నీవు తప్పక తిరిగి జన్మించవలెను

నీవు తప్పక తిరిగి జన్మించవలెను

vgr count -123 ... మాట్లాడుకొనుచూ, ప్రతి ఒక్కరూ ఒక మంచి సమయం కలిగి ఉన్నారు, మరియు దానియందు నేను ఆనందించుచున్నాను, మరియు తరువాత ఆ విధంగా ఏదో చెప్పవచ్చును.

[సహోదరుడు మాట్సన్-బోజ్ మాట్లాడుచున్నాడు.]

ఈ ఉదయవేళలో, రోడు దిగువకు వచ్చుచూ నేను ఆలోచించుచున్నాను; నేను అల్పాహారం కొరకు ఆలస్యమయ్యాను.

మేము పదిమైళ్ళ దూరంలో పల్లె ప్రాంతములో ఉంటున్నాము. కేవలం నేను ఎన్నిసార్లు ఆలస్యంగా వచ్చాను ఆలోచించుట జరిగినది. మీకు తెలుసా, నా వివాహము కొరకు కూడా నేను ఆలస్యమయ్యాను, వారు నా కొరకు ఎదురుచూస్తు మరియు ఎదురుచూస్తూ ఉన్నారు. మరియు ఇప్పుడు నేను నా సమాధికి ఆలస్యము కాగలను.

[ఎవరో అన్నారు, “అయినప్పటికీ, మీరు పెళ్ళి చేసుకున్నారు.”]

నేను వివాహం చేసికొన్నాను, అవును.

2

సరే, ఆ విధంగా ఇక్కడ ఉండుట మంచిది, మరియు కేవలం ఇక్కడ కొద్ది సమయం, ఈ సహవాసంలో ఉండుటకు, ముందుగా నేను ఈ ప్రశ్న అడుగుటకు ఇష్టపడుచున్నాను. నా పరిచర్య ఒక స్థలం నుండి మరియొక స్థలానికి బలంగా ముందుకు నెట్టుకొనుచూ మరియు పొంగిపొర్లుతున్నటువంటి ఒక సంగతి అయి ఉన్నది. మరియు వెళ్ళి ప్రజలను కలియుటకు మరియు వారి చేతులతో కరచాలనం చేయుట ఎలాటి బాధ, అసౌకర్యం నాకు కల్గించుచున్నవో ఏ ఒకరికీ తెలియదు. గత రాత్రి నేను చెప్పినట్టుగా, ఒక స్త్రీ భోజనం తినుటకు ఆమె తన ఇంటికి నన్ను ఆహ్వానించినది; ఆహా, నేను ఊహించగలను, నేను అసలైన మంచివైన కొన్ని పాత ధాన్యములు (బార్లీ, ఓట్లు మొదలైన ధాన్యాలతో చేసిన ఆహారం) కలిగి ఉందును, మరియు అవి దక్షిణాది వంటకము చేయుటకు తీసుకొనవలయును. కాని నీవు దానిని ఎలా చేయనైయున్నావు. చూడండి, మీరు చేయలేరు.

3

కనుక నేను ఈ ఉదయవేళలో ఆలోచించుచున్నాను, అది ఇక్కడ ఒక అద్భుతమైన సమయం అయి ఉన్నది. గతరాత్రి రోగుల కొరకు ప్రార్ధించుట గూర్చి నేను చెప్పాను. మరియు బిల్లీ మధ్యాహ్నమందు వచ్చి, మరియు అతడు సాధారణంగా చుట్టూ ఉన్న యవ్వన ప్రజలు మరియు ప్రతి వ్యక్తితో వారికి చేయినిచ్చి కరచాలనం చేయును. మరియు అతడు వెనుకకు వచ్చి, “నాన్నా, ప్రార్ధించబడుట కొరకు అక్కడ చాలమంది ప్రజలున్నారు,” అని చెప్పాడు.

ఇప్పుడు కూడికలో వలె నేను ఆ ప్రజల కొరకు ప్రార్ధించకపోవుటకు కారణమేదనగా.... నేను ఇప్పుడే డల్లాస్ విడచి వచ్చాను; మీరందరూ డల్లాస్ ను గూర్చి మాట్లాడుకొనుచున్నారు. మరియు ఈ విధమగు కన్వెన్షనులు, బోధించుటకే నేను ఎక్కువగా ప్రయత్నించేదను, మీరు చూడండి, ఎందుకనగా ఆ దర్శనముల నుండి విశ్రాంతి తీసికొనుటకు అది నాకు ఒక అవకాశం ఇచ్చును. నన్ను చీల్చివేసేవి దర్శనములు అయి ఉన్నవి.

అయితే దీని తరువాత నాకు ఇంకా రెండు కూడికలున్నాయి, మరియు అప్పుడు నేను ఒక మంచి పూర్తి విశ్రాంతి తీసుకొననై ఉన్నాను. కేవలం నేను అది కలిగి ఉండవలెను. కేవలం నాకుగా నేను అనుభూతి చెందుచున్నాను.... మరియు గత దినమున నేను డల్లాస్ నొద్ద బలహీన నరాలతో సువార్త పొలము నుండి వెళ్ళిపోయిన మన సహోదరులు ఐదుగురిని చూచుటకు అక్కడ ఉన్నాను, రేమండ్ రిచి మరియు సహోదరుడు గ్రాంటు. మరియు నేను అతనితో మాట్లాడాను మరియు అతడు అక్కడ కూర్చుండి మరియు తనకు తానే నిగ్రహించుకొని మరియు ఏడ్చుచుండెను. మరియు మరొక వ్యక్తి ఈ విధముగా చేతులను బయటకు పెట్టి కూర్చుని మరియు నరముల బలహీనతతో అతడు కేకలు వేయుచూ మరి అలాగే ఉన్నాడు. మనం రంపపు పొట్టుతో చేయబడలేదని మీకు తెలియును; మనం ఇంకా మానవులమే అని మీకు తెలియును. మరి అలాగున, నేను డిసెంబరు నుండియూ విశ్రాంతి లేకయున్నాను, కనుక కేవలం నేను కొంత విశ్రాంతి తీసుకొనవలసి యున్నది.

4

మరియు నేను కూడికలు పూర్తి చేయుటను బట్టి సంతోషించెదను. ఏ విధంగా అయిననూ నేను మీయెడల బిగ్గరగా అరచిన దానిబట్టి మీరందరూ అలసి ఉన్నారని నేను ఊహించుచున్నాను. నేను వారిని గూర్చి మాట్లాడుతున్న పద్దతిని గూర్చి, సహోదరీలతో ఒక రాత్రి నేను సరి చేసుకొనవలెనని నేను ఆలోచించాను. అయితే అది (చూడండి) సహోదరిలైన మిమ్మును గూర్చి అది నా ఉద్దేశ్యం కాదని మీరు ఎరుగుదురు. మిమ్మును అనుకరించుచున్న వారిని గూర్చియే నా ఉద్దేశ్యమై ఉన్నది.

సరే, ఇక్కడ ఒక సంగతి ఉన్నది, ఆయన ఒక స్త్రీని చేసెనని ప్రభువు చెప్పెనని నేను నమ్ముచున్నాను... పురుషుడు స్త్రీని ఏలవలసి ఉన్నది. ఒక పురుషుడు నిన్ను దానిని చేయనిచ్చినంతకాలం అతడు దానిని చేయనివ్వండి మంచిది అప్పుడు, అది ఆ పురుషుని యొక్క పొరపాటు అయి ఉన్నది, అది కాదా? అది నిజము. ఏలువానికి వారు విధేయులుగా ఉండవలసి ఉన్నారు.

5

కాని, అది ఉన్నటువంటి దాని స్థితిలో సంఘమును చూచుట అది నాకు నిజమైన వింత భావన కలుగజేయుచున్నది. నేను సభ్యత లేనివానిగ ఉండుట నా ఉద్దేశ్యం కాదు అని మీరు ఎరుగుదురు. అయితే సేవకులు మరియు అందరూ చుట్టూ కూర్చుని ఉండగా నాకు ఒక అవకాశం వచ్చినప్పుడు, అది సరియైన ఒక పద్ధతిలో కన్వెన్షనులలో (చాలామంది కూడుకొను సమావేశాలలో) పెట్టుదును, వారు కూడ దానిని అలాగే ఉంచుటకు ప్రారంభించగలరు, మీరు చూడండి, కనుక అప్పుడు మనం అలా చేయగోరము. కేవలం దానితో మనస్తత్వ శాస్త్రానికి చెందిన ఒక చిన్న ముక్కను ఉపయోగించి, సేవకులు ప్రారంభించవలెను. మనం “అది ఇదే అయి ఉన్నది!” అని కేవలం మన తండ్రులు ఉపయోగించిన ఆ నియమాలు క్రింద ఉంచుటకు ఆ పాత కాలపు వరుసలోనికి మనం వెనుకకు వెళ్ళినయెడల, చూడండి, మరియు వారు దానిచే జీవించిరి, చూడండి. కనుక ఇప్పుడు మనకు అది అవసరము. సాతానుడు ఒక విధమైన యుక్తిగల శత్రువు, కేవలం అలా లోనికి కదలును... పాపము అలా ఉండును. (నేను ఏమి చెప్పెదను?), అది సభ్యతగా లేనిది, మీరు ఎరుగుదురు, అది యుక్తిగా ఉండును, కేవలం ఒక రకమైన మురికి పనులు... అదే ఆ పదము: యుక్తిగలది. కేవలం చాలా యుక్తిగలవాడు: కనుక అది తేలికగా సరిగా కదలును, మీరు ఎరుగుదురు; అది చాలా అమాయకముగా కనిపించును. మొదటి సంగతి, అది ఒక సాలి గూడెతో ఉన్న సాలీడు వలే ఉన్నది, నిన్ను పట్టుకొనును మరియు నీవు అక్కడకు వెళ్ళెదవు, అని నీవు తెలుసుకొనవలెను.

నేను ఒక సంగతిని గూర్చి ఆలోచించుచున్నాను, అది మార్గము యొక్క అంతము అయి ఉన్నది. బహుశ అది నా కొరకు చాలా దూరంగా లేదు; ఇక నేను బాలుడను కాను. మరియు ప్రజలందరిని మరలా కలియవలెనని నేను ఆలోచించుచున్నాను. ఒకసారి నా స్నేహితుడు నాకు చెప్పుచుండెను... వారు ఒక బహుమతిని ఇచ్చుచున్నారు; మరియు మనలో ప్రతి ఒక్కరికీ ఇది నిజముగా లోతుగా వెళ్ళవలెనని నేను కోరుచున్నాను.

6

బ్రిటిష్ కొలంబియాలో, వేంకోవర్ లో వారు 12 అంగుళాల వెడల్పున, ఒక 100 గజాల దూరం ఒక సైకిలు నడిపించగల ఒక బాలునికి వారు ఒక బహుమతి ఇచ్చుచున్నారు, వారు అతనికి ఒక కొత్త స్విన్ సైకిలును ఇచ్చెదరు. మరియు ఆ బాలురందరూ, వారు చక్కని స్వారీ చేయువారు అని వారు అనుకున్నారు. వారు వారి అమ్మ కొరకు పట్టణంలోనికి వెళ్ళి మరియు ఒక సంచి కూరగాయలు తీసుకొని మరియు దానిని చేతి కింద ఉంచి మరియు వెనుకకు నడిపిస్తూ మరి ఎన్నడూ కూడ హేండల్ బారులు పట్టుకొనలేదు. కనుక ప్రతీ ఒక్కరూ ఈ పోరాటంలో అతడు గెలుచునని ఎరిగి ఉండెను.

వారికి అక్కడ ఆడదాని వలె ఉన్న ఒక చిన్న బాలుడు ఉండెను, కేవలం అది అమ్మ యొక్క బాలుని వలె అని మీకు తెలియును. వారిలో ఏ ఒక్కరూ వానిని గూర్చి ఏమాత్రం లెక్క చేయలేదు. కనుక వారందరు వారి యొక్క వారి నంబర్లు పిలువబడగా... స్వారీ చేయుటకు వారి బోర్డు మీద వారున్నారు. మరియు ఒక్కొక్కరూ పడిపోయారు. అయితే ఆడదాని వలే ఉన్న ఈ చిన్న బాలుడు ఎన్నడూ వాలకుండగ దానిని సరిగా చివరకు నడిపించెను.

కనుక బాలురందరూ అతని చుట్టుముట్టి మరియు అన్నారు, “నీవు అది ఎలా చేశావు?”

7

అతడు అన్నాడు, “అబ్బాయిలూ, నేను మీకు చెప్పెదను, అది ఇక్కడే ఉన్నది.” “మీరంతా ఏమి చేస్తున్నారో నేను గమనించాను, మరియు నేను మీ పొరపాటును చూశాను,” అని చెప్పాడు, చూడండి. “మీరు ఈ విధముగా కిందకు చూస్తున్నారు, అది బోర్డు మీద ఉండునట్లు ప్రయత్నించుచున్నారు. కేవలం నేను అంతమును గమనించి మరియు నిలకడగా పోనిచ్చాను.

నీవు అక్కడే ఉన్నావు, (చూడండి, చూడండి). ఉద్దేశ్యం అదే అయి ఉన్నది. ఇక్కడ ఏమి బాగున్నదో అది కాదు, అయితే అంతములో, తొణగకుండా, యేసు ప్రభువు వైపు చూచుట. ఇప్పుడు కొంచెం సేపు మనం ప్రార్ధించెదము.

ప్రభువా, మేము యేసును ఎప్పుడు చూడగలిగేదమా అని, అంతమువరకు మేము చూచునట్టు, మా మనస్సులు మీ మీద ఉంచుచున్నాము. మరియు ఇక్కడ ఈ కన్వెన్షన్ లో, ప్రభువా, ఇప్పుడు ఈ చక్కని సహోదరులు మరియు సహోదరీల గుంపువారు ఇక్కడ సహవాసం మరియు, అల్పాహార విందు కలిగి ఉండుటకు కలసి సమావేశమైనారు. మా తరువాత సమావేశ సమయం ఒక అల్పాహారము దగ్గర ఉండదని, కాని మాకు ఎలా అది ప్రభువు యొక్క పెండ్లి విందు అయి ఉండును అని తెలియును, నిత్యమూ ప్రభువు యొక్క సంతోషములను అక్కడ మేము పంచుకొందుము.

