చరిత్రలో నుండి ఆయనను పైకి ఎత్తుట

చరిత్రలో నుండి ఆయనను పైకి ఎత్తుట

VGR COUNT-121 నెవిల్ సోదరుడా, వందనములు. స్నేహితులారా, శుభోదయము, ఇది నిజానికి ఒక… ఈ రాత్రి ఇక్కడ ఆలయము నొద్ద యుండి, ఐదు రాత్రులు వరుసగా కూటములను ప్రారంభించుట ఒక గొప్ప ఆధిక్యతగా నేను భావించుచున్నాను. ఆలయమునొద్ద నేను ఉజ్జీవ కూటములను కలిగియుండి, ఇప్పటికి చాలా కాలమైనది. మనము వార్తాపత్రికలోగాని లేక మరే విధముగా దానిని ఎన్నడూ మనము ప్రకటించియుండలేదు. ప్రజలు కూర్చొండుటకు చాలినంత స్థలము ఇక్కడ లేదని మనకు తెలుసు, ఏలయనగా ఈ ఆలయము చిన్నది, మరియు కూర్చొనే సీట్లు చాలా తక్కువ. అయితే వారందరిని కూర్చొండబెట్టుటకు మనము చేయగలిగినదంతయూ చేద్దాము.

2

ఇక్కడ హైస్కూలు (జిమ్)ను మనము పొందబోవుచున్నాము, అప్పుడు మనము దానిని ప్రకటించవచ్చును, అయితే ఇప్పుడు అక్కడ పాఠశాల నడుచుచున్నది, ఒక విధముగా దానిని పొందుట ఇప్పుడు కష్టము. నేను త్వరలో బహుశ, సముద్రములను దాటి, దేవుని సువార్త పొలములలోనికి వెళ్ళుచున్నాను. మేము తిరిగి అక్కడకు వెళ్ళక మునుపు మీ అందరితో ఒక చిన్నసహవాసమును ఏకముగా కలిగియుండ గోరుచున్నాము. మీకు తెలుసా, మనము ప్రతిసారి కలుసుకొంటూయున్నాము, అయితే చివరగా ఒకే ఒకసారి మనము కలుసుకొనబోవుచున్నాము. కాబట్టి మనము-వాక్యము దానికై అది దినదినము, ప్రతి దినము విప్పబడుచుండగా మరియు మనము వాక్యమును చూచుచుండగా వాక్యముతో మరియు మనము వాక్యమును చూచుచుండగా వాక్యముతో మరియు మనము ప్రభువుతో మనము రాగల్గినంత దగ్గరగా తిన్నగా ఆయనను సమీపిద్దాము. ఒక చిన్న కూటమును మనము ఇక్కడ కలిగి యున్నట్లైతే బాగుంటుంది, మరియు అప్పుడు మనము రోగుల కొరకు ప్రార్ధన చేద్దాము.

3

బహుశా కొన్ని సంవత్సరముల క్రితం, బహుశా ఇంకొంచెం ఎక్కువ కాలం కావచ్చు, ప్రభువు ఒక దర్శనమును నాకిచ్చి దాని ద్వారా అది నాకిలా చెప్పబడియున్నది. నా పరిచర్య మార్పుచెందుటను గూర్చి నేనొక పుస్తకంలో ఇంటి యొద్ద దానిని వ్రాసియున్నాను. మీలో అనేక మంది ఇక్కడ కూర్చొనియున్నారు...నేను ఎక్కువ విషయములను చెప్పను. అయితే గుర్తుంచుకోండి మొదటిగా ఆలయము నిర్మించబడినపుడు, మీకు గుర్తున్నదా మనము ఆ మూలరాయిని అక్కడ వేసినపుడు ఆయన ఇలా చెప్పియున్నాడు, “ఇది నీ ఆలయయు కాదు”. అయితే ఆయన ఆకాశము క్రిందకూర్చుని సంభవించబోవు అనేకమైన కార్యములను గూర్చి నాతో చెప్పియున్నాడు.

మీరు ఎరిగియున్నట్లైతే అది చెప్పబడిన రీతిగానే ఖచ్చితంగా నెరవేరి యుండుటను మీరు గమనిస్తారు. చూడండి? అది ఎల్లప్పుడు ఆ రీతిగానే ఉండియున్నది. కాబట్టి, అందుచేత, ఆయన ఏది చెప్పినా అది దేవుడై యున్నాడు, అది తప్పక సత్యముగా యుంటుంది, దాని మీద నిశ్చయముగా నేను విశ్రమిస్తాను.

4

తరువాత కొద్దికాలం క్రితం నేను దర్శనంలో ఉండియున్నాను మరియు నేనొక పెద్ద గుడారమును చూసియున్నాను. ఓ, అది గంభీరమై యున్నది పెద్ద కార్యము. నేను మాట్లాడియుండగా అనేకమైన ఆత్మలు వేదిక మీదికి వచ్చియున్నవి, మరియు వారు వారి చేతులను పైకెత్తి మెల్లగా నిశ్శబ్దంగా ఒక విధంగా వారు ఏడ్చుచున్నారు. అప్పుడు ఒక చక్కని మృదువుగా మాట్లాడు ఒక మనిషి వేదిక నొద్దకు వచ్చి ఇలా అన్నాడు, “ఇప్పుడు బ్రదర్ బ్రెన్హాం సిద్ధపడుచూయుండగా మనం ప్రార్ధనా వరుసను ఏర్పరచుదాము”. నేనలా నిలబడియున్నాను. ప్రార్ధనా వరుస నా ఎడమ వైపుగా యున్నది. అప్పుడు ఆ వరుసలో నిలబడియున్న జన సమూహములను నేను గమనించగా వారు పట్టణంలోని ఒక భాగము సమూహము లేక అంతకంటే ఎక్కువగా వారు ఉన్నారు.

5

అక్కడ ఆ గుడారంలో ఒక చిన్న చెక్క కట్టడం ఉన్నది. అక్కడ ఒక స్త్రీ మరియు ఒక పురుషుడు అక్కడ నిలబడి వారి పేర్లను తీసుకొనుచున్నారు. మరియు ప్రజలు పడక మంచముల మీద మరియు చేతికర్రల మీద లోనికి వెళుతూ మరొక వైపు గుండా చక్కగా నడుచుకుంటూ వచ్చుచున్నారు. సరే, అక్కడ ఏమి జరిగినదో నాకు ఆశ్చర్యం కలిగినది. అప్పుడు ఇక్కడ మీరు చూచుచున్న ప్రభువు యొక్క దూత నా నుండి వెళ్ళి తిన్నగా ఆ చిన్నకట్టడం లోనికి వెళ్ళినది. మరియు అక్కడ నిలబడిన తరువాత క్రిందికి వెళ్ళినది ఒక స్వరం ఇలా మాట్లాడి చెప్పినది, “ఆ చిన్న స్థలములో నేను నిన్ను కలుసుకుంటాను. సరే, ఇప్పుడు ఆ సమయం కొరకు నేనెదురు చూసియున్నాను.

అధికమైన పనిని బట్టి కొద్ది సమయం నేను విశ్రమించుచున్నాను. నాకు సెలవున్నది. నేను తిరిగివస్తాను. గతవారం చివరిలో మూడు రాత్రులు సంఘ సిద్ధాంతం గూర్చి మేము ఒక చిన్న సమయమును కల్గియున్నాము. అది గత శనివారం రాత్రి, ఆదివారం ఉదయం, మరియు ఆదివారం రాత్రి, ఈ కూటమునకు ముందు ఒక విధముగా సంఘము అది ఉన్న స్థితి నుండి కదిలించబడినది. కాబట్టి ఆ రీతిగా ఈ కూటముతో మేము ముందుకు వెళ్ళి ఇపుడు పైకి వచ్చుచున్నాము. మరియు తర్వాత వెనువెంటనే ఆదివారం రాత్రి నేను ఆలయమునకు నేనెరిగియున్నంత వరకు ఒక వీడ్కోలు చెప్పే రాత్రి.

6

మరియు ఇప్పుడు, ఈ వారంలో ఏదో ఒక సమయంలో ఇక్కడ ఉన్న ఒక చిన్న గదిని ఒక ప్రార్థనా గదిగా నేను వాడుకొనవలెనని నేను నిరీక్షిస్తున్నాను. రోగులను మరియు బోధించబడుచున్నవారిని లోనికి తీసుకుని, మరియు ఆయన నన్నక్కడ కలుసుకుంటాడేమో చూస్తాను, మరియు క్రొత్త పరిచర్యలోకి తిరిగి ఆలయము నొద్ద ప్రారంభిస్తాను. అది జరుగుటను నేను నిశ్చయంగా చూడగోరుచున్నాను. స్నేహితులారా, అదేమై యున్నదో నాకు తెలియదు. అది ఎలా ఉంటుందో కూడా నేనూహించలేను. అయితే ఇప్పుడు ఆయన దానిని వినుచున్నాడు, అది కొంత ఆయన దీనరోగులై బాధపడుచున్న ఆయన పిల్లలకు అది ఇంకా కొంచెం ఎక్కువగా సహాయపడుతుందని నా నమ్మకం. ఆయన నాకిదివరకు అనుగ్రహించిన ఇతర వరములతో నేనున్న దానికంటే నేను మరిఎక్కువ నమ్మకంగా యదార్థంగా ఉందునని నేను ఆయనకు వాగ్దానం చేస్తాను. మరియు అది సంభవించినట్లైతే, మిగిలిన వరములు ఎలా యదార్ధంగా ఉన్నవో అదియు సరిగ్గా అంత యదార్థంగా ఉంటాయి.

ఇతర వరములు ఇంకను అవి సరిగ్గా ఉండి యున్నంత నిశ్చలంగా యున్నవి. చూడండి? అయితే ఒక నూతన మైనదేదో సంభవించుటకు నేను ఎదురుచూచుచున్నాను, మరియు అది ఇక్కడ జరుగుతుందని నా నిరీక్షణ.

7

ఇప్పుడు నేననుకుంటాను బహుశా రాత్రికి మనము దానిని మాట్లాడి అది ఎలా ఉంటుందో చూద్దాము. మరొక కార్యమును నేను చేయగోరుచున్నాను మనము మొదటిసారిగా వెళ్ళినపుడు నేను దానిని కనుగొనుటకు ప్రయత్నించాలని కోరుచున్నాను. అది ఆ రీతిగా ఉంటుందేమో చూచుటకు నేను నా భార్యను అక్కడ లోనికి పంపి మరియు అది వచ్చినపుడు ఆమెను నాతో ఉండనివ్వండి. లేకపోతే అప్పుడు, స్త్రీలను ఒకేసారి ఇద్దరేసి చొప్పున ఒకేసారి ఇద్దరు స్త్రీలు లోనికి రావచ్చును. కాబట్టి ఇది పని చేస్తుందని నేను చెప్పుటలేదు, కాబట్టి మీకు తెలుసు, కారణము ఏదో క్రొత్తది సంభవించుట కొరకు మనము ఎదురుచూచుచున్నామని ఇది వరకే చెప్పబడినది. మరియు మనము ఎదురుచూచుచున్నాము.

అయితే ఇప్పుడు అది సంభవిస్తుందని నాతో చెప్పలేదు, అయితే దర్శనంలో అది ఒక గుడారములో నేను దానిని చూసియున్నాను. అయితే అది ఎక్కడైనా ఏ సమయంలోనైనా జరగుతుంది. అయితే మనం దానికొరకు ఎదురుచూస్తున్నాము.

8

మిమ్మలను పెందలకడ పంపించుటకు మేము ప్రయత్నించబోవు చున్నాము. పాటల పరిచర్య ఒక అర్థగంట, తరువాత బోధించు పరిచర్య అటు తర్వాత వేదిక పిలుపు మరియు ఆ విధంగా దరిదాపు ఒక గంట, ఆది ఒక గంటన్నర పడుతుంది, ఆవిధంగా నిలబడే ప్రజలకు కాళ్ళు నొప్పిగా ఉండకుండా ఉంటుంది, మరల తిరిగి రేపు రాత్రికి రావచ్చు.

ఇప్పుడు ధన్యమైన ఈ ప్రాచీన వాక్యమును మనము తెరువకముందు, దానిలో ఉన్నది తప్ప దానికి బయట ఉన్నది ఏదియు ఎన్నడూ చెప్పమని మేము మీకు వాగ్దానం చేయుచున్నాము, ఏలయనగా అది వాక్యము పునాదియై యున్నది. అది చేయుటకు ముందు ఒక్క క్షణము ప్రార్థన కొరకు మనం తలలను వంచుదాము.

9

ప్రియమైన దేవా, నీ సన్నిధిలో ఈ రాత్రి మేము నిలబడియుండగా మేము కేవలం నేల యొక్క ధూళియై యున్నామని పెళుసైన విరిగిపోవు వారమని మేము గ్రహించుచున్నాము. నిన్ను గౌరవించుటకు, నిన్నుమహిమ పరచుటకు మమ్మును ముందుకు తెచ్చియున్నావు. మా జీవితములు మరియు మా గమ్యము నీ ధన్యమైన చేతులలో ఉంచబడియున్నవని మేము గ్రహిస్తాము. ఒక శ్రేష్టమైన దేశంలో నీతో శాశ్వతంగా జీవించుటకు మాకొక నిత్యమైన గమ్యం ఇయ్యబడియున్నదని విశ్వాసం ద్వారా నీ చేతులలోనికి మమ్మలను మేము అప్పగించుకొనుచున్నాము. అక్కడ మేము రోగుల కొరకు మరియు అవసరతలోయున్నవారి కొరకు ఎన్నడూ ప్రార్ధన చేయవలసిన పనిలేదు. అక్కడ ఎన్నడు చెంపమీద ఒక కన్నీటి చుక్క కారదు. అక్కడు ఎన్నడూ ఒక బలహీనమైన వ్యక్తి, ముడతలు పడిన శరీరం గల్గినవ్యక్తి ఎన్నడూ ఉండడు. అయితే మేము శాశ్వతంగా యవ్వనస్థులుగా మేమక్కడ ఉంటాము. మరియు దేవుని యొక్క మహిమ మా మీద వుంటుంది. మనకు కారణము మనం శాశ్వతంగా ఎన్నటికీ స్వస్థత నొందియున్నాము. ఇప్పుడు ఈ జీవి అనగా మనం ఆయన యొక్క స్వంత మహిమపర్చబడిన శరీరంగా మనమును మార్పుచెందుతాము, అప్పుడు ఆయన ఉన్నరీతిగానే మనమాయనను చూస్తాము. మాలో ప్రతి ఒక్కరికీ ఆ ధన్యమైన ఘడియ వచ్చువరకు మా యొక్క ప్రతీ ప్రయాసను నీ గొప్ప నామము ఘనపరచబడుటకు నీవు మాకు ఇచ్చియున్న విశ్వాసం ప్రకారం మేము యెరిగియున్న ప్రతీ ప్రయత్నం చేస్తాము.

