అనుభవములు

అనుభవములు

..ఈ మధ్యాహ్నం మరలా తిరిగి వచ్చుట మరియు ఉండుట...?... గడచిన ఆదివారము నేను ఇక్కడకి వచ్చుటకు ప్రయత్నించాను కాని విమానములన్ని నిలిపివేయబడ్డాయి. నేను రావాలని ప్రయత్నించాను- అది ఆగిపోయింది. మీతో ఉండుటకు ఇక్కడికి వచ్చుటకు నాకు ఏ మార్గము లేదు, కానీ, ఖచ్చితముగా నాకు తెలిసినంతవరకు, మీ అందరి నిమిత్తము ఎల్లవేళలా ప్రార్థించాను.మరియు నేను విన్నాను సహోదరులు - మీలో చాలా మంది సహోదరులు వేదికమీద నిలబడి ప్రార్థించారు మరియు చాలా మంది ప్రజలు ప్రార్థన చేయించుకున్నారు మరియు స్వస్థపడ్డారు. నేను ఖచ్చితముగా అందు నిమిత్తము కృతజ్ఞతతో ఉన్నాను.ఇప్పుడు, ఇది ఇక్కడ ఫీనిక్స్ లో మన ఆదివారం ఆరాధన వరుసలో ఆరవ ఆదివారం, మరియు మనకు - దీని తరువాత రెండు ఆదివారాలు ఉన్నాయి. మరియు ఇక్కడ ఉండటం వలన చాలామంది ప్రజలు దేవుని సన్నిధి యొక్క గొప్ప ప్రయోజనము పొందుకుంటారు అని నేను నమ్ముచున్నాను.ఇక్కడికి ఒకరు వచ్చి ఉన్నారు అని నేను విన్నాను అది - చికాగోకు చెందిన ఒక మహిళ మరియు వేర్వేరు ప్రాంతముల నుండి వచ్చిన వారు. ఇక్కడ ఉండుటకు వారికి ఇంక కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంది. నేను గడచిన ఆదివారము ఆమెను చూడలేకపోయాను, కావున ఎక్కువ రోజులు ఉండని, లేక ఉండలేని వారిని, మొదటగా ప్రార్ధనా వరుసలో నన్ను తీసుకోనివ్వండి. సహోదరి, నాకు మీ - మీ సందేశం కొద్ది నిమిషముల క్రితం గదిలో అందింది మరియు ఇంకొకటి వెలుపల అందినది, మరియు నేను ప్రతి ఒక్కరికి ప్రార్దించుటకు ప్రయత్నిస్తాను.

మీలో చాలామందికి రెండు వారాల క్రితం ఆదివారం ఇక్కడ జరిగిన చెడు విషయం గుర్తు ఉందని అనుకుంటున్నాను, కొన్ని వారాల క్రితం ఈరోజు ఇక్కడ ఈ బలిపీఠము వద్ద. చాలామందికి అది గుర్తుంది, మీకు గుర్తు లేదా ఏమి జరిగిందో? ప్రస్తుతానికి అది ఒక అత్యంత - అత్యంత భయంకరమైన విషయాలలో ఒకటి, అది నా జీవితములో ఇదివరకెన్నడూ జరగనిది. మరియు మీలో చాలామంది గ్రహించలేదు. మంచిది, ఈ మధ్యాహ్నము అది ఒక మంచి కార్యము అని నేను అనుకుంటున్నాను మరియు నాకు కూడా ఒకసారి...?...నేను ఈ విషయాలను మీకు వివరిస్తాను మరియు బహుశా సాక్ష్యం ఇచ్చుటకు సమయము తీసుకుంటాను. వాస్తవానికి దీనిని చేయుటవలన అది - అది దానిపట్ల మీకు మరింత అవగాహన ఉంటుంది.మరియు ఇది వాయువ్య భూభాగములో గొప్ప కూడిక, ఇది నాకు చాలా ఎక్కువ. నేను ఎటువంటి స్థితిలోనికి వచ్చాను అంటే మరలా నా పూర్వ స్థితికి వచ్చుటకు ముందు నలభై నాలుగు గంటలు సృహ లేకుండా ఉన్నాను. రోగులు స్వస్థపడుటకు ఇంకా అనేకమంది ఉన్నారు. కొన్ని వేల మంది ప్రజలు, రోగులు స్వస్థత పొందుటకై… ప్రభువుకు ప్రార్థించుటకై ఎదురుచూస్తూ ప్రజలు… అటు తరువాత...?... కానీ వాంకోవర్ నుండి, పోర్ట్ ల్యాండ్ వరకు, పోర్ట్ ల్యాండ్ నుండి సెలంకు, ఆష్ లాండ్ కు, ఐదుగురి నిమిత్తము బోయిస్ కు...?... ఆరాధన, అది గొప్ప ప్రయోజనాన్ని పొందినది. కాగా అన్నిటినీ ప్రకటించుటకు నాకు సంతోషముగా ఉంది...?…కానీ ఒక విషయం నేను- నాకు ఒక సూచనను ఇవ్వవలసిందిగా మొరపెట్టి అడిగాను... అది చిన్నగా కనిపించవచ్చు...?... అర్ధం ఏమిటో వివరించుటకు... ప్రపంచములో ఉండే అన్ని స్వస్థతల కంటే అది నాకు ఎక్కువ. మరియు భూమిమీద నేను ఉండుటకు కారణము అదే అని నేను నమ్ముచున్నాను… ఇప్పుడున్నట్లుగా సమస్తము చక్కగా సమకూడి జరిగినచో, అప్పుడు ఈ కొద్దిపాటి పనితో నేను ఇంటికి తీసుకుని పోబడుదును నేను నమ్ముతున్నాను. ఎందుకనగా నా ఉద్దేశం ఎల్లప్పుడూ సంఘము ఐక్యముగా ఉండుటయు, ప్రజలు దేవున్ని కలిసి ఆరాధించుటయు చూచుటయే.

అటు తరవాత గడచిన వారం, అసెంబ్లీ ఆఫ్ గాడ్, చర్చ్ఆఫ్ గాడ్, ఫోర్ స్క్వేర్ సంఘము మరియు పెంతెకొస్తు ఏకత్వం వారు ఏకమవుటను నేను చూడవలసి వచ్చింది. వారు కలిగి ఉన్న సామూహిక ఉజ్జీవ కూడికలు, బాప్తిస్మం ఆరాధనలు మొదలగునవన్నీ. ప్రతి మనిషిని ఒక్క హృదయము మరియు ఒక్క మనసుతో ఒప్పింపబడనివ్వండి, మరియు అక్కడ ప్రతిరోజు వందలమంది రక్షింపబడుతున్నారు. ఒక గొప్ప ఏకత్వ ఉజ్జీవం (ఓహ్, మై), అది నాకు ఎంతో ఎక్కువ. మరింత ఎక్కువ... నేను కూడికలు మొదలుపెట్టినప్పటి నుండి జరిగిన అన్నికూడికల కంటే ఎక్కువ ప్రయోజనం ఉంది...? ... ప్రభువును చూచుటకు ...? ...అయన సంఘములో కలిసి రావడం ...? ... నేను చూస్తున్నది ...? ... పెంతెకొస్తు. అది ప్రతిచోటా జరిగితే, యేసు వస్తాడు. మరియు ప్రజల మతాల యొక్క చిన్న తేడాలు వారిని వేరుగా ఉంచుతాయి, కానీ నిజమైన ప్రధాన సువార్త యొక్క మూలాధారములు అన్ని ఒక్కటే.మరియు నేను- వారు ఒకరితో ఒకరు అంగీకరించి ఉజ్జీవమును కలిగి ఉండుటకు సిద్దపడుటను చూచుటకు ఇష్టపడుతున్నాను. మరియు అది మనకు అవసరము. ఎందుకంటే వాంకోవర్ నుండి బోయిస్ వరకు పూర్తిగా జరిగినది అదే : ఒకే హృదయం మరియు ఒకే మనస్సు, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సేవకులను మరియు ఫోర్ స్క్వేర్ సువార్త సేవకులను చూడండి ..?... [టేపు మీద ఖాళీ యున్నది.] ఇప్పుడు ఉన్న స్థానములో. మరియు జిల్లానందు గల దేవుని సంఘముల తరపున ప్రాతినిధ్యం వహించే వారు. అది ఖచ్చితంగా ఒక ... [టేపు మీద ఖాళీ యున్నది.] మరియు వారందరూ అలాంటి ఐక్యతతో కలిసి రావడం నా జీవితంలో చూడలేదు మరియు బల్లవద్ద ఒకరినొకరు కౌగిలించుకోవడం ...?... [టేపు మీద ఖాళీ యున్నది.] మరియు కన్నీరు పొంగుతున్నది [టేపుపై ఖాళీ ఉంది.] దానినే నేను ఇష్టపడుతున్నాను. అప్పుడు అక్కడ నిజమైన ఉజ్జీవం ఉంటుంది.మరియు వారు ఏకత్వ ఉజ్జీవములను కలిగి ఉన్నారు. ఇది ఒక వారం పాటు అసెంబ్లీస్ అఫ్ గాడ్ లో ఉంటుంది, ఆపై వచ్చే వారం ఫోర్ స్క్వేర్ మరియు చర్చ అఫ్ గాడ్ లో [టేపు మీద ఖాళీ యున్నది] వచ్చే వారం పెంతెకొస్తు ఏకత్వం వారి వద్ద, ఇలా మారుతూ జరుగుతూ ఉంటుంది. ఓహ్, మై అది నాకు అద్భుతమైనది. ఇది అన్నింటికన్నా విలువైనదని నేను భావిస్తున్నాను... అది క్రీస్తు శరీరం యొక్క స్వస్థత. చూడండి? అది - అది నిజమైన దైవిక స్వస్థత (కాదా?) ఎప్పుడైతే క్రీస్తు శరీరం ఉండగలదో - అప్పుడు మనం ఒక్కటిగా తీసుకురాబడుతాం. ఇపుడు అదే నిజమైన దైవిక స్వస్థత.

ఇప్పుడు, గత వారం... నేను - నేను సంఖ్యాకాండము మరియు ఇశ్రాయేలీయుల పిల్లలను ఐగుప్తు నుండి బయటకు తీసుకువచ్చుటను గురించి, వాగ్ధాన స్థలములోనికి వారిని తీసుకువచ్చుటను గురించి బోధిస్తూ ఉన్నాను. మరియు మేము గొప్ప సమయం కలిగియున్నాము. కానీ ఈ రోజు మీరు నన్ను ఆ విషయమై క్షమించి మన్నించగలిగితే, నేను చాలా బలహీనంగా ఉన్నాను ... [టేపు మీద ఖాళీ యున్నది] అయినప్పటికీ నేను - నేను మీకు కొన్నిసాక్ష్యాలు మరియు ప్రాముఖ్యమైన సంగతులు లేక మనము ముందుకు వెళ్ళుచుండగా ఇంక ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తాను; అటు తర్వాత మనము స్వస్థత వరుసను కలిగి ఉందాం.మరియు నేను ప్రయత్నించాను ...నేను దానిని ఎందునిమిత్తము చేస్తున్నాను- నేను దానిని ఎందునిమిత్తము భోదిస్తున్నాను అంటే ఈ ఒక్క కార్యము నిమిత్తమే. మరియు నా స్వంత మానవ శక్తి దానిని చేయదు -చేయదని నేను చూస్తున్నాను. కానీ దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నేను - నేను ప్రార్థిస్తాను. ఫీనిక్స్ నేను ఇప్పటివరకు కలిగివున్నవాటి అన్నిటిలోకి కష్టతరమైనది. ఇప్పటివరకు హాజరైన అతిచిన్న సమూహాలు ఫీనిక్స్ లోనివే. ప్రపంచంలోని అన్ని నగరాలకంటే నేను ఎక్కువగా ప్రేమించే నగరం ఫీనిక్స్. నేను దానిని ప్రేమిస్తున్నాను. మరియు అది - నేను ఉండాలనుకుంటున్నాను ... ఒక దినమున ఇది నా గృహము కావాలనుకుంటున్నాను, మరియు అందుకే అపవాది నాతో ఇక్కడ గట్టిగా పోరాటం చేస్తాడు. అది నిజం. కానీ దేవుని కృపతో నేను గెలుస్తాను. దేవుని కృప వలన , నేను - నేను దేనిని అడిగానో దానిని కలిగి ఉంటాను.

ఫీనిక్స్ లో నేను ఏది చూడాలనుకున్నానో, అది దేవుడు చేయాలని ప్రార్ధించబోతున్నాను, ఎందుకంటే నేను ఫీనిక్స్ లో ఉన్న అన్ని సంఘములను వాయువ్య భూభాగంలోని వాటివలే చూడాలనుకుంటున్నాను: అందరూ ఏక హృదయం మరియు ఏకాత్మ, మరియు ఒకే స్థలములో. స్నేహితులారా, మనము దానిని చేయగలం. మనము దానిని చేయగలం, చేయలేమా? మరియు- మరియు దానిని చేయుటకు దేవుడు మనకు సహాయము చేస్తాడు అని నేను-నేను నమ్ముచున్నాను. ప్రతి వ్యక్తిని ... ఎవ్వరు వారి సంఘము యొక్క స్వంత సిద్ధాంతం కలిగి ఉండకూడదు అన్నది నా ఉద్దేశము కాదు. పర్వాలేదు. కానీ నా ఉద్దేశము ఏమిటంటే, ఒకే హృదయం, ఒకే మనసు, ఒకే తాటి పైన మనం ఉండగలిగితే. మనమందరం క్రైస్తవులం...?...నేను...?... తప్పకుండా చేయవచ్చు. ఇది అపవాది మన మధ్య వచ్చుటే. మీరు అలా అనుకోవట్లేదా? అది వాడు చేస్తాడు, మరియు అది వాడి… కానీ దేవుడు క్రమమును కదిలించే గడియ వచ్చిందని నేను నమ్ముచున్నాను.

ఇపుడు కొంచెం... [టేపు మీద ఖాళీ యున్నది]... నా వర్తమానము ముగించునపుడు, గత ఆదివారం ఇశ్రాయేలు పిల్లలను బిలాము ప్రవక్త వద్ద విడిచిపెట్టాను. మరియు అక్కడ దానిని బోధించుటలో నామీద నేను దోషారోపణ చేసుకున్నాను. దీన్ని గడచిన ఆదివారం చూసినవారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మంచిది, నాకు ఏమి జరిగినదో మీరు చూసారు. మంచిది, నా మీదకు నేను- నేను తీర్పు తెచుకున్నాను. సహోదరుడు కిడ్సన్ మరియు నేను ఎల్లప్పుడు... నేను ఈ ప్రకటన చేశాను, ప్రార్ధన ముందు నిలబడగలిగే ఏ వ్యాధి లేదు లేక ఏ బాధ లేదు అది ఏదయినా, ఎంత కఠినముగా ఉన్నా నేను ఆ వ్యక్తి నిమిత్తము సమయము తీసుకుంటే వారు స్వస్థపడతారు. ప్రతిచోట నేను దానిని ప్రస్తావించడం మీరు విన్నారు కదా, మీరు వినలేదా? మరియు అది సత్యము. అది ఇంకనూ సత్యమే. కానీ ఇప్పుడు, ఈ దినము ఆ గొప్ప పరీక్ష పూర్తయినది, మరియు నేను దానిని దేవునికి మరింత దగ్గరగా జీవించే మార్గములను నాకు నేర్పించుటకు అడ్డంకిగా కాక ఒక మెట్టుగా దానిని చేసుకుంటాను, మరియు నేను దేవునికి దగ్గరగా జీవించవచ్చు. మరియు నేను ఆయనకు దగ్గరగా జీవించుచుండగా, మరియు ఆయన ఆత్మ ద్వారా నడిపించబడుటకు ఈ ప్రజలకు నేను సహాయపడగలను.

మరి ఇప్పుడు, దానిని ప్రారంభించుటకు ముందుగా నేను మొదట ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఆపై మనము కొన్ని క్షణాలు మాట్లాడబోతున్నాము, జరిగిన కొన్ని కార్యముల మీద కొన్ని సాక్ష్యాలు ఇస్తాను, అటు తరువాత ప్రార్థనా వరుసను ప్రారంభిస్తాము. ప్రార్థించబడాలని కోరుకునే ప్రతి ఒక్కరి నిమిత్తము ప్రార్థించడానికి సరిపడినంత సమయం ఇస్తాము, మరియు ప్రత్యేకించి ఇతర కూడికలకు తిరిగి రాలేని వారి నిమిత్తము ప్రార్థించడానికి సమయం ఇస్తాము. అటు తరువాత నేను మీకు కారణాలు చెప్తాను ...మరియు నేను ఈ విషయం చెప్పేముందు, ప్రార్ధించుటకు ముందు, నాకు స్వస్థతా వరమును మరియు మరి ఎక్కువ విజయమును తిరిగి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. గడచిన ఆదివారమునకు ముందు నుంచి-అందులో ఆపై రెండు వారములు, కొన్ని నెలల క్రితం కంటే మరి ఎక్కువగా జబ్బుపడిన వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాను. అది సరైనది. ఇది మొదటి స్థానంలో కంటే మరింత ఆశీర్వాదముగా తిరిగి వచ్చింది. కూడికలో, ఖచ్చితముగా, మీరు దానిని గుర్తిస్తారు.

అయితే ముందుగా మనం ప్రార్థన కోసం ప్రతిచోటా మర్యాదపూర్వకముగా తలలు వంచుదాం. ప్రియమైన తండ్రీ, మేము మిమ్మల్ని ఎలా సమీపించాలో మాకు తెలిసినంత వినయముగా ఈరోజు మీ వద్దకు వచ్చాము. మరియు చివరిసారిగా నేను ఈ బలిపీఠము మీద నిలబడినప్పుడు, నేను ఖండించబడిన వ్యక్తినని గ్రహించాను: మీరు లేకుండా నేను ఎంత నిస్సహాయుడనో ఇక్కడ నిలబడి గ్రహించాను. మీ సన్నిధి నన్ను విడిచిపెట్టింది అని అనుభూతి చెందుటకు మరియు నేను చూచుటకు కేవలము వినడానికి కష్టముగా ఉన్న ఒక చిన్న అమ్మాయి ఇక్కడ ఈ బలిపీఠము వద్ద పూర్తిగా చెవిటిదానిగా అయిపోయింది; ఒక మనిషిని, వినికిడి లోపము ఉండి చెవిటివానిగా మారుటకు...ఓ క్రీస్తు, మీరు లేకుండా నేను విఫలుడనని గ్రహించాను. నేను ఒంటరిగా వెళ్లలేను. అందువలన, ఈ సమయములలో, తండ్రీ, మీరు లేకుండా నేను - నేను ఇంటికి కూడా వెళ్లనని నిర్ణయించుకున్నాను, ఎందుకంటే నేను మీ మీదకు నిందను మాత్రమే తీసుకువచ్చాను. దానిని నేను చేయకుండా నా నుండి దూరపరచండి.[టేపు మీద ఖాళీ యున్నది] వారిలో ప్రతి ఒక్కరు, వారందరూ స్వస్థత పొందుతారు. తండ్రీ, ఈ మధ్యాహ్నం నేను మాటలాడుచుండగా సాక్ష్యములలో నాకు సహాయము చేయండి. ప్రజలు అర్ధం చేసుకొనులాగున అది ఉండునట్లుగా. మరియు తండ్రీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం పొందుకొనునట్లుగా [టేపు మీద ఖాళీ యున్నది], ప్రతీ [టేపు మీద ఖాళీ యున్నది] ధనికులు, బహిష్కరించబడినవారు, తెలుపు, నలుపు, అందరూ ... ఇప్పుడు మాతో ఉండండి, మరియు మా అందరిపై మీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి. కూడికలో మహిమ పొందండి మరియు అలసి, నీరసించిన మీ సేవకుడికి సహాయము చేయండి. ప్రభువైన యేసు క్రీస్తునామములో దీనిని అడుగుచున్నాము. ఆమెన్.

నా చివరి ... గడచిన సారి దేవుడు తన దూతను కిందకి పంపించాడు... మీలో చాలా మంది, ఇక్కడ...స్వస్థతవరం దూత నా వద్దకు ఎలా తీసుకువచ్చిందనే దాని గురించి ఎంతమంది విన్నారు? మీలో చాలా మంది విన్నారు. మంచిది, ప్రియమైన స్నేహితులారా, గ్రహించిన తరువాత, చాల గంటలు ఆ స్థితిలో పడియుండుటవలన, నేను ఒక చిన్న కాగితం ముక్కను తీసుకొన్నాను మరియు వివరించాను, బయటకి వెళ్ళడానికి ముందు, నేను ఇది నా జీవితం ముగింపు అని అనుకున్నాను, మరియు నా భార్యకు ఏమి చేయాలో రాశాను, మరియు సహోదరుడు కిడ్సన్ కు ఒక చిన్న వివరణ మరియు ఆ విధముగా వేరు వేరు వ్యక్తులకు. నా స్వంత జీవితమును పట్టి ఉంచుటకు నాకు ఏ పట్టు లేదని గ్రహించాను; ఏ సమయములోనైనా అది పోతుంది. కానీ మీతో ఇది నా చివరి కూడిక అయితే, ఆదూత యొక్క స౦దర్శన౦ నిజం, దేవుని ముందు చెప్పుచున్నాను. అవును. ఇది నిజం. మరియు నాపక్కన ఈ పరిశుద్ద గ్రంధమును పెట్టుకొని నిలబడి ఉండగా, ఆయన వచ్చాడు, మరియు నేను మీకు సత్యమునే చెప్పితిని. నేను ఈ క్షణమే చనిపోవలసివచ్చినా, ఇది నిజం.

మరియు- కానీ దాని విషయం ఏమిటంటే, నా స్వభావములో నేను - నేను వినడానికి ఇష్టపడతాను, మరియు నేను చేయగలిగిన సహాయం ప్రతి ఒక్కరికి చేయడానికి నేను ఇష్టపడతాను. అలా చేయడ౦ ద్వారా, దేవుని నుండి దూరముగా ఉండడానికి నా స్వభావానికి అనుమతి నిచ్చాను. మీరు చూడలేదా? నా చిత్తము ఎల్లప్పుడూ దేవుని చిత్తము కాదు. మరియు ప్రజలు నన్ను కార్యములు చేయమని అడుగుతారు, మరియు నేను ప్రజలను ప్రేమిస్తున్నాను, నేను ఇంతకు ముందు మీకు చెప్పినట్లుగా... ఒక సమయములో నాకు చాలామంది స్నేహితులు లేరు ఎందుకంటే నేను ఆడంగి వారిలో ఒకనిగా ఉన్నానని ప్రజలు నన్ను పరిగణి౦చారు, నాకు — నాకు చాలా మంది స్నేహితులు లేరు. కానీ నేను బయటకు వచ్చి దేవుని ప్రజలను కనుగొనినప్పటి నుంచి, ఆయన నాకు లక్షలాదిమంది స్నేహితులను ఇచ్చాడు. నేను వారి కోసం ఏదైనా చేసేంతగా - నేను వారిని చాలా ప్రేమిస్తున్నాను. నేను—నేను— నేను దీనిని గ్రహించాను, నా హృదయపూర్వకముగా, ఏదైనా ఉంటే... మరెక్కడి నుంచో నేను బలం పొందుకొనకపోతే, వచ్చే ఏడాది ఈ సమయానికి, నేను కాకుండా దీనిని చేసేవారు వేరొకరు ఉంటారు. ఎందుకంటే, వారు ఎంత ప్రయత్నించినా- ఎవరైనా నన్ను ప్రోత్సహించడానికి ప్రయత్నించినా, నేను స్వయముగా అనుభూతి చెందుతున్నాను, నా మానవ బలం వదిలివెళ్ళడం నేను చూస్తున్నాను. ఎందుకనగా ప్రజల కొరకు ఏదో ఒకటి నా హృదయములో నుండి దానిని బయటకు తెచ్చును. మరియు నేను — నేను— నేను ఈ ప్రకటన చేశాను; దీని ద్వారా నేను జీవించాలి, నేను దానిని బదులుగా, నేను వెళ్లిపోయినప్పుడు, ఆ జీవపు కీర్తనను నేను ఎల్లప్పుడూ ఇష్టపడతాను. “కాలము అను ఇసుక మీద అడుగు జాడలు మన వెనుక విడిచి పెట్టబడును.” నేను వెళ్ళిపోయినపుడు ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను, నేను దేవునికి మరియు అతని సంఘమునకు సేవ ఎలా చేయాలో నాకు తెలిసినంత ఉత్తమమైన సేవ ఇక్కడ ఉన్నప్పుడు చేశాను (అది సరైనది.), ఆయన సంఘము కోసం, మరియు అది ఆయన మహిమ కోసం.

ఇప్పుడు, ఇల్లినాయిస్ లోని వాలిండియాలో, నేను మీకు చెప్పినట్లుగా దూత సందర్శించిన సమయం, గత ఆదివార౦ నేను మీకు చెప్పినట్లుగా, మీరు-లేదా గడచిన ఆదివారం. మీకు, అయన రాకడను గురించి నేను చెప్పింది మీకు గుర్తు ఉందా? ఈసారి నేను ఇక్కడకు రావడానికి ముందు. రెండు వారముల క్రితం ఆదివారం నేను గదిలో ఉన్నాను. నేను కెనడా మరియు చుట్టు ప్రక్కల అంతా వెళ్లాను. నేను అతనిని ఎప్పుడూ చూడలేదు, మరియు నేను చుట్టూ చూస్తూ, గదిలో ఏదో చూశాను; నేను తిరిగాను మరియు అక్కడ దూత నన్ను చూస్తూ నిలబడి ఉన్నాడు. మరియు నేను బోర్లాపడిపోయాను, కానీ నేను - నేను… అసెంబ్లీస్ ఆఫ్గాడ్ నుంచి ఉత్తర దిక్కున జరిగే కూడికలకు నిర్వాహకుడు సహోదరుడు లిండ్సే. నేను కేకలు వేయడాన్ని అతను విన్నాడు, మరియు అతడు - అతడు ఆ గదిలోకి అడుగు పెట్టాడు. మరియు అతను గదిలోకి అడుగు పెట్టగానే ... ఎందుకు, అతను అలా చేయాలని అనుకోలేదు; అతనుఒక మంచి వ్యక్తి. కానీ అది జరిగినప్పుడు, అది ఏదో అంతరాయం కలిగించింది, మరియు దూత వెళ్లిపోయాడు.

ఆ తర్వాత ఆదివారం నేను ఇక్కడికి వచ్చాను. అది శుక్రవారం. మరియు ఆదివార౦ నేను ఇక్కడికి వచ్చాను, లేఖనములోని ఏ భాగ౦ గురి౦చి చెప్పాలో నాకు తెలియదు... నేను పరిశుద్ధ గ్రంధములోని ఈ భాగము ఎప్పుడూ చదవలేదు, కానీ నాకు సంఖ్యాకాండము యొక్క 22వ అధ్యాయం వచ్చింది, మరియు అక్కడ నేను బిలాము ప్రవక్త గురించి మాట్లాడడం ప్రారంభించాను, అతని వంతు వచ్చినపుడు, మరియు అతను వచ్చినపుడు, మరియు దేవుడు ఇదివరకే బిలాముకు ఏ విధముగా చెప్పాడు “వారి మనుషులతో వెళ్ళవద్దు.” కానీ అతను మళ్ళీ ప్రార్ధించడం కొనసాగించాడు, మరియు- మరియు తుదకు నేను బిలాము గురించి నమ్ముతాను, డబ్బు మీద అతనికి ఉన్న ప్రేమే అతను వెళ్ళాలని అనుకోవడానికి కారణము అని. నాకు ఖచ్చితముగా తెలియదు; నేను లోపలికి వచ్చే వరకు నాకు తెలియదు. నేను అనుకోను ... అది డబ్బు మీద ప్రేమని. కానీ నా విషయములో అది డబ్బు మీద ప్రేమ కాదు, అది మనుషుల మీద సానుభూతి. అది ఏదైనప్పటికీ, ఇంకా ఎంత చిన్నదైనా, ఎంతపెద్దదైనా సరే, దేవునికి అవిధేయత చూపడం తప్పు. (అది సత్యము.)

అప్పుడు బిలాము, అక్కడకు వెళ్తూ ఉన్నాడు, మరియు దేవుని దేవుని దూత అతనిని మార్గములో కలుసుకున్నాడు. మరియు నేను దాని వద్దకు వచ్చినపుడు, స్నేహితులారా, నాకు - నాకు తెలియదు. ఇక్కడ నన్ను తాకునది ఏదో ఉంది, మరియు మనకు కేవలం ఒక గీత మాత్రమే ఉన్నది అద్భుతాలు తప్ప మరేమీ చేయలేము; అదంతా, అద్భుతాలు తప్ప మరేమీ కాదు. మంచిది...ఈ బలిపీఠము మీద నిలబడి బిలాము వద్దకు వెళ్ళినపుడు, మీ అందరికి ప్రసంగిస్తూ మరియు ఆదూత మార్గములో నిలుచొని ఉండుట నేను చూశాను, మరియు బిలాము దానిని చూడలేకపోయాడు... అతను స్వారీ చేస్తున్న (కంచర) గాడిద దానిని చూసింది. అప్పుడు అతను ఇరుకైన మార్గము, ఒక ద్వారముగుండా వెళ్లినట్టు, ఇరుకైన స్థలమునకు వెళ్ళెను. మరియు అక్కడ దూత మళ్లీ కనిపించాడు, మరియు ఆ గాడిద దాన్ని చూసింది, మరియు బిలాము యెహోవా దూతను చూడలేకపోయాడు, మరియు ఆ విధముగనే మనము దేవునికి అవిధేయత చూపాము. కాబట్టి నేను దానిని చేసినపుడు, దూత కనిపించడమంటే ఏమిటో అప్పుడు నేను చూసాను; మరియు మొదటిసారిగా అది నిజమని నేను గ్రహించాను. నేను ఎంత పొరపాటు చేశాను. దేవుని కుమారుడు సహితము అటువంటి మాట పలుకలేదని నేను దేవుని శక్తిని గూర్చి ప్రజలతో దృఢమైన నిశ్చయత కలిగి ఉన్నాను. నేను తీసుకురావాలని సవాలు చేసాను- అప్పటికప్పుడు ఏమి స్వస్థత కలుగునో దానిని..?... [టేపు మీద ఖాళీ యున్నది] కనుగొనేందుకు... [టేపు మీద ఖాళీ యున్నది.]

