గోడమీది చేవ్రాత
vgr count-153 ఇది బుధవారము రాత్రి అయినందున, గత సాయంకాలము కూడా నేను వాగ్ధానము చేసినందున ఈ రాత్రి ప్రభుని యొక్క అనుమతి అయినట్లయితే నేను మాట్లాడనైయున్న అంశము: గోడ మీది చేవ్రాత. అది చాలా.... ఓ!మనము ఈ అంశముపై వారముల తరబడి చెప్పుకోవచ్చు. అయినను ఉపరితల భాగాన్ని కూడా వివరించుట సాధ్యము కాదు. కాని ఈ రాత్రి పరిశుద్ధాత్మ సహాయముద్వారా దానిలోని కొద్ది బాహ్యాంశమును చెప్ప ప్రయత్నించుదును. ఇప్పుడు దానియేలు 5వఅధ్యాయము 25వ వచనము చదువ గోరుదును. అది ఈ విధముగా ఉన్నది.
వ్రాసిన శాసనమేదనగా, మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్.
ఇప్పుడు చదువబడిన దానిని ప్రభువు ఆశీర్వదించునుగాక.
2
ఇక్కడున్న సంరక్షకుడు, మనమంచి సోదరుడు ఈ ప్రకాశముగా వెలుగుచున్న దీపములను ఆర్పివేయవలెనని కోరుచున్నాను. అది ఇటువైపుగా ప్రకాశించుచున్నది. చాలా దయతో మీకు వందనములు. కూడిన జనులను చూడలేకపోయాను. నేను ఎవరితోనయినా మాట్లాడినప్పుడు, మాట్లాడుచుండగా వారి ముఖములోనికి చూడగోరుదును. ప్రజలతో అది ఒక వ్యక్తిగత సంబంధమును ఎక్కువగా ఏర్పరచునట్లుగా తోచుచున్నది.
ఈ అంశము మీద మాట్లాడుటకై నేను నా సమయమును తీసికొన ప్రయత్నించు చుండగా, ఈ రాత్రి ఇప్పుడు మనము ప్రభువునందు విశ్వాసముంచుదము. అది చాలా గొప్ప అంశమని నాకు తెలుసు. అది ఒక సౌవార్తీకరణ అంశము. దైవిక స్వస్థతకు చెందిన అంశము కాదు. కాని అది దైవిక స్వస్థతకు మిక్కిలి గొప్పది. ఈ రాత్రి నాకు తెలిసిన అతి వ్యాధిగ్రస్త శరీరము, ఈ భూమి మీద మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆత్మీయ శరీరమే. అంతగా అది చీల్చబడి, విరిగిపోయి, నిజంగా దానికి దైవిక స్వస్థత అవసరముగా నున్నది.
3
ఇప్పుడు మన అంశము ఈ రాత్రి బబులోనులో ఆరంభమగును. బబులోనును మొదటగా షినారులో కనుగొనిరి. ఇంకా అక్కడే యున్నది. మొదట అది దేవుని గవినిగా పిలువబడినది. బాబెలు. ఆ బాబెలును తరువాత బబులోనుగా పిలిచారు. అనగా గందరగోళము అని అర్థము. బైబిలులోని మొదటి గ్రంథమగు ఆదికాండములో బబులోను కనబడును. అది బైబిలు మధ్యలో కనబడును. అది బైబిలు చివరలో కనబడును. చివరి గ్రంథము ప్రకటన. బైబిలు అంతటిలోను అది ఉండుటను బట్టి ఈనాటికిని ఇంకనూ అది తప్పక ఉనికిలో ఉండి యుండవలెను.
4
మరియు ఈనాడు భూమిమీద నున్న సమస్తమూ, ఆత్మీయా విషయముల విధానములోను, అనగా దేవుని ఆత్మ, దయ్యము ఆత్మ వంటివి. ఈనాడు లోకములో నున్న అన్ని విధముల పూజా పద్ధతులు మొదలగునవి ఆదికాండములోనే ఆరంభమాయెను. ఆదికాండము అనగా, ప్రారంభము అని భావము. ఇంకనూ మరో పేరు క్రింద, మరో రూపము క్రింద ఉన్నసంగతులన్నియూ ఆదికాండములో ప్రారంభమైన అదే ఆత్మ బయటకు తెచ్చుచున్నది. అది ఒక చెట్టు పెరిగి, ఒక శిరస్సుకు వచ్చినట్లుగానే ఉన్నది. చివరలో అది అంతయూ ఒక అగ్రభాగమునకు చేరును. దేవుని యొక్క గొప్ప తీర్పులో ఆయన అన్నింటిని స్థిరపరచును. అది ఒక ప్రతిదియు అంతమును కలిగి ఉండును. ఆది లేని సంగతులకు మాత్రమే అంతము ఉండదు.
5
అందుకే తిరిగి జన్మించిన క్రైస్తవునకు ఎన్నడూ అంతము లేదు. ఎందుకనగా అతడు నిత్యజీవమును కలిగియున్నాడు. నిత్యజీవము దేవుని యొక్క జీవములోని ఒక భాగమే. ఎందుకనగా దేవుడు నిత్యుడు. అదే మాటను గ్రీకు భాషలో జో అందురు. అనగా దేవుని యొక్క జీవము అని అర్థము. నేను వారికి నిత్యజీవము ఇచ్చుచున్నాను అని యేసు చెప్పినపుడు తిరిగి అదే మాటను ఉపయోగించెను. కాబట్టి తిరిగి జన్మించిన వ్యక్తికి, అతని ఆత్మ మార్పు పొందినది. అతడు దేవునిలో ఒక భాగమగును. ఇంకా హెచ్చుగా అతడు దేవుని కుమారుడగును. దేవుడెంత నిత్యుడో అతడును అంతే నిత్యుడగును. ఎందుకనగా అతడు తన యొక్క జన్మ అనగా ఆత్మీయ జన్మద్వారా దేవునిలో భాగము.
6
బహు దుర్మార్గుడగు హాము కుమారుడైన నిమ్రోదు అనుపేరు గల ఒకని ద్వారా బబులోను ఏర్పడినది.
బబులోను ఒకపుడు ప్రపంచ రాజధాని. అక్కడ ఈ గొప్ప పట్టణము నిర్మించబడినపుడు, దాని చుట్టు నున్న చిన్నపట్టణములన్నియూ ఈ గొప్ప బబులోను పట్టణమునకు కప్పములు, పన్నులు మొదలగునవి చెల్లించుచుండెను.
మీరు హిస్లోపు యొక్క రెండు బబులోనులు, మరియు అనేక ప్రాచీన చరిత్రలు అటువంటి పురాతన గ్రంథములు కొన్ని చదివినచో, అక్కడ అన్ని విధములగు కుతుహలము కలిగించు బోధలు ఉండెనని మనము కనుగొందుము. అక్కడ వారికి ఒక స్త్రీ ఉన్నది. ఆమె పేరు ఇప్పుడు నాకు గుర్తుకు రాదు. ఆమె భూమిలో నుండి వింతయిన వేర్లు కలిగి వాటిలో నుండి దేవతలను తయారు చేసెడిది. అందులోని కొన్ని మూలములయొక్క దేవుళ్ళను, మొదలగు వానినే యాకోబు తన మామ యొద్ద నుండి తీసికొనెనని నమ్మబడుచున్నది. కేవలము చిన్న వాదములు; వాటిలోనుండియే ఈనాడు ప్రపంచములో మనము చూస్తున్న ఈ పూజా పద్ధతులు బయటకు పుట్టుకొచ్చినవి. వాటి యొక్క స్వభామును మీరు పరీక్షించినచో, ఈనాడు వీటి యొక్క స్వభావమును కూడా గమనించినచో ఒకే స్వభావము అవి కల్గియున్నవని తెలియును.
7
ఆ గొప్ప సారవంతమగు లోయలో బబులోను ఉండెను. యూఫ్రటీసు, టైగ్రిస్ నదుల ద్వారా అది చుట్టు ముట్టబడి నీటిపారుదల కలిగియుండెను. అది ఒక గొప్ప వ్యవసాయ కేంద్రము. బబులోను ఒక మహా పట్టణము. పట్టణము చుట్టు కొలత దాదాపుగా నూట ఇరవై మైళ్ళు; ప్రతి ప్రక్కను ముప్పది మైళ్ళు. అనగా నూట ఇరవై మైళ్ళు చుట్టుకొలత. బబులోను పట్టణములోని వీధులు రెండు వందల అడుగుల వెడల్పు కలిగి యుండెనని చెప్పుచుందురు. గోడలు ఎనభై అడుగుల మందము. నిజంగా రెండు వందల అడుగుల ఎత్తు. ఈ గోడల చుట్టూ రథములతో వారు రథపు పందెములను వేసెడి వారు. గవునులు ఇత్తడితో చేయబడినవి. ఆ గవునులు రెండు వందల అడుగుల వెడల్పుకలిగి యుండును. పట్టణము యొక్క మధ్యలో రాజ భవనముండెను. ఆ భవనమే సింహాసనము. పట్టణముయొక్క మధ్య నుండి యూఫ్రటీసు అను గొప్ప నది ప్రవహించుచుండెను. దానిని మీరు గమనించినచో అది దయ్యముయొక్క పట్టణము. ఎందుకనగా అది దేవుని యొక్క పట్టణపు పోలికలో నిర్మించబడినది. సింహాసనము ఎదుట జీవజల నది యుండినట్లుగానే, ఈ పట్టణములో వారు గోడలపైనుండి, చుట్టూ వ్రేలాడుచున్న పూతోటలు పెంచెడివారు.
8
అది అటువంటి మహాశక్తిగల పట్టణము, ఒకప్పుడు తెలిసిన ప్రపంచమంతటిపై అది దండనాధికారము చేసినది. ప్రపంచమంతయూ దానికి కప్పము చెల్లించిరి. సైన్సులో ఇంకా ప్రగతి సాధించెను. ఆధునిక రథములు, అధునాతన నమూనా చిత్రములు, అతి శక్తివంతమగు ఆయుధములు, శ్రేష్ఠమగు లోహములు అది కలిగి యుండెను. తక్కిన ప్రపంచమంతటికి అది తలమానికముగా ఉండెను.
9
ఈ రాత్రి మనము మాట్లాడుకోనైయున్న సంఘటన జరిగిన కాలములో రాజగు బెల్తెషాజరు ఈ ప్రాకారము లోపల రాజుగా నుండెను. నెబుకద్నేజరు ఈ “బెల్తెషాజరుయొక్క తండ్రి' అని బైబిలు చెప్పుచున్నది, గాని నిజంగా ఈ రాజగు నెబుకద్నెజరు ఇతనికి తాత. అతని సింహాసనమే ఇతడు ఆక్రమించెను.
అన్యుల రాజ్యములకు ప్రారంభము నెబుకద్నెజరు అని మీలో చాలా మందికి గుర్తు ఉండి యుండును. బంగారు శిరస్సు అదే. ఎన్నో మైళ్ళ దూరాన ఉన్న యెరూషలేమునకు అతడు వెళ్ళి యూదులను చెరపట్టుకొని తన రాజ్యములోనికి తీసికొనివచ్చి వారిని బానిసలుగా చేసెను. వారి శాస్త్రజ్ఞులను మొదలగు వారిని వారు ఉపయోగించుకొనిరి.
10
జర్మనీలోనికి వెళ్ళినపుడు రష్యాచేసినట్లుగా నేచేసెను. వారి యొద్ద జర్మను శాస్త్రజ్ఞులున్నారు గనుకనే వారికి అణుబాంబులు ఇంకా ఏవేవో ఉన్నవి. అందుకే వారు ఈ రోజున అంతగా ప్రగతి చెందారు. వారు వారిని పట్టుకొని అక్కడకు తీసికొని వెళ్ళిరి. అంతేగాని వారంతట వారు అలాగు కాలేదు. నెబుకద్నెజరు యూదులను చేసినట్లుగానే వారు వారిని పట్టుకొని వచ్చి ఆలాగు ఉపయోగించుకొనిరి.
ఈ కాలములోనే దానియేలు అను ఒక నీతిమంతుడు ఉన్నట్లు కనుగొందుము. ప్రభువు యొక్క ఒక ప్రవక్త. ఆ సమయములో చెరలోనికి కొనిపోబడెను. రాజగు నెబుకద్నెజరు కాలములోనున్న జ్ఞానులు, మేధావులు, హస్త సాముద్రిక వేత్తలు మొదలగు వారందరి మీదను అతడు పై అధికారిగా నియమింపబడెను.
