పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము

పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము

VGR COUNT -215 నిన్న రాత్రి మిమల్ని అర్ధరాత్రివరకు నేను ఉంచితిని, అయినా ఈ రాత్రి ఇంత మంది వచ్చుటను చూచి నిశ్చయముగా నాకు చాలా సంతోషముగానున్నది. మీరందరూ ఈ రోజు వచ్చెదరని నేను తలంచలేదు, కాని మీరందరూ ఆదివారపు పాఠశాలకు వచ్చినట్లుగా వచ్చియున్నారు, కావున అది చాలా యుక్తమైనది.

2

ఇప్పుడు, మన సమయమును ఈ సంఘ సిద్ధాంతములను గూర్చి ధ్యానించుట కొరకు వినియోగించవలెనని మనము ప్రయత్నించుచున్నాము. మరియు కేవలము దానినే నేను బోధించెదను. ఇప్పుడు నేను ఎరుగని వారు కొంతమంది మన మధ్య ఉండవచ్చు. నేను ఇచ్చట అంతగా ఉండనందువలన ఈ సంఘము యొక్క సభ్యులు ఎవరో తెలుసుకోలేకపోవుచున్నాను. కాని ఈ కూటము కేవలము సంఘ సభ్యుల కొరకు మాత్రమేనని నేను ప్రకటించియున్నాను, ఏలయనగా, వెలుపల ఉండు ప్రజలు అనేక రకముల భిన్నమైన సిద్దాంతములను మరియు మొదలగునవి కలిగియున్నారు. సరి, అటువంటి వాటిని వారు నమ్ముచున్నారు. వాటిని నమ్మునట్లుగా వారు బోధించబడిరి. కాబట్టి వేరొక సంఘము నుండి మీరిచ్చటకు వచ్చినప్పుడు, బహుశా మేము ఉపదేశించు కార్యములు మీరు వినిన ఉపదేశములకు వ్యతిరేకముగా ఉన్నప్పుడు, అప్పుడు మీరు ఇలాగు భావించెదరు, “నేను దానితో సమ్మతించనని,” చెప్పెదరు. చూచారా! సరే, మేము దీనిని చేయుటకు కారణమేమనగా, మేము కఠినముగానో లేక ఎవరినైనా గాయపరచుట మా ఉద్దేశ్యము కాదు. ఇప్పుడు మీకేది ఇష్టమో దానిని మీరు విశ్వసించ వచ్చును. కాని మనము... నేను దీనిని బోధించుచున్నప్పుడు చాలా దృఢముగా బోధించవలెను. కారణమేమనగా, దానిని మేము మీ హృదయములోకి లోతుగా దిగగొట్టవలెను. ఈ గుడారము ఆ సిద్దాంతముల కొరకే నిలబడుచున్నది, చూచారా, మేము కేవలము దానికొరకే ఇచ్చట నిలబడియున్నాము. కావున, మీ మనస్సులను నొప్పించుటకు మేము ఇష్టపడుటలేదు మరియు మీరు విశ్వసించే దానియందున్న మీ విశ్వాసమును మేము గాయపరచుటకు ప్రయత్నించుచున్నామని లేక అటువంటిదేదో చేస్తున్నామని మీరు తలంచవద్దు. అటువంటి ఏ ఉద్దేశ్యము మాకు లేదు.

మరియు ఇది ఒక... మనము దేనిని ఆధారము చేసుకొని నిలబడియున్నాము, ఏ సిద్దాంతముల కొరకు మనము నిలబడియున్నాము, ఎందుచేత మనము దానిని బోధించుచున్నామనే విషయములను గూర్చి ప్రతి రెండు లేక మూడు సంవత్సరములకు ఒకసారి ఇచ్చట మేము ధ్యానించెదము, ఎందుకు మనము దీనిని నమ్ముచున్నాము. కావున, ఇక్కడ ఎవరైననూ ఈ సంఘ సభ్యులు కాని కొత్తవారు ఉండినయెడల, ఈ ఉదయమున మరియు ఈ రాత్రికి వీటినిగూర్చి చర్చించుటకు మిమ్ములను నిశ్చయముగా సంతోషముగా మేము ఆహ్వనించుచున్నాము.

3

అంతేకాకుండా, ఈ గుడారమున ఎప్పటిలాగా బుధవారమున జరుగు ఆరాధన ఉండును, ఇచ్చట జరిగించు ఆరాధనను గురించి నేను చెప్పుచున్నాను. మరియు కొద్దిపాటి విశ్రాంతి కొరకు దూర ప్రాంతమునకు నేను వెళ్ళితిని. ఎందుకనగా వాస్తవముగా నేనెంతో అలసిపోయాను. కావున కొద్ది విశ్రాంతి కొరకు కొంత కాలము దూరముగా ఉంటిని. అచ్చట నుండి తిరిగి వచ్చిన తర్వాత, చక్కని అనుభూతిని మరియు అద్భుతమైన అనుభవమును నేను కలిగియున్నాను. కావున నేను మరల వెళ్ళబోవుచున్నాను, ఈ కూటము ముగిసిన వెంటనే, జనవరి నెలవరకు నేను మీ యొద్దకు తిరిగి రాలేను. ఏ కూటముల కొరకు నేను వెళ్ళుట లేదు, నా విశ్రాంతిని కొనసాగించుటకే నేను వెళ్ళుచున్నాను.

కాని, మేము తిరిగి లోపలికి వచ్చినప్పుడు, సంఘములో అక్కడక్కడ కొంత నిరుత్సాహముతో ఉండుటను కనుగొనియున్నాము. మరియు కొంత మంది సభ్యులు నులివెచ్చని స్థితిలోనికి దిగజారిపోయిరి, దూరముగా తొలగిపోయిరి, ఒకరికి ఒకరు వ్యతిరేకముగా చిన్న చిన్న మనస్పర్ధలను కలిగి ఉండుటను, ఇంకా అటువంటి వాటిని కలిగియున్నట్టుగా చూచితిమి. ఎచ్చట ఆ విధముగా యున్నదో కనుగొని, ప్రతీ ఒక్కొక్కరి దగ్గరకు నేను వెళ్ళితిని, ఇప్పుడు మేము ఆ కార్యములన్నింటిని చక్కదిద్దువరకు వాటిని పరిశీలించుచూ సరిచేసితిమి. ఇప్పుడు అవన్నియు చక్కదిద్దుకున్నాయి. చూచారా?

4

మరి అవన్నీ అట్లే ఉండును, అవేమియు తప్పు కాదు; ఏ సభ్యులలోనూ ఏ పొరపాటు లేదు. పురుషులు మరియు స్త్రీలు ప్రతి ఒక్కరు చాలా చక్కని వారు. వారి మధ్య సమస్యలను తీసుకొని వచ్చువాడు అపవాది అని వారు గ్రహించినయెడల మంచిది. ఖచ్చితముగా అది నిజము. అవి ప్రజల వలన ఏర్పడిన సమస్యలు కావు. ఆ సహోదరుడు దానిని గ్రహించునట్లు మీరు చేయగలిగినయెడల, అప్పుడతడు తన సహోదరుని పట్ల తనకు గల శత్రుత్వమును తనలో ఉంచుకొనడు. దానినిగూర్చి అతడు బాధపడును. “అవును, అది... నేను నా సహోదరుని పట్ల నేను పొరపాటు చేస్తాను,” అని అతడు బాధపడును. చూచారా, అతను తప్పు చేసి ఉండవచ్చును, అయినాగాని, అలాగు చేసినది ఆ సహోదరుడు కాదు, ఆ విధముగా చేయునట్లు చేసినది అపవాదియే.

నీవు “సరే, ఈ వ్యక్తి ఫలానా-ఫలానా కార్యము చేసెను,” అని నీవు చెప్పవచ్చును. నీ సహోదరుడు దానిని చేయలేదు, నీ సహోదరి దానిని చేయలేదు. వారిలోనికి చొరబడి దానిని చేసినది అపవాదే. కావున నీ సహోదరుని, నీ సహోదరిని తప్పు పట్టవద్దు; దానికి కారణమైన ఆ అపవాదినే తప్పుపట్టండి.

5

కాబట్టి, మరి ఈ సంఘము యొక్క సిద్దాంతములు మీకు చాలా వింతగా అనిపించ వచ్చును. వాటన్నింటితో మీరు అసలు ఏకీభవించక పోవచ్చును. దానినే మేము విశ్వసించుచున్నాము, ఎందుకనగా, అవి పరిశుద్ధ గ్రంథములో ఉన్నవి గనుక మేము వాటిని విశ్వసించుచున్నాము; మరియు వాటిని ఉన్న విధముగానే మేము బోధించుచున్నాము.

ఇప్పుడు, గత రాత్రి మన అంశము: “మనమెందుకు ఒక సంఘ శాఖ కాదు?” ఇప్పుడు, మనము కూడుకొనియున్న ఒక సమూహముగా ఉన్నాము, ఏలయనగా మనము ఒక సంఘముగా ఉన్నాము, కాని మనము స్థాపించబడిన ఒక సంఘశాఖ కాదు. అందునుబట్టి మనమెందుకు స్థాపించబడిన ఒక సంఘశాఖ కాదో కారణములను తెలిపితిని.

ఇప్పుడు, ఈ ఉదయమున మనము దీనిని చర్చించుటకు మొదలు పెట్టుచుండగా, దానికి ముందుగా మనము ప్రార్థించెదము.

6

ప్రియమైన దేవా, మీ యొక్క స్వంత మహిమ కొరకు, మాలో మరియు మా ద్వారా, మీ పని చేయుటకు, మమ్ములను మీకు ఒక సాధనముగా అప్పగించుకొనుటకు మా మనస్సులను, మా ఆత్మలను శుద్దీకరించమని అడుగుటకు మీ యొక్క పరిశుద్ద సన్నిధికి మేము మరలా వచ్చి యున్నాము. మరియు తండ్రీ, మాట్లాడునది నేను కాకుండునట్లు నా తలంపులను, నా మనస్సును నా మాటలను శుద్ధీకరించుము; ఆయన సంఘము తెలుసుకొనునట్లుగా, సర్వశక్తి గల దేవుని యొక్క సత్యములను బయటకు తెచ్చునట్లుగా పరిశుద్ధాత్మ ఈ మట్టి పాత్రను, పెదవులను అభిషేకించును గాక.

మరియు ఈ ఉదయమున కూడుకొనియున్న సమూహము నుండి దేవుడు మహిమ పొందునట్లు, ప్రభువా, దురాత్మ కలిగించు ప్రతీ శోధనల నుండి, సూదురుల మధ్య శత్రుత్వమును మరియు అసూయలను తీసుకొనువచ్చు సమస్త దురాత్మలను ప్రజల నుండి దూరముగా పారద్రోలి, ఆ దురాత్మను కదిలించి తరిమివేయుము, అట్లు మీరు చేసినప్పుడు, అప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడుచుండగా వారు వినగలుగుదురని మేము మిమ్ములను అడుగుచున్నాము. మీరు మాతో మాట్లాడుచున్నప్పుడు, ఆ మాటలను త్రోసివేయుటకు మా హృదయములో ఏ ఒక్క కార్యమైనను లేకుండునట్లుగా, ఓ దేవా, పడమరకు, తూర్పుకు మధ్య ఎంత దూరము ఉన్నదో - అంత దూరముగా దానిని మా యొద్ద నుండి పారద్రోలుము. అప్పుడు మేము దేవుని చిత్తమును మాత్రమే ఎరిగి, దానిని మాత్రమే చేయుదుము గాక! కావున దేనికొరకు మేము నిలబడవలనో మరియు దానికొరకే అది ఎందుకు నిలబడవలెనో, అంతే కాకుండా, సంఘము మరియు దాని సిద్ధాంతముపై జరుగనైయున్న ఈ చర్చను మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్ములను నడిపించుము. దీనిని మేము యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

7

ఇప్పుడు, గత సాయంత్రము మనమెందుకు స్థాపించబడిన ఒక సంఘశాఖ కాదని అనే అంశము మీద కొన్ని ఆలోచనలను మీతో చెప్పాను. మనము... వాటినే నేపద్యముగా తీసుకొని కొద్దిసేపు చూద్దాము. ఒక సంఘశాఖగా స్థాపించుకొనిన సంస్థ తనకంటూ ఒక హద్దును కలిగియుండునని మనము కనుగొనియున్నాము.

ఇప్పుడు మనము చర్చించుటకు చాలా విషయములు గలవు. గత రాత్రి సంఘములో స్త్రీలు బోధించుటకు మనమెందుకు అంగీకరించుట లేదో మనము చర్చించితిమి. ఈ ఉదయమున సాధ్యమైతే, “పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము,” అను అంశమును మనము ధ్యానించాలని ఆశించుచున్నాము. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును మనమెందుకు నమ్ముచున్నాము మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఏలాగున వచ్చును, అది ఏమి చేయును, దానిని పొందుకొనిన తరువాత అది ఏ విధముగా మనము ప్రవర్తించునట్లుగా చేయును.

మరియు తరువాత ఈ రాత్రికి దేవుడు అనుమతించినయెడల, నేను, “ఈ కాలమున యుండు సర్పము యొక్క సంతానము,” అను అంశము పై మాట్లాడగోరుచున్నాను. సర్పము యొక్క సంతానమును గూర్చి జనులు నమ్ముట లేదు, కాని అది లేఖనానుసారమై యున్నది. చూచారా?

8

ఇప్పుడు, ఎవరు నమ్మినా, నమ్మకపోయినా... ఇప్పుడు, నేను నిజముగా దీనిని మీలోకి ధృఢముగా చొచ్చుకొనిపోవునట్లుగా చేయగలిగిన యెడల, ఇప్పుడు దీనిని నేను వేరే ఉద్దేశ్యముతో చేయుటలేదు - మీరు ప్రియమైన ప్రజలుగా యున్నారు. దానిని మీ లోపలికి వెళ్ళునట్లుగా చెయ్యాలని నేను ప్రయత్నించుచున్నాను, మరియు మేము దానిని కొంచెము కఠినముగా చేయబోవుచున్నాము. కావున, మీరు “జానీ, వెళ్లి కూర్చొనుము,” అని మృధువుగా చెప్పినట్లయితే, అతను వినిపించుకోకపోవచ్చును. కాని, “జానీ, కూర్చో!” అని మీరు కొంచెము గట్టిగా చెప్పినట్లయితే, దానికి ఎక్కువ శ్రద్ద చూపును. కావున ఈ ఉదయుమున, ఇప్పుడు, మేము, “జానీ కూర్చో!” అని గట్టిగా అరిచి చెప్పబోవుచున్నాము. సరే, నేను దీనిని గూర్చి మాట్లాడాలని కోరుచున్నాను, అందువలన మేము ఏ ఉద్దేశ్యముతో దీనిని గూర్చి మాట్లాడుతున్నామో మీరు అర్థము చేసుకోగలరు. చూచారా?

9

మీ ఆలోచనలకు మరియు మీ నమ్మకములకు వ్యతిరేకముగా ఏదైనా మేము చెప్పినయెడల, మేము ఏ ఒక్కదానిని కూడా... ఈ సంఘమునకు ఏ సంఘశాఖ బేధము లేదని గుర్తుంచుకోండి. బాప్టిస్టు, మెతడిస్టు, ప్రిస్బెటేరియన్, లూథరను, కాతలిక్కు, ప్రొటెస్టంట్, యూదులు, అతడెవరైననూ, అతడు ఒక సహోదరునిగా ఉన్నంత కాలము, అతడు ఏ సంఘశాఖకు చెందినవాడైనాగాని, అతడు ఏ సంఘశాఖకు చెందినవాడైనా - అతడు మా యొక్క సహోదరుడని మేము నమ్ముదుము. దేవుడు అతడికి వ్యతిరేకి కాదు, కాని సంఘశాఖలు ఉండుటకు కారణము...

సంఘశాఖలు ఇచ్చట ఏలాగు ఏర్పడినవో చూద్దాము. ఎవరికైనా ఒకరికి ఏదైనా కొద్దిపాటి బయలుపాటును దేవుడు బయలుపరచినప్పుడు, ఆ విశ్వాసము చుట్టూ కొందరు వచ్చి దానిని విశ్వసించుచూ, పిదప దానిని ఆధారముగా చేసుకొని ఒక సంఘ సంస్థగా ఏర్పరచుకొనెదరు, ఎప్పుడైతే అది ఒక సంఘ సంస్థగా మారిపోవునో ఇక దేవుడు దానియందు సంచరించలేడు.

10

కృప యొక్క రెండవ క్రియను తప్ప వేరేదేనినైనా మెతడిస్టు ఎన్నడైనా అంగీకరించినదా? కృప తప్ప వేరే ఏదియు లేదు అనేదానిని అది ఆధారముగా చేసుకొని వారు ఒక సంఘ శాఖగా మారిపోయిరి. ఆ విధముగానే బాప్టిస్టులు వారు విశ్వసించుచున్న దానిని తప్ప వేరేదేనినైనా - లేక లూథరన్లు కూడా, “నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించునను” దానిని ఆధారముగా చేసుకొనివారు ఒక సంఘశాఖగా మారిపోయిరి. దానిని దాటుకొని బాప్టిస్టులు దానికన్నా ముందుకు సాగిపోగలరా? “నీవు విశ్వసించినప్పుడే, పరిశుద్ధాత్మను పొందుకున్నావు మరియు నీటిలో ముంచబడితివి కదా, ఇక అది చాలును” అని వారు చెప్పెదరు. ఎందుకు? దానినే ఆధారముగా చేసుకొని వారు ఒక సంఘశాఖగా మారిపోయిరి. గమనిస్తున్నారా? “భాషలలో మాట్లాడినప్పుడే నీవు పరిశుద్ధాత్మను పొందుకొన్నావు. అంతటితో అది సమాప్తమైనదని,” పెంతుకోస్తు ఏలాగు విశ్వసించగలుగుచున్నది? ఎందుకనగా, దానిని ఆధారముగా చేసుకొనే వారు ఒక సంఘశాఖగా మారిపోయిరి. సహోదరుడా, వారి కార్యములు, వారిలో ప్రతిఒక్కరు, వారే సరియని వారు భావించవచ్చును, కాని దేవుడు ఏదోక చిన్న సంఘశాఖకు బద్దుడు కాడు. సమస్తము మీద ఆ కార్యమును విశాలముగా ఆయన వ్యాపింపజేయును. ఇక అది అంతే, సమస్య తీరిపోయినది. మనము దానిని నమ్ముచున్నాము.

11

మరి మేము సంఘశాఖగా మారకపోవుటకు అదియే కారణము. అనేక రకములైన సంఘశాఖలలో ఉన్నవారు దీనిలో విలీనమై ఒక చిన్న సంఘముగా ఉండునట్లు దేవుడు మనకు అవకాశము కల్పించెను, కాని మనము దీనిని ఒక సంఘశాఖగా చేయము. ఏలయనగా, యేసుక్రీస్తు యొక్క పరిపాలనయందు మరియు ఆయన నాయకత్వము క్రింద ఇంతవరుకు మేమేవిధముగా ఉన్నామో, ఆ విధముగానే మేము ఉండగోరుచున్నాము. అది నిజము. ఆయన మనకు ఏదైతే బయలుపరచుచున్నాడో, అది సత్యమని మనము చూచితిమి. అది ఆయన వాక్యముతో ఏకీభవించుచూ మరియు పరిశుద్ధ గ్రంథము యొక్క మొదటి నుండి చివరిదాకా అది సత్యమని మరియు ఆత్మయు దానిని సమ్మతించుచున్నది. మనము దానిని అంగీకరించకుండనట్లు బంధించుటకు ఏ సంఘశాఖపు అడ్డుగోడలు మనకు లేవు. అదేమి చెప్పుచున్నదో దానితో అలాగే కొనసాగుచూ మరియు దానితోనే ముందుకు సాగిపోదాము.

12

కావున సంఘశాఖ ఆ విధముగా చెప్పినప్పుడు, క్రీస్తు సంఘమని తమను గూర్చి చెప్పుకుంటూ ఒక సంఘశాఖ క్రిందయున్న చర్చ్-ఆఫ్-క్రెస్ట్ వారు, “అద్బుతము జరుగు దీనములు గతించిపోయినవి, అన్ని కార్యములు ఆ విధముగానే ఉన్నవి,” అని చెప్పుచున్నారు. అలాగైతే లేఖనములో ఆ విధముగా ఉన్నట్లు ఎచ్చటైనా మీరు కనుగొని చూపించగలరా? కాని లేఖనములో ఉన్నదానిని చేయుటకు వారియొద్ద ఏమియు లేదు. వారు సంఘశాఖగా మార్చబడి, దాని ఆధీనములో వారు ఉన్నారు. చూశారా? కావున లేఖనములో ఉన్నదానిని చేయుటకు మీకు అసాధ్యము. కాని ఆత్మ మనల్ని ఎలా నడిపించునో కేవలము అలాగే ముందుకు సాగిపోవుటకు మనము స్వేచ్చగా ఉండగోరుచున్నాము. ఆ ఆత్మ ద్వారా లోతైన లోతులలోకి మరియు ఉన్నతమైన, ఇంకా అత్యున్నతమైన స్థితికి మరియు కేవలము అలాగే ముందుకు సాగుచూ, ఇంకా ముందుకు సాగుచూ, మరియు ముందుకు సాగుచూ మరియు ఇంకా, ఇంకా, ఇంకా మరియు ఎక్కడికి నడిపించునో అచ్చటకు ముందుకు సాగుపోతూ ఉండండి.

కాని ఇప్పుడు, మేము ఎటువంటి మూఢభక్తిని అంగీకరించము. సరిగ్గా అక్కడే మేము ఒక గీత గీయుదుము. ఎవరికైనా ప్రభువు ఏదైనా ఒక ప్రత్యక్షతను బయలుపరచినయెడల, మరి అది ఈ పరిశుద్ధ గ్రంథముతో ఏకీభవించనియెడల, ఆదికాండము నుండి ప్రకటన వరకుయున్న ఈ పరిశుద్ధ గ్రంథములో లేనిదైతే, దానిని ఒక సిద్ధాంతముగా మార్చినప్పుడు దానిని మేము అంగీకరించము. చూచారా? ఈ పరిశుద్ధ గ్రంథములో నుండి అది రావలసియున్నది. మరియు ఎవరో ఒకరి బయలుపాటు ద్వారా వచ్చినదిగా అది ఉండకూడదు. ఆ బయలుపాటు వాక్యముతో సరిగ్గా సరిపోవలయును, మంచిది.

13

ఒక వ్యక్తి కొద్ది కాలం క్రితం నావద్దకు వచ్చి, “బ్రెన్హాం సహోదరుడా, నేను ఇప్పుడే అమెరికాలోని సమైఖ్య రాష్ట్రముల నుండి వచ్చాను, ఇప్పుడు నేను ఒక క్రైస్తవ సహోదరితో పరిచయము కలిగియున్నాను. మరియు ఈ క్రైస్తవ సహోదరి ఎంతో చక్కని స్త్రీ, కాని ఇంతకుముందే ఆమెకు ముగ్గురు లేక నలుగురు భర్తలుగలరని నాకు తెలిసినది. ఆ విధముగా ఆమె ఒకరి తర్వాత ఒకరికి విడాకులను ఇచ్చివేసి వివాహమాడినట్లుగా నాకు పరిచయమైన ఈ మూడు నెలలో ఆమెను గురించి నేను తెలుసుకున్నాను. మరియు ఆమెకు పరిశుద్ధాత్మ గలదు, ఎడతెగక ఆమె అన్యభాషలలో మాట్లాడేది, ఆ విధముగా ఎడతెగక ఆమె అన్యభాషలలో మాట్లాడుచూ, ప్రవచనములు మరియు ప్రత్యక్షతలను చెప్పును. ఆమె నిజముగా ఆత్మతో నింపబడిన స్త్రీగా ఉన్నది,” అని చెప్పెను. అంతేకాకుండా ఆమె ఒక స్త్రీ బోధకురాలుగా ఉన్నది.

“ఎందుకని ఈ విధముగా ఫలానా - ఫలానా కార్యములు సంభవించినవి? ఏలాగు ఈ స్త్రీ ఈ విధమైన కార్యములను చేయగలిగినది?” అని అతడు వెళ్ళి ప్రభువుని అడిగెను అని చెప్పెను. అప్పుడతడు, “నా భార్యను గూర్చి నాకు ఒక కల వచ్చినది. ఆ కలలో నా భార్య వేరొక వ్యక్తితో అక్రమ సంభంధమును కలిగియుండెను, అదొక అక్రమ కార్యము.” ఆమె, “నేను చేసినదానిని క్షమించుదువా?” అని నా పాదముల మీద పడి అడిగినది, అని చెప్పెను.

“నిశ్చయముగా నేను క్షమించెదను” అని అతడు చెప్పెను.

“ఎందుకని నీవు నన్నింత సుళువుగా క్షమించగలిగితివని?” ఆమె అడుగగా, “ఎందుకనగా, నేను నిన్ను ప్రేమించుచున్నానని,” అని అతడు చెప్పెను. అప్పుడు కలలో ప్రభువు నాతో మాట్లాడి ఇలా చెప్పెను, నీకున్న ప్రేమను బట్టి నీవు ఆమెను క్షమించితివో, అలాగే ఆమె పట్ల నాకున్న ప్రేమను బట్టి నేను ఆ స్త్రీని క్షమించితినని అని ఆయన చెప్పెను,“ అని అతడు అన్నాడు.

నేను, “అయ్యా, నీ కల చాలా బాగున్నది, అది చాలా మధురముగా ఉన్నది, కాని అటువంటి కలను దేవుడెన్నడూ నీకు ఇవ్వడు. అది ఆయన వాక్యముతో ఏకీభవించదు,” అని చెప్పాను. అది నిజము. అది ఆయన వాక్యముతో సరిపోవుట లేదు. అది చూచుటకు ఎంతో వాస్తవముగా కనిపించిననూ, అది వాక్యము నుండి రావలసియున్నది.

14

పాత నిబంధనలో వర్తమానమును తెలుసుకొనుటకు వారికి మూడు విధానములను ఉండెను. మొదటిది ధర్మశాస్త్రము ద్వారా, తరువాత ఒక ప్రవక్త ద్వారా; తరువాత కలలు కనువాని ద్వారా. ఇప్పుడు ధర్మశాస్త్రము చుట్టలలో వ్రాయబడి మందసములో పెట్టబడెను, మరియు అవి ఆజ్ఞలుగాను మరియు ధర్మశాస్త్ర నియమములుగా ఉండెను. పిదప ఒక ప్రవక్త, ప్రవచించును లేక కలలను కనును. దేవుడు, ప్రవక్తలతోను మరియు కలలుతోను ఈ రెండిటి ద్వారా వ్యవహరించును. “మీలో ఒక ఆత్మ సంబంధియైనవాడు గాని లేక ఒక ప్రవక్త గాని మీలో ఎవరైననూ ఉండినయెడల, ప్రభువైన నేను అతనికి నన్ను కలల ద్వారా తెలియజేసికొందును. మరియు దర్శనములలో నన్నునేను కనపరచుకొందును. అతను చెప్పునది జరిగినయెడల, అప్పుడు అతని మాట వినుడి, ఏలయగా నేను అతనితో ఉన్నాను. అతడు చెప్పినది జరుగనియెడల అప్పుడు అతని మాట మీరు వినవద్దు.”

ఇప్పుడు, ఎవరైనా ఒక కలను చెప్పినా, లేక ఒక ప్రవచనమును చెప్పినా, అది సత్యమో - కాదో తెలుసుకొనగోరిన యెడల, ఆ ప్రవక్తను లేక కలను కనినవానిని ఊరీము తుమ్మీము దగ్గరకు తీసుకొని వెళ్ళెదరు.

15

ఇప్పుడు, మీలో కొందరికి ఇది కఠినమైనదిగా ఉండవచ్చునని నాకు తెలియును, కాని అది వాస్తవముగా ఏమైయున్నదనగా... ఇశ్రాయేలు యొక్క పన్నెండు గోత్రములకు ప్రధానయాజకుడిగా యున్న అహరోనుకు ఇరుప్రక్కల ఆరేసి రాళ్ళు గల ఒక దట్టిని తన రొమ్మున కలిగి వుండెను. మరియు అందులో పొదగబడిన ఒక్కొక్క రాయి ఒక్కొక్క గోత్రము యొక్క జన్మ రత్నం(రాయి)ను సూచించుచున్నది. యూదా గోత్రము, గాదు గోత్రము, రూబేను గోత్రము, బెన్యామీను గోత్రము... ఇలా ప్రతి గోత్రమునకు ఒక జన్మ రత్నము ఉండును. మరియు ఆ జన్మ రత్నము... అది మందిరమునందు ఉండే స్తంభమునకు వ్రేలాడే పలకలో ఒకదానికి తగిలించబడి యుండును లేదా త్రిభుజాకార స్తంభమునకు దీనిని వ్రేలాడదీసెదరు. మరియు ప్రభువు ఫలానా కార్యమును చేయబోవుచున్నాడని ప్రవచించిన ఈ ప్రవక్తను వారు దీని ఎదుటికి తీసుకొని రావలయును, అప్పుడు అతడు తన ప్రవచనమును లేక తన కలను చెప్పవలెను. ఇప్పుడు, ఆ కల లేక ఆ ప్రవచనము దేవునియొద్ద నుండి వచ్చినయెడల, ఆ పతాకములోని రత్నములన్ని వెలుగుచూ ప్రకాశించును. ఆ రంగులు ఒకదానితో ఒకటి మిళితమై ఒక వర్షధనస్సును పోలిన రంగుతో అది ప్రకాశించును, ఒక అతీతమగు జవాబు. చూచారా? అది నిజము. ప్రతీ రాయి ఒక్కొక్క రాయితో ఏకీభవించుచు, ప్రతీ రాయి దానియొక్క రంగును ఇంకొక దానితో మిళితము చేస్తూ, అవన్నీ ఏకముగా దేవుని యొక్క జవాబుతో ప్రతిబింభిస్తాయి. “ఆ వ్యక్తి ప్రవక్త; అతను చెప్పినది సత్యము లేక ఆ కల నా ద్వారా పంపబడినది.” ఆ పతాకము నుండి ప్రకాశించే వెలుగు ద్వారా తెలుపబడును. కాని ఆ పతాకములో ఏ సూచన లేనియెడల, దానిలో ఏ కదలక లేనియెడల, అది ఎంత నిజమైనదిగా కనిపించినా నేను దానిని లెక్క చేయను, అది నిశ్చయముగా తప్పు. దానిని వారు అంగీకరించరు.

16

నేడు ఇదెంతో మంచి ఉదాహరణగా ఉన్నది. ఇప్పుడు, పాత నిబంధన యొక్క ఊరీము తుమ్మీము ఆనాడు ఆ విధముగా క్రియచేసి గతించిపోయినది, ఎందుకనగా అది యాజకత్వ రూపమున మారిపోయినది. ఇప్పటి ఊరీము తుమ్మీము దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథమైయున్నది. అవునయ్యా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో “ప్రతి మనుష్యుని మాట అబద్ధమవును, కాని నా మాట సత్యము,” అని చెప్పబడెను. ఒక వ్యక్తి ఏదైనను చెప్పి అదెంతో వాస్తవముగా అనిపించిననూ లేదా అతని కల ఎంతో నిజమైనదిగా ఉన్ననూ లేక అతని ప్రత్యక్షత సరిగ్గానే ఉన్నట్లు కనిపించినను పరిశుద్ధ గ్రంథములోని ప్రతీ పుస్తకము, పరిశుద్ధ గ్రంథములోని సమస్తము అది సత్యమని దానిమీద ప్రతిబింబించకపోయినయెడల, దానిని విడిచి పెట్టుము, దానిని అలాగే వదిలి వేయుము.

ఇప్పుడు, నీవు ఒక చిన్న లేఖనభాగమును తీసుకొని, “యేసు ఫలానా - ఫలానా కార్యము చేసెను, కావున మనము కూడా అలాగే చేయవలయును,” అని చెప్పవచ్చును. నీవు చెప్పాలని కోరునదేదైననూ వాక్యము తీసుకుని చెప్ప వచ్చును. కాని నీవు చెప్పే కార్యము వాక్యానుసారమైన మార్గము గుండా వచ్చి, అది దేవుని వాక్యముతో పరిపూర్ణ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మముగా ఏకీభవించవలెను. అప్పుడది సత్యమగును, దానిని దేవుడే చెప్పిన మాటగా యుండును. ఇది ఆయన యొక్క ఊరీము తుమ్మీముగా ఉన్నది.

