తప్పించుకొని ఇక్కడికి త్వరగా రమ్ము

తప్పించుకొని ఇక్కడికి త్వరగా రమ్ము

vgr count -144 మీకు వందనములు. ఎవరినైతే మనము ఆరాధించుటకు వచ్చితిమో ఆయనతో మాట్లాడుటకై మన శిరములు ఇప్పుడు వంచుదము.

ధన్యుడవగు ప్రభువా, ఇది మాకొక గొప్ప దినము, ప్రభువు చేసిన దినమిది. కావున మేమంతా ఎంతో సంతోషించుచున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయములలో ఆయన కురిపించిన తన గొప్ప కృప కొరకు మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. మరిప్పుడు, మేము దేవుని రాజ్య పౌరులమయితిమి. ముగింపులో మేము ఏలాగుంటామో అనేది ఇంకా కనపర్చబడలేదు గానీ, ఆయన వంటి ఒక మహిమ శరీరమును మేము కలిగియుంటామని మాత్రం మేమెరిగియున్నాం, ఎందుకనగా ఆయనను ఆయన వున్నట్టే మేము చూచెదము. ఈ మధ్యాహ్నం మేము నీ వాక్యమును ధ్యానించుచుండగా అది మా హృదయములలోను, మనస్సులలోను వుండును గాక. ప్రతీ హృదయమును ఆశీర్వదించండి, ఇక్కడున్న ప్రతి విశ్వాసిని ఆశీర్వదించండి. ఆయన రాకడ కొరకు ప్రభువా, మమ్మును సిద్ధపర్చండి. ఈ మనవులన్ని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.

దయచేసి మీరు కూర్చొండి.

2

బయటవున్న ఆ చక్కని సూర్యకాంతి, ఈ వారమంతటిలో ఇలా లేకపోవటం చాలా బాధాకరం. కానీ మనకేమియ్యాలో ఆయనకి బాగా తెలుసు. మనకి ఏది అత్యుత్తమో ఆయన ఎరిగియున్నాడు. ధన్యకరమగు మన ప్రభువు యొక్క మంచితనం అదే, ఆయన్ని మనం అడుగుమునుపే మన అక్కరలన్నిటిని ఆయన ఎరిగియుండెను.

3

మరి కావున, నాకైతే ఈ వారం చాలా బాగుంది, ఎందుకనగా అనేక కార్యాలు జరిగినవి. ఈ వారంలో ఒక రాత్రి నాకు గుర్తుండిపోయేదిగా వుంది, ఎందుకనగా పరిశుద్ధాత్మ సందర్శన చాలా బలంగా ఆ రాత్రి వుండెను. అయినను దానిని నేను పొందజాలకుంటిని. ఓ, అదెంతో అద్భుతమగు గొప్ప అనుభవము. నా జీవితంలో అలాంటిది కేవలం ఒక్కసారి మాత్రమే జరిగియుండెను. ఇక్కడ బ్రదర్ ఉడ్ వున్నాడు, నేను మరి అతని సోదరుడు నది దగ్గర చేపలు పట్టుచుంటిమి. దాని సంగతి మీలో అనేకులు విన్నారు. విన్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి అదే తిరిగి జరిగినది.

దానికి ముందు రోజు.... చూడండి, ఇక్కడున్న నా మిత్రుడు శ్రీ. ఉడ్ ఒకప్పుడు ఒక యెహోవా సాక్షిగా వుండెను. యెహోవా సాక్షులారా, దేవుడు ఇప్పటికి కూడా మీ కొరకు పరిశుద్ధాత్మను వుంచి యున్నాడు; ఆయన నిశ్చయంగా వుంచెను. సరే, అతడికి పోలియో వచ్చిన ఒక పిల్లవాడు వున్నాడు. మరి అతడు.... అతడు దిగువున వున్న టెక్సాస్ కి వచ్చాడు, మరి అక్కడే గతంలో ప్రభువు దూతను ఫోటో తీయుట జరిగినది. మరి నేను విదేశాలకి వెళ్ళి వచ్చాను. మరి అతడు తిరిగి ఒకచోట జరిగే కూటములోకి వచ్చి కూర్చొనియుండెను, ఆ చోటు ఈ బిల్డింగ్ అంత పరిమాణంలో వుంది, అప్పుడు పరిశుద్ధాత్మ అతన్ని పిలచెను, అతని బాలున్ని స్వస్థపర్చెను. అసలు ఏ కాలు అంగవైకల్యముగా వున్నదో కూడా అతడు ఇప్పుడు చెప్పలేనంత పరిపూర్ణముగా ఆ బాలునికి స్వస్థత వచ్చినది, అతడు సంపూర్ణంగా బాగుపడ్డాడు.

4

మరప్పుడు, శ్రీ. ఉడ్, మరియు అతని వారందరు యెహోవా సాక్షులు... అతని సోదరుడు అతన్ని చూడటానికి వచ్చాడు. మంచిది, ఒకరకంగా అతన్ని వారంతా తమ కుటంబములో నుండి వెలివేసారు, ఎందుకనగా అతడు ఈ విశ్వాసంలోని వచ్చాడు. అప్పుడు ఒకసారి అతని సోదరుడు అతన్ని చూడటానికని వాళ్ళ ఇంటికి వచ్చాడు, అప్పుడు నేను నా ఇంటి ఆవరణములో గడ్డి నరుకుచున్నాను. సరిగ్గా అతను వచ్చినప్పుడే పరిశుద్దాత్మ రంగం మీదికి బలముగా వచ్చెను. లోపలికి వచ్చినప్పుడు అతన్ని గూర్చిన సంగతులు పూర్తిగా అతనికి తెలియపర్చెను కనుక అతడు వెళ్ళి తన తండ్రిని కూడా తీసికొని వచ్చాడు.

దారిలో వున్నప్పుడు, అతని తండ్రితో కలసి మేము వస్తుండగా, అతడు అడిగాడు, “మనం చేపల పట్టడానికి వెళ్దాము.” కావున ఆ మార్గములో పరిశుద్ధాత్మ దిగి వచ్చి, ఆ పర్యటనలో ఏమేమి జరగనైయుండెనో దానంతటిని ఖచ్చితముగా తెలియజేసెను, ఏ చేపను పట్టుకొంటామో, ఎవరు దాన్ని పట్టుకొంటారో, ఎలా దాన్ని పట్టుకొంటారో అంతటిని తెలిపెను. ఆయన చెప్పినట్టే పరిపూర్ణముగా అలాగే జరిగెను. అది ఎంతో చక్కగా ఉన్నది: అతడు ఎంతో లోతుగా మాట్లాడును... అంతట అతని కుమారుడు అతన్ని ఇలా అడిగాడు, “నాన్న, దాని గురించి నీవు ఏం అనుకొంటున్నావు?”

అందుకతడు, “మంచిది, తాను పట్టుకొనబోయే చేపను గూర్చి ఒకరు ముందుగానే చెప్పాడంటే అది మంచిదేనని నేను అనుకొనుచున్నాను,” అని బదులిచ్చాడు.

5

అప్పుడు కొన్ని రోజుల తర్వాత మార్పునొందిన తన సహోదరుడు లేల్ మరలాగే నేను ఇద్దరం కలిసివున్నాం. వారు సంబాషించుకొంటున్నారు; మేము కెంటకీ చెరువులో చేపలు పట్టుకొనుచున్నాం. మరి అతడు అన్నాడు, “లేల్, నీకు తెలుసా, మనం పై చోటుకి వెళ్ళి, ఫలాని స్త్రీకి చెప్పాలని?” ఆమె ఒక చర్చి-ఆఫ్-గాడ్ కి, ది ఆండర్సన్ చర్చి-ఆఫ్-గాడ్ కి చెందినది. అదే మొదటి చర్చి-ఆఫ్-గాడ్ అని నేననుకొనుచున్నాను. వారి చిన్నతనంలో ఆమె వారిని సాకినది, వారంటే ఆమెకెంతో ఇష్టం. వారు చిన్న యెహోవా సాక్షుల బాలురు, కానీ... “మనం అక్కడికి వెళ్ళి మనం రక్షించబడితిమన్న సంగతిని ఆమెకి చెప్పవల్సివుంది.”

మంచిది, అతడు అలా దాన్ని అన్నప్పుడు పరిశుద్ధాత్మ వచ్చెను. అంతట నేను, మేము చేపలు పడుతున్న ఆ పడవలో నిలువబడి ఇలా అన్నాను, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అదేమనగా అతి శీఘ్రముగా మీరొక చిన్న ప్రాణి యొక్క పునరుత్థానమును చూడబోవుచున్నారు.” నేను అనుకొన్నాను, “చిన్న ప్రాణియా? అదెక్కడ నుండి వచ్చెను... అదేమైయుండును?”

6

మరుసటి దినమున మేము మరలా చేపల వేట చేయుచుంటిమి. కొన్ని సూర్యచేపలను పట్టుటకు మేము గాలము వేసితిమి. ఇక్కడున్న బ్రదర్ ఉడ్ యొక్క సహోదరుడగు లేల్ అప్పుడు ఒక సూర్య చేపలాంటి దానిని పట్టుకొన్నాడు. దానిని మీరిక్కడ చిన్న చెరువు చేపలు అంటారని నేను అనుకొనుచున్నాను. ఆ చిన్న చేప గాలంను పూర్తిగా మ్రింగివేసినది, గనుక అతడు దానిని ఇలా పట్టుకొని గట్టిగ బయటకి లాగాడు. అది బయటకి వచ్చినప్పుడు అతడు గట్టిగలాగుట వలన ఆ చేప కడుపులో వున్నదంతా, మెప్పలు మొదలగునవి బయటికి వచ్చేసినవి. తర్వాత అతడు దానిని నీటిలోకి విసిరివేసాడు. అది కొద్ది సేపు అలా ఇలా కొట్టుకొనుచుండగా, “చిన్నదానా ఇక నీ పనైపోయింది,” అనే బావనను వ్యక్తపర్చాడు.

కనుక ఆ చిన్న చేప ఆ నీటిపై అలా తేలాడుచుండెను, గాలి దానిని అటు ఇటు నెట్టుచుండెను. ఒక అరగంట సేపటి తర్వాత, నేను చేపలు పట్టుచుంటిని, అకస్మాత్తుగా మొన్న ఒక రాత్రి ఎలాగైతే గర్జించుకొన్నట్టు పల్లముగుండా ఒక శబ్దం వచ్చినదో, సరిగ్గా అక్కడ కూడా అదే వచ్చినది. ఇప్పుడు ఎంత కాంతివంతముగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడో అక్కడ కూడా అదేరీతిగా తేటగా ప్రకాశిస్తున్నాడు. నేనున్న చోటును అది తాకినప్పుడు నేను లేచి నిలబడి చిన్న చేపను పిలిచాను. ఏదో ఇలా చెప్పినది, “చనిపోయిన ఆ చిన్న చేపతో మాట్లాడుము.”

మరి నేను పలికాను, “చిన్న చేపా, యేసుక్రీస్తు నీ జీవాన్ని నీకు తిరిగి ఇచ్చాడు.” వెంటనే అది తన ప్రక్కకి కదిలాడి వెళ్ళగలిగినంత వేగంగా కదిలి, నీళ్ళలోకి వెళ్ళిపోయినది. కావున దేవుని యొక్క సామన్యతను చూడవచ్చును.

7

మార్కు 11:24 మరియు 25, శిష్యులకి ఒక పాఠమును చూపుటకు ఆయన అక్కడ దేవుని యొక్క గొప్ప శక్తిని ఒక చెట్టు మీద ప్రయోగించుటను మనం అక్కడ కనుగొనవచ్చును. ఆయన దానినే ఒక చేప మీద వాడెను. అపోజమ్ స్వస్థపడుటను గూర్చి ఇంకా మిగితా వాటిగూర్చి మీలో అనేకులు వినేవుండవచ్చును. దేవుడు చాలా సామాన్యతలో తన కార్యాలను చేస్తాడు, అయితే మీరేమో వున్నతమైన చోట, గొప్ప వాటిలో, పెద్ద పెద్ద స్తోత్రాలాపనలో దేవున్ని చూడాలనుకొని దేవున్ని సామాన్యతయందు చూచుటలో విఫలమౌతారు. దీనంతటికి కారణం దేవుడు సామాన్యతలో వున్నాడనే సంగతిని గమనించకపోవటమే. మీరు క్రిందికి దిగి ఈ సంగతులన్నిటిని గమనించినట్లేతే, దేవుడు నీతోనే వుండి కదులుటను నీవు చూడగలవు.

8

దానిని వినుట నాకు అదే మొదటసారి, మరలాగే మొన్న ఒక రాత్రి నేను వేదిక మీద నిలబడివున్నప్పుడు సరిగ్గా దానిని నేను విన్నాను, అప్పుడు నేను ప్రార్ధనలు చేయుచున్నాను. మరిప్పుడు మరొక వర్తమానమును నేను పొందుకొన్నాను, అది ఈ రాత్రే, ఈ పట్టణాన్ని నేను విడిచి వెళ్ళకముందు.

