మనమెందుకు ఒక శాఖ కాదు?

మనమెందుకు ఒక శాఖ కాదు?

ఇంచుమించు మూడు నెలల, పిదప, మరలా ఈ ప్రసంగా వేదిక యొద్దకు వచ్చుట భాగ్యముగా తలంచుచున్నాను. ఉడుతలకు కఠినమైన సమయముగా యుండినది; నాకు కూడా. ఓ, ఇప్పుడు ఇది సడలించునట్లుగా యున్నది, మరియు మరలా సేనలో ప్రవేశించవలెననే భావము మీకు ఎక్కువగానే కలుగుచున్నది. రాబోవు వారమునందు, రాబోవు బుధవారమున రాత్రియందు, ఈ గుడారములో ఒక ఉజ్జీవమును ప్రారంభించుటకు ఎదురుచూచుచున్నాను. దేవుని చిత్తమైనయెడల, నేనొకవిధమైన, ఒక భిన్నమైన మరియు నూతన విధమగు సేవను దేవుడు నాకు వాగ్దానము చేసెను. ఆ విధముగా చేయుటకు ఆయన ఇష్టపడిన యెడల, నూతన విధమగు సేవను వచ్చే వారములో, మొట్టమొదటగా ఈ గుడారములో ప్రారంభించెదనని నేను నమ్ముచున్నాను.

తరువాత ఎటువంటి కూటముల జాబితా నాకు లేదు, కాని రాబోవు జనవరి నెలలో అస్ట్రేలియాలోను, మరియు న్యూజిలాండ్లోను మాత్రమే కూటములు ఏర్పాట్లు చేయబడినవి. అటు తర్వాత సహోదరుడు ఆస్బర్న్, మేము ఇరువురము కలిసి జరిపించబోవు కూటములు టుల్సాలో ఏర్పాటు చేయుచున్నారు, కొన్ని దినముల క్రితము నేను అతనికి వాగ్దానము చేసితిని. అవి ఎప్పుడు జరుగునని మాకు ఖచ్చితముగా తెలియదు.

2

సహోదరుడు జెఫ్రీస్ని అచ్చట వెలుపల సంధించి కరచాలనము చేసినదియు, ఆ పాటను అతడి కుమారుడు పాడుటను వినుటయు మరియు ఆ పాట కొరకై సహోదరుడు సంగీతమును వాయించుట నిజముగానే అది ఎంతో బాగున్నది. దానిని మీరు ఇష్టపడుచున్నారు కదూ? “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము.” అది నిజము. శ్రీ. గున్తర్, అది నిజమని నీవు ఎరుగుదువు, “మీ బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు వృద్దుడైనప్పుడు దానినుండి తొలగిపోడు.” అది నిజము. కొన్ని సమయములలో అతడు దానినుండి తొలగిపోవునేమో గాని అది అతని నుండి తొలగిపోదు, చూచారా. అది ఎల్లప్పుడునూ అతడితోనే నిలిచియుండును. చిన్న వయస్సులో అతడికి ఇవ్వవలసిన తర్ఫీదును, మరియు అతడు పెద్దవాడగుచున్నప్పుడు ఇవ్వవలసిన తర్ఫీదును ఇచ్చిన యెడల అది ఖచ్చితముగా అతడిలో నిలిచియుండును. ఇప్పుడు ఇది...

3

నేను సహోదరుడు జెఫ్రీస్ ను అచ్చట వెలుపల సంధించి, “సహోదరుడా జెఫ్రీస్.... ” అని నేను పలకరించితిని. వేరే స్థలముల నుండి సహోదరులు, ఇచ్చటకు వచ్చుటను నేను చూచినప్పుడు ఎల్లప్పుడూ నేను సంతోషించెదను; కాని ఇటువంటి ఒక రాత్రి సమయమందు సహోదరుడు రావలెను. ఈ రాత్రియందు, సామాన్యముగా ఈ గుడారమునకు వచ్చే ప్రజలే వచ్చెదరు. ప్రార్థన కోసము, ఉజ్జీవము కోసము, ఈ రాత్రి యందే, ఈ రోజు రాత్రి, రేపటి ఉదయమున మరియు రేపటి రాత్రికి ఈ గుడారములో మేము విశ్వసించుచున్నవాటిని మరలా జ్ఞాపకము చేసుకోవలెనని కోరుచున్నాను. భయంకరమగు వింతైన చాలా విచిత్రమైన కొన్ని నమ్మకములు మాకు గలవు, కాని అవి ఈ పరిశుద్ధ గ్రంథములో ఏ విధముగా యున్నవో వాటిని మనము చూచుచున్నాము. అవి అచ్చట సరిగానే యున్నవి.

4

ఒక నిర్దిష్టమైన శాఖకు చెందినవారై మాతో చేరని ఏ సహోదరుడైనా లేదా ఏ సహోదరియైనా ఈ రాత్రి ఇచ్చట యుండినయెడల, వారిని ఎంతో ప్రేమతో ఆహ్వానించుచున్నామనే దానిని మీరు గ్రహించవలెనని మేము కోరుచున్నాము. చూడండి, ఎంతగా మిమ్మల్ని ఆహ్వానించగలమో అంతగా మిమ్మల్ని మేము ఆహ్వానించుచున్నాము. కాని ఇప్పుడు, నా నమ్మకము... దీనిని మేము కొంతమట్టుకు కఠినముగా చేయుచున్నాము. కాబట్టి మీరు దానితో ఏకీభవించనట్లుగా కనబడినయెడల, మంచిది, ఇప్పుడు, నేను చెర్రీ పండును తినేటప్పుడు చేయునట్లుగా మీరు చెయ్యండి. అది నాకు ఎంతో ప్రీతికరమైన తినుబండారము. నేను చెర్రీ పండును తినేటప్పుడు దానిలో గింజ ఉన్నందువలన ఆ చెర్రీ పండును నేను విసిరివేయను. గింజను తీసివేసి పండును తినెదను. ఆ విధముగానే కోడి మాంసమును తినేటప్పుడు కూడా... మీకందరికి కోడిమాంసమంటే ఇష్టమే, చూడండి. మీరు ఎముక ఉన్నందువలన మాంసమును తినకుండా వదిలివేయరు కదా! ఎముక చుట్టూ యున్న మాంసమును తింటునే యుందురు. మంచిది, నేటి రాత్రియందు కూడా మీరు ఆ విధముగానే చేయండి; ఇచ్చట నేను చెప్పు భావమును మీరు గ్రహించవలెను, మీరు ఏదో ఒక దానిని తినేటప్పుడు, “ఇప్పుడు, నేను కేవలము... నేను ఇంకా మూడు కూటముల వరకు ఈ చిన్న సంఘ సిద్దాంతముతో ఊరకే కూర్చొని యుందును. వారు విశ్వసించుచున్నదానిని మరలా వారు జ్ఞాపకము చేసుకొందురు,” అని మీరు చెప్పవచ్చును.

5

మీరు ఒక వ్యక్తిని దాదాపుగా నమ్మునట్లు చేయుటకు గల ఒకే ఒక మార్గమేదనగా, అది సత్యమని వారు ఎరుగునంత వరుకు దానిని మేకును దిగగొట్టునట్లుగా వారి మనస్సులలో చొచ్చుకొని పోవునట్లు చేయుటయే. ఆ ఒక్క మార్గము ద్వారా మాత్రమే దానిని మీరు చొచ్చుకొని పోవునట్లుగా చేయగలరు. నా ప్రియమైన స్నేహితులలో ఒకరైన శ్రీ. ఉడ్స్ తో నేను ఒకప్పుడు యుంటిని, మీరు మేకును సగము వరుకే దిగగొట్టినట్లైతే, పలక వదులుగా వుండు స్థితిలో ఉండుటచే, గాలి కొట్టినప్పుడు ఆ పలక క్రిందకు జారి పడిపోవును; కాబట్టి దానిని మీరు బాగా దిగగొట్టి, ఆ గోడతో అతుక్కుపోయినట్లుగా చేయవలెను. కాబట్టి ఇప్పుడు, కొన్ని స్థలముల యందు దీనిని నేను కరుకుగా చెప్పినట్లు చేసినయెడల, ఈ రాత్రి వెలుపల సంఘముల నుండి ఇచ్చటకు వచ్చి కూర్చొనియున్న మిమ్మల్ని నేను త్రోసివేస్తునట్లుగా భావించవద్దు. మేము విశ్వసించుచున్న దానిని ఈ సంఘమునకు ఒక మేకును దిగగొట్టినట్లుగానే వారి మనస్సులలో చొచ్చుకొని పోవునట్లుగా చేయుటకు నేను ప్రయత్నించెదను. ఇప్పుడు నా మాటల యొక్క భావమును చక్కగా గ్రహించినవారందరూ “ఆమేన్” అని చెప్పండి. మంచిది. అది సరే.

దీనిని నా చేతులనుండి పోవునట్లుగా చేసెదను. అటు తర్వాత... దీనిని వారు రికార్డు చేయుచున్నారు. కాబట్టి మా స్థితి ఏమిటి, మేము దేనిని ఆధారము చేసుకొని నిలబడియున్నామనే దానిని గురించి తరువాత కాలముల యందు వారు తెలుసుకొనుటకు ఆశించినయెడల, ఈ రికార్డు చేయబడిన టేపులు దానిని తెలుపును. దీనిని మేము ప్రతీసారి చేస్తున్నాము, ఎందుకనగా క్రొత్తగా జనులు వచ్చుచున్నారు, మేము దీనిని బోధించుచున్నాము. అన్ని సంఘముల సిద్దాంతములను మరలా చెప్పవలెననిన మాకు సాధ్యమవ్వదు, కాని వాటిల్లో నుండి కొన్నింటిని మాత్రము మేము మాట్లాడాలని ఆశించుచున్నాము. ఇప్పుడు, బుధవారము రాత్రిగా యున్నను, ప్రారంభమగుచున్నది.

6

స్వస్థతా కూటముల కొరకు సిద్ధపడుటకై, ఇప్పుడు సోమవారము మరియు మంగళవారము ప్రార్థనలో గడుపుటకై నేను బయటకు వెళ్ళుచున్నాను. మీరు ఫోనును ఉపయోగించుట ద్వారా, లేదా మీరు ఆశించు ఏ విధముగానైనను, జరగబోవు ఈ ఉజ్జీవ కూటములకు మీరు ఆశించువారినెవరినైనా తీసుకొని రావలయును. వారిని కంగారుగా రావద్దు అని చెప్పండి. “మంచిది, ఈ రోజు రాత్రి ప్రార్ధన కూటమునకు పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను ప్రార్థించుకోవలెను, మరియు రేపటి రాత్రికి కూడా ఆ విధముగానే అది...” అని చెప్పవద్దు. ఆ విధముగా మీరు చేయవద్దు. మీరు లోపలికి వచ్చి కూర్చొని కొంచెము ప్రసంగమును ఆలకించవలెను, ఎందుకనగా మేము నిదానముగా ఆ వాక్యమును అత్యంత సమీపముగా, మీ ముందు ఉంచవలెనని ఆశించుచున్నాము. అప్పుడు దెయ్యము ఎటూ కదలుటకు ఒక చుక్కంతటి స్థలము కూడా ఉండదు.

అప్పుడు మీరు విశ్వాసముంచునంత వరకు, మీ విశ్వాసము చివరి వరుకు చొచ్చుకొనిపోవు వరుకు మీరు అనుమతించినప్పుడు, అటు తర్వాత మీ అంతర్మదిలో క్రియ చేయుటకు మీరు అనుమతించినప్పుడు, అప్పుడు దేవుని యొక్క విశ్వాసము దానికి వెనుక ఆధారముగా యుండును. అటు తర్వాత మీరు స్వస్థతను పొందుకొని వెళ్ళెదరు, చూచారా. ఎందుకనగా మీ విశ్వాసము మాత్రము ఎక్కువగా ఏమియు చేయలేదు, మీ విశ్వాసము వెళ్ళుచున్న అదే దిశలో మీ అంతర్మది వెళ్ళవలెను; పిదప దేవుని యొక్క విశ్వాసము అచ్చటకు వచ్చి వాటిన్నింటిని రుజువుపరచును చూచారా? కాని మీ విశ్వాసము, “ఓ, అవును, దానిని ఇప్పుడే నేను పొందుకొంటిని,” అని చెప్పుచూ, కాని మీ అంతర్మది కూడా దాని వెనుక “అది నాలో క్రియ చేయుటను బట్టి నేను ఆశ్చర్చపడుచున్నాను,” అని సందేహించినయెడల, అది దానిని చెయ్యనే చెయ్యదు, చూచారా. కాబట్టి ఇది ఒక నిజమైన స్వస్థతా కూటముగా ఉండవలెనని నేను ఆశించుచున్నాను. స్వస్థతను పొందుకొనుటకై వచ్చే వారెవరైనా గాని, లేదా నేను ఈ నూతన ఆరాధనా కూటములలో, వారిని గదిలోకి ఆహ్వానించుటకు ముందుగానే ఎందుకొరకై వారు వచ్చితిరనే దానిని నిజముగానే వారు గ్రహించియుండవలెనని నేను ఆశించుచున్నాను. కాబట్టి జ్ఞాపకముంచుకొని, మా వద్దకు రావలయును. ఇచ్చట మిమ్మల్ని చూచినప్పుడు మేమెంతగానో సంతోషించెదము.

7

ఇప్పుడు, జ్ఞాపకముంచుకొనండి, ఉదయమున సంఘ సిద్దాంతమును గురించి ఇంకా కొనసాగుతునే వెళ్ళెదము మరియు రేపటి రాత్రికి అదే విధముగానే కొనసాగిపోయెదము. మీరు రావలెనని మిమ్మల్ని మేము ఆహ్వానించుచున్నాము. మీరెవరైనా గాని రావచ్చును. ఎవరినైనా చూచుటకు మేమెల్లప్పుడు ఆశించెదము, కాని నేటి రాత్రికి ఈ సిద్దాంతమునందు ఎదిగిన ఈ గుడారమునకు చెందినవారి కొరకు మాత్రమే ఇది ఉద్దేశించబడినది. సువార్త సేవకు బయట ప్రాంతములకు వెళ్ళునప్పుడు, పరిశుద్ధ గ్రంథమందు కనబడు మూలాధారమైన సువార్త సిద్దాంతపు లేఖనములనే మేము ప్రసంగించెదము. ఇచ్చట, ఈ గుడారమునందు, మా స్వంత అభిప్రాయములు మరియు మా స్వంత నమ్మకములు ఒక సంఘముగా మాకు గలవు. దానినే నేటి రాత్రియందు మేము మరలా మాట్లాడబోవుచున్నాము.

ఆయన యొక్క ఆశీర్వదించబడిన వాక్యమును మనము తెరచుటకు ముందుగా, కొద్దిసేపు ప్రార్ధన కొరకై మనము మన తలలను వంచెదము.

8

సర్వశక్తిమంతుడు మరియు బలవంతుడైన దేవా, ప్రపంచము యొక్క మొదటి పరమాణువు గిరగిరా తిరుగుటకు ముందే నీవు దేవునిగా యున్నావు. నీవు ఒక్క రవ్వంత కూడా మారలేదు. ప్రపంచమును ఆధారముగా చేసుకొని పట్టుకొనియుండు ఏ పరమాణువు లేకుండా గతించిపోయినను, ప్రపంచమే లేకుండా గతించిపోయినను నీవు ఇంకా దేవునిగానే యుందువు. నీవు శాశ్వతముగా యుండి మరియు శాశ్వతముగా యుండు దేవునిగా యున్నావు. నీకు దినముల యొక్క ఆరంభము లేదు లేదా జీవితము యొక్క అంతము లేనివాడవు. నీవు నిరంతరము యుండువాడుగా యున్నావు. తండ్రీ, నీవు అంతము లేనివానివిగాను మరియు మేము అంతముగలవారిగాను యుండుటచే, మీ యొక్క దైవీక కృప కొరకు మేము బ్రతిమాలుకొనుచున్నాము. దేవా, కాలమనే ఈ సహజ స్వభావమైన స్థితినుండి దాటి నిత్యత్వములో కలిసిపోవునని మేము గ్రహించుచున్నాము. అందువలన, ప్రభువా, మా యొక్క రక్షణను మేము పరిశీలించుకొని, నీ వాక్యమందు మేము ఏ విధముగా నిలబడియున్నామో చూచుకొనుటకై మరియు మా అనుభవములలో మేము ఏ స్థానమందుయున్నామనే దానిని గురించి చూచుకొనుటకే మేము ఇచ్చటకు వచ్చుచున్నాము. నిన్ను తృప్తిపరచు విధముగా మేము జీవించుచున్నామా? మా ఆత్మలతో నీ ఆత్మ సహించుకోగలుగుచున్నాదా? మా బోధ ఈ పరిశుద్ధ గ్రంథముతో ఏకీభవించునట్లుగా సరితూచబడియున్నదా? తండ్రీ, జరుగబోవు ఈ మూడు ఆరాధనలలో ఈ రెండు విషయములను మేము క్షుణ్ణంగా పరీక్షించుకొని చూచునట్లుగా చేయుము. ప్రభువా, దీనిని అనుగ్రహించుము.

9

ఇచ్చటయున్న సంఘ కాపరిని, డీకన్ లు, ధర్మకర్తలు, జనులనందరిని మరియు ఈ సంఘమునకు వచ్చుచున్న ప్రజలను ఆశీర్వదించుము. ఇచ్చటకు నేను వచ్చుచున్న దినముల నుండి, ప్రభువా, అనేకమంది ఈ గుడారములో చేరిరి, వారి పేర్లు కూడా నేను ఎరుగను. మరియు వారు ఎక్కడ నుండి వచ్చిరో కూడా నాకు తెలియదు; కాని నీవు వారిని గురించి సమస్తమును ఎరిగినవాడవని నిశ్చయముగా నేనెరుగుదును. ప్రభువా, ఈ రోజు రాత్రియందు ఇచ్చటకు మేము ఒకే ఒక ఉద్దేశ్యము కొరకు వచ్చితిమి, అదేమనగా వ్రాయబడియున్న ఈ వాక్యము చుట్టూ సహవాసము చేయుటకే, మా జీవితములలో పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించుము, అప్పుడు మేము సమాధానముతోను, నిదానముతోను, దైవీక భయముతోను కూర్చొని, మా జీవితములను ఆయన వాక్యము ద్వారా మేము పరీక్షించుకొనెదము. ప్రభువా, దీనిని అనుగ్రహించుము.

ప్రభువా, ఈ రోజు రాత్రి ఈ కట్టడములో, పలు రకముల సంస్థలకు చెందిన నా సహోదరులు గలరు. ప్రభువా, సహవాసము చేయుటకు వారు ఇచ్చటకు వచ్చియున్నందులకు నేను కృతజ్ఞడనైయున్నాను. బహుశా మేము కొన్ని సిద్దాంతములలో భిన్న అభిప్రాయములను కలిగియుండవచ్చును, కాని ఆ ఒక పెద్ద నియమమున మేము ఏకమవ్వటకు సహోదరులుగా దానిముందు నిలబడియున్నాము, ఓ దేవా, అది మా సహవాసమును బలపరచనిమ్ము మరియు మా... మరియు దేవుని యొక్క కృప, ప్రేమ అనే కట్టుతో మమ్మల్ని మరింత ఎక్కువగా బంధించుము. ఇప్పుడు, ప్రభువా, ఇది ఒక మానవుడు చేయు పనికంటే ఎంతో అధికమైనదని మేము గ్రహించుచున్నాము, ఎందుకనగా నేడు రాత్రియందు ఇచ్చట నిత్యత్వమనే గమ్య స్థానమును చేరు ఆత్మలయందు మేము శ్రద్ధవహించవలసియున్నది. కాబట్టి పరిశుద్ధాత్మ వాక్యములోకి చొచ్చుకొని వెళ్ళి, దానిని మా ముందుంచి, మేము దేనినైతే ఎరుగవలెనని ఆయన ఆశించుచున్నాడో, ఆయన యొక్క స్వకీయ మార్గమున దానిని మాకు విశదపరచి అనుగ్రహించుము. ప్రభువా, దానిని అనుగ్రహించుము. ఈ మూడు ఆరాధనలు ముగించుటకు ముందుగా, మేము బలపరచబడిన సంఘముగాను, ఐక్యముతో మా హృదయములు మా ఉద్దేశ్యములు ఏకమై, దేవుని రాజ్యము యొక్క పౌరులమై, ఇంతకు ముందెన్నడూ లేని విధముగా ముందుకు కొనసాగిపోవలెను.

10

ప్రభువా, కొన్ని వారములుగా మంచి విశ్రాంతిని అనుగ్రహించినందుకు మరియు సంఘము ఎదుట, ఇచ్చటకు వచ్చియున్న ప్రజల ఎదుట నీకు కృతజ్ఞతలు తెలుపవలెనని ఆశించుచున్నాను. నీ ప్రసన్నత వలనను, నీ ఆశీర్వాదముల వలనను ఈ రోజు రాత్రి అద్భుతమైన అనుభూతిని నేను పొందుకొనుచున్నాను. ఓ దేవా, సముద్రమును దాటి అవతలి దేశమునకు వెళ్ళుచున్న ఇచ్చటయున్న ఈ సహోదరుడు కొరకు మేము ప్రార్ధి౦చుచున్నాము, అతడు దూరముగాయున్న చీకటితో నిండుకొనియున్న దేశములకు వెళ్ళుచున్నాడు. మా సహోదరుడు జెఫ్రీస్ వెళ్ళేటప్పుడు, అతడి కుమారుడ్ని మరియు అతడి భార్యను ఆశీర్వదించి, అతడికి ఎక్కువ ఆత్మలను అనుగ్రహించుము. అతడు ఈ సువార్త అనే వెలుగుతో చీకటికి రంధ్రములను వేసి ఆ సువార్త వెలుగును దూరముగా మరియు విశాలముగా ప్రకాశించునట్లు చేయుము. తండ్రీ, మా విజ్ఞాపనలను ఆలకించుము. ఈ విజ్ఞాపనను నీ కుమారుడగు యేసుక్రీస్తు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్.

11

ఈ రోజు రాత్రి, నేను నా చిన్న స్కోఫీల్డ్ పరిశుద్ధ గ్రంథమును చదువుచుండగా. మొన్ననే ఇరువది-ఐదు సంవత్సరములు దాటిపోవుటను నేను తెలుసుకొన్నాను. దానిని ఇంకా నేను చదువగలుగుచున్నాను, కాని అది కొంచెము మసకగా కనబడుచున్నది, కాబట్టి చదువుటకై కళ్ళ అద్దాలను ఒకటి నేను కొన్నాను. ఈ రోజు రాత్రి దానిని మొట్టమొదటగా ఉపయోగించుచున్నప్పుడు, అది ఎలాగున్నదనే దానిని నేను చూడబోవుచున్నాను. ఇప్పుడు, నాకు ఇటువంటి అంశములు గలవు, అది సంఘమనునది...? ఓ, అనేక విషయములు, వాటిని మనము చూడగలిగినయెడల, వాటిల్లో ఒకటి, మనమెందుకు సంఘముగా పిలువబడితిమి? మనమెందుకు ఒక శాఖ కాదు? ఎందుచేత? విశ్వాసి ఆత్మ యొక్క నిత్యభద్రత యందు మనమెందుకు నమ్మకమును కలిగియున్నాము? స్త్రీ ప్రసంగికులను మనమెందుకు ఖండించుచున్నాము? మనమెందుకు ముంచుట బాప్తిస్మమును ఇచ్చుచున్నాము? సంఘము శ్రమలగుండా వెళ్ళునా? అటువంటివి అనేక రకముల అంశములు గలవు; రాబోవు కొన్ని రాత్రులకు పదిహేను లేదు పదునెనిమిది అంశములు గలవని అనుకొనుచున్నాను.

12

కాబట్టి నేను ప్రారంభించాలనుకొను అంశము: “మనమెందుకు ఒక శాఖ కాదు?” అను దానిపై మాట్లాడుటకు ప్రభువు నా హృదయమును ప్రేరేపించుచున్నట్లుగా అనిపించినది అందుకు కారణము. ఇప్పుడు, శాఖలలో ఉన్నవారిపట్ల మాకు ఎటువంటి విరోధ భావమనేది లేనే లేదు. వారిని వ్యతిరేకించు భావము మాకు లేదు, కాని మేమెందుకు ఏ శాఖలలోకి వెళ్ళుట లేదనే దానిని గురించి వివరించాలని నేను ఆశించుచున్నాను. మీరెరుగు విధముగా నేనొక చిన్న బాప్టిస్టు సంఘములో సేవకుడిగా అభిషేకించబడితిని. సమీపకాలము వరుకు బాప్టిస్టు సంఘము ఒక శాఖగా లేదు. కాని ఇప్పుడు ఇతర శాఖల వలె అది కూడా ఒక శాఖగా మారిపోయినది. కాని మేము ఒక శాఖగా మారకపోవుటకు గల కారణమేమనగా...

13

ఇప్పుడు, మేము ఒక నిర్మాణము (Organization)గా యున్నాము. మేము నిర్మించబడిన నిర్మాణముగా యున్నాము, క్రీస్తును ఆరాధించుట కొరకు క్రమముగా ఏకమైయున్న ఒక సమూహ ప్రజలుగా న్యాయస్థానములో నమోదు చేయబడితిమి, కాని మేము ఒక శాఖలో లేము. ఏ ఒక్కరు కూడా మాపై అధికారమును చెలాయించలేరు, మీరు చూచారా. ఇది ఒక శాఖ కాదు. ఇది కేవలము క్రైస్తవ విశ్వాసుల మధ్యగల క్రమమైన సహవాసము. ప్రజలు ఈ సంఘమునకు వచ్చుచున్నారు. వారి జీవితాంతము వారు రావలనుకున్నంత వరుకు వచ్చినట్లైతే ఇది వారియొక్క గృహ సంఘముగా మారిపోవును.

14

వారు ఇచ్చటకు వచ్చి మరియు మేము ప్రసంగించు వాటన్నింటియందు భిన్న అభిప్రాయములను కలిగియుండవచ్చును. దానివలన ఎటువంటి అభ్యంతరము లేదు. అదంతా ఖచ్చితంగా సరియే. మీరు క్రైస్తవులుగా వున్నంత వరుకు, ఇతరులకు మేము చేయుచున్నట్లుగానే మీకు మా స్నేహ హస్తములను చాచి మీతో సహవాసమును చేసెదము. చూచారా? నేను నీటి ద్వారా ముంచుట బాప్తిస్మమునందు నమ్మకము గలవాడిని, మీరు చిలకరింపునందు నమ్మకము కలిగియున్నట్లైతే, దానితోనే నిలిచి యుండుము, మనమధ్య మన అభిప్రాయములు ఏకమైయుంటే ఏ విధముగా యుండెదమో, ఆ విధముగానే మనము యుండెదము. కాని మీరు క్రైస్తవ సహోదరుడుగా లేదా సహోదరిగా ఉన్నంత వరుకు, మిమ్మల్ని మేము పరిపూర్ణముగా ప్రతీ ఒక్కొక్కరిని ఆహ్వానించుచున్నాము, చూచారా.

15

కాబట్టి మాకు ఏ శాఖలు లేవు, ఎందుకనగా శాఖ సహోదరత్వమును విడదీయునదిగా యున్నదనేది నా అభిప్రాయము. కొందరు ఈ విధముగా చెప్పెదరు, “మంచిది, మాకు ఆ ఉజ్జీవముతో ఎటువంటి సంబంధము లేదు. అది ఒక మెథడిస్టు ఉజ్జీవము.” “మంచిది, అది బాప్టిస్టుల ఉజ్జీవము, దానితో మాకు ఎటువంటి సంబంధము లేదు. మేము మెథడిస్టులము, మాకు దానితో ఏ సంబంధము లేదు. ”సహోదరుడా, క్రీస్తు దానితో ఉండినయెడల, మనకు... మనకు అన్ని విధములుగా దానితో సంబంధముగలదు. మనము మన ప్రయత్నములన్నింటిని. అచ్చట క్రీస్తు శరీరమే బాధపడుచున్నది. దానిని అధికముగా నేడు మన దేశములో నేను చూచుచున్నాను. మనము ఎంతగా... ఇప్పుడు, క్రీస్తు ఎన్నడూ, ఏ సమయమునందును ఎటువంటి ఒక సంఘ శాఖను స్థాపించలేదు. ఇప్పుడు, దానిని దృఢముగా మనము తెలుసుకొనవలసిన అవసరత యున్నది.

16

ఇప్పుడు, మీలో ఏవరైనా గాని నేను చెప్పుచున్నవాటికి ఆధారముగా కొన్ని చరిత్రలను, లేదా ఇంకా కొన్ని ఇతర విషయములను తెలుసుకొనవలెనని ఆశించిన ఎడల, నేను రేపు రాత్రికి దానిని గురించి మిమ్మల్ని అడిగెదను. దాని గురించి చెప్పుటకు ఇప్పుడు నాకు సమయము లేదు. నేను వేరే అంశమునకు వెళ్ళుట లేదు, ఎందుకనగా ఆ ఒక్క అంశముపైనే వారమంతా వినియోగించెదము. కాని మీకు ఆ స్థలమును గురించి వేరే దేనిని గురించైనా తెలుసుకోవాలని ఆశించిన యెడల, మీరు నన్ను అడుగవచ్చును, వాటిని వ్రాసి ఆ బల్లపై ఉంచండి, దానిని నేను తీసుకొని మీకు వాటికి జవాబు ఇచ్చెదను.

17

ఇప్పుడు, మనకున్న చాలా ప్రాచీనమైన శాఖ, మరియు మొదటి సంఘ శాఖగా యున్నది కాథలిక్ సంఘమే. ఆ శాఖ మూడు వందలు లేదా అంతకన్నా కొంచెము ఎక్కువ సంవత్సరములలో చివరి అపోస్తులుడు మరణించిన తరువాత స్థాపించబడినది. అది నిజము. దాని మీరు ఆది నైసియా పితరుల పుస్తకములలోను, జోసెఫస్ వ్రాసిన పుస్తకము లోను ఓ, అనేకమంది గొప్ప చరిత్రకారులు ద్వారా చూడగలరు. చూచారా? సంఘ కాలములలో ఆఖరి అపోస్తలుడు మరణించువరకు, అపోస్తలుల కాలమునకు తరువాత మూడువందల సంవత్సరముల వరకు స్థాపించబడిన సంఘ శాఖలు ఒక్కటి కూడా లేదు. కాథలిక్ సంఘమే మొట్టమొదటి సంఘ శాఖగా స్థాపించబడినది.

ప్రొటస్టెంటు సంఘము, ఒక శాఖలో నుండి వెలుపలికి త్రోసివేయబడిన శాఖ యగును. మొట్టమొదటి సంస్కారము లూథర్ ద్వారా వచ్చినది, లూథరుకు తరువాత జ్వింగ్లీ వచ్చెను, జ్వింగ్లీకు తరువాత కాల్విన్ వచ్చెను, ఈ విధముగా ఒకరి తరువాత ఒకరు వచ్చిరి. అటు తరువాత వెస్లీ ఉజ్జీవము ఉద్భవించెను, అటు తరువాత అలెగ్జాండర్ కాంబెల్, జాన్ స్మిత్ ఇంకా అనేకులు వచ్చిరి. ఇప్పుడు మనకు గల చివరి కదలిక, పెంతెకోస్తు కాలములోని పలు భాగములుగా యున్నవి.

18

దేవుడు ప్రతి కాలములోను వ్యవహరించుచూ వచ్చెనని నేను నమ్ముచున్నాను. కాని ప్రతీసారి ఒక సంఘము విఫలమైనప్పుడు, అది ఒక శాఖగా మారిపోవుచుయున్నది. అది అచ్చటయే తప్పిపోవుటను మీరు ఎప్పుడైనా గమనించితిరా? ఆ విధముగా వారు ఎప్పుడైతే తప్పిపోవుచున్నారో, దేవుడు మరలా ఆ సంఘమును లేవనెత్తుట లేదు. అది తిన్నగా భీజములోనికి వెళ్ళిపోవుచున్నది. ఇప్పుడు, దానిగురించి చరిత్రను మీరు తెలుసుకోవాలని ఆశించినయెడల, దానిని మేము ఇవ్వగలము. సంఘ చరిత్రలలో, పడిపోయిన ఏ ఒక్క శాఖ సంస్థయు మరలా పైకి లేవనే లేదు. బాప్టిస్టు, మొతడిస్తు, ప్రెస్బిటేరియన్, లూథర్ మరియు అది ఏదైనా గాని, ఎప్పుడైతే అవి పడిపోయినవో, అప్పుడే అవి నశించిపోయినవి. ఇప్పుడు, అది నిజము. నేను ఇప్పుడు చెప్పిన విధముగా, చాలా క్షుణ్ణముగా మీరు దీనిని ఆలకించవలెను, దీనిని మీ అంతరంగములో పదిలపరచుకొనునట్లుగా మేము చెయ్యబోవుచున్నాము, చూచారా? ఒక వ్యక్తి వ్యక్తిగతముగా వెలుపలికి వచ్చి, ఒక సంఘమును స్థాపించినప్పుడు, అది ఎన్నడూ నిలదొక్కుకొని యుండలేకపోయినది.

19

దేవుడు వ్యక్తిగతముగా ఒక్కరితోనే వ్యవహరించును, శాఖతో కాదు. ఏ ఒక్క కాలములోను దేవుడు ఒక శాఖతో వ్యవహరించునట్లుగా లేదు. ఆయన ఎల్లప్పుడూ వ్యక్తిగతముగా ఒక వ్యక్తితోనే వ్యవహరించును. పాత నిబంధనలో ఆయన వ్యక్తిగతముగా ఒకరితోనే వ్యవహరించెను. అదే విధముగా నూతన నిబంధనలోను ఆయన వ్యక్తిగతముగా ఒక్కరితోనే వ్యవహరించెను. ఏ కాలములోనైనను ఆయన ఎల్లప్పుడూ వ్యక్తిగతముగా ఒకరితోనే వ్యవహరించును గాని శాఖలతో వ్యవహరించడు. కాబట్టి దేవుడు శాఖలో లేనియెడల, నేను ఏ శాఖతోనైనా సంబంధమును కలిగియుండుట వలన నాకు ఏ ప్రయోజనము గలదు? ఇప్పుడు, నేను శాఖలలోయున్న ప్రజల గురించి మాట్లాడుట లేదు, నేను సంఘ శాఖ గురించే మాట్లాడుచున్నాను; ఎందుకనగా దేవుని యొక్క ప్రజలు ఆ శాఖలలో అన్నింటిలోను గలరు.

20

ఇప్పుడు, దేవుడు ఒక హెచ్చరిక అనే దానిని దానికి ఇవ్వకుండా, దానికి ఏమి సంభవించదు, దానికి ఏమైన సంభవించుననే దానిని నేను నమ్మట లేదు....

ఇప్పుడు, ఉదాహరణముగా, సంఘములలో నుండి వెలువడిన వివాదాంశములు వలె. సమీపకాలమందు మనకు రక్తమును గురించి మరియు నూనెను గురించి వివాదము కలిగినది. దాని సంబంధముగా, “ప్రియమైన సహోదరుడా బ్రెన్హాం,” అని ఒక ఉత్తరము మొదలగునవి వచ్చుటను మీరెరుగుదురు. దానికి విరుద్ధముగా నేను నిలబడుటకు కారణమేమనగా, అది వాక్యములోనిది కాదు. ఆ కారణముగానే నేను శాఖలను వ్యతిరేకించుచున్నాను, ఎందుకనగా అది వాక్యములోనిది కాదు. విశ్వాసమునకు ఆధారముగా దానిలో ఏదైనా ఒకటి యుండవలెను. దానికి మనము ఏదైనా ఒక శాఖపై ఆధారపడకుండా, దానికి మనము దేవుని యొక్క వాక్యముపై ఆధారపడియుండవలయును. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము మాత్రమే అందుకు పునాదియై యున్నది.

21

దేవుని యొక్క వాక్యము ఒక శాఖను గురించి మాట్లాడలేదు, కాని శాఖకు విరుద్ధముగా మాట్లాడినది, కాబట్టి మనము వాక్యము మాట్లాడునదే మాట్లాడవలెను. బిషప్ ఏమి చెప్పినను, ఇతరులు ఏమి చెప్పినను, ఎవరేమి ఆలోచించినను, ఏ మంచివారు ఏమి చెప్పినను, ఏది ఏమి చెప్పినను, అది దేవుని యొక్క వాక్యానుసారముగా లేనియెడల, అది తప్పిదమైనది. గమనించారా, అది ఆ విధముగానే యుండును, వాక్యమే అంతిమమైనదిగా యుండవలెను. దేవుని యొక్క వాక్యమే ఖచ్చితమైనదిగా యుండవలయును. ఆమేన్.

ఇప్పుడు గురుంచుకోండి, శాఖలలోయున్న వారిని నేను క్రైస్తవులు కాదు, అని చెప్పుట లేదు (దానిని మీరు అర్ధముచేసుకొన్నారా). ఆ శాఖలన్నింటిలలోను వేలమంది ప్రశస్త్రమైన ఆత్మలు యున్నవి, వారు దేవుని యొక్క పిల్లలుగా యున్నారు. కొని వారిని ప్రత్యేకపరచి మరియు వేరుచేసి యుండుటకు నేను దానిని వ్యతిరేకించుచున్నాను. దేవుని యొక్క వాక్యము దానికి విరోధముగా యున్నది.

22

నేడు దేశములో కనబడు వాదము (ism), ఈ దేశములో ఎప్పుడైనా ఒక వాదము ఉండినయెడల, అది రాబోవుచున్నదని దేవుని యొక్క వాక్యము ముందుగానే దానిని చూచి ప్రవచించినది. మనకు అవసరమగు సమస్తమును దేవుని యొక్క వాక్యము ఇచ్చటయున్న ఈ వాక్యములో నుండి మనకు ఇచ్చునని నేను నమ్ముచున్నాను. మన ఆదినుండి అంతము వరకు, అది సరిగ్గా దేవుని యొక్క వాక్యములో కనబడుచున్నది. అటు తర్వాత అది దేవుని యొక్క వాక్యములో యున్నయెడల, అది ముందుగానే చెప్పబడినదని అప్పుడు మనము నమ్మొదుము. దేవుని యొక్క వాక్యము ఒక హెచ్చరికగా యున్నది.

23

ఇప్పుడు, మీరు దేవుని యొక్క వాక్యమును వార్తాపత్రికను చదువుచున్నట్లుగా చదువవద్దు. పరిశుద్ధాత్మ ద్వారా మీరు దేవుని యొక్క వాక్యమును చదువవలెను, చూచారా. ఎందుకనగా పరిశుద్ధాత్మయే క్రీస్తు ద్వారా మాట్లాడుచున్నది — వీటిని జ్ఞానులకు, వివేకులకు మరుగుపరచి, పసిబాలురకు బయలుపరచుట చేత క్రీస్తు దేవుడను స్తుతించెను. కాబట్టి, మీరు చూడండి, విద్యా జ్ఞానమును పొందుకొనుటకు మరియు శాఖగా మారుటకు అచ్చట మార్గమేమియు లేదు, క్రమపద్ధతిలో వెళ్ళుటకు ఒకే ఒక్క మార్గము గలదు, అది దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడుటయే. మరియు ఆ అనుభవము ఈ వాక్యముతో ఖచ్చితముగా ఇమిడిపోయి యుండునట్లుగా మీరు కలిగియుండవలయును. అప్పుడు మీరు దానిని పొందుకొనెదరు. చూచారా?

24

ఇప్పుడు ఇంకా కొన్ని నిమిషములలో దీనికొరకు మనము వచ్చునప్పుడు, మనము ఎటువంటి జనులతో వ్యవహరించుచున్నామో, వారిలో కొంతమంది తమ సిద్దాంతములయందు యుండు కాల్వినిస్తువాదులు, వేరేకొంతమంది ఆర్మేనియన్వాదులు మరియు వివిధ మార్గముల వారు గలరు. ఇప్పుడు, ఇచ్చట ఎల్లప్పుడూ, ఒక రొట్టెను నీవు ఎన్ని పల్చటి తునకలుగా విరిచినను, దానికి రెండు ప్రక్కలు ఉండును. అది ఖచ్చితముగా నిజము. తమ సిద్దాంతములు సరియైనవియేయని కారణములు చూపి ఒప్పించు విషయములను వారు కలిగియుందురు, కాని అందులోని విషయమేమనగా, అందులో సత్యమనేది ఎచ్చట యున్నది? అందుకొరకే మనము ఇచ్చటకు వచ్చియున్నాము, మేము దానిని దేవుని యొక్క కృప ద్వారా దానియొక్క సత్యమును మేము మీకు చూపించెదము అని అనుకొనుచున్నాము. ఇప్పుడు, మనము తీసుకొనెదము... కొన్ని సంఘముల యొక్క సిద్దాంతములను నేను సేకరించి వాటిని ఇచ్చట వ్రాసియుంచుకున్నాను.

25

ఇప్పుడు మీరందరూ, కొద్ది నిమిషములు పరిశుద్ధ గ్రంథములో ప్రకటన మొదటి అధ్యాయము లేదా ప్రకటన 17వ అధ్యాయము నుండి ప్రారంభించుటకు మనము త్రిప్పెదము. దానిని మనము చదివి ఈ సంఘములు ఎచ్చట ప్రారంభించబడినవనే దానిని గురించి మరియు దానిని ఏది ప్రారంభించినదనే దానిని గురించి చూచెదము. ఇప్పుడు, పరిశుద్ద గ్రంథము అన్నింటిని గురించి ముందుగానే హెచ్చరించుచున్నది. మనము మనము జీవించుచున్న ఈ దినములను గూర్చి కూడా అది ముందుగానే హెచ్చరించియున్నది. మరిప్పుడు, మీరు తలంచినయెడల, ప్రకటన 17వ అధ్యాయము. నేను 13వ అధ్యాయమని పొరపాటుగా చెప్పితిని, అది దేనిని గురించి... దానికి కొద్దిసేపు తరువాత వచ్చెదము. అందులో అమెరికా గురించి ప్రవచనము పలుకబడియున్నది. కాని చాలా క్షుణ్ణంగా ఇప్పుడు ఆలకించండి.

ఆ యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఈలాగు చెప్పెను - నీవిక్కడికి రమ్ము; విస్తార జలముల మీద కూర్చొన్న మహా వేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను.

ఇప్పుడు గుర్తించుకోండి, ఇది చాలా మర్మముగా ధ్వనించును. ఇప్పుడు, ఈ నీచురాలైన స్త్రీ. మేము దీనిని బోధించినయెడల, ఈ గురుతుల గురించి భావమును మొదటగా మీరు కనుగొనియుండవలయును. పరిశుద్ధ గ్రంథములో ఒక స్త్రీ “సంఘము”నకు సాదృశ్యముగా యున్నది. ఎంతమంది దానినెరుగుదురు? మనము ఒక వధువుగా యున్నాము, సంఘము ఒక వధువుకి సాదృశ్యముగా యున్నది.