17

కావున దేవుడెన్నడూ, ఏ కాలములోనూ ఒక సంస్థగా స్థాపించబడిన సంఘశాఖలను ఏర్పరచలేదు. ఎప్పుడైనా ఆయన ఆలాగు చేసిఉంటే నాకు చెప్పండి. శిష్యులలో ఆఖరి అపోస్తులుడు మరణించేంతవరకు అనగా 360 సంవత్సరముల వరకు ఎన్నడూ ఏ ఒక్క సంఘశాఖ కూడా ఏర్పడలేదు. ఆ తర్వాతే రోమన్ కాతలిక్ సంఘము ఒక శాఖగా ఏర్పడెను. ఆ రోమన్ కాతలిక్ సంఘమునే పరిశుద్ధ గ్రంథమున దేవుడు ప్రకటన 17లో “వేశ్య” గా పిలిచెను. అదొక అపవిత్రమైన స్త్రీగా ఉన్నది. మరియు దాని నుండే ఆమె కుమార్తెలు వచ్చిరి. ఆ కుమార్తెలు కూడా వేశ్యలై, ఆమెవలె అపవిత్రులుగానే యుండిరి. లేఖనము ఆ విధముగానే చెప్పుచున్నది.

మరియు రోమన్ కాతలిక్ సంఘమే సమస్తమైన ప్రొటెస్టంట్ తత్వమునకు (Protestantism) జన్మనిచ్చెను, వారు కూడా సరిగ్గా ఒక సంఘశాఖగా మారిపోయి మరియు ఆమె చేసిన అదే క్రియలను వారూ చేసిరి. ఆమె అపవిత్రురాలిగా వుండుటకు కారణమేమనగా, ఆమె చేతిలో సిద్ధాంతములనే పాత్రను పట్టుకొని యున్నది, మోహోద్రేకముతో కూడిన వ్యభిచారపు మద్యమును ఆమె పట్టుకొనియున్నది. ఆమె దానిని భూరాజులకు ఇచ్చెను, “విస్తార జలముల,” మీద ఆమె కూర్చొనియుండి, ఆ భూరాజులను ఏలెను. పరిశుద్ద గ్రంథమున దానిని మనము ఆ విధముగానే కనుగొంటిమి. ఆమె సంఘమనే ఏడు కొండల మీద కూర్చొనియుండుటను మనము చూచితిమి. మనము వాటిని కనుగొన్నాము. అది మూడు కిరీటములతో అలంకరించబడి యుండుటను మనము చూచితిమి. పాతాళము, పరలోకము మరియు పాపవిమోచనా స్థలముపై అధికారమునుగలదిగా దానిని మనము కనుగొంటిమి. నిజము. మరియు ఒక మనిషి దానిని పరిపాలించుచుండెను; అతనే అంత్యక్రీస్తు, దేవుని ఆలయములో కూర్చొని, తన్నుతాను దేవునిగా కనపరచుకొంటూ, భూమిమీద పాపములను క్షమించుచుండెను. వీటన్నింటిని గూర్చి మనమెరుగుదుము, వాటన్నింటిని అన్వేషించుచూ, వాటిని వెళ్ళి చూచి మరియు అవన్నీ నిజమేయని మనము కనుగొన్నాము.

18

“జ్ఞానముగలవాడు గ్రహించును గాక” అని చెప్పబడినది. ఆత్మ వ్యక్తపరుచుచూ దానిని మాట్లాడుటను మనము కనుగొన్నాము. “జ్ఞానముగలవానితో, బుద్దిగలవానితో, వివిధ ఆత్మలతో, వరములుగలవానితో” ఆత్మ ఎడతెగకుండా చెప్పుచున్నది. అంత్యదినములలో దేవుడు సంఘములో సంచరించుటను మీరు చూడగలుగుచున్నారా? సంపూర్ణమైన ఆత్మ వరములతోను, దేవుని యొక్క నిజమైన వరములతోను నింపబడిన ఒక సంఘము లేపబడవలసి యున్నది. “జ్ఞానముగలవాడు దానిని గ్రహించును గాక. మృగము యొక్క సంఖ్యను అతడు లెక్కింపనిమ్ము, అదొక మానవుని సంఖ్యయే. అతని సంఖ్య ఆరు-వందల-అరవైయారు.” ఖచ్చితముగా అదెచ్చట ఉన్నదో దానిని మనము కనుగొన్నాము. మనము కనుగొన్న ఆ విషయము ఇంతకంటే సంపూర్ణముగా ఉండలేదు. మీరే దానిని వ్రాసుకోండి, వికార్వీస్ (VICARIUS) అనగా ఇంకొకరికి బదులుగా అనగా క్రీస్తుకు బదులుగా, “ఫిల్లీ” (FILII) దేవునికి బదులుగా, వికార్విస్-ఫిల్లీ-డీ (VICARIUS FILII DEI) అనగా దేవుని కుమారునికి బదులుగా మరియు మీరు రోమన్ సంఖ్యలలో వాటిని వ్రాసి లెక్కపెట్టి చూచినయెడల మీకు ఆరువందల అరవై ఆరు వచ్చుచున్నదా లేదా చూడండి. మరియు దేనినైననూ అన్వేషించునప్పుడు మీకు 'ఇది అదేమో' లేక 'అది ఇదేమో' అనే సందేహము కలుగవచ్చును. కాని లేఖనము అదేచ్చట ఉండునని సెలవిచ్చుచున్నదో, సరిగ్గా అదే స్థలములో మీరు దానిని అన్వేషించి చూడాలి, సరిగ్గా అది అక్కడే ఉన్నది. మనమిచ్చట ఉంటూ ప్రొటెస్టంటులమగు మనము సరిగ్గా అచ్చటినుండి బయటకు వచ్చుచున్నాము.

19

కాతలిక్ సంఘమున ఏ సిద్దాంతమును అభ్యసించితిమో దానినే తీసుకొని, దానినే చూపించుటకు నేడు మనము దేనినైతే ప్రయత్నించుచున్నామో, ప్రొటెస్టంటు సంఘమువారమగు మనము సరిగ్గా దానినే దత్తతకు తీసుకొనియున్నాము. కాతలిక్ సంఘము ఇచ్చుచున్న అదే ఆత్మీయ వ్యభిచారపు కళ్ళ అద్దములను మనము ప్రజలకు ఇచ్చుచున్నాము - ఎందుకనగా అవి లేఖనానుసారమైనవి కావు. అవి మానవ-కల్పితములు. అది తప్పుడు ప్రవచనము. అదొక అబద్ధము. అది అపవాదికి సంబంధించినది.

మనము ఏ కాలమందు జీవించుచున్నామో చూపించుటకై మరియు మనము దానిని కనుగొనుటకై దానియొక్క పుట్టుపూర్వోత్రములను చూచితిమి. ఒక జారత్వము ద్వారా జన్మించిన బిడ్డ, అక్రమ సంబంధము ద్వారా జన్మించిన బిడ్డ, పదునాలుగు తరముల వరకూ ప్రభువు యొక్క సమాజ మందిరములోనికి రాలేనివానిని గూర్చి గత రాత్రి మనము ధ్యానించితిమి. అనగా అది నాలుగు వందల సంవత్సరములగును, ఒక తరమునకు నలుబది సంవత్సరములు.

20

అదెంత ఘోరమైన పాపముగా ఉన్నది! ఎంత భయంకరమైనది, అప్పుడే కాదు, కాని అది ఇప్పుడు కూడా ఎంతో భయంకరమైయున్నది. అది ధర్మశాస్త్రము క్రింద ఉన్నప్పుడే అంత భయంకరమైనదైతే... మరియు క్రీస్తు ధర్మశాస్త్రమును హెచ్చించుటకే వచ్చెను. ఆయన “నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా; నేను మీతో చెప్పుచున్నదేమనగా, నిర్నిమిత్తముగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, నరహత్య చేసినట్లేయగును.” దానిని హెచ్చించెను. “వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా, అదొక క్రియయై యున్నది; కాని నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారము చేసినవాడగును.” దానిని వేలసార్లు హెచ్చించెను. సరే, ఆనాడు చేసిన ఆ పాపకార్యము మాసిపోవుటకు పదునాలుగు తరములు పట్టినయెడల, అదే పాప కార్యమును దేవుని యొక్క భూతద్దముతో చూసినప్పుడు అదెంతటి ఘోర పాపమగును?

21

మరియు ఈ రోజున ప్రజలు, ఉన్నత పాఠశాలలో చదువుచున్న యవ్వనస్తులు బీరు పార్టీలలో త్రాగుతూ, విచ్చలవిడిగా జీవించుచూ... అలాగే యవ్వన బాలికలు వ్యభిచారములో జీవించుచూ, చిన్న బాలురు ఆవిధమైన చెడు కార్యములకు బానిసలైరి. దీనితరువాత ఎటువంటి తరము రాబోవుచున్నది? ఈ యవ్వన బాలికలు ఆ విధముగా ప్రవర్తించుటకు కారణమేమిటి? వారి తల్లి జుట్టును కత్తిరించుకొని, కురచ వస్త్రములను ధరించుకునే నవీణ పోకడను అవలంభించే స్త్రీ, వారి అమ్మమ్మ లోక ప్రకారమైన అలంకరణను అలంకరించుకొని వేదికలమీద నాట్య బృందములో నాట్యమాడు స్త్రీ. మరియు ఆయన, తల్లిదండ్రుల దోషమును పిల్లల మీదను మరియు పిల్లల పిల్లల మీదను, మూడు మరియు నాలుగు తరము వరకు విచారించుదునని చెప్పెను. అంతకన్నా నీవు చేయు కార్యములకు వేరేమి ఎదురు చూడగలవు?

22

సమస్త విషయములు బయటకు ప్రాకునప్పుడు, మరియు నీతిమంతుల సంతానము ఒక ప్రక్కగా ఒదిగి ఉండుటకు ప్రారంభించినప్పుడు, పలుచగా మరియు ఇంకా పలుచగా యగుచూ దుష్టులు కేవలం వర్దిళ్ళుచూ, చాలా మతాభిమానులై, దుష్టత్వముతో ఇంకా దుష్టులై మరింత దుష్టులుగా మరియు మరింత దుర్మార్గులై, ఇక రక్షించుటకు ఏమియు ఉండనందువలన ఆయన గతమున జల ప్రళయము ద్వారా నాశనము చేసిన రీతిగానే పూర్తిగా నాశనము చేయుట తప్ప మరేదియు లేదు. మానవుని యొక్క ప్రతీ ఆలోచన ఎల్లప్పుడూ పాపపూరితముగానే ఉన్నది. నేడు పురుషుడు ఆలోచనంతా, ఒక విస్కీ సీసా కోసము లేదా ఏదోక స్త్రీ కొరకు లేక వ్యర్ధమైన వాటిని వెంబడించెదరు, తన భార్యకు వారు నమ్మకముగా జీవించలేరు. బాలురు తాము స్నేహము చేసే బాలికలయెడల నమ్మకముగా జీవించలేరు. బాలికలు తాము స్నేహము చేసే బాలురకు యధార్ధముగా జీవించలేరు. ఎందుచేత, వారు అపవిత్ర ఆత్మలతో ఆవరింపబడి, అటువంటి స్థలమందు చిక్కుకొనిపోవునట్లు దయ్యము వారిని బంధించి తన ఆధీనములో ఉంచుకొనెను. సమస్తము పూర్తిగా పాపపు సమ్మేళనగా మారిపోయినది. నేడు మనము ఈ విధముగా ఉండుటకు అదే కారణమై యున్నది. దీనిని ఇక్కడ నుండి తుడిచివేయుటకే రష్యా విజృభించుచూ, ఖచ్చితముగా దేవుని చేతిలో ఒక ఆయుధముగా ఉండుటకు కారణమైనది. పరిశుద్ధ గ్రంథము ఆ విధముగానే చెప్పుచున్నది. నిశ్చయముగా, దేవుడు కమ్యూనిజమును ఉపయోగించుకొనును. ఆయన దానిని ఉపయోగించును. లేఖనము ప్రకారము కమ్యూనిజమే సమస్తమును నాశనము చేయును, మరియు మనము అటువంటి చెడ్డ దినములలోనే ఉన్నాము.

23

ఇప్పుడు, ఈ విషయములు బయటకు తెచ్చుచూ... చూచారా? వినండి జనులారా, మీరు దీనిని ఎదుర్కొనుచున్నారు. మరి మీరు దీనిని... ఇది మీ నిత్య గమ్యమును నిర్దేశించును, కావున దీనిని ఏదో తేలికగా తీసుకోవద్దు. ప్రభావితం చేసే ఊరీము తుమ్మీములో నుండి దీనిని చూడుము. ఏ విధముగా ఇది మాటలను ప్రభావితము చేయుచున్నదో.

ఇప్పుడు, మనము మాట్లాడుచున్న ఈ విషయములు పరిశుద్ధ గ్రంథముతో ఏకీభవించుచున్నవా లేవా అని చూడుము. లేఖనము ఏమి సెలవిచ్చుచున్నదో, దానితో అవి సరితూగుచున్నవో లేదో చూడుము.

24

ప్రతీ సంఘము, మీరు చెప్పుకుంటున్నట్లుగా, “నేనొక క్రైస్తవుడను,” అని చెప్పినప్పుడు, “మీరు ఏ సంఘశాఖకు చెందినవారు?” అని అడిగెదరు. అతడే సంఘశాఖకు చెందియున్నా గాని, దానివలన ప్రయోజనమేమున్నది? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముతో సంఘశాఖకు ఏ సంబంధములేదని మనము గ్రహించియున్నాము. ప్రొటెస్టంటు సంఘ శాఖలన్నీయూ వేశ్యలు. మీ పరిశుద్ధ గ్రంథము ఆ విధముగానే చెప్పుచున్నది. మెథడిస్టని చెప్పినప్పుడు మీరు మెథడిస్టు వేశ్యలు. బాప్టిస్టని చెప్పినట్లైతే, మీరు బాప్టిస్టు వేశ్యలు. మీరు పెంతెకోస్తువారని చెప్పినయెడల, మీరు పెంతెకోస్తు వేశ్యలు. పరిశుద్ధ గ్రంథము అలాగునే చెప్పుచున్నది. కాబట్టి ఆమెయే “వేశ్యలకు తల్లి.”

ఇప్పుడు, మీరు పొందినదంతా ఇదే అయిన యెడల... ఇప్పుడు, మీరు వీటితో సహవాసము చేయుచూ ఒక క్రైస్తవునిగా ఉన్నప్పటికిని, నీవు ఒక క్రైస్తవుడవే గాని నీవొక మెతడిస్టువి కాదు, నీవొక బాప్టిస్టువి కాదు, నీవొక పెంతకోస్తువి కాదు — నీవొక క్రైస్తవుడివి.

ఎందుచేత...

25

మందిరమునకు వచ్చుటకు నేను సిద్దపడుచుండగా ఈ ఉదయమున రేడియోలో, లూయిస్-విల్ లో యున్న ఈ క్రైస్తవ రౌండ్ టేబుల్ సమావేశము పై జరుగుచున్న చర్చను నేను విన్నాను. తమ పిల్లలకు ఆధునిక మద్యమును ఏ విధముగా త్రాగవలెనో నేర్పించు కార్యక్రమమును సంఘములు దత్తత చేసుకొని అవలంభించనున్నారు. ఎటువంటి ఒక అవివేకుల గుంపును మనము ఉత్పత్తి చేయబోవుచున్నాము? ఎందుకు అది అలాగు జరుగుచున్నది? ఎందుకనగా, ఒక అనాగరికుల జాతికి చెందిన ఈజిప్ట్ రాజు కధలను గూర్చి తెలిసిన దానికంటే ఎక్కువగా వారి తల్లిదండ్రులకు దేవుని గూర్చి తెలియదు. ఆ సమస్త దుర్గంధము నుండి వైదొలుగుము. మిమ్మల్ని మీరు ఆధునికపరచుకొననవసరము లేదు. మీరు దానిని చేసినప్పుడు మీరు త్రాగుబోతులగుదురు. “ఓ మనము ఈమెను దీనిని చేయనిచ్చెదము, మరియు ఇతనిని దీనిని చేయనిచ్చెదము,” ఆ విధముగా కార్యములు మారిపోవును... మీరు ఏమి ఆశించగలరు? మనము మరొక తరమునకు వెళ్ళలేము. మనము దానిని చేయలేము. మనము అంత్యకాలములో ఉన్నాము.

26

కావున, ఏదోక బాతు కూతలను గూర్చి నేర్పే శిక్షణ తరగతులను మీరు నాకివ్వవలెనని నేను కోరుటలేదు. నేను ఒకవేళ... దానిగూర్చి తెలుసుకొనుటకు నాకు ఇష్టము లేదు.

అచ్చట కూర్చొనివున్న నా భార్యతో నేను చెప్పాను. “మీడా, నేను మత పిచ్చిగలవాడనా? నేను మతిపోగొట్టుకొన్నానా? లేక ఆ కార్యములకు విరోధముగా నాలో నుండి దేవుని ఆత్మయే ఎలుగెత్తి ఘోషించుచున్నాదా? నా సొంత ఆలోచనకు, నా స్వచిత్తమునకు వ్యతిరేకముగా ఈ కార్యములను చెప్పుటకు ఇచ్చట ఏదైనా ఉన్నదా? ఇలాగు జరుగుటకు మూడు విషయములు మాత్రమే కాగలవు. ఒకటి నేను నా మతిని పోగొట్టుకొని ఉండవలెను... అది అలాగైనట్లైతే, దానిని నేనెరుగను. నేను ఒక ఉద్రేకపూరితమైన, ఆందోళన చెందుచున్న వ్యక్తియగుదును. అది కేవలం నా స్వభావముగా ఉండును, కాని ఒక దైవజనుడిగా నాకున్న వరము దానిని చేయుచున్నది. కాని నేను... నా మతిని పోగొట్టుకొని ఉండాలి లేక ఒక మతావేశపరునిగా ఉండాలి, లేక అది దేవుని యొక్క ఆత్మగా ఉండాలి,” అని చెప్పాను. అది వాటిల్లో ఏదోకటిగా ఉండవలసినదిగా ఉన్నది.

27

కాని ఆ కార్యములను చూచి నేను తట్టుకోలేకపోవుచున్నాను, కాని నా లోపలవున్న ఏదోకటి బయటకు కేకలు పెట్టుచున్నది. పరిశుద్ధ గ్రంథము ప్రకారముగా అది అలాగునే జరుగవలెనని నేనెరుగుదును. అలాగైతే దానికి వ్యతిరేకముగా నేను ఎలుగెత్తి కేకలు వేయుటవలన ప్రయోజనమేమిటి? జరుగుచున్న కార్యములకు వ్యతిరేకముగా కేకలువేయు ఒక స్వరము ఆయనవద్ద లేనియెడల, దేవుని న్యాయ సింహాసనము ఎదుట నిలబెట్టి ఇప్పుడు ఇచ్చటయున్న ఈ తరము వారికి ఏ విధముగా న్యాయమును తీర్చి శిక్షించును? అరణ్యములో నుండి కేకలు వేయుటకు యోహాను లేనియెడల, పరిసయ్యులకు ఏలాగు తీర్పు జరుగును? వారు ఇది చేయకూడదు, దానిని చేయకూడదు, వారు దీనిని చేయకూడదు, మరియు నీవు దీనిని చేయకూడదు, మరియు నీవు ఆత్మతో నింపబడియుండవలెను,“ అని నేను చెప్పినప్పుడు, దాని వలన ప్రయోజనమేమిటి? ”మతిలేనివాడు! బుద్దిలేనివాడు! అతనికి ఏదో జరిగినది!“ అని చెప్పుకుంటూ ఒక ప్రక్కగా నడిచి వెళ్ళిపోయెదరు. మంచిది, దీనిని చేయుట వలన ప్రయోజనమేమిటి? ఎందుకనగా, దేవుని యొక్క స్వరముగా ఆయన ఒక స్వరమును కలిగియుండవలసియున్నది. ఏదోవిధముగా ఆయన దానిని చెప్పవలయును, దానినిబట్టే ఆయన న్యాయతీర్పు తీసుకొని రాగలడు. ”అదిగో అక్కడ చెప్పబడినది; కాని నీవు మూర్ఖుడవై దానిని త్రోసివేసితివి,“ అని చెప్పును. అది నిజము. మరియు నీవు కేకలువేయని యెడల ఆయన ఏమి చేయగలడు? కావున నీలో ఉన్నదేదోకటి కేకలు పెట్టుచున్నది; దానికి నీవేమియు చేయలేవు.

28

ఇప్పుడు, ఇప్పుడు, మనమిచ్చటికి మనకుగల తదుపరి అంశమును తీసుకుని వచ్చినప్పుడు దానినిగూర్చి ధ్యానించి తెలుసుకున్నాము, మనము స్థాపించబడిన ఒక సంస్థగా ఉండకపోవుటకు గల కారణమును మనము కనుగొన్నాము. మరియు మెతడిస్టులలో, బాప్టిస్టులలో, ప్రెస్బిటేరియన్లలో, పెంతెకోస్తులలో మొదలగువాటిలో మరలా నూతనముగా జన్మించిన క్రైస్తవులు, పరిశుద్ధులైన జనులుగలరని మనము నమ్ముచున్నాము. ఇక్కడ ఈ పరిధిలో కలిసిపోయివున్న ఆ విత్తనమే దేవుని సంఘమని, గతరాత్రి మనము దేనిగూర్చి ప్రసంగించితిమో, దానిద్వారా అది లోపలికి వచ్చునని మేము నమ్ముచున్నాము. ముందు నిర్ణయమును గూర్చి మనము తర్వాత చర్చించుకుందాము. ముందు నిర్ణయమనేది లేనిదానికి ముందే దేవుడు ఉండెను. ఆయన తన భవిష్యత జ్ఞానము లేదా దివ్యదృష్టి ద్వారా ముందుగా నిర్ణయించగలడు, ఏలయనగా ఆయన సమస్త విషయములనూ ఎరిగినవాడు.

మరియు ఈ రాత్రియందు రక్షింపబడి గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో వారి పేర్లు వ్రాయబడుటనేది ఎవరికీ జరుగదని మనము గతరాత్రి కనుగొన్నాము. నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథములో ఈ జగత్తుకు పునాది వేయబడక ముందే వ్రాయబడియుండవలెను, లేనియెడల నీ పేరు అందులో అసలు ఉండనే ఉండదు లేక ఇక ఎన్నటికీ వుండనేరదు. జగత్తుకు పునాది వేయబడక మునుపే దేవుడు గొర్రెపిల్లను వధించినప్పుడు, నీవు కూడా ఆ గొర్రెపిల్లతోనే వధింపబడియున్నావని మనము కనుగొన్నాము. నీవు దానిని నమ్ముచున్నావా? ఒక్క నిమిషములో దానిని మనము చూద్దాము.

29

మనము ఆరంభించుటకు ప్రకటన వైపునకు త్రిప్పుదాము, ప్రకటన 17 లేక... ప్రకటన 13:8, మరియు ఒక గొర్రెపిల్ల వధింపబడినప్పుడు ఏమి జరుగునని పరిశుద్ధ గ్రంథము చెప్పెనో ఇచ్చట చూద్దాము. క్రీ.శ. 33 లో అది వధింపబడినయెడల లేదా అదెచ్చట వధింపబడినదో... అదెప్పుడు వధింపబడినది. సరే. ఇప్పుడు, అమెరికా సంయుక్త రాష్ట్రములు (యు.ఎస్.ఎ) గూర్చి ఇచ్చట ప్రవచించబడినది. ఇప్పుడు దీనిని మనము చదువుదాము.

భూనివాసులందరును, అనగా, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు [ఎవరికి? మృగమునకు] నమస్కారము చేయుదురు.

గొర్రెపిల్ల ఎప్పుడు వధింపబడెను, రెండు వేల సంవత్సరముల క్రితమా? బహుశా వంద మిలియన్ల సంవత్సరముల క్రితము కావచ్చును. జగత్తుకు పునాది వేయబడకమునుపే యేసుక్రీస్తు మన పాపముల కొరకు చనిపోయెను. ఓ, ఇప్పుడు నేను పరవశము చెందుచున్నాను.

ప్రపంచము సృష్టించకమునుపే, వారిని రక్షించుటకు యేసుక్రీస్తు చనిపోయెను. “సరే, అటైతే దేవుడెందుకు ఇలాగు చేసెను, అనంతుడగు దేవుడు పాపమును ఎందుకు అనుమతించెను?” అని నీవు అడగవచ్చును. దేవునిలో కొన్ని ప్రత్యేకమైన గుణాలక్షణములు గలవని నీకు తెలుసా, సాతానుని దేవుడు అనుమతించక పోయినట్లయితే ... ఆయన లూసిఫరును సృష్టించినప్పుడు, ప్రపంచమును చెరుపువాడు వీడే అని ఆయనకు తెలియును. ఓ, ఏదోక మూలలో త్రోసివేయుటకు మన దేవుడు ఒక అల్పుడు కాదు కాని, ఆయన ఆదియు మరియు అంతములేని అనంతుడగు దేవుడు. ఆయనలో అనేక గుణాలక్షణములు గలవు. ఆయన ఒక రక్షకుడు. రక్షించబడుటకు ఎదియు లేనియెడల, తాను ఒక రక్షకుడని ఆయన ఏ విధముగా వ్యక్తపరచును? మనమేవిధముగా తెలుసుకోగలము...

30

నేనీ ప్రశ్నను అడుగుచున్నాను. ఎవరు ముందు? ఎవరు మొదటగా ఉన్నారు, రక్షకుడా లేక పాపియా? సరి, మొదట రక్షకుడు ఉన్నట్లైతే, అప్పుడు రక్షకుడు పాపికంటే ఉన్నతుడగును, పాపియగుట ఏ విధముగా జరిగినది? ఒక పాపి ఉండనియెడల ఆయనొక రక్షకుడనేది ఎన్నడునూ ఎరుగలేము. ఎవరు అత్యంత శక్తివంతులు, స్వస్థపరచువాడా లేక రోగియా? స్వస్థపరుచువాడు అనారోగ్యమును తీసుకొని దానిని నాశనము చేయును. ఏది మొదటగా ఉండెను, దేవుడా లేక క్యాన్సరా? దేవుడే మొదటిగా ఉండెను. అలాగైతే ఆయన రోగమును ఎలా అనుమతించెను? ఎందుకనగా, ఆయన దానిని నాశనము చేయగలిగినయెడల, ఆ వ్యాధి రాకముందే దానిని నివారించవచ్చు కదా. మరి ఆయన అనంతుడు కాబట్టి అది జరుగునని ఆయనకు ముందే తెలుసు. కాని ఆయన చేయలేని యెడల - ఆయన స్వస్థపరచనియెడల, రోగము లేనియెడల, ఆయన స్వస్థపరచువాడనేది ఎప్పటికినీ మనము ఎరుగలేము. అందుకే ఆయన స్వస్థపరచువాడని తెలియాలంటే, ఒక రోగమనునది ఉండవలసియున్నది. నేను చెప్పుచున్న భావమేమిటని మీరు అర్ధము చేసుకోగలుగుచున్నారా? ఇప్పుడు, ఆయన సమస్త విషయములను ఎరిగినవాడు.

31

ఇప్పుడు, ప్రకటన 13:8లో, వినండి. “గొర్రెపిల్ల వధింపబడియుండెను.” ఎప్పుడు? “జగత్తుకు పునాది వేయబడక ముందు.” దేవుడు తనయొక్క అనంత జ్ఞాణమందు కాలము యొక్క ప్రవాహముగుండా క్రిందికి చూచి, ఏదేది సంభవించునో, దానిని ఆయన సృజించి కాలమనే చట్రములో అది పడునట్లుగా చేసి, పిదప దానినేవిధముగా ఆయన కోల్పోవలసివచ్చునో వాస్తవముగా దానిని ఆయన ఎరిగియుండెను.

యవ్వనస్తుల్లారా మీరెందుకు... భార్యలు గల పురుషుల్లారా, ఒక స్త్రీని పరీక్షించి చూడండి, ఆమె ఎలాంటిదో మీరు కనుగొనగలరు. అది నిజము. ఒక పురుషుని పరీక్షించి చూడండి, అతడు త్రాగుబోతైనయెడల అతని నోటియొద్ద మద్యపు సీసా కదులును, అతను దానినుండి రక్షింపబడెనో లేదో అది మీకు తెలుపను. అతను ఒక దుష్టుడైనయెడల, ఇతర పురుషుల భార్యలను వెంటాడే అసహ్యమైన కుక్కలాంటివాడై, పరుల సంసారములను నాశనము చేస్తూ, స్త్రీల వస్త్రాలను ఒలిచివేయుచూ... ఆ స్త్రీలను తన వెనుక తిరుగునట్లుగా చేయును. అతనిలో ఏమున్నదనేది అది తెలుపును. అతడెవరనేది నిశ్చయముగా అది తెలుపును. అది నిజము.

32

దేవుడు తన శక్తిని కనబరచుటకు, తానేమైయున్నాడో తెలుపుటకు, తానొక రక్షకుడని వ్యక్తపరచుటకు ఒక పాపిని ఇచ్చట ఉండునట్లుగా ఆయన అనుమతించెను.

నేను చెప్పిన రీతిగానే, విమోచన అనే పదమునకు భావమేమిటో తెలియకుండా దేవదూతలు ఏ విధముగా విమోచనా గీతములను గూర్చి పాడగలరు? కాని, దానిని గూర్చి మనము పాడగలము. నశించిపోవుటనే మాటకు భావమేమిటో మనకు తెలియును, అలాగే కనుగొనబడుటనే మాటకు భావమును మీరెరుగుదురు. కాని మీరు నశించకపోయినయెడల కనుగొనబడుటంటే ఏమిటో మీకు తెలియదు. తప్పిపోయిన వారికే దాని అర్థమేమిటో తెలియును. రోగిగా యుండి పిదప మంచి ఆరోగ్యమును పొందినప్పుడు దానివలన కలిగే ఆనందమేమిటో ఆ రోగికే తెలియును. అసలు స్నేహితుడంటూ ఎవరూ లేనివాడై, భుజముపై చేయివేసి మాట్లాడుటకు ఎవరు లేనివాడై, తనను ఎవ్వరు పట్టించుకోని, తనను గూర్చి ఎవ్వరు తలంచని, వీధులలో ఒంటరిగా తిరిగే నికృష్టుడైన ఒక వ్యక్తికి, తన భుజముచుట్టూ చేయి వేసి ఆప్యాయముగా ఒకరు పలకరించినపుడు, ఆ వ్యక్తికే నిజ స్నేహితుడంటే ఏమిటో తెలియును. మీకు కూడా నిశ్చయముగా తెలియును.

ఒక రాత్రి అనేది లేనియెడల, ఈ సూర్యకాంతిని మనమేవిధముగా అభినంధించగలము? ఎన్నడూ మేఘములు కమ్ముకొని చీకటిగా లేనియెడల, ఒక చక్కటి ప్రకాశమైన దినమును మీరేవిధముగా అభినందించగలరు? ఒక శీతాకాలమనేది లేనియెడల, వేసవి యొక్క వెచ్చని సూర్యరశ్మిని మీరేవిధముగా అభినందించగలరు? అది అనుకూల - ప్రతికూల థర్మము (నియమము). నా ప్రసంగము నుండి నేను దారి తప్పిపోవుచున్నాను, ఆ విధముగా చేయుట నా ఉద్దేశ్యము కాదు. సరే మంచిది.

33

ప్రకటన 17:8, ఇక్కడ మనము, ఒక్క నిమిషము, ఇప్పుడు చూద్దాము, గొర్రెపిల్ల ఎప్పుడు వధింపబడెను? “జగత్తుకు పునాది వేయబడక మునుపే.” సరి. ప్రకటన 17:8.

నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు; అయితే అది అగాధ పాతాళములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్దముగా వున్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని (ఎప్పుడు) జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో...

