విశ్వాసమే మన విజయము

విశ్వాసమే మన విజయము

VGR COUNT-225ఈ రాత్రి ఇక్కడ ప్రభువు ఆరాధనలో ఉండుట నిశ్చయముగా గొప్ప ధన్యత, కాని మనము ఆహ్వానించిన తరువాత, వారు కూర్చొనుటకు తగినంత స్థలము లేకపోవుట విచారకరమైన విషయము. వారు కూర్చొనుటకు స్థలము లేదు మరియు ఇప్పుడు నేను వస్తున్నప్పుడు, ప్రజలు కిటికీల చుట్టూ, వీధులలో పైన, క్రింద నిలబడి యుండుట చూశాను. అంతటా క్రిక్కిరిసి యున్నది. మరియు వారికి భవనములోనికి ప్రవేశించుటకు కూడా వీలులేకున్నది. కాని ఇది చాలా చిన్న స౦ఘము. మేము దీనిని గూర్చి ఎన్నడూ ప్రకటించలేదు. మరియు ఇక్కడున్న పత్రికలో కూడా మేము.... ఓ, కొద్దిమంది స్నేహితులు ఫోన్ చేసి వారికి మేము రండి అని చెప్పాము. అయితే ఆ వార్త నిదానముగా వ్యాపించినది, ఎవరో ఒకరు లూయిస్ విల్ నుండి వచ్చారు, మరియు వారు మరియొకరికి, వారు మరియొకరికి చెప్పారు. ఆ విధంగా అది చుట్టు ప్రక్కలకు వ్యాపించినదని మీరెరుగుదురు.

నేను అక్కడున్న ఉన్నత పాఠశాలను తీసుకోవాలని ఆశించాను, కాని వారు పాఠశాల జరుగుచున్నందున మేము దానిని తీసుకొనలేకపోయాము. లేనట్లయితే మేము దానిని గూర్చి ప్రకటించేవారిమి. ఇక్కడున్న స్థానిక ప్రజలు, మేము మిమ్ములను దూరముగా ఉంచాలనే ఉద్దేశ్యము మాకు లేదని మీరు గ్రహించాలి, కాని ఇక్కడ స్థలము చాలా ఇరుకుగా ఉన్నది. కాబట్టి పాఠశాల అద్దెకు తీసుకున్నట్లయితే, మేము ఆ విధముగానే చేసేవాళ్ళము, కాని మేము చెయ్య లేకపోయాము.

2

కాబట్టి ఆ వెనుక ఉంచిన పుస్తకాలు లభ్యమగుటకు ఇది చివరి రాత్రి, ఆ వెనుక (శ్రీ మెర్సీర్, ఇంకా అచ్చటయున్న కొంతమంది) వారి దగ్గర టేపులు, మరియు పుస్తకములు లభ్యమగును. రేపు ఉదయము, ఆదివారపు బడి యుండును. రేపు ఉదయము ప్రభువు చిత్తమైతే ఆదివారపు బడి ముగిసిన వెంటనే నేను సువార్త సంబంధమైన వర్తమానము ఇవ్వాలని ఆశిస్తున్నాను. అది తొమ్మిదిన్నరకు ప్రారంభమగునని తలస్తున్నాను. అవును కదా సహో. నెవిల్? తొమ్మిది గంటల, ముప్పై నిమిషములకు ఆదివారపు ఆరాధన ప్రారంభించబడును. మరియు ఆదివారపు బడి తరగతులు ముగించబడిన వెంటనే, మేము ఒక్క అంశముపై సువార్త వర్తమానము ప్రసంగించబడిన తరువాత బలిపీఠము నుండి పాపులను పిలవాలని ఆశిస్తున్నాను. మనము రాత్రులలో ఎక్కువగా అనగా ఆదివారము రాత్రి నుండి రోగులు, ప్రజలు అవసరతలు, వ్యాధులతో పీడించబడుచున్నవారికి సమయము కేటాయించాము.

మరియు తరువాత, రేపు రాత్రి ఒకవేళ మాకు సాధ్యమతే, పంచిపెట్టబడిన ప్రార్ధనా కార్డులను మేము పిలుచుటకు ప్రయత్నిస్తాము. ఇక్కడకు వచ్చి ప్రార్ధనా కార్డులు పొందుకున్నవా రందరూ వర్తమానము అయిన తర్వాత మేము కొంతమందిని ప్రార్థన వరుసలలోనికి పిలుస్తాము. ఆ విధముగా చేయుటకు మేము సంతోషిస్తాము. “రేపటి రాత్రి కొరకు ప్రార్థనా కార్డులు, ఉదయము ఆదివారపు బడి ముగించిన వెంటనే ఇవ్వబడతాయి. ఆదివారపు బడి ముగించిన వెంటనే, బహుశా పదకొండు గంటల ముప్పై నిమిషాలకు, రేపు ప్రార్థనా కార్డులు ఇవ్వబడును. కాబట్టి ఇక్కడున్న వారి యొక్క ప్రియులు ఎవరైనా ప్రార్థనా అవసరతలు కలిగిన వారుంటే వారు ఒకవేళ ఉదయకాలపు వర్తమానమునకు హాజరు కాలేనట్లయితే వారిని కనీసము పదకొండు గంటల ముప్పై నిముషాలకు ఇక్కడకు తీసుకు రండి.

ఒకవేళ మీరు ఎప్పుడూ వెళ్ళే ఆరాధనా స్థలమునకు వెళ్ళినట్లయితే అలా చేయండి. మేము మిమ్ములను మీ ఆరాధన స్థలము నుండి లాగము, మీరు ఏ స్థలమునకు వెళ్ళాలని ఆశిస్తున్నారో దాని విషయములో మీకు పూర్తి స్వేచ్చ కలిగియున్నారను భావము మీకుండాలనే మా ఆశ.

3

ఈ రోజు నేను చాలా తీరికలేకుండా గడిపాను. కొద్ది నిముషముల ముందర వారు నా వద్దకు వచ్చి, “మీరు ఇప్పుడు క్రిందకు వచ్చినట్లయితే, నేరుగా ప్రసంగము ప్రారంభించవచ్చు,” అని చెప్పారు. అప్పటికే, ఈ చిన్న గుడారము నిండిపోయినది కాబట్టి ఈ రాత్రి మాట్లాడాలని తలంచిన కొన్ని వాక్యభాగములను గూర్చి తలంచాను. మొదటిగా ప్రభువు మనందరి జీవితములో చేసిన కార్యములను బట్టి, ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ కూడికలకు హాజరయిన వారిని గూర్చి ప్రార్ధి౦చబడిన వారిని గూర్చి నివేదికలు వచ్చాయి. ఇక్కడున్న ఈ చిన్న స్థలములో గొప్ప కార్యములు సంభవించాయి. ప్రజలు ఒక వ్యక్తిగతముగా ప్రార్థన చేయించుకోవలసిన అవసరము లేనట్లుగా కన్పిస్తున్నది. వేదిక మీద ఉన్న వారికంటె ఎక్కువగా వెనుక ఉన్నవారు బాగుపడుచున్నారు. కాబట్టి దానిని బట్టి మేము సంతోషిస్తున్నాము. ఆ ప్రజలు ఆ రీతిగా దానిని పొందుకోనుట చూచుటకు రమ్యముగా ఉన్నది.

4

ఈ రాత్రి నేను “విశ్వాసమే మన విజయము,” అనే అంశమును తీసుకొనుచున్నాను. యోహాను 5వ అధ్యాయము 4వ వచనము నుండి కొద్ది వాక్యభాగమును చదువగోరుచున్నాను:

“దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే.

ఇప్పుడు, ఎంతో అద్భతమైన మాటలు; “మన విశ్వాసమే విజయము.” ఇప్పుడు విజయము గూర్చి మాట్లాడుచున్నాము. భూమి మీద మానవాళి ప్రారంభమైనప్పుటి నుండి అనేకానేక సంవత్సరములుగా ఎన్నెన్నో గొప్ప విజయములు సాధించుచూ కొనసాగుచూ యున్నది. పారిస్ లొంగిపోవుటను గూర్చిన నేను ఒక పుస్తకమును చదివాను. రెండవ ప్రపంచ యుద్ధములో పారిస్ లొంగిపోయింది. పారిస్లోయున్న ఆ విజయ స్తూపము దగ్గరకు హిట్లర్ను తీసుకొని వచ్చి నిలబెట్టినప్పుడు జర్మనీ సైనికులు తమ గుర్రములపై కవాతు చేయుచు అచ్చట యున్న ఆ విజయ స్తూపముగుండా ఆ గొప్ప విజయోత్సవ సంబరమును జరుపుకుంటూ సావదానముగా దానిని దాటి వెళ్ళుటకు వారికి ఎన్నో గంటలు పట్టినదని వారు చెప్పిరి. అచ్చట హిట్లర్ నిలబడి యుండగా పైన ఆకాశమంతా మూయబడి చీకటి కమ్మినట్లుగా యుండినది, ఎందుకనగా వారి యొక్క విమానములు ఇటు అటు రయ్యిన ఎగురుచుండగా అచ్చట పైన ఆకాశమంతా ఆ విమానములతో మూయబడినది. జర్మనీకి ఫ్రాన్స్ లొంగిపోయిన పిదప అటు వంటి ఒక గొప్ప విజయోత్సవమును అచ్చట వారు జరుపుకొనిరి.

5

తరువాత ఇంగ్లాండులోని లండన్లో, ఒక సమావేశములో బెర్లిన్ను, రష్యా వారు జయించి దానిని అక్రమించిన విధానము గూర్చి తీసిన చలన చిత్రమును చూసే అవకావము నాకు కలిగినది. బెర్లిన్, రష్యాకు లొంగిపోయినది. భీకరమైన గొప్ప సైన్యపు దండుతో సిద్ధపడి, గొప్ప ఫిరంగులు, యుద్ద ట్యా౦కులు మరియు బ్రహ్మాండమైన యుద్ధ వాహనములతో వారు ఆ బెర్లిన్ ప్రాంతమంతటినీ చుట్టుముట్టి దానిలో ఆ సైన్యము ప్రవేశించగా, అంతటి భీకరమైన సైన్యపు దండు లోపలికి ప్రవేశించినప్పుడు అచ్చట ఏ జీవైనా ప్రాణముతో తప్పించుకొని యుండుటను మనము ఎలా చూడగలము. వారు గొప్ప మిడుతల దండువలె గురి తప్పని కాల్పులతో కాల్చుకుంటూ మెల్లగా లోపలికి దూసుకుపోతూ ఒక మైలు నుండి ఇంకొకమైలు అలా మైళ్ళ కొలది దూరమును దాటుకుంటూ ముందుకు దూసుకుపోయారు. మైళ్ళకొలది గురి తప్పని తుపాకులతో పేల్చుకుంటూ వారు బెర్లిన్ పట్టణమును నేలమట్టంగా సమూలముగా ధ్వంసం చేసారు. వారు యుద్ధ ట్యాంకులతో చొచ్చుకుపోయారు. పదాతి దళము ఆ దేశమును తమ స్వాధీనములోనికి తీసుకున్నది మరియు వారు స్టాలిన్ను విమానములో అక్కడికి తీసుకువచ్చారు. ఆ విమానము క్రిందకు దిగిన వెంటనే ఆ రష్యా సైనికులు వీధులలోనికి తమ విజయ సూచికలు చూపుతూ వీధులలోనికి వచ్చారు. స్టాలిన్ విజయోత్సవములో నిలబడి యుండగా బూడిదలో కూలిపోయిన బెర్లిన్ వీధులలో వేల పదివేల కొలదియున్న ఆ రష్యా సైనికులు కవాతు చేస్తూ ముందుకు సాగారు.

వీధులలో జర్మనీ స్త్రీలు చెరపట్టబడ్డారు. చిన్నపిల్లలు చనిపోయారు, వారిలో కొద్దిమంది అగ్నికి అహుతయ్యారు, కాని అది రష్యాన్ ప్రజలకు విజయము.

6

గతించిన కాలములో గొప్ప విజేత నెపోలియన్, సెపోలియన్ గూర్చి నాకు చెప్పారు. కొద్ది సంవత్సరముల క్రిందట, ఐదు సంవత్సరముల క్రిందట వాటరు దగ్గర ఆగే ధన్యత నాకు కలిగినది. నేను అక్కడ ఒక పుస్తకము తీసుకున్నాను. నేను నెపోలియన్ జీవిత చరిత్ర చదివాను. అతడు ఫ్రెంచిని ద్వేషించాడు. అతడు ఒక ద్వీపములో జన్మించి ఫ్రాన్స్ లో నివసించుటకు వచ్చాడు, కాని అతడు గొప్ప విజేత అయ్యాడు. ప్రారంభములో అతడు మంచి వ్యక్తి, కాని తరువాత విజయము అతని తలకెక్కినది. స్త్రీలు రాత్రి సమయములో తమ పిల్లలను మంచము మీద నిద్రపుచ్చుటకు, అతడు చాలా భయంకరుడు, తనతో సమ్మతించని ప్రతి ఒక్కరిని అతడు చంపివేశాడు. కాబట్టి ఆ “ఆ పిచ్చివాడు వచ్చి నిన్ను తీసుకువెళ్తాడు,” అని చెప్పుటకు బదులుగా “నెపోలియన్ నిన్ను తీసుకు వెళ్తాడు,” అని చెప్పేవారు. వెంటనే క్రూరుడైన నెపోలియన్ గూర్చి ఆలోచిస్తూ ఆ చిన్న పిల్లలు చాలా వేగముగా ఆ దుప్పటి క్రిందకు దూరిపోయేవారు.

కాని మీరు గమనించారా, అతడు సాధించిన విజయము ఎంతో కాలము నిలబడలేదు. అతడు ప్రారంభములో మధ్యపానమును నిషేదించాడు, కాని త్రాగుబోతుగా ముప్పై మూడవ సంవత్సరములో మరణించాడు. అటువంటి విజయము ఎక్కువ కాలము నిలబడదు. ఎందుకనగా దానిని సాధించిన మార్గము సరియైనది కాదు. నీవు ఎన్నడూ తప్పు నుండి మేలు పొందలేవు. నీవు ఖచ్చితముగా క్రీడా నియమములను పాటిస్తూ ఆటను ఆడాలి.

7

ఒలింపిక్స్ క్రీడలు మరియు పరుగు పందెములను గూర్చి అవగాహన కలిగిన వారికి ఈ విషయము తెలుసు, నీవు ఒకవేళ పందెములో అందరికంటె ముందుగా వచ్చినప్పటికి, ఆట నియమాలు పాటించకపోతే నీవు అనర్హుడవే. నీవు ఖచ్చితముగా నియమానుసారముగా ఆడాలి

మరియు మానవ జీవితము కూడా అదే విధముగా ఉన్నది. నీవు ఈ జీవిత క్రీడను నియమాలకు వ్యతిరేకముగా ఆడి గెలుస్తానని తలంచవద్దు. నీవు తప్పనిసరిగా దేవుని వాక్య ప్రకారము మరియు నీవు ఇక్కడకు తీసుకురాబడిన ఉద్దేశ్యమును బట్టి దానిని నీవు ఆడాలి.

8

మనము జీవిస్తున్న ఈ కాలములో ఎంతోమంది ప్రజలు తమ జీవితాలలో ఎలాటి లక్ష్యము, ప్రయోజనము లేకుండా జీవిస్తున్నారు. ప్రజలు ఎవరో ఒకరితో వారు సమానముగా ఉంటే చాలు అన్నట్లు జీవిస్తున్నారు. లోకము యొక్క నాగరికత, పోకడలతో, లోకము వారికి చూపుచున్న దురాశలకు అనుగుణముగా జీవించుటకు ప్రయత్నిస్తున్నారు. సరిగా ఈ విధముగా: మీరు గనుక ఒక పాఠశాలకు వెళ్ళినట్లయితే ఆ బాలికలలో ఒకరు చిన్న గౌను లేక మరొకటి ధరించి వచ్చినట్లయితే ఒక పాఠశాలలో మిగిలిన వారందరి ఆశయము అలాటి వస్త్రమునే ధరించాలని.

కొంతమంది స్త్రీలు టీవీలలో వచ్చు కార్యక్రమములు చూస్తూ ఆ కార్యక్రమములలో నటించే స్త్రీలు ఏ విధముగా వస్త్రాలను ధరించుచున్నారో ఈ స్త్రీలు కూడా అదే విధమైన వస్త్రధారణతో వారిని అలంకరించుకోవాలని ఆశించెదరు. అదే విధముగా తాము కూడా వస్తాలను ధరించుకొని మరియు టీవీలో చూచిన విధముగానే వారివలె ప్రవర్తించాలనేదే వారి ఆశయముగా మారిపోవును. అది చూచుటకు ఎలాగువున్నదంటే ఒక క్రొత్త ఉద్యో గము సాధించుకోవాలి, లేదా, సంపాదించి తమ జీతమును పెంచుకోవాలి, క్రొత్త టీవీని లేదా ఒక క్రొత్త కారును కొనుక్కోవాలనేంత వరకే అమెరికా వారి యొక్క లక్ష్యము పరిమితమైనట్టుగా కనబడుచున్నది.

9

నన్ను ఈ విషయము చెప్పనీయండి: ఆ సంగతులు సరియైనవి కావచ్చును, కాని మానవ జీవితములో వాటికంటె ఉన్నతమైన ఆశయాలు, లక్ష్యాలు కలవు. మరియు క్రైస్తవులు తమ ఆశయాలకు ఉన్నతమైన లక్ష్యాల మీద దృష్టించాలి.

మనమందరమూ కూర్చొని మనము మొదటిగా ఇక్కడకు ఎందకు వచ్చాము అని ఆలోచిస్తే మంచిది. మనలను దయతో ఇక్కడికి తీసుకు వచ్చినది ఎవరు. మనము దాని గూర్చి యోచించి మన ద్వారా ఆయన ఏమి చేయాలని ఆశించుచున్నాడు, మనము ఆయన యొద్దకు వచ్చుచున్నందువలన ఏ ఉద్దేశ్యమును ఆయన మనలో సంపూర్ణము చేయాలనుకుంటున్నాడు, ఏ సంకల్పమును ఆయన మనయందు కలిగియున్నాడన్న దానిని గూర్చి మనము ఆయనను అడగాలి, కాని మనము లోకముతో కలసిపోయినట్టుగా నాకు అన్పిస్తుంది.

ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము మనము లోకమును జయించగలమని చెప్పుచున్నది మరియు మనము ఎలా జయిస్తాము? లోకము యొక్క పోకడలను అనుసరించుట ద్వారా కాదు, కాని లోకమును జయించు విజయమే మన విశ్వాసము అని బైబిల్ చెప్పుచున్నది.

10

అది నాకు ఒక విషయమును జ్ఞాపకమునకు తెస్తుంది. ఈ మాట చెప్పుట నాకు ఇష్టములేదు, కాని అతడు పని పాటా లేకుండా తిరిగే దేశదిమ్మరి, అతడు మా ఇంటి తలుపు దగ్గరకు వచ్చి అతడు ద్వారము దగ్గరకు వచ్చాడు. అతడు, “నాకు దయతో శాండ్విచ్ ఇస్తారా? అని ಅడిగాడు.

నేనన్నాను, “తప్పకుండా, లోపలికి వస్తావా?” మరియు శాండ్విచ్ బదులుగా అతడు తినుటకు మరేదైనా తయారుచేయాలనుకొన్నాను. నాకు అందుబాటులో ఉన్న పదార్ధములతో అతనికి ఆహారము సిద్దపరచి, తినుటకు అతడిని కూర్చుండ బెట్టాను. మరియు అతడు భుజిస్తుండగా నేను అతనితో మాట్లాడవచ్చు అని తలంచాను. అతడు దేశ దిమ్మరి వలెయున్నాడు. “నీవు ఎక్కడి నుండి వస్తున్నావు?” అని అడిగాను.

అతడు కొద్దిగా తన భుజములు ఎగురవేసి, “ఎక్కడ నుండి కాదు,” అని చెప్పాడు.

