సర్ప సంతానము

సర్ప సంతానము

VGR COUNT -341....దేవుడు, తన ఆత్మ బలముతో సమస్తమును సష్టించిన, గొప్పవాడైన మరియు బలవంతుడైన దేవుడు; పాపులమైన మన కొరకు ఉచితముగా మరణించి; మరలా ఆయనతో అద్భుతమైన సహవాసమును కలిగియుండుటకు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును తీసుకువచ్చెను. లోకమునకు పునాది వేయబడకముందే ఆయనతో మనకు సహవాసము కలదని దన్యకరమగు వాక్యములో మనకు చెప్పబడి యున్నది. ''ఉదయ నక్షత్రములు కూడి పాడగా, దేవుని కుమారులు ఆనందముతో కేకలు వేసిరి - అది జగత్తుకు పునాది వేయబడకముందే జరిగెను''. .గొర్రెపిల్ల అదే సమయములో వదించబడలేదని మనకేలాగు తెలియును; దేవుడు తనయొక్క మహా ఆలోచనలో, యేసుద్వారా మనకు కలిగిన ఆదరణ యందు మనము సంతోషించి చప్పట్లు కొట్టుట చూచెను.

మరియు, ఆయన రెండవ రాకడయందు ప్రత్యక్ష్యపరచబడబోవు ఆ గొప్ప దైవ మహిమకు ఈ రాత్రి మనము చూచునది రుచి మాత్రమే. సమస్త రోగము మరియు రుగ్మత వెడలిపోవును. అప్పుడు మనకు ఆయన యొక్క స్వంత మహిమ శరీరమువంటి శరీరము వచ్చును, అప్పుడు మనము ఆయనను ఉన్నట్లుగానే చూతుము. ఇక్కడ మనము చూచునప్పుడు చేతులు వడలిపోయి, జుట్టు నెరసిపోయి, భుజములు వంగిపోయి కనబడుచున్నవి. మనము మర్త్యులమని మనకు తెలియుచున్నది. ఇప్పుడు మనము తలలు నేలవైపు వంచియున్నాము. ఆ మట్టిలోనే కలిసిపోనై యున్నాము. అందులో నుండియే మనము తీయబడితిమి. కాని, ప్రభువగుదేవా, నీవు నిశ్చయముగా దేవుడవు. దానిని మేము నమ్మినయెడల చివరి దినములందు మరల మేము లేపబడుదుమని వాగ్దానము చేసియున్నావు.

2

నీ సన్నిదిలో ఈ రాత్రి మేము మా విశ్వాసముతో నిలబడియున్నాము, దైర్యముతో మేము వచ్చుచున్నాము. ఎందుకనగా అలాగు రమ్మని యేసు మమ్మును పిలచెను. మేము చేసిన ఏదోమంచి పనినిబట్టి కాదు. ఎందుకనగా మంచిదేదియూ మేము చేయలేదు, కాని మాకు కేటాయించబడిన ఆయన కృప అను విదిని బట్టియే మేము దీనముగా వచ్చుచున్నాము. కాబట్టి, వాక్యమును తీసికొని వచ్చుచుండగా మమ్మును ఈ రాత్రి దీవించమని అడుగుచున్నాము. ''మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గానీ దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాట వలనను జీవించును''అని వ్రాయబడియున్నది.

మరియు ఈ రాత్రి దేవునియొక్క నోరును మాట్లాడనిమ్ము. వినుచున్న మా హృదయముల లోతులలోనికి చొచ్చుకొని పోవునట్లు వాక్యములను తీసుకు రమ్ము. నీ ఆత్మతో నింపబడి నీ సన్నిదిలో వుండునట్లు కృప చూపుము. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.

3

''ఏలమనము ఒక శాఖ కాదు?'' అను అంశముమీద గత రాత్రి, ఈ దినము మనము మాట్లాడుకొనియున్నాము. మనము ఎందుకు ఒక శాఖ కాదో గట్టిగా చెప్పియున్నాము. మరియు ఎందుకు శాఖలను మనము నమ్ముటలేదో చెప్పియున్నాము - ఎందుకనగా శాఖలు ఎన్నడూ దేవునిచే అభిషేకించబడలేదని బైబిలులో మనము కనుగొనుచున్నాము, అవి అపవాది ద్వారా అభిషేకించబడినవి - బైబిలు ద్వారా దానిని రుజువు చేసియున్నాము. శాఖల ద్వారా తప్పులు ఎట్లు వచ్చినవో చూచాము. ఈ ఆలయమును దేవునియొక్క దన్యకరమగు వాక్యము యొక్క సహవాసములోనికి తీసికొని వచ్చి, సరిదిద్దవలెననుటకు దీనిని చెప్పుచున్నాము. శాఖలు చెప్పు దానిమీద మన నిరీక్షణ నిర్మించబడియుండలేదు, లేక ఏ వ్యక్తి చెప్పిననూ; ప్రభువగు దేవుడుచెప్పు దానిమీదనే అది నిర్మించబడియున్నది. మనము ఎన్నడయినా గాని ఆ విదముగానే సరిగా దిద్దబడగలము.

4

మరియు ఈ ఉదయమున, శాఖలద్వారా వెలువడిన వివిదమైన ఐదు సంగతులను గూర్చి నేను చెప్పానని నమ్ముచున్నాను. బైబిలులో వాటినిగూర్చి నిశ్చయముగా పేర్కొనబడలేదు, ఆ ముసలి తల్లియగు వేశ్యా కాథలిక్ సంఘము బోదించు దానినే ప్రొటస్టెంటు సంఘములు ఒక సిద్దాంతపు బోదగా స్వీకరించి దానికి తలవంచుచున్నారు. అది ప్రొటస్టెంటు సంఘములోనికి వచ్చియున్నది. దానికే మనము తలవంచుచున్నాము. అది దేవునియొక్క వాక్యమునకు పూర్తిగా విరుద్ధము.

5

మొదటి శాఖా సంఘమును గూర్చి ఈ మద్యాహ్నము చూశాము. నైసీన్ సంఘముయొక్క నైసీన్ తండ్రుల చరిత్రలో అది చూచాము. అపొస్తలుల మరణము తరువాత, నైసీన్ పితరులు వచ్చిరి. చాలా సంవత్సరముల పాటు వారు కొనసాగిరి. మూడు వందల ఇరవై ఐదు సంవత్సరములు. చివరకు ఫ్రాన్సులోని నైసియాకు వచ్చిరి. అక్కడే వారు ఆ గొప్ప నైసీన్ ఆలోచనా సభను ప్రారంభించిరి. మరియు వారు అక్కడ ఈ కాథలిక్కు సంఘము ఇప్పుడు అనుసరించుచున్న సిద్దాంతములను రూపొందించిరి. అది ప్రొటస్టెంటులకు కూడా అందించబడెను.

6

''నీవు ఇంకనూ నా పేరును కలిగియున్నావు'' అని ఆయన థెస్సలోనీకయ సంఘకాలము వరకు చెప్పెను, అది పదిహేను వందల సంవత్సరముల అందకార యుగము. ఆ ఒక్కొక్క సంఘకాలమును గూర్చి ఈ ఉదయకాల బోదలో నేను చెప్పాను. మరియు వేరొక ప్రక్కన, క్రీస్తు అక్కడ లేకపోయెను, వారు ''కాథలిక్, లూథర్, వెస్లీ, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, పెంతెకోస్తు'' అను శాఖా నామములతో వచ్చియుండిరి. కానీ ఆ కాలపు అంతమందు ఆయన ఈలాగు చెప్పెను, “ఒక తెరువబడిన ద్వారమును నేను నీ ముందుంచియున్నాను''. చూడండి? ఇప్పుడు మనమున్న ఈ కాలము అదేనని మనము నమ్ముచున్నాము, తెరువబడిన ద్వారపు కాలము, చివరి లవొదికయ సంఘము వెళ్ళిపోవు మద్యకాలము.

7

లవొదికయ ఆలోచన సభకు సరిగ్గా మూడు వందల ఇరవై అయిదు సంవత్సరములు, మరియు అక్కడవారు ఈ చిలకరింపు, కుమ్మరింపు, తప్పుడు బాప్తిస్మములు, తప్పుడు ఆత్మలను ఇంకా వీటన్నింటిని రూపొందించి అన్వయించిరి. దానిని వారు అవలంబించిరి. యాజకుడగు లూథరు కాథలిక్కు సంఘమునుండి బయటకు వచ్చి ఈ క్రియలను తనతో కూడా తెచ్చెను, అందులోనుండి జ్వింగ్లీ బయటకు వచ్చెను. జ్వింగ్లీ నుండి కాల్విన్ వచ్చెను, కాల్విన్‌లో నుండి వెస్లీ వచ్చెను. ఓ ... ఇంకా చాలా వచ్చినవి. అయితే వారు ఈ సిద్ధాంతములను తీసుకొని వచ్చుచునే యుండిరి. వారు నడిపించబడుటకు ఆయన ఎన్నడూ ఏర్పరచని మార్గములను వారు వెంబడించుచుండగా, దేవుడు తన సంఘమును ఎట్లు నడిపించగలడు?

8

మరియు గుర్తు చేసికొనండి. ప్రకటన 17లో ''ఒక స్త్రీ'' ని మనము కనుగొందుము. ఈ మాటలు తేటగా ఇప్పుడున్నవి. అవి బైబిలులో వ్రాయబడియున్నవి. వాటిని చెప్పగలను అనుకొనుచున్నాను. ఈ స్త్రీ ఒక వేశ్య అని చెప్పబడెను, అనగా ఆమె చెడ్డపేరుగల స్త్రీ; ఆమె ఒకనికి వివాహము చేయబడవలసి యున్నది, కాని లోకముతో జారత్వము చేసినది. ఆమె ''వేశ్యలకు తల్లి''.అందువలన ఆమె కుమార్తెలను కనినది. దానిని పటముగా గీచి చూపించాము. అక్కడ దానిని లేఖనములో చూచాము. దాని సిద్ధాంతములను చూచాము. అది కాథలిక్కు సంఘము తప్పమరేదీ కాదనుటకు కావలసిన రుజువులను దేవుడు పరిపూర్ణముగా చూపించెను. అది మాత్రమే కాగలదు. అది ఎవరిని కనినది? ప్రొటస్టెంటు సంఘములను, అక్షరాలా ఆమె చేసెను.

ఆమె తనయొక్క చేతిలో జారత్వము అను మద్యపు గిన్నెను పట్టుకొని యున్నది, అది భూరాజులకు అందించబడినది. ఆత్మీయముగా మాట్లాడినట్లయిన, ఆమె ఈ భూభాగమంతటినీ పరిపాలించుచున్నది. అది ఖచ్చితముగా సత్యము. మరి ఇంకొకటి లేదు.....

9

మనము దానియేలు గ్రంథములో ప్రతిమను చూచి ఇది చెప్పగలము, ఆ ప్రతిమ వైపు చూడండి; శిరస్సు బంగారము. అది బబులోను సామ్రాజ్యము. ఇత్తడి... లేక వెండి, మెదష్ - ఓ - పెర్షియా; ఇత్తడి : మహా అలెగ్జాండరు. (గ్రీసు సామ్రాజ్యము) ఆ తరువాత రోమా సామ్రాజ్యము, తూర్పు, పశ్చిమ రోమ్, ఆ రెండు పాదములు. కాథలిక్ సంఘము ద్వారా ఆకాశము క్రిందనున్న ప్రతి దేశములోను రోమనిజము అంతో ఇంతో మిశ్రితమై యున్నది. తూర్పు పశ్చిమ రోమాయే రెండు పాదములు. ఈ పది రాజ్యములను గమనించండి, ఈ ఉదయమున మనము మాట్లాడుకొనిన పదికొమ్ములకు అది సమాంతరము. పుట్టనైయున్న ఆ పది రాజ్యములలోని ప్రతిదానిలోను ఇనుము మట్టి కలిసియున్నది. అవి ఎక్కడనూ కలియవు.

10

అవి ఒకదానికొకటి అంతర వివాహము చేసికొనెను. వారందరుని బైబిలు చెప్పెను. వాటిని నేడు మనము చూచుచున్నాము. మీ బాలురు కాథలిక్కు బాలికలతో స్నేహము చేయుచున్నారు; వారు పెండ్లి చేసికొనినప్పుడు తమకు కలుగు పిల్లలను కాథలిక్కులుగా పెంచవలెనని ప్రమాణము చేయుదురు. చూడండి. అది మరొకరి శక్తిని విచ్చిన్నము చేయుట. కాని ఏమిటది? అది మొత్తం వేశ్య బైబిలు చెప్పెను. ఇప్పుడు మీరేమి చేయబోవుచున్నారు? ప్రజలయొక్క పాపములు వారిని వెంబడించును. ద్వితీయోపదేశ కాండములో ఒక అక్రమ సంతానము యోహోవాయొక్క సమాజములో పదు నాలుగు తరముల వరకు ప్రేవేశింపరాదని చెప్పబడెను. అది దర్మశాస్త్రము. క్రీస్తు దర్మశాస్త్రమును మహోన్నతపరచుటకు వచ్చెను. ఇప్పుడు అది మరెంతగా వర్తించును.

11

ఈ సిగరెట్లు త్రాగుచూ, పొట్టి బట్టలు తొడుగుచూ, జుట్టు కత్తిరించుకొని వీదుల్లో తిరుగుచున్న ఈ అల్ప వేశ్యల మాట ఏమిటి? వారి సంగతి ఏమగును? దాని తల్లి అలాగు ప్రవర్తించుటయే అందుకు కారణము. అతిక్రమము ఒక తరము నుండి మరొక తరమునకు వచ్చుచున్నది. అదే ఇది. మరియు ఏమిటి మనకున్నది? పాపము తప్ప మరొకటి మన తావులో కనబడుట లేదు.

12

మేఘములను రేపి ప్రళయము ద్వారా అప్పుడు జనులను తుడిచిపెట్టునుట్లుగా చేయుటకే ఆవల రష్యాను దేవుడు అణుబాంబుతో లేపియున్నాడు. దానిని తుడిచి పెట్టును. అది నిశ్చయము అని బైబిలు చెప్పుచున్నది. రష్యా ఒక నాస్తిక దేశము. సర్వశక్తుడగు దేవుని చేతిలో అది ఒక కీలు బొమ్మగా ఆడుచున్నది. నిశ్చయంగా దేవునితో నడచుటకు నిరాకరించినందున ఇశ్రాయేలు వారిని నాశనముచేయుటకు రాజగు నెబుకద్నెజరును వాడుకొనిన ప్రకారమే. పరిశుద్ధుల రక్తము చిందించి మత్తిల్లిన కాథలిక్కు సంఘముపై ప్రతీకారము తీర్చుకొనుటకు రష్యాను లేపియున్నాడు. బైబిలు అలాగు చెప్పెను. అది మొత్తమును మ్రింగివేయును.

13

కాబట్టి ఇటువైపు చూడండి,వారి తల్లి ఒక వీది బాలిక. వారి తల్లి ఒక వేశ్య. ఈనాడు ఆమె ఏమిటి? గుడ్డలు లేని రాకెన్‌రోల్ నాట్యగత్తె. దాని పిల్లలు ఏమవుదురు? ''దేవుడది చేయునా? '' అని మీరు అడుగవచ్చును. అవునండీ: దేవుడు దోషమును పిల్లలమీదికి రప్పించును. పద్నాలుగు తరములవరకు వచ్చును. మరియు క్రీస్తు దానిని ఉన్నతపరచుటకు వచ్చినట్లయిన, ''వంద తరములు లేదా అయిదు వందల తరముల వరకు తెచ్చును. '' ఆయన ఈలాగు చెప్పెను, ''నరహత్య చేయవద్దు అని పూర్వము మీతో చెప్పబడిన మాట విన్నారు గదా! ఒకడు తన సోదరుని మీద కోపపడి వ్యర్థుడా అనిన యెడల అప్పుడే అతనిని చంపినవాడగును. వ్యభిచరించరాదు అని మీతో చెప్పబడిన దానిని విన్నారు గదా? కాని స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.'' ఆయన దానిని రూపొందించెను. ఎంత హెచ్చింపయినది? అనేక రెట్లు పెంచబడినది. దర్మశాస్త్రము క్రింద అది పద్నాలుగు తరములైన యెడల దానికి ఈనాడు మరెంత రెట్టింపు శిక్షపడును?

14

మరియు యువకులు, మద్య వయస్కులు, వివాహితులకు, తమ పెండ్లి ప్రమాణముల పట్ల గౌరవము లేదు. వారు స్త్రీలను తీసికొని ఇష్టమొచ్చిన చోట మామూలు కుక్కలవలె జీవించుచున్నారు. కొందరు మనుష్యులకంటె ఒక కుక్కకే మంచి నీతి, మర్యాద వుంటున్నది. ఇది చాలా కఠినమగు మాట అని నాకు తెలియును గాని అది నిజము.

ఎందువలన? సంఘములు దానిని చూస్తూ ఏమీ మాట్లాడుట లేదు. ఎందువలన? వారు తమ తల్లి చేసిన విదముగానే ప్రవర్తించుచున్నారు. దానిని సంఘము స్వతంత్రించుకొన్నది. కాథలిక్కు సంఘములో నుండి ప్రొటస్టెంటు సంఘము వచ్చినందున, కాథలిక్కు సంఘపు పాపములు ప్రొటస్టెంటులను వెంటాడుచున్నవి. నిశ్చయముగానే. కాబట్టి కుండకాగును నీవు నల్లగా ఉన్నావనలేదు. అది పూర్తి సత్యము.

15

లేఖనములందు దానిని మనము కనుగొనుచున్నాము. దేవుడు ఎన్నడైనా ఒక శాఖను అభిషేకించెనేమో వాక్యములో ఒక్కచోట నాకు చూపించండి అని చెప్పాను. ఈ రాత్రి ఒక్క కాగితము దానికి జవాబుగా ఇక్కడ బల్లమీద లేదు. ఒక స్త్రీ బోదకురాలిని ఎన్నడైనా దేవుడు అభిషేకించెనేమో ఒక్క చోట చూపించండి. నీళ్ళు పోయుటను దేవుడెన్నడైనా ప్రతిపాదించెనేమో ఒక్కచోట చూపించండి. దేవుడెన్నడైనా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము ఎవరికయినా ఇచ్చెనేమో ఒక్క చోట చూపించండి. ఆ సంగతులు కనుగొనండి. అయినా మనము ఇంకనూ చేయుచున్నాము. అది సంఘములోనే జరుగుచున్నది. ఇప్పుడు, మీకు చెప్పాను...

16

ప్రభువగు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమును మనము నమ్ముచున్నాము. గనుక మనము బాప్టిష్టులమని ఎందుకు పిలువబడకూడదో కారణమును చెప్పాను. మరి ఏ విదముగాను బైబిలులో ఎవరూ బాప్తిస్మము పొందలేదు. ''తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ '' నామములో ఒక వ్యక్తి అయినా గాని ఎన్నడైనా బాప్తిస్మము పొందెనేమో ఒకచోట నాకు చూపించండి. అట్లయిన నేను చేతులెత్తి అబద్ధ ప్రవక్తనని చెప్పుకొందును.

మీరు తప్పక ''యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము'' పొందవలెనని బైబిలు చెప్పినయెడల మీరు అలాగే చేయవలయును. వారు మరల బైప్తిస్మము పొందవలెనని పౌలు ఆజ్ఞాపించెను. వారెట్లు బాప్తిస్మము పొందినా అక్కర లేదు. వారు వచ్చి మరల బాప్తిస్మము పొందవలెను. యేసుక్రీస్తుకు బాప్తిస్మమిచ్చిన అదే స్థానికుడగు యోహాను ద్వారా వారు బాప్తిస్మము పొందిరి. ''అది ఇక పనిచేయదు, మీరు వచ్చి మరలా బాప్తిస్మము పొందవలెను''అని చెప్పెను. పరిశుద్ధాత్మను పొందు ముందుగా వారది చేయవలసి యుండిరి. అది దేవునియొక్క కార్యక్రమము.

ఈ రాత్రి అంతకంటె మరింత లోతునకు నేను వెళ్ళుదును. ఎందువలన? యేసు తన మాటకు కట్టుబడియుండును. దానిని మీరు నమ్ముదురా? దాదాపు మీరందరూ ఈ ఉదయమున ఇక్కడ ఉండిరి. కాని నేను దానికంటె మరికొంత లోతునకు వెళ్ళుదును.

17

అది జరిగిన తరువాత పౌలు మరల ఎందుకు ఆజ్ఞాపించెను? ''పరలోకము నుండి ఒక దూత దిగి వచ్చి మరొకటి ప్రకటించినయెడల శాపగ్రస్తుడవును గాక! '' అని చెప్పెను. నీవు బోదించుటకూడదు. ''దానిమీద మాకు క్రొత్త ప్రత్యక్షత వచ్చినది'' అని మీరు ఇప్పుడు అనవచ్చును. నీవు పొందలేవు. అపవాది మాత్రమే హవ్వ యొద్దకు క్రొత్త వెలుగుతో వచ్చెను. నీకు మరి ఏ క్రొత్త వెలుగు అవసరము లేదు. ఇంతకు ముందే దేవుడక్కడ పెట్టిన వెలుగులో నీవు నడువవలసి యున్నావు. అంతే.

18

ఇప్పుడు దీనిని గమనించుడి, ఎంత సూక్ష్మము! వారు రూపాంతరపు కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు, యేసు తన శిష్యులతో ఇట్లనెను. ''మనుష్యకుమారుడనగు నన్ను జనులు ఏమని చెప్పుకొనుచున్నారు?''

''నీవు మోషేవు లేక ఏలియావు లేక ప్రవక్తలలో ఒకడవు అని చెప్పుకొనుచున్నారనిరి.

''మీరెవరినని నన్ను గూర్చి చెప్పుకొనుచున్నారు?'' అనడిగెను.

''నీవు క్రీస్తువు. సజీవుడగు దేవునియొక్క కుమారుడవు'' అని పేతురు చెప్పెను.

''యోనా కుమారుడవగు సీమోనూ, నీవు దన్యుడవు. రక్తమాంసములు దీనిని నీకు బయలుపరచలేదు'' అని ఆయన చెప్పెను. చూడండి. అది సెమినరీల వలన రాదు, శాఖల వలన అది రాదు. ''రక్త మాంసములు దీనిని నీకు బయలుపరచలేదు. వేదాంత పాఠశాల పాండిత్యము ద్వారా నీవు దీనిని నేర్చుకొనలేదు. కాని పరలోకము నందున్న నా తండ్రి దీనిని నీకు బయలుపరచెను. ఈ బండమీద నేను నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దీనియెదుట నిలువజాలవు. '' ఆయన ఎవరై యున్నాడో అను ఒక ఆత్మీయ ప్రత్యక్షత.

గమనించండి. ''నీవు పేతురువు. పరలోక రాజ్యపు తాళపుచెవులు నీకిచ్చెదను. భూమి మీద నీవు దేనిని బందించుదువో పరలోకమందును నేను దానిని బందించెదను. భూమి మీద నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ''ఇప్పుడు ఆయన తన మాటను నిలబెట్టు కొనవలసి యున్నాడు, లేని యెడల ఆయన దేవుడు కాడు.

19

దీనిని ఆయన పలికిన కొద్ది దినముల తరువాత సిలువ వేయబడెను. తిరిగి లేచి పరమునకు ఎక్కిపోయెను. ఆ పెంతెకోస్తు దినమున పేతురు సువార్తను విప్పెను. కదా? నిశ్చయంగా ఆలాగు జరిగెను.

ఇప్పుడు గమనించండి. వారందరూ వారిని ఎగతాళి చేయుచుండిరి. ఎందుకనగా వారు పరిశుద్ధాత్మతో నింపబడియుండిరి. మతపిచ్చి కలవారని, భిన్నమతావలంబికులని, లేదా అట్టిది మరేదో పేరుతో వారిని పిలచుచుండిరి. వారు నవ్వుచూ ఇట్లనిరి, ''వీరు క్రొత్త మద్యముతో మత్తిల్లిరి''.

వారి మద్యను పేతురులేచి తన స్వరమెత్తి ఇట్లనెను, ''అయ్యలారా, సోదరులారా, నా మాట ఆలకించుడి. నా మాటలు విని గ్రహించుడి. మీరు అనుకొనుచున్నట్లుగా వీరు మద్యముతో మత్తులు కాదు: పగటిలో ఇంకా మూడవ ఘడియ అయిననూ కాలేదు. కాని ప్రవక్తయగు యోవేలు ద్వారా పలుకబడినది ఇదే. అంత్యదినములలో మనుష్యులందరి మీద నా ఆత్మను క్రుమ్మరించెదను. ఆ దినమున ఆయన తన కుమారులు, కుమార్తెలు, దాసీల మీద ఏమి క్రుమ్మరించును?''.

