ఆయన స్వరము వినుము
VGR COUNT -221 సహోదరుడా నెవిల్, ధన్యవాదములు. “ప్రభువు యొక్క గృహమునకు మనము వెళ్ళుదము అని వారు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని,” అని దావీదు పలికియున్నాడని నేను నమ్ముతాను. దినములోని ఏ మరొక్క సమయముకంటె, కూటములోని ఇతరత్రా విభాగములు కలిగియున్న వాటికంటె, ఆదివారపుబడికి ఒక ప్రత్యేకతయున్నది. రాత్రి యొక్క మంచి విశ్రాంతి నుండి మనమప్పుడే మేల్కొంటాము, మరియు మనం వ్యత్యాసముగా అనుభూతి చెందుతాము. మరియు మీరు విశ్రాంతి పొందినవారై దినమునకై సంసిద్ధపడతారు.
ఇప్పుడు, మనమది గ్రహించగలుతాము. గడిచిన రాత్రి, మనం అడిగియుంటాము, ప్రజలకు వారి స్వంత ఆలయాలు ఉన్నవారిని... వారు వెళ్ళనటువంటి వారియొక్క ఆలయములు ఉన్నటువంటి వారిని అడిగితిమి. వారు దర్శించునవి... లేక, ఆలయాలకు క్రమముగా వెళ్ళు సభ్యులని, అనగా ఈ ఉదయం వారియొక్క స్వంత ఆలయాలకు తప్పకుండ వెళ్ళవలసినవారిని అడిగియుంటిమి. ఎందుకనగా, మనమొక వివిధ మతముల సంయుక్తానుబంధం కెలిగినవారమై, వారియొక్క స్వంత సభలోని సభ్యులను, ప్రజలను మనం తీసికొనుటకు ఇష్టపడము.
మరియు అనేక సార్లు నేను ఇతర సంఘాలను గద్దించుచున్నాను అని నాపై ఆరోపణ చేయబడినది. అది తప్పు. ఇతర సంఘాలను నేను దూషించను. అనేక సార్లు, వారు నిర్లక్షపెట్టువాటిని నేను గద్దిస్తాను, అయితే సంఘమును నేను గద్దించను. అయితే అనేకసార్లు, లేఖనమునకు వ్యతిరేకమైన వాటిని వారు బోధించినప్పుడు అప్పుడు నేను గద్దిస్తాను. ఇంకా తరువాత పాపయుక్తమైన విషయాలు వారు చేసినప్పుడు మరియు వారియొక్క సంఘములలో జరిగించబడుటకు వాటిని అనుమతించినప్పుడు, దానిని నేను గద్దిస్తాను.
2
అయితే ఎన్నడు కూడా... ఈ విధంగా చెప్పబడుతుంది... ఇక్కడ కూర్చున్న వారిలో అనేక మంది కాథలిక్ స్నేహితులు నాకున్నారు. మరి నేనెన్నడు కాథలిక్ వారిని నేను గద్దించను. కాథలిక్ సంఘము యొక్క సిద్దాంతాన్ని నేను గద్దిస్తాను. కారణం, లేఖన సంబంధితమైనది అది కాదని నేను నమ్ముతున్నాను. ప్రొటెస్టాంట్ సంఘ శాఖలలో అనేకమైన వాటిని గద్దించిన దాని కంటె ఎక్కువేమి కాదు కారణం అవి లేఖన సంబంధమైనవని తలంచుట లేదు.
సత్యమైనదేదో దానికై నిలబడుటకు బాధ్యుడనైయున్నాను, చూచారా. మీకు తెలుసా? మీరు నమ్మకంగా, నిజంగా విధేయులైయున్నట్లయితే దేవుడు మిమ్ములను అభినందిస్తాడు.
3
మీకు తెలుసా, అనేక సార్లు పురుషులు భార్యలను వెదకుతారు... నిజమైన పరుషుడు, అనగా పురుషత్వముగల పురుషుడు ఆమె ఎంతో - ముఖములో ఎంతో అందంగా లేక ఆలాగున అగుపించే అమ్మాయి కోసము అతడు ఎదురు చూడడు. ఈ ఒకానొక దినాలలో అది గతించిపోవును అని అతనికి తెలుసు, చూడండి. అతడు, స్త్రీలయందు, స్త్రీ వ్యక్తిత్వముగల నిజమైన స్త్రీ కొరకు అతడు వెదకుతాడు. మరియు ఆమె నమ్మకస్తురాలైతే, నిజమైన స్త్రీయైతే, ఆ పురుషుడు ఆమెను అభినందిస్తాడు. అతడెంతటి చెడ్డవాడైనప్పటికి నాకనవసరం, మరియు అతడెంతగా చెడ్డ స్త్రీలతో తిరిగినవాడైనా నాకనవసరం. అయితే, దేనికై స్త్రీ నిజముగా నిలబడవలెనో, దానికై నిలబడు స్త్రీని కొనియాడకుండ యుండు ఏ చెడ్డ పురుషుడు లోకంలో యుండడు. అది నిజం. ఎందుకనగా అతడు దానిని అభినందిస్తాడు.
వాక్యమును ప్రకటించుట ద్వారా - అది ఆ విధంగా యుండును. ఒక మనుష్యుడు తానేమి నమ్మియన్నాడో దాని పక్షమున అతడు నిలబడితే, అది ఆ విధముగా యుంటుంది.... ఇప్పుడు కాదు... మీరు జ్ఞాపకముంచుకోండి, దేవునికి నీ హృదయం తెలుసు. ఏది సత్యమని మీరు నిజంగా నమ్మారో, దానికై మీరు నిలబడితే, అప్పుడు నీవు మాట్లాడుచున్న దాని మీద నీకు విశ్వాసముంటుంది.
