విశ్వాసము ద్వారా మోషే
నెవిల్ సోదరుడా వందనములు. ప్రజలారా, శుభోదయం. ఈ రోజు ఇక్కడ ఆలయములోయుండుట బాగున్నది. బహుశ సోదరుడు నెవిల్ ఈ ఉదయము మాట్లాడితే, రాత్రికి నేను ప్రయత్నం చేయవచ్చని తలంచాను, అలాగైతే ఈ ఉదయము ఒక సండే స్కూలు పాఠము కొరకు ఎదురు చూస్తాను. ప్రభువు చిత్తమైన యెడల, ఈ సండే స్కూలు పాటమును కలిగియుండుటకు మనము ప్రయత్నం చేద్దాము.
2 ఇప్పుడు, నేను లోనికి వచ్చి దరిదాపుగా రెండువారములైయున్నది. మీకు తెలిసినట్లుగా నేను పొలములో, చాలా బలహీనతతోయున్నాను, నేను నిజముగా, నిజముగా అలసిపోయాను. ఇంకేమాత్రము ముందుకు వెళ్ళలేను. ఒక చిన్న విశ్రాంతి కొరకు నేను లోనికి రావలసి వచ్చింది. నేను జన్మించిన, ఆ కెంటక్కీలోని, ఉల్ఫ్ క్రిక్ డామ్ నొద్దకు వెళ్ళుటకు మూడు రోజులు పట్టింది. నేననుకొన్నాను, “ఓ, ఇప్పుడు నాకు అద్భుతముగాయున్నది. నేను బాగాయున్నాను.”
3 నేను తిరిగి ఇంటికి వచ్చాను, మరియు మొదటిగా నన్ను ఎదుర్కొన్న సంగతి ఏమనగా, ఆదాయపు పన్నును గూర్చిన ఒక ప్రభుత్వ వ్యవహారము. మళ్ళీ తిరిగి మార్గమంతటి గుండా నేను అడుగనకు వెళ్ళిపోయాను. కాబట్టి నేను గ్రహించాను, తిరిగి నేను విశ్రాంతి తీసుకొనుటకు, ఒక వారము పైన లేక రెండు వారములు పడుతుంది.
4 ఇప్పుడు నా పరిచర్య మార్పు చెందుటకు నియమించబడుచున్నది. నాకు ఏ కూటములు నిర్ణయించబడినవి లేవు. ఆ కారణమును బట్టియే, ఒక విధముగా ప్రక్కకు వచ్చి, తరువాత కొన్ని వారముల పాటు విశ్రాంతి తీసుకొని, సంపూర్ణముగా విశ్రాంతి తీసుకొని, ప్రభువు కొరకు కనిపెట్టాలని తలంచాను.
5 మాతో ఎంతో కాలము నుండియుండియున్న, పాత-కాలపు ప్రజలైన మీకు తెలుసు, ప్రభువు మనతో ఏమి చెప్పాడో, ఆయన చెప్పిన దానిని నెరవేరుస్తానని, ఆయన ఎల్లప్పుడు నెరవేర్చాడు.
6 గుర్తుంచుకోండి, ఎంతో ప్రారంభములో, ఇక్కడయున్న సంఘము. ఆ ఉదయమున నేను ఆలయమునకు పునాది రాయి వేసినపుడు…అది ఆ రాయి మీద వ్రాయబడింది, నా బైబిలులోని ఖాళీ పేజీలో అది వ్రాయబడింది. ఆ ఉదయమున ఆ గొప్ప దర్శనము చెప్పింది, “ఇది నీ ఆలయము కాదు.”
7 నేనన్నాను, “ప్రభువా, అది ఎక్కడయున్నది?” ఆయన నన్ను ఆకాశము క్రింద నిలబెట్టాడు. మరియు ఒక స్వరము వచ్చింది. నేను చూడగా అక్కడ చెట్లవలె, మూడు సిలువలు ఫలములతోయున్నాయి. ఆ దర్శనము ఏమిటో మీకు తెలుసు. ఎన్నో సంవత్సరముల నుండి, అది బయట వ్రాయబడింది.
8 మొన్నటి దినమున, ప్రభువు ముందుగా చెప్పిన సంగతులను గూర్చి ఒక పుస్తకమును ఏరుకొని చదువుచున్నాను; అవి ఇది వరకే నెరవేరియున్నవి. ఈ యవ్వనులను గూర్చి, యుద్ధము ఎలా బయటకు వస్తుందో, ఆ కార్యములన్నీ తాకబడినవి.
9 కేవలము రెండు విషయాలు మిగిలియున్నాయి, ఆ గొప్ప ప్రవచనములలో ఒకటి, అదేమనగా కార్లు రిమోట్ కంట్రోల్ ద్వారా, రోడ్ల మీదకు రావటం. కోడి గ్రుడ్డు ఆకారములో కనబడుతున్నాయి, నీవు దానిని నడపనవసరము లేదు. అది దానికై అది నియంత్రణ చేసుకొంటుంది. తరువాత ఒక గొప్ప స్త్రీ అక్కడ పైకి లేచుట, ఏలయనగా అమెరికా ఒక స్త్రీ యొక్క దేశమైయున్నది. ఒక గొప్ప స్త్రీ ఈ దేశములో ఒక అధ్యక్షుడిగా పైకి లేచుట, లేక అలాటిది ఏదో; మరియు అప్పుడు ఒక సంపూర్ణ నాశనము వచ్చుట. మొత్తము దేశము తుడిచివేయబడింది.
10 నేను ముందే చెపుతున్నాను…ఇది ఇప్పుడు ప్రభువు చెప్పేది కాదు (ఇతర సంగతులు, స్త్రీ గురించి, అది ప్రభువైయున్నాడు) 1933లో నేను ముందే చెప్పాను. 1977కు ముందే ప్రపంచము సంపూర్ణముగా నాశనము చేయబడుతుంది.
11 ఇప్పుడు వారు దేనినైనా నాశనము చేయుటకు కలిగియున్నట్లుగా, అప్పుడు నాకు అది తెలియదు, కాని ఈ దేశము సంపూర్ణముగా నాశనమైపోయింది, చెట్ల మొద్దులు, అవన్నియూ ఆ రీతిగా విడవబడినవి.
12 కాబట్టి అది మార్గములోయున్నది. మరియు ఆయన చెప్పియున్నట్లుగా మిగిలిన విషయములన్నీ నెరవేరాయి, అది కూడా నెరవేరుతుంది; సరిగ్గా ఆయన లేఖనములో ఏమి చెప్పాడో, అదే ఇక్కడయున్నది. క్రీస్తు మొదటి సారి వచ్చియున్నట్లైతే, ఆయన రెండవసారి వస్తాడు, ఆయన చెప్పిన ఈ విషయములన్నీ నెరవేరతాయి. దీనిని సరియైన రీతిలోచూచుట ద్వారా, మన సంఖ్య పిలవబడుటకు సమయమైయున్నదని, ఒక దేశముగా, మనము ఎరిగియున్నాము. సంఘము ఎత్తబడుటను తీసుకొనుటకు సమయమైయున్నదని మనము ఎరిగియున్నాము. మనము ఈ దినమున, జీవించుచున్నామని ఎరుగుట, అది ఏ సేవకుని హృదయమైనా, ఏ సంఘ సభ్యుని హృదయమునైనా కదిలిస్తుంది. ఇది ఎన్నడైనా ఏ వ్యక్తియైనా, భూమి మీద జీవించిన అతి గొప్ప సమయమైయున్నది, అది తిన్నగా ఇప్పుడే; అదే, సంఘము కొరకైయున్నది. కాబట్టి నిశ్చయముగా నేను మీ ప్రార్థనలను కోరుచున్నాను.
13 తరువాత ఆలయములో, సంఘములోని బోర్డు సభ్యుల కొరకు తిరిగి ఎన్నికలు కలిగియుండబోవుచున్నారని నేను చూసియున్నాను.
14 సంఘమునకు ఒక చిన్న కూటము. ఒక రేపబడుట అవసరమైయున్నది, మీరు ఎల్లప్పుడూ నాకు దయగాయుండి, నన్ను దీవించియున్నారు. నేను ఇక్కడయుండుట ద్వారా, ఒక దీవెనకరముగా యుంటుంది. నిశ్చయముగా మీతోయుండుట, నాకు దీవెనకరముగాయుండియున్నది. నేను దానిని దేవుని ద్వారా చూసియున్నట్లుగా, నేను చెప్పినది సత్యమైయున్నదని మీరు అంగీకరించారు. నేను దానిని మెచ్చుకొంటాను.
15 అందును బట్టి, నేను లోనికి వచ్చుట ప్రారంభించాను, అప్పుడు నేను కనుగొనవలసినది ఏమనగా, మన సంఘమును, దాని బోర్డు సభ్యులను తిన్ననిగా చేయటం, తరువాత ఎన్నికలు మరియు మొదలైనవి. మరియు అప్పుడు-అప్పుడు, దాని తరువాత, నేననుకొన్నాను, నేను తిరిగి పొలములోనికి వెళ్ళు వరకు, నేను బయటకు వెళ్ళి కొంత విశ్రాంతి తీసుకొంటాను.
16 ఇది మీ మద్యయుంచుకోండి. ఇప్పుడు, ఇది బయట వారికి కాదు. ఇది ఈ ఆలయము కొరకైయున్నది. ఈ ఆలయముతో మనకు కూటము కావాలి, ఆ ప్రకారము సమస్తము, ప్రతి పొరపాటు, ముందుకు కొనిపోబడుచున్న విషయములు, మరియు బహుశ ఒకరి పట్ల భిన్న బేధ భావనలు; అవే, నేను వారిలో ప్రతి ఒక్కరిని ముఖాముఖిగా ముందుకు తేగోరుచున్నాను. నీవు దానిని ఎదుర్కొనుటకు ఇష్టపడకపోయినట్లైతే, నీవు ఈ ఊరిని విడిచి వెళ్ళుట మంచిది; ఏలయనగా, మనము ఆలయమునొద్ద చేసినట్లుగా, దానిలో ప్రతి దానితో మీరు ఒకరితో ఒకరు ముఖాముఖిగా ఎదుర్కొనబోవుచున్నారు. అంతయూ చక్కపర్చబడాలి, కారణము మనము సహోదరులము మరియు సహోదరీలమైయున్నాము, ప్రభు రాత్రి భోజనమును, దీవెనల బల్లనొద్ద, విచ్ఛిన్నము చేసియున్నాము. తప్పుగా మనలను ప్రవర్తింపచేయునది దయ్యము తప్ప మరేదియు కాదు. వాడే దేనికైనా ఆ రీతిగా చీల్చివేసి, అపార్థములు కలిగిస్తాడు. నేను సోదరుడు నెవిల్ తో మాట్లాడుచున్నాను, మరియు ప్రజలను ప్రజల యొద్దకు ఏకముగా చేయుటకు, చివరకు ఈ పాత ఆలయము వెనుకకు వచ్చి, తిరిగి తన పాదములపై స్థాపించబడి, దేవుని రాజ్యము కొరకు మార్గము గుండా వెళ్ళనట్లు, మేము స్థలము వెంబడి, స్థలములకు తిరుగుచున్నాము. ఇప్పుడు, ఇది ఆ కారణమును బట్టే చెప్పాను, ఎందుకంటె మన చిన్న గుంపుతో ఈ ఉదయమున అది ఇక్కడయున్నది.
17 ఇప్పుడు నేను కొంత విశ్రాంతిని పొందబోవుచున్నాను. నేను వెళ్ళవలసినంత త్వరగా వెనుకకు వెళతాను. అప్పుడు నేను తిరిగి పొలములోనికి వెళ్ళుట కొరకు ఎదురు చూస్తాను. ఈసారి, ప్రభువు చిత్తమైన యెడల, మనము ఏమి కూడబెట్టామో, ఆ చిన్న నిధులను, ఆ బయట విదేశీ పొలము కొరకు నేను తీసుకొంటాను, ఒక క్రొత్త గుడారమును, మరియు కొన్ని పరికరములను కొని, పొలములో ముందకు వెళ్ళుట ప్రారంభిస్తాను. సంఘము నుండి సంఘమునకు కాదు, కాని మన సొంత కూటముల కొరకు వెళతాను.
18 నన్ను ఆహ్వానించిన సోదరులను అగౌరవముగా మాట్లాడుట లేదు, అది అద్భుతమైనది. అయితే దానిలో అతి ఎక్కువుగా, ఈ కూటములలో కనుగొనేదేమంటే నీవు అక్కడయుండబోవుచున్నావని వాళ్ళు చెపుతారు, అప్పుడు నీ స్నేహితులందరూ లోనికి వస్తారు, తరువాత డబ్బు కొరకు ఎంతో ఎక్కువుగా మద్దెల వాయిస్తాయి. సరిగ్గా అది ప్రజలు క్రిందికి కారిపోవునట్లు చేస్తుంది. మీరు చూడండి, నేను సిరిగా దానిని కనుగొనుట ఆరంభమైంది. కాబట్టి అది సరికాదు. వారిని తెచ్చే స్థలమును మనము కలిగియుండవలసియున్నాము. మీరు మీ డబ్బును తేవలసిన అవసరము లేదు. మీకై మీరుగా మార్గము వెంబడి వచ్చి, ప్రభువును సేవించండి? చూశారా? కాబట్టి ఇప్పుడు.