ఇప్పుడు బెల్తెషాజరు రాజ్యాధికారము పొందెను. బెల్తెషాజరు దుర్మార్గుడగు వ్యక్తి. అతడు ఏదీ లెక్క చేయలేదు.
11
బబులోనులోని ప్రజలందరును తమకున్న భద్రత ఎంతోగొప్పదని తలంచిరి! గవునులు ఒక్కసారి మూయబడితే ఆ రెండు వందల అడుగుల గోడలు, ఎనుబది అడుగుల మందము గల వాటి లోపల నున్న వారు ఎంత క్షేమముగా నున్నామని తలంచుదురో గదా!
కాని దీనిని గుర్తుంచుకొనండి. సైన్సు నిన్నుఎంత భద్రతగా తయారు చేసినప్పటికి లెక్కకు రాదు. నీవు పాపము చేసినపుడు దేవుడు పట్టుకొనును! ఒకే ఒక భద్రత యున్నది. అది యేసుక్రీస్తు నందే!
12
ఈ ప్రతిష్ఠగల అమెరికాలో ఆధునిక నాగరికతతో మనము జీవించుచున్న రీతిగానే ప్రపంచ రాజ్యములకు నాయకత్వము వహించుచున్న ఇదే మాదిరి గొప్ప ప్రాముఖ్యత గల రాజ్యముగా వారును ఆనాడు తలంచిరి. నేను నాలోనే కలవరము చెందాను. కాని వారి దృక్పధమునే మనమును కలిగి యుంటున్నామేమోనని నేను భయపడుచున్నాను. అత్యుత్తమ శాస్త్రజ్ఞులు, అతి శ్రేష్ఠమగు మర తుపాకులు, అణుబాంబులు, అతివేగపు విమానములు, కలిగియుండిన మనము ఆలాగే తలంచుచున్నామని అనుకొనుచున్నాను... ప్రపంచములో అగ్ర దేశముగా ఉండి, మొత్తం మీద దేవుడు లేకుండా క్షేమంగా ఉన్నామని తలంచుచున్నాము.
అది చాలా చక్కని పోలిక. దేవుడు ఎన్నడూ మారడు. పాపము పట్ల ఆయన వైఖరి అప్పుడున్నట్లుగానే ఇప్పుడును ఉన్నది. ఇక్కడ దాగుకొను చోటులేదు. క్రీస్తునందు మాత్రమే నీకు భద్రత.
13
ఈ గొప్ప పట్టణములోనికి ప్రపంచములోని ఏ సైన్యమును దండెత్తి ప్రవేశించు మార్గము లేదని వారనుకొనిరి. గొప్ప ఎత్తయిన ప్రాకారములు, వారియొక్క ఆధునిక సామాగ్రి, కలిగియుండి బాహ్యాప్రపంచమును దిగ్భంధించినట్లుగా ఉండిరి. అయితే మాదీయ పారసీక అను పిలువబడు దుష్టరాజ్యము, ఇప్పుడు ఇండియాలోని హిందువులు, ఎన్నో మైళ్ళ దూరము నుండి యూఫ్రటీసు నది గమనమును మార్చి ప్రాకారముల క్రింద నుండి ఈ పట్టణములోనికి ప్రవేశించుటకు నది లోయను త్రవ్వుచున్నారని వీరు తెలిసికొనలేకపోయిరి. అంత భద్రముగా తాము ఉన్నామని తలంచినపుడు జరిగినది! ఎల్లప్పుడూ వారు ఆలాగే భావించిరి. ఆ విధంగా వారు తలంచినపుడు వారు పాపములో దొర్లుచుందురు.
14
నాకంతా సరిపోయినదని ఒకడు తలంచినపుడు వానిని పాపము పట్టుకొన నారంభించినట్లుగానే ఇది యున్నది. సంఘము, దేశము, వ్యక్తి. బయటనుండి ఏ సహాయము నాకక్కర లేదని తలంచినపుడు అతనిలో పాపము ఏలుబడి చేయనారంభించును. అది సత్యము మనము కూడా గమనించుదుము. ఆ ఆధిక్య స్వభావమును ప్రజలు కలిగి యున్నపుడు పాపము ప్రవేశించి వారిని తినివేయుట సామాన్య విషయమే.
కాబట్టి వారు ఆ ద్వారములు మూసినపుడు తాము క్షేమంగా ఉన్నామని వారనుకొనిరి. కాని దేవుడు పరమునుండి తొంగిచూస్తున్నాడు! పాపము ఏ దేశమునకయినను నిందయే.
మన యొక్క ఈ గొప్ప సామాగ్రి, మన అణు నియంత్రణపు జలాంతర్గాములు, సెకెండుకు చాలా వందల మైళ్ళు ఎగిరిపోగల మన జెట్ విమానములు... ఒక నిమిషములో శబ్ద పరిధిని దాటిపోగల విమానములతో మనమును ఆలాగే తలంచుచున్నామేమోనని ఆశ్చర్యపడుచున్నాను. కాని ఎన్నడూ మరిచిపోవద్దు. నీ పాపము నిన్ను పట్టుకొనును!
15
ఈ కాలములోనే వారు గవునులు మూసిరి. తాము భద్రముగానున్నాము గనుక ఎంత సుఖభోగముతో జీవించవలెనంటే అంత సుఖభోగముగా జీవించగలమని తలంచిరి. వారు అగ్రరాజ్యమై యుండిరి. అన్ని దేశములు సైన్సు కొరకు సహాయము కొరకు ఈ దేశము వైపు చూచుచుండిరి.
కనుక అటువంటి సమయములో అక్కడ ఒక ... ఈ రాజు ఒక గొప్ప సంతోషకరమగు సమయమును కలిగియుండవలెనని తలంచెను. ఒక గొప్ప పెద్ద నృత్యము. నేనంటున్నాను, ఒక ఆధునిక రాక్ ఎన్ రోల్ పార్టీని ఒక దినమున ఏర్పాటు చేయుటకు నిశ్చయించెను. దానికి తక్కువేమీ లేదు. కనుక అతడు సమయము నిర్ణయించి, పాల్గొను వారందరినీ, సైనికులందరినీ, సైన్యాధిపతులను, భార్యలను, ఉపపత్నులను అందరినీ ఆహ్వానించెను.
ఉపపత్ని అనగా చట్ట సమ్మతమగు వేశ్య మాత్రమే. మీరు చూడండి. ఒక మనిషి తనకు అన్నీ ఉన్నవని తృప్తిగా ఉన్నపుడు పాపములోనికి జారిపోవును?
16
తనకు దొరికిన అతి శ్రేష్ఠమగు మద్యములను తాను ఏర్పాటు చేయనైయున్న ఈ గొప్ప రాక్ ఎన్ రోల్ పార్టీకి సిద్ధ పరచెను. తాను క్షేమముగా ఉన్నానని అతడు తలంచెను. తాను భద్రముగా ఉన్నాను గనుక ఏదియు తనకు హాని కలుగచేయజాలదని అతడు తలంచెను. ఈ గొప్ప విందును ఇతడు తన రాజభవనము వెనుక నున్న ఈ తోటలలోఒక దానిలో ఏర్పాటు చేసెను. ఆ తోటలో ఉండినపుడు, బహుశా వారు దానిని ఎంతో అందముగా, వ్రేలాడదీసి, అందగత్తెలను ఏర్పరచి, సైనికులను ఆనందింపచేయుటకు అనేక మంది స్త్రీలను ఏర్పాటు చేసియుందురు. అలంకరించియుందురు. వారి బీరు, వారి ద్రాక్షారసము! ఈనాడు కూడా రాక్ ఎన్ రోల్ పార్టీలో ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేయనిచో ఎవరు వెళ్ళెదరు? ఈ ఆధునిక మంచి సిద్ధపాట్లు అవే. సరిగ్గా అంతే! వారు అంతా సిద్ధము చేసి ఉంచారు. ఎంతో గొప్ప ఆనంద సమయము కొరకు ఎదురుచూస్తున్నారు.
17
అనేకమంది వివాహిత స్త్రీలు వచ్చారనుటలో ఏమీ సందేహము లేదు. వారి భర్తలు పిల్లలను చూచుటకు ఇంటి యొద్ద ఉండగా, వీరు ఆనందముగా గడుపుటకు వచ్చారు. ఆలాగే ఒక తల్లి తన జబ్బుగల బిడ్డతో ఇల్లు తుడుచుకొంటూ ఉండగా, ఆమె త్రాగుబోతు భర్త ఈ విందును ఆనందించుటకు వచ్చియుండుననుటలో సందేహము లేదు. అది కేవలము ఒకటిలో ఆరు, మరియొకటిలో ఒక అరడజను అన్నట్లుగానే యున్నది.
వారు త్రాగుచూ హాయిగా సమయము గడప నారంభించుటను నేను చూడగలను. వారు మేళమును ప్రారంభించి సంగీతమును ఆలపించుటను నేను ఊహించుచున్నాను. ఆ చిన్న యుక్త వయస్కులు ఒకరినొకరు పట్టుకొని ఊగుచున్నారు. సైనికులు త్రాగి స్త్రీలను పట్టుకొని, తలలతో వారిని తాకుచూ, ముద్దుపెట్టుకొంటూ, కుర్చీలలో కూర్చుంటూ లేస్తూ వెర్రిగా ప్రవర్తించుచున్నారు. తాము క్షేమముగా ఉన్నామని ఆలోచించుచున్నారు!
ఓ! అమెరికా! ఆ త్రాగుడు విందులు, రాక్ ఎన్ రోల్ పార్టీలు చూచిన దేవుడు ఈ రాత్రి నిన్నును చూస్తున్నాడు.
18
ఎంత గొప్ప ఆనంద సమయాన్ని వారు కలిగి యుందురు!ఇక్కడ రాజగు బెల్తెషాజరు ఆధునిక ఎల్విన్ ప్రిస్లేవలె ఉన్నాడని నేనూహించగలను. వారికున్న అనేక గంభీర కృత్యములను అతడు చేయగలడు. మత్యువు గడప యొద్దనే ఉన్నదన్నసంగతిని ఆటపాటలలో మునిగి పోయిన వారు ఎన్నడూ ఎరుగరు!
కనుక విందు మంచి ఊపులో ఉండగా, అది దాదాపుగా ఒక ఆధునిక హాలీఉడ్ టెలివిజన్ ప్రసారము వలె ఉండగా, వారు మతమును గూర్చి కొన్ని మంచి సరసోక్తులు ప్రేల్చుదామని తలంచియుందురు; ఆర్థర్ గాడ్ ఫ్రే ప్రదర్శన వంటిదో, లేక అట్టివిధమగు మరొకటో, లేక ఎర్నీఫోర్ట్ పిపెకర్ వంటిదో, లేక అటువంటి ఆధునికమైనది మరేదో ఉపయోగించి బోధకుని గూర్చిన సరసోక్తి ఏదో ప్రేల్చవలెనని తలంచారు. కాని ఇంకనూ దేవుడు పరలోకము నుండి చూస్తున్నాడు! తమ్మును ఎవరు అంటుకోలేని రాజ్యములో ఉన్నామని వారు తలంచారు. కాని నీవు విత్తునది కోయుదువు!
ప్రజలారా! దాని గూర్చి మెళకువ కలిగియుండుడి. మీరు ఒక దేశమైనా, ఒక సంఘమైనా, లేక ఒక వ్యక్తివైనా, ఏమి విత్తుదువో అదే కోయుదువు.
19
ఈ రాజు లేచి నిలబడి, ఆడపిల్లల్లారా, “ఒక్క నిమిషం ఆగండి. బోధకుని మీద ఒక మంచి సరసోక్తిని మనం విందాం అని చెప్పుటను నేనూహించగలను.” లేదా అట్టిదేదో.
సుకుమారంగా అలంకరించుకొన్న ఆ యువ స్త్రీలందరూ “హూపీ, అవును. అటువంటిది వినుట మా కిష్టము అని యందురు.”
ఈనాటి యువకుల వలెనె ఆ యువ సైనికులు అల్లరి చేస్తున్నారు. ఎందుకనగా ఇది ఆధునిక బాబెలు కంటె గొప్పది! నేను అమెరికనును. ఆలాగే దానియేలు ఆ కాలములో చెంది యుండును. కాని అది పాపమును క్షమించదు!
“నీవు క్రైస్తవురాలవా?” అని ఒకసారి ఒక బాలికను అడిగాను.
“నీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, నేను ఒక అమెరికనును” అని చెప్పినది.
