జక్కయ్య
vgr count -132 సోదరుడా వేల్, నీకు చాలా వందనములు. మరియు నేను గమనించాను, ప్రజలు కొన్నిసార్లు కొంచెము ... మీరు ప్రక్కగా కూర్చొని యున్నారు, మీరు కుడివైపు తిరిగినట్లయితే, నేను దానిని అప్పుడు చేయగలను. మీ కుర్చీలను తిన్నగా ఈ చుట్టూ తెచ్చుకొనండి, అప్పుడు మనము ఒకరిని ఒకరము అందరమూ చూసుకొనగలము.
ఇప్పుడే ఆ సోదరుడు చెప్పినట్లుగా, నేను ఒక వ్యవస్థకు చెందిన వాడనని, అది క్రైస్తవ వ్యాపారస్థుల యొక్క వ్యవస్థ అని అతడన్నాడు. నా సహవాసపు కార్డును నేను అతనికి చూపించుట జరిగియున్నది. కాబట్టి నేను క్రైస్తవ వ్యాపారస్తులను గూర్చి ఎలా తలంచెదనో నీవు తెలుసుకొంటావు. ఆ వ్యవస్థకు మాత్రమే నేను చెందినవాడను, కారణము మనమందరము ఉమ్మడిగా కలిగియున్న దానిని కొంత వారు కలిగియున్నారు: క్రీస్తు.
2
ఈ చక్కని గుంపు ప్రజలైన మిమ్ములను నేను ఈ ఉదయమున అభినందించుచున్నాను. మరియు మొన్నటి రాత్రి మీ అధ్యక్షుడైన, దేమోస్ శకరియన్ తో నేను మాట్లాడుచుంటిని. అతడు నాకు ఒక ప్రాణ-స్నేహితుడు. ప్రపంచమంతటిలోయున్న ఈ వర్గముల నుండి, అతడు ఇక్కడయున్న మీతో ఒక్కొక్కరికి, మీ అందరికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు పంపుచున్నాడు. మరియు నేను రాగలిగినంత త్వరగా ఆఫ్రికా నుండి స్టట్‌గార్ట్, జర్మనీ వరకు రమ్మని అతడు కోరుచున్నాడు, అక్కడ వారు కూటములలో, వారికి రాత్రి బోధకుడిగా యుండుటకు మనకు వీలవుతుందేమోనని వారు చూడగోరుచున్నారు, మరియు 30వ తారీఖునుండి ప్రారంభము కాబోవుచున్న ఫిలదెల్ఫియా కూటములకు, మన అందరికి అతడు ప్రత్యేకమైన ఆహ్వానమును పంపుచున్నాడు. అది జూన్ నెల అని, 4వ జూలై వరకు ఫిలదెల్ఫియాలోనని నేను నమ్ముచున్నాను. మరియు అక్కడ ప్రభువు చిత్తమైన యెడల, ఆ ఫిలదెల్ఫియా హాలులో ఆ గొప్ప కూటములో మరలానేను మాట్లాడవలసి యున్నది (అది వుంటుందని నేను నమ్ముచున్నాను, అయితే నిశ్చయమని నేను అనను). అయితే మీరు అందరూ వచ్చుటకు ఆహ్వానించుచున్నాము.
3
ఇప్పుడు, ఇలాంటి ప్రియమైన గుంపు ప్రజలముందు నిలబడుట నాకు ఒక గొప్ప ఆధిక్యతయై యున్నది. ఈ ఉదయకాలము అల్పాహారము భుజించిన స్థలములో తిన్నగా ఏమి జరుగగలదో మనము గ్రహించలేము... ప్రపంచము చుట్టూ, నేను క్రైస్తవ వ్యాపారస్థుల కూడికతో మాట్లాడియున్నాను. ఒకసారి లాస్‌ఏంజలస్‌లో అల్పాహారము చేయుస్థలములో 1000 మందిని మేము కలిగియున్నాము, అనేక సార్లు వారితో మాట్లాడే ఆధిక్యతను నేను కలిగియున్నాను. గ్రుడ్డివారు లేచి చూపుపొందుట, కుంటివారు నడిచి వెళ్ళుట, మరియు వందల మంది ప్రజలు, వ్యాపారస్థులు, వైద్యులు, న్యాయవాదులు, విమర్శకులు లోనికివచ్చి, దేవుని శక్తి క్రింద తిన్నగా సాగిల పడ్డారు మరియు ఒక... ఓ మర్యాదస్తుడా, నీ యొద్ద ఏదోయున్నది.
ఇప్పుడు, గుర్తుంచుకోండి అక్కడ ఒక కార్యమున్నది. ఈ ఉదయమున మనమందరము ఒకే నమ్మకమును కలిగియున్నాము. ఇక్కడ మనము కలిగియున్నది అదియే. మనందరకు ఒకటి ఉమ్మడిగా యున్నది, అయితే దానిని మనము ఎలా వాడుకోవాలో తప్పక ఎరుగవలసియున్నది, చూడండి. మంచిగా వేటాడుటకు అది మనము కలిగియున్న ఒక తుపాకీ వలె యున్నది, అయితే దానిని ఎలా వాడవలెనో మనము ఎరుగవలసి యున్నది. కాబట్టి సువార్త కూడా ఆ విధానములోనే యున్నది. కాబట్టి మనము దానిని దేవుని మహిమ కొరకు, ప్రతి ఆత్మను దేవుని రాజ్యములోనికి తెచ్చుటకు వాడుదాము, ఆ రాజ్యములోనికి ఎలా వెళ్ళాలో మనము ఎరుగుదుము.
4
మరియు ఇప్పుడు ఇక్కడ కూడియుండిన చిన్నగుంపును దేవుడు దీవించును గాక, మరియు ఈ అల్పాహార సమావేశములను జరిగిస్తూ యుండండి, మరియు వాటన్నిటికీపైగా దానిని ఆత్మసంబంధంగా ఉంచండి, ఆ ఆత్మను ఎన్నడూ చనిపోవద్దు, ఆ పాతకాలపు పాటలను పాడండి, చప్పట్లు కొట్టండి, ప్రభువును స్తుతించండి. ఆ రీతిగానే నీవు తప్పక దానిని పాటించవలసియున్నది...
నేను ఒక దక్షిణాది వాడిని, నేను ఉద్రేకముగల వాడిని, ఉద్రేకము లేనిది ఏదైనా అది మతమైనది అని నేను ఋజువు చేయగలను. నీ మతము ఏ విధమైన ఉద్రేకము కలిగి ఉండనట్లైతే, నీవు దానిని సమాధిచేసి మరియు ఉద్రేకము కలిగిన మరొకదానిని పొందుము. అది మతమైనది. మనము తప్పక ఉద్రేకమును కలిగియుండవలసి యున్నది. యేసు అన్నాడు “వారు మౌనంగాయుండి ఉన్న యెడల ఆ రాళ్ళు వెంటనే కేకలు వేస్తాయి.”
ఏదో... మరణము మరియు జీవము కలిసియుండలేవు, క్రీస్తు ఎక్కడకు వచ్చాడో ఆయన జీవితమంతటిలో ఒక్క సమాధి కార్యక్రమంలో కూడా ఆయన బోధించలేదు. కారణము జీవమున్నచోట మరణం నిలబడలేదు. వారు మరణం నుండి లేపబడ్డారు. ఆయన ఒక గుంపు ప్రజలలోనికి వచ్చినప్పుడు జీవము వస్తుంది, ఏలయనగా ఆయన జీవమైయున్నాడు. మరియు ఈ ఉదయం మన హృదయమంతటిలో మహోన్నతముగా మనము ఆయనను ప్రేమిస్తాము, మరియు ఈ చిన్న కూటాలలో మనము ఆయనను నిజంగా ప్రేమించుచున్నామని మన హృదయముల యొక్క ఆరాధనను మనము ఆయనకు ఇస్తాము. మరియు ఈ రీతిగా చిన్న కూటముగా యుంటుంది....
5
నన్ను మన్నించండి? [ఒక కారును త్రాడుకట్టి ఈడ్చుట కొరకు ఒక ప్రకటన చేయబడినది] దానిని నన్ను శుభ్రం చేయనివ్వండి. అయితే అది ఇక్కడ మన గుంపులోని వారిదై యుండదు, అది పైన మెట్ల మీద ఎవరో దర్శించుటకు వచ్చినవారు ఆ కారును లోనికి త్రోసివేశారు. కాబట్టి దీన్ని తిన్నగా చేయు మన సోదరులను నేను మెచ్చుకొనుచున్నాను, ఆరీతిగా ఏ ఒక్కరు కూటములను విడిచి వెళ్ళుచుండగా ఇబ్బందిపడరు.
ఇక్కడే నేను ఆనందాన్ని పొందుతాను, సరిగ్గా ఈలాంటి గుంపుతో... మీకు పాతకాలపు దక్షిణాది సామెత మీరెరుగుదురా, ఒకే ఈకలుగల పక్షులు ఏకముగా గుంపు కడతాయి. ఈ ఉదయకాలం ఇక్కడున్న పక్షుల వంటి ఈకలను నేను కలిగియున్నందుకు ఆనందించుచున్నాను. అక్కడ ఏదో ఉన్నది.
ఇది ఏ స్వస్థతా కూటము కాదు, స్వస్థతా కూటమైనప్పుడు, నీవు ఎంతో ఒత్తిడి క్రింద అభిషేకం క్రింద నీవుంటావు. మరియు ఈ మధ్యాహ్నం నేను నా గదిలోనికి వెళ్ళినప్పుడు...అక్కడ నేను ఒంటరిగా దేవునితో ఉన్నాను, మరల బయటకు వచ్చాను. అప్పుడు నీవు గమనించవలసియున్నది, కారణం సాతాను ఒక నిజమైన శత్రువుయై యున్నాడు. ఇప్పుడు నేను అలసిపోయియున్నట్లుగా, గందరగోళము చేయుట అది సుళువుగా వుంటుంది. అయితే వాడు ఈ మార్గముగుండా వచ్చినప్పుడు, మీరు 50 మైళ్ళ కావలిసినంత స్థలముగల గదిని కలిగియున్నారు. మరియు ఏ సమయములోనైన గందరగోళం చేయుటకు వాడు కూర్చొని యున్నాడు. మీరు చుట్టూ కూర్చొని ఒక మంచి సమయమును కలిగి యుండండి. మీ ముఖములన్నిటిని చూడండి, మరియు ఆ చిరునవ్వులను చూడండి, ఆ ఉత్సాహమును చూడండి, క్రీస్తు యొక్క సన్నిధిని చూడండి. మంచిది అది నాకు ఒక నిజమైన ఆత్మసంబంధమైన ఉదరసేవ ఉత్సాహమై యున్నది, మనమంతా ఏకముగా కూడి దానిని వినుట.
6
మరియు మీరు ఆ పాటలను వినుచున్నారు. ఆ పాతకాలపు విధానంలో పాడు చక్కని పాటలను నేను ప్రేమిస్తాను. ఏదైనా నేను ప్రేమించేదియున్నట్లైతే అది పాటలు పాడుటయే. మరియు నేను ఏదైనా ద్వేషించినది ఉన్నట్లైతే అది మితిమీరిన తర్ఫీదుతో కూడిన స్వరమై యున్నది. మీకు తెలుసా, వాటిలో ఒకటి ఏమనగా వారి ముఖములు నీలపురంగుగా మారువరకు నటించుటయే. మరియు చూడు నీవు ఎంతవరకు నీ ఊపిరిని బిగపట్టుకొనగలవు. నీవు క్రిందకి దిగిరమ్ము. వారు దేవుని మహిమ కొరకు పాడుటలేదు, వారు ఎంతసేపు ఊపిరిబిగపట్టి పాడగలరో చూచుకొనుచున్నారు.
ఆ పాతకాలపు చక్కని పాటలకంటే మరి ఎక్కువ ఏదియూ లేదని తలస్తాను, అదే ఆత్మతో పాడు పెంతికొస్తు పాటలు, దేవుని మహిమ కొరకు పాడు పాటలు. అది నిజము. నీ యొక్క బొగ్గు బక్కెట్టు ఏ విధమైన రాగమును నీవు చేయలేని ఎడల ఎలాగైనా నీవు పాడుము. ప్రభువుకు ఉత్సాహ-ధ్వనిని చేయుము. దానిని గూర్చి నామకార్థమైనది ఏమియూ లేదు. మరియు దేవునికి ఏ రూపమును లేదు. అదే బైబిల్ చెప్పియున్నది. కాబట్టి ఆయన ఒక నామకార్థ ప్రజలను కలిగియుండడు. ఆయన ఒక నామకార్థముకాని ప్రజలను కలిగియుంటాడు. ప్రతీ స్థలములో ఏదైనను ఆత్మచేయుచున్నది. ఓ, దాన్నిబట్టి మనం ఎంతో సంతోషిస్తాము.
7
ఇప్పుడు రాబోవుచున్న కూటాలలో నేను నమ్ముచున్నాను... నా యధార్థత అంతటితో నేను దీన్ని చెప్పగోరుచున్నాను, కారణము ఆయా స్థలముల నుండి వచ్చిన ప్రజలు ఇక్కడున్నారని నేను గ్రహిస్తాను. నేను న్యూయార్కు విడిచినప్పటినుండి నేను ఎన్నడూ అలాంటి రాత్రిని చూడలేదు. అదే ఇక్కడి మొదటికూటం, ఈ పట్టణంలో ఆ విశ్వాసము తిన్నగా మనలను కలుసుకొనియున్నది. ఇక్కడ ప్రార్థన ఏదో కార్యమును చేసియున్నది, అది ఎక్కడ జరిగియున్నదో నాకు తెలియదు, అయితే ఎవరో ప్రభువుతో మాట్లాడుచున్నారు.
