శక్తివంతమైన జయశాలి

శక్తివంతమైన జయశాలి

vgr count -123 ధన్యవాదములు. ఈ రాత్రి, ప్రభువు యొక్క నామములో పరిచర్య చేయుటకు తిరిగి ఈ రాత్రి ఈ గుడారము క్రిందకి వచ్చుట, ఇక్కడ ఉండుట అది ఎటువంటి భాగ్యము.

ఇప్పుడు, ఆయన యొక్క వాక్యము చదువుటకుముందు, ఒక చిన్న ప్రార్థనలో ఆయనతో మాట్లాడుదాం. మన తలలువంచెదమా!

నిత్యడైన దేవా, ప్రభువైనయేసును మృతులలో నుండి తిరిగి లేపినవాడా, నీకు వ్యతిరేకముగా మేము చేసిన అనేక అతిక్రమములను నీవు మన్నించెదవని మేము ప్రార్ధించెదము, మరియు గొప్ప కుమ్మరింపుతో, నీ పరిశుద్ధాత్మ ఈ రాత్రి మా యొద్దకు వచ్చును గాక, మరియు ఈ రాత్రి పాపులు వారి యొక్క మార్గములలో రోదించెదరు గాక - మరియు రోగులు స్వస్థపడుదురు గాక, మరియు దేవా, ఈ రాత్రి సజీవదేవుని యొక్క గొప్ప సూచనలు ఈ గుడారము క్రింద జరుగును గాక. అనుగ్రహించండి.

ఇది నీ వాక్యము, మేము దీనిని చదవబోవుచుండగా, మరియు అది పరిశుద్ధాత్మ తప్ప ఎవరును అనువదించలేరు. మరియు వాక్యము యొక్క మూలాంశమును ఆయన మాకిచ్చును అని మేము ప్రార్థించెదము. ప్రభువా, అనుగ్రహించండి, యేసు నామము ద్వారా మేము ప్రార్ధించుచున్నాము. ఆమెన్.

2

నేను దేవుని యొక్క వాక్యమును ప్రేమించెదను. నేను దానిని చదువుటకు ఇష్టపడుచున్నాను. దాని యందు ఏదో ఉన్నది, ఆయన నిత్యుడు అని తెలుసుకొనుటకు- చాలా ఆసక్తి గల ఏదో దానిని మనము చదువుచున్నాము. ఆయన వలె ఆయన మాట కూడా నిత్యమైయున్నది. ఏ వ్యక్తి అయినా - ఏ వ్యక్తి అయినా తన మాట కన్నా ఎక్కువ కాదు. ఒకవేళ నేను మీ మాటను తీసుకొనకపోతే అప్పుడు ఇక మనకు ఎటువంటి సంబంధము లేదు. మీరు నా మాటను తీసుకొనలేరు, మీరు నన్ను నమ్మలేరు. మరియు ఒకవేళ మనము దేవుని మాటను తీసుకొన్నట్లయితే, ఆయన ఏదైతే సత్యమని చెప్పాడో దానిని మనము నమ్మగలము. మరియు ఒకవేళ దానిని మనము తీసుకొనలేకపోతే, ఆయనే వాక్యమని దేవుడు మనకు బయలుపరచేటంత వరకూ మనము వెళ్ళి మరియు ప్రార్దించే సమయము. “ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు వాక్యమే దేవుడై యుండెను.”

3

ఇప్పుడు, ఈ రాత్రి, ప్రకటన గ్రంధము 6వ అధ్యాయము మరియు 2వ వచనము మనము చదువబోవుచున్నాము.

మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడెను; దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండియుండెను. అతనికి ఒక కిరీటమియ్యబడెను. అతడు జయించుచు, జయించుటకు బయలు వెళ్ళెను.

ఒకవేళ ఇది ఈ విధముగా చెప్పవలెననిన, నేను దీనిని ఈ విధముగా పిలుచుటకు ఇష్టపడుచున్నాను, “శక్తివంతమైన జయశాలి.”

4

కొంతకాలము క్రితము, పోర్చుగీస్లోని లిస్బన్లో నిలబడే భాగ్యమును నేను కలిగియున్నాను, మరియు బానిసలను మరియు యుద్ధ ఖైదీలను తీసుకొని వెళ్ళే ఒక పాత ఓడలోని క్రింద భాగమునకు వెళ్ళియున్నాను. మరియు అక్కడ ఒక మనుష్యుడున్నాడు . ఒక లోహముపై ఒక చిత్రము చెక్కబడినది, అది ఒక మనుష్యుడు, గొప్ప యోధుడు. అతడు ఒక హీరో, ఎందుకనగా అతడు ఈ పట్టణమును పట్టుకొనియున్నాడు. మరియు అప్పుడు, అతడికి పైన ఒక. అతడు ఒక తుర్కువాడు (ఒక జాతి). మరియు దానికి పైగా ఇంకొక మనుష్యుడు ఉన్నాడు, ఈ గోడ దగ్గర ప్రాణము నిచ్చినవాడు, ఇంకొక హీరో, జయశాలి, ఒక హీరో వలె తన ప్రాణమును ఇచ్చి, అతడు ఆ గోడలను పడగొట్టి మరియు తుర్కుల నుండి దానిని తీసుకొనియున్నాడు, మరియు స్పానిష్ వారు దానిని జయించియున్నారు.

మరియు ఈ లోకమంత్రా పూర్తిగా హీరోలతో నిండిపోయినది, మరియు జయశాలులతో మరియు అటువంటివారు. మరియు ఈ రాత్రి నేను కాన్స్టంటైన్ గూర్చి ఆలోచించుచున్నాను. గొప్ప శక్తి గల యోధుని వలె రోమ్ వైపు ప్రయాణము చేయుచున్నాడు, అక్కడకు వెళ్ళుట యందు కొంచెము కలవరము చెందియున్నాడు. ఒక రాత్రి, అతడు నిద్రలో ఉండగా, అతడు ఒక కలను కనియున్నాడు, దానిలో ఒక తెల్లని సిలువ తన ఎదుటకి రావడం చూచాడు. మరియు ఒక స్వరము అతడితో మాట్లాడి మరియు చెప్పినది, “దీనితో, నీవు జయించెదవు,” మరియు మధ్యరాత్రిలో అతడు తనవారినందరినీ లేపి, మరియు తమ కవచముపై తెల్లని సిలువను రంగు వేసుకొనమని చెప్పాడు. మరియు దాని ద్వారా, మంచిది, వారు జయించవలసియున్నది.

5

మరియు నిజముగా, ఒకవేళ ఏదైనా జయింపబడవలసిన కార్యమున్నదంటే, అది సిలువ ద్వారానే రావలసియున్నది. జయించుటకు ఉన్న ఒకే ఒక మార్గము, అది సిలువ ద్వారానే.

మరియు మనము ఎరిగియున్నాము కాన్స్టంటైన్ ఒక గొప్ప వ్యక్తి, కానీ అప్పుడు మూడు సంవత్సరాల క్రితము తిరిగి మనము తలంచుచున్నాము. నేను జర్మనీ నుండి వచ్చుచున్నప్పుడు, ప్రభువు అక్కడ గొప్ప కూడికను మాకు ఇచ్చియున్నాడు, మరియు మేము బ్రస్సెల్స్ లో ఆగియున్నాము. మరియు మేము వాటర్లూకి ఎంతో దూరములో లేము. మరియు వారు కొన్ని విగ్రహములను గూర్చి మాతో చెప్పుచున్నారు మరియు అటువంటివి, వాటర్లూ దగ్గర జరిగిన గొప్పయుద్ధము యొక్క నమూనాలను (విగ్రహముల రూపములో) వారు కలిగియున్నారు, చాలా, చాలా వందల సంవత్సరాల క్రితము, అక్కడే గొప్ప నెపోలియన్ ఓడించబడ్డాడు.

మరియు నెపోలియన్, ఒక గొప్ప వ్యక్తిగా మనమందరము అతడిని ఎరిగియున్నాము, కానీ అతడు ఒక యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు ఒక మంచి మార్గములో ప్రారంభించాడు; ముప్పైమూడు సంవత్సరాల వయస్సులో అతడు ప్రపంచాన్ని జయించాడు. ప్రపంచములోని అన్ని దేశములలో ప్రతీఒక్కరినీ అతడు కొట్టిన తరువాత, అతడు కూర్చొని మరియు ఏడ్చుచుండెను, ఎందుకనగా అతడు కొట్టుటకు ఇంక ఎవ్వరునూ లేరు. మరియు ఒక త్రాగుబోతుగా యవ్వన ప్రాయములోనే అతడు మరణించెను. అతడు ప్రారంభించినప్పుడు, అతడు ఒక నిషేదించువాడు, అందరినీ తిరస్కరించువాడు; కానీ అతడు చనిపోవునప్పుడు, అతడు ఒక త్రాగుబోతు. మరియు ప్రపంచము అతడిని చూసి భయపడుతూ ఉండేది.

6

అక్కడ ఆ విమానాశ్రయములో, నేను ఒక చిన్న పుస్తకమును చదువుచున్నాను, అది చెప్పుచున్నది, ఆ స్త్రీలు రాత్రులలో, తమ పిల్లలను వారు పడుకొనబెట్టుచున్నప్పుడు, చాలా మంది తల్లులు, “ఒకవేళ నీవు నిద్రపోకపోతే, ఆ పాత బూచివాడు వచ్చి నిన్ను తీసుకొనిపోతాడు,” అని చెప్పేవారు. ఎందుకు, నెపోలియన్ వచ్చి వారిని తీసుకొనిపోతాడు అని ఎక్కువగా చెప్పి వారు తమ పిల్లలను భయపెట్టేవారు, ఎందుకనగా అతడు అటువంటి హంతకుడు. ఆ చిన్నపిల్లలు తమ చిన్న కళ్ళను పెద్దవిచేసి మరియు వెంటనే ఆ తలగడ క్రిందకు దూరేవారు, ఎందుకనగా ఆబలమైన నెపోలియన్ వచ్చి వారిని తీసుకొనిపోతాడు అని వారు అనుకొనేవారు. కానీ అతడు ఓడించబడ్డాడు, ఎందుకనగా ఎన్నడూ నిబంధనలు బట్టి అతడు సరైన ఆటను ఆడలేదు.

మరియు కేవలము గుర్తించుకొనండి; సజీవుడైన దేవుని సంఘమునకు అది మంచి గుణపాఠమై యున్నది. ఒకవేళ నిబంధనలను బట్టి మనము ఆటను ఆడకపోయినట్లయిన, చివరలో మనము అనర్హులమౌతాము. జయించుటకు మనము ఆటలోని నిబంధనలను పాటించవలసియున్నది.

మరియు ఒకవేళ ఆటలోని నిబంధనలు ఇక్కడ ఈ విధముగా ఉన్నట్లయితే, క్రీస్తుయొక్క సహవాసములోనికి మరియు ఆయన సంఘములో ప్రవేశించడానికి ఒక వ్యక్తి ఖచ్చితముగా తిరిగి జన్మించవలయునన్న మరియు ఈ భూమిపై మనము ఒక గొప్ప సంఘశాఖ అయి ఉండవచ్చు, కానీ ఒకవేళ నిబంధనలను బట్టి ఆట ఆడకపోయిన ఎడల, చివరలోమనము అనర్హులవుతాము. మనము దేవుని యొక్క నిబంధనలను బట్టి తిన్నగా రావలసియున్నది (సరిగా ఆడవలసియున్నది). అవి మన యొక్క నిబంధనలు కాదు; అవి ఆయన యొక్క నిబంధనలు, అవే మనము అనుసరించవలసి యున్నది. మనము ఆయనయొక్క నిబంధనలను బట్టి పందెములో పరిగెడుచున్నాము, మరియు వాటికి మనము లోబడియుండవలెను.

7

కనుక మీరు చూడండి, నెపోలియన్, ఒక గొప్ప యోధునిగా, మరియు ఒక గొప్ప జయశాలిగాఉన్న తరువాత, అతడు భయముతో జనులను జయించెను, మరియు అది ఆట యొక్క నిబంధన కాదు. ఆట యొక్క నిబంధన ఏదనగా ప్రేమ ద్వారా జయించుము.