నేను దానిని విశ్వసించినా, విశ్వసించకపోయినా కేవలం మా ద్వారా దానిని తెచ్చుటకు అది నాకు ఎంతో ఉత్తమమైన దానిగా నేనెంచుచున్నాను ; వారిని తీసుకు రండి (మీరు చూస్తున్నారా?), ఎందుకంటే దేవుని బలం మరియు శక్తి నాకు తెలుసు. మరియు ఆ దేవుడు దానిని నేను పొందేలా ఎలా చేశాడో నాకు తెలియదు. ఎందుకంటే యేసుక్రీస్తు, వారి అవిశ్వాసం కారణముగా ఆయన చేయలేని అనేక శక్తివంతమైన పనులు ఉన్నాయి (అది వాక్యమేనా?). ఆయన ఏమై ఉన్నాడో చూడండి. మరియు ఆయనలో ఉన్న శక్తిని చూడండి. మరియు కేవలము స్వస్థతా వరమును కలిగి దేనినైనను ఎదిరించినపుడు, విశ్వాసము లేక అవిశ్వాసము పైకి వస్తుంది. మరియు ఆయన నన్ను ఆరు నెలల పాటు దానితో ఉండడానికి అనుమతించాడు. నేను ఏమి చేసానో చూసినపుడు అది నా హృదయాన్ని ముక్కలు చేసింది. ప్రజలైన మీ ముందు పట్టుకొని ప్రసంగించుటకు ప్రయత్నించాను; నేను దానిని చేయలేకపోయాను. అది నన్ను అక్కడికక్కడే కరిగించివేసింది. నేను బలిపీఠము వద్దకు వచ్చిన తరువాత నేను బిలాము స్థితిలో ఉంటూ అతను ఎంత చెడ్డవాడో అని అతని గురించి ప్రసంగించడం మరియు మాట్లాడడమును చూసాను. దేవుని దూత అక్కడ నన్ను కలుసుకొని, నన్ను చేయవద్దు అన్న కార్యములను నేను చేస్తూ ఉన్నాను. నేను ఆశ్చర్యపోతున్నాను, అతను ఆరు నెలలుగా నన్ను సందర్శించలేదు మరియు నేను అద్భుతాలు ప్రదర్శించడానికి స్వస్థతా వరమును ఎక్కువగా పరిమితము చేసాను అని చెప్పాడు. వరుస అంతా అద్భుతాలు జరిగాయి. కాబట్టి దేవుడిని అయన చిత్తానుసారముగా ఎన్నుకొననివ్వండి. దేవుడు నన్ను చేయమని చెప్పినది ఏదైనా- ఏమైనా - ఏదైనా ఆత్మలో నన్ను నడిపించునట్లు అనుభూతి చెందనివ్వండి. సరే, అది-అది లేఖనానుసారం.

15

యేసు కొలను వద్దకు వెళ్ళినపుడు, అక్కడ చాలా మంది ప్రజలు వికలాంగులుగా అక్కడ ఉన్నారు బహుశా ఈరోజు ఈ భవనములో ఉన్నంతమంది లేదా అంతకంటే ఎక్కువమంది ఉండవచ్చు. ఆ ప్రజలందరి మధ్యలో ఆయన నడుచుకుంటూ వెళ్లి, ఒక్కడిని వారిలోనుంచి తీసుకున్నాడు. ఆ విధముగా చేయుటకు ఆయన దేవునిచే నడిపింపబడ్డాడు. మరియు అయన అతనితో ఇలా అన్నాడు, “స్వస్థపడగోరుచున్నావా?”

అతను అన్నాడు,“అయ్యా, నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు.”

ఆయన,“నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుము.” అని అతనితో చెప్పెను.

చూడండి, అయన అతనితో వాదించనవసరము లేదు, ఎందుకంటే క్రీస్తు ఎరిగియున్నాడు అతనికి స్వస్థపడుటకు విశ్వాసం ఉన్నదని; మరియు ఆ మనుష్యుడు తన పరుపెత్తికొని నడిచెను. అయన ఆ పట్టణములో ఇంక ఏ ఒక్కరినీ స్వస్థపరచకుండా నేరుగా అక్కడ నుండి వెళ్లిపోయెను. ఆయన మరో మనిషిని తీసుకొని, అతనిని పట్టణం బయటకు నడిపించి అతనిని నిలబెట్టి అతనితో మాట్లాడుతూ, నేలమీద ఉమ్మివేసి, ఉమ్మితో బురద చేసి, వాని కన్నులమీద ఆ బురద పూసి సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగుకొనుమని చెప్పెను. ఆయన మార్గములో వేలాదిమంది పడి ఉన్నారు. అతను వారందరినీ ఎన్నడూ నయం చేయలేదు. కానీ ఆత్మ ఎవరి నిమిత్తమైనా పక్కకి తిప్పినపుడు, అప్పుడు ఆయనకు కనికరము కలిగెను, అది మానవ హృదయానుసారమైన కనికరము కాదు, ఎందుకంటే ఆ వ్యక్తి వద్దకు వెళ్ళమని దేవుడు ఆయన ద్వారా మాట్లాడుతున్నాడు. ఏది అయితే తప్పిదమైనదో అది నేను చేసినట్లు అప్పుడు చూసాను. మరియు నేను ఖండించబడ్డాను మరియు నన్ను బట్టి నేను సిగ్గుపడ్డాను. మరియు నేను దాని గురించి ప్రజలైన మీకు చెప్పాను.

16

ఆపై నేను ప్రార్థనా మందిరం వద్దకు వచ్చి, “ప్రభువా, అది మీ దైవిక చిత్తం కాకపోతే, నేను తప్పు చేశాను, మీరు నాకు సహాయం చేస్తారా? మీరు చేయండి అందునుబట్టి ఉంటే... ఇక్కడికి నేను ఏ వ్యక్తినైనా తీసుకువస్తే, మరియు వారు స్వస్థత పొందుకోకపోతే, నేను దీని నుండి తెలుసుకుంటాను మరియు నా జీవితములో నేను ఆ సవాలును ఇక ఎన్నటికి చేయను లేదా ప్రార్ధన వరుసలో ఎవరిని ప్రార్ధనా వరుసలోకి తీసుకొనిరాను, లేక వారు పిలుచునట్లుగా అద్భుతాల వరుసను చేయను.” మరియు ఏమి జరిగిందో మీకు తెలుసా, మొదటి వ్యక్తి తీసుకురాబడింది, ఆ చిన్న అమ్మాయి ... కాలిఫోర్నియా నుండి ఈరోజు ఆమె ఇక్కడ ఉందని నేను ఆశిస్తున్నాను, అది నిజమని నేను నమ్ముతున్నాను. మరియు ఆమెకి వినికిడి కష్టముగా ఉంది, నేను చిన్న అమ్మాయితో ముందే మాట్లాడాను. మరియు నేను నా చేతులు ఆమెపై ఉంచాను మరియు ప్రకంపనలు నా చేతికి తగులుతున్నవి. బహుశా పగిలిన కర్ణభేరి వ్యాధికి కారణమైంది మరియు దానిపై చిన్న పెరుగుదల ఉంది, కొద్దిపాటి పెరుగుదల,' ఎందుకనగా ఎక్కడో అది జీవం కలిగి ఉంది'. మరియు ప్రకంపనలు ఆగిపోయాయి, మరియు నేను మీకు చెప్పాను. ఎప్పటివలె, “ఇప్పుడు, ఆ బిడ్డ స్వస్థత పొందింది.” మరియు నేను ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించాను, నేను గట్టిగా ఆమెతో అరవలేకపోయాను లేదా నా చేతులు రెండు కలిపి గట్టిగా కొట్టాను మరియు ఆమె వినలేకపోయింది. నేను ఆమెను తిప్పాను- ఆమె చెతిని పట్టుకున్నాను. ప్రకంపన తిరిగి వచ్చింది. నేను దానిని మళ్లీ వెళ్లగొట్టాను మరియు అది తిరిగి వచ్చింది. కాబట్టి నేను ఆ చిన్నదానిని ఒంటరిగా విడిచిపెట్టాను.

17

తరువాత వచ్చిన మరొక వ్యక్తికి వినికిడి కష్టముగా ఉంది. నేను అన్నాను, “అయ్యా, మీరు నమ్ముతున్నారా?” అతను నిజమని తన తల ఊపాడు ... నేను అతనిని పిలిచాను; అతను తల ఊపాడు మరియు తల వంచుకున్నాడు. మరియు నేను ఇలా చేసి, అతని చేతిని పట్టుకున్నాను: ప్రకంపనలు లేవు; అది ఆత్మ అభిషేకము వలన పూర్తిగా ఆత్మీయ కార్యముగా ఉన్నది. ఇది బహుశా జీవము కోల్పోయిన నరములు. మరియు నేను ఆ వ్యక్తి కోసం ప్రార్థించినప్పుడు, నేను అతని వెనక నా చేతులను కొట్టడం కూడా వినలేకపోయాడు. మరియు నేను ఖండించబడినట్లు నేను చూశాను. మరియు అక్కడ నేను మొదటిసారిగా ఈ బలిపీఠములో నిలబడ్డాను మరియు ఒక మనిషికి దేవుడు లేకుండా విడవబడుట అంటే ఏమిటో తెలుసుకున్నాను. నేను నిస్సహాయముగా ఉన్నాను. మిత్రులారా, ఈ దినము మీ ముందు నేను సిగ్గుపడుతున్నాను. దానినిబట్టి నేను సిగ్గుపడుతున్నాను. మరియు అది ఇక్కడ ఫీనిక్స్‌లో జరిగినందుకు నన్ను క్షమించండి. కానీ అది ఎక్కడో జరగవలసి ఉంది. అది సరియినది. మరియు అది ఇక్కడ జరిగింది.

18

నేను బయలుదేరాను. మరియు బ్రదర్ షారిట్ మరియు నేను, మేము బయటకు వెళ్లాము, మరియు నేను - నేను అలసిపోయాను. నాకు నిద్ర పట్టలేదు. నేను విమానములో ప్రయాణం ప్రారంభించాను. నేను విమానములో ఏడవటం మొదలుపెట్టాను. హోస్టెస్ దగ్గరకు వచ్చింది మరియు అంది, “అయ్యా, విషయం ఏమిటి.” నేను-నేను ఆమెకు చెప్పలేను. ఆమె అర్ధం చేసుకోలేదు. నేను విమానం నుండి దిగాను. నేను లోపలికి వెళ్లాను. సేవకులు వచ్చి నన్ను కలిసినప్పుడు నన్ను లోపలికి తీసుకెళ్లారు, వారు నన్ను పడుకోబెట్టారు, మరియు వారు వెళ్ళారు. వారు నాతో మాట్లాడటం ప్రారంభించారు. మరియు…

రెవరెండ్ బాక్స్ టర్, అద్భుతమైన దైవ సేవకుడు, అతను గదిలోకి వచ్చాడు, తనంతట తానుగా లోపలికి వచ్చాడు. అతను అన్నాడు, “సహోదరుడా బ్రన్హాం,” అన్నాడు, “స్వస్థతావరం మీ నుండి పోలేదని నేను మీకు భరోసా ఇవ్వగలను.” అన్నాడు, “వరములు మరియు పిలుపులు పశ్చాత్తాపం లేకుండానే ఇవ్వబడతాయి.” అన్నాడు,“దేవుడు మీతో వ్యవహరిస్తాడు, కానీ అతను మీ నుండి వరమును తీసుకుంటే అతను తన వాగ్దానానికి పూర్తిగా విరుద్ధముగా ఉంటాడు.” అన్నాడు, “ఇది మిమ్మల్ని విడిచిపెట్టదు.” అన్నాడు, “సంసోను రాత్రంతా వేశ్యతో పడుకున్నాడు, తర్వాత రోజు ఉదయం బయటకు వెళ్లి పట్టణపు తలుపులను తీసుకొని వారితో వెళ్ళిపోయాడు. చూడండి? అది నిజము. మరియు దావీదు మరియు మొదలైన వారు ఆ విధముగా. మరియు చెప్పాడు ”అయన మీతో వ్యవహరిస్తాడు“ అని. అన్నాడు,”మోషె బండతో మాట్లాడవలసి వచ్చినప్పుడు దానిని కొట్టాడు.“ చూడండి? అన్నాడు, ”అది నిజం, కానీ నీళ్లు బయటకు వచ్చాయి. అదినిజం. “ కాని అన్నాడు,”

అయన మీతో వ్యవహరిస్తాడు, మరియు దాని నిమిత్తము మీరు వెల చెల్లించులాగున చేస్తాడు. కాని, చూడండి, వరము అక్కడే ఉంది.“

ఎందుకో నేను చేయలేకపోయాను...ఇప్పుడు, అది పోయిందని నేను భయపడ్డాను. నేను దేవుడిని అస్సలు ఎక్కడా అనుభవించలేకపోయాను. మరియు నేను - నా జీవితములోని అన్ని రోజులలో అలాంటి - అలాంటి మరో మూడు రోజుల ద్వారా ఎన్నడూ వెళ్లకూడదని నేను ఆశిస్తున్నాను మరియు నమ్ముతున్నాను. అది భూమిపై నరకం, మిత్రులారా. ఇది ... నేను ...ఇప్పుడు, దేవుడు ... దేవుడు వెళ్ళిపోయాడు. దూత వెళ్లిపోయింది. పరిశుద్ధాత్మ ... నేను - నేను - నాకు ఏమి లేదు ...

19

[టేపు మీద ఖాళీ యున్నది] ఆ ప్రకంపనలు నా చేతికి తగులుతున్నవి, మరియు నేను ఎలా అనుభూతి చెందానో మీకు తెలియదు. నేను ఆ చిన్న అమ్మాయి కోసం ప్రార్థించే ముందు అది ఇంకా ఉందని నాకు తెలుసు. నేను ఎన్నటికీ దోషిని కాను ...? ... నేను ఎప్పటికీ చేయను... మరియు నేను - నేను మీ కోసం చేయగలిగినదంతా చేస్తాను. మరియు నాకు తెలిసినంత వినయముగా మరియు నెమ్మదిగా నేను నడుస్తాను. మరియు చిన్న అమ్మాయికూడా చెవిటి మరియు మూగ మరియు క్షయ వ్యాధి కలిగి ఉంది [టేపు మీద ఖాళీ యున్నది] కొంచెం [టేపు మీద ఖాళీ యున్నది]...?...ఆమె మాట్లాడగలదు, వినగలదు మరియు క్షయవ్యాధి పోయింది. దేవుడు ఆమెను స్వస్థపరిచాడు.

తరువాత అదే రాత్రి, నేను వారి చిత్రాలను ఇక్కడ పొందాను. మిత్రులారా, నేను - నేను దానిని కూడా తీసుకురాబోతున్నాను. నన్ను క్షమించండి; నేను చాలా భయపడ్డాను మరియు కలత చెందాను. మరియు అక్కడ ఉన్నటువంటి మూగ పాఠశాల నుండి ఒక చిత్రం, వారి ఉపాధ్యాయురాలు, వారు మూగ పాఠశాల నుండి చెవిటి మరియు మూగగా జన్మించిన ఏడుగురు పిల్లలను తీసుకువచ్చారు, మరియు వారిలో ఐదుగురు ఆ రాత్రి ప్రార్ధనా వరుసలోకి వచ్చారు. మరియు మొత్తం ఐదుగురు చక్కగా ఉన్నారు అని ప్రకటించారు. మొత్తం ఐదుగురు, నేను వారి చిత్రాలు, వారి సాక్ష్యం, మరియు వారి ప్రియుల ఇళ్ళకు పంపించాను. చెవిటి మరియు మూగ వారిగా జన్మించారని, వైద్యులచే నిర్ధారింపబడినవారు, కాలిఫోర్నియాకు తీసుకురాబడిన వైద్యులు కాదు మరియు కాలిఫోర్నియాలోని వైద్యులు వారు బాగు చేయబడ్డారని నిర్ధారించారు. వారిలో ఐదుగురు … అలాగే నాకు చట్టపరమైన రక్షణ (లీగల్ డిఫెన్స్) అను వారి నుండి కొన్ని లేఖలు వచ్చాయి. ఒరెగాన్ రాష్ట్ర గవర్నర్ నా కూడికకు వచ్చారు, మరియు ఇడాహో రాష్ట్ర గవర్నర్ గత రాత్రి నా కూడికలో హాజరయ్యారు, మరియు వారి ప్రముఖ వైద్యులు మరియు ప్రతిదీ. కాబట్టి ప్రభువు ఇప్పుడే ఆశీర్వదించటం ప్రారంభించాడు (మీకు తెలుసా?) ఆ విధంగా. కనుక ఇది అద్భుతముగా ముగించబడింది. మరియు - మరియు నేను చాలా కృతజ్ఞుడను. నేను ఎప్పటికీ దోషిగా ఉండకూడదు.

20

మరియు నేను ఇప్పుడు ప్రజలకు చేసిన విధముగా... గడచిన ఈ రెండు వారములు నేను ఇదివరకు కలిగిన రెండు వారముల సమయము కంటే చాలా ఎక్కువ అద్భుతాలు జరిగాయని నేను కనుగొన్నాను. నేను ప్రజలను ప్రార్ధనా వరుస గుండా తీసుకువచ్చి, వారి కోసం ప్రార్థిస్తున్నాను. అప్పుడు నామీద ఉన్నదేదో నన్ను ఆపి మరియు ప్రజలను లాగినపుడు, బహుశా ఎవరికైనా తగినంత విశ్వాసం లేకపోవడం లేక ఏదో; అప్పుడు వారు వచ్చినప్పుడు అది నన్ను ఆపుతుంది. అటుతరువాత అప్పుడే బలిపీఠము మీద అద్భుతాలు జరుగుతాయి. లేకపోతే, నేను దేవుడు చెప్పినట్లు మాత్రమే వెళ్తాను ...? ... కొందరు మనుషులు చేయమని చెప్పినట్లు కాదు . “నేను నా తల్లిని తెస్తాను, మీరు ఆమెను బాగు చేయండి. ఆమె వికలాంగురాలు మరియు పొరుగువారు నమ్ముతారు.” మీరు దీనికంటే ఎక్కువ నిందను తీసుకురాలేరని నేను కనుగొన్నాను. మరియు కేవలం ... అది సరైనది. ఎందుకంటే ఆమెకు మొదటి స్థానంలో నమ్మకం లేదు. మరియు అలా ... మరియు ఆ విధముగా, ప్రజలు దానిని అదునుగా తీసుకుంటారు. కాబట్టి నేను ... దేవుడు నన్ను క్షమించినట్లయితే, నాకు తెలుసు. మరియు నేను తిరిగి ఎన్నటికీ ఈ విషయములో దోషిని కావాలనుకోను.

21

మరియు ఈ గత కొన్ని వారాల్లో నా కూడికలలో గత మూడునాలుగు నెలలు లేదా ఐదు నెలలు కంటే ఎక్కువ అద్భుతాలు జరిగాయి (అది సరియైనది): ఎక్కువ అద్భుతాలు. మరియు మేము ప్రజలను కూడా జాగ్రత్తగా చూసుకోలేకపోయాము. ఒరెగాన్ కూడికలనుండి ఇక్కడ మరియు అక్కడ ఎవరైనా ఉంటే, వారు గ్రహించారు తమ ఆడిటోరియములు మరియు స్కేటింగ్ రింక్లు మరియు మండపాలు మరియు మనము తీసుకునే ప్రదేశములు, ప్రతి రాత్రి వేలాది మంది వెనుకకు వెళ్ళిపోయారు, మరియు వేల రెట్లు ప్రజలు స్థలములోకి ప్రవేశించగలిగారు. మరియు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు మరియు గొప్ప కార్యములు చేస్తున్నాడు. ఇప్పుడు, అప్పటి నుండి చాలా మంది ప్రజలు బాగుపడ్డారు, ఎందుకంటే దేవుడు నేను ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడో అక్కడ ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. మరియు మీరు దానిని అర్ధం చేసుకుంటారని నాకు ఖచ్చితముగా తెలుసు. నాకు కావాలి ... ఇప్పుడు నా ఉద్దేశ్యం మీకు అర్థమైందా? ప్రజలనుబట్టి నేను అద్భుతాలు చేయకూడదు. ఎవరి దగ్గరైనా దేవుడు నన్ను ఆపాలి అనుకుంటే...

22

కానీ ఇప్పుడు, ప్రియమైన మిత్రులారా, అది ఏమై ఉన్నదో ఇక్కడ ఉంది. ఆ ప్రకంపనలు అదే విధముగా కదిలాయి... అది దేవుని యొక్క దైవిక వరము. ఇప్పుడు, అతను దానిని నా నుండి దానిని తీసివేయబోతున్నట్లయితే, ఈ మధ్యాహ్నం ఈ బలిపీఠము నుండి నేను బయటకి రాను. ఎందుకంటే నేను వేరొకరికి సహాయం చేయలేనప్పుడు, నేను ఇక్కడ ఉండాలనుకోవడం లేదు. మరియు నేను - నేను ... అప్పుడు నేను ప్రార్ధనా వరుసను ప్రారంభించాను. మరియు అటు తరువాత దేవుడు ఇదివరకు ఎన్నడూ లేనంతగా అద్భుతాలు చేయడం ప్రజలు చూడటం ప్రారంభించారు. కొన్నిసార్లు వారి నిమిత్తము ప్రార్ధన చేయబడుతుంది మరియు వారు తిరిగి వెళ్తారు మరియు ఆ చంక కర్రలతోనే కూర్చుంటారు మరియు లేస్తారు. వారు కూర్చొని ఉండగా దేవుని శక్తి అంతా ఒకేసారి వారిమీదకు వస్తుంది, వారి ఊతలను పడవేసి భవనము చుట్టూ మరింత వేగముగా పరిగెడతారు. మరియు ఇక్కడ ఎవరో పడక మీద ఉండగా, పక్షవాతముతో వణుకుతూ అక్కడ పడుకుని ఉన్నప్పుడే. అకస్మాత్తుగా వారు ఇంకను ప్రార్థన కొరకు వేచి చూస్తుండగా, బహుశా ఒక అరగంటకు ముందుగానే వారు పక్షవాయువుతో ఊగుట మాని వారి పరుపుల నుండి పైకి లేచిరి. మరియు వారిలో కొందరు ఇంటికి వెళ్తారు, మరియు -మరియు బహుశా కొన్ని గంటలు ఇంట్లో అలాగే ఉండవచ్చు మరియు రాత్రి మేల్కొని, లేదా అలాంటిదే మరొకటి. మరియు ఇక్కడ కూడికలకు వారు దేవుణ్ణి స్తుతిస్తూ వస్తారు, స్వస్ధపరచబడి. చూస్తున్నారా? కానీ ప్రజలు చేయవలసింది అదే. వారు నమ్మవలెను. చూస్తున్నారా? ఇది మరియ చెప్పినట్లుగా లేదా - యేసు ఇలా చెప్పారు మరియ మరియు మార్తా: “మీరు రాయిని తీసివేయండి.”చూడండి? మీరు స్వయముగా చేయవలసిన కార్యము ఉన్నది. మరియు మీరు దానిని నమ్మాలి. దేవుడు పని చేస్తాడు. ఇక్కడి వలే. ఈ విధంగా నేను అన్నింటినీ ప్రజల నుండి తీసివేస్తున్నాను. అదంతా చేస్తున్నది నేనే. చూశారా? కానీ అక్కడ మీరు చేయవలసిన కార్యము ఏదో ఉంది. మీరు వెళ్లి, నమ్మితే, స్వస్థపడుతారు.

23

మరియు ఒక చిన్న పిల్లవాడు ... ఇది చాలా దయనీయమైనది; ఆ చిన్న పిల్లవాడు వచ్చాడు . నేను దీనిని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ఆడిటోరియములో అది వేలాడుతుంది. ఒక చిన్న పిల్లవాడు కాళ్ళకి పట్టీలు, పోలియోతో అతను వచ్చాడు. అతను చెప్పాడు, “సహోదరుడా బ్రాన్హాం”, అతను చెప్పాడు, “నాకోసం మీరు ప్రార్ధన చేస్తారా?”

నేను “సరే” అన్నాను,

మరియు అతని తల్లి అక్కడ ఉంది, మరియు- మరియు నేను చెప్పాను... మరియు ఆమె చెప్పింది, “మీరు అతని కోసం ప్రార్థన చేస్తే, సహోదరుడా బ్రాన్హాం... ”

మరియు నేను, “సరే, సహోదరి” అని చెప్పాను. నేను చెప్పాను, “ఇప్పుడు, నువ్వు కాదు ...”

ఆమె చెప్పింది, “నేను ఒక అద్భుతాన్ని కోరుకొనడం లేదు.” ఆమె ఇలా చెప్పింది, “మీరు ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను. ”మరియు నేను చిన్న పిల్లవాడి కోసం ఒక క్షణం ప్రార్థన చేసి అతనిపై చేతులు ఉంచాను. మరియు సహోదరుడా, సహోదరి, ఆ తర్వాత రెండు రాత్రులు, చిన్న పిల్లవాడు తలుపు వద్ద నిలబడి ఉన్నాడు, నేను వచ్చే ప్రవేశద్వారం వద్ద , అతని పట్టీలు అతని వీపుపై వేలాడుతున్నాయి. అతను అక్కడ నిలబడి ఉన్నాడు. చూడండి? తల్లి యొక్క సామాన్యత, దీనత్వం తెలుసుకోవాలంటే ...? ... “నేను దేవుడిని నమ్మగలను; నేను ఏ గొప్ప అద్భుతాన్నీ చూడవలసిన అవసరం లేదు. కానీ నేను దేవుడిని నమ్మగలను.”

24

అటుతరువాత నా పరిచర్య మొదటి స్థానములో ఉన్నదానికంటే ఎక్కువ ఆశీర్వదింపబడింది. మీరు చూస్తున్నారా? కాబట్టి ... మరియు అక్కడ నిలబడి ఉన్న చిన్న పిల్లవాడు తన చిన్న కాలును కదిలించి మరియు ఆ విధముగా. ఇప్పుడు మూడురాత్రుల సమయములో, ఆ చిన్న పిల్లవాడు తిరిగి వచ్చాడు మరియు పట్టీలు అతని భుజాల మీద వేలాడుతున్నాయి, అక్కడ నిలబడి ఉన్నాడు. వాటిని పట్టుకుని: పెద్ద బూట్లు, అతని బూట్లు అతని పట్టీలు పట్టేలాగా చేయవలసివచ్చింది. [టేపు మీద ఖాళీ యున్నది]...?... అంతే. స్వస్థత ఆ విధముగానే ఉండాలి, స్నేహితులారా. మానవునిపై ఎక్కువ ఆధారపడవద్దు [టేపు మీద ఖాళీ యున్నది]. ఎవరైతే సర్వశక్తిమంతుడై ఉన్నాడో ఆ దేవునిపై విశ్వాసం పెట్టండి (మీరు చూస్తున్నారా?) ఎందుకంటే ఇది ఏమీ పనిచేయదు. కానీ ఆయన చిత్తం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. మరియు మీరు పొందుకుంటారు [టేపు మీద ఖాళీ యున్నది]- మీకు నయమవుతుందని చిన్న బిడ్డలవలే సామాన్యముగా నమ్మండి, ఈ చిన్న ప్రార్ధన దేవుడు మీకోసం నన్ను చేయమన్నాడు అని నమ్మండి, మీరు కేవలం దానిని నమ్మినట్లు అయితే, మీరు దేనిని అడిగారో దానిని మీరు కలిగి ఉంటారు.

25

ఇప్పుడు, దానిలోకి ... అప్పుడు ఏమి జరిగిందో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. వారం చివరిలో, చాలా మంది ప్రజలు వస్తున్నారు. వారు కెనడా నుండి వచ్చారు, ప్రతిచోటు నుండి వచ్చారు. మరి అన్నియు క్రమముగా... నేను ఫీనిక్స్ తిరిగి వచ్చే వరకు నేను సూర్యుని వెలుగు చూడలేదు. సూర్యుని చూడటం చాలా సంతోషముగా ఉంది, ఏమి చేయాలో నాకు తెలియదు. మరియు మనము చెల్లించవలసిన దగ్గర నేను మిమ్ములను చూస్తున్నాను - ఒక రెస్టారెంట్‌లోకి వెళ్లి, ఒక పంపర పనస లేక పెద్ద దబ్బపండు (grapefruit) కోసం యాభై సెంట్లు చెల్లించాల్సి వచ్చింది. ఒక పంపరపనస పండు రెండు సగములకు యాభై సెంట్లు, మరియు మీరు ఎక్కడ ఉన్నారో నేను చూశాను ... [టేపు మీద ఖాళీ యున్నది] నేను అన్నాను ,“ఇది దేవునిది...?...అప్పుడు ” అది సరియినది, అవి చెట్ల మీద పెరగడం మీరు చూశారు, మరియు - మరియు ఆ విధముగా, మరియు ఒక పంపర పనస పండుకు యాభై సెంట్లు, నేను చెప్పాను, “మంచిది, నేను వీధిలోనికి వెళ్లి ఫీనిక్స్‌లో వాటిని ఫుట్‌బాల్‌ వలే తన్నుతాను.” నేను చెప్పాను ... ఓహ్, స్నేహితులారా మీరు నివసించడానికి ప్రపంచములో అత్యంత సుందరమైన ప్రదేశం కలిగి ఉన్నారు. మీరు కలిసి ప్రార్ధించాలని నేను ఆశ పడుతున్నాను, మరియు మీరు- మీరు ప్రపంచములోనే అత్యుత్తమ సంఘమును కలిగి ఉండవచ్చు, ఉత్తమ ప్రజల సమూహమును కలిగి ఉండవచ్చు. మీరు సమస్తమును కలిగి ఉన్నారు.