20

ఈ మాటను వారు విన నారంభించినప్పుడు, హృదయములో కోయబడిరి. ఎందుకనగా అ ఆలు కూడా రాని ఒక వ్యక్తి మాట్లాడుట వారు వినిరి. అతని అంతరంగమందు ఏదో వున్నదని వారెరిగి వినిరి. పరిశుద్ధాత్మ అతనిలో మండుచున్నది. ఆపగలరా? గాలి వీచుచున్న ఎండవేళ పొడిగా వున్న ఇల్లు అంటుకొన్నప్పుడు ఆర్ప చూసినట్లు అది ఉండును. దానిని నీవు ఆర్పలేవు. అతడు పరిశుద్ధాత్మతో నింపబడి యుండెను. ఇప్పుడతడు ఏమి చేయును?

''అయ్యలారా, సోదరులారా? రక్షిoచబడుటకు ఇప్పుడు మేమేమి చేయవలెను?'' అని అడిగిరి. పేతురును గమనించండి. పరలోక రాజ్యపు తాళపుచెవులు నీ యొద్ద ఉన్నవి. చూచారా?

మూడవ దినమున తిరిగి లేచిన యేసునొద్ద పరలోక రాజ్యపు తాళపు చెవులు లేవు. అది మీకు తెలియునా? ''మరణము, పాతాళముయొక్క తాళపు చెవులు నా యొద్దనున్నవి'' అని ఆయన చెప్పెను. కాని పరలోక రాజ్యముయొక్క తాళపుచెవులు లేవు. ఎందుకనగా అవి పేతురునకు ఇవ్వబడినవి.

21

ఆయన ఈలాగు చెప్పెను, ''పేతురూ, భూమి మీద నీవు దేనిని విప్పుదువో పరలోకమందు నేను దానిని విప్పెదను. భూమి మీద నీవు దేనిని బందించుదువో పరలోకమందు దానిని నేను బందించెదను.'' ప్రపంచమునకు ఈ దన్యకరమగు దానిని విప్పుటకు తాళపు చెవులు కలిగి అక్కడ నిలబడియున్నాడు. అతని చేతులలో తాళపు చెవులున్నవి. రక్షించబడుటకు మేమేమి చేయవలెనని?వారడుగుచున్నారు. '' అపొస్తలుడు చేయమని చెప్పుట కాదు గాని పరలోకమందు దేవుడు దానిని గుర్తించవలెను. అతనికి ఆయన ఆ అదికారమును అనుగ్రహించెను.

ఇప్పుడు పేతురు ఇట్లనెను, '' మీలో ప్రతి ఒక్కరును మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమందు బాప్తిస్మము పొందవలెను. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందెదరు. '' అది సరియేనా? మరి ఏ ఇతర నామము లేదా మరి ఏ ఇతర మార్గము, మరి ఏ ఇతర రూపములో తాళపుచెవులు త్రిప్పినా గాని పరలోకమందు విప్పబడుట జరుగదు. దాని వలన భూమిమీద, పరమున కూడా విప్పబడెను. లేనియెడల పేతురు మాట యేసు విని యుండెడివాడు కాడు. ఆ తరువాత బైబిలులో ప్రతిచోటను యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మము పొందిరి. అంతకు ముందు బాప్తిస్మము పొందినవారు వచ్చి మరల యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందితేనే గాని పరిశుద్దాత్మ రాలేదు. అదియే సరి. ఇంకా అది అలాగే కొనసాగుచున్నది.

22

కాబట్టి ''తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ''నామమందు బాప్తిస్మమును బోదించుచున్న యెడల అది అబద్ద ప్రవచనము. ఇప్పుడు మిమ్మును నేను గాయపరచగోరుట లేదు, కాని ఈ సంఘము ఎరుగునట్లుగా దీనిని నేను నొక్కి చెప్పవలసియున్నాను. విద్యలేని పిచ్చివారివలె ఇక్కడ మనము లేము, దేవునియొక్క వాక్యము మీద మనము నిలబడియున్నామని మనకు తెలియును. ఎవరైనా ఏ ఒక్క చోటయినా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమందు బాప్తిస్మము పొందినట్లు చూపించవలసినదని సవాలు చేయుచున్నాను.

ఇప్పుడు మీరు అబద్ధ ప్రవచనమును విందురా? సత్యమును విందురా? లేఖనములను పరిశోదించుడి. అది మీ వంతు. ఏ ఒక్క వ్యక్తి అయినా గాని బైబిలులో ఏ ఒక్క సంఘమునయినా గాని శాఖగా అభిషేకించెనేమో నాకు చూపండి! ఒక స్త్రీ బోదకురాలిని వారెన్నడైనా అభిషేకించిరేమో నాకు చూపండి. మనము చెప్పుకొనుచున్న ఈ సంగతులన్నియూ ఎన్నడయినా బైబిలులో అభిషేకించబడినవేమో నాకు చూపండి అవి అక్కడే లేవు. ఒక్క చోటు నాకు చూపించండి. ఒక శాఖయొద్దకు మీరు వెళ్ళండి.

23

మెథడిస్టులు లేచి, శుద్దీకరణమును బోదించిరి. అది మంచిదే. కాని వారు ఆలాగు చేసి ఒక శాఖను తయారుచేసిరి. దానిని వారు స్థిరపరచిరి. అందుకే బైబిలు ఈలాగు చెప్పుచున్నది. ''నీకు పేరు మాత్రమున్నది.''

''నేను ఒక క్రైస్తవుడను అని నీవందువు.''

''అయితే ఏ శాఖకు నీవు చెందినవాడవు?''

''ఒక మెథడిస్టును అందువు. '' అయితే నీవు వేశ్యవు.

''నేను బాప్టిస్టును'' ఒక వేశ్యవు. ''పెంతెకోస్తు'' - నీవు ఒక వేశ్యవు. ఆ సంఘమునకు నీవు చెందియున్నావు. నీవు క్రీస్తుకు చెందియుండాలి. ''మెథడిస్టు'', '' బాప్తిస్టు'' అని చెప్పుకొనవలసిన పని నీకు లేదు. నీవు కైస్తవుడవయినచో నీ హృదయమందును క్రైస్తవుడవే.

24

ఈ శాఖలలో ప్రతి ఒక్కటియూ దేవునియొక్క పిల్లలను ఉత్పత్తి చేయగలదు. అది నిజము. కాని నీవు మెథడిస్టువు, బాప్టిస్టువు అయినందున పరలోకమునకు వెళ్ళుదువు అనుకొనుట తప్పు. ఆ కారణము చేతనే మనము దానికి దూరమగుచున్నాము. బాప్టిస్టు దానినెందుకు చూడలేరు? ఒక మెథడిస్టు వ్యక్తిని ముఖము మీదనే కొద్దికాలము క్రిందట నేనడిగాను. అతడిట్లు పలికెను. ''నీవు పెంతెకోస్తువారిని పట్టుకొని వ్రేలాడుచున్నావు. అదొక్క దానికే మేము నీకు విరోదము.''

''మనము ఎవరము?'' అనడిగాను.

“మనము మెథడిస్టులము.''

''అయితే నేనేమి చేయుదునో చెప్పుదును. నేను మీ పట్టణమునకు వచ్చెదను గాని.

''ఓ! అలాగు చేయవలెనని ఉన్నది కాని అంత స్తోమత లేదు'' అని అతడనెను.

''నా ఆలోచన అదే. పెంతెకోస్తువారు దానిని నమ్మిరి గనుక నేను వారితో నిలచియున్నాను అది నిజము. వారు దానికోసము ప్రాకులాడుదురు. దానివలన లాభము పొందుచున్నవారు వారే!'' అని నేను చెప్పాను.పెంతెకోస్తు సంఘము గూర్చి వ్రాయబడిన వ్యాసమును ఈ మద్య ఆ లైఫ్ పత్రికలో ఎందరు చదివారు? ఈ కాలములోని మహత్తర సంఘటనలలో అది ఒకటి. ఒక్క సంవత్సరములో వారి సంఘములోనికి చేర్చబడినవారు, తక్కిన సంఘములన్నింటినీ కలిపి అందులో చేర్చబడిన వారికంటె ఎక్కువ. ఎందువలన? వారి తప్పుల మద్య కూడా దేవుడు వారిని ముందుకు నడిపించుచున్నాడు, ఎందుకనగా వారు సత్యమును నమ్మి దానితో సాగిపోవుచున్నారు. అది నిజము.

25

కాని ఇప్పుడు మనము ఏమి చేయుచున్నాము? చూడండి? ఆ కారణము చేతనే మనము ఒక శాఖ కాదు.పెంతెకోస్తువారు ఒక శాఖ అయిరనుట ఖచ్చితము. నలుబది సంవత్సరముల క్రితము మొదటిసారిగా పరిశుద్ధాత్మ వారిమీద క్రుమ్మరించ బడినప్పుడు (పెంతెకోస్తు సంఘము) వారు భాషలతో మాట్లాడసాగిరి, అది వరములలో ఒకటి. అది అన్ని వరములలోను చిన్నది. పరిశుద్ధ పౌలు చెప్పిన ప్రకారము అది అల్పమగు వరము. (భాషలలో మాట్లాడుట) అది పడిన వెంటనే వారు, ''ఓ! దానిని ఇప్పుడు పొందాము'' అని చెప్పి వారు ఒక శాఖను తయారుచేసిరి. జనరల్ కౌన్సిలు ఇప్పుడు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అయినది. ''ఓ! నీవు భాషలతో మాట్లాడితేనేగాని'' అందులో చేరవు. దేవుడు వారినుండి దూరమైపోయెను, వారిని అక్కడే కూర్చోనిచ్చెను. అవునండి, నిశ్చయంగా.

26

ఆ తరువాత ఏకత్వము వారు వచ్చిరి, యేసు నామములో బాప్తిస్మము కనుగొనిరి. ''ఓ! దానిని మేము పొందాము'' అని చెప్పి వారు ఒక సంస్థగా మారిరి. వారేమి చేసిరి? దేవుడు వారియొద్ద నుండి వెళ్ళిపోయెను. వారింకా అక్కడే కూర్చొనియుండిరి. ''ఇచ్చయించిన వానిని రానిమ్ము'' అదే.

చూడండి, ఏకత్వమువారు అసెంబ్లీస్ వారియొద్దకు వెళ్ళలేరు. అసెంబ్లీస్‌ వారు ఏకత్వము వారి యొద్దకు వెళ్ళలేరు. వారిలో అతి గొప్పవారితో నేను మాట్లాడాను. శ్రీ గోస్ - డాక్టర్ పోప్.... ఇంకా చాలామంది గొప్పవారున్నారు. వారితో నేను కూర్చొని, ''ఒక పండితునిగా ఉన్న మీరు ఆ ప్రారంభ సూచనగూర్చి ఏలాగు బోదించగలుగుచున్నారు?'' అనడిగాను. అందులో ఇద్దరు ముగ్గురు యథార్థపరులున్నారు. వారిట్లు పలికిరి.

''మంచిది, బ్రన్హాం సోదరుడా, అది తప్పు అని మాకు తెలియును. కాని మేము ఏమి చేయగలము? దానిగూర్చి ఇప్పుడు మేమేమి చెప్పినాగాని మొత్తము కార్యక్రమమునకు దెబ్బ తగులును. '' తప్పకుండా, ఇక నీవు బిషప్పుగా ఉండవు, జనరల్ ఓవర్‌సీర్‌గా ఉండవు. అది అసలు సంగతి.

27

సోదరుడా, నేను ఎక్కడో ఒక మూలన ఒక చిన్న పని కలిగియుండుట మంచిది, లేదా ఒక పైన్ చెట్టు క్రింద బోదించెదను, మరియు సత్యమును నిలుపు కొందును. నీవు సత్యము చెప్పుచున్నావని తెలిసికొనుము. మనిషి సత్యమును కోరును. క్రైస్తవునిగా నీవు సత్యమును చెప్పవలసిన విధిని కలిగియున్నావు. దానికే దేవుడు నిన్ను బాద్యునిగా ఎంచును. ఈ సంగతుల మీద నిలబడుము. యేసుక్రీస్తు నామములో నీవు బాప్తిస్మము పొందనియెడల, ఈ సంగతులను నీవు కలిగియుండని యెడల నీవు పరిశుద్ధాత్మను కలిగియుండవు.

''ఓ! నేను భాషలలో మాట్లాడుచున్నాను'' అని నీవందువు. అందువలన నీవు పరిశుద్ధాత్మను కలిగియున్నావని అర్థముకాదు. మాంత్రికులు, దయ్యములు, క్షుద్రశక్తులుగలవారు ఇంకా చాలామంది భాషలలో మాట్లాడుట నేను చూచాను. నిశ్చయంగా వారు పరిశుద్ధాత్మను కలిగిలేరని మీకు తెలియును. వారు మానవ కపాలములో నుండి రక్తమును త్రాగుదురు, నాట్యమాడి దయ్యములను పిలచుదురు, మరియు భాషలలో మాట్లాడుదురు. నిశ్చయంగా వారు పరిశుద్ధాత్మను పొందలేరు.

28

కాబట్టి, నీవు భాషలతో మాట్లాడినందున నీవు దానిని పొందినట్లు కాదు. నీ ఆత్మ ఆయన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చును, ఆత్మ ఫలములు నీయందు కనబడును. ప్రేమ, విశ్వాసము, సంతోషము, సమాదానము, దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము, దయాళుత్వము, అదొక్కటే నీవు దానిని పొందినట్లుగా రుజువు. అప్పుడే నీవు పరిశుద్ధాత్మను పొందియున్నట్లుగా తెలియును. దానికదే సాక్ష్యమిచ్చును. ఇప్పుడు, నీవు అసెంబ్లీస్‌కు, లేదా బాప్టిస్టులకు లేదా ప్రెస్బిటేరియనులకు చెందియున్నావు గనుక దానిని పొందినట్లుగా ఎంచు ప్రయత్నములు చేయుచున్నావు. నీవేమి చేయుచున్నావనో నీవు చూచుచున్నావా? నీవు ఒక వేశ్య యొక్క నామమును దరించుకొనుచున్నావు. అది అక్షరాలా నిజము. అట్టి దాని నుండి తొలగిపొమ్ము. దాని నుండి బయటకు రమ్ము! నీ సంఘము నుండి బయటకు రమ్ము అని నేను చెప్పుట లేదు. దాని విషయములో నీకు తోచినది చేయుము. కాని దూరముగా రమ్ము. ''ఓ! నేను క్రీస్తు సంఘమునకు చెందియున్నాను. వారు అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవని చెప్పుచున్నారు'' అందువు. వారు అబద్ధ ప్రవక్తలు. రోగులను స్వస్థపరచుటకు, మృతులను లేపుటకు, దయ్యములను వెళ్ళగొట్టుటకు యేసుక్రీస్తు సంఘమునకు అదికారమిచ్చుట నేను చూపించగలను. దానిని సంఘము నుండి ఆయన తీసికొనినట్లుగా ఎవరయినా నాకు లేఖనములో చూపించగలరా అని సవాలు చేయుచున్నాను.

ఎవరు దానిని తీసివేసిరి? మీ స్వసిద్ధాంతములు, నిజము. దేవుని వాక్యము కాదు. పరిశుద్ధాత్మ ఇంకా పనిచేయుచున్నది. ఎప్పటివలెనే వెళ్ళుచున్నది. నిత్యము అలాగే కొనసాగును.

29

ఆ కారణముచేతనే మనము ఒక శాఖకాదు. ''పైకి భక్తిగల వారివలె ఉండియు, దాని శక్తిని ఆశ్రయించనివారు. అట్టి వారికి విముఖుడవై యుండుము.'' అట్టి వాటిని మేము నమ్మము. ఇప్పుడు, అదెట్లు ప్రారంభమయినది? మనము వీలైనంత త్వరగా వెళ్ళిపోవలెను. అదెట్లు ప్రారంభమాయెను. పరిశుద్ధాత్మగూర్చి సమద్ధిగా ఇక్కడ వాక్యములు వ్రాసి ఉన్నవి.

మరో సంగతి ''పరిశుద్ధుల యొక్క పట్టుదల'' గూర్చి గత రాత్రి ఒక సవాలు మేము చేసాము, బాప్టిస్టువారు నమ్మునట్లుగా అది ఉండదు. కాదండీ.. నేను తప్పకుండా బాప్టిస్టులతోను, కాల్వినిజం సిద్ధాంతముపట్ల వారికిగల అభిప్రాయముతోను విభేదించుదును, ప్రేస్బిటేరియనులతో నిశ్చయంగా నేను ఏకీభవించను. మెథడిస్టుల యొక్క ఆర్మీనియను సిద్ధాంతము విషయములో వారిలో నేను అంగీకరించను. అవునండీ! కాని వారిద్దరూ ఒక సత్యమును కలిగియున్నారు. కాని సత్యముఎక్కడున్నదో అక్కడికి దానిని మీరు తీసికొని రావలసియున్నారు. దానితో మీరు ఏకీభవించినయెడల దాని తప్పుదురు. ఖచ్చితముగా.

30

బాప్టిస్టులు కొందరిని ఇక్కడ ముంచుట ద్వారా బాప్తిస్మమిచ్చుదురు, ఆ పది మందిలో తొమ్మిదిమంది సిగరెట్లు త్రాగువారే. వారికి బోదకుడు బాప్తిస్మమిచ్చును, ఆ తరువాత వారు వెళ్ళి పేకాట, రాత్రంతా జూదము ఆడెదరు, మోసకరమగు వ్యాపారములు చేయుదురు, స్త్రీలు పొట్టి దుస్తులు దరించి వీదులలో తిరుగుచున్నారు, తమ జుట్టు కత్తిరించుకొనుచున్నారు, పొగత్రాగుచున్నారు, త్రాగుడు విందులలో పాలుపొంది మురికి సరసోక్తులు చెప్పుకొనుచున్నారు. దానిని మీరు క్రైస్తవ్యమందురా? మీకు నిత్య భద్రత ఉన్నదని తలంచుచున్నారా? అలాగే మీరు నరకమునకు వెళ్ళుచున్నారు! ఏ విదముగాను పరలోకమును మీరు అనుభవించలేరు. నిశ్చయంగా అనుభవించరు. అది నిత్యభద్రత కాదు.

కాని ఒకడు పరిశుద్ధాత్మ మూలముగా తిరిగి జన్మించినప్పుడు..... మీ పెంతెకోస్తువారు క్రిందికి పైకి ఎగిరి, భాషలతో మాట్లాడి, ఆ బల్లలమీద క్రిందా మీద తెలియకుండా పరుగులెత్తుచున్నారు, అందువలన మీరు నిత్య భద్రతను కలిగియున్నారని అర్థము కాదు. మీ మనస్సులలో ఎన్నడూ అలాగు తలంచవద్దు. కాదండీ నిశ్చయంగా అది కాదు. మీరు దేవునితో సరిచేసికొనలేదని మీ స్వంత జీవితమే సాక్ష్యమిచ్చుచున్నది. అది నిజము. మీరు సరిగా లేరు. అదింకా నిత్య భద్రత కాదు.

31

కాని, నేను ఒక విషయమును మిమ్మును అడుగగోరుచున్నాను. అసలు నిత్యత్వపు భద్రతయున్నదా? బైబిలు అలాగు చెప్పుచున్నది. లోకము అనునది అసలు ప్రారంభము కాకముందే మన పేర్లను గొర్రెపిల్ల జీవగ్రంథమందు వ్రాసెనని బైబిలు చెప్పెను. ఒక క్రొత్త పేరు వ్రాయబడెను. ఆ పేరు నాదే'' . అతని ఉద్దేశ్యము మంచిదే. కాని వాక్య ప్రకారము అది తప్పు. నీవు రక్షిoచబడిన రాత్రిలోనే నీ పేరు వ్రాయబడుట కాదు. బైబిలు ప్రకారము, ప్రకటన 13:17 ప్రకారము ''ప్రపంచమనునది లేకముందే నీ పేరు అక్కడున్నది. జగత్తుకు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు వదించబడెను.''

32

ఆదిలోనే అంతమును ఎరిగిన అనంతుడగు దేవుడు, కారణము లేకుండా పాపమును ఆయనెట్లు భూమిమీదకు అనుమతించును?మనము చెప్పిన కొన్నిటిని బలపరచుటకు ఇవి చెప్పుచున్నాను;

మొదట ఎవరు? పాపియా లేక రక్షకుడా? (సభలో కొందరు ''రక్షక్షుడే'' అని చెప్పుచున్నారు -సంపా.) నిశ్చయంగా రక్షకుడే! ఎవరు ఎక్కువ శక్తిగలవారు? పాపియా లేక రక్షకుడా? రక్షకుడు పాపమును తీసివేయగలడు గనుక ఆయనే ఎక్కువ శక్తిమంతుడు.

అయితే పాపమును ఆయన మొదటగా ఎందుకు రానిచ్చెను? తాను రక్షకుడనని చూపించుటకే.

ఎవరు ఎక్కువ శక్తిగలవారు? స్వస్థపరచువాడా? లేక రోగియా? (''స్వస్థపరచువాడు'') స్వస్థపరచువాడే. అయితే ఆయన రోగమును ఎందుకు రానిచ్చెను? తాను స్వస్థపరచువానినని చూపించుటకు నేను ఎంతో భక్తి అనుభూతి చెందుచున్నాను. అవునండీ ఓ! అవి ఆయన గుణాలక్షణములు. అందుకే ఆయన శ్రమలను రానిచ్చెను. తానే ఆనందము అని చూపించుటకు ఆయన దుఃఖమును రానిచ్చెను. నిశ్చయంగా అంతే పగలున్నదని రుజువు చేయుటకే ఈ రాత్రి మనకున్నది. సమాదానమున్నదని చూపించుటకే మనకు కోపమున్నది. నిశ్చయంగా అవి అనుకూల ప్రతికూలతలు. ఓ! ఆయన ఆశ్చర్యకరుడు.

33

అదెట్లు ప్రారంభమాయెను? రాత్రంతా మిమ్మును ఉంచకుండా త్వరగా వెళ్ళి పోవుటకు తిన్నగా దానిని చెప్పుకొందము. అన్నింటికీ ఒక ప్రారంభము ఉండవలసియున్నది. ఒక సంగతి మిమ్మును అడుగ గోరుచున్నాను. దీనిని మీ జేబులో పెట్టుకొనుడి. మీ అనుదినపు దానిలో కాదు. కాని దీనిని వినండి. నీవు ఒక నిత్యత్వపు జీవివైనయెడల నీకు ఎన్నడూ ఆది, అంతములు ఉండవు. ఎందుకనగా నిత్యత్వము అను పదము'' ఆది, అంతము లేనిది '' అను పదము నుండి వచ్చినది. ఈ ఉదయమున మెల్కీ సెదెకును గూర్చి చెప్పినది మీకు గుర్తుండెనా? రాజులను సంహరించి వచ్చుచూ అతడు అబ్రహామును కలిసికొనెను. తండ్రియగు అబ్రహాము నడుములో వుండగానే లేవీ దశమ భాగమును మెల్కీసెదెకునకు చెల్లించెనని బైబిలు నందలి హెబ్రీ 7లో చదువుచున్నాము. అబ్రహాము ఇస్సాకును కనెను; ఇస్సాకు యాకోబును కనెను; యాకోబు లేవీని కనెను. అనగా తండ్రీ, తాత, ముత్తాత. లేవీ తన ముత్తాత యొక్క నడుమునందున్నప్పుడే అతడు మెల్కీసెదకునకు దశమ భాగము చెల్లించెనని చెప్పబడెను. నిత్యత్వము గూర్చి చెప్పుచున్నాను.

34

''అతడు ఛాయగా దానిని చేసెరనిగాని, సూచనగా చేసెనని గాని ఎన్నడూ చెప్పలేదు,'' గాని ''అతడు దశమ భాగమును చెల్లించెనని'' బైబిలు చెప్పుచున్నది. ఆమేన్! మనము సరైన సంతతి మూలముగా వచ్చియెడల, పౌలు సువార్త ప్రకటించినప్పుడే నేను అక్కడున్నాను. మీరు, మనము అక్కడున్నామని చెప్పగలము. దానిని మన చెవులలో భద్రపరచుకొనునట్లుగా ఒక్క నిముషములో దానిని చెప్పెదను. మనము అలాటి వారమని లేఖనములు చెప్పుచున్నవి. అది చాలా వెనుకకు కూడవెళ్ళినది.