4
నాకు ఇక్కడ ఇద్దరు మంచి స్నేహితులున్నారు. సహోదరుడు చార్లీ కాక్స్ అక్కడ కూర్చోనియుండుట నేను చూస్తున్నాను. ఎక్కడైతే నేను కొద్ది విశ్రాంతి తీసుకుంటానో, అక్కడ కొద్ది వారములు కెంటకిలో ఉడుతల వేటకై, అతనితో నేనున్నాను. సహోదరుడు బాంక్స్ ఉడ్, మరి ఇప్పుడు మేము మా యొక్క తుపాకులు తర్పీదు పొందుచున్నాము; దానిని నేను ఎంతో మంచిగా చేసికొనవలసియున్నది. అది ఏభై గజాలు టాకా వరకు సరిగ్గా చేసికొనవలసియున్నది, లేదా నేను వేటాడలేను, చూశారా, అంతే. మంచిది, ఒక చిన్న గురివైపు నడిపించుటవలన అది దానికి చేయ మేలు ఏమిటి, చూచారా? ఎందుకనగా, నీవు ఉడుతను పేల్చివేస్తున్నట్లయితే మరియు అది తలనే కాల్చునదియైతే, తలను కొట్టు గురి, బహుశా దానితల అంత లావుగా ఉండవచ్చు. ఒక అంగుళం గుత్తితో ఎక్కడున్నప్పటికి ఫరవాలేదు, చూచారా అక్కడెక్కడ యుండినా ఫరవాలేదు. ఆ ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు అన్నారు, “అది సరిపోతుంది. నేను ఉడతను కొడతాను” అని చెప్పారు. వారు వెళ్ళిపోయి ఉడుతను తీసికొనివస్తారు.
అయితే, నాకైతే అది సంపూర్ణంగా సరిగ్గా సరిపోవాలి. అది గురిని తప్పక తాకవలసియుంటుంది. అది అంగుళములో పావు భాగమైన తప్పిపోకూడదు. అది టాకా పై భాగమును కొట్టవలసియుంటుంది, లేనట్లయితే నేను కలవరపడిపోయి వణికిపోతాను.
5
గడిచిన రోజు నేను అడవిలో కూర్చొనియున్నాను. “ప్రభువా, ఎందుకని ఎందుకలా నేను విచిత్రమైనవానిగా యుండియున్నాను? లేదా, ఎందుకని నీవు నన్ను విచిత్రమైనవానిగా చేశావు?” అని అడిగాను. నేనన్నాను, “ఇప్పుడు అక్కడ, సహోదరుడు బాంక్స్ తన తుపాకితో వేటకు వెళ్ళిపోయాడు, అతడు టెలిస్కోపుతో చూచి దానిని కాల్చివేయుటకు దానిని ఎక్కుపెట్టాడు...” ఒక్కొసారి గురి తప్పిపోవును, ఎందుకనగా... ఫ్యాక్టరీలో తాయారు చేయబడిన మందుగుండు దానిని ఏలాగైనా చేయును, ఎందుకనగా నీకు ఇంకా కొద్దిగా పొడి నీ యొద్దనున్నది. అయితే అది కొంచెము లేక అంగుళమో, లేక రెండు అంగుళాలో దూరముగా తాకుతుంది. సహోదరుడు బాంక్స్ చెప్పును, “అది పరవాలేదు, నేను ఉడుతను కొట్టాను.” అది పరవాలేదు. అది అతడిని ఇబ్బంది కలుగచేయలేదు. చార్లీ, అదే విధముగా.
6
నాకైతే సరిగ్గా మద్యలోనే గురిని తాకవలసియున్నది, లేదా అది నన్ను కలవరపడినట్లుగా చేసి, తలకిందులు చేస్తుంది. నేను యధాతదంగా విచిత్రమైనవాడిగానే అయిపోయాను అని నేనన్నాను.
తరువాత నేను వెనుకకు చూచుటకు పారంభించాను. నా జీవితం అలాగుండుట నేను కనుగొన్నాను. అది నా యొక్క నిర్మాణము. “సరే, నీవు నన్నెందుకు ఆ విధముగా చేశావు?” అని నేననుకున్నాను. అది కొంచెము ఆ వైపునకు, లేక మరో వైపునకు వెళ్ళినట్లయితే - అది నాకు వణుకు పుట్టిస్తుంది అని నేననుకున్నాను. తరువాత ఆ విధముగానే మేమెప్పుడు వేట కొరకు వెళ్ళినా, అక్కడ 'గ్లటన్ హాలో' యొద్ద యుంటాము. అక్కడ యున్నప్పుడు ప్రభువు నాకు ఆ విధముగ బయలుపరచెను... (అది గ్లటన్ అని పిలువబడుచున్నదని నేను నమ్ముతున్నాను, అయితే ఉడుతలు చాలా త్వరితంగా తింటవి. అందుచేత నేను దానిని “తిండిబోతు (Glutton)” అని పిలుస్తాను.)
కాబట్టి, ఈ స్థలముపైనే, “అది అదేనని” నేననుకున్నాను. నరకమును గూర్చి దానియొక్క నిశ్చయత నేను కలిగియుంటె తప్ప, అది అక్కడయున్నదని నేను బోధ కూడా చేయను, చూచారా. కాబట్టి దైవిక స్వస్థతను గూర్చి లేఖనము ముందుగా తెలియజేసినట్లయితే మరిక్కడ దీనివలె, దానివలె అగుపించినట్లయితే - తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని లేఖనము చెప్పినట్లయితే, అనగా, ముగ్గురు దేవుళ్ళున్నట్లు చెప్పినట్లయితే అక్కడ నేను ఒకే ఒకరిని చూశాను. ఇప్పుడు నేను ఏ విధముగా ఒక మనుష్యుడు తొందరపడి, చెప్పిన దానిని... వారు దానిని గూర్చి ఏమి చెప్పుచున్నారో అట్టి దానిని, ఏ విధంగా నేను తీసుకొనగలను?