నేను, “అయితే నీవు ఎక్కడికి వెళ్తున్నావు?” అని ప్రశ్నించాను.

మరియు అతడు తినటం ఆపి, పైకెత్తి నన్ను చూశాడు, “ఎక్కడికో తెలియదు,” అని చెప్పాడు. అతడు చుట్టూ చూసి, కొంత ఆహారము మ్రి౦గిన తర్వాత, “అయ్యా! నా టోపి ఎక్కడ విశ్రాంతి తీసుకుంటుందో, నేను అక్కడే విశ్రాంతి తీసుకుంటాను,” అని చెప్పాడు.

నేనన్నాను,'“ఒహో అలాగా.” “ఎంతకాలము నుండి ఇలా తిరుగుచున్నావు?” అని అడిగాను.

అతడు చెప్పాడు,“ఓ, ఇరవై సంవత్సరాల, లేక ఇంకా ఎక్కువే.” తనకు తాను బాగుండాలి అలాంటి ఏ ఆశయాలు అతనికి లేవు.

11

ప్రజల యొక్క దృక్పథము ఇప్పుడు ఆ విధముగానే యున్నది. నేను వారిని “కొట్టుకొని పోవువారు, తేలిపోయేవారు,” అని పిలుస్తాను. మరియు సంఘములో చేరే ప్రజలు కూడా ఆ విధముగానే యున్నారు. నేను తరచుగా నీళ్ళ మీద తేలుతూ ఉన్న దుంగలు గూర్చి ఆలోచిస్తాను. కొట్టుకుపోయే దుంగ ఎక్కడో ఎలాటి చెత్త మధ్య అయినా పడియుంటుంది. అలాగే గాలివాటుగా కొట్టుకుపోయే వారు సంఘములో ఉన్నా బయట ఉన్నా అట్లాగే ప్రవర్తిస్తారు.

ఇప్పుడు, మీరు ఒక నదిని తీసుకోండి, ఉదాహరణకు జీవితమనే నదిని తీసుకున్నట్లయితే, ప్రతి చెత్త కుప్ప మధ్య విస్తారమైన కొట్టుకొనిపోయే దుంగలు చిక్కుబడియున్నాయి. మరియు పడవ కూడా ఆ ప్రక్కనే వెలుతుంది. అది కూడా కలపతో చేయబడినదే, కాని మీరు గమనించినట్లయితే ఆ కలప పడవ నిర్మించినవాని చేతిలో రూపుదిద్దబడినది. అది కేవలము ఒక రూపములో తీర్చి దిద్దబడుట మాత్రమే కాదు కాని, యజమాని ద్వారా నడిపించబడుచూ మరియు అది ఒక శక్తితో ముందుకు నెట్టబడుచున్నది. మనము అందరమూ కూడా ఒక పదార్ధముతో చేయబడ్డాము. అది కేవలము నీ ఆశయాల మీదనే ఆధారపడి ముందుకు కొనసాగించబడును.

12

ఆ గొప్ప నిర్మాణకుడు, శిల్ఫియగు ఆయన చేతుల ద్వారా వాడుకొనగలిగే పాత్రగాను, ఆయన ఆధీనములోనే ఉండునట్లుగాను ఆయన యొక్క శక్తితో నింపగలిగే వ్యక్తిగా నిన్ను రూపించుటకు ఆయనకు నీవు అనుమతిస్తావా? ఒకవేళ కొన్ని చిన్న పాత్రలు, ఆ యజమాని చేతి ద్వారా భిన్నమైన పాత్రలుగా చేయబడినవి, లోతు లేని నీళ్ళలో యుండు కొన్ని కలుపు మొక్కలను ఎప్పుడూ అంటి పెట్టుకొని యుండును, అచ్చట దాని వెనుక ఒక శక్తి యుండుటచే ఆ యజమానుడు ఒక చిన్న పడవను ఆ లోతు లేని నీళ్ళ నుండి ముందుకు త్రోయుచూ దానిని త్రిప్పి మరలా లోతైన నీళ్ళలోకి నడిపించును.

మనము ఏ రీతిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడో ఆ విధముగా మనలను రూపించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాని మనము ఎన్నడూ కూడా స్థిరముగా నిలబడకుండా ఆయన మన పట్ల దానిని చేయుటకు మనము ఆయనకు సహకరించకపోతే ఆయన ఎలా ఆ కార్యము చేస్తాడు, లేక మనము ఎలా ఆ కార్యం చెయ్యగలము? మనకు మనమే యజమానులం కావాలని ఆశిస్తున్నాము. మన స్వంత ఆలోచనా విధానములో ఆలోచించాలని మనము కోరుచున్నాము. అనేకమంది ప్రజలు సంఘమునకు వెళ్తారు, సంఘములో సభ్యులవుతారు; పుస్తకములో వారి పేరు వ్రాయిస్తారు, కాని ఎన్నడు ఆ సంఘము ఏమి విశ్వసిస్తుందో కూడా ఆలోచన చెయ్యరు లేక ఆ సంఘము దేని మీద ఆధారపడి యున్నదని కూడా పరిశీలించి చూడరు, ఆ సంఘము వాక్యమును ఎలా బోధిస్తుంది, లేక వారు సంపూర్ణ సువార్తను బోధిస్తున్నారా? లేదా? చిన్న వాక్య భాగమును తీసుకొని తమ స్వంత సిద్దాంతమును ఏదైన అందులో కలిపి బోధిస్తున్నారా అని పరీక్ష చేయరు తేలిపోతూ ప్రవాహమున కొట్టకొనిపోయేవారు, ఎన్నడూ ఎలాటి విలువ చేయరు.

13

కాని ఈ రాత్రి భవనము వెలుపల మరియు లోపల ఉన్నవారితో ఈ విషయము చెప్పనీయండి. నీవు రాబోయే దినములలో మరణాంధకారము కలిగిన లోయలలో ఒక దినమున నీవు నీ గమ్యం చేరుతావు. ఆ గడియలో నీవు కలుసుకొనవలసిన ప్రభువును కలుసుకొనుటకు ఇప్పుడే నీవు సిద్ధపడమని నేను ఈ గడియలో నీకు సలహా ఇస్తున్నాను. నీవు ఆయన చేతిలో రూపించబడిన మహోన్నత కళాఖండముగా ఆయనను కలుస్తావు లేదా ప్రవాహములో కొట్టకుపోయే దుంగవలె నీ అంతిమ గమ్యమునకు చేరెదవు. కాబట్టి, కొత్త టి.వి, మెరుగైన కారు, సంపాదన అనే విషయాలలో కొట్టుకొని పోనియ్యవద్దు. దానిని మించిన అర్థము జీవితమునకున్నది. “మంచిది, మిగిలిన అందరూ సంఘములో చేరినట్లయితే, నేను కూడా చేరతాను,” అని చెప్పుటకు ప్రయత్నంచవద్దు.

14

నీవు సంఘములో చేరినప్పుడు, మొదటిగా ఆ సంఘము దేనికోసం నిలబడుతుందో కనుగొనుము. అది ప్రజలు కేవలము సహవాసము చేయుటకు కూడుకొనే స్థలమా? లేక అది సజీవ దేవుని వాక్యమును బోధించు స్థలమా మరియు యేసు ఎందుకొరకు మరణించాడో ఆ సిద్దాంతములన్నిటి కొరకు నిలబడే స్థలమా? నీవు దానిని కనుగొని తీరాలి. కేవలము అలలతో కొట్టుకొనిపోవద్దు. ఎందుకనగా, “జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది. దానిని కనుగొనువారు కొందరే” ఎందుకనగా, “నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై యున్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు.” ఏదో ఒకదాని కొరకు మనము ఒక సంకల్పమును కలిగి యుండాలి.

ఇప్పుడు, గడిచిన దినములలో లేదా నేటి దినములలో అది ఆ విధముగా జరుగుట లేదు. ఒక వ్యక్తి దేవుని వద్దకు వచ్చినప్పుడు, ఆయన సంకల్పమును చేయుట కొరకే అతడు ఒక ఉద్దేశ్యమును కలిగియుండవలయును.

15

దానియేలు, అతడు బబులోను చెరగా తీసుకుపోబడినప్పుడు, అతడు తన ఇంటినుండి దూరముగా కొనిపోబడుచున్నప్పటికిని, మరొక దేశములోని ప్రజల వద్దకు బానిసగా కొనిపోబడినప్పటికిని, దానియేలు తన హృదయములో, వారు తనకు ఏమి చేసినప్పటికి, బబులోను పాపముతో తనను అపవిత్రపరచుకొనని నిర్ణయము చేసుకున్నాడు.

ఓ తమ హృదయములో ఒక ఉద్దేశ్యమును కలిగి నిర్ణయించుకొన్న మరియు అలాటి ధైర్య సాహసములు కలిగిన వారిని అనేక మందిని మనము కలిగివున్నట్లయితే, “నేను క్రైస్తవుడిని అయినట్లయితే, నాకు చెందిన ప్రతి దైవిక ఆశీర్వాదమును నేను కనుగొని దానిని స్వతంత్రించుకుంటాను. నేను పరిశుద్దాత్మను పొందుకుంటానని బైబిల్ బోధిస్తున్నట్లయితే, దేవుడు నాకు పరిశుద్దాత్మను ఇచ్చేవరకు నా మోకాళ్ళ మీద ఉంటాను, మరియు నేను కొట్టుకుపోను,”

16

చాలా కాలము క్రిందట నేను వృద్దుడైన అంకుల్ రాబిన్సన్ జీవిత చరిత్ర చదివాను. మరియు అతడు చాలా గొప్ప వ్యక్తి, ప్రేమ కలిగిన వాడు మరియు గొప్ప విశ్వాసము కలిగినవాడు. అతడు పరిశుద్దాత్మను గూర్చి గొప్ప ఆకలి కలిగియున్నాడు. ఎందుకనగా పరిశుద్ధ గ్రంధము దానిని గూర్చి బోధిస్తున్నది. మరియు ఒక దినమున అతడు మొక్కజొన్న చేను దున్నుచుండగా, అతడు తన కంచర గాడిదను ఆపి, చాళ్ళలో మోకరించి, “దేవా, నీవు నాకు పరిశుద్దాత్మ బాప్తీస్మం ఇవ్వనట్లయితే, నీవు మరలా ఈ భూమి మీదకు వచ్చినప్పుడు, నా ఎముకలను ఇక్కడే చూస్తావు,” అని చెప్పాడు. నీ హృదయములో సంకల్పించడం అంటే అది. అది నిజమైన పనిలో చిత్తశుద్ధి కలిగియుండుట.

“నీ హృదయంలో ఆ విధమైన సంకల్పమును నీవు కలిగియున్నప్పుడు, దేవుడు పరలోకపు కిటికీలు తెరుస్తాడు. తప్పక ఏదో కార్యము జరుగవలసియున్నది. నీవు దేవుని పనిలోనికి దిగవలసియున్నది. ఒక సంకల్పము కలిగి, ఆయన నిన్ను రక్షించినందుకు కృతజ్ఞత కలిగి యుండాలి.

17

మరియు దానియేలు తన హృదయములో నిర్ణయము తీసుకున్నప్పుడు, అపవాది దానిని పరీక్షించాడు, కాని ఆకలితో ఉన్న సింహము ఎదుట కూడా అతడు తన హృదయములో సంకల్పించుకున్న సంకల్పమును చేయుటకొరకై చక్కగా ధైర్యముగా దానిని ఎదుర్కొని నిలబడి యుండుటను మనము కనుగొన్నాము.“ దేవుని వద్దకు వచ్చిన ఏ మనుష్యుడైనా, నిజముగా తన హృదయములో స్థిరమైన విశ్వాసము కలిగియున్నట్లయితే, అది ఖచ్చితముగా మరణపు ద్వారము ఎదుట, దుఃఖము ద్వారము ఎదుట చక్కగా నిబడుతుంది. అది స్థిరముగా నిలబడుతుంది, ఎందుకనగా విశ్వాసమే మన విజయము. నీవు నీ విశ్వాసమునుబట్టి జయించావు.

అబ్రాహాము, జీవితములో ఖచ్చితమైన సంకల్పమంటూ ఏదీ లేకుండా, బబులోను నుండి తండ్రి, స్నేహితులతో కలసివచ్చిన ఒక సామాన్యమైన వ్యక్తి. వారు షినారులో స్థిరపడ్డారు. అక్కడ ఆ గోపురము నిర్మించబడినది. మరియు ఒక దినము అబ్రాహాము ప్రార్ధిస్తుండగా, ఎట్టి సందేహము లేదు, అతడు దేవుని హస్తమును తాకే వరకు ప్రార్థించాడు. అతడు దానిని ఎలా చేశాడు? విశ్వాసమును బట్టి.

బహుశా, అతడు ఈ విధముగా తలంచియుండవచ్చు: “ఓడ తయారుచేసి, నోవహును తేలిపోచేసిన దేవుడు ఉంటే, ఆయన ఈ దినము కూడా జీవించి ఉంటాడు.” ఎక్కడో అన్యుల దేశములో, అతడు యాత్రికునిగా ఉన్న దేశములో అతడు దేవుని హస్తమును తాకాడు. అక్కడ దేవుడు తానే శిల్పి, నిర్మాణకుడైయున్న ఆ పట్టణమును గూర్చిన ప్రత్యక్షతను దేవుడు అతనికి అనుగ్రహించాడు.“

18

మరియు అబ్రాహాము తన జీవిత కాలమంతటిలో దేవుడు దేనికి శిల్సియు, నిర్మాణకుడై యున్నాడో ఆ పట్టణమును కనుగొనాలనే ఆశయముతో ఈ లోకములో ఒక యాత్రికునివలె, పరదేశివలె గడిపాడని మనము చదివాము అతడు దేనినో తాకాడు. అతడు దేవునిని పట్టుకున్నాడు, ఆ దేవునియందు విశ్వాసముంచాడు. ఆ నూతన యొరుషలేమును ముందుగానే అతడు చూశాడు, అతడు తన సామాగ్రిని వీపున తగిలించుకొని యాత్రికుడు అయ్యాడు. ఎలాంటి సంకల్పము లేని, గాలికి కొట్టుకుపోయే చెత్తలా కాకుండా, దేవుడు దేనికి శిల్ఫియు, నిర్మాణకుడైయున్నాడో ఆ నిత్యమైన ఆ పట్టణమును తాను కనుగొనవలననే విశ్వాసము అతనిలో యుండెను. ఆ పట్టణమును కనుగొనాలనే సంకల్పమును అతడు తన జీవితములో కలిగియున్నాడు.

నేను చెప్పవచ్చా ఒక దినమున యుద్దము ముగిసిన తర్వాత అతడు ఆ పట్టణపు రాజును కలిశాడు. ఆయన అతనికి రొట్టె, ద్రాక్షారసమును మరియు ప్రభురాత్రి భోజనమును ఇచ్చాడు; ఆ రాజు మెల్కీసెదకు.

ఓ, నీవు నీ హృదయములో ఏ సంకల్పము లేకుండా దేవుని యొక్క వాగ్దానములలో ఏ ఒక్కటి కూడా నిజరూపములోనికి రాలేదు. ఒకవేళ పాపముల వలన, సందేహముల వలన, ఎత్తు-పల్లముల వలన, కలవరముల వలన నీ ఆత్మ పీడింపబడిన యెడల, నీవు జయించ వలసినదే. ఏదో చోట ఎచ్చటో నీవు జయించగల స్థలము ఒకటి కలదని నీ అంతరంగమునందు ఏదో ఒకటి నీకు చెప్పుచూ ఉండును. ఎందుకు నీవు ఒక స్థలము నుండి ఒక స్థలమునకు, ఒక సంఘము నుండి ఒక సంఘమునకు కొట్టుకొని తేలిపోతూ చుట్టూ తిరుగుచూ యున్నావు? పరలోకమును తాకేవరకు కేవలము మోకరించి యుండుము. నేను గత రాత్రి చెప్పినట్లుగా, “ధ్వని పరిమితులను దాటి వెళ్ళము”. అప్పుడు నీ జీవితములో ఒక గురిని కలిగియుంటావు. ఒక సంఘమునకు చెందియుండుటలో ఒక సంకల్పమును, లక్ష్యమును నీవు కలిగియుంటావు. నీవు బాప్తిస్మము పొందుటలో ఒక ప్రయోజనము కలిగియుంటావు. నీవు వెదకువాటియందు ఒక సంకల్పము కలిగియుంటావు.

19

ఎందుకనగా దేవుడు యాధార్థవంతుడు, మరియు దేవుడు సత్యవంతుడు మరియు దేవుడు అబద్ధమాడడు అని మనము ఎరిగియున్నాము. మరియు దేవుడు దానిని అబ్రహాము హృదయములో ఆయన స్వరము ద్వారా ఆయన వాక్యము ద్వారా పెట్టినట్లయితే, ఇప్పుడు దానిని మన ఎదుట ఆయన పరిశుద్ధ గ్రంథములో పరిశుద్దాత్మ సాక్ష్యము ద్వారా, పరిశుద్దాత్మ సూచనలు, అద్భుతముల ద్వారా, యేసుక్రీస్తు ఇంకనూ సజీవుడని మరియు ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని ఋజువు పరుస్తుంది. అయితే మనము ఇంకనూ ఎందుకు అటువంటి వాటిని ఆశిస్తూ ప్రాచీన దురాశలను వెంబడిస్తున్నాము?

నీవు అవసరతలో ఉంటే, ఎలాటి అవసరత అయినా, తన పరిశుద్ధ గ్రంథములో ఆయన వాగ్దానము చేసినది ఏదైనా, ఆ అవసరతను తీర్చుటకు ఈ రాత్రి ఆయన ఇక్కడ ఉన్నాడు. ఇంకా ముందుకు వెదుకవలసిన అవసరము లేదు. ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది. ఆయన ఆత్మ ఇక్కడున్నది, మరియు నీవు దేనికొరకు వెదుకుచున్నావో దానిని నీకు అనుగ్రహించుటకు ఆయన ఇష్టపడుచున్నాడు దానిని ఇచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు, ఇంకా ఎందుకు నీవు నిరీక్షిస్తున్నావు?

20

నీవు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, నీటిలో తేలిపోయేవాడివలె రావద్దు. “నేను అక్కడకు వెళ్తాను, అది పనిచేస్తుందో లేదో నేను చూస్తాను.” నీవు ఎన్నడూ గమ్యం చేరలేవు, కాని నీవు సమస్తమును అమ్మి వేసి ఒట్టివాడవై పాప భారముతోను, అవిశ్వాసముతోను, సందేహములతోను మరియు కలవరములతోను ఈ లోకమునందు నీవు అలసిపోయినప్పుడు ఆ స్థితిలో దృఢమైన ఒక తీర్మానమును నీవు కలిగి, యుగముల బండతో నిశ్చయముగా కట్టబడి లంగరు వేయబడుటకై జీవముగల దేవుని యొద్దకు రమ్ము. జీవముగల దేవుని సన్నిధిలోనికి నిన్ను లాగుటకు ఇక్కడ పరిశుద్దాత్మ ఉన్నది. అది నీకు లోకములో ఉన్న దేనినైనా, రోగము, వ్యాధి, ఒకవేళ మరణమైనా దానిని జయించే విశ్వాసమును అనుగ్రహించును.

“సహో బ్రన్హాం, నీవు మరణము అని చెప్పావు,” అని అడగవచ్చు. అవును, నా ఉద్దేశ్యము అదే. మరణము.

21

లాజరు మరణించి భూమిలో పాతిపెట్టబడినప్పుడు, అతను అప్పటికే కుళ్ళిపోవుట ప్రారంభమైనది. యేసు, మార్తతో, “అతనిని ఎక్కడ పాతిపెట్టిరి? నీవు సందేహించనట్లయితే, నీవు దేవుని మహిమను చూస్తావు,” అని చెప్పలేదా?

