దేవుని కన్ను

దేవుని కన్ను

vgr  count -117 మరియు అది పరిశుద్ధాత్మతో యున్నది, ఇప్పుడది వినుటకు వచ్చిన వారందరితో ఉన్నది, మరియు యేసు నామములో ప్రభువు యొక్క దూతలు సేవకులకు దగ్గరలో ఉన్నారు.

ఈ మధ్యాహ్నము లేఖనములలో నేను కీర్తనల గ్రంథం చదువుచుండగా, నేను అది కొద్దిసేపు చదువుటకు ఇష్టపడుచున్నాను, దానిలోని కొద్ది వాక్యములు. నేను రెండు వాక్యములు చెపుతాను. అవి 32వ కీర్తన, 7వ మరియు 8వ వాక్యములు.

నా దాగు చోటు నీవే....

దావీదు ఆలాగు చెప్పటను నేను ప్రేమిస్తాను, అది దేవుడే అతని యొక్క దాగు చోటు అనుటను. ఏలాగు మనకు ఒక దాగు స్థలము ఉన్నదా అని నేను అలోచించుటను ప్రేమిస్తాను, దేవుని యొక్క గొప్ప సన్నిధియే మనకు దాగు స్థలము, అక్కడనే మనము ప్రపంచ కార్యముల నుండి దాగుకొనగలము. మరియు ఎప్పుడైతే సమస్యలు వచ్చినాయో, ఆయనే మన యొక్క దాగు చోటు. మరియు 8వ వచనములో ఈలాగు చెప్పెను:

.... నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను.

నేను ఆలోచించాను — దేవుడు అక్కడ మాట్లాడుచున్నాడు — ఆయన ఏ విధముగా తన కన్ను ద్వారా మనకు మార్గదర్శిగా ఉండగలడు. మరియు దానిని గురించి తెలియాలంటే ఆయన యొక్క సన్నిధి చాలా దగ్గరగా ఉండాలి మరియు మనలకు దారి చూపించాలి. మరియు ఆ లేఖనము క్రీస్తు యొక్క నిజ సేవకుడి విషయములో ఏలాగు నిజమవ్వగలదు అని నేను ఆలోచించాను. పరిశుద్ధ యోహాను 5:19లో, ఆయన చెప్పినప్పడు,

...నిశ్చయముగా, నిశ్చయముగా, నేను మీతో చెప్పుచున్నాను, కుమారుడు తనంతట తానుగా పమియూ చేయనేరడు; కాని తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో, వాటినే కుమారుడును అలాగే చేయును.

2

యెహోవా యొక్క ఆ గొప్ప కన్ను. యేసు ఆ కన్ను ద్వారా చూచుచున్నాడు. సీమోను శిబిరము దగ్గరకు వచ్చినప్పుడు అది ఖచ్చితముగా యెహోవా కన్ను ద్వారానే చూచి ఉండాలి. మరియు ఆయన చెప్పియున్నాడు, అతని పేరు సీమోను అని, మరియు ఆయన ఆ పేరుని కేఫాగా మారుస్తున్నాడని, మరియు అతని యొక్క తండ్రి పేరు యోనా అని చెప్పాడు. అది ఆయన చూచుచున్నది కేవలం దేవుని యొక్క కన్ను ద్వారా మాత్రమే.

దేవుని కన్ను ప్రవక్తలతో సంఘ కాలములన్నీటిలోనూ ఉన్నది, అది కాలమునకు అవతల ఏమి జరుగనైయున్నదో చూచును. అది మరేదో కాదు కాని దేవుని కన్నే, ఎప్పుడైతే నతానియేలు ఫిలిప్పు ద్వారా ఆయన సన్నిధికి తీసుకొనిరాబడియున్నాడో, మరియు యేసు అతనితో ఈ విధముగా అన్నారు, “ఇదిగో ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు.”

“భోధకుడా, నన్ను నీవు ఏలాగు ఎరుగుదువు?” అని నతానియేలు అడుగగా.

“ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచాను” అని ఆయన చెప్పెను. ఆయన తప్పక దేవుని యొక్క కన్ను ద్వారా మాత్రమే దానిని చూచి ఉంటాడు.

3

పరిశుద్ద యోహాను 4లో ఎప్పుడైతే అక్కడ ఆయన ఆ స్త్రీకి అయిదుగురు భర్తలున్నారని చూశాడో, అది ఖచ్చితముగా దేవుని కన్ను అయివుంటుంది. ఆ స్త్రీ ఆయన వస్త్రపు చెంగుని ముట్టినప్పుడు మరియు ఆయన నుండి ప్రభావము బయటకు వెళ్లింది, దేవుని యొక్క కన్ను ద్వారా ఆయన చూచుచుండెను. ఆయన తన చుట్టూ చేరిన వారినందరిని మరియు ఆమెను కనుగొనేంతవరకు తేరి చూచాడు మరియు ఆమె యొక్క సమస్య ఏమిటో ఎరిగియున్నాడు.

ఆయనను పరిసయ్యులు ఎప్పుడైతే “నీవు బయల్జేబూబువి” అని అన్నారో, కేవలం దేవుని యొక్క కన్ను ద్వారా మాత్రమే ఆయన వారి హృదయపు ఆలోచనలను ఎరిగియున్నాడు.

“మనందరిలో ఎవరు గొప్పవారు,” అని శిష్యులు అడిగినప్పుడు, అది కేవలం దేవుని కన్ను ద్వారా మాత్రమే ఆయన వారి యొక్క హృదయపు ఆలోచనలు ఎరిగి, వారికి బోధించాడు.

ఆయన బేతెస్ధ కోనేరు దగ్గరకు వెళ్లి, అక్కడ పరుపు మీద ఒక మనుష్యుడను కనుగొను వరకు చూట్టూ చూచాడు, అది కేవలం దేవుని కన్ను ద్వారా చూచుటవలన మాత్రమే జరిగింది, మరియు మీకు తెలుసా అతను ఆ రకమైన స్థితిలో 38 సంవత్సరముల నుండి ఉంటున్నాడు.

4

గత రాత్రి మనము లేఖనములను చదువుచుండగా ఒక ఓదార్పు ఉన్నది, అది మనము యేసు చెప్పినదానిలో కనుగొనగలము, “లేఖనాలు ఎన్నడూ తప్పిపోవు.”

మరియు తరువాత ఎప్పుడైతే యేసు వెళ్లిపోయాడో మరియు దేవుని యొక్క ఆ గొప్ప కన్ను మార్గదర్శకంగా ఉన్నది, ఆయన వాగ్దానం చేసియున్నాడు, “నేను చేయు క్రియలు, నేను చేయు కార్యములు, మీరును చేయుదురు.”

మరియు మార్గమును చూపు ఆ కన్ను ప్రభువైన యేసు వెళ్ళినప్పుడు ఆయనతో పాటుగా వెళ్ళలేదు. ఆయన యొక్క సంఘములో శాశ్వతముగా కొనసాగుచున్నాడు. ఆయన మూడవ దినమున పునరుత్థానము చెందినప్పుడు, పైకి ఆరోహణమై, పరిశుద్ధాత్మని తిరిగి పంపెను; ఈ రాత్రి సంఘము అదే మార్గదర్శకము చేయు కన్ను ద్వారా ఆయన యొక్క ప్రజలను సర్వసత్యములోనికి నడిపించునట్లు చూచుచున్నది. మరియు ఆయనే సత్యము.

మరియు లేఖనాలు తప్పిపోవు అనేది తెలుసుకుంటునందుకు మనము ఈ రాత్రి ఎంతో సంతోషంగా ఉన్నాము, మరియు అదే కన్ను ఈ రాత్రి మన మధ్యలోకి వచ్చి మనకు మార్గదర్శకముగా ఉంటుంది... లేక మనము ఈ రాత్రి దానియొక్క సన్నిధిలో ఉన్నాము; అది మనలను అనారోగ్యము నుండి ఆరోగ్యములోనికి తీసుకొని వెళ్ళుటకు మార్గమును చూపును, అదే మనలను ఇబ్బందుల నుండి సిలువ వైపుకి తీసుకొని వెళ్ళటకు మార్గమును చూపును, అదే మన బాధల నుండి మంచి ఆరోగ్యము వైపుకి తీసుకొని వెళ్ళుటకు మార్గమును చూపును, అదే మన పాపపు జీవితం నుండి దేవునిలోకి తీసుకొని వెళ్లే పరిశుద్ధ జీవితము వైపునకు మార్గమును చూపును. దేవుని యొక్క ఆ సన్నిధి చాలా దగ్గరగా ఉన్నది!

5

యేసు చెప్పెను, “ఇదిగో, నేను సదాకాలము మీతో ఉన్నాను, యుగసమాప్తి వరకు మీతో ఉన్నాను.” మరియు మనము అంతమునకు దగ్గరిలో ఉన్నాము. తరువాత యేసు దానిని ధృఢపరిచియునాడు, యేసు తననుతాను యూదులకు బయలుపరుచుకున్నప్పుడు మార్గము చూపు ఆ కన్ను ఆయనతోనే ఉన్నది, లేక వారి యొక్క అంతము, యూదుల సంఘ కాలము యొక్క అంతమునకు మునుపే, ఆయన దేవుని యొక్క కన్ను ద్వారా చూచి తనను బయలుపరుచుకున్నాడు.

ఆయన సమరేయులతో కూడా అదే విధముగా చేసియున్నాడు. మరియు ఇప్పుడు, అన్యజనులు మాత్రము మిగిలియున్నారు. మరియు ఈ రాత్రి దేవుడు అదే కన్ను ద్వారా ఇంకనూ చూచుచున్నాడు, ఎందుకనగా క్రీస్తు నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మరియు ఆయన ఇంకనూ దేవుని యొక్క కన్ను ద్వారా చూచుచున్నాడు. ఆయన తన కృపతో, మరియు పరిశుద్దమైన శక్తితో ఉన్నాడు, మనలను శుభ్రపరచి ఆయన తన కుమారులు కుమార్తెలుగా పిలుచుచున్నాడు, మనలను ఆయన ద్రాక్షరసముగా లేక ద్రాక్షరసములోని తీగెలుగా ఉపయోగించుట కొరకు, ఇంకనూ దేవుని యొక్క కన్ను ద్వారా చూచుచున్నాడు, ఏమి జరుగుతున్నదో మరియు ఏమీ జరుగనైయున్నదో చూచుచున్నాడు. మరియు మనము దేవుని కన్ను ద్వారా చూచినంత కాలము చీకటిలో నడువము.