ఆ సాక్ష్యమును ఇచ్చిన ఆ చిన్న సోదరుడు ఈ ఉదయకాలం అతడు పాటలను నడిపించుటను నేను మెచ్చుకొనుచున్నాను. అతడు పైకి లేచి నిలబడగానే, ప్రభువుతో మాట్లాడగానే, నేనన్నాను, “అతడింతకు మునుపు ప్రభువుతో మాట్లాడియున్నాడు.” ఏలయనగా అతడెవరితో మాట్లాడియున్నాడు. అది అతి శ్రేష్ఠమైన కార్యం, అదే ఆత్మలను జయించుట. మరియు సోదరులారా మనం అంత్యకాలములో యున్నాము. మనం ఇక్కడ మార్గము యొక్క అంతములోయున్నాము, మరియు అభ్యసింపచేయువారు రావల్సి వచ్చినట్లయితే, నీవు దాన్ని ఎరిగియున్నట్లైతే... ఒక మర్తుడుగా వెనుకకు వచ్చి సాక్షమిచ్చు అవకాశం నీవు కలిగియున్నట్లైతే, ఆయన ముందు ఇది వరకు నీవు ఉండినట్లైతే, ఆయన ఎంత ప్రియమైనవాడుగా ఉన్నాడో నీవు చూస్తావు. అప్పటికి అది చాలా ఆలస్యమయిపోతుంది. ఇప్పుడే మనం దాన్ని చేద్దాం, మనకు అవకాశం ఉండగానే. అందరమూ దానియందే పగలు, రాత్రి ముందుకు కొనసాగుదాం.
8
కొద్దికాలం క్రితం ఆ దక్షిణాన ఒక నీగ్రో-జాతి మనిషి ఉండి యున్నాడు. మరియు ఒక రాత్రి అతడు ఆ చెట్లు నాటు కూటమునొద్ద యున్నాడు. అక్కడవారు వారి రాత్రి భోజనంగా ఉంటుంది, చూడండి.
రాత్రివేళ నీవు నీ రాత్రి భోజనమును కలిగియుంటావు. నీవు సరిగ్గా... అప్పుడు నేను ఇంటి యొద్ద ఉన్న అనుభూతిని కలిగియుంటాను, మీరు రాత్రి భోజనాన్ని గూర్చి మాట్లాడినప్పుడు, నేను ఆభోజనాన్ని పోగొట్టుకొన్నట్లుగా అనుభూతిని చెందుతాను. మనము ఉదయకాల అల్పాహారం, మధ్యాహ్న భోజనము, మరియు రాత్రి భోజనమును కలిగియున్నాము. నేను కలిగియున్నట్లైతే... రాత్రి భోజనమే నా మధ్యాహాన్న భోజనమైతే, అప్పుడు నేను నా మధ్యాహ్నభోజనాన్ని నేనెక్కడ పొందుతాను? కాబట్టి నేను... మీరెరుగుదురా తిన్నగా మనం దానిలోనే ఉన్నాం ప్రజలారా. నిశ్చయంగా మనం దానిలోనే యున్నాము. ఏలయనగా అది ప్రభురాత్రి భోజనమై యున్నది. ఆయన మధ్యాహ్న భోజనం కాదు, మీకు తెలుసా.
కాబట్టి మనం నిశ్చయంగా సరియై యున్నాము. కాబట్టి అప్పుడు, ఆ చెట్లునాటే స్థలములో వారు రాత్రి భోజనమును కలిగియుండిరి, మరియు అక్కడ ఆ వృద్ధ నీగ్రోవ్యక్తి తన జీవితాన్ని ప్రభువుకు ఇచ్చియున్నాడు.
తరువాత నేను మీకు చెబుతాను, అలాంటి వాటిని వినుట అద్భుతమైన విషయం... వారు ఆ పాతకాలపు పాటలను పాడినప్పుడు అది ఎలాంటి రాగమును చేయుననగా, అది సరిగ్గా,
నేను లేచి యేసునొద్దకు వెళతాను,
ఆయన నన్ను తన హృదయమునకు హత్తుకొనును.
మీరు అలాంటి రాగమును ఎన్నడైనా విన్నారా? సరే, ఆ రీతిగానే దాన్ని వారు పాడియున్నారు. అయితే, ఓమై, అక్కడ ఆత్మయున్నది. అవునండి. అది వారి హృదయం నుండి వచ్చినదై యున్నది.
9
మరియు అలాంటి స్థలములో ఆ పాత వద్ధుడైన నీగ్రో రక్షించబడి ఉన్నాడు. మరుసటి రోజు ఉదయమున అతడు స్వతంత్రుడైనాడని ప్రజలకు చెప్పుచున్నాడు... ఇది ఆ బానిసత్వపుకాలంలో జరిగినది. మరియు అతడన్నాడు... ఆ విషయం తోటలను నాటే యజమాని చెవులకు వెళ్ళినది, కాబట్టి అతడు ఇతని యొద్దకు వచ్చి ఇలా అన్నాడు, “మోస్ ఈ ఉదయమున నేను బానిసల మధ్య నుండి నీవు స్వతంత్రుడనైయున్నానని నీవు చెప్పుచున్న ఈ మాటలు విషయం ఏమిటి?”
అతడన్నాడు “అవును, యజమానుడా, ఈ ఉదయమున నేను స్వతంత్రుడనై యున్నాను.”
అతడన్నాడు “మోస్ నీవు నా ఆఫీసునొద్దకు రమ్ము,” మరియు అతడు ఆఫీసునొద్దకు వెళ్ళాడు. “నీవు కూర్చో” అని యజమాని అన్నాడు, “మోస్ నీవు ఏమైయున్నావని నీవు చెప్పావు?” అని అతడన్నాడు.
రోమా 8:2.
అతడన్నాడు “యజమానుడా, నేను ఇంకనూ నీ బానిసనే, అయితే పాపము మరణము యొక్క నియమము నుండి నేను స్వతంత్రుడనై యున్నాను,” అని అతడన్నాడు. గత రాత్రి, “ఆ చిన్న పాత, కూటమునొద్ద క్రీస్తు నన్ను స్వతంత్రునిగా చేశాడు.”
అతడన్నాడు, “మోస్ నిజముగా అది నీ భావమా?”
అతడన్నాడు, “యజమానుడా అవును నా భావము అదే.”
అతడన్నాడు మంచిది, “మోస్ ఈ ఉదయమున నీకు నేను కూడా విమోచనను ఇస్తూ సంతకం చేయబోవుచున్నాను. ఒక బానిసత్వం నుండి నేను నీకు విడుదల నిచ్చుచున్నాను,” “నీ సహోదరులకు సువార్తను బోధించుము.” యజమాని అన్నాడు “ఇప్పుడు నేనును క్రైస్తవుడనైయున్నాను. నీవు నీ సోదరుల యొద్దకు వెళ్ళి సువార్తను ప్రకటించుము,” అని అన్నాడు.
10
ఎన్నో సంవత్సరముల సేవ తర్వాత ఈ వృద్ధ నీగ్రో తన మరణమును సమీపించాడు. కాబట్టి అనేకమంది తెల్లజాతి సోదరులు అతనితో చివరిసారిగా కరచాలనం చేయుటకు అతనిని చూచుటకు ప్రోగైనారు. మరియు అతడు కోమాలోకి వెళ్ళిపోయినాడు. కొద్ది సమయమునకు అతనికి మెళకువ వచ్చింది అతడు చుట్టూచూసి ఇలా అన్నాడు “ఓ, నేను మళ్ళీభూమి మీదికి వచ్చానా?”
వారన్నారు “మోస్ నీవెక్కడున్నావు?”
అతడన్నాడు, “ఓ, నేను ద్వారమునొద్దకు వెళ్ళాను” మరియు అన్నాడు “నేను చూడగా, నేను యేసును చూశాను.” మరియు అతడన్నాడు “ఈ నల్లని వృద్ధ హృదయం ఎంతో పరవసించింది, మళ్ళీ ఈ మార్గముగుండా క్రిందికి వచ్చుట నాకిష్టం లేదు.” మరియు అతడన్నాడు “నేను అక్కడ నిలబడియుండగా ఒక దూత నా యొద్దకు నడచివచ్చి ఇలా అన్నాడు మోస్, ఇక్కడకు రమ్ము: నీ వస్త్రమును, కిరీటమును నేను నీకివ్వగోరుచున్నాను.”
అతడన్నాడు “నా వస్త్రమును గూర్చి, కిరీటమును గూర్చి నాతో మాట్లాడవద్దు, నాకు వస్త్రమువద్దు, కిరీటము వద్దు. ”
దూత అన్నాడు, “మోస్ అలాగయితే నీ కోరిక ఏమిటి, నీవు చేసిన ఆ సేవ కొరకు ఆ దీర్ఘాయువు కొరకు?”
అతడన్నాడు, “నన్నుఒక వేయి సంవత్సరములు ఆయనను చూడనిమ్ము”
11
అది మన అందరి యొక్క భావనయైయున్నదని నేను తలస్తాను. మన డబ్బు మీద మన వ్యాపారము మీద, లేక మనము చేయువాటిమీద, మనమిచ్చు సాక్ష్యముల మీద, మనము ఆసక్తి కలిగియుండుట కాదండి, కేవలము ఆయనవైపు నన్ను చూడనిమ్ము. ఒక దినమున నేను చేయుటకు ఎదురు చూచునది అదియే, ఆయన పాదముల యొద్దకు ప్రాకుకొంటు వెళ్ళి, ఆ ప్రశస్తమైన ఆ గాయములను పొందిన పాదములను నన్ను ముద్దు పెట్టుకొననిమ్ము, నన్ను ఆయన వైపు కొంచెము చూడనివ్వండి.
నాకు ఒక నివాసము వద్దు, ఒక మూలన ఎక్కడో నన్ను సహోదరులైన మీతో నన్ను సహవాసము చేయనివ్వండి.
12
ఈ ఉదయమున ఇక్కడ కూర్చొని చూస్తూయుండగా, ఈ ప్రియమైన యవ్వనస్థులను, నేను ఈవైపు నుండి ఆవైపుకు చూచుచున్నాను... ఈ మధ్యనే వివాహమైన ఒక యవ్వన జంటను గురించి నేను అడిగియున్నాను, మరియు వారు దేవుని కొరకు అగ్నితో మండుచున్నారని సోదరుడు స్వీట్ నాకు చెప్పాడు.
మరొక వృద్ధ మనిషిని నేను గమనించాను, మీలో కొందరు నెరసిన వెంట్రుకలను కలిగిన నాకంటె పెద్దవారున్నారు, నేను ఒక బాలుడుగా యున్నప్పటి నుండి వారు సువార్తను ప్రకటించుచుండిరి. నేను భుజిస్తూ యుండగా, నాకై నేను ఇలా తలంచాను, వివిధమైనవారు ఇలాగు మాట్లాడుటను నేను విన్నాను, “ఇది భూమిమీద మనమందరము కలుసుకొనుట చివరి సారియైనట్లైతే కావచ్చు,” మీకు తెలుసా అయితే ఇది మనము చివరిసారి కలుసుకొనుటకాదు.
ఇక్కడ యున్న మీలో కొందరు మనుష్యులు, ఒక వీధి మూలన సువార్తను బోధిస్తూయుండగా, పాత గిటారను వాయిస్తూయుండగా, మీరు జైలులోనికి నెట్టబడ్డారు, ఈ కారణమును బట్టియే (సువార్త కారణము, తె॥త॥దారుడు) మిమ్ములను పట్టణములో నుండి బయటకు వెళ్ళగొట్టారు ఇప్పుడు సులభముగానున్న దారిలో నడుచుచున్న నా కొరకు మీరు వెల చెల్లించి యున్నారు. పురుషులైన మీరు, స్త్రీలైన మీరే తప్పక ఘనపర్చబడాలి. అది ఇక్కడ ఆపైనయున్న మీరే, నేను కాదు. నేను ఒక పాపియైన బాలుడుగా ఉన్నప్పుడు అదిగో ఆ బయట నేను ఒక గుర్రముతో అంగలు వేయుచున్నాను, మరియు గుర్రమునకు ఒక కొక్కెమును కట్టి, ఎవరు ఎక్కువ దూరము కొక్కెము కట్టిన గుర్రముతో, లేక తాడుకట్టిన ఎద్దులతో ఎవరు ఎక్కువ స్వారీ చేస్తారు - అయితే ఆ సమయములో మీరు సువార్తను బోధించుచుండిరి. నేను గుర్రముల పందెములలో యున్నాను.
13
స్త్రీ, పురుషులైన మీరే ఆ ఘనతకు తగినవారు. మీరు తప్పక ఇక్కడ నిలబడాలి. మీ వెనుకగుండానే నేను ముందుకు వచ్చుటకు, మీరు నాకు మార్గమను సిద్ధపరచుచుండిరి. సహోదరీ, సహోదరుడా నేను మిమ్ములను మరలా కలుసుకొంటాను. అది మరొక అల్పాహార విందుగా యుండదు, కాని అదిగో ఆ ఆకాశములో ఈ వైపు నుండి ఆవైపు వరకు ఆ గొప్ప వివాహోత్సవపు విందు పరవబడుతుంది. మరియు మనము అక్కడకు వెళ్ళినప్పుడు, మనము భిన్నమైన వారముగా యుంటాము.
స్త్రీ, పురుషులైన మిమ్ములను నేను ఆ బల్ల మీదుగా చూచినప్పుడు, సందేహము లేదు, మనము ఒకరితో ఒకరము కరచాలనము చేయుచుండగా ఉత్సాహముతో కన్నీరు మన బుగ్గల మీద నుండి ధారగా కారుతుంది, “అవును, బ్రదర్ బ్రెన్‌హాం, ఆ ఉదయమున నేను ఆ బాంగూర్ కూటమునొద్ద యున్నాను.”