“సందేహించవద్దు అని నేను, నీతో చెప్పలేదా? అని ఆయన ఆ దినమున యాయీరుతో అన్నాడు. ”నీవు కేవలము విశ్వసించినట్లయితే, నీవు దేవుని మహిమను చూస్తావు.“

అప్పుడు విశ్వాసము మరణమును జయించును. విశ్వాసము, మరణము మీద జయమైయున్నది. విశ్వాసము, పాపము మీద జయమైయున్నది. విశ్వాసము రోగము మీద జయమైయున్నది. విశ్వాసము, కలవరము మీద జయమైయున్నది. విశ్వాసము, కృంగిన స్థితిపై జయమైయున్నది. లోకమును జయించినది విశ్వాసమే.

22

నీవు అంటావు, “యోహాను దానిని వ్రాసినప్పుడు, అతనికి నా సమస్యలు లేవు. నేనే గుంపుతో సతమతమగుచున్నానో ఆ సమస్య అతనికి లేదు. నేను ఎదుర్కొనే సమస్యల గుండా అతడు వెళ్ళవలసిన అవసరము లేదు.” అది నిజము. అతడు అదే గుంపుతో వ్యవహరించవలసిన అవసరతలేకపోవచ్చును. అతడు అదే కార్యమును జయించవలసిన అవసరము లేకపోవచ్చును, కాని అతడు ఎన్నడూ వాటిని మినహా యించలేదు. ఎందుకనగా అతడు, “లోకమును సమస్త కార్యములను జయించినది మన విశ్వాసమే,” అని చెప్పాడు.

అది ఎలా ఉన్నది? దానియందు విశ్వాసముంచుము. దాని పైగా సవారి చేయుము. దేవుని యొక్క వ్రాయబడిన వాక్యము మన ఎదుట పెట్టబడియుండగా, మరియు ప్రభువైన యేసు పునరుద్దానమును పరిశుద్దాత్మ రుజువు పరుస్తూ మీరు ప్రార్థించునప్పుడు “వేటి విషయము ప్రార్థిస్తున్నారో, వాటిని పొందియున్నారని నమ్ముడి; అప్పుడు అవి మీకు దొరుకును,” అని వ్రాయబడిన దైవిక వాగ్దానములను మన ఎదుట నిరూపిస్తుంది. అప్పుడు నీవు చేయవలసినది ఏమిటి? విశ్వసించుము, కేవలము తేలిపోయే విశ్వాసము కాదు. ఏదో ఒక వేషధారి విశ్వాసము కాదు, కాని ఒక నిజమైన విశ్వాసమును కలిగియుండుము.

23

ఇప్పుడు, విశ్వాసము అనునది ఒక విజేత; విశ్వాసము జయశాలి. అది కేవలము శాంతి కలిగించేది కాదు; అది జయించును. “లోకమును జయించినది విశ్వాసమే.” అది ఏమి చేస్తుంది? విశ్వాసము అంటే ఏమిటి? జయించుట అనగా ఏమిటి? జయించుట, విజయము ఒక్కటే. జయించుట అనగా, “క్రింద పడవేయుట, స్వారీ చేయుట, చేతులు బంధించి, చెరసాలలో పడవేయుట.” అనగా ఒకప్పుడు నిన్ను ఏలిన పాపము మీద ఇప్పుడు నీవు ఏలుబడి చేయుట. అనగా, ఇప్పుడు నీవు దానిని జయించావు. నీవు దానిని కొరడాతో కొట్టావు. నీవు దానికంటె గొప్పవాడివి. ఓ, ఇప్పుడు నాకు చాలా ఆసక్తిగా అన్పిస్తుంది.

ఏది ముందు, ఒక పాపియా లేక రక్షకుడా? రక్షకుడు, ఎందుకనగా రక్షకుడు పాపము కంటే ఎంతో శక్తిమంతుడు. ఏది ముందు, స్వస్థతపరచువాడు, లేక రోగము. రోగము కంటె శక్తిమంతుడు కావాలంటే స్వస్థపరచువాడు ముందు ఉండాలి. స్వస్థపరచువాడే ముందు. ఆయన రోగమును జయించాడు. అపవాది యొక్క ప్రతి శాపమును జయించిన విజయము విశ్వాసమే. విశ్వాసమే విజయము.

24

దేనియందు విశ్వాసము? సంఘము మీద విశ్వాసము కాదు, నీ సిద్దాంతము మీద విశ్వాసము కాదు, ఏదో ఒక వ్యక్తి మీద విశ్వాసము కాదు, కాని విజయమును గూర్చి వాగ్దానము చేసిన యేసుక్రీస్తు నందు నీ విశ్వాసము ఉండాలి. అదియే విజయమగును. అది ఏమిటి? అది విజయము. “నా చెయ్యి ఇంకా వంకరగా ఉన్నది,” అనవచ్చు. కాని విశ్వాసమే విజయము. నాకు ఇంకా అనారోగ్యముగా ఉన్నది,“ కాని విశ్వాసమే విజయము. ఓ, అది లోకమును జయించును. నీవు ప్రార్ధన ద్వారా ఆ కార్యము కొరకై జయమును సాధించునంత ఎత్తులోకి నీవు దేవుని యొద్దకు ఎక్కినప్పుడు, అప్పుడు నీకు హాని చేయకలిగినది ఏదియు ఉండదు. నీవు జయించావు. నీవు యాభై మైళ్ళ పొడవున విస్తారమైన గదిని కలిగియున్నావు. అప్పుడు నీవు స్వేచ్చగా విహరిస్తున్నావు.

మీలో త్రాగుబోతులుగా ఉండి, విస్కీకి బానిసగా ఉన్న నీవు అప్పుడు వాడి మీద యజమానుడవు అవుతావు. సారాయి అనే ఆ పాత దెయ్యం ఇప్పుడు నీకు యజమానుడిగా ఉన్నాడు. వాడు నిన్ను త్రాగుబోతుగా చేశాడు, కాని నీవు విశ్వాసము పొందుకున్నప్పుడు, నా ఉద్దేశ్యము నకిలీ విశ్వాసము కాదు, నిజమైన విశ్వాసము, అప్పుడు వాడు నీ ఏలుబడినందు ఉండు బానిసగా అయిపోతాడు.“

పొగాకు మానుకోలేని స్థితిలోయున్న స్త్రీ మరియు పురుషులగు మీరు, దాని నుండి విడుదల పొందుకోవలెననే తీర్మానమును నీవు కలిగియుండి ఆ స్థలము యొద్దకు నీవు వచ్చినప్పుడు, దానిని నీవు విశ్వాసము ద్వారా జయించెదవు. అప్పుడు, నీవు దానిపై యజమానునిగా యు౦డేదవు.

25

ఇప్పుడు ఇక్కడ కూర్చొనియున్న ఒక స్త్రీ? ఆమె ఈ బలిపీఠము వద్దకు అనేక పర్యాయములు వచ్చినది. మంచి స్త్రీ? కాని చాలా కాలము క్రితము పొగ త్రాగుటకు అలవాటుపడింది. ఆమె దానిని జయించలేకపోయినది. ఆమె ఇక్కడకు వచ్చినది, మరియు నేను ఆమె కొరకు ప్రార్థించాను. ఆమె దానిని జయించలేకపొవుచున్నట్లు అన్పించినది. మీకు తెలుసా? నేను ఆమెతో, “మార్గము చివర అపాయమున్నది,” అని చెప్పాను.

ఆమె చెప్పినది, “సహోదరుడా బ్రన్హాం, నేను ఏడ్చాను, గోజాడాను,”

మీరు గమనించండి. అది ఉద్రేకము, గాలితో పోరాడుట, అట్టిదాని వలన ఎలాటి ప్రయోజనము లేదు.“ మరియు క్రిందకు దిగి వచ్చి ఆమె మీద చేతులుంచి, ఆమెతో కలసి ప్రార్థించాను. ఆమె తిరిగి వెళ్ళిపోయినది. కొన్ని దినముల తర్వాత నేను మరలా ఆమెను కలిశాను. సిగరెట్ పొగ ఉక్కిరిబిక్కిరి చేసినది. ఆమె చేతులు ఇంకా గోధుమ వర్ణములో ఉన్నాయి.

“ఒకరాత్రి, ఆమె ఆ దిగువనున్న వైద్యుని వద్దకు వెళ్ళినది, ఆమె అనారోగ్యము పాలయినది. బరువంతా కోల్పోయి పీలగా అయినది. వైద్యుడు ఆమెను చూసి, ”కాన్సరు, సిగరెట్టు త్రాగుట వలన వచ్చింది,“ అని చెప్పాడు. ఆమె అక్కడ మరణావస్థలో పడియున్నది. ఆమె అప్పుడు తన కార్యమును చిత్తశుద్ధితో నెరవేర్చాలి.

26

నీటిలో కొట్టుకుపోయేవాడు గడ్డిపరక కోసం అర్రులు చాస్తాడు. ఆ రాత్రి ఈ ఆలయమును విడిచి వెళ్ళిన తర్వాత, నీవు మెధడిస్టు లేక బాప్టిస్టులో చేరవచ్చు. నీవు ఇక్కడ కూర్చొని, “ఇప్పుడు నేను... నేను మంచి వ్యక్తిని, నాలో ఏ తప్పిదము లేదు,” అని నీవు ఎంతకాలము అనుకొనుచున్నప్పటికీ నీవు ఏమి సాధించలేవు. అది నిజము. కాని ఎప్పుడైతే దేవుడు నీ పాపములను ఏ రీతిగా చూస్తున్నాడో ఆయన వాక్యపు వెలుగులో ఆ రీతిగా నీవు చూచినప్పుడు, అలా నీవు చూచినప్పుడు, నీవు పశ్చాతాపము పొందుతావు లేదా నశిస్తావు. ఏదో ఒక కార్యము అక్కడ సంభవిస్తుంది. నీవు నీ కర్తవ్యమును నెరవేర్చాలి.

నీ గుండె ఊపిరితీయుటకు ఇబ్బంది పడుచుండగా నీవు ఇక్కడ నుండి వెళ్తావు. ఆ వెనుక వైద్యుడు లేచి, నీ వద్దకు వచ్చి నిన్ను పరీక్షించి, “అది గుండెపోటు” అని చెప్తాడు. నీవు కార్య రంగములోనికి దూకాలి.“ ఆమె ఎప్పుడైతే తన కర్తవ్యమును పరిష్కరించుకొనవలసి వచ్చినదో, ఆమె అక్కడ కూర్చొని నా వైపు చూస్తూయుండెను.

27

సహో. రాబర్సన్ వెనుక ఉన్నాడు, సహో ఉడ్స్ ఇక్కడే ఎక్కడో కూర్చొని ఉన్నారు. వీరు నేను కలసి ఒకసారి ట్రక్కులో ఎక్కడికో వేటకు వెళ్ళుతున్నాము. పరిశుద్దాత్మ మమ్ములను ఆమె ఎక్కడ నివసిస్తున్నదో ఆ గుట్టలు గల ప్రాంతమునకు మమ్ములను నడిపిస్తున్నట్లున్నది. మరియు నేను అక్కడకు వెళ్ళకముందే ఆమె ఆ దర్శనము చూసియున్నది. ఆ గదిలోనికి పరిశుద్దాత్మ దిగి వచ్చినది, అప్పుడు ఆమె చిత్తశుద్ధితో కార్యములోనికి దిగినది. అప్పటి నుండి ఆమె ఎన్నడూ సిగరెట్ త్రాగలేదు. తర్వాత ఆమె అనేక పౌండ్ల బరువు పెరిగినది. వారు కాన్సర్ యొక్క ఆనవాలును కూడా కనుగొనలేకపోయారు. అది ఏమిటి? జయించేది విశ్వాసమే. ఇక్కడ నేను ఆమె కొరకు ప్రార్ధించినప్పుడు ఎందుకు దానిని జయించలేకపోయినది? ఆమె అటు ఇటు అల్లాడుచున్నది, కాని ఎప్పుడైతే వైద్యుడు, “నీకు కాన్సర్ ఉన్నది, నీవు త్వరలో మరణిస్తావు,” అని చెప్పాడో అప్పుడు ఆమె నిజముగా కార్యరంగము లోనికి దిగినది.

నీవు చిత్తశుద్ధితో వ్యవహరించుటయే దానిని జయించు మార్గమై యున్నది. ఎందుకు అంతవరకు ఎదురు చూస్తావు? ఇప్పుడే కర్తవ్యములోకి ప్రవేశించవచ్చుగదా? దేవుని యందు నీ విశ్వాసముంచు. ఒకవేళ ఆ స్త్రీ తన విశ్వాసమును నా మీద ఉంచినట్లయితే? అది విఫలమైయుండేది. ఎందుకనగా నేను ఒక మనిషిని, కాని ఎప్పుడైతే ఆమె తన విశ్వాసమును మార్చినది, బ్రెన్హాం గుడారము నందు కాదు, విలియం బ్రెన్హాం మీద కాదు లేక మరియు ఎవరిమీదో కాదు; కాని ఆమె యేసు క్రీస్తునందు విశ్వాసముంచినది; అప్పుడు ఆమె విశ్వాసము పొందుకున్నది. ఆమె సమస్త భయములు, సందేహములకంటె పైకి ఎత్తుగా ఎదిగినది. దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. ఆమె జయించినది. సమస్తమును జయించే విజయము విశ్వాసమే.

28

నేను తరచుగా “ఎందుకు క్రైస్తవులు అలాంటి విషయములనుబట్టి కృంగిపోతూ ఉంటారా,” అని ఆశ్యర్యపడుతుంటాను. పురుషులు మరియు స్త్రీలు అనేకసార్లు నా వద్దకు వచ్చి వారు ఈ విషయాలు ఒప్పుకుంటూరు. వారితో వ్యక్తిగతముగా నేను మాట్లాడినప్పుడు వారు తమ అనైతిక, పాప జీవితము గూర్చి ఒప్పుకుంటారు. ఎందుకనగా వారు దానిని తృణీకరించలేరు; పరిశుద్ధాత్మ అక్కడే ఉంటాడు. ఒకవేళ వారు దానిని కప్పివేయుటకు ప్రయత్నించినట్లయితే, పరిశుద్దాత్మ వారి నుండి దానిని బహిరంగపరచును. దానినిబట్టి వారు ఒప్పుకుంటారు. ఒకవేళ వారు కొన్ని విషయములను తప్పించుటకు ప్రయత్నించినట్లయితే, పరిశాద్ధాత్మ వారిని ఆపి, “ఒక్క నిమిషము, ఇక్కడ పలాని సంగతి ఉన్నది,” అని చెప్పును.

కాబట్టి వారు నా దగ్గరకు వచ్చినప్పుడు, ఈ లోకములోని చిన్న చిన్న విషయాలు కూడా నాకు చెబుతారు. మరియు విశ్వాసుల మధ్య నేను దానిని గమనించాను. నీవు ఎక్కడికో వెళ్ళుచున్నావు. ఎందుకు కొట్టుకుపోతున్నావు? నీ గూర్చి ఒక లక్ష్యమును కలిగియుండుము. లోకముతో సరితూగుట మానివేసి నీ లక్ష్యమును క్రీస్తు మీదనుంచుము.

29

నీవు వార్తా పత్రికలను చూస్తావు, అది చెప్పును, “ఈ కాలములో దైవీక స్వస్థత, అలంటి దైవిక స్వస్థత అనునది లేదు.” అది నీ మనసులో ఒక సందేహమును పెడుతుంది. మరొకరు రేడియోలో ఒక చక్కటి ప్రసంగము చేస్తారు, చాలా మంచి ప్రసంగం, కాని “అద్భుతములు జరిగే కాలము ముగిసిపోయినది,” అని చెప్తారు. మరియు దానికి నీ మద్దతు తెల్పుతావు. గ్రహించారా, అది నిన్ను బలహీనపరుస్తుంది. అమ్మివేయుము. దేవునితో సరిపడుము. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండుము లేదా ఎన్నడూ అలా ఉండవద్దు. దేవుని పరిశుద్ధ గ్రంథము ఒక విషయమును గూర్చి బోధించకపోయినట్లయితే , దానితో నిన్ను నీవు వేరుకమ్ము. అయితే అది బోధించినట్లయితే, దానితో కలిసియుండుము.

30

అది నీకు ఈ విషయమును జ్ఞప్తికి తెస్తుంది: ఉదాహరణకు, ఇప్పటి నుండి ముప్పై రోజులలో మనము మరొక దేశమునకు ప్రయాణమై వెళ్ళుతున్నాము? మరియు ఆ దేశములో వాతావరణము ఎంతో అద్భుతముగా ఉంటుంది, మనము ఇక ఎన్నడూ తిరిగి వెనుకకురాము. మరియు అక్కడ మనము ఎన్నడూ మరణించము, మరియు వృద్దులము కాము, కాని నిత్యము మనము అక్కడే నివసిస్తాము. వస్తువులు అమ్మే దుకాణమునకు వెళ్ళి కొంత డబ్బుతో పనికిరాని చెత్త అంతటిని మీతో తీసుకు వెళ్ళుటకు కొనుచున్నట్లుగా నేను మిమ్ములను గూర్చి ఊహించవచ్చా? నీవు, నీ వద్దనున్న చెత్త అంతటిని వదిలించుకొనుటకు ప్రయత్నిస్తావు. కాని నీవు ఒక సంఘములో చేరిన తర్వాత దానిని విడిచి మరియొక సంఘముతో చేరుట ద్వారా నిన్ను నీవు కలవరపరచుకొనుట ద్వారా నీవు మరింత చెత్తను పోగుచేసుకొనుచున్నావు. కాని, ఒకవేళ నీవు ఎక్కడికి వెళ్తున్నావో దానిని గూర్చి ఆలోచించినట్లయితే అనేక సందేహములను, బుద్ధిహీనమైన కార్యములను నీవు విడిచిపెడతావు. నీవు నిజమైన విశ్వాసమును కలిగియుంటావు.

31

నేను ప్రజలతో చెప్తు౦టాను....

“రోగుల కొరకు ప్రార్థించే సహోదరుడు బ్రెన్హాం మీరేనా?”

“అవును.”

“మంచిది, అది నా విశ్వాసమునకు వ్యతిరేకము.”

“కావున నీకు ఏ విశ్వాసము లేదు. బైబిల్ ఆలాగు బోధించుచున్నది.”

ఇప్పుడు చాలామంది జనులు వరసులోకి వచ్చి చెపుతారు. “మంచిది, నాకు విశ్వాసము ఉన్నది.”

“అయితే నీవు అక్కడ ఏమిచేయుచున్నావు.”

ఓ, నిజమైన విశ్వాసమునకు ఓటమి తెలియదు. అది ఓడించబడదు. మరణము సహితము దానిని ఓడించలేదు. దానికి ఓటమి తెలియదు. శ్రమలకు ఓటమి తెలుసు, కాని విశ్వాసమునకు ఓటమి తెలియదు. అది ఓడిపోజాలదు. మరియు ఆ మార్గములో మాత్రమే నీవు దేవునిని సంతోషపెట్టగలవు. “విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము,” అని హెబ్రీ 11 అధ్యాయము చెప్పుచున్నది.

32

ఈ స్థలములో, మీరు వచ్చి అటు ఇటు తిరుగుచూ అసహ్యమైన మాటలను, బూతులను మాట్లాడు క్రైస్తవులుగా మీరు ఉంటే మిమ్మల్ని చూచి ఇంకా ఈ సంఘమునకు చెందిన వారిగా నేను ఊహించగలనా? నీవు మరొక దేశమునకు వెళ్ళవలసియుండగా, నీవు అమెరికా అంతటా తిరుగుచూ అమెరికా దేశములో మాట్లాడుచున్న అసహ్యమైన యాసను నేర్చుకొనుటకు ప్రయత్నిస్తావా? అసలు దానిని విగలమా? ఖచ్చితముగా నీవు ఆ విధముగా చేయవు? నీవు ప్రయత్నించే కార్యము ఏమిటంటే, అక్కడ ఉన్న భాషలోని పదాలను కొన్ని అయినా నేర్చుకొనుటకు ప్రయత్నిస్తావు. అది నిజము. “ఎలా ఉన్నారు” అనే మాటలను అయినా నేర్చుకొనుటకు ప్రయత్నస్తావు. మరియు ఈ రోజు ప్రజలు క్రైస్తవులు అంతకంటే ఎక్కువగా పరలోకపు భాష అయినటువంటి దేవుని స్తుతులను, అక్కడ మనము పాడి, ఆనందిస్తాము, వాటిని నేర్చుకొనవలసిన బాధ్యతను కలిగియున్నాము. దేవునిని స్తుతిస్తూ, బిగ్గరగా ఆరాధించుటకు ఇష్టపడని ప్రజలు, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమి చేస్తారు? అది నీకు తగిన స్థలముగా ఉండదు. ఇప్పుడే విశ్వాసమునుపొంది దానిని జయించుట మంచిది, ఎందుకనగా దానిని జయించు విజయము విశ్వాసమే. లేదు, నీవు అలాంటి చిన్న చిన్న విషయములకు అతుకబడి యుండకూడదు; నీవు విజయము పొందవలసి ఉన్నది.