19 నా సేవ ఇప్పుడే తిన్నగా ఒక మార్పును తీసుకొనియున్నది. మీకు గుర్తున్నదా, నేను ఒక మనిషి చేతిని పట్టుకొని, అక్కడ కేవలము నిలబడియున్నప్పుడు, ప్రభువు వారి యొక్క ఇబ్బంది ఏమిటో నాకు చెప్పేవాడు. “అప్పుడు అది నెరవేరేది, ప్రజల హృదయములోని రహస్యములను నీవు గ్రహిస్తావు,” అన్నాడు. అప్పుడు మీలో ప్రతి ఒక్కరికి తెలుసు, అది పరిపూర్ణముగా చెప్పబడిన విధానములో సంభవించేది. ఇప్పుడు ఇది తరువాత అడుగు, అది ముందుగా చెప్పబడి, ప్రవచించబడియున్నది, మీరు చూడండి, వాటిలో దేనికైనా ఎంతో దూరములోయున్నది. ఇప్పుడే తిన్నగా అది మార్పులోయున్నది.
20 ఆ కారణమును బట్టియే సాతానుడు, ఆదాయపు పన్ను వ్యవవహారముతో నాతో పోరాడుచున్నాడు, ఒక సేవకుడిగా, ఇరవై ఏడు సంవత్సరముల క్రితము, నేను సేవలో ప్రవేశించినప్పటి నుండి ప్రతి పైసాకు, నేను పన్ను కట్టాలని, గవర్నమెంటు వారు నాతో చెప్పుటకు ప్రయత్నము చేయుచున్నారు. అది ఆలాగు కాదు, ఏలయనగా అది ఇక్కడ సంఘము గుండా వెళ్ళియున్నది.
21 నేను ఈ సంఘము యొక్క ధర్మకర్తనైయున్నాను. అది అక్షరాల సత్యము. అది అక్కడ రికార్డుల మీదయున్నది. కాబట్టి, అప్పుడు, నేను ఈ సంఘముల యొక్క ధర్మకర్తయైన కోశాధికారిని, అప్పుడు ఈ ప్రపంచములో అక్కడ ఏదీ…ప్రభుత్వము దానితో చేయునది ఏదియు లేదు. వారు సంఘమును ప్రశ్నించుట లేదు. సంఘము యొక్క కోశాధికారిగా వారు నన్ను ప్రశ్నించుచున్నారు. అదిగో అక్కడ బ్యాంకులో ధర్మకర్తలు, ఒక పేపరుపై సంతకము చేసియున్నారు, అదే, నా నిధులన్నీ…నేను నా సొంత ఫౌండేషన్ ను కలిగియుండుటకు బదులుగా, నేను నా సంఘము ద్వారా నేను దానిని జారీ చేసియున్నాను, ‘కారణము అది దానికై అదే, ఎలాగైనా ఒక ఫౌండేషన్ గా యుంటుంది.
22 దానిని చేయుటకు, దానిని విడిచి, దూరముగా యుండుటకు, నేను సంఘమును విడిచి, దూరముగా యుండుట జరిగింది. ఇక్కడే ఏమియూ లేనందున, బయటకు వెళ్ళుట జరిగింది. నేను సంఘమునకు తిరిగి వస్తానని ప్రజలకు వాగ్దానము చేసిన తరువాత, ప్రతి సారి నేను వారికి సహాయము చేశాను. ఆ కారణమును బట్టియే, నేను దానిని ఆ రీతిగాయుంచాను, కారణము ప్రజలైన మీకు నేను వాగ్దానము చేశాను. ఆ కారణమును బట్టియే ఒక వ్యక్తి స్వేచ్ఛను కలిగియుండుటకు బదులుగా, దానితో ఆ మార్గములో నిలిచియున్నాను. అప్పుడు, దానిని చేసినట్లైతే, అది ఒక సంస్థకు దానిని విసిరి వేస్తుంది. మరియు సంస్థకు నేను గట్టిగా వ్యతిరేకిని. కాబట్టి అదియున్నట్లుగానే, దేవుని యొక్క హస్తములలోయుంచుతాను, ఆ ప్రకారము అది ముందుకు దేవుని యొక్క రాజ్యమునకు కదలగలదు.
23 ఇప్పుడు, ఈ ఉదయమున, ఈ ధన్యమైన పాత వాక్యమును నమ్మి, నమ్మగోరుదుము.
24 ఇప్పుడు, మొన్నటి దినమున మేము ధర్మకర్తల కూటమును కలిగియున్న తరువాత…సోదరుడు ఈగాన్ మరియు అనేకమంది ధర్మకర్తలలో కొందరు ఇక్కడ కూర్చొండియున్నారు, వారికి కూడా నేను చెప్పగోరుదును; అది సత్యమైయున్నది, మీలో ప్రతి ఒక్కరూ ఇక ఎంత మాత్రము నియమించబడిన ధర్మకర్తలు కారు, నేను సంఘము ముందు బాహాటముగా చెప్పాను మీరు ధర్మకర్తలైయున్నారు, మరియు మీ పేర్లు పుస్తకముల మీద యున్నవి. మంచిది.
25 ఇప్పుడు, వారు మరి కొన్ని పెద్దల ఎన్నికలను తదితరములను కలిగియుండబోవుచున్నారు. ఈ కూడిక తరువాత వెంటనే వారిని, సోదరుడు నెవిల్ పిలవబోవుచున్నాడు, మంచిది, కోశాధికారి అలాటి వారి కొరకు సంఘమును, మనము చక్కపెట్టుచున్నాము. అన్నిటి యొక్క పూర్వ వృత్తాంతములను తీసుకొందాము, అప్పుడు అది వచ్చుచుండగా, మనము ఉజ్జీవమును కలిగియుండగలము.
26 ఇప్పుడు, మన సండే స్కూలు పాఠము కొరకు, ఈ గొప్ప సజీవమైన దేవుని వాక్య పుటలను, తిరిగి త్రిప్పుటకు ముందు, కొన్ని క్షణముల పాటు మన తలలను వంచి, ఈ గ్రంధకర్తతో మాట్లాడదాము. ఇప్పుడు మీరు దీవెనపొందకుండా దాయుచున్న సమస్తమును, ప్రతి తలంపును ప్రక్కన పెడదాము.
మనము ప్రార్థించుకొందాము.
27 అత్యంత పరిశుద్ధుడైన, నీతిగల దేవా, ఇప్పుడు మా జీవితములను, మా ఆత్మలను, మా శరీరములను, మా సేవలను, మా తలాంతులను నీకు కానుకగా ఇస్తూ నా ధన్యమైన గంభీరమైన సన్నిధిలోనికి మేము వస్తున్నాము. మరియు మాకు కలిగిన సమస్తము నీకు అర్పించుచున్నాము. ప్రభువా, నీవు మా మీద చూస్తూయుండగా, ఏదైనను ఒప్పుకొనని పాపము, కప్పబడని పాపము అక్కడయున్నట్లైతే, ఓ ప్రభువైన దేవా, నీ కుమారుని రక్తమును ఆ స్థలములో అన్వయించమని, మేము నిన్ను అడుగుచున్నాము. ఏలయనగా మాలో మేము చాలినవారము కాదని, మరియు ఎన్నడైనా మేము బయట ప్రమేయము లేకుండా సర్వ సమృద్ధిని కలిగియుండుట అక్కడ అసాధ్యమైయున్నది. అయితే మేము సంపూర్ణముగా, ఆయన ప్రశస్తమైన రక్తముపై, ఆయన కృప మా ఖాతాపై అన్వయించబడుటకు ఆధారపడుచున్నాము, అదేమనగా అయోగ్యమైన పాపులమైన మేము ఒక దినమున. మా ముందు ప్రభువైన యేసు రక్తమును తీసుకొని, ధైర్యముగా నీ సముఖమునకు వస్తాము. అదేమనగా, నీవు గతించిన కాలములో అది, నీ అద్వితీయ కుమారుని రక్తమైయున్నదని నీవు గుర్తించియున్నావు, మరియు మాకు వాగ్దానము చేశావు, అదేమనగా, “ఆయన ద్వారా, మా పాపములను మేము ఒప్పుకొన్నట్లైతే, ఆయన కృప ద్వారా మేము నీతిమంతులుగా తీర్చబడతాము.”
28 ఇప్పుడు ప్రభువా, మేమడుగుచున్నాము, మా పొరపాటు ఏదైనా ఏదైనా ఉల్లంఘించిన పాపము, ఏదైనా వదిలిపెట్టినా. ఏదైనా హద్దు మీరినా, ఏదైనా చెడ్డ తలంపు, దయ్యము యొక్క అగ్ని బాణముల ద్వారా, మా ఆత్మను గ్రుచ్చినట్లైతే, నీ యొక్క మరియు నీ ప్రజల యొక్క చెడ్డ శత్రువును దూరముగా తరిమి వేయుము.
29 నీ వాక్యము, మా ద్వారా మాట్లాడునట్లు, మా ద్వారా వినబడునట్లు, మమ్ములను మేము నీ సాధనములుగా లోపర్చుకొనుచుండగా, ఈ సమయములో దేవుని వాక్యమును పట్టుకొనుటకు, పరిశుద్ధాత్మను పంపుమని, మేము నిన్ను అడుగుచున్నాము. మేము తిరిగి దానిని ఈ రోజు, నీ నుండి పొందియున్నట్లుగా, అనుభూతి చెందుతూ, క్రీస్తు యొక్క పని కొరకు తిరిగి సర్దుకొందుము గాక; పరిశుద్ధాత్ముని యొక్క దర్శనమును బట్టి, ఈ రాత్రి మరియు రేపటి పరిచర్యకు మేముగా బాగుగా అమర్చబడుదుము గాక.
30 ఈ దుష్ట దినమున వాక్యమును ముందుకు పట్టుకొనియున్న, ప్రపంచములోని సంఘములను, ప్రతిచోటయున్న మా సోదరులను దీవించండి. ఏలయనగా రాత్రి అకస్మాత్తుగా వచ్చుచున్నది, పనిచేయుటకు ఎక్కువ సమయము అక్కడ మిగిలియుండలేదని మేము భావిస్తున్నాము. యుద్ధ మేఘములు తిరిగి తేలి ఆడుచున్నవి. చెడుగు సమీపమైయున్నది, మరియు ఇంతకు ముందెన్నడు పనిచేయని రీతిగా, మమ్మును పనిచేయనిమ్మని మేము ప్రార్థిస్తాము. అలసిపోయిన మా శరీరములకు విశ్రాంతినివ్వండి, ప్రభువా, తిరిగి మమ్ములను యుద్ధ భూమిలోనికి పంపండి. కారణము ప్రభువైన యేసు నామములో, ఆయన కొరకు మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
31 ఈ ఉదయమున, బైబిలులోని, హెబ్రీ పత్రిక 11 అధ్యాయము నుండి మనము తెరుద్దాము.
32 బుధవారము రాత్రి హెబ్రీ పత్రికలోని 7వ అధ్యాయము మీద మనము మాట్లాడుచున్నాము, “తల్లియు మరియు తండ్రియు లేనివాడు, దినముల ప్రారంభమును లేక దినములకు అంతములేనివాడైన, మెల్కీసెదెకు.”
33 ఈ ఉదయమున, బహుశ, మనము చెప్పబోయే పూర్వపు వృత్తాంతములను, పూర్వపు పఠనములలో కలిగిన వారమై, ఈ అద్భుతమైన గ్రంథమును తెరచుట సముచితమైయన్నదని, నేను తలంచాను. 9 మరియు 10వ అధ్యాయము మీదుగా దాటుకొంటూ, అవి బలి అర్పణ నియమములైయున్నవి మనము “విశ్వాసము,” యొక్క అంశములోనికి వస్తాము. హెబ్రీ పత్రిక, 11వ అధ్యాయములో, 23వ వచనము నుండి ప్రారంభిద్దాము, అది ఈ విధముగా చదువుతాము:
“మోషే పుట్టినపుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైయుండుట చూసి, విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు దాచిపెట్టిరి.
మోషే పెద్దవాడైనపుడు విశ్వాసమును బట్టి, ఐగుప్తు ధనము కంటె క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,
అల్ప కాలము పాపభోగము అనుభవించుటకంటె, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి,
ఫరోకుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు; ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను.
విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచునట్టు. స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను.”
34 ఈ ఉదయమున, “విశ్వాసము ద్వారా ఎన్నుకొనుట,” అను అంశమును నేను తీసుకొనగోరుచున్నాను. ఒక అంశము కొరకు, 23వ అధ్యాయములోని మొదటి మూడు మాటలను నేను తీసుకొనగోరుదును, విశ్వాసమును బట్టి, మోషే. మనము చేసే సమస్తమూ, “విశ్వాసము ద్వారా ఎన్నుకొంటాము,” విశ్వాసము ద్వారా మనము ఎన్నుకొనవలసియున్నది. మోషే చేసినదంతా ఏమని మనము కనుగొంటామంటే దానిని తిరిగి చెప్పుటలో విలువయున్నది, విశ్వాసమును బట్టి; చూచుట ద్వారా కాదు, విశ్వాసము ద్వారా.
35 ఈ ఉదయమున నేను దీనిని ఈ సంఘము కొరకు, ఈ రాష్ట్రములో ఎన్నుకొన్న కారణమేమనగా, మన చుట్టూ పాఠశాలలో సహితము, మనము ఎంతో ఎక్కువగా శాస్త్రీయ బోధను కలిగియున్నాము. ఈ కారణమును బట్టి, మనము ప్రజలను విశ్వాసము నుండి దూరముగా లాగివేసియున్నాము. ఇప్పుడు విశ్వాసము, సైన్సు ద్వారా ఋజువు చేయబడదు. సైన్సు చూడనిదే విశ్వాసమై యున్నది. మనము ఎన్నడైనా, ఈ గొప్ప విశ్వాసమును పోగొట్టుకొన్నట్లైతే, అప్పుడు మనము సంపూర్ణముగా చీకటిలో యుంటాము…మనము ఎంత చక్కగా చదువుకొన్న వారమైనప్పటికీ లెక్క కాదు, మన సొంత నమ్మకమునకు సరిపోవునట్లు, దేవుని వాక్యమును మనము ఎలా వివరించగలము.