ప్రభువా, నెరసిన తలగలవారై మరియు వంగిన భుజములు గలవారై సంవత్సరాల నుండి బోధించుచు, ఈ ఉదయవేళ ఇక్కడ కూర్చుని ఉన్న ఈ మనుష్యులను దీవించండి. ఓ దేవా, వారు ఏమి త్యాగము చేసి దేనితో వెళ్ళుచున్నారో మీకు మాత్రమే తెలుసును. తండ్రీ, నేను నా హృదయమంతటితో ప్రార్ధించుచున్నాను, ఒకవేళ నేను మీ దృష్టిలో కృపను కనుగొని ఉన్నయెడల, ఈ సహోదరులను ఆశీర్వదించుము, ప్రభువా, ఇంకను వారికి గొప్ప పరిచర్యలు ఇవ్వండి, ప్రభువా, ఏలయనగా వారి పరిచర్య మరియు వారి ప్రత్యేకతలు, వారిలో ప్రతి ఒక్కరి అవసరత మాకు ఉన్నది. అది పరిశుద్దులు మరియు విశ్వాసులతో కూడిన మీ గొప్ప శరీరముగా తయారవుచున్నది. ప్రభువా, నేను వారి సహోదరుడుగ నిలబడి మరియు అదే రాజ్య సహపౌరుడుగ, ముందుకు కదలికొనసాగుటకు మమ్మును ప్రోత్సాహపరచునట్లు కొన్ని మాటలు మాట్లాడుటకు ఈ ఉదయకాలంలో మాకు సహాయం చేయండి. యేసు నామములో దానిని అడుగుచున్నాము. ఆమేన్.

8

నేను ఒక చిన్న అంశము మీద మీతో మాట్లాడుటకు ముందు, నేను ఆశ్చర్యపడుచున్నాను, నేను ఈ రాత్రి స్వస్థత పరిచర్యలు చేపట్టుటకు ప్రారంభించుచుండిన యెడల, ఆ పరిశుద్ధాత్మ ఎక్కువగా సంతోషించునని ఎంత మంది తలంచుచున్నారు. సంప్రదించుటకు నాకు సమయం లేదు. మరియు మనం కొన్ని ప్రార్ధనా కార్డులు ఇవ్వవలసియున్నది, ఎందుకనగా “ఈ గుంపువారు ఇక్కడకు రండి మరియు మీరు ఇక్కడకు రండి,” అని అలా చెప్పుటకు అక్కడ చాలమంది ప్రజలు ఉన్నారు. మేము ప్రార్ధన కార్డులు బయటకు ఇవ్వవలసి ఉన్నది. కనుక నేను సాధారణ ఆలోచన కలిగి ఉండునట్లుగా, ఆ తరువాత రెండు రాత్రులు స్వస్థతా పరిచర్య చేపట్టుటకు అది ఒక మంచి సంగతి అయి ఉండునని మీరు అనుకొనుచున్నారా? అది మనం, చూచెదము... మంచిది, మీకు వందనములు, అదంతయు సరే. ఇప్పుడు, తరువాత దానిని మనం చేయుదము.

అయ్యా, మీ మధ్యాహ్న కూడిక ఎప్పుడు అయి ఉన్నది? రెండు గంటలకు మంచిది, నేను మీకు చెప్పుదును. నేను లియోను పంపుదును... అతడు ఎక్కడ ఉన్నాడు? నేను ఊహించుచున్నాను అతడు, లియో మరియు జేన్ అక్కడ ఉన్నారు, బిల్లీ, లేక వారిలో కొందరు ఈ మధ్యాహ్నం ప్రార్ధనా కార్డు కోరు ప్రతి ఒక్కనికి ఇచ్చుటకు ప్రార్ధనా కార్డులతో ఉన్నారని అనుకుంటున్నాను. నేను ఈ రాత్రికి నా అంశములు మార్చి మరియు రోగుల కొరకు ప్రార్ధించెదను.

9

ఆ తరువాత కన్వెన్షనులో (చాలామంది హాజరగు సమావేశము) నేను బోధించగోరునది, “తన గూడును రేపు పక్షిరాజు.” నేను గత రెండు లేక మూడు సార్లు వచ్చినప్పుడు నేను దాని కొరకు ప్రయత్నించాను, మంచిది. ఇపుడు కేవలం నేను వాక్యము నందు ఆనందించుచున్నాను, మీరు అలా లేరా? కేవలం వాక్యము నందు ఆనందించుట... కనుక ఈ ఉదయం నేను పైకి గెంతి, నేను అన్నాను, “ఓ భార్య,” మరియు పిల్లలు దేశంలో చాలా మైళ్ళ దూరంలో ఉన్నారు, మరియు నేను వారి అల్పాహారం తీసుకొనుటకు వెనుకకు వెళ్ళు వరకు వారు అల్పాహారం తీసుకొనలేదు.

మరియు నాతో చిన్న పిల్లలున్నారు, మరియు, ఓ, ఆ పిల్లలతో మరియు ప్రతి దానితో నేను ఒక విధమైన ఘనమైన సమయం కలిగి ఉన్నాను. నేను వారితో చాలా ఎక్కువ సమయం ఉండుట లేదు. మరియు నేను ఇంటికి వెళ్ళినప్పుడు రాత్రి సమయములో మేము అర్ధరాత్రి వరకు నేల మీద చుట్టు దొర్లుచుందుము. జోసెఫ్ వెనుక వైపు ఎక్కించి ఆడు ఆటను కోరును, మరియు బెకీ ఏదో దానిగూర్చి ఆమెకు ఒక కధ చెప్పమని నన్ను కోరును; అది ఎలా జరుగునో మీకు తెలియును. మరియు కనుక, మేము ఒక గొప్ప సమయం కలిగి ఉన్నాము.

10

మరియు మేము గత రాత్రి ఇంతవరకు నిద్రపోలేదు... రమారమి ఒంటిగంట వరకు పడకకు వెళ్ళలేదు. మరియు అపుడు జోసఫ్, సగం రాత్రి వరకు - నా మెడను పట్టుకొని నిద్రించాడు. అప్పుడు, మరియు అలా మనం మన పిల్లలను ప్రేమిస్తాము. మరియు నేను వారికి అల్పాహారము తీసుకువచ్చాను. మరియు వారు కేవలం నేను ఈ సహవాస సమయం కొరకు వచ్చుచుండగా, మరియు మీరు డబ్బుతో కొనలేని ఒక అల్పాహారము, అది బల్లదగ్గర వడ్డించ లేనిదియునై దానికొరకు వస్తుండగా నిద్రలోనికి వెళ్ళారు. దేవుని పరిశుద్దుల చుట్టు సహవాస సంబంధమైన అల్పాహారము. మరియు ఆయన వాక్యము చదవకుండా ఏ ఆరాధన సరియైనది కాదు, కనుక నేను పరిశుద్ద యోహాను 8వ అధ్యాయం నుండి కేవలం ఒక భాగమును చదువగోరుచున్నాను. మరియు 5వ వచనం, ఎందుకనగ నా గొంతు బొంగురు పోయినది, మరియు కేవలం మీతో మాట్లాడుదును, ఎందుకనగా నా గొంతు బొంగురు పోయినది.

యేను ఇట్లనెను - ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

11

మనం ఇక్కడ సహోదరులు, మరియు సహోదరీలు, సేవకులైనవారు, ఆదివారపు బడి ఉపాధ్యాయులు, మరియు మీరు ఎవరయినప్పటికి మనం కలసి సమకూర్చబడి ఉండగా, ఈ ఉదయవేళ నేను ఆశ్చర్యపడుచున్నాను. దీని అంతటి ఉద్దేశ్యం ఏమిటి? మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము, మరియు ఆ గొప్ప పోరాటము ఏమైయున్నది? మరియు ప్రతి రాత్రి నేను ఇది చెప్పుటకు ప్రయత్నించుచున్నాను, అది ఇలా కనిపించును, చాలాసార్లు సంస్థలను ఖండించుటకు ప్రయత్నించుచున్నాను మరియు దీనిని ఖండించుటకు, మరియు దానిని ఖండించుటకు ప్రయత్నించుచున్నాను. నేను తీవ్రవాదినై ఉన్నాను, అది సత్యమై ఉన్నది, మరియు కొన్నిసార్లు నేను ఒక వైపుకు చాలా దూరం వరకు వెళ్వెదను. నేను ఆ మరొక వైపు పడిపోవునట్లు చేసెదను. అయితే అది అలా చేయుట నా ఉద్దేశ్యం కాదు. నేను ఇది చెప్పుటకు ప్రయత్నించుచున్నాను: మన సమస్త చక్కని సంస్థలన్నియు, మరియు మన చక్కని పురుషులు, మరియు చక్కని స్త్రీలు, అయినను మనం ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనం తగినంతగా లేకుండా ఉన్నామని (తక్కువగా ఉన్నామని) కనుగొనవచ్చుననీ నేను భయపడుతున్నాను, మరియు అప్పుడు మనం ఆ విధముగా ఉండగోరుట లేదు; ఇప్పుడే అది మనం కలిగి ఉందము.

12

నల్లజాతి వృద్ద మనిషి ఒక కన్వెన్షనులో... లేక, కూడికలో, ఈ మధ్యనే నాకు చెప్పి ఉండెను, మరియు అతడు అన్నాడు, ఎవరో మరొకరు, అనెను, “చాలా కాలము క్రితం నేను ప్రభువుతో దానిని గూర్చి మాట్లాడాను. మరియు నాలో ఏదైనా పొరపాటు ఉన్న యెడల, ఇప్పుడే అది సరియైనదిగా నన్ను చేసికొననిమ్ము, ఎందుకనగా ఆ నదియొద్ద ఏ కష్టం ఉండునట్లు నేను కోరుటలేదు,” అని నేను ఆయనకు చెప్పాను. నేను ఏది చెప్పుటకు ప్రయత్నించుచున్నానో దానిని అది బాగా వ్యక్తపరచెనని నేను తలంచుచున్నాను, “కనుక ఆ నదియొద్ద మాకు కష్టంగా లేకుండునట్లుగా ఇప్పుడే అది మాతో మాట్లాడండి, ఎందుకనగా మీరు అప్పుడు వెనుకకు రాలేరు, చూడండి. సరిగా ఇప్పుడే మరింత ఎక్కువ నిశ్చయిత కలిగి ఉండునట్లు చేయండి.”

కనుక యేసు ఈ గొప్ప అధికారికి చెప్పినప్పుడు, “నీవు తప్పక తిరిగి జన్మించవలెను” అన్నారు. అప్పుడు, “ఎందుచేత నేను తప్పక జన్మించవలెను?” నేను తెలిసికొనగోరినది ఏమనగా అదే. నేను ఒక సువార్త సేవకుడను అయిన యెడల, నేను ఒక మంచి వ్యక్తిని అయిన యెడల, నేను నా ఋణములు చెల్లించి, మరియు నేను నీతిగా ఉండి, మరియు నిజాయితీ గలవాడనై, మరియు మనుష్యుల ఎదుట యధార్ధంగా నడచిన యెడల, మరింత ఎక్కువగా నాలో నుండి దేవుడు ఏమి కోరి ఉండును? నేను తప్పక తిరిగి జన్మించవలెనని, ప్రజలు నాతో చెప్పునట్లుగా, ఎందుకు తప్పకుండా ఒకరకమైన ఆ అనుభవము కలిగి ఉండవలెను? ఉన్నతముగా జీవించి, మరియు పరిశుద్దునిగా ఉన్న ఈ అధికారికి యేసు ఎందుచేత చెప్పెను, మరియు ఈ విధముగ విజ్ఞప్తి చేసి ఉండెను, లేక “విజ్ఞప్తి” చేయబడుట కాదు, కాని అలా అతడు తప్పక తిరిగి జన్మించవలెనని “ఆజ్ఞాపించెను.”

13

కావున, ఇప్పుడు కాల్వనిష్టులు నమ్మిన దానిలోనికి వెళ్ళవలెనని ఒత్తిడిచేయుటకు ప్రయత్నించుట లేదు, మీరు చూడండి, నేను ఇది చెప్పుట లేదు. నేను లీగలిస్టు (చట్టాన్ని తు.చ. తప్పక అనుసరించువాడు) ప్రజలతో మాట్లాడుతున్నానని తెలియును. అది ఎంతమాత్రము కాదు, ఎందుకనగ నేను కూడ ఒక లీగలిస్టునే. అయితే నేను ఇది నమ్ముచున్నాను: అలా కాల్విన్ ఏదో కలిగి ఉన్నాడు, మరియు కనుక ఆర్మీనియను ఏదో కలిగి ఉన్నాడు. మరియు వారు ఇద్దరు ఏదో కలిగి ఉన్నారు, అయితే వారు దానియొక్క లోతునకు వెళ్ళి తప్పిపోయిరి. కాల్వనిస్టు, “సరే, నేను రక్షించబడ్డాను మరియు అది దానిని స్థిరపరచును,” అని అనును. అతని జీవితం అది కలిగి ఉండలేదని రుజువు చేయును, అప్పుడు అతడు రక్షించబడలేదు.

మరియు ఆ లీగలిస్టు అంటాడు, “నేను ఇది చేయవలసి ఉన్నాను, మరియు నేను ఇది తప్పకుండ చేయుదును, మరియు నేను తప్పకుండ అది చేయుదును.” అప్పుడు నీవు తిరిగి జన్మించనియెడల, నీవు ఇంకా రక్షించబడలేదు, కనుక నీవు అక్కడే ఉన్నావు, చూడండి. అది మధ్యలో, మనం ఎక్కడ నిలచి ఉండవలెననగా, రోడ్డు మధ్యలో నిలచి ఉండవలెను.

14

నీవు ఏమై ఉన్నావనగా, కాల్వనిజం ఏమై ఉన్నదనగా, కృప ఏమై ఉన్నదనగా, దేవుడు నీ కొరకు ఏమి చేసెనో అదే అయి ఉన్నది. అయితే క్రియలు ఏమై ఉన్నవనగా, కృప ద్వారా ఆయన నీ కొరకు ఏమి చేసెనో ప్రశంసించుట కొరకు నీవు దేవుని కొరకు చేసినవే. అది మొత్తం జవాబు అయి ఉన్నది. అప్పుడు నేను రక్షించబడినయెడల, అప్పుడు నేను రక్షించబడినవానిగా జీవించెదను. అయితే నేను రక్షించబడిన వానివలే జీవించగలిగి మరియు రక్షించబడక ఉందును, చూశారా. కనుక, అది అప్పుడు నిజమై ఉన్నది, అలా మనం తప్పక తిరిగి జన్మించునట్టు, అది ఈ స్థానమునకు తీసికొనిరాగలదు.