కొద్దిసేపటిక్రితం నేను చాలా భయపడ్డాను కాబట్టి సహోదరుడు నన్ను చుట్టూ తిప్పడానికి బయటకు తీసుకువెళ్లాడు (సహోదరుడు షర్రిట్) - మరియు కూటమునకు రావడానికి ముందు నన్ను కొంచెం బయట తిప్పాడు. మరియు నేను అన్నాను, “ఇక్కడ ఈ స్వర్గాన్ని చూడండి. ఎందుకు, మీరు కలిసి ఉంటే వెయ్యేళ్ల పరిపాలనకు సిద్ధముగా ఉన్నారు. అది సరిఅయినది. కనుక ఇది ఖచ్చితముగా అద్భుతమైనది మరియు బాగుంది.

26

ఇప్పుడు... అప్పుడు శుక్రవారం రాత్రి, గత శుక్రవారం రాత్రి, వాగ్దానం చేసినట్లుగా ఫీనిక్స్‌ లో కూడికలకు రావడానికి నేను నా రిజర్వేషన్లు చేసుకున్నాను. విమానాలు వారమంతా నిలిపివేయబడ్డాయి. అప్పుడు నేను అన్నాను. “నేను బస్సు పట్టుకుని సాన్‌ఫ్రాన్సిస్కోకి వెళ్తాను, బహుశా పొగమంచుపోయి ఉంటుంది.” కొన్నిసార్లు అది ఒక గంట వరకు లేకుండా ఉంటుంది; మరలా తిరిగి వస్తుంది. మరియు విమానాలు తిరగడానికి వెళ్ళవచ్చు, అటుతరువాత వాటికీ అవకాశం వచ్చినప్పుడు కిందకి వస్తాయి, అవి శాన్ ఫ్రాన్సిస్కోలో భూమి మీద నిలపవచ్చు: మరియు భయంకరమైన పొగమంచు. మరియు నేను అన్నాను, “బస్సు లో వెళ్తాను” అని. మరియు నేను చాలా బలహీనపడుచున్నాను మరియు ఎక్కడ వరము ఎలా ప్రారంభించాలో...? ... పనిచేస్తుంది; అందువలన, నాకు ఇప్పుడు ఏదో తెలుసు... నేను విడిచిపెట్టాలి లేక మరియు - నేను త్వరపడాలి.

27

ప్రజలు నన్ను దాటారు; వారు ఎప్పుడూ నా మీద వారు లేదా వారిపై నేను చేతులుంచలేదు. మరియు వారు నన్ను దాటారు, మరియు ఆ స్వస్థత కారణముగా నా నుండి ఆ బలం పోయింది...ఆ ప్రజలు నమ్ముతున్నారు. వారి కొరకు నేను ప్రార్ధింపనవసరం లేదు. నేను వారి కొరకు ప్రార్ధించినట్లుగానే వారి విశ్వాసం చేరుకుంది మరియు పొందుకుంది (మీరు చూస్తున్నారా?). కాబట్టి గతరాత్రి ప్రార్ధనా వరుస వలన నేను చాలా బలహీనమైపోయాను. సుమారు మూడు వేలమంది గతరాత్రి నన్ను దాటారు, మూడు వేలు, నేను నేలమీద కూలిపోయే వరకు. మరియు వారు నన్ను వారి చేతులతో ఎత్తుకున్నారు, ఇద్దరు మనుషులు నన్ను ద్వారము వద్దకు తీసుకువచ్చారు.

మరియు అనేక ఆత్మలు ప్రజల నుండి బయటకు వెళ్లి ఇతరులలోకి ప్రవేశించాయి. ఈ మహిళ మతిస్థిమితం కోల్పోయింది. ఆమె - ఆమె మనసును దేవుని నుండి ఆమెతో మాట్లాడుతున్న ఇంకో స్త్రీ వైపునకు మరల్చింది, అక్కడ కూర్చుని , నేను ప్రార్దిస్తున్నపుడు ఆ స్త్రీతో మాట్లాడుటకు ఆమె తిరిగింది మరియు ఒక పిచ్చి ఆత్మ ఆమెపైకి వచ్చింది. నేను ఆ దీన ఆత్మను అలా విడిచిపెట్టవలసి వచ్చింది; ఆమె ఇంకా మతిలేనిదిగానే ఉంది. మరియు ఒకరిలో నుండి ఒకరిలోకి వెళ్ళే అనేక మూర్ఛరోగాలు ఉన్నాయి అంతవరకు ...

28

అప్పుడు నేను ద్వారం బయటకు బయలుదేరాను, మరియు నేను - బస్ స్టేషన్‌కు వెళ్లాను... సహోదరుడు లిండ్సే మరియు కొంతమంది - సేవకులు, వారు చెప్పారు, “మీరు ఈ విధముగా వెళ్ళకూడదు.”

నేను అన్నాను, “నేను ఫీనిక్స్‌కు తిరిగి వెళ్లాలనుకుంటున్నాను.” మరియు వారు చెప్పారు ... “మంచిది,” నేను చెప్పాను, “జరిగినటువంటి అలాంటి ఒక విషయం; నేను వెళ్లి మన పరలోక తండ్రి నాకు మరొక అవకాశం దయచేసాడు అని చెప్పాలని ఆశపడుతున్నాను. కాబట్టి నేను- నేను చెప్పాను, ”నేను-నేను వెళ్లి వారికి చెప్పాలి.“

వారు అన్నారు, “ఎందుకు, మీరు వెళ్ళలేరు.”

ఒక స్త్రీ అన్నది, “నేను మిమ్మల్ని కారులో తీసుకువెళతాను.”

ఓహ్, మరియు నేను అన్నాను, “లేదండి. నేను బస్సులో వెళ్తాను.” కాబట్టి నేను అక్కడ వేచి ఉన్నాను ... విడిచిపెట్టిన తరువాత, మరియు మేము బస్సు కోసం వేచి ఉండటానికి వెళ్ళాము. నేను శాన్ ఫ్రాన్సిస్కోకు నా టిక్కెట్ పొందాను. మరియు కూర్చుని... మరియు బస్సు వచ్చింది. అప్పటికే మూడు గంటలు ఆలస్యమైంది. మరియు పొగమంచు, మీరు ఎంతమాత్రము చూడలేరు. మరియు అక్కడ బల్ల వద్ద సిద్దపడుచుండగా, నేను చాలా భయపడ్డాను, మరలా నేను మానవ స్పర్శకు అందకుండా దాటిపోయాను, మరియు నేను నిద్రపోతున్నాను అని వారు అనుకున్నారు. అటుతరువాత వారు నన్ను తీసుకువెళ్ళారు, మరియు, నేను దాని నుండి బయటకు వచ్చినప్పుడు, అప్పుడు ఆ- ఆ బస్సు సుమారు తెల్లవారుజామున ఒంటిగంట, రెండు గంటల సమయములో వచ్చింది. ఎందుకంటే, అది మరింత దూరం వెళ్లలేకపోయింది; అతను నిలిపివేయవలసినదే. అప్పుడు అతను పర్వతాల మీదుగా నడపలేకపోయాడు. అది నన్ను ఫీనిక్స్ నుండి పూర్తిగా బయటకు నెట్టివేసింది.

29

నేను ఇంటికి వెళ్లినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు, నేను వేగముగా విఫలమవుతున్నట్లు నేను చూడటం మొదలుపెట్టాను, ఆపై నలభై నాలుగు గంటలు నేను సాధారణ స్థితికి చేరుకున్నాను. అప్పుడు అది జరిగినప్పుడు, అప్పుడు నాకు తెలుసు నేను ఎంత బలహీనముగా ఉన్నానో, ఎంత నిజంగా ...? ... శరీరం. నేను వెళ్ళాను ... అప్పటి నుండి నాకు బలహీనముగా అనిపించడం మొదలుపెట్టింది మరియు అలసిపోయాను, అయిననూ నేను కూటమునకు రావాలనుకున్నాను. మరియు ఇప్పుడు జబ్బుపడిన మరియు బాధపడుతున్న మీ కోసం ప్రార్ధించటానికి నేను ఫీనిక్స్ తిరిగి వచ్చాను. మరియు మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు, అర్ధం చేసుకోరా? మీరు అర్ధం చేసుకుంటారు, మీ పూర్ణ హృదయముతో నన్ను నమ్మండి, ఈ జబ్బు పడిన ప్రజలు నా వద్ద నుండీ వెళ్లిన తరువాత, గుర్తుంచుకోండి, వారు బాగుపడతారు. మీరు వెళ్లి కేవలం నమ్మండి. మరియు మీరు వచ్చినపుడు, మీ విశ్వాసం సమీపించి మరియు ఆ స్వస్థతా వరమును పట్టుకుంటుంది మరియు మీరు స్వస్థత పొందుకుంటారు. మీరు దానిని నమ్మడం లేదా, మీరందరు? అది అన్ని రకములుగా పనిచేస్తే ... వినండి. ఇక్కడ ఉన్న ప్రియమైన ఫీనిక్స్ ప్రజలారా, మీలో ప్రతి ఒక్కరు మీ కాపరి దగ్గరికి వెళ్లి, ప్రతి ఒక్కరు, “ఫీనిక్స్ లో ఐక్యత ఉజ్జీవములను కలిగి ఉందాం” అని చెప్పాలి మీరు అలా చేయగలరని మీరు అనుకోవడం లేదా, ఐక్యత ఉజ్జీవములను కలిగి ఉండండి మరియు ప్రతి ఒక్కరు రక్షణను కలిగి దేవుని కొరకు జీవిస్తూ వెళ్లనివ్వండి. మీరు దానిని చేయగలరని నమ్మడం లేదా? మీరు కేవలం నమ్మినట్లయితే మీరు ఖచ్చితముగా చేయగలరు. విశ్వాసం కలిగి ఉండండి మరియు దేవుని నమ్మండి, ఎందుకంటే అయన దానిని చేయాలనుకుంటున్నాడు. మరియు అయన రాలేడు…ప్రణాళికనుండి ఈ చిన్న ఫీనిక్స్ వేరైపోయిందని తెలుసుకొనుటను నేను ఇష్టపడుట లేదు.

30

ఇప్పుడు, నా లేఖనములను నేను ఎక్కడైతే విడిచిపెట్టానో వాటిని తీసుకొంటాను. మీరు యెహోషువాను గుర్తుచేసుకుంటారు, లేఖనములు అన్నిటి గుండా మీరు ఇశ్రాయేలు పిల్లలను తీసుకువచ్చినపుడు, అది చివరి భాగమునకు మాదిరిగా ఉంది. అది నిజమేనా? ఇప్పుడు, ఇశ్రాయేలు పిల్లలు ఎలా మూడు దశల ప్రయాణం కలిగి ఉన్నారో నేను మీకు చెప్పాను; వారు కలిగి వున్నారు: మూడు దశలలో వారి ప్రయాణమును. అది నిజమేనా? మరియు సంఘము దాని మూడో దశలోకి వచ్చింది. అది నిజమా?

గుర్తు ఉంచుకొనండి...[టేపు మీద ఖాళీ యున్నది] నూతన దేశము యొక్క ఆధారములతో వెనుకకు వచ్చినపుడు, ఇప్పుడు ప్రజలైన మీరు అక్కడే నిలబడి ఉన్నారు. కానీ మీరు ...?...[టేపు మీద ఖాళీ యున్నది] సంఘమునకు చెందిన మీరు నమ్మలేకపోయారు. వారు గందరగోళములో పడి మరలా అరణ్యములోనికి వెళ్లారు, మరియు అక్కడ...వారు జబ్బుపడటం మొదలైనది, మరియు అక్కడే ఇత్తడి సర్పము సంఘమునకు ఇచ్చిన వరం. అది నిజమేనా? పెంతెకొస్తునకు... చూడండి, పెంతెకొస్తు సంఘము తరువాత సంఘము అనేకములుగా చీలిపోయింది, సంపూర్ణ సువార్త మీరు...[టేపు మీద ఖాళీ యున్నది] అప్పుడు జబ్బు మీ మధ్యలోకి వచ్చింది...?... [టేపు మీద

ఖాళీ యున్నది]

31

నేను ఈ పరంపర (సిరీస్‌)ను ముగించేలోపు మీరు మరొక విషయం గమనించండి. ఇప్పుడు, ముందుగా...ఇప్పుడు... [టేపు మీద ఖాళీ యున్నది] ఈ గడియ వరకు ఛాయలు మరియు మాదిరులు వచ్చాయి. అది ఛాయ మరియు మాదిరి అయితే దానిలో మిగిలినదంతా కూడా నెరవేరాలి. ఇప్పుడు, మీరు దీన్నిపొందులాగున ... ముఖ్యంగా సేవకులైన మీరు దీనిని పొందాలని నేను కోరుకుంటున్నాను.

గుర్తుంచుకోండి, వారి నాయకుడైన మోషే అన్ని వేళలా ఈ దినము క్రీస్తు ఆత్మకు మాదిరిగా ఉన్నాడు. అది నిజమేనా ? కానీ మోషే ప్రజలను ఎప్పుడూ యోర్దాను దాటించలేదు. ఒక కొత్త క్రమము వచ్చింది. అది నిజమేనా? సంఘ నిర్వాహకుడైన మోషే ప్రజలను ఎప్పుడూ యోర్దాను దాటించలేదు. యెహోషువా ప్రజలను దాటించాడు. అది నిజమేనా? మిత్రులారా, మన గొప్ప సంస్థ సంఘమును యోర్దాను దాటించలేదు. ఇప్పుడు, దానిని గుర్తుంచుకోండి. యెహోషువా రంగం మీదకి వచ్చాడు. చూస్తున్నారా? దేవుడు సంఘముకు తొమ్మిది ఆత్మీయ వరములను పంపబోతున్నాడు. అది అంతటిని ఒక్కటిగా లాగుతుంది మరియు ఆమె యోర్ధానును దాటుతుంది. అయన అన్నది జ్ఞాపకపరచుకొనండి, “ఇప్పుడు లేచి, ఈ యోర్ధానును దాటుదాం,” అని యెహోషువాతో అన్నాడు.

మరియు నేను నమ్ముచున్నాను సంఘ చరిత్రంతటిలో ఒక సమయము ఉంటే, ఆ స్వరము ఇప్పుడే, “లెమ్ము, మనము ఇప్పుడే యోర్దానును దాటుతున్నాం.” అది నిజము. అన్నిటి గుండా సంఘము లాగబడింది. ఇక్కడ సంఘశాఖలుగా అది చీలిపోయింది, దీని మీద ఇదే నా చివరి మాటలు. నేను తీవ్రముగా ప్రయత్నించాను.

32

నేను - నేను ఫీనిక్స్‌ను ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇప్పుడు, నేను ప్రతిదీ ఏక హృదయం మరియు ఏకాత్మను కలిగి ఉండుట చూడాలనుకుంటున్నాను. నేను ఇక్కడకు వచ్చి దీనిని నా గృహముగా చేసుకోవాలని ఆశపడుచున్నాను. నేను ఎక్కడైతే ... యేసు వచ్చు వరకు, ఆదివారము వెంబడి ఆదివారము ఆలాగు ప్రతి ఆదివారము మీరు కూడికను కలిగి ఉండండి. కానీ నేను- నా అంతట నేను దానిని చేయలేను. కానీ నేను మీకు నా దర్శనాన్ని ఇవ్వబోతున్నాను. ఈ సమయములోనే మన సంఘశాఖలు ... వారు ఒకరితో ఒకరు ఏకీభవించరు. చూస్తున్నారా? మరియు ప్రజలైన మీరు ఒకరితో ఒకరు అంగీకరించే సమయము ఇదే, సంఘము కూడా. ఈ విధముగా ఈ వరము సంఘములోనికి వచ్చి, రెండు వైపుల వారిని ఆకర్షిస్తుంది, ప్రజలను వారి సంఘములనుండి బయటకు తీసుకురావడం కాదు. కాదు, మీరు మీ సంఘమునకే వెళ్ళండి. మీ సంఘము, మీ సంస్థ మంచిదే. నేను దానికి వ్యతిరేకము కాదు. కానీ సహోదరుడా, నీవు ఎంతమాత్రము నేను వేరొకరికంటే కొంచెం మెరుగుగా ఉన్నాను అని అనుకొనవద్దు, లేదా ఎవరైనా నీకంటే కొంచెం తక్కువ అని అనుకొనవద్దు.

మీరు గుర్తుంచుకోండి, మనమందరం దేవునితో ఒక సమానత్వం కలిగి ఉన్నాము. మనం అయన కుమారులు మరియు కుమార్తెలం. మరియు మనం దేవుని కుమారులు మరియు కుమార్తెలు అయితే, మనం అలా ప్రవర్తిద్దాం, అలా మాట్లాడుదాం, అలాగే జీవించుదాం, మరియు దేవుని కుమారులు మరియు కుమార్తెల వలే ఉందాం.

33

ఇప్పుడు, దీనిని చేయునది ఆ వరములే. చూడండి, వైఖరి మారింది. మార్టిన్ లూథరు కాలం నుండే ప్రపంచాన్ని సంఘము నడిపించింది. అది నిజమేనా? కానీ సంఘకాలము గతించిపోతుంది. అది నిజం. అది మోషే భాగము. అది గతించిపోయింది, ఎందుకంటే మోషే దేవుడిని విఫలపరచినట్లే, సంఘము దేవునిని విఫలపరచింది. సంఘశాఖలు అని నా ఉద్దేశం. నేను ఏమి చెప్తున్నానో మీరు అర్థం చేసుకుంటున్నారా? నేను ఏమి మాట్లాడుతున్నానో మీకు అర్థం అయిందని ఎంతమంది అనుకుంటున్నారు? ధన్యవాదాలు, మిత్రులారా.

చూడండి, వారు - వారు దానిని పోందుకోలేరు అని అపవాది కొన్నిసార్లు నాతో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ మీరు పొందుకుంటారు అని నాకు తెలుసు. చూస్తునారా? అది విఫలమైంది. సంఘము విఫలమైంది. అది ఎంతవరకు వెళ్లిందంటే, మీరు మేథోడిస్టులు కాకపోతే, మీరు అందులో లేరు; మీరు బాప్టిస్ట్ కాకపోతే, మీరు అందులో లేరు; మీరు అసెంబ్లీస్ ఆఫ్గాడ్ కి చెందినవారు కాకపోతే, మీరు అందులో లేరు; మీరు ఏకత్వముకు చెందినవారు కాకపోతే, మీరు అందులో లేరు; మీరు దీనికి లేక దానికి చెందినవారు కాకపోతే, మీరు అందులో లేరు.

34

సంఘము విఫలమైంది. చూస్తున్నారా? ప్రజలను ఒక్క శరీరముగా తీసుకురావడానికి బదులు, అది వారిని వేరు చేసింది. మోషే వలే, బండతో మాటలాడుటకు బదులు, అతను బండను కొట్టాడు (చూసున్నారా?), మరియు అది విఫలమైంది. కాబట్టి సంఘము ఎప్పటికీ ప్రజలను యోర్దానును దాటించలేదు. అది నిజము.

కాని ఇప్పుడు, దేవుడు తన క్రమాన్ని మార్చాడు, ఆయన వెనుకకు పంపుతున్నాడు... నా మాటలు గుర్తుపెట్టుకుంటున్న మీరు, ఈ ప్రపంచములోకి గొప్ప వ్యక్తులుగా వచ్చుటకు మార్గములో ఉన్నారు. అది నిజము. ఈ ప్రపంచములోకి వచ్చుటకు గొప్ప శక్తులు మార్గములో ఉన్నాయి. ఇది ఒక ప్రజలు ప్రజలను బయటకు పిలవడమై ఉన్నది. జ్ఞాపకపరుచుకోనండి, “నా ప్రజలారా, దానిని విడిచి రండి.” అది సరియైనదేనా. బబులోను, గందరగోళము... ఇప్పుడు ప్రజలలో నుంచి కాదు, సంఘములో నుంచి కాదు కానీ మీ మధ్యలో ఉన్న గందరగోళములో నుంచి బయటకు రండి. చూస్తున్నారా? బయటకు రండి; ఏక హృదయం మరియు ఏక ఆత్మ మరియు ఏక తాత్పర్యముతో దేవుని ఆరాధించుదాం. అది సరైనదేనా? అప్పుడు దేవుడు తన సంఘమును యోర్ధానును దాటిస్తాడు. అది మరణమును దాటును. ఇప్పుడు, మీ హృదయమంతటితో మీరు దానిని నమ్మండి.

35

నేను కేవలం దీనిని చదువుతున్నప్పుడు… మీలో ఎంతమంది… ఈ “హెరాల్డ్ ఆఫ్ ట్రూత్.”ను మీరు కనుగొనలేదని నేను ఎరుగుదును. సహోదరీ, ఈ సహోదరుడు ఎక్కడ ఉన్నాడు? మీరు ఇంకనూ దీనిని తెలియజేయలేదు, అవునా? ఇది “హెరాల్డ్, హెరాల్డ్ ఆఫ్ ట్రూత్” పత్రిక, నూతనమైనది. నేను ఈ సంవత్సరం, ఈ నెల దానిని గమనిస్తున్నాను…?...

గడచిన రాత్రి నాకు ఒక అనుకొనని సంఘటన జరిగింది. నా భార్య..... నేను అలసటగా మరియు అపస్మారక స్థితిలో అక్కడ ఉన్నాను అని నా భార్య విన్నపుడు అది ఆ చిన్న దీనప్రాణిని చంపబోయింది. ఆమె కలత చెందింది. నేను ఎప్పుడూ..... ఆమె చాల వెనుకబడి ఉంది, నేను ఆమె చిత్రాన్ని తీయలేకపోయాను. కానీ ఆమె దాని చిత్రము తీసింది, మరియు దానిని నాకు పంపింది. మరియు కొద్ది సేపటి క్రితం నేను ఆమెతో మాట్లాడుతున్నాను ... మరియు నా చిన్న కుమార్తె, ఇరవై నెలల వయసు, నా కొరకు టెలిఫోనులో ప్రార్ధన చేసింది. ఆమె చిన్న హృదయాన్ని దేవుడు దీవించును గాక, ఆమె తండ్రిని చూసింది, “యేసయ్య, నా తండ్రికి సహాయము చేయండి. యేసయ్య, నా తండ్రి ఇంటికి వచ్చుటకు సహాయము చేయండి.” ఈ మాసములో వారు దానిలో మా చిత్రములు కలిగి వున్నారు, లేదా ఆమె మరియు నాది మరియు నా కార్యదర్శి సహోదరుడు కాక్స్ మరియు సహోదరి కాక్స్. వారు శ్రేష్ఠమైన ప్రజలు.

36

మరియు ఇక్కడ, నేను కొద్దిగా చదివి వినిపించాలని ఆశపడుచున్న సాక్ష్యాన్ని ఇక్కడ నేను గమనించడం జరిగింది. మరియు అది ...?...[టేపు మీద ఖాళీ యున్నది] ఆమె స్వస్థపరచబడింది, కొంతమంది మంచి వైద్యులు, ఆమె నరాలు విఫలమయ్యాయని నిర్ధారించారు. ఆమె చాలా పిచ్చిగా అయింది. ఆమె కేవలం చిన్నదానివలే...?... ఆమె చిన్న చిత్రం మీరు అక్కడ చూడవచ్చు. ఆమె మానవ ప్రేమలో కొంత భాగం; అంతే. మరియు దేవుడు ఆమెను అక్కడికక్కడే తక్షణమే స్వస్థపరిచాడు. నెలల తరబడి మంచములో ఉన్న ఆమె లేచి చిన్న పైజమాతో నడిచింది. ఎందుకు, మీరు కనీసం ఆమె దగ్గరకు కూడా వెళ్ళలేరు, ఆమె కలిగి ఉంది [టేపు మీద ఖాళీ యున్నది] ఆమె మీద మరియు అంతటా. ఆమె మీదంతా మరియు అంతటా రక్తము ఉంది. ఆమె ఒక్క నిమిషములో నెమ్మదించి మరియు ఆమె చిన్న పైజమాలో నడిచింది, తన చిన్న చెప్పులు వేసుకుని, ఆ సోడా ఫౌంటెన్ వరకు నడిచింది మరియు నాతో సోడా తాగింది. నలుమూలల నుండి వచ్ఛే ప్రజలు, ప్రతి చోటా, ఆమెవైపు చూస్తూ...?...[టేపు మీద ఖాళీ యున్నది]

37

నాకు ఇక్కడ ఒక సాక్ష్యం ఉంది నేను -నేను దానిని చదవాలనుకుంటున్నాను. మీకు తెలుసా, తదనుగుణంగా, ఈ సాక్ష్యములు మీకు చెప్పుటకు నాకు ఇప్పుడు దాదాపు పదిహేను నిమిషాల సమయం ఉంది, అటుతరువాత సమయము జబ్బు పడినవారికొరకు ప్రార్ధించుటకు.

ఇక్కడ, కొంతకాలము క్రితము, నేను అనుకుంటున్నాను, ప్రజల మధ్యలో ఒక... “అజుసా న్యూస్” ను మీరందరు చదివారా? “అజుసా న్యూస్” ఎవరి దగ్గరైన ఉందా? సరే. మీదగ్గర ఉందా? “జోన్స్‌బోరో ఈవినింగ్ సన్”లో వచ్చినటువంటి గొప్ప వ్యాసం మీరు ఎప్పుడైనా దానిని చదివారా...మీరు గమనించారా, అజూసా న్యూస్లో ఉంది - నేను కాలిఫోర్నియాకు వెళ్లాల్సి ఉంది, జోన్స్‌బోరో సన్“లో అది ఉంచబడింది, క్యాన్సర్‌తో మరణిస్తున్న వారికోసం విమానములో ఎల్ డొరాడోకు వెళ్లడం గురించి? ఎవరైనా ”అజుసా న్యూస్“ ను .... మీలో చదివారా? నేను అక్కడ కూడికలు కలిగి ఉన్నాను.

అక్కడ ఒక సేవకుడు వేదిక వద్ద నిలబడి ఉన్నారు, ఒక పెద్ద క్యాన్సర్ అతని పైన ఉంది, ఓహ్, బహుశా అంత పెద్దది, అతని మెడ మీద ఉంది. అతనికి ఇంక అవకాశం లేదని వైద్యుడు చెప్పారు మరియు విలేఖరులతో అక్కడ నిలబడి, చిత్రాలను చూపిస్తున్నాడు. ఆ క్యాన్సర్ తెల్లగా మారిపోయింది, అతని మెడలోంచి పడిపోయి, నా పాదాల వద్దకు వచ్చింది. నేను ఇప్పుడు దానిని ఆల్కహాల్ లో ఉంచాను. అతని మెడలో గుంట ఉంది, మరియు పత్రికలోని అతని చిత్రము చూపెడుతోంది. చక్రాల కుర్చీలో ఉంచబడిన ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు-ఎన్ని సంవత్సరాలు అన్నది మర్చిపోయాను, ఆ విధముగా కట్టబడి, అక్కడ ఆ కుర్చీలో స్థిరముగా ఉన్నాడు, ఒక బాప్టిస్ట్ డీకను. మరియు అతను... ఒక క్షణం, కుర్చీలోంచి లేచి మరియు భవనంగుండా నడచి దేవుడిని ఘనపరిచాడు మరియు అటువంటి కార్యములు.

38

అటు తరువాత నేను ఎల్ డోరాడోకి ఒక చిన్న సెస్నా, ఒక విమానములో వెళ్లాను, పేదరాలైన అమ్మాయి వద్దకు, ఆమె, ఆ అమ్మాయి ఏ క్షణములోనైనా చనిపోవుటకు సిద్దముగా ఉన్నది. ఆమె పోలియో బాధితురాలు జీవితకాలమంతా అంగ వైకల్యముతో ఉంది. ఆమె వయస్సు దాదాపు ఇరవై ఎనిమిది, ముప్పై సంవత్సరాలు. ఇంకా క్యాన్సర్ ఒక కణజాల క్యాన్సర్‌గా మారింది మరియు అమె వద్దకు, వైద్యుని వద్దకు వెళ్ళాను, విమానం దిగిన తర్వాత నేను లోపలికి వెళ్లి అతనితో మాట్లాడాను…మరియు వారు నన్ను - అక్కడికి వెళ్లి మరియు నన్ను కలిసి మరియు తీసుకుని - నన్ను గృహమునకు తీసుకువెళ్ళి మరియు అక్కడ ... సుమారు నాలుగు నుంచి ఆరు పౌండ్లు ఆమె శరీరముపై ఎక్కడైతే పెరిగిందో అక్కడి నుంచి కత్తిరించాను అని వైద్యుడు చెప్పాడు. ఆ అమ్మాయికి కుట్లు వేశాడు మరియు రెండు వారముల కంటే తక్కువ సమయములోనే దానికంటే ఎక్కువ మరలా ఆమెలో పెరిగింది. అక్కడ ఇంక ఏ ఆశలు లేవు, అస్సలు ఏమి లేవు. మరియు ఆమె ప్రజలు దానిని ఆమెనుంచి దూరముగా ఉంచారు. కాబట్టి నేను వెళ్ళాను. నేను ఎప్పటికీ మర్చిపోలేను.

మీలో కొంతమందికి ఇది మీకు ముఖ్యము కాకపోవచ్చు కానీ మీరు ఆమెను మీ తల్లి అనుకొని ఆలోచించండి, ఆమె మీ కుమార్తె అయినట్లైతే. అది నాకు చాలా ముఖ్యము. తీర్పు స్ధలమునందు నేను దీనికి సమాధానము చెప్పాలి. కొద్దిసేపటి క్రితం నేను దానిని తీసుకోవడం జరిగింది... గడచిన రాత్రి నేను ఆ అమ్మాయి గురించి కల కన్నాను, మరియు ఇక్కడ కొద్దిసేపటి క్రితం “హెరాల్డ్ ఆఫ్ ట్రూత్” అనే పత్రికను నేను తీసుకున్నాను, మరియు అక్కడ ఆమె సాక్ష్యమును చదివాను. ఆపై అది ఎలా బయటకు వచ్చింది - యాదృచ్చికంగా ఉంది.