“అదేమీ గొప్ప చెప్పుట కాదు అన్నాను.” ఏమీ కాదు.
20
ఒక అమెరికనుగా ఉండుటకు నేను సంతోషించుచున్నాను. కాని అది క్రైస్తవ్యమును ఏమీ ప్రతిబింబించదు. మీరును అది నిశ్చయము చేసికొనండి.
అక్కడ వారికి ఒక ప్రవక్త యుండెను. కాని వారు వినరు. వారికి వర్తమానమున్నది. కాని దానిని వారు హేళన చేయగోరుచున్నారు.
ఈ ఆధునిక అమెరికా ఆలాగు లేదా అని నేనాశ్చర్యపడుచున్నాను. వారికి సువార్త ఉన్నది. సత్యమున్నది. కాని వారు దానిని హేళన చేయగోరుచున్నారు.
కాబట్టి వారన్నారు. “మనము వెళ్ళి ఆ పరిశుద్ధుల పాత్రలు ఇక్కడికి తీసికొని వచ్చి, వాటిలో నుండి మంచి సరసోక్తిని పుట్టించి నవ్వుదం.”
తన ప్రజలను చూచి అవహేళన చేయుటకు పాపులను దేవుడు అనుమతించడు. ఏదో ఒక రోజున మీరు దానికి వెల చెల్లించుదురు.
21
వారు వెళ్ళి ప్రభుని యొక్క పాత్రలు తెచ్చిరి. దేవాలయములోనికి తీసికొని వచ్చిరి. యెహోవా యొక్క పాత్రలు ఉపయోగించి బాగా త్రాగుదామని తలంచారు. వారు తమ ఓర్టెల్స్ 92 లేదా పాబ్స్ బ్లూరిబ్బన్ అను మద్యములను అందులో పోయగానే మంచి సరసోక్తి విసిరారు. వారు గ్లాసులను, పాత్రలను ఒకదానికొకటి ఆనందంగా తాకించి, త్రాగనారంభించారు. యెహోవా యొక్క మతమును హేళన చేయుచూ నవ్వసాగిరి. తాము చేయుచున్న దానిని ఎరుగని అజ్ఞానులు!
ఈ రాత్రి ఈ దేశము కూడా ఆలాగే యున్నది. తిరిగి జన్మించుట, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము యొక్క ప్రభువైన యేసుక్రీస్తుని వర్తమానమును విసర్జించి అజ్ఞానులుగా యున్నారు.
వారు భక్తిగా ఉన్నప్పటికిని రాక్ ఎన్ రోల్ యొక్క త్రాగుడు పార్టీలు కలిగియుండిరి. మత నిష్ఠ కలిగియున్నారని బైబిలు చెప్పుచున్నది. ఎందుకనగా వారు తమ దేవతలను స్తుతించిరి అని యున్నది.
కనుక ఎంతో మత భక్తి కలిగియున్ననూ తప్పులో యుండవచ్చును! అది నిజము. అది యధార్థత కాదు. ఒక మనుష్యుని యెదుట అతని మార్గము సరిగా కనిపించును గాని తుదకు అది మరణమునకు నడుపును. కనుక వారికి ఒక గొప్ప రాష్ట్ర సంఘమున్నది. ఆరాధించుకొను ఒక మతమున్నది. దేవుని యొక్క పవిత్ర వస్తువులను హేళన చేసి నవ్విరి.
22
దేవునియొక్క పవిత్ర వస్తువులను హేళన చేయుట ఈనాటివలెనె యున్నది. పవిత్రముగా, నీతిగా, శుభ్రంగా జీవించుటకు ప్రయత్నించుచున్న వారిని, వారు పాత మనుష్యులు పరిశుద్ధ బండలు లేదా మరో విధమగు అసభ్య పేర్లతో పిలుచుదురు. ఆయన చేయుచున్నకార్యములను, ప్రభుని యొక్క వరములను వారు అపవిత్రాత్మ యొక్క కార్యము, అదృష్ట జాతకము చెప్పేవాడు, లేదా ఒక దయ్యము అని పిలుచుచున్నారు. ఓ! ఏలాగు నీవు తీర్పును తప్పించుకొందువు? హతసాక్షుల యొక్క రక్తము దానికి విరుద్ధముగా మాట్లాడును. దీని యొక్క అధునాతన పాపమును బట్టి ఈ దేశమును దేవుడు తీర్పు చేయనిచో ఆయన సొదొమ గొమొర్రాలను తిరిగి లేపి వాటిని నాశనము చేసినందుకు క్షమాపణ చెప్పుకోవలసి యుండును. అది నిజము. మనము తీర్పునకు బద్దులము! మన ధన్యకరమగు రక్షకుడు జరిగించుచున్న ఈ గొప్ప ఆశ్చర్యక్రియలను మీరు చూచుచున్నారు. అవి హెచ్చరిక సూచనలు. తీర్పు సమీపములో ఉన్నదని చాటుచున్నవి. ఆమె ఈ దేశమును ఒక ప్రక్కనుండి మరో ప్రక్కకు, తూర్పునుండి పడమరకు, ఉత్తరము నుండి దక్షిణానికి కుదిపి వేసినది. వారు దానిని అలక్ష్యము చేసిరి. దాని చూచి నవ్విరి. దానిని విమర్శించిరి. పనికిరాని చెత్తగా దానిని వారు వార్తా పత్రికలలో వ్రాసిరి. దాని గూర్చి ఆలోచించుము. ఆధునిక బబులోను!
23
ఇప్పుడు వారు తమ కప్పులను తాకించి మద్యము త్రాగుచున్నారు. అకస్మాత్తుగా, బెల్తెషాజరు అను పేరు గల గొప్ప సినిమా కుర్రాడు తన గిన్నెలోనిది త్రాగుటకు లేచిన సమయములో కండ్లు చెమ్మగిల్లినట్లు అయినవి. ఆ దుర్గము వైపు అతడు తిరిగి చూడగా పరలోకము నుండి ఒక మానవ హస్తము వచ్చి ఆ గోడమీద ఏదో వ్రాయుట ప్రారంభించెను.
మీరు గమనించవలెనని కోరుచున్నాను. అది గోడమీద వ్రాసెను. బహుశా వారి తళుకులకు వెలుపటగా ఆ దీప స్తంభములను పెట్టి యున్నారేమో. అక్కడ వారు తమ ఆధునిక రాక్ ఎన్ రోల్ పార్టీ అవుచున్నది. దీపములు గోడకు కొట్టుచున్నవి. దేవుడు కార్యములను మూలలో చేయడు. దీపముల క్రిందనే ఆయన చేయును. అక్కడ దేవుడు మాట్లాడును, సంచరించును. ఆయన యొక్క సహజాతీతమగు చేవ్రాత గోడ మీద అందరు చూచుచుండగనే వ్రాయబడెను.
24
ఈ ఆధునిక హాస్యగాడు, మంచి రేడియో హాస్యగాడు, టెలివిజను తార అగు ఈ రాజు మొదటగా దానిని చూచి యుండును. తన గ్లాసు లేదా గిన్నెను తాకించి ఆ చేతిలో పట్టుకొన్న దానిలోంచి త్రాగనై యుండగా అతని కండ్లు చెమ్మగిల్లినవి. ఏదో వణికి పోయినట్లు అయిపోయెను. అలాగాయెనని నేను ఊహించుదును. ఆ విధముగా బైబిలు చెప్పెను. అతని కీళ్ళలో నుండి ఎముకలు స్థానము తప్పెను నిశ్చయంగా అతడు వణికి పోయినాడు. సందేహము లేదు. దేవుడు తన గురుతులను చూపించ నారంభించినపుడు వణుక వలసిన సమయము! అది నిజము. అతడు గమనించుచుండగా అతని యొక్క రాక్ ఎన్‌రోల్సంగీతము అతనిని వణికించినది.
ఈ గోడ మీది చేవ్రాతను అతడు గమనించుచుండగా ఇట్లు జరిగినదని నేను ఊహించగలను. అతని యొక్క భార్య పెదవులకు రంగులు పూసికొన్నదని నేను ఊహించగలను. అతని యొక్క భార్య పెదవులకు రంగులు పూసికొని, ఏలాగు పూసికొన్నదో నాకు తెలియదుగాని, జుట్టు అలంకరించుకొని, చుట్టూ వ్రేలాడ వేసికొని, ఈ త్రాగిన సైనికులతో ఇట్లు చెప్పుచున్నది. ఈ రాత్రి అబ్బాయి సంగతి ఎలా ఉన్నది అని వెకిలిగా నవ్వుతూంది.
ఎవరో యువకుడు ఆమెను పట్టుకొని సరే, మనము దీని తరువాత నాట్యమాడుదము అని చెప్పెను. సంగీతము ఆగిపోయినది.
ఓ! ఈ గొప్ప పాపపు దేశము! ఒక సమయాన మీ రాక్ఎన్ రోల్ విందులు ఆగిపోవనై యున్నవి! ఒక బోధకుని యొక్క స్వరమును మీరు విననిచో ఒక దినమున తీర్పులో దేవుని యొక్క హస్తమును వినవలసి యుందురు. కాని ఆ రాక్ ఎన్ రోల్ఆగును. ఆ బాండు మేళము ఆగి ఈ విధముగా పాడినట్లుగానే నాదేవా, నీ చేరువగా అని టైటానిక్ ఓడలో, ఒక రోజున నీవు ఆ రాగమును మార్చవలసి యుందువు.
25
సంగీతము ఆగిపోయినది. వారి యొక్క హాస్యగాడు,- వారి యొక్క టెలివిజను తార నిలబడిపోయి యున్నాడు. మోకాళ్ళు కొట్టుకొను చున్నవి. ఈ గొప్ప సంభవము జరుగుట చూచి వణకి పోతున్నాడు. ప్రాకారములన్నియూ మూయబడి యున్నవి. నేను ఎన్నుకొన్న వారు, నా రక్షక భటులు గవిని యొద్ద కాపలా యున్నారు అని అతడు చెప్పెను.
కాని మీరు చూడండి. నీవను కొనుచున్నట్లుగా దేవుడు గేటు యొద్దకు రానవసరం లేదు. ఆయన మహిమ నుండి దిగి వచ్చును! ఆయన చేయి గోడ మీద వ్రాయుచున్నది.
వెంటనే, అది చాలా అధునాతన స్థలము అయి యున్నందున అతడు, సోదె చెప్పువారిని, హస్త సాముద్రికులను, బిషప్పులను, డాక్టర్లను, పోపులను, కార్డినల్స్‌ను, ఇంకా ఎవరెవరినో పిలిపించెనని బైబిలు చెప్పుచున్నది. అతడిట్లు పలికెను. పెద్ద మనుష్యులారా, నేను ఇప్పుడు మీతో చెప్పేది వినండి. మీరు మీరు ఇష్టమైనది వేయుటకు, మీరు బోధించుకొనుటకు మీకు భాగ్యము ఇచ్చాను. ఇప్పుడు నాకు మీరు ఆ గోడ మీది దానిని అనువదించవలెను.
26
అప్పుడెట్లు ఉన్నదో ఇప్పుడును ఆలాగే యున్నది. వారు ఆ సహజాతీతమగు దానికి అలవాటు కలిగి లేదు. దాని గూర్చి వారికి ఏమియూ తెలియదు. తెలియని భాషలను ఎట్లు అనువదించవలెనో వారికి తెలియదు. ఒక పరలోక భాషను గూర్చి వారికి అసలు ఏమీ తెలియదు. వారు మూగబోయిరి. దాని గూర్చి ఏమీ తెలియదు. అందరూ అక్కడనిలబడిపోయి...
గుర్తుంచుకొనండి. ఇది అన్యుల రాజ్యము యొక్క అవతరణ. అది సహజాతీతమగు దాని క్రింద వచ్చినట్లుగానే, సహజాతీతమగుదాని క్రింద పోవును.
కాని ఈ బిషప్పులు, కార్డినల్సు, గొప్ప డాక్టర్లు , ఆ సహజాతీతమగు దానిని అనువదించలేకపోయిరి. దాని గూర్చి వారికి ఏమీ తెలియదు. వారు తమ కళా గ్రంథములను తరచి చూచిరి. దానితో పోల్చి చూడగా వారు ఏమీ కనుగొనలేకపోయిరి. చూడండి. ఆత్మీయ సంగతులను ఆత్మీయ రీతిగానే అర్థము చేసికోబడును. అప్పుడు వారు అందరూ విస్మయము చెందిరి. ఏమీ చేయవలెనో వారికి తెలియలేదు.