“ఓ, నేను నిన్ను గుర్తుపడతాను. ఓ, ఇక్కడ పలానా-పలానా వారు యున్నారు.” ఓ, మేము వచ్చుటను నేను చూడగలను, మరియు ఆ వరుసగుండా ఆయన నడుస్తూ నీ కన్నుల మీద నుండి కన్నీటిని తుడిచివేస్తూ ఇలా అంటాడు, పిల్లలారా ఏడ్వవద్దు ఇప్పుడు అది అంతయూ సమాప్తమై పోయినది. మీరు ఇంటికి వచ్చేశారు. జగత్తు పునాది నుండి మీ కొరకు సిద్ధపరచబడి ఉండిన మీ ప్రభువు యొక్క ఆనందములలో ప్రవేశించండి.“ ఆ దినము కొరకు నేను ఎదురుచూస్తున్నాను.
నేను మీ సోదరుడనై యున్నాను. నేను మీకు సహాయపడుటకు ఇక్కడున్నాను, సిద్ధపరచుటలో మీరు దొర్లించుచున్న భారమును నేనును నెట్టుటకు ఆ చక్రముకు నా భుజములను కలుపుతాను. ప్రభువు మిమ్ములను ఇప్పుడు దీవించును గాక. ఇప్పుడు ప్రార్థన కొరకు ఒక్క క్షణం మన తలలను వంచుదాము.
14
కనికరముగల తండ్రీ, నీ యొక్క దైవిక సన్నిధిలోకి, నీ యొద్దకు వచ్చుట అది ఎంత భాగ్యమైయున్నదో, అక్కడ వరములు, విభాగములు, మరియు పరిశుద్ధాత్మ ఆయన ప్రియమైన పిల్లల మధ్య పనిచేయుటను మేము చూడగలము. మరియు ఈ దినమున మేము ఇక్కడ ఉన్నాము, మేము ఒకరికొకరము క్రొత్తవారముగా ఇక్కడ కూర్చొని యున్నాము అయితే మేము క్రొత్తవారము కాదు. మేము దేవుని రాజ్యం యొక్క సహ-పౌరులము. మేము ఈ భూమ్మీద యాత్రికులము మరియు పరదేశులమై యున్నాము. అయితే మేము నీ రాజ్యము యొక్క పౌరులమై యున్నాము.
మొదటిసారిగా మిమ్ములను కలుసుకొనుచున్నాను, అయితే ప్రభువు నందు మీరు నాకు ప్రియమైనవారు. ఈ రోజు మమ్ములనందర్నీ దీవించవలసినదిగా మేము అడుచున్నాము. ప్రభువా ఈ ఆత్మను కొనసాగించుము. ప్రజలలో నుండి అది ఎన్నడూ చనిపోకుండునుగాక, ప్రతి సేవకుడు, ప్రతి పనివాడు, ప్రతి సంఘ సభ్యుడు దీవించబడును గాక ఆత్మలు పుట్టును గాక. తండ్రీ మేము మిమ్ములను ప్రేమించుచున్నాము. మరియు విమోచించబడినవారి ఈ పాతపాటలను వినుచున్నప్పుడు మరియు మీ ప్రశస్తమైన నామమును వినుచున్నప్పుడు మా హృదయములు నిజంగా మండుచున్నవి.
ఈ పట్టణంలోని మా చిన్న ప్రయాసను ఇప్పుడు మీరు దీవించవలెనని మేము అడుగుచున్నాము. ఓ దేవా, ప్రతి సంఘములో, ప్రతి హృదయములో ఆ పాత-కాలపు ఉజ్జీవమును ప్రారంభించుము. ఎన్నుకొనబడిన వారిని పిలువుము. పేకాట గుహల నుండి, ఆటలాడు కొలనుల నుండి మరియు నీచమైన స్థలముల నుండి, వీధులలో నుండి వారిని నీ రాజ్యములోనికి పిలువుము. ప్రభువా బాధపడుచున్న నీ దీనమైన పిల్లలను స్వస్థపర్చుము. వారికి నీ యొక్క సన్నిధిని, నీ ప్రేమను వివరించుము.
మేము ఇప్పుడు చదవబోవు మాటలను దీవించుము. మరియు మేము చదువబడిన వాక్యము చుట్టూ సహవాసము చేయుదుము గాక. ఏలయనగా మా రక్షకుడైన, ప్రభువైన యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
15
ఒక చిన్న అంశం కొరకు ఈ కూడికను ఎక్కువ దీర్ఘకాలం ఉంచకూడదని నాకు తెలుసు, అయితే ఒక చిన్న అంశం మీద లేక ఒక చిన్న డ్రామా మీద మాటలాడగోరుచున్నాను, (కొన్ని క్షణముల పాటు మీ యొక్క దష్టిని నే తీసుకొనగోరినట్లైతే), మరియు అది లూకాసు వార్త 19 అధ్యాయం, 4వ వచనంలో కనబడుతుంది.
అప్పుడు యేసు ఆ త్రోవను రానైయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడిచెట్టెక్కెను.
ఆ చిన్న వ్యక్తి మీద అది ఒక భీకరమైన రాత్రిగా యుండెను. అతడు విశ్రాంతిని తీసుకొనలేకపోయాడు. అతడు తన పడక మీద ఈ ప్రక్కనుండి ఆ ప్రక్కవరకు దొర్లుచుండెను, కారణము ఒక వింతైన, క్రొత్త దినమున అతడు జీవించుట సంభవించెను, కారణము అతని యొక్క సంఘము మరియు దాని యొక్క వర్తమానము ఒకదానితో ఒకటి దాని అంతమునకు వచ్చి యున్నవి.
మీరు చూడండి అతడు ఒక ప్రాచీన సంఘమునకు చెందిన యూద విశ్వాసియై యున్నాడు. మరియు ఆ దినమున నజరేతు ప్రవక్తగా పిలువబడు, నజరేయుడైన యేసు, ఒక యేసేపు అను వడ్రంగివాని కుమారునిగా చెప్పుకొనుచున్న ఒక వార్తను వారు కలిగియుండిరి.
16
ఒక మనిషి సహజాతీతమైన పరిచర్యలో వచ్చియున్నట్లైతే, ఆ దినములలో ఎంతో వింతైన ఆ కార్యమును గూర్చి ప్రజలు తప్పక ఎలా భావించియున్నారో అది పరిపూర్ణముగా యూదా నమ్మకమును వ్యతిరేకమైనదిగా, తప్పక అలాంటి దాన్ని ఒక వింతైన కార్యముగా ఆ దినమున ప్రజలు భావించారు. అలాంటి కార్యమునందు వారికి నమ్మకం లేదు. వారు ఏమి అనుకున్నారంటే, ఇలాంటి కార్యములు మోషేతో పాటు ఎన్నో సంవత్సరముల క్రితమే ఆగిపోయినవి మరియు దేవుడు ఒకేరీతిగా యున్నాడని ఎరుగుటలో తగినంతగా వారు ఆత్మ-సంబంధమైన మనస్సును కలిగియుండ లేదు. మరియు వారు కాలము యొక్క ఒక కూడలి నొద్ద వారు ఉండిరి.
కాబట్టి అది అతనికి తప్పక చాలా కఠినముగా ఉండి యున్నది, ఏలయనగా అతని యాజకుడు ఏమి చెప్పాడో దానినే అతడు నమ్మియున్నాడు, మరియు ఈ ప్రవక్త పెట్టే అలాంటి కూటములకు సంఘపు వారు ఎవరునూ హాజరవకూడదని వారు నిషేధించిరి.
17
మరియు ఈ ప్రవక్తను గూర్చి వారు అనేకరకములుగా మాట్లాడుచుండిరి. కాబట్టి అతడు ఒక విశ్రాంతి లేని రాత్రిని అతడు కలిగియుండెను, ఏలయనగా అతని భార్యయగు రిబ్కా ఈ ప్రవక్తయందు నమ్మికయుంచినది. ఆయన కూటములకు ఆమె హాజరయినది, మరియు ఎన్నో వింతైన కార్యములు సంభవించినట్లు ఆమె ఆయనకు చెప్పియున్నది.
దానిని గూర్చి అతడు అతని యొక్క యాజకుని సంప్రదించగా ఇప్పుడు అది వెర్రితనమని, వారు అన్నారు. రిబ్కా అలాంటి దాన్ని గూర్చి నమ్మవలసిన అవసరం ఇప్పుడు మనకు లేదు. మనము ఈ పట్టణములోనే ఉన్న అతి శ్రేష్ఠమైన సంఘములలో ఒక దానికి మనం చెందియున్నాము. మన సమాజ మందిరము అందరికంటె పెద్దదియైయున్నది. మరియు ఈ పట్టణంలోని ఒక వ్యాపారస్థునిగా నేనిక్కడయున్నాను, నా పేరు జక్కయ్య మరియు ఈ పట్టణంలోనే అతి గొప్ప భోజనశాలను నేను కలిగియున్నాను. మరియు నేను గొప్ప వ్యాపారమును కలిగియున్నాను, మనము గౌరవింప తగిన ప్రజలము. అందుచేత ప్రవక్త అని మీరు పిలచునట్లుగా అంతటా సంచరించుచున్న ఆ వెర్రివాని గుంపులోనికి వెళ్ళి నన్ను నేను వారిలో కలుపుకొని, నన్ను నేను హీనముగా చేసుకొనుట నాకు నీతియుక్తము కాదు, మన యాజకులు లేక బోధకులందరూ దానిని ఏమాత్రము పట్టించుకొనుట లేదు. మరియు నా హోదాలో ఒక వ్యాపారస్థుడుగా అలాంటి దానితో నన్ను నేను సంయుక్తపరచుకున్నట్లైతే అది నా వ్యాపారమును నష్టపరుస్తుంది. మరియు రిబ్కా , నీవు ప్రవక్తయని గొప్పగా పిలువబడుచున్న ఆ సహవాసమును మానివేయుట మంచిది.
18
ఇది రిబ్కా యొక్క హృదయములో భారముగా యున్నది, కాబట్టి మీరు చూడండి, ఆమె జక్కయ్య కొరకు ప్రార్థన చేయుట ప్రారంభించినది. అతడు ఒక వ్యాపారస్థుడైయుండి, లోకములోనూ మరియు సంఘ-సమాఖ్యలోనూ ఎంతో ఎక్కువవాడయి యున్నందున, ఇంకను ఈ ప్రవక్త తాను ఒక (దేవుని కుమారుడనని) చెప్పియున్నట్లైతే, ఆయన నిజముగా ప్రవక్తయైయున్నట్లైతే, ఆయన యందు తన భర్త నమ్మికయుంచవలెనని కోరియున్నది. ఆమెయే ఒక నిజమైన భార్యయై యున్నది. ప్రతి-వ్యాపారస్థుడు అలాంటి భార్యను, తన కొరకు ప్రార్థనచేయు భార్యను కలిగియుండవలెను. ఆయనను విమర్శించ వద్దు, కేవలము ఆయన కొరకు ప్రార్థన చేయండి. ఆయనను క్రీస్తునొద్దకు తెచ్చుటకు అదియే శ్రేష్ఠమైన మార్గం.
నీకు తెలుసా దాన్ని గూర్చి అక్కడ ఏదోయున్నది. నీవు ఎవనిని గూర్చియైన యధార్థంగా ప్రార్థన చేసినప్పుడు నేను నీకు తెలుసా, అది వారిని ఒక విధముగా నెమ్మదిలేని వారినిగా చేస్తుంది. అలాంటి దానితో నీవు ఎన్నడైనా ఒక అనుభవమును కలిగియున్నావో లేదో నాకు తెలియదు, అయితే ఆమె ప్రార్థనకు జవాబిచ్చుటకు దేవుడు ప్రారంభించెను, కొన్నిసార్లు ఇది వరకు ఉన్నదానికంటె ఎక్కువగా ఒక భర్త చికాకుగా ఉంటాడు, అయితే గుర్తుంచుకోండి దేవుడు నీ ప్రార్థనకు జవాబిచ్చుచున్నాడు. దాన్ని ఎలా చేయాలో దేవునికి తెలుసు.
కొన్ని సార్లు ఒక మనిషి , అతడు ఏదైనా గ్రహించుటకు ముందు తన త్రాడుగుండా అతడు అంతమునకు రావలసియున్నది... లేక బహుశా అతడు పైకి చూచువరకు దేవుడు అతన్ని గాయపరచి, రోగిగా చేసి దేవుడు అతని వీపు మీద అతన్ని ఉంచవలసియున్నది. అయితే దేవుడు తన కార్యములు చేయుటలోవింతైన మార్గాలను కలిగియున్నాడు. అయితే ఆయన మార్గములు ఎల్లప్పుడూ సరియైనవి.
19
అయితే రిబ్కా తన ప్రియమైన భర్తయైన చిన్న జక్కయ్య కొరకు ప్రార్థన చేయుచుండెను. మరియు రాత్రంతయూ అతడు ఎగురుతు, దొర్లుతూ చూచారా, దేవుడు రిబ్కా ప్రార్థనకు జవాబిచ్చుచుండెను. వారి భర్తలైన వ్యాపారస్థుల కొరకు ఎన్నడైనా అలా ప్రార్థనచేయు రిబ్కాలెవరైనా ఇక్కడ యున్నారా?
అప్పుడు తెల్లవారు సమయం కావచ్చుచున్నది. రిబ్కా ఒక విధముగా నిద్రమగతలో యున్నది. అయితే రాత్రంతయూ తన హృదయంలో ఆమె ప్రార్థన చేయుచున్నది, ప్రభువా నీకు వందనములు నీవు నా భర్తతో పనిచేయుచున్నందులకు వందనములు.
“జక్కయ్య సంగతి ఏమిటి?” అని ఆమె రాత్రంతయూ తరచుగా అలా మాట్లాడినది.
“ఓ, నాకు తెలియదు, అది తప్పక నా మనస్సులో వ్యాపారమును గూర్చినదై యున్నది.” చూడండి, అతడు కొంచెం తప్పించుకొనుటకు ప్రయత్నం చేయుచున్నాడు, అది అంత వరకే. అది దేవుడు అతనితో పనిచేయుటకై యున్నది.