39

అప్పుడు అక్కడ నిలబడి, ఇంట్లోకి నడిచాను బహుశా ఎల్డొరాడోలో చిన్న సామాన్యమైన తెల్లని కుటీరము... లోపలికి వెళ్తూ, ప్రియులు ముంగిలిలో సిద్దపడుతున్నారు మరియు వారందరూ నాకొరకు చూస్తున్నారు మరియు వేచి ఉన్నారు. మరియు నేను లోపలికి వెళ్లాను మరియు కుటుంబమంతటినీ ఒక్కటిగా చేర్చాను. నేను అన్నాను, “ఆమెకి ఏమి జరిగిందో ఆమెకు తెలుసా?”

“లేదు, ఆమెకు చెప్పవద్దు, సహోదరుడా బ్రాన్హాం.” అన్నారు.

నేను అన్నాను, “ఇప్పుడు, నేను వాగ్దానం చేయలేను. చూశారా?”

అన్నారు, “సరే, మేము ఆమెకు ఎన్నడూ తెలియజేయలేదు.”

నేను అన్నాను, “ఇప్పుడు, మొదటి విషయం, మీ అందరికీ విశ్వాసం ఉందో లేదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను?”

అన్నాను, “సరే, మనం ఇతరుల గురించి విన్నాము...” మరియు ఆమె తండ్రి ఒక పెద్ద వ్యక్తి, పాత నీలం చొక్కా వేసుకొని, ఆ దీన పెద్ద మనిషి అక్కడ నిలుచొని ఉన్నాడు. మరియు అతను ఏడుస్తున్నాడు. నేను చెప్పాను, “తండ్రి, ఇప్పుడు, ఏడువ వద్దు.” నేను అన్నాను, “ఏడువ వద్దు.” నేను అన్నాను, “ఇప్పుడు, అది మీ విశ్వాసాన్ని బలహీనము చేస్తుంది.” నేను అన్నాను, “మీరు దానిని విశ్వసించాలి- అది - అంటే మీకు - నీవు నీ బిడ్డ యొక్క అవసరతలన్నీ తీరినవని నీవు నమ్మవలెను.” నేను అన్నాను, “నువ్వు క్రైస్తవుడివా?”

మరియు అతను అన్నాడు, “సహోదరుడా బ్రన్హాం సమూహమంతటిలో ఆమె ఒక్కతే క్రైస్తవురాలు.”

అతను అన్నాడు, “మేము చాలా నీచమైన వారము అని అనుకుంటున్నాను.” అన్నాడు, “అదే కారణము వల్లనే ఆమె - దేవుడు ఆమెను మా నుండి తీసుకుంటున్నాడు, ఎందుకంటే మేము క్రైస్తవులం కాదు కాబట్టి.” మరియు అప్పుడు నేను దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని చూసాను. చూసారా ? మీ అవకాశాన్నిఎన్నటికీ విఫలమవ్వనివ్వకండి.

40

మరియు అక్కడ ఆ చిన్న వంటగదిలో వారిలో కనీసం పదిహేను లేదా పద్దెనిమిది మంది నిలుచొని ఉన్నారు. నేను అన్నాను, “మీరందురు బంధువులా?”

“అవును”

నేను అన్నాను, “మీలో ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా?” మరియు వారిలో ఒకరు యేసుక్రీస్తు సంఘసభ్యుడు అయితే మరియు వారిలో అందరు క్రైస్తవత్వములో ఉన్నట్లే. మరియు నేను అన్నాను, “మీరు దీన్ని చేస్తారా? ఒకవేళ దేవుడు ఈ అమ్మాయిని బ్రతికిస్తే, మీలో ప్రతి ఒక్కరూ - పశ్చాత్తాపపడి, మీరు ఆయనకి మాట ఇస్తారా, మీలో ప్రతి ఒక్కరూ క్రైస్తవులుగా ఉంటాము మరియు బాప్తిస్మము పొందుతాము మొదలగునవి మీరు ఆయనకు మాట ఇస్తారా?”

వారు ప్రతి ఒక్కరూ, “దేవుడు దానిని చేస్తే, మేము అలా చేస్తాం” అని చెప్పారు.

సరే, నేను బయటకు నడిచాను. ఆమె చెప్పింది, “అమ్మాయికి ఏమి జరిగిందో బయటకు వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను.”

41

మరియు నేను గదిలోకి వెళ్లాను, లోపలికి ఎవరినీ అనుమతించలేదు. అవసరతలో ఉన్న ఆ అమ్మాయి అక్కడ పడుకుని ఉంది. ఆమె జీవించడానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి, ఇంకా రెండు లేదా మూడు రోజులు ఆమె ఉండబోతుందని చెప్పవచ్చు, ఎందుకంటే ఆమె వేగంగా కృశించిపోతుంది. నేను లోపలికి వెళ్ళినప్పుడు, ఆమె చెప్పింది, “మీరు సహోదరుడు బ్రన్హాం అని నేను అనుకుంటాను” అని.

మరియు నేను, “అవునమ్మా” అని చెప్పాను. మరియు ఆమె - ఆమె నుంచి కాన్సర్ తీసిన ప్రదేశం ఇంకనూ నయం కాలేదు లేక ఏమి లేదు ఇంకనూ ఆమెకు అటు ప్రక్క తెరువబడే ఉంది. మరియు, ఓహ్, ఆమె ఆ విధముగా ఉబ్బి ఉంది పౌండ్ల కొద్ది మాంసమును ఆమె నుండి తీసివేశారు కాన్సర్ ఉన్న చోటునుంచి... ఆ విధముగా ఏ కణజాలం ఉంటుందో మీకు తెలుసా? అది నేరుగా ఆమెలోకి వెళ్ళింది, ఎక్కువ కండ అన్ని వేళలా పెరుగుతుంది. మరియు అందుకని ఆమె, “మంచిది, మీరు సహోదరుడు బ్రాన్హాం అని నేను ఊహించాను.”

నేను అన్నాను, “అవును.”

మరియు ఆమె ఇలా చెప్పింది, “సహోదరుడా బ్రాన్హాం, మీరు ప్రజలలో ఏమి తప్పు ఉందో చెప్పగలరని నేను గ్రహించాను.” నేను సరిగ్గా అప్పుడే అక్కడ ఏమి జరుగుతుందో చూసాను.

మరియు నేను అన్నాను, “అవునండీ, దేవుని సహాయము మరియు దయవలన, నేను చేయగలను.”

ఆమె అన్నది, “సహోదరుడా బ్రన్హాం, నాకు ఏమి జరిగిందో మీరు చెప్తారా? ఆమె చెప్పింది, ”వారు - వారు నాకు చెప్పరు.“ అన్నది, ”ఇప్పుడు, మీరు ఇక్కడకి మీరు వచ్చిన విధానమును బట్టి నాకు తెలుస్తోంది...?...

[టేపు మీద ఖాళీ యున్నది] అన్ని పాపాలు దాగి ఉన్నాయి.“ మరియు నేను, ”అవునండి.“

“సహోదరుడా బ్రన్హాం, మీరు నాతో యదార్ధముగా ఉండండి...”

నేను చెప్పాను.. [టేపు మీద ఖాళీ యున్నది] నేను స్వస్థపడితే.“

మరియు నేను ఆమె చేతిని పట్టుకున్నాను; నేను, “అవునమ్మా. ఇది క్యాన్సర్.” [టేపు మీద ఖాళీయున్నది]

“సహోదరుడా బ్రన్హాం అదే అని నేను అనుకున్నాను.”

“కానీ అదనముగా, ”మీ - మీ వైద్యుడిని, మరియు బయట వంటగదిలో మాట్లాడుతున్న వారిని నేను అక్కడ కలుసుకున్నాను, మీ సమయం రాబోయే రెండు లేదా మూడు రోజులే అని వారు చెప్పారు. మరి నేను.....“

ఆమె అన్నది, “ఒక్కటి ఉంది... [టేపు మీద ఖాళీ యున్నది] నా రక్షకునికి నా ఆత్మకు మధ్య ఆటంకముగా ఏమీ లేదు.” ఆమె అన్నది... మరింత విలువైనది...

“అవును.”

“పాడండి.”

ఆమె చెప్పింది, “నేను నా .. [టేపు మీద ఖాళీ యున్నది] నడిపించడానికి ప్రయత్నించాను. మరియు నేను - నేను చేయలేకపోయాను.

మరియు అన్నది ... మరియు నేను చెప్పాను, “బహుశా ఇదే అవకాశం కావచ్చు; వారందరూ నిన్ను బాగా ప్రేమిస్తున్నారు. ”నేను అన్నాను,“ ఇప్పుడు వారందరూ వాగ్దానం చేశారు, నువ్వు కోలుకుంటే నువ్వు దేవున్ని సేవించే రీతిగానే... [టేపు మీద ఖాళీ యున్నది] అది-అది - అది వారు కూడా చేసెదరు.

42

అటుతరువాత, స్నేహితుడా...ఇప్పుడు గుర్తుంచుకో, ఒకరోజు నేను కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్తాను. దూత నాకు చెప్పింది - జరుగుతుందని, అది అప్పుడే జరిగింది; నేను దానిని అనుభూతి చెందాను. నేను ఆమె వద్దకు వెళ్లి ఆమె కొరకు ప్రార్ధన చేశాను; ప్రకంపననలు ఆగిపోయాయి. మరియు నేను అన్నాను, “సహోదరి, నీకు నయమవుతుంది.”

ఆమె అన్నది, “సహోదరుడా బ్రన్హాం, నాకు ఏమైందో నాకు తెలియదు, ”ఆమె అన్నది, “కానీ- నాకు తిరిగి నయమవుతుంది అని నాకు తెలుసు.”

నేను చెప్పాను, “నీకు నయమవుతుంది.” నేను బయటకు నడిచాను మరియు బయట వంటగదిలో ఉన్న ప్రజలందరూ ఏడుస్తున్నారు, మరియు నేను బయటకు నడిచాను మరియు బయటకి రాగానే తలుపు మూసాను.

వారు అన్నారు,“ మంచిది, సహోదరుడా బ్రన్హాం, దాని సంగతి ఏమిటి?”

నేను చెప్పాను, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ అమ్మాయి బ్రతుకుతుంది.”

ఆమె పేద ముసలి తండ్రి ఏడుస్తూ ఉన్నాడు. మరియు ఈ కాగితములో రాయబడిన ఆమె సాక్ష్యం ఇక్కడ ఉంది. చెపుతుంది ... ఇక్కడ... ఆమె నా మాటలను ఇక్కడ పేర్కొంది.

“నిన్న, నేడు, నిరంతరము, ఏకరీతిగా ఉన్న క్రీస్తు...ఆయన ఈ అంత్య దినములలో కూడా అద్భుతాలు చేస్తున్నాడు. 1947, 16వ తేదీ, మే నెల, నాకు తప్పనిసరిగా ఆపరేషను చేయాలని వైద్యులు కనుగొన్నారు. వారు పరీక్ష చేసినపుడు, విజృంభిస్తున్న క్యాన్సర్ను వారు కనుగొన్నారు. అంతా - అన్ని - పట్టణములో ఉన్న శ్రేష్ఠమైన వైద్యులంతా చెప్పగిలింది ఏమిటంటే నాకు చాలా కొద్ది సమయము ఉందని. నా స్నేహితుడా, దేవుడు రంగము మీదకు వచ్చాడు. సహోదరుడు బ్రాన్హాం ఇక్కడ నుండి అర్కన్సాస్‌లోని జోన్స్‌బోరోకు విమానములో వచ్చి నాకు ప్రార్ధన చేసారు. ప్రభువు తక్షణమే ఆ కాన్సర్ బీజాన్ని చంపేశాడు మరియు నా శరీరమును స్వస్థపరిచాడు. సహోదరుడు బ్రాన్హాంను నాకొరకు ప్రార్థించుటకు పంపినందుకు మరియు నా శరీరమును స్వస్థపరిచినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలపకుండా నేను ఉండలేను. శ్రీమతి. లడ్డీ మెరిక్, 325 వెస్ట్ కుక్ స్ట్రీట్, ఎల్ డొరాడో, ఆర్కాన్సాస్.” ఆమెకు వ్రాయండి. చూడండి?

ఇప్పుడు, ఆ స్త్రీ, ఆ కాన్సర్ తో గొప్ప వైద్యులను సంప్రదించినప్పుడు... ఏ అద్భుతము జరగలేదు. ఇది ఒక అద్భుతం. ఆమె దానిని అద్భుతముగా అంగీకరించింది, కానీ అది ఆమె పూర్తిగా నయమవుటకు కొద్ది వారముల ముందు, ఆ కాన్సర్ బీజము చనిపోయింది అని నేను ఆమెకు చెప్పాను. కానీ వారు… ఆమె దానిని నమ్మింది, మరియు అదే జరిగింది. మీరు అదే విషయాన్ని నమ్మలేరా?

43

ఇప్పుడు, ఇది చదివినప్పుడు మరో చిన్న విషయం నా హృదయాన్ని ప్రోత్సహించింది. కెనడాలో ఒక ప్రియమైన తల్లి ఉంది. ఇప్పుడు తప్పిపోని శ్రద్ధను నా పట్ల చూపండి, నేను ఈ వ్యాసము చదువుచుండగా. మనము ప్రార్ధన స్వస్థతా కూడికను కలిగి ఉన్నాము.“ సమస్తము సాధ్యమే, ”దానికి శీర్షిక.“ కెనడాకు చెందిన ఒక తల్లి ద్వారా, రెవ. విలియం బ్రాన్హాంకి వినయముగా అంకితం చేయబడింది.” దేవుడు స్వస్థపరిచింది అక్కడ ఉంది. ఆమె హృదయాన్నిదేవుడు దీవించును గాక, నేను వారిని ఎన్నటికీ మరువను. మరియు ఆ చిన్న పాట, “సమస్తము సాధ్యమే.” ఇది ఎక్కడైనా పాడినట్లు మీరు వినవచ్చు. వారు చెప్తారు ఒక తల్లి శిశువును ఊపుతుందని; ఆమె దానిని పాడుతుంది. మరియు వీధులలో వారు దానిని పాడుతున్నారు; వారి పనిలో వారు దానిని పాడుతున్నారు, “అన్నీ సాధ్యమే,” మరియు ప్రతీచోటా వారి ఉజ్జీవం తీరం వెంబడి తీరముకు ప్రాకింది. ఒకప్పుడు తిరస్కరించిన చిన్న సంఘములు, అవి వాటిని మళ్లీ తెరిచారు. మిషనరీలు లేదా సువార్తికులు అక్కడ రంగములోకి దిగారు మరియు దాన్ని తెరిచారు. ఎలాంటి ఒక ఉత్తేజం. మనకు కావలసింది అదే, కాదా స్నేహితుడా?

44

ఇప్పుడు, శ్రద్దగా వినండి:

ప్రియమైన ప్రభువా, నీవు ఎన్నుకున్న వారు, కొందరు ఉన్నారు,

ఈ పాప ప్రపంచం నుండి బయటకు పిలువబడిన వారు.

వెళ్ళడానికి సిద్ధంగా ఉండటానికి లేదా ఉండడానికి సిద్ధంగా ఉండటానికి,

యజమాని అతనిని పిలిచినట్లు.

హృదయశుద్ధి కలవారిని మాత్రమే మీరు ఎన్నుకున్నారు

మరియు మిమ్మల్ని అనుసరించే వారిని.

అప్పుడు, ప్రియమైన ప్రభువా, మీరు వారికి ఇస్తారు

ఎవ్వరూ ఇవ్వలేని అమూల్యమైన బహుమతి.

ఓ పరలోకపు తండ్రి, మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాము

మీరు ఒక దూతను కిందకు పంపినట్లు.

అతను ఒక వర్తమానముతో వచ్చాడు, ఓ ఎంత మధురం

మరియు “ఒక కిరీటం” అని వాగ్దానం చేశాడు.

దేవదూత ఇలా అన్నాడు, “నేను నీకు ఇస్తాను

దైవిక స్వస్థతా వరాన్ని.

నీవు వెళ్లి వారిని నమ్మమని చెబుతావా?

ఈ వాగ్ధానము, అప్పుడు, నీదే.“

“అవును ప్రభువా. నేను నా వంతు కృషి చేస్తాను”

అతను కృపా సింహాసనం వద్ద మోకరిల్లినట్లు.

“నాకు తెలుసు, ప్రియమైన ప్రభువా, అన్నీ సాధ్యమే.

నీ విన్నపం మేరకు నేను చేస్తాను.

ప్రియమైన ప్రభువా, నేను ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నానో, అక్కడికి నేను వెళ్తాను;

మీరు నేను ఎలా ఉండాలనుకుంటున్నారో నేను అలాగే ఉంటాను.

నేను మూగవారి కొరకు ప్రార్థిస్తాను మరియు వారు మాట్లాడతారు.

నేను అంధుల కొరకు ప్రార్థిస్తాను మరియు వారు చూస్తారు. “

[టేపు మీద ఖాళీ యున్నది] మీరు…ద్వారా నయమవుతారు.

అతని నుండి ఒక స్పర్శను పొందడానికి.

మరియు అతను దాఖలు చేస్తాడు - వారు కాలిబాటల వెంట దాఖలు చేస్తారు.

అతని ఒక్క తాత్కాలిక చూపు కోసం.

జబ్బుపడిన వారిని ఉత్తరము మరియు దక్షిణము నుంచి తీసుకువచ్చారు.

మరియు కొంత మంది [టేపు మీద ఖాళీ యున్నది] కుంటివారు

కొంతమందిని తీసుకు వచ్చారు [టేపు మీద ఖాళీ యున్నది]... స్వస్థపడాలని [టేపు మీద ఖాళీ యున్నది]

ఓ దూత, ప్రియమైన [టేపు మీద ఖాళీ యున్నది] అతనిని-అతనిని సవాలు చేస్తారు ...?... [టేపు మీద ఖాళీ యున్నది]

ఈ బిడ్డ నుండి దయ్యమును పారద్రోలుటకు మరియు అది పోతుంది.

ఓ యేసు, ప్రభువా మరియు రక్షకుడా,

మీ స్వంత వారిని దీవించండి

వారు… [టేపు మీద ఖాళీ యున్నది]

మీరు ప్రేమించిన మీ సేవకుడిని దీవించండి [టేపు మీద ఖాళీ యున్నది]

మీ శక్తితో, మరియు అతనికి మీ బలమును ఇవ్వండి [టేపు మీద ఖాళీ యున్నది] పాపము నుండి...

ఆ దీవించిన గడియ వరకు.

45

మా పరలోకపు తండ్రి, నేను కలిగినటువంటి దీన ఆధిక్యతకు మీకు కృతఙ్ఞతలు, ప్రియమైన దేవా, ఆ కొంతమంది... నమ్మినవారు, తండ్రి. మరియు ఎంతో ప్రియమైన మీ దూత...?... మరియు ఇప్పుడు దీనిని కవితగా మార్చిన ఈప్రియ వ్యక్తి, నేను ఎల్లప్పుడు దీనునిగా ఉండునట్లు మీరు నన్ను ఉంచవలెనని, నేను ప్రార్థిస్తున్నాను, తండ్రి. మరియు ఈ దినము, మూగవారు మాటలాడుదురు మరియు గుడ్డివారు చూసెదరు; ఆ దయ్యము పట్టిన మీ బిడ్డను, దయ్యము విడిచిపెట్టి పోవునుగాక. మీరు సమీపముగా నిలబడి ఉన్నారు అని ఎరుగుటకు, నాకు కావలిసినదంతా మీ నుంచి ఒక్క స్పర్శ మాత్రమే తండ్రి. నాకు తెలుసు, తండ్రి, దయ్యములు అన్నియు మీ అధీనములోనే ఉన్నవని నేనెరుగుదును. మీ గొప్ప శక్తి మాకు దగ్గరగా ఉన్నపుడు, ఏమీ నిలువలేదు. తండ్రి, ఈ రోజు ఈ ఆడిటోరియంలో, ఫీనిక్స్ లో ఉన్నవారందరిని మీరు స్వస్థపరచాలని నేను ప్రార్థిస్తున్నాను, ఎందుకంటే ఇక్కడే మీరు నేను మానవునికి బదులు దేవుని మాటలు వినాలని మీరు నాకు ఒక పాఠం నేర్పించారు. మరల ఎన్నటికినీ, మీకు అసంతృప్తి కలిగించే పని ఎన్నడూ చేయకుండునట్లుగా, ఓ తండ్రీ, నాకు సహాయము చేయండి. మరిప్పుడు, ప్రభువా, ఆ ఆదివారము లేదా ఆదివారము వారం, అది నాకు ఒక హెచ్చరిక, తండ్రి, ఈ ఆడిటోరియములో మీ ప్రజలు స్వస్థత పొందుట, ఈ ఆదివారం నాకు ఆశీర్వాదము. ఈ దినము, మీరు దానిని అనుగ్రహిస్తారు అని ప్రార్థిస్తున్నాను, కుమారుడైన యేసుక్రీస్తు నామములో, నేను అడుగుచున్నాను, తండ్రి. ఆమెన్.

46

[సహోదరుడు బ్రాన్హాం ప్రార్ధించుటకు ముందు ఒక సేవకుడు మాటలాడుచున్నాడు]: పరిచర్యలో, ఇప్పుడు త్వరలో ముప్పై- నాలుగు సంవత్సరములు అవుతాయి. వివిధ రకములైన విశ్వాసములు కలిగిన కొన్ని వందల వందల మంది బోధకులలో మరియు మానవ స్వంత బోధలో అనగా పెంతుకొస్తు బోధలో, ఒక మనిషి దినదినము తన దీనత్వమును కనుపరచుటలో సహోదరుడు బ్రాన్హాం కనపరచినట్లుగా నేను ఏ వ్యక్తిని కనుగొనలేదు. దీని ప్రభావము వలన ఆయనలో నుండి జీవము నలిగి బయటకు వచ్చుచున్నది. చీకటి శక్తులతో పోరాటమంటే ఏమిటో మీరు గ్రహించలేరు. అపవాది యొక్క అన్ని శక్తులు అతని ముందు విడుదల చేయబడ్డాయి. బహుశా, మీకు, ఒక చిన్న భాగము మాత్రమే మీకు వ్యతిరేకముగా ఉండవచ్చు. గుర్తుంచుకోండి, యేసు సిలువపై బాధపడటానికి కారణం అతని స్వంత పాపాలు కాదు, ఎందుకంటే పాతాళం యొక్క శక్తులు అతడిని చిదిమేయాలని నిశ్చయించుకున్నాయి. కాబట్టి మీకు ఏదైనా దేవుని వద్ద నుండి ప్రత్యేకమైనది ఉంటే, చీకటి శక్తులు మిమ్మల్ని చిదిమేయడానికి తమకు సాధ్యమైనవన్నీ చేస్తాయి.

కాబట్టి ఈ మధ్యాహ్నం మీరు దేవుడిని నమ్మడానికి మీ వంతు కృషిచేయాలని మేము కోరుకుంటున్నాము. సహోదరుడు బ్రాన్హాం ఏమి చెప్పాలో మీరు విన్నారు. మీలో ఎంతమంది ఇప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నాడని, ఆయన స్వస్థపరుస్తాడని నమ్ముతున్నారు? మీరు నమ్మితే మీ చేతులు చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దానికి కావలసినదంతా విశ్వాసమే. కాబట్టి మీరు దీనులుగా ఉండాలని మరియు విశ్వసించాలని మేము కోరుకుంటున్నాము. ఒక్క క్షణములో మీ వద్దకు తిరిగి వచ్చెదము.

ద్వారము వద్ద వేచి ఉన్నటువంటి ఒక కేసు ఉంది, కాన్సర్ తో చనిపోతున్నటువంటి వ్యక్తిని తీసుకువచ్చారు. మనం ప్రార్ధన వరుసను ప్రారంభించుచుండగా, బ్రాన్హాం అతని కొరకు ప్రార్ధించుటకు వెళ్తారు. సహోదరుడా కిడ్, నీవు ఇప్పుడు ప్రార్ధనా వరుసను ప్రారంభించండి. మీరు తెలుసుకునేలా అందరూ శ్రద్దగా వినండి.

మీలో కొంతమంది ద్వార పాలకుల పేర్లు నాకు తెలియదు, కొద్దిసేపటి క్రితము నేను మూడు కూడికలు హాజరు అయి మరియు ఇక్కడికి యాభై మైళ్ళ కంటే దూరములోఉన్న వారు ఎవరని ఇక్కడ ఉన్న ద్వారపాలకుడిని అడిగాను. మీరు మొదట ఆ ప్రజలను పంపిస్తే... యాభై మైళ్ళ కంటే దూరములో ఉన్న మరియు ఇక్కడ మూడు కూడికలు లేదంటే అంతకన్నా ఎక్కువ వాటికీ ఉన్న వారిని...

స్నేహితులారా, ఇటువంటి ప్రశ్నను అడిగినపుడు, ఈ కార్యాలను అదునుగా తీసుకోకండి. మీరు దానిని చేస్తే, ఏమి జరగవచ్చునో ఇక్కడ ఉంది: ఆ వ్యాధి మీ మీద పడవచ్చు లేదా మీకు ఇంకేదైనా రావచ్చు. మీరు వ్యవహరించేది మాతో మాత్రమే కాదని గుర్తు ఉంచుకొనండి. మేము ఉండగలిగినంత యదార్థముగా మీతో ఉండాలని కోరుకుంటున్నాము. కొద్దిసేపు నేను మీకొక చిన్న ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే ఒక నిమిషములో సహోదరుడు బ్రాన్హాం ఇక్కడికి పైకి వస్తారు.

[టేపు మీద ఖాళీ యున్నది.]

మీరు దానిని చేయకపోతే మీరు మమ్మల్ని ఆటంకపరుస్తారు. ఇప్పుడు, మేము - మీరు దయచేసి విధేయులుగా ఉండాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే అది ఆటంకపరుస్తుంది మరియు ఒక అవకాశము నుండి మిమ్మల్ని మీరు లేదా మరొకరిని మోసం చేస్తారు. మేము మిమ్మల్ని పిలిచేంతవరకు దయచేసి నిలబడకండి లేదా ప్రార్ధనా వరుసలోకి రాకండి. ఇప్పుడు గుర్తుంచుకోండి, మేము కోరుతున్నాము, సహోదరుడు బ్రాన్హాం ప్రార్ధించుచుండగా, ప్రతీ ఒక్కరు మీ తలలు వంచండి. దీని కొరకు మీరు ఉండగలిగినంత దీనముగా ...?...]

47

మన తలలు వంచుదామా...?... మా పరలోకపు తండ్రీ, [టేపు మీద ఖాళీ యున్నది] ఇప్పుడు, ఈ కూడిక కొరకు. ప్రియమైన యేసు [టేపు మీద ఖాళీ యున్నది.]... రెండు వారములు కూడుకొనలేదు ఈ వారము ఈ వేదిక వద్ద ఉన్నారు. స్వస్థత పొందాలని ఆశపడుచున్న ప్రియమైన ప్రజలు ఇక్కడ నిలుచొని ఉన్నారు. తండ్రి, నన్ను నమ్మగలిగితే అదే వారికి ఆశీర్వాదం అని వారికి చెప్పుటకు వినయముగా ప్రయత్నించాను, ప్రభువా, వారి విశ్వాసమే, వారిని స్వస్థపరిచేదని, నమ్ముటకు వారికి ఉన్న విస్వసమే అది అక్కడ ఉంది. మరి ఇప్పుడు, వచ్చు ప్రతీవారు, మీ దైవాశక్తిచే తాకబడుదురు గాక. మరియు నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను, మీ దూత అత్యంత సమీపముగా నిలిచి ఉందని నేను అనుభవిస్తుండగా, ఓ దేవా, మేము ప్రతి ఒక్కరినీ ఆశీర్వదిస్తాము మరియు వారు బాగుపడతారు. యేసుక్రీస్తు నామములో, నేను ప్రార్థిస్తున్నాను.

48

సహోదరి నీ హృదయమంతటితో నమ్ముచున్నావా? ప్రియ పరలోకపు తండ్రి, ఈ భయంకరమైన దయ్యముతో బాధింపబడుతున్న మా సహోదరిని ఇక్కడ చూస్తూ, తండ్రి, ఆమెకు నయం అవ్వునట్లు, ఆమెకు విముక్తి నిచ్చుటకు మీరు సమీపముగా ఉన్నారు. ప్రియమైన ప్రభువా, దీనిని అనుగ్రహించండి.

ఈ స్త్రీని బంధించినటువంటి దయ్యపు ఆత్మ, యేసుక్రీస్తు ద్వారా, ఆమెను విడిచిపెట్టమని, నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. ఇదిగో ఇక్కడ...?... ప్రతి చిన్న మచ్చ తుడిచివేయబడింది. అప్పుడు మీరు బాగుంటారు. మీరు కలిగి ఉన్నారా...?... ఇప్పుడు, మీరు కేవలం...?...

ఎంతకాలముగా మీకు ఈ కీళ్ల నొప్పులు ఉన్నవి , సహోదరి? ఇప్పుడు, దేనిని అనుమానించవద్దు. మీరు చేయలేదా? మీరు దేవున్ని సేవించాలనుకుంటున్నారు, కాదా? తండ్రీ, సామాన్యమైన విశ్వాసముతో, ఈ కీళ్లనొప్పులతో, వికలాంగురాలై, మరియు అధిక రక్తపోటు మరియు చాలా నొప్పులతో బాధింపబడుతూ, ఈ మధ్యాహ్నము మా సహోదరి వచ్చింది, తండ్రి. ఆమె దీన శరీరము విచ్చిన్నమవుతున్నది. మరియు మీరు, ఆ రాత్రి గదిలోకి మీ గొప్ప దూతను పంపి, నేను దీనిని ప్రజలవద్దకు తీసుకువెళ్లాలని చెప్పిన దేవా, ఆమె విశ్వాసము ఇప్పుడు దానిని అందుకొనును గాక.