6

దేవుని కన్ను ఆయన యొక్క చిత్తమును ప్రతిబింబిస్తుంది, ఆయన యొక్క ఆత్మను ప్రతిబింబిస్తుంది, ఆయన వాక్యమును ప్రతిబింబిస్తుంది. మనలను నిలకడగా ఉండునట్లు చేయునది (ఓడలో క్రింది భాగములో ఉండే అమరిక) లేనట్లయితే, మరియు మనకున్న ఈ తర్ఫీదులనీటితో శ్రేష్టమైనది మనమేమైనా చేయగలమా? మరియు మనకున్న ఈ నేర్పించే అన్నీ రకముల తర్ఫీదులతో (టైనింగ్) మరియు ఈ వేదాంత శాస్త్రముతో మనమేమైనా శ్రేష్టమైనది చేయగలమా? అది ఓడకున్న గొప్ప తెరలను మరియు మంచివైన వాల్ల్స్ మరియు ఓడలో ముఖ్యమైన భాగము (స్టెర్న్) మరియు సంచులు ఉండి, ఒక గొప్ప దిక్సూచి లోపల ఉండి, దానికి నియంత్రణ యంత్రము (రాడార్) లేకపోయినట్లయితే ఎలా? దానికి నియంత్రణ యంత్రము లేక దిక్సూచి గానీ లేకపోయినట్లతే ఎలా? అది కేవలం గాలి ద్వారా ఒక ప్రదేశము నుండి మరియొక ప్రదేశమునకు నడిపించబడుతుంది.

అయిననూ, దేవుడు దిక్సూచిని మరియు నియంత్రణను కలిగి యున్నందులకు మనము దేవునికి కృతజ్ఞులమైయున్నాము. ఈ దినమున మనము ఎచట నిలుచుని ఉన్నామో మరియు జరగబోవునది ఏమిటో ఆయన తెలియజేయును. “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను,” అని ఆయన చెప్పెను. కావున మనము దేవుని కన్ను ద్వారా చూద్దాం, మరియు ఆయన మనలను కల్వరి వైపునకు నడిపించుటను చూద్దాము.

మరియు ఆ కల్వరి వద్ద, సమస్తమూ సమప్తమాయెను. “ఆయన మన యొక్క అతిక్రమముల వలన గాయపడ్డాడు, ఆయన పొందిన దెబ్బలచేత మనము స్వస్థతను పొందాము.” యేసుక్రీస్తు కల్వరి పైన మరణించుట వలన ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పాపి రక్షించబడ్డాడు. యేసు కల్వరి వద్ద మరణించుట ద్వారా ప్రతి ఒక్క బలహీనమైన వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. ఆయన తన పనియంతటిని ముగించియున్నాడు.

7

ఇప్పుడు దేవుడు చేయుచున్న ఏకైక కార్యమేదనగా వాక్యమును ప్రకటించుటకు సేవకులను అభిషేకించుటయే, లేక సంఘమునకు వరములను ఇచ్చుట, ప్రభువైన యేసు యొక్క కార్యము ముగింపునకు వచ్చినదని తెలియజేయుట. మనము ప్రార్ధన చేయునపుడు, దానిని ఈ రాత్రి దేవుడు నీకు దయచేయును గాక, అదే నా ప్రార్ధన.

నిత్యజీవపు మరియు ఆశీర్వదించే దేవా, ప్రభువైన యేసును మృతులలో నుండి తీసుకొని వచ్చి, మరియు ఆయనను పైకి లేపిన దేవా, ఆయనను నీ అత్యున్నత సింహాసనము మీద కుడి ప్రక్కన కూర్చోపెట్టుకున్నావు, మా యొక్క ఒప్పుకోలును బట్టి మధ్యవర్తిత్వము చేయుచున్నావు. ఆయన వాక్యములలో నుండి మాకు భోధించిన ప్రతి ఒక్క వాక్యమును మేము విశ్వసిస్తున్నాము అని ఒప్పుకోలుతో ఈ రాత్రి మేము చెప్పుటకు మీ దగ్గరికి వస్తున్నాము.

మరియు ఒప్పుకోలుతో అదే కార్యమును చెపుతున్నాము. మరియు ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని మేము విశ్వసిస్తున్నాము. తరువాత ఆయన సన్నిధి ఇక్కడనే ఉన్నట్లయితే ఆయన 1900 సంవత్సరముల తరువాత కూడా జీవిస్తున్నాడని ప్రకటిస్తున్నాము, ఈ కాలము యొక్క అంతము... లేక అన్యజనుల కాలము యొక్క అంతము. ప్రభువైన దేవా, రమ్ము. మేము అందరము పలికే అన్ని మాటల కన్నా, మీరు పలికే ఒక్క మాటే మాకు మరింత అర్ధవంతమైనది. నీవు కేవలం నీ యొక్క శక్తితో మాట్లాడుటను చూడాలనుకుంటున్నాము, బహుశా అది కొన్ని హృదయాలను వారు మునుపెన్నడూ చేరని ఒక స్థలములోనికి కొనిపోవును.

8

మరియు అది విశ్వాసమును ఒక స్థాయి తీసుకొని వచ్చి బలహీనులను స్వస్థపరచి మరియు పాపికి నమ్మకము కలిగించును, ఆ కార్యము అతను లేక ఆమె యొక్క పాపముల నుండి మారుమనస్సు పొందునట్లుగా చేయును. ఆలాగైనట్లైతే మనము ప్రార్ధన చేద్దాం, ప్రభువా, ఈ రాత్రి, ఒక ఖచ్చితమైన మార్గములో మా శరీరాలను నీకు అప్పగించుకొనుచున్నాము. ప్రభువా, నీవు మాతో మాట్లాడుము, ఈ ఆశీర్వాదములు మాకు దయచేయుము.

మా స్వరమును విడుదల చేసి, ఈ మైక్రోఫోను ద్వారా పంపుము, అక్కడ ఏదో కొద్దిగా జీవం కలిగియున్నదని అది రుజువు చేయును, ఎందుకనగా ఈ మైక్రోఫోను వెనుక భాగములో శబ్దము చేయకునట్లయితే, అది మూగబోవును. కాబట్టి, ఓ దేవా, ప్రభువైన యేసు మాట్లాడుము, మా అంతట మేముగా నీ సేవకొరకు అప్పగించుకొనుచున్నాము. మేము నీ సన్నిది కొరకు పిలుచుచున్నప్పుడు, మరియు వినయముతో వంగి మరియు నిన్ను మహిమ పరుచుచున్నాము. మేము ఒక కార్యములు చేయుటకు హక్కును కలిగియున్నాము, ఎందుకనగా నీవు అది చేయుదునని వాగ్దానము చేసియున్నాను. మరియు నీవు దానిని వాటి ఆధారముగా చేస్తావు, నీవు చేయాలని కాదు, కాని నీవు దానిని వాగ్దానము చేసియున్నావు, మరియు లేఖనాలు ఎన్నటికి తప్పిపోవు. అవి ఖచ్చితముగా నెరవేరవలసియున్నది.

కాబట్టి, ప్రభువా, నీ సేవకులమై మేము, వినయముతో యేసుక్రీస్తు పునరుత్థానపు సూచన కొరకు ఎదురుచూచుచున్నాము. ఆయన నామమున అడుగుచున్నాము. ఆమేన్.

9

ఇప్పుడు, అది దేవుని మీద ఆధారపడియున్నది. మరియు ఆయన సన్నిధి ద్వారా మనలను ఆశీర్వదించియున్నట్లయితే, ఆయన ఆయనను బయలు పరచుకున్నట్లయితే, ఎమ్మాస్ నుండి వచ్చిన వారి వలే మసము కూడా సంతోషకరమైన హృదయములతో వెళతాము.

సేవకుడు మాట్లాడియున్నాడు, పాటలు పాడియున్నారు, మరియు ప్రార్థన కూడా చేయబడింది, లేఖనము కూడా ప్రకటించబడింది. ఇప్పుడు, ఇది దేవుడు మాట్లాడే సమయము. మరియు దేవుడు మనలా ఈ రకముగా మాట్లాడడు.... ఇక్కడ ఉన్నవారు ఎవరైనా ఉండేవరకు ఈ విధముగా, మరియు కార్యములను జరిగించును,

“అనేక బలమైన కార్యాలు వారి యొక్క అవిశ్వాసము వలన ఆయన చేయలేకుండెను.” కాబట్టి, ఒకవేళ ఆయన మనలను దీవించుటకు ఈ భవనములోనికి ఈ రాత్రి వచ్చినట్లయితే, మన యొక్క వివేచనము మరియు మన ఉద్రేకలు కదులుతాయి మరియు ఆయన తనకు తానుగా ఆయనే ప్రియమైనవాడని, పునరుత్థానము చెందిన యేసు ఆయనేనని తెలియజేసుకుంటాడు.

ఇప్పుడు, మనము ప్రార్దనా వరుసను పిలుద్దాము, ఎక్కువ మంది కాదు, కాని కొద్ది మందిని వేదిక వద్దకు తీసుకొనిరండి. నా దగ్గర ప్రార్థనా కార్డులున్నాయని వారు చెప్పుటను నేను నమ్ముచున్నాను, ప్రార్ధనా కార్డు “పి,” అది పౌలు వలే ఈ రాత్రికి ఇది ఇవ్వబడుతుంది. గత రాత్రి వారిలో నుండి ఒక గుంపును తీసుకున్నాము, కావున ఈ రాత్రి 50 మందికి పైగా ఉండవచ్చనని నేను విశ్వసిస్తున్నాను, గతి రాత్రి 75 మంది లేక కొద్దిగా ఎక్కువ ఉండవచ్చును.

10

కాబట్టి, కొద్దిమందిని తీసుకొని ప్రారంభించుదాము, సమయము అయిపోకముందే, మన నుండి సమయము త్వరగా అయిపోకముందే, 85 నుండి ప్రారంభించి 100 వరకు చేద్దాం, ఒకరు ఇక్కడికి పైకి రండి. మరియు పి-85 కార్డును ఎవరు కలిగియున్నారు? మీరు మీ చేతిని పైకి ఎత్తినట్లయితే మేము మీరు ఎక్కడ ఉన్నారో చూడగలము? బహుశా నేను సరైన స్థలములో లేననుకుంటాను. నేను ఏమి అన్నాను పి-65? ఓ, ఆ స్త్రీ ఇక్కడే ఉన్నది, స్త్రీ, మంచిది, ఇక్కడికి రమ్ము.