నీవు అడగవచ్చు “సహో, బ్రెన్హాం, నేను దానిని ఎట్లా చెయ్యగಲను?”

ఎందుకు, అది చాలా సామాన్యమైనది. అది కేవలము.... ఇక్కడ ఈ కూడికలలో నిన్ను నీవు ఎలా సమర్పించుకోవాలని ఆలోచిస్తూ ఉండవచ్చు. ఈ భవనములో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, మరియు నా కూటములో కొన్నిసార్లు అనేక భాషలు మాట్లాడు ప్రజలు ఉంటూరు, వారిలో ఎవరినీ నేనెరుగను, కాని నిన్ను నేను ఎలా ఎరుగగలను. దానిని నేను ఎలా ఎరుగగలను? నిన్ను నీవు సమర్పించుకొన్నప్పుడే కేవలము నిన్ను నీవు పరిశద్దాత్మకు అప్పగించుకొనుము. అప్పుడు ఇక ఎంతమాత్రము నీవు కాదు. నీవు ఏమి మాట్లాడబోవుచున్నావో నీకు తెలియదు. నీ ద్వారా ఆయనను చెప్పనివ్వు. ఇది అంత సులువైనది.

33

మీలో అనేకమంది ప్రజలు మీ విశ్వాసమును వైద్యుల మీద నిలుపుతారు. నీకు వైద్యుడున్నట్లయితే నీవు నమ్మకము కలిగియుండాలి, నీకు ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు నీవు నమ్ముచున్న ఆ విశ్వాస పాత్రుడైన వైద్యుని వద్దకు వెళ్తావు. నీవు చేయవలసినది అదియే. అది మంచిదే. అప్పుడు నీ విషయమును అతనికి అప్పగిస్తావు. ఒకవేళ నీవు ఆసుపత్రిలో ఉండాలి అని ఆయన చెప్పినట్లయితే, మరొకమాట పలుకకుండ వెంటనే ఇంటికి వెళ్ళి దుస్తులు తీసుకొని ఆసుపత్రికి వస్తావు. ఖచ్చితముగా నీవు వైద్యుని మీద విశ్వాసము కలిగియున్నావు. నీవు ఆసుపత్రిలో ఉండాలో, లేదా ఇంటికి వెళ్ళిపోవచ్చునో నిర్ణయిస్తాడు. లేదా ఒక సంచి నిండా సరిపడు మాత్రలు వ్రాస్తాడు మరియు ఆ మాత్రలు నీవు మింగుతావు. అందులో ఏమున్నదో కూడా నీకు తెలియదు, కాని నీకు వైద్యుని మీద విశ్వాసమున్నది.

34

మరి దేవుని గూర్చిన విషయములో? మరియు ఆయన నీకిచ్చిన సువార్త మాత్రలు మ్రి౦గుటకు నీవు భయపడిపోతావు. “ఆయన పొందిన దెబ్బల వలన మీరు స్వస్థపడియున్నారు.” “లోకమును జయించిన విజయము మన విశ్వాసమే,” దాని మింగుము, అప్పుడు ఏమి సంభవించునో చూడుము. అది సంపూర్ణ నిశ్చయత. ఆ ఔషదములలో ఏమున్నదో తెలియకుండానే వాటిని తీసుకొనుట ద్వారా వైద్యుని మీద నీకున్న నమ్మకమును ఋజువు పరుస్తున్నావు. శస్త్రచికిత్సకు నిన్ను నీవు అప్పగించుకొనుట ద్వారా వైద్యుడి మీద నీకున్న నమ్మకమును ఋజువు పరుస్తున్నావు. అది వైద్యుడి మీద నీకు ఉన్న నమ్మకమును నిరూపిస్తుంది. కాని క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు, ఆయన వాక్యమునుబట్టి ఆయన మీద ఆధారపడుటకు నీవు భయపడతావు. అది ఎలా ఉన్నది? “విశ్వాసమే విజయము.”

నీ సమస్యను వైద్యుడికి అప్పగించుకున్న రీతిగానే ఈ రాత్రి నీ సమస్యను యేసుక్రీస్తుకు అప్పగించుము. ప్రభువా నీకు ఏది ఇష్టమైతే అదే నాకు ఇవ్వండి, ఈ సమస్యకు మీరే వైద్యుడు. అప్పుడు నీవు జయము పొందుకుంటూవు. అప్పుడు జయించే విశ్వాసమును నీవు పొందుకుంటావు. మరలా ఎన్నడూ నీవు మరొక ప్రార్థన వరుసను వెదుకవు. నీవు మరిదేనిని ఎన్నడు వెదుకవు. నీవు అక్కడే దానిని పొందుకుంటావు. దానితో ఆ సమస్య పరిష్కారమైపోతుంది. అది వారి వద్ద ఉన్నదా? లేక వీరివద్ద ఉన్నదా? అని చూచుటకు నీవు ఎన్నడూ ఒక సంఘము నుండి మరియొక సంఘమునకు మారవు. అది వారి వద్ద లేదు. అది నీవే కలిగియున్నావు. నీవు విశ్వాసమును పొందుకున్నప్పుడే, నీవు విజయమును కలిగియున్నావు.

35

ఈ రాత్రి అమెరికాలో మన అవసరత మరియు ఈ గుడారములో ఈ రాత్రి మన అవసరత ఏమిటంటే, వైద్యుడైన యేసు మన విశ్వాసము మీద శస్త్రచికిత్సను చేయుటకు మనము అనుమతించాలని నేను చెప్పుచున్నాను. వైద్యుడు నీకు చెబుతాడు, “నీకు అపెండిక్స్ ఉన్నది, అంతా విషతుల్యమైపోతుంది, అది బయటకు తీసివేయాలి. నీకు అది, ఇది, పలాని సమస్య ఉన్నది, దానిని బయటకు తీసివేయాలి.” నీ మిగిలిన అవయవాలు సక్రమంగా పనిచేయుటకు వీలుగా దానిని తీసివేస్తాము. ఈ రాత్రి మన విశ్వాసము సంగతి ఏమిటి? దేవుడు శస్త్రచికిత్స చేసే వాక్యమును తీసుకొనుటకు మనము భయపడుచున్నాము. రెండంచుల ఖడ్గముకంటే వాడిగల వాక్యమును తీసుకొని నటన, దగా, వేషధారణ తప్పు అని మనకు చెప్పు ప్రతీ కార్యముపై దేవుడు మన మీద శస్త్ర చికిత్స జరుపుటకు అనుమతించెదము. అంతేకాకుండా మనల్ని ఆటంకపరచే ప్రతీ నీడను తొలగించుకుంటూ నిత్యమైన దేవుని యొక్క వాగ్దానములవైపు ముందుకు ప్రయాణించాలి. ఓ, మనము ఆ రీతిగా చేసినట్లయితే, యేసు మన విశ్వాసము మీద శస్త్రచికిత్స చేసి అందులో ఉన్న ప్రతి సందేహమును, ప్రతి భయములను, ప్రతి కలవరములను, సమస్త పాపములను అచ్చట యుండు సమస్తమును ఆయన తీసివేస్తాడు. మన విశ్వాసము మీద చక్కగా శస్త్ర చికిత్స చేసిన పిదప మనము ఒక నూతన సృష్టిగా వెలుపలికి వచ్చెదము. అప్పుడు మనము వ్యత్యాసముగా వుండెదము. అందుకే ఒక శస్త్ర చికిత్స అవసరమైయున్నది.

36

ఆ శస్త్రచికిత్సలో యేసుక్రీస్తునందు నీ విశ్వాసమును ఉంచగలవా? నీవు ఆయనయందు విశ్వాసమునుంచగలవా? “ప్రభువైన దేవా, నీ మాటనుబట్టి,” అని నీవు చెప్పగలవా? పరిశుద్ధ మార్కు సువార్త 5లో శిష్యులు “ప్రభువా నీ మాటను బట్టి,” అని చెప్పిరి. “మేము రాత్రియంతా ప్రయాసపడినప్పటికి, ఏమియు పట్టలేదు. అయినప్పటికి ప్రభువా, నీ మాటనుబట్టి నేను వల వేస్తున్నాను,” అని పేతురు చెప్పాడు. ప్రభువా, నేను జాలరిని. చంద్రుడు సరియైన స్థానములో ఉన్నప్పుడు ఆ సూచనలు నాకు తెలుసు. అవి ఎరను ఎప్పుడు కొరుకునో, లేదో నాకు తెలుసు. అవి లోతట్టుకు ఎప్పుడు వెళ్తాయో, ఎప్పుడు బయటికి వస్తాయో నాకు తెలుసు. అంతమాత్రమే కాదు. నేను రాత్రంతా వల వేశాను. నిపుణుల ఆలోచన ప్రావీణ్యుల బృందము ఇచ్చట నాతో ఉన్నారు మరియు మా వృత్తి, వ్యాపారము మాకు తెలుసు. మేము ఈ సెలయేరులో రాత్రంతా పరిశోధించాము, మరియు మాకు ఏమియు దొరకలేదు, కాని ప్రభువా, నీ మాటను బట్టి నేను వలవేస్తాను.“ ఎందుకనగా ప్రధాన శస్త్ర చికిత్స నిపుణుడు ఆ విధముగా చెప్పాడు, ప్రధాన వైద్యుడు ఆ రీతిగా చెప్పాడు. వారి వలలు పిగిలిపోవునంతగా విస్తారమైన చేపలను వారు పట్టినారు. ఎందుకని? విశ్వాసమే విజయము. అప్పుడు నీటిలో ఒక్క చేపకూడా ఉండియుండక పోవచ్చు, కాని దేవుడు ఎప్పుడైతే వాగ్దానము చేశాడో, ఆయన చేపలను సృజించి, వాటిని అక్కడ ఉంచాడు.

37

బహుశా నీవు జీవించుటకు ఎంత మాత్రము అవకాశము లేకపోవచ్చును, నీవు కాన్సరుతో మరణిస్తూ ఉండవచ్చును. ఒకవేళ నీవు చక్రాల కుర్చీలో బంధించబడి ఉండవచ్చును, నీవు పూర్తిగా గ్రుడ్డివాడివి కావచ్చును. నీ సమస్య ఏమిటో నాకు తెలియదు, కాని నీవు ముఖ్య వైద్యుని యొక్క ఔషధాల చీటీని పాటించినట్లయితే “మీరు ప్రార్థించునప్పుడెల్ల, మీరు వేటి విషయము ప్రార్థిస్తున్నారో, వాటిని పొందియున్నారని విశ్వసించుడి. అప్పుడు అవి మీకు అనుగ్రహించబడును.” అక్కడున్న ప్రతి అవరోధమును, కష్టమును విశ్వాసము జయించునని మీరు నమ్మికయుంచుడి. నీ ఆత్మ బురదవలె మారునంతగా పాపమును మోస్తూ౦డవచ్చు. నీవు కోపమును, బూతులు మాట్లాడుటను, ఫోన్లో గాలివార్తలు చెప్పుటను మానివేయాలని ఎంతగానో ప్రయత్నించి ఉండవచ్చు. నీకు తెలిసిన ప్రతి విధమైన ఔషదమును అందుకొరకై నీవు ప్రయత్నించి ఉండవచ్చు. కాని యేసుక్రీస్తును నీ హృదయములోనికి అనుమతించినట్లయితే, ఆయన నీ విశ్వాసమునకు చికిత్స చేసి, ఈ లోకము నీ ఎదుట ఉంచిన ఎలాంటి అవరోధమును అయినా దానిని జయించే విశ్వాసమును ఆయన నీకు అనుగ్రహించును. ఎందుకు? లోకమును జయించు విజయము విశ్వాసమే.

38

ఇప్పుడు, సజీవ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సన్నిధి ఇక్కడ ఉండగా నీవు ఎలా సందేహిస్తున్నావు? ఆయన గొప్ప పరిశుద్దాత్మ ఈ ఆలయములో ఉన్నది. వాక్యము దానిని మనకు వాగ్దానము చేస్తున్నది, “ఇదిగో నేను ఎల్లప్పుడూ మీతో ఉందును, యుగ సమాప్తి వరకును మీతో ఉందును,” అది ప్రభువు ద్వారా వాగ్దానము చేయబడినది. దేవుడు ఆయన వాక్యమును నెరవేర్చవలసియున్నది. నీవు దానిని విశ్వసించుచున్నావా? ఆయన ఈ కార్యములను చేస్తానని వాగ్దానము చేసినప్పుడు, దేవుడు వాటిని ఖచ్చితముగా నెరవేర్చవలసిన బాధ్యత కలిగియున్నాడు. ఇప్పుడు మీరు దీనిని గూర్చి ఆలోచించాలని నేను కోరుచున్నాను. నీవు పాపము కలిగియుంటే, నీ జీవితములో ఏదైనా తప్పిదము ఉంటే, మనము ప్రార్థన కొరకు తలలు వంచి యుండగా, మీరు వాటి గూర్చి యోచించాలను కోరుచున్నాను. కొద్ది నిమిషములు ప్రార్ధన కొరకు తలలు వంచుదాము

39

నేను ప్రార్థన చేయుటకు ముందు, ఒక ప్రశ్నను నేను వేయగోరుచున్నాను. ఈ ఆలయములో పురుషుడైనా, స్త్రీ, బాలిక, బాలుడు ఎవరైనా తమ చేతులు పైకెత్తి ఇలా చెప్పేవారున్నారా? “ప్రభువా, నేను దీనిని జయించలేనట్లుగా అన్పిస్తున్నది. ఈ కార్యములను చేయకూడదని నాకు అనిపిస్తుంది. అది, ఇది చేయకూడదు అని నాకు తెలుసు. కాని ఈ రాత్రి ఇప్పుడే వర్తమానము వినిన తర్వాత నా విశ్వాసమునకు శస్త్రచికిత్స చేయండి. ప్రభువా నన్ను మీరు సంపూర్ణముగా పరీక్షించి, నా విశ్వాసములో ఉన్న ప్రతి చిన్న వ్యాధిని బాగుచేయండి. ఈ సమస్యలను జయించగలిగే విశ్వాసమును ఇవ్వండి.”

నీ చేతిని ఆయన వైపు ఎత్తి పట్టుకొనుము. నీవు ఆ విధముగా చేస్తావా? ప్రభువు నిన్ను దీవించును గాక. దయతో చేతులు పూర్తిగా పైకెత్తండి.“ ”మనము ప్రతి భారమును, సుళువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.“

అనారోగ్యముతో, అవసరతలతో ఎందరున్నారు, మీ చేతుల పైకెత్తి, “ప్రభువా, నా విశ్వాసమునకు శస్త్ర చికిత్స చేయండి. ప్రభువా, ఈ రాత్రి నేను అవసరతలో ఉన్నాను,” అని చెప్పండి. దేవుడు మిమ్మును దీవించును గాక. విశ్వాసమే విజయము. మనము విశ్వాసము ఎలా పొందుకుంటాము? “వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును,” “పాపపు ఆత్మతో, అక్కరలో ఉన్న మీకు, ఈ ఆలయములో క్రమము ప్రకారము మీకు వేదిక పిలుపు (బలిపీఠపు పిలుపు) ఇవ్వటం లేదు. ఎందుకనగా ఇక్కడ తగినంత చోటులేదు. గోడలకు ఆనుకొని ప్రజలున్నారు. ఈ బలిపీఠం చుట్టూ ప్రజలు క్రిక్కిరిసి ఉన్నారు. కాబట్టి వేదిక పిలుపు ఇచ్చుటకు ఈ స్థలము అనుకూలముగా లేదు. కాని ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థిస్తాను. నేను ప్రార్థిస్తుండగా, ఇప్పుడే మీరు, మిమ్ములను క్రీస్తుకు అర్పించుకొనండి.

40

ప్రియమైన దేవా, నీవు ఉన్నావని, యదార్థముగా నిన్ను వెదకువారికి బహుమానము దయచేయువాడవు నీవని విశ్వసించి వచ్చిన పశ్చాత్తాప్త హృదయములతో నీ కొరకు కనిపెట్టుచున్న వీరి మీద నీ దయను చూపించండి. ప్రభువా, వారిని కనికరించవలసినదిగా నేను ప్రార్థిస్తున్నాను. వారి సమస్య ఎట్టిదైనా, క్యాన్సరు అనే సందేహము, కోపము అనే క్యాన్సరు, అవిశ్వాసము, ద్వేషము వంటివి ఏవైనాగాని వారి నుండి ఇప్పుడే తొలగించి. ప్రభువా, వారికి పరిశుద్దాత్మను అనుగ్రహించండి. ప్రభువా, మీ మంచితనముతో, మేలులతో వారిని నింపండి. నీ యందున్న విశ్వాసమును ఒప్పుకొనుచూ చేతులు పైకెత్తియుండగా, ఇప్పుడే వారిని నీ రాజ్యము నిమిత్తము బాప్తీస్మం ఇవ్వండి. ఈ కార్యమును వారిలో జరిగించవలసినదిగా, కనికరము కలిగిన దేవా, నీకు ప్రార్ధించుచున్నాము. సముద్రములో కొట్టుకొనిపోయే వారి ఆలోచనలను వారు మార్చుకున్నారు. వారు ఆ నావలోనికి రావాలని కోరుచున్నారు, ప్రధాన శిల్పిచే చెక్కబడి, క్రీస్తుయేసు నందు నూతన సృష్టిగా మార్చబడి, పరిశుద్దాత్మచేత శక్తి పొందుకొని, ఆయన చిత్తమునుబట్టి నడుపబడుచున్నట్లుగా మార్చబడాలి. నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో దీనులముగా మేము ప్రార్థించుచుండగా తండ్రీ, వారికి ఇప్పుడే దీనిని అనుగ్రహించండి.

ప్రభువా, ఇప్పుడు అనేక హస్తములు గాలిలోనికి ఎత్తియున్నారు. వారు ఒక స్థలము నుండి మరియొక స్థలమునకు తిరిగియున్నారని వారు గ్రహించియున్నారు. పలాని పలాని వ్యక్తితో రోగులు కొరకు ప్రార్థనలు చేయి౦చుకోవాలని అనేక మైళ్ళ నుండి కారులు నడుపుకుంటూ వచ్చారు. వారు ఇక్కడికి ఎంతో దూరము నుండి వచ్చియుండవచ్చు. ప్రభువా, దానినిబట్టి వారిని అభినందిస్తున్నాను. ప్రభువా, నేను నీ సేవకుడిని అని నన్ను నమ్మకపోయినట్లయితే? వారు ఇక్కడికి వచ్చేవారు కాదు. వారికి నా ప్రార్థనల మీద నమ్మకముంచునట్లుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాను.

41

ప్రభువైన దేవా, ఇక్కడున్న ప్రతి ఒక్కరి కొరకు నేను యదార్థముగా ప్రార్థిస్తున్నాను. పరలోకమందున్న గొప్ప దేవా, వారి జీవితములో నీ గొప్ప పరిశుద్దాత్మలో సంచరించి, వారిలో ఉన్నప్రతి అవిశ్వాసమును కత్తిరించివేయండి. “విశ్వాసమే విజయము,” అని వారు గ్రహించునట్లు చేయండి. మాకు సహాయపడేది ఈ లోకంలో ఉన్న ఒక వ్యక్తి కాదు, ఏదో ఒక సంఘము కాదు, లేక ఎవరో ఒక వ్యక్తి యొక్క ప్రార్థన కాదు, కాని విజయము మీదున్న విశ్వాసమే.

