అనుభవములు
ఈ రోజు నా వద్దకు ఏమి తేబడిందో నేను మీకు చెప్తాను. నేను దాదాపు.....నన్ను చాలా బలహీనపరిచడానికి ప్రయత్నించింది. నేను అంత బలహీనునిగా అవ్వడానికి కారణము ఏమిటో నేను గ్రహించలేకపోవుచున్నాను. నేను ఎల్లప్పుడూ కూడికను కలిగిన ప్రతిసారి... నేను - నేను ఎన్నడూ అనారోగ్యముగా ఉండాలనుకోలేదు. ప్రతి ఒక్కరు నా యొక్క జీవిత కధను, అది ఎలా సంభవించినదో నేను చెప్పుట విన్నారు; నేను కేవలము యవ్వనునిగా ఉన్నప్పుడు అది (ఆ రోగము) జ్వరము వలన కలిగినది, పొగ త్రాగుట మరియు ఇతరమైన దాని వలన కాదు. మరియు నేను — నేను ఎప్పుడునూ అనారోగ్యముగా ఉండుటకు ఇష్టపడలేదు...?... [టేపు పై ఖాలీ స్థలము] దేవునికి, మరియు ప్రతియొక్కటి చేసేవాడిని, ఫుట్ బాల్ ఆడటం, మరియు అది నన్ను ఎంతగానో కృంగదీసింది...?...అది కేవలం ఆటలను బయటికి లాగి...?...ఆ వెలుపల కేవలం నన్ను లాగేది....[టేపు పై ఖాలీ స్థలము]
అది ఏమిటా! అని నేను ఆశ్చర్యపోయాను. నేను అర్ధము చేసుకోలేకపోయాను; నేను కొన్నిసార్లు ఎంతో బలహీనునిగా అయిపోయేవాడిని, దానివలన నేను సృహ తప్పిపోయేవాడిని, మీకు తెలుసా. వారు నన్ను బయటకు తీసుకొని వెళ్ళేవారు, మరియు ఏమైందో తెలుసుకొనుటకు బహుశా సృహలోనికి వచ్చుటకు కొన్ని గంటలు నాకు సమయము పట్టేది...?.... నేను అనుకొనుచున్నాను.... అది ఏదో....?... [టేపు పై ఖాలీ స్థలము]
2
దాని గురించి నేను ఎంతో నిజాయితీగా ఉన్నాను, దాని గురించి నేను ఎంతో ఆలోచించాను, దానిపై నా మనస్సును ఎక్కువగా పెట్టాను. “నీవు జాన్ డొయి యొక్క బిడ్డ గురించి ప్రార్ధనచేసి; దాని గురించి మరచిపో. దానిని స్వస్థపరచుట దేవుని పనియైయున్నది.”దాని గురించి నీవు ఎంతో నిజాయితీతో ఆలోచిస్తున్నావు.“ ”అప్పుడు నీవు అలా చేసినప్పుడు, మానసికముగా కుప్పకూలిపోతావు“ అని చెప్పారు.
నా స్వభావము అది కాదు.... మంచిది, ఎక్కువగా కొనసాగిపోతూ ఉంటాను, కాని నేను... దాని గురించి నేను మరచిపోవాలని వారు నాకు చెప్పారు; వారి దృష్టిలో నేను ఎంతో ఎక్కువగా నిజాయితీగా ఉన్నాను. దేవుని పని కోసం నీవు ఎక్కువ నిజాయితీగా ఉండుటను నేను నమ్మను. అది నిజము. నీవు ఎంత ఎక్కువ నిజాయితీతో ఉంటే, అంత ఎక్కువగా దేవుడు నిన్ను నడిపిస్తాడు.
కావున నేను...నేను మానసికముగా కుప్పకూలిపోవచ్చు అని వారు నాకు చెప్పారు. అయితే నేను — నేను కొనసాగిపోయాను. మీలో చాలా మంది నన్ను ఎరుగుదురు, నేను ఇక్కడ ఉన్న మొదటిసారి నుండి ఎరిగిన వారు, కొద్దిసేపు, నేను నా మనస్సులో విషయాలను పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను.....
3
[టేపు పై ఖాలీ స్థలము]... దైవిక స్వస్థత గురించి బోదించుచున్నాడు, బహుశా నేను జన్మించక ముందు. మరియు నేను —నేను ఆయనను డెబ్బై-ఒకటి సంవత్సరాలకు చూచాను, మరియు మొదటిలో నేను ఎంత అవసరతను కలిగి ఉన్నానో అంతకంటే ఎక్కువ అవసరతను ఇంకా ఆయన కలిగి యున్నారు...?.... ఇప్పుడు, నేను చూశాను. మరియు రాత్రి వెంబడి రాత్రి కూడికలను సంవత్సరం పాటు ఆయన కలిగియుండగలరు, అని ఆయన చెప్పుట నేను విన్నాను..... [టేపు పై ఖాలీ స్థలము]
అది నా స్వంత ప్రాణమును తీసుకొనును అని నేను నమ్ముచున్నాను. మంచిది, అది అలా ఎందుకో నాకు అర్ధము కాలేదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుకున్నాను, అని నేను ఎరుగుదును. మరియు సహోదరుడు బోస్వర్త్, “అతడు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నాడు అని” చెప్పాడు. అది మమ్ములను సహోదరులనుగా చేసినది. మరియు మా ఇద్దరిని రక్షించినది దేవుడే. మరియు అప్పుడు అతడు ఎలా నిలబడగాలిగాడు మరియు నేను ఎందుకు నిలబడ లేకపోవుచున్నాను అని నేను ఆశ్చర్యపోయాను. మరియు “సరే, బహుశా అతడు కేవలము — నాకంటే ఎక్కువగా పరిశుద్ధాత్మను ఎక్కువగా కలిగియున్నాడు, అని నేను అనుకున్నాను. అప్పుడు నేను అనుకున్నాను... సరే, ఆ విధముగా నేను — ఆ విధమైన ఓదార్పుతో నన్ను నేను ఓదార్చుకున్నాను.