27
చివరగా చిన్న రాణి, గుర్తుంచుకొనండి. ఆమె ఆ రాక్ ఎన్ రోల్ పార్టీ వద్ద లేదు. ఏదో జరిగినదని ఆమెకు తెలిసినది. ఎట్లనగా ఎవరో వచ్చి రాజు భయక్రాంతుడై యున్నాడనియు, విందు ఆగిపోయిందనియు కబురు తెచ్చిరి. ఆమె మంచి విశ్వాసులలో ఒకరుగా పేర్కొనబడ వచ్చును. ఏదో విధముగా మరిచిపోని వారిలో ఆమె ఒకతె.
ఆమె విందులోనికి త్వరపడి వెళ్ళెను. ఆధునిక హాస్యగాడు భీతిల్లి బృందమంతా వణకుచుండగా, ఇట్లు చెప్పెను. రాజు సదాకాలము బ్రదుకును గాక! కాని అప్పుడే అతడు చచ్చెనని అతనికి తెలియదు. చిరకాలము బ్రదుకును గాక! అన్నది. మీరు ఆ గోడపైవ్రాతను బట్టి కలవరపడుచున్నారని నేనెరుగుదును. పోపు, బిషప్పు, కార్డినల్సు, దైవిక డాక్టరు పట్టా గలవారు, ఎవరునూ దానిని చదువలేక పోయిరని నేను చూచాను. కాని ఓ రాజా! ఒక్కసంగతి వినండి. దైవ సంబంధమగు దానిని వివరించు వ్యక్తి నీ రాజ్యములో ఒకడున్నాడు.
28
ఓ! సోదరుడా! గోడమీది చేవ్రాతను మనము చూచునపుడు, ఈనాడు, దానిని ఎరిగిన వ్యక్తి ఒకడున్నాడని గ్రహించ వలెను. పట్టణములో నున్న ప్రతి డాక్టరు కార్యాలయానికి నీవు వెళ్ళియుండవచ్చును. నీవు చనిపోదువు అని వారని యుందురు. కాని ఒకాయన ఉన్నాడు! పాతాళపు మురికి గోడలంత నల్లగా నీ ఆత్మ నీవు చేసిన పాపము వలన తయారయి యుండవచ్చును. నిరీక్షణలేక నీవు ఆత్మహత్య చేసికొనుటకు సిద్ధపడియున్నావు. కాని ఒకాయన ఉన్నాడు. ఆయన మన రాజ్యములో ఉన్నాడు. ఏలయనగా మనము ఆయన రాజ్య పిల్లలము. ఒకాయన ఉన్నాడు.
అతడు ఆ ఆత్మ సంబంధమైన దానిని ఎరుగును. ఎన్నోసంవత్సరాల క్రితమే దేవతల యొక్క ఆత్మను అతనిలో కనుగొన్నాము. అతనిలో మహత్తరమగు ఆత్మయున్నది. అతడు స్వప్నములను అనువదించగలడు. అతడు దర్శనములు చూచెను. అందులో ఏ ఒక్కటియూ తప్పిపోలేదు. కనుక కలవరము చెందవద్దు. కొద్ది నిమిషముల వ్యవధి ఇమ్ము. నేను అతనిని ఇక్కడికి తోడుకొని వచ్చెదను అన్నది.
29
నీవు ఆయనను పిలచు దినము ఒకటి వచ్చును! నీ ఇంటిలో ఆయనకు స్థలము లేకపోవచ్చును. టెలివిజను చూస్తూ, పేకాడుచూ, బీరు త్రాగుచూ, రాక్ ఎన్‌రోల్ విందులకు హాజరగుచూ, తీరిక లేక యుండవచ్చును. కాని నీవు ఆయనను పిలచు సమయము ఒకటి వచ్చును! అది నిజము!
కనుక దానియేలును తీసికొనివచ్చిరి. అతడు వచ్చుచుండగా... నీతిని బోధించు బోధకుడు, దైవజనుడు!అటువంటి స్థలములో జీవించుచున్న దైవజనుడు వాటిని ఖండించకుండా జీవించలేడు అని నేను తలంచగలను. కాని చూడండి. దానికి రాజు ఏమీ శ్రద్ధ చూపలేదు. అందుకే అతడు అటువంటిస్థితిలో పడవలసి వచ్చెను.
వారు దానియేలును తీసికొని వచ్చిరి. అతడిట్లనెను. మీ పోపులు, డాక్టర్స్, ఏమిటి మీకు భావము చెప్పిరి? వారేమీ భావము చెప్పలేకపోయిరి.
అయితే అప్పుడు ఏమి జరిగెను? దానియేలు చెప్పెను, ఓ, బెల్తెషాజరూ, నీవు ఈ సంగతులన్నియూ ఎరుగుదువు. అవి నీకు మరుగు కాలేదు.
30
నేను అమెరికాకు చెప్పుచున్నాను! నా స్వరమును ఈ నిమిషములో వారు వినునట్లు చేయవలెనని కోరుచున్నాను. ఈ సంగతులన్నియూ మీకు తెలియకుండాలేవు! మన వలెనె ఇంతకు ముందు పాపము చేసిన దేశములను త్రాసులో తూచగా తక్కువగా కనబడెను. ఫ్రాన్సుకు ఏమీ జరిగెను? జర్మనీకి ఏమి జరిగెను? మద్యము, స్త్రీలు, వినోదకాలముతో గడిపిన ఇతర దేశములకు ఏమి జరిగెను? ఎల్లప్పుడూ ఆలాగే జరుగును. తీర్పు నుండి మనము తప్పించుకోలేము. దేవుడు న్యాయవంతుడు.
31
మరియు ఇట్లనెను, నీ తండ్రిని దేవుడు ఎంతో గొప్పగా హెచ్చించెను. గాని అది మరిచిపోయెను. నీవు చేయుచున్నక్రియలనే అతడును చేయుచుండెను. దేవుడు అతనిని ఒక అడవి మృగము వలె మార్చి వేసెను. నీవు ఈ సంగతులన్నియూ ఎరుగుదువు. అయితే ఇప్పుడు ఆయన యొక్క పవిత్ర పాత్రలను తీసికొని వాటిని హేళన చేయుచున్నావు. గమనించుము. గోడమీద వ్రాత వ్రాయబడెను. ఈ సమయమున నీ రాజ్యము లెక్కించబడెను. నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసి వేయబడి మరియొక క్రూరమగు, దేవుడు లేని దేశమునకు అప్పగించబడును. వారు వీరికంటె చెడ్డవారు. పాపమును పాపముతోనే దేవుడు పోరాడ చేయును. నేడును అంతేనని ఆశ్చర్యపడుచున్నాను!
32
అదే సమయమున, మొదటగా నేను చెప్పునదేమనగా, అతడు ఆ వ్రాతను గమనించుచుండగా, అప్పుడే, ఆ గవునుల క్రింద కావలివారు చంపబడిరి అని అతనికి కొద్దిగా కూడా తెలియదు. వీధులలో సైనికులు తిరుగుచూ రాజభవన భటులను చంపుచుండిరి. వారు మెట్ల మీద ఉండిరి. అయితే అక్కడున్న స్త్రీలు పిల్లలను, భర్తలను విడిచిపెట్టి, భర్తలు భార్యలను విడిచిపెట్టి, మద్యముతో మత్తిల్లి, ఏదో విధమైన ఆధునిక నాట్యము, భోగము అనుభవించు చుండిరి. సైనికులు మెట్ల మీద ఉండిరి. కొద్ది నిమిషాలలో రాజు సంహరించబడును. త్రాగుబోతులందరూ దేవుని నమ్మని జనులు మరియు దయ్యముతో ఆవరించబడిన దేశము ద్వారా నరకబడుదురు. స్త్రీలు, యువబాలికలు వీధులలో వివస్త్రలుగా చేయబడి చెరుపబడెను. తరువాత వారి మడిమెలను పట్టుకొని ఈడ్చి తలలను గోడలకేసి కొట్టుదురు. పిచ్చిపట్టిన, త్రాగిన ఆ సైనికులు వారితో శరీర వాంఛ జరిగించిన పిదప వారిని చీల్చి వేయుదురు! అది గుమ్మముయొద్దనే యున్నది. ఎందుకనగా వారు త్రాసులో తూచబడగా తక్కువగా కనబడిరి.
33
మన యొక్క ఈ ఆధునిక పోకడలన్నియూ, స్వస్థతా కూటములను చూచి నవ్వుచూ, హేళన చేస్తున్నవారునూ, దేవుని సజీవ సంఘమును చూచి నవ్వుచూ హేళన చేయుచున్నవారునూ, బైబిలు చెప్పినట్లుగా, గర్వాంధులు, బింకములాడు వారు, పైకి భక్తి కలిగి యుండియు దాని శక్తిని ఆశ్రయించని వారును ఈనాడు అలాగే అవుదురని నేను వ్యధ చెందుచున్నాను.
ఈనాడు మనము ఎంతో భద్రంగా ఉన్నామని అనుకొనుచున్నాము. అయితే అకస్మాత్తుగా ఏదో జరుగవచ్చునని ఆశ్చర్యపడుచున్నాను. సైన్సులో రష్యా మన కంటె అయిదు సంవత్సరములు ముందుగా నుండుట మనము కనుగొనుచున్నాము.
మనము ఎన్నో విందులకు హాజరయ్యాము. పాపమును ఎంతో అనుభవించుచున్నాము. ఇక మీదట ప్రార్థన కూటములను ఏ మాత్రము లెక్కచేయని రీతిలో సంఘము నిద్రించుచున్నది. వారికి చింత లేదు. సజీవుడగు దేవుని యొక్క నిజమైన ఆత్మకు, నిజమగు దానికి, వ్యతిరేకముగా వారు తమ స్వరమునెత్తి యున్నారు. వారు వాటిని కలిగి యుండరు. అంతగా శాఖలో వారు మునిగిపోయారు. అంతగా వారు ముస్తాబు అయిపోయారు! వారికి ప్రార్థన కూటములకు వెళ్ళే సమయము లేదు. వారు టెలివిజనుల యొద్ద, చిత్రములు చూచుటకు చుట్టూ మూగియున్నారు. త్రాగుడు విందులు మొదలగు వానిలో మునిగియున్నారు. అది సత్యము.
అది పాత పోకడగా కనిపించవచ్చును. కాని ఈనాడు దేశమునకు అవసరమైనది అదే. రబ్బరు తొడుగులు చేతులకు తగిలించుకొని సువార్తను ఎంతగానో వారు హేళన చేయుచున్నారు. దానిని వట్టి చేతులతోనే పరిశుద్ధాత్మ ద్వారా ఉపయోగించవలసియున్నాము. నిజంగా!
34
బిల్లీగ్రాహం ఒకటి రెండు వారముల క్రితం తన యొక్క వర్తమానములో ఒకదానిలో ఈలాగు చెప్పెను. రష్యా ఏ సమయములో కోరితే ఆ సమయంలో ఈ దేశము రష్యాకు ఒక ఉపగ్రహముగా మారును. ఎక్కడున్నాం మనము?
ఈ దినములలో మీరు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాను అను పాట వింటూ ఇంటి యొద్ద కూర్చొనుటకు ఎల్విన్ ప్రిస్లే రికార్డులను కొంటూ యుందురు! మిమ్మును త్రాసులో తూచగా మీరు తక్కువగా కనబడెదరు. ఏమి జరిగినది? అక్కడ గోడ మీద చేవ్రాత కనబడుచున్నది!
భూమికి ఆవలగా అయిదు వందల మైళ్ళ దూరాన మనము అదుపు చేయలేని స్పుత్నిక్‌ను రష్యా వారు ఏర్పాటు చేసిరి: వచ్చే ముప్పది నిమిషాలలోఅమెరికాపైన అట్టివి అరడజను వాటిని ఉంచి, లొంగి పొండి, లేనిచో కొద్ది నిమిషాలలోబూడిదెగా మారుదురు అని చెప్పవచ్చును. వారది చేయగలరు. అది చేయకుండా వారిని ఆపునది ఏదియూ లేదు. అది వారి చేతులలో యున్నది. రక్తము లేని, హృదయములోని, దేవుడు లేని కమ్యూనిస్టులు! పాపమును తేలిక చేయుటకు దేవుడు ఉపయోగించుకొనునది అదే. నిశ్చయంగా! మీరు బైబిలు చదివినచో ప్రకటన గ్రంథము ప్రకారము రష్యా ఆ విధంగా చేయనైయున్నది. మంచిది. ప్రవచన బోధకులగు మీరు దానిని అంగీకరించకపోవచ్చును. కాని అది జరిగిపోవు వరకు వేచి చూడండి. ఆ పని కొరకే రష్యా ఇక్కడ పెట్టబడినది. బైబిలు ఆలాగు చెప్పెను.
