పునరుత్థానము యొక్క రుజువు
vgr count -210 [సహోదరుడు ఆర్మన్ నెవిల్ లూకా 24:1-32 చదువుచున్నారు.]
ఆదివారమున తెల్లవారుచుండగా (ఆ స్త్రీలు) తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి.
సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడియుండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని, ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు.
ఇందునుగూర్చి వారికేమియు తోచకయుండగా, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన యిద్దరు మనుష్యలు వారియొద్ద నిలువబడిరి.
వారు భయపడి ముఖములను నేలమోపి యుండగా మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెడుకుచున్నారు?
ఆయన ఇక్కడలేదు, ఆయన లేచియున్నాడు, ఆయన ఇంక గలిలయలో ఉండినప్పుడు,
మనుష్యకుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగించబడి, సిలువవేయబడి, మూడవ దినమందు లేవవలసియున్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి.
అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసుకొని
సమాధి యొద్దనుండి తిరిగి వెళ్ళి, యీ సంగతులన్నియు పదునుకొండగురు శిష్యులకును తక్కినవారందరికిని తెలియజేసిరి.
ఈ సంగతులు అపొస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దాలేనే మరియయు యోహన్నయు యాకోబు తల్లియైన మరియయు వారితో కూడా యున్న ఇతర స్త్రీలను.
అయితే వారిమాటలు వీరి దృష్టికి వెర్రిమాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు.
అయితే పేతురు లేచి, సమాధి యొద్దకు పరుగెత్తుకొనిపోయి వంగి చూడగా, నార బట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను.
ఇదిగో ఆ దినమందే వారితో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరములో ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళచూ.
జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి యొకరితో నొకరు సంభాషించుచుండిరి.
వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను.
అయితే వారాయనను గుర్తుపట్టలేకుండ వారి కన్నులు మూయబడెను.
ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నయీ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి.
వారితో క్లెయోపా అనువాడు యొయషలేములో బస చేయుచుండి, యీ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే యెరగవా? అని ఆయనను అడిగెను.
ఆయన అవి ఏవని వారిని అడిగినపుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే, ఆయన దేవుని యెదుటను ప్రజలందరి యొదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తయైయుండెను.
మన ప్రధానయాజకులను అధికారులను ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి, సిలువ వేయించిరో నీకు తెలియదా?
ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించియుంటిమి, ఇదిగాక యీ సంగతులు జరిగినేటికి మూడు దినములాయెను.
అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాది యొద్దకు వెళ్ళి, ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి.
మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరిగాని, ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి.
ఇందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులార.
క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి.
మోషేయు సమస్త ప్రవక్తలును వెుదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.
ఇంతలో తాము వెళ్ళచున్న గ్రామము దగ్గరకు వచ్చినపుడు ఆయన యింక కొంత దూరము వెళుతున్నట్లు అగుపడగా.
వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగూకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను.
ఆయన వారితో కూడ భోజనమునకు కూర్చున్నపుడు, ఒక రాట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా.
వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను.
అపుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా, అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.“
నెవిల్ సోదరుడా, నీకు వందనములు. మీకు అందరికి సాయంకాల శుభములు. ఈ దినము నాకు ఒక గొప్ప దినమై యున్నది. అది అనేకమైన రీతులలో గొప్పగా యుండియున్నది. ఈ రోజు, నేను కొంచెము వృద్ధుడయ్యాసు, అందుచేత అది దానిని ఒక గొప్ప దినముగా చేస్తుంది, మరియు నేను ఒక గొప్ప వయస్సునకు వచ్చుచున్నాను. అయితే నేను... అది ఒక గొప్ప దినమై యుండియున్నది, కారణము అది ఈష్టరుయైయున్నది. మరియు, ఇప్పుడు, కారణము ఇది ఒక గొప్ప దినమైయున్నది నాకు ఏదో సంభవించియున్నది, నేను దానిని కలిగియున్నాను, నేను ఎన్నడు, దానిని మరచిపోలేను. అది నా హృదయములోనికి వచ్చిన ఒక ఆశయైయున్నది. అది ఎమనిన, నేను ఎందుకు ఈ భూమి మీదికి జన్మించియున్నానో, ఆ కార్యములను గూర్చి నా జీవితమంతయు నేను ఆశ్చర్యపడ్డాను.
2
అప్పుడు ఈ ఉదయమున, నేను మోషేను గూర్చి మాట్లాడుచుండగా, దానిని గూర్చి ఆలోచించుచుంటిని మరియు అతడు, ఒక హెబ్రీయుడు అని తెలుసుకొనినప్పుడు ఏది తప్పక అతని హృదయములోనికి వచ్చియున్న దేవుడు ఎందుకు అతనిని ఫరో యొక్క రాజభవనములో అతడు పెంచబడుటకు అనుమతించియున్నాడో, మరియు తరువాత ఎడారి వెనుకకు ఒక స్థలములో ఒక స్థానమునకు, అతడు తన జీవితములో ఏమి చేయవలసియున్నదో తెలుసుకొనుటకు అతనిని తీసుకొని వెళ్ళెను?
3
నేసు తరచుగా ఒక బాలుడుగా నేను ఆశ్చర్యపడియున్నాను. నా బాల్యదినములలో దేవుడు ఎలా నాతో మాటాడియున్నా, తరువాత ఆ చిత్రమును తీయుటకు ఆయన ఎలా అనుమతించియున్నాడో నేను ఆశ్చర్యపడ్డాసు. జర్మనీ దేశములోను మరియు ఫిన్ల్యాండ్ దేశములోను ఎలా దానిని చేసియున్నాడో నేను ఆశ్చర్యపడ్డాను. ఈ సంగతులన్నియు ఎలా సంభవించినవో అని నేను ఆశ్చర్యపడ్డాను, నేను కేవలము వాటిని నమ్మలేకపోయాను. దానికి కారణమేమనగా నేను ఒక బోధకుడను కాదు, నాకు విధ్యలేదు. ఒక బోధకుడిగా ఉండు సామర్ధ్యము నాకు లేదు.
దేవుని ప్రజలు దాస్యములో ఉన్నారని నేను నమ్ముదును. వారు దాస్యములో ఉన్న కారణము ఏమనగా అది మానవుల యొక్క ఆచారమును బట్టి అని నేను నమ్ముచున్నాను. మరియు ఈ దినమున వేలకొలదిగా ప్రజలు ప్రతీ రోజు చనిపోవుచున్నారు. ఆ వ్యాధులను వైద్య శాస్త్రము తాకలేదు. మరియు వారు దేవుని పిల్లలైయున్నారు.
మరియు నేను నమ్ముదును - దానిని చూచుటకు నేను బ్రతికియుండకపోవచ్చు - అయితే నేను నమ్ముచున్నాను మరియు బహుశా అది సమీపములో ఉన్నది, ఆయన సర్వశక్తిగల దేవుడై యున్నాడనీ, రుజువు చేయుటకు దాని కొరకు ఆయన ఏదో చేయబోవుచున్నాడు. నేను దానిని నమ్ముతాను. నేను ఒక మోతాదులోదానిని చూచియున్నాను, అయితే మనము ఏదైతే చూస్తామో, దానికి అది ఒక చిన్న మోతాదై ఉన్నదని నేను నమ్మతాను.
4
ఇప్పుడు, ఈ ఉదయమున చిన్న విశ్రాంతి కొరకు నేను వెళ్ళవలసియున్నది. అది నాకు ఈ రోజే, నేను నీళ్ళలో ఉండగా.. నేను ఎన్నో బాప్తీస్మములు ఇచ్చియున్నాను, అందువలన నా జీవితములో ఎన్నడు లేనంతగా ఈ రోజు నాకు జలుబు చేసియున్నది. నాకు ఎంత జలుబు చేసియున్నదనగా, ముక్కు కారుచున్నది. నేను క్రిస్మస్ నుండి లేక క్రిస్మస్ తరువాత నుండి నేను ప్రయాణం చేస్తూనే ఉన్నాను, కనీసం ఒక రాత్రి కూడా నాకు విరామము లేదు మరీ అంత అధ్వాన్నమైన జలుబు కాదు, అయితే నేను కేవలము బలహీనముగా ఉన్నాను. మరియు ముక్కు నుండి జలుబు కారుచున్నది.
5
ప్రభువు చిత్తమైనయెడల, కొన్ని దినములు విశ్రాంతి తీసుకొనుట కొరకు రేపటి దినమున నేను ఆ సరస్సు యొద్దకు వెళ్ళచున్నాను. ప్రభువు చిత్తమైనయెడల, కొన్ని దినములలో నేను తిరిగి వస్తాను. ప్రభువు చిత్తమైనయెడల, నేను కూటమునకు బయటకు వెళ్ళకమునుపు, ఒక పది లేక ఇరవై దినములు మనమందరము తిరిగి ఏకముగా కూడుకుందాము తరువాత వెనుకకు కొన్ని మాసముల వరకు న్యూ-ఇంగ్లాండ్ రాష్ట్రములోనికి వెళ్తాను. మరలా తిరిగి వస్తాను. అది 'మే' నెల మొత్తమును తీసుకొంటుంది, రెండు లేక మూడు రోజులు సెలవులు తీసివేసినట్లతే తరువాత అక్కడి నుండి నేను ఆఫ్రికా వెళ్ళు వరకు, ఇంచుమించు రెండు దినములు తప్ప ఇలా ఎంత మాత్రమను సమయము లేదు. అది మొత్తము జూన్ మాసము గుండా వెళ్ళుచున్నది. అది కఠినముగా ఉండబోవుచున్నది. నేను నా కొరకు ప్రార్ధించుచున్న ఈ సంఘములోని ప్రజలపై నేను ఆధారపడతాను, కారణము అది నాకు అవసరము నాకు అది ఎంతో అవసరము.
మరియు మీకు తెలుసా, మహిమకు ఈవైపులా, ఇది అంతయు ఏమైయున్నదో మరియు ఎలాంటి ఇబ్బందులు గుండా నేను వెళ్ళవలసియున్నదో, ఎవరికి ఎన్నడు తెలియదు ప్రజలకు నేను దానిని చెప్పను. దానిని ప్రజలకు చెప్పవలసిన అవసరము లేదు. వారు దానిని గ్రహించలేరు. నేను దానిని గ్రహించలేను, అది ఎలాటిదనగా నీవు ముందుకు వెళుతూ, ముందుకు సాగిపోతూ ఉంటావు.
6
ఇప్పుడు, అందునుబట్టి ఎక్కువసేపు ప్రజలు నిలబడనవలసిన పని లేదు. ఈ రాత్రి లూకా సువార్త 24లో పునరుత్థానమును గూర్చి సహోదరుడు నావిల్ చదివియునట్లుగా, ఈ రాత్రి ఈ అంశమును, ఒక అంశముగా నేను ఎన్నుకునియున్నాను. ఈ రాత్రి నా అంశము ఏమనగా: “పునరుత్థానము యొక్క రుజువు.”
మరియు ఇప్పుడు, అతడు చదువుచుండిన, ఆయన ఇక్కడ మాటాలాడిన అనేకమైన విషయములను గూర్చి నేను ఎత్తి చూపుచున్నాను. అది, మొదటిగా ఈ ఉదయమున సమాధి యొద్దకు ఈ మొదటిగా వెళ్ళినవారు.
7
ఇప్పుడు, ఆయన ఎంతగా చనిపోయినప్పటికీ, ఆయన మరణము ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నప్పటినీ, పునరుత్థానము అక్కడ లేకున్నయెడల, అక్కడ చనిపోయినది కేవలము ఒక మనిషియే. చూడండి, ఈ ప్రపంచములో అనేకమంది గొప్ప వ్యక్తులు యుండియున్నారు, వారు గొప్ప ప్రకటనలు చేసియున్నారు. ఉదాహరణకు, గొప్ప చైనా తత్వవేత్తయైన, కన్ఫ్యూషియస్, అతడు ఇరవై-మూడు వందల సంవత్సరముల క్రితం చనిపోయియున్నాడు. భుద్దుడు, జపాన్ దేశము యొక్క గొప్పదైవ ప్రవక్త ఇతడు కూడా దరిదాపుగా ఇరవై-మూడు వందల సంవత్సరముల క్రితం చనిపోయి యున్నాడు, ఇతడు గొప్ప ప్రకటనలు చేసియున్నాడు, అయినను అతడు చనిపోయాడు. అతను ఇంకనూ సమాధిలో ఉన్నాడు. అక్కడ ఉన్న మహ్మద్, అతని సమాధి వద్ద ఉండే ఆధిక్యత నాకు దొరికినది. అక్కడ రెండువేల సంవత్సరాల నుండి అతని సమాది యొద్ద తెల్లని గుర్రము ఉన్నది. అతడు ఒక దినమున లేస్తాడని ఆ గుర్రంపై స్వారీ చేసి ప్రపంచమును జయిస్తాడని ప్రతి నాలుగు గంటలకు అక్కడ భటులను మారుస్తున్నారు, ప్రపంచములోనే మహ్మదీయుల సంఖ్య అతి పెద్దదైయున్నది. క్రైస్తవులను మరియు కేథలిక్కులను అందరిని కలిపినా, వారే అందరికంటే పై సంఖ్యగా ఉంటారు. అయినా ఇంకను మహ్మద్ సమాధిలోనే ఉన్నాడు.
8
“యేసు మృతులలో సుండి లేచియున్నాడని,” మనము చెప్పినపుడు ఈ మతముల వారందరు “దానిని రుజవు చేయండి,” అని వారంటారు.
మరియు మనము అంటాము, “మంచిది, ఆయన మా హృదయములో ఉన్నాడు.” వారి స్థాపకుడు కూడా వారి హృదయములో ఉన్నాడని వారంటారు.
అయితే ఒక స్థిరమైన పునరుత్థానము యొక్క స్థిరమైన పునాదిని యేసు మన కొరకు విడిచిపెట్టినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. మనము ఆశ్చర్యపడనవసరము లేదు. అది సత్యమైయున్నది. ఆశ్చర్యకరమైన విషయమేమనగా, అనేక మంది దానిని చూడలేకున్నారు. దానికి నేను ఆశ్చర్యపడ్డాను, మరియు ఈ రాత్రికి లేఖనము ద్వారా నేను దానిని సమీపించుటకు ప్రయత్నించబోవుచున్నాను.
9
ఇప్పుడు, మీరు గమనించియున్నట్లైతే, వీరు ఉదయమున పెండలకడ సమాధినొద్ద యండి, ప్రకాశమానమైన వస్త్రములను ధరించిన ఇద్దరు మనుషులను వారు కలుసుకొన్నారు, వారు వీరితో అన్నారు, “ఆయన సజీవుడైనవానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు?” వారు సమాధి నొద్దకు వెళ్ళినపుడు ఆయన అక్కడ లేకపోవటను వారు కనుగొన్నారు. మరియు ఈ దొడ్డ ప్రశ్నను వారు వీరిని అడిగారు, “సజీవమైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు?” మరియు ఆయన చెప్పలేదా... “ఆయన ఇంకను గలిలయలలో యుండినప్పుడు మీకు ఈ విషయములను చెప్పలేదా.”
ఇప్పుడు, మీరు బహుశా దాని యొక్క పై భాగమును చదివి యున్నారు, అయితే ఒక క్షణము దానిని చదవుదాము, అతడన్నాడు, “ఆయన గలిలయలో యుండగానే ఈ సంగతులను మీకు చెప్పియుండలేదా,” ఎందుకు, వారు దానిని గ్రహించలేదు? ఎందుకు, వారు దానిని గ్రహించలేదు? ఇక్కడ దానికి మరొక గొప్ప ప్రాధాన్యత ఉన్నది, అదేమనగా, ఈ శిష్యులకు ఈ విషయమును చెప్పిన ఈ మనుష్యులు సమాధినొద్ద ఉన్నారు. వారు తప్పక ఆయనతో కూడా గలిలయలో ఉండి యున్నారు, కారణము ఆయన సిలువ వేయబడుటకు ముందు యేసు వారితో ఏమి చెప్పియున్నాడో వారు ఎరిగియుండిరి. ఓ, అది ఎలాంటి ధన్యమైన సంగతి! మీరు చూడండి, ఆ శిష్యులకు ఆ దేవదూతలు ఇక్కడ యుండియున్నారని వారికి తెలియదు, అయితే వారు నిజానికి అక్కడ ఉన్నారు, కారణము, “ఆయన ఇంకను గలిలయలలో యుండినప్పుడు మీకు ఈ విషయములను చెప్పలేదా,” అని లేఖనము చెప్పినదానిని అది నెరవేరుచున్నది, అదేమనగా, ఆయనయందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని యొక్క దూతలు కావలియండును.
10
ఈ రాత్రి దానినెరుగుట ఎలాంటి ఒక గొప్ప కార్యము, ఈ కట్టడములోనే తిన్నగా దేవుని యొక్క దూతలు హాజరుగా నిలబడియున్నారు. మరియు మనము చెప్పే ప్రతిమాట, మనము చేసే ప్రతికార్యము వారికి తెలుసు. దానియొక్క లేఖనానుసారమైన రుజువు ఇక్కడ ఉన్నది, “ఆయన గలిలయలో ఇంకను ఉండియుండగా ఈ సంగతులను మీతో చెప్పలేదా?” వారన్నారు, “గుర్తుచేసుకోండి, ఆయన మీకు ఈ సంగతులను చెప్పియున్నాడు.”
ఆ మాట, గుర్తుచేసుకోండి, అది ఒక అద్భుతమైన మాటైయున్నది. మరియు, ఓ, తప్పిపోయిన వారికి ఇది ఎలాంటి ఒక విచారకరమైన సంగతిగా ఉండబోవుచున్నది, వారు వారి యొక్క చివరి ప్రసంగమును వినియున్న తరువాత, వారు వారి యొక్క నాశనమును ముద్రించుకున్న తరువాత, వారు సాతాను యొక్క నరకములో తప్పిపోయినవారిగా ఉంటారు, మరియు వారు త్రోసివేసిన అవకాశములను గుర్తుచేసుకొని వారు మారుమనస్సు పొందుటకు ఏమాత్రము అవకాశము లేదు.
