సంఘ క్రమము

సంఘ క్రమము

VGR COUNT-67 గుడారములో అయిదు రాత్రుల కూడికలను మేము ఇప్పుడే ముగించియున్నాము, దేవుని కృప మరియు ఆయన యొక్క సహాయమును బట్టి, లేఖనముల ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘమును క్రమములో ఉంచుటకు నేను చాలా కష్టపడియున్నాను, బ్రెన్హాం గుడారములో అని మేము నమ్ముచున్నాము.

నేను చెప్పుటకు ఇష్టపడుతున్న మొదటి సంగతి, నేను లేనప్పుడు ప్రతి సారి కాపరే గుడారమును గూర్చి పూర్తి బాధ్యత వహించుచున్నాను, మరియు నేను తిరిగి వచ్చినప్పుడు కాపరి వైపే నేను చూచెదను. కనుక, నేను బయటకు వెళ్ళినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వము క్రింద ఆయన ఏదైతే మంచిది అని అనుకొనుచున్నారో దానిని చేయడం లేక మార్చడం లాంటివి చేయడానికి ఆయన పూర్తి అధికారమును కలిగియున్నాడు.

2

ఈ దినమున ఉన్న జనులకు అపోస్తలుల సంఘ బోధ, అపోస్తలుల ఆశీర్వాదములు ఉన్నవని మనము నమ్ముచున్నాము. మనము సంపూర్ణ సువార్త యందు నమ్మిక యుంచి యున్నాము, ఆయన తిరిగి వచ్చేంత వరకు ప్రభువైన యేసుక్రీస్తు పలికినట్లుగా సూచనలు మరియు అద్భుత కార్యములన్నీ అయన సంఘమును వెంబడించునని మనము నమ్ముచున్నాము. మనము ఆ సంగతులను నమ్ముచున్నాము, మరియు వాటిని క్రమములో ఉంచవలెనని నమ్మేదము, సంఘము దాని యొక్క క్రమమును కలిగియున్నది. ప్రతీ ఒక్క సంఘము దానియొక్క సిద్ధాంతములను మరియు క్రమమును మరియు క్రమశిక్షణన కలిగియున్నది.

మా సంఘములో చేరేవారిగా (joiners) ఉన్న సభ్యులను ఎవరిని కలిగిలేము. సజీవుడైన దేవుని యొక్క విశ్వవ్యాప్త సంఘములోని సభ్యులందరూ మన సహోదరీ, సహోదరులమని మసము నమ్మెదము; మరియు ఆ జనులందరికీ ఎల్లప్పుడూ ఆహ్వానము, వారు ఏ సంఘ శాఖకు చెందినవారైనా, ఇండియానాలోని జెఫర్సస్ విల్ లోని 8వ పెన్ వీధిలోని, బ్రెన్హాం గుడారము మీకు ఎల్లప్పుడూ ఆహ్వానము పలుకుచున్నది.

3

రోమా 5:1, లోని విశ్వాసము ద్వారా నీతీకరణను నమ్ముచున్నాము. ఒక వ్యక్తి విశ్వాసము ద్వారా నీతీకరించబడిన తరువాత, అతడు ప్రభువైన యేసుక్రీస్తుతో సమాధానము కలిగియున్నాడని మనము నమ్ముచున్నాము; కాని అదే వ్యక్తి త్రాగుడు, పొగత్రాగుట, అతడు చేయకూడని కార్యములు చేయుట, శరీరసంబధమైన చెడు అలవాట్లను కలిగియుండుట కూడా సాధ్యమే.

ప్రభువు యొక్క సేవకొరకు యేసుక్రీస్తు యొక్క రక్తము ఈ వ్యక్తిని శుద్ధీకరించునని అప్పుడు మనము నమ్మేదము. మరియు అది... హెబ్రీయులకు 13:12-13 ప్రకారము శుద్ధీకరణను నమ్ముచున్నాము: “కావున యేసు కుడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమపొందెను.” మరియు ఇప్పుడు మనము జీవించుచున్న కొత్త నిబంధన కాలము యొక్క విశ్వాసుల కొరకు క్రొత్త నిబంధనలో ఈ శుద్దీకరణను గూర్చి బోదింపబడుతున్నదని మనము నమ్ముచున్నాము.

మరియు ఆ వ్యక్తి శుద్దీకరింపబడిన తరువాత, అపరిశుభ్రమైన అలవాట్లు అన్నీ ఆ వ్యక్తిలో నుండి వెళ్ళిపొయినవి (అతడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విశ్వాసి మరియు అతడి అలవాట్లు అన్నీ వెళ్ళిపోయినవి), అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము కొరకు అతడు తగినవాడని, అది విశ్వాసిని నింపుట కొరకు వచ్చుచున్నదని కూడా మనము నమ్ముచున్నాము. మరియు అప్పుడు ఆ విశ్వాసీ...

అది కేవలము, నేను మీకు చాలా సార్లు బోధించినట్లుగా ఉన్నది, అది ఒక కోళ్ళ మందలో నుండి ఒక గ్లాసును బయటకు తీయునట్లుగా. నీతీకరణ అనగా, హృదయములో ఒక ఉద్దేశ్యముతో, “దానిని పైకి తీయుట, అది ఉపయోగించుటకు సిద్దము చేయుట.” ఒక పాపికి దేవుడు చేయునది అదియే. అతడు ఇంకనూ మురికివాడే.

అప్పుడు అతడు యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా శుభ్రపరచబడును. మరియు శుద్ధీకరణ అనేది రెండు అర్ధములనిచ్చు పదమైయున్నది, అంటే అర్ధము, “శుభ్రము చేయబడి, మరియు సేవకొరకు ప్రక్కన పెట్టబడినది.” పాత నిబంధనలో, బలిపీఠపు పాత్రలు శుద్దీకరించబడి, మరియు సేవకొరకు ప్రక్కన పెట్టబడినవి.

4

మనము నమ్ముచున్నాము, పరిశుద్ధాత్మ అదే పాత్రను సేవలో పెట్టుచున్నది; పరిశుద్ధాత్మ అనేది కృప యొక్క మరొక మెట్టు కాదు, కాని వరములను తీసుకొనుటకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు - అదే అధికమైన కృపతో నింపబడిన విశ్వాసి ద్వారా సూచనలు మరియు అద్భుతములు వాటికవే ప్రత్యక్షపరచబడును. (I కొరింధి 12లో పలుకబడిన అపోస్తలుల వరములు).