అపవాది, మా సహోదరిని నీవు బంధించావు. యేసుక్రీస్తు నామములో ఆమెని విడిచిపెట్టమని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడు, సహోదరీ, అది చాలా త్వరగా ఆగిపోయింది, నీ మీద ఒక అద్భుతము చేయబడిందని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు, దేనినీ సందేహించవద్దు. నీ పాదములు పైకి మరియు కిందకి ఈ విధముగా లేపాలి అని నేను ఆశిస్తున్నాను , నిజముగా...నీ చేతిని కదపండి. మీరు అక్కడే ఉన్నారు. ఇప్పుడు, నేరుగా నడుచుకుంటూ వెళ్లి మరియు మెట్లు దిగండి. ఈ మహిళపైన ఒక అద్భుతము ప్రదర్శించబడింది. నడువుము, సహోదరీ. ఇప్పుడు, మీ తలలను పైకెత్తిచూడవచ్చు. కీళ్ల నొప్పులతో బాధింపబడిన, ఆమె అక్కడ...

ప్రతీ ఒక్కరు, “దేవునికి స్తోత్రం,” అని చెప్పండి. ఆ రకమైన దానికి దేవునికి స్తుతులు చెల్లిద్దాం,స్నేహితులారా, ఈ విధమైన దాని, కొరకు...?... తండ్రి ఎలా పనిచేస్తున్నాడో చూసారా? ఆమె కీళ్ల నొప్పులతో వికలాంగురాలయింది.

49

ఇప్పుడు, ప్రతి ఒక్కరూ తలలు వంచి ప్రార్థనలో ఉండండి. నిజముగా మర్యాద పూర్వకముగా ఆ విధముగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలను అనుగ్రహిస్తాడు. నేను దీనిని నమ్ముతాను.

మా పరలోకపు తండ్రీ, మీ మంచితనానికి మరియు మీ దయకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు నేను ప్రార్థిస్తున్నాను, ప్రియమైన ప్రభువా, ఇప్పుడు చాలా మైళ్లు దూరం నుండి వచ్చిన మా ప్రియమైన సోదరుడిపై మీరు నయమవునట్లు దయ చూపుతారని ప్రార్థిస్తున్నాను. తండ్రీ, మేము ప్రార్థన చేస్తున్నప్పుడు అతనికి సహాయం చేయండి.

సాతానూ, బలహీనత యొక్క శక్తీ, ఆ మనిషిని విడిచిపెట్టు; యేసుక్రీస్తు నామములో, అతనిని విడిచిపెట్టమని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను.

అయ్యా, ఒక్కటి... కొద్దిసేపటి క్రితం నేను కాన్సర్ ఉన్న ఒక స్త్రీ గురించి చెప్పడం మీరు విన్నారు కదా. మంచిది ఇప్పుడు, ఆ కాన్సర్ తో చనిపోతున్నటువంటి ఆ స్త్రీకి జరిగిందే మీకు జరిగింది. ప్రతి ప్రకంపన, మీకు చెప్పుటకు నాకు తెలిసినదంతా, అయిపోయింది. కావున మీరు వెళ్లి స్వస్థత పొందుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయ్యా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక.

50

నీవు నమ్ముతున్నావా నేను దేవుడిని అడిగితే, అయన నీకు కనుదృష్టిని మరలా తిరిగి దయచేస్తాడని? ఆ అల్సర్ కంటే పెద్దది మీరు కలిగి ఉన్నారు అని నేను చూస్తున్నాను, కాదా? అవును, అయ్యా. ఏ రకమైన ఆస్తమా అది... ఇప్పుడు, ఆ కార్యములన్ని నేను తెలుసుకొనుటకు ఒకే మార్గము ఉన్నది, సహోదరి, మరియు దేవుని ద్వారా మాత్రమే మీకు చెప్తున్నాను. అది సరియైనదేనా? దాని కోసం... నీవు దానిని కలిగి ఉన్నావు అని నాకు తెలిసే ఒకే మార్గము, నేను ఆ ప్రకంపనలు చెప్పగలను, నీకు ఆస్తమా వ్యాధి ఉంది...?... దానికొరకు. ఇప్పుడు నీ హృదయమంతటితో నమ్ము. మా తండ్రీ, అన్ని హృదయాల రహస్యాలన్నిటినీ వెల్లడించే మీరు, ఇప్పుడు ఈ సహోదరికి దయ చూపునట్లుగా నేను ప్రార్థిస్తున్నాను. తరువాత, ఓ దేవా, ఇప్పుడు, ఇక్కడ నిలబడి, మీ కృప మరియు మీ సహాయము ద్వారా, గడచిన ఆదివారము ముందు నుండి మీ సన్నిధి విడిచిపెట్టినట్టుగా నేను ఎలా అనుభూతి చెందుతున్నానో మీకు తెలుసు: మరి ఇప్పుడు, ఇక్కడ మీ సన్నిధి ఉన్నది, మరియు ప్రతి ఒక్కరు దాటుచుండగా ...?... తండ్రీ, ఇప్పుడే, స్వస్థపడులాగా, మా సహోదరికి సహాయము చేయండి. ఆమెను ఆటంకపరుచుటకు ఆమె మీదకి వచ్చిన ఈ దయ్యము మరియు ఆమె కన్నులు చూపు కోల్పోబోతున్నాయి మరియు నువ్వు... [టేపు మీద ఖాళీ యున్నది] ... యేసుక్రీస్తు నామములో, ఆ స్త్రీలో నుంచి బయటకు రా, యేసుక్రీస్తు నామములో...?...

51

ఆ ప్రకంపనలు [టేపు మీద ఖాళీ యున్నది]...?... నువ్వు...?...కొంచెము గది అంతా చూడుము మరియు నీవు చూడగలిగితే ... చుట్టూ చూడుము. పైన ఉన్న ఆ బల్బులు కనిపిస్తున్నాయా? నీవు వాటిని లెక్కించగలవా? వాటిని చూపుము. నీవు వాటిని ఇప్పుడు చూపగలవేమో చూద్దాం. అది సరి. అది...?... ఆ విధముగా.

ప్రేక్షకులలో ఎవరైనా మీ చేయి పైకెత్తండి. ఇప్పుడు ఆమె భవనములో పదిహేను బల్బులను చూస్తోంది. సరే, అక్కడ ఎవరైనా మీ చేతిని పైకి లేపండి. మీరు వారి చేతులను చూస్తారు. మీరు వారి చేతులు చూడండి. ఆశ్చర్యపోతున్నాను ఆకుపచ్చ రంగు ఆ విధమైన కోటు వేసుకున్న ఆ స్త్రీ, నెరసిన జుట్టుతో... మీ ఒక్క వేలినే పైకి లేపిందా లేక మొత్తం చేతిని పైకి లేపిందా. ఇప్పుడు, ఆమె దానిని మార్చింది. ఒక్క నిమిషం...?... ఆమె చేయగలిగితే ... మరలా మీ చేతిని పైకి లేపండి, సహోదరి. చూడండి? ఇప్పుడు... అవును, అవును. ఆమె ఎవరో మీరు చెప్పగలరా? ఆమె ఆకుపచ్చ రంగు కోటు ధరించి ఉన్న ఆమెను ఇక్కడ నుండి చూడగలరా. అవును, మేడం, అది బాగుంది. ఆమెకి ఎన్ని వేళ్ళు ఉన్నాయని నీవు అనుకుంటున్నావు - ఆమె అక్కడ పట్టుకొని ఉంది? నీవు అంత దూరం లెక్కించగలవా? అది ఒక రకమైన నీడవలె ఉంది... అది ఖచ్చితముగా సరైనది. ఇప్పుడు, ప్రతీఒక్కరు, “దేవునికి స్తోత్రం” అని చెప్పండి. మీరు మీ తలలను పైకి ఎత్తవచ్చు.

ఇప్పుడు, సహోదరి, నీకు చూపు వచ్చింది మరియు నీవు ఇక సంపూర్తిగా నయమైన స్త్రీగా ఉండబోతున్నావు. దయచేసి అందరూ, దేవునికి స్తుతులు చెల్లించుదాం.

52

ప్రజలు ఎందుకు చేయలేదు అని కొద్ది రోజుల క్రితం ఎవరో అడిగితే... అన్నారు, “సహోదరుడా బ్రన్హాం, నేనేమి అర్ధం చేసుకోలేకపోతున్నాను అంటే, ఏ ప్రజలైతే ప్రార్ధింపబడ్డారో... మరియు వారు స్వస్థపడినప్పుడు,” అన్నారు, “పెంతెకొస్తులో ఉన్న ప్రజలు, వారు బిగ్గరగా కేకలు వేయుటకు ఇష్టపడతారు,” అన్నారు, “వారు అంతకన్నా ఎక్కువ అరవకపోవడం ఆశ్చర్యం.”

నేను అన్నాను, “వారు చాలా ఆశ్చర్యపోయారు, వారు కేవలం...వారు కేవలం - ఇది అప్పుడే జరిగింది.” నేను అన్నాను, “కొంత సమయము తరువాత మీరు భవనము వెలుపలికి వెళ్లి మరియు వారు భవనములో నుంచి బయటకు వస్తున్నప్పుడు చూడాలి, అప్పుడు మీకు అర్ధమవుతుంది.”

మంచిది, ఇప్పుడు, మనం ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరు మీ తలలు వంచండి.

53

ఇక్కడ ఉన్నవారు...?...ప్రకంపనలు. మీ కుడిచేతిలో ఏమి లేదు, ఎందుకంటే నేను ...?... ప్రతి ఒక్కరు మీ తలవంచండి [టేపు మీద ఖాళీ యున్నది].

సమస్తము దేవుడి చేతిలో పెట్టబడింది. నేను ఆ స్త్రీ కొరకు ప్రార్థిస్తుండగా, ఆ ప్రకంపనలు నా చేతిమీద ఆగాయి. ఇప్పుడు, అది ఆమె జీవం కొరకు నా దగ్గరకు వచ్చింది. మనందరి వలె ఆమె కూడా జీవించాలని ఆశపడుతుంది. [టేపు మీద ఖాళీ యున్నది]

మరి ఇప్పుడు, నా హృదయమంతటితో నమ్ముతున్నాను... ఆమె ఫీనిక్స్ మహిళ; మీరు మళ్ళీ ఆమెను వీధిలో స్వస్థత పొందిన దానిగా చూస్తారు. ఇప్పుడు...?... ఇప్పుడు, దయతో మీ తలలు వంచినందుకు మరియు ఇతర కార్యములకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు అత్యంత మంచివారు మరియు నాకు - నాకు ఆవిశ్వాసం తెలుసు... ఇక్కడ ఉన్న సహోదరి వాల్ డ్రాప్ ఆమెకు సాక్ష్యం ఇవ్వాలని నేను ఆశపడుచున్నాను. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు.

నేను ఆశపడుతున్నాను, సహోదరి వాల్ డ్రాప్, నీవు ఇక్కడికి రాగలిగితే మరియు ఆమెకు ఒక సాక్ష్యం ఇస్తే, మీ స్థితి ఆమెకు చెప్పండి. ఇదిగో కాన్సర్ తో చనిపోబోతున్నటువంటి మీ ఫీనిక్స్ సహోదరిలలో ఒకరు. నేను ఇదివరకు ఇక్కడ ఇంకొక కూడికలో ఉన్నపుడు, సరిగ్గా ఇక్కడే వాస్తవానికి ఇదివరకే కాన్సర్ తో ఆమె చనిపోయింది. ఎంతమందికి ఆమె తెలుసు, మీ చేతులను చూద్దాం? శ్రీమతి. వాల్ డ్రాప్, ఆమె అక్కడ ఉంది. నిలపండి...ఒక నిమిషం అంబులెన్సును నిలపమని వారికి చెప్పండి. ఇక్కడ ఉన్న స్త్రీ కొరకు నేను ఒక సాక్ష్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. మంచిది. కృతజ్ఞతలు...[టేపు మీద ఖాళీ యున్నది.]

54

గుర్తుంచుకొనండి, నా హృదయము దేవునితో యదార్థముగా ఉండాలని కోరుకుంటుంది; ఇది బాగుంటుంది, మీరు అలా అనుకొనుట లేదా? వారిని నయం చేయకుండా వదిలేయడం కంటే వారిని స్వస్థపరచడం మంచిది. మీరు అలా అనుకోవడం లేదా? ఇప్పుడు, ఆ స్త్రీకి బాగవుతుంది. ఇక్కడ ఉన్న శ్రీమతి. వాల్ డ్రాప్ వలె ఒక రోజు మీతో వీధులలో ఈమె ఉంటుంది, మరియు చాలా మర్యాదగా మీరు తీసుకున్న నిర్ణయం ఆ తీర్పు వచ్చినప్పుడు మీరు సంతోషముగా ఉంటారు.

ఇప్పుడు, మీరు మరలా మీ తలలు వంచగలిగితే ఇంకొంత మంది కొరకు ప్రార్ధించుచుండగా... అవునమ్మా. ఇప్పుడు, మీరు ... మీకు ఎంతకాలం నుండి తెలుసు? మీరు... ఇప్పుడు, చూడండి, సహోదరి, మీకు ఎలా చేయాలో వైద్యునికి తెలిసినదంతా అతను చేసాడు. ఇప్పుడు, నీకు అవకాశము వచ్చింది. కేవలము... మీ ప్రియులు వారు చేయగలిగినదంతా చేశారు; మీ వైద్యుడు అతను చేయగలిగినదంతా చేసాడు; ఇప్పుడు నీ రక్షకుడు, ఆయన నిన్ను స్వస్థపరచగలడు. నీవు దానిని నమ్ముతున్నావా? మంచిది. సరే అయితే ఇప్పుడు నీ తలను వంచు.

తండ్రి, మా ఈ సహోదరి, జీవితం ముగింపుకు దగ్గరగా ఉందని గ్రహించి; ఆమె మమ్మల్ని విడిచి వెళ్లబోతుంది, తండ్రి. ఎక్కడికో, చీకటి నిత్యత్వములోనికి ఆమె వెళ్తోంది. ఆమె పరిస్థితి మరియు ఆమె ఆత్మ మీరు యెరిగి ఉన్నారు, మరియు ఆమె చనిపోతే ఆమె ఎక్కడికి వెళుతుందో మీకు తెలుసు. తండ్రి, మేము అందరం మీకు తెలుసు. మా పేరుతో సహా మీకు మేము తెలుసు. మా ప్రతీ తల వెంట్రుకా మీకు తెలుసు; మా గురించి సమస్తము మీకు తెలుసు.

మా వైద్యులు వారికి ఉన్న తెలివిని అంతటితో వారు చేయగలిగినదంతా చేశారు. వారు ఆమెకు ఎక్స్-రే కిరణాలూ ఇచ్చారు, మరియు వారు ఆమెకి చికిత్సలు చేశారు, ఇప్పుడు నిరంతరం కాన్సర్ ఆమె ప్రాణాన్ని తీసుకుంటుంది. తండ్రి, మీరు మాత్రమే ఆమెను నయం చేయగలరు. దయ్యమా, ఆ స్త్రీలో నుండి నువ్వు బయటకి రావాలని, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను.

55

ఇప్పుడు, మీ తల వంచే ఉండండి, ప్రతి ఒక్కరు మరియు మీరు ... ఆమెను పట్టుకొని ఉండుటకు ప్రయత్నించండి… ఇప్పుడు, అమ్మ, నీవు ఎక్కడ నివసిస్తావు? అరిజోనాలోని, గ్లోబ్ లో. అక్కడ అది మంచి నగరము, కాదా? నీవు నన్ను చూడాలి అని అనుకుంటున్నాను…?... నీవు విచారంగా ఉండాలని నేను అనుకోవడం లేదు; ఇప్పుడు నువ్వు కేవలం విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను. నీవు ప్రయత్నం చేస్తావు కదా? నీవు - నీకు ... వివాహమైంది, కాదా? ఉహ్- హు. పిల్లలు ఉన్నారా? విదేశాలలో నీకొక అబ్బాయి ఉన్నాడు. అమ్మ, నువ్వు అతనిని మరలా చూడాలనుకుంటున్నావు, అనుకోవడం లేదా? నువ్వు చూస్తావు.

అతను కూడా నిన్ను చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు, ఇక్కడ చూడు. నీవు నాతో యదార్ధముగా ఉండాలనుకుంటున్నాను, నేను నీతో యదార్థముగా ఉన్నాను; నీవు కూడా నాతో అదే చేస్తావు కదా, చేయవా? ఇప్పుడు, నీవు స్వస్థపడకుండా నిన్ను పట్టి ఉంచే కార్యము ఒకటి ఉంది మరియు అదేమిటో నేను నీకు చెప్తాను. నేను దానిని నీకు బయటకి చెప్పనా, అలా చెప్పేయనా? నీకు ...?... రహస్యముగా. ఇప్పుడు, అదేమిటో నాకు తెలుసు అని నీకు తెలుసు, నీకు తెలీదా? సరే. ఇంకెప్పుడు చేయవద్దు. లేదు, నాకు తెలుసు...?... బయలుపాటు ఇక్కడ ఉంది. ఇప్పుడు నీవు... అవును, నీవు చేయగలవు. దేవుడు దానిని నీ నుండి తీసివేయగలడు. అవును, కానీ ఇప్పుడు చూడు. ఈ ప్రపంచములో నేను దానిని తెలుసుకునేందుకు ఏ మార్గము లేదు, కేవలము దేవుని ప్రత్యక్షత వలననే; కానీ ఈ కాన్సర్ నిన్ను విడువదని నేను తెలుసుకున్నాను. చూస్తున్నారా? ఆ కారణం చేతనే అది పట్టుకొని ఉంది. ఇప్పుడు, నువ్వు ప్రార్ధించు. నీవు దానిని చేస్తావా? దయ చేత, నీవు దానిని చేస్తావా? తప్పకుండా అయన నిన్ను విడుదల చేస్తాడు?

తండ్రి, ఇప్పుడు ఆమె దానిని బలిపీఠము వద్ద విడిచిపెట్టుటకు సిద్ధముగా ఉంది. పరలోకపు తండ్రి, నేను దానిని ఎలా కనుగొన్నానో మీకు తెలుసు; మరియు ప్రియమైన దేవా, ఇప్పుడు మీరు ఇక ఎన్నటికీ ఆమె మరలా దానిని చేయకుండా ఆమెలోని కోరికను తీసివేయమని నేను ప్రార్థిస్తున్నాను. అపవాది, ఈ మహిళ యొక్క ఒప్పుకోలును బట్టి, స్వచ్ఛమైన హృదయముతో దేవునికి సేవచేయాలనే ఆమె కోరికను బట్టి, యేసుక్రీస్తు నామములో నీవద్దకు వస్తున్నాను; ఆ స్త్రీలో నుంచి బయటకు రా.

ఇప్పుడు, సహోదరీ, ఇక్కడ చూడండి. ప్రతీ ప్రకంపనా నిలిచిపోయింది. నీ అలవాటు నుంచి కూడా నీవు విడుదల పొందావు. ఇప్పుడు వెళ్లి నీ హృదయమంతటితో దేవుని సేవించు. సహోదరీ, నీ కుమారుడిని నీవు చూస్తావు. నీ చేతులను అతని మెడచుట్టూ ఉంచి మరియు అతనికి చెప్పండి, “తల్లి విడుదల పొందినది.” ప్రతి ప్రకంపనా ఆగిపోయింది. ఒక తమాషా అనుభూతి వచ్చింది, నీకు రాలేదా? అవును, నీ నుండి ఆ అలవాటు కూడాపోయింది. ఇప్పుడు, నీవు బ్రతికున్నంత కాలము ఆ అలవాటుని దూరం పెట్టు. దేవుడు నిన్ను దీవించును గాక.

56

[సహోదరుడు బ్రాన్హాం మాటలాడుతున్నపుడు, ఒక స్త్రీ సహోదరుడు బ్రాన్హాంతో సుదీర్ఘముగా మాట్లాడుతోంది.] అవును. సహోదరి, అది సరైనది. దేవుడు నిన్ను దీవించును గాక. కలిగి ఉండుటకు అది ఒక మంచి ఆత్మ. ఇప్పుడు, కొద్ది నిమిషములు మీ తలలను వంచి ఉండండి. ఈ దినము ఈ కూడికకు వచ్చినటువంటి ఈ స్త్రీ. ఇక్కడికి ఈమె చికాగో నుండి వచ్చింది, మరియు ఆమె ఇక్కడ క్షయవ్యాధితో బాధపడుతోంది, మరియు ఆమెకు రక్తస్రావం- మరియు రక్తస్రావం కేవలం ఇక్కడ ఉంది. ఉహ్-హు.

ప్రియమైన దేవా, మీరు విశ్వాసాన్ని అభినందిస్తారు. నేను ఊహిస్తున్నాను, తండ్రి, ఇంకా ఆ ఇత్తడి సర్పము ఆ మైదానములో ఎత్తి పట్టుకొని ఉంటే, ఆ ప్రజలు ఆ ఇత్తడి సర్పమును చూచుటకు సముద్రమును దాటి ఉండేవారు, ఎందుకంటే ఇతరులు దానిని చూచి స్వస్థపడ్డారు అని వారికి తెలుసు. మరియు ఓ తండ్రి, ఈ దినమున మీరు ఒక ఇత్తడి సర్పమును లేపలేదు, కానీ మీ వరమును మీరు ప్రతిష్టించారు. మరియు అన్ని ప్రదేశముల నుంచి ప్రజలు వస్తున్నారు. మరియు తండ్రి, ప్రార్ధింపబడుట కొరకు వచ్చిన ఈ దీన మహిళ నా స్వస్థలములో నుండి వచ్చుచున్నది, తండ్రీ, పర్వతములు మరియు ఎడారులకు వేల మైళ్ళ దూరములో ఆక్కడ ఆ హోటలు గదిలో ఆమె ఉంది, ఎక్కడైతే మిమ్మల్ని అంగీకరించక ఆత్మహత్య చేసుకున్నారో అక్కడకి దగ్గరలో ఆమె ఉంది. వారమంతా ఆమె వారి అరుపులు మరియు కేకలు విన్నది. కానీ సర్వశక్తివంతుడవైన ప్రభువా, నయమైన స్త్రీగా, ఆమెను తిరిగి గృహమునకు పంపించుటకు ఆ రక్తస్రావమును తగ్గించుటకు మీరు ఈ రోజు ఇక్కడ ఉన్నారు. తండ్రి, దీనిని అనుగ్రహించండి. నేను ప్రార్థిస్తున్నాను, మీ దీన దాసుని ప్రార్ధనను ఆలకిస్తారా? మరియు తండ్రి, ఈ స్త్రీ తన జీవితాన్ని మీకు అంకితం చేస్తుందని, మరియు మీరు దీనిని ఆమెకు అనుగ్రహిస్తే స్తుతి మహిమలు మీకే చెల్లిస్తుందని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు మీరు నా మాటలు వింటారా, తండ్రీ, గడచిన కొద్ది వారములుగా ఎదురు చూస్తున్న ఈ గడియ. దీనిని అనుగ్రహించండి, తండ్రి.

నా సహోదరిని బంధించిన ఓ దయ్యమా, సజీవ దేవుని కుమారుడైన, ప్రభువైన యేసుక్రీస్తు నామములో, ఆమెను విడిచిపెట్టమని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను [టేపు మీద ఖాళీ యున్నది.] యేసుక్రీస్తు నామములో ఆమెలో నుంచి బయటకు రమ్మని, నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. అప్పుడు ప్రతీ ప్రకంపన ఆగిపోయింది. నీవు ఇప్పుడు స్వస్థత పొందిన స్త్రీవి. కావున ఇప్పుడు నీవు వెళ్లి నీ హృదయమంతటితో ఆయనను నమ్ముము. ఒక్క ప్రకంపన కూడా...?... అది దొరికింది... దేవుడు ఆమె శ్రేష్ఠమైన విశ్వాసాన్ని గుర్తించాడు...?...

57

ఓ నిత్యుడవైనా ప్రభువా, ఎవరి శ్రమలలో [టేపు మీద ఖాళీ యున్నది.] మీ కుమారుడైన యేసు నామములో, ఆమె స్వస్థత కొరకు నేను ప్రార్థిస్తున్నాను, తండ్రి.

యవ్వనస్థురాలా, ఇక్కడ చూడు. నీ శరీరములో ఒక రకమైన ఇన్ఫెక్షన్ ఉంది. అది ఏమిటో నేను పట్టుకోలేకపోతున్నాను. ఒక క్షణం నువ్వు ఇక్కడ నా చేతిని చూడాలనుకుంటున్నాను. ఇక్కడ దీనిని చూడు; ఒకవేళ ఇది ఐతే ...?... తప్పు...?... దానిని చూడు...?... నీవు కూడా ఆ ప్రకంపనలు అనుభవిస్తున్నావని నేను నమ్ముచున్నాను. ఒక చిన్న గర్జనవలే అనిపించిందా? అదే నాకు కష్టంగా అనిపించింది- ఒక దెబ్బ తగిలినట్టు అనిపించింది. నా శరీరమంతటిగుండా వస్తూ, నన్ను మొత్తం వణికిస్తోంది. నీవు దానిని అనుభూతి చెందుతున్నావా? వారంతట వారుగా ఆ ప్రకంపనలు అనుభవించడం ఇది కేవలం నాల్గవసారి. స్నేహితులారా, ఒక నిమిషం మీరు మీ తలపైకెత్తాలని కోరుకుంటున్నాను. ఆ స్త్రీ నా చేతి కదలికను అనుభూతి చెందేంతగా, ఇక్కడ ప్రకంపన నన్ను చాల గట్టిగా చేతిని తాకుతుంది. సహోదరీ, నీవు దానిని అనుభవించగలుగుతున్నావా? అక్కడ వారికి చెప్పు. ఆమె దానిని స్వయముగా అనుభూతి చెందగలుగుతుంది.

58

ఇప్పుడు, ఆమె గుండె సమస్యతో భాధపడుతోంది, దీని వలన ఆమె గుండెలో అడ్డంకి ఏర్పడుతుంది. ఆమెకు ఆస్తమా సమస్య కూడా ఉంది. ఆమె చాలా ఆందోలనాపరురాలు, లోతుగా ఆలోచిస్తోంది, మరియు నిజ - కార్యములు జరుగుటకుముందే వాటి నిమిత్తము చింతిస్తుంది. ఇంకా... సహోదరి, ఇప్పుడు, నీవు నా చేతిని చూడాలనికోరుచున్నాను. కనుక ఇది నిలిచిపోతే నీవు దానిని అనుభూతి చెందవచ్చు. నీవు దానిని అనుభూతి చెందవచ్చు. నీవు చాలా మంచి విశ్వాసము కలిగి ఉండాలి. నీవు ఎక్కడి నుంచి వచ్చావు? సుపీరియర్? అది అరిజోననా, అవునా ? ఎందుకు, ఇది మొదటిసారి. నాకు తెలిసి ప్రకంపనలు అనుభవించిన నాలుగోవ వ్యక్తి, దాని ప్రతిచర్య. అది పడి దొర్లడం కాదు, కానీ అది అక్కడ దొర్లేంత గట్టిగా నా చేతిని కొడుతుంది. ఆమె తిరిగి దానిని అనుభవిస్తోంది.

ఇప్పుడు, మీ తల వంచండి. సహోదరి, నీవు నా చేతిని చూడు. ఒకవేళ అది మారితే... అది వదిలిపోతే ఇది దీనివలె సాధారణ స్థితికి తిరిగి వస్తుంది. లేదా నీవు దానిని అనుభవించినపుడు నీవు దానిని చెప్పవచ్చు...ఇప్పుడు, నువ్వు చూడు దాని అనుభూతి ఎప్పుడు విడిచిపెడుతుందో మరియు నా చేయి సాధారణ స్థితికి వస్తుంది.

తండ్రీ, మీరు మా సహోదరిని స్వస్థపరచాలని ఆమెకొరకు ప్రార్ధించుచున్నాము. ఓ అపవాది, సజీవ దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నామములో ఆ స్త్రీ లో నుంచి బయటకు రమ్మని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను.

నీవు ఇప్పుడు దానిని అనుభూతి చెందడం లేదు, అనుభూతి చెందుతున్నావా? నా చేతివైపు చూడు. ఇప్పుడు, ప్రేక్షకులు, మీరు మీ తలను పైకెత్తవచ్చు. అది నిలిచిపోయింది, నిలవలేదా? ఇంక ఎంత మాత్రమూ నీవు దానిని అనుభూతి చెందడం లేదు. మరియు అక్కడ నా చేయి తెల్లగా మారింది. ఇపుడు జబ్బుపడిన ప్రజలకొరకు వచ్చే ప్రకంపనలలో నీవు అనుభూతి చెందే ప్రతిచర్యను పొందుకున్నావు.

59

ఇప్పుడు, మీరు ఇక్కడ ఒక చిన్న సాక్ష్యం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. కరెంటుతో ఛార్జ్ చేయబడిన రైలు, వణుకుతున్నట్లుగా- ఉన్న దానిపై మీరు చేయి వేసినట్లుగా మీకు అనిపించింది. అది సరియైనదేనా? మరియు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, అది గంతులు వేస్తూ వెళ్లడం ప్రారంభమవుతుంది, ఆపై అది ఒక్కసారిగా వెళ్లిపోయింది. అది సరియైనదేనా? అప్పుడే మీ గాలి వచ్చింది. అది ఇక్కడ అరిజోనాకు చెందిన మీ మహిళల్లో ఒకరు. ఆపై ఎర్రగా ఉండి, తెల్లటి మచ్చలతో ఉన్న నా చెయ్యి కిందకి చూసేసరికి తెల్లగా మారిపోయింది. అది సరియైనదేనా? చూసారా? ఇప్పుడు, అది.. ఆ స్త్రీ నాకు తెలియదు, నా జీవితములో ఇంతకు ముందు చూడలేదు. మీరు ఇక్కడకు రావడం ఇదే మొదటిసారి? ప్రతి ఆదివారం ఇక్కడే ఉంటాను, మీ కోసం వేచి ఉండండి...అది సరియైనదా? సరే, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, సంతోషిస్తూ, సహోదరి, 'నువ్వు నయమయ్యావు కాబట్టి. దేవుడు నిన్ను దీవించును.