11
అప్పుడు నీవు నాతో ఇలా అంటావు, బోధకుడా, పాతాళములో జ్ఞాపకమును తెచ్చుకొనుట ఉన్నదా?“ యేసు అక్కడ ఉన్నదని చెప్పియున్నాడు. ధనవంతుడు పాతాళములో తన కన్నులెత్తి అబ్రాహామును మరియు అతని రొమ్మన ఉన్న లాజరుని చూసియున్నాడని ఆయన చెప్పాడు. మరియు అతడు అన్నాడు, ”జ్ఞాపకము తెచ్చుకో, నీ జీవితకాలములో....“ అక్కడ ఒక జ్ఞాపకము ఉన్నది. ఆ తప్పిపోయినవారి సంగతి ఎంత భయంకరంగా ఉంటుందో, వారు గొప్ప కూటాలలో కుర్చుని, దేవునితో అభిషేకించబడిన సేవకుల యొక్క గొప్ప ప్రసంగములను వారు వినియున్నారని, అంత మాత్రమే కాదు, అభిషేకించబడిన సూచనలను, ప్రజల మధ్య దేవుడు చేసిన అద్భుతములను వారు చూచుట, మరియు ఇంకను జ్ఞాపకమునకు తెచ్చుకొని ఇంకనూ తప్పిపోయినవారిగా యుండుట. ఇందుకు అది వారిని నిత్యము వెంటాడుతుంది.
12
యేసు మరణించిన తరువాత బైబిల్ మనకు చెప్పియున్నది, అదేమనగా, “దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో, అవిధేయులైనవారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి వారికి ప్రకటించెను.” మరియు ఆ నోవహు, హనోకు అను వారి దినము యొక్క గొప్ప ప్రవక్తలు, మెస్సియా రాబోవుచున్నాడని వారికి సాక్ష్యము ఇవ్వటం మరియు వారు ఆ వర్తమానమును తిరస్కరించియున్నారని జ్ఞాపకము చేయుట.
ఓ, నా తప్పిపోయిన సోదరుడా, దానిని జ్ఞాపకము చేసుకొనుట భయంకరమైన సంగతిగా ఆ దినమున నీకు ఉంటుంది. నీవు చనిపోయినప్పుడు, నీ క్రియలు నిన్ను వెంబడిస్తాయి. మరియు అవి నిత్యత్వము అంతటా నిన్ను పీడిస్తూ ఉంటాయి, లేక నిత్యత్వము అంతటా ఇవి నిన్ను దీవిస్తూ ఉంటాయి.
13
అయితే గుర్తుంచుకొండి, ఇది తప్పక ఎల్లాంటి ఒక్క గొప్ప సంగతిగా యుండబోవుచున్నది, రక్షించబడిన వారికి ఎల్లాంటి ఆనందము, ఈ రాత్రి ఈ కట్టడములో యున్న దూతలు మనమందరము కలిగియున్న ఈ గొప్ప కూటములు మరియు గొప్ప సమయములు, మనమందరము ఏకముగా కలిగియున్న గొప్ప సంతోషమును, మీ ముందుకు ఆ యదార్థతలను తెచ్చుట, రెండు గుంపులు వారికి— రక్షించబడిన వారికి, మరియు రక్షణ పొందని వారికి ఎలాటి సమయముగా అది తప్పక ఉండబోవుచున్నద్రి!
దేవుడు ఒక మంచి దేవుడైయున్నాడు. ఆయన ఎంతో దీర్ఘ-శాంతముగలవాడు. ఆయన ఎంతో సాత్వికముగలవాడు, ఎంతో సమాధానముగలవాడు, ఎంతో దయాళత్వముగలవాడు. ఎవ్వరు నశించిపోవద్దని ఆయన కోరుచున్నాడు. మరియు మనష్యులు నశించిపోకుండా ఉండుటకు ఆయన చేయగలిగిన సమస్తము చేసెను; అయితే వారు ఎలాగైనా నశించిపోవుదురు, ఎందుకనగా వారు నమ్మలేదు.
14
ఇప్పుడు పునరుత్థానము తరువాత ఈ రాత్రికి ఆ ఇద్దరు మనుషులను గూర్చి మనము పాఠము తీసుకుందాము. అనేక మంది వచ్చి అక్కడ ఒక ఖాళీ సమాధియున్నదని, ఆయన దేహము అక్కడ లేదని చెప్పియున్నారు. కొందరు స్త్రీలు వారు దేవదూతల దర్శనమును చూసియున్నామని, “ఆయన మృతులలో నుండి లేచియున్నాడని,” వారు మాకు చెప్పియున్నారని చెప్పి, మరియు ఇంకనూ, ఈ వర్తమానమంతటితో, ఇంకనూ ఈ ప్రజలు నమ్మలేదు, నిరుత్సాహపడియున్నారు, మరియు ఇంటికి తిరిగి వెళ్ళియున్నారు.
మొదటి ఈష్టరు ఉదయమున, దానిని ఆలోచించండి, మొట్టమొదటి వసంతకాలములోని మొదటి రమ్యమైన ఈష్టరు ఉదయము, యేసు తన ప్రజల మధ్య సజీవుడైయున్నాడు, మరియు వీరు మార్గము వెంబడి నడుస్తూ నిరాశతో యున్నారు, దుఃఖముతో నిండిన హృదయములు, మరియు ఆయన సిలువను బట్టి కలత చెందిన వారైయున్నారు. వారు నడుచుచుండగా, అక్కడ మరొకరు ఆ మార్గము వెంబడి వారితో నడచుటను మనము కనుగొంటాము. ఆయన ఎవరైయున్నారో వారికి తెలియదు, కారణము వారి కన్నులు మూయబడియున్నవని లేఖనము చెప్పియున్నది.
15
ఓ, ఇక్కడే మీరు దానిని చూడాలని నేను కోరుచున్నాను, ఇది ఏదో ఒకటి సంభవించినది మాత్రమేకాదు, అయితే అది ఒక ప్రవచనమై యున్నది, అది సంభవించబోవడానికి ఒక ఛాయయైయున్నది. మీకు తెలుసా, మన దేవుడైన ప్రభువు దేనినీ ఆయన ఎన్నడూ మార్పిడి చేయలేదు. ఆయన చేసిన ప్రతిదానికి ఒక అర్ధమున్నది. ఆయన చేసిన సమస్తమూ నిత్యత్వమైనదిగా చేశాడు, అది ఎన్నడూ చనిపోలేదు, ప్రతి కదలిక, ప్రతి చర్య, ప్రతి మాట. ఓ, దానిని బట్టి నాకు ఎంతో సంతోషము. నీవు దానికి మేకును కొట్టినట్టుగా కొట్టుకొనవచ్చును, నీలో యున్నదానంతటితో, మరియు అది ప్రత్యక్షపర్చబడుతుంది.
16
వారు మార్గము వెంబడి నడుస్తూ ఉండగా ఒక క్రొత్తవ్యక్తి వారితో నడవటం ప్రారంభించారు మరియు వారు, ఆయన - వారితో ఇలా అన్నాడు, “మీరు ఎందుచేత అంత విచారముగా ఉన్నారు? మీరు దేనిని గూర్చి సంభాషణ చేయుచున్నారు?”
ఆయన అన్నాడు.... వారు తిరిగి ఆయనతో ఇలా అన్నారు, “యెరుషలేము చుట్టు పట్ల నీవు ఒక్కడివే క్రొత్తవాడవా? ఇక్కడ జరుగుచున్న సంగతులు నీకు తెలియవా? నజరేయుడగు యేసు అను పేరు కలిగిన ఒక ప్రవక్తను మేము కలిగియున్నాము మరియు ఆయన విమోచకుడుగా ఉంటాడని మేము ఆయన యందు నిరీక్షణ ఉంచియున్నాము, అయితే ఇది మూడవ దినమైయున్నది, మరియు మా ప్రజలు ఆయనను సిలువ వేసియున్నారు.” మరియు ఏమి సంభవించియున్నదో, ఆయన ఎలా చనిపోయి యున్నాడో వారెలా ఆయన ఒక గొప్పవిమోచకుడిగా ఉంటాడని ఎదురు చూచారో అవి అన్ని ఎలా సంభవించియున్నవో ఆ వృత్తాంతాన్ని ఆయనకు చెప్పటకు ప్రారంభిచారు, అయితే ఎలా ఆ సర్వోన్నతుడైన దేవుని ప్రవక్త తన ముఖము మీద ఉమ్మివేయబడి, ఎలా విచారముతో అక్కడే నిలువబడి యున్నాడో మరియు ఆ సైనికులు ఆయన తలకు గుడ్డకట్టి ఆయన కన్నులను మూసి ఆయన తల మీద కర్రతో ఎలా కొట్టారో, “ఓ ప్రవచించువాడా, ఇప్పుడు ప్రవచించు. ఇప్పుడు ఎవరు కొట్టారో మాతో చెప్పు, మేము అప్పుడు మేము నిన్ను నమ్ముతాము,” అని అన్నారు. అది ప్రజలు గ్రహించుటకంటే ఎక్కువైయున్నది. మెస్సియా దానికి భిన్నముగా మరొకరీతిగా ఉంటాడని వారు ఆలోచించియున్నారు
17
ఈ దినమున కూడా అది నిజమైన చిత్రముగా లేదా, ప్రజలు ఈ దినమున కూడా దేవుని రాజ్యము అది నిజముగా ఉండియున్న దానికంటే భిన్నముగా ఉంటుందని వారు ఎదురు చూచుచున్నారు. ఇది వైభవముతో వచ్చుటకు వారు ఎదురు చూచుచున్నారు. ఇది వాటికన్ పట్టణములోను లేదా ఏదో ఒక గొప్ప ఆలయములో అది సజీవముగా ఉండునని వారు ఎదురు చూచుచున్నారు. అయితే ఆయన దానిని ఒక గుంపు పేదవారి మధ్యకు విద్యలేని వారిమధ్యకు దీన హృదయముగల ప్రజల యొద్దకు దానిని తెచ్చుచున్నందున, అది జ్ఞానముగల వారి యొక్కయు మరియు వివేకముగలవారి యొక్కయు కన్నులకు అవి గుడ్డితనమును కలుగజేయుచున్నది.
ఓ, ఆయన పాదములను కడిగి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిన ఆ నిజమైన విశ్వాసి చేసినదానికి, ఆ స్త్రీ ఆ వెక్కిరింతలు తీసుకొనుట ఎలాంటి ఒక వెక్కిరింతగా ఉన్నది. అయన సిలువ మీద వేలాడుట, మరియు ఆయన చేతులు సిలువ మీద వేలాడుట, మరియు ఆయన చేతులు సిలువకు కొట్టబడియుండుట, ఎలాంటి వెక్కిరింతగా ఉన్నది, మరియు ప్రధానయాజకుడు, “ఇప్పుడు నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ ఒక అద్భుతమును చేయుము. నీ చేతులను విడిపించుకొని సిలువ మీద నుండి దిగి రమ్ము, అప్పుడు మేము నిన్ను నమ్ముతాము,” అని వారు చెప్పుట ఎంత వెక్కిరింతగా ఉన్నది.
18
ఇప్పుడు శరీరసంబంధమైన మనిషి యొక్క మనస్సులో, అనగా సహజమనిషి, సంఘ సభ్యుడు, అనుకరణ చేయు విశ్వాసి... ఏలయనగా ప్రతి సంఘము మూడు రకములైన మనుషులను కలిగియుంటుంది, వారే, నిజవిశ్వాసి, నటించు-విశ్వసి, మరియు అవిశ్వాసి. ప్రతి సంఘము వారిని కలిగి యుంటుంది, గుడ్డివారి కన్నులను తెరచిన ఈ మనిషి చెవిటివారి చెవులను తెరచిన ఈ మనిషి. నాలుగు దినముల క్రితము మరణించి సమాధిలో ఉన్న మనిషిని తిరిగి లేపుట, అలాటి ప్రకటనలు చేసిన ఈ మనిషిని గూర్చి తలంచినప్పుడు తన ముఖము మీద ఉమ్మివేయబడి అక్కడ నిలబడియున్నారు, మరియు ఒక ప్రధానయాజకుడు ఆయన మీదకు లేచి, ఈ మాటలు పలుకుచున్నాడు మరియు ఆయన ఎన్నడూ నోరు తెరువలేదు తిరిగి మారుగా వాదిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కారణము ఆయన అన్నది, “నేను ఎల్లపుడు నా తండ్రికి ఇష్టమైన దానిని చేస్తాను.” మరియు ఇది సంభవించుట దేవునికి ఇష్టమైయుండెను.
19
ఇప్పుడు కొన్ని నిముషముల పాటు మనము ఆయనను గమనిద్ధాము. ఇప్పుడు ఈ శిష్యులు ఇది ఎందుకు తప్పక ఇలా జరిగియున్నదో వారికి అర్ధము కాలేదు. కాబట్టి వారు మార్గము వెంబడి వెళ్ళుచుండగా, ఆ కథను ఆయనకు వివరించుట ప్రారంభించారు, అప్పుడు యేసు వారిని ఆపియున్నాడు. మీరు చూడండి, వారాయనతో మాట్లాడుచూ ఉండగా, ఆయన వారికి ప్రత్యక్షమవుచూ ఉన్నాడు. ఆ కారణమును బట్టియే వారు ఆయనను గూర్చి ఎక్కువగా మాట్లాడనందుననే, ఈ దినమున అనేకమంది సంఘ ప్రజలకు ఆయన ప్రత్యక్షమగుటలేదు. సంఘము ఎల్లప్పుడూ వారు చేయు పెద్ద కార్యములను గూర్చి జరుగుచున్న సాంఘిక విందులను గూర్చి, లేక వారు వెళ్ళబోవుచున్న విహారయాత్రలను గూర్చి, వారు చేయబోవు క్రొత్త వాటిని గూర్చి సొసైటీలను గూర్చి మాట్సడుచున్నారు. సంఘము సాంఘిక కార్యకలాపములను గూర్చి ఎంత భారమును కలిగియున్నదనగా, చివరకు వారు క్రీస్తునుండి దూరముగా వెళ్ళిపోయియున్నారు. నిజమైన సంఘము ఈ సొసైటీలన్నిటి నుండి ఎల్లప్పుడూ బరువును దించుకొని, మరియు సమస్తమును ప్రార్ధనా కూటముగా, మార్చవలసియున్నది — ఆయనను ఎరిగినవారందరూ, ఆయనను ప్రేమించువారందరు.
20
ఆయన ఇక్కడ వారితో యున్నాడు.
ఆయన ప్రత్యక్షమైనప్పుడు వారు ఆయనను గూర్చి మాట్లాడుచుండిరి. మనము పొరుగువారిని గూర్చి మాట్లాడుట మానివేసినట్లైతే, మరియు యేసును గూర్చి ఎక్కువ మాట్లాడినట్లైతే, యేసు మనకు ఎక్కువ ప్రత్యక్షమగుటను మనము కలిగియుంటాము. ఇంకెవరో పొరపాట్లను గూర్చి మనము మాట్లాడుచున్నాము, కేవలము యేసును గూర్చి మాట్లాడండి. అక్కడ ఎక్కువ కార్యములు జరుగుతాయి.
21
ఇప్పుడు, వారు ఆయనను గూర్చి మాట్లాడుకొనుచుండగా, ఆయన ప్రత్యక్షమయ్యెను. అప్పుడు గమనించండి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన నీ పక్షము వహించుటకు ప్రారంభించడు. “ఓ, ఇది సత్యము. దీనికి ఒక క్రొత్త బోధకుడు ఉండాలి, లేక ఈ పొరుగువాడు నీకు ద్రోహము చేశాడు,” ఇది తప్పక బయట పారవేయవలసియున్నది. చూడండి, ఆయన ప్రత్యక్షమైన వెంటనే, ఆయన వాక్యమును బోధించుటకు ఆరంభించెను. ఒక నిజమైన సేవకుడు ఎల్లప్పుడును వాక్యము నొద్దకు వెళతాడు.
ఆయన అన్నాడు, “ఓ, అవివేకులారా, ప్రవక్తలు క్రీస్తును గూర్చి చెప్పిన వాటన్నిటిని నమ్మని మందమతులారా, చూడండి, ఎలా ఆయన దీనిని లోనికి తెచ్చాడో? ”ప్రవక్త చెప్పిన దానిని నమ్మకుండా, నీవు ఇంకనూ మందమతిగలవాడవుగా, అవివేకివిగా యున్నావా?“
22
ఆయన ఈ రాత్రి ప్రత్యక్షమైతే ఏమిటి? నేను దీనిని అడుగగోరుచున్నాను. ఈ రాత్రి బ్రెన్హం గుడారము నొద్ద ఆయన ఏమి చేస్తాడు? నీవు నీ హృదయములో ఎంతో మందమతిగలవాడవుగా యున్నావా, ఈ రాత్రి జఫర్సన్ విల్ లో ఆయన ఏమి చేస్తాడు, ఇక్కడ 25 సంవత్సరములుగా సువార్త ప్రకటించబడియున్నది, అద్భుతములు, సూచక క్రియలు మరియు మహాత్కార్యములు, ఒక్కటి కూడా సందేహములేదు, యేసు ఈ భూమిని విడిచినప్పటి నుండి, ఎన్నడూ జరగని కార్యములు, రోజూ ఇక్కడ జరుగుచున్నవి. రోగులు బాగుపడ్డారు, సూచక క్రియలు, అద్భుతములు చేయబడియున్నవి. ఎన్నడూ తప్పిపోని గొప్ప ప్రవచనములు ఇవ్వబడినవి. రాజీపడకుండా సువార్త ప్రకటించబడియున్నది, మరియు ఇంకనూ సారాయితొట్లు, రాత్రివేళ నృత్య సంగీతములు జఫర్ససన్ విల్ నిండియున్నవి.