35
ఇప్పుడది స్పుత్నిక్‌తో ఇక్కడున్నది. ఒక రాత్రి మనము అట్టి దానిని ఒక దానిని ప్రయోగించ ప్రయత్నించాము. సరిగ్గా వారు చేసినట్లే మనమును చేయాలని తలంచాము. భూమికి మూడడుగుల పైకి లేచి, పతనమాయెను.రాక్ ఎన్ రోల్ మరియు పాపము విస్తరించినది! మనము త్రాసులో తూచబడినాము. తక్కువగా కనబడితిమి. దేవా! కృప చూపుము!
మనము ఏమీ చేయనై యున్నాము? వారు ఆ క్షిపణులతో స్పుత్నిక్‌లను పంపి, లొంగిపొండి. లేనిచో అయిదు నిమిషాలలో బూడిద కుప్పగా మారుదురు అని చెప్పినచో ఎట్లుండును? మన ప్రభుత్వము ప్రాణములను కాపాడుటకు లొంగిపోవును. వారు చేయకలిగింది అది మాత్రమే.
ఇక్కడున్న మనకందరికి, కొందరు అమెరికనులకు ఏమీ జరుగును? ఇక్కడున్న వారికి మాత్రమే కాదు. దేశ వ్యాప్తంగా నేను మాట్లాడుచున్నాను. రాజ్యముతో చెప్పుచున్నాను.
36
ఒక గులాబీ కొమ్మవలె మీ చిన్న పెదవులకు రంగువేసికొన్న బాలికలారా, చిన్న చురుకైన పడతులారా, సవార్తను బోధించుచున్న బోధకుని చూచి మీరు ఆ మూలన హేళన చేయుచున్నారు. యుక్తవయస్సులో నున్న వారలారా! స్వాధీనపరచుకోగల మేధాశక్తి కంటె ఎక్కువైన తప్పించుకొను మార్గమున్నదని తలంచుచున్నారు!
ఓ తండ్రీ, నీవు నీభార్యతో ఇంట్లో కూర్చొని రాత్రులందు టెలివిజను చూచుకొంటున్నావు. మీ కుర్రవాడు మరేదో అల్లరితో కూడిన ఆటపాటలతో మునిగి యున్నాడు. నీ కుమార్తె కాంటీన్‌లో కూర్చొని రాక్ ఎన్ రోల్ చేస్తూంది. మీకేమి సంభవించనైయున్నదో గదా? మీరు టెలివిజను చూచుకొంటూ సువార్తను హేళన చేస్తున్నారు!
సంఘ సభ్యుడా, నీకేమీ జరుగనై యున్నది? నీ ఫలితము ఏమీ కానున్నది? ప్రతి పుస్తకములోను నీ పేరు ఉండి యుండవచ్చును. లేదా పట్టణములో నున్న పెద్ద సంఘములో ఉండి యుండును; ప్రభువైన యేసు యొక్క రక్తము క్రింద భద్రముగా నీవు ఉండనిచో, నశించు వారితో పాటుగా నీవును నశించెదవు. నీకు ఏ నిరీక్షణ ఉండదు.
37
ఏమీ జరుగనై యున్నది. అక్కడ పైన స్పుత్నిక్ఉన్నది. ఏమీ జరుగును? దేశము లొంగిపోవును. ప్రభుత్వము చేయకలిగిన మంచి పని అదొక్కటే మరి.
అప్పుడు ఏమీ సంభవించును? ఓడలలో పట్టునంత మంది సైనికులు కుప్పతెప్పలుగా వచ్చెదరు; గాలివిమానములలో నుండి అలల వలె దిగుదురు. ఈ దేశములో కాలు మోపుదురు. వీధులలో స్త్రీలు చెరపబడుదురు. మీరేమీ చేయుదురు. అది వారికి చెందును. నిన్ను అవతలకు త్రోసి దానిని వారు తీసికొందురు.
ఆ సమయంలో యువకులగు మీకు, యవ్వన స్త్రీలగు మీకు ఏమి జరుగును? పాపమునకు వెల చెల్లించవలెను? ఏ దేశమైనా సరే, అది చేయవలసినదే. వ్యక్తిగతంగా గాని లేదా దేశముగా గాని అది చెల్లించబడవలెను! క్రూరుల గుంపు దేవుడు లేనివారు, పొగరు పట్టిన వారు, అయిన కమ్యూనిస్టు సైనికులు మీ భార్యలను పట్టుకొని చెరిపెదరు. మీ యువతులను బలత్కరించెదరు. నీవు ఆలాగు నిలబడి చూచెదవే గాని ఏమీ చేయజాలవు.
దానికి కారణము ఏమిటి? ఈ టెలివిజనులలోని చెత్త అంతా నీవు చూచి, రాక్ ఎన్ రోల్ సంగీతము విన్నావు. ఎంతో పాపము చేశావు. చల్లారిన నామాకార్ధ బోధకుడు దైవ సంబంధమగు దానిని నీకు తర్జుమా చేయలేకపోయెను. గోడ మీద చేవ్రాత యున్నది! అది నిజము! మనము త్రాసులో తూచబడితిమి. తక్కువగా కనబడితిమి.
38
అది ఎప్పుడు జరుగును? ఉదయమున పగటికాంతి రాకముందుగానే. దానిని ఎవరు ఆపగలరు? దాని ప్రయత్నించుము. అది జరుగునని బైబిలు చెప్పుచున్నది.
కాని మీకు చెప్పెదను. సజీవుడైన దేవుని యొక్క సంఘమును అది ఎన్నడును అంటుకొనజాలదు. ఆ సమయానికి మనము వెళ్ళిపోదుము!
కనుక, స్నేహితుడా, విను! అది అంత దగ్గరగా నున్నచో, మనము గోడ మీది చేవ్రాతను చూస్తున్నాము. ఇది ఇప్పుడు జరుగకుండా ఏదియు ఆపజాలదు.
అమెరికాకు బోధించబడినది. సహజాతీతమైనది జరిగినది. అయినను వారు దానిని దాటిపోయి చెడుగా తిరుగుటను కొనసాగించుచున్నారు.
ఏదైనా ఒక దేశమునకు వెళ్ళి ఉజ్జీవ కూటము జరపండి. ఒక వారంలో నలభై మంది మారుదురు. ఆరు వారాల తరువాత మరల వెళ్ళండి. నలుగురు కూడా అక్కడ ఉండరు. ఆ పాత చెరువు ఎండిపోయి యుండుట కనుగొందురు. దేవుడు ఎన్నుకొనినవారు అనేకులున్నారు. చివరివాడు లోనికి రాగానే తలుపు మూయబడును. అంతా అయిపోవును.
39
కృప సమాప్తమైన పిదప అక్కడ తీర్పు తప్ప మరేదియూ ఉండదు. ఇక్కడ మనము రహదారి చివరన ఉన్నాము. దైవ సంబంధమైనది గతించినది. దానిని చూచి వారు నవ్వి హేళన చేశారు. చివరగా దేవుడే తన స్వంత శక్తితో వచ్చెను. తన ప్రియకుమారుని ద్వారా సంఘమును బట్టి పని చేయుటకు ఆయన రాగా వారు దానిని ఆత్మీయతా వాదములేక దయ్యము అని చెప్పిరి. తీర్పు తప్ప మరేమి మిగిలి యున్నది? ఇక్కడ గోడ మీది చేవ్రాత కనబడుచున్నది.
అది అంత చేరువగా నున్నది. శ్రమలకు ముందుగా సంఘము రాకడలో ఎత్తబడునని ఏ బోధకుడైనా ఎరుగును. కనుక అది అంత దగ్గరగా నున్నది. ఉదయముకాక ముందే జరుగవచ్చును. అయితే ఎత్తబడుట మాట ఏమిటి? అది అంతకంటె దగ్గరగా ఉన్నది. ప్రభువు యొక్క నామము స్తుతింప బడునుగాక! ప్రభుని రాకడ సమీపముగా ఉన్నది. వ్రాత వ్రాయబడెను. అది బైబిలులో వ్రాయబడెను. దానిని చూచుటకు మనము బ్రదికి యున్నాము.
40
నా స్వరము బ్రతిమాలుటను బట్టి, నీవు ఈ ఘడియలో యేసుక్రీస్తును చేర్చుకొందువా? మారుమనస్సు పొంది, ప్రతివాడును పాపక్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్ధానము మీకును, మీ పిల్లలకును, దూరస్థులందరికిని చెందును. ఆ నామముననే తప్ప ఆకాశము క్రింద ఇయ్యబడిన మరి ఏనామము వలనను రక్షణ కలుగదు. అని పేతురు పలికెను. నీవు క్రీస్తు వాడవైతేనే! నీవు మెతడిస్టువు, బాప్టిస్టువు, పెంతెకోస్తువు, నజరేయుడు, కాతలిక్కు మరేదైనా కావచ్చును. నీవు క్రీస్తువాడివి కానిచో నశించినట్లే! క్రీస్తు నీ లోనికి వచ్చును. అది పరిశుద్ధాత్మద్వారా క్రొత్త జన్మ. మనము ప్రార్థించుచుండగా ఈ రాత్రే చేర్చుకొనుము.
41
మీ తలలు వంచుడి. ఈ గొప్ప సంగతి జరుగునని ఇక్కడ ఉన్నవారిలో ఎందరు ఎరుగుదురు? దీనిని గూర్చి నేను ఆశ్చర్యపడుచున్నాను. నీవు నీ భార్యతో కూడా ఈ రాత్రి పడకకు వెళ్ళవచ్చును. ఉదయాన ఆమె వెళ్ళిపోవును. తల్లిదండ్రులగు మీరు మీ చిన్న వారికి ముద్దు పెట్టి ఈ రాత్రి నిద్ర పుచ్చియుందురు. రేపు ఉదయాన ఆ పడక ఖాళీగా ఉండును. శ్రీమతి జోన్స్‌కు ఏమీ జరిగిందోనని తెలిసికొనుటకు నీవు వీధులలో పరుగిడుదువు. ఆమె కూడా వెళ్ళి పోయినది. ఎత్తబడుట సమీపములో యున్నది. బైబిలులో స్పష్టముగా ఇయ్యబడెను.
ఈ కూటములో, నీకింకా తరుణముండగానే, బుద్ధిగల స్త్రీ, పురుషులుగా ఆ పిలుపుకు మీ హృదయములో చోటిచ్చి ప్రభువైన దేవా, నీ నిత్యజీవముతో నన్ను నింపుము. అని చెప్పుము. ఎందుకనగా ఇంకా నీ ఆత్మ మేధాజ్ఞానముతో నిండియుండినచో నీవు భూసంబంధివే. కాని పరలోకము నుండి వచ్చు దేవుని యొక్క ఆత్మ నీ హృదయములోనికి వచ్చి, నీలో పరిశుద్ధాత్మను ఇచ్చును. శ్రమ వచ్చినపుడు ఆత్మదానిని సృష్టికర్త యొద్దకు వెళ్ళును. (పరిశుద్ధాత్మ) నీవును దానితో వెళ్ళెదవు. నీవెంత మత నిష్ట కలిగియున్నా లెక్కకు రాదు. నీలో ఆ తీసికొనిపోవునది లేనిచో అది వెళ్ళజాలదు.
42
మనము తలలు వంచి యుండగా ఈ రాత్రి ఈ వర్తమాన వినికిడిలో క్రీస్తు వైపు చేతులెత్తి ఎందరు ఈలాగు చెప్పెదరు? దేవా, నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపుము. నీవు వచ్చినపుడు నీతో నేను వెళ్ళగోరు చున్నాను. మీరు చేతులు పైకెత్తెదరా? సంఘమంతటిలోను వీరున్నారు. దేవుడు మిమ్ము దీవించును. అక్షరాలా రెండు వందలకంటె ఎక్కువ మంది గాలిలోనికి చేతులు ఎత్తియున్నారు.