“దేవునికి స్తోత్రం” అని చెబుదాం. అది చాలా బాగుంది. దాని కొరకు దేవుడు స్తుతించబడాలి మరియు మహిమ పరచబడాలి. చిన్న మహిళ సుపీరియర్ నుండి వచ్చిన చిన్నది. అరిజోనాలో అది ఎక్కడ ఉంది? గ్లోబ్ వైపు, గ్లోబ్ వైపు. మీరు సహకరిస్తూ పేపర్‌లో ఇచ్చిన మీ ప్రకటన చూశాను. అది చాలా బాగుంది. మీరు సహోదరుడు ఫాల్క్‌నర్‌?ధన్యవాదాలు అండి.

60

అయ్యా, నేను దేవునిని అడిగితే అది మిమ్మల్ని విడిచిపోతుందని మీరు నమ్ముతున్నారా? మీకు ఇంకా కొన్ని కార్యాలు ఉన్నాయని నేను చూస్తున్నాను, కానీ అదే మీ ప్రధాన సమస్య, కాదా? ఉహ్-హు. అక్కడ మీరు చిట్లిన నరము కలిగి వున్నారు లేదా ఆ విధమైనదని నేను అనుకుంటున్నాను ...?... అది సరియైనది, కాదా? ఇప్పుడు, ఇక్కడ ఈ చెవిలో దానిని చెప్పండి, మరియు మీ - మీ మూత్రపిండము. అది అది సరియైనదేనా? మంచిది, ఇప్పుడు అది నిలిచిపోతుందని మీ హృదయమంతటితో నమ్ముతున్నారా? చూడండి, ఇవి... వీటిపై ... అది నాకు తెలిసిన ఒకే మార్గము, ఏదో ఒక మార్గంద్వారా నేను దానిని చెప్పగలిగాను. ఎందుకంటే ద్వారము వెలుపల మీరు చెప్పలేదు అని మీకు తెలుసు.

సమస్తమును ఎరిగిన, మా పరలోక తండ్రీ, రండి మా సహోదరుని మీద దయ చూపండి. అతను ఇప్పుడు శ్రమపడుతున్నాడు. మరియు తండ్రీ, మీ ఆత్మ వలన, మీ కృపవలన, సూటిగా అతనిలో ఏమి లోపమున్నదో చెప్పగలిగాను, తండ్రి. అతను చూచినప్పుడు అతను ఎలా సందేహించగలడు. కాని అతనిని బాగుచేయుటకు మీరు ఇక్కడ ఉన్నారు. అతను తక్షణమే మొదలుపెట్టాలని, శ్రమపడకూడదని నేను ప్రార్ధించుచున్నాను తండ్రి. అదంతా అతనినుండి పోవలెనని అతను వెళ్లిన అన్ని స్థలములలో, మరియు పనిచేయు స్థలములో వారికి మరియు మొదలైనవారికి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, మీ గొప్ప శక్తిని చెప్పగా, ఎవరో విని, వారు వచ్చి స్వస్థత పొందుకుంటారు; మరియు వారు వారి హృదయాలు మీకు ఇస్తారు. ప్రభువా, అవిశ్వాసుల మధ్య ఇతనిని ఒక సాక్షిగా చేయండి. యేసుక్రీస్తు నామములో ఈ దయ్యమును నేను గద్దించుచున్నాను.

అయ్యా, అది అక్కడ నిలిచిపోయింది. ప్రతి ప్రకంపనా వెళ్ళిపోయింది. నా సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. ఇప్పుడు మీ పొరుగు వారి మధ్య ఒక సాక్షిగా ఉండండి.

61

[టేపు మీద ఖాళీ యున్నది] గడచిన ఆదివారం ముందు వారం నుండి చెవిటిగా ఉన్నారా...?... ఇప్పుడు, ఒక ప్రకంపన ఉంది. మీరు దానిని చూడాలనుకుంటున్నాను. మీరు నా చేతిని చూడగలుగుతున్నారా [టేపు మీద ఖాళీ యున్నది] ఇక్కడ ఉన్నట్లుగా [టేపు మీదఖాళీ యున్నది]... ఈ విధముగా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను నా చేతిని పెట్టుచున్నాను...[టేపు మీద ఖాళీ యున్నది]... దీనిమీద వత్తిడి చేస్తోంది. చూసారా? వాస్తవానికి, మీరు ఉన్న దగ్గర నుంచి, మచ్చలను చూడలేరు. చేతిలో ఎక్కడ తేడా ఉందో, ఎంతమంది దానిని చూడగలరు? మీ చేతిని చూడండి. ఖచ్చితముగా, ఇప్పుడు, బాల్కనీలో చూడండి? రెండు చేతుల మధ్య వ్యత్యాసాన్ని చూడగలుగుతున్నారా? ఇప్పుడు ఇది మొదటి చెవిటి కేసు. ఒక చెవి చెవిటిది. అతనికి మూత్రపిండాల సమస్య ఉంది, అతని మూత్రపిండాలతో అతను బాధ పడుతున్నాడు. సరే. ఒక్క నిమిషం. ప్రతి ఒక్కరు ప్రేమగా మర్యాదగా ఉండండి.

62

నిత్యుడవైన తండ్రి, నిత్యజీవమునకు కర్త మరియు శ్రేష్టమైన ప్రతి జీవిని అనుగ్రహించువాడా, మా సహోదరుని మీద మీ అనుగ్రహము కొరకు, నేను అడుగుచున్నాను, తండ్రీ, అతను బాధ పడుచున్నాడు. అతను నాకు తెలియదు; అతను మీకుతెలుసు. మీరు అతనిని అతను ఉన్నటువంటి సంఘములోను మరియు అతను పనిచేయు స్థలములోని వారి మధ్యలో అతనిని ఒక సాక్ష్యంగా చేస్తారని, నేను ప్రార్థిస్తున్నాను, తండ్రి. గడచిన దినములలో ఇక్కడ మీరు శరీరధారిగా ఉన్నపుడు ఇతరులు చేసిన విధముగా ఇతను తాను కలిసిన వారందరితో మీకు ప్రాతినిధ్యం వహించులాగున. దీనిని మీరు మా సహోదరునికి అనుగ్రహించాలని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.

మరి ఇప్పుడు, ప్రభువా, ఈ బలిపీఠము మీద నేను చివరిగా చెవిటి వ్యక్తికి ప్రార్ధించినపుడు, నేను మీ చిత్తమునకు బయట ఉన్నాను అని భావిస్తున్నాను. కానీ ఈ దినము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను, తండ్రీ. మీరు నన్ను క్షమించారని మరియు నేను మీ చిత్తములో ఉన్నాను అని భావిస్తున్నాను, మరియు మీరు నా మాటలు వినాలని ప్రార్థిస్తున్నాను.

తండ్రీ, అద్భుతం చేయమని నేను అడుగుట లేదు కానీ, తండ్రీ, ఈ ప్రజలందరి ముందు లోకమునందు ఉన్న దేవుని కుమారుడు చెప్పిన విధముగా, ప్రార్ధించవలసిన అవిశ్వాసమును సవాలు చేసిన పాపమును బట్టి మీ సేవకుడు క్షమించబడ్డాడు అని వీరు తెలుసుకొనులాగున చేయమని అడుగుతున్నాను. ప్రభువా, ప్రజలు మీరు క్రీస్తు అని మరియు నేను మీ క్షమించబడిన సేవకుడినని తెలుసుకొనులాగున, మీరు తక్షణమే ఇతని చెవి తెరవాలని ప్రార్థిస్తున్నాను.

దయ్యమా, యేసుక్రీస్తు నామమున నేను నిన్ను కలుసుకొనవచ్చుచున్నాను; ఆ వ్యక్తి నుండి బయటకు రమ్మని, నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. అతనిని చెవిటివానిగా చేసి మరియు అతని మూత్రపిండములకు సమస్య కలిగిస్తున్న అపవిత్రాత్మ, యేసుక్రీస్తు నామములో, ఓ ఆత్మ అతనిలోనుండి బయటకు రా, ఆ మనుష్యుని విడిచిపెట్టు.

మిత్రులారా, ఇప్పుడు మీ తలలను వంచి ఉండండి. అది తగ్గుతోంది. నా మాటలు వినబడుతున్నాయా? మీ కన్నులు తెరవండి- మీ తలలు పైకెత్తండి. మీకు ఆ చెవి ఎంత కాలముగా వినబడుట లేదు? పుట్టుకతోనే ఆ చెవి వినబడదు. ఇప్పుడు ఇది వినండి. నా చేతిని ఇక్కడ పెట్టండి. ఓయ్? ఓయ్? ఓయ్? ఇది గుసగుసలు. ఇప్పుడు ఇక్కడ వినండి. ఓయ్ అని, అతను తిరిగి స్పానిష్ భాషలో మాట్లాడుతున్నాడు...?

63

దేవునికి నేను ఇప్పుడు కృతజ్ఞతా ప్రార్ధన చేయాలనుకుంటున్నాను. మా పరలోకపు తండ్రీ, అతను చెవిటివానిగా పుట్టాడు, ఇప్పుడు వినగలుగుతున్నాడు. ప్రభువా, రెండు వారముల క్రితం నేను చేసిన బుద్ధిలేని కార్యమును బట్టి, మీ సేవకుడిని మీరు పరిగణించి మరియు క్షమించారని మీ స్వంత పెదవుల ద్వారా మీరు ఈ రోజు సాక్ష్యమిచ్చారు. మరియు ప్రియమైన తండ్రీ, నేను ఎల్లప్పుడూ మీతో మృదువుగా నడవనివ్వండి. నేను జీవించినంతకాలము మీకు సేవ చేయుటకు అనుమతించునట్లు ప్రార్థిస్తున్నాను. అటుతరువాత, తండ్రీ, నేను అలసిపోయినను, నేను ఇంకా అలసిపోవుటకే ప్రయత్నిస్తాను. తండ్రీ, అటుతరువాత ఒకరోజు నా జీవితము ముగిసినపుడు, మీ సింహాసనము వద్ద మేము కూడినప్పుడు, నేను ప్రార్ధించిన వారినందరిని కలుసుకుంటాను. ఓ క్రీస్తు, దీనిని అనుగ్రహించండి. ఎలా మీకు కృతజ్ఞతలు తెలుపగలను. తండ్రీ, నా హృదయమంతటితో మీకు కృతఙ్ఞతలు తెలుపుతున్నాను. మీరు నాతో ఉండటం కొనసాగిస్తారని మరియు జబ్బుపడినవారిని స్వస్థపరుస్తారని నేను ప్రార్థిస్తున్నాను, ఎందుకనగా మా వైద్యులు పరిమితమైన శక్తిని కలిగి ఉన్నారని మీరు చూసి ఉన్నారు. కాని తండ్రీ, మీశక్తి అపరిమితమైనది, మరియు మీరు ప్రజలకు ఒక- ఒక స్వస్థత కొమ్మును పైకి లేపారు. దానినిబట్టి మీకు కృతఙ్ఞతలు తెలుపుచున్నాము. ప్రభువా, ఇది కొనసాగాలని ప్రార్థిస్తున్నాను, యేసుక్రీస్తు నామములో, దీనిని అడుగుతున్నాను. ఆమెన్.

64

సమస్తమునకు మీకు కృతజ్ఞతలు. సరే. ముందు అతనిని రానివ్వండి. ఇప్పుడు, పిల్లవాడు లోపల ఉన్నాడు... అవును, యవ్వనస్తుడు. నీకు ఆంగ్లము అర్ధమవుతుందా? నీకు అర్ధమవుతుందా? నీవు క్షయవ్యాధితో బాధపడుతున్నట్లు నేను చూస్తున్నాను. ఇప్పుడు, ఇక్కడ నా చేతులని చూడు. నా చేతిమీద చిన్న మచ్చలు రావడం చూస్తున్నావా? ఇక్కడ దీనిని చూడు. తేడా చూసావా? స్పానిష్ ప్రజలారా దేవుడు ఖఛ్చితముగా మిమ్మల్ని పరిగణించాడు. మీరు స్పానిష్ మాట్లాడుతారని నేను అనుకుంటున్నాను...?... వారిలో స్వస్థత పొందినవారు చాలామంది ఉన్నారు. కొద్ధి వారాలలో, మెక్సికోలోని, మీ స్వదేశమునకు నేను వెళ్తున్నాను. నీవు ఒక సాక్ష్యముగా ఉంటావని నేను నమ్ముతున్నాను. నీవు దేవున్నిసేవిస్తావు, చేస్తావా, యవ్వనస్థుడా? నీవు చేస్తావు.

మా పరలోకపు తండ్రీ, ఈ యవ్వనస్థుడిని మీరు సృష్టించారు, ఈ భూమి మీదకి మీరు తీసుకువచ్చారు, మరియు అతను ఇక్కడ, ఒక యవ్వనస్థుడిగా, మీ రాజ్యమునకు ఎంతో ముఖ్యము, తండ్రీ, నేడు యవ్వనస్థులు దారి తప్పియున్నారు... కానీ ఇతను మిమ్మును సేవించాలనుకుంటున్నాడు, మరియు అపవాది ఇతనిని బంధించింది కానీ ఇప్పుడు ఇతనిని స్వస్థపరచుటకు మీరున్నారు తండ్రీ. [టేపు మీద ఖాళీ యున్నది]... ఇత్తడి సర్పముకు ఇశ్రాయేలు ప్రజలు చేసినట్లు: చూసి జీవించునట్లు-వారివలె ఇతను ఈ రోజు వస్తున్నాడు. తండ్రీ, ఈ యవ్వనస్తుడు ఒక శ్రేష్ఠమైన యవ్వనస్థుడిగా ఉండునట్లు... [టేపు మీద ఖాళీ యున్నది]... అతని ప్రజలను చైతన్యవంతులను చేసే సాక్షిగా ఉండునట్లు, అతనికి సహాయము చేయండి. తండ్రీ, దీనిని అనుగ్రహించండి. ఈ దినమునుండే అతను బరువు

పెరుగుట మొదలగును.

ఇప్పుడు, అపవాది, క్షయవ్యాధి దయ్యమా, యేసుక్రీస్తు నామములో నేను నిన్ను కలుసుకొన వచ్చుచున్నాను. ఈ బాలునిలో నుండి బయటకు రా. యేసుక్రీస్తు నామములో, అతనిని విడిచిపెట్టమని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను.

65

ఇప్పుడు, యవ్వనస్థుడా, నా చేతిని చూచుటకు నేను తల యెత్తుటకు ముందే, నా చేయి తెల్లగా మారిపోయింది, అది మారిపోలేదా? అది ఎక్కడైతే ఎర్రగా మరియు కొట్టుకుంటూ ఉండిందో దానిని నేను చూపిస్తున్నాను. అది నిజమేనా? తెల్లగా మారిపోయిందా... నేను నాచేతిని అదే స్థితిలో పెట్టాను. అది నిజమేనా. సంగతి ఏమిటి? అప్పుడు నీవు నయమై ఇంటికి వెళ్తావనుటకు అది నీకు సూచన. అయ్యా, అది సరియైనది, ప్రేక్షకులారా మీరు తల పైకెత్తవచ్చు.

స్పానిష్ యవ్వనస్తుడు ఇక్కడ నిలబడి ఉండగా నా చేతి మీద ఉన్న క్షయవ్యాధి ప్రకంపనలు, మరి ఇప్పుడు, పూర్తిగా అది, పూర్తిగా అది విడిచిపోయింది, ఇప్పుడు, నీవు వెళ్లవచ్చు ... నీవు నా చేతిని చూశావు; నీవు గమనించావు అది... నీవు బాగున్నావు. నీవు ఇంటికి వెళ్ళినపుడు ఎంతమాత్రమూ ఆలస్యము చేయక, నీవు బాగుపడెదవు. మరియు బరువు పెరుగుతావు. నీవు కృశించిపోయి ఉన్నావు - తిరిగి ఎదుగుటకు ఎక్కువగా సంపూర్ణ ఆహారం తీసుకో మరియు నిద్రపో. అందరం, దేవుని స్తుతిద్దాం.

66

దీనిని నమ్ముతున్నారా? మీరు ఆంగ్లము మాట్లాడుతారా? లేదు. ఆంగ్లము మాట్లాడుతారు? ఆమెను అడగండి ఆమె నమ్మితే దేవుడు ఆమెను స్వస్థపరుస్తాడు. అయితే సరే, ఇప్పుడు, ప్రతి ఒక్కరు మీ తలలు వంచండి, కేవలము ...

మా పరలోకపు తండ్రీ, జబ్బు పడినవారిని తిరిగి బాగుచేయుటకు మీరు ఇక్కడ ఉన్నారు. కీళ్లవాతముతో వికలాంగురాలైన, పేద చిన్న ముసలి స్పానిష్ తల్లి ఇక్కడ నిలబడి ఉంది. నేను ఆమెతో మాట్లాడలేను, తండ్రీ. ఆమె నా ప్రార్ధన వినలేదు, ఆమెకు అది అర్ధంకాదు. కాని, మీకు అర్ధమవుతుందని నాకు తెలుసు, తండ్రీ. మీకు అన్ని భాషలు అర్ధమవుతాయి, మీరు అన్ని భాషలు మాట్లాడగలరు. ప్రియమైన ప్రభువా ఈరోజు మీరు ఈ కీళ్ళవాతము నుంచి ఆమెను విడుదల చేయాలని నేను నా హృదయమంతటితో ఆమె కొరకు విజ్ఞాపన చేస్తున్నాను అని ఆమె తెలుసుకొనులాగున మీరు చేస్తారని, నేను ప్రార్థిస్తున్నాను, తండ్రీ. దీనిని అనుగ్రహించండి, తండ్రీ. మెక్సికోలోని, వారి స్వదేశములో మీరు మాకు ఒక గొప్ప కూడిక ఇస్తారని నేను అనుకుంటున్నాను. తండ్రీ, ఇప్పుడు, ఆమె ఈ భవనములో నుంచి సంపూర్ణముగా బయటకు వెళ్ళును. ప్రభువా ఇది మీ దైవచిత్తమైతే, ఆమెకొరకు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని వేడుకొనుచున్నాను, దీనిని అనుగ్రహించండి, తండ్రీ.

కీళ్ళ వాతముతో ఆ స్త్రీని వికలాంగురాలిని చేసిన దయ్యమా, యేసుక్రీస్తు నామములో ఆమెను విడిచిపెట్టు.

మీ తల వంచి ఉండండి. ప్రకంపనలు ఆమె చేతిని విడిచిపెట్టినట్టు అనిపిస్తుంది. అది ఆమెకు ఏమి చేసిందో నాకు తెలీదు. ఇప్పుడు యవ్వనస్థురాలా, నీవు - నీవు ఆమెతో మాట్లాడు, మరియు నీవు ఆమెకు చెప్పు ఆమె - ఆమె కుడి పాదమును ఈ విధముగా పైకి లేపమని చెప్పు. ఇప్పుడు, నన్ను అనుసరించి నడవమని ఆమెకు చెప్పు; దేనిని అనుమానించవద్దు. నన్ను అనుసరించి నడవమని చెప్పు. ఇప్పుడు, నడవండి. ఇప్పుడు మీరు మీ తల ఎత్తవచ్చు. నేరుగా ఇక్కడ నడవండి.

67

అందరూ, “దేవునికి స్తోత్రం”, అని చెబుదాం. ఆమె చుట్టూ చూసింది; ఆమె ఉద్దేశమేమిటో నాకు తెలుసు అన్నట్టుగా ఆమె నవ్వింది. అందరూ, “దేవునికి స్తోత్రం”, అని చెబుదాం. మై, ప్రభువైన యేసు అద్భుతమైన వాడు కాదా? ఆయన అద్భుతమైన వైద్యుడు కాదా? ఇప్పుడు, నిజముగా మాధుర్యముగా కొద్ది నిమిషములు, మీరు మరలా మీ తలలను వంచితే, మరియు ...

అవునమ్మా ... సహోదరి, అది ఎలా జరిగింది... నీవు దానిని ఏవిధముగానైనా గాయపరిచావా; అది అల్సర్ గా మారింది. ఉహ్-హు. అది ఎలా వచ్చిందో నీకు తెలియదు? అది... అది బహుశాకొన్ని ... ప్రకంపనలు వచ్చుట నీవు చూస్తున్నావా? అది ఒక అల్సర్. సహోదరీ, నీవు ఎంత కాలముగా దీనిని కలిగి యున్నావు ? పదమూడు సంవత్సరములు కావస్తోంది. ఇప్పుడు, నీవు నమ్ముతున్నావా నేను ప్రభువైన యేసును అడిగితే ...

ఇప్పుడు, ఎల్లపుడూ ఆ చెడిపోయినది దాని నుండి వచ్చులాగున చేయునది అక్కడ ఏదో ఉంది. నీవు చూస్తున్నావా? అది నీ క్రింద ... ఔనా ...ఓహ్, నీ చీలమండలో ... మంచిది, ఇప్పుడు, నీ వయసెంత? ఇరవై. ఇప్పుడు, యవ్వనస్థురాలా, నేను నా హృదయమంతటితో దేవుని అడిగితే, అది ఎండిపోవడం మొదలవుతుందని, ఇప్పుడు నయమవుతుంది, బాగవుతుందని - నీవు దీనిని నమ్ముతున్నావా? నీ దినములన్నింటిలో ఆయనకు సేవ చేస్తావా? నీవు యేసును ప్రేమించి ఆయనకు సేవ చేస్తావా? నీవు దానిని చేస్తావా? నీవు చేస్తావా ?

68

ఇప్పుడు, మీ తలను వంచండి. కొన్ని సంవత్సరములుగా తెరువబడిన పుండును కలిగిన ఒక చిన్న స్పానిష్ యువతి ఇక్కడ నిలబడి ఉంది. అది ఒక అల్సర్ పుండు, అది ఆమె పాదం నుండి వస్తుంది.

ఓ తండ్రీ, ఎంతో మంది వైద్యులు ఆ పాదమును వారి చేతులలోకి తీసుకున్నారు మరియు బాధపడ్డారు అనుటలో ఏ సందేహము లేదు. తండ్రీ, వారు కేవలము ఆ యవ్వనస్థురాలికి సహాయము చేయుటకు వారు తమ మందుల చీటీ పలక వద్దకు వెళ్లిఎన్నో రకముల మందులు రాశారు. ఎలా చేయాలో వారికి తెలిసినదంతా వారు చేసారు. ఎలా చేయాలో ఆమెకు తెలిసినదంతా ఆమె చేసింది. ఏవిధముగా చేయాలో నాకు తెలిసినదంతా నేను చేస్తున్నాను. మరి ఇప్పుడు, తండ్రీ, ఏ విధముగా చేయాలో మీకు తెలుసని నాకు తెలుసు. మీరు మాత్రమే దానిని చేయగలరు. ప్రభువా, మా హృదయాంతరంగములో నుంచి, మీతో మాటలాడుచున్నాను. తండ్రీ, నేను నమ్ముచున్నాను, ఈ చిన్న మహిళ మీకు సాక్షిగా ఉంటుందని నేను నమ్ముచున్నాను. ఆమె చిన్న జీవితం మీకు ఇచ్చునట్లు, ఆమె సాక్షిగా ఉండుటకు మీరు ఉపయోగించుకొనునట్లు మరియు ఆ పుండు కొన్ని సంవత్సరములుగా ఎలా ఉన్నదో ఆమె ప్రజలకు చెప్పునట్లు. ఇప్పుడు, మీ కుమారుడైన యేసు స్తుతింపబడుటకు, మీరు నా మాటలు అంగీకరించులాగున నేను ప్రార్థిస్తున్నాను, తండ్రీ.

ఓ, దయ్యమా...?... ఇన్నాళ్లు ఈ స్త్రీ, కలుసుకొనివచ్చాను...[టేపు మీద ఖాళీ యున్నది] యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను...[టేపు మీద ఖాళీ యున్నది.]

69

యవ్వనస్థురాలా, నీవు నీ తల పైకెత్తితే... ఇక్కడ నా చేతిచుట్టూ ఏదో జరిగింది. అది వేరొక రంగులోకి మారింది, మారలేదా? ఇప్పుడు, ఏమి జరిగింది; అది నాకు సూచన. అది...[టేపు మీద ఖాళీ యున్నది] ఇప్పుడు, నీ హృదయమంతటితో నీవు దానిని నమ్ముచున్నావా? నీకు నయమవుతుంది నీవు నమ్ముచున్నావా? సహోదరీ, నీవు ఎక్కడ నివసిస్తావు? అరిజోనాలోని మియామిలో. ఓహ్, అక్కడ మీ దేశమునకు వచ్చుటకు నాకు ఒక ఆహ్వానము కలదని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు చూడు, నేను అక్కడికి వచ్చినట్లైతే, నీవు వెళ్లి ...[టేపు మీద ఖాళీ యున్నది] దీనిని గూర్చి సాక్ష్యమివ్వు మరియు ప్రజలకి చెప్పు... నీవు చెప్తావా? ఇప్పుడు, కొద్ది రోజులలో, నీవు గమనిస్తావు... నీవు దేనితో స్నానం చేస్తున్నావు? లవణములు, ఎప్సం సాల్ట్ లేక ఆ విధమైనవి? లేదు, ఇంతవరకు అలాంటివి ఏమి లేదు. ఇప్పుడు, నీవు- నీవు [టేపు మీద ఖాళీ యున్నది] అక్కడ ఆ ప్రదేశములో చూడు, ఆ పుండు, అది ఎండిపోవడం మొదలయింది; నీవు దానిని గుర్తించడం ప్రారంభిస్తావు, దాని చుట్టూ ...[టేపు మీద ఖాళీ యున్నది] దానిని నయం చేయడానికిదాని పైన ఏదయినా ఉంచడం వంటిది. నీవు చూసావా? కాని దానిని స్వస్థపరచిన వాడు దేవుడు. చూడు? ఆ క్రిమి కారణమయ్యే జీవం, ఆ ఇన్ఫెక్షన్, అక్కడ ఇప్పుడు పోయింది. చూడండి? ఇది - ఇది మొదలవుతుంది... ఇప్పుడు, నీ హృదయమంతటితో నీవు నమ్మితే... చూడు, నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. (నీవు చూసావా?) నీవు దానిని నమ్మినట్లైతే? మంచిది, దేవుడు నిన్ను దీవించునుగాక. అట్లయిన నీకు త్వరగా నయమవుతుంది.

70

పర్వాలేదు... అక్కడ కొన్ని ఉన్నాయా? క్షమించండి? అవును, నేను చూశాను.

ఇప్పుడు, అమ్మ, మీ దినములు బహు కొద్దిగా ఉన్నాయని, మీరు గ్రహించి యున్నారు, లేదా? ఇంకా ఎక్కువగా చేయడానికి ఏమీ లేదు. మీరు జీవించాలనుకుంటున్నారు. అమ్మ, నేను జీవించాలనుకుంటున్నాను; మనందరం జీవించాలనుకుంటున్నాము. ఇప్పుడు ఏడవవద్దు. వద్దు... ఇప్పుడు, చూడండి. నాకు ఇంటివద్ద ఒక ప్రియమైన వృద్ధ తల్లి ఉంది, ఆమె బ్రతికి ఉంటే. ఆమె ఉందని నేను నమ్ముతున్నాను. ఆమె నాకొరకు ప్రార్థిస్తుంది. నాకు ఒక భార్య మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వారు నాకొరకు ప్రార్థిస్తారు, నా కొరకు ప్రార్ధించే సంఘము మరియు ప్రజలు దేశమంతటా కలిగి ఉన్నాను సహోదరీ, అందువలననే, నేను నా మార్గములో ఇంకా నిలిచి యున్నాను. నాకొరకు ప్రార్ధించేవారు ప్రతి చోట ఉన్నారు. వేలాది మంది ఉన్నారు. ఇప్పుడు యేసు వారి ప్రార్ధనలు వింటాడు.

ఇప్పుడు, మీకు కాన్సర్ వచ్చింది. అది మీకు తెలుసు, మీకు తెలుసు కదా? ...?... ఇప్పుడు, మీరు కేవలం నమ్మినట్లైతే. ఇతరులు స్వస్థపడ్డారు. నేను ప్రార్ధించిన వారందరూ స్వస్ధపడలేదు. అమ్మ, వారిలో చాలామంది చనిపోయారు. చాలామంది-కానీ ఏమిటి - అది నేరుగా ఏమి చేస్తుందో అదే నిర్ణయిస్తుంది. నేను... నీకు నయమవచ్చు లేదా నీవు తక్షణమే చనిపోవచ్చు. ఇప్పుడు, నీవు బాగవ్వాలని ఆశపడుచున్నావు, నేను నీకు నయమవ్వాలని క్రీస్తును అడుగుతాను. దానిని నీవు నీ హృదయమంతటితో నమ్ము, నీ దినములు చాలా సంవత్సరములు పొడిగించబడుతాయని... నీవు దానిని నమ్ముతున్నావా? నీవు నమ్ముతున్నావా...?