మరియు నేను, “మంచిది, నేను ఈ రోజు ప్రార్ధించబోవుచున్నాను. నేను కూడికకు వెళ్ళుచున్నాను, మరియు దేవుడు ఎక్కువగా పరిశుద్ధాత్మను నాకు ఇచ్చునేమో నేను చూచెదను, కావున నేను మరి ఎక్కువ నిలబడగలను” అని అనుకున్నాను. కావున గత రాత్రి కూడికలో, అద్భుతములు జరిగినా కూడా నేను నిజముగా అలాగే ఉన్నాను.
4
నేను ఇంటికి చేరుకున్నాను. నేను - నేను నా ప్రియులకు ఏమియు చెప్పలేదు. అయితే ఈ ఉదయము, నేను వేకువనే లేచాను. ఎడారికి వెళ్ళాను, మరియు దానిగురించి నేను మాట్లాడవలసియున్నది. నేను దానిని అస్సలు అర్ధము చేసుకోలేకపోవుచున్నాను. మరియు ఆయన ఎరుగును. మరియు — దాని గురించి ఆయన సమస్తము ఎరుగును. కావున అక్కడ ఎడారిలో ప్రార్ధన చేస్తూ, కొద్ది సమయము తరువాత, ప్రార్ధన తరువాత, అది కొన్నిసార్లు ఆయన మాట్లాడినట్లుగా, మీరు నేను మాట్లాడునప్పుడు వినబడే శబ్దముతో విన్నట్లుగా ఎన్నడూ మాట్లాడలేదు.
అయితే అది, ఎవరో కిందకి వచ్చి మరియు చెప్పినట్లుగా అనిపించినది. మరియు అది ఏమిటో నామనస్సులో ఎప్పటికీ స్థిరపడిపోయినది. ఏదో నాతో, “వారు వాక్యముతో బోధించుదురు మరియు అది ఒక వరము. ప్రతియొక్కరూ తమ స్వంత విశ్వాసముపై ఆధారపడుదురు. అది వరము ద్వారా మాత్రమే. కావున నేను కూడా అట్టివాడినే, నా యొద్ద నుండి తీసుకొనుము” అని చెప్పింది.
ఇప్పుడు, నేను ఒక వరమును కాదు. మీరు చూచారా. వరములు ఉన్నవి అని నేను నమ్ముచున్నాను (అదినిజము.), అది ఈ లోకములో ఉన్నది. అయితే వరము ఏదనగా, దేవుడు పరలోకము నుండి క్రిందకు పంపునదియే. మరియు ఇది మానవ శరీరములో నింపబడి, లేక దేవుడు ఎక్కడ పెట్టవలెనని కోరుకుంటాడో అక్కడ ఉన్నది.
ఒక దినము, అది స్తంభముపై ఇత్తడి సర్పములో పెట్టుటకు ఆయన యొక్క ఎన్నికయైయున్నది ... [టేపుపై ఖాలీ స్థలము]
5
[ఇక్కడ ఉన్న ఈ టేపులోని భాగము ఒక గుర్తించబడని వర్తమానములోనిది బహుశా డిసెంబరు మూడవ తేది
మీ అందరికి వందనములు. ఇప్పుడు, మీరు కోరినట్లయితే మనము అలాగే నిలబడియుండగా, మరియు మనము తలలు వంచి ప్రార్ధించుకొందుము.
మా పరలోకపు తండ్రీ, ఫినిక్స్ లోని కూడిక ద్వారా మాకు నిత్యత్వమునకు ఇటు ప్రక్క ఒక దగ్గర కూడుకొని ఆరాధించుటకు ఇది మాకు ఇవ్వబడిన మరొక ఘడియ కొరకై ఈరాత్రి మీకు వందనములు చెల్లించుచున్నాము. మరియు మేము ప్రార్ధించుచున్నాము, తండ్రీ, మీరు మాతో కూడా ఉందురు గాక, మరియు దేవుని నామ మహిమ కొరకు గొప్ప కార్యములు జరుగును గాక. దైవిక సన్నిధిలో ఇక్కడ కూడియున్న ప్రతియొక్కరిని ఆశీర్వదించుము. కూడికను, స్వస్థతను ఆశీర్వదించుము, మరియు గొప్ప యేసుని నామము మహిమపరచబడును గాక, ఓ దేవా, వెలపెట్టి కొనబడిన దేవుని యొక్క సంఘము ఇక ఏమాత్రము పాపము చేయకుండ పూర్తిగా రక్షింపబడేంత వరకు అది వ్యాప్తిచెందును గాక. దానిని దయచేయుము, తండ్రీ. మమ్ములను మరియు ఈ కూడికలో మిగిలిన భాగమును దీవించండి, మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమెన్.
6
మరలా ఈ రాత్రి నేను ఇక్కడ నిలబడి ఉన్న ఈ ప్రక్కన ఉన్న పరలోకము తప్ప నాకు వేరే ఏ స్థలము తెలియదు. రేపు రాత్రికి మిమ్మల్ని కలుసుకుని ఒక్క సంవత్సరం అవుతుంది. కాబట్టి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయాను; వారందరూ నేను స్పానిష్ సంఘమునకు వెళుతున్నాను, అని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. మరియు “మంచిది, వారు నన్ను స్వీకరించరు” అని నేను అనుకున్నాను. అయితే నేను హృదయ పూర్వకమైన ఆహ్వానం పొందియున్నప్పుడు, నేను మరల తిరిగి రావాలని అనుకున్నాను. కావున మూడు రాత్రులు ఇక్కడ మనము కూడికలను కలిగి ఉంటాము. ఆపై ఆదివారము, సన్నీ స్లోప్ లో ఉన్న మరొక సంఘములో ఉండుటకును అది అలాగే పిలవబడుచున్నది, అని నేను అనుకుంటున్నాను. మరియు ఆపై సోమవారం లేదా పదకొండు మరియు పన్నెండు తారీఖులలో మెక్సికోలోని టిజువానాలో ఉండబోతున్నాము.