ముందు ఏర్పాటు మరియు కృపను గూర్చి బైబిల్ గ్రంధము మాట్లాడితే, అది ఇక్కడ పనిచేయవలసియున్నది. మరియు అది ఇక్కడ కృపయై ఉండవలసియున్నది. నేను అది ఆ విధముగా బోధించలేను. నేను దానిని బైబిల్ ద్వారా మరియు దానిద్వారా మరియు దానిద్వారా పరిష్కరించవలసియున్నది, ఎంతవరకనగా గురిని అది పరిపూర్తిగా తాకువరకు, చూడుడి, అది లేఖనముల నుండి పరిపూర్ణముగా బయటకు వచ్చువరకు దాని నేనది చేయవలసియున్నది.
అటు తరువాత నేను నిలబడినప్పుడు నేనేమిచేస్తున్నానో దానియందు నేను నిజముగా విశ్వాసము కలిగియుండగలను, చూచారా. నేనేమి బోధిస్తున్నానో, అది సత్యమని ఎరుగుదుము, చూచారా. ఆ తరువాత, దానిని గూర్చి ఎవరైనా వ్యతిరేకమైనది పొందుకున్నట్లయితే, ఆయన ఏమి చెప్పియుండెనో అతనిని ఎక్కడ నిలుపుచేయవలెనో దానిని చాలినంతగా నీవు ఎరుగునంతగా నీవు చదివియన్నావు, చూచారా. అది అక్కడే.
7
ఆ విధంగా అదియుండును... మనము కేవలం సులభముగా దేవుడు మనలను పలు విధములైన మార్గములలో చేశాడు. అది లోకమును ఆ విధముగా చేసినది. సరే, అది ఆ విధముగా నన్ను అట్టి భయభీతునిగా చేయును. తలక్రిందులైపోవు వ్యక్తిగా చేసినది. అది ఖచ్చితంగా సరియైనదిగా యుండవలసియున్నది.
ఈ రాత్రి, ఈ దినము ఈ ఉదయం ప్రభువైన యేసు మృతుడు కాడని నేనెరిగియున్నానని చెప్పుటకు నేనెంతో ఆనందంగా ఉన్నాను. ఆయన జీవించుచున్నాడు. గలిలయలోను లేక మరొకచోట ఎక్కడైనను లోకములో ఆయన ఎలాగుండెనో ఇప్పుడు ఇక్కడ ఖచ్చితముగా అలాగే ఆయన ఉన్నాడు. ఆయన పునరుత్థానుడై జీవించుచున్నాడు. జీవముగల దేవుని కుమారుడై యుండి, సర్వాంతరామియైయున్నాడు. నేను చేయలేనట్లయితే.... ఒక విధమైన చరిత్రకారుడైన దేవుని గూర్చిన లేఖనము నేను బోధించినట్లయితే, ఆయన ఇక్కడే యున్నాడను దానిని నేను ఖచ్చితంగా చెప్పలేను, నేనంతా గందరగోళము ఉంటాను; అది నన్ను ఎంతో ఆందోళన చెందునట్లు చేస్తుంది, నేనేమి చేస్తున్నానో నేనెరుగకయుంటాను, చూచారా. ప్రజలకు ఎక్కడ చెప్పాలో నేనెరుగకుందును, “సరే, ఇప్పుడు, ఆయన ఇది చేయును లేక ఆయన అది చేయును.” నేను మీకు చెప్పలేను.
నాకు తెలియదు, అయితే ఆయన ఏమి వాగ్దానము చేశాడో అది చేయునని నీవు ఎరిగితే, అది చేయుట నీవు చూచినట్లయితే అప్పుడు నీవెక్కడ నిలబడియున్నావో, అది నీవెరుగుతావు, చూచారా.
8
మరియు చూడండి దేవుడు ఆయన యొక్క గొప్ప ప్రణాళికలలో ఒక ప్రత్యేక సంగతి కొరకు ఖచ్చితంగా ఒక్కొక్కరిని ఏ విధంగా చేసియున్నాడో ఎరిగియుండుట, ఎందుకనగా ఆ ఉద్దేశ్యం కొరకే ఆయన వారిని వాడుకొనును.
కొంతకాలం క్రితం, అక్కడ ఈ చిన్న స్త్రీని గూర్చి మీరు వినియందురు, శ్రీమతి. స్ట్రిక్కర్, ఎలాంటి వాయిద్య సంగీతం లేకుండగనే ఆమె పాడినది. ఆమె రాగము తీసికొనుటకై, ఆమె తాళము లేక దానిని మీరేమని పిలుస్తారో మరి, ఆమె ఊదునటువంటిది ఒక చిన్న వస్తువు ఆమె యొద్దనున్నది. నిజమైన మెల్లని నాదముతో దానిని పైకెత్తి పాడినది. అది పైకెత్తి (పెద్దది చేసి) “ఓడ అహో,” అన్నది. దానిని నేనొక్కసారి ప్రయత్నంచేయుట మీరు వినవలసియున్నది. అదెంతో భయంకరముగా ఉండును.
అయితే మీరు చూడండి, ఆమె అది చేయుట కొరకై ఆమెను ఏ విధముగా చేయవలెనో దేవుడు ఎరిగియున్నాడు. ఆదే మార్గమున మనమంతా పలుపలు విధములుగా చేయబడ్డవారము. క్రీస్తులో మన యొక్క స్థానమును మనము కనుగొన్నట్లయితే, అక్కడే కట్టుబడి ఆయనను సేవిస్తాము.