10

ఇక్కడ మనం కల్గియున్న ఈ మొదటి ఉజ్జీవమునకు జ్ఞాపకముగా ఇది ఇక్కడ మన చిన్న కూడికను ఒక శుభమైన ఒక చిన్న జ్ఞాపకంగా ఉన్నది. నీ శక్తి గల హస్తం ద్వారా నీవు చేసిన బలమైన కార్యములను మాకు చూపుము. ఇక్కడ నుండి ప్రతీ దేశమును తుడిచిపెట్టు ఉజ్జీవం ముందుకు వెళ్ళును గాక. మరియు ప్రపంచమంతట ఈ రాత్రి కొండల మీద ఉజ్జీవ జ్వాలలు మండుచున్నవి. మరియు స్త్రీలు పురుషులు వారి వ్యాధుల నుండి మరియు రోగముల నుండి స్వస్థత నొందియున్నారు, మరియు నిజమైన సజీవుడైన దేవునితో వారు పరిచయమునకు వచ్చియున్నారు. ఓ, ప్రభువైన దేవా ఈ రాత్రి మీ ఆత్మను మాపై కుమ్మరించుము, ప్రభువా గొప్ప మోతాడులో కుమ్మరించుము.

ప్రభువా అది నీకు బాగా ఇష్టమైన యెడల, అది నీదైవిక ప్రణాళికలో యున్నట్లైతే, ఓ దేవా మేము నిన్ను అడుగుచున్నాము, ఇక్కడ పొలముల నుండి ప్రార్ధనలో నిలచియున్న ప్రార్ధనా యోధులను బట్టి మొదటిసారిగా వారు చూడగలుగునట్లు ఈ క్రొత్త వరము పనిచేయుట ఆరంభింపనిమ్ము, ఆ గొప్ప యెహోవా యొక్క హస్తము ఒక క్రొత్త విధానములో కదులును గాక. (ప్రభువా దానిని దయచేయుము), మరియు ఆ ఫలములలో మమ్ములను పాలుపొందనిమ్మ,

11

అది అనుగ్రహింపబడవలెనని కేవలం దీనంగా అడుగుచున్నాము, అది ఎక్కడో ఉండియున్నదని మేమెరిగి యున్నాము. కారణము అది చేయుట నీ గొప్ప సిద్ధపాటులో యున్నదని మేము భావించుచున్నాము. ప్రభువా మేము ఈ గ్రంధము యొక్క నీ ధన్యమైన పరిశుద్ధమైన పేజీలు త్రిప్పచుండగా మమ్ములను దీవించుము. ప్రభువా, మా ఆత్మలు దానిని స్వీకరించునట్లు తెరవబడునుగాక. మరియు ఈ రాత్రి కూటము ముగించబడిన తర్వాత మేము మా గృహములకు వెళ్ళబోవుచున్నాము, అప్పుడు మేమును ఆ ఎమ్మాయు గ్రామం నుండి వచ్చినవారివలె, “ఈ రాత్రి మార్గంలో ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయములు మండలేదా అని మేమును చెప్పదుము గాక” ఏలయనగా ఆయన మహిమ కొరకు ఆయన నామంలో అడుగుచున్నాము. ఆమేన్.

12

ఈ రాత్రి లేఖనం యొక్క పఠనం కొరకు నేను కొన్ని వచనములను ఎన్నుకుని యున్నాను, మీరు దాని వైపు తిరగగోరినట్లైతే, అది 1 రాజులు గ్రంధం 18వ అధ్యాయం, 1 రాజులు, 17వ వచనం నుండి నేను చదువగోరుచున్నాను. ఒక అంశం కొరకు నేను తీసుకొనునది ఏమనగా “చరిత్రలోనుండి ఆయనను పైకెత్తుట.” ఇప్పుడు దాన్ని వ్రాసుకొనుచున్న మీ కొరకు దాన్ని మరల చెప్పుచున్నాము; “చరిత్రలో నుండి ఆయనను పైకెత్తుట.” ఇప్పుడు 17 మరియు 18 వచనములు, 1 రాజులు.

ఆహాబు ఏలియాను చూచి ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవేకావా యని అతనితో అనగా

అతడు-నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవత ననుసరించు నీవును, నీ తండ్రి యింటివారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టు వారై యున్నారు.

అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరిని, యెజెబెలు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తలు నాలుగు వందల ఏబదిమందిని, అషేరాదేవి ప్రవక్తలైన నాలుగువందల మందిని నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను.

ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి, ప్రవక్తలను కర్మెలు పర్వతమునకు సమకూర్చెను.

ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి యెన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాని ననుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి.

13

ఈ రాత్రి ఇక్కడ ఈ అంచు మీద నిలబడియుండగా రెండు గొప్ప దృశ్యములు నెరవేరుటను నేను గమనించుచున్నాను మరియు ఇవే ఆ రెండు గొప్ప దృశ్యములు వాటిలో ఒకటి చరిత్ర ముగించబడుట మరియు మరొకటి కాలము అంతమగుట.

యుగములన్నిటిగుండా అనేక గొప్ప మనుష్యులలో ఇప్పుడు మనము సమీపించబోవుచున్న ఈ ఘడియను చూచుటకు ఎదురు చూచిరి. మరియు మర్త్యమైన సూర్యుడు అస్తమించబడుట మరియు శాశ్వతమైన వెలుగు బ్రద్దలయ్యే ఈ గొప్ప మహిమకరమైన సమయంలో మనము జీవించుచున్నాము. ఎన్నడైనా మనుష్యులు జీవించుటకు అనుమతించబడిన యుగములలోనే అతిగొప్ప యుగములో మనము జీవిస్తున్నామని నేను భావిస్తున్నాను, కారణము ఇది సమయము సమాప్తమై అది నిత్యత్వము లోనికి మిళితమవుతుంది. ఏమి సంభవించియున్నదో, మనము ఏమి చదివియున్నామో కేవలం చరిత్ర మనకు చెప్పచున్నవి. అయితే భవిష్యత్తులో ఏమి ఉంచబడియున్నదో అది దేవుని చేతిలో యున్నది.

ఈ దినమున మనం కనుగొనునదేమనగా అక్కడ అతి ఎక్కువ చరిత్ర వ్రాయబడి యుండలేదు, కారణము అది ఎన్నడూ వాడబడలేదని నేను భావిస్తాను. ఈ రెండు గొప్ప సంఘటనలు పైపైన ఉన్న లోతులేని నీళ్ళ లోనికి పరుగెత్తుచున్నవి. ఉదాహరణకు..దేశంలోని సంక్షోభాన్ని మనము ఎలా నడిపించబోవుచున్నాము మరియు దేశీయ భద్రత పైపైన ఉన్న నీళ్ళ లోనికి పరుగెత్తుచున్నది.

14

నేను ప్రపంచమంతా పర్యటించి యున్నందున, కేవలం మన దేశం మాత్రమే కాదు. అయితే ప్రతీ దేశము వారు ఏమి చేయాలో వారికి అర్థమగుట లేదు. ప్రతీచోట ఒక సొరంగం ఉన్నట్లుగా కనబడుచున్నది.

నేను ఆఫ్రికా దేశంలోకి వెళ్ళినపుడు ప్రజల మధ్యలో ఒక భయము లేచుటను వారు చూచుచున్నారు, మరియు కమ్యూనిజమే ప్రపంచమును తుడిచి పెట్టుచున్నది. నేను స్విట్జర్లాండ్ దేశములోనికి వెళ్ళినపుడు అది కూడా అదే రీతిగా యున్నది. నేను దర్శించిన ఇతర దేశములన్నిటిలో ప్రతీ చోట పరిష్కారం కాని శాంతి సమాధానము లేని పరిస్థితులున్నవి.

15

మీకు తెలుసా అలాటి ఒక సమయం వస్తుందని ప్రభువు ముందే చెప్పియున్నారు, “జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము భయభ్రాంతులతో కూడిన కాలము”. మానవ పరిధిలో మనకు సాధ్యమైన ప్రతీదానిని, మరి అది మరి ఎక్కువ దీర్ఘముగా ఉండుటకు మనము సమస్తము ప్రయత్నించునట్లుగా కనబడుచున్నది. అయితే మన పని ముగిసిపోయినదని నేను నమ్ముచున్నాను. మనము దానిని గూర్చి ఏదైనా చేయగలమని నేను నమ్ముట లేదు. మనము దాని యొక్క అంతములో ఉన్నాము.

కొద్దికాలము, రాజులను కలిగి యుండుటకు మనము ప్రయత్నించాము. వారు పని చేయలేకపోయిరి. తర్వాత వారు ప్రజాస్వామ్యం ద్వారా ప్రయత్నించారు, అది కూడా పని చేయలేదు. మనము అన్నిటిని ప్రయత్నించాము. వారు నియంతల ద్వారా ప్రయత్నించారు మరియు అది కూడా పని చేయలేదు, ప్రతీసారి ప్రతీ ఒక్కరు కొంచెం లోతులేని వారిగా కనబడినది.

ఇప్పుడు ఏదైనను సంభవించబోయే ఒక గొప్ప తరుణంలో మనము నిలబడియున్నాము. అది ఐదు నిముషములలో అంతా సమాప్తమై పోతుంది, ప్రతీ దేశం బూడిదగా మారిపోతుంది. మనము అంతములో ఉన్నాము, సంఘము తప్పక ఎక్కడ ఉండవలసియున్నది? ఒక గొప్ప సంక్షోభంలో సంఘము ఉన్నది!

16

తరువాత ఇంకా కుటుంబములలో మనము సంక్షోభములను కలిగియున్నాము. కుటుంబ జీవితము లోతులేని నీళ్ళవలె పరుగెడుతున్నట్లుగా కనబడుచున్నది. ఒక కుటుంబంలో ఇంటి యజమానియైన తండ్రి సమక్షంలో కుటుంబీకులందరు ఉదయమున కూర్చుండియున్నప్పుడు తండ్రి ఆ కుటుంబంతో మాట్లాడతాడు. మరియు వారు ఆ కుటుంబంలోని ఆ పాత కుటుంబ బైబిల్ తీసుకుని వారు దానిని కొంచెం చదివి, బల్లచుట్టూ చేరి ప్రార్ధనచేస్తారు. దానినిపుడు మీరెంత మాత్రమూ చూడలేరు. మరియు ఆ దినం ముగించబడినపుడు తల్లి ఇంటిలో పాత్రలన్నియు శుభ్రం చేసి యున్నది, మరియు వారు రాత్రికి పరుండక ముందు వారందరు ప్రోగై మరల కొంచెం బైబిల్ చదువుతారు.

నిశ్చయంగా ఆ దినాలలో మనము నేరములను కనుగొనుట చాలా కష్టము. బాలురందరు పొలములలోనికి పనికి వెళతారు మరియు ఇంటిలోని ఆడపిల్లలు ఆ సెలయేరు నొద్ద బట్టలు ఉతుకుచూ తల్లికి సహాయపడతారు. అయితే ఈ దినమున ఒక చిన్న బటన్ నొక్కగానే మన పాత్రలన్నియు కడిగివేయబడుచున్నవి. మరియు తల్లులు కారులో బయటకు వెళ్ళి పేకాట ఆడుచూ, వీధులలో ఎగిరి గంతులు వేయుచూ ఉన్నారు. మరియు పని అంతయు ట్రాక్టర్ల ద్వారా జరుగుచున్నది. తద్వారా మన మధ్య బద్దకముగా సోమరి తనములో ఉన్న గుంపు తప్ప మరెవరూ లేరు. కుటుంబ జీవితము నిర్లక్ష్యం చేయబడినది. అది ఎంతవరకన గా బైబిల్ ఒక ప్రక్కకు నెట్టివేయబడినది, అమెరికాలోని అనేకమైన గృహాలలో బైబిల్ ను వెదుకుటకు ఒక గంట పట్టుచున్నది.

17

ఆదివారం ఉదయమున ఇరవై నిముషములపాటు వారి మత నిర్వహణకు వారు సంఘమునకు వెళతారు. ఒక వేళ సంఘకాపరి ముప్పై నిముషముల సమయం తీసుకున్నట్లైతే, (సంఘ పెద్దల బోర్డు ఆయనను నిలదీసి అడుగుతారు- తర్జుమాదారుడు). అది ఏమిటి కుటుంబ జీవితం ముగిసిపోయినది.

ఇదివరకు తల్లి మరియు తండ్రి ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకుని మరియు ఒకరినొకరు ఆప్యాయతగా యుండేవారు. మరియు ఆమె వెంట్రుకలు తెల్లబడినపుడు ఆమె యొక్క దీన వృద్దముఖము ముడతలు పడి పీక్కుపోయినపుడు మరియు ఆమె కళ్ళజోడు ముక్కు మీదకి వ్రేలాడుచుండగా ఆమె యవ్వన ప్రాయంలో అందంగా ఉన్నప్పుడు తండ్రి ఆమెను ఎలా ప్రేమించే వాడో ఇపుడును అలాగే ప్రేమించేవాడు.