ఈ ప్రపంచమంతటిలోనూ ప్రేమ కన్నా గొప్పదైన శక్తి మరేదియూ లేదు. మరియు నేను దాదాపుగా ఖచ్చితముగా చెప్పగలను, జనులుగా మనము, ఎక్కువగా మన ప్రాధనత్యను వేరే ఇతర నిబంధనలపై పెట్టియున్నాము (అమర్యాదగా ఉండాలని నా ఉద్దేశము కాదు), కాని కొన్నిసార్లు మనలను మనము చేసికొన్నాము, మరియు ఆ నిబంధనలపై ఎక్కువ ప్రాధాన్యత ఉంచియున్నాము, కేవలము మనలను మనము అనర్హులుగా కనుగొనడానికి.

8

మార్టిన్ లూధర్ గనుక నిబంధనల ప్రకారము సరైన ఆటను ఆడినట్లయితే ఏమి జరిగేది? ఒక మెథడిస్టు సంఘము అనేది ఉండేది కాదు. ఒకవేళ మెథడిస్టు గనుక నిబంధనల ప్రకారము సరైన ఆటను ఆడినట్లయితే ఏమి జరిగేది? ఒక పెంతుకొస్తు సంఘమనేది ఉండేది కాదు.

కానీ ఒకవేళ మనము గనుక నిబంధనల ప్రకారము సరైన ఆట ఆడుటలో విఫలమైనట్లయితే, దేవుడు మనలను అనర్హులుగా చేసి మరియు రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలను పుట్టించగలడు. మరియు ఆటను సరైన రీతిలో ఆడాలని దేవుడు కోరుచున్నాడు, మరియు మనము దానిని చేయవలసియున్నది. కనుక మనము ఆట యొక్క నిబంధనకు తిరిగి వచ్చేంత వరకు, మనము ఎంతగా కొనసాగుచున్నామని అనుభూతి చెందుచున్ననూ అది ఎటువంటి వ్యత్యాసమును తీసుకొనిరాదు.

9

ఈ మధ్యాహ్నమున నేను కొంత మంది ఇండియనులతో మాట్లాడుచున్నాను, హోపి ఇండియనులు, కూడికలో ఉండుట కొరకు ఆరిజోనా నుండివచ్చియున్నారు. మరియు గతరాత్రి కొంత మంది యవ్వనస్తులు ఇక్కడ బలిపీఠము యొద్దక్రీస్తుకు తమ హృదయములను సమర్పించియున్నారు. మరియు వారితో పాటు ఒక మిషనరీ కూడా వచ్చియున్నాడు, మరియు నేను చెప్పాను. “సహో, బ్రన్హాం, దేవున్ని అడగాలని నేను నీ యందు ప్రేమ కలిగియున్నాను, ఒకవేల ఆ ఇండియనులకు సేవ చేయుటకు ఆయన నా పనిని ఎక్కువ చేయునేమో,” అని అతడు అడిగాడు.

నేను చెప్పాను, “అయ్యా, వారి యందు నేనూ అదే అనుభూతి కలిగియున్నాను.” కానీ నేను చెప్పాను, “ఒకవేళ దేవుడు నీకు ఒక తలాంతు ఇచ్చినట్లయితే, ఆ తలాంతులోనే నిలిచియుండుము. మరియు నీవు ఏమి చేయ ప్రయత్నించినప్పటికీ, ఒకవేళ ఆ తలాంతు పనిచేయని ఎడల, అది ఎంత గొప్పదన్నది కాదు, ఒకవేళ అది నిబంధనల ప్రకారము పనిచేయకపోతే, మీరు ఆ పందెములో అనర్హులవుతారు.”

10

మరియు నాకు తెలిసిన, బలమైన శక్తి, ప్రేమయే. “మనుష్యుల భాషలతోను, దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడుకంచును గణగణలాడు తాళమునై యుందును. కొండలను పెకలింపగల శక్తిని నేను కలిగియున్నను, ప్రేమలేనివాడనైతే వ్యర్ధుడనే.”

కనుక మనము పిలచుచున్నట్లుగా, ఒకవేళ మనము ఈ ఆట ఆడబోవుచున్న ఎడల. ఒకవేళ మనము గెలుపొందబోవుచున్న ఎడల, మనము తిరిగి ఆ గెలిచే సూత్రము యొద్దకు తిరిగి రావలయును. మనము చూచియున్న ఈ గొప్ప సూచనలు మరియు అద్భుతములను బట్టి, మనము దేవుని స్తుతించెదము. కానీ ఒకవేళ ఆ సంగతులు గనుక దైవసంబంధమైన క్రైస్తవ ప్రేమ మరియు దేవుడు మరియు ఆయన జనుల యందు గౌరవముపై నిర్మించబడని ఎడల, అది విఫలమగును. అది విఫలమవ్వవలసినదే. (చూసారా?) ఎందుకనగా దానికి పునాది లేదు. మరియు ఈ గొప్ప సంగతిలో, నేను..

11

కొంత సమయము క్రితము నేను ఇంగ్లాండులోని లండన్లో ఉన్న వెస్ట్మినిష్టర్ అబ్బే యొద్ద నిలబడినప్పుడు, మరియు “జీవితము యొక్క కీర్తన” రాసిన కవి యొక్క రూపమును నేను చూసాను, పొడుగాటి వ్యక్తి, మరియు నేను అతడి పద్యమును గూర్చి ఆలోచించాను:

రోదించుచున్న సంఖ్యలలో నాకు చెప్ప వద్దు,

జీవితమనేది ఒక ఖాళీ స్వప్నము!

(కేవలము తిని, త్రాగి మరియు ఆనందించు)

మరియు నిద్రపోయినవాని వలె నటిస్తున్న ప్రాణము మరణించినది,

మరియు సంగతులన్నీ ఉండవలసిన రీతిగాలేవు.

జీవితము వాస్తవమైనది! మరియు జీవితము అవశ్యకమైనది!

మరియు సమాధి దాని యొక్క గురి కాదు;

మట్టి నుండి వచ్చావు కనుక, తిరిగి మన్నే అవుతావు,

ప్రాణమును గూర్చి మాట్లాడబడలేదు.

గొప్ప వ్యక్తుల యొక్క జీవితములన్నీ మనకు జ్ఞాపకము చేయును,

మరియు మనము మన జీవితములను అద్భుతముగా తయారు చేసుకొనగలము.

స్వల్పమైన వాటిని మన వెనుక విడిచి పెట్టి,

కాలమనే ఇసుక రేణువులపై పాదముద్రలు.

మరొక దానిని సూచించుచున్న పాదముద్రలు,

జీవితమనే ప్రధానమైన ఏటిలో పయనిస్తూ,

దూరమైన మరియు విరిగిన సహోదరుని కొరకు

చూచుట ద్వారా హృదయమును వెనుకకు తెచ్చును.

అప్పుడు మనము పైన ఉండి మరియు చేసెదము,

కష్టపడుచున్న ఒక హృదయముతో మనము,

నడిపించబడుచున్న మూగ పశువువలె ఉండకుండా!

ఒక హీరో వలె ఉండుము........

12

దేవుని యొక్క రాజ్యము కొరకు ఒక శ్రేష్టమైనది వారు చేయునట్లుగా, అదే సంఘములో ఉన్న ప్రతీ ఒక్కొక్కరు వారి హృదయములో అటువంటి ఉద్దేశ్యము కలిగియుండాలి. మరియు మీరు దేవున్ని ఏవిధముగా సేవించెదరు? మీరు ఒకరికొకరు సేవ చేసుకొన్నప్పుడు. అది చెప్పవలయుననిన, నీవు ఆ కొమ్మ యొక్క చిన్న కొనను పట్టుకొనినప్పుడు, మరియు లోకముతో పూర్తిగా సంబంధము కలిగియున్న వ్యక్తులు, వారే క్రిందకు దిగి వచ్చిన (తగ్గించుకొన్న) వ్యక్తులు, మరియు వారు గొప్ప వ్యక్తులు కాలేదు; మరియు ఒక ఉద్దేశ్యమును నెరవేర్చుట కొరకు వారు తమను తామే తగ్గించుకున్నారు.

ఈ రాత్రి, నేను తలంచుచున్నాను, స్త్రీ పురుషులైన ఈ ప్రేక్షకులను నేను చూసినప్పుడు, దరిదాపుగా నా వయస్సులో ఉన్నవారు, కధల పుస్తకములో ఒక హీరో గూర్చి మనము చదివెడివారము, అందరూ త్వరగా మర్చిపోతారు, మరియు అతడే స్విట్జర్లాండ్ యొక్క ఆర్నాల్డ్ వాన్ వి౦కిల్ రీడ్. ఎందుకు, ఆ స్విస్ పర్వతాలపై, ఈ రోజుకూ మీరు అతడి పేరు ప్రస్తావించినప్పుడు, మరియు ఆ జనుల ముఖములలో కవళికలు మారిపోతాయి, మరియు వారి చెక్కిళ్ళపై నుండి కన్నీరు కారుతుంది.

13

మనమందరము ఆ కథను గూర్చి బాగుగా ఎరిగియున్నాము. ఆ ఫిన్నిష్ ప్రజలు, ఫిన్నిష్ కాదు, నన్ను క్షమించండి, కానీ ఆ స్విస్ ప్రజలు, యుద్ధము లేకుండా శాంతితో జీవించుటకు ఆ పర్వతములపైకి వెళ్ళియున్న ఒక గుంపు జర్మన్లు వారు, మరియు వారు ఇంకనూ యుద్ధము చేయని ప్రజలు.

కానీ ఒక రోజు, వారి యొక్క చిన్న సంపద ఒక సైన్యము ద్వారా దాడి చేయబడినప్పుడు, మరియు ఆ ఫిన్నిష్ ప్రజలందరూ ఆ పర్వతము క్రిందనున్న లోయలో సమకూడియున్నారు. మరియు వారు తమ పిల్లలను, తమ గృహములను కాపాడుకొనుటకు వారు అక్కడికి వెళ్ళియున్నారు; మరియు వారి జీవితములో తమకు ప్రియమైన దానిని కాపాడుకొనుటకు వారు వెళ్ళియున్నారు. మరియు ఆ రంగములో ఒక చిన్న గుంపుగా వారు తమను తాము కనుగొన్నప్పుడు, మరియు చూచారు, ఒక ఇటుక గోడవలె ఉన్న ఒక గొప్ప సైన్యము కవాతు చేస్తూ, వారి వైపు వస్తూ ఉన్నారు. ప్రతీ ఒక్కరూ బల్లెము, మరియు కవచము, మరియు శిరస్త్రాణములు, మరియు గొప్ప ఆయుధములతో తర్ఫీదుపొంది, పరిపూర్ణముగా తర్ఫీదు పొందినవారు, కనీసము ఒక్కరు కూడా తప్పటడుగులు వేయకుండా, అంతములేని వరుసవలె అది కనిపించుచున్నది. మరియు ఇక్కడ వారు నిలబడియున్నారు, పోరాడుటకు తమ చేతులలో కర్రలు మరియు రాళ్ళు మరియు పాత కొడవళ్ళు పట్టుకొని, ఆ గోడకు వ్యతిరేకముగా హక్కు కొరకు ఒక గుంపుగా నిలబడియున్నారు. పూర్తిగా తర్ఫీదు పొందిన వ్యక్తులుగా తమ పగవాడు (శత్రువు) రాగా, వారు కలిగియున్న ఆ వధను గూర్చి ఆ చిన్న సైన్యము ఏమి చేయగలదు? ఎందుకు, వారు నిస్సహాయులు. వారు చేయగలిగిన కార్యము ఒక్కటియునూ లేదు

14

కానీ చివరికి, ముప్పై మూడు సంవత్సరముల వయస్సు కలిగిన ఒక యవ్వనస్తుడు బయటకు వచ్చాడు, మరియు అతడు చెప్పాడు, “స్విట్జర్లాండ్ దేశపు పెద్ద మనుషులారా, ఈ రోజు స్విట్జర్లాండ్ కొరకు నేను నా జీవితమును సమర్పిస్తాను.”

“ఆర్నాల్డ్ వాన్ వి౦కిల్ రీడ్, అంత గొప్ప శత్రు సమూహమునకు వ్యతిరేకముగా నీవు ఏమి చేయగలవు?” అని వారు అన్నారు.

అతడు అన్నాడు, “ఆ పర్వతమునకు ఆవలివైపున, నాభార్య మరియు ముగ్గురు పిల్లలను ముద్దు పెట్టుకొని వారికి వీడ్కోలు చెప్పాను. మరియు అక్కడొక చిన్న తెల్లని గృహమున్నది, మరియు నేను తిరిగి గృహమునకు వచ్చుటకు వారు ద్వారము యొద్ద నిలువబడి గమనిస్తున్నారు, కానీ, ”నేను చెప్పాను,“ ఈ భూమిపై నేను ఎన్నడూ వారిని తిరిగి చూడను, ఎందుకనగా ఈ రోజు నేను నా జీవితమును స్విట్జర్లాండ్ కొరకు అర్పిస్తున్నాను, మరియు అది సరైనది.”