86, మీ చేతిని పైకెత్తగలరా? ప్రార్ధనా కార్డు పి-86. స్త్రీ.. ప్రతి ఒక్కరూ ప్రార్ధనా కార్డులను పొందుకున్నారా, చూడండి, వారు పైకి లేవలేకపోతున్నారా, లేక అటువంటి ఏదైనా, లేక మీ చేతులను కదపలేక పోతున్నారా, లేక మీరేమైనా... మీ పొరుగువారి కార్డులను చూడండి. బహుశా, వారు వినలేని చెవిటి వారు మరియు మూగవారు అయ్యుండవచ్చును.

85, 86, 87. ప్రార్ధనా కార్డు 87, బయట స్థలములో నిలబడండి, భవనములో అంతా కార్డులు ఇవ్వబడ్డాయి. బాలురు వాటిని బయటనే ఇచ్చియున్నారు. 87, 88, ఓ, దానిలో... మంచిది. 88, 89. ప్రార్థనా కార్డు పీ-89. అక్కడ స్త్రీ ఉన్నది. స్త్రీ నీకు కృతజ్ఞతలు, ఆమెకు సహాయం చేయండి. బహుశా, ఆమె వినలేనిది (చెవిటి) అయ్యుండవచ్చును. 89, 90. మీ చేతులను పైకెత్తగలరా? నేను వాటిని చూడవచ్చునా, ఏ ఒక్కరైనా? ప్రార్ధనా కార్డు పి-90? స్త్రీ.. మంచిది.

91, ప్రార్ధనా కార్డు పి-91 92, 93, 94, 94. మంచిది. 95, 95, ప్రార్ధనా కార్డు పి-95. మీ చేతులను పైకెత్తగలరా? వరుసలో 96, చూశారా, అది ఎవరో... ఇప్పుడు, మీరు ఇక్కడకి వచ్చుట ద్వారా మీరు స్వస్థతని పొందుకుంటారని కాదు, దానిలో ఎటువంటి అర్ధము లేదు. మీరు కూర్చునియున్న కుర్చీలోనే స్వస్థతని పొందుకుంటారు, కేవలం మీరు అదే విధముగా ఇక్కడ స్వస్థతని పొందవచ్చును.

96, 97, 98, 99, 100. ఇప్పుడు, మనము వీటిని సమయములో పూర్తి చేసినట్లయితే, మనము వెనుకకు వెళ్లి మరోక దగ్గర నుండి ప్రారంభించి వారిని పైకి తీసుకొని వద్దాము.

11

కాని ఇప్పుడు, మీరు ఇక్కడకి వచ్చుట ద్వారా మీరు స్వస్థతని పొందుకుంటారని కాదు. ఒక... మీరు ఇక్కడ ఏ మాదిరిగా స్వస్థతని పొందుకుంటారో బయట కూడా అదే విధముగా స్వస్థతని పొందుకుంటారు. మీ విశ్వాస స్థాయిని బట్టి దేవుడు మిమ్ములను స్వస్థపరుస్తాడు, మరియు అది ఒంటరిగానే. కేవలం నీవు నమ్మినట్లుగా.

ఇప్పుడు, బయట ఉన్నవారిలో ఎంతమంది దగ్గర ప్రార్ధనా కార్డులు లేవు, మరియు మీరందరు దేవుడు మిమ్ములను స్వస్థపరచాలని ఆశిస్తున్నారా? మీరు వేదిక దగ్గరకు పిలుపును పొందలేకపోవచ్చును, కాని మిమ్ములను దేవుడే స్వస్థపరచాలని ఆశిస్తున్నారా, ఈ భవనములో ఎక్కడ ఉన్నా, కేవలం మీ చేతులని పైకెత్తండి. వారిని ఒక వరుసలో ఉంచండి, ఆ కారణము చేతనే మేము బయట కార్డులను ఇచ్చాము.

12

మంచిది. మీరు ఇది చేయండి. మీరు కేవలం క్రీస్తుని చూడండి. పరిశుద్ధ గ్రంధము చెబుతుంది, “ఆయనే ప్రధానయాజకుడని మరియు ఆయనే మన శారీరక బలహీనతల యొక్క అనుభూతుల ద్వారా స్పర్శిస్తాడని.” మీలో ఎంత మందికి ఆ విషయం తెలుసును? పరిశుద్ధ గ్రంథము దానినే భోదిస్తుంది.

మంచిది, ఒక స్త్రీ, ఆయన వస్త్రపు చెంగుని ముట్టినప్పుడు ఆయన ఈ విధముగా అన్నాడు, “నేను బలహీనమయాను.” మరియు ఆమె వినుటకు వచ్చినవారిలో ఎక్కడికో వెళ్లిపోయినది. మరియు యేసు చెప్పెను ఆయన బలహీనపడ్డారని, ఆయన నుండి ప్రభావము బయటకు వెళ్లినది. తరువాత ఆయన ఆమెను కనుగొనేంత వరకు చుట్టూ చూశాడు. మీలో ఎంతమంది ఆ కథను చదివారు?

మంచిది, అయితే పరిశుద్ధ గ్రంధము హెబ్రీయులకు 13:8లో, ఆ “యేసు నిన్న, నేడు, మరియు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని చెప్పుచున్నదా?” లేఖనాలు చెబుతున్నాయి, “ఇంకనూ ఆయనే ప్రధానయాజకుడని మరియు ఆయనే మన శారీరక బలహీనతల యొక్క అనుభూతుల ద్వారా స్పర్శిస్తాడని.” అయితే ఈ రాత్రి మీరు చూడండి, ఒక ప్రసంగీకుడిని కాదు, మీ సహోదరీ లేక సహోదరులలో ఒకరిని కాదు, మీరు కల్వరిని చూడండి, క్రీస్తు ఏమైయున్నాడో చూడండి... ఖచ్చితముగా కల్వరిని కాదు. కల్వరి అనగా అక్కడనే ధర చెల్లించబడియున్నది, కాని ఈ రాత్రి క్రీస్తు కల్వరి దాటి వెళ్లియున్నాడు. ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. మన యొక్క ఒప్పుకోలును బట్టి మధ్యవర్తిత్వం వహించుటకు నిత్యం జీవించే ఉన్నాడు. ఈ రాత్రి క్రీస్తు యొక్క ఆత్మ మన మధ్యలో ఇక్కడే ఉన్నది.

13

మరియు ఆ ప్రజలు పైకి వరుసలో వచ్చునప్పుడు గమనించండి. క్రీస్తు భుమి మీద ఉన్నపుడు, ఆయన ఇలా అన్నారు, “నేను దేవుని వద్ద నుండి వచ్చాను, నేను దేవుని వద్దకే వెళతాను.” అది సత్యమని మీకు తెలుసా? అరణ్యములో ఇశ్రాయేలియుల సంతతితో క్రీస్తు ఉన్నాడని మీలో ఎంతమంది నమ్ముతారు? ఇశ్రాయేలియులను అగ్నిస్తంభము ద్వారా నాయకత్వము వహించినది క్రీస్తేనా? దూత ఆ మండుచున్న పొగలో ఉండి నిబంధస చేసినదని మీరు నమ్ముతారా? అది ఆయనేనని ఆయనే చెప్పియున్నాడు.

“నేను అబ్రహాము కంటే ముందు ఉన్నవాడను.” మరియు మోషేతో పొదలో మాట్లడినది నేనే. తరువాత దేవుడే పాపమును తీసివేయుటకు శరీరధారిగా వచ్చెను, అది ఆయన తన యొక్క కుమారుని శరీరములో ఉండేను, క్రీస్తు. ఎందుకనగా తనకుతాను ప్రపంచమును పునరుద్దరించుట కొరకు దేవుడు క్రీస్తులో ఉన్నాడు.

ఆయన క్రీస్తు ద్వారా తననుతాను తెలియపరచుకున్నాడు, మరియు యేసు చెప్పెను, “నేను దేవుని వద్ద నుండి వచ్చియున్నాను, అగ్నిస్తంభము నుండి, మరియు నేను తిరిగి అదే స్థితిలోకి వెళ్ళుదును.” ఆయన మృతి చెందిన తరువాత, పాతిపెట్టబడి, మరియు పునరుత్థానము చెందాడు, మరియు ఆయన తిరిగి వెలుగుగా మారాడు. పౌలు దమస్కు మార్గములో ఆయనను కలుసుకున్నాడు. అది నిజమని మీలో ఎంతమందికి తెలుసు?

మంచిది, ఏ ఆత్మయైనా దానికి అదే సాక్ష్యమును చెప్పును. ఏ జీవితమైనా తనను తానే సాక్ష్యమును చెప్పును. ఒక జీవితం యొక్క.. నేను ముందుగానే చెప్పినట్లు, ఒక గుమ్మడికాయ నుండి తీయబడిన మద్యము దానిని తీయబడిన గుమ్మడికాయ యొక్క జీవిత కాలము మీద ఆధారపడి యుండును. ద్రాక్షాలు ద్రాక్షాల మీద ఆధారపడును.

యేసు చెప్పెను, “నేనే ద్రాక్షావల్లిని, మీరు తీగలు.” నీలో ఉన్న జీవం అలాగున్నది... నాలో నిషేధించబడిన దానియొక్క ఆత్మ ఉన్నదని ఒకవేళ నీతో చెప్పినట్లయితే, నా దగ్గర పెద్ద తుపాకులు ఉన్నాయని మరియు నాతో ఉండుట ఎంతో భయానకముని నీవు తలుస్తావు. నాలో ఒక చిత్రకారుడి యొక్క ఆత్మ ఉన్నదని ఒకవేళ నీతో చెప్పినట్లయితే, చిత్రాలను చిత్రించే చిత్రకారుడు వలే కనపడతాను.

మరియు ఒకవేళ మనము క్రీస్తు యొక్క ఆత్మ మనలో ఉన్నదని చెప్పినట్లయితే, క్రీస్తు చేసిన కార్యాలను మనము చేస్తాము.