లేఖనములో బోధింపబడినట్లుగా నేను నమ్ముచున్నాను, “వరములు మరియు పిలుపులు మారుమనస్సు లేకుండగనే కలిగియుండును,” మనము ఈ లోకములో జన్మించినప్పుడు, మనము ఒక ఉద్దేశ్యముతో ఇక్కడకు పంపబడియున్నాము, అది దేవునిది. మరియు మనము పెద్దవారిగా మారక మునుపే మనము ఇంకనూ పిల్లలముగా ఉన్నప్పుడే, దేవుని ద్వారా మనము కలిగియున్న ఆ వరములు అప్పుడే మనలో ఉన్నవి. మరియు పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఈ వరములను క్రియారూపములోనికి తీసుకొనివచ్చును (కాని ప్రారంభములోనే మనము వాటిని కలిగియున్నాము), అది I కొరింధీ 12 ప్రకారము - ఉపదేశకులు, మరియు అపోస్తలులు, మరియు ప్రవక్తలు, మరియు భాషల యొక్క వరములు మరియు తొమ్మిది ఆత్మీయమైన వరములు. ఇప్పుడు ఈ వరములు క్రియారూపములో ఉన్నవని మనము నమ్ముచున్నాము, మరియు అవి ప్రతీ స్థానిక సంఘములోను ఉండవలెను.

అయినప్పటికి, దానిలో ప్రపంచ వ్యాప్తముగా అపోస్తలుల విశ్వాసులమని బహిరంగముగా చెప్పుకొను జనులు చాలా మూఢభక్తిలో చిక్కుకొని యున్నారని మనము కనుగొన్నాము. కేవలము ఇతర పద్ధతులలో ఉన్నవారివలె, మరియు అటువంటి వారు, మనము మూఢులను కలిగియున్నాము, అన్ని యుగముల గుండా, అటువంటి వారిని మనము కలిగియున్నాము. వారు అపోస్తలుల యొక్క దినములోనే దానిని కలిగియున్నారు. మరియు పౌలు అక్కడ చెప్పియున్నాడు, ఏ విధముగా కొందరు వచ్చి మరియు ఇతర సిద్ధాంతములను మరియు అటువంటివి బోధించి, బలవంతముగా ఒప్పించి, వాటి వైపు త్రిప్పువారిని గూర్చి. కాని ఆయన యొక్క సొంత బోధలోనే అయన చెప్పెను, అతడు బోధించినది కాక - మరొక దానిని పరలోకము నుండి వచ్చిన ఒక దూత మీకు బోధించినా, “అతడు శాపగ్రస్తుడవును గాక.”

5

కనుక 8వ పెన్ వీధిలో ఉన్న బ్రెన్హాం గుడారమైన మేము, క్రొత్త నిబంధన యొక్క బోధనలను వెంబడించుటకు ప్రయత్నించుచున్నాము. ఏలయనగా యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడని; మరియు అపోస్తలుడైన పౌలు అన్యజనుల యొక్క సంఘమును క్రమములో పెట్టుట కొరకు, దేవుని యొక్క ఎన్నిక ద్వారా పిలువబడి మరియు ఎంపిక చేయబడిన పాత్రగా పంపించబడియున్నాడని మేము నమ్ముచున్నాము.

ఇప్పుడు, బైబిలులోని అపోస్తలుల యొక్క బోధనుబట్టి, “ప్రభువైన యేసుక్రీస్తు నామములో ముంచుట ద్వారా నీటి బాప్తిస్మమును,” ఈ బ్రెన్హాం గుడారములో మేము నమ్ముచున్నాము. మరియు సభ్యులందరూ... లేక అటువంటి దానిని ఆశించి బ్రెన్హాం గుడారమునకు వచ్చిన వారెవరైనా, ఏ సమయములోనైనా ప్రభువైన యేసు నామములో ముంచబడుటకు కోరుకొన్నవారు, కాపరిని సంప్రదించవచ్చును. మరియు ఒకవేళ వారు మారుమనస్సు పొంది, మరియు ప్రభువైన యేసుక్రీస్తు యందు నమ్మిక కలిగియుండినయెడల, ఎంత త్వరగా అయితే అంత త్వరగా, అయినప్పటికీ అతడు ఇవ్వగలిగినయెడల, తక్షణమే ఆ కాపరి మీకు బాప్తిస్మమిచ్చును. ఆ విధముగా చేయుట ద్వారా అది వారిని విశ్వాసుల యొక్క సహవాసములోనికి తీసుకొని వచ్చును.

నీటి బాప్తిస్మము ద్వారా మనము సహవసములోనికి తీసుకొని రాబడుచున్నామని మనము నమ్ముచున్నాము, కాని పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము ద్వారా మనము సభ్యునిగా... ప్రపంచ వ్వాప్తముగా ఉన్న యేసుక్రీస్తు యొక్క శరీరములో సభ్యులుగా ఉండుట కొరకు తీసుకొని రాబడుచున్నాము.

6

ఇప్పుడు మనము మరొక సంగతిని నమ్ముచున్నాము, లాభాపేక్ష లేకుండా ఆత్మ ప్రత్యక్షత ప్రతీ వ్వక్తికి ఇవ్వబడుచున్నది. ఇప్పుడు, మనము నమ్ముచున్నాము, ఈ వరములు మరియు అటువంటివి సంఘములో పనిచేయుచున్నప్పుడు... అవి ఆత్మ ద్వారా వరములను కలిగియున్న జనులు వచ్చి మరియు మనతో ఆరాధించవలేనని, తనది కాని దానికొరకు ఆపేక్షించువారి వలె మనము ఆశించుచున్నాము.

ఇప్పుడు, చాలా స్థలములలో, మనము కనుగొనెదము జనులలో నున్న ఈ వరములు... ఎలా మరియు ఎప్పుడు ఈ వరములను ఉపయోగించవలెనని జనులకు అర్ధము కాదు. మరియు ఆ విధముగా చేయుట ద్వారా వారు ఒక నిందను మాత్రమే తీసుకొని వచ్చెదరు; అది ఈ దినములలో దేవుని ద్వారా సంఘమునకు ఇవ్వబడిన ఈ అద్భుతమైన ఆశీర్వాదములను బట్టి బయటనున్న వారిని, అవిశ్వాసులను మరియు అటువంటివారిని సాతాను భయపెట్టుటకు ప్రయత్నించుచున్నదని మనము నమ్ముచున్నాము.

పౌలు చెప్పెను, “ఏకముగా కూడి అందరూ భాషలతో మాటలాడుచుండగా, అన్యుడెవరైననూ లోపలికి వచ్చినయెడల, మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకొందురు గదా? కాని ఒకవేళ ఒకరు ప్రవచించి, మరియు హృదయ రహస్యములు బయలు పరచినయెడల, అప్పుడు వారు సాగిలపడి, 'నిజముగా, దేవుడు మీలో ఉన్నాడని చెప్పుదురు.'”

