బయటకు పిలువబడినవారు
vgr count -153 సహోదరుడా జోసఫ్, నీకు ధన్యవాదములు. మనము ప్రార్ధించుకుందాము.
ఓ ప్రభువా, మరలా ఈ రాత్రి మేము కూడుకొని మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని కలిగియున్నందుకు మేము మీకు కృతజ్ఞలమైయున్నాము. మరియు మీ సన్నిధి, మా అందరిని ఆశీర్వదించవలసిందిగా మేము వేడుకొనుచున్నాము. ఆ తప్పిపోయిన గొర్రెలను తిరిగి వెనుకకు తీసుకు వచ్చుటకు మరియు ఈ రాత్రి దేవుని రాజ్యమునకై మీరు ఆత్మలను గెలుచుటను చూసే అవకాశమును మేము కలిగియుండెదము గాక. ఓ నిత్యమైన మరియు ఆశీర్వాదకరమైన దేవా, మునుపెన్నడూ మాట్లాడనట్లుగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుము. మరియు నీ రాజ్యములోనికి పిల్లలు జన్మించుటను చూడవలెనన్న మా హృదయ వాంఛను మాకు అనుగ్రహించుము. పిదప రోగులను మరియు బాధలలో ఉన్నవారిని స్వస్థపరచండి; మమ్మును మేము నీకు అప్పగించుకొనగా, ఈ కూడిక ద్వారా మహిమను పొందండి. మీ పరిశుద్ధమైన మరియు ప్రియమైన కుమారుడు, యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
మీరు కూర్చొనవచ్చు.
2
నా కొరకు కొంత సహాయం దారిలో ఉందని తెలుసుకొనుటను బట్టి ఈ మధ్యాహ్నము నేను చాలా ఆనందముగా ఉంటిని, అదేమనగా నా మంచి సహోదరుడు మరియు స్నేహితుడును అయిన సహోదరుడు టామీ ఆస్బర్న్, “బ్లాక్ గోల్డ్ ”అనెడి తన చిత్రపటముతో శనివారము రాత్రికి ఇక్కడకు రానైయున్నాడని నేను నమ్ముచున్నాను. మరియు పిదప అతడు ఆదివారము మధ్యాహ్నము కూడా సహాయము చేయును. సహోదరుడు టామీ బోధించుచూ మరియు రోగుల కొరకు ప్రార్ధించును, కావున ప్రభువు యొక్క ఈ గొప్ప సేవకుడైన, సహోదరుడు టామీ ఆస్బర్న్ ను బట్టి మీరు ఆనందిస్తారని నాకు తెలియును.
మరియు ఇప్పుడు ప్రభువు చిత్తమైనయెడల, ఈ రాత్రి... నేను రెండు బైబిళ్ళను కలిగియున్నాను. మరియు నేను ఆ రెండింటి నుండి ప్రసగించాలని కోరుటలేదు, అయితే నేను ఒక పాఠ్యభాగమును లేదా ఒక లేఖనమును కలిగియున్నాను, లేదా ఒక దానినుండి ఒక లేఖనమును, మరియు పిదప మరొకదాని నుండి ఒక పాఠ్యభాగమును నేను చదవగోరుచున్నాను.
3
పరిశుద్ధ లూకా సువార్తలోని 17వ అధ్యాయము, 26వ వచనము నుండి ప్రారంభించి, దీనిని మనము చదువుదాము:
“నోవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును.
నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు నుండిరి; అంతలో జలప్రళయము వచ్చి వారందరిని నాశనము చేసెను.
లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచుకొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి.
అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను.
ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును.“
మరియు ఇప్పుడు, ఒక వాక్య విధానము ద్వారా...... కావున నేను దానిని ఒక పాఠ్యసందర్భము కొరకు చదివితిని. పరిశుద్ధమైన లేఖనములలో ఆదికాండములో 19వ అధ్యాయము మరియు 22 వ వచనము, అది ఇట్లు చెప్పును:
నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొనిపొమ్ము; నీవక్కడకు చేరువరకు నేనేమియు చేయలేననెను.
మరియు ప్రభువు అట్లు అనుమతించినయెడల, ఈ రాత్రి నేను “బయటకు పిలువబడినవారు,” అను ఒక అంశమును తీసికొనగోరుచున్నాను.
4
గడిచిన సాయంకాలము “గోడ మీద చేవ్రాత” అను అంశముపై మాట్లాడవలెనని నా హృదయములో ఉండెను. మరియు ప్రభువు మనలను ఆశీర్వదించెను. మరియు ఆయన మనలను ఆశీర్వదించుట మాత్రమే కాదు గాని, ఆయన వాక్యమును చదవడానికి మనకు అనుమతించుటవలన, మరియు అతి త్వరలో జరగనైయున్న సంగతులను పరిశుద్ధాత్మ మనకు బయలుపరుచునట్లు చేయుటవలన, ఆయన రాజ్యమును ముందుకు కొనసాగించెదము.
మరియు అట్లు చేయుటలో మనము గొప్ప ఆధునిక బబులోనును గొప్ప ఆధునిక అమెరికాతో పోల్చియున్నాము. మరియు ఈనాడు మన దేశంలో మనము చూడగా, గోడ మీద ఒక చేవ్రాతను వారు కలిగియున్నప్పుడు వారున్నటువంటి గందరగోళములోనే మనమును ఉండుటను కనుగొనియున్నాము. మరియు పిదప మనము కూడా గోడ మీద ఒక చేవ్రాతను కలిగియున్నామని మనము కనుగొనియున్నాము. మరియు నైతికముగా మాట్లాడినచో అవే పరిస్థితులను కనుగొనుచున్నాము. ఆ రోజుల్లో ఉంపుడుగత్తెలని పిలువబడే ఆ సిగ్గుమాలిన స్త్రీలతో వారు మద్యం సేవించుచుండిరి, మరి ఈనాడు, వారే గొప్ప సినీ తారలుగా, మరియు మొదలగువారిగా పిలువబడుచున్నారు. అప్పట్లో వారు వారి తరగతిలో ఉండియున్నారు, కాని ఇప్పుడైతే వారు అంతటా ప్రతిచోట వ్యాపించియున్నారు.
5
పాపము అనునది ఒక గుండ్రని లోతు పళ్ళెములో పగలగొట్టబడిన ఒక గుడ్డువలె ఉన్నది. మరియు పాపము ఆ మధ్యలోనున్న పసుపు సొనవలె ఉన్నది. దానిని “సొన” అని పిలుస్తారని నేను నమ్ముచున్నాను. మరియు మీరు ఆ సొనను కలిసిన కొద్దీ అది ఆ గుడ్డు అంతటా వ్యాపించును. మరియు పాపము ఆ విధంగానే ఉన్నది. మీరు దానిని వ్యాపారాత్మకముగా చేయుచు, మరియు దానికి మెరుగులు దిద్దుచూ, దానిని అందముగా కనబడునట్లు చేయుచూ, మరియు దానికి వేరొక పేరును ఇచ్చుచున్నకొలది, మీరు దానిని అన్నిచోట్లకు వ్యాపింపజేసెదరు. పాపము, మనయొక్క ఈ గొప్ప సుందరమైన దేశంలో చేసినది అదే. అది అందముగా చేయబడినది, లేదా ఇతరులను ఆకర్షించే విధంగా చేయబడినది అని నా భావం. పాపము ఆకర్షణీయముగా మారినది.
సంవత్సరముల క్రితము, వినోదమునకై వారు చార్లీ బార్లీకార్న్ ను కలిగియుండేవారు, వాని చెవుల మీదుగా వ్యాపించి ఉన్న టోపితో భయంకరముగా కనపడు ఒక ప్రాణిలాగా ఉండి, మరియు ఏదో పూర్వకాలపు జంతువువలె కనబడేవాడు. అది కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న చార్లీ బార్లీకార్న్, ఈనాడైతే వాడు పూర్తిగా మెరుగులు దిద్దబడియున్నాడు. వారు ఒక బంపర్ అని పిలచు దానిలో వాడున్నాడు, మరియు వాడు అనేక క్రైస్తవ టెలివిజన్ కార్యక్రమాలలోను చాలా ప్రసిద్ది చెందియున్నాడు. అది నిజము. అయితే వాడు అదే పాత దుష్ట సాతానుడై యున్నాడు.
6
కొన్నిసార్లు బామ్మగారు, పంటినొప్పి కొరకు ఆమెకు గంజాయి త్రాగే అలవాటు ఉండేది. కానీ, ఓ, ఆ దయ్యము ఎంత ప్రసిద్ధికెక్కినదో చూడండి. కూతురు, తల్లీ, మరియు పిల్లలు కూడా, త్రాగుచున్నారు, మరియు అది ప్రసిద్ధిగాంచినది, అయితే సరిగ్గా అది కూడా పాపమే. అది కేవలము మరొక పేరు క్రింద దాగియున్నది.
ప్రజలు జూదమాడుట తప్పు అని భావించేవారు. మద్యపాన దుకాణములు, మరియు అటువంటి కార్యములు కొనసాగిస్తున్న నీచమైన స్థలములను వారు కలిగియుండినను, అటువంటి స్థలములకు మర్యాదస్తులైన ప్రజలు వెళ్లకయుందురు. మరియు స్త్రీలు ఒక మద్యపాన స్థలముగల వీధి గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు, వారు వేరొక ప్రక్కనుండి వెళ్ళేవారు. అయితే ఈనాడు ఆమె మద్యపాన దుకాణములలోనికి అడుగుపెడుతుంది, తన పిల్లలను చూసుకొనే పనిని ఎవరో ఒక చిన్న పనిమనిషికి అప్పగిస్తుంది, మరియు ఆమె ఒక తల్లిగా ఉండుటకు బదులుగా ఒక త్రాగుబోతులా అయ్యింది. ఆమె చాలా ప్రసిద్ధిగాంచినది.
మరియు ఎక్కడో గుహలలోనో మరియు జూదమాడు స్థలములలోనో ఆడుటకు వాడుకగా ఉన్న జూదము, ఇప్పుడొక గుంపు ప్రజలు కూడుకున్న ప్రతీసారి, వారు పేకలను బయటకు తీసి, మరియు ఆడుటకు వెళ్ళునట్లుగా మారింది. అది ఇంకనూ పాపమే. నీ పాపమునకు నీవు వెల చెల్లించునట్లు దేవుడు చేయును. ఆయన పాపమును ద్వేషించును. ఆయన ఒక పరిశుద్ధ దేవుడు. మరియు ఒక పరిశుద్ధ దేవుడు పాపమును సహించలేడు. ఒకవేళ ఆయన పాపమును సహించగలిగినయెడల, ఆ మొదటి పాపము చేసినప్పుడే ఆయన ఆ విషయాన్నంతా ఆపివేసియుండేవాడు. అయితే పాపమునకు మరణము అవసరమైయున్నది, మరియు అట్లు చేయువారు ఇదివరకే పాపములో మరియు అతిక్రమములలో చనిపోయియున్నారు. అది బాధపరచునని నాకు తెలియును, అయితే బాధపరచుటకే నేనట్లు చెప్పుచున్నాను. అయితే దానిని చెప్పుటలో నా భావము అదే, బాధపరచుటకే.
7
ఆ గొప్ప ఉపద్రవముల ద్వారా, మనము చూసియున్నాము, ఈ దేశము కొరకు రాబోవు తీర్పుల యొక్క ఊడ్చివేతను మనము చూస్తున్నాము; ఏలయనగా దేవుడు మనలను పాపముతో పోనీయడు. ఆయన ఒక నీతిమంతుడైన దేవుడైయుండి, మనకు తోచినట్లుగా మనము జీవించినయెడల, మరియు దానికి తగిన వెల చెల్లించకుండా మనలను విడిచి పెట్టడు.
నేను ఇదివరకు చెప్పినట్లు, నేను మరలా చెప్పుచున్నాను. మనము చేయుచున్న దానితోనే మనలను పోనిచ్చినయెడల, ఆయన నీతిమంతునిగా ఉండుటకై, పరలోకపు దేవుడు సొదొమలకు పునరుత్థానము కలుగజేసి మరియు వారిని నాశనము చేసినందుకు వారికి క్షమాపణ చెప్పవలసియున్నది, ఎందుకనగా మనము సరిగ్గా వారున్నంత దరిద్రముగానే ఉండియున్నాము, బహుషా వారికంటే ఇంకా దారుణముగా ఉన్నాము.
మరియు ఇప్పుడు, దేవుని యొక్క నిజమైన ఆత్మను కొంచెమైనను కలిగియున్న వారెవరైనను, రాబోవు తీర్పు యొక్క వేడిని వారు అనుభూతి చెందగలరు. మీ ఆత్మలో మీరు వివేచించి మరియు ఏదో జరగనైయున్నదని మీరు తెలుసుకొనగలరు. చిన్న దేశాలు, మరియు పెద్ద దేశాలతో సహా ప్రపంచమంతయూ వణుకుచున్నది, ఎందుకనగా బొల్ శెవీకుల, కమ్యూనిస్టుల, భక్తిహీనుల, హృదయములేని మత సిద్ధాంతముల చేతులలో ఈ ప్రపంచమును ఒక్క నిమిషములో ధూళిగా చేయు శక్తి ఉన్నది.
కేవలం దేవుని కనికరములు దీర్ఘశాంతము గలవైయున్నందున, దానిని ఆపుచున్నది. ఉదయముకల్లా మనము రష్యాకు ఒక ఉపగ్రహముగా మారగలము. అయిననూ మనము దానిని గ్రహించటలేదు; మనము కేవలం సాగిపోవుచున్నాము, మరియు ప్రపంచము ఒక మానసిక రోగిగా మారినప్పుడు, దేని గూర్చి ఈ బలహీనమైన పరిస్థితిలన్నియు కలిగెనో అని వారెరుగరు. స్వయంగా మానసిక వైద్యులు కూడా నరముల ఉద్రిక్తతకు లోనగుచున్నారు.
8
సహజమైనది ఎన్నడునూ సహజాతీతమైన దానిని అనువదించలేదు, అటువలె ఆ మంత్రగాళ్ళు మరియు జ్యోతిష్కులు కూడా ఎప్పటికీ గోడ మీద చేవ్రాతను చదువలేరు. అట్లు చేయుటకు ఆత్మ నింపుదల కలిగిన మనుష్యులు కావలయును. ఆ జ్యోతిష్కులు అన్యభాషలను చదవలేకపోయిరి. ఆ సహజాతీతమైన దానిని గ్రహించుటకు అనువాదము చేయు వరమును వారు కలిగిలేరు, కావున అదంతయూ దేనిగూర్చియని వారు ఎరుగకపోయిరి.
ఈనాడు ప్రపంచము ఆ రీతిగానేయున్నది. రాక్-అండ్-రోల్ పార్టీలతో, మరియు వారు సంఘములలో పెద్ద పెద్ద నాట్య వేడుకలతో, మరియు అలంకారప్రాయమైన పై పై ప్రసంగములతో, మరియు మొదలగువాటితో వారు కాలయాపన చేయుచుండిరి, మరియు సువార్త నిర్లక్ష్యము చేయబడినది. మరియు సహజాతీతమైన దాని గూర్చి వారేమియు ఎరుగకయుండిరి.