వారు అన్నారు, “శ్రీ ఆర్నాల్డ్ వాన్ వి౦కిల్ రీడ్ నీవు ఏమి చేస్తావు?”

అతడు చెప్పాడు, “మీరు కేవలము నన్ను వెంబడించండి, మరియు పోరాడుటకు దేనినైతే మీరు కలిగియున్నారో, మీలో ఉన్న దానంతటితోను పోరాడండి.”

మరియు వారు చెప్పారు, “నీవు ఏమి చేస్తావు?”

మరియు తన చేతిలో ఏదైతే ఉన్నదో దానిని అతడు విసిరివేశాడు; ఆ గొప్ప సైన్యము రావడము అతడు చూశాడు, మరియు దానినంతటినీ చూశాడు, ఆ బల్లెములలో చాలా మందమైన బల్లెము కనుగొనేంత వరకూ చూశాడు. మరియు కథ ఆ విధముగా సాగుచుండగా, తన చేతులను పైకెత్తి మరియు కుడివైపు తీసుకొని తిన్నగా, అరుస్తూ ఆ బల్లెముల మధ్యలోనికి వెళ్ళిపోయాడు, “స్వేచ్ఛ కొరకు మార్గమును సరాళము చేయుము” మరియు అతడు మళ్ళీ అరిచాడు, “స్వేచ్ఛ కొరకు మార్గమును సరాళము చేయుము.” వందలాది బల్లెములు అతడిని పటుకొనుటకు కాచుకొనియుండగా, మరియు అతడు వారి మధ్యకు పరుగెత్తికొని పోయాడు: అతడు తన చేతులు చాచి వాటి నిండా ఆయుధములను పట్టుకొని, మరియు తన ఛాతిలోనికి దింపుకొనియున్నాడు. అటువంటి హీరోయిజం యొక్క ప్రదర్శన, అది శత్రువులు పరారయ్యేలా చేసింది, మరియు ఆ చిన్న స్విస్ ప్రజలు కర్రలు, మరియు రాళ్ళు, మరియు కొడవళ్ళతో, వారి యొక్క భూభాగము నుండి ఆ సైన్యము పారిపోయేలా చేసారు, మరియు అప్పటి నుండి వారు ఒక యుద్ధమును కూడా కలిగిలేరు.

15

అటువంటి రకమైన హీరోయిజం ఎప్పుడో ఒకసారి పోల్చబడుతుంది, మరియుఎవరూ దానిని అధిగమించలేరు. మరియు స్విట్జర్లాండ్, ఈ రోజుదానిని గుర్తించుకొనుచున్నది, ఆర్నాల్డ్ వాన్ వి౦కిల్ రీడ్, వందలాది సంవత్సరములు యుద్ధము లేదు. అది ఒక గొప్ప హీరో యొక్క కార్యము.

కానీ ఓ, సహోదరుడా, సహోదరి, అది ఒక చిన్న సంగతి, ఒక రోజు వరకూ, ఆదాము యొక్క జాతి మూలన ఇరికించబడినప్పుడు, వారు ప్రవక్తలను కలిగియున్నారు, వారు ధర్మశాస్త్రమును కలిగియున్నారు. మరియు వారు ప్రవక్తలను చంపివేసి, మరియు ధర్మశాస్త్రమును నాశనము చేసారు. మరియు ఆదాము యొక్క జాతి అంతా రాబోవుచున్న ముంచుకొస్తున్న శత్రువు, దెయ్యము మరియు అతడి సైన్యమంతటికీ వ్యతిరేకముగా నిరీక్షణ లేకుండా మరియు నిస్సహాయులుగా నిలబడియున్నారు. తర్ఫీదు పొందిన ఆత్మ సంబంధులు, ఏ విధముగాను వారు మర్త్యులకు పోలిక కాదు. మరియు వారు ఏమి చెయ్యగలరు, వారు నిస్సహాయులు.

కానీ తండ్రి రొమ్మున ఉన్న ఒకాయన మహిమలో నుండి బయటకు అడుగుపెట్టి, మరియు ఆయన చెప్పాడు, “నేను ఈ దినమున క్రిందకి వెళ్ళి మరియు పడిపోయిన ఆదాము యొక్క జాతి కొరకు నా ప్రాణము పెట్టెదను.”

16

మరియు ఆయన ఇక్కడ భూమిపై ఉన్నప్పుడు, మానవులను జయించిన ఆ చీకటి బల్లెపు పోట్లను అనగా మరణమును ఆయన కనుగొనియున్నాడు. మరియు కల్వరి యొద్ద అటువంటి వాటిని చేతినిండా తీసుకొని మరియు తనను తాను మరణమునకు అప్పగించుకున్నాడు, మరియు తన సంఘముతో ఆజ్ఞను విడిచిపెట్టి, ఆ చిన్నకరుకైన గుంపు, నిరక్ష్యరాస్యులు, చదువులేని జాలరులు. పోట్లాడుకొనుటకు ఏదో కర్రలు మరియు రాళ్లతో ఆయన విడిచిపెట్టలేదు, కానీ ఆ పెంతుకొస్తు దినమున, అది ఇంతకు ముందెన్నడూ కలిగియుండని ఒక గొప్ప ఆయుధమును సంఘము చేతిలో పెట్టియున్నాడు. మరియు ఆయన చెప్పాడు, “నన్ను వెంబడించి, మరియు నీలో ఉన్న వాటన్నిటితోనూ పోరాటము చేయుము.”

మార్గమును ఆయనే నడిపించెను; ఆయన శక్తివంతమైన జయశాలి. తన కొరకు మరియు తన సొంత మహిమ కొరకు ఆయన జయించలేదు, కానీ పడిపోయిన ఆదాము యొక్క జాతి యొక్క మంచి కొరకు ఆయన జయించెను. అటువంటి జయశీలుడు ఎవ్వరునూ లేరు.

17

ముప్పై మూడు సంవత్సరముల వయస్సులో నెపోలియన్ ఒక త్రాగుబోతు పిచ్చివానిగా ఓడిపోయెను, కానీ ముప్పై మూడు సంవత్సరముల వయస్సులో, క్రీస్తు, ఆటను సరైన రీతిలో ఆడుచూ, మరణమును, నరకమును, రోగమును మరియు సమాధిని జయించెను. అటువంటి జయశీలుడు ఎన్నడును లేడు మరియు ఎన్నడు ఉండడు.

పురుషులు మరియు స్త్రీలారా, మరియు నా సహోదరి మరియు సహోదరులారా, ఇదే సమయము, ఈ రాత్రి క్రీస్తు మన కొరకు విడిచిపెట్టిన దానిని సంఘము పట్టుకునే సమయము. “మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” మరియు ఆ ఖడ్గమును తీసుకొని మరియు త్యాగముతో తిరిగి ఆ పాత సువార్త వరుసలోనికి తిరిగి రండి, మన శత్రువును జయించుటకు బయలు వెళ్ళండి. అతడిని ప్రేమతో జయించండి, దానిద్వారానే అది, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లుగా ఆయనను అనుగ్రహించెను.”

18

ఆయన భూమిపై ఉన్నప్పుడు, ఆదాము యొక్క జాతికి చాలా భయములు ఉండేవి. మరియు అది నిజము, వారు ఇంకనూ వాటిని కలిగియున్నారు, కానీ వాటిని వారు కలిగియుండ కూడదు. ఆర్నాల్డ్ వాన్ వింకిల్ రీడ్ ఒక్కసారే వారందరి కొరకు యుద్ధము ముగించినట్లుగా, మరియు క్రీస్తు కల్వరి యొద్ద అందరి కొరకు ఒక్కసారే జయించియున్నాడు.

ఆయన ఇక్కడ భూమిపై ఉన్నప్పుడు, ఆయన ఒక రోగి యొద్దకు నడిచి వెళ్ళాడు, ఆ రోగము మానవజాతిని బంధించినది, మరియు ఆయన చెప్పాడు, “ఓ దెయ్యపు ఆత్మా నేను నిన్ను గద్దిస్తున్నాను, ఆ వ్యక్తిలో నుండి బయటకు రా.” ఆయన దెయ్యమును జయించెను. ఒక వ్యక్తి చనిపోయి సమాధిలోపడియున్నప్పుడు, ఆ వ్యక్తి కొరకు ఆయన మరణమును జయించెను, లేక రోగమును, ఆ దెయ్యములు పట్టినవాడు ఆయనను నాశనము చేయుటకు వచ్చినప్పుడు, మరియు ఆయన దేవుని కుమారుడని అతడు గ్రహించియున్నాడు; అతడు ఆయనతో చెప్పాడు, “ఓ, ఒకవేళ నీవు మమ్ములను బయటకు వెళ్ళగొట్టినట్లయితే, మమ్ములను ఆ పందుల మందలోనికి పంపించుము.” ఏలయనగా యేసుక్రీసు కలిగియున్న అధికారమును అతడు ఎరిగియున్నాడు. ఆయన ఆ దెయ్యమును కలుసుకున్న ప్రతీ చోటా దానిని జయించాడు. మరియు ఆయన తనకు తాను జయించుట మాత్రమే కాదు గానీ, సంఘమునకు ఆజ్ఞను విడిచిపెట్టియున్నాడు, “నా నామములో మీరు ఏది అడిగినను, దానిని నేను చేతును.”

19

మీ చేతులలో ఏమున్నదో దానితో పోరాడండి. ఒకవేళ అది పాటలు పాడడమైతే, సువార్తను పాడండి. ఒకవేళ ఈల వేయడం తప్ప మరేమి మీకు చేతకాకపోతే, దేవుని యొక్క మహిమ కొరకు నీవు ఎంత గట్టిగా ఈల వేయగల్గిగితే అంత గట్టిగా వేయి. ఒకవేళ నీకు చప్పట్లు కొట్టడం తప్ప మరేమి రాకపోతే, వాటినికొట్టు. నీ చేతిలో ఏదైతే ఉన్నదో దానితో జయించు. నీ పొరుగు వారందరూ నిన్నుప్రేమించునంతగా, ఆ చప్పట్లను కొట్టు. సంఘశాఖల వారందరూ నీవు క్రీస్తుకు చెందియున్నావని ఎరుగునంతగా ఈలను వేయి. వారిని జయించు; ఆటను నిజాయితీగా ఆడు. సరైన రీతిలో ఆడు.

ఈ సాంఘిక సువార్త ఆధిపత్యము చేయుచున్న దినములలోమనము జీవిస్తున్నాము, సంఘములన్నీ వాటంతట అవి కలిపి ఐక్యమగుచూ మరియు ఒక సాంఘికమైన మతమును ఏర్పాటు చేయుచున్నాయి, మరియు కలిపి అవి కట్టబడుచున్నవి; ఇది ఒక భయంకరమైన దినము. వారు దైవత్వమునంతటినీ తీసివేయుటకు ప్రయత్నించుచూ, మరియు క్రీస్తుయొద్ద నుండి మహిమను తీసివేసి మరియు ఆయనను కేవలము ఒక ప్రవక్తగా చేయుటకు ప్రయత్నించుచున్నారు. ఒకవేళ క్రీస్తు కేవలము ప్రవక్తే అయితే, మనలో ప్రతీ ఒక్కరూ నశించినట్లే, ఆయన ప్రవక్త కన్నాఎక్కువైనవాడు, మరియు ఈ రోజు.

20

కొంత కాలము క్రితము ఒక స్త్రీ నాతో చెప్పినది; “సహో బ్రెన్హాం, నీ ప్రసంగమును గూర్చి నాకు నచ్చనిది ఒకటి ఉన్నది,” అని అన్నదామె.

మంచిది, “అది ఏమిటి, సహోదరి?” అని నేను అడిగాను.

మరియు ఆమె అన్నది, “నీవు ఎక్కువగా క్రీస్తును ఘనపరచుటకు ప్రయత్నించెదవు; ఆయనపై నీవు ఎక్కువ సమయము తీసుకొనెదవు. ఆయన ఏమైయున్నాడో దాని కన్నా ఆయనను ఎక్కువ చేసెదవు.”

“ఒకవేళ నేను పదివేల భాషలు కలిగియున్ననూ, అవన్నియు నాకు సరిపోవు, మరియు ఆయన వాస్తవముగా ఏమైయున్నాడో అను దానిని ఎన్నడూ వివరించలేను. ఆయన సమస్త స్తుతులకు యోగ్యుడు,” అని అన్నాను.