నీ కుమారుడు, మా రక్షకుడు గూర్చి మేము చదివియున్నాము. ఆయన తన స్వదేశ మునకు వెళ్ళినప్పుడు, అక్కడున్న కొందరు “ఇతడు ఎవరు? ఇతడు వడ్రంగివాని కుమారుడు కాదా? ఇతడు, ఇతని తల్లిని మనము ఎరుగమా? ఆమె పేరు మరియ. ఇతని అక్క చెల్లెళ్ళు, సహోదరులు యూదా, యోహాను ఇక్కడ లేరా? మరియు వారు ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఆయన వారి అవిశ్వాసమును బట్టి ఆశ్చర్యపడెను. వారి మధ్య గొప్ప కార్యములు చేయలేకపోయెను.”

42

ఒక వ్యక్తి నీ యెదుట ఎంత గొప్ప దయను పొందినప్పటికి, మా స్వంత విశ్వాసమే విజయము అని మేము గ్రహించియున్నాము. దేవా, ఈ రాత్రి ఇక్కడ నుండి మానవుని తొలగించి మిమ్ములను మీరు ఇక్కడ కనపర్చండి అని ప్రార్థిస్తున్నాను. మా ప్రభువా, నీ పునరుద్ధానమే కేంద్రముగా మా విశ్వాసము ఉండును గాక. ఆయన మృతుడు కాదు, కాని యుగయుగములు ఆయన సజీవుడుగా యున్నాడు. “నేను మీతో ఎల్లప్పుడును ఉందును మరియు యుగసమాప్తి వరకు యుందును,” అని ఆయన వాగ్దానము చేశాడు. ఆయన ఇక్కడున్నాడని మేము విశ్వసిస్తున్నాము. ప్రియ ప్రభువా, ఈ రాత్రి ఆయన ఇక్కడ ఉన్నాడని తనను తాను కనపర్చుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. మరియు అప్పుడు పరిశుద్దాత్మ ప్రతి హృదయమును సంధించి, వారి విశ్వాసమునకు చికిత్స జరిగించి వారి రోగములను, శ్రమలను, వాధ్యులను జయించకలుగునట్లు అనుగ్రహించుగాక. ఏమి సంభవించినా సరే, ఒకవేళ ఏ ఒక్క కార్యము జరుగునట్లుగా అనిపించినను, అయినా గాని వారిలో విశ్వాసము సృష్టించబడి వారు పలికినప్పుడు అది సంభవించును గాక! అదియే జయమైయున్నది. వారు విశ్వాసముతో పలికినప్పుడు అది జరిగే విశ్వాసముతో వారిని ఇక్కడ నుండి పంపండి. అది విజయము. అది లోకమును జయించును. ఆయన మహిమ నిమిత్తము ఆయన నామములో దానిని మేము ప్రార్థిస్తున్నాము. ఆమేన్.

43

నేను చాల కష్టముగా చుడగలుగుచున్నాను ఎలా ప్రార్ధనా వరుసను పిలువగలను, ఆ ద్వారము విధులలోకి కిక్కిరిసీపోయినది, మరియు కిటికీల చుట్టూ, ద్వారముల చుట్టూ, ఇక్కడ పైన. మీరు కోరినట్లయితే నేను దానిని ప్రయత్ని౦చగలను. నేను ప్రార్ధనా వరుసను పిలుస్తాను, కానీ నేను చెప్తాను, దీని తరువాత నాకు నేనే దోషిగా బోధించుకున్నాను.

మీరు భయభక్తులతో గలరని నేను నమ్ముచున్నాను, మానవునికి యుండు విశ్వాసమురీతిగా, మీరు కలిగియున్న సమస్త విశ్వాసము నంతటినీ తీసుకొని దేవుని హస్తములోనికి అప్పగించి “ప్రభువా, ఇప్పుడు మీకిచ్చుటకు నా దగ్గరనున్న ఈ కొంచెము తీసుకొని, నీ విశ్వాసమును నాలోనికి రానిమ్ము,” అని చెప్పండి. ఆయన మిమ్ములను స్వస్థపరుస్తాడని నేను నమ్ముచున్నాను. ఈ వేదిక మీద నుండియే నేను మిమ్ములను పిలుస్తాను, మీరు ఇక్కడికి రానవసరంలేదు.

మీరు దానిని నమ్ముచున్నారా? మీ దగ్గర ప్రార్థనా కార్డులు ఉన్నట్లయితే, వాటిని పట్టుకొనండి; మేము వాటిని ఉపయోగిస్తాము. కాబట్టి మేము నమ్ముచున్నాము.

44

ఇప్పుడు, ఈ విషయము నా మనస్సులోనికి వచ్చినది. కొద్దిసేపటి క్రితము మేము లోపలికి వస్తున్నప్పుడు, ఈ రాత్రి కూడా కొన్ని ప్రార్థనా కార్డులు ఇచ్చినట్లుగా బిల్లీ నాతో చెప్పాడు. ఎందుకనగా గత రాత్రి చాలా ఎక్కువ కార్డులు పిలిచాము. మరియు చెప్పాడు, “ప్రార్ధనా కార్డులు కావాలసిన వారు అక్కడ కొంతమంది ఉన్నారు డాడీ, నేను వారికి ప్రార్థనా కార్డులు ఇచ్చాను.”

“సరే మంచిది,” అని నేను చెప్పాను.

“కాని మీరు ప్రార్థనా వరుసను ఎలా పిలుస్తారు?” అని అడిగెను.

అక్కడ వెనుక చాలామంది గుంపుగా ఉన్నారు. వారందరూ అక్కడ గోడల ప్రక్కన గుంపుగా ఉన్నారు. కాబట్టి వారిని వరుసను పిలుచుటకు మార్గము చాలా కష్టముగా ఉన్నది. “నీవు ఇక్కడ నిలబడియుండుటకు లేదా నీవు ఎక్కడున్నావో అక్కడ కూర్చొనియుండుటకు తేడా ఏమిటి? కాని ఆ విధముగా చేయుటకు నీకు విశ్వాసము కావాలి. దానికి నీ విశ్వాసమును మరియు నా విశ్వాసమును, దేవుని విశ్వాసముతో ఒక్కటిగా కలపాలి. నీ విశ్వాసమును మరియు నా విశ్వాసమును వాడిపోవును, కాని దేవుని విశ్వాసము ఆధిపత్యము కలిగియుండును, మరియు ఆ కార్యము జరిగించును.

45

ఈ విషయముల ఆధారముగా నేను మిమ్ములను ప్రశ్నించకోరుచున్నాను. “మీరు ఇది దేవుని వాక్యము అని విశ్వసిస్తున్నారా?” ఒక వేళ అది దేవుని వాక్యము అయినట్లయితే అది అసత్యమైనదిగా యుండుటకు అవకాశము లేదు. అది ఖచ్చితముగా సత్యమైయుండి తీరవలయును. అది దేవుని వాక్యమైనప్పుడు అది సత్యమైయున్నది. ఇచ్చట ఆయన పలికే ప్రతీ మాటను నెరవేర్చుటకు ఆయన యొక్క కర్తవ్యమైయున్నది. మాటను కాపాడుకొనుటకు అది ఆయన యొక్క బాధ్యతయైయున్నది. ఇక్కడ ఆయన పలికిన ప్రతి మాటకు పూచీ వహించాలి. ఆయన ఆ మాటలను నెరవేర్చ వలసియున్నది.

ఇప్పుడు నీవు రోగిగా, రక్తహీనత లేక క్యాన్సరు లేక క్షయ వ్యాధితో మరణిస్తూ ఉండవచ్చు, మరియు మీరు ఇచ్చట వేదిక పైకి వచ్చి, మేము ఎరిగిన దైవ సేవకులు అందరిని ఇక్కడ సమకూర్చి మీలో ప్రతి ఒక్కరి కొరకు వారు ప్రార్థించినప్పటికీ, నీ యందు నీకు విశ్వాసము కలిగి యుంటేనే గాని అది క్రియ చేయదు. గ్రహించారా? కాని మీరు గమనిస్తుండగా ప్రక్కన ఉన్నవారిని ఎవరినైనా దేవుడు స్వస్థపరచినా, లేక తాను స్వస్థతను పొందుకొన్నాను అని నీతో వారు చెప్పినా అప్పుడు అది నీ విశ్వాసమునకు సహాయపడును. ఎందుకనగా వారు స్వస్థత పొందుట మీరు చూశారు.

46

ఈ మధ్య కాలములో దక్షిణాఫ్రికాలోని దర్బన్లో నేను ప్రార్ధిస్తున్నాను, వారు ఒక వ్యక్తిని వేదిక మీదకు తీసుకువచ్చారు. మీకు ఆ కథ తెలుసు. దానిని గూర్చి మీలో అనేకమందికి నేను చెప్పాను. మహ్మదీయురాలైన ఆ స్త్రీ ఏ విధంగా స్వస్థపడినది, ప్రతి ఒక్క జాతినుండి అనేకమంది స్వస్థపడ్డారు. అక్కడ సుమారుగా ఇరవై జాతుల వారున్నారు లేదా అచ్చట ఇంకా ఎక్కువ జాతులుగలవారున్నారు. ముందుకు వంగిపోయి పుట్టిన ఒక బాలుడు, తన చేతులతో నడుస్తూ వేదిక వద్దకు వచ్చాడు. మరియు పరిశుద్ధాత్మ అతనితో చెప్పుట ప్రారంభించాడు. అతడు “జూలు” తెగవాడు, పరిశుద్ధాత్మ మాట్లాడుట ప్రారంబించగానే ఆ వ్యక్తి గూర్చి చెప్పాడు. అతడు తన కుడి, ఎడమలకు భేదము తెలియని ఆఫ్రికా అనాగరికుడు. అతడు ఎవరో కూడా పరిశుద్ధాత్ముడు చెప్పాడు. వారందరూ అక్కడ కూర్చొనియున్నారు. అక్కడ మంత్రగాళ్ళు, నోట మాటరాక అలాగే నిలబడియున్నారు, “ఇది ఏమి క్రొత్త సంగతి,” అని అన్నారు. విసనకర్రలతో విసిరించుకొంటున్న తెగల ప్రధానులు, వారు విసురుకునే ఆ విసనకర్రలు ఆపించారు.

కాని ఆయన చెప్పాడు, “నీవు నివసిస్తున్న నీ గుడిసెలో అచ్చట యున్న గోడమీద నా ప్రభువు చిత్రము వ్రేలాడుచున్నది.” మరియు అతని తల్లిదండ్రులు వెనుక వేలాదిమంది ప్రజలతో నిలిచియున్నారు, అది నిజమేనని సాక్ష్యమిచ్చుటకు వారు చేతులు ఎత్తారు.

మరియు చెప్పాడు, “ఇప్పుడు నీకు ఒక సహోదరుడు ఉన్నాడు అతడు మేక లేక కుక్క మీద స్వారీ చేస్తుండగా క్రిందపడి కాలు దెబ్బతిన్నది. అతుడు చేతి కర్రల మీద నడుస్తున్నాడు. మరియు అతడు ఈ కూటములో ఉన్నాడు. అతని విశ్వాసము ఇప్పుడే జయించినది, అతడు స్వస్థపడ్డాడు.” దానికి కారణమేమిటి? తాను ఎవరన్న విషయమును మరియు తన జీవిత ములో ఎప్పుడో సంభవించిన ఒక సంఘటనను గూర్చి ఇంత స్పష్టముగా చెప్పిన ఈయన, నేను మాట్లాడే భాషను కూడా అర్థము చేసుకోలేని మరియు మాట్లాడలేని ఒక తెల్లజాతీయుడై యుండి యే విధముగా వీటిని చెప్పగలిగెను. అసలు ఈయనలోని ఆ శక్తి ఎటువంటిదై యుండునని ఆ బాలుడు ఆశ్చర్యపోయెను?

47

మరియు ఆ బాలుడు అనువాదకుడి ద్వారా ఆ సంగతులను గూర్చి విన్నప్పుడు, తన చేతికర్రలను క్రిందకు విసిరివేసి అతడు సంతోషముతో గంతులు వేస్తూ, పరుగెత్తుతూ ఇక్కడికి వచ్చాడు. మరియు అతని సహోదరుడు, ఏది కుడిచేయి, ఏది ఎడమ చేయి తెలియని వ్యక్తి, నేను అతడిని వారి స్థానిక నాట్యము చేయించుటకు ప్రయత్నిస్తున్నానని తలంచాడు. అతని సహోదరుడు పరుగెత్తుచూ, గంతులు వేయుచు రావడం చూసిన అతనిలో ఒక కార్యము జరిగినది. అతడు అవిశ్వాసము అనే పాపపు హద్దులను దాటినాడు మరియు నేను వెనుకకు తిరిగాను, నేను ఒక దర్శనము చూశాను. అతడిని లేచి నిలబడమని చెప్పాను. అతడు స్వస్థత పొందాడు. మరియు ఆ బాలుడికి నేను చెప్పినది గ్రహించే తెలివితేటలు కూడాలేవు. అనువాదకుడు చెప్పిన తర్వాత కూడా గ్రహించే తెలివితేటలు లేవు. అతని మెడలో ఒక గొలుసు ఉన్నది. నేను ఆ గొలుసు పట్టుకొని చెప్పాను, “యేసుక్రీస్తు నిన్ను బాగు చేయును; లేచి నిలవబడుము.”

పుట్టుకతోనే వికలాంగుడిగా ఉన్న ఆ బాలుడు లేచి నిలువబడ్డాడు. కన్నీరు అతని నల్లటి పొట్ట మీదుగా కారుతున్నాయి. ఇరవైఐదు వేలమంది అన్యులు ఒకే సమయములో స్వస్థపడునంతగా ఆస్థలములో దేవుని మహిమ బలముగా క్రుమ్మరించబడినది.

48

వారు ఏమి చేశారు? మరుసటి ఉదయము నేను కిటికీ దగ్గర కూర్చొనియున్నాను. ఆ పట్టణపు మేయర్ నా వద్దకు వచ్చి చెప్పాడు. “ఆ కిటికిలో నుండి బయటకు చూడండి; మీరు ఆశ్చర్యపడతారు.”

మరుసటి ఉదయము అక్కడ ఏడు పెద్ద ట్రక్కుల నిండా చేతికర్రలు, చక్రాలు కుర్చీలతో వీధులలో వెళ్ళుచున్నాయి. గత రాత్రి ఆ కూటములో ఉన్న ప్రజలు స్వస్థతను పొందుకొని వీధులలో నడిచి వెళ్ళుచున్నారు. జూలు, సొంఘి, బజుటస్, కోజెటస్ మరియు అనేక రకముల తెగల ప్రజలు, వారిలో వారు ఒకరికొకరు బద్ధ శత్రువులుగా వుంటూ ఎప్పుడూ యుద్దాలు జరిగేవి. కాని ఒకరి చేతిలో మరి యొకరు చేతులు వేసి కలుపుకొని, “సమస్త కార్యములు సాధ్యము, కేవలము నమ్ముము,” అని పాడుచూ వెళ్ళుచున్నారు. వారు తమ స్వభాషలో ఆ పాట పాడుచున్నారు.

నేను కిటికీ దగ్గర లేచి నిలువబడి, గాలిలో నా చేతులు పైకెత్తి తిరిగి జవాబిచ్చాను. “ఆశ్చర్యకరమైన కృప, నా వంటి నీచుని రక్షించిన కృప ఎంత మధురమైనది.”

ఆ సమయములో ప్రభువుని దర్శనములో చూచేవరకు అది నేను చూసిన వాటిలో మహిమకరమైన దృశ్యము.

49

అది ఏమిటి? అది దేనినో ఉత్తేజపరచినది. ఆ ప్రజలు కొట్టుకొని పోయేవారు కాదు; వారు అంతకుముందు ఎన్నడూ వినియుండలేదు. వారు దానిని వినినప్పుడు చిన్న పిల్లలవంటి విశ్వాసముతో సామాన్య రీతిలో దానిని అట్లే పట్టుకున్నారు. వారు చేసినది అదియే, వారికి ఎలాటి శస్త్ర చికిత్స అవసరము లేదు. వారు కేవలము దానిని చూసిన వెంటనే, దానిని వెంబడించారు. అది వారి సొత్తు అయినది. ఎవరూ కూడా దానికి వ్యత్యాసముగా వారితో చెప్పలేరు. అది జరుగుట వారు చూశారు.

ఇప్పుడు, యేసుక్రీస్తు ఇంకనూ జీవిస్తూ ఉన్నట్లయితే, ఇప్పుడు ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, ఇండియానాలోని జెఫర్సన్ విల్ నందు ఉన్నాడు. గ్రుడ్డి బోధకుని కన్నులను తెరుచుటకు ఆ రోజు రాత్రి ఇచ్చట ఆయన అదే శక్తిని కలిగియున్న దేవుడుగా యున్నాడు. రక్తహీనతతో మరణిస్తున్న ఆ బాలికను ఆయన బాగుచేశాడు. మరుసటి దినము వైద్యులు ఆమె బాగుపడినది అని చెప్పారు.

50

ఈ మధ్యకాలములో ఇక్కడే నేను ఒక వ్యాసము చూశాను. ఈ పుస్తకములలో ఒకదానిలో చూశానని తలస్తున్నాను, నాకు ఖచ్చితముగా గుర్తులేదు. ఒక దినమున నేను దానిని చదువుచూ, ఇక్కడే ఎక్కడో పెట్టానని తలస్తున్నాను. బహుశా నేను, నాకు ఖచ్చితముగా గుర్తులేదు, కాని నేను ఒక వార్తా వ్యాసమును చదివాను. సరే, అది నా చివరి మహాసభలను గూర్చి వ్రాయబడిన వ్యాసము. అక్కడకు ఒక స్త్రీ వచ్చినది. అది బర్లింగ్టన్, వేర్మౌంట్లో జరిగినది. ఆమె ఎంతగానో నిరుత్సాహపడినది; ఆ దినమున ఆ బాలుర వద్ద ఆమెకు ప్రార్థనా కార్డులు దొరకలేదు. అక్కడ ఉన్నవారిలో, ఇప్పుడు ఇక్కడ, జెనె మరియు లియో, మరియు బిల్లీ ఉన్నారు. ఆమె వెనుక కూర్చొనియున్నది. మరియు అకస్మాత్తుగా ఆమె ఎందుకని ప్రార్థనా వరుసలలోనికి రాలేకపోయినది అని ఆలోచిస్తున్నది. మరియు మొదటి వ్యక్తి పైకి వచ్చారు. ఆయన, “నీవు శ్రీమతి పలాని ఇటువంటి ఒక పలాని స్థలము నుండి వచ్చావు, ఈ విషయములు నీలో సంభవించాయి.”

వెంటనే ఆమె ఆ ఆటంకమును బద్దలు చేసుకుంటూ వెళ్ళినది. ఆమె అన్నది, “నాకు తెలుసు. మరియు అది సత్యము అని నేను ఎరుగుదును.”

ఆమె ఆ విధముగా హృదయములో తలంచిన వెంటనే, ఆ గొప్ప పరిశుద్దాత్మ నన్ను చుట్టూర ఆవరించి నన్ను పిలిచి నాతో ఈ విధముగా చెప్పసాగెను “శ్రీమతి పలాని ఆమె, ఇక్కడ కూర్చొనియున్నది.” ఆ భవనమునకు రెండంతల దూరములో వెనుక కూర్చొనియున్నది. “ఆ చివరిలో ఆ చిన్న స్త్రీ కూర్చొనియున్నది. ఆ చివరలో ఆ చిన్న స్త్రీ కూర్చొనియున్నది, ఆకుపచ్చ రంగు వస్త్రము ధరించియున్నది. ”నీవు పలాని వ్యక్తివి,“ నీ పేరు ఇది. ”నీవు మూర్చ వ్యాధితో బాధపడుచున్నావు.“ ప్రతి రోజు నీకు నాలుగు, ఐదు సార్లు మూర్చవస్తుంది. ఆమె ఎగిరి నిలబడినది అది ఆమెను గుర్చియే, ఆమె ఆశ్చర్యచకితురాలయినది, ఆమెకు ఏమి చేయాలో తెలియలేదు.