జీవగ్రంథమందు నీ పేరు ఎప్పుడు వ్రాయబడినది? గతరాత్రి నేను చెప్పిన విధముగా, “మహిమలో ఒక నూతన పేరు వ్రాయబడెను, అది నాదే, అది నాదే,” అని ఒక వ్యక్తి ఆ పాటను వ్రాసెను. దాని భావము భాగానేవున్నాది గాని లేఖనానుసారముగా అది సరి కాదు. నీవు క్రీస్తు వద్దకు వచ్చిన రాత్రియందు నీపేరు వ్రాయబడలేదు. యేసు, “నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరునూ నాయొద్దకు వచ్చెదరు. మరియు నా తండ్రి ఆకర్షించనియెడల ఎవరునూ నాయొద్దకు రాలేరు. నాయొద్దకు వచ్చు ప్రతివానికి నిత్యజీవమును ఇచ్చెదను మరియు అంత్యదినమందు లేపుదును. వారెవరునూ నశింపరు. వారిని నాకిచ్చిన నా తండ్రి చేతులలో నుండి ఎవరనూ వారిని పెకలించలేరు,” అని అనెను. ఓ మై! పరిశుద్ద యోహాను 5:24, “నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు. వాడు తీర్పులోకి రాక మరణములో నుండి జీవములోకి దాటియున్నాడు.” అందువలననే ఈ సంఘము పరిశుద్ధుల యొక్క వీడని పట్టుదలయనే నిశ్చయతను విశ్వసించుచున్నది. బాప్టిస్టు యొక్క వ్యవస్థయందు కాదు, ప్రెస్బిటేరియన్ యొక్క వ్యవస్థయందు కాదు, కాని పరిశుద్ధ గ్రంథమందున్న లేఖనమందు.

34

“సరే, బ్రెన్హాం సహోదరుడా, ఒకసారి కృపలోకి వస్తే ఇక ఎల్లప్పుడూ కృపలోనే ఉండెదనని నేను ఊహించుచున్నాను,” అని మీరు అనవచ్చును. అదెంతో అవమానమును తెచ్చుటకు కారణమగును. కాని ఒక పురుషుడు లేదా ఒక స్త్రీ దేవుని ఆత్మలో జన్మించినప్పుడు, పాతవన్నీ గతించిపోయి సమస్తము నూతమగును. అంతేకాకుండా, అతను నిత్యుడగు దేవుని ద్వారా జన్మించినవాడై మరియు ఆశీర్వదింపబడియుండును. దేవుడేలాగు నశించలేడో, అలాగే వారు కూడా ఎన్నటికినీ నశించలేరు.

అనంతుడగు దేవుడు, నీవు నశించబోవుచున్నావని ఆయన ఎరిగి, నీకు నిత్యజీవమిచ్చుటకు క్రిందికి దిగి వచ్చెనని నీవు నాకు చెప్పనుద్దేశించుచున్నావా? అచ్చట నీవు నశించెదవని ఆయన ఎరిగి ఇక్కడ నిన్ను రక్షించెనా? ఎందుకొరకు నిన్ను ఆయన రక్షించెను? ఆయన తనకు తానే వ్యతిరేకముగా ఎందుకు పని చేయును. ఆయన నిన్ను ఒకసారి రక్షించినయెడల, నీవు నిత్య నిత్యమువరకూ రక్షింపబడియున్నావు. నిన్ను నిరుత్సాహపరచుటకు పాతాళములోని ఏ దురాత్మలకు సాధ్యమవ్వదు.

35

ఇప్పుడు, ఆది నుండి అంతమువరుకు చెప్పగల అనంతుడగు దేవుడు, నీవు వచ్చే సంవత్సరము దేవుని నుండి తొలగిపోతావని ఆయన ఎరిగియుండియు ఈ వారము ఇచ్చట నిన్ను రక్షించిన పిదప నీవు నశించపోగలవా? అట్లైతే ఎందుకొరకు అటువంటి పనిని ఆయన చేయుచున్నాడు? అది బుద్దిహీనమైన పనియగును, నేనైతే దానిని చేయను. రేపు నీవు నాకు శత్రువగుదువని నేనెరిగిన, ఈ రోజు నిన్ను నా స్నేహితునిగా చేసుకొనను, దానిని నేను చేయను, నేను నిన్ను అలాగే విడిచిపెట్టెదను. చూచారా? దేవుడు నిన్ను ఈ భూమిమీదికి రాకమునుపే ఎరిగియుండుటవలన ఈ రోజు ఆయన నిన్ను తన సేవకునిగా చేసుకొనెను. నీ శరీరములోనికి కాల్షియంను ఆయన ప్రవేశించునట్లు చేసినప్పుడు, నీలోకి... విశ్వ కాంతి (కాస్మిక్ లైట్)ని ఆయన సృష్టించినప్పుడు మరియు ఇంధన రసాయనములను మరియు సమస్తమును నీలో కలుగజేసి, వాటిని దేవుడు భూమిపై సృష్టించినప్పుడు, నీలోవున్న ప్రతి పీచు పదార్ధమును సృజించి మరియు నీవేమి చేయుదువో ఆయన ఎరిగియున్నాడు. అటువంటి అనంతుడగు దేవుడు ఏ విధముగా...

36

“రేపు నేను దేవునినుండి తొలగిపోయెదనేమో మరియు నశించదునేమో, అందువలన ఈ రోజు చాలా జాగ్రత్తగా అడుగులువేస్తూ వెళ్తాను,” అని మీరు తలంచినయెడల, అసలు ఆరంభములోనే మీరు రక్షింపబడలేదు. నీవేదో ఉద్రేకముతో కార్యములను చేయవచ్చు, నీవు రక్షింపబడితివని తలంచవచ్చు, నేను రక్షింపబడితివని ఏదో అనుభూతిని చెందవచ్చు, నీవు రక్షింపబడ్డావని ఒకవేళ నీవు విశ్వసించవచ్చు, నీవు సంఘములో చేరవచ్చు. నీవు మంచి బాప్టిస్టు, మెతడిస్టు, లేక పెంతెకోస్తుగా ఉండవచ్చు. దానికి దీనికి ఏ సంబంధము లేదు. అసలు నీ పేరు... నీవు రక్షింపబడినవాడివైతే, ఈ ప్రపంచము ఆరంభము కాకమునుపే నీవు రక్షింపబడితివి. దేవుడు తన మనస్సులో ఎవరిని చూచెనో, వారిని రక్షించుట కొరకే ఆయన యేసును పంపించెను. ఎవ్వరూ నశించిపోవుట ఆయనకు ఇష్టములేదు, అది ఆయన చిత్తము కాదు. కాని ఆయన దేవుడు కాబట్టి ఎవరు నశించుదురో, ఎవరు నశించరో ఆయన ఎరిగియున్నాడు. లేఖనము ఆ విధముగానే సెలవిచ్చుచున్నది. కావున నీవు తెలుసుకోవలసినది అదియే.

37

బాప్టిస్టు, మెతడిస్టు మరియు కాల్వనిస్టుల ప్రజలమని తలంచుచూ చెప్పుకుంటున్న వారితోనూ మనము అందుకే విభేదించుచున్నాము. కాని కాల్వనిజము సరియైనదే.

అంతేకాకుండా మనము ఆర్మేనియన్ వైపునకు తిరుగుదాము. వారేమి పొందుకున్నారు? క్రియలను. వారు హోలినెస్ గుంపువారు. క్రియలు, “దేవునికి స్తోత్రము. నేను నా వెంట్రుకలను పొడుగుగా పెంచుకొనెదను. స్త్రీలు, ఓ దేవునికి స్తోత్రము, నేను పొట్టి వస్త్రాలను ధరించను, పురుషులు కూడా ఆ విధముగానే అనేక క్రియలను గూర్చి చెప్పెదరు... వాటికి దేవుని రాజ్యముతో ఏ సంబంధము లేదు. లేదండి. నీవు నీ వెంట్రుకలను పొడవుగా పెరగనివ్వ వచ్చు, నీ యొద్దున్న మంచి వస్త్రములను నీవు ధరించువచ్చును లేక నీవు దీనిని, దానిని లేక ఏదైనా చేయవచ్చును. ఆ క్రియలవలన నీకే ప్రయోజనము లేదు. నీవు నీ చక్కటి వస్త్రాధారణవలన రక్షింపబడలేదు. అట్లైతే దేవుడు అటువంటి వాటినే నియమించి యుండును. అలాగైతే యేసు కూడా మరణించవలసి యుండెడిది కాదు. దేవుడు నిన్ను కృప చేత రక్షించెను గనుక నీవు రక్షింపబడితివి. మరియు నీవు ఈ సత్క్రియలను కేవలము మెప్పు పొందుటకే చేయుదువు... ఒక సామాన్యమైన సంస్కారము ఆ విధముగా చేయాలని నీకు చెప్పును. నీవు మెప్పు పొందుటకే ఆ క్రియలను చేయుదువు.

దేవుని కొరకు నేనేమి చేయుదునో, అవే క్రియలగును ఇచ్చట నేను నూట-యాభై సంవత్సరముల వరకు జీవించుచూ ఇక ఎన్నటికి నేను ఇంకొక ప్రసంగమును ప్రసంగించలేకపోయినా గాని అప్పటికీ నేను రక్షించబడినవానిగానే యుందును. అది నిశ్చయము. నేనొక బోధకుడనైనందువలన రక్షింపబడలేదు గాని, దేవుని కృపవలనే నేను రక్షించబడితిని. నేను దానిని పొందుకొనుటకై పాత్రుడనగుటకు ఏ ఒక్క మంచి కార్యమును నేను చేయలేదు.

38

ఒక అర్థ మిలియన్ల డాలర్ల కొరకు నా పై న్యాయ స్థానమందు దావాను వేసారు. మరియు వారు, “ఎందుకు నీవు వెళ్ళావు... నీ ఖర్చుల నిమిత్తము చెల్లించుటకు నీవు వాడిన డబ్బు వారిది. నీ ఖర్చుల నిమిత్తము దానిని చెల్లించక మునుపు ఆ డబ్బు నీకు చెందినది. నీ సంఘము ద్వారా ఆ డబ్బును నీవు చెల్లించితివి, నీవు దానిని నీ సంఘము ద్వారా చెల్లించినాగాని మొదటగా ఆ డబ్బు నీకు చెందినదేయగును” అని చెప్పిరి.

నేను, “కాని నేను దానిని ఏ చెడు ఉద్దేశ్యముతో చేయలేదు,” అన్నాను.

“అవును, నీవు అలాగే చేసితివి, ఎందుకనగా ఒక ప్రేమ కానుక స్వీకరించబడునని నీవే వారితో చెప్పితివి,” అని అన్నారు.

“ఆలాగు నేనెప్పుడు కానుకను స్వీకరించితినో, ఎవరైనా ఒక్కరు నాకు చెప్పవలెనని,” నేను అడిగాను.

“సరే, ఉత్తరాల ద్వారా నీవు దానిని అభ్యర్థించితివా?” అని అతడు అడిగెను.

నేను, “నా కార్యాలయమునకు వచ్చి వెదికి చూడండి; నేను ఎవరిని ఒక్క పైసా కూడా అడగలేదు,” అని అన్నాను.

పరిశుద్ధ గ్రంథములో, “ఏలాగు మాట్లాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింపకుడి, మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకనుగ్రహించబడును,” అని చెప్పబడినదని మీకు తెలుసా? మరియు నేను ఆ కేంద్ర ప్రభుత్వ న్యాయవాదుల ఎదుట కూర్చొని వుండగా వారిలో ఒక్కొక్కరు అన్ని వైపుల నుండి నా పై ప్రశ్నలను వేస్తూ నన్ను ఇబ్బందిపరచిరి; అసలు దానిగురించి నాకు అ, ఆ, ఇ... లు కూడా తెలియనివాడిని, మరి వారేమో ఎలాగైనా నీతో నిజమును చెప్పించుటకు శత ప్రయత్నాలను చేస్తూ ప్రశ్నలపై ప్రశ్నలను వేస్తూ నిన్ను ఇరుకించుటలో ఎంతో తర్ఫీదును పొందిన అటువంటి నేర్పు కలిగిన మనుష్యులతో ఎవరైనా వారి తెలివితేటలతో సరితూగగలరా? అతడెంత మేధావి అయినాగాని, నా ప్రభువుతో అతడెన్నటికినీ సరి తూగలేడు. ఈ లేఖనమున, “నీవు అధిపతుల యొద్దకును మరియు అధికారుల యొద్దకును మీరు తీసుకొనిపోవునప్పుడు, ఏమి మాటలాడుదుమాని చింతింపకుడి,” అని చెప్పబడినది.

అక్కడ నేను తీసుకొనిన డబ్బును దేనికొరకు దానిని వెచ్చించితినో నాకు తెలియును... దానిని వారు విభేధించలేరు. చట్టబద్దముగానే అది వాడబడినది. కాని వారు, “ఆ ధనము మొదట నీకు చెందినది, దాని తరువాతే నీవు దానిని బ్రెన్హాం గుడారమునకు ఇచ్చితివి,” అని అన్నారు.

“కాని నేను బ్రెన్హాం గుడారమునకు కోశాధికారిగా ఉన్నాను,” అని నేను చెప్పాను. అంతేకాకుండా ఇది... “మంచిది, దానిగూర్చి మాకనవసరము. అలాగైతే ఆ ధర్మకర్తలు దీనిని, దానిని మరియు మిగిలిన కార్యములను ఎందుకు చెయ్యలేదు?” అని అతడు అడిగెను.

“అట్లైతే నీవు నా నిజాయితిని సందేహించుచున్నావా?” అని నేను అడిగితిని.

“నీవు చాలా యదార్థవంతుడవని మేము తలంచుచున్నాము, శ్రీ. బ్రెన్హాం మీకు ఒక విషయమును నేను చూపించగోరుచున్నానని,” ఆ న్యాయవాది చెప్పెను. ఇప్పుడు కేవలం నేను దీనిని దేవుని మహిమ కొరకే చెప్పుచున్నాను. ముఖ్యముగా యౌవ్వనస్తుల కొరకు చెప్పుచున్నాను, అతను, “మీకు నేనొక విషయమును చూపించగోరుచున్నాను,” అని అనెను. మీరు పరిశుద్ధ గ్రంథము ప్రకారముగా జీవించినయెడల దేవుడు మీ ద్వారా జీవించును. దేవుడు చెప్పినదానితో మీ ఆత్మ సమ్మతించకపోయినయెడల, అట్లైతే మీరు పరిశుద్ధ గ్రంథము ప్రకారముగా జీవించుటలేదు.

39

గత రాత్రి మనము స్త్రీ బోధకుల గూర్చి మాట్లాడుకొన్న సంగతి మీకు జ్ఞాపకమున్నదా; వారు “ఓ, నేను బోధించుటకు పరిశుద్ధాత్మ నన్ను పిలిచెనని నేను నమ్ముచున్నాను,” అని ఆ విధముగానే చెప్పెదరు గదా?“ ఎవడైనను తానొక ప్రవక్తయైనను, ఆత్మ సంబంధియైనను తలంచుకొనినయెడల, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలిసికొనవలెను. ఎవడైనను తెలియనివాడైతే, తెలియనివాడుగానే ఉండనిమ్మని,” పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది. కావున, స్త్రీ బోధకులను మేము నమ్ముచున్నామని మనుష్యులు చెప్పే మాటలను మీరు వినినప్పుడు, దేవునితో వారు సరిగ్గా లేరని లేక సత్యమును ఎరుగనివారని అది చూపుచున్నది. అది నిజము. లేఖనము కూడా ఆ విధముగానే చెప్పుచున్నది. దానిని మనమిక్కడ కనుగొన్నాము, మరి అది లేఖనముతో పూర్తిగా ఏకీభవించుచున్నది. ఇప్పుడది చూచుటకు ఎంత వాస్తవముగా కనిపించిననూ, అది లేఖనమునకు విరుద్దముగానే యున్నది. అది సరియైనది కాదు.

40

ఇప్పుడు ఇక్కడ మనము ఏదోకదానిని పొందబోవుచున్నాము. గమనించండి. దేవుడు, భూమి మరియు ఆకాశములను సృష్టించిన ఆ అనంతుడగు దేవుడు, ప్రతీ పురుగును, ప్రతీ ఈగను, ప్రతీ కీటకమును, ఉండబోవు ప్రతీ దానిని ప్రపంచము కలుగక ముందే ఆయన వాటిని ఎరిగియుండెను. మరి మీరు ఆయన వాక్యము ద్వారానే జీవించవలయును.

అప్పుడు ఆ న్యాయవాదులు వద్ద నేను నిలబడియుండగా, ఈ న్యాయవాది అక్కడకు నడచుకుంటూ వచ్చి, “మీరు నిజాయితీ లేనివారనే భావముతో మేము దానిని చెప్పుటకు ప్రయత్నించుటలేదు, కాని ఎవరైనానూ మీకు ధనమును ఇచ్చునప్పుడు, అది మొదట మీదగుననే విషయము మీరు ఎరుగకున్నారని చెప్పుచున్నాము. మరియు ”కాలిఫోర్నియాలోని సంపూర్ణ సువార్త క్రైస్తవ పురుషుల వ్యాపారస్థుల సహవాసము నుండి కొన్ని వేలడాలర్లు శ్రీ. మైనర్ ఆర్గన్ బ్రైట్ వద్ద నుండి మీరు చెక్కును తీసుకొని సంతకము చేసిరి. మరియు అదే రోజు మీ బ్యాంకు నుండి దానిని తీసి విదేశాల పర్యటనకు నాలుగు లేక ఐదు టికెట్లను కొన్నారు. అది ఇంచుమించు ఇరవై-నాలుగు వేల డాలర్లని,“ అతడు చెప్పెను.

నేను, “అవునండి” అని అన్నాను.

అతను, “అందుకొరకే నీవు ఆదాయపు పన్నును చెల్లించవలసి ఉన్నది,” అని చెప్పెను.

“ఎందుకు? మేమిరువరం సరిగ్గా అదే బ్యాంకులో ఉన్నప్పుడు, అతను నాకు ఆ చెక్కును ఇచ్చెను, నేను దానిని బ్యాంకులో వేసి పిదప అక్కడే ప్రయాణ టికెట్లకు దానిని వ్రాసియిచ్చితిని” అని నేను అన్నాను.

“ఆ చెక్కునీ చేతిలో ఒక్క నిమిషము ఉన్నను, అర నిమిషము ఉన్నను అది నీకు చెందినదేయగును. సంఘమునకు చెందినదిగా యగుటకు ముందు ఒక అర నిమిషము అది నీ చేతిలోనే ఉండెను, అందునిమిత్తము నీవు ఆదాయపు పన్నును చెల్లించుటకు బద్దుడవై ఉన్నావు,” అని అతడు చెప్పెను.

“అతను ఆ చెక్కును సంఘమునకు ఇచ్చినయెడల, దానికొరకు ఆదాయ పన్నును అతడు చెల్లించవలయును, ఎందుకనగా దానిని అతను సంఘమునకు ఇచ్చెను. కాని ఆ చెక్కును అతను నీకు ఇచ్చెను” అని అతడు చెప్పెను.

“మీరు దాని పేరున ఆదాయ పన్నును చెల్లించవలెననుచున్నారు, అది సంఘమునకు చెల్లించునట్లగును, అట్లైతే దానికి పన్ను చెల్లించే అవసరం లేదు,” అని నేను అన్నాను. “మీ సంఘము పన్ను చెల్లించవలెనని చెప్పుట లేదుగాని నీవు పన్ను చెల్లించవలెనని మేము చెప్పుచున్నాము” అని అతడు చెప్పెను.

అప్పుడు నేను, “ఎందుకు? తన పేరుతో సంతకము చేసిన కేంద్ర ప్రభుత్వ ఆదాయ పన్ను కార్యాలయమునకు చెందిన వ్యక్తే నన్ను ఈలాగు చేయమని చెప్పెనని,” అన్నాను.

“ఆ వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వ అధికారిగా ఉద్యోగమున లేడు,” అని అతడు అన్నాడు.

“రాజ్యాంగమును వ్రాసిన వారు ప్రభుత్వములో ఇప్పుడు లేకపోయినను, ఆ రాజ్యాంగ శాసనము ఇప్పటికీ చెల్లుచున్నది గదా? ఏదోక రోజు నీవు కూడా ప్రభుత్వ ఉద్యోగిగా విరమణ చెందుదువు, అప్పుడు నీవేమి చెప్పగలవు? అలాగైతే మనము ఏ విధమైన ప్రభుత్వమును సేవించుచున్నాము?” అని నేను అడిగాను. నిశ్చయముగా.

41

అప్పుడు మరొక వ్యక్తి, శ్రీ. బ్రెన్హాం గారు, మీరు ప్రతీ పైసా ఎక్కడ, ఎందుకు ఖర్చు పెట్టారో మేము కనుగొన్నాము, దానిని మీకు మేము చూపించగలము,“ అని చెప్పెను.

“అలాగే చూపించండి,” అని నేను అన్నాను.

అతను “కెనడాలో, ఆల్బర్టాలో ఒక కూడికను నీవు జరిపించితివి, అచ్చట నీకు ప్రేమపూర్వ కానుకగా మూడువేల డాలర్లు ఇవ్వబడినది,” అని చెప్పెను. “అవునండీ,” అని నేను అన్నాను.

అతను, “దాని తరువాత ఆదివారము, అక్కడ ఒక పాత మందిరము ఉండుటను కనుగొని, మీరు వెళ్లి ఆ చర్చిలో 'పైకప్పు' లేకుండా ఆరాధించుటను చూచి, ఆ మూడు వేల డాలర్లను ఆ మందిరము కట్టుకొనుటకు ఆ ప్రజలకు ఇచ్చితిరి,” అని చెప్పెను.

నేను “అవును, నిజము” అని అన్నాను.

“కాని అందుకొరకు ఆదాయ పన్ను చెల్లించుటకు నీవు బద్దుడవు, నీవు ఆ డబ్బును ఆ మందిరము కట్టుటకు ఇచ్చితివి, కాని దానికి ముందు ఆ డబ్బు నీకు చెందినది,” అని అతడు చెప్పెను.

“ఇది నిజమే కదా? ఫలానా ఒక వ్యక్తి [మరియు నేను అతని పేరు చెప్పను, ఎందుకనగా మీలో చాలా మందికి అతను తెలియును], ఇక్కడ ఈ దేశములో అతని ఇళ్ళు కాలిపోయినది. ఆ సమయమున నీవు నీ కూటమును ముగించి వచ్చి నీవద్ద వున్న పదిహేను వందల డాలర్లు ఇచ్చితివి. ఇప్పుడు మీలాంటి ఒకరికి అది చాలా ఎక్కువ ధనముగా అనిపించవచ్చును. కాని, అది నాకు కేవలం పదిహేను రోజుల భోజనమునకు లేదా ఇతర వాటికి సరిపోవును. నేను బోధించిననూ లేక బోధించకపోయిననూ, కార్యాలయమును మరియు ఇతర విషయములను చూచుకొనుటకు ఒక రోజుకు వంద డాలర్లు ఖర్చగును. నీవద్ద పదిహేను వందల డాలర్లు ఉండెను. కాని ఆ వ్యక్తి ఇల్లు కాలిపోయెను, అతనికి ఆరుగురు పిల్లలుండిరి, నీవు అతనికి పదిహేను వందల డాలర్లు ఇచ్చితిని,” అని అతడు చెప్పెను. నిజమే. వారివద్ద నేనిచ్చిన చెక్కు గలదు.

“అది నిజము. ఒక వ్యక్తి ఐదు మంది పిల్లలతో గుడారములో ఉంటూ మరియు శీతోష్ణ స్థితి సున్నా డిగ్రీలో ఉండి నేలపైన మంచు పడుచూ కప్పియున్నప్పుడు, నీవేమి చేయుదువు? అక్కడ ఆ వ్యక్తి మరియు చిన్న పిల్లలు గడ్డకట్టే చల్లటి మంచులో అచ్చట ఉంటూ, వణికే ఆ చలికి కప్పుకొనుటకు సరియైన వస్త్రములు కూడా వారికి లేనప్పుడు, నేను ఒక మంచి ఇంట్లో వుంటూ, నాయొద్దవున్న ఈ డబ్బు వారికిచ్చుటవలన అది వారికి ఉపయోగపడునని మీరు తలంచి చూడలేరా?” అని నేను అడిగాను.

42

“ఇక్కడ ఒక వీధిలో ఒక వ్యక్తి మరణించెను, అది వాస్తవమే కదా? కెంటకీ నుండి వచ్చినవాడు. భూస్థాపనకు కూడా అతని వద్ద డబ్బులు లేకుండెను, నీవే అతనిని భూస్థాపితము చేసితివి. పిదప నీవు, నీ భార్య, జెసి పెన్నీ అనే దుకాణమునకు వెళ్ళి రెండువందల డాలర్లకు పైగా అతని పిల్లలకు వస్త్రములను కొనుటకు ఖర్చు పెట్టితివి,” అని అతడు చెప్పెను.

“అది నిజము” అని నేను అన్నాను.

అతను, “ఈ ఫలానా నగరములో నివసించిన ఒక వృద్ద స్త్రీ గూర్చి వాస్తవము కాదా, అప్పట్లో ఆమె న్యూ-ఆల్బనిలో నివసించెడిది. ఆమె చెల్లించవలసిన కిరాణా బాకీకి మరియు విద్యుత్ శక్తి కార్యాలయమునకు చెల్లించవలసిన బాకీని ఆమె చెల్లించనందువలన, వారు ఆమె ఇంటి విద్యుత్ శక్తిని నిలిపివేయుటవలన అందుకొరకు మూడువందలు మరియు ఇంకా ఎన్నో డాలర్లను నీవు ఆమెకు ఇచ్చితివి. అంతేకాకుండా ఆమే యున్న ఇంటికి అద్దెను చెల్లించనందువలన ఆ ఇంటి యజమాని ఈ శీతాకాలములో ఆమెను బయటకు త్రోసివేయునని ఆ ఇంటి అద్దె కొరకు నీవు ఐదువందల డాలర్లు చెల్లించితివి. ఆమె ఇంటి బాడుగకు రానున్న జూన్ నెలవరకు చెల్లించితివి మరియు కిరానా సామాన్ల కొరకు మరలా పదునాలుగు లేక పదిహేను వందల డాలర్లు నీవిచ్చితివి,” అని చెప్పెను.

“నాకు ఆ విషయము బాగుగా గుర్తున్నది. యెనభై ఏళ్ళ వయస్సుగల ఒక వృద్ద తల్లి ఉండెను, ఆమెకు వ్యాధితో బాధపడుచున్న ఒక కూతురు మరియు వాత రోగముతో బాధపడుచూ, పడక మీద యున్న బోధకుడగు ఒక కుమారునితో ఏ ఆధారమూ లేనివారుగా జార్జియాలో నివసించుచుండిరి. ఆ పరిస్థితిలో వున్న వారికొరకు నీవేమి చేయుదువు? అని నేను అతనిని అడిగితిని. కాని నేనైతే వారికి సహాయము చేయుదును,” అని నేను చెప్పాను.

“మీ ధర్మకర్తలకు ఈ విషయము తెలుసా?” అని అతను అడిగెను.

నేను “లేదండి, వారికి తెలియదు,” అన్నాను.

“నీ భార్యకు తెలుసా?” అని అతను అడిగెను.

“లేదండి, ఆమెకు తెలియదు,” అని నేను అన్నాను.

“అయితే ఎవరికి తెలియకుండా దీనిని నీవెందుకు చేసితివి?” అని అడిగిరి.

“ఎందుకనగా, నీ కుడి చెయ్యి చేయునది, నీ ఎడమచేతికి తెలియకయుండవలెను,” అని నా ప్రభువు చెప్పెను. దేవుని ఆజ్ఞల మించిన ఆజ్ఞలను మీరు కలిగియున్నారా?“ అని నేను వారిని అడిగితిని.

43

మరియు అప్పుడే పరిశుద్ధాత్మ రక్షించుటకు వచ్చెను. కావున ఆయన చేయు క్రియలు ఎంతో చక్కగా ఉండును. మీరు పరిశుద్ధాత్మను మాట్లాడుటకు అనుమతించినయెడల, ఆ సమయమున అసలు మీరేమి మాట్లాడుచున్నారో మీకు తెలియకుండానే సమయోచితముగా మీరు మాట్లాడెదరు. “సరే, అలాగే, నేను దానికొరకు పన్నును చెల్లించాలని మీరు రూఢిగా అడిగినయెడల, నాకు సాధ్యమైనంతవరకు నేను దానిని చెల్లించెదను. నేనింకా చిన్న బాలుడను కాను, కాని నాకు సాధ్యమైనంతవరకు నేను దానిని చెల్లించెదను. నాకు తెలిసినంత వరకూ, ఎవరికీ దేనినీ అచ్చివుండరాదు. నేను నిజాయితీగా ఉండుట కొరకే ప్రయత్నించెదను. ఒకప్పుడు వేల కొలది డాలర్లు నేను అప్పుబడితిని. వాటిని వారానికి ఒక్క డాలరు చొప్పున చెల్లించుచూ, దేవుని కృపవలన పూర్తిగా నేను దానిని చెల్లించితిని. నేను ప్రజలకు సహాయము నిమిత్తము ఇచ్చిన ఈ డబ్బుకు పన్ను చెల్లించుటకు బాధ్యుడనైయున్నానని మీరు దావావేసి నిరూపించినయెడల...” అని నేను చెప్పాను. గత పది సంవత్సరములుగా ఆ విధముగా ప్రజలకు నేను సహాయము చేసిన ధనము కొరకు దాదాపు ఇరువదివేల డాలర్లు అపరాధ రుసుముగా నేను చెల్లించవలెనని వారు లెక్కను చూపించిరి.

“ధర్మకర్తలు ఇవి ఏమీ ఎరుగరు,” అని అతను చెప్పెను.

“దానిని ఎరుగవలసిన అవసరము వారికి లేదు,” అని నేను చెప్పాను.

మరియు కావున అతడు చెప్పెను, “మంచిది...”

అప్పుడు అతడు చెప్పెను..

44

“పేద విధవరాళ్ళు మరియు అనాధులు సహితము తాము పొందుకొనిన సహాయమునకు ప్రభుత్వానికి పన్ను చెల్లించవలెనని లేదా వారు ప్రభుత్వమునకు పన్ను చెల్లించకుండా ఋణస్థులుగానే చనిపోయెదరని నేనెరిగినపుడు అది నన్ను గాయపరచినదని,” వారితో చెప్పాను. నేను వారితో ఏమి మాట్లాడుచున్నానో నాకు తెలియకుండెను, ఆ తండ్రియే నా ద్వారా అలా మాట్లాడించెను, కాని వాస్తవముగా అలా మాట్లాడుట నాకు తెలియదు.

“దానికొరకు వారు ఆదాయ పన్ను కట్టవలసినవసరము లేదు,” అని అతను చెప్పెను.

“వారు ఎందుకని కట్టవలసిన అవసరము లేదు?” అని నేను అడిగాను.

“అది వారు అడగకుండానే ఇవ్వబడిన బహుమతిగా ఉన్నదని,” అతను చెప్పెను. అప్పుడు పరిశుద్ధాత్మ నన్ను మేల్కొలిపెను.

“ఓ, అట్లైతే అడగకుండానే ఇవ్వబడిన బహుమతి పన్నురహితమైనదా?” అని నేను అడిగాను.

“అవును, అది సరియే,” అని అతను చెప్పెను.

“అట్లైతే నేను కూడా ప్రభుత్వమునకు ఏమియు చెల్లించుటకు ఋణస్తుడను కాను. ఎందుకనగా, నా జీవితములో నేనెన్నడూ కానుకను తీసుకొనలేదు,” అని నేను అన్నాను.

అప్పుడు నా న్యాయవాది పైకి లేచి, అతను “బ్రెన్హాం మీరు నిరూపించ...”

నేను, “దానిని రుజువు చేయుటకు వాషింగ్టన్ లో రెండు మిలియన్ల ఉత్తరములు నావద్ద గలవు. నేనెప్పుడూ కానుక పట్టలేదు,” అని చెప్పాను.

“కాని కూడికలకు నీవు వెళ్ళునప్పుడు, సేవకుల ద్వారా కానుకలను పట్టి ఖర్చుల కొరకు దానిని చెల్లించెదరు కదా, కావున ఈ కూడికలు జరుగునప్పుడు ఏదోక విధముగా వారియొద్ద నుండి ఎంతో కొంత డబ్బును నీవు పొందుకొనెదవనే ఒక అవగాహన నీకు గలదు,” అని వారు చెప్పిరి.

నేను, “అసలు ఆ తలంపే ఉండదు,” అని చెప్పాను.

అతను, “సరే, అలాగైతే నీవు ఉత్తరముల ద్వారా సహాయము చేయమని వారిని అడిగెదవా?” అని అడిగెను.

నేను, “ఆలాంటి కార్యమును చెయ్యను,” అని చెప్పాను.

“అలాగైతే నీవేలాగు నీకు కావలసిన డబ్బును పొందుకొనెదవు?” అని అడిగెను.