ఆమె చెప్పినది, “బ్రెన్హాం నీవొక మత ఛాందసవాదివని వేదిక యొద్ద నుండి చెప్పడం నేను విన్నాను.”

“వాక్యానుసారము, అవును,” అని నేను అన్నాను.

“ఆయన కేవలము మనుష్యుడే అని, ఒకవేళ నేను నీకు వివరించి మరియు వాక్యము ద్వారా రుజువు చేయగలిగితే, మరియు నీవు ఆయనను దేవునిగా చేయుటకు ప్రయత్నించుచున్నావు,” అని ఆమె చెప్పినది.

నేను అన్నాను, “ఆయన దేవుడు,” “దేవుడు క్రీస్తులో ఉండి, లోకములో తనను తాను సమాధానపరచుకొనుచున్నాడు,” అని అన్నాను. నేను చెప్పాను, “ఒకవేళ ఆయన ప్రవక్తే అయితే, మనమందరము నశించిపోయినట్లే.”

“ఒకవేళ బైబిల్ నుండి ఆయన కేవలము మనుష్యుడు అని నేను రుజువు చేయగలిగితే, నీవు దానిని అంగీకరించెదవా?” అని చెప్పినదామె.

“సరేనమ్మా ఒకవేళ బైబిలు దానిని చెప్పినట్లయితే,” అని నేను అన్నాను.

ఆమె చెప్పినది, “యోహాను సువార్త 11వ అధ్యాయములో ఆయన లాజరు యొక్క సమాధి యొద్దకు వెళ్ళినప్పుడు, బైబిలు చెప్పెను, ”ఆయన ఏడ్చెను,“ మరియు ఒకవేళ ఆయన దేవుడైతే, ఆయన ఏడ్వలేడు. కనుక అది ఆయనను ఏదో కాదు కానీ కేవలము ఒక సామాన్యమైన మానవునిగా చేసినది.”

21

నేను చెప్పాను, “సహోదరి, నీ వాదన సరిగా లేదు. నేను చెప్పాను, ”నీవు చూచుటకు విఫలమయ్యావు. నీవు మనుష్యుని చూచావు, కానీ ఆ మనుష్యునిలో ఉన్న దేవుని చూచుటలో నీవు విఫలమయ్యావు.“ నేను చెప్పాను, అది సత్యము. ఆయన లాజరు యొక్క సమాధి దగ్గరకు వెళ్ళినప్పుడు, ఆయన ఒక మానవుని వలె ఏడ్చుచుండెను, కానీ ఆ చిన్నభుజములను కలిపి వెనుకకు లాగుకొన్న ఆయన, మరియు చనిపోయిన ఆ వ్యక్తి ముఖముపైన చూచి, అది చనిపోయి మరియు అతడి ప్రాణము నాలుగు దినముల ప్రయాణము చేసినది, మరియు ఆయన చెప్పెను, ”లాజరూ, బయటకు రా.“ ఆ చనిపోయిన మనుష్యుడు తిరిగి తనకాళ్ళపై నిలిచెను; అక్కడ మాట్లాడుచున్నది ఒక మానవుని కన్నా ఎక్కువైనది. ఆయన ఒక శక్తివంతమైన జయశాలి. అది దేవుడు తన కుమారునిలో నుండి మాట్లాడుట.

మరియు ఆయన ఒక మానవుడు, ఆయన పర్వతము పైనుండి దిగి వచ్చుచున్నప్పుడు, ఆరాత్రి, ఆకలితో, తినుటకు ఏమియూ లేదు, మరియు తినుటకు ఏదో ఒక దానిని కనుగొనుటకు అంజూరపు చెట్లు చుట్టూ చూచెను. ఆకలి వేసినప్పుడు ఆయన మానవుడైయున్నాడు, కానీ ఎప్పుడైతే ఆయన ఐదు రొట్టెలు మరియు రెండు చిన్న చేపలను తీసుకొని అయిదు వేల మందిని పోషించెనో, అది మానవుని కన్నా ఎక్కువైనది. అది దేవుడు తన కుమారునిలో ఉండి మాట్లాడుట, క్రీస్తుయేసు, మానవునిలో ఉన్న దైవత్వము.“

22

అది - నిజముగా ఆయన మానవుడై యున్నాడు, ఆయన ఆ చిన్న దోనె వెనుక ఉన్నప్పుడు, ఆ రాత్రి ఆ సముద్రము యొక్క పదివేల దెయ్యములు ఆయనను ముంచివేయుదమని ప్రమాణము చేసినప్పుడు . అది ఒక మహాసముద్రము పై సీసా బిరడా వలె తలక్రిందులగుచున్నది. మరియు ఆ దెయ్యము, చూస్తూ, చెప్పెను, “ఇప్పుడు, ఆయనను మేము పట్టుకున్నాము.” కానీ ఆయన లేచినప్పుడు, దోనె అమరమున తన పాదమును నిలిపి, పైకి చూచి మరియు చెప్పెను, “నిమ్మళించుము,” మరియు ఆ అలలు మరియు ఆ గాలులు ఆయనకు లోబడెను. ఆయన దానిని చేసినప్పుడు, ఆయన మానవుని కన్నా ఎక్కువైనవాడు.

సిలువ యొద్ద దయ కొరకు ఆయన పిలచుచున్నప్పుడు, ఆయన ఒక మానవుడు. ఆయన ఒక మానవుని వలె చనిపోయెను, కానీ ఈష్టరు ఉదయమున, ఆ రోమను ప్రభుత్వపు ముద్ర పగులగొట్టబడి మరియు సమాధి ఖాళీ అయినదో, ఆయన తిరిగి లేచియున్నాడు. ఆయన ఒక మానవుని వలె చనిపోయి యుండవచ్చుకానీ దేవుని వలె మరలా ఆయన తిరిగి లేచెను. ఆయన దైవ - మానవుడు.

ఆ కవి ఈ విధముగా చెప్పటలో ఆశ్చర్యములేదు:

జీవిస్తూ, ఆయన నన్ను ప్రేమించెను; చనిపోతూ, ఆయన నన్ను రక్షించెను;

పాతి పెట్టబడి, ఆయన నా పాపములను దూరముగా కొనిపోయెను.

లేపబడి, మరి నిత్యమూ ఆయన నీతీకరించెను.

ఒక రోజు, ఆయన వచ్చుచున్నాడు. ఓ! మహిమకరమైన రోజు.

ఆ గ్రుడ్డి ఫాన్నీ క్రాస్ బే అరుచుటలో, ఆశ్చర్యము లేదు,

ఓ మంచి రక్షకుడా, నన్ను దాటిపోవద్దు,

నా దీనమైన మొర్రను ఆలకించుము;

ఇతరులందరిపై నీవు పిలచుచున్నావు,

నన్ను దాటిపోవద్దు.

నీవే నా సౌకర్యమంతటికీ వాగువై యున్నావు,

నాకు జీవము కన్నా ఎక్కువ,

నీవు కాకుండా ఈ భూమిపై నేనెవ్వరిని కలిగియున్నాను,

లేక ఆ పరలోకములో ఎవ్వరిని కలిగియుండెదను కానీ నిన్ను తప్ప.

23

ఆయన మానవుని కన్నా ఎక్కువ; ఆయన దేవుని యొక్క శక్తివంతమైన జయశాలి. ఓహ్, ఎలా, ఆయనను ప్రేమించగలము, ఆయనను ఎలా స్తుతించగలవు, ఏవిధముగా మనము ఒకరికొకరము ప్రేమించుకొనగలము, ఆయన మనలను ప్రేమించినట్లుగా, మరియు మన కొరకు తన్ను తాను అప్పగించుకొనెను, రోగమును, మరణమును, నరకమును జయించిన ఆయన ద్వారా మనము మరింత జయశిలులుగా ఉండాలని.

ఈ భూమిపై ఒక జయశాలిగా ఆయనను మనము చూచెదము, ఆయన సమాధి ప్రక్కన నిలబడి మరియు ఆ మనుష్యునిలోని మరణమును జయించుట మనము చూచాము. ఆయన ప్రాణము నాలుగురోజులు ప్రయాణము చేసెను; ఆయన ఎక్కడ ఉన్నాడో నాకును తెలియదు; మీకును తెలియదు. కానీ ఆయన ఎక్కడైతే ఉన్నాడో, దానిని ఆయన జయించెను, వెనుకకు తీసుకొని వచ్చెను. క్షయత దాని యజమానుని ఎరుగును. ఆమెన్. మరియు ఈ మనుష్యుని ప్రాణము చనిపోయెను, తిరిగి వచ్చి మరియు ఒక మర్త్య శరీరములో మళ్ళీ జీవించెను, మరియు ఒక బల్ల యొద్ద కూర్చొని మరియు తినెను. మరియు అంతకు ముందెన్నడూ ఏ మానవుడు దానిని చేయలేకపోయెను. ఆయన దేవుని యొక్క శక్తివంతమైన జయశాలి.

24

ఆ రోగము... ఆయన ఎన్నడూ సమాధి కార్యక్రమమును బోధించలేదు. మరణము ఆయన సన్నిధిలో నిలువలేదు. ఏ విధముగా మరణము మరియు జీవము కలిపి నివసించగలవు? అవి చేయలేవు. ఆ కారణమునుబట్టే ఈ రోజు, సహోదరుడా, దేవుని యొక్క ఆత్మ ద్వారా ఒక సంఘము తిరిగి జన్మించినప్పుడు, మరణము మరియు జీవము కలిపి ఉండలేవు. ఏదో జరుగును. క్రీస్తు వచ్చి మరియు మన అభిరుచులను జయించును; ఆయన మన కోరికలను జయించును. మనపైన ఉన్న దైవీకము కాని అన్నీటినీ ఆయన జయించును. మరియు ఎందుకనగా ఆయన జీవించుచున్నాడు కాబట్టి, మనమునూ జీవించెదము. దైవీకము కాని వాటన్నిటినీ ఆయన జయించును. ఆయన ఇప్పటికే దానిని చేసెను, మనము దానిని స్వీకరించునట్లుగా అది మన చేతుల యొద్ద పడియుండెను.

ఈ భూ-సంభంధమైన పరిచర్యలో ఆయనను మనము ఒక జయశాలిగా చూచియున్నాము. ఖచ్చితముగా, మనము చూచాము. కానీ ఇప్పుడు, ఆయన మరణించిన తరువాత ఇప్పుడు ఆయనను గమనించండి. ఆయన ఇంకనూ జయించుచూ వెళ్ళెను. ఆయన సమాధి యొద్ద ఆగిపోలేదు. బైబిలు చెప్పెను, “ఆయన ఆత్మ చెరలోనికి వెళ్ళి మరియు పూర్వము నోవహు దినములలో కనిపెట్టుచుండినప్పుడు అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి బోధించెను.”

25

భూమ్యాకాశములు నల్లగా మారడము, పర్వతములపై నుండి బండలు దొర్లిపడడము వంటి వాటిగా నేను ఆయనను చూచాను. ఆకశాములన్ని, చంద్రుడు, నక్షత్రములన్నీ ప్రకాశించుటకు తిరస్కరించెను. ఆయన దానిని జయించెను. మరియు ఆయన క్రిందకు వెళ్ళినపుడు, క్రిందకు దిగి, మరియు ద్వారమును తట్టెను, అక్కడ నశించిన ఆత్మలు ఉండెను, మరియు ఆ ద్వారములు తెరువబడినప్పుడు, మరియు హానోకుని చూచి నవ్వి మరియు అపహాస్యము చేసిన ఆ ప్రజలు, నోవహును చూచి అపహస్యము చేసినవారు ఆయన ఈ విధముగా చెప్పుటను నేను వినుచున్నాను, “హనోకు చెప్పినట్లుగా, తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చువాడను, నేనే! మీరు హనోకును ఎందుకు నమ్మలేదు? నీవు నోవహును ఎందుకు నమ్మలేదు?”

ఆయన జయించియున్నాడని ప్రతీది తెలిసికొనవలయును. ఆయన వారిపై ద్వారమును మూసివేసినప్పుడు, కృపా దినములు గతించిపోయెను పాతాళము యొక్క అంచుల వరకూ ఆయన వెళ్ళెను. మరియు దెయ్యము యొక్క పాతాళపు ద్వారములను ఆయన తట్టెను.