కాబట్టి రాత్రి గతించిపోగా, పెందలకడ ఉదయమున, రిబ్కా ఒక విధమైన నిద్ర మగతలోనికి వెళ్ళినది. ఉదయమున పెందలకడనే జక్యయ్య లేచి తన్నుతాను దులుపుకొనుటను ఆమె కనుగొనినది. మరియు అతడు తన వ్యాపారపు అంగీ యొద్దకు వెళ్ళాడు... అంగీలలో శ్రేష్ఠమైనదానిని తీసి ధరించుకొనెను. మీరు చూడండి, ఆ దినమున ఆ ప్రవక్తను దర్శించబోవుచున్నాడని అంతటా ఒత్తిడిగా, హడావిడిగా ఉన్నది. మరియు ఆయన అక్కడ యుండగానే తాను భోజనము చేయవలసినవాడై యుండెను.
20
జక్యయ్య అంతటా చీల్చివేయబడ్డాడు, కారణము అతడు శ్రీ లెవిన్‌స్కీ యొక్క భోజనశాలకు వెళ్ళబోవుచున్నాడు. మంచిది, నా భోజనశాలయే నిజంగా శ్రేష్ఠమైనది. మరియు నా భార్య అలాంటి వ్యక్తిని వెంబడించునదై యున్నట్లైతే, ఎలాగయినా ఆమె నా వ్యాపారమును మార్గమునకు తెస్తుంది. మీరు చూడండి అతడు యూదుడై యున్నాడు మరియు అతనికి వ్యాపారం కావాలి. మరియు మీ ప్రవక్త ఎంతో పేరుగాంచిన వాడు కాబట్టి అనేక మంది ఆకర్షింపబడతారు, కాబట్టి అక్కడ తప్పక... వ్యాపారము నా వైపుగా వస్తుంది. ఆ పట్టణంలోనే అతడు ఒక గొప్ప వ్యాపారియై యుండెను. అలాంటప్పుడు ఈ ప్రవక్త ఎందుకింత మార్గం గుండా రాడు, లేక అతని మార్గం గుండా దాటి వెళ్ళడు.
కాబట్టి అతడు... ఆ రాత్రి, విశ్రాంతి లేని ఒక రాత్రి తరువాత, మరియు ఎన్నో పీడకలలు అలాంటివి వచ్చాయి, మరుసటి రోజు ఉదయమున అతడు తన్ను తాను చక్కగా దువ్వుకొనియున్నాడు, మరియు రిబ్కా దుప్పటిని తీసి తన తలను పైకెత్తి ఇలా అన్నది, ప్రియమైన జక్యయ్యా, ఇంత ప్రొద్దున్నే నీవు ఎక్కడకు వెళ్ళుచున్నావు?
21
“ఓ, నేను కొంత తాజా గాలిని కలిగియుండుటకు నేను బయటకు వెళ్ళుచున్నానని” నేననుకొంటాను. మీకు తెలుసా ఒప్పుదల నీ మీద పనిచేస్తున్నప్పుడు, నీవు ఎన్నో సాకులను కనుగొంటావు, మన అందరికి అది తెలుసు. నేను కొంత తాజా గాలిని పీల్చుటకు బయటకు వెళ్ళుచున్నానని, మరియు అతడు కొంచెము అత్తరును తన మీద చల్లుకొని, తలను చక్కగా దువ్వుకొని, అతడు అంతాచక్కగా పెండ్లి-కొడుకువలె శుభ్రము చేసుకొని యున్నాడు. మరియు అతడు వీధిలోనికి వెళ్ళి నడుచుచుండగా, రిబ్కా కిటికీను తెరిచి, బయట అతనిని చూచుచున్నది. జక్యయ్య అంతా చక్కగా తిన్నగా చేయబడినవాడై, మీకు తెలుసా, ఒక మంచి వ్యాపారస్థుని వలెకనబడునట్లుగా, తన శ్రేష్ఠమైన వస్త్రములను ధరించి వీధిలో నడిచి వెళ్ళుచున్నాడు, మీకు తెలుసా.
ఆమె మోకరించి ఇలా ప్రార్థన చేయుచున్నది, “ప్రియమైన దేవా, నీకు వందనములు, కారణము ఈ దినమున నీవు నా యొక్క భర్తతో మాట్లాడుచున్నావు. మరియు ఇప్పుడు, నీ ప్రియమైన కుమారుడు, ప్రజల మధ్య ఒక మూఢ-భక్తి గలవానిగా ఆయన పేరును కలిగియున్నప్పటికి, అతడు దురాత్మను తన మీద కలిగియున్నాడని చెప్పినప్పటికి, మాకు తెలుసు, ఇంకనూ ఆయన నీ యొక్క ప్రియమైన కుమారుడని నేను నమ్ముచున్నాను. ప్రియమైన దేవా, ఎలాగైనను నా భర్తను, ఆయన సన్నిధిలోనికి తీసుకొనుమని నేను ప్రార్థన చేయుచున్నాను. (ప్రార్థించే విధానము అదియే). మరియు ఆయనను క్లిష్టముగా యుండనియ్య వద్దు, అయితే నీ ప్రియమైన కుమారుడు, ఆయనయే మెస్సీయాయై యున్నాడు” అని ఒప్పించబడునట్లు ఆయనను నా భర్త పట్ల చేయనిమ్ము. మరియు దానిని బట్టి ఆమె దేవుని స్తుతించి, తన పనిలోనికి వెళ్ళినది.
22
కొన్ని నిమిషములు జక్యయ్యను మనము వెంబడిద్దాము. అతడు వీధిలో నడుచుచున్నాడు, అది చాలా పెందలకడయై యున్నది, ఇంకా అనేక మంది బయటకు రాలేదు. అయితే, అతడన్నాడు... “నేను ఆయనను ఈ రోజు కలుసుకొనబోవుచున్నాను, మరియు నేను ఆయనకు నా మనస్సులో కొంచెము ఇస్తాను” మీకు తెలుసా, కొన్నిసార్లు ఒప్పుదల ఆరీతిగా పనిచేస్తుంది.
అతడన్నాడు, “నేను ఆయనతో చెపుతాను, అతడు నా భార్య తన సంఘమును విడిచిపెట్టునట్లు చేశాడు. ఎందుచేత, నేను సంఘ నాయకులలో ఒకడిని. కాబట్టి నేను నీతో చెపుతాను, నేను ఆయనను చూసినప్పుడు దీనిని నేను ఆయనకు చెప్పబోవుచున్నాను. కొంచము ఆగండి, అని నేను ఆయనకు చెపుతాను. మీకు తెలుసా, అతడు వీధి గుండా నడుచుచుండగా, చక్కగా పెండ్లికొడుకు వలె. మరియు, నా వ్యాపారులైన సహచరులందరితో నేను నిలబడియుండగా, నేను అది ఆశిస్తాను. ఆ బోధకుడు నాకు దగ్గరగా నిలబడవలెనని నేను కోరుకొంటాను, ఆ రీతిగానే నేను ఎక్కడ నిలబడియుంటానో ఆయన చూస్తాడు. మరియు అలాంటి మూఢ-భక్తియందు నాకు నమ్మకము లేదని ఆయనను తెలుసుకోనిస్తాను. కాబట్టి నేను దిగువకు వెళతాను... అతడు నిశ్చయముగా దక్షిణపు ద్వారము గుండగా ప్రవేశిస్తాడు, ఏలయనగా ఆయన గలిలయలో యుండియున్నాడు మరియు ఆయన వచ్చు మార్గము ఇదియే. కాబట్టి నేను ఆ ద్వారము నొద్దకు వెళ్ళి నేను ఆయనను కలుసుకుంటాను. ఆయన ఆ ద్వారములో తిన్నగా ప్రవేశిస్తుండగానే, నేనక్కడకు చేరుకోగానే నా మనస్సులో చిన్న భాగమును ఆయనకు ఇస్తాను.” అయితే దానినంతయూ ప్రార్థన ద్వారా రిబ్కా కప్పివేసియుండెనని అతడు యెరుగకయుండెను. మీరు చూడండి.
23
కాబట్టి అతడు అక్కడకు చేరుకోగానే అతడు ఒక శబ్దమును వినుట ప్రారంభించాడు. మరియు అతడు ఇంకా దగ్గరకు చేరుకొనుటకు ప్రయత్నించాడు. మరియు అతడు అలా చేసినప్పుడు ఆ ద్వారమునొద్ద ప్రజలందరు కంచెల మీద, గోడల మీద వ్రేలాడుచూ యున్నారు. ఎందుకు అతడు వారి దగ్గరకు కనీసం సమీపించలేకపోయాడు, మరియు ప్రతి ఒక్కరు అక్కడ గుమికూడగానే, పోలీసువారు ఆ జన-సమూహాన్ని వెనుకకు నెట్టుచున్నారు, ఇక్కడ ఏమి జరుగుచున్నది.
కాబట్టి అతడనుకొన్నాడు “మంచిది, నేను ఒక్కడిని మాత్రమే ఇక్కడ లేను అయితే అనేక మంది ఇక్కడున్నారని ఊహించాడు. అక్కడ ఎవరు నిలబడియున్నారు. అక్కడ ఏరకమైన ప్రజలున్నారో కొంచెం చూడు. ఈ ప్రజలు పేదవారు. నిజానికి మీకు తెలుసా, నేను ఒక వ్యాపారస్థుడనై యున్నాను, కాబట్టి నేనిలాంటి వారితో సహవాసం చేయకూడదు, అయితే ఎలాగయినా, నేను పైకెక్కి ఒక మూలన ఉంటాను.”
24
మంచిది, ఇతడొక చిన్న వ్యక్తియై యున్నాడు. ఏమి జరుగుచున్నదో తెలుసుకొనుటకు వచ్చియున్నాడు. అతడు ఎంత చిన్నవాడనగా కనీసం అక్కడ వారి తలలను కూడా చూడలేడు, అక్కడ అనేక మంది నిలబడియున్నారు.
అతడు అనుకున్నాడు, తన చేతితో దారిగుండా ఆపి మీరందరూ దారిలోగుండా వెనుకకు వెళ్ళండి: నేను జక్యయ్యనై యున్నాను! మీకు తెలుసా కొన్ని సార్లు వారి తలలో వారు ఏదోయై యున్నదన్నట్లుగా కొన్ని సార్లు భావన కలిగియుంటారు. ఎలాగయినా నీవెవరివై యున్నావు. భూమ్మీద నీవు ఆరు అడుగులు యున్నావు నీవు చనిపోయినప్పుడు నీవు ఒక ఆత్మను కలిగియున్నావు, మరియు ఆత్మ దాని యొక్క ప్రయాణాన్నిపైకి గానీ, లేక క్రిందకు గానీ ఏదో ఒక మార్గాన్ని తీసుకుంటుంది. అది నీవు క్రీస్తును అంగీకరించుదాని మీద ఏదో ఒక మార్గాన్ని తీసుకుంటుంది. నీవు ఆయనను క్రిందకు నెట్టి వేస్తావా, నీవును క్రిందకు వెళతావు, లేక నీవాయనను అంగీకరిస్తావా నీవు ఆయనతో పాటు పైకి వెళతావు. అయితే మనలో ఎవరునూ, ఎలాగైనా నీవు ఎంత మాత్రము ఏమియూ కావు.
25
ఈ మధ్యనే ఒక చిన్న వస్తు ప్రదర్శనశాల దగ్గర నిలబడియున్నాను, నేను వారి బరువులను చూచుకొనుచున్న ఇద్దరు బాలురువైపు చూచుచున్నాను... ఒక చిన్నకార్డు మీద ఒక మనిషి 150 పౌన్ల బరువు ఉన్నాడని చెప్పబడినది, అయితే ఆ బరువు యొక్క విలువ ఎంత.
నీవు 150 పౌండ్ల బరువు ఉన్నావు, (అది ఒక పురుషుడు), అయితే నీ విలువెంతో నీకు తెలుసా? నీ విలువ 84పైసలే. అది నిజము నీలో కొంత గంధకము,... మరియు కొంత కాల్షియం ఉన్నది. మరియు అది ఒక కోడి యొక్క గూడు మీద చల్లుటకు సరిపోతుంది. 84 పైసలా, అప్పుడు దాని మీద 500 డాలర్లు విలువైన కోటును, ఒక టోపీని, ఒక 100 డాలర్ల సూటును ధరించుచున్నావు: అలాగే నీ ముక్కును పైకి లేపుతావు, అప్పుడు వర్షం కురిసినట్లైతే నీవు మునిగిపోతావు. మరియు అప్పుడు నీవెవరివోనని అనుకుంటున్నావు. నీవెవరివి? నీ విలువ 84 పైసలే.
26
నీవు ఒక భోజనశాలకు వెళ్ళి చారుతోనున్న కప్పును తీసుకుంటావు. మరియు దానిలో ఒక ఈగ పడియున్నది, అప్పుడు వెంటనే నీవు దానిని క్రిందపడవేస్తావు (సోదరుడు బ్రెన్‌హాం తన వ్రేలును కొరుక్నొనుచున్నాడు) అవునండి. అలాంటి ఆహారముతో నేను చేయునది ఏమియు లేదు. సరే వ్యాపారస్థుల కూడిక, వార్తా పత్రికలు దానిని యెరుగును. ఆ భోజనశాల యొక్క అధ్యక్షుడైన, యజమానుడైన అతని పరిస్థితి ఏమిటి? చూడు 84 పైసలు విలువను నీవు గమనించుము. నీవు దానిలో ఏ విషమును ఉంచనియ్యవు. అయితే నీ నిత్యమైన ఆత్మలోనికి దెయ్యము కోరిన దేనినైనా నీవు తీసుకురానిస్తున్నావు, అది నిజము.