7

ఇప్పుడు, విశ్వాసుల మధ్యలో ఆత్మీయ వరములు ఆ దినమునకైన క్రమమని మనము నమ్మెదము. ఒక వ్యక్తి ప్రేరేపణ ద్వారా ప్రసంగించి మరియు అప్పుడు... లేక ఒక ప్రేరేపించబడిన ఉపదేశకునిగా ఉండి, మరియు స్వస్థత వరమును తిరస్కరించి, లేక ప్రవచనా వరమును, లేక భాషలతో మాట్లాడుటను, లేక భాషలకు అర్ధము చెప్పుటను, లెక ఇటువంటి వరములేవైననూ తరస్కరించెదరని మనము నమ్మలేము.

కాబట్టి, జెఫర్సన్ విల్ లో 8వ పెన్ వీధిలో ఉన్న బ్రెన్హాం గుడారము ఈ విధముగా పనిచేయాలని, దేవుని వాక్యమునందు ఇదినా నమ్మిక అయి యున్నది. నేను అనుకొనుచున్నాను, మొదటి సంగతి, మరియు నమ్ముచున్నాను, నేను చెప్పుచున్న ఈ సంగతులు, ప్రభువులో ఎదుగుటకు బ్రెన్హాం గుడారములో ఖచ్చితముగా మరియు ఈ విధముగా కొనసాగించబడాలని కోరుచున్నాను. మరియు ఒకవేళ ఏ సమయములోనైనా ఇవి... ఇవి ప్రశ్నింపబడవచ్చును, దానియందు ప్రశ్న కలిగి ఉన్న వ్యక్తి ఒకవేళ వారు కాపరి యొద్దకు వెళ్ళలేనియెడల నన్ను సంప్రదించవచ్చును, లేక వారు కాపరిని సంప్రదించవచ్చును. ఒకవేళ నేను ఇంటి దగ్గర ఉన్నా, యాత్రలకు సువార్తకు లేక పరిచర్యకు వెళ్లినా, సంఘమునకు లేక కాపరికి ఏ సమయములోనైనా సహాయపడుటకు ఆనందించెదను. మరియు ఈ సంగతులన్నీ లేఖనానుసారము మరియు ఇది సంఘ క్రమము అని నేను నమ్ముచున్నాను.

8

నేను నమ్ముచున్నాను, మొదటిగా, ఈ బ్రెన్హాం గుడారమునకు చెందిన ప్రతీ సభ్యుడు, లేదా ప్రతీ ఆరాధికుడు ఒకరితో ఒకరు చాలా దైవికమైన ప్రేమను కలిగియుండాలి, ఎంతవరకంటే... రాత్రికాల కూడికల తరువాత ఒకరితో ఒకరు విడిచి వెళ్ళుటకు, వారు విడిచి వెళ్ళవలసి వచ్చినప్పుడు వారి హృదయములు ఒకరికొకరు వీడిపోనట్లుగా. దైవికమైన ప్రేమలో నేనొక నిజ విశ్వాసిని. అదే పరిశుద్ధాత్మ యొక్క రుజువని అపొస్తలుడైన పౌలు చెప్పెను. “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరునూ తెలిసికొందురు,” అని యేసు చెప్పెను.

మరియు మనందరికోసము చనిపోవుటకు యేసుక్రీస్తును భూమి పైకి పంపినది ఆ దేవుని యొక్క ప్రేమే అని మనము నమ్ముచున్నాము. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టినవానియందు విశ్వాముంచు ప్రతివాడును నశింపక, నిత్యజీవము పోందునట్లు ఆయనను అనుగ్రహించెను.” మరియు ఇక్కడ నిత్యజీవమనగా, దేవుని యొక్క సొంత జీవమైయున్నది, ఎందుకనగా మనము పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము ద్వారా దేవుని యొక్క కుమారులము మరియు కుమారైలమగుచున్నాము; అదే అబ్రహాము యొక్క సంతానము, అతడు సున్నతి పొందక మునుపే దేవునిని నమ్మియున్నాడు, మరియు అటువంటి అబ్రహాము కలిగియున్న విశ్వాసమును మనకి ఇచ్చును.

9

ఇప్పుడు, తరువాత సంగతి, ఈ ఆరాధికులు ఒకరినొకరు కలుసుకొనవలయును, ఈ వరము కలిగియున్న జనులు, “భాషలు మాట్లాడువారు, మరియు ప్రత్యక్షతలు పొందుకొను జనులు మరియు అనువాదములు మరియు అటువంటివి అని మనము నమ్ముచున్నాము. ఈ సభ్యులు, లేక ఈ విశ్వాసులు కూడిక ప్రారంభమవ్వడానికి నలభై-అయిదు నిమిషములు లేక ఒక గంట ముందు ఒకరితో ఒకరు సమకూడవలయును. సంఘము (ఆలయము) త్వరగా తెరవబడవలెను, మరియు ఈ రాత్రులలో విశ్వాసులందరూ కలిసి రావలయును, మరియు... కూడిక ప్రారంభమవ్వడానికి కనీసము నలభై-అయిదు నిముషములు లేక ఒక గంట ముందు రావలెను.

10

బ్రెన్హాం గుడారములో ఎల్లప్పుడు ఒక ఆత్మతో నింపబడిన పియానో వాయించువాడు ఉండవలెనని నేను నమ్ముచున్నాను, అతడు త్వరగా వచ్చి, ఆత్మతో నింపబడి, మరియు ఆత్మీయమైన సంగీతమును మృదువుగా, చాలా సున్నితముగా వాయించవలయును, ఎలాంటివి అనగా,

అక్కడ సిలువలో రక్షకుడు చనిపోయెను,

అక్కడ పాపములను కడుగుకొనుటకు నేను ఏడ్చాను;

అక్కడ నా హృదయముపై రక్తము ఆపాదించబడెను,

ఆయన నామమునకు మహిమ!

అటువంటి క్రమములో “నా దేవుడు, నీకు దగ్గరగా,” “యుగముల బండ, నా కొరకు చీల్చబడెను,” లేక “సిలువ దగ్గర,” లేక అటు వంటివి క్రమములో మృదువుగా, నెమ్మదిగా, అతడు పరిశుద్ధాత్మలో ఆ విధముగా ధ్యానిస్తూ ఉండగా, (అతడు లేక ఆమె, ఎవరైనా.)

మరియు లోపలికి వచ్చుచున్న ఆరాధికులందరూ కలుసుకొని, మరియు వారి... వారి కోట్లు మరియు టోపీలు వారికి చూపించబడిన సీట్లకు తగిలించుకొని, ఆతిధ్యముతో, ఆత్మతో నింపబడిన డీకన్లు లేక ద్వారపాలకులు మాత్రమే చేయగలరు, మరియు ప్రేమలో సజీవుడైన దేవుని సంఘము కొనసాగుట చూడవలయునని నేను నమ్ముచున్నాను.

11

ఈ ఆరాధికులు ఒకరితో ఒకరు మాట్లాడుకొనకూడదు, మరియు దూరముగా నున్నవారితో మాట్లాడుట, మరియు సంఘములో అల్లరి చేయకూడదు.

