మెస్సియ యొక్క సూచన

మెస్సియ యొక్క సూచన

vgr count -77...మొదటగా ఏమి చేయవలెను, అను దర్శనము కొరకు, అదిగో ఆయన వాక్యము. అది ప్రేరేపించబడినదని నీవు నమ్మెదవా“ ఆయన అబద్ధమాడి యుండవచ్చునా లేక ఆయన వేళాకోళమాడుచుండెనా? ఆయన దానిని చేయలేదు. ఆయన చెప్పెను, ”కుమారుడు తనకు తానుగా ఏమియూ చేయనేరడు, కానీ తండ్రి ఏమి చేయుట అతడు చూచునో: దానినే అతడు (కుమారుడు) చేయును. తండ్రి పనిచేయు విధముగానే, నేను కూడా పనిచేయుదును.“

యవ్వన బిడ్డల కొరకు: తాను ఏమి చేయవలెనని దేవుడు కోరుచున్నాడో ఆ దర్శనమునే యేసు చూచెను. మరియు నాటకీయముగా ఆయన దానిని నటించెను. దానిని చూచుటకు ఈ రాత్రి మీరు మాతో పాటుగా ఆ భోజనపు బల్ల యొద్ద ఉండవలెను, అదే సంగతి జరుగును.

2

ఇప్పుడు, గమనించుడి, పిదప ఆయన ఈ మాటలు పలికెనని లేఖనము చెప్పుచున్నది: “కొంత సమయము తరువాత, లోకము నన్ను ఇక చూడదు;” అదియే అవిశ్వాసి, “ఇంకనూ మీరు నన్ను చూచెదరు; ఏలయనగా నేను మీతోను, మీలోను లోకాంతము వరకు ఉందును.”

ఇప్పుడు, అది నిజమేనా లేక అది నిజమే కదా? దానిని మనము మాట్లాడుకొని మరియు మన మధ్యలో వివాదము తీర్చుకొనెదము. సత్యము అదే కదా? “నేను...” నేను అనేది వ్యక్తిగత సర్వనామము. “లోకము యొక్క అంతము వరకూ నేను మీతోను, మీలోను ఉందును. కొంత సమయము తరువాత, మరియు ఆ అవిశ్వాసి, సంఘ ప్రపంచము, రంగము మీదకు వచ్చును, మరియు వారు ఇక నన్ను చూడరు; కానీ సంఘమే తనకు తాను, యుగాంతము వరకు నేను మీతోను, మీలోను ఉందును.” లోకము, అది ఇంకనూ ముగింపునకు రాలేదు, కాబట్టి క్రీస్తు అదే రీతిగా ఉండును.

3

౩ ఇప్పుడు, ఆయన చెప్పాడు, “ద్రాక్షావల్లిని నేను, మీరు తీగలైయున్నారు.” ఇప్పుడు, ద్రాక్షావల్లి దానికి అదే కాయలను కాయదు, అది కేవలము తీగలను వేరు చేయును, మరియు ఆ తీగలే కాయలను కాయును. మీకు అది తెలుసా? అవును అప్పుడు, మీరు ఒకవేళ ద్రాక్షావల్లి యొద్దకు వెళ్ళిన యెడల, మీరు ఏమి కనుగొనుటకు ఎదురు చూచెదరు? ద్రాక్షలు. ఒకవేళ మీరు ఒకపుచ్చ తీగ యొద్దకు వెళ్ళిన యెడల, ఒకవేళ అది సారవంతమైన తీగయైన యెడల, నీవు ఒక పుచ్చకాయను కనుగొనెదవు. ఒకవేళ నీవు ఒక పీచు చెట్టు వద్దకు వెళ్ళిన యెడల, నీవు పీచుకాయలను కనుగొందువు..

కానీ అప్పుడు, ఒకవేళ నీవు... ఒకవేళ క్రీస్తే ద్రాక్షావల్లి అయిన యెడల, మరియు ఆయన సంఘములోని సభ్యులు తీగలైన యెడల, సంఘములో నీవు ఏమి కనుగొనవలసియున్నది? “నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు కార్యములు మీరునూ చేయుదురు; దీని కన్నా గొప్పవి చేయుదురు”.

4

సంఘమునకు వెళ్ళినప్పుడు మీరు ఏమి కనుగొందురు? “మేము పెస్పిటేరియన్లము”. “మేము బాఫ్టిస్టులము”. “మేము పెంతెకోస్తువారము”. “మాకు వర్తమానము యున్నది.” “మాకు ఇది యున్నది.”

అది క్రీస్తు కాదు. క్రీస్తు ప్రేమై యున్నాడు, ఎందుకనగా ఆయన దేవుడు.

“కలవు..., మీరు ఒకరి యెడల ఒకరు ప్రేమను కలిగియున్నప్పుడు, దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొనెదరు. ”

కానీ, “మేము ఆ కూడికకు వెళ్ళము; మా సంఘము దానికి సహకరించుట లేదు.”

అది సరే. యేసు చెప్పెను, “తండ్రి నాకిచ్చిన వారందరూ నాయొద్దకు వచ్చెదరు.”

5

ఇప్పుడు గమనించుడి. ఇప్పుడు లేఖనములను పరిశోధించెదము, పిదప, వెనుక అక్కడ ఆయన ఏమి చేసియున్నాడో కనుగొనెదము, దానిని బట్టి ఆయనే మెస్సియ అని ప్రజలు తెలుసుకొనెదరు. మరియు ఆయనే మెస్సియ అని ప్రజలకు రుజువు చేయుట కొరకు అప్పుడు ఆయన ఏమి చేసియున్నాడో, ఇప్పుడునూ ఆయన అదే కార్యములు చేయవలసియున్నది. లేక ఆయన నిన్న నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉండలేడు. దానిని మీరు నమ్మెదరా?

ఇప్పుడు, మనము, నాకు తెలుసు మనము, మన సంఘములు, వ్యతిరేకముగా చెప్పును: “ఓహ్‌, మనము ఈ శాఖా సంస్థను కలిగియున్నాము కాబట్టి, మనము ఈ సేవా కార్యక్రమములు కలిగియున్నాము కాబట్టి”, అని చెప్పును.

ఆ సంగతులు మంచివే, కానీ క్రీస్తు చేసినవి అవి కాదు, మరియు ఆయన చేయమని చెప్పినవి కూడా అవి కాదు, ఎంతమాత్రము కాదు.

6

కాబట్టి, గమనించుడి, వెనుకకు త్రిప్పెదము; మనము పరిశుద్ధ యోహానులో చదువుచున్నాము; మనము 12వ అధ్యాయము దగ్గర ఉన్నాము. మనము మొదటి అధ్యాయమునకు వెళ్ళెదము; ఇక్కడ ఆయన చెప్పిన నిర్వచనములను చెప్పుటకు గల కారణమును, మొదటి అధ్యాయమునకు వెళ్ళి కనుగొనెదము. అది సరియే. పరిశుద్ధ యోహాను 1వ అధ్యాయము, ఆయన బాప్తిస్మము పొందిన తరువాత, పరిశుద్ధాత్మ ఆయనపై ఉండుటను మనము ఇక్కడ కనుగొనియున్నాము. అదే దేవుని...

మరియు ఆయన కొలతలేని ఆత్మను కలిగియున్నాడు. మనమైతే కొలత కలిగియున్నాము. ఇక్కడొక ఆలోచన ఉన్నది! అక్కడ మహాసముద్రంలో ఉన్న నీరంతయూ అది క్రీస్తులో ఉన్న ఆత్మయై యున్నది. మనలో ఉన్నదైతే ఆ మహాసముద్రములోని ఒక చెంచాడు, కానీ ఆ మహాసముద్రంలో ఏవైతే రసాయనాలు, మూలకాలు ఉన్నవో అవే ఈ చెంచాలో కూడా ఉన్నవి. దాని కన్నా ఎక్కువ ఏమీ లేవు. ఆయన వాటిని కలిగి ... నీరంతయూ ఆయనలో ఉన్నది, మరియు మనమైతే ఒక చెంచాడు. ఆయనదైతే: ఆయన శరీరధారియైన దేవునిగా మన మధ్య నివసించెను; ఆయన ఇమ్మానుయేలు. కానీ మనమైతే ఆయన కృప ద్వారా దత్తతు కాబడిన బిడ్డలము.