కనుక మనము ఏమై ఉన్నామో ఆ తిరిగి జన్మించిన అనుభవము చెప్పును. దాని అర్ధము మనం అలా చేయటం కాదు... నేను కేకలు వేయుటయందు, మరియు ఆత్మ యొక్క సమస్త ప్రత్యక్షతలు మరియు ప్రదర్శనల యందు నమ్మిక ఉంచియున్నాను, కాని ఇంకను అది కాదు, చూశారా. అది దానికి ఏదో వ్యత్యాసమైనదిగా ఉన్నది. హృదయంలో ఉన్న ఏదో, అది ఒక నూతన సృష్టి అయి ఉన్నది. మరియు సేవకులైన మనము పురుషులు మరియు స్త్రీలు ఇద్దరు, చాలాసార్లు మనము, “నీవు తప్పక తిరిగి జన్మించవలెను,” అని వాక్యమును చెప్పుటలేదు మరియు ఆ విధముగా ప్రజల తలల మీదనుండి (ఆలోచననుండి) తీసి వేయుచున్నామని నేను ఆశ్చర్యపడుచున్నాను. మనము ఆ స్థానమునకు వెనుకకు తిరిగి వచ్చి మరియు ఒక పుట్టుక అనగ దాని ఉద్దేశ్యము ఏమిటో వారు తెలిసికొనినట్టు చేయుటయే, చూడండి. అది మాటలు చెప్పుట కంటే ఇంకా ఎక్కువైన ఏదో విషయానికి వెనుకకు వచ్చుట అయి ఉన్నది; మూలాధారముతో ఉన్న ఒక నిజ విషయానికి వెనుకకు వచ్చుట అయి ఉన్నది. ఈ గొప్ప తిరిగి జన్మించిన అనుభవము మరియు అది మన కొరకు ఏమి ఉత్పత్తి చేసినదో అదే అయి ఉన్నది.

15

ఇప్పుడు, అక్కడ చాలాసార్లు అలా ఆలోచించుటకు మనం ప్రారంభించెదము, “మంచిది, మనము తిరిగి జన్మించి ఉన్నయెడల, మనం సంతోషంగ ఉందుము, మరియు కేకలు వేయుదుము, మరియు భాషలతో మాట్లాడుదుము, లేక ఏదో విధముగ దేవుడు ప్రత్యక్ష పరచబడెను, అదే అది. అయితే, సహోదరులార, మీయంత మీరే సేవకులు, అలా అది కాదని తెలుసుకొందురు. ఇప్పుడు, మనం ప్రజలు ఎగురుట, కేకలు వేయుట, నాట్యం చేయుట, మరియు మోసము చేయుట, దొంగిలించుట, అబద్దం చెప్పుట మరియు ఇతరమైన ప్రతిసంగతియు, చూచియున్నాము, చూడండి, మరియు మనకు అది తెలియును. కాబట్టి ఆయన మాట్లాడునది ఏమిటో అది కాదు.

“నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించును,” అని మార్టిన్ లూధరు చెప్పెను. అతడు అనెను, “మేము అది పొందాము.” జాన్ వెస్లీ వెనుక ఏదో కొత్త దానితో వచ్చెను. మరియు లూధరు అయి ఉండెను... అతడు చెప్పినట్టుగానే, “నీతిమంతుడు విశ్వాసం ద్వారా జీవించును,” అనునది చాలా మట్టుకు అతడు సరిగానే ఉండెను; చూడండి, అది యధార్ధం: వారు విశ్వాసము ద్వార జీవించగలరు. నీతిమంతులు విశ్వాసం ద్వార జీవింతురని అప్పుడు మనం తప్పక అలా చేయవలెనని లూధరు చెప్పెను. మరియు అతడు అది కలిగి ఉండెనని అతడు తలంచెను, కాని అతడు అది కలిగి ఉండలేదని కనుగొనెను.

16

వెస్లీ అనెను, నీవు శుద్దీకరణము పొంది మరియు కేకలు వేసినప్పుడు, నీవు దానిని పొందావని చెప్పెను, కాని అనేకమంది అలా కేకలు వేసి అది పొందలేదని అతడు కనుగొనెను. మనం భాషలతో మాట్లాడిన యెడల మనం దానిని పొందామని పెంతెకోస్తువారు చెప్పుదురు, కాని చాలా మంది భాషలతో మాట్లాడినను మరియు దానిని కలిగి ఉండలేదని మనం కనుగొంటిమి; అది నిజము. కాబట్టి అది దాని నుండి ఏదో వ్యత్యాసముగా ఉన్నది, సోదరుడా, అది యధార్ధము.

వారు కేకలు వేసినయెడల, వారు భాషలతో మాట్లాడినయెడల, వారి ఇది చేసిన యెడల... అని యేసు ఎన్నడూ చెప్పలేదు. “వారి ఫలముల వలన వారిని తెలిసికొందురు,” అని చెప్పెను. మరియు ఆత్మ యొక్క ఫలము కేకలు వేయుట, భాషలలో మాట్లాడుట కాదు; అవును, అవి పరిశుద్ధాత్మ యొక్క గుణలక్షణములు. అయితే అది అనుకరణము చేయబడగలదు; మనము అది ఎరుగుదుము.

నా జీవితంలో అనేక చెడు ఆత్మలతో నేను వ్యవహరించితిని, మరియు మాంత్రికులు, మరియు మొదలగువారు, మరియు ప్రపంచమంతటా, చెడ్డవైన ఆత్మలు కేకలు వేయుట, నేను చూచాను, భాషలలో మాట్లాడుట, సమస్త ప్రత్యక్షతలు కలిగి ఉండుట, అన్ని రకాల సూచనలు మరియు అద్భుతాలు మరియు ప్రతీ సంగతియు, చేయుట చూచియున్నాను. దెయ్యములు, మరియు అక్కడ దేవుడు ఉండెను అను దానిని కూడ కాదందురు, చూశారా. కాని నీవు దాని ద్వారా వెళ్ళలేవు.

17

మరియు అది మనయొక్క ఉద్రేకమునకు వచ్చినప్పుడు మరియు... జ్ఞాపకముంచుకొనుడి, నేను దానియందు నమ్మిక కలిగి ఉన్నాను; హృదయమును తాకెడి మతమును కలిగియున్న ఏ వ్యక్తి అయినను కేకలు వేయునని నేను నమ్ముదును, మరియు ఒక చిన్నదానిని చేయును... నేను దానిని నమ్ముదును, కాని ఇంకా, అది ఇంకా సంపూర్తి అయినది కాదు. ఇక్కడ దక్షిణాన ఉన్న ఆ వృద్ధ నల్లజాతి మనిషి పుచ్చకాయ తినుచున్న దానివలె. వానికి ఒక పుచ్చకాయ ముక్క ఇవ్వవలెనని అడిగెను, “బాలుడా అది ఎలా ఉండేను?” అనెను. “అది మంచిదిగా ఉండెను, అయితే అక్కడ దానికి ఇంక ఎక్కువైనదేదో ఉండెను.” కనుక, ఆ విధమైనదే ఇది కూడా అయి ఉన్నది. ఇది బాగున్నది, కాని అక్కడ ఇంకను దానికి ఎక్కువైనది ఉన్నది, మీరు చూశారా. మనము ఈ ఒక్క ముక్క (పుచ్చకాయ) ద్వారా జీవించలేము.“

కనుక అక్కడ ఏదో వ్యత్యాసమైనది ఉన్నది. కనుక సహోదరులు మరియు సేవకులైన మీరు, ఇది వివరించుటకు చాలా సమర్ధత కలిగి ఉన్నారు... ఇప్పుడు ఇక్కడ బోధించుటకు నా మనస్సులో నేను కలిగి ఉన్న “జీవము” అను ఒక చిన్న పాఠ్యంశమును నేను తీసుకోవలసి ఉన్నది. అయితే నేను దిగి వచ్చినప్పుడు, ఏదో నన్ను తాకినది, “ఈ ఉదయవేళలో నీవు సేవకుల ఎదుట ఉన్నావు; వారి చేతులలో తాళము చెవి పట్టుకొని ఉన్న మనుష్యుల ఎదుట నీవు ఉన్నావు. ఈ మనుష్యులకు సహాయపడగల సంగతులను గూర్చి అత్యుత్తమమైన దానిని నీవు పలుకుము.” ఈ ప్రజలు అలా సహాయం పొందగలిగినంతకాలం, ఆ మొత్తం లోకమంతా సహాయము పొందగలదు; మీ సమాజములు మరియు ప్రతీచోట, వారు దాని నుండి ఒక సహాయం పొందగలరు. దానంతటి తరువాత, సహోదరులారా, మనము ఒక స్థలము కొరకు పనిచేయుచున్నాము. మన సమస్త భేదములు మరియు ప్రతీదియు, మనము ఇంకను ఆత్మలను దేవుడే అయి ఉన్న, ఒక యజమాని దగ్గరకు తీసుకొని వచ్చుచున్నాము. ఇక్కడ మనము అందుకొరకే ఉన్నాము.

18

ఇప్పుడు ఈ ఉదయవేళ, ఎందుచేత నేను తప్పక తిరిగి జన్మించవలెను మరియు నేను ఏమి అనుకున్నానో మీకు నేను వ్యక్తపరచగోరుచున్నాను, మరియు నేను దానిని ఒక చిన్న పిల్లవాని మార్గములో మీకు విశదపరచగోరుచున్నాను. మీ కిష్టమైన యెడల, జగత్తు పునాది మునుపుకు ఒక చిన్న యాత్ర చేయుదము.

ఇప్పుడు మన దేహములు భూమి యొక్క మట్టి నుండి వచ్చినవని మనకు బోధించబడెను. వైద్యశాస్త్రము అది చెప్పెను, మరియు బైబిలు అది చెప్పెను, కాబట్టి మనము భూమి యొక్క మట్టి నుండి వచ్చితిమి అను ఒక్క దానిపై వారు అంగీకరించెదరు.

మరియు ఇక్కడ కొంతకాలం కిందట నేను ఒక కీవానీస్ కూడికలో మాట్లాడుచున్నాను. మరి నేను ఒక అంశము మీద మాట్లాడుచున్నాను. చాలా... అలా చాలామంది ప్రజలు మరియు వారు ఏమి నమ్మారో మొదలైనవి. అప్పుడు ఈ ఆలోచన దీని నుండి వచ్చెను. మన శరీరములు ఎక్కడ నుండి వచ్చెను. మరి నేను డాక్టరును అడిగాను, “డాక్టర్, నేను మిమ్మును ఒక ప్రశ్న అడుగగోరుచున్నాను,” నా శరీరము మట్టి నుండి వచ్చుట అది నిజమేనా?“

అతడు అనెను, “ఎందుచేత అలా రెవరెండు గారు, అది మీరు ఎరిగి ఉండవలసినది.”

నేను అన్నాను, “అవును, అయితే అది మట్టి నుండి ఎలా వచ్చింది తెలిసికొనగోరుచున్నాను.”

“ఎందుకనగా” అతడు అన్నాడు, “నీవు తినే ఆహారము ద్వారా,” “నీవు ఆహారం తినుచున్నావు మరియు అది రక్త కణములుగా మారును,” అని చెప్పెను.

19

“సరే,” నేను అన్నాను, “అది సరియైనదయితే అప్పుడు నేను ఎంత ఎక్కువ తింటే, అంత ఎక్కువ మట్టిని నాలో పొందుచున్నాను, ఎంత పెద్దగా ఉంటే మరియు అంత బలముగా ఉండగలుగుదును. ఒక జగ్గులో నుండి ఒక గ్లాసులోనికి నీరుపోసిన విధముగా, లేక కుప్పలుగా ఉన్న పదార్దములు, లేక మొదలైనవి; నేను దానిలో మరింత ఎక్కువ పెట్టినప్పుడు, పెద్దవాడను మరియు బలవంతునిగా ఉండియుందును.”

“ అది నిజము,” అని చెప్పెను.

నేను అన్నాను, “అప్పుడు నేను నిన్ను ఒక ప్రశ్న అడుగగోరుచున్నాను. నేను 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, పదిహేడు, అలా 25వ సంవత్సరం వరకు, నేను రొట్టె, మాంసము, బంగాళాదుంపలు మొదలైనవి, నేను ఇప్పుడు తినినట్లుగనే తిన్నాను, అది ఎలా జరిగినది; మరియు అవి రక్తకణములుగా మారినవా? అది నిజము.” నేను అన్నాను,“ నేను అప్పుడు తినినట్టుగానే ఇప్పుడు తినుచున్నాను, అయితే నేను వాటిని తినినప్పుడు, అప్పుడు నేను ఎల్లకాలము పెద్దవాడినయ్యాను, బలవంతుడనయ్యాను, అది ఎందుకు అలా జరిగినది. మరియు నేను 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, అది ఎక్కువగా నేను తిన్నాను. చాలా మంచిగా ఉన్నాను. నేను పెద్దవాడనగుచూ, బలహీనపడుచూ ఇంకా కిందకు దిగజారి, లేకుండా పోవుదును.” అది ఎందుకు అలా జరిగినదనగా, నేను ఒక జగ్గులో నుండి ఒక గ్లాసులోనికి నీరు పోయుచూ ఉండినయెడల మరియు అది పైకి వచ్చువరకు నింపుచూ ఉండును. అది సగం వరకు వచ్చినప్పుడు, అప్పుడు నేను మరీ ఎక్కువగా పోయగా చాలా త్వరగా కదలుచు మరియు చాలా త్వరగా కదలుచు అది క్రిందకు పోవును, శాస్త్రీయముగా, అది ఎలా జరిగినదో నాకు చెప్పండి. అది దానికలా జరిగి ఉండలేదు.

20

అయితే బైబిలులో జవాబు ఉన్నది. దేవుడు మానవాళితో చేసిన అది ఒక నియామకము. నీవు ఒకప్పుడు... నీవు ఇక్కడ ఉన్నావు, అప్పుడు నీవు తప్పకుండ వెళ్ళిపోవుదువు, మరియు దేవుడు ఆయన చిత్రమును కలిగి ఉన్నాడు. ఈ ఉదయవేళ, ఇక్కడ ఈ సమావేశములో బాగా వృద్దులయిన పురుషుడు మరియు స్త్రీ ఈ ఉదయం నాముందున్న, భర్త మరియు భార్యను నేను కేవలం కల్పనా కథకు సంబంధించిన దానిగా దీనిని ఉంచుచున్నాను.

కొన్ని సంవత్సరములు క్రితం మీరు అందమైన యవ్వన స్త్రీగా ఉన్నారు, మరియు పురుషుడు అందమైన యవ్వన పురుషునిగా ఉన్నాడు. మీరు మీ పరిచర్యలోనికి అప్పుడే ప్రవేశించి ఉండవచ్చును. తల్లి అందముగా ఉండెను, మరియు ఏ విధంగా ఆ రోజు ఆమెను బలిపీఠం దగ్గరకు నడిపించి, ఆమె నీ భార్యగా ఉండునట్లు పరిగ్రహించినట్టు చట్టబద్దమైన వివాహం చేసికొన్న భార్యగా దేవుని సేవకునితో చెప్పావు. మీరు ఎంత సంతోషంగా ఉన్నారు. మంచిది, అప్పుడు నీవు ఏ ఆహారమును భుజించావో ఇప్పుడు కూడా ఈ ఉదయమున ఇక్కడ అదే ఆహారమును భుజిస్తున్నావు.