45

నేను, “ప్రజలు నాకేమి పంపించెదరో దానినే పొందుకొనెదను,” అని అన్నాను. తరుచుగా నాకు దశమ భాగములను పంపుచున్న జనుల ముఖములను ఈ మధ్యనే చూచుచున్నాను. వారిని నేనెన్నడూ డబ్బు కావాలని అడుగలేదు; నేను అడగకుండానే వారే నాకు పంపించెదరు. అది పరిశుద్ధాత్మవలన జరుగు కార్యము. ఎందుకనగా, ఆయన తన స్వకీయులపట్ల శ్రద్ద వహించుచూ వారి అవసరతలను తీర్చగల సమర్థుడు, అని చెప్పాను.

“సరే అయితే, బ్రెన్హాం గారు, మీరు దానిని రుజువు చేయగలరా? మీరు వారిని డబ్బును అడగకుండానే మీకు కానుకగా ఇచ్చారని మీరు చెప్పే మాటలకు ఆధారముగా కనీసము ఎనిమిది లేక పది సంవత్సరములు వరకు మీకు వారియొద్ద నుండి వచ్చిన ఉత్తరములను మీరు తీసుకొని రాగలరా?” అని అతను అడిగెను.

నేను “మీకు కావలసినవన్ని నేను తీసుకొని వచ్చెదను,” అని చెప్పాను.

అతను, “ఒక్కొక్క సంవత్సరము వచ్చిన ఉత్తరములలో మూడు కావలెనని,” అడిగెను.

నేను, “అలాగే, వాటిని నేను మీకిచ్చెదను,” అని చెప్పాను.

“అట్లైతే మీ యొక్క తపాలా పెట్టె తాళపు చెవి నాకిచ్చెదరా... రెండు, మూడు రోజులలో పోగైన మీ ఉత్తరములను నేనే వెళ్ళి, దానిని తెరిచి తీసుకొనెదనని” అతను అడిగెను.

“మీకిష్టమైనది మీరేదైనా చెయ్యవచ్చును. మీరు నా కార్యాలయమునకు రావాలనుకున్నా రావచ్చును,” అని నేను చెప్పాను.

అతను “మీరు ఏ విధమైన అభ్యర్థనలను వారియొద్ద అభ్యర్ధించెదరు?” అని అడిగెను.

నేను “దేనిని నేను అభ్యర్ధించను,” అని చెప్పాను.

“తపాలా ద్వారా మీరేమి పంపించుదురు?”

“ప్రార్థనా వస్త్రములు,” అని నేను చెప్పాను.

“దాని కొరకు వేల అడుగుదురా?” అని అతను అడిగెను.

నేను, “నేను వారికి పంపించు ఉత్తరములను మీరే వచ్చి చదివి చూడండి.”

అది ఆ విధముగానే జరుగుచున్నది. గత ఇరవై సంవత్సరములుగా నేను చెల్లించిన ఆదాయపు పన్ను డబ్బును ఇప్పుడు ప్రభుత్వమే నాకు తిరిగి చెల్లించవలసియున్నది“ అని చెప్పాను. ”ఏలాగు మాట్లాడుదుము? ఏమి చెప్పుదుము, అని చింతింపకుడి, మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో వుండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు.“ చూచారా? ఆ కారణముచేతనే వాక్యముతో నిలిచియుండుటను మనము విశ్వాసించుచున్నాము. అది క్రియ చేయుటకు బహుశా ఎక్కువ కాలమైనా గాని అది వాక్యానుసారముగా ఎప్పుడు క్రియ చేయవలెనో సరిగ్గా అప్పుడే అది క్రియ చేయును.

46

ఇప్పుడు, జగదుత్పత్తికి మునుపే మరియు అది ఉనికిలోకి రాక మునుపే తండ్రి గొర్రెపిల్లను వధించెనని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్న దానిని మనమందుకే నమ్ముచున్నాము. మరియు ఆయన ఆ గొర్రెపిల్లను వధించినప్పుడే రాబోవుచున్న తన బిడ్డల పేర్లను ఒక్కొక్క దానిని జీవగ్రంథములో ఆయన వ్రాసియుంచెను. మరియు అది పూర్తిగా సమాప్తమగువరకు ఆ కాలము వరకూ మనము జీవించెదము. నేను చెప్పే భావము మీకు అర్థమగుచున్నదా? ఆ అనంతుడగు దేవుడు దానిని ఎరిగియుండెను, ఈ ప్రపంచము ఆరంభమవ్వక మునుపే తన ప్రణాళికలో సంభవింపబోవు కార్యములను ఆయన ముందే చూచెను, మరియు దానిని కేవలం ఆయన ఆ విధముగానే చేసెను.

ఇప్పుడు జ్ఞాపకముంచుకొనుము, తండ్రి ఒక గొప్ప మహోన్నతమైన నిర్మాణికుడిగా ఈ ప్రపంచమును చేసినప్పుడు, మన శరీరములోకి కావలసిన కాల్షియం, పొటాషియం, పెట్రోలియం మరియు అనేక రకములైన లవణములను ఈ సృష్టియందుంచి దానియొక్క ప్రతీ భాగమును ఆయన ఎరిగియున్నాడు. అంతేకాకుండా, అది సృష్టింపక మునుపే ఆ శరీరము ఎటువంటి రూపమును కలిగియుండునో ఆయన ఎరిగియున్నాడు. దానియొక్క నిత్య గమ్యమును నిశ్చయముగా ఆయన ఎరిగియుండెను. ఏ రకమగు ఆత్మలు వాటిల్లో నివసించునని కూడా ఆయన ఎరిగియున్నాడు.

47

మరిప్పుడు ఈ పాఠ్యంశమును మనము ముగించక మునుపు, ఈ రాత్రి మనము “సర్పము యొక్క సంతానము” మరియు “స్త్రీ యొక్క సంతానమను” అంశములలో కొన్ని కార్యములను తీసుకొని, అవి ఎందుకు ఆలాగున ఉన్నవో దానిని నేను మీకు చూపెదను. ఆ సర్పము సంతానము ఏ విధముగా క్రియ చేయుచూ ముందుకు కదలి పోయినదో; మరియు ఆ స్త్రీ సంతానము ఏ విధముగా క్రియ చేయుచూ ముందుకు కదలిపోయినదో చూడండి, అనగా సర్ప భీజము యొక్క సంతానము ప్రబలమగుచూ, దాని సంఖ్య అధికమగుచూ అది ఇంకా అధికమగుచూ, అధికమగుచూ, అధికమగుచూ, అధికమగుచూ మరియు అత్యధికమగుచూ, జగత్తుకు పునాది వేయబడక మునుపే వ్రాయబడిన అతి స్వల్పమైనవారిని తప్ప వేరే దేనిని కూడా మిగల్చకుండా ఆ శేషమును మాత్రమే మిగిలి ఉంచునంతగా అది ప్రబలమగుటను గమనించండి.

48

కాని శరీరము రూపొందుచున్నప్పుడు గ్రంథములోనున్న ఆఖరి పేరు ఇక్కడ భూమిపై గుర్తించబడినప్పుడు, గ్రంథములన్నీ మూయబడును: ఏలయనగా విమోచనా కథ పూర్తిగా చదువుటవలన ఇక అది సమాప్తమాయెను. పిదప ఆయనను చూచుటకు మరియు పునరుత్థానములో ఆయనను కలుసుకొనుటకు మనము వెళ్ళెదము. “నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు.” “నన్ను పంపిన తండ్రి ఆకర్షించితేనేగాని ఎవడును నా యొద్దకు రాలేడు, కాగా పొందగోరినవాని వలనైననూ, ప్రయాసపడువాని వలననూ కాదు గాని, కరుణించు దేవునివలననే అగును,” అని లేఖనము చెప్పుచున్నది. పొందగోరువారి వలన కాదు. చాలామంది ప్రజలు ఈ విధముగా చెప్పెదరు. “నేను సంఘములో చేరెదను. నేను మంచివానిగా ఉండెదను. నేను దీనిని చేసెదను. దీనికి దానికి ఏ సంబంధము లేదు. అది కరుణించు దేవుని వలననేయగును.

49

ఇప్పుడు, మీరు గమనించండి, దేవుడు ఆరంభించినపుడు... వర్ష ధనుస్సులో ఏడు రంగులు ఉన్నట్లుగానే దేవునికి ఏడు ఆత్మలు కలవు. మరి మీరెప్పుడైననూ గమనించారా? మూడు అంచులుగల ఒక అద్దపు ముక్క ఏడు పరిపూర్ణ రంగులను ప్రతిబింభించును. మీరు ఎప్పుడైననూ దానిని ప్రయత్నించారా? మూడు అంచులుగల అద్దపు ముక్కను తీసుకోండి, అది మూడు అంచులుగల ఒకే అద్దపు ముకైనను అది ఏడు రంగులను ప్రతిబింభించును. అలాగుననే తండ్రి, కుమార మరియు పరిశుద్ధాత్మ ఒక్కటే అయినప్పటికీ, దేవుని యొక్క ఏడు రకముల ఆత్మసంబంధమైన గుణలక్షణములను అది ప్రతిబింభించుచున్నది.

50

అట్లైతే మొదటగా దేవుని యొక్క గొప్ప ఆత్మ ఏదనగా అది ప్రేమయై ఉన్నది. దేవుడు ఆ గొప్ప వర్ష ధనుస్సువలె ఉన్నాడు. ఆయన ఏ విధముగా కనబడునో మనము దానిని ఊహించలేము. కాని ఏడు రంగుల వర్షపు ధనుస్సువలె ఏడు ఆత్మలు గలవానిగా ఆయన కనబడుచున్నాడని చెప్పవచ్చును. ఎరుపురంగు పరిపూర్ణ ప్రేమనే ఆత్మకు సాదృశ్యము గాను, నీలిరంగు పరిపూర్ణమైన సహవాసమనే ఆత్మకు సాదృశ్యముగా ఉన్నది. ఆ ఆత్మలన్నీ పరిపూర్ణమైనవి! పిదప అవన్నీ క్రిందికి దిగి వచ్చుటకు ఆరంభించెను. అవన్నీ ఆ విధముగా క్రిందికి దిగజారిపోతూ... దైవిక ప్రేమ (అగాపే) నుండి శారీరకమైన (ఫీలియో) ప్రేమనే తుచ్చమైన ఇచ్ఛలకు మరియు ఇంకా నీచమైన వ్యామోహాలకు అట్టడుగు స్థితికి వచ్చెను. అప్పుడు దేవుడే స్వయముగా తన్నుతాను తగ్గించుకొని ఒక మానవునిగా మారెను, యేసుగా ఆయనే పాతాళము యొక్క అగాధమునకు దిగివచ్చి, జగత్తుకు పునాది వేయబడక మునుపే గ్రంథమందు ఎవరి పేర్లు వ్రాయబడెనో వారిని ఆయన ఎరిగియుండుటచే, వారిని పైకెత్తి, తనతో ఉండుటకు వారిని విమోచించెను. అక్కడే నీవు ఉన్నావు. మనము ఆయనను చూచేంతవరకు మరియు మనము ఆయన యొక్క సారూప్యములో నిలబడేంత వరకు విమోచనా కథను పూర్తిగా అర్ధము చేసుకొనుటకు మనకు సాధ్యమవ్వదు.

51

ఇప్పుడు, మనమందుకే ఒక సంఘశాఖ కాదు. అందువలననే మనము వేరేదేనికి సహకరించుటలేదు... కావున దేవుని కొరకు మనకు సాధ్యమైనంతవరకు దేవుని యొక్క ప్రతికదలికకు మనము సహకరించుచున్నాము. అందుకే మనము ఒక సంఘశాఖ కాదు. ఇప్పుడు, ఆ తప్పుడు బోధలన్నియు ఆ సంఘశాఖలలో నుండే పుట్టుకొచ్చినవి.

ఇప్పుడు, నేను చెప్పిన విధముగా, నేను గట్టిగా నొక్కి చెప్పుచున్నాను, ఎందుకనగా దానిని మీలో నిలిచిపోవాలని నేను కోరుచున్నాను. ఇప్పుడు, అక్కడెక్కడో దూరముగా వున్న ఇతర సంఘములో యున్న ఆ విషయములను గూర్చి నేను ఆలోచించను. మనమంతా ఏకముగా సమ్మతించు గొప్ప విధానములయందు నిలిచియుండు ఒక మంచి క్రైస్తవుడిగా మరియు సహోదరుడుగా ఉండుటకే నేను ఆశించెదను. చూచారా? కాని అదే సమయమున మోసపరచేవారిగా మనముండుటకు ఇష్టపడుట లేదు.

52

నిన్న ఉదయమున కెంటకీ పర్వతములలో ఉడుతల వేటలో నేను ఉండగా, నేను ఒక యవ్వన బాలునితో మాట్లాడుచుంటిని. ఆ అరణ్యములో నాటిన సూచికను చూపించే పలకను నేను గమనించలేదు, కావున నేను వేరొక వైపు కూర్చొని యుంటిని, బాంక్స్ సహోదరుడు ఆ అడవి మార్గముగుండా ఇచ్చటకు వచ్చుచున్నాడని నేను భావించాను. అదే పరిధిలో అతడు కూడా ఉడతల వేటాడుచుండెను. కావున అతడు వచ్చుచున్నట్లుగా నాకు కనబడుటచేత నేను ఈల వేసి అతనిని పిలిచినప్పుడు అది అతను కాదు గాని ఆ యవ్వన బాలుడని తెలుసుకున్నాను. ఉడ్స్ సహోదరుడు ఆ యవ్వనస్తుని వలె వస్త్రములను ధరించుకొని ఉండుటచేత అతను ఉడ్స్ సహోదరుడు అని నేను అనుకున్నాను. ఆ యవ్వనస్తుడు వెనుకకు తిరిగి చూచినప్పుడు, అది అతను కాడని నేను చూచితిని. సూచికవున్న స్థలమొకటి ఉన్నదని నాకు ఉడ్స్ సహోదరుడు చెప్పియుండెను. మరి అది నాకు తెలియదు. అచ్చట ఎటువంటి కంచె లేకుండెను; అదంతా అడవియే. అంతే కాకుండా అచ్చటవున్న హిక్కరీ చెట్టు ఏ వైపునకు చెందినదో నాకేలాగు తెలియును? కావున, నేను ఉడతలు అరిచే అరుపులను వింటూ అక్కడ కూర్చొనివుంటిని. “సరే, ఈ రాత్రి ఇంటికి వెళ్ళి కూడికను ప్రారంభించాలని గుర్రమునకు జీను కట్టుచూ నేను ఆలోచిస్తూ ఉంటిని.”

53

ఆ సమయమున వర్షము కురియుచూ, తుఫాను గాలులు వీచుచుండెను. అప్పుడే నేను ఈ వ్వక్తిని చూచితిని మరియు నేను అతనితో మాట్లాడితిని. నేను అచ్చటికి వెళ్ళిన తర్వాతే అతని వేట స్థలము యొక్క సరిహద్దుల్లో నేను ఉన్నానని తెలుసుకొంటిని. చూచారా? మరియు నేను అతనితో మాట్లాడితిని. అతను, “ఓ, అదేం ఫరవాలేదు, మీకిష్టమైన చోటున మీరు వేటాడండి,” అని చెప్పెను.

మరియు నేను, “మంచిది...” అని చెప్పాను.

అతను “నీవు నా స్థలమందు లేవు, నీవు ఈ హిక్కరీ చెట్టు అవతల కూర్చొనియుంటివి, హిక్కరీ చెట్టుకు ఇవతల వైపువున్న స్థలము నాది, అయినా అదేమి ఫరవాలేదు, బ్రెన్హాం సహోదరుడా, నీకిష్టమైన చోటు ఎక్కడైననూ నీవు వేటాడ వచ్చును. మా ఇంటికి రండి. నాన్న మిమ్మల్ని చూచుటకు ఇష్టపడును.” చూచారా?

నేను “సరి...” అని చెప్పాను.

మేము పరిశుద్ధ గ్రంథము గూర్చి మాట్లాడుటకు మొదలు పెట్టితిమి. పిదప వేట అంశము పై మాట్లాడుచూ, అతను ఈ విధముగా చెప్పాడు, బ్రెన్హాం సహోదరుడా, ఇక్కడ ఎవరు వేటాడినను దానిగూర్చి ఎన్నడునూ లెక్క చేయము. కాని, నా తండ్రి ఒక రోజు ఇక్కడ ఉన్నప్పుడు ఒక పట్టణము నుండి వచ్చిన వేటగాడు ఆయన గొర్రెలలో ఒకదానిని తన తుపాకీతో కాల్చి చంపెను. అతను ఇంచుమించు అరవై లేక డెబై పౌండ్ల బరువుగలవాడు, అందునిమిత్తము నా తండ్రి అతని యొద్ద అరెచెను, అదొక్కటే చాలా బాధ కలిగించింది తప్ప, ఇచ్చట ఎవరు వేటాడినను దానిగూర్చి మేము లెక్క చేయము.“

సరి, ఆ విషయం గూర్చియే నేను మాట్లాడుచున్నాను. మీరే సంఘశాఖకు చెందియున్నా దానిని నేను లెక్క చేయను, కాని పరిశుద్ధ గ్రంథముతోనూ మరియు పరిశుద్ధాత్మతోనూ మీరు నిలిచియుండండి. మీ యొక్క సంఘశాఖ గూర్చి మేము చింతించుట లేదు గాని, ఆ సంఘశాఖలు అతి త్వరలోనే ఒకదానిపై మరొకటి ఆధారపడియుండును. కాని అది పరిశుద్ధ గ్రంథముతో ఏకీభవించి ఉండవలయును లేదా మానవ-కల్పితమైన సిద్ధాంతములను అది అంగీకరించును. మీరు పరిశుద్ధ గ్రంథముతోనే నిలిచియుండుడి.

54

ఇప్పుడు, వారు ఒక తప్పుడు సంఘశాఖను ఏర్పరచుకొనిరి. ఇప్పుడు, దానితరువాత వారు తీసుకొని వచ్చిన ఇంకొక తప్పుడు కార్యమేమనగా, నీటి బాప్తిస్మము. పరిశుద్ద గ్రంథము బోధించు విధముగా నీటి బాప్తిస్మము ముంచుట ద్వారా తీసుకొనవలయునని ఉన్నది. కాని కాతలిక్ సంఘము నీళ్ళను చిలకరించుట లేక నీళ్ళను తలపై పోయుటను తీసుకొని వచ్చినది. నీళ్ళను చిలకరించుట లేక నీళ్ళను తలపై పోయుటను సమర్థించుచూ పరిశుద్ధ గ్రంథములో ఏ లేఖనమూ లేదు. ఆ విధముగా పరిశుద్ధ గ్రంథములో ఎచ్చటా కనుగొనలేరు. ముంచుట ద్వారానే నీటి బాప్తిస్మమును తీసుకొనవలనని ఉన్నది.

పిదప, కాతలిక్ సంఘము తరువాత లూథరన్ సంఘము ఉద్భవించి నీళ్ళను తలపై పోయుటను తీసుకొని వచ్చినది. దానితరువాత ఆంగ్లికన్ సంఘము మరియు ఇంకా అనేకమైనవి ఉద్భవించి ఆ విధముగానే అనుసరించుచూ వచ్చినవి. ఆ తరువాత కొంత కాలము తరువాత, బాప్తిస్టులు మరియు కాంప్బెలైట్యనే సంఘ సంస్థలు ఉద్భవించి మరలా ముంచుట బాప్తిస్మము వద్దకు వచ్చిరి. కావున, సాతాను దానిని గమనించాను. కాబట్టి ఒక తప్పుడు నామమున వారు ముంచుడు బాప్తిస్మమును తీసుకొనునట్లు చేసెను. కావున వారు, తండ్రి, కుమార మరియు పరిశుద్ధాత్మ నామమును ఉపయోగించుచూ బాప్తిస్మమును ఇచ్చుటకు ఆరంభించిరి. తండ్రి, కుమార, మరియు పరిశుద్ధాత్మ నామమున నీటిలో ముంచే బాప్తిస్మమును పరిశుద్ధ గ్రంథమున ఎవరైనా ఎప్పుడైనా తీసుకున్నట్లుగా ఏ ఒక్క చిన్న ఆధారము లేఖనములలో లేదు. దానిని ఉపదేశించు వారెవరైనా గాని అతడొక తప్పుడు (అబద్దపు) ఉపదేశకుడగును.

55

ఇది మీ మనస్సులలో నాటుకుపోవాలనే భావముతో దీనిని నేను చెప్పుచున్నాను. ఇప్పుడు, నేను చెప్పినది సత్యము కాదని మీరు భావించినట్లయితే, మీ ప్రశ్నకు ఈ వేదిక పైనే జవాబు చెప్పుటకు నేను ఆశించుచున్నాను. ఆ విధముగా ఉన్నట్లైతే నాకు చూపించండి. పరిశుద్ధ గ్రంథములో ఏ స్థలములోనైనా, ఏ ఒక్కరైనా, ఎప్పుడైనా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము తీసుకున్నట్లుగా ఒక్క స్థలములోనైనా నాకు చూపించినట్లయితే, నేను నా వీపు వెనుక, “అబద్దపు బోధకుడు,” అని వ్రాసిన ఒక పలకను తగిలించుకొని నా చేతులు పైకెత్తి, “నేనొక అబద్దపు బోధకుడనని గట్టిగా అరుచుచూ వీధులలో అటు, ఇటు తిరుగుచూ చెప్పెదను. అటువంటిదేదియూ లేదు. అదెక్కడ నుండి వచ్చినది? ఇప్పుడు దానిని అన్వేషించుటకు మరలా వెనుకకు వెళ్ళి చూద్దాము. ఇది పరిశుద్ధ గ్రంథమునకు ఈ ప్రక్కన గలదు. మీరు చరిత్రను పరిశీలించవలెను. కాతలిక్కులు అనేక దేవుళ్ళు గలరని నమ్మెదరు. మరియు వారు నిజమైన ఒక్క దేవుడిని మూడు వేర్వేరు దేవుళ్ళుగా ముక్కలు చేసిరి.

56

మరియు నా మాటలను ఆలకించండి, దేవుని సేవకుడిగా మనమందరికీ తెలిసిన ఒక గొప్ప వ్యక్తియగు బిల్లీ గ్రహం గూర్చి, ఆ దినమున దిన పత్రికలో వచ్చిన ఆ వార్త ఎంతో ఘోరమైన విషయముగా ఉండెను. మన వద్ద ఆ నివేదిక గలదు. బీలర్ సహోదరుని వద్ద అది ఉన్నది. ఒకానొక వ్యక్తి బిల్లీ గ్రహం వద్ద, “త్రిత్వము గూర్చిన ఈ గొప్ప వైరుధ్యం ఏమిటి? ముగ్గురు దేవుళ్ళు గలరా, నిజముగానే ముగ్గురు దేవుళ్ళు గలరా? లేక అసలు అదేమిటి? ఒక చోట అది ముగ్గురు దేవుళ్ళువలె కనిపించుచున్నది. మరియు వేరొక చోట...” అని అడిగెను. “అదింకా బయలుపరచబడలేదు. కావున మర్మము ఎవరికీ తెలియదు,” అని బిల్లి గ్రహం చెప్పెను. మై! ముగ్గురు దేవుళ్ళుయున్న యెడల మనము కూడా అన్యులగుదుము!

ఆ యూదుడు చెప్పినట్లుగా, “వారిలో ఎవరు మీ దేవుడు? తండ్రియా? కుమారుడా మీ దేవుడు? లేక పరిశుద్ధాత్మ మీ దేవుడా?” ఒకే ఒక్క దేవుడు మాత్రమే ఉన్నాడు. అవి మూడు వ్యక్తిత్వములు కాదు, ఏలయనగా ఒక వ్యక్తిత్వముగలవాడు ఒక వ్యక్తిగా ఉండవలసియున్నది. ఒక వ్యక్తిగా లేకుండా ఒక వ్యక్తిత్వమనేది ఉండనేరదు. అది మీకు తెలుసు. ఒక వ్యక్తిగా లేకుండా ఒక వ్యక్తిత్వమనేది ఏ విధముగా ఉండగలదు?

57

“ఓ, దేవుళ్ళు ముగ్గురనేదానిని మేము నమ్మము. ఒక్క దేవుడినే మూడు వ్యక్తిత్వములలో మేము నమ్ముచున్నాము.” సరి, ఒక వ్యక్తిత్వమనేది ఉండుటకు ముందు ఒక వ్యక్తి ఉండవలసియున్నది,“ అని నేను చెప్పాను.

“అట్లైతే, మరేమిటది?”అని మీరు అడుగవచ్చును.

అది ముగ్గురు దేవుళ్ళు కాదు గాని, అది ఆ ఒక్క దేవుని యొక్క మూడు కార్యాలయములై యున్నవి. ఆదిలో, అరణ్యములో మండుచున్న పొదలో అగ్ని జ్వాలలతో వ్రేలాడిన అగ్నిస్తంభముగా ఆయన తండ్రిగా ఉండెను. ఇప్పుడే నేను చెప్పిన విధముగా, పితృత్వమున, దేవుడు, దిగి వచ్చెను. క్రిందికి దిగి వచ్చెను. అది అత్యున్నతమైన క్రమముగా యున్నది. ఆత్మ, ఆ దైవికమైన ప్రేమ (అగాపే), జోయీ (zoe)- అనే గ్రీకు పదము అర్ధమేమనగా, దేవుని యొక్క జీవము తనకు తానుగానే అగ్ని స్థంభము రూపములో ఏర్పడెను. మరియు అదే దేవుడు, పితృత్వములో ఉండిన అదే దేవుడు పిదప కుమారునిగా అయ్యెను, మరియు ఆత్మయొక్క... ఆత్మ రూపమున మండుచున్న పొదలో అగ్నిస్తంభముగా యున్నప్పుడు ఏదైతే చేసెనో మానవ రూపమునయున్న క్రీస్తులో నుండి బయలుపడి అది అదే రుజువును తీసుకొని తెచ్చెను. నేను నా తండ్రి క్రియలను చేయనియెడల, నన్ను నమ్మకుడి,“ అని ఆయన చెప్పెను. ప్రతీ చెట్టు దాని ఫలము ద్వారా అది గుర్తించబడును.

58

మరియు ఆయన మానవ రూపమును దాల్చిన తరువాత, గమనించండి, ఆ జీవము సహజాతీతమైన స్థితి నుండి సృజించగల మరియు తాకగల ఒక శరీరములోకి ప్రవేశించెను. అంతేకాకుండా, త్యాగపూరితమైన మరణముగుండా మరియు యేసు అనబడే ఈ ఒక్క దేవుని యొక్క అత్యున్నతమైన బలియాగము ద్వారా... “నేను మరియు నా తండ్రియును ఏకమైయున్నాము,” అని చెప్పెను. నా తండ్రి నాలో నివసించుచున్నాడు,“ అని ఆయన చెప్పెను. ఎవరునూ ఇంత కంటే స్పష్టముగా చదవలేరు.

వారు “తండ్రిని మాకు నీవు కనపరచుము, మాకంతే చాలును,” అని వారు అడిగిరి. యోహాను 14:8.

ఆయన చెప్పెను, “నేనింతకాలము మీయొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు.”

నేను ఈ విధముగా చెప్పుచున్నప్పుడు, ఒకసారి ఒక స్త్రీ పైకి లేచి, ఆమె “అలాగైతే బ్రెన్హాం సహోదరుడా, నీవు మరియు నీ భార్య ఏకముగా ఉన్నట్లుగా, తండ్రి మరియు కుమారుడు ఏకమై ఉన్నారు కదా!” అని అడిగింది.

“ఓ, కాదు, వారు ఆ విధముగా ఏకముగా ఉండుట కాదు.” నీవు నన్ను చూచుచున్నావా?“ అని ఆమెను నేను అడిగితిని.

ఆమె, “అవును” అనెను.

నేను, “అలాగైతే నీవు నా భార్యను నాలో చూచుచున్నావా?” అని అడిగాను.

ఆమె, “లేదు,” అని చెప్పెను.

నేను, “కావున వారు ఆ విధముగా ఏకముగా ఉండుట కాదు.” యేసు, “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు, తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నాము,” అని చెప్పెను. కాబట్టి “నా భార్య నాలో నివసించుట లేదు” అని చెప్పాను. చూచారా? వారు ఏకమైయున్నారు. అన్ని విధాలుగా వారు ఏకమైయున్నారు. నేను మరియు నా భార్య ఒప్పందము ద్వారా ఒకటైతిమి. మేము భర్త మరియు భార్య అనే బంధము ద్వారా ఏకమైయున్నాము, కాని మేము రెండు వ్యక్తిత్వములుగల ఇద్దరు వ్యక్తులమైయున్నాము. నా భార్య ఒక రకమైన ఆలోచనను కలిగియుండును మరియు నేను మరొక ఆలోచనను కలిగియుందును. కావున మేము ఇద్దరు వ్వక్తులమైయున్నాము. కాని దేవునియందున్న విషయము ఆ విధముగా కాదు, దేవుడు మరియు క్రీస్తు ఒక్క వ్యక్తిగానే ఉన్నాడు.

59

అట్లైతే పరిశుద్ధాత్మ అనగానేమి? ఆదిలో ఎవరితో ఆయన ఏకమైయుండెనో, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేర్లు ఉన్నవో, ఏ జనుల కొరకు ఆయన మరణించెనో, ఆ జనులలో నివసించుచున్న అదే దేవుని యొక్క ఆత్మయే పరిశుద్ధాత్మగా ఉన్నది. లేఖనము ఆ విధముగానే చెప్పుచున్నది. జగత్తుకు పునాది వేయబడక మునుపే వారు ఆయనతో ఉండిరని యేసు వారితో చెప్పలేదా? ఆ విషయములకు మీ మనస్సులు నల్లగా మసిబారి మరియు అంధకారముతో నిండియున్నవి, మరియు మన అందరి మనస్సులు అలాగుననే ఉన్నాయి. కాని మనమిచ్చట ఉండుటనేది కేవలం ఒక యాదృచ్చికముగా సంభవించిన సంఘటన కాదు. దేవుని యొక్క సృష్టి ఆరంభములోనే మనము దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలుగా ఉన్నాము. మరియు మనము ఇక్కడ ఒక సాక్షులుగా, పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములన్నిటిలో దేవుని యొక్క కృప కుమ్మరించబడినదనే సాక్ష్యమిచ్చుట కొరకే మనమిచ్చట విడిచిపెట్టబడి యున్నాము. మనము ఒక నిత్యమైన ఆత్మను కలిగియున్నాము. ఎవరునూ, ఏ ఒక్కరూ దానిని అడ్డుకొనుటకు ఏ మార్గము లేదు. దేవుని యొక్క సంఘము ఎంత నిశ్చయతను కలిగియుండగలదో అంతటి నిశ్చయతను అది కలిగియుండును.

60

మనము మాట్లాడుచుండినట్లుగా, అక్రమ సంబంధము ద్వారా జన్మించిన బిడ్డ పదునాలుగు తరములకు, నాలుగు వందల సంవత్సరములకు యెహోవా సమాజములో ఏ విధముగా చేరకూడదో మరియు తల్లిదండ్రుల యొక్క దోషము పిల్లల మీదికి మూడు నాలుగు తరములవరకూ తీసుకొనిరాబడుననే చిన్న పాఠ్యంశమును గూర్చి చూద్దాము. అలాగే తల్లిదండ్రుల నీతి కూడా విచారించబడును.

రేపు అనే ఒక దినమున మీకు ఒక ముని మనుమడు ఉండినయెడల, మీరే క్రియలను చేయుదురో, నేడు మీ ప్రవర్తన ఏ విధముగా ఉన్నదో దానిని బట్టే మీ మునిమనువడు ఏలాగు ఉండునో అది నిర్దేశిస్తుంది. ఎందుకనగా, మనమచ్చట పరిశుద్ధ గ్రంథమందు మెల్కీసెదకును గూర్చి చదివెదము, అబ్రాహాము రాజులను సంహరించి తిరిగి వచ్చుచుండగా, ఆయన అతనిని కలిసెను. మరియు మూలపురుషుడైన అబ్రాహాము ఆయనకు పదియవంతును తనకు కలిగిన దానినంతటి నుండి దశమ-భాగమును ఇచ్చెను. మరియు ఆయన దశమ-భాగముల గూర్చి మాట్లాడుతూ ఇట్లనెను, “లేవి మాత్రమే దశమ-భాగములను పొందదగినవాడు,” కాని అతడు, “దశమ-భాగములను స్వీకరించిన లేవి, అబ్రాహాము నడుమలో యుండినప్పుడే దశమ-భాగములను చెల్లించెను,” అని చెప్పెను.