71

మా పరలోకపు తండ్రీ, ఈ పేద వృద్ధ తల్లి తన చేతులను నా చేతిలో పెట్టి ఉండగా, తన చేతులంతా ముడతలు పడి ఉన్నాయి, తండ్రీ, చాలా మైళ్ళ దూరములో ఉన్న, ముడతలు పడిన చేతులు గల నా పేద చిన్న స్వంత తల్లి గురించి ఆలోచించుచున్నాను. ఏ సందేహము లేదు ఆ చేతులు ఆ టబ్బులో చాలా కఠినముగా పనిచేసినవి; బహుశా ఆత్మ మరియు శరీరమును కలిపి ఉంచుటకు పనిచేసింది, చిన్న బిడ్డలను పెంచింది. వారు ఏడ్చినప్పుడు, ఈ చేయి చేసిన విధముగా, వారి కన్నీళ్లను తుడిచి మరియు వారి చిన్న చెంపల మీద అనందం తీసుకు వచ్చుటకు ఈ ప్రపంచములో మరే ఇతర చేయి లేదు. కాని తండ్రీ, ఇప్పుడు, ఆ చేతులు నా చేతిలో ఉన్నాయి. ఆ చేతులకు వేరొక చేతి స్పర్శ కావాలి, చాలా ధారాళముగా, కలువరిలో ఏదైతే గాయపడిందో అది... ఓ క్రీస్తు, మిమ్మల్ని నమ్ముటకు సహాయం చేయండి, మీమాట తీసుకొనండి. ఈ పెద్ద వికారమైన కాన్సర్ దయ్యం, నల్లబడిన ఆత్మ; ఆమె నిస్సహాయురాలు, వైద్యుడు శక్తిహీనుడు. కాని అపవాది మీద మీకు అధికారం ఉంది. తండ్రీ, ఆమెను మీ వద్దకు తీసుకు వస్తున్నాను. నా స్వంత అనర్హమైన చేతులతో నడిపించుచున్నాను, నేను ఆమెను మీ వద్దకు నడిపించుచున్నాను. ప్రభువా, మీరు ఆమెను స్వస్థపరుస్తారా? ఇప్పుడు, ఆమెలో ఉన్న ఈ కాన్సర్ భయపడులాగున, మీ సేవకునికి వాక్ శక్తిని ఇవ్వండి, ఇస్తారా ప్రభువా.

ఓ దయ్యమా, అభిషేకించబడిన దేవుని వరముగా, నేను నిన్ను కలుసుకొన వచ్చుచున్నాను, మరియు యేసుక్రీస్తు నామములో నేను నిన్ను కలుస్తున్నాను. నీవు ఆ స్త్రీలో నుండి బయటకు రా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమెను విడిచి పెట్టమని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, ఆమెను విడిచి పెట్టు.

అమ్మ, ఇప్పుడు, ఇక్కడ ఏమి జరిగిందో మీరు చూసారు. ఇప్పుడు, సంతోషిస్తూ మీ మార్గములో వెళ్ళండి, దేనిని సందేహించకండి. మీకు ఇప్పుడు నయమవుతుంది. ఓహ్, మై, దేవుణ్ణి స్తుతిద్దాం. ఆమె అన్నది “నాకు తెలుసు నేను ఆమె వద్దకు వెళ్లిన ప్రతిసారీ” ఆమె చిన్న హృదయము దీవించబడును.

72

దయ, ఇక్కడ ఇంకొక కాన్సర్ కేసు ఉంది. అమ్మ మీరు చికాగో నుంచి వచ్చినట్లు చెప్పారు? ఆ రమ్యమైన ప్రదేశమును ఒకానొక దినమున నేను సందర్శిచబోతున్నాను. నేను ఈ మే నెల, పిభ్రవరి చివరి భాగములో, అక్కడ ఆ స్టేడియములో ఉండవలసింది. నాకు ఇంకా ఖచ్చితముగా తెలియదు. నేను ఎక్కడున్నా, నేను అక్కడికి వచ్చినపుడు నీవు వేదిక మీదకు వచ్చి సాక్ష్యం చెప్తావా? నీవు చెప్తావా? అయితే సరే. ఇప్పుడు, ఏమి లేదు...?... దేవుడు నిన్ను స్వస్థపరిచాడని నీవు సాక్ష్యం చెప్పాలని నేను కోరుకుంటున్నాను, అయన ఇప్పుడు దానిని చేస్తే, నీవు ఆయనను ప్రేమించి నీ దినములన్నింటిలో ఆయనకు సేవ చేస్తావా?

ఇప్పుడు, చాలా మర్యాదగా ఉండండి. ఇక్కడ వందలాది మైళ్ళ దూరంనుంచి వచ్చిన స్త్రీ ఉన్నది, అవును, కాన్సర్ తో ఆమె వేల మైళ్ళు నుంచి వచ్చింది ఆమె చికాగో నుంచి వచ్చింది.

సహోదరీ, ఇప్పుడు అక్కడ నా చేతిని గమనించండి, నేను ఊహిస్తున్నాను...?... ఆ మచ్చలను చూడండి, అవి నా చేయి అంతా ఎలా వచ్చిపోతాయో. సహోదరీ, నేను ప్రార్ధించుచుండగా, ఇప్పుడు గమనించండి. అవి ఆ తెల్ల మచ్చలు అక్కడ పోవడాన్ని గమనించండి?చూస్తున్నారా? ...[టేపు మీద ఖాళీ యున్నది]. ఆ విధముగా అనిపించిందా...?...[టేపు మీద ఖాళీ యున్నది.]

73

ఆమె కాన్సర్ తో భాదపడుతుంది. ప్రభువా, మీరు మాత్రమే, ఆమెను స్వస్థపరచగలరు. ఆమె చికాగో నుండి వచ్చింది...[టేపు మీద ఖాళీ యున్నది] ప్రియమైన ప్రభువా, మీరు అనుమతిస్తే...[టేపు మీద ఖాళీ యున్నది]...?... మరియు ఆమె చేస్తానని వాగ్దానం చేసింది...?... ప్రజలు. మీరు మీ సేవకుడిని అక్కడకు పంపినట్లైతే ఆమె ఆ స్టేడియంవద్దకు వచ్చి, మీ స్వస్థతా శక్తిని గూర్చిసాక్ష్యం ఇస్తుంది. మీరు మాత్రమే ఆమె శరీరము నుంచి ఆ దయ్యమును బయటకు తీసుకు రాగలరు. అందువలన, ప్రియమైన ప్రభువా, మీ వద్దకు వచ్చుచున్నాను, మీరు దీనిని చేస్తారని నా హృదయమంతటితో అడుగుతున్నాను.

అపవాది...[టేపు మీద ఖాళీ యున్నది]... ఈ కాన్సర్, దాని జీవం. నేను నిన్ను కలుసుకొని వచ్చాను...[టేపు మీద ఖాళీ యున్నది]... దేవుని కుమారుడైన, యేసుక్రీస్తు. ఆమెను విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నాను. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఆమెలో నుంచి బయటకురా.

అక్కడ అంతా బాగైపోయింది, అవ్వలేదా? అది ఎలా ఉందో చూడండి? అమ్మ, దాని అర్ధం, మీరు ఇంకనూ జీవిస్తారు, చికాగోకు తిరిగి వెళతారు మరియు దేవుని కొరకు సాక్ష్యమిస్తారు.

ప్రేక్షకులారా, మీరు మీ తల పైకెత్తవచ్చు. అక్కడ ఉన్న ఆ మహిళను సంపూర్తిగా విడిచిపెట్టింది. నా సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక. నీ పేరు ఏమిటి? శ్రీమతి...?...దేవుడు నిన్ను దీవించును గాక.

దేవుణ్ణి స్తుతిద్దాం. చికాగో నుంచి ఫీనిక్స్ వరకు. సరే.

74

చికాగోనుండి వచ్చిన ఆ సహోదరిని చూడండి. ఇప్పుడు, కొన్ని రోజులలో మరోసారి మీకు అనారోగ్యం కలుగవచ్చు. కాని దానిని గుర్తించవద్దు. చూస్తున్నారా? మీరు జబ్బు పడుతారు మరియు మీకు కడుపు నొప్పివస్తుంది. దానిని గుర్తించవద్దు. ఎప్పుడూ దేనిని గుర్తించవద్దు; నమ్మకమును మాత్రమే ఇప్పుడు మీ మనసులో ఉంచుకొనండి. చూడండి, అది దాని ప్రతిచర్య... కేవలం, మీరు చికాగో నుంచి వచ్చారు, ఒక క్షణం, సహోదరీ. అటు తిరగండి. సహోదరి వాల్ డ్రాప్, మీరు నిలుచుంటారా? రెండు సంవత్సరములు, లేదా ఎనిమిది నెలల క్రితం నా కూడికలలో ప్రార్ధనా వరుసలో గుండె, పెద్ద ప్రేగు మరియు కాలేయ కాన్సర్ తో చనిపోయిన స్త్రీ అక్కడ ఉంది. సహోదరి వాల్ డ్రాప్, అది నిజమేనా? మీరు మరలా జబ్బు పడతారు అని నేను చెప్పాను. మీరు జబ్బుపడ్డారు, పడలేదా, సహోదరీ? కాబట్టి మీరు చూడండి...?... మీరు కోరుకుంటే అక్కడ.

ఇప్పుడు, అక్కడ మీకు ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఒకరు గుండె, పెద్దప్రేగు, కాలేయ కాన్సర్ నిమిత్తము ప్రార్ధించబడినవారు, మరొకరు చికాగోకు చెందిన ఇప్పుడే ప్రార్ధింపబడిన మరొక స్త్రీ. ఒకరితో ఒకరు మాట్లాడుకునే సోదరీమణులు చూడడం అద్భుతమైనది కదా? ఒకరు స్వస్థపడి నేడు బాగున్నారు, ఇంకొకరు దేవుని చేతులలో ఇప్పుడే తాకబడ్డారు. అయన స్వస్థతకు “దేవునికి స్తోత్రం” అని చెబుదాం...?... సరే.

75

అవును, అయ్యా. నేను చూస్తున్నాను మీరు... మీకు చాలా సమస్యలు ఉన్నాయి. మీ ఛాతీ ఈ మంట, ఈ విధముగా పైకి పైకి ఉన్నట్లు అనిపిస్తోందా? ఓహ్, దాని కిందకి ...?... ఓహ్, క్రింద ఇక్కడ. అవును. ఇప్పుడు, నాకు కీళ్లవాతం కనిపిస్తుంది ...మీకు ఉందా...?.... వాస్తవానికి మీకు దగ్గు కూడా ఉంది, మీరు ఎక్కువగా దగ్గుతారు, కాదా?దగ్గు మరియు గొంతులో అడ్డుపడుట, ప్రతీదీ, మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేస్తోంది...?...ఇప్పుడు, నాకు అది తెలిసిన మార్గము ఒక్కటే, అది దేవుని ద్వారా, కదా? నేను దానిని తెలుసుకొనిన మార్గం అది ఒక్కటే. ఇప్పుడు, మీకు విశ్వాసం ఉంది, సహోదరుడా నమ్మండి...[ఆ సహోదరుడు సహోదరుడు బ్రన్హాంతో మాటలాడుచున్నాడు- సంపాదకీయం]. ఓహ్, కృతజతలు సహోదరుడా మీరు చాలా దయగలవారు అని ఆలోచిస్తున్నాను.

ప్రియమైన పరలోకపు తండ్రీ, దీనితో సహోదరుడు వచ్చాడు... అపవాది అతనిని వికలాంగుడిని చేసాడు మరియు అతనిని బంధించాడు మరియు అతను శ్రమపడ్డాడు. ఓ ప్రభువా, అతను కేవలం ఖైదు గృహములో ఉన్నాడు. మరియు, మీరు మాత్రమే ప్రభువా, ఈ జైలులో నుంచి అతనిని బయటకు తీసుకు రాగలరు. కేవలం మీరు మాత్రమే అతనిని బాగుచేయగలరు. మరియు అతను అన్నాడు, “నా హృదయమంతటితో - ఆ యేసును నేను నమ్ముతున్నాను. మరియు యేసు మిమ్మల్ని ఇక్కడికి పంపారని నమ్ముతున్నాను.” ప్రభువా, అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనుటకు ఎటువంటి ఒక సాక్ష్యం. మీరు అతని ప్రార్ధన వింటారని నాకు తెలుసు. తండ్రీ, మీరు నా ప్రార్ధన వింటారని నాకు తెలుసు, మీరు అతనిని నయం చేస్తారని తెలుసు.

76

కాబట్టి, సాతాను, యేసుక్రీస్తు నామములో నేను నిన్ను కలుసుకొన వచ్చుచున్నాను. దేవునిచే అభిషేకించబడిన సేవకునిగా, యేసుని నామములో నీవు అతనిని విడిచిపెట్టు మరియు అతనిలో నుంచి బయటకు రమ్మని, నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను.

అవును, అయ్యా. దేవుడు మీ కన్నీళ్ళు చూసాడు. అయన మీ విశ్వాసాన్ని చూసాడు. ఇప్పుడు మీరు అయన శక్తితో తాకబడ్డారు; మీరు నడవవచ్చు; బాగవుతారు. నా ప్రియ సహోదరుడా, దేవుడు- దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నేరుగా మెట్ల మీద నడవండి. ఇక ఎంత మాత్రం మీరు చింతించవలసిన అవసరం లేదు.

ఇప్పుడు, మిత్రులారా, మీ తల పైకెత్తవచ్చు. (దీనికి బాగా అలవాటు పడ్డారు.) దేవుణ్ణి స్తుతిద్దాం. అప్పుడు విషయం... అతను నేను స్తుతిస్తున్నాను అన్నాడు. సంతోషం నేను నిన్ను కలుసుకున్నాను. సంతోషం అతను యేసును కలుసుకున్నాడు. అందునుబట్టి మనం కృతజ్ఞులం. ఇప్పుడు, కేవలం కొద్ది క్షణములు, మరల ప్రతి ఒక్కరు, తల వంచండి.

77

మీరు చాలా అనారోగ్యముగా ఉన్నారు, లేదా? అయితే సరే. ఆమెను అడగండి ఇప్పుడు ఆమె తన హృదయమంతటితో నమ్మితే, ఆమె దాని నుంచి బాగుపడుతుంది...?... ఇక్కడ ఉన్న తల్లులైన మీరు ... రక్త స్రావమునకు దగ్గరలో ఉన్నారు... ప్రియమైన తండ్రీ, అపవాది ఉచ్చు బిగించాడని నేను గ్రహించాను. మరి ఇప్పుడు, వాడు మా సహోదరిని పట్టుకొని ఉన్నాడు మరియు ఆమె ఈ లోకమును విడిచిపెట్టుటకు ఇప్పుడు రక్తస్రావమయ్యే మెదడుకు సంబంధించిన ఒకదానిని కలిగించాడు. ఆ గడ్డ కట్టిన రక్తాన్ని మీరు మాత్రమే కరిగించగలరు. కానీ తండ్రీ, మీరు దానిని చేస్తారా? తండ్రీ, దానిని అనుగ్రహించండి. అపవాది దీనిని చేసాడు, మరియు అది వాడి కార్యం. కానీ మా సహోదరిని విడుదల చేయుటకు మీరు ఇక్కడ ఉన్నారు.

అపవాది, దేవుని కుమారుడైన, యేసుక్రీస్తు ద్వారా నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, ఆ స్త్రీని విడిచిపెట్టు...?... సహోదరుడా...[టేపు మీద ఖాళీ యున్నది]... నా హృదయములో. దేవుడు ఆమెను దీవించును. అది కూడా ఆగిపోయింది. ఆమె బాగుంటుంది.

అవును. మీరు ఆంగ్లము మాట్లాడుతారా? లేదు. ఇప్పుడు ఆమెను అడగండి, మరియు అదేమిటో నాకు తెలుసని ఆమెకు చెప్పండి తద్వారా ఆమెకు నమ్మకం కలుగుతుంది. ఆమె [టేపు మీద ఖాళీ యున్నది] ఉదరం బాధిస్తుంది ఆమెకు చెప్పండి. ఆమెకు చెప్పండి. ముచ్చో. “మచ్ ఓ” అంటే “చాలా” మరియు “చాలా ఎక్కువ”. అది ఏమిటో చూడండి. ఆమెకు కడుపులో గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంది. ఇప్పుడు- ఇప్పుడు నేను దానిని ఎలా చెప్పగలిగానో చెప్పండి, అది ఆమె చేతి ప్రకంపనలద్వారా, అది తెలియడం ద్వారా ఆమె విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. “ఆమె నమ్ముతుంది” అని ఆమె చెప్పింది.

78

అయితే సరే. ఇప్పుడు, మీరు తల వంచినట్లయితే. (మనకు ఇంకా ఎంత సమయము ఉంది? ఓహ్, ఐదు గంటలు అయింది. మనకు ఐదు నిముషాలు ఉంది. అటుతరువాత... చూడండి, మనము ప్రజలను బయటకి పంపిస్తామని మాట ఇచ్చాము...?... ఒక్క క్షణం ఇక్కడ చూద్దాం.)

ప్రియమైన తండ్రీ, మీకు మా హృదయం తెలుసు, మరియు మా దేవుడు తెలుసు, ఈ పేద ముసలి ప్రాణి ఇక్కడ నిలుచొని ఉంది. ఆమె ఉదరముకు సంబంధించిన సమస్యతో బాధపడుతోంది. తండ్రీ ఆ పుండు ఎండిపోవలసినదే అని, ఆమె తెలుసుకొనుటకు, నేను ఆమె భాషలో మాట్లాడలేను. మీరు వెళ్లి మీ స్వంత చేతులతో దానిని కదిలించి మరియు తుడిస్తే తప్ప, అది జరుగుటకు కొద్ది రోజులు పడుతుంది. తండ్రీ, పూర్తిగా కొత్తకడుపును చేయుటకు మీకు శక్తి ఉంది. ఓ తండ్రీ, అది ఒక అద్భుతమని నాకు తెలుసు. కాని తండ్రీ, రెండవదిగా, మీరు కేవలం ఆమెను నయం చేస్తే అది కూడా అద్భుతము అవుతుంది. ఆమె నయమవ్వాలని ఆశపడుతుంది. వైద్యులు ఆమెకు మందులు ఇచ్చారు, ఆమె విసిగిపోయింది. కానీ అకారణముగా విశ్వాసాన్ని పట్టుకొని లేను, తండ్రీ, ఆమె చాలా ఆందోళనగా ఉంది; అది ఈ పొత్తికడుపు సమస్యకు కారణమవుతుందా...?... తండ్రీ, ఆమెకు చెప్పుటకు ఆ సూచన నాకు ఇవ్వమని, నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మరియు ఆమె నమ్మితే, ఆమెకు నయమవుతుంది, కాదా, ప్రభువా?

79

సాతాను, నీవు ఆమెలో నుండి బయటకురా, నీవు ఆమెను విడిచి పెట్టాలని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. సహోదరుడా జోసెఫ్, ఆమె...

ఇప్పుడు, మీరు ఆమెకు వివరించండి; ఇప్పుడు ఆమెకు చెప్పండి నయం అవుటకు కేవలం కొద్ది రోజులు పడుతుందని. ప్రకంపనలు ఆమెను విడిచిపెట్టాయి. ఆమె బాగుంది. ఇప్పుడు, మీరు బాగవుతారు ... మీకు బాగవుతుంది. మీరు బాగవుటకు, అది సుమారు- సుమారు ఒకటి నుండి పదిహేను రోజులు పట్టవచ్చు, లేదా అదే విధముగా. ఆమెకు చెప్పండి; కొద్ది సేపటి తర్వాత ఆమె కేవలం... ఆమె - ఆమె దానిగురించి మర్చిపోగలిగితే... ఆమెకు చెప్పండి, “దాని గురించి మర్చిపోయి వెళ్ళమని. ఆమె కేవలం...” ఈ విధముగా ఆమెకు చెప్పండి ...?... ఎల్లప్పుడు క్రీస్తుకు సేవ చేయమని ఆమెకు చెప్పండి. ఆమె హృదయమును దేవుడు దీవించును. సరే.

80

మీరు మీ చెయ్యి పక్కకు పెట్టుకున్నారా...?... దాని నుంచి నేను ఏ ప్రకంపనా చూచుటలేదు. ఇప్పుడు, అయ్యా, అయితే మీకు సహాయం చేసేది ఒక్కటే. కొద్ది కాలం క్రితం ఒక యవ్వన మహిళ ఇక్కడికి వచ్చింది...అది ... వెన్నెముకకు మత్తు మందు తీసుకోవటంవలన, అది ఆమెకు ఏదో చేసింది, మరియు నడుము క్రింద నుంచి ఆమె నరాలు... ఆమె ప్రసవానికి దానిని తీసుకుంది, మీకు తెలుసా? ఆమె క్రిందభాగం అంతా పక్షవాతం వచ్చింది, ఏ స్పర్శ లేదు, నడవలేదు లేక ఏమి చేయలేదు. ఆమె కొరకు నేను ప్రార్ధించాను, దాదాపు ఎనిమిది లేక పదిరోజులవుతుందని నేను అనుకుంటున్నాను, మరియు ఆమె వీధిలో, ఆమె చక్రాల కుర్చీలో నుంచి లేచి, నడుస్తోంది.

ఇప్పుడు, ఆ దేవుడు ఆమెను స్వస్థపరచగలిగితే...?... నేను ప్రభువైన యేసును నిన్ను బాగుచేయమని అడిగితే నీకు నయమవుతుంది నీవు నమ్ముతావా? ఆమె నీ భార్యా...?... మీరు కలిసి సంతోషముగా ఉండాలనుకుంటున్నారు. అది నాకు తెలుసు. మీ గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారు నాకు తెలుసు సహోదరుడా. కొద్ది సేపటి క్రితము నా భార్య నాకు ఫోన్ చేసినప్పుడు... నాకు తెలుసు ఎలా ... మీరు సంతోషముగా కలిసి ఉండాలనుకుంటున్నారు, మరియు నేను మీరు సంతోషముగా కలిసి ఉండాలనుకుంటున్నాను. ఒకవేళ అతనిని ఆయన బాగుచేసినట్లైతే నీవు- నీ జీవితకాలమంతా క్రీస్తుకు సేవ చేస్తావా.? ఇప్పుడు, అది జరుగుతుందో లేదో అనే దానితో సంబంధం లేకుండా... ఇప్పుడు, అది ఎలాగైనా జరుగుతుందని మీరు నమ్ముతారు, నమ్మరా? అవునమ్మా. అయితే సరే.

81

ఇప్పుడు, ప్రతీ ఒక్కరు, మీ తలలు వంచండి. ఇక్కడ పక్షవాతముతో ఉన్నటువంటి సహోదరుని కొరకు మనం ప్రార్ధిద్దాం.

ప్రియమైన తండ్రీ, ఆ వ్యక్తి నుంచి వచ్చే ప్రకంపనలు నేను-నేను అనుభూతి చెందుతున్నాను, కానీ ప్రియమైన ప్రభువా అతను పక్షవాతానికి గురి అయ్యాడు. ప్రియమైన ప్రభువా, ఏదో జరిగింది, అతని శరీరంలోని క్రింది భాగములోని అతని నరాలు చచ్చుబడిపోయాయి. అతని నుండి ఈ స్థితి తీసివేయండి, మీరు మాత్రమే ఈ నరములలోకి మరలా జీవం తీసుకుము రాగలరు. నాప్రార్ధన వింటారా. అతని అందమైన చిన్న భార్య అతని పక్కన నిలబడి ఉండుట చూస్తుండగా, ఓ ప్రభువా, అతనిని చూస్తే ఆమెకు ఎలా అనిపించాలి అతను ఆమెను చూస్తున్నపుడు మరియు యవ్వన జంటలను ఆ వీధులలో చూసినప్పుడు. ఓ దేవా, కరుణించండి. అతనిని దీని నుండి కోలుకోనివ్వండి. మీరు చేస్తారా ప్రభువా? చెవిటివారు వినులాగున మూగవారు మాట్లాడులాగున చేయగలిగే మీరు, ఈ రోజే అతని పక్షవాత స్థితి అతనిని విడిచిపోవాలని, మరియు ఈ రోజే జీవం తిరిగి అతని కాళ్లకు రావాలని నేను ప్రార్ధిస్తున్నాను. దేవుని పరిశుద్ధ కుమారుడైన యేసుక్రీస్తు నామములో, ఈ ఆశీర్వాదమును అతని కొరకు నేను ప్రార్ధిస్తున్నాను. ఆమెన్ [టేపు మీద ఖాళీ యున్నది]

82

...?... అది అతని శరీరం నుంచి... నీకు ఉంది... నీకు ప్రమాదం లేదా మరేదైనా జరిగినదా? ఈ నెలలో చెప్పండి... సరే, దేవుడు మీ హృదయమును దీవించును. ఎప్పుడు, ఎక్కడ. నేను మీరు చేయాలనుకుంటున్నాను...? ఎలాగున్నా అని నేను చూస్తున్నాను [టేపు మీద ఖాళీ యున్నది] ఎందుకు, మీరు ఖచ్చితముగా చేయగలరు. ఎందుకు, దేవుని స్తుతించండి అతను ఇప్పుడు దాని వద్ద నడుస్తున్నాడు...?...

“దేవుణ్ణి స్తుతిద్దాం…”?... అని చెబుదాం...?... “దేవునికి స్తోత్రం...? ...” ?... అని చెబుదాం, ప్రతీ ఒక్కరం. ఇప్పుడు ప్రతీ ఒక్కరు మీ తలలు వంచండి [టేపు మీద ఖాళీ యున్నది]

83

నా సహోదరుడా నేను చూస్తున్నాను, నీవు దారుణమైన స్థితిలో ఉన్నావు. ఇప్పుడు నీ హృదయమంతటితో నమ్ముతున్నావా? ఇప్పుడు, దేనితో సంబంధం లేకుండా...నీకు తెలుసు నేను దేవుణ్ణి అద్భుతాల కొరకు అడగనని ప్రమాణం చేశాను, విశ్వాసమును బట్టి మాత్రమే. నీవు ప్రకంపనలను కూడా కలిగివున్నట్లు నేను చూస్తున్నాను. అవును, అయ్యా. నేను దానిని అనుభూతి చెందుతున్నాను. ఇప్పుడు నేను దానిని తెలుసుకునే మార్గం ఉందా? ప్రపంచములోఏ దారి లేదు, సర్వశక్తిమంతుడైన దేవుని ద్వారా మాత్రమే. అది నిజమేనా? ఇప్పుడు అక్కడ అది ఉంది. మీకు ఈ అల్సర్ స్థితి వచ్చింది. నీవు చాలా కంగారుగా ఉన్నావు. నీవు చాలా కంగారుగా ఉన్నావు. మరియు నీ వెన్ను విరిగింది. ఇప్పుడు, నేను దేవునిని అడిగితే ... నీ అల్సర్ ఆగిపోతుందో లేదో నేను చెప్పగలను, కానీ మిగిలిన కార్యములు నీ విశ్వాసము మీద ఆధారపడి ఉన్నాయి. కానీ నేను దేవుణ్ణి అడిగితే, ఏదేమైనా నీవు నమ్ముతావా, నమ్మవా? నీవు నమ్ముతావా?

మా ప్రియ పరలోక తండ్రీ, విరిగిన వెన్నుతో మా సహోదరుడు ఇక్కడ నిలుచొని ఉన్నాడు, కేవలం మీ ద్వారా మాత్రమే తప్ప , ఈ ప్రపంచములో అతనిని బాగు చేసే మార్గమేదీలేదని అతను ఎరిగియున్నాడు. అతను అల్సర్ తో కూడా బాధపడుతున్నాడు. తండ్రీ, మీరు మాత్రమే, ఆ దైవిక స్వస్థత గలవారు. మీరే, అన్ని కార్యములు చేయగలిగినవారు. ప్రభువా, ఆ వ్యక్తి విశ్వాసము కలిగి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. నేను దానిని నమ్ముతున్నాను. దేవుని దూత, ప్రత్యక్షతను మరియు మీ వరములను ఇతను అర్ధం చేసుకున్నాడని నేను నమ్ముతున్నాను.

అందువలన, ఇతనిని బంధించిన అల్సర్ అని పిలువబడే దయ్యమా , ఈ వ్యక్తి నుంచి బయటకు రా, యేసుక్రీస్తు నామములో, అతనిని విడిచిపెట్టమని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా, మీ అల్సర్ పోతుంది.

84

ఇప్పుడు, తండ్రి, మా సహోదరుని మీద దయ చూపండి. కొద్ది రోజులలో అతను ఈ పట్టణములో లేక ఎక్కడికి వచ్చినా అతని వీపు మీద ఆ ఊత కర్రలను ఉంచుకొని తన పాదములతో నడుస్తూ ప్రజలకు సాక్ష్యమిస్తూ చెపుతూ,“ ఎందుకు, ఒకప్పుడు నేను విరిగిన వెన్ను కలవాడిని ఇప్పుడు కొద్దిలోనే అది స్వస్థపడింది. మరియు ఇప్పుడు నేను బాగున్నాను ఎందుకంటే యేసుక్రీస్తు నన్ను బాగు చేసాడు.” ప్రభువా, దీనిని అనుగ్రహించండి. మరియు ఈ వ్యక్తి దానిని సాక్ష్యమిచ్చులాగున యేసుక్రీస్తు నామములో నేను దీనిని అడుగుతున్నాను. ఆమెన్.

అయ్యా, నేను నా హృదయమంతటితో నమ్ముతున్నాను మీరు...?... ఇప్పుడు బాగయ్యారు. [టేపు మీద ఖాళీ యున్నది]

“ఇప్పుడు, నేను నమ్ముతున్నాను.” అతను అన్నాడు, “అయ్యా, నేను స్వస్థపడతాను.” అది స్వస్థపడుతుంది, కాదా, స్నేహితులారా? అందరూ, దానిని నమ్మడం లేదా? ఇప్పుడు దాని నిమిత్తము దేవుని స్తుతిద్దాం. సరే. మీ తలలు వంచండి.

సహోదరుడా మనము ఇంకను ఎంత సమయము కలిగియున్నాం? ఐదు గంటలు. ఇప్పుడు ఇక్కడ మరలా తిరిగి రాలేనటువంటివారు మరియు ప్రార్ధింపబడుటకు కనీసము ప్రార్ధనా వరుసలోకి కూడా మనము తీసుకురాలేనటు వంటి వారు ఇంకా ఎంత మంది ఉన్నారు. మరలా రాలేము అని చెప్పేటటువంటి వారు సుమారు ఇరవై లేక ముప్పై మంది ఉన్నారు.

85

సభా భవన సంరక్షకుడా, నీవు కేవలం- కేవలం- కేవలం కొద్ది నిమిషములు మమ్మల్ని భరించగలిగితే. నేను వీరి కొరకు కేవలము ప్రార్ధించి వారిని వరుసగుండా వెళ్లనిస్తాను. వారి సమయమును బట్టి వారిని నేను ఎంతగానో అభినందిస్తున్నాను.