నేను కేవలము ప్రతి ఒక్క దేశమును పిలుచుటకు ఎక్కువ సమయం కావాలని కోరుకుంటున్నాను. మరియు ఇది నాయొక్క సెలవు దినములుగా ఉండవలెను.... నేను గత వారం మయామీలో ఉన్నాను. వారు ఒక మంచి కూడికను మయామిలో కలిగియుండిరి. నేను ఎంతో అలిసిపోయాను ప్రత్యేకముగా గడిచిన రాత్రి కొన్ని వందల మంది ప్రజలు ప్రార్థన వరుస గుండా వచ్చారు. మయామిలో ప్రభువు మాకు గొప్ప పనిని ఇచ్చాడు. ఆ ...
7
ఆపై వారు నన్ను ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోమని చెప్పారు, ఎందుకంటే దానికోసం నిలబడటం చాల కష్టం. నేను ఇప్పుడు పెన్సకోలాలో, ఇరవై తొమ్మిదవ తేదీని మళ్లీ ప్రారంభించబోతున్నాను, మరియు ఐదు రాత్రులు అక్కడే ఉంటాను, అక్కడ వారు రెండు పెద్ద సర్కస్ టెంట్‌ని ఒక చోట కలిపి ఉంచుతారు, ఎందుకంటే ప్రజలను కూర్చోవడానికి ఆడిటోరియం లేదు. ఆపై అక్కడ నుండి, కాన్సాస్ నగరంలోని మున్సిపల్ ఆడిటోరియంకు నేను రెండు వేల మైళ్ళు లేదా అంతకంటే ఎక్కువ అని ఊహిస్తున్నాను, అక్కడికి వెళ్ళడానికి నాదగ్గర నాలుగు రోజులు ఉన్నాయి. ఆపై అక్కడ నుండి తోపెకా, మరియు తిరిగి - ఎల్గిన్, ఇల్లినాయిస్, ఆపై చికాగో, ఆపై వాషింగ్టన్, మరియు కెనడా వరకు. అప్పుడు మా -సేవలు నవంబర్ వరకు, ఐదవ తేదీ - అక్టోబర్ వరకు కొనసాగుతాయి. ఆపై అక్కడ నుండి, నాకు మూడు వారాలు సెలవులు లభిస్తాయి. ఆపై ప్రారంభించబోయే మా తదుపరి స్థానం దక్షిణాఫ్రికాలో. నేను అక్కడ నుండి ఆస్ట్రేలియా, మరియు వచ్చే ఏడాది వరకు అన్ని యూరోపియన్ దేశాలకు వెళ్తాను. మరియు నేను ఖచ్చితంగా...... [టేపు పై ఖాలీ స్థలము]
8
జీవితం అది మండుతుoడగా, మరియు మరొక సంవత్సరం గడిచిపోయింది, ఈ గత సంవత్సరంలో క్రీస్తు కోసం అనేక కార్యములు నెరవేరాయని చూసిన ఈ అదనపు(అధిక) సమయం కోసం నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ఇప్పుడు అనుకుంటున్నట్లుగా, మనం ఎప్పటికీ తెలియని ఒక సమయాన్నిఎదుర్కొంటున్నాము. ప్రతి చోటా దేశాలు విచ్ఛిన్నమవుతున్నాయి. వారు చాలా భయంకరమైన గందరగోళంలో ఉన్నారు. మరియు మనం నిజంగా ప్రేమించే, అధికారంతో వచ్చే యేసును చూసే వరకు అది ఎంతో కాలం ఉండదని, నేను నిజంగా నమ్ముతున్నాను. మరియు ఆయన కృప ద్వారా, ఆయన సహాయం ద్వారా నేను మునుపటి సంవత్సరంలో చేసినదానికంటే ఈ సంవత్సరం మరింత ఎక్కువ చేయడానికి ప్రయత్నించడమే నా సంకల్పం.
ఇక్కడి నుండి వెళ్లిపోయిన తరువాత, మరియు సంవత్సరం చివరిలోకి వస్తుండగా, కేవలం గత సంవత్సరంలో యేసు ద్వారా నా సేవల్లో దాదాపు ముప్పై ఐదు వేల మంది స్వస్థత పొందారు. అవి స్వస్థపరచబడ్డాము అని ఎవరైనా సాక్ష్యమిచ్చిన సంఖ్య మాత్రమే కాదు. అది డాక్టర్ ఇచ్చిన వాగ్మూలము. మరియు క్యాన్సర్‌తో బాధపడేవారు, చెవిటివారు, మూగవారు, అంధులు, అలా దాదాపు అన్ని రకాల వ్యాదులతో ఉన్న వందలాదిమంది ఎంత మంది వచ్చారో నాకు తెలియదు.
9
ఇప్పుడు, ఈ రాత్రి, మేము ఖచ్చితంగా అక్కడ పది గంటలకు కూడిక కలిగి ఉంటాము. రేపు రాత్రి ... ఈ రాత్రి కూడికకు రావాలని గుర్తుంచుకోండి. మరియు రేపు రాత్రి, మేము నేరుగా వెళ్తాము, వర్తమానములు కూడా ఉంటాయి. ప్రతి రోజు,... ప్రతిరోజు ఉదయం పది గంటలకు, బ్రదర్ గార్సియా ...? ... ఇక్కడ స్పానిష్ ప్రజలకు స్వస్థత గురించిన సూచనలు ఇస్తారు. మరియు క్రీస్తుకు మీ హృదయాలు ఇచ్చే క్రమములో: ...? ... స్పానిష్ అర్థం చేసుకోగల ప్రజలందరూ, ఆ కూడికల కోసం రండి. బహుశా నేను ఇక్కడ ఈరాత్రి కూడికలకు రావచ్చు ...? ...