ఒక చిన్న నీ ఆచార సంబంధమైన నీ చిన్న ప్రార్థనలు మరియు కొన్ని పూసలను లెక్కించుటవంటివి నీవు చేస్తావు, లేక ఫలానా, ఫలానిది ఫలాని రీతిగా నీవు చేస్తావు, లేక ఒక నిర్ణీత ప్రమాణము నీవు చేస్తావు, లేక... చూడండి అది ఎలా ఎన్నదో? ఓ, నీవెన్నడైనా ఉన్నదానికంటె సాతాను ఇంకా మంచి వ్యాపారస్థుడు. అది నిజం.
27
అయితే నేను మిమ్ములనొకటి అడుగగోరుచున్నాను. అప్పుడు నీవు... మనము ఏదీ కానప్పుడు మనము ఎవరమో అయి ఉన్నామనే భావనను మనము కల్గియున్నాము. ఆ రీతిగానే అతడు అక్కడ నిలబడినప్పుడు అతడు తక్కువ వాడు అనే భావనను కలిగియుంటాడు. అతడు అన్నాడు “నేను ఏమి చేయాలో నాకు తెలుసు. ఆయన ఎటు దాటిపోవుచున్నాడో నాకు తెలుసు , ఏలయనగా ఆయన లెవిన్‌స్కీ భోజనశాల మీదుగా వచ్చుచున్నాడు, ఆయన హల్లెలూయ వీధిని విడిచి పెట్టిన తరువాత ఆయన ఇరుకు అను వీధికి రావలసియున్నది. కాబట్టి నేను ఇరుకు పేరు కల్గిన వీధిలోనికి వెళ్ళి అక్కడ ఆయన కొరకు నేను ఎదురు చూస్తాను, ఎందుకనగా తప్పకుండా ఆయన ఆ దారినే దాటి వెళ్ళవలసి యున్నది. మరియు ఆయన దాన్నిదాటి వెళ్ళుచుండగా అక్కడ నేను దానిని ఆయనకు చెబుతాను.”
కాబట్టి ఈ వీధి దిగువ గుండా అతి గర్వమును తెలుపు నడకతో ఈ చిన్నవ్యక్తి ఎరుపెక్కిన ముఖంతో ఆదారిగుండా వెళ్ళుచున్నాడు. కారణము అతడు ఒక వ్యాపారస్థునిగా గౌరవించబడడు, కాబట్టి అతడు ఆ వీధిగుండా వెళ్ళుచున్నాడు. అతడు ఇరుకు అని పిలువబడు వీధినొద్దకు చేరుకున్నాడు, మరియు చక్కగా పెండ్లికుమారునివలె ఆ మూలన కనిపెడుచూ ఉన్నాడు. “ఆయన హల్లెలూయ మూల నుండి ప్రక్కకు తిరుగుట కొరకు అతడు ఎదురు చూచుచుండెను. ఆయన దాటి వెళుచుండగా నేను ఆయనకు చెబుతాను.”
28
అతడక్కడ నిలబడియుండగా అతనికొకటి గుర్తుకువచ్చినది, “ఇప్పుడు అదే గుంపు ఆ ద్వారము నొద్దకు రాగానే ఆ సమయమునకు ఆ గుంపు రెండంతలు అయినది, మరియు నేను ఆ దిగువన ఎంత చిన్నగా ఉన్నానో ఇక్కడను అంత చిన్నగానే ఉన్నాను, కాబట్టి నేను ఆయన్ను ఎలాగైనా చూడగోరుచున్నాను. వారు నీ మీదుగా తిన్నగా పరుగెత్తుకుని వెళతారు.” చూడు, దేవుడు తన కార్యములను చేయుటలో ఒక విధానమును కలిగి యుంటాడు. ఆ కారణం కొరకే ఆయన అతన్ని చిన్నవానిగా చేసియున్నాడు, చూడండి.
అయితే అతడనుకున్నాడు “సరే ఎలాగయినా, నీకు తెలుసా నాకొక మంచి తలంపు ఇప్పుడే వచ్చియున్నది.” మరియు అతడు నిలబడిచూడాలి, అక్కడొక మేడిచెట్టు ఉండి ఉన్నది. ఇప్పుడు అది మా స్వగ్రామమైన ఇండియానాలో అది ఉన్నది, అయితే ఆ దినములలో ఆరీతిగా అది పిలువబడియున్నది, నేననుకొంటాను దాని యొక్క అసలయిన పేరు, ఒలీవ చెట్టు లేక అలాంటిది.
29
కాబట్టి అతడనుకున్నాడు “నీకు తెలుసా ఆ కొమ్మలు ఎత్తుగా ఉన్నాయి, అయితే ఆ చెట్టు పైకెక్కినట్లైతే అక్కడ నన్నెవరూ తొక్కకుండా వెళతారు, అప్పుడు ఆయన దాటిపోవుచుండగా నేనాయనను చూడగలను, నేను నా కన్నులను ఆయన మీద ఉంచిన వెంటనే అప్పుడు నేనాయనను చూస్తాను, నా మనస్సును తిన్నగా చేసుకుంటాను,” చూడండి రిబ్కా ఇంకనూ ప్రార్థన చేయుచూనే యున్నది. చూడండి.
కాబట్టి జక్కయ్య ఇలా ఆలోచించ సాగాడు, “ఆ మొదటి కొమ్మను ఎక్కుటకు నేనెంతో పొట్టివాడను (ఆ రీతిగానే మనలో అనేక మందిఉంటాము, నేను ఆ కొమ్మ ఎక్కుటను ఎంతో పొట్టివాడను,” సరే మంచిది...
కానీ నీవు ఆయనను చూడగోరినట్లైతే, నీవు ఆయనను చూచుటకు దేవుడొక మార్గమును నీకు ఏర్పాటు చేస్తాడు. అది వింతగా ఉండవచ్చు అయితే ఆయనను చూచుటకు దేవుడు నీకు మార్గమును ఏర్పాటు చేస్తాడు. మరియు నీకు తెలుసా... ఒక ఉదయమున నీవును సంపూర్ణ సువార్త యొక్క వ్యాపారస్థుల కూటమునకు రావలసియున్నది నీ హోదాకు అది చాలా వింతగా కనబడుతుంది అయితే నీవాయనను చూడగోరినట్లైతే నీవు చూచుటకు దేవుడు మార్గమును ఏర్పాటు చేస్తాడు.
30
నీవంటావు, “ఆ దిగువన వారు ఒక కూడికను కలిగియున్నారు, మరియు ఓ, మై, వారు కేకలు వేయుచున్నారు, వారు ... నీకు తెలుసా, నేను ఊరకనే లోనికి వెళతాను, ఎందువలననగా నిజముగా నేను దానిని నమ్మను. అయితే ఈ అల్పాహార సమావేశములలో ఈ దినములలో ఒక దినమున, నేను ఊరకనే వెళ్ళి వారు ఏమి చేస్తారో చూస్తాను.” మీరు చూడండి? దానిని సరిగ్గా చూచుటకు నీకు దేవుడు ఒక మార్గమును ఏర్పాటు చేయును.
మరియు అప్పుడు చిన్న జక్కయ్యకు ఒక ఆలోచన వచ్చినది. (నన్ను మన్నించండి. ఇక్కడే నేను మిమ్మును దరిదాపుగా చెవిటిగా చేయుచున్నాను. నేను బయట బహిరంగ స్థలములలోని ఆడిటోరియంలలో ఆ విధముగా బోధించియున్నాను. కాబట్టి స్నేహితులారా, నేను మీ మీద కేకలు వేయుచున్నానని నా భావము కాదు.)
31
అయితే జక్యయ్యకు ఆలోచన వచ్చియున్నది. నేను మొదటి కొమ్మ మీదకు ఎక్కినట్లైతే, అక్కడ అంత ఎత్తుగల వారు ఎవరునూ లేరు. కాబట్టి యేసు వీధిగుండా వస్తున్నప్పుడు, ఆయన ఎలా యుంటాడో అతడు చూడగలడు, మరియు అప్పుడు ఆయన ఏమైయున్నాడో, అతని యొక్క ఆలోచనను గీయగలడు. అప్పుడు అతడు ఆయనను ఇష్టపడనియెడల, చెట్టు మీదనుండియే తిన్నగా ఆయనతో చెపుతాడు.
కాబట్టి అప్పుడు... తరువాత విషయము ఏమనగా, అతడు ఇప్పుడు ఎలా చెట్టు మీదకు ఎక్కబోవుచున్నాడు. కాబట్టి ఇంకనూ వీధులలోని చెత్తను ప్రోగుచేసుకొనే వ్యక్తి ఇంకనూ వచ్చియుండలేదు, మరియు అక్కడ మూలన చెత్త తొట్టిలో వేయబడియున్నది.
సరే, అతడు అనుకొన్నాడు అది ఎగతాళిగా యుంటుంది, అయితే మొదటి కొమ్మ మీదకు ఎక్కుటకు అది శ్రేష్ఠమైన మార్గము. కాబట్టి చుట్టూ ఎవరునూ లేరని నిశ్చయించుకొనుటకు అతడు చుట్టూ చూశాడు. అతడు చెత్తతొట్టి దగ్గరకు వెళ్ళాడు, మరియు దానిని పైకి లేపుటకు అతడు ప్రయత్నము చేశాడు, మరియు చెత్తను పోగుచేయు వ్యక్తి ఇంకనూ వచ్చియుండలేదు, మీకు తెలుసా, అది నిండిపోయియున్నది. అయితే అది ఒక్కటే అతని దష్టిలో కనబడుచున్నది, కాబట్టి అతడు దానిని వాడుకొనవలసి యున్నది. సరే, అతడు శ్రేష్ఠమైన అంగీని ధరించియున్నాడు. ఇప్పుడు అతడు ఏమి చేయబోవుచున్నాడు?
32
సరే, నీకు తెలుసా, నీవు ఆయనను చూడవలెనని ఆయన నిర్ణయించినట్లైతే, ఎలాగైనా, నీవు ఆయనను చూస్తావు నీవు దేనిగుండా వెళ్ళవలసినప్పటికి లెక్క కాదు. అక్కడ ఏదైనా లాగుచున్నట్లైతే, నీవు తెలివిగా దానికిపైగా ఉన్నతముగా ఒక దానిని ఆలోచన చేస్తావు, అయితే దేవుడు నీ హృదయము లోపల పనిచేయుచున్నాడు. రిబ్కా ప్రార్థించుచున్నది. గత రాత్రి అదే విశ్వాసమును తయారుచేసినది (చూడండి?), అదే ప్రార్థన చేయుచూ యుండుట.
కాబట్టి అతడు ఏమనుకొన్నాడంటే, “సరే ఒక్క పనిని నేను అక్కడ చేయవలసి యున్నది, అదే చెత్తకుండీని నా చేతిలోనికి తీసుకొనుట.” మరియు అతడు క్రిందకు దిగి (ఈ వ్యాపారస్థుడు), ఆ చెత్త కుండీని గట్టిగా పట్టుకొన్నాడు, మరియు దానితో వస్తున్నాడు. అతడు చుట్టూ చూశాడు, మరియు అక్కడ లెవిన్‌స్కియే కాదు, అతనితో మరి ఎక్కువమంది అతనిని గమనించుచున్నారు. అతడు అలాగునే అల్పాహారమునకు వెళ్ళియున్నాడు, మరియు అతడు పైకి చూసినప్పుడు, అక్కడ జోన్స్ కూర్చొనియున్నాడు. మై, అతని భార్య ప్రార్థన చేయుచున్నప్పుడు, దేవుడు ఎలా కదులుతాడో, లేక ఇటువైపు, అటువైపు, అతడు పట్టణములో ఒక గొప్ప వ్యక్తియై యుండవచ్చు, అయితే అతనిని ఎలా చిన్న వ్యక్తిగా చేయాలో దేవునికి తెలుసు. ప్రార్థన దానిని చేస్తుంది.
33
కాబట్టి అతడు చెత్తకుండీని పట్టుకొని చూశాడు. అతని ముఖము ఎర్రగా మారింది. మరియు అతడు ఇటువైపు చూడగా, అక్కడ బూట్లు అమ్ము వ్యక్తి యున్నాడు, ఇక్కడ బట్టలను అమ్ము వ్యక్తియున్నాడు, మరియు అతడు ... ఓ, మై, అతడు పట్టుబడ్డాడు, కాబట్టి అతడు ఎలాగైనా ముందుకు వెళ్ళాలి.
కాబట్టి వారిలో కొందరు అన్నారు, “ఈ ఉదయమున, మీరు ఆ మర్యాదస్తుని చూశారా? అక్కడ జక్కయ్య అల్పాహారమునొద్ద యున్నాడు. నాభావము... తన చేతితో చెత్తకుండీని పట్టుకొనియున్నాడు.”
మరియు అతడు ఇటు వెళ్ళచున్నాడు. అతడు చెట్టు క్రిందకు వెళ్ళుచున్నాడు, మరియు అతని ముఖము ఎర్రగాయున్నది. అతడు ఆ పనిలో ఇదివరకే పట్టుబడ్డాడు, కాబట్టి ఇప్పుడు లేచి అక్కడకు వెళ్ళవలసిన పనిలేదు. నీవు ఇక్కడయున్నావని, నీవు ఎరుగబడియున్నావు. నీవు ఒక కూటమునకు వెళ్ళినట్లైతే, నీవు ఎరుగబడియున్నావు. నీవు ఒక కూటమునకు వెళ్ళినట్లైతే, నీవు లేచి నిలబడినట్లైతే, నీవు ఇదివరకే అక్కడయున్నావని అది చూపుతుంది, కాబట్టి అక్కడ ఏదో కదులుచున్నది.