అయితే ఈ దినమున క్లిష్టముగా వుండాలని నా భావము కాదు, అయితే ఆమె కొంచెము వృద్ధురాలు కాగానే, క్రొత్త మోడల్ కొరకు అతడు ఆమెను తిన్నగా మార్చివేస్తాడు. అది ఆ మార్గములో యున్నది, కారులను మార్చి వేసినట్లుగానే అది కనబడుచున్నది. నిజమైన కుటుంబ ప్రేమ వారి మధ్య ఎక్కువ ఏమాత్రము లేనట్లుగా అది కనబడుచున్నది. ఏదో సరిగ్గా సంభవించియున్నది, కుంటుంబ జీవితము హరించుకొని పోవుచున్నది. ఇది వరకు మనము కలిగియున్నట్లుగా ఆ పాతకాలపు అమెరికా గృహమును మనము కలిగిలేము, చాలా కాలము క్రితము మనము కలిగియున్నట్లుగా.

ఇక్కడ మరొక విషయమును నేను మీకు చెప్పగోరుచున్నాను, అదేమనగా మరొక కార్యము తరిగిపోవుచున్నది, స్నేహము తరిగిపోవుచున్నది. ఇది వరకు మనము స్నేహితులను కలిగియున్నట్లుగా ఇప్పుడు అది కనబడుటలేదు. ఇది వరకు మనము నమ్మకమైన స్నేహితులను కలిగి యున్నట్లుగా, ఇప్పుడు స్నేహితులు కనబడుటలేదు. అది అలాగే యున్నది, నేను గుర్తుంచుకోగలను, మన పొరుగునయున్న వారికి ఎవరికైనా జబ్బు చేసినపుడు, ప్రతి ఒక్కరూ అక్కడకు వచ్చి చుట్టూ చేరి వారికి చేయగలిగినంత సేవ చేసి, ఏదైనా చేయుటకు తమ హస్తములను చాచిరి. రాత్రంతయు వారితోనే కూర్చొనియుండిరి. నేను తరచుగా చెప్పియున్నట్లుగా, అది సత్యమై యున్నది. దానిని చివరకు మనము వార్తాపత్రికలో దానిని చూచు వరకు కనీసము మన పొరుగువాడు చనిపోయినాడని మనకు తెలియదు, స్నేహము!

18

తండ్రి ఇంటి తాళమును ఒక దానిని కలిగియుంటాడు, మరియు తల్లి ఒక ఇంటి తాళము కలిగియుంటుంది. మరియు వారిద్దరు అర్ధరాత్రి వరకు, బయటకు వెళ్ళిపోతారు. మరియు వారు ఎక్కడ యున్నారో పిల్లలకు తెలియదు, చిన్నపిల్లలు పిల్లలను ఆడించేవారి యొద్ద ఉంటారు. ఇప్పుడు ఆ విధముగా జీవితమును జీవించుచున్నారు.

బైబిలు ఈ విషయములన్నిటిని ముందే చెప్పియున్నదని మీకు తెలుసా? అలాగైతే ఇప్పుడు అది ఏమిటి? అది ఏమనగా, అవి హరించుకొనిపోవుటను మనము నిలబడి చూచుచున్నాము.

19

సంఘ జీవితాన్ని మనము తీసుకొందాము. అక్కడే అవన్నియా ప్రారంభమైయున్నవి. సంఘ జీవితము హరించుకొనిపోవుచున్నది. ఈ దినమున ప్రజలు సంఘమును కేవలము ఒక విగ్రహముగా, ఒక చిత్రముగా తీసుకొనుచున్నారు. సంఘము లోనికి వెళ్ళి ఐదు నిమిషములు కూర్చొనుచున్నారు, మరియు “నామత విధిని నేను నెరవేర్చియున్నాను”, అని చెప్పుచున్నారు. అది ఏమైయున్ననూ పాష్టరుకు జీతమివ్వటానికి, ఒక చిన్న కానుకను లోన వేయుచున్నారు. వారు దానిని తయారు చేయవలసిన పనిలేదు, వారు ఒక చిన్నరాత్రి విందును చేసి, ఆ డబ్బు ద్వారా సంఘకాపరికి జీతమును చెల్లించుచున్నారు. అతడు, ఆ డబ్బుతో తృప్తిపడకపోతే, అతడు మంచి జీతము దొరికే మరొక మంచి స్థలానికి పరిగెత్తుకొని పోతాడు. సంఘకాపరి ఎంత మాత్రము దైవికముగా పిలువబడినవాడుగా కనబడుటలేదు, అది అతనికి ఒక భోజనము టికెట్టువలె కనబడుచున్నది. ఎక్కువ డబ్బు ఎక్కడ సంఘకాపరికి వారు ఇవ్వజూపితే, అక్కడకు కాపరి వెళ్ళిపోతాడు. అది తప్పక ఆ విధముగా యుండరాదు.

ఏలీయా చేసినట్లుగా ఆ కొండ మీద అతడు యుండవలసి యునట్లైతే, కెరీతు వాగునొద్ద అతడు యుండవలసియున్నట్లుగా, కాకులు అతనికి ఆహారము తెచ్చునట్లుగా, అతని యొక్క దైవిక పని పూర్తిఅగు వరకు, అతడు తప్పక అక్కడ నిలిచి యుండవలసియున్నది. అతనికి ఒక కాణి వచ్చిన లేకపోయినా లెక్కకాదు, మొదటిగా తప్పక అది దేవుని పిలుపై యుండాలి.

అయితే ఇప్పుడు అది ఎలా మారిపోయినదనగా, డబ్బు పిలుపు కొరకుగా, ఒక ఉన్నతమైన స్థానమును, ఒక విధముగా పొందుట కొరకు, లేక ఎక్కువ పేరు ప్రఖ్యాతులుగల ఒక పెద్ద సంఘముగా, అలా మరేదోగా ఉండుటకు, ఇప్పుడు అది మారిపోయినది. తరువాత సంఘము, అక్కడ వారిని క్రిందికి పోనిచ్చుచున్నది. వారు బయటకు పరుగెత్తుటకు ఆరంభించారు. అది విప్పబడుటను చూడండి.

20

నేను ఇంకనూ యాభై సంవత్సరముల క్రిందే యున్నాను. బాప్టిష్టు సంఘములలోనికి, మెథడిష్టు సంఘములలోనికి నేను వెళ్ళినపుడు అది నాకు గుర్తున్నది, వారి మధ్యపాతకాలపు ఉజ్జీవమును చూచుట నాకు గుర్తున్నది,వారు అక్కడ కేకలు వేసి ప్రభువుకు స్తుతులు చెల్లించుట, మార్గములలో పైకి క్రిందికి ఎగురుట, వేదిక నొద్దకు పాపులను రమ్మని ఒప్పించుట నాకు గుర్తున్నది, ఇప్పుడు అది ఎంత మాత్రమును ఎక్కడను కనబడుటలేదు. ఆ ఉజ్జీవ కాలములో వారు పాతకాలపు ప్రార్ధనా కూటములను జరిగించే వారు, ఆ పొరుగున ఉన్న ఒక పాపి, ఒక బాలుడు లేక ఒక బాలిక, ఆ పిల్లలు ఒప్పించబడి, వారు క్రీస్తునొద్దకు, వేదికనొద్దకు దారిచేసుకొని వచ్చు వరకు ఆ వృద్ధ తల్లులు, తండ్రులు వారి కొరకు ఎంతో తీవ్రముగా ప్రార్ధన చేసేవారు. అయితే అది ఎంత మాత్రమును నీవు ఇప్పుడు చూడలేవు. అది లోతులులేని నీళ్ళలో పరిగెత్తుచున్నట్లుగా కనబడుచున్నది. అది ఆ మార్గములలో తప్పక యుండియున్నట్లుగా, ఇప్పుడు కనబడుటలేదు.

అనేక సంవత్సరముల క్రితము అప్పుడు, దరిదాపుగా అన్ని సంఘములు కలిపి ఒక సంఘములో ఉజ్జీవమును కలిగియుండేవి, మిగిలిన సంఘముల వారందరూ వారితో సహకరించేవారు, వారు వారి సంఘములను మూసివేసి, వారి సభ్యులను కూటములకు పంపి, లోనికి వచ్చి వారికి సహాయపడేవారు, మరియు వారు ఒక ఉజ్జీవమును కలిగియుండేవారు. మీరు ఇపుడు దానిని ఎంత మాత్రమును చూడలేరు. ఇప్పుడు ఏమి సంభవించియున్నది? మరియు దీనిని గూర్చి మీరు ఏమి చేయబోవుచున్నారు? సజీవ దేవుని యొక్క వాక్యమును అది సరిగ్గా నెరవేర్చుచున్నది.

21

అది రెండు స్థంభములను చూపుచున్నది, వాటిలో ఒకటి, కాలము సమాప్తమగుట, మరియు మరొక సంగతి, ప్రభువైన యేసు యొక్క రాకడ. కారణము నిశ్చయముగా పరిశుద్ధాత్ముడు మాట్లాడి దానిని చెప్పియున్నాడు, “అంత్యదినములలో సంఘములు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటె సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారుగా యుంటారు”. సంగతులు ఆ రీతిగా యుంటాయని బైబిలు ముందే చెప్పిన యెడల, అది సంభవించుట తప్ప, ఇంకా ఏదైనా సంభవించుటకు మనము ఎలా ఎదురు చూడగలము? “పైకి భక్తిగలవారుగా నుండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా యుందురు”.

మన దేశముగుండా వెళ్ళండి, మన దేశములు, మరియు నమ్ము విశ్వాసులను మీ చిన్నగుప్పెడు నిండా దొరుకుతారు, నా భావము నిజమైన విశ్వాసులు, యేసుక్రీస్తు నిజముగా జీవించుచున్నాడని నమ్మేవిశ్వాసులు. చూడండి, ఒక విగ్రహము వలె వారు కేవలము ఒక సంఘమును కలిగియున్నారు. మన కూటములలో, గత దినముల గుండా మనము వాటి గుండా వెళ్ళియున్నాము. కాథలిక్ సంఘము మీద వారి విగ్రహముల మీద మనము దానిని త్రోసివేయుచున్నాము, వారు సంఘమును దాటిపోతూ యుండగా దానికి సాగిలపడతారు మరియు ప్రొటెస్టెంట్ వారైన మీరును అంత చెడ్డగానే యున్నారు, వారు కేవలము సంవత్సరమునకు ఒక మారు సంఘమునకు వెళతారు. బహుశ వారిలో కొందరు సంవత్సరమునకు ఒకసారి సంఘమునకు వెళతారు, అదీ ఈష్టరు పండుగ రోజున.

22

ఈ మధ్యనే ఒక పట్టణములో ఒక సేవకుడు ఈ విషయాన్ని ఎత్తి చూపటం నేను విన్నాను. అతడన్నాడు,“నా ప్రజలందరికి ఈష్టరు ఉదయమున నేను ”ఒక సంతోషకరమైన క్రిస్మస్“, అని అభినందించాను ఎందుకంటే, ”వారిని మరలా నేను వచ్చే క్రిస్మస్ లేక ఈష్టరు వరకు మరలా చూడను. అందుకే వారికి “ఒక మేర్రీ క్రిస్మస్”, అని చెపుతాను అని అన్నాడు.

మనము ఇక్కడ నిలబడియుండగా, ఆ కార్యములు మన ముందు విప్పబడుటను గమనించుచుండగా, మర్త్యులమైన మనలో ప్రతి ఒక్కరు ఏదో సంభవించబోవుచున్నదని మనము ఎరుగుదుము. అది ఈరీతిగా ముందుకు వెళ్ళలేదు. ఒక ఐదు నిమిషములు ఆగుటకు ఒక్కరికి కూడా సమయము లేదు. వారు తొందరగా యున్నారు, త్రోసుకొని పోవుచున్నారు, పరిగెత్తుచున్నారు, వీధులగుండా కూరుకొనిపోవుచున్నారు.

ఈ మధ్యహాన్నము పిల్లలు పెద్ద రహదారులగుండా వస్తూయుండగా, నేను వచ్చుచున్నాను లేక, అది మధ్యాహన్నవేళయై యున్నది. నేను న్యూ ఆల్బనీ నుండి వచ్చుచున్నాను. మరియు ఆ పిల్లలు మధ్యగుండా ఒక స్త్రీ వచ్చుచుండెను, దరిదాపు. ఇరవై మైళ్ళు వెళ్ళవలసిన ప్రాంతములో ఆమె అరవై లేక డభై మైళ్ళ వేగములో ఆమె ఎంతో కరుకుగా తెగగొట్టుచున్నట్లుగా వచ్చుచున్నది. ఆమె ఎక్కడకు వెళ్ళుచున్నది? ఆ కొన్ని నిమిషముల సమయములో నేనన్నాను,“దానిని గూర్చి మీరు ఏమి ఆలోచిస్తారు?” నాతో ప్రయాణము చేస్తున్న వ్యక్తికి, మరొక రెండు కార్లు పందెము కార్లవలె పరిగెత్తుచూ, కరకరమని శబ్దము చేయుచూ వేడిగా, పిల్లల మధ్యకు పరుగెత్తుకొని వచ్చుచున్నది. అది ఉదయము, మేము నివసించు వీధిలో, అది ఒక గుర్రముల పందెము వేయు స్థలమైయున్నది, పాత్రలను కడుగుటకు తొందరగా వెళ్ళాలి లేక ఆర్థర్ గాడ్ ప్రే సంగీతమును వినాలి లేక అలాంటిది ఏదో చేయాలి. మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారు? సంగతి ఏమిటి? ఇదంతయూ తబ్బిబ్బు అవటానికి కారణము ఏమనగా స్త్రీలు మరియు పురుషులు ఇహ లోకమును ప్రేమించు వారై యున్నారు. తప్పక గొప్పకార్యము ఏమైయుండవలెననగా, ఇంటికి వచ్చి బైబిలు చదివి మరియు ప్రార్ధించుటయే.