లేవీని గూర్చి ఆలోచించండి; అతని తండ్రి యాకోబు, తరువాత అతని తండ్రి ఇస్సాకు; అతని తండ్రి అబ్రహాము; లేవీ తన ముత్తాత యొక్క నడుములో వున్నప్పుడే మెల్కీసెదెకునకు దశమ భాగము చెల్లించెను.

35

ఒక సంగతి మిమ్మును అడుగ గోరుచున్నాను. యోబు 38, ''భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడుంటివి? '' ఉదయ నక్షత్రములు కూడి పాడినప్పుడు దేవుడు ఆనందముతో పులకించెను; మరియు దేవుని కుమారులు ఆనందముతో అరచుచున్నారు. ఆనందముతో పులకించిన ఈ దేవుని కుమారులు ఎవరు?'' ''జగత్తు పునాది వేయబడక ముందే మీతో నాకు సంతోషము కలదని'' యేసు వారితో చెప్పెను. మనము కాల జీవులము కాదు గాని నిత్యత్వపు జీవులము. ''నా తండ్రి ఒకని ఆకర్షించితేనే గాని తప్ప ఎవడును నాయొద్దకు రాడు. నా యొద్దకు వచ్చువారందరికీ నేను నిత్యజీవము ఇచ్చెదను. అంత్య దినమున వారిని లేపుదును. తండ్రి చేతిలో నుండి ఎవరునూ వారిని అపహరింపజాలరు. ఆయన వారిని నాకనుగ్రహించెను.'' మీరెట్లు పోగొట్టుకొందురు? చూడండి, మీరు భయపడితిరి. మీరు భీతిల్లితిరి. ఇక్కడనుండి పారిపోవుదును. ఇంక మీరు ఎక్కడా లేరు అనుటకు అతి గొప్ప రుజువు అదియే. అది నిజము.

36

దేవుడు నిన్ను ఎట్లు రక్షి౦చగలడు? దేవుడు అనంతుడు అని ఈ సంఘములో ఉన్న వారెందరు నమ్మి చేతులు ఎత్తగలరు? ''అనంతము'' అను మాటకు అర్థము మీకు తెలియునా?పరిపూర్ణము అని భావము. ''అనంతము'' అను మాటను మీరు వివరింపజాలరు.

మీరెప్పుడయినా మీ కెమేరాను తీసికొని అనంతము వైపు గురి పెట్టారా? ఆ తరువాత అని దాని అర్థము. మంచిది. దానిని వెల్లడి చేయు మార్గము మరేదియూ లేదు. దేవుడు అనంతుడుగా ఉన్నాడు. ఆయన అనంతుడయిన యెడల ఒక పేడ పురుగును గాని, ఈగ గాని, పేను గాని, ఎలుక గాని, భూమిమీద ఉండిన, ఉండబోవు మరి ఏ జీవి అయినా గాని ప్రపంచము అసలు రూపొందక ముందే ఆయనకు తెలిసియుండును. అనంతమును గూర్చిన చిన్న భావన అది.

37

ఇక్కడ నిన్ను రక్షి౦చుచున్న అనంతుడగు దేవుడు, వచ్చే వారము, వచ్చేనెల, వచ్చే సంవత్సరము నిన్ను పోగొట్టుకొందునని తెలిసికొనును గదా! అసలు ఉద్దేశ్యమునే ఆయన పోగొట్టుకొనును. కాబట్టి ఆయన నిన్ను పోగొట్టుకొనలేడు. ''నా మాటలు విని, నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, అట్టివాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు.'' అలాగు చేయలేడు నీకు ఇంకనూ.... దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు; ఎందుకనగా దేవుని యొక్క బీజము అతనిలో నిలిచియున్నది. కనుక పాపము చేయజాలడు. అతనికి పాప పరిహారార్థ బలి అర్పించబడియుండగా పాపమేలాగు చేయగలడు? నేను పరిపూర్ణ ఆరోగ్యముతో ఉండగా రోగినెట్లు కాగలను? నేను చూడగలుగుచుండగా గ్రుడ్డివాడనెట్లవుదును? ఓ! ఒకే సమయములో భవనము లోపల, బయట ఎట్లుండగలను? ఒకే సమయములో మత్తుగా, మత్తులేనివానిగా ఎట్లుండగలను? నీవు అలాగుండలేవు. నీవు రక్షిoచబడినప్పుడు నీవు ప్రాయశ్చిత్తము క్రింద ఉన్నావు. నీ పాపములు నీకు ఆరోపించబడవు.

38

నీ దావీదు ఈలాగు చెప్పలేదా? ''ఎవని అతిక్రమములు దేవుడు పరిహరించెనో వాడు దన్యుడు.'' ఆయన జీవికి విరోదముగా దేవుడు పాపమును ఆరోపించడు. అది చాలా గట్టిమాట అది వెన్న తీసిన పాలు కాదు. అదే బైబిలు. నీతిమంతునికి దేవుడు పాపము ఆరోపించడు. ''దేవుడు, '' తన కృపను బట్టి ముందు నిర్ణయముద్వారా ''ఎవరూ నశింపరాదని ఇచ్ఛయించెను, అందరూ మారుమనస్సు పొందవలెనని కోరెను. ''అయితే అనంతుడయినందున ఎవరు వచ్చుదురో, ఎవరురారో ఆయనకు తెలియును. సమస్తమును తన చిత్తప్రకారము జరుగునట్లు ఆయన ముందు నిర్ణయము చేయగలడు.

ఆయన దానిని చేయనియెడల, మొదటిగా పాపమును ఎందుకు అనుమతించెను. ఆయన రక్షకుడు అయినప్పుడు.... అక్కడ పాపి లేనియెడల, ఆయన ఎన్నడూ రక్షకుడు కాజాలడు, ఆయనలో ఉండిన గుణలక్షణము బయటకు రాబడదు.

39

ఆయనెట్లు స్వస్థపరచువాడు కాగలడు? ఆయనెట్లు స్వస్థపరచువాడు కాగలడు. ఆయన వ్యాది వచ్చుటకు అనుమతి ఇచ్చెను, కాబట్టి తాను స్వస్థపరచువానిగా చూపించుకొనగలడు. ఆయన ఒక స్వస్థపరచువాడు. ఆయనేలాగు తెలియబడును? ఆయన గుణలక్షణము ఏలాగు పనిచేయగలదు? వ్యాది అనునది లేనియెడల ఆయనెట్లు స్వస్థపరచువాడు కాగలడు? ఆయన వ్యాదిని అనుమతించవలసి యుండెను.

రోమా 8 లో పౌలు పలికిన దానిలో ఆశ్చర్యములేదు. ''కుమ్మరి వానికి రూపించబడు పాత్ర ఏమి చెప్పగలదు. '' ''ఓ వెర్రివాడా! నన్నెందుకు ఈలాగు రూపించితివి'' అని నన్ను నిలబడి అడుగునా? ఐగుప్తులో తన మహిమ కనుబరచునట్లుగా ఫరోను ఆ ఉద్దేశ్యముతోనే ఆయన లేపలేదా? తనకు ఇష్టమొచ్చిన వారిని ఆయన కఠినపరచును. తనకు ఇష్టమొచ్చిన వారిని నీతిమంతులుగా తీర్చును. ఇచ్చయించు వాని వలనగాని, ప్రయాసపడు వాని వలనగాని, ఏమీ కాదు గాని కరుణించు దేవుని వలననే కలుగును. కాబట్టి ఆ విషయములో నీవు చేయగలిగినది ఏమియూ లేదు. నీవు ఒక్కటి కూడా చేయజాలవు. అది కృప అయినయెడల, అది ఉచితముగా ఇచ్చు కానుక అయినప్పుడు, దాని విషయములో నీవు ఏమియూ చేయజాలవు. దేవుడు దానిని నీకు ఇచ్చెను, అది దేవునియొక్క చిత్తము. దేవుడు అందుకు నిన్ను ముందుగా నిర్ణయించెను.

40

''జగత్తుకు పునాది వేయబడకముందే దేవుని కుమారులముగా, దత్తత పొందుటకు మనము ముందుగా నిర్ణయించబడితిమని'' బైబిలు చెప్పెను. తన గుణ లక్షణములను రుజువు చేయుటకు జగత్తుకు పునాది వేయబడక ముందు తన సొంత ఆలోచనలో దేవుడు గొర్రెపిల్లను వదించెను. వదించబడిన గొర్రెపిల్ల ఆయనే. ఆయనతో కూడా మనము వదించబడితిమి. లోకపు పునాది వేయబడక ముందే ఆయన మనస్సులో గొర్రెపిల్లయొక్క రక్తము స్రవించినది. అప్పుడే నీ, నా పేర్లు గ్రంథముమీద వ్రాయబడియున్నవి. అంతా ఆయనయొక్క గొప్ప ఆలోచనలో జరిగెను.

41

ఆయన అనంతుడు. లేనియెడల ఆయన ఎందుకు దానిని అనుమతించెను? రక్షకుడా లేక పాపియా? ఎవరు బలవంతుడు? అని నేనడిగాను. ఎక్కువ బలము ఎవరికున్నది? బలవంతుడగువాడు తక్కువవానిని అనుమతించవలయును, దానిని ఆయన నామమహిమ కొరకే చేయును.

లూసీఫరును ఆయన చేసినప్పుడు అది అపవాది యగునని ఆయనకు తెలియును. తాను క్రీస్తును, రక్షకుడను అని చూపించుటకు దానినక్కడ ఆయన అనుమతించవలసి యున్నది. ఆ విదముగా ఆయన దానిని జరుగనిచ్చెను. ''దేవుడు ప్రేమించు వారికి సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుచున్నవని ''బైబిలు చెప్పుట లేదా? (సభ, ''ఆమేన్'' చెప్పుచున్నది. సంపా.) కాబట్టి దేనిని గురించి నీకు భయము? మనము లేచి మరియు చేయుదము! ఏ దశనైనా ఎదుర్కొను హృదయముతో. ప్రాదేయపడి నడిపించబడు మూగ పశువువలె ఉండవద్దు; ఒక నాయకునిగా ఉండుము నాకది ఇష్టము. లేచి నిలబడుదము!

42

నేను బాలునిగా వున్నప్పుడు నాకు ఎంతో సహాయపడిన ఒక చిన్న పద్యము ఇట్లున్నది:

ఒక గొప్ప రోమను ఉండెను.

రోమా రాజు యొక్క దినములలో; ఒక పిరికి వాని స్వరమును,

దుర్గము ముందు వినెను:

''ఓ! అటువంటి ఫర్చెట్టులో ఎంతో కష్టము.

దానినెవరూ కదిలించలేరు.'' ''ఓ! కాదు'' అని నాయకుడుఅనెను.

''ఒక దారి నేను కనుగొ౦దును లేదా తయారుచేతును.''

43

అక్కడే నీవుందువు. అది నిజము. ఈ బైబిలు, యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా వున్నాడని చెప్పుచున్నచో, ఇది జరుగును, అది జరుగును అని అందరూ చెప్పుచున్నప్పుడు ఈ ఆలయములో నుండి నేను అడుగు బయట పెట్టుట తేలిక పనికాదు. ''నిన్ను ఒక పిచ్చవానిగా ఎంచుదురు, చెరసాలలో త్రోయుదురు. వైద్య సమాఖ్యవారందరూ నీకు విరోదులవుదురు. '' కాని దేవుడు, దానిని చేయుము అని చెప్పెను. ఆయన అలాగుండెనని బైబిలు చెప్పెను. ఇప్పుడు ఆకాశము క్రింద ప్రతి దేశములోను ఉజ్జీవ అగ్ని మండుచున్నది. ఎందుకు? దానికి నిలబడుము

ప్రతిరోజూ నీ పనిని నీవెట్లు ఎదుర్కొందువు?

నీవు నీ పనిలో భయపడుచున్నావా

నీవు అలసిన, ఖాళీ మనస్సు కలిగియున్నావా?

(నాకది అసహ్యము)

''నీ ముందున్న పని నెదుర్కొనుటకు సిద్ధముగా వున్నావా?

లేక భయము నిన్నువెంటాడుచున్నదా?

అలాగయిన, తరువాత నీవు కనుగొను దానిని ఎదుర్కొనుము,

ఆలోచించుట ద్వారా దానిని నీవు చేయుదువు.''

దానితో నిలచియుండుము. నిశ్చయంగా. దానియేలువలె నీ హృదయమందు పట్టుదల కలిగి యుండుము. దేవునితో నిలచియుండుము.

44

''ఇదంతా ఎక్కడ జరిగినది?'' ''అదెట్లు సంభవించెను?'' ''ఎందుకు మనము నాశనమునకు కాచుకొనియున్నాము? బ్రనహాం సోదరుడా, దానిని నాకు వివరించుము. ఇదంతయూ తుడిచి పెట్టుకొనిపోవలెనను ఆలోచన నీలో వచ్చుటకు కారణమేమి? ముందు ఒకసారి అది తుడిచిపెట్టుకొని పోయినది. నిజమేనా? జల ప్రళయపు నాశనము. ఇక్కడ కొన్ని లోతైన సంగతులు వచ్చుచున్నవి. చదువుటకు మనము సిద్ధపడుదము.

45

నాతో పాటు ఇప్పుడు మీరు ఆదికాండము మూడవ అద్యాయము తీయవలెనని కోరుచున్నాను. ఏదయినా మీరు తెలిసికొనవలెనన్న యెడల దానిని ఆదికాండములో మీకు చూపించగలను. ప్రతి ''విశ్వాసము'' ప్రతి ''వాదము,''ఈనాడు మనకున్న ప్రతిదియూ ఆదికాండములోనే ప్రారంభమాయెను. ''ఆదికాండము'' అనగా ప్రారంభము అని ఎందరికి తెలియును? ఖచ్చితంగ ఆదిలోనే కాథలిక్కు సంఘమును మనము కనుగొందుము - బబులోను, సంస్థాపకుడు నిమ్రోదు. దానిని బైబిలు మద్యలో మనము కనుగొందము, బైబిలు చివరలో దానిని మనము కనుగొందుము; స్త్రీ బోదకులను తీసికొని వచ్చుటకు ప్రయత్నించుట, కర్ర బొమ్మలను ఆరాదించుట బైబిలు ప్రారంభములోనే మనము కనుగొందుము.

హిసోపు యొక్క చారిత్రక గ్రంథము ''రెండు బబులోనులు'' ను ఎందరు చదివారు? ఈ చరిత్రలో మనకు ఇది తెలియును. యాకోబుయొక్క భార్య తన తండ్రియొక్క విగ్రహమును దొంగిలించి దాచెను, వారు బయట అరణ్యములోనికి దానిని తీసికొనిపోయిరి. అందువలన పాళెము అపవిత్రమాయెను.

46

అది సరి. ఇప్పుడు ఆదికాండము నుండి చదువుదము;

దేవుడైన యోహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఈ స్త్రీతో - ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను.

......అందుకు స్త్రీ - ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును.

అయితే తోట మద్యనున్నచెట్టు ఫలములను గూర్చి దేవుడు - మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను.

అందుకు సర్పము - మీరుచావనే చావరు;

ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరువబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగినవారై దేవతలవలె ఉండురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పెను. (చూచారా! క్రొత్త వెలుగును వెంటాడుచున్నారు.)

47

చూడండి. నేడు వీరు బైబిలునుండి ఏలాగు కొంత తీసివేయగోరుచున్నారో! ''పోయుట లేదా చిలకరింపును, లేక ఇది, అది అంతా ఒకటే'' అందురు. కాదండీ దేవుడు ఒక కార్యక్రమమును తయారుచేసెను. దానినే మనము వెంబడించవలసి యున్నాము. ఇది. (సహో. బ్రన్హాం బైబిలును సూచించెను - సంపా.)

స్త్రీ - ఆ ఆహారము ఆహారమునకు మంచిదియు; కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్నితీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను.

అప్పుడు వారిద్దరి కన్నులు తెరువబడెను. వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి.

48

ఒక నిమిషముపాటు ఇక్కడ నేను ఆపగోరుదును. ప్రతిదానికి ఒక ఆది ఉండవలసియున్నది. నీకు ఒక ఆదియున్నది. గత ఈ రెండు కూటములలో నేను మాట్లాడిన దానికి దీనిని ప్రాతిపదకగా తీసికొనుచున్నాను. ఇప్పుడు ఈ ఉదయము మనము వెనుకకు వెళ్ళి దేవుడు భూమిని ఎట్లు చేసెనో ప్రదర్శనాత్మకంగా చూచాము, ఆయన వాయువులను రూపించెను; వాయువులు కాల్షియంగా, పొటాష్‌గా, ఇంకా చాలా వాటిగా మారినవి. ఆయన నీ శరీరమును తయారు చేయుచుండెను. ఆయన ఒక గొప్ప నిర్మాణకునివలె పని చేయుచుండెను. ఒక కాంట్రాక్టరు సామాగ్రి అంతటితో ఇంటి నిర్మాణము చేపట్టినట్లుగా వుండెను. ఆయన నీ శరీరమును తయారు చేయుచుండెను. దానిని అక్కడ ఉంచెను. ఏది తయారు కాబడవలసియున్నదో ఆయన మనస్సులో ఖచ్చితంగా ఎరుగును. ప్రపంచమును తయారు చేయుచుండగా దేవుడు ఆ చేతిని తయారుచేసెను. కాని నా ఆత్మను ఆయన లోకమనునది ఏర్పడక ముందే చేసెను. కాని ఈ చేయి, ఈ శరీరమును ఆయన లోకమును సృజించినప్పుడు చేసెను. ఎందుకనగా ఈ శరీరము మట్టిలోనుండి వచ్చి తిరిగి మట్టిలోనికి పోవును. దానిని దేవుడు చేసెను. దానినంతటినీ ఆయన తన యొక్క గొప్ప నమూనా మరియు కార్యక్రమము ప్రకారము దానిని నియమించెను.

49

కాని, ఆయన భూమిని తయారు చేయుటకు వెళ్ళినప్పుడు మానవుని చేసెను. మానవుడు సరిగా కనబడలేదు. ఈ ఉదయమున దానిని మనము నాటక రూపములో చూచాము. తండ్రి ఎట్లు దిగివచ్చి తన కుమారుని వైపు చూచెనో, తన స్వరూపమందు ఎట్లు చేసెనో మనము చూచాము. అప్పుడు ఆయన ఒక భార్యను, సాటియగు సహాయమును చేసెను.

ఇప్పుడు, గుర్తుంచుకొనండి. భూమి మీద జీవులన్నింటికి ఆదాము పేర్లు పెట్టెను. ఆయన పశువులను, మృగములను సమస్తమును సృజించెను. ఈనాడు పరిణామవాదులు, ఆయా గొప్ప విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఆరువేల సంవత్సరములనుండి తప్పిపోయిన ఆ గొలుసు కొరకు వెదకుచూ ప్రయత్నములు చేయుచున్నారు. మానవుడు జంతు జీవములోని వాడని మనకు తెలియును. స్త్రీ, పురుషునిలోని ఒక భాగము - ఒక ఉప ఉత్పత్తి, మూల సృష్టిలో స్త్రీ లేదు. పురుషుని ప్రక్కటెముకలో నుండి స్త్రీని తయారు చేయుటకు ఎన్నో సంవత్సరాల ముందే దేవుడు సృష్టి చేయుటను ఆపెను.

50

ఆదాము సమస్త సృష్టికి పేర్లుపెట్టెను, కాని తనకు ఏదీ లేదు. అందుకే, ఆయన అతనికి సాటియగు సహాయమును చేసెను; అతని ప్రక్కటెముకను తీసికొని ఆ ఖాళీని పూడ్చి అతనికి ఒక సాటియగు సహాయమును చేసెను; పురుషుడు ఆత్మయందు ద్విలింగుడు. మరియు స్త్రీ పురుషునిలో భాగమైయున్నది.

పురుషునికి దేవుడిచ్చిన భార్య దొరికెను; ఆమె అతనికి ఒక భాగముగా వుండును. ఆమె ఖచ్చితంగా అతని భార్య.

ఆ కారణముచేతనే వివాహములో ఎన్నో ''అవదులు'' ఉన్నవి, వెళ్ళి చెక్కని అందమగు గోదుమ రంగు కండ్లు లేదా నీలపు రంగు కండ్లు లేదా ఏదో నీవు అందముగా వన్నదని తలంచు బాలికను ఎన్నుకొందువు. ఆమెకొరకు ఆశించుదువు. ఆమె మొదటి శిశువును కనగానే ఆమె పండ్లు బయటకు వచ్చును. ఆమెకు ముడుతలుపడును. ముసలిదగును. అప్పుడు నీవామెను బయటకు తన్నుదువు.

మీలో కొందరు స్త్రీలు ఉంగరాల జుట్టు కలిగిన పిల్లలను కలిగి యున్నారు. కాని అంత అందముగానున్న ఆ జుట్టురాలిపోవును. నా అనుభవమును బట్టి దానిని ఎరుగుదును. ఏమి సంభవించును? అది ఏమిటి? మీరయితే దానికొరకు భ్రమించుచున్నారు. మొదట మీరు ప్రార్థించవలసియున్నారు, ఎందుకనగా ఒక స్త్రీ మీలో భాగమైయున్నది.

నీవు ఒక స్త్రీని హత్తుకొని, నీ భుజమునకు ఆమెను అదుముకొని నీ భార్యగా ఆమెను నీవు అంగీకరించినప్పుడు.... ఆమె నీ మీద ఒక ముద్రవేయును. మీరు అర్థము చేసికొనునట్లు ఈలాగు చెప్పుచున్నాను. మరి ఏ స్త్రీ అయిననూ ఆ ముద్రలో సరిపోరు. ఆ ముద్రను చెరుపలేరు. దానికి నిన్ను దేవుడు బాద్యునిగా ఎంచును. దానిని నీవు గుర్తించుకొనుము.

51

మీలో కొందరు మరియొకని భార్యను తీసికొనుచున్నారు. ఈ రోజు నేను పట్టణములోని ఒక చిన్న పిల్లను గూర్చి విన్నాను. ఆమె నాకు తెలియును. ఎవడో ఒక జూదరి ఆమెకు చాలా చక్కని దుస్తులు, వస్తువులు కొని ఆమెకు ఎరవేసి ఆమెతో ఆడుటకు ప్రయత్నించెను. ఆ విదంగా ప్రవర్తించిన ఆ ఎలుకవంటి వాడిని ఒక మనిషిగా ఎంచుట పొరపాటే. కుక్క కూడా అంత నీచముగా ఉండదు. అయినా మీరు కుక్కను ''ఛండాలపుది'' అని పిలుచుదురు. ఈ జెఫర్‌సన్‌విల్‌లోని సగం మంది స్త్రీలకంటె ఆ కుక్కకే ఎక్కువ నీతియున్నది. ఒక తల్లి పందిని మీరు ''నీచముగా'' పిలుచుదురు, కాని ఈనాడు అమెరికాలోని చాలామంది స్త్రీలకంటె అదిచాలా నీతిగా యున్నది. అది అక్షరాలా నిజము.

ఇప్పుడు, నేను చెప్పినది పరుషముగా ఉన్నదని నాకు తెలియును. ఇంటియొద్ద దానిని నేను విసిరి వేయగోరుచున్నాను, దానిని మీరు ఎరుగవలెనని కోరుచున్నాను, మరియు అది సత్యము. ఈనాడు స్త్రీ అసలు నీతి అంటే ఎరుగని స్థితికి వచ్చిరి. ''నా అంతరాత్మను అది గద్దించుట లేదు'' అని నీవందువు. అసలు నీకు అంతరాత్మ ఉంటే గదా? అవునండీ! నీకు తప్పు ఒప్పు అసలు తెలియదు.