అంతటనూ బోధించబడవలసిన ప్రభువు యొక్క రాకడను గూర్చిన వర్తమానమును అన్నివిధాలా మీరు వారితో మాట్లాడవచ్చును, అది దేశములోనే అత్యవసరమైన వర్తమానమైయున్ననూ వారు దానిని చూచి నవ్వెదరు. అయితే ఆత్మీయమైన ప్రజలు, తిరిగి జన్మించినవారు, ఏదో జరగనైయున్నదని ఎరిగియున్నారు, మరియు దాని విషయమై వారు సంతోషముగా నున్నారు; ఎందుకనగా అది ప్రభువైన యేసు తన సంఘము కొరకు వచ్చునట్టి రెండవ రాకడయైయున్నది. అయితే రక్షించబడనివారు, అదంతయూ దేని గూర్చియై యున్నదో వారెరుగకయున్నారు. అది ఒక సహజాతీతమైన కదలికయైయున్నది.
9
సరిగ్గా గత రెండు సంవత్సరాలలో దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప కూటములలో ఒకటి, భారతదేశములోని బొంబాయి నగరములో కలిగియుండే భాగ్యము నాకు దొరికింది. మరియు సరిగ్గా అచ్చటకు వెళ్ళుటకు మునుపే, వారి దేశమును గూర్చి ఎంతో అధ్యయనం చేయగా, బెల్షస్సరు నుండి బబులోనును స్వాధీనపర్చుకొనియున్న మాదీయ పారసీకుల వంశస్థులు అక్కడ స్థిరపడ్డారనియు, మరియు ఈనాడు వారు హైందవులుగా పిలవబడుచున్నారనియు నేను కనుగొంటిని. మరియు అప్పుడు నేను వారి వార్తా పత్రికలో ఒక ఆశ్చర్యకరమైన సంగతిని చదువుచుంటిని, మరియు ఇప్పటికినీ నేను దానిని కలిగియున్నాను. ఒక ఆత్మీయమైన ప్రాముఖ్యత కలిగియున్నట్లు అనిపించిన దేనినైనా నేను చదివినప్పుడు, దాన్ని అట్టిపెట్టుకొనియుండుట నాకు ఇష్టం; ఏలయనగా అది ఏదైనా అర్ధవంతమైనది కానిచో దేవుడు అస్సలు చలించడు.
వారి దేశములో అధిక భూభాగమును కుదిపి వేసినటువంటి ఒక గొప్ప భూకంపము వచ్చెనని, ఎక్కడైతే వారి వార్తా పత్రికలో వారు చెప్పియున్నారో దానిని నేను చదువుచుంటిని; రెండు సంవత్సరములక్రితం మీ సొంత అమెరికా వార్తాపత్రికలలో దానిని మీరు చదివియున్నారు. మరియు అది ఇట్లు చెప్పెను, ఈ గొప్ప భూకంపము రావడానికి రెండు లేదా మూడు రోజులకు ముందు, ఒక గొప్ప వింతైన కార్యము చోటుచేసుకొనినది, ఏదనగా గోడల చుట్టూ ఉండే గొర్రెలు మరియు పశువులన్నియు.....
10
ఇండియాలో, కంచెలకు బదులుగా, వారు గోడలను కలిగియుందురు. మరియు వారి పశువుల శాలలు, వాటిలో చాలా వరకు రాళ్ళతో చేయబడియుండెను. మరియు గోడ నీడన నిలబడియుండవలసిన పశువులు మరియు గొర్రెలన్నియూ, మైదానం మధ్యకు వెళ్ళనారంభించాయి. మరియు ఆ భూకంపము సంభవించకముందే, పశువుల శాలలోని ఖాళీ సందులలో గూళ్ళు కట్టుకొనియున్న చిన్న చిన్న పక్షులు, ఆ గోడలు కూలి వాటి మీద పడతాయని, అవి దూరంగా అడవులలోనికి ఎగిరిపోయినవి. వాటిని బయటకు తోలుటకు ఎవ్వరునూ లేరు. ఒక భూకంపము రానైయున్నదని చూపించుటకు అక్షరార్ధంగా ఎలాంటి సూచన లేకుండెను. అయితే, దేవుడు తన సొంత వారిపట్ల జాగ్రత్తవహించును అను దాన్ని బట్టి, అవి ఒక స్పర్శను కలిగియున్నవి. ప్రమాదము నుండి తప్పించుకొనుటకు అవి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినాయి.
మరియు దేవుని సారుప్యములో చేయబడిన మనుష్యులు, ఈ గొప్ప ఒత్తిడి రానున్నదను స్పర్శను ఎరిగినవారై, సురక్షితమైన చోటుకు వెళ్ళవలసియున్నదని నాకు అనిపించుచున్నది. కాని వారాలాగు చేయకుందురు. వారు వినకుందురు. ప్రతీ పగలు మరియు ప్రతీ రాత్రి దేవుని యొక్క గద్దింపు స్వరము మాట్లాడుచున్ననూ, మనుష్యులు మాత్రం పాపములో జీవించుటనే కోరుకుందురు.
ఇంకా ఎంతో సమయము లేదని మీకు తెలియునా, వారికి ఎంతో సమయమున్నదని ప్రజలు అనుకుంటున్నారు, అయితే మనమనుకున్నంత సమయము లేదని లేఖనములు ప్రకటించుచున్నవి. యేసు ఇట్లు చెప్పెను, “నోవహు దినములలో ఉండునట్లు, మరియు లోతు దినములలో ఉండినట్లు, మనుష్యకుమారుని రాకడ దినములలో ఉండును.”
11
నోవహు దినములలో మరియు లోతు దినములలో, ఆ నాశనము మరియు తీర్పు దినములలో ఏమి జరిగినదో మనము చూద్దాం. అవి రెండూ ఈ మూడవ నాశనముతో అనుసంధానమైయున్నవి. యేసు ఇట్లు చెప్పెను, “ఆ దినములలో ఉండినట్లే, మనుష్యకుమారుడు రెండవసారి వచ్చునప్పుడు ఉండును.” అది సరిగ్గా అప్పుడుండినట్లే ఉండును.
మరియు నోవహు దినములలో, మరియు ఆ సమయములో మాత్రమే కాదు గాని, లోతు దినములలోనూ, అవి కూడలి సమయాలుగా... మరియు ప్రతిసారి భూమిమీదకు తీర్పు రాకమునుపే, దేవుడు కృపా పిలుపును పంపించుననియు, మనకు బోధించబడినది.
సరిగ్గా జలప్రళయము యొక్క నాశనమునకు ముందు రోజుల్లో దేవుడు భూమి మీదకు హనోకు అను ప్రవక్తను పంపించెను. మరియు ఆయన ఒక దూతను పంపించెను, మరియు ఆయన ఒక వర్తమానమును పంపించెను, మరియు ఆయన సహజాతీతమైన దానిని చేసెను. అయితే మనిషి ఏమి చేసాడు? వారు తినుచు, త్రాగుచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. వర్తమానము యొక్క పిలుపును వారు త్రోసివేసారు. ఆ మనుష్యుల యొక్క వర్తమానము ద్వారా, లోతు మరియు నోవహు, వారిరువురి వర్తమానము కృపా, దయ మరియు విమోచనను కలిగియున్నది. కృపను గూర్చి చెప్పాలంటే, కృప ద్వారానే దేవుని యొక్క కనికరము మరియు విమోచన ప్రజలకు అందించబడినది, కాని వారు దానిని త్రోసివేసారు. వారేమి చేయుటను మనము కనుగొన్నాము? వారు నవ్వుతూ, ఎగతాళి చేయుచూ, పరిహాసమాడుతూ, పెండ్లాడుచూ, వ్యభిచారంలో జీవించుచూ, నారు నాటుచూ, ఇండ్లు కట్టుచూనున్నారు.
12
ఈనాటి నిర్మాణ కార్యక్రమాలను చూడండి. మరియు సరిగ్గా ఇక్కడ కూడా నన్నొక విషయము చెప్పనివ్వండి. శాస్త్రీయమైన ప్రపంచంలో గల అభివృద్ధిని చూడండి. ఇప్పుడు, అవమానించుటకో, లేదా మీ భావాలను కించపరచుటకో, నేనిది చెప్పడంలేదు; కేవలం ఇది సత్యము గనుక నేను చెప్పుచున్నాను. అయితే అటువంటి కార్యాలు వేరొకవైపు నుండి వచ్చును. కయీను కుమారులు ఇనుమును మరియు లోహములను పదును చేయుట, మరియు భవనములు నిర్మించుట వంటి గొప్ప నిర్మాణికులు మరియు గొప్ప శాస్త్రవేత్తలయ్యారు; మరియు ఆ గొప్ప శాస్త్రీయ ప్రపంచము చాలా మత సంబంధమైన ప్రపంచము, అయితే అది కయీను నుండి వచ్చినది.
అయితే షేతు నుండి వచ్చినవారు బీదవారు, దేవుని నమ్మినటువంటి దీనమైన వ్యవసాయదారులైయున్నారు. మరియు ఆ ప్రవక్త ప్రసంగించినప్పుడు, దానిని వారు స్వీకరించారు. సహజాతీతమైనది జరిగినప్పుడు దానిని వారు స్వీకరించారు. మరియు విమోచన ప్రతిపాదించినప్పుడు, వారు దానిని స్వీకరించారు, మరియు వేరొక వైపువారు ప్రభువైన దేవుని యొక్క తీర్పులలో నశించిపోయారు.
కేవలం వారు తెలివిగల వారైనందున, వారు ఇష్టపడిన ఏ స్త్రీతోనైననూ జీవించవచ్చునని వారు తలంచారు. వారు తెలివైనవారు గనుక వారు త్రాగవచ్చుననియు మరియు ఇతరులకు అది అనవసరం అనుకున్నారు. అయితే దేవుడు పాపమును ద్వేషంచును, మరియు ఆయన న్యాయ విమర్శ చేయకుండా దానిని పోనియడు. మరియు ఏదైతే నేమి అవిశ్వాసిని నశింపజేసినది. తీర్పు యొక్క జలములైయున్నవి మరియు నోవహును సురక్షితంగా తీసుకువెళ్ళినది అదే జలములైయున్నవి. మరియు అవిశ్వాసిని నాశనము చేయు సువార్త వర్తమానమే, తీర్పు ఎన్నడైనా తాకకముందే సంఘమును ఎత్తబడుటలోనికి తీసుకువెళ్తుంది. వారు క్షేమముగా కొనిపోబడుదురు.
13
యేసు ఇట్లు చెప్పెను, “మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.” మరియు ఇది జరిగినప్పుడు, అంత్యకాలము వచ్చును. మన ఆశీర్వాద కారకుడైన రక్షకుడు ఇట్లు చెప్పెను, సువార్త లోకమందంతటను ప్రకటించనప్పుడు, “అటుతరువాత అంతము వచ్చును.”
ఇప్పుడు, మీరు ప్రపంచమంతటా కరపత్రాలను పంపించిన తరువాత, లేదా ప్రపంచమంతటా బైబిళ్ళను పంపించిన తరువాత, లేదా ప్రపంచమంతటా మిషనరీలను పంపించిన తరువాత అని ఆయన ఎన్నడూ చెప్పలేదు, అయితే ఈ సువార్త ప్రకటించబడిన తరువాత అని చెప్పెను. అలాగైతే సువార్త అనగా ఏమిటి? పౌలు ఇట్లు చెప్పెను, “ఈ సువార్త మా వద్దకు కేవలం మాటలతో కాదు గాని, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములను ఆధారము చేసుకొని వచ్చియున్నది,” పరిశుద్ధాత్మ వాక్యమును ప్రత్యక్షపరచుటవలననైయున్నది. మీరు గనుక ఆ తరువాత వచనమును చూసినట్లైతే, “మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి,” అని ఆయన చెప్పినప్పుడు, ఆయన నిన్నా, నేడు, మరియు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడని తనను తాను ప్రత్యక్షపరచుకొనుటకు. ఆయన ఇట్లన్నాడు, “నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఇదిగో నేను యుగసమాప్తి వరకు, సదాకాలము మీతో కూడా ఉన్నాను.”
14
చాలాసార్లు, మేము ఈ వర్తమానమును తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు, సరిగ్గా లోతు మాటలు తన బంధువులకు అగుపించినట్లే మా మాటలు ఈ ప్రపంచానికి అగుపించును. మేము వారికి ఎగతాళిగానైనా ఉండియుండాలి, లేదా వారివే పనికిరాని మాటలైయుండాలి అని నాకు అనిపించుచున్నది. వారి సంఘ కాపరులు ఈ గొప్ప విడుదలను గూర్చిన వర్తమానమును దాటి వేసైనా ఉండవచ్చును, లేదా అది రాబోవు వేరొక తరానికి చెందినదని వివరించుటకు ప్రయత్నించియుండవచ్చును. అయితే దానిలోని వాస్తవమేదనగా, వాక్యమును నిర్ధారించుటకును మరియు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ప్రత్యక్షపరచుటకును ప్రభువు యొక్క దూత ఇచ్చట ఉండియున్నాడు, మరి అందువల్లనే ఈ సూచక క్రియలు వెంబడించుచున్నవి.
వారు ఎగతాళి చేయుటకు ప్రయత్నించిరి, మరియు వారు లోతుతో ఇట్లనిరి... అంతేకాకుండా అతని సొంత బంధువులే లోతును పరిహసించిరి; మరియు లోతు నీతిమంతుడైయుండెను. వారి పాపముల యొక్క వంకరతనమును చూచుటను బట్టి, దినదినము నీతిగల తన మనస్సు నొప్పించబడెనని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది.
మరియు ఈ దేశము మానవ శరీరమును దుర్వినియోగం చేయుటయను దానితో నిండిపోయినది. విధ్వంసముతో, యుక్తవయసులో మద్యపానీయులు, మత్తు బానిసలు, బాల్య నేరములు, సరిగ్గా అప్పుడున్నట్లే ఉన్నది. మరియు పురుషులు దానిని ఎగతాళి చేయుచున్నారు. మరియు వారు ప్రభువైన దేవుని యొక్క సహజాతీతమైన సూచనలను చూసినప్పుడు, మా వల్లనే మతము ఎగతాళి చేయబడుచున్నదని చెప్పుటకు వారు ప్రయత్నించుచున్నారు.
15
ఈ మధ్యనే ఒకరు చెప్పిరి, ఒక గొప్ప డాక్టరు-ఆఫ్-డివినిటి యైయున్న ఒకరు నాకు ఒక ఉత్తరమును వ్రాశాడు. మరియు అతనిట్లన్నాడు, “శ్రీ. బ్రెన్హాం గారు, నీకు నీవు ప్రక్కకు తొలగిపొమ్ము. నీవు ప్రభువైన యేసును అనుకరించుటకు ప్రయత్నించుచున్నావు.” “నీవు కేవలం వంచన చేయుచున్నావు,” అని అన్నాడు. ఒక మానవుడు దానిని చేయలేడన్న విషయాన్ని, పాపం ఈ బలహీనుడైన వ్యక్తి ఎంత తక్కువగా తెలుసుకున్నాడు గదా. అది అంత్యకాలము యొక్క సూచన, మరియు ఆయన దానిని నెరవేర్చుచున్నాడు.
అయితే, “ఓ, అతడు చెప్పేది వినకండి. ఈ మనుష్యుడు పిచ్చివాడు. ఈ గొప్ప స్థలము ఎటు నాశనము చేయబడుతుంది?” అని వారు లోతును ఎంతగానో ఎగతాళి చేసారు.