23

జాన్వెస్లీ తల్లియైన సూసన్నగూర్చి నేను తలంచుచున్నాను. ఆమె పదిహేడు మంది పిల్లలకు తల్లి, వినియోగించుటకు ఆమెకు సమయమున్నది. ఆమె ప్రతి రోజు రెండు లేక మూడు గంటలు ప్రార్ధనలో గడిపేదని నేను తలంచుచున్నాను. ఆమె పదిహేడు మంది పిల్లలను పెంచియున్నది, వారిలో నుండి ప్రపంచములోని భోధకులలో అతి గొప్పబోధకుడు బయటకు వచ్చియున్నాడు, మరియు పాటలు వ్రాయు వారిలో అతి గొప్ప కవి కూడా వారిలోనుండి వచ్చి యున్నాడు. వారే చార్లెస్ మరియు జాన్. కారణము ఆమె రోజూ లోకకార్యములలో కాకుండా, దేవుని సేవించుటకు సమయమును తీసుకొనియున్నది.

మన దేశము దేని మీద పునాది వేయబడినదో మనము చూసినపుడు, మన గృహ పునాది, మరియు మన సంఘ పునాది, మునిగి పోవుచున్నది, అలాగైతే, సోదరులారా, మనము ఏమి చేయగలము?

అప్పుడు, నేను ఇది చెప్పగలను, ఓ, ప్రపంచమునకు మీరు మరలా ప్రతిధ్వనించే స్వరము నాకు యున్నట్లైతే! మనము స్థిరమైన పునాదిని విడిచిపెట్టియున్నాము, మరియు అదే ధన్యమైన దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యము, బైబిలు. భూమ్యాకాశములు గతించునుగాని, అయితే దేవుని వాక్యము ఎన్నడూ గతించదు, “మరియు ఈ బండమీద” దేవుడున్నాడు,“నా సంఘమును కట్టుదును, మరియు పాతాళ లోకద్వారములు దాని ఎదుట నిలువజాలవు”.

24

కాబట్టి మన అందరకు ఎలాంటి ధన్యమైన ఆధిక్యత యున్నది, మరలా మన చేయి చాపి, దేవుని యొక్క ఆ పాత మంచి బైబిలును తీసుకొని, దాని పుటలను తిరిగి త్రిప్పినట్లైతే, మనము తిన్నగా సత్యమును చదువు చున్నామని తెలుసుకొంటాము గతించిన దినములలో ఇలాంటి సమయములు సంభవించియున్నవని చూచుటకు కారణము అది చరిత్రలోని దేవుని గూర్చి మాట్లాడుచున్నది, మరియు మనము ఆ మార్గములతో పొందికగా వచ్చు ఒకే ఒక మార్గము ఏదనగా చరిత్రలోనుండి, ఆ చారిత్రాత్మకమైన దేవుని పిలచుటయే ఏలయనగా దినములన్నిటిగుండా, జలప్రళయము భూమిని నాశనము చేసిన కాలములో, ప్రభువు యొక్క రాకడకు ముందు, మరియు భిన్నమైన సందర్భములలో ఆయన పిలువబడినపుడు ఆయన ఎన్నడూ తప్పిపోలేదు. ఆయన ఎల్లప్పుడునూ సరియైయున్నాడు.

25

ఇప్పుడు ఒక సమయమును గూర్చి నేను తలంచుచున్నాను, అది చెరలోనికి వెళ్ళిన ఒక దేశము, అదే ఇశ్రాయేలైయున్నది. వారు ఐగుప్తులో యున్నారు మరియు ఐగుప్తీయులకు సేవ చేయుటకు, కఠినముగా మరియు క్రూరముగా వత్తిడి చేయబడ్డారు. ప్రతి ఒక్కరూ చల్లబడి పోయినట్లుగా అది కనబడుచున్నది. ఒక దేశమైనప్పటి నుండి అమెరికా దేశము, ఇశ్రాయేలు ఐగుప్తులోయున్నట్లుగా, రెండంతలు ఐగుప్తులోయున్నదని మీకు తెలియునా? మనము ఇంచుమించు 150 లేక 70 సంవత్సరములుగా ఇక్కడ యుండి యున్నాము. అయితే వారు ఐగుప్తులో 420 సంవత్సరము బానిసలుగా యుండి యున్నారు.

అయితే, ఆశలన్నియు కోల్పోయినట్లుగా, వారికి ఒక సమయము వచ్చినది. అయితే సంక్షోభ సమయములో, అబ్రహాముతో మాట్లాడిన, ఆ చరిత్రలోని దేవుని యందు విశ్వాసముంచినట్లుగా, అక్కడ ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ యున్నట్లుగా కనబడుచున్నది, మరియు ఆయనను పిలిచినట్లైతే ఆయన వారికి జవాబు ఇచ్చునని వారు నమ్మి యుండిరి. మరియు వారే హాము, అమ్రాము మరియు యెకెబేను, ఈమె అమ్రాము భార్య. వారే మోషే తల్లి మరియు తండ్రి.

26

మరియు కొద్ది కాలము క్రితము నేను దాని మీద భోధించుచూ, ఎలా అమ్రాము రాత్రివేళ పని నుండి తిరిగి తన భార్య నొద్దకు వచ్చి, అతడు ఇలా చెప్పాడు, “యోకేబేదు నేను ఎంతో అలసిపోయాను”, మరియు వెట్టి పని చేయించు అధికారులు నా వీపు మీద కొరడాలతో కొట్టిన తాజాగా యున్న దెబ్బలు చూడుము.

బహుశ, ఆమె ఓపికగా కూర్చొని, ఆ గాయములను కడిగి, ఏడ్చిఇలా అన్నది, “ఓ, అమ్రాము, దాని కొరకు అక్కడ ఏదైనా చేయబడవచ్చునా?”.

అప్పుడు అతడు ఇలా అనుటను నేను వింటాను,“ఓ ప్రియమైన దానా, ఈ రోజున నీవు నాతో అక్కడ యుండి యుంటే, ఆ బరువులను లాగే ఆ కుర్రవాళ్ళను వారు ఎలా కొట్టియున్నారో చూసియుండే దానివి. అయితే వారు క్రూరమైనవారు (హృదయము లేనివారు) వారిని వారు పశువుల వలె హింసించుచున్నారు. వారు మన ఇశ్రాయేలులోని యవ్వనస్థులు. అక్కడ ఏదైనా చేయబడవచ్చునా?”

ఇప్పుడు అదే నేను ఆశ్చర్యపడుచున్నాను. ఈ దినమున యున్న మన యవ్వన బాలురు, ఈ దినమున మన యవ్వనస్థులు, రేపటి దినమున స్త్రీలు మరియు పరుషులైయున్నారు. మెడల క్రింద వరకు వ్రేలాడుచున్న జట్టు, తొడలపై దాకా వ్రేలాడుచున్న చెడ్డీలు ఒక పిస్తోలును ప్రక్కన జేబులో వ్రేలాడదీసుకొని, నోట్లో ఒక ప్రక్క సిగరెట్టు పెట్టుకొని యున్నారు, అది ఎలా యుంటుంది? అది ఇంకనూ దయ్యము క్రింద బానిసత్వమై యున్నది.

27

“అక్కడ ఏదైనా చేయవచ్చునా?”

బహుశ, అమ్రాము మాత్రమే ఆ దేశములో యున్న వారిలో ఒక్కడు, అతడు ఎంత అలసిపోయినప్పటికి, ఆ చిన్న మెట్లపైకి ఎక్కేవాడు. అక్కడ ప్రతిరాత్రి అతడు అబ్రహాము యొక్క దేవునిని పిలిచేవాడు, ఆయన ఇబ్బంది ఘడియలలో అబ్రహాము నొద్దకు వచ్చినవాడని, యోబు యొద్దకు వచ్చినవాడని, ఇస్సాకు నొద్దకు వచ్చినవాడని, యకోబు నొద్దకు వచ్చినవాడని తెలుసు కొనియున్నాడు. మరియు నిశ్చయముగా, ఆయన వారి దినమున దేవుడైయున్నట్లైతే, ఆయన ఈ దినమునను దేవుడై యున్నాడు. ఆయన మోషే కాలములో దేవుడైయున్నట్లైతే, ఆయన ఈ దినమున కూడా దేవుడై యున్నాడు. ఆయన చరిత్ర నుండి బయటకు పిలువబడవలసియున్నది, దృశ్యము మీద వని చేయుటకు పిలువ బడవలసియున్నది.

నేను చూడగలను, అమ్రాము అతడు ఎంత అలసిపోయినప్పటికి లెక్క కాదు, ప్రతి రాత్రి అతడు ప్రార్ధన చేయుచున్నాడు, అది దేవుని యందు అతని విశ్వాసమును ఋజువు చేసినది. అయితే ఈ దినమున ప్రజలు, వారు అడిగిన ప్రతి దానిని పొందకపోయినట్లైతే, వారు మొదటిసారి ప్రార్ధన చేసినపుడు, ఆయన వారికి చనిపోయినవాడుగా కనబడుతుంది.

ఈ దినమున ఎటువంటి స్త్రీ, పరుషులు అవసరమనగా, ధైర్యసాహసపు ఆత్మ నింపబడిన స్త్రీ పురుషులు, పట్టుకలిగి వదలనివారు నిజముగా దేవుడు జీవించుచున్నాడని చివరకు కార్యము చేయుటకు వస్తాడని చూడగలుగువారు, కాదు అను జవాబును తీసుకొనిన వారు. వారు దానితో నిలచియుండుటకు నిర్ణయించుకొనినవారు.

28

వారు రోగులైనట్లైతే, మరియు వైద్యుడు వచ్చిమీరు బాగుపడరు అని చెప్పిననూ, ఇంకనూ ఏదో వారిలోయుండి వారు స్వస్థత నొందబోవుచున్నారని చెపుతుంది. ఏది సంభవించినను లెక్కకాదు, పట్టుకొనియుండును!

సంఘశాఖా ప్రపంచములోని సంఘములలో నీవు చేరి యున్నావా, ఒక స్థలము నుండి మరొక స్థలమునకు తిరిగి తిరిగి నీ బలమంతయూ హరించి వేయబడినను, నీవు ఇంకనూ నెమ్మది పొందని స్థితిలో యున్నావా? ప్రార్ధన ఆలకించి మరియు పాపము నుండి రక్షించే దేవుడు ఇంకనూ అక్కడ యున్నాడు.

29

మనము చూచుచుండగా అమ్రాము, ఆ చింతతో కూడిన రాత్రులందు, వీపు రక్తము కారుచుండగా, మరలా అతడు మెట్లు ఎక్కి పైన ఉదయము రెండు లేక మూడు గంటల వరకు ప్రార్ధన చేయుచూనే యున్నాడు, మరియు అది కేవలము గాలితో మాట్లాడినట్లుగా కనబడుచున్నది. కాని అతని యూదుని హృదయపు అంతరంగములో అక్కడ ఒక విశ్వాసం యుండియున్నది. దానిని ఏ అనుమానపు గాలులు బయటకు ఊదలేవు. ఆ విధమైన స్త్రీ పురుషులు ఈ దినమున రంగము మీదికి లేచుట మనకు అవసరమైయున్నది. ఈ రాత్రి ఆయన జవాబును ఇయ్యకపోయి నట్లైతే, ఆయన రేపు రాత్రికి జవాబు ఇస్తాడు. ఈ సంవత్సరము ఆయన జవాబు చెప్పకపోయినట్లైతే, ఆయన వచ్చే సంవత్సరమున జవాబు ఇస్తాడు. కారణము ఆయన దేవుడైయున్నాడు, ఒక దేవుడు కాదు, అయితే ఆయనే దేవుడు.

ప్రతి రాత్రి అమ్రాము మెట్టు ఎక్కి పైన మిద్దె మీద ప్రార్ధన చేయుచూనే యున్నాడు (తర్జుమాదారుడు) యొకెబదు పైకి వచ్చి అతనితో ఇలా అంటుంది. “అమ్రాము, ప్రియమైనవాడా, నీవు ఈపైన రాత్రంతయూ ప్రార్ధన చేయుచున్నావు. నీవు పని చేసే చోట, నీవు ఆ కుర్రవాళ్ళకు ఎందుకు చెప్పకూడదు, వారిని కూడా కొంచెము ప్రార్ధన చేయనిమ్ము.”

“సరే, హనీ, వారు ఒకవేళ ప్రార్ధన చేయపోతే? ఎవరో తప్పక ప్రార్ధన చేయవలసియున్నది. ఎవరో తప్పక క్షుణ్ణముగా ప్రార్ధన చేయవలసి యున్నది”.

ఆ మార్గములోనే తప్పక ప్రతి క్రైస్తవుడు ఈ రాత్రి భావించవలసి యున్నది, ఎవరి కొరకో ఎదురు చూచుటకాదు, అయితే ముందు వరుసను మీరే తీసుకోండి, మనమే, మరియు ముందుకు వెళ్ళండి.

30

బైబిలు ఒక చరిత్రయై యున్నదని మీరు నమ్మియున్నట్లైతే, అది ఒక ప్రవచనాత్మకమైన గ్రంథము కూడా, అదే దేవుడు అంత్యదినములలో లేచునని కూడా అది చెప్పుచున్నది మరియు ఆయన రంగము మీదికి వచ్చుటకు అది సమయమై యున్నది. అదే అమ్రాము ఎరిగియుండెను. ఆ...మోషే ప్రవచించియున్నాడు. లేక, మోషే కాదు, నన్ను మన్నిచండి. చరిత్రలోని దేవుని ద్వారా అబ్రహామునకు ఒక వాగ్దానము ఇవ్వబడియుండెను. మనకు వ్రాయబడియున్నట్లుగా, ఆయన నాలుగు వందల సంవత్సరములుగా ప్రార్ధనకు జవాబియ్యలేదు. అయితే వారిని బయటకు తెస్తానని ఆయన వాగ్దానము చేసియున్నాడు.

ఎంతో దీర్ఘకాలముగా మనము ఒక మౌన దేవునిని కలిగియున్నట్లుగా కనబడుచున్నది, అయితే ఆ ఘడియ వచ్చియున్నది, అక్కడ ఆయన రంగము మీదికి లేపబోవుచున్నాడు.

ఒక రాత్రి అమ్రాము ప్రార్ధించిన తరువాత బహుశ, ఎన్నోసంవత్సరములుగా అతడు ప్రార్ధించినాడు. మరియు అతని వెంట్రుకలు తెల్లబడిపోయినవి, అయితే విడుదల రాలేదు, అయితే పరిస్థితులు ఇంకా అధ్వాన్నముగా మారుచున్నవి ఒక రాత్రి అతడు తిన్నగా ప్రార్ధించుటకు లేచాడు.