9
ఈ ఉదయం ఇక్కడ చక్రాల కుర్చీలో కూర్చున్న చిన్న బాలికను చూడుడి. నీ చిన్న హృదయం దీవించబడును గాక. హనీ, నీ యొక్క అంగవైకల్యం ఏంటి? కండరాలు. .... ఓ, నేనది మొదలుపెడితే నేనా మాటను చెప్పలేకున్నాను. కండరాలు క్షీణించే వ్యాధి, లేక ఎదో. ప్రియమైనదానా, అది నీకు అంగవైకల్యత కలిగించినదా, లేక అది పోలియోనా? పోలియో. మీకు తెలుసా, యేసు చిన్న ఆడపిల్లలను, ఆయన చేయును కదా? నీవెంతో మంచి చిన్న బిడ్డవు. మరి నీవు స్వస్థత పొందునట్లుగా యేసు అనుమతించునని నేను నమ్ముతున్నాను.
10
గడిచిన రాత్రి, ఆ వ్యాధి కలిగి ఇక్కడే కూర్చొనియున్న ఆ ఇద్దరు ఆడపిల్లలు. ఆ వ్యాధి ఏదో ఈ లోకంలో ఏ ఒక్క వ్యక్తికి తెలియదు. వారి యొక్క చిన్న చేతివ్రేళ్ళ రాలిపోయినవి. వారి చిన్న పాదములు కూడా రాలిపోయినవి; అందమైన ఆడపిల్లలు. వారియొక్క అమ్మను మరియు అమ్మమ్మను గూర్చి తెలిసికొనుట నాకు తటస్థించినది. అప్పుడే అక్కడ కూర్చొనియున్న ఆ చిన్నవారిని హింసించుచున్న ఆ దయ్యాన్ని గద్దించుటకు నేనలా నడిపించబడితిని. ఎంతకాలము వారు తోపుడు కుర్చీల్లో కూర్చుండియుండిరో నాకు తెలియదు. గతించిన రాత్రి, “చిన్న ఆడపిల్లలు లేచి నిలబడి, చుట్టూరా నడుస్తున్నారు,” అను వార్తలు వరుసలో ప్రాకిపోయినవి. అది ప్రభువైన దేవుడు వారియెడల ఎంతో కనికర సంపన్నుడైయుండెను.
ఓ, ఆయన మనయెడలను ఎంతో దయాళుడైయున్నాడు. ఆయనను మనమెక్కువగా అభినందించవలసియున్నది.
11
తరువాత, నేను ఇంటికి వెళ్ళిపోయిన తరువాత, కొద్ది నిమిషాలు క్రిందపండుకొని, గతరాత్రి నేను తలస్తుయున్నాను. “ఆత్మ ఒక మనుష్యునిలో నుండి బయటకు వెళ్ళిపోయిన తరువాత, అదేమైయుంటుంది,” అని నేను ఆలోచిస్తున్నాను. బయటకు కదిలి వదలిపోయినదో, అది అతని యొక్క అంతరంగ వ్యక్తి, అతడు చనిపోలేదు; అతడింకా బ్రతికేయున్నాడు, చూచారా; అతడు యుగములకు జీవించును. మరియు ఈ తెర ఆవలికి ఎవరైతే దాటిపోయియుండిరో, మన ప్రియులు, అదేమైయున్నదో మనకు తెలియని ఒక శరీరములో వారుంటారు. అది బయలుపరచబడలేదు.
12
ప్రతియొక్కదానికి మూడు దశలున్నవి. ఒక మర్త్యమైన శరీరము యొక్క దశ ఉన్నది. ఒక అమర్త్యమైన శరీరము మరియు అటు తరువాత మహిమగల శరీరము ఉన్నది, చూచారా. మిగతా వాటివలె తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒక బాటలో వెళ్ళును, మరియు మూడు ఒకటిగా చేయును. నీతికరణ, శుద్దీకరణ, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము అనునవి ఒక ద్వారము గుండా ఒకటిగా చేయును. అటు తరువాత ప్రాణము, శరీరము, ఆత్మ ఒకటిగా చేయును. మరియు అది మూడులో పయనిస్తుంది, మరియు మూడునూ ఒకటి.
మరియు ఒక మూడు కోణములు గల ఒక గాజు ముక్క తీసికొని, సూర్యుని ఎదుట అది పెట్టుము, అది రంగులు ప్రతిబింభింపచేస్తుంది. అయినను ఒక్కదానిలో గుండా ఏడు రంగులు వచ్చును. మరియు నీవు ఒక ఎర్రని దానిని తీసుకొని ఎర్రదాని గుండా ఎర్రని దానివైపు చూడు, అది ఎలాంటి రంగు అవుతుందో, అది ఎంతమందికి తెలుసు? తెలుపు. అది వింతగా లేదా? అది ఎరుపు గుండా ఎరుపును చుస్తే, తెలుపు కన్పిస్తుంది.
ఎరుపు విమోచనమునకు సూచనయైయున్నది. మరి మీరు ఆయన ప్రశస్త కుమారుని యొక్క ఎర్రని రక్తము గుండా, దేవుడు మన యొక్క ఎర్రని పాపములవైపు చూచుచున్నాడు, అవి తెల్లగా యున్నవి. అయితే ఆయన రక్తము గుండా చూడవలసియున్నది. ఒకవేళ అది అలాగు కానట్లయితే, వారు పాపులే. కాబట్టి మనము రక్తము క్రింద యుండవలసియున్నది.
13
dప్రాణము శరీరమును విడిచిపెట్టిన తరువాత విశ్రాంతి స్థానములోకి దాని యాత్రను అది కొనసాగించును. ఈ ఆకారము రూపముగల శరీరములోకి అది వెళ్ళును, అయితే అది ఈ విధమైన పోలికగలది కాదు.