భూమి మీదనే గొప్ప పట్టణముగా పేరుగాంచిన ఈ సొదొమ మరియు గొమొర్రా, అగ్ని గంధకములచేత ఎట్లు నాశనము చేయబడుతుంది? ఈనాడు వారు అంటారు, “ప్రపంచము ఎట్లు దహించబడుతుంది? ప్రపంచము ఎట్లు నాశనము చేయబడుతుంది?” నా అత్యంత ప్రియమైన సూదరుడా, దానిని ఉనికిలోనికి తెచ్చిన అదే దేవుని యొక్క పలుకబడిన మాటయే, అది ఉనికిలోనికి తీసుకురాబడిన విధంగానే అది ఉనికిలోనుండి తీసివేయబడునని పలుకును: అది ప్రభువు యొక్క మాటవలనే జరుగుతుంది. ఆమేన్. అది వాస్తవము. ఈ దిక్కుమాలిన, దౌర్భాగ్యపు, దరిద్రపు, గ్రుడ్డిదైన మరియు దిగంబరియైన దేశమునకు దేవుడు కనికరము చూపును గాక.
దానిని బైబిలు ఈలాగు చెప్పలేదా, “నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలినవాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై యున్నావని యెరుగక - నేను ధనవంతుడను, ధనవృద్ది చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.” అది ఎటువంటి ఒక దయనీయమైన స్థితి!
16
కేవలం ఒక క్షణం మీరు నా మనసుకు వచ్చిన ఒక విషయమును గమనించవలనెని నేను కోరుచున్నాను. సొదొమ మరియు గొమొర్రాల నాశనమునకు ముందు ఆ పర్వతము మీద అబ్రాహాము అను పేరుగల ఒక ప్రవక్తను దేవుడు కలిగియున్నాడని మనము కనుగొనెదము. మరియు ఆయన అతనికి ఒక వాగ్దానము చేసియున్నాడు, మరియు పాపములో బ్రతుకుటకు బదులు, అతడు కరుకైనా మార్గమునే ఎంచుకొని మరియు నిజమైన సత్యవాక్యమును బోధించుటకు ఇష్టపడియున్నాడు. మరియు ఆ ప్రభువు యొక్క దూత అతడిని కలుసుకున్నది, సరిగా ఈ గొప్ప నాశనము సంభవించుటకు ముందు.
ఇప్పుడు మీరు గమనించవలసినదిగా నేను కోరుచున్నాను. నోవహు కాలములో అది నీటి ద్వారా. సొదొమ మరియు గొమొర్రాల కాలములో అది అగ్ని ద్వారా. మరియు ఈ సారి అది అగ్ని చేతయని దేవుని యొక్క అతి పరిశుద్ధ వాక్యము చేత మనకు బోధింపబడియున్నది.
మరియు లేఖనము చెప్పినది గమనించండి. అబ్రాహాము తొంబది-తొమ్మిది ఏండ్లవాడైయుండెను. దాదాపు ఒక నూరేండ్లు .....అప్పుడు శారా ఏనభై-తొమ్మిది ఏండ్లగలదైయుండెను. కావున చాలా ఏండ్ల క్రితమే ఆమెకు, స్త్రీలకు జరుగునట్టిది నీలిచిపోయెను. అయినను దేవుడు తన వాగ్దానమును నిలబెట్టుకొనుటకు సమర్దుడని అతడు ఎరిగియుండెను గనుక అబ్రాహాము హత్తుకొనియుండెను, ఏలయనగా అతడు విశ్వాసముగలవాడై యుండెను. అతడు వాక్యముతో అనగా, దేవుడు అతనికి చెప్పిన మాటలతో నిలబడియుండెను.
దూతలు ప్రజలకు ప్రత్యక్షమగునది అప్పుడే, ఎప్పుడనగా మీరు మానవ-కల్పిత వేదాంతముతో కాక, వాక్యముతో అనగా, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,” అను వాక్యముతో నిలిచినప్పుడు. అప్పుడే దూతలు ప్రత్యక్షమగుదురు.
17
అబ్రాహాము వాక్యముతో నిలిచియుండెను. మరియు ఒకనాడు అతడు సింధూర వృక్షము క్రింద కూర్చునియుండగా, ముగ్గురు మనుష్యులు వచ్చుటను అతడు చూసియుండెను. మరియు అతడు ఆత్మసంబంధి గనుక, దేవుడు ఇంకనూ దేవుడైయుండెనని అతడెరిగియుండెను. మరియు ఈ మనుష్యులు ప్రత్యక్షమగుచుండగా, అబ్రాహాము వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వెళ్ళెను. మరియు “అయ్యాలారా, ఒక క్షణము ఆగండి, నేను కొద్దిగా నీళ్ళు తెప్పించెదను, మీ కాళ్ళు కడుగుకొనుడి మరియు మేము ఆహారమును సిద్ధపరిచెదము. మరియు పిదప మీరు అలసట తీర్చుకున్న తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందునిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరి,” అని అనెను. ఆ మాటలలోనికి వెళ్ళుటకు నాకు సమయము ఉన్నచో బాగుండునని నేను కోరుచున్నాను, “ఇందునిమిత్తము గదా మీరు వచ్చితిరి.”
మరియు ఆ కొద్దిపాటి భోజనము సిద్ధపరచబడిన పిమ్మట, అబ్రాహాము నిలుచుని, ఈ మనుష్యులు భోజనము చేయుటను గమనించుచుండెను, ఆ దూత తన వీపును గుడారము వైపునకు త్రిప్పుకొనియుండెను. ఆయన వీపు గుడారము వైపునకును, మరియు శారా గుడారము లోపల ఉన్నదనియు పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది.
18
నాశనమునకు ముందు చివరి వర్తమానమును తీసుకువచ్చుచున్న ఈ దూత యొక్క స్వభావమును గమనించండి. “అబ్రాహామా, నేను నీకు చేసిన వాగ్దానమును నేను నిలబెట్టుకొనబోవుచున్నాను,” అని ఆయన అన్నాడు. నేను దానిని ప్రేమించుచున్నాను. మన తండ్రియైన దేవుడంటే అదే. “నేను నీతో చేసిన వాగ్దానమును నేను నిలబెట్టుకొందును. దాదాపు జీవకాలమునకు, ఇంచుమించు వచ్చె ఇరవై-ఎనిమిది రోజులలో, జీవకాలమున నేను నిన్ను దర్శించబోవుచున్నాను. మరియు ఏ కుమారుని కొరకు నీవు ఇరువది-ఐదు సంవత్సరములుగా, వేచియున్నావో, వానిని నీవు పొందుకొనబోవుచున్నావు.”
అల్పురాలైన శారా, విశ్వాసములో బలహీనురాలైయున్నది.... అయితే ఆ రోజుల్లో, సున్నతి చేయబడిన పురుషుడిని బట్టి స్త్రీ కూడా లోపలికి తీసుకురాబడుతుంది, ఏలయనగా సున్నతి మాత్రమే దేవునియెదుట గుర్తించబడుతుంది. మరియు స్త్రీ సున్నతి చేయబడనేరదు; కావున ఆమెకు, భర్తయే ప్రాయశ్చిత్తమైయున్నాడు, ఎందుకనగా వారు ఒక్కటైయున్నారు. ఆ సమయములో అబ్రాహాము యొక్క విశ్వాసమే శారాను కాపాడినది.
19
“శారా కుమారుని పొందుకొనును,” అని ఆ దేవదూత చెప్పినప్పుడు, ఆ దూత వెనుకనున్న గుడారములో శారా ఉన్నది, శారా తన హృదయములో, బిగ్గరగా కాదు కాని, ఆమె తనలో తాను నవ్వుకొనెను. మరియు గుడారము తట్టు వీపును త్రిప్పుకొనియున్న ఆ దూత, అబ్రాహాము ముఖములోనికి చూచుచూ, ఇట్లు చెప్పెను, “శారా, నవ్వనేలా?” అది ఏ రకమైన మనసును చదువుట? ఆయన వెనుక గుడారము లోపల ఉన్న ఆమె యొక్క తలంపును వివేచించెను. దానిని లేఖనము ఎట్లు తేటపరచుచున్నదో మీరు చూచుటలేదా? అది నాశనమునకు ముందు పంపబడిన చివరి హెచ్చరిక వర్తమానమైయున్నది. మీ కన్నులు తెరువుడి. ఆయన వెనుకనున్న గుడారములో, వెలుపలకు బిగ్గరగా కాదు కాని ఆమె తన మనసులో నవ్వుకొనెను, మరియు ప్రభువు యొక్క దూత ఆమె చేసిన దానిని వివేచించెను. “ఆమె ఎందుకొరకు నవ్వెను?”
మరియు ఆమె పిలువబడినది. మరియు ఆమె గడగడ వణికిపోయెను. ఆమె, “నేను నవ్వలేదు,” అని అన్నది.
ఆయన ఇట్లనెను, “ఓ, అవును నీవు నవ్వితివి.” అది ఆకాశము నుండి అగ్ని గంధకము కురియుటకు ముందు ఆ దూత ఇచ్చిన చివరి వర్తమానమైయున్నది.
యేసు ఇట్లు చెప్పెను, “సొదొమ మరియు గొమొర్రా దినములలో జరిగినట్లు మనుష్యకుమారుడు ఆకాశము నుండి ప్రత్యక్షమగు దినములలో జరుగును.” మీరు ఆ వర్తమానమును చూశారా? “మనుష్యకుమారుడు ఆకాశమునుండి ప్రత్యక్షమగునప్పుడు....”
20
ఇప్పుడు, ఈ దూత సొదొమ వెళ్ళి మరియు ఒక మనుష్యుని ద్వారా తన వర్తమానమును మాటలాడుట ప్రారంభించినప్పుడు, వారాయనను ఎగతాళి చేసిరి మరియు ఆయనను అపహసించిరి. మరియు వారు వర్తమానమును అంగీకరించకపోయిరి. మరియు వారు ఈనాడు కూడా దానిని అంగీకరింపకుందురు. ఇది అదే కార్యమైయున్నది, మరియు వారు దానిని నమ్మకుందురు. ఒకే ఒక విషయము మిగిలియున్నది: అది న్యాయతీర్పు.
అయితే గమనించండి, వారు ఆ విధంగా ఉందురని పరిశుద్ధ గ్రంధము చెప్పెను. వారిని గూర్చి II తిమోతి 3లో, పరిశుద్ధ గ్రంధము ఈలాగు చెప్పుచున్నది, “కడవరి దినములలో ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.” అది నేరుగా ఆ దినము గూర్చి కాదు గానీ, అంత్యదినముల గూర్చి. “మనుష్యులు మూర్ఖులు, గర్వాంధులై, టెలివిజన్ యొక్క ప్రియులును... లేక లోకము యొక్క కార్యములను ప్రేమించువారైయుందురు.'' దానితో పాటు వెళ్ళువారైయుందురు. ”దేవుని కంటే ఎక్కువగా లోకమును ప్రేమించువారు, అతిద్వేషులు, మరియు అపవాదకులు, మరియు సజ్జనద్వేషులై యుందురు.....“
మీరిట్లందురు, “సహోదరుడా బ్రెన్హాం, వారు నాస్తికులు. వారు కమ్యూనిస్టులై యుండవచ్చును.”
అది క్రైస్తవులమని చెప్పుకొను అమెరికన్లు: “పైకి భక్తిగలవారివలె ఉండియు, దాని శక్తిని (సువార్త యొక్క అతీతమైన శక్తిని) ఆశ్రయించనివారు, అట్టివారి ప్రాకారముల నుండి దూరముగా పొమ్ము; అట్టి వారికి విముఖుడవైయుండుము. ఇటువంటివారు పాపభరితులై నానావిధములైన దురాశల వలన నడిపింపబడి, అన్ని రకములైన వినోదములతో, సమాజములలోనికి మరియు మొదలగువాటిలోనికి, మరియు ఇండ్లలోనికి చొచ్చి, అవివేక స్త్రీలను చెరపట్టుకొని పోవుదురు.” మరియు “మా సంఘము దీనిని చేయును, మరియు మేము చాలా సమయమును కలిగియున్నాము.” కాని దేవుని యొక్క మనసును మరియు తలంపులను మరియు పరిశుద్ధాత్మను వెదుకుటకు సమయము కేటాయించనివారైయుందురు. వారు దానిని నిరాకరించుదురు. సమయము కేటాయించనివారు......
21
అయితే మీరు లోతును గమనించవలెననియు మరియు నోవహును కూడా గమనించవలెననియూ నేను కోరుచున్నాను. ఎటువంటి వర్షము పడుటకుముందే, న్యాయతీర్పు యొక్క ముంచుకొచ్చుచున్న మేఘముల నుండి ఒక్క చుక్క తేమయైననూ రావడానికిముందే.... గతరాత్రి మనము చదివినట్లు, సువార్త ద్వారా గోడమీద చేవ్రాతను మనము చూచుచున్నామని నేను నిజముగా నమ్ముచున్నాను. మానసికంగా సరిగానున్న ఏ వ్యక్తియైననూ, మనకు కేవలం కొన్ని ఘడియలే మిగిలియుండుటను చూడగలడని నేను నమ్ముచున్నాను, మరియు బహుషా ఇదియూ చివరిదైయుండవచ్చును. అయితే న్యాయతీర్పు యొక్క ఒక్క నీటి చుక్కయైనా పడుటకుముందే, నోవహు ఓడలోనికి వెళ్ళియుండెను.
మరియు అబ్రాహాము ఆ దూతతో ఈలాగు చెప్పలేదా, “సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు దుష్టులతో పాటు నిరపరాధులను శిక్షించునా?” నిశ్చయంగా కాదు, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయమును జరిగించును.
మరియు గమనించండి, ఆకాశము నుండి ఒక్క అగ్నిగంధకమైనా కురియుటకు ముందే, లోతు సొదొమ వెలుపలకు తీసుకుపోబడెను.
యేసు చెప్పెను, “నోవహు దినములలో జరిగినట్లు మరియు లోతు దినములలో జరిగినట్లు, ఆ ప్రకారమే దేవుని కుమారుని యొక్క రాకడలో జరుగును.” మరియు గోడ మీద చేవ్రాత ఉన్నయెడల, న్యాయతీర్పు యొక్క సమయము సమీపించినయెడల, అప్పుడు సంఘము యొక్క ఎత్తబడుట ఎంత సమీపముగానున్నది? అది ఈ రాత్రి ఎంత సమీపముగా నున్నది? దానిగూర్చి ఆలోచించుడి.
22
భద్రత కొరకు నోవహు ఓడలోనికి వెళ్ళెను. లోతు సొదొమ నుండి బయటకు వచ్చెను. ఒకరు బయటకు వచ్చిరి, ఇంకొకరు లోపలికి వెళ్ళిరి. ఈ రెంటి సమ్మేళనము దేనికి సాదృశ్యముగానున్నది? ఇది భద్రత కొరకు సంఘము లోకము నుండి బయటకు వచ్చుటకును మరియు మహిమలోనికి వెళ్ళునట్లు క్రీస్తు యొక్క ఓడలోనికి వెళ్ళుటకు సాదృశ్యముగానున్నది. ఒకరు బయటకు వచ్చిరి, మరొకరు లోపలికి వెళ్ళిరి. ఒకరు లోకముతో పాటు నశించకుండుటకు బయటకు వచ్చిరి; మరొకరు సురక్షితముగా ఉండుటకు ఓడలోనికి వెళ్ళిరి. మరియు క్రీస్తే ఆ సురక్షితమైన ఓడయైయున్నాడు.
మరియు గుర్తుంచుకొనుడి. అగ్ని వడగండ్ల యొక్క న్యాయతీర్పుకు ముందే, మరియు ఐగుప్తును కటిక చీకటి కమ్ముటకు ముందే, వెలుగు ఉండగానే గోషేనుకు, ఇశ్రాయేలు తన దారిని కలుగజేసుకొనెను. మరియు కటిక చీకటిలో తిరుగులాడుటకు ఐగుప్తు విడిచిపెట్టబడెను.