9

దీనిని నేను చెప్పగోరుచున్నాను. త్వరలో నా పరిచర్యలో మరో మెట్టు అతి శీఘ్రముగా రాబోతున్నదని నేను నమ్ముచున్నాను, అది దీనికంటే ఎంతో ఉన్నతమైనది. నా పరిచర్య ఆరంభమందు నేను ఎవరి మీదైన చేయినుంచినప్పుడు జరిగిన దానిని మీలో ఎవరైనా గుర్తుంచుకొన్నవారు వున్నారా? మీకది గుర్తుందా? మంచిది. దానితోపాటే నేను యధార్ధముగా వుండినట్లేతే హృదమయులోవున్న రహస్యములను నేను తెలపగలననే వాగ్దానమును గూర్చి మీలో ఎందరికి గుర్తున్నదండి? అది అక్కడే చెప్పబడినదని. ఎందరికి తెలుసును? చూశారా అది జరిగినది? ఇప్పుడు మరేదో కార్యం ఇప్పుడు వచ్చుచున్నదిప్పుడు. అది వున్నపాటునే వచ్చుచున్నది. అది వీటికంటే గొప్పదిగా వుండబోవుచున్నది. ఇక అదే ఆఖరిది అని నేను అనుకొనుచున్నాను. అది బహుశా అలా కాకుండా... గతములో వాటివలే అది కూడా జరుగును.

10

కానీ ఇప్పుడు, ఈ మధ్యాహ్నాం మీరు కొన్ని లేఖనాలు మీద దృష్టి నిలపాలని నేను కోరుచున్నాను, దేవుని చిత్తమైతే కొద్దిసేపు మాట్లాడకొనబోవుచున్నాను, ఆ అంశమును ప్రభువు దీవిస్తాడని నమ్ముచున్నాను. అది పరిశుద్ధ లుకాలో వున్నది, చదువుకొనుటకు లేఖనభాగమును పరిశుద్ధ లూకా 17వ అద్యాయం 26వ వచనం తీసికొందాం. ఒక పాఠ్యంశాన్ని పొందుకొనుటకు దీనిని నేను చదవగోరుచున్నాను.

నోవాహు దినములలో జరుగునట్టు మనుష్యుకుమారుని దినములలోను జరుగును.

నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినమువరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచునుండిరి; అంతలో జలప్రళయము వచ్చి వారినందరిని నాశనం చేసెను.

లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి.

అయితే లోతు సోదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను.

ఇప్పుడు, ఆదికాండము వైపు తిప్పుదాం - ఆదికాండములో అని నేను అనుకొనుచున్నాను, 19వ అధ్యాయము 22వ వచనము అనుకొంటున్నాను, ఒక పాఠ్యంశాన్ని నేనక్కడ పొందగోరుచున్నాను.

నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొనిపొమ్ము; నీవిక్కడికి చేరువరకు నేనేమియూ చేయలేననెను.

ఇప్పుడు, ఒక నిమిషం మనం ప్రార్ధించబోవుచుండగా చదవబడిన దానికి ప్రభువు తన ఆశీర్వాదములను జోడించును గాక.

ఇప్పుడు ప్రభువా, ఇది నీ చేతిలో వున్నది, నీ యొక్క ఈ మాటలను తీసికొని, అవి మా కన్నులకి, మా హృదయములకి వెలుగుగా ఈ మధ్యాహ్నాం చేయుము, ఎందుకనగా మేము ఒక గొప్ప దినములో జీవిస్తున్నాము. తండ్రీ, ఒక అసాధారమైన రీతిలో నిన్ను నీవు మాకు బయలుపర్చుకొనమని మేము ప్రార్ధించుచున్నాము. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

దేవుని వాక్యము ఎన్నడు తప్పిపోదు. ఇప్పుడు, ఈ మధ్యాహాం కొరకు నేను ఎన్నుకొన్న అంశము: “తప్పించుకొని ఇక్కడికి త్వరగా రమ్ము.”

11

ఇప్పుడు, కొన్ని రాత్రుల క్రితం నేను స్ముత్నిక్ (ఉపగ్రహం) గురించి నేను మాట్లాడుచూ వచ్చాను. మూడు రాత్రుల క్రితం నుండి మీకు బోధించుచున్నాను, అమెరికా ప్రభుత్వాం, లేదా సైన్యం దానిని ప్రవేశ పెట్టారు, అవి వంద లేక రెండు వందల నిముషములకొకసారి ప్రపంచం చుట్టు తిరుగుచు, ప్రపంచంచుట్టు అవి ఒక వృత్తమును చేయుచున్నవి. ఇవన్ని ఏమి చూపుతున్నవనగా ఏదైతే చెప్పబడినదో, అది అతి సమీపముగా వున్నదని.

ఇప్పుడు, స్త్రీ, పురుషులు తమ నేత్రములు తెరుచుకొని దేవుని వాక్యము వైపు చూచే ఒక రోజు ఏదైన వున్నదంటే అది ఈ రోజు అయివున్నదండి. అది ఈ దినమేనండీ, ఎందుకనగా రేపు అనేది బహుశా వుండకపోవచ్చును. సంఘము తన కవచమను ధరించవలసి ఉన్నది అంటే, అది నేడే. మరో దినమున ధరించుదునులే అని అనవద్దు. ఎత్తబడుటలోకి వెళ్ళకుండ నిన్ను ఆటంకపర్చేది, దేవునికి నీకు మధ్య ఏది వున్నా, దానిని ఇప్పుడు నీవు సరిచేసుకోవటం మంచిదండి. నీ స్థానమును విడచి పెట్టవద్దు. మన ధన్యకరమగు ప్రభువు యొక్క శీఘ్ర ఆగమనమును కొరకు మనం ఎదురుచూస్తువున్నాం. ఆ గడియ కొరకు మనం కనిపెట్టుకొనియున్నాం. స్వయంగా యేసే ఇలా చెప్పెను, “ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు మీ తలలు పైకెత్తుకొనుడి, మీ విమోచన సమీపముగా వున్నది.” ఆకాశములో సూచనలు, భీతిగొలిపే దృశ్యములు, భయముచేత మానవుని హృదయాలు భీతిళ్ళుచున్నవి, సముద్రం ఘోషిస్తున్నది, రాక్షసి అలలు ఎగిసిపడుచున్నవి, గొప్ప కార్యాలు జరుగుచున్నవి.

కొందరు తమ బుర్రలలో ఇలా అనుకొనుచున్నారని నాకు తెలుసును, “బ్రదర్ బ్రెన్హాం, నీవెందుకు ఈ విషయాలనే నిరంతరాయంగా నొక్కినొక్కి చెప్పుచున్నావు?” ఎందుకనగా అది నా హృదయమందుండెను. అవి నేడు పదే పదే చెప్పాల్సిన అవసరత వుందండి.

12

ఇప్పుడు, బబులోను గురించి మరియు గోడ మీద చేవ్రాత గురించి మనం చెప్పుకొంటున్నాం. మరి నేడు, మనమిక్కడ వుంటుండగా మనకళ్ళు యెదుటే తీర్పు యొక్క వేడిగాలులు వీచుటను ఇంచుమించుగా మనం చూస్తున్నాం. లోకము తన ముగింపునకు వచ్చినది. ప్రభువైన యేసు ఆగమనమునకు బయట ఎట్టి నిరీక్షణ అనేది ఈ లోకానికి లేదండి. ఆయన రాకడ ఒక్కటే నిరక్షణ అయివున్నది. ప్రతీ కౌంటీలో (నిర్దిష్ట ప్రాంతం) నీవొక ఐసహోవర్ ని పెట్టికొనియుండ వచ్చును, అయినను అమెరికా ఇంకా పాపములోని నడిచి వెళ్ళును.

మరో గొప్ప ఉజ్జీవము కొరకు నేను ఎదురుచూచుటలేదు. అసలు విషయం ఏమిటంటే ఉజ్జీవము వచ్చి వెళ్ళిపోయింది, కానీ అది మీకు తెలియలేదు. అది ఎల్లప్పుడు అలాగే వుంటుంది. నీవు దేనికొరకో ఎదురుచూస్తావు, అప్పుడు సాతాను నీకు, “ఇక్కడొక గొప్పది, అక్కడొక గొప్పది వుండబోవుచున్నది” అని చెబుతాడు. అయితే అది నీ ప్రక్కనుండే వెళ్ళిపోవుచున్నది. బాప్తీస్మమిచ్చు యోహాను భూమ్మీదికి రాలేదా, అయితే నీతిమంతులు సహితం దానిని గుర్తించలేదు. శిష్యులు ఇలా చెప్పలేదా, “ఏలీయా ఎప్పుడు వస్తాడు?”

ఆయన చెప్పెను, “ఆయన ఇదివరకే వచ్చెను, కానీ అది మీకు తెలియలేదు.”

ఉజ్జీవమనేది ముగింపు దశలోవున్నది. ఇంకేదో గొప్పది కావాలని ఎదురుచూడకు. ఆకాశములో మనం ఇదివరకే గొప్ప కార్యాన్ని కలిగియున్నాం: పరిశుద్ధాత్మ తనకు తానే ఈ తరములో బయలుపర్చుకొన్నాడు. ఇంకా చేసేది ఏది వాటిని గూర్చిన ఏది మిగిలియుండలేదండీ.

13

కానీ రాబోయే తీర్పులు లోకము వాటిని గూర్చిన బావనను కలిగియున్నది. వార్తా పత్రికలు... పెంటగాన్ గురించి నేను విన్నాను, నాకైతే అది తెలీదు, కానీ వారు చెప్పుచున్నారు. ఏం చేయాలో వారికి కూడా పాలుపోవట్లేదంట. మంచిది, నిన్ను నడిపించగల్గిన పుస్తకం ఒకటే ఒకటున్నది, అది దేవుని బైబిల్. నీవేమి చేయాలో చెప్పగలిగిన ఏకైక పుస్తకం అదేనండీ, దానికొరకు నీ తల పైకెత్తుము, పైకి చూడుము, దానినుండి తప్పించుకొనే మార్గమే లేదండీ.

విద్వంసం కలిగించే ఆయుధము ఇప్పటికే మనిషి చేతులోకి వచ్చేసినది, తద్వారా వారు కావాలనుకొంటే ఈ లోకమంతటిని ఒక్క గంటలోనే నాశనం చేయగలరు. అలా చెయ్యకుండా ఈ మధ్యాహ్నం రష్యాను ఏది ఆపుతుంది, వారి నాయకులలో కొందరు ఒడ్కాతో అధిక మత్తులై ఒక్క బటన్ నొక్కితే ఈ ప్రపంచం దాని కక్ష్యలో నుండే పూర్తిగా కనుమరుగైపోగలదు. మరి అది లేఖనాలకి విరుద్ధంగా లేదండీ. నువ్వు అక్కడే వున్నావు. చూశారా, మనం అంత్యకాలములో ఉన్నాము.

14

మరి దీనిని నేను మీ దృష్టికి తీసికొని రాగోరుచున్నాను, అదేమనగా ఈ వారంలో జరిగిన, మనం చూచిన సంగతులన్ని సిద్దపర్చిన చోటులో కూటమును కలిగియున్నప్పుడు, ప్రజలు దాన్ని గూర్చి ఏ మాత్రం పట్టించుకోవట్లేదంటే దానర్ధం లోకము అంతములోనికి వచ్చిందని అర్ధం. అయితే మీలాంటి ఒక చిన్న గుంపు ప్రతీదినం ప్రతీరాత్రి ఎంతో నమ్మకంగా కూడుకొనుచున్నది, కారణం ఏదో మిమ్మును నెట్టుచున్నది, మీలోపల ఏదో వుండివున్నది. ఆత్మ చేత నింపబడిన ప్రజలారా, మీలోపల ఏదో వుండి మిమ్మును హెచ్చరిస్తున్నది.

ఇప్పుడు, గొప్ప వేదాంతి ఒకడు ఈ పట్టణమునకు వచ్చినట్లేతే, అతనికి ఎంతో విద్యవుండి, చాలా చక్కగా అనార్గళంగా మాట్లాడగలిగినట్లేతే, బహుశా ఈ పట్టనమందున్న ప్రతీ సంఘము సంపూర్ణముగా అతనికి సహకరించును. అటువంటి ఒక అద్భుతమైన ప్రసంగీకుడు చెప్పుదానిని వినుటకు వెళ్ళుట అనేది ఒక గౌరవముగా బావించుదురు. అయితే సంఘము ఎదురుచూచేది మాత్రం అది కాదు. సంఘము, నిజమైన విశ్వాసి పరిశుద్ధాత్మ యొక్క బయలుపాటు నిమిత్తం ఎదురుచూచును, వారి హృదయములలో ఏదో కదులుచుండును. అదేమిటో పిల్లలకి తెలీదు. అయితే ఈ మధ్యాహాం అదేమిటో వివరించుటకు దేవుడు నాకు సహాయం చేయును గాక.