14

ఇక్కడ ఉన్న ఛాయా చిత్రము ఏమిటంటే, అది నాది కాదు; నా దగ్గర చేయుటకు ఏమియు లేదు. ఇది క్రీస్తు తనంతట తాను ప్రజలకు తెలియపరుచుకొనుట. తరువాత, ఇది జర్మనీలో మరియు వివిధ స్థలములలో ఈ ఛాయాచిత్రము (ఫోటో) తీయబడింది, ఆ గొప్ప వ్యక్తి ముందు... చివరకు ఎఫ్.బి.ఐ ( అన్నీ రకాల పరిశోధనలు చేసి నిజాలను కనిపెట్టుట కొరకు తర్ఫీదు పొందిన ఒక దర్యాప్తు సంస్థ - అనువాదకుడు) ఆ ఛాయా చిత్రమును పరీక్షించినది: జార్జ్, జె. లేసి.

మరియు ఇది సహజాతీతమైనదని నిర్ధారణ అయ్యేంత వరకు, మరియు అది చూచుటకు అదే విధమైన అగ్నిస్తంభము వలే ఉన్నది, తరువాత ఆది క్రీస్తు ఇంకనూ తన సంఘముతోనే ఉన్నాడు. “నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను.” తరువాత, “నేను చేయు కార్యములు మీరును చేయుదురు.” అది క్రీస్తు యొక్క ఆత్మయై యున్నట్లయితే, అదే రకమైన కార్యములను చేయును. ఒకవేళ అది క్రీస్తు యొక్క ఆత్మ కానట్లయితే, అది అటువంటి కార్యములను చేయలేదు. దీనిని బట్టి, మనము ఇలాగు అందాము...

15

స్త్రీ, నీ కొరకేనా ప్రార్దించవలసినది? ఇక్కడ ఈ భవనములో చేతులెత్తి నీలబడినవారిలో నేను ఎంతమందికి తెలియదో వారిని నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను? మీ చేతులను చూడనివ్వండి, ఈ భవనములో ప్రతి ఒక్కరు, ప్రార్ధన కొరకు వరుసలో రండి, నాకు మీరు తెలియదు.

పరిశుద్ధ గ్రంథము యొక్క చిత్రముపటము ఇదే. ఇప్పుడు, జ్ఞాపకము ఉంచుకోండి, పరిశుద్దాత్మ చేత పరిశుద్ధ గ్రంథము వ్రాయబడింది. మరియు పరిశుద్ధ గ్రంథము వ్రాసిన ఆత్మ ఇంకనూ జీవించుచూనే ఉన్నది. ఆయనలో ఎటువంటి మార్పు లేదు. ఆయనకు అప్పుడు తెలిసిన దాని కన్ననూ అధికముగా ఆయనకు నేటి దినమున కొత్తగా ఏమియూ తెలియవలసిన అవసరంలేదు, ఎందుకనగా ఆయన అనంతుడైయున్నాడు.

మరియు ఒకవేళ దేవుడు ప్రారంభములో ఏదైననూ చేసియున్నట్లయితే, మరియు అదే రకమైన కష్టములు తిరిగి వచ్చినట్లయితే, మరియు ఆయన ప్రారంభములో కార్యములు చేసినట్లుగా కాకుండా, మరో విధముగా కార్యములు చేసియునట్లయితే, ఆయన కార్యములకు ఆయనే విరుద్దముగా చేసినట్లు, ఆయన తరువాత కూడా అదే విధముగా చేయవలసియున్నది. ఆయన మనవలె కార్యములు చేసెడివాడు కాదు, ఎందుకనగా ఆయన అనంతుడైయున్నాడు.

పరిశుద్ధ గ్రంథము రెండు అయి యున్నది, అది చరిత్ర, అది ఒక ప్రవక్త, అది ఒక ప్రేమ కథ, మరియు అది మన కొరకు క్రీస్తుని చిత్రీకరిస్తుంది. అట్లయితే పరిశుద్ధ గ్రంథము యొక్క క్రీస్తు మృతి చెందలేదు కాని, జీవించేయున్నాడు; ఆయన పరిశుద్ధ గ్రంథములో ఏలాగు ప్రత్యక్షపరచుకొనియున్నాడో, అలాగే తనకుతాను ప్రత్యక్షపరచుకొనియున్నాడు.

16

ఇప్పుడు, ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది, ఒక ప్రియమైన, ప్రేమ కలిగిన వ్యక్తి.. నేను ఆమెను ఎన్నడునూ చూడలేదు. ఆమె యొక్క వయస్సు షుమారుగా నా తల్లి యొక్క వయసుతో సరి సమానముగా ఉండవచ్చును. నేను నా జీవితంలో ఆమెను చూడలేదు. మేము ఒకరికి ఒకరము పూర్తిగా అపరిచితులమైన వ్యక్తులుగా ఉన్నాము. మరియు ఇదిగో ఇక్కడ పరిశుద్ధ గ్రంథము యొక్క దృశ్యములలో ఒక చిత్రమున్నది, పరిశుద్ధ యోహాను 4వ అధ్యాయములో ఒక స్త్రీ మరియు ఒక పరుషుడు ఉన్నదానివలే ఉన్నది... యేసు ఆ బావి వద్ద ఒక స్త్రీతో ఉన్నదానివలే, మరియు ఆయన ఆ స్త్రీ తో ఇలాగు అన్నాడు.

ఇప్పుడు, గమనించండి, ఆయన యెరికో మార్గములో ఉన్నాడు, కాని ఆయన సమరయ వెళ్లవలసియున్నది. ఎందుకు? ఆయన దానినే పరిశుద్ధ యోహాను 5వ అధ్యాయములో మాట్లాడియున్నాడు, “మొదటగా నా తండ్రి నాకు చూపునంత వరకు నా అంతట నేను ఏమియూ చేయలేను.” మీరు ఆ లేఖన భాగమును విశ్వసించెదరా? తరువాత తండ్రి ఆయనకు ముందుగా చూపకుండా ఆయన ఒక అద్భుతమును కూడా చేయలేదు.

“నిశ్చయముగా, నిశ్చయముగా, నేను మీతో చెప్పుచున్నాను, కుమారుడు తనంతట తానుగా ఏమియూ చేయడు, కాని తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో, వాటినే కుమారుడును అలాగే చేయును,” చూశారా.

17

17 మరియు నా ప్రియమైన, ప్రేమకలిగిన సూదరీ, నేను నీకు చేయగలిగిన ఒక మంచి సహాయం చేయగలను లేక నీ సమస్య ఏదైయునష్టటికి... నీవు రోగిగా కూడా లేవు. నాకు తెలియదు. నేను ఎన్నడూ నిన్ను కలువ లేదు. నేను నీకేదైనా సహాయం చేయగలనూ అంటే... ఒకవేళ అది ఆర్థిక సంబంధమైనదైతే, నేను నీకు కొద్దిగా ధన సహాయం చేయగలను, ఎందుకనగా నేను కొద్దిగానే కలిగియున్నాను కాబట్టి. ఒకవేళ నీవు అంతర్గత సమస్యను కలిగియున్నట్లయితే, నీకు సంబంధించిన ప్రియమైన వారితో మాట్లాడుటకు నేను ప్రయత్నిస్తాను. నేను చేయగలిగినదంతా చేస్తాను.

కాని, ఇప్పుడు, ఇది స్వస్థతకు సంబంధించినది... ఒకవేళ అది స్వస్థత అయితే, నీవు క్రీస్తు నుండి స్వస్థత పొందగోరుతున్నట్లయితే, అది ముందుగానే జరిగిపోయినది. ఆ కార్యము చేయటకు అది నాలో కాని మరెవ్వరిలో గానీ లేదు. అది దేవునిలో మాత్రమే ఉన్నది.

మరియు దేవుడు ఆయన వాక్యము ప్రకారం దానిని చేస్తాడు. తరువాత, ఒక సేవకులుగా, మేము చేయు ఏకైక కార్యమేదనగా, లేఖనాల ద్వారా దానిని వివరించుటకు, కొంతమంది మనుష్యులు ఆ కార్యములు చేయుటకు సరిపోయినవారు. అదియే ప్రారంభపు మార్గమైయున్నది. అది ఆ మాదిరిగా ఉన్నది, అది నీవైనా కావచ్చును లేక నేనైనా కావచ్చును. కాని దేవుడు ఎంతో మంచివాడు. ఆయన ప్రతియొక్క చిన్న రాయిని కదిలించుతాడు కాబట్టి ప్రతి ఒక్కరూ... ఆయన ప్రజలను ప్రేమిస్తాడు, మరియు ఆయన వారిని తీసుకొని వచ్చుటకు ఇంకా ఏదో చేస్తాడు, ఆయన యందు విశ్వాసము ఉంచుటకు మరియు నమ్మకమును కలియుండుటకు ప్రయత్నిస్తుంటాడు.

18

ఇప్పుడు, ప్రభువైన దేవుడు నీవు ఇక్కడ ఎందుకొరకు ఉన్నావు అని నాకు బయలుపరిచి యున్నట్లయితే, అది కేవలం ఆయన అక్కడ సమరయ స్త్రీ దగ్గర బావి వద్ద చేసియున్నట్లే. ఆయన, అమె యొక్క సమస్యను కనుగొన్నాడు. ఆయన ఎప్పుడైతే ఆమె యొక్క సమస్యను ఆమెతో చెప్పియున్నాడో, ఆమె ఇలా అన్నది, “అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మెస్సీయ వస్తాడని మాకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయును.”

మరియు ఆమె ఆయనను ప్రవక్త అని విశ్వసించినది, కాని యేసు చెప్పెను, “నీతో మాట్లాడుచున్నది నేనే.”

మరియు ఆమె పట్టణములోకి పరుగెత్తికొని పోయి ఇలా చెప్పెను, “మీరు వచ్చి, నేను చేసిన వాన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. ఆయన మెస్సీయ కాడా?” అని మెస్సీయ యొక్క సూచన అయినట్లయితే, ఇప్పుడు నిన్న, నేడు, నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నట్లయితే, ఇదియూ మెస్సీయ సూచనే.

తన దగ్గరకు తీసుకొని రాబడినవారికి ఆయన అదే కార్యమును చేసి యూదులకు ప్రకటించియున్నాడు. ఫిలిప్పు పెళ్లి నతానియేలుని పర్వతమునకు సుమారు 30 మైళ్ళ అవతల కనుగొని, వెనుకకు తీసుకొని వచ్చాడు. మరియు యేసు అతనితో ఇలా చెప్పెను, నీవెక్కడ ఉన్నావో నేనెరుగుదును, అక్కడ ఆయన ఏమి చేశాడు.