ఓ, దేవుని యొక్క ఉగ్రతను మనము ఎలా తప్పించుకుంటాము? నేను ఎన్నోసార్లు దీనిని చెప్పియున్నాను, మరియు ఇంకనూ ఈ రాత్రి దానిని చెపుతాను. ఒకవేళ దేవుడు మనలను శిక్షించకుండా వెళ్ళిపోనిచ్చినట్లైతే, ఆయన అన్యాయస్తుడైన దేవుడుగా యుంటాడు. ఆయన సోదమా మరియు గొమొర్రా అను పట్టణములను పైకి లేపి, వారిని క్షమాపణ అడగవలసియున్నది, కారణము అవి చేయుచున్న ఆ కార్యములను బట్టియే ఆయన వాటిని ముంచివేసెను, కారణము ఆ కార్యములు మనము ప్రతి రోజూ చేయుచున్నాము, మరియు బహు అధ్వాన్నముగా మారుచున్నాము. వారు అన్యులైన ఒక గుంపు ప్రజలైయున్నప్పటికి, ఆయితే మనము తప్పక ఒక క్రైస్తవ దేశముగా యుండవలసియున్నది.
23
ఆయన వాటితో మాట్లాడుచుండగా, ఆయన వారి వీపులను తట్టుట మాత్రమే కాకుండా, ఒక చిన్న బిడ్డ సిద్ధాంతమును వారు ఇచ్చట మాత్రమే కాకుండా, ఆయన వారికి లేఖనములను వివరించుట ప్రారంభించెను, ఇంకనూ వారిని ఆయన గద్దించుచుండెను మరియు అన్నాడు, “ఓ, అవివేకులారా, మందమతులారా, ప్రవక్త చెప్పిన దానిని మీరు ఎందుకు అనుమానించుచున్నారు?”
చూడండి, ఆయన ఎక్కడకు వెళ్ళియున్నాడో? తిన్నగా లేఖనముల యొద్దకు వెళ్ళాడు. వారు ఆయన మాటలను విని గమనించుట ప్రారంబించిరి, ఆయన అన్నాడు, “క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా?” మరియు ఆయన దినమంతయూ మార్గము గుండా వెళ్ళుచు, వారితో మాట్లాడుచున్నాడు, ఇంకను వారు ఆయనను ఎరుగకుండిరి, కారణము వారి కన్నులు మూయబడియుండెను. వారు ఆయనను చూడకుండా, వారు ఆయనను గ్రహించకుండా వారి కన్నులు మూయబడియుండెను.
24
ఇప్పుడు, ఇక్కడ దీనియొద్దకే నేను వెళ్ళగోరుచున్నాను, దానినే మీరు చూడాలని నేను కోరుచున్నాను. పునరుత్థానము తరువాత అది మొదటి వర్తమానమైయున్నది. మరియు రోజంతటి గుండా ఆయన వారితో నడిచియున్ననూ, వారు ఆయనను ఎరుగకుండిరి, ఇంకనూ, ఆయన వారితో యుండియున్నాడు, అయితే ఆయనే స్వయముగా వారి కన్నులను మూసియున్నాడు. అయితే సూర్యుడు అస్తమించు వేళకు, యేసు తానే వారిని దాటిపోవుచున్నట్లుగా అగుపడెను.
ఈ చివరి దినములలో సూర్యుడు అస్తమించుచుండగా, తిరిగి ఆయన సరిగ్గా ఖచ్చితముగా దానినే ఆయన చేసియుండలేదా, అప్పుడు సంఘమునకు దినమంతటిగుండా ఆయన ఏమి ఇచ్చియున్నాడో మీరు గమనించియున్నారా? కేవలము వాక్యమును బోధించుచున్నాడు. ఆయన ఒక్క సూచనను లేక అద్భుతమును ఎన్నడూ చేసియుండలేదు. ప్రవక్త ఏమి చెప్పియున్నాడో, పునరుత్థానమును గూర్చి దానిని తప్ప మరి ఏదియు ఆయన ఎన్నడూ చెప్పియుండలేదు. ఆయన వెళ్ళిపోయినప్పటినుండి, ఈ చివరి దినము వరకు దానినే ఆయన చేసియున్నాడు.
అయితే ఇప్పుడు, ఓ, ఆయన నామము సన్నుతించబడును గాక, సూర్యుడు అస్తమించుచున్నాడు, ఆయన ఆగునట్లుగాయున్నాడు. ఓ, పానీ క్రాస్బి మొర్రపెట్టిన దానిని నేను ఆలోచించగలను, “ఓ మృధువైన రక్షకుడా, నన్ను దాటిపోవద్దు.”
25
ఈ శిష్యులు అన్నారు, “వచ్చి మాతో బస చేయండి, చీకటిపడుచున్నది, కారణము అది ఆలస్యమగుచున్నది.” ఆయన వారిని దాటిపోవుచునట్లుగా కనిపించాడు, అయితే వారు ఆయనను బలవంతము చేశారు. మరొక మాటలో వారు ఆయనను బ్రతిమిలాడారు. ఓ, ఎక్కువగా ఆయనను బ్రతిమిలాడేవారు యున్నట్లైతే ఎంత మంచిది.
సహోదరి, సహోదరుడా, పట్టణములో జరుగుచున్న హేయకృత్యముల కొరకు ఏడ్చుచూ నిటూర్పులు విడిచే పరిశుద్ధాత్మ కొరకు ప్రార్ధన చేయువారిని మాత్రమే ముద్రించుమని, బైబిలు చెప్పియున్నదని నీకు తెలుసా?
26
ఇప్పుడు నేను నిన్ను ఒక ప్రశ్నను అడుగుచున్నాను. మనము మన మతసంబంధమైన ఆలోచనల కొరకు ఎంతో ఉద్రేకాన్ని కలిగి యున్నాము, అయితే నశించిన లోకము కొరకు, ఈ చివరి దినమున ఈ పట్టణము యొక్క పాపముల కొరకు, కనీసము ఒక రాత్రి ప్రార్ధనలో ఒక అరగంట ప్రార్ధన చేయువారు, ఈ జఫర్సన్ విల్ పట్టణములో ఎవరున్నారు? అయితె లేఖనముల ప్రకారము హేయకృత్యముల కొరకు ఏడ్పునూ నిటూర్పులు విడుచువారిని మాత్రమే దేవుని దూత ముద్రించుచున్నాడు.
ఇక ఎంతమాత్రమూ మనకు వాటియందు ఆసక్తి లేదు. ఒక మంచి సమయమును మనము కలిగియుండవచ్చునని మనము తెలుసుకొనగోరుచున్నాము. మన సంఘములో ఒక చిన్న సొసైటీని మనము కలిగియుండవచ్చునని మనము తెలుసుకొనగోరుచున్నాము, తరువాత సంఘ కాపరిని ఎన్నుకొనుటకు ఓటు వేయుటకు సమయము ఎప్పుడు వస్తుందా అని మనము తెలుసుకొనగోరుచున్నాము, మన సంఘము ప్రక్కన యున్న మన పొరుగువాని సంఘముకంటే కొంచెము బాగా కనిపించాలని మనము కోరుచున్నాము. ఈ దినమున ఈ లోకములోని ఆలోచనలు అవియే.
27
“ఓ, ప్రభువైన దేవా, నా యొద్దకు త్వరగా రమ్ము, లేనిచో నేను నశిస్తాను. ఓ, రక్షకుడా, ఓ నన్ను దాటిపోవద్దు. నీవు సర్వశక్తుడవైయున్నావు. సర్వశక్తిగలవాడవైన నీవు నాయొద్దకు వచ్చి, నా హృదయములో నివాసము చేయుము, ఓ ప్రభువా,” అని ఎవరు మొర్రపెట్టుటలేదు.
ఒక స్త్రీగాని లేక పరుషుడుగాని వారి చేతిని ఎత్తి ప్రభువైన యేసును వారి యొక్క రక్షకుడిగా అంగీకరించుట కనీసము కష్టముగా యున్నది, పాతకాలపు విలపించువారి యొక్క బల్ల తొలగించబడియున్నది అక్కడ ఎంతమాత్రమునూ దుఃఖపడుట లేడు. అక్కడ ఎంతమాత్రము వేదిక నొద్ద ఏడ్చుట అనునదిలేదు.
28
కొంచెము యోచించండి, చార్లెస్ జి. ఫిన్నీ కేవలము ఒక సువార్త బోధకుడు, ఒక మారుమనస్సు పొందిన చిన్న న్యాయవాది, ఎండిపోయినట్టుగా కనబడుచున్న ఒక చిన్నవ్యక్తి, అతడు ఒక కట్టడములో ధ్వనించుట వినుటను పరీక్షించుచున్నాడు. మరియు అతడన్నాడు, “మారుమనస్సు పొందండి, లేనిచో నశించండి.” అప్పుడు ఒక మనిషి ఒక గోపుర శిఖరము మీద కూర్చొండినవాడై సృహ తప్పి క్రిందపడిపోయాడు.
అతడు ఒక కట్టడము యొక్క మిద్దే మీద నిలబడి న్యూ-ఇంగ్లండ్ అను స్థలములో నశించినవారికి నరకమును గూర్చి బోధించాడు. “మీరు మారుమనస్సుపొందని యెడల మీరు నశిస్తారు,” అని అతడు కేకలు వేసినపుడు, స్త్రీలు మరియు పరుషులు సృహ తప్పి వీధులలో పడిపోయారు.
అయితే, ఈ దినమున మారుమనస్సును గూర్చి, నరకాన్ని గూర్చి, అగ్నిగంధకములను గూర్చి మీరు బోధించగలరు, ప్రజలు దానిని చూసి నవ్వుతారు, కారణమేమిటి? మన హృదయములు చల్లబడిపోయినవి. మనము బిన్నమైనవారముగా మారిపోయాము. మనకు అధికముగాయున్నది. మనకు ఎక్కువ దేవుడు మరియు తక్కువ లోకము కావాలి. మన హృదయములు ఎంతో చల్లగా యున్నవి.
ఏదో కొంత, ఉద్రేకము మీద మనము ఆసక్తిని కలిగియున్నాము. మనము నాట్యము చేయగలమా, మనము కేకలు వేయగలమా అని ఆసక్తిని కలిగియున్నాము. దానియందు నాకు నమ్మకమున్నది. మనము భాషలలో మాట్లాడగలిగినట్లైతే, దానియందు నాకు నమ్మకమున్నది. దానిలో ప్రతి దాని మీద నాకు నమ్మకమున్నది. మనము దానిని కలిగి, హృదయములోబ్రద్ధలై కన్నీరు కార్చుచూ పరితపించనట్లతే, దేవుడు మనలను ఎన్నడూ వాడుకొనలేడు. అవి మంచివే, మనము తప్పక దానితో వెళ్ళునట్లు ఈ మిగిలినవి కూడా ఉండవలసియున్నది. అసలైన దానిని మనము వదిలిపెట్టియున్నాము, మరియు ద్వితీయ శ్రేణిలోని దానికి మనము వెళ్ళియున్నాము, మరియు చిన్నదానిని నీవు ఎన్నడూ పెద్దవానిగా చేయలేవు.
29
మన సొంత కూటములలో సైతము మన సొంత కూటములలో కూడా ఆత్మ స్వస్థతకు బదులుగా, దైవిక స్వస్థతను మనము మరి ఎక్కువగా కలిగియున్నాము. సోదరుడా, ఈ దినమున మనకు అవసరమైనది ఏదనగా, దేవుని కొరకు ఆత్మలు మండే ఉజ్జీవము. నా భావము ఏమనగా, “మంటతో యుండుట,” వేదిక నొద్ద వారి బుగ్గల మీదుగా కన్నీరు ప్రవహించుట, ఐదు నిముషముల పాటు కాదు, మరియు మనము పైకి లేచి దానిని మర్చిపోవుట కాదు. అయితే వారి హృదయములో ఒక భారము కలిగి, నశించిన ఆత్మలను తిరిగి క్రీస్తు నొద్దకు తెచ్చుటకు ప్రయత్నము చేయుట.
“దేవా, లోకాశలన్నిటిని, క్రీడలన్నిటిని, లోక అలంకారములన్నిటిని మా నుండి తీసివేసి, నశించినవారిపట్ల నా హృదయములో భారమును ఉంచమనియే నా ప్రార్థనయై యున్నది.”
30
వారు ఆయన బలవంతము చేశారు, “ఓ ప్రభువా, మాకు నీవెవరివో తెలియదయ్యా, అయితే నీ బోధను మేము ప్రేమించుచున్నాము. లోనికి వచ్చి, ఈ రాత్రి మాతో బసచేయండి.” మరియు యేసు నడుస్తూ లోనికి వెళ్ళియున్నాడు, వారు ఆయనను ఎరుగకయుండిరి. ఆయనలోనికి వెళ్ళగానే... బహుశ ఇది ఒక చిన్న పాక కావచ్చు, అయితే ఇక్కడ ఎక్కువగా తగ్గించుకొనుట ఆయనకు లెక్కకాదు..
నీవంటావు, “సరే, బ్రెన్హం సోదరుడా, నేను ఒక ముసలివాడను.” నీవు ఎంతముసలివాడవైనప్పటికి లెక్కకాదు.
“నేను కేవలము బాలుడను.” నీవ ఎంత చిన్నవాడవైనప్పటికి లెక్కకాదు.
“నేను ఎంతో పేదవాడను. నా మీద మాసిన బట్టలున్నాయి.” ఓ, ఒకవేళ నీవు గడ్డి సంచితో కప్పబడియున్నప్పటికి, అది దేవునికి ఏ బేధమును చేయదు. కేవలము ఆయనను అడుగుము, నీవు దేవుని దృష్టిలో గొప్పవాడవు. మనుషుల ముందు నీవు ఎక్కువగా కనబడకపోవచ్చు, అయితే నీవు దేవుని దృష్టిలో గొప్పవాడవు. నీవు ఆయన ఎన్నికలలో ఒకడవు.
31
“లోనికి వచ్చి మాతో యుండండి.”
“ఓ, నేను అయనను లోనికి రమ్మని అడుగలేను, నేను ఒక త్రాగుబోతునై యున్నాను. నేను ఒక జూదగాడినైయున్నాను.”
నీవు ఏమై యున్నప్పటికి నాకు లెక్కకాదు. నీవు ఆయనను అడిగి తెలుసుకొనుము. నీ ఆహ్వానము మీద ఆయన వస్తాడు. ఆయన ఎన్నడూ ఒక్క ఆహ్వానాన్ని కూడా త్రోసివేసియుండలేదు, మరియు ఒక్క ఆహ్వానాన్ని కూడా త్రోసివేయజాలాడు. ఆయన హృదయములలో ప్రవేశించటానికి ఎదురుచూస్తు ప్రయత్నము చేయుచున్నాడు.
నీవంటావు, “నేను ఒక వీధి వేశ్యయైయున్నాను.” నీవు ఏమైయుండినావో నేను లెక్కచెయ్యను. దేవుడు నీ హృదయములోనికి ఆయన మార్గమును చేసికొనుచున్నాడు. కేవలము చెప్పు, “లోనికి రమ్ము, ప్రభువా, మరియు నాలో ఉండుము.”
32
గమనించండి, దినమంతటిగుండా ఆయన వారికి వాక్యమును తెచ్చుచుండెను, అయితే ఏ సూచక క్రియలు లేవు. ఆయనలోనికి వెళ్ళినపుడు, మరియు తలుపు వేయబడినది, అయన కూర్చున్నాడు, ఓ, సోదరుడా, అప్పుడే ఆయన తన పునరుత్థానమును బయలుపరిచియున్నాడు. ఆయన ఉదయము వారిని కలుసుకొన్నప్పటినుండి, సూర్యుడు ఆస్తమించువరకు, ఏ సమయములో ఆయన దానిని చేయలేదు. కేవలము వాక్యము తప్ప, ఆయన జీవితములో చేసిన ఒక్క కార్యము కూడా చేయలేదు. అయితే గమనించండి, సాయంకాలపు సమయములో, అప్పుడే ఆయన తన పునరుత్థానము రుజువు చేసుకొనెను.
దీనత్వముతో దీనిని నన్ను చెప్పనియ్యండి. దీనిని మిగిలిన స్వరముతో నన్ను చెప్పనియ్యండి, అయితే ఒక విరిగిన హృదయముతో కూడా. అది సాయంకాలపు సమయము, బైబిలు చెప్పియున్నది అస్తమయ కాలమున వెలుగు కలుగును, అది పగలు కాదు లేక రాత్రి కాదు,“ అని ప్రవక్త చెప్పియున్నాడు. ఏ విధమైన ప్రత్యక్షత లేకుండా, అది కేవలము వాక్యమును వినుటయైయున్నది, ఒక మబ్బుగాయున్న ఒక పొగమంచుగాయున్న దినముగా యున్నది. అయితే సాయంకాలమున మరలా వెలుగు కలుగును. అది వెలుగుగా యుండును.
33
మరియు ఈ సాయంకాలపు వేళలో మనము ఇప్పుడు జీవించుచున్నాము, అక్కడ క్రీస్తు, ఆయన సేవకుల ద్వారా రెండువేల సంవత్సరములుగా సువార్తను ప్రకటించియున్నాడు, అయితే ఇది సాయంకాలపు వెలుగులై యున్నవి. సాయంకాలపు వెలుగులు పునరుత్థానము యొక్క ప్రత్యక్షతయై యున్నది. ఎప్పుడు? వారికి తెలియదు. ఆయన మృతలలోనుండి లేచి యున్నాడు. వారు ఆయనను ప్రేమించియున్నప్పటికి, వారు ఆయనను నమ్మియున్నప్పటికి, ఇంకనూ ఆయన మృతులలో నుండి లేచియున్నాడని వారికి తెలియదు. దానికి వ్యతిరేకముగా వారు వాదించియున్నారు. మరియు ఇప్పుడు, అది ఇక్కడ సాయంకాలపు సమయములో యున్నది. ఆయన మృతులలోనుండి లేచియున్నాడని తన్నుతాను రుజువు చేసుకొనబోవుచున్నాడు. ఆయన ఎలా దానిని చేసియున్నాడు? వాక్యమును బోధించుట ద్వారా కాదు, ఆయన ఇది వరకే దానిని చేసియున్నాడు, మరియు ఇంకనూ వారు నమ్మలేదు.