34
కాబట్టి అతడు ఆ చెత్తకుండీని లేపి, అక్కడకు పరుగెత్తుకొని వెళ్ళి, దానిని అక్కడ పెట్టుచుండగా: మరియు ఇప్పుడు అతని యొక్క చక్కని అంగీవైపు చూడండి, అంగీ అంతయూ చెత్తతో నిండియున్నది, చూడండి పట్టణములోని ఒక వ్యాపారస్థుడు, ఎంతో పేరుగాంచిన వ్యాపారస్థుడు. మంచిది, అతడు చేసిన మొదటి కార్యము ఏమనగా, వారందరకు పైగాఅతడు పైకి ఎక్కినాడు. లెవిన్‌స్కీ మరియు వారందరూ వీధి గుండా వెళుతూ ఇలా చెప్పుకొనుచున్నారు. మీకు తెలుసా, ఇక్కడయున్న మన స్నేహితుడైన జక్కయ్య, ఆ గ్రచ్ వీధి దగ్గర ఒక పేరుగాంచిన ఆహారశాలను నడుపుచున్నాడు (చూడండి?). అతడు కూడా చెత్తను ప్రోగుచేసేవాడయ్యాడు. అతడు పట్టణములోచెత్తను ఎత్తివేయువాడై యున్నాడు. ఓ, అతని చిన్న ముఖము మండుచున్నది, ఓ, మై, అతని నీతి గల కోపము రగులుకొనినది!
“బహుశ మనము తప్పక ఆ బోధకునికి, (రెవరెండ్ డాక్టర్, మీకు తెలుసా, పిహెచ్. డి) పట్టా కలిగిన వానికి మనము ఈ సంగతి చెప్పాలి. నీ సంఘ సభ్యులలో ఒకరు చెత్తను ప్రోగు చేసేవాడుగా మారియున్నాడు. (అతడు వెళ్ళు ఆ గొప్ప వంశపు సంఘములో)” చూడండి?
35
కాబట్టి, వారందరూ చిన్న జక్కయ్యను దాటిపోయిన తరువాత, అతడు చెత్తకుండీ మీదకు ఎక్కియున్నాడు, అయినా ఇంకనూ అతడు ఆ కొమ్మను అందుకోలేకపోయాడు. ఇప్పుడు, అతడు ఒక విపరీతమైన స్థితిలో యున్నాడు, కాబట్టి అతడు కొంచెము చెట్టుపైకి ఎగప్రాకుటను ప్రారంభించాడు. సరే, చెట్టుపైకి ఎగప్రాకుట, అనగా భావము ఏమిటో, మీకు తెలుసునో లేదో నాకు తెలియదు. అది దక్షిణాది మాట. “పైకి ప్రాకుట, దానిని గట్టిగా పట్టుకొనుట, కొంచెముపైకి తన్ను తాను లాగుకొనుట.”
కాబట్టి అతడు ఆ చెట్టు యొక్క మొదటి కొమ్మకు చేరుకొన్నాడు, మరియు పైకి చూశాడు, అక్కడ కూర్చొన్నాడు, అది క్రీస్తును చూచుటకు ఒక మంచిచూపు కాదా...ఒక మనిషివైపు చూచుట ఆ పట్టణములోని వ్యాపారస్థుడైయుండి, తన బట్టలన్నియూ మురికి చెత్తతో నిండియున్నవి, అతని చేతులన్నియూ బ్రద్దలైపోయినవి, ఒక పరిశుద్ధ గుండ్రాళ్ళుగా పిలువబడు ఒక బోధకుడు వచ్చుచుండగా చూచుటకు అతడు చెట్టు ఎక్కుచున్నాడు. మీరు ఊహించగలరు, ఎలాంటి... ఓ, అవును, దానినే అతడు లెక్కించియున్నాడు. ఒక దయ్యము అను పిలువబడు వ్యక్తి, ఒక బెయల్జబూబు, ఆరంభము నుండియే ఒక చెడ్డ పేరు కలిగిన ఒక గలలీయుడు, అక్రమముగా పుట్టినవాడని వారు తలంచారు. చూడండి, లోకము ఆయనను ఎన్నడూ ఎరుగలేదు, సోదరులారా. వారు ఇంకనూ దానిని ఎరుగలేదు. మనము వెర్రివారమని వారు తలుస్తారు. వారు ఇంకనూ ఆయనను కలుసుకొనియుండలేదు, అంతవరకే.
36
కాబట్టి అతడు ఆపైన కాలు మీద కాలు వేసుకొని కూర్చుని ముందుకూ, వెనుకకూ ఊగుచున్నాడు, ఇప్పుడు అది ఒక చక్కని దశ్యము కాదా. పట్టణంలో ఒక హోదాగల ఈ మనిషి, చెత్త కుండీలోని మురికి అంతా అతని మీద పడియున్నది. మరియు ఈగలు జక్కయ్య మీద చుట్టూ చేరియున్నవి. మరియు అతడిక్కడ కూర్చొనియున్నాడు, పూర్తిగా దుర్గంధముతో తన చుట్టూ, చెత్తకుండీలోని మురికితో, అతని చేతులు బ్రద్దలైయున్నవి. అదంతయూ గలిలయవాడైన మూఢ-భక్తిగల ఒక ప్రవక్తను చూచుటకొరకే ఆయన ఒక ప్రవక్తగా పిలువబడియున్నాడు, అతని యొక్క సొంత సంఘము అతనికి వ్యతిరేకముగాయున్నది. అయితే మీరు చూడండి. రిబ్కా ఇంకనూ ప్రార్థన చేయుచూనే యున్నది, అదే ఆ కార్యమును చేయించినది.
కాబట్టి అతడు అనుకున్నాడు ఇప్పుడు కొంచెం ఆగు. నేను ఇక్కడ కూర్చొన్నట్లైతే ఆయన నన్ను చూస్తాడు. మరియు మీకు అదేమిటో తెలుసా. అయితే ఆ మనిషి మనసులోని తలంపులను సహితం వివేచింపగలవాడని రిబ్కా నాతో చెప్పినట్లుగా నాకు గుర్తున్నది. అదేమిటో నీకు తెలుసా, కాబట్టి నేను ఆయన నుండి దాక్కొంటాను. కాబట్టి అతడు ఇంకా కొంచెం చెట్టుపైకెక్కి అక్కడ రెండు కొమ్మలను చూచాడు. అది కూర్చొనుటకు అనుకూలంగా ఉంటుంది. ఆ రెండు దారులు కలియు చోటే మనమందరం కూర్చొనుటకు మంచి స్థలమైయున్నది, అక్కడ రెండు దారులు కలిసియున్నవి: నీవు మరియు దేవుడు. అక్కడే ఒక తీర్మానమును చేయవలసి యున్నది.
37
ఇప్పుడతడు ఆ కొమ్మ మీద కూర్చొని ఇలా అనుకున్నాడు, ఇప్పుడు ఒక నిమిషం ఆగుము. ఈ గలిలయవాడైన ప్రవక్త... ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళినప్పుడు రిబ్కా నాతో ఇలా చెబుతుంది. ఆయన ఫిలిప్పుకు చేసినట్లుగా నీవాయనను చూసియున్నావా, లేక ఆయన పేతురుకు చేసినట్లుగా లేక ఆయన ఇతరులకు చేసినట్లుగా, ఎలా ఆయన జన-సమూహంలోనికి చూసి వారియొక్క తలంపులను ఎలా వివేచించునో? కాబట్టి నిశ్చయముగా నేను ఆయన ముందు కూర్చొనియున్నాను, ఆయన నిజానికి పైకి చూడవచ్చు. ఈ ఒలీవ చెట్టు నిజానికి అంత పెద్దదేమి కాదు, ఒకవేళ నేనక్కడ కూర్చొన్నట్లు ఆయన చూచియుండుట సంభవిస్తే? సరే నిశ్చయముగా ఆయన నావైపు చూస్తాడు. కానీ... మరల అప్పుడు ఒకవేళ లెవిన్‌స్కీ ఇక్కడకు వచ్చి నన్ను చూచినట్లైతే, అప్పుడు అందరూ ఈ చెట్టు చుట్టూ చేరి నావైపు తమ వ్రేలితో చూపితే? ఇప్పుడు అది మరొకరీతిగా ఉండదా? కాబట్టి శేష్ఠమైన కార్యం ఏదనగా నేను ఎవరికీ కనబడకుండా మారు వేషంలో ఇక్కడ దాగియుండుటయే.
38
కాబట్టి ఆ కొమ్మలను తనపైకి లాక్కొని ఆకులలో కలసిపోయే రీతిగా ఒక మారువేషంలో పరిసరాలలో కలసిపోయేటట్టు తన్ను తాను దాచుకొన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు అతన్ని చూడలేరు. అతడు కేవలం ఆకులతో కప్పబడియున్నాడు. అయితే బయటకు చూడగలుగునట్లు అతడు దాన్ని లేపి చూచుటకు ఒక ఆకును ప్రక్కకు తీసివేసియున్నాడు. మరియు ఆ చిన్న ఆకుతో అతడు... ఇప్పుడు ఎవరునూ ఆయన్ను అక్కడ చూడలేరు, చెట్టు కొమ్మలన్నియూ అతని చుట్టూ లాగుకొనియున్నాడు. మరియు అతడు ఒక చిన్న వ్యక్తి ఆ చెట్టు మొదళ్ళలో కూర్చొనియున్నాడు. కొమ్మలన్నియూ, ఆకులన్నియూ అతని చుట్టూ యున్నవి, అయితే అతడు ఒక చిన్నఆకును పైకిలేపి బయటకు చూడగలడు. అతడు అనుకున్నాడు, “ఇప్పుడు వారు నన్ను ఎన్నడూ చూడలేరు. ఏ ఒక్కరూ నన్నిక్కడ చూడలేరు, నేను నిజంగా ఇక్కడ దాక్కొనియున్నాను,” అయితే నీవు భయపడవద్దు, నీవు ఎక్కడ ఉన్నావో ఒకరికి మాత్రం తెలుసు.
అతడు ఒక కొన్ని నిముషములు ధ్యానము చేయుచూ ఉన్నాడు. మరల అతని చుట్టూ ఈగలన్నియూ గుమికూడి యున్నవి, మరియు అతడు ఒక శబ్దమును వినుట సంభవించినది, అతడు అన్నాడు, ఆయన తప్పక వచ్చుచున్నాడు. సాధారణముగా ఒక శబ్దం చుట్టూరా ఉన్నచోట ఆయనుంటాడు, మీకు తెలుసా. మీరెల్లప్పుడు ఒక శబ్దాన్ని వింటారు.
39
నీకు తెలుసా, ఆ పాత ఆలయంలో, ప్రవక్త అభిషేకించబడి ఆలయంలోకి వెళ్ళినప్పుడు అతని (అహరోను) యొక్క అంగీ అంచు ఒక ప్రత్యేకమైన బట్టతో తయారుచేయబడినది. మరియు దానికి ఒక దానిమ్మ పండు మరియు ఒక గంట ఉంటుంది. మరియు అది ఒక నిర్ణీతమైన నడకను తీసుకుంటుంది, అతడు నడుస్తూయుండగా ఈ గంటలు, మరియు దానిమ్మ పండ్లు, ప్రభువుకు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మ్రోగుతాయి, అతడు నడుస్తూయుండగా బయట జనసమూహము అతడు సజీవునిగా ఉన్నాడని తెలుసుకొను మార్గం ఈ శబ్దం ద్వారానే, కొన్నిసార్లు నేనాశ్చర్యపడతాను.
ఈ బాంగార్ అనే ఈ స్థలంచుట్టూ ఉన్న ప్రజలు ఎవరో సజీవులై యున్నారని తప్పక తెలుసుకొనవలసియున్నది. అది నీవు నడుచు నడక ద్వారా మాత్రమే తెలియబడుతుంది, ప్రభువు పరిశుద్దుడు, పరిశుద్ధుడు, ప్రధానయాజకులమై యుండి ఆత్మ-సంబంధమైన బలులను ఆయనకు అర్పించుచున్నాము. ఆయన నామమునకు మన పెదవుల యొక్క జిహ్వ ఫలమును అర్పించుట, మనము అదియే అయివున్నాము.
మన పెదవుల జిహ్వఫలమును ఆయనకు అందించుచున్నాము.
40
తరువాత అప్పుడు ఆ చుట్టూ మూలకు వచ్చినప్పుప్పుడు, అది అక్కడ యున్నది, గొప్ప శబ్దము. మరియు అతడు ఆ చిన్న ఆకును పైకి లేపి చూశాడు. అతడన్నాడు “ఇక్కడ నన్నిక్కడ ఎవరూ చూడలేదు.”
కాబట్టి అతడు చుట్టూ మూల గుండా చూశాడు, అప్పుడు అతడు గమనించాడు, ఒక గొప్ప పెద్ద మనిషి మూల గుండా జనములను త్రోసుకుంటూ వస్తున్నాడు “నన్ను మన్నించండి, మీరు దారిలో నుండి తొలగండి.”
ఇద్దరు లేక ముగ్గురు మనుష్యులు ఆయన వెనుకయున్నారు. నన్ను మన్నించండి, బోధకుడు ఈ ఉదయమున అల్పాహారం చేయుటకు ప్రయాణం చేయుచున్నాడు. “క్షమించండి మేము ఆయనను ఇబ్బంది పరచలేము. మీరు వెనుకకు తొలగండి.”
అతడు అన్నాడు, “అక్కడ పేతురు అని పిలుబడిన ఒక వ్యక్తి యొక్క వివరణ అది తప్పకయై యుంటుంది, ఆ మనిషితోనే ఆయన ఆయన ఎవరో, ఆయన తండ్రి ఎవరో చెప్పింది, అది తప్పక నడిపించుచున్నది అక్కడ జనములను వెనుకకు నెట్టుచున్నది ఆయనే యై యుంటుంది.”