పురుషులారా మరియు స్త్రీలారా, ఇప్పుడు నేను చెప్పునది ఆలకించుడి. ఈ దౌర్భాగ్యపు భూమిమీద మీరు విడిచిపెట్టబడుటకు ముందే, మరియు ఇక్కడ పాపములో కుళ్ళిపోవుటకు ముందే, మీరు సాధ్యమైనంత వేగముగా వెలుగునొద్దకు పరుగెత్తుడి..... [ టేపు ఖాళీ ఉన్నది.] క్రీస్తు యేసు అనే వెలుగునొద్దకు పరుగెత్తుడి మరియు ఆయన యొక్క కృపా వర్తమానమును స్వీకరించుడి.
“త్వరపడుము,” అని ఆ దూత చెప్పెను, “మరియు అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు బయటకు చేరుకొనువరకు నేనేమియు చేయలేను,” అనేను — న్యాయతీర్పు రాకుండెను.
23
మనందరినీ మోకాళ్ళ మీద పడవేయగల క్షిపణిని రష్యా కలిగియున్నది. మరి అందునుబట్టియే మనము వారికన్నా ఐదు సంవత్సరములు వెనుకబడియున్నామని మన శాస్త్రవేత్తలు చెప్పుచున్నారు. ఇప్పుడు వారున్న చోటును అందుకొనుటకు మనకు ఐదు సంవత్సరములు పట్టును. మనము కలిగియున్న చిన్న స్పుట్నిక్లు భూమి మీద నుండి మూడు అడుగులలోపే విఫలమగుచున్నవి, వారు కలిగియున్నవి ప్రపంచమంతటిని చుట్టి వచ్చుచున్నవి.
అది మనతో ఏమి చెప్పుచున్నది? దేవుడు తన సంఘముతో చెప్పుచున్నాడు, “ఇక్కడికి రమ్ము, నీవు ఇక్కడికి వచ్చువరకు నేనేమియు చేయలేను.” వారియొక్క సంఘశాఖ సరిహద్దులను బద్దలు చేసుకొనుటకు మరియు ఆమెను మహిమలోనికి కొనిపోవుటకు ఒక నిజమగు పరిశుద్ధాత్మ కుమ్మరింపునకు ఆయన యొక్క సంఘము వచ్చునట్లు దేవుడు వేచియున్నాడు. “నీవు ఇక్కడికి వచ్చువరకు నేనేమియు చేయలేను,” మనము కూడి వచ్చుటకు వేచియున్నాడు.
24
యేసు చెప్పెను, “మనుష్యకుమారుడు పరలోకము నుండి ప్రత్యక్షపరచబడునప్పుడు.” దీనిని చెప్పుటలో నన్ను ముగించనీయుడి: అదేదనగా మనుష్యకుమారుడు ఇప్పుడు పరలోకము నుండి ప్రత్యక్షపరచబడుచూనే ఉన్నాడు.
సహోదరుడా బ్రెన్హాం, అది కొద్దిసేపటి తర్వాత వచ్చునా?“
అది ఇప్పుడే. మరియు నేను ఈ కూటములో దీనిని చాలా వ్యక్తిగతం అన్నటు చేయనక్కరలేదని నేను ఆశీంచుచున్నాను. అయితే దేవుని చేత మీకివ్వబడిన మీయందున్న ఆత్మ, నేను మాటలాడుచున్న దానిని గ్రహించగలదు. మనుష్యకుమారుడు ఇదివరకే మహిమ నుండి వచ్చియున్నాడు మరియు గత కొద్ది సంవత్సరాలుగా కృప చేత తన సంఘమునకు తనను తాను బయలుపరచుకొనుచున్నాడు, వారికి ఆయన యొక్క గొప్ప సన్నిధిని చూపించుచూ, ఆయన భూమి మీద ఉన్నప్పుడు చేసిన అవే కార్యములను చేయుచూ, నాశనమునకు ముందు ఆయన అబ్రాహాముకు చేసినట్లే, తనను తాను బయలుపరచుకొనుచున్నాడు. ఆయన తనను తాను సంఘమునకు బయలుపరచుకొనుచు, ఇప్పుడు కనికరముతో వచ్చియున్నాడు. అది హేళన చేయబడియుండెను మరియు ఎగతాళీ చేయబడియుండెను. తరువాతి సారి ఆయన తనను తాను బయలుపరచుకొనును, అదెప్పుడనగా లోకము మీద మరియు దేవుణ్ణి మరచిన దేశముల మీద మరియు వారియొక్క కృపా దినమును దాటి పాపము చేసిన వారి మీద న్యాయతీర్పు జరుగునప్పుడు. ఎందుకనగా వారు దేవుని మరచిపోయిరి. మరియు వారు అచ్చట ప్రభువు దూతను ఎగతాళిచేసి పరిహాసమాడినట్లే అదే కార్యమును చేయుచున్నారు. అయితే ఇప్పుడాయన ఇచ్చట కనికరముతో ఉన్నాడు.
25
ఆయన దేశములపై న్యాయతీర్పుతో వచ్చును, మరియు ఆయన కనికరములో ప్రత్యక్షపరచబడుచుండగా, ఓ, ఇక్కడికి త్వరపడుము! పిల్లలారా, త్వరగా పరుగెత్తుడి; చల్లబడిన నామకార్ధపు మరియు ఈ మానవ-కల్పిత బబులోను యొక్క వేదపాండిత్యమనే అవిశ్వాసపు గోడల నుండి తొలగిపోవుడి. మానవ-కల్పిత వేదపాండిత్యము నుండి పారిపోవుడి. దేవుని కృపలను రంగము మీదకు వెళ్ళుడి. మరియు అచ్చట కనికరము కొరకు కేకలు వేయుడి; ఏలయనగా ఆయన స్వంత కుమారుని యొక్క తన రక్తమే మనకు కనికరము అనుగ్రహించును. ఈ పాత సందేహపు లోకము నుండి తొలగిపోవుడి. మీ మూడనమ్మకాల నుండి తొలగిపోవుడి. దేవుని యొక్క కృపా వర్తమానమును మరియు ఆయన యొక్క విమోచన వర్తమానమును స్వీకరించుడి, మరియు ఆయన కృప యొద్దకు పారిపోవుడి, మరియు అచ్చట ఇట్లు కేకలు వేయుడి, “ఓ, దేవుని కుమారుడవైన యేసు, నాయందు కనికరపడుము.”
ఏలయనగా అవిశ్వాసపు లోకముతో పాటు ఈ మానవ-కల్పిత సిద్దాంతపు గోడలు ముక్కచెక్కలై మరియు నాశనమవ్వబోవుచున్నది. “ఏలయనగా విశ్వసించనివారు, అవిశ్వాసులతో కూడా నశించిరి. అవిశ్వాసపు లోకము అవిశ్వాసులతో పాటు నశించెను.” అయితే నీతిమంతుడైన లోతు బయటకు తీసుకొనిపోబడెను, మరియు నోవహు కూడా అట్లే తప్పించబడెను. మనము ప్రార్ధించుచుండగా, ఒక్క క్షణము దానిగూర్చి ఆలోచించుడి.
26
ఇప్పుడు, పురుషులారా మరియు స్త్రీలారా, మీరు నిలబడియున్న అవిశ్వాసము యొక్క ప్రతీ అడ్డు గోడనుండియూ. “సరి, బహుషా అది మనసును చదువుటయై యుండవచ్చును,” అని చెప్పు హేతువాదులనుండియూ, బయటకు రావలెనని మహోన్నతుడైన దేవుని సేవకునిగాను మరియు మీ సహోదరునిగాను ఈ రాత్రి నేను మిమ్మును బ్రతిమాలుచున్నాను. అబ్రాహాము అట్లు ఆలోచించినయెడల ఏమగును? నేను ఒక మెథడిస్టునైయున్నాను. నేను ఒక కథోలిక్ నై యున్నాను. నేనొక పెంతెకోస్తువాడనై యున్నాను,“ అని చెప్పునట్టి ఆ పాత మానవ-కల్పిత అడ్డుగోడల నుండి బయటకు రండి. అవన్నియూ మానవ-కల్పిత సరిహద్దులైయున్నవి. గొప్ప భూకంపము సంభవించుటకు ముందు, వాటినుండి బయటకు వచ్చి దేవుని యొక్క కృపలోనికి మీరు వచ్చునట్లు మిమ్మును పిలుచు ఆత్మ యొక్క కుదుపును మీరు అనుభూతి చెందుటలేదా? ఆ చిన్న పక్షులు, అవి ఏదో ఒక అనుభూతిని పొందినవి, మరియు దానిని వెంబందించినవి. దేవుడు మీకు ఏదో ఒక కార్యమును చూపించుచున్నాడు. ఆయనను, అనగా ప్రభువైన యేసును వేంబండించుడి. మీ శిరములు వంచియుండగా....
పాపియైన స్నేహితుడా, ఈ రాత్రి మీరు క్రీస్తు వైపుకు మీ చేయి ఎత్తి, “దేవా, నా పట్ల కనికరము చూపుము. ఈ అంత్యకాలములో నేను ఈ స్థితిలో నిలబడదలుచుకొనుట లేదు,” అని చెప్పుదురని నేను ఆశ్చర్యపోవుచున్నాను. మీరు మీ చెయ్యి పైకెత్తి మరియు ఇట్లు చెప్పుదురా, “సహోదరుడా బ్రెన్హాం, నా కొరకు ప్రార్ధించుము. నిజముగా నేను జీవించుచున్న ఈ స్థితిలో, దేవుని యొక్క సముఖములో నేను మరణించగోరుటలేదు.” మీరు ఇక్కడ ఉన్నారా? కేవలం మీ చేయి పైకెత్తుడి.
అమ్మా, దేవుడు నిన్ను దీవించును. అందుకు ధైర్యము అవసరము. దేవుడు నిన్ను దీవించును, యువతి. అయ్యా, దేవుడు నిన్ను దీవించును. ఇచ్చటనున్న నిన్ను, అయ్యా. దేవుడు నిన్ను దీవించును. ఈ వైపునున్న స్త్రీ, దేవుడు నిన్ను దీవించును.
మీరు చెప్పవచ్చును, “సహోదరుడా బ్రెన్హాం....” నా సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. ఆ వెనుకనున్న నిన్ను, అయ్యా, దేవుడు నిన్ను దీవించును.
27
ఓ , ప్రభువు ఆశీర్వదింపబడును గాక. ఆయన కండ్లు తెరచుచున్నాడు. ఆయన దానిని చేసినందుకై మీరు సంతోషించుట లేదా? ఏలయనగా గుర్తుంచుకొనుడి, “నా తండ్రి పిలువనిదే ఎవడును తన చేయి పైకెత్తలేడు. మరియు ఆయన ఎందరినైతే ముందుగా నిర్ణయించెనో వారిని ఆయన పిలిచెను. ఆయన ఎందరినైతే పిలిచెనో, వారిని ఆయన నీతిమంతులుగా తీర్చెను. ఆయన ఎందరినైతే నీతిమంతులుగా తీర్చెనో, వారిని ఆయన మహిమపరచెను.” ఈ భూమ్యాకర్షణ శక్తికన్నా బలమైనది ఏదైనా మీ లోపల లేకుండా, మీరు మీ చేయి పైకెత్తలేరు. సహజముగా గురుత్వాకర్షణ శక్తి మీ చేతులను క్రిందకు లాగును; అది శాస్త్రీయమైనది. అయితే మీరు తప్పిదస్తులై యున్నారనియు, మరియు మీరు యేసును కోరుకొనుచున్నారనియు మీకు చెప్పు ఒక ఆత్మ మీలోపల ఉన్నది; అప్పుడు మీరు ఆ నియమములను ధిక్కరించి భూమ్యాకాశముల యొక్క సృష్టికర్త వైపునకు మీ చేయి ఎత్తియున్నారు. ఆయన సన్నిధి ఇచ్చట ఉండియుండగా చేయి పైకెత్తని పాపియైన స్నేహితుడా, పదిహేను లేదా ఇరువదిమంది ఇదివరకే తమ చేతులు పైకెత్తియున్నారు, నీవు నీ చేతులు పైకెత్తవా? చిన్నవాడా, దేవుడు నిన్ను దీవించును. ఆ వసారాలో ఉన్నవారు?
“సరి, సహోదరుడా బ్రెన్హాం, నా ప్రక్కన ఎవరో కూర్చునియున్నారు, ” అని నీవు తలంచుదువు.
అయితే, ఓ, మై, అవును, నీ ప్రక్కన ఎవరో కూర్చునియున్నారు. అది ప్రభువు యొక్క దూతయైయున్నాడు. అది బోధింపబడి మరియు రుజువు చేయబడినప్పటికి సువార్తను ధిక్కరించి మరియు బయటికి నడిచి వెళ్ళుట కంటే, ఎక్కువగా నీవు నీ ప్రక్కన కూర్చున్నవారికి లేదా నీ సామాజిక స్థితికి భయపడుదువా? మిమ్ములను సంఘములో చేరమని అడుగుటలేదు; నేను మిమ్మల్ని కృప కొరకు వేడుకొనమని అడుగుచున్నాను. దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు, “ఇక్కడికి రమ్ము, నీవు ఇక్కడికి వచ్చువరకు నేనేమి చేయలేను.”
28
మనము ప్రార్ధించుటకు ముందు ఇంకా ఎవరైనా వారి చేయి పైకెత్తుదరా? ఇక్కడున్న ఆ స్త్రీ, దేవుడు నిన్ను దీవించును. అక్కడున్న ఆమె, దేవుడు నిన్ను దీవించును. అమ్మా, దేవుడు నిన్ను దీవించును. అక్కడున్న అయ్యా, దేవుడు నిన్ను దీవించును. కేవలం కొద్ది సేపు వేచియుండుడి. ఇక్కడున్న స్త్రీ, దేవుడు నిన్ను దీవించును. అయ్యా, దేవుడు నిన్ను దీవించును. అక్కడున్న యౌవనస్తుడా, దేవుడు నిన్ను దీవించును. ఇక్కడ కూర్చునియున్న సహోదరీ, దేవుడు నిన్ను దీవించును. ఇక్కడ కూర్చునియున్న సహోదరీ, దేవుడు నిన్ను దీవించును. ఇక్కడ ముందు వరుసలో ఉన్న ఈ యౌవనస్తుడిని దేవుడు దీవించును గాక.
ఇప్పుడు ఇంకెవరైనా చేయి పైకెత్తనివారు, ఇట్లు చెప్పుడి, “ఓ, దేవా, నా పట్ల కనికరము చూపుము. నేనిప్పుడు గోడ మీద చేవ్రాతను చూచుచున్నాను. ఇక్కడ నా కూర్చీ వద్ద ఏదో కూర్చుని, నన్ను లాగుతూ ఇట్లు చెప్పుచున్నది, ఇదే నీ సమయము. నీవు క్రైస్తవుడవు కాకున్నను ఒక క్రైస్తవవుడవని చెప్పుకొనుచున్నావని నీకు తెలియును.”
“ఓ, నేను సిగ్గుపడుదును...” ఇప్పుడు సిగ్గుపడవద్దు. ఆయన వచ్చినప్పుడు నీ పరిస్థతి ఏమగును? ఇక సమయము లేదు. ఇప్పుడే రమ్ము.