నీ ప్రియమైన వారిని నీవు కలుసుకుంటావు, వారితో నీవు కరచాలనము చేయలేవు. నీవు వారితో మాట్లాడగలుగుతావు, వారిని చూడగలవు. ఇక్కడ ఎలాగున్నారో అక్కడ అలాగే వారు కన్పిస్తారు.
ఎందుకనగా ఎప్పుడైతే పేతురు, యోహాను, యాకోబులు మోషే మరియు ఏలియాలను రూపాంతరపు కొండపైన చూచినప్పుడు, వీరు - వారిని గుర్తుపట్టిరి.
అయితే అది ఒక శరీరము. అయితే ఆ తరువాత, ఆ యొక్క శరీరము, పరలోకసంబంధమైన ఆ శరీరము, అది భూమిపైకి తిరిగి వచ్చి, ఒకప్పుడు జీవించిన పదార్ధమును అది పైకెత్తుకొనిపోవును. అప్పుడది మహిమగల శరీరముగా మారును. ఆ శరీరమే ప్రభువైన యేసులో, ఆయన యొక్క పునరుత్థాన శరీరములో మనము చూచునటువంటి శరీరము.
14
“మనమేమైయుందుమో ఇంకా అది అగుపించలేదు,” అని పౌలు చెప్పుచున్నాడు, “అయితే ఆయన స్వంత మహిమగల శరీరమువంటిది మనము కలిగియుందుమని మనమెరుగుదుము, ఏలయనగా ఆయన యున్నట్టుగానే ఆయనను మనము చూచెదము.” మడతబడిపోయిన ఈ ముసలి హస్తాలు, చెదిరిపోయిన కండరాలు, సౌందర్యవంతమైన యవ్వనములోకి మరుగైపోవును. మీరు వృద్దులైన పురుషులు, స్త్రీలు, గుర్తుంచుకొనండి: అది మీ యొక్క వృద్దాప్యము, అది రాలిపోవుటకు ఒక గురైయున్నది. అయితే, పునరుత్థానమందు, పాపమగు ఏ ఒక్క దానికి అవి గురుతు కావు. అయితే, ఆ విధముగా దేవుడు మిమ్ము ఎందుకు చేసెను? ఒక వయస్సులోకి ఆయన మిమ్ము తీసుకొనివచ్చాడు. మీకు ఇరువది-రెండు, ఇరువది-మూడు వయస్సు వచ్చునప్పటికి మీరు మీ యొక్క పుష్టితో యుంటారు. మీరు ఆహారం భుజిస్తారు, బలవంతులుగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, మరియు ఎంతటి బలవంతుడవైన రూపముగలవానిగా నీవు కనిపిస్తావు. ఆ తరువాత, నీవు ముడతలుబడిపోతుంటావు. చూచారా, మరణం ప్రవేశపెట్టబడినది. అయితే, పునరుత్థానమందు, వృద్దాప్యమంతా తుడిచివేయబడుతుంది.
15
నేనిక్కడ ఒక చిన్న వృద్ధ బోధకునివైపు మరియు అతని భార్యవైపు చూస్తున్నాను. వారు వారి యొక్క ఎనబైలో యున్నారని, అనుకుంటున్నాను. సహోదరుడు మరియు సహోదరి కిడ్, బహుశా నేను జన్మించక ముందే సువార్తను ప్రకటిస్తున్నారు. నేనొక ముసలివాడనైయున్నాను. చిన్న వృద్ధ దంపతులుగా, ప్రశాంత ముఖ వర్చస్సుతో యుండి, వారు ఇక్కడే కూర్చొనియుండుట నేను చూస్తున్నాను. ఆ పునరుత్థానములో వారు ఏ విధంగా అగుపించెదరా అని నేనిప్పుడే ఆలోచన చేస్తున్నాను. ఆ ముడతలు పడిన శరీరము, చేతులు వణికిపోతూ వంకరగా యుండుట, నెరసిన వెంట్రుకలు, ప్రకాశవంతమైన యవ్వన స్థితిలోనికి మారిపోవును. అది నిజముగా ప్రభువును సేవించుటకు చెల్లుబడి చెందియుండును. అది నిజముగా ఉండును. ఒక దినమున మనమాయెనను చూచెదము.
16
రోజెల్లా గ్రీఫిత్ ప్రస్తుతం ఇక్కడ యుంటే, ఇక్కడే యున్నదని అనుకుంటున్నాను. ఆమెను గూర్చి ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడే కొన్ని సంవత్సరాల క్రితం బాగుపడిన ఒక చిన్న త్రాగుబోతు. ఇక్కడ ఉన్నటువంటి కొందరు మద్యపానము సేవించువారికి అది సహకరించును. ఈ ఉదయం ఇంటికి వెళ్ళిపోయినది, సరే. అద్భుతకరమైన విషయం! గతరాత్రి ఆమె చేత ఒకటి చెప్పించవలసి యుండవలసినదని నేననుకుంటున్నాను, అది నేనెరిగియున్నట్లయితే, ఈ ఉదయం ఆమె ఇంటికి వెళ్తుందని నేను యెరిగియుంటె, నేనది చేసియుండెడివాడను.
కాబట్టి చాలా విషయాలు మందిరములోని వారు వినాలని నేను ఆశపడుతున్నాను.
17
నీటి బాప్తిస్మము తీసుకొనుటకు, ఈ ఉదయం ఎవరైనా ఉన్నారా? మమ్ములను చూడనివ్వండి; ఒకటి, రెండు, మూడు , నాలుగు, ఐదు, ఆరు, షుమారు ఆరు లేక ఏడుగురు బాప్తిస్మము పొందుటకు ఇక్కడున్నారు. ఈ ఆదివారపుబడి పాఠము వెనువెంటనే బాప్తిస్మము కార్యక్రమముండును.