పాపియగు స్నేహితుడా, నీవెన్నడూ క్రీస్తును అంగీకరించనిచో, ఈ సమయమున నీ హస్తమును పైకెత్తి, ప్రభువైన యేసూ, నాపై దయచూపవా అని అడుగుము. అమ్మా, నిన్ను దేవుడు దీవించును. ఇక్కడున్న నిన్ను దేవుడు దీవించును. వెనుక ఉన్న నిన్ను దేవుడు దీవించును. ఇంకెవరైనా గాని, ప్రభువా, నన్ను గుర్తు చేసికొనుము అనండి. ఇక్కడున్నవారిని, ఈ వైపునున్న వారిని దేవుడు దీవించును గాక! ప్రభువు మీతో ఉండును. ఓ ప్రభువా, నన్ను గుర్తుచేసికొనుము. నా కండ్లు ఇప్పుడే తెరువబడినవి. ఎంతో కాలము నుండి నేను క్రైస్తవునిగా చెప్పుకొనుచున్నానని ఇప్పుడు గ్రహించాను. కాని తిరిగి జన్మించుట అనగా ఏమిటో నాకెన్నడూ తెలియదు. పరిశుద్ధాత్మను ఎన్నడూ నేను పొందలేదు.
ఒకడు తిరిగి జన్మించని యెడల వాడెన్నడునూ దేవుని రాజ్యములో ప్రవేశించలేడు, కనీసము ఆ రాజ్యమును చూడనేరడు.
43
మీరు మీ హస్తము నెత్తి చెప్పండి, ఓ పరిశుద్ధాత్మా, నా పట్ల దయ చూపుము. నీవు సంఘము కొరకు వచ్చునపుడు నన్ను తీసికొని పొమ్ము. అమ్మా, దేవుడు నిన్ను దీవించును. ఇంకెవరైనా సరే, ఓ, దేవా నన్ను గుర్తు చేసికొనుము అనండి. అయ్యా, మిమ్ము దీవించును. అమ్మా, దేవుడు నిన్ను దీవించును, దేవా, నన్ను గుర్తు చేసికొనుము. ఇక్కడున్న యువకుని దేవుడు దీవించును. అక్కడున్న ఆమెను దేవుడు దీవించును. ఆ బాగా వెనుకనున్న యువతిని; ఈ వెనుకనున్న ఈమెను; ఓ దేవా, నాకు దయ చూపుము. నేను గోడ మీది చేవ్రాతను చూస్తున్నాను. ఈ రాత్రి బైబిలులో నుండి చెప్పబడినది చరిత్ర పునరావృతమగుటయేనని ఈ రాత్రి నేను గ్రహించకలుగు జ్ఞానములోయున్నాను.
మనము అంతములో నున్నాము. ఏదీ సహాయము చేయజాలదు. లోకమును నాశనము చేయునది పాపుల చేతిలో నున్నది.
44
కొద్ది సంగతులు చెప్పెదను. క్రీస్తు నొద్దకు వచ్చుటకు అభిషేకించబడిన వారిలో నీవే చివరి వ్యక్తివి కావచ్చును. చివరి వాడు రాగానే తీర్పు మొదలవును. ఇంకా ఒక్కటే కొదువగా నున్నది. అది నీవే కావచ్చు. మేము కనిపెట్టుచుండగా ఆయనను ఈ రాత్రి చేర్చుకొందువా?
బహుశా ఇరవై, ముప్పయి చేతులు ఎత్తబడినవి. ప్రజలను ఇక్కడకు తీసికొని వచ్చుటకు, వేదిక పిలుపును ఇచ్చుటకు ఇక్కడ మనకు చోటు లేదు. ఎందుకనగా మనకు స్థలములేదు. కాని మిమ్మును నేను నిశ్చయంగా అడుగుచున్నాను. ఓ! యధార్థంగా ఈ హెచ్చరిక స్వరమును వినండి. మీరు కూర్చున్న చోటనే యధార్థంగా క్రీస్తును అడగండి, ప్రభువా, పాపినగు నాపై దయ చూపుము. కృపా తెరకు ఆవలగా నేను జారిపోక ముందే నన్ను చేర్చుకొనుము. నేను పాపము చేసి నా కృపా దినమును దాటిపోకముందే ప్రభువా, నాకు కృప చూపుము. ఆయన దానిని చేయును.
నేను మీతో ప్రార్థించుచుండగా ఆలాగు మీరును ప్రార్థించండి.
45
ధన్య ప్రభూ, ఈ రాత్రి ఒక భయంకర స్థితిలో మేము నిలబడి యున్నాము. నీ వాక్యము మేము చదువుచుండగా, ఏ ఘడియలోనైనను రేడియోలలోను, రాక్ ఎన్ రోల్ మేళములోను, నా దేవా, నీకు చేరువగా అను పాట వినబడనైయున్నదని ఎరిగియున్నాను. కాని అప్పటికి చాలా ఆలస్యమయి పోయియుండును. తీర్పు తాకియున్నది. క్షిపణులు మా వైపు గురిపెట్ట బడినవి. మైళ్ళకొలది, నాశనము జరుగును. భూమిని తుడిచిపెట్టు టన్నుల కొలది అణుశక్తులు, మొదలయినవి సర్వ ప్రపంచమును మండించును. అది పాపాత్ముల చేతిలో ఉన్నది. అది జరుగు విధానము అదేనని బైబిలు చెప్పెను. గోడమీది చేవ్రాతను మేము చూస్తున్నాము.
ఓ ప్రభువైన దేవా, జనులకు ఇటువంటి ఒక వర్తమానము అందించవలెనని ప్రయత్నించుటలో నేను అసమర్థుడను. అటువంటి ఒక అంశమును అందించవలెనని ప్రయత్నించుటకు ఎంత అల్పుడనో ఇక్కడ నిలబడి గమనించియున్నాను. కాని దానిని అందించుటలో నా వంతును నేను నెరవేర్చ లేక పోయినందుకు క్షమించుము. కాని ఏమయినను, నా హృదయములో నుండి నేను అడుగునదేమనగా, వారి హృదయములలో నీవేలాగు ఉంచవలెనని ఆశించావో అదే రీతి ఆ వర్తమానమును ఉ౦చుమని నిన్ను అడుగుచున్నాను. ఎందుకనగా ఘడియ సమీపించుట నేను చూస్తున్నాను. దేవా, దయ చూపుము. ప్రతి ఒక్కరిని రక్షించుము. వారిని పరిశుద్ధాత్మతో నింపుము. వారు నీ పిల్లలగుదురు గాక! నీ మేలులతో వారిని దైవికముగా చుట్టుము. ప్రభువైన యేసునుండి భద్రతను పొందునట్లు చేయుము.
ఎందుకనగా మా దేశమునకు భద్రత లేదు. ఉన్నదని మేము అనుకొన్నాము. ఆ బబులోను సామ్రాజ్యము కూడా ఆలాగే తలంచెను. కాని ఒక దుష్టరాజ్యము దానిని నాశనము చేయుటకు ఎడతెగక పని చేస్తున్నది. ఇప్పుడు కూడాను ఒక దుర్మార్గపుదేశము పని చేయు చున్నది. మా కంటె వారు ముందంజలో ఉన్నారని మేమెరుగుదుము. మేము వారి దయ మీద ఆధారపడియున్నాము.
ప్రభువా, సంఘము నీ దయపై ఆధారపడియున్నది. వారు నాశనము చేతురు. కాని నీ సంఘమును నీవు స్వీకరించుము. ఓ, ప్రభువా, ఈ రాత్రి నీ కాపుదలలోనికి మమ్ముతీసికొనుము. యేసు నిమిత్తము మమ్ము దీవించుము. ఆయన నామమున మేము ప్రార్థించు చున్నాము. ఆమేన్.
46
ఒక్క నిమిషము నెమ్మదిగా, గౌరవంగా ఉందము.
మృదువుగా, నెమ్మదిగా యేసు పిలచుచున్నాడు.
నీ కొరకు పిలచుచున్నాడు......
ఇప్పుడు మనము పాడుచుండగా, పరీక్షించుకొనండి.
తలుపునొద్ద ఆయన కనిపెట్టి చూస్తున్నాడు
నీ కొరకు, నా కొరకు కనిపెట్టుచున్నాడు.
ఇంటికిరమ్ము. (ఎక్కడ?
ఎక్కి రమ్ము. ఇంకా పైకి రమ్ము.)
అలసటపడ్డ నీవు, ఇంటికి రమ్ము.
ఆశతో, మృదువుగా యేసు పిలచుచున్నాడు.
పిలచుచుండగా, ఓ, పాపి, ఇంటికి రమ్ము!
[సహో.బ్రెన్‌హాం, మృదువుగా, నెమ్మదిగాను పాటను పాడుటకు ప్రారంభించారు-సంపా.]
47
ఓ! అది ఇప్పుడే సంభవించినట్లయినచో అది ఆశ్చర్యకరమగు కాలముగా ఉండదా? ఓ! అది సరియే. ఆయన ఎప్పుడైనా సిద్ధమే. ఆమేన్! ఆయనను ఎరిగినందుకు నేను ఎంతో సంతోషించుచున్నాను. ఇక్కడ ఎండి పోవుచున్న ఈ పాత బలహీన శరీరము ఒక్క క్షణములో, రెప్పపాటులో మార్పు చెందునని నేను సంతోషించుచున్నాను. నిత్యము జీవించుటకు నేను మరల ఒక యువకునిగా మారుదును.
వృద్ధులు అక్కడ నిత్యమూ యువకులుగా ఉందురు,
ఒక్క క్షణ కాలములో రూపాంతరము పొందుదురు;
అమర్త్యులై, ఆయన పోలికలో నిలబడెదరు.
వారు సూర్యుని, నక్షత్రములను మించిపోయి ప్రకాశించుదురు.
ఎంత గొప్పతరుణము! ఆయనను నిరాకరించవద్దు.
ఓ! మిమ్మును ఆయన “బాగా చేశావు” అని అనుట వినగోరుదురు,
ఆ నిత్యత్వపు దినమున!
నీ హృదయము నుండి ఆ ప్రియ రక్షకుని త్రోసివేయవద్దు,
ఆయనను త్రోసివేయవద్దు. (ఆ రాత్రే ఇదేకానీయండి)
48
ఎందరు పూర్ణహృదయముతో ఆయనను ప్రేమించుచున్నారు? ఆయన వచ్చినట్లయితే సిద్ధముగా ఉన్నారా? ఓ! ఎంత ధన్యకరము! అంతరంగమందు తేలిక అయినట్లుగా మీరిపుడు భావించుట లేదా? సువార్త, వాక్యము ద్వారా మనము కడుగబడి యున్నాము. మీ ప్రక్కనున్న వారి యొద్దకు వెళ్ళి, ఒకరితో కరచాలనము చేయుచూ, దేవుడు మిమ్మును దీవించును గాక! ఎంతో హాయిగా అనుభూతి చెందుచున్నాను. యాత్రికుడా, దేవుడు నిన్ను దీవించును. సోదరీ, సోదరుడా, దేవుడు నిన్ను దీవించును అని చెప్పండి. మార్గములో యున్న బాటసారిని మనము పలుకరించుచున్నాము.
చక్కని ఆ పురాతన రాజమార్గములో నడచుచూ
నేను వెళ్ళిన ప్రతి చోటను చెప్పుచు,
ప్రభువా, నేను ఆ పాతకాల క్రైస్తవునిగానే ఉందును
నాకు తెలిసిన ప్రతిదాని కంటెను.
49
ఈ గౌరవమగు క్షణములో మనము ఉండగానే, ఇప్పుడు ప్రార్థన వరుసను పిలచుటకు చాలా ఆలస్యమయిందని అనుకొనుచున్నాను. మనము... ఇంతమంది క్రీస్తు నొద్దకు వచ్చుట చూచి పరిశుద్ధాత్మ చాలా సంతోషించెనని నమ్ముచున్నాను. వెంటనే మీరు ఒక సంఘమును కనుగొని బాప్తిస్మము పొంది ఆ సంఘములోనికి వెళ్ళండి. ఒక మంచి ఆత్మ నింపుదల కలిగిన సంఘము. మీరు జీవించనంత కాలము అందులో నిలిచి యుండుడి.
క్రీస్తు ఏ కార్యములు చేయుదునని వాగ్ధానము చేసెను? నేను చేయు క్రియలు మీరును చేయుదురు అనెను. అయితే ఆయన సన్నిధి ఇక్కడున్నది. అది నాకు తెలియును. ఇక్కడ ఒకాయన ఉన్నాడు. ఆయనే గలిలయలోనడిచిన వాడు. తన రక్తము ద్వారా విమోచించిన వాడును ఆయనే. ఆయన తన దెబ్బలచే నిన్నుబాగు చేసెను. ఆయన చేసిన ప్రతి కార్యమును జరిగించుటకు ఇక్కడ ఉన్నాడు. ఎందుకనగా ఆయన అదే ప్రభువైన యేసు.