52

ఇప్పుడు గమనించండి. ఈ మనిషిని దేవుడు సృష్టించినప్పుడు దేవుడు అతని ఆత్మను వేరుచేసెను. మానవునిలో నుండి ఒక భాగమును అనగా అతని ప్రక్కలో నుండి ఒక భాగమును తీసి దానినుండి స్త్రీని చేసెను. మరియు ఆయన, పురుషుని నుండి స్త్రీత్వమును, రమ్యమైన ఆత్మను తీసి, అందులో నుండి స్త్రీని సృజించెను. మరియు పురుషుని దీరునిగా, స్థూల దేహము కలవాడిగా చేసెను, పురుషునియొక్క ఆత్మలోనుండి స్త్రీని సృజించెను. మానవుని ఆయన స్త్రీత్వముతో కూడా చేసెను. ఈనాడు పురుషులను చూడండి (వారిని మీరు ఏవేవో పేర్లతో పిలుచుదురు) అతని వ్రేళ్ళగోరులు చూడండి. (ఒక్క ప్రక్క నాలుగు,ఒక ప్రక్క అయిదు) జుట్టు కళ్ళలో పడునట్లు దువ్వుచున్నాడు. నోరు తెరచుకొని ఏదో పెద్ద అందగాళ్ళవలె మీకు కనబడగోరుచున్నారు, గుర్తుంచుకొనండి. సహోదరి, ఆ పనిలో ఎక్కడో పొరపాటున్నది. ఎక్కడో తప్పున్నది వారిమీద మీరు నిఘా వేసియుంచుట మంచిది.

53

స్త్రీ, పురుషుని పాంట్లు వేసికొని, నోట్లో సిగ రెట్టు పెట్టుకొని పురుషుని రీతిలో మాట్లాడుచున్నదంటే ఆమెలో ఏదో పొరపాటున్నది. సోదరుడా ఆ ముసలి దానిని గమనించుము

స్త్రీ, ఎప్పుడూ స్త్రీగానే ఉండవలసియున్నది, ఆమె స్త్రీ వలె బట్టలు దరించవలెను. దేవుడు మానవుని సృజించినప్పుడు, పురుషుని ఒకదాని కొరకు, స్త్రీని మరొక దాని కొరకు సృజించెను. పురుషునికి దేవుడు ఒక విదమగు బట్టలు దరింపచేసెను. స్త్రీకి మరో విదమైనవి దరింపచేసెను. స్త్రీకి మరో విదమైనవి దరింపచేసెను. ''పురుషునికి చెందిన బట్టలు స్త్రీలు దరించుట హేయము'' అని బైబిలు చెప్పుచున్నది.

54

స్త్రీలు ఈ చిన్న పాంట్లు, ఇంకా ఏవేవో దరించుచున్నారు, వాటిని మీరేమని పిలుచుదురు? ''నిక్కర్ నికర్స్. '' వాటిని వారేమని పిలచుదురు (ఎవరో ''షార్ట్స్'' (పొట్టివి) అని అనుచున్నారు - సంపా.) అవి పొట్టివి కావు. పొడవుగా కాళ్ళుండును. ఏవేవో పేర్లతో వాటిని మీరు పిలచుచున్నారు, (''పెడల్ పుషర్)

''ఇవి స్త్రీల కోసమండి'' అని మీరందురు.

''కాదు. మీరు పొరబడుచున్నారు. స్త్రీలు అటువంటివి వేసికొనరు. '' స్త్రీలు అనగా గౌరవముగల స్త్రీలు వేసికొనరు. అది నిజము. అటువంటి వస్త్రములు దరించుట స్త్రీకి అవమానము అని బైబిలు చెప్పుచున్నది; మరియు స్త్రీకి చెందిన వస్త్రములు పురుషుడు దరించరాదు. మగవారు నేడు ఆడంగివారు గాను, స్త్రీలు మగతనముతోను రోజు రోజుకు మారిపోవుచున్నారు. ఏమిటి సంగతి? బైబిలు ద్వారా దానిని మనము కొద్ది నిమిషములలో చూద్దాం. స్త్రీలు ఇక స్త్రీలుగా లేరు, మీ క్రైస్తవ స్త్రీల గురించి నేను చెప్పుట లేదు మామూలుగా నేను మాట్లాడుచున్నాను. వారు పురుషునివలె ప్రవర్తించగోరుచున్నారు; వారు మగవారివలె ప్రవర్తించగోరుచున్నారు; పురుషునివలె జుట్టు కత్తిరించుకొని, ఆ విదముగా ఆ కార్లమీద చేతులువుంచి, దేవుడు అమెరికాను దీవించును గాక అని పాడుచున్నారు, వారి నోట్లో ఒక చోట సిగరెట్ కూడా ఉండును.

55

వీది లోనికి వెళ్ళండి. రోడ్లమీద చూడండి. ఒక సంగతి మీకు చెప్పగోరుచున్నాను, స్త్రీ డ్రైవర్లు మీరు దీనిని వినవలెను. బిల్లీపాల్ మరియు నేను కలిసి ఆరు నెలల పాటు దేశమంతటా తిరిగి కూటములు ఏర్పాటు చేశాము, రోడ్లమీద జరిగిన ప్రమాదములను నేను లెక్క వ్రాసికొన్నాను. మూడు వందల ప్రమాదములలో స్త్రీ డ్రైవర్లు ఎందరున్నారో తెలియునా? అందులో పంతొమ్మిదిమంది మాత్రమే పురుష డ్రైవర్లు, మిగతా రెండు వందల ఎనభై ఒక్క మంది స్త్రీ డ్రైవర్లే.

స్త్రీలలో మంచి డ్రైవర్లు లేరని నేను చెప్పుట లేదు. కాని ఆమె తన ఇష్టము వచ్చినట్లు త్రిప్పును. ఆమె వెనుక నీవు సరిగా వచ్చుటకు ప్రయత్నించవలెను. ఒక పోలీసు వచ్చినప్పుడు ఆమె తన జుట్టుపైకి విసరుచూ ఒక విదమగు చక్కని చూపు చూస్తు నిలబడి యుండును. అప్పుడితడు ''నీవు నిశ్చయంగా తప్పు చేశావు'' అని పలుకును. కాని, ''నిన్ను శిక్షిoచు చట్టముఏదీ మాకు లేదు'' అనును.

56

ఒకరోజు నేను వస్తూ వుండగా టాక్సీ సూటు దరించిన ఒకరి విషయములో అలాగే రుజువు చేశారు. ''మాకు ఎట్టి చట్టము లేదు'' ఒకవేళ వుంటే..... ఆ గొప్ప ఇంగ్లాండు ప్రభువులు చెప్పిన దానిలో ఆశ్చర్యము లేదు. ''ప్రజాస్వామ్యమనగా ఎవరిష్టమొచ్చినట్లు వారు వెళ్ళిపోవుటయే గాని లంగరులు లేవు. '' అది నిజము. ఎన్నికల సభలో నిలబడియుండెను. ప్రజాస్వామ్యము కుళ్ళిపోయినది. నియంతలు ఇంకా తదితరులందరూ అలాగే యున్నారు. మొత్తం కుళ్ళిపోయినది. దేవుడు తాను చెప్పినట్లుగా ఒక మొత్తమును నాశనము చేయుట తప్ప మరొకటి ఏమీ కనబడుట లేదు. క్రొత్తదానిని ప్రారంభించును.

57

రాకడకు మీరెంత దగ్గర్లో వున్నారో జాగ్రత్తగా గమనించండి. ఈ స్త్రీని అతనికి సాటియగు సహాయముగా వుండుటకు సృజించెను. ఆమె అతనికి సహాయకారిగా ఉండవలెను. మరియు అప్పుడు.....

ఇప్పుడు, దీనిని అంగీకరించు బోదకుడెవరూ ఇంకా నాకు దొరకలేదు. వారు మరో రీతిగా చెప్ప ప్రయత్నించుచున్నారు, కాని అది నీకు భావరహితముగానే తోచుచున్నది. ఆదాము, హవ్వలు కొన్నియాపిల్ పండ్లు తినిరని వారు చెప్ప ప్రయత్నించుచున్నారు. సోదరుడా దీనిని నేను సరసోక్తిగా చెప్పుట లేదు గాని దీనిని నేను చెప్పగోరుచున్నాను. స్త్రీలు తాము దిగంబరులుగా వున్నామని యాపిలు పండ్లు వారికి ఇద్దాం మరియు అది సరియైనదని నీకు తెలియును.

అది సరియే కదా? వారు యాపిలు తినుటవలన అలాగు జరుగలేదు. వారు తాము దిగంబరులమని గ్రహించిరి నిశ్చయంగా కాని అందువలన కాదు. అది లైంగికపరంగా జరుగవలసియుండెను. వారు ఈ నిషేదించబడిన ఫలమును తినిరి గనుక వారు తాము దిగంబరులమని గ్రహించిరి.

స్త్రీయే ఒక చెట్టు ఫలముగా లేదా? నీవు నీ తల్లి ఫలము కాదా? తీసికొనకుండా నిషేదించబడిన ఫలము అదే.

58

ఇప్పుడు ఇక్కడ ఒక గొప్ప సంగతియున్నది. మానవులెవరో విజ్ఞాన శాస్త్రము తెలిసికొనుటకు పాత ఎముకలను త్రవ్వుచున్నది వారు అవశేషములను, పుర్రెలను, తలలను, చేతులను, ఎముకలను సేకరించి వాటిని మానవులవలె కనబడునట్లు చేయుచున్నారు. అయితే మనిషికి అతి దగ్గర పోలికలో చింపాంజీ మాత్రమే వున్నది. అది మాత్రమే మానవజాతికి అతి సమీపములో వున్నది;

అయితే ఉన్నతమైన మనిషికి దానితో ఏమీ సంబందములేదు. అన్నిటికన్న అల్పమగు జీవి కప్ప; అత్యున్నత జీవి మానవుడు, దేవుడు అడుగునుండి ప్రారంభించి తన స్వరూపములోనికి వచ్చువరకు మానవుని సృజించెను. పలు, మృగముల స్వరూపముల నుండి పైగా అనగా దేవునియొక్క పోలిక లోనికి మనలను తీసికొని వచ్చెను. ఆయన యొక్క పోలికలో మానవుని సృష్టించెను. అదే అతి ఉన్నత రూపము. అల్పమైన రూపము, కప్పగా మారిన తలకప్ప మొదలైనవి.

59

ఈ తప్పిపోయిన గొలుసును వారు కనుగొనలేరు. ఇప్పుడు లేఖనములను గమనించండి, మీలో చాలామంది దీనితో ఏకీభవించరు. కాని దానిని మనము మనస్సులో ఉంచుకొని దానికి వ్యతిరేకముగా ఎట్టి నాదము పెట్టుకొనకుందము.

వినండి. మీలో చాలామంది ఆ డాక్టరు డీహాన్ చెప్పినది వినుచున్నారని నాకు తెలియును. అతడు స్వశక్తి కలవాడు, ఒక మంచి బాప్టిస్టు సోదరుడు, తప్పక నేనాయనను ప్రసంశించుదును. నాకు తెలిసినంతవరకు ఆయనకు ఎంతో జ్ఞానము, మేదాశక్తి యున్నవి. చాలా మరచిపోయెను. ఎందుకనగా ఆయన డాక్టర్ ఆఫ్ డివినిటీ డిగ్రీ, వైద్య డిగ్రీ, సైన్సు డాక్టరేటు కలిగియున్నాడు. ఆయన తెలివిగలవాడు. కాని.... ''నరుల కుమార్తెలు చక్కనివారని దేవుని కుమారులు చూచి'' అను వాక్యమును ఆయన జోసఫస్ విదానములో చెప్పుచున్నాడు. వారు మానవ శరీరమును పొంది భార్యలుగా వారిని స్వీకరించిరని చెప్పుచున్నాడు. నోదు దేశములో మహాబలాఢ్యులుండిరి. వారు తమకు భార్యలను కూర్చుకొని వారితో జీవించసాగిరి. పడిపోయిన దేవదూతలగు దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూచిరి; శరీరాశ అంత గొప్పది, పడిపోవుట వలన వారు పాపములో వుండినందున వారు తమ్మును తాము మానవ శరీరములోనికి తెచ్చుకొనిరి.

వారిది చేయగలిగినయెడల, వారు దైవిక స్వస్థతను చెడుపు చేయుదురు. అన్నిటినీ నాశనము చేయుదురు. అపవాది సృష్టి చేయగలిగినచో దేవునికి సమానమగును. అపవాది సృష్టి చేయలేదు. అపవాది సృష్టి చేయగలదని చెప్పు ఒక్క వాక్యమును నాకు చూపించండి. వాడు సృష్టి చేయజాలడు. సృష్టింపబడిన దానిని వాడు తారుమారు మాత్రమే చేయగలడు. వాడు సృష్టికర్త కాడు. వాడు తారుమారు చేయువాడు మాత్రమే.

60

మంచిది, అయితే మరి ఏమి జరిగినది? గమనించండి. నేను ఈలాగు చెప్పుదును ఆ తప్పిపోయిన గొలుసు ఇక్కడున్నది.

ఇప్పుడు వారికి చింపాంజీ ఉన్నది, కానీ ఒక బిడ్డను పుట్టించుటకు నీవు ఒక చింపాంజీని, ఒక స్త్రీని కలుపలేవు. మానవుని వారి ఏ జంతువుతోనూ కలుపలేరు. అది కలియదు. ఏ జంతువు రక్తమైనా గానీ మనిషికి ఎక్కించలేరు.

61

నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు, వారు ఆ తక్కువ రంగు కలవారితో ఒక విదముగా ప్రవర్తించెదరు; ఒకతను ''వారు జంతువులు తప్ప మరేమి కారని'' చెప్పెను.

నేను ''క్షమించండి, మీలాంటి మానవులు మాత్రమే, ఇంకా గొప్పవారు కూడా కావచ్చును'' అని చెప్పాను. ఒక విషయమును నన్ను చెప్పనివ్వండి, అటువంటి స్వభావము నీకు కలిగినప్పుడు నీవు తిరిగి జంతువుగా మారుచున్నావు, నేను ''ఆ మనిషి, అతడు పేకలోని ఇస్సేటు ఆసులాగ ఉండిన, అతడు గుమ్మడి కాయవలె పసుపుగా ఉండిన, అతడు నీలిమందువలె నీలముగానుండిన, అతడు రక్తమార్పిడి చేసి(రక్తదానము) నీకు జీవితమును ఇవ్వగలడు. కానీ, ఒక జంతువు రక్తము ఎన్నడూ నీలోనికి ప్రవేశింపలేదు'' అని చెప్పితిని. ఖచ్చితముగా, అతడు మనిషే.

62

ఒకని చర్మము నల్లగాను, ఒకనిది పసుపుగాను, ఒకనిది తెల్లగాను, మరొకనిది మరో రంగులోను ఉన్నంత మాత్రాన ఏమీ తేడారాదు. ''ఒకే రక్తముతో దేవుడు మానవులనందరినీ సృజించెను'' అని బైబిలు చెప్పుచున్నది. అది అక్షరాలా నిజము.

మనము నివసించుచున్న స్థలములనుబట్టి రంగుమారును, అందులో విశేషమేమీలేదు. దేవుడు అన్ని జాతులవారిని ఒకే రక్తముతో సృజించెను. అందరూ ఒక్కలాగే వున్నారు. ''ఆ చైనా వ్యక్తి పసుపుగా ఉన్నాడు గనుక అతనితో మాకెట్టి సంబందము లేదు'' అని నల్లజాతి వ్యక్తి చెప్పజాలడు. అతడు నీ సోదరుడు. (సహో. బ్రన్హాం ప్రసంగపు బల్లను చాలాసార్లు తట్టెను- సంపా.) తెల్లటి వ్యక్తి పసుపు రంగు లేదా నల్లరంగు వ్యక్తితో ''నీతో నాకేమి సంబందము లేదు'' అని చెప్పలేడు. అతడు నీ సోదరుడు. నిశ్చయంగా

63

ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఇక్కడ ఏమి జరిగినది. అది చేసినది ''సర్పము'' అని నేను విశ్వసించుచున్నాను, మరియు దానిని బైబిలు ద్వారా బలపర్చగలను. చింపాంజీకి మనిషికి మద్య తప్పిపోయిన ఆ గొలుసు సర్పము మాత్రమే. ఎందుకనగా, వినండి, దీనిని గమనించండి, సర్పము ప్రాకు జంతువు కాదు. అతడు భూమి మీద ఉన్న జీవరాశులన్నింటికన్నా చాలా ''యుక్తి గలవాడు.''

ఈ దినము నేను నిఘంటువులలో ''యుక్తి'' అను పదమును గూర్చి వెదకి చూచాను. దాని అర్థము ''తెలివి, నేర్పరితనము.'' హెబ్రీలో మహా అందురు. జీవిత సూత్రమును గూర్చి నిజమైన తెలివికలదని అర్థము.

64

ఇప్పుడు ఒక్క క్షణము దీనిని గమనించుదము. అతడు తెలివైనవాడు, యుక్తిగలవాడు. అయినా గాని ''సర్పము'' గానే పిలువబడెను. కాని గుర్తుంచుకొనండి. ఉన్న వాటన్నింటిలో అది తెలివైనది, మానవునికి దగ్గరగా ఉన్నది భూమిమీద అదియే. అది ప్రాకునది కాదు. శాపమువలన అది ప్రాకునదాయెను, అన్నింటికంటె అది... అందమైనదని బైబిలు చెప్పెను.

శాపము వలన కూడా దాని అందమంతయూ పోలేదు; సర్పముయొక్క రంగులు ఎంతో అమోఘముగా ఉండును, దానియొక్క అందము, తెలివిని చూడండి. శాపము కూడా దానిని కదలించలేకపోయెను. కాని, గుర్తుంచుకొనండి; దాని పాదములు పోయి పొట్టతో ప్రాకునని దేవుడు చెప్పెను, మానవునివలె కనిపించు ఒక్క ఎముకను కూడా మీరు సర్పములో కనుగొనలేరు. అందువలనే విజ్ఞాన శాస్త్రము తప్పిపోయినది. కాని సర్పము స్థితి అది.

65

జ్ఞానులకు, తెలివిగలవారి కన్నులకు దేవుడు దానిని మరుగుపరచి, చివరి దినములలో దేవుని కుమారులకు దానిని ప్రత్యక్షపరచుదునని వాగ్దానము చేసెను. దేవుని కుమారుల ప్రత్యక్షత అది. జగత్తుకు పునాది వేయబడక ముందే దేవునితో సంతోషించిన ఆయన కుమారులు చివరి దినములలో దైవత్వమును గూర్చి, ఈ విషయముల గూర్చి ప్రత్యక్షత పొందుదురు, దేవుని కుమారులకు ఈ సంగతులు ప్రత్యక్షపరచబడును. దానిని లేఖనము బోదించుచున్నదని మీకు తెలియును. ఇక్కడ మనమున్నాము.

ఆ కారణము చేతనే దేవుడు ఈ సంగతులను మనకు తెరచుచున్నాడు. దేవుడు తన కుమారులను ప్రత్యక్షతలోకి తెచ్చుచున్నాడు. మానవ జ్ఞానపు పరిమితులను ఆయన దాటి వెళ్ళుచున్నాడు.

ఆత్మీయ ప్రత్యక్షతలలోనికి వెళ్ళి వాటిని తీసికొని వచ్చుచున్నాడు. ''జ్ఞానము కలవానికి'' అని బైబిలు బోదించుట లేదా? ఏదో సెమినరీలో నేర్చుకొన్నది కాదు. దేవుని ఎదుట మోకాళ్ళూని నేర్చుకొన్నదే దేవునికి సంతోషము కలిగించును. దేవునియొక్క కుమారులు ప్రత్యక్షపరచబడుదురు.

66

సర్పము ఇక్కడున్నది. సర్పము ఎట్లుండెనో మీకు నేను వివరణ ఇచ్చుచున్నాను;

మనము... చిన్న తల కప్పనుండి ఏదో రీతిగా పరిణామము చెంది, ఆ తరువాత నుండి ఆ తరువాతకు మారుచూ చివరకు ఒక కోతిగాను, ఆ తరువాత చింపాంజీగాను మారినాము. మరియు చింపాంజీ నుండి, మానవునిగా మారినాము మరియు అలా ఎట్లు అని మనము ఆశ్చర్యపడుదుము ''మంచిది,'' విజ్ఞానశాస్త్రము ఆ విదముగా చెప్పుచున్నది. ''ఇప్పుడు అగండి, మనము ఒక స్త్రీని ఒక కోతికి కలుపగలము, మరియు చింపాంజీకి కలుపగలము మరియు అదే విదముగా ఒక మనిషి చింపాంజితో కలవవచ్చును అని త్రిప్పి చెప్పవచ్చును. '' అది పని చేయదు. ఏ జంతువుతోనయినను కలపండి, కానీ పనికి రాదు, రక్తము కలువదు; నీ రక్తమును తీసికొనుము, అది అన్ని విదములా భేదమైనది, అన్ని విదములా. ఇక్కడ మద్యలో ఒక రక్తమున్నది, మరియు వారు జంతువును కనుగొనలేరు. ఓ హల్లెలూయా, నేను దైవికము కలిగివుండినట్లు భావన కలుగుచున్నది.

67

గమనించండి. ఎందుకు? వారి నుండి దేవుడు దానిని దాచెను. మనిషి ఎముకవలే ఉండు ఎముక సర్పమునకు లేదు, తెలివిగల మనిషి కనిపెట్టలేకుండునట్లు, ఆయన ఆ విషయమును దూరముగా ఉంచెను. ఆ

తెలివిగల వ్యక్తి ఎక్కడనుండి వచ్చెనో ఇప్పుడు నేను మీకు చూపించబోవుచున్నాను, అతడు ఎక్కడ... ఎక్కడ ఉండెను, చూడండి, ఆ విదముగా అతడు రాలేడు.''నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు,'' ''ఈ బండమీద నేను నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దానియెదుట నిలువజాలవు.'' ఆత్మీయ ప్రత్యక్షత.

కయీను పొలమునందలి ఫలములను అర్పణగా తెచ్చెను. అందుకు బదులుగా హేబెలు గొర్రెను అర్పించుట ఏలాగు సాద్యమైనది? ఆత్మీయముగా అది అతనికి ప్రత్యక్షపరచబడినది. ప్రత్యక్ష్యత ద్వారానే అది రావలసియున్నది. సెమీనరీల వలన దానిని నీవు పొందజాలవు. శాఖలద్వారా దానిని నీవు పొందజాలవు. పరలోకమునుండి దానిని నీవు పొందుదువు.

68

ఇప్పుడు సర్పమును గమనించండి, ఇది ఆదిలో వున్న సర్పము. దానియొక్క పట్టణము గీద్దాం. వాడు ఒక పెద్ద శరీరముగలవాడు. వాడు మానవునికి, చింపాంజీకి మద్యనున్నవాడు. మరియు సర్పము; అపవాది; లూసీఫరు ఆ రక్తము మాత్రమే మానవ రక్తముతో కలియగలదని ఎరిగియుండెను, దానివలన మాత్రమే తన పని జరుగునని తలంచెను. చింపాంజీ వలన దాని పని జరుగదు, ఆ రక్తము కలియదు. ఇంకా వివిదమగు వాటివలన పని సఫలము కాదు, గొర్రె వలన పని నెరవేరదు. ఒక గుర్రము వలన పని కాదు. ఏ ఇతర జంతువుతోను పనినెరవేరదు. ఈ సర్పముతోనే ఆ ఉద్దేశ్యము నెరవేరును.

వాడు ఎట్లుండెనో ఇప్పుడు చూద్దాం, ఒకపెద్ద శరీరముతో ఉండెను, చరిత్రకు ముందున్న రాక్షసుడు. పెద్దఎముకలను వారు కనుగొనిరి, దీనిని నేను బైబిలులో మీకు చూపించెదను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ పెద్ద శరీరము కలవాడు, పది అడుగుల పొడవున్నవాడని అనుకొందాము. పెద్ద భుజములతో మానవునివలెనే కనబడెను. మరియు వాని రక్తము; క్రమేణా ఒక జంతువునుండి మరో జంతువులోనికి వచ్చుచుండెను.

69

మీరు జంతువులను కలపవచ్చును, అవి ఎక్కువ రక్తము, ఎక్కువ జీవము, ఎక్కువ స్వరూపము పొందుచుండును. చివరకు మానవ పరిణామములోనికి దగ్గరగా వచ్చుచుండును. కాని ఇక్కడ చివరి సంబందము తెంపివేయబడును. ఆ తప్పిపోయిన గొలుసును విజ్ఞానశాస్త్రము కనుగొనలేక పోవుచున్నదని ఎందరికి తెలియును? మీరందరూ దానిని ఎరుగుదురు. ఎందువలన? అది ఈ సర్పమే.

వాడు ఒక పెద్ద వ్యక్తిగాయుండెను. దయ్యము వచ్చినది. ''నేను ఆవేశపరచగలను'' అన్నది. మీరు స్త్రీలను చూచునప్పుడు, వారి క్రియలను చూచునప్పుడు దయ్యము ద్వారా అభిషేకము పొందినట్లు భావించండి, ఆమె మీ భార్య కాదు. అపవాది దిగివచ్చి సర్పములోనికి వె ళ్ళినది. ఏదెను తోటలో హవ్వ దిగంబరిగా ఉన్నట్లు కనుగొన్నది. ''మద్య'' లో వున్న ఫలమును గూర్చి అది మాట్లాడసాగెను. ''అది కంటికి రమ్యముగా వున్నది అని చెప్పెను. వాడేమి చేసెను?