18
ఇప్పుడు ఆదివారపుబడి గది మన సహోదరి ఆర్నోల్డ్ కు, ఆమె యొక్క చిన్నపిల్లలకు, మూసివేయబడుతుంది. సహోదరి ఆర్నోల్డ్, మీరు ఇష్టపడితే, రాబోవుచున్న అదే రోజు కొరకు మనమది వాయిదా వేద్దాం, ఎందుకనగా బడి కొరకు మనకు గది లేదు కనుక.
చిన్నబిడ్డలకై కొంత లేఖనమును కొద్ది నిముషాలలో నేను చదువుతాను, మరియు ఒకటి ఆలోచించుటకు అది కూడా వారికై ఉపకరిస్తుంది. అటు తరువాత ఆదివారము యదావిధిగా ఆదివారపుబడిలో మీ యొక్క ఆరాధనను మీరు కొనసాగిస్తారు.
19
ఇప్పుడు మేమొకటి చెప్పాలనుకుంటున్నాము... ఈ ఉదయం, ఇక్కడ మరొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను; ఇది చేయవద్దని నేను వారికి చెప్పాను, కాని ఏది ఏమైనా వారది చేశారు. అదేమనగా, గతరాత్రి నా యొద్దకు వచ్చిన కానుక — ఒక కానుక. అది చేయవద్దని నేను వారితో చెప్పితిని, చూచారా. అయితే, ఏది ఏమైనా వారది చేశారు. బిల్లీ యొద్దకు సహోదరుడు డాక్ దానిని తెచ్చియున్నాడని అతడు చెప్పేవరకు అది నాకు తెలియదు. ఇంకా నేనది లెక్కపెట్టలేదు, అయితే అది షుమారు మూడువందలు లేక మూడువందలకు పైచిలుకు అను సమాచారమని నేననుకుంటున్నాను. అది ఎంత....? నీకు జ్ఞాపకముందా, డాక్, అదెంత? అది ఎంత, సహోదరుడా? మూడు-వందల-ఇరవై-నాలుగు-పన్నెండు. నీకు చాలా ధన్యవాదాలు.
చాలా కాలం నుండి నా పనులను నేను నిలుపు చేస్తున్నాను; మీకది తెలుసు. ప్రస్తుతం ఇక్కడున్న నా యొక్క కార్యదర్శి, లేక వారిలో కొంత మంది, ఈ ఉదయం ఇక్కడున్నారు. వారు నా యొక్క వినియోగ వ్యయాలు ఎరిగియున్నారు. నేనెక్కడ యుండినప్పటికి, ఇక్కడ స్థానికంగా యుండినప్పటికి, దినానికి - వంద డాలర్లు నాకు ఖర్చు అవుతుంది. నా యొక్క కార్యాలయానికి, చేతిరుమాలలు తీసుకొనుటకు ప్రపంచమందంతటికి ఖర్చగువాటికి ఆవుతుంది.
20
నేను ఇక్కడున్న మిమ్ములను ప్రోత్సాహపరచుటకై నేనిది చెప్పాలనుకుంటున్నాను: ప్రజల మొత్తం మీద, నా జీవితంలో నేను స్వీకరించిన పెద్ద మొత్తం కానుక ఇది. సగటున, షుమారు ఒక్కొక్కరికి ఒక డాలరు అవుతుందని మీరు గ్రహించారా? మొత్తం పని యంతటిలో ఏ కానుకలోనైనా, వెరశి షుమారు ఒక్క వ్యక్తికి ఒక్క డాలరు అవువుతుంది.
ఎందుకనగా, ఇక్కడకు మీరు తీసుకొనిరాలేరని నాకు తెలుసు. బయట, వారు కానుకలు పట్టరు. షుమారు మూడు వందల మంది ప్రజలు ఈ స్థలములో ఇరుక్కొని కూర్చొనలేరు. నాకు అనుమానమే... సహోదరుడా నెవిల్! ఆలయంలో కూర్చుండు సీట్లు ఎన్నో మీకు తెలుసా? [“ఇప్పుడున్నట్లుగా షుమారు మూడు వందలు యుండగలవు,” అని సహోదరుడు నెవిల్ చెప్పెను.] షుమారు మూడు వందలమంది ప్రజలు. కాబట్టి, చూడండి, అది ఒక్కరికి సగటున ఒక్క డాలరు ఆవువతుంది. నేనెంతగా అభినందిస్తున్నానో, దేవునికి తెలుసు. నేను మీకు అనేకమైన ధన్యవాదములు చెల్లించుకుంటున్నాను. అది నేరుగా ప్రభువు యొక్క పనికై వెళ్తుంది. అందుకై నేను మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను.
మరియు... ఒకవేళ రాత్రికి ముందే వారిలో కొందరు వెళ్ళదురేమో, ఎందుకనగా... నేను గతరాత్రి నేను ఇంటికి వెళ్ళిపోయి, వసారాలో కూర్చున్నాను. అది చిన్న పెట్టె ఈ విధంగా యుంటుంది - అవి కొన్ని జెల్లీ, అది ఒకరు పంపియున్నారని అనుకుంటున్నాను. మీకు తెలుసు, నేను జెల్లీలను ఇష్టపడతాను. మరియు నేనది అభినందిస్తున్నాను.