ముగించుటకు ముందు ఇంకెవరైనా వారి చేయి పైకెత్తి, “ఓ, దేవా, నా యందు కనికరపడుము, నా తండ్రీ, కనికరము చూపుము,” అని చెప్పుదురా? యౌవనస్తుడా, దేవుడు నిన్ను దీవించును. “నేనిప్పుడు నిన్ను నా రక్షకునిగా అంగీకరించుదును. ఆ దినమున, ఎత్తబడుటలో నీవు నన్ను మహిమలోనికి కొనిపోవాలనని నేను కోరుచున్నాను. నేను వెళ్ళగోరుచున్నాను. ఏలయనగా, అది ఇక ఎంతో కాలము ఉండదని నేను ఎరిగియున్నాను; మేము అంత్యకాలములో ఉన్నాము.”
29
వెనక్కు జారినవారెవరైనా మీ చేతులెత్తి మరియు ఇట్లు చెప్పువారు ఉన్నారా, “దేవా, నా పట్ల కనికరము చూపుము. నాకు వీలయినంత త్వరగా, తిరిగి నేరుగా దేవుని రాజ్యము నొద్దకు నన్ను పరిగెత్తనిమ్ము. నేను చాలా కాలంగా ఈ పాత సరిహద్దులలో ఉండియున్నాను. ప్రభువా, నేను తిరిగి గృహమునకు రాగోరుచున్నాను. నేను ఇప్పుడే, నా దారిలో ఉండియున్నాను.” మీ చేయి పైకెత్తగలరా? దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. అది నిజము. ఆయన ప్రతీ హస్తమును చూచును.
ఇక్కడున్న మీలో ఎంతమంది ఎన్నడూ తిరిగి జన్మించకుండా, ఎన్నడూ పరిశుద్ధాత్మను పొందకుండా కేవలం ఇక్కడికి వచ్చి క్రీస్తుని ఒక రక్షకునిగా స్వీకరించిన వారున్నారు? ఆయన మీ రక్షకునిగా మీరు అంగీకరించినప్పటికినీ, పరిశుద్ధాత్మతో మీరు నింపబడకుండా ఎన్నడూ మీరు ఎత్తబడుటలోనికి వెళ్ళలేరు. అది లేఖనము. మీరు తిరిగి జన్మించనంత వరకు దేవుని రాజ్యమును మీరు చూడలేరు. మరియు దేవుడు మిమ్మును నూతన జన్మతో నింపవలెనని కోరుకొనే వారు, మీ చేతులు పైకెత్తి మరియు ఇట్లు చెప్పుటను చూడనీయుడి, “దేవా, నా యందు కనికరపడుము. నీ ఆత్మను నా పైకి పంపుము.” అది సరియే. అనేకమంది చేతులు... ఇప్పుడు, మనము ప్రార్ధించబోవుచున్నాము.
30
నిశ్శబ్దముగా మరియు గౌరవముగా, దేవా, ప్రభువు యొక్క ఆ ప్రాచీన వాక్యము యొక్క వైఖరి విమోచించబడిన దేవుని యొక్క సంఘమంతయూ ఇక ఎన్నడూ పాపము చేయకుండా రక్షింపబడునంత వరకు దాని శక్తిని ఎన్నడూ కోల్పోదు. ఆ పాటను కవి రాసినప్పుడు, తండ్రి అతడు ఏమి రాయుచున్నాడో అతనికి తెలిసినయెడల ఆశ్చర్యమే కదా? చివరి వ్యక్తి లోపలికి తీసుకురాబడినప్పుడు, ఇక వాక్యము ఎంత మాత్రము ప్రభావితం చేయదు, అది ఇక భూమియందంతటా పందుల ముందు ముత్యములు చల్లినట్లుండును. అయితే న్యాయతీర్పు యొక్క కెరటం క్రింద మన దేశము స్వారీ చేయుటను మనము చూచుచుండగా, మరియు అచ్చట దూరాన నదికి ఆవల కృప కొరకు కేకలు వేయుచూ నల్లని, పసుపుపచ్చని, చామన ఛాయచేతులను మేము చూచుచుండగా, మా గుండెలు మాలో తరుక్కుపోవుచున్నవి, మరియు నీ రాకడ ఆలస్యమైనచో, రానున్న శనివారము ఈ దృశ్యమును చూచువారైనా ప్రజలు, ఆ దర్శనమును గ్రహించుదురు గాక.
అతి పరిశుద్ధమైన దేవా, ఈ రాత్రి తమ చేతులను పైకెత్తిన వారి పట్ల నీ కనికరము కొరకై మేము నీకు కృతజ్ఞలు చెల్లించుచున్నాము. ప్రభువా, వారిలో పాపులైయున్న అనేకులు, తమ చేతులు పైకెత్తి మరియు ఇట్లు చెప్పిరి, “దేవా, ఒక పాపినైన నా యెడల కనికరము చూపుము.” నీవు నీ వాక్యములో చెప్పియున్నావు, “నా మాట విని, నన్ను పంపినవాని యందు విశ్వాసముంచువాడు, నిత్యజీవము గలవాడు; మరియు వాడు దుష్టులతో పాటు తీర్పు తీర్చబడక, తీర్పులోనికి రాక, మరణము నుండి నిత్యజీవములోనికి దాటియున్నాడు.” ప్రభువా, వారి నిమిత్తమై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ఇప్పుడు వారు నీవారైయున్నారు.
31
సువార్త అను వల వేయబడియున్నది. అది దేనిని పట్టుకొన్నదో నేనెరుగను. అది తాబేళ్ళను పట్టుకొనియుండవచ్చును; అది బహుషా పాములను పట్టుకొనియుండవచ్చును; అది బల్లులను పట్టుకొనియుండవచ్చును; అయితే నిశ్చయంగా, అది కొన్ని చేపలను కూడా పట్టుకొనియుండెను. ప్రజల యొక్క హృదయములను నీవు ఎరిగియున్నావు. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ ఒక చేపయైయుండి, యజమానుని బల్లవద్ద వాడబడుదురని నేను నమ్మగోరుచున్నాను. ప్రభువా, దీనిని అనుగ్రహించండి.
కొనిపోబడుటకు సిద్దబడునట్లుగా, సంఘమును త్వరగా పరిశుద్ధాత్మతో నింపుము. ప్రభువా, సంఘశాఖల సిద్ధాంతములన్నిటి నుండి వారిప్పుడే తప్పించుకొని - సురక్షితమైన ఓడయైయున్న ప్రభువైన యేసుయొక్క రొమ్మునొద్దకు చేరుదురు గాక. తద్వారా భూమి మీద ఉన్నవారు ఆకాశము నుండి ప్రత్యక్షపరచబడిన అగ్నిచేత పరీక్షించబడుదురు... ప్రభువా, అనుగ్రహించండి. నీకే స్తుతి చెల్లును గాక, ఆశీర్వాదకరమైన యేసు నామములో వారిని మేము నీకు అప్పగించుచున్నాము. ఆమేన్.
32
ఒక్క నిమిషము ఆ సంగీతమును అలాగే కొనసాగనీయుడి. ఓ, దానిని నేనెంతగానో ప్రేమించుదును, మీకు తెలియును, నేనిక ఎంతమాత్రము పిల్లవాన్ని కాదు. ఒకానొక ఈ దినాల్లో ఆ బైబిలును నేను చివరిసారిగా తెరవబోవుచున్నాను. అది జరిగినప్పుడు నేను ఆ వేదిక మీద నిలబడియుంటానని నేను ఆశిస్తున్నాను. నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన వాస్తవమైయున్నాడని నేను ఎరుగుదును. దీనమైన తప్పిపోయిన బలహీనమైన నా సహోదర, సహోదరీలను ఆయన యొక్క కృప మరియు కనికరమునొద్దకు పిలుచుటకు నేనెంతగానో ఇష్టపడుచున్నాను.
ఆ పాత పాటలు నన్ను పులకరింపజేయును. అవి ప్రభావితము చేయును. యేసు భూమి మీద ఉన్నప్పుడు, ఆయన వాటిని పేర్కొన్నాడు. ఆయన అన్నాడు, “కీర్తనలలో దానిగూర్చి వ్రాయబడలేదా, అవి పాటలైయున్నవి.
ఓ దేవుని గొర్రెపిల్లా, నేను వచ్చుచున్నాను! నేను వచ్చుచున్నాను!
దానిని మనమందరము ఒకసారి పాడెదము.
కేవలము (నిజముగా మీరు అదే భావమును కలిగియున్నచో
మీరు మీ చేయి పైకెత్తుదురా?) ఒక్క విన్నపము,
అయితే నా కొరకు నీ రక్తము కార్చితివి,
మరియు నీ వద్దకు రమ్మని నన్ను పిలిచితివి,
ఓ దేవుని గొర్రెపిల్లా, నేను వచ్చుచున్నాను! నేను వచ్చుచున్నాను!
ఇప్పుడు దీనిని పాడుచుండగా, దీనిని మీ మనసులోనికి తీసుకొనుడి. ఒకానొక ఈ దినాల్లో మనము నిలబడియుండెదము, మరియు మీరు మార్పునొందెదరు. ఈ మర్యమైన, పాపభరితమైన శరీరములు ఒక వృద్ద మనుష్యుని నుండి తిరిగి ఒక యౌవనస్తునిగా మారిపోవును. ఆయనను కలుసుకొనుటకు, మరియు ఆయనతో నుండుటకు మరియు సదా ఆయనతో సహవాసము చేయుటకు మనము ఆకాశములోనికి పోయెదము.
నేను వాగ్దానము చేసితిని గనుక నేను నమ్ముచున్నాను,
ఓ దేవుని గొర్రెపిల్ల, నేను వచ్చుచున్నాను! నేను వచ్చుచున్నాను!
33
ఓ, ఆ దినమున అది అద్భుతముగా ఉండదా? మనుష్యకుమారుడు తన సంఘములో తనను తాను ప్రత్యక్షపరచుకొనుటను చూచుటకు మీరు సజీవులుగా ఉన్నందుకు ఈనాడు మీరు సంతోషించుటలేదా? “మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున...” ఆయన ఏమి చేయును? మొదటిగా కృపలో తనను తాను బయలుపరచుకొనును. పిదప ఎవరైతే కృపను నిరాకరించారో, వారికి శిక్ష విధించుటకు ఆయన తనను తాను న్యాయతీర్పులో ప్రత్యక్షపరచుకొనును. ఇదే అనుకూల సమయము.
ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నది ఏమిటి? కృపచేత, నీ ఆత్మను రక్షించుచూ, ఆయన జీవమును నీకనుగ్రహించుచూ, దుఃఖమునకు బదులు నీకు సంతోషమును అనుగ్రహించుచూ, భయమునకు బదులు విశ్వాసమును, వ్యాధికి బదులు స్వస్థతను అనుగ్రహించుచూ, అక్కడ ఇదివరకు చేసినట్లే తనను తాను ఆయన యొక్క కృపలో నీకు ప్రత్యక్షపరచుకొనుచున్నాడు. మరియు ఆయన దానిని ఇప్పుడు చేయుచున్నాడంటే, ఎత్తబడుట మరియు న్యాయతీర్పు ఎంత దూరములో ఉన్నవి? నేను దేనిగూర్చి మాటలాడుచున్నానో, ఎంతమంది గ్రహించుచున్నారు? చేవ్రాత, ప్రభువైన యేసును ప్రత్యక్షపరచుట.
34
కేవలము ఆలోచించండి, ఆయన భూమి మీద ఉన్నప్పటి నుండి అది చేయబడుట ఇదే మొదటిసారి. ఇక్కడ భూమి మీద ఆయన తనను తాను యూదులకు ప్రత్యక్షపరచుకున్నప్పుడు, ఆయన దానిని ఎట్లు చేసెను? ఫిలిప్పు వెళ్ళి మరియు నతానియేలును ఒక చెట్టు క్రింద కనుగొనెను. ఆయన యేసు వద్దకు వచ్చినప్పుడు, అతనెవరన్నది, మరియు అతను అక్కడికి వచ్చుటకు ముందు ఎక్కడున్నాడన్నది, అతనితో యేసు చెప్పెను. మరియు అది అతనిలో నుండి ఒక విశ్వాసిని కలుగజేసెను. ఆయన తనను తాను బయలుపరచుకొనుచుండెను. అది నిజమేనా? క్రీ.శ. 96లో టైటస్ యెరూషలేమును ఆక్రమించినప్పటి నుండి నాశనము మొదలయ్యెను.
యూదులు ఏమి చెప్పిరి? “ఆయన ఒక దయ్యము పట్టినవాడు.”
ఆయన ఏమి చెప్పెను? “నేను, నా దినములో, ఇప్పుడు నన్ను నేను బయలుపరచుకొన్నప్పుడు, దానికి నేను మిమ్ముల్ని క్షమించుదును. అయితే ఆ విధంగానే పరిశుద్ధాత్మ ప్రత్యక్షపరచుకొను దినమున, దానికి వ్యతిరేకముగా ఒక మాటయైనా, ఈ యుగమందైనను, రాబోవు యుగమందైనను క్షమించబడదు.”
35
ఆయన తనను తాను సమరయులకు బయలుపరచుకొన్నప్పుడు, ఆ బావినొద్దనున్న స్త్రీకి, ఆమెలో ఉన్న లోపమును ఆమెతో చెప్పి, ఆయన దానిని ఎట్లు బయలుపరచెను? ఆమె ఇట్లన్నది, “అయ్యా! నీవొక ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మెస్సీయా వచ్చినప్పుడు, ఆయన ఈ సంగతులను చేయునని మాకు తెలియును.”
ఆయన చెప్పెను, “నీతో మాటలాడుచున్న నేనే ఆయనను.”
మరియు ఆమె త్వరగా ఆ ఊరిలోనికి పరిగెత్తుకునిపోయి మరియు ఇట్లన్నది, “మీరు వచ్చి, నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. ఈయన మెస్సీయా కాడా? అది అబ్రాహాముకు తనను తాను ప్రత్యక్షపరచుకున్నవానిలో నున్న అదే దేవుడు, అదే దూత, అదే ఆత్మ, అదే విధానము, అదే పద్ధతి, అదే వర్తమానము.
మరియు మనుష్యకుమారుని రాకడలో అట్లే జరుగునని యేసు స్వయంగా చెప్పెను. అది అదే విధంగా ప్రత్యక్షపరచబడును.
36
ఇంకా ఏమి చెప్పాలో నాకు తెలియదు. ప్రభువే స్వయంగా కనికరము చేత తన పిల్లలకు బయలుపరచుకొనును గాక, అదియే నా ప్రార్ధన.
ప్రభువైన యెహోవా, ఇప్పుడు, ప్రభువా, ఈ ప్రజలతో నేను నా హృదయపూర్వకముగా మాటలాడియున్నాను. ఎట్లనగా, నా మాటల దగ్గరకు నీవు వచ్చినప్పుడు, ఆ ఘడియలో నేను లెక్కచెప్పవలసియున్నదని నేను గ్రహించియున్నాను. నా మాటలు నన్ను పైకెత్తవచ్చును, లేదా అవి నన్ను ఖండించవచ్చును. మరియు నేను మాటలాడినది నా మాటలు కావు; నేను మాటలాడినది నీ మాటలేమైయున్నవి. కావున అందుచేత, ప్రభువా, ఒక దినమున నీవు నాకై సమాధానముతో వచ్చుదువని నేను విశ్వాసముతో నీ కొరకు చూచుచున్నాను.