26

“నీ విక్కడికి రమ్ము, వారికి తీర్చబడు తీర్పును నీకు నేను కనుపరచెదను.” ఇప్పుడు, ఈ మహావేశ్యకు తీర్పు తీర్చబడబోవుచున్నదని చెప్పబడియున్నది, ఆ మలినమైన స్త్రీ, విస్తారమైన జలముల మీద కూర్చొనియున్నది. ఇప్పుడు, స్త్రీ “సంఘము”నకు గురుతుగా యున్నది. నీళ్ళు “ప్రజలకు” గురుతుగా యున్నవి. ఇప్పుడు దీనిని మీరు గమనించిన యెడల, ఈ అధ్యాయములో యున్నప్పుడే 15వ వచనమును చూడండి.

దూత నాతో ఈలాగు చెప్పెను - ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మూటలాడు వారిని సూచించును. [చూచారా?]

ఇప్పుడు, ఈ గొప్ప సంఘము, గొప్ప స్త్రీ, ఆమె ఒక నీచురాలైన స్త్రీగా యున్నదనే దానిని మీరు ఇప్పుడు గుర్తుంచుకోండి. స్త్రీ సంఘమునకు సాదృశ్యముగా యున్నయెడల క్రీస్తు యొక్క సంఘము ఒక వధువుగా యున్నది, ఒక పరిశుద్ధ వధువుగా యున్నది. ఇక్కడ ఒక అపవిత్రమైన స్త్రీ గలదు. అట్లయిన అది అపవిత్రమైనదిగాను, వేషధారి వలె యుండు వధువుగా యుండవలయును. చూచారా? ఇప్పుడు, ఆమె ఏమి చేయుచున్నది? “ఆమె జలముల మీద కూర్చొనియున్నది.” లేదా “పైన కూర్చొనియున్నది” అనగా “విస్తారమైన జలములపై అధికారమును చెలాయించుచున్నది,” అని అర్థమగును. ఇంకొక మాటలలో చెప్పాలంటే, సమస్త భాషలు మాట్లాడువారు మరియు జనములు మీద ఆమె యొక్క అధికారము గలదు. ఈ స్త్రీ, ఆమె ఒక గొప్ప వ్యక్తిగా యున్నది.

27

ఇప్పుడు, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి...

“భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి,” ఐశ్వర్యవంతులు, గొప్ప మనుష్యులు ఆ విధముగా చేసిరి. మీరు ఏ విధముగా చేయగలరు... ఒక రాజు ఏ విధముగా ఒక సంఘముతో వ్యభిచరించును? అది ఆత్మీయమైన వ్యభిచారమగును. ఆత్మీయమైనది... వ్యభిచారము అనగా ఏమిటి? అది, ఒక స్త్రీ తన భర్తకు విరుద్ధముగా చేయు తప్పుడు కార్యము వంటిది, ఆమెకు - ఒక భర్త యుంటుండగానే వేరొక పురుషునితో ఆమె జీవించుట. అట్లైన ఈ సంఘము - క్రీస్తు యొక్క వధువువలె నటించుచూ భూరాజాలతో ఆమె వ్యభిచరించుచూ మలినమైనదిగా జీవించుచు, నీచ వృత్తిని ఆమె చేయుచున్నది. ఓ, అది లోతైన మరియు గొప్ప భావముతో నిండినదైయున్నది. నేను వాక్యమును ఎంతో ప్రేమించుచున్నాను!

28

ఇప్పుడు గమనించండి.

భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి.

ఆమె త్రాగుటకు మద్యమును యిచ్చి, ఆమె దానితో ప్రేరేపించినది: “మేమే సంఘము. మేమే దానిని పొందుకొనియున్నాము!” చూచారా? ఇప్పుడు, దీనిని మీ మనస్సులో పదిలపరచుకోండి. మంచిది.

అప్పుడతడిని అరణ్యమునకు కొనిపోగా,... దూత యోహాను వైపు చూచి, “మహా సంఘమునకు చేయబడు తీర్పును నేను నీకు కనపరచెదను.” ఇప్పుడు, గమనించండి.

అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా: దేవదూషణ నామములతో నిండుకొని యేడు తలలును పది కొమ్ములును గల ఎర్రని మృగము మీద కూర్చుండిన యొక స్త్రీని చూచితిని..

పరిశుద్ధ గ్రంథములో “ఎర్రని” (Scarlet) రంగును “రాజయోగ్యమైన” దానికి సాదృశ్యముగా యున్నది. “సింధూర వర్ణము” (Scarlet) అనగా “ఎర్రని” (Red) రంగు అని అర్థమగును. మరియు “మృగము” (beast) “అధికారమునకు” (power) సాదృశ్యముగా యున్నది. ప్రకటన 13వ అధ్యాయములో ఆ మృగము సముద్రములో నుండి పైకి వచ్చుటను మీరు గమనించితిరా? మృగము సముద్రములో నుండి పైకి వచ్చుటను మీరు ఎప్పుడైతే చూచుచున్నారో, దాని భావమేమనగా ప్రజల మధ్యనుండి ఈ అధికారము పైకి లేచుచున్నదని అర్థమగుచున్నది; కాని ప్రకటన 13వ అధ్యాయములో గొర్రెపిల్ల పైకి లేచి వచ్చినప్పుడు, భూమిలోనుండి పైకి వచ్చుచున్నది — అది జనసంఖ్య అధికముగా లేని అమెరికా దేశము. కాని దాని తరువాత దానికి రెండు అధికారములు గలవు, అవి రాజ్యాధికారము మరియు మత సంబంధమైన అధికారముగా యున్నవి. అది అధికారమును పొందుకొని, ఇంతకుముందున్న ఆ ఘట సర్పమువలె అది మాట్లాడినది. కావున మీరు దానిని గుర్తించుకొంటూ వెళ్ళవలెను. అనేక సంవత్సరముల క్రితము విగ్రహారాధికులైన రోములో వారు చేసినట్లుగానే మత సంబంధమైన బాధలలోకి మనము వచ్చుచున్నాము. అది “ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడుగా” యున్నది. ఇప్పుడు, అది ఏమైయున్నది... “దానిపై కూర్చొనియున్న ఒక మృగము,” ఒక అధికారమునుగలదిగా అది యన్నది.

29

రిబ్కాను మీరు గమనించితిరా? ఎలీయాజరు ఆమెను కనుగొనినప్పుడు అది సాయంకాలపు సమయముగా యుండినది, ఆమె ఒంటెలకు నీళ్ళను పోయుచున్నది. ఎందుకనగా ఎలీయాజరు, “నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్ళు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో, ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండును గాక,” అని మనస్సులో అనుకొనెను. అతడు ఆ విధముగా ప్రార్ధి౦చుచుండగానే, రిబ్కా అచ్చటకు వచ్చి నీళ్ళను చేదుకొనుచు, అతడు త్రాగుటకును మరియు అతడి ఒంటెలకును నీళ్ళు పోసెను. గమనించండి, ఒంటె ఒక మృగముగా యున్నది. ఏ ఒంటెలకు ఆమె నీళ్ళును పోసినదో, అదే మృగము ఆమె యొక్క వరుడగు ఇస్సాకు యొద్దకు ఆమెను మోసుకొనిపోయినది.

30

ఆ విధముగా నేడు సంఘము కూడా నీళ్ళును పోయుచూ మరియు ఆరాధించుచున్న అదే పరిశుద్ధాత్మ యొక్క శక్తి, వరుడుని సంధించుటకు ఆమెను భూమిలో నుండి కొనిపోవును. నిశ్చయముగా, ఇస్సాకు సాయంకాలమందు వెలుపల పొలములో యుండెను. మనము ప్రభువును మహిమలో సంధించము. ఆయనను మనము ఆకాశములో సంధించెదము అని ఎఫెసీయులు 5వ అధ్యాయములో చెప్పబడియున్నది. ఓ, అది మెతడిస్తులను కేకలు వేయునట్లుగా చేయుచున్నది. దానిని గురించి ఆలోచించండి! చూచారా? ప్రభువు... ఇస్సాకు తన తండ్రి గృహము నుండి వెలుపలికి వచ్చి అతడు పొలములో యున్నప్పుడు రిబ్కా ఒంటెలమీద వచ్చుటను అతడు చూచెను. ఆమె అతడిని చూచిన మొదటి చూపులోనే అతడిని ప్రేమించుటచే, ఆమె ఒంటె మీదనుండి దూకి, అతడిని సంధించుటకు పరిగెత్తుకొనుచు వెళ్ళినది. అది నిజము. మనము కూడా ప్రభువుని ఆ విధముగా సంధించెదము. ఏ ఒంటెకైతే ఆమె నీళ్ళను పోసినదో, అదే ఒంటె ఆమెను, ఆమె యొక్క భర్త దగ్గరకు మోసుకొని వెళ్ళినది. సంఘము ఆరాధించుచున్న అదే శక్తి, లోకము దానిని మూఢభక్తి అని అందురు, ఆకాశములో ప్రభువును సంధించుటకై సంఘమును ఆకాశములోనికి అదే శక్తి పైకి కొనిపోవును; అదియే పరిశుద్ధాత్మయై యున్నది, చూచారా. అచ్చట అది.

గమనించండి, రిబ్కా ఒక కన్యగా యున్నది.

31

కాని మనము ఇచ్చట చెప్పుకొనుచున్న ఈ స్త్రీ ఒక వేశ్యగా యున్నది.

ఇప్పుడు, అధికారము అనగా ఏమిటన్నదనే దానిని మీరు అర్థము చేసుకోగలిగితిరా? అధికారము, అనగా అది ఒక మృగముగా యున్నది, ఆమె ఎర్రని రంగు గల మృగముపై కూర్చొనియున్నది. ఇప్పుడు, అది ఎటువంటి విధమగు ఒక మృగమైయున్నది? ఎర్రని రంగుగలది; అనగా అది ఒక “ఐశ్వర్యముతో కూడిన అధికారము”ను గలదిగా యుండును. ఆమె ఇప్పుడు ఎటువంటి ఒక సంఘముగా యుండును? ఆమె సంపన్నురాలైన ఒక సంఘముగా యుండును; ఆమె ఒక గొప్ప సంఘముగా ఉండును. ఆమె ఒక అధికారము గల సంఘముగా యుండును మరియు ఆమె ప్రభావము వలన సమూహములు మరియు ప్రజలు కొట్టుకొనిపోవుదురు. ఆమెతో భూరాజాలు, ఆత్మీయ వ్యభిచారమును చేయుదురు, మరియు భూమిపైయున్న గొప్పవారును ఆమెతో ఆత్మీయ వ్యభిచారమును చేసెదరు. ఇంకా కొద్ది నిమిషములలో ఆమె ఎవరనేది మనము కనుగొనెదము. మరియు ఈ శాఖల గురించియు కనుగొనెదము.

ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల (రాజత్వమైన) వస్త్రము ధరించుకొని, బంగారముతోను, రత్నములతోను, ముత్యములతోను అలంకరింపబడినదై, ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన యొక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొనియుండెను.

ఆమె తన చేతితో ఏమి పట్టుకొనియుండెను? ఆమె యొక్క సిద్దాంతమును, దానిని ఆమె ప్రజలకు ఇచ్చి: “మేమే సంఘము! మేమే ఇది!” ఆమె దానిని భూరాజులు త్రాగునట్లు చేసినది. వారిని ప్రేరేపించునట్లు చేసినది, “మేము ఇది! మాకు గొప్ప అధికారములు గలవు! మేము ప్రతీ రాజ్యాన్ని ఊడ్చివేయుదుము! మాదే గొప్ప సంఘముగా గలదు. రండి, మా సిద్దాంతమును త్రాగండి... ఇచ్చట, దీనిలోనిది కొంచెము పోసుకొని త్రాగండి, మీరు దానిని త్రాగండి, మీరు దానిని త్రాగండి.” అదే అచ్చట గలదు, చూచారా, “ఒక సువర్ణ పాత్రను ఆమె తన చేత పట్టుకొనియుండెను.”

32

గమనించండి.

ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణముగల వస్త్రము ధరించుకొని, బంగారముతోను, రత్నములతోను, ముత్యములతోను అలంకరింపబడినదై, ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన యొక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొనియుండెను.

ఇప్పుడు స్నేహితుల్లారా, ఒక వార్తాపత్రికను మనము చదువుటలేదు. దేవుని యొక్క నిత్యమైన మరియు ఆశీర్వదించబడిన వాక్యమును మనము చదువుచున్నాము. ఆకాశములు మరియు భూమి సమస్తము గతించిపోవును, కాని ఆ వాక్యము నిలిచియుండును. అది నిజము.

దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడియుండెను - మర్మము, వేశ్యలకును, భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లియైన మహా బబులోను.

33

ఇప్పుడు, ఇచ్చట కొంతకాలము క్రితము, “గోడమీద చేతివ్రాత” అనే ఒక అంశముపై నేను ప్రసంగించితిని, కాని అది ఇచ్చట ఈ సంఘములో కాదని నేను తలంచుచున్నాను, మరియు బబులోను యొక్క చారిత్రాత్మకమైన స్థితిని గురించి అప్పుడు చెప్పితిని. ఇప్పుడు, పుట్టుకొచ్చిన ప్రతీ “వాదము,” (ism) నేడు ప్రపంచములో కనబడు ప్రతీ మత మార్గము మరియు ప్రతీ “వాదము,” ఆదికాండములో ప్రారంభమైనవి. ఇప్పుడు, హిస్లోప్స్ పుస్తకమును తీసుకొని దానియొక్క చరిత్రను మీరు చదువుకుంటూ వచ్చినయెడల లేదా ఆ మంచి పుస్తకములలో కొన్నింటిని మీరు చూడగోరినయెడల, ఒక్కొక్క “వాదమును,”“ చూడగలరు. ఇంకా కొన్ని నిమిషములలో, స్త్రీ ప్రసంగికుల గురించి, చూచారా, మీకు చెప్పుటకు, అది ఎచ్చటనుండి ప్రారంభమైనదని తెలుసుకొనుటకు, అది ఆదికాండములో ప్రారంభమైనదని, చూచారా, చూపించుటకై నేను మిమ్మల్ని అచ్చటకు తీసుకొని వెళ్ళబోవుచున్నాను. వ్యత్యాసమైన కార్యములు ఆదికాండములో నుండి ఏ విధముగా ఉద్భవించినవనే దానిని చూద్దాము. ”ఆదికాండము“ అనగా ”ఆరంభము“ అని అర్థమగును. ఎంతమంది అది నిజమని ఎరుగుదురు? ఆదికాండము అనగా ఆరంభము, కాబట్టి ప్రతీదానికి ఒక ఆరంభము ఉండవలయును.

34

ఒక వృక్షమును నేను చూచునప్పుడు, నేను అరణ్యములలో రెండు, మూడు నెలలు యుంటిని. నేను ఒక వృక్షమును చూచినప్పుడు అది ఎంత అందముగా యున్నది. నేను దానిని చూస్తున్నాను. అది కృశించుచు పోవుచున్నది, ఇంకొకటి అచ్చట పుట్టుకొని వచ్చుచున్నది. నిరంతరముగా కొనసాగు జీవన ప్రక్రియ. దానిని గురించి నేను ఆలోచించి చూచాను. కాని వృక్షమునకు ఎచ్చటో ఒక ఆరంభము గలదు. దానికి ఒక ఆరంభము వుండి తీరవలయును. దానిని ఒక వృక్షమని పిలుచుచుండగా (లేదా సింధూర వృక్షమని, లేదా ఒక పెద్ద వృక్షము లేదా ఒక బోరుగు వంటి ఒక అడవి వృక్షమనియు లేదా ఒక తాటిచెట్లు అని లేదా దానిని ఏమని పిలచినా), దాని వెనుక ఒక పరిపూర్ణమైన జ్ఞానము దానికి యుండియుండవలయును. లేదా సింధూర వృక్షము ఒక్కటి మాత్రమే యుండినయెడల లోకములో నున్న వృక్షములన్నియు సింధూర వృక్షముగానే యుండియుండును. కాని ఏదో ఒక పరిపూర్ణమైన జ్ఞానము దానిని క్రమపరచియుండును. ఆయన పరిశుద్ధ నామము ఆశర్వీదించబడును గాక!

ఆయనే చంద్రుడిని, నక్షత్రములను సూర్య కుటుంబములో అమర్చెను. ఆయన సమస్తమును క్రమములో యుంచెను. ఆయన యొక్క సంఘమును ఆయన అభిప్రాయములన్నింటిని మన ఆలోచనలలో నుండి తీసివేసి కల్వరిలోకి మనల్ని పూర్తిగా పడద్రోసినప్పుడు, ఆ సంఘము ఉత్తరము, దక్షిణము, తూర్పు మరియు పడమర దిశలలోకి లేదా ఏ దిశలోనికైనను ఆయనకు ఇష్టమైన రీతిలో తనకనుకూలముగా అది తిరుగుచుండును. మనము వృక్షములవలె మరియు ఆయన యొక్క ఇతర సృష్టివలె ఆయనకు విధేయులమై యున్నప్పుడు, ఆయన దానిని క్రమములో యుంచును. చంద్రుడు ఈ విధముగా “ఈ రోజు రాత్రికి నేను వెలుగునివ్వను, నాకు బదులుగా మీలోని కొన్ని నక్షత్రములు ప్రకాశించి వెలుగునివ్వండి,” అని చెప్పుటను మీరు ఆలకించలేరు. కాని మనము — ఆ విధముగా లేము, మనము వ్యత్యాసమైనవారము, మీరు చూచరా?

35

ఇప్పుడు, బబులోను, బబులోను ఏ విధముగా ప్రత్యక్షమైనదనే దానిని గమనించండి. అది పరిశుద్ధ గ్రంథములో మొదట కనబడుచున్నది. అది పరిశుద్ధ గ్రంథములో మధ్యలో కనబడుచున్నది, మరియు అది పరిశుద్ధ గ్రంథములో చివరలో కనబడుచున్నది. ఇప్పుడు, అందులో ఏదో వున్నది... ఇప్పుడు, అది నిమ్రోదుతో ఆరంభమగుచున్నది. నిమ్రోదు పీనారు లోయలో బబులోను నిర్మించెను. అది టైగ్రీస్ నదికి, యూఫ్రటీస్ నదికి మధ్య గలదు. యూఫ్రిటీసు నది దానిగుండా పారుచున్నది. ఆ దేశపు ప్రతీ రహదారి తిన్నగా బబులోనుకు నడిపించును. ప్రతీ ఒక్కొక్క ద్వారపు తలుపు రెండు వందల అడుగుల వెడల్పును కలిగియుండును, అవి ఇత్తడితో చేయబడినవి. మీరు బబులోను నగరములోనికి వెళ్ళినయెడల, ప్రతీ వీధి తిన్నగా సింహాసనము యుండు స్థలమునకు నడిపించును.

36

ఇప్పుడు, మీరు రోమునకు వెళ్ళిన, ప్రతీ రహదారి వైపుకు నడిపించును. ఒక బాల యేసును చేతిలో పట్టుకొనియున్న కన్య మరియు అచ్చట రహాదారి మలుపు తిరుగు ప్రతీ మారుమూలలో కూర్చొనియుండి రోము వైపునకు దారి చూపుచున్నట్లుగా యుండును. చూచారా? అది పరిశుద్ధ గ్రంథమందు మొదటలో కనబడుచున్నది, అది పరిశుద్ధ గ్రంథము యందు మధ్యలో కనబడుచున్నది, మరిచ్చట అది పరిశుద్ధ గ్రంథము యందు ఆఖరిలో కనబడుచున్నది. ఇప్పుడు, కొద్ది నిమిషములలో చదవాలని నేను ఆశించుచున్నాను, అందువలన మీరు దీనియొక్క నేపథ్యమును తెలుసుకోగలరు, చూచారా. సరే.

మరియు ఆ స్త్రీ [సంఘమూ ఇప్పుడు గమనించండి, మీరు “స్త్రీ” అనే పదమును చూచినప్పుడు అది “సంఘము” అని దానిని తలంచుకోండి, చూచారా] ... పరిశుద్దుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి యుండుట చూచితిని.

ఇప్పుడు, “పరిశుద్దులు” అనే మాట ఎచ్చట నుండి వచ్చినది? అది “పరిశుద్దుడుగా చేయబడినవాడు” లేదా “పరిశుద్ధపరచబడినవాడు” అనే మాటలలో నుండి వచ్చినది. పరిశుద్దుడుగా చేయబడినవాడు. సరే.

37

ఆ స్త్రీ పరిశుద్దుల రక్తము చేతను మత్తిల్లినట్లు నేను చూచితిని...

ఇప్పుడు, ఈ స్త్రీ సంఘముగా యుండిన యెడల, ఆమె పరిశుద్దులను హింసించెను. ఆమె గొప్ప సంఘముగా యున్నది. ఆమెకు భూమియందంతటా అధికారమును కలిగియున్నది. ఆమె విస్తారమైన జలముల మీద కూర్చొనియుండెను. భూరాజులు ఆమెతో వ్యభిచారమును చేసిరి. మంచిది, ఆమె ఎవరైయున్నది? ఒక విధమగు మర్మముగా యున్నది. ఇప్పుడు ఆత్మలు. సంఘములో తొమ్మిది రకముల ఆత్మ వరములు యున్నట్లుగా మీరెరుగుదురు, ఒకటి జ్ఞానము, గ్రహింపు, స్వస్థత మరియు మొదలగునవి.

యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి యుండుట చూచితిని...

వారు యేసు చెప్పిన దానిని గురించి అంతగా ఆసక్తిలేనివారై, సంఘము చెప్పినదానియందే మిగుల ఆసక్తిగలవారుగా యున్నట్లు కనబడుచున్నది. అది నిజము. అది వాస్తవము కూడా.

38

.....నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా.

“నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా. నేను ఆమెను గూర్చి ఒక ఆశ్చర్యకరమైన కార్యముగా యుండినది. ఏ విధముగా ఆ స్త్రీ, అది నేను ఆశ్చర్యపడితిని...” ఇప్పుడు, నేను యోహాను యొక్క స్థానమును తీసుకొని దానిని కొంచెము తేటగా విశదపరచుటకు ప్రయత్నించెను, చూచారా. యోహాను, “అచ్చట ఆమె కూర్చొనియున్నది. ఆమె ఒక క్రైస్తవ సంఘమువలె నటించుచున్నది. ప్రపంచమునందుండు సమస్త సంపదపై ఆమె ఆధిపత్యమును కలిగియున్నది. భూమియొక్క రాజాలు ఆమె పాదముల క్రింద గలరు. ఆమె ఒక ఐశ్వర్యవంతురాలుగాను మరియు ఆకర్షణీయమైన వర్ణములనుగలదైయున్నది. ఆమె ఏ విధముగా యేసు యొక్క హతసాక్ష్యుల రక్తము చేత మత్తిల్లినట్లు యుండగలదు? ఆమె తనను ఒక క్రైస్తవరాలుగాను మరియు ఒక క్రైస్తవ సంఘముగా చెప్పుకుంటూ, ఏ విధముగా క్రీస్తు యొక్క సాక్షులను హతమార్చగలదు?”

39

ఇప్పుడు, గమనించండి.

ఆ దూత నాతో ఇట్లనెను - నీవేల ఆశ్చర్యపడితివి? యీ స్త్రీని గూర్చిన మర్మమును, ఏడు తలలును, పది కొమ్ములును గలిగి దాని మోయుచున్న క్రూరమృగమును నేను నీకు తెలిపెదను.

ఇప్పుడు, దీనిని ఇప్పుడిచ్చట సామాన్యముగా చదువుచున్నాము. దీనిని మీరు పట్టుకొనండి, ఇది చాలా సుళువుగా యుండును.

నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని యిప్పుడు లేదు, అయితే అది పాతాళపు అగాధము నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకు సిద్ధముగా యున్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథము సందు ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారు, ఆ మృగము యుండెను గాని యిప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలిసికొని ఆశ్చర్యపడుదురు.

ఇప్పుడు, ఇప్పుడిది ఇది కొద్దిగా గిల్లును, కావున అది ఇక్కడ ఉంది. అతడు పలికెను, ఇప్పుడు గమనించండి, ఎప్పుడైతే అందరు, కొందరు కాదు, అయితే భూమిపై నివసించువారందరు, అందరు. ప్రపంచములోని వార౦దరు ఈ స్త్రీ గురించి ఆశ్చర్యపడుదురు. అయితే ఒక్క గుంపు ప్రజలు దానిగురించి ఆశ్చర్యపడరు, ఎవరి పేర్లయితే గొర్రెపిల్ల జీవగ్రంధములో వ్రాయబడియున్నవో వారు.

40

ఇప్పుడు, దీనిని సరిగ్గా ఇచ్చుటయే ఎంత గట్టిగా చెప్పవలయునో నేను అంత గట్టిగా దీనిని చెప్పుట మంచిదగును, ఎందుకనగా దానికి ఇంకా కొన్ని నిమిషములలో మనము రాబోవుచున్నాము. చూచారా? వారియొక్క పేర్లు ఎప్పుడు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో వ్రాయబడినవి? ఎప్పటి నుండి? వారు పాల్గోన్న ఆఖరి ఉజ్జీవ కూటమునందా? వారు దైవపీఠము యొద్దకు వెళ్ళిన ఆ రాత్రా? వారు సంఘమునందు చేరిన రాత్రా? నేను మిమ్మల్ని నొప్పించాలని ప్రయత్నించుట లేదు, కాని నేను మీకు చెప్పుచున్నాను, వారి పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో జగత్తు పునాది మొదలుకొని వ్రాయబడియున్నట్లుగా పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. అది ఖచ్చితముగా ఆయన తన కుమారుడిని పంపించుచున్నాననియు, ఆ దేవుని యొక్క కుమారుడు ఒక పాపి యొక్క స్థానమును తీసుకొని, తన యొక్క రక్తమును చిందించునని ఆదియందే దేవుడు దానిని చూచెను; జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన తన రక్తమును చిందించెనని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. క్రీస్తు యొక్క రక్తము జగత్తు పునాది వేయబడక మునుపే చిందించెనని పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నదానిని ఎంతమంది ఎరుగుదురు? ఆయన రక్తము చిందించబడినప్పుడు, ఆయన యొక్క శరీరములోయున్న ఒక్కొక్క సభ్యుడు, వారి పేర్లు ఆ రక్తముతో గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో జగత్తు పునాది వేయబడక మునుపే వ్రాయబడియున్నది. మీరు ఎందు నిమిత్తమై భయపడుచున్నారా? ఓ, సహోదరుడా! అది ద్వారపు తలుపులను తెరచుచున్నది, అది అలాగే కదా యున్నది?

41

సరే మంచిది, “ఇప్పుడు, దీనిని ఇచ్చట చదివి, అది చెప్పుచున్న విషయము సరియో, కాదో అని చూచెదము, చూచారా. ”ఆ దూత నాతో ఇట్లనెను,“ నీవేల..... అది 8వ వచనము అని నేను అనుకుంటున్నాను.

“నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని...” మంచిది, అది ఇదే. యిప్పుడు లేదు, అయితే అది పాతాళపు అగాధములోనుండి పైకి వచ్చుటకును. [ఇప్పుడు, మనము మరల దానిని చదువబోవుచున్నాము, ఎందుకనగా నేను ఇతర విషయములను గూర్చి చూడాలనుకుంటున్నాను, కావున మనము దానిని త్వరలో చూడబోవుచున్నాము], నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారు ఆశ్చర్యపడుదురు.

వేరొక మాటలలో చెప్పాలంటే భూనివాసులలో ఒక సమూహపు ప్రజలు వంచించబడుదురు. అతడు వారిని వంచించును, కాని అచ్చట ఒకే ఒక గుంపు జనులు మాత్రము వంచించబడలేదు, వారే జగత్తు పునాది వేయబడక మునుపే జీవగ్రంథములో పేరు వ్రాయబడినవారై యున్నారు. కొద్దిసేపటి తరువాత మనము ఆ లేఖనము యొద్దకు వచ్చెదము.

42

ఇప్పుడు, ఆ స్త్రీని గమనించండి, ఆ సంఘము; ఆమె రహస్య బబులోనుగా యున్నది. ఆమె నిమ్రోదు ద్వారా ప్రత్యక్షతమవుటను మనము చూచుచున్నాము. నిమ్రోదు యొక్క ఉద్దేశ్యము ఏమైయున్నది? నిమ్రోదు ఒక నగరమును నిర్మించి, ఇతర నగరములన్నియు ఆ నగరమునకు పన్ను చెల్లించునట్లుగా చేసెను. నేడు అటువంటి ఒక కార్యము జరుగుటను మనము చూచుచున్నామా? అటువంటి ఒక స్థలము నేడు గలదా? ప్రపంచములోనున్న ప్రతీ దేశముపై అధికారమును చెలాయించు ఒక సంఘము గలదా? ఖచ్చితముగా గలదు. ప్రతీ దేశము తనకు పన్ను చెల్లించునట్లుగా చేయుచున్న ఒక స్థలము నేడు గలదా? అటువంటి ఒక స్థలము గలదా? మనము ఇంకా కొంచెము ముందుకు వెళ్ళి, ఆ మిగిలిన లేఖన భాగమును కూడా చదివెదము, అప్పుడే మీరు ఆ దృశ్యమంతటిని తెలుసుకోగలరు. మంచిది.

ఆ మృగము యుండెను గాని యిప్పుడు లేదు మరియు ఇంకను ఉండబోవుదానిని చూచి ఆశ్చర్యపడుదురు.

ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును.

ఇప్పుడు, జ్ఞానము అనునది ఆత్మ వరములలో ఒకటైయున్నదని ఎంతమంది ఎరుగుదురు? అట్లయిన యెడల ఆయన ఇప్పుడు ఎటువంటి విధమైన గుంపు యొక్క జనులతో మాట్లాడుచున్నాడు? ఆత్మ వరములు క్రియ చేయు సంఘమందున్న ఒక గుంపు యొక్క ఆ జనులతోనే ఆయన మాట్లాడుచుండవలయును.

ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును.

43

ఇప్పుడు, ఇచ్చట నిలిపి, సంఘకాలములన్నింటి గుండా దీనిని వెలుపలకు తీసి కనుగొనెదము. ఈ అంత్యకాలమునందు ఈ వరములు ఏ విధముగా క్రియ చేయుచునేవనే దానిని పరిశుద్ధాత్మ బహిరంగముగా చెప్పుచున్నది. ఇప్పుడు స్వస్థతా వరమును మనము కలిగియున్నాము. ఓ, అది చక్కగా కొనసాగుచున్నది. మంచిది, సహోదరుడా, ఇంకా ఇతర వరములు కూడా ఉన్నవే! ఇది వాటిల్లో ఒకటి మాత్రమే కదా. ఇది ఒక చిన్న అల్పమైన కార్యమే కదా! అంతకంటె గొప్ప వరము ఇదిగో ఇచ్చట గలదు. ఇదియే శ్రేష్ఠమైన వరము, అది జ్ఞానమనే పరిశుద్ధాత్మ యొక్క వరమైయుండి, అది దేవుని యొక్క వాక్యముతో ఏకముగా సమకూర్చి మనము ఎచ్చట నిలబడియున్నామనే దానిని సంఘమునకు చూపించుచున్నందువలన ఎవరో ఒకరిని స్వస్థపరచినదానికంటే ఇది శ్రేష్ఠమైనదిగా లేదా? మనమందరము బాగా యుండాలని ఆశిస్తాము; కాని నా శరీరము బాగా యుండుటకంటే, నా ఆత్మ ఎల్లప్పుడూ బాగా యుండుటయే నేను ఆశించెదను. ఓ, పత్మాసు దీవిలోయున్న యోహానుతో ఇచ్చట పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుచు, “ఇది జ్ఞానమైయున్నది దీనిని అతడు ఆలకించనిమ్ము,” అని చెప్పెను. ఇప్పుడు, ఇచ్చట ఒక పటమును గీచి యుండుటను మనము చూస్తున్నాము.

44

ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ యేడు తలలు ఆ స్త్రీ కూర్చున్న యేడు కొండలు.

నాకు తెలిసినంత వరకు ప్రపంచమంతటిలోను ఏడు కొండలు మీదనున్న పట్టణము ఒక్కటి మాత్రమే యున్నది. ఏడు లేదా అంతకన్నా ఎక్కువ గల కొండలమీద యున్న రెండు పట్టణములని చెప్పవచ్చు. వాటిల్లో ఒకటి సిన్సిన్నాటి అనునది, ఏదో ఒక నక్కతో కూడిన కల్పితమైన గాధ సిన్సిన్నాటి గురించి యుండుటను మీరెరుగుదురు. కాని దానికంటే ఎక్కువగా దీనిలో గలదు. కాని సిన్సిన్నాటిపై అధికారమును చెలాయించు ఏ ఒక్క సంఘము లేదు. ప్రపంచమంతటిలోనూ ఏడు కొండల మీద కూర్చొని మొత్తము ప్రపంచమంతటి మీద అధికారము చెలాయించు ఒకే ఒక్క స్థలము యున్న ఒక సంఘము గలదు. నేను ఇప్పుడే అచ్చటనుండి, వచ్చితిని. ఆ కార్యములన్నియు. ప్రకటన 13వఅధ్యాయము, “అందులో జ్ఞానము గలదు” మరియు “బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది యొక మనుష్యుని సంఖ్యయే,” అని అచ్చట చెప్పబడి యుండుటను నేను చూచుచున్నాను. ఒక సమూహము యొక్క మనుష్యులు కాదు, ఒక గుంపు యొక్క ప్రజలు కాదు, కాని ఒక వ్యక్తిగా యున్నది. “అతడి సంఖ్య ఆరు వందల అరువది ఆరు.”

45

రోము నగరములోనున్న పోపు యొక్క సింహాసనము మీద “వికారియస్ ఫిల్లి డై” (VICARIVS FILI DEI) అని వ్రాయబడియున్నట్లుగా తరుచుగా నేను ఆలకించియున్నాను. అది నిజమేనా అని పలుసార్లు ఆశ్చర్యపడితిని. ఒక గీతను గీచి, రోము అంకెలను వ్రాసి, వాటిని కలిపి కూడినయెడల ఆ సంఖ్య వచ్చును. అది ఖచ్చితముగా నిజము. ఒక అద్దములో యుంచబడియున్న పోపు యొక్క ముక్కోణపు కిరీటమునకు దగ్గరగా నిలబడి నేను చూచితిని. పాతాళము, పరలోకము మరియు పాపవిమోచనకరమగు స్థలము అనే వాటిమీద అధికారము, చూచారా. కావున, నేను ఇప్పుడే అచ్చటనుండి వచ్చితిని, ఆ కార్యములన్నియు, అవి నిజమని నేనెరుగుదును, రోము నగరు నుండి ఇప్పుడే తిరిగి వచ్చితిని. అది ఇప్పుడు చిత్రించబడియున్నదని మనమెరుగుదుము.

ఏడుగురు రాజులు కలరు, అయిదుగురు కూలిపోయిరి [అది పూర్వకాలము నందు], ఒకడున్నాడు [ఇప్పుడు రావలసినవాడు, కైసరు], మరియు కడమ వాడు ఇంకను రాలేదు [అతడు హేరోదు, దుర్మారుడు];...

ఇప్పుడు అది ఎంత పరిపూర్ణముగా యున్నదో గమనించండి.

... వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండవలెను.

హేరోదు ఎంతకాలము పరిపాలించెనని ఎవరికైనా తెలుసునా? ఆరు నెలలు. అతడే తన తల్లిని ఒక చెట్టుకు కట్టి గుఱ్ఱము ద్వారా వీథులలో ఈడ్చుకొని వెళ్ళి; నగరమును కాల్చివేసి, తాను చేసిన నేరమును క్రైస్తవులపై మోపెను. మరియు వారు నగరమును కాల్చివేయుచుండగా కొండ ప్రక్కన కూర్చొని సారంగి లేదా ఫిడేలు వాయించుచు యుండెను. ఆరు నెలలు. చూడండి, “మృగము...” ఇప్పుడు గమనించండి, అతడు ఎంతటి దుర్మార్గుడుగా యుండెనో చూడండి. చూచారా?

46

ఇప్పుడు గమనించండి.

ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన యీ క్రూర మృగము ఆ యేడుగురితో పాటు. [ఏడవవాని యొక్క స్వభావముతో], ఒకడై యుండి, తానే యెనిమిదవ రాజగుచు నాశనమునకు పోవును.

నాశనమునకు అనగా ఎవరైనా ఎరుగుదురా? అది “పాతాళము.” అతడు ఎచ్చట నుండి ఎక్కి వచ్చెనో గమనించి చూడండి. పాతాళము నుండి. అది ఏమిటది? అగాధపు గొయ్యిగా యున్నది. కాథలిక్ సిద్దాంతమునకు ఎటువంటి ఒక పునాది లేదు. కాథలిక్కు సిద్దాంతము పరిశుద్ధ గ్రంథములోలేనిది. కాథలిక్కు వారియొక్క ఏ సిద్దాంతము కూడా ఏ పరిశుద్ధ గ్రంథములోను అటువంటి విషయమనేది అసలు లేనే లేదు. ఆ విధముగా వున్నట్లుగా వారు వాదించలేరు. ఆ కాథలిక్కు గురువు ఈ విధముగా చెప్పెను, పవిత్ర హృదయ సంఘము యొక్క గురువు ఇచ్చటకు నా యొద్దకు వచ్చి, “ఓ, అతడు...” నేను మేరీ ఎలిజబెత్ ఫ్రేజర్ కు బాప్తిస్మమిచ్చిన విషయమును గూర్చి అతడితో చెప్పుచుంటిని. అతడు, “ఓ, పూర్వకాలపు కాథలిక్కు సంఘము బాప్తిస్మము ఇచ్చిన రీతిలోనే నీవు ఆమెకు బాప్తిస్మము ఇచ్చితివి,” అని చెప్పెను.

“వారు ఎప్పుడు ఆ విధముగా ఇచ్చిరి? అని నేను అడిగితిని.

“పరిశుద్ద గ్రంథములో, మీ పరిశుద్ద గ్రంథములో,” అని అతడు జవాబిచ్చెను.

“కాథలిక్కు సంఘము అటువంటి బాప్తిస్మమును ఇచ్చినదా? అది కాథలిక్కు సంఘము యొక్క ఉపదేశమా?” అని నేను అడిగితిని.

“అవును” అని చెప్పెను.

“పొరపాటు లేని కాథలిక్కు సంఘము, ఎందుకని దీనిని ఇంతగా మార్చివేసినది?” అని నేను అడిగాను. చూచారా?

“మంచిది, మీరు చూడండి, మీరందరూ పరిశుద్ధ గ్రంథమును నమ్మెదరు. మేము సంఘమును నమ్మెదము.” చూచారా? “పరిశుద్ధ గ్రంథము ఏమి చెప్పుచున్నదనే దానిని గూర్చి మాకు అక్కర్లేదు, కాని సంఘము ఏమి చెప్పుచున్నదో అదియే మాకు,” అని అతడు చెప్పెను. ఖచ్చితముగా అది నిజము. మీరు ఎప్పుడైనా వారితో వాదము చేసిన యెడల, ఒకసారి ప్రయత్నించి చూడండి. పరిశుద్ధ గ్రంథము ఏమి చెప్పుచున్నదో అది వారికి అక్కర్లేదు. దానితో వారికి అసలు ఏ సంబంధము యుండదు; వారి సంఘము వారికేమి చెప్పుచున్నదో అదియే వారికి ముఖ్యము. చూచారా?

కాని సంఘము ఏమి చెప్పుచున్నదో దానిని మనము పట్టించుకోము. దేవుడు ఏమి చెప్పుచున్నాడో దానినే మనము నమ్మెదము. ఆమేన్. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథములో ఈ విధముగా, “ప్రతి మనుష్యుడు అబద్ధికుడగునుగాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు,” అని వ్రాయబడియున్నది. అందుచేతనే మనము సంఘ శాఖ కాదు.

47

ఇప్పుడు గమనించండి, దీనిని ఒక నిమిషము ఆలకించండి. “ఐదుగురు రాజులు కూలిపోయిరి, ఐదుగురు రాజులు.” చరిత్రలో, నుండి మీకు అది ఆధారపూర్వకముగా కావాలని ఆశించిన యెడల, దానిని నేను మీకు చూపించెదను. “ఒకడున్నాడు, కడమ వాడు ఇంకను రాలేదు.” ఇప్పుడు గమనించండి. “మృగము.” ఇప్పుడు, మృగము ఒక రాజు కాదు. ఉండినదియు, ఇప్పుడు లేనిదియు, ఇంకను ఉండబోవునదియు మరియు లేనిదియు.“ అది ఏమిటది? ఒకరి తరువాత ఒకరుగా వచ్చిన పోపులుగా యున్నారు, అధికారము, మృగము పరిపాలన చేయుచున్నది. అది విగ్రహారాధ రోము, పోపుల రోముగా మారినప్పుడు. విగ్రహారాధ రోము పోపు రోముగా అప్పుడది మార్చబడినది. వారు రాజనకు బదులుగా పోపును కలిగియుండిరి. మరియు పోపు వారికి ఒక ఆత్మీయ రాజుగా యున్నాడు. అందుచేతనే ఆత్మీయ రాజుగా అతడికి ఒక కిరీటమును ధరింప చేసిరి, అతడు యేసుక్రీస్తు యొక్క ప్రతినిధిగా చెప్పుకొనుచున్నారు. దానినే అచ్చట మీరు చూడగలరు.

48

ఇప్పుడు, గమనించండి,

ప్రొటస్టెంటు సంఘములోకి సరిగ్గా తిన్నగా ఈ కాథలిక్కు సిద్దాంతమనేది ఏ విధముగా చొచ్చుకొనిపోయినదో దానిని తీసి మేము మీకు చూపించెదము, చూచారా, వాటిలోని అనేకమైన కార్యములు ఇంకా కూడా సరిగ్గా ఆ ప్రొటస్టెంటు సంఘములోనే యుండుటను మేము చూపించబోవుచున్నాము. అవి పరిశుద్ధ గ్రంథమునకు ఖచ్చితముగా విరుద్ధమైనవి మరియు పరిపూర్ణముగా విరుద్ధమైనవే. ఇప్పుడు, “ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు.” ఇప్పుడు జ్ఞాపక ముంచుకోండి, “భూమి మీద ఉన్నవారిలో జగత్తు పునాది వేయబడక మునుపే జీవగ్రంథములో ఎవరి పేరు వ్రాయబడలేదో వారందరూ వంచించబడుదురు.”

49

మనము చూద్దాము.

ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన [11వ వచనము], ఈ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒకడునైయుండి, తానే యెనిమిదవ రాజగుచు నాశనమునకు పోవును. [అతడు పాతాళమునకు వెళ్ళే ఆ మార్గము యొక్క అంతమునకు వెళ్ళేంతవరుకు అతడు అట్లే యుండును.]

నీవు చూచిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు, [ఇప్పుడిచ్చట గమనించండి. ఏదో ఒకటి యుండుటను మీరు చూడాలని ఆశించినయెడల, దీనిని గమనించండి]... నీవు చూచిన పది కొమ్ములు పదిమంది రాజులు. వారిది వరకు రాజ్యమును పొందలేదు కాని యొక ఘడియ క్రూరమృగముతో కూడ రాజులవలె అధికారమును పొందుదురు.