51

మరియు చెప్పాడు, “అంత మాత్రమే కాదు, నీవు ఎంతగానో నిరుత్సాహముగా ఉన్నావు, ఎందుకనగా నీ భర్త వెట్రన్స్ వైద్యశాలలో ఉన్నాడు, మరియు వారు అతని కడుపు భాగము అంతా తీసివేశారు. మరియు ఇప్పుడు ఆ వ్యాధి శరీరములోని మరియొక భాగములో ప్రవేశించినది, వైద్యులు అతడు బ్రతుకుటకు ఎలాంటి అవకాశము లేదు అని చెప్పారు.” ఆ పత్రికలో దానిని వర్ణించినట్లుగా ఆమె చెంపలమీద కన్నీరు కారుచుండగా అది సత్యమే అని తన చేతులు పైకెత్తినది.

అప్పుడే దర్శనములో ఆ వ్యక్తి ఇంటికి రావడము నేను చూశాను. మరియు నేను చెప్పాను, “ప్రభువు యిలాగు సెలవిచ్చుచున్నాడు, కలవరపడకు; అతడు స్వస్థపడి ఇంట్లో ఉండును.” మరుసటి ఉదయము, అతని మరలా శస్త్రచికిత్స చేయు నిమిత్తము పరీక్ష చేస్తుండగా అతని శరీరములోని ఆ కణుతులు అతని శరీరములో వ్యాపిస్తున్నాయి. వైద్యులు..... అతడన్నాడు, “నాకు ఏ కణితి ఉన్నట్లు అన్పించుటలేదు.” వైద్యులు అతనిని పరీక్షించారు, వారు ఏ కణితిని కనుగొనలేకపోయారు. అతనిని ఎక్సరే యంత్రము క్రింద పరుండబెట్టి ప్రతి పరీక్షను చేశారు. పరిపూర్ణముగా అతడు బాగుపడ్డాడు. పరిపూర్ణమైన ఆరోగ్యముతో మరుసటి దినము అతడు ఇంటికి వచ్చాడు. ఎందుకని? విశ్వాసమే విజయము. ప్రార్థనా కార్డు లేదు, చేతులు వేసి ప్రార్ధించలేదు, ఏమి చేయలేదు, కాని సమస్తమును జయించిన విజయము విశ్వాసమే, జయించాలంటే అదియే మార్గముగా యున్నది.

52

చికాగోలో నా చివర కూటములో, వేదిక మీద ఒక రంగుజాతి స్త్రీ నిలబడియున్నది. నన్ను క్షమించండి, ఆ వేదిక మీద నిలబడియున్న స్త్రీ ఒక శ్వేత జాతీయురాలు అని నమ్ముచున్నాను. ఆ ముందు రాత్రి ఒక స్వీడన్ వృద్ద స్త్రీ ఆవేదిక మీద ఉన్నది. ఆమె సహో ఆస్బార్న్ ఆఫ్రికా దేశములో ఏర్పాటు చేయబోయే కూడికల నిమిత్తము పెద్ద మొత్తములో నగదును కానుకలను ఆమె వేయడము బిల్లీ చూశాడు. మరియు బిల్లీ నాతో చెప్పాడు“ ఆ పేద స్త్రీ రంగు వెలసిపోయిన దుస్తులు ధరించియున్నది. కానుక ఇవ్వటానికి ఆమె దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉన్నది?

బిల్లీ ప్రార్థనా కార్డులు ఇచ్చుట ప్రారంభించగానే, ఆమె, “హనీ, నాకు ఒక ప్రార్థనా కార్డు ఇవ్వుము,” అని అడిగినది.

“నా దగ్గర లేవు, అయిపోయినది” అని చెప్పాడు. అతడు వెళ్ళి ప్రార్థనా కార్డులు ఇస్తున్న లియో, జెన్ దగ్గరకు వెళ్ళి అడిగాడు. వారివద్ద కూడా ప్రార్థనా కార్డులు లేవు. కాబట్టి అతడు, “సహోదరీ, రేపు రాత్రి నిన్ను కలిసి, నీకు ప్రార్థనా కార్డు ఇస్తాను,” అని చెప్పాడు.

“సరే మంచిది” అని చెప్పి, వరండాలోనికి వెళ్ళి ఒక చోట కూర్చున్నది. నాకు ఆ విషయము ఏమియూ తెలియదు.

53

తరువాత నేను లోపలికి వచ్చాను, ఆ రాత్రి వేదిక మీద, మరొక స్త్రీ నిలబడియున్నది. ఆమె వెనుక కూర్చొనియున్నది, ఆమెను ఆటంకపరుస్తున్న ఆటంకములన్నింటినీ బ్రద్దలు చేసుకుంటూ విశ్వాసము అనే ఆయుధము ద్వారా ఎచ్చట దేవుడు క్రియ చేయుచున్నాడో అచ్చటకు వచ్చి చేరినది. అక్కడ, ఎప్పుడైతే ఆమె ఆ స్తానమును తాకినదో, ఆయన చెప్పాడు, “ఆ రెండువ బాల్కనీలో వెనుక కూర్చొన్న ఆ వరుసలో రెండవ వ్యక్తి, గళ్ళ దుస్తులు ధరించి యున్నది. ఆమె పేరు పలానా, ఆమె తన భర్త కోసం ప్రార్థిస్తున్నది. అతడు రైల్వేలో సరుకు రవాణా విభాగములో పనిచేస్తాడు. అతనికి ఒక చెవి వినబడదు.” ఆమె దాదాపుగా స్పృహ కోల్పోయినది. ఆమె లూథరన్ మరియు ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు.... ప్రభువు చెప్పాడు, “ప్రభువు యిలాగు సెలవిచ్చుచున్నాడు, అతడు స్వస్థపడ్డాడు.” ఆ రాత్రి ఆమె ఇంటికి చేరుకున్నప్పుడు అతడు సంతోషముతో ద్వారము దగ్గర నిలువబడియున్నాడు, మరియు అదే సమయములో అతడు సరుకుల రవాణా కార్యలయములో కూర్చొనియుండగానే అతని చెవి తెరువబడినది.

54

“ఒక రంగుజాతి స్త్రీ? అక్కడ కూర్చొనియున్నది. ఆమె దానిని చూచి విశ్వసించినది. ఆమె తన సహోదరి నిమిత్తము విశ్వాసముతో కూర్చొని యున్నది. ఆమె సహోదరి పది సంవత్సరములుగా లిటిల్ రాక్ పిచ్చాసుపత్రిలో బాధపడుచున్నది. పరిశుద్దాత్ముడు ఆమె వద్దకు వచ్చి ఆమెను గూర్చియు మరియు ఆమె సహోదరిని గూర్చియు చెప్పాడు. ”ఆమె పిచ్చితో బాధపడుచున్నది, పది సంవత్సరములుగా తన తలను గోడకు కొట్టుకొనుచున్నది. కాని ప్రభువు యిలాగు సెలవిచ్చుచున్నాడు, “ఆమె ఇప్పుడే స్వస్థపడినది.” మరుసటి ఉదయము, వారు ఆమె గది తలుపు వద్దకు వెళ్ళినప్పుడు, ఆమె స్వస్థ బుద్ధితో, సరియైన వివేచనతో నన్ను బయటకు తీయండి అని అడుగుచుండుటను సంరక్షణ అధికారి చూశాడు. చికాగోలోని తన సహోదరికి ఆమె కబురు పంపినది. ఆమె బిగ్గరగా అరచినది. ఆమె, “కనికరము కలిగిన దేవా, గతరాత్రి వేదిక మీద చెప్పబడినది దీనిని గూర్చియే.”

ఆమె అన్నది, “ప్రియమైనదానా, నీ దగ్గర డబ్బులేదని నాకు తెలుసు. కాని నేను తక్షణమే విమానము టికెట్ పంపుతున్నాను. వెంటనే ఇక్కడకు రమ్కు; రేపు రాత్రికి మీటింగ్ ముగుస్తాయి.

పది సంవత్సరముల నుండి పిచ్చాసుపత్రిలో ఉన్న ఆ స్త్రీ మరుసటి రాత్రి వేదిక మీద నిలువబడి సర్వశక్తుడగు దేవుని స్తుతించినది.

అది ఏమిటి? ఆమె సహోదరి ఈ లోక కార్యములను బ్రద్దలు చేసికొని ముందుకు వెళ్ళినది. ఈ లోక కార్యములు అనగా కేవలము పొగత్రాగుట, మద్య పానము మరియు సినిమాలు చూడటము మాత్రమే కాదు. అది విశ్వాసము. ఆమెకు ఉన్న సమస్త ఆటంకములన్నింటిని దాటుకుంటూ, వాటన్నింటినీ బ్రద్దలు చేసుకుంటూ ఎచ్చటకు వెళ్ళి చేరాలో ఆ స్థలము యొద్దకు ముందుకు సాగూతూ తన విశ్వాసము ద్వారా దానిని తాను జయించితినని కనుగొనెను. అప్పుడు ఆమె ఇలా చెప్పగలిగినది ఆమె “ఒకవేళ దేవుడు ఆ తెల్లజాలి స్త్రీకి ఆ కార్యము జరిగించినప్పుడు, దేవుడు నల్లజాతి స్త్రీ అయిన నా జీవితములో కూడా ఆ కార్యము జరిగిస్తాడు,” అని అన్నది. మన విశ్వాసము ద్వారా సందేహములను జయించే ప్రతీసారి దేవుడు ఆ కార్యమును మన జీవితములో చేస్తాడు. అది భయంకరమైన చెడ్డ పరిస్థితులైనా గానీ దానితో ఏ సంబంధము లేకుండా దేవుడు క్రియ చేయును. ఓ, ఆయన జీవించువాడు.

55

చికాగోలో ఆ రాత్రి, ఆ స్త్రీ సాక్ష్యము చెప్పుచుండగా ఉన్నవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మీ చేతులు పైకెత్తండి. మంచిది, అవును, ఇక్కడ చుట్టూ చూడండి. ఖచ్చితముగా అది జరిగినది. అక్కడ అనేక సంవత్సరములు ఆ స్త్రీ పిచ్చాసుపత్రిలో ఒక పిచ్చిదానిలా యుండినది. అది ఏమిటి? విశ్వాసమే విజయము.

ఇప్పుడు, అదే యేసు ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. నేను నా విశ్వాసమును ఆయన చేసిన వాగ్దానములవైపుగా కొనసాగించినయెడల, ఆయన వచ్చి అదే కార్యమును చేస్తాడు. ఒకవేళ విశ్వాసమును, ఆయనచేసిన వాగ్దానములవైపు విడుదల చేసినట్లయితే, ఈ ఆలయములో కూర్చొనియున్న మీలో ఏ ఒక్కరికి అయినా ఆయన అదే విధముగా జరిగించినట్లయితే, ఆయన ఇంకనూ జీవిస్తున్నాడని మీరు విశ్వసిస్తారా? ఆయన భూమి మీద శరీరధారిగా యున్నప్పుడు ఆయన అదే విధముగా చేసెను కదా? అపోస్తలులు అదే విధముగా చేసారా? పౌలు ఆ వ్యక్తి వైపు చూచి ఆ విధముగానే జరిగించెను. ఆ బావి దగ్గరకు వచ్చిన ఆ స్త్రీతో యేసు చెప్పినప్పుడు. రక్తశ్రావముగల స్త్రీ ఆయన వస్త్రమును తాకినప్పుడు, ఆమె స్వస్థతను పొందుకుని దానినుండి విడుదల పొందెను. ఆయన చుట్టూ చూసి “నన్ను ముట్టినది ఎవరు?” అని అడిగాడు. ఎవరు ముట్టినది ఆయనకు తెలియలేదు కాబట్టి ఆయన “నన్ను ముట్టునది ఎవరు?” అని అడిగాడు. అందరూ తెలియదన్నారు. ఆయన, నేను బలహీనుడను అయ్యాను, శక్తి నా నుండి వెడలిపోయినది,“ అని అన్నాడు. ఆ కార్యము చేసిన స్త్రీని చూచునంత వరకు ఆయన చుట్టూ చూశాడు. ఆమె రక్తశ్రావముతో బాధపడుచున్నది. ఆమెతో చెప్పాడు, ”నీ విశ్వాసము జయం పొందినది.“

56

అది ఏమిటి? “నేను నిన్ను స్వస్థపరిచాను,” అని ఆయన ఎన్నడూ చెప్పలేదు. ఆయన చెప్పాడు, “నీ విశ్వాసము నిన్ను రక్షించినది. నీవు ఏమి చేశావు? నీలోయుండు ప్రతీ సందేహమును క్రిందవేసి అణగదొక్కుచూ, ఆ సందేహమనే అవిశ్వాసమును నీవు లొంగదీసుకొని నీవు నీలో కలిగియున్న విశ్వాసముతోనే దానిపై జయమును పొందావు.” ఆమె తన హృదయములో తాననుకొన్నది. “నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టినట్లయితే నేను బాగుపడుదును.” యేసు చెప్పెను, ఆమె తన మనస్సులో తలంచిన దానినిబట్టి పొందుకొన్నది. ఈ దినమున ఆయన ఇక్కడ ఉండి, ఆ దినమున చేసిన అదే కార్యములను చేయునని ఆయన స్వంత వాక్యము చెప్పుచున్నది, “ఇంకా కొద్దికాలము తరువాత లోకము నన్ను చూడదు. అయిననూ మీరు నన్ను చూచుదురు. నేను చేసిన కార్యములను, మీరును చేయుదురు. మరియు వాటికంటె గొప్ప కార్యములు చేతురు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. మరియు మీరు వీటికంటె గొప్ప కార్యములు చేతురు.”

అది ఇక్కడున్నది, మనము ఈ చివరి దినములలో జీవిస్తున్నాము. యేసు ఇక్కడ ఉన్నాడు. మనము ప్రార్థించుదాము, మనము విశ్వసించుదాము. నేను ప్రార్థిస్తుండగా మీరు విశ్వసి౦చండి.

57

ప్రభువా, ఇక్కడ కొద్దిమంది ప్రజలు గుంపుగా ఉన్నారు, మరియు నీవు గొప్ప దేవుడవు. ప్రభువా, మీరు బహుజన సమూహములను స్వస్థపరచుటను గూర్చి పరిశుద్ధ గ్రంధములో చూచియున్నాము. ఇశ్రాయేలీయులు, మోషె నాయకత్వములో ప్రయాణము చేస్తున్నప్పుడు, వారు అరణ్యము నుండి బయటకు వచ్చినప్పుడు, వారి మధ్య బలహీనుడు ఒక్కడు కూడా లేరు. నీవు అతి గొప్ప వైద్యుడవు; నీవే అతిగొప్ప శస్త్రచికిత్స నిపుణుడవు.

ప్రభువా, ఈ రాత్రి ఇక్కడ శరీరములలో రోగముతో లేదా ఆత్మలయందు బాధలతో వారు తమ విషయమును ఈ సమయమునందు నీకు అప్పగించుకొనియున్నారు. నీవు గొప్ప వైద్యుడవు. తండ్రీ, వారి సందే హములు అన్ని తొలగిపోవునంతగా వారిలో కార్యము జరిగించండి.

నీవు నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నావని“ నీ వాక్యము చెప్పుచున్నది. ప్రభువా, మీరు ఆ ఖడ్గమును వాడి, మా మధ్యకు దిగివచ్చి నీవు మారనివాడవని ప్రకటించండి. ”నేను మీతోను, మీలోను ఉందును.“ ప్రభువా, వారు నీవు ఇచ్చట వున్నావని చూసినప్పుడు, ఈ భవనములో ఉన్న ప్రతి రోగమును, ప్రతి పాపమును అధిగమించునంతగా వారి విశ్వాసము పెరిగి, వారు స్వస్థపడుదురు గాక. యేసు నామములో మేము దీనిని ప్రార్థిస్తున్నాము. ఆమేన్.

58

అది నాలో ఉంచిన స్థానమును మీరు గ్రహించారా... లేక దానిని అభినందించినారా? ఇక్కడ చూడండి, ఇక్కడ కనీసము రెండు వందల యాభై మంది ప్రజలు నిలబడియున్నారు. అంత కంటే ఎక్కువకూడా ఉండవచ్చని నేను తలస్తున్నాను. నాకు ఖచ్చితముగా తెలియదు, కాని ఈ గుంపులో అత్యధిక భాగము నాకు తెలియదు. ఇక్కడ ఎంత మందికి నేను తెలియదు. మీ గూర్చి గాని, మీ సమస్య కాని నాకు తెలియదని మీకు తెలుసు. మీ చేతులు పైకెత్తండి. కేవలము ఇక్కడ ద్రుష్టి ఉంచండి. ఎందుకు, వారు అన్నిచోట్ల ఉన్నారు. ఖచ్చితముగా, నాకు తెలియదు, కాని ఆయనకు తెలుసు.

ఇప్పుడు, మిమ్ములను మీరు ఆయనకు సమర్పించుకొని, ఆ స్త్రీ కలిగియున్న అదే విశ్వాసముతో ఆయనను మీతో మాట్లాడిచ్చనట్లయితే, ఆయనను మీరు విశ్వసించుదురా? ఏదైనా ఒక సంగతి నిరూపించబడినట్లయితే, అది నిరూపించబడిన ఒక నిజమైన సంభవము.

59

ఇక్కడకు ఒకవేళ ఎవరైనా వచ్చి “నా దగ్గర క్యాన్సర్ను బాగుచేయు ఔషదము గలదు” అని చెప్పినట్లయితే, క్యాన్సర్ వలన మరణకరమైన స్థితిలోని వ్యక్తిని తీసుకొని వైద్యుల ఎదుట దానిని నయం చేసి ఋజువుపరచినట్లయితే, ఈ లోకములోని ప్రతి ఒక్కరూ ఆ ఔషధము కోసరము ఉరుకులు, పరుగులతో వస్తారు. సహోదరుడా, ఎందుకని? యేసుక్రీస్తు అనేకమంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను బాగుచేయుట నేను చూశాను. అయినప్పటికీ ఆయన కేవలము ఒక్క కార్యమునే అడుగుచున్నాడు: “నీవు విశ్వసించినట్లయితే”, అదే అత్యంత కఠినముగా అన్పిస్తుంది. ఆయన గ్రుడ్డివారి కన్నులు తెరుచుటను, కుంటివారు నడుచుటను నేను కన్నులారా చూశాను. చనిపోయిన వారు, వైద్యుల చేత ధృవీకరించబడిన తర్వాత సజీవులుగా లేచుటను నేను చూశాను. అనేక కార్యములు చేశాడు, నేను చూచుచుండగా ఆయన చేసిన కార్యములను గూర్చి నేను వ్రాసినట్లయితే అవి అనేక గ్రంథములు అవుతాయి. అయినప్పటికీ, విశ్వసించునట్లు చేయుట అతి కష్టము.

60

ఇక్కడున్న రోగులందరూ కూడా.... ఇక్కడున్నన ప్రతి ఒక్కరూ కూడా పూర్తి భయభక్తులతో ఉండాలని నేను కోరుచున్నాను. ఇప్పుడు, నేను నమ్ముచున్నాను. భావోద్రేకములను నేను ఎంతగానో విశ్వసిస్తాను. ఉద్రేకము లేనిది ఏదైనా అది మృతము అని నేను నమ్ముచున్నాను. ఒకవేళ నీ యొక్క భక్తి (మతము)లో కొంచెము భావోద్రేకము లేనట్లయితే, దానిని పాతిపెట్టుట మంచిది. ఎందుకనగా ప్రతి దానికి ఒక సమయము కలదు.