ఈ మానవజాతి యొక్క ఆదాము సంతతియైన నా సహోదరులను మరియు నా సహోదరీలను నేను ప్రేమించుచున్నాను. సువార్త ప్రకటించబడి మరియు అది త్రోసివేయబడినప్పుడు, సరిగ్గా నీవు చెప్పినట్లే ఇది అంత్యకాలమైయున్నదని నేను గ్రహించుచున్నాను. మరియు ఇప్పుడు, ఈ చివరి ఘడియలో, నీవు అదే దూతను అదే కార్యములు చేయుటకు పంపియున్నావు. మానవులు తాము స్వంతంగా కల్పించుకున్న వేదపాండిత్యము చేత బోధింపబడినవారైయుండిరి గనుక దానిని ఎగతాళి చేయుచూ, పరిహసించుచుండిరి. ప్రభువా, వారు ఆ ఇతర దినములలోను అదే కార్యమును చేసిరి. ఈ చిన్న గుంపు ఈ రాత్రి దానిని చూచుటలో విఫలమవ్వకుందురు గాక. మరియు ఆ దినమున కయీను యొక్క ప్రజలు సైతము ఎటువంటి సాకు చెప్పకుండునట్లు, ఒక శాస్త్రీయమైన రుజువుగా ఉండుటకు ఆయన పటము కూడా తీయబడియున్నది.
37
ప్రభువా, ఈ అన్యుల కాలము యొక్క ముగింపులో నిన్నా, నేడు, మరియు నిరంతరం ఒక్కటే రీతిగానున్న ఆయన వచ్చి మరియు ఆదరించి మరియు ఆకాశము నుండి దేవుని కుమారునిగా తననుతాను ప్రత్యక్షపరచుకొనునట్లు అనుగ్రహించండి. నీ మహిమార్ధమై ఈ కార్యములు చేయబడుటకు అనుమతించుచూ, గత కొద్ది సంవత్సరములుగా మీరు మాతో ఉండినట్లే, “నేను చేయు క్రియలు, మీరును చేయుదురు; వాటికంటే మరి గొప్పవియు చేయుదురు, ఏలయనగా నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతోను, మీలోను ఉందును,” అని చెప్పబడిన ప్రభువు యొక్క మాటలు ప్రత్యక్షపరచబడునట్లు, మరలా ఈ రాత్రి నీ సువార్త నిమిత్తము దానిని జరగనివ్వండి. ప్రభువా, మీకు వందనములు, ప్రభువైన యేసు అను నీ ప్రియ కుమారుని నామములో మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఆమేన్.
ఒకవేళ బిల్లీ ఏమైనా ప్రార్ధనా కార్డులు ఇచ్చినయెడల, ప్రార్ధన కొరకు కొంతమందిని మేము పిలువబోవుచున్నాము. ఈ రాత్రికై అతడు కార్డులు ఇచ్చాడా? మంచిది. అదేమిటి? “బి.” అది సరియే. గత రాత్రి మనము ఎచ్చటినుండి పిలిచియున్నాము? అది... ఓ, నిజమే, గడిచిన సాయంకాలము మనము ఎటువంటి ప్రార్ధనా కార్డులను ఇవ్వలేదు. మనము నేరుగా జనసమూహములో నుండి పిలిచియున్నాము. పరిశుద్ధాత్మ అనుమతించినయెడల, మరలా ఈ రాత్రి మనము దానినే చేయుదుము, లేనిచో నేను ఒక ప్రార్ధనా వరుసను పిలుచుదును. ఎక్కువగా ప్రార్ధనా కార్డులను ఇచ్చుటను నేను కోరుటలేదు, ఎందుకనగా బహుషా సహోదరుడు ఆస్బర్న్ మరియు నేను ఎలాగైనా ప్రతీ ఒక్కరినీ వరుసలో నుండి తీసుకురావలసి యుండును.
38
కావున ఈ రాత్రి మనము “బి” కార్డులలో నుండి ఎక్కడినుండైనా పిలుచుదుము. మనము 50 నుండి మరియు 1 నుండి, మరియు 85 నుండి పిలిచామని నేను నమ్ముచున్నాను. నాకున్న జ్ఞాపకశక్తి మేరకు అది సరియేనని నేను తలంచుచున్నాను. ఈ రాత్రి మనము 25 నుండి పిలిచెదము. అది మరొక కొత్త సంఖ్య.
మేమెందుకొరకు ప్రార్ధనా కార్డులను ఇచ్చుచున్నామని మీరు ఆశ్చర్యపోవచ్చును, మీరు ఒకవేళ కొత్తవారైనచో మీకు తెలియజేసెదను. ఇక్కడున్న మీలో ఎంతమంది వ్యాధిగ్రస్తులైయుండి, ప్రభువు మిమ్మల్ని స్వస్థపరచవలెనని కోరుచున్నారు, అట్లు ఈ భవనములో ఎవరైనా ఉంటే - మీ చేతులు పైకెత్తగలరా? ఇప్పుడు ముందుగా ఎవరు రానున్నారు. చూడండి, పరిశుద్ధాత్మ మన మధ్యలో కదిలింపబడుటకు మనము ప్రార్ధనా కార్డులను ఇవ్వవలసియున్నది. పిదప ఆయన నేరుగా కూటములోనికి వచ్చి, మరియు రోగులను స్వస్థపరచును.
యేసుక్రీస్తు, నిన్నా, నేడు, మరియు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడని ఎంతమంది స్థిరముగా ఒప్పుకొనియున్నారు, ఆయన తనను తాను అదేవిధంగా బయలుపరచుకొనునని వాగ్దానము చేసియున్నాడని ఎంతమంది స్థిరముగా ఒప్పుకొనుచున్నారు? ఆయన మూల ఉపదేశములోను, శక్తిలోను, ఆత్మలోను, క్రియలోను ఒకే రీతిగానున్నాడు. ఒకే ఒక్క కార్యమేదనగా, ఆయన ఒక భౌతిక దేహమును కలిగిలేడు. కావున ఆయన ఏమి చెప్పెను? “నేను ద్రాక్షావల్లిని; మీరు తీగెలు.” ద్రాక్షావల్లి ఫలమును ఫలించదు. అది తీగలను శుద్దిచేయగా, మరి అవి ఫలమును ఫలించును. అది సరియే.
39
ఒక పదము నాకు వస్తూ ఉంటుంది, నేను వివరించెదను: ఆ దూత ఎవరని ఆశ్చర్యపోవుచున్న కొందరు ఇప్పుడు ఇక్కడ ఉండియున్నారు. మరియు నేను ఈ దూతను, “ప్రభువు,” అని సంభోదించాను. అబ్రాహాము... దాని విషయమై సందేహించుచున్నది.... లేదా, దాని గూర్చి ఆలోచించుచున్నది ఎవరనగా, ఆయన ఒక పండితుడు.
తనతో మాట్లాడిన ఆ దూతను, అబ్రాహాము, “ప్రభువు,” అన్న పేరుతో పిలిచాడు, అనగా ఎలోహిం అనబడు గొప్ప సర్వశక్తుడైన యెహోవాయే. ఆయన ఒక మానవ శరీరములో ప్రత్యక్షపరచుకున్నాడు. మరియు ఆయన తన స్వంత కుమారుడైన యేసు యొక్క శరీరములో ఆయన ప్రత్యక్షపరచుకొనుచున్నాడు. మరియు ఈ రాత్రి తనకు తానుగా ఆయనపై ఆనుకున్న ప్రతీ విశ్వాసి యొక్క శరీరములో ఆయన ప్రత్యక్షపరచుకొనుచున్నాడు. “నేను మీతోను, మీలోను యుగసమాప్తి వరకు ఉందును.” అది సరియే.
నేను ఇక్కడ... 25. ప్రార్ధన కార్డు 25ను కలిగియున్నవారెవరో, మీ చేయి పైకెత్తండి. [టేపుపై ఖాళీ ఉన్నది.]
40
ఇక్కడే దేవుని యొక్క వాక్యము సత్యమందు ప్రత్యక్షపరచబడలసియున్నది, లేనిచో అది తప్పిపోవునటు అగుపించును, ఎట్లనగా యేసుక్రీస్తు వాగ్దానము చేసియున్నాడు. దాని గూర్చి మీకు బాగుగా తెలియును. మరియు మనము అంత్యకాలములో ఉన్నాము అనునది ఎంత వాస్తవమో - అంతే వాస్తవముగా క్రీస్తు ఇచ్చట ఉండి తనను తాను బయలుపరుచుకొనుచున్నాడు, “దానిని విద్యావంతులకు, జ్ఞానులకు, మరియు వృద్దులకు మరుగుచేసి, మరియు నేర్చుకొనునట్టి పసిపిల్లలకు దానిని బయలుపరచుచున్నాడు.” ఆయన యొక్క బయలుపాటును చూపించుచూ, సంఘమును తీసుకువచ్చుచున్నాడు, న్యాయతీర్పు వెల్లడియగుటకు ముందే తనను తాను ప్రత్యక్షపరచుకొనుచున్నాడు, ఎందుకనగా ఆయన ఎల్లప్పుడూ ఒక సంహార దూతను పంపుటకుముందు ఒక కనికరించు దూతను పంపించును. బైబిలు చదవండి, చరిత్రను చదవండి మరియు అది వాస్తవమో - కాదో చూడండి.
నీవు ఎలా ఉన్నావు? ప్రార్ధన చేయవలసినది ఈ వ్యక్తికేనా? ఇక్కడొక స్త్రీ నిలబడియున్నది, ఒక నల్లజాతి స్త్రీ. నాకు తెలిసినంతవరకు, నా జీవితములో ఆ స్త్రీని నేనెన్నడూ చూచియుండలేదు. మరియు నిశ్చయంగా నేను ఆమెను ఎరుగను. మనము ఒకరికొకరము అపరిచితులమే కదా? అవునా, మేడమ్? అట్లయినచో, మనము అపరిచితులమని ప్రజలు చూచునట్లు కేవలం నీ చేయి పైకెత్తగలవు.
41
ఇప్పుడు, ఇది యోహాను సువార్త 4వ అధ్యాయములో జరిగినదానిని వర్ణించునట్టి ఒక అందమైన చిత్రము: ఒక స్త్రీ, ఒక పురుషుడు, వారిరువురు వేర్వేరు జాతులవారైయున్నారు; అప్పుడు ఒక సమరయురాలు మరియు ఒక యూదుడు, ఇప్పుడు ఒక శ్వేతజాతి పురుషుడు మరియు ఒక తెల్లజాతి స్త్రీ బైబిలు దృశ్యమందు ఒక సమరయ స్త్రీ మరియు ఒక యూదుడైయున్నారు. అయితే అప్పుడు చెప్పినట్లే, ఆమె హృదయములో ఉన్నదానిని ఆ స్త్రీకి చెప్పుటవలన యేసు తనను తాను సమరయుల జాతికి బయలుపరచుకున్నయెడల... మరియు ఆమె చెప్పెను, “నీవొక ప్రవక్తవైయుండవచ్చు, అయితే అది మెస్సీయా యొక్క సూచనయైయున్నదని మేమెరిగియున్నాము.”
మరియు ఆయన ఇట్లనెను, “నేనే ఆయనను.” నిన్నటి దినమున ఆయన సమరయులకు తనను తెలియజేసుకున్న విధానము అదైయున్నయెడల, నేడు నల్లజాతి వారికిని ఆయన దానిని అదేవిధంగా తెలియజేసుకొనవలసియున్నది. ఆయన తనను తాను బయలుపరచుకొనుచున్నాడు. ఆయన గనుక... మరియు ఇక్కడ నా చేతులెత్తియున్నాను, నా జీవితములో నేనెన్నడూ ఈ స్త్రీని చూచియుండలేదు. ఆమె కూడా తన చెయ్యి పైకెత్తియున్నది, ఆమె... నేను ఆమెను ఎరుగను, ఆమె గూర్చి ఏమియూ ఎరుగను, ఆమెను ఎన్నడూ చూచియుండలేదు, అంతే కాదు ఆమె గూర్చి నాకేమియు తెలియదు.
42
అయితే, పరిశుద్ధాత్మ గనుక అదే శక్తితో యేసుక్రీస్తుని బయలుపరచినయెడల, ఎంతమంది ఆయనను మెస్సీయగా అంగీకరించి మరియు విశ్వసించుదురు? జనులైన మీరందరూ దానిని చేయవలెను. ప్రజలుగా, నిత్వత్వమునకు బద్దులమైన ప్రజలుగా, మన మధ్యనున్న పరిశుద్ధ గ్రంథము సాక్షిగా, నాకు తెలిసి సరిగ్గా ఇప్పటివరకు ఈ స్త్రీని నా జీవితములో నేనెన్నడూ చూసియుండలేదు.
అది అక్కడే ఉన్నది. ఇప్పుడది ఏమైయున్నది? అది... మీరు చెప్పుదురు... సరి, అది జరిగినచో, అది సహజాతీతమైనదై యుండవలెను; దానిని మనందరము ఎరిగియున్నాము. మరియు ఎల్లప్పుడూ అంత్యకాలమునకు ముందు సహజాతీతమైన విధానములోనే దేవుడు తనను తాను బయలుపరచుకొనును. బబులోను సామ్రాజ్యము నాశనమగుటకు ముందు, నోవాహు ఓడలోనికి వెళ్ళుటకు ముందు, మోషే ఇశ్రాయేలు వారిని బయటకు తీసుకువచ్చుటకు ముందు, సొదొమ మరియు గొమొర్రాలు నాశనమగుటకు ముందు, యెరుషలేము నాశనము చేయబడుటకు ముందు... ఎల్లప్పుడూ, సహజాతీతముగా, మరియు అదే కార్యము ఈనాడు చేయబడునని వాగ్దానము చేసియున్నాడు.
43
వారాదినమున చెప్పినట్లే, ఇప్పుడు, నీవు చెప్పగలవు, “ఓ, అది బయెల్జెబూబు, ఒక సోదె చెప్పువాడు. అది ఒక...” అయితే సోదె చెప్పటమంటే ఏమిటో ఎవరికైనా తెలిసినయెడల, ఆ సోదె చెప్పుట అనునది అపవాది యొక్క అబద్దమని వారికి తెలియును, మరియు అది కొంతైనా వాస్తవము కాదు, మరియు సోదె చెప్పువారు సువార్తను ప్రకటించి మరియు ప్రజలను రక్షింపజాలరు. మీరు ఒక్కరి గూర్చియైనా విన్నారా? లేదు. మీరెన్నడూ వినలేరు. వారు అపవాది చేత నింపబడి ఒక వంకర చేయబడ్డ ఆత్మను కలిగిన ప్రజలైయున్నారు. అది ఖచ్చితముగా సరియే.
ప్రభువు యొక్క దూత నీతిని, మరియు పశ్చాత్తాపమును, మరియు ప్రభువు యొక్క రాకడను గూర్చి బోధించుచు మరియు సూచనలను చూపించును. వాస్తవానికి అపవాది ఒక సోదె చెప్పువాడిని లేదా ఒక జ్యోతిష్యుడిని అనుకరణ చేయుటకు తీసుకొనును, అయితే అనుకరణ కేవలం ఒక వాస్తవమైనది ఉన్నదని తెలియజేయుచున్నది. ఒక నిజమైన డాలరు ఉన్నదని ఒక నకిలీ డాలరు తెలియజేస్తుంది.