మరియు ఆ దెయ్యము ద్వారము నొద్దకు వచ్చెను, మరియు గమనించుటకు మనము చూచిన ఎడల, అక్కడ అతడు చెప్పియున్నాడు, “మంచిది, దానంతటి తరువాత, ఇక్కడ నీవున్నావు. ఖచ్చితముగా నేను నిన్ను పట్టుకొనెదను అని తలంచాను, నేను ఆ ప్రవక్తలను చంపినప్పుడు, ఆ చెరసాలలో యోహాను యొక్క తలను నేను నరికివేసినప్పుడు, ఖచ్చితముగా నిన్ను నేను పట్టుకొనియున్నానని తలంచాను. కానీ ఇప్పుడు, దానంతటి తరువాత, నీవు ఇక్కడ ఉన్నావు.”

26

ఆయన చెప్పడము నేను వినగలుగుచున్నాను (తనను తాను నిలువు చేసికొని), చెప్పెను, “సాతానా, నేను కన్యక ద్వారా జన్మించిన సజీవ దేవునియొక్క కుమారుడను. ఆ సిలువపై నా రక్తము ఇంకా తడిగానే ఉన్నది (ఆరిపోలేదు). నేను వెల చెల్లించియున్నాను. నేను జయించియున్నాను, మరియు దానిని తీసుకొనుటకు నేను క్రిందకి వచ్చియున్నాను, నీవు దేనినైతే కలిగియున్నావని ఆరోపించుకొనుచున్నావో దానినంతటినీ నీ నుండి లాగివేసుకొనుటకు.” అతడి ప్రక్కకు వచ్చి మరియు మరణము యొక్కయు, పాతాళము యొక్కయు తాళపుచెవులను లాగివేసుకొనెను, అతడు ఏ స్థలమునకు చెందినవాడో అక్కడకి తన్నివేయబడెను. ఆయన పాతాళమును జయించెను. ఆయన లేచినప్పుడు, మరణము యొక్కయు, పాతాళము యొక్కయు తాళపు చెవులు ఆయన ప్రక్కన వ్రేలాడుచుండెను.

మరప్పుడు సంఘము దేనికి భయపడుచున్నది? ఆమెన్. ఆయన సాతానును జయించెను; ఆయన రోగమును జయించెను; ఆయన మరణమును జయించెను; ఆయన పాతాళమును జయించెను. ఆయన తన యొక్క మార్గములో ఉన్నాడు. గుర్తించుకొనండి, మరి కొంతమంది విశ్వాసులు కూడా వెళ్ళియున్నారు. వారు పరదైసు అనే స్థలములో ఉన్నారు. వారు దేవునియొక్క ప్రసన్నతలోనికి (సన్నిధి) వెళ్ళలేరు, ఎందుకనగా వారు గొర్రెలు మరియు మేకలు మరియు అటువంటి వాటి యొక్క చిందించబడిన రక్తము క్రింద ఆరాధించిరి. అది ఎన్నడూ పాపమును తుడిచిపెట్టలేదు; అది కేవలము పాపమును కప్పియున్నది.

మరియు అది ఈ రోజు ఆ విధముగానే ఉన్నది, స్నేహితుడా, నీ పాపములను నీవు కప్పియుంచి మరియు లోపలికి వెళ్ళలేవు; అవి పూర్తిగా విడిచిపెట్టబడవలసి యున్నవి. మరియు దానిని చేయగలిగినది ఒకే ఒక సంగతి ఉన్నది: అది నీ సంఘము కాదు. అది నీ నీటి ద్వారా ఇవ్వబడిన బాప్తిస్మము కాదు. ఆ పాపములను కప్పి మరియు తుడిచిపెట్టగలిగినది యేసుక్రీస్తు యొక్క రక్తము మాత్రమే. అక్కడ జయించుటకు కావలసినది ఒకే ఒక్కటున్నది, అది యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మాత్రమే.

27

మరియు అది ఆదివారము ఉదయము సుమారు నాలుగు గంటల సమయమని చెప్పెదము. శారా మరియు అబ్రహాము పరదైసు గుండా చుట్టూ నడుస్తూ ఉన్నారు. మరియు ఒక్కసారిగా, ద్వారమునొద్ద తట్టుచున్న ఒక శబ్దము వచ్చుచున్నది. మరియు యోబు ద్వారము నొద్దకు వెళ్ళాడు, మరియు ఎవరు తట్టుచున్నారో చూచుటకు అతడు ద్వారమును తెరచుచున్నాడు, ఉదయకాలమున దినము యొక్క ఈ సమయములో వచ్చుచున్నాడు. మరియు అతడు చూస్తూ, తనచేయి పైకెత్తి ఆయన చెప్పాడు, “ఆయనే నా విమోచకుడు, ఆ మెరుపు మెరుయుచున్నప్పుడు వెనుక నేను అచ్చట చూచియున్నాను. ఆయన జీవించుచున్నాడని నాకు తెలుసు, మరియు చివరి దినములలో, ఆయన భూమిపై నిలుచును. అది ఆయనే.”

అబ్రహాము చెప్పాడు, “యోబు, నీవేమి చెప్పెదవు” అతడు తన భుజముకు పైగా చూసుకొని, చెప్పెను, “శారా, ఇక్కడకు రా, ఇటు చూడు. ఈ ఉదయమున, ద్వారము నొద్ద ఎవరున్నారో చూడుము.”

“ఎందుకు,” శారా చెప్పెను, “నేను గుడారములో ఉండి నవ్వగా, తన వీపును నా వైపునకు త్రిప్పిన వాడాయెనే, మరియు దానిని ఆయన ఎరిగియుండెను. అవును అదే. అది ఆయనే.”

28

ఇక్కడ దానియేలు పరిగెత్తుకుంటూ వచ్చెను, మరియు శారా భుజములకు పైగా చూస్తూ. అతడు చెప్పాడు, “అదే ఆ రాయి, చేతి సహాయము లేకుండా పర్వతముపై నుండి తీయబడుట నేను చూచాను.”

మరియు అప్పుడే, యెహేజేలు పరుగెత్తుకొనుచూ వచ్చాడు; అతడు చెప్పాడు, “ఆ మధ్యాకాశములో, తిరుగుచున్నట్టు నేను చూచిన ఆచక్రము మధ్యలో చక్రము అదే.”

ఆ శక్తివంతమైన జయశాలి అడుగో, ఓహ్, మై, అప్పుడు మనము వినినట్లుగా, చెప్పెను, “పిల్లలారా, రండి, మీరు కొన్ని విషయములలో నమ్మకస్తులైయున్నారు. రండి, ఈ ఉదయకాలమున మనము బయటకు వెళ్ళుచున్నాము. మీరు ఇక్కడ ఉండి చాలా కాలమైనది. మనము ఎత్తుకు వెళ్ళిపోవుచున్నాము.” ఓహ్, దేవా, అదే సంఘము యొక్క కోరికగా ఉండును గాక. మనము ఎత్తుకు వెళ్ళిపోదాము. ఐగుప్తులో నుండి మన యొక్క కర్రలను లాగివేద్దాం.

29

అబ్రాహాము చెప్పాడు, “తండ్రి, మేము కొంచెము ఒక చిన్న ఈల వేయునంత సేపు ఆగెదెమా, మేము వెళ్ళుచుండగా? నేను ఆ పాత స్థలములను చూచుటకు ఇష్టపడుచున్నాను.”

“ఖచ్చితముగా, నలభై దినముల వరకు నేను నా శిష్యులతో మాట్లాడబోవుచున్నాను. కొంతసేపు చుట్టూ చూడుము.”

మీకు తెలుసు, ఆయన పునరుత్థానము తరువాత, లేఖనము చెప్పుచున్నది అనేక మంది పరిశుద్ధులు లేచెను, పట్టణములోనికి వెళ్ళి అనేక మందికి అగుపడెను. అబ్రహాము మరియు శారా పట్టణము గుండా వెళ్ళుచూ, “అది ఆశ్చర్యముగా లేదా?” చెప్పెను, “శారా, ఆ పాత స్థలముల వైపు చూడుము.” ఓహ్, మై, నిజమైన ఆత్మసంబంధమైన దానిని ఇప్పుడే నేను అనుభూతి చెందుచున్నాను. నిజముగా నేను చెందుచున్నాను. “దానిపై చూడుము. దావీదు పట్టణమదిగో, ఆ అందమైన స్థలములన్నీ అవిగో. నేను నిర్మించిన బలిపీఠములు అవిగో. ప్రభువు యొక్క నామము దీవించబడును గాక.”

30

నలభై దినముల తరువాత, ఆయన నిలబడి, తన చివరి ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, “సమస్త సృష్టికి వెళ్ళి మరియు సువార్తను ప్రకటించుడి [సంఘములు నిర్మించుట కాదు, సంస్థలను తయారుచేయుట కాదు, కానీ సువార్తను బోధించుట; మనము వ్యతిరేకముగా చేసితిమి]. నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును. నా నామములో వారు దెయ్యములు వెళ్ళగొట్టుదురు. ”మరియు అటువంటివి, ఆయన చెప్పుచూ వెళ్ళుచున్నాడు.

ఆయన మాట్లాడుచుండగా, భూమ్యాకర్షణశక్తి జయించబడెను. అనేక మంది సహోదరులు గమనించుచుండగా, ఆయన పాదముల క్రింద వెలుగాయెను. మరియు ఆయన పైపైకి వెళ్ళిపోవడం ప్రారంభించాడు, పైకి కొనిపోబడుతూ, ఆయన మరియు పాత నిబంధన పరిశుద్దులు, మహిమలోనికి వెళ్ళిపోవుచున్నారు. వారు నక్షత్రములకు పైగా, చంద్రునికి పైగా, నక్షత్రములన్నిటికి పైగా వెళ్ళిపోయెను. మరియు ఆ గొప్ప పట్టణము కనిపించేటంత వరకూ వచ్చిరి. ఓ! యేసు ముందుగా నడుచుచుండగా, ఆ శక్తివంతమైన జయశాలి వలె, ముందుకు నడుచుచూ, అది ఏ విధముగా ఉండును.

మరియు హరాత్తుగా, ఆ పాతనిబంధన పరిశుద్ధులు ఆ గొప్ప పెద్ద అందమైన పట్టణము చూచేటంతగా వచ్చిరి, మరియు పరలోకమంతా కదిలేనటువంటి ఒక గొప్ప పేలుడు వంటి శబ్దముతో వారు అరిచారు. “గుమ్మములారా, మీ తలలుపైకెత్తికొనుడి, మహిమ గల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి!”

31

మీకు తెలుసా, వారు చెప్పారు, హిట్లర్ ఫ్రాన్స్ను జయించినప్పుడు, అతడు ఆ విజయ చిహ్నము దగ్గర నిలబడి, ఆ జర్మను సైనికులు ఎన్నో మైళ్ళ దూరము కవాతు చేస్తుండగా, మరియు ఆ విమానములన్నీ ఆకాశమును నింపివేసేను. ఆ ఫ్రాన్స్ దేశములోనికి హిట్లరుయొక్క గొప్ప రాకను వారు వేడుక చేసుకొనుటకు అందరూ అక్కడ ఉండిరి. వారు ఏ విధముగా స్టాలిన్ను జర్మనీకి తీసుకొని వచ్చిరి, కానీ ఓ సహోదరుడా, ఆ దినమున సంఘము యేసును తీసుకొని వచ్చినప్పుడు: “మహిమ గల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి మరియు పైకెత్తుకొనుడి,”

మరియు ఆ దూత చెప్పెను, “ఈ మహిమ గల రాజు ఎవడు?”

మరియు ఆ పాత నిబంధన పరిశుద్ధులు, కేకలు వేసెను, “సైన్యములకథిపతియగు ప్రభువు, పోరాటములో శక్తిమంతుడు, గొప్ప జయశాలి. ఆయన చెరను చెరగా కొనిపోయి మరియు జనులకు వరములిచ్చెను.” ఆయన దానిని చేసెను అని బైబిలు చెప్పెను.

32

గృహమునకు స్వాగతించుటను గూర్చి నీవు మాట్లాడుచున్నావు? ఆ గొప్ప ముత్యములు గల ద్వారము పైన దూతలన్నీ ఆవరించియుండగా, అవి తెరవబడుచూ, మరియు యేసు, ఆయన వెనుక పాతనిబంధన పరిశుద్ధులతో, మహిమ యొక్క వీధుల గుండా, పాడుచూ “యేసు నామము యొక్క శక్తి అంతటితో,” మరియు ఆ తండ్రి సింహాసనము ఎదుటకు ఆయన వచ్చెను, మరియు “తండ్రి, ఇదిగో వీరు కొద్ది విషయములలో వీరు నమ్మకస్తులై యున్నారు,” అని చెప్పెను.