వారు కిరీటమును ధరించిన రాజ్యము గల రాజులు కాదు, వీరు సర్వాధికారులు. చూడండి, వారు రాజుగా పట్టాభిషేకము చేయబడని రాజులు, కాని ఒక ఘడియ క్రూర మృగముతో కూడ రాజులవలె అధికారమును పొందుదురు. అది ఇప్పుడే ఈ స్వల్పమైన నీడవంటి కాలములోనే సరిగ్గా ఇప్పుడే సర్వాధికారులు లేచుచున్నారు. చూచారా, “ఒక ఘడియ క్రూరమృగముతో కూడ రాజులవలె అధికారమును పొందుదురు.” ఇప్పుడు, సరే మంచిది.

50

వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును, అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు.

వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజులైయున్నందునను [మహిమ!] పిలువబడినవారై, ఏర్పరచబడినవారు, మరియు నమ్మకమైన వారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.

“జగత్తు పునాది వేయబడక మునుపే ఏర్పరచబడినవారై, తమ యొక్క పిలుపునందు నమ్మకము గలవారు,” అనే అంశము మీద ఇప్పుడు ఒక ప్రసంగమును నేను ప్రసంగించగలనని నమ్ముచున్నాను. హల్లేలూయ! అది అదే. “వారు పిలువబడినవారు, ఏర్పరచబడినవారు, మరియు నమ్మకముగలవారు.” మరియు అనేది ఒక కలుపునట్టి పదముగా యున్నది, చూచారా: “ఏర్పరచబడిన వారు మరియు నమ్మకమైనవారు.” వారు ఎంతటి వారైనా, ఏమున్నాగాని వారిని ఆయన జయించును.

51

ఈ గొప్ప కమ్యూనిజము నేడు మనము కమ్యూనిజము యొక్క కదలికను కలిగియున్నాము, అయినా గాని దానిని గురించి ఏ విచారము చెందకండి. అది ఖచ్చితముగా దేవుని యొక్క హస్తములలో యుండి క్రియను చేయుచున్నది. ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా దానిని నేను నిరూపించగలను. ఆమె (అనగా కాథలిక్కు మత మార్గము - తెలుగు తర్జుమాదారుడు) హత్యచేసిన ఒక్కొక్క హతసాక్షి నిమిత్తము ఆయన ఆమెను హింసించును. అవునండీ. ఈ రాజులందరు ఏకీభవించి ఆమెను ద్వేషించబోవుదానిని మీరు గమనించండి. అన్ని దేశములలోను, మొత్తం ప్రపంచమంతటా కమ్యూనిజము వ్యాపించియున్నది. ఎందుచేత, దానిని శిక్షించుటకై దేవుని యొక్క కదలికగా అది ఏర్పరచబడి యుండవలయును. మీరు చెప్పవచ్చును. “ఒక్క నిమిషము ఆగండి బ్రె'న్హాం సహోదరుడా, కమ్యూనిజము దేవుని యొక్క ఒక కదలికగా యున్నదా?” సంపూర్ణముగా, నిశ్చయముగా, అది దేవుని యొక్క ఒక కదలికగా యున్నది. పరిశుద్ధ గ్రంథము కూడా ఆ విధముగానే చెప్పుచున్నది. అది దైవభీతి లేని, అవమానకరమైన, అక్రమమైన జనుల మీద తీర్పును తీర్చుటకై అది కదులుచున్నది.

ఈ లోకములో మనకు ఇక ఏమి మిగిలియున్నది?

52

ఇచ్చట ఒకానొక దినమున (నేను మాట్లాడుచున్న అంశముపై ఇప్పుడు ఒక నిమిషము సాధ్యమైనయెడల నిలిపెదను), ఒక లేఖనములో నేను చదవియున్నాను, జారత్వము వలన జన్మించిన ఒక బిడ్డ పదునాలుగు తరముల వరుకు ప్రభువు (Lord - తెలుగు తరుమాదారుడు) యొక్క సమాజములో చేరకూడదు. దానిని ఎంతమంది ఎరుగుదురు? అది నిజము, ద్వితీయోపదేశకాండము - 23వ అధ్యాయము, జారత్వము వలన జన్మించిన బిడ్డ, ఒక స్త్రీ భద్రత లేని పొలములో కనబడినప్పుడు, ఒకడు ఆమెను పట్టుకొని ఆమెతో శయనించినయెడల, ఆమెను అతడు వివాహము చేసుకొని తీరవలయును. ఆమె ఒక వేశ్యయైనను అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆమెను విడిచిపెట్టకూడదు. ఈ స్త్రీ ఒక కన్యకవలె నటించి, అతడిని ఆమె వివాహము చేసుకొనిన, ఆమె కన్యత్వము లేనిదైనయెడల, అందుకొరకు ఆమెను చంపివేయవచ్చును. ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ వివాహము చేసుకొని అక్రమముగా ఒక శిశువు జన్మించుటకు వారు కారణమైనయెడల, ఆ బిడ్డ ప్రభువు యొక్క సమాజములో పదునాలుగు తరముల వరకు చేరకూడదు. మరియు నలుబది సంవత్సరములు ఒక తరమగును. ఆ సంతానము నాలుగు వందల సంవత్సరములకు ముందే ఇశ్రాయేలీయుల సమాజములో వచ్చి చేరకూడదు.

53

దేవునికి పాపము అసహ్యమైనదిగా యున్నది. ప్రభువగు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తముగుండా సాగిపోవచ్చని ఏ విధముగా మీరు ఎదురు చూచుచున్నారు, కేవలం మీరు ఒక సంఘ శాఖకు చెందినవారుగా యుంటూ, ఏ విధముగా లోపలికి ప్రవేశించగలమని ఎదురుచూచుచున్నారు? మీరు దేవుని యొక్క నియమములోకి రావలయును లేనియెడల అసలు మీరు రానే రాలేరు. అది నిజము. డీకన్, ప్రసంగీకుడు, మనము ఎవరైనా గాని, అందువలన నీకు ఏ ప్రయోజనము లేదు. దేవుని యొక్క నియమము ప్రకారము మీరు రావలయును.

పదునాలుగు తరములు. ఇచ్చట ఇప్పుడు కూర్చున్న వారిలో ఒకరు దానిని గురించి నాతో వాదించుచుండిరి. “అట్లయినయెడల ఎవరు రక్షింపబడువారు అనేది మనకు ఎట్లు తెలియును?” అని అడిగెను.

“అచ్చటే నీవు ఒక మంచి కాల్వినిస్టుగా యుండవలయును,” అని నేను చెప్పాను. నీ పేరు భూమికి పునాది వేయబడక ముందే జీవగ్రంథములో వ్రాయబడినది. దేవుడు ఆ రక్త ప్రవాహమును తీసుకొనుచున్నాడు, అది ఆయనకు సంబంధించినది. చూచారా?

“మంచిది, దేనిని అది....”

54

ఆలకించండి, నేటి యౌవ్వనులగు మీరు యౌవ్వన బాలురు మరియు యౌవ్వన బాలికలగు మీరు ఈ సంఘమునకు వచ్చుచున్నారో లేదో ఎచ్చటకు వెళ్ళుచున్నారో నేనెరుగను. మీరు చేయుచున్న ఈ కార్యముల నిమిత్తము, ఇంకొక తరము యుండినయెడల, మీ పిల్లలకు తీర్పు తీర్చబడునని మీరు గ్రహించుచున్నారా? మీకు మర్యాద గాని లేక బిడియము గాని లేదా? పొట్టి వస్త్రములు మరియు అటువంటివి ధరించుచుండు ఇచ్చట యున్న బాలికలారా, ఆ కార్యము నీ కూతురిపై ప్రతిబింబించును. మీ అమ్మమ్మ ఇంటి గుమ్మము దాటి బయటకు రాని ఒక స్త్రీగా యుండేదని మీరెరుగుదురా? మరియు నీ తల్లి సంఘములోని గాయకుల బృందములో ఒక బాలికగా యుండెడిది, కనుకనే నీవు ఒక అర్థనగ్నపు బాలికగా తిరుగుచున్నావు? ఖచ్చితముగా నీవు ఆలాగే యున్నావు. అట్లయినయెడల, ఇక నీ పిల్లలు ఏ విధముగా యుందురు? అవునయ్యా! దేవుడు తల్లిదండ్రుల అక్రమమును పిల్లల యొద్దను మరియు వారి పిల్లల యొద్దను మూడు తరములు లేదా నాలుగు తరముల వరుకు విచారించుచు వచ్చెదనని చెప్పియుండెను.

55

నా సహోదరుడా, నీవు ప్రతీసారి చేయు మంచి క్రియల యొక్క ప్రతిఫలము, అది నీ పిలల్ల మీదకు వచ్చుచున్నదని నీవు గ్రహించగలుగుచున్నావా?

ఇచ్చట గమనించండి, హెబ్రియులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయమును తీసి చూచెదము, పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రాహామును మొల్కీసెదెకు ఎదుర్కొనినప్పుడు, ఆయన అతడిని ఆశీర్వదించెను. ఇప్పుడు “లేవీ” ఆయనకు దశమ-భాగములను చెల్లించిన దానిని గురించి పౌలు ఇచ్చట చెప్పుచున్నాడు, “లేవీ తన సహోదరుల యొద్ద దశమ-భాగములను తీసుకొనుటకై ప్రభువు యొద్ద ఆజ్ఞను పొందియుండెను, దశమ-భాగములను తీసుకొను లేవీ, దశమ-భాగమును యిచ్చెను” అని చెప్పెను. ఎందుకనగా అబ్రాహాము మొల్కీసెదకును సంధించినప్పుడు, లేవీ అబ్రాహాము యొక్క నడుములో యుండెను. అబ్రాహాము అతడికి ముత్తాతగా యున్నాడు. అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు లెవీని కనెను. తండ్రి, తాత, ముత్తాత. లేవీ అబ్రహాము యొక్క నడుములో యున్నప్పుడు, మొల్కీసెదకుకు అబ్రాహాము దశమ-భాగమును చెల్లించెనని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. హల్లేలూయా!

దేవుని యొక్క మహా గొప్ప కాలచక్రమును ప్రపంచములో నున్న ఏదైనా ఒక శక్తి ఆటంకపరచునని ఎవరైనా మీ యొద్ద చెప్పినయెడల అటువంటి వాటిని మీరు నమ్మవద్దు. అది ఇప్పుడు కూడా తిరుగుచూసే దాని పని అది చేయుచున్నది. అది ఆదిలోనే ఏర్పాట్లు చేయబడినది. ఆయన యొక్క కార్యక్రమములను ఆటంకపరచుటకు ఏ దయ్యములు గాని లేదా తగినన్ని దయ్యములు అసలు లేనే లేవు.

56

ఇప్పుడు, లేవీ రహస్యముగా దశమ-భాగమును చెల్లించినట్లుగా పరిశుద్ధ గ్రంథము చెప్పుట లేదు. అతడు తన ముత్తాత నడుములో ఉన్నప్పుడే ఆ “దశమ-భాగమును చెల్లించెనని” పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. మహిమ! ఆయనే నా ప్రభువు. ఓ, అసలు లోకము సృజించక ముందే ఆయన దానిని ఎరిగియుండెను. సమస్తమును ఆయన ఎరిగినవాడు. అబ్రాహాములో నుండి లేవీ దశమ-భాగములను చెల్లించెను.

సహోదరులారా, సహోదరీణులారా, ఏ విధముగా మీరు ఇట్లు తిరుగగలుగుచున్నారు? జనులు మరొకరి భార్యలతో తిరుగుచున్నారు, భార్యలు కుటుంబములను విడగొట్టుచున్నారు, మీరు ఈ రీతిగా జీవించుచు, రాబోవు తర్వాతి తరము ఏ విధముగా యుండునని మీరు ఎదురు చూచుచున్నారు? ఆ విధముగానే అది యున్నది. అది ఇప్పుడు ఒక అక్రమ సంతానపు గుంపై, తారుమారుగా జన్మించిన దుర్నీతి గుంపే గాని మరేమియు కాదు. ఒక్కటి మాత్రమే దానికొరకు విడువబడియున్నది, అదియే మనము జీవించుచున్న అణుబాంబు కాలముగా యున్నది. ఖచ్చితముగా అది నిజము. మనము అంత్యకాలమందు యున్నాము.

57

దూరమున నున్న కెంటకీ కొండలలో నేటి ఉదయమున ఒక చిన్న బాలుడు కూర్చొనియుండెను, పది అడుగుల దూరమంత దగ్గరగా కూడా మీరు అతడి యొద్దకు వెళ్ళలేరు. అతడు ఒక విధమైన పంచదార పాకమును తయారు చేయువాడు. బహుశా అతడికి కుడి, ఎడమ చేతుల తేడా తెలియనివాడు. అతడు వినినప్పుడు... అచ్చట స్తంభములను నాటిన స్థలము పైకి నేను ఎక్కితిని, నేను ఎచ్చట యున్నానో ఆ స్థలము నాకు తెలియదు, నేను చిన్న గుంటలలో ఉండియున్నాను. నేను ఉడుతల వేట కొరకు వెళ్ళితిని. నేను అచ్చట కూర్చొనియున్నప్పుడు, ఆ బాలునితో నేను మాట్లాడుటకు ప్రారంభించితిని. ఆ బాలుడు సైన్యములో చేరబోవుచున్నానని చెప్పెను, మేము మాట్లాడుకొంటూ యుండగా, ప్రభువు గురించి మేము మాట్లాడుట ప్రారంభించితిమి, “ప్రసంగికుడా, మనము అంత్యకాలమందు యున్నామని నీవు నమ్ముచున్నావా?” అని అతడు నన్ను అడిగెను.

“నిశ్చయముగా, మనము కుమారుడా, నిశ్చయముగా మనము అంత్యకాలమందు యున్నాము.”

58

ఇచ్చటే మనము యున్నాము. సహోదరుడా, మనము ఈ ఘడియలలోనే జీవించుచున్నాము. మనము ఆ స్థలములోనే యున్నాము. పూర్వకాలమునందు మన పితరులు, తల్లులు, తాత, మరియు అమ్మమ్మ ఏ విధముగా జీవించారో మీరు చూడగలుగుచున్నారా? తండ్రి మరియు తల్లి ఏ విధముగా జీవించారనే దానిని మీరు చూడగలుగుచున్నారా? నేడు మనము దుర్నీతికాలమందు యున్నాము. ఎంతగా గొంతు చించుకొని మీరు ప్రసంగించినను, వారు అదే కురచ వస్త్రములను ధరించుకొంటూ మరియు అవే కార్యములు చేయుచు, నీ ముఖముపైనే ఉమ్మి ఊసినను ఆశ్చర్యమేమీ లేదు. వారు సిగరెట్లను పీల్చుచూ, ఆ పొగను మీ ముఖము పైనే ఊదుచూ, “నీ పనిని నీవు చూసుకో,” అని చెప్పెదరు. ఎందుచేత? ఎందుకనగా వారు ఆ వంశములో నుండి వచ్చిన వారు. దానిని తీసి మీకు చూపించెదను. “సర్పము యొక్క సంతానము,” అనే దానినుండి తీసికొని ఆమె ఎచ్చటకు కదులుచున్నదో, వారెందుకని ఆ విధముగా ప్రవర్తించుచున్నారనే దానిని గురించి మనము కనుగొనెదము. జగత్తు పునాది నుండే వారు దయ్యపు సంతానముగా యున్నారు. అది నిజము.

మనకు మరేమియు విడువబడలేదు, న్యాయతీర్పు అనే కార్యము మాత్రమే మిగిలియున్నది. న్యాయతీర్పు తప్ప మరేదియు లేదు. దేవుడు సమస్తమును తుడిచివేసినట్లు తుడిచివేయును, మానవులే దానిని తమ మీదికి తెచ్చుకున్నారు. అది ఆ విధముగా ఉండాలని దేవుని ఉద్దేశము కాదు, కాని అది ఆ విధముగానే యుండునని ఆయనకు తెలుసు. అందుచేతనే, “జగత్తు పునాది వేయబడక మునుపే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో పేర్లు వ్రాయబడినవారు తప్ప భూనివాసులందరిని అతడు వంచించునని ఆయన చెప్పియుండెను.”

59

ఇప్పుడు గమనించండి, మనము కొంచెం తర్వాతయున్న దానిని చదివెదము. ఇప్పుడు మనము 12వ వచనమునందు యున్నామని నేను తలంచుచున్నాను.

నీవు చూచిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు. వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని యొక గడియ క్రూరమృగముతో కూడ రాజులవలె అధికారము పొందుదురు.

వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును, అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు.

వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునైయున్నందునకు తనతో కూడ వారు పిలువబడినవారై, ఏర్పరచబడినవారై, నమ్మకమైన వారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.

మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములును, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును.

...నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించిరి,....

60

ఇప్పుడు దానిని గమనించండి, ఈ పది కొమ్ములను, ఈ పది రాజ్యములను చూడండి, ఆ సమస్తము క్షీణించిపోవుననియు, ఈ సర్వాధికారులు ఎవరైయున్నారనే దానిని, ఏ ప్రక్కన ఈ సర్వాధికారులు వాలుచున్నారనే దానిని గమనించండి. వారు ఏ వైపు వాలుచున్నారు. కమ్యూనిజము వైపు వాలని ఒక్క సర్వాధికారిని నాకు చూపించండి. చూచారా? వారేమి చేయుదురు? “ఆ వేశ్యను ద్వేషించెదరు,” స్త్రీ సంఘంగా యున్నది. కాని గమనించండి. దానిని చేయునది ఏదనేది గమనించి చూడండి.

...వారు ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేనిదానిగాను, దిగంబరిగా చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు.

61

వారు దానిని ప్రపంచ పటములో నుండి తీసివేయుదురు, ఇచ్చట నేను నిలబడి యుండుట ఎంత నిశ్చయముగా యున్నదో, అది కూడా అంత నిశ్చయమైనది. మనకు సమయమున్నయెడల ఆ సంఘము గూర్చిన అంశమును మనము తీసుకొని లేఖన భాగముల నుండి దానిని చూచి, అందులో చెప్పిన విధముగా, చదివెదము, “ఈ భూమిమీద యుండు రాజులందరు, నావికులందరు మరియు అందరు రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచుందురు: ఎందుకనగా బబులోను మహా పట్టణము ఒక్క ఘడియలోనే నాశనమై పోయెను,” అని వ్రాయబడియున్నవాటిని చూడగలరు. ఓ, అది ఏ విధముగా, “పరలోకమా, అపోస్తులారా, ప్రవక్తలారా, దానిగూర్చి ఆనందించుడి, ఏలయనగా దానిచేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పుతీర్చియున్నాడు.” చూచారా, అది నిజము. నిశ్చయముగా, కమ్యూనిజము దేవుని హస్తములలో నుండి క్రియ చేయుచున్నది. నెబుకద్నెజరు రాజు దేవుని హస్తములలో యుండి చేయబడినవాడై యూదులను బంధించి నగ్నముగా నడిపించుకొని తీసుకొని వెళ్ళినట్లుగా.

62

పాపము నశించిపోతునే యుండును, అచ్చట ఒక నీతిగల భీజము యున్నయెడల, అది కొంచెము కొంచెముగా నశించిపోతూ, మరియు నశించిపోతూ చివరకు అది సర్వనాశనమైపోవును. అది ఆ స్థితికి దిగజారిపోవును, ఎందుకనగా వారి తల్లులు, తండ్రులు, మరియు మొదలగువారు ఆ విధముగానే మనకు ముందు జీవించిరి; మనకింక మరేదియు విడువబడలేదు. యేసు ఏమి చెప్పెనో మీరెరుగుదురా? ఆ దినములు తక్కువ చేయబడక పోయినయెడల, ఏ శరీరియు తప్పించుకొనడు.

63

మీరు చూడగలుగుచున్నారా? వీటిని మనమెందుకు కలిగియున్నామని మీరు చూడగలుగుచున్నారా? నేను తప్పులను లెక్కపెట్టుటలేదు. ఆర్థర్ గాడ్-ఫ్రీ, ప్రతీఒక్కరు మరియు ఎల్విస్ ప్రెస్లీ, పైవస్త్రమును నడుము వరుకు ధరించుకొని, మెడవరుకు వ్రేలాడే వెంట్రుకలతోను మరియు ఇటువంటి పలు రకములైన వాటితో యవ్వనస్తులు ఒయ్యారాలను ఒలకపోస్తూ ప్రవర్తించటము మీరెరుగుదురా? ఏది ఆ విధముగా చేయుచున్నది? అది దేనిని సూచించుచున్నది? ఎందుకనగా ఇంతకు ముందు జీవించిన అక్రమ సంతానపు ఒక గుంపు నుండి అది పుట్టుకొచ్చినది. అదే గాని మరేదియు కాదు. ఓ, వారు పైకి లేచి నిలబడి, “నా దేవా నీకు సమీపముగా,” అని పాడెదరు, పీ-పిక్కర్ ఎర్ని మరియు ఇంకా అనేకులు చేసిన విధముగా, ఏదో ఒక విధమైన ఒక స్తుతి గీతమును మరియు మొదలగు వాటిని చేయుచుందురు. సహోదరుడా, అది ఏమిటనేది నీవెరుగుదువా? అది, అది సంపూర్ణముగా ఒక వేషధారణగా యున్నది. అవునండీ.

64

రాక్-అండ్-రోల్, బూగీ-ఊగీ మరియు అటువంటి పలు రకములైన వాటిల్లో పాల్గొనుచు వాటితో సంబంధముగల ఏ వ్యక్తికి ఈ ప్రసంగ పీఠమునకు వెనుక నిలబడుటకు అర్హత లేదు. అతడికి ఈ ఉన్నత స్థలమందు నిలబడుటకు ఒక్క అణువంత అర్హత కూడా లేదు. ఈ స్థలము దేవునిచే పిలువబడు యాజకులకు మాత్రమే. ఈ స్థలము వెనుక నిలబడుటకు దేవునిచే పిలువబడిన సేవకులకు మాత్రమే చెందును. అటువంటి లోకపు కార్యములలో పాల్గోను వారికి ఇచ్చట స్థానము లేదు.

కాని నేడుయున్న బాధ ఇదే, వారు ఒక విధమైన విడిదిగా (lodge) సంఘమును మార్చివేసిరి. విడిదిలో ఇటువంటి కార్యములు చేయుట సమంజసమే, మీరు చెయ్యాలనుకుంటే చెయ్యండి, అది మీకు సంబంధించిన విషయము. కాని నేను దీనిని మీకు చెప్పనివ్వండి. ఒక సంఘమునకు (church) మరియు ఒక విడిది (lodge)కి ఎంతో తేడా గలదు. అవునండీ, ఇటువంటి విందులు, విలాస కార్యములు మరియు అనేక రకములైన వాటిని ఒక విడిదిలో చెయ్యాలని మీరు ఆశించినయెడల అది మీకు సంబంధించిన విషయమై యున్నది. కాని, సహోదరుడా, సంఘమనునది ప్రసంగ పీఠము నుండి బేస్మెంట్ వరుకు ఊడ్చి శుభ్రము చేయబడ వలయును. అది నిజము. నవీన యంత్రములతో మరియు అటువంటి వాటితో ఊడ్చి శుభ్రము చేయవలెననేది నా భావము కాదు, ప్రాచీన పద్ధతిలో దేవునిచే క్రుమ్మరించబడు ఉజ్జీవమును గురించి చెప్పుచున్నాను. అది చెత్తను ఒక ప్రక్క నుండి మరొక ప్రక్క వరకు పారద్రోలునట్లు శుభ్రము చేయును. అవునండీ. ఆపిలు పండును చుట్టూర గుమికూడియున్న బోద్దింకలు విద్యుద్దీపమును (లైటును) వేసిన వెంటనే ఆ కాంతికి ఏ విధముగా అవి చెల్లాచెదురై పారద్రోలబడునో ఆ విధముగానే.

65

ఇప్పుడు గమనించండి, “వీరు ఏకాభిప్రాయముగలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు.” ఆ లేఖనమునకు క్రింది లేఖనముకు నేను వచ్చితిని. “పది కొమ్ములు.” అవును, ఇప్పుడు.

దేవుని మాటలు నెరవేరువరుకు వారు ఏకాభిప్రాయముగలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన [అచ్చట గమనించండి] సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ది పుట్టించెను.

మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహా పట్టణమే.

ఇప్పుడు, దీనిని మళ్ళీ మళ్ళీ చెప్పవలసిన అవసరము లేదు; అది ఆ కాథలిక్కుల ఆచార్యాధిపత్యము అని మనమొరుగుదుము. దీనిని ఎవరైనా. నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానన్నేది ఎంత రూఢిగా నమ్ముచున్నానో, అంత రూఢిగానే దీనిని కూడా నేను నమ్ముచున్నాను. ఒక క్రైస్తవునిగా ఇచ్చట నేడు నేను నిలబడుటను ఏ విధముగా నమ్ముచున్నానో, అదే విధముగానే దీనిని కూడా నేను నమ్ముచున్నాను, అదేమనగా కాథలిక్కు ఆచార్యధిపత్యము... ఏడు కొండల మీద నిర్మించబడిన ఆ మహా పట్టణము వాటికన్ నగరమేయగును. సంఘము యొక్క ఆచార్యాధిపత్యమనేది ఉండినదియు, ఇప్పుడు లేనిదియునైయున్న మృగముగా యున్నది, మరియు ఆమెయే ఆ బబులోనుగా యున్నది. సమస్తము ఖచ్చితముగాను, అన్ని విధాలుగా పరిపూర్ణముగాను లేఖనభాగముల ద్వారా చిత్రీకరించబడియున్నవి — అది కాథలిక్కు సంఘము.

66

ఇప్పుడు, ఇచ్చట మిమ్మల్ని ఆశ్చర్యపరచు ఒక విషయము యున్నది. “మంచిది, సహోదరుడా బ్రెన్హాం, నీవు నన్ను తాకలేదు,” అని మీరు చెప్పవచ్చును. కాని ఒకదానిని నేను మీ దగ్గర అడగాలనుకుంటున్నాను. తిన్నగా ఇప్పుడు మనము 5వ వచనమునకు వెళ్ళెదము.

దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడియుండెను - మర్మము, వేశ్యలకును, భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లియైన మహాబబులోను,

ఆమె ఎవరు? “వేశ్య.” ఆమె ఒక “తల్లిగా” యున్నది. ఏమిటి? “తల్లి,” ఆమె ఏదో ఒకదానిని కనుచున్నది. కుమారులకు ఆమె ఒక తల్లిగా యున్నదా? వేశ్యలకు తల్లిగా యున్నది. ఒక వేశ్య అనగా ఏమని అర్ధము? తప్పుడు ప్రవర్తన గల స్త్రీ, ఆమెను తప్పుడు ప్రవర్తన గల స్త్రీగా మార్చినది ఏది? ఆమె సిద్దాంతము. ఆమె క్రైస్తవ సంఘమువలె నటించుచు మానవ-కల్పితమైన సిద్దాంతములను తీసికొని ఇచ్చుచున్నది. ఆమె ఇచ్చట ఏమి చెప్పుచున్నదనగా.... ఆమెయే మొదట స్థాపించబడిన సంస్థయైన యెడల, ఆమెలో నుండి పుట్టుకొచ్చిన పలు రకముల స్తాపక సంస్థలు గలవన్నట్లుగా ఇది కనబడుచున్నది. ఆమెయే వేశ్యలకు తల్లిగా యున్నది. అది నిజమే కదా! ఆమె ఒక తల్లిగా యుండలేదు.... ఆమె స్త్రీలకు ఒక తల్లిగా యుండలేదు. వారు స్త్రీలైన ఎడల, అవి సంఘముగా యుండును. ఇప్పుడు మనము కనుగొనెదము. ఏది వెలుపలికి వచ్చినదనే దానిని....

67

మొదటగా స్థాపించబడిన స్థాపన సంస్థ ఏది? కాథలిక్కు సంఘము. రెండవదిగా స్థాపించబడిన స్థాపక సంస్థ ఏది? లూథర్ సంఘము. మూడవదిగా స్థాపించబడిన స్థాపన సంస్థ ఏది? జ్వింగ్లీ, దాని తర్వాత ఏది వచ్చినది? కాల్విన్, అటు తర్వాత వచ్చినది ఆంగ్లికన్, ఆంగ్లికన్ తర్వాత దాని వెనుక మొథడిస్తు వచ్చినది. మొథడిస్తులు, మెథడిస్టు దేనిని ఉత్పత్తి చేసినది? దానిలోనుండి అలెగ్జాండర్ కాంబెల్ పుట్టుకొని వచ్చెను. అలెగ్జాండర్ కాంబెల్లో నుండి జాన్ స్మిత్ వచ్చెను; అలెగ్జాండర్ కాంబెల్లో నుండి క్రైస్తవ సంఘము వచ్చినది, అటు తర్వాత భిన్నాభిప్రాయముల వలన ఆ చర్చి అఫ్ క్రైస్ట్ సంఘము నాలుగు లేదా ఐదు సంఘములుగా మరియు ఇతర చిన్న వాదములు వెళ్ళిపోయెను. తర్వాత ఇదిగో ఇచ్చట బాప్టిస్టు సంఘము వచ్చుచున్నది. దానిలో నుండి చీలి అనేక సంఘములు ఏర్పడినవి. మెథడిస్టు సంఘములో నుండి మొదటగా వెస్లీ మెథడిస్టు ఏర్పడినది. దానిలోనుండి నాలుగు లేదా ఐదు సార్లు చీలికలు ఏర్పడినవి. అటు తర్వాత మరొక విధమగు మెథడిస్టు సంఘము ఏర్పడినది. దానిలోనుండి వారు చీలిపోయి వెలుపలికి వచ్చి స్వేచ్చా మెథడిస్టు సంఘము ఏర్పరచుకొనిరి. మరలా దానిలో నుండి నాజరీను సంఘము పుట్టుకొచ్చినది. నాజరీను సంఘము నుండి పిలిగ్రమ్ హోలినస్ ఏర్పడినది. ఈ విధముగా సిద్దాంతములను ఆధారము చేసుకొని భిన్నాభిప్రాయములవలన చీలిపోతూ అనేకనేక చిన్నచిన్న సంఘములు ఏర్పడుతూ పలు రకములుగా కొనసాగుచు అనేక సంఘములు ఏర్పడినవి. వారు ప్రతీఒక్కరు ఏమి చేసిరి? వారు చివరకు పెంతెకోస్తులో అంతమైరి.

68

పెంతెకోస్తు ఏమి చేసినది? వారి తల్లి ఏమి చేసినదో దానినే ఇదియు చేసినది, వారు వెనుకకు వెళ్ళి మరలా సంస్థను స్థాపించుకొనిరి. మరియు అది ఏమైనది? ఒక సంస్థగా మారిపోయినది. మీరు ఒక సంఘములోకి ప్రవేశించిన వెంటనే అడిగే మొదటి ప్రశ్న ఏమనగా, “మీ సిద్దాంతము ఏమిటి?” అని అడిగెదరు. బాలుడా, చక్కని వరుస గల దువ్వెనతో మిమ్మల్ని దువ్వుతూ, మీరెవరు, చూచారా, మీరు దేనిని నమ్ముచున్నారనే దానిని కనుగొనెదరు. మీరు గాని వారితో జతకూడ లేనట్లుగా తెలిసినయెడల, సహోదరుడా, అప్పుడే, నిన్ను వారు వెంటనే వెలివేయుదురు. అది నిజము.

మిమ్మల్ని మీరు పెంతెకోస్తువారమని చెప్పుకొనుట వలన భద్రముగా యున్నట్లుగా మీరు అనుకోవద్దు. సహోదరుడా, మార్గము నుండి తొలగిపోయి తొట్రిళ్ళిన అనేకమంది పెంతెకోస్తులు మార్గమునందు గలరు. నిశ్చయముగా నేనెరుగుదును. చూచారా?

69

ఇప్పుడు, ఈ సంస్థలన్నియు, ఒక సంస్థగా కాకుండా, సహోదరత్వముతో నిలిచియుండి, పెంతెకోస్తు ఆశీర్వాదముల నుండి తొలగిపోకుండా యుండియున్నట్లైన యెడల, వారిని పరిశుద్ధాత్మ వేరుచేయుటకు అనుమతించి యుండినయెడల, పరిశుద్ధాత్మ వారిని వేరుచేసియుండును. ఒకానొక సమయమున అననీయ, సఫ్సీర లోపలికి ప్రవేశించి ఫలానా మరియు - ఫలానా అని చెప్పగానే, “మీరెందుకు అసత్యము పలుకుచున్నారు?” అని పరిశుద్ధాత్మ అనెను

కాని మనమేమో, “అతడు సహోదరుడు జోన్స్, అతడిని నొప్పించునట్లుగా ఇప్పుడు ఏమీ తిట్టవద్దు. సంఘములోయున్నవారందరిలోను అతడే ఎక్కువగా డబ్బును ఇచ్చువాడు. అతడు పరిశుద్ధాత్మను పొందుకొనియున్నాడని నేనెరుగుదును, అతడు అన్యభాషలలో మాట్లాడుట నేను విన్నాను. మరియు అతడు ఆత్మలో కేకలు వేయుటను నేను చూచితిని,” అని చెప్పుచున్నాము. అదేమనగా ఎండిపోయియున్న ఆవు చర్మముపై బఠాణీలను పోయుచున్నప్పుడు కలిగే శబ్దమువలె దానికి దీనికి మధ్య ఏ తేడాయు లేదు. చూచారా? అసలు దానికి దీనికి ఏ సంబంధము లేదు. దేవుడే దానిని చెప్పవలసియున్నది. అతడు పరిశుద్ధాత్మను కలిగియున్నాడా, లేదాయని దేవుడే చెప్పవలెను.

నిశ్చయముగా, “కాని మేము అతడిని మా సంస్థలలోకి చేర్చుకున్నాము. మంచిది, అసెంబ్లీవారమగు మేము అతడిని వెలుపలికి త్రోసివేసినప్పుడు, ఏకత్వము (oneness) వారు అతడిని చేర్చుకున్నారు.” ఏకత్వము వారు కొంచెము కాలమే అతడిని అనుమతించి తర్వాత వారు కూడా అతడిని వెలివేసిరి, ఎందుకనగా . వారు అక్కడి వరకే అతడిని మోసుకొని వెళ్ళిరి. అటు తర్వాత యేసు మాత్రమే (Jesus only) అను వారు అతడిని చేర్చుకొనిరి. వారు కూడా కొంచెము కాలమే అతడిని చేర్చుకున్నారు; మరలా అటు తర్వాత చర్చ్-ఆఫ్-గాడ్ సంఘము వారు అతడిని చేర్చుకున్నారు, మరలా అచ్చట నుండి వెలివేయబడి దేవుని దేవుని ప్రవచనా సంఘము వారు (Church of God of Prophecy) అతడిని చేర్చుకున్నారు. మరలా అచ్చట నుండి అతడిని టోమిల్సన్ (Tomilson move) కదిలిక అతడిని చేర్చుకొనెను. ఓ, నా సహోదరుడా, ఈ విధముగానే మనము ఒకదాని నుండి ఇంకొక దానికి పరిగెత్తుచూ యుంటిమి కదా! ఆఖరి ఉజ్జీవము, అది పెంతెకోస్తులో క్రుమ్మరించబడినది. మరిప్పుడు,

వారిలో నీలి రంగు అగ్నిజ్వాలను, నూనెను ఆరాధించువారును, ముఖములో నుండి రక్తమును చిందించుచున్నట్లు చేయువారును గలరు. ఓ, దయ చూపుము. వారిప్పుడు ఎచ్చటికి వెళ్ళిపోయారో నేనెరుగను. కేవలము ఒక్క కార్యమేమనగా...

70

పూర్తిగా అంతా చెడిపోయినది.

అది కలుషితమవునని పరిశుద్ధ గ్రంథము చెప్పియున్నదానిని మీరెరుగుదురా? ఈ దినమున అది ఈ విధముగానే యుండునని పరిశుద్ధ గ్రంథములో ఇచ్చట దానిని గురించి చెప్పిన విషయమును మీరెరుగుదురా, వారి భోజనపు బల్లలన్నియు వాంతితోను కలుషితముతోను నిండియున్నవి? మరియు, “ఎవరికి నేను సిద్దాంతమును బోధించగలను? ఎవరికి నేను దీనిని గ్రహించునట్లుగా చేయగలను? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము.” అతడు ఎవరికి సిద్దాంతమును బోధించగలడు? “చన్ను విడిచినవారికా [తల్లి].” చూచారా?

71

ఇప్పుడు, ఈ నగరములో చెడునడతగల స్త్రీ కనిన ఒక యవ్వన స్త్రీ ఎవరూ లేరని అనుకుందాము, కాని ఒక కన్యత్వము గల కుమార్తెను ఏది తీసుకొని వచ్చుచున్నది. ఆమె జన్మించినప్పుడు అట్లే యుండినది. ఆమె చక్కగా ప్రవర్తించగలదు. కాని ఆమె తల్లి ఆ స్వభావము గలదని మీరు గమనించనియెడల, పదిలో తొమ్మిది శాతం ఖచ్చితముగా ఆ అమ్మాయి కూడా ఆమె తల్లి ప్రవర్తించినట్లుగానే ప్రవర్తించును. ఇప్పుడు, అది నిజమని మీరెరుగుదురు. వేశ్య విడిదిని జరిపించు ఒక వృద్ధ స్త్రీ ఒక కుమార్తెను కనియుండవచ్చును, ఆ కుమార్తె పదహారు సంవత్సరాలకు ఎదిగినప్పుడు, ఆమె పవిత్రముగాను మరియు యుక్తమైన ప్రవర్తనగలదై, ఆ లిల్లీవలె యుండవచ్చును, కాని — ఆమె ఆ మార్గమునకు వెళ్ళకుండా యుండినయెడల. కాని విషయమేమనగా, ఆమె తన తల్లివలె తాను కూడా ఆ మార్గములోనే వెళ్ళి, ఆ విధముగానే ప్రవర్తించును.

72

ఇప్పుడు, కాథలిక్కు సంఘమే మొదటి ప్రాచీన వేశ్యా సంఘముగా యుండి, అది తనయొక్క కల్పితమైన సిద్దాంతములతో పుట్టుకొచ్చి, ఆ మూఢ నమ్మకములతో ఆమె తన్నుతాను ఏర్పరచుకొనినది. “అది పాతాళములో (Bottomless pits) నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది,” అని పరిశుద్ధ గ్రంథము చెప్పెను. ఆ విధముగానే పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది.

ఇప్పుడు, వారు దానిని తప్పిదముగా బోధించుచున్నారు. అది దేవుని యొక్క వాక్యానుసారముగా తప్పిదముగా యున్నది. అటు తర్వాత ఇదిగో ఇచ్చట ఆమెలో నుండి పుట్టుకొచ్చిన మొథడిస్తు సంఘము వచ్చుచున్నది, ఒక అందమైన యవ్వనస్తురాలు, కాని ఆమె కూడా ఏమి చేసినది? ఆమె కూడా అదే మార్గమున సరిగ్గా వెనుకకు వెళ్ళి తన తల్లి చేసినట్లుగానే ఆమె కూడా అదే కార్యములను చేసినది. ఆమె యొక్క సంఘస్తులు పొట్టి వస్త్రవులను ధరించుకొనుచున్నారు, వారు సిగరెట్లను కొల్చుచున్నారు, వారి ఇష్టానుసారముగా ప్రవర్తించుటకు వారిని వారు అనుమతించిరి. వాటిని గురించి వారు అసలు ఖండించనే ఖండించరు. పిరికివాడగు ఆ దీన వృద్ద కాపరి ఆ ప్రసంగ పీఠమునకు వెనుక నిలబడి వాటిని గురించి గద్దించిన యెడల వారు జీతము తరిగిపోవునని, లేదా తినుటకు బిస్కెట్లు మిగలదేమో అని భయపడి దానిని గురించి ఏమీ చెప్పడు.

సహోదరుడా, దీనిని నేను చెప్పాలనుకుంటున్నాను, సువార్తను ప్రకటించుచూ అల్పమైన బిస్కెట్లను తిని, పారుచున్న నీటికాలువలోని నీళ్ళను త్రాగే స్థితి ఏర్పడినను నేను సత్యమును గురించే చెప్పుదును. నా సంఘములోని ప్రతీఒక్కరు లేచి వెలుపలికి వెళ్ళిపోయినను, వారికి నేను సత్యమునే చెప్పుదును. అవును, నిజముగానే.

73

సంగతి ఏమిటి? ఓ, అదంతా ఒక భోజనపు టిక్కెట్టు కోసమే, “మంచిది, నగరములో యున్న పెద్ద సంఘమునకు నేనొక సంఘ కాపరినని మీరెరుగుదురు.” బాప్టిస్టు మరియు మెథడిస్టులగు మీరు ఒక అబద్ధపు ప్రవక్తల యొక్క మాటలకు చెవియొగ్గుచున్నారు. ఇప్పుడు అది కఠినమైన మాటయే, కాని ఈ పరిశుద్ధ గ్రంథమునకు విరుద్ధముగా బోధించువారెవరైనా గాని వారొక అబద్ధపు ప్రవక్తయేయగును. అదెంతగా మెరుగుపెట్టిన బోధయైనను అది నాకనవసరము, అది అబద్ధపు ప్రవచనమే. అది నిజము.

“ఓ, పుస్తకములో నీ పేరు నమోదు చేయబడియున్నంత వరకు అంతా బాగానే యుండును.” మీ పేరును మీరు ఒక డజను పుస్తకములలో నమోదు చేసికొనియుండి యుండవచ్చు; కాని నీ పేరు జీవగ్రంథములో లేకపోయినయెడల, నీవు నశించినవాడవగుదువు. నీవు ఎంతో మంచివాడిగా యున్నను, నీవు ఎంతో విశ్వాసము గలవాడవైనను, ఎంతో పరిశుద్ధుడవైనను మరియు ఎంతో నీతిమంతుడవైనను గాని దానికి దీనితో ఏ ఒక్క సంబంధము లేనే లేదు!

74

ఏశావు యాకోబు కంటే రెండింతలు పురుషత్వము గల ఒక వ్యక్తిగా యుండెను, అతడు కళ్ళు కనపడని తన వృద్ధ తండ్రిని చక్కగా చూచుకొనుచు మరియు సమస్త కార్యములను శ్రద్ధగా చేయుచుండెను. కాని యాకోబు ఒక పిరికివాని స్వభావముగలవాడై తన తల్లి యొక్క చెంగు పట్టుకొని తన తల్లి చుట్టూ తిరుగుచుండే ఒక ఆడంగివాడుగా యుండెడివాడు. కాని దేవుడు, “యాకోబును నేను ప్రేమించితిని మరియు ఏశావును ద్వేషించితిని,” అని చెప్పెను. రోమా 8వ అధ్యాయములో ఆ విధముగా చెప్పబడియున్నది. ఆ బాలుడు జన్మించక ముందే ఇది చెప్పబడెను. అది ఖచ్చితముగా నిజము.