ఈ సమయంలో, నేను నా అతిథిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయన దైవ స్వస్థతపై అత్యంత బైబిలు అధికారులలో ఒకరు. చాలా సంవత్సరాలు అమెరికాలో ఉన్నారు. నేను అక్కడ పెంచబడ్డాను, అని మీలో చాలా మందికి తెలుసు...? ... మరియు అదే దీనిని అంతటిని జరిగించెను...? ... మరియు నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, ఆయన పుస్తకం చదివినప్పుడు, నేను ఆయనను కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. సంవత్సరాల క్రితం ఆయన స్వర్గ వాసులు అయ్యారని నేను విన్నాను. కానీ మరొక రోజు మయామిలో, నేను ఈ ప్రియమైన సోదరి మరియు సోదరుడిని కలిశాను. మరియు వారు నా కూడికలలో సమావేశమయ్యారు. ఆపై నా ఇతర స్నేహితులతో ఉండటానికి, లేదా అక్కడ వారిని కలిసే అవకాశాన్ని పొందుకున్నాను...? .... మరియు అతను గత ఆదివారం నన్నుకలుసుకున్నాడు.
10
మీలో చాలామందికి ఆయన తెలుసు. అతను ఇక్కడకు వచ్చి ప్రజలకు “హలో(నమస్తే)” అని చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అతను స్పానిష్‌లో మాట్లాడలేడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, కాబట్టి అతను దానిని ఆంగ్లంలో కూడా చెప్పవలసి ఉంటుంది. మరియు ఆయనే డాక్టర్ ఎఫ్. ఎఫ్. బోస్‌వర్త్. డాక్టర్ ఎఫ్. ఎఫ్. బోస్‌వర్త్ గురించి ఇక్కడ ఎంతమంది విన్నారు? సరే, అయ్యా, సహోదరుడా బోస్వర్త్, రండి.
[బ్రదర్ బోస్‌వర్త్ మా ట్లాడుతున్నారు]
ధన్యవాదాలు, సహోదరుడా బోస్‌వర్త్. ఒక మంచి ప్రమాణము (అధికారము) ఉన్న సహోదరుడు బోస్‌వర్త్ ఆ మాటలు చెప్పడం నాకు చాలా మంచి అనుభూతిని కలిగిస్తుంది.... నేను పుట్టకముందే ఆయన దైవిక స్వస్థతపై బోధించాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి అది ఒక అధికారం, అవునా?
11
కాబట్టి, ఈ రాత్రి ప్రార్ధన కోసం ఇక్కడ కొంతమంది ఉన్నారని నేను ఊహిస్తున్నాను. ఇక్కడ ఎంతమందికి ఇంగ్లీష్ అర్థమవుతుందో - మీ చేయి పైకెత్తి, “నేను ఇక్కడ ప్రార్థన కోసం వచ్చాను” అని చెప్పవచ్చు. మీ చేతులను చూద్దాం, వీరి కోసం ప్రార్థించాలి. మంచిది, చాలా తక్కువ మంది ఉన్నారు. మరియు వాస్తవానికి ఇక్కడ... ఇంగ్లీష్ అర్థం కాని వారు కొంతమంది ఉన్నారు.
ఈ రాత్రి ఇక్కడ ఉన్న చిన్న గాయక బృందంలో కొంతమందిని చూడటం నాకు సంతోషంగా ఉంది. రేపు రాత్రి నేను కొంచెం తొందరగా వస్తే, నా కోసం “కేవలం నమ్ముము” అనే పాట మీరు పాడుతారా అని నేను ఆశ్చర్యపోతున్నాను. మీకు ఇంగ్లీష్ అర్థమవుతుంది, అవునా? ఫరవాలేదు. ఫరవాలేదు. నేను మీ చిత్రాలను పొందాను -నా అధ్యయనంలో వాటిని కలిగి ఉన్నాను. మరియు నేను దానిని ఎప్పుడూ చూడను, కానీ యవ్వన స్త్రీని దీవించమని నేను దేవుడిని ప్రార్థిస్తాను. ఆమె చాలా మంచిగా ఉన్నది. అక్కడ ఉన్న ఒక చిన్న యువకుడు, అతను బాస్(పాటలో ఒక రకమైన శృతిలో) పాడాడు, పాడటం గురించి నాకు ఏమీ తెలియదు, కాని ఇక్కడ ఉంది అని నేను నమ్ముతున్నాను.
కాబట్టి ప్రతిసారి నేను ఆ స్పానిష్ పదం, “ఓహ్, అవును,” లేదా... “ఓయ్, ఓయ్” ఎదో అలాంటి పదం అని అనుకుంటున్నాను, అది అంతేనా? నేనెప్పుడు ఒక మాట కూడా వినలేదు .....వినండి, అలాంటిది...? ... మీరందరూ నాపై నవ్వారు. నేను దానిని ఖచ్చితంగా కూనీ చేశాను అని నాకు తెలుసు.
ఆపై నేను, అక్కడ ఒక చెవిటి మహిళ ఉంది అని చెప్పాను. మరియు ఆ కంపనం ఆమె చేయి వదిలి వెళ్ళడం నేను అనుభవించాను, ఆమె స్వస్థత పొందినది అని నాకు తెలుసు. కానీ నేను ఆమెకు అర్థం అయ్యేలా చేయలేకపోయాను. ఆమె నన్ను చూసి నవ్వుతోంది. మరియు నేను, “మీరు? నా మాట వింటున్నారా?” అని అడుగుతూనే ఉన్నాను.
మరియు చిన్న సహోదరుడు, “ఆమెకు, 'ఓయ్” అని చెప్పుoడి“ అని చెప్పాడు
మరియు నేను, “ఓహ్, అవును,” లేదా అలాంటిదే అన్నాను.
మరియు స్త్రీ, ఆ యవ్వన స్త్రీ నవ్వింది. మరియు నేను ... సరే, ఎలాగైనా, ఆమె విన్నది, అవునా? అది బాగానే ఉంది. అలా ఆమె స్వస్థత పొందింది .
నేను వచ్చేవారం, “ఓయ్” మరియు “ఫీనిక్స్” అనే రెండు పదాలు తెలుసుకుని మెక్సికోకు వెళ్తున్నాను. ఎలాగైనా, మేము దేవుడు తెలిసిన వ్యక్తులను సందర్శించబోతున్నాం.