44
కావున, స్త్రీ, ఏదేమైనా, నేను చెప్పునదేమనగా, నేను యాభై జీవితకాలములలో చెప్పేదానికంటే దేవుని యొద్ద నుండి వచ్చు ఒక్క మాట ఎంతో అర్ధవంతమైయున్నది. అయితే నీవే న్యాయమూర్తిగా వ్యవహరించుము. దేనికొరకు నీవిచ్చట ఉన్నావో, నాకు తెలియదు. నీవిచ్చట దేనికొరకు ఉన్నావో తెలుసుకొనుటకు నాకు ఎలాంటి మార్గము లేదని నీవెరుగుదువు. అయితే ఆయన తన కుమారుడైన, ప్రభువైన యేసు ద్వారా బావినొద్దనున్న ఆ స్త్రీకి చేసినట్లే, ఆయన నాకు బయలుపరచినయెడల, అప్పుడది దేవునియొద్ద నుండి వచ్చునని నీవు విశ్వసించుదువా?
ఇప్పుడు, నేను ఇట్లు చెప్పినచో, “నీకు ఆరోగ్యం బాగోలేదా?”
నీవు చెప్పుదువు, “అవునయ్యా, నాకు ఆరోగ్యం బాగోలేదు.”
నేను చెప్పుదును, “మంచిది, ప్రభువు నిన్ను స్వస్థపరచనైయున్నాడు.” అప్పుడు దానిని నీవు సందేహించే హక్కు నీకున్నది.
45
ఆయన ఆ బావినొద్ద నున్న స్త్రీతో, “మంచిది, అమ్మా, నీవొక అన్యురాలివైయున్నావు; నీవొక సమరయురాలివి; నీవు రక్షించబడవు,” అని చెప్పినయెడల, ఆమె సందేహించే హక్కును కలిగియుండేది. అయితే ఆయన ఆమె హృదయమందున్న రహస్యమును గూర్చి చెప్పియుండెను. అందునుబట్టియే, అది ఒక ఆత్మ సంబంధమైన శక్తినుండి రావలసియున్నదని ఆమె ఎరిగియున్నది. అబ్రాహాము మరియు ఆ మిగతా కాలములలో ఉండినట్లే, మెస్సీయా వచ్చినప్పుడు అదే విధంగా జరుగునని ఆమెకు బోధింపబడియుండెను. మరియు ఆమె తగినంత ఆత్మ సంబంధియైయున్నది, ఒక వ్యభిచారియై యున్నప్పటికినీ, ఆమె నిశ్చయంగా దానిని గ్రహించుటకు సరిపడా ఆత్మ సంబంధియైయున్నది.
నీవెవరన్నది లేదా నిన్ను గూర్చి నేనేమియు ఎరుగను, అయితే ఆయన ఎరిగియున్నాడు. అయితే ఆయన దానిని నాకు బయలుపరచినయెడల, కూటములోనున్న జనులు మరియు నీవు కూడా నమ్ముదుమని వాగ్దానము చేసియున్నారు.
46
దీనిని ఇప్పుడే వివరించుటకు నేను కొంత పదజాలమును కలిగియుంటే బాగుండునని నేను కోరుచున్నాను. దానిని చేయునది ఏదియు లేదు. అది ఎట్లు అనిపించునో మీకు తెలియునా? ఇక్కడున్న ప్రతీయొక్కరు నా స్వాధీనములో ఉన్నారు. అది వాస్తవము. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ఇచ్చట ఉన్నది. అది నన్ను ఎగిరి గంతులేసి కేకలు వేయునట్లు చేయుటలేదు; అవి ప్రభువు యొక్క ఆశీర్వాదములైయున్నవి.
అనేక సార్లు పెంతెకోస్తువారైన మీరు దానిచేత మోసపోవుచున్నారు. ఏ మనుష్యుని కంటెను గొప్ప అభిషేకమును యేసు కలిగియున్నాడు. మరియు సరిగ్గా నేనిప్పుడు చదివినట్లే, ఆయన ఒక లేఖనమును చదివాడు. మరియు ఆయన ఇట్లు చెప్పెను, “ఈ దినమున ఈ లేఖనము మీ కన్నులయెదుట నెరవేరినది.” మరియు ఆయన ఏమి చేసెను? ఆయన లేఖనమును చదివి, ఆ చోటునుండి పరుగెత్తలేదు. ఆయన కూర్చున్నాడు, మరియు ఆయన నోటినుండి ప్రశస్తమైన మాటలు వచ్చియున్నవి, అది ఏనాడు అభిషేకించబడని గొప్ప అభిషేకమైయున్నది; ఎందుకనగా లేఖనము ఇట్లు చెప్పుచున్నది, “న్యాయతీర్పును చూపించుటకు, రోగులను స్వస్థపరచుటకు, మరియు మొదలగువాటిని చేయుట కొరకు నేను నా ఆత్మను అతనిపై ఉంచాను.” ఆయన దానిని చెప్పెను.
మీరక్కడ ఆనందించుచున్నది మీ రక్షణ యొక్క ఆశీర్వాదములనే గానీ ఆత్మ యొక్క శక్తిని కాదు.
47
అయితే ఆయన ఇప్పుడిచ్చట ఉన్నాడు. ఆమె దాచిపెట్టాలనుకొనినా గానీ ఇప్పుడా స్త్రీ, తన జీవితమును దాచి పెట్టలేదు. అది నిజము.
ఈ స్త్రీ తన ప్రక్క భాగమున ఒక సమస్యను కలిగియున్నది, దానిగూర్చి ఆమె ప్రార్ధనను కోరుచున్నది. అది “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” నీవు చర్మవ్యాధిని కూడా కలిగియున్నావు, దాని నిమిత్తము నేను ప్రార్ధించవలెనని నీవు కోరుచున్నావు. అది “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” అది సత్యము.
ఆమెనే న్యాయమూర్తిగా ఉండనీయుడి. నీవు నా స్వరమును వినుచున్నావా? అయితే అది నా స్వరము కాదు. నేను ఈ స్త్రీని ఎరుగను. ఆయన ఏదైతే మాటలాడియున్నాడో, అది నా స్వరమును వాడుకొను వేరే వ్యక్తియైయున్నాడు. అది పరిశుద్ధాత్మయని నీవు నమ్ముచున్నావా?
ఇప్పుడు, అచ్చటనున్నవారు, ఈ రాత్రి ఇచ్చటకు పిలువబడినవారైన మీరు, నమ్మికతో వెళ్ళండి. మీరు నమ్మకముతో ఇట్లు చెప్పుడి, “ప్రభువా, నాకు బయలుపరచుకొనుము. ప్రభువా, నన్ను నీ వస్త్రపు అంచును తాకనీయుము.” ఒత్తిడికి లోనవ్వకండి. కేవలం ఇట్లు చెప్పుడి, “ప్రభువా, నన్ను నీ వస్త్రపు అంచును తాకనీయుము. తిరిగి ఆయనను నాతో మాటలాడనీయుము.” ఏమి జరుగునో చూడండి.
48
నేను ఆ స్త్రీతో ఇంకా కొద్దిసేపు మాట్లాడినయెడల, ఇంకా ఎక్కువ చెప్పబడుతుంది. నల్లజాతి ప్రజలైన మీరు నేను ఇంకా కొద్దిసేపు ఈ స్త్రీతో మాటలాడుటను ఇష్టపడుదురా? మీరు సరే, అనినచో మీ చేతులు పైకెత్తుడి. ఆయన కోరుకొనునో లేదో నాకు తెలియదు, అయితే బహుషా ఆయన కోరుకొనవచ్చును. పరిశుద్ధాత్మ ఏమి చెప్పునో చూచుటకు, నేను ఇంకా కొంచెం సమయము నీతో మాటలాడవలెనని నీవు కోరుచున్నవా?
ఇప్పుడు, ఆయన చెప్పినదంతా తప్పైయుండవచ్చును, నాకిప్పుడు తెలియదు. నేను తెలుసుకొను ఒకే ఒక విధానమేదనగా, ఇక్కడ చేయబడుచున్న టేపు రికార్డింగుల వలన. మరియు ఆ టేపు రికార్డింగులు ఎల్లప్పుడూ ఆఫీసు వద్ద లేదా ఆ వెనుక ఉంటాయి. మీరు వాటిని పొందుకొనగలరు.
49
ఇప్పుడు, ప్రజలు ఇంకనూ నా స్వరమును వినగలిగినచో, ఆ స్త్రీ తన ప్రక్కభాగమునకు ఏదో చేయుచున్నది. ఆమె ప్రక్కభాగములో ఒక సమస్య ఉన్నది. అది నిజము. మరియు సరిగ్గా ఈ సమయములో ఆమె వేరెవరిగూర్చో ప్రార్ధించుచున్నది, అది ఆమె సహోదరి కొరకు. సరిగ్గా ఇప్పుడు నీ హృదయములో ఆమె కొరకే నీవు ప్రార్ధించుచున్నావు. మరియు నీ సహోదరి వ్యాధితో బాధపడుచున్నది. మరియు ఆమె కీళ్ళ నొప్పులను కలిగియున్నది; ఆమె గుండె జబ్బును కలిగియున్నది, మరియు ఆమె ఎక్కువగా దగ్గుతూ ఉంటుంది. అది ఉబ్బసము వ్యాధి.
పిదప ఒక మనిషి ప్రత్యక్షమగుటను నేను చూచుచున్నాను. అతనొక పురుషుడు... అతను నీ సహో... కాదు, అతను నీ బావయైయున్నాడు. అతను కూడా కీళ్ళ నొప్పులను మరియు గుండె జబ్బును కలిగియున్నాడు. అది “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” ఇప్పుడు నీవు నమ్ముదువా? నీవు నమ్ముచున్నవా? అది నీవు నమ్ముచున్న ప్రకారంగానే నీకు జరుగును. ప్రభువు నీతో ఉండును గాక, మరియు నా సహోదరీ, దేవుడు నిన్ను దీవించును.
50
నీవు నమ్మియున్నావా? ఇప్పుడు, చాలా భక్తి మర్యాదలతోనుండుడి. నీవెలా ఉన్నావు? నాకు తెలిసినంతవరకూ, యౌవనస్తురాలా, నేను నీ ఎదుట గానీ లేదా నీవు నా ఎదుటగానీ నిలబడుట ఇదే మొదటిసారి. అంతేనని నేను అనుకొనుచున్నాను. అంతేనా? అంతెయైనచో, నీవు నీ చేయి పైకెత్తగలవా? ఇప్పుడు, ఇక్కడొక తెల్లజాతి స్త్రీ, తెల్లజాతి పురుషుడు ఉన్నారు.
ఇప్పుడు, తెల్లజాతి ప్రజలైన మీరు, నా జీవితములో నేనెన్నడూ చూడనటువంటి ఇక్కడ నిలబడియున్న ఈ అమ్మాయికి ప్రభువైన యేసు తనను తాను బయలుపరచుకొన్నయెడల... మరియు ఆమె నన్ను ఎరుగదు, మరియు ఎక్కడైనా ఒక కూటములో తప్ప నన్ను ఎన్నడునూ చూసియుండలేదు. ఒకసారి ఒక కూటములో నీవున్నావు కాని, వేదిక మీద కాదు కదా? కేవలం ఇక్కడే. అది సరియే. ఆలాంటప్పుడు పూర్తిగా మనము ఒకరికొకరము అపరిచితులమైయున్నాము.
51
ఇప్పుడు, నీవిక్కడ దేనికొరకు ఉన్నావన్నది ఆయన తెలియజేసినయెడల, అప్పుడు అది అవునో - కాదో అన్నదానికి నీవే న్యాయమూర్తివై యుండగలవు; నీకే తెలియును. ఏదో జరుగుచున్నదని నీవు ఎరిగియున్నావు, అది నీవు మునుపెన్నడూ పొందనటువంటి, ఒక నిజమగు, దీనమైన మధురానుభూతి. నీకునూ మరియు నాకునూ మధ్య నిలబడియున్న ఆ వెలుగు ప్రభువు యొక్క దూతయైయున్నాడు. మరియు నేను ఆ యౌవనస్తురాలిని చూచుచున్నాను; ఆమె తన గుండెను పట్టుకొనియున్నది. ఆమెకు గుండె జబ్బు ఉన్నది. మరియు ఆమె ఒక విధమైన శ్వాస ఆగునంత తీవ్రముగా బాధపడుచుండెను. ఆమెకు ఊపిరాడకుండెను. అది “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” అది నిజము.
నీవు ఇంతక్రితమే వేరెవరితోనో మాటలాడుచున్నట్లు నేను చూచియున్నాను; ఆమె దేనిగూర్చియో నిజంగా సంతోషించుచున్న నీ బంధువైయున్నది. ఆమె నీ సహోదరి, మరియు ఆమె ఒక గ్రంథి సమస్య నుండి, మరియు ఒక పెద్ద ప్రేగు సమస్య నుండి ఇప్పుడే స్వస్థత పొందినది. మరియు ఆమె ఒక ఒత్తడి గల యువతి. పిదప మరొకరు ప్రత్యక్షమగుటను నేను చూచియున్నాను, మరియు ఆమె కొంతకాలం క్రితం నా కూటములో స్వస్థతనొందిన ఒక సహోదరి. ఆమె కాన్సర్ జబ్బు నుండి స్వస్థపరచబడియున్నది.
నీవు ఈ పట్టణమునకు చెందినదానిని కాదు. నీవు మిచిగాన్ రాష్ట్రమందలి, డెట్రాయిట్ నగరమునకు చెందినదానవు. మరియు నీ పేరు ఐరీన్. నీ ఇంటిపేరు డ్యూస్ మరియు నీ సహోదరి పేరు వియోలా. ప్రభువైన యేసు నామములో క్షేమంగా ఇంటికి వెళ్ళుము మరియు నీవు కోరినది ఏదో దానిని పొందుకుందువు గాక. ఆమేన్.
నమ్ముట నీవలనైతే, సమస్తమూ సాధ్యమే.
52
యువతీ, నీవేమి తలంచుచున్నావు. అంత్యదినములలో దేవుడు తన కృపచేత ప్రత్యక్షపరచబడుట వలన ఈ కార్యములు వచ్చుచున్నవని నీవు నమ్ముచున్నావా?
అక్కడ మూలన చిన్న నల్లజాతి స్త్రీ కూర్చునియున్నది, సరిగ్గా ఇప్పుడే దేవుడు నిన్ను ముట్టాడనీ నీవు నమ్ముచున్నావా? నీవు కలిగియున్న ఆ పైల్స్, అది నయమైపోయెనని నీవు నమ్ముచున్నావా?
మరియు ఆమె ప్రక్కన కూర్చుని, నీవు నీ చెయ్యి పైకెత్తుటవలన మరి కొంచెం ఆశ్చర్యపోయాను, ఎందుకనగా నేను నిన్ను పిలువలేదు. నేను దేవుని యొక్క సేవకుడినని నీవు నమ్ముచున్నావా? నమ్ముదువా? నీవు కండ్ల జబ్బును కలిగియున్నావు. అది వాస్తవము. అది “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” మంచిది, నీవు ఇంటికి వెళ్ళి మరియు క్షేమంగా ఉండవచ్చును. నీవు ఆయన యొక్క వస్త్రమును తాకియున్నావు. ఆమేన్.
యేసు ఒక్కటే రీతిగా ఉన్నాడు... ఆ వ్యక్తి దేనిని తాకాడు? వారు నాకు నలభై అడుగుల దూరంలో ఉన్నారు. వారు అసలు నన్ను తాకనే లేదు. అయితే వారు ప్రధానయాజకుడిని తాకియున్నారు, మరియు ఆయన మానవ పెదవులను వాడుకొని తిరిగి ప్రత్యుత్తరమిచ్చాడు. మీరు చూశారా?