వారందరూ కలిసి రావలయును. మొదటిగా, కొద్ది క్షణములు బలిపీఠము ఎదుట, నిశ్శబ్దముగా ప్రార్ధించవలయును. గట్టిగా ప్రార్ధించకూడదు, మీరు ఇతరులకు అంతరాయము కలుగజేసెదరు; నిశ్శబ్దమైన ప్రార్ధన, మీరు ఆరాధనలో ఉండెదరు. అది నాటుకొననివ్వండి. మీ ఆత్మలో, ఆరాధించుట, అప్పుడు మీ స్థలమునకు తిరిగి రండి.

లేక, మీరు బలిపీఠము యొద్దకు వెళ్ళనవసరము లేదు. కేవలము వెళ్ళి, మీ కొరకు ఒక స్థలము చూసుకొని, కూర్చొని, సంగీతము వినుచూ, కళ్ళుమూసుకొని, తలలు వంచుకొని, మరియు నిశ్శబ్దముగా ఉంటూ, ఆ విధముగా దేవున్ని ఆరాధిస్తూ ఉండండి.

12

అప్పుడు ఒకవేళ ఆత్మ ఇతరులకు ఏదైనా బయలు పరచగోరినయెడల, లేక ఎవరైనా ఒక స్థలమునకు ఆత్మతో నింపబడివారు భాషలతో మాట్లాడగలిగినయెడల, అప్పుడు ఆ వ్యక్తి లేచి మరియు వర్తమానమును ఇవ్వవచ్చు. మరియు ఆనువాదము వచ్చేంత వరకూ ప్రతీ ఒక్కరూ సమాధానము కలిగియుండవలెను.

అనువాదము వచ్చినప్పుడు, అది కేవలము లేఖనములను సూచించుట కాదు, లేక అర్ధము లేనిదిగా ఉండుట కాదు. అది సంఘమునకు నేరుగా (సూటిగా) ఇవ్వబడిన వర్తమానముగా అది ఉండవలయును, లేక అది శరీరానుసారమైనది అని మనము అనుకొనెదము. అటువంటివి ఎక్కువగా చూచెదము. సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయుట కొరకు మాత్రమే ఆత్మ మాట్లాడునని నేను నమ్ముచున్నాను.

13

మరియు ఇప్పుడు ఈ క్రమములో ఉన్న వర్తమానముగా ఇది ఉంటుంది, బహుశా, జనులు ఈ సమయానికి సమకూడుతూ ఉండవచ్చు, కొంతమంది రోగులు వచ్చియున్నారు. బహుశా అక్కడ ఒక వ్యక్తి పక్షవాతముతో లేక మరి దేనితోనో పడియున్నాడు, అంతకు ముందెన్నడూ మీరు అతనిని చూడలేదు. కాని అనువాదము వచ్చినప్పుడు, అది ఈ క్రమములో ఉండును, ఆ అనువాదకుడు లేక ఇప్పుడే మాట్లాడే ఆ వ్యక్తి, “మంచిది, ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మన మధ్యలో ఉన్న ఆ వ్యక్తి ఫలానా - ఫలానా స్థలము నుండి వచ్చియున్నాడు,” మరియు స్థలమును చెబుతాడు. మరియు అతడు పక్షవాతము కలిగియున్నాడు, ఎందుకనగా మూడు లేక నాలుగు సంవత్సరాల క్రితము,“ లేక మరేదైనా... బహుశా ఆ కారణము, అతడు ఏదైనా చెడు చేసియున్నాడు, తన భార్యను మరియు బిడ్డలను విడిచిపెట్టిన విధముగా, మరియు వారినుండి పారిపోవుట లాంటిది. మరియు అతడు వడ్రంగి పని చేసేబల్ల అటువంటిది ఏదైనా దాని మీద నుండి పడిపోయి, మరియు గాయపడి యున్నాడు, మరియు అది అతడిని పక్షవాతమునకు గురిచేసింది. ”ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఒకవేళ దానిని గూర్చి అతడు పశ్చాత్తాపము పొంది, మరియు తన భార్య యొద్దకు వెళతానని వాగ్దానము చేసి మరియు ఆమెతో అతడు సమాధానపడుటకు ఇష్టపడితే, అప్పుడు అతడు స్వస్థత పొందుకొని మరియు తిరిగి కుటుంబము యొద్దకు వెళతాడు.“

14

మరియు ఎవరైనా, ఏదైనా చెప్పడానికి ముందే, లేచి నిలబడి మరియు అది ప్రభువు యొద్ద నుండి వచ్చినది అని చెప్పుటకు, మంచి ఆత్మ వివేచన కలిగి సువార్త సిద్దాంతములో ఆత్మీయమైన స్థిరత్వము కలిగిన వారు ఆ భవనములో కనీసము ఇద్దరూ లేక మరెక్కువ మంది జనులు ఉండవలెను.

మరియు ఒకవేళ ఈ సంగతి జరుగకపోతే, ఇంక అప్పుడు భాషలను గూర్చి సంఘములో ప్రస్తావించకూడదు. ఒకవేళ ఆ వ్యక్తి భాషలలో మాట్లాడితే, పౌలు చెప్పెను, “అర్ధము చెప్పువాడు లేనియెడల” మరియు అటువంటిది, “వారిని ఇంటి దగ్గర మాట్లాడుకొననివ్వండి, లేక వారు ఎక్కడైతే అక్కడ; ఏలయనగా వారు వారికి మాత్రమే ఆశీర్వాదముగా ఉంటారు, మరియు అది సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు కాదు.”

15

అప్పుడు ఆ వ్వక్తి, మాట్లాడుట మరియు అనువాదము తరువాత; మరియు అప్పుడు ఇద్దరు లేక ముగ్గురు తీర్పరులు, పరిశుద్దుడైన పౌలు యొక్క బైబిలు సిద్ధాంతము ప్రకారము అది ఇద్దరూ లేక ముగ్గురు తీర్పరుల ద్వారా తీర్పు తీర్చబడవలయును; వెళ్ళుటకు పిలువబడిన ఆ వ్యక్తిని వెళ్ళ నివ్వండి... బహుశా, అది ఒక ఖచ్చితమైన వ్వక్తిని సూచించును, లేక కాపరి లేక ఎవరైనా వెళ్ళి, ఆ వ్యక్తి పై చేతులు ఉంచవలెనని, మరియు అది... రోగమైనా లేక బాధ అయినా, వారు స్వస్థత పొందుకొనెదరు. అప్పుడు కాపరియైనా లేక ఇతర వ్యక్తి అయినా, ఎవరైనా, విశ్వాస సహితమైన ప్రార్ధన ప్రార్ధించుటకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపింపబడినవారు, వారు వెళ్ళి, ఆత్మ చెప్పిన విధముగా ఆ వ్యక్తికి పరిచర్య చేయవలెను.