ఇప్పుడు, ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తులకు మరియు చుట్టుపక్కల వారందరికీ కొంత సమయం, వాక్యమును చదువుతున్నాను, నేను మీతో కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడాలనుకుంటున్నాను. దేవుని వాక్యం వినడం మరియు వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది అని నేను అనుకుంటున్నాను. అది సరియైనదేనా?... వాక్యం ఏమనగా.....మీ యొక్క విశ్వాసాన్ని నిర్దిష్టమైన దాని పైన ఆధారం చేసుకుని ఉండుటయే.
12
కొద్ది కాలం క్రితం, నేను ఒక స్ట్రెయిట్ జాకెట్టు (మానసిక రోగులకు కాళ్ళు చేతులు కట్టి పెట్టి ఉంచే దుస్తులు) వంటిది ధరించిన చాలా భయంకరమైన దెయ్యాని ఎదుర్కొన్నాను, అది నన్ను నిందించి మరియు నాపై ఉమ్మివేసి, కొరకడానికి ప్రయత్నించింది. నేను ఆ దెయ్యాన్ని కలవడానికి వెళ్ళినప్పుడు, ఆ వ్యక్తిని ఆ దెయ్యాన్ని నుండి విడిపించడానికి క్రీస్తు మరణించాడు అన్న ఆ ఒక్క విషయం నాకు తెలుసు. అదే వాక్యము. ఆ రాత్రి దేవదూత నా దగ్గరకు వచ్చి మాట్లాడాడని నాకు తెలుసు, నేను ప్రార్థించినప్పుడు నిజాయితీతో ఉండి ప్రజలు నన్ను నమ్మేలా చేయగలిగితే ప్రార్థన ముందు ఏదీ నిలబడదని నాతో చెప్పాడు. అందువల్ల, నా వద్ద రెండింతలు సాక్ష్యం ఉంది. ఆ వ్యక్తినుండి బయటకు రమ్మని నేను యేసుక్రీస్తు నామములో అతడిని అడగగలను. మరియు ఆ వ్యక్తి తన స్ట్రెయిట్ జాకెట్ నుండి తీసివేయబడ్డాడు. మరియు అతని సరైన మానసిక స్థితిలో సాధారణంగా ఇంటికి వెళ్లాడు.
ఎందుకు? ఎందుకంటే యేసు క్రీస్తు నామము యొక్క అధికారం. ఓహ్, మై నరకంలోని ప్రతి దెయ్యం ఆ నామమునకు లోబడి ఉంటుంది. అది సరైనది. ఇది అన్ని నామముల కన్నా పై నామము, యేసు నామము. ఇది మానవ పెదవుల ద్వారా ఇవ్వబడలేదు. పరిశుద్ధాత్మ, గొప్ప గాబ్రియేలు, దిగివచ్చి తన పేరును యేసు అని పిలవమని మరియకు చెప్పాడు.
13
మరియు మొట్టమొదటిసారిగా ఆ పేరు మర్త్య పెదవులతో చెప్పబడింది, ఒక మర్త్యుడి చెవుల్లోకి వెళ్లింది, తల్లి గర్భములో చనిపోయిన శిశువు సంతోషంతో గంతులు వేసాడు ...? ... అతనే బాప్తీస్మమిచ్చు యోహాను. అది సరియైనదేనా? అది ఆరు నెలలు జీవం లేకుండా ఉండి, జీవాన్ని పొందింది. ఇదిగో నీ శుభవచనము నాచెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను.
మరియు అది చనిపోయిన వ్యక్తిని సంతోషంతో గంతులు వేసేలా చేస్తే, అప్పటికే సజీవంగా ఉన్న వ్యక్తికి అది ఏమి చేయాలి. అది సరియైనదేనా?
ఇప్పుడు, కొన్నింటిని వివరించడానికి అపోస్తులుడైన యోహాను సువార్త, 4 వ అధ్యాయం మరియు 46వ వచనముతో ప్రారంభించుకుందాం. ఇప్పుడు, ఎవరూ తొందరపడాలని నేను కోరుకోను. ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా, అలాగే మౌనముగా మరియు ప్రశాంతంగా ఉండండి.
ఇప్పుడు, ఈ బహుమతిపై చాలా కార్యాలు పెరిగాయి, మరియు నేను పోయినసారి ఇక్కడ ఉన్నప్పుడు నాకు తెలియని అనేక విషయాలు గత సంవత్సరంలో నేను నేర్చుకున్నాను... మరియు వాస్తవానికి, మనం వెళ్లే కొద్దీ, అది కేవలం కొనసాగుతూ ఉంటుందని నేను నమ్ముతున్నాను. నేను ఆ విధంగా విశ్వసిస్తున్నాను. ఎలాగైనా, ఆయన చేస్తాడని నేను నమ్ముతున్నాను. మరియు ఇప్పుడు, మీరు దగ్గరకు వచ్చినప్పుడు, ఎన్నటికీ... ఎప్పుడూ తొందరపడకండి ...? ... [ఖాళీ. Spot.on.tape]
14
నేను దానిని తీసుకువచ్చి ఇవ్వాలంటే,... నేను అక్కడికి విమానంపై వెళ్లి వెనక్కిరావలసియున్నది. వాస్తవానికి, నేను అలా చేయలేను. కాబట్టి నేను ... వారు అక్కడ కార్యదర్శికి ఒక మాట చెప్పారు. వారు ఉత్తరాలకు సమాధానమిస్తారని నేను అనుకోవడంలేదు. కాబట్టి కార్యదర్శి అతనికి రుమాలు, లేదా, చిన్న రిబ్బన్ ముక్క, పంపాడు. మేము వారానికి అనేక వేలకొలది ముక్కలను, మరియు దానితో ఏమి చేయాలో సూచనలు పంపిస్తాము.
మరియు వారు దానిని ఆ బిడ్డపై ఉంచారు. ఆర్మీ వైద్యుడు కూడా అది మళ్లీ మామూలుగా ఉండదని చెప్పాడు. బిడ్డపై రుమాలు పెట్టిన నాలుగు గంటల్లో, ఆ బిడ్డ మళ్లీ సాధారణముగా ఉంది. చూశారా? ఓహ్, దేవుడు అన్నీ చేయగలడు.