రెండువేల సంవత్సరములుగా వాక్యము బోధించబడియున్నది, సంఘము ఇంకనూ నమ్మలేదు. కాని సాయంకాలపు వెలుగువచ్చియున్నది, పునరుత్థానము యొక్క ప్రత్యక్షత. ఆయన వారిని లోనికి తీసుకొని వెళ్ళాడు, మరియు ఆయన ఒక అద్భుతమును చేశాడు, లేక ఆయన సిలువకు ముందు చేసినట్లువలె ఒక కార్యమును చేశాడు. అది ఆయనయైయున్నాడని వారు తెలుసుకొనిరి. వారి యొక్క కనులు తెరువబడినవి. ఆయన వెంటనే అదృశ్యమైపోయాడు.
34
గమనించండి, అది ఒక క్లుప్తమైన వర్తమానమైయున్నది. అది ఎక్కువ సమయమైయుండలేదు. ఆయన ఎక్కువ సమయము వారితో యుండలేదు. ఆయన తన్నుతాను ప్రత్యక్షపర్చుకొని వారి దృష్టినుండి అదృశ్యమైపోయాడు. వారి కన్నులు తెరువడినవి మరియు అది ఆయనయైయున్నాడని వారు గుర్తించిరి. వారన్నారు, “ఆయన మార్గము వెంబడి మనతో మాట్లాడుచుండగా మన హృదయములు మనలో మండలేదా?”
ఓ సోదరుడా, సోదరీ ఈ సంవత్సరములన్నిటి గుండా మన హృదయములు ఎంత మండియున్నవి. నేను 20 సంవత్సరముల నుండి ఒక క్రైస్తవునిగా యున్నాను, కాదు, దరిదాపు 29 సంవత్సరముల నుండి, 27 సంవత్సరముల నుండి నేను ఒక బోధకుడనైయున్నాను. మరియు మార్గమంతటిగుండా, నేను ఆయన వాక్యమును చదివినప్పుడు, ఆయన నాతో మాట్లాడినపుడు, ఆయన వాక్యమును వినుటకు నా హృదయము మండుచున్నది.
35
అయితే ఇప్పుడు, సాయంకాలపు వెలుగులు వచ్చియున్నవి, సూర్యుడు అస్తమించుచున్నాడు. నాగరికత వెళ్ళిపోయినది. ప్రపంచము అంతములో యున్నది. ఇప్పుడు పునరుత్థానుడైన క్రీస్తుగా తన్నుతాను బయలుపరచుకొనుటకు ఆయన మన మధ్య ప్రత్యక్షమై ఏదో కార్యమును చేయుచున్నాడు. మన నేత్రములు తెరువబడతాయి. ఆయన శాశ్వతముగా సజీవుడై యున్నాడని మనము చూడగలము. పిండివంట మంచిదని రుజువు చేయుట, దానిని తినుటయే. అదియే పునరుత్థానము యొక్క రుజువై యన్నది.
యేసు వాగ్ధానము చేసియున్నట్లైతే, బైబిలు వాగ్దానము చేసియున్నది, “ఆయన నిన్న, నేడు, నిరంతరము ఒకేరీతిగా యున్నాడు,” మరియు ఆయన దానిని రుజువు చేయని పక్షమున అప్పుడు లేఖనము తప్పైయున్నది, యుగములన్నిటిగుండా మనము ఈ లేఖనముల యొక్క ఉపదేశములన్నిటిని కలిగియున్నాము, అయితే ఈ దినము ప్రత్యక్షత దినమైయున్నది, ఏలయనగా పునరుత్థానము యొక్క ప్రత్యక్షతయైయున్నది.
36
ఇప్పుడు వారు ఏమి చేశారు? వారి కన్నులు తెరువబడినపుడు వారున్నారు, “మన హృదయములు మనలో మండలేదా?” మరియు వారు త్వరగా తమ ప్రజలను కలుసుకొనుటకు పరుగెత్తుకొనిపోయిరి. “సరే, బహుశా అది ఏదోమైయున్నది,” అని వారు వెనుకకు తిరిగి మార్గమున వెంబడి వెళ్ళలేదు“; అయితే వారు దానిపట్ల సరైన వైఖరితో యుండిరి, మరియు వారు తమ సొంత ప్రజల యొద్దకు వెళ్ళి, ”నిజముగా ప్రభువు లేచియున్నాడు, నిజమనిరి! ఆయన లేచియున్నాడని మనకు తెలును.“ వారి మతమును గూర్చి వారు వాదించుటకు వెళ్ళలేదు. వారి కన్నులు తెరువబడిన కారణమున వారు వెళ్ళియండిరి. వారు ఆయనను ఆయన పునరుత్థానములో చూసియుండిరి.
37
నా స్నేహితుడా, దాని కంటె అత్యంత రమ్యమైన సంగతి ఏమున్నది, ఈ రాత్రి దాని కంటె మహిమకరమైన సంగతి ఏమిటి, ఈ ఈష్టరు ఉదయాన? ఈ చిన్న దీనమైన గుడారములో మృతులలో నుండి లేచిన అదే యేసును మనమధ్య చూచుట, 20 సంవత్సరముల క్రితము అది మూడువేల డాలర్లకంటె తక్కువయైయున్నది, ఈ చిన్న దీనమైన స్థలములో, ఆయన వచ్చుటను చూచుట, ఆయన సిలువకుముందు చేసిన కార్యములను చూచుట, ఆయన పునరుత్థానమును రుజవు చేయుట ఎలాటి సంగతి? ఈ చివరి దినముల వరకు ఆయన ఎన్నడూ దానిని చేయలేదు. ఇప్పుడు ఆయన దానిని చేయుచున్నాడు, దాని కారణము ఏమనగా దానిని ఆయన చేస్తానని వాగ్దానము చేసియున్నాడు. ఇది సాయంకాలపు సమయమైయున్నది. వెలుగులు ప్రకాశించుచున్నవి. దేవుడు తన పిల్లల యొక్క కన్నులను తెరుచుచున్నాడు, వారు, తేలికైన హృదయములతో పరుగెత్తుకొని వెళ్ళి, “ఓ, ఆయన నిజముగా లేచియున్నాడు,” అని చెప్పిరి.
38
ఇప్పుడు ఈ రాత్రి బహుశా వర్జీనియా రాష్ట్రము నుండి, దేశములోని అన్ని ప్రాంతముల నుండి వచ్చిన ప్రజలు ఈ కట్టడములో యున్నారు, మరియు నీవు ఎక్కడ నుండి వచ్చియున్నప్పటికి లెక్కకాదు, యేసు వారికి ప్రత్యక్షమైనట్లుగా, మీకును ఈ ఈష్టరు ఉదయమున ప్రత్యక్షమైయున్నట్లైతే, మీరును తిరిగి తేలికైన వృదయములలతో వెళ్ళవచ్చును. బహుశా నీవు ఆయనతో చాలా కాలము నడిచియుండవచ్చు. బహుశా కొన్ని సంవత్సరములుగా నీవు ఒక క్రైస్తవుడవై యుండవచ్చు, అయితే నీవు ఇంకనూ ఆయన యొక్క పునరుత్థానము యొక్క ప్రత్యక్షతా శక్తిని ఎన్నడూ చూసియుండకపోవచ్చు.
ఓ, ఆయన దానిని ఈ రాత్రి చేసినట్లైతే, నీవు ఆయనను మృతులలో నుండి లేచిన ప్రభువుగా స్వీకరిస్తావా? ప్రార్ధన కొరకు మనము తలలను వంచియుండగా, ఇప్పుడు దానిని యోచించండి. ఈ ప్రార్ధనలో ఎంతమంది జ్ఞాపకము చేసుకోబడాలని కోరుచున్నారు? మీ చేతిని దేవునికి ఎత్తండి. ప్రభువు మిమ్ములను దీవించును గాక.
39
ఇప్పుడు, ప్రభువైన దేవా, ప్రజలు నిలబడియున్నారు, వారి అవయవములు తిమ్మిరితో యున్నవి, అయితే, ఓ, వారు నిన్ను ప్రేమిస్తారు. ప్రభువా, ఈ పునరుత్థాన దినమున వారు వచ్చియున్నారు. బహుశ వారు, ఎక్కడ నుండో ఒక పాత ఖాళీ సమాధి నుండి ఖాళీ సువార్తను బోధించు స్థలము నుండి వచ్చియున్నారు, “అద్భుతములు జరుగు దినములు గతించి పోయినవని,” వారు అనుచున్నారు. ఆ రీతిగానే వారు సమాధిని కనుగొనియున్నారు, కారణము ఆయన అక్కడ లేడు. ఆయన మృతులలోనుండి లేచియున్నాడు . అయితే క్లియోపా మరియు అతని స్నేహితుడు వారితో ఎన్నో ప్రయాణములను కలిగియున్నారు, ఈ రాత్రి, మార్గముగుండా దానిని చర్చించి యున్నారు.
కాని ప్రభువైన దేవా, ఈ సాయంకాలపు సమయములో, ఈ రాత్రి నీ యొక్క పునరుత్థానమును, ఈ చిన్న సంఘమునకు ప్రత్యక్షపర్చమని నేను ప్రార్ధన చేస్తాను. ఈ దగ్గర నిలబడినవారికి, నీవు దీనుడవైయున్నావని రుజువు చేయుము; అది ఎంత దీనముగా యున్నప్పటికి లెక్కకాదు. నీకు స్వాగతమియ్యబడిన మరియు నీవు కోరబడిన ఏ స్థలమున కైనను నీవు వస్తావు. ప్రభువా, ఇక్కడ అవసరతలో యున్నవారు ఎందరో యున్నారు, అనేకమంది రోగులు, పీడించబడుచున్నవారున్నారు, అనేక మంది నీవు లేనివారుగా, క్రీస్తు లేనివారుగా, దేవుడు లేనివారుగా యున్నారు, మరియు వారికి సహాయము అవసరము. మరొకసారి, ఈ రాత్రి, ఈ చిన్న గుడారమునకు నిన్నునీవు బయలుపర్చుకొమ్మని తండ్రీ నీకు ప్రార్ధన చేయుచున్నాను.
40
ఓ, ప్రభువైన దేవా, నీవు నీ సేవకునికి మంచిగా యుండి యున్నావు, ఎన్నో సంవత్సరముల క్రితము, ఈ దినమున, ఒక చిన్న కరుకుగా కనబడుచున్న చెక్క గదిలో, 15 సంవత్సరముల వయస్సులో ఇక్కడయున్న నా యవ్వన తల్లి, ఒక ఉదయమున పెందలకడ కిటికీని తెరచినపుడు, నేను నా చిన్న మొదటి కేకను వేసియున్నాను. ఓ ప్రభువైన దేవా, ప్రతి సంవత్సరమును బట్టి నీకు వందనములు. నేను తప్పుగా చేసిన అనేక కార్యములను గూర్చి నేను సిగ్గుపడుచున్నాను. నన్ను క్షమించమని ప్రార్ధన చేయుచున్నాను, ప్రభువా, నేను ఒక విషయమై సంతాపడుచున్నాను, అదేమనగా నేను చిన్న బాలుడుగా యున్నపుడు నేను నిన్ను సేవించలేకపోతిని. ప్రభువా, నాకు సహాయము చేయుము.
ఓ ప్రభువా, నేను నీ దృష్టిలో దయను పొందినవాడనైతే, ఈ బలహీనమైనా శరీరమును బలపర్చుము. నా శక్తిని నూతన పర్చుము. నా యవ్వన కాలపు శక్తిని నూతనపర్చుము, నీవు పక్షిరాజులకు చేసినట్లుగా, మరియు నా తలను పైకెత్తుము. ప్రభువా, నీ ప్రేమను నేను ప్రజలకు ప్రత్యక్షపర్చునట్లుగా, నేను నీతో నడవగలుగునట్లుగా, నా తలను ఫైకెత్తుము, నా హృదయమును క్రిందకు దించుము. నేను నిన్ను సేవించునట్లుగా, నాకు లోతైన ప్రేమను, ఎక్కువ సమర్పణను, ఒక లోతైన, నిండైన జీవమును, సంపూర్ణమైన జీవమును నాకు దయచేయుము.
ప్రభువా రోగులను, పీడించబడుచున్నవారిని స్వస్థపర్చుట ద్వారా, నీ యొక్క పునరుత్థానమునకు సాక్ష్యమునిమ్ము, ఈ రాత్రి నీ శక్తిని ప్రత్యక్షపరచుము మరియు ప్రభువైన యేసు నామములో మీకే స్తుతిని ఇచ్చుచున్నాము. ఆమెన్.
41
సహోదరీ జెర్టీ, ఆ పాట నాకు ఇష్టము, ఎంత మందికి అది తెలుసు, “పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వశక్తిగల ప్రభువైన దేవుడు”? దానిని మనమందరము ఈ విధముగా ఆలపిద్దాము, ఇప్పుడు అందరూ కలసి, కేవలము మరొక్కసారి, నాకు ఇష్టము. ఆ పాతకాలపు పాటలు ఎంతమందికి ఇష్టము? ఓ, ఎల్విస్ ప్రేస్లీ క్రైస్తవ్యము పేరులో పాడే బాగా ఊగె పాటలు, ముక్కలు ముక్కలుగా నరికి వేయు చిన్నపాత పాటలు అన్నియూ నీవు తోసుకోవచ్చు, నీవు అవి తీసుకొనుము. హృదయమును కదిలించే సువార్త యొక్క ప్రేమ పాటలు, ఆ పాత-కాలపు పాటలను నాకివ్వండి.
పరిశుద్ధుడు! పరిశుద్ధుడు! పరిశుద్దుడు!
సైన్యములకు ఆధిపతియైన ప్రభువైన దేవుడు
భూమ్యాకాశములు సంపూర్ణముగా నీతో నిండియున్నవి,
భూమ్యాకాశములు నిన్ను స్తుతించుచున్నవి,
ఓ, మహోన్నతుడైన ప్రభువా.
అది నీకు ఏదో చేయుట లేదా? కేవలము ఆరాధించండి, అందరము కలసి, మరలా మనమందరము ఇప్పుడు దానిని పాడుచుండగా, ఇప్పుడు దేవుని కేవలము ఆరాధించండి. మనము పాడుచుండగా, ఒక రకముగా నిన్ను నీవు మూసివేసుకొనుము.
పరిశుద్ధడు! పరిశుద్ధడు! పరిశుద్ధుడు!
సైన్యములకు ఆధిపతియైన ప్రభువైన దేవుడు
భూమ్యాకాశములు సంపూర్ణముగా నీతో నిండియున్నవి,
భూమ్యాకాశములు నిన్ను స్తుతించుచున్నవి,
ఓ, మహోన్నతుడైన ప్రభువా.
42
మహోన్నతుడగు ప్రభువైన దేవా, నీవు సూర్యుని దాని కక్ష్యలలో ఉంచావు. నీవు చంద్రుని, నక్షత్రములను ఉంచావు. నీవు భూమిని నీ అరచేతితో కొలిచి, మరియు నక్షత్రములను ఊది యున్నావు. నీవు దేవుడవు 1900 సంవత్సరముల క్రితమే నీవు యేసును మృతులలోనుండి లేపి యున్నావు, మాకు ధన్యమైన నిశ్చయతను ఇచ్చుటకు ఆయనను మాకు సజీవునిగా చూపించావు, ఇప్పుడు మేము ఆయన రాకడ కొరకు కనిపెట్టుచున్నాము, ఆయన దావీదు సింహాసనము మీద కూర్చిని మరియు భూమిని సమాధానముతోను నీతితోను ఏలుబడి చేస్తాడు. ఇక ఎంతమాత్రము మేము యుద్ధములను గూర్చి చదువము. దుఃఖమైనను, ఆకలియైనను ఇక ఎంతమాత్రము అక్కడ యుండదు. అక్కడ ఇక ఎంత మాత్రము విచారము, ఎంతమాత్రము మరణము లేదు. పాత సంగతులు గతించిపోయినవి మరియు, ఓ దేవా, అది ఎంతో సమీపమైయున్నది.
నీ పిల్లల హృదయములను బలపర్చుము. ఈ రాత్రి మేము కోరినవాటిని ఇమ్ము ప్రభువా, మా కొరకు కాదు, కాని ఆయన యొక్క పునరుత్థాన సాక్ష్యము తాజాగా మా హృదయములో కలిగియుండుటకు నేను నా హృదయమును తగ్గించుకొని నాకు సహాయము చేయమని నిన్ను అడుగుచున్నాను. శ్రోతలు వారి హృదయములను తగ్గించుకొని వారికి సహాయము చేయవలెనని నిన్ను అడుగుచున్నారు, అట్లు మేమందరము ఏకముగా పునరుత్థానుడైన ప్రభువును చూచెదము గాక.
ప్రభవా, మా మధ్యలోనికి రండి. ఈ సంఘమును శుద్ధి చేయుము దేవుని యొక్క కనికరములు కొరకు నేను అడుగుచున్నాను. ప్రభువా, మాకు తీర్పు తీర్ఛవద్దు. మేము తీర్పుకొరకు అడుగుట లేదు. మేము కనికరము కొరకు అడుగుచున్నాము, మాకు కనికరము నిమ్ము, ఓ నిత్యుడవైన దేవా, నీ సన్నిధిని మరియు నీ ప్రేమను మాతో ప్రత్యక్షపర్చుము, ఏలయనగా మేము యేసు నామములో అడుగుచున్నాము. ఆమెన్.
43
ఓ, నేను ఎక్కువగా ఆరాధించాలని కోరుచున్నాను. నా హృదయము కేవలము నిండిపోయినది! ఎలాటి ఒక నిశ్చయశత! యేసు మృతులలో నుండి లేచియున్నాడు. అది శాంతాక్లాస్ వంటి ఒక కథ కాదు. నేను పిల్లల ముందు ఏదైనా తప్పు చెప్పుచున్నట్లైతే, మీరు నన్నుక్షమించండి, నా భావము అది కాదు. అయితే పిల్లలకు సత్యము చెప్పుటయందు నాకు నమ్మకమున్నది. నేను సత్యమును తెలుసుకొనగోరుచున్నాను. వారు యేసును గూర్చి నాకు చెప్పారు. ఆయన మృతులలో నుండి లేవకపోయినట్లైతే, ఇప్పుడు అది ఒక మర్మమైన కథయైయున్నది. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యుండకపోయినట్లైతే అపుడు అది ఒక మర్మమైన కథయై యున్నది.