అప్పుడు ఆ సమయములో, ఆ వ్యక్తి... మరియు పరిశుద్ధాత్మ చెప్పిన విధముగా, అది అప్పుడే పరిశుద్ధాత్మ దానిని ఇచ్చిన విధముగా నెరవేరును. మరియు అప్పుడు ఆ జనులు ఆనందించి, మరియు కృతజ్ఞత కలిగియుండి, మరియు దేవునిని ఘనపరచి మరియు ఆరాధించెదరు, ఎందుకనగా దేవుడు ఆరాధనను కోరుచున్నాడు.

16

అప్పుడు వారు తలలు వంచి మరియు తిరిగి ప్రార్ధనలో ఉండెదరు, ఒకవేళ పరిశుద్ధాత్మ మరొక వర్తమానముతో ఈ వరములు ప్రత్యక్షపరచునేమో అని చూచెదరు.

మరియు ఒకవేళ ఏ సమయములోనైనా ఒక వ్యక్తి భాషలతో మాట్లాడినా, మరియు అనువదించినా, మరియు తీర్పరులు ఆ వ్యక్తిని పంపెదరు... అతడు చెప్పినదంతా జరుగుట చూచువరకు, మరియు అది నెరవేరనియెడల, మొత్తము సమూహమంతా బలిపీఠము దగ్గరకు వెళ్ళి మరియు అటువంటి ఆత్మను వారి యొద్ద నుండి తీసివేయమని ప్రార్ధించుట కొరకు, ఎందుకనగా అటువంటి ఆత్మ ఉండుటను ఎవరూ కోరుకొనరు. అది తప్పైనది అని మనము ఎరుగుదుము, మరియు అది శత్రువుది మరియు దేవునిది కాదు, ఎందుకనగా దేవుడు సత్యము మాత్రమే చెప్పగలడు. ఈ సూతన క్రమమును మీరు ప్రారంభించే ముందు, అది సంఘము స్పష్టముగా అర్ధము చేసుకొనవలయును.

17

అప్పుడు, అది బహుశా ఈ విధముగా ఉండవచ్చు, వర్తమానము ఒక సహోదరునితో, బహుశా ఒక రైలు పట్టాల మార్గము లేక అటువంటి దాని దగ్గర జీవించుచున్న అతడిని అక్కడ నుండి బయటకు వెళ్ళమని చెప్పు విధముగా ఉండును, ఎందకనగా అక్కడ రోడ్డుపై ప్రమాదము లాంటిది లేక అటువంటిది ఏదైనా జరుగుతుందని చెప్పుతుంది.

మరియు ఆ తీర్పరులు, వారు సంఘమునకు మాట్లాడుటకు అనుమతినిచ్చిన తరువాత, లేక అప్పుడే ఇవ్వబడిన వర్తమానమును ఆచరణలో పెట్టమన్నయెడల, ఒకవేళ వారి తీర్పు, “అది దేవునిదే,” అప్పుడు అది నెరవేరు వరకూ గమనిస్తూ చూడండి.

మరియు ఒకవేళ అది జరిగినట్లయితే, దేవునికి వందనములు; మరియు ఎంతో కృప కలిగియుండండి, మీ హృదయములో ఆయనయెడల కృప కలిగియుండండి. మరియు ఆయనను స్తుతిస్తూ మరియు ఆరాధిస్తూ, మరియు దీనులుగా ఉండండి. అన్ని విషయములలో ఎక్కువగా, దీనులుగా ఉండండి.

18

మీరు ఆరాధించుచున్న సంఘము లేదా కాపరి కన్నా మీరు ఎక్కువగా తెలుసుకొనియున్నారన్న స్థానమునకు మీకు మీరు ఎన్నడూ పొంగవద్దు (గర్వించవద్దు). ఒకవేళ మీరు ఆ స్థానమునకు వెళితే, అప్పుడు మీరు ఇంకొక స్థలమునకు వెళ్ళి, ఆరాధించమని మీ ప్రతి ఒక్కొక్కరికి నేను సలహా ఇస్తున్నాను, ఎందకనగా బైబిలు క్రమమునకు బయట ఉన్న దేనిని అనుమతించవద్దని నేను కాపరి గారిని అడుగుతూ ఉన్నాను — ఇక్కడ సంఘములో మనము చూచిన విధముగా... మరియు ఆ వరములు సరైన స్థానములో మరియు సరైన ఆరాధికుల మధ్య క్రియ చేయబడాలని నేను కోరుచున్నాను. ఒక వేళ వాక్యప్రకారము, అవి సరిగా కొనిపోబడినట్లయితే, మన ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఒక శక్తివంతమైన, అద్భుతమైన సంఘము క్రియలో ఉండడము మీరు చూడగలరు.

19

ఇప్పుడు, జరుగనైయున్న తరువాత కార్యము ఎదనగా, ఒకవేళ ఈ జనులు... ఈ సమయములలో క్రమము తప్పుచుండగా, పరిశుద్ధాత్మతో నింపబడి మరియు వారి యొక్క హృదయములలో ఎక్కువగా కృపను కలిగి ఉండిన ఒక డీకన్ లేదా ద్వారపాలకుడు గౌరవముగా ఆ వ్వక్తి యొద్దకు వెళ్ళి, తండ్రివలె, మరియు ఈ విధముగా వారిని సరిచేయపలెను - లేక కాపరియైనా, ఎవరైనా కావచ్చు. ఆ విధముగా చేయుట డీకన్లకు చాలా అవసరమైయున్నది. కాపరి, ఈ సమయములో ఈ ఆత్మీయమైన పరిచర్యలు జరుగుతూ ఉన్నప్పుడు, ప్రార్ధనా గదిలో గాని లేక మరెక్కడైనా ఉండి ప్రార్ధించవలెను.

ఈ వర్తమానములు, అప్పుడు ఒకవేళ ఏవర్తమానములు ప్రసంగించబడకపోతే, ఎటువంటి ప్రత్యక్షతలు లేకపోతే, అప్పుడు జనులు ఒకవేళ వారు కోరుకొంటే, లేచి మరియు ఒక సాక్ష్యమును, కేవలము దేవుని మహిమ కొరకు ఒక సాక్ష్యమును ఇచ్చే భాగ్యమును కలిగియున్నారు. ఈ విధముగా చేయాలనే బంధకములో వారు లేరు, కాని సాక్ష్యములనేవి వర్తమానము ముందైనా లేక పాటలు ప్రారంభించడానికి లేక అటువంటిదేదైనా చేయడానికి ముందు ఇవ్వవలెను, ఈ ఆరాధనా కూడికలలో సాక్ష్యములు.