15

ఈ మధ్యనే నేను ఇండియాకు వెళ్ళే భాగ్యము కలిగినది, మరి ప్రభువు వలన ఇండియాకి నడిపించబడ్డాను. అక్కడికి నేను వెళ్ళినప్పుడు, అప్పుడే వారికి ఒక భూకంపము కలిగెను. ఈ రాత్రి లేక ఈ రోజే క్రిస్టియన్ బిజనెస్మెన్ వారి ఆఫీసులో నుండి నేనొక పత్రికను పొందాను, నా మంచి మిత్రుడు టామీ నిక్కెల్స్ దానిని ప్రచురించబోవుచుండెను.

ఒక వింతైన సంఘటన జరుగుట ఆరంభమైంది. ఆ గొప్ప దేశాన్ని భూకంపం కంభళించబోయే రెండు రోజుల ముందు అది జరిగినది, దానిని మేమిక్కడికి కూడా మోసికొని వచ్చాము, అదేమనగా, ఆ దేశములోని జంతువులు తమ పాకలను మరియు చిన్న చక్కని పక్షులు వంటశాల పొగగొట్టముల మీద, ఇండియా యొక్క గొప్ప గోడల మీద తాము ఏర్పర్చుకొన్న గూళ్ళను.... వారు కంచెలను తప్ప ఎక్కువ కలిగిలేరు. వారి కట్టడములు గొప్ప రాతి కట్టడములు, అనగా వారు రాళ్ళును తీసికొని గొప్ప గోడలను నిర్మించుదురు. సరే, అవన్ని అడవికి తరలిపోయాయి. మిట్ట మధ్యాహ్నాం యొక్క ఎండ వేడిమి నుండి సాయంకాలం పశువుల పాకలకు తిరిగి వచ్చి సేదదీరిన పశువులు సహితం తమ తమ పాకులను విడిచిపెట్టి వెళ్ళి, పచ్చికబయళ్ళ మైదానపు మధ్యలో నిలబడినవి.

ఏమిటి అది? భూకంపము రాబోతున్న దానిని ఒక్క బౌతికవస్తువు అంటూ ఏదీ దాన్ని చూపలేదు. రాబోవుచున్న ఈ భూకంపము యొక్క జాడను శాస్త్రవేత్తలు కూడా పసిగట్టలేకపోయిరి. కానీ, ఓ, “ప్రభువు నామమునకు మహిమ,” అని నేను చెప్పగోరుచున్నాను. అది రాబోతున్నదని సృష్టికర్తకి ముందే తెలుసును, ఆయన తాను సృజించిన జీవులను ఆ గోడల యొద్ద నుండి ముందే వాటిని తరలించెను, ఆ గోడల కూలి వాటిక్రింద అవి పడి చనిపోకుండా వుండేందుకు ఆయన వాటిని మైదానములోకి నడిపించి, వాటిని చదును చేసెను.

16

మరి ఆ చిన్న పక్షి, తనలో పెట్టబడిన ఆ సహజ జ్ఞానాన్ని బట్టి... దానికి (పక్షికి) ఆత్మ అనేది లేదండి, అయినప్పటికి అటువంటి ఒక చిన్న పక్షి మరలాగే ఒక ఆవు తమలో పెట్టబడిన ఆ సహజ జ్ఞానమును బట్టి గోడల కూలుట వలన కలిగే అపాయమును తప్పించుకోగలిగితే, మరి సంఘము ఎంత ఎక్కువుగా జాగ్రత్తపడి రాబోతున్న ఉగ్రత్త నుండి, అనగా పాత నివాస స్థలములలో నుండి బయటకి వచ్చి తన్నుతాను లాగుకొని పైకి చూడవలెను, ఎందుకనగా విమోచన సమీపముగా ఉన్నది.

దేవుడు, తన పక్షులను హెచ్చరించిననట్లు, ఆయన తన ప్రజలను కూడా హెచ్చరించును. అలా ఆయన హెచ్చరించినప్పుడు అనేకమంది జనులు తమ గొప్ప సంస్థాపక దేవాలయములను మరియు సామాజిక సువార్తను విడిచి బయటకి వచ్చి, దేవుని పిల్లలతో వారు నిలువబడుచున్నారు. వారు మూఢ భక్తిపరులని పిలువబడినప్పటికిని, లేక తమకిష్టమైన పేర్లతో వారిని పిలిచి దూషించినప్పటికిని, వారు మాత్రం చెక్కు చెదరకుండా తమ స్థానములలోనే నిలిచియుండిరి. వారిని హెచ్చరించేది పరిశుద్ధాత్మయే. నిశ్చయంగా అది అంతే. రాబోవుచున్న ఈ ఉగ్రత... ఓ, ఆయన దీనిని చేస్తున్నందును దేవున్ని నేనెంతో ప్రేమించుచున్నాను.

17

దేవుడు పాపమును ద్వేషించును, పాపమనేది నిశ్చయంగా తీర్పులోకి రావాల్సిందే. అది ఇలా చెప్పబడినది, ఏమనగా ఒకవేళ దేవుడు గనుక అమెరికాను అతి త్వరలో దాని పాపముల నిమిత్తం తీర్పు తీర్చకపోయినట్లేతే, ఆయన సొదొమ గొమొర్రాలను పునరుత్థానమందు లేపి వారికి క్షమాపణ చెప్పవల్సివుండవచ్చును. నిశ్చయముగా. మనం ఏమి విత్తుతాము దాన్నే కోచెదము, ఆత్మీయత కలిగిన ప్రతి ఒక్కరు అది సత్యమని గుర్తుంచెదరు. మార్గమునకు మనం చివరన వున్నాము.

ఆ క్రీస్తులో నీవు పధిలముగా వున్నావని నీవు ఎరగాలంటే, అందుకు వున్న ఏకైక మార్గం ఏమనగా స్వయంగా దేవుడే నిన్ను అక్కడుంచుటకు ఎన్నుకొన్నాడు. “మొదట నా తండ్రి అతనిని ఆకర్షించితేనే తప్ప ఎవడును నాయొద్దకి రాలేడు.” మరియు దేవుడు ఆయనకి అనుగ్రహించిన వారందరిని ఆయన అంత్యదినములో లేపును.

18

ఇప్పుడు, యేసు చెప్పుటకు ఆరంభించి ఇలా చెప్పెను, “నోవాహు దినములలో వుండినట్లే మనుష్యకుమారుని రాకడయందును వుండును.” ఇప్పుడు, ఆయన చెప్పిన కొన్ని సంగతులను నీవు గమనించుము. ఆయన చెప్పెను, “నోవాహు దినమందు వారు తిన్నారు, తాగారు, పెళ్ళిళ్ళు చేసికొన్నారు, పెళ్ళికియ్యబడ్డారు.” ప్రపంచంలో ఎక్కువ విడాకులు తీసికొనేది ఎక్కడో మీకు తెలుసా? అది అమెరికా సంయుక్త రాష్ట్రములలోనే. లోకములు ఎక్కడా లేని విధంగా విడాకులు తీసికొనే వారి సంఖ్య ఒక్క అమెరికాలోనే చాలా ఎక్కువ.

19

మరలాగే గమనించండి, లోతు దినములను గూర్చి ఆయన ఏమి చెప్పెను. “లోతు దినములయందు వారు తినుచున్నారు, పెళ్ళిళ్ళు చేసికొనుచున్నారు, పెళ్ళికియ్యబడుచున్నారు” అని చెప్పెను. మరియు వారు భవనాలు కట్టుచున్నారు, పంటలు నాటుచున్నారు. భవన నిర్మాణాలు, వృద్ధి అనేది ఇప్పుడు ఎంత శరవేగంగా అభివృద్ధి చెందుచున్నవో నీవు గమనించావా? వందేళ్ళు క్రితం వుండిన మనిషి వైపు ఒకసారి చూడు, ఆరువేల సంవత్సరాల నాటినుండి వున్న మనిషిలాగానే వందేళ్ళ క్రితం వుండిన మనిషి వున్నాడు. కానీ ఈ వందేళ్ళలోనే ఎంతో పురోగతి అతడు సాధించాడు. ఒకప్పుడు నీవొక సందేశమును పంపాలంటే, ఒక ఉత్తర ద్వారానో లేదా దానిని స్వయంగా మోసికొనేపోయే వ్యక్తియో వుండేవాడు. కానీ ఇప్పుడైతే టెలిఫోన్లు, టెలిగ్రాంలు, టెలివిజన్లు వచ్చేసాయి. రెండొందల ఏళ్ళ క్రితం వార్తా సందేశమును దాన్ని మోసికొనేపోయే వాటిద్వారా వెళ్ళేది, కానీ నేడైతే ఎంతో వేగంగా కేవలం రెండు నిముషాలలోపే వార్తా సందేశం ప్రపంచం మొత్తం చుట్టివేయును.

వ్యత్యాసమును చూడండి. మూడు వందల సంవత్సరాల క్రితం ఒక ఫ్రెంచి శ్రాస్త్రవేత్త, “ఒకవేళ మానవుడు గంటకు నలబై మైళ్ళ వేగముతో వెళ్ళినట్లయితే, గురుత్వాకర్షణ శక్తి అతడిని భుమిపై నుండి పైకి ఎత్తును,” అని చెప్పెను. ఇప్పుడైతే వారు స్ముత్నిక్ వంటి ఉపగ్రహాల ద్వారా గంటకి పొందొమ్మిది వందల మైళ్ళు ప్రయాణిస్తూ భూమిని చుట్టి వస్తున్నారు. ఇప్పటి నుండి ఒక సంవత్సరానికి ముందు దానంతట్లో మనిషి వుండి చేస్తున్నాడు. అభివృద్ధి శరవేగంగా దూసుకొనిపోవుచున్నది. నిశ్చయంగా, పురోగతి త్వరితంగా చోటు చేసికొనుచున్నది. అది రెండింతల వేగంతో దూసుకుపోవుచున్నది. అది ఆ విధంగా వుంటుందని దేవుడు చెప్పియున్నాడు.

20

ఇప్పుడు, మిగతా లోక జనులు కలిగియున్నట్టుగా ఆ గొప్ప గొప్ప కార్యాలు మనమెందుకు కలిగిలేము అని నేను కొన్నిసార్లు ఆశ్చర్యపోదును. మనమెందుకు అట్టివాటిపై పై-చెయ్యి కలిగి లేకున్నాము. ఈ భూసంబంధమైన పై-చెయ్యి అనేది నాకవసరం లేదు; దేవునిలో అంతకంతకు ఎదుగుట అనేది మాత్రమే నేను కోరుదును.

21

గమనించండి. ఆదియందు ఇద్దరు బాలురు, కయీను మరియు హేబేలు దేవున్ని ఆరాధించుటకు వచ్చారు. వారిద్దరు చర్చీలు కట్టారు, వారిరువురు బలిపీఠములు నిర్మించారు. వారిరువురు చర్చికి చెందియున్నారు. వారిరువురు గౌరవనీయములే. దేవుడు దేవుడే అనే ఆరాధన వారిరువురిలో వున్నది, యధార్ధతతో వారు మోకరించి దేవున్ని ఆరాధించారు. ఒకరిని మించి మరొకరు సనాతానవాదులే. ఒకవేళ దేవుడు సనాతన ధర్మమును మెచ్చుకొన్నట్లేతే, హేబేలను అంగీకరించినట్లే ఆయన కయీనును కూడా అంగీకరించవల్సివుండేది, అలా లేనియెడల ఆయన నీతిమంతుడు కాకపోవును. దానిని గమనించండి. ఏమి చెయ్యాలో అనేది హేబేలునకు తెలియపర్చబడియున్నది.

22

ఆ రెండు చెట్లు పెరుగుటను జాగ్రత్త గమనించండి. అవి రెండు పైకి వచ్చినవి; అవి ఆదికాండములో నుండి ఎదిగి నిర్గమకాండములోనికి వచ్చినవి. అక్కడ ఇశ్రాయేలు వుండెను, అతడు తన మార్గమందు వుండెను, ఏ సంఘ శాఖకి చెందియుండలేదు, వాగ్దాన భూమిలోకి పోవుటకు అక్కడుండెను. అలాగే అక్కడ మోయాబు వుండెను, అతడు అతనికి సోదరుడు, వారొకి ఒక బిషప్పును కలిగియుండిరి. వారు బయటకు తీసికొనిరాబడిరి, వారిరువురు సహోదరులే, మోయాబు మరియు యాకోబు, ప్రాధమికంగా వారిరువురు సరైన వారే. మోయాబుకి కూడా ఏడు బలిపీఠములున్నవి, ఏడు బలులు, ఏడు ఎద్దులు, ఏడు పొట్టేళ్ళు వున్నవి, అవన్ని క్రీస్తు రాకడను గూర్చి మాట్లాడుచున్నవి. దిగువున ఇశ్రాయేలు గుడారములో కూడా ఏడు ఎద్దులు, ఏడు బలిపీఠములు, ఏడు పొటేళ్ళును వున్నవి. సనాతన ప్రాధమికంగావారిరువురు సరైన వారే. అయితే ఇశ్రాయేలుకి మాత్రమే ప్రత్యక్షత వుంది. ఇశ్రాయేలుతో... మోయాబుకి అప్పుడే ఒక కరుకైన నాయకుడు వుండెను, అదొక మెరుగైన చర్చిగా వుండినది, ఎంతో సనాతన భక్తి. మోయాబు వుండగలిగినంత ప్రాధమిక భక్తిని కలిగి, వుండాల్సినంత చెత్త అంతటిని కలిగివుండెను. కానీ బిలాము వారి మధ్యలో వున్న అతీతమగు సూచనను అనగా అగ్నిస్తంబమును చూచుటలో విఫలమయ్యాడు. పరిహారమును చూచుటలో అతడు విఫలంచెందాడు. చూపునకు తక్కువ కులం వారిగా కనబడుతున్న ఆ జనులను దేవుడు శపించును అని అతడు అనుకొన్నాడు. అయితే అది నీ చేతిలో లేదండీ, దానిని జరిగించేది కేవలం నీ విశ్వాసం మాత్రమే. వారికి అతీతమగునవి వున్నవి.