అలాగే మనము దానిని చేయవలసియున్నది. తిన్నగా క్రిందికి పని (ప్రార్థన) లోనికి ఉపక్రమించాలి. అతడు అన్నాడు, “దేవా, నీవు దానిని వాగ్దానము చేసియున్నావు. మేము దాని కొరకు ఎదురుచూసి యున్నాము, గురుతులన్నిటిని మేము ఇక్కడ చూస్తాము, మరియు కాలము సమీపమై యున్నది దానిని గూర్చి ఏదైన చేయుటకు అది నీ సమయమైయున్నది”.

అతడు తన హృదమంతటితో ప్రార్ధనలో లోతుగా నిమగ్నమైయుండగా, ఎవరో ఆ మూలన నిలబడియుండుటను అతడు చూశాడు. అతడు తన కన్నులను రుద్దుకొని మరలా చూశాడు. దూసిన ఖడ్గమును పట్టుకొనియున్న ఒక దూత అక్కడ నిలబడియుండెను. అతడన్నాడు, “విడుదల వచ్చుచున్నది. నీవు ఈ లోకములోనికి ఒక కుమారుని కనబోవుచున్నావు, మరియు అతడే వారికి విడుదలను తేబోవుచున్నాడు”. చూడండి? దేవుడు ఎల్లప్పుడు ప్రార్ధనకు జవాబిస్తాడు. ఆయన ఇవ్వడా? (సంఘము “ఆమెన్” చెప్పినది). మనము సరిగ్గా పట్టుకొనియున్నట్లైతే,

31

మోషే, ఇశ్రాయేలు ప్రజలను నమ్మకముగా అరణ్యములోనికి నడిపించినపుడు, అతడు ఎర్ర సముద్రము నొద్దకు వచ్చాడు ఇటు వైపున కొండలు, అటు వైపున ఎడారులుయున్నవి, మరియు ఫరో సేనలు ఈవైపున యున్నవి, మరియు ఎర్ర సముద్రము వారికి ముందుగా యున్నది. మరియు వారి మెడ మీద చిన్నవల వేయబడినట్లుగా వలలో పడియున్నారు. ప్రకృతి సహితము మొర్ర పెట్టినట్లుగా కనబడుచున్నది. ఏమి సంభవించబోవు చున్నది? వారి పని ముగించబడినది. వేల కొలదిగా ఫరో యొక్క సైనికులు వారిని క్రిందకు తరిమి కొట్టుచూ పరిగెత్తుచున్నారు. అయితే ప్రజలు ఏమిచేశారు? సణుగుచూ ఫిర్యాదు చేయుటకు మొదలుపెట్టారు, “ఓ, ఇది వరకు మనము ఉండియున్నచోటే నిలిచియుంటే మనకు ఎంతో బాగుండేది”.

అయితే వారి మధ్య ఒకరున్నారు, అతడు తన హృదయములో దేవుని యొక్క విశ్వాసపు మంటను కలిగియున్నాడు, ఎలాటి ఇబ్బంది సమయములోనైనా ఆ చరిత్రలోని దేవుడు రంగము మీదికి వస్తాడని అతడు ఎరిగియుండెను, చరిత్రలోని దేవుడు, ప్రస్తుత దినము యొక్క దేవుడుగా, లేచి రంగము మీదికి వచ్చు వరకు, మోషే దేవుని వైపు చేతులు చాపి ప్రార్ధించెను. మరియు ఆ మార్గమును తెరచెను, ఇశ్రాయేలు నీళ్ళగుండా పొడినేలను నడిచిరి.

32

ఓ, దాని తరువాత కొద్ది కాలమునకు, యెహోషువ అదే గుంపు వారిని, వారి పిల్లలను యోర్దానుకు నడిపించాడు. అది ఏప్రిల్ మాసము, మొత్తము జలప్రవాహములన్నియూ పొంగి ప్రవహించుచున్నవి, మరియు యొర్దాను ఇదివరకటికన్నా ఐదు రెట్లు పెద్దగా యున్నది. ఏ మంచి మిలటరీ నాయకుడు, దానికి భిన్నముగా వారిని అక్కడకు తెచ్చినట్లు కనబడుచున్నది. మరియు ఆ సమయములోనే, దానిని దాటుటకు అక్కడ ఏ అవకాశము లేకుండెను. నలభై సంవత్సరముల క్రితము, అక్కడ చరిత్రలోని దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేసినట్లు యోహోషువ జ్ఞాపకమునకు తెచ్చుచున్నాడు, మరియు అతడు ఆ దేవుని పిలిచాడు. అప్పుడు ఆ దేవుడు గొప్ప శక్తితో దిగివచ్చి, వారి ప్రస్తుతపు సంక్షోభములో సజీవుడై, యొుర్దానును పాయలు చేసి వారిని అవతలకు దాటిపోనిచ్చాడు.

33

ఈ రాత్రి మనము చదివిన అంశము ప్రకారము, దానికి అనేక సంవత్సరముల తరువాత, మన అంశమును చదివినట్లుగా, ఏలీయా ఆ దేశము యొక్క శాపమును చూసియున్నాడు, మరియు ఆ కొండపైన వారున్నారు, మరియు వందల సంవత్సరములుగా ఏ ప్రార్ధనకు ఇశ్రాయేలులో జవాబియ్యబడలేదు, అయినను ఏలీయా రంగము మీదికి రాగలిగే దేవుడు అక్కడ చరిత్రలో యున్నాడని ఎరిగియుండెను. ఈ దేవుని యొక్క సన్నిధిలో నిలబడి, ఏ దేవుడు అగ్ని ద్వారా జవాబు ఇస్తాడో అని, నిలబడియున్న ఆ అవిశ్వాసపు లోకమును సవాలు చేశాడు. మండుచున్న అగ్నిగుండములో హెబ్రీ పిల్లలను కాపాడిన దేవుడు, అగ్నిని దించి అర్పణను దహించి వేసెను.

తరువాత కొద్ది కాలమునకు లాజరు అను పేరుగల ఒకడు మరణించెను. ఇంకను అక్కడ జీవించిన ఒక దేవుడున్నాడు, ఆయన హనోకును మరణము చూడకుండా తీసుకొనిపోయెను, మరియు ఏలీయాను అగ్నిరధములపై కొనిపోయెను. మరణాంధకారపు ఘడియలో ఆయన రంగము మీదికి పిలువబడ్డాడు, ఆయన ఏ సమయములోనైనా ఇదివరకు పనిచేసినట్లే సరిగ్గా పని చేసెను. ఇంకనూ, ఆయన చరిత్ర యొక్క దేవుడై యున్నాడు, అయితే చరిత్ర నుండి ప్రస్తుత సంక్షోభమునకు ఆయనను లేప వచ్చును.

అక్కడ యెరికో గుమ్మము నొద్ద ఒక గ్రుడ్డి బిక్షకుడు కూర్చొని అరచుచుండెను. అతనికి ఏ ఆశలేదు. ఏ వైద్యుడు ఏ మంచియు అతనికి చేయలేదు అతని డబ్బు ఖర్చుచేయబడియున్నది. అతడు అక్కడ కూర్చొని కొన్ని దినములలో మరణము అతనికి తియ్యని ఉపశమనాన్ని ఇచ్చుట తప్ప, అతనికి అక్కడ ఏమియు మిగిలియండలేదు. అయితే ఒక దినమున, ప్రస్తుత సంక్షోభములో, చరిత్రలోని దేవుడు ఆ వీధిగుండా నడుచుకొంటూ రంగము మీదికి వచ్చెను. దేవుడు గ్రుడ్డివాని కన్నులను తెరచెను.

34

అది యాయిరు గృహములో, వైద్యులు విఫలమైపోయినారు, ఆ చిన్న బాలికను మరణమునకు వదిలివేశారు. మరణము దాని యొక్క చేదైన పన్నును తీసుకొనియున్నది, ఒకే ఒక పన్నెండు సంవత్సరముల ఈడు గల బాలికను మింగివేసియున్నది, మరియు ఆమెను బయట పడకపై యుంచారు. ఒక హృదయము బ్రద్ధలైన చిన్న భోధకుడు తన సంఘమును, తన స్నేహితులను విడిచి, మృతులను సజవులుగా చేయగల ఒక దేవుడు చరిత్రలో యున్నాడని అతడు జ్ఞాపకము చేసికొనెను. మరియు ఆయనను కనుగొనుటకు అతడు వెళ్ళియుండెను. వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తియ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, ఆయన ఇంకనూ అదే దేవుడైయున్నాడు.

35

యేసు అని పిలుబడు దేహములో నివాసము చేయుచున్నఈ దేవుడు, దేవుని యొక్క కుమారుడు, ఆయన రంగము మీదికి పిలువబడినపుడు, చరిత్ర నుండి పైకి పిలువబడినపుడు, ఆయన పాతనిబంధనలో మృతలును లేపిన దేవుడు, ఇప్పుడు ఒక ప్రవక్త ద్వారా ఒక చనిపోయిన బిడ్డకు తిరిగి జీవము నిచ్చెను. ఆ దేవుడు చనిపోజాలడు. ఆయన నిత్యత్వ మంతటా దేవుడై యున్నాడు.

ఆ బిడ్డ చనిపోయి బయట ఉంచబడియున్నది. ఆ చిన్నయాయిరు తన బిడ్డను ఆ షునేమియురాలు తిరిగి బ్రతికించుకొన్నదని అతడు ఎరిగియుండెను, అతడన్నాడు, “ఆ చరిత్రలోని దేవుడు, పని చేయుటకు ఆయన ఎన్నడైనా పిలువబడినట్లైతే, ఈ దినమున కూడా ఆయన అదే దేవుడైయున్నాడు”. అతడు అంతా వెతుకుతూ, ఆ శక్తిని కలిగియున్నట్లు చెప్పబడిన, నజరేయుడైన యేసు అను మనిషిని గూర్చి అతడు విన్నాడు, అందరూ ఆయనను ద్వేషించియుండిరి. అయితే అతడు ఆయనను రంగము మీదికి పిలిచెను, ఆయన బహు సన్నిహితమైన ప్రతినిధిగా యున్నాడు, ఆ దినమున జీవించుచున్నసజీవడైన దేవునిని ఆయన కనుగొంటాడు. ఆయన రంగము మీదికి పిలువబడినప్పుడు, ఆ చరిత్రాత్మకమైన దేవుడు పైకి పిలువబడి నపుడు, చనిపోయిన బాలుని గూర్చి ఆయన ఏలీయాతో మాట్లాడినట్లుగానే, ఆయన అదే విధముగా చేసెను.

36

ఈ ప్రస్తుత సంక్షోభ సమయములో సోదరుడా, సోదరీ నన్ను మరి ఎక్కువగా చెప్పనివ్వు, కాన్సర్ ప్రపంచమును తిని వేయుచున్నది, మరియు అన్నిరకములైన వ్యాధులు, అదే చరిత్రలోని దేవుడు, కుష్టురోగులను శుద్ధి చేసియున్నాడు. రోగులను బాగు చేసియున్నాడు, చనిపోయిన వారిని లేపి యున్నాడు, ఈ దినమున ఆయన అదే దేవుడై యున్నాడు. రంగము మీదకు ఆయన వచ్చి పని చేయునట్లుగా, ఆయన ప్రజలు ఆయనను పిలువవలెనని ఆశతో ఆయన కనిపెట్టుచున్నాడు.

ఒక దినములో ఏడు సార్లు వ్యభిచరించిన వేశ్యను క్షమించిన దేవుడు, అతి క్రూరమైన పాపిని ఆయన కడిగిన లిల్లీ పువ్వంత తెల్లగా వారిని చేయగలడు. చరిత్రలోని అదే దేవుడు పాపముతో, అవిశ్వాసముతో నల్లబడిపోయిన ప్రతి హృదయమును కడుగుటకు, ఈ దినమున ఆయన జీవించుచున్నాడు.

37

ఒకసారి చాంధ్ర రోగముతో యున్న ఒక బాలుని ఒక తండ్రి కలిగియుండెను, మరియు అతడు అతనిని సంఘమునకు తీసుకొని వెళ్ళెను, మరియు శిష్యులు అతని చుట్టూ చేరి కేకలు వేసి, కొద్ది సేపు గంతులు వేశారు, అది ఏ లాభము చేయలేదు. అయితే అక్కడ చరిత్రలోని ఒక దేవుడు ఇంకనూ అక్కడ జీవించియుండెను. ఆయనను కనుగొనుటకు అతడు నిర్ణయించుకొనెను, ఆయన కొండపై నుండి దిగివచ్చుట చూసి, ఆయన యొద్దకు పరుగెత్తుకొనిపోయి ఇలా అన్నాడు, “ప్రభువా, నామీద కనికరము చూపుము, ఒక దయ్యము నా కుమారుని తీసుకొని అగ్నిలో పడద్రోయుచున్నది”.

యేసు అన్నాడు,“నీవు నమ్మినట్లైతే, నేను చేయగలను” నీవు దీనిని నమ్మినట్లైతే? చరిత్రలోని దేవుడు ఈ దినమున ఇంకనూ జీవించు చున్నాడని నీవు నమ్మినట్లైతే, ఆయన రంగము మీదికి పిలువబడ్డాడు, మరియు చాంధ్ర రోగము ఆ బిడ్డను విడిచిపోయెను.

అదే దేవుడు ఈ దినమున జీవించుచున్నాడు, సంఘము తప్పిపోయినను, రాజకీయములు తప్పిపోయినపుడు, మనిషి తప్పిపోయినను, మరియు సమస్తము తప్పిపోయినను ప్రతిదీ తప్పిపోయిననూ, దేవుడు మాత్రము తప్పిపోడు, ఆయన పాత, నల్లటి అట్టతోయున్న బైబిలును సమర్ధించిన దేవుడై యున్నాడు. ఎన్నడైనాయుండియున్నట్లుగానే, ఆయన వాగ్దానములు కేవలము సత్యమైయున్నవి. ఆయన ప్రజలు ఆయనను పిలచుటకు ఇది సమయమైయున్నది, చరిత్ర నుండి పైకెత్తవలసియున్నది. “కారణము అది ఈలాగు వ్రాయబడి యున్నది”, యేసుక్రీస్తు నిన్న నేడు, నిరంతరము ఒకటే రీతిగా యున్నాడు.