ఇప్పుడు, పరిశుద్దాత్మ యొక్క సంపూర్ణతలో ఆయన పరిశుద్దాత్మను పొందుకొనిన తరువాత, మనము (నీటి), బాప్తిన్మము పొందినట్లుగా, ఆయన పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతను పొందుకున్నాడు, ఇప్పుడు, వెంటనే యోహాను సువార్త 1వ అధ్యాయములో ఆయన పరిచర్య ప్రారంభము కావడము మనము కనుగొనుచున్నాము.

7

మరియు రక్షింపబడిన ఒక ఖచ్చితమైన మనిషి అక్కడ ఉన్నాడు. మరియు అతడు రక్షింపబడిన వెంటనే, అతడు తన సహోదరుడైన, సీమోను కొరకు వెళ్ళి మరియు తన సహోదరుడిని ప్రభువైన యేసు యొక్క సన్నిధిలోనికి అతడు తిరిగి తీసుకొని వచ్చియున్నాడు. మరియు మొదటిసారి యేసు అతడిని చూచినప్పుడు, అతడి పేరు ఏమిటో ఆయన చెప్పియున్నాడు, మరియు సీమోను నుండి పేతురు, కేఫాగా అతడి పేరు మార్చుచున్నాడని ఆయన అతడికి చెప్పెను. ఆయన దానిని చేసియున్నాడా? మరియు అతడి యొక్క తండ్రి పేరేమిటో కూడా అతడికి ఆయన చెప్పియున్నాడు, యోనా. “నీవు, లేక నీ పేరు సీమోను; నీవు యోనా యొక్క కుమారుడవు, అని చెప్పెను.

ఇప్పుడు గుర్తించుకొనండి, ఇదియే మొదటి సంగతి. మరియు “పేతురు విద్యలేని ఒక పామరుడైయున్నాడు, అతడు ఎన్నడూ చదువుకొనలేదు, అతడు తన స్వంత పేరును కూడా సంతకము చేయలేదు. పరిశుద్ధగ్రంథము చెప్పుచున్నది అతడు అవివేకి మరియు నిరక్షరాస్యుడు. ఒకవేళ విద్యే గనుక పెద్ద పాత్ర పోషించిన యెడల, మరి దాని సంగతి ఏమిటి? మరియు ఆ వ్యక్తికే పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు ఇవ్వబడెను.

మన యొక్క పాఠశాల బడులు మరియు అటువంటి సంగతులతో మనము ఎక్కడికి వెళ్ళిపోయాము? అది మనకు అవసరము లేదు అని నేను చెప్పుట లేదు, కానీ మీరు మీ యొక్క విద్యపై ఎక్కువ శ్రద్ధ చూపించుచున్నారు. అది సరియే, కానీ అది ఎన్నడూ నిన్ను రక్షించదు; మీరు గమనించకపోతే, అది మిమ్ములను చెడ్డవారినిగా మార్చును. సువార్త ఇప్పటి వరకూ కలిగియున్న ఆటంకములలో గొప్పది విద్యయే. అది నిజము, ప్రజలు చాలా జ్ఞానులుగా ఉండుటకు ప్రయత్నించెదరు.

8

అది, మన నేరచరిత్ర ... అమెరికాలోని నేర వ్యవస్థ విభాగములో బాలనేరస్తుల విభాగానికి అధిపతియైన కెప్టెన్‌ ఆల్‌ఫరార్‌, అతడు నా యొక్క కూడికలో మార్చు చెందెను. అతడు చెప్పాడు, “సహోదరుడా బ్రాన్హాం, దానిని గూర్చి నీవిచ్చిన ప్రకటన సత్యమే. అమెరికా సంయుక్త రాష్ట్రములలో గత పది సంవత్సరములలో జరిగిన ప్రతీ బాలనేరస్తుని యొద్దకు నేను నిన్ను నేరుగా తీసుకొని వెళ్ళెదను, అవన్నియూ విద్యావంతులైన ప్రజలచే చేయబడినవే.” అది నిజము. వాటిలో తొంభై శాతము. వారు చాలా తెలివైనవారు, ఎంతటి వారంటే చట్టమును మరియు అటువంటి సంగతులను సైతము వారు త్రోవ తప్పించగలరు. అందుకొరకే వారు సమస్యలో ఇరుక్కొన్నారు.

మరియు వారు తలంచెదరు “అవును, మేము ఒక గొప్ప సంఘమును కలిగియున్నాము; మాకు ఒక గొప్ప పేరు ఉన్నది.” అది కాదు కావలసినది. మీరు తిరిగి జన్మించవలసియున్నది. అది లేకుండా, మీరు ఎంత మంచి వారైనప్పటికీ, మీరు నశి౦చెదరు. కయీను హేబెలు కన్నా మంచివాడు, హేబెలు వలెనే ఆరాధన చేశాడు, హేబెలు వంటి మందిరమునే నిర్మించాడు,హేబెలు వలెనే అర్పణను అర్పించాడు; మరియు దేవుడు అతడిని తిరస్మరించియున్నాడు. ఎందుకనగా అతడు ఆత్మీయమైన ప్రత్యక్షతను కలిగిలేడు, అదియే నిజమైనది. యేసు చెప్పెను, “అదే ఆత్మీయమైన ప్రత్యక్షత మీద ఆయన తన సంఘమును కట్టెను; మరియు పాతాళ లోక ద్వారములు దాని ముందు నిలువనేరవు (జయించజాలవు).”పరిశుద్దాత్మ ద్వారా బయలుపరచబడిన ఆత్మీయ ప్రత్యక్షత.

9

ఇప్పుడు, యేసు ఏమి చేయుచుండెను? ఆయన యూదుల యొద్దకు వెళ్ళి తనను తాను తెలియజేసుకొనుచున్నాడు. ఇప్పుడు, ఇది జరిగిన వెంటనే, ఫిలిప్పు అను పేరు గల ఒకడుండెను. అది ఆశ్చర్యమని అతడు తలంచుచుండెను, కనుక పదిహేను మైళ్ళు చుట్టూ వెళ్ళి మరియు నతనయేలు అనుపేరు గల అతని స్నేహితుడిని కనుగొనెను. మరియు నతనయేలు, అతడిని కనుగొనినప్పుడు, అతడు ఒక చెట్టు క్రింద ఉండెను, ప్రార్ధించుచుండెను. మరియు నతనయేలు ప్రార్ధన ముగించేవరకూ. అతడు వేచియుండెను, మరియు అతడు, బహుశా, అతడు పైకి లేచినప్పుడు, అతడు చెప్పాడు, “హలో, ఫిలిప్పు. నిన్ను చూచుటకు సంతోషముగా ఉన్నది.”

అతడు చెప్పాడు, “మేము ఎవరిని కనుగొనియున్నామో వచ్చి చూడుము.” అంతే, కనీసము “నీవు ఎలా ఉన్నావు? నిన్ను కలుసుకున్నందుకు సంతోషము. నీ భార్య బాగుగానే ఉన్నదా?” అని అడుగుటకు కూడా సమయము లేదు. అతడు ఒక వర్తమానమును కలిగియు౦డెను.

10

మరియు ఒకవేళ సంఘము గనుక క్రీస్తు పట్ల అంత ఆసక్తి ఉన్న యెడల, ఏదో సంగతి జరుగును. కానీ మనమైతే అన్నిరకముల సాంఘిక వ్యవహారములు మరియు ప్రతీది కలిగి ఉందుము. మనము చనిపోవుచున్నామనుటలో ఆశ్చర్యములేదు. నిశ్చయముగా. మరియు రష్యా ఇక్మడకు వచ్చుచున్నదని మనము ఆందోళన చెందుచున్నాము మరియు... దానిని గూర్చి భయపడవద్దు. అది బయట నుండి వచ్చి ఆ ఆపిల్ పండును కొరుక్కొని తినుచున్న ఆ రాబిన్‌ పక్షి వలన కాదు అది గాయపడేది ... అది ఆ కాయ మధ్యలో నుండే పుట్టుకొచ్చిన ఆ పురుగు వలనే అది చచ్చును. అది మన మద్య ఉన్న ఆ కుళ్ళే, అదే మనలను చంపుచున్నది.

మనము నిజముగా దేవుని కొరకు నిలబడిన స్తీ పురుషుల కొరకు ఒక నిజమైన క్రైస్తవ వెన్నెముకగా ఉన్నాము...బుధవారం రాత్రి ఆలయంనకు వెళ్ళుటకు బదులుగా టి.వి.లో రాక్‌-అన్‌-రోల్‌ చూచుటకు మరియు ఆర్దర్ గాడ్ ఫ్రే కార్యక్రమము మరియు రేడియోలో ఈ ప్రజలందరినీ, మరియు వుయ్‌ లవ్ సూసి అను కార్యక్రమమును చూచుటకు మనము ఇంటి వద్దనే ఉండిపోదుము. అది మీరు దేవుని కన్నా లోకమును ఎక్కువగా ప్రేమించుచున్నారని చూపించుచున్నది. ఒకవేళ మీ హృదయము దేవుని కొరకే అయితే, దేవుడే మొదటి స్థానములో వచ్చును, మరియు నీ హృదయమంతా నిండుకొనును.