50
ఇప్పుడు నెమ్మదిగా మనము ఒక్క క్షణం ప్రార్థించుదము. పరిశుద్ధాత్మ యొక్క మనస్సును కనుగొన నేను ప్రయత్నించుచుండగా ప్రార్థనలో ఉండండి.[సహో. బ్రెన్‌హాం ఆగిరి సంపా.]
ఆ చక్కని సంగీతమును యాతనలో నున్న మనుష్యులు ఈరాత్రి దానిని వినుటకు ఎంత ఇష్టపడుదురో గదా! ఈ రాత్రి నీవు కూర్చొని యుండిన కుర్చీలో వారును ఒకప్పుడు కూర్చొని సువార్తను వినిరి. ఇప్పుడు గతించిపోయిరి. ఈరాత్రి యాతనలో ఉన్నారు. నీవు కూర్చున్న చోటును వారు తీసికొనుటకు వారెంతగా ఇష్టపడుదురో గదా! ఇప్పటికి సమయం మించి పోయినది.
[సహో. బ్రెన్‌హాం ఆగారు సంపా.]
51
ప్రభువా, నీవు భూమ్యాకాశములను సృజించిన వాడవు. నీవే ధన్యుడగు ప్రభువైన యేసును ఈ భూమి మీదికి పంపించితివి. ఆయనయందు ఆత్మ యొక్క సర్వ పరిపూర్ణత నివసించుచున్నది. ఆయన పెదవుల ద్వారా నీవు ఇట్లు పలికావు, నేను ద్రాక్షావల్లిని. మీరు తీగెలు. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తాను ఏమీయూ ఫలించదు. ఈ రాత్రి నిన్ను నీవు మామధ్య బయలుపరచుకొనుమని నేను ప్రార్థించుచున్నాను. బోధించబడిన ఈ వర్తమానము నీ యొద్ద నుండి వచ్చినదని ఈ జనులు తెలిసికొందురు. సిద్ధపడుడని మీరు మాకు హెచ్చరిక ఇచ్చుచున్నారు. చివరి దినములు సమీపములో నున్నవి.
ప్రభువా, ఇక్కడ వ్యాధిగ్రస్తులు కూర్చొని యుండిరి. వారు బాగవునట్లుగా వారికి ధైర్యము ఇమ్ము. దేవుని యొక్క మహిమ నిమిత్తము దీనిని మేము అడుగుచున్నాము. ఇప్పుడు ప్రభువా, మమ్మును మేము నీకు లోబరచుకొనుచుండగా; సజీవ దేవునియొక్క సంఘముగా అప్పగించుకొనుచున్నాము. ఇక్కడున్న ప్రతి హస్తము పైకి లేచినదని నేను చూస్తూ తలంచుచున్నాను. ప్రభువా, ఈ రాత్రి నిన్ను అడుగగోరునది ఏమనగా, మా కొరకు ప్రత్యేకమైన దానిని చేయుము. ఈ జనులు సంపూర్తిగా నీకు లోబడునట్లుగా దయచూపుము... [టేపుపై ఖాళీ ఉన్నది సంపా.] దీనిని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.
52
[టేపుపై ఖాళీ ఉన్నది సంపా.] ... ఎందుకనగా ఆయన ఎల్లప్పుడును తీర్పుకు ముందు కృప చూపును. సేవకులు అక్కడే ఉండి ప్రార్థించవలెనని కోరుచున్నాను. ప్రార్థించుదము.
ఇప్పుడు ప్రత్యేకంగా నేను బోధించుచున్నాను. ఈ ముందున్న జనులు, లేక ఎక్కడున్ననూ, దానిని చెప్పుటకు మొదలు పెట్టుడని అడుగుచున్నాను. మన బలహీనతలను ముట్టుకొనగల ప్రధానయాజకుడు ఆయనే అని బైబిలు చెప్పుచున్నది. నిన్న ఆయన ప్రధాన యాజకుడైనచో, ఈ రోజును అంతే. ఆయన ఆలాగే యున్నచో నిన్న జరిగించిన కార్యములను నేడును జరిగించగలడు. అది నిజమేనా? ఇప్పుడు ఆయనను మనము తాక కలిగినచో, మీ బలహీనతలతో మీరు ఆయనను తాకండి. తిరిగి ఆయనను మాట్లాడనీయండి.
53
కాస్త ఆలోచించండి. ఒక దినమున ఈలాంటి జన సందోహముచుట్టూ ఉండగా ఆయన నిలబడినపుడు పేతురు అను ఒక మనుష్యుడు అక్కడకు వచ్చెను. అతని పేరు సీమోను ఆయనిట్లు చెప్పెను. నీ పేరు సీమోను. నీవు యోనా కుమారునివి. కాని ఇక మీదట నీవు పేతురు అనబడెదవు. అతడు ఎవరాయెను? ప్రియమగు అపోస్తలుడు.
ఫిలిప్పు నతానియేలును కనుగొనినపుడు అతనితో ఇట్లు చెప్పెను, “ఇదిగో! ఏ కపటము లేని ఇశ్రాయేలీయుడితడు.” ఇంకోమాటలో చెప్పాలంటే ఒక క్రైస్తవుడు. “ఒక యధార్థపరుడు.”
“బోధకుడా! నీవు నన్ను ఏలాగు ఎరుగుదువు?” అనెను.
“ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే, నీవు ఆ చెట్టు క్రింద ఉన్నపుడే నిన్ను నేను చూచితిని” అని చెప్పెను.
రక్తస్రావ రోగముగల స్త్రీ వచ్చెను. ఆయన జనసమూహము వైపు చూచెను.
ఆయన దయ్యము వలన ఈ కార్యములు చేయుచున్నాడని వారనుకొనిరి. వారు తమ హృదయాలలో ఇతడు బయల్జెబూబు అని చెప్పిరి. ఆయన వారి ఆలోచనలను కనిపెట్టెను. అది నిజమేనా?
“తండ్రి నాకు ముందు చూపించితేనేగాని నేను ఏ కార్యమును చేయను. నేను చేయు కార్యములు మీరు చేయుదురు” అని ఆయన చెప్పెను. కనుక ఆయన ఆలాగు చేయవలసి యున్నాడు. తన సంఘములో పని చేయవలెనన్నచో ఆలాగే చేయాలి. ఎందుకనగా అది ఆయన మాట.
54
ఇప్పుడు మిమ్మును అడుగగోరు చున్నాను. ఈ జన సమూహములో కనీసము ఇద్దరు ముగ్గురు జనులు ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొనుటకు కావలసిన విశ్వాసమును ప్రభువు యొద్ద నుండి పొందినచో మీరందరును ఆయనను మీ వైద్యునిగా అంగీకరించుటకు సంతృప్తి చెందుదురా? ఆయన ఆత్మ రూపములో తిరిగివచ్చి భూమి మీద ఉండినపుడు ఏ కార్యములను జరిగించెనో అవే కార్యములను తిరిగి చేయును. ఆలాగు మీరు చేయుదురా? మీరు ఇష్టపడినచో, ఆమేన్ చెప్పండి. [అందరూ ఆమేన్ చెప్పిరి సంపా.] ఆయన దానిని దయచేయవలెనని నా ప్రార్థన. ఇప్పుడు మీరు ప్రార్థించండి. మీరు...
ఎంతమంది రోగులు ఇక్కడ బాగుపడగోరుచున్నారు?చేతులెత్తండి. ఎక్కడున్నా సరే. మంచిది. బాగుపడగోరుచున్న రోగులు.
నేను చూడని వారు ఇంకెవరైనా సరే ఈ భవనములోఉండినచో, చూచునట్లుగా ఇప్పుడు...
55
ఇక్కడ రోసిల్లా కూర్చొని యున్నదని తలంచుచున్నాను. మద్యముతో బాధితురాలగు పిల్ల. ఎక్కడో కూటంలో ఆమెను ఆలాగు పిలచుట జరిగినది. వైద్యులు ఆమెను విడిచి పెట్టారు. ఆమె ప్రభువు ద్వారా పిలువబడినపుడు ఆమెను ఎన్నడూ నేను ఎరుగననియు, ఎన్నడూ చూడలేదనియు ఆమె ఎరుగును. ఆమె యొక్క జీవితము, స్థితి అంతటి గూర్చియూ ప్రభువు ఆమెకు చెప్పెను. ఆమె బాగవునని చెప్పెను. దేవుని కృపకు గురుతుగా ఈ రాత్రి ఆమె ఇక్కడున్నది. వైద్యులు ఒకరి తర్వాత ఒకరు, మద్యమునకు లోనైన వారిని ప్రత్యేకంగా బాగుచేయువారు సహితము ఆమెను బాగవదని విడిచిపెట్టారు. ఆమె అట్టి మద్యమునకు బానిసయిన స్త్రీ. నేనామెను ఎరుగుదును.
56
కాని మరో రీతిగా, గోధుమరంగు సూటూ ధరించి ఇక్కడ కూర్చొనియున్న ఈయన, నా వైపు చూస్తున్న ఈయన మాకు పూలు తెచ్చు సోదరుడని నాకు తెలియును. అది నిజమను కొంటున్నాను. నేను ఇప్పుడు అతని పేరును గుర్తుచేసుకోలేను. సహో. బోజ్‌తో కొంత కాలం క్రితం మా ఇంటికి వచ్చెను. షూల్జ్. సహో. షూల్జ్.
అంతకు మించి, సహో.ఫ్రెడ్ సాద్‌మన్‌కు కొద్ది క్షణాల క్రితం ఎక్కడో ఈ భవనంలో చూచాను. ఎక్కడో ఇప్పుడు దానిని మరిచిపోయాను. ఏమైనాగాని ఆయన ఎక్కడో ఇక్కడే ఉన్నాడు.
నేను-ఇంకెవరిని ఎరుగను. కాని దేవుడు మీ అందరినీ ఎరుగును. మీరు ప్రార్థించి దేవుని అడగండి. మీ విశ్వాసమును పరీక్షించుకోండి.
57
ఇప్పుడెవరునూ ఇటూ అటూ కదలవద్దు. రానున్న కొద్ది క్షణములు బహు మర్యాదగా ఉండండి. నమ్మిక మాత్రముంచుము మీ కిష్టమైనచో ఇప్పుడు ఆలాగుచేయండి. కొద్ది క్షణములు ఎంత మర్యాదగా ఉండగలరో అంత మర్యాదగా ఉండి మౌనంగాకూర్చొండి. [నమ్మిక మాత్ర ముంచుము అను పాటను ఆర్గనులో వాయించును సంపా.]
కాస్త ఆలోచించండి. క్రీస్తు దానిని వాగ్ధానము చేసెను. కొద్ది కాలమైన పిదప లోకము నన్ను ఇక చూడదు. అయినను మీరు నన్ను చూచెదరు. ఏలయనగా నేను... నేనే, మరొకరు కాదు. నేను అనునది వ్యక్తిగత సర్వనామము. యుగసమాప్తి పర్యంతము నేను మీతో ఉందును. నేను చేయు కార్యములు మీరును చేయుదురు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. అది నిజమేనా? అది నిజమై యుండవలెను!
సరే. నేను ప్రభువుకు ఎంతో కతజ్ఞుడను... మీరు కోరినచో మీ తలలు పైకెత్త వచ్చును.
58
ఇక్కడే మూలన ఒకామె కూర్చొని యున్నది. ఆమె నల్లజాతి స్త్రీ. అమ్మా! నిన్ను నేను ఎరుగను. దేవుడు నిన్ను ఎరుగును. ఇప్పుడు ఆస్త్రీ పైగా ఆ వెలుగు ఉన్నది. ఆమె... నీ వ్యాధి ఏమిటో, దానిగూర్చి నీవు ప్రార్థించుచున్నావో, ప్రభువు నాకు బయలుపరచినచో, నీకు సహాయము చేయువాడు ప్రభువైన యేసే అని నమ్మగలవా? నీవు తప్పక ఏదో బాధలో ఉండి యుండాలి. లేక ఏదో కోరుచున్నావు. ఎందుకనగా అది అక్కడున్నది.
స్నేహితులారా, చూడండి. నేను దానిని చూచుట లేదు అని మీరనవచ్చు. మీరు దానిని చూడలేదనుట సమంజసమే. నేను సూటిగా దానివైపే చూస్తున్నాను. చూచారా? మీరనవచ్చు, మంచిది. సహో. బ్రెన్‌హాం. నీవు నీ జ్ఞానేంద్రియములతో నీవు చూచినచో నేనును చూడగలను. ఓ! కాదు.