ఒకవేళ నీవు నా దగ్గరకు వచ్చినట్లయితే, దానిని నీకు నేను ఇస్తాను, మరియు ఉదాహరణకు “సహోరదుడా బ్రెన్హాం, నాకు వంద డాలర్లు కావాలి.” నీవు ఎంతో గౌరవ మర్యాదలతో నా వద్దకు వచ్చి “సహోదరుడా బ్రెన్హాం, నాకు వందడాలరు అత్యవసరముగా కావాలి,” అని అడగ వచ్చును. నా జేబులో వందడాలర్లు ఉన్నవని నీకు తెలుసు. నా దయా గుణమును బట్టి, ఆ వంద డాలర్లు నీకు ఇస్తానని నీవు నమ్ముతావు. మంచిది, ఇప్పుడు దానిని పొందుకోవాలని ఆశతో నీవు మర్యాదగా నిలబడి యుంటూవు.“ నేను వందడాలర్లను నీకు ఇవ్వగానే, నీ ఇష్టము వచ్చినంత బిగ్గరగా అరవవచ్చును. నీ చేతిలోనికి వంద డాలర్లు వచ్చాయి. గ్రహించారా? కాని ఇప్పుడు నీవు వచ్చినప్పుడు, గౌరవ మర్యాదలతో రమ్ము వంద డాలర్లు కావాలని కేకలు వేస్తూ రావద్దు. నేను నిన్ను అర్థము చేసుకోలేక పోవచ్చును. గమనించారా? కాని నీవు వచ్చి నన్ను అడుగుము. నేను నీకు వందడాలర్లు ఇచ్చిన తర్వాత అప్పుడు అరచుట ప్రారంభించుము.

61

దేవుని యొద్దకు వచ్చి ఆయన పరిశుద్దాత్మను ఈ భవనము లోపలను మరియు వెలుపటను మరియు ప్రతిచోటను సంచరించమని ఆయనను అడుగుదాము. నీవు ఎక్కడ నిలబడి యున్నావో నేను లక్ష్యపెట్టను. ఒకవేళ అది మరియొక్క దేశములో ఉన్నవారికొరకు నీవు ప్రార్థిస్తున్నట్లయితే ఆయన కార్యము చేస్తాడు.

మనము కేవలము చూద్దాం.“నన్ను పరిశోధించుడి,” అని దేవుడు చెప్పాడు. దేవుడు, దేవుడా, కాదా అని పరిశీలించుటకు అది మంచి మార్గము. “నన్ను పరిశోధించుడి,” అని ప్రభువు చెప్పాడు. ఆయన దేవుడైనట్లయితే, అప్పుడు ఆయన ఉన్నాడని మనము ఎరుగుదుము. ఆయన చేసిన కార్యములను మరలా ఈ రాత్రి చేయమని ఆయనను అడుగుదాము. అప్పుడు ఇక్కడికి ఈ వేదిక పైకి ఎక్కి నీవు రానవసరము లేదు. ఈ ఆలయములో కనీసము ముగ్గురు వ్యక్తులకు ఆయన కార్యము చేసినట్లయితే, ఒకవేళ అది జరిగినప్పుడు, అది ప్రజలను తాకినప్పుడు, నాకు తెలిసిన వారి జీవితములో జరిగినట్లయితే నేను దానిని లెక్కించను. గ్రహించారా? నాకు తెలియని వారికి అది జరగాలని నేను కోరుచున్నాను.

62

ఇప్పుడు, రోగముల విషయములో నాకు తెలిసినంతవరకు దీర్ఘకాలముగా వ్యాధితో బాధపడుచూ ఇచ్చటయున్న ఒక వ్యాధి గ్రస్తురాలను నేనెరుగుదును. అది ఎటువంటి వ్యాధి అనేది నేనెరుగుదును. అసలు అది వ్యాధి కాదు. ఆ వ్యక్తి నా ప్రియమైన మిత్రురాలు ఎడిత్ రైట్, ఆమె అక్కడ వెనుక కూర్చొనియున్నది. ఆమె అనేక సంవత్సరములుగా బాధపడుచున్నది. ఆమె కొరకు మేము ప్రార్ధి౦చాము కాని ఆమెకు ఆ వ్యాధి బాగవలేదు, ఆ వ్యాధిలోయున్న నొప్పి నుండి ఆమెకు విడుదల దొరికినదిగాని, ఎంతో కాలముగా ఆమె అలాగే బాధపడుచున్నగాని ఆమెను వ్యాధి నుండి విడిపించలేదు. ఎడిత్ సమస్య నాకు తెలుసు. ఆమె తప్ప మిగిలిన వారిలో, ఎవరు ఏ వ్యాధి చేత బాధపడుచున్నారో నాకు తెలియదు, కాని మీరు నన్ను ఎరిగినట్లయితే, మిమ్మల్ని స్వస్థపరచువాడను నేను కాదు, మీరు నన్ను చూస్తున్నాగాని అది నేను కాదు, అది ప్రభువు అని మీరు గ్రహిస్తారు. ఇప్పుడు మీరు ప్రార్థించండి; నేను ప్రార్థిస్తాను, మనము కేవలము ప్రభువును విశ్వసించుదాము.

“సహోదరి గెర్తీ, ఇప్పుడు నీవు సాధ్యమైనంత నెమ్మదిగా ”గొప్ప వైద్యుడు ఇక్కడ ఉన్నాడు, కనికరము కలిగిన యేసు,“ అనే పాటను వాయించుము.

63

ఇక్కడ నా స్నేహితుడు సహో. బ్యాంక్స్ వుడ్ కొరకు చూస్తున్నా సహో, వుడ్స్ ను ఎరిగినవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా, అతడు ఈ సంఘములో ధర్మకర్త, కాని అతడు మునుపు యొహోవా సాక్షుల సంఘమునకు చెందినవాడు. అతడు లూయిస్విల్ వచ్చినప్పుడు ప్రభువు కార్యమును చేయుట చూశాడు.... అతనికి కుంటివాడైన కుమారుడు ఉన్నాడు. అతని కాలుకి పక్షవాతము సోకి కాలు పైకి వంగినది. అతడు కూడికలకు హాజరయ్యాడు. అది నాకు తెలియదు. అతని గూర్చి నేను ఎన్నడు వినలేదు. కాని అతడు ఇక్కడకు వచ్చినప్పుడు నేను విదేశముల నుండి, స్వీడన్ నుండి వచ్చాను. అతడు ఆలయములో వెనుక కూర్చొనియున్నాడు. ఆ రాత్రి ప్రభువైన యేసు ఆ బాలుడు, డేవిడ్ను పిలిచి, అతడిని స్వస్థపరిచినాడు. ఆ స్వస్థపడిన కాలు ఏదో కూడా ఆ బాలుడికి తెలియదు. గ్రహించారా? ఓ వందలకొలది కార్యములు ఉన్నవి, నీవు విశ్వసించినట్లయితే.

64

ఇప్పుడు, ఒకసారి నేను దానిని గూర్చి ఆలోచించాను, నేను నిజముగా దానిని అడిగాను. నాకు గుర్తున్నది అది... నేను కొంతమంది అమిష్ ప్రజలను చూశాను, లేక మొనోనైట్ వారు అని నమ్ముచున్నాను, ఆ చిన్న స్త్రీలు తల మీద టోపీలతో ఉన్నారు. దానిని బట్టియే నేను వారిని గూర్చి ఆలోచించాను. నేను ఇండియానాలోని ఫోర్ట్ వేన్లో ఉన్నాను. అక్కడ పరిశుద్దాత్మను పొందిన ఒక చిన్న మొనోనైట్ యువతి ఉన్నది. ఒకవేళ ఆమె అమిష్ యువతి కావచ్చును. ఆమె ఎంతో ప్రియమైన బాలిక, ఆమె “గొప్ప వైద్యుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, కనికరము కలిగిన యేసు” అనే పాటను వాయించుచున్నది. నా చేతులలోకి ఒక చిన్న బిడ్డను ఇచ్చారు. ఆ బిడ్డ కుంటిది మరియు నేను ప్రార్ధించినప్పుడు ఆ బిడ్డ స్వస్థపడినది. ఆ బిడ్డ నా చేతుల నుండి క్రిందకు దూకి వేదిక మీద పరుగెత్తెను. మరియు తల్లి స్పృహ కోల్పోయినది, మరియు అమిష్ లేక మొనోనైట్ యువతికి, ఆ స్త్రీ తెలుసు. పరిశుద్దాత్మ ఆమెను తాకినది, ఆమె కేకలు వేయుట ప్రారంభించినది, మరియు ఆమె చేతులు పైకెత్తి ఆ పియానో నుండి దూరముగా పరుగెత్తినది. అచ్చట ఆ పియాలోని వాయించుటకు ఎవరూ లేకపోయినా దానంతట అదే ఆ పియానో ఒక్క శ్రుతి కూడా తప్పకుండా, “గొప్ప వైద్యుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, కనికరము కలిగిన యేసు,” అనే పాటను వాయించినది. ఆ కుర్చీల మధ్య ఖాళీల నుండి, చుట్ట ప్రక్కల నుండి ప్రజలు గుంపుగా అక్కడ కూడుకున్నారు. ఆ శ్రుతిని మీటే వరుసగా యుండు తెల్లని పరికరాలు (Ivory keys) పైకి, క్రిందకు కదులుచూ “గొప్ప వైద్యుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, కనికరము కలిగిన యేసు,” అనే పాటను వాయించుచూ ఆ సంగీత ధ్వని ఆగకుండా అలాగే వినిపించుచున్నది. అక్కడున్న పరిశుద్దాత్మ శక్తికి నేల మీద పడిపోయారు. ఆయన ఇంకా జీవిస్తున్నాడు. ఆయన ఇంకనూ యేసే.

65

ఇప్పుడు మనము నెమ్మదిగా ఒక్క నిమిషము ఆ పాటను ఆలపించుదాము. తరువాత ప్రభువు ఏమి చెప్పెనో విందాము. ప్రతి ఒక్కరూ మీ విశ్వాసమును స్థిరపరచుకొనుడి, ఆ విశ్వాసపు వాకిళ్ళవైపుకు చూస్తూ ప్రారంభించుచూ మీ హృదయము అంతటితో విశ్వసించుడి.

గొప్ప వైద్యుడు ఇప్పుడు సమీపముగా ఉన్నాడు....

ప్రభువైన యేసూ, నీవు దయచేయుదువుని ప్రార్థిస్తున్నాను. [స్పష్టత లేని మాటలు]. [సహో ! బాన్హాంగారు నెమ్మదిగా ప్రార్థించుచున్నారు.]

..... సంతోషించు హృదయము,

ఓ, యేసు స్వరము వినుము.

సెరాపుల కీర్తనలో మధురమైన శృతి,

మధురమైన నామము.........

ఇప్పుడు, అనారోగ్యముతో ఉన్నవారు, ప్రతి సందేహమును బయటకు త్రోసివేయండి. మీలో అనేక మంది ఇంతకు ముందు ఎన్నడూ దీనిని చూసియుండలేదు. “ఏది ఏమైనా నేను దీనిని విశ్వసిస్తున్నాను,” అని చెప్పండి.

యేసు, ప్రశస్తమైన యేసు.

[సహోదరుడు బ్రెన్హాం ఆలపించుచున్నారు.]

66

నేను మూఢత్వములో లేనని నమ్ముచున్నాను, కాని నాకు ఇప్పుడు నేను నా గదిలోనికి వెళ్ళి, తలుపులు మూసుకొని, రహస్య గదిలోనికి వెళ్ళాలని అన్పిస్తున్నట్లున్నది. ఇప్పుడు నేను ఇక్కడున్న ప్రజలందరి నుండి నన్ను వేరుచేసుకొనుచున్నాను. చూడండి, మరియు “రహస్యమందు చూచు మీ తండ్రికి ప్రార్థన చేయండి. రహస్యమందు చూచు ఆయన బహిరంగముగా బహుమానమిచ్చును. అడుగుడి, ఇవ్వబడును; వెదకుడి దొరుకును; తట్టుడి; తెరువబడును; వెదకు ప్రతివాడును కనుగొనును.” ఆయన ఇక్కడ ఉన్నట్లుగా ఊహించుకొనుడి. ఆ చిత్రములో మీరు చూస్తున్న వెలుగు, వలయం అది దూరముగా లేదు. అది హృదయములను వివేచించును. అది క్రీస్తే, “కొద్దికాలము తరువాత... నేను దేవుని వద్దనుండి వచ్చాను, మరలా దేవుని వద్దకు వెళ్ళుదును.” ఆయన వెళ్ళాడు, అంతకుమునుపు ఆయన ఏమైయున్నాడో అక్కడికి వెళ్ళాడు. ఆయన మరలా వచ్చినప్పుడు, ప్రభువు యేసు శరీరధారిగా యున్న రీతిగానే ఆయన అదే విధమైన ఒక శరీర సంబంధమైన శరీరధారిగానే ఆయన వచ్చును.

67

“సహా బ్రెన్హాం, నీవు ఏమి చేస్తున్నావు?” అని నీవు నన్ను ప్రశ్నించవచ్చును. కేవలము నన్ను నేను లోపరచుకొనుచున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను నిలబడియున్నాను. ఇప్పుడు ఇది ప్రదర్శన కాదు. లేదు, అయ్యా. ఆ విధంగా తలంచవద్దు; లేనియెడల నీవు చెడ్డ పునాది మీద ఉన్నావు. అది ఎచ్చటో ఒక చోటకు త్రోసుకుంటూ వెళ్ళుటకు ప్రయత్నించుచున్నది. దేవుని యొక్క వాక్యము సవాలు చేయబడియున్నది. ఆయన ఏమైయున్నాడో నేను చెప్పాను. ఒకవేళ అది కానట్లయితే? ఆయన ఎల్లప్పుడూ తన వాక్యమును నెరవేర్చును. నేను దానిని గూర్చి భయపడుట లేదు. ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు ఆయన వస్త్రపు చెంగును తాకుదురు.

పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, “ఆయన ఇప్పుడు, (ఇప్పుడే) ప్రధాన యాజకుడైయున్నాడు, ఆయనను మన బలహీనతతో మనము తాకవచ్చును.”

68

నీలిరంగు దుస్తులు ధరించి అక్కడ కూర్చొనియున్న సహోదరీ, నీవు నిజాయితిగా నన్ను చూస్తున్నావు. నీ గూర్చి నాకు తెలియదు. తెలుసు అని నేను నమ్మను. ఏ వ్యక్తి అయినా తన యొక్క విశ్వాసముతో తాకునేమోనని వెదికిచూస్తున్నా ఎక్కడా కూడా దానిని నేను చూడలేకపోవుచున్నాను. ఒకవేళ అది సహాయపడవచ్చును. దేవుని దగ్గర నీకు ఒక అవసరము ఉన్నది. ఒకవేళ నేను నీకు తెలియని వాడినైతే, నీ చెయ్యి పైకెత్తుము. నేను నిన్ను ఎరుగను, కాని నీకు నేను తెలుసు. సరే, మంచిది. నీవు ఎందుకొరకు వచ్చియున్నావో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు నా జీవితములో ఎన్నడూ నిన్ను చూడలేదు. బహుశా నీవు నా కూడికలకు ఎక్కడైన వచ్చియుండ వచ్చును. ప్రభువైన యేసు నీ సమస్య ఏమిటో నాతో చెప్పినట్లయితే నీవు విశ్వసిస్తావా? అది సత్యమైనట్లయితే నీవు దానిని విశ్వసించవలసియున్నది. బహుశా అది ఇతరులకు విశ్వాసమును ఇవ్వవచ్చు. నాకు తెలియదు. నీవు అక్కడ కూర్చొని నావైపు చూస్తుండుటను నేను చూశాను. నీవు ఏ మాత్రము నా మీద నుండి దృష్టిని ప్రక్కకు మరల్చలేవు. నీవు అలాగే చూస్తున్నావు.

ఈ స్త్రీ నా ఎదురుగా కూర్చొనియున్నది, ఆమె నాకు తెలుసు. ఇక్కడున్న ఈ ప్రజలను నేను ఎరుగుదును, నీవు నాకు తెలుసునని నేను భావించుట లేదు. నాకు తెలియదు, కాని ఆయన ఎరుగును. నీవు అవసరతలో ఉన్నట్లయితే వేదిక మీదకు వచ్చి నిలబడుటకు నీవు ఇష్టపడిన. అవును. ఇప్పుడు, అందరూ చూడగలరు... మీరు చూడగలరని నమ్ముచున్నాను. ఆ స్త్రీ నిజముగా కాంతిహీనముగా ఉన్నట్లు నాకు కన్పిస్తున్నది, కాని ఆమెకు మరియొక సమస్య కలిగియున్నది; ఆమె చర్మవ్యాధి కలిగియున్నది. అది నిజము. అది నిజమైనట్లయితే, నీ చేతిని ఎత్తుము. అది ఆమె శరీరము మీద కనబడని చోట ఉన్నది, ఆ వ్యాధి ఆమెకు ఉన్నది. అది సరియే. గ్రహించారా? అది తాకినది. “మావైపు చూడుము,” అని అతడు చెప్పాడు. మరియు వారు అతనివైపు తేరిచూచినప్పుడు, పౌలు, “నీవు స్వస్థతనొందుటకు విశ్వాసము కలిగియున్నావని,” చెప్పాడు.

69

నీ ప్రక్కన కూర్చొనియున్న ఆ స్త్రీ సంగతి ఏమిటి? ఆమెకు అడ్డుగా యున్న ఆటంకములన్నింటిని బ్రద్దలు చేసుకుంటూ ముందుగా వెళ్ళుచున్నది ఎందుకనగా ఆమె ప్రార్థించుచున్నది. నేను నిన్ను ఎరుగను. మనము ఒకరికి ఒకరము అపరిచితులము. అది నిజము. నీ జీవితములోని సమస్యకాని, లేక నీవు ఇక్కడకు ఎందుకు వచ్చినావో లేక నీ జీవితములో నాకు తెలియని దానిని గూర్చి పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరచినట్లయితే, ఆ శక్తి అదృశ్యరూపమునయున్న ఆ శక్తి క్రీస్తు నుండి కలిగినది అని నీవు నమ్ముతావా? నేను నిన్ను ఒక ప్రశ్న వేయగోరుచున్నాను. ఇప్పుడే, నీ హృదయములో ఒక అనుభూతి కలిగి యున్నావు, నిజముగా మధురమైన, సాత్వికమైన, విధేయతతో కూడిన అనుభూతిని నీవు కలిగియున్నావు. అది నిజమైతే నీ చేతిని పైకెత్తుము. గమనించారా? అదే, నీపైన ఆ వెలుగు నిలబడియున్నది. నీవు పాదములలో, కాళ్ళలో సమస్య కలిగియున్నావు. అది నిజము. కాదా? అది నిజమైతే నీ చేతి రుమూలును ప్రజలవైపు ఊపుము, దానినిబట్టి వారు కూడా చూస్తారు. ఇక ఎన్నడూ మరలా దానిని బట్టి నీవు బాధపడవు.

అది ఏమి చేస్తుంది? నా జీవితములో నేను ఎన్నడూ చూడని ప్రజలు ఉన్నారు. అది ఏమి చేస్తుంది? ఆ యిద్దరు.

70

ఈ స్త్రీ కుడివైపున, ఇప్పుడు ఒక యువకుడు కూర్చొనియున్నాడు, అది అతడిని తాకిన వెంటనే ఏడ్చుట మొదలు పెట్టాడు; అది మరొక స్త్రీకి చెందినది. కాదు, అది ఆ యువకుడి నిమిత్తమే. అతడు తల నొప్పితో మరియు గొంతు నొప్పితో బాధపడుచున్నాడు. అది నిజము. యవ్వనస్తుడా, నీవు నాకు క్రొత్తవాడివని నమ్ముచున్నాను. నిన్ను నేను ఎన్నడూ చూడలేదు. అది నిజము. అది నిజము. అది నిజమైతే నీవు నీ చేతులు పైకెత్తుము.