41
మరియు అప్పుడు చిన్న జక్కయ్య పైకి చూశాడు. అప్పుడు అక్కడ ఆయన వినియోగదారులలో ఒకరు నిలబడి యున్నాడు. అతడన్నాడు, ఎందుచేత మరొక చిన్న బిడ్డను ఈ ఉదయం తీసుకొచ్చారు, అయితే వైద్యుడు రెండు రోజుల క్రితమే ఇంత పెందలకడ ఈ చలిలో తీసుకు వస్తే ఆ బిడ్డచనిపోతుంది. వారు దాన్ని చేయలేకపోయారు. ప్రజలు ఎంత వెర్రి వారు కాగలరు. అక్కడ తల్లి ఆ బిడ్డ యొక్క తండ్రి జ్వరముతో ఉన్న బిడ్డను దుప్పటితో చుట్టి అక్కడ ఉన్నారు, నేను నిన్న నా ఆహారశాలలో ఆబిడ్డను గూర్చి వైద్యునిని అడిగినప్పుడు, ఆ బిడ్డ చనిపోబోవుచున్నదని వైద్యులు నాకు చెప్పారు, ఆ బిడ్డ తీవ్రమైన వ్యాధితో ఉన్నది. కొంచెం చల్లని గాలి ఆ బిడ్డను సోకితే అది ఆ బిడ్డను చంపివేస్తుంది. మరియు ఆ బ్డి తల్లి మరియు తండ్రి ఆ మూఢ-భక్తి గల వానియొక్క మాట విని వైద్యుల నిబంధనలకు భిన్నముగా ఆ బిడ్డను వీధిలోనికి తీసుకొని వచ్చియున్నారు.
“మరియు ఇప్పుడు చూడండి వారు వెనుకకు నెట్టివేయబడుచూ ఉన్నారు. ఆయనతో ఉన్న ఆ పన్నెండు మంది మనుష్యులు జన సమూహములను ఆయనకు దూరంగా ఉంచుచూ వారు ఆయనపట్ల శ్రద్ధవహించుచున్నారు. అదే రిబ్కా చెప్పియున్నది. సరే నేను మీతో చెబుతాను, ఆ చిన్న బిడ్డను బయటకు తెచ్చినందులకు గాను ఆ మనిషిని తప్పక జైలులో పెట్టవలెను.”
అకస్మాత్తుగా ఆ నమ్మకమైన తండ్రి మరియు ఆ ప్రియమైన తల్లి ఆ బిడ్డను చేతులలోనికి తీసుకుని తిన్నగా వీధి లోనికి పరుగెత్తుకుంటూ వచ్చి, ఆ తల్లి దరిదాపుగా మోకాళ్ళూనినది.
ఆ గొప్ప మనిషియైన పేతురు మృదువుగా అన్నాడు ప్రియమైన సహోదరి మమ్ములను మన్నించాలి, మా బోధకుడు కొద్ది సేపు మాత్రమే నిలబడగలడు.
“అయితే ఓ, దయగల అయ్యా, నా బిడ్డ చనిపోవుచున్నది, ఆమె జీవించుటకు ఇంకకొన్ని నిమిషాలు కూడా మిగిలి లేవు, మరియు మీ యజమానుని నోటనుండి వచ్చే ఒక్కమాట పూర్తి పరిస్థితిని మార్చివేస్తుంది.”
ఇప్పుడు జక్కయ్య ఆ చిన్న ఆకును పైకి లేపి ఇలా అన్నాడు ఏమిటది ఒక్క మాట చాలా, దానిని గూర్చి ఆయనకు తెలుసు. వీధిలోని ఒక పిచ్చుక కూడా ఆయన మాట సెలవు లేకుండా కనీసం నేల మీద రాలదు ఆయనకు అది తెలుసు. ఈ కూటము కొరకైన మీ ప్రార్థనలు ఆయనకు తెలుసు. గతించిపోయినదంతయూ ఆయనకు తెలుసు. ఆయన ప్రియమైనవాడు, దయగలవాడు, మాధుర్యమైన వాడు, మరియు...
మరియు అతడు ఆగిపోయాడు. ఆ గుమ్మము నొద్ద కొన్ని గంటల తరువాత ఆ బర్తిమయికు చేసినట్లే ఆయన చేశాడు... బర్తిమయి యొక్క కేకను ఆయన వినలేకపోయియుండవచ్చు. అక్కడ అనేక మంది ప్రజలు అరుస్తూ కేకలు వేస్తున్నారు. అతని విశ్వాసం ఆయనను తాకినది.
ఆయన ఆగి మరియు వెనుకకు తిరిగి ఇలా అన్నాడు. “కుమారీ నీ బిడ్డను తిరిగి వెనుకకు తీసుకొని వెళ్ళుము, ఏలయనగా నీ విశ్వాసం నీ బిడ్డను రక్షించినది.”
మరియు నేను జక్కయ్యను చూడగలను “అలాంటి మూఢ-భక్తిని మీరెవరైనా విన్నారా?”
ఆ సమయములోనే ఆ బిడ్డ తండ్రి కూడా తన చేతులెత్తి ఇలా అన్నాడు. “సజీవుడైన దేవునికి స్తుతి కలుగును గాక! ఇప్పుడే నా బిడ్డ యొక్క స్వస్థతను నేను నమ్మి అంగీకరించుచున్నాను.” ఆ బిడ్డయొక్క కట్లను విప్పి ఆమెను దారిలో విడిచిపెట్టండి. మరియు వెంటనే ఆ చిన్న 6 సం॥ల పాప త్రాడుతో ఆటాడుకొనుచూ దుముకుచూ వెళ్ళింది. అది యేసు యై యున్నాడు.
42
జక్కయ్య అనుకున్నాడు, “అది అద్భుతంగా ఉంది, అదేమిటో నీకు తెలుసా నేను నా పెద్ద నోటిని మూసుకుని ఉంచుట మంచిదిగా నేను నిర్ణయించుకొంటాను. బహుశా నేనే తప్పై యున్నాను. నిశ్చయంగా ఆయన నన్ను చూచుట నాకిష్టము లేదు. కాబట్టి మళ్ళీ అతడు ఆ చిన్న ఆకును పైకి లేపి ఇలా అనుచున్నాడు, ఆయన దగ్గరవుతున్నాడనుకుంటా అని ఆశ్చర్యపడుతున్నాడు. మరియు అతడు క్రిందకు చూశాడు. ఇక్కడ తిన్నగా ఆయన చెట్టు క్రిందగా వస్తున్నాడు. మరియు ఆయన ఆగియున్నాడు. జక్కయ్య అనుకున్నాడు ఆయన నన్ను ఇక్కడ చూడలేడు, నాకెంత సంతోషం.”
అయితే యేసు ఆగి, ఆ చెట్టు పైకి చూచి అన్నాడు “జక్కయ్యా నీవు చెట్టు దిగి క్రిందకు రమ్ము, ఈ రోజు నేను నీతో కలిసి భోజనం చేయుటకు నీ ఇంటికి వచ్చుచున్నాను.” అతడు చెట్టు మీద ఉండుటయే కాక అతడెవరో కూడా ఆయన యెరిగియున్నాడు.
తన జీవిత దినములన్నిటిలో యేసు దాటిపోవు ఆ స్థలమును గూర్చి అతడెంతో సంతోషించియున్నాడు. ఇప్పుడు అతడు యెరికోలోని సంపూర్ణ సువార్త వ్యాపారస్థుల యొక్క సమాఖ్యలో ఒక సభ్యునిగా మారాడు. అలాంటి దానిలో ఒక సభ్యునిగా యుండుట నాకెంతో సంతోషము.
ఆ సంఘటన తరువాత అతడు ఎన్నడూ మునుపటివాని వలె ఉండలేదు. రిబ్కా యొక్క ప్రార్థనకు బహుమానం ఇవ్వబడినది. ఆమె భర్త ఆ దినమున రక్షణపొంది యున్నాడు. మరియు యేసు ఆమె గృహములో భోజనము చేసియున్నాడు. “ఈ రోజు నేను తప్పక నీ ఇంటికి వెళ్ళవలసి యున్నది” అని యేసు అన్నాడు.
43
మరియు స్నేహితులారా, ఆయన మీతో కూడా మీ గృహముకు వెళతాడు. బహుశా ఇక్కడ ఒక జక్కయ్య కూర్చొని యుండవచ్చు నాకు తెలియదు. ఆయన వస్తాడు. నీవు దేని వెనకో నిన్ను నీవు దాచుకొనుటకు ప్రయత్నిం చేసినట్లైతే నీవు నిజమైన ఒప్పుకోలును చేయుటకు మరియు క్రీస్తు అను పరిశుద్ధాత్మను నీ హృదయంలో స్వీకరించుటకు నిన్ను నీవు దాచుకొనుచున్నావన్నమాట. నీవు తిన్నగా ఎక్కడ ఉండియున్నావో ఆయనకు తెలుసు. ఇప్పుడే తిన్నగా ఆయన నీతో మాట్లాడును. ఒక్క క్షణము మన తలలు వంచుదాము.
ప్రియమైన దేవా, ఈ సమయములో ఒక అసాధారణమైనది ఏదో నన్ను తాకియున్నది. నేను స్పర్శి౦చాను... నేను దానిని వ్యక్తపర్చవలసిన పని లేదు, ప్రభువా, ఇక్కడయున్న ఈ ప్రజలకు కాదు, లేని యెడల నేను ఒక వేషధారినవుతాను. అయితే నేను ఇంకా నా కథను ముగించలేదు. అది తప్పక ఇదే సమయమైయున్నదిగా కనబడుచున్నది. బహుశ అక్కడ ఒక జక్కయ్య యుండవచ్చు, ఒక స్త్రీ లేక ఒక పురుషుడు కావచ్చు, నీవు ఇప్పుడే వారి హృదయములతో మాట్లాడియున్నావు, నేనును ఈ రోజు నీతో కూడా నా గృహమునకు వెళ్ళగోరుచున్నాను.
44
ఈ బల్లనొద్ద వారు కూర్చొండియుండుటను నీవు కనుగొన్నావు. ఈ ఉదయమున నీవు ఈ మార్గము గుండా వెళ్ళవలసియున్నదని, వారు ఇక్కడ కూర్చొనియున్నారు. ఓ ప్రభువైన దేవా, వారును జక్కయ్యవలె చెట్టు దిగివచ్చి మరియు ఇలా చెప్పుదురు గాక, ప్రభువైన దేవా, నేను ఏదైనా పొరపాటు చేసినట్లైతే, నేను దానిని సరిచేసుకొంటాను. వారు సంఘమును అశ్రద్ధ చేసినట్లయితే లేక ప్రార్థనను వారు ఆశ్రద్ధ చేసినట్లైతే, లేక ఒక క్రైస్తవునిగా లేక ఒక విశ్వాసిగా వారి విధి నిర్వహణను నిర్లక్షం చేసినట్లైతే నేను ఆహ్వానిస్తూ వారు పరిశుద్ధాత్మను పొందుటలో నిర్లక్షము చేసినట్లైతే ఈ ఉదయమున నీవు వారి హృదయమును తట్టుచున్నావు.
ప్రభువా దాన్ని దయచేయుము ఇప్పుడే అలాంటి వ్యక్తి ఒకరు వున్నట్లయితే, వారు వెనుకకు వెళ్ళి చిన్నగా తమ్ము తాము దాచుకొని తిన్నగా బయటకు వెళ్ళి బహిరంగముగా ఇలా చెప్పుదురు గాక, “ప్రభువా నాతో ఇంటికి రమ్ము, నాతో నిలిచి యుండుము. ఇప్పుడు నేను నిన్ను తీసుకొనగోరుచున్నాను. ప్రార్థన చేయు నా యొక్క భార్య లేక ప్రార్థన లేక ప్రార్థనచేయు నా యొక్క భర్త ప్రార్థన, లేక ప్రార్థన చేయు నా తల్లి యొక్క ప్రార్థనలకు జవాబు వచ్చును గాక. ప్రభువా, ప్రార్థనలకు అది నీవై యున్నావని నేను గ్రహించునట్లు నీవు తెలుసుకొనవలెనని నేను కోరుచున్నాను. ఇప్పుడు నా చేతిని ఎత్తి నీ కృప కొరకు అడుగుచున్నాను.”
45
మనము తలలు వంచి వుండగా మరియు ప్రతి ఒక్కరు ప్రార్థనలో వుండగా, ఇప్పుడు తిన్నగా మీ హృదయాంతరంగములో మీరు యదార్థముగా ఉండవలెనని కోరుచున్నాను. మీ సోదరుడుగా మీరు నన్ను స్వీకరించినట్లయితే. ప్రతి హృదయములో వున్న తలంపులను ఎరిగివున్న అదే పరిశుద్ధాత్ముడు ఇక్కడ వున్నాడు. మీ హృదయమును ఆయన ఎరుగును. మరియు ఏదో నా వర్తమానములో నన్ను ఆపి ఇలా చెప్పినది, ఇదే ఆ ఘడియయై యున్నది. ఆయన ఎవరితోనే మాట్లాడి వున్నాడు, మీలో ఎవరును మీ తలలను పైకి ఎత్త వద్దు, పాటను వాయించుటకు ఆ చిన్న సహోదరి ఇక్కడ వున్నట్లయితే.
ఆయన మీ హృదయములో కార్యము చేసివున్నట్లయితే మీరు... దేవుడు మీ హృదయమును తట్టివున్నాడని మీరు గ్రహించివున్నారని (ఈ జీవితమును ఆయనకు ప్రతిష్టించండి, లేక మీ స్వ-రక్షకునిగా ఆయనను స్వీకరించండి) మీరు మీ చేతిని ఎత్తగలరా? చెప్పండి ప్రభువా అది నేనైవున్నాను. దేవునితో యదార్థముగా వుండండి. దేవుడు మిమ్మును దీవించును, ఇంకా ఎవరైనా వున్నారా? ప్రభువు మిమ్ములను దీవించును, దేవుడు మిమ్మును దీవించును. ఇంకా ఎవరైనా వున్నారా? ఆయన మిమ్మును తట్టుచుండగా.