59
వెలుగు రూపములో నున్న యేసును పౌలు చూచెను. కాని అతనితో ఉన్నవారు దానిని చూడలేకపోయిరి. చూచారా? జ్ఞానులు నక్షత్రమును చూచిరి. ఆ వెలుగు వారిని నడిపించెను. కాని మరెవరూ దానిని చూడలేదు. అదికేవలము కొందరికే. అది వరము.
ఆ స్త్రీకి సైనన్ జబ్బు ఉన్నది. అది నిజము. నీకు గుండె వ్యాధి కూడా గలదు. అది పూర్తిగా వాస్తవం. [ఆ స్త్రీ మహిమ, హల్లెలూయా, యేసూ! వందనములు! హల్లెలూయా అని చెప్పుచున్నది సంపా.]వినండి. నీ పేరు, వారు నిన్ను ఎస్సీ అని పిలచుదురు. [అది నిజము] హూ. నీ చివరి పేరు అప్షైర్. [అది నిజము సహో. బ్రెన్‌హాం] నీవు ఉత్తర క్లీవ్ లాండు వీధిలో ఉందువు. నీ చిరునామా 1264. అది పూర్తి నిజం. [అక్కడే నేను ఉంటున్నాను] నీ... అమ్మా! నీవు ఒక దానిని అంటుకొని యున్నావు. నన్నెనడూ నీవు అంటుకోలేదని నీకు తెలియును.
నీ ప్రక్కన కూర్చొనియున్న బాలిక కూడా ప్రార్థించుచున్నది. ఆమె ఎవరికొరకో ప్రార్థించుచున్నది. అది నీ తల్లి. ఆమెకు ఊపిరితిత్తులు బాగోలేవు. ఇక్కడున్న స్త్రీతో నీకు కొంత సంబంధమున్నది. నీవు ఆమె కోడలువి. నీ పేరు మార్గరెట్. అది సరియే. నీవు అదే స్థలములో ఉంటున్నావు. నీవు వచ్చుట, వెళ్ళుట నేను చూచాను.
60
అక్కడ కూర్చొనియున్న తరువాత మనిషి. అయ్యా!దానిగూర్చి మీరేమి అనుకొను చున్నారు? యేసుక్రీస్తు దేవుని కుమారుడని మీరు నమ్ముచున్నారా? నమ్ముదురా? నీ బాధ ఏమిటో ప్రభువు నాకు బయలుపరచినచో ఆయనను అంగీకరించుదువా? నీకు కడుపు వ్యాధి ఉన్నది. అది నిజము. అది నిజమయినచో లేచి నిలబడుము. ఖచ్చితమే. నీవు ఒక బోధకునివి.
అతని యాజక దుస్తులు చూచి చెప్పుచున్నావు అని మీరనవచ్చును.
సరే. అంతేగాక నీవు ప్రెస్బిటేరియను అని కొందరు తలంచుదురు గాని నీవు ఒక పెంతెకోస్తు బోధకునివి. అది సరియే. ఆమేన్. నీ ఉద్రిక్తత వలన నీకు ఈ అల్సరు ఏర్పడినది. అది పోయెను. ఇంటికి వెళ్ళి బాగుపడుము సోదరుడా. ఆమేన్.
దేవుని యందు విశ్వాసముంచుము. సందేహించవద్దు.
61
ఇక్కడ కూర్చొనియున్న నీవు ఏమీ తలంచుచున్నావు?అవును. నీవు నమ్ముదువా? నేను దేవుని దాసుడనని నమ్మెదవా? లేక దేవుని యొద్ద నుండి నీకు ఏదయినా కావలెనా? నీవు కోరునదేదో దేవుడు నాకు బయలుపరచినచో ఆ దైవ సంబంధమైనది జరిగినదని నీవు నమ్ముదువా? యేసు ఏలాగు చెప్పునో ఆలాగే నీవు నమ్మెదవా? నీ పూర్ణ హృదయముతో? నీకు ఒక కణితి వంటిది ఉన్నది. అది నీ నడుము పైన పెరిగినది. అది నిజము. నీకు కడుపు వ్యాధి కూడా కలదు. అది నరముల ఉద్రిక్తత వలన ఏర్పడినది. అది నిజము. నీ పేరు ఈవా మే. రీడ్‌మన్ అనునది నీ చివరి పేరు. నీవు 1378 పశ్చిమ 13వీధిలో జీవించుచున్నావు. అది నిజము. అక్కడ కూర్చొని యున్నది నీ చిన్నపిల్ల అని నీవు నేను దేవుని దాసుడనని ఎరుగునట్లుగా చెప్పుచున్నాను. ఆమెకు ప్రార్థన కొరకు నీవు వచ్చావు. ఆమెకు రక్త సంబంధమగు రోగమున్నది. ఆమె గొప్ప ఆనందము చెందినపుడు లేదా గట్టిగా ఏడ్చినపుడు అది కలుగును. అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ చిన్న బాలుడు ఆమె సోదరుడు. అది నిజము. ఆ చిన్నబాలునికి కూడా నీవు ప్రార్థన కోరుచున్నావు. అతడు ప్రేవులు బిగబట్టు వ్యాధితో బాధపడుచున్నాడు. ఈ మధ్యనే బాగా బరువు తగ్గిపోయెను. కాదా? అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.
62
నీ ప్రక్కన కూర్చొనియున్న తెల్లజాతి స్త్రీ దేనివలనో కలవరము చెందునట్లు కనబడుచున్నది. సోదరి, నీవు నమ్మెదవా? తాను త్వరగా వచ్చుచున్నానని అన్యుల తరమునకు ప్రకటించుటకు దేవుడు తన కుమారుడగు యేసు క్రీస్తును పంపెనని నీవు నమ్ముచున్నావా?[ అవునండి, అని సోదరి చెప్పుచున్నది సంపా.] నీవు ఒక గ్రంథి వ్యాధితో బాధపడుచున్నావు. ప్రేవుల సంబంధమగు వ్యాధితో కూడా నీవు బాధపడుచున్నావు. నీకు ఉద్రిక్తత ఎక్కువ. నీవు ఈ పట్టణము నుండి రాలేదు. నీవు డిట్రాయిట్ నుండి వచ్చావు. నీవు జీవించుచున్న వీధి సంఖ్య 12134, ఫాండ్లర్ వీధి. అది నిజము. డెట్రాయిట్, మిషినగ్. నీవు ఇటలీ దేశస్థురాలవు. నీ పేరు వయోలా,పా ల ఫ్ ... పాలాఫ్‌బా. హూ... దేవుని యందు విశ్వాసముంచుము. నీవు అడిగిన దానిని పొందుము.
63
ఇటు వైపుగా నీవు ఏమి ఆలోచించుచున్నావు? నీ పూర్ణ హృదయముతో నమ్ముదువా?
అక్కడ కూర్చొనియున్న ఆమె; నీ సంగతి ఏమిటి? అక్కడ చివరనున్న నీవు నీ పూర్ణ హృదయముతో నమ్ముదువా? మంచిది. ఇద్దరిలో ఎవరో ఒకరు. ఏమీ పరవాలేదు. ఆమె ప్రక్కనే యున్న నీవు ఏమి ఆలోచించుచున్నావు? కూర్చొని నా వైపు చూస్తున్న ఆ తల్లి, నీవు నీ పూర్ణ హృదయముతో నమ్మెదవా? దాని గూర్చిఏమి ఆలోచించుచున్నావు? నీకున్న ఆ నరముల రుగ్మతను ప్రభువైనయేసు బాగు చేయునని నమ్ముచున్నావా? నమ్ముదువా? నీ భర్తకు చెవి వ్యాధి ఉన్నదని నేను చెప్పినపుడు నీవింకా ఎక్కువగా నమ్మవచ్చును గదా! అతని కొరకు ప్రార్థించమని కోరుదువా? అది నిజము. నీవు ఇప్పుడు నన్ను నమ్ముచున్నావా? మొదట నీవు దానిని పొందలేదు. అప్పుడే నీవు నీ స్వస్థతను పొందియున్నావు గనుక ఒక విధమగు మేల్కొలుపు నీకు కలిగినది.
64
ఆమె ప్రక్కనున్న స్త్రీ; నీ చేతిని పైకెత్తుము. దాని గూర్చి నీవేమి ఆలోచించుచున్నావు? దేవుడు నిన్ను బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? [ఆయన బాగు చేయునని నేనెరుగుదును అని ఆ స్త్రీ చెప్పినది సంపా.] నీవు నమ్మెదవా? సరే మంచిది. నీ ఎముకల వ్యాధినిన్ను విడిచిపోయినది.
అయ్యా! ఏమి ఆలోచించుచున్నారు? చేతులూపిన మీరే. మీ గుండె వ్యాధిని దేవుడు బాగు చేసి స్వస్థపరచునని మీరు నమ్ముచున్నారా? ఆయన చేయునని నమ్ముదురా?
కూర్చొని, అక్కడ నుండినా వైపు చూస్తున్న నీవు, నమ్మెదవా? దేవుడు... నీకు కూడా గుండె వ్యాధి కలదు. కాదా? అవును. నీకు చక్కెరవ్యాధి కూడా కలదు. అది నిజము. దేవుడు నిన్ను బాగు చేయునని నమ్ముదువా? అయితే నీవది పొందగలవు.
మీరు నమ్మరా? దేవుని యందు విశ్వాసముంచుడి.
65
ఇక్కడ ఏమి ఉన్నది? ఆ చోటు చివర కూర్చొనియున్న మీరును నమ్ముదురా? బాగుపడితివని నమ్మవలెను. చూచారా? నీకు పాదమునకు వ్యాధి కలదు. కాదా? ప్రభువైన యేసు... ఇప్పుడు నీవు ఎవరి కోసమో ప్రార్థించుచున్నావు. నీ సోదరుని కొరకు. అతడు విస్కాన్ సిన్‌లో ఉన్నాడు. ఈ మధ్యే అతని ఊపిరితిత్తులకు శస్త్ర చికిత్స జరిగినది. అందులో సగము తీసివేయబడెను. అది నిజము. నీవు నమ్ముదువా?అయితే నీవు అడిగిన దానిని పొందెదవు. ఓ! ప్రభువు యొక్క నామము ఆశీర్వదించబడును గాక!
నేనాయనను స్తుతించెదను, నేనాయనను స్తుతించెదను,
పాపుల కొరకై వధించబడిన గొర్రెపిల్లను స్తుతించండి.
ప్రజలందరూ ఆయనకు మహిమ నీయుడి.
ఎందుకనగా ఆయన రక్తము ప్రతి డాగును కడిగి వేసెను.
66
ధన్యుడవగు ప్రభువా, ఒక దినమున నీవు మేఘముల కావలగా వచ్చుట మేము చూతుము. ఇప్పుడిచ్చట నీవు ఆత్మీయశరీరములోఉన్నావని మాకు తెలియును. పరి పూర్ణముగా నిన్ను నీవు మాకు ప్రకటించుకొంటివి. ప్రభువా, లోకము దానిని చదువజాలదు. మేము కూడా దానిని ఆశించముగాని నీవు చెప్పావు గదా, వారిక మీదట నన్ను చూడరు. కాని నిన్ను చూడకలిగిన పిల్లలను నీవు సంపాదించుకొన్నావు. నిన్ను ఎరిగిన పిల్లలను మేము పొందియున్నాము. దాని కొరకు మీకు వందనములు.
గొప్ప పరిశుద్ధాత్మతో నీవు ఈ భవనమును ఇప్పుడు నీవు తుడిచివేసి, ఇక్కడున్న ప్రతి వ్యాధిగ్రస్తుని బాగుచేయుమని మేము ప్రార్థించుచున్నాము. ప్రభువా, నీవే ఇప్పుడు మహిమను పొందుము. ప్రజలు మృత్యు ఛాయలో కూర్చొనక, వారు లేచి ప్రకాశించునట్లుగా దేవునికి స్తుతి మహిమ చెల్లించుచున్నాము. యేసు నామమున.
మీరాయనను నమ్ముచున్నచో లేచి నిలబడి మీ పూర్ణ హృదయముతో ఆయనను స్తుతించుడి. ప్రభువైన యేసునందు ఆనందించుడి. ఎందుకనగా ఇప్పుడు ఆయన తన గొప్ప దైవ మహిమార్థమై మీలో ప్రతి ఒక్కరిని స్వస్థపరచును. ప్రభువు మిమ్మును దీవించును. ఆమేన్.