అలాగైతే ఆయన తిరిగి లేచిన దేవుడుగా తన్నుతాను రుజువు చేసికొనక పోయినట్లైతే, ఆయన చనిపోయియున్నాడు. అయితే ఆయన మృతులలో నుండి లేచియున్నాడని తెలుసుకొనుటకు నేను సంతోషించుచున్నాను, మరియు ఇప్పుడు ఆయన జీవించుచున్నాడు. ఆయన ఇక్కడయున్నాడు. మరియు ఈ ఉదయమున నేను మీతో మాట్లాడినట్లుగా, మీ హృదయములలో నుండి ఎవరును ఈ పవిత్రమైన ఇసుకలను తీసివేయలేరు. యాత్రికుడా, దేవుడు ఈ రాత్రి నీ హృదయమును తెరుచును గాక, మరియు ఆయన కుమారుడు మృతులలో నుండి తిరిగి లేచియున్నాడని, ఇక్కడ తన్నుతాను బయలుపర్చుకొనుటకు యుండి యున్నాడని నీవు తెలుసుకొందువు గాక.
44
ఇప్పుడు, ఎంత మందికి ప్రార్ధన చేయవలసియున్నదని నేను బిల్లిని అడిగాను. అతనికి తెలియదు. ఈ పట్టణములో ఎంత మందికి ప్రార్ధన అవసరము, రోగులైనవారు, మీ చేతులను ఎత్తండి. ప్రార్ధన కావలసినవారు అంతటా యున్నారు. అది చాలా ఎక్కువగా యున్నారు. చూడండి, అది ముగిసినది. శ్రోతలలో మూడు వంతులలో, రెండు వంతుల మంది యున్నారు. ఒక ప్రార్ధనా వరుస గుండా వారిని తెచ్చుట అది చాలా అధికముగా యుంటుంది. మనము దానిని చేయలేము. ప్రార్థనా కార్డులను ఇవ్వమని నేను అతనికి చెప్పియున్నాను. మరియు వారిని మనము వరుసగా నిలబెట్టి ఎంత మందిని తేగలమో అంత మందిని తెద్దాము. నేను ఊహిస్తాను. నీవు ఒక వంద ప్రార్థనా కార్డులను ఇచ్చావా? మంచిది. అవును, అతడు వంద ప్రార్థనా కార్డులను ఇచ్చియున్నాడు. మరియు ఈ కట్టడములో 250 మంది లేక ఆ మోస్తరుగా వారిని మనము ఏర్పరచవచ్చును.
45
కాబట్టి, బహుశ అనేక మంది యున్నారు. ప్రార్థనా కార్డులులేనివారైన మీరు ఎంతమందిని దేవుడు స్వస్థపర్చాలని కోరుచున్నారు? మీ చేతులను ఎత్తండి, ఈ కట్టడములో ప్రతి స్థలములో చేతులు ఎత్తబడియున్నవి, ప్రార్థనా కార్డులు లేనివారు. దరిదాపుగా వారిలో సగము మంది యున్నారు. మంచిది. ఇప్పుడు మనము చేయగలుగు ఒకే చట్టముగా తీర్మానము చేయు పద్ధతి యున్నది.
అక్కడ నా హృదయములో ఒకటి యున్నది. నా హృదయము లో ఇక్కడ ఒకటి యున్నది. నేను దేనిని గూర్చి మాట్లాడుచున్నానో ఇది నేను ఎరుగు వరకే నేను దానిని చెప్పలేను. నేను ప్రార్ధన చేయుచున్నాను. నేను దేవునిని పట్టుకొనియున్నాను. నేను అరణ్యము వెనుకకు వెళ్ళబోవుచున్నాను. నేను తప్పక దేవునిని కలుసుకొనవలసియున్నది. అక్కడ ఏదో యున్నది. నేను తప్పక ఆ ఇసుకల మీదికి వెళ్ళవలసియున్నది, ఇక్కడ కొద్ది సంవత్సరముల క్రితము నేనున్నాను. నేను ఆయనతో మాట్లాడగోరుచున్నాను. నేను ఆయనను రెండుసార్లు దర్శనములో చూశాను. నేను వెళ్ళక మునుపు నేను ఆయనను చూడగలనని నేను నిరీక్షించుచున్నాను.
46
అక్కడ లేఖనములో ఒకదానిని నేను కనుగొనియున్నాను. నాకు తెలియదు. అది నా హృదయములో యుండియున్నది. మరియు నేను దానిని గూర్చి మాట్లాడిన ప్రతిసారి, ఏదో సంభవించుచున్నది. నేను కేవలము.... నేను ఒక స్థలములో యున్నాను. నేను ఏమి చేయవలయునో నాకు తెలియదు, ఈ పరిచర్య ఇప్పుడు నేను కలిగియున్నది మాసిపోవుచున్నది. దాని స్థానములో ఏదో అతి గొప్పది దాని స్థానమును తీసుకొనబోవుచున్నది.
ఈ వారము లేక రెండు వారములలో నేను ఆ పవిత్రమైన ఇసుకలలోనికి వెళ్ళబోవుచున్నాను, నేను వెళ్ళగలిగినట్లైతే, ఆ ఎడారి వెనుక నా ప్రభువును కలుసుకొనగలనేమో చూస్తాను. నేను విశ్రమించలేను. ఇదంతా ఏమిటో నేను కనుగొను వరకు, నేను ఆయనను కనుగొను వరకు నాకు శాంతి ఉండదు, నేను దానిని గ్రహించలేదు, ఈసారి ఆయన నన్ను త్రోసివేస్తాడని నేను నమ్మను. నేను గొప్పలు చెప్పుకొనుచున్నాను. ఆయన నాకు సహాయము చేయవలెనని ప్రార్ధన చేయుచున్నాను.
ఇది కాదు నేను.. నేను.. నాకు అది ఇష్టము లేదు, నేను ఇక్కడికి తిరిగివచ్చి, “బోధించి ముందుకు వెళ్ళగలను. ఒక విధముగా వారు సహాయపడుటకు నా పట్ల శ్రద్ధవహించుటకు నాకు తగినంత మంది స్నేహితులున్నారని నేను ఊహిస్తాను. అది అది కాదు, నా ఉద్దేశ్యము అది కాదు. నేను కలిగియున్న ఈ సేవను, దేవుడు నాతో యున్నట్లైతే నేను దానిని ముందుకు కొనసాగించగలను. నేను ముందుకు కొనసాగగలను. నా హృదయము తృప్తి చెందలేదు. నా దినములు అక్కడ కరడును పిలుచుచున్నది. ఏదో అక్కడ కదులుచున్నది. నేను దాని మీద నా చేతులను ఉంచియున్నట్లుగా కనబడుచున్నది; అయితే ప్రభువా, అది ఎక్కడ యున్నది?
47
అది నా కొరకు కాదు; అది ఆయన ప్రజల కొరకై యున్నది. అది దేవుని పిల్లల కొరకై యున్నది. నేను కేవలము అర్పణలుగా మారతాను. నేను ఒక ముసలివాడనై యున్నాను. నా దినములు ముగించబడుచున్నవి, నా యవ్వన దినములు గతించిపోయినవి. 49 సంవత్సరముల వయస్సు గల మనిషి ఇక ఎంత మాత్రము బాలుడు కాడు. మనకు అది తెలును. ఒక సంవత్సరముతో నాకు ఏభై సంవత్సరములు వస్తాయి, నేను బాలుడను కాదు. నేను పెంచవలసిన పిల్లలున్నారు, అది సత్యము; అయితే సోదరుడా, అన్నిటికంటెపైగా నేను చేయవలసిన పనిని నేను కలిగియున్నాను. నాలో ఈ తృష్ణ యేమిటో నేను తప్పక ఎరిగి యుండవలసియున్నది. నేను దానిని కనుగొను వరకు వెళ్ళవలసియున్నది. నేను తప్పక ఎక్కడో ఆయనను కనుగొనవలసియున్నది - నేను తప్పక తెలుసుకొనవలసియున్నది!
48
నేను అదే ప్రకటన చేసియున్నప్పుడు 10 లేక 15 సంవత్సరముల నుండి ఇక్కడ కూర్చొండియున్నవారు యున్నారని నేను ఊహిస్తాను. ఇక్కడ యున్నవారిలో ఎంతమందికి అది గుర్తున్నది? ఆ ఎత్తబడిన చేతులను కొంచెము చూడండి? కేవలము విడువబడిన ఆ వృద్ధ చేతులను చూడండి? “ఇక్కడ ఏదో యున్నది.” నేనున్నాను, “అక్కడ ఏదో యున్నది, నేను దరిదాపుగా దానిని తాకగలను, అది అది సమీపమైయన్నది.” ఆ నది యొద్ద మీ అందరి ముందు దేవుని దూత మాట్లాడిన తరువాత, కొంచెమే నాకు తెలుసు, అయన అన్నాడు, “బాప్తీస్మమిచ్చు యోహాను ఆయన యొక్క మొదటి రాకడకు ముందే దేవుని యొద్దకు పంపబడియున్నట్లుగా, నీవునూ ఒక వర్తమానమును ప్రపంచమంతయూ పంపుతావు.” ఇది సంభవించినది.
ప్రతి దేశము ఇప్పుడు వెళ్ళుచున్న స్వస్థతా కూటములను కలిగియున్నది, ప్రపంచమంతటా, రష్యా వరకు. అవునండి, ప్రతి స్థలములో స్వస్థతా కూటములు ముందుకు వెళ్ళుచున్నవి, అది అక్కడ చనిపోయియున్నది. ఇప్పుడు దానికంటె మరి గొప్పది ఏదో కదులుచున్నది. అక్కడ ఒక... నేను ఆ మల్బరీ ఆకులు వీచుచున్న శబ్దము కొరకు నేను కనిపెట్టుచున్నాను. నేను ముందుకు వెళ్ళుచున్నాను. నా కొరకు ప్రార్దన చేయండి.
49
ఇప్పుడు, నేను సేవలో యున్నట్లుగా, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము కలిగియున్నట్లుగా, ఆయన నజీవుడైయున్నట్లైతే, ఆయన ప్రతి వాగ్దానమును నెరవేర్చును. ఎవరు అయనను 2000 సంవత్సరములుగా సజీవునిగా యుంచారు? ఆ నిత్యమైన వెలుగును ఎవరు వెలుగునట్లుగా చేశారు? ఇప్పుడు ఇది సాయంకాలపు వెలుగైయున్నది. ఆయన సిలువకు ముందు, అయన ఆ రీతిగా ప్రత్యక్షపరచుకొనియున్నాడు, ఆయన శిష్యులకు తన్నుతాను ప్రత్యక్షపర్చుకొనియున్నాడు. అది ఆయనయైయున్నాడని త్వరగా దానిని వారు గుర్తించిరి. ఇప్పుడు అదే ఆయన చేస్తాడు.
మీలో ఎంతమంది నా ఇతర కూటములలో యుండి యున్నారు? ఈ కట్టడమంతటా మీ చేతులను చూడనియ్యండి. అది నూరు శాతమైయున్నదని నేను ఊహిస్తాను. కాబట్టి నేను దానిగుండా వెళ్ళవలసిన పనిలేదు. దేనికొరకు ఎదురుచూడాలో మీకు తెలుసా. పునరుత్థానుడైన యేసును మరలా చూడాలని మీలో ఎంతమంది ఈ రాత్రి ఆ దృశ్యముగుండా నడువవలెనని వేచియుండి, కనిపెట్టుచున్నారు? ప్రభువు మిమ్ములను దీవించును గాక.
50
ఇప్పుడు కేవలము ఆయన సజీవుడై ఇక్కడ ఉన్నాడని చూపుటకు. అది ఏమైయున్నది? మనము కొంచెము... ఒకేసారి మనము ఎక్కువ మందిని పిలువలేము, బహుశా మనము నిలువబడవచ్చు, నలుగురు లేకు ఐదుగురు, లేక ఆ విధముగా మంచిది. ఇప్పుడు ప్రార్ధనా కార్డులతో ప్రారంభిద్దాము, మరియు వారిని లేపుట ఆరంబిద్ధాము. మనము ఒకటో నెంబరును తీసుకొందాము. ఎవరు దానిని కలిగియున్నారు? మీ కార్డు వైపు చూడండి. నెంబరు ఒకటి. ఒకటి? ఓ, నన్ను క్షమించండి. మంచిది, స్త్రీ ఒకటి. నెంబర్ రెండు? నెంబర్ మూడు? మూడవ నెంబరు ఎవరు కలిగియున్నారో మీరు పైకి లేవగలరా? నెంబర్ నాలుగు, నెంబర్ ఐదు, నెంబర్ ఆరు, ఆరవ నెంబర్ను నేను చూడలేదు. నెంబర్ ఏడు, దయచేసి ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఎనిమిది, నెంబర్తొమ్మిది, నెంబర్ తొమ్మిది. అయ్యా, మంచిది. మనము ఎంత మందిమి ఉన్నామో చూద్దాము. మంచిది, మనము అక్కడే తిన్నగా ప్రారంభిద్ధాము. మరియు ఇప్పుడు మనము చూడగలము, బహుశా, మరికొందరిని మనము తీసుకొందాము .
నేనెరుగని వారు ఈ కట్టడములో ఎంతమంది ఉన్నారు? మీరు ఎవరో నాకు తెలియదు, మరియు దేవుడు మిమ్ములను స్వస్థపరచాలని కోరుచున్నారా, మీ చేతులను ఎత్తుడి. అందరు నన్నేరుగనివారే. మంచిది. కేవలము మర్యాదగా ఉండండి.
51
ఇప్పుడు, మన ప్రభువైన యేసు భూమి మీద నడచినపుడు. వారు ప్రజలను వరుసలో పెట్టుచుండగా మన ప్రభువైన యేసు, ఆయన భూమి మీద నడచినపుడు, ఆయన ఎన్నడూ ఒక స్వస్థపరిచేవాడనని చెప్పుకొనలేదు. మీలో ఎంతమందికి తెలుసు? ఆయన అన్నాడు, “అది నాలో జీవించుచున్న తండ్రి అయి యున్నాడు.” ఆయన దానిని చెప్పియున్నాడని మీలో ఎంతమందికి తెలుసు. నాకు నేనుగా ఏమీ చేయలేను, ఆ మనిషి ఎక్కడ నుండి వచ్చియున్నాడో అతను ఏమి చేయుచున్నాడో, వారాయనను నమ్మియున్నారు. ఇప్పుడు, ఆయన ఒక మనిషిని కనుగొన్నాడు, ఒక ఒక మనిషి, ఆయన యూదా జాతియందు తన్నుతాను బయలుపరచుకొనియున్నాడు. ఆ మనిషి ఏమి చేసియున్నాడో, అతను ఎక్కడ ఉండియున్నాడో దానిని చెప్పుట ద్వారా ఆయన ఒక అద్భుతమును చేసియున్నాడు; మరియు వారు ఆయనను నమ్మియున్నారు.
52
ఆయన సమరయ తెగవారికి తన్నుతాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, ఆయన ఒక స్త్రీతో ఆ రహస్యమేమైయున్నదో, ఆమెతో చెప్పియున్నాడు, మరియు ఆమె ఆయనను నమ్మియున్నది, మరియు ఆ జనాంగమంతయు, నమ్మియున్నది. అది నిజమేనా? అయితే గుర్తుంచుకోండి, దానిని ఆయన ఎన్నడూ ఒక అన్యునికి చేయలేదు, ఒక అన్యుని సముఖములో ఆయన ఎన్నడూ చేయలేదు, కారణము...
ఇది అన్యుల యుగమైయుండి యున్నదని మీలో ఎంతమందికి తెలుసు? అయితే ఇప్పుడు సాయంకాలపు వెలుగులు వచ్చియున్నవి. ఏ విధమైన వెలుగు ప్రకాశించినది? కుమారుడు అస్తమించుచుండగా, ఏ విధమైన వెలుగు ప్రకాశించుచున్నది? అదే కుమారుడు పైకి వచ్చినపుడు తూర్పున ప్రకాశించియున్నాడు. మీరు దానిని నమ్ముతారు?
భూమి ఇవతల నుండి అవతలికి వెళ్ళియున్నది అదే కుమారుడేనా? అదే కుమారుడేనా, అదే కుమారుడు. పైకి పొడుచుకుంటూ వచ్చి వెలుగును ప్రకాశించాడు మరియు అది ఇప్పుడు దినమంతటిగుండా చీకటి అయియున్నది, కేవలము ఇది ఒక మసకగా ఉన్న దినమైయున్నది! మరియు ఇప్పుడు, కుమారుడు అస్తమించక ముందు అది తిరిగి ప్రకాశించియున్నది, ఆ వెనుక ప్రకాశించిన అదే వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. ఆ వెనుక అక్కడ సమరయుల మీద, యూదుల మీద అది ప్రకాశించియున్నది, అయితే అన్యుల మీద ప్రకాశించలేదా, ఇప్పుడు అన్యుల మీద ఆయన అదే వెలుగైయున్నాడని, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఒకేరీతిగా ఉన్నాడని ఉండుటకుగాను ఆయన తప్పక అదే రీతిగా ప్రకాశించవలసియున్నది. అది నిజమేనా? ఇప్పుడు, మీరు నమ్ముతారా?
53
ఇప్పుడు, సహోదరి గెర్టీ, ఒక్క క్షణం పాటు ఎంతో నెమ్మదిగా వాయించుము.