మీరు వివాహం కాబడిన కొన్ని సంవత్సరముల తరువాత, ఒక ఉదయాన పైకి లేచి మరియు నీవు అన్నావు, “అమ్మా, ఆ అందమైన కళ్ళక్రింద అక్కడ ఒక ముడత వచ్చుచున్నది.”

ఆమె అన్నది, “అవును, నాన్న, నేను నీ చెవి దగ్గర నెరసిన వెంట్రుకలు వచ్చుట గమనించియున్నాను.” అది మొదట శిశువు పుట్టినప్పుడు అయి ఉన్నది.

21

ఏమి జరిగినది? మరణంలోనికి వచ్చినది. అది చాలమందిని ఒక మూలన ఉంచినది, అయితే త్వరలో అది నిన్ను ఒక మూలన ఉంచనైయున్నది మరియు నిన్ను అక్కడ ఉంచును, చూశారా. ఎందుకనగా అది నిన్ను తీసికొని వెళ్ళనైయున్నది. ఇక మీదట ఆయన నిన్ను ఎలా ఉండాలని కోరియున్నాడో దేవుడు అతని చిత్రమును స్థిరపరచి ఉన్నాడు. ఇప్పుడు నేను పునరుత్థానము నందు విశ్వాసముంచి ఉన్నాను, క్రైస్తత్వము పునరుత్థానము నందు విశ్వసించును, సమస్తము పునరుత్థానం పై ఆధారపడి ఉండెను.

ఇప్పుడు చాలమంది ప్రజలు ఈ విధంగా క్రిందకు వెళ్ళి, వారు మరల ఎగురుచున్న రెక్కలతో ఒక విధమైన ఆత్మతో మరలా పైకి వచ్చెదరని తలంచెదరు. ఇప్పుడు స్త్రీ పురుషులైన మీరు ఉన్న విధముగానే మరలా పైకి వత్తురు. అది ఆ విధముగా ఉండును... ఈ బైబిలు వేదిక నుండి టేబిలు కిందకు పడినయెడల, మరియు మరొక బైబిలు తీసికొని, దాని స్థానములో ఉంచినయెడల - అది పునరుత్థానము కాదు. అది మరల మరొకటి పెట్టుట. పునరుత్థానము అనగ క్రిందకు వెళ్ళిన అదే బైబిలును పైకి తీసికొని వచ్చుట. మరియు అపుడు పునరుత్థానములో అంతయూ...

22

ఇప్పుడు ఈ ఉదయాన వృద్ధులైన, తన నెరసిన, వంగిన భుజాలు గలవారై ఉన్నారు. తల్లి మరియు మీరు చాలా కలిగి ఉన్నారు... చాలా నొప్పులు మరియు బాధలు మరియు అలా ఉపయోగానికి సహకారిగా లేని సంగతులు కలవు మరియు అది మార్చబడెను. అయితే జ్ఞాపకముంచుకొనుడి, మిమ్మును భూమి మీదకు తెచ్చిన అదే దేవునికి మీరు ఇంకను సేవచేయుచున్నారు. అప్పుడు అది అంతయు ఈ విధముగా మీరు ఉండునట్లు చేయుటకు అది తప్పకుండా దేవుని ఉద్దేశ్యంలో ఉన్నది. అయితే జ్ఞాపకముంచుకొనుడి, పునరుత్థానములో ఒక నెరసిన జుట్టుగాని, ఒక ముడతగాని నీవు కలిగి ఉండవు. మరణము నీకు చేసిన సమస్తము పునరుత్థానములో నీవు మరచిపోగలవు.

దేవుడు, ఆయన ఆ చిత్రమును పెయింట్ చేసి (ఆయన కిష్టమైన రీతిగా తీర్చిదిద్ది) ఆయన చెప్పెను, “అక్కడ వారు ఉన్నారు. ఇప్పుడు, మరణమా రమ్ము, అయితే నేను అది చేయువరకు వారిని నీవు తీసికొనలేవు.” మరియు మీరు ఆ మట్టిలోనికి వెళ్ళి మరియు మరలా లేచినప్పుడు, ఆ విధముగ ఎన్నటికీ నిలచి ఉండుటకు, ఆ ఉదయాన బలిపీఠం నొద్ద ప్రేమగల జంటగా ఉన్న విధముగానే మీరు మరలా పైకి వచ్చెదరు. కనుక మనం దేనిగూర్చి భయపడవలసి ఉన్నది?

23

ఎవరో వ్యక్తి కొంతకాలం క్రిందట నాతో చెప్పెను, “బిల్లీ, నాతో అలా చెప్పుచున్నావు, అది నీ ఉద్దేశ్యమా?” నేను అబ్రాహాము గూర్చి, దూతలు ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుట గూర్చి బోధించుచున్నాను. మరియు నేను అన్నాను, “అది దేవుడు మరియు ఇద్దరు దూతలు అయి ఉండెను,” అన్నాను.

“ఒక దేహములో ఉన్న దేవుడై ఉండెనని నాకు చెప్పుట, అది నీ ఉద్దేశ్యమా?”

నేను అన్నాను, “అది నిశ్చయముగా.” మరియు నేను అన్నాను, “అది ఒక వాక్యశరీరము (Theophany) కాదు; అది దేవుడు అయి ఉండెను. అది శరీరంలో ఉన్న ఒక మనిషి అయి ఉండెను, మరియు ఆయన దేవుడు అయి ఉండెను.”

అతడు చెప్పెను, “అప్పుడు నేను నిన్ను అడుగగోరుచున్నాను, ఆయన ఆ శరీరమును ఎలా పొందెను?”

24

నేను అన్నాను, “మంచిది, భూమ్యాకాశములను సృజించిన, ఆ గొప్ప సృష్టికర్త,” మరియు మనం పదహారు మూల పదార్ధముల నుండి తయారు చేయబడ్డాము, అవి పొటాష్, మరియు పెట్రోలియము, మరియు కాస్మిక్ లైట్ (విశ్వానికి సంబంధించిన వెలుగు), మరియు కాల్షియం, మొదలైనవి - అందుచేత, ఆయన ఆ పదహారు మూల పదార్ధములను తీసికొని ఉండనియెడల మరియు “వ్యూ,” అని వాటిని కలిపి ఊదును మరియు అనును, గాబ్రియేలూ ఇక్కడకు రమ్ము, దానిలోనికి అడుగు వేయుము.“ మరియు మిఖాయేలు కొరకు ఒకటి మరియు తన కొరకు ఒకటి, ఎందుకనగా ఆయన నిశ్చయముగా చేయును. కేవలం ఒక సెకనులో అదృశ్యమగును. అతడే నా యొక్క తండ్రి. ఈ పొటాష్ మరియు కాల్షియమునకు ఏమి జరిగినను ఏమియు కాదు, అది ఎక్కడ ఉంచబడి ఉన్నదో ఆయన సరిగానే ఎరుగును.

నేను కొంత కాలం క్రిందట ఒక అద్దము ఎదుట నిలబడి, నాకు ఉన్న ఈ కొన్ని వెంట్రుకలను దువ్వుతున్నాను. నా భార్య నాతో అన్నది. ఆమె అన్నది,“ బిల్లీ, నీవు పూర్తిగా బట్ట తలగలవాడవు అయిపోయావు.”

నేను అన్నాను, “అయితే నేను వాటిలో ఒకటి పోగొట్టుకొనలేదు.”

అమె అన్నది, “ఆమె ఎక్కడున్నావో ప్రార్ధించి చెప్పుము.”

నేను అన్నాను, “నీవు నాకు జవాబు ఇచ్చినప్పుడు, నేను నీకు జవాబు ఇస్తాను. నేను అవి కలిగి ఉండకమునుపు అవి ఎక్కడ ఉన్నవో నాకు చెప్పుము: అవి నా కొరకు ఎక్కడ కనిపెట్టుకొని ఉన్నవో నేను నీకు చెప్పుదును.”

25

అవి ఉన్నయెడల, అవి పొందకముందే అవి ఉండెను. అవి ఈ భూపదార్దముల నుండి రావలసి ఉన్నవి. నేను ఇక్కడకు రాక మునుపే అప్పుడే అవి ఇక్కడ ఉన్నవి. మరియు నేను వెళ్ళిపోయిన తరువాత అవి ఇక్కడ ఉండును. అయితే ఏదో రోజున దేవుడు మమ్ములను ఇద్దరిని పునరుద్దరించును. మరియు మేము చాలకాలం క్రితము ఒక యవ్వన మనిషిగా ఉపయోగించబడినట్టుగా మేము కలసి వచ్చెదము. నా తండ్రి ఇలా చెప్పును, “దీనిలోనికి అడుగువేయుము మరియు దానిలోనికి అడుగుపెట్టుము,” ఏదో రోజున ఆయన నా ఆత్మను తీసికొనును, మరియు నీ ఆత్మను తీసికొనును, మరియు మనం మరలా ఒక యవ్వన మనిషిగ మరియు ఒక యవ్వన స్త్రీగ మరల, నిత్యముగా జీవించుటకు అడుగువేయుదుము.

ఇప్పుడు దేవుడు ఒక సియర్స్ (అమెరికాలో ఒక కంపెనీ) వలె లేడు మరియు (Roe BuckHarmony House) రొబక్ హార్మనీ హౌస్ (అమెరికాలో అందమైన షాపు) వలె ఆ రెండు వంటివాడు కాదు. ఆయన మనలను వ్యత్యాసమగు వారిగ కనబడునట్లు చేశాడు. ఆయన వస్తువులను వ్యత్యాసముగా చేయును. ఆయన పెద్ద పర్వతాలను మరియు చిన్న పర్వతాలను చేయును. ఆయన (పాప్లార్) అడవి బూరగ చెట్లను చేయును. మరియు ఆయన ఓక్ వృక్షాలను చేయును, మరియు ఆయన తాటిచెట్లను చేయును. ఆయన దుబ్బులుగ ఉన్న చిన్న మొక్కలను చేయును, మరియు ఆయన గొప్ప వృక్షాలను చేయును. ఆయన నదులను చేయును, ఆయన ఎడారులను చేయును, ఆయన మహా సముద్రాలను చేయును, మరియు ఆయన మైదానములను చేయును. ఆయన ఎర్రని తలగలవారిని చేయును, తెల్లని తలగలవారిని, గోధుమ రంగు తలగలవారిని, నల్లని తలగలవారిని, చిన్న వారిని, పొట్టిగ ఉండు వారిని, లావుగ ఉన్న వారిని, మరియు వ్యత్యాసమైన వారిగ చేయును, చూడండి. ఆయన వారిని ఆ పద్ధతిలో చేయును, ఎందుకనగా ఆయన ఏమి ఇష్టపడునో అలాగే చేయును. ఆయన సొంత స్వభావము ఆయన ఏమై ఉన్నాడో రుజువు చేయును.

26

ఇప్పుడు వారు మాట్లాడుదురు... ఇక్కడ ఫ్లోరిడా నుండి మీలో చాలామంది ప్రజలు. మీరు అద్భుతమైన స్థలమును పొందారు. అయితే ఎల్లవేళలా నా తలచుట్టు అమర్చబడి, నాకు ఉన్న జుట్టుకు నేను చేసిన దాని కంటే మీరు మీ పచ్చగడ్డికి చాలా అత్యుత్తమమైన శ్రద్ద తీసుకొనుచున్నారు. కేవలం అది మృదువుగా ఉండునట్లు, ఈ విధముగా, ఆ విధముగా చేయుచున్నారు. ఇప్పుడు అది మానవ కంటికి అందముగ కనబడవచ్చును, నాకైతే, నేను అడవిని ఇష్టపడుదును, పర్వతములపై భాగమును, ఎక్కడ అది చదునుగా లేకుండా ఉన్నదో, దేవుడు దానిని ఆ పద్దతిలోనే చేసెను, మరియు అది వంకరగా ఉండక ముందు, ఆయన దానివైపు చూచుటకు ఆ విధముగానే ఇష్టపడును.

దేవుడు వస్తువులను చేయు పద్దతినే నేను ఇష్టపడుదును. మరియు ఆయన ప్రజలను చేయు పద్దతిని నేను ఇష్టపడుదును. ఆయన అనేక విధములుగా చేయు దేవుడై ఉండెను. ఆయన ఎర్రని పువ్వులను చేయును, తెల్లని పువ్వులను నీలపు రంగు పువ్వులను; ఆ విధముగానే ఆయన మానవాళిని చేయును. మరియు మనము పునరుత్థానములో ఆ విధముగానే ఉందుము.

27

మీరు నీలపు రంగుపూలు పూయు మొక్క తీసికొందురు మరియు వాటిని సంకర విత్తనముగా చేతురు మరియు వాటిని ఒంటరిగా ఉంచండి, అవి మరల వాటి అసలు రంగుకు తిరిగి వెళ్ళును. మీలో కొంతమంది జంతువులను పెంచువారికి తెలియును, మీరు ఒక ఆడ గుర్రమును ఒక గాడిదతో సంకరం చేసిన, ఆ గాడిద దాని అసలైన స్థానమునకు వెళ్ళి గాడిదగా ఉండదు. పునరుత్థానములో ఆ విధముగానే ఉండును. మనము మరలా అసలైన దాని దగ్గరకు వెళ్ళెదము, ఏదేను తోటలో తన స్వరూపములో దేవుడు వానిచేసినప్పుడు, ఎలాటి మనిషిగా ఉండెనో అలాటి మనిషి దగ్గరకు మరలా వెళ్ళెదము. అతడు ఒక పురుషునిగా ఉండును, ఆమె ఒక స్త్రీగా ఉండును. మరియు ఆమెను అందముగా కనిపించునట్లు చేయుటకు అందముగా అలంకరించు వస్తువులు తయారు చేసే కర్మాగారములు అవసరము లేదు. ఆమె ప్రారంభములోనే అందముగ ఉన్నది.