యేసు దినాల్లో కూడా సరిగ్గా అంతేవుంది, యేసు మరియు పరిసయ్యులు, ఇరువురు కూడా సనాతన భక్తిపరంగా ఒకటిగానే వున్నారు, కానీ దేవుడు క్రీస్తుతో వుండెను. ఆ గొప్ప సూచనలు అద్భుతాలు ఆయన్ని మాత్రమే వెంబడించినవి.

23

ఇప్పుడు, ఆదికాండములో పైకి వచ్చిన ఈ రెండు కొమ్మలు, ఇవి రెండు ఒక చోటే పెరిగినవి, అవి రెండు తమ తమ విత్తనమును కనబర్చబోవుచుండెను. మరి వారు నేడు ఇక్కడ వున్నారు, అదే కార్యము, ఆ దినమునే చెప్పుచున్నవి, “కన్యక ద్వారా కలిగిన జన్మను మేము నమ్ముచున్నాము. క్రీస్తు బలి అర్పణను మేము నమ్ముచున్నాము, రెండవ రాకడను మేము నమ్ముచున్నాము.”

కానీ సహోదరుడా, అతీతమగు సూచనలు మరియు అద్భుత కార్యాముల ద్వారా గుడారములో ఉండుట ద్వారా దేవుడు ఎల్లప్పుడు తన్నుతాను రుజువు చేసికొనును. దేవుడు ఎల్లప్పుడు తన్నుతాను కనపర్చుకొనును. ఆయన అతీతుడు, అతీతమగు విధానం ద్వారా తప్ప మరేరీతిగానైనా ఆయన ఏదీ చెయ్యజాలడు, ఏదీ చెప్పజాలడు. దానిని మీరు చూస్తున్నారా? ఓ, దానిని నేను ఎంతో ప్రేమిస్తున్నాను.

24

కయీను వంశావళిని మీరు గమనించాలని నేను కోరుచున్నాను, కయీను భక్తిపరుడే. హేబేలు వున్నట్టే అతడు కూడా భక్తిగానే వుండెను. హేబేలు వున్నంత యధార్ధముగా అతడు కూడా వుండెను. హేబేలు వున్నంత సనాతన భక్తి అతడును కలిగివున్నాడు. అయితే తేడా అనేది మనకిక్కడ కనబడెను. అదేమనగా అతడికి ప్రత్యక్షత లేదు. అదే తేడా మరి. మత్తయి 16లో యేసు చెప్పెను, ఆయన రూపాంతర కొండ దిగి వచ్చుచున్నప్పుడు, అది అక్కడేనని నేనుకొనుచున్నాను ఆయన ఇలా అన్నాడు, “నేను (మనుష్యుకుమారుడు) ఎవరినని జనులు చెప్పుకొనుచున్నారు?”

“ఒకరన్నారు నీవు ప్రవక్తవి, మరొకరు నీవు ఫలానా అని అనుకొనుచున్నారు,” అనెను.

అందుకాయన, “నేను ఎవరినని మీరు అనుకొనుచున్నారు?”

పేతురు, “నీవు సజీవుడవగు దేవుని కుమారుడవగు క్రీస్తువి,” అని చెప్పెను.

25

ఇప్పుడు, పేతురు మీద అక్కడ ఆయన తన సంఘమును కట్టుచున్నాడని క్యాథలిక్ చర్చి అనుచున్నది. ప్రొటస్టంట్లు చేరి ఆయన తన సంఘమును తన మీదనే కట్టబడుచున్నాడని అనుచున్నారు. మీరు లేఖనమును బట్టి చూస్తే వారిరువురు తప్పేనని నా నమ్మకం. ఆయన ఎన్నడు కూడా దానిని తన మీద కట్టుకొనలేదు, లేదా పేతురు మీద కట్టలేదు. అయితే అయన ఏమి పలికెనో గమనించండి; ఆయన అన్నాడు, “రక్తమాంసములు దానిని నీకు బయలుపర్చలేదు. ఒక సెమినారీ నుండి దానిని నీవు పొందలేవు, వాటినుండి వచ్చింది వారిరువురే (క్యాథలిక్కులు, ప్రొటస్టంట్లు). రక్తమాంసములు దీనిని నీకు బయలుపర్చలేదు, కానీ పరలోకమందున్న నా తండ్రియే దీనిని నీకు బయలుపర్చెను. మరియు ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును, మరియు పాతాళలోక ద్వారములు దీని యెదుట నిలువనేరవు.”

ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆత్మీయ ప్రత్యక్షత! అక్కడే నీవున్నావు. అదెల్లప్పుడు ఆయన సంఘముగా వున్నది. హేబేలు కలిగియున్నది అదేనండీ. అపోస్తలులు కలిగియున్నది అదేనండీ. నీవును పొందుకొన్నది అదేనండీ. సంఘము కూడా తనలో దానిని కలిగివున్నది, అదేమనగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా రుజువు చేయబడిన ఆయన కుమారుని యొక్క దైవ ప్రత్యక్షత అయివున్నది. “మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు వెంబడించును.” పునరుత్థాడగు యేసు యొక్క సన్నిధి బయలుపాటు. మరి ఎవరైతే ఆత్మ సంబంధమైన వైఖరి కలిగివుందురో అట్టివారు దానిని పొందుకొంటారు, దానిని నమ్ముతారు. నువ్వు అక్కడే వున్నావు. “ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును.” మనమిప్పుడు ఆ దినమునందు జీవిస్తున్నాము.

26

కయీను సంతానాన్ని గమనించండి. కయీను జనము ఎంతో చురుకైన, శాస్త్రజ్ఞలగు జనులైయున్నారు. కయీను జనులు ఎంతో భక్తిగా కనబడతారు, వారికి గొప్ప పెద్ద చర్చిలుంటాయి, పెద్ద పెద్ద సంఘాలుంటాయి, విద్యావంతులు, మేధావులు. సైన్స్ రంగంలో వారు విశేషంగా రాణిస్తారు. ఖనిజాలను వారు కనుగొని తవ్వి బయటికి తీస్తారు. వారు గృహాలు నిర్మిస్తారు. నిర్మాణ రంగంలో వారు గొప్ప గొప్పవాటిని నిర్మిస్తారు. దానిని నేడు మీరు చూడగలరు. ఎంతో భక్తిపరులుగా ఉన్నారో మీరు చూడండి. అయితే ఓడలోకి ప్రవేశించన జనులు చాలా సాధారణమైన దీనులగు రైతులు. అవును.

వ్రాయబడిన వాక్యముతో కాక, ఆత్మసంబంధమగు బయలుపర్చబడిన సత్యము ద్వారా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనేది దేవుని పక్షమున వాస్తవముగా వుండియుండిగా వారు తెలివితేటలతో కూడిన భావజాలము వైపు వారు వుండిపోయారు. ఆమేన్. ఓ, ఆయన ఎంతో త్వరగా దైవత్వముగా ఆయన మారిపోతాడు. అతడు దేవునికి కుమారునిగా లేక కుమార్తెగా వుండును. “ఈ పర్వతముతో మాట్లాడుము; సందేహింపకు, అది కదిలిపోవును.” దాన్ని మీరు పొందారా? ఈ దినము రాబోవుతున్న ఆ ఉగ్రత నుండి ఆయన ప్రజలు తప్పించుకొని సురక్షితమైన చోట్ల ఆయన జనములు గుంపుగా కూడవలసియున్నది, రాబోయే తీర్పు తప్పించుకొనుటకు.

27

ఇప్పుడు, మీరు గమనించాలి నేను కోరుచున్నాను. ప్రతీచోట తీర్పు అనేది పడటానికి ముందు ఎల్లప్పుడు అతీతమైన సంగతులు చోటుచేసికొంటాయి. మరి నోవాహు, వారు ఎంతో కాలం వేచియుండిరి. మరప్పుడు దూత, ఒక ప్రవక్త, హనోకు ప్రత్యక్షమయ్యెను, మరలాగే మిగతావి. మరి అతీతమగు సూచనలు జరిగినవి. తరువాత వారు లోనికి వెళ్ళిరి.

ఇప్పుడు, ఇశ్రాయేలీయులను బయటకు తీసికొని వచ్చుటను మీరు గమనించాలని నేను కోరుచున్నాను: వారు ఎంతో కాలం వేచియుండిరి, వందల సంవత్సరాలు, అప్పటికి ఏమీ జరగలేదు, యేసేపు చనిపోయినది మొదలుకొని ఏ అతీతమగు కార్యము సంభవింపలేదు, అతడు క్రీస్తుకి మాదిరి. ఐగుప్తును దేవుడు తీర్పు తీర్చటానికి ముందు, దేవుడు తన సంఘమునకు బయటకి తీసికొని వచ్చుటకు ముందు ఒక వర్తమానము అనేది వుండెను, ఒక ప్రవక్త బయలుపడెను, దూతలు బయలుపడెను, అతీతమగు సూచనలు చోటుచేసికొనెను. దేవుని పిల్లలు గోషేను అనే చోట వుంచబడిరి, అక్కడున్న వారికి, వారు బయటికి వచ్చుటకు ముందు ఏ తెగులు వారిని సమీపించలేదు.

28

అదే కార్యము క్రీస్తు మొదటి రాకడలోను. నాశనము వచ్చుటకు ముందు, ఆయన వారితో చెప్పెను, “మిద్దెమీద వున్నవాడు క్రిందికి దిగిరాకూడదు, పొలములో వున్నవాడు తన వస్తువులను ఏమీ తీసికొనిపోవుటకు రాకూడదు; అయితే పట్టణములో నుండి వెళ్ళిపోవాలి.” ఆ యూదులు వున్నది అక్కడే. వారు ఇరాను మరియు తదితర చోట్లకి చెదిరిపోయారు, అది తిరిగి వచ్చి యెరూషలేములోకి ప్రవేశించుట. మోసం చేసే, దొంగతనాలు చేసే ఈ యూదుల కాదండీ, ఇటువంటి వారు లక్షానలబై నాలుగు వేలమందిగా వుండిలేరు, అయితే తీతు దండెత్తి వచ్చి గోడలను ద్వంసం చేస్తున్నప్పుడు తప్పించుకొని పారిపోయిన ఆ నిజమైన యూదులండీ, ఆ గొప్ప నాశనములోనికి వారు వెళ్ళియున్నారు, యెరూషలేము మరియు యూదుల చెదిరిపోయారు. ఈ మధ్యనే వారు ఒకటిగా సమకూడారు, అది కూడా దేవుడు చెప్పిన ప్రకారమే నెరవేర్పు అయినది. స్నేహితులారా, మనం కాలము యొక్క అంతమందు వున్నాము.

29

గమనించండి, వర్తమానికుడు వచ్చిన ప్రతీసారి, వర్తమానికుడు ఎల్లప్పుడు సంఘము చేత తృణీకరించబడతాడు. ఇప్పుడు, నీవు చరిత్ర తిరిగేస్తే అది నీకు అర్ధమౌతుంది. దేవుడు పంపిన వర్తమానికున్ని సంఘము చేర్చుకొన్న కాలము ఏదీ లేదండీ. అది నిజము.

మార్టిన్ లూథర్, జాన్ వెస్లీలను చూడుము. మిన్నానైట్ సహోదరులారా, అమీష్ యులారా మీ సంగతేంటి? వర్తమానము వచ్చినప్పుడు సంఘము దానిని తృణీకరిస్తుంది. నిశ్చయంగా అది అలానే చేస్తుంది. మరి ఇంకా ఇంకా ఇంకా ఎదుగుచున్నాం, ఆ శేషించిన చిన్న గుంపు దశలవారిగా వాక్యరూపములోనికి వచ్చుచున్నది. ఓ, ఆయన నామానికి మహిమ కలుగును గాక. మనం ముగింపులో వున్నాం. అది నిజం. తీర్పు... గోడ మీద చేవ్రాతను నీవు చూడవచ్చును.