70

హవ్వతో ప్రేమకలాపము సాగించుట ఆరంభమాయెను. వాడు ఆమెతో భర్తగా జీవించెను. అది కంటికి అందముగా ఉన్నట్లు ఆమె చూచి వెళ్ళి తన భర్తకు చెప్పినది. కాని అప్పటికే సాతాను ద్వారా ఆమె గర్భము దరించినది. ఆమె మొదటి మగ కుమారుని కన్నది. అతడే కయీను, సాతాను కుమారుడు.

''అది తప్పు''అని మీరనవచ్చు. సరే. అది తప్పో, ఒప్పో మనము కనుగొందము. ''నీ సంతానమునకును, సర్పముయొక్క సంతానమునకును'' మద్య వైరము పెట్టెదను (ఆదికాండము 3:15) ఏమిటి? సర్పము యొక్క సంతానము. ఆమెకు ఒక సంతానముండెను. మరియు వాడికి సంతానముండెను. ''వాడు నీ మడిమను కరచును, నీవు వాడి తల చితుకగొట్టెదవు.'' నలుగగొట్టబడుట అనగా పరిహారము చేయుట.

సర్పసంతానము అక్కడే యున్నది. గమనించండి. ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చుచున్నారు.

ఈ పెద్ద శరీరముతో సర్పము అక్కడ నిలబడియుండెను. ఆదాముయొక్క భార్యతో వ్యభిచారము చేసిన దోషము దానిమీద ఉండెను. ఈనాడు పాపము ఎక్కడున్నది? ఇప్పుడు ఇలాంటి క్రియలు జరుగుటకు కారణమేమి? (మీరు నిశ్చయంగా నేను మాట్లాడుచున్న దానిని గ్రహించుదురు).

71

వాడు అలాగు చేయగానే దేవుడు ఆదాము హవ్వలను పిలువసాగెను. ''నేను దిగంబరిని'' అని అతడనెను.

''నీవు దిగంబరివని నీకు చెప్పినదెవరు?''అని దేవుడు ప్రశ్నించెను. అప్పుడు వారు సైన్యము మాదిరి ఒకరి నుండి ఒకరు నెట్టుకొనసాగిరి.

''నీవు నాకిచ్చిన స్త్రీ వల్లనే ఈలాగు జరిగినది.నన్ను ఒప్పించినది ఆమెయే'' అని అతడనెను.

''సర్పము నాకు యాపిలు ఫలమిచ్చెను'' అని ఆమె అన్నది. మంచిది. బోదకుడా! నీ ప్రక్కవారిని చూచుకొనుము. ''సర్పము నన్ను మోసము చేసెను'' అని ఆమె పలికినది. మోసము చేయుట అనగా అపవిత్రపరచుట అని మీకు తెలియునా? దాని అర్థము పాడు చేయుట. అపవాది ఆమెకు యాపిల్ఇవ్వలేదు. ''సర్పము నన్ను మోసము చేసినది.'' ఆ తరువాత శాపము వచ్చెను.

72

''నీ భర్త మాట వినుటకు బదులుగా సర్పము యొక్క మాట నీవు విన్నందున లోకములో నుండి నీ ప్రాణమును తీసికొంటిని. నీ దుఃఖములు విస్తారములగును. నీ భర్తపట్ల నీకు వాంఛ కలుగును. ''నా మాట వినుటకు బదులుగా నీ భార్య మాట విన్నావు గనుక (నిన్ను అత్యున్నత జీవిగా ఏ మట్టినుండి తీసితినో) మట్టిలోనికే తిరిగి పోదువు'' అని ఆయన చెప్పెను. ''నీవు ఆ విదముగా చేసినందున, నీ బ్రదుకు దినములన్నిటను పొట్టతోనే ప్రాకుదువు. నీవు ద్వేషింపబడుదువు. నీవు మన్ను తిందువు'' అని సర్పముతో అనెను. అదే ఆ తప్పిపోయిన గొలుసు.

73

ఇక్కడ కయీను వచ్చుచున్నాడు. స్వభావములను మనము గమనించుదుము. ఇక్కడ కయీను వచ్చుచున్నాడు. అతడెవరు? అతడు తెలివిగల వ్యాపారి. అతడు పొలమును దున్నును. చురుకైనవాడు, తెలివైనవాడు, మతనిష్ఠ చాలా ఉన్నవాడు; అతని యొక్క గుణ లక్షణములను ఇప్పుడు గమనించండి. ఇంకొద్ది సమయము నా మాట వినండి. ఇక్కడ అతను వచ్చుచున్నాడు. నైతికంగా జీవించుచున్నానని అతడు ఎరుగును. అతడు సంఘమునకు వెళ్ళగోరెను. అతడు తన కోసము ఒక సంఘము కట్టుకొనెను, ఒక బలి తయారు చేసెను. ఒక బలి పీఠము మరియు అన్నియు నిర్మించెను. దాని మీద తన పొలములో పండిన ఫలములు మరియు పూలు దేవునికి తెచ్చి అర్పించెను. ఇట్లు పలికెను. ''ప్రభువా, మేము యాపిలు పండ్లు తిన్నామని నాకు తెలియును. అందువల్లనే ఈలాగు జరిగినది. ''అతనియొక్క కొందరి వారసులకు కూడా అదే అభిప్రాయము వున్నది. అదెక్కడ నుండి వచ్చినదో అర్థమగుచున్నది.

అతడు తన పొలములో నుండి పండ్లు తెచ్చి బలిపీఠము మీద పెట్టి ''ఇది పరిహారార్థ బలి'' అని పలికెను.

''ఫలములు కాదు'' అని దేవుడు చెప్పెను.

కాని ఆత్మీయ ప్రత్యక్షతనుబట్టి, అది రక్తము అని హేబేలు ఎరిగియుండెను. కాబట్టి అతడు ఒక గొర్రెపిల్లను తీసికొని వచ్చి దాని మెడను నరికి చంపెను.

74

''అది సరియైనది. రక్తమే పనిచేసినది'' అని దేవుడు పలికెను. నేను ఏ రక్తమును గూర్చి మాట్లాడుచున్నానో మీకు తెలియును. ''ఆ విదముగా చేసిన ఆ రక్తము.''ఇప్పుడు గమనించండి, పరిశుద్ధుడగు తన సోదరుడు దేవుని యెదుట అంగీకరించబడుట కయీను చూచెను, అక్కడ సూచక క్రియలు అద్భుతములు జరిగెను, అతనికి సోదరునిపై అసూయ కలిగెను. ''వీడి పని అంతమొందించుదము'' అని అతడనెను. వానియొక్క సోదరుల వైపు చూడండి. నేడు వాని పిల్లల వైపు చూడండి. ''నేను వానికంటె తెలివైనవాడను.''కాబట్టి అతనికి కోపము వచ్చెను. కోపము ఎక్కడ నుండి వచ్చెను? అది కోపమని నీవు చెప్పగలవా....అతడు తన సోదరుని చంపెను. అతడు ఒక హంతకుడు. నీవు దేవునిని ఒక హంతకుడని పిలువగలవా?

ఆదాము దేవుని యొక్క కుమారుడు. ఆదాము దేవుని కుమారుడని బైబిలు చెప్పుచున్నది. (లూకా 3:38) శుద్ధ ప్రారంభము ఆ వెనుకయుండెను.

ఆదాము దేవునియొక్క కుమారుడు. ఆ శుద్ధ ఊటలో నుండి అసూయ, ద్వేషము మొదలగునవి రాలేవు. అది మరియొక చోటనుండి రావలెను. ఆది నుండి హంతకుడగు సాతాను ద్వారా అది వచ్చెను. ''వాడు ఆది నుండియూ అబద్ధికుడు, హంతకుడు'' అని బైబిలు చెప్పుచున్నది. అవును. అతడు తన సోదరుని చంపెను.

అది క్రీస్తుయొక్క మరణ సాదశ్యముగా ఉన్నది. అప్పుడు అతని స్థానములో షేతు వచ్చెను. క్రీస్తుయొక్క మరణము, సమాది, పునరుత్థానము.

75

ఇక్కడ చూడండి, ఇక్కడ కొందరు రాక్షసులు వచ్చుచున్నారు. కయీను అప్పుడు నోదు దేశములోనికి వెళ్ళెను. వాని తండ్రి ఒకపెద్ద రాక్షసుని పోలిన వ్యక్తి అయినచో, కయీను ఎట్లుండును? అతని తండ్రివలె వుండును. అతడు నోదు దేశమునకు వెళ్ళి తన సోదరీలలో ఒకరిని తీసికొనెను. అది మాత్రమే అతడు చేయగలడు. హవ్వద్వారా వచ్చిన స్త్రీలు తప్ప మరెవరునూ లేరు. వారికి డెబ్బదిమంది కుమారులు కుమార్తెలు కలరని వారు చెప్పుదురు. పురుషులను మాత్రమే లెక్కలోనికి తీసికొనిరి గాని స్త్రీలను కాదు. హవ్వ తప్ప ఒక స్త్రీ లేనియెడల మానవజాతి అంతరించియుండెడిది. వారికి కుమార్తెలు ఉండిరి. తన స్వంత సోదరినే అతడు పెండ్లి చేసుకొని యుండెను.

అతడు నోదు దేశములోనికి వెళ్ళి తనకు భార్యను తెచ్చుకొనెను. ఆమెను అక్కడ పెండ్లి చేసికొనగా వారికే ఆ గొప్ప ఉన్నత దేహులు పుట్టిరి. తమ తండ్రియగు అపవాది ద్వారా పుట్టినవారు, పడిపోయిన దేవుని కుమారులు, కయూను సంతానము. మీ తప్పిపోయిన గొలుసు అక్కడనే యున్నది!

76

సర్పముయొక్క సంతానమును గమనించండి. సర్పముయొక్క సంతానము మతాశక్తి గలదని మరువకండి. దాని కదలికను కొంతసేపు గమనించండి. సర్ప సంతానము గూర్చి చెప్పెదను.హేబెలు వరుసలో ఎవరు వచ్చిరి? వినండి.

హేబెలు తరువాత షేతు వచ్చెను. షేతు తరువాత నోవహు వచ్చెను. నోవహు తరువాత షేము వచ్చెను. షేము తదుపరి అబ్రహాము వచ్చెను. అబ్రహాము తరువాత ఇస్సాకు వచ్చెను. ఇస్సాకు తరువాత యాకోబు వచ్చెను. యాకోబు తరవాత యూదా వచ్చెను. యూదా తరువాత దావీదు వచ్చెను. దావీదు తరువాత క్రీస్తు వచ్చెను, పరిపూర్ణతకు.

77

హేబెలులో దేవుని ఆత్మ ఎట్లు జీవించెనో చూడండి. షేతులో అదెట్లు జీవించెనో చూడండి. యూదాలో అదెట్లు జీవించెనో చూడండి. దావీదులో అదెట్లు జీవించెనో చూడండి. ఆ నీతి సంతానములో నుండి ఆ ఆత్మ ఎట్లు పిలచుచున్నదో చూడండి. వారేమి చేసిరో అక్కరలేదు గాని, వారు ముందుగా నిర్ణయించబడినవారు.

యాకోబు వైపు చూడండి. నేను ఈ విదంగా చెప్పకూడదు. కాని యాకోబు ఎప్పుడూ తన తల్లి కొంగు పట్టుకొని తిరుగువాడు, సిగ్గు ఎక్కువ, బిడియపు బాలుడు. ఆశీర్వచనము పొందుటకొరకు తన తండ్రి యొద్దకు వెళ్ళిమోసము చేసెను, కాని జగత్తు పునాది వేయబడకముందే అది అతనికి అనుగ్రహించబడెను నిశ్చయంగా తన మామకు అబద్ధములు చెప్పి నిరవంజి చువ్వలు కొన్ని (చారలుండును) నీటిలోవేసి మందలను బెదిరించి అవి గర్భము దరించిన పిదప చారలుగల వాటిని ఈనునట్లు చేసి మోసము చేసెను. వాటిని సంపాదించెను. అందులోనే దేవుడతనిని దీవించెను! అది సత్యము. యాకోబును గూర్చి మరేదయినా చెప్పువారికి శ్రమ కలుగును.

78

బిలాము అను అబద్ధ ప్రవక్త ఏమి చెప్పెనో మీకు తెలియునా? ''అతనిని దీవించువాడు దీవించబడును. అతనిని శపించువాడు శపించబడును.''

''యాకోబు, నిన్ను నేను ఎన్నుకొంటిని. క్రొత్త దేశములోనికి తీసికొని వచ్చితిని. పక్షిరాజు తన గూటిని రేపునట్లు అతనిని నేను రేపి బయటకు తీసికొని వచ్చితిని. ''హల్లెలూయా! (సహో. బ్రన్హం మూడు సార్లు చప్పట్లు కొట్టెను - సంపా.) ''బలము ద్వారా కాదు, శక్తి ద్వారా కాదు గాని నా ఆత్మ ద్వారానే అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.''

అది ఆ పరిపూర్ణతకు వచ్చుటకు గమనించండి. క్రీస్తునందున పరిపూర్ణతకు ఆ ఆత్మ పనిచేసెను, పితరులందరూ అందు మూలముగానే వచ్చుచున్నారు. వారేమి చేసినాగాని, ఏమి చెప్పినా, వారు మాత్రము సంపూర్తిగా నీతిమంతుల సంతతియై యున్నారు.

79

మరియు, ఇక్కడ, నీతిమంతుడగు అబ్రహామును గూర్చి తలంచు చున్నప్పుడు, నాకు ఎంతో మంచి అనుభూతి కలుగుచున్నది. నీతిపరుడగు అబ్రహాము మెల్కీసెదెకును కలిసికొనెను, ఆయన దేవుడే. మెల్కీసెదెకు ఎవరు? ''షాలేము రాజు. యెరుషలేము రాజు. సమాదానమునకు రాజు. అతనికి తండ్రి లేడు. అతనికి తల్లి లేదు. అతనికి ఎన్నడూ జీవిత ప్రారంభముగాని, జీవిత అంతముగాని లేదు.'' ఆయన ఎవరైయున్నా గాని, ఆయనింకా జీవించుచునే యున్నాడు. ''ఆయన ఎన్నడూ జన్మించలేదు, ఆయన ఎన్నడూ మరణించడు. ఆయనకు ఎన్నడూ తండ్రిగాని తల్లిగాని లేరు. ఆయన జీవితమునకు ఎన్నడూ అద్యంతములు లేవు. '' అదెవరో నాకు చెప్పండి? నిత్యుడగు దేవుడు ఓ, మీరు దానిని ఏమని పిలచుదురోనని నేను మరచినాను, థియాఫనీ అనగా అదియే. అదే విదముగా.... అది కట్టుకథ కాదు; అయినను అది ప్రత్యక్ష పరచబడెను. అబ్రహాము గుడారముయొద్దకు ఆయన వచ్చినట్లుగా, ఒక దేవదూతవలె, ప్రవచించెను, అతని వెనుక నుండి శారా నవ్వెను. ఆ విషయము, అదే విషయము. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన మెల్కీసెదెకును కలిసెను. మరియు తాత ..... ముత్తాత ..... అయిన అబ్రహాం, నీతిమంతుని సంతానములో, మెల్కీసెదెకునకు దశమ భాగమును చెల్లించెను; మరియు ఇక్కడ అది ముని మనుమలకు ఏర్పాటు చేయబడెను. నీతి విత్తనము.

80

ఇక్కడ సర్పము యొక్క సంతానము చూడగలరు. గుర్తుంచుకొనండి. వారి మద్య వైరమున్నది. సర్ప సంతానము వచ్చుచున్నది. అది దేనిని ఉత్పత్తి చేసెను? మొదటి కొద్ది సంవత్సరములను మనము చూద్దాం. ఏమి జరిగినదో ఇప్పుడు గమనించండి. దానిని పూర్తిగా చదువుదాం. ఎందుకనగా దానిని నేను పరిశీలించి చూచాను.

సర్పము యొక్క బీజము కయీనును ఉత్పత్తి చేసెను. కయీను నోదు దేశములోనికి వెళ్ళి ఉన్నత దేహులను ఉత్పత్తి చేసెను. అంతట వారు నోవాహు యొక్క దేశములోనికి వచ్చిరి. వారు తెలివైనవారు, విద్యగలవారు, మేదాశక్తిగల జనులు. నిజమేనా? వారు నిర్మాణకులు, కనిపెట్టువారు ,శాస్త్రజ్ఞులు; నీతిమంతుని సంతానమువలన వచ్చినవారు కారు, సాతాను సంతతి. సర్పమువలన జన్మించిరి. వారు శాస్త్రజ్ఞులు, శిల్పులు, విద్యగలవారు, గొప్పవారు అని లేఖనము చెప్పుచున్నది. వారు ఇత్తడి, ఇనుము ఇంకా ఆయా ఖనిజములతో పనిచేయుచుండిరి. వారు ఎన్నో క్రొత్తవి కనుగొనిరి. వారు ఆయా లోహములను సాగదీయుచుండిరి. ఇండ్లను నిర్మించిరి. లేఖనము అలాగు చెప్పుచున్నది. నీతిమంతుడగు నోవాహు సంతానమును చూచి వారు నవ్వుచుండిరి. అవునా? (సభ ''ఆమేన్'' చెప్పుచున్నది- సంపా.)

81

ఇంకొద్ది ముందుకు వెళ్ళి వారిని చూద్దాం, ఓడ యొద్దకు వెళ్లి వారిని చూద్దాం, సమస్తమూ నాశనమాయెను - అంతా పాప భూయిష్టమాయెను, పరిపాలన వారిదే, అత్యంత తెలివి, మేదాశక్తి కలవారు. దేవుడు తొంగి చూచినప్పుడు ఎంతోమంది మిగిలి యుండలేదు. కాబట్టి ఆయన నోవహును అతని కుటుంబమును ఓడలోనికి తీసికొనెను. వర్షము కురిసెను. మొత్తము తుడిచి పెట్టుకొనిపోయెను. ఆయన ముందుగానే హనోకును కొనిపోయెను. అది నిజమేనా?(సభ ''ఆమేన్'' చెప్పుచున్నది- సంపా.) అక్కడ దాదాపు సంతానమంతయూ ఉండెను. కాని ఆయన ఉద్దేశ్యము నెరవేర్చబడవలసియున్నది.

82

ఇప్పుడు, నోవహు అతని కుమారులగు హాము, షేము, యాపెతులు నీతిమంతుల వరుసలోనికి వచ్చిరి. ఆ సంతానము ఎట్లు పైకి వచ్చెను? ఆ సంతానము ఓడలోనికి వచ్చెను. ఆదియందు స్త్రీ ద్వారా జరిగినట్లుగానే అది జరిగెను. వారి భార్యలు సాతను యొక్క సంతానమును వారు ఓడలోనికి మోసికొని వచ్చిరి. హవ్వ సాతానుయొక్క సంతానమును మోసికొనివచ్చి కయీనును కనినట్లే అది ఉన్నది. ఈ స్త్రీలనుమీరు వేదికల మీద బోదకులుగా నిలబెట్టుచున్నారు, దానిని బైబిలు ఖండించుచున్నది! పౌలు ఈలాగు పలికెను. ''ఎవడైనను తాను ప్రవక్తనని, ఆత్మసంబందినని తలంచుకొనిన యెడల, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలిసికొనవలెను. ఎవడైనను తెలియనివాడైతే తెలియనివాడుగానే వుండనిమ్ము. ''

83

ఆ కారణముచేతనే ఇక్కడున్న బాప్తిస్టు సంఘము నుండి నేను బయటకు వచ్చి వేసాను. సహో. ఫ్లీమాన్ కొంతసేపు క్రితం ఇక్కడనే వున్నాడు; ఆ రాత్రి ఆయన అక్కడ ఉన్నాడని అనుకుంటున్నాను. డా. డేవిస్, ''నీవు ఇక్కడ నిలబడి, స్త్రీలను బొదకులుగా అభిషేకించెదవు'' అని చెప్పెను.

నేను ''నేను దానిని చేయను, నిశ్చయంగా!'' అని అన్నాను.

అందుకతడు, ''మంచిది, నిన్ను బయటకు త్రోసివేతును'' అని అనెను.

''బయటకు త్రోయబడుటయే నాకు మంచిది'' అన్నాను. ''ఇది దేవుని యొక్క వాక్యము. దేవుడు దీనిని ఖండించుచున్నాడు. దేవుడు ఖండించుచున్న దానిని నేను సమర్థించజాలను'' అని చెప్పాను. లేదండి. వారు ఎట్టి వారైనా గాని అబద్ధ బోదకులు మరియు అబద్ధ ప్రవక్తలు అని అందువలన అర్థమగుచున్నది. సాద్యమైనచో ''ఏర్పరచబడినవారిని సహితము వారు మోసపుచ్చుదురని'' బైబిలు చెప్పెను. అక్కడనే నీవు ఉన్నావు.

84

ఇప్పుడు దీనిని గమనించండి. హాము తదితరులు అక్కడ నుండి తమ భార్యలతో వచ్చిరి. అతని మీద ఒక శాపముండెను. హాములో నుండి నిమ్రోదు వచ్చెను, అతడే బబులోను నిర్మించెను. బబులోను నుండి కాథలిక్కు సంఘము వచ్చెను. ఆరంభము అక్కడే. అలాగు ఆహాబు వచ్చెను. ఆహాబు నుండి యూదా ఇస్కరియోతు వచ్చెను; అంత్యక్రీస్తు అతనిలోనే పరిపూర్తియ్యెను. ఈ చివరి దినములలో ఇక్కడ క్రీస్తు విరోదియొక్క ఆత్మయున్నది, క్రీస్తు ఆత్మయూ ఉన్నది. క్రీస్తు విరోది ఆత్మ ఈలాగు చెప్పుచున్నది, ''అద్భుతములు జరుగు దినములు గతించినవి. ''క్రీస్తు ఆత్మ ఈలాగు చెప్పుచున్నది,''ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు.''

''నీవు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందినా, క్రుమ్మరింపు ద్వారా పొందినా, చిలకరింపు ద్వారా పొందినా, మరి ఏ విదముగా పొందినా పెద్ద తేడా ఏమీ లేదులే. అంతా ఒకటే '' అని క్రీస్తు విరోది చెప్పును. అయితే దేవుడు మాట తప్పనివాడు, మారనివాడు అని బైబిలు చెప్పుచున్నది. నీవెవరిని సేవించనైయున్నావు? ఎన్నిక చేసికొనుట నీ వంతు.

85

ఇప్పుడు నీవు ఈలాగు చెప్పవచ్చును, ''వారు కలిసి ఉండగలరా? బ్రన్హం సోదరుడా, వారు ఓడలో వుండిరని నీవు చెప్పావు కాదా? హాము, షేములు ఇద్దరూ కలిసి ఉండిరి.'' నిజమే. హాము దుష్టుడు. షేము భక్తిగలవాడు. నీతిమంతుడు. మంచిది.

హామును మనము వెంబడించుదాం. సరే, ఇప్పుడు, చూడండి. హాము, షేములు ఒకే ఓడలో వుండిరి; ఒకరు నీతిమంతులు, మరొకరు నీతిహీనులు. అదే ఓడలో ఒక కాకి, ఒక పావురము కూడా ఉండెను. ఒకే సంఘములో యేసు, యూదా ఉండెను. ఒకే సంఘములో క్రీస్తు విరోది, పరిశుద్ధాత్మ ఉండెను. మరియు ఈనాడు కూడా అదే ఆత్మ పనిచేయుచున్నది. పైకి భక్తి కలిగి యుండిరి - చాలా మతనిష్ఠ. కాని ''పైకి భక్తిగల వారివలె ఉండియు దానిశక్తిని ఆశ్రయించనివారు. అట్టి వారికి విముఖుడవై యుండుము.''

86

యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని పరిశుద్ధాత్మ ప్రకటించుచున్నది. ఏ పక్షమున నీవు ఉందువు?