ఆయన చెప్పెను, “కుమారుడా, లేవుము, మరియు నీ శత్రువులనందరినీ నీ పాదపీఠముగా చేయు వరకు ఇదిగో కుడిపార్శ్వమున కుర్చొనుము.” అక్కడ ఆయన నిలబడియున్నాడు, ఈ రాత్రి.

అదిగో, ఆ శక్తివంతమైన జయశాలి;

అదిగో, ఆయనను స్పస్టముగా చూడుము;

ఏలయనగా ఆయన శక్తివంతమైన జయశాలి,

ఆ తెరను రెండుగా ఆయన చింపినప్పటినుండి.

33

మన ప్రభువైన యేసుక్రీస్తు జయించినట్లుగా ఎన్నడూ ఏదీ లేదు. ఈ రాత్రి ఈలోకమునకు కావలసినది ఏమనగా, కొంత వాస్తవము. ఈ రాత్రి ఈ లోకమునకు కావలసినది ఏమనగా, ఏదో అయివున్న అది కావాలి. క్రైస్తవులలో ఈ లోకము చూడాలనుకొంటున్నది ఏదనగా, అది ఒక నిజమైనది. సంఘము ఆటలాడిన దానిని చూసి వారు అలసిపోయారు. వారు విసుగు చెందినంతగా అలసిపోయియున్నారు. “నేను ప్రెస్బెటేరియన్ వాడిని,” “నేను మెథడిస్టును,” “నేను కాథలిక్కును,” “నేను పెంతుకొస్తువాడిని,” “నేను నాజరీస్ వాడిని.” ఈ లోకము ఆకలిగొనుచున్నది దాని కొరకు కాదు. వారు నిజమైన జీవపు రొట్టె కొరకు ఆకలిగొనియున్నారు.

యేసు చెప్పెను, “మీరు లోకమునకు ఉపైయున్నారు, కానీ ఒకవేళ ఈ భూమి తన సారము కోల్పోతే - లేక ఆ ఉప్పుతన సారము కోల్పోతే, అది దేనికి పనిచేయదు కానీ బయటకు విసిరివేయబడును.”

ఉప్పు తాకబడితే అది సారవంతమగును. మీరు ఉప్పై యుండుడి; లోకము దాహముగొనును. ధైర్యముగా నిలబడు స్త్రీ, పురుషులను అనగా నిజమైన పురుషులు మరియు స్త్రీలను దేవుడు మనకిచ్చును. నీ గొలుసులో ఉన్న నీ బలహీనమైన బంధమే (Link) నీ బలమైన స్థలమై యున్నది. అది ఆ గొలుసుకు చెప్పును, మిగతా విషయములన్నీ ఎంత బలముగా ఉన్నప్పటికీ, ఒక్క స్థలములో ఉన్న ఆ బలహీనతే, అదే మనము కప్పుకొనవలసియున్నది.

34

ఇక్కడ, కొంతకాలము క్రితము. మీ అందరికీ తెలుసు, నేనొక వేటగాడిని. ఆటలో చంపుటకు కాదు, అక్కడ ఉండుటకు వెళ్ళెదను - దేవున్ని చూచుటకు, ప్రకృతిలోనికి బయటకు వెళ్ళెదను. కొన్నిసార్లు ఆ ఇందనపు వాసన పీల్చుట మరియు సిగరెట్లు వలన నేను చాలా బలహీనపడి మరియు అలసిపోయెదను, దాదాపుగా అది నిన్ను వాంతు చేసుకునేలా చేస్తుంది. ఎక్కడో ఆ పర్వతముపైన ఆయన ఆలయములోనికి వెళ్ళుటకు నేను ఇష్టపడుచున్నాను, అక్కడ ఒంటరిగా, విమానపు మోటార్లు మరియు అటువంటి వాటి యొక్క శబ్దములు వినకుండా, కానీ ఆ చెట్ల పైగుండా వీచుచున్న ఆ గాలుల ద్వారా గుసగుసలాడుచున్న ఆ నిత్యదేవుని యొక్క స్వరమును వినుటకు. నాకు అదే దేవుడు. ఓ, దానియందు ఏదో వాస్తవము ఉన్నది.

35

నా స్నేహితుడైన బర్ట్ కాల్తో కలిసి ఆ ఉత్తరమున ఉన్న అరణ్యములో వేటాడుచూ ఉండేవాడిని. కొద్ది దినముల క్రితము నేను అతడిని కలిసాను, మరియు అతనితో కరచాలనము చేసాను, మరియు అతడితో కలిసి భోజనము చేసాను, నేను ఆ క్రొత్త ఇంగ్లాండులో ఉన్నప్పుడు, ఆదేశములో అక్కడ, ఆ స్వస్థతా ఉజ్జీవములో మరియు ఒక రోజు...

మరియు ప్రతీ వేసవి ముగింపులో, నేను వేటాడుటకు అక్కడకి వెళ్ళేదను, మరియు ఒకరోజు పైకి వెళ్ళుచూ, నేను బర్ట్ తో మాట్లాడుచున్నాను మరియు నేను చూచిన వారందరిలో అత్యుత్తమమైన వేటగాళ్ళలో అతడు ఒకరు నేను . నీవు ఎన్నడూ అతడిని గూర్చి చింతించవలసిన అవసరము లేదు; అతడు ఎచ్చట ఉన్నాడో మీరు తెలుసు కొనెదరు. మీరు అతడిని వెతక వలసిన అవసరం లేదు; ఆ అరణ్యములో అతడు ఎక్కడ ఉన్నాడో అతడికి తెలుసు. అతడొక మంచి వేటగాడు, కానీ నాకు తెలిసినంతలో మిక్కిలి స్వార్థపరుడు. అతడు ఎంతగా ఉండగలడో అంత క్రూరుడు. నన్ను బాధపరచుటకు, అతడు చిన్న జింక పిల్లలను కాల్చుటకు ఇష్టపడతాడు.

36

ఇప్పుడు టెక్సాస్ బాలురైన మీరు, ఇక్కడ వేటగాళ్ళయిన మీరు, ఒక జింకపిల్లనుచంపుట మంచిదే. ఒకవేళ ఆ చట్టము మీద ఒక జింకపిల్లను చంపవచ్చు అని చెబితే. అదిమంచిదే. ఆ జింక ఎంత వయస్సు కలది అన్నది కాదు. అబ్రహాము ఒక దూడను వధించాడు, మరియు దేవుడు దానిని తిన్నాడు అది సరే. కనుక వాటిని చంపుట యందు ఏ హానీ లేదు. అది కచ్చితముగా సరియే. కానీ ఒక హంతకునిగా ఉండుట, అది వేరైనది.

అది నీకు అర్ధము కాలేదా? ఆయన అలానే చేశాడు. ఆయన దూడను తిని, ఆవు యొక్క పాలు త్రాగాడు, మరియు కొన్ని జొన్నరొట్టెలు తిన్నాడు. అది ఖచ్చితముగా నిజము. పాలు చిలకగా వచ్చిన వెన్నను తిన్నాడు ఖచ్చితముగా ఆయన తిన్నాడు. మరియు దేవుడు దానిని చేశాడు, మరియు అబ్రహాము ముందే అదృశ్యమైపోయాడు.

“అది దూత” అని మీరు చెప్పవచ్చు. అబ్రహాము అది దేవుడే, ఎలోహిం అని చెప్పాడు. అది నిజము. అది దేవుడే. ఓ,నేను చాలా ఆనందిస్తున్నాను, దానిని ఆయన తన చేతిలో పట్టుకున్నాడు. ఎంత గొప్పవాడవు నీవు.

37

ఎవరో నాకు చెప్పారు, “సహో, బ్రెన్హాం, అది దేవుడు అని నీవు నమ్ముచున్నావా?”

నేను చెప్పాను, “ఖచ్చితముగా, అది దేవుడే.”

“అది... మన గొప్ప సృష్టికర్త?”

ఆయన కేవలము.... మనమందరము పదహారు మూలకముల ద్వారా చేయబడ్డాము. ఆయన అలా క్రిందకు వచ్చి మరియు కొంత చమురును, సూర్య కాంతిని, మరియు అణువులను తీసుకొని ఒక చిన్న శరీరములో “ఉఫ్..ఫ్” అని ఊదాడు, దానిలో ప్రవేశించాడు, మరియు తన దూతలను దానిలో పెట్టి, మరియు అబ్రహాము దగ్గరకు నడిచి వచ్చాడు. ఖచ్చితముగా మాంసమును తిన్నాడు, మరియు ఆకలిగొన్నాడు, మరియు తన దృష్టి నుండి అదృశ్యమైపోయాడు. అదే దేవునికి తెలుసు నేనెక్కడ పాతిపెట్టబడతానో ఆయనకు తెలుసు మీరెక్కడ పాతిప్టెబడతారో.

38

ఎంతోకాలం క్రితము కాదు, నాకు మిగిలియున్న ఈ రెండు లేక మూడు వెంట్రుకలను దువ్వుకొనుచున్నాను. నా భార్య ఆ వెనుక కూర్చొని, ఆమె చెప్పినది, “బిల్లీ, నీకు బట్టతల వచ్చియున్నది.”

నేను చెప్పాను, “కానీ దానిలో ఒక్కదానిని కూడా నేను కోల్పోను.”

ఆమె చెప్పినది, “అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? నాకు చెప్పు.”

నేను చెప్పాను, “నేను వాటిని పో౦దుకోవడానికి ముందు, అవి ఎక్కడ ఉన్నాయి? అవి నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి; ఒకరోజు నేనువాటి దగ్గరకు వెళ్ళతాను.” అవి ఉన్నాయి. నీ శిరస్సుపై ఉన్న ప్రతీ వెంట్రుక లెక్కించబడినది; మరియు వాటిలో ఒక్కటి కూడా నశించిపోదు. ఒక చిన్న పిల్లవానిగా ఉండదలచిన ఈ చేతులు, సువార్త ప్రసంగించుట ద్వారా వ౦గిపోయిన ఈ భుజములు, ఒక రోజు ఆయన స్వరూపములో చేయబడిన చిత్రములోనికి తిరిగి వచ్చును, ఆయన స్వరూపములో, ఆయన రక్తములో కడుగబడి, ఆయనకృప ద్వారా విమోచింపబడి, నేను లేచి నిలబడెదను. అవును, వాస్తవంగా. మరియు మరణమందు భయము లేదు. ఇదిగో ఆయన వచ్చెను.

39

మరియు ఒక రోజు, నేను బర్ట్ దగ్గరకు వెళ్ళాను, మరియు అతడు తన కొరకు ఒక ఈల (ఊల) చేసికొనియున్నాడు. మరియు అది ఒక చిన్న జింకపిల్ల యొక్క ఏడ్పు వలె ఆ చిన్న ఈల మ్రోగునట్లుగా అతడు చేశాడు. నేను చెప్పాను, “బర్ట్, దానిని ఉపయోగించవద్దు?”

అతడు చెప్పాడు, “ఓ, బిల్లీ, నీకు నీవు ప్రక్కకు తప్పకో. నీవు ఒక కోడిపిల్ల- హృదయము కలిగిన ప్రసంగీకుడవు. మీ అందరితోను అదే సంగతి అయి ఉన్నది.” చెప్పాడు, “నీవొక మంచివేటగాడవు, కానీ తేలికైన హృదయము కలవాడవు.

నేను చెప్పాను, “బర్ట్, నేనొక వేటగాడిని, కానీ ఒక హంతకుడను కాదు. నివు దానిని చేయుట చూడడము నాకు ఇష్టము లేదు.” నేను చెప్పాను బెర్ట్, దానిని ఉపయోగించవద్దు.“

అతడు చెప్పాడు, “ఒవ్, పో.”

ఆ ఉదయమున మేము వేటాడడము ప్రారంభించాము, దాదాపుగా ఆరు అంగుళముల మంచు, ఏ వేటగాడికైనా తెలిసినటుగా మంచి వాతవరణము. మరియు మరియు మేము వేతాడాము- నేను కాలమునకు (వేటాడే కాలము) కొంచము ఆలస్యం అయ్యాను, నేను అక్కడకి వెళ్ళేముందు, నేను కొద్దిగా కూడికలలో ఉన్నాను, మరియు ఆ ఉదయమంతా వేటాడిననూ ఏమియూ దొరకలేదు, ఎందుకనగా ఆ తెల్లతోక కలిగిన జింకలు, ఆ పైన వాటికి ఏ విధముగా దాగుకొనవలేనో నిజముగా తెలుసు. మరియు ప్రత్యేకించి పగటిపూట, అవి వెళ్ళిపోతాయి.