బయటికి వచ్చిన ప్రతీ వర్తమానికుడు ప్రతీసారి ప్రేమ, కృప, విమోచనా అనే వర్తమానమును పట్టుకొనివచ్చును. తీర్పుకి ముందు వచ్చే దేవుని వర్తమానము ఎల్లప్పుడు ఒక విమోచన వర్తమానముగా వుండును. నోవాహు ఒక విమోచనను కలిగివుండెను. లోతు ఒక విమోచన కలిగివుండెను. అది ఒక విమోచన వర్తమానము అయినప్పటికి జనులు దానిని త్రోసివేసారు. అది ఒక కనికరం మరియు విడుదలనిచ్చేది. అయినప్పటికి జనులు దానిని త్రోసివేసారు.

30

లోతు దినాలను మీరు గమనించాలని నేను కోరచున్నాను. ఆ కారణము చేతనే ఈ భూమ్మీద ఏ ఒక్క మిస్సైల్ పడి విద్వంసం కాకమునుపే సంఘము ఇక్కడ నుండి వెళ్ళిపోవునని నేను నమ్ముదును. నేనొక వేదాంతిని కాను. నేనెక్కువ చదవలేదు, అందువలన నాకు అధిక విధ్య లేదు. అయితే నేను మాదిరులను బాగా పోల్చిచెప్తాను. మాదిరులను నేను గమనించుదును. నా నీడ ఎలా వుందో అని నేను చూచితే, నేనెలా వుంటాననే ఒక బావన నాకు వుండును.

నీవు గమనించావా? నోవాహు ఓడలోనికి వెళ్ళటానికి ముందు ఒక్క వర్షపు బిందువు కూడా భూమ్మీద పడలేదు. మేఘాలు అక్కడ వ్రేలాడుచున్నవి, ఉరుములు మెరుపులు ఘీంకరిస్తున్నవి, కానీ నోవాహు లోనికి ప్రవేశించే వరకు ఏ ఒక్క వాన జల్లు పడలేదు. మరి దూత లోతుతో ఇలా చెప్పెను, “ఇచ్చటకు నీవు వచ్చువరకు నేనేమి చెయ్యలేను.” ఏ అగ్ని క్రింద పడదు. సోదోమాలో నుండి లోతు బయటికి వచ్చే వరకు ఆకాశంలో వ్రేలాడుచున్న ఏ ఒక్క అగ్నిగంధకం క్రిందపడలేదు. అది వాస్తవము. యేసు చెప్పెను, “అప్పుడు వునట్టే, మనుష్యకుమారుని రాకడయందును అలాగు వుండును.” నిశ్చయంగా.

ఈ దినాలలో, లేక ఈ రాత్రులలో, లేదా ఉదయవేళ, లేదా ఏదో ఒక సమయంలో సంఘము ఇంటికి వెళ్లిపోవును, తీర్పులో ఒక క్షిపణి భూమిని తాకుటకు ముందే అది వెళ్లిపోవును. తీర్పు రాకమునుపే సంఘము వెళ్లిపోవును. నీవు చూడవల్సినంత దగ్గరగా తీర్పు వ్రేలాడుతున్నట్లేతే, గోడమీద చేవ్రాత లేదా ఆకాశములో... అక్కడ వారు స్పుత్నిక్ వంటి క్షిపణులు, మరియు రెండు లేక మూడు బాంబుల సమస్తమును ముగింపు చేయగలవు. అవసరమునుకుంటే వారు నేడే దానిని చేయగలరు. మరి మనం దానిని చూశాం. ఈ గడియలోనే యేసు వచ్చి, తన సంఘమును తీసికొనిపోవుటకు పరిస్థితి ఎంతో దగ్గరకు వచ్చినది. ఆయన రాకడ తప్ప మరి ఇంకేది మిగిలియుండ లేదు. అది నిజము. “మంచిది, అది... మంచిది, ఎప్పట్నుంచో నేను దాన్ని వింటున్నాను,” అని అనట్లు మనము కూర్చొని అంటున్నాం. చూశారా, తిరస్కారం.

31

ఇప్పుడు, మీరు దీన్ని గమనించాలని నేను కోరుచున్నాను. సరిగ్గా అప్పుడే... అది లోతు కాలము. ఈ భూమిని దేవుడు అగ్నితో కాల్చును. దానిని ఆయన చెప్పాడని మీలో ఎందరికి తెలుసును? ఆయన దానిని చేస్తాడు.

ఇప్పుడు, సొదొమ గొమొర్రాల భూమిని కాల్చివేయబడటానికి ముందు వచ్చిన ఆ దూత స్వభావముని మీరు గమనించాలని నేను కోరుచున్నాను. ఇప్పుడు, సొదొమ గొమొర్రాల యొక్క నైతిక విలువలను చూడండి, వాటిని అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పోల్చండి. కేవలము వాటిని పోల్చిచూడండి. విడాకులు, విద్య, అపవిత్రత. మీరు దానిని చూశారా?

32

ఏమి జరిగిందో ఇప్పుడు గమనించండి. దేవునికి ఒక శేషము వుంది. అది అబ్రాహాము, అక్కడ కూర్చొని వున్నాడు. మరి గమనించండి. దూతలు వెళ్ళి సొదొమలో నుండి బయటికి రావాలని లోతుకి చెప్పినప్పుడు, అతనికి అవసరమైనదంతా, లేక అతన్ని వెంబడించేటట్టు చేసిరి, ఎందుకనగా వారు దానిని అగ్నిగంధకములతో కాల్చివేయబోవుచుండిరి. మరి, లోతు వీధుల వెంబడి వెళ్ళి, రాత్రివేళ తన కుటింబీకుల యొద్దకి అలాగే ప్రతీచోటకి వెళ్ళి తన శక్తికొలది వారికి ఆ సంగతిని భోదించాడు. అయితే వారేమి అన్నారో గమనించండి. వారు అతన్ని ఎగతాళి చేసి మాట్లాడిరని బైబిల్ చెప్పెను.

ఇప్పుడు, నేడును అదే జరుగుచున్నది. వర్తమానమును గూర్చి వారు నేడు ఏమి అనుచున్నారు? “ఓ, అదంతా బూటకం. అదొక వెక్కిరింత. అనుకరణ చేయుటకు నీవు ప్రయత్నపడుచున్నావు. మాకు భిన్నంగా వుండాలని నీవు ప్రయత్నిస్తున్నాను. అదొక ఎగతాళి.” అది పరిశుద్ధాత్మ మరియు నీవు దానిని చూడలేనంత గ్రుడ్డివానిగా ఉన్నావు.

నువ్వు ఇలా అనవచ్చు, “బ్రదర్ బ్రెన్హాం, అది లేఖనాధారమేనా?” మీరు ఓపిక పడితే మరికొంత లోతుకి వెళ్ళి దాన్ని చూద్దాం. అగ్నికి ఆహూతి కాబోతున్న సొదొమకి వచ్చిన దయగల దూతను చూడండి, అది నేడు కూడా అలాగునే వుండునని ఆయన పలికాడు.

33

ఒక మనిషి ఆకారములో దూత అబ్రాహాము యొద్దకి వచ్చెను. అబ్రాహాము ఆత్మీయంగా ఆయన్ని గుర్తించాడు. ఆయన తన వీపును గుడారము వైపు వుంచి కూర్చొన్నాడు. మరి అబ్రాహాము ఆయనకి ఆహారం పెట్టెను. మరి ఆయన అన్నాడు “అబ్రాహామా, మీదటికి ఈ కాలమున తిరిగి వచ్చెదను... జీవకాలమున.” అబ్రాహాము అప్పటికి నూరేండ్లు ప్రాయం. శారా తొంబై ఏండ్లు. ఎన్నో ఏండ్ల నుండి వారు ఆ వాగ్దానం కొరకు ఎదురు చూస్తువున్నారు.

ప్రభువు రాకడ కొరకు ఎదురు చూచువారు ప్రతీ కదలికను గమనింతురు. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. అయస్కాంతమునకు ఇనుప ముక్క అతుక్కొనట్టుగా, అటువంటి ఒక కార్యము సంభవించుటకు వారు ఎంతో ఆసక్తితో ఎదురుచూచుచున్నారు. అది జరగాలని వారెంతో జాగ్రత్తగా కనిపెట్టి చూచుచున్నారు. అబ్రాహాము దానికొరకు అనగా దేవుడు తనకి చేసిన వాగ్దానము కొరకు ఎదురు చూచాడు.

34

మరి సమయం ఎంతో సమీపమైయింది. ఒక మనిషి వచ్చాడు, అయితే ఆయన మనిషి కాడు, ఆయన దూత. దూత అంటే ఎవరో కాదండీ, స్వయంగా మనిషిగా దిగి వచ్చిన సర్వశక్తిగల దేవుడే. ఇప్పుడు వినండి, బైబిల్ పాఠకులారా, అబ్రాహాము ఆయన్ని ప్రభువు అని పిలిచాడు. ప్రభువు అనగా ఎలోహిం, సర్వశక్తుడు, మానవ రూపం దాల్చిన యెహోవా, ఆయన తన వీపును గుడారము వైపు తిప్పి అక్కడ కూర్చొనియున్నాడు. ఆయన అన్నాడు, “జీవకాలమందు నేను శారాని దర్శించెదను.” తొంబై ఏండ్ల వయస్సు.

మీకు తెలుసా, శారా ఏమి చేసిందో? గుడారము లోపల శారా తన హృదయములో, బాహాటముగానే కాదండీ, తన హృదయములో, గుడారములోపల, ఆ మనిషి తన వీపును త్రిప్పినప్పుడు, శారా తన హృదయములో నవ్వుకున్నది. మరి దూత, అబ్రాహాము వైపు చూచి ఇలా అనెను, “శారా ఎందుకు నవ్వెను?”

35

అది ఏ రకమగు మానసిక శాస్త్రము (మనిషి ఆలోచనలు అన్ని చదివే శాస్త్రం)? దాన్ని బట్టి నీవు సిగ్గుపడుట లేదా? అక్కడికి వచ్చిన అదే దయగల దూత ఇచ్చటికి ప్రతీరాత్రి వచ్చి, అదే కార్యాములను జరిపించుచుండెను. ఈ భూమ్మీద అగ్నిపడి కాల్చబడకమునుపు అది జరిగినది. “లోతు దినములలో జరిగినట్టు మనుష్యుకుమారుని రాకడలోను జరుగును.”

అది వర్తమానము తీసికొని వచ్చిన దూత, తన వెనకున్న ఆ గుడారములో ఏమి జరుగుచున్నదో వివేచించగలడు. మరి శారా బయటికి వెళ్ళి దానిని కాదనుటకు ప్రయత్నించెను. “అవును, నీవు అబద్ధమాడావు,” అని తన వెనుక భాగాన గుడారములో వున్న శారా హృదయపు ఆలోచన వివేచించి చెప్పెను.

ఆ ఆత్మ యొక్క స్వభావాన్ని మీరు చూడలేరా? ఆ ఆత్మ ఎవరో కాదు గానీ యేసుక్రీస్తు. ప్రభువైన యేసు శరీరధారిగా ఈ భూమ్మీద వుండినప్పుడు ఆయన అదే కార్యమును జరిగించాడు. తానే ఆయనని రుజువు చేయుటకు ఆయన అదే సూచన కార్యాములను జరిగించియుండెను. మరియు ఆయన ఇప్పుడు ఇక్కడ, ఈ రాత్రి భూమ్మీద వుండి అగ్నితో ఈ లోకాన్ని దహించివేయుటకు ముందు అవే కార్యములను జరిగించుచున్నాడు. మరి ప్రజలు అంటున్నారు, “నీవు పరిహరిస్తున్నావు నీవు క్రీస్తు విరోదివి. నీవు ఎగతాళి చేస్తున్నావు. అనుకరణ చేయుటకు నీవు ప్రయత్నిస్తున్నావు. ఏదో తేడాగా వుండాలని నీవు ప్రయత్నిస్తున్నావు. అది మనసును చదివి చేప్పేది. సోది చెప్పేవానికి కొంచెం ఎక్కువ అది.” మరి యేసు అన్నాడు, “దీనికి విరోధముగా ఒక్క మాట, ఎవరు చెప్పినా, వారికి ఈ లోకమందును రాబోయే లోకమందు పాపక్షమాపణ వుండదు.”

36

ప్రజలు స్వీకరించినా లేక తిరస్కరించినా, దేవుడు చేసేది మాత్రం చేస్తూనే వుంటాడు, వర్తమానము బయటకి వెళ్ళవలసినదే. అయితే అట్టివారు దానిని ఎన్నడూ స్వీకరించలేరు, నోవాహు కాలంలో వారు దానిని స్వీకరించలేదు. ప్రభువైన యేసు దినాలలో వారు దానిని స్వీకరించలేదు, అలాగైతే నేడు కూడా వారు దానిని స్వీకరించరు. అది వాస్తవం. అయితే తీర్పు రాకముందు హెచ్చరించటమనేది తండ్రికి అభీష్టమాయెను.