నేను సాయంత్రం వెళ్లిన తర్వాత నిన్న రాత్రి మాట్లాడుతున్నాను ......? ... [టేపు పై ఖాలీ స్థలము]
పేరు ఏమిటి? ఇది వారి చిన్న వార్తాపత్రికలలో ఒకటి, “చనిపోయిన మాదిరిగా ఉన్న ఒక వ్యక్తి, ప్రార్థన ద్వారా లేపబడుట” అని ముద్రించబడిఉంది. మరియు నేను ఆమెకు రుమాలు లేదా రిబ్బన్ పంపాను, ఆమె క్యాన్సర్ చివరి దశలో ఉంది. మరియు మూడు వారాల తరువాత, ఆమె డాక్టర్ ఆమె బాగయిందని చెప్పాడు. ఆమె సంపూర్ణంగా బాగుంది. మరియు అది సేవ గురించి మొత్తం తెలియజేసింది. అది అంతటా వ్యాపించింది. మరియు ఈ రుమాలు కోసం ఆ దేశంలోని కొన్నిప్రాంతాల నుండి అక్షరాలా వందల మరియు వందలాది ఉత్తరాలు కుప్పలుగా వచ్చాయి.
15
ఇప్పుడు, వచ్చే నవంబర్ ప్రాoరంభంలో [టేపు పై ఖాలీ స్థలము]చిత్తమైతే [టేపు పై ఖాలీ స్థలము], ఉత్తర అమెరికా ఖండం నుండి దక్షిణాఫ్రికా వరకు, ఆస్ట్రేలియా నుండి, మరియు అక్కడ కింద వరకు, విదేశీ సువార్త పరిచర్య కార్య్యక్రమాలలో. మీరు నా కోసం ప్రార్థిస్తారు, అవునా?
ఇప్పుడు, మరియు ఎప్పుడైనా నేను మీ కోసం ఏదైనా చేయగలిగితే, నేను చేస్తాను....
ఇప్పుడు, నాకు ఉత్తరాలు, వ్యక్తిగతంగా వచ్చేఉత్తరాలు, నేను వ్యక్తిగత ఉత్తరాలకు ఎందుకు సమాధానం ఇవ్వడంలేదో మీకు అర్థమైంది అనుకుంట. అవి వచ్చాయి. రోజుకు వందలు మరియు వందలు వస్తాయి. కాబట్టి నేను వారికి వ్యక్తిగతంగా సమాధానం ఇవ్వలేకపోయాను. కానీ వారు హాజరవుతారు.
16
ఇప్పుడు, ఈ రుమాలు గుర్తుంచుకోండి, మీరు వాటి గురించి ఆశ్చర్యపోయారు. “ఇప్పుడు, సహోదరుడా బ్రాన్హాం, వాటి సంగతేమిటి?” మీ లేఖ ఒక ఉత్తరము రూపమున ఉన్న కాగితము కావచ్చు. మీ లేఖకు మీ సమాధానం కార్యదర్శి నుండి వచ్చి ఉండచ్చు, కానీ మీ రిబ్బన్ వ్యక్తిగతంగా నా ద్వారా ప్రార్థించబడింది. ఇప్పుడు, మీరు గమనిస్తే, చాలా మంది వ్యక్తులు ఉత్తరాన్ని అభిషేకిస్తారు-రుమాలును అభిషేకిస్తారు. కానీ మీరు బైబిల్‌ని పరిశీలిస్తే, అవి అభిషేకం చేయబడలేదు, ఆ రుమాలు లేదా ఉపవస్త్రం పౌలు శరీరం నుండి తీసుకోబడ్డాయి (అది సరైనదేనా?).
ఇప్పుడు, అది ఏమిటి, ఒక ఆశీర్వాదం. ఏలియా మాదిరిగానే. అతను తన సిబ్బందిని తీసుకొని గెహాజీతో, “వెళ్ళు, పిల్లల మీద దానిని ఉంచు” అని చెప్పాడు. అతను తాకినది ఆశీర్వదించబడిందని అతనికి తెలుసు.
మీరు, “సరే, సహోదరుడా బ్రాన్హాం, మీరు ఎప్పుడైనా అలా చేస్తారా?” అని అడగవచ్చు
సరే, నేను కూడికలలో ఉన్నప్పుడు, నేను కిందకు వెళ్తాను, మరియు వారు నాకు అర అంగుళం తెల్లని రిబ్బన్ వందల గజాలు పంపుతారు. మరియు నేను వాటిని తీసుకొని నేను ఒక్కడినే పగటిపూట వెళ్ళి, వాటిలో ప్రతి ఒక్కటి నా చేతుల్లోకి తీసుకొని దేవుడు వ్యక్తిని స్వస్థపరచాలని వాటి కోసం ప్రార్థిస్తాను. ఆపై వాటిని తిరిగి కార్యదర్శికి మరియు వివిధ కార్యాలయాలకు పంపడము, మరియు వారు వెంటనే వాటిని బయట జబ్బుపడినవారికి పంపుతారు. లేక ఒక ఉత్తరము రూపమున ఉన్న కాగితము, కానీ - రిబ్బన్ వ్యక్తిగతంగా ప్రార్థించబడింది, నేను ప్రార్ధించడానికి తెలిసిన నిజాయితీ అంతటితో ప్రార్థిస్తున్నాను. నేను అనుకుంటున్నాను, “ఒకవేళ నా బిడ్డ అనారోగ్యంతో ఉంటే మరియు దాని కొరకు ప్రార్థన చేయడానికి నేను ఒక వ్యక్తి కోసం పంపినట్లయితే, అతను అలా చేయాలని నేను ఆశిస్తాను.” మీరు చేస్తారు కదా? మరియు...? ... నేను చేయగలిగినంత వరకు ప్రయత్నిస్తాను. అలాగే, ఈ రాత్రి సమయములో మీ ప్రార్థనలు కూడా దాని వలే ఉన్నవి.
17
ఇప్పుడు, నాకు తెలిసినంతవరకు, ఈ బలిపీటము దాటిన ఒక వ్యక్తి గురించి మాత్రమే, నాకు తెలుసు మరియు అతను... వారి వద్ద ఉన్న వాటి నుండి సంపూర్ణంగా విడిపింపబడ్డారని నాకు ఖచ్చితంగా తెలియదు, అని అన్నాడు. మరియు అతడు మూర్ఛరోగంతో బాధపడుతున్న యువకుడు. అతను బలిపీటము మీదుగా వెళ్ళాడు, ఆత్మ అతన్నివిడిచిపెట్టింది, తిరిగి అతనిపైకి వచ్చింది. అది అతడిని మళ్లీ వదిలేసింది; అది తిరిగివస్తుంది. సరే, నేను - మూడవసారి కూడా నేను ప్రయత్నించాను. ఆ అబ్బాయి ప్రకాశింపబడి. అతను నవ్వేవాడు. అతను చుట్టూ చూసేవాడు. కొన్ని క్షణాల్లో, నేను అతనిపై దానిని చూసేవాడిని.
ఇప్పుడు, మిత్రులారా, మీకు తెలిసి ఉండవచ్చు. ఇప్పుడు, జాగ్రత్తగా వినండి. నేను నేరుగా దానిలోకి వెళ్తున్నాను.....
18
[టేపు పై ఖాలీ స్థలము] ...? ... దేవుని మహిమ కొరకు గృహము ఇవ్వబడింది. ఇప్పుడు, నేను చెప్పినట్లుగా, బహుశా కొంత సమయం ఇది మనం కలుసుకునే చివరి రాత్రి అయ్యి ఉన్నది గనుక, నేను ఈ ప్రకటన చేయడం మీరు విన్నారు, దేని యొద్ద నుండి అయిననూ... అతను అక్కడే ఉండి ఉంటే నేను చేయనిది ఏదైనా మిగిలినట్టు నాకు కనిపించలేదు, నాకు ఆ వ్యక్తి చనిపోబోతున్నాడు అని తెలిస్తే, నేను దానిని బయలుపరుస్తాను.
కానీ మీకు తెలుసా, దానితో మీరు ఇబ్బందుల్లో పడతారు? మోషే చేశాడని మీకు తెలుసా? మోషేకు బండను కొట్టే శక్తి ఉంది, రెండవసారి కూడా, కాని అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంది. మరియు అతను దేవుని మొత్తం కార్యక్రమాన్ని కూడా ఉల్లంఘించాడు. అది సరియైనదేనా? కానీ అది చేయడానికి దేవుని ముందు అతనికి అధికారం ఉంది. అతను మొదట బండను కొట్టాడు, నీరు రాలేదు, మరియు అతను దానిని మళ్లీ కొట్టి నీటిని పిలిచాడు.
మరియు - మరియు (అతనికి అధికారము లేదని)...? ... నేను ఎన్నడూ అనుకోలేదు ... మనలో చాలా మందికి అది దేవుని చిత్తం కాదని తెలుసు. కానీ ప్రవక్తకు అది చేయగల శక్తి ఉంది. కానీ అది అతనిని ఇశ్రాయేలీయులతో కలిసి వాగ్దాన భూమిలోకి వెళ్ళకుండా చేసింది. చూశారా?
19
ఇప్పుడు, చాలాసార్లు ఈ కార్యాలు వదిలింపబడి మరియు అవి తిరిగి వచ్చినట్లు అనిపించినప్పుడు, నేను - నేను వాటిని ఒంటరిగా వదిలేస్తాను, ఎందుకంటే నేను భయపడ్డాను. చూడండి ... ఒకానొక కూడికలో, నేను వాంకోవర్‌లో అని అనుకుంటున్నాను, ఒక గ్రుడ్డితనంతో ఉన్న మహిళ, ఆమె జర్మన్ మహిళ, సంవత్సరాలుగా గ్రుడ్డితనంతో ఉంది. గుడ్డి ఆత్మ ఆమె నుండి దూరంగా పోయిన వెంటనే, అక్కడ నిలబడి ఉన్న ఆమె కుమార్తెకు చూపిస్తూ జర్మన్ భాషలో మాట్లాడటం ప్రారంభించింది. వారంతా అరిచి ఏడుస్తున్నారు. ఆమె వెళ్ళిపోవడానికి తల తిప్పింది; అది ఆమె పైకి తిరిగి వెళ్లింది. ఆమె నా వద్దకు తిరిగి వచ్చింది, అది మళ్లీ వదిలింపబడింది, మరియు అది విడిచి పోయింది ... మరియు ఆమె మళ్లీ చూడగలదు. ఆమె చాలా ఉప్పొంగిపోయింది. ఆమె వెళ్లినప్పుడు, అది మళ్లీ తిరిగి వస్తుంది.[టేప్ మీద కాలిగా వున్నది]
ఆ వ్యక్తులు విభిన్న సిద్ధాంతాలతో వచ్చారు, [టేపు పై ఖాలీ స్థలము] ... కానీ ఏక మనస్సుతో మరియు ఏక హృదయముతో. ప్రతి మనిషి మిమ్మల్ని శుభాకాంక్షలు చెప్పనివ్వండి. మీరు ఉన్నంత వరకు ...? ... ఒకే ఆత్మ ద్వారా మరియు శరీరంలోని భాగమవ్వుట ద్వారా.
ఇప్పుడు, ఒక కాన్సర్ వ్యాధితో కాని లేదా ఒక పెద్దపుండు కాని ఉన్నట్లయితే నా శరీరము ఏ మాత్రము పనిచేయదు. ఒకవేళ నేను ఎక్కడైనను నిరాశగా ఉన్నట్లయితే నా శరీరమంతా చీల్చబడును. అదే ఆ రీతిగానే ఉన్నది....ప్రతీ సమయములోను...
20
ఇప్పుడు, సంఘముల యొక్క సమాఖ్య రాబోతుంది. ఇది ఇప్పటికే జాతీయమైనది. మీకు తెలుసా, మీరు ...? ... మరియు వారు సమకూడి ఐక్యపడుచున్నాయి. మరియు ప్రపంచంలో రెండు గొప్ప శక్తులు కదులుతున్నాయి. చెప్పకుండానే అవి ఏమిటో మీకు తెలుసు. ఒకటి శక్తి కలయిక అయి ఉంది, మరొకటి కాథలిక్కులు మరియు కమ్యూనిస్టు సిద్ధాంతం కలిసి వస్తాయి. ఒకటి క్రీస్తుకు వ్యతిరేకంగా, మరొకటి, కాథలిక్ సంఘం. ఆ రెండు శక్తులు కలిసి వస్తున్నాయి. ఇది ... ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఒకరు లేదా మరొకరి పక్షం వహించడానికి బాధ్యత వహిస్తారు.
అప్పుడే చిన్నపవిత్ర పరిశుద్ధాత్మ యొక్క సంఘం కలిసి వస్తుంది. అప్పుడే ... [టేపు పై ఖాలీ స్థలము] ... చాలా కాలంగా బహిరంగ భవనంలో. మరియు దేవుడు ఈ రోజుల్లో దానిని బహిరంగ భవనంలో వేలాడదీస్తాడని నేను నమ్ముతున్నాను. హింసలు ...
21
ఇప్పుడు, ఇది మార్గదర్శకత్వం. [టేపు పై ఖాలీ స్థలము]
ఇక్కడ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను. ఈ ఉదయం నేను అతనితో మాట్లాడాను, ఒక సేవకుడు, సంఘముల యొక్క మరొక సంస్థకు చెందినవాడు. అతను ఇక్కడకు వచ్చాడు, మరియు అతను వేదిక మీద నిలబడ్డాడు. నిన్న రాత్రి మా కూడికలో పరిశుద్దాత్మ ఎలా వాలిందో మీకు తెలుసు. అతను ఇక్కడ ఉన్నాడు, అతను, “సహోదరుడా, ”నేను వారందరితో సంతోషించాను“ అని అన్నాడు. ఇప్పుడు, దీన్ని చేయడానికి అదే మార్గం. ఇది ఇంకేదో చేసింది; అది అప్పుడు చెప్పబడింది. కొద్ది క్షణాల్లో, అతను సేవకుడిగా ఉన్నందున అది బాధాకరమైన ప్రదేశం కావచ్చు. అతను శరీరంలో ఉన్నాడు. చూశారా? అతను శరీరంలో ఒక బాధాకరమైన ప్రదేశంలో ఉండచ్చు. కానీ దానికి బదులుగా, అతను దానితో తన ఆత్మను ఇచ్చాడు. మరియు పవిత్ర ...
ఇప్పుడు, ఇలాంటి వ్యక్తుల గుంపులో ఇది ఇలా పని చేస్తే, అది దేవుని సంఘములో ఏమి చేస్తుంది. చూశారా? సరే, వారందరూ కలిస్తే, ఏమి జరుగుతుందో చెప్పడం కష్టం. అది సరియైనదేనా? అందరూ ఒకే చోట ఏక మనస్సుతో ఉన్నప్పుడు, ఒక బలమైన గాలి వలే పరలోకములో ప్రారంభమయ్యాయి, అది వారు ఉన్న ఇంటి మొత్తాన్ని నింపింది.
22
సహోదరి గార్సియా, ఇప్పుడు మీరు... అంతా సిద్ధంగా ఉన్నారా? నాకు తెలుసు మీ అందరికీ ... [టేపు పై ఖాలీ స్థలము]
కొండకు అవతలి వైపు ఉన్నప్పుడు. నేను ఆ పొద కింద నిలబడి మీరు మాట్లాడేది వింటున్నాను. కాబట్టి నేను కోరుకుంటున్నాను ... కాబట్టి మీరు అక్కడికి చేరుకున్నప్పుడు నా కోసం వెతకండి.
అది మంచిదే. మీరు దీన్ని ఇష్టపడుతున్నారా? మంచిది. ఓహ్, మై. మేము ఇప్పుడు దాని పొందుపరిచాము, మరియు మేము ... సోదరుడు దానిని తీసుకురాబోతున్నాడు ... [టేపు పై ఖాలీ స్థలము]
23
[టేప్ యొక్క ఈ భాగం, ఇక్కడ లిప్యంతరీకరించబడింది, ఇది గుర్తించబడని సందేశం నుండి వచ్చింది.]
ఇది దేవుని వాక్యమని ఎంతమంది నమ్ముతున్నారు? మనమందరం నమ్ముతున్నాం, అవునా? అయితే సరే. మీరు ఇప్పుడు బైబిలును కలిగి ఉన్నవారు, నాతో కలిసి పరిశుద్ధ లూకా 5 వ అధ్యాయం తెరవండి. ఇక్కడ అందరికీ తెలిసిన అధ్యాయము మనము ప్రార్థనలోకి వెళ్లే ముందు కొన్ని క్షణాల పాటు దాని గురించి చదివి మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు, మేము వాక్యాన్ని చదువుతుండగా జాగ్రత్తగా వినండి.
జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సుతీరమున నిలిచి,
ఆ సరస్సు తీరముననున్న రెండు దోనెలను చూచెను; జాలరులు వాటిలోనుండి దిగి తమ వలలు కడుగుచుండిరి.
ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె ఎక్కి- దరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను.
ఆయన బోధించుట చాలించిన తరువాత-నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా
సీమోను -ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాటచొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను.
వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా
వారు వేరొక దోనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి.
24
మనము కొద్ది నిమిషములు ప్రార్ధనకై మన తలలను వంచుదామా. మా పరలోకపు తండ్రి, నీ నామము బట్టి పిలువబడు దేవుని గృహము అని పిలచునట్టి ఈ గృహములో మేము ఉండుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి ఈ రాత్రి మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ఇది సరిదిద్దు గృహము, పవిత్ర స్థలము, మేము ఆరోపణ చేయబడిన స్థలము, మరియు మా నేరారోపణల గురించి వాదించు స్థలము అని మేము ఎరిగియున్నాము. ఇప్పుడు, మేము ప్రార్దించుచున్నాము, తండ్రీ, మేము చేసిన ప్రతియొక్క పాపము మరియు ప్రతియొక్క అతిక్రమమును మన్నించమని....