ఓ, మీరు దానిని గ్రహించగలుగుచున్నారా? లేవి అబ్రాహాము యొక్క మునిమనుమడు మరియు ఇక్కడ లేవి కనీసం ఎనిమిది నుండి పది వందల యేళ్ళ తరువాత లేదా ఒకవేళ అనేక సంవత్సరములు తరువాత జన్మించి ఉండవచ్చును. అదెన్ని సంవత్సరములో నాకు తెలియదు. తరముల ద్వారా దానిని మీరు అంచనా వేసి తెలుసుకోవచ్చును. అయితే అబ్రాహాము ఇస్సాకును కనెను; ఇస్సాకు యాకోబును కనెను; యాకోబు లేవీని కనెను. మరియు ఇక్కడ లేవి యొక్క తండ్రి యాకోబుయగును; ఇస్సాకు అతని తాతయ్య అగును; అబ్రాహాము అతని ముత్తాత అగును; యాకోబు అబ్రాహాము నడుములో ఉన్నప్పుడు “అతను మెల్కిసెదకుకు దశమ-భాగమును చెల్లించెనని,” పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది.

61

మరిప్పటి యవ్వన తరము, అంతటా తిరుగుచూ, పొగ పీల్చుచూ, మద్యము త్రాగుచూ మరియు ఇంకానేక వ్యసనములకు బానిసలుగా యున్నప్పుడు మరొక తరము ఉండగలదని మీరేలాగు ఎదురుచూడగలరు? అందుచేతనే మనము పాపముగలవారై యున్నాము, యవ్వన బాలికలు మరియు యవ్వన బాలురు వీధులలో విచ్చలవిడిగా తిరుగుచు బాల్యములోనే వారు నేరస్థులగుటకు కారణమేమనగా వారి తల్లిదండ్రులు గత కాలములో వారేమి చేసారో అదే అందుకు కారణమైయున్నది. అదే విధముగా గత కాలములో ప్రాచీన ఆచారపు దైవ భక్తిగల తల్లిదండ్రులను కలిగియుండుటచేతనే ఆ ప్రాచీన పద్దతిని అవలంభించే అమ్మాయిలను మరియు సత్యము కొరకు నిలుచు బోధకులను మనమింకా కలిగియుండుటకు కారణమైయున్నది. అదే ఖచ్చితముగా సత్యము. ఏ సంఘశాఖతోనూ లేక వాక్యముతోనూ రాజీపడకుండా, సత్యము కొరకు నిలుచు బోధకులను మనము ఇంకనూ కలిగియుండుటకు కారణమేమనగా, సరిగ్గా ఇదే విధముగా సువార్త పరిచర్యయందు నిలబడిన ప్రాచీనకాలపు దైవభక్తిగల బోధకులను ఆనాడు మనము కలిగియుండుటమే కారణమగును. అవును.

62

ఇప్పుడు, మనము ఈ దినమున ఉన్నాము.

మరిప్పుడు ఇక్కడ మేము చెప్పగోరుచున్నదేమనగా... (కొన్ని సంఘశాఖలు ఉన్నట్లుగా) మనము వారితో సమ్మతించి ఉండక పోవుటకు కారణమేమనగా, మనము ఒక సంఘశాఖ కాదు, ఎందుకనగా మనమొక సంఘశాఖయైన యెడల మనము దానికి లోబడి యుండవలసి వచ్చును.

మరియు జ్ఞాపకముంచుకొనుడి, మీరు కోరే ఏ స్థలములోనైనా లేఖనములలో వెదకి చూడండి, చిలకరించుట లేక తల పై నీళ్లు కుమ్మరించుట, లేక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఎవరైననూ బాప్తిస్మము పొందినట్లు పరిశుద్ధ గ్రంథములో ఏ ఒక్క సలములో కూడా మీరు కనుగొనలేరు. కావున అది లేఖనములో లేనియెడల, అది ఏదోక చోట ప్రారంభించబడినదిగా ఉన్నది.

63

నేను చెప్పుచుండినట్లుగా, ఒక పెద్ద వృక్షము క్రింద కూర్చొని, దానిని చూచుచూ అది.... ఓ, ఒక ధృఢమైనదిగా ఉండవచ్చును, అది ఎత్తుగా, చాలా పెద్దదిగా ఉండవచ్చును, అది చాలా శక్తివంతమైనదిగా ఉండవచ్చును, కాని దానికి ఒక ఆరంభము గలదు. దానికొక ఆరంభమనేది ఉండవలసియున్నది మరియు సమస్తమునూ... మనమింత ఠీవిగా నిలబడియున్న ఈ పాత-కాలపు భక్తి అనేది ఏదోకచోట ఆరంభమైయుండును. దానికొక ఆరంభమనేది ఉండవలసియున్నది. మరియు మనము కలిగియున్న ఇజమ్స్ కు ఒక ఆరంభము గలదు. మన సంఘశాఖలలో మనము వాడుచ్ను తప్పుడు లేఖనములకు ఒక ఆరంభమును కలిగియున్నది. అలాగే “నేను మెథడిస్టుని” అని మనము చెప్పినయెడల, మీరొక ఆరంభమును కలిగి ఉండవలసియున్నది. మీరు “నేనొక బాప్టిస్టుని” అని చెప్పినయెడల మీరొక ఆరంభమును కలిగియుండవలసియున్నది. మీరు, “నేనొక క్యాతలికని,” అని చెప్పినయెడల మీరొక ఆరంభమును కలిగియుండవలసియున్నది. మీరు, “నేను మరలా తిరిగి జన్మించిన ఒక క్రైస్తవుడను,” అని చెప్పినయెడల, మీరొక ప్రారంభమును కలిగియుండవలసియున్నది. మీరు దానిని కలిగి యుండవలసియున్నది.

64

వెనుకకు వెళ్ళుము, అదెక్కడ ఆరంభమయ్యెనో కనుగొనుడి. చిత్రము (బొమ్మ) యొక్క ఆరంభమునకు మనము తిరిగి వెళ్ళుదము. అట్లైతే పరిశుద్ధ గ్రంథములో సంఘశాఖనునది లేనియెడల, ఆ సంఘశాఖ ఎచ్చటో ఒక ఆరంభమును కలిగియుండవలయును. అది కాతలిక్ సంఘముతో ఆరంభమైనది. ప్రొటెస్టంటు వారు దాని నుండే పుట్టిరి.

అయితే తన సిద్ధాంతము ప్రకారము ఆమె ఒక చెడ్డ స్త్రీ అని పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లయితే, ఎందుకనగా ఆమె ఆత్మ సంబంధమైన జారత్వములు చేసినది. జారత్వము అనగా ఏమిటి? జ్ఞాపకముంచుకొనుడి, ఇంతకుముందే దానిగూర్చి మనము చూచాము. తన భర్తతో జీవించుచున్న స్త్రీ పవిత్రమైన ఒక కన్యకవలె ఉన్నది. ఆమె ఆ ఒక్క పురుషునితో జీవించినంత కాలము ఆమె ఎన్నడునూ అపవిత్రపరచబడలేదు. కాని దుర్నీతి అనగానేమి? వక్రీకరించబడిన నీతి. తన భర్తను విడిచి ఆమె మరొక పురుషునితో చేరినయెడల ఆమె భ్రష్టురాలగును. చూచారా? అదే వక్రీకరించబడిన నీతియగును.

65

ఇప్పుడు, సంఘశాఖ తప్పైనదైన యెడల.... ఒకవేళ అది సరియైనదైన యెడల, “ఇప్పుడు, మనము సంఘశాఖను కలిగియుందాము,” అని దేవుడు చెప్పియుండేవాడు. మరి... పరిశుద్ధ గ్రంథములో కాతలిక్ సంఘమును ఒక మహావేశ్యగాను, దుర్నీతిపరురాలు గాను చెప్పబడినది, ఎందుకనగా ఆమె పరిశుద్ధ గ్రంథమును త్రోసివేసి తన సమాజమునకు తన సొంత వేదాంతమును ఇచ్చుచున్నది. సహోదరుడా, సహోదరి, మీరు పరిశుద్ధ గ్రంథమును వెంబడించుటనుబట్టి కాతలిక్ సంఘము మిమ్మల్ని చూచి నవ్వుట లేదా? పరిశుద్ద గ్రంథము ఏమి చెప్పుచున్నదో దానిని వారు లెక్కచేయరు, కాని సంఘమేమి చెప్పుచున్నదో, వారి సంఘశాఖ ఏమి చెప్పుచున్నదో దానినే వారు అనుసరించెదరు. సరి, అప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మమును పరిశుద్ద గ్రంథము ఖండించుచుండగా, అదే బాప్తిస్మమును మీరు సమ్మతించి, దానిని అనుసరించుచు పిదప వారు తప్పు అని మీరెలా చెప్పగలరు? ఎందుకనగా మెథడిస్టులు ఆ విధముగానే చెప్పుచున్నారు, బాప్టిస్టులు ఆ విధముగానే చెప్పుచున్నారని మీరు కూడా చెప్పుచున్నారా? పరిశుద్ద గ్రంథములో అటువంటి కార్యమేలేనప్పుడు మీరు చిలకరింపును మరియు నీళ్లను తలపై పోయుటను మీరేలాగు అంగీకరించుచున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఎవరూ మరియు ఎన్నడూ బాప్తిస్మము పొందినట్లుగా పరిశుద్ధ గ్రంథమున ఎచ్చటా లేనే లేదు. మరి మీరేలాగు దానిని చేయుచున్నారు?

66

చూడండి, అందుకే మేము ఒక సంఘశాఖ కాదు. వారి సిద్ధాంతములతో మేము రాజీపడనవసరము లేదు. మేము తీసుకొను... ఆత్మ లేఖనము మీద వెలుగును ప్రకాశింపజేసినప్పుడు, మేము లేఖనముతోను మరియు “ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు” అను దానితోను నిలచియుందుము. అక్కడే నీవు నిలిచి ఉండాలి. అటువంటి ఏ కార్యములు లేనే లేవు. లేఖనములో అది వ్రాయబడలేదు.

ఓ, “అలాగైతే మత్తయి 28:19 గూర్చి ఏమందువు?” అని మీరు అడుగవచ్చును. ఇప్పుడు, ఇప్పటికే ఒక డజను సార్లు ఈ అంశమును గూర్చి మనము చర్చించాము. యేసు చెప్పిన ఆ విషయమును తప్పుగా అపార్దము చేసుకొనబడినది, “కావున, మీరు వెళ్ళి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మమిచ్చుచు సమస్త దేశములకు వెళ్లి బోధించుడి.” చెప్పిన ఈ విధముగా ఎప్పుడైనా ఎవరైనా చేసినట్లుగా ఉన్నదా? ఆ విధముగా బాప్తిస్మమొందిన ఏ వ్యక్తియైనా ఎక్కడైననూ ఉండెనా? ఒక్కరు కూడా లేరు. అట్లైతే ఎక్కడో ఏదో తప్పు జరిగియుండవలసి యున్నది. నిశ్చయముగా, అది కాతలికత్వము చేసిన కార్యముగా యున్నది.

67

నైసియాకు ముందున్న పితరుల కాలములో చరిత్రలో ఎప్పుడైననూ ఇటువంటిది ఉన్నదేమో చరిత్రకారులారా కనుగొని చూడండి. 'ఆంటే-నైసిన్ ఫాదర్స్' అనే పుస్తకములను చదవండి, మరియు గమనించండి, ఇంగ్లాండ్ రాజు బాప్తిస్మమును పొందుకున్నంతవరకు వాస్తవములను అన్వేషించి తెలుసుకోండి. కాతలిక్కు సంఘము ఉద్భవించేవరకు వారిలో అందురూ యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమొందినవారే, తమ ఇష్టానుసారముగా దేనినైనా మార్చగల అధికారము మాకు గలదని కాతలిక్కు చెప్పుచున్నది. కావున వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమిచ్చుటకు ఆరంభించిరి. మార్టిన్ లూథర్ దానిని బయటకు తెచ్చెను. జాన్ వెస్లీ దానిని వెంబడించెను. మరి అలెగ్జాండర్ కాంప్బెల్ దానితోనే వచ్చెను. అలాగే బాప్టిస్టు సంఘము యొక్క జాన్-స్మిత్ దానినే వెంబడించెను. ఇదిగో ఈ పెంతకొస్తు వారు కూడా ఇప్పటికీ దానితోనే ఉన్నారు. అయితే ఆ ఘడియ వచ్చియున్నది!

68

గత రాత్రి మనము ధ్యానించిన ఆ దీపస్తంభమును గమనించండి. మొదటి దీపస్తంభము వెలుగుతో ప్రకాశించుచుండెను. అది పదిహేను వందల సంవత్సరముల పాటు చీకటి యుగములగుండా ప్రయాణించుచూ, ఆ వెలుగు చీకటగుచూ, చీకటగుచూ, చాలా గాడాంధకారముగా మారిపోయెను. పిదప ఆ వెలుగు ప్రకాశించుటకు ఆరంభించెను. మరియు చివరి సంఘ కాలమునకు కొంచెము ముందుగా, ఆమె మరలా తిరిగి వెలిగింపబడినది. రెండు సంఘ కాలముల మధ్య వ్యవధిలో వెలుగు వచ్చినది. థెస్సలొనిక సంఘము, అలాగు గాఢాంధకార యుగమువరుకు ఉన్నవన్నీ ఎఫెసు సంఘకాలములో వెంబడించిన లేఖనములనే అవి వెంబడించినవి. ఆయన “నీకు కొద్దిగా బలమున్నది, కాని నీవు నా నామమును తృణీకరింపలేదు,” అనెను. మరియు తరువాత వచ్చిన సంఘము, “నీవు చాలా గొప్ప కార్యమును చేసితివి, కాని నీవు నా నామమును తృణీకరింపలేదు.” నైసీయాకు ముందున్న పితరుల కాలములో ఇదే కొనసాగినది. “నీవు నా నామమును తృణీకరింపలేదు.” ఆ తరువాత పదహేను వందల సంవత్సరములు చీకటి యుగముగా ఉండెను. ఆ తరువాత లూథరన్ సంఘము బయటకు వచ్చెను. ఆయన, “నీవు నా నామమును కలిగియుండలేదు. కాని నీవు ఒక నామమును కలిగియున్నావు.” యేసు అను నామమును మాత్రము కాదు. కాని లూథర్, కాతలిక్, బాప్టిస్టు మరియు ప్రెస్బిటేరియను అను నామములను వారు కలిగియున్నారు.

నీవు జీవించుటకు ఒక నామము నీవు కలిగియున్నావు. [మేమొక సజీవ సంఘము. మేము వర్ధిల్లుచున్నాము. మేము ముందుకు సాగుచున్నాము,“ అని మీరు చెప్పుచున్నారు.]; కాని నీవు మృతుడవే! అని లేఖనము చెప్పుచున్నది. ఈ నామమునే మనము రక్షణ పొందవలెనుగాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరే నామమున రక్షణ పొందలేము.” బాప్టిస్టు నిన్ను రక్షించదు. కాతలిక్ నిన్ను రక్షించదు. ప్రెసిటేరియను నిన్ను రక్షించదు; యేసు మాత్రమే నిన్ను రక్షించును.

69

చిన్న పాఠ్య గ్రంథములన్నిటిలో, మానవ-కల్పిత సిద్ధాంతములను వారు ఈలాగు వ్రాసిరి, “అదియే మేము నమ్ముచున్నది.” మరి దానినుండి మేము దూరంగా ఉండుటకు అదియే కారణము. పరిశుద్ధ గ్రంథము తప్ప మాకు వేరొక గ్రంథము లేదు. ఆత్మ నాయకత్వము తప్ప ఏ మానవ నాయకత్వము గాని, బిషప్పు నాయకత్వము మమ్మల్ని నడిపించదు... ఆత్మ తప్ప. అది నిజము. పిదప, ఒక తప్పుడు ఆత్మ లోపలికి ప్రవేశించి, దానిలో దేనినైననూ వంకర చేయుటకు ప్రయత్నించినయెడల, “అది తప్పు, దానినుండి దూరముగా తొలగిపొమ్ము,” అని వాక్యము దానిని చక్కదిద్దును. చూచారా? అచ్చటకు ఆత్మ వచ్చి, “అది తప్పు” అని చెప్పుచు సాక్ష్యమిచ్చును, ఏలయనగా మన ఆత్మ ఆయన ఆత్మతో కలిసి సాక్ష్యమిచ్చును.

ఒకరు ఇక్కడ వచ్చి, “ఓ మనము దానిని చేయవలెను. ఓ, వారు ఇది, అది లేక మరొక దానిని చేయుట ఏమి ఫరవాలేదని నేను అనుకొనుచున్నాను,” అని చెప్పును. కాని ఆత్మ “అతడు చెప్పిన మాటల్లో ఏదో తప్పుగా వున్నది,” అని చెప్పును. పిమ్మట పరిశుద్ధ గ్రంథము యొద్దకు వెళ్లి మనము చేయవలసిన విధానమునకు ఆమెను తీసుకొని రండి, అప్పుడు “అది తప్పు, దానినుండి దూరంగా ఉండుము,” అని ఆత్మ చెప్పును. ఆ కారణముచేతనే పరిశుద్ధ గ్రంథము, “జ్ఞానముగల మనస్సు ఇందులో ఉన్నది, బుద్దిగలవాడు ఇదిగో ఇచ్చట గలడు. దీనిని గలవాడు ఇదిగో ఇచ్చట ఉన్నాడు,” అని చెప్పుచున్నది“: అచ్చటయున్న సంఘమును క్రమములో కూర్చబడుచున్నది. దేవుని యొక్క గొప్ప ప్రణాళికను మీరు చూడగలుగుచున్నారా?

70

ఇప్పుడు చూడండి. ఫిలదెల్పియా సంఘకాలమే మెథడిస్టు సంఘకాలముగాను, సహోదర ప్రేమగల సంఘకాలముగాను, సంస్కరణల కాలముగాను ఉండెను. ఇంగ్లాండులోని ఆంగ్లికన్ సంఘములో కాల్వనిజము ఉద్భవించినప్పుడు, వారి మధ్య ఏ ఉజ్జీవము లేకుండా, ఎండు గడ్డిలో నుండి రాలిపోయిన గడ్డి విత్తనమువలె వారు ఉన్నప్పుడు, అర్మేనియన్ సిద్ధాంతమును తీసుకొనుటకు, దేవుడు జాన్ వెస్లీని ఉదారవాదిగా లేపెను. మరియు దానిని వారి తలలోకి దిగిపోవునట్లు యుక్తమైన కార్యమును అతడు చేసెను. కాని అతడేమి చేసెను? ఇచ్చట అతడు మెథడిస్టులతో పాటు వచ్చి, కాల్వనిస్టులు అనుసరించిన అదే మార్గమున కొనసాగగల అంత దూరముగా కొనసాగుతూ వచ్చెను. ఇప్పుడు దాని మధ్యలో మెథడిస్టులు మరియు బాప్టిస్టులు ఇంకా ఆ మార్గమునే వెంబడించుచున్నారు. ఇప్పుడు ఇక్కడ లేఖనములోకి వెళ్ళి చూస్తే బాగుండును. ప్రకటన 3వ అధ్యాయము తీసుకొనుము, దానిని అచ్చట మీరు చూడగలరు.

71

ఇప్పుడు, చివరి సంఘకాలము, పెంతెకోస్తు సంఘమై యున్నది, అది నులివెచ్చనిదైన లవొదకయ సంఘకాలము. అది తృణీకరించబడినదిగా ఉన్నది. కాని, యేసు సిలువలో కనబడిన విధముగానే, ఏడు సువర్న దీపస్తంభముల మధ్య సంచరించుచున్నట్లుగా కనబడుటను గుర్తుంచుకోండి, ఆయన కుడి చేయికి ఎడమ చేయి దూరము ఉన్నంతగా ఆ చీకటి ఆయనకు దూరముగా నుండెను. “మరియు ఆయన ఆల్ఫాయు మరియు ఒమేగా కనబడవలెను.” దాని మధ్యలో కాదు. ఆయన తన చేతులు చాపబడి ఉన్నప్పుడు, “అల్పాయు మరియు ఒమేగాగ” కనబడవలెను. రూబేను మరియు బెన్యామిను గోత్రములు ఉన్నట్లుగా ఆయన మాణిక్యమును మరియు సూర్యకాంతమనే రత్నములుగా యుండెను. అనగా మొదటి గోత్రము మరియు చివరి గోత్రముకు సూచనగా, అచ్చట ఆయన నిలబడి తన చేతులు చాచి యుంచెను.

72

కాని దీనిని చెప్పుచుండగా గుర్తుంచుకోండి, దానిని గందరగోళము చేసుకొనవద్దు; ఎందుకనగా, వారు స్థాపించబడిన ఈ సంఘశాఖల యొక్క పేర్లును స్వీకరించి ఆ కార్యములలో మిళితమైన సరిగ్గా ఆ క్షణమందే వారు మరణించెదరు. కాని మెధడిస్టు మరియు పెంతెకోస్తు మధ్యలో, ఆయన, “నేను మీయందు ఒక తెరువబడిన ద్వారమును ఉంచియున్నాను,” అని చెప్పెను. మీరు చెయ్యాల్సినది అదియే, ఎందుకనగా నామమును మరలా అనుగ్రహించబడినది. “నీ ముందు తెరువబడిన ఒక ద్వారమును నేను ఉంచియున్నాను. కావున నేనే మార్గము, సత్యమును, మరియు జీవమును. నా ద్వారా తప్ప ఎవడునూ నా తండ్రి యొద్దకు రాలేడు.” ఏమిటిది? అదే తెరువబడిన ద్వారమగును.

73

“ఇరుకైనది!” మీరు గమనించినట్లయితే, ఇరుకైనది, అది (s-t-r-a-i-g-h-t) తిన్నగా కాదు. అది ఇరుకైనది (అనగా s-t-r-a-i-t)గా ఉన్నది. “మార్గము ఇరుకైనది.” అనగా నీటి మార్గము ఇరుకైనది. ఎలా? “మీరు కలిగియున్న, ఆ యేసు నామమున బాప్తిస్మముకు తిరిగి రండి. ”నీకున్న... కొద్ది జీవమును నీవు కలిగియున్నావు, ఎందుకనగా నీవు నా నామమును తృణీకరించలేదు.“ ఆ తరువాత, తరువాత, ఇక్కడే వారు దానిని పోగొట్టుకొనిరి, కాతలిక్కు సంఘశాఖలోనికి వెళ్లిపోయిరి; తరువాత లూథరన్ సంఘశాఖలో నుండి బయటకు వచ్చి, ఆ తరువాత వెస్లీ సంఘశాఖలోనికి బయటకు వచ్చి, పిదప వారు పెంతెకోస్తు సంఘశాఖలోకి వెళ్ళుచుండిరి. కాని, అంత్యకాలమునకు కొంచెము ముందు విత్తనము ఇంచుమించు భూమిపై నుండి కనుమరుగైపోయినది. నీతిమంతుల విత్తనము అతి ప్రయాసతో గట్టెక్కివచ్చినది, సర్పము యొక్క విత్తనము విస్తారముగా వర్దిళ్లుచూ, అంతకంతకు వృధి చెందుచూ ఈ అణు యుగమున నాశనమగుటకు సిద్ధపడుచున్నది. ”కాని ఆ సమయమునకు కొంచెం ముందు, నేను తప్పించుకొను ఒక మార్గమును పెట్టెదను. ఒక తెరువబడిన ద్వారమును నేను మీ ముందు ఉంచెదను. ఈ ద్వారము ఇరుకైనది మరియు ఈ మార్గము సంకుచితమునైయున్నది, మరియు దానిని కనుగొనువారు చాలా కొద్దిమంది మాత్రమే ఉండెదరు. కాని నాశనమునకు పోవు దారి విశాలమైనది మరియు దానిని వెంబడించువారు అనేకులు.“

అక్కడే నీవు ఉన్నావు. కాని దీనికంటే ముందు, ఈ గొప్ప వెలుగు ప్రకాశించవలసియున్నది. నేను చాలా సంతోషించుచున్నాను. దానిని నేను ఏలాగు వ్యక్తపరచవలెనో నాకు తెలియుట లేదు. నాకు ఎంతో సంతోషముగానున్నది.

ఇది ముగించవలసిన సమయమైనది, ఇంతవరుకు నేను నా అంశమును అసలు తాకనే లేదు.

74

నేను, “పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము” అను అంశమును గూర్చి మాట్లాడాలనుకుంటున్నాను. ఒక పది లేక పదిహేను నిమిషములకు ఎలాగైనను నేను దీనిని చెప్పవలెను. గతరాత్రి నేను చేసినట్లుగా మిమ్ములను మూడు గంటలసేపు ఇచ్చట ఉంచను; సాధ్యమైనంతవరకు నేను ప్రయత్నించెదను.

ఇప్పుడు, తప్పుడు నీటి బాప్తిస్మమును ఇచ్చుచున్నందువలన సంఘశాఖలు తప్పుగా ఉన్నవి. మరి అటువంటి సంఘశాఖలను పట్టుకొని వ్రేలాడేవారు ఎవరైనా గాని వారు నిశ్చయముగా తప్పిదమైన దానికి మద్దత్తునిచ్చుచున్నారు. దేవుడు వ్యతిరేఖించుచున్నదానికి వారు మద్దత్తునిచ్చుచున్నారు. ఈ సంఘశాఖ కాలములలో ఆ విధముగానే ఉందురని చెప్పబడినది. లేఖనములో కూడా ఆ విధముగానే చెప్పబడినది. మరియు వారిని వేశ్యలని చెప్పుచున్నది, ఎందుకనగా, వారు మానవ-కల్పిత సిద్ధాంతములను బోధించుచున్నారు. “ఇప్పుడు, మనము...”

75

కొంత కాలము క్రితము నేను ఒకానొక స్థలమునకు వెళ్ళితిని, ఒక వ్యక్తి దైవిక స్వస్థత పై ఒక వ్యాసము వ్రాస్తుండెను, అతను లోపలికి వచ్చి, “బ్రెన్హాం సహోదరుడా, జనులలో నీపట్ల వున్న వ్యతిరేకమేమనగా, నీవు పెంతెకోస్తువారి దగ్గరకే వెళ్ళెదవనే ఒక కార్యము గలదు,” అని అతడు చెప్పెను.

నేను, “సరే, నీ పట్టణములో నీవు నాకు మద్దతునిచ్చినయెడల, నేను మీ యొద్దకు వచ్చెదను,” అని అన్నాను.

అతను, “మంచిది, నేను అందుకొరకు ఏర్పాటు చేయుటకు ప్రయత్నించెదను.” మెథడిస్టు సంఘమైన ఫలానా సంఘము యొక్క బిషప్పు వద్దకు వెళ్ళి దానిగూర్చి మాట్లాడాను. అంతేకాకుండా దీన్ని గూర్చి వేరే ఎవరిదగ్గర ఆలోచించనవసరము లేదని నేను తలంచి దానిని ఆ బిషప్పుతో చెప్పినప్పుడు, “ఇదిగో చూడు, మెథడిస్టు సంఘస్తులమగు మేము ఈ అద్భుతములను నమ్మము,” అని చెప్పెను.

76

ఇప్పుడు, నీవేమి చేసెదవు? ఇప్పుడు నీవు మెథడిస్టు సంఘమును లేక సంఘశాఖల మాటలను వినేదవా? నీవు అలా చేసినట్లైతే నీవొక వ్యభిచార మత సభ్యుడవగుదువు. అటువంటి ఒక కూటమునకు బాప్టిస్టు సంఘము సమ్మతించునని మీరు తలంచుచున్నారా? ఎందుకని? ఎందుకనగా, వారు బాప్టిస్టులు, వారు వేశ్యలని పరిశుద్ద గ్రంథము చెప్పుచున్నది. ఆమె తన కుమార్తెలను కనెను. మరి వారు కూడా 'వేశ్యలు'గానే ఉండిరి. ఎందుకు? దేవుని సిద్ధాంతమునకు బదులుగా అదే రకమైనటువంటి సిద్ధాంతములను, మానవ-కల్పిత బోధలను అది నీకు ఇచ్చుచున్నది. అందుకే మనము బాప్టిస్టులతో కలిసి ఒక సంఘశాఖగా మారలేదు. అందుకే మనము మెథడిస్టులతో కలిసి ఒక సంఘశాఖగా మారలేదు.

77

ఇప్పుడు, మనము పెంతెకోస్తు వారితో కలిసి ఎందుకు ఒక సంఘశాఖగా కాలేదు? ఇక్కడే విషయము గలదు. ఖచ్చితముగా అది నిజము. పెంతెకోస్తు ఎచ్చట ఆరంభమైనదో వారచ్చటే నిలిచి యుండిన... లూథరన్లు ఎక్కడ ప్రారంభమైయ్యారో వారక్కడే నిలిచి వుండినయెడల, వారే పెంతెకోస్తులై యుందురు. కాని ఈ లూథరన్లు తమని ఒక సంఘశాఖగా చేసుకున్నప్పుడు, దేవుడు వెస్లీ అను మరొక పెంతెకోస్తుని లేపెను. వెస్లీ సంఘస్తులు తమను ఒక సంఘశాఖగా చేసుకున్నప్పుడు, ఆయన బాప్టిస్టు అనెడు మరొక పెంతెకోస్తుని లేపెను. వీరు కూడా తమను ఒక సంఘశాఖగా చేసుకున్నప్పుడు, కాంప్బెలైట్స్ అనే దానిని లేపెను, వారు కూడా తమను ఒక సంఘశాఖగా చేసుకున్నప్పుడు, పెంతెకోస్తను మరొక దానిని ఆయన లేపెను. చివరకు వారు కూడా తమను సంఘశాఖగా చేసుకున్నప్పుడు, ఆయన ముందుకు సాగిపోయెను. కేవలం దానిని గమనించి చూడండి.

సంఘశాఖలు రూపొందుటనేది దేవుని యొక్క దైవిక ప్రణాళిక కాదు. అటువంటి సంఘశాఖలను కలిగియుండుట దేవుని యొక్క ప్రణాళిక కాదు. కావున మీరు చూడండి, అందుకే మనమొక సంఘశాఖ కాదు.

78

దీనిని జ్ఞాపకముంచుకొనిడి, ప్రారంభమున నేను చెప్పినట్లుగా, ఇప్పుడు, నేను మీ మనస్సులను నొప్పించినట్లైతే, అది నా ఉద్దేశ్యము కాదు. దీనిని సంఘము కొరకు చెప్పుచున్నాను. మీరు సంఘముతో కూడ ఉన్నట్లైతే, మీరిచ్చట ఉండుటను మేము ఇష్టపడుచున్నాము; కాని మేము దేనికొరకు నిలబడి యున్నామో మరియు మేమెందుకు ఒక సంఘశాఖ కాదో, దానిని మేము మీకు తెలుపుచున్నాము.

ఇప్పుడు, సంఘశాఖనేది తప్పుడు విధానముతోను మరియు తప్పుడు బోధకులతో ఆరంభమైనది. నేను చెప్పేది మిమ్మల్ని గాయపరుచును, మిమ్మల్ని గాయపరచాలనే నేను చెప్పుచున్నాను. వారు నిశ్చయముగా తప్పుడు బోధకులగుదురు. ఆ విషయములను గూర్చి ఎరిగిన ఏ మనుష్యుడైనను, పరిశుద్ధ గ్రంథము ఉపదేశించే కార్యములకు అది వ్యతిరేకమైన ఉపదేశమని ఎరిగి బాప్టిస్టు, మెథడిస్టు, లూథరన్, లేక పెంతెకోస్తుల కొరకు నిలబడి రాజీపడే ఏ వ్యక్తి అయినాగాని అతను తప్పుడు ప్రవక్తయగును. వాటిచుట్టూ అతుక్కొని ఉండవద్దు. ఖచ్చితముగా, ఆలాగు చెయ్యవద్దు. అందుకే నేను 'అసెంబ్లీస్' తో చేరలేదు. అందుకే నేను 'ఏకత్వము'తో (Oneness) చేరలేదు. అందుకే నేను బాప్టిస్టు, మెథడిస్టు, లేక ప్రెస్బిటేరియన్లతో చేరలేదు, ఎందుకనగా వారు తప్పుగా ఉన్నారు. ఆ ప్రజలు తప్పని నేను ఉద్దేశించుటలేదు గాని, వారు బోధించే సిద్ధాంతము తప్పని నేను ఉద్దేశించుచున్నాను — ఎందుకనగా అది దేవుని యొక్క వాక్యముతో సరిపోవుట లేదు. పౌలు చెప్పెను, అతను అక్కడకు వెళ్ళి... ఈ నీటి బాప్తిస్మమును గూర్చి మాట్లాడుతూ ముగించుటకు ముందుగా, పౌలు ఏమి చెప్పెనో నేను మీకు చూపించనియ్యండి.