వారు పైకి వచ్చినప్పుడు సొదొమ ఏమనును? లోతు వారి వీధుల వెంబడి వెళ్ళినప్పుడు మీరంటారు, “కేవలం లోతు?” నీతిగల అతని ఆత్మ అనుదినము వారి పాపములను బట్టి విసుగు చెందెనని బైబిల్ చెప్పినది. అతడు నిజంగానే విసుగుచెంది నొచ్చుకొన్నాడు. దూతలు అతడిని అభిషేకించి మరియు అతడిని సువార్తతో వెలుపలకు పంపెను.

37

ఓ, సహోదరుడా, మనం గొప్ప దినములో జీవిస్తున్నాం. తిమోతికి వ్రాసిన రెండవ పత్రికలో బైబిల్ ఇలా సెలవచ్చినది, “అంత్యదినములలో జనులు ఎలా వుంటారోననే దానిని ఆత్మ ఎంతో తేటగా తెలియపర్చెను. వారు విశ్వాసము నుండి తొలిగిపోతారు, గర్వాంధులు, అహంకారులు, మూర్ఖులు, దేవునికంటే సుఖానుభావమును ఎక్కువుగా ప్రేమించువారవుతారు.”

మరొక రాత్రి నేను చర్చికి వస్తున్నాను, అప్పుడు ఎంతో ఎక్కువుగా మంచు కురుస్తుంది, రావటానికే చాలా ఇబ్బందిగా వుండినది, కానీ అదే సమయంలో వారొక బాస్కెట్ బాల్ ఆటను కలిగియున్నారు, దానికి మాత్రం వందలాది మంది జనులు హాజరయ్యారు. ఏమిటది? వారి దేవుడు బాస్కెట్ బాల్. మరప్పుడు నీ దేవుడు ఎవరు? ఒక గొప్ప గాలి గొప్పగా ఊదబడినది. అయితే మనకి మాత్రం ప్రభువైన యేసుక్రీస్తే మన దేవుడైయున్నాడని నేను ఆనందిస్తున్నాను, ఆయన పునరుత్థానుడు, భూమ్యాకాశములకి సృష్టికర్త. అయితే వారు దానిని చూడగోరుచున్నారు. వారిలో వున్న ఆ రకమగు ఆత్మ వారినచ్చటకి లాగుచున్నది. క్రైస్తవునిలో వున్న ఆత్మ అతన్ని క్రీస్తు నొద్దకు ఆకర్షించును. నా తండ్రి ఒకనిని ఆకర్షించనదే ఒకడు నా యొద్దకి ఎలా రాగలడు.“

38

ఓ, అవును. నా సోదరుడా, అందుకే నేను దీన్ని చెప్పుచున్నాను: త్వరపడుము, తప్పించుకొనుము, నీకింకా ఎక్కువ సమయం లేదు. ఈ దినాలలో ఒక దినాన ఈ సంఘ సమాఖ్య గోడలు కూలబోవుచున్నవి. నీకు అవకాశం వున్నప్పుడే నీవు రావటం మంచిది. లోకములో నుండి బయటపడుము. క్రీస్తులోనికి ప్రవేశింపుము. ఇరు ప్రక్కల దేవుని ఉగ్రత పవనాలు వీచుటను నీవు చూచినప్పుడు, ఇప్పుడు గంటకి అవి పద్దెనిమిది వందల మైళ్ళ వేగంతో వేలాడుచుండుటను, లేదా లోకము చుట్టూ పద్దెనిమిది వేల మైళ్ళ వేగంతో అవి వేలాడుచుండుట, లోకము చుట్టు మళ్ళీ మళ్ళీ వచ్చుటను. అయిదు నిముషాల్లో మొత్తాన్ని పిండి చేయగల బాంబుల బటన్ మీద చేతులుంచిన దేశాలను నీవు చూచినప్పుడు... ఒక గొప్ప కార్యం, ఏదో ఒక గొప్ప ఉజ్జీవం రావాలని ఎదురుచూడకు; ప్రభువు రాకడ కొరకు ఆశతో ఎదురుచూడుము. ఇప్పుడే సంసిద్ధుడవైయుండుము. నీవు వీటిని చూడలేకపోతున్నావంటే దయ్యమే నీ కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయుచున్నది.

39

ప్రతీ తరములోను, ప్రతీ దేశములోను క్రీస్తు తన్నుతాను బయలుపర్చుకొన్నాడు. నేడు కూడా ఆయన దానిని చేయుచున్నాడు. నామకార్ధ సంఘం నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది. ఆత్మ సంబంధమైన సంఘమైతే మేల్కోనుచున్నది, నిద్రించు కన్యక నిద్రలోకి జారిపోయింది, తద్వారా అది మహాశ్రమల కాలంలోకి నెట్టివేయబడును. అయితే దివిటీలో నూనె వున్న వారు మాత్రం సంసిద్ధంగా వున్నారు. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక.

కన్యకల ఉపమానమును నేనెంతో ఇష్టపడతాను. మనం ఇదివరకు వాడిన ఆ పాతకాలపు బొగ్గు దీపములను గూర్చి మీకు తెలుసును కదా. నేను వాడేవాడిని... ఇదివరకు మాకు లైట్లు లేవు, అవి ఈ మధ్యనే వచ్చినవి. మరి ఇక్కడ చూడండి. దివిటీల అడుగు బాగాన నూనె వుండును. దానిని పీల్చుకొనుటకు వత్తి వుండును. ఇప్పుడు, ఆ వత్తి అనేది ఒక ప్రత్యేక పదార్ధముతో చేయబడును. మంట అనేది వత్తికి చివరి భాగాన వచ్చును.

మరి ఇప్పుడు గమనించుము, ఒక వైపు గొట్టము అందులోకి వేసి దాని ద్వారా నూనెను పీల్చుకొని పైకి నీవు తెచ్చి మండించలేవు (దీపము కాలేదు). ఒక ఇనుప గొట్టము ద్వారా ఒక మానవ-కల్పితముల ద్వారా అది సాధ్యం కాదండీ. వత్తి అనగా విశ్వాసము. దీపము వెలిగించుటకు కావల్సినదంతా స్వయంగా పరిశుద్ధాత్మయే. నీవు నీ విశ్వాసమును పొందుకున్నప్పుడు దాని యొక్క వత్తి చివరి భాగములో దేవుని మహిమార్ధమగు అగ్ని వుండగా, మరో చివరి భాగములో దేవుని పరిశుద్ధాత్మ నూనెలోకి మునిగిపోయి వుంటుంది. అప్పుడు నేను ఈ బలిపీఠము మీద వుండటం ఎంత వాస్తవమో, అంతే వాస్తవముగా మండుచున్న దీపము కూడా వుండును. అది నిజం.

అయితే ఆ నూనె అనేది నీటితో కలవదు, అయితే ఏమగును? ఏమగునో అది నీకు తెలుయును. అది మినుకు మినుకున వృదా ప్రయాసమగును. దాని పైన భాగాన బూడిద ఏర్పడును, అప్పుడు నీవు లేచి నీ దీపమును చక్కదిద్దకోవలయును. దీపములను సరిదిద్దుకొనే ఒక సమయమున్నదంటే అది నిశ్చయంగా ఇదేనండీ. “త్వరపడి ఇచ్చటకు రమ్ము; నీవు ఇచ్చటకు చేరువరకు నేనేమి చేయలేను.”

40

ఇప్పుడు, ఆ దేవుని యొక్క తీర్పు చాలా సమీపముగా మనకి వున్నదని మనము చూచినయెడల, మరి గుర్తుంచుకోండి, తీర్పు వరసలో నేను నీ యెదుట నిలువబడినప్పుడు, నేను ఏ సంగతులు నీ ముందుకి తీసికొని రాబడటం నీవు చూస్తావు... అప్పటివరకు నీవు వేచివుండాల్సిన పన్లేదు. గంట గంటకి, రాత్రికి రాత్రి భూమ్మీద వుండినప్పుడు ఆయన యొక్క భౌతిక దేహములో ఏలాగైతే కార్యాలు ఆయన చేసాడో, సరిగ్గా అలాగునే వివిధ రూపాల్లో యేసుక్రీస్తు తన్నుతాను మనకి కనపర్చుకొనుచున్నాడు. హృదయములో వున్న రహస్యములను ఆయన బయలుపరుచుచున్నాడు. మొన్న ఒక రాత్రి ఐదువందల మంది ప్రజలయెదుట దిగివచ్చి అనేక కార్యములను జరిగించాడు.

ఆకాశములో ఒక గర్జన వినబడినప్పుడు మరి ప్రతి ఒక్కరు దాని చూచుటకు ఆరంభింతురు, ఇక్కడ అది ఒక ఉరుమువలె, ఇక్కడ ఈ వేదిక మీద పడెను, ఈ కట్టడము అంతట గర్జించుకొంటూ తిరిగెను, ఒక గాలి వీచినట్టుగా కాక, ఒక బలమైన గాలీ వేగముగా వీచినట్లుగా వుండెను. అయితే మనమేమి చేశాం? మన హృదయాలను మండించుకొని పట్టణమంతా దానిని విస్తరించుటకు బదులు మనము ఈ విధముగా అంటిమి, “అది చాలా బాగుంది, అవును, దాని విషయమై నా హృదయములో ఎట్టి సందేహం లేదు.” ఓ, లెమ్ము, నీ దీపమును చక్కదిద్దుకొనుము. నీ ఆత్మతో లేదా నీటితో నీవు పొందిన నూనె మిళితమైనది. అది బూడిద మాత్రమే తీసుకొని వస్తుంది. దీపములు ఆరిపోతాయి. నీ దీపము యొక్క పొగ గొట్టమంతా పొగ బూడిదతో నిండుకుంటుంది. అందువలనే దేవుని రాజ్యము సమీపమైయున్నదని నీవు చూడలేకపోవుచుంటివి, మనమిప్పుడు అంతమందున్నాము, లేచి మీ దీపములను చక్కబెట్టుకొనుడి, మనమంతా కలిసి కొనసాగుదాము.

41

దానిని మీరు నమ్ముదురా? మీరు నమ్ముచున్నారా? గుర్తుంచుకోండి, లేఖనముల ద్వారా ముందే తెలపబడిన ప్రకారం ఈ లోకము దాని వినాశనాన్ని ఎదుర్కొకొనకముందే, దేవుడు తన కనికరమునుబట్టి తన సంఘమును దానిలో నుండి తీసుకొనిపోవును, ఎందుకనగా శ్రమలలో సంఘము ఎట్టి పరిస్థితులలో ఉండబోదు.

42

గమనించండి, నోవాహు... తనను నాశనము చేసే ఒకదానిలో నుండి లోతు బయటకు వచ్చెను. తనను పదిలంగా వుంచే ఒక దానిలోనికి నోవాహు వెళ్ళెను. ఈ రెండు ఏమి చెబుతున్నాయి. వాటిని కలిసి చూచినప్పుడు. మనం గనుక ఈ లోకములోనే వుంటే అప్పుడు మనం కూడా దానితో నాశనం అవుతాము, అలా కాకుండా వుండేందుకే మనం క్రీస్తులోకి రావాలి, కేవలం అచ్చట మాత్రమే మనకి సురక్షితం. నోవాహు లోనికి వెళ్ళెను, లోతు బయటికి వచ్చెను. అతడు లోకములో నుండి, సొదొమలో నుండి బయటకు వచ్చాడు. తీర్పుకి పైగా తేలాడే ఓడలోనికి నోవాహు వెళ్ళెను.

సహోదరుడా, ఒకే ఒక కార్యమేదనగా, బహు జనసమూహములను, అటువంటి గొప్పవాటిని క్రీస్తు నాశనం చేసిన ప్రతిసారి, ఆయన తాను ఎన్నుకొన్నవారిని మాత్రము అందులో వుంచక మొదట వారిని వెలుపలికి తీసుకొని వస్తాడు. మరి ఇంతకమునుపే పరిపూర్ణమని ఆయన పలికిన సంఘము మీదికి దేవుడు ఏలాగు తీర్పును తీసుకొని వస్తాడు? మనము క్రీస్తు శరీరమైయున్నాము. మనము క్రీస్తుతో మృతిపొందిన వారిమైతే అప్పుడు అబ్రాహాము సంతానమవుదుము మరియు వాగ్దానమునకు వారసులమగుదుము. క్రీస్తునందు దేవుడు మనల్ని ఇంతకమునుపే తీర్పు తీరిస్తే మరలా మరోసారి ఎలా తీర్పులోనికి దాన్ని తెస్తాడు?

43

మరి నీవు క్రీస్తులో వున్నట్లేతే, క్రీస్తు చెప్పెను, “ఈ సూచనలు వారిని వెంబడిస్తాయి. నేను చేయు క్రియలు మీరును చేయుదురు.” అవే కార్యాలు. “నేను ద్రాక్షావల్లిని మీరు తీగలు.” తెగిపోయిన కొమ్మ మరియు చిన్న సంఘశాఖ పురుగు ద్వారా తెంపబడిన కొమ్మ తన జీవాన్ని అది పోగొట్టుకొంటుంది, అది ఎండిపోయి కాల్చివేయబడుతుంది.