మానవునిలో ఏమున్నదనే దానిని దేవుడెరుగును. అదే విధముగా సంఘములో ఏమున్నదనే దానిని కూడా దేవుడెరుగును. మనము జీవపు రొట్టె ద్వారాను, దేవుని యొక్క వాక్యమనే రొట్టె ద్వారాను జీవించుచున్నాము. ఇప్పుడు, అందువలననే మనము ఒక సంఘ శాఖ కాదు.

75

ఇప్పుడు, నేను మీకు ఇంకొక చిన్న.... ఇచ్చట నేను వ్రాసియుంచుకొనియున్న దానిలో నుండి ఒక చిన్న ఉదాహరణను నేను మీకు ఇవ్వాలని ఆశించుచున్నాను. “మహా ...” ఇప్పుడు ప్రకటన 19:2లో యున్న దానిని ఆనవాలుగా ఇచ్చట నేను గురుతును పెట్టియున్నాను. ఇప్పుడు అది ఏమైయున్నదనే దానిని గురించి చూచి మరియు కనుగొనలెనని నేను ఆశించుచున్నాను.

ఆయన తీర్పులు సత్యములును న్యాయములునైయున్నవి; తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. [అది కాథలిక్కు సంఘము యొక్క ముగింపుగా యున్నది.]

76

ఇప్పుడు, ఒక సంఘ శాఖను గురించి ఇచ్చట లేఖన భాగములలో యుండుటను, ఇచ్చట అది ఒక సంఘ శాఖను గురించనే దానిని మీరు గమనించవలెనని మేము ఆశించుచున్నాము. అది... పరిశుద్ధ గ్రంథము ఒక సంఘ శాఖ గురించి గొప్పగా చెప్పనే చెప్పుట లేదు. సంఘ శాఖ కాథలిక్కు సంఘము నుండి పుట్టుకొచ్చినది. సంఘ శాఖకు ఆమెయే మొదటి తల్లిగా యుండి మరియు ప్రతీ సంఘ శాఖ అచ్చట నుండియే పుట్టుకొని వచ్చినది. ఇప్పుడు, ఇది కొంచెము కఠినముగా యుండును; ఇది ఎల్లప్పుడూ కొంచెము కఠినముగానే యుండును, చూచారా. కాని నేను సంఘ శాఖలు దేవుని వలన జన్మించబడలేదనియు లేదా నియమించబడలేదనియు మీరు తెలుసుకోవాలి అని కోరుకొనుచున్నాను. అవి దెయ్యము వలన నియమింపబడినవి!

దేవుని యొక్క సంఘమనునది...

“మనము విభజింపబడలేదు,

మనమందరము ఒకే శరీరమైయున్నాము.

ఒకే నిరీక్షణను, ఒకే సిద్దాంతమును మరియు

ఒకే దాతృత్వము లోను మనమందరము యున్నాము!“

అదియే జీవముగల దేవుని యొక్క సంఘముగా యున్నది. వారేమైయున్నాగాని, వారి విషయము ఏమైనా గాని, మనమట్టుకు ఒక్కటిగా కలసియున్నాము. అది నిజము. అతడు మొథడిస్టుయైనా లేదా బాప్టిస్టుయైనా గాని, సహోదరుడా, అతడు నూతనముగా జన్మించినవాడై యుండి మరియు పరిశుద్ధాత్మతో నింపబడియున్నయెడల, అతడు నా సహోదరుడు, మేము సమ్మతించి ఏకముగా నడిచెదము. నిజము. అవునండీ. అందులో ఎటువంటి బేధము కలిగియుండదు.

77

మోషే. కొన్నిసార్లు మీరు, “సహోదరుడా బ్రెన్హాం, మూఢభక్తివంటివారైన ఆ పెంతెకోస్తుల గుంపు యొద్దకు నీవు ఎందుకు వెళ్ళుచున్నావు?” అని అడగవచ్చును. ఆ విషయమేమిటనేది మీరెరుగుదురా? ఫరో చూచిన అదే కిటికీ గుండా మోషే కూడా ఆ ఇశ్రాయేలు యొక్క సంతానమును చూచెను. ఫరో వారిని మట్టిని త్రోక్కే బానిసలుగా చూచెను, కాని మోషే వారిని దేవునిచే ఎన్నుకొనబడినవారిగా చూచెను. వారు వాగ్దానముగల జనులని అతడు ఎరిగియుండెను. ఎందుచేత? అతడు దానిని వాక్యము ద్వారా ఎరిగియుండెను.

విశ్వాసము ద్వారా, అతడు ఫరోగా సింహాసనమునందు ఆసీనమవ్వబోవుచున్నాడు, ప్రపంచమంతా అతడి కాళ్ళ యొద్ద పడియున్నది, గంభీరముగా అతడు కూర్చొనియుండగా ద్రాక్షారసమును అతడి నోట్లో పోయుచు, అందమైన స్త్రీలు అతడికి విసురుచుందురు. ఒక చక్రవర్తిగా లేదా సర్వాధికారిగా లేదా ప్రపంచమునకే రాజుగా సింహాసనమునందు ఆసీనమవ్వబోవుచున్నాడు. నలుబదియేండ్ల మోషే. చేతులలోకి సమస్త అధికారము రాబోవుచున్నది. కాని ఎప్పుడైతే మట్టిని త్రోక్కుతున్న బానిసలైన ఆ గుంపును అతడు చూచెనో, వారిలో తాను కూడా ఒకడినని అతడు ఎరిగెను. హల్లేలూయ! అదియే, వారిలో తాను ఒకడినని అతడు ఎరిగియుండెను. విశ్వాసము ద్వారా మాత్రమే అతడు దానిని ఎన్నుకొనెను!

78

ప్రతీ ఒక్కొక్కరము ఎన్నుకొనబడవలసినవారిగా యున్నాము. నీవు ఎన్నుకొనవలెను. నీవు దేనిని ఎన్నుకోవాలనుకుంటున్నావో దానిని ఇప్పుడే ఎన్నుకొనవలెను. ఒకవేళ మీరు బ్రతికియుండినయెడల ఉదయమున మీకు ఇష్టమైన దానిని ఎన్నుకొనెదరు, రేపటి రాత్రికి మీరు ఎన్నుకొనెదరేమో, ఏదో ఒక దినమున నీవు ఎన్నుకొనవలసినవాడివిగా యున్నావు. సహోదరుడా, చాలా కాలము క్రిందట ఈ పరిశుద్ధ గ్రంథమును నా నిఘంటవుగాను, ఈ పరిశుద్ధ గ్రంథమును నా జీవగ్రంథముగాను నేను ఎన్నుకొన్నాను; ఈ పరిశుద్ధ గ్రంథమే దేవుని యొక్క వాక్యమైయున్నది. నేను జీవించుచున్నది ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారానే. నేను నిలబడగలుగుచున్నది ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారానే.

79

అందుచేతనే మోషే ఇశ్రాయేలు జనమును చూచెను మరియు “ఓ, వారు ఎంతో మంచివారు, వారియందు ఏ విరోధము నాకు లేదు, ఓ, అటువంటిది ఏది లేదు, వారికి వ్యతిరేకముగా ఒక్క మాట కూడా నేను మాట్లాడను,” అని అతడు చెప్పలేదు. నేడు అనేక మంది ప్రజలు ఆ విధముగానే చెప్పుచున్నారు. “ఓ, ఆ పెంతెకోస్తులు మరియు ఆ జనులు పరిశుద్ధాత్మను గలవారు, ఆ జనులు దైవీక స్వస్థతయందు నమ్మకమునుగలవారు, ఓ, నేను వారికి విరోధముగా నేనేదియు మాట్లాడను.” కాని మోషే ఆ విధముగా చెయ్యలేదు. అతడు ఐగుప్తును త్యజించి వారిలో ఒకడిగా కలిసిపోయెను, అతడి యొక్క సహోదరుల మధ్యలోకి వెళ్ళి వారిలో కలిసిపోయెను. వారిలో అతడు ఒకడుగా కలిసిపోయెను.

80

సహోదరుడా, అచ్చటయే నా మార్గమును కనుగొంటిని. ప్రభువు నిమిత్తమై తృణీకరించబడిన ఆ కొద్దిమందితో నేను నా మార్గమును ఎన్నుకొనసాగెదను. వారు కొద్దిమందైనా గాని లేదా ఏమైనా గాని వారికి ఒక వాగ్దానము గలదు. మరియు వారి పేర్లను నేను గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమునందు చూచెదను. వారు నా సహోదరులు. అది నిజము. మీరు అటువంటి వారిని ఎన్నుకొని మరియు వారితోనే నిలచియుండుడి. సరియా లేదా తప్పో, ఏదైనా గాని మీరు వారితోనే నిలిచియుండుడి. వారు తప్పుగా యుండినయెడల, వారిని సరిదిద్దుటకు వారికి సహాయము చేయుము. అది నిజము. వారిని తన్ని త్రోసివేయుటవలన వారిని నీవు సరిదిద్దలేవు. చూచారా, వారిని దానినుండి వెలుపలకు లాగుటకు ప్రయత్నించండి.

81

చార్లీ, వారు సహోదరుడు ఆవెన్ గురించి చెప్పినట్లుగా అగ్నిని గురించి మరియు చేతులలో రక్తము కారుచున్నట్లు చేయుదురు. “నేను ఎన్నటికి ఏ.ఏ. అలెన్ని కించపరచలేదు,” అని నేను చెప్పాను. “నాకు ఏ.ఏ. అలెన్ వలె ప్రసంగించగల ప్రావీణ్యము యుండినయెడల, స్వస్థతా ఆరాధనను నేను జరిపించనే జరిపించను,” అని నేను చెప్పాను. ఇప్పుడు, మీ చేతులలో రక్తము కారునట్లుగా చూపించుచు అదియే పరిశుద్ధాత్మను పొందుకున్నందుకు ఆధారమని చెప్పు మాటలను నేను అంగీకరించను. కాని సహోదరత్వము అనే విషయము వచ్చునప్పుడు, అతడు నా సహోదరుడు. యుద్ధరంగమునందు నేను అతడితో కలిసి పోరాడెదను. అది నిజము. ఒకవేళ తప్పుగా యుండినయెడల, అతడికి సహాయము చేయుటకు నేను ప్రయత్నించెదను. ఒకవేళ నేను తప్పుగా యుండినయెడల, అతడి సహాయమును నేను కోరెదను. ఆ విధముగానే మేమే ఒకరితో ఒకరము సమ్మతించి కొనసాగెదము.

82

ఇప్పుడు, ఇచ్చట గమనించండి. ఆమె, “మర్మము, మహాబబులోను... వేశ్యలకు తల్లి.” స్నేహితుల్లారా, నేటి సంఘము ఏ విధముగా యున్నదనే దానిని ఇప్పుడు మీరు చూడగలుగుచున్నారా, నేటి సంఘములు వారికి ఇష్టమైన ఏ మార్గములోనైనను వారు జీవించుచుండుటను మీరు చూడగలుగుచున్నారా? “అదంతా ఫరవాలేదులే, ముందుకు కొనసాగిపో,” పంది పందితో తిన్నది దానిపైపు మీ దృష్టిని కేంద్రీకరించవద్దు. “ఆ, దానిని చేయడంలో ఎం తప్పున్నదిలే, మీరు ఇంకా ఆ పాత పద్ధతిలోనే యుండుటకు ప్రయత్నించుచున్నారు.” ఇప్పుడు వారి సిద్దాంతమును గమనించండి. ఇప్పుడు గమనించండి. అది వారి అలవాటైయున్నది. కొన్ని సంవత్సరముల క్రితము కాథలిక్కు సంఘము మాత్రమే సినిమాలను చూచుటకు అనుమతించెడిది. మెథడిస్టు సంఘము అస్సలు దానిని గురించి తలంచే తలంపే దానికి యుండదు, అన్ని సంఘ శాఖలు కూడా అలాగే యుండెడివి: “కాదు, అది దయ్యము యొక్క క్రియగా యున్నది.” మంచిది, నేను ఏమి జరిగిందనే దానిని గూర్చి నేను విభ్రాంతినొందుచున్నాను. అవునండి.

83

మీరెరుగుదురా, ఆ యవ్వన కాథలిక్కు బాలికలను చూడండి, వారు ఈ చిన్న (ఇప్పుడు, మీలో కొందరికి నా యొక్క వయస్సు యుండును) చిన్న యవ్వన బాలికలు మోకాళ్ళ ఎత్తు వరకుయున్న దానియొద్దకు వెళ్ళిరి. ఆ వ్యక్తి, నేడు రాత్రి పాతాళమున యుండునని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దానిని నేనెరుగను, నేను అతడికి తీర్పరిని కాను. కాని ఎప్పుడైతే అతడు మొదటగా ఆ రోత పాటను, తనిఖీ చేయకుండా రేడియోలో ప్రసారము చేసారో, చుట్టివేయండి (Rollem), బాలికల్లారా, చుట్టివేయండి, చుట్టివేయండి మరి మీ అందమైన మోకాళ్ళను చూపించండి. ఎన్నో సంవత్సరముల క్రితము మొట్టమొదటిసారిగా అది ఆ విధముగా వచ్చుటకు మీకెంతమందికి జ్ఞాపకము గలదు? అచ్చటే అది మొదటిసారిగా ప్రసారమైనది. అది నిజము. వారు ఈ వ్యక్తిని టెక్సాస్ నుండి తీసికొనివచ్చినప్పుడు, ఈ స్త్రీలను అతడి యొద్దకు తీసుకొని వెళ్ళి, వారు లోపలి వస్త్రములుగా ఉపయోగించు వస్త్రములను వెలుపల ధరించునట్లుగా ఆ స్త్రీలను చేసి, ముందు కనబడని ఏదో ఒక క్రొత్త తరహలో ఆ స్త్రీలు కనబడునట్లుగా వారిని యుంచి, వారు ఆ స్త్రీలు వాటితోనే యుండునట్లుగా వదిలివేసిరి. ఇప్పుడు వారేమి చేయుచున్నారు? అది లోపలికి ప్రవేశించినది. అది ఒక ఆత్మగా యున్నది!

84

ఒకానొక దినమున ఒక వ్యక్తి నాతో ఈలాగు మాట్లాడుచున్నాడు, “నేనేమి చెయ్యవలయునో నాకేమి అర్థమగుట లేదు. నా కుమారుడు ఎంతో మంచివాడుగా యుండెను. కాని ఇప్పుడు అతడి చేతులకు ఏమి దొరుకుచున్నదో దానిని తీసుకొని వెళ్ళిపోవుచున్నాడు,” అని చెప్పెను.

“ఎందుకని?” అని నేనడిగాను.

“అతడు ఒక దొంగతో సంబంధమును కలిగియున్నాడు.”

మీరు ఒక దొంగతో సంబంధమును కలిగియున్నచో, మీరు కూడా ఒక దొంగగా మారుచున్నారు. నా వృద్ధ కెంటకీ తల్లి ఈ విధముగా చెప్పుచూ యుండేది, “నీవు పేలు పట్టిన కుక్కతో పండుకొనియున్నయెడల, మీకు పేలు పట్టును,” అని చెప్పెడిది. ఒక చెడు నడతగల స్త్రీ దగ్గరకు ఒక మంచి బాలుని తీసుకొని వెళ్ళియంచినయెడల, ఏమి జరుగునో తెలుసా? ఆ మంచి బాలుడు కూడా చెడిపోవును. అదే విధముగానే చెడు ప్రవర్తనగల ఒక పురుషుని యొద్ద ఒక మంచి ప్రవర్తనగల బాలికను యుంచినయెడల అదే జరుగును. నీవు ఎవరితో సంబంధమును కలిగియున్నావో దానినిబట్టి నీవెవరివో నిన్ను గురించి తెలుసుకోవచ్చును. నిన్ను నీవు వారినుండి వేరుపరచుకొని రావలెయును. “వారిని విడిచి, ప్రత్యేకపరచుకొని వెలుపలికి రండి!” అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. నిన్ను నీవు వేరుపరుచుకో. అది నిజము.

85

వారియొక్క సంఘ శాఖలు వారిని ఆ విధముగా అనుమతించునట్లుగా దిగజారి పోయిన నీచ స్థితికి అవి వచ్చినవి... మంచిది, ఒకానొక దినమున ఇచ్చటయున్న ఒక పెద్ద మంచి బాప్టిస్టు సంఘమున ఇరువది నిమిషములు మాత్రమే ప్రసంగించి ముగించెను, ఎందుకనగా ఆ సంఘ కాపరి సిగరెట్టును కాల్చుకోవాలని. సంఘ సభ్యులందరూ వెలుపలికి వెళ్ళిపోయిరి. ఆ సంఘ కాపరి మరియు ఆ సంఘ సభ్యులందరూ కలిసి అచ్చట వెలుపల నిలబడుకొని పొగను పీల్చుకొని, మరలా లోపలికి ప్రవేశించిరి.

నేను కాంగ్రెగేషనిస్ట్ సంఘమునకు వెళ్ళియుంటిని, అచ్చట ఒక వ్యక్తి పొడవైన అంగీని ధరించుకొని, ఈ విధముగా ప్రసంగవేదికయందు నిలబడుకొని, కొండపై అతడు చూచిన ఒక పుష్పమును గురించి చెప్పెను. అతడు మాట్లాడినదంతా దానిని గురించే. ప్రసంగమును ముగించి అచ్చట నుండి అతడు నడచుకొంటూ వెళ్ళెను. అతడి చేతివ్రేళ్ళ మధ్యలో సిగరెట్లను కాల్చుట వలన పసుపు రంగుగా అవి మారిపోయినవి. అవును. అచ్చట యున్న స్త్రీలతో, ఆ వ్యక్తి పేకాటను ఆడుటకు వారితో వెళ్ళెను.... వారు అదే ఆ జర్మనీ పేకాటకు పేరేమిటి? దానిని మీరెరుగుదురా? అది... ఓ, నాకు జ్ఞాపకము కలదని నేననుకున్నాను. పినోకుల్ (Pinochle), వారు పినోకుల్ననే ఒక ఆటను ఆడుకొనుటకై సిద్ధమయ్యిరి. అది... అచ్చటే మీకు దానితో సంబంధమును కలిగియున్నారని నేననుకుంటున్నాను. అది ఎప్పుడూ అలవాటుగా ఆడే పేకాట అది. బేస్మెంట్లో ఆడుకునే ఒక పినోకుల్ ఆట అది. ఓ, ఎంతటి ఘోరము. అదే వారి పునాదిగా యున్నది. అందులో ఆశ్చర్యపడుటకేమియు లేదు.

వీరు వీటన్నింటిని చేయుచు కాథలిక్కు సంఘము వారు లాటరీ ఆట ఆడుకొనుటను చూచి ఎగతాళి చేయుచున్నారు. ప్రొటస్టెంటు సంఘము వారలారా వారెంతటి నీచమైనవారో మీరు కూడా అట్టివారే; కాబట్టి వాటిగురించి మీరేమి చెప్పగలరు? కుండ మూకుడును చూచి రోతగా యున్నదని చెప్పలేదు. నిశ్చయముగా, ఆలాగు చెప్పలేదు. అదే విధముగా మీరు కూడా, వీటన్నింటిని చేయుచు, “మంచిది, నేనొక ప్రెస్బిటేరియన్ని నేనొక మెథడిస్టును,” అని చెప్పలేరు. మీరు మరలా నూతనముగా జన్మించనంత వరకు మీరు ఎందుకు పనిరానివారుగానే యున్నారు. అది నిజము. కాని మీరు ఎప్పుడైతే నూతన జన్మ అనుభవము పొందుకుందురో, అప్పుడు, అవన్నియు తప్పుడు కార్యములని మీ అంతరంగములో ఏదో చెప్పుటను మీరు కనుగొనెదరు. మరియు నీవు దానినుండి వెలుపలికి ఖచ్చితముగా వచ్చెదవు, అది సత్యమని నీవు దానిని ఎరుగుదువు. నిశ్చయముగా. అవునండీ. ఆ కార్యములు ఆ విధముగా జరుగుచునేయున్నవి, ఎందుచేత? “వేశ్యలకు తల్లి.”

86

ఒకానొక ఈ దినములలో వృద్ధ తల్లి, “వీటన్నిటికి తర్వాత, నీకు తెలుసా, ప్రియమైనవాడా, మనిద్దరము ఒక్కటిగానే యున్నాము,” అని చెప్పుచు యుండెడిది. అప్పుడు ఏమి జరుగునో నీవెరుగుదువా? ఇప్పుడు వాళ్ళు చేయుచున్న క్రియలను చేయుచున్నట్లుగానే, అన్ని సంఘములు ఏకముగా ఒకదానితో ఒకటి మిళితమైపోవును. అప్పుడు ఇటువంటి చిన్న గుంపుకు ఏమి సంభవింపునో నీవెరుగుదువా? బాలురులారా! మీరు తీసుకొనబోయే దృఢమైన నిర్ణయము నిమిత్తమై వారు మిమ్మల్ని బాధపెట్టెదరు? అది ఖచ్చితముగా నిజము.

కాని బాధపడనక్కర్లేదు, గొర్రెపిల్ల అతడిని జయించును! ఎందుకనగా ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునుగా యున్నాడు. సంఘ శాఖకు బదులుగా దేవుడే తన సంఘమును నడిపించును. సహోదరుడా, స్వర్ణమయమైన నూనెయగు పరిశుద్ధాత్మను ఆయన తన సంఘముపై కుమ్మరించును, సహోదరుడా: పరలోకము నుండి అగ్ని క్రుమ్మరింపబడును, మీరు ఇంతవరకు చూడనివంటి సూచక క్రియలు మరియు అద్భుత క్రియలను చూచెదరు. అవునండీ. “చిన్నమందా, భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది.” అవునండీ. “అంతము వరకు దృఢముగా నిలబడు!” మీరు ముందుకు సాగిపోతూ యుండండి, మార్గమున కొనసాగిపోతూ యుండండి, మీ తలలను కల్వరి వైపు యుంచండి. ఈ పరిశుద్ధ గ్రంథము సత్యమైనది. బాధపడవద్దు.

87

ఇప్పుడు గమనించండి, వారియొక్క అలవాట్ల గురించి, వారు చేయుచున్న నీచమైన కార్యములను గురించి, మనము చెప్పుకుంటూ పోవచ్చును. ముందుగా మీరెరుగవలసిన కార్యమేదనగా, అది ప్రొటస్టెంటు సంఘములోనికి కారినది. అటుతర్వాత కాథలిక్కు స్త్రీలు... మీరు సంఘమునకు వెళ్ళి తలపై చేతిరుమాలును వేసుకున్నంతవరకు ఆ పొట్టి బట్టలను ధరించుటవలన మీకు ఎటువంటి ఇబ్బందియుండదు అని చెప్పెదరు. అది ఒక పారంపర్య ఆచారముగా వారు చేయుచున్నారు. “శుక్రవారము రోజున మాంసాహారమును తినవద్దు.” ఓ, సంఘములో ప్రవేశించునప్పుడు తలపై చేతిరుమాలును వేసుకొని వెళ్ళవలననే మాట పరిశుద్ధ గ్రంథములో ఎచ్చట కలదు? దానిని గురించి ఎచ్చటైనా లేఖనములలో చెప్పియున్నట్లైతే దానిని నాకు చూపించవలెనని నేను కోరుచున్నాను. అది అబద్ధపు ప్రవచనముగా యున్నది. సంఘములో మీరు టోపీని ధరించవలెననే కార్యము పరిశుద్ధ గ్రంథములో ఎచ్చట చెప్పబడియున్నది? మీరు సంఘములో టోపీని ధరించినట్లైతే, మీరు క్రీస్తును అవమానపరచిన వారగుదురు. అది నిజము. నేను పురుషులను గురించి మాట్లాడుచున్నాను. స్త్రీలారా, మీకు ఒక ముసుగు కలదు, కాని ఒక టోపీ లేదా చేతిరుమాలు గురించి ఎచ్చట యున్నాదో నాకు చూపించవలెనని నేను మీకు సవాలు చేయుచున్నాను. మీ తల వెంట్రుకలే మీకు ముసుగైయున్నది. కాని మీరేమో ఆ వెంట్రుకలను కత్తిరించితిరి. ఇప్పుడు దానిని గురించి మీరేమందురు? ఓ, “అది పాత పద్ధతి,” అని వారందురు. అట్లైనఎడల అది లేఖనమైయున్నది, దేవుని యొక్క వాక్యము సత్యము.

88

యేసు పాదములను కడిగి తన తలవెంట్రుకలతో తుడిచిన, దానిని గురించి మీరెరుగుదురు, ఆ స్త్రీని గురించి ఇచ్చట క్రొద్దికాలము క్రితము చెప్పితిని. నేను, నేడు ఒక స్త్రీ ఆయన యొక్క పాదములను కడిగి, తుడవవలెననిన యెడల, ఆ పాదములను తుడుచుటకు చాలినంత తల వెంట్రుకలను కలిగియుండుటకై ఆమె తలక్రిందులుగా నిలబడవలెను,“ అని చెప్పితిని. అది నిజము. ఓ, అది ఆ విధముగా నిన్ను చూచుట ఒక అవమానకరముగా యున్నది... ఇచ్చట, గడ్డకట్టుకొనుపోవు చలిలో ఒక లావు పాటి స్త్రీ ఒక చిన్న కోటును ధరించుకొని ఒయ్యారంగా నడుచుచూ వస్తూ నగ్నముగా వారి శరీరమును చూపించుకొంటూ వచ్చుచున్నారు.

“ఎందుచేత నీవు స్త్రీలనే తిట్టుచున్నావు?” అని ఎందుకు చెప్పుచున్నారు. నిన్ను గద్దించే తీరవలయును. మీ స్త్రీలు ఆ విధముగా ప్రవర్తించునట్లుగా అనుమతించే సహోదరుడా, నేను నిన్ను గురించి అసలు ఏమనుకోవాలో నాకు అర్థమవుట లేదు. ఇప్పుడు, అది సత్యము.

సంఘ కాపరులారా, మీరు ఇచ్చట యున్నారని నేను తలంచనే లేదు. కాని మీరు ఆ వ్యక్తిని చూచినయెడల, అతడిని నా యొద్దకు రమ్మని మీరు చెప్పండి... చూచారా. అతడు క్రీస్తును గౌరవించకుండా, అతడి యొక్క సంఘము ఈ విధముగా ప్రవర్తించునట్లు అనుమతించినయెడల... ఇప్పుడు అతడు... అచ్చట వారు బహుశా దానిని అతడి వెనుక చేయవచ్చు, కాని మీరు అతడియొద్ద దానిని గురించి చెప్పని యెడల, అతడు యేసుక్రీస్తుకు సేవచేయుటకు తగిన అర్హతగల సేవకుడే కాదు. అది ఖచ్చితముగా సరియినది. అతడు యేసుక్రీస్తు యొక్క సేవకుడుగా యుండుటకు అర్హతలేనివాడుగా యున్నాడు. క్రీస్తు యొక్క సేవకుడనేవాడు, పరిశుద్ధ గ్రంథము వలన వచ్చినయెడల అతడు భయములేని ధైర్యశాలిగా యుండవలెను. నిశ్చయముగా. కాని వారు వెలుపలికి వెళ్ళి మరియు ఏలాగైతేనేమి వారు దానినే చేయుచున్నారు, ఆ విధముగానే వారు యున్నారు.

89

పిదప, మొదటి విషయమును మీరెరుగుదురా, ప్రొటస్టెంటులు దానిని వెంబడించ వలసియుండెను. మంచి మొథడిస్తు వారులారా మిమ్మల్నే, బాప్టిస్టులారా మిమ్మల్నే, ప్రెస్బిటేరియన్, నజరీనులు, పరిశుద్ధ యాత్రకులు మరియు మీరందరూ దానిని గైకొనిరి. అదే విషయము. అట్లే మీరు వెంబడించిరి, ఒకటి, ఆరుగురు, ఇంకొకదానిలో డజను కొద్ది, అచ్చటనే ఆ సంగతి గలదు. “వేశ్యలకు తల్లి” మీ శాఖ: “వారు ప్రధాన కార్యాలయములో దానిని ప్రారంభించనంత వరుకు, అది ఏ తేడాను కలుగజేయుచున్నది?” అని అనుచున్నారు. గ్రహించితిరా? మొత్తం ఒక పూర్తి తేడాను కలుగజేయును. వారు ప్రధాన కార్యాలయమును దానిని ప్రారంభించలేదు. బహుశా వారు ఇచ్చట క్రిందయున్న ఈ ప్రధాన కార్యాలయములో దానిని ప్రారంభించవచ్చు. కాని పైనయున్న దానిని కాదు. మీరు ఎచ్చటి నుండి వచ్చితిరనే దానిమీద అది ఆధారపడియున్నది. అది సత్యము.

90

ఇప్పుడు, ఇంకొక దానిని గురించి మాట్లాడుటకు సమయము లేదని నేను తలంచుచున్నాను. దీనిని ఉదయము వరుకు వదిలివేయుట మంచిది. సరి, ఈ చిన్న అంశమును మనము తీసుకొనెదము. ఇచ్చట మనకు, “నీటి బాప్తిస్మము” గలదు. మనకు “ముందుగా ఎన్నుకొనుట,” ఓ, ఇంకా అనేక విషయములు గలవు. అందువలన “స్త్రీ ప్రసంగికులు” అనే చిన్న అంశమును మాత్రమే మనము తీసుకొనెదము.

ఇప్పుడు, ఇప్పుడు, స్త్రీ ప్రసంగి, మీ యొక్క భావములను నేను కించపరచుట లేదు, కాని మీకొక విషయమును చెప్పాలని నేను ఆశించుచున్నాను. అవి లేఖనములుగా అణువంత కూడా ఆధారపూర్వకముగా ఎచ్చట పరిశుద్ధ గ్రంథములో లేవు. అవును, మీరు దేనిని తీసుకొని చెప్పెదరని నేనెరుగుదును, మీ అభిప్రాయములన్నింటిని... అవును, “మీ కుమారులును, మీ కుమార్తెలును, ప్రవచనములు చెప్పుదురు,” అనే లేఖనమును కదా చూపెదరు. “ప్రవచనము” అనే పదమునకు మీ సంఘ కాపరికి భావము తెలియకుండా యుండినయెడల, నీవు ఒక ప్రసంగికురాలివిగా యుండవచ్చు అని ప్రసంగవేదిక వెనుక అతడు నిలబడి చెప్పుటకై ప్రయత్నించుటనేది అతడి పని కాదు, చూచారా. ఎందుకనగా అది ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరుకు దానిని ఖచ్చితముగా ఖండించుచున్నది. దానిని ఇచ్చట నేను మీకు చూపించాలని ఆశించుచున్నాను.

91

ఇప్పుడు మీరు I తిమోతి 2:11కి త్రిప్పవలెనని నేను ఆశించుచున్నాను. మీరు త్రిప్పి చూడండి, దానిని అచ్చట మనము కనుగొనవచ్చును; దానిని అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయములో కూడా కనుగొనవచ్చును. ఈ అంశము మీద లేఖనము ఏమి చెప్పుచున్నదనే దానిని గురించి ఇచ్చట మీరు ఆలకించండి.

ఇప్పుడు, ఎవరో ఒకరు, “మంచిది, సహోదరుడా బ్రెన్హాం, నీవు స్త్రీ ద్వేషిగా యున్నావు,” అని చెప్పుచుండెను. నేను స్త్రీలను ద్వేషించుట లేదు. నేను ఒక స్త్రీలకు చెందని ఒక స్థానమును వారు తీసుకొనుటకు ప్రయత్నించుటను చూచుటకు నేను ఇష్టపడుట లేదు. ఇచ్చటయున్న హోవార్డ్ నౌకాశ్రయము మీకు జ్ఞాపకము యున్నదా, అది ఓహియో నది యొడ్డున ఎంతో ప్రసిద్ధి చెందిన నౌకాశ్రయముగా యుండినది, దానికి ఒక స్త్రీని ప్రధానాధికారిగా నియమించిరి, ఏమి జరిగినదో చూడండి, ఓటు వేయడానికి వారు స్త్రీకు అర్హతను ఇచ్చిరి, ఏమి జరిగినదో చూడండి.

92

మీకు ఇప్పుడే చెప్పాలని నేను ఆశించుచున్నాను. స్త్రీలను కించపరచవలెననుటకు కాదు. పురుషులారా, నీవు ఈ విషయములో మీరు కూడా ఇందులోనే యున్నారనే దానిని ఎరుగవలెను, కాని సహోదరుడా, నన్ను ఒక విషయమును మీకు చెప్పనివ్వండి. ఈ దేశము ఒక స్త్రీ యొక్క దేశముగా యున్నది. నేను దానిని లేఖనముల ద్వారాను, లేదా మీ ద్వారాను లేదా మీరు ఆశించే ఏ విధముగానైనను, దానిని మీకు రుజువుపరచి చూపించాలని ఆశించుచున్నాను. ఇదియే. మన రూపాయి కాగితముపై ఏమి కనబడుచున్నది? ఒక స్త్రీ, ఆమె ఎచ్చట కనబడుచున్నది? ప్రకటన గ్రంథములో, ఇక్కడ, మీరు ఆమెను చూడగలరు. ఆమె పదమూడవ సంఖ్యగా యున్నది, అంతేకాకుండా, అమె ఆరంభించిన ప్రతీ కార్యము పదమూడుగానే యున్నది. పదమూడు నక్షత్రములు, పదమూడు గీతలు, పదమూడు కాలనీలు. సమస్తము పదమూడులో ఆరంభమగుచున్నవి. ఆమె ప్రకటన గ్రంథములో పదమూడవ అధ్యాయములో కనబడుచున్నది. ఒక స్త్రీ, పదమూడు.

93

1933వ సంవత్సరములో, ఇప్పుడు చర్చి-ఆఫ్-క్రైస్ట్ సంఘము యుండు స్థలములో, ఆ ప్రాచీన మసోనిక్ గృహములో మేము కూటములను జరుపుచున్నప్పుడు, ప్రభువు యొక్క దర్శనము నాకు కలిగి, “జర్మనీ ప్రభావితమై లేచి, ఆ మాగినాట్ గోడను కట్టునని,” ముందుగానే తెలుపబడినది. మీలో అనేకులకు అది జ్ఞాపకముండును. ఏ విధముగా వారందరూ అందులో దుర్గముగా యుందురనియు, అమెరికను అచ్చట సరిగ్గా ఆ గోడ యొద్ద ఒక గొప్ప అపజయమును పొందుదరనియు,

అంతేకాకుండా ఏమి సంభవించుననియు, రూస్వెల్డ్ గురించి, అనగా అతడు మరలా వరుసగా నాల్గవసారి కూడా రాష్ట్రపతిగా అవుననియు చెప్పబడినది. ఖచ్చితముగా, సరిగ్గా ముందుగా చెప్పబడిన విధముగానే అవి నెరవేరినవి. అంతే కాకుండా మోటారు వాహనములగు కారు ఎక్కువగా గ్రుడ్డు ఆకారములో తయారు చేయబడుననియు, చివరి దినములలో, అవి గ్రుడ్డు ఆకారములోనే మలచబడియుండుననియు, ఆ కారు నడుపుటకై స్టీరింగ్ చక్రము యుండదనియు, వేరొక శక్తి ద్వారా అవి నడిపించబడుననియు ముందుగానే చెప్పబడెను. ఇప్పుడు వారు భద్రత కోసమై, రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపించబడు కార్లను తయారు చేయుచున్నారు. నేను చెప్పుచున్నది నిజము. మీరు అప్పుడు నగరమునందు ప్రవేశించలేరు, ఒక ఇరువది మైళ్ళ వేగముగా వెళ్ళు ప్రదేశముగా అది యుండి, అందులో మీరు ఇరువది మైళ్ళ వేగము వరుకే వెళ్ళవలెను. రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపించబడుట వలన అది వెళ్ళి వేరొక కారును గ్రుద్ద లేదు. గమనించారా! అది ఆ విధముగా ఇప్పుడే నడిపించబడుచున్నది.

నేను, “దీనిని జ్ఞాపకముంచుకోండి, ఆ దినమునందు, అంత్యకాలము సమీపించుటకు ముందుగా ఒక స్త్రీ.... దీనిని వ్రాసియుంచుకోండి. గొప్ప అధికారమును కలిగిన ఒక స్త్రీగ రాష్ట్రపతిగా, లేదా సర్వాధికారిణిగా, లేదా గొప్ప అధికారమును కలిగిన ఒక స్త్రీగా ఈ అమెరికా దేశమునందు లేచును. ఈ దేశము స్త్రీల ప్రభావము క్రిందకు లోనగును. ఇప్పుడు, 'ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడుగా' దీనిని మీరు జ్ఞాపకమునందు యుంచుకోండి.”

94

మరియు, ఆమె తప్పిదమైనదిగా యున్నది. ఇది దేనికి దారి తీస్తుంది? నేను మీకు చెప్పనివ్వండి. ఆత్మీయ తలంపును కలిగినవారుగా యుండండి; దానిని తెరచి యుంచండి, గమనించండి. అదెందుకు ఆ విధముగా చేయుచున్నది? కాథలిక్ సంఘము లోపలికి వచ్చుటకై అది దారిని ఇచ్చుచున్నది. గమనించారా? మీరు సినిమా తారలను మరి సమస్త కార్యములన్నింటిని ఆరాధించుచున్నారు. నేను ప్రసంగించిన ఆ ప్రసంగము మీకు జ్ఞాపకమున్నదా? మార్గీ, అది అనేక సంవత్సరముల క్రితము అమెరికా ఐక్యదేశము మీదకు దండెత్తుట, అమెరికా ప్రభుత్వమును పడగొట్టుటను గురించి నేను ప్రసంగించితిని. అది నీకు జ్ఞాపకమున్నదా? అతడు ప్యారిస్ నగరమునందు పెరిగెననియు, మనము వారిని ఆ స్త్రీల నుండి, ఆ మద్యపానము నుండి మరియు గొప్ప సమయమునందు కాపాడిన పిదప అతడు తిన్నగా ఇచ్చట హాలీవుడ్నందు జ్వలించెననియు నేను అప్పుడు చెప్పితిని. ఇప్పుడు, మనము “మోడల్స్”గా స్త్రీలను తయారుచేయుటకు, పారిస్ పట్టణమునకు వారిని మనము పంపించుటకు బదులుగా, “మోడల్స్” స్త్రీలుగా తయారుచేయుటకై వారే ఇచ్చటకు వారిని పంపించుచున్నారు.

అది ఏమి చేసినది? మనము - మన పిల్లలను చలన చిత్రములను చూచుటకై సినిమా హాలుకు పంపించుటకై అనుమతించము, కాని అది తిన్నగా టెలివిజన్లోకి వెళ్ళి, అట్లే అది వెలుపలికి వెళ్ళి సమస్తమును అది కలుషితము చేసినది. ఆమెను దానిగుండా ఆ విధముగా - నేడు చిన్న బాలులందరు, చిన్న బాలికలందరు టెలివిజన్లో కనబడే ఏదో ఒక నటులవలె యుండుటను మనము చూచుచున్నాము. ఏమిటది? అది ఒకదానికొరకు దారి తీయుచున్నది. ఈ పట్టణమునందున్న సమస్త మద్యపాన దుకాణములకంటే ఒక చెడు ప్రవర్తనగల స్త్రీ ఎంతోమందిని పాతాళమునకు పంపించగలదు. అది నిజము. అర్థనగ్నముగా వీధులలో నడచుకొని వెళ్ళుచున్న ఆమెను గమనించండి. ఆ వ్యక్తి ఎవరైనా గాని నీకు అక్కర్లేదు. అతడు ఆరోగ్యవంతుడైన ఒక వ్యక్తిగా యుండి, అటువంటి ఒక స్త్రీని అతడు చూచినప్పుడు, అతడి యొక్క భావములను అది ఉద్రిక్తము చెయ్యును. ఇప్పుడు, యధార్థవంతులుగా యుండండి.

95

నేను లెక్క చేయను.... అనేక సంవత్సరములుగా నేను పరిశుద్ధాత్మను కలవానిగా యున్నాను. ఒక స్త్రీని నీవు అర్థనగ్నముగా చూచిన పిదప.... నా కారునందు ఒక సిలువ ప్రేలాడుచున్నట్లుగా నేను యుంచితిని. ఒకాయన నన్ను, “నీవు కాథలిక్కువా?” అని అడిగెను. కాథలిక్కులు సిలువను యుంచుకొనుటకై ఎప్పుడు ఒక ప్రత్యేకమైన హక్కును పొందుకొనిరి? సిలువ అనగా, “క్రైస్తవుడు” అని అర్ధము.

పరి. సిసిలియా మరియు కాథలిక్కులు కలిగినంటి గురుతులు వంటి కార్యములు అటువంటి కార్యముల యందు మనకు ఎటువంటి సమ్మకము లేదు. మనము క్రీస్తునందు విశ్వాసముగలవారమైయున్నాము. మరణించిన వారిని ఆరాధించుట వంటి సమస్త రకాల అలవాటులు వారియందే కనబడుచున్నవి. అది మరణించినవారి యొక్క ఆత్మలతో సంబంధము(Spiritualism)ను కలిగియుండుటగా యున్నది. అదంతా మరణించిన వారిని ఆరాధించుటగానే యున్నది. అటువంటి ఒక విషయమనేదేదియు లేదు, లేదు.

96

నేను ఆ యాజకుడుతో, “అట్లైనయెడల.... పేతురు మొదటి పోపా?” అని అడిగితిని....?

“అది నిజము,” అని అతడనెను

అట్లైనయెడల పేతురెందుకు, “దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసనునరుడు” అని చెప్పెను? “మీరు మరణించిన ఐదువేలమంది స్త్రీలను మధ్యవర్తులుగా చేసుకొని మరియు అటువంటి అన్ని విధములగు వాటిని మధ్యవర్తులుగా మీరు చేసుకొనుచున్నారు?ఇప్పుడు, ఏమి సంభవించినది?” మీరు అక్కడనే యున్నారు. దీనికి వారియొద్ద ఏ జవాబు లేదు. అది నిజము.

97

ఇప్పుడు వారియొక్క కొన్ని సిద్దాంతములను, వారియొక్క తప్పుడు సిద్దాంతములను, ఒక అబద్ధపు గుంపైన ప్రొటస్టెంటు ప్రవక్తలను వారు వాటి చుట్టూ తిరిగి వచ్చి, వాటిని బోధించుచుండగా, ప్రొటస్టెంటు జనులగు మీరు దానిని దిగ మ్రి౦గుచున్నారు. అది ఖచ్చితముగా నిజము. శాఖలు, మరియు మీరు అవలంభించు బాప్తిస్మము పద్ధతులు, భిన్నమగు క్రమములు మరియు అటువంటి కార్యములు ఇవన్నియు సంపూర్ణముగా లేఖనముల ప్రకారముగా లేవు. అవి పరిశుద్ధ గ్రంథపు లేఖనములకు విరుద్ధముగా యున్నవి. అట్లు౦డియు మీరు వాటిని ఎంతో గట్టిగా పట్టుకొనియున్నారు. అది నిజము.

98

ఇప్పుడు స్త్రీ ప్రసంగికుల గురించి చెప్పుచున్నదానిని వినండి. మొదటగా I తిమోతి 2:11ని చదవాలని నేను ఆశించుచున్నాను. ఇప్పుడు ఇచ్చట ఏమి చెప్పుచున్నదనే దానిని గమనించండి.