11

నతనయేలు చెప్పెను, “మేము ఎవరిని కనుగొనియున్నామో వచ్చి చూడుము నజరేయుడైన యేసు, యోసేపు కుమారుడు”.

మరియు ఇప్పుడు అతడు ... “ఇప్పుడు ఒక్క క్షణము ఆగుము, పిలిప్ఫు దాని గూర్చి నీవు ఖచ్చితముగా ఒక చెడ్డ ముగింపునకు (కొసకు) వెళ్ళావని నాకు తెలుసు. నీవు ఆ లోతైన చివరికి వెళ్ళావు. నీవు ఒక మంచి, నిజాయితీ గల వ్యక్తివని నేను ఎరిగియున్నాను. మరియు అటువంటి ఒక దానితో నీవు వెళ్లి యున్నావని నాకు చెప్పుటకు నీవు ఇక్కడ ఉన్నావా? ఎందుకు, నీవు ఒక మత మూడత్వము లోనికి వెళ్లియుండవచ్చు. ఫిలిప్పూ నీకు తెలుసా, ఒకవేళ అతడే మెస్సియ అయితే అతడు ఎక్కడనుండీ వచ్చునో నీకు తెలుసా? అతడు యెరూషలేమునకు వెళ్ళియుండును. అతడు యాజకుని యొద్దకు, ఆ ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళియుండును. ఆయన చెప్పును, గొప్ప కయప, దేవుని యొక్క ప్రధాన యాజకుడా, దేశములోనే నీవు అత్యంత తెలివైన వాడవని మాకు తెలుసు, దేశములోనే గొప్ప మత సంబంధమైన వ్యక్తివి, మరియు పరిశుద్ద యాజకులైన మీరందరూ, మీకు వాక్యము అంతా తెలుసు.” ఆయన అక్కడికి వచ్చి మరియు ఆయన తనను తాను తెలియపరచుకొనును, అని అతడు చెప్పుట నేను వినియున్నానని తలంచగలను.

ఆయన వాటికన్‌కు వెళ్ళునని క్యాథలిక్కులైన మీరు తలంచెదరు. ఆయన బిషప్పు యొద్దకు వెళ్ళునని ప్రెస్పిటేరియన్లలైన మీరు తలంచెదరు. ఆయన రాష్ట్ర ప్రెస్పిటేరియన్ దగ్గరకు వెళ్ళునని పెంతెకొస్తు వారైన మీరు తలంచెదరు. కానీ ఆయన ఎవని యొద్దకు వెళ్ళవలేనని కోరుకొనునో వారి యొద్దకు ఆయన వెళ్ళును. అదే ఆయన పని.

12

మరియు అతడు చెప్పాడు, “నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా?” మరే మనుష్యుడు ఇవ్వ లేనటువంటి ఉత్తమమైన సమాధానము ఫిలిప్పు అతడికి ఇచ్చెను. , “నీకు నీవే వచ్చి చూడుము.” అదియే మార్గము. ఇంటి వద్ద కూర్చుని విమర్శించవద్దు. వెళ్ళి కనుగొనుము; లేఖనములను పరిశీలించుము. నీవే వచ్చి దానిని కనుగొనుము. పర్వతము ఆవల రోడ్డు పైన, నతానియేలు అతనితో చెప్పుటను నేను వినుచున్నాను “ఆ ముసలి జాలరి నీకు తెలుసు -ఆ సమయమున నీవు అతడి యొద్ద చేపను కొన్నావు. అతడు రశీదుపై సంతకము కూడా చేయలేడు కదా?”

“అవును”..

“గత దినమున ఆయన అతని యొద్దకు వచ్చాడు. అతడి పేరు సీమోను, నీకు తెలుసు, మరియు అతడి పేరు ఏమిటో మరియు అతడి తండ్రి పేరు ఏమిటో ఆయన అతడికి చెప్పి వున్నాడు. ఒకవేళ నీవు ఎవరో ఆయన ఎరిగియుంటే అది నన్ను ఆశ్చర్యపరచి ఉండెడిది కాదు.”

“ఇప్పుడు, ఫిలిప్పు. ఇప్పుడు, ఫిలిప్పు . ఇప్పుడు, అటువంటివి నీవు నాకు చెప్పలేవు. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి నేను నా మనస్సును సిద్ధపరచుకొందును.”

13

కాబట్టి మొదటి సారి యేసు యొక్క ప్రసన్నతలోనికి వెళ్ళిన్నప్పుడు, యేసు చుట్టూ చూచెను “ఇదిగో ఇతడు ఏ కపటము లేని నిజమైన ఇశ్రాయేలీయుడు!”అని చెప్పెను. ఇప్పుడు, అతడొక అరబ్బు అయియుండవచ్చు. అతడొక గ్రీకుదేశస్తుడు అయియుండవచ్చు. వారందరూ ఒకే రకమైన దుస్తులు ధరించెదరు, మరియు ఒకేలా ఉందురు. నల్లజాతి ప్రజలు, వదులైన వస్త్రములు, అంగీలు, గడ్డము మరియు తలపాగాలు ధరించెదరు. మరియు అది కాకుండా, అతడు ఒక అవిశ్వాసి అయ్యు౦డవచ్చు. అతడు ఒక విమర్శకుడు అయ్యుండవచ్చు, కానీ ఆయన చెప్పాడు. నీవు ఒక నీతిమంతుడువు, నీలో ఏ కపటమును లేదు.“

మరియు అతడు ఆయన వైపు చూచెను, అతడు చెప్పాడు, “రబ్బీ, నీవు నన్ను ఎప్పుడు ఎరిగియున్నావు? నేను నిన్ను చూచుట, లేక నీవు నన్ను చూచుట ఇదే మొదటిసారి అయ్యున్నది. నీవు నన్ను అంతకు మునుపు ఎప్పుడు ఎరిగియున్నావు?”

ఆయన చెప్పెను, “ఫిలిప్పు నిన్ను పిలువక ముందు ఆ చెట్టు క్రింద ఉన్నప్పుడు, నేను నిన్నుచూచితిని.”

ఆ యూదుడు ఏమి చెప్పెను? ఇదిగో ఒక నిజమైన విశ్వాసి యొక్క వైఖరి ఇలా ఉండును. అతడు ఆయన వైపు చూచెను, అతడు చెప్పెను “నీవు దేవుని కుమారుడవు. నీవు ఇశ్రాయేలు రాజువు.”

14

కానీ అక్కడ కొందరు నిలబడియుండెను, తెలివైన యాజకులు, వారు చెప్పిరి “ఈయన బయెల్టెబూబు. ఆయన ఒక సోది చెప్పువాడు.”

“యేసు వెనుకకు తిరిగి మరియు ఈ విధముగా చెప్పెను. ”మీరు మనుష్యకుమారునికి, నాకు వ్యతిరేకముగా మాట్లాడినను, నేను మిమ్ములను క్షమించెదను. కానీ,“ వేరొక మాటలో ”ఒక రోజు పరిశుద్దాత్మ రానై యున్నది. మరియు అప్పుడు అతడు అదే సంగతి చేసినప్పుడు, దానికి వ్యతిరేకముగా ఒక్క మాట మాట్లాడిన యెడల అది ఎన్నడూ క్షమించబడదు, ఈ లోకములోను, రాబోవు యుగములో కూడా క్షమించబడదు“. లేఖనము ఆ విధముగా చెప్పుచున్నదని ఎంత మందికి తెలుసు? సరే. క్షమించబడని పాపమేదనగా పరిశుద్దాత్మను, పరిశుద్ధాత్మ కార్యమును చెడ్డది అని పిలుచుటయే. అదే... ”దాని నిమిత్తమై మీరు ఎన్నడూ క్షమించబడరు,“ అని యేసు చెప్పెను.