ఒక మంచి ఆరోగ్యకరమైన ద్రాక్షాతీగలో... లేక కొమ్మలో ద్రాక్షాజీవం ప్రవహిస్తుంది. ద్రాక్షా చెట్టు, ఆ కొమ్మ కేవలం అదే రకమగు ఫలములనే ఫలిస్తుంది. అది ఒకవేళ పీచ్ వృక్ష తీగ అయితే, ఆ పీచ్ వృక్ష కొమ్మ, పీచ్ పండ్లనే కాయను. ఒకవేళ అది ఒక ద్రాక్షాఫలమిచ్చే చెట్టు అయితే, ద్రాక్షాపండ్లనే అది కాయను. అదొక గుమ్మడి కాయ చెట్టు అయినట్లేతే, అది నిశ్చయంగా గుమ్మడి కాయలనే కాస్తుంది. అదొక పుచ్చకాయచెట్టు అయితే, పుచ్చకాయల్నే కాయును. ఒక చెట్టు ఏ జీవమైతే దానియందు కలిగివుండునో, ఆ ఫలమునే అది ఫలిస్తుంది.

44

ఈ విషయం నాకు చెప్పు, నొక మానవ సంస్థాగతమైన శాఖలో వుండి, నిన్ను నీవు.... నేనొక సంగతి నీకు చెప్పగోరుచున్నాను. ఏ కాలములోను, ఏ సమయమందును దేవుడెన్నడు ఒక సంస్థను అంగీకరించలేదు. చరిత్రలో ఒక చోటునైనా నీవు దానిని నాకు చూపగలవా. మొట్టమొదటి సంస్థాగతమైన సంఘము క్యాథలిక్ సంఘము. ప్రకటన 17:17 ఏం చెప్పుచున్నది? ఆమె ఒక మహావేశ్య అని, ఆమెకి అనేకమంది కుమార్తెలు కూడా వున్నారని అది చెప్పుచున్నది. ప్రొటస్టంట్ సంఘము తిన్నగా దానిలోనుండి బయటకి వచ్చి, తనకు తానే అది ఒక సంస్థాగతముగా మారినది, తన చుట్టు కంచెలను ఏర్పర్చుకొన్నది, మరి ఇలా అంటుంది, “మేము కేవలం దీన్ని మాత్రమే నమ్ముతాం, మరి దేనిని నమ్మము.” అది విడిచిపెట్టుచున్నది - గొర్రెను మేపుటకు పచ్చక అనే దానికి చోటు లేకుండా పోయింది. మీ సంస్థకి విరోధంగా నాకేం లేదండీ, అయితే మిమ్మును మీరు దానికి అంటిపెట్టుకొనుచు ఇలా అనుకొందురు, “మా గుంపుకి అంతా తెలుసు.” దేవుడు అనుమతించిన దానికంటే మరి అధికముగా నీ గుంపుకి తెలియదు. మరి అది... మెతడిస్టు, బాపిస్టు, పెంతెకోస్తు అను సంస్థల కొరకు యేసు మరణించలేదండీ. ఆయన తన పూర్తి శరీరము కోసమే చనిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పూర్తి శరీరము ఎత్తబడుట కొరకు సిద్ధపడటమే సార్వత్రిక దర్శనము.

నా ప్రియ స్నేహితులారా, నా ప్రార్ధన ఏదనగా... నీ ప్రతీ కదిలికను యేసు చూస్తున్నాడు, నీవు చేయు ప్రతీ పనిని ఆయన గమనిస్తున్నాడు.

45

కొద్దికాలం క్రితం, రాణి లేదా రాజు, ఇంగ్లాండ్ రాజగు కింగ్ జార్జి తాను చనిపోకముందు కెనడా వచ్చాడు; అతడు వచ్చినప్పుడు, అతని ఆనందం నిమిత్తం టీచర్ తన పిల్లల్నందరిని బయటకి తీసికొనివచ్చి వారి చేతిలో బ్రిటిష్ జెండాలను వుంచి, వాటిని ఊపునట్లు చేసెను. వారా ఆ విధంగా జెండాలు పట్టుకొని వీధులలో నిలిచి, అతడు తన అందమైన రాణితో వచ్చుచున్నప్పుడు వాటిని ఊపగా, ప్రజల ఏడ్చారు. ప్రతీ ఒక్కరు ఎంతో సంతోషముతో తమ చేతిలో వున్న జెండాలను ఊపి అతడికి స్వాగతం పలికారు.

రాజు నిష్క్రమించిన అనంతరం పిల్లలందరు తిరిగి తరగతికి వచ్చేసారు. ఒక చిన్న బాలిక మాత్రం తిరిగి రాలేదు. టీచరు ఆమెను కనుగొనలేకపోయింది, కనుక టీచరు వీధిలోకి వెళ్ళి, ఆ బాలిక కొరకు వెదకసాగింది. కొద్దిసేపటి తర్వాత ఆ బాలిక ఒక టెలిగ్రాఫ్ స్తంబమునకు తన చిన్న తలను ఆనించి వెక్కెక్కి ఏడూస్తున్నట్టు కనిపించింది. టీచరు ఆ బాలిక దగ్గరకి వెళ్ళి, “ప్రియా, ఏమైంది? నువ్వు రాజు వచ్చుచున్నప్పుడు నీ జెండాను ఊపలేదా?” అని అడిగింది.

అందుకా అమ్మాయి, “అవును, రాజు వచ్చినప్పుడు నేను కూడా జెండా ఊపాను.”

ఆమె అన్నది, “నువ్వు దగ్గరికి వెళ్ళావా?”

బాలిక చెప్పెను, “అవును, దగ్గరికి వెళ్ళాను.”

మంచిది, “మరి నువ్వు రాజును చూడలేదా?” అడిగినది.

బాలిక చెప్పినది, “అవును, నేను రాజును చూచాను.”

“సరే, మరెందుకు నువ్వు ఏడుస్తున్నావు?” అని అడిగినది.

అందుకామె, “అయితే రాజు మాత్రం నన్ను చూడలేదు. నేను చాలా చిన్న దాన్ని కదా, అతడు నన్ను చూడలేకపోయాడు,” అని అన్నది.

46

కానీ యేసు అయితే అలా కాదండీ. నీకు విధ్యవున్నా లేకున్నా, ధరించుటకు సరైన వస్త్రాలు లేకున్నా అవేమి ఆయన పట్టించుకోడు, ఆయన కొరకు నీవు చేసే ప్రయత్నాన్ని ఆయన చూస్తాడు, ఆయన నీ ప్రయత్నములన్నిటిని ఎరిగియున్నాడు. ఈ రోజే పరిశుద్ధాత్మ నిన్ను సిలువ దగ్గరకి నడిపించునట్లు నీవెందుకు అనుమతించుకూడదు? ఈ దినమే నీవెందుకు సిద్ధపడకూడదు? “నోవాహు దినములలో వుండినట్లే మనిష్యకుమారుని రాకడలోను వుండును.” ఆయన అతిశీఘ్రముగా రానైయున్నాడని తెలిసే ప్రతీ సూచనను మనం చూస్తున్నాం. దీని గూర్చి మనం తలంచుకొనుటకు మనమంతా కొద్దిసేపు మన తలలు వంచుదాం.

మీరిలా చెప్పాలని నేను కోరుచున్నాను, “బ్రదర్ బ్రెన్హాం, ముగింపు ప్రార్ధన నీవు చేయుచుండగా అందులో నన్ను జ్ఞాపకము చేసికొనుము. నీవు నన్ను జ్ఞాపకము చేసికోవాలని నేను కోరుచున్నాను, నేను ప్రభువుకి దగ్గరవ్వాలనుకుంటున్నాను. మరి ఆ దినమందు, నేను చేసే చిన్న పని, ఆయన కొరకు చేసే ఏ పనినైన ఆయన దానిని చూచి, నా నీతికి దానిని లెక్కగట్టాలని నేనిప్పుడు ఆయన కుమారుడగు యేసుని అంగీకరిస్తున్నాను, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుచున్నాను.” మీరు మీ చేతులను పైకెత్తగలరా? ప్రభువు మిమ్మును దీవించును గాక. మంచిది, ఈ ప్రదేశమంతటా, బాల్కానిలో వున్నవారిని ప్రభువు దీవించును గాక. నా ఎడమ ప్రక్కవున్నవారిని, అవును. మంచిది, దేవుడు మిమ్ములను దీవించును గాక. ఎడమ వైపు బాల్కానిలో వున్న వారిని ప్రభువు దీవించును గాక. మంచిది.

47

మంచిది, ఆయనిక్కడ వున్నాడు. అదంతా మీ ఇష్టం. ఏమిటి? త్వరపడండి. వర్తమానము ఎల్లప్పుడు అత్యవసరముగా వుంటుంది. త్వరగా రండి, తొందరగా. ఏ దూత? అదే దూతను ఇప్పుడు మీరు చూస్తున్నారు. అబ్రాహాము గుడారములో కార్యములు జరిగించిన అదే పరిశుద్ధాత్మ, ఈ రాత్రి ఇక్కడ వుండెనని తలలు వంచిన ఎందరు మీలో ఎరిగియున్నారు? మీ చేతులు నన్ను చూడనివ్వండి. మీరక్కడే వున్నారు.

ఆలాగైతే వర్తమానము అనగా ఏమిటి? ఆయన వర్తమానము ఏమైయున్నది? త్వరపడి ఇక్కడ నుండి బయటపడుము. ఎందుకు, ఈ గొప్ప సంఘశాఖ గోడల యొద్ద నుండి తొలుగుము. ఇంతకాలం నీవు జీవించిన ఈ పాపపు గోడల యొద్దనుండి తొలిగిపొమ్ము. ఈ పాప అపవిత్రమగు టెలివిజన్ చిత్రాల నుండి, ఈ వార్తాపత్రికాల చెత్త అంతటి నుండి, మరలాగే, “ట్రూ స్టోరీ” అనే ఈ మ్యాగీజైన్ల నుండి బయటపడుము, వాటి నుండి బయటికి రమ్ము. ఈ సంశయాలన్ని నుండి బయటపడుము. “ఇది ఒక మనసు చదివేది కావచ్చునేమో? ఒకవేళ ఇది అదేనేమో?” అనే ఇటువంటి అపోహాల నుండి తొలిగిపొమ్ము. త్వరపడి వాటినుండి బయటపడుము, క్రీస్తు కనికరము మధ్యకు పరిగెత్తుకొని రమ్ము. సిలువ యెద్ద నీకొక చోటు అనగా ఒక ఊట నీ కొరకు ఉన్నది. దాని గూర్చి ఆలోచించుము. మనం ప్రార్ధించుచుండగా, విశ్వాసము ద్వారా ఆయన్ని చేర్చుకొనుము.

48

పరలోకపు తండ్రీ, నీవే దేవుని కుమారునివి. మేము జీవిస్తున్న ఈ చివరి చెడ్డ దినాలలో ధన్యకరమగు మా రాజు యొక్క ఆగమనమునకు ముందు నీవొక దూతను భూమ్మీదకు పంపి ఆ నాటి కార్యములనే నేడును రుజువు చేస్తున్నావని తెలిసికొనుటను బట్టి నేనెంతో సంతోషిస్తున్నాను. ఒక మనిషిలో చెడ్డ ఆత్మ వున్నట్లేతే అతను కేవలం చెడ్డ కార్యాలనే చేస్తాడు. “మంచిది, నేను ఈ గుంపు ప్రజలకి చెందియున్నాను, నేనొక గొప్ప పెద్ద సంఘములో సభ్యుడనైయున్నాను,” అని అనుకుంటున్న అనేక మంది సహోదరుల కళ్ళు గ్రుడ్డివైనవి. ప్రభువు దినాల్లో వున్న ప్రధానయాజకుడగు కయిప మీద, అలాగే ఆనాటి వేదపండితుల మీద వున్న అదే ఆత్మ ఇప్పుడు వారి మీదను వున్నదని వారు గుర్తించకున్నారు. ఆయన చెప్పెను, “మీరు మీ తండ్రి అపవాధి సంబంధులు.” వారు పవిత్రులే, నీతిమంతులే, లేఖనాలయందు బహు ప్రావీణ్యము గలవారే, అయినప్పటికి ప్రత్యక్షత పొందుటలో వారు విఫలమయిరి. చురుకుదనం గలవారే, తెలివి తేటలు గలవారే, గొప్పవారే, కానీ సామాన్యతయందు చూచుటలో, పరిశుద్ధాత్మ పనిచేయుటను చూచుటలో విఫలం చెందియున్నారు. దేవా, మేము జీవించే గడియను వారు చూచునట్లు వారి హృదయములను మరియు నేత్రములను తెరువుము. తీర్పు అనేది రాకముందు వర్తమానము ఏ విధంగా రావాల్సివుండెనో ముందుగానే చెప్పబడినది. దానిని వారు చూచునట్లు వారి మీద నీ కనికరమును చూపించండి.