సమస్తమునందు స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను.

స్త్రీలు మౌనముగా ఉండవలసినదే గాని, ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.

దీనిని ఇచ్చట వ్రాసియుంచినందుకు నేను బాధ్యుడను కాను. ఇది ఇచ్చట యున్నదని మీకు చెప్పుటకే నేను బాధ్యతను కలిగియున్నాను. చూచారా? గమనించితిరా?

స్త్రీ సమస్తమునందు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. [మీరు ఎప్పుడైనా ఒక సాంప్రదాయ మతాచారమును కలిగిన సంఘమునకు వెళ్ళి, వారిని గమనించినయెడల, చూచారా? గమనించారా?]

ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారమును చేయుటకైనను స్త్రీకి నేను సెలవియ్యను [ఒక సంఘ కాపరి, డీకను లేదా అటువంటి వారెవరైనా గాని] పురుషుని మీద అధికారము చేయుటకైనను [గమనించారా], పురుషుని మీద అధికారము చేయుటకైనను నేను సెలవియ్యను గాని, ఆమె మౌనముగా ఉండవలసినదే.

మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా.

99

మీరెరుగుదురా... ఇప్పుడు వినండి, స్త్రీలారా. మంచి నీతిగల క్రైస్తవ స్త్రీలైన మీరు, దేవుడు ఒక పురుషునికి ఇవ్వగలిగిన శ్రేష్ఠమైనవారుగా యున్నారు. లేనియెడల ఆయన అతడికి వేరే ఇంకొక దానిని దేనినైన ఇచ్చియుండును. అవునండీ. గమనించారా? స్త్రీ ఒక మూల సృష్టి కూడా కాదు. ఆమె దేవునిచే సృష్టించబడిన ఒక సృష్టి కాదు. ఆమె ఒక పురుషునిలో నుండి తీయబడిన ఒక ఉప-సృష్టి. దేవుడు మానవుడిని పురుషుని గాను మరియు స్త్రీ గాను సృష్టించెను. ఆయన వారిని వేరుచేసెను. మరియు ఆ పురుషుడు ఎంతో కాలముగా ఈ భూమిపై జీవించిన తర్వాతనే, మృగములకు పేరు పెట్టెను. మరియు అక్కడ ఆయన చాలా కాలము జీవించెను. ఆయన ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసి, ఉప-సృష్టిగా ఒక స్త్రీని చేసెను. “మొదట ఆదామును, తర్వాత హవ్వయును నిర్మింపబడిరి.” ఇప్పుడు గమనించండి.

ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను.

100

దేవుడు మానవుడిని తీసుకొనెను; దెయ్యము స్త్రీని తీసుకొనెను. దానిని సూటిగా దానియొక్క ముఖములో చూడండి. దానిని నేడు చేయుచున్నదెవరు? నిజమైన దేవుని సంఘమును చూడండి. అది “యేసు” అని చెప్పెను. అంత్యక్రీస్తు “మరియ!” అని చెప్పును. ఆ ఆత్మలను గమనించి చూడండి, గమనించితిరా, వారు అచ్చటే యున్నారు. “దేవుని యొక్క తల్లియగు మరియ వర్ధిల్లాలి, స్త్రీలలో ఆశీర్వదింబడినదానివి, మా మరణ తరుణమునందు పాపులమైన మా కొరకు విజ్ఞాపించుము. ఆమేన్.” మరియా ప్రార్ధి౦చు... ఓ, ఎంత దయనీయము! చూడండి, అచ్చటకే మీరు వెళ్ళుచున్నారు. “స్త్రీలు,” దెయ్యము యొక్క అంశముగా యున్నది. క్రీస్తు మాత్రమే ఆరాధనకు పాత్రుడు, ఆయన మాత్రమే. అక్కడే మీరు ఉన్నారు, అక్కడే మీరు ఉన్నారు.

101

“మొదటగా ఆదాము నిర్మించబడెను, తర్వాతే హవ్వ నిర్మించబడినది. ఆదాము మోసపరచబడలేదు. మీరెట్లు ఒక స్త్రీని కాపరిగా, డీకన్ గా నియమించగలరు? ఆదాము మోసపరచబడలేదు, కాని స్త్రీ మోసపరచబడినది. ఆమె నిజముగానే. ఆమె తాను చేసిన దానిని తప్పు అని భావించనే లేదు, కాని ఆమె తప్పు చేసినది. స్త్రీ మోసపరచబడి విధినతిక్రమించినది. ఎందుకనగా... వీధులలో ప్రతీసారి ఒక శవము సమాధి చేయబడుటకై పోవుచున్నప్పుడు, అందుకు ఒక స్త్రీయే కారణముగా యున్నది. ప్రతీసారి ఒక పసిబిడ్డ కెవ్వుమని కేకవేయునప్పుడు అందుకు ఒక స్త్రీయే కారణముగా యున్నది. ఎవరో ఒకరు మరణించు ప్రతీసారి ఒక స్త్రీయే కారణముగా యున్నది. నెరసిన ప్రతీ తల వెంట్రుకకు ఒక స్త్రీయే కారణముగా యున్నది. సమస్తమునకు, మరియు మరణమునకు ఒక స్త్రీయే కారణముగా యున్నది. తప్పిదమైన ప్రతీ కార్యమునకు ఒక స్త్రీయే కారణముగా యున్నది. అట్లు౦డగా ఆమెను సంఘమునకు తలగా: సంఘ కాపరిగా, ఓ, కొన్నిసార్లు బిషప్ గా కూడా నియమించుచున్నారు. అది మీకు అవమానము.

102

ఇంకా ఒక నిమిషములో, మీకు ఇంకొక వాక్యమును త్రిప్పి చూపించెదను. చూడండి! ఇప్పుడు, మనము I కొరింథీయులు 14:32 త్రిప్పి, అచ్చట పౌలు ఏమి చెప్పెనో చూచెదము మరియు పిదప ఒక నిమిషములలో ఇంకా కొన్ని వాక్యములను చూచెదము. మిమ్మల్ని ఎక్కువ సేపు ఉంచుటకు నేను ఆశించుట లేదు, అందువలన మీరు ఎక్కువ అలసిపోవుట వలన ఉదయమున వచ్చుటకు మీకు కష్టముగా యుండును. సరే, నేను వాక్యమును చదువబోవుచున్నాను. పౌలు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో ప్రసంగించెనని ఎంతమంది నమ్ముచున్నారు? ఇప్పుడు, జ్ఞాపకముంచుకోండి, పౌలు అదే విధముగా తిమోతికి కూడా వ్రాసెను. గమనించితిరా? అది. ఇప్పుడు, I కొరింథీయులు 14:32, ఇప్పుడు సరిగ్గా మనమిచ్చట ఆరంభించెదము, మరియు ఇక్కడ నుండే చదువుట ఆరంభించుదము. 14:34 ఇచ్చట నుండునని నేను నమ్ముచున్నాను.

సంఘములో మీ స్త్రీలు మౌనముగా ఉండవలెను...

అతడు ఏమి చెప్పెనని మీరు ఆలకించితిరా?

సంఘములో మీ స్త్రీలు మౌనముగా ఉండవలెను, వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు...

మీ పరిశుద్ధ గ్రంథములో దానికి గమనిక అని యున్నదా? ఉన్నయెడల, దానిని అట్లే వెనుకకు త్రిప్పి ఆదికాండము 3:16కి అది తీసుకొని వెళ్ళుచున్నదా అని చూడండి. దేవుడు, హవ్వతో నీ భర్త యొక్క మాటలను ఆలకించకుండా సర్పము యొక్క మాటలను నీవు ఆలకించుట వలన జీవితకాలమంతా అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆమె లోబడి యుండవలెనని పరిశుద్ధ గ్రంథము చెప్పుచుండగా, ఒక సంఘ కాపరిగా లేదా సంఘ పెద్దగా ఒక స్త్రీ ఏ విధముగా ఒక పురుషునిపై పెత్తనమును చెలాయించును, ఆదియందు అది ఉన్న విధముగానే దేవుని వలన... దేవుడు మారలేడు. వాక్యమును ఇచ్చట ఒక విధముగా చెప్పుటను, ఇంకొక చోట ఇంకొక విధముగాను మీరు చెప్పకూడదు. అది ఆ విధముగా చెయ్యుట లేదు. అన్ని సమయములనందు అది ఒకేలాగ యుండును. కాబట్టి ఆదియందు, అచ్చట....

103

దీనిని ముగించు ముందుగా, నాకు ఒక అవకాశమున్నయెడల వివాహము మరియు పరిత్యాగము అనే అంశముపైన మీకు తేటపరచవలెనని నేను ఆశించుచున్నాను. దానిని ఈ సంఘములో నేను చెయ్యనేలేదు. కాని ఈ రెండు నిబంధనలను గమనించండి. ఒకటేమో ఆమె వివాహము చేసుకొనవచ్చునని చెప్పుచున్నది, ఇంకొకటేమో అతడు వివాహమును చేసుకొనకూడదని చెప్పుచున్నది, ఒకటి ఇలాగని ఒకటి అలాగని చెప్పుచున్నవి. పరిశుద్ధ గ్రంథము దానిని గురించి ఏమి చెప్పున్నదనే దానిని ఎరుగుటకు ఒక నిమిషము వేచియుండండి. చూచారా? సరే. ఇప్పుడు, ఇచ్చట గమనించండి:

104

సంఘములో మీ స్త్రీలు మౌనముగా యుండవలెను, వారు లోబడియుండ వలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రము చెప్పుచున్నది. (ఆంగ్ల “They are commanded to be under obedience” వారు లోబడి యుండవలెనని ఆజ్ఞాపించబడినది,“ అని వ్రాయబడినది - తెలుగు తర్జుమాదారుడు).

పిదప పాత నిబంధన కాలమునందు స్త్రీలు మాట్లాడుటకు వారికి అనుమతి లేదు, ఎందుకనగా వారు అనుమతించబడలేదని పౌలు చెప్పుచున్నాడు, అది నిజము కాదా? “సంఘములో మీ స్త్రీలు మౌనముగా యుండవలెను, అది లోబడుటయై యున్నది.” ఇప్పుడు మీకు కావలసినయెడల గమనికను చూడండి, అది మరల మిమ్ములను ఆదికాండము 3:16కు తీసుకు వెళ్ళెను, గమనించారా. సరే, “క్రింద, ధర్మశాస్త్రము క్రింద.”

వారు ఏమైనను నేర్చుకొనగోరినయెడల, ఇంట తమ తమ భర్తల నడుగవలెను. సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము.

ఏమిటి?....

105

ఇప్పుడు, ఆ ప్రశ్న గుర్తును మీ యొక్క ఒక్కొక్క పరిశుద్ధ గ్రంథములలో చూడండి. ఏమిటి? పౌలు దానిని ఆ విధముగా చెప్పుటకు దానిని ఆ విధముగా అనుసరించుటకును గల కారణమేమైయున్నది? ఇప్పుడు, మీరు కాని ఆ కొరింథీయులు పౌలుకు వ్రాసిన ఆ ఉత్తరములు ఎప్పుడైనా దొరికినయెడల. ఇప్పుడు, మంచిదైన ఏ పుస్తకశాలలోనైన అవి మీకు లభ్యమగును. చూడండి, ఆ కొరింథీయులు పౌలుకు వ్రాసిరి, వారు వ్రాసి అతడికి చెప్పిరి. పిదప మారు మనస్సు పొందిన ఈ స్త్రీలు... వారికి “డయానా” అనే ఒక దేవత యుండెడిది, ఆమె ఎఫెసిలో కూడా యుండినది. కొరింథీయులు ఆమెనే ఆరాధించిరి, ఎందుకనగా అది ఒక అన్యజనుల ఆరాధనగా యుండెడిది.

మరియు వారు పొలమునకు వెళ్ళు దారిలో ఒక రాతిని కనుగొనిరి, అది చూచుటకు ఒక స్త్రీ రూపమున యుండుటను చూచిరి. వారు దేవుడనే వాడు ఒక స్త్రీ రూపమున యున్నాడు, ఆమె తన స్వరూపమును క్రింద మనకు పడవేసినది,“ అని చెప్పిరి. వారి దేవాలయము సొలోమోను ఆలయము కంటే గొప్పదిగా యుండెనని చరిత్రకారులు చెప్పుచున్నారు. ఓ, అదంతా చలువరాతితో యుండినది, బంగారముతో పొదిగించబడినది, సొలోమోను కట్టించిన దేవాలయము దేవదారు కలపతో నిర్మించబడి, స్వర్ణముతో పొదిగించబడినది, చూచారా? మిక్కిలి శ్రేష్ఠమైనదిగా యుండినది. అది దీనికంటే శ్రేష్ఠమైనదిగా యున్నట్లు చెప్పబడినది. దేవుడు ఒక స్త్రీగా యుండినయెడల, ఆమె నిశ్చయముగా స్త్రీ పూజారులను కలిగియుండవలెను. నిశ్చయముగా, దేవుడు ఒక స్త్రీగా యుండినయెడల అప్పుడు స్త్రీ ప్రసంగికులు యుండుట సబబే. కాని దేవుడు ఒక పురుషుడుగా యున్నాడు, పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నదేమనగా, ఆయన ఒక పురుషుడుగా యుండెనని చెప్పుచున్నది. ఆయన ఒక పురుషుడుగానే యుండెను. చూచారా? దేవుడు ఒక పురుషుడుగా యున్నయెడల, అట్లైన అది ఒక పురుషుడుగానే యుండవలెను.

106

ఇప్పుడు గమనించండి, “ఏమిటి” అనే ప్రశ్నను.

ఇప్పుడు, ఆ స్త్రీ యాజకులలో కొందరు, వారు అన్య మతము నుండి క్రైస్తత్వములోకి మారినప్పుడు, ఇచ్చట కూడా వారు వారియొక్క కార్యాలయమును ఒక ప్రసంగికురాలిగా వారే నిర్వహించుకోవచ్చునని వారు అనుకొనిరి. వారు అచ్చట డయానా గురించి ప్రసంగించియుండిన యెడల, వారే ఇచ్చటకు వచ్చి క్రీస్తును గురించి ప్రసంగించిరి.

“ఏమిటి? దేవుని వాక్యము మా యొద్ద నుండా బయలు వెళ్ళెనా?” అని అతడు అడిగెను. దీనిని క్షుణ్ణంగా ఆలకించండి, సహోదరుడా, ఏ విధముగా దానిని సేవకులు చెయ్యగలుగుచున్నారు? 36వ చవనము.

దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలు వెళ్ళెనా? మీ యొద్దకు మాత్రమే వచ్చెనా?

ఎవరైనను తాను ప్రవక్తననియైనను ఆత్మసంబంధిననియైనను తలంచుకొనిన యెడల [ఒక ప్రవక్తగా యుండాలనే అవశ్యత కూడా లేదు, ఒక సామాన్యమైన ఆత్మ సంబంధియైన వ్యక్తిగా యుండినయెడల చూచును], నేను మీకు వ్రాయుచున్నది ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. [దానిని మీరు నమ్ముచున్నారా?]

ఎవడైనను తెలియనివాడైతే, తెలియనివాడుగానే యుండనిమ్ము.

ఇప్పుడు, నాకు సాధ్యమైనంత వరుకు దీనిని ఎంత తేటగా చెప్పువలెనో అంత తేటగా చెప్పితిని. చూడండి? “ఎవడైనను తాను ప్రవక్తననియైనను లేదా ఆత్మసంబంధినని యైనను తలంచుకొనినయెడల, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను,” అని అతడు చెప్పెను. “కాని, అతడు తెలియనివాడైతే, తెలియనివాడుగానే యుండనిమ్ము,” అని చెప్పెను. చూడండి, మీరు చేయవలసిన ఒకే ఒక పని ఏదనగా, వారు దానిని ఇంకా చెయ్యాలని ఆశించినయెడల, వారు కొనసాగునట్లు వారిని వదిలివేయండి; ఎందుకనగా అచ్చట ఆరంభమైనదానిని అతడు చూచెను.

107

ఎవరో ఒక స్త్రీ నాతో ఈ విధముగా, “ఓ, పౌలు ఒక స్త్రీ ద్వేషి” అని చెప్పినది.

అతడు స్త్రీని ద్వేషించువాడు కాదు! పౌలు అన్యజాతి సంఘమునకు ఒక అపోస్తలుడని మీరెరుగుదురు. ఇచ్చట గమనించండి. మీకు తెలుసా పౌలు...? పౌలు దానినే ప్రసంగించెనని ఎంతమంది నమ్ముచున్నారు? దానినే ఇచ్చట అతడు చెప్పియుండెనా? మరియు పౌలు చెప్పెను.

“మంచిది, సహోదరుడా బ్రెన్హాం, ఒక్క నిమిషము ఆగుము, కేవలము ఒక్క నిమషము! ఇప్పుడు, మా బిషప్ అదేమి ఫర్వాలేదులే అని చెప్పుచున్నాడు. అసెంబ్లీ సంఘమునకు చెందిన పై విచారణ కార్యదర్శి (General overseer) అదేమి ఫర్వాలేదులే అని చెప్పుచున్నాడు. ఏకత్వపు బిషప్, అదేమి ఫర్వాలేదులే అని చెప్పుచున్నాడు,” అని మీరు చెప్పవచ్చును.

వారేమి చెప్పుచున్నారో దానిగూర్చి నాకు అనవసరము, అది ఒక తప్పిదమై యున్నది! మేము దీనిని మేకు దిగగొట్టునట్లుగా మీ హృదయాలలో ముద్రించెదమని ముందే చెప్పితిని. అబద్ధపు ప్రవక్తలు ఆ విధముగానే చెప్పెదరు. కాని పరిశుద్ధ గ్రంథము ఈ విధముగా, “ఎవరైనను తాను ప్రవక్తననియైనను ఆత్మసంబంధిననియైనను తలంచుకొనిన యెడల, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలు అని అతడు ధృడముగా తెలిసికొనవలెను,” అని చెప్పుచున్నది. “అతడి యొక్క ఆత్మ ఈ వాక్యమునకు సాక్ష్యము పలకని యెడల, అతడు ఆరంభము నుండియే ఒక అబద్ధపు ప్రవక్తగా యున్నాడు. నేను అటువంటి కార్యములతో ఏకీభవించి, అటువంటి క్రియలను గురించి పట్టించుకొననివాడినైయుంటూ స్త్రీలను ప్రేమించుటకంటే, దేవుని యొక్క నిబంధనలకు, దేవుని యొక్క సంఘమునకు విరోధముగా యుండుట కంటేను, నేను స్త్రీలను ద్వేషించే ఒక స్త్రీ ద్వేషకుడుగానే యుండుటకు ఆశించుచున్నాను.” పౌలు గలతీయులకు వ్రాసిన 1:8లో ఈ విధముగా చెప్పెను, “నేను మీకు ప్రకటించిన సువార్త గాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయడల అతడు శాపగ్రస్తుడవును గాక!” ఇప్పుడు, దానిని గురించి మీరేమి చేసెదరు?

108

ఇప్పుడు, “మీ కుమారులు మరియు కుమార్తెలు ప్రవచించెదరు, అని యోవేలుచే వ్రాయబడియుండి, పెంతెకోస్తు దినమున పేతురు దానిని లేఖనానుసారముగా తీసి చెప్పెను కదా, దానిని గురించి మీరేమి చెప్పుదురు?” అని మీరు అడిగెదరు. అది ఖచ్చితముగా నిజమే.

మీకు తెలుసా, పాత నిబంధన కాలమందును, ఇప్పుడును, ఎవరైనాగాని ఆ ఒడంబడిక గుండా వచ్చుటకు గల ఒకే మార్గము... అబ్రాహాముకు మాత్రమే వాగ్దానము చేయబడినది, సున్నతి ద్వారా ఆ వాగ్దానము యొక్క ముద్ర ఇవ్వబడినది. ఎంతమంది దానినెరుగుదురు? దానిని దేవుడే స్థిరపరచుచున్నాడు.

109

ఒక బాప్టిస్టు సహోదరుని వలె, అతడు, “బ్రెన్హాం సహోదరుడా, బాప్టిస్టులమైన మేము ఎందుకని పరిశుద్ధాత్మను పొందుకొన్నాము,” అని అడిగెను.

నేను, “నీవు ఎప్పుడు దానిని పొందుకున్నావు?” అని అడిగితిని.

“మేము నమ్మిన ఆ ఘడియ యందే,” అని అతడు చెప్పెను.

నేను, “పౌలు చెప్పెను, 'మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా?'” అని అడిగెను అని చెప్పితిని. నేను, “ఇప్పుడు, బాప్టిస్టులగు మీరు వచ్చి దానిలోనిది కొంచెము పొందుకోండి, అప్పుడు నిత్యభద్రత గురించి మేము మీతో మాట్లాడెదము,” అని చెప్పితిని. “కాని... మంచిది, అటువంటిది మీరెచ్చట పొందుకొంటిరి?” చూచారా? అతడు, “నీవు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితివా,” అని అడిగెను. వారు విశ్వాసులుగా యుండిరి, శబ్దముతోను, ఆనందముతోను మరియు సమస్తమైన కార్యములు వారియందు యుండెను. అయినా గాని వారు ఇంకా కూడ పరిశుద్ధాత్మను పొందుకోలేదు. వారింకా పొందుకోలేదని పౌలు చెప్పుచున్నాడు. చూచారా?

“నీవు విశ్వసించినప్పుడు నీవు పరిశుద్ధాత్మను పొందితివా?

అందుకు వారు, “పరిశుద్ధాత్ముడున్నాడనే సంగతియే మేము వినలేదనిరి.”

“అలాగైతే మీరు దేనినిబట్టి బాప్తిస్మము పొందితిరి?” అని అడిగెను.

వారు “బాప్తిస్మమును తీసుకున్నామనిరి.” కాని తప్పిదమైనది, చూచారా, కాబట్టి అతడు వారికి మరలా బాప్తిస్మమును ఇవ్వవలసినది. సరే.

110

ఇప్పుడు, దీనిని ఇప్పుడు గమనించండి, ఈ స్త్రీ ప్రసంగీకులు, వారు లోపలికి ప్రవేశించినప్పుడు, వారియొక్క పెత్తనమును వారు గైకొనవచ్చునని వారు తలంచిరి; కాని అది ఆ విధముగా చేయుటకు దేవునిచే ఖచ్చితముగా అనుమతించబడలేదు. మరియు స్త్రీ అనే అంశము మీద మనమిచ్చట, చూచారా, అతడు. ఇప్పుడు, పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నదేమనగా, “ఎవడైనను తాను ప్రవక్తననియైనను, ఆత్మ సంబంధినని యైనను తలంచుకొనినయెడల, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలిసికొనవలెను. ఎవడైనను తెలియనివాడైతే, తెలియనివాడుగానే యుండనిమ్ము.” అందువలననే - ఈ ప్రార్థనా మందిరములో స్త్రీ ప్రసంగికులను, స్త్రీ డీకన్ లు, లేదా ఈ సంఘము యొక్క కార్యాలయపు పనులలోను నియమించుట లేదు, ఎందుకనగా ఇచ్చట ఉంచబడిన ఈ లేఖనము దానిని గురించి బహిరంగముగా చెప్పుచున్నది.

111

ఇప్పుడు, “మీ కుమారులు మరియు కుమార్తెలు ప్రవచించెదరనే” పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. “ప్రవచనము” అనే మాటకు భావమేమిటి? దానిని గమనించి చూడండి, “ఆత్మ ప్రేరేపణతో ఏదైన విషయమును గురించి చెప్పుటయగును” లేదా “ఏదైనా విషయమును గూర్చి ముందుగానే చెప్పుట” యగును. అది ఒక సమ్మిళితమైన పదము.

“శుద్దీకరణ” అనగా “శుభ్రపరచబడి, సేవకొరకై ప్రత్యేకపరచి యుంచబడుట,” అని అర్థము. అర్థమయ్యిందా? లేదా, అది ఒక భావము కంటే అనేక భావములను కలిగియుండు సమ్మిళితమైన పదముగా యున్నది. అటువంటి భావములను కలిగియుండు అనేక పదములను మనము మన ఆంగ్ల భాషయందు కలిగియున్నాము.

మనము బోర్డ్ (board) అని చెప్పుచున్నాము. ఆ పదమునకు భావమేమిటి? “మంచిది, అతడు బస చేసిన విడిదికి అతడు అద్దెను చెల్లించుట,” అనే అర్ధము నిచ్చునట్లుగా మీరు దానిని చెప్పవచ్చును. “కాదు, అతడు ఆ విధముగా చెప్పలేదు, అతడు ఒక రంధ్రమును వేసెననే,” అర్ధముతో అతడు చెప్పెను అని అనవచ్చును. “కాదు, అతడు ఆ విధముగా చెప్పనే లేదు, అతడు అతడిని విసుగు (Bored) పెట్టాడు.” అదే అర్ధముతో చెప్పవచ్చును. లేదా మీరు గమనించండి, ఒకే ఒక పదము, మీరు దేనిని గురించి మాట్లాడుచున్నారనే దానిని మొదట మీరు ఎరిగియుండవలెను. చూచారా?

“మీ కుమారులు మరియు మీ కుమార్తెలు ప్రవచించెదరు,” అనే వాక్యము కూడా అదే విధముగా అనేక భావములను ఇచ్చు సమ్మిళితమైన పదముగా యున్నది. ఇప్పుడు దేవుడు నియమించిన ఒకే ఒక మార్గమేదనగా.....

112

“మంచిది, మేము పరిశుద్ధాత్మను పొందుకొన్నామని,” ఈ బాప్టిస్టు చెప్పెను.

నేను అడిగాను, “అప్పుడు.....”

“అట్లైన మనము ఎప్పుడు విశ్వసించితిమి.”

నేను అన్నాను, “ఇప్పుడు, గమనించండి....”

అతడు, “దేవుడు అబ్రాహాముకు అనుగ్రహించెను. అబ్రాహాము దేవుడిని నమ్మెను,” అని చెప్పెను. ఆ విధముగానే అతడు దానిని చెప్పెను. అతడు, “అబ్రాహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను,” అని చెప్పెను. అది సత్యమని ఎంతమందికి తెలుసు? ఇప్పుడు, ఎంత సుళువుగా సాతాను దానిని ఒక సహోదరుడు పొరబాటు పడునట్లుగా చేయుచున్నాడో గమనించండి. ఎంతో సుళువుగా. ఇప్పుడు, అది లేఖనమైయున్నది.

సహోదరుడా, నేను మీకు చెప్పుచున్నదేమనగా, దీని లోపల, లోపల ఇచ్చట, దీని లోపలికి ప్రవేశించుటకు ముందుగా మీరు అభిషేకమును పొందుకొనియుండవలయును. మీరు ఒక రహస్యమైన స్థలమునకు వెళ్ళి ప్రార్ధించవలెను. “మీరు వెలుపలికి వెళ్ళు ప్రజలను ఎందుకు చూడకూడదు?” అని ప్రజలు చెప్పుచున్నారు. సహోదరుడా, నీవు జనులతో మాట్లాడాలంటే లేదా వారికి నీవు ప్రసంగించాలంటే, నీవు ప్రసంగవేదిక యొద్దకు వెళ్ళుటకు ముందుగా, నీవు కొద్దిసేపు నీవు దేవునితో ఏకాంతముగా గడుపుట మంచిదగును. ఖచ్చితముగా, గమనించండి, ఎందుకనగా సాతాను యుక్తిపరుడు, చాలా వివేకముగలవాడు.

113

ఇప్పుడు అతడు చెప్పిన దానిని గమనించండి, అతడు, “అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను,” అని చెప్పెను. అది నిజము. “ఇప్పుడు, నమ్మకమును కలిగియుండకుండా మరి అబ్రాహాము వేరే ఏమి చేయగలడు?” అని అతడు అనెను.

“అతడు చేయగలింగిదల్లా అదియే,” అని నేను పలికితిని.

“నమ్మట తప్ప, ఇంకేమైన ఎక్కువగా నీవు కాని లేదా మరెవరైనా గాని ఏమి చేయగలరు?” అని అతడు అడిగెను.

నేను, “మనము చేయగలింగిదల్లా అది ఒక్కటే. కాని సహోదరుడా, గమనించి చూడు, దేవుడు అబ్రాహాము విశ్వాసమును అంగీకరించెను, లేదా గుర్తించెను. ఆయన అతడికి ఒక ముద్రను ఇచ్చెను. ఒడంబడిక ముద్రగా సున్నతి అనే ఒక గురుతును ఇచ్చెను. చూడండి, ఆయన అతడికి.... ఆయన, ”ఇప్పుడు, అబ్రాహామా, నేను నీ విశ్వాసమును గుర్తించితిని, కాబట్టి నేను నిన్ను అంగీకరించితిననుటకు గుర్తుగా నేను నీకు ఒక గుర్తును ఇచ్చెదను,“ అని చెప్పెను. కావున ఆయన అబ్రాహాముకు సున్నతి చేసెను. అది ఒడంబడికకు ఒక ముద్రగా యుండెను.

మరిప్పుడు ఈ దినములలో.... ఇప్పుడు, ఒక స్త్రీ ఆ ఒడంబడికయందు ఉండలేదు. వివాహము చేసుకొనిన స్త్రీవలన మాత్రమే ఇది సాధ్యమగును. కనుగొని చూడండి, ఒక స్త్రీకి సున్నతి చేయలేము. కావున అది లోపలికి రావలయును, కావున ఆమెయు మరియు ఆమె భర్త ఏకముగా యున్నారు. వారు ఇక ఇద్దరు కాదు, వారు ఒక్కటిగా ఏకమైయున్నారు. దానిని ఎందరు ఎరుగుదురు? లేఖనము కూడా ఆలాగే చెప్పుచున్నది. కావున ఆమె వివాహము చేసుకొనుట వలన ఆమె ఒక్కటగుచున్నది. అట్లే క్రిందికి వెళ్ళి ఇచ్చట తిమోతి పత్రికయందు దానిని చూడండి. అదే విషయమును ఇచ్చట చెప్సియుండుటను మీరు గమనించగలరు, “అయినను వారు స్వస్థబుద్ధి కలిగి, విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలయందు నిలకడగా యుండినయెడల, శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును,” అని చెప్పబడియున్నది.

114

ఇప్పుడు, అటుపిదప, పాత నిబంధనలో సున్నతి అనుననది శరీరానుసారముగా యుండినది, కాని ఈ క్రొత్త నిబంధనలో, యోవేలులో, “నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులును, మీ కుమార్తెలును ప్రవచనము చెప్పుదురు,” అని చెప్పబడినది. ఇప్పుడు “ప్రవచనము” అనే పదమునకు బోధించుట అని భావము కాదు. “ప్రవచనము” అనగా “పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఒక అనుభవమును గూర్చి చెప్పుట యగును,” లేదా “సంభవించబోవు ఏదో విషయమును గూర్చి ముందుగానే తెలియచేయుట” యగును. మరియు పాత నిబంధన కాలమందు ప్రవక్తిలు యుండెనని మనమెరుగుదుము. కాని వారు ఒక బోధకునివలె ఒక భవనమునందుగాని, వెలుపల సంఘముయందు గాని, జనసమూహము మధ్యగాని వారు మాట్లాడనే లేదు. కాని, చూడండి, హన్నా మరియు దేవాలయములోయున్న ఇంకా అనేకులు వారు ప్రవక్తిలుగా యుండిరి, మిర్యాము ఒక ప్రవక్తిగా యుండెను లేదా అటువంటి వారివలె యుండిరి. ఆమె తనపై ఆత్మను కలిగియుండినది. అది నిజము, కాని ఆమె తన యొక్క స్థానమును ఎరిగినదై ఆ స్థానముందే ఆమె నిలిచియుండెను.

నేడు స్త్రీలు ప్రవక్తిలుగా నిశ్చయముగా యుండవచ్చును, కాని ఈ ప్రసంగవేదిక వెనుక నిలబడి ప్రసంగించు లేదా అటువంటి ఏదైనా ఒక ప్రసంగికురాలుగా ఆమె యుండకూడదు. మీరు ఆ విధముగా చేసినయెడల పరిశుద్ధ గ్రంథము తనకు తానే విరుద్ధముగా యున్నట్లుగా మీరు చేసినవారగుదురు. పరిశుద్ధ గ్రంథము ఇచ్చట ఒక విధముగా చెప్పి ఇంకొక చోట వేరే విధముగా చెప్పదు. అది ఎల్లప్పుడు ఒకే విధముగా చెప్పకపోయినయెడల, అది దేవుని యొక్క వాక్యముగా యుండలేదు. చూచారా? కావున, “మీ కుమారులు మరియు కుమారైలు ప్రవచించెదరు,” అనగా వారు “సంభవించబోవు కార్యములను ముందుగా తెలిపెదరు,” లేదా “వాటి గురించి సాక్ష్యమును పలికెదరు,” అని అర్థము. ఇప్పుడు, మీరు దానిని పరిశీలించి చూడండి, వీరి యొక్క పరిశుద్ధ గ్రంథమనే నిఘంటువును తీసుకొని అది సరిగ్గా యున్నదో లేదో కనుగొని చూడండి. “మీ కుమారులు మరియు కుమారైలు ప్రవచించెదరు.”

115

ఇప్పుడు, ఒక కపట స్త్రీ లేదా ఆ హక్కు తనకు గలదని అబద్ధముగా వాదించెడు స్త్రీని గురించి కూడా పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది... కాథలిక్కు సంఘమునకును మరియు ఇప్పుడు మనము మాట్లాడబోవుచున్న అంశమునకు రెండింటికిని ఇది క్రియ చేయగలదు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనమునకు మనము త్రిప్పి అది ఎంత దగ్గరగా యున్నదో మనము దానిని కనుగొందుము. ఏమి సంభవించబోవుచున్నదనే దానిని గూర్చియు, ఈ సంగతులు ఏ విధముగా ఉంటాయనే దానిని గూర్చియు, ఈ స్త్రీ ఏమి చేయబోవుచున్నదనే దానిని గూర్చియు, ఈ అంత్యదినములలో పలుకుట ద్వారా అది ఎంత భయంకరమైన దెయ్యపు క్రియగా యున్నదో ఇచ్చట మీరు దానిని చూచి గమనించినయెడల, మీరు దానిని కనుగొనగలరు. కాథలిక్కు సంఘము ఒక స్త్రీగా యున్నదనే దానిని గూర్చి జ్ఞాపకముంచుకోండి. దానిని ఇప్పుడే మనము చదివితిమి, మనము చదువలేదా? ఇప్పుడు క్షుణ్ణంగా దీనిని గమనించండి, అది ఏమి చెప్పుచున్నదో, (ప్రకటన గ్రంథము 2:20), “అయినను....” ఆయన తుయత్తైర సంఘము గురించి దీనిని మాట్లాడుచున్నాడు, చూచారా? “అయినను...” అచ్చట ఒక మధ్యకాలపు సంఘము అంధకారపు కాలముల గుండా వెళ్ళినది.

అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసియున్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యొజెబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.

116

ఇప్పుడు, మీరు ఎప్పుడైనా గమనించియుండిన యెడల, ఈ సంఘ కాలములను గమనించండి, పిదప మనము ముగించెదము. అటు తర్వాత ఉదయ కాలమున మనము తీసుకొనబోవు సంగతులను పరిశీలించెదము. గమనించండి. యూదుల దేవాలయములో యుండు సువర్ణ స్తంభము క్రింద, లోపలి ప్రక్కన సముఖపు రొట్టెలు మొదలగునవియు, ఏడు సువర్ణ దీప స్తంభములు గలవు. మీకందరికి వాటిగురించి తెలియును, చూచారా. అచ్చట ఏడు సంఘ కాలములు యుండినవి. అవి ఆ విధముగానే ఆ ఏడు సంఘ కాలముల గురించే మాట్లాడుచున్నవి. ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయమును గమనించినయెడల, యేసు సంఘ కాలములలో, ఏడు స్వర్ణ దీపస్తంభములలో నిలిచియుండుటను మనము చూడగలము. అట్లే యోహాను తిరిగినప్పుడు మనుష్యకుమారుని పోలిన ఒకడు పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించియుండుటను చూచెను. అది ఎట్లు యున్నదనగా, వెలుగుచున్న దీప స్తంభములలో ఒక వధువు నిలబడియున్నట్లుగా అది యున్నది.

ఇప్పుడు, పాత నిబంధనలో వారు వీటిని తీసుకొని, ఒక దీప స్తంభమును తీసుకొని ఇంకొక దానిని వెలిగించెదరు, ఇంకొక దీప స్తంభమును తీసుకొని మరియొక్క దానిని వెలిగించెదరు, ఒకదానినుండి ఇంకొక దానిని, ఒకదాని నుండి మరొక దానిని వెలిగించెదరు, ఏడు దీప స్తంభములన్నియూ వెలిగించు వరుకు వారా విధముగా చేయుదురు.

117

మీరు గమనించిన యెడల, ఆరంభకాలమునందు దేవుడు యూదులతో వ్యవహరించుటకు ప్రారంభించినప్పుడు, వారు స్వర్ణ యుగము గుండా వెళ్ళిరి; పిదప యూదులతో వ్యవహరించుటలో గాడాంధకారపు యుగమునందు దేవుడు అహాబులో వ్యవహరించనారంభించెను. అచ్చట ఆ సంఘ కాలములను మీరు చదివి దానిని గమనించిన యొడల, ఆయన మరలా దానిలోనికి వచ్చుచుండెను. ఇప్పుుడు ఆయన కొన్ని సంగతులను గూర్చి ముందుగా చెప్పి, సరిగ్గా ఆ గాడంధకారపు యుగమునందు అచ్చట వెయ్యిన్ని ఐదువందల సంవత్సరములు లేదా మొదట ఆహాబు కాలము అటు తర్వాత యూదులు. అహాబు యొజెబెలును వివాహము చేసుకొనిన కాలమే వారు కలిగియున్న గాడాంధకారపు కాలముగా యుండినది. ఆ సమయమునందే ఇశ్రాయేలీయులు విగ్రహారాధనను చేయునటుగాను, జనులందరిని ఆహాబును వెంబడించునట్లుగా చేసి యొజెబెలు దేవుడిని వారు ఆరాధించునట్లుగా చేసిరి. వారు దేవుని యొక్క బలిపీఠములను తొలగించి అచ్చట తోటలోని విగ్రహములను యుంచుట మీకు జ్ఞాపకము యుండును. తానొక్కడే యెహోవా కొరకు రోషముగలవాడిగా యున్నానని ఏలిషా కేకలు వేసెను, ఇశ్రాయేలీయులలో బయలునకు మొకాళ్ళూనకయు, నోటితో ముద్దు పెట్టుకొనకయు యుండు ఏడు వందలమంది నాకు ఇంకను మిగిలియున్నారని దేవుడు చెప్పెను. అది మీకు జ్ఞాపకము ఉన్నదా? అది వెలుపలికి వచ్చుచున్న ఎన్నుకొనబడిన సంఘమునకు ఒక సాదృశ్యముగా యున్నది. అచ్చట చూడండి, అదే విధముగా యున్నదో గమనించితిరా?

118

ఇప్పుడు, ఈ సంఘములో, మీరు మొదటి సంఘమును గమనించినయెడల, మొదటి సంఘమగు ఎఫెసు సంఘము ఒక గొప్ప సంఘముగా యుండినది. ఆయన, “నీలో ఇంకా జీవము గలదని,” చెప్పెను. మీరు ఒక్కొక్క సంఘమును గమనించి చూచినయెడల, సన్నగిల్లుటకు ప్రారంభించి సన్నగిల్లుతు, తుయత్తెర సంఘము వరకు కాంతి విహీనమైపోయెను. పిదప వెయ్యిన్ని ఐదువందల సంవత్సరములు, అటు తర్వాత ఆయన వేరొక ప్రక్కగా వెలుపలికి వచ్చెను, “నీయందు కొంచెము కాంతి మాత్రమే గలదు. నీలో యున్నదానిని స్థిరపరచుకోలేనియెడల నీ దీప స్తంభమును తీసివేతును? అది ఆ విధముగా కొంచెము కొంచెముగా కొనసాగుచూ, ఫిలడెల్ఫియ సంఘ కాలమునకు వచ్చినది. అటు తర్వాత ఆ విధముగానే లవొదికయ సంఘ కాలమునకు వచ్చినది.

119

ఇప్పుడు, ఇదిగో ఆ అందమైన విషయము. ఓ, స్మిత్ సహోదరుడా ఇదంటే నాకెంతో ఇష్టము. చూడండి, దీనిని గమనించండి. ఇప్పుడు, ఈ సంఘ కాలమునందు మనము చూచినట్లుగా... ఇప్పుడు, దీనిని గమనించండి, మొదటి సంఘ కాలము ఎఫెసు, ఎఫెసు సంఘ కాలముగా యున్నది. ఇప్పుడు, వెయ్యిన్ని ఐదువందల సంవత్సరములు జరుగు వరుకు యున్న ఆ ఒక్కొక్క సంఘ కాలములను మీరు గమనించి చూచిన ఎడల... మీరు ఈ రాత్రి మీ గృహములకు వెళ్ళిన తర్వాత సమయమున్నయెడల దానిని చదవండి, లేదా వేకువజామున సంఘమునకు వచ్చుటకు ముందుగా ప్రకటన గ్రంథములోని 1వ, 2వ మరియు 3వ అధ్యాయములను చదవండి. ఆ సంఘ కాలములలో ఒక్కొక్క దానియందు “నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు,” అని ఆయన చెప్పుటను మీరు కనుగొనవచ్చును' ఇది ఆ గాడాంధకారమగు కాలమగు తుయతైర సంఘకాలము యొక్క వెయ్యిన్ని ఐదువందల సంవత్సరముల వరకు అది అట్లే యుండినది. పిదప ఆయన వేరొక ప్రక్కగా వచ్చి “జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే?” అని ఆయన చెప్పెను.