ఇప్పుడు, ఈ ప్రార్ధనా వరుసలో అనేకమంది ఉన్నారని నేను ఊహిస్తాను, నాకు తెలియదు. మీలో ఇబ్బంది ఏమిటో, లేక మీ గురించి నాకు ఏమి తెలియనివారు ఎంతమంది యున్నారు? మీకు అది తెలుసు. నేను మీ గూర్చి ఏమియు ఎరుగనని ప్రార్ధనా వరుసలలో ఉన్నవారు మీ చేతులను ఎత్తండి. మీలో నా గూర్చి ఏమియు తెలియదని శ్రోతలలో ఎంత మంది ఎరిగియున్నారు? నీవు ఈ చుట్టూ ఇప్పుడు ఉన్నప్పటికి లెక్క కాదు, మీ గురించి నాకు ఏమియు తెలియదు. మంచిది, కేవలము నమ్మండి.
54
ఇప్పుడు, మన ప్రభువు మనకు ఒక చిన్న చనిపోయిన బాలికను లేపుటకు వెళ్ళుచున్నాడు; మరియు ఒక స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టినది, ఆయన వెనుకకు తిరిగి ఇలా అన్నాడు, “నన్ను ఎవరు ముట్టియున్నారు?” మరియు ప్రతి ఒక్కరు మౌనముగా ఉన్నారు. వారాయనను ముట్టలేదని అన్నారు.
అయితే ఆయన చుట్టూ చూచెను మరియు వారిలో కొందరు ఆయనను గద్దించియున్నారు (పేతురు) మరియు అన్నాడు, “ప్రభువా నన్ను తాకినది ఎవరని నీవు ఎలా చెప్పుచున్నావు, ఇక్కడ జనసమూహమంతయు నిన్ను ముట్టుచున్నారు?”
ఆయన అన్నాడు, “అయితే నా నుండి ప్రభావము వెళ్ళిపోయినది.” అనగా, శక్తి.
ఏది ఎవరో ఆయన కనుగొను వరకు చుట్టూ చూచుచున్నాడు. అది ఆ స్త్రీ అయి ఉన్నదని, ఆయన ఎలా ఎరిగియుండెను? అది ఆమె యొక్క స్వంత విశ్వాసమైయుండెను, ఏలయనగా ఆయన ఆ రీతిగా చెప్పియున్నాడు, “నీ విశ్వాసము నిన్ను రక్షించియున్నది. నీవు కలిగియున్న నీ రక్తస్రావము ముగించబడినది. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచియున్నది. అది ఈ రోజున ఉన్న యేసుక్రీస్తు, నిన్న ఉండినవాడు. అదే కార్యమును ఆయన ఈ దినమున చేసినట్లైతే, అప్పుడు ఆయన ఒకేరీతిగా ఉన్నాడని రుజువు చేస్తాడు.
55
ఇక్కడ ఈ స్త్రీని తప్పక నేను ఎరిగియున్నానని తోచుచున్నది. నీవు అదే వ్యక్తివై యున్నవా? నీవేనా... నేను నిన్ను తెలుసుకొనవలసియున్నది. నీవు ఎవరివో నాకు తెలియదు. అయితే నీ ముఖము పరిచయముగా ఉన్నట్లు కనబడుచున్నది. నాకు తెలియదు. అయితే అది ఏమైయున్నప్పటికీ, నీవు ఒక్క నిమిషము వచ్చి ఇక్కడ నిలువబడుము. నేను తప్పక నిన్ను ఎరిగినట్లు అయితే నేను నీకు చెప్తాను. నాకు తెలియదు, నీ పేరు నాకు తెలియదు, అయితే నిన్ను చూచినట్లు నాకు తెలియుచున్నది, బహుశా నేను నిన్ను చూచియున్నానేమో. నీవు ఇక్కడ దేనికొరకు ఉన్నావో నేనేమి ఊహించలేను. నేను నిన్ను ఎరిగియున్నానని నాకు తెలియదు, అయితే అది కేవలము... నీ ముఖము పరిచయమైనట్లుగా కనబడుచున్నది. నేను నిన్ను ఎరిగియున్నానా? నీవు నాకు తెలియదు. మంచిది, అలాగైతే నీవు ఒక క్రొత్త వ్యక్తివి. ఆమె మొఖము నేను ఎరిగియున్నట్లుగా కనబడుచున్నది. అయితే నాకు కేవలము తెలియదు. నిశ్చయముగా నాకు తెలియదు.
56
ఇప్పుడు ప్రతి ఒక్కరు మెళకువగా ఉన్నారా, మీ గురించి ఏమాత్రమైన ఆత్మసంబంధమైనది మీకున్నట్లైతే, ఇపుడే తిన్నగా ఒకటి వెళ్ళుచున్నది. ఓ, మీరు దానిని మీరు కేవలము దానిని... మీరు తప్పక దానిని అనుభూతి చెందవలసిన పనిలేదు, అయితే, మీరు తప్పక దానిని అనుభూతి చెందుతారు. ఇక్కడే ఈ వేదిక నొద్ద ప్రభువు యొక్క దూత ఉన్నాడని నాకు తెలుసు.
ఇక్కడ ఉన్న చిత్రమును, ఆ వెలుగును మీరు చూస్తారా? ఆ వెలుగు తిన్నగా ఇక్కడ ఉన్నది. నీవంటావు, “నేను దానిని చూచుటలేదు.” “ఆయన మీకు దీనిని గలిలయలో చెప్పలేదా,” అని చెప్పిన వారితో చెప్పిన దూతలను వారితో కూడా చూడలేదు. ఆ దూతలు అక్కడున్నారు.
ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన క్రీస్తైయున్నాడు, ఆయన తిరిగి లేచినవాడు. ఈ దినమున ఒక వెలుగు రూపములో క్రీస్తు ఇక్కడున్నాడని మీలో ఎంత మందికి తెలుసు? నిశ్చయముగా, ఆయన అలా ఉన్నాడని బైబిల్ చెప్పియున్నది.
57
ఇప్పుడు మీరు నిజమైన మర్యాదతో ఉంటారా. ఎన్నడు చుట్టూ కదలవద్దు మీరెక్కడున్నప్పటికి కేవలము ప్రార్ధించండి. ఇప్పుడు మనము ఒకరికొకరము కొత్తవారమై యున్నట్లైతే... మరియు ప్రభువైన దేవుడు, ఆయన... నీవు రోగివైయున్నట్లైతే, నేను నిన్ను స్వస్థపరచగలిగినట్లైతే, నేను నేను అది చేస్తాను, అయితే నేను అది చేయలేను, నేను దానిని చేయలేను, ఆయన ఇదివరకే దానిని చేసియున్నాడు. యేసు కలువరిలో చనిపోయి తిరిగి లేచినపుడు దానిని చేసియున్నాడు. ఆయన దానిని రుజువు చేసియున్నాడు.
మరియు, నీవిక్కడ దేనికొరకు ఉన్నావో ఆయన నాకు బయలుపరచినట్లైతే. ఇప్పుడు ఆయనిక్కడ నిలబడి ఉన్నట్లైతే, ఈ సూటు వేసుకొని, నీ వెవరివైయున్నావో ఆయనకు తెలియును. ఆయన చెప్పెను, “తండ్రి ఏది చేయుట కుమారుడు చుచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు.” ఒకవేళ ఆయన ఇక్కడ ఉన్నట్లయితే, నీ వెక్కడినుండి వచ్చియున్నావో, నీ పేరేమైయున్నదో, ఈ కూటమునకు రాకముందు, నీవేమి చేసియున్నావో, లేక నీ హృదయములో ఏమి ఉండి ఉన్నదో లేక అలాంటిదేదైనా ఆయన నీకు బయలుపరుస్తాడు...
కాని స్వస్థత కొరకు అది ఒక ముంగించబడిన కార్యమైయున్నది. అది ఇదివరకే ముగించబడినది. ఇప్పుడు, ఆయన అదే కార్యము చేసినట్లైతే నీవడుగుచున్న దానిని నీవు పొందుతావని నీవు నమ్మటలేదా? నీవు కూడా దానిని నమ్ముతావని ఆయన ఈ స్త్రీకి బయలు పరచినట్లైతే, శ్రోతలు మీ చేతులు దేవునికి ఎత్తుతారా? ఆమెనే తీర్పరిగా ఉండనివ్వండి.
58
ఇప్పుడు మీలో ఎవరైనా వచ్చి ఈ స్థానమును తీసుకొనగోరినట్లైతే, మీకు స్వాగతం. ఇప్పుడు ఇక్కడే నేను ఒక అబద్దికునిగా కనబడపోవుచున్నాను, మరియు దేవుని వాక్యము సత్యము కాదా లేక సత్యమును చెప్పుచున్నాను మరియు ఆయన వాక్యము నిజమైయున్నది, సరియైయున్నది. నీవక్కడే యున్నావు. అక్కడ ఎవ్వరు చుట్టూ తిరగవద్దు. ఇది దానిని చూపుతుంది. ఇది దానిని చేస్తుంది.
ఇప్పుడు ఆ స్త్రీ రోగిగా ఉన్నట్లైతే మరియు నేనామె మీద చేతులుంచి, “సహోదరి నీవు స్వస్థతనొందగోరుచున్నావు,” అపుడు ఆమె దాని కొరకు కేవలము నా మాటను తీసుకొనియున్నది. అయితే ఆమె జీవితములో ఉన్నదానిని ఏదైనా పరిశుద్ధాత్మడు బయలుపరచినట్లైతే, ఆ వెనుక, అది సత్యమో కాదో ఆమె తెలుసుకుంటుంది, అలాటిదేదో జరిగి యున్నదని. జరిగియున్నదానిని ఆమె యెరిగియున్నట్లైతే, ఏమి జరుగబోవుచున్నదో నిశ్చయముగా ఆయనకు తెలుసు. మీరు దానిని నమ్మరా? నా సహోదరి, ఇప్పుడు ఆయన నీకు దానిని చేయును గాక.
59
అప్పుడు మేమందరము దానిని నమ్ముతామని శ్రోతలు అందరు చెప్పియున్నారు. నీవు నేను ఏకముగా ఒకరికొకరు క్రొత్తవారమై యున్నాము, మొదటిసారిగా మనమిక్కడ కలుసుకొనుచున్నాము. నీవిక్కడ నిలబడి యున్నావు, నీలో ఏదో తప్పు ఉన్నది. అది ఏమైయున్నదో నీకు తెలియదు. నాకు తెలియదు. కారణము నీవు, నాకు తెలియదు. నీవేమైయున్నవో నీ ఇబ్బంది ఏమిటో నేను ఎలా ఎరుగగలను, అయితే నీ ఇబ్బందేమిటో దేవుడు ఎరుగును.
ఇప్పుడు, మీరు నిజమైన మర్యాదగా ఉండండి. ఇప్పుడు, ఈ స్త్రీ తనకై తానుగా ఆరంభము నుండి ఇక్కడ లేదు నీవిక్కడ మరొకరి కొరకు ఉన్నావు, అది ఒక చిన్నబిడ్డ మరియు ఆ బిడ్డ ఇబ్బంది ఏమనగా అది ఒక నిజమైన నరముల బలహీనత, అది నీ మనుమడు, నీ సంగతి నేను నమ్ముచున్నాను, అక్కడ ఒక వింతైన విషయము ఉన్నది, ఆ బాలుడు ఈ పట్టణము కాదు కాని మరొక పట్టణములో ఆ బాలుడ్ని నేను చూచుచున్నాను. అది న్యూ-ఆల్బనీ వలె కనబడుచున్నది. అది నిజము. బిడ్డ నరముల ఉద్రిక్తతో ఉన్నాడు. ఇంకా అతనిలో లోపమేమనగా అతని కాలేయములో కూడా తప్పు ఉన్నది, కాబట్టి వారిలా అనుచున్నారు. ఈ బాలుడు ఎప్పుడు వాంతి చేసుకొంటూ ఉంటాడు. అది నిజము. నీవు దానిని గూర్చి కలత చెందియున్నావు, మరియు నీవు ఆ బాలుడు కొరకు నిలబడి యున్నావు. అది “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” నీవే తీర్పరివి. ఆ విషయములు సత్యమేనా? నీనేమి చెప్పియున్నానో నాకు తెలియదు. అది ఏమి చెప్పినదో టేపుకు తెలుసు. అది నాకు చెపుతుంది.
ఇప్పుడు మరొక విధముగా అది మరొకరి కొరకై యున్నది. ఆ అభిషేకము నీ మీద ఉండియుండగా నీవు కలిగియున్న ఆ చేతి రుమాలును ఎవరి మీదనైన ఉంచుము మరియు అనుమానించవద్దు, నీ వడిగినది నీవు పొందుతావు. అది ఏమైయుండెనో, అది ఏమైయుండబోవుచున్నదో ఆయన ఎరుగును. సందేహించవద్దు. నమ్ముతూ వెళ్ళుము.
60
అయ్యా, మీరు ఎలా ఉన్నారు? మనము ఒకరికొకరము క్రొత్తవారమైయున్నాము అని నేననుకుంటాను. మనము క్రొత్తవారమైయున్నాము. ఈ ఉదయం వరకు నా జీవితములో ఎన్నడూ నేను నిన్ను చూచి యుండలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు బహు నెమ్మదిగా ఉండండి ఈ అభిషేకము ఇది వరకే తాకుచున్నది మీరు చూడండి, దీనిని నేను వివరించాలని కోరెదను. అయ్యా, అయితే నీవు దేవునికి తప్పక తెలుసు. ప్రభువైన దేవుడు నీ ఇబ్బంది ఏమిటో నాకు బయలుపరచినట్లైతే నిన్ను స్వస్థపరిచేవానిగా, లేక నీ రక్షకునిగా నీకేమి అవసరమైయున్నదో నీవు ఆయనని నమ్ముతావా? నీవు నమ్ముతావా? ఇప్పుడు, ఆ దర్శనము తాకినపుడు నీవు కేవలము దానిని వినుము.
నీవు నేల మీద కదులుటకు ప్రయత్నించుచున్నావు, అది నీ మాకాళ్ళతో ఉన్న ఇబ్బందైయున్నది. అది నీ మోకాళ్ళలోని కీళ్ళ వ్యాధియైయున్నది. ఇంకా నీ కన్నులతో కూడా నీకు ఇబ్బంది యున్నది. అవి బలహీనమై పోవుచున్నవి. మరియు నీ చెవిలో కూడా ఇబ్బంది యున్నది. అది సత్యము. నీవు ఈ పట్టణము వాడివి కాదు. నీవు కెంటకీలోని, సోమర్సెట్ నుండి వచ్చి యున్నావు. నీ పేరు శ్రీ. హడ్సన్. ఇప్పుడు నీ హృదయమంతటిలో నమ్మి వెనుకకు వెళ్ళుము. నీవు స్వస్థపడతావు. నీ హృదయమంతటితో నమ్ముము.
61
ప్రతి ఒక్కరు, మీ హృదయమంతటితో నమ్ముతారా? దేవుని యందు విశ్వాసముంచుము. సందేహించవద్దు, అయితే కేవలము నమ్మము. సహోదరి, ప్రభువైన దేవునికి నీవు తప్పక తెలియును. నీవిక్కడ దేనికొరకు ఉన్నావో ఆయన నాకు బయలుపరుస్తాడని నీవు నమ్ముతావా? ఆయన దానిని చేయగలిగినట్లైతే, నీవు దానిని అంగీకరిస్తావా?
ఇక్కడ ఒక లావైన వ్యక్తి కూర్చొని ఉన్నాడు, అవును. అయ్యా, మనమిద్దరము ఒకరికొకరము క్రొత్తవారమని నేను నమ్ముతాను. అయితే కొన్ని క్షణముల క్రితము నేను ఆ మనిషితో మాట్లాడుచున్నపుడు, నీకు ఏదో సంభవించియున్నది. నీవు నీ హృదయములో ఇలా అనుకొనుచున్నావు, “నేను దానిని నమ్మతాను,” అది నిజమైయున్నది. అది నిజమేనా? ప్రభువైన దేవుడు నీవు దేని నుండి స్వస్థపడాలని కోరుచున్నావో నాకు బయలుపరచినట్లైతే, నీవు దానిని అంగీకరిస్తావా? నీవు ఒక విధమైన దగ్గుని కలిగియున్నావు. అది నిన్ను బాధించుచున్నది. అది నిజము. నీ చేతి నెత్తుము. మంచిది, నీవు దానిని నమ్మినట్లైతే, నీవు దానిని ఇక ఏమాత్రము కలిగియుండవు. అది నీ నుండి వెళ్ళిపోతుంది. ఆమెన్.
62
అతడు దేనిని తాకియున్నాడు? అతడు ఏమి చేసియున్నాడు? అతడు ప్రధానయాజకుని తాకియున్నాడు, నన్ను కాదు. నేనెన్నడూ మనిషిని చూచియుండలేదు. ఇతనిని గూర్చి నాకేమియు తెలియదు. అది పునరుత్థానుడైన యేసు అని నీవు నమ్మచున్నావా...? ఆయన అదే అయియున్నాడని రుజువు చేయుటకు ఆయన పునరుత్థానడైన తరువాత ఆయన అదే కార్యమును చేసియుండలేదా? కొందరన్నారు, “అది ఎలాటి ఆత్మ అయియున్నది?” ఒక ఆత్మ ఎల్లప్పుడు దానికై ఇది సాక్ష్యమును కలిగి యుంటుంది. మనము తీగలమైయున్నాము, ఆయన ద్రాక్షావల్లియైయున్నాడు. ఒక గుమ్మడికాయ, గుమ్మడికాయలే కాస్తుంది. ఒక ద్రాక్షా చెట్టు, ద్రాక్షా కాయలే కాస్తుంది. ఒక యాపిల్ చెట్టు, యాపిల్ కాయలే కాస్తుంది. ఒక క్రైస్తవుని జీవితము, క్రీస్తునే కలగియుంటుంది. ఇది వింతైన విషయం కాదు.