ఈ మధ్యాహ్నాం చేతులు పైకెత్తిన ప్రతి శరీరములోనికి, హృదయములోనికి, వారి జీవితములలోనికి, వారి అంతరంగములోనికి నీ పరిశుద్ధాత్మను పంపి వారిని తిరిగి జన్మింపచేయుము, అలాగే క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా వారిని చేయునట్లు అనుగ్రహింపుము. వారి కళ్ళు తెరవబడి ఇలా చెప్పుదురు గాక, “ఇంతకమునుపే నేనెందుకు దీనిని చూడలేకపోతిని.” ప్రభువా, దానిని అనుగ్రహించండి. సమయం వుండగానే వారు ఈ గొప్ప గడియలో రక్షింపబడుదురు గాక. ఏలయనగా దీనిని యేసు నామములో అడుగుచు నీ మహిమ కొరకు వాటిని నీకు అప్పగించుచున్నాను. ఆమేన్.

49

మీరు ఆయనను ప్రేమిస్తున్నారా? ఈ పాటకి స్వరమును ఇవ్వండి, “నేనాయనను ప్రేమించుచున్నాను, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను.” దయచేసి మీ చేతులను పైకెత్తుడి.

నేనాయనను ప్రేమించుచున్నాను,

నేనాయనను ప్రేమించుచున్నాను

ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను

నా రక్షణనను కొనెను

ఆ కల్వరి వృక్షము పైనే.

నేను ఇప్పుడు మనము ఆ విధముగా పాడుచుండగా,

నీ వెనుకవున్న వారి యొద్దకి మీ ప్రక్కనున్న వారి యొద్దకి,

మీ యెదుటవున్నవారి యొద్దకి చేరి ఎవరితోనైన కరచాలనం చెయ్యండి.) నేనాయనను ప్రేమించుచున్నాను

ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను

మరి కొనెను... (వైధ్యుడు) నా రక్షణనను

ఆ కల్వరి వృక్షము పైనే.

50

వెళ్ళిపోవుటకు మీలో ఎందరు సిద్ధపడియున్నారని అనుకొనుచున్నారు? ఓ, అదెంతో అద్భుతముగా లేదా? బూర మ్రోగినయెడల ఏమగును? మనము సిలువను విడచి మరియు కిరీటమును పొందుకుంటాం. మనం తప్పిపోము, ఇదివరకే దేవుడు మనల్ని స్వీకరించెను. ఆయన తన ఆత్మను పంపియున్నాడు. ఆయన ఆత్మ ఇక్కడ మనతో వుండి ఏ కార్యలు చేయునని ఆయన చెప్పనో, సరిగ్గా వాటినే చేయుచుండెను.

దేవుడు మిమ్మును పిలిచియుండుటను బట్టి మీరు ఆనందంగా లేరా? ఎవరి కన్నులైతే ముసుకొనిపోయినవో, ఎవరైతే చూడలేకపోతున్నారో వారి మీద దయ చూపించండి, వారిని ఖండించవద్దు, వారి మీద జాలి చూపించండి. జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో, వారే తప్ప మిగతా వారు దాన్ని చూడలేరు. “ఎందుకనగా దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో, వారిని పిలిచెను: ఎవరిని పిలిచెనో, వారిని నీతిమంతులుగా తీర్చెను: ఎవరిని నీతిమంతులుగా తీర్చేనో, వారిని మహిమపర్చెను.” అది ఇదివరకే జరిగెను. అది ఆయన గ్రంథమందు వ్రాయబడెను. దేవుడు తన ముందు జ్ఞానము ద్వారా ఎవరిని ఎరిగెనో, వారే ఆయన్ని చేర్చుకుంటారని వారిని విమోచించు నిమిత్తం క్రీస్తు వచ్చెను. ఆమేన్. అది అద్భుతముగా లేదా.

51

మనం కాలము యొక్క అంతమందు వున్నామని, అందుకే ఈ గొప్ప కార్యాలు సంభవించుచున్నవని, మనమిక్కడ క్రీస్తులో సురక్షితముగా వున్నామని తెలిసికొనుటకే మనము ఈ మధ్యాహ్నాం ఇక్కడ వున్నాము. నీ జీవితమే దానికి రుజువు. ఒకవేళ నీ జీవితము దానికి సమాంతరముగా తూగకపోనట్లేతే, నీవు మోసపోయినట్లేతే. అది వాస్తవం. ఒకవేళ మీరు దానిని చూచి, గ్రహించి, దాన్నిబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తే, నీ జీవితం దేవుని నీతితో నిండుకోన్నట్లే, చేయుటకు అది కష్టమైనదేం కాదు...

నీవు ఏ తప్పు చెయ్యాలనుకోవు. అక్కడే రెండు పాఠశాలలు తుదకు తప్పులోనికి పోయినవి, ఆర్మేనియన్ల సిద్ధాంతము. నీవు ఒక ప్రత్యేక కార్యాన్ని చెయ్యవల్సివుంది, ఒక నిర్దిష్ట కార్యాన్ని చెయ్యాల్సివుంది. అది పని చేయను. మరో ప్రక్క కాల్వినిష్టులు వెళ్ళి, “దేవునికే స్తోత్రం, నేను రక్షింపబడ్డాను, కనుక నాకిష్టము వచ్చింది నేను చెయ్యొచ్చును,” చూశారా. కానీ ఆ దారి మధ్యలో ఇది వున్నది. నువ్వు నిజంగా ఆయన్ని ప్రేమిస్తే, నీ భార్య పట్ల ఎలాగైతే నీవుంటావో అలాగునే ఆయన పట్ల కూడా నువ్వు వుంటావు.

52

దీనురాలగు నా భార్య, నేను తరచుగా విదేశాలకి వెళ్తుంటాను. నేను విదేశాలకి వెళ్ళుచున్నప్పుడు, “శ్రీమతి. బ్రెన్హాం, నేను పోయిన తర్వాత నీవు మరో భర్తను కలిగియుండరాదు,” అని నేనామెను పట్టుకొని చెప్పాల్సిన పన్లేదండీ. మరి అలాగే ఆమె కూడా నా చొక్కా కాలరు పట్టుకొని, “యవ్వనుడా, వేరే భార్యలను తాకవద్దు,” అని నాతో ఆమెయు చెప్పాల్సిన అవసరం లేదండీ. ఒకవేళ అలా అనుకొన్నట్లైతే, అది గృహమే కాదు. అవునండీ. మేమిరువురం కలిసి ప్రార్ధనలో కూర్చుంటాం. నేను ఆమెను ముద్దాడి, “ప్రియమైనదానా, నా కొరకు ప్రార్ధించుము,” అని చెప్పి సెలవు తీసుకుంటాను.

ఆమెయు ఇలా అనును, “బిల్లీ, నీ కొరకు ప్రతీగంట నేను ప్రార్ధిస్తాను.” మేము అలా ఉండెదము. ఆమె వేరే భర్తలతో వుంటుందనే చింత నాకుండదు. వేరే భార్యాలను నేను కలిగివుంటాననే చింత ఆమెకి వుండదు, ఎందుకు? మేము ఒకరినొకరం ప్రేమించుకొనునంత కాలం అది అంత చక్కగా వుంటుంది. నిశ్చయంగా.

53

ఇప్పుడు, నేను విదేశాలకో లేక మరో చోటికి వెళ్ళినప్పుడు, అక్కడ నేను ఏదైనా తప్పు చేస్తే, అప్పుడు నేను నా భార్యను కాక మరో స్త్రీని ప్రేమించినట్టే. నేను తిరిగి వచ్చిన తర్వాత నేను ఈ సంగతి నా భార్య దృష్టికి తెచ్చినట్లైతే, ఆమె నన్ను క్షమిస్తుందని నేను నమ్ముదును. నేను వచ్చి ఆమెకు చెబితే ఆమె నన్ను మన్నిస్తుంది అని నేను అనుకొనుచున్నాను. “కానీ ఆ ముప్పై-ఏండ్ల దీనురాలు, తలనెరిసిన ఆమె నాకును జనమునకు మధ్య నిలువబడును, అలా అగును. నేనామెను ఎంతో ఎక్కువుగా ప్రేమిస్తున్నాను, ఆమె నన్ను మన్నించగలదు, కానీ నేను ఆమెను ఎట్టి పరిస్థితిలోను గాయపర్చకూడదు. నేనామెను ప్రేమిస్తున్నాను. నేనామెను ప్రేమిస్తున్నాను. ఆ విధంగా నేనామెను ప్రేమించినంత కాలం ఆమె ఈ లోకంలో వున్నంత కాలం ఆ విషయమై ఇక చంతపడదు.

మరలాగే నీవు ప్రభువును నీ పూర్ణ హృదయముతో ప్రేమించినంత కాలము, నీవు సిగరెట్లు ముట్టవు, ఏ విస్కి త్రాగవు, ఏ తప్పు చెయ్యవు. నీవు ప్రభువును ప్రేమించుదువు. నువ్వు ప్రభువును ప్రేమించకపోయినా పొగత్రాగుటను విడిచి పెట్టొచ్చును, మధ్యం సేవించటను ఆపేయ్యవచ్చును, ఏదైనా చెయ్యొచ్చును, ఆయన్ని ప్రేమించనియెడల, నువ్వు నశించినట్లే. అది నిజము. “క్రియల మూలముగా కాక కృప మూలముగానే నీవు రక్షింపబడ్డావు.”

54

ఇప్పుడు, నీ జీవితము యేసుక్రీస్తు జీవితముతో సరిపడితే ఆయన వాక్యమందు ఈలాగు సెలవిచ్చాడు, “నీవు కొండను చూచి - నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయుబడుమని చెప్పి, తన మనస్సులో సందేహింపక - తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల, వాడు చెప్పినది జరుగును.” నీవు ఏమి చెప్పినా. ఆ కొండను కదిలించుటకు నీకున్న ఏకైక మార్గం దైవికముగా మాట్లాడుటయే. నీవు దేవుని కూమారునుని అయినప్పుడు నీవు దేవున్ని పొందుకొన్నావు, ఆయన జీవమైవున్నాడు, (Zoe) నీలో దేవుని సొంత జీవము, అప్పుడు నీవు దేవునిలో భాగమైవుంటావు. నీ లక్ష్యం సరైనది. అయితే అప్పుడు నీ ఉద్దేశ్యం కూడా సరైనదగును, నెరవేరును....

55

[టేపు మీద ఖాళీ.] ... దేవుని మహిమ, పలుకుము మరియు ఏమి జరుగునో గమనించుము. అది ఖచ్చితంగా జరిగి తీరవల్సిందే. నమ్మాటానికి ఏదీ అక్కడ లేనప్పుడు నీవెలా నమ్ముతావు? దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రావల్సివుంది. చాలా మోసమైన సంగతులు ఉన్నవి అని నాకు తెలుసు. చాలా తప్పుడు విషయాలు ఉన్నవి అని నాకు తెలుసు, చాలా సంగతులు అట్టివి జరుగుచున్నవి. ప్రతీ సంస్కరణలో అది వున్నది. అది నిజం. క్యాథలిక్ సంఘానికి మార్టిన్ లూథర్ విరోధముగా మాట్లాడి, దానితోనే ఏలాగు జతకట్టుననేది ఇక్కడ అసలు ప్రశ్నే కాదు; ప్రశ్న ఏదంటే, అంత మూఢత్వములో అతడు తన తల పైకెత్తుకొని వుండుటకు తగినంత కృపను ఏలాగు పొందుకొన్నాడన్నదే. ప్రతి సంస్కరణలోనూ అది అలాగునే వుండినది.

నేడు కూడ అది అలాగునే వున్నది. దైవిక స్వస్థత మీదను, సూచక క్రియలు మరియు అద్భుతాలు అనే వాటి మీదను మూఢత్వము అనేది ఎంతో ఎక్కువుగా తగిలించబడివున్నది, కానీ అది సరికాదు. నకిలీ డాలర్ దేనిని చూపిస్తుంది? ఎక్కడో నిజమైన అసలైన డాలర్ వుండేవుంటుందని నకిలీ దాని ద్వారా తెలుస్తుంది. దేవుని బైబిల్ దానిని అలా చెబుతున్నది. మనం ఆయన్ని కనుగొన్నందున నేనెంతో ఆనందిస్తున్నాను.

56

దేవుడు మిమ్ములను దీవించును గాక. ఈ రాత్రి ప్రభువు చిత్తమైతే ఏడున్నరకి, “హృదయమనే ద్వారములో ద్వారము,” అనే అంశము మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు దేవుడు మిమ్మును దీవించు గాక. ఈ రాత్రి దేవుడు నశించిన వారిని రక్షించునట్లు రోగులను స్వస్థపర్చునట్లు ఆశతో రండి. డాక్టర్ వేల్.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...