36 విశ్వాసము ద్వారా మాత్రమే తప్ప, అక్కడ ఎన్నడైనా దేవునిని సంతోషపర్చు మార్గమే లేదు. అది విశ్వాసమును బట్టి అని, లేఖనము దానిని తేటగా ఆ మార్గములో చెపుతుంది. “మరియు విశ్వాసము లేకుండా,” దేవునిని సంతోషపర్చుట అసాధ్యమని బైబిలు చెపుతుంది.
37 కాబట్టి, విశ్వాసము సైన్సుతో సమ్మతించదు, మరియు సైన్సు విశ్వాసముతో సమ్మతించదు, అది వాటిని ఒకదానికి ఎదురుగా మరొకటి అంచు మీద పెట్టినట్లుగా యుంటుంది, అలాగైతే తప్పక మనము మోషే చేసినట్లుగా ఎంపిక చెయ్యాలి. విశ్వాసమును బట్టి మనము నమ్ముతాము!
38 ఇప్పుడు, మనము విశ్వాసమును పోగొట్టుకొన్నట్లైతే, అప్పుడు మన ప్రార్థనలకు ఎన్నడూ దేవుని ద్వారా జవాబు రాదు. “ఏలయనగా దేవుని యొద్దకు వచ్చువాడు, మొదట ఆయన యున్నాడనియు, ఆయనను శ్రద్ధగా వెదుకు వారికి తప్పక ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.” కాబట్టి, మనము విశ్వాసమును పోగొట్టుకొన్నట్లైతే, మన ప్రార్థనలు రద్దు అవుతాయి; మనము ఎక్కడకూ వెళ్ళలేము.
39 కాబట్టి ఉదయమున మనము ఆలోచించగలిగేదంతా, విశ్వాసమును పట్టుకొనియుండుట గూర్చియే. అలాటప్పుడు, మనము విశ్వాసమును పోగొట్టుకొంటే, మన ఆశలన్నీ వెళ్ళిపోతాయి. మనము విశ్వాసమును పోగొట్టుకొంటే మన ఆత్మ సంబంధమైన యదార్ధత అంతా వెళ్ళిపోతుంది. ఏలయనగా, నీవు చూసే వాటి యందు నీవు విశ్వాసమును కలిగియుండలేవు, కారణము నీవు చూసేవన్నీ నశించిపోయేవి.
40 మనము ఒక గొప్ప వ్యక్తి వైపు, ఒక గొప్ప సేవకుని వైపు, లేక ఒక గొప్ప సంఘము వైపు చూసినట్లైతే, ఒక దినమున అవన్నీ నశించిపోతాయి. మనము ఒక గొప్ప దేశము వైపు చూసినట్లైతే, లేక ఒక గొప్ప ఆయుధము వైపు చూసినట్లైతే, ఒక రోజు అవి నశించిపోతాయి. అప్పుడు మనము సైన్సు ప్రకటించలేని కార్యములను బట్టి, మనము తప్పక విశ్వాసము ద్వారా జీవించాలి. అది విశ్వాసము బట్టియే మనము నమ్ముతాము.
41 ఇప్పుడు, మనము విశ్వాసమును పోగొట్టుకొన్నట్లైతే, మన మహిమను పోగొట్టుకొంటాము. ఇప్పుడు మనము విశ్వాసము నుండి దూరముగా వెళ్ళిపోయినట్లైతే, అప్పుడు మనము సంఘము యొక్క జ్ఞానయుక్తమైన పరిధిని తీసుకొంటాము.
42 అనేకసార్లు ప్రజల మధ్య నమ్మేదేమనగా, అది పెద్ద సంఘముయైయున్నందున, వారు గొప్ప సంఘములు కలిగియున్నందున, వారు గొప్ప గోపురములను కలిగియున్నందున, గొప్పగా దుస్తులు ధరించి, దువ్వుకొనియున్నవారు యున్నందున, వారు గొప్ప నిధులను కలిగియున్నందున, అలాటి కార్యములను వారు చేయగల సమర్ధులైనందున, అనేకసార్లు మనము తలంచేదేమనగా, నిర్ణీత సంఘము తప్పక ప్రేరేపించబడియున్నదని మనము భావిస్తాము. లేక కొన్నిసార్లు, గొప్ప జన సమూహములను ఆకట్టుకొనే, పొలములోని వివిధమైన సేవకులను బట్టి, కొన్నిసార్లు అలాటివి ప్రేరేపణకు సూచనలు అని మనము అనుకొంటాము. అయితే అది మొత్తానికి సత్యము కాదు. అది మానవ ప్రేరేపణయై యున్నది.
43 కాని నిజమైన ప్రేరేపణ దేవుని చిత్తమును చేయుట ద్వారా వస్తుంది. చూడండి? అది ఒక్కరైనా, లేక ఒక గుప్పెడైనా, అది ఒక పెద్ద సంఘమై, లేక ఒక చిన్న సంఘమైనా, అది లెక్క కాదు. అది ఒక వాక్చాతుర్యము గల బోధకుడైన లేక తన అ ఆ లు రాని ఒక మనిషియైనా, అది లెక్క కాదు. అది అతడు తెచ్చే వర్తమానముపై ఆధారపడియున్నది, అది దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రేరేపించబడిందా, లేక అది మానవ ప్రేరేపణతో కూడిన జ్ఞానయుక్తమైన ఆలోచన ద్వారా ప్రేరేపించబడినదా?
44 కొందరు ప్రజలు ఒక వాక్చాతుర్యము గల ఒక బోధకుని బట్టి ప్రేరేపించబడతారు. అది దానిని సరిగా చేయదు. కొన్నిసార్లు వారు ప్రేరేపించబడతారు, కారణమేమనగా, ఆ మనిషి ఎంత తర్ఫీదు పొందినవాడనగా చివరకు అతడు తన అంశమును ఎత్తిచూపుతాడు. అది దేవునిదైయున్నదని దాని భావము కాదు. చూడండి?
45 అది శాశ్వతమైన, నిత్యమైన ధన్యకరమైన దేవుని వాక్యము ద్వారా మాత్రమే, మనము ప్రేరేపణ పొందగలము, అది పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడింది. విశ్వాసము ద్వారా దానిని మనము స్వీకరిస్తాము.
46 ఇప్పుడు మనము మోషేను గూర్చి. ఆయన జీవితములోని ఈ గొప్ప సమయమును గూర్చి ఆలోచిద్దాము. అతని పుట్టుకను గూర్చి, దేవుడు ఎలా అతని పట్ల శ్రద్ధ వహించియున్నాడో, మనము వెనుక చదివియున్నాము, కాని మోషే జీవితములో అక్కడ, అతడొక ఎంపిక చేసుకొనే సమయమును కలిగియుండెను. మనము సరిగ్గా చదివియున్నట్లైతే, అతడు ఫరో కుమార్తె యొక్క కుమారుడైయున్నాడని మనము కనుగొంటాము, మరియు సింహాసనమునకు వారసుడైయున్నాడు, మరియు ఐగుప్తులో తరువాత ఫరోయైయున్నాడు. కాబట్టి అతడు పెద్దవాడైనపుడు, అతడు చుట్టూ చూసి గమనించినదేమనగా, ఆ బానిసలు బురద గుంటల్లో పనిచేయుచుండిరి. మోషే, రాజనగరి కిటికీల గుండా, ఫరో చూసిన అదే బానిసలను చూసియున్నాడు, అయితే ఆ చూచుటలో ఎంత తేడాయున్నదో.
47 ఆ తలంపునే కొన్ని క్షణములపాటు, నేను ఆధారము చేసుకోవాలని కోరుచున్నాను, పరలోకపు దేవుడు ఇక్కడే ప్రతి హృదయ గృహములోనికి దానిని నడుపును గాక. నీవు దేనివైపైనా ఎలాచూస్తావో, అదే భేధమును చేస్తుంది.
48 గొప్ప సువార్తికుడైన, జాన్ స్ట్రాల్, సోదరుడైన బాస్ వర్త్ పరిచర్యలో మార్పు చెందిన వాడు, ఎన్నో సంవత్సరముల క్రితము మీకు అతడు గుర్తున్నది, వృద్ధుడైనా గ్లోరీబార్న్. అతడన్నాడు, ఒకసారి అతని ప్రియమైన సహచారిణియగు భార్యతో కలసి, ఆమె చనిపోక ముందు ప్రయాణము చేయుచున్నాడు వారు ఫ్రాన్సులోని లోరైన్, లాసల్లాలో యున్నారు. అదే స్థలమును నేనును దర్శించు ఆధిక్యత కలిగినది. అక్కడ మార్గదర్శి వారిని తోటల గుండా తోడుకొని వెళ్ళుచూ, వివిధమైన స్థలములను చూపిస్తున్నాడు. వారు అప్పుడు వారు ప్రభువైన యేసు సిలువ యొక్క ప్రతిమ నొద్దకు వచ్చారు. శ్రీ. స్ప్రాల్ దూరముగా యుండి, అతడు అతని భార్య దానివైపు చూస్తూ, వారి హృదయములలో, ఆ చిత్రకారుని, ఆ శిల్పకారుని వివరిస్తూ, ప్రభువైన యేసు ప్రేమతో కూడిన, దయనీయమైన బాధను వ్యక్తము చేస్తూ, ఎందుకు అతడు దానిని అంత కరుకుగా కనబడునట్లు చెక్కియున్నాడు అని అనుకొనుచున్నారు. ఆ మార్గదర్శి శ్రీ. స్ట్రాల్ దగ్గరకు వచ్చి, ఇలా అన్నాడు, “అయ్యా, ప్రభువైన యేసు ప్రతిమను మీరు విమర్శ చేయుచున్నారని నేను భావిస్తున్నాను”.
అతడన్నాడు, “అవును”.
49 అతడన్నాడు, “నేను రవ్వంత కూడా ఆశ్చర్యపడలేదు, కారణమేమనగా, దరిదాపుగా ప్రజలందరూ, మొదటిసారి చూచినపుడు, వారు తప్పక దానిని విమర్శిస్తారు”.
50 శ్రీ స్ప్రాల్ అన్నాడు, “ఎందుచేత, అలాటి వస్తువును చూసి నేను ఏ మాత్రము జాలినొంది, ఏ ప్రేరేపణ పొందలేకపోయాను, కాబట్టి ఆ శిల్పకారుడు ఎందుకు దానిని అలా తయారుచేశాడో అని ఆశ్చర్యపడుచున్నాను.
51 శిల్పకారుడా…అని అతడన్నాడు, “శ్రీ స్ప్రాల్, ఈ ప్రతిమ బాగానే యుండి మరియు శిల్పకారుడు సరియైన దానిని తన మనస్సులో కలిగియున్నాడు. అయితే అక్కడ ఇబ్బంది ఏమనగా, నీవు దానివైపు చూస్తున్న విధానమే.” అతని యొక్క భార్యను అతనిని, అతడు చేయిపట్టుకొని, సిలువ పీఠము నొద్ద వేదిక క్రిందకు నడిపించాడు. అతడన్నాడు, “శ్రీ స్ప్రాల్, ఇప్పుడు పైకి చూడు.” మరియు అతడు పైకి చూసినపుడు, అతని గుండె ఆగిపోయినట్లైంది అని అతడన్నాడు. దూరము నుండి ఆ విధముగా చూచుటలో మరియు క్రిందికి వెళ్ళి దానిని చూడవలసిన విధానములో చూచుట మధ్య, ఎంత తేడా యున్నదో.
52 అదే మార్గములో దేవుడును యున్నాడు. అదే మార్గములో విశ్వాసమున్నది. అది నీవు దానిని చూచు విధానమైయున్నది. నీవు ఒక విధమైన చరిత్రాత్మకమైన బైబిలు వలే లేక మరేదోగా గతించిన దినములలో జరిగిపోయినదిగా నీవు దానిని చూచినట్లైతే, నీవు ఎన్నడూ బైబిలు యొక్క నిజమైన విలువను పొందలేవు. నీవు తప్పక నీ మోకాళ్ళపై ఒరిగి, బైబిలు యొక్క ఆజ్ఞలను పాటించి, పరిశుద్ధాత్మ యొక్క నేత్రముల ద్వారా దానిని చూడాలి.
53 ఈ ఉదయమున నేను శ్రోతలను అడుగగోరుదును. ఈ దినమున ఆయన అదే దేవుడు కానట్టైతే, ఒక చరిత్రాత్మకమైన దేవుడైతే మనకు ఏ మంచి చేస్తాడు? మోషేను తీసుకొని అతని ద్వారా అద్భుతములను చేయించిన దేవుడును గూర్చి మనకు చదవబడినపుడు, ఈ రోజున కూడా ఆయన అదే దేవుడు కానట్లైతే మనకు అది ఏ మంచి చేస్తుంది? హెబ్రీ పిల్లలను మండుచున్న అగ్ని గుండము నుండి రక్షించిన దేవుడు, ఈ రోజున అదే దేవుడు కానట్లైతే, అది ఏ మంచి చేస్తుంది? గతించిన దినములో తప్పు మరియు ఒప్పుల మధ్య తీర్పు తీర్చి, చెడును శిక్షించి, మరియు మంచిని దీవించిన దేవుడు, ఈ దినమున కూడా ఆయన అదే దేవుడు కానట్లైతే, ఆ దేవుడు ఏ మంచి చేస్తాడు? అలాగైతే మనము సంఘమునకు ఎందుకొరకు వెళ్ళుచున్నాము? ఆయన అదే తీర్పు తీర్చు దేవుడు కానియెడల, మరియు ఆయన ఎల్లప్పుడు అదే ఉద్దేశ్యమును కలవాడు కాని యెడల, మనము ఎందుకు లోక కార్యములకు దూరముగా యున్నాము? మండుచున్న జ్వరముతో యున్న స్త్రీ చేతిని పట్టుకొన్నప్పుడు, ఆమె జ్వరము తగ్గిపోయింది, మరియు ఈ రోజున ఆయన అదే దేవుడు కానట్లైతే, అది ఏ మంచిని మనకు చేస్తుంది? నాలుగు రోజుల క్రితము చనిపోయి, సమాధిలోయున్న, తన స్నేహితుని జీవమునకు పిలిచిన దేవుడు, ఆయన ఈ రోజున కూడా అదే దేవుడు కానట్లైతే, అలాటి దేవుని సేవించుట ఏ మేలు చేస్తుంది?