79

యేసు ఈ ఆజ్ఞను మత్తయి 28:19 లో చెప్పినప్పుడు, పేతురు పది రోజుల తరువాత, “మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు,” అని చెప్పెను. సువార్తికుడైన ఫిలుప్పు సమరియకు వెళ్ళి బోధించినప్పుడు, మరల ఈ బాప్తిస్మమును గూర్చి ప్రస్తావించబడినది. వారందరికీ యేసుక్రీస్తు నామములోనే అతడు బాప్తిస్మము ఇచ్చెను. పౌలు, పేతరు మరియు యోహాను వచ్చి వారి మీద చేతులుంచిరి; అంతట వారు పరిశుద్ధాత్మను పొందిరి. పిదప వారు అచ్చట నుండి వెళ్ళిపోయారు. తరువాత పేతురు తిన్నగా కొర్నేలి ఇంటికి వెళ్ళెను. మరియు కొర్నేలి... “పేతురు ఇంకనూ మాట్లాడుతుండగానే, పరిశుద్ధాత్మ వారిపై దిగెను.” పేతురు, “మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవరైనను నీళ్ళను ఆటంకము చేయగలడా అని చెప్పి, వారిని యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను.”

80

ఇప్పుడు, పౌలు ఎఫెసి తీరప్రాంతమున వెళ్ళినప్పుడు కొంతమంది బాప్టిస్టులను అతను కనుగొనెను. మరియు వారు అక్కడ ఒక అపోస్తులుడని, పరిశుద్ధ గ్రంథము యొక్క అపోస్తులుడును కలిగి వుండిరి. అతని పేరు అపోల్లో, అతను ఒక న్యాయవాది, మారుమనస్సు పొందినవాడు; మరియు యేసే క్రీస్తని ప్రజలకు పరిశుద్ధ గ్రంథము ద్వారా అతను రుజువు చేయుచుండెను. “మెస్సీయ్యా ఈ కార్యమును చేయవలసియున్నది. ఈయనే ఆ మెస్సీయ్యా,” అని అపోల్లో యేసుక్రీస్తు గూర్చి చెప్పుచుండెను.

అప్పుడచ్చట పెద్ద ప్రజల గుంపు గలరు. మరి వారు ఆనందించుచూ, కేరింతలు పెట్టుచు, ఒక మంచి సమయమును కలిగియుండిరి. అకుల మరియు ప్రిస్కిల్ల అక్కడకు వెళ్లి, వారితో చేరి సహవాసం చేస్తూ ఉండిరి. వారు ఏ సంఘశాఖను కలిగియుండలేదు. కేవలము వారు సహవాసమును మాత్రమే కలిగియుండిరి. మరియు వారు ఈ మనుష్యుడు గొప్ప వ్యక్తిగా, చురుకైనవానిగా, ఒక న్యాయవాదిగా మరియు ఒక ప్రతిభావంతునిగా ఉండుట చూచిరి. కావున అతను... వారు, “ఇప్పుడు, నీవు దేనినైతే ఎరిగివుంటివో దానిని నీవు చాలా బాగుగా ఎరిగి వున్నావు, కాని పౌలు అను ఒక దీన సహోదరుడు మా వద్ద గలడు. అతను వచ్చినప్పుడు అతను పొందుకొనిన కొన్ని అనుభవములను గూర్చి చెప్పును. మరియు అతను దేనిని గూర్చి మాట్లాడుచున్నాడో దానిని అతను ఎరిగియున్నాడు. నీవు కేవలం అతని యొద్ద కూర్చొని ఆ మాటలను నీవు వినిన ప్రభువు యొక్క మార్గమును నీకు ఇంకా స్పష్టముగా బోధించును... కాని అతని మీద ఏదోకటి మోపుటకు ప్రయత్నించవద్దు, ఎందుకనగా నీ మాటలనుబట్టి అతను మౌనముగా నుండడు, మీరు చూచారా. కాని నీవు కేవలం ముందుకు వెళ్ళి, అతని మాటలను శ్రద్దగా వినుము,” అని వారు చెప్పిరి.

81

మరియు పౌలు అచ్చటకు వచ్చెను, పౌలు ఒకసారి అచ్చట ఉన్నప్పుడు, అతను అక్కడ వారిని గమనించుచూ, వారి మాటలను వినెను. “అది చాలా మంచిది, కాని బాప్టిస్టులైన మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా?” అని పౌలు వారిని అడిగెను.

“ఓ,” దానిని మేము పొందలేదా?“ అని వారు అన్నారు.

“దానిని పొందామని అనుకోవట్లేదు?”

“మంచిది, ఎందుకు?”

“మంచిది, మీరే విధముగా బాప్తిస్మము పొందితిరి?” అని పౌలు వారిని అడిగెను.

“ఓ, మేము బాప్తిస్మము పొందితిమి. మేము బాప్తిస్మము పొందితిమి,” అని చెప్పిరి.

“సరి, ఎవరు మీకు బాప్తిస్మము ఇచ్చిరి? మీరేవిధముగా బాప్తిస్మము పొందితిరి? అలాగైతే దేనినిబట్టి బాప్తిస్మమును (Unto what) పొందితిరని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. గ్రీకు భాషలో, ”అలాగైతే ఏ విధముగా [Unto how]“ అని ఉన్నది. ”అలాగైతే దేనినిబట్టి,“ అని చెప్పుచున్నది. ”నీవు దేనివలన బాప్తిస్మము పొందితిరి?“ వేరొక మాటలలో ”ఏ విధముగా బాప్తిస్మము పొందితిరి?“ అని అర్ధము.

“బాప్తిస్మమమిచ్చు యోహానుచే బాప్తిస్మము పొందితిమి, యేసుక్రీస్తుకు బాప్తిస్మము ఇచ్చిన అదే వ్యక్తి, అదే నీటి గుంటలో బాప్తిస్మము తీసుకున్నాము,” అని వారు చెప్పిరి. అది చాలా చక్కటి బాప్తిస్మము. మీరు ఆ విధముగా అనుకొనుట లేదా? అది సరిగ్గానే అతుకునట్లుగా కనిపించుచున్నది కదా? మన ప్రభువైన యేసుక్రీస్తుతో నీటిలోనికి నడిచి, యేసుతో బాప్తిస్మము తీసుకొనుటనేది చక్కగానే ఉన్నట్లుగా మనకు అనిపించును. అలాగే దేవుడు పరిశుద్ధాత్మ రూపములో దిగివచ్చి, యేసులోనికి ప్రవేశించినంత వరకు దేవుడు దానిని అనుమతించెను. ఆయన బాప్తిస్మమును తీసుకున్న వెంటనే, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నివసించుటకు నేనాందించుచున్నాను” అని దేవుడు చెప్పెను. ఈ బాప్తిస్మము బాగుగానే ఉన్నట్లు నాకు అనిపించుచున్నది.

82

కాని పౌలు, “అది ఇప్పుడు ఇక పని చేయదు, ఏ మాత్రము పని చేయ్యదు,” అని చెప్పెను.

“అదెందుకు ఇకెంత మాత్రము పని చేయదు?” చూచారా?

“మీరు మరలా బాప్తిస్మము పొందవలసియున్నది,” అని పౌలు చెప్పెను.

“యేసుకు బాప్తిస్మము ఇచ్చిన యోహానుచే బాప్తిస్మము పొందిన మేము మరలా బాప్తిస్మము పొందవలెనని నీవు చెప్పుచున్నావా?” అని వారు అడిగిరి.

“అది నిజము.”

“అలాగైతే ఏ విధముగా మేము బాప్తిస్మము పొందవలెను?” అని వారు అడిగిరి.

“యేసుక్రీస్తు నామములో,” అని పౌలు చెప్పెను. పౌలు వారందరినీ తీసుకొని వెళ్లి, వారికి బాప్తిస్మము ఇచ్చెను. అపోస్తులు కార్యములు 19:5 “వారు దీనిని వినినప్పుడు, వారు మరలా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందిరి. మరియు పౌలు వారి మీద చేతులుంచగా, వారు పరిశుద్ధాత్మను పొందిరి.”

స్త్రీ మరియు పురుషులను యేసుక్రీస్తు నామములో మరలా బాప్తిస్మము పొందుమని పౌలు నిర్బంధించి ఇచ్చినయెడల, నేను దానికి వ్యతిరేకముగా వేరొక సువార్తను బోధించిన యెడల, అప్పుడు నాలోవున్న ఆత్మ పౌలు కలిగివున్న ఆత్మలాంటిది కాదు. “నేను మీకు వ్రాసియున్నవి దేవుని యొక్క ఆజ్ఞలని అతడు అంగీకరించును గాక.”

83

ఇప్పుడు గలతీయులకు 1:8లో పౌలు, “పరలోకము నుండి ప్రకాశవంతమైన ఒక దూత దిగివచ్చిననూ,” అని చెప్పెను. అతడు దేనిగూర్చి మాట్లడుచున్నాడు? ఒక ప్రత్యక్షతను గూర్చి. ప్రభువు నామము స్తుతించబడును గాక! మీ ప్రత్యక్షత ఎంత బాగున్నను అది అనవసరము. కూటము ప్రారంభములో ఈ ఉదయమున ఊరీము తుమ్మీము గూర్చి మాట్లాడిన విషయము మీకు గుర్తున్నదా? ఎవరైనను ఏదైనా ఒక కార్యమును గూర్చి చెప్పినప్పుడు అది లేఖనానుసారము కానియెడల అతను ఒక అబద్దికుడగును. అతను ఒక అబద్దపు దూతయగును, తన స్వంత వర్తమానమును తీసుకొనివచ్చి చెప్పు ఏ వ్యక్తియైనా ఒక అబద్దపు ప్రవక్తయగును. బాప్తిస్మము పొందుటకు ఒకే ఒక్క మార్గము గలదు, అదే యేసుక్రీస్తు నామమగును. మీరు ఆ విధముగా బాప్తిస్మము పొందకపోయినయెడల, అదిగో అక్కడ ఒక బాప్తిస్మపు తొట్టి వేచియున్నది. అది నిజము.

తప్పుగా! తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఎవరైననూ ఎక్కడైననూ బాప్తిస్మము పొందినట్లుగా ఒక్క స్థలమును నాకు చూపించండి. అది పరిశుద్ద లేఖనములో లేదు. అటైతే అదేమిటి? అది కాతలిక్ సంఘముతో ప్రారంభమైన మత సిద్దాంతము. దీనిని మనము రుజువు చేయగలము. మన వద్ద పూర్తిగా నైసీ పితరుల సిద్దాంతములే గలవు. దానికి సంబంధించిన చరిత్ర పుస్తకములు మన వద్ద ఉన్నవి. హిస్లోపు యొక్క రెండు బబులోనులు అనే చరిత్ర మన వద్ద గలదు. మన వద్ద జోసెఫన్ వ్రాసిన వ్రాతలు గలవు. పురాతన చారిత్రక ఆధారములన్ని మనయొద్ద వున్నవి. యేసుక్రీస్తు కాలములోనే జోసెఫస్ దానిని వ్రాసెను. దానితరువాత హిస్లోపు యొక్క రెండు బబులోనులు వ్రాయబడినది. పిదప “యాంటే-నైసీన్ ఫాదర్స్,” వ్రాయబడినది, కాతలిక్ సంఘము ఏర్పడక మునుపు వ్రాయబడినది. ఆ తరువాతే కాతలిక్ సంఘము లోపలికి ప్రవేశించి అసలైన వాటన్నిటిని త్రోసివేసి, సమస్తమును కైవశము చేసుకొని అన్య రోమ్ పోపుల రోమ్ గా మార్చబడెను. అక్కడనుండే వారు తప్పుడు చిలకరింపు నీటి బాప్తిస్మమును మరియు ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు బదులుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమనే తప్పుడు బాప్తిస్మమును ఇచ్చుటకు ఆరంభించిరి. మరియు యేసు, పత్మాసులోనున్న యోహానుకు ఆత్మ ప్రేరేపణ ద్వారా ఇలా చెప్పెను, “నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది, కాని నీవు మృతుడవే.” “తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ” ఒక మృతతుల్యమైన నామముగా వున్నది.

84

స్విట్జర్లాండ్, జర్మనీ, మరియు అనేక స్థలాలో నేనుంటిని, కావున నాకు సంభవించిన ఒక చిన్న వ్యక్తిగత అనుభవమును మీకు నేను చెప్పనివ్వండి. జోతిష్కులు ఏ విధముగా పని చేయుదురు? దురాత్మలు ఏ విధముగా పయణించును? మీ కాపరిగా నేను చెప్పే ఈ విషయమును మీరు నమ్మవలెనని నేను కోరుచున్నాను, ఎందుకనగా నేను మీతోనే చెప్పుచున్నాను. దురాత్మలు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనే పయణించుచున్నవి. వారు ఈకలను కత్తిరించి పెట్టుకొని, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామము ద్వారా ఒకరి మీద ఒకరు మంత్రములను వల్లించెదరు. వాటిని మూడు ఉన్నతమైన నామములుగా వారు పిలుచుచుందురు. కాతలిక్ సంఘములు దానికి తల్లిగా ఉన్నవి. ఈ చిన్న విగ్రహములయెదుట సాగిలపడి, కత్తెరతో ఒక ఈకను కత్తిరించి, దానిని వెనుకకు త్రిప్పి, తమ ఇరుగుపొరుగు వారిపై మంత్రములను ఉచ్చరిస్తూ మరియు ఆలాగున దానికొరకు అక్కడ వారు మరణించినట్లు కాల్చబడుదురు, అంతే కాకుండా ఇంకా అటువంటివి అనేక కార్యములు వారు చేసెదరు.

స్విట్జర్లాండులో ఈ విధముగా నా చేతులు ఆ ద్వార బంధముపై పెట్టి నేను నిలిచియుంటిని. యధార్దవంతులైన పురుషుల, స్త్రీల నాలుకలను కోసి, కాల్చిన ఇనుప కడ్డీలతో వారి కళ్లల్లో పొడిచి, ఇంకా నానావిధాలుగా వారిని చిత్రహింసలు పెట్టి వేశ్యయగు ఆ కాతలిక్ సంఘము వారిని చంపెను. అదొక్కటే కాదు, మీ పురాతన ఆంగ్లికన్ సంఘములు కూడా అదే చేసెను. ప్రొటెస్టంటు సంఘములగు మీరు కూడా అలాగే చేసిరి. వారు “తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ,” నామములోనే ఆ మంత్రములను ఉచ్చరించిరి.

85

మీ సహోదరుడుగా మరియు మీ కాపరిగా నేను దేవుని కృపవలన ఈ విషయములలో కాపాడబడుటకు, అంతేకాక నేను మాట్లాడుచున్న వాటిగూర్చి ముందుగా నాకు తెలుసుకొనే భాగ్యమును బట్టి నేను కృతజ్ఞతను కలిగియున్నాను. ఒకసారి ఒక స్త్రీ ఈ సంఘమునకు వచ్చి నన్ను ఖండించి, “ఇతను ప్రేతాత్మలతో సంబంధమునుగలవాడై మోసగించుచున్నాడు,” అనెను. పరలోకమందున్న దేవుడు అది అంతయూ ఏమిటో ఎరిగియున్నాడు.

నేను ఏ మనుష్యుని యొక్క... పారిస్ లో యున్న పిగ్ ఆలే అను స్థలముగలదు, అదెంతో దుష్ట స్థలమని, ఈ స్థలమందే అటువంటి మాంత్రికులుగలరని వారు చెప్పేంతవరకు నాకు ఆ స్థలమును గూర్చి తెలియదు. ఎందుకనగా నేనెన్నడు అచ్చటకు వెళ్లియుండలేదు. కాని ఆ తర్వాత వారు చెప్పినది నిజమా కాదాయని కనుగొనుటకు నేను అచ్చటకు వెళ్లాను. నాతో కూడ ఇద్దరు లేక ముగ్గురు దైవ సేవకులను తీసుకొని వెళ్లగా, అక్కడ ఆ వీధిలోనే ఆ స్త్రీలు తమ వస్త్రములు విప్పుట మరియు అలాంటివి ఉండెను. అది నిజము.

రోమ్ ఏడు కొండలపై ఉన్నదని నాకేలాగు తెలియును? “వికారియస్-ఫిల్లి-డి” (VICARIUVS FILII DEI - దేవుని కుమారునికి బదులుగా ఆ స్థానమున నిలుచుట), అనే అర్ధమును కలిగియున్న మాటను పోపు కిరీటమందు ఉన్నదని నా కేలాగు తెలియును? ఎవరో చెప్పిన మాటలనుబట్టి నమ్మవలెనా? పరలోకమున, భూమిపై మరియు పాతాళమున సర్వాధికారము తమకు ఉన్నట్లు సూచనగా చూపే ముక్కోణపు కిరీటమును పోపు ధరించివుండెనని నాకేలాగు తెలియును? నేనే స్వయముగా అచ్చటకు వెళ్ళి, దానిని చూచునంత వరకు అది నాకేలాగు తెలియును?

86

ఒక జీవముగల ఒక దేవుడు ఉన్నాడని నేనెట్లు తెలుసుకోగలిగితిని? ఎవరో చెప్పిన వేదాంత శాస్త్రము బట్టి కాదు, నాస్తికులు మనతో చెప్పునట్లుగా, గత కాలంలో ఏదోక ఉద్వేగభరిత సమయమున ఎవరో ఒక మేధావి చెప్పిన భావములను బట్టి కాదు; కాని ఒక రోజు నేను ఆయనను కనుగొంటిని, ఆయనతో ముఖాముఖిగా మాట్లాడితిని, అదే నా యొక్క కార్యములను వ్యత్యాసముగా చేసెను. ఖచ్చితముగా అదే వాస్తవము.

మరణించిన ఆత్మలతో సంబంధమును కలిగివుండి మాట్లాడగల దుష్ట ఆత్మను గల మాంత్రికులు, “తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ” నామమును ఉచ్చరించుచూ పని చేయుదురు. ఆ మాంత్రికులు మంత్రాలను ఉచ్చరించుచూ, క్రియ చేయుచున్న ఒక కూడికలో నేను ఉంటిని. వారు మీకు సవాలు చేయలేరని అనుకోవద్దు. వారు అక్కడ నిలబడియుండి, ఒక బల్లను గాలిలోకి విసరగా, అదలా చుట్టూ తిరుగుచు తేలియాడినది; మరియు ఒక గిటారు దానంతట అదే సంగీతమును వాయించుచుండెను. అప్పుడు అక్కడ నిలిచియున్న నన్ను వెలుపలికి పంపించదలచిరి. నేను “మీరు చేయునది తప్పు!” అని చెప్పితిని. కాని దురాత్మ తిరిగి వారితో మాట్లాడినది, ఆ దురాత్మ తానే దేవుడనని చెప్పుకొనుచూ, అది తాను దేవుడనని చెప్పుకొనినది. నేను, “అది తప్పు; అది దయ్యము!” అని చెప్పితిని.

వారు, “ఈ మనుష్యుడు అవిశ్వాసి” అని చెప్పిరి.

నేను, “అవును ఇటువంటి దుష్టచేష్టలకు నేను అవిశ్వాసినే, ఎందుకనగా ఇది నా ప్రభువు ద్వారా కలిగినది కాదు. ఇది మాంత్రిక చర్య. ఇది దయ్యపు కార్యము. కావున ఇప్పుడు నేను బాప్తిస్మము పొందిన ఈ శక్తివంతమైన నామములో ఇచ్చట అది దయ్యమని నిరూపించుటకు నేను ప్రయత్నించెదను. ”ఉన్నతమైన పరలోకము నామములో నిజము తెలుపుము,“ అని నేను అడగగా; ఏ జవాబు రాలేదు. ”పరిశుద్ద సంఘము“ నామములో నిజము చెప్పుము” అని అడగగా; ఏ జవాబు రాలేదు. “తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నిజము తెలుపుము” అని నేను అడగగా; అతడు ఏ జవాబు చెప్పలేదు. మరియు అంతట నేను, “యేసుక్రీస్తు నామములో నిజము చెప్పుము” అని నేను అడిగాను. అతడు, “అవును, నీవన్నట్లు అది తప్పు” అని అనెను. అది నిజమని దేవునికి తెలియును. అవునండి.

ఓ, తండ్రియందు విశ్వాసము,

కుమారునియందు విశ్వాసము,

పరిశుద్ధాత్మ యందు విశ్వాసము,

ఈ మూడు ఒక్కటే.

దయ్యములు వణుకును,

పాపులు మేల్కొందురు,

ప్రభువైన యేసునందు విశ్వాసము ద్వారా

దేనినైనా కదుల్చును.

అవునండి. ఆ నామముతోనే నిలిచియుండుడి.

“జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది, కాని నీవు మృతుడవే.” అదే నీ సంఘము యొక్క పరిస్థితిగా ఉన్నది. అలాగే అది ఉన్నది.

87

వినండి, ఒక స్త్రీ కూర్చొనియున్నది... ఈ ఉదయ కాలము, ఈ మందిరమందు చాలా మంది చక్కటి, అందమైన స్త్రీలు ఇక్కడ కూర్చొనియున్నారు. యౌవ్వన స్త్రీలు, మధ్య వయస్సున స్త్రీలు, వృద్ద స్త్రీలు వారందరు చక్కని వారు. కాని వారు ఎవరో ఒకరి భార్యగా, ఎవరో ఒకరి కుమార్తెగా, ఎవరో ఒకరి ప్రియురాలుగా ఇంకా అనేక విధాలుగా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎవరో ఒకరికి చెందినవారు. కాని ఇచ్చట శ్రీమతి. బ్రెన్హాంగా ఒకరు కూర్చొనియున్నారు. మీరు అందరునూ స్త్రీలే. కాని శ్రీమతి. విల్లియం బ్రెనాం ఒక్కరే గలరు. ఆమె మాత్రమే నాతో ఇంటికి వచ్చును. ఆమెయే నా హృదయ ప్రియురాలు. ఆమె మాత్రమే నా పిల్లలను పెంచి పెద్ద చేసేది.

ఈ రోజు ప్రపంచములో చక్కటి సంఘములు చాలా ఉన్నాయి, కాని అసలైన, సత్యమైన తిరిగి-జన్మించిన దేవుని యొక్క సృష్టిని శ్రీమతి. యేసు మాత్రమే తీసుకొని రాగలుగుచున్నది. నేను దేనిని ఉద్దేశించి చెప్పుచున్నానో మీకు అర్థమైనదా? ఆమె పేరు మెథడిస్టు కాదు, బాప్టిస్టు కాదు. ఆమె పేరు యేసు, శ్రీమతి. యేసు. నిశ్చయముగా, ఆమెయే. మెథడిస్టు సంఘ సభ్యులను తీసుకురావటలేదు, బాప్టిస్టు సంఘసభ్యులను తీసుకురావటలేదు, లేదా ప్రెస్బిటేరిన్ లేక కాతలిక్ సంఘసభ్యులను తీసుకురావటలేదు. యేసుక్రీస్తులో జన్మించి, ఆయనలో నాటబడి మరియు స్థిరపరచబడిన జనులనే ఆమె తనలో నుండి వెలుపలికి తీసుకొని వచ్చుచున్నది. ఆలాగే ఆమె వాళ్లను జన్మింపజేయుచున్నది. అదే ఆమె యొక్క విధానము. ఆమెతో ఉన్నందుకు నేనెంతో సంతోషించుచున్నాను. ఆమె ఒక మర్మయుక్తమైన సంఘము. ఆమెకు ఏ సంఘశాఖ లేదు. ఈ గొప్ప ప్రఖ్యాతిగాంచిన ఆకర్షణీయమైన పేర్లును మరియు పెద్ద భవనములను ఆమె మోసుకొని వెళ్లదు. శరీరము యొక్క సభ్యులు ఎచ్చట ఏకమై కూడుకొనెదరో, అచ్చటే ఆమె వారిని సంధించును. వారు ఆత్మతోను మరియు సత్యముతోను ఆరాధించెదరు. వారు జగత్తుకు పునాది వేయబడక మునుపే ఎన్నుకొనబడినవారు.

88

మరొక లేఖనము మరియు నేను ముగించెదనని మీకు వాగ్దానం చేయుచున్నాను. మరియు మిగిలిన అంశమును ఈ రాత్రికి చెప్పెదను. లియో, ఈ రాత్రికి నీవు దానిని అర్ధము చేసుకోగలవు.

ఒక నిమిషము ఎఫెసీయులకు వెళ్ళి చూద్దాము. ఈ ఒక్క లేఖనమును చదవిన పిదప నేను మిమ్ములను పంపించెదను. దీనిగూర్చి పరిశుద్ద గంధము ఏమి చెప్పుచున్నదో మనము కనుగొనెదము. గొప్ప బోధకుడైన పౌలు చెప్పిన విషయమును నేను తీసుకొన బోవుచున్నాను... అతనివంటి గొప్ప బోధకుడు వేరే ఎవ్వరు లేరు. అన్యజనుల సంఘమునకు అతను అపోస్తులుడుగా ఉండెను. ఎఫెసీయులు 1వ అధ్యాయము తీసుకొనండి.

ఇప్పుడు, మనము ఇంకొక నిమిషములో ముగించబోవుచున్నాము, నా ప్రియ స్నేహితుడా, దీనిని వినుము, ఈ ఉదయమున నేను ఎటువంటి సంఘమునకు ప్రసంగించుచున్నానో అదే విధమైన సంఘమునకే పౌలు ప్రసంగించుటను మీరు వినండి.

దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపోస్తులుడైన పౌలు... [ప్రెస్బిటేరియన్ సంఘమునకా? ఏ సంఘమునకు?] ... ఎఫెసులో ఉన్న పరిశుద్దులకు [పరిశుద్దులైన వారికి]... [ఇప్పుడు, వారు ప్రపంచమంతటనూ చెల్లాచెదరివున్నారని జ్ఞాపకముంచుకొనుడి. కాని ఎఫెసులోయున్న ఈ గుంపును ఉద్దేశించి పౌలు మాట్లాడుచున్నాడు. లోకములో యున్న జనులనుద్దేశించి అతడు మాట్లాడుటలేదు; స్థానిక సంఘ సభ్యులతో అతను మాట్లాడుట లేదు; కాని దీనిని పరిశుద్దులైన వారినుద్దేశించి అతడు మాట్లాడుచున్నాడు, మీరు చూచారా. మరియు క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి, క్రీస్తు యేసులోనికి మనమేవిధముగా వెళ్ళెదము? “మనమందరమూ ఒకే ఆత్మతో బాప్తిస్మమును పొంది, విశ్వాస పాత్రులుగా జీవించుచున్నాము. నీవు పరిశుద్ధాత్మను పొందియున్నావని ఏ విధముగా తెలుసుకొందువు? మనము బహుశా ఈ రాత్రికి దానిని తెలుసుకొనెదము. చూచారా? మంచిది.] ...క్రీస్తు యేసునందు:

మన తండ్రియైన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.

మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.

89

అదెక్కువగా కేకలు పెట్టదని మీకు తెలుసా, అది గట్టిగా అరవదు, అవన్ని ఫరవాలేదు అది తప్పని చెప్పుటలేదు, అవన్ని సరే. కాని దానికి కావలసినది అది కాదు. సమర్పింపబడిన ఒక హృదయమును అది కోరుకొనును, పరలోక స్థలములందు కూర్చొని ఆత్మ సంబంధమైన విషయములందు విందారగించును. మరియు ఆత్మ దేనిపై విందారగించును, ఉద్రేకము మీదా? పూర్తిగా దానిమీద కాదు. అది ఉద్రేకమును తెచ్చును. చూచారా, కాని నీవు...

గురుగులు మరియు గోదుమల మీద కురిసే వర్షము గూర్చిన దర్శనము మీకు జ్ఞాపకమున్నదా? గుర్తుంచుకొనుడి, వర్షము అవసరమైనప్పుడు, ఆ చిన్న గురుగు యొక్క తల క్రిందికి వంగిపోయి ఉండును; గోదుమ దాని తల వంగిపోయి ఉండును. వర్షము వచ్చినప్పుడు ఆ రెండూ కూడా ఎగిరి గంతులు వేస్తూ కేకలు వేసినవి. వర్షము ఒక్కటే, రెండిటిపైనా కురిసినది. “కాని వారి ఫలములనుబట్టి వారిని మీరు తెలుసుకొందురు.”

మన తండ్రియైన దేవుని నుండి మీకు కృప కలుగును గాక... [ఇప్పుడు గమనించండి.]

[ఇప్పుడు 4వ వచనము.] తన చిత్తప్రకారము చొప్పున ఆయన మనలను తనలో ఎన్నుకొనెను [గత ఉజ్జీవమందా ఎన్నుకొనెను? (సంఘము, “కాదు” అని చెప్పుచున్నది.) హు! (“కాదు”). బాప్టిస్టు లేదా మెథడిస్టు సంఘ సభ్యుడైనప్పుడా? కాదు. వారు ఆ కూడికలో ఉండుటకు మునుపే, “ఏర్పరచుకొనెను.” అవును.] జగత్తు పునాది వేయబడకముందే, [మనలను సరిగ్గా అప్పుడే ఎన్నుకొనెను. ఇప్పుడు, మనము ఆయనను ఎన్నిక చేసుకోలేదు; ఆయనే మనలను ఎన్నుకొనెను. చూచారా? జగత్తుపునాది వేయబడక మునుపే ఆయన మనలను ఎన్నుకొనెను.] మనము పరిశుద్దులుముగా ఉండవలెనని...

90

మనమేవిధముగా పరిశుద్ధులముగా ఉంటిమి? మనము చేసిన క్రియలబట్టి కాదు, కాని ఆయన మనకొరకు చేసిన దానినిబట్టి, ఎందుకనగా పరిశుద్దులముగా ఉండుటకు మనకు సాధ్యమవ్వదు. ఒక పందిని నీవేవిధముగా ఒక గొర్రెపిల్లగా మార్చగలవు? రాయ్ సహోదరుడా, నీవు పందులను మరియు గొర్రెలను రెండింటిని పెంచావు. అయితే ఆ రెండింటిని నీవు కలుపలేవు. ఒక పంది... అది ప్రతీచోటా తిరుగుతూ, మరియు అది తినే అన్ని రకాల చెత్తను తినును. ఒక పెంట కుప్ప మీద కూర్చొని అది తన కడుపునిండుగా తినును. సరి, అదలాగువున్నా దానిగూర్చి నీవేమి అంతగా పట్టించుకొనవు. అది పంది కాబట్టి అదలాగే ఉండునని నీవు తలంచెదవు. అది కూడా మంచిపందే. దాని స్వభావము అంతే. కాని అలాగు ప్రతీచోటా తిరిగే ఒక గొర్రెపిల్లను నీవు చూడలేవు. పెంట దిబ్బల మీద ఉన్న దానిని తినుటకు పంది గొర్రెపిల్లను ఆహ్వానించలేదు. అది రాదు. వెళ్లదు. కారణమేమిటి? ఎందుకనగా, అదొక పంది. నీవు వెళ్ళి ఆ పందితో అలాగు పెంట కుప్పలపై తినకూడదని చెప్పిన, “దేవుడు ఆశీర్వదింపడును గాక, నేనొక పందిని. నీవెక్కడ ఉండాలో అక్కడ వుండు. నీవు నీ స్థలానికి వెళ్ళుము. పరిశుద్ద గుండ్రాయిగా నీవు ఉండాలనుకుంటే వుండుము,” అని పంది చెప్పును. అదే దాని స్వభావము. “నీవు లోకమును లేక లోక సంబంధమైన కార్యములు ప్రేమించినయెడల, దేవుని ప్రేమ నీలో లేదు,” అని వాక్యము చెప్పుచున్నది.

91

ఇప్పుడు, నేను ఆ పెంటను తినుట మానివేసాను, అందువలన నాకున్న పంది స్వభావము నాలో నుండి పోయి నన్నేమైనా వ్యత్యాసము అది మార్చివేసినదా, (చూచారా?) నేనికమీదట పందిగా ఉండనట్లు అదేమైనా మార్చివేసినదా; అది అలా కాదు. కాని నా స్వభావము మారినప్పుడు. “ఓ, వారు నా చుట్టూ ఒక కంచెను వేసి, నన్ను నిర్బంధించి, ”నీవు ఇటువంటివి చేయకూడదని,“ ఒక అడ్డుకట్టలాంటిది వేసెదరని నేను ఊహించుచున్నాను. ఓ, లేదు. నీవు కేవలం మరలా జన్మించుము, అప్పుడిక నిన్ను నిర్బంధించివుంచే అడ్డుకట్టలాంటిదేది అవసరము లేదు, అంతే. ఇక నీవు మార్పు చెందితివి. అది నిజము.