15

ఇప్పుడు, మీరు గమనించారా? యేసు దానిని ఒక అన్యునికి చెయ్యలేదు, మరియు ఒక అన్యుని యొక్క సమక్షములో కూడా చెయ్యలేదు, ఎందుకనగా తన శిష్యులు అన్యుల వద్దకు వెళ్ళుటకు ఆయన నిరాకరించెను. మరియు ఆ సురోఫెనికయ స్త్రీ ఆయనతో చెప్పెను, “వచ్చి, నా కుమార్తెను కనికరించుము”.

“ఆయన ... ఆమెకు చెప్పెను ... ఆయన చెప్పెను, ”నేను కేవలము ... పిల్లల యొక్క రొట్టెను తీసుకొని మరియు కుక్కలకు వేయుట యుక్తము కాదు.“

మరియు ఆమె చెప్పెను, “అవును, ప్రభువా, అది నిజము, అది నాకు తెలుసు. కానీ ఆ కుక్కలు బల్ల మీద నుండి పడిన రొట్టెముక్కలను తినును కదా.”

ఆయన చెప్పెను, “అది గొప్ప విశ్వాసము: ఒకవేళ నీవు ఆ రీతిగా నమ్మిన యెడల, ఆ రీతిగానే వెళ్ళి కనుగొనుము.” ఆయన కేవలము అది మాత్రమే ఆయనకు చెప్పెను, ఆమె కొరకు ఎటువంటి దర్శనము లేదు, ఆమె యొక్క విశ్వాసమే దానిని చేయనిమ్ము చూడుము.

ఇప్పుడు, ఆయన దానిని చేసెను మరియు తన శిష్యులు దానిని చేయుటకు ఆయన నిరాకరించెను. ఇప్పుడు, కేవలము మూడే రకములైన ప్రజలు, లేక జాతులవారు ఉన్నారని మనకు తెలుసు. అది హాము, షేము మరియు యాపెతు అనువారు. అదియే యూదులు, అన్యులు మరియు సమరయులు, సమరయులనగా సగము యూదుడు మరియు అన్యుడు. పేతురును మీరు గమనించుడి, రాజ్యము యొక్క తాళపు చెవులు అతనితో ఉన్నవి: పెంతెకొస్తు యొద్ద యూదుల కొరకు అతడు దానిని తెరచెను; సమరయ గుండా వెళ్ళెను; కొర్నేలి గృహము వద్దకు; అప్పటి నుండి ఎన్నడూ అది వాడబడలేదు. వారే లోకములోని మూడు జాతుల ప్రజలు.

16

ఇప్పుడు, “ఆయన...” ఆయన దినమున, “ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, మరియు ఆయన స్వకీయులే ఆయనను నిరాకరించిరి.” ఇప్పుడు, ఆయనను గూర్చి అపహాస్యము చేసి మరియు ఆయన ఒక బయెల్జెబూబు, ఒక దయ్యము, ఒక మానసిక శాస్త్రము, లేక ఒక సోదె చెప్పువాడు, లేక ఒక దురాత్మ అని చెప్పిన వారికి, ఆయన చెప్పెను, “దాని నిమిత్తమై నేను మిమ్ములను క్షమించబోవుచున్నాను.” వారిపై ఎన్నడూ.. పరిశుద్దాత్మ ఇంకనూ ఆ దేశముపై ఎన్నడూ కుమ్మరింపబడలేదు. చెప్పెను, “నేను నిన్ను క్షమించెదను: కానీ పరిశుద్దాత్ముడు వచ్చినప్పుడు, ఒక్క మాట వ్యతిరేకముగా పలికిన యెడల, లేక అది ఎన్నటికీ క్షమించబడదు.”

17

మరియు ఇప్పుడు, గమనించుడి, ఒక రోజు ఆయన సమరయ మార్గమున వెళ్లెను. మరియు ఆయన అలా వెళ్ళినప్పుడు, ఆయనకు అవసరము వచ్చెను, ఆ మార్గమున వెళ్ళెను, మరియు కొంత ఆహారమును కొనుటకు ఆయన తన శిష్యులను పట్టణములోనికి పంపెను. మరియు అక్కడ కొంచెము స్థలము ఉన్నది. పట్టణము

బయట ఒక బావి ఉన్నది, ఒక అందమైన దృశ్యము మరియు అక్కడే జనుల కొరకు ఒక బావి ఉన్నది. నీరు తెచ్చుకొనుటకు వారు అక్కడకు వెళ్ళెదరు. మరియు నీటిని పైకి తోడుకొనుటకు ఆ బావిపై చక్రము లాంటి పరికరమొకటీ ఉన్నది, మరియు ఆ స్రీలు తాడుతో కట్టబడియున్న తమ కుండలతో అక్కడకు వచ్చుచున్నారు, వారు అలా వెళ్ళి, వాటిని అలా భావిలోనికి జారవిడిచి మరియు నీటిని తోడుకొనుచున్నారు. మరియు వాటిని పైకి తీసుకొని వచ్చుచున్నారు, మరియు ఆ కుండను తమ తలపై పెట్టుకొని, మరియు ఒక్కొక్క నడుముపై ఒక్కొక్క కుండ పెట్టుకుని, మరియు అలా నడుచుకుంటూ, సాగిపోవుచున్నారు.

తన శిష్యులు వెనుకకు వచ్చు వరకూ యేసు అక్కడ ఎదురు చూచుచుండెను. మరియు ఆయన వేచియున్నప్పుడు, ఒక అందమైన స్త్రీ అని చెప్పవచ్చు, నిజముగా అందమైన స్తీ అక్కడకు నడిచి వచ్చియున్నది. ఆమె ఒక సమరయురాలు. మరియు నీటిని తోడుకొనుటకు తన కుండను బావిలోనికి జారవిడుచుట ప్రారంభించినది. “అమ్మా, త్రాగుటకు కొన్ని నీళ్ళు ఇవ్వుము” అని ఎవరో చెప్పుటను ఆమె విన్నది.

మరియు ఆమె చుట్టూ తిరిగి చూసినది. మరియు అక్కడ ఒక యూదుడు కూర్చొని ఉన్నాడు. ఆమె చెప్పెను, “మంచిది, మన ఇరువురికి ఎటువంటి సంబంధము లేదు. నీవు ఒక యూదుడవు, మరియు నేను ఒక సమరయురాలను, సమరయకు చెందిన స్త్రీ: మరొక మాటలో, వారిలో విభజన ఉన్నది, జాతి వివక్షలు.

కానీ ఎటువంటి భేదము లేదని ఆమె తెలుసుకొనులాగున ఆయన చేసెను. “ఒకవేళ నీవు ఎవరితో మాట్లాడుచున్నావో నీవు ఎరిగియున్న యెడల; ఆ నీళ్ళ కొరకు నీవు నన్ను అడిగెదవు మరియు నేనిచ్చిన యెడల ఇక నీవు ఇక్కడకు నీళ్ళ కొరకు రావలసిన అవసరముండదు లేక నేను నీకు ఇచ్చెదను.”

ఇప్పుడు వినండి, అది నిన్నటి యేసు. ఇప్పుడు, ఆయన సమరయుల దగ్గర ఉన్నాడు. యూదులు మరియు సమరయులు, త్రోసివేయబడినవారు, సగము-జాతి. మరియు ఇప్పుడు తిరిగి గమనించండి.

18

మరియు ఆమె చెప్పెను, “అంటే నువ్వు మా తండ్రియైన యాకోబు కంటే గొప్పవాడివా? అతడే ఈ బావిని త్రవ్వించెను.” చూడండి, వారు అతనిని దేవునిగా బావించిరి, కూడా. “అతడు బావిని త్రవ్వించెను”. అతడి పిల్లలు దాని నుంచే త్రాగిరి, కూడా. మరియు అతడి పశువులు కూడా, మరియు ఇక్కడ నువ్వు చెప్పుచున్నావు. నీవు కలిగియున్న నీళ్ళు త్రాగితే ... నీవు అతడి కన్నా గొప్పవాడివని చెప్పుచున్నావు.

మరియు సంభాషణ కొనసాగుచూ ఉన్నది. ఆయన ఏమి చేయుచున్నాడు. ఆత్మను సంధించుచున్నాడు. చూడండి. మరియు ఆమె సమస్య ఏమిటో ఆయన కనుగొనినప్పుడు, ఆమె సమస్యను ఆయన కనుగొనెను. మరియు ఆయన చెప్పెను,

“అమ్మా, వెళ్ళి నీ భర్తను తీసుకొని మరియు ఇక్కడకు రమ్ము”.

నాకు ఎటువంటి భర్త లేడు,“ అని ఆమె చెప్పెను.