దానిని గురించి పరిసయ్యులు ఏమని ఆలోచించారు? దానిని వారు దెయ్యపు క్రియ అన్నారు. మరియు యేసు చెప్పెను, “నేను మిమ్ములను క్షమిస్తాను, కాని పరిశుద్ధాత్మ వచ్చి ఇదే కార్యమును చేసినప్పుడు, ఒక్క మాట వ్యతిరేకముగా మాట్లాడువానికి, ఈ యుగమందైనను లేక రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.”

19

ఇప్పుడు, మీరు గమనించారా మనమెక్కడ నిలిచియున్నమో. ఇప్పుడే సువార్త సత్యమైనదో మరియు అసత్యమైనదా నిరూపించబడవలసియున్నది. ఒకవేళ క్రీస్తు ఆ విధముగా వాగ్ధానము చేసియునట్లయితే, ఆయన - ఆయన యొక్క వాక్యమునకు బద్దుడైయుంటాడు.

మరియు మనము సేవ చేస్తున్న ఈ మతము ఈ ప్రపంచమంతటిలో దేవుడే ఏకైక మతము అదే వారి యొక్క దేవుడిని సజీవుడని నిరూపించుచున్నది అని ఎరుగుట ఎంత ఓదార్పును ఇచ్చును. 20 లేక 30 మతాల ప్రజల ముందు నిలబడి యుండుటను నేను చాలా గౌరవముగా భావిస్తున్నాను, వివిధ రకాల మతాల ప్రజలు వివిధ రకాలా దేవుళ్ళను నమ్ముతారు, మహమ్మదీయులు, బౌద్దులు, మరియు సిక్కులు, మరియు జైనులు, మరియు ఓ, అన్నీ వివిధ రకాలు, మరియు దుప్పటి కప్పుకొను స్థానికవారు మరియు వారి చేతిలో విగ్రహాలు ఉంటాయి.

కాని వారిలో ఏ ఒక్కరూ... మనిషి పెద్ద ప్రకటన చేసియున్నాడు, కాని ఒకే ఒక్క మనిషి ఈ విధముగా చెప్పియున్నాడు, “నేను మరణించుటకును మరియు తిరిగి జీవించుటకును అధికారమును కలిగియున్నాను.” మరియు ఆయన దానిని చేసియున్నాడు. మరియు 1900 సంవత్సరములు — ఆయన నామము ఆశీర్వదించబడును గాక — ఆయన ఇంకనూ జీవిస్తున్నారు. ఆయన మృతి చెందలేదు.

మీరు చూచినట్లు, ఎక్కడనో చీకటి మూలలల్లో ఉండి కాదు. ఇదిగో ఇక్కడ వెలుగు క్రింద. నేనును మరియు ఈ స్త్రీ మొదటిసారిగా కలిసినట్లుగా, ఈ రాత్రి క్రీస్తు జీవించియున్నాడని నేను ప్రకటించుచున్నాను.

20

మరియు ఒకవేళ నీ యంతట నీవు ఆత్మీకు అప్పగించుకున్నట్లయితే, నీ ద్వారా ఆయనను మాట్లాడనియుము. ఇప్పుడు, అది ఖచ్చితముగా మానవాతీతమైన కార్యమైయుంటుంది. దానిని నీవు ఏమగుకుంటవో దాని మీద ఆధారపడియుంటుంది. నీవు పరిసయ్యుల వైపు ఉన్నవాడివైతే, నీపు వారికి ఇవ్వబడిన ప్రతిఫలమును అందుకుంటవు. అది దయ్యము అని వారన్నారు, భవిష్యత్తును చెప్పువాడు, లేక ఇంకేదో, బయల్జేబూబు, దెయ్యాల రాకుమారుడు అని; ఎవరికైనా తెలుసు చీకటి మంత్రాలు మరియు సోది చెప్పుట అనేవి దెయ్యూలకు సంబంధించినవని. ఖచ్చితముగా. అది సాతాను వక్రీకరించిన కార్యమైయున్నది.

నిజమైన దేవుని యొక్క ఆత్మ కేవలము క్రీస్తు దగ్గర నుండి మాత్రమే వచ్చును. ప్రభువు మనకు సహాయము చేయును గాక, మన సహోదరి. ఆయన అనుగ్రహించును గాక... మరియు ఆయన నీకు చెప్పినట్లయితే.... ఇప్పుడు, ఒకవేళ నేను నీ మీద చేతులు వేసి “నీవు స్వస్థత పొందుకున్నావు, వెళ్ళము” అని అన్నట్లయితే, నీకు దానిని అనుమానించే హక్కున్నది. కాని ఆయన నీ జీవితంలో జరిగినది ఏదైనా నీకు చెప్పినట్లయితే, మీకు తెలుసా అది ఏమైనా... దానిని మీరు మీ జీవితంలో ఎన్నడో చేసియున్న విషయము, నతానియేలుకు మాదిరిగా; లేక అయిదుగురు భర్తలు కలిగిన ఆ స్త్రీ వలె. అది సత్యమా లేక అసత్యమా అన్నది మీకే తెలుస్తుంది. దానికి నీవే తీర్పరివి.

నీవు దేవునితో నిజాయితీగా ఉండుము, నీవు ఉంటున్నావా? నేను దేవునితో నిజాయితీగా ఉంటున్నాను. మీరందరూ దేవునితో నిజాయితీగా ఉండి మరియు చెబుతారా, “ఆయన దానిని చేసినట్లయితే, నాలోని ప్రతి యొక్క సంశయమును తీసివేయుము. ఆయన మృతులలో నుండి లేచియున్నాడని నేను విశ్వసిస్తున్నాను.” మీ చేతులను పైకి ఎత్తుట ద్వారా ఆ విషయమును ఆయనకు వాగ్దానము చేస్తారా? దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆయన మీకు దానిని దయచేయాలని నేను ప్రార్థిస్తాను.

21

ఆ స్త్రీ, కిళ్ళ నొప్పులతో బాధపడుతున్నది. అందునిమిత్తమై, ప్రార్ధన కొరకే ఆమె వచ్చియున్నది. అది ఖచ్చితముగా నిజమైయున్నది. అది మంచిది, నీవు నీ చేతిని పైకెత్తుము. ఇప్పుడు నీవు నమ్ముచున్నావా? ఇప్పుడు, ఆమెతో మరి కొద్దిగా మాట్లాడుదము. నీవనవచ్చును, “సహోదరుడా బ్రెన్హాం, నీవు దానిని ఊహించి ఉండ వచ్చును.” చూచారా, ఇప్పుడు నీ ఆలోచనలను నీవు దాచి ఉంచలేవు. మీరు వాటిని పట్టుకొనియుండుడి. ప్రభువు వాటిని బయలుపరుస్తాడు.

చట్టనూగ ప్రజలారా, నేను చెప్పేది వినండి. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడిన దానికి కేవలం రెండు అడుగుల దూరంలోనే ఆ వెలుగు దూత యొక్క ఛాయచిత్రము (ఫోటో) తీయబడింది. అది “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” మరియు తీర్పు దినమున దానిని కనుగొనండి, అది నిరూపితమౌతుంది. ఆయన సిలువ వేయబడక ముందు ఆయన ఏమైయున్నాడో అనునది ఆయన యొక్క సన్నిధి రుజువును మీరు ఒకవేళ నమ్మకపోయినట్లయితే. అప్పుడు తీర్పు దినాన, మీరు దానిని చూస్తారు.

22

అవును, ఆ స్త్రీ దేనినో కదుపుటకు ప్రయత్నం చేయటను నేను చూస్తున్నాను. అది ఒక కుర్చీయైయున్నది. ఆమె కుర్చీలో నుండి లేచి వెనుకకు మరియు క్రిందకు జరుగుతున్నది. ఆమె తిరిగి లేచినది. ఆమె ఒక గదిలో ఉన్నది. అది ఒక చేయి కలిగిన చిన్న కుర్చీ వలే ఉన్నది. ఆమె ఆ స్థలములో నుండి బయటకు వచ్చుటకు ప్రయత్నము చేయుచున్నది. ఆమె కిటికీ వైపునకు వెళుతున్నది. ఆమె యొక్క వెనుక భాగమును ఆమె పట్టుకున్నది. అది ఆమె యొక్క వెన్ను నొప్పి. అది ఆమె వెన్ను. అది ఖచ్చితముగా నిజము.

మీరు మరెవరికో కూడా ప్రార్ధన కావాలని కోరుకుంటున్నారు. అది మీ యొక్క కుమార్తె కొరకు. మీ కుమార్తెలో ఉన్న సమస్యను దేవుడు నాకు బయలుపరుస్తాడని మీరు విశ్వసిస్తున్నారా? ఆమెకు మైగ్రేన్ (తలలో ఒకవైపున మాత్రమే కలుగు విపరీతమైన నొప్పి ) సంబంధించిన తలనొప్పులునాయి. అది “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.”

మీ హృదయంలో ఇంకా ఏదో పోయబడుచున్నది. మరొకరి కొరకు కూడా ప్రార్ధన కావాలని అనుకుంటున్నారు. అది మీ యొక్క కుమారుడి కొరకు. అతని మీద ఒక నల్లటి నీడ కమ్ముకొనియున్నది. మీరు అతని యొక్క ఆత్మరక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు. అతడు ఒక పొపి. అది “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” అది సత్యము. నీవు నమ్ముచున్నావా? నీవు దానిని నమ్ముచున్నట్లయితే... నీతో ఏదో మాట్లడుచున్నదని నీకు తెలుసు. స్త్రీ, అది నేను కాదు. నీవు నా స్వరమును విన్నావు. మరి ఇప్పుడు నీలో ఉన్న ఆ యొక్క అనుభూతి కొద్దిసేపటి క్రితమే పైకెత్తబడింది, ఆలాగు జరగలేదా? నీకును నాకును మధ్యన వెలుగున్నది, ఆ దూత ఉన్నది. ఇప్పుడు అది నీ దగ్గర నుండి వెడలిపోయింది. నీవు అడిగిన ప్రతి ఒక్కటీ నీవు పొందుకున్నావని నేను నమ్ముచున్నాను. నీవు అడిగినది ప్రతి ఒక్కటి నీవు కలిగియున్నానని విశ్వసించి వెళ్ళుము. దేవుడు నిన్ను దీవించును గాక.