38

ఆయన చరిత్రలోని దేవుడైయున్నాడు, మరియు ప్రస్తుత దినమున దేవుడై యున్నాడు. “మరియు అంత్య దినములలో ఆయన చెప్పియున్నాడు, ”సర్వశరీరులపై నా ఆత్మను క్రుమ్మరిస్తాను, మరియు నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు మరియు అద్భుతములు వెంబడించును, ఏలయనగా, నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు, వారు క్రొత్త భాషలతో మాట్లాడుదురు, వారు సర్పములను ఎత్తిపట్టుకొందురు లేక మరణకరమైనది ఏదైనా త్రాగినను అది వారికి హాని చేయదు, మరియు మీరు రోగుల మీద చేతులుంచినపుడు వారు స్వస్థతనొందుదురు“.

ఆ వాగ్దానము ఇచ్చినది చరిత్రలోని దేవుడైయున్నాడు. మరియు ఈ దినమున మనము ఆయన మేపు గొర్రెలమై యున్నాము. మనము ఆయన దొడ్డిలోని గొర్రెలమై యున్నాము, ఆయన వచ్చి క్రియ చేయునట్లుగా మనము నిలబడి ఆయనను పిలువవలెనని ఆయన కనిపెట్టుచున్నాడు. ఆయనను రంగం మీదికి పిలువండి. ఆయన ఎలా కదులుతాడో ఆయనను గమనించండి. మహోన్నతమైన దానిని ఆయన చేయుటను గమనించండి. మనుష్యులు ఆశ్చర్యపడునట్లుగా మరియు వారు తలలు గోకుకుని దానిని అర్థం చేసుకొనలేనట్లుగా ఆయన కార్యం చేయుటను గమనించండి. ఆయన చరిత్రాత్మకమైన దేవుడై యున్నాడు. మరియు ఈ దినపు దేవుడైయున్నాడు. చరిత్రలోనుండి ఆయన పిలువబడవలెనని ఆయన కనిపెట్టుచున్నాడు.

39

చరిత్రలో మాత్రమే ఆయన దేవుడైయున్నట్లైతే, ఆ చరిత్రాత్మకమైన దేవుని వలన మనకేమి ప్రయోజనం, అంత వరకే మనమాయనను చూచుట కాదా? చరిత్రలో చేసినది మనకే మేలు చేస్తుంది? అమ్రాము, యొకెబెదులకు ఆయన చరిత్రలో దేవుడు మోషేకు చేసినది మనకే మేలు చేస్తుంది? చరిత్రలో దేవుడు లాజరుకు చేసినది మనకే మేలు చేస్తుంది? ఆ గవిని నొద్ద ఆయన చరిత్రలో ఆగుడ్డి బర్తలోమయికు చేసినది మనకు ఏ మేలు చేస్తుంది? ఈ దినమున ఆయన అదే దేవుడు కాని యెడల చరిత్రలోని ఆ దేవుని వలన మనకేం ప్రయోజనం?.

ఈ దినమున కూడా ఆయన అదే దేవుడైయున్నాడు. ఆయన మన దోషములన్నిటిని క్షమించువాడు, మన సంకటములన్నిటిని కుదుర్చ వాడు. ఆ చరిత్రలోని దేవునిని చరిత్రలో నుండి పైకి పిలిచినట్లైతే ఆయన ఈ దినమున కూడా ప్రకాశిస్తాడు. ఏమిటి? కాలము అంతమగుచున్నపుడు, రాజకీయములు అంతమగుచున్నప్పుడు, జీవితం అంతమగుచున్నపుడు మరియు సమస్తము అంతమునకు వస్తున్నప్పుడు యేసు వెలుగునకు వచ్చును. సమస్తము అంతమును వచ్చినపుడు ఆయన ఇంకను ప్రకాశించును, “లోయలోని పద్మము ప్రకాశమానమైన ఉదయ నక్షత్రం”. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. ఆ చరిత్రలోని దేవునిని తిన్నగా పిలవండి, ఈ దినపు దేవునిగా ఆయనను గమనించండి. ఆయన అప్పుడు ప్రకాశించినట్లుగానే ఈ దినమున కూడా ప్రకాశించునట్లు చరిత్రలోనుండి ఆయనను పైకెత్తండి, ఆయన ఒకటే రీతిగా పనిచేస్తాడు. ఆయన అదే కార్యముచేస్తాడు. ఆయన అదే రీతిగా క్షమిస్తాడు. ఆయన అదే రీతిగా స్వస్థపరుస్తాడు. ఆయన కనికరములు అదే రీతిగా ఉన్నవి ఆయన ఇష్టతలు ఒకటే రీతిగా ఉన్నవి. ఆయన శక్తియు అదే రీతిగా ఉన్నవి. ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన మన యొక్క పిలుపు కొరకు కనిపెట్టు చున్నాడు.(తర్జుమాదారుడు).

40

నీవు కేవలం నీ పెదవులతో ఆయనను పిలువలేవు, పెదవుల పొగడ్తల ద్వారా ఆయన రాడు. ఆయన విశ్వాసం ద్వారా వస్తాడు. అది నీ విశ్వాసం, నీ దీర్ఘ ప్రార్ధన కాదు. అది దాని కొరకై నీవు మండుచున్న స్థితి. అయితే ఆ చిన్న మిణుకు మిణుకు మనుచున్న నీ ఆత్మలోని విశ్వాసం ద్వారా ఆయన నీ యొద్దకు వస్తాడు, అది గట్టిగా పట్టుకుని ఇలా చెపుతుంది, 'ఆ చిన్న విశ్వాసం ఈ రాత్రి నన్ను ఆలయమునకు తెచ్చియున్నది. అది నా ఆత్మను తాజాగా వెలిగించగలదు. మరియు ఇక్కడ నుండి మండుచూ పాటలు పాడుచూ నన్నుబయటకు పంపిస్తుంది, ఆకాశంలోని పక్షులువలె. ఎందుకు ఆయన చరిత్రలోని దేవుడు మరియు ప్రస్తుత దినపు దేవుడై యున్నాడు. ఆయన పిలువబడుటకు కనిపెట్టు చున్నాడు. ప్రభువు నామమున పిలవండి. ఆయన నీ ప్రార్థన వింటాడు. కీర్తనలద్వారా ఆయనతో మాట్లాడండి. ఆయనకు ప్రార్ధించండి మరియు ఆయనను నమ్మండి.

ముగింపులో నేను ఈ మాటలు చెప్పగోరుచున్నాను. ఆ కారణమును బట్టియే ఈ రాత్రి కూటం ఇక్కడ యున్నది. ఆ కారణమును బట్టియే ఈ కూటము ఇక్కడ యున్నది. ఆ కారణమును బట్టియే ఈ కూటము ప్రారంభించబడి యున్నది. అదిగో నేనక్కడ ఈ పునాది రాయిని వేస్తూ యుండగా ఇరవై ఏడు సంవత్సరముల క్రితం దేవుడు నాతో నేను ప్రపంచమంతటా సువార్తను భోధిస్తానని చెప్పియున్నాడు. ఆయన దానిని నెరవేర్చి యున్నాడు.

అప్పుడు వారు దానిని గూర్చి నవ్వి ఇలా అన్నారు, “నీ ఏడవ తరగతి విద్యలో నీవెక్కడకు వెళ్ళుచున్నావు బిల్లీ?”. నేనన్నాను, “ప్రభువైన యేసు నామంలో నేను వెళ్ళుచున్నాను”.

41

పదకొండు సంవత్సరముల క్రితం వేదిక మీద నేను ప్రసంగము చేసి వెళ్లకముందు, శ్రీమతి గెర్జి కూర్చుని ఈ పాట పాడియున్నది “కేవలము నమ్మము”, మరియు అదిగో అక్కడ నేను దావీదు మరియు గొల్యాతును గూర్చి బోధించినట్లుగా ఆ గొప్ప రాక్షసుడు అక్కడ నిలబడియున్నాడు. అక్కడ బాగుగా పెరిగియున్న శాస్త్రీయ లోకము దైవీక స్వస్థతను తప్పు అని వంచించి దానిని అవమానపరచుటకు నిలబడి యుండెను. మరియు ప్రతీ ఒక్కరు నాతో ఇలా చెప్పచున్నారు, “అబ్బాయ్ నీవు అక్కడ బ్రద్ధలై పోతావు, వారు నిన్నుజైల్లో పెడతారు. వారు నీకు ఇదీ అదీ ఫలానిది చేస్తారు అని చెప్పారు. అయితే చరిత్రలోని దేవుడు అదిగో రంగం మీదికి వచ్చి దానిని చేయుమని నాతో చెప్పాడు. మరియు ఆయన కృపను బట్టి మరియు కనికరమును బట్టి నేను దాన్ని చేసియున్నాను.

చరిత్రలో ఉన్న అదే దేవుడు పది సంవత్సరముల క్రితం మరల రంగం మీదికి లేచియున్నాడు. దానిని ఎంతో నిశ్చయంగా నెరవేర్చియున్నాడు. అయన దీనిని నెరవేర్చియున్నాడు. ఆయన చరిత్రలోని దేవుడు, మరియు ప్రస్తుత దినపు దేవుడైయున్నాడు. ఆయన ఎన్నడు కునుకడు నిద్రపోడు. ఆయన చనిపోలేడు, కారణము ఆయన ఆదియు మరియు అంతములేనివాడై యున్నాడు.

42

ఈ రాత్రి నీ విషయంలో పాపివైన స్నేహితుడా, ఆ చిన్నపులకింపు చేయు నీ హృదయం చుట్టూ ఉన్న ఆ భావన ఆయన ఒకటే రీతిగా ఉన్నాడని నీతో చెబుతుంది. మరియు నీవు ఆయనకు వ్యతిరేకంగా చేసిన ప్రతీ పాపమును, ప్రతీ నేరమును, ప్రతీ భారం నుండి ఆయన నిన్ను విడిపించ గలడు. నీ ఆశలను దేనిలోఉంచుతావు? కనీసం నీ సొంత ఇంటి మీద, నీ భార్యమీద, నీ కుటుంబం మీద నీ తల్లితండ్రి మీద కూడా ఉంచలేవు.

నా ఆశలు యేసు రక్తములోని నీతి కంటె మరిదేని మీదను నిర్మించబడలేదు,

నా ఆత్మ చుట్టూ అంతామార్గము నిచ్చినపుడు,

అడు ఆయనే నానిరీక్షణ మరియు ఆధారము.

క్రీస్తు అను నిశ్చలమైన బండమీద, మనమ నిలబడతాము,

మిగిలిన నేల అంతయూ కూలిపోయే ఇసుకయే.

సంఘ, స్నేహితుడా, అది ఏమైయున్నప్పటికి వారందరూ ఒక అంతమునకు వచ్చుచున్నారు. అయితే ఆయన నిరంతరం జీవించును. మరియి ఆయన జీవించుచున్నందున మనమును ఆయనతో జీవించు చున్నాము.

43

దానికి ప్రతిగా నీవు ఏమి ఇవ్వగలవు? నీవు ఏమి ఇవ్వగలవు? ఈ రాత్రి దేవుడు నిన్ను తీర్పునొద్దకు పిలిచినట్లైతే? నీవు దాన్ని గూర్చి ఏమి చేస్తావు. నీవు నీ ఆశలను నీ దేశంపై ఉంచావా? మిగిలిన దేశములన్నిటి వలె అది కూడా బ్రద్ధలగుచున్నది. నీ ఆశలను ఒక నిర్ణీతమైన రాబోవుచున్న ఎలక్షన్ల మీద ఉంచావా? ఆ మనుష్యులు వారి మీద నాకే వ్యతిరేఖత లేదు, అయితే వారు మర్త్యులై యున్నారు మరియు విడిచి వెళ్ళిపోవువారై యున్నారు. ఏదో జరగబోవు దాని మీద, నీ ఆశలను ఏమాత్రము అలాటి వాటి మీద ఉంచలేవు, అయితే చరిత్రలో దేవునిపై ఉంచుము, ఒక ధన్యమైన దినమున ఆయన తిరిగి వస్తానని ఆయన వాగ్దానం చేశాడు.

వారు నిన్ను బయటకు తీసుకొనిపోయి శవమును పాతిపెట్టువాడు నిన్ను మట్టితో పూడుస్తాడు. అయితే నిన్నుపైకి తీసుకునిపోవువాడు ఈ దినములలో ఒక దినమున వస్తాడు. నిన్ను పాతిపెట్టువాడు నిన్ను క్రిందక దించుతాడు, అయితే నిన్ను పైకి తీసుకుని వెళ్ళువాడు ఎంతో నిశ్చయంగా పైకి తీసుకెళతాడు. “ఏలయనగా క్రీస్తులో నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. కారణము అనేకులకు ఆయన ఇప్పుడు చరిత్రలోని దేవుడైయున్నాడు. అయితే నీవు నీ స్వంత రక్షకునిగా ఆయనను అంగీకరించినట్లైతే ఆయన నీకు ఈ దినపు దేవుడు అవుతాడు. మరియు నీ హృదయంలో ఆయనను యధార్థంగా కనుగొంటావు.

అక్కడ ఏదో నీలో ఉండి ఇలా చెబుతుంది. నీవు ఉద్రేక భరితునిగా ఉండవు. నీవు ఏడ్వవు. నీవు భాషలతో మాట్లాడవు. నీవు పరుగెత్తవు. నీవు కేకలు వేయవు. అయితే ఏదో సంభవించినట్లు నీవు గుర్తిస్తావు, ఏదో సంభవించినట్లు నీవు తెలుసుకుంటావు. నీవు జీవించినంత కాలము నీ జీవితము దానితో సమ్మతిస్తుంది.