కావున ఆ గొర్రెపిల్లలోవున్న ఆత్మను బయటకు తీసి దానిని పందిలో నీవు పెట్టగలిగినయెడల, గొర్రెపిల్లవలె ఈ పంది అదే కార్యములను చేయును. అలాగే పందిలోవున్న ఆత్మను తీసి గొర్రెపిల్లలో పెట్టిన ఆ పందివలె ఈ గొర్రెపిల్ల ప్రవర్తించును. ఆ గొర్రెపిల్ల వెనుకకు తిరిగి ఈ పంది ఏమి చేయునో అదే కార్యమును అది చేయును. ఇప్పుడు చూడండి, పందుల్లారా, మీరెక్కడవున్నారు? అది ఖచ్చితముగా నిజము. అది సరియే. చూచారా?

92

మీరు బయటకు వెళ్ళి మరియు లోకకార్యములను ప్రేమించి, పొట్టి వస్త్రములను ధరించి మరియు వీటన్నిటిని చేయుదురు. అలాగే చేస్తూ ఉండుడి, దానినిబట్టి మీరు ఎలాంటివారనేది అది చూపుచున్నది. “వారి ఫలములను బట్టి వారిని తెలుసుకొందురు, ముళ్ళ చెట్టు నుండి ఎవరైననూ అంజూరపు పండ్లను ఏరుకొనెదరా?” చూచారా? లేదు, లేదు. నీవు అంజూరపు చెట్లనుండి అంజూరపు పండ్లనే కోసుకొందువు. ఆపిల్ చెట్ల నుండి ఆపిల్ పండ్లే నీకు లభించును. ముళ్ళ చెట్ల నుండి ముళ్ళే లభించును. అదే వాస్తవం.

ఇప్పుడు, చాలా శ్రద్దగా వినండి.

తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్తప్రకారమైన దయాసంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన యెదుట పరిశుద్దులమును, నిర్దోషులమునై యుండవలెనని...

ఎవరు దానిని చేసిరి? ఎందుకనగా నేను త్రాగుటమాని వేసితిని? నేను పొగ త్రాగుట మానివేసితిని? లేదు. నీవు దానిని చేయలేదు, ఆయనే దానిని చేసెను. జగత్తు పునాది వేయబడకమునుపే తన కృపా సన్నిధిలో నేను అంగీకరింపబడునట్లుగా ఆయనే దానిని చేసెను. నేను ఏమియూ చేయలేదు. అందుకొరకు ఏ ఒక్క కార్యమును నేను చేయలేదు. అసలు ఏదైనా చేయుటకు నాయొద్ద ఏమియు లేదు. ఆరంభమునందే నేను ఒక పందివలె ఉంటిని. తాగుబోతుల కుటుంబములో పుట్టి, దొంగ సారాయిని కాస్తూ పెంచబడి, సారాయి పీపాల యొద్ద కూర్చుంటూ, అవమానకరమైన పరిస్థితులలోవుంటూ నేనొక పాపిగా వుంటిని, అది నిజము. కెంటకీలో దొంగ సారాయి కాచేవానిగా, పెద్దవాడనయ్యేంత వరకు కనీసం ఎన్నడునూ ఒక జత బూట్లను కూడా నేను వేసుకొనలేదు. వెంట్రుకలు నా మెడ మీద పొడుగుగా వ్రేలాడుతూ, దొంగ సారాయి కాచే పీపాల చుట్టూ తిరుగుచూ, దొంగసారాయిని తయారు చేస్తూ పెరిగినవాడిని. అయిననూ, ఏడు సంవత్సరముల వయస్సులో పరిశుద్ధాత్మ నా వద్దకు వచ్చెను. “ఆ సారాయిని ఒక్క చుకైననూ నీవు ముట్టవద్దు. అచ్చటయున్న అమ్మాయిల వద్దకు వెళ్ళి, వారితో బుద్దిలేనివానివలె తిరగవద్దు. అంతేకాకుండా, సిగరెట్టును త్రాగుటగాని లేక పొగాకును నమలుటను చేయవద్దు.” ఓ, మై! అదేమిటి? సువార్త ప్రకటించుటకు మరియు ఆయన గొర్రెలను నేను నడిపించుటకు జగత్తుకు పునాది వేయబడకముందే అది తండ్రి యొక్క సమయోచితమైన చిత్తమైయుండెను. నిరంతరము దేవుని నామము ఆశీర్వదింపబడును గాక! నేను మునిగిపోయినా లేక కూలిపోయిననూ, నాకు కీర్తి కలిగిననూ లేక అపకీర్తిపాలైననూ ఆయన వాక్యముతోనే నేను నిలిచియుందును, ఎవరు నన్ను ప్రేమించిననూ లేక ప్రేమించక పోయిననూ, నేను ఆయనను సంతుష్టిపరచుదును. ఆయన దేనియందు ఆనందించునో దానినే నేను చేయుటకు ఇష్టపడెదను.

93

బాప్టిస్టులు మరియు మెథడిస్టులు నన్ను తృణీకరించినా, “పరిశుద్ధాత్మను పొందుకొనుటకు ఆరంభపు రుజువు అన్యభాషలలో మాట్లాడుట,” అని పెంతెకోస్తువారు చెప్పుచున్నారు. మనము పెంతెకోస్తు కాకపోవుటకు అదే కారణము. ఒక గాదెలో ఉన్నంత మాత్రమున పందిగా మారిపొతాదనేది మనము నమ్మనట్లుగానే మీరు అన్యభాషను మాట్లాడుటవలన పరిశుద్ధాత్మను పొందుకున్నారని మేము నమ్మము. లేదండి. అలాగుననే రాజభవనములో నీవు ఉన్నంత మాత్రాన నీవు ఒక రాజువై పోవుదని మేము నమ్మము. అది అలాగు సాధ్యపడదు! నీవు ఒక సేవకుడిగా ఉండవచ్చును. చూచారా, నీవు ఇంకేదైననూ కావచ్చు. కాని నీవొక రాజగుటకు సాధ్యమవ్వదు.

లేదండి! పరిశుద్ధాత్మను ఒక అనుభవము ద్వారానే నీవు పొందుకొనెదవని మేము నమ్ముదుము లేఖనములను గూర్చి నీ తెలివితేటలతో నేర్చుకొనిన కల్పితమైన భావనల ద్వారా కాదు కాని, నీ వ్యక్తిగతమైన అనుభవము ద్వారానే పరిశుద్ధాత్మను నీవు ఎరుగగలవు. ఇప్పుడు అది పరిశుద్ధాత్మమా కాదాయని నీవు తెలుసుకోవాలంటే, దానితర్వాత నీ జీవిత విధానాన్ని (ప్రవర్తన) ఏ విధముగా ఉన్నదో గమనించి చూడుము. ఏ విధమైన ఆత్మ నీలోకి ప్రవేశించిందనేది అది నీకు తెలుపును.

94

నీవు భాషలలో మాట్లాడవచ్చును లేక మాట్లాడకపోవచ్చును. కాని అదియే పరిశుద్ధాత్మను పొందుకొనినందుకు రుజువని నమ్ముచూ ఒక భయంకరమైన కార్యమును పెంతకొస్తువారు ఏ విధముగా చేయగలిగిరి? పెంతకొస్తువారు దానిని ఎందుకు చేసిరనే సంగతిని మీరు అర్ధము చేసుకోండి? ఎందుకని? ఎందుకనగా, నలుబది ఏళ్ల క్రితము ఆరంభమున దేవుడు వరములను పునరుద్దరించుటకు ప్రారంభించినప్పుడు, కొంతమంది అన్యభాషలలో మాట్లాడుటకు ప్రారంభించిరి. కాని పౌలు బోధించిన ప్రకారము, వరముల న్నింటికంటే భాషలలో మాట్లాడుటయే అత్యల్పమైన వరముగానున్నది. “వరములన్నిటిలో అల్పమైనది భాషలలో మాట్లాడుట.” అప్పుడు వారు దానిని చేయనారంభించినప్పుడు, వారందరూ ఉత్తేజభరితులై దానిని ఒక సంఘశాఖగా చేసుకొనిరి. దానిని జనరల్ కౌన్సిల్ గా పిలిచిరి. అదే అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ అనే సంస్థగా పిలువబడుచున్నది.

95

ఇప్పుడు, నేను వారిలో శ్రేష్ఠమైనవారితో, వారియొక్క శ్రేష్ఠులైన వేదాంత పండితులతో మాట్లాడాను. కావున వారు, “బ్రెన్హాం సహోదరుడా, నీవు చెప్పినది నిజమే, కాని ఇప్పుడు మేమేమి చేయగలము? మేము దానికి వ్యతిరేఖముగా లేచినయెడల మనల్ని బయటకు తన్ని తరిమివేయుదురు. అలాగే మా సంఘము మమ్ములను గూర్చి ఏమనుకొనెదరు? భాషలలో మాట్లాడుటయే పరిశుద్ధాత్మకు రుజువని ఏళ్ళ తరబడి మేము భోదించితిమి. అనేక ఏళ్ళ తరబడి అలాగే భోదించితిమి. ఇప్పుడు దానిని మార్చినయెడల ఏమగును?” అది సంఘశాఖ యొక్క శాపమై ఉన్నది. ప్రభువు దీవింపబడును గాక, మనకు ఏ సంఘశాఖ లేదు. కేవలం ఆత్మ నడిపింపు ప్రకారముగా మనము దానిని అనుసరించుచున్నాము.

96

పరిశుద్ధాత్మ బాప్తిస్మమనేది ఒక వ్యక్తిగత అనుభవమై యున్నది. ప్రజలు భాషలలో మాట్లాడుటను నేను చూచియున్నాను. మంత్రగత్తెలను మరియు మంత్రగాళ్ళను నేను చూచియున్నాను. చెతబడిచేయబడినవారితో మరియు దయ్యములతో వ్వవహరించిన ఏ మిషనరీకైనా ఆ కార్యములను గూర్చి తెలియును. వారు నిలవబడి భాషలలో మాట్లాడుచు, వారి తల వెనుక వైపుకు దుమ్మును చల్లుచూ, ఈటెతో తమ్మును గాయపరచుకొనుచూ మరియు భాషలలో మాట్లాడుచూ దానిని అనువదించుట నేను చూచితిని. మరి దానిని పరిశుద్ధాత్మని మీరు చెప్పగలరా? నిశ్చయముగా, అది కాదు. అది ఒక దయ్యము. “వారి భాషల ద్వారా నీవు వారిని తెలుసుకుందువు,” అని ఎన్నడూ యేసు చెప్పలేదు. కాని ఎఫెసీయులకు 5:1లో, “ఆత్మ ఫలములేవనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, దయాలత్వము, సహనము, సాత్వికము, విశ్వాసము, ఆశానిగ్రహము.” అది సరియేనా? అక్కడే నీవున్నావు.

97

ఇప్పుడు, నీవు ఒక మెథడిస్టువైనయెడల, ఆ రకమైన ఫలములు నిన్ను వెంబడించినట్లైతే నీవు త్వరగా కోపపడవు, ఎటువంటి వ్యర్ధమైన గోలను చేయవు, నీ సహనమును కలిగియున్నయెడల, నీవు ప్రేమను కలిగియున్నంతవరుకు, నీవు ప్రతీ ఒక్కొక్కరితో విచక్షణతో ప్రేమాభిమానమును కలిగియుందువు, మొదటగా నీవు క్రీస్తును ప్రేమించినయెడల, రెండవదిగా నీ సహోదరుడుని ప్రేమించెదవు, ఆ తర్వాతే మూడవదిగా నిన్ను గూర్చి నీవు ఆలోచించుకొనెదవు. ఇంకా ఆ విధముగా నీవు ముందుకు సాగుతూ వుంటు, నీవు దీర్ఘశాంతము, దయాళుత్వము, సహనము, విశ్వాసము కలిగియున్నయెడల...

నీవు “ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. మరియు దైవిక స్వస్థత ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ నేటికీ ఏకరీతిగానే ఉన్నాడు,” అని చెప్పెదవు.

ఇప్పుడు, “ఒక్క నిమిషము ఆగుము, చర్చ్-ఆఫ్-క్రైస్ట్ అను సంఘమందు అద్భుతములు జరుగు దినములు గతించినవని నాకు బోధింపబడియున్నది,” అని చెప్పవచ్చు. నీకు దయ్యము పట్టియున్నది. అది సరియే.

నీవు, “సరి, మనము బాప్తిస్మము పొందవలసిన వారమైయున్నాము. పరిశుద్ద గ్రంథములో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమనునది లేదు. అది లేఖనములో ఎట్లున్నదనగా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము ఇచ్చినట్లుగా ఉన్నది. నేను దానిని ఇప్పుడే చూచుచున్నాను,” అని చెప్పెదవు.

“ఒక్క నిమిషము ఆగుము, నిన్ను అసెంబ్లీస్ నుండి బయటకు తన్నివేయుదుము.” నీవు దానిలో ఇరుక్కుపోయి ఉన్నావు, నీవు నీలో ఒక తప్పుడు ఆత్మను కలిగియున్నావు. నీవు తప్పుడు భోదను లేక తప్పుడు ప్రవక్త యొక్క మాటలను ఆలకించియున్నావు.

ఇప్పుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఎవరైనా, ఎన్నడైనా బాప్తిస్మము పొందుకొన్నట్లుగా కేవలం ఒక్క చోట నీవు కనుగొనగలవా, ఆ విషయమును నేను మీకే వదిలివేయుచున్నాను. కాని ప్రతీ చోట, వారు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందిరని నేను నీకు చూపించెదను. ఇప్పుడు, ఎవరు సరి, తప్పుడు బోధను చేసే సంఘసంస్థలా లేక పరిశుద్ధ గ్రంథమా?

98

నీవు, “సరి, నేను చిలకరింపు బాప్తిస్మమును తీసుకొనియున్నాను. దేవునికి స్తోత్రము, అదే నాకెంతో బాగున్నది. నీకు పెద్దగా చదువు కూడా లేదు. చిలకరింపు బాప్తిస్మమును వారికివ్వమని నేను నీకు చెప్పుచున్నాను. నీళ్ళను చిలకరించుట లేక నీళ్ళలో ముంచుట వీటి మద్య పెద్దగా వ్యత్యాసం ఏమున్నది?” అని చెప్పవచ్చును. దానిని నేను లెక్క చేయను. అదెలా మీ కంటికి కనిపించినా అది నాకనవసరము. బాప్తిస్మము పొందుడని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. మరియు “బాప్తిస్మము” అనగా “ముంచబడుట” అని అర్ధమగును.

“ఆ, ఎలాగు తీసుకున్నా ఫర్వాలేదు?” అని నీవు చెప్పవచ్చు.

సరే, అలాగైతే, దేవుడు, “నీ పాదరక్షలను తీసివేయుము; నీవు పరిశుద్ధ స్థలములో ఉన్నావు,” అని మోషేతో చెప్పినప్పుడు, “లేదు, నేను కేవలం నా టోపిని మాత్రము తీస్తాను, నా పాదరక్షల దారమును తీయాలంటే చాలా కష్టము,” అని మోషే చెప్పినయెడల, అది బాగుండునా? లేదండీ. మోషే తన పాదరక్షలను విప్పేవరుకు దేవుడు అతనితో మాట్లాడి ఉండడు. మరియు క్రీస్తు వేసిన నియమములకు మరియు మూల సిద్ధాంతములకు సంఘము మరలా తిరిగి వచ్చేంత వరకు దేవుడెన్నటికీ సంఘముతో మాట్లాడడు, మరియు ఏదో భావోద్వేగాలతో చేయుట లేక ఏదోక సంఘశాఖ అటు లేక ఇటు వైపుకు లాగుటచేత దాని ఆధిపత్యం వహించకూడదు. కాని అద్భుతములను నమ్మాలి, సూచనలను నమ్మాలి, పరిశుద్ధాత్మను నమ్మాలి, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుటకు, ఇంకా వాటన్నిటి వైపుకు వారు తిరిగి రావలసియున్నారు. వాటివద్దకు వారు తిరిగిరావలయును, లేకపోతే దేవుడు వారితో మాట్లాడడు. ఖచ్చితముగా అది నిజము.

99

సరిగ్గా సంఘము అచ్చటకే తిరిగి రావలసియున్నది. అందుకే మనము ఒక సంఘశాఖ కాదు. ఖచ్చితముగా ఆ కారణముచేతనే మనము సంఘశాఖకు చెందినవారము కాదు. మనము పరిశుద్ధ గ్రంథమును నమ్ముచున్నాము, మరి దానిలో అనేక విషయములు మనకు తెలియవు, చాలా విషయములు తెలియవు. కాని, “ప్రభువైన యేసు, తెరవబడిన హృదయములతో మేము నిలబడియున్నాము, కేవలం దానిని బయలుపరచుము.”

మనము వెలుగులో నడిచెదము, అది అందమైన వెలుగు.

దయనే మంచు బిందువులు ప్రకాశించు స్తలముయొద్దనుండే అవి వచ్చుచున్నవి.

మా చుట్టూ పగలు మరియు రాత్రియు అది ప్రకాశించును.

యేసే లోకానికి వెలుగు.

(మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను కాదు,

కాని యేసే ఈ లోకానికి వెలుగు.)

యేసే, ఈ లోకానికి వెలుగని వెలుగు యొక్క

పరిశుద్దులారా మీరందరు ప్రకటించుడి.

అప్పుడు, పరలోకము యొక్క గంటలు మ్రోగును,

యేసే, ఈ లోకానికి వెలుగు.

(ఇప్పుడు ఆరాధనలోయున్న ప్రతీ ఒక్కరు.)

మనము వెలుగులో నడిచెదము, అది అందమైన వెలుగు.

(అలాగే ఒక్క నిమిషము దానిని పాడండి.)

దయనే మంచు బిందువులు ప్రకాశించు స్తలము యొద్ద నుండే అవి వచ్చుచున్నవి.

మా చుట్టూ పగలు మరియు రాత్రియు అది ప్రకాశించును.

యేసే లోకానికి వెలుగు.

100

కావున సంఘశాఖల యొక్క ఆలోచనలను గైకొనుటకంటే యేసును మరియు ఆయన వాక్యమును నీవు అంగీకరించవచ్చుకదా? ఎంతమంది యేసును మరియు ఆయన వాక్యమును అంగీకరించెదరు? ఇప్పుడు, దేవుడు ఎన్నడైననూ ఒక సంఘశాఖను స్థాపించినట్లుగా ఒక్క స్థలమునైనను కనుగొనగలవా? ఆయన ఒక స్త్రీ బోధకురాలిని నియమించినట్లు లేఖనములో ఏ ఒక్క స్థలమునైనా కనుగొనగలవా. చిలకరింపబడినట్లు లేక నీళ్లను తలపై పోయబడినట్లుగా ఒక్క స్థలమునైనా ఏ వ్యక్తియైనా కనుగొనుము చూద్దాం. ఒకరైననూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో తప్ప - తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందినట్లు ఏ స్థలమునైనా, ఎక్కడైనను కనుగొనగలవా? ఎవరైనా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందినట్లుగా ఒక్క స్థలములో కనుగొనగలవా. రండి, వచ్చి నాకు చూపించండి. అచ్చట ప్రతీ వ్యక్తి యేసు నామములోనే బాప్తిస్మము పొందెను.

101

ఇప్పుడు, మనము వీటికంటే మరి కొద్ది లోతైన విషయములలోనికి వెళ్ళబోవుచున్నాము. ఇప్పుడు, మనము ఆరంభమందున్న రుజువులోనికి మరియు ఇంకా అనేక విషయములలోకి వెళ్ళి, అవి ఎచ్చటవున్నవని అన్వేషించి కనుగొందాము. ఇప్పుడు, వారు దానికి వ్యతిరేఖముగా భోదించినయెడల, పరిశుద్ధ గ్రంథములో లేని సంగతులను వారు భోదించుచున్నారని అర్ధమగును.

జ్ఞాపకముంచుకొనుడి, సంఘశాఖనేది ఒక్కచోటైనా ఎప్పుడైనా ఉన్నట్లు మీరు నాకు చూపించగలరాయని నేను అడుగుచున్నాను. కనీసం ఒక్క స్థలాన్ని నాకు చూపించండి, లేనియెడల ఎవరో తప్పిదములోనున్నారు. ఒకటి ఇక్కడ ఉన్నదేమో, మరొకటి అక్కడ ఉన్నదేమోనని నాకు చూపించమని నేను మిమ్మల్ని అడుగుట లేదు. అటువంటిదేదియు లేదని నేను మీకు చూపించుచున్నాను. కడమ అపోస్తులుడు చనిపోయిన తరువాత మూడు వందల సంవత్సరములవరకు ఎన్నడైననూ ఒక్క సంఘశాఖైనా ఎచ్చటైనా గలదాయని కనీసము ఒక్క స్థలమును నాకు చూపించండి. క్యాతలిక్ సంఘము ఆరంభించక మునుపు ఏ ఒక్క సంఘశాఖైనా ఉన్నదేమో నాకు చూపించండి. ఈ సంఘశాఖలను పరిశుద్ధ గ్రంథము ఖండించుటలేదని రుజువుగా ఒక్క స్థలమైననూ నాకు చూపించగలరా. అలాగైతే మీరెందుకు ఒక సంఘశాఖను స్థాపించుచున్నారు?

102

పాపక్షమాపణ కొరకు ఎప్పుడైననూ, ఎవరైననూ చిలకరింపు బాప్తిస్మమును తీసుకున్నట్లు నాకు ఒక్క స్థలం, ఒక్క స్థలం, ఇప్పుడు ఒక్క స్థలమును నాకు చూపించండి. 'ఇక్కడ' ఒకటి, మరొకటి 'అక్కడ' అనేది నా ఉద్దేశ్యం కాదు. పూర్తిగా లేఖనమంతటిలో అన్వేషించి ఒక్క స్థలమును నాకు చూపించండి. వారియొక్క పాపక్షమాపణ కొరకు ఎవరైననూ నీళ్లను తలపై కుమ్మరిస్తూ బాప్తిస్మమును తీసుకున్నట్లు లేఖనమంతటిలో ఒక్క స్థలమును నాకు చూపించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఎవరైనా ఎప్పుడైనా బాప్తిస్మమును పొందినట్లు ఒక్క స్థలమును నాకు చూపించండి. కేవలం ఒక్క స్థలమును, ఒక్క వ్యకియైనా, ఎక్కడైననూ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందినట్లు నాకు చూపించండి. దేవుడు ఒక స్త్రీ భోదకురాలిని సంఘములో ఎక్కడైనా నియమించినట్లుగా లేక ఒక స్త్రీ భోదకురాలు సంఘములో ఉండవలెనని చెప్పినట్లు లేఖనములలో ఉన్నట్టుగా, ఒక్క స్థలమును నాకు చూపించండి. అదెక్కడ ఉన్నది?

ఇప్పుడు, ఇదొక పెద్ద సవాలుగావున్నది. కాబట్టి మీ ప్రశ్నలను కనుగొనాలని నేను కోరుచున్నాను. ఇప్పుడు ఈ ప్రసంగ పీఠమందు ఉన్నప్పుడే నేను చెప్పిన విషయములలో ఏదైనా ఒక్కటైనా ఇదిగో ఇచ్చట ఉన్నదని మీరు నాకు ఈ రాత్రి చూపించినట్లైతే, నేను క్షమాపణ అడిగెదను. అది ఆలాగు లేనియెడల, మరి మీకు సంబంధించిన ఈ విషయములకు మీ యొద్ద జవాబు లేనియెడల, మీరెందుకు వీటిని అంగీకరించకూడదు? దీన్ని అంగీకరించి మాలో ఒకరుగా ఉండుటకు రండి, ఏలాగైననూ మీరు మాలో ఒకరుగానే ఉన్నారు. మీ పేరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో ఉండినయెడల, మీరు వెలుగులోకి నడిచెదరు. ఆ వెలుగును మీరు చూచెదరు. దేవుడే దానిని బయలుపరచును, అప్పుడు మీరు దానిలో నడిచెదరు. అది ఖచ్చితముగా నిజము. చూచారా?

103

ఇప్పుడు, దానిగూర్చి ఏమిటి? నేను మిమ్ములను ఒక సంఘమునకు తిరిగి తీసుకొని వెళ్ళుట లేదు. మిమ్ములను పరిశుద్ధ గ్రంథము యొద్దకే తిరిగి నేను తీసుకొని వెళ్ళుచున్నాను. ఇచ్చట పౌలు ఏమి చెప్పెను? “మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల, అతడు శాపగ్రస్తుడగును గాక!”

“ప్రతిమనిషి మాట అబద్దమగును, కాని నా మాట సత్యము,” అని దేవుడు చెప్పెను. కావున, పెంతెకోస్తు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను, ఏ సంఘమైననూ, ఏమి చెప్పినా నేను లెక్క చేయను. దేవుని వాక్యమే సత్యమైనది. మరి వారెందుకు దానిని ఆరంభించిరి! ఎందుకనగా సంఘశాఖల నిమిత్తమే వారాలాగు చేసిరి.

ది పెంటెకోస్టల్-అసెంబ్లీస్-ఆఫ్-గాడ్ అనే సంఘశాఖ “పరిశుద్ధాత్మను పొందుకొనుటకు మొట్టమొదటి రుజువేదనగా అన్యభాషలలో మాట్లాడుటయే,” అను సిద్దాంతమును వారు ఆరంభించకుండా ఉండినయెడల, వారి గొప్ప బోధకుల యొక్క హృదయాంతరంగము నుండి సత్యమునకు సంబంధించిన ఏ విషయములనైనా వారు అంగీకరించియుందురు. అది తప్పని వారికి తెలుసు. అది నీటిని బంధించియుంచలేదు. ఖచ్చితముగా సాధ్యమవ్వదు. భాషలను మాట్లాడుట ద్వారా మీరు పరిశుద్ధాత్మను పొందలేరని దేవుని యొక్క పరిశుద్ద గ్రంథముతో నేను మీకు రుజువు చేయగలను. ఆ విధముగా పరిశుద్ధ గ్రంథములో లేదు. ఓ, మేము భాషలలో మాట్లాడుట ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్నామని మీరు అనుకొనుచున్నారు; అవును, నిశ్చయముగా, మీరు అలాగే తలంచుచున్నారు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచబడునట్లు అని వ్రాయబడియున్నది. చూచారా? “ఆయన జ్ఞానులు మరియు వివేకుల యొక్క కనులకు దానిని మరుగుపరచి మరియు పసిబాలురకు దానిని బయలుపరచెను.” అదొక ఆత్మీయ ప్రత్యక్షతగా యున్నది. ప్రత్యక్షత దానిని తాకినప్పుడు మీరు దానిని గమనించండి, అది ప్రకాశవంతముగా ఉండుటను గమనించండి. చూచారా, దానినే మీరు గ్రహించవలయును. చూచారా, స్నేహితుడా, నీవు గమనించవలసినది అచ్చటే ఉన్నది. చూచారా? అది అచ్చటే ఉన్నది.

104

మన భోదకుడైన పరిశుద్ధాత్మ కొరకై దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాము. మరియు ఆయన ఏదో ఒక పాత మూఢ కల్పనా కధలులాంటి ఆలోచనలను ఇక్కడికి తీసుకొని వచ్చి, “ఓ, హల్లేలుయా! ఇదిగో అది ఇచ్చట ఉన్నది. నిజము. అది ఇక్కడే వ్రాయబడియున్నది. హల్లేలుయా!” అని చెప్పడు. పరిశుద్ధాత్మ వెనుకకు వెళ్ళి, నిన్ను మరలా సరిగ్గా లేఖనముల యొద్దకు తీసుకొని వెళ్ళి, ఆ లేఖనములు ద్వారానే నిన్ను సరిగ్గా నీ స్థానంలో పెట్టును. చూచారా? అప్పుడే మీరు సత్యమును పొందుకొనెదరు. అదే ఖచ్చితముగా నిజము. “సూత్రం వెంబడి సూత్రం మరియు వాక్యము వెంబడి వాక్యముగా ఉండును.” ఆ విధముగానే అది చేయునని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది.

105

“నీవు సంఘశాఖను ఖండించుచున్నావా?”అని అడుగవచ్చును. లేదండి. “నీవు స్త్రీ బోధకులను ఖండించుచున్నావా?” అని అడుగవచ్చును. లేదండి. “నీవు భాషలలో మాట్లాడుటను ఖండించుచున్నావా?” లేదండి. “తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందినవారిని ఖండించుచున్నావా?” లేదండి, లేదండి. కాని ఇప్పుటికైనా సత్యమును మీరు స్పష్టముగా ఎరుగుట మంచిది, వారెరిగిన ఈ వెలుగును అనుసరింపక పోయినయెడల దేవుడు వారిని బాధ్యులుగా చేయునని నేను మీకు చెప్పుచున్నాను. ఇంత వరకు మీకది తెలియకపోవచ్చును, కాని ఇప్పటినుండి దానిని మీరెరుగుదురు. చూచారా? ఇప్పుడు, అది నేను చెప్పినది సరికాదని నీవు అనుకొనిన యెడల, లేఖనములను వెదకి చూడండి. అప్పుడు మీ స్థానమేమిటో కనుగొని మరలా తిరిగి వచ్చి ఈ రాత్రికి ఈ బల్లపైన వాటిని ఉంచండి. మరి అది సరియో కాదో, మనము చూద్దాం. పిదప మీరు వెళ్ళి, తెరవబడిన మనస్సుతో, తెరవబడిన హృదయముతో దానిని అన్వేషించి చూడండి.

ఇప్పుడు, నేను ప్రసంగించిన ప్రసంగము ఈ బ్రెన్హాం గుడారమునకు మాత్రమే వర్తించునని తలంచవద్దు. చూచారా? ఇచ్చట ఉన్నది. అది ఇక్కడే ఉన్నది.

అక్కడ కాదు...

106

దీనికి “బ్రెన్హాం గుడారము” అని పేరు పెట్టవలెనని నేను కోరుకోలేదు. “గుడారము” అని మాత్రము పిలువబడవలెనని, దానికి నా పేరు జతపరచకూడదని నేను కోరుకోలేదు. ఈ సంఘమును మార్చవలెనని నేను తలంచుచుంటిని...

దీనిని ఎప్పుడు కొన్నామో మీ అందరికీ తెలుసు, నేను పబ్లిక్ సర్వీసు కంపెనీలో ఉద్యోగము ఉన్నప్పుడు నేను దీనిని కొన్నాను. ఇచ్చటయున్న ఈ భవనమును మరమ్మత్తులు చేయుట కొరకు సీవార్డ్ సహోదరుడు దస్తావేజులను కుదువ పెట్టి అప్పు తీసుకొనుటకు దానిని వ్రాయించినప్పుడు, నా పేరును దానికి జతపరచెను. అప్పటినుండి ఇది ఆ విధముగానే పిలువబడుచున్నది. కాబట్టి ఇప్పుడు మనకున్న ఈ అప్పును నేను తీర్చిన వెంటనే ఈ మందిరమును సమాజము పేరు మీద మార్చబడిన పిదప నా పేరును దానినుండి తొలగించబడును.

107

ఈ మందిరము పైన నా పేరు పెట్టాలని నేను తలంచలేదు. ఇదొక “బ్రెన్హాం గుడారముగా” ఉండకూడదు. ఇది కేవలం ఒక మందిరముగానే ఉండవలెను. “ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మందిరము,” లేక “ప్రభువు యొక్క గుడారము,” ఆ విధముగా ఏదైనా ఉండవలెను. “నివసించు స్థలము,” “ప్రార్థనా గృహము” లేక మరేదైనా ఒక పేరు ఉండవలెను. ఈ సంఘమే ఆ పేరును ఎన్నుకొనును గాక. నా పేరు కాదు, నేను కేవలం ఒక మనిషిని. దీనిపై నా పేరుండుటకు అర్హత లేదు. “బిల్లీ బ్రెన్హాం,” అని దస్తావేజులలో వుండెను గనుక నా పేరు దీనిమీద పెట్టవలసివచ్చినది, చూచారా? మరి అది ఇకమీదట ఆలాగు ఉండకూడదు. లేదండి. ఇది ఈ సమాజము యొక్క జనులందరికి చెందిన మందిరముగా ఉండవలయును. ఇది, ఇక్కడయున్న సంఘమునకు చెందినవారిదగును.