ఇప్పుడు గమనించండి, ఇదంతా ఎలా వచ్చియున్నది? ఇప్పుడు మనము భూమి మట్టి నుండి వచ్చినయెడల, బైబిలు మనం అలాగే వచ్చామని చెప్పెను, మరియు విజ్ఞాన శాస్త్రం కూడ మనం భూమి మట్టి నుండి వచ్చామని చెప్పెను. అప్పుడు ఖచ్చితముగా ఒక ముక్క జీవకణమూ లేనప్పుడే అకస్మాత్తుగా అగ్నిపర్వతం వలె పెద్ద శబ్దంతో బద్దలయినప్పుడే మన శరీరములు ఈ భూమి మీద పెట్టబడి ఉండెను. అది అలా కానియెడల, అది ఎక్కడ నుండి వచ్చినది?

28

ఈ ఉదయాన నీవు నివసిస్తున్న ఆ శరీరము, భూమి మీద ఒక చిన్న జీవకణము ఎన్నడూ పెట్టబడకముందే, పదివేల సంవత్సరములప్పుడు ఇక్కడే ఉండెనని, నీకు తెలియునా? దేవుడు ఈ గొప్ప క్షిపణి సుదూరాన వ్రేలాడుచుండగా, దానిని సూర్యుని చుట్టూ తిప్పుచూ, మరియు అది ఈ మార్గం చుట్టూ తిరుగుచుండెను, మరియు అక్కడ కాల్షియం, పోటాష్, మరియు పెట్రోలియం మొదలైన వాటిని సృజించుచుండగా, ఈ ఉదయాన ఈ బల్ల యొద్ద నీవు కూర్చుండి ఉందువని, అప్పుడే ఆయన గొప్ప మనస్సులో ఆయన కలిగి ఉండెను. ఓ, హల్లెలూయ, ఆయన అనంతుడైన దేవుడు!

ఒక వడ్రంగి ఒక ఇంటిని నిర్మించుటకు వెళ్ళినప్పుడు, అతడు ఏలాగు చేయును? మొదట అతని పనిముట్లను అన్నిటిని ఉంచును. అతడు ఏమి కట్టబోవుచున్నాడో, ఆయన మనస్సులో ఆయన కలిగి ఉండెను. ఆ ప్రపంచం దాని మీద జీవము యొక్క చిన్న బిందువునైనా యుండకముందే, సరిగ్గా అక్కడే నీ శరీరమును ఆయన కలిగియుండెను. అది అలా కానియెడల, అది ఎక్కడ నుండి వచ్చినది? ఆ కారణము చేత ఆయన దానిని మెలిత్రిప్పుచుండెను, మరియు దానిని దొర్లించుచుండెను, మరియు దానిని తిప్పుచుండెను. ఆయన దానిని సూర్యుని వైపునకు త్రిప్పి ఉండును మరియు అది పొటాష్ ను తయారు చేసి ఉండును; ఆయన దానిని ఈ విధముగా వెనుకకు త్రిప్పి ఉండును మరియు అది కాల్షియమును తయారు చేసి ఉండును; ఆయన దానిని ఈ విధముగా వెనుకకు త్రిప్పినప్పుడు, అది పెట్రోలియమును తయారు చేసి ఉండును. ఓ, ఆయన పరిశుద్ద నామమునకు, స్తుతి కలుగును గాక!

29

మనం దేనిగూర్చి భయపడెవలెను? అక్కడ ఏ చోటనైనా ఉన్న ప్రజలందరి కంటే మనం స్వేచ్చగా మరియు సంతోషముగా ఉందుము. మనం దానిగూర్చి ఊహించవలసిన అవసరము లేదు; దేవుడు మన మధ్యలో ఉండి, మరియు దానిని రుజువు చేయును. అది నిజము. అది ఆయన వాక్యము మరియు ఆయన ఆత్మ ప్రకారము ఉన్నది.

ఇప్పుడు మనము దీనిని చూద్దాము.... మన శరీరములు, అక్కడ ఉన్న ఈ భూమి అయినా పూర్తిగా రూపించబడక ముందే, సరిగా ఇప్పుడు మనం నివసించుచున్న మన శరీరములు, ఆ భూమి మీదనే పడి ఉండెను. పొటాష్, కాల్షియం, పెట్రోలియం మొదలైనవి. కనుక ఇప్పుడు మనం దానిని తప్పిపోకుండ ఇప్పుడు ఒక చిన్న చిత్రమును తీసుకొందాము.

ఈ భూమి అంతా రూపించబడిన తరువాత మరియు అది అంతయూ కేవలం అక్కడ సూర్యుని ఎండలో ఆరబడిన ఎడారిగా, దానిపై ఎన్నడూ జీవము లేకుండా, ఎన్నడూ ఏదియు జీవముగా పిలువబడలేదు, కాని మన శరీరములు తయారు చేయుటకు అక్కడ సమస్త పదార్ధములు ఉంచబడి ఉండెను. ఆ గొప్ప పరిశుద్ధాత్మునికి దేవుడు ఇలా చెప్పుట నేను వినగలను, “ఇప్పుడు వెళ్ళు మరియు భూమిపై పొదిగి ఉండుము.” ఇప్పుడు ఆ మాట పొదుగుటకు అనగా, “తల్లిగా ఉండుట” కోడిపెట్ట పొదిగినట్టుగొనే లేక ఒక పావురం తన జతగాని పిలుచుటకు కూయుట వలె. “వెళ్ళి, భూమిపై పొదిగి ఉండుమ.

30

ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఊహను ఉపయోగించుకొని మరియు ఒక నాటకముగ చేయుదము. అప్పుడు ఆ గొప్ప పరిశుద్ధాత్ముడు వెళ్ళి మరియు భూమి మీద ఆయన రెక్కలు పరచి, మరియు ఒక ప్రయోజనము కొరకు పొదుగుటకు ప్రారంభించెను. దేవుడు ఏమైయుండెను అను దానికి ప్రసరించుటకు అది ఏదో తెచ్చుచున్నది. నేను గతరాత్రి చెప్పినట్టుగా, “ఏది మొదట, ఒక పాపాత్ముడా? లేక ఒక రక్షకుడా?” ఏ విధముచేతనయిననూ ఇదంతా ఏమై ఉన్నది? మొదటగా ఉన్నది ఏది? ఒక స్వస్థపరచువాడా లేక వ్యాదియా?

ఎందుకు, నిశ్చయముగా ఒక స్వస్థపరచువాడు. సరే, అప్పుడు ఎందుకు మనం పాపులుగా అయ్యాము? అది ఆ విధముగానే ఉండవలసి ఉన్నది. దేవుడు ఒక రక్షకుడు అయినయెడల, ఆయన రక్షించుటకు రక్షించబడవలసిన ఏదో కలిగి ఉండవలెను. కనుక అక్కడ ఏ పొరపాటు లేదు; అది కేవలం అదంతా ఆయన మార్గములో పని చేయుచున్నది. ఇప్పుడు నేను ఇది పాపులకు చెప్పుట లేదు. నేను అది సేవకులకు చెప్పుచున్నాను, చూడండి మరియు దేవుని పిల్లలకు చెప్పుచున్నాను. అది అంతయు యధార్ధముగా పనిచేయుచున్నది, మనం ఏమి చేశాము, లేక చేయలేదు అనేది ఏమియు కాదు, అది సరిగానే బయటకు రావలసియున్నది, కారణం ఆయన నియమించినది ఏదో దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు.

ఇప్పుడు గమనించండి, అప్పుడు అది అలా చుట్టూ తిరుగుతూ అది అలా ఉండగా, అది అంతా సరిగా బయటకు వచ్చుచున్నది. అక్కడ మనం విచారపడవలసిన అవసరం లేదు, ఎందుకనగా అది సరిగా వెళ్ళనై ఉన్నది.

31

ఇప్పుడు, ఒకవేళ దేవుడు... పగటివేళ మనం వెలుగు కలిగి ఉండినయెడల అక్కడ ఎన్నడూ రాత్రి లేనియెడల ఏమిటి, ఏది పగటివేళ అయి ఉండెనని నీవు ఎలా ఎరిగియుందువు? పగలు ఎలా... నీవు ఎన్నడూ రోగివై ఉండనియెడల, ఆరోగ్యంగా ఉండి ఆనందించుటకు ఎలా నీకది తెలిసి ఉండును. నీవు ఎన్నడూ నశించక ఉండినయెడల, రక్షించబడి ఉండి ఆనందించుటకు అది నీవు ఎలా తెలిసికొందువు?

ఎందుచేత, సహోదరుడా, ఏదో రోజున యేసు వచ్చునప్పుడు మరియు ఆ పునరుత్థానము, దేవుడు ఈ లోకమును తీర్పు తీర్చుటకు తీసుకున్నప్పుడు, ఈ భూమి మట్టిలో నిద్రించుచున్న ప్రతి శరీరము ఆయన సన్నిధిలో లేచి, మరియు ఈ భూమి యొక్క చుట్టు మిలియనుల బలముతో, విమోచన కథలు పాటలుగా పాడుచు, దూతలు వంచబడిన తలలతో బయట సమకూర్చబడి ఉండగ మనము ఏమి మాట్లాడుచున్నామో ఎరుగక యుందుము. వారు తప్పిపోలేదు, రక్షించబడి ఉండుట ఏమిటో వారు ఎరుగరు. తప్పిపోవుట అనగా మరియు రక్షించబడుట అనగా ఏమిటో మనకు తెలియును. మనము ఒక తండ్రిని పొందాము.

32

యేసు చెప్పినది మీరెన్నడైనా గమనించారా, ఆయన ఒక దయ్యమును వెళ్ళగొట్టినప్పుడు, దానిని ఆయన తనవ్రేలితో దానిని చేసెను. యేసు చేప్పెను, “నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టిన యెడల... దేవుని వ్రేలితో.” చూడండి, ఆయనకు ఒక దయ్యం అనగా ఏమై ఉన్నది? స్వస్థత కొరకు కేవలం అది ఒక చిన్న సంగతి. అయితే గమనించండి, ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆయన ఏమి చేసెను? ఆయన వెళ్ళెను మరియు గొర్రెపిల్లను పట్టుకొని మరియు అది ఆయన భుజములపై ఉంచుకొనెను.

మనిషి యొక్క బలమైన భాగము ఏమై ఉన్నది? అతని వెనుక భాగము మరియు అతని కాళ్ళు. చూడండి, ఆ దయ్యము వానికి ఏమియు కాదు. అయితే ఆ గొర్రెపిల్లను, ఆయన తన యొక్క భుజాల మీద అడ్డముగా ఉంచుకొని మరియు దానియొక్క పాదమును పట్టుకొనును. మరియు అతడు తిరిగి దొడ్డిలోనికి ఉంచినంత వరకు వాని దేహము యొక్క బలముతో దానిని పట్టుకొనును. దేవుడు ఆయన పిల్లలను ప్రేమించును.

33

ఇప్పుడు, అతడు వాటిని ఎలా పొందుకొనెను? పరిశుద్ధాత్మ వెళ్ళి మరియు భూమిపై పొదిగెను. మరియు ఆయన పొదుగనారంభించి, కూయుచు... మాట వరసకు ఇలా చెప్పుదము, ఆయన వేళ్ళుచుండెను... ఆయన పిలచుచుండెను. ఆమె కూర్చుని ఆమె జతగాని కొరకు కూయుచున్న సాయంకాల పావురము వలె కూయుచుండెను. మరియు అతడు కూయుటకు ప్రారంభించగా ఏమియు కాదు గాని, అగ్నిపర్వతం వలె అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో బ్రద్దలగుచు సూర్యుని ఎండలో ఆరిన తెల్లని ఏడారిగా కనబడుచు అక్కడ కొండ నుండి కిందకు దిగివచ్చుచున్నది. కొంత కాల్షియంతో కొంత పొటాష్ కదలుటకు ప్రారంభించుట నేను చూచుచున్నాను. నేను అప్పుడు మరల గమనించాను, వింతైన సంగతి, ఒక చిన్న తడి మరియు పెట్రోలియం కలసి పరుగెత్తుటకు ప్రారంభించాయి. సరిగా ఒక చిన్న రాయి కింద నుండి ఒక చిన్న ఈస్టరు పుష్పము దాని తలను పైకెత్తెను. జీవము భూమి మీదకు వచ్చెను. మరియు అది అరచి చెప్పెను, “రండి, తండ్రి, దీనివైపు చూడండి.

తండ్రియైన దేవుడు దానివైపు చూచి మరియు అనెను, “అది చాల అందముగా ఉన్నది, కేవలం అలా కూయుచు ఉండుము.”

34

ఆయన కూతవేయగా మరియు పుష్పములు పైకి వచ్చెను, మరియు గడ్డి పైకి వచ్చెను మరియు మొక్క జీవము మరియు చెట్లు పైకి వచ్చెను మరియు పక్షులు భూమి నుండి పైకి ఎగిరెను, మరియు మట్టిలో నుండి మరియు కొంచెంసేపటికి జంతు జీవము పైకి వచ్చెను. ఆయన అలాగే కూయుచుండగా, మరియు ఒక మనిషి పైకి వచ్చెను. అతడు అద్భుతముగా కనబడెను, అయితే అతడు ఒంటరిగా ఉండెను; అతనికి సాటియైన సహాయం లేకుండెను.

కనుక అది చూచుటకు... నేను ఇప్పుడు ఇది నిజంగా నాటుకొనవలెనని కోరుచున్నాను. దేవుడు ఎన్నడూ స్త్రీని అసలు సృష్టిలో ఉంచలేదు. ఆమె ఒక మనిషి యొక్క ప్రత్యుత్పత్తి అయి ఉన్నది. మనుష్యుడు మరియు స్త్రీ ఒక్కటిగా ఉండెను. ప్రారంభంలో ఆదాములో నుండి ఒక స్త్రీని ఆయన తీసెను. ఒక స్త్రీ, పురుషుడు మరియు భార్య నిజముగా ఒక్కటై ఉన్నారు, అయితే వారిని శరీరములో ఉంచుటకు, వారిని మరలా ప్రత్యుత్పత్తి చేయుటకు అది చేయబడెను. కాని ఆయన పురుషుని యొక్క స్త్రీ భాగమును తీసుకుని మరియు దానిలో నుండి ఒక స్త్రీని తయారు చేసెను.

35

కాబట్టి ఒక స్త్రీ ఒక పురుషుని వలె ప్రవర్తించుటకు ప్రయత్నించినప్పుడు, ఒక పురుషునివలె బట్టలు ధరించినప్పుడు మరియు ఒక పురుషుని వలె మాట్లాడినప్పుడు, ఆమె తన స్థానమును తప్పిపోయెను. ఒక స్త్రీ, స్త్రీ తత్వము కలిగి, మాధుర్యముగా ఉండి, ప్రేమించుచు, పెద్దదిగా కాక మరియు, అలాగే నడచుచు ఒక పురుషుని వలె ప్రవర్తించుచుండును. సరే, ఆమె అలా ఉండకూడదు. మరి ఆమె అలా చేసినప్పుడు, ఆమె జీవము వంకరగా అయినది. ఆమె మాధుర్యముగా, ప్రేమ కలిగి దయగా ఉండును. ఆదాము ఎత్తుగా మరింత ఎక్కువ ధృడంగా ఉన్నాడు, ఎందుకనగా పురుషత్వమునకు మాదిరిగా, అతడు ఒక మగవానిగా ఉండెను. ఆ స్త్రీ ఆడదియై ఉండెను, అయితే అది అదే ఆత్మయై ఉండెను, ఎందుకనగా ఆయన ఆమెను ఆదాము నుండి తీసెను.