120

ఈ సంఘ కాలములలో ఏ సంఘ కాలములోనైనను లేదా ఫిలడెల్ఫియ సంఘ కాలము గాని మరలా ఆ నామమును తీసుకోలేదు, ఆ నామమును అసలు వారు తీసుకోలేదు, ఎందుకనగా అది సరిగ్గా ఆ సమయము నందు వెలుపలికి వెళ్ళిపోయినది. ఇప్పుడు, ఓ, వారియొక్క అసత్య బోధలే అందుకు హేతువనే దానిని మనము చూపించుచూ, సరిగ్గా అచ్చట అది ఒక తల్లియనియు, వాటన్నింటికిని కాథలిక్కు సంఘమే తల్లిగా యున్నదియు, అది ఏ విధముగా “తల్లి, మహా వేశ్య బబులోను,” అనే సంగతిని మీకు చూపించవచ్చును. అదియే అదగుచున్నది... గమనించండి, ఇచ్చట ఈ సంఘ కాలమునందు ఆమె వెలుపలికి వచ్చునప్పుడు, ఆమె యొద్ద కొంచెము కాంతిని కలిగియుండినది. కాని అటు తర్వాత ఆమె కొంచెము కొంచెముగా క్షీణించుచు కాంతిహీనమైనది. అటు తర్వాత ఆమె ఇచ్చట మరలా వచ్చి ఒక శాఖయందు ఈ వెయ్యిన్ని ఐదువందల సంవత్సరములుగా యుండినది. ఆమె ఇప్పుడు ప్రభువగు యేసుక్రీస్తు సంఘముగా వెలుపలికి రాలేదు గాని కాథలిక్కు సంఘముగా ఆమె వెలుపలికి వచ్చినది. ఏ విధముగా లూథర్ వెలుపలికి వచ్చెను? లూథరన్ సంఘము వలె, ఏ విధముగా బాప్టిస్టు వెలుపలికి వచ్చెను. బాప్టిస్టు సంఘము వలె, ఆయన నామమున కాదు, ఆయన నామమున కానే కాదు. వేరొక నామమున వచ్చిరి. “నీకొక నామము గలదు.” “మీరు రక్షింపబడుటకు ఆకాశము క్రింద యేసుక్రీస్తు నామము తప్ప వేరొక నామము ఇవ్వబడలేదు.” “జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే? యని ఆ సంఘశాఖ గురించియే చెప్పబడియున్నది.

121

“ఓ, నేనొక ప్రెస్బిటేరియన్” నీవు చచ్చినదానివి. “ఓ, నేనొక బాప్టిస్టుని” నీవొక చచ్చినదానివి. మీరు క్రీస్తు యేసులో పునర్జీవించబడునప్పుడే మీరు జీవమును కలిగి యుందురు. అది నిజము. మీ తప్పుడు నీటి బాప్తిస్మములు, తప్పు బాప్తిస్మము, చిలకరించుట, పొయ్యుట, ముంచుటకు బదులుగా, ప్రభువైన యేసుక్రీస్తు నామమును ఉపయోగించుటకు బదులుగా, “తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ” ఉపయోగించుట. ఈ సమస్త అబద్ధపు కార్యములు పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చిన ప్రకారముగానే లోపలికి ప్రవేశించుచు అవి సాధ్యమైనంతగా క్రుమ్మరింపబడుచున్నవి. మనము వీటిని సహించుచూ, “మంచిది, మా సంఘం దానిని ఈ విధముగా నమ్ముచున్నది,” అని చెప్పుచున్నాము. కాని పరిశుద్ధ గ్రంథము దీనిని చెప్పుచున్నది. చూచారా? అటువంటి సంగతులు లేనే లేవు. అటువంటి సంగతులు అసలు లేనే లేవు అని చెప్పుచున్నది.

122

వారు వారి నాలుకను చాచి పరిశుద్ధ ప్రభువు భోజనము (Holy Eucharis)ను తీసికొని, మరియు గురువు (priest), ద్రాక్షారసము (Wine)ను త్రాగితే అది పరిశుద్ధాత్మ అని వారు చెప్పుచున్న కార్యము పరిశుద్ధ గ్రంథములో అసలు ఎక్కడ కూడా లేదు. కరచాలము చేయుట, కుడిచెయ్యిని ఇచ్చి సహవాసము చేయుటయు అది పరిశుద్ధాత్మని చెప్పుచున్న సంగతి పరిశుద్ధ గ్రంథమున లేనే లేదు. ఎవరైన ఒకడు లేచి, “ఇప్పుడు నేను ఒక విశ్వాసిని,” అని చెప్పి పరిశుద్ధాత్మను పొందుకున్నాను అని చెప్పిన సంగతియు లేనే లేదు. ఒకవేళ అట్లు౦డినయెడల, ఇచ్చటయున్న అపోస్తుల కార్యములు 2వ అధ్యాయమును మనము ఈ విధముగా చదువవలసియుండును, “పెంతెకోస్తు దినము వచ్చినప్పుడు రోము గురువు (Roman Priest) తన మెడ కాలరును త్రిప్పియున్నట్లుగా వీధిలో నడుస్తూ వచ్చెను. అతడు ఆ విధముగా వచ్చి మీరందరు, మీ నాలుకను చాచి ఈ మొదటి పరిశుద్ధ ప్రభువు భోజనమును తీసుకోండి,” అని చెప్పియుండవలయును. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము ఆ విధముగా చదివిన సరిగ్గా యుండునా?

123

మంచిది, ప్రొటస్టెంటులు యగు మీరు కూడా ఎంత చెడ్డవారుగా ఉన్నారంటె, అచ్చటకు తిరిగి వచ్చి ఈ విధముగా మీరు, “మెథడిస్టులగు మీ యొద్దకు మేము వచ్చినప్పుడు మీరు వారిని కుడిచేతిని చాపమని వారికి మీ కుడిచేతిని ఇచ్చి కుడిచేతి సహవాసము అని చెప్పుచు, వారికి ఆరు నెలల శిక్షణను ఇచ్చుచున్నారు,” అని చెప్పెదరు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయమును మీరెచ్చట చదువుచున్నారు? చూచారా? దానిని మీరెచ్చట పొందుకున్నారు? గమనించారా?

పరిశుద్ధ గ్రంథము ఈ విధముగా చెప్పుచున్నది, “వారందరూ ఏక మనస్సు గలిగినవారై ఒకే చోటకు వచ్చియుండిరి.” అచ్చటకు ఏ బిషప్పు వచ్చి దీనిని చేయ్యలేదు, ఏ గురువు అచ్చటకు వచ్చి దీనిని చెయ్యలేదు. “అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొక ధ్వని ఆకాశము నుండి ఆకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను.” వారు దానిని పొందుకొన్నవిధానము అచ్చటగలదు. అవునండీ, మహిమ నుండి వచ్చిన బలమైన గాలి వంటిది, అది ఏ వీధిలో నుండి గాని లేదా ఏ సంఘ శాఖలో నుండి గాని రాలేదు. “జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే.”

124

చూడండి, మీ ఆచారాలు మరియు శాఖలు దేవుని ఆటంకపరచి, “మేము దానిని నమ్ముచున్నాము, అద్భుతములు జరుగు కాలము గతించిపోయినదని మేము నమ్ముచున్నాము,” అని చెప్పనంతవరుకు దేవుడిని ఆటంకపరచుచుందురు. దానిని చెప్పువాడు ఒక అబద్ధపు ప్రవక్తగా యున్నాడు. మీరు కరచాలము చేయుట వలన పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు అని చెప్పువాడు ఒక అబద్ధపు ప్రవక్తయే యగును. మీరు విశ్వసించునప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకోవచ్చును అని చెప్పువాడు ఒక అబద్ధపు ప్రవక్తయే యగును. నీటి బాప్తిస్మమును తీసుకొనుటకు బదులుగా, నీళ్ళను పోయుట లేదా నీళ్ళు చిలకరించవచ్చునని చెప్పువాడు కూడా ఒక అబద్ధపు ప్రవక్తయే యగును. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే నామమున బాప్తిస్మమును పొందుట యనేది పరిశుద్ధ గ్రంథమందు లేఖనములలో లేనప్పుడు, ఆ విధముగా పొందుకోవలెనని చెప్పువాడు ఒక అబద్ధపు ప్రవక్తగా యున్నాడు. అది నిజము. ఆ విధముగా బాప్తిస్మము పొందవలెనని చెప్పుచున్నట్లుగా పరిశుద్ధ గ్రంథమందు ఏ లేఖనము లేదు. ఆ విధముగా ఏ వ్యక్తియు పొందునట్లుగాను లేదు, కాని యేసుక్రీస్తు నామమున మాత్రమే బాప్తిస్మమును పొందుకొనునట్లుగా యున్నది. యోహాను శిష్యులు కూడా పరిశుద్ధాత్మను పొందుకొనుటకై మరలా ప్రభువగు యేసుక్రీస్తు నామమున తిరిగి బాప్తిస్మమును పొందవలసి వచ్చెను. అది నిజము.

ఇప్పుడు, అది యేసు మాత్రమే అనే సిద్దాంతము కాదది, యేసు మాత్రమనే సిద్దాంతమును నేనెరుగుదును, అ మాత్రమే కాదు. ఇది ఈ పరిశుద్ధ గ్రంథము యొక్క సిద్దాంతముగా యున్నది. అది నిజము.

కాని విషయము అదియే. దానితో మీరేమి చేస్తున్నారు? అదిగో నీ తల్లి, అదిగో ఆ ఆచారముల తల్లి.

125

ఇప్పుడు, మీరు పరిశుద్ధ గ్రంథమును పరిశీలించి చూచి ఎవరైనా, ఎప్పుడైనా, ఎచ్చటైనా చిలకరింపు బాప్తిస్మమును పొందుకున్నట్లుగా చూపించండి చూద్దాం. మెథడిస్టు, ప్రెస్బిటేరియన్, కాథలిక్కులగు మీరు పరిశుద్ధ గ్రంథములో ఏ వ్యకైనా చిలకరింపు బాప్తిస్మము పొందుకున్నట్లుగా చూపించండి చూద్దాము. పాపక్షమాపణ నిమిత్తమై నీళ్ళను పోయుట అనేది పరిశుద్ధ గ్రంథములో ఎచ్చటైనా ఒక చోట యున్నదేమో నాతో చెప్పండి. దానిని తీసి చూపించండి. మీరు దానిని కనుగొనగలిగితిరా? అట్లు మీరు కనిపెట్టి చూచి యున్నయెడల, నా యొద్దకు వచ్చి చెప్పండి; అప్పుడు “నేనొక అబద్ధపు ప్రవక్తను, నేను తప్పిదముగా యుంటిని,” అని ఒక పలకపై వ్రాసుకొని దానిని నా వీపు వెనుక తగిలించుకొని వీధులలో నడిచెదను. లేదా ఎనుబది శాతమైన మీరు బాప్తిస్మమును పొందుకొన్న విధముగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మమును పొందినట్లుగా పరిశుద్ధ గ్రంథములో ఒక్క స్థలమును కనుగొనినయెడల వచ్చి నా యొద్ద చెప్పండి. ఆ విధముగా బాప్తిస్మమును ఇచ్చినట్లుగా ఒక్క లేఖనమును కనుగొని నాకు చూపించినయెడల, “అబద్ధపు ప్రవక్త,” అనే పలుకను వ్రాసుకొని, నా వీపు వెనుక తగిలించుకొని వీధులలో నడిచెదను. క్రొత్త సంఘములో ఆ విధముగా బాప్తిస్మమును పొందుకొని వారు మరలా వచ్చి బాప్తిస్మమును తీసుకొన్నదానిని నాకు చూపించండి. “యేసు” నామమున మాత్రమే కాదు, కాని మన ప్రభువగు యేసుక్రీస్తు నామమున అది నిజము. అది సరిగ్గా యున్నదాయని చూడండి.

126

మరి ఇచ్చట, అది ఏమైయున్నది? ఆమె వేశ్యలకు ఒక తల్లిగా యున్నది. ఆమెను ఒక వేశ్యగా చేసినది ఏది? ఆమెను ఒక వేశ్యగా మార్చినది ఏది? ఆమె సిద్దాంతము. వాళ్ళను ఒక వేశ్యగా చేసినది ఏది? ఆమె సిద్దాంతమే.

ఆ కారణము చేతనే వారి శాఖలను వారి సిద్దాంతములను మనము సహించలేక పోవుచున్నాము. మనము ఈ పరిశుద్ధ గ్రంథముతో పరిశుద్ధముగా నిలచియున్నాము. మీరు దాని ప్రకారముగా ఏ విధముగా జీవించుచున్నారో నాకు తెలియదు గాని, ఎలాగైతేనేమి దానిలోనిది మీకు బోధించబడియున్నది. అది నిజము. అది మీ చేతులలోనే యున్నది కాని దాని ప్రకారముగా మిమ్మల్ని నేను జీవింపచేయలేను, ఏది సత్యమో దానిని మాత్రమే మీకు నేను చెప్పగలను. ఆ కారణము చేతనే మనము ఒక శాఖగా లేము! అటువంటి ఒక కార్యములోనికి వెళ్ళి మనల్ని మనమే కలుషితము చేసుకొని ఏదో ఒక సిద్దాంతమునకు దాసోహము యగుటకు నేను ఇష్టపడుట లేదు. నిందను భరించుచూ వెళ్ళిన ప్రభువు బిడ్డలగు కొద్దిమంది యొక్క మార్గమునే నేను ఎన్నుకొనుటకు ఇష్టపడుచున్నాను. నేను వాక్యమునకు మరియు దేవుని ముందు కళంకము లేనివాడుగా నిలిచియుండి, “ఏ మానవుని యొక్క రక్తము నా వస్త్రములపై లేదని,” చెప్పుటకే నేను ఇష్టపడుదును. ఆ కారణము చేతనే మనము బ్రెన్హాం గుడారములో యున్నాము. ఆ కారణము చేతనే మనము అసెంబ్లీస్ లో లేము; ఆ కారణము చేతనే మనము ఏకత్వము (oneness)లో లేము. ఆ కారణము చేతనే మనము జీసస్ ఒన్లీ కాదు. ఆ కారణము చేతనే మనము మెథడిస్టులము కాదు. ఆ కారణము చేతనే మనము బాప్టిస్టులము కాదు, ఇచ్చట ఒక చిన్న గుడారము (Tabernacle) మాత్రమే. మనమెప్పటికి ఒక శాఖ కానే కాదు. మన క్రీస్తులో స్వతంత్రులమైయున్నాము. ఆ కారణము చేతనే మనము అవలంభించుచున్న విధానమునందే మనము నిలిచియున్నాము. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించుచు మరియు దేవుడు మాకు సహాయము చేయుచున్నాడు.

127

ఇప్పుడు, మేమెందుకు ప్రభువు సహవాసము (communion) తీసుకొనుచున్నామనే దానిని గూర్చి మేము మీకు చెప్పగలము, మేమెందుకు పాద శుద్ధిని అవలంభించుచున్నామో మేము మీకు చెప్పగలము, వారు పాపములో పాలిభాగస్తులుగా యున్నయెడల అటువంటి వారిని ఈ సహవాసపు ఆరాధనలో పాల్గోనుటకు మేము వారిని అనుమతించము. ఆ కారణము చేతనే గత రెండు లేదా మూడు వారములుగా ఎచ్చట మనస్పర్థలు వంటి గలిబిలి వాతావరణము యున్నదో వారియొద్దకు వెళ్ళుచు ఒక్కొక్క సభ్యుడిని నేను సంధించుచు వచ్చుచున్నాను. మీరు ఇచ్చట పీఠము యొద్దకు వచ్చి దేవుని యొక్క ఆశీర్వదించబడిన ద్రాక్షారసపు పాత్రలోనిది త్రాగి, పాలిభాగస్తులై యుండియు, ఒకరిని చూచి ఒకరు మాట్లాడకపోవుటయు, వీథులలోకి వారిని చూచినప్పుడు, మీ తలను త్రిప్పి వేసుకొని వెళ్ళుటయు వంటి కార్యములను చేయుచున్న మీకు సిగ్గుగా లేదా? సహోదర మరియు సహోదరిణులగు మీరు ఫోనులో ఒకరిని గురించి ఒకరు అర్థములేని వ్యర్థపు సంభాషణలతో మీ మాటలు నిండిపోవుచున్నవి. మీరు ఆ విధముగా యుండినయెడల, క్రైస్తవుడిని అని నీవు చెప్పుకొనుటకు కూడా నీకు అసలు అర్హత లేదు. నిజము. అటువంటి ఫోను సంభాషణలకు వైదొలగి యుండండి; ఇంకొకరి గురించి ఇంకొకరి దగ్గర మీ నోటి ద్వారా మంచి మాటలను వారి గురించి నీవు చెప్పలేనియెడల, నీవు అసలు మాటలాడవద్దు; జ్ఞాపకముంచుకోండి, అందునిమిత్తమై నీవు భాధ్యుడవగుదువు. అటువంటి ఆత్మ నీలో యున్నంత వరుకు నీవు దేవునియందు సరిగ్గా లేవని ఇంకా నీవు ఎరుగుదువు.

నీవు ఆ విధముగా లేనియెడల...

128

ఏ వ్యక్తియైన తప్పిదముగా యున్నయెడల, అతడి యొద్దకు వెళ్ళి సమాధానపడవలెను. అటు నీవు సమాధానపడలేనియెడల, ఎవరినైనా ఒకరిని నీతో తీసుకొని వెళ్ళు, దేవుడు తన సంఘమును క్రమశిక్షణలోనికి తీసుకొనిరాలేకపోవుటలో, ఏ ఆశ్చర్యము చెందనవసరము లేదు, ఎందుకనగా నీవు చేయవలసిన దానిని నీవు సరిగ్గా చేయనందువలన. ఫోను తీసుకొని ఇంకొకరితో, ఇంకొకరి గురించి మాట్లాడుటయు, ఏం జరుగుచున్నదనే దానిని గురించియు, చిన్న చిన్న వ్యర్ధమైన కార్యముల గురించియు మరియు మొదలగు వాటిని గురించి మాట్లాడుటకు బదులుగా, పరిశుద్ధ గ్రంథము ఏమి చెప్పుచున్నదో దానిని గురించి మీరెందుకు మాట్లాడుకోకూడదు? ఒక సహోదరుడు అపరాధము చేసియుండిన యెడల, అతడి యొద్దకు వెళ్ళి, అతడితో సమాధానపడగలవా లేదా యని నిన్ను నీవు పరిశీలించుకో. “నాకు అతడు దాని చేస్తాడు కదా....” అతడేమి చేసినా నాకు అనవసరము, ఏమైనా గాని అతడి యొద్దకు వెళ్ళు. అతడు నీ యొద్దకు రావాలని నేను చెప్పుట లేదు గాని అతడు అపరాధమును చేసినయెడల, మీరు అతడి యొద్దకు వెళ్ళండి. “మంచిది, అతడే తప్పు చేసాడు, అతడే నా యొద్దకై రావలెను,” అని మీరు చెప్పినట్లైతే, పరిశుద్ధ గ్రంథము ఆలాగు చెప్పుట లేదు. నీవే అతడి యొద్దకు వెళ్ళవలెనని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. అతడు తప్పుగా యున్నను నీవు అతడి యొద్దకు వెళ్ళుము.

అప్పుడు కూడా అతడు మాటను ఆలకించనియెడల, అప్పుడు ఒక సాక్షిగా నీతో ఎవరినైనా అతడి యొద్దకు తీసుకొని వెళ్ళండి.

అటుపిదప కూడా ఆ సాక్షిని చూచుటకు అతడు సమ్మతించనియెడల, అప్పుడు, “నేను మన సంఘ కాపరిని నీ యొద్దకు తీసుకొని వచ్చెదను,” అని చెప్పండి. పిదప సంఘకాపరి, “అతడితో, ఇప్పుడు నుండి ముప్పది దినములలో సహోదరుడగు నీవు దీనిని సరిచేసుకోలేనియెడల, నేను దీనిని సంఘములో చెప్పెదను.... ఇచ్చట ఈ సహోదరుడు సమాధానపడుటకు సమ్మతించుచున్నాడు, దీనిని చేయుటకు నీవే సమ్మతించుట లేదు. కాబట్టి ముప్పది దినములలో నీవు దీనిని సరిచేసుకోలేనియెడల, అప్పుడు ఏమి జరుగునంటే, అటు తర్వాత ఇక నీవు మాలో ఒకనిగా యుండలేవు,” అని చెప్పవలెను.

129

“అతడు సంఘమునకు చెవియొగ్గని యెడల, అతడు ఒక అన్యుడుగాను మరియు ఒక పూటకూటి యింటవాడుగాను యుండును,” అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. మీరు గమనించండి, ఒక సహోదరుడు సంఘము యొక్క కాపుదల క్రింద యున్నంతవరుకు క్రీస్తు రక్తము అతడిని కాపాడుచు యుండును. ఆ కారణము చేతనే సంఘము ఇప్పుడు కొనసాగుచున్న ప్రకారముగా కొనసాగుటకు మేము అనుమతించుట లేదు. ఇప్పుడు, ఇది బాప్టిస్టు సంఘము యొక్క సిద్దాంతముగా యున్నది... లేదా ఇచ్చట బ్రెన్హాం గుడారము యొక్క సిద్దాంతముగా — మీరు దీనిని చేసినయెడల! చూడండి, ఎందుచేత....

130

ఉదాహరణకు ఇచ్చట ఇద్దరు పురుషులు యున్నారనుకోండి, అది నేను మరియు లియో అనుకోండి, మీరు “అతడే నా పట్ల తప్పు చేసెను, నీకు తెలుసు కదా,” అని నేను చెప్పవచ్చును. కాని అది క్రియచేయదు, నేనే అతడి యొద్దకు వెళ్ళవలయును. మంచిది, అతడు ఈ సంఘము యొక్క ఒక సభ్యుడుగా యున్నాడు. అతడు ఒక క్రైస్తవుడుగా యున్నాడు. అతడు ఇచ్చట ప్రభురాత్రి భోజనపు ఆరాధనలో నాతో పాలుపంచుకొనుచున్నాడు. మేము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమును పొందియున్నాము. ఒకరిపట్ల ఒకరముగా సహోదరులుగా, యదార్థవంతులుగా ప్రవర్తించితిమి; పిదప ఏదో కార్యము జరిగినది.

అది, ఆ వ్యక్తి కాదు తొంబై శాతము జనుల మధ్య దూరిన ఒక దెయ్యముగా అది యున్నది. అది జనులు కాదు. అది దయ్యమే. దయ్యము ఆ విధముగా చెయ్యుటకు మీరు అనుమతించు వరకు, మీరు మీ సహోదరుడకు హాని చేయుచున్నారు. అది నిజము.

131

సరి, లియోకు నాకు మధ్య ఏదో కార్యము వలన మనస్పర్థలు ఏర్పడినవి. మేము వెళ్ళి దానిని సరిచేయవలెను. మా మధ్య ఏదో ఒక కార్యము తప్పిదముగా యున్నట్లుగా మీరు చూచినయెడల, మీరు మా యొద్దకు వచ్చి, “మీరిద్దరు ఇచ్చటకు రండి. మేము దానిని సరిచేయబోవుచున్నాము,” అని చెప్పవలసిన బాధ్యతను మీరు కలిగియున్నారు. ఇప్పుడు పిదప అతడు అక్కడకు వచ్చినయెడల అక్కడ కనుక్కొనవచ్చును. పేదప, మేము ఇచ్చట యున్నాము. అసలు మేము ఒకరితో ఒకరం సమాధానపడలేము అని నేను చెప్పవచ్చును, అట్లైనయెడల మీరు ఆ విధముగానే సంఘమునకు కొనసాగుచున్నారని అర్థమగును.

ఓ, మీరు దానిని గూర్చి ఏమి చెయ్యకపోయినను, ఓ, యేసుక్రీస్తు రక్తము మా ఇద్దరిని కాపాడుచున్నది. చూచారా? కాని అటు తర్వాత ఆ పాత కాన్సర్ వ్యాధి ఇంకొక కాన్సర్ ఉత్పత్తి చేయును, ఆ కాన్సర్ వ్యాధి ఇంకొక కాన్సర్ ని ఉత్పత్తి చేయును, చివరకు సంఘమంతా సమస్త కార్యములును వ్యాధితో పీడించబడుచుండును. అప్పుడు మీరు సంఘమునకు వచ్చునప్పుడు, అది చాలా చల్లగా యుండును, సంఘ సభ్యులు లోపలికి ప్రవేశించుటకు ముందు ద్వారపాలకులు అచ్చటకు వచ్చి చుటూ కమ్ముకొనియున్న మంచు గడ్డను పగులగొట్టవలసిన స్థితి ఏర్పడును. ఇప్పుడు అది నిజమని మీరెరుగుదురు. చల్లగా: చల్లబడిపోయిన వారెవరో చుట్టూ కూర్చొనియున్నారు. మీరెరుగుదురు, అస్సలు నోరు మెదపకుండా కూర్చోవడము. “మేము ఎంతో ఆత్మీయముగా యుండెదము.” మంచిదే, ఏమి జరిగినది? మీరు చక్కగా పరిగెత్తితిరి కదా, ఏమి సంభవించినది? చూడండి, మీ పాపములు మిమ్మల్ని వేరుపరచుచున్నది. సహోదరుడా, అందునిమిత్తమై దేవుడు నిన్ను బాధ్యుడుగా చేయును.

ఇప్పుడే నేను ఈ విషయమును సరిచేసెదను.

132

నా యొద్ద ఎటువంటి అపరాధము లేదు. లియో యొద్ద కూడా ఎటువంటి అపరాధము లేదు గాని మా మధ్య చొరబడిన దెయ్యముగా అది యున్నది. అది నిజము. ఆ కార్యమును సరిదిద్దుకోవలయును. అతని యొద్దకు వెళ్ళుము. పిదప అతడు ఆలకించక పోయినా (లేదా నేను ఆలకించకపోయినా, అది ఏమైనా గాని), దానిని సంఘమునకు తెలుపవలెను. అతడు ముప్పది దినముల లోపు వచ్చి సరిదిద్దుకోలేక పోయినయెడల అప్పుడతడు యేసు యొక్క భద్రత క్రింద నుండి వెలుపలికి తీసుకొని రాబడుచున్నాడు. మనము అతడిని కోల్పోవుచున్నాము. అది ఖచ్చితముగా నిజము. అటు తర్వాత ఏమి సంభవించుచున్నదో గమనించి చూడండి. దేవుడు అతడిపై చర్య తీసుకొనును. మీరు మీ చేతులను తీసివేసిరి. మీకు సాధ్యమైనంత వరుకు అతడి పట్ల శ్రేష్ఠమైనది మీరు చేసితిరి. పిదప కొద్దిసేపు దేవుడు అతడిని చూచుకొనునట్లు అనుమతించండి. ఆయన అతడిని సాతాను వైపు త్రిప్పివేయును. పిదప అతడు తిరిగి వచ్చును. ఒకవేళ అతడు తిరిగి రానియెడల, అతడి యొక్క జీవితము స్వల్పకాలముగా యుండును.

133

దేవుని యొద్ద తనను సరిదిద్దుకొనని ఒక సహోదరుడు పరిశుద్ధ గ్రంథములో యున్నాడు మీకు జ్ఞాపకమున్నదా? ఎంతమందికి ఆ సంఘటన జ్ఞాపకమున్నది? అతడు తన పెంపుడు తల్లితో జీవించుచుండెను, వారు అతడిని సరిదిద్దలేకపోయిరి, “నాశనమగుట కొరకు, అట్టివానిని సాతానుకు అప్పగించవలెను,” అని పౌలు చెప్పెను. మీరు దానిని II కొరింథీయులలో కనుగొనవచ్చును, అతడు సరిదిద్దుకొనెను.

134

నాకొక సహోదరుడుండెను, ఒక మంచి స్నేహితుడుగా యుండెను, అతడి పేరును నేనిచ్చట చెప్పాలని ఆశించుచున్నాను. అతడు ప్రసంగించు ఒక సహోదరుడు, ఈ ప్రసంగించే సహోదరుని పేరు సహోదరుడు రాస్ముస్సన్. నేటి రాత్రియందు ఇచ్చట కూర్చొనియున్న అనేకులగు బోధకులారా, మీ పత్రికలోని పేజీలలో అతడి యొక్క పేరు గలదు. చీకాగో నుండి వచ్చిన ఏ శాఖా సంబంధము లేని ఒక సంఘమది, గమనించండి, అతడికి ఒక కుమారుడుండెను. అతడు ఒక సేవకుడుగా యుండెను; అతడు వెళ్ళి ఒక కాథలిక్కు అమ్మాయిని పెళ్ళి చేసుకొనెను; అతడు ఆ విధముగా ఆరంభించి అతడు దీనిని మరియు దానిని చేయుచూ యుండెను. ఏదేదో చేసి ఇబ్బందులకు గురియయ్యెను. అతడి తండ్రి అతడి యొద్దకు వెళ్ళి, “కుమారుడా, ఇప్పుడు గమనించు, నీవు డాడీతో సరిదిద్దుకుంటావా?” అని తండ్రి అడిగెను. అతడు, అతని తండ్రిని, వారియొక్క సంఘమును పరిశుద్ధ బండల యొక్క గుంపు అని పిలచెను. ఆ తండ్రి, “ఇప్పుడు, గమనించు, ఈ సంఘముతో నీవు ఈ విషయము నిమిత్తమై సరిచేసుకోవాలనుకొనుచున్నావా?” అని చెప్పెను.

అతడు “నాన్నా, నీవు నా తండ్రివి, నీతో ఎటువంటి వివాదమును కలిగియుండుటకు నేను ఇష్టపడుట లేదు,” అని చెప్పెను.

135

సరే మంచిది. అతడు వెళ్ళి సంఘ డీకన్లలో ఒకరిని తీసుకొని తన ఇంటికి వెళ్ళెను. “వెస్లీ, నేను నీతో మాట్లాడవలెను, ఈ విషయము నిమిత్తమై సంఘంతో నిన్ను నీవు సరిదిద్దుకొనెదవా?” అని అడిగెను. అతడు తన తండ్రికి రెండు జవాబుల్లాంటి చిన్న జవాబును ఇచ్చెను. “జ్ఞాపకముంచుకో వెస్లీ, నేను ఆ సంఘపు కాపరిని, నేను నీ తండ్రిని, కాని దేవుడు చెయ్యమని చెప్పినదానిని నేను చేసెదను. ఆ సంఘంతో నిన్ను నీవు సరిదిద్దుకొనుటకై నీకు ముప్పది దినములను అవకాశమును ఇచ్చెదను. అట్లు కానియెడల దేవుని సన్నిధి నుండి మేము నిన్ను వెలివేయుదుము. నీవు నా స్వంత కుమారుడవు, కాని ఆయన నా రక్షకుడు; నేను నిన్ను ప్రేమించుచున్నాను, వెస్లీ, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెరుగుదువు, ఇప్పుడే నీ కొరకు నా ప్రాణములను సహితము అర్పించెదను. అయినా గాని నీవు దేవుని యొక్క వాక్యముతో నిన్ను నీవు సరిదిద్దుకొనవలయును,” అని చెప్పెను. గమనించారా? “నేను సంఘ కాపరిని, నేను ఈ మందకు కాపరిగా యున్నాను. నీవు నా కుమారుడివైనను, లేదా నీవు ఎవరైనా గాని నీవు దేవుని వాక్యముతో ఏకీభవించియుండవలెను. నీవు దానిని చేయనియెడల, అట్లైన నేను ఈ మందకు ఆయన యొక్క కాపరిగా యుండుటకు నాకు అర్హత లేదు,” అని అనెను.

బాలుడా, అటువంటి వాడే ఒక సంఘ కాపరియై యున్నాడు. అటువంటి వాడే ఒక పురుషత్వముగలవాడుగా యున్నాడు. మీరు కూడా అలాగే అనుకుంటున్నారు కదా? అతడే ఒక మగాడుగా యున్నాడు. దానిని అతడు తన కుమారుడికి చెప్పెను. అది అతడి కుమారుడిని గాయపరచినది, అయినా కాని చెప్పెను, ఏమిటి? “మీరు ఎవరిని గాయపరచుచున్నారు, ఒక మనిషినా లేక నీ రక్షకుడిని గాయపరచుచున్నారా?”

136

కాబట్టి అతడు, “ఆ విధముగా మేము కొనసాగితిమి,” అని చెప్పెను.

అతడు దానిని చేయుటకు ఇష్టపడలేదు. మరియు మేము నేను సంఘముతో నా కుమారుడు వెస్లీ ఈ విషయమునకు చెవియొగ్గుటకు నిరాకరించుచుండెను. సంఘ డీకన్ ల మాటలను కూడా లెక్క చేయ్యుట లేదు, సహోదరుడు ఫలానా - ఫలానా ఒక సాక్షిగా దీని నిమిత్తమైయున్నాడు. [“అవును నేను దీనికి ఒక సాక్షిగా యున్నాను,” అని అతడు అనెను.] “సరే, వచ్చే ఆదివారము ఎనిమిది గంటలకు, ఇప్పుడు నుండి నాలుగు వారములలో అతడు ఈ విషయము నిమిత్తమై సంఘముతో తన్నుతాను సరిదిద్దు చేసుకొననియెడల, మనము వెస్లీని, నా కుమారుడిని శరీర నాశనము కొరకై సాతానునికి అతడిని అప్పగించెదము, ఆయన యొక్క రక్తము, యేసుని రక్తము మరియు ఈ సంఘము కాపుదల ఇక అతడికి యుండదు,” అని చెప్పెను.

137

ఆ రాత్రి వచ్చినది, ప్రసంగ వేదికయందు నిలబడి, “అతడికింకా రెండు నిమిషములు మాత్రమే అవకాశము గలదు,” అని అతడు చెప్పెను. సమయము ఆసన్నమైనది. “ఇప్పుడు నా కుమారుడగు వెస్లీ రాస్మస్సన్, ఈ సంఘము యొద్దను, సర్వశక్తిమంతుడునగు దేవుని యొద్ద చెప్పితిమి. నీ వాక్యానుసారముగాను, నీ కుమారుడును, మా రక్షకుడును వదిలి వెళ్ళిన క్రమశిక్షణా పద్ధతులను మాకు సాధ్యమైనంతవరకు అన్నింటిని చేసితిమి. ఇప్పుడు. నేను, ఈ సంఘంతో కలిసి నా కుమారుడిని, అతడి యొక్క ఆత్మ రక్షణ కొరకై, అతడి శరీర నాశనము కొరకై అతడిని సాతానునికి అప్పగించుచున్నాము,” అని అనెను. చెప్పినదంతా అదియే. ఒక వారము లేదా రెండు వారముల వరకు, ఒక నెల లేదా రెండు నెలల వరకు ఏమి సంభవించలేదు.

138

ఒకనాటి రాత్రియందు వెస్లీకి అనారోగ్యము కలిగినది. అతడు వ్యాధిగ్రస్తుడైనప్పుడు, ఆ వ్యాధి అధికమగుచున్నది. అతడు ఒక వైద్యుడిని పిలిపించెను. వైద్యుడు వచ్చి అతడిని పరీక్షించి చూడగా అతడికి నూటయైదు డిగ్రీల జ్వరము గలదు, ఎందుచేత ఆ జ్వరము వచ్చినదో దాని కారణమును వారు కనుగొనలేకపోయిరి. వ్యాధి ఎక్కువగుచునే యున్నది. “బాలుడా, నీకు ఏమి సంభవించినదో నాకు అర్థమగుట లేదు,” అని వైద్యుడు చెప్పెను. ఏమి చేయవలెనో అతడికి తెలియలేదు. “ఎందుకన్నా మంచిది. ఒక మంచి నిపుణుడైన వైద్యుడ్నీ పిలిపించండి,” అని అతడు చెప్పెను. నిపుణుడైన ఒక వైద్యుడ్నీ పిలిపించిరి, ఆ నిపుణుడైన వైద్యుడు అచ్చటికి వచ్చెను. వారు అతడిని ఆస్పత్రికి తీసుకొని వెళ్ళి, అంతా పరీక్షించి చూచిరి, “నేనేమి చెప్పలేకపోతున్నాను, కాని, ఇతడు మరణాపాయములో యున్నాడు,” అని ఆ నిపుణుడైన వైద్యుడు చెప్పెను. అతడి పిల్లలు, అతడి భార్య ఏడుస్తూ, ఇంకా అనేకులు అచ్చట ఆ మంచం చుట్టూ నిలబడియుండగా, అంతా చింతాక్రాంతమైన వాతావరణము అచ్చట చుట్టుకొనియున్నది. “అతడు మరణమునకు దగ్గరగుచున్నాడు, అది అంతే, అతని నాడి వ్యవస్థ మరియు శ్వాస క్షీణించుచు హీనదశకు చేరుకొనుచున్నది,” అని ఆ వైద్యుడు చెప్పెను.

అప్పుడతడు, “నాన్నను పిలవండి” అని చెప్పెను. ఓ, అవును, దానిని చెయ్యుటకు అదియే మార్గముగా యున్నది. అది దానికి సరైన కార్యము. “నాన్నను పిలవండి.” అతడి తండ్రి పరిగెత్తుకుంటూ ఆ వైద్యశాలకు అతడిని చూచుటకై వచ్చెను. “నాన్నా, ఇప్పుడు నేనేమి చెయ్యలేను, కాని దేవుడు నా మాటలను వినుచున్నాడు. నేను సమస్తమును సరిదిద్దుకొనెదను, నేను దానిని సరిదిద్దుకుంటాను. అవును నేను చేసెదను,” అని అతడు తన తండ్రితో చెప్పెను. అవునండీ, సహోదరుడా, అతడి యొక్క శ్వాస మరలా అప్పటికప్పుడే మామూలు స్థితికి వచ్చినది.

మరుసటి ఆదివారమున సంఘము ముందు అతడు నిలబడి, దేవుని సన్నిధి ఎదుట, ఈ సంఘము యొక్క సన్నిధిలో నేను పాపమును చేసితిని. నేను సంఘ కాపరి మాటలను ఆలకించకుండా త్రోసివేసితిని. నేను ఇచ్చటయున్న డీకన్ యొక్క మాటలను ఆలకించకుండా త్రోసివేసితిని, “ఇటువంటి దుష్క్రియను నేను చేసినందువలన నన్ను క్షమించవలెనని నేను సంఘమును కోరుచున్నాను.” దేవుడు నా జీవితమును కాపాడెను, అని అతడు చెప్పెను. అతడు తనను సరిదిద్దుకొనెను అని నేను మీతో చెప్పుచున్నాను. అవును. ఆ విధముగానే అది జరుగవలెను, చూచారా. చూచారా? మీరు దేవుని విధానములో మాత్రమే దానిని చేసినయెడల! గమనించారా?

139

ఇప్పుడు, మనము చేయు విధానమును చూడండి, కార్యవర్గ సభ్యుల సమావేశమును సమావేశపరచి, “మంచిది, ఇప్పుడు, దీనిని మనము ఉంచెదమా...” అని అంటున్నాము. నేను బ్రెన్హాం గుడారమును గురించి చెప్పుటలేదు, కాని ప్రొటస్టెంటు జనులను గురించి నేను చెప్పుచున్నాను. మనకు ఒక కార్యవర్గ సభ్యుల సమావేశము గలదు: “మీరు జోన్స్ గురించి ఏమనుకుంటున్నారు? అతడితో ఏమి చెయ్యాలని మీరు అనుకుంటున్నారు? అతడు మనతో యున్నదానికంటేను మెతడిస్తు సంఘములో మంచి సభ్యుడుగా వుండునని అనుకుంటున్నాను.” విషయము అదే. అది తప్పు! అందుచేతనే మనము వారి పారంపర్య ఆచారములను పాటించుట లేదు, ఏదో ఒక బిషప్ గా మనము పిలవవలెను లేదా ఏదో, ఈ పెంతెకోస్తు సంఘపు జిల్లా మనిషిని వారేమని పిలచుదురు, జిల్లా సంఘ అధికారిని ఈ మనిషి యొక్క ప్రవర్తనను పరిశీలించుటకు పిలువవలెను.

ఏమి చెయ్యవలెనని పరిశుద్ధ గ్రంథము మనకు చెప్పుచున్నది. ఆ కారణము చేతనే వారి సంఘ శాఖల కార్యములతో పిచ్చివారివలె మనము ప్రవర్తించుట లేదు. ఆ కార్యముల నుండి మనము వైదొలగి స్వతంత్రులుగా యున్నాము. ఆమేన్. మీరు నా మీద కోపగించుకొనుచున్నారా? దానిని మీరు చేయవద్దు. రేపటి రాత్రికి ఒకవేళ మంచి ప్రశ్నలను అందునిమిత్తమై నా యొద్దకు వచ్చుననుకుంటున్నాను, కాని మనము... అది నిజము, చూడండి.

140

జ్ఞాపకముంచుకోండి... లేదు, దీనిని ఇప్పుడే నేను చెప్పెదను. భిన్నమైన సంఘ శాఖల నుండి వచ్చిన ప్రజలగు మీరు, మీ శాఖ.... సహోదరుడా, ఒక క్రైస్తవుడవు కావని నేను చెప్పుట లేదు. మీ శాఖలలో వేలకొలది మంచి క్రైస్తవులు లేరని నేను చెప్పుట లేదు. మేమెందుకని ఒక శాఖ కాదనే దానిని గురించి చెప్పుటకే నేను ప్రయత్నించుచున్నాను. ఎందుకనగా దానితో నేను ఏకీభవించలేను. లేదండీ, మీరు ఏమి చేయవలెననే దానిని మీ యొద్ద చెప్పుటకు ప్రయత్నించుచున్నాను. సువార్తను ప్రసంగించుటకు దేవుడు నన్ను పిలచియున్నయెడల, ఏ విధానముగా దానిని చెయ్యమని దేవుడు నాతో చెప్పునో దానినే నేను ప్రసంగించెదను. అది ఈ పరిశుద్ధ గ్రంథమందు ఇచ్చట వ్రాసిన విధముగానే అది యుండును. ఒకవేళ నేను దానితో ఏకీభవించనియెడల, అప్పుడు దేవుడు నాకు తీర్పును తీర్చును గాక! కాని ఒకవేళ నేను తోడేలు వచ్చుటను లేదా శత్రువు వచ్చుటను చూచి కూడా నేను వారిని హెచ్చరించుటలో విఫలమైనయెడల, అప్పుడు దేవుడు అందునిమిత్తమై లెక్క అడుగును. కాని నేను హెచ్చరించియుండిన యెడల, అప్పుడు అది మీ బాధ్యతగా యున్నది. చూచారా?

141

గుర్తుంచుకోండి, అచ్చట అంత్యదినములయందు అపాయకరమైన కాలములు వచ్చును, మనుష్యులు స్వార్దప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు.“ చూచారా, దూషకులు: ”ఓ, వారు అవివేకులైన ఒక సమూహముగా యుందురు, అద్భుతములు జరుగుకాలము గతించిపోయినది. అటువంటి “కార్యమనేది అసలు లేనే లేదు,” అందురు. అతడొక అబద్ధపు ప్రవక్తగా యున్నాడు. “ఇప్పుడు మనమెరుగుదుము మన స్త్రీలకు పురుషులవలె అంతటి జ్ఞానము గలదు.” దానిని ఒక్క అణువంత కూడా నేను తప్పుగా చెప్పుట లేదు. కాని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ఆమెను ప్రసంగ వేదిక నుండి వైదొలగియుండుమని చెప్పుచున్నది. అది నాకు చాలునంతగా యున్నది, చూచారా, అది నిజము. సరే, చూడండి, “మంచిది, ఇప్పుడు మన సంఘ శాఖలు, అచ్చట మీ గుడారములో మంచి జనులు యున్నట్లుగానే మా యొద్ద కూడా మంచి జనులు గలరు,” అని వారు అందురు. నేను దానిని గురించి అస్సలు ఏమి చెప్పుట లేదు, కాని శాఖలను పరిశుద్ధ గ్రంథము ఖండించుచున్నది. అది నిజము. కావున, ఇప్పుడు మీ సంఘములో మంచి సభ్యులు లేరని నేను చెప్పుట లేదు, అది అద్భుతమైనది, వారు ఎంతో మంచి జనులుగా యున్నారు. కాథలిక్కు మరియు ఇంకా తదితర సంఘములను నేను సంధించినప్పుడు అందులో కొంతమంది మంచి జనులు గలరు. నేను ఆ విధముగా సంధించిన అనేక స్థలములలో మంచి సభ్యులను నేను సంధించగలిగితిని.