వేల్ సహోదరుడా, నీవు ఇక్కడకు వచ్చెదవా. బిల్లీ ఎక్కడ లేక ఇక్కడ ఉండవలసినవారు ఎక్కడున్నారు.

23

స్త్రీ, నీవు ఏలాగున్నావు? ఇప్పుడు ఆ స్త్రీకి ముందు, మీ హృదయము అంతటితో ఇప్పుడు ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఇప్పుడు, అక్కడ బయట ఉన్నవారు, అక్కడ ప్రార్ధనా కార్డులు లేవు, బాల్కనీలో పైన, మీరు ఎక్కడైతే ఉన్నారో, కేవలం చూడుము, చెప్పండి, “ప్రభువైన యేసు, ఇది సత్యమైతే, ఆ మనిషిని అక్కడ నుండే నాతో మాట్లడనీయుము. ఆయనకు అనుమతిని ఇవ్వము. నీవు మారనివాడివి... నాకు అది మనిషి కాదని తెలుసు, ఎందుకనగా అతనికి నేను తెలియదు. ఇదిగో నేను కేవలం ఈ వినుటకు వచ్చిన వారిలో కూర్చొనియున్నాను. కాని కొద్దిసేపటి క్రితం అతను నీవే ప్రధానయాజకుడవని మరియు మా బలహీనత యొక్క అనుభూతి ద్వారా నిన్ను తాకవచనని మాకు చెప్పియున్నాడు. మరియు అతడు మాతో మాట్లడుటకు నీవు అనుమతిని ఇవ్వుము, మరియు అది నాలోని ప్రతి ఒక్క సంశయమును నాలో నుండి తీసివేస్తుంది. మరియు నేను నిన్ను నమ్ముతాను, ప్రభువైన దేవా, నీవు నన్ను స్వస్థపరచాలని మరియు నన్ను బాగుచేయాలని కోరుచున్నావు.”

నీవు దానిని చేసి మరియు ఏమి జరుగునో కనుగొనుము. నీవు వినుటకు వచ్చినవారిలో కుర్చునియున్నావు, అవును... నేను ఎందుకు చెప్పుచున్నాను అంటే, ప్రజలు ఆ ఆలోచన మీద, ఏదో ఒక దాని మీద వారు మనస్సులో పరుగులెత్తుతుంటారు, తిరుగుతుంటారు. మీరు తిరుగవద్దు, కేవలం నమ్మకము కలిగియుండుము. ఆయన చెప్పెను, “నీవు నమ్మినట్లయితే సమస్తము సాధ్యమే.” అన్ని కార్యాలు; అది అద్భుతమైనది కాదా? సమస్తమును సాధ్యమే.

24

నా సహోదరి? మనము ఇంతకముందు ఎటువంటి పరిచయం లేనివారము, నా వైపునకు ఒక నిజాయితీ కలిగిన స్త్రీ వలె చూడుము, నీవు క్రైస్తవురాలివి, ఎందుకనగా నీ ఆత్మ స్వాగతిస్తునది కనుక. స్త్రీ, నీవు ఎరిగియున్నావు, నీ సహోదరుని సన్నిధిలో నీవు ఆ విధమైన అనుభూతి పొందలేవు.

ఇప్పుడు, నీవు నాతోను మరియు ఇక్కడ ఉన్న వినుటకు వచ్చిన వారితోనూ నిజాయితీగా ఉండుము. కేవలం ఇప్పుడే, ఏదో ఒక స్థానమును ఆక్రమించుకోబోవుట ప్రారంభమగుచున్నది. అది ఏమిటి? ఇక్కడ నీవు చూసిన దూత యొక్క ఆ చిత్రము పఠము. అది ఇపుడే నీ మీదకు వచ్చియునది.

ఇప్పుడు, నాకు, నీవు నిజమైన వెలుగును చూస్తున్నావు. కాని నా నుండి నీవు కదలి వెళ్ళుట నేను చూస్తున్నాను. మరియు నీవు కీళ్ళ నొప్పుల గురించి కూడా ప్రార్థన చేస్తున్నావు. మరియు నీ భర్త కొరకు నీవు ప్రార్ధన చేస్తున్నావు, మరియు ఆయన కూడా అదే విధమైన బాధతో ఉన్నాడు. అది ఖచ్చితముగా నిజమైయున్నది.

నీ ప్రార్థనా అవసరతల చీటీలో ప్రార్ధన కొరకు ఇంకా చాలా ఉన్నాయి, చాలా కాలం నుండి అవి అలాగే ఉన్నాయి. నీవు మోకాళ్ళ మీద ఉండుటను నేను చూస్తున్నాను. నీవు ప్రార్ధన చేస్తున్నావు, మరియు ఇద్దరు మనుషులు వచ్చుట నేను చూస్తున్నాను, మరియు వారిద్దరూ పాపము చేత నీడ వలె ఉన్నారు. వారు నీ యొక్క సహోదలు. మరియు నీవు వారి రక్షణ కొరకు ప్రార్ధన చేయుచున్నాను. అది “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.”

ఇప్పుడు ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నదని నీవు నమ్ముతావా? అయితే, దేవుడు నిను దీవించును గాక. నా సహోదరీ, నీవు వెళ్ళుము, మరియు నీవు ఏదైతే అవసరత కలిగియున్నవో, దేవుడు విడుదల చేయాలని నీవు కోరునది, దేవుడు దానినుండి నిన్ను విడుదల చేస్తాడు. దేవుడు నిన్ను దీవించును గాక, అది నా ప్రార్ధన.

25

దయచేసి, మీరు నిజమైన భక్తీ మర్యాదతో ఉండండి.

అక్కడ ఉన్న అన్నిటిలోకి అవిశ్వాసమనేడి అన్నిటికన్నా అత్యంత భయంకరమైనది. నన్ను ఏదో విధముగా వెళ్లనివ్వండీ, కాని నన్ను మతపరమైన అవిశ్వాసిగా ఉండనీయవద్దు. అక్కడ ఉన్నవాటిలో అవిశ్వాసమే పాపము. ధూమపానము, మద్యపానము, వ్యభిచారము చేయుట, శపించుట, ఒట్టు పెట్టుకొనుట, అనునవి పాపము కాదు. అవి అవిశ్వాసము యొక్క లక్షానాలు. “విశ్వసించనివానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.”

మరియు ప్రజలు తాము మతపరమైనవారని చెప్పుకొనుచు, సంఘమునకు వెళ్లి, ఆరాధనాభావము కలిగి, మరియు ఇంకను అవిశ్వాసిగా, పాపులుగా ఎంచబడుదురు. యేసు చెప్పెను, “మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు.” అయినను వారు ఆరాధనాభావము కలిగి మరియు మతపరమైనవారుగా ఉండవచ్చు. అక్కడ ఉన్న అత్యంత చెడ్డ దయ్యము ఏమిటనగా, మతపరమైన దయ్యము. అది ఎటువంటి చెడు ఆత్మల కన్నా ఐదు రెట్లు ఎక్కువగా భయంకరమైనది.

26

సహోదరి, ప్రభువు నిన్ను దీవించును గాక. నీవు నా సహోదరివి. నీవు విమర్శకురాలివి అయ్యుండవచ్చును, మరియు నీవక్కడ నిలుచుని ఏదైనా తప్పు కార్యము చేయవచ్చును. అయితే నీవు నా సహోదరివని నాకేలాగు తెలిసినది? ఎటువంటి చెడుతనము లేని నతాయేలుని ఆయన కనుగొన్న మదిరిగానే ఇది కూడా తెలిసింది.

నీవక్కడ నీ కొరకు నిలబడి యుండలేదు. నీవక్కడ వేరొకరి కొరకు నిలుచుని ఉన్నావు. నీ సహోదరి కొరకు, ఆమె ఒక వైద్యశాలలో ఉన్నది. నీ చేతిలో ఏదో చిన్న దానిని కలిగియున్నావు. ఆమెకు కాన్సరు వచ్చినది. మరియు నీవు ప్రార్ధన చేస్తున్న, నీ బంధువు నీకు అత్త లేక పిన్ని అవుతుంది, ప్రభువు నందు ఆమె ఒక సహోదరి. ఆమెను నేను, “సహోదరి” అన్నప్పుడు నీవు గందరగోళమునకు గురైయుండ వచ్చును. నీ మనస్సుని చదువుట లేదు. కాని మన మధ్యలో అవిశ్వాసులున్నారు అందుకనే అది నాకు తెలుసును.

ఇప్పుడు, విశ్వసించి వెళ్ళము. సందేహించవద్దు. ఆమెకు త్వరలో బాగవుతుంది. అది కూడా నీవు సందేహించనట్లయితేనే. దేవుడు నిన్ను దీవించును గాక. ఏ మాత్రమూ సందేహించవద్దు. వెళ్ళు, నీ హృదయమంతటితో ఆయనను విశ్వసించుము.

అయ్యా, మీరు ఎలా ఉన్నారు? మనం అపరిచితులమని నేను అనుకుంటున్నాను, ఇదే మన మొదటి కలయికా? నీవు నాకు తెలియదు, నిన్ను ఎన్నడూ చూడలేదు. కాని దేవునికి నీవు తెలుసు. వినుటకు వచ్చినవారు, మీ హృదయమంతటి నుండి విశ్వసిస్తున్నారా? విశ్వాసము కలిగియుండుడి.

ఒక చిన్న స్త్రీ అక్కడ కూర్చొనియున్నది, ఎక్కువ వయస్సు కలిగియున్నది, తలను ఊపుతూవున్నది — అక్కడ ఉన్న వరుసలో రెండవది, అక్కడ వెనుకాల. ఆ సైనస్ సమస్య నుండి దేవుడు నిన్ను స్వస్థపరచగలడని, నిన్ను బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? మంచిది, అయితే ఆయన నిన్ను స్వస్థపరిచాడు. నీకు తెలుసా, నీవు దేనినో తాకియున్నావు. అది ప్రభువైన యేసుని.

27

యవ్వన స్త్రీ, మీ ముఖము పైకి చేతి రుమాలుని ఎందుకని ఎత్తియున్నావు? నేను దేవుని సేవకుడనని నీవు నమ్ముచున్నావా? పసుపు రంగు వస్త్రాలను ధరించిన నీవే, దేవుడు ప్రార్ధనలను వింటాడు మరియు జవాబిస్తాడని నీవు నమ్ముచున్నావా?