నీ చివరి ఘడియ వచ్చినపుడు మరియు నీవీ లోకమును విడుస్తున్నప్పుడు నీవు ఏ అపాయమునకు భయపడవు. “నీవు నాకు తోడుగా ఉందువు. నీ దుడ్డుకర్రయు నీదండమును నన్ను ఆదరించును”. వైద్యులునిన్ను త్రోసివేసి బయటకు వెళ్ళిపోతారు, మరియు చల్లని నరములు పైకి వస్తాయి.

44

శ్రీ వాఘటర్ గత రాత్రి ఆయన ప్రసిద్ధిగాంచిన ఈ పట్టణం యొక్క మాజీ మేయర్ యై యున్నాడు, శ్రీ నిక్సన్ ప్రసంగం వినుటకు అతడు వెళ్ళియున్నాడు, మరియు అక్కడే తిన్నగా అతడు చనిపోయాడు. నేనెరిగియున్నంత వరకు ఆరోగ్యంతో ఉన్న మనిషి,

నేను ఇంటి నుండి బయటకు వెళ్ళి మరల తిరిగి వచ్చాను అపుడు నా భార్య నాతో ఇలా చెప్పింది, “బిల్లీ, ఫలానా ఫలానా వ్యక్తి చనిపోయాడని నీకు తెలిసిందా?”.

మొన్నటి దినమున నా చిన్న కుమార్తె ఒక చిన్నబాలికతో మంగళవారం రోజున కూర్చొని ఉన్నది, మరియు తర్వాత ఆదివారం ఆమె సమాధి చేయబడినది. నిమ్మోనియా జబ్బు వచ్చినది. అది ఆమె యొక్క గుండెలోనికి వెళ్ళి ఆమెను చంపివేసినది. ఆమె చనిపోయినది.

నా స్నేహితుడైన శ్రీ బక్ విలియమ్స్ యొక్క భార్య శ్రీమతి విలియమ్స్ అక్కడ ఉన్నది. చాలా సంవత్సరములుగా నేనాయనను యెరుగు దును ఇక్కడ ఉన్న జిల్లాబ్రేక్మాన్, ఇక్కడే ఎక్కడో ఈ కట్టడంలో ఆమె ఉండి యున్నది. మేము ఆ వీధిలో నివసించి యుండగా ఎన్నోసంవత్సరములు ఇక్కడే ప్రక్కింటిలో ఆమె నివసించియున్నది. ఆమెయు వెళ్ళిపోయినది. ఆమె నరముల ఉద్రిక్తతతో బాధపడినది, నేను తిరిగి ఇంటికి వచ్చే సమయానికి ఆమె చనిపోయినది. అది ఏమై యున్నది? కొన్నిసార్లు నీవు దాన్ని(మరణాన్ని తర్జుమాదారుడు) కలుసుకొనవలసి యున్నది. నీవు ఎంతో డబ్బును ప్రోగు చేసుకొని ఉండొచ్చు, ఎందరో స్నేహితులను కలిగి ఉండవచ్చును...అది మంచిదే అయితే అవన్నియు రెండవ స్థానంలో ఉన్నవి, చరిత్రలోని దేవుని యందు నమ్మిక ఉంచుము, ఆయన ఈ దినపు దేవుడై యున్నాడు, కేవలం ఒకే రీతిగా ఉన్నాడు, ఆయన నీ కొరకు ఏమి చేస్తాడో చూడుము.

రోగముతో మరియు అవసరతతో ఉన్న మీరు బహుశా వైద్యులు మిమ్మును త్రోసి వేసి నీకు ఇంకా ఏమియు చేయలేము అని చెప్పవచ్చు. గుర్తుంచుకో చరిత్రలోని అదే దేవుడు ఈ దినమున కూడా మారనివాడై యున్నాడు. మనము తలలు వంచియుండగా మనం ఒక్క క్షణం ప్రార్ధన చేద్దాము.

45

ఇక్కడ ఎవరైనా ఈ రాత్రి యున్నట్లైతే, నాకు తెలియదు. ఇక్కడ యున్న వారు ఎవరైనా ఈ రాత్రి మీ ఆత్మకు రక్షణ కావలెనని ఎరిగినవారు, ఆయన ఒక క్షణములో, ఒక రెప్పపాటులో వస్తానని వాగ్దానము చేసియున్నాడు, మీరు అనుకొనని ఘడియలో, నీవు ఆయన లేకుండా ఉన్నట్లైతే, మీరు ఊహించడండి మీరు ఆయనను కలిగియుండండి, గుర్తుంచుకోండి,“ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు, తుదకు అది అతనిని మరణమునకు నడిపించును. నీవు రక్షించబడలేదని, నీవు దాని విషయములో సరైన అవగాహనను కలిగియుంటే, ఈ రాత్రి ఆయన రావలసియున్నట్లైతే, నీవు ఆయనతో వెళ్ళిపోతావు. నీవు అలాగు చేయగోరినట్లైతే, నీ చేయిని ఎత్తగలవా, అలా చేయుట ద్వారా, చెప్పు చెప్పు, ”దేవా నాపై కనికరమును చూపుము“. నీకు వందనములు. దేవుడు నిన్ను దీవించును. ఎన్నో చేతులు పైకెత్తబడినవి.

మనము ముగించక ముందు మరొకరున్నారా? మీరు ప్రార్ధన చేయండి. ప్రభువు నిన్ను దీవించును. యవ్వన స్త్రీ. ఇప్పుడు ఏమాత్రము సిగ్గుపడవద్దు. నిశ్చయముగా. చరిత్రలో దేవుని గూర్చి భోధిస్తే అది ఏ మంచి చేస్తుంది, ఆయన ఈ దినమున అదే దేవుడు కాని యెడల సహోదరి, సహోదరుడా, నేను దీనిని చెపుతాను. చరిత్రలోని దేవుని గూర్చి నేను ఒకసారి చదివి యున్నాను. అనేక పుస్తకములలో ఆయనను గూర్చి చదివియున్నాను. అయితే ఒక దినమున నేను ఆయనను కలుసుకొన్నాను.

46

నేను ఆయనను కలుసు కున్నాను. ఆయన నా యొద్దకు వచ్చాడు. నన్ను త్రాగవద్దని, పొగత్రాగవద్దని, నన్ను నేను అపవిత్రపర్చుకోరాదని, నేను పెద్దవాడైనైన తరువాత నాకు ఒక పని యున్నదని ఆయన నాతో చెప్పియున్నాడు. అడు నేను ఒక చిన్న బాలుడను. ఆయన-ఆయన దానిని ఋజువుచేశాడు. ఆయన దానిని చేశాడు. సైన్సు తీసిన ఆయన చిత్రము, ఇప్పుడు ఇక్కడ వ్రేలాడుచున్నది. చూడండి? అది ప్రపంచమునకు తెలుసు. మీ మధ్య ఆయన దానిని బుజువు చేసియున్నాడు. ఆయన ఈ దినమున అదే దేవుడైయున్నాడు, ఆయన చరిత్రలోనే ఒకే దేవుడు కాదు. కేవలము ప్రపంచము లోకము యొక్క చెత్తతో మరియు మురికితో నిన్ను దొంగచాటుగా నిన్ను త్రోసివేయనిమ్ము, ఇప్పుడే ఆయనను నమ్మండి. (టేపు మీద ఖాళాయున్నది-సంపా).

నీ చేతిని ఎత్తుతావా? ఇంక చెతులెత్తని కొందరు, మీ చేతులను ఎత్తి ఇలా చెపుతారా, “దేవా, దానిని గూర్చి నాకు నిశ్చయత లేదు, అయితే నాకు నిశ్చయత కావాలి. నన్ను...

దేవుడు నిన్నుదీవించును. యవ్వనస్దుడా, ఇంకెవరైనా?దేవుడు నిన్ను దీవించును, ఆ వెనుక సహోదరీ. దేవుడు నిన్ను దీవించును, సోదరుడా దేవుడు నిన్ను దీవించును. ఇంకెవరైనా యున్నారా? (సహోదరీ దేవుడు నిన్ను దీవించును) ఆ పైన సోదరుడా, దేవుడు నిన్ను దీవించును, అది మంచిది.

నీవంటావు, బ్రదర్ బిల్లీ నా చేతిని నేను ఎత్తినట్లైతే, దాని భావము నాకు ఏమైనాయున్నదా? నీవు ఒక్కసారి నీ చేతిని ఎత్తి, కనుగొనుము. ఎల్లప్పుడు సహోదరుడా, సహోదరీ, నీవు ఏదైన మంచి దానిని చేసినపుడు, నీవు దానిని గూర్చి మంచి అనుభూతిని ఇప్పుడు చెందుతావు. యదార్ధముగా యుండండి. దేవునితో అబద్దమాడవద్దు. నీవు దేవునితో అబద్దమాడుట లేదా ఆయనకు తెలుసు. నీవు నీతోనే అబద్దమాడు కొనుచున్నావు.

నీకు తెలుసా, ఒక అబద్దము ఎంత నాశనకరమైన సంగతో, చివరకు వారు నన్ను ఫెడరల్ కోర్టులోనికి తీసుకొనివెళ్ళినా, నేరస్టుల కోర్డులలో , వారు నీ చేతిమీద అబద్దాన్ని కనుగొనే పరికరాన్ని పెడతారు, నీవు దానిని చెప్పటకు నీ శాయశక్తులా ప్రయత్నించగలవు, అది యదార్ధము గా దానివలె శబ్దము నిస్తుంది. అయితే నీవు అబద్ధమును చెప్పచున్నావని నీ నరములు ఋజువుచేస్తాయి. ఎందుకు? నీవు అబద్దమాడటుకు తయూరు చేయబడలేదు. అబద్దమును కనిపెట్టు ఒక పరికరమే దానిని ఎరిగియున్నట్లైతే దేవుని గూర్చి ఏమిటి?

47

నీవంటావు,“అయితే సోదరుడా, నేను ఒక బాప్టిష్టును. నేను ఒక ప్రెస్బిటేరియన్ను, నేను ఒక మెథడిష్టును. అది సత్యము. నేను మిమ్మలను ఒక్క విషయము అడుగుచున్నాను. ఈ చరిత్ర యొక్క దేవుని నీవు ఎన్నడైనా కలుసుకొన్నావా? నీ ముందు మండుచున్న పొదలో ఆయన నిలబడియున్నాడా, నీకు తెలుసా? ఆయన తిరిగి నీ హృదయముతో మాట్లాడియున్నాడా, నీ పాపములు వెళ్ళిపోయినవి నీవు ఎరిగియున్నావా? అది అలా కాని పక్షమున, ఏదో సంఘములో చేరాలనే అవకాశమును నీవు ఎన్నడును తీసుకొన వద్దు లేక అక్కడకు వెళ్ళి ఒక చిన్న మంచి అనుభూతిని నేను దానిపట్ల కలిగియున్నానని చెప్పవద్దు. నీవు తప్పక ఆయనను ఎరుగవలసియున్నది. ఆయన గూర్చి వినుట కాదు, లేక ఆయన దీవెనలు పొందుటకాదు, ఆయన జీవమనగా, అయితే ఆయనను ఎరుగుటయే జీవము ఆయనను ఎరుగుట, వ్యక్తిగతముగా ఆయనను ఎరుగుట, ఆయనను, అనగా వ్యక్తిగత సర్వనామము, ఆయనను ఎరుగుట. ఆయన గ్రంథమును ఎరుగుటకాదు, ఒక మంచి బైబిలు విద్యార్థిగా యుండుట కాదు, ఒక మంచి సంఘ సభ్యుడివిగా ఉండుటకాదు, లేక ఒక మంచి మనిషిగా లేక మంచి స్త్రీగా యుండుటకాదు. అది దానిని చేయలేదు. ధర్మశాస్త్రము దానిని చేసినది. అయితే, ఆయనను ఎరుగుట. నీవు ఆయనను కలుసుకొన్నావా? మండుచున్నపొదలో నుండి మోషేతో మాట్లాడిన దేవుడు, నీ ముందుకు వచ్చియున్నాడా? ఆయన నీతో మాట్లాడుటను నీవు విని యున్నావా, చివరకు అది ఆయనే అని నీవు ఎరుగుదువా? ఆయన అలా నీతో మాట్లాడక పోయినట్లైతే, నీ చేతిని పైకెత్తి, చెప్పు,”దేవా, ఇప్పుడు నాతో మాట్లాడు. నా హృదయము చుట్టూయున్నఆలాపన నీవేనా. నేను-నేను నిన్ను ఎరుగగోరుచున్నాను“.

యవ్వనస్థులారా, ప్రభువు నిన్ను దీవించును. ప్రభువు నిన్ను దీవించును, ఆ వెనుక. అది బాగున్నది, అది మంచిది. ఇంకా ఎవరైనా లేనివారు. అది మంచిది దేవుడు నిన్ను దీవించును, సహోదరీ, యవ్వనస్థురాలా, ప్రభువు నిన్ను దీవించును, ఇక్కడ, అది మంచిది. దేవుడు నిన్ను దీవించును, ఆపైన అక్కడయున్న చిన్న స్త్రీ.

48

ఇప్పుడు మెల్లగా తలలు వంచి యుండగా, దానిని మృదువుగా ఆలపిద్దాము;

ఒక బంగారు ఉదయమున, యేసు వస్తాడు;

ఒక బంగారు ఉదయమున, యుద్ధములన్నీగెలవబడతాయి,

మనము విజయముతో కేక వేస్తాము, నీలి ఆకాశము బ్రద్దలు చేస్తూ,

ఒక బంగారు ఉదయము, నీ కొరకు, నా కొరకు.

(సోదరుడు బ్రెన్హాం, ఒక బంగారు ఉదయమున అను పాటను ఆలపించుచున్నారు-సంపా).