40

మరియు అది రమారమి మధ్యాహ్న సమయము, ఎందుకు, ఈ మనకు సుమారుగా సగము సైజులో ఉన్న ఒక చిన్న పొద బయటకు బర్ట్ కూర్చొని ఉన్నాడు, మరియు అతను అక్కడ కూర్చొని ఉన్నాడు. అతడు ఒక కాఫి జగ్గును (Jug) తీసుకొనుచున్నాడని నేను తలంచాను, లేక అతడు - మేము త్రాగేది కాఫీ కాదు కానీ, అది వెచ్చని చాక్లెట్ యొక్క జగ్గుయై (ద్రవ రూపములో) యున్నది. మరియు అతడు తన చాక్లెట్లు యొక్క జగ్గును తీకొనబోవుచున్నాడని నేను తలంచాను, మరియు మేము కొన్ని శాండ్విచ్లను కలిగియున్నాము, అప్పుడు మేము వేరుపడి మరియు తిరిగి వేటాడెదము ఎందుకనగా ఉదయమంతా మేము ఒక గుంపును కూడా చూడలేదు. జింకలు బయపడి పోయాయి. అవి ఉదయమంతా గడ్డిపొదల క్రింద మరియు దట్టమైన చెట్లమొదల్లో ఉంటాయి. కనుక మీరు వాటిని కనుగొనలేరు.

41

మరియు అతడు అక్కడ కూర్చొని ఉండగా, నేను అతడిని గమనించాను, అతడు తన జేబు నుండి తీయుచుండగా, నేను లేచి నిలబడ్డాను. మరియు అతడు ఈ చిన్న ఈలను బయటకు తీసియున్నాడు.

నేను అనుకొన్నాను, “ఖచ్చితముగా, బర్ట్, నీవు దానిని చెయ్యవు.” మరియు ఆ బల్లికళ్ళ యొక్క చూపుతో అతడు నావైపు చూచి, మరియు అతడు చెప్పాడు - నవ్వాడు, మరియు దానిని ఊదటం ప్రారంభించాడు. నేను చెప్పాను, “బర్ట్, దానిని చెయ్యవద్దు.”

కానీ దానిని అతడు ఊదినప్పుడు, అలా, నా దగ్గర నుండి ఇరవై గజముల దూరములో, ఒక గొప్పపెద్ద తల్లి జింక నిలబడినది. ఇప్పుడు, అది ఒక ఆడ జింక. ఎందుకు, అది చాలా దగ్గరగా ఉన్నది నేను దాని యొక్క పెద్ద గోధుమరంగు కళ్ళను చూడగలుగుచున్నాను, మరియు ఆమె ముఖములో ఆ నరములు, అందముగా కనబడు జంతువు, దానిచెవులు లేచి నిలబడెను. అది ఏమిటి? అది ఒక బిడ్డ ఏడుపు.

మరియు నేను బర్ట్ వైపు క్రిందకు చూచాను, మరియు అతడు తిరిగి పైకి నావైపు చూచెను; నేను తలంచాను, “బర్ట్, నీవు దానిని చేయవు. ఖచ్చితముగా, నీవు చేయవు.”

42

మరియు తిరిగి చాలా తేలికగా దానిని అతడు ఊదాడు. మరియు సాధారణముగా, రోజు యొక్క ఆ సమయములో ఒక జింక ఆ విధముగా నిలబడుట చాలా అసాధారణము. మరియు అది తిన్నగా ఆపొద యొద్దకు నడుచుచున్నది. ఓహ్, అవి ఎన్నడూ ఆ విధముగా చేయవు. మరియు అది బయటకు నడిచినది కనుక నీవు అది కనబడునట్లుగా.

మరియు నేను ఆ తుపాకీని విన్నాను, ఆ 30.06 పైన, ఆ మీటను అతడు వెనుకకు లాగగా, ఆ నూట ఎనభై పుట్టగొడుగు లాంటి బుల్లెట్ అక్కడ ఉన్నది. మరియు అతడు ఖచ్చితమైన గురి కలవాడు (నేర్పరి). మరియు ఆ విధముగా అతడు తుపాకీని గురిపెట్టినప్పుడు, నేను తలంచాను, “ఓ, దేవా, ఖచ్చితముగా అతడు చేయడు. ఆ నమ్మకమైన తల్లి, అది ఆటలాడు సంఘముగా లేదు; ఆమెలో ఏదో నిజమైనది ఉన్నది. ఆమె ఒకతల్లి ఒక బిడ కష్టములో ఉన్నది. ఆమె ఆ విధముగా నటించుట లేదు. ఒక నిజమైన, వాసవమైనదేదో దానిలో అది కలిగి ఉన్నది. ఆమె ఒక తల్లి, ఆమె ఆ విధముగా నటించుటలేదు. ఎదో అమెను ఆ విధముగా చేయునట్లు చేయుచున్నది. అది ఎందుకనగా ఆమె ఒక తల్లి.”

43

మరియు అది కొన్ని అడుగులు ముందుకు నడిచినది. నేను అనుకొన్నాను, “ఓ, బర్ట్, ఆ విధముగా నీవు దాని యొక్క గుండెను ప్రేల్చెదవా?” నాకు తెలుసు ఒకవేళ ఆ తుపాకీ గనుక కాల్చబడితే, అతడు ఆ నమ్మకమైన హృదయాన్ని రెండు వైపుల నుండి పేల్చివేయును. ఎందుకు దగ్గర అది ఉండుట ద్వారా అతడు అది వెనుదిరుగుటను మార్చి చేయగలడు. “ఆ ప్రశస్త తల్లి, తన బిడ్డ కొరకు వెదకుచున్నది,” అని నేను తలంచాను.

మరియు ఆ జింక చుట్టూ చూస్తూ మరియు ఆ వేటగాడిని చూచినది. ఆమె వణికినది, కానీ, ఆమె పరుగెత్తుకొని పోలేదు, లేదు. ఆమె ఒక తల్లి. ఆమె అక్కడ నిలబడినది. ఆ బిడ కష్టములో ఉన్నది. ఓ! అది ఎంత వాస్తవమైనది.

నేను నా తలను త్రిప్పుకొన్నాను; ఇక ఏ మాత్రము నేను దానిని చూడలేకపోయాను. నేను అనుకొన్నాను, “దేవా, అతడు దానిని చేయుట నేను చూడలేను, ఆ దీన ప్రశస్తమైన తల్లిని చంపుట, మరియు అక్కడ దానితో అది - ఆమెలో ఉన్న ఏదో ఆమెను నడిపించుచున్నది, ఒక తల్లి.” మరియు ఆ తుపాకీ కాల్చబడుటను వినగోరాను. నేను నా వెనుకకు తిరిగిపోయాను నేను అనుకొన్నాను, “దేవా, అతడు దానిని చేయునట్లుగా అనుమతించవద్దు,” నేను ఒక్క క్షణం ఎదురు చూచాను; నాకు ఆ తుపాకీ వినబడలేదు. నేను చుట్టూ చూచాను, మరియు తుపాకీ ఆ విధముగా పోవుచున్నది. అతడు దానిని చేయలేకపోయెను.

అతడు చుట్టూ చూచెను, అతని చెంపల పై నుండి పెద్ద కన్నీళ్ళు క్రిందకి కారుచుండెను. అతడు తుపాకీని నేలపై విసిరివేసి మరియు నా కాలికి ఉన్న ఫ్యాంటుతో నన్ను గట్టిగా లాగుకొనెను; అతడు చెప్పాడు, “బిల్లీ, నేను ఇప్పటి వరకూ చాలా చేసాను. నీవు మాట్లాడుచున్న యేసు యొద్దకు నన్ను నడిపించు. ప్రేమను తీసుకొని వచ్చే క్రీస్తును నేను ఎరిగియుందును గాక.”

44

అది ఏమిటి? అతడు నిజమైనదేదో చూచాడు. ఏదో పెట్టబడకుండా ఉన్నదానిని (తయారు చేయబడకుండా ఉన్నది) అతడు చూచాడు. వేషధారణ వలె ఉండకుండా ఉన్నదానిని అతడు చూశాడు. వాస్తవమైనదాన్ని ఏదో అతడు చూశాడు. మరియు అక్కడ ఆ మంచు గుట్టపై, నేను ఆ క్రూరమైన వేటగాణ్ణి -హృదయముకల వేటగాడిని ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు నడిపించాను, మరియు ఒక మధురమైన దీన క్రైస్తవునిగా మారిపోయెను. ఎందుకు? బోధ (Preaching) అంతయూ దానిని చేయలేకపోయెను. అది, అతడు నిజమైనదేదో చూచియున్నాడు.

ఓ, సజీవ దేవుని సంఘమా, ఈ రాత్రి ఈ ప్రపంచము ఏదో నిజమైన దాని కొరకు చూచుచున్నది. మరణమును నీవు ఎదుర్కొని నిలబడగలిగేలా, కావలసినంత క్రీస్తును నీ హృదయములో కలిగియుండుటను నీవు ప్రేమిస్తావా? కనీసము రోగులైన మీరు, రోగముతో ఉన్నవారు, జీవించినా లేక మరణించినా, ఆయన యొక్క వాక్యమందు ఆయనను తీసుకొనెదవా, ఆయన వాక్యముపై నిలబడెదవా? నీవు ఈ వ్యత్యాసములు కలిగిన నీవు, మరియు ఈ చిన్న ఇబ్బందులన్నీ మరియు శాఖాపరమైన అవరోధములన్నీ నీవు వీధిలో నడుస్తూ ఉన్నప్పుడు, ప్రదర్శించుటకు ఏదో ఒక దానిని నీవు కలిగియుండుటను ప్రేమించవా,“ఒకవేళ దైవ సంబంధమైన పురుషుడు లేక స్త్రీ ఎవరైనా ఉన్నారంటే అదిగో అక్కడ వెళ్ళుచున్నాడు,” అని స్త్రీ పురుషులు చెప్పుట. ఏదో నిజమైనది, ఒక జీవితము అది చెబుతుంది.

45

ఒక్క క్షణం, దీనిని మనం తలస్తూ ఉన్నప్పుడు, మన తలలు వంచుదాం. అది ఏమిటి? ప్రేమ ఆ వేటగాడిని జయించినది (స్వాధీనపరచుకొన్నది). దేవుని ప్రేమ జయించును. ఈ రాత్రి, ఈ భవనములో, మీరు ప్రేమించెదరా, మీరు చేసెదరని నాకు తెలుసు. ఇక్కడున్న అందరూ, వారి హృదయములలో చాలా నిజముగా క్రీస్తును కలిగియుండుటను ప్రేమించెదరా, కేవలము క్రీస్తే నిజముగా మీకు వాస్తవముగా ఉండును, తన బిడ్ల కొరకు ఆ తల్లి యొక్క ప్రేమ వలె. మీ చేతులను మీరు పైకెత్తగలరా, నిశ్శబ్దముగా, మనము ఎదురుచూచుచుండగా? నీవు ఎంతకాలము నుండి క్రైస్తవుడుగా ఉండినప్పటికీ పరవాలేదు, కేవలము నేను నిన్ను అడగగోరుచున్నాను. దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. అది మంచిది. చుట్టూ, వందలాది చేతులు.

“ప్రభువా, నాలో చేయుము... ప్రభువా, ఒక స్త్రీ వలె లేక ఒక పురుషుని వలె, నేను లేచెదను గాక, ఒక పరిశుద్ధుని వలె నేను లేచెదను గాక, ఒక నిజమైనదానిగా ఉండుట కొరకు నా కుర్చీలో నుండి నేను లేచెదను గాక. మరియు, దేవా, నా హృదయములో నుండి బహుగా ఉన్న నీ ప్రేమను కనుపరచులాగున చేయుము, ఆ క్రూర-హృదయము కలిగిన పాపులు వెంబడించుటకు, మరియు ఒక మాదిరిగా నన్ను గమనించుటకు, మరియు కల్వరి యొద్దకు నన్ను వెంబడించును.”

46

ఇంకా ఎవరైనా ఉన్నారా, మేము ఎదురుచూచుచుండగా, ఒక్క క్షణం? మీ చేతులు పైకెత్తండి. నాకు తెలుసు -కొద్దిసేపటి క్రితం తమ చేతులు పైకెత్తని వారు. దేవుడు నిన్ను దీవించును, సహోదరి. యవ్వన స్త్రీ, దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును, హనీ. అది మంచిది. అక్కడ వెనుక, ప్రభువు నిన్ను దీవించును. ఇప్పుడు ఆ బయట, మీ చేతులు పైకెత్తి చెప్పండి, “దేవా...”