స్త్రీ, నీవు కూడా నీ చేతి రుమాలుని పైకి ఎత్తియున్నావు, నీవు ఎత్తావు కదా? మంచిది, నీవు నీ తండ్రీ కొరకు ప్రార్థిస్తున్నావు. ఆయన కాన్సరు నుండి స్వస్థపడతాడని నీవు నమ్ముచున్నావా? మంచిది.

స్త్రీ, ఆమె ప్రక్కన కూర్చున్న నీవు, నీవు నీ కన్నులను తుడచుకొనుచు మరియు ఆలాగు చేయుచున్నావు. నీవు నీ భర్త కొరకు ప్రార్థన చేయుచున్నావు. అతను రక్షించబడలేదు. అది “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” నీవు నమ్మకము మరియు విశ్వాసము కలిగియుండుము. దేవుడు నీకు దానిని దయచేయును.

అయ్యా, మీకు ప్రకాశవంతమైన కన్నులు ఉన్నాయి. అయితే అంతా మంచిగా ఉన్నది అని దాని భావము కాదు. నీవు నీ కన్నుల కొరకు నన్ను ప్రార్ధన చేయమని అడుగవలెనని కోరుకుంటున్నావు. అది మంచిదే. అది మాత్రమే కాదు, మీరు నేను ఇంకెవరి గురించో ప్రార్ధించాలని కోరుకుంటున్నారు. ఆమె మీ భార్య. ఆమెకు గుండెకు సంబంధించిన సమస్య ఉన్నది. నీవు కాన్సరు గురించి కూడా భయపడచున్నావు. నీవు భయపడుటలేదా? చింతించవద్దు.

28

మీరు ఈ నగరమునకు సంబంధించినవారు కారు. మీరు మంచి వ్యక్తియైయున్నారు. మీరు నాక్స్-విల్ అను నగరమునకు చెందిన వ్యక్తి. మీరు సేవకుడు కూడా. అది సత్యము. మీ చివరి పేరు క్లేన్. మీ మొదటి పేరు డేవిడ్. రెవరెండ్ డేవిడ్ క్లేన్. మీరు మీ హృదమంతటితో విశ్వసించినట్లయితే, నీవు ఏదైతే అడిగియునావో - దానిని పొందుకొని వెళ్ళుము. “నమ్ముట నీవలనైతే, సమస్తము సాధ్యమే.”

నా కుడి చేతి వైపున వెనుక భారీగా కూర్చున్న స్త్రీ, ఇక్కడ కూర్చున్న స్త్రీ ఆమె చేయగలిగినంత కఠినముగా ఆమె ప్రార్ధన చేయుచున్నది. నీవు కూడా దేవుడు నిన్ను తాకాలని ప్రార్ధన చేయుచున్నాను. దేవుడు నీకున్న మూత్ర పిండ సంబంధిత వ్యాధి నుండి నిను స్వస్థపరచి, నిన్ను బాగుచేస్తాడని నీవు నమ్ముచున్నావా?

నీకున్న మరొక విషయమును గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను, నీవు ఒక విధమైన దగ్గు కూడా కలిగయున్నావు. అది ఆస్తమా. నీవు నీ హృదయమంతటితో నమ్మినట్లయితే, పైకి లెమ్ము, బాగుపడుము.

నీవు నమ్ముతావా? నేను నిన్ను ఎన్నడూ చూడలేదు. కాని దేవునికి నీవు తెలుసు. నీవు సమస్యలో ఉన్నావు. నీవు పైత్యరస నాళములో ఏర్పడే చిన్న రాళ్ళతో బాధపడుతున్నావు. అది నిజము. మరియు నీనెవరిగురించో ఆందోళన చెందుతున్నావు. అది ఒక పురుషుడు, ఒక సహోదరుడు. కాన్సర్. అతనికి చాలా సార్లు శస్త్రచికిత్స చేయబడియున్నది — ఖచ్చితముగా చెప్పాలంటే నాలుగు సార్లు చేయబడియున్నది — సఫలం కొలేదు. నీ హృదయమంతటితో నీవు విశ్వసిస్తావా? నీవు ఆలాగు చేసినట్లయితే, దానిని వేదిక మీద నుండి వెళ్ళి, మరియు నీవు అడిగిన దానిని క్రీస్తు నామములో పొందుకొనుము.

కేవలం నమ్ముము.

29

అవును, నీవు అక్కడ కూర్చునియున్నావు, గోధుమ రంగు టోపీని ధరించి కూర్చనియున్న ఒక చిన్న స్త్రీ, నీకున్న కీళ్ళ నొప్పి మరియు కడుపుకు సంబంధించిన సమస్య నుండి దేవుడు స్వస్థపరచగలడని నీవు నమ్ముచున్నావా? నిన్ను బాగుపరచగలడని అనుకుంటున్నావా? మంచిది, నీవు దానిని పొందుకున్నావు. దేవుడు నిన్ను దీవించును గాక.

ఈ స్త్రీయేనా? కొద్ది నిముషముల క్రితం ఇక్కడున్న అవిశ్వాసులు గుంపు, మరియు అది నన్ను పట్టుకున్న...

స్త్రీ, మనము ఒకరికి ఒకరము పరిచయము లేనివారము.

మీకు తెలుసా, యేసు చెప్పెను, “గోధుమలను మరియు గురుగులను రెండిటిని పెరగనివ్వుము.”

యేసు ఈ రాత్రి జీవించియున్నాడని మీరు ఒప్పుకుంటున్నారా? ఆయన మృతులలో నుండి లేచాడని మీరు ఒప్పుకుంటున్నారా?

30

ఈ స్త్రీ, నాకు పరిచము లేని స్త్రీ.

సహోదరీ, నాకు నీవు తెలియదు, నేను నీకు తెలుసునా? ఆ బయట ఉన్నవారివలె మనము ఖచ్చితముగా ఎటువంటి పరిచయం లేనివారము. అది ఈ స్త్రీ కొరకు కాదు. అది అక్కడ ఒక చిన్న బాలుడు, ఇటు వచ్చుచున్నాడు. ఆ వరుసకు చివరన, ఆ చిన్నవాడిని దేవుడు స్వస్థపరచాడని నమ్ముచున్నారా? బాలుడి వినికిడి శక్తిని తిరిగి అతనికి ఇచ్చి, అతడిని స్వస్థపరచి, అతనిలో ఉన్న చెవిటితనమును తీసివేయును గాక, దేవునికి స్తోత్రములు చేపుదామా? అతనిని తిరిగి అతని ఇంటికి తీసుకొనివెళ్ళండి. దేవుడు నిన్ను దీవించును గాక.

అక్కడికి వెళ్ళి మరియు ఆయన చెవిలో మాట్లాడుము. ఏమి జరిగినదో గమనించుము. నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా?

31

నేను నీకు పూర్తిగా పరిచయము లేనివాడిని. కాని నీవు ఒక రకమైన ఆందోళనతో కలత చెందుతున్నావు, కారణమేనుంటే అది మూత్ర సంబంధమైన వ్యాధి (బ్లాడర్), అది నిన్ను చికాకు పెడుతుంది. అది నిజము. అది సత్యము, అది కాదా? నీవు నమ్ముచున్నావా?

ఇప్పుడు, నీవు చూడము, నీవు ఈ స్త్రీతో ఎంత ఎక్కువగా మాట్లాడితే... అది కేవలం... నీవు ఊహించుము అది నీకేమి చేయగలదు. నేను కేవలం దానిని పడవేయబోవుచున్నాను. ఇక్కడ ఏమి జరుగుతున్నది? అది ఏమైయునది, ఇక్కడ నేను నిలబడి ఆయన తనంతట తాను చేసేదానికన్నా ఎప్పుడు ఒక వ్యక్తి ... అది ఏమిటి? దేవుడు ఎప్పుడు ఆయన వరమును ఉపయోగించడు. కాని ఈ స్త్రీ ఉపయోగించినది. ఆమె దేవుని దగ్గర నుండి తీసుకున్నది. ఆమె యేసు ద్వారా దానిని తీసుకున్నది, ఆమె విశ్వాసము. ఆమె, ఆయనను తాకినది. ఆయన చెప్పెను, “నేను....” ఆయనకు ఏమి జరిగినదో తెలియదు. దానిని ఉపయోగించుచున్నది నీవైయున్నావు.

ప్రజలు సంశయాలతో ఈ విధముగా అనుటలో ఆశ్చర్యమేమీ లేదు, “మంచిది, నేను దానిని అర్థము చేసుకోలేకుండా ఉన్నాను. బహుశా... ఇదియై ఉండవచ్చును, అది, లేక మరోకటి.” ఇదియేనా, కారణము ఏమంటే మీరు కేవలం వేదికను మాత్రమే చూచుచున్నారు. మీరు చూచునది ఇది మాత్రమే. మీరు మా గృహాలలో కూటములు జరిగినప్పుడు లేరు. నా భార్య అక్కడ కూర్చుని ఉంటుంది. ఇక్కడ బాలురు, ఇక్కడ సేవకులు కూర్చుని వుంటారు, నాతో ఎల్లప్పుడూ ఆ విధముగానే ఉంటుంది.

32

రాబోవు కాలము గురించి వారాలు మరియు నెలలు మరియు సంవత్సరములు చెప్పిన కార్యముల గురించి ఆలోచించుము. ఖచ్ఛితముగా, అక్కడ, బయట, అబ్బాయిలారా, వాటిలో ఏదైననూ విఫలం చెందుట నీవు చూశావా? అవి నీజమైనవని ఎంతమందికి తెలుసు? ప్రతి ఒక్కటి ఇక్కడనే కాదు, బయట ప్రదేశాలలో, నా గురించి తెలిసినవారు, చూశారా.

ఇది కేవలము నీవైయున్నావు, ఇప్పుడు, నీవు దేవుని వరమును ఉపయోగించుచున్నావు. నేను ఆయన యొక్క బహుమతిని కాను. ఇది ప్రభువు యొక్క దూత. ఆయన ఎవరైనా ఒకరి స్వరమును ఉపయోగించుకొని మాట్లాడతాడు.