సంఘమా నివు గ్రహించావా, ఇది చేయుట ద్వారా, నీవు సంఘమునంతా ఆరాధన యొక్క ఆత్మలో ఉంచెదరు, నేర్పించుటకు వాక్యము ముందుగా వచ్చును అని నీవు గ్రహించావా? అప్పుడు పరిశుద్ధాత్మ వాక్యములోనికి వచ్చును, మరియు వాక్యము ద్వారా దేవున్ని ప్రత్యక్షపరచును, అది నీ యొక్క ఆరాధనకు రుజువుగా ఉండును.

20

ఇప్పుడు, దీని తరువాత, అది కాపరి గారు వచ్చే సమయము, ఒకవేళ వర్తమానములు వెళుతూ ఉంటే... ఖచ్చితమైన సమయానికి రావాలని కాపరికి చెప్పండి, ఏడున్నర, లేక పావుతక్కువ-ఎనిమిది అని చెప్పండి. మరియు కాపరి ఆయన యొక్క ధ్యానములో నుండి లేక బలిపీఠము తీసుకొనుటకు ఎక్కడ నుండి వస్తే ఈ వర్తమానములు ఇంకా అక్కడ నుండి వచ్చుచున్నప్పుడు... ఒకవేళ కొనసాగుతూ ఉండినయెడల, ఏ సహాధరుడైనా ఆయనకు చెప్పవలెను — ఎందకనగా పరిశుద్దులకు తెలుసు, కాపరి ఎప్పుడు బలిపీఠము పైకి వస్తాడని, ఎందుకనగా అది సేవ చేయడానికి ఆయన యొక్క సమయము. మరియు అది దేవుని యొక్క ఆత్మను సంఘములోనికి తీసుకొని రావడానికి మరియు అన్ని వరములు ప్రత్యక్షపరచబడడానికి చాలా మరియు కావలసినంత సమయమును అది ఇస్తున్నది.

21

మరియు ఒకవేళ అవిశ్వాసి ఎవరైనా అక్కడ ఉన్నట్లయితే, క్రమములో లేకుండా, ఒక మంచి హృదయము కలిగిన వ్యక్తి వారి దగ్గరికి వెళ్ళి (ద్వారపాలకుడు లేదా రక్షకభటుడు), మరియు వారికి చెపుతూ, ఒకవేళ వారు... పరిచర్య జరుగుతూ ఉన్నది కనుక మర్యాదపూర్వకముగా ఉండమని లేదా వినయముగా అని అడగవలెను. ఎందుకనగా, ఆత్మ ఆ భవనములో ఉన్నది, మరియు సంఘము యొక్క క్షేమాభివృద్ధికై దేవుని యొక్క వరములన్నీ ప్రత్యక్షపరచబడుచున్నవి. మరియు ఆ వ్యక్తికి ప్రేమతో చెప్పవలయును, కఠినముగా కాదు. మరియు వారు త్రాగుతూ, లేక ఏదైనా అతిక్రమము, లేక ప్రభువు యొక్క ఆరాధనకు ఆటంకముగా ఉన్న మరేదైనా, వరములు ఆప్పుడే ప్రత్యక్షపరచబడుచుండగా, అటువంటి ఆటంకము కలిగించే స్థానమునకు వారు వస్తే; అప్పుడు ఆ వ్యక్తిని ఒక వైపుకి తీసుకొని వెళ్ళవలయును, వెనుక గదిలోనికి లేక ఎక్కడకైనా, మరియు అతడితో మాట్లాడి దయగా వ్యవహరించవలయును.

22

ఇప్పుడు, కాపరి గారు బలిపీఠము పైకి వచ్చుచుండగా... కాపరి బలిపీఠము పైకి వచ్చిన తరువాత, నేను ఇక్కడనున్న బ్రెన్హాం గుడారమునకు సలహా ఇస్తున్నాను, అది కాపరి సమాజమును నడిపిస్తూ కనీసము ఒకటి లేదా రెండు పాటలు నడిపించవలెను. ఏలయనగా మేము ఆ విధముగా కనుగోన్నాము, ఎప్పుడైతే సంఘములో ఎక్కువ మంది క్రియ చేయడానికి ప్రయత్నిస్తారో... అది కేవలము గందరగోళమును తీసుకొని వచ్చును. నేను సంఘములో కాపరిగా ఉన్నప్పుడు, నాకు నేనుగా పాటలను నడిపించేవాడను - మరియు అది ఒకవేళ కాపరి ఆ విధముగా తనకుతాను చేసినయెడల, మంచి సంగతి అని నేను అనుభూతి చెందుతూ ఉన్నాను.

23

మరియు వారు సమకూడు అన్ని ప్రార్ధనా కూడికలలోను, ప్రార్ధనా కూడికల సమూహము, కాపరి ప్రతీదానిలోనూ ఉండవలెను. వ్యక్తిగతముగా ఏ ఒక్కరికీ వెళ్ళి నడిపించమని అటువంటి కూడికలను విడిచిపెట్టకూడదు. ఏలయనగా మేము అటువంటి దానిని కనుగొన్నాము, అది వారు సిద్దాంతములో తప్పిపోయారు, మరియు అది కారణమైనది... తిన్నగా దానిని సంఘములోనికి తీసుకొని వచ్చి, మరియు చాలాసార్లు భిన్నాభిప్రాయములను అటువంటివాటిని తీసుకొని వచ్చును, సజీవుడైన దేవుని సంఘమునకు అటువంటివాటితో సంబంధము లేదు. మరియు ఎక్కడైతే సమాజమంతా కూడి... మరియు అటువంటి అన్ని ప్రార్ధనా కూడికలలోనూ కాపరి వుండవలెను.

24

మరియు కూడికలో కాపరి ఒక గుంపు ఈ విధముగా మరియు మరొకటి ఆ విధముగా అని చెపుతూ, ఎన్నడూ ఒక పక్షము తీసికొనకూడదు. కాపరి వారిద్దరి మధ్యను నిలబడి, మరియు వారియొద్దకు వెళ్ళి, వెంటనే వారిద్దరిని సమాధానపరచవలెను. మరియు ఒకవేళ అతడు వారిని సమాధానపరచలేకపోతే, అతడితో పాటు ఒక డీకన్ ను అతడు తీసుకొని వెళ్ళవచ్చును. మరియు ఒకవేళ వారు పాస్టరును లేదా డీకన్ ను కాని వినకపోతే, అప్పుడు అది సంఘమునకు చెప్పవలయును, మరియు యేసు చెప్పెను, “అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. మరియు మీరు భుమిమీద వేటిని బంధింతురో, అవి పరలోకమందునూ బంధింపబడును; భూమి మీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందునూ విప్పబడును.”

25

ఇప్పుడు కాపరి బలిపీఠముపైకి వచ్చినప్పుడు, కాపరి కనీసము ఒకటి లేదా రెండు పాటలను నడిపించి, మరియు తిన్నగా వాక్యములోనికి వెళ్ళవలెను.