108

మరియు ఈ సంఘము సార్వభౌమ అధికారమునుగలదిగా యుండును. ధర్మకర్తల లేక డీకన్స్ యొక్క సముదాయము మీరేమి చేయవలెనో చెప్పదు. కాని ఏదైనా ఒక తీర్మానమును గైకొనవలెననిన, ఈ సంఘమే ఏకగ్రీవముగా కూడి తీర్మానించి ఎన్నుకొని, మీరేమి చేయవలెనో చెప్పును. ఖచ్చితముగా అదియే సరియైన విధానము.

మీకు మీ కాపరి నచ్చనియెడల, ఇద్దరు లేక ముగ్గురికి కాపరి పట్ల వ్వతిరేఖ భావమును ఏదైనా కలిగియున్నయెడల, వారు తమ ధర్మకర్తలతో, డీకన్స్ తో కలిసి లేచి దానిని చెప్పలేరు. వారు కేవలం ఇచ్చట ఏదోకదానిపై పరిచారకులుగా మాత్రమే ఉన్నారు. వారు కేవలం ఒక్క ఓటుతో మాత్రమే ఎన్నిక చేయబడినవారు. అంత వరుకే. అతను ఒక సహాయక కాపరియైనా, అతను కలిగియున్నది కేవలం ఒక్క ఓటు మాత్రమే. అతను కూడా అక్కడ వెనుక కూర్చొనియున్న ఒక సామాన్య సభ్యునివంటివాడే. అది ఏ సమస్యయైనా సంఘము యొక్క సంపూర్ణమైన ఎన్నిక (ఓటు) ఏమి తీర్మానించునో అదియే తుది నిర్ణయమగును. అది నిజము. అదియే సరి. సంఘ కాపరిని ఏ డీకన్ సముదాయము (బోర్డు) కాపరిని తీసివేయలేదు, లేక డీకన్ సముదాయము (బోర్డు)ని ఏ సంఘ కాపరి తీసివేయలేడు. సమస్తమును సంఘమే అందరి ఓట్ల ఎన్నిక ద్వారా చేయును.

అది తన స్వకీయ స్వేచ్ఛను కలిగియుండును. మనకు ఏ బిషప్పులు లేరు. మనకు పర్యవేక్షకులు (జనరల్ ఏవరొసీయర్) లేరు. మనము యేసును మాత్రమే కలిగియున్నాము. ఆమేన్! ఆయనే మన పర్యవేక్షకుడు. ఆయనే ప్రధాన కాపరి. ఆయనే మన రాజు. ఆయనే మన ప్రభువు. ఆయనే మన స్వస్థపరచువాడు. ఆయనే మనకు సమస్తమునకు సమస్తమైయున్నాడు. మరియు మనము కేవలము ఆయన వెలుగులో నడుచుచున్న జనులమైయున్నాము. ఆమేన్.

109

మరియు ఆయన సంఘములో కొంతమందిని సిద్దపరచియున్నాడు. ఏమిటది? శరీరమనే “సంఘములో,” కొంతమందిని సిద్దపరచియున్నాడు. ఏమిటది? మొదటి అపోస్తులులు, వారే మిషనరీలగుదురు, ఇప్పుడు మన సంఘములో ఒకరిని కలిగియున్నాము, చిన్నవాడు, అచ్చట ఆ వెనుక కూర్చొనియున్నాడు, అతడు నా స్నేహితుడు, సహోదరుడు. అతడిని నేను క్రీచ్ జెఫ్రీసన్ అని పిలిచెదను. పరిచర్యలలో మిషనరీ పిలుపు మొట్ట మొదటిదగును. అది ఉన్నతమైన పిలుపు. “ఒక అపోస్తులుడనగా మిషనరియా?” అని మీరడగవచ్చును. ఖచ్చితముగా. వెళ్ళి నిఘంటువులో “అపోస్తులుడు” అను పదమునకు అర్ధం వెదకి చూడండి, అపోస్తులుడు అనగా “పంపబడినవాడు.” అలాగే మిషనరీ అను పదమునకు అర్ధమేమిటో వెళ్లి చూడండి, దాని భావమేమనగా “పంపబడినవాడు” అనే అదే అర్ధమినిచ్చును. ఉన్నతమైన ఆజ్ఞ ఏదనగా, ప్రభువైన యేసు కోసం సముద్రాలను దాటి ప్రయాణించే ఒక మిషనరి పరిచర్యయగును. ఉన్నతమైన పరిచర్య.

మొదటిది, అపోస్తులులు; రెండవది, ప్రవక్తలు. ప్రవక్త అనగానేమి? ఒక దీర్గదర్శి. ఎవరో ఒకరి ద్వారా ఏర్పరచినవాడు కాదు... ఒక అపోస్తులుడనువాడు తనను ఒక మిషనరీయని చెప్పుకుంటు ఇంటివద్ద ఉండువాడు కాదు; కాని నిజముగానే ఒక మిషనరీగా పరిచర్యను చేయువాడే మిషనరీయగును. మరియు ప్రవక్త అనగా ఒక దీర్గదర్శియై యున్నాడు.

110

అపోస్తులులు, ప్రవక్తలు, బోధకులు, సువార్తికులు, కాపరులుయనే శరీరము దానిని కలిగియుండును. కాబట్టి ఆ స్థానిక శరీరము(సంఘము)లో తొమ్మిది ఆత్మ సంబంధమైన వరములు గలవు. అవి జ్ఞానము, తెలివి, దైవిక స్వస్థత, బాషలలో మాట్లాడుట, బాషలకు అర్థము చెప్పుట, వివిధమైన ఈ వరములన్నీ ఆ స్థానిక శరీరము (సంఘము)లో ఉండును. మరియు ఈ అపోస్తులు, కాపరులు, బోధకులు మరియు సువార్తికులు వీరందరూ ఇచ్చట ఉండి ఈ వరములు, ఈ కార్యములు సరిగ్గా క్రియచేయుచున్నవా లేదా యని నిశ్చయముగా కనిపెట్టుచుందురు. ఏదైననూ తప్పుగా క్రియచేయుటను వారు కనుగొనినయెడల, వెంటనే వారు దానిని ఖండించెదరు, ఎందుకనగా అది లేఖనానుసారముగా లేదు. ఎవరైననూ ఇక్కడికి వచ్చి, “దేవుడు స్తుతింపబడును గాక, నేను నా చేతుల నుండి నూనె కారుచున్నది. ఇక్కడ చూడండి. కావున మీకు తెలుసా, నేను పరిశుద్ధాత్మను పొందియున్నానని నమ్ముచున్నాను. కాబట్టి నా చేతులలో నూనె కారుచున్నది,” అని చెప్పవచ్చును.

“అది లేఖనానుసారమైనది కాదు.” అది నిజము. “మనము గదిలోనికి వెళ్ళి కూర్చొని లేఖనములగుండా దానిని వెదుకుదాము, పరిశుద్ధాత్మను పొందుకొనుటకు అదియే రుజువనుటకు లేఖనములలో అదెక్కడ ఉన్నదో నాకు చూపించుము,” అని ఎవరో ఒకరు చెప్పుటను నీవు వినెదవు.

111

ఒకరు, “ఓ, నేను భాషలలో మాట్లాడితిని; నేను దానిని పొందితినని,” చెప్పవచ్చు. అదే పరిశుద్ధాత్మ యొక్క రుజువైతే నాకు లేఖనములో చూపించండి. అది నిజము.

ఒక స్త్రీ, “ఓ, ప్రభువు నన్ను బోధించుటకు పిలిచెనని,” చెప్పవచ్చును. ఏ స్త్రీయైనా బోధించినట్లైతే నాకు లేఖనములలో చూపించండి.

“ఓ, ప్రభువు నాతో చెప్పివున్నాడని నాకు తెలియును! నేను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందిన ఆ రాత్రి ఆయన నన్ను ఆశీర్వదించెనని,” ఎవరైనా ఒకరు చెప్పవచ్చును. “ఆ విధముగా బాప్తిస్మమును పొందవలెనని లేఖనములలో ఎక్కడ ఉన్నదో నాకు చూపించండి.

“మంచిది, ఇతర వ్యక్తులవలె నేను కూడా మంచివాడనే, నేను మెథడిస్టును లేక బాప్టిస్టును లేక ప్రెస్బిటేరియను, నేను పెంతెకోస్తుని” చెప్పవచ్చును. ఆ విధముగా లేఖనములో దేవుడు ఎక్కడ చెప్పాడో నాకు చూపించు. చూచారా? అది నిజము. అది అక్కడ లేదు.

112

ఇప్పుడు, ఈ గుడారము యొక్క సభ్యులగు మీ ముందు ఒక బహిరంగ సవాలు గలదు. ఇప్పుడు ఈ ఉదయమున నేను చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటైననూ మీకు తప్పుగా ఉన్నట్లు తలంచినట్లైతే, అది లేఖనానికి వ్యతిరేఖముగా ఉన్నట్లయితే, ఈ సాయంకాలమున ఈ ప్రసంగ పీఠముమీద వాటిని పెట్టుటకు నీవు బద్దుడవైయున్నావు. అది నిజము. మీరు వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టండి. సంఘశాఖనేది పరిశుద్ధ గ్రంథమున లేఖనములలో ఎచ్చట ఉన్నది, యేసు ఎచ్చటైనా ఏ సంఘశాఖనైనా స్థాపించేనా లేక నేను బోధించిన వాటిల్లో ఏది విరుద్దమైనదో పరిశుద్ధ గ్రంథములోని లేఖనములలో నాకు చూపించండి. సంఘములో స్త్రీని బోధకురాలిగా ఎక్కడ ఆయన నియమించెను, చిలకరింపు బాప్తిస్మమును లేక తలపై నీళ్లను పోయుటను ఆయన ఎచ్చట చేసెను లేక అటువంటివి ఏదైననూ నేను మాట్లాడిన కార్యములలో ఏమైనా వ్యతిరేకముగా ఉన్నట్లైతే వాటిని నాకు లేఖనముల ద్వారా నిరూపించుచూ, ఇక్కడకు తీసుకొనివచ్చి వాటిని దీనిపై పెట్టండి. అంతేకాకుండా, ఈ రాత్రికి, ప్రభువు చిత్తమైతే, “పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము” మరియు “సర్పము యొక్క సంతానము మరియు స్త్రీ యొక్క సంతానము,” అనే అంశములను గూర్చి తెలుసుకుందాం. సరే, మంచిది. ప్రభువు మిమ్ములను దీవించును గాక. ఎంతమంది చక్కగా ఉన్నట్లు అనుభూతి చెందుచున్నారు?

ఓ, నేను ప్రయాణించుచున్నట్లు, ప్రయాణ అనుభూతిని చెందుచున్నాను,

ఓ, నేను ప్రయాణించుచున్నట్లు, ప్రయాణ అనుభూతిని చెందుచున్నాను,

(ఇప్పుడు, దానిని నిజముగా ప్రభువు కొరకు మాధుర్యముగా పాడండి.)

పరలోకపు గృహము ప్రకాశవంతమైనది మరియు సుందరమైనది,

ఓ, నేను ప్రయాణించుచున్నట్లు, అనుభూతిని చెందుచున్నాను,

ఓ, నేను ప్రయాణించుచున్నట్లు, ప్రయాణ అనుభూతిని చెందుచున్నాను,

ఓ, నేను ప్రయాణించుచున్నట్లు, ప్రయాణ అనుభూతిని చెందుచున్నాను,

పరలోకపు గృహము ప్రకాశవంతమైనది మరియు సుందరమైనది,

ఓ, నేను ప్రయాణించుచున్నట్లు, అనుభూతిని చెందుచున్నాను.

113

ఇప్పుడు, ఈ కొద్ది వారాల విశ్రాంతి గడువునందు, నాలోయున్న సమస్యను ఒక దానిని నేను కనుగొన్నాను. అది నన్ను ఇబ్బంది పెట్టుచున్నది. మరిప్పుడు నేను దానిని నా సంఘము యెదుట ఒప్పుకొనగోరుచున్నాను. ఈ ఓక్ చెట్టు మరియు హిక్కరీ వృక్షాల వెనుక కూర్చొని ధ్యానించుచుండగా, “ఎక్కడ నా మొదటి పొరపాటు చేసితిని? ఏది నన్ను తప్పిదములోనికి వెళ్ళునట్లు చేసింది? అది ఏమిటి?” అని అలోచించుకున్నాను. నన్ను తప్పిదములోనికి పంపినది ఏదని నేను కనుగొంటినో మీకు తెలుసా? ఏదైనా ఒక విషయమందు సామార్థ్యానికి మించి వెళ్లే ఒక కార్యము గలదు. అదేమిటో మీకు తెలుసా? మీరు చక్కగా ఉండుటకు ప్రయత్నించవచ్చు, ఇంకా ప్రయోజనకరముగా ఉండుటకు ప్రయత్నించవచ్చు. అప్పుడు మీరు కూడా మరింత యుక్తముగా ఉండగలరు. మరియు ప్రజలు నన్ను చుట్టూముట్టి బలవంతము చేయుటను నేను అనుమతించితిని. చూచారా? “బ్రెన్హాం సహోదరుడా, మీరు ఇక్కడకు రండి, ప్రభువు మీతో దీనిని చెప్పుమని నాకు చెప్పియున్నాడు,” అని చెప్పెదరు.

“సరే, అలాగే, సహోదరుడా, ఇదిగో అచ్చటకు నేను వస్తున్నాను,” అని నేను చెప్పెదను.

“ఓ, బ్రెన్హాం సహోదరుడా, అక్కడికి వెళ్ళకు సుమా, ఇక్కడకి వెళ్ళకు.”

“సరే, నేను అక్కడికి వెళ్ళకుండా ఉండుట మంచిదేమో.” చూచారా? మరియు మీరేమి చేయాలనేది మీకు తెలియకపోవును. అదే నన్ను ఆందోళనపరచుచున్నది. ప్రభువు నన్ను ఎక్కడికి నడిపించునో, అక్కడికి నేను వెళ్ళుచున్నాను మరియు ఎవరేమనుకున్నా దానిగూర్చి నేను లెక్క చేయను. చూచారా? అదే ఖచ్చితముగా వాస్తవము. కావున ఎవరి అభిప్రాయములను నేను గాయపరుచను.

114

ఆ తరువాత నేను మరొక దానిని గమనించితిని. అక్కడ నా పిల్లలు ఒక నరాల ఉద్రిక్తతకు గురైన గుంపుగా, మనోధైర్యమును కోల్పుయి రాత్రి వేళలో కేకలు పెట్టుచుండిరి. అన్ని వేళలో అనేక చోట్లలో నుండి ఎడతెగకుండా ప్రజలు వస్తూ మా ఇంటి ముందు మరియు వెనుక గుమిగూడియుందురు. నేను రోగులైన ఆ ప్రజల పై నింద మోపుటలేదు. కాని, సాధ్యమైన ఏర్పాట్లన్ని అమర్చియున్నాము.

అలాగే ఇక్కడ మందిరములో ఒక కూడికను నేను నిర్వహించినప్పుడు, అంతెందుకు, నేను ఇంచుమించు మెల్లగా తప్పించుకొని సంఘము నుండి వెలుపలికి వెళ్లవలసి వస్తున్నది. ఎందుకనగా, ప్రజలు 'అదంటూ' మరియు 'ఇదంటూ' నన్ను ఇబ్బందిపరుచుచున్నారు. కావున నేను చాలా అలసిపోవుచున్నాను. కొన్నిసార్లు స్వస్తతా కూటముల నుండి ఇచ్చటకు వచ్చినప్పుడు వాస్తవముగా నేను వారికి న్యాయం చేయలేకపోవుచున్నాను. నేను చెప్పే... “ఉదాహరణకు, బ్రెన్హాం సహోదరుడా, ప్రభువు ఇలా చెప్పాడు...” అని చెప్పెదరు. “అవును. మనము ఇక్కడకు వచ్చి, వెళ్లునప్పుడు...” అందులో ఏ ప్రయోజనము లేదు. నేను దానిని చేయకూడదు. మనము దానిని చేయవలసిన అవసరము లేదు.

115

ఇప్పుడు, దానిగూర్చి శ్రద్ద వహించుటకు మేము తగిన చర్యలు తీసుకొనియున్నాము.

మరిప్పుడు, జ్ఞాపకముంచుకొనుడి... నన్ను చూడాలని ఎవరైననూ... నేను అందరినీ చూచుటకు ఇష్టపడుచున్నాను. కాబట్టి కొద్ది సమయము కేటాయించి ప్రజలతో మాట్లాడుటకు ఇష్టపడుచున్నాను. కావున నీవు ఆ విధముగా చేయలేవు. ఎవరైనా ఒకరు నన్ను కలుసుకొనుటకు వచ్చినప్పుడు, మొదటిగా సమయమంతయూ మీ ఒక్కరికే వెచ్చించినయెడల, మరొకరు నన్ను కలుసుకొనుటకు మీరు అవకాశమిచ్చుటలేదని మీరు తెలుసుకొనవలెను. మరి అది సరి కాదు. కేవలం కొద్ది మాటలను వినాలని, ఆశిస్తూ ప్రజలు ఎంతో దూరము నుండి నీ యొద్దకు వచ్చెదరు, ఎందుకనగా నాకు గల విశ్వాసము బట్టి ప్రజలు నమ్మి నా యొద్దకు వచ్చినప్పుడు, దేవుడే వారికి ఆ విశ్వాసమును అనుగ్రహించును. కావున వారికి దానిని గూర్చి బోధించుటకు ఆ కొద్ది సమయము వారికి ఎంతో అవసరమైయున్నది. “లేదు, నేను ఎవరినీ చూడగోరుట లేదు,” అని చెప్పి మీరు వారిని పంపివేయకూడదు. అది సరి కాదు, ఎందుకనగా నేను దానిని చేయుటకు భయపడెదను. ఎందుకనగా... ఎవరో ఒకరు వచ్చి, “ఇప్పుడు, బ్రెన్హాం సహోదరుడా, నీవు ఫలానా-ఫలానా కార్యములు చేయవలెనని, ఇది - ఇప్పుడిది ప్రభువు యొక్క చిత్తమని ప్రభువు నాతో చెప్పుచున్నాడు,” అని చెప్పెదరు. ప్రభువు తన చిత్తమును గూర్చి నాతో చెప్పును.

116

శ్రీ. కింగ్, ఇక్కడకు వచ్చేవారు. ఇక్కడ దిగువున నివసించిన ఆర్.ఎ. కింగ్ ఎంతమందికి జ్ఞాపకమున్నది? అతడు ఇలా అన్నాడు... ఒకసారి నేను అక్కడ ఒక పడవను నిర్మించుచుంటిని. అతను, “ఇప్పుడు బ్రెన్హాం సహోదరుడా, ఆ పడవను నీ సొంత పరిమాణములు ప్రకారము నిర్మించుము,” అని చెప్పెను. అతను, “నేను నిర్మించుచు...”

ఎవరో ఒక వ్యక్తి ఒకసారి ఒక పడవను నిర్మించుచుండెను. ఒకరు ఆ వైపు వచ్చి, “నీవు ఈ పార్శవ భాగపు అంచులను ఈ విధముగా కోయవలెను,” అని చెప్పెను. మంచిదని, దానిని ఆ విధముగానే అతడు చేయుటకు ప్రయత్నించెను. మరొకరు, “దానిని ఈ విధముగా చేయవలయును, అడ్డు కర్రలు ఇలా ఉండాలి, ఆ వంపును ఈ విధముగా ఉండాలి, ముందు భాగము, తెడ్డు, చుక్కాని మరియు ఇవన్నీయూ ఈ విధముగా ఉండవలెను,” అని చెప్పెను. దానిని ముగించినప్పుడు చూచుటకు అదెంతో ఘోరముగా ఉన్నట్లు కనిపించినది అని అతడు చెప్పెను.

కావున నేను ఆ పడవను తీసుకొని వెనుకయున్న నా ఇంటి పెరటిలో పెట్టాను. తర్వాత మరలా వేరొకటి తయారుచేయుటకు నా రంపముతో దానిని కోయుటకు మొదలు పెట్టాను,“ అని అతను చెప్పెను. అంతలో వేరొకరు ఆ దారిన వచ్చి, ”నీవు దీనిని ఆ విధముగానే నిర్మించాలని“ సలహా చెప్పెను.

“అప్పుడతను, ఒక పడవను ఒకరి సూచనల ప్రకారము నిర్మించాను, కాని అదెందుకు పనికిరాకుండా అదిగో ఇంటి వెనుక పెరటలో ఉన్నది. కాబట్టి ఇక ఎవరి ఆలోచనల ప్రకారముగా కాకుండా దీనిని నా ఆలోచన ప్రకారమే నిర్మించాలనే అభిప్రాయముతో నేను దీనిని నిర్మించుచున్నాను,” అని అతను చెప్పెను. అది నిజము.

117

ఇప్పుడు నేను ఏదైననూ చెయ్యవలెనని దేవుడు కోరిన యెడల, నేనేమి చేయవలెనో ఆయన నాకు చెప్పును. నేను చేయు వాటి విషయములో నేను తప్పని నీవు తలంచినయెడల లేక ఆలాంటిది ఏదైనవున్ననూ, దేవుడు నన్ను సరిదిద్దునట్లుగా నీవు నా కొరకు ప్రార్థన చేయుము. చూచారా? ఎందుకనగా నేను అనేకులకు చెవియొగ్గలేను.

ఇప్పుడు, ఇక్కడ మందిరములోని మీరు కేవలం ఒక్కరికి లేదా ఇద్దరికి మాత్రమే చెవియొగ్గవలసి యున్నారు; అయితే నేనిచ్చట లక్షలాది మందియొద్దకు వెళ్ళి చేరునట్లు దీనిని మాట్లాడవలసియున్నాను. కావున నేను దానిని ఏ విధముగా చేయగలను? అంతే కాకుండా నేను “ఏ మనుష్యునికైననూ నేను జవాబివ్వబోవు ముందు, నేను కూర్చుండి దానిని అన్వేషించుచూ అధ్యాయనం చేసేటప్పుడు పరిశుద్ధాత్మ నన్నేవిధముగా నడిపించునో నేను గమనించి, పిదప, అదేదైననూ ఆమెతో లేక అతనితో నా నిర్ణయమును చెప్పెదను. మరియు అదే నా నిర్ణయమగును. దానితోనే నేను నిలబడెదను.” సరిగ్గా అక్కడే నిలచెదను, అదియే యుక్తమైనది, అని చెప్పుచున్నాను.

118

ఇప్పుడు, వ్యక్తిగత సమావేశములు నిర్ణయించబడియున్నవి. నన్ను చూడగోరిన వారెవరైనా మంచిదే. నిరభ్యంతరముగా కలుసుకోవచ్చును. మీరు నా ఫోన్ నెంబరు Butler -21519 కి ఫోన్ చెయ్యండి. టెలిఫోన్ సమూహ పట్టికలో (Directory) విల్లియం బ్రెన్హాం, Butler-21519ను మీరు కనుగొనినయెడల, వ్యక్తిగత సమావేశముల కొరకు ఏర్పాట్లు చేయబడును. కావున నిర్ణయించిన సమయము మరియు సంధించుటకు నిర్ణయించిన స్థలమును వ్రాసి ఉంచబడును. అప్పుడు నేను ప్రతి ఒక్కరిని సంధించి, వారి సమస్యలను మరియు వారి అవసరతలను బట్టి వారికి సహాయము చేయబడును. కాని కేవలం ఒక్కరితో ఒక రోజంతా లేదా నాలుగైదు గంటలు గడిపి మరుసటి దినమున చెయ్యవలసిన సమస్తమును చెయ్యలేక విఫలమగుదును. అట్లైతే మనకు చాలా సమయము అవసరమగును. కాబట్టి వారి సమస్య ఏమిటి, అందుకొరకు ఎంత సమయము పట్టునని అడిగిన తర్వాతే వారిని ఆహ్వానించెదము. మేము ప్రతి ఒక్కరిని చూడవలయును. మనము దానిని ఆ విధముగానే చెయ్యగలము.

శ్రీ. మెర్సియర్ లేక అక్కడ కూర్చొనియున్న శ్రీ. గోడ్ మీ ఫోన్లకు జవాబునిచ్చెదరు. మరియు ఆ సమావేశములన్నింటినీ నా పుస్తకములో చక్కగా వారు వ్రాసియుంచెదరు. నిశ్చయముగా వారాలాగు చేసెదరు. అప్పుడు నేను ప్రతీ ఒక్కరిని సంధించగలను.

ఏదైనా ఒక అత్యవసర పరిస్థితి అయిన యెడల, అది ప్రార్థనా కూడిక సమయములో రోగులు వచ్చినయెడల, మీ రోగులను మరియు బాధించబడుచున్న వారిని లోపలికి తీసుకొని రండి. వారు ఒకటి లేక రెండు రాత్రులు కూర్చొని వర్తమానమును విననివ్వండి.

119

ఇప్పుడు, అత్యవసరమైన వాటి కొరకు మేము ప్రార్ధించెదము.

కాని పిదప, ఇంచుమించు రెండు రాత్రులు తరువాత నేను నా నూతన పరిచర్యను ప్రారంభించగోరుచున్నాను. మరియు వారిని ఇక్కడ ఈ గదిలోనికి నేను తీసుకొని వెళ్ళదలచుచున్నాను. ఎందుకనగా, మీకు ఈ దర్శనం గూర్చి తెలియును. ఎంత మందికి ఆ దర్శనము జ్ఞాపకమున్నది? ఖచ్చితముగా, మీకు జ్ఞాపకమున్నది. గుడారమున యున్న ఆ చిన్న గదిని గూర్చి ఆ దర్శనమైయున్నది.

ఇప్పుడు, ఆ నూతన పరిచర్య యొక్క దర్శనము ప్రకారముగా స్త్రీలను ఆ గదిలోనికి పంపించు విషయములో, మొదటి రాత్రి నేను మిడాని తీసుకొని వెళ్ళబోవుచున్నాను. అప్పుడు అది... ఆమెతో అది ఏ విధముగా పని చేయునో అక్కడ చూచెదను మరియు అది అక్కడ సరిగ్గా పని చేయనియెడల, అప్పుడు నేను తిరిగి ఇద్దరు స్త్రీలను ఒక్కసారిగా లోపలికి పంపదును, ఎందుకనగా ఒక పురుషుడు ఉన్న స్థలమునకు వారు వచ్చుచున్నారు. చూచారా? ఎందుకనగా మన మనస్సులు నిష్కళంకమైనవియే; కాని అక్కడ వెలుపలవున్న అపవాదికి అది లేదు, మీరు చూచారా. కనుక వాడు దానినిగూర్చి ఏమని తలంచును, చూచారా, మరియు లోకము దానిని గూర్చి ఏమి మాట్లాడునో మీరెరుగుదురు.

కాని ఇది బహిరంగంగా కనబరుచుటకు అనుమతించలేని ఒక పరిచర్యగా యున్నది. ఈ పరిచర్యను ఎన్నడూ, ఎవ్వరు అనుకరించి ఈ విధముగా చెయ్యుటకు సాధ్యమవ్వదు. మీరు చూచారా? లేదండీ! లేదు, ఇందులో సమస్తము ఏకముగా విలీనమైయుండుటను ఇప్పుడు నేనెరుగుదును. కావున ఆ పరిచర్యను ప్రారంభించి, దానిని చేపట్టునట్లుగా అది నాకు కనబడుచున్నది. సరిగ్గా అది అచ్చటే యున్నది.

120

నెవిల్ సోదరుడా, ఈ ఉదయమున నేను లేవక మునుపు గతరాత్రి నేను కలగనుచుంటిని. నేను ఒక కలకనుచుంటిని. మరియు పరిచర్యను గూర్చి అనుకొనుచుంటిని.... నేనేమి చేయుచున్నానో నాకు తెలియట్లేదు, కాని అదేమైనప్పటికిని జరుగుచున్న కార్యములను గూర్చి నీవు మాట్లాడుచుంటివి, నేను అటువంటివి ఎన్నడునూ చూడలేదు. నేను ఏడ్చుచు, దేవుని స్తుతించుచూ, నా చేతితో నా భార్యను ముఖము మీద ఆ విధముగా అలా కొట్టాను. అలాగే పడుకొని దేవుని స్తుతించుచునేయున్నాను. ఓ, ఏదోక కార్యము ఇచ్చట సంభవించుటకు సిద్దముగాయున్నట్లు, అది నిశ్చయముగా సంభవించునని నేను ఎరిగియున్నాను. ఇంతకుమునుపు ఎన్నడూ లేనంత ఎంతో అద్భుతముగా అది ఉండబోవుచున్నది. దేవుడు ఏదోక గొప్ప కార్యాన్ని చేయబోవుచున్నాడని నేను నమ్ముచున్నాను. కాని ఇప్పుడు విచక్షణతోను, జ్ఞానముతో, సరిగ్గా దేవుని వాక్యముతో మనము దానిని సంధించవలెను. సరియే. ఓ, మనము ఆయనను ప్రేమించుచున్నాము.

121

ఇప్పుడు జ్ఞాపకముంచుకొనుడి, మీ స్నేహితులలో ఎవరైననూ నన్ను చూడగోరినయెడల మరియు ఏదైనా వ్యక్తిగత విషయమును మాట్లాడకోరినయెడల, Butler -21519నకు ఫోను చెయ్యవచ్చును మరియు వ్యక్తిగత సమావేశము కూడా అచ్చట ఏర్పాటు చేయబడును. ఇంటి చుట్టూ మరియు ఈ మందిరము చుట్టూ ఉంచుకొని వారితో నేను మాట్లాడలేను, ఎందుకనగా మీరు ఇక్కడికి లోపలికి వచ్చి... వాస్తవముగా నేను చాలాసేపు బోధించాను. మీతో చాలా కాలము లేనందున గనుక నేను ఇక్కడే మీతోనే ఉంటాను. నేను చెప్పే ప్రతీ వాక్యమును మీరు గ్రహించాలనే ఉద్దేశ్యముతోనే నేను మిమ్ములను వీలైనంత ఎక్కువ సమయం ఉంచెదను. ఎందుకనగా, స్నేహితులారా, దీనిని చేయుటకు మనం కలిగియున్న ఏకైక సమయమిదే. ఇదియంతయూ అతి త్వరలో సమాప్తమవ్వబోవుచున్నది. మనము ఆ లోయ గుండా వెళ్ళబోవుచున్నాము. గత సంవత్సరము ఇచ్చటయుండి, ఇప్పుడు మరణించినవారిని తలంచి చూడండి. చూచారా?

122

కావున మనము ఆ లోయగుండా వెళ్ళబోవుచున్నాము. కావున దీనిని మనమిప్పుడే చేయవలసినవారమై యున్నాము. ఇది ఇప్పుడే చేయబడవలసి యున్నది. మరిప్పుడు మిమ్ములను అంతసేపు ఉంచుటకు అదియే కారణము. నీవు, “మంచిది, దానిగూర్చిన లేఖనము ఏమి చెప్పుచున్నది?” అని అడగవచ్చును. అవును, ఒకసారి రాత్రంతా పౌలు బోధించెను. మరి ఒక వ్యక్తి భవనము మీద నుండి పడి చనిపోయెను. ఎంతమందికి అది తెలియును? రాత్రంతయూ ప్రసంగించెను! పౌలు వెళ్ళి, అతని దేహముపై పరుండగా, ఆ వ్యక్తి గుండె కొట్టుకొనుటకు ప్రారంభించెను, అప్పుడతడు ప్రాణముతో లేచి చింతించవద్దు, లేదు... [టేపులో ఖాళీ ఉన్నది.]

మనతో యేసు నామము తీసుకొని వెళ్ళెదము,

ఆయన పాదముల వద్ద సాగిలపడుచూ,

పరలోకమునందు రాజులకు రాజు ఆయన

కిరీటము ధరించును.

మన ప్రయాణము సంపూర్ణమగునప్పుడు.

(సరే, మనము లేచి నిలబడెదము.)

మనతో యేసు నామము తీసుకొని వెళ్ళెదము.

నీతో యేసు నామము తీసుకొనివెళ్ళు,

దుఃఖముతో మరియు బాధతో నిండిన బిడ్డా,

నీకు సంతోషము మరియు ఆదరణ ఇచ్చును.

మీరేమి చేయవలెనో నేను చెప్పుదును. మీ చుట్టూ తిరిగి ఒకరితో ఒకరికి కరచాలనము చేయుడి, “సహోదరుడా, ఎలాగు ఉన్నారు? మిమ్ములను కలువుట నాకు ఆనందముగా యున్నది,” అని చెప్పుము.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...