ఆయన చెప్పెను, “అది నిజము, నీకు అయిదుగురు కలరు; మరియు ఇప్పుడు నీతో జీవించుచున్నవాడు నీ భర్త కాదు: నీవు నిజమే చెప్పియున్నావు.

ఇప్పుడు, ఆమె ఏమి చెప్పెను? “నీవు ఒక సోదెగానివా? అది ఒక మానసిక శాస్త్రమా? నీవు బయెల్జెబూబువా, అని చెప్పెనా? లేదయ్యా. ఆమె ఒక వేశ్య అయుండి అమెరికా సంయుక్త రాష్ట్రములలో సగముమంది ప్రసంగీకులకు దేవుని గూర్చి తెలిసియున్నదాని కన్నా ఆమె ఎక్కువగా ఎరిగియున్నది.

ఆమె చెప్పెను, “అయ్యా, నీవు ఒక ప్రవక్తవని గ్రహించియున్నాను. ఒకవేళ నీవు ఆ లేఖనము తీసుకొనిన యెడల, అది ఆ ప్రవక్త యొద్దకే వెళ్ళును. మోషే పలికిన ఆ ప్రవక్తే. ” నీవు ఒక ప్రవక్తవని నేను గ్రహించియున్నాను. మాకు తెలుసు మేము సమరయులము. ఇప్పుడు వారు ఏ విధముగా నేర్చించబడి యున్నారో చూడండి, “మాకు తెలుసు మెస్సియ వచ్చినప్పుడు, అయన ఈ విషయములను మాకు చెప్పును. కానీ నీవు ఎవరవు?”

19

అది ఏమైయుండును? మెస్సియ యొక్క సూచన అది యూదులకు ఇవ్వబడినది అది సమరయులకూ ఇవ్వబడినది. అన్యులు దేవున్ని నమ్మరు. వారికీ ఏ మెస్సియను గూర్చి ఏమీ తెలియదు. వారు విగ్రహాలను, సూర్యదేవుళ్ళను మరియు ప్రతీ దానిని ఆరాధించెదరు. అదే తరగతిలో మనమున్నాము.

మరియు చెప్పెను, “మాకు తెలుసు మెస్సియ వచ్చినప్పుడు... ఆ కారణము చేతనే అది ఆయన ప్రకటించవలసియున్నది. వారు ఆయన నుండే వినెదరు. మాకు తెలుసు ఆయన వచ్చినప్పుడు, ఆయన ఈ సంగతులను మాకు చెప్పును. కానీ నీవెవరవు?”

ఆయన చెప్పెను, “అది నేనే నీతో మాట్లాడుచున్నది.”

మరియు ఆమె పట్టణములోనికి పరుగెత్తి మరియు చెప్పినది, “రండి, నేను చేసిన సంగతులు గూర్చి నాకు చెప్పిన ఒక మనుష్యుని వచ్చి చూడుడి: ఈయన మెస్సీయా కాడా ?

20

ఒకవేళ ఆ విధముగానే ఆయన ఇశ్రాయేలీయులకు తెలియజేసుకొనిన యెడల వారు ఆయన కొరకు ఎదురుచూచుచున్నారు. ఇంకా ఆయన రావాలని , ఎదురు చూచుచున్న సమరయులకు కూడా; మరి ఈ రోజు, ఆయన రావాలని ఎదురు చూచుచున్నఅన్యుల సంగతి ఏమిటి? ఒకవేళ ఆయన ఆ విధముగా చేసిన యెడల, మరియు దేవునిగా ఉండి, ఆయన మారడు. ఒకవేళ ఆయన వారికి చూపి౦చిన గుర్తు (సూచన) అదే అయితే, ఆయన మెస్సియగా గుర్తించబడుటకు, నిజమైన యూదుడు దానిని నమ్మెను.

ఓహ్‌, ఆ గొప్ప తల బిరుసు వ్యక్తి అతడు దానిని నమ్మలేదు. అతడు ఒక పరిశుద్ధమైన మరియు ఒక పురాతనమైన వ్యక్తి అయినప్పటికీ, అతడు ప్రారంభము నుండియు దానిని నమ్మలేదు అతడు ఒక గొప్ప వ్యక్తి.

కానీ తత్త్వవేత్తలు, మనము ఈ రోజు ఆ విధమైనటు వంటి వారిని కలిగిలేము : వారు ఇంకా ఒక ఖచ్చితమైన జాతి నుండి రావలసియున్నది, లేవి, అతడు యాజకునిగా మారుటకు ముందు... అతని యొక్క తండ్రి యొక్క తండ్రి, తండ్రి యొక్క తండ్రి ఒక యాజకుడై యున్నాడు, మరియు ఒక కళంకములేని, పరిశుద్దమైన వంశావళిలో నుండి అతడు రావలసియున్నది. అది దానితో ఒక్క సంగతి కూడా సంబంధము కలిగిలేదు.

21

నీవు ఎన్నడూ ఒక్క అబద్ధము కూడా చెప్పి యుండక పోవచ్చును. సత్యమైన వానిగా జీవిస్తూ ఉండవచ్చు, మరియు ప్రతీ రాత్రి ఆలయమునకు వెళుతూ ఉండవచ్చు, మరియు ఉండదగినంత మర్యాదగా ఉండవచ్చు. మరియు దశమభాగములను చెల్లించుచుండవచ్చు, మరియు ప్రతీదీ చేస్తూ ఉండవచ్చు మరియు బలిపీఠం యొద్ద మోకరిల్లి మరియు ఆరాధిస్తూ, మరియు ఒక పులి నేరుగా ఒక గుహ లోనికి వెళ్ళిపోయినట్లుగా అతడు తిన్నగా నరకమునకు వెళ్ళిపోవును. లేఖనము అదే చెప్పుచున్నది కయీను అదే చేసెను. కానీ మన యొక్క స్వంత పద్ధతులుతో కూడిన మతము మనలను ఎక్కడకు తీసుకొని వెళ్ళిపోవుచున్నది, ఏ విధముగానైనా? అది మనలను దేవుని నుండి దూరముగా పంపి వేయుచున్నది. ఖచ్చితముగా, అది అదే.

22

ఇప్పుడు, గమనించుడి. యూదులు, నిజమైన అసలైన యూదులు, దానిని నమ్మిరి. ఆ సూచన ప్రదర్శింపబడుట అతడు చూసిన వెంటనే, “అతడే మెస్సియా నీవు దేవుని కుమారుడవు; నీవు యూదులరాజువు, అని అతడు చెప్పాడు.

యేసు చెప్పెను “ఎందుకనగా నీవు వచ్చుటకు ముందు నీవు చెట్టు క్రింద ఉన్నావని నేను నీతో చెప్పినప్పుడు నీవు నమ్మావు, నమ్మావా? నీవు దీని కన్నా గొప్ప సంగతులు చూచెదవు.

మరియు బావి యొద్ద నున్న స్త్రీ చెప్పెను, “ఆ సంగతులను మెస్సియ చేయునని మేము ఎరిగియున్నాము, ఎందుకనగా అవి జరుగుట కొ రకు మేము ఎదురుచూచుచున్నాము. కానీ నీవు ఎవరవు? నీవు ఒక ప్రవక్తవా?”

ఆయన చెప్పెను, “నేనే మెస్పియ”.

ఆమె వచ్చెను, పురుషులతో చెప్పెను, “ఇప్పుడు, మెస్సియ ఈ సంగతులనుచేయును అని మీరు నాకు నేర్పించారు. ఇప్పుడు, నేను చేసిన సంగతులను నాకు తెలియజేసిన ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆయనే మెస్సియ కదా?”

23

ఇప్పుడు, ఒకవేళ అదేరీతిగా ఆయన చేయవలసియున్న యొడల ... ఇప్పుడు గుర్తించుకొనుడి, అది ఒక అన్యుని ముందు ఎన్నడూ చేయబడలేదు. మనము రెండు వేల సంవత్సరములు సగము చీకటి మరియు సగము వెలుగు కలిగియున్నాము; సంఘములో చేరుట కానీ రెండు వేల సంవత్సరముల తరువాత, తిరిగి లేచిన క్రీస్తుగా, ఒకవేళ ఆయన తనను తాను ప్రకటించుకొనని యెడల, ఆయన అన్యాయస్తుడు మరియు పక్షపాతి అయ్యుండును.