ఇప్పుడు చేతులను ఎత్తిన మీరు, మీ కొరకు నేను ఎంతగానో ప్రార్ధన చేయవలెనని మీరు కోరితే, మరియు దేవుడు నా ప్రార్థనను వింటాడని మీరు నమ్మినట్లైతే, ఇక్కడ యున్న వేదిక నొద్దకు నడిచి రావాలని మీరు కోరినట్లైతే, నన్ను మీతో ఇక్కడ నిలబడి కొంచెము ప్రార్ధన చేయనిమ్ము, వేదిక తెరువబడియున్నది. సోదరుడా, ప్రభువు నిన్నుదీవించును. అది నిజము పురుషులారా ప్రభువు మిమ్మను దీవించును. సహోదరీ ప్రభువు నిన్ను దీవించును. ఇక్కడ తిన్నగా పైకి వచ్చి నిలబడండి. నీవు నమ్మనట్లైతే దేవుడు నీకు సహాయము చేస్తాడు, మరియు ప్రార్ధన వింటాడు. ఆయన యొద్దకు వచ్చుటకు, ఆయనను ఎరుగుటకు నేను వచ్చి మీకు సహాయ పడవలెనంటే, తిన్నగా పైకి నడిచి రండి. మీరు వస్తారా?.

ఒక బంగారు ఉదయమున, యేసు.

(అది ఉదయమున ఉండదని నీకు ఎలా తెలుసు?).

......యుద్ధము.(ఇప్పుడు నీవు తిన్నగా పోరాడుచున్న యుద్ధము, ఇప్పుడే నీవు దానిని గెలువుము... ఇప్పడే నీవు దానిని గెలువుము, అప్పుడు నీవు విజయముతో కేక వేస్తావు...)

ఒక బంగారు ఉదయమున, నీ కొరకు, నా కొరకు ఒక బంగారు ఉదయమున, యేసు.

(తిన్నగా పైకి రండి, అది బాగుంది, తిన్నగా చుట్టూ మీరు పైకి రండి....)

..... యుద్ధములన్నియూ గెలువబడినవి;

మనము విజయముతో కేక వేస్తాము, నీలి ఆకాశము బ్రద్ధలు చేస్తూ,

ఒక బంగారు ఉదయము....

మేము కనిపెట్టుచుండగా, మీరు పైకి రారా? ప్రార్ధనలో మేము ఇక్కడ మీకు సహాయము చేస్తాము. విశ్వాససహితమైన ప్రార్ధన మనకు ఎంతో సహాయము చేస్తుంది. మీరు రారా? ఈ దినము యొక్క దేవుని అంగీకరించుమని, మీరందరిని నేను మిమ్మలను ఒప్పించుచున్నాను. కేవలము ఏదో ఒక దేవుడు కాదు, నీవు ఏదో సంఘమునకు వెళ్ళి, “మంచిది, నేను సంఘములో చేరియున్నాను”, అని చెప్పట కాదు. ఆ దేవుడు పని చేయడు. ఒక మెథడిష్టు దేవుడు, ఒక బాప్టిష్టు దేవుడు, ఒక ప్రెస్బిటేరియన్ దేవుడు, ఒక పెంతికొస్తు దేవుడు, వారు పని చేయరు. ఈ బైబిలులోని

దేవునిని తీసుకోండి. ఒక పెంతికొస్తు దేవుడు, ఒక మెథడిష్టు దేవుడు, ఒక బాప్టిష్టు దేవుడు, లేక ఏ యితర సంఘశాఖా దేవుడైనా లోకములోనికి వెళ్ళి పోతాడు. అయితే ఈ బైబిలు యొక్క దేవుడు నిన్నుయేసు వలె చేస్తాడు. ఆయన నిశ్చయముగా చేస్తాడు. ఆయన ఆత్మనీలో నివసిస్తుంది, మరియు నీ జీవితమంతయూ మార్పు చెందుతుంది, ఆ కోపము, ఆ ద్వేషము, ఆ క్షమించలేని ఆత్మ, అది నీ యొక్క ఆత్మను ఒక తప్పిపోయిన నిత్యత్వము లోనికి క్రుళ్ళిపోతుంది.

నేను కేవలము ఇప్పుడు వలను విసురుచున్నాను, అది నీ యిష్టము. దానిని లోనికి వెంబడించు, నీవు వెంబడించవా? తిన్నగా వేదిక నొద్దకు కదలండి. ఆ వెనుక అనేక మంది మీ చేతులను ఎత్తియున్నారు. వారి కుర్చీలగుండా ప్రజలు మిమ్మలను పైకి రానిస్తారు. యవ్వనస్థుడా, ప్రభువు నిన్ను దీవించును.

49

మెల్లగా ఆమె పాటను మీటు చుండగా, ఇక్కడ అనేకులు వేదిక చుట్టూ నిలబడియున్నారు. ఏడు ఆత్మలు ఇక్కడ వేదిక నొద్ద నిలబడి యున్నవి. మీకు తెలుసా, ఏడు దేవునికి ఒక పరిపూర్ణమైన సంఖ్య పరిపూర్ణత? ఇప్పుడే పరిశుద్ధాత్ముడు, ఇక్కడ నిలబడియున్న ఒక వ్యక్తి మీదకు దిగియున్నాడు. సోదరుడా, దానినే నేను పరిశుద్ధాత్మ అని పిలుచుచున్నాను.

ఇప్పుడు మీలోప్రతి ఒక్కరికి ఆయన ఇక్కడ యున్నాడు. మీ హృదయంలో దీనులుగా యుండండి. ఒక వేదిక చుట్టూ నీవు ఇలా నిలబడుట ఒకవేళ ఇది ఆఖరు సారియైతే, ఇప్పడే నీవు నీవు ఎన్నడైనా చేయునది ఇది చివరి ప్రార్థనయైతే? యేసు రాబోవుచున్నాడు. నీకు తెలుసా, ఉదయము కాకమునుపే, ఆయన నీ హృదయ ద్వారమును తట్టవచ్చు. ఒక దినమున నీవు తప్పక వెళ్ళవలసియున్నది. ఆయన అందరికీ దేవుడైయున్నట్లైతే, ఆయన చరిత్ర యొక్క దేవుడైయున్నాడు, మరియు ఆయన ఈ దినము యొక్క దేవుడైయున్నాడు. ఆయనతో నీతో మాట్లాడియున్నాడు. నీవు ఆయనను కలుసు కొనుటకు ఆయన ముందు నిలబడియున్నావు. నీవు ఆయనను కలుసు కొనుటకు ముందుకు వచ్చియున్నావు. ఆయన నిన్ను కలుసుకొంటాడు. ఆయన తిన్నగా ఇక్కడే నిలబడియున్నాడు.

నీవు చేసిన తప్పులన్నిటిని, నీ హృదయములో ఒప్పకొనుము. చెప్పు, “దేవా, పాపినైన నన్ను కనికరించుము. నేను తప్పుచేసియున్నాను మరియు నేను-నేను తప్పు అని నా హృదయమంతటితో ఇప్పుడు ఒప్పకొనుచున్నాను. నా పట్ల కనికరము చూపి నా పాపములను క్షమించుము. నేను-నేను నా శేష దినములన్నియూ నిన్ను సేవిస్తాను. ఇప్పుడు నా హృదయములో మండుచున్న ఈ చిన్న అగ్ని చిన్న విశ్వాసము, ఈ రాత్రి నన్ను ఈ వేదికనొద్దకు తెచ్చి యున్నది. అది నా హృదయాంతరంగములో లోతుగా నా ఆత్మను పట్టుకొననిమ్ము. ఏదో మండుచూ నాతో చెపుతుంది, 'అవును, యేసు నీవు జీవించుచున్నావు. నేను నిన్నుప్రేమించుచున్నాను.

మరియు కొన్ని గంటలలో, నీవు కార్యములను చేస్తూ, గొప్పకార్యములను చేస్తూ రంగము మీదికి వచ్చుటను నేను చూడబోవుచున్నాను. నీవు నా హృదయముతో మాట్లాడినపుడు, నేను ముందుకు వచ్చి యున్నందుకు నాకు ఎంతో సంతోషము. ప్రజలనుండి కాన్సరు వ్యాధులను నీవు తీసివేయుట, రోగులను స్వస్థపర్చుట అవసరతలోయున్న వారిని ఆదుకొనుటను, నీవు చేయబోవుచున్నావని, నేను నిన్ను చూస్తాను. దేవుడు వారికి ఏమి చేశాడో వారు సాక్ష్యమిస్తూ తిరిగి వెళ్ళుచుండగా, వారి ప్రార్థన వినుము, చరిత్రలోని దేవుడు, చరిత్రలో నుండి ఆయన పైకి లేచియున్నాడు, మరియు ఆయన ఈ దినమున ఒకటే రీతిగా యున్నాడు, రంగము మీదికి వచ్చుచున్నాడు. కారణము, ఈసారి ఆయన ఉండిపోవుటకు వచ్చుచున్నాడు. ఆయన రెండవరాకడ. ఇప్పుడు మనము ప్రార్ధన చేసికొందాము, మీలో ప్రతిఒక్కరూ ఇప్పుడు నాతో ప్రార్ధించండి.

50

ప్రియమైన దేవా, ఈ ఏడుగురిని ఇప్పుడు నీ ముందుకు తెచ్చు చున్నాను. మొదటి రాత్రి ఏడు అద్భుతమైన నక్షత్రములను ఉత్పత్తి చేసియున్నది. నీ ప్రశస్తమైన వాక్యములో నీవు చెప్పియున్నావు, “నా తండ్రి, మొదట ఆకర్షించితేగాని యెవడును నా యొద్దకు రాడు. మరియు నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను, మరియు అతనికి నిత్యజీవమునిచ్చి, అంత్యదినమున అతనిని లేపుదును”. ప్రభువా, అది నీ వాగ్దానమైయున్నది, ఒక ఒప్పుదల ద్వారా, ఒక కదలిక ద్వారా ఈ ఏడు ప్రశస్తమైన అద్భుతమైన ఆత్మలు, ఈ రాత్రి ముందుకు అడుగు వేసియున్నారు, కారణము ప్రవక్తలతో మాట్లాడిన ఆ దేవునిని, గ్రుడ్డివానితో మాట్లాడిన ఆ దేవునిని వారు నమ్మియున్నారు. ఆయన ఇంకనూ ఈ దినమున జీవించుచున్నాడు. మరియు ఆయనను కలుసుకొనుటకు వారు ముందుకు అడుగులు వేసియున్నారు. ఆ వాగ్దానము చేసిన అదే దేవుడు, అతని సొంత ఇష్టముపై కలుసుకొనియున్నాడు. నడి యొడ్డున ఆ రక్తస్రావముగల స్త్రీని కలుసుకొనియున్నాడు.

లాజరు సమాధి నొద్ద మరణమును ఆయన ఎదుర్కొని అతనిని బ్రతికించిన దేవుడు, ఈ రాత్రి అదే దేవుడైయున్నాడు. ఆత్మసంబంధమైన మరణమును ఇప్పుడు ఆయన ఎదుర్కొని అతనిని పైకి త్రిప్పి ఇలా అంటాడు, “నా ఆత్మయొక్క ప్రేరేపణ ద్వారా నన్ను ఒప్పుకొనుటకు వచ్చిన, వీరిపై నీ చేతులను తీసివేయుము. నేను వారికి నిత్యజీవమునిస్తాను. మరియు ఎవడును వారిని నా యొద్దనుండి తీసుకొనలేడు. అంత్యదినమున నేను వారిని లేపుదును”.

51

వారిని బట్టి నీకు వందనములు, తండ్రీ. మరియు మరణము వారిని స్వతంత్రులుగా చేయు వరకు వారు నీ చేతులలో నమ్మకముగా నిలిచియుందురుగాక. ఆ గొప్ప దినమున, ప్రభువు యొక్క ఆనందములో వారు ప్రవేశించినపుడు, అప్పుడు ఆకాశము ఈ వైపునుండి ఆ వైపునకు పెండ్లి విందు సిద్ధపరచబడినపుడు, రాజు వారి యొద్దకు వచ్చి ఇలా అంటాడు, ఆ చిన్న కాంక్రీటు ఆలయమునొద్ద, 1958వ సంవత్సరమున అక్టోబర్ 1వ తారీకున నీకు గుర్తున్నదా? నీవు పైకి వచ్చి నన్నునీ రక్షకుడిగా స్వీకరించియున్నావు. నేను నీతో మాట్లాడియున్నాను. అప్పుడు నీవు ఒక పాపివై యున్నావు, అయితే ఇప్పుడు నేను నిన్ను రక్షించియున్నాను. ఇప్పుడు నీవు నా వాడవు, నీవు నిత్యజీవమును కలిగియున్నావు. ఇప్పుడు జగత్తు పునాది నుండి నేను నీకు సిద్ధపరచిన ఆనందములో ప్రవేశింపుము“. ప్రభువా, దానిని దయచేయుము. ఇప్పుడు వారు నీవారై యున్నారు. యేసుక్రీస్తు నామములో వారిని మేము నీకు అప్పగించుచున్నాము. ఆమెన్.

52

ఇప్పుడు మీ తలలు వంచియుండగా, శ్రోతలు (ఇక్కడ వేదికనొద్ద), మీలో ప్రతి ఒక్కరిని నేను అడుగబోవుచున్నాను. మీ హృదయాంతరంగములో, మీ ఆత్మ యొక్క లోతులలో, ఆ చిన్న విశ్వాసపు మంట, నీవు ముందుకు వచ్చి వేదికనొద్ద, నీవు చేసిన ఈ కార్యమును నీ ద్వారా చేయించినదని నీవు భావించుచున్నావు, నీ చేతులను ఎత్తిన తరువాత ముందుకు నడిచివచ్చినపుడు, ఆ చిన్న మంట నీలో మండుచున్న ఆ చిన్నమంట, నీ హృదయములో నిజమైన సజీవమైన విశ్వాసముగా అది మండుచున్నదని నీవు భావించుచున్నావా? యేసు నీ పాపములను క్షమించియున్నాడని నీవు నమ్ముచున్నావు, మరియు ఇప్పటి నుండి నీవు ఆయన వాడవు కాబోవుచున్నావు? వేదిక చుట్టూయున్నవారు, యేసు మీ పాపములన్నిటిని క్షమించియున్నాడని మీరు భావించినట్లైతే, మీ కుడి చేతిని పైకెత్తండి. చుట్టూయున్న ఒకరు...

ఇప్పుడు, రెండు, మూడు చేతులు పైకెత్తలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రార్ధిస్తూ యుండండి.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...