ఆ విధముగా ప్రతీ ఒక్కరూ లేచి ఒక మాట చెప్పడానికి మరియు ఇటువంటి పెద్ద సాక్ష్యపు కూటములకు సమయము లేదు. అది బ్రెన్హాం గుడారములో వర్ధిల్లదు.

ఒకవేళ ఏ జనులైనా ఈ టేపును వినుచున్నయెడల, మరియు ఇది మీ సంఘములో వర్ధిల్లినయెడల, అది పరిపూర్ణముగా మంచిదే. మరియు అది మీ సంఘములో వర్ధిల్లినందుకు మేము చాలా ఆనందిస్తున్నాము.

కాని మా దగ్గర ఇక్కడ, అది కుదరదు; అది కేవలము గందరగోళమునకు కారణమగును. నేను ఇరవైకన్నా ఎక్కువ సంవత్సరముల నుండి కాపరిగా ఉన్నాను, మరియు అది గందరగోళమునకు మాత్రమే కారణమవునని నేను కనుగొన్నాను. ఒకవేళ మీరు ఒక సాక్యమును కలిగి ఉన్నట్లయితే, ఆత్మ ఆ విధముగా ఆశ్వీర్వదిస్తున్నప్పుడు, జనుల యొక్క సమాజము ముందు దానిని ఇవ్వండి.

26

లేక, సాక్ష్యమివ్వడానికి నిజమైన మార్గము అది సంఘములో కాదు కాని అది చీకటి స్థలములలో అయి యున్నది. చీకటి ఎక్కడ ఉన్నదో అక్కడ మీ వెలుగును ప్రసరింపనీవ్వండి. వీధి గృహములలోకి మరియు ఇతర స్థలములలోను, మరియు పాపము అటువంటి సంగతులు పోగుపడుచున్నప్పుడు, వెళ్ళి అక్కడ మీ వెలుగు ప్రసరించండి. మీరు చేయవలసిన స్థలము అదే.

కాని, ఏ విధముగానైనా, ఒకవేళ ప్రభువు మిమ్మును ఆశీర్వదించి మరియు మీకొక గొప్ప ప్రత్యేకమైన దీవెనను ఇచ్చినట్లయితే, లేక జనులకు చెప్పడానికి మీరేదైనా సంగతిని కలిగియున్నయెడల, దానిని ఏదైనా కూడిక సమయములో, కూడిక ముందు, ప్రారంభములో, లేక దేవుని యొక్క వాక్యము ముందుకు తీసుకొనిరాబడే ముందు, పరిశుద్దుల యొక్క ఆరాధనలో, మరియు ఆత్మ ఆశీర్వదిస్తున్నప్పుడు మరియు సాక్ష్యమిస్తున్నప్పుడు మరియు ప్రత్యక్షతలు మరియు భాషలు మరియు అనువాదములు అటువంటి సమయములో చేయుము.

27

అప్పుడు కాపరి, కీర్తన నడిపించిన తరువాత, వెంటనే సంఘమును ప్రార్ధనలో నడిపించి, సామూహిక ప్రార్ధన, అతడు బలిపీఠము యొద్ద నిలబడియుండగా, మిగతావారినందరినీ తలలు వంచి ప్రార్ధనలో ఉండమని అడగవలెను.

ఇది గొప్ప ఆశీర్వాదము అని మనము కనుగొన్నాము, మరియు సంఘము సడిపించబడుటలో దీనిదే ఎక్కువ ఆధిపత్యము.

మరియు అప్పుడు, దాని తరువాత కాపరి చేయవలసిన మరొక సంగతి... ఒకవేళ వారు నిజమైన ఆత్మీయమైన కూడికను కలిగియుంటే, వరములు ప్రత్యక్షపరచబడుట, జనుల యొక్క హృదయములలో చాలా రహస్యములు మరియు కూడికలో వరముల ద్వారా చేయబడవలసిన సంగతులు, అప్పుడు దేవుని యొక్క ఆత్మ కూడికలో ఉండును, మరియు దేవుని యొక్క ఆత్మ మీద దేవుని యొక్క ఆత్మను (అప్పటికే కూడికలో ఉన్నది) కనుగొనుట ఆ కాపరికి చాలా సులువు, ఆయన చదువుతూ, ప్రసంగము ప్రారంభిస్తాడు. అక్కడ నిలబడి, ఆయన ఏమి చేయగోరితే అది, పరిశుద్ధాత్మ అతడి యొక్క హృదయముపై పెట్టిన దానిని బట్టి ఆ కాపరి అప్పుడు ప్రసంగించును.

28

కాని ఆ సమాజము కేవలము... ఆయన ప్రసంగించుటను వారందరూ ఆనందించవచ్చు, లేక ఆ వాక్యము వచ్చుచున్నప్పుడు, “ఆమేన్” చెప్పవచ్చు. కాని కాపరి ద్వారా పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ విధముగా పైకి లేచి మరియు వర్తమానములు ఇస్తూ, భాషలు మరియు అనువాదములు ఇచ్చుటను లేఖనము ఖండిస్తూ, మరియు “ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉండును,” అని చెప్పుచున్నది.

కాపరి అప్పుడు ఈ వ్యక్తిని పిలిచి మరియు వారి యొక్క స్థానములో వినయముగా ఉండమని చెప్పవలెను. కాపరి ఎటువంటి వ్యక్తిగా ఉండాలంటే, అతనియందు చాలా దీనుడుగా ఉండవలెను, కాని మరీ దీనుడుగా కాదు గానీ సంఘములో ఆయన తప్పు జరగడం చూచినప్పుడు అతడు ప్రభువైన యేసుక్రీస్తుగా ఉండవలెను. ఆయన కోరడా తీసుకొని వారిని సమాజ మందిరములో నుండి తోలివేసెను. మరియు ఇప్పుడు దేవుని యొక్క సంఘము తీర్పు గృహమైయున్నది, మరియు కాపరియే సంఘములో ఉన్నతమైన స్థానము (highest order) కలిగినవాడు. పరిశుద్ధాత్మ కాకుండా, అపోస్తలుల సంఘములో పెద్దే (elder) ఉన్నతమైన స్థానము కలవాడు. పరిశుద్ధాత్మ ఆయన యొక్క వర్తమానమును నేరుగా పెద్ద యొద్దకు తీసుకొని వచ్చును, మరియు ఆ పెద్ద దానిని జనులకు ఇచ్చును.

29

ఆరాధన చేయుటకు మరియు అందరూ సమకూడుటకు, పరిశుద్దలు మరియు వారి వరములు మొదటి స్థానమును తీసుకొనును, (నేను అంతకు ముందు చెప్పినట్లుగా) అది ఆ భవనములోనికి ప్రభువు యొక్క ఆత్మను కాపరి కొరకు తీసుకొని వచ్చును. మరియు అది అప్పుడు ఆయన ద్వారా ఆ కార్యమును జరిగించుటకు పరిశుద్ధాత్మకు సుళువైన కార్యముగా ఉండును. ఆయన యొక్క ప్రసంగానికి ముందు ఒక గొప్ప ఆత్మీయమైన కూడిక ముందుగా జరిగినప్పుడు అది జరుగును.