63
నీ కన్నులు హీనముగా మారుచున్నవి, నీ కన్నుల కొరకు నీవు ప్రార్ధన కోరుచున్నావా. అది నిజము, ఇది నిజము కాదా? అది నిజమై యున్నది నీ చేతిని ఎత్తుము. నీవెవరివో నాకు తెలియదు. అయితే దేవునికి తెలుసు. అయితే నీ జీవితమును నీవు దాయలేవు. ఇక్కడ నేను ఒకదానినేదో చూస్తున్నాను, అది ఒక హాస్పటల్. ఇప్పుడు ఒక్క క్షణము ఆగుము. అది కంటి పరీక్ష కాదు. అది కాదు. అది ఒక ఆపరేషన్ అయి ఉన్నది. అది నీవు కాదు, అది నీ స్నేహితుడై ఉన్నాడు. అతడొక ఆపరేషన్ కలిగి ఉన్నాడు. అదేమనగా, ఒక ఆపరేషన్ అయి ఉన్నది. నీవు దానిని గూర్చి భయపడుచున్నావు, కారణము అది ఒక కండరముల వ్యాధి. భిన్నముగా ఉన్నదని నీకు తెలుసు. అది నిజము. అది ఇండియానాలోని కారిడన్ వద్ధయైయున్నది. అది నిజము. ఇప్పుడు, నీ హృదయమంతటితో నమ్ముతావా. వెళ్ళుము, మరియు నీవడిగిన దానిని పొందుకొనుము, ప్రభువైన యేసుక్రీస్తు నామములో పొందుకొనుము.
64
నీ ముఖము నాకు తెలును. నేను కాదు. నిజానికి అది అభిషేకించబడియున్నది, చూడండి, అయితే బాగా గుర్తున్నట్లైతే నీవు ఒక బోధకుడవు, కాదా. చూడండి, నేను కేవలము తెలుసుకొనగోరుచున్నాను కాబట్టి ఇది ఏమీ కాదని సంఘము చూస్తోంది. ఇది ఒకటైయున్నది. నేనెవరినైన ఎరిగియుండి ఉంటే నేను వారు నాకు తెలుసు. అయితే నీవు ఇక్కడ దేనికొరకు యున్నావో నాకు తెలియదు. నాకు ఏ ఆలోచన లేదు. అది నిజమైయున్నట్లైతే మీ చేతిని ఎత్తండి. నీవు ఇక్కడ ఎందుకొరకు ఉన్నావో నాకు తెలియదు, అయితే ఈ చుట్టూ ఉన్నదానిని బట్టి నీవు జాక్సన్-మిల్ లేక బయట ఉన్న ఎక్కడో నీవు ఒక బోధకుడవై యున్నావు, కారణము నీవు ఒకసారి నా గృహమునకు వచ్చియున్నావు. నీవు ఒక బిడ్డ కొరకు లేక మరి దేనికొరకో నన్ను ప్రార్ధన చేయమన్నట్లు నేను నమ్ముతాను. అవును. అది ఒక బిడ్డను గూర్చి యై ఉన్నదని నాకు తెలుసు. అవును.
అయితే నీవు నీ యొక్క ప్రేగులలో ఒక విధమైన ఇబ్బందితో బాధపడుచున్నావు. నన్ను నీకు చెప్పనియ్యండి, అప్పుడు నేను దేవుని యొక్క దాసుడనో కానో, నీవు తెలుసుకుంటావు. ప్రార్ధన కొరకు నీ హృదయములో మరొక వ్యక్తి ఉన్నాడు, అది ఒక చంటి బాలికయై యున్నది. ఆమె ఇక్కడ లేదు. ఆమె ఆ నది అవతల ఉన్నది. ఆమె కెంటకీలో ఉన్నది. నీ హృదయమంతటితో నమ్ముము, నీవడిగిన దానిని పొందవచ్చును. ఆమేన్.
65
నీవు నమ్ముచున్నావా? నీవు నమ్మగలిగినట్లైతే, నీవు పొందవచ్చును. అనుమానించవద్దు. శ్రోతలలో ఆ వెనుక ఉన్న వారి సంగతి ఏమిటి? మీరు నమ్ముచున్నారా.
ఆ ఎడమవైపున వెనుక భాగమున ఒక నల్లజాతి స్త్రీ కూర్చొని ఉన్నది, ఆమె స్త్రీ సంబంధమైన వ్యాధిని కలిగియున్నది, ఎడమ వైపుగా ఆమె కూర్చోనియున్నది. అమ్మా, నీ హృదయమంతటితో నీవు నమ్మగలిగినతే, నీవు నీ స్వస్థతను పొందవచ్చును. నీవు నమ్ముచున్నావా? అది మంచిది. స్తంబము దగ్గర కూర్బినియున్న వర్ణ జాతి స్త్రీ, ఆ మనిషి ప్రక్కగా ఉన్నది. ఆమె తన చేతిని ఎత్తి ఉన్నది. నీవు స్త్రీ సంబంధమైన వ్యాధిని కలిగియున్నావు. మంచిది, సహోదరి, ప్రభువైన దేవుడు నిన్ను స్వస్థపరచియున్నాడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచియున్నది. ఆ వెలుగు ఆ స్త్రీ పై వ్రేలాడుచుండుటను మీరు చూడగలరా? అక్కడ చూడండి.
66
ఓ, ఎంత అద్భుతము! ప్రభువైన దేవుడు ఎన్నడూ తప్పిపోడు. మర్యాదగా ఉండండి. ఓ, ఆయన జీవించుటను బట్టి ఎంతో సంతోషము. ఆయన మన హృదయములో జీవించుచున్నాడు. “నీవు నమ్మగలిగినట్లైతే, సమస్తమును సాధ్యమే.”
మనమిద్దరము ఒకరి కొకరు క్రొత్తవారమని నేననుకుంటాను. నీవు నాకు తెలియదు. నేను నిన్నెప్పుడు చూచియుండలేదు. అయితే నీవు దేవునికి తప్పక తెలియును. నేను నిన్ను ఎప్పుడైనా చూచినట్లు నాకు తెలియదు. అయితే ప్రభువు నీవిక్కడ దేనికొరకు నిలబడియున్నావో ప్రభువు నాకు బయలుపరచినట్లయితే, నీవు నన్ను ఆయన సేవకుడని నమ్ముతావా. ఆయన మృతులలో నుండి లేచియున్నాడని నమ్ముతావా? మనము క్రొత్తవారమైయున్నట్లైతే, ఒక విధమైన శక్తి నీవిక్కడ దేనికొరకు ఉన్నావో దానిని బయలు పరచనైయున్నది. నీవు ఇక్కడ ఒక విధమైన నరముల బలహీనతను బట్టి ఇక్కడ ఉండి, ప్రార్ధన చేయిచున్నావు. అది సత్యము. ఇప్పుడు ఎవరి కొరకైనా ప్రార్ధిస్తాను మరియు నేను దేవుని సేవకుడిని కాదేమో కనుగొనండి. మరొకరి కొరకు ప్రార్ధన చేస్తాను, మరియు ఆయన దానిని బయలుపరుస్తాడేమో చూస్తాను. మీరు దానిని నమ్ముతారు.
సరే, ఆమె నరముల బలహీనతలో ఉన్నది ఆమె ఇంకా మూత్రపిండముల వ్యాధితో కూడా ఉన్నది. మరియు ఆమె కారిడాన్ అనే స్థలములో జీవించుచున్నది. అది సత్యము, అది కాదా? అపుడు మీరు నమ్ముతారా? ఇప్పుడు వెళ్ళుము మరియు నీవు అడుగునట్లు పొందుము.
67
నేను మిమ్మను అడుగుచున్నాను, దానిని నమ్మమని మీ విశ్వానమును సవాలు చేయుచున్నాను. ఈ కట్టడములో మీరు ఎక్కడున్నప్పటికీ లెక్క కాదు, కేవలము మీరు దానిని నమ్మండి. వెనుక వరకు.
ఆ వెనుక నిలబడియున్న యవ్వనుడు, ఫోర్ట్-వేన్ లోని గుడ్డిగా ఉన్న అతని స్నేహితుని కొరకు ప్రార్థన చేయుచున్నాడు. దేవుడు అతడిని బాగుచేస్తాడని నమ్మచున్నారా? మంచిది, అలాగైతే మీరు దానిని పొందవచ్చును. ఆ వెనుక ఉన్న కొందరు నమ్ముచున్నారా. ఆ వెనుక, వెనుక. నమ్ముము! దానిని సవాలు చేయండి! దేవా కరుణించుము.
అక్కడ తిన్నగా మీ క్రింద కూర్చొని ఉన్న వర్ణ జాతి స్త్రీ ఒక కణితలో ఉన్నది. అమ్మా, ప్రభువు మిమ్మును స్వస్థపరచునని మీరు నమ్మచున్నారా, తిన్నగా ఆ వెనుక సీటులో చాలా తిన్నగా ఉన్న వెనుక సీట్లో ఒక చిన్న గుండ్రని టోపి పెట్టుకొని ఉన్నది. తన చేతిని పైకెత్తుచున్నది. కణితిని దేవుడు బాగుచేస్తారని మీరు నమ్ముచున్నారా. మీరు నమ్మినట్లయితే, మీ చేతినెత్తి ఆయనకు ఆడించండి. మంచిది, అలాగైతే ఇంటికి వెళ్ళుము మరియు స్వస్థతనొందుము.
68
ఓ, ఆయన ఆశ్చర్యకరుడు! ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది, ఈ ముందు భాగములో లోపల కూర్చొని యున్నది, కొంచెము ఆ వెనుకలో ఉన్నది. ఆమె మరొకరి కొరకు ప్రార్ధన చేయుచున్నది. ప్రభువు యొక్క దూత అక్కడ ఆమె ప్రక్కన నిలబడియున్నాడు. ఆమె తన స్నేహితుని కొరకు ప్రార్ధన చేయుచున్నది. ఆమె ప్రార్ధన చేయుచున్నది. ఆమె ఇక్కడ జీవించే వ్యక్తి కాదు, ఆమె ఒక చిన్న పట్టణములో, ఆ చుట్టూ అంతా దేవదారు వృక్షములు ఉండే స్థలములో నివసించుచున్నది. అది ఇండియానాలోని, హెన్రీవిల్ అయి ఉన్నది. ఆమె గుండె వ్యాధితో బాధపడుచున్న ఆమె యొక్క మరదలి కొరకు ప్రార్థన చేయుచున్నది. మీరు దానిని నమ్మగలరా?మీరు దానిని నమ్మగలిగినట్లయితే, ఆ వెనుక కూర్చొనియున్నవారు, దేవుని యుందు విశ్వాసముంచండి మరియు దానిని స్వీకరించండి. మంచిది.
అమ్మా, మంచిది. నీవు నాకు క్రొత్త వ్యక్తివైయున్నావు. నీవు నాకు తెలియదు. అయితే దేవునికి మీరు తప్పక తెలియును. మీరు దానిని నమ్మినట్లైతే, మీ చేతిని ఎత్తండి. అమ్మా, ఆ కళ్ళజోడు పెట్టుకొనియున్న స్త్రీ. మంచిది. అది అంతే. మీరేమి ఆలోచిస్తున్నారు? “మన ప్రభువైన దేవుడు ఆయనే దేవుడైయున్నాడు.” ఆయన చనిపోలేదు. ఆయన చనిపోలేదు, అయితే ఆయన సజీవుడైయున్నాడు. ఆయన సజీవుడైయుండుట మాత్రమే కాదు, కాని ఆయనిక్కడే ఉన్నాడు.
69
మనము ఒకరొకరము క్రొత్తవారమని నేను అనుకొనుచున్నాను? ఇది మనము కలుసుకొనుట మొదటిసారి, అని నేను అనుకొనుచున్నాను. అయితే మనమిద్దరము దేవునికి తెలుసు. నీవు దేనిని గూర్చి అంతగా భయపడుచున్నావు? ఆ పరిమళములను గూర్చి, ఆ సువాసనలను గూర్చి ఆలోచించంటం మానివేయుము. దానికి దూరముగా వెళ్ళుము. కేవలము దేవునిని నమ్మము. ఇది నీ మనస్సులో కలిగియున్నావు. నీవు దానిని నమ్మినట్లైతే, ఇంటికి తిరిగి వెళ్ళుము మరియు స్వస్థతనొందుము.
నీవు ఒక ఇబ్బందిని కలిగియున్నావు. నీవు హాస్పటల్లోనికి వచ్చి బయటకు వెళ్ళుటను నేను చూసాను. ఒకటి, రెండు, మూడుసార్లు ఆపరేషన్ జరిగినది. అది ప్రేగులో ఉన్నది. ఒక కణితి వంటిది, అది కేన్సర్ కణితి అయి ఉన్నది. నీవు ఈ పట్టణపు వ్యక్తివి కావు. నీవు కెంటకీ వాస్తవ్యురాలవు. నీవును, నేను యుండియున్న క్యాప్స్ బెల్ వాస్తవ్యురాలవు. శ్రీమతి. వాగన్, తిరిగి వెళ్ళము. దానిని నమ్మము. నీవడిగిన దానిని నీవు పొందగలవు. నీవు నీ హృదయమంతటితో నమ్ముచున్నావా?
70
నీవు వెళ్ళి, నీ రాత్రి భోజనమును తినగోరుచున్నావా, నీ కడపులోని బాధ ముగించబడవలెనని కోరుచున్ననవా? మంచిది, ముందుకు వెళ్ళుము. దేవుని యందు విశ్వాసమును కలిగియుండుము.
నీవు ఆ కీళ్ళవ్యాధిని జయించి స్వస్థపడగోరుచున్నావా? నీ దారి వెంబడి కేవలము వెళ్ళుము, దానిని నమ్మము. దేవుడు ఆ ఇబ్బందిని బాగు చేస్తాడని నీవు నమ్ముతావా. నీ దారి వెంబడి వెళ్ళుము, దానిని నీవు నమ్మము.
ఈ మనిషి ఆ చివరిలో తిన్నగా వెనుక తెల్ల టీషర్ట్ ధరించి యున్నాడు... కాదు, అది సహోదరుడు ఫంక్. అది ఆయన వెనుక వ్యక్తి. నీకు పరిశుద్ధాత్మ యొక్క బాప్తీస్మము కావాలి, కాదా? మంచిది, నీవు దానిని నమ్మినట్లైతే, నీవు దానిని పొందవచ్చును. ఆమెన్.
71
నా ముఖము వైపు చూస్తున్న ఇక్కడ కూర్చొండియున్న. ఓ స్త్రీ నీవేమనుకొనుచున్నావు? నీవు ఓహాయోలోని, మిడిల్ టౌన్ నుండి వచ్చియున్నావు. నీవ దానిని నమ్మగోరుచున్నావా? కనీసము ఒక క్రైస్తవునిగా ఉండని వ్యక్తి అది మంచి విశ్వాసమైయున్నది. నీవు ఒక క్రైస్తవుడనని చెప్పుకొనవు. అది నిజము. నీవు ఆయనను నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తావా. తిరిగి లేచిన ప్రభువును నీవు నమ్మి, నీ యొక్క రక్షకునిగా అంగీకరిస్తావా? నీవెవరివో నాకు తెలియదు. నేను నిన్ను ఎన్నడూ చూచియుండలేడు. అది నిజము. అయితే నీవాయనను తిరిగి లేచిన ప్రభువుగా ఇపుడే నీ హృదయములో తిన్నగా అంగీకరించినట్లైతే, నీ పాపములు క్షమించబడియున్నవి మరియు దేవుడు నిన్ను బాగుచేయును, నీ చేతిని ఆయనకు ఎత్తి మరియు ఆయనను నమ్మము. మంచిది. నీ దారి వెంబడి వెళ్ళుము, ఆనందించుము. మీ విశ్వాసమును నేను సవాలు చేయుచున్నాను, మీరు నమ్మమని నేను సవాలు చేయుచున్నాను.
72
మనము ఒకరి కొకరము క్రొత్తవారమైయున్నాము, అయితే దేవునికి తెలుసు. నేను నీకు తెలుసా, అయితే నాకు నీవు తెలియదా, అది అదియేనా? నీవిక్కడ దేనికొరకు ఉన్నావో దేవుడు నాకు బయలుపరుస్తాడని నీవు నమ్ముతావా? మంచిది. మీలో ఎంతమంది దానిని నమ్ముతారు? ఓ మీరెలా అనుమానించగలరు? దేవుడు. దేవుడెన్నడైనా మీ కనులను తెరిచియున్నాడా?
ఇక్కడ అనేక మందికి నేను తెలియును. నేనిక్కడ మీతో పాటు పెరిగియున్నాను. ఎలా నేను... నా జీవితము గుండా వెనక్కి వెళ్ళి నేను దానిని కనుగొన్నప్పుడు ఎన్నడైనను, ఎప్పుడైనను ఆయన చెప్పినది పరిపూర్ణమైన సత్యముగా నెరవేరినది. ఇది సత్యము కాదేమో పరీక్షించి చూడండి. సరే, నేను మీకు ఏమి చెప్పచున్నాను? యేనుక్రీస్తు మృతులలో నుండి లేచియున్నాడు. ఆయన సజీవుడైయున్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఇది ఈస్టరై యున్నది. ఇది రెండువేల సంవత్సరముల నుండి ఈస్టరుగా ఉన్నది. సాయంకాపు వెలుగులు ఇప్పుడు ప్రకాశించుచున్నవి. అది అప్పుడు తూర్పును ప్రకాశించినది, ఇప్పుడు అది పశ్చిమాన ప్రకాశించుచున్నది.