మరియు ఎందుకనగా మనము పెద్ద ఆలయములను కలిగియుండుటను బట్టి కాదు: అది సూచన కాదు. ఎందుకనగా మేము దేశమంతటా వెళ్ళి, బిల్లీ గ్రామ్‌, ఓరల్‌ రాబర్ట్స్‌ మరియు మేమందరము, మరియు సంఘములోనికి అధిక సంఖ్యాకులను తీసుకొని వచ్చుటను బట్టి కాదు: అది సూచన కాదు. అది అసలు సూచనయే కాదు. ఆయన చేసినది అది కాదు: చెప్పవచ్చు, “ఇక్కడ చూడుడి, యోహాను కన్నా ఒక పెద్ద గుంపును నేను తీసుకొని వచ్చెదను.” అది ఒక సూచన కాదు. కానీ మెస్సియ యొక్క సూచన అనగా ఆయన చేసిన దానిని నేను ఇక్కడ మాట్లాడుచున్నాను.

ఒకవేళ ఆ యూదుల యొక్క తరము ముందు ఆయన దానిని చేసి, నిలిపివేసిన యెడల, మరియు ఆయన కొరకు ఎదురుచూచుచున్న ఆ సగము జాతి వారి ముందు, ఆయన ఈ అన్యుల యొక్క తరము ముందు కూడా ఆయన అదే సంగతి చేయవలసియున్నది, లేనిఎడల ఆయన అక్కడ, ఆ రీతిగా చేయుట తప్పై యుండును. ఒకవేళ ఆయన మనలను మన యొక్క వేదాంత శాస్త్రము, మరియు అటువంటి వాటితో కొనసాగుటకు అనుమతించిన యెడల, మరియు వారి యొక్క నాశనముకు ముందు అయన అంతక మునుపు వారికి చేసియున్న విధముగా ఆయన ప్రకటింపబడకున్న యెడల ...,

మరియు సమయము సమీపించి యున్నది అని రుజువు చేయుటకు ఇదియే గొప్ప సూచన అయ్యున్నది. అది యూదులకు సమీపమై యున్నది. మరియు ప్రతీ పరిశుద్ద గ్రంథ బోధకుడు కూడా అన్యుల యుగము ముగింపునకు వచ్చినదని ఎరిగియుండెను. మరియు ఆయన తిరిగి యూదుల వైపు తిరగవలసియున్నది. మరియు దేవుడు హిట్లర్‌, ముస్సోలిని, మరియు ఆ నియంతలందరూ, మరియు రష్యా యొక్క హృదయములను కఠినపరిచెను. మరియు ఆ యూదులను తిన్నగా పాలస్తీనాకు పారద్రోలగొట్టెను. నిజానికి వారు అక్కడే ఉండి యుండవలసియున్నది.

24

నా దగ్గర ఒక చిత్రము కలదు. విజ్ఞాన శాస్త్రము ప్రకారము అర్ధరాత్రికి మూడు నిమషములకు ముందు ఆ యూదులు తమ ప్రియమైన వారిని, ముసలివారిని అవిటి వారిని వారి యొక్క వీపులపై కట్టుకొని వారు వచ్చుచున్నారు. మీరు లుక్ మాస పత్రికలో దానిని చూడవచ్చు, లైఫ్‌, ఆ ముసలివారిని తమ వీపులపె మోసుకొని ఇరాన్ మరియు అటువంటి ప్రదేశముల నుండి వారు వచ్చుచున్నారు. నా స్నేహితుడు ఒకడు వారి యొద్దకు వెళ్ళాడు, వారినందరినీ కలర్‌ ఫోటోలు తీశాడు మీరందరూ చనిపోవుట కొరకు స్వదేశమునకు వచ్చుచున్నారా?“ అని అడిగాడు.

వారు చెప్పారు, లేదు మేము మెస్సయ్యాను చూచుట కొరకు వెను తిరిగి వచ్చుచున్నాము. మేము చనిపోవుట కొరకు వచ్చుట లేదు. మేము మెస్సయ్యాను చూచుట కొరకు వచ్చుచున్నాము.

యేసు చెప్పెను “అంజూరపు చెట్టు చిగురించుటకు ప్రారంభించగానే, ఈ తరము (నలభై సంవత్సరములు) ”ఈ సంగతులన్నియూ నెరవేరు వరకూ ఈ తరము గతి౦పదు.

మీకు అర్ధమైనదా ఏమి జరుగుచున్నది ? అన్యులకు చివరి పిలుపు. ఏ సమయములోనైనా దేశములన్నీ ధూళిగా మారుటకు సిద్దముగా ఉన్నవి. మరి దానిని గూర్చి ఆలోచించుటకు, అది జరుగుటకు ముందు, మొదట సంఘము గృహమునకు చేరును. మరియు ఒకవేళ ఉదయమునకు ముందే మనము దూళిగా మార్చబడ వలసినయెడల మరియు తీర్పు, మరి సంఘము గృహమునకు వెళ్ళుటను గూర్చి ఏమిటి? అది ఏ నిముషములోనైనా వచ్చును. నిశ్చయముగా, ఓహ్‌, మేల్కొనండి. జనులారా వాక్యము చదువుట ద్వారా మీలోనున్న ఆత్మసంబంధమైన ప్రాణమును కుదపండి. మనము అంతమున ఉన్నాము. సమయము సమీపించెను.

25

మనము వేదాంత శాస్త్రమును కలిగియున్నాము, మనము సంఘ కాలమును కలిగియున్నాము. కానీ ఇదే సమయమైయున్నది. మరియు ఇప్పుడు, యూదులకు చివరి సూచన ఏమిటి? ప్రభువైన యేసు ప్రత్యక్షమగుట, ఆయన అప్పుడు చేసిన అవే సంగతులను చేయుచూ నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని తనను ప్రకటించుకొనుటకు ఆయనే పరిశుద్ధాత్మ యొక్క ఆత్మగా తిరిగి తన సంఘము లోనికి వచ్చుటయే అన్యజనులకు చివరి సూచన అయ్యున్నది. మీరు బయట చూడవచ్చు. మరియు మీరు వార్తాపత్రికలు చదవవచ్చు మరియు ఆకాశములో రాతలను చూడవచ్చు. మీరు చూడుడి, మనము నాశనమునకు బద్దులమై యున్నాము. మన కొరకు మరెటువంటి మార్గమూ లేదు.

26

ఒకవేళ ఇది చేయుచున్న పాపములతో దేవుడు ఈ దేశమును ఇలా కొనసాగుటకు అనుమతించిన యెడల, ఒక న్యాయవంతుడైన దేవునిగా, వాటిని కాల్చివేసినందుకు ఆయన సొదొమ మరియు గొమెర్రాలను ఫైకి లేపి మరియు క్షమాపణ చెప్పబద్దుడై యున్నాడు. మనము చేయుచున్న పాపములనే వారు చేసిరి. దేవుడు పాపులను

ప్రేమించును, కానీ పాపమును ద్వేషించును, మరియు ఆయన న్యాయవంతుడు మరియు ఆ పాపము తీర్పు తీర్చబడవలసియున్నది.

మరియు ఆయన ఏమి చేయుచున్నాడు: ఆయన కుమారుడు పరిశుద్దాత్మ యొక్క రూపములో ఈ రోజు దేశమంతటా కదులుచున్నాడు; మరియు సంఘము దానిని త్రోసివేసినది, దాని నుండి దూరమగుచున్నది, దానిని గూర్చి అపహాస్యము చేయుచున్నది, దానిని బట్టే తీర్చును తీసుకొని వచ్చుటకు ఆయన న్యాయవంతుడు: ఆయన ఏమి వాగ్దానము చేసెనో దానిని ఆయన చేయును. యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉండెను. అదే ప్రభువైన యేసు, తనను తాను అక్కడ ప్రకటించుకొన్న ఆయన, వాగ్దానము చేసి, ప్రవచించి, ఈ సంగతులన్నీ జరుగును అని చెప్పెను: మరియు ఇవిగో అవి ఇక్కడ ఉన్నవి. దానిని గూర్చి మనము ఏమి చేయబోవుచున్నాము? స్నేహితుడా, దానిని మనము అంగీకరించెదము. దానిని మనము నమ్మెదము.

27

ఇక్కడ ఒక చిన్న చిత్రము ఉంచబడినది; ఎవరో దానిని గురించి నన్ను అడిగియున్నారు: ఆ వెలుగు. ఇప్పుడు, నన్ను గూర్చి మర్చిపోండి. నేను కేవలము ఒక మనుష్యుడను. చూడండి. మనము ఆ వెలుగును గూర్చి మాట్లాడుచున్నాము. అది ఒక అగ్నిస్తంభము. వేలిముద్రలు మరియు పత్రాలకు సంబంధించిన వాటికి అధిపతి అయిన జార్షి.జె.లేసీ, దానిని పరీక్షించెను. అది చరిత్రలో ఇప్పటి వరకూ ఫోటో తీయబడిన కేవలం ఒకే ఒక సహజాతీతమైనదిగా, వాషింగ్టన్‌, డి.సి.లోని మతపరమైన కళా విభాగము యొక్క హాలులో అది వ్రేలాడదీయబడియున్నది. అది స్విట్టర్లాండ్‌లో ఉన్నది; అది జర్మనీలో ఉన్నది: అక్కడ వాటి యొక్క ఫోటోలను తీసిరి.