21
ఒకరు ఇక్కడున్న ఒక సహోదరి... నేనామె పేరు సరిగా చెప్పలేకున్నాను. మా కుటుంబానికి ఆమె ప్రాణ స్నేహితురాలు, నా కొరకు, బిల్లీ కొరకు, ఆమె ప్రేమ కానుకగా, మా అమ్మ యొద్ద అది యుంచి వెళ్ళినది. సహోదరీ! మేమెంతగా దానిని అభినందించామో నీకు తెలియదు. అదెంత మంచి సమయమో, ఓ, అనేకములైన విషయాలు. మీరు గ్రహించారా.
ఆయన అర్ధం చేసుకుంటాడని నేను ఖచ్చితముగా నమ్ముచున్నాను. కాబట్టి, మీలో ఒక్కొక్కరిని ఆయన మిక్కిలి ఎక్కువగా, సమృద్దిగా దీవించునని నేను విశ్వసిస్తున్నాను. నేను మీతో కలసి, మీ ఒక్కొక్కరితో కలసి ఇంటికి వచ్చి, కొద్దిసేపు మీతో కలసియుండి, మీతో మాట్లాడవలెనని ఆశ కలిగియున్నాను. అది చేయుటకు నేను ఇష్టపడుచున్నాను, అయితే అది ఏలాగో మీకు తెలుసా. అది అలాగే కదలుచూ దాని మీదనే యుండును; మనం చాలా త్వరగా వెళ్ళవలసియున్నది.
నిజంగా ప్రభువు చితమైనట్లయితే, ఈ రాత్రి కూటము అయిన వెంటనే, కూటము ముగించబడిన వెంటనే — రాష్ట్రాన్ని నేను వదలిపెడతాను. పండ్రెండు గంటలకు ముందే నేనిక్కడ నుండి వెళ్ళవలసియున్నది. పండ్రెండు గంటలకు నాకు ఒక నియామకమున్నది. ఈ మధ్యాహ్నం నాకు నిండుగా యున్నవి, అది ఏలాగో మీకు తెలుసు. అది ఆలాగే నిరంతరం కొనసాగిపోవడమే అవుతుంది. ప్రజలు రోగముతో యున్నారు, చనిపోతున్నారు; చాలాసార్లు నేనొక స్థలములోకి వెళ్ళి, అక్కడ నిలబడియుంటాను మరియు ఒకరు లోపలకు వచ్చి అలాగే నిలబడి, “సహోదరుడా బ్రెన్హాం, నేను మీకు తెలుసా?” అని అడుగుతారు.
“లేదు, నాకు తెలియదు.”
“నీవు వచ్చి ప్రార్ధించినప్పుడు ఎందుకని నేను చనిపోతూ, ఆసుపత్రిలో పడియున్నాను. ప్రభువు నన్ను స్వస్థపరచాడు.” “ఆ నీవు దినాన దర్శనము వచ్చినప్పుడు, నన్ను వీధిలో కలసినప్పుడు నేను గ్రుడ్డివాడను,” చూశారా.
నాకు అదేమైనది తెలియదు. అయితే ఒక ఆనందకరమైన ఈ తలంపును నేను తలస్తున్నాను. సహోదరుడా ఈగన్, ఒక దినమున నా ఆఖరి ప్రసంగమును ప్రసంగించిన తరువాత, ప్రభువు ప్రార్థన చేయమని కోరినటువంటి ఆఖరి వ్యక్తికి నేను ప్రార్ధించిన తరువాత, నేను గృహానికి వెళ్ళిపోతాను. ఆ యొక్క పునరుత్థానపు ఉషోదయవేళ, ఓ, ఎటువంటి ఆనందకరమైన దినముగా అది ఉండును!
22
ఆ సంతోషము!
నేనక్కడ నిలబడియున్నప్పుడు, దక్షిణ దేశపు రాణి వచ్చును. ఆమె ఎటువంటి పలుకుబడి కలిగియుండెనో నేను చూడగలను. బిల్లి గ్రహం తన పలుకుబడితో వచ్చుట నేను చూస్తాను. ఓరల్ రాబర్ట్స్ మరియు మిగతావారు, షంకే, ఫిన్నే, మూడీ, కాల్విన్, నాక్స్, తదితరులు అక్కడకు వచ్చుట నేను చూచెదను. ఆ తరువాత నా గుంపువారు వచ్చుట చూచెదను. ఓ, అది ఆనందకరముగా ఉండబోవుచున్నది. అది నాకు కిరీటమును ధరింపజేయునట్లుగా ఉండును. అది నిజం. దేవుని యొక్క కృప చేత, అక్కడ అనేక లక్షల మంది యుందురని నా నిరీక్షణ.
ఇప్పుడు, నేను చాలా త్వరగా విదేశాలకు వెళ్ళవలసియున్నది. ఇప్పుడు నేనెరిగినంత వరకు, నేనది తలస్తున్నాను, నేరుగా మనయొక్క స్వంత కూటములోనే — కేవలము దానిగురించి ఆలోచించండి — క్రీస్తు కొరకు ఆత్మల సంపాదించుటలో, నేను నా యొక్క రెండవ మిలియనులో ఉన్నాను. మరియు నేను అనేక, అనేక మిలియనులు సంపాదించుటను చూడాలని నా నిరీక్షణ.
23
బాప్తిస్మము కూటములు మరియు నియామకాలు మొదలైనవి... మరియు కూటమైన తరువాత ఇది కొనసాగించబడుతుంది. ఏ సమయములోనైనా మీరు వ్యక్తిగత ఇంటర్వ్యూ కొరకు వచ్చుచున్నట్లయితే, లేదా తదితరమైన విషయాలు యున్నట్లయితే ఏజెంట్ తో మాట్లాడండి. సహోదరుడు మెర్సియర్ ఇక్కడున్నాడు. ఒక విధమైన పద్దతిని మనము కలిగియుండవలసియున్నది... అది మనము చేయవలసియున్నది; మనకది తెలుసు.