ఇది... ప్రభువు ఆమెతో చెప్పియున్నాడా? మంచిది. ఆయన ఏదైతే చెప్పియున్నాడో అది నిజమేనా? అది నిజమేనా, ఆయన చెప్పినది ఏమిటి? ఇప్పుడు, స్త్రీ, మీకు తెలుసా, అది నాకు తెలియదు. నేను దానిని తిరిగి టేపు ద్వారా మాత్రమే తెలుసుకోగలను, అది మాత్రమే నేను తెలుసుకొనుటకు నాకున్న ఏకైక మార్గము.

కాని కొద్దిగా మాట్లానివ్వండి. అవును, ఆమె అక్కడున్నది. అది మూత్ర సంబంధమైన సమస్య. అది మాత్రమే కాదు, నీవు ఒక కుమారుని కొరకు ప్రార్ధన చేయుచున్నావు. అది మెదడుకు దెబ్బ తగులుట వలన జరిగినది. అది నిజము. అది మాత్రమే కాదు, నీవు నీ సహోదరుని కొరకు ప్రార్థించుచున్నావు, మరియు అది కాన్సరు. స్వస్థపరిచేవాడు దేవుడని నీవు ఒప్పుకుంటున్నావా? అయితే వెళ్ళము, దేవుని యొక్క శాంతి నీతో ఉండును గాక, నీవు ఏదైతే అడిగియున్నావో, అది నీకు ఇవ్వబడుచున్నది. మంచిది.

33

నీ పూర్ణహృదయముతో నీవు నమ్ముచున్నావా? ఇప్పుడు, భక్తీ మర్యాదతో ఉండండి. అక్కడ ఉన్న విశ్వాసులు, కేవలం నమ్ముము. విశ్వాసము కలిగియుండుము.

అక్కడ నిలుచొని నీవు, నీకున్న నీ వెన్నెముక సమస్య నిన్ను విడిచిపోయినదని, నీవు నమ్ముతావా? నీవు నమ్ముచున్నావా? మంచిది. నీ దారిలో నీవు వెళ్ళుము. కేవలం చెప్పుము, “తండ్రి, నీకు కృతజ్ఞతలు.”

నీకున్న స్త్రీ సమస్య నిన్ను విడిచిపోయినదని నీవు నమ్ముతావా, స్త్రీలకు ఉండే సమస్య? నీవు నమ్ముచున్నావా? మంచిది, నీవు సంతోషముతో నీ మార్గములో వెళుతూ ఇలాగు చెప్పుము, “ప్రభువైన దేవా, నీకు కృఙ్ఞతలు.” మంచిది.

34

స్త్రీ, నీకు దీని గురించి నీకు తెలుసునా, లేక తెలియదో, కాని నీవు కాన్సర్ నీడ చేత ఆవరించబడ్డావు. నీకు అది తెలుసు. మంచిది, దేవుడు నిన్ను స్వస్థపరచాడని నీవు నమ్ముతున్నావా? వెళ్ళుము, మరెప్పుడు దాని ద్వారా నీవు తిరిగి బాధించబడవు.

స్త్రీ, రమ్ము, చాలా కాలము నుండి నీవు ఆందోళనగా ఉన్నావు. అది నీవు 40 సంవత్సరముల స్త్రీ అయినప్పటి నుండి ప్రారంభమైనది, నీ లోపల మార్పు సంభవించుట జరిగిన దగ్గర నుండి, దానినే రుతుక్రమము ఆగిపోవుట (మోనోపాజ్) అంటారు. దాని ద్వారా, నీకు చాలా సమస్య వచ్చినది. ఇప్పుడు నీకున్న ఆ సమస్య యొక్క స్థితి, కడుపులో మంట పెడుతున్నట్లుగా ఉన్నది, దాని వలన నీకు కడుపుకు సంబంధించిన సమస్య వచ్చియున్నది. అది నీ కడుపులో జీర్ణాశయ పూతగా మారినది. అది నిజము.

ఎందుకని దేవుడికి 35 సంవత్సరముల క్రితం నీకు ఏమి జరిగినదో తెలుసు? స్త్రీ, నాకది తెలియదని మీకు తెలుసా, నాకు తెలుసా? మంచిది, ఇప్పుడు వెళ్ళి తినుము, నమ్ముము. నీవు బాగుపడతావు.

35

నేను నీకు కడుపుకి సంబంధించిన సమస్య గురించి చెప్పినప్పుడు, నీకు ఒక నిజమైన కొత్త అనుభూతి కలిగియున్నది, నీకు ఆ విధముగా కలుగలేదా? మంచిది, అదే సమయములో నీవు స్వస్థతను పొందుతున్నావు. కాబట్టి నీవు కేవలం నీ మార్గములో వెళ్ళుము, నీ హృదయమంతటితో నమ్ముము. మంచిది. ప్రతి ఒక్కరూ...

ఆస్తమా స్థితి నిన్ను విడిచి పెట్టినదని నీవు నమ్ముతావా? నీవు దానిని నమ్మియున్నట్లయితే, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు? అంతా మంచిది, అయినట్లయితే నీవు నీ మార్గములో వెళ్ళి, ఇలా చెప్పుము, “ప్రభువైన యేసు, నీకు కృతజ్ఞతలు.”

నేను నీతో ఒక్క మాట కూడా చెప్పనట్లయితే ఏమగును, కేవలం నీవు స్వస్థపడ్డావు అని చెప్పినట్లయితే, నీవు నా మాటను తీసుకుంటావా? దేవుడు నిన్ను దీవించును గాక. కేవలం నీవు నీ మార్గములో వెళ్ళము.

ఒకవేళ నీవు కల్వరి దగ్గరకి వెళ్ళినట్లయితే, నీవు మధుమేహ మందు (ఇన్సులిన్) తీసుకోవాల్సిన అవసరము లేదు, ఆయన మధుమేహ వ్యాధిని స్వస్థపరుస్తాడు. నీవు దానిని నమ్ముతావా? తిరిగి నీ మార్గములోకి సంతోషముతో వెళ్ళి ఇలా చెప్పుము, “ప్రభువైన దేవా, నీకు కృతజ్ఞతలు.”

అవును, నీకు ఒకదానికి సంబంధించిన వాపు ఉన్నది; మరియు అది వాపుకు సంబంధించినది. అది నీ యొక్క స్త్రీ గ్రంథులలో ఉన్నది. దేవుడు నిను స్వస్థపరుస్తాడని నీవు నమ్ముతావా? ఆనందముతో తిరిగి నీ మార్గములో వెళ్ళము. సంతోషముగా ఉండుము.

36

నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా? లేఖనాలు ఈ విధముగా చెప్పుచున్నాయి, “నమ్మినవారిని ఈ సూచకక్రియలు వెంబడిస్తాయి.” విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు, మీరు ఒకటి చేయగలరా? మీ దగ్గర ఉన్నవారి మీద మీ చేతులుంచండి, మీ చుట్టు ప్రక్కల ఉన్నవారి మీద చేతులుంచండి. ఇవన్నియూ... మీరందరూ ఒకరి మీద ఒకరు చేతులుంచండి.

ఇప్పుడు, నీవు మెథడిస్టువైనట్లయితే, నీ మెథడిస్టు సంఘములో ఏలాగు ప్రార్ధన చేస్తారో ఆలాగు ప్రార్ధన చేయుము. నీవు పెంతెకోస్తు వైనట్లయితే, నీ పెంతెకోస్తు సంఘములో ఏలాగు ప్రార్ధన చేస్తారో ఆలాగు ప్రార్థన చేయుము. నీవు బాప్టిస్టు వైనట్లయితే, నీ బాప్టిస్టు సంఘములో ఏలాగు ప్రార్ధన చేస్తారో ఆలాగు ప్రార్ధన చేయుము. నీవు ఏ సంఘమునకు సంబంధించిన వాడివైనా సరే, నీవు చేతులుంచిన వారికొరకు ప్రార్ధన చేయుము. “నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడిస్తాయి. రోగుల మీద వారు చేతులుంచినప్పుడు, వారు స్వస్థతని పొందుకుంటారు.”

37

ఇప్పుడు, మనము మన శిరస్సులను వంచుదాము.

నిత్యజీవము మరియు ఆశీర్వాదము కలిగిన దేవా, మేము ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేయుచున్నాము. ఒకరి పాపములను ఒకరము ఒప్పుకొనుచున్నాము. మరియు విశ్వాసముతో పునరుత్థానుడైన క్రీస్తుని ఒప్పుకొనుచున్నాము, నీ కుమారుడు, ఆయన ప్రతిచోటా ఉన్నాడు, పాపులను కాపాడుటకు, ఆయన రోగులను స్వస్థపరుచుటకు ఇక్కడనే ఉన్నాడు.

ఓ నిత్యుడగు దేవా, ఇప్పుడు అవిశ్వాసి తన యెక్క తప్పును తెలుసుకోనీయుము, మరియు పరిశుద్ధాత్మను రానీయుము, మరియు శక్తిని తీసుకొని రమ్ము, మరియు విశ్వాసమును, మరియు వారికి కరుణను దయచేసి మరియు వారిని క్రీస్తు యొక్క రక్షణ జ్ఞానములోనికి తీసుకొని రమ్ము.

ఓ, సాతాను, నీవు రోగులను బంధించియుంచావు, ఈ ప్రజలలో నుండి బయటకు రమ్ము. నీవు ఓడిపోయావు, ఎందుకనగా నీవు ఏమి చేయలేవు. క్రీస్తు మృతులలో నుండి లేచాడు మరియు ఈ రాత్రి ఇక్కడ జీవించియుండి ఇక ఎన్నటికి నీకు ఎటువంటి చట్టపరమైన హక్కులు లేవని తెలియజేసి ధృఢపరుస్తున్నాడు. క్రీస్తు కల్వరి దగ్గరనే నీకున అన్నీటిని తీసివేశాడు, ఇతరుల కొరకు ఆయన గొప్ప బాధను అనుభవించాడు, మరియు ఆయన మృతి చెంది, మరియు విజయముతో పునరుత్థానుడైయున్నాడు. ఈ రాత్రి ఆయన ఇక్కడ జీవించి ఉండుటను బట్టి ఆయన మాకు నమ్మకమును కలుగజేయుచున్నాడు, మరియు మమ్ములను అభిషేకించుచున్నాడు. మరియు ఇప్పుడు ఆయన సన్నిధి ఇచ్చట ఉన్నది, మరియు సాతానా, ఇంక ఎంతో కాలము నీవు వారిని బంధించియుంచలేవు. యేసుక్రీస్తు నామములో వారి నుండి బయటకు రమ్ము.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...