మరియు అప్పుడు పరిశుద్ధాత్మ వాక్యమును లోనికి వెళ్ళి మరియు వాక్యమును బోధించును, అప్పుడే వరముల ద్వారా ప్రత్యక్షపరచబడెను, మరియు దాని తరువాత బలిపీఠపు పిలుపు ఇవ్వబడును. మరియు అప్పుడు చాలామంది చూసి మరియు తెలిసికొనెదరు — పరిశుద్ధాత్మ యొక్క కార్యము ద్వారా, మరియు సజీవుడైన దేవుని సంఘముపై దేవుని యొక్క వాక్యమును కాపరి పెట్టును. మరియు పౌలు చెప్పినట్లుగా, “అతడు క్రింద పడిపోయి మరియు చెప్పును, 'నిజముగా దేవుడు నీతో ఉన్నాడు.'” ఇప్పుడు, ఈ సంగతులలో, అవన్నియు భక్తిపూర్వకముగా జరుగవలెను.

30

మరియు ఈ సమయములో కాపరియైనా, మనయొక్క సహోదరుడు నెవిల్. గుర్తించుకొనండి, ఆయన సంఘానికి పూర్తి శిరస్సు అయి యున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిన ఏ అధికారమునైనా ఉపయోగించుకొనే హక్కును సహోదరుడు నెవిల్ కలిగియున్నాడు... వేరే మాటలలో, ఏదైనా చెప్పమని పరిశుద్ధాత్మ ఆయనకు చెప్పినప్పుడు. సంఘములో, దేవుడు నడిపించిన విధముగా ఏదైనా చేయుటకు ఆయన హక్కును కలిగి యున్నాడు. ఆయన తన యొక్క సొంత డీకన్ బోర్డు మీద అధికారమును కలిగియున్నాడు. ఆయన మార్పుచేయుట కోరుకొనినయెడల, డీకన్ బోర్డును, ధర్మకర్తలను, లేక పియానో వాయించేవారిని, లేక సంఘములో ఉన్న ఏ కార్యాలయమునైనా అతడు మార్చగలడు, ఆ విధముగా చేయుటకు అతడు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడవలెను. మరియు అతడు ఏమి చేసినా, నేను దానిని గుర్తిస్తాను, అతడు దైవసంబంధమైన మనుష్యునిగా ఉండుటకు అని నేను నమ్ముచున్నాను. అది ప్రభువు వలన జరిగినది అని నేను గ్రహించి, మరియు దానిని అనుమతిచ్చెదను. ఏ విధముగా నడిపించబడాలని దానిని అతడు అనుభూతి చెందుతాడో, ఆ విధముగా సంఘమును నడిపించుటకు అది అతడికి పూర్తి అధికారమును ఇచ్చును. ఇప్పుడు... లేక సంఘములో ఏ కార్యాలయమైనా, జనుల యొక్క స్థానములను మార్చాలని అతడు కోరినయెడల, అతడు దానిని చేయుటకు ఆ అధికారమును కలిగియున్నాడు. (అది ఎల్లప్పుడు ప్రియముగా ఉండునని నేను నమ్ముచున్నాను, మరియు ఉపయోగించవలసిన అవసరము లేకుండును).

31

ఇప్పుడు దేవుడు మిమ్ములనందరిని దీవించును గాక. మరియు అది మీ అత్యున్నతమైన జ్ఞానము అంతటితోనూ కొనసాగించబడాలని నేను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధాత్మ మీ ప్రతిఒక్కొరిని గమనించును గాక.

మరియు సంఘములో ఉన్న ప్రతీ అధికారి తన బాధ్యతను నెరవేర్చును గాక, సంఘములో మీ కార్యాలయమును మీరు ఏ విధముగా నెరవేర్చియున్నారన్న దానిని గూర్చి దేవుడు మిమ్ములను లెక్క అడగబోతూ ఉన్నాడన్న సంగతి మీరు ఎరిగియుండవలెను. ప్రతీ ఒక్కరూ లెక్క అప్పజెప్పవలెను.

మరియు సంఘానికి, మరియు మన సంఘములో ఉన్న ప్రియమైన వరములు కలిగిన పరిశుద్ధులకు, ప్రవచనము కలిగిన వారెవరైనా లేక భాషలలో మాట్లాడగలిగిన, లేక అనువాదము లేక ప్రత్యక్షతలు... మీ వంటి వారిని సంఘములో కలిగియున్నందుకు మేము సంతోషిస్తున్నాము. మరియు ఆయన మీతో చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ దానిని రుజువు చేయుటకు మేము ప్రతీదానిలోనూ పూర్తిగా సహకరించెదము. మరియు మేము మిమ్ములను ప్రేమిస్తూ ఉన్నాము. మరియు ఈ వరములు మీలో ఉన్న వని మేము నమ్ముచున్నాము, మరియు ఒకవేళ మీకు ఒక మంచి అవకాశము దొరికినయెడల, మరియు దాని గూర్చి లేఖనపరమైన బహుకరణను కలిగినయెడల, మన మధ్యలో గొప్ప పనివారిని మీరు తయారు చేయగలరు. మరియు ఆ ప్రభువు మిమ్ముల నందరిని దీవించవలయుననినదే నా యదార్ధమైన ప్రార్ధన.

32

క్రైస్తవులు, ఈ టేపును వినుచున్నప్పటి నుండి, నేను విడిచి పెట్టినది ఒక్క సంగతి ఉన్నదని నేను చూచియున్నాను, మరియు అది ఇదే: జనులు భాషలలో మాట్లాడుచు ఉన్నప్పుడు, లేఖన ప్రకారము అది ఇద్దరు లేక ముగ్గురు మధ్యను ఉండవలెను. అంటే, ఒక్కొక్క కూడికలో కేవలము రెండు లేక మూడు వర్తమానములు మాత్రమే ఇవ్వవలెను. దాని తరువాత లేఖనముల ప్రకారము అది, “వర్తమానములు రెండు లేక మూడు ఉండవలెను.” పరిశుద్ధాత్మ తన యొక్క పరిశుద్ధ గ్రంధములో మనలను నిర్దేశించునట్లుగా మీరు ఆ కార్యములను నెరవేర్చుదురు గాక. మరియు ఇదే నా జ్ఞానమంతటి ప్రకారము , మీరు చేయవలసిన మార్గము. పౌలు చెప్పెను, “వారు మాట్లాడుచున్నప్పుడు, ఇద్దరు లేక ముగ్గురు చేత వారు వివేచింపబడవలెను.”

ప్రభువు మిమ్మును దీవించును.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...