అది ఎందుకు వ్యాపించలేదు? అది ఎందుకు తెలియపర్చబడవలెను? అది తెలియపర్పబడదు. ఈ సంగతులు జరుగువరకూ వారు వీటిని ఎన్నడూ గ్రహింపరు. ఆయన చెప్పెను, అది ఆయన జ్ఞానులకును, మరియు వివేకులకును మరుగుపరచి, మరియు నేర్చుకొను పసిబాలురకు మాత్రమే వాటిని బయలుపరచెదను. యేసు దానిని చెప్పెనని ఎంతమంది ఎరిగియున్నారు? దాని కొరకు దేవునికి వందనములు.

28

క్యాథలిక్‌ ప్రజలైన మీకు, మీకు పరిశుద్ధ ప్యాటిక్‌ అంటే ఎవరో తెలియదు. అసలు ఆయన ప్రారంభమే క్యాథలిక్‌ కాదు, అది మీకు తెలుసా. కానీ ఆయన చనిపోయిన చాలా కాలము తరువాత ఆయన ఒక పరిశుద్దుడని మీరు గుర్తించిరి. మరి అస్సిసీకి చెందిన పరిశుద్ధ ఫ్రాన్సిస్‌ గూర్చి ఏమిటి? బైబిల్‌ను చంకలో పెట్టుకొని యుండిన ఒక నడిచే ప్రసంగీకుడు అతడు. అప్పుడు మీరు అతనిని గుర్తించలేదు.

మరియు ఆర్క్ కు చెందిన జోనా సంగతి ఏమిటి? ఆమె కృప కొరకు కేకలు పెట్టుచుండగా, క్యాథలిక్‌ సంఘము ఆమెను ఒక కట్టెకు కట్టి కాల్చివేసినది. ఒక బయల్జెబూబుగా, ఒక మంత్రగత్తెగా మీరు ఆమెను కాల్చివేసిరి. ఒక ఆత్మసంబంధమైన స్త్రీ, దర్శనములు చూచెను, మరియు సూచనలు మరియు అద్భుత కార్యములను చెసెను. మరియు ఒక బయల్జెబూబుగా, ఒక మంత్రగత్తెగా మీరు ఆమెను కాల్చివేసిరి. కానీ ఒక వంద సంవత్సరముల తరువాత, ఆమె ఒక పరిశుద్దురాలని మీరు గ్రహించిరి. అవును, మీరు పశ్చాత్తాపపడిరి, మీరు ఆ యాజకుని

యొక్క శరీరమును త్రవ్వి తీసి, మరియు నదిలో పడవేసిరి. ఇప్పుడు ఆమె ఒక పరిశుద్దురాలుగా చిత్రించబడినది.

29

దేవుడు ఎల్లప్పుడూ ఆయన దయను, ఆయన సూచనను పంపును; ఆయన జ్ఞానులు మరియు వివేకుల యొక్క కళ్ళకు పైగా వెళ్ళిపోయి మరియు పసిబాలురకే బయలుపరచును. ఆయన తన సంఘమును పిలిచి మరియు దానిని ముద్రించును; అదియే జరుగుచున్నది. ఆయన న్యాయవంతుడు. ఆయన దానిని పంపెను. ఆయన తన వాక్యమునకు బద్దుడైయున్నాడు.

ఆ దినమున అక్కడ ఉన్న అనేకమంది యూదులను చూడుడి, మత్తయి 12, ఆయన చేసిన కార్యములను అనేక మంది చూచెనని ఆయన చెప్పెను, అయినప్పటికీ వారు ఆయనను నమ్మలేదు, ఎందుకనగా ప్రవక్తయైన యెషయా చెప్పెను, “వారికి కన్నులుండియూ వారు చూడలేరు, మరియు చెవులుండియూ, వారు వినలేరు”; గుడ్డివారు.

అన్యులు ఆచారములు మరియు శాఖాసంఘముల ద్వారా గ్రుడ్డివారయ్యిరి. మరియు చివరికాలములో ఆయన చేసిన కార్యములనే తిరిగి చేయుచూ, మర్మముగా, పునరుత్ధానుడైన యేసు తన ఆత్మలో తన సంఘము మధ్య కదులుచూ ఉండుటను చూచుటలో వారు విఫలమయ్యిరి .

ఓ, దేవా, మా కన్నులను తెరువుము. మా కన్నులు తెరువమనునదియే నా ప్రార్ధన.

30

మనము ముగించే ముందు, మరొక సంగతిని ఆయన చేసెను. ఒక రోజు ఆయన వెళ్ళుచూ ఉన్నాడు ... ఆయన ఏ దర్శనమును చూడలేదు. ఆయన ఒక చిన్న గుంపు ప్రజల మధ్య సాగిపోవుచూ ఉన్నాడు, మరియు అందరూ ఆయనను భుజము తట్టుచూ, మరియు కరచాలనము చేయుచూ, మరియు అవన్నీ చేయుచూ ఉండిరి. మరియు ఒక చిన్న స్త్రీ తన హృదయములో ఈ విధముగా అనుకొనెను, “ఆయన ఒక పరిశుద్ధమైన వ్యక్తి అని నేను నమ్ముచున్నాను. ఆయన దేవుని కుమారుడని నేను నమ్ముచున్నాను. మరియు నేను ఒక చిన్న స్త్రీని.” మరియు ఆమె ఒక రక్తస్రావపు సమస్యతో రుతువిరతి దశలో బాధపడుచూ ఉన్నది, మరియు దానిని ఆమె చాలా సంవత్సరముల నుండి కలిగియున్నది, మరియు అది ఆగుట లేదు. వైద్యులు దానికి ఎటువంటి వెద్యము చేయలేకపోయిరి. మరియు ఆమె చెప్పెను, “ఒకవేళ నేను ఆయన వస్త్రపు అంచును తాకగలిగిన యెడల, నేను సంపూర్ణురాలగుదునని నేను నమ్ముచున్నాను. ఆమె ఆయన అంగీని తాకియున్నది. ఇప్పుడు, ఆ పాలస్థీనియన్లు ధరించే వస్త్రము వదులుగా పొడుగాటి దానిగా ఉండును; ఆ అంచును, ఆ అంగీ యొక్క కొనను వదులుగా ఉన్న దానిని ... మీరు తాకలేరు. మరియు ఆమె ఆ అంగీ యొక్క అంచును తాకియున్నది. బహుశా ఆయన క్రింద కూర్చొని, మరియు ఆమె ఆ అంచును తాకియున్నది. ఆయన కొంచెము ముందుకు నడిచి, మరియు ఆయన వెనుదిరిగి, ”నన్ను ఎవరు తాకిరి?“ అని ఆయన అడిగెను.

అది నిన్నటి దినమున యేసు. పరిశుద్ధ గ్రంథము చెప్పెను, “ఆయన ఒక ప్రధాన యాజకుడు”, ఈ రాత్రి, “మన అతిక్రమముల ద్వారా ఆయన తాకబడెను.” అది నిజమేనా? నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉండెను.

31

ఆ స్తీ ఆయనను తాకినది. ఆయన అడిగెను, “ఎవరు నన్ను తాకిరి? మరియు పేతురు,.... ఓహ్‌, అతడు పెద్దగా అనుభూతి చెందెను. ఎందుకనగా ఆయన ఒక రకముగా అపొస్తులులకు పెద్ద అయ్యున్నాడు, అతడు చెప్పెను ”ఇప్పుడు“ ప్రభువైన యేసును గద్దించెను, మరియు చెప్పెను, ఆ విధముగా నీవు ఎందుకు అన్నావు? అవును, నిన్ను ఎవరు తాకారో ఎవరు చెప్పగలరు? ప్రతి ఒక్కరూ నిన్ను తాకుచున్నారు.”

యేసు చెప్పెను, “కానీ నేను బలహీనుడనైతిని. నాలో ప్రభావము పోయినది.” ఓహ్‌, అటువంటి తాకిడినే న్యూ హేవన్‌ ప్రజలైన మీరు తాకవలెనని నేను ఆశించుచున్నాను.