''అది కేవలము కొన్ని సిద్ధాంతముల గ్రంథము'' అని క్రీస్తు విరోది చెప్పును. (సహో. బ్రన్హం బైబిలును చూపించుచున్నారు - సంపా) ''అపోస్తలుల విశ్వాసమును మనము తిరిగి చెప్పుదము.'' బైబిలులో అపోస్తలులు వల్లించిన విశ్వాస ప్రమాణమును ఎక్కడయినా ఉంటే చూపించమని సవాలు చేయుచున్నాను. ''నేను దేవుని యందు విశ్వాసముంచుచున్నాను, తండ్రియగు దేవుడు, భూమ్యాకాశములను సృష్టించిన మహా శక్తిగలవాడు, యేసుక్రీస్తు ఆయన కుమారుడు, పరిశుద్ధుల రోమను కాథలిక్కు సంఘమును నేను విశ్వసించుచున్నాను, పరిశుద్ధుల సహవాసమును నమ్ముచున్నాను.'' బైబిలులో దానిని మీరు ఎక్కడ కనుగొందురు? అయినా గాని దానిని మీరు మీ పెద్ద మెథడిస్టు మరియు బైప్టిస్టు సంఘములలో వల్లించుచున్నారు. అది దయ్యము యొక్క సిద్దాంతము. దానిని అబద్ధ ప్రవక్తలు ఉపదేశించుచున్నారు!

87

మీ భావములను గాయపరచుట లేదని నేను తలంచుచున్నాను, కాని దానిని ఈ ఆలయమునకు నొక్కి చెప్పుచున్నాను. ఇక్కడి బ్రన్హం (టాబెర్నికల్) ఆలయములో ఉన్నవారు, ఆ విదమగు దానికి దూరస్థులు. పరిశుద్ధులతో సహవాసము అనునది భూతవాదము, ''మానవునికి దేవునికి మద్య ఒక మద్యవర్తి ఉన్నాడు, ఆ వ్యక్తియే యేసు క్రీస్తు.'' (సహో. బ్రన్హం ప్రసంగపు బల్లను నాలుగు సార్లు తట్టెను - సంపా.)అక్కడ ఎంత మంది మరియలు ఉన్నా పట్టించుకోవలసిన పనిలేదు.

చూడండి, వెనుక ఆ స్త్రీ సంతానము ఏమి చేసినదో మీరు చూచారా? స్త్రీ సంతానమును ఎట్లు మోసికొని వచ్చెనో చూడండి?

అమెరికాలో నేడు చూడండి, అమెరికా దయ్యము యొక్క సంతానము. ఏమిటది? అది స్త్రీ రాజ్యము. ''ఇది స్త్రీ ప్రపంచము'' అను మాట మీరు వినిరి. అది నిజము. ఇది స్త్రీ రాజ్యము. ఆ రీతిగా వారు ఏర్పాటు చేసిరి.

88

కొద్దికాలము క్రిందట నేను స్విట్జర్లాండు వెళ్ళాను. ఒక చిన్న పరిశుద్ధ స్త్రీ ఈలాగు అన్నది, ''నేను అమెరికా వెళ్ళిన యెడల స్వేచ్ఛ పొందుదును'' అని విన్నాను.

అది నిన్ను ఎక్కడికి నడిపించునో చెప్పెదను వినుము అన్నాను. నేను ఆమెకు సవివరంగా చెప్పితిని.

అంతా ఆమె విని, ''ఓ! అయితే అది నాకు వద్దు'' అన్నది.

అవును. ''అది అక్కడకే దారి తీయును'' అని అన్నాను. వారు ఇక్కడ మీరు ప్రవర్తించునట్లుగా ప్రవర్తించరు.

89

ఏమిటది? అమెరికా ఎందువలన స్త్రీయో నేను చూపించుదును. మన నాణెము మీద ఆడ బొమ్మయున్నది. ఇక్కడున్న ప్రతిది స్త్రీయే. ఈ దేశములో, చట్ట విరుద్ధముగా మద్యము అమ్మువారు సరిపడినంత మందిలేరు, ఉన్నారా? నాకు చెప్పండి. నీవు నలుబది మద్యము అమ్ము స్థలములు, మరియు ముగ్గురు వేశ్యలను పెట్టుము, వంపులు తిరుగుచూ ఆ వీదుల వెంబడి నడచు అందమైన ఆ స్త్రీలు; వారు ఎక్కువ ఆత్మలను నరకమునకు పంపుదురు, అటు తరువాతే, ఆ మద్యపు స్థలములు. అది ఖచ్చితముగా నిజము.

అది ఎవరు? స్త్రీ ఆమె ఎవరు, ఆమె అమెరికాయొక్క దేవుడు.

90

ఈ ముసలి సినిమా తారలు కొందరిని చూడండి, వారు నాలుగయిదు సార్లు పెండ్లి చేసికొని ఒకే సమయమున ముగ్గురు నలుగురు వేర్వేరు భర్తలతో జీవించుచున్నారు; ఈ కొన్ని పత్రికలు వారిని దిగంబరులుగా చిత్రములు తీసి బయటకు ప్రచురించుచున్నారు. బాలికలకు వారేనా మాదిరి చూపించువారు? ఎందువలన? ఎందుకనగా నీకు ముందు నీ తల్లి, నీకు ముందు నీ అమ్మమ్మ కూడా నీకు ముందు....

ఆ సర్ప సంతానము ఎక్కడ పనిచేయుచున్నదో మీరు చూచారా? నిశ్చయంగా అది పని చేయుచున్నది. అది ఏమి చేసెను? దర్మశాస్త్రము ప్రకారము పద్నాలుగు తరముల వరకు పాపమునకు ప్రతిఫలము వచ్చినయెడల మరి ఈనాడు ఇంకెంత ఎక్కువగా వచ్చును? నీతిమంతుల సంతానము పనిచేయ ప్రారంభించినది. ఒక సమయము వచ్చును, అప్పుడు క్రియలు కుదించబడును, లేనియెడల ఎవరును మిగలరని దేవుడు చెప్పెను. మనము అంత్యకాలమందున్నాము.

91

నీతిమంతులను ఈ రాత్రి వెంటాడుడి; పట్టణములోనికి వెళ్ళి వెదకండి ఓ! మీరు సంఘ సభ్యులను కనుగొందురు, వారు బాప్టిస్టు, ప్రెస్బిటేరియను మొదలగు శాఖలకు ఉండగలిగినంత విదేయతతో ఉంటున్నారు. దేవునితో వారికేమి నిమిత్తము లేదు, ఒక కుందేలుకు మంచు బూట్లు తొడుగుటకన్నా, అసలు దేవుని గురించి వారికి ఏమీ తెలియదు. వారికి తెలిసినదంతయూ ఒక్కటే. నీవు క్రైస్తవునివా? అని ప్రశ్నించితే,

''నేను కాథలిక్కును'' అందురు.

నీవు క్రైస్తవుడివా?

''నేను బాప్టిస్టును,''

నీవు క్రైస్తవునివా?

''నేను ప్రెస్బిటేరియన్‌ను.''

నీవు క్రైస్తవునివా?

''నేను పెంతెకోస్తును. '' అలాగు చెప్పినందున ఏమీ లాభము లేదు. దేవుడు నిన్ను ఆయన కృపచేత రక్షి౦చెను గనుక, నీవు క్రైస్తవుడవు. దానిని నీవు ఎరుగుదువు. ఏదో నీ జీవితమును మార్చినందున నీవే వేరుగా జీవించుచున్నావు. నీవు క్రీస్తు యేసునందు క్రొత్త వ్యక్తివి, నూతన సష్టివి.

92

నిశ్చయంగా కాని, సర్పసంతానము ఎక్కడున్నదో మీరు చూచారా? సర్పసంతానము ఏమిటి? వ్యభిచారము. దానిని మీరు గమనించుచున్నారా? హవ్వతో వ్యభిచారము, దానివలన ఏమి జరిగినది? అది దేనిని తీసికొని వచ్చెను? ఈ రాత్రి అది ఏమిటి?

మొదటి పాట వెలుపడిన ఆ గత సంవత్సరములను చూడండి. మీ ముసలి వారికి తెలియును, రేడియోలో పాట పాడు ముందుగా దానిని వారు సెన్సార్ చేసెడివారు. మొదట వచ్చిన పాట ఇది: ''బాలికలారా, వాటిని మడవండి. వాటిని మడవండి. మీ అందమగు మోకాళ్ళు చూపండి. అమ్మ, నాన్నలను చూచి నవ్వండి. వారికి ఆ పాత హా హా హా ఇవ్వండి. '' వారు మొదట ఆ పాటలతోనే చొచ్చుకొని వచ్చారు. ఆ పాటను వ్రాసినవాడు ఈ రాత్రి ఎక్కడున్నాడని మీరు తలంచుచున్నారు? అతడు చనిపోయెను. మొదటగా వచ్చి, ''ప్రమాదకరమైన మలుపులు,'' ''నగ్నత'' గూర్చి చెప్పి వేలాది ఆత్మలను నరకమునకు పంపిన ఆ క్లారా బవ్ గూర్చి మీరేమను కొనుచున్నారు ఈ రాత్రి ఆమె ఎక్కడున్నదని మీరు తలంచుచున్నారు? ఆమె ఎప్పుడో చనిపోయినది. ఆమె శరీరము మన్నుగా మారి ఎక్కడున్నది? దానిని పురుగులు మరియు క్రిములు తినివేసినవి. కాని ఆమె ఆత్మ దేవుని ఎదుట పడియున్నది.

93

ఆ స్త్రీని తీసికొని ఆ పాత అపవిత్రపు రీతిగా కనబడు దుస్తులను తయారు చేసిన ఆ పురుషుడు ఎచ్చటున్నాడు? వారికి సరిపడని బట్టలు, తగని దుస్తులు దరింపజేసిరి. ''వారెందుకు అవి చేసిరి? అటువంటివి మీరెందుకు దరించాలి?'' అని నీవనవచ్చు. పురుషులు నీవైపు చూడవలెనని నీ కోరికయే అందుకు కారణము. దానిని రుజువు చేయుటకు మరి ఏ ఇతర మార్గము లేదు. (సహో. బ్రన్హం చాలాసార్లు ప్రసంగపు బల్లను తట్టెను - సంపా.)

ఒక పాపి నీ వైపు చూచినప్పుడు ఏమి జరిగినదో నీకు తెలియునా? తీర్పు దినమున నీవు ఈలాగు చెప్పవచ్చును, ''బ్రన్హం సోదరుడా, నా భర్త పట్ల నేను ఎంతో యథార్థంగా జీవించాను.'' కాని నీవు వ్యభిచారివి! యేసు ఇట్లనెను, ''ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడగును.'' ఆ వ్యక్తి వ్యభిచారము చేసినట్లుగా జవాబు ఇయ్యవలసి యున్నాడు. అయితే దానికి కారకులెవరు? నీవు బట్టలు దరించుకొనిన తీరు, నీవు కనబరచుకొనిన రీతియే అందుకు కారణము. నీవు ఏదో ఒక విదంగా లేక పురాతన పెట్టెలోనున్న బట్టలు తీసి దరించవలెనని నా భావము కాదు. నీవు ఒక స్త్రీవలె కనబడుము.

94

నీ చిన్న బట్టలు తీసివేసి నిండుగా శరీరము కప్పుకొనుము, నీవు నోటిలో సిగరెట్టు పెట్టుకొని వుండుటను నీ కుమార్తె చూచుచున్నది, నీవు ఏ మంచి ఉద్దేశ్యముతోను అది చేయుటలేదు. అలాగు వీదిలో నడువవద్దు. వాస్తవానికి నీవు అమాయకురాలవు కావచ్చుగాని, అపవాది హవ్వను వాడుకొన్నట్లే నిన్నును ఒక సాదనముగా తన కొరకు వాడుకొనుచున్నాడు.

ఎందువలన ఇది స్త్రీ దేశము? కాథలిజంయొక్క అదిపత్యమునకు ఇది నడిపించుచున్నందునే. నేడు అది ఏమిటి? వారెన్నడునూ యేసును ప్రస్తావించరు. ''దేవుని తల్లియగు మరియా! నీవు దన్యురాలవు.''అందురు. ''పరిశుద్ధ సిసీలియా'' అందురు, చనిపోయిన పరిశుద్ధుల పేర్లు వాడుచుందురు. అన్నీ పరిశుద్ధుల పేర్లే.

95

గత సంవత్సరం నేను మెక్సికోలో వున్నాను. అక్కడకు ఒక పేద స్త్రీ కాళ్ళను ఈడ్చుకుంటూ వచ్చినది. ఆ విదముగా ఆమె మోకాళ్ళు అరిగిపోయి, దాగివున్నవి; ఏడ్చుచూ, ఆమె చేతులు పట్టుకొన్నది. మరియు ఆ తండ్రి ఇద్దరు పిల్లలను ఎత్తుకొని నడచుచున్నాడు, ఆ పిల్లలు ఏడ్చుచున్నారు, ఆ విదముగా తల్లి బాదపడుచున్నది; ఎందుకనగా, వారు పరిశుద్ధురాలు అనబడు ఒక స్త్రీ చనిపోయినది అని చెప్పిరి. ఆ కొండమీద వారు ఆమె విగ్రహమును ఉంచినారు. ఒక ప్రేమికుడు ఆమెను చంపెను, ఆ విదముగా ఆమె చంపబడిన వెంటనే, ఆమె పరిశుద్ధురాలయినది; ఆమె ఒక కేథలిక్. కాబట్టి ఆమె పశ్చాత్తాపముకొరకు పోవుచున్నది; పశ్చాత్తాపముకొరకు ఆమె ఆ గులకరాళ్ళపైన రెండుమైళ్ళు ప్రాకుకుంటూ వెళ్ళవలెను.

సోదరుడా! నేను చేయగలిగినది ఏ ఒక్కటి ఉన్నాగాని, యేసుక్రీస్తు చనిపోవుట వ్యర్థమే. కృపచేత నేను రక్షి౦చబడితిని, నా అంతట నేను కాదు గాని దేవుని చిత్తమును బట్టి, ఆయన మంచితనమును బట్టి రక్షి౦చబడితిని.

96

ఆ పత్రికా విలేఖరులు నన్ను, ''శ్రీ బ్రన్హం ... '' ఆ - ఆ చిన్న బిడ్డ తిరిగి జీవమునకు తేబడినది, మరియు అక్కడ కొన్ని సంగతులు ఉన్నవి. ముప్పది వేల మంది కాథలిక్కులు .... కాదు, నన్ను క్షమించండి. అది ఇరువది వేలు. ఆఫ్రికాలో ముప్పదివేలు. ఇరువది వేలమంది కాథలిక్కులు, క్రీస్తును తమ సొంత రక్షకుడిగా స్వీకరించినారు, ఇది ఒకేసారి మెక్సికో నగరములో జరిగినది. మరియు ఆ మత గురువులు,వారు ఏమి చెప్పలేకపోయినారు; చాలా త్రొక్కిసలాట జరిగినది. ఆ ప్రక్కన చాలామంది వుండిరి. కాబట్టి ఆయన, ''శ్రీ బ్రన్హం, నీవు చేసిన ఆ పనిని మన పరిశుద్ధులు చేయగలరా?'' అని అడిగెను.

వారి సిద్ధాంతములు తెలిసి, ''వారు బ్రదికియున్నచో తప్పకుండా చేయగలరు'' అన్నాను. చనిపోవువరకు నీవు కాథలిక్కు పరిశుద్ధునివి కాలేవు. నీకు తెలియునా?

''నీవు చనిపోవువరకు పరిశుద్ధునివి కాలేవు కదా?'' అని అతడడిగెను.

''నీవు ఇక్కడ దానిని చదివావు?'' అనడిగాను. పౌలు ఇట్లనెను, ''ఎఫెసులో వున్న పరిశుద్ధులకు, దేవునిచేత పిలువబడినవారికి. '' ''ఎఫెసులోవున్న పరిశుద్ధులకు, అతని ఉత్తరము చదువుచున్నాడు; ఇతర చోట్లనున్న పరిశుద్ధులకు.'' గలతీ, రోమా, ఇంకా ఆయా చోట్లనున్న పరిశుద్ధులకు. శుద్ధి పొందినవారు. దానిని గూర్చి నీవేమందువు?

97

బైబిలును గూర్చి, మేము తర్కించము, ఎందుకనగా మేము సంఘమై యున్నాము. బైబిలు చెప్పినది మాకు అక్కర్లేదు, సంఘము చెప్పునదే లెక్క అయితే కాథలిక్కు సంఘము గూర్చి నీ అభిప్రాయమేమిటి?'' అని నన్ను అడిగిరి.

''మీరు ఆ ప్రశ్న నన్ను అడుగకుండిన బాగుండును ఎందుకనగా మీరు నన్ను అడిగినందున నేను సత్యము చెప్పెదను'' అన్నాను.

''నాకు సత్యమే చెప్పవలెను'' అని కోరుచున్నాను అనెను.

''అంతకంటె నాకు తెలిసిన భూతవాదము మరొకటిలేదు'' అన్నాను.

''ఎందుకని నీవట్లు అనగలిగావు?'' అన్నాడు.

''చచ్చిన వారితో మాట్లాడునది భూతవాదము కాక మరేమిటి? '' ''ఆ పరిశుద్ధుడు తిరిగి మాట్లాడుచున్నాడు అంటే అతడు పాతాళములో వున్నాడు. ఆ దారిని దాటినవారు తిరిగి రాలేరు. '' అని నా బైబిలు చెప్పుచున్నది. అది నిజము. ''అపవాది పరిశుద్ధునివలె మాట్లాడుచున్నది. అంతే'' అని నేను చెప్పాను.

''అయితే ఒక్క నిమిషము ఆగు!'' ''మీరు కూడా మృతుల కొరకు విజ్ఞాపన చేయుదురు గదా? '' అనడిగెను.

''ఎక్కడ'' అన్నాను.

''యేసుక్రీస్తు చనిపోయెను గదా?''అన్నాడు.

''కాని ఆయన తిరిగి లేచెను. '' ఆయన చనిపోలేదు. ఆయన మద్యవర్తిగా వుండుటకు జీవించియున్నాడు. దేవునికి, నరునికి ఆయన ఒక్కడే మద్యవర్తి.

''మృతి పొందియు నేను తిరిగి జీవించుచున్నాను. సదాకాలము జీవించి యుందును. మరణము, పాతాళముయొక్క తాళపుచెవులు నాయొద్ద ఉన్నవి.'' ''ఇచ్ఛయించు వానిని వచ్చి ఉచితముగా జీవజలము త్రాగనిమ్ము.'' అని ఆయన పలికెనని చెప్పాను. ఆయన మా దేవుడు! ఆయన మా దేవుడు.

98

నీతిమంతుల సంతతి ముగియుటకు సిద్ధముగాయున్నది. ఈ విషయముల గూర్చి ప్రజలతో మాట్లాడండి, బైబిలు మార్గములోనికి తిరిగి వెళ్ళుటగూర్చి మాట్లాడండి, అద్భుతములను గూర్చి జనులతో మాట్లాడండి. వానిని గూర్చి ప్రజలతో ముచ్చటించండి, వారి ''సంఘము దానిని నమ్మదు.'' కాబట్టి దేవునికి వారు, ఉంపుడుగత్తెకు పుట్టిన పిల్లలు. మనము హింస, శో'దనలు, హేళన మొదలగునవి సహించనియెడల, దేవుని పిల్లలము కాము. బైబిలు ఆ విదముగా చెప్పెను.

నన్ను మీరు ''పరిశుద్ధుడు'' అని హేళన చేయవచ్చు. మీ ఇష్టమొచ్చినట్లు పిలవండి. నా హృదయము దేవునితో సరిగా వున్నంత కాలము, నా అనుభవం దేవుని బైబిలుతో జతగా వున్నంత కాలము నేను సరయిన దిశగా పయనించుచున్నట్లే.

99

అవునండీ: దానినే మనము నమ్ముచున్నాము. సజీవ దేవునియొక్క సంఘము అది. వేదాంత పాండిత్యము వలన అది వచ్చినది కాదు. ఒక మానవ నిర్మిత జ్ఞానాభిప్రాయమువలన వచ్చినది కాదు. యేసుక్రీస్తు దేవునియొక్క కుమారుడైయున్నాడు అను ప్రత్యక్షపరచబడిన సత్యము వలనే పూర్తిగా అది వచ్చును.

బాప్టిస్టు సంఘము లేదా మెథడిస్టు సంఘము ''పలానిది'' చేయవలెనని నేర్పించిన ఆ తెలివిని బట్టి ఆదారపడితే చాలదు. ఈ బైబిలు చెప్పుదానిని వినవలెను! నేను ''తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ'' నామములో బాప్తిస్మము పొందాను. ఆ తరువాత బైబిలు చదివి ఒక బోదకుడు యేసుక్రీస్తు నామములో తప్ప మరి ఏ ఇతర విదముగాను ఎవరూ ఎన్నడూ బాప్తిస్మము పొందలేదని నాకు చెప్పినప్పుడు నేను అది చదివి సత్యమని తెలిసికొన్నాను. అప్పుడు నేను వెళ్ళగలిగినంత త్వరగా నీటిలోనికి వెళ్ళితిని.

100

యేసుక్రీస్తు గొప్ప స్వస్థతలు చేయువాడు అని ఎవరో నాకు చెప్పిరి. ''అద్భుతములు జరుగు దినములు గతించిపోయెను'' అని నా సంఘము చెప్పుచున్నది, మరియు నాకు స్వస్థత అవసరము; నేను బహు త్వరగా అప్పుడు వేదిక యొద్దకు పరుగెత్తి స్వస్థత పొందుదును, నిశ్చయంగా అదే చేయుదును.

నేను ఒక బోదకుడను అయినచో, నా వేదికమీద ఒక స్త్రీ బోదకురాలు నిలబడి యున్నది. స్త్రీ బోదించరాదని నేను బైబిలులో చదివాను. కాబట్టి నాకు ఎంత నిఘాతము కలిగినా గాని ఆమెను నేను అక్కడి నుండి దింపి వేయుదును.

గుర్తుంచుకొనండి, ఆ వెనుక రైట్ సోదరి కూర్చొనియున్నది. అటువంటిది చేసినందుకు ఒకరాత్రి ఒక స్త్రీ నన్ను తలుపుగుండా త్రోసివేయ చూచినది, అవును'' నీవు ఆ విదంగా నా సంఘము లోనికి రాకూడదు. '' అన్నాను. సగం శరీరము కనబడునట్లు బట్టలు దరించి వచ్చినది. ''అలాగున నా సంఘములోనికి వచ్చువారిని ఖచ్చితంగా బయటకు త్రోసివేతును. '' అన్నాను. ఆ బాలిక ఆ విదంగా వచ్చికూర్చున్నది. ఆ తదుపరి ఆమె చనిపోయినది. చనిపోతూ నన్ను ఆమె పిలచినది. ఆమె ఒక కాథలిక్కు బాలిక. నేను వెనుక్కు చూచి ఆమెను పసిగట్టాను. అప్పుడు పాటలు పాడుచున్నారు. నేను నా కోటు తీసివేసి వెనక్కు నడిచి వెళ్ళాను. ఆ కోటును ఆమె భుజముల చుట్టూ కప్పితిని. ఆమెతో ఇట్లు చెప్పాను,''అమ్మా! నా ప్రసంగము నీవు వినగోరినచో దేవుని సంఘములో నీవుండగా దయచేసి ఈ కోటు దరించుము.''

101

ఆమె అక్కడ నుండి చిన్నపెదవులు విరచుచూ చకా చకా వెళ్ళిపోయినది. ''నా ఆవుకు కూడా అతని మతము వంటి మతము వద్దు'' అనుకొంటూ వెళ్ళిపోయినది.

''చింతించకండి. ఆమెకు అది దొరకదు'' అన్నాను.

మేము గుడారములో వుండగా ఆమె చనిపోవుచున్నది రమ్మని కబురు చేసిరి. ఆమె గుండెపోటుతో చనిపోతున్నది, ఆమె భర్త వచ్చెను. ''త్వరగా రండి'' అని పిలిచెను. (నేను కూటములో వున్నాను) చాలా పెద్దపొడవైన వ్యక్తి నా కొరకు తలుపు నొద్ద నిలబడి కనిపెట్టుచుండెను. నేను పరుగెత్తుకొంటూ నా కారులో ఎక్కి అక్కడికి వెళ్ళాను. వెళ్ళి ఆ హవర్ట్ పార్క్‌లో వుండు ఆ వద్ధ నర్సును నేను కలిసికొన్నాను. ''రెవరెండ్, మీరు రానవసరం లేదు'' అన్నది. అది ఇరవై సంవత్సరాల నాటి సంగతి. ఇంకా ఎక్కువ కావచ్చు కూడా. ''ఆమె చనిపోయినది. మూడు నిమిషముల క్రితమే చనిపోయెను. మీకొరకు ఆమె ఎంతో గోలచేసినది. మీకు ఒక కబురు చెప్పమన్నది.'' అని ఆమె నాతో చెప్పెను.