గమనించండి, ఒక పురుషుడు ఒక భార్యను కలిగి ఉండినప్పుడు, అతడు ఈ భార్యను తన ఒడిలోనికి తీసుకొనును (మనం ఒక మిశ్రమ ప్రేక్షకులము) మరియు తన ప్రేయసిగా ఈ స్త్రీని తన రొమ్ము భాగమునకు హత్తుకొనును, అతని పై ఆమె తన ముద్రను (రూపమును) వేయును. అక్కడ మరొక స్త్రీ దానిని ఎన్నటికీ పాడు చేయగలుగును. వారు ఒక్కటిగా ఉన్నారు. అలా తగిన విధంగా మరి ఏ ఇతర స్త్రీ మలచబడదు. ఒక స్త్రీ చుట్టూ నీ చేతులుంచే హక్కు నీకు లేదు, నాట్యం చేయు స్థలము, లేక ఎక్కడైననూ లేదు; అది నిజము. నీవు ఒక భార్యను పొందావు, మరియు నీవు నీ రొమ్ము భాగమునకు ఆమెను లాగావు, మరియు దేవుడు ఆమెను నీ హృదయంపై ఉంచాడు, మరియు ఆమె ఎదురుగా నిన్ను ముద్రించెను, మరియు ఆమె నీదే! మరియు నీవు ఆమెకు చెందినవాడవు.

36

మరొక పురుషుని నీ చేతులలోనికి తీసికొనిన స్త్రీ అయిన నీవు, నీవు దేనినుండి తీయబడితివో దానిని పాడు చేశావు. దానిని జ్ఞాపకముంచుకొనుము. నీవు ఒక పురుషుని వలె ప్రవర్తించినప్పుడు, నీ స్థానములో ఉండకుండ తప్పిపోయావు. మరియు పురుషుడు కూడా స్త్రీ వలె ప్రవర్తించ ప్రారంభించి, చిన్న బిడ్డవలె మరియు ఇది, అది మరియు మరొకటి చేసినప్పుడు, అతడు అతని స్థానములో ఉండకుండ తప్పిపోయాడు. అతడు యజమాని. అతడే ఏలువాడు. ఇప్పుడు ఒక చాపవలె ఉండవలెనని నా ఉద్దేశ్యము కాదు. నేను కేవలం ఒక ఏలువాడు, ఒక సాటియైన సహాయం అని అన్నాను. స్త్రీలను తన్నటం కాదు, వారు అలాంటి వారు కాదు.

అయితే బైబిలు చెప్పెను... దేవుడు సృష్టించునప్పుడు చెప్పెను, “అతడు నిన్ను ఏలును.” ఒక అధికారిగా ఉండుటకు కాదు, అయితే నీలో భాగమై ఒక సాటియైన సహాయకారిగా ఉండవలెను. ఆమె మాధుర్యముగా, మరియు దయగలదియు మరియు సంరక్షకురాలు; నీవు ఆమెను చుట్టూ మాధుర్యముగా నడిపించుము, ఎందుకనగా ఆమే నీలో భాగము అయి ఉన్నది. నీవు ఆమెను సరిగా చూడనియెడల, అప్పుడు నీయంత నీవే సరిగచూచుకొనక తప్పిపోయావు. మానసికముగా సరిగా ఉన్న వ్యక్తి అలా చేయడు. అంతా సరియే.

37

కనుక ఇప్పుడు గమనించండి. అయితే ఆయన ఈ మనిషిని చూచినప్పుడు, అతడు ఎలాటి ఒక జాతియై ఉండెను. చరిత్ర ముందు కాలానికి సంబంధించిన ఏదో గొప్ప జంతువని నేను నమ్ముట లేదు. కేవలం అతడు దేవుడు చెప్పిన విధముగానే, అతడు ఒక పురుషుడై ఉండెనని నేను నమ్ముచున్నాను. ఆ హవ్వ ఏదో దానివలె ఉండెనని నేను నమ్ముటలేదు... నేను ఒకసారి గ్రీసులో ఒక మ్యూజియంలో నిలబడి ఉండి హవ్వ మరియు ఆదాముల గూర్చి ప్రఖ్యాతిగాంచిన చిత్రమును చూశాను. అక్కడ ఆదాము వెంట్రుకలు, ఆహా, అతని ముక్కులో నుండి అక్కడ అలా వచ్చినట్టుగా ఉండెను. మరియు హవ్వ, ఓ, చూచుటకు ఒక విధమైన భయంకర జీవిగా ఉండెను. ఒక కాలు మరియొక దానికంటే పెద్దదిగా ఉండి మరియు పాదము ప్రక్కకు పెట్టి మరియు ఆమె పళ్ళు ఈ విధంగా ఉండెను. ఒకవేళ మొదట ఆదాము ఏమి చూచెనో అదే అయి ఉండిన యెడల, ఒక మనుష్యుడు అలాటి ఒక స్త్రీని ప్రశంసించును.

అది ఏమై ఉండెను? అది ఒక వేదన అయి ఉండెను, ఆ కారణం చేతనే... ప్రారంభంలో ఒక పాపి అని అతడు గుర్తించినప్పుడు, ఎందుచేత పురుషుడు క్రీస్తు దగ్గరకు వచ్చి ఉండలేదు? అతడు ఇంకనూ పొదలలో దాగుకొని ఉన్నాడు. మరియు దేవుడు ఇంకనూ పిలచుచునే ఉన్నాడు. అతడు ఏ విధంగా నిర్మించబడి ఉన్నాడో, ప్రారంభంలోనే ఒక పిరికి పంద; ఆదిలో అతడు ఏమి చేసెనో చూపించును.

38

ఇప్పుడు, అయితే హవ్వ అందమైనది. ఆమె నిజముగా అందముగా నుండెను. ఆదాము సామాన్యమైనవాడుగ, బలమైనవానిగా నుండి, పెద్ద కండరాలు కలిగి, అతని మెడచుట్టు బిరుసు తనంతో కూడిన వెంట్రుకలను కలిగి ఉండెను. హవ్వ ఇలా ఉండెనని చెప్పెదము... వారు ఇద్దరు దిగంబరులుగా ఉన్నారు; వారు పాపము ఎరుగనివారుగా ఉన్నారు. మరియు ఆ మొదటి రోజు వారు అక్కడ కూర్చుని ఉన్నారు, మరియు ఆదాము ఆమె వైపు చూచెను మరియు అతడు అనెను, “ఎందుకనగా ఆమె నా మాంసములో మాంసము మరియు నా ఎముకలలో ఎముక.” ఎందుచేత? ఆమె వానిలో నుండి తీయబడినది; ఆమె వానిలో భాగమై ఉన్నది. మూల సృష్టిలో లేదు (అది ముగించబడెను) కాని వారిద్దరు ఒక్కటై ఉన్నారని చూపించుటకు, అతనిలో నుండి తీయబడెను.

ఈనాడు పెంతెకోస్తు ప్రజల మధ్య ఉన్న వివాహము మరియు విడాకులు గూర్చి ఏమిటి? పిమ్మట మనము బోధించెదము... “ఓ, నీవు తప్పక తిరిగి జన్మించవలెనని మేము నమ్మెదము.” నేను ఏమి చెప్పుచున్నానో మీరు చూశారా? మీరు దానిని నమ్మినయెడల, అప్పుడు అది ఎలా ఉన్నదో ఆ విధముగా జీవించండి. మనం ఏమి మాట్లాడుతున్నామో దానిని ఉత్పత్తి చేయుదము. ఎందుకనగా మనం మన మనస్సును సంఘం మీదను, మరియు సంస్థ మీదను, ఈ గుంపు మీదను, మరియు ఈ స్త్రీ మీదను మరియు ఈ మనుష్యుని మిదను ఉంచుతాము. వారి మీద నుండి మీ మనస్సును తీసివేయండి! వారు విఫలమగుదురు. మీ మనస్సు క్రీస్తు మీద ఉంచండి, ఆయన వాక్యము మిద ఉంచండి, అప్పుడు అది విఫలము కాదు. మనిషి పై కాదు, ఆయననే మీ మాదిరిగా ఉండనియ్యండి.

39

చాలాసార్లు ఈ ప్రజలు దైవిక స్వస్థత కలిగినవారని పిలువబడుచు, ఈ దేశం గుండా వెళ్ళుచున్నారు. ప్రజలు వారిని మాదిరిగా తీసికొనుచున్నారు. మీరు మీ మనస్సును వారి మీద నుండి తీసి పారేయుట చాల మంచిది; అది సరియైనది. మీరు మీ మనస్సును క్రీస్తు పై ఉంచండి. మీ మనస్సు ఉంచగలిగినది ఆయన ఒకని పైనే. మీ పాస్టరు మిద కాదు, మీ పాస్టరుని ప్రేమించండి మరియు అతనిని గౌరవించండి; అతడు ఒక గౌరవించదగిన మనుష్యుడు, నిజముగానే ఒక దైవజనుడై ఉండెను. అయితే మీ మనుసు క్రీస్తుపై ఉంచండి మరియు మీ ప్రేమను క్రీస్తుపై ఉంచండి. కేవలం అతడు ఏమై ఉన్నాడో ఒక గౌరవించదగినవానిగా అతన్ని గౌరవించండి, ఎందుకనగా అతడు నీ కొరకై దేవుని ప్రతినిధిగా ఉన్నాడు.

ఇప్పుడు, అయితే, అప్పుడు మనం వారిని గమనించెదము, ఎంత మాధుర్యముగా మరియు ప్రేమతో వారుండెనో గమనించెదము. మరియు ఇప్పుడు, అవి ఎంత నీలముగా ఉన్నవో, ప్రకాశించుచున్న నక్షత్రముల వలె ఆమె కన్నులు అంత నీలముగా కనబడుచున్నవని నేను చెప్పుదును. మరియు అవి, తళతళ మెరయునట్లుగా, ఆమె తప్పకుండ అందమైనదై ఉన్నది. మరియు ఆదాము ఆమె వైపు చూచెను, ఎందుకనగా అది మొదటి చూపులోనే ప్రేమ అయి ఉండెను. శస్త్ర చికిత్స చేయబడెను మరియు ఆమె అతని ప్రక్క నుండి తీయబడెను.

40

మరియు అతడు తప్పక చేతితో తీసికొని, మరియు మనం ఇలా చెప్పుదుము, చెప్పెను, “డార్లింగ్” ప్రియురాలా, మనం కొంచెం నెమ్మదిగా నడిచెదము.“ అది శ్రీ మరియు శ్రీమతి అయి ఉండెను. సంవత్సరాల క్రితం, మీరే అయి ఉన్నారు. మరియు మనం కొంచెం నెమ్మదిగా నడిచెదము, మరియు వారు తోట గుండా నడిచెను. మీరు తెలిసికొను మొదటి సంగతి, అక్కడ అడవి నుండి ఒక భయమును కలిగించు గర్జన వచ్చెను. అది ఎవరు అయి ఉండెను? అది సింహము, సింహము అయి ఉండెను. ఆమె భయము లేకుండా ఉండెను; భయపడుటకు ఆమెకు ఏమియు లేదు; ఆమె పరిపూర్ణ ప్రేమ కలిగి ఉండెను, మరియు ప్రేమ భయమును పోగొట్టును. మరియు ఆదాము చెప్పెను, ”సింహమా ఇక్కడకు రమ్ము, హవ్వా, నీవు దానినెన్నడూ చూడలేదు. దీనిని, నేను దానిని సింహము అని పిలిచెదను, ఇక్కడ ఉన్న ప్రతి దానికి నేను పేరుపెట్టి ఉన్నాను. “మరియు అతడు దాని మెడ వెనుక భాగమును నిమిరి మరియు అది ఒక పిల్లి వలే మ్యావ్ అని అరచినది మరియు వారిని వెంబడించినది.

చిరుతపులి బయటకు వచ్చెను, మరియు సమస్త జంతువులు వాటిని చుట్టి వెంబడించెను. కొంచెం సేపటి తరువాత ఆదాము చెప్పెను, “ఓ, ప్రియమైనదానా, ఏమిటో తెలియునా? అది రమారమిగా సాయంకాలము; మనం చర్చికి వెళ్ళుట చాలా మంచిది.” అది ఆదిలో ఆదాము మరియు హవ్వ అయి ఉండెను, ఈనాడు మీరు వారి సంతానం అయి ఉన్నట్టుగనే.

41

“మనం తప్పక రోడ్ హౌస్కు (రహదారి ప్రక్కనున్న గృహమునకు) వెళ్ళెదము; మనం తప్పక వెళ్ళి బంకో ఆట ఆడెదము,” అని కాదు. “సూర్యుడు అస్తమించినప్పుడు, మనం తప్పకుండ ఆరాధించుటకు వెళ్ళెదము.” మొత్తం దేవదారుతో అలంకరించబడిన ఒక చక్కని పెద్ద చర్చికి వారు వెళ్ళి ఉండలేదు మరియు దానిలో ఒక వందవేల డాలర్ల ఆర్గను (వ్రాయించు సాధనము) లేదు. వారు కలపగల అరణ్యంలోనికి వెళ్ళిరి. మరియు బహుశా, దేవునిలో నుండి బయటకు వెళ్ళిన లోగోస్, ఒక అగ్నిస్తంభ రూపములో ఉండెనని చెప్పుదుము; (Halo) హేలో (మర్మమై ఉన్న ఈ వెలుగు) దూరాన పొదలలో అది వ్రేలాడుట కేవలం నేను చూడగలుగుచున్నాను, మరియు ఆదాము మరియు హవ్వలు ఆరాధించుటకు సృష్టికర్త ఎదుట మోకాళ్ళు వేయగా దాని నుండి సన్నని పొడవైన మెరుపు రేఖలు ప్రకాశించుచున్నవి. మరియు దాని నుండి ఒక స్వరం వచ్చి మరియు ఇలా చెప్పుట నేను వినగలను, “ఈనాడు భూమి మీద మీ ప్రభువైన దేవుడు ఇచ్చిన ఈ సహవాసమును నా పిల్లలు ఆనందించారా?

“అవును, తండ్రి, అది అద్భుతముగా ఉన్నది.”

42

చూడండి, వారు స్పర్శించగలవారుగ ఉన్నారు, వారు తాకగలరు, వారు తినగలరు, వారు ప్రేమించగలరు, మరియు వారు... ఎందుకనగా, వారు నిజముగానే ఉన్నారు. వారు ఆత్మగా లేరు, వారు ఏదో విధంగా స్పర్శించగలవారుగా ఉన్నారు. దేవుడు దూతలను చేశాడు, అయితే ఆయన నిన్ను ఎన్నడూ దూతలుగా చేయలేదు; నీవు ఎన్నడూ దూతగా ఉండలేవు. మరియు ఇక్కడున్న వీరందరు, “గోధుమ రంగు కన్నులు గల దేవుని దూత నా కొరకు కనిపెట్టును.” అది దయ్యం యొక్క ఒక అబద్దమై ఉన్నది. అయితే నీ భార్య, ఇంకా ఆమె నీ భార్యయే. “దేవుడు ఏమి... నీవు భూమి మీద దేనిని జతపరచచెదవో నేను పరలోక మందును జతపరచెదను. నీవు భూమి మీద దేనిని బంధించెదవో, నేను పరలోకములో దానిని బందించెదను.” దేవుడు ఏమి చేయునో ఏదియు దానిని వేరుచేయదు; చేయలేదు.

అప్పుడు అక్కడ ఆమె ఒక స్త్రీగా ఉండెను. మరియు వారు అన్నారు, “అవును, ప్రభువా, ఈనాడు నా ప్రభువైన దేవుడు మాకు ఇచ్చిన భూమి మీద ఎంతగానో మామట్టుకు మేము ఆనందించాము. మరియు తండ్రి, మేము నిన్ను ప్రేమించుచున్నాము.” వారు ఆరాధించుచున్నారు. “ఇప్పుడు నేను నిద్రించుటకు కింద పండుకొనుచున్నాను.” మరియు ఆదాము అతని పెద్ద చేయిని బయట ఉంచెను, సంవత్సరాల క్రితం, మీరు చేయునట్లుగానే, అమ్మ - నాన్నకు చేయునట్లు, హవ్వ ఆమె అందమైన చిన్న తలను అతని చేయిపై పెట్టెను.

43

మరియు వారు నిద్రపోయిన వెంటనే, అతడు సింహమును ఇక్కడ కింద ఉంచెను మరియు చిరుతపులిని, ఇక్కడ కింద, ఆయన సృష్టి విశ్రాంతి పొందుటకు, వాటన్నిటిని కింద ఉంచెను (దేవుడు చేసెను.) మరియు అప్పుడు పరలోక సైన్యము బయటకు వచ్చెను. గాబ్రియేలు నడచి వచ్చి, మరియు ఇలా చెప్పుట నేను చూడగలను, ఆదాము వైపు చూచి మరియు చెప్పును, “తండ్రీ, మీకు తెలియును అతడు కేవలం నీవలె కనబడుచున్నాడు.

ఎన్నిసార్లు నా భార్య మరియు నేను చిన్న జోసెఫ్ పడక దగ్గరకు వెళ్ళి, గతరాత్రి కూడ, మరియు ఆమె అనెను, “బిల్లీ, అతని నుదురు ఎత్తుగా ఉండునని మీకు తెలియును; అది నీ నుదురు వలె ఉన్నది.”

మరియు నేను అన్నాను, “అయితే అతని కన్నులు, నీ కన్నులు వలే పెద్దగా ఉన్నవి.”

ఎందుచేత? అతడు మనవలె కనబడును, అతడు మన ఐక్యత యొక్క సంతానం అయి ఉన్నాడు. మరియు మనిషి దేవుని వలె కనబడును, ఎందుకనగా నిశ్చయముగా అతడు ఆయన స్వరూపమై ఉండెను. “తండ్రీ, కేవలం అతడు మీవలెనే కనబడును. అతని పెదవులు మరియు అతని కన్నులు వైపు చూడండి.” తండ్రి ఆయన పిల్లల వైపు చూచుచుండెను, అది ఎంత మాధుర్యముగా ఉండును. ఎన్నడూ రోగిగా ఉండకుండునట్లుగా, ఎన్నడూ చావకుండునట్లుగా, ఎన్నడూ గుండెపోటు లేకుండునట్లుగా, ఎన్నడూ ఒక విచారమైనను లేకుండునట్లుగా ఉండును: అది అద్భుతంగా లేదా? తల్లి ఎన్నడూ వృద్ధాప్యం పొందదు, నాన్న ఎన్నడూ వృద్ధాప్యం పొందడు. ఎన్నడూ బూడిద రంగు వెంట్రుకలుండవు. ముఖంలో ముడతలుండవు. ఎల్లప్పుడూ అందముగా ఉండును మరియు ఎన్నడెన్నటికీ ప్రేమగలవాడై ఉండును.

44

అప్పుడు పాపము లోనికి వచ్చెను. మరియు పాపము చిత్రమును పాడు చేసెను. అయితే పాపము దేవుని ఉద్దేశ్యమును ఆపు చేయలేదు! దేవుడు ఓడించబడలేదు! కనుక అప్పుడు, ఆ కారణముగా పాపము లోనికి వచ్చెను, స్త్రీ పురుషుడను కనెను వక్ర మార్గంలో అది రెండవది అయి ఉండెను. ఆయన సొంత చేతులతో భూమి మీద మన్ను నుండి దేవుడు ఎన్నడూ అతని సృష్టించలేదు, అయితే స్త్రీ వానిని లైంగిక సంపర్కము ద్వారా తేవలసి ఉండెను.

అప్పుడు ఏమి జరిగినది? భూమి మన్ను నుండి ఎక్కడ మన దేహములు మనకు చేయబడెనో - ఆ కాల్షియం, కలప అనగా చెక్క - కర్ర మొదలైన పనిముట్లు ఆ పొటాష్, అలా దేవుడు ఉంచినది - ఇంకనూ ఉపయోగించబడుచున్నది. ఒక రోజున దాని యొక్క ఆఖరి ముక్క ఉపయోగించబడును; అది సరియైనది. ఆ నిర్మాణమునకు ఉపయోగించు పనిముట్లు పైల్ (కుప్ప) క్రిందకు వెళ్ళును. అయితే దేవుడు ఇంకనూ నేలమంది నుండి మనిషిని చేయుచున్నాడు. మరియు నీవు ఏ కారణం లేకుండగనే ఈ భూమి మీదకు వచ్చావు, విషయాలు ఏమైనను, నీయంత నీవే ఇక్కడకు వచ్చుటకు ఎంత మాత్రం ఏ మార్గము లేదు. దేవుడే ఇక్కడకు నిన్ను తెచ్చెను.

45

అపుడు, పాపము దానిని పాడు చేసినయెడల మరియు దేవుడు ఓడిపోలేదు, అప్పుడు ప్రజలు భూమి మీదకు ఒక వంకర మార్గంలో వచ్చుచున్నారు, అయితే ఇంకా, దేవుని పనిముట్లు ఉపయోగించబడుచున్నవి. ఆ పొటాష్, కాల్షియం, మరియు పదార్ధం ఆయన దానిని తినునట్లు చేయుచున్నాడు.... నీ ద్వారానే... భూమిని సేద్యం చేయుట మరియు నీ చెమట ఊర్చి నీ జీవనము చేయుదువు. అయితే మనిషి కేవలం ఖచ్చితంగా అలాగే, కచ్చితంగా అలాగే వచ్చెను. దేవుడు ఇంకా ఆయన ఉద్దేశ్యమును ఆయన మనస్సులో ఉంచుకొనెను.

ఇప్పుడు ఏమి జరిగినది? ఆ పరిశుద్ధాత్ముడు నన్ను తెచ్చెను మరియు ఈ ఉదయం ఈ భూమి మీదకు నిన్ను తెచ్చెను... లేక, నీవు మరియు నేను, తరచుగా ఈ భూమి మీద మరియు ఏ ఎన్నికలేకనే, మనం ఏమి అయి ఉన్నామో అలా మనలను చేసెను. ఒక ఎంపిక లేకుండగనే మనం ఏమైయున్నామో అలా మనం వచ్చాము. ఆయన ఒక ఎంచుకొనుట లేకుండానే, నేను ఏమైయున్నానో నన్ను చేసినయెడల, మరియు ఇంకా నేను దేవుని స్వరూపంలో చేయబడి ఉంటిని, మరియు నా తండ్రి మరియు తల్లి యొక్క పవిత్ర వివాహ బంధము ద్వారా వంకరగా ఉన్న ఒక కార్యము అయినను అలా చేయుటకు దేవుడు అనుమతించిన, ఒక పాపముతో కూడిన కార్యము ద్వారా తేబడితిమి మరియు నేను ఈ భూమి మీదకు వచ్చాను, మరియు దేవుని కృప ద్వారా ఎంత అత్యుత్తమముగా నేను ఉన్నానో, అలా అయి ఉన్నాను, మరియు ఏ ఎంపిక లేకుండానే, నేను ఒక ఎన్నిక చేసికొనినయెడల, ఈ అంత్యదినాలలో ఎలా ఎంత ఎక్కువగా ఆయన నన్ను పైకి లేపును.

46

ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు భూమిని ఎన్నడూ విడచిపెట్టలేదు; అది ఇంకా భూమి మీద ఉండి, మరియు అది భూమిపై ఉండి పొదుగుచున్నాడు. “ప్రయాసపడి భారం మోసికొనుచున్న వారలార, నా యొద్దకు రండి.” దేవుని స్వరూపంలో అలా నిర్మించబడి ఉన్న సమస్త వస్తు సాధనములైన మీరు కూయుచు, పిలుచుచూ, ప్రేమ కొరకు ప్రయత్నించుచున్నారు. మరియు పరిశుద్ధాత్మ ప్రేమతో పిలిచియెడల, మరియు మనం వెనుకకు వచ్చి మరియు అందుము, “అవును, గొప్ప దేవుడా, నీవు నన్ను చేశావు మరియు నేను నిన్ను ప్రేమించుచున్నాను. మరియు నీవు నా సృష్టికర్తవు, మరియు నేను పాపంతో ఉన్నాను, మరియు దాని గూర్చి నేను సిగ్గుపడ్డాను.” అప్పుడు ఆయన నన్ను నిత్యజీవంలో ఉంచెను.

ఆయన పిలుపునకు తిరిగి జవాబిచ్చుట ద్వార అప్పుడు ఆయన నిత్యజీవము ఇచ్చినయెడల, మరియు ఏ ఎన్నిక లేకుండా నేను ఏమైయున్నానో అలా నన్ను చేసినయెడల, నేను ఒక ఎన్నిక చేసిన తరువాత, మరియు పరిశుద్ధాత్మచే నింపబడిన తరువాత అలాగు ఎంతో ఎక్కువగా ఆయన నన్ను పైకి లేపును. పరిశుద్ధాత్మ దేవుని సొంత జీవమైయున్నది. దేవుడు తనకు తానే జీవమును పొగొట్టుకొనుట కంటే అలా నీవు నీ జీవమును పోగొట్టుకొనలేవు. ఆ పదము గ్రీకు పదము (ZOE) జోయి నుండి వచ్చును. “నేను వారికి నిత్యజీవమును ఇచ్చెదను.”

47

ప్రారంభము గల ఏదైనను అంతము గలదై ఉండును. ప్రారంభం లేని ఆ సంగతులకు అంతము లేదు. నీవెన్నడైనా అలా ఆలోచించావా? ఆకాశములలోని ఆ గొప్ప కళాఖండము అయిన దేవుని వర్షధనుస్సు (మనం అలా చెప్పుదము) దేవుని ఏడు ఆత్మలతో ఉన్నది. ఎరుపు, పరిపూర్ణ ప్రేమ. అది వచ్చిన తరువాత ఫిలియా ప్రేమ, అగాపే నుండి ఫీలియో ప్రేమకు అది నీ భార్య కొరకు నీవు పొందిన ప్రేమ అయి ఉన్నది. ఎవరో వ్యక్తి (మనిషి) ఆమెను అవమానపరచిన యెడల, నీవు అతని మెదడు బయటకు వచ్చినట్లు కాల్చివేయుదువు, చూడండి. ఎందుకనగా అది ఒక పౌరుషమును పుట్టించును. అయితే అది ఫీలియో ప్రేమ, రెండవదైన ప్రేమ అయి ఉన్నది.

అప్పుడు మరొక పురుషుని భార్య కొరకు దురాశ వచ్చును. అప్పుడు చూచుటకు అసహ్యకరమైనది వచ్చును, చూడండి. కేవలం అది వంకరగా చేయబడినది. అయితే ఈ రకమైన సమస్త ప్రేమకు ఒక ప్రారంభము గలదు. అయితే ఆ నిజమైన, స్వచ్చమైన దేవుని ప్రేమ, అలా నేను మాట్లాడుచున్నది. తిరిగి జన్మించుట ద్వారా, కొత్తజన్మ ద్వారా మానవునిలోనికి వచ్చును, దానికి ప్రారంభం లేదు మరియు దానికి అంతమూ లేదు. నీవు అప్పుడు దేవునికి ఒక కుమారుడవు మరియు దేవునికి ఒక కుమార్తెవు అగుదువు, మరియు నీ ప్రేమలు పై నుండి వచ్చును.

48

ఒక మనిషి నీ భార్యను అవమానపరచినప్పుడు, ఫిలియో ప్రేమ అతని నీవు కాల్చి చంపి వేయునట్లుగా చేయును. అగాపే ప్రేమ నశించిన అతని ఆత్మ కొరకు నీవు ప్రార్ధించునట్లు చేయును. అదే వ్యత్యాసము.

కనుక నీవు తప్పక తిరిగి జన్మించవలెను. ఇప్పుడు అది అలాగైతే కేవలం స్నేహంతో కూడిన ప్రేమ అయినయెడల, “ఓ, నేను అసెంబ్లీస్ కు చెందినవాడను,” అని నేను చెప్పుదును. మరియు “అయ్యా, నీవు దేవుని సంఘానికి చెందినవాడవు,” అలా చెప్పుదును. మరియు నేను అంటాను, “ఓ, నిశ్చయముగా, మేము అద్భుతమైన స్నేహం, సహవాసం కలిగి ఉన్నాము.” ఇంకా అది కాదు. ఇక్కడ ఈ ఉదయవేళ మనం వివిధ మతశాఖలకు చెందినవారమని నాకు తెలియును. అయితే సహోదరులారా, ఇది పూర్తి జవాబు కాదు. ఇది స్నేహము కొరకు మరియు సహవాసం కొరకు జవాబు అయి ఉన్నది, అయితే దేవుని గూర్చి ఏమిటి? నా ఉద్దేశ్యం ఏమిటో చూశారా?

49

అగాపే ప్రేమ (దేవుని ప్రేమ) ఫీలియో ప్రేమకు (శరీర సంబంధమైన ప్రేమ) వ్యత్యాసముగా ఉన్నది. ఫీలియో ప్రేమ అనగా మనం వచ్చి సమావేశం అవుతాము, కలసి ఆలోచిస్తాము, ఇలా అంటాము, “అవును, మనం సహోదరులమై ఉన్నాము,” అది చక్కగా ఉన్నది, మన చేతులతో కరచాలనం చేస్తాం, నిశ్చయముగా “ఎందుకనగా నేను అన్ని శాఖలకు చెంది ఉన్నాను.” నిశ్చయముగా, అంతా కలసి ఉన్న ఒకే గూటిలోని పక్షుల వలే ఉన్నాము. మనం ఏమై ఉండవలసి ఉన్నదో అదే, నేను అది ఇష్టపడతాను, అది మంచిది, ఇక్కడ నీవు ఒక మంచి సంగతిని పొందావు. అయితే సోదరుడా, అది అంతా పూర్తిగా అది కాదు. భూమిలో ప్రతి దానినుండియు దూరాన ఉన్న సృష్టికర్త యొద్దకు అలా మనలను లాగునది మనం ఏదో మరొకటి పొందవలసియున్నది. మనకు నిత్యజీవము నిచ్చు ఆయననే, ఈ కాల్షియం మరియు పొటాష్ లనుంచును. అది ఎంత వృద్ధాప్యం అయినను ఏమియు కాదు, ఎంతగా అది ముడతలు పడినను, ఏలాగు అది ఎండిపోయినప్పటికిని, లేక ఎంతగా రోగి అయినప్పటికి, దేవుడు దానిలో ఉన్న ప్రతి (ఇంచుమించుగ 29 గ్రాములు బరువు) ఔన్సును ఎరుగును. భూమికి పునాదులు వేయక మునుపే ఆయన త్రాసులో ఆయన దానిని తూచెను. మరియు నేను ఒక తీర్మానం చేయుటకే దీనిలో ఉంచబడితిని. నేను క్రీస్తుకు నా తీర్మానం చేసియున్నాను. మరియు అక్కడ.... అంత్యదినాన పైకి ఎత్తబడి మరియు ఆయన స్వరూపములోనికి మారకుండా నరకములో ఉన్న దయ్యములన్నియు నన్ను ఆపలేవు.

50

అయితే ఆ నిత్యజీవము లేకుండా, ఈ సహవాస జీవితము, అది క్షీణించగలదు. దానికి ఒక ప్రారంభముగలదు, దానికి అంతమూ గలదు. అయితే నిత్యజీవమునకు సంబంధించి, నిత్యత్వము దానికది చనిపోవుట కంటే, అది ఇక చనిపోలేదు. మరియు నిత్యత్వము అనగా ఏమిటి? అది అంతము లేని ఒక పరిపూర్ణ వృత్తము అయి ఉన్నది. కేవలం అది చుట్టూ తిరుగును... ఆయన దానిని ఈ మార్గము చుట్టూ తిరుగునట్లు ప్రారంభించెను, టేబిలు గుండా వెళ్ళును, నేల మీద భూమి మీద నుండి ఇంకా అది ఒక పరిపూర్ణ వృత్తము అయి ఉండెను. మరియు దేవునికి ప్రారంభమూ లేదు లేక అంతమూ లేదు.

ఆయన ఆత్మను మనలో పెట్టినప్పుడు, అలా ఈ శరీరములోనే ఆయన భూమి మీద నుండి పొదుగుచున్నాడు. అగాపే ప్రేమ ద్వారా స్వారీ చేయబడి మన ఫీలియో ప్రేమ ఒక చోటకు వచ్చినప్పుడు, అలా పోషించబడి మరియు భూమి మీద నుండి పొదిగినప్పుడు, ఈ కాల్షియము మరియు పొటాష్ లో మనం అప్పుడు నిత్యజీవము పొందాము. దానిని చేసిన దేవుడే, దానిని మరల తిరిగి లేపి, ఎంతగానో మరింత ఎక్కువగా చేయగలడు. కాబట్టి నీవు తప్పక తిరిగి జన్మించవలెను.

51

ఇక్కడ ఈ మధ్య ఒక అల్పాహార విందులో కూర్చుండగా, కేవలం, ఇద్దరు సేవకులు, నేను మరియు ఒక మెథడిస్టు బోధకుడు. అల్పాహారము కాదు, కేవలం ఒక చిన్న మధ్యాహ్న భోజనం; మేము కలసి కొన్ని ఐస్క్రీములు కలిగి ఉంటిమి. మరియు ఆ 4-హెచ్ కెంటకీ క్లబ్ అక్కడ ఆ రేడియో కార్యక్రమంలో చూపించెను, కేవలం పొలంలో నీవు పెంచిన వాటివలే ఖచ్చితంగా ఆ చిన్న జొన్న గింజలను చేయు ఒక చిన్న యంత్రమును వారు పరిపూర్ణముగా కలిగి ఉండెను. చెప్పెను, “అలా పొలంలో ఎదిగిన ఒక సంచిలో తీసుకొందము, మరియు ఆ యంత్రంచే చేయబడిన మరొకటి, వాటిని మొత్తంగా, చేసి ఉంచండి, నీవు ఒకదాని నుండి మరొకటి ఏదో చెప్పలేవు. ప్రతి ఒక సంచి నుండి ఒక పిడికెడు వాటిని పొంది, వాటిని మొత్తం అంతా కలిపి ఉంచండి, మరల అది అని చెప్పడానికి అక్కడ ఏ మార్గమూ లేదు.

వారు అదే విధమైన జొన్న రొట్టె చేయుదురు, అది అదే విధమైన ముతక ధాన్యములు చేయగలదు. అది అదే విధమైన (కారన్ ప్లేక్స్) మొక్క జొన్నతో చేయు అల్పాహారము చేయగలదు, అది అదే పరిమాణంలో పొటాషియం, కాల్షియం పొంది, మరియు ప్రతిదియు దానిలో ఉండును. ప్రతిదియు అక్కడ సరిగా ఉన్నది, బయట ఉన్న చర్మము, ఆ గింజ లోపల భాగం కూడ, కేవలం పరిపూర్ణముగా ఉండును. పరిశోధనాశాలలో కూడ, నీవు వాటిని విడిగా కోసి మరియు వ్యత్యాసం చెప్పలేవు. నీవు ఎన్నడైనా వాటిని ఎరిగి ఉండుటకు వాటిని నాటవలెను, కేవలం ఆ విధంగానే నీవు చెప్పెదవు. ప్రభువు యొక్క నామమునకు స్తుతి కలుగును గాక.

52

సహోదరుడా, ఎంతగా అది నిజంగా కనిపించినను, నిత్యజీవము అయిన, దేవుని తాకి ఉండుటకు అది అక్కడ పొందవలసి ఉన్నది. దేవుడు పొలంలో ఎదిగించిన దానిని, మరియు ఆయనే చేసి, మరల లేపును. మనిషి తయారు చేసినది, ఏమియు కాదు... కనుక మన మానవ-నిర్మిత సంస్థలు, ఏదెను తోట నుండి మానవ నిర్మితమతం ఇంకా అంజూరపు ఆకులవలె ఉన్నవి. మనిషి దేవుని ఆత్మ ద్వార తిరిగి జన్మించి మరియు వానిలో నిత్యజీవము కలిగి ఉండేవరకు అది ఎన్నడూ పని చేయదు.

సేవక స్నేహితులారా, నేను మీ సమయమును చాలా ఎక్కువ తీసికొనుచున్నాను, అయితే విడువక ముందు, నేను ఇది చెప్పగోరుచున్నాను. ఇది మితో విడిచి పెట్టగోరుచున్నారు. మీ సహోదరునిగా, మిమ్మును ప్రేమించినవారిగా, ఇప్పుడు కేవలం విడచి వెళ్ళే ముందు విశదముగా చూచిన దీనిని జ్ఞాపకముంచుకొనుడి.

ఎంతోకాలము క్రితము కాదు, ఒక యవ్వన వ్యక్తి, ఒక యజమాని, అక్కడ ఒక గొప్ప మనిషి ఉండెను. మరియు ఓ, ఎంతగానో అతడు వాయించగలడు. కేవలం అతడు తన సంగీతంతో ప్రపంచాన్నే తబ్బిబ్బు చేయగలడు. అతడు దాని విషయంలో ఒక గొప్ప కళాకారుడై ఉండెను. కనుక ఒక రాత్రి ఒక ప్రత్యేక దేశం, ఇంగ్లాండులో చాల వేల కొలది ప్రజలను వినోదపరచుచుండెను. మరియు వారు చాలా ఆశ్చర్యపడిరి, చుట్టూ ప్రతిచోట ఉన్న ఆ గొప్ప యజమానులను చూచి చాలా ఆశ్చర్యపడెను మరియు ఆ ప్రజలు, అతడు అతని కచేరీ లేక అతని సంగీతమును వాయించిన తరువాత, వారు కేకలు వేశారు, మరియు వారి చేతులతో చప్పట్లు కొట్టి మరియు పిచ్చిగా అభిమానించిరి. కాని అలా వారు శ్లాఘించుచున్న దానికి ఆ యవ్వన వ్యక్తి శ్రద్ద చూపలేదని గమనించిరి; అతడు పైకి చూచుచుండెను.

53

వారు అరచుచుండిరి, మరియు ఓ, కేవలం అతని సంగీతమును వారు ప్రశంసించుచున్నట్టు అతడు ఎరిగి ఉండుటకు ఎంత గట్టిగా చేయవలెనో అంత గట్టిగా చేస్తున్నారు, మరియు అతడు ఒక మేధావి అయి ఉండెను. కాని అతడు పైకి చూచుచుండెను. వారు అతడు ఏమి చూచుచుండెనో అని ఆశ్చర్యపోయారు. ఆ బాల్కనీ దారికి పైగా ఆ వృద్ధ బోధకుడు అక్కడకు పైగా ఎక్కి ఉన్నాడు. అతడు ఆ బోధకుడు దానిగూర్చి ఏమి చెప్పనై ఉండెనో అని ఆశ్చర్యపడుచు, అతని కంటిని అలాగే ఉంచెను. వారు ఏమి చెప్పినను, అతడు లెక్క చేయలేదు; ఆ వృద్ధ యజమాని అయిన బోధకుడు, అది ఆ బోధకుడు ఏమి చెప్పుచుండెనో అదే అయి ఉండెను.

సువార్త సేవకులారా, ఈ పెద్ద ప్రచార శిబిరములు మరియు ప్రజలు చప్పట్లు చరచి తెలుపు ఆమోదమును గుర్తించవద్దు; మీ కన్నులు యజమాని మీదనే ఉంచండి, ఎందుకనగా ఆ రోజున మనలను పైకిలేపువాడు ఆయన ఒక్కడు మాత్రమే.

54

మనము ప్రార్ధించుకొందము.

తండ్రియగు దేవా, ఈ తీవ్రమైన చిన్న వ్యాఖ్యానములు నరాల బలహీనత గల ఒక వ్యక్తి నుండి వచ్చుచున్నవి, అయితే దేవా, నేను ప్రార్ధించుచున్నాను, అలా ఏ విధంగా అయినను నా సహోదరులు మరియు సహోదరీల యొక్క అంతరంగ లోతులలోనికి అది వెళ్ళుననియు, అలా వారు మేము ఈ టెలివిజను కార్యక్రమం, లేక ఇది, అది లేక మరొకటి కలిగి ఉందుము అని వారు తలంచినను, అది ఏ భేదమును కలగ చేయలేదని, అలా వారు గ్రహించగలరు. మా కన్నులు యజమాని మీద ఉండునట్లు మమ్మును కాపాడండి.

అతీతమైన ప్రేమను కలిగి ఉండుటయే అని మరల తిరిగి జన్మించుట అనగా జ్ఞాపక ముంచుకొనండి మరియు మేము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరిగియుండుటయు. మేము సమృద్ధియైన జీవము కలిగి ఉన్నాము మరియు ఆ సమృద్ధియైన జీవమే దేవుడు మానవునిలో ఉంచిన ఏదో అయి ఉన్నది.

55

ఈ ఉదయాన సేవకులుగా మనం, ఈ చిన్న సమావేశం కొరకు ఇక్కడ సమావేశమవ్వగా, ఆ రోజున పొదుగుటకు పరిశుద్ధాత్మను పంపగల ఒక్కరు ఆయన మాత్రమే అని ఎరుగుచూ, మన మనస్సులు యజమానుని మీద ఉండునట్లు చేయండి. ఈ గొప్ప హైడ్రోజను బాంబు భూమిని తాకినప్పుడు మరియు అది మరల వెనుకకు శుభ్రము చేయబడిన తెల్లని ఎడారిగా అగును, దేవుడు మొత్తం అంతా మరలా కొత్తదిగా చేయనారంభించును. ఒక తీర్మానము చేసుకున్న ప్రజలతో అది వచ్చును. వారి శరీరములు ఇక్కడ పడి ఉండును, ఏమియు కాదు గాని, తిరిగి పొటాష్ మరియ కాల్షియం, పెట్రోలియంగా అగును. అయితే పరలోకపు దేవుడు, వారి ఆత్మను తీసుకున్న ఆయన తిరిగి వారు ఉన్నట్టుగానే వారిని ఉంచును. ఏదో రోజున యేసు వచ్చునప్పుడు సంపూర్తి చేయబడు నెగిటివ్ చిత్రము యొక్క ఒక ఛాయ మాత్రమే అయి ఉన్నది. అప్పుడు ఆయన ఉన్న విధముగా మనం ఆయనను చూడగలము మరియు మనము తెలియబడినట్లుగాను మనము ఎరుగుదుము. అప్పటి వరకు, పైకి చూచుచున్న, మమ్మును విశ్వాస పాత్రులయిన సేవకులుగా ఉంచండి, యేసు నామములో. ఆమెన్.

నేను మా సమయమును ఎక్కువగా తీసికొన్నందుకు నేను చింతించుచున్నాను. మరియు ఇప్పటికే 9:30 అయింది. నేను మీకు చాలా వందనాలు చెల్లించుచున్నాను. నేను వెంటనే ఇంటికి వెళ్ళుదును, మరియు ఈ రాత్రి ప్రార్ధన కొరకు మరియు రోగుల కొరకు సిద్దముగా ఉందును. దేవుడు మిమ్మును దీవించును.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...