142

ఇప్పుడు, స్నేహితుల్లారా, దీనిని మేము ఏ విధముగా తీసుకొని వచ్చెదమంటే, ప్రభువు చిత్తమైనయెడల, తదుపరి రెండు పాఠ్యాంశములలో దానిని పూర్తిగా తీసుకొని వచ్చుటకు రేపటి మధ్యాహాన సమయమందు వాక్యమును ప్రసంగించవలసి వచ్చునా అనే దానిని గూర్చి రేపటి ఉదయకాలమందు నేను మీకు చెప్పెదను, చూచారా, మేము దీనిని చెయ్యుటకు ప్రయత్నించు కార్యమేమనగా మిమ్మల్ని ఒక స్థలము యొద్దకు తీసుకొని వచ్చి నిలుపవలెనని నేను ఆశించుచున్నాను. మీరు ఎవరనన్నా మీతో తీసుకొని రావలెనని ఆశించినయెడల, మీరు పరిపూర్ణముగా దానిని చెయ్యవలెనని మేము ఆహ్వానించుచున్నాము. కాని ఇప్పుడు జ్ఞాపకముంచుకోండి, ఊరకే తప్పులను లెక్కించుటకై ప్రయత్నించుటకు ఇచ్చటకు మీరు రావద్దు... వద్దు, లేదా తప్పులను కనుగొని ఇచ్చట నుండి వెళ్ళవద్దు. నేను నా సంఘ సభ్యులతో మాట్లాడుచున్నాను, మీరు చూచారా. దీనిని నా సంఘమునకు వెలుపల నేను బోధించుట లేదు; ఎందుకనగా అది ఇంకొక వ్యక్తి యొక్క కార్యముగా యున్నది, అతడే ఆ మందుకు కాపరియై యున్నాడు. నేను ఊరకే....

[టేపు నందు ఖాళీ స్థలము.]

143

తిన్నగా ఆదికాండమునకు వెళ్ళెదము, అది ఎచ్చట యున్నదనే దానిని కనుగొని అతడిని దాని ద్వారా వెలుపలకు తీసెదము. ఇప్పుడు ఆదికాండమునకు వెళ్ళి, ఎందుకని ఒక వేశ్య కుమారుడు పదునాలుగు తరముల వరకు ప్రభువు సంఘములోనికి ప్రవేశించకూడదనే దానిని కనుగొనెదము. దానిని ఏ విధముగా తీయవలె... ఆ పాపము పోవుటకు దానికి నాలుగు వందల సంవత్సరములు పట్టును. ఏ విధముగా తల్లిదండ్రుల అనీతివారి పిల్లలయందును, మరియు పిల్లల పిల్లలయందును విచారించపడుచున్నదనే దానిని గూర్చియు, అది ఏ విధముగా ఆదికాండమందు ఆరంభమైనదనే దానిని గూర్చియు మరియు మొదలగు వాటిని గూర్చియు మనము కనుగొనెదము.

144

అటు తర్వాత మీరు చూడబోవునదేదనగా, జగత్తు పునాది వేయబడక మునుపే, ఒక పరమాణువు (atom) అచ్చట కలుగుటకు ముందే, ఒక ఉల్క (Meteor) గాని, ఒక వెలుగు గాని కలుగుటకు ముందే దేవుడు ఒక్కొక్క సృష్టిని, భూమిపై యుండు సమస్త కార్యములను గురించి ఎరిగియున్నాడు. అంతము లేనిది అనే పదమును వివరించి చెప్పువారు లేదా ఆ పదమును రెండుగా చేసి దానికి అర్ధము చెప్పువారు ఇచ్చట ఎవరైనా గాని యున్నారా? అట్లే కెమెరా పరికరమును “అనంతము” అనే దూరము వరకు దానివైపు త్రిప్పండి. అది ఒక పరిమితి వరకే పనిచేయును. అంతే, చూచారా. అనంతము. మనకు అది సాధ్యము కాదు, హద్దుకు పరిమితమైన మన తలంపులతో, అనంతమైన దానిని గురించి మన తలంపులలో తలంచుచు వాటిని గూర్చి ఎంతో పరిశీలించి చూచిన వాటిని ఎప్పుడూ మనము గ్రహించలేము. చూడండి, మనకు అది సాధ్యము కాదు. మీకు అది సాధ్యము కాదు. చూచారా? కాని మీకు సాధ్యమైనయెడల గమనించుచూ ఆత్మలో దానిని పట్టుకొనినయెడల అచ్చట దానియొక్క విధానమును గూర్చిన అనుభూతిని మీరు పొందుకోగలరు; పిదప లేఖన భాగములోని వాక్యముతో వచ్చినయెడల, జగత్తు పునాది వేయబడక మునుపే యున్నదానిని ఇప్పుడు మీరు చూచెదరు, చూచారా.

145

ఇప్పుడు, యేసుక్రీస్తు దేవుని యొక్క గొర్రెపిల్ల అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. (ఇప్పుడు, దీనిని రేపటి దినమున ముగించు సమయమున మీలో ఎవరైనా యుండకపోవుదురు. కాబట్టి ఇప్పుడు, దీనిని క్షుణ్ణముగా ఆలకించండి.) జగత్తు పునాది వేయబడక ముందు వధింపబడిన దేవుని యొక్క గొర్రెపిల్లగా యేసుక్రీస్తును గురించి పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. అది సరియే కదా! ఆయన ఎప్పుడు వధించబడెను? జగత్తు పునాది వేయబడక మునుపే. జగత్తు పునాది వేయబడక మునుపు, ఈ విశ్వము, అది చెల్లాచెదురైన పరమాణువుగా యుండి, దానిలో నుండి సూర్యుడు ఉద్భవించుటకు ముందే, సూర్యుని నుండి ఒక పరమాణువు పేరగుటకు ముందే, ఇది సూర్యుని యొక్క ఉల్కాగా లేదా వెలుగు నక్షత్రముగా యుండినయెడల, ఒక వెలుగు ఉల్కాపాతము ఏర్పడుటకు కోట్ల, కోట్ల, కోట్లకొలది సంవత్సరములకు ముందే క్రీస్తు వధించబడెను. దేవుని యొక్క మహోన్నత తలంపు అనునుది ఒక కార్యమును గురించి తీర్మానించిన యెడల అది ముగించబడిన ఒక క్రియగా యుండును. “కలుగును గాక!” అని దేవుడు పలికినప్పుడు, అది అంతకుముందే ముగించబడి మరియు సమాప్తమైన కార్యముగా యున్నది; అందునిమిత్తమై కోట్లకొలది సంవత్సర కాలములు పట్టినను ఆయన దానిని పలికిన వెంటనే అది అంతకుముందే ముగించబడిన, సమాప్తమైన కార్యముగా యున్నది. జగత్తు పునాది వేయబడక ముందు గొర్రెపిల్ల వధించబడినప్పుడు అదే పరిశుద్ద గ్రంథము, అదే ఆత్మ గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో జగత్తు పునాది వేయబడక మునుపే మన పేర్లు అచ్చట వ్రాయబడియున్నవని చెప్పుచున్నది.

కావుననే ఆ వ్యక్తి, “అచ్చట మహిమయందు ఒక క్రొత్త నామమును వ్రాయబడి యున్నదనే,” పాటను వ్రాసెను. అతడు మంచి భావముతో దానిని రచియించెను, కాని అది లేఖన వాక్యానుసారముగా లేదు. చూచారా? లోకము ఆరంభమగుటకు ముందే ఆ నామము అచ్చట మహిమయందు వ్రాయబడినది. గొర్రెపిల్ల వధించబడినప్పుడే, మన పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమునందు వ్రాయబడినవి.

146

ఒక చిన్న లేఖన భాగమును మీకు చూపించెదను. ఒక నిమిషము మీరు ఓర్చుకొనెదరా? అది ఇప్పుడే నా తలంపునకు వచ్చుచున్నది. తిన్నగా దానియొద్దకు మిమ్మల్ని త్రిప్పగలనని నేను తలంచుచున్నాను. నాకు ఖచ్చితముగా తెలియుట లేదు. ఇంతసేపు మిమ్మల్ని ఇచ్చట ఉంచినందుకు నేను చింతించుచున్నాను. కాని ఇది మధ్యరాత్రి యగునని నేను చెప్పితిని, కాని అది అంత చెడ్డదిగా యుండదు కాని ఈ ఒక్క లేఖన భాగమును నేను తియ్యాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు నాతో కూడా మీరు రోమీయుల పత్రికకు త్రిప్పి, దీనిని నాతో కూడా ఇప్పుడు మీరు చదవాలని నేను ఆశించుచున్నాను. ఇప్పుడు రోమీయులకు వ్రాసిన పత్రికను చూద్దాము; అది అచ్చటే యున్నది. దానిని మీరు కనుగొనినయెడల తియ్యండి. రోమియులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము. మరియు 8వ అధ్యాయము 28వ వచనము నుండి ప్రారంభించెదము. దీనిని మీరు ప్రార్థనతో నాతో కూడా చదవాలని ఆశించుచున్నాను. ఇప్పుడు ఇచ్చట దేవుడు ఏమి చెప్పుచున్నాడో జాగ్రత్తగా ఆలకించండి.

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మేమెరుగుదుము.

[నాతో కలిసి చదివెదరా?] ఎవరిని ఆయన ముందుగానే ఎరిగియుండెనో,.....

ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.

మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను.

147

జగత్తు పునాది వేయబడక ముందు దేవుడు క్రిందకు చూచినప్పుడు. ఇప్పుడు, “మంచిది, ఇప్పుడు నేను దీనిని చెయ్యబోవుచున్నాను. ఓ, ఇప్పుడు మనము ఏమి చెయ్యబోవుచున్నాము?” అని దేవుడు తన కార్యములను చెయ్యుట లేదు. చూచారా? అచ్చట ఏమియు లేదు...

జ్ఞాపకముంచుకోండి, అవినీతి, పాపము అనగా నీతియైన కార్యము క్రమము తప్పిపోవుట. దెయ్యము సృష్టించలేదు. అందరూ దానిని అర్ధము చేసుకున్నారా? అది ఈ సంఘము యొక్క ఒక సిద్దాంతముగా యున్నది. దెయ్యము సృష్టించలేదు. దేవుడు సృష్టించినదానిని వాడు తారుమారు చెయ్యగలడు. ఇప్పుడు క్రమము తప్పుట అనగా ఏమిటి? ఇచ్చట అనేకులు వయస్సు వచ్చినవారుగానే యున్నారు. దీనిని జాగ్రత్తగా ఆలకించండి. మనము వివాహము కాబడినవారముగా యున్నాము. వివాహితులైన స్త్రీలు, మరియు వివాహితులైన పురుషులు యగు మీరు ఏకమై, భార్యా-భర్తలుగా జీవించవచ్చును. స్త్రీలు తమ భర్తతో యున్నంత వరుకు వారు శీలవంతులుగానే యుందురు. అది నిజము. అది నీతిగాను, ధర్మముగాను మరియు అదంతా బాగానే యుండును. అది ఆ విధముగానే యుండును. దేవునిచేత అది నియమింపబడినది. వేరొక స్త్రీ కూడా నీ భార్యవలె ప్రవర్తించవచ్చు. వాటిల్లో ఒక కార్యమునందు దేవుని దృష్టిలోమీరు నీతిమంతులుగా యున్నారు, అదే క్రియను మీరు వేరోక స్త్రీతో కలిసి చేసినప్పుడు, మీరు దేవుని ఎదుట మరణ శిక్షకు పాత్రులగుదురు. అదేమిటది? నీతి క్రమమును తారుమారు చేయబడినది, చూచారా, నీతి క్రమము తారుమారు చేయబడినది.

148

దెయ్యము సృష్టించలేదు, కాని దేవుడు ఇంతకు ముందే సృష్టించిన వాటిని తారుమారు చేయుచున్నాడు.

ఒక అబద్ధము అనగా ఏమిటి? సత్యమును తారుమారు చేయుట. ఎవరో ఒకరు ఈ విధముగా “ఓ, శనివారము రాత్రి తొమ్మిది గంటలకు బిల్ బ్రెన్హాం జెఫర్సన్-విల్లో ఉన్నారు,” అని చెప్పాడనుకుందాము. అది నిజము. “ఆయన అంథోని మద్యపాన అంగడిలో త్రాగుచు తూలుచున్నాడు,” అని చెప్పినయెడల. అది అబద్దము. అది ఎలాగవున్నది? నేను జెఫర్సన్-విల్ లో వున్నాను, అది నిజమే. నీతిని తారుమారుగా చేసిన ఒక అబద్ధముగా ఇది యున్నది. నేనేమి చెప్పుచున్నాననేది మీకు అర్థమగుచున్నదా? చూడండి, ఒక అబద్ధము, సరియైన కార్యమును వక్రీకరించుట అనగా తారుమారు చేయుట. నేనెచ్చట యున్నానో దానిని అది సూచించవచ్చు, కాని “నేను సంఘములో ప్రసంగించుచూ యున్నానంటే” సరియైన మాటయే, అది నీతిగా యుండును, అతడు సత్యమును చెప్పెను. “మద్యపాన అంగడిలో త్రాగుచుండెను,” అది అబద్ధము. వక్రీకరించుట. చూడండి, సత్యమును తారుమారుచేయుట. చూడండి, నేనేమి చెప్పుచున్నానో అర్థమగుచున్నదా? ఆ అనీతియంతా నీతిని తారుమారు చేయుట.

149

మరణము, అది ఏమైయున్నది. జీవమును తారుమారు చేయుట. అనారోగ్యము అంటే ఏమిటి? ఆరోగ్యమును తారుమారు చేయుట. మీరు ఒక మంచి బలమైన మానవునిగా ఉండవలసినవారు. సరే. మీరు అనారోగ్యమునకు లోనైనయెడల అదేమైయున్నది? మీ ఆరోగ్యమును తారుమారుగా చేయుట. చూచారా, దానిలోయున్నదంతా అదియే. అది ఏమిటి? బలముగా, అందగాడివలె, యువకుడుగా, యవ్వనస్తురాలిగా, అందమైన యువతిలా మీరు ఉండవలసినవారు, కాని ఇప్పుడు మీరు శరీరమంతా ముడతలు పడినవారై, వృద్దులగుచున్నారే, ఏమిటది? జీవము క్రమమునుండి తప్పుట వలననే. చూడండి, మరలా అదే విధముగా తిరిగి వచ్చుచున్నది. చూచారా? అది మరలా తిరిగి రావలయును. ప్రభువు నామము ఆశీర్వదించబడును గాక. దానిని మరలా తిరిగి ఇస్తానని దేవుడు వాగ్దానము చేసెను. అది అంతటి నిశ్చయముగా యున్నాదంటే... అది ఇచ్చట యున్నదని మనమెరుగుదుము. కాబట్టి అది యున్నంత నిశ్చయముగానే దేవుడు దానిని మరలా తీసుకొని వచ్చును. ఆయన దానిని వాగ్దానము చేసి దానిని చేస్తానని ప్రమాణము చేసెను. అదే మనకు...

150

ఇప్పుడు, ఏ రకమైన జనులుగా మనము యుండవలెను? ఈ కార్యములన్నియు ఏ విధముగా సంభవించబోవునని ఇప్పుడు గమనించండి. ఇప్పుడు, ఆయన ఎవరిని ముందు ఎరిగెనో వారిని ఆయన పిలచెను. ఆయన ఎవరిని పిలచెనో ఆయన వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునుపే, లోకము ఆరంభమగుటకు ముందే, ఈ లేఖన భాగము ఇప్పుడు తీసుకొని ఇది నిజమేనని మనము నిరూపించినయెడల, దానికి అనేక గంటలు మనకు పట్టును. కాని దానిని ఆ విధముగా చేయుటకు మనము ఆశించుట లేదు. ఇప్పుడు, ఈ అవినీతియంతా, నీతి అవినీతిగా తారుమారు చేయబడినదిగా యున్నది. దానినే దెయ్యము చేయుచున్నాడు. మీరు దేవునికి లెక్క అప్పచెప్పు వయో స్థితికి చేరినప్పుడు, తప్పు ఒప్పులను ఎరిగే పరిపక్వమునకు వచ్చి వాటిని మీరు ఎరిగినప్పుడు మీ తప్పిదములలో నుండి మీరు వైదొలగవలెను. ఎందుకనగా పాపమునందు జన్మించి, అక్రమములో రూపుదిద్దబడి, అబద్ధికులుగా ఈ లోకమునకు మీరు వచ్చిరి. మీరు శరీరేచ్చవలన జన్మించినందువలన, తప్పనిసరిగా తిరిగి జన్మించవలెను. మీరు పరలోకములోనికి ప్రవేశించుటకు మీరు నూతనముగా జన్మించి తీరవలయును. ఎందుకనగా ఇచ్చట మీరు వచ్చిన ఈ విధానపు జననము....

నూతన జన్మ అనునది శరీరము పునరుత్థానము అని యెహోవా సాక్షులు భావించుట చాలా తప్పిదమైనదిగా యున్నది. మీరు చూచారా, అది అలాగున కాదు. చూచారా? అదేదో ఒక కార్యముగా యుండవలయును.

151

మీరు కాలమనే పరిమితియందు యున్నారు. నిత్యము అనేది ఆదియు అంతము లేనిదిగా అది యున్నది, నిత్యము అనే ఏ కార్యమైనా గాని ఒక ఆరంభము లేనిదిగాను లేదా దానికి అంతము లేనిదిగాను యుండును. చూచారా? కాబట్టి మీరు దేవునిలో ఒక భాగమైయున్నయెడల మీలోయున్న ఆత్మకు అసలు ఆరంభమనేది లేనిదిగాను లేదా దానికి అంతమనేది అసలు లేనిదై, మీలోయున్న ఆ ఆత్మ ద్వారా మీరు నిరంతరము జీవించువారుగా యుందురు. చూచారా?

ఆ దైవిక ప్రేమలాంటి, పిదప అది శరీరిక సంబంధమైన ప్రేమగా మారి, అటు తర్వాత అది కామపు ప్రేమగా మారుచున్నది. అది ఆలాగే కొనసాగుచూ క్రమము తప్పుచూ, దిగజారిపోతూ చివరకు అది అయోమయంతో నిండిన గందరగోళముగా మారుచున్నది. మంచిది ఇప్పుడు, ఆ మార్గమొక్కటే యున్నది, యేసు మనలను లేవనెత్తుటకు అదే, నిచ్చెన నుండి క్రిందికి దిగి వచ్చి లోతైన స్థలము నుండి మహోన్నతమైన ఒక ఎత్తైన స్థలమునకు, మరణమునుండి జీవమునకు, ఆనారోగ్యము నుండి ఆరోగ్యమునకు, అవినీతి నుండి నీతికి మనలను ఆయన తీసుకొని పెళ్ళెను. చూచారా? నీచ స్థితి నుండి ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళుటకై ఆయన ఉన్నత స్థితి నుండి నీచ స్థితికి దిగెను. ఆయన యొక్క కృప ద్వారా నేను ఆయన వలే మారుటకై, మహిమ సింహాసనము నందు నేను స్వాతంత్రుడనగుటకై, ఆయన నావలే మారెను. ఈ విషయముల గురించి నేనేమి చెప్పుచున్నానో అర్థమగుచున్నదా?

ఇప్పుడు గమనించండి, పరమాణువుల నుండి ఈ జగత్తు ఆరంభము కాకముందే ఏమి జరుగబోవుచున్నదనే దానిని దేవుడు చూచినప్పుడు, సరిగ్గా ఆ సమయమునందే ఆయన నిన్ను చూచెను, ఆయన నన్ను చూచెను, ఆయన ఒక్కొక్క ఈగను, మిద్దిలి పురుగును, కప్పను, దోమను, భూమిపై యుండు సమస్తమును ఆయన చూచెను. ఆయన దానిని అప్పుడే అచ్చట చూచెను. నిశ్చయముగా ఆయన చూచెను.

152

ఇప్పుడు, “నేను నా కుమారుడిని క్రిందికి పంపించెదను, ఆయనను మరణించనివ్వండి, ఒకవేళ ఎవరైనా ఆయన గురించి పరితపించవచ్చు, అది అంతటి చింతాక్రాంతమైన కార్యముగా యుండి ఒకవేళ ఎవరైనా ఒకరిని ఆ కార్యము రక్షించవచ్చునని” ఆయన ఎన్నడునూ చెప్పలేదు.

ఎవరు రక్షించబడుదురని ఆయన ముందుగానే ఎరిగియుండెను. అవునయ్యా. “యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని,” తాము ఏమైయున్నామని వారు నిరూపించుకోనే తరుణమునకు ముందే ఆయన దానిని గూర్చి చెప్పెను: ఎందునకగా వారు ఏలాగు యందురో ఆయన ముందుగానే ఎరిగియున్నాడు. ఆయనకు తెలుసు. ఆయన సమస్తమును ఎరిగియున్నాడు. మీరు జన్మించుటకు ముందే, ఈ జగత్తు ప్రారంభము కాకముందే మీరేమి చేయబోవుదురని ఆయన ఎరిగియున్నాడు.

153

ఇప్పుడు గమనించండి. నాకు తుపాకీ పేల్చటం తెలియుననేది మీరు ఎరుగుదురు, తుపాకీలు అంటే నాకు ఇష్టము. టెక్సాస్లో యుండు ఒక స్త్రీ (టెక్సాస్ అని నేను అనుకుంటున్నాను), స్విఫ్ట్ A. 220 అనే ఒక తుపాకీని నాకు కొని ఇచ్చినది. అటువంటి ఒక తుపాకీ నాకు వుంటే బాగుండునని నేను ఎన్నోసార్లు ఆశించాను. అది కావాలని పరిశోధించుచుంటిని. అది ఎంతో శక్తివంతమైన చిన్న తుపాకీ, అది ఒక ఇరువది రెండు తుటాలను, నలుబది-ఎనిమిది గ్రెన్ తుటాలను ఉపయోగించు తుపాకీ. దానిని మీరు ఉపయోగించగలరు. ఇప్పుడు దానిని ఉత్పత్తిచేయు కర్మాగారమువారు దానిని తయారుచేయకూడదు, అది చాలా అపాయకరమైన తుపాకీ అని అంటున్నారు. కాని మీరు దానిని తుటాలతో నింపి ఒక నిమిషమునకు ఐదువేల అడుగుల వరుకు ఉపయోగించి దానిని ఆలాగే చెక్కుచెదరకుండా ఉంచవచ్చును. ఒక నిమిషమునకు ఐదు వేల అడుగులు అనగా ఒక నిమిషమునకు ఒక మైలు దూరము వరకు. ఇంకొక విధముగా చెప్పాలంటే, రెండు వందల గజముల దూరములో కూర్చొనియున్న ఒక డేగను మీరు తుపాకీతో పేల్చినప్పుడు తుటా తగిలిన వెంటనే డేగ యొక్క రెక్కలు చిందరవందరగా ఎగురుటను తుపాకీని పేల్చిన ప్రేలు దానినుండి తీసే లోపల నీవు చూడవచ్చు. చూచారా?

కాని పళ్ళు పొడుచుకొనే పుల్ల యొక్క చివర భాగమున ఉన్నంతటి ప్రేలుడు మందును తీసుకొని ఆ తుపాకీలో ఉంచి - ఒక పళ్ళు పొడుచుకునే పుల్ల చివరి భాగమున ఉన్నంతటి ప్రేలుడు మందును మాత్రమే, ఈ భవనమునకు వెలుపల చివరన కూర్చొని యుండు పందిని ఆ తుపాకీతో ప్రేల్చినయెడల, ఆ శబ్దమును విని అది కూర్చొనియున్న మిమ్మల్ని చూస్తూ౦డును. కారణమేమిటి? ఆ తుటా అంతగా చెదరి ఎంతో వేగముగా దూసుకుపోవును. మీరు దీనికి దానికి మధ్య అడుగా ఒక రేకును ఉంచినయెడల, దానిపై తుటా యొక్క ఒక చిన్న ధూళి కూడా దానిమీద పడనివ్వదు. అది ఆ విధముగా బూడిదగా మారదు, అగ్ని లావావంటి బూడిదగా అది అవ్వదు, అది సమస్తమును చేధించుకొని దూసుకొనివెళ్ళిపోవును. ఆ తుటాలో యున్న రాగి, సీసము, ముందుయుండు ఆమ్లము యొక్క స్థితికి వెళ్ళిపోవుచున్నవి. అది కోట్లకొలది సంవత్సరములకు ముందు ఏ స్థితిలో యున్నది. ఆ స్థితికి అది వెళ్ళిపోవుచున్నది. నా చేతిలో ఇప్పుడు నలుబది ఎనిమిది “గైన్” చిన్న తుటా ఒకటి యున్నది. తర్వాత నిమిషమునందే అది కోట్లకొలది సంవత్సరములకు ముందున్న స్థితిని చేరుకొనును. ఈ లోకము ఇంకా కోట్లకొలది సంవత్సరములు నిలిచి యుండినయెడల, అది మరలా ఒక తూటావలె మార్పుచెందే అవకాశము దానికి యున్నది, ఎందుకనగా అది రాగిగా మార్పుచెందియుండును.

154

ఇప్పుడు దేవుడు ఏమి చేసెనో గమనించి చూడండి, అప్పుడు మీరు ఆయనను ప్రేమించెదరు, అటు తర్వాత గృహమునకు వెళ్ళి, ఉదయకాలమందు కొంచెము ఆలస్యముగా మీరు నిద్రనుండి లేచినను ముందుకంటె మరెంతో ఎక్కువగా ఆయనను మీరు ప్రేమించెదరు. ఇప్పుడు దేవుడు ఒక కాంట్రాక్టర్ గా యున్నారు, ఎంతమంది దానినెరుగుదురు? ఆయన ఒక భవనమును కట్టువాడు. సరే, చక్కగా క్షుణ్ణముగా ఆలకించండి, వారు చెప్పుచున్నారు... దేవుడు ఆ కాలమునందు, ఇప్పుడు పూర్వ చరిత్రలోని కార్యముల కాల వరుస క్రమమును దానిగూర్చిన అభిప్రాయమును మనము తీసుకొనబోవుచున్నాము. దేవుడు కోట్ల సంవత్సరములకు ముందు, ఆయన జగత్తును సృష్టించబోవుచున్నప్పుడు, దానిని ఆయన ఆరంభించెను. ఇప్పుడు ఆయన తలంపు... ఆయన ఒక ప్రణాళికను తన తలంపులో యుంచుకొనెను.

155

మీరు “బ్రెన్హాం సహోదరుడా, ఆయన అంతటి మహోన్నతుడైనయెడల, పాపము చెయ్యుటకు దెయ్యమును ఎందుకు అనుమతించెను?” అని అడుగవచ్చును. మంచిది, సాతానుని సృష్టించుటకు ముందే, వాడు దెయ్యముగా యుండునని ఆయనకు తెలుసు. మహిమ! ఇప్పుడు భక్తి పరవశముతో నేను అనుభూతి చెందుచున్నాను. ఓ, నా దేవా, సాతానుని సృష్టించుటకు ముందే వాడు సాతానుగా యుండునని దేవునికి తెలుసు. ఇప్పుడు, మీరు “అంటే, దాని భావమేమిటి? వాడు సాతానుగా యుండుటకు ఆయన ఎందుకని అనుమతించెను,” అని మీరు అడిగెదరు? ఆయన తాను దేవుడునని నిరూపించు కొనుటకే ఆ విధముగా చేసెను. ఆ హేతువు చేతనే ఆయన దానిని ఆ విధముగా చేసెను. అవినీతిపరుడైన వాడెందుకు యుండవలెను? ఎందుకు....

156

ఎవరు మొదట యుండెను, రక్షకుడా లేక పాపాత్ముడా? ఎవరు మొదటయున్నవారు? ఒక రక్షకుడు యుండెను. మొదటయున్నవాడు ఎవరు? ఒక స్వస్థపరచువాడా లేక ఒక వ్యాధిగ్రసుడా? ఒక పాపాత్ముడు యుండుటకు ఎందుకని అనుమతించెను? ఎందుకనగా ఆయన ఒక రక్షకుడనే తనలో యుండే ఆ గుణాలక్షణము బయలుపడాలంటే ఒక పాపి లేనియెడల ఆయనను ఎన్నటికీ ఒక రక్షకుడుగా ఎరిగి యుండలేము. హల్లెలూయా! ఆయన యొక్క మహిమార్ధమై సమస్తమును ఆయన సమాప్తము చేయగలడు. “కుమ్మరి పాత్రను చూచి...” లేదా “నన్నెందుకు ఈ విధముగా మలిచితివి అని కుమ్మరిని చూచి కుండ ప్రశ్నించగలదా?” ఆ చక్రమును త్రిప్పువాడు ఎవరు? ఎవరియొద్ద బంకమట్టి గలదు? ఎవరి చేతులలో ఆ మట్టి ముద్ద గలదు? పౌలు, “బుద్ధిహీనుడా, ఆ ఉద్దేశ్యము కొరకే ఫరోను చేసితినని ఆయన చెప్పలేదా?” అని చెప్పెను. నిశ్చయముగానే జగత్తు అనేది ఒకటి యుండుటకు ముందే, ఎవరు ఏమైయుందురో అనే దానిని గూర్చి ఆయన ఎరిగినవాడై యున్నాడు. ఆయన ఒక రక్షకుడుగా తన్నుతాను బయలుపరచుకొనుటకై పాపము అనుమతించెను. ఆయన ఒక స్వస్థపరచువానుగా తనను తాను బయలుపరచుకొనుటకై వ్యాధిని అనుమతించెను. ఆయన ప్రేమస్వరూపిగా తన్నుతాను బయలుపరచుకొనుటకై ద్వేషమును అనుమతించెను. నిశ్చయముగా దానిని ఆయన చేసెను. ఆయన దేవుడు, అవి ఆయన యొక్క గుణాలక్షణములైయుండి, వాటిని బయలుపరచుటకై ఏదో ఒకటి ఆయనకు కావలసి వచ్చెను.

అంతా పగటి వెలుగుగా యున్నట్లైతే, రాత్రి అనేది ఒకటున్నదనేదానిని గూర్చి మీరే విధముగా తెలుసుకొందురు? రాత్రనేది ఒకటి యున్నదనే దానిని గూర్చి నీవే విధముగా ఎరుగగలవు? రాత్రి అనేది ఒకటి యున్నందువలన అది పగటి వెలుగును నిరూపించుచున్నది. నిశ్చయముగా, అది ఆ విధముగానే యున్నది. ఆమేన్. ఆయన ఏమేమి చేసెననే దానిని మీరు గ్రహించగలిగితిరా?

157

ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే, ఈ సూర్యుడ్ని తీసుకొని, ఇప్పుడు మనము జీవించుచున్న గ్రహమగు భూమి, సూర్యుడుని చుట్టూ తిరిగి వచ్చుటకు ముందే, ఇదిగో సూర్యుడు యున్నాడని చెప్పి, దానిని ఆయన ఈ ప్రక్కనుంచి అది కోట్ల సంవత్సరములుగా అచ్చట వ్రేలాడుచు యున్నట్లుగా ఆయన దానిని యుంచెను. ఆయన ఏమి చేయుచున్నాడు. కొంచెము వాయువులను చేయుచున్నాడు. ఆయన ఈ ప్రక్కనుండి తిరిగి వచ్చి ఆయన వేరొక దానిని చేసెను. అచ్చట ఆయన దేనిని నిర్మించుచున్నాడు? పోటాష్ ను చేయుచున్నాడు. ఆయన ఇటు ప్రక్కకు తిరిగెను. మరియు ఆయన ఏమి చేయబోవుచున్నాడు? కొంచెము కాల్షియమ్ ను చేయుచున్నాడు. ఆయన ఏమి చేయు చుండెను? ఆయన నిన్ను మరియు నన్ను సృజించుచుండెను. ఆయన ఏమి చేయుచుండెను? ఆయన కాంట్రాక్టర్ వలె రె౦డుకు నాలుగు, రెండుకు ఎనిమిది అనే కొలతలతో ఆయన యొక్క పలకలును, మరియు ప్రక్కలును అన్నింటిని వేసుకొంటూ ఎన్ని కట్టడములను ఆయన నిర్మించబోవుచున్నాడో అనే దానిని గూర్చి ఆయన ముందే ఎరిగినవాడైయున్నాడు.

మనము ఈ భూమిలో యుండు పదహారు మూల పదార్థములతో (Elements) నిర్మించబడితిమి, మరియు ఈ జగత్తు కలుగక ముందే ఆయన మనల్నందరిని సృష్టించి, అచ్చట ఆయన మనల్నందరిని... బహుశా ఈ భూమి ఆ కాలమందు దీర్ఘ చతురస్త్రపుపు ఆకారములో యుండి యుండవచ్చును. అదేలాగు యుండినదో నాకు తెలియదు. ఆయన ఎందుకని బంగారమును, రాగిని, ఇత్తడిని, నీటిని మరియు వీటన్నింటిని కలుగజేసెను? ఆయన ఒక కాంట్రాక్టర్. ఆయన కట్టడములను నిర్మించువాడు. ఆయన సమస్తమును అచ్చట ఏర్పరచుచు మరియు సమస్తమును కోయుచూ రూపుదిదుచుండెను. వీటన్నింటిని ఆయన చేసిన పిదప అది ఒక మహా గొప్ప బ్రద్దలగు అగ్నిపర్వతముగా యుండెను. కొంచెము కాల్షియమ్ ను చేయుటకై ఆయన కోట్ల కొలది సంవత్సరములుగా ఆ పాత అగ్నిపర్వతము కణకణ మండే లావాను క్రక్కునట్లుగా చేసెను. అదేమిటది? అది మీలో ఒక భాగమైయున్నది.

158

అటుపిదప, ఈ భూమిపై ఏ ప్రాణియు సృజించబడక ముందే మన శరీరములు అచ్చట యుండెను. హల్లేలూయా! ఒక చిన్న తడి బిందువు భూమిలో కలుగుటకు ముందే మనము అచ్చట యున్నాము. ఆదాము ఏదేను తోటలో ఇటు అటు నడుచుచున్నప్పుడే, నేను అచ్చట యున్నాను. ఆమేన్. అవునయ్యా! ఓ, మహిమ! సెరూపులు, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవుని యొక్క కుమారులు ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు నేను అచ్చట యుండి జీవ శ్వాస పొందుకొనుటకై వేచియుంటిని. నేను అచ్చట యున్నాను. ఆయన ఇచ్చట నన్ను సృజించి నా శరీరము ఇచ్చట పడి యుండునట్లు చేసెను. అవునయ్యా. మీరెచ్చట నుండి వచ్చితిరనేది కాదు, అవి ఏ విధముగా ఇచ్చటకు వచ్చెను. దేవుడే అది ఇచ్చట యుండునట్లుగా చేసెను. దేవుడే దానిని చేసెను. మనము పెట్రోలు, పోటాష్, కాస్మిక్ లైట్, పదహారు మూల పదార్థములతోను మరియు ఇంకా మొదలగువాటితో చేయబడితిమి. చూచారా, మనమిచ్చట యుండితిమి.

159

ఆ తర్వాత ఏమి జరిగినది? దేవుడు పరిశుద్ధాత్మతో (దీనిని మనము ఒక ఆనవాలు రీతిలో తీసుకొనెదము), “నీవు వెళ్ళి ఆ లోకమును ప్రేమించు, ఎందుకనగా నేను ప్రేమ స్వరూపినైయున్నాను. నీవు నా యొక్క ఉత్పత్తిగా యున్నావు. కాబట్టి ఇప్పుడు నీవు బయలుదేరి వెళ్ళి ఆ లోకమును ప్రేమించుము,” అని చెప్పెను. ఆ గొప్ప పరిశుద్ధాత్మ అచ్చట నుండి బయలు వెళ్ళెను. ఒక చిత్రము వంటి రూపములో ఇప్పుడు దీనిని మనము ఆలకించి చూచెదము. అది ఆ విధముగా లేదు. పరిశుద్ధాత్మయు దేవుడు ఒక్కడే, ఒకే ఉద్దేశ్యము, ఒకే స్వకీయ ఉద్దేశ్యము — ఒకే వ్యక్తి, నన్ను క్షమించవలెను. అప్పుడు ఆయన తన రెక్కలను భూమియంతట మీదకి పరచి, ఆయన పొదుగుటకు ఆరంభించెను. పొదుగుట అనగా ఏమిటి? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు చేర్చుకొని ముద్దాడుచున్నట్లుగా, “క్లక్, క్లక్, క్లక్.” ఓ.

160

“ఓ, జీవమా, వెలుపలకు రా!” అని ఆయన కేకలు వేసెను. ఆయన చూటూ చూచెను. “ఈ భూమిపై సుందరముగా యుండాలని నేను ఆశించుచున్నాను. వెలుగు కలుగును గాక!” పరిశుద్ధాత్మ కదలాడుచుండును. ఆయన ఆ విధముగా చేసినప్పుడు, కొండనుండి కొంచెము కాల్షియమ్ క్రిందికి కారుచూ వచ్చుచుండుటను నేను చూచుచున్నాను. అది వచ్చి పోటాష్ లో మిశ్రమమగుచున్నది. చివరకు అదెచ్చట ముగియుచున్నది? “జీవము, కలుగును గాక!” మరియు బండ క్రిందనున్న ఒక చిన్న ఈస్టరు పుష్పము యొక్క తల వెలుపలికి పొడుచుకొని వచ్చినది. “తండ్రీ, ఇచ్చటకు రా, వచ్చి దీనిని చూడుము.”

“అది చూచుటకు అందముగా యున్నది, ఆ విధముగా పొదుగుచునే యుండెను.” ఆయన పుష్పములను పొదిగి పుష్పింపచేసెను. ఆయన సమస్త ఫల వృక్షములను మొలిపింపజేసెను. ఆయన జీవము గల జంతువులను చేసెను. పక్షులు మట్టిలోనుండి ఎగురుచు వెళ్ళెను. కొద్దిసేపైన తరువాత ఒక పురుషుడు మరియు ఒక స్త్రీవచ్చుచున్నారు. ఒక పురుషుడు వచ్చుచున్నాడు, అతడు స్త్రీగాను పురుషునిగాను యుండెను. ఇప్పుడు ద్విలింగ అమరికలను కలిగి ఉన్నవాడు కాడు (hermaphrodite). అతడిలో యుండెను.

161

ఒక స్త్రీ తత్వపు ఆత్మ అచ్చట యుండెను.

స్త్రీ తత్వముగల ఒక పురుషుడుని మీరు తీసుకొనినయెడల, అతడు చూచుటకు బాగుగానే యుండవచ్చును, కాని అతడిలో ఏదో కొరత గలదు. ఒక స్త్రీని మీరు తీసుకొనినయెడల, ఆమె తన తలవెంట్రుకలను కత్తిరించుకొని, మగవారు ధరించు వస్త్రములను ధరించుకొని, బయటకు వెళ్ళుచున్నది. “దేవా దీవించు, నేను చెప్పుచున్నాను” అచ్చట ఏదో కొరత గలదు. ఒక స్త్రీ తత్వపు ఆత్మను కలిగియున్నది. ఒక పురుషుడు పురుషత్వమును కలిగియున్నాడు. దానిని మనమెరుగుదుము. దానిని మీరు ఎరుగుదురు. ఒక స్త్రీ పురుషునివలె ప్రవర్తించుటకు ప్రయత్నించినయెడల, అది చక్కగా యున్నట్లు కనబడునా?

162

ఎందుచేత, నన్ను ఒకసారి గేమ్ వార్డెన్ గా నియమించినప్పుడు, ఒక దినమున బస్సులో వెళ్ళుచున్నాను. ఆమె యొక్క కాలిపై నా చేతితో కొడుతూ మాట్లాడుకొంటూ వచ్చితిని. ఆమె ఒక స్త్రీ అని నాకు తెలియలేదు. ఆమె వెల్టర్స్ యొక్క టోపిని మరియు ఒక పెద్ద నల్లటి కల్ల అద్దములు లాంటివి ధరించుకొనియుండినది; సరిగ్గా నేను ఆమె ప్రక్కనే కూర్చొనియున్నాను. ఆమె జరిగిపోయిన ఒక సంభవమును గురించి నాతో చెప్పుచూ యుండినది. ఆమె ఇలా చెప్పినది, “నీకు తెలుసా, నిన్న రాత్రి, [ఆమె చూచుటకు మోటుగా యుండినది, సిగరెట్టును పీల్చుచూ,]” ఆమె నాతో, “నిన్న రాత్రి అతడు కాలు జారిపైనుండి క్రిందవరుకు జారుకుంటూనే వచ్చాడు. దానిని చూచినప్పుడు, నా జీవితములో నేనెన్నడు నవ్వలేనంతగా నవ్వితిని,” అని చెప్పినది.

చెప్పినదానిని విని నేను కూడా నవ్వు ఆపుకోలేకపోతిని. నేను “బాలుడా, అది భలే తమాషాగా యున్నది,” అని అన్నాను. ఈ విధముగా నేను కూర్చొని మాట్లాడుచూ యుంటిని. ఆమె తన టోపీని తీసివేసి తన తలను ఆడించినది. ఆమె ఆ విధముగా చెయ్యకుండాయుండిన యెడల అస్సలు ఆమె ఒక స్త్రీ అని కూడా నాకు తెలిసేది కాదు. దానిని చూచినప్పుడు, నా జీవితములో నాకెన్నడు కలగని సిగ్గును కలుగజేసినది, నేను “నీవు ఒక స్త్రీవేనా” అని అడిగాను.

ఆమె, “ఎందుకు, నిజంగా స్త్రీనే,” అని అన్నది.

నేను “నన్ను క్షమించండి,” అని అన్నాను. నేను అటువంటిది ఎన్నడూ చూడలేదు. ఇప్పుడు, అది సత్యము.

163

ఒక దినమున నేనొక ప్రకటన పలకను చూచి ఉత్సాహపడితిని. “స్త్రీలు వస్త్రములు ధరించుకొనుటకు సిద్ధముగా యున్నారు,” అని ఒక పెద్ద ప్రకటన దానిపై కలదు. “అందుకొరకు దేవునికి స్తోత్రము,” అని మనస్సులో అనుకొన్నాను. చూచారా? కాని చూచినప్పుడు, అది ఇంతకు ముందే కుట్టి సిద్ధముగా యుంచబడిన స్త్రీలు ధరించుకొనుటకు సిద్ధపరచబడిన వస్త్రముల ప్రకటనగా యున్నది. “స్త్రీలు వస్త్రములను ధరించుకొనుటకు సిద్ధముగా యున్నారు,” అని ఉన్నట్లుగా నేను తలంచుకొని, “వారికొరకు, నేను దేవునికి స్తోత్రము,” అని అన్నాను. కాని అది నిజముగా, ఇంతకు ముందే కుట్టి తయారు చేయబడిన వస్త్రముల యొక్క ప్రకటనగా అది యున్నది. ఈ దేశమున స్త్రీలు వస్త్రములను ధరించుకొనుటకు సిద్ధపడినయెడల, అది ఏదో హాస్యాస్పదముగా అది అలాగుండదా? యుండును కదా! సరే మంచిది.