''ఏమిటి? '' అనడిగాను.

''దానిని బట్టి దయచేసి నన్ను క్షమించమని ఆ బోదకునికి చెప్పుము'' అన్నదని నాతో పలికెను.

102

ఆమెను చూచుటకు అక్కడికి నేను వెళ్ళాను, ఆమె అందమగు స్త్రీ, ఆమె బహు శ్రమపడినదని ఆమె ముక్కు యొద్దనున్నచిన్న పొక్కులను బట్టి తెలిసినది. చాలా అందగత్తె. ఆమె కళ్ళు పూర్తిగా బయటకు వచ్చి సగం తిరిగిపోయినవి. ఆమె ప్రేవులు, మూత్ర పిండములు కదిలినది. పడకమీద నుండి ఆవిరి వస్తున్నది. ఆమె భర్త నావైపు చూచి, ''సాహో బ్రన్హం! ఒక ప్రార్థన చేయుము. ఎందుకనగా ఆమె నిన్ను చూడగోరినది.'' అన్నాడు.

''ఇప్పుడు ఆమెకు ప్రార్థించుట వలన ఏమీ మేలు లేదు'' అన్నాను. ఒక చెట్టు ఎటు ఒరుగునో అటే పడును, ''మోసపోకుడి; దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడేమి విత్తునో ఆ పంటనే కోయును.''

103

అదెక్కడున్నదో మీరు చూచారా? ఇప్పుడేమి జరిగినది? అలాగు చేయు స్త్రీ వైపు చూడండి, అప్పుడు ఒక బృ౦దగాయనిగా జీవించిన ఆమె గూర్చి ఆలోచించండి. ఆమె కుమార్తె ఏమిటి? ఒక తిరుగుబోతు. తిరుగుబోతు కుమార్తె ఎవరు? రాక్ ఎన్రోల్, ఆమె కుమార్తె ఏమగును? ఏమిటది?

నీతిమంతుల యొక్క సంతతి చూడండి? బాప్టిస్టులవైపు చూడండి, కొద్దిగా వెనక్కు వెళ్ళండి. బాప్టిస్టులారా, మీ సంస్థాపకుడగు జాన్ స్మిత్‌ యొద్దకు వెళ్ళండి. ప్రజల యొక్క పాపముల కొరకు అతడుప్రార్థన చేసినందున అతని కండ్లు ఉబ్బిపోయినవి. బహుగా ఏడ్చుటవలన అతని కండ్లు మూసికొన్నందున అతని భార్య అతనికి చెంచాతో భోజనము తినిపించవలసి వచ్చెను.

104

మరియు ఇక్కడ చుట్టూ వున్నమెథడిస్టులైన మీరు ముక్కులకు, చెవులకు ఏవేవో తగిలించుకొని అపవాదికి జీనుల వలె కనబడుచున్నారు; పొట్టి దుస్తులు వేసికొని బయటకు వెళ్ళుచున్నారు! మెథడిస్టు సంఘ పెద్దలలో ఒకడగు జాన్ స్మిత్ ఎనుబది అయిదేండ్లప్పుడు ఒక చిన ప్రసంగము చేసెను. (నాలుగు గంటల ప్రసంగము) చనిపోవు ముందు చేసెను. వారు అతనిని ఎత్తికొని వేదిక ఎక్కించవలసి వచ్చెను. అతని చివరి మాటలు ఇట్లున్నవి. ''మెథడిస్టు సంఘ ప్రవర్తన చూచి నాకు ఎంతో దిగ్భ్రాంతి కలిగినది. మెథడిస్టు సంఘ కుమార్తెలు కూడా తమ వ్రేళ్ళను బంగారు ఉంగరములు “దరించుచున్నారు.'' ఈ పొట్టి దుస్తులు, అలంకరణతో పాటు పాటలు పాడుట చూచి ఇప్పుడు ఆయనేమనును? మీరు బాగుగా పరుగెత్తిరి. కాని ఏమి జరిగినది? మీరు మీ తల్లివలె ప్రవర్తించుచున్నారు. అది అక్షరాలా నిజము.

ఇక్కడ ఏ శాఖలు కనబడక పోవుటకు అదియే కారణము. ''మేము మోథడిస్టులము,'' ''మేము బాప్టిస్టులము'' అనుచున్నారు. మేము క్రీస్తుకు చెందిన వారము. ఆ విదంగా ఉండి, స్వేచ్ఛను పొందండి.

105

ఇప్పుడు, సర్ప సంతానమును చూడండి? అటువంటి స్త్రీ ఇప్పుడు ఏమి చెల్లించును? అది ఏమి చేయును? వారింకా వచ్చుచునే వున్నారా? వారు బాప్టిస్టులను వెనక్కు త్రోసిరి, మెథడిస్టులను వెనక్కు త్రోసిరి, ప్రెస్బిటేరియనులను వెనక్కు త్రోసిరి. వారేమి చేసిరి? వారందరూ ఆ ముసలి వేశ్య అయిన తమ తల్లివలెనే తిరిగిరి. అక్కడ వారందరూ ఒకే వేశ్యా వృత్తిలో వున్నారు. ఏమీ తేడా లేదు. వారు ముంచబడిరి, వారు చిలకరింపు పొందిరి. వారు ఒప్పుదలను చేసిరి. వారు ఆరు నెలల శిక్షణను పొందిరి. ఆ సమయములో వారు మరీ ఎక్కువగా త్రాగలేదు. అంతే. వారు మంచి సభ్యులుగా మారిరి. వారు బాగా చెల్లించుదురు.

ఓ! ఆత్మ ఫలములతో దానికెట్టి పొత్తు లేదు. ఆత్మ ఫలము ''విశ్వాసము'' - యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడని నమ్ముము -సహోదరుల పట్ల ప్రేమ, సంతోషము, సమాదానము, దీర్ఘశాంతము, అవి అత్మ ఫలములు.

106

మనము పురుషుని తీసికొందము, ''అతడు తన పొరుగువానితో మంచిగా జీవించుచున్నాడు'' అనవచ్చు. ఏశావు అలాగే జీవించెను. ఏశావు ఎన్నడూ ఎవరికీ హాని చేయలేదు. ఏశావు అపవాది సంబంది; కాని అదే గర్భములో నుండి వచ్చిన యాకోబు దేవుని సంబంది. అపవాది సంతానము, స్త్రీ సంతానము కనబడుచున్నది.

ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రపంచమునకు ఇక ఏమి మిగిలియున్నది? దీనిని నేను బహు కఠినంగా చెప్పుచున్నాను. దీనిని క్రిందికి త్రోయండి. వచ్చే కూటంలో ఉజ్జీవమును మనము ప్రారంభించుదము. ఒక రూపమునకు అది రావలసియున్నది. దయచేసి దీనిని నేను వ్యంగ్యముగా చెప్పుట లేదు. దీనిని నేను నీచముగా పలుకుట లేదు. ఇది ఒక మత సంబందమగు అక్రమ సంతానము అను పెద్ద గుంపుగా ఏర్పడును. ఇదే నా తుదిమాట.

107

చివరకు అది అలా తయారగును. అది సత్యమని మీరెరుగుదురు. ''సంఘములో చేరుట'', '' సంఘ సభ్యత్వము'' గా చివరకు అది వచ్చును. ''పైకి భక్తి కలిగియుండియు, దాని శక్తి ఆశ్రయించనివారు.'' ఒక అక్రమ మత సంతతి! నిజంగా అదే.

ఇక దానికి తరువాత ఏమి మిగిలియున్నది? రాకెట్లు సిద్ధముగా గురి పెట్టబడియున్నవి. చాలా వున్నవి. కోబాల్టు బా౦బులు ఇంకా చాలా శక్తికొరకు కాచుకొనియున్నవి. నీటి ద్వారా జరిగినట్లే అగ్నిద్వారా నాశనము జరుగును.

108

మరియు స్నేహితులారా, మీరు క్రైస్తవులయినచో, మీ హృదయములో దేవుడున్నచో, మీరు మరణములో నుండి జీవములోనికి దాటియున్నారని ఎరిగినచో, మీరు లోకములో మిక్కిలి సంతోషముగల వ్యక్తిగా ఉండవలసియున్నారు. మీలో పరిశుద్ధాత్మ వుండినప్పుడు....

''యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడు'' అని బైబిలు చెప్పుచుండగా,

''అద్భుతములు జరుగు కాలము అయిపోయినది అని మేము నమ్ముచున్నాము'' అని శాఖలు చెప్పుచున్నవి.

109

''ఆమేన్! యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడు. అవును!'' అని పరిశుద్ధాత్మ చెప్పుచున్నది. ''మారుమనస్సు పొంది ప్రతివాడును పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, అన్యజనులకు, దూరస్థులందరికి, ప్రభువగు దేవుడు పిలిచిన వారందరికి చెందును'' అని బైబిలు చెప్పుచున్నది. ''మెథడిస్టువారు పిలిచిన వారందరికి, బాప్టిస్టువారు పిలిచిన వారందరికీ'' అని కాదు గాని మన ప్రభువగు దేవుడు పిలిచిన వారందరూ పరిశుద్ధాత్మను పొందుదురు. యేసు క్రీస్తునామములో బాప్తిస్మము పొందుదురు. అది బైబిలు చెప్పుచున్న మాట.

దానికి నీవు ''ఆమేన్'' అని చెప్పుము.

''అందులో పెద్ద తేడా లేదు'' అని సంఘము చెప్పవచ్చును.

కానీ నీలో నున్న ఈ పరిశుద్ధాత్మ వాక్యమునకు ''ఆమేన్'' అని చెప్పును. ''మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. '' అంతే!

110

దీనంతటికి యాపిలు తినుటయే కారణమని ఏ ఒక్క వాక్యమైనా చెప్పుచున్నదేమో చూపించండి. వారు యాపిలు తినిరని చెప్పు వాక్యమును నాకు చూపించవలెనని కోరుచున్నాను. కయీను అలాగే తలంచెనని మీతో నేను చెప్పాను. అతని సంతానము ఇంకా అలాగే తలంచుచున్నది. స్త్రీ పురుషులు అక్రమంగా శారీరక సంపర్కము జరిగించుటవలనే అది జరిగినదని బైబిలును బట్టి దేవుని యొక్క ఆత్మీయ ప్రత్యక్షత బయలుపరచుచున్నది. అక్కడ నుండియే భారీకాయులు వచ్చిరి, అక్కడ నుండియే పాపము వచ్చినది, అక్కడ నుండి చెడు వచ్చినది.

ఇప్పుడు గమనించండి. చూడండి. సర్పము రెండింతల యుక్తి గలది. వాడి సంతానము కూడా ఎల్లప్పుడూ రెండింతల యుక్తినే కలిగియున్నది. నేను ఈ వేదిక మీదికి ఎక్కి, నా చేతిలో ఈ మైక్రోఫోనును పట్టుకొని (సహో. బ్రన్హం మైక్రోఫోనును కదిలించినారు - సంపా.) వేదికకు నా పాదమును అంటించి ఈలాగు చెప్పుదును: ''నేడు మీ గొప్ప మేదావులు ఎక్కడ? '' ''మీ సంఘ కాపరులు వెళ్ళి ఎంతో మేదా జ్ఞానమును సంపాదించుకొని వచ్చి నిలబడియున్నారు. ''దేశములో వున్న అతి పెద్ధ సంఘమునకు అతడు కాపరి. సర్ప సంతానము ఎక్కడ నిలబడును? అటువంటి తెలివి, యుక్తి గల స్థానములలోనే తెలివి, చురుకుదనము గల పండితులు అక్కడేయున్నారు. బలము ద్వారా కాదు, శక్తిద్వారా కాదు, నా ఆత్మద్వారా అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

111

ఆ మూలన నిలబడియున్న చిన్నసోదరుని మీరు తీసికొనండి. కండ్ల నుండి నీరు కారుచున్నది. పాత గిటారు వాయించుచు అక్కడ నిలబడి ''సోదరులారా వచ్చి ప్రభువును కనుగొనండి'' అని పిలచుచున్నాడు. (సహో. బ్రన్హం ప్రసంగ వేదికను ఒకసారి తట్టెను - సంపా.)

సంఘకాపరి వచ్చి, ''నా సంఘపు వారిని రానీయను. లిడీని, జానీని నేను అటువంటి చోటనుండగా చూడనీయను'' అనుచుండెను.

అలాగే సాగిపొండి. అపవాది సంతానమా మీరు మీ నిత్య గమ్యమువైపు పోవుచున్నారు. అది నిజము. అక్రమ పిల్లలు అని కూడా నేను చెప్పగలను. అది వాస్తవము. మీరు చూడండి. ''నా తండ్రి ఆకర్షించితేనేగాని ఎవడును నాయొద్దకు రాడు. నాయొద్దకు వచ్చువారందరినీ నేను అంత్య దినమున లేపుదును. ఎవరునూ నశించరు. '' దానిని నేను గ్రహించను. దానిని నేను గైకొందును. ఇది తప్ప దానిని ఎవరునూ చేయజాలరు. అదంతయూ ఆయనలోనే యున్నది. ''ఒక్కటి నేను చేశాను, '' అని మీరెవరూ చెప్పజాలరు. సమస్తమూ దేవుని కృపయే చేసెను. కాబట్టి నేను ఏమియూ చేయలేదు. నేను ఎన్నడును ఏ ఒక్క కార్యమును చేయలేదు. ప్రతి చిన్నదానిని దేవుడే చేసెను. దానిలో ఏ ఒక్క భాగమును కూడా నీ వ్రేలు ఎత్తి నేను చేసితినని చెప్పజాలవు.

''నేను ఒక మంచి కుటుంబములో నుండి వచ్చాను. నేను దీనిని చేశాను'' అని నీవనవచ్చును. దానివలన ఏమీ లాభము లేదు. దానిని చేసినవాడు దేవుడే; దేవుని కృప.

112

ఇంకా పూర్తిగా 11:00గంటలు కాలేదు. అయినా గాని నేను ముగించుదును. ఈ సంగతులు సత్యములని బైబిలు చెప్పుచున్నదని ఎందరికి తెలియును? ముఖ్యంగా ఈ బ్రన్హం (తబెర్నికల్) ఆలయము వారికి తెలియును. (సంఘము ''ఆమేన్'' చెప్పుచున్నది- సంపా.) మనము బోదించి విశ్వసించు వాటిలో ఇది ఒకటిలో ఆరవవంతు మాత్రమే. కాని గుర్తుంచుకొనండి. నిలబడియున్నవారికి దీనిని చెప్పుచున్నాను. మీరు ఒక సభ్యునిగా ఇచ్చటకు వచ్చియుండలేదు, మేము నమ్ముచున్నది బైబిలు. ఈ బైబిలు దేవునియొక్క సత్యము.

మనము ఇప్పుడు పాత నిబందనను నమ్ముచున్నాము. ఏది సత్యమో, ఏది అసత్యమో నమ్మగల విదానము వారికి ఒకటుండెను. వారికి వ్రాయబడిన దర్మశాస్త్రమున్నదని మనందరికి తెలియును. దర్మశాస్త్రము, నిబందన మందసములో ఆజ్ఞలు మొదలగునవి వారికుండెనని ఎందరికిది తెలియును? ''నీవు వ్యభిచరించరాదు. వ్యభిచరించిన వారిని రాళ్ళతో కొట్టి చంపవలెను. '' చూచారా? అది ఆజ్ఞ. ఆజ్ఞ మీద ఉన్న దర్మశాస్త్రము, నిబందన మందసములో ఆజ్ఞలున్నవి. నిబందన మందసము యొక్క అరలలో ఆజ్ఞలయొక్క శాసనములున్నవి. ఒక వ్యక్తి వ్యభిచారములో పట్టుబడినప్పుడు వారు దర్మశాస్త్రము చెప్పినట్లు ''రాళ్ళతో కొట్టి చంపుట'' చేసెడివారు. వారతనిని వెలుపటకు కొనిపోయి రాళ్ళు రువ్వి చంపెడివారు. ఆజ్ఞమీద వున్న శాసనము అదే.

113

వారికి తెలిసికొనుటకు రెండు మార్గములున్నవి. స్థిరపరచుటకు మూడు మార్గములు మామూలుగా వుండును. ప్రవక్త లేదా ఒక స్వప్నములు చూచువాని ద్వారా తెలిసికొనుట మరో మార్గము. ఇది ఎందరికి తెలియును? ''మీలో ప్రవక్త యున్నచో లేదా ఆత్మసంబందియగు వాడున్నచో, యెహోవానగు నేను వానికి ప్రత్యక్షపరచుకొని కలల ద్వారాను, దర్శనము ద్వారాను అతనితో మాట్లాడును. '' అది నిజము ఆయన ప్రవచించువాడు.

''ఓ! హల్లెలూయా! దానిని నేను పొందాను, యెహోవా నామము పేరట నేను ప్రవచించుచున్నాను. నాకు ప్రత్యక్షత దొరికినది'' అని ఎవరయినా వచ్చి చెప్పిన యెడల మీరు అనుమతించినట్లుగా వారు అనుమతించరు. మొదట దేవుని ద్వారా దానిని వారు పరీక్షి౦చుదురు.

114

అహరోను యొద్ద ఊరీము, తుమ్మీము అని పిలువబడినవి ఉండెను. ఆ మాట ఎందరు విన్నారు? అది ఏమిటి? అది పండ్రెండు రాళ్ళు పండ్రెండు పితరులను బట్టి అటు ఇటు ఆరు చొప్పున ఉంచిరి. పండ్రెండు రాళ్ళు. అంతటవారు ఈ ప్రవక్తను, లేక కలలు కనువానిని తీసికొని వెళ్ళి అతనికి ఈ ఫలకమును కట్టెడివారు. అక్కడ వారతనిని నిలబెట్టెడివారు. ''ఇప్పుడు నీ ప్రవచనము రానిమ్ము'' అనెడివారు.

''యెహోవా నాతో కొన్ని సంగతులు మాట్లాడినాడు.'' అది ఎంత వాస్తవముగా కనబడినాగాని ఆ సహజాతీతమగు వెలుగు అక్కడ రానియెడల అది తప్పు. (అది సంపూర్ణ సత్యముగానే వినిపించవచ్చును) ఆ దీపములు ఏకమై అక్కడ ఇంద్రదనుస్సుగా ఏర్పడవలెను. ఊరీము, తుమ్మీము యొద్ద ఆ వెలుగులు ఏకమై సహజాతీతముగా పనిచేసి దృవీకరించవలెను. దేవుడు ఎల్లప్పుడూ తన వాక్యమును దృవపరచుటను మీరు చూతురు. చూడండి, దేవుడు తన వాక్యమును ఎల్లప్పుడూ దృవపరచును. చూడండి? ఆ అతీతమగు వెలుగు అక్కడ రెపరెపలాడుట లేదు, అది అంత నిజముగా కనిపించిననూ నేను దానిని లెక్క చేయును, అది తప్పుగా యున్నది.

115

కల కనినవాడు ఈలాగు చెప్పును, ''నేను ఒక కల కన్నాను, ఇశ్రాయేలు కదిలి ఒక ప్రత్యేక స్థలమునకు వెళ్ళవలెను. ఎందుకనగా సిరియనులు వచ్చి ఒక ప్రక్క ముట్టడి చేయుచున్నారు. '' వారు ఆ కల కనిన వానిని అక్కడికి తీసికొని పోయెదరు; అక్కడ ఆ వెలుగులు వెలగని యెడల సిరియనులు అప్పటికే అక్కడికి వచ్చి కూర్చున్నాగాని అది తప్పు. అది ఊరీము, తుమ్మీముద్వారా ఖచ్చితముగా రుజువు చేయబడవలెను.

ఆనాటి యాజకులు ఊరీము తుమ్మీముతో సాగిపోవుచుండిరని మీకు తెలియునుకదా! ఇప్పుడు ఆ పూర్వపు యాజకత్వము పోయినది. అందరికీ తెలియును, దానితోపాటు ఆ ఊరీము తుమ్మీము కూడా పోయినది. అది మనకు తెలియును. తెలియదా?(సంఘము ''ఆమేన్'' చెప్పుచున్నది- సంపా.) మరియు క్రొత్త యాజకత్వము వచ్చియున్నది. మరియు, ఈరోజు మనకు ఊరీము, తుమ్మీము ఉన్నదా? అవునండీ. దేవుని వాక్యము! అవునండి. ఇది అదియే. (సహో. బ్రన్హం బైబిలును చూపించుచున్నారు -సంపా) ఒకే వ్యక్తి ఏ రకమగు ప్రత్యక్షతను కలిగియున్నాగాని, ఏది చెప్పినా గాని, బైబిలుకు అనుకూలంగా లేని ఏ సిద్ధాంతము లేదా మరేది చెప్పినా గాని అది తప్పు.

అతడు ఏ శాఖకు చెందిన వాడయినా నాకు లెక్కలేదు. అతడు ఎంత మంచివాడయినా, ఎంత తెలివిగలవాడయినా, ఎంత విద్యగలవాడయినా, తప్పులోనే యున్నాడు.

116

ఈ సంఘములో మనము ఉపదేశించిన సంగతులు ఎవరయినా చెప్పవచ్చును. ''నీవు చిలకరింపు పొందినా ఏమీ తప్పు లేదు అని చెప్పినయెడల అది అబద్దమే. అది ఊరీము, తుమ్మీములో వెలుగదు. క్రుమ్మరింపు అయినా మంచిదే అని అతడు చెప్పినయెడల అది అబద్ధము. ''తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తీస్మము పొందుట మంచిదే'' అని చెప్పినయెడల అది అబద్ధము. ''అద్భుతములు జరుగు దినములు గతించినవి'' అని చెప్పినయెడల అది అబద్ధము. ''స్త్రీలు బోదించినా పరవాలేదు'' అని చెప్పినచో అది అబద్ధము. ''నీవు ఏమి చేసినాగాని నీ శాఖను హత్తుకొనియుండినచో చాలు'' అని చెప్పినచో అది అబద్ధము. అది ఊరీము, తుమ్మీములను వెలిగించదు. ఆ ముసలి వేశ్యనుండి డజనులకొలది బయటకు వచ్చినవి. అందుకే మనము శాఖలనుండి దూరముగా ఉన్నాము.

117

ఆ శాఖలలో ఉన్న మన సోదరీ సోదరులను మనము ప్రేమించుచున్నాము. కాని మీరు వెళ్ళి ఈలాగు చెప్పవద్దు. ''నేను ఒక మెథడిస్టును, నిన్ను ఒక క్రైస్తవునిగా చేయుదును. '' నీవు ఒక క్రైస్తవుడువి. ఎందుకనగా నీవు దేవుని ఆత్మ మామూలుగా జన్మించియున్నావు. నీవు మెథడిస్టువి లేక బాప్టిస్టువి కానవసరం లేదు. నీవు ఏదీ కానవసరం లేదు. నీవు దేవుని యొక్క ఆత్మ మూలముగా జన్మించవలసియున్నావు. దానిని నీవు నమ్ముదువా? (సంఘము ''ఆమేన్'' చెప్పుచున్నది - సంపా.)

ఈ ప్రాతిపదిక మీద ఎవరయినా గాని వచ్చి, ఈ ఆరాదనా సహవాసములో సహకరించ గోరుచున్నయెడల, యేసుక్రీస్తు నామములో ముంచుట ద్వారా బాప్తిస్మము పొందగోరిన యెడల, ఇదిగో ఇక్కడే నీరున్నది. ఒక నిమిషములో వారు బాప్తిస్మమీయనై యున్నారు. ఎవరయినా గాని ఏ విదముగా వచ్చినా గాని ఇక్కడ మేమున్నాము. అది నిజము.

118

మాకు ఎట్టి సభ్యత్వము లేదు; మీరు ఈ ఆలయమునకు వచ్చియున్నారు. మెథడిస్టు చర్చిలోను, బాప్టిస్టు చర్చిలోను, ప్రెస్బిటేరియను చర్చిలోను క్రీస్తు ఉన్నాడని మేము నమ్ముచున్నాము. వాటన్నింటిలోను ఆయనకు సభ్యులున్నారు. అబద్ధ ప్రవచనమున్నది. ఆ సంగతులు, ఆ సంఘముల బోదనలు పూర్తిగా బైబిలునకు విరుద్ధము.