చూడు స్నేహితుడా, “సహోదరుడా, బ్రెన్హాం, అది ఏమి వ్యత్యాసమును చేయుచున్నది?” అని మీరు చెప్పవచ్చు. ఓ, స్నేహితుడా, ఇక ఎంతమాత్రము చల్లగా మరియు బిగుతుగా ఉండవద్దు. మనము ఎక్కడ నిలబడి యున్నామో గ్రహించెదము. మన చేతులు పైకెత్తి, చెప్పుదము దేవా, నాయందు దయ చూపించుము, ఒక పాపి, నేను నిన్ను దీవించును, ఇక్కడ ఇటు ప్రక్కన. కొంతసేపటి క్రితము నేను నిన్ను చూడలేదు. ఇక్కడ వెనుక, ప్రభువు నిన్ను దీవించును. నిజమైన నీతిగా ఉండు.

47

నీవు చెబుతావు, “ఓ, సహో, బ్రెన్హాం, నేను బాషలలో మాట్లాడాను; నేను అరిచాను.” అది మంచిది. దానికి వ్యతిరేకముగా నాకు ఏమియూ లేదు; అవి దేవుని కార్యములై యున్నవి. కానీ చూడుము, స్నేహితుడా, దానితో వెళ్ళుటకు నీవు ప్రేమను కలిగిలేనట్లయితే, ఎవ్వరూ నిన్ను నమ్మరు, ఎవ్వరూ నిన్ను నమ్మరు. అది ఆశ్చర్యము. నేను దానిని నమ్మెదను, కానీ అది కలిగిలేకుండా కూడా నీవు ప్రేమను కలిగియున్నావు, వారు నిన్ను త్వరగా నమ్మెదరు. అది సరియే. నీవు నిజమైన దేవుని ప్రేమను పొందుకో, ఈ సంగతులు వాటంతట అవే జరుగుతాయి, కానీ మొదటగా దేవున్ని పొందుకో, దేవున్ని పొందుకో, ఆ నిజమైన సంగతిని పొందుకో. ఆ చెట్టును పొందుకో, దాని యొక్క ఫలమును అదే ఫలించును.

ఇప్పుడు ఎవరైనా తమ చేతిని పైకెత్తగలరా, కొద్దిసేపటి క్రితము, ఎత్తని వారు, “దేవా, నా యందు దయ చూపించుము,” అని చెప్పండి. ఆయన అక్కడే నిలబడి నీ వైపు చూస్తూ ఉన్నాడని నీవు తలంచుట లేదా? దేవుడు నిన్ను దీవించును, యవ్వన సహోదరి అది మంచిది. చిన్న స్త్రీ ఇక్కడ, బహుశా దేవుడు నిన్ను దీవించును, స్త్రీ ఇక్కడ కూర్చొని ఉన్నది. మీరు కలిగియుండే ఆఖరి అవకాశము ఇదే కావచ్చు. వెనుక ఉన్న ఆ చిన్న బాలికను దీవించుము, ఒక చిన్న బుడతడు, అతడి యొక్క చిన్న హృదయమును దీవించుము.

“దానిగూర్చి ఆ బిడ్డ ఏమి ఎరిగియున్నది?” అని చెబుతావు.

యేసు చెప్పెను, “చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు; దేవుని రాజ్యము ఈలాటివారిదే.”

48

అక్కడ చేతులు పైకెత్తిన, సహోదరీ, దేవుడు నిన్ను దీవించును. యవ్వనస్తుడా, దేవుడు నిన్ను దీవించును. అది మంచిది. హనీ, వేరే చిన్న బాలుడు, నీలో నుండి ఒక చిన్న బోధకుడను దేవుడు తయారు చేయాలని నేను ప్రార్థిస్తాను. ఇప్పుడు, నిజమైన నిశ్శబ్దము. దానిని గూర్చి ఆలోచించండి. ఒకవేళ ఇదే నీ చివరి రాత్రి అయితే ఏమిటి? దీని తరువాత నీకు ఎటువంటి అవకాశము ఉండదు. నీవు ఈ జీవాన్ని విడిచిపెట్టినప్పుడు, అది అంతా ముగుయును. చాలా సంవత్సరములు నీవు వ్యర్ధము చేసియుండవచ్చు, ఇప్పుడు అది ఏమిటి? ఈ రాత్రి ప్రారంభించెదము. స్త్రీ దేవుడు నిన్ను దీవించును. ఒక్క క్షణం ఎదురుచూచుట బహుశా నీకు చాలా ఎక్కువగా అనిపించవచ్చు. నీవు మరణములో నుండి జీవము వరకూ దాటియున్నావు. నీ చేతిని నీవు దేవుని వైపు ఎత్తి మరియు చెప్పుము; మరియు ఒకవేళ దేవుడు ఇక్కడ, నీలో ఏదో దానిని సృష్టించకపోతే చూడుము. ఖచ్చితముగా, ఆయన చేయును.

సహోదరీ, దేవుడు నిన్ను దీవించును, అక్కడ ఉన్న యవ్వన స్త్రీ, కేవలము యవ్వనస్తురాలు. ఈ అపహస్యమైన రాక్ అన్ రోల్, బూగీ-ఊగీ కాలములో ఇప్పుడే క్రీసుకు సేవ చేయుటకు ఒక యవ్వన బాలిక తన చేతులను పైకెత్తెను, దేవుడు నిన్ను దీవించును, యవ్వన స్త్రీ నీకు నీవుగా దానిని చేయలేవు. క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు; మరియు నా యొద్దకు వచ్చు వారందరికీ, నేను నిత్యజీవమిచ్చెదను, అంత్య-దినమున నేను వానిని లేపుదును.”

వేరే చేయి? దేవుడు ఆ యవ్వన స్త్రీని దేవుడు దీవించును, ఆమె ప్రక్కగా ఆమె చిన్నస్నేహితురాలు కూర్చొని ఉన్నది.

49

“దానర్ధము ఏదైనా ఉన్నదా?” అని నీవు చెప్పవచ్చు. నీ చేయి నీవుపైకెత్తినప్పుడు, నీవు ఏమి అర్ధము చేసుకున్నావో దానిపై అది ఆధారపడును. మనము చిన్న ఆచారములు, మరియు దీనిని చేయు చిన్నసంగతులను కలిగియున్నామని నేను ఎరుగుదును, లేక మరొకటి, కానీ యేసు దీనిని చెప్పెను; “ఆయన (వ్యక్తిగత సర్వనామము) ఎవడైతే నా మాటను విని, మరియు నన్ను పంపిన వానియందు విశ్వాసముంచునో, అతడు నిత్యజీవమును (అది దేవుని యొక్కసొంత జీవము) కలిగియున్నాడు (వర్తమాన కాలము), మరియు ఎన్నడు తీర్పులోనికి రాక, కానీ అతడు మరణములో నుండి జీవమునకు దాటియున్నాడు (భూతకాలము).” అదే ఆయన చెప్పెను.

బలిపీఠము యొద్దకు నీవు పరిగెత్తగోరుచున్నావా, నీ కుర్చీ దగ్గర మోకాళూనగోరుచున్నావా, నీ చేయి పైకెత్తగోరుచున్నావా, నీ సమర్పణను ఎక్కడ నీవు చేయగోరుచున్నావు, అది ఏమియూ కాదు. నీ కుర్చీ దగ్గర మోకాళ్ళూనినప్పుడు, లేక నీ చేయి పైకెత్తినప్పుడు నీవు కలిగియుండగోరిన స్థితి అదే. నీవు దేవుని గూర్చి ఏమి తలంచావు, మరియు నీవు ఏమి అనుకొనుచున్నావు అదంతయూ అదే.

50

మనము ప్రార్ధించే ముందు, ఇంకనూ ఎవరైనా ఉన్నారా? దేవుని యొక్క అవసరత కలిగియున్న అందరూ, దేనికొరకైనా మీ చేయి పైకెత్తండి ఇప్పుడే, “దేవా నా యందు దయ చూపించుము; నాకు నీ అవసరత ఉన్నది.” దేవుడు నిన్ను దీవించును. దేవుడు దయచూపించును గాక. ఇప్పుడు దానిని గూర్చి ఆలోచించు; బహుశా ఇది నీ చివరి ఘడియ కావచ్చు.

దేవుని చిత్తమైతే, రేపు రాత్రి, లేక మరుసటి రాత్రి, గోడ మీద చేవ్రాత అనుదాని పై ప్రసంగించగోరుచున్నాను, ఆకాశములో(రోదసిలో) రాకెట్లు, దేవున్ని కాలము యొక్క అంతమునకు తీసుకొనివచ్చుచున్నది (లాగచున్నది).

........నా కొరకు చిందించబడెను,

మరియు అది నన్ను నీ యొద్దకు తీసుకొనివచ్చుచున్నది,

ఒకవేళ కృపను మరియు తీర్పు నుండి నిన్ను వేరుచేయుచున్న చివరి గడియ ఇదే అయిన ఏమవును?

.....నేను వచ్చాను.....

నీ చేయిని పైకెత్తగలవా? “దేవా, నా యందు కృప చూపించుము.” దేవుడు నిన్ను దీవించును, వెనుక అక్కడ, యవ్వనస్తుడు, నీ చేయి క్రింద పెట్టి ఏడ్చుచున్నావు. సందేహము లేదు ఆ వృద్ధ తల్లియొక్క ప్రార్ధనలు నీ కొరకు వెళ్ళినవి, కుమారుడా, దేవుడు నిన్ను వినియున్నాడు. ఆయన నిన్ను చూసాడు. ఆయన నీ ప్రక్కగా నిలబడియున్నాడు. నీ చేయి పైకెత్తమని చెప్పినది ఆయనే.

51

మేము ప్రార్ధించే ముందు, ఎవరైనా? యదార్ధముగా దేవుడు నిన్ను దీవించును, యవ్వనస్తుడా, నేను గమనించాను, ఆ వరుస గుండా, ఒక యవ్వన స్త్రీ తన చేయి పైకెత్తినది. ఇప్పుడు, ముగ్గురు యవ్వనస్తులు వరుసలో కూర్చొని, ఆ వరుసలో మరొకరు మిగిలియున్నారు, ఇప్పుడు, క్రీస్తు కొరకు తన చేయి పైకెత్తనివారు. “ఓ, దేవా, ఏదో నిజమైన దానిని, నాలో తయారు చేయుము.”

ఓ స్నేహితుడా, బహుశా మీరొక సంఘానికి చెందియుండవచ్చు, అది-అది కేవలము-ఒక సంఘానికి చెందియుండుట మంచిది, కానీ ఓహ్, మై, ఒకవేళ మీరు తిరిగి జన్మించకపోతే, మీరు నశించిపోతారు. చూశారా? దాని గూర్చి ఆలోచించండి. యేసు జయించెను; యుద్ధము చేయుట కొరకు ఆయన నీ చేతికి ఏదో దానిని ఇచ్చును. మరొకసారి ఇప్పుడు, మనము ప్రార్ధించే ముందు. సరైన నిర్ణయము తీసుకొన్నావన్న నిశ్చయతను కలిగియుండుము. ఒకవేళ నీవు నీ చేయి ఎత్తితే, నీవు కలిగియున్నావని నీకు తెలుసు. ఒకవేళ లేకపోతే. ఇక్కడ ఉన్న ఆ చిన్న స్త్రీని దేవుడు దీవించును. హనీ, నిన్ను దీవించును, అంతా సరియే.

ఎక్కడో ఆ వెనుక, అవును, ఒక చిన్న యవ్వన బాలిక. ప్రియ సహోదరి, దేవుడు నీకు ఆశ్చర్యకరుడుగా ఉండును గాక. ఇప్పుడు నిజమైన గౌరవముతో మన యొక్క తలలు వంచుదాము. ప్రతీ ఒక్కరూ ప్రార్ధనలో.

నేను సహోదరుడు, సెరుల్లోను అడుగగోరుచున్నాను, ఒకవేళ అతడు నా కొరకు ఇక్కడకు వచ్చి ప్రార్ధనలో నడిపించమని. నా గొంతు గొంగురు పోతున్నది. ప్రతీ ఒక్కరూ, మీ తలలు వంచి, ప్రార్ధించండి మరియు దేవుడు మీతో ఉండును గాక.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...