నేను బలహీనుడనైతినినని నేను గ్రహించుచున్నాను. ప్రభావము నాలో నుండి పోయినది.“ ప్రతీ ఒక్కరూ నిశ్శబ్ధమైరి. అక్కడ నది ఒడ్డున ఆ జాలరుల మధ్యలో అక్కడ నిలబడికొనియున్న తన చిన్న గుంపు ప్రజల మధ్యలో. ఆయన చుట్టూ చూసెను. మరియు ఆయన అటుగా చూచెను, మరియు ఆయన ఆ చిన్న స్త్రీని చూసెను. ఏది నిజమైన విశ్వాసమో చెప్పగల శక్తి ద్వారా ఆయన నింపబడి యుండెను. ఆయన ఆ స్తీతో చెప్పెను, ఆమె యొక్క స్థితి చెప్పెను, ”నీ విశ్వాసమే నిన్ను రక్షించెను“ అని ఆయన చెప్పెను.

32

అది నిన్నటి యేసు. పరిశుద్ధ గ్రంథము చెప్పెను, ఆయన నిన్న నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉండెను, మరియు ఒక ప్రధాన యాజకునిగా క్రొత్త నిబంధనలో, హెబ్రీయులలో, మన అతిక్రమముల ద్వారా ఆయన తాకబడుచున్నాడు.

పిదప, ఇంకనూ, ఒకవేళ ఆయన ప్రధాన యాజకునిగా ఉన్న యెడల, ఒకవేళ మీరు ఆయనను తాకితే, ఇప్పుడు మీరున్న స్థలములో ప్రేక్షకుల మధ్య కూర్చొని మరియు ఇలా చెప్పిన ఎడల, “ఓ దేవా, నన్ను నిన్ను తాకనిమ్ము, యేసూ, నేను నిన్ను నమ్ముచున్నాను,” ఉద్రేకపూర్వకముగా కాదు, కానీ కేవలము ఆయనను తాకుము, ఆయన ఏ విధముగా స్పందించును? ఆయన అప్పుడు చేసిన విధముగానే ఇప్పుడునూ చేయును, లేక ఆయన అదే యేసు కాలేదు. చూశారా? తన సంఘము యొక్క పెదవులను ఉపయోగించుకొని ఆయన తిరిగి మాట్లాడవలసియున్నది, మరియు అదే సంగతిని చెప్పవలసియున్నది, ఎందుకనగా మనము ... తీగలమై యున్నాము, ఆయన ద్రాక్షావల్లి. ఆయన అప్పుడు చేసిన విధముగానే, ఆయన ఇప్పుడునూ తిరిగి మాట్లాడి మరియు అదే సంగతిని చెప్పును, లేకపోయిన యెడల ఆయన అదే యేసుగా ఉండలేదు, ఆయన అదే ప్రధాన యాజకుడు కాదు, ఆయన మరొకడు .

కానీ ఈ రాత్రి ఆయన సజీవుడైయున్నాడు. ఓహ్‌, స్నేహితుడా, దానిని బట్టి నేను చాలా ఆనందించుచున్నాను. ఆయన సజీవుడు! మరియు ఈ రోజు మనము ... మనము ఆధారపడుటకు ఒక్క సంగతి కూడా లేనప్పుడు, మీరు-మీరు ... మనము కేవలము ... మనము అయిపోయియున్నాము. కేవలము ఒకే ఒకటి నిలిచియుండును, అదే దేవుని యొక్క రాజ్యము.

33

మన దేశమా? అయిపోయినది. అది లోతున కేంద్రము వరకూ చెదపురుగులతో తినివేయబడినది. ఫరో యొక్క స్థలములలో నేను నిలబడియున్నాను; వారి యొక్క రాజభవనములను కనుగొనుటకు ఇరవై అడుగులు త్రవ్వవలసియున్నది; మరియు రోములోని కైసరు యొక్క ...; మరియు అన్ని రాజ్యములు కూలిపోయినవి ఎందుకనగా కూలిపోనటువంటి ఒక రాజ్యము వచ్చుచున్నది, అదే దేవుని యొక్క రాజ్యము. ఈ ఇతరమైనవన్నీ ఈ మర్త్యమైనవన్నీ అమర్త్యతకు దారినిచ్చుచున్నవి.

కానీ, మనము కలిగియున్న గొప్ప దేశము; మరియు సూర్యుని క్రింద ఉన్న ప్రతీ దేశమూ దయ్యము ద్వారానే నియంత్రించబడుచున్నదని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. యేసు అలా చెప్పెను. అన్ని దేశములు దయ్యము ద్వారా నియంత్రించబడుచున్నవి. అందుకే మనము గొడవలు పడి మరియు మనము ఉన్న విధముగా కొనసాగుచున్నాము. సాతాను చెప్పినది, “అవన్నియు నావి”. అతడు ఆయనకు చూపెను, “ఇక్కడ, ఇవన్ని నేను నీకు ఇచ్చెదను, నీవు నన్ను ఆరాధించిన యెడల. వాటన్నిటికీ ఆయనే వారసుడని యేను యెరిగియుండెను. ఆయన చెప్పెను, ”సాతానా, నా వెనుకకు పొమ్ము“. చూశారా?” ఆయన వాటికి వారసుడని ఆయన ఎరిగియుండెను,.

మరియు ఎంతకాలమైతే మనము.. మనము ఒక అత్యుత్తమమైన దేశాధ్యక్షుడని మనము కలిగియున్నాము. ఇప్పుడు, నేను ఒక రాజకీయవేత్తను కాదు, కానీ మిస్టర్‌. ఐసన్‌హోవర్‌ను నేను ఇష్టపడెదను. మరియు అతడు ఒక అద్భుతమైన వ్యక్తి అని నేను తలంచెదను. కానీ ఈ సంయుక్త రాష్టములలోని ప్రతీ ప్రాంతములో మనము ఒక ద్వైత్ ఐసన్‌హోవర్‌ను ఉంచిన ఎడల, ఆమె ఇంకనూ పాపముపై కేకలు వేయుచూ ఉండును. ఆమె ఆ విధముగా చేయునని, పరిశుద్ధ గ్రంథము చెప్పెను. మీరు అక్కడే ఉన్నారు. సమయము సమీపించినది.

34

మరియు స్నేహితుడా, కొంతకాలము క్రితము నేను ఫిన్హాండ్‌లో ఒక యాత్రకు వెళ్ళాను. మొదటి... వెంటనే, రెండవ ప్రపంచ యుద్ధము. నేను ఆ ఫిన్లాండ్‌ స్త్రీలను చూసాను. రాత్రి సమయములలో, ప్రతీ ఒక్కరూ మట్టిని దున్నే నాగళ్ళను వారు వెనుక పెట్టుకొని, పురుషులు, చిన్న పిల్లలు ఒక లాంతరు పట్టుకొని; రాత్రిళ్ళు కూడా వారు ఆగకుండా, వారు అలా పనిచేయుచూ ఉందురు. యుద్దము ముగిసినది, వారు గోధుమలను నాటవలసియున్నది. ఒకవేళ వారు గోధుమలను నాటనిఎడల వచ్చే స౦వత్సరం వారికి ఏ పంట ఉండదు, వారందరూ ఆకలితో చనిపోవుదురు. చిన్న పిల్లలు లాంతరును పట్టుకొని నడుచుచూ ఉందురు మరియు వారు చాలా అలసిపోవుదురు; మరియు తల్లి లాగుచూ, మరియు చెమటలు కార్చుచూ , మరియు భుజములు కొట్టుకొని పోయి, మరియు అవన్నీ. యవ్వన బాలికలు మరియు అందరూ. నాన్న వెనుక వచ్చుచూ ఆ విధముగా గోధుమలు చల్లుచూ ఉండును. ఏ విధముగా నైనా దున్నుచూ భూమిని అలా దున్ని గోధుమలను నాటుదురు. మంచు వచ్చుచున్నది; శీతాకాలమంతయూ ఉండును. గోధుమలు లేకపోతే, జీవము ఉండదు.

మరియు సహోదరుడా, దేవుని యొక్క రాజ్యములో, ఈ రోజు, ఆ విధముగా ఉన్నది: అది మీరు ఊహించిన దానికన్నా ముందే. పెద్ద పెద్ద ఉజ్జీవములను ఆపుటకు మనము సమయమును కలిగిలేము, భూమిని దున్నవలసి యున్నది, విత్తనము రావలసియున్నది.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...