ఇప్పుడు, దానిని ఎవరయినా గాని నాకు విశదపరచిన యెడల నేను వెదకి, బైబిలులో అది దొరికిన యెడల మరల వచ్చి నిజమని చెప్పుదును. అందుకు సరిపడిన దేవుని ఆత్మ నాలో వున్నదని నాకు తెలియును. నేను బోదకుని యొద్దకు వెళ్ళి కరచాలనము చేసి నా పేరును గ్రంథములో వ్రాసుకొన్నప్పటికిని, నా హృదయములో ద్వేషము, అసూయ, కక్ష, కలహము వున్నయెడల వెంటనే నేను దేవునితో సరిచేసికొనవలెను. లేనియెడల యేసుక్రీస్తు గొప్ప వైద్యుడు అని నమ్మినా ప్రయోజనము లేదు. నేను తప్పక సరిచేసికొందును. దాని విషయములో యథార్థముగా వుందును. దేవునితో నేను సమాదానపడుదును. నేను బాప్టిస్టును లేదా మెథడిస్టును అని చెప్పి అంటిపెట్టుకొని యుండినయెడల నా హృదయములో క్రైస్తవ్యము ఉండదు. కనుక నేను సరిచేసికొందును. అవునండి.

119

ఇప్పుడు గుర్తుంచుకొనండి. ప్రభుని చిత్తమయితే వచ్చే బుదవారము రాత్రి నుండి ఈ ప్రాతిపదిక మీద ఉజ్జీవ కూటములు ఆరంభమగును. స్నేహితులారా వినండి, సత్యమగు, సజీవుడగు దేవుడున్నాడు. అది నిజము. యేసుక్రీస్తు దేవునియొక్క కుమారుడు, పరిశుద్ధాత్మ నేడు సంఘములో వున్నది. ఎవరయినా అలాగు చెప్పినయెడల దానిని సందేహించు హక్కు నాకున్నది. కాని వినండి. చిన్న బాలునిగా ఉన్నప్పుడు ఒక రోజున నేను ఒక చెట్టు క్రింద నిలబడి వున్నాను. ఆయనను నేను చూచాను. ఆయన మాట విన్నాను. ఆయన నాతో ఇట్లనెను, ''ఆ చెడు స్త్రీలకు దూరముగా ఉండుము, సిగరెట్లకు దూరముగా ఉండుము, బూతులు, త్రాగుడు మొదలగు చెడుక్రియలకు దూరముగా ఉండుము. నీవు పెద్దవాని వయినప్పుడు నీతో నేను జరిగించవలసిన ఒక పనియున్నది. '' ఆయన వాస్తవమని నాకు తెలియును. సజీవుడగు దేవుడు తన వాక్యముతో ఏకీభవించును.

120

నేను ఇంకొంత పెద్దవాడనయినప్పుడు, ఆయన నన్ను కలిసికొనెను. ఆయన నాతో మాట్లాడెను. అక్కడ మండుచున్న పొదలో అయినను నేను చూచాను. ఆ అగ్ని అక్కడ కదలుట చూచాను. ఏమి జరుగునో ఆయన చెప్పుట విన్నాను. ప్రతిసారి అది ఖచ్చితంగా అలాగే జరిగినది. ఇప్పుడును అలాగే ఖచ్చితముగా జరుగగలదు. ఆ పరిపూర్ణమైన సంగతులను చెప్పిన ఆయనే నేను బోదించు ఈ రీతిగా బైబిలును బోదించుటకు ప్రేరణ ఇచ్చెను. అది నిజము. కాబట్టి అది దేవునియొద్ద నుండి వచ్చెను.

నాకయితే ఆయన సర్వశక్తుడగు దేవుడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నాడు. యేసు ఇట్లనెను. ''నేను తండ్రి వద్దనుండి వచ్చియున్నాను, తండ్రియొద్దకు వెళ్ళుచున్నాను.'' ఆయన వచ్చినప్పుడు. అరణ్యములో ఆయన దేవుడు. ఆయనే మండుచున్న వెలుగు. ఎందరు దీనిని ఎరుగుదురు? (సంఘము ''ఆమేన్'' చెప్పుచున్నది - సంపా.) ఆయన మండుచున్న దీపము, అగ్నిస్తంభము. మరియు ఆయన ఈ భూమి మీదకు వచ్చెను, మరియు ఈలాగు చెప్పెను, ''నేను తండ్రి యొద్దనుండి వచ్చితిని, మరియు నేను వెళ్ళెదను... దేవుని నుండి వచ్చితిని. మరియు తిరిగి దేవుని యొద్దకు వెళ్ళెదను.''

121

ఆయన చనిపోయి, సమాది చేయబడి, మరలతిరిగి లేచెను, దమస్కు మార్గములో పౌలు ఆయనను కలిసెను. ఆయన ఎవరు? (ఒకరు ఈ విదముగా చెప్పెను, ''అది అగ్నిస్తంభము'' - సంపా.) అది అగ్నిస్తంభము. అవునండి. ఆయన ఈ భూమిమీద ఉండగా ఏమి చేసెను? పౌలును కలిసికొన్నప్పుడు ఆయన ఏమి చేసెను? అతనిని ఆయనెట్లు పంపెను? ఎట్లు బాప్తిస్మము పొందవలెనో, ఏమి చేయవలెనో తెలియచేయు ఒక ప్రవక్తయొద్దకు పంపెను. అతని మీద చేతులుంచి అతనిని స్వస్థపరచెను. తాను ఒక దర్శనమును చూచితినని చెప్పెను.

అదే యేసు నేడు ఇచ్చటున్నాడు. ఇంకా అవే కార్యములను చేయుచూ, అగ్నిస్తంభముగా వున్నాడు. అవే సంగతులను బోదించి తన వాక్యము ద్వారాను, అద్భుతములు, సూచక క్రియలద్వారాను స్థిరపరచుచుండెను. క్రైస్తవునిగా ఉన్నందుకు నేనెంతో సంతోషించుచున్నాను. ఏమి చేయవలెనో నాకు తెలియదు. మీరు క్రైస్తవులయినందుకు నాకు సంతోషముగా వున్నది.

122

ఇక్కడ ఆలయములోని వారికి ఈ ఆలయపు పేరును మార్చనైయున్నామని చెప్పాను, ''బ్రన్హం ఆలయము'' అని వుండుట సరిగా లేదు. అది ఒక మనిషి పేరు. దాని పేరును మార్చనైయున్నాము. మరో పేరు పెట్టెదము. తరువాత దానిని చెప్పెదను. ఇది కేవలము సజీవ దేవునియొక్క సంఘముగా ఉండవలెనని కోరుచున్నాను. ఇది ''మెథడిస్ట్,'' ''బాప్టిస్ట్'', ''ప్రెస్బిటేరియను'', ''పెంతెకోస్తు'' గా వుండుట కాదు. వారందరినీ నా హృదయ పూర్వకముగా ప్రేమించు చున్నాను. ఏది ఏదో నేను చెప్పజాలను. మీకు నేను చెప్పలేను.

123

నేను కేవలము వాక్యమును బోదించవలసియున్నాను. నేను వలను విసిరి లాగవలెను. అక్కడ, కప్పలు, నీటి సాలీళ్ళు, పాములు, కొన్ని చేపలు కూడా వున్నవి. దానిని నిర్ణయించు పని దేవునిది. నేను కేవలము వలను లాగవలెను. వాక్యము మాత్రమే బోదించి ఈలాగు చెప్పవలెను, ''ప్రభువా! ఇదిగో వీరు. నీ బలిపీఠము చుట్టూ వున్నారు. నీ వారిని నీవెరుగుదువు; ప్రారంభము నుండి నీవు వారిని ఎరుగుదువు. ఏది ఏదో నాకు తెలియదు. ప్రభువా, అది నీవే చేయుము. అది నీ పని. నేను శాయశక్తులా చేయగలిగినది అదే. నేను ఇక్కడ నుండి వెళ్ళి మరియొక గుంపు మద్య వాక్యమును ప్రకటించెదను. నేను చేయగలిగినదంతయూ అదే. ''

ఓ! నేను యాత్ర చేయుచున్నట్లు భావించుచున్నాను.

యాత్ర చేయుచున్నుట్లు భావించుచున్నాను.

నా పరలోక గృహము ప్రకాశమానముగా, చక్కగాయున్నది.

నేను యాత్రచేయుచున్నట్లు భావించుచున్నాను.

124

ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఎవరయినా నన్ను కలువవలెనన్నచో ఇక్కడున్న శ్రీ. మెర్సియర్‌ను పిలవండి లేక బట్లర్ 2-1519. మిమ్మును చూచుటకు మేము ఆనందించుదుము. మీ ప్రియులను తీసికొనండి. ఉజ్జీవవ కూటములందు తొందరయుండును. నేను కూడా రెండు రోజులపాటు ఈ రాత్రినుండి విరామము కొరకు వెళ్ళుచున్నాను.

అక్కడికివెళ్ళి ఈ విదంగా చెప్పదలచుకొన్నాను: ''ప్రభువా, నీవు నా చెంతన వున్నావు. నీవు ఇక్కడున్నావని నాకు తెలియును. నీ యొద్దకువచ్చు వారియొద్దకు నీవును వచ్చెదవని నీ వాక్యము చెప్పెను. '' ఆ అగ్ని స్తంభము కదులుట ఆరంభించు వరకు నేను కనిపెట్టి ప్రార్థించగోరుచున్నాను. అది సిద్ధమవునని నాకు తెలియును. అప్పుడు నేను రోగులు, బాదపడు వారియొద్దకు వెళ్ళి ప్రార్థన చేయుదును, మరియు వారికి నేను చేయగలిగినది చేసెదను.

125

ఇప్పుడు మీ దయను ప్రసంశించక తప్పదు. మీరు విశ్వాసముతో రండి. గొప్ప కూటము కొరకు మేము ఆశించుచున్నాము. సహో జెఫ్రీస్‌నకు నేను చెప్పగోరుచున్నాను. ఈ రాత్రి ఆయన ఇక్కడేవున్నాడా? సహో జెఫ్రీస్‌ను, ఆయన పనిని నేను ప్రసంశించగోరుచున్నాను. అతడు ద్వీపములకు తిరిగి వెళ్ళెనని తలంచుచున్నాను. రైట్ దంపతులను, ఇంకా మీ అందరిని చూచుట సంతోషముగా యున్నది. కొద్దిసేపటి క్రితము ఆటార్నీ రిబిన్‌సన్ ఇక్కడికి వచ్చుట చూచాను. ఒక రోజున అతడు అందించిన వర్తమానమునుబట్టి వందనములు తెలుపగోరుచున్నాను. అదెవరో నాకెవ్వరూ చెప్పలేదు. నాకు సిగ్గువేసెను. ఈ రాత్రి నేను బోదించిన రీతిగా, ప్రవచనముల మీద అతడు నిజంగా మంచి వర్తమానమును అందించెను. ఈ ఉదయమున లేక గత రాత్రి మరొక సేవకుడు ఇచ్చటుండెను. సహో. స్మిత్: మెథడిస్టు సంఘము లేదా చర్చ్ ఆఫ్ గాడ్నుండి వచ్చెను. ఈ రాత్రి అతడున్నాడో లేదో నాకు తెలియదు. ఈ వేదికమీద నిలబడి వెనక్కుచూచి ఎవరున్నారో లేరో చెప్పుట చాలా కష్టము. చూడండి. అంతా సమానముగా కనబడును. మీరు చెప్పలేరు. సహో. స్మిత్ ఇక్కడున్నయెడల అతనిని అభినందించుచున్నాము.

126

ఇక్కడ కూర్చున్న సోదరుడు జార్జియా నుండి వచ్చెను గదా? సహో. కాలిన్స్‌కు ప్రక్కన కూర్చొనియున్నాడు. (సహో. నెవిల్ ''అవును'' అని చెప్పుచున్నాడు - సంపా.) సోదరుడా,ఈ రాత్రి మరల చూచుట సంతోషము. మీ అందరినీ చూచుట ఆనందము. మరియు మిగిలినవారు మీరందరు, మీరెవరో ప్రతి ఒక్కరికీ తెలియును.

ఆ సమయములో ఒక బాలిక యొద్దకు వెళ్ళి ప్రార్థించిన సోదరీ సోదరులు వేరేనని నమ్ముచున్నాను. ఆ చోట ఒక వైద్యుడు కూర్చొనియున్నాడు. ప్రభువు నిన్ను దీవించును వైద్యుడా.

127

ఇప్పుడు దయచేసి నన్నుబట్టి అభ్యంతరపడవద్దు. సోదరులకు సేవకులకు చెప్పుచున్నాను. నేను బహు కఠినముగా దీనిని చెప్పితిని. ఇది మన ఆలయము. మనము అందుకొరకే నిలబడియున్నాము. మనము ఆ వాక్యమును వేసి దానితో వారిని కుదుపవలసియున్నాము. మీరెన్నడయినా గీత దాటినచో మీయొద్దకు మరల వచ్చి ఇట్లు చెప్పెదము: ''మీకు బాగుగా తెలియును. అది ఈ టేపుమీద వున్నది. ఆ టేపు ఇక్కడున్నది''.

ఇంకా వెళ్ళవలసినది చాలా మనకున్నది, కాని, మనము అంతవరకే పొందాము. మీరు దానితో నిలచియుండుడి, మరియు తరువాత మిగిలిన దానిని పొందెదము. పుచ్చకాయ తినిన వ్యక్తి ఈలాగు చెప్పెను: ''అది చాలా బాగున్నది. కాని ఇంకా ఉన్నదా?'' ఆ విదంగానే ఇంకా చాలా రావలసియున్నది.

128

ప్రభువు మిమ్మును బహుగా దీవించును గాక! ఇప్పుడు మనకు బాప్తిస్మపు కార్యక్రమమున్నది, అవును కదా నెవిల్ సోదరుడా? (సహో. నెవిల్ ''అవును'' అని నేను విశ్వసించుచున్నాను అని చెప్పెను - సంపా.) ఇప్పుడు బాప్తిస్మము పొందుటకు ఎవరైనా వున్నారా? మీరెవరయినా గాని మీకు బాప్తిస్మము ఇచ్చుటకు ఇక్కడ మేమున్నాము. బాప్తిస్మము పొందవలసినవారు చేతులెత్తండి. ఇక్కడ ఒకామె యున్నది. ఇంకెవరు? స్త్రీ పురుషులకు ఇక్కడ బట్టలు మా దగ్గర ఉన్నవి.

129

''బాప్టిస్టు సంఘమును విడిచిపెట్టండి'' అని మేము చెప్పుట లేదు. ''మెథడిస్టు సంఘమును విడువండి'' అనుట లేదు. మీరు మీ సంఘములకు వెళ్ళండి. కాని లేఖన ప్రకారము ప్రభువగు యేసు నామములో -''యేసు'' మాత్రమే అను నామము కాదు - ''ప్రభువగు యేసుక్రీస్తు'' నామములో (అది లేఖనము) మీరు బాప్తిస్మము పొందనియెడల తప్పులో ఉన్నారు.

ఎవరినీ నేను బాదపరచగోరలేదు. నదియొద్దకు నేను వచ్చినప్పుడు అన్ని విషయములలో తేటగా ఉండగోరుచున్నాను. ఏలాగు ఉండవలెనో నాకు తెలిసినది చెప్పెదను. నేను విదేశములకు వెళ్ళు టిక్కెట్టును కలిగియున్నాను. మీరును అలాగే చేయుడని సలహా ఇచ్చుచున్నాను. తిరిగి మీ ఆలయములకు వెళ్ళండి. అది మీకు దేవునికి మద్యనున్నది. కాని, లేఖనములలో ''యేసుక్రీస్తు నామమున'' తప్ప మరి ఏ విదముగా బాప్తిస్మము పొందినవారు ఎవరూలేరు. మరియు బాప్తిస్మము పొందినవారు పరిశుద్ధ పౌలు ద్వారా ఈలాగు ఆజ్ఞాపించబడిరి. ''దేవదూత దిగివచ్చి మరియొక సువార్త ప్రకటించినా గాని శాపగ్రస్తుడగును. '' వారు వచ్చి మరల ''ప్రభువగు యేసు'' నామములో బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. అదియే సరి. అతడు అలాగు చేసెను. తాను చేసిన దానినే మనము చేయవలెనని చెప్పెను. దేవుని చిత్తమయితే మనము దానినే చేయుదము.

130

కాళ్ళు కడుగుటను మనము నమ్ముచున్నాము. ప్రభు రాత్రి భోజనమును మనము నమ్ముచున్నాము. క్రీస్తుయొక్క రెండవరాకడ మనము నమ్ముచున్నాము. - ఆత్మ రూపిగా వచ్చుట కాదు గాని అందరికి కనబడు రీతిలో, ప్రభువగు యేసు సశరీరుడుగా వచ్చును. మహిమలోనికి మరల వచ్చును. చనిపోయిన తరువాత భౌతిక పునరుత్థానము పొందుదురని మనము నమ్ముచున్నాము- మనము ముడతలు పడిన శరీరముతో, ముసలితనముతో సమాదిలోనికి వెళ్ళినట్లుగా కాదు. క్రొత్త శరీరము, నూతన యౌవ్వనముతో సదా జీవించెదము.

ఆత్మయొక్క అమర్త్యతను నిరాక్షేపముగా మనము నమ్ముచున్నాము. ఒకే ఒక విధమగు నిత్యజీవమున్నది అని నమ్ముచున్నాము. అది యేసుక్రీస్తు నుండి నీవు పొందు జీవము. కాబట్టి, నిత్య శిక్షను మనము నమ్ముట లేదు. మనము నరకమును నమ్ముచున్నాము - అగ్ని, గందకములు మండుచుండును - కాని అవి నిత్యమూ మండునని మనము నమ్ముట లేదు. నిత్యమూ మండుట వున్నచో అది నిత్య జీవమే అగును. ఒకే ఒక నిత్యజీవమున్నది. అది దేవునియొద్ద నండి వచ్చును. అది సత్యము. నీవు మిలియను సంవత్సరములు, పది మిలియనుల సంవత్సరములు కాలవచ్చును. అది నాకు తెలియదు. కాని అందులో నీకు నిత్యజీవముండదు. నిత్యమూ నీవు కాలవు. నీవు సదాకాలము కాలవచ్చును గాని నిత్యమూ కాదు, ''నిత్యత్వము'' మరియు ''సదాకాలము'' మద్యతేడా యున్నది. ''సదాకాలము'' అను దానికి ఒక పరిక్షి౦దియున్నది. (ఒక అనుసందానము) ఒక కాల పరిది లేక వ్యవది అని అర్థము. కాని ''నిత్యత్వము'' వేరు. నిత్య శిక్ష నీకు లేదు. నీకు నిత్యజీవమున్నది. ఎందుకనగా ఒకే ఒక రూపములో నిత్యజీవమున్నది. నిత్యజీవముకలవాడు నిత్యమూ దేవునితో జీవించును. కాని పాపము చేసిన ఆత్మ ఏమగును? (సంఘము ''మరణము'' అని చెప్పుచున్నది - సంపా.) చనిపోవును. అది నిత్యజీవము పొందదు. దానికి శిక్షయున్నది గాని నిత్యజీవము లేదు. కాబట్టి, చూడండి ఇంకా మీకు బోదించబడవలసినవి చాలా వున్నవి. వాటిని తరువాత చూద్దాం. ప్రభువు మిమ్మును దీవించును!

131

ఈ సహోదరి లోపలికి వెళ్ళుచుండగా, మనము ఆ మంచి పాత పాటను పాడుదము. ఇక్కడ వున్న ఈ స్త్రీ... రోసిల్లా, ఆమె నీ తల్లియా? (సహోదరి, రోసిల్లాగ్రిస్ఫిత్, ''అవును'' అని చెప్పినది -సంపా.) ఎందుకు? ఈ విదంగా చేయుట,నిన్ను చూచుటకు సంతోషముగా వున్నది. అది చాలా మంచిది.

మనకున్నచిన్న మంచి సహోదరీలలో రోసిల్లా గ్రిస్ఫిత్ ఒకరు. ఆమె త్రాగుబోతుగా వుండిన ఒక యువతి; ఇక్కడ వున్న మీలో కొందరికి ఇది ఆశ్చర్యముగా వుండును. ఆ విదముగా నేను చెప్పుటను రోసిల్లా పట్టించుకొనదు. ఇండియానాలో అక్కడికి వచ్చినప్పుడు, ఆమె ఒక దౌర్భాగ్యురాలు మరియు త్రాగుబోతులలో ఒకరు. చికాగోలో ఉన్న ఆ నలుగురు గొప్ప వైద్యులు ఆమె గురించి, ఒక సారాయి తప్ప మిగిలిన అన్నియు మానివేసినది అని చెప్పియున్నారు. కానీ ఒక రాత్రి కూటమునకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ ఆమెను బాగుచేసెను. ఆవిదముగా జరిగినది. ఆమె వైపు చూడండి, సుమారు ముప్పది సంవత్సరముల వయస్సు ఉండునని అనుకుంటున్నాను, పదునెనిమిది దాటిపోయినవి; మంచిదైన, అందమైన ఆ యువతి. అప్పటినుండి మరలా విస్కీ త్రాగలేదు, అటువంటి కోరికయు లేదు. క్రీస్తు కొరకు జీవించుచూ, వీదుల వెంట పోవుచూ, ప్రతిచోట పాపులకు, మద్య పానీయులకు, అందరికీ దేవునియొక్క మహిమను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది. దేవుని కొరకు కొంత చేయుచున్నది. ఆమె యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందియున్నది, మరియు ఆమె తల్లి అదే విదముగా ఇక్కడకు వచ్చియున్నది; దేవుడు ఆమెను స్వస్థపరచగలిగినచో యేసు ఆమెను స్వస్థపరచగలిగినచో.....

132

''వాక్యములో లేక వాక్యము కొరకు మీరు చేయు ఏదైననూ, '' దానినంతయు ఆ నామములో ..... అదియే బైబిలు చెప్పియున్నది. అది సరియే. ఇప్పుడు మనము బాప్తిస్మపు కార్యక్రమమును ప్రారంభించుచున్నాము. కొంతసేపు ఆ దీపములను వెలిగించండి, బాప్తిస్మము పొందుటకు, ఆ కార్యక్రమము కొరకు సిద్ధపడుదము. మరియు దేవునిలో మంచి సమయమును ఆశించుచున్నాము. నీవు ఈ రాత్రి బాప్తిస్మపు కార్యక్రమము చేయుచున్నావా? మంచిది, నీవు సిద్ధపడుట మంచిది. మరియు నేను ప్రారంభించుదును, మీరు అక్కడికి పోవుచుండగా నేను పాటలను పాడెదను. వారు చేయుచుండగా... (సహో. నెవిల్ ''అక్కడ వెనుక వస్త్రములు సిద్ధముగానున్నవా, డాక్?'' అని అడుగుచున్నాడు - సంపా.) బాప్తిస్మపు వస్త్రములు, డాక్, త్వరగా. మంచిది. మనము ఆ పాత మదురమైన పాటను పాడుదము ..... (సహో. బ్రన్హం, సంఘము పాడుటను నడిపించుచున్నాడు, మరియు సహో. నెవిల్ ఆ సహోదరికి బాప్తిస్మము ఇచ్చుచున్నారు - సంపా.) (టేపులో కొంత ఖాళీ వచ్చినది - సంపా.) మరియు మనము చేయువరకు, మనము వెళ్ళువరకు ఆ విదముగా చేయుదము?

యేసు నామమును మనతో తీసికొందము,

ఆయన పాదములయొద్ద పడెదము,

పరలోకపు రాజులకు రాజు, ఆయనకు కిరీటమిచ్చును.

మన ప్రయాణము పూర్తి అయినప్పుడు.

అంతా మంచిది, నీ పాదముల వరకూ!

యేసు నామమును నీతో తీసికొనుము,

దుఃఖము మరియు విపత్తు కలిగిన కుమారుడా;

అది నీకు సంతోషము, సౌకర్యమును ఇచ్చును.......

మనము ఏమి చేయవలెనో నేను మీకు చెప్పుదును. మీ కుడిప్రక్కకు తిరిగి అక్కడ ఉన్న వారితో కరచాలనము చేయుడి, ఈ విదంగా చెప్పుడి, ''సహోదరుడా, ఎలా ఉన్నావు? మీతో ఐక్యముగా ఉండుట నాకు చాలా ఆనందముగా వున్నది.''

అమూల్యమైన నామము, ఓ ఎంత మదురము!

భువియొక్క ఆశ మరియు దివియొక్క ఆనందము;

అమూల్యమైన నామము, అమూల్యమైన నామము, ఓ.......

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...