164

పిదప ఆదాము వచ్చినప్పుడు, ఆదాము తాను ఒంటరివాడుగా యున్నట్లుగా కనుగొనెను. కాబట్టి ఆయన అతడి యొక్క ప్రక్కటెముకను ఒకటి తీసి హవ్వను అతడి కొరకు ఒక ఉప-సృష్టిగా చేసెను. మరియు ఆయన ఆదాములో యున్న స్త్రీ తత్వపు ఆత్మను తీసి, స్త్రీ లోపల యుంచెను. అది ప్రేమను, స్త్రీ తత్వమును, జాలిని, మృదువైన ఆత్మను కలిగియున్నది. ఆదాములో పురుషత్వపు ఆత్మ యుండునట్లుగా ఆయన చేసెను. ఇప్పుడు ఇందులో ఏదైన బేధము యున్నట్లుగా కనబడినయెడల, అది ఎచ్చటో తలక్రిందులుగా చేయబడినట్లుగా కనబడుచున్నది. ఇప్పుడు, వారిరువురు ఏకముగా యుండిరి.

165

మనము ముగించుటకు ముందుగా, ఒక చిన్న నాటకమును తీసుకొనెదము. ఇచ్చట ఆదాము హవ్వతో చెయ్యిలో చేతిని కలిపి నడుచుచూ వచ్చుచున్నారు. ఈ ప్రేమ కథంటే నాకెంతో ఇష్టము. ఆ విధముగా వారు ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకొని వచ్చుచుండగా, మీకు తెలుసా, హవ్వ “ఓ, ప్రియమైనవాడా, దానికి పేరు పెట్టినట్లుగా చెప్పుచున్నావా?” అని అడిగినది.

“అవును, దానికి నేను పేరు పెట్టాను.

“అయితే, దానిని ఏమని పిలువవలెను?”

“ఓహ్-హో - దానిని గుర్రము అంటారు”

“అది ఏమిటి?”

“ఆ, అది ఆవు.”

“దీనికి నీవే పేరు పెట్టావా?”

“అవును. హూ.”

“దీనిని ఏమని పిలువవలెను. అది ఆ రెండూ వాటి తలలను ఒకదానిపై ఒకటి ఆనిచ్చి అవి ఆ విధముగా అచ్చట కూర్చొనియున్నవి.”

“అవి ప్రేమ పక్షులు.”

“ఓ, అలాగా, అలాగా,” అవి ఆ విధముగా చూస్తునే యున్నవి. “ఇచ్చటయున్న దీని పేరేమిటి?”

“నేను దానిని ఇది, దానిని, దీనిని, ఇది అని పిలచెదను.”

“ఓ, అలాగా ఓ, అది చక్కగా యున్నది.” “ఒక సింహము గర్జించుచున్నది.” దానిని ఏమని పిలువవలెను?“

“అది సింహము.”

“ఇది ఏమిటి?”

“పులి.”

అన్నీ చూచుటకు.... “ఓ, అలాగా,” పిల్లి పిల్లలవలె ఇద్దరు మ్యావ్ మ్యావ్ అని మాట్లాడుకుంటూ యుండిరి.

166

అది కొంతసేపటి తరువాత హవ్వ చుట్టూ తిరిగి చూస్తూ యుండినది, ఆమె “ప్రియమైనవాడా, ఇచ్చట చూడండి, సూర్యుడు అస్తమించుచున్నాడు, సంఘమునకు వెళ్ళుటకు సమయము ఆసన్నమైనది,” అని చెప్పెను. సూర్యుడు అస్తమించినప్పుడు, దానిలో ఏదో ఒకటియున్నది, అప్పుడు మీరు ఆరాధించవలెననే భావన మీలో కలుగును. ఆ రోజు రాత్రి మీరు సంఘమునకు వెళ్ళనియెడల, ఒక గది లోపలకు వెళ్ళి, పరిశుద్ధ గ్రంథమును చదవండి. ఆ విధముగా గదిలో వెళ్ళుటకు ఎంతమందికి ఇష్టము? చూచారా? అది సహజముగానే ఒక మనిషిలో యుండు కార్యముగా యున్నది. మీరు దానిని చేయవలెను. “సంఘమునకు వెళ్ళుటకు సమయము ఆసన్నమైనది.”

ఇప్పుడు, “ఇప్పుడు ఒక నిమిషము ఆగు. ఇప్పుడు, జోన్స్ - అసంబ్లీస్ సంఘమునకు చెందినవాడు, మనము దీనికి చెందిన అని వారు చెప్పలేదు. అటువంటి భిన్నమైన విభజనము ఆ కాలమునందు లేవు, కాబట్టి వారు ఆరాధించుటకై వెళ్ళిరి. వారికి ఒక సంఘము లేదు, కూర్చొనుటకు వారికి ఒక మంచి కుర్చీ లేదు. వారు మహా పెద్ద మందిరమగు అరణ్యములోకి వెళ్ళి మోకరిళ్ళిరి.

167

అప్పుడు ఆ వలయాకారము (Halo) పొదలలో నుండి వ్రేలాడుచూ యుండినది, చూచారా. ఒక శబ్దము ఈ విధముగా మాట్లాడుటను నేను వినగలుగుచున్నాను, “భూమిపైయున్న నా పిల్లల్లారా, ప్రభువగు దేవుడు మీకు అనుగ్రహించిన దినమును సంతోషముగా గడిపితిరా?” అని అడిగెను.

“అవును, ప్రభువా, నేడు మేము సంతోషముగా గడిపితిమి, అవును కదా, ప్రియమైన వాడా?”

అవును, అవును, ప్రియసఖీ, మనము సంతోషముగా గడిపితిమి, “ప్రభువా, నిశ్చయముగా మేము మిమ్మల్ని అభినందించుచున్నాము. ఇప్పుడు నేను పడుకొని నిద్రించబోవుచున్నాను.” చూచారా? అతడు తన పెద్ద చేతులను చాచెను, ఆమె అతడి చేతిపై ఆనుకొని నిద్రించుచున్నది, మరియు అతడు పులిని నిద్రింపజేయుచున్నాడు, సింహమును నిద్రింపజేయుచున్నాడు. మరియు సమస్తమును నిద్రింపజేయుచున్నాడు — ఎంతో ప్రశాంతముగా యుండెను.

కాబట్టి దేవుడు క్రిందికి దిగి వచ్చుచున్నాడు మరియు ఆయన తన పరలోకపు సృష్టియగు ఒక సమూహమును, ఓ, దూతలును, గాబ్రియేలును క్రిందికి తీసుకు వచ్చుచుండెను. వారు శబ్దము చేయకుండా కాళ్ళ వ్రేళ్ళపై మెల్ల మెల్లగా నడుచుచూ పడక గదిలోకి వచ్చి, చూచారా, చూట్టూ చూచిరి. గాబ్రియేలు, “తండ్రీ, ఇచ్చటకు రా, ఇచ్చటకు వచ్చి చూడుము, అతడు ఇచ్చట యున్నాడు. ఇచ్చట, నీ పిల్లలు ఇచ్చట నిద్రపోవుచున్నారు,” అని చెప్పెను.

168

తల్లులైన మీలో ఎంతమంది తండ్రులతో కలసి మీ పిల్లల పడక గదిలోకి వెళ్ళి, ఆ పసి బాలురు గురించియు మరియు ఆ పసి బాలికల గురించియు మాట్లాడియుంటిరి? “వాడు మీలాగే ఉన్నాడు కదా? ఇలాగ యున్నాడు, అలాగ యున్నాడు,” అని మాట్లాడుకుంటిరి. ఆ విధముగా మీరు మాట్లాడ లేదా? అంతెందుకు? అనేకసార్లు నేను, మీడా, జోసఫ్ గురించి మాట్లాడుకొంటిమి. ఆమె, “బిల్లీ, వాడికి మీలాగే పెద్ద నుదురు గలదు,” అని చెప్పును.

“అవును, కాని, మీడా, వాడికి నీలాగే పెద్ద కళ్ళు గలవు,” అని నేను చెప్పితిని. ఎందుకని? అతడు మా ఇద్దరి కలయిక ద్వారా జన్మించినవాడు, మేమిద్దరం కలసి ఉత్పత్తి చేసిన ఉత్పత్తిలోని ఒక భాగమై అతడున్నాడు.

ఇప్పుడు, తండ్రి చెప్పెను, దీనిని గురించి దీనిని ఈ విధముగా చెప్పవచ్చునా, “నీవెరుగుదువా....” గాబ్రియేలు, “మీరెరుగుదురా, అతడు మీవలె యున్నాడు,” అని చెప్పెను. మిమ్మల్ని మీరు చూచుకోండి, దేవుడు చూచుటకు ఆ విధముగానే యుండును. దేవుడు యున్నట్లుగానే, మీలాగానే ఆయన యుండును. మీరు ఆయన సంతానముగా యున్నారు. దానిని ఎంతమంది ఎరుగుదురు?

169

ఇప్పుడు, గమనించండి, మనము కలిగియున్న ప్రాణులలో అల్పమైన ప్రాణి ఏది? కప్ప. ప్రాణులలో ఉన్నతమైన ప్రాణి ఏది? మానవుడు. ఖచ్చితముగా ఉన్నతమైన ప్రాణి ఏది? అది అల్పమైన ప్రాణియగు కప్ప నుండి ఆరంభమై, ఒక్కొక్క దశగా హెచ్చుతూ పక్షికి వచ్చి ఈ విధముగా దశలవారిగా హెచ్చింపబడుచూ, ఉన్నతమైన ప్రాణి దశకు వచ్చి చేరినది. ఆ విధముగా ఉన్నతమైన ప్రాణి వర్గమునకు వచ్చి చేరిన తర్వాత, అప్పుడది దేవుని యొక్క పోలికవలె అది సృజింపబడినది. చూచితిరా? అచ్చటే నీవు యున్నావు. స్త్రీ దేవుని యొక్క పోలికతో సృజించబడలేదు, కాని మానవుని యొక్క పోలికలో సృజించబడినది. చూచారా? ఇప్పుడు, ఇప్పుడు ఇదిగో వారు. దేవుడు వారి వైపు చూచి, “అవును వారు చూచుటకు వారు మనోహరముగా యున్నారు,” అని చెప్పెను.

170

సహోదరుడా, అదేమిటది? వారు మరణించవలసిన వారు కారు. అది మొదటి పిడికెడంత కాల్షియమ్, మొదటి పోటాష్, మరియు సమస్తము ఆ విధముగానే ఆరంభమైనవి. అది అందముగా యున్నది కదా? కాని పాపము లోపలికి ప్రవేశించి దృశ్యమును పాడు చేసినది. ఇప్పుడు దేవుడు.... దానిని దేవుడెందుకు అనుమతించెను? కొద్దిసేపు ముందు మనము మాట్లాడుచున్నట్లుగా, ఆయన దానిని అనుమతించుటకు గల కారణమేమి? ఆయన తానొక రక్షకుడునని నిరూపించుట కొరకే ఆయన దానిని అనుమతించెను. దానిని ఆయన నిరూపించెను. ఆయన తానొక స్వస్థపరచువాడని నిరూపించుటకే వ్యాధి కలుగుటకు ఆయన అనుమతించెను. ఆయన జీవమునకు అధిపతి అనే దానిని నిరూపించుట కొరకే మరణమును ఆయన అనుమతించెను. చూచారా? ఆయన మంచివాడని నిరూపించుట కొరకే సమస్తమైన చెడు కార్యములు యుండుటకు ఆయన అనుమతించెను; ఆయన ఏమై యుండెనని నిరూపించుటకే.

171

విమోచనా కథను పాడుటను గురించి మీరు మాట్లాడుదురు. అంతెందుకు సహోదరుడా, యేసు వచ్చినప్పుడు, ఈ సంఘము ఈ భూమి యొక్క అంచులలో నిలబడి విమోచనా కథలను గురించి పాడుచుండును. అప్పుడు దేవదూతలు మనము దేనిని గురించి మాట్లాడుచున్నామనే దానిని ఎరుగక, తమ తలలను వంచుదురు. ఎందుకనగా, వారు నశించబడని (పొగొట్టబడని) వారుగానే యున్నారు. మనము దేనిద్వారా దాటిపోతిమనే దానిని గురించి వారికి తెలియనే తెలియదు. పోగొట్టబడి మరలా వెదకి కనుగొనబడిన దానియొక్క భావమును గురించి మనకు మాత్రమే తెలుసు. ఓ, మనము ఆయనను స్తుతించుచూ ఆర్బటించవచ్చును కదా! ఆయన వారికి రక్షకుడు కాదు! కాదు. మహిమ! వారికి ఆయన ఒక స్వస్థపరచువాడు కాదు. లేదు. మహిమ! ఆయన వారికి జీవము కాదు. ఖచ్చితముగా కాదు; వారు అతిక్రమముల వలన మరియు పాపము వలన మరణించలేదు. మనము మరణించితిమి కాని పునరుద్ధరింపబడితిమి. ఆ విధముగానే మనము యున్నాము. మన కిరీటములను తీసివేసి, మనము ఏమని చెప్పగలము, “పూజ్యనీయులైన మీరు ఫలానా మరియు ఫలానా అనా?” ఓ, లేదు, కాదు, కాదు, కాదు. సమస్త్ర మహిమ ఆయనకే చెందును. అంతే. నీవు అదే చేయవలెను. “పిదప మనము ఏ విధముగా జయించితిమనే కథను మేము చెప్పెదము. కొద్దికొద్దిగా దానిని మనము చక్కగా అర్ధము చేసుకోగలము.”

172

పిదప, దానిలో, పిదప దానిలో ఏమి జరిగినది? దేవుడు, “మంచిది, సమస్తము శిథిలావస్థకు వచ్చినవి. కాబట్టి సమస్త కాల్షియమ్ మరియు పోటాష్ ను, నేను నశింపచేయుట మంచిది,” అని చెప్పెనా? లేదు, లేదు. అది ఆ విధముగానే జరుగునని ఆయన దానిని ఎరిగియుండెను. ఇప్పుడు, ఇప్పుడు, నేనున్న విధముగా పరిశుద్ధాత్మ నన్ను సృష్టించినయెడల, నేను భుజించి, దానిని నా శరీరములోనికి చొప్పించి మరిప్పుడు నేను వున్న స్థితికి ఎదిగితిని, నేను... ఒక ఆకారముగా ఆయన నన్ను సృజించెను. జగత్తు పునాది వేయబడక మునుపే, దేవుడు, దృశ్యములో చూచిన ప్రతీదీ పరిపూర్ణముగా రూపుదాల్చినవి. చూచారా? అది ఒక స్త్రీ మూలముగా కలిగినవి. ఆ విధముగానే జరుగునని ఆయన సెలవిచ్చెను. తదుపరి కాలమున దేవుని మూలముగా అది కలిగినది. ఆ కాలమునందు స్త్రీ మూలముగా అది వచ్చినది. ఈ కాలమునందు పురుషుని మూలముగా అది వచ్చినది. చూచారా? ఆ కాలమందు అది శరీరక ఇచ్చవలన వచ్చినది, ఈ కాలమందు అది దేవుని యొక్క పలుకబడిన వాక్యము ద్వారా వచ్చును? చూచారా?

కాబట్టి, ఇప్పుడు ఏదైనా నాకు హాని కలిగించగలదా? లేదండీ. ఏదీ కూడా మనకు హాని కలిగించదు. పౌలు చెప్పిన విధముగా, “మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవియైనను, రాబోవునవియైనను, అధికారులైనను, ఎత్తయినను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.” ఏదీ కూడా మనలను ఎడబాప నేరదు.

173

నేను ఒక చిన్న కథను ముందే చెప్పాను. నాకు పూర్తిగా బట్టతల వచ్చుటకు ఇంకా నాకు ఐదు వెంట్రుకలే గలవు. కొంత కాలము క్రితము ఈ కొన్ని తల వెంట్రుకలను నేను దువ్వుకొనుచున్నప్పుడు, నా భార్య, “బిల్లీ, నీకు దాదాపు పూర్తిగా బట్టతల వచ్చేసింది,” అని అన్నది.

అందుకు నేను, “కాని వాటిల్లో ఒక్కటైనను నేను పోగొట్టుకోను,” అని అన్నాను.

“అట్లైనయెడల అవి ఏవి?” అని అడిగెను.

“వాటిని నేను మరలా పొందుకొనుటకు ముందు అవి ఎచ్చట యుండినవి? అని నేను అడిగితిని. చూచారా? వాటిని పొందుకొనుటకు ముందు సరే, ఒక కాలము, వంద సంవత్సరములకు ముందు ఈ తల వెంట్రుకలు ఇచ్చట లేవు అవి భూమి యొక్క ధూళిలో యుండినవి. అది నిజమేనా? ఇంచుమించు ఏబది సంవత్సరములకు ముందు అవి నా తలపై వచ్చుటకు ఆరంభించినవి. అవి ఎచ్చట నుండి వచ్చినవి? భూమి యొక్క ధూళినుండి. అవి ఎచ్చటనుండి వచ్చినవో అదే స్థలమునకు అవి మరలా వెళ్ళుచున్నవి. అది సరియేనా? అవి ఒక కాలమునందు లేవు; పిదప అవి అచ్చట యున్నవి, మరిప్పుడు అవి లేవు. అది ఏమిటది? అవి ఆ విధముగా యుండాలని వాటిని కలిగించినవారు ఎవరు? దేవుడు! దేవుడే దానిని ఆ విధముగా చేసెను. ఆయన ఒక చిత్రము చిత్రించెను, ”ఆ విధముగానే అతడు నాకు కావాలి,“ అని పలికెను.

174

“ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? పాతాళమా, నీ జయమొక్కడ?” రాబోవు దినములలో మీరునన్నిచ్చట సమాధి చేయవచ్చును, నాకు తెలియదు; కాని, సహోదరుడా, నేను మరణించి యుండను, దానిని మీకు నేను చెప్పుచున్నాను. లేదయ్యా. “ఓ మనము లేచెదము, హల్లేలూయా, మనము లేచెదము. ఆ పునరుత్థానపు ఉదయమున మరణపు కట్టులు తెగిపోయినప్పుడు, మనము లేచెదము!” హల్లేలూయా, మనము లేచెదము! నేను మృతులలో నుండి లేచుటకు నన్ను ఏదియు ఆటంకపరచలేదు. నేను మృతులలో నుండి లేచుటను అడ్డగించుటకు పాతాళమంతటిలో చాలినన్ని దెయ్యములు లేవు. నా పునరుత్థానమును ఆటంకపరచుటకు ఏదీ కూడా ఎచ్చట లేనే లేదు. నాకు దేవుని యొక్క వాగ్దానము గలదు, నాకు పరిశుద్ధాత్మ గలదు. నేను “జో” (Zoe) కలిగియున్నాను, దేవుని యొక్క నిత్యజీవము. అది ఇచ్చట విశ్రాంతి పొందుకొనుచున్నది. ఈ మృత శరీరము భూమిలో నుండి వచ్చినది, దేవుడు నన్ను పొదిగి భూమిలో నుండి వెలుపలకు.

175

ఆయన పొదిగి భూమిలో నుండి నన్ను సృజించినయెడల, ఇప్పుడు నేను వృద్ధాప్య కాలమునకు వచ్చిన స్థితిలో, మందిరపు ఘంటల శబ్దమును నేను వినే ప్రతీసారి, ఏదో ఒక మెల్లని స్వరము నాతో మాట్లాడుచున్నది; ఒక దూత పొదలలో నుండి నాతో మాట్లాడి, “నీవు, ఎన్నడూ త్రాగకూడదు, లేదా పొగ పీల్చకూడదు, నా కొరకు నీవు చేయవలసిన ఒక పనిగలదు. నీ శరీరమును కళంకపరచుకోవద్దు, లేదా స్త్రీల వెంటపడవద్దు మరియు అటువంటి కార్యములు చెయ్యవద్దు, నీవు పెద్దవాడగునప్పుడు నా కొరకు ఒక పని చేయుటకు నీతో నాకు పని యున్నది,” అని చెప్పెను.

“నీవెవరవు? నీవెవరవు?”

“దానిని గురించి ఇంకా ఎక్కువగా రాబోవుకాలమందు నీవు తెలుసుకొనెదవు.” అటు తర్వాత నేను బాప్తిస్మము ఇచ్చు స్థలము యొద్దకు ఆయన వచ్చి, అచ్చట ఆయన వ్రేలాడుచుండెను. ఆయన తనను తాను బయలుపరచుకొనెను. ఆయన తనను తాను తెలియజేసుకొనెను. ఆయన నా ప్రశ్నకు జవాబిచ్చెను. ఆయన ప్రతీ చోటా ప్రతీ దగ్గర నిలబడియుండుటను నేను చూచుచున్నాను.

176

మీరు ఏ విధముగా... నాకు తెలుసుకొను అవకాశము ఏదియు లేకుండా, నన్ను ఆయన నేనున్నానన్న విధముగానే సృజించెను. నేను నా తండ్రి యొద్దకు వెళ్ళి, “చార్లీ బ్రెన్హాం, నీవు ఎల్లా హార్వీని వివాహము చేసుకొని నన్ను ఈ భూమిలో నుండి కలుగజేయండి,” అని చెప్పలేదు. లేదయ్యా. ఆ విషయమును తెలుసుకొనే అవకాశమేదియూ నాకు లేదు. దేవుడు దానిని చేసెను. నేను దానిని ఎరిగే అవకాశమే లేకుండా ఆయన నన్ను సృష్టించియుండినయెడల, ఆ పరిశుద్ధాత్మ నాపై పొదుగుచూ యుండగా, “అవును, ప్రభువా, నీవు నా సృష్టికర్తవి, నిన్ను నా రక్షకుడిగా నేను అంగీకరించుచూ మరియు నేను నిన్ను ప్రేమించుచున్నాను?” అని నేను చెప్పేటప్పుడు, అవెంతటి విశిష్టమైన మాటలుగా యుండును. ఏ విధముగా నీవు నన్ను ధూళిలో పట్టుకొనియుంచుకోగలవు? అది నీకు సాధ్యము కాదు, సహోదరుడా, అది సాధ్యము కానే కాదు.

177

ఒక తునకైన ఈ కాల్షియమ్ లేదా పోటాష్ లేదా మరేదైనా, దేవుడు సృష్టించిన ఏదీ కూడా వ్యర్థమవ్వదు. “తండ్రి నాకు అనుగ్రహించిన వారందరును [జగత్తు పునాది వేయబడక మునుపే], నా యొద్దకు వత్తురు!” వ్యూ! ఇప్పుడు నాకు గెంతులు వేయాలనిపించుచున్నది, యదార్ధముగా. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరును నా యొద్దకు వత్తురు, వారిలో ఎవరిని పొగొట్టుకొనక, కాని నేను వారిని మరల పునరుత్థానములోనికి లేపుదును.“ ఆయన పిలుపును నేను ఆలకించి ఆయన యొద్దకు వచ్చితిని. అట్లుండగా వారే విధముగా నన్ను భూమియొక్క ధూళిలో బంధించియుందురు? నన్ను భూమి యొక్క ధూళిలో బంధించి, నా ముఖముపై పారతో తీసిన మట్టిని వేసి నన్ను సమాధిచేయువారు తగినంతమంది ఈ లోకములో లేరు. ఆయన రక్తముతో కడగబడిన వాడినై, ఆయన ఆత్మతో జన్మించినవాడనైన నేను మరలా ఆయన పోలికలో ఏదో ఒక దినమున పునరుత్థానములో లేచి నిలబడెదను! హల్లేలూయా! మీకు కావలిస్తే మీ శాఖలన్నింటిని మీరే ఉంచుకోండి; నేను యేసును తీసుకొనెదను. ఆమేన్!

178

భీమా అధికారి ఒకరు నా యొద్దకు వచ్చి విల్బర్ స్నయ్డర్, అనే ఆయన నాకొక మంచి స్నేహితుడు. అతడు, “బిల్లీ, నీకొక భీమా పథకమును అమ్మవలెనని ఆశించుచున్నాను,” అని చెప్పెను.

“ఇంతకు ముందే అది నాకు కలదు,” అని నేను చెప్పాను. (“కుమారుడి కొరకు నీవెప్పుడు దానిని తీసుకున్నావు” అని ప్రశ్నార్ధకముగా, నా భార్య నావైపు చూచింది.)

అతడు “నీవు భీమాని చేసియున్నావా?” అని అడిగెను.

“అవునండీ,” అని నేను చెప్పాను.

“అది ఏ కంపెనీకి చెందినది? అది ఏమిటది?” అని అతడు నన్ను అడిగెను.

“అది ఆశీర్వదించబడిన నిశ్చయత, యేసు నా వాడు, ఓ, దైవీక ప్రేమ యొక్క తొలి రుచి ఎంత మధురముగా యున్నది; రక్షణ యొక్క స్వాస్థ్యము, దేవునిచే క్రయమిచ్చి కొనబడి, ఆయన యొక్క ఆత్మలో జన్మించి, ఆయన యొక్క రక్తములో కడుగబడితిని,” అని నేను చెప్పాను.

అతడు, “అది మంచిది, బిల్లీ, అది నిన్ను సమాధి తోటలో పెట్టదు,” అని చెప్పెను.

కాని నేను, “అది నన్ను అచ్చటనుండి బయటకు తీసుకొని వచ్చును,” అని అన్నాను. హల్లేలూయా! అచ్చటకు వెళ్ళుటకు నేను బాధపడుట లేదు; అచ్చటనుండి వెలుపలకు వచ్చుటయే ప్రాముఖ్యమైనది.

179

కాబట్టి నా యొద్ద ఒక భీమా పథకము గలదు. అది, “నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరిని నేను తీసుకొని వచ్చెదను, వారు నావారు,” అని అది చెప్పుచున్నది. నా తండ్రి ఏమి చేసెననో, నా తల్లి ఏమి చేసినదనో, ఏది ఏమి చేసినా గాని నేను లెక్క చెయ్యను. “నా తండ్రి నాకనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. నా తండ్రి ఒకడిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు.” హల్లేలూయా! ఎందుచేత ఆయన వారిని ఎరిగియున్నాడు? “జగత్తు పునాది వేయబడక మునుపే వారిని నేను ముందుగానే ఎరిగితిని. నేను గొర్రెపిల్లను వధించినప్పుడు, ఆయనతో అతడిని కూడా నేను వధించితిని,” ఆమేన్. “నేను సంఘమును ముందుగానే నిర్ణయించుకొంటిని.”

ముందుగా నిర్ణయించుకోబడినది ఏది? సంఘము. మీరేవిధముగా సంఘములోకి ప్రవేశించుచున్నారు? “మనమందరము ఒక్క శరీరములోనికి ఒక ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి.” మనము అచ్చట యుందుమని జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన ఎరిగియుండెను. దేవుడెవరిని ముందు ఎరిగెనో ఆయన వారిని పిలిచెను. ఆయన ఎవరిని ముందుగా పిలచెనో ఆయన వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని ఆయన నీతిమంతులుగా తీర్చెనో, ఆయన వారిని ఇంతకు ముందే మహిమపరచెను.

180

ఆయన చేసి ముగించిన దానిని, ఆయన నన్ను అచ్చట సంధించెదనని దేవుని యొక్క గ్రంథములో చెప్పెను. పాతాళములోయున్న సమస్త దెయ్యములన్నీ అతడిని అచ్చటకు వెళ్ళనీయకుండా ఆటంకపరచి, అతడిని అవి వేరెచ్చటను ఉంచజాలవు: ఎందుకనగా దేవుడు దానిని గురించి ముందే చెప్పెను కాబట్టి, ఆయన చెప్పిన విధముగానే అది జరిగి తీరును. జగత్తు పునాదికి కోట్ల సంవత్సరములకు ముందే, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవుని కుమారులు ఆనందించి జయ ధ్వనులు చేసినప్పుడే, భూమికి పునాది వేయబడక ముందే, చూచారా, పునాది వేయబడక ముందే... ఆ దేవదూతలు మరియు సమస్తము ఆనందించి దానిని గురించి జయధ్వనులు చేసినప్పుడు, జగత్తుకు పునాది వేయబడక ముందే, ఆయన నన్ను ముందుగానే నిర్ణయించుకోగా — దెయ్యము ఏ విధముగా భూమి యొక్క ధూళిలో నన్ను బంధించి ఉంచగలదు? అది వాడివలన సాధ్యము కానే కాదు. అది నిజము.

181

ఇప్పుడు చూద్దాము, ఇచ్చట నా యొద్ద డెమోక్రాట్ టైమ్ గలదు. ఇది పదకొండు గంటలకు ఇంకా ఇరువది నిమిషములు గలవని చూపించుచున్నది. అది పది గంటలకు ఇంకా ఇరువది నిమిషములు గలవని చూపించుచున్నది. ఉడ్ సహోదరుడా, అది సరిగ్గానే ఉన్నదా? సరే, మంచిది. పది గంటలకు ఇంకా ఇరువది నిమిషములు గలవు. అందరూ సంతోషముగా యున్నారా?

ఓ, నాకు పయనించుచు వెళ్ళిపోవాలనిపించుచున్నది,

నాకు పయనించుచు వెళ్ళిపోవాలనిపించుచున్నది;

నా పరలోకపు గృహము ప్రకాశముగాను, సుందరముగాను యున్నది,

మరియు నాకు పయనించుచు వెళ్ళిపోవాలనిపించుచున్నది.

ఓ, నాకు పయనించుచు వెళ్ళిపోవాలనిపించుచున్నది,

నాకు పయనించుచుచు వెళ్ళిపోవాలనిపించుచున్నది;

నా పరలోకపు గ్రహము ప్రకాశముగాను మరియు సుందరముగాను యున్నది,

మరియు నాకు పయనించుచు వెళ్ళిపోవాలనిపించుచున్నది.

182

ఇటువంటి పాత పాటలు మీకు ఇష్టమా? ఒక పాత పాటను మనము పాడుట మనకు అలవాటు. అది “కృప మరియు కరుణ నన్ను కనుగొనినది. అచ్చట వేకువ చుక్క ప్రకాశించినది. ”అదేమి పాటది గెర్జీ సహోదరి? మనము చూద్దాము. సహోదరుడా నెవిల్ ఈ పాట అంటే నాకిష్టం“కృప మరియు కరుణ నన్ను కనుగొనెను, అచ్చట ప్రకాశమానమైన వేకువ చుక్క దానియొక్క కిరణములతో నన్ను చుట్టుముట్టి చూపించినది. ఓహ్, అవును. అది ”సిలువలో అనే పాట. ఆ పాటకు సహోదరి శృతిని కలుపును. అది “సిలువ చెంతకు?” అనే పాట, ఇచ్చటకు రండి సహోదరుడా నెవిల్, ఈ పాటంటే నాకెంతో ఇష్టము. ఆత్మ ప్రేరేపణతో వ్రాయబడిన ఈ ప్రాచీన పాటలంటే ఎంతమందికి ఇష్టము? పైకి క్రిందికి ఎగురుతూ గెంతులు వేస్తూ అరుస్తూ పాడే బూగీ-ఊగీ పాటలను మీకు కావలిస్తే మీరే ఉంచుకోండి. నేను దీన్ని పాడెదను, ఇచ్చట కృపా మరియు కరుణ నన్ను కనుగొనెను. అది అంతే. సరే, మంచిది. దాన్నిప్పుడు పాడెదము.

యేసు సిలువకు సన్నిహితముగా నన్ను ఉంచుము,

అక్కడ ప్రశస్తమైన ఊట గలదు,

అందరికీ ఉచితము, స్వస్థతమిచ్చు ఒక ప్రవాహమది,

కల్వరి కొండ నుండి ప్రవహించుచున్నది.

సిలువలో, సిలువలో,

నా మహిమ శాశ్వతముగా యుండును;

ఎత్తబడిన నా ఆత్మ అవతలి నది యొడ్డున

విశ్రాంతిని కనుగొని పొందుకొను వరుకు.

[సహోదరుడు బ్రెన్హాం గారు “సిలువకు సన్నిహితముగా” అనే పాటను మౌనముగా పాడుచున్నారు.] ఓ, అది ఎంత అందముగా యున్నది. రక్షకుడే లేకుండినయెడల ఎలాగయుండి యుండును? దానిని ఆలోచించి చూడండి. ఈ వాక్యమే లేకుండినయెడల, ఏలాగు యుండును? ఆయన నిన్ను పిలువకున్నయెడల ఏలాగు యుండును? ఆయన నిన్ను ముందుగా ఎరుగకున్నయెడల ఏలాగు యుండును? మరియు నేటి రాత్రికి అందరివలె నీవు కూడా ఈ లోకస్తులవలె లోకంలో యుండినయెడల, ఏలాగు యుండును? అయినను మీరు ప్రేమించెదరా? ఓ, నా దేవా, ఉదయకాలము తొమ్మిది-ముప్పది నిమిషములు గల ఆరాధనను మీరు మరచిపోవద్దు.

సిలువలో, సిలువలో

నా మహిమ శాశ్వతముగా యుండును;

పరవసించిన నా ఆత్మ అవతలి నది ఒడ్డున

విశ్రాంతిని కనుగొని పొందుకొను వరకు.

.

183

ఇప్పుడు, “ఊట యొక్క స్థలము” అనే పాటకు శృతి కలపండి. ఈ ప్రాచీన మంచి పాట, “ఆ ఊట యొద్ద స్థలమొకటి కలదు.” ఎంతమందికి ఇది తెలుసు? అవును. “ఊట యొద్ద ఒక స్థలము గలదు.” దీనిని మీరు పాడేటప్పుడు, చాలా నిశ్శబ్దముగా మీ ప్రక్కన ఉండు ఒక్కొక్క సహోదరుడితో కరచాలము చేయండి, మెతడిస్టులందరికీ అచ్చట స్థలము గలదని మీరెరుగుదురా, బాప్టిస్టులకు స్థలము, పెంతెకోస్తులకు అచ్చట ఒక స్థలము గలదు. ఆ ఊట యొద్ద మన అందరికి అచ్చట స్థలము గలదు. ఆ పాత పాట ఎంతమందికి తెలుసు? ఓ, నిశ్చయముగా మీకు తెలిసియుండును. ఇప్పుడు పాతకాలపువారగు మీలో కొందరికి, ఇప్పుడిది ఒక మంచి పాత కెంటకీ పాటగా యున్నది.

స్థలము, స్థలము (కరచాలము చేద్దాము), అవును,

అచ్చట స్థలము కలదు,

ఊట యొద్ద నీ కొరకు స్థలము గలదు;

స్థలము, స్థలము, అవును, అచ్చట స్థలము గలదు,

ఊట యొద్ద నీ కొరకు అచ్చట స్థలము గలదు.

ఓ, స్థలము, స్థలము, అచ్చట విస్తారమైన స్థలము గలదు,

ఊట యొద్ధ నీ కొరకు అచ్చట స్థలము గలదు;

ఓ, స్థలము, స్థలము, అవును, అచ్చట స్థలము కలదు,

ఊటయొుద్ధ నీ కొరకు అచ్చట స్థలము గలదు.

184

ఇప్పుడు, ఒక చిన్న ఆశ్చర్యమైనదొకటి మీ కొరకు నా యొద్ద గలదు. వచ్చే వారములో కూడికలప్పుడు, మిక్కిలి నూతనమైన ఉపన్యాసములు, పుస్తకములు మరియు సమస్తము మందిరము యొక్క అటు ప్రక్కన అమ్మబడుటకు పెట్టబడియుండును. టేపులు, ఇంకా మొదలగునవి మరియు సమస్తము మంచి సాహిత్యములు. ఆ గదులలోని ఒకదానియందు ఒక బల్లపై ఉంచబడును. సాహిత్య పుస్తకములు, నూతనముగా ప్రసంగించబడిన ప్రసంగ పుస్తకములు, మంచి రచనతో మొట్టమొదటిగా రచించిన పుస్తకములు నూతనముగా ముద్రించబడినవియు, క్రొత్త ముద్రణ యొక్క కూర్పులును వచ్చే బుధవారము రాత్రికి కట్టడము యొక్క చివరి భాగమున ఉంచబడును. మేము ప్రభువులో ఒక మంచి తరుణమును ఎదురు చూచుచున్నాము. ప్రార్థనా పూర్వకముగా రండి, వ్యాధిగ్రస్తులను మరియు దుఃఖములలో ఉన్నవారిని మీతో తీసుకొని రండి. వారిచ్చటకు వచ్చునట్లుగా వారికి ఉత్తరమును వ్రాయండి. దేవుడు బలముగా కదలాడును. ఇప్పుడు ఆయన దానిని చేయుననే దానిని ఎరిగి, మేమిచ్చట యున్నాము.

185

ఇప్పుడు, నేనెరిగిన ప్రతీ ఒక్కరు ఏదో ఒక చిన్న కార్యమును మీరు పొందుకోవలెనని నేను ఆశించుచున్నాను. క్రమమునకు విరుద్ధమైనదేదైనా యుండినయెడల దానిని మనము సరిదిద్దుకోవలెనని ఎన్నో దినములకు ముందే నేను మీ యొద్ద చెప్పినదానిని మీరు జ్ఞాపకముంచుకోండి. ముందున్న దానికంటే ఒక భిన్నమైన ఆత్మ ఇచ్చట యున్నదనే దానిని మీరెరిగియుందురని నాకు తెలుసు. చూచారా? అది నిజము. ఇప్పుడు, ముందున్న ఆత్మను వదిలి వెళ్ళిపోవుటకు అవకాశమివ్వకండి. అది విడిచి వెళ్ళిపోవుటకు మీరు దానికి అవకాశమియ్యవద్దని యేసు క్రీస్తుని నా ముందు౦చుకొని నేను మీకు దానిని ఆజ్ఞాపించుచున్నాను. దానితోనే నిలిచియుండండి, చూచారా, మనస్పర్థలన్నింటిని వెంటనే సరిదిద్దుకొని ముందడగు వేసుకొంటూ ముందుకు కొనసాగిపోండి. మీరు సహోదరులుగా యున్నారు. నీ సహోదరుడో లేక సహోదరియో తప్పిదము చేయుట లేదు. దెయ్యపు ఆత్మ ఆచ్చట లోపలికి ప్రవేశించుచున్నది. చూడండి, వాడు లోపలికి... ఆ సహోదరుడు లేక సహోదరి కొరకు విచారించు. అది మీ మధ్య జొరబడిన దెయ్యము అనే దానిని నీవు తెలుసుకోవలయును. నీకు ద్వేషముతో నిండిన మనసేదైనా యుండినయెడల, దానిని ఇప్పుడే, వెంటనే నీలో నుండి తొలగించుకో. నీకు అర్థమయ్యిందా, ఎందుకనగా అది నీకు ఒక కొరుకు పుండుగా వుండి నిన్ను నాశనము చేయును. అవును, అది ఆ విధముగా చెయ్యును, అందుకే దానినుండి దూరముగా యుండండి. దానిని మీరు జ్ఞాపకములో ఉంచుకోండి:

స్థలము, స్థలము విస్తారమైన స్థలము అచ్చట గలదు,

స్థలము కలదు, మొతడిస్తులకు,

బాప్టిస్టులకు, ప్రెస్బిటేరియన్లకు స్థలము కలదు;

అందరి కొరకు అచ్చట స్థలము గలదు,

స్థలము, స్థలము, అవును, అక్కడ స్థలము గలదు,

ఊట యొద్ద నీ కొరకు అచ్చట స్థలము గలదు.

186

ఎంతమందికి మనము ఆరాధనకు ముగించుటకు పాడే పాట “యేసుని నామమును నీతో తీసుకొని వెళ్ళు, వేదన మరియు దుఃఖము గల బిడ్డా అది నీకు సంతోషమును మరియు సమాధానమును ఇచ్చును, నీవు వెళ్ళు ప్రతీచోటకు దానిని తీసుకొని వెళ్ళు?” ఎంతమందికి జ్ఞాపకమున్నది? సహోదరుడు జెఫ్రీస్, సహోదరి జెఫ్రీస్ మరియు అచ్చట యున్నవారి బాలురులు, వీరందరూ మాతో ఉండుటకు మీకు సాధ్యపడినయెడల మరెంతో అనందముగా యుండును. “యేసు యొక్క నామమునకు తలవంచి, ఆయన పాదముల యొద్ద సాష్టాంగముగా పడి.” ఓ, ఎంత బాగుంది. “మన యాత్ర సమాప్తమవునప్పుడు, ఆయనను పరలోకములో రాజులకు రాజుగా పట్టాభిషేకము చేయుదుము. యేసుని నామమును నీతో తీసుకొని వెళ్ళు, నేడు దానిని నీ రక్షణ కేడెముగా తీసుకొని వెళ్ళుము. ఓ, శోధనలు నిన్ను చుట్టిముట్టినప్పుడు, ఆ పరిశుద్ధ నామమును నీ ప్రార్థనలో ఉచ్చరించుము. ఓ, దానిని ప్రేమించుము, యేసు యొక్క నామము అద్భుతమైనది. ఇప్పుడు, అట్లే లేచి నిలబడెదము, మనము పాడుచున్నప్పుడే. అది మంచిది.

యేసుని నామును నీతో కూడా తీసుకొని వెళ్ళుము,

వేదన మరియు దుఃఖములతో నిండిన బిడ్డా;

అది నీకు సంతోషమును మరియు సమాధానమును ఇచ్చును,

ప్రశస్తమైన నామము, ఓ అది ఎంత మధురమైనది!

భూలోకము యొక్క నిరీక్షణ మరియు పరలోకపు సంతోషము,

ప్రశస్తమైన నామము, (ఓ ప్రశస్తమైన నామము)

ఓ ఎంత మధురమైనది!

భూలోకము యొక్క నిరక్షణ మరియు పరలోకపు సంతోషము.

187

మనము ఇప్పుడు తలలు వంచియుందుము, ఇప్పుడు ఇది కొద్ది భిన్నముగా, మీ ఒక చేతిని పైకెత్తి చెప్పండి:

యేసు నామమునకు తలవంచి,

ఆయన యొక్క పాదముల యొద్ద సాష్టాంగముగా వడి,

మన యాయాత్ర నమాప్తమగునప్పుడు,

పరలోకమునందు ఆయనను రాజలకు రాజుగా

కిరీటము దరింపచేతుము,

ప్రశస్తమైన నామము (ప్రశస్తమైన నామము)

ఓ, అదెంత మధురమైనది! (ఓ అదెంత మధురమైనది!)

భూలోకము యొక్క నిరీక్షణ మరియు పరలోకపు సంతోషము

ప్రశస్త నామము (అవును, ప్రశస్త్ర నామము!)

ఓ, అదెంత మధురమైనది (ఓ, అదెంత మధురమైనది!)

భూలోకము యొక్క నిరక్షణ మరియు పరలోకపు సంతోషము.

మన తలలు ఆ విధముగానే వంచియుండగా, దానిని మనము పాడెదము. [సహోదరుడు బ్రెన్హాంగారు, “యేసుని నామమును నీతో కూడా తీసుకొని వెళ్ళుము,” అనే పాటను మెల్లగా పాడుచున్నారు.]

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...