మీరు ఆయనతో ఇంటికి వెళ్ళగోరుచున్నారా? మీతో ఆయనను ఇంటికి తీసుకొని వెళ్ళుచున్నారా? మీరు ఇంకను వెళ్ళుచున్నారా... సరే. ఆయన మిమ్మును కనుగొన్నాడు. అయితే నీవు చెట్టు మీద నుండి క్రిందికి వచ్చుటకు నిరాకరించి వున్నావు. నీవు దాన్ని చేస్తావా? ఆయనతో ఇంటికి వెళ్ళుటకు ఇష్టంలేదా?
46
నీ మరణ-పడక వద్దకు ఆయన రావాలని కోరుచున్నావు. ఈ ఉదయమున ఆయన్ని తణీకరించినట్లయితే, నీ మరణపడక మీద ఆయన వుండడు, నీవు పరిశుద్ధాత్మను దుఃఖపరచగలవు, దేవుడు దీవించును ఇప్పుడు ఇంకా ఎవరైనా వున్నారా?.
నీవంటావు, “అది నాకు ఏమి చేస్తుంది, బ్రెన్‌హాం సోదరుడా, నేను నా చేతిని ఎత్తినట్లైతే?” సరే, అది మరణమును జీవమునకు మార్చుతుంది. ప్రతి శాస్త్రీయమైన నిబంధనను నీవు చేతులెత్తినప్పుడు విరుగగొట్టుచున్నావు. సహోదరీ, ప్రభువు నిన్ను దీవించును.
నీ చేతులు తప్పక క్రిందికి వ్రేలాడాలని సైన్సు చెపుతుంది, భూమ్యాకర్షణ దానిని క్రిందకు పట్టుకొని యుంటుంది. అయితే అక్కడ నీ చుట్టూ ఒక ఆత్మయున్నది, మరియు నీతో ఒకటియున్నది. నీ చుట్టూ యున్నది పరిశుద్ధాత్మయై యున్నాడు. మరియు ఆయన నీతో చెప్పుచున్నాడు, “నీవు తప్పుయై యున్నావు. నీ హృదయమంతటిలో ఈ చెడును నీవు కలిగి జక్కయ్య వలె నీవు ఒక క్రైస్తవుడవై యున్నావని నీవు చెప్పుకొనుచున్నావు.”
47
అతడు ఒక విశ్వాసియై యున్నాడని తలంచాడు. నీవు కూటములను విమర్శించి యున్నావు. మొదటి స్థానములో నీవు వారిని నమ్మలేదు. ఇప్పుడు, నేను నీతో మాట్లాడుచున్నాను. బిడ్డా, నన్ను అంగీకరించుము, మరియు “అలాగైతే మీ చేతులను ఎత్తండి.”
మీ చేతులను పైకి ఎత్తినప్పుడు అది భూమ్యాకర్షణ నియమములను విచ్ఛిన్నము చేస్తుంది, నీలో యున్న ఆత్మ ఒక తీర్మానము చేసియున్నది: నాకు యేసు కావాలి, నేను నా యొక్క ప్రతిష్టను మరియు సమస్తమును నేను పోగొట్టుకొన్నాను, అది ఎంత ఖరీదైనను నాకు లెక్క కాదు. నా జీవితమును నేను నష్టపోయినను, ప్రభువా, నీతో దానిని నేను కనుగొంటాను. నా చేతిని ఎత్తుచున్నాను, దేవా, అది ఇక్కడ యున్నది. నేను ఒక క్రైస్తవుడనని చెప్పుకొనుచున్నాను, అయితే నా హృదయములో కోపమున్నది మరియు చెడుయున్నది. ప్రభువా, ఈ ఉదయమున దానిని బయటకు తీసి వేయుము. జక్కయ్యకు నీవు ఆ చెట్టునొద్ద చేసినట్లుగా, నీవు ఈ బల్లనొద్ద నన్ను కనుగొన్నావు. మీ చేతులను ఎత్తగలరా?.
నలుగురు తండ్రులు తమ చేతులను ఎత్తియున్నారు, అయితే ఇంకా హాజరు కావలసిన ఒకరున్నారు. దేవుడు ఇప్పుడు మాట్లాడుచున్నాడు.
మీరు ఆయన సేవకునిగా నన్ను నమ్మియున్నట్లైతే? ఒకరు ఇంకనూ మిగిలియున్నారు. దేవుడు నిన్ను దీవించును, సహోదరీ. మంచిది. తీర్మానము నీదే. యేసు చెట్టు ఎక్కి అతనిని క్రిందకు పడద్రోయలేదు, అతడు తనకై తానుగా రావలసియున్నాడు.
48
మనము ప్రార్థించుటను కొనసాగించుచుండగా, ప్రభువైన దేవా, భూమ్యాకాశములకు సృష్టికర్తా, నిత్యజీవమునకు కర్తా, మంచి ఈవుల నన్నిటిని ఇచ్చు వాడా, క్రీస్తును మా యొద్దకు పంపిన వరమే నీ పరిశుద్ధాత్మయై యున్నది, మరియు మేము ఆయనను ప్రేమిస్తాము. ఆయన మా కాపరియై యున్నాడు, మరియు మాకు కొదువ లేదు. మరియు ఆయన తన శాంతికరమైన జలములగుండా మనలను నడిపించి, మన ఆత్మలకు సేద తీర్చుచున్నందులకు వందనములు. ఆయన మనలను నీటి కాలువల యోరను నాటి యున్నాడు, దాని ఆకు ఎన్నడూ వాడిపోదు. మరణము సహితము దాని యొక్క ఆకును ఎండిపోచేయలేదు. ఈ భూ-సంబంధమైన గుడారము శిథిలమైపోయినను, మన కొరకు ఇదివరకే మరొకటి కనిపెట్టుచున్నది. ఏదియు దానిని ఎండిపోజేయలేదు, మనము నిత్యజీవము కలిగి యున్నాము, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క సొంత జీవము, మనలో నివాసము చేయుచున్నది, అది నశించిపోలేదు, క్రీస్తు వాగ్ధానము చేసినట్లుగా అది తప్పక లేపబడుతుంది.
మరియు చేతులెత్తిన వారందరిని, ఆ కార్యము కొరకు, ఎత్తని వారిని కూడా అత్యధికముగాను, సమృద్ధిగాను దీవించమని నేను ప్రార్థించుచున్నాను. సహోదరుల మధ్య మరియు సహోదరీల మధ్య ఆ ప్రేమించే ఆత్మ ఎన్నడూ చావకూడదని దేవా, నేను నీకు ప్రార్థన చేయుచున్నాను, ప్రభువా ఆ ప్రేమ ఎల్లప్పుడును వారి మధ్య సజీవముగా యుండును గాక, మరి వారి మధ్య భేదములన్నియూ రక్తము క్రిందనుండును గాక, మరియు యేసు వచ్చు వరకు ఆ సహవాసము నిలిచియుండును గాక, మరియు మేమంతా ఏకముగా ఒక గొప్ప శరీరముగా ఐక్యమగుదుము గాక. తండ్రీ దానిని దయచేయుము.
49
రోగులుగా ఉన్న వారందరినీ దీవించుము. నీ నుండి సహాయమును కోరుచూ నేనెరిగిన వారందరిని దీవించండి. మరియు వారితో మాట్లాడుచున్నది పరిశుద్ధాత్మయేనని వారెరుగుదురు గాక. ఆయనే మన రోగములన్నిటిని బాగు చేయువాడై యున్నాడు. మన మధ్య ఉన్న ప్రతీ రోగమును బాగుచేయవలెనని ఆయనకు ప్రార్థనచేయుచున్నాను, ప్రతివిధమైన బలహీనతను శరీరములోని రుగ్మతలన్నిటిని ఈ లోకములో పరదేశులు, మరియు యాత్రికులయిన వారందరి నుండి తీసివేయుము, వారు నీ సొంత పిల్లలైయున్నారు. తండ్రీ దానిని దయచేయుము.
ఈ ఉదయమున వారు ఇక్కడ నుండి బయలువెడలుచుండగా, వారు సంతోషముతో, ఆనందముతో, సంపూర్ణులై బాగుపడి, వారి ఆత్మలలో మరియు హృదయములలో నూతనత్వమును పొందివారు వెళ్ళుదురు గాక. యేసు అదే మారని ప్రభువుయై ఉన్నాడని, మేము ఆయా మూలలకు వెళ్ళి పెట్రోల్ బంకులలోనూ, ఇంకెక్కడైనను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుదుము గాక. ప్రభువా, దానిని దయచేయండి.
ఈ ఉదయమున ఇక్కడ ఉన్న సేవకులను, వ్యాపారస్థులను కూడా దీవించండి. వారి వ్యాపారము వృద్ధి చెందును గాక. అత్యంత అతి విలువైన ఈ దినమున యున్న వ్యాపారము తండ్రియైన దేవుని పనియేనని మేమంతా యెరుగుదుము గాక. మేము ప్రియులైన పిల్లలవలె ఆయన పని మీద ఉందుము గాక. మర్యాదగల క్రైస్తవులుగా, మరియు క్రైస్తవ స్త్రీలుగా మేము ప్రవర్తించుదము గాక. తండ్రీ దానిని దయచేయుము. కారణము నీ కుమారుడైన యేసు నామములో ఈ మానవులను అడుగుచున్నాము. ఆమేన్.
50
మీరు నిజమైన మంచి అనుభూతిని కలిగియున్నారు, ఇంకా 5 ని॥లు నాకు ఇస్తారా, లేక మీరందరూ పెద్ద హడావిడిలో ఉన్నారా? నేనొక దానిని మీకు చెప్పగోరుచున్నాను.
ఈ దినమున ఈ సంపూర్ణ సువార్త యొక్క హద్దులలో నేనిక్కడ యుండుటకు కారణమేమనగా నేను దాన్ని నమ్ముచున్నాను. మన దేహములు భూమి యొక్క ధూళి నుండి వచ్చియున్నవని నేను నమ్ముచున్నాను. మనమందరము దానిని యెరిగియున్నాము. మొదటగా దానిని బైబిల్ చెప్పియున్నది, సైన్సు దానిని ఋజువు చేయుచున్నది. భూమి యొక్క 16 మూల పదార్థముల నుండి మనము తయారు చేయబడ్డాము, పెట్రోలియం, పొటాష్, కాస్మిక్ లైట్, అణువులు తదితరములు. ఇప్పుడు అది అలాగైయున్నట్లైతే ఈ ప్రపంచము అతి శీతలమైన ఒక అగ్నిపర్వతముగా యున్నది, మన దేహములు ఈ భూమి మీద యున్నవి. మీకు ఒక చిన్న ప్రోత్సాహకము నిచ్చుచున్నాను.
నేను ఒక మర్మమైయున్న వ్యక్తినని మరియు అందరికి దూరంగా ఉండేవాడినని ప్రజలు తలస్తున్నారు. అయితే నేను అలా లేను. నేను మీ సోదరుడనై యున్నాను. మిమ్ములను ప్రేమించుచున్నాను. నేను మీతో ఇంటికి వచ్చి మీతో భోజనము చేసి, నిజముగా మీతో కొంత సహవాసమును చేయగోరుచున్నాను. పైన ఒక చిన్న గదిగా నా కొరకు కనిపెట్టుచునున్నది. నేను ఒకేసారి దేవుని యొక్క సేవకునిగాను మరియు ఒక మనిషి యొక్క సేవకునిగాను ఉండలేను. నేను తప్పక నాకై నేను సగభాగమును ప్రార్థించుట కొరకు దీనిని పొందుతారని నమ్ముచున్నాను. ఇది మీరు ఆలోచించే దానికంటె ఆలస్యమయిపోతుంది.
51
మనము భూమిలో విత్తనమును వేయవలెను. కొద్ది కాలం క్రితం నేను ఫిన్‌లాండ్ దేశమును విడిచినప్పుడు, యద్ధము అయిపోయిన వెంటనే, లేక గత యుద్ధము ముగిసిన తర్వాత వారు అక్కడ బయట స్త్రీలు, పురుషులు, మరియు చిన్న బాలురు ఆ నేలను చీల్చు దంతులతో పరుగెత్తుచూ రాత్రి వేళలో వారు లాంతర్లను పట్టుకొని భూమిని దున్నుచున్నారు. వారు భూమి యొక్క పై పొరను పగులగొట్టనిదే విత్తనములులోనికి వెళ్ళవు, అప్పుడు వారు తర్వాతి సంవత్సరమంతయూ ఆకలితో బాధపడతారు. ఆ మంచు రాక ముందే వారు విత్తనమును భూమిలో నాటవలసి యున్నది. వారు తప్పక విత్తనములను లోనికి వేయాలి. అక్కడ రాత్రి అనేది లేదు, వారు ఏ సమయములోనూ ఆగుట లేదు. వారు దీపములను పట్టుకున్నారు వారు ట్రాక్టర్లను వాడలేరు, అలాంటివి వారికేమియు లేవు, స్త్రీలు ఆ దంపతులతో (చేతితో నేలను దున్ను సాధనం తె॥త॥ దారుడు) నేలను దున్ను చున్నారు, వారి వెనుకనే విత్తనములు విత్తుకుంటూ పురుషులు బయలుదేరారు. లేని యెడల వారికక్కడ పంట యుండదు.
సహోదరీ, సహోదరులారా అది నీవాలోచించు దానికంటె ఆలస్యమయిపోతుంది. ఏదో ఒక విధంగా నేలను తప్పక గీకవలసి యున్నది. రాత్రిపగలు విరామం లేకుండా మనము ఆ పని చేయవలసియున్నది! మనము విత్తనమయిన వాక్యమును ప్రజల హృదయములలో తప్పక నాటవలసి యున్నది. మనము అలా చేయని ఎడల మనకు పంట ఉండదు. [స్పష్టత లేని మాటలు].