సహోదరుడు మెర్సియర్, వారిని అతడు తీసికొని వస్తాడు. వారు వచ్చినట్లుగానే వారిని కూర్చుండబెడతాడు. నియమకాలన్ని అయిన వెంటనే (అన్ని అయిపోయినవి), నేను లోపలకు వచ్చినప్పుడు అతనిని పైకి పిలచి, “ఆ గుంపు వారి విషయం నేను ముగించాను” అని చెప్తాను. అతడు నాకు క్రొత్త గుంపువారిని ఇస్తాడు మరియు నేను తిరిగి వెళ్తాను, గమనించారా. తరువాత అన్ని పనులన్ని ఆ కార్యాలయానివే. రాగలిగిన వారిని ఒక్కొక్కరిని లోపలికి తెచ్చుటకై, అక్కడ పైన ఏలాగు వారిని యుంచవలెనో అతనికి తెలుసు. కాబట్టి ఈ చిన్న కార్యాలయము నిర్వహించు విధానమును బట్టి అది అలాగు యుండుటను బట్టి మేమెంతో సంతోషంగా ఉన్నాము.
కాబట్టి అది బట్లర్ 2-1519; అది... లేదా మీరు జఫర్సన్-విల్ లో మాట్లాడాలనుకున్నట్లయితే, కేవలము నా కొరకు పిలవండి, మరియు అక్కడ కార్యాలయము నుండి వారు జవాబిస్తారు. మీ దయకై, మీకు ధన్యవాదాలు.
24
ఇప్పుడు, మనము... ఆయన దీవెనకరమైన వాక్యమును మనము తెరువక ముందు... జ్ఞాపకముంచుకోండి, ఈ కూటము అయిపోయిన వెంటనే, బాప్తిస్మముల కార్యక్రముండును, ఈ రాత్రి ప్రార్థనా కార్డులు ఇచ్చుటకై బిల్లీ ఇక్కడే యుంటాడు.
ఈ రాత్రి ఆదివారపు రాత్రి, ఆలయపు రాత్రియైయున్నది. లూయిస్-విల్ ఆ చుట్టూనున్న నగరములోని అనేక మంది వారియొక్క స్వంత ఆలయాలలో యుంటారు. వారు వారియొక్క ఆలయాలలో యుంటారు. అయితే, ఇది ఎక్కువగా బయటవారికే అవుతుంది. కాబట్టి ఈ రాత్రికి పెద్ద ప్రార్ధనా వరుసను చేసి, వారిలో ఒక్కొక్కరికి ప్రార్థించుదామని అనుకుంటున్నాను. మనమలాగు చేస్తామని నేను నమ్ముతున్నాను.
కొద్ది ప్రార్థనా కార్డులే మా యొద్ద యున్నవి. నేను తలస్తున్నాను, గతరాత్రి... నిన్నటి రాత్రి తరువాత, ఓ, నేను వాటిలో ఒకానొక చిన్న ఒంటరి ప్రయాణము చేయబోవుచున్నాను అని నేను భావించాను (మీకు తెలుసా) మనము మాట్లాడినవి. ఈ చిన్న పాత మందిరములో మరలా చేతులు పైకెత్తుట, అది చూచుట.
25
నా దగ్గర ఇక్కడ చిన్న పిల్లవాడువున్నాడు. చిన్న జోసఫ్, అతడు చిన్న బాలుడు. అతడు కేవలం మూడు సంవత్సరాలవాడు. వారందరూ కేకలు వేయుచు యున్నప్పుడు, అక్కడ దారి మధ్యలో అతడు చేతులు పైకెత్తి, అక్కడున్న దారి మధ్యలోనే కేకలు వేయుచు, ప్రభువును స్తుతిస్తూ అక్కడ ఎగరలేకపోతున్నాడు.
ఈ ఉదయం తనయొక్క చిన్న సోదరితో అతడు అందులోకి వచ్చాడు. ఆమె ముంజేయిని కొరికాడు అని అనుకుంటున్నాను. కాబట్టి అతడా విధంగా ప్రవర్తించనంతవరకు అతని కేక ఏ మంచి చేయదు అని నేను అతనితో చెప్పాను. ఓ, మై! ఆ చిన్నవారు, వారు నీ పక్కకు రాలేకున్నారు, వారు రాలేరా? అవును, అది ఏమైయుండెను, ఇతరులు అది చేయుట అతడు చూచి, మరియు అతడు చేయవలసినది కూడా అదేనని అతడు అనుకున్నాడు — మరియు బహుశా, మనము చేయు దానిని అనుసరించుచుండవచ్చు.
26
ఇప్పుడు, ఇక్కడ తెరవబడియున్న ఆయన యొక్క వాక్యము మనకిక్కడయున్నది. అందుకొరకై ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడుదాము.
ప్రియమైన దేవా, నీవు ప్రార్థన ఆలకించి, జవాబు అనుగ్రహించగలవాడవని నమ్మి, గౌరవముతోను, నెమ్మదిగాను, ప్రశాంతతతోను, విశ్వాసముతోను మేము నీ యొద్దకు వచ్చుచున్నాము; ఎందుకనగా తప్పిపోనివాడైయుండి, “నా నామమున తండ్రిని మీరేమి అడుగుదురో నేనది చేయుదునని,” వాగ్దానం చేసియున్నాడు. అన్నిటికి తగిన నీ కుమారుడైన ప్రభువైన యేసు నామములో వచ్చుచున్నాము.
అటు తరువాత దేనినైతే మేము అడిగియుంటిమో ఆయన నామమున అది పొందుకుంటామని మేమెరిగియున్నాము. నిన్ను సమీపించు మరే ఇతