పెద్దలను నియమించుట

పెద్దలను నియమించుట

VGR COUNT -43...మరియు అది, మొదటిగా సంఘములో కొంత మంది పెద్దలను నియమించవలెను. మరియు ఇక్కడ మన యొక్క చిన్న సంఘము శ్రేష్టమైనది. దాని సంఘ పెద్దలను పంపుటకై ఇది ఎటువంటి సంఘ శాఖను లేదా మరి దేనిని కలిగి లేదు. ఇది (ఈ సంఘము) దీని యొక్క సొంత పెద్దలను ఎన్నుకొనును. ఇది దీని యొక్క సంఘ కాపరిని ఎన్నుకొనును, ఇది దీని యొక్క ధర్మకర్తలను ఎన్నుకొనును, ఇది సంఘములోనికి వచ్చు దానిని మరియు బయటకు పోవు దానిని సమస్తమును ఎన్నుకొనును. ఎదో ఒక వ్యక్తి ప్రతి దానిపై అధికారము చెలాయించి, చెప్పుట అనేది లేదు; అది సంఘమే చేయును. మరియు ఎవరైతే వచ్చి వారి యొక్క సన్నిధితో, వారి యొక్క దశమ భాగము మరియు కానుకలతో సంఘమునకు సహాయముగా ఉండెదరో, వారే సంఘమై యుందురు, అటువంటి దాని మీద ఎల్లప్పుడు వారు చట్టబద్దమైన అధికారము కలిగియుందురు.

మరియు నేను మునుపటి పెద్దల సముదాయమునకు ధన్యవాదములు తెలియజేయగోరుచున్నాను. సంఘమంతటి కొరకు ఇక్కడ నుండి దీనిని నేను చెప్పుచున్నాను. సహోదరుడు కాక్స్, సహోదరుడు ప్లేమేన్, సహోదరుడు హిగ్గిన్ భోతమ్ మరియు సహోదరుడు డీట్స్మాన్ అనే ఆ సహోదరులలో ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే; ఈ గుడారములో (టేబర్నికల్) వారు మాకు, ప్రభువునకు మంచి సేవను చేసియున్నారు.

2

మరియు తరచుగా, సంఘము యొక్క నియమ నిబంధనల ప్రకారముగా, ప్రతీ సంవత్సరము, పెద్దలు లేదా ధర్మకర్తలు వారి సమయమును సంపూర్తి చేయుదురు. మరియు వారు తిరిగి రావలెననుకున్న యెడల, అది మంచిదే. వారు తిరిగి రావలెననుకొనకపోయినట్లయితే, ఈ రాజీనామా చేసిన సమూహము యొక్క స్థానములో వేరొకరిని వారు నియమించెదరు.

మరియు నిన్నటి రాత్రి నేను ధర్మకర్తల సమూహమును పిలిచితిని, నూతన ధర్మకర్తల సమూహము అక్కడ యున్నది. ఇక్కడ ఈ రాత్రి నేను సహోదరుడు లూధర్ మెక్డోవెల్ను గమనించినంత వరకు, ఇంతకు మునుపు ధర్మకర్తల సమూహమునందు యున్న ఆయనను ఈ లోపట చూచుటను బట్టి మేము ఆనందించుచున్నాము. ఈ వారములో దానిని కనుగొనుటకు, మరియు తయారు చేయబడిన నకలు యొక్క కాపీని తెరచి చూచుటకు, నేను క్రిందికి వెళ్ళితిని, అది సంఘమునకు కూడా చూపించబడును (ప్రదర్శించబడును). ఇప్పుడు సంఘము యొక్క ధర్మకర్తలు, సహోదరుడు విలియం మోర్గాన్, సహోదరుడు మైక్ ఈగన్, సహోదరుడు బ్యాంక్స్ వుడ్ మరియు సహోదరుడు రోయ్ రోబర్సన్ మరియు రెండు పట్టణముల మధ్య జీవించుచున్న సహోదరుడు రోబర్సన్ తప్ప మిగిలిన వారందరు ఈ పట్టణమునకు చెందినవారే. ఆ మనుష్యులలో ఉన్న అర్హతను ప్రభువు చూచెను, మరియు వారు గౌరవింపదగిన మనుష్యులు, మరియు ఇప్పుడు వారు, ఈ సంఘము యొక్క ధర్మకర్తల పనిని పొందుకొనియున్నారు.

3

మరియు ఈ కూటము జరుగుచూ ఉన్నప్పుడు, మరియు సహాయ సంఘకాపరి ద్వారా చెప్పబడినదేమనగా, మనము... నూతన పెద్దల సమూహమును ఎన్నుకొనుచున్నాము, ఏలయనగా వారు సేవ చేసిన సమయము ముగిసిపోయినది - రాజీనామా చేసిరి. మరియు ఇంకొంత మంది పెద్దలను ఎన్నుకొనవలసియున్నది. ఇప్పుడు, సంఘము. ఇది ఏ విధముగా జరిగినదనగా బోర్డు వారు, (వారిలో), సహవాసము కలిగియుండి మరియు నీతిమంతులుగా, గౌరవింపదగిన వారిగా, కనుగొనబడిన వారిని (ఆ మనుష్యులను) పెద్దలుగా నియమించ వచ్చును.

పెద్ద యొక్క కార్యాలయము చాలా గొప్ప కార్యాలయమైయున్నది, మరియు సంఘములో ఒక పెద్దగా యుండుట ప్రభువునకు ఒక గొప్ప గౌరవమిచ్చుటైయున్నది. కాబట్టి గత రాత్రి కూటములో, ఒకానొక వ్యక్తి నా యొద్దకు పిలువబడెను. మరియు గత శుక్రవారము సంఘ కాపరితో కలసినప్పుడు, వీరు గౌరవింపదగిన మరియు నీతిమంతులైన పురుషులు అని ఆ వ్యక్తి చేత అంగీకరించబడెను.

4

వారు కనుగొనిన ఆ యవ్వనస్తుడు, కచ్చితమైన అర్హతను కలిగిలేడు (అతడు సరైన రకపు వ్యక్తి కాదు అని కాదు), ఇతడు మన యొక్క ధర్మకర్తల సమూహములో ఒక గౌరవనీయుడైన వ్యక్తి చేత సిఫారసు చేయబడినవాడు. అయితే నేను మరియు సంఘకాపరి కలసినప్పుడు, నేను ఆ యవ్వనస్తుని యొక్క వయస్సు అడిగితిని. అతడు తన యొక్క ఇరువై ఏళ్ళ ప్రాయములో ఉన్నాడు; గౌరవనీయుడు, నీతిమంతుడు మరియు నిజాయితీ గల వ్యక్తి అయితే అతడు ఒంటరిగా (పెండ్లి కాని వాడిగా) యున్నాడని కనుగొనబడినది. పరిశుద్ధ గ్రంథము పెళ్ళి అయిన వ్యక్తి పెద్దగా ఉండవలెనని చెప్పుచున్నది. అతడు తప్పనిసరిగా ఒక్క భార్యకు భర్త (ఏకపత్ని పురుషుడై) యుండవలెను.

మరియు తరువాత, ఇంకొక వ్యక్తి చాలా గౌరవనీయుడైన వ్యక్తి, ఆ పని కొరకు సరైన అర్హత కలిగినవాడు మరియు సద్భక్తిగల మనిషి ఇతడిని ఒక సహోదరుడు సిఫారసు చేసెను. దీనిని (కేసును) పరిశోధించిన తరువాత, ఆ సహోదరుడు ఇటీవలె ఈ విశ్వాసములోనికి వచ్చియున్నాడు అని తెలిసినది; అతని భార్య దీని యందు (ఈ భోదయందు) నమ్మకము కలిగిలేదు. అది ఈ పని కొరకు అతనిని అనర్హునిగా చేసినది. ఏలయనగా అతని కుటుంబమంతయు అతనికి తప్పనిసరిగా లోబడి యుండవలెను. వారు కూడా తప్పనిసరిగా ఈ విశ్వాసములోనే యుండవలెను. ఎందుకనగా ఒక విరోధము రావచ్చును.

5

మరియు మనము ఇప్పుడు కట్టుచున్నాము, మరియు ఈ సంఘమును నిలబెట్టవలెనని మనము కోరుచున్నాము.... మరియు నేను సంఘము యొక్క సాదారణమైన ప్రవక్తగ, (కాయువాడిగా) ఇది లేఖనానుసారముగా, ప్రతీదియు వాక్యముతో సరిపోయినదా లేదా అని తప్పని సరిగా చూడవలెను.

కాబట్టి, ఇక్కడ,ఈ గుంపు జనులలో ఎన్నుకొనుటకు ఎవరినైతే మనము గౌరవనీయులు మరియు నీతిమంతులైన పురుషులుగా తలంచితిమో ఆ కొంత మంది పురుషులు బోర్డు, సంఘకాపరి మరియు ప్రవక్త చేత అనుకూలమైన వారుగా కనుగొనబడియున్నారు. మేము కేవలము వారిని తీసుకొని రాగలము. మరియు తరువాత సంఘము చేత, వారి యొక్క సొంత ఓటు ద్వారా వారు నియమించబడెదరు. మరియు వారు ఈ కార్యాలయమును (పనిని) అంగీకరించెదమని, వారు అనుకున్నట్లయితే, ఈ పురుషులు సేవచేయవచ్చును. తరువాత బహుశా దేవుడు వారిని పిలిచియున్నాడని వారు అనుకున్నట్లయితే, దానిని చూచుటకై (తెలుసుకొనుటకై) వారు కొంత సమయము కొరకు పనిచేయవచ్చును. మరియు తరువాత వారు అనర్హులమని వారు అనుకున్నట్లయితే, రానైయున్న కొన్ని వారములలో ఈ పనికి రాజీనామా చేయుటకు వారికి హక్కుయున్నది, వారి స్థానములో వేరొకరు నియమించబడెదరు.

6

అయినప్పటికిని, ఉజ్జీవము యొక్క ఆరంభములో (దేవుని చిత్తమైతే), నేను కొంత విశాంత్రి పొందుకొన్న తరువాత వరకు నేను ఈ గుడారములో ఇక్కడ ఆగాలని అనుకొనుచున్నాను, తరువాత నేను ఈ సంఘములో కోశాధికారిని మరియు పెద్దలను హస్తనిక్షేపణము ద్వారా మనము అభిషేకించెదము. అయితే మొదటిగా వారు నియమించబడవలసియున్నది మరియు వారు దానిని ఎలా ఇష్టపడెదరు మరియు జనులు దానిని ఎలా ఇష్టపడెదరు అనేది చూచెదము. తరువాత రెండు వైపులా అది ఆమోదయోగ్యమైనచో, అప్పుడు మేము ఈ పురుషులను అభిషేకించబడిన పెద్దలుగా చేయుదము, అదే విధముగా ధర్మకర్తలు కూడా ఎన్నుకొనబడెదరు.

దేవుని యొక్క వాక్యము చేత ఇది సంఘము యొక్క చట్టము మరియు సార్వభౌమత్వమైయున్నది. అందుచేత, అది — వారు అలా దానిని చెప్పలేరు. “ఈ మనిషి మంచి మనిషి అని నేను అనుకొనుచున్నాను,” అది అలా కాదు, “సహోదరుడు నెవిల్, ఈ మనిషి సరైనవాడు అని తలంచుచున్నాడు”, లేదా “దర్మకర్తల సమూహము ఈ మనిషి సరైన వాడు అనుకొనుచున్నది.” అది సంఘము చేత చెప్పబడవలసియున్నది! ఇక్కడ తమలో తాము ఎవరూ ఏమియూ చేయలేరు. ఇది సంఘము యొక్క ఓటు (ఎన్నిక). ఇది శ్రేష్టమైన సంఘము.

పురాతన నియమావళి పట్టిక, 1937వ సంవత్సరములో వచ్చిన వరదలలో నాశనమై పోయినది. మేము వాటి నకలు తయారు చేసియున్నాము, మరియు త్వరలో కోశాధికారుల, పెద్దల, దర్మకర్తల, సంఘకాపరుల, సహాయకుల మరియు మొదలైన వారి విధులను ఇక్కడ గోడ మీద వ్రేలాడదీసెదము.

7

దేవుని యొక్క కృప చేత, ఇది నాకు చెప్పబడినది, ఈ సంఘము యొక్క బోర్డ్ ద్వారా వంద శాతము ఓట్లతో, వారు సహోదరుడు హోలిన్ హిక్కర్సన్ను ఒక నీతిమంతునిగా, గౌరవనీయుడైన మనిషిగా ఎన్నుకొనిరి. మరియు ఈ చెప్పబడిన గుడారమునకు పెద్దగా యుండుట గొప్ప గౌరవము అని ఈ మార్గములో, ఈ స్థితిలో పొందుకొని యుండుటను వారు కనుగొనిరి.

బోర్డు యొక్క ఓటు చేత, సహోదరుడు కాలిన్స్ కూడా గౌరవనీయుడు మరియు నీతిపరుడైన మనిషి అని మేము కనుగొనియున్నాము. తనకు తాను ఒక సేవకునిగా ఉండుటను బట్టి, సంఘము యొక్క పెద్దగా యుండవలెనని, పెద్దగా మాత్రమే కాదు గానీ సహోదరుడు నెవిల్కు సహాయకునిగా, బహుశా ఆదివారపు బడి పాఠమునకై లేదా సహోదరుడు నెవిల్ స్థానమును తీసుకొనుటకు, లేదా దేనికైతే పిలువబడెనో దానంతటికి, మరియు అతను సహోదరుడు నెవిల్నకు సహాయకునిగా ఉండుటకై ఆయన రావలెనని మేము అడుగుచున్నాము. అది సహోదరుడు కాలిన్స్.

సహోదరుడు టోని జెబెల్ను సంఘము ఒక గౌరవనీయుడైన మరియు నీతిపరుడైన మనిషిగా కనుగొన్నది, ఈ చెప్పబడిన గుడారములో పెద్ద యొక్క భాద్యతను పొందుకొనుటకు రావలెనని అతడిని అడుగుచున్నాము. అతను సంఘకాపరుల మరియు ధర్మకర్తల బోర్డు ముందర అభిమానించబడెను.

8

మరియు మన మధ్యలో గౌరవనీయుడైన మనిషిగా కనుగొనబడిన మరియు అడుగబడెను. (ఇప్పుడు కేవలము గౌరవనీయుడైన మనిషిగా మాత్రమే కాదు, కానీ ఇప్పుడే బోర్డు ద్వారా ఎన్నుకొనబడెను) మెమ్ఫిస్ లేదా హెన్రీవిల్ నుండి సహోదరుడు టైలర్, మెమ్ఫిస్, ఇండియానా అదే అని నేను అనుకొనుచున్నాను. అదేమై యున్నప్పటికి, ఒక ద్వారపాలకునిగా కొంత కాలము అతడు మనతోనే యున్నాడు. ఈ చెప్పబడిన గుడారములో పెద్దగా ఒక గొప్ప కార్యాలయమును అతడు అంగీకరించులాగున సంఘకాపరి మరియు బోర్డు లేదా సంఘము అతనిలో దయను కనుగొనియున్నది.

మరియు చెప్పబడిన ఈ గుడారములో కోశాధికారి యొక్క కార్యాలయమును అంగీకరించుటకు సంఘకాపరి చేత మరియు బోర్డు చేత ఎన్నుకొనబడిన, సహోదరుడు మైక్ ఇగన్ యొక్క అల్లుడు, సహోదరుడు బాబ్ హీర్నర్డ్ కూడా అడుగుచున్నాము, అది ఒక గౌరవింపదగిన పని, మరియు దానికి నీతి మరియు మర్యాద అవసరమై యున్నవి.

ఇది చేయుచుండగా, నేను అనుకొనుచున్నాను, నా సహోదరులారా, ఇక్కడ నుండి మిమ్మను పిలుచుచున్నాను, ఇది మీకు గొప్ప గౌరవమైయున్నది. మరియు అది మాత్రమే కాదు గానీ, ఎదో ఒకటి చేయవలసియున్నది.

9

పెద్ద యొక్క అర్హతలను చదువుటకై ఈ సమయములో మన సహాయకుడు, సహోదరుడు నెవిల్ను నేను కలిగియున్నాను. సహోదరుడు నెవిల్, మీరు గనుక దేవుని యొక్క వాక్యము నుండి చదివినట్లయితే [సహోదరుడు నెవిల్ 1తిమోతి 3:8-12 చదువుచున్నారు — సంపా]:

అదే విధముగా, పెద్దలు కూడా తప్పకుండా గంభీరమైన వారుగా ఉండవలెను, రెండు నాలుకల దోరణి కలవానిగా, పాపిష్టి పైకమునందు కాంక్షగలవానిగా మరియు దాక్షరసము ఎక్కువగా త్రాగు వానిగా ఉండకూడదు;

స్వచ్ఛమైన వివేకముతో విశ్వాసము యొక్క మర్మమును పట్టుకొనువానిగా ఉండవలెను.

మరియు ఇది మొదటిగా రుజువు చేయబడనివ్వండి; తరువాత కల్మషము లేని వారిగా, వారిని పెద్ద యొక్క కార్యాలయమును ఉపయోగించుకొననివ్వండి.

వారి యొక్క భార్యలు సహితము గంభీరమైన వారుగా, అపోహలు (కొండెములు) చెప్పే వారిగా కాకుండా, స్థిరబుద్ధి కలిగినవారిగా, అన్ని విషయములలో విశ్వాసులుగా ఉండవలెను.

పెద్దలు, ఒక్క భార్యకు భర్తలుగా ఉండవలెను (ఏక పత్ని పురుషుడు), వారి యొక్క పిల్లలను మరియు వారి యొక్క సొంత గృహమును మంచిగా పాలించువారుగా ఉండవలెను.

పెద్ద యొక్క కార్యాలయమును మంచిగా ఉపయోగించువారు, వారికి వారు ఒక మంచి ఘనతను కొనిన వారిగా యున్నారు, మరియు విశ్వాసములో గొప్ప ధైర్యమును కలిగియున్నారు. అది క్రీస్తు యేసులో యున్నది

10

ఆమేన్. ఈ సమయములో నేను, ఎవరైతే పిలువబడిరో ఆ సహోదరులను అడుగుచున్నాను, ఒక్క క్షణం వారు ఇక్కడకు, ఈ వేదిక యొద్దకు నడిచి వచ్చినట్లయితే, మరియు ప్రార్థన కొరకు ఒక్క క్షణము మనము మన యొక్క శిరములను వంచుదము, వారు నాకు కావలెను... మరియు ఇది ఏమిటో సంఘము ఎరిగియున్నది, ఇది మీ యొక్క పెద్దల బోర్డును మరియు మీ యొక్క కోశాధికారిని ఎన్నుకొనుటైయున్నది.

ప్రభువైన యేసు, ఇది స్థిరబుద్ధితో, దైవికమైన ఆలోచనతో మేము ఇప్పుడు మీ యొద్దకు సమీపించియున్నాము. మీ యొక్క అతిపరిశుద్ధమైన వాక్యముపై గౌరవముతో మేము వచ్చియున్నాము. “ప్రతీ మనిషి యొక్క మాట అసత్యము, కానీ దేవుని యొక్క వాక్యము సత్యము,” అని మేము నమ్ముచూ వచ్చియున్నాము. యేసు తన యొక్క ప్రశస్తమైన సొంత రక్తముతో వెల ఇచ్చి కొనిన ఈ సంఘము కొరకు మరియు ఆరాధించుటకై మాకు ఈ భవనమును మీరు ఇచ్చియున్నందుకు మేము మీకు కృతజ్ఞలమై యున్నాము.

మరియు ఈ గొప్ప మందకు విచారణకర్తలుగా ఉండుటకు, పరిశుద్దాత్మ మమ్మలను నియమించెను. ఇప్పుడు మేము ఈ జనసమూహమునకు, ఆత్మ చేత నింపబడిన మరియు ఈ కార్యాలయమునకు(పనికి) సిద్ధముగా యున్నారని మేము నమ్మిన సద్భక్తిగల, నీతిమంతులైన కొంత మంది పురుషులను ఇచ్చుటకై (పెట్టుటకై) ప్రయత్నించుచున్నాము. పెద్దల సమూహమును గురించి ఒక సారి చెప్పిన విధముగా, వెళ్ళి విధవరాళ్ళను మరియు ఆనాధలను గురించి జాగ్రత్త వహించి ఈ విధముగా సేవచేయుచు, ధారాళముగా ఇచ్చుచూ మరియు సంఘము యొక్క శ్రేయస్సు గురించి జాగ్రత్త వహించుచూ, పరిశద్దాత్మ చేత మరియు మంచి సాక్ష్యములు కలిగిన పురుషులను మిరు మీ మధ్యలో వెదకుడి. మనము సంవత్సరముల తరబడి గొప్ప దైవావేశము గల, పరిశుద్ధుడైన పౌలు వ్రాసిన వ్రాతలు కేవలము చదువుచున్నాము. అతడు లేఖనము చెప్పిన దానిని, అవసరతను బట్టి దాని స్థానములో పెట్టెను.

దేవా, ఈ పురుషులను దీవించుడి. మరియు ఇపుడు ఇది ఒక ఎన్నిక, ప్రభువా, శ్రేష్టమైన సంఘముగా, ప్రభువైన యేసు యొక్క శరీరముగా, వారు ఎన్నుకొనుచున్నారు. మరియు [టేపులో ఖాళీ స్థలమున్నది-సంపా]... మరియు సేవ యొక్క ఈ భాగమును, నీతికరమైన మరియు యేసు యొక్క పరిశుద్ధ నామములో ఒక ప్రత్యేకమైన మార్గములో నడిపించెదము.

11

ఇప్పుడు మన శిరములు వంచి యుండగా, మన యొక్క శిరములు మాత్రమే కాదు కానీ మన యొక్క హృదయములు కూడా, మరియు ఇక్కడకు తరచుగా వచ్చుచూ మరియు మీ యొక్క దశమ భాగములతో మరియు కానుకలతో దీనికి సహాయపడుచున్న ఈ సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి సంఘములో ఒక వ్యక్తిగా పరిగణించబడుచున్నాడు. సంఘకాపరి మరియు నేను ఒంటరిగా, సహాయ సేవకుడు (సహోదరుడు నెవిల్) మరియు నేను చూచినప్పుడు. నేను అడుగుచున్నాను, సహోదరుడు టేలర్ ఒక నీతి గల వ్యక్తిగా మరియు అర్హునిగా, ఈ గుంపు జనులకు ఒక పెద్దగా ఉండుటకు, మీ యొక్క శ్రేష్టమైన ఆలోచనతో ఈ సంఘము కనుగొనిన యెడల, దానిని మీ యొక్క హస్తము పైకి ఎత్తుట ద్వారా మీ సమ్మతిని చూపించవలసినదిగా కోరుచున్నాను.[సహోదరుడు బ్రన్హాం మౌనముగా యున్నారు - సంపా], మంచిది. ఇప్పుడు ఏదైనా ప్రతికూలముగా ఉన్నచో, మి యొక్క హస్తమును పైకి ఎత్తగలరు. [సహోదరుడు బ్రన్హం మౌనముగా యున్నారు - సంపా] ధన్యవాదములు.

12

ఇక్కడ ఈ సంఘములో ఉన్న ఈ సభ్యులలో ఎవరినైనా కనుగొనినచో, మరియు అంతయు, సహోదరుడు హాలిన్ హిక్కర్సన్ ఒక నీతిమంతుడు మరియు గౌరవనీయుడైన మనిషి అని మీరు కనుగొనినచో మరియు ఈ చెప్పబడిన సంఘమునకు పెద్దగా ఉండుటకు యోగ్యత గల మనిషిగా మీ ధృషిలో అతడిని మీరు కనుగొనిన యెడల మీ యొక్క కుడి హస్తమును పైకి ఎత్తి మీరు తెలియజేయవచ్చును? [సహోదరుడు బ్రన్హం మౌనముగా యన్నారు - సంపా] మంచిది. ప్రతికూలత ఉన్నట్లయితే, మీ హస్తమును పైకి ఎత్తగలరా? [సహోదరుడు బ్రన్హాం మౌనముగా యున్నారు - సంపా].

సహోదరుడు కాలిన్స్ కూడా అదే విధంగా, ఒక నీతిమంతుడు మరియు గౌరవనీయుడైన మనిషిగా, మరియు ఈ సంఘమునకు పెద్దగా పనిచేయుటకు యోగ్యత కలిగిన వ్యక్తిగా ఈ జన సమూహము కనుగొన్నదా? మీ కుడి హస్తమును పైకి ఎత్తగలరా? [సహోదరుడు బ్రన్హం మౌనముగా యున్నారు- సంపా] ప్రతికూలమైన వారు, (వ్యతిరేకించువారు) మీ హస్తమును ఎత్తగలరా? [సహోదరుడు బ్రన్హాం మౌనముగా యున్నారు - సంపా].

13

సహోదరుడు టోనీ జెబెల్ను ఒక గౌరవనీయుడైన మనిషిగా మరియు ఈ కార్యాలయమునకు యోగ్యత కలిగినవాడిగా, చెప్పబడిన సంఘములో ఉన్న ఈ మందకుపైగా పెద్దగా యుండుటకు ఈ జనసమూహము కనుగొన్నదా? మీ యొక్క కుడి హస్తమును పైకి ఎత్తగలరా? [సహోదరుడు బ్రన్హాం మౌనముగా యున్నారు — సంపా] వ్యతిరేకముగా (ప్రతికూలముగా) యున్నవారు, మీ హస్తమును పైకి ఎత్తగలరా? [సహోదరుడు బ్రన్హం మౌనముగా యున్నారు - సంపా.]

కోశాధికారిగా, ఈ సంఘమునకు సెక్రటరీ - కోశాధికారిగా ఈ ఆర్థిక లావాదేవీలు మరియు దీని యొక్క బిల్లులను చెల్లించేందుకై, కొంత కాలముగా ఇప్పటి వరకు మనతోయున్న సహోదరుడు హార్నడ్ ఒక మంచి నీతిమంతుడైన మనిషిగా యున్నాడని ఈ జనసమూహము అనుభూతి కలిగియున్నదా? అలా అయినచో, మీక్క కుడి హస్తమును పైకి ఎత్తండి. [సహోదరుడు బ్రన్హాం మౌనముగా యున్నారు - సంపా] వ్యతిరేకత ఏమైన ఉన్నయెడల, మీ యొక్క కుడి హస్తమును పైకి ఎత్తండి. [సహోదరుడు బ్రన్హాం మౌనముగా యున్నారు - సంపా.]

14

ఈ సిలువ యొక్క పాదముల చెంత, ఈ ప్రస్తుత సమయమునందు నిలబడిన సహోదరులకు, ఈ సంఘము నూటికి నూరు శాతముతో (ఏ వ్యతిరేకత లేకుండా), దేవుడు మిమ్మను పిలచిన ఈ కార్యాలయము కొరకు, దేవుని యొక్క ధృష్టిలో మీరందరు యోగ్యులుగా కనుగొనబడియున్నారని నేను చెప్పగోరుచున్నాను.

ఇప్పుడు, నీవు చెప్పియున్నావు “వారిని మొదట ప్రయత్నించనివ్వండి, మరియు వారు ఈ కార్యాలయమును కోరుకున్నచో చూద్దాం.” దేవుని చిత్తమైతే, కొన్ని వారములలో ఈ మనుష్యుల గుంపుపైన, అధికారికముగా ట్రస్టీలుగా లేదా ఈ సంఘమునకు పెద్దలుగా, మరియు కోశాధికారిగా ఉండుటకు హస్తనిక్షేపణము చేయుటకు నేను తిరిగి వచ్చెదను. కొంత సమయమునకై మన యొక్క శిరములను వంచెదము:

15

ప్రభువా, ఈ లోకములో దైవికముగా నడిచేందుకు ఇంకను ఈ భూమి మీద జీవించుచున్న కొందరు మనుష్యుల నిమిత్తము మేము ఈ రాత్రి ఆనందించుచున్నాము; ఎంతో దైవికముగా ఒక గూడారము, అది కలిగి యున్నటువంటి ఖండితమైన నియమములతో, ఒక్క ఓటు కూడా విరుద్ధముగా వేయబడకుండా వారికి నాయకులుగా ఉండుటకు ఐదుగురు మనుష్యులను వారి వారి స్థానములలో ఉండుటకు ఎన్నుకొనిరి (ఓటు వేసిరి) వారి కొరకు మేము ఆనందించుచున్నాము, సేవకులు మరియు బోర్డు సభ్యులు, మేము ఈ నిర్ణయములను తీసుకొనుటకు మీరు మాతో యుండియున్నారు అని అనుభూతి చెందియున్నాము.

దేవా, ఈ మనుష్యులను దీవించండి. మరియు ఇది వారికి పరలోకములో ఒక గొప్ప హోదాను కొనుచున్నదని యెరిగి, వారు వారి యొక్క హృదయపూర్తిగా ఈ కార్యాలయమునకు (పనిని) సేవచేయుదురు గాక. ఏదో ఒక దినమున పరలోకము యొక్క గ్రంథములు మూసివేయబడినప్పుడు, పరసంబంధమైన జీవుల యొక్క (దివ్యమైన) గ్రంథము మరియు పరలోకము యొక్క గొప్ప పుస్తకము తెరువబడును. దేవుడు మరియు రక్షకుని ముందు వారి యొక్క పేర్లు నూరు శాతము ఉండును గాక మరియు ఆయన రాజ్యములో పరలోకమందున్నవి అన్నియూ సమానముగా యుండును గాక, ప్రభువా, వారిని దీవించండి, మరియు ఈ కార్యాలయమునకు వారు మంచిగా సేవచేయుదురు గాక. యేసు నామములో వారి కొరకై మేము కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఆమేన్.

16

సహో, హర్నార్డ్ మరియు సహా, జెబెల్ మరియు సహా, కాలిన్స్ సహా, హిక్కర్సన్ మరియు సహో, టెలర్, నేను మీతో కరచాలనము చేయదలచుచున్నాను [సహోదరుడు బ్రన్హం వారితో కరచాలనము చేయుచున్నారు.] ఇటువంటి గౌరవనీయులైన మనుష్యులతో ఈ సమయమంతయూ మేము సహవాసము కలిగియున్నామని ఎరిగియున్నందుకు చాలా ఆనందించుచున్నాము. ఇప్పుడు దేవుడు మిమ్మను దీవించును గాక. మరియు కొంత సమయము నేను విశ్రాంతి తీసుకొని మరియు తిరిగి వచ్చిన వెంటనే, మేము మిమ్మలను చూచెదము, మరియు మీ కార్యాలయమును ఎంతగా మీరు ఇష్టపడుచున్నారో చూడండి. మంచిది, వారి యొక్క ఓటు ద్వారా, నూరు శాతము ఎటువంటి విరోధము లేకుండా, జరిగినదని నేను అనుకొనుచున్నాను.

ఓ, ఈ దినమున దైవికముగా దేవుని ముందర ఎవరైతే జీవించగలుగుచున్నారో, ఆ ప్రజలతో మీరు సహవాసము కలిగియున్నందులకు మరియు ఆ స్థితిలో, ప్రస్తుతమందున్న లోకము ముందర జీవించువారిని బట్టి, మీరు ఆనందించుట లేదా? ఇది అద్భుతమైన విషయము.

17

మరియు ఈ సంఘమును మరియు ఈ మనుష్యులను నా సేహ్నితులుగా కలిగియుండు ఈ తరుణమును బట్టి మరియు ఈ రాత్రి దానిని కలిగియున్న దానిని బట్టి నేను చాలా ఆనందించుచున్నాను. దేవుడు ఈ లోకమందంతటా యున్న ఆయన యొక్క సంఘముతో నేను సహవాసము కలిగియుండేందుకు నన్ను అనుమతించినందులకు నేను చాలా ఆనందించుచున్నాను. ఓ, వారు అలక్ష్యము చేయబడిరి మరియు తృణీకరించబడిరి మరియు వారి గురించి మాట్లాడబడిరి మరియు ఈ ఉదయ కాలములో నా వర్తమానములో నేను మాట్లాడిన విధముగా, బహుశా కేవలము మంటి పనివారు, “మూఢభక్తి గల గుంపుగా,” ఆ విధముగా లోకము వారిని చూచుచున్నది, అయితే దేవుడు వారిని ఆయన పిల్లలుగా చూచుచున్నాడు. దానిని బట్టి నేను చాలా ఆనందించుచున్నాను. చంద్రుని యొద్దకు ఎంత దూరము ఉంటుందో బహుశా వారు మీకు చెప్పలేకపోవచ్చును. సూర్యమండలములన్నియూ ఏ విధముగా పనిచేయుచున్నావో వారు మీకు చెప్పలేకపోవచ్చును. అయితే వారు ఒక్క విషయమును ఎరిగియున్నారు: వారు తిరిగి జన్మించిన గడియను వారు ఎరిగియున్నారు. వారిని బట్టి నేను ఎంతో ఆనందించుచున్నాను.

18

మరియు నేను నేర్చుకొనిన ఈ చిన్న ఉపమానము వలె, ఈ రాత్రి నేను నా ఇద్దరు కుమార్తెలతో, ఒక రకముగా మేము ఇంటికి వచ్చెలా చేసి, దానిని మాకు వాస్తవముగా చేసిన దీనిని అనుసంధానము చేయదలచుచున్నాను. మీరు దాని భావమును అర్థము చేసుకొనెదరని అనుకొనుచున్నాను. ఒక ఉదయకాలమున, మంచము మీద నుండి లేచిన తరువాత... నేను ఇద్దరు చిన్న బాలికలను కలిగియున్నాను. వారిలో ఒకామె రిబ్కా, మరియు ఇంకొకామె శారా, మరియు వారు తండ్రి యొక్క చిన్న బాలికలు.

మరియు నేను చిన్న బాలుడైన జోసెఫ్ ను కలిగియున్నాను. ఒక రాత్రి, కూటములో నుండి, నేను చట్టనోగా (ఒక ఊరి పేరు) నుండి వచ్చినప్పుడు, నేను ఈ చివర కూటములో అక్కడ ఉన్నాను. మరియు నేను కారులో యున్నాను, నా పెద్ద కుమారుడైన బిల్లీతో కలసి వెళ్ళుచున్నాను. మేడ మరియు అతని భార్య కారులో యున్నారు. మరియు బాలికలు కూడా యున్నారు. మరియు మేము అటుగా వెళ్ళుచుండగా, నగరములో యున్న అనేక పట్టణములు దాటిపోవుచుండెను ఎవరు ఏమీ చెప్పలేదు. మరియు వారు చేయుచున్న విధానము గురించి ఆ రాత్రి ఆ ప్రజలను చాలా కఠినముగా నేను చీల్చి వేసితిని. ఎవ్వరు ఏమి చెప్పలేదు. మరియు చిన్న జోసెఫ్ అక్కడకు వచ్చెను. మరియు నా భుజములపై నుండి నన్ను గట్టిగా పట్టుకొనెను, మరియు ఆయన “డాడీ, ఈ రాత్రి నిశ్చయముగా నీవు బోధించావు!” అని చెప్పెను.

19

మరియు ఈ ఉదయ కాలమున, నేను విడిచిపెట్టుచుండగా మరియు ఎనిమిదవ, పదియవ వీధిలోనికి వెళ్ళుచున్నపుడు నా భార్య మరియు ఆ ఇద్దరు బాలికలు, ఏ ఒక్కరు ఏ విషయము నాతో మాట్లాడుట లేదు, మరియు చిన్న జోషప్ మరలా నా యొక్క భుజమును పట్టుకొనెను; అతడు “డాడీ, ఈ ఉదయ కాలమున నిశ్చయముగా ఆ బోధ నేను ఇష్టపడియున్నాను,” అని అతడు చెప్పెను. నేను, “మంచిది, నేను ఒక అభిమానిని కలిగియున్నాను; అది నా కుమారుడే.”

మరియు మన యొక్క చిన్న మాటలలో. ఒక ఉదయ కాలమున గదిలో కూర్చొనియున్నాను, చిన్న బెక్కి పరుగెత్తుకొని వచ్చి మరియు ఇలా చెప్పినది, ఆమె నా కాలును లాగివేసి మరియు ఆమె యొక్క చేతిని నా చుట్టూ వేసినది, మరియు ఆమె తండ్రి యొక్క చిన్న బాలిక (గారాల పట్టి). మరియు ఆమె నన్ను హత్తుకొన్నది. మరియు చిన్న శారా తన యొక్క చిన్న పైజామాతో మంచముపై నుండి ఎరిగి వచ్చి వెనుక పరిగెత్తినది. ఆమె చిన్న గోధుమ రంగు కన్నులు కలిగియున్న బాలిక.

చిన్న బెక్కి ఇలా చెప్పినది, “ఓ, శారా నీవు ఇక్కడకు రావలసిన అవసరము లేదు, ఎందుకనగా డాడీని పూర్తిగా నేను కలిగియున్నాను. డాడీ పూర్తిగా నా వాడు!” మరియు చిన్న శారా, ఆమె యొక్క చిన్న పెదవులు క్రిందకు వ్రాలినవి, ఆమె యొక్క చిన్న గోధుమ రంగు కళ్ళు ఎర్రబారినవి. నేను ఈ విధముగా కదిలితిని మరియు ఇంకొక కాలు పట్టబడినది, మరియు ఆమె వచ్చి నా కాలు లాగివేసినది.

20

బెక్కి పెద్ద కాళ్ళు కలిగియున్నది, కాబట్టి అవి నేలను చేరియున్నవి. చిన్న శారా తడబడుచూ నడుచుచుండెను, కావున నేను నా రెండు చేతులను శారా చుట్టూర వేశాను. చిన్న శారా బెక్కి వైపు చూచినది మరియు “బెక్కి నీవు డాడీని పూర్తిగా కలిగియుండ వచ్చును, అయితే డాడీ, నన్ను పూర్తిగా కలిగియున్నాడు!”అని చెప్పెను.

మరియు అదే విధముగా ఇక్కడ ఉన్నది అని నేను అనుకొనుచున్నాను. తత్త్వజ్ఞానమంతయూ మనము ఎరిగియుండలేకపోవచ్చును, మరియు ఆ గొప్ప గ్రీకు పదములన్నియూ, ఈ గుంపు ప్రజలు బహుశా ఎరిగియుండలేకపోవచ్చును. అయితే ఒక్క విషయము మాత్రము నిశ్చయము: యేసు మనందరిని కలిగియున్నాడని నేను నమ్ముచున్నాను. ఆమేన్.

మంచిది, సహోదరుడు నెవిల్.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...