ఇప్పుడు మీరు ఒక్క క్షణము మర్యాదతో ఉండగలరా. ఎలాగైనా ప్రతి ఒక్కరికి నేను ప్రార్ధించాలి. తదుపరి కూడికలు తిరిగి రాలేనటువంటి, ఇక్కడ వరుసలో ఉన్న ప్రియులైన మీరు... మంచిది, మీరు - మీరు దేవునిని నమ్ముతారా, నేను కేవలము ఆయనను అడిగితే మీకు నయమవుతుంది నమ్ముతారా, నమ్మరా, యవ్వనస్థురాలా? నీవు దానిని నమ్ముతున్నావు. నీవు కూడా దానిని నమ్ముతున్నావు, కాదా, సహోదరీ? నేను దేవుని అడిగితే నీవు బాగుపడతావ్, కాదా? నేను అనుకొంటున్నాను ఆమె... ఓహ్, ఆమె చెవిటిది. ఓహ్ సరే మంచింది.

నా సహోదరుడు కిడ్సన్ నాకు ఒక మాట తీసుకువచ్చాడు అదేమనగా అక్కడ ప్రేక్షకులలో ఉన్న ఒక గుంపు అన్నారు నేను వెదక మీద నుంచే నేను వారి నిమిత్తము ప్రార్థిస్తే వారు స్వస్థపడుతారు అని. అది దేవుడు కదిలినప్పుడే, కాదా? అది నిజము. ఇప్పుడు, సరే మీరు మీ తల వంచండి, మరియు నేను - నేను ఇంకొంత మందికి ప్రార్ధించుటకు ప్రయత్నిస్తాను. మాకు మరొక పది నిమిషాలు ఇవ్వండి, అటుతరువాత మేము- అప్పుడు ప్రేక్షకులందరి కొరకు ప్రార్ధిస్తాను. స్నేహితులారా, అది మనోహరమైనది. దాని నిమిత్తము క్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తాడు, ఇప్పుడు ఒక్క క్షణం.

86

తండ్రీ, మీరు ఈ బాలుడిని స్వస్థపరుస్తారని మరియు అతనిని బాగు చేస్తారని నా హృదయమంతటితో ప్రార్థిస్తున్నాను. తండ్రీ, యేసుక్రీస్తు నామములో దానిని నేను అడుగుతున్నాను తండ్రీ. ఆమెన్. యవ్వనస్థుడా దేవుడు నిన్ను దీవించును.

ఇప్పుడు, ఇక్కడ చెవిటిగా ఉన్న యవ్వన స్త్రీ ఈమేనా? ఈమె చెవిటి మరియు మూగనా...?... సహోదరీ నీవు ఆమెకు సోదరివా ? నీవు మేనకోడలివా? ఆమె ఆ విధంగా పుట్టిందా? ఆమె చెవిటి మరియు మూగగా మారిపోయింది. ఒక పక్షవాతం ఆమెను చెవిటి మరియు మూగగా మార్చింది. ఇప్పుడు, అది ఆ విధముగా జరగవచ్చు... మీరు ఫీనిక్స్ నుండి వచ్చారా? అవునా, అలాగా . ఓహ్ ... ?... అక్కడ? అవును, మేడం. సరే, గతవారం, ఐదుగురు ఈ కూడిక నుండి మాట్లాడుతూ మరియు వింటూ వెళ్లారు... ఇప్పుడు, మీకు విశ్వాసం ఉంటే, ఆమె... ఇప్పుడు, ఖచ్చితముగా ఆమె పలకడం లేదా మాట్లాడడం ప్రారంభించినపుడు, అది చిన్న బిడ్డవలె ఉంటుంది. చూస్తున్నారా? ఆమె నుంచి ఏ ప్రకంపనా లేదు; ఆమె కేవలం పక్షవాతానికి గురయింది, ఆమె నరాలు మరియు స్వరపేటిక స్తంభించాయి.

ఇప్పుడు, ఇక్కడ చెవుడు మరియు మూగ అయినటువంటి యవ్వనస్థురాలు ఉంది. ఆమె మిచిగాన్ నుండి వచ్చింది. ఆమె మా- మీసా మాట్లాడుతుంది. క్షమించండి. దానిని నేను సరిగా గ్రహించలేదు, మీసా నుంచి. ఆమె వెళ్తుంది...?... మరిప్పుడు ఐతే ఆమె ...(ఆమెకు ఏమైంది, ఏంటి? పోలియో?) పోలియో ఆమె వినికిడిని స్థంబింపచేసింది... ఖచ్చితముగా మనకి తెలుసు అదే నరం మీద మాట మరియు వినికిడి. ఇప్పుడు, నేను దేవుణ్ణి అడిగితే, ఆ అమ్మాయికి నయమవుతుంది, ఆ స్త్రీ నమ్ముతుందా. ఇప్పుడు, ఆయన ఇప్పుడు ఆమె చెవులను తెరువగలడు. అది, నాకు తెలియదు. అది నేను చెప్పలేను. ఆయన ఇప్పుడు ఆమెను మాట్లాడులాగా చేయగలడు. నేను చెప్పలేను. అయన చేస్తే, అది ఒక పసిబిడ్డవలె ఉంటుంది. ఆమె స్పష్టముగా మాట్లాడలేదు. కానీ ... నేను అడిగితే...[టేపు మీద ఖాళీ యున్నది] సరే, ఆమెకు సైగ చేసి ఆమె నమ్ముతుందా అని అడగండి.

87

తండ్రీ, అందమైన చిన్న బాలిక ఇక్కడ నిలుచొని ఉంది. ఆమె హృదయమును దీవించండి. దయ్యము వచ్చి ఆమె వినికిడిని మాటను తీసివేసింది. ఏ దయ్యపు కార్యమునకు ఆమె స్వస్థపడాలని ఆమె కోరుకుంటుందని నేను నమ్మడం లేదు. కానీ ఇక్కడ ఆమె పక్కన నిలుచొని ఉన్న మరో వ్యక్తి, తండ్రీ, ఆమె కన్నీళ్లతో (...?... ఆమెకు దగ్గరగా ), ఆమె బాగవ్వాలని కోరుకుంటుంది తండ్రీ, ఆమె బడి నుంచి ఇంటికి వచ్చి తిరిగి సంఘమునకు వెళ్లి వాక్యమును వర్తమానమును వినాలని మరియు దేవుని స్తుతించాలని కోరుకుంటుంది. ఓ ప్రభువా, గతవారం ఒరెగాన్ లేదా ఇదాహోలోని ఆ ఐదుగురు చిన్న బిడ్డల గురించి ఆలోచిస్తున్నాను. మీరు వారిని ఏ విధముగా స్వస్థపరిచారు, వారిని పాఠశాల నుంచి బయటకు తీసుకువచ్చారు. వైద్యులు వారికి నయమైందని ధృవీకరించి వారినితమ గృహముకు వారి ప్రియుల వద్దకు పంపారు.

ఓ తండ్రీ, ఆమె మీద దయ చూపించండి. తక్షణమే ఆమె దీని నుండి కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మరియు తండ్రీ, ఇది మీ చిత్తమైతే, మీ దాసుడు గద్దించినపుడు, అపవాది ఆమెను విడిచి పెట్టును, మరియు ఆమె తక్షణమే మాటలాడును మరియు వినగలుగును. కాని పక్షమున, తండ్రీ నా హృదయమును మీరు యెరిగి ఉన్నారు. ఆమె కోలుకుంటుందని మేము నమ్ముతున్నాము. యేసుక్రీస్తు నామములో ఆమెను విడిచిపెట్టమని అతనిని నేను అడుగుతున్నాను.

88

ఇప్పుడు, ప్రతి ఒక్కరు మీ తలలు వంచి ఉండండి. ప్రతి ఒక్కరు ప్రతిచోటా మీ తల వంచి ఉండండి. నన్ను దీనిని చూడనివ్వండి. నేను చెప్పేది వినబడుతుందా? (మీ తలలు వంచి ఉండండి. ఆమె వినికిడి ఆమెకు వద్దకు వస్తుంది.) చూస్తుంటే, ఆమె దానిని విన్నట్లు ఉంది. ఆమె నా మాటలు విన్నదా అని నేను అడిగాను, ఆమె వినగలిగిందని అనుకోకుండా ఉండుటకు...

ఒక్క క్షణం, ప్రతి ఒక్కరు. ఈ జీవము దాని వద్దకువస్తుంది. అది అట్లయితే ... దేవుడు దానిని చేయకపోతే, అది ఖచ్చితముగా ఉంది. అయన దానిని సమయానికి చేస్తాడు. ఏది స్వస్థత, అద్భుతములు కాదు. ఆమెన్.

నేను చెప్పేది వినపడుతుందా? “ఆమెన్.”అని నీవు చెప్పు [“ఆమెన్.” అని ఆ అమ్మాయి చెప్పింది] సరే, హనీ నీ తల పైకిఎత్తు. నేను చెప్పేది వినపడుతుందా? నేను చెప్పేది నీకు వినపడుతుందా? ఆమెన్. [ఆమెన్.] అందరం దేవునిని స్తుతిద్దాం .

ఇప్పుడు, సహోదరి, ఆమెకు భయంకరమైన తల నొప్పివస్తుంది. మీతో ఉన్న ఆ అమ్మాయి, దానిని కలిగి ఉండబోతుంది... ఓహ్, నీవు ఆమె కొరకు వేచిఉంటావు. సహోదరీ ఆమెకు తల నొప్పి వస్తుంది. అది ఆమెను భాదపెడుతుంది, మరియు మీరు ఆమెకు చెప్పండి... ఆమె బాగుంటుందని. దాని గురించి ఏమీ చింతించకండి. దేవుడు నిన్ను దీవించును. ఆమె నా మాట వింటుందని చెప్పింది. ఖచ్చితముగా ఆమె వింటుందా...?...[టేపు మీద ఖాళీ యున్నది]...?...

89

అయ్యా? ఇక్కడ ఒక సేవకుడు ఉన్నాడు-తన మేనకోడలిని తీసుకువచ్చాడు, ఆమె చెవిటిది. ఇప్పుడు మీకు తెలుసు గత-వారంలో చివరి ఆదివారం, నేను అద్భుతాల కోసం అడగలేదు. ఇప్పుడు, అందరు మీ తల వంచండి.

పరలోకపు తండ్రీ, మీరు ఎల్లప్పుడూ సమీపములోనే ఉంటారు... మరియు ఈ సుందరమైన చిన్న స్త్రీ స్వస్థత కోసం ఇక్కడకు వస్తుంది. మరియు నేను నమ్ముతున్నాను, తండ్రీ, మీరు ఇక్కడ ఉన్నారని మరియు మీరు మా హృదయాల దీనత్వాన్ని వింటారని నేను నమ్ముతున్నాను. మరియు వారు జబ్బుపడిన మరియు పీడిత, మరియు చెవిటి, మరియు మూగ, మరియు గుడ్డి వారిని తీసుకుని రావచ్చు. మరియు మీరు మాత్రమే, ప్రభువా, నయం చేయగలరు. మీరు ఈ అమ్మాయి చెవులకు వినికిడిని పునరుద్ధరించాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు దానిని అనుగ్రహిస్తారా, ప్రియమైన తండ్రి. ఆమె తక్షణమే నా మాట వినులాగున మరియు నయమవులాగున చేయండి. అయినప్పటికీ, తండ్రీ, “ప్రజలు నిన్ను విశ్వసిస్తే, నీ ప్రార్థన ముందు ఏదీ నిలబడదు” అని మీరు చెప్పిన మీ వాగ్దానాన్ని నేను విశ్వసిస్తున్నాను. అది ఆమెను విడిచిపెడుతుందని నేను నమ్ముతున్నాను, తండ్రీ. అది ఇప్పుడు చేస్తుందో లేదో, నాకు తెలియదు. అది మీ శక్తిలో ఉంది తండ్రీ, నాది కాదు. మరియు నా శక్తి మీ నుండి వస్తుంది. ఆ చెవిటి ఆత్మను ఆమెలో నుంచి తరిమి వేయుటకు మీరు నాకు శక్తినివ్వాలని నేను ప్రార్థిస్తున్నాను.

చెవిటితనమునకు కారణమైన దయ్యమా, యేసుక్రీస్తు నామములో ఆమెలో నుండి బయటకురా.

మీకు వినిపిస్తుందా...? నేను దానిని నమ్ముతున్నాను. ముఖ్యముగా ఎడమ వైపునది.

వినిపిస్తుంది? వినిపిస్తుందా? ఆమె... అవును, అది వచ్చింది. (ఒక్క క్షణం, ఆమె...) వినిపిస్తుందా ? (సరే. మీరు మీ తల పైకెత్తవచ్చు.) ఇక్కడ వేచిఉండుటకు మనకు ఇంకొంచెము సమయము దొరికితే. ఆమె పొందుకుంది...?... వినిపిస్తుందా? [టేపు మీద ఖాళీ యున్నది]...?... దేవుడు మిమ్మల్ని దీవించును...?...

అందరం “దేవునికి స్తోత్రం.” అని చెపుదాం. సరే, ఇప్పుడు ప్రతి దగ్గరా మీ తల వంచండి.

90

ఆమెతో ఎవరు ఉన్నా, చెప్పండి... ఇప్పుడే రావడం మొదలవుతుంది. (మీ తల వంచండి, మనము ఒక...) మనము తొందరపడాలి; అతను నాకు చెప్పాడు, ఇది పది నిమిషాల తర్వాత.

అవునండి. ఇప్పుడు ప్రియమైన సహోదరీ నువ్వు సేవకుని భార్యవా? సరే, నా భార్యకు నీపై ఎలా సానుభూతి చూపాలో తెలుసు, ప్రియమైన, నేను వెళ్లినప్పటి నుండి, నేను ఉండగా ... మీరు ... అది ఏమిటి, మీకు కడుపులో గ్యాస్ సమస్య ఉంది; మీ కడుపు ...?...[టేపు మీద ఖాళీ యున్నది]

ప్రియమైన తండ్రీ, మరియు ప్రజలందరి హృదయాలను తెలిసిన మీరు, మరియు ఇది మీ సేవకుడు... [టేపు మీద ఖాళీ ఉన్నది]... ఒక యవ్వన సేవకుడు... ఓ దేవా, వారి జీవితం నీకు ఫలవంతముగా ఉండుగాక, తండ్రీ , మాకు పని చేయడానికి ఇంకా చాలా రోజులు లేవని భావిస్తున్నాము, ఆపై [ టేపుపై ఖాళీ ఉంది.] మరియు మనం యేసును చూస్తాము. మరియు తండ్రి, మేము... [టేపు మీద ఖాళీ యున్నది] “అయ్యా, మనం యేసును చూస్తాము.” ఓహ్, మనం ఆయనను ఎలా ప్రేమిస్తున్నాం. మరియు నేను యవ్వన సేవకుని నిమిత్తము మీకు ధన్యవాదాలు తెలుపుచున్నాను. మరియు నేను ప్రార్థిస్తున్నాను, తండ్రీ, అతని జీవితం చాలా సఫలీకృతం కావాలని. మరియు అతని సహచరుడు ఈ రోజు మీ ముందుకు వస్తాడు... [టేపు మీద ఖాళీ యున్నది] అతని భార్యకు స్వస్థత చేకూర్చాలని మీరు అతని కోసం పంపారు. ఇప్పుడు తండ్రీ, నీ సేవకుని ప్రార్థన వినండి. మరియు వారు దేశానికి తిరిగి వెళ్లి, ప్రార్థన చేస్తూ, మాట్లాడేటప్పుడు, మీరు స్వస్థపరచువారు కూడా అను సాక్ష్యాన్ని తీసుకుంటారు.

దయ్యమా, ఈ స్త్రీని యేసుక్రీస్తు నామములో విడిచిపెట్టు.

91

యవ్వనస్థురాలా దేవుడు నిన్ను దీవించును గాక. దాని ప్రతి ప్రకంపన పోయింది. ఇప్పుడు చూడండి, మీ కడుపు పచ్చిగా ఉంది. మీ చేతిపై దద్దుర్లు వచ్చినట్లుగా ఉంది, మరియు మీరు దానిపై ఏదైనా ఉంచుతారు మరియు అది మెరుగుపడటం ప్రారంభించింది, బాగా లేదు. కొంతకాలం తర్వాత, మీరు దానిని కలిగిఉన్నారని కూడా మర్చిపోతారు. మీరు ఇప్పుడు బాగానే ఉంటారు. దేవుడు నిన్ను దీవించును. మీ భర్త పేరు ఏమిటి? వాల్టర్ బెక్మాన్. ఇప్పుడు, ఇది... యవ్వనస్థురాలా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అది చాలా బాగుంది. [టేపు మీద ఖాళీ యున్నది]

..?... స్నేహితులారా, ఇలా ఏర్పాటు చేయడం, ఆమె ఆశ్చర్యంగాఉందా...?... తల కారు వెనుకకు తగులుతోంది... [టేపు మీద ఖాళీ యున్నది]

అతను చెప్పాడు, “అది సరే. బ్రదర్ బ్రాన్హాంని చూడటానికి నేను అక్కడికి వచ్చినప్పుడు, నేను తిరిగి వెళ్ళినప్పుడు, నేను...?... [టేపు మీద ఖాళీ యున్నది] నాచేతిలో ఉంచుతాను. చిన్న పిల్లవాడు తక్షణమే విడుదల అయ్యాడు, పట్టీను తీసివేసి, అతని వీపుపై వేసుకొని నేలపైన తన పాదములతో నడిచాడు. అదేనా...?... సేవకులారా? ”దేవునికి స్తోత్రం“ అని అందాం. ఓ ప్రభువా. దేవుడు నిన్ను దీవించును.

92

చూడండి దేవుడు నిజమా...?... ఇప్పుడు చూద్దాం. ఇంకా ఎంతమంది? సహోదరుడు అన్నాడు అతను ఇప్పటికే ... వారు ఇంక తలుపులు మూసివేస్తారు అని అనుకుంటున్నాను. మరియు ఈ వ్యక్తులు తిరిగి రాలేకపోతే, నేను వారిలో ప్రతి ఒక్కరికీ ప్రార్థన చేయబోతున్నాను.

మరియు వరుస గుండా వీలైనంత మందిని ఉండనివ్వండి (నువ్వు నమ్ముతావు, నమ్ముతావా సహోదరీ?) అది నేను కాదు...ఎలా ఉందో నీకు అర్థమైంది. నేను మీలో ప్రతి ఒక్కరితో ప్రార్థన చేయాలనుకుంటున్నాను.

మనం ... నేను మొదటగా చెప్పాలనుకుంటున్నాను, ఈ మధ్యాహ్నం ప్రతి ఒక్కరికీ విమోచన కోసం దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము, కాదా? ఇప్పుడు, నేను వరుసలోని ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించాలనుకుంటున్నాను మరియు వారిని దాటనివ్వండి, తద్వారా నేను వారిపైనా చేతులు ఉంచగలను. పరిశుద్ధ గ్రంధం ఇలా చెబుతోంది, “వారు రోగుల మీద చేయి ఉంచినప్పుడు వారు కోలుకుంటారు”, కాదా?

93

మా పరలోకపు తండ్రీ, మా సమయం అయిపోవస్తుందని మీకు తెలుసు. మరియు మనము చాలా సార్లు తెలుసు...?... సమూహాలు, మరియు విశ్రాంతి తీసుకోవడానికి పక్కకు వెళ్ళాయి. కానీ తండ్రీ, ఈ పరిచారకులు తమ సంఘములతో ఉండవలసిన సమయం ఇది. మరియు ఓ దేవా, ఈ మధ్యాహ్నం కారణముగా మీరు ఆత్మలను రక్షించడానికి పంపండి. ఈ రాత్రికి వారి పరిచారకులు అభిషేకింపబడాలి. సహోదరుడు ఫాల్క్‌నర్ మరియు సహోదరుడు అవుట్‌లా, సహోదరుడు ఫుల్లర్, ఇక్కడ ఉన్న సోదరులందరూ, తండ్రి, ఇక్కడ ఉన్న మీ పరిచారకులు, వారు ఈ రాత్రి అభిషేకించబడాలి, దేవునిశక్తి వారి మధ్యలో ఉంటుంది మరియు వారు మునుపెన్నడూలేని విధంగా మాట్లాడతారు. పాపులు కల్వరికి వెళ్ళే మార్గములో విలపిస్తారు మరియు అక్కడ దేవుని ఆత్మతో నింపబడతారు. ఓ తండ్రీ, అనేకులు, ఈ రాత్రి కూడా, అప్పుడు రక్షింపబడవచ్చు.

మరియు ఇప్పుడు వరుస ద్వారా వస్తున్న వారు, మీకు తెలుసు. మరియు మీ ఆత్మ చాలా బలముగా ఉండుగాక, వారు వెళ్ళినప్పుడు, మరియు నేను వారి చేతిని పట్టుకున్నప్పుడు, ప్రతి ఒక్కరిపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది. వారు ఈ మధ్యాహ్నం ఈ భవనాన్ని విడిచిపెట్టునపుడు, వారి స్వస్థత కోసం మీకు కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషిస్తారు; ఎందుకంటే విశ్వాసం అనేది మీరు చూడని, రుచి చూడని, అనుభూతి చెందని, వాసన చూడని లేదా వినని విషయాల యొక్క సాక్ష్యం, ఆశించిన విషయాల యొక్క మూలాంశం అని మేము గ్రహించాము. ప్రభువా దీనిని అనుగ్రహించండి. వారందరిని క్షేమంగా ఉండనివ్వండి. మరియు మీరు చేసిన వాటన్నిటికీ, ఇంకా మీరు చేయబోయే వాటన్నిటికీ యేసుక్రీస్తు నామములో మేము మీకు కృతజ్ఞతలు మరియు స్తుతులు చెల్లిస్తున్నాము. ఆమెన్.

94

ఇప్పుడు, మనలో ప్రతి ఒక్కరం ఒక్క క్షణం నిలబడదాం. ఇప్పుడు, నేను వీటిని గుండా వెళుతున్నప్పుడు, మీరందరూ నాతో ఆ పాట పాడాలని కోరుకుంటున్నాను. మరియు సహోదరుడా, పాటల నాయకులలో ఒకరు, నువ్వు ఇక్కడికి వస్తావా పాటల నాయకుడా? ఇక్కడ పాటల నాయకుడు ఎవరు?... ఇదిగో... ఇక్కడకు రండి, సహోదరుడా హర్షల్. మీరు పాడాలని నేను కోరుకుంటున్నాను, “కేవలము నమ్ముము.”

సేవకులారా మీరు ప్రార్థన వరుస ఉన్న చోటికి నడవాలని మరియు వారు వరుస గుండా వస్తున్నప్పుడు వారి కోసం ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు దానిని చేస్తారా? వారు మనలని దాటి వెళ్లుచుండగా కేవలము కరచాలనం చేయుటకు, సుమారు పదిహేను లేదా ఇరవై మందిని మనం కలిగిఉన్నాము. అందరూ, మృదువుగా పాడుతున్నారు ... [ప్రేక్షకులు “కేవలము నమ్ముము ” అని పాడుతున్నారు.]

[టేపు మీద ఖాళీ యున్నది ]సహోదరీ, మీ చేయి పైకి లేపండి. ఓహ్, ఆమె ఎలా సేవ చేస్తోంది...?... ఆమె ఎడమ వైపున ఉంది. ఆమెని చూడండి. “దేవునికి స్తోత్రం” అని అందరూ అందాం. [ప్రేక్షకులు పాడుతున్నారు , “కేవలము నమ్ముము”.]

95

మరియు మీరు ఇక్కడ ఈ నగరములో ఉన్నట్లయితే, తండ్రీ, మీరు ఈ ప్రదేశములో ఉంటే, మేము అందరం మీ వద్దకు పరుగెత్తే వారము. కానీ మీరు పరిశుద్ధ గ్రంధము ప్రకారం, ఉన్నత స్థాయికి ఆరోహణమై, మనుష్యులకు వరములు ఇచ్చారు. మరియు పిల్లలను తీసుకురావడానికి వారు దేశమంతటా ఇక్కడకు రావాలి. తండ్రీ, దానిని కరుణించుము. బిడ్డ క్షేమముగా ఉంటాడనినీ సేవకుడికి ప్రజల ముందు మీ సూచనను ఇవ్వండి .

సాతాను, నేను దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో నిన్ను కలుసుకొన వచ్చాను. అమ్మాయి నుండి బయటకురా. నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, ఆమెను యేసుక్రీస్తు నామములో విడిచిపెట్టు.

నేను తల ఎత్తకముందే అది ఆగిపోయింది. సరే, అమ్మా, ఇక్కడ చూడండి. (ఇప్పుడు, ప్రేక్షకులు, ఇక్కడ, మీరు ఇప్పుడు అదే విషయముపై నా చేతిని చూడాలని నేను కోరుకుంటున్నాను.)

ఇప్పుడు, చిన్న అమ్మాయి, నీవు ఇప్పుడు క్షేమముగా ఉండబోతున్నావు, ప్రియమైనదానా. ఇప్పుడు అమ్మా...?... మీ గది నుండి ఒక తీగ తీసి ఆమె చిన్న నడుము చుట్టూ ఇలా పెట్టు. మీరు కొంతకాలం ఇక్కడ ఉండబోతున్నారా లేదా మీరు తిరిగి వెళ్తున్నారా? ఇప్పుడు, మీరు ఆ తీగను తీసుకొని ఆమె చుట్టూ ఉంచండి, నేను మీకు చెప్పింది నిజమో కాదో అప్పుడు మీకు తెలుస్తుంది. మీరు ఆ తీగను కూడా కత్తిరించారు. ఆపై రేపు రాత్రికి, లేదా మరుసటి రాత్రికి, మీరు అదే తీగను తీసుకొని ఇలా చిన్న అమ్మాయి చుట్టూ వేసి, అది ఎంత కుంచించుకుపోయిందో కత్తిరించండి. మరియు కనీసం రెండు మూడు రాత్రులు అలా చేయండి, అప్పుడు నేను మీకు చెప్పింది నిజమేనని మీకు తెలుస్తుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, సోదరి.

96

ఇప్పుడు నువ్వు నమ్ము సహోదరి. [సహోదరి సహోదరుడు బ్రన్హాంతో మాట్లాడుతుంది— సంపాదకీయం.] అవును. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, సహోదరి. మీరు రక్షణ సైన్యం అనే యోగ్యమైన ప్రదేశములో ఉన్నారు. నేను ఖచ్చితముగా అభినందిస్తున్నాను. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, సహోదరి.

తండ్రీ, ఇక్కడ ఒక రక్షణ సైన్యమునకు చెందిన స్త్రీ ఈ మధ్యాహ్నం ఇక్కడ నిలబడి ఉంది. ఓహ్, మీరు ఆమెను స్వస్థపరచి, ఆమెను బలపరచాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆమె కంగారుపడుతోంది మరియు విచ్చిన్నమవుతుంది. ఆ తర్వాత సాతాను తన మార్గములో ఉంటే, ఆమెను ఒక మెత్తని సెల్‌లో ఉంచుతాడు. కానీ మీ పద్ధతి వేరు. మీ మార్గం ఆరోగ్యకరమైన మార్గం. ఆమె ఇకనుండి ఆ బాటలోనే నడవాలి, ఆరోగ్యకరమైన మార్గములో.

నేను నిన్ను మందలిస్తున్నాను, భయము యొక్క ఆత్మ, ఆమెను యేసుక్రీస్తు నామములో విడిచిపెట్టు. ఆమెన్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నా సహాదరి. సంతోషిస్తూ, సాక్ష్యమిస్తూ మీ మార్గములో వెళ్ళండి.

97

ప్రియమైన తండ్రీ, మీరు నా సోదరుడిని స్వస్థపరచాలని నేను ప్రార్థిస్తున్నాను. అతను ప్రార్థింబడుట నిమిత్తము మిన్నెసోటా నుండి వచ్చుచున్నాడు. మరియు మీరు అతనిని బాగుచేయడానికి ఇక్కడ ఉన్నారు. మీరు దానిని అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను, తండ్రి.

సాతాను, నువ్వు నా సోదరుడిని ఈ ఆస్తమాతో బంధించావు. యేసుక్రీస్తు నామములో అతన్ని విడిచిపెట్టు.

దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నా సోదరుడు. మీరు ఇప్పుడు ఆనందముగా తిరిగి వస్తారని నేను నమ్ముతున్నాను. ప్రకంపన నా చేతిని విడిచిపెట్టింది. మరియు వెళ్ళండి మరియు మీరు బాగవుతారు. దేవుడు నిన్ను దీవించును. అయితే సరే...?...

తండ్రీ, మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములోనా సహోదరిని స్వస్థపరచాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నా ప్రియమైన సహోదరిని.

ప్రభువా , నేను ప్రార్థిస్తున్నాను... [టేపు మీద ఖాళీ యున్నది] ఈ ఊపిరితిత్తుల సమస్యతో ఉన్న సహోదరుడు నిమిత్తము కుమారుడైన యేసుక్రీస్తు నామములో. దేవుడు నిన్ను దీవించును.

ఇది కేవలం భయాందోళన మాత్రమే ... నమ్మండి ... దేవా, ఈ ప్రియమైన వ్యక్తిని మీరు స్వస్థపరచాలని నేను ప్రార్థిస్తున్నాను, తండ్రి. ఈ రోజు మీరు అతనికి అతని కంటి చూపును పునరుద్ధరించాలని నేను ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థన ఆలకించండి. యేసుక్రీస్తు నామములో, నేను అడుగుతున్నాను. ఆమెన్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నాప్రియమైన సహోదరుడా.

ఓహ్, ప్రియమైన యేసు , న్యూ మెక్సికో నుండి వచ్చిన ఈ ప్రియమైన స్త్రీని బాగుచేసేలా మీరు ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను. తండ్రీ, ఆమె ఆనందంగా, ఉత్సాహంగా పులకించిపోయి, బాగుండాలి; ఎందుకంటే నేను ఈ గుడ్డి ఆత్మను గద్దిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో, స్త్రీని విడిచిపెట్టు.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...