73
అయ్యా, ఇది కొన్ని గంటలపాటు వెళ్తుంది. ఆ మనిషి నేనతనిని ఎరుగనని చెప్పినట్టైతే, బహుశా, అతడు ఎక్కడో ఒక కూటములో లేదా ఏదో ఒక స్థలములో నన్ను చూచి ఉంటాడు. నాకు తెలియదు. దేవునికి తెలుసు నాకు తెలియదు. ఎన్నడైనా అతనిని చూచానేమో నాకు తెలియదు. అతనిని ఎన్నడైనా చూచినట్లుగా నాకు తెలియదు; అయితే అతడు నన్ను చూచియున్నాడని చెప్పాడు, ఫిలిప్పు వెళ్ళి నతానియేలును తీసుకొని వచ్చినట్టుగా, అతడు ఎరిగియున్నదానిని, దేవుడు ఆ మనిషికి బయలుపరచినట్లైతే, మీలో ఎంతమంది ఇలా చెప్పారు, “నాకైతే అది శాశ్వతముగా పరిష్కారమైనది”? నేను నీకు తెలియదని నీవు నీ చేతిని ఎత్తి పట్టుకుంటావా, నేను నిన్ను ఎరగనట్లైతే, కేవలము నీ చేతులను ఎత్తుము, నీ గురించి నాకు ఏమియును తెలియదు. నీ గురించి నాకు ఏమియు తెలియదు. నేను ఎరిగియున్నంత వరకు నేనెన్నడూ నా జీవితములో నిన్ను చూచియుండలేదు. అపుడు దేవుడు దానిని దయచేసినట్లైతే, మీలో ఎంతమంది ఇలా చెప్తారు, “ఇప్పుడే నేను తిరిగి లేచిన ప్రభువుగా నన్ను స్వస్థపరిచేవానిగా నేనాయనను అంగీకిరిస్తాను”?
74
నిన్ను స్వస్థపరచాలంటే, అయ్యా, నేను నిన్ను స్వస్థపరచలేను. నిన్ను స్వస్థపరిచే శక్తి నాకు లేదు. కేవలము నేను కలిగియున్నదేమనగా దానిని నేను చేయునట్లు అనుమతించు ఒక దేవుని వరము. ఇప్పుడు నేను అలసిపోయి బాలహీనంగా ఉన్నాను, ఈ దర్శనములు దరిదాపుగా నన్ను చంపివేస్తాయి. అది చాలా ఆధ్వాన్నముగా ఉంటుంది... కొలనులో నిలబడి బోధించుటకంటే అది మరి ఎంతో కష్టముగా ఉండను. అది కఠినముగా ఉంటుంది. అయితే దేవుడు మంచివాడైయున్నాడు.
నీవు వెన్నుముక బాధతో బాధపడుచున్నావు మరియు అది ఒక ఎదుగుదలైయున్నది, ఇది నీ వెన్ను మీద ఉన్నదని వారు చెప్తారు అది ఖచ్చితంగా సత్యము. ఇప్పుడు నీవు నమ్ముతావా? ఇప్పుడు చూడండి, నేను మనిషితో ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఎక్కువగా అది చెప్పబడుతుంది. మీకు మర్యాదగా ఉండమని నేను మిమ్మను అడుగగోరుచున్నాను. మర్యాదగా ఉండండి.
మీరు మరొకరి కొరకు ప్రార్ధన చేయండి, మరియు ప్రభువు దానిని బయలుపరుస్తాడేమో చూడండి. మీ మనస్సులోకి వచ్చిన ఎవరి గురించైనా అడుగుచున్నాను. ఎందుచేత, చూడండి, నాలో ఏమియు లేదు. నేను మీకు సహాయము చేయలేను. నేను ఒక మనిషిని అయి ఉన్నాను. అయితే యేసు దేవడైయున్నాడు, మరియు ఆయనిక్కడ హాజరై యున్నాడు. మీ కన్నులు దానిని చూచుటకు తెరువబడలేదా, మీరు చూడలేరా? తెర వెనుక జరిగిన దానిని చూచుటకు మీరు చూచుచున్నారు, కాదా? కారణము రెండువేల సంవత్సరములుగా ఆయనిక్కడ యుండియున్నాడు. వాక్యముతో ఆయన మీతో మాట్లాడియున్నాడు, మీ యొక్క ప్రసంగములో ఆయన మార్గము గుండా మీతో మాట్లాడియున్నాడు, మరియు తన్నుతాను ప్రత్యక్తపరచుకుంటూ ఇప్పుడాయన ఇక్కడున్నాడు.
75
నేను నా హృదయములో దానిని ఉంచుకొనుటకు ప్రయత్నము చేయుచున్నాను. అవును, నీవు పరీక్షించబడుట నేను చూచాను. అది నీవెన్ను పూస మీద యున్నది. అది ఒక ఎదుగుదలై యున్నది, మరియు నీవు నీ భార్య కొరకు ప్రార్ధన చేయుచున్నావు. నీ భార్యతో ఉన్న ఇబ్బంది ఏమిటో దేవుడు నాకు చూపగలిగినట్లతే, నేనాయన ప్రవక్తనని నీవు నమ్ముతావా? శ్రోతలు దానిని నమ్ముతారా? అబ్బాయ్, ఇక్కడ, అది ఒక నరముల బలహీనత మరియు చర్మవ్యాధియై యున్నది. అది ఖచ్చితముగా సత్యము అది “యోహోవా ఈలాగు తెలవిచ్చుచున్నాడు.” నీవు అడిగినదానిని పొందియున్నావని నీవు నమ్ముతావా? అలాగైతే ఆనందిస్తూ నీ దారిన వెళ్ళుము. మీ హృదయమంతటిలో ఎంత మంది నమ్ముచున్నారు?
76
మీరు నా కొరకు ఒకదానిని చేయాలని నేను కోరుచున్నాను. మీ చేతులను ఒకరి మీద ఒకరు ఉంచండి. కేవలము, ఒక్క నిమిషము పాటు మీరెక్కడ నిలువబడియున్నప్పటికి, మీరు ఒకరి మీద ఒకరు చేతులను ఉంచండి. ఎలాటి సమయము! స్నేహితులారా, మీరు చూడలేరా? ఇది నేను కాదని మీరు గ్రహించలేరా?
అవును. ఇక్కడ ఉన్న ఆ కళ్ళజోడు పెట్టుకొని ఉన్న ఆ చిన్న స్త్రీ సంబందమైన వ్యాధితో బాధపడుచున్నది, అది ఋతుస్రావపు వ్యాధితో కలత చెందవద్దు. అది సమాప్తమైపోయియున్నది. అది వెగటుగా మారియున్నది. అది నీ నుండి వెళ్ళిపోయియున్నది.
77
ఏదో ఇక్కడ సహజాతీతమైనది హాజరైయున్నది, అది యదార్ధమై యున్నది. నీ పాపములు ఆయనకు తెలుసు. నీ గురించి అంతా అయనకు తెలును. అది ప్రభువైన యేసు కాడా? అలాగైతే నేను మీకు చెప్పుచున్నాను, అది సత్యమైయున్నదని మీకు చెప్పినట్లైతే అది సత్యమని దానిని రుజువు చేస్తాడు. ఇప్పుడు, నేను మీకు సత్యమును చెప్పుచున్నాను. మీలో ప్రతి ఒక్కరు స్వస్థతనొందవచ్చును. మీరు కేవలము దానిని అంగీకిరించినట్లైతే మీ తల నుండి కాదు, మీ హృదయము నుండి మీరు సర్వశక్తిగల దేవుని యొక్క సముఖములో ఉన్నారని మీరు దానిని స్థిరపరుచుకున్నట్లైతే, ఆయన కూడా హాజరైయున్నాడు. అక్కడ ఒక్క బలహీనమైన వ్యక్తి ఈ కట్టడములో నుండి బయటకు వెళ్ళవలసిన పనిలేదు. మీరు కేవలము దానిని నమ్మగలిగినట్లైతే, మనమందరము పరిపూర్ణముగా బాగుపడి బయటకు వెళ్ళవచ్చును. ఆయన నా ప్రార్థనను విన్నట్లైతే బయట కూడా నా ప్రార్ధన వింటారు. ఆయన నా ప్రార్థన వినుట మాత్రమే కాక, ఆయన మీ ప్రార్ధన కూడా వింటాడు.
78
ఇప్పుడు, బైబిల్ చెప్పెను - ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన దానిని రుజువు చేశాడు. ఆయన మృతులలో నుండి లేచియున్నాడు అని బైబిల్ చెప్పెను. ఆయన దానిని రుజువు చేశాడు. అది నిజమేనా? ఇప్పుడు, నేను మిమ్మనొకటి అడుగగోరుచున్నాను. యేసు దీనిని చెప్పియున్నాడు, ఆయన ఈ భూమిని విడువక మునుపు ఆయన చెప్పిన చివరి మాటలు, “నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు జరుగును.” ఇక్కడ ఎంతమంది విశ్వాసులున్నారు? “ఆమెన్” చెప్పండి. ఇప్పుడు మీరు విశ్వాసులై ఉన్నారు. నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు జరుగును. వారు రోగుల మీద చేతులుంచినపుడు, వారు స్వస్థతనొందుదురు. ఆ వాగ్దానము సత్యమేనా? సరే, మీరు విశ్వానులైయున్నారు, మీరు ఒకరి మీద ఒకరు చేతులుంచియున్నారు. అలాగైతే, బైబిల్ సత్యమైయున్నది.
ఇప్పుడు, మీలో ప్రతి ఒక్కరు ఒకరికొకరు ప్రార్ధించండి. కేవలము మీ సొంత సంఘములో ప్రార్ధించినట్లుగా ప్రార్ధించండి. ఒకరి మీద ఒకరు చేతులుంచండి. ఇప్పుడు ఒకరి మీద ఒకరు చేతులుంచియుండగా, మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్ధన చేయండి, ఒకరు మీద ఒకరు చేతులుంచండి. ఇప్పుడు నేను ప్రార్ధించుచుండగా ఒకరికొరకు ఒకరు ప్రార్ధించండి.
79
ఓ ప్రభువా, ఈ రాత్రి నీవు వచ్చి నీ సంఘమును నీవు స్వీకరించినట్లైతే, మాకు ఒక్క సాకు కూడా మిగిలియుండదు. నీవు ఇక్కడ ఉన్నావు. ఈ చిత్రము గోడ మీద వ్రేలాడుచుండగా, ఆ ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన అగ్నిస్తంభము ఈ రాత్రి ఇంకనూ నీవు అదే దేవుడైయున్నావు, అదే శక్తితో, అదే రుజువులతో నీవు మృతులలో నుండి లేచియున్నావు, మరియు నీవు మృతులలో నుండి లేచియున్నావని ఇదే రుజువైయున్నది.
ఇప్పుడు, ప్రభువైన దేవా, ప్రజల హృదయములో గొప్ప కార్యములు చేయును. ప్రతి పాపమును క్షమించి ప్రతి రోగమును బాగుచేయుము. ప్రభువా, వారి ప్రార్థనలకు జవాబిమ్ము మరియు ఇప్పుడు నీ సేవకుని యొక్క ప్రార్ధన వినుము. ఇప్పుడు, ప్రతి దయ్యమును ప్రతీ దయ్యపు శక్తిని ప్రతి వ్యాధిని ఖండిస్తూ; దేయ్యముతో చెప్పుచున్నాను, “దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో వారిలో నుండి బయటకు రమ్ము. ప్రజలలో నుండి బయటకు వెళ్ళిపొమ్ము. ఈ ప్రజలను విడిచిపెట్టము! వారు ఒకరు మీద ఒకరు చేతులను ఉంచియున్నారు. వారు దేవుని సేవకులైయున్నారు, సాతానా, బయటకు రమ్ము, యేను నామములో నీకాజ్ఞాపించుచున్నాను. బయటకు రమ్ము! - నీవు చీకటిలోనికి వెళ్ళుము వారిని ఇంక ఎంత మాత్రమును బాధించవద్దు. యేనుక్రీస్తు నామములో.”
80
ఇప్పుడే, దేవుడు మిమ్మలను స్వస్థపరచియున్నాడని మీలో ఎంతమంది నమ్ముచున్నారు. మీ కాళ్ళపై నిలువబడండి. మీరు కుంటి వారైనప్పటికి ఎలాగైనా నిలబడండి. ఇది అంతే. మీరు దేవుని మహిమను చూస్తారని మీతో చెప్పలేదా? ఇక్కడ నడువలేని ఎవరైనా కుంటివారు ఉన్నట్లైతే, ఈ దారిగుండా పైకి క్రిందకు నడవండి. ఇక్కడ ఎవరైనా చెవిటివారున్నట్లైతే, మీ మంచి చెవిలో మీ వేలునుంచి వినబడని చెవులో నుండి వినండి. ఎవరైనను బాధింపబడువారున్నట్లైతే, వారి చేతిని ఎత్తలేని స్థితిలో యున్నట్లైతే, మీ చేతులెత్తండి. క్రీస్తు... పైకెత్తబడు చేతులను చూడండి, వారు చేతులలో పీడించబడుచున్నవారు. ఆమెన్. ఆయన ఇక్కడున్నాడని నేను చెప్పియున్నాను.
మంచిది నహోదరి, గెర్టీ.
ఆయన జీవించుచున్నాడు, ఆయన జీవించుచున్నాడు,
క్రీస్తు ఈ దినమున జీవించుచున్నాడు!
నా జీవితము యొక్క ఇరుకు మార్గముగుండా
ఆయన నాతో మాట్లాడుచున్నాడు నడుచుచున్నాడు,
ఆయన జీవించుచున్నాడు, ఆయన జీవించుచున్నాడు,
రక్షణలేని వారికి రక్షణ!
ఆయన ఎలా జీవించియున్నాడో నన్ను అడుగము?
ఆయన నా హృదయములో జీవించుచున్నాడు,
మరలా, ప్రతిఒక్కరు!
ఆయన జీవించుచున్నాడు, ఆయన జీవించుచున్నాడు,
క్రీస్తు ఈ దినమున జీవించుచున్నాడు!
నా జీవితము యొక్క ఇరుకు మార్గముగుండా
ఆయన నాతో మాట్లాడుచున్నాడు నడుచుచున్నాడు.
ఆయన జీవించుచున్నాడు, ఆయన జీవించుచున్నాడు, రక్షణ లేనివారికి రక్షణ!
ఆయన ఎలా జీవించియున్నాడో నన్ను అడుగుము?
ఆయన నా హృదయములో జీవించుచున్నాడు.
ఈ గొప్ప శ్రోతలు “హల్లెలూయ!” అని చెప్పండి. ప్రభువు జీవించుచున్నాడు. [ప్రభువు జీవించుచున్నాడు!“] ఆయన నామము స్తుతించబడును గాక! [”ఆయన నామము స్తుతించబడును గాక.“] ”హల్లెలూయ!“ [”హల్లెలూయ!“]
ఆయన జీవించుచున్నాడు, (మన చేతులను
ఆయనకు ఉపెదము) ఆయన జీవించుచున్నాడు,
క్రీస్తు ఈ దినమున జీవించుచున్నాడు!
నా జీవితము యొక్క ఇరుకు మార్గముగుండా ఆయన నాతో మాట్లాడుచున్నాడు నడుచుచున్నాడు.
ఆయన జీవించుచున్నాడు, ఆయన జీవించుచున్నాడు,
రక్షణలేని వారికి రక్షణ!
ఆయన ఎలా జీవించియున్నాడో నన్ను అడుగుము?
ఆయన నా హృదయములో జీవించుచున్నాడు.
81
ఆ పాత పాటను మీలో ఎంతమంది ప్రేమిస్తారు. “ఆమెన్” చెప్పండి. మీ ప్రక్కనున్నవారితో కరచాలనం చేయండి. చెప్పండి, ప్రభువుకు స్తోత్రం! ప్రభువుకు సోత్రం! [ప్రభువుకు సోత్రం!“] ప్రభువుకు స్తోత్రం! ప్రభువుకు స్తోత్రం. మంచిది. ”నా విశ్వాసము నీవైపు చూస్తుంది.“ ఓ ఎంత అద్బు...
నీవైపు నా విశ్వాసము చూస్తుంది,
ఓ దేవుని గొర్రెపిల్లా,
దైవరక్షకుడా!
ఇప్పుడు నేను ప్రార్ధిస్తూ ఉండగా వినుము,
నా సమస్త అపరాధం తీసివేయుము,
ఓ ఈ దినము నుండి
నన్ను సంపూర్ణంగా నీవాడవుగా చేయుము!
82
ఇప్పుడు సర్వశక్తుడైన మరియు సర్వశక్తిగల దేవుని యొక్క సన్నిధిలో మర్యాదగా మన తలలను వంచుదాము. ప్రభువైన దేవుడు మీలో ప్రతి ఒక్కరికి తన దీవెనను ఇచ్చును గాక. ప్రభువు మిమ్మను దీవించును గాక. మీలో ప్రతి ఒక్కరిని దీవించును గాక. ఇక్కడ ఉన్న శ్రేష్ఠమైన దానిని మీకిచ్చును గాక. ఆయన కృప మీ మీద నిలచియుండును గాక, ప్రతి ఒక్కరు వారి స్వస్థత కొరకు పైకి లేచుచున్నారు. దీనిని ఎన్నడు తిరస్కరించవద్దు. ఎంతో మంది రక్షింపబడియున్నారు, ఎందరో క్రీస్తును స్వీకరించారు, హృదయ రహస్యములను క్రీస్తు బయలుపరచుచున్నాడు. క్రొత్తవారైన మిమ్ములను తిరిగి మా ఆలయమునకు, మా ఆరాధనకు ఆహ్వానించుచున్నాము.
నేను మాట్లాడుట కొరకు అభిషేకము ఒక క్షణము ఒక్క విధముగా నన్ను విడచునట్లు, నేను కొద్దిక్షణముల క్రితము నేను పాటను పాడియున్నాను. మీరు ఇక్కడున్నందుకు నాకు సంతోషము. ఇక్కడ మీతో ఉండుట ఒక గొప్ప దినమైయున్నది. ప్రభువు మిమ్మును దీవించును. ఆలయములోని వారికి, వచ్చేవారుము రాత్రి మనకు ప్రభురాత్రి భోజనము, పాదపరిచర్య ఉన్నది. మీ ఇరుగు పొరుగున ఉన్నవారు ఎవరైనా ఆగి మమ్ములను చూడవచ్చును. మనము తిరిగి కలుసుకొనువరకు మా కొరకు ప్రార్ధించండి. ఇప్పుడు మన తలలను వంచుదము. సంఘ కాపరిని మనము అడుగబోవుచున్నాము: వచ్చి మాకు సెలవియ్యండి (లేక మీరు కోరినదేదైనా ఉంటే మాకు చెప్పండి.)