53
నీవు దానిని నమ్ముచున్నావా? నీవు నమ్ముదువా? నాకు జవాబిచ్చుటకు నీవు కొద్దిగా భయపడుచున్నావు. నేను నీతో చెప్పబోవుచున్నాను. అది నీవు నాకు భయపడుట వలన కాదు కాని అది నీ భాషవల. నీవు జర్మనువైయున్నావు. అది వాస్తవము. అయితే నీకు కీళ్ళ నొప్పులు ఉన్నవి, మరియు అందునిమిత్తము నేను నీ కొరకై ప్రార్ధించవలెనని నీవు కోరుచున్నావు. ప్రభువైన యేసు నిన్ను ఆశీర్వదించుననియు మరియు నిన్ను స్వస్థపరచుననియు మరియు నిన్ను బాగుచేయుననియు నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముదువా?
నీవు వేరొకరి కొరకు ప్రార్ధించుచున్నావు. అది నిజము. మరియు నీకును ఆ ప్రజలకును మధ్యన నీరు, చాలా నీళ్ళు ఉండియున్నవి. మరియు వారున్న దేశము ఫ్రాన్స్ కి ఆవల ఉన్న జర్మనీ దేశము. మరియు నీవు ప్రార్ధించుచున్నది ఒక సహోదరీ మరియు ఇద్దరు సహోదరుల కొరకు, మరియు ఇప్పుడు వారు జర్మనీ దేశములో ఉండియున్నారు. నేను వారిని చూచుచున్నాను. నీ సహోదరి ఒక గుండె జబ్బుతో మరియు పిత్తాశము సమస్యతో బాధపడుచున్నది; ఆమె నీకు ఉత్తరము వ్రాసి అట్లు చెప్పినది. నీ యొక్క సహోదరునికి అతని పాదములో సమస్య ఉన్నది, మరొకటి మానసిక లోపం ఉన్నది. అది వాస్తవము. నీవు నీ కన్నీటిని తుడుచుకున్న ఆ చేతి రుమాలును తీసుకొని వారికి పంపించుము. మరియు సందేహించకుము, ప్రభువు వారిని బాగుచేయును. ఆమేన్. దేవునియందు విశ్వాసముంచుము.
54
సందేహపడవద్దు. సమస్తము సాధ్యమే. యేసుక్రీస్తు నిన్నా, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు.
నీవు నాకు అపరిచతురాలివి అని నేను అనుకొనుచున్నాను.
ఇప్పుడు, నీవు ప్రార్ధించుచున్నావు. కేవలం నమ్మికయుంచుము. ఇప్పుడు, చాలా మంది ప్రార్ధించుచుండగా, అది నన్ను నిరాశపరచుచునట్లున్నది. పరలోకము నుండి దేవుని కుమారుడు ప్రత్యక్షపరచబడుట అనునది ఆయన సంఘమునకు కనికరమైయున్నది.
నీవు చాలా ఒత్తిడిలో ఉన్నావు, ఒక ఆపరేషన్ జరిగినది, అది నీ పొట్ట మీద. ఆపరేషన్ లో నీ కడుపులోని ఒక భాగము తీసివేయబడియున్నది. నీవు ఎక్కువగా తినలేవు. ఆయన నిన్ను స్వస్థపరుచునని నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముదువా?
నేను ఇంకా ఏదో నీకు చెప్పాలని నీవు కోరుచున్నావు, ఎందుకనగా నీ హృదయములో నీవొక భారమును కలిగియున్నావు. అమ్మా, కేవలం యేసుక్రీస్తు బయలుపరచితేగానీ, నీ భారమేమిటనేది నేను తెలుసుకొనలేను. ఆయన దానిని బయలుపరచునని నీవు నమ్ముచున్నవా? ఆయన దానిని బయలు పరచినయెడల నీవాయనకు స్తుతి చెల్లించుదువా?
అది మరియొకరి కొరకు, మరియు ఆమె నీ సహోదరి. మరియు నీ సహోదరి ఈ రాష్ట్రములో లేదు. ఆమె దక్షిణాన వెచ్చని ప్రదేశములోని అట్లాంటా అను ఒక స్థలములోని, జార్జియాలో ఉన్నది. మరియు ఆ స్త్రీని గూర్చి నేను ఒక వింతైన కార్యమును చూచుచున్నాను. ఆమె ఒక పర్యటనలో ఉన్నది, లేదా ఆమె ఒక... సేవకురాలు లేదా ఒక మిషినరీ. పసుపు పచ్చని ప్రజలుండు ఒక చోటు, చైనా. ఆమె చైనా నుండి తిరిగి వచ్చిన మిషినరీయైయున్నది. మరియు ఆమె తన కుడి రొమ్మున క్యాన్సర్ వలన మరణావస్థలో ఉన్నది. ఆమె బ్రతుకదని వైద్యుడు చెప్పెను. అయితే నీవు నీ చేతిలోనున్న చేతిరుమాలును తీసుకొని, ప్రభువు పేరిట ఆమెకు పంపించుము, మరియు ఆమె దేవుని మహిమార్ధమై జీవించును గాక. “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,” అది అట్లే జరుగును గాక. వెళ్ళుము, మరియు సందేహించకుండా విశ్వాసముంచుము.
నమ్ముట నీవలనైతే, సమస్తము సాధ్యము.
55
మనమిద్దరము ఒకరికొకరము అపరిచితులమని నేను అనుకొనుచున్నాను. ప్రభువైన యేసు నీ హృదయ రహస్యమును నాకు బయలుపరచినయెడల, లేదా నీ గత జీవితములో జరిగినది ఏదైనా నాకు తెలియజేసినయెడల, నీకు ఒక అపరిచితుడిగా, వాక్యము నుండి నేను సత్యమునే బోధించానని నీవు నమ్ముదువా?
ప్రేక్షకులు కూడా దానిని అంగీకరించినయెడల అద్భుతముగా నుండును, “ఈ స్త్రీకి, సరిగ్గా ఆమె హృదయములోనున్న కార్యమును దేవుడు బయలుపరచినయెడల, నేనిక ఎంతమాత్రము సందేహించను కాని నేను విశ్వసించెదను,” అని చెప్పగలరా?
అయ్యా, ఆ వరుస చివరిలో కూర్చున్న నీవు దిగులు పడకుండా, నీ హృదయపూర్వకంగా నమ్మినయెడల, నీవెంతగానో ఆందోళన చెందుతున్న - ఆ గుండె జబ్బు నుండి దేవుడు నిన్ను స్వస్థపరచును.
అక్కడ అతని ప్రక్కనున్న ఆ స్త్రీ, నీ విశ్వాసమే దానిని చేసియున్నది. ఇప్పుడు నమ్మికయుంచుము మరియు జీవించుము.
56
నేను దేవుని యొక్క వాక్యము నుండి సత్యమునే బోధించియున్నానని నమ్మునట్లు మీ విశ్వాసమును నేను సవాలు చేయుచున్నాను. ఆ దూత ఏమి చెప్పెను? “ప్రజలు నిన్ను నమ్మునట్లు నీవు చేయగలిగి, మరియు పిదప నీవు యధార్ధముగా ప్రార్ధించినయెడల, ఆ ప్రార్ధన ముందు ఏదియు నిలువజాలదు.”
ఇచ్చట వెనకాల నా కుడి ప్రక్కన ఒక చిన్న యువతి కూర్చొనియున్నది. ఆమె తన ఒడిలో ఒక చిన్న బిడ్డను లాలించుచున్నది. తన తలను వంచి మరియు గౌరవముగా ప్రార్ధించుచున్న ఆమె, ఇప్పుడే తన కండ్లు పైకెత్తినది, ఎందుకనగా ఆమె తన బిడ్డ కొరకు ప్రార్ధించుచున్నది. సహోదరి అది నిజమే. ప్రభువైన దేవుడు ఆ బిడ్డ యొక్క సమస్యను నాకు బయలుపరచినయెడల, నీవు దేనిగూర్చి అడుగుచున్నావో దానిని అంగీకరించుదువా? నీవు స్వస్థత కొరకు అడుగుచున్నావు. స్వస్థపరచు శక్తిని నేను కలిగిలేను. నేను కేవలం ఒక సువార్త సేవకుడనైయున్నాను. అయితే నీ చిన్న బిడ్డకు తలపై ఒక బలమైన దెబ్బ తగిలియున్నది. అది సత్యము. ఇప్పుడు నీవు నీ హృదయపూర్వకముగా నమ్మినయెడల, నీవు అడిగినదానిని నీవు పొందుకొనెదవు.
57
మరియు నీ వెనుక చాలా ఒత్తిడిలోనున్న ఆ చిన్న యువతి, ఆమె ఏ సమయములో నైనా ప్రసవించుటకు సిద్ధముగానున్నది. ఆ చిన్నబిడ్డ గూర్చి ఆమె హృదయము తల్లడిల్లుచున్నది గనుక ఆమె ఏడ్చుచనున్నది. మరియు ఆమె మరొకరికి జన్మనిచ్చుటకు సిద్దముగానున్నది, మరి కావున ఆమె ఒత్తిడిలో నున్నది. అయితే సహోదరి, భయపడవద్దు. దేవుడు మరణఛాయల లోయల గుండా నడుచును. మరి ఆయనే నిన్ను విడిపించును.
అయ్యా, దేనికొరకు నీవు కండ్లు తుడుచుకొనుచున్నావు? నీవు దేవునియందు విశ్వాసము కలిగియుండవచ్చును గదా, అప్పుడు నీవు ఆ కడుపు జబ్బు నుండి స్వస్థత నొందెదవు, మరియు ఆయన నిన్ను బాగుచేయును. ఇప్పుడు నీవు స్వస్థతనొంది యున్నావని నీవు నమ్ముచున్నావా? మంచిది, అలాగైతే వెళ్ళి, నీ భోజనమును చేయుము. ఆమేన్.
ప్రభువైన యేసును నీవు నమ్ముచున్నావా?
అక్కడ చివరన గుండె బ్బుతో ఉన్న నీవు, దేవుడు నిన్ను బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? దానిని నమ్ముట నీవలనైతే! అది నిన్ను ఆశ్చర్యానికి గురిచేసినది కదా? లేచి నీ కాళ్ళపై నిలబడుము. మంచిది, గుండె జబ్బును గూర్చి మరచిపొమ్ము. నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచినయెడల, ఆయన కృప మరియు కనికరము నిన్ను తాకియున్నవి. ఇది పరలోకము నుండి దేవుని కుమారుడు ప్రత్యక్షపరచబడెను. వెళ్ళుము, విశ్వాసముంచుము.
58
అయ్యా, నీవు చాలా ఆనందముగా ఉన్నావు. నీవు నీ హృదయముందు సంతోషమును కలిగియున్నావు, ఎందుకనగా నీవు ప్రార్ధించుచూ ఉన్నావు. నీవు దేనికొరకు ప్రార్ధించుచున్నావు అనునది ప్రభువు నాకు బయలుపరచినయెడల, అది జరుగునని నీవు నమ్మేదవా? అది నీ భార్య కొరకైయున్నది. ఆమెకు రెండుసార్లు గుండె నొప్పి వచ్చియున్నది. ఆమెకు విరిగిన తుంటి కలిగియున్నది. నీవు విశ్వాసముంచుము, అప్పుడు నిన్ను బట్టి ఆ విషయములో దేవుడే శ్రద్ధ వహిస్తాడు. ఆమేన్.
నీవు నమ్ముచున్నావా? నీకు ఒక ఆపరేషన్ జరిగినది, మరి అది నిన్ను ఎంతగానో బలహీనునిగా చేసినది; నీవు రక్తహీనతతో ఉన్నావు. ఆ కణితి నిన్ను చాలా బలహీనునిగా చేసినది. మరియు నీవు మరొకరి కొరకు ప్రార్ధించుచున్నావు, ఒక సహోదరి కొరకు. ఆమెకు అధిక రక్తపోటు ఉన్నది. ఆమె చేతిలోనుండి ఆ వస్తువును అతను అక్కడ పెట్టుటను నేను చూచుచున్నాను, (అది నిజము) బలంగా ఉన్న వ్యక్తి అతను డాక్టరైయున్నాడు. ఆమెకు కూడా గుండె జబ్బు ఉన్నది. అతను ఆ విధంగా వినుచూ, మరియు ఆమె వీపుపై తట్టుచున్నాడు. నీవు నమ్ముచున్నావా? ఆమె నిన్ను స్యాలి అని పిలుచును. ఒల్యాండర్ అనేది నీ పేరైయున్నది. నీవు మౌంట్-క్లేర్ అనే వీధిలో నివసించువాడవు. మరియు 5526 నీ చిరునామ. ఇప్పుడు, నీవు నీ హృదయపూర్వకంగా నమ్మినయెడల, అప్పుడా చేతిరుమాలను ఆమె వద్దకు తీసుకొనిపొమ్ము, మరియు సమాధానముతో వెళ్ళుము. మరియు దేవుడు నీతో నుండి నీ హృదయ వాంఛను నీకు అనుగ్రహించును గాక.
59
దేవునియందు విశ్వాసముంచుడి. నేను వెళ్ళు సమయము వచ్చియుండవచ్చును; అబ్బాయి నన్ను నెట్టుచున్నాడు. ఇప్పుడు మీరు మీ హృదయపూర్వకంగా విశ్వాసముంచుదురా? అలాగైతే ఒక క్షణము లేచి నిలబడండి.
మీరు ఒకటి చేయవలెనని నేను మిమ్మును అడుగుచున్నాను, (ఒక్క నిమిషము) అది వింతగా అగుపించవచ్చును. దేవుని కుమారుడు పరలోకము నుండి ప్రత్యక్షపరచబడియున్నాడని మీరు నమ్ముచున్నారా? అలాగైతే ఒకరిపై ఒకరు మీ చేతులుంచుడి. కేవలం మీ చేతులను ఒకరిపై ఒకరు పెట్టుకొనుడి. బైబిలు ఈ విధంగా చెప్పుచున్నది: “వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థతనొందుదురు.” వారు రోగుల మీద చేతులుంచుదురు.
ఇప్పుడు, నేను ప్రార్ధించునట్లు మీరు కూడా ప్రార్ధించుడి; నేను విశ్వసించినట్లే మీరునూ విశ్వాసముంచుడి; మరియు నిరంతరముండు, పరలోకపు దేవుడు మిమ్మును బాగుచేయును. మరియు క్రీస్తు కొరకు జీవితములను సమర్పించుకొనియున్న మీరు, వెంటనే ఒక మంచి సంఘమునకు వెళ్ళుడి మరియు బాప్తిస్మము పొందుడి, ప్రభువు నామములో వేడుకొనుడి.
ప్రియమైన పరలోకపు తండ్రీ, ఈ రాత్రి కనికరించుము. మేము అలసిపోయి మరియు బలహీనులుగా ఉండియున్నాము. అయిననూ నిత్యము ఆశీర్వాదకరమైన దేవా, సరిగ్గా ఈ క్షణమందే ఈ ప్రజల యొక్క అవిశ్వాసమనే పాపపు పొరలను రాల్చునట్లు, ఒక్క ఉదుటున నీవు నీ ఆత్మను పంపించగలవని నేను ప్రార్ధించుచున్నాను. మరియు వారు స్వస్థతనొందునట్లు, వారిప్పుడే విశ్వాసముతోను మరియు శక్తితోను నింపబడుదురు గాక.
సాతానా, నీ దినములు లెక్కించబడినవి. నీ రాజ్యము లెక్కించబడియున్నది. నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ సమూహము నుండి మరియు ఈ ప్రజల నుండి బయటకు రమ్ము.
ఇప్పుడు, విశ్వసించువారందరునూ మీ చేతులు పైకెత్తి మరియు ఆయనను స్తుతించుడి.