54 మరలా మనము ఒక చెంచాడు బూడిదగా మారినప్పటికి, ఏదో ఒక మహిమకరమైన దినము, ఆయన మనలను భూమి నుండి పిలుస్తాడని, మనము విశ్వాసము ద్వారా నమ్ముతాము. దానిని మనము ఎలా ఋజువు చేస్తాము. మనము ఋజువు చేయాలని మనము అడగబడలేదు. దానిని నమ్మవలెనని మనము అడగబడ్డాము.
55 విశ్వాసము బట్టి మోషే పలానా-పలానా దానిని చేశాడు. మరియు మోషే, ఒక యవ్వనస్థుడుగా, ఫరో కిటికీ గుండా చూసిన మురికి, రోతగాయున్న, బురదలోయున్న బానిసలనే, అతడు చూశాడు.
56 ఫరో మరియు ఐగుప్తీయులు, వారిని చూసినపుడు, వారు బానిసలు కంటె ఎక్కువ ఏమీ కారు. అంత వరకే వారు వారికి పనికి వచ్చేది; వారు కేవలము ఫరో నిర్మించుచున్న పట్టణములను కట్టుటకు, ఇటుకలు చేయు మట్టి చీమలు వంటి వారు. ఆ విధముగానే ఫరో మరియు ఐగుప్తీయులు, ఆ బానిసల వైపు చూశారు.
57 కాని మోషే వారి వైపు చూసినపుడు, అది ఒక వేరైన చూపుగాయుండెను. అతడు కిటికీ గుండా దాటి వెళుతూ వారిని చూసినపుడు వారి ముఖములు గొప్ప గుంటలు పడిపోయి, వారి వంగిపోయిన శరీరములతో, వారి చెంపల మీదుగా కన్నీరు కారుచుండెను, దేవుని యొక్క ప్రజలుగా అతడు వారిని చూశాడు. అతడు వారిని బానిసలుగా చూడలేదు. అతడు వారిని దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలుగా చూశాడు.
58 ఓ, నేను దేశమునుండి దేశమునకు, రాజ్యము నుండి రాజ్యమునకు బోధించుటకు వెళ్ళుచున్నాను! నేను ఈ చిన్న ఆలయ ద్వారములు విడిచిపెట్టినప్పటి నుండి, ఇది ఒక అరితసంఘ వ్యవస్థయైయున్నది, మనకు ఇక్కడ ప్రేమ తప్ప ఏ చట్టము లేదు, బైబిలు తప్ప వేరే గ్రంథము లేదు, క్రీస్తు తప్ప వేరే సిద్ధాంతము లేదు, త్రోసివేయబడిన వారిని, ఎన్నికైన వారిగా మరియు ఎన్నుకొనబడిన ప్రజలుగా దేవుని యొక్క ప్రజలుగా వారిని చూచుటకు ప్రయత్నించాను. మీరు బ్రాన్హాం గుడారమునకు చెందియున్నవారా, అని నేను వారిని అడగను. మీరు మెథడిష్టువారా, లేక ప్రెస్బిటేరియన్ వారా, లేక పెంతెకొస్తు వారా, లేక నజరేనుయులా, లేక పిలిగ్రమ్ హోలీనెస్ వారా, అని నేను వారిని అడగను. నేను కేవలము దేవుని యొక్క ప్రజలుగా చూడగోరుచున్నాను. వారి చర్యలను, వారి పనులను చూస్తూ, వారు ప్రభువైన దేవుని సేవకులని చూస్తున్నాను. వారు ఏ జాతికి చెందిన వారైనప్పటికి లెక్కకాదు, నా హృదయము వారితో సహవాసము చేయుటకు ఆశిస్తుంది. నేను వారిని ప్రేమిస్తాను, ఎందుకంటె వారు దేవుని యొక్క ప్రజలైయున్నారని నాకు తెలుసు.
59 పొడవైన లంగాతో, చక్కని పొడవైన వెంట్రుకలను కలిగి, చక్కని, మర్యాదగా కనబడుచున్న వస్త్రములను ధరించి, వీధి గుండా నడుచుకొంటూ వస్తున్న ఒక స్త్రీని నేను చూసినపుడు; మరియు అదే వయస్సులోయున్న బహుశ పొట్టి బట్ట ధరించిన, మరొక స్త్రీని చూసినపుడు, లోక దృష్టి ప్రకారము పొడవైన వెంట్రుకలు కలిగియున్న స్త్రీ కంటె, ఆమె రెండంతలుగా చక్కగా కనబడవచ్చు, కాని ఒక క్రైస్తవ బాలికవలె వస్త్రధారణ చేసిన బాలిక వైపునే నేనుంటాను. వారు ఆమె వైపు చూసి నవ్వుచున్నప్పటికి, ఆమెను ఒక పిచ్చిది అని పిలిచినప్పటికి, ఇంకనూ, నేను ఆమె పక్షముగాయుంటాను. ఆమె ఆ ఇతర బాలిక కంటె, రూపు రేఖలలో చక్కగా యుండకపోయినప్పటికి, ఇంకనూ ఆమె ఒక ప్రత్యేకమైనదైయున్నది. విశ్వాసమును బట్టి, ఆమె జీవితమును నడుపుచున్న, అదృశ్యమైన వాని వైపు చూచుచున్నది.
60 “పెద్దగా,” పిలువబడూ, లేక “బోధకుడిగా,” పిలువబడుచు పనిచేయుచున్న వ్యక్తిని నేను చూసినపుడు అతడు పొగత్రాగుటను నిరాకరించినందున, బీరు త్రాగుటను నిరాకరించినందున, అందరూ చేసినట్లు చేయక, అతడు డాన్సులను నిరాకరించినందున, అతడు ఒక “పిచ్చివాడుగా,” పిలువబడతాడు, కాని నా హృదయము అతని కొరకు వెళుతుంది. ఈ ఐగుప్తు నేల క్రింది, అతడు నా సోదరుడైయున్నాడు అతనిని కౌగలించుకొని, “సోదరుడా, మనము ఈ భూమి మీద పరదేశులము మరియు యాత్రికులమైయున్నామని, నేను నీతో సహవాసము చేయుటకు ఇష్టపడుచున్నానని, చెప్పుటకు మన హృదయము ఎదురు చూస్తుంది.”
మోషే ఎన్నుకొనవలసియుండెను, విశ్వాసము ద్వారా ఎన్నుకొనవలసియుండెను.
61 ఫరో కుమార్తె యొక్క కుమారుడుగాయుండె అవకాశము కొరకు, ఎంతమంది యవ్వనస్థులు ఎగిరిదూకే వారో! మోషే కలిగియున్న అవకాశము కొరకు, లోకము మైమరపించే, సుఖభోగములను అనుభవించుట కొరకు, ఐగుప్తు రాజుగా మారుటకు, ప్రపంచమునంతా వారి పాదముల యొద్ద కలిగియుండుటకు, ఎంతమంది యవ్వనస్థులు ఎగిరి దూకేవారో! “బోధించబడుచు శ్రమనొందుచున్న దేవుని యొక్క ప్రజలలో యుండుటకు మోషే తన ఎన్నికను చేసినపుడు,” అది “ఎలాటి ఒక వెర్రి సంగతి,” అని ఎంతమంది తన దినమునయున్న యవ్వనస్థలు తప్పక తలించియుండేవారో.
62 అతడు దానిని ఎందుకు చేశాడు? విశ్వాసమును బట్టి, అతడు తన కన్నులను పైకెత్తినపుడు, అతడు ఈ లోక ఆకర్షణకు పైగా చూశాడు. అతడు పాపభోగములకు పైగా చూశాడు. బైబిలు చెప్పియున్నది, అతడు విశ్వాసమును బట్టి, స్థిరబుద్ధిగలవాడై, అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లుండెను, మరియు ఏమి సంభవించినను లెక్క చేయక, దేవుని సేవించుటకు అతడు ఎన్నుకొనెను.
63 అది మారియుండలేదు. మనలో అనేకమంది, ఏది మంచి కట్టడము అని పిలువబడుతుందో దానిలోనికి వెళ్ళాలనుకొంటాము. బహుశ, మనము ఒక మంచి కుర్చీల వరుసలో కూర్చొని, సుఖబోగములతో సహవాసము చేయాలనుకొంటాము. పొగత్రాగుటకు, సారాయి త్రాగుటకు, ఎక్కువ పేరు ప్రతిష్ఠల కొరకు, లోకములోని వారి వలె వస్త్రధారణ చేయాలనుకొంటాము కాని విషయమేమిటి? నీవు నీ కన్నులు పైకెత్తి, విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచుచు, పేరుగాంచిన పరిశుద్ధ రోలర్లు అని పిలువబడే తిరస్కరించబడిన వారి పక్షమున నీవు నిలబడతావు. విశ్వాసమును బట్టి, మనము అదృశ్యుడైన వానిని చూచుచు, హింసలు మరియు ఇబ్బందిని అనుభవించుటను కోరుకొన్నాము.
64 ప్రజలు ఇబ్బందులను తప్పక ఎన్నకోవాలని నేను వారికి చెప్పుటలేదు. నీవు పీడించబడుటను తప్పక ఎన్నుకోవాలని నేను చెప్పను. అది చేయుట మానవత్వముగాయుండదు. అయితే బాధను అనుభవించుట మన విధి నిర్వహణ మార్గములోయుంచబడినట్లైతే, అప్పుడు అది వచ్చు రీతిగా, మనము దానిని స్వీకరిద్దాము. నిన్ను ఎగతాళి చేయటానికి, నీవు ఎవరికో ఏదో చేయాలని నేను కోరుట లేదు. నేను లోకములో పలానా-పలానా సంఘమునకు చెందియున్నాను, వారు దానిని నమ్మరు, అనేక విషయములు, ప్రజలు నిన్ను ఎగతాళి చేయునట్లు చేయుట. అది నీకై నీవు నీ మీదికి తెచ్చుకొనుచున్నావు ఇక్కడ నుండి వెళ్ళి, ఏదో తీవ్రమైన భావములు కలిగించు కార్యములు చేయమని నేను నిన్ను కోరుట లేదు. దానిని నీవు చేయాలని నేను కోరుటలేదు, అప్పుడు నీవు వెర్రివాడవని ఎవరో చెపుతారు. అది నీకై నీవు నీ మీదికి తెచ్చుకొనుచున్నావు. అయితే దేవుని పట్ల నీ విధి నిర్వహణ మార్గములో, అది యుంచబడినట్లైతే, అప్పుడు లోకము ఏమి చెప్పుతుందో చెప్పనియ్యి. నీవు ముందుకు జీవించుము.
నీవు ఒక ఎంపికను చేసికొనుము. ప్రతి స్త్రీ, పురుషుడు దీనిని చేయాలి.
65 మోషే చూసిన దానినే ఫరో చూసియుంటే ఏమయ్యేది? ప్రజలు శ్రమలను అతడు చూశాడు. చెల్లించవలసిన వెల ఎలాటిదో అతడు ఎరిగియుండెను. కాని పాపభోగము కంటె, ఎక్కువగా విశ్వాసమును బట్టి అతడు దానిని ఎన్నుకొనెను.
66 బహుశ యవ్వన స్త్రీలు, సొగసుగాయున్న యవ్వన స్త్రీలు ఇక్కడయుండవచ్చు. లోకము నీకు ఇలా చెప్పాలనుకొంటుంది, “ఇది అది చెయ్యి, నీవు అందముగాయున్నావు. నీ దేహము చక్కని ఆకృతిలోయున్నది. నీవు తప్పక దానిని చూపెట్టాలి.”
67 కానీ, నా సహోదరీ, నీ కన్నులను పైకెత్తి దానికి దూరముగా, “స్త్రీ, పురుషునికి చెందిన వస్త్రమును ధరించుట హేయము,” అని చెప్పిన వాని వైపు చూడుము.
68 నీ సమాజములోని ప్రజలు, నీవు సహవాసము చేయు స్త్రీలు, “ఆ పొడవైన వెంట్రుకలు కత్తిరించు,” అన్నారు. అది చల్లగాయుంటుంది. అది ఇది, అది, మరొకటి అని అంటారు. “లేక, అది నీకు బాగావుంటుంది,” అంటారు, ఆ మాట వినవద్దు!
69 నీ కన్నలు పైకెత్తి, విశ్వాసమును బట్టి, దానిని చెప్పిన వానిని చూడుము, “స్త్రీకి ఆమె వెంట్రుకలే మహిమ, ఆమె వాటిని కత్తిరించరాదు.”
70 “అది పేరు ప్రతిష్ఠలుగాయుంటుంది, అని వారు చెప్పినట్లైతే, నీవు సంఘిక హోదా కొరకు కొంచెము త్రాగినట్లైతే, లేక నీ యజమానితో, నీ ఉద్యోగములో నీవు బాగా నిలబడతావు, మిగిలిన స్త్రీలందరి వలె నీవు సిగరెట్లు త్రాగినట్లైతే, నీ యిరుగు పొరుగు మధ్య ఎక్కువ సాంఘిక హోదాలో నిలబడతావు.”
71 నీ కన్నులు పైకెత్తి, విశ్వాసమును బట్టి, “ఈ దేహమును పాడుచేస్తే, నేను దానిని పాడుచేస్తాను,” అని చెప్పిన ఆయన వైపు చూడుము. విశ్వాసమును బట్టి, ఆ విషయములను మనము నమ్ముతాము. అది నీవు చూసేది కాదు, అది నీవు ఏదో నీవు నమ్మునదైయున్నది. విశ్వాసమును బట్టి, మోషే చేశాడు.
72 ఈ విశ్వాసపు నడకలో, అక్కడ ఎంపికచేయు ఒక సమయము ఉంటుంది.
73 మనము చేసే విచారకరమైన పొరపాటునే లోతు చేశాడు. అనేకసార్లు మన సొంత మేలు కొరకు మనము ఎన్నుకొంటాము. బాగాయుండే వాటిని మనము ఎన్నుకొంటాము.
74 కొన్ని సార్లు అక్కడ చిన్న పోట్లాట సంఘములో వస్తుంది, మరియు ఎవరో అంటారు, “బాగుంది, ఆ పెద్ద లేక సంఘకాపరి ఈ వైపునయున్నాడు.” దాని వైపు చూడవద్దు. ఏది న్యాయమో దానిని చూడుము. వారిద్దరిని ఏకముగా తెచ్చి, దానిని బయటకు పారద్రోలుము. అది దైవభక్తితో కూడినది.
75 అక్కడ ఒక ఎన్నికయున్నది. మన కొరకు మనము ఎన్నుకొంటాము. మన సొంత మేలు కొరకు మనము దేనినో కోరుకొంటాము.
76 దేవుని యొక్క ప్రజలతో నడుచుట కొరకు, మోషే శ్రమలను ఎన్నుకొనెను. ఇప్పుడు దానిని ఆలోచించండి, దీనిని వినండి. దేవుని ప్రజలు యొక్క ఇబ్బందులను ఎన్నుకొనుట, ఒక గొప్ప భాగ్యముగా ఎంచుకొన్నాడు, ఏలయనగా అతడు స్థిరబుద్ధిగలవాడై, అదృశ్యుడైన వానిని అతడు చూచుచుండెను.
ఇప్పుడు, లోతు, ఒకప్పుడు, ఒక ఎన్నికను చేయవలసియుండెను.
77 బహుశ, అది ఈ ఉదయమున కావచ్చు, ఇక్కడ కూర్చొన్న స్త్రీ, పురుషులు వారి చివరి ఎంపికను చేయవచ్చు. ఈ రోజున నీవు ఏమైయున్నావో, దానికి కారణము ఏమనగా, ఎన్నో సంవత్సరముల క్రితము నీ ఎన్నిక, ఇప్పుడు నీవున్నట్లుగా చేసింది. ఇప్పుడు నీవు ఏమి ఎన్నుకొంటావో, ఈ రోజు నుండి అయిదు సంవత్సరముల తరువాత నీవు ఎలా యుంటావో అది నిర్ణయిస్తుంది. ఈ రోజు నుండి అయిదు సంవత్సరముల తరువాత నీవు ఒక మిషనరీవి కావచ్చు. ఈ రోజు నుండి అయిదు సంవత్సరముల తరువాత నీవు ఒక ప్రసిద్ధిచెందిన క్రైస్తవుడవు కావచ్చు.
78 లేక, నీవు తప్పు తీర్మానము చేసింనందువల్ల, ఈ రోజు నుండి అయిదు సంవత్సరముల తరువాత, నీవు నరకములోయుండవచ్చు. బహుశ ఈ రోజు నుండి అయిదు సంవత్సరముల తరువాత, నీవు మద్యము విక్రయించుశాలలో, ఉమ్మి తొట్లు కడిగేవాడిగా మారవచ్చు. ఈ రోజు నుండి అయిదు సంవత్సరముల తరువాత, నీవు వీధులలో వేశ్యగా మారవచ్చు.
79 లేక, క్రీస్తు కొరకు నీవు చేయు ఎన్నికను బట్టి, సమాజమునకు ఒక ఘనమైన స్త్రీగా లేక పురుషుడిగాయుంటావు. ఈ రోజు నుండి అయిదు సంవత్సరముల తరువాత, బహుశ నీవు మహిమలోయుండవచ్చు, లేక ఎత్తబడుటలో వెళ్ళిపోవచ్చు, కారణము ఈ రోజు నీవు చేసిన తీర్మానమును బట్టి.
80 అయితే నీవు తప్పక ఎన్నుకోవాలి. నీవు చూసే దాని వైపు చూడవద్దు. విశ్వాసమును బట్టి చూసే దానిని ఎన్నుకొనుముము. నీవు విశ్వాసముతో ఎన్నుకొనేదే, అది మాత్రమే లెక్కించబడుతుంది.
81 లోతు తన ఎన్నికను చేయవలసియుండెను, అబ్రాహాము లోతుకు ఎంపికనిచ్చెను.
82 దేవుడు నీ ఎన్నికను నీకిస్తాడు, “ఈ రోజు మీరు ఎవరిని సేవిస్తారో కోరుకోండి.” ఏదెను తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము మరియు జీవ వృక్షముయుండెను. అతడు కోరుకొన్న దేనినైనా మనిషి ఎంపిక చేసుకొనుటకు అతనికి ఆధిక్యత ఇవ్వబడింది. స్వేచ్ఛా సమ్మతితో కూడిన నైతిక బాధ్యతగా, నీవు దేనిని ఎంపిక చేసుకొంటావో నీకును ఆధిక్యత ఇవ్వబడింది.
83 నీకు నా సలహా ఏమనగా, నీవు ఎలా పేరు ప్రతిష్ఠలు కలిగియుండగలవో, ఎలా ప్రత్యేకమైన ఆకర్షణగాయుండగలవో, నీ చుట్టూయున్న ఆ అధునాతన సంగతులను చూడవద్దు. కాని, విశ్వాసమును బట్టి, తప్పులన్నిటిని సరిచేసి, ఒక దినమున వచ్చి, నీకు నిత్యజీవమును ఇస్తానని, నిన్ను మృతులలో నుండి లేపుతానిని వాగ్దానము చేసిన ఆయనను ఎన్నుకొనుము. ప్రభువు పక్షమునయుండి తృణీకరించబడిన, కొద్దిమందితో నీ ఎంపికను, చేసికొనినను పరవాలేదు. దేశములో ఇబ్బందులు యున్నట్లైతే, దేశములో అక్కడ ఇబ్బందులుయున్నప్పటికి, సంఘములో ఇబ్బందులుయున్నప్పటికి, గృహములో ఇబ్బందులుయున్నప్పటికి, అవి ఎక్కడయున్నను లెక్కకాదు, నీ ఎంపికను చేసికొనుము, “విశ్వాసమును బట్టి,” నేను దేవునిని సేవిస్తాను. ఆయన సన్నిధిలో నా హృదయమును తగ్గించుకొంటాను, నేను దేవుని యొక్క పిల్లలతో నా మార్గమును తీసుకొంటాను, వారు త్రోసివేయబడి, తృణీకరించబడి, బయటకు నెట్టివేయబడి, ఎగతాళి చేయబడుటను నేను చూస్తాను, అయినా ఇంకనూ నేను నా విధి నిర్వహణ కొయ్యను తీసుకొంటాను. నేను తిన్నగా వారితో నిలబడతాను. వారు ఏడ్చినపుడు, నేను వారితో ఏడుస్తాను, వారు దుఃఖములోయున్నప్పుడు, నేనును దుఃఖములోయుంటాను. వారు ఎలా జీవిస్తే, నేనును ఆలాగునే జీవిస్తాను.
84 నయోమి చెప్పినట్లుగా…లేక రూతు నయోమితో చెప్పినట్లుగా, “నీ మార్గములే నా మార్గములు. నా మార్గములే నీ మార్గములు. నీవు ఎక్కడ నివశిస్తే, నేనును అక్కడ నివశిస్తాను. నీవు ఎక్కడకు వెళితే, నేనును అక్కడకు వెళతాను. నీవు సేవించే దేవుడే, నాదేవుడు.” ఆ ఎంపికను తీసుకొనుము, అది నీ మనస్సాక్షి యొక్క చర్మమును, నీవు ఏదోయైయున్నావనే ఆలోచన, చర్మమును లాగివేసినను, నిన్ను నీవు తోలు ఒలుచుకొని, ప్రభువు యొక్క తృణకరించబడిన కొద్దిమందితో, నీ మార్గమును తీసుకొనుము, సేవా పొలములో నమ్మకముగా, నీ విధి నిర్వహణ కొయ్యనొద్ద నమ్మకముగా నిలిచియుండుము.
85 లోతు చుట్టూ చూశాడు. అతడన్నాడు, “నాకు ఒక అవకాశము దొరికింది.” అతడు సొదొమ వైపు చూశాడు. అబ్రాహాముయున్న చోట చూసిన వాటి కంటె, చక్కటి మంచి పచ్చటి పొలములను అతడు చూశాడు. పశువులు చక్కగా మేసి బలిసినవిగాయుండాలనే, అవకాశములను అతడు చూశాడు.
86 ఎవరి భావనలను నేను గాయపరుచుట లేదని నా నమ్మకము. అయితే సువార్తతో రాజీపడుట ద్వారా, దాని నుండి ఎక్కువ డబ్బును పొందాలనే ఆలోచన కొరకే అనేకమంది బోధకులు నిలబడియున్నారు. ఒక భోజనపు టికెట్టు కొరకు! సజీవమైన దేవుని వాక్యమునందలి, నా విశ్వాసపు ఒప్పుదల మీద రాజీపడుట కంటె, నేను నిస్సారమైన దేశములోనే జీవిస్తూ, కాలువలో నీళ్ళు త్రాగి, సోడా బిస్కెట్టు తింటాను. నా మార్గమును ఆలాగే తీసుకొంటాను.
87 వారిలో కొందరు అన్నారు, “బిల్లీ, నీ కూటములతోయున్న చిక్కు ఏమిటి, అక్కడ అనేకమంది పెంతెకొస్తు వారు అక్కడయున్నారు.” ఒక గొప్ప సంఘశాఖ సేవకుడు ఆ మాట అన్నాడు.
నేనన్నాను, “మరి నీ సంఘశాఖ నా కూటములను భరిస్తుందా?”
88 ఈ మధ్యనే, లుక్ మేగజైన్లో, అక్కడ ఒక వ్యాసము వ్రాయబడింది. ఆ గ్రంధకర్త మాట్లాడుచూ, పెంతెకొస్తు ప్రజలను గూర్చి చెప్పాడు. అతడన్నాడు, “ఈ దినమున పెంతెకొస్తు సంఘము ప్రపంచములోనే బహు వేగముగా అభివృద్ధి చెందుచున్న సంఘమైయున్నది.” ఎందుచేత? కారణమేమనగా స్త్రీ పురుషులు వారి నేత్రములను పైకెత్తి, దూరములోనికి చూస్తున్నారు.
89 గ్రంధకర్త ఇంకా పెంతెకొస్తు ప్రజలను ప్రశంశించియున్నాడు. ఓ, నిజానికి, అతడన్నాడు, “వారిలో కొందరు సంఘ వ్యతిరేక శక్తులుగా మారారు. మెథడిష్టు వారు ఒక ఆచారముతో ఆరాధిస్తారు. వారు దేవునిని ఒక ఆచారము ద్వారా ఆరాధిస్తారు. బాప్టిష్టువారు, ప్రెస్బిటేరియణ్ వారు ఆలాగునే చేస్తారు. కాని పెంతెకొస్తువారు వారి బైబిలు ద్వారా ఆరాధిస్తారు.”
90 విశ్వాసము ద్వారా మనము వాగ్దానమును చూస్తాము. వారు ఎంతగా త్రోసివేయబడినప్పటికి లెక్కకాదు. నేను ఇంకా వారిలో ఒకడిని, నేను వారితోనే నా పాలు తీసుకొంటాను. వారు ఎగతాళి చేయబడినప్పటికి, వారు వారి యొక్క ఎత్తు-పల్లములు కలిగియున్నప్పటికి, ఇశ్రాయేలు చేసినట్లుగా, ఆ కొండ ప్రక్కనయున్న, అబద్ధ ప్రవక్తయైన, ఒక బిలాముతో నిలబడి, నేను ఎన్నడూ దేవుడు దీవించిన దానిని శపించుటకు ప్రయత్నించను. ఏలయనగా పాళెములో, ఒక చీల్చబడిన బండయున్నది, రక్తము కారుచున్న బలి అర్పణయున్నది, మరియు ఒక అగ్ని స్తంభమున్నది. వారు ఎక్కడ యున్నప్పటికి లెక్క కాదు, అది వారిని ముందుకు విజయమునకు నడిపించుచున్నది, మరియు వారు తప్పక దాని యొద్దకు రావలసియున్నది, ఏలయనగా వారు విశ్వాసము ద్వారా నడుచుచున్న వాగ్దాన ప్రజలైయున్నారు. వారు ఒక సంఘశాఖ కాకపోయినను, వారు చుట్టూ తిరుగులాడువారైయున్నారు, మరియు ఆలాగుననే దేవుని ప్రజలున్నారు. అయితే నేను వారి హోదాలలో చేరి, నా మార్గమును వారితో తీసుకొనగోరుచున్నాను; వారి శాఖలో కాదు, వారి సహవాసములో, నిత్యుడైన దేవుని ఆత్మ యొక్క దైవోక్తుల చుట్టూ, విశ్వాసమును బట్టి నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందియున్నాను. దేవా, ఎల్లప్పుడు నేను అదే భావనను కలిగియుండుటకు నాకు సహాయము చేయుము.
91 గమనించండి. వారు ముందుకు సాగిపోగా, పశువులు బాగుగా బలిసే అవకాశాలను లోతు కనుగొన్నాడు. అనేకమంది బలిసిన జేబు పుస్తకము అవకాశాలను చూస్తారు. ఒక మంచి సాంఘిక హోదాలోయుండే అవకాశాలను అనేకమంది చూస్తారు. కొన్ని ఎక్కువ డాలర్లు వచ్చే అవకాశాలను అతడు చూశాడు. ఆ పట్టణమునకు ఒక మేయరుగాయుండే అవకాశాలను అతడు చూశాడు. ఒక క్రొత్తవాడైయుండి, అతడు యున్నట్లుగా ఒక చక్కని చురుకైన మనిషిగాయున్నాను, “బహుశ నేను ఆ పట్టణానికి ఒక ముఖ్యమైన మనిషిని కావచ్చు,” అనుకొన్నాడు. అతడు అవకాశమును చూశాడు, కారణము అవి అతని ముందు ఉంచబడినవి. కాని ఆ పట్టణమును నాశనము చేయవలసియున్న అగ్నిని అతడు చూడలేదు. ఆ దేశము మొత్తము పాపముతో నిండియున్నదని, దేవుడు దానిని నాశనము చేయవలసియున్నదని, అతడు తనకై తాను సఖ్యపడలేదు.
92 ఈ రోజున, ప్రజలు ఈలాగు చెప్పుట ద్వారా తమ్మును తాము సఖ్యము చేసుకొనుచున్నారు, “నీవు ఒక…?”
నేనంటాను, “నీవు ఒక క్రైస్తవుడవేనా?”
93 వారంటారు, “నేను ఒక అమెరికను.” ఒక కాకి, నేను ఒక కప్పను అని చెప్పుకొనుటకు ప్రయత్నము చేయుటకంటె, అది దానితో ఇంకా ఎక్కువ చేసేది ఏమీ లేదు. అది దానితో చేయునది ఏమియు లేదు.
94 ఆమె నాశనము గావించబడబోవుచున్నది, ఏలయనగా దేవుడు న్యాయవంతుడైయున్నాడు. మరియు అమెరికాను ఆమె పాపములతో ఆలాగునే ముందుకు వెళ్ళ నిచ్చినట్లైతే, నీతిమంతుడైన సార్వభౌమాధికారము కలిగిన దేవుడు, సొదొమ గొమొఱ్ఱా ప్రజలు తిరిగి లేపి, వారి పాపములను బట్టి వారిని కాల్చివేసినందుకు, వారికి క్షమాపణ చెప్పవలసియున్నది; దానితో ఆలాగునే ఆయన మనలను ముందుకు వెళ్ళనిచ్చినట్లైతే.
95 నీ అన్యాయపు చేష్టలు ద్వారా ఆయన నిన్ను ముందుకు వెళ్ళనిచ్చినట్లైతే, ఆయన అననియా సప్పీరాలకు మరొక అవకాశము ఇవ్వవలసియున్నది. ఆయన నిశ్చయముగా ఇవ్వాలి. కానీ ఆయన న్యాయవంతుడు. అననియ తన డబ్బును చూశాడు. పేతురు క్రీస్తును చూశాడు.
96 ఓ, అయ్యో! ఆ స్థలములో అతని పిల్లల నాశనమవుతారని లోతు చూడలేకపోయాడు.
97 ఈ దినమున, మీలో అనేకులు, పాత నామకార్థ ఆచారములను పట్టుకొనియున్నారు, మీ పిల్లల నాశనమును మరియు వారు బాల నేరస్థులుగా మారుటను మీరు చూడలేదు. మీ కుమార్తెను వేశ్యా గృహములో మీరు చూచుట లేదు. నీ కుమారుడు ఒక త్రాగుబోతుగా, చీట్ల పేక నొద్దయుండుట మీరు చూచుట లేదు.
98 “కారణము ఆమె నీళ్ళు పారు దేశమైయున్నది. పాపము అంటుకొనబడదు. అతడు చూస్తున్నప్పుడు, ఆ సొసైటీలన్నీటికి అతని భార్య శిరస్సుగా మారటం, ఉప్పు స్తంభముగా మారటం అతడు చూసియుండలేదు. అతడు తన ప్రాణమును దక్కించుకొనుటకు, చిన్న పట్టణానికి, అతని పళ్ళ అంచు దగ్గరగా మాత్రమే తప్పించుకొంటాడని, అతడు అతనిని చూచుకొనలేదు. అతడు దానిని చూడలేదు, కారణము అతడు తన ముందున్న దానిని మాత్రమే చూడగలిగినాడు.
99 కాని, అబ్రాహాము, నీళ్ళు పారుచున్న దేశమును గుర్తించలేదు, కారణము అతడు తన కన్నులు పైకెత్తి రేపటిని చూశాడు, ఏలయనగా అతడు అన్నిటిని స్వతంత్రించుకొంటాడు. నిజమైన క్రైస్తవుడు ఈ రోజున కన్నులెత్తి క్రీస్తు యొక్క వాగ్దానమును చూస్తాడు: “సాత్వికులు ధన్యులు, ఏలయనగా వారు అన్నిటిని స్వతంత్రించుకొంటారు. వారు భూమిని స్వతంత్రించుకొంటారు.” విశ్వాసము ద్వారా, నిజమైన క్రైస్తవుడు, కన్నులు పైకెత్తి దానిని చూస్తాడు. నీవు కోరినట్లుగా అతనిని పిలచుకో. అతడు తన కన్నులు పైకెత్తి చూశాడు. అతడు దానిని చేసినపుడు. దేవుడు అన్నాడు, “అబ్రాహామా, ఈ దేశము గుండా నడువు, అదంతయూ నీదే.” విశ్వాసమును బట్టి అబ్రాహాము దీనిని చేశాడు; మోషే అదే విశ్వాసమును కలిగియున్నాడు.
100 అది ఒక విశ్లేషకుని ద్వారా వ్రాయబడింది, అతడు దీనిని చెప్పాడు. అవి అత్యంత సుందరమైన మాటలైయున్నవని నేను తలంచాను. “లోకములోని శ్రేష్టమైన వాటిని తీసుకొని త్రాసులో ఒక వైపున మోషేయుంచాడు, హీనమైన మతమును త్రాసులో మరొక వైపున యుంచాడు; ఈ లోకములోని శ్రేష్టమైనవి, హీనమైన మతము ముందు కాటాలో తేలిపోయినవి.”
101 కాబట్టి ఈ రోజున అది ఆలాగునేయున్నది. మనలను వారు ఏమని పిలిచినా, “పిచ్చివారు,” లేక “పరిశుద్ధ బండలు,” లేక వారు ఏమని పిలిచినా లెక్కకాదు. లోకము ఇచ్చే శ్రేష్టమైన దానిని నీచమైనది తేల్చి వేస్తుంది. “పాతకాలపు, పాత పొగమంచు, పిచ్చి వాళ్ళు,” అని వారు పిలవబడతారు. సాతానుడు నీకు ప్రతిపాదించగోరే, శ్రేష్టమైన దానిని, అది కాటాలో తేల్చివేస్తుంది. అది ఎంతో నిశ్చయముగా తేల్చివేస్తుంది.
102 క్రీస్తు విషయమైన నింద, గొప్ప భాగ్యముగా మోషే ఎంచుకొన్నాడు. అతడు ముందే క్రీస్తును చూచాడు. తరువాత అతడు కొన్ని బలమైన ప్రేరేపణతో కూడిన మాటలు, ఆయనను గూర్చి మాట్లాడాడు. “చూడండి, ప్రభువైన మీ దేవుడు, నా వంటి ప్రవక్తను లేపుతాడు.” అతడు ఎరిగియుండెను. అతడు ముందే ఆయనను చూశాడు, మరియు లోక ఆకర్షణలన్నిటికంటె, ఆయన కొరకైన నింద, గొప్ప భాగ్యముగా ఎంచుకొన్నాడు.
103 క్రైస్తవ స్నేహితుడా, ఈ రోజు, నీవు దానిని చేయగలవా? లోకములోని ఆకర్షణలన్నిటి కంటె, మరియు పేరు ప్రతిష్టల కంటె, వాగ్దానము చేసిన ఆయనను మనము చూస్తాము. హీనమైన ఈనాటి సంఘము, దాని పరిస్థితులన్నిటితో, సాతాను నీకు ప్రతిపాదించే సమస్తమును, తేల్చివేస్తుంది. మనము చీల్చివేయబడినా, మనము ముక్కలుగా బ్రద్ధలైపోయినా, సంఘశాఖలు మరియు వెర్రితనములో, కలతపడి విరిగిపోయినా, సాతాను నీకు ప్రతిపాదించే దేనినైనా, అది తేల్చివేస్తుంది. నిశ్చయముగా.
104 ఐగుప్తు యొక్క సంపదలన్నిటికంటె, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముగా ఎంచుకొన్నాడు. తరువాత అతడు ఏదో చేయవలసియుండెను. అతడు ఐగుప్తును విడిచిపెట్టాడు. ఓ, ఆ మాట నాకు ఇష్టము. అతడు ఐగుప్తును విడిచిపెట్టాడు. చూడండి, అతడును అదే కిటికీ గుండా చూస్తున్నాడు, కాని ఫరో కంటె వేరుగా వారిని చూస్తున్నాడు. ఒక వేళ ఫరో, తన అంతమును చూసియుంటే ఏమయ్యేది? ఒక వేళ అతని దేశము మునిగిపోవుట ఫరో చూస్తే ఏమయ్యేది? మోషే దానిని చూశాడు. ఎలా? సైన్సు ద్వారానా? విశ్వాసము ద్వారా మోషే దానిని చూశాడు. అతడు చేసిన సమస్తమూ విశ్వాసము ద్వారాయైయున్నది, ఏలయనగా నాలుగు వందల సంవత్సరముల తరువాత, ఆయన ఈ దేశమును దర్శిస్తానని, మరియు వారిని బయటకు తీసుకొని వస్తానని, ఆయన తండ్రి అబ్రాహాముకు దేవుడు వాగ్దానము చేశాడు. మరియు విశ్వాసమును బట్టి, దేవుడు చెప్పిన మాట మోషే నమ్మియున్నాడు, మరియు వారిని బయటకు తెచ్చే ఎన్నుకొనబడిన నాయకుడనని, విశ్వాసమును బట్టి, అతడు తన్ను తాను ఎరిగియుండెను. అతడు ఎక్కడయున్నాడో, అతడు ఎరిగియుండెను. ఐగుప్తు యొక్క సింహాసనము మీద కూర్చొనుట కంటె, క్రీస్తు విషయమైన నిందను గొప్ప భాగ్యముగా ఎంచి, బురద గుంటలలో, ఒక బురద అలుకువాడెగా అతని స్థానమును తీసుకొనెను. “నేను వారితో విచారిస్తున్నాను,” అని ఎన్నడూ అతడు చెప్పలేదు. అతడు వారి స్థానమును తీసుకొని, వారితో వెళ్ళెను…వారి స్థానమును తీసుకొన్నాడు, మేము వారితో వెళ్ళాము.
105 ప్రేరేపించబడిన గ్రంథకర్త చెప్పుటలో ఆశ్చర్యము లేదు:
ప్రభువు యొక్క తృణీకరించబడిన కొద్దిమందితో, నేను దారిని తీసుకొంటాను.
యేసుతో నేనులోనికి ప్రారంభించాను, ఇప్పుడు నేను దాని గుండా వెళ్ళుచున్నాను.
నేను కానాను యొక్క దేశము మార్గములోయున్నాను. (నిశ్చయముగా.)
106 మోషే. అది ఒకరి ద్వారా ఇలా చెప్పబడింది. అదేమనగా మోషే ఫరో యొక్క కుమారుడైయుండి. ప్రపంచ ఆకర్షణ అంతయూ కలిగియుండేవాడు. ఫరో యొక్క కుమారుడుగా యుండుట కంటె, అబ్రాహాము యొక్క కుమారుడుగా యుండగోరాడు. ఫరో యొక్క కుమారుడై రాజుగా యుండుటకంటె, అబ్రాహాము యొక్క తృణీకరించబడిన కుమారుడిగా యుండగోరాడు.
107 ఈ గొప్ప అమెరికా సంయుక్త రాష్ట్రములకు అధ్యక్షుడిగా యుండుట కంటె, లేక ఒక ఎల్విన్ ప్రెస్లీ, లేక ఒక పాట్ బూగ్ గా యుండుటకంటె, ఆయన యొక్క సహదాసునిగా, ప్రభువైన యేసుక్రీస్తు కుమారునిగా యుండగోరుదును, లేక మీరు దానితో ఎవరిని చేయగోరినప్పటికి. నేను దానితోనే నా మార్గమును తీసుకొంటాను.
108 స్త్రీలు కూడా తప్పక తమ మార్గమును తీసుకోవాలి. మేరీ పిక్ పోర్డు లేక ఏదో గొప్ప సినీ తారకు బదులుగా, లేక ఆకర్షనీయమైన ఏదో బాలికకు బదులుగా, ప్రభువు యొక్క తృణీకరించబడిన కొద్దిమందితో నీ మార్గమును తీసుకొనుము.
109 ఒక హాలీ ఉడ్ సినీతారగా లేక ఈ భూమి మీద గొప్ప వ్యక్తిగాయుండుటకంటె, ఒక ఉపదేశకుడిగా వేదిక మీదయుండి, క్రీస్తు యొక్క శోధింపశక్యము గాని నిధులను, వేదిక మీదయుండి బోధిస్తాను. నేను అడుక్కొని కొంచెముగా తినవలసి వచ్చినను, లేక నేను ఏమి చేయవలసివచ్చినను, నేను ప్రభువు యొక్క ప్రజలతో నా మార్గమును తీసుకొంటాను. విశ్వాసము ద్వారా నేను దానిని చేస్తాను. నాకు ఎన్నో అవకాశములు ప్రతిపాదించబడినవి. కాని, దేవుని యొక్క కృపను బట్టి, నేను ఇంకనూ విశ్వాసము ద్వారా చూస్తాను.
విశ్వాసమును బట్టి, దూరముగా నేను దానిని చూస్తాను;
మనకు నివాస స్థలమును అక్కడ సిద్ధపర్చుటకు,
మన తండ్రి మార్గములో పైన కనిపెట్టుచున్నాడు.
110 మొన్నటి దినమున ఒక ఆదాయ పన్ను మనిషి ఇలా అన్నాడు, “నీ యింటిని నీవు ఎందుకు ఆలయముగా మార్చావు? చెత్తవలె కనబడుచున్న ఆ చిన్న ఆలయము కొరకు, ఇరువది ఐదువేల డాలర్ల ఇంటిని ఇచ్చునట్లుగా, ఏది నిన్ను ఆలాగు చేసింది?”
111 నేనన్నాను, “నేను దానిని చేసినది సంఘమునకు కాదు. అది అక్కడయున్న ప్రజలకు చేశాను.” ఈ లోక వస్తువులు నాకు ఏదీ వద్దు. నేను తీసుకొన్న ప్రతి పైసా డబ్బు ఈ సంఘమునకు ఇచ్చి వేశాను. ఎందుచేత? నా విశ్వాసము దేవునిపైయున్నది, ఈ లోకములోని వస్తువుల మీద కాదు. నేను కోరుకొనేవి పైనయున్నవి. మీరు దేవునితో యధార్ధముగా యున్నట్లైతే, మీరందరూ ఒకటేనని నేను నమ్ముతాను. అది నిజము. మీరు ఒక్కటైయున్నారు. విశ్వాసము ద్వారా మనము స్వీకరిస్తాము. విశ్వాసము ద్వారా మనము దేవునిని నమ్ముతాము.
112 మోషే, ఎంపిక చేయవలసియుండెను. అతడు ఎంపిక చేసిన తరువాత, అతడు విశ్వాసముతో పోరాడవలసియుండెను, ఏలయనగా అతడు రాజాగ్రహమునకు భయపడలేదు. ఇప్పుడు, మానవ పరముగా, అతడు రాజాగ్రహమునకు భయపడు హక్కును కలిగియుండెను. రాజాగ్రహమునకు భయపడు హక్కును అతడు కలిగియుండెను, కాని అతడు భయపడలేదు. అతడు దానిని చేయలేదు, కారణమేమనగా, అతడు ఒక పనిని చేయవలసియుండెను, అతడు విధి నిర్వహణ మార్గములోయుండెను. దానిని గూర్చి రాజు ఏమి చెప్పాడో అతడు లెక్కచేయలేదు. అతడు తన మార్గమును సరిగ్గా ఆలాగునే తీసుకొనెను.
113 ఇప్పుడు, ఫరో, సహజముగా, అతడు తన ఓటమిని చూసినపుడు, అతడు మోషేకు మరియు ప్రజలతో…అతడన్నాడు, “మంచిది, నేను ఏమి చేస్తానో మీకు చెపుతాను. మీరందరూ ఈ దేశములోనేయుండి మరియు బయటకు వెళ్ళి, మీ దేవునికి బలి అర్పించండి.”
114 ఆ విధముగానే దయ్యము పనిచేస్తాడు. “ఓ, మీరు భక్తిగాయుండవచ్చు. మీరు ఎందుకు ఆ పైకి వెళ్ళి, ఏదో ఒక సంఘములో ఎందుకు చేరకూడదు? ఈ పనులన్నీ మీరు చేయవలసిన పనిలేదు.” ఒక పురుషుడు తన భార్యతో ఇలా అంటాడు…
115 భార్య చెపుతుంది, “నా భర్తా, నేను రక్షించబడ్డాను. ఇక ఎంతమాత్రము పెదవులకు రంగులు, ముఖానికి రంగులు వేయను. ఇవి ఇక ఎంతమాత్రము అవి చేయను. ఇక విందులు ఏ మాత్రము లేవు. ఈ సామాజిక కార్యకలాపములు ఇక ఎంత మాత్రము లేవు. నేను వాటిలో నుండి బయటకు వచ్చాను! ఇక నా సమయమును వాక్యము చదవటానికి, నా గృహముపట్ల శ్రద్ధ వహించడానికి వాడతాను.”
116 “ఇప్పుడు, చూడు, ప్రియమైనదానా, నీవు భక్తిగాయుండవచ్చు, మంచిదే. ఇప్పుడు చూడు, నీవు ఆ పైకి వెళ్ళావు, నీవు తప్పు సంఘానిని కలిగియున్నావు.
117 లేదు. నీవు తప్పుకాదు. నీవు మంచి వరుసలోయున్నావు. ఒక బోధకుడు అలాటి దానిని బోధించినట్లైతే, నీవు తప్పక దానితో నిలిచియుండాలి లేఖనములు గుండా వెనుకకు పరిశోధించండి, అది నిజము కాదేమో కనుగొనండి.
118 “ఓ,” “ఆ పైకి వెళ్ళండి, అన్నాడు. వారు దానిని ఇక్కడ చేయవలసిన పని లేదు. చూడండి? ఇక్కడ వాళ్ళు దానిని చేయరు.” ఆ విధముగానేయుంటుంది… “అంత దూరమే వెళ్ళండి.” అయితే ఆ దేశములో నుండి నీవు బయటకు వెళ్ళుట వాడికి ఇష్టము లేదు. ఆ విధముగానే దయ్యము చేస్తాడు. నీవు లోక కార్యముల నుండి బయటకు వెళ్ళుట వాడికి ఇష్టము లేదు; సంఘములోనికి లోకమును సరిగ్గా తెస్తాడు.
119 మొన్నటి దినమున రోడ్డు మీద వస్తూయుండగా, నేను రేడియోను త్రిప్పాను. అక్కడ ఒక పాటయున్నది, నేను దానిని వింటూనేయున్నాను, అది పూర్తిగా భక్తి పరమైన పాటా, లేక దయ్యము దేవుని కార్యములను లోక ప్రమాణములోని తీసుకొని వస్తుందా అని చెప్పుటకు, నేను ఆ పాటను దరిదాపుగా, పూర్తిగా వినవలసి వచ్చింది. నీవు దానిని చేయరాదు. దేవా కనికరము చూపుము!
120 ఎల్విన్ పెస్లీ ఎన్ని ఆల్బమ్ లు వ్రాసినను, ఎన్ని భక్తి గల పాటలు వ్రాసినను లెక్కకాదు. వాడు ఇంకను దయ్యము పట్టినవాడు. ఈ దినమున నేను ఎరిగియున్న అన్ని ఉద్యమములకంటె, వాడు ఎక్కవ మంది పిల్లలను నరకానికి పంపుతున్నాడు. పాట్ బూన్, మిగిలిన వారందరూ, అతడు క్రీస్తు సంఘమునకు చెందినవాడు; మరియు ఎల్విన్ ప్రెస్లీ, ఒక పెంతుకొస్తువాడు, వారు ఆ మనుషుల రూపములోయున్న యూదా ఇష్కరియోతులైయున్నారు. దేవుని యొక్క ఉన్నతమైన కార్యములను సాతానుడు తెచ్చుటకు ప్రయత్నించి, ఆ ప్రకారము వారు ఇక్కడ క్రింద వాటిని కలుగలుపు చేస్తారు. ప్రజలు దానికి పైగా చూడరు. వారు ఇక్కడ చూసి అంటారు, “బాగుంది, అదంతా ఒక్కటే.” అదంతా ఒక్కటి కాదు. ఆ దేశము నుండి బయటకు వెళ్ళిపో.
121 అతడన్నాడు, “మీరు కొన్ని రోజులు వెళ్ళవచ్చు, వెళ్ళండి, కాని ఈ దేశములోనే యుండండి.” నిశ్చయముగా, వారు తిరిగి వస్తారని అతనికి తెలుసు. తరువాత, అది పనిచేయుకపోవుటను అతడు కనుగొన్నాడు, కాబట్టి అతడు మరొక భిన్నమైన దానిని ఆలోచించాడు. అతడన్నాడు, “మీరు ఏమి చేయాలో చెపుతాను మీరు కోరుకొన్న చోటికి వెళ్ళండి, కాని మీ పిల్లలనందరిని, మీ భార్యలనందరిని, మీ పశువులన్నిటిని ఈ వెనుక వదిలి వెళ్ళండి. మీరు వాటిని ఇక్కడ వదిలిపెట్టి, బయటకు వెళ్ళండి.” కారణము, వారికి వెనుక అక్కడయున్న వస్తువులు వారిని వెనుకకు రమ్మని శోధిస్తాయి.
122 అదే దయ్యము నీకు చెపుతుంది. కొన్ని లోక సంబంధమైన విషయములు నీ మీద వ్రేలాడుచున్నంత వరకు, నీవు ఇంకా పొగత్రాగాలని అనుకొంటావు. నీవు సారాయి త్రాగాలనుకొంటావు, నీవు లోకములోని వారి వలె వస్త్రధారణ చేయాలనుకొంటావు, అంతమట్టుకు మంచిని దయ్యము కోరుకొంటుంది.
123 వెనుకకు జారుటకు గూర్చి నేను ఎంతగానో వింటాను. ప్రజలు తలంచినంతగా ఎంతో ఎక్కువ వెనుకకు జారిపోవుటవుందని, నేను నమ్మను. వారిని మళ్ళా వెనుకకు శోధించుటకు, ప్రజలు ఎన్నో వస్తువులను కేవలము ఐగుప్తులో విడిచిపెడతారు, అంతమట్టుకే. వెనుకకు జారుటలు వారు చెప్పినట్లుగా కాదు. నీవు నీ వెనుక ఎంతో లోకమును విడిచిపెట్టావు, అది మిమ్మును శోధిస్తుంది.
124 సోదరుడా, నేను నీకు చెపుతాను, అర్ధరాత్రి ఇశ్రాయేలు సిద్ధమైనపుడు, ఈ లోకములో వారు కలిగియున్న సమస్తమును మూటకట్టుకొని, వెళ్ళుటకు సిద్ధమయ్యారు.
125 దేవా, అలాటి ఉజ్జీవమును మాకు పంపుము. మనము సమస్తమును మూట కట్టుకొని, వెళ్ళిపోవుటకు సిద్ధమవుదాము. అర్ధరాత్రి కేక వచ్చుచున్నది. “ఆయనను ఎదుర్కొనుటకు మీరు వెళ్ళండి.” మీరు సమస్తమును మూటకట్టుకొనుట మంచిది. నిన్ను వెనుకకు లాగుటకు శోధించకుండా, నీకు లోకములోని ఏదియు లేకుండుట మంచిది, మరియు నిన్ను ఏ త్రాళ్ళు క్రిందికి లాగకూడదు. మూట కట్టండి. మనము సిద్ధపడదాము.
126 ఏమిటో నీకు తెలుసా? నేను మీకు చెపుతాను, వారు దేవునికి ఎంతో నమ్మకముగాయున్నారు, చివరకు ఫరో అర్ధరాత్రి వేళ ఎంతో ఉద్రేకభరితుడై, “వెళ్ళిపోండి! వెళ్ళిపోండి! అన్నాడు. వెళుతూనే యుండండి. నీకు కలిగిన సమస్తమును తీసుకొని, వెళ్ళిపొమ్ము!”
127 నాకు ఎంతో సంతోషం, అదేమనగా, ఒక మనిషి దేవునికి ఎంత దగ్గరగా జీవించగలడంటే, చివరకు అతనితో ఏమి చెయ్యాలో దయ్యమునకు తోచదు. అది నిజము. బయటకు వెళ్ళిపో! బయటకు వెళ్ళిపో! వెళుతూనేయుండుము! దేవునికి లోబడుము!
128 విశ్వాసమును బట్టి, అతడు వాగ్దానమును చూశాడు. మట్టి పురుగు, లేక మట్టి పురుగు కాకపోయినా, అతడు తన మార్గమును, ప్రభువు యొక్క తృణీకరించబడిన కొద్దిమందితో తీసుకొనెను. ఫరో అన్నాడు, “మీకున్న సమస్తమును తీసుకొని, ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపొండి! మీతో ఏమి చేయాలో నాకు అర్ధమగుట లేదు.” విశ్వాసమును బట్టి, అతడు దేవునికి ఎంతో నమ్మకముగా యున్నాడు.
129 విశ్వాసము అద్భుతములను చేస్తుంది, నీవు దేవునికి నమ్మకముగాయున్నట్లైతే. విశ్వాసము బట్టి, మనము ఆయనను చూస్తాము.
మన సమయము ముగించబడింది; సమయం దాటిపోయింది.
130 కాని, విశ్వాసమును బట్టి, ఈ ఉదయమున, నీ కన్నులు పైకెత్తుము. నీ చుట్టూ ఏమున్నదో, ఈ అధునాతన ప్రపంచాన్ని చూడవద్దు, కాని వాగ్దానము నిచ్చిన ఆయనను చూడుము. బైబిలు చెప్పింది, “మనము ఇప్పుడు అన్నిటిని పరిపూర్ణముగా చూడము, కాని మనము యేసును చూస్తాము.” ఈ ఉదయమున, నీవు ఆయన వైపు చూడుము, నీ మార్గములు మార్పు చెందుతాయి.
131 ఒక్క క్షణము, ప్రార్థన కొరకు మనము తలలు వంచుచుండగా, ఈ వర్తమానమునకు ప్రభువు తన దీవెనలు చేర్చును గాక.
132 ఇప్పుడు నీ హృదయములో ఆలోచించుము. లోక సంబంధమైన కార్యముల కొరకు నీవు ఎదురు చూస్తున్నావా? విశ్వాసము ద్వారా, నీవు యేసును చూస్తావా? నీ సంఘము యొక్క పేరు ప్రతిష్ఠలు కొరకు చూస్తున్నావా? లోకముతో నీ సాంఘిక హోదా ఏమైయున్నదని చూస్తున్నావా? లేక సర్వ శక్తుడైన మహోన్నతుని కుడి పార్శ్వమునయున్న, ఆ నీతిమంతుల కొరకు హతసాక్షిగా బాధను అనుభవించిన, దీనుడైన యేసును చూస్తున్నావా? అదిగో నీ కన్నులను పైకెత్తి, ఆ జీవ వృక్షమును చూస్తావా? అలాగైతే, సైన్సు వృక్షమును మరియు జ్ఞానమును విడిచి, ఆయనను సేవించుము.
133 నేను ప్రార్థన చేయక ముందు, నీవు ప్రార్థనలో గుర్తు చేసుకొనబడవలెనని కోరుచున్నావా? నీకు అవసరమైన దేని కొరకైనా, నీ చేతిని ఎత్తుము. ప్రభువు మిమ్మును దీవించును. మీ హస్తములన్నిటిని ఆయన చూస్తున్నాడు.
134 నీవు ఒక పాపివైయున్నట్లైతే. ఇప్పుడు నీ కన్నులు పైకెత్తి చూడుము. నీవు భేధముగాయున్నట్లైతే, నీవు చిన్న చిన్న తగాదాలను కలిగియున్నట్లైతే, అది ఏ భేధము చేస్తుందంటావా? ఈ దినములలో ఒక దినమున నీవు చనిపోవుచున్నావు. ఏ రోజు? బహుశ ఈ రోజే కావచ్చు! నీకు తెలియదు. ఇప్పటి నుండి ఒక గంట తరువాత, నీవు బహుశ పాతాళములోయుండవచ్చు. లేక బహుశ నీవు పరలోకములోయుండవచ్చు. అయితే నీవు తప్పక ఇప్పుడే ఎన్నుకోవాలి. నీ జీవితములో ఏదైనా సరికానిదియున్నట్లైతే, విశ్వాసము ద్వారా, ఇప్పుడే నీవు ఎన్నుకొనుము.
135 నీవంటావు, “నేను ఆమెతో కొనసాగవలసి వచ్చినను! నేను అతనితో కొనసాగవలసి వచ్చినను! వారు ఏమి చేసినను లెక్కకాదు, ఇప్పుడు, నీవు విశ్వాసము ద్వారా ఎన్నుకొనము.
136 కారణము, యేసు అన్నాడు, “నీవు ఎవరి అపరాధమునైనా హృదయ పూర్వకముగా క్షమించకపోయినట్లైతే, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించడు.” కాబట్టి దానికి దగ్గరగా రండి. నీ హృదయములో ఏ వ్యక్తి మీదయైనా, పాపియైనా లేక పరిశుద్ధుడైనా, ఏదైనా నీవు కలిగియున్నట్లైతే, నీవు నరకాగ్ని అపాయములోయున్నావు.
137 ఇప్పుడు నీ కన్నులను ఎత్తుము. నీవు ఏమి చూస్తావు, నీ శత్రవునా? లేక నీ రక్షకుని చూస్తావా? ఈ ఉదయమున నీవు దేనిని చూస్తావు?
138 నీవు రోగిగాయున్నట్లైతే, మరియు నీవు బాగుపడవని వైద్యుడు చెప్పినట్లైతే, సిలువ వైపు నీ కన్నులను పైకెత్తుము, “అక్కడ ఆయన నీ అతి క్రమముల కొరకు గాయపర్చబడినాడు, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థతనొందియున్నారు. వైద్యుడు ఏమన్నాడో దాని వైపు చూడవద్దు; వాడు సైన్సులో పనిచేయుచున్నాడు. విశ్వాసము దేవుని ఆత్మ యొక్క పరిధిలో పని చేస్తుంది. ఇప్పుడు మీ చేతులను ఎత్తియుండగా, ఈ విషయములను గూర్చి ఆలోచిద్దాము. దేవుడు వారిని చూసియున్నాడు.
మనము ప్రార్థన చేసుకొందాము.
139 ఓ, నిత్యుడైన దేవా, వర్తమానము ముందుకు వెళ్ళిన తరువాత, ఇప్పుడు నిమ్మళముగా ఆరాధించుచుండగా, ప్రభువా, ఆ విత్తనములు రాతి నేల మీద పడనీయవద్దు. ప్రభువా, ఈ వర్తమానము, ముళ్ళుపొదలు, గచ్చ తీగలలో పడనీయవద్దు, (లోతు వలె) ఈ లోక చింతలు దానిని అణిచివేసినవి, అంతములో, అవి విసర్జించబడినాయి. కాని, ధన్యుడైన ఓ దేవా, అవి మంచి ఫలభరితమైన, పశ్చాతప్తులైన హృదయములపై పడునుగాక. ప్రభువా, నా హృదయము మీద కూడా పడును గాక, ఆ ప్రకారము మేమందరము దేవుని యొక్క చూపుడు అద్దము గుండా చూస్తూ, తిరస్కరించబడిన ప్రభువైన యేసు సంఘమును, తిరస్కరించబడిన ప్రజలను, తిరస్కరించబడిన మార్గమును చూచుదుము గాక, మేము మహిమకరమైన మార్గములో నడుచుదుము గాక.
140 మోషే వలె, అతడు ఎక్కడికి వెళ్ళుచున్నాడో అతనికి తెలియదు. ప్రజలు ఎటు వెళ్ళుచున్నారో వారికి తెలియదు. ఏ మార్గము గుండా వెళ్ళాలో వారికి తెలియదు. వారు ప్రారంభించారు, అంతే.
141 ఓ, ప్రభువైన దేవా, ఈ అద్భతమైన కీర్తన పాడుచుండగా, విశ్వాసము ద్వారా, దూరము నుండి మేము ఆ దేశమును చూడగలము. అది ఆలాగున సరిగ్గా ఇప్పుడుయుండును గాక, అదేమనగా ఇక్కడయున్న స్త్రీ పురుషులు, లోకము ఏమి చెప్పబోవుచున్నదో లేక వారు ఎలా చెప్పుచున్నారో, తలంచకుందురు గాక. వారు సరిగ్గా వారి ఆత్మలో పైకి లేచి వెళ్ళుదురు గాక.
142 మోషే వెలుగును వెంబడించాడు, మరియు అది అతనిని వాగ్దాన భూమికి నడిపించింది. అతడు ఎక్కడికి వెళ్ళుచున్నాడో ఎరగనివాడై, పగటికంటె శ్రేష్ఠమైన దేశమునకు, అతడు వెలుగులో నడిచాడు.
143 ప్రభువా, ఈ రోజు, దయచేయుము, అదేమనగా ఇక్కడున్న అనేకమంది లేఖనము యొక్క వెలుగులో, పరిశుద్ధాత్మ యొక్క సహవాసములో, సంఘముతో నడుచుదురు గాక; సంఘము, ప్రథమ-ఫలములు, క్రీస్తును స్వీకరించిన క్రొత్తగా జన్మించిన బిడ్డలు, పరిశుద్ధాత్మతో నింపబడినవారు, ఆత్మతో నడిపించబడుదురు గాక. దేవుని యొక్క నిబంధనల చుట్టు, ఈ సహవాసముతో ఏకముగా నడుచుదుము గాక, ఆయన యొక్క మరణము, సమాధి, పునరుత్థానములో ఆయనను సేవించుదుము గాక. ఆయన ఆజ్ఞల ప్రకారము మనము ఆయనను సేవించుదుము గాక, “మీరు పై నుండి శక్తిని పొందువరకు యెరుషలేములోని నిలిచియుండండి.” రోగుల కొరకు ప్రార్థన చేయుచూ, దైవిక స్వస్థతలో మనము ఆయనను సేవించుదుము గాక. దేవుని యొక్క వాక్యము చుట్టూ సహవాసము చేయుచూ, ఏక మనస్సుతో రొట్టె విరుచుచు, ప్రభు రాత్రి భోజనము ద్వారా ఆయనను సేవించుదుము గాక. దృశ్యముగా ప్రభువు వచ్చు వరకు, మనము ఆయన దైవిక నిబంధనల చుట్టూ ఆయనను సేవించుదుము గాక. ప్రభువా, దానిని దయచేయుము. ఇప్పుడు మేము దానిని నీకు అప్పగించుచుండగా, ప్రభువైన యేసు నామములో మా ప్రార్థనలను అంగీకరించుము.
144 త్వరగా, నెమ్మదిగా, మన తలలను వంచియుండగా, ఈ పాటను మనము పాడుకొందాము. ఇప్పుడు ఇది ఆరాధనయైయున్నది. వర్తమానము ముగించబడింది. ఎవ్వరూ వెళ్ళవద్దు. నిమ్మళముగా వుండండి. మనము ఆరాధిద్దాము.
145 ఈ వర్తమానము దిద్దుబాటుయైయున్నది. నీవు ఏమి చేసియున్నావో, మరొకసారి ఆలోచించుము, నీవు తప్పక ఏమి చేసియున్నావో, ఈ రోజు నీవు ఏమైయున్నావో, ఆలాగున ఏది నిన్ను తయారుచేసినదో. ఈ రోజున ఏది నిన్ను దోషిగా తీర్పు తీర్చింది. దానికి కారణము నిన్నటి దినమున నీవు ఏదో చేసియున్నావు. అది రేపు ఏమవుతుంది? ఈ రోజే దానిని సరిచేసుకొనుము, అప్పుడు రేపు నీవు స్వతంత్రుడుగాయుంటావు. చూడండి? నీవు తప్పక ఎన్నిక చేసుకోవాలి. నీవు ఎలా దానిని చేయగలవు? “విశ్వాసమును బట్టి, నేను సమస్తము నుండి విడిపించబడ్డాను, మరియు ఒక దినమున నేను ఆ పైకి వెళ్ళబోవుచున్నాను.”
త్వరలోనే, తియ్యగా,
మనము ఆయనను కలుసుకొంటాము…
ఇప్పుడు ప్రభువును మీ ఆత్మలో ఆరాధించండి.
త్వరలోనే, తియ్యగా,
మనము ఆ తృణీకరించబడిన సంఘమును కలుసుకొంటాము. (ఖఠినముగా వెళ్ళుచున్నాము, కాని ఒకరోజున మనము కలుసుకొంటాము.)
పైనయున్న సమృద్ధియైన తండ్రిని,
మన స్తుతి సుంకమును ఆయనకు చెల్లిస్తాము,
ఆయన మహికరమైన ప్రేమ వరకు కొరకు,
మన గౌరవనీయమైన దీవెనలు…
ప్రభువు యొక్క తృణీకరించబడిన కొద్దిమందితో, విశ్వాసము ద్వారా, నేను ఎన్నుకున్నాను.
తియ్యగా (తియ్యగా)…(త్వరలోనే),
ఆ సుందరమైన ఒడ్డున మనము ఆయనను కలుసుకొంటాము; (త్వరలోనే)
తియ్యగా (తియ్యగా) త్వరలోనే,
ఆ సుందరమైన ఒడ్డున ఆయనను మనము కలుసుకొంటాము.
అక్కడ ఒక దేశమున్నది అది…
ఆయనను ఆరాధించండి. ఇది ఆరాధనయైయున్నది.
…విశ్వాసముతో నేను చూడగలను,
విశ్వాసము ద్వారా, నేను నా ఎన్నిక చేస్తాను.
ఓ, తండ్రి కనిపెట్టుచున్నాడు…
146 ప్రభువు వారందరిని నేను అక్కడ పైన చూస్తాను; సోదరుడు జార్జ్, సోదరుడు సెవార్డ్, పరిశుద్ధులందరూ.
…అక్కడ మన నివాస స్థలము (అవును, ప్రభువా!)
తియ్యగా
147 ఆమె తండ్రి, హౌవార్డ్, ఎడ్వర్డ, పాతకాలపు పరిశుద్ధులందరూ, అదిగో ఆ వెనుక, వారి మార్గమును తీసుకొన్నారు.
తియ్యగా (అవును, ప్రభువా!) త్వరలోనే (త్వరలోనే),
ఆ సుందరమైన ఒడ్డున మనము కలుసుకొంటాము.
మనము దాని మీద పాడుతాము…(ఓ, దేవా!)
ధన్యమైన శ్రావ్యమైన గీతములు, (దేవునికి మహిమ!)
…దుఃఖము ఎంతమాత్రము యుండదు,
ఆ విశ్రాంతి స్థలములో, దీవెనల కొరకు, ఒక్క ఒగర్చుటయుండదు.
తియ్యగా, తియ్యగా, త్వరలోనే…(త్వరలోనే)
మనము ఆ చక్కని స్థలములో కలుసుకొంటాము…