అక్కడ ముగ్గురు వ్యక్తులు ఒకే వరుసలో కూర్చొనియున్నారు. నేను ఎన్నడూ చూడలేదు. ఆ ప్రజలను నేను నా జీవితంలో ఎన్నడూ కలవలేదు. మీరు విశ్వసిస్తారా?

ఇక్కడ ఈ వైపున ఎవరో ఉన్నారు, ఈ దిశలో. రోగులు, అక్కరలో ఉన్నవారు ఎందరున్నారు? ఈ వైపున అవసరతలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ చేతులు ఎత్తండి. ఓ, ప్రతిచోటులో ఉన్నారు. సరే మంచిది. ఇప్పుడు నమ్ముచూ ఉండుము.

71

అక్కడ కూర్చొనియున్న వ్యక్తి నన్ను చూస్తున్నాడు, నీవు ఖచ్చితముగా క్రీస్తును కనుగొనాలి, లేకపోతే మరణిస్తావు. క్యాన్సర్ నిన్ను చంపివేస్తుంది. దేవుడు స్వస్థపరచువాడు.

ఇక్కడే ఈ కుర్చీలో కూర్చొనియున్న పెద్ద వయస్సు గల స్త్రీ, ఆమె ఉదర సమస్యతో, కీళ్ళ నొప్పులతో బాధపడుచున్నది. అది నిజము. అది బాగయినది. అని నీవు నమ్ముచున్నావా?

ఆమె చుట్టూ చూస్తున్న నీవు, నీవు విశ్వసిస్తున్నావా? నీవు క్రీస్తు యొక్క అవసరత కలిగియున్నావు. నేను ఆయన సేవకుడిని అని నీవు విశ్వసిస్తున్నావా? నీవు తీసివేయాలనుకొనుచున్న ఆ కణితిని, దేవుడు దానిని చేయగలడని నీవు నమ్ముచున్నవా? నాకు కణితి కనబడలేదు, కాని అది అక్కడ ఉన్నది. అది నీ మెడ వెనుక వైపున ఉన్నది. బహుశా నీ పేరు శ్రీమతి వెల్స్ అని నేను చెప్పకలిగినట్లయితే, అప్పుడు నన్ను విశ్వసిస్తావా....? అది నిజము, కాదా? (ఆ సహోదరి “అవును, అది నిజము” అని చెప్పినది) మంచిది. నా జీవితములో నిన్ను ఎన్నడూ చూడలేదు; ఆ విషయము నీకు తెలుసు. నీవు దేవునియందు విశ్వాసమును కలిగియు౦డుము.

72

అక్కడ కూర్చొనియున్న స్త్రీ మీద మరణపు సూచన ఉన్నది: అది క్యాన్సర్. అమ్మా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని నీవు విశ్వసిస్తున్నావా? నమ్ముచున్నావా? క్యాన్సర్తో బాధపడుచున్నది. నీ మీద నల్లటి నీడ వేలాడుచున్నది. నీవు నమ్మిన యెడల, అది ఇప్పుడే నిన్ను విడిచి పోయినది. నాకు ఆ స్త్రీ తెలియదు. నా జీవితములో ఆమెను ఎన్నడూ చూడలేదు. నాకు తెలిసినంత వరకు ఇక్కడున్న ప్రజలు నాకు తెలియదు. మీరు విశ్వసిస్తారా?

నేను ఒక మనుష్యుని వైపు చూస్తున్నాను; నా జీవితములో అంతకు ముందు అతడిని చూసిన జ్ఞాపకము లేదు. అతడు హెర్నియాతో బాధపడుచున్నాడు. అయ్యా, దేవుడు నీ హెర్నియాను బాగుచేసి నిన్ను స్వస్థపరుస్తాడని నీవు విశ్వసిస్తున్నావా? మీ పేరు రెవ. రీడ్, నీ భార్య నరముల బలహీనతతో బాధపడుచున్నది. నేను నిన్ను ఎరుగను. నీవు ఈ ప్రాంతము వాడివి కాదు. నీవు ఓహియో నుండి వచ్చావు. అది నిజము. అది సత్యము, అయితే చెయ్యి ఎత్తుము. నీవు నీ భార్య ఇప్పటికే మీ హృదయమంతటితో విశ్వసించుడి. ఇప్పుడు మీరు నమ్ముచున్నారా?

73

ఈ వరుస చివరలో, ఈ దిశలో చివరన, ఆ వెలుగు అక్కడ వ్రేలాడుటను నీవు చూచుటలేదా? ఈ వరుసలోని చివరి స్త్రీ వైరస్ ద్వారా అంటు వ్యాధితో బాధపడుచున్నది. నీది ఈ పట్టణము కాదు. నీవు కొలంబస్, ఇండియానా నుండి వచ్చావు. నీ పేరు ఎలిజబెత్, నీవు ఓహియో అని పిలువబడు వీధిలో నివసిస్తున్నావు. నీ ఇంటి నెంబరు 1932 ఓహియో, వీధి. విశ్వసించి వెళ్ళుము. ఇప్పుడే అది నిన్ను విడిచిపోయినది. విశ్వాసమును కలిగియుండుము.

ఇప్పుడు ఆ ఆత్మ సంచరిస్తున్నది; అది ఈ వైపుగా ఒక పురుషుని వద్దకు వెళ్ళుచున్నది. అక్కడ ఏదో ఒక సంబంధము కలదు. లేదు, అతడు కొలంబస్ నుండి వచ్చాడు. అతడు కంటిలోని పుండు సమస్యతో బాధపడుచున్నాడు. అయ్యా, ప్రభువైన యేసు నిన్ను స్వస్థపరచి సంపూర్ణముగా బాగుచేస్తాడని నీవు విశ్వసిస్తున్నావా? నీ ఎదురుగా నీ మేనల్లుడు కూర్చొనియున్నాడు, నీ సహోదరి కుమారుడు, అతడు ఎముకల వ్యాధితో బాధపడుచున్నాడు, ఆ వ్యాధి అతడు ఎముకలను తినుచున్నది. అది ఇక నుండి తినదు. అది ఒక విధమైన సమస్యగా ఉన్నది. నీ హృదయమంతటితో విశ్వసించినట్లయితే, నీవు సంపూర్ణముగా బాగుపడతావు. దేవుని యందు విశ్వాసముంచుము. ఇప్పుడు మీలో ఎందరు విశ్వసిస్తున్నారు?

74

అక్కడ కూర్బునియున్న మరియొకరి మీద క్యాన్సర్ నీడ ఉండుట చూస్తున్నాను. సహోదరి నీ హృదయమంతటితో నీవు విశ్వసించినట్లయితే ఆ కార్యము జరుగుతుంది. నీ విశ్వాసము ఆ సందేహపు గీతను దాటినదా? ఎంతమంది మీ విశ్వాసము సందేహపు సరిహద్దును దాటినది అని నమ్ముచున్నారు? మీ చేతులు పైకెత్తండి. మిగిలిన వారు స్వేచ్చగా ఉండండి. అందరూ ఎత్తారు.

ఈ కుర్చీలో కూర్చొనియున్న బాలికలను నేను ఎరుగుదును. గత రాత్రి నుండి నేను మిమ్ములను ఎరుగను, కాని ఇప్పుడు నేను మిమ్ములను ఎరుగుదును. ఈ రోజు నా భార్య మీ గూర్చి చెప్పినది. వివాహము కాకమునుపు మీ తల్లి పేరు ఫల్కర్సన్. ఆమె ఎవరికి అంతుపట్టని వ్యాధితో బాధపడుచున్నది. నీ చేతి వ్రేళ్ళకు వ్యాధి సోకినది, మరియు నీ రక్తమునకు వ్యాధి సోకినది, లేక చేతులకు వ్యాధి సోకినది. మొదటిగా వ్రేళ్ళు ఊడిపోతున్నాయి. మీ ఇద్దరికి మీరు ఇద్దరూ అందమైన యువతులు; నాకు మీ తల్లి తెలుసు. మీ అమ్మమ్మ ఇరవై సంవత్సరముల క్రితము నా కూడికలలో క్షయవ్యాధి నుండి స్వస్థపడినది. అది నిజము. శ్రీమతి. ఫల్కర్సన్, అందమైన ఆ యువతులను అభ్యంతరపెట్టుచున్న అపవాదిని దేవుడు గద్దిస్తున్నాడు. యేసును సమాధినుండి లేపిన శక్తి, అది మిమ్ములను ఎన్నడూ బాధపరచకుండా దానిని పారద్రోలును గాక. దేవుని వాక్యము యొక్క అధికారముతో ఈ మాట చెప్పుచున్నాను. నీవు అపవాది మీద ఉగ్రత చూపాలి. దేవుడు మనకు విజయమును అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడే దానిని మనము కలిగియున్నాము. “లోకమును జయించిన విజయము మన విశ్వాసమే.”

75

ఈ ఆలయములో ఆయన శక్తి మిమ్మలను స్వస్థపరచినదని విశ్వసించిన వారందరూ లేచి నిలువబడి ఆయనకు స్తుతులు చెల్లించండి. మీ చేతులు పైకెత్తి ఆయనను స్తుతించండి. ప్రభువైన యేసు, మీ స్వస్థపరచు శక్తినిబట్టి వందనములు. “జయించిన విజయము ఈ విశ్వాసమే. ఆ విజయము మన విశ్వాసమే.” ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్వస్థత ప్రకటిస్తున్నాను ప్రభువా, దానిని అనుగ్రహించండి.

“నేను ఆయనను స్తుతిస్తాను. గెర్జీ సహోదరీ, ”నేను ఆయనను స్తుతిస్తాను.“ ఆటంకపరచు సరిహద్దును మీరు దాటియున్నారా?

పాపుల నిమిత్తము వధింపబడిన గొర్రెపిల్లను స్తుతించుడి;

సమస్త ప్రజలారా, ఆయనను మహిమ పరచుడి,

ప్రతి పాపపు డాగును ఆయన రక్తము కడిగివేసినది.

(సరే మంచిది, అలాగే కొనసాగించండి.)

నేను ఆయనను స్తుతిస్తాను, నేను ఆయనను స్తుతిస్తాను,

పాపుల నిమిత్తము వధించబడిను గొర్రెపిల్లను స్తుతించుడి;

సమస్త ప్రజలారా, ఆయనను మహిమ పరచుడి,

ప్రతి పాపపు డాగును ఆయన రక్తము కడిగివేసినది.

76

వినండి. మీరు ఇంకా ఆ స్థలమునకు ఎక్కలేదని, స్నేహితులారా, నేను ఇంకనూ నమ్ముచున్నాను. ఇటువంటి ఒక కూడిక ద్వారా నేను సాతానును గెలువనియ్యను. ఆ సాతాను జయించుటకు అసలు అవకాశమే లేదు. సువార్త ప్రకటించబడినది, దానిని నిరూపించుటకు క్రీస్తు ఇక్కడ ఉన్నారు. అపవాది అబద్ధికుడు. యేసుక్రీస్తు ద్వారా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ స్వస్థపడియున్నారు. అటువంటి విశ్వాసముతో ముందుకు సాగిపోవుడి; అది ఇక్కడ ఉన్నది; అది నీదే. ఇంక ఎంతమాత్రము కొట్టుకుపోవద్దు; ఆ కల్వరియందు దృఢమైన వారిగా నిశ్చయతను కలిగియుండి ఆయనను స్తుతించుము, మహిమ పరచుము. నీవు ఆయనను ప్రేమిస్తున్నావని ఆయనకు చెప్పుము. నీవు ఆయనను ప్రశంసిస్తున్నావని ఆయనకు చెప్పుము. ఆయన నుండి నిన్ను వేరుపరుస్తున్న ఆ గీతను దాటి రమ్ము, అప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరచి మరియు పరిపూర్ణముగా బాగుచేయును. హృదయపూర్వకముగా దానిని చెప్పుము. కేవలము మాటలతో కాదు. నీ పూర్ణ హృదయములో ఆయనకు స్తుతులు చెల్లించెదము.

నేను ఆయనను స్తుతిస్తాను. (మీ హృదయము నుండి

చెప్పండి.) నేను ఆయనను స్తుతిస్తాను,

పాపుల నిమిత్తము వధించబడిన గొర్రెపిల్లను స్తుతించుడి;

సమస్త ప్రజలారా, ఆయనను మహిమపరచుడి.

(ఆయనను స్తుతించుడి).

ఆయన రక్తము ప్రతి డాగును కడిగివేసినది.

77

ఎటువంటి డాగు? సందేహము అనే డాగు. “నేను ఇప్పుడు స్వస్థపడ్డాను; ఆయన పొందిన దెబ్బల వలన నేను స్వస్థపడ్డాను. నేను ప్రభువు వాడను; నా వ్యాధులు తొలగిపోయినవి. నేను ఆయనను స్తుతిస్తాను. నేను ఆయనను మహిమపరుస్తాను. నేను జయోత్సవము చేస్తాను. నేను ఆయనను ప్రేమిస్తున్నాను, అని చెబుతున్నాను. ఆయనను విశ్వసిస్తున్నాను. నేను స్వతంత్రుడను.” హల్లెలూయ!

......... ప్రజలారా

ఆయన రక్తము ప్రతి డాగును కడిగివేసినది.

నేను ఆయనను స్తుతిస్తాను, నేను ఆయనను స్తుతిస్తాను,

పాపుల నిమిత్తము వధించబడిన గొర్రేపిల్లను స్తుతించుడి;

సమస్త ప్రజలారా, ఆయనను మహిమ పరచుడి,

ఆయన రక్తము కడిగినది. (అంతే;

దానిలోనికి వెళ్ళండి) ప్రతి డాగును.

నేను ఆయనను స్తుతిస్తాను, నేను (హల్లెలూయ, హల్లెలూయ)

పాపుల నిమిత్తము వధించబడిన గొర్రే పిల్లను స్తుతించుడి;

సమస్త ప్రజలారా, ఆయనను స్తుతించుడి.

(అది చేసినది) ప్రతి డాగును కడిగివేసినది.

నేను ఆయనను స్తుతిస్తాను. (నిరంతరము

రక్తములో కడుగబడుట).... ఆయన,

పాపుల నిమిత్తము వధించబడిన గొర్రేపిల్లను స్తుతించుడి;

ఓ, సమస్త ప్రజలారా, ఆయనను స్తుతించుడి,

ఆయన రక్తము ప్రతి డాగును కడిగివేసినది.

78

మహిమ! ప్రభువుకు స్తోత్రము! మీరు ఆయనను ప్రేమిస్తున్నారా? ఆయనను స్తుతించుడి. ఆయనను స్తుతించుడి. మహిమగల క్రీస్తు, మహిమగల దేవుడు, యుగయుగములు జీవిస్తున్నాడు, పాత నిబంధననలోని ఆ గొప్ప యొహోవా దేవుడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. “ఆయన కార్యములు అద్బుతములు ఆశ్చర్యకరములు.” “ఆయన సూచక క్రియలు, అద్భుత కార్యములు శాశ్వతమైనవి.” ఓ, ఎంత అద్భుతమైనవి. ఓ, ఆయన మహిమోన్నతుడు.

ఇప్పుడే, దేవుని యొక్క సన్నిధిని మీలో ఎందరు అనుభవిస్తున్నారు? ఖచ్చితముగా, ఇప్పుడు ప్రతి సందేహము మీ నుండి తొలగిపోనియ్యుడి. నీవు స్వస్థత పొందియున్నావు. ఆయన పొందిన దెబ్బల వలన నీవు స్వస్థపడ్డావు. అది జరిగిపోయినది. ఆయనను స్తుతించుచు, మహిమపరచుము. ఆలయములో పరిశుద్దాత్మ అంతటా కుమ్మరించబడుచున్నది. గొప్ప వెలుగు వలయము ఈ స్థలములో తిరుగుచున్నది. ఎంత అద్భుతము. మనము అయనను ఎంతగా ప్రేమిస్తున్నాము.

మరియు యుద్ధము ముగించబడిన తర్వాత,

మనము కిరీటము ధరించుదుము!

అవును, మనము కిరీటము ధరించుదుము!

అవును, మనము కిరీటము ధరించుదుము!

యుద్ధము ముగించబడిన తర్వాత,

మనము కిరీటము ధరించుదుము,

నూతన యెరూషలేములో,

కిరీటము ధరించుదుము,

కిరీటము ధరించుదుము,

ప్రకాశవంతముగా మెరుస్తున్న

కిరీటము ధరించుదుము.

మరియు యుద్ధము ముగించబడిన తర్వాత,

మనముకిరీటము ధరించుదుము.

నూతన యెరూషలేములో,

కిరీటము ధరించుదుము,

కిరీటము ధరించుదుము.

ప్రకాశవంతముగా మెరుస్తున్న

కిరీటము ధరించుదుము.

మరియు యుద్ధము ముగించబడిన తర్వాత,

మనము కిరీటము ధరించుదుము.

నూతన యెరూషలేములో.

79

నా ఉద్దేశ్యములో ఇది, పెంతుకోస్తు దినము పరిశుద్దాత్మ దిగి వచ్చి సంకెళ్ళను తెంచినట్లుగా ఉన్నది. నేను ఇప్పుడే గమనించాను. ఈ కూడికలో ఒక మొనోనైట్ సహోదరుడు నిలబడియున్నాడు. అతడు ఇండియానా పోలీస్ నుండి వచ్చాడు, అతడు అనేక సంవత్సరముల నుండి మూర్ఛ వ్యాధితో బాధపడుచున్నాడు. మరియు పరిశుద్దాత్మ కూడికలలో యున్న అతడిని పిలిచెను, నేను నమ్ముచున్నాను, అతనికి మరలా ఎన్నడూ మూర్ఛ వ్యాధి కలుగదు. అతడు మోనోనైట్ బోధకుడు, దేవుడు అతడిని స్వస్థపరచి, పరిపూర్ణ ఆరోగ్యవంతునిగా చేశాడు. ఓ, ఆయన అద్బుతకరుడు కాదా? ఆయన మంచితనమును రుచిచూచిన వారికి మాత్రమే ఆయన ఎంత మంచివాడో తెలుసు.

80

ఇప్పుడు, స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్యకు వచ్చి ఆశీర్వదించినప్పుడు అది పాతకాలము ఉజ్జీవము వలె నాకు అన్పిస్తుంది. మీరు ఇక్కడ ఉన్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ దైవిక సన్నిధిలో నిలబడియున్న ప్రతి వ్యక్తి, తన విశ్వాసములో ప్రతి సందేహమును ముంచివేసినట్లయితే, మీరు ఇప్పుడు స్వతంత్రులగుదురని నేను నమ్ముచున్నాను, ఇప్పటి నుండి ఏ రోగము ఉన్నదని చెప్పవద్దు. ముందుకు సాగిపొమ్ము, నీ వ్యాధిని ఒక వైద్యుడికి అప్పగించావు, ఇప్పుడైతే యేసుకు అప్పగించుము; నీవు స్వస్థత పొందునట్లుగా ఆయన నీకు శస్త్రచికిత్స జరిపి, నీ ప్రతి సందేహమును తొలగించివేశాడు. కాబట్టి మనము విశ్వాసమును కలిగియున్నాము. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక!

అది పాతకాలపు ఉజ్జీవము,

అది నాకు చాలునంత ముంచిది.

అది పాతకాలపు ఉజ్జీవము,

అది పాతకాలపు ఉజ్జీవము,

అది పాతకాలపు ఉజ్జీవము

అది నాకు చాలినంత మంచిది.

ప్రతి ఒక్కరిని ప్రేమించునట్లు అది చేస్తుంది,

ప్రతి ఒక్కరిని ప్రేమించినట్లు అది చేస్తుంది,

ప్రతి ఒక్కరిని ప్రేమించినట్లు అది చేస్తుంది,

అది నాకు చాలినంత మంచిది.

ఓ, అది పాతకాలపు ఉజ్జీవము,

అది పాతకాలపు ఉజ్జీవము,

అది పాతకాలపు ఉజ్జీవము,

మరియు అది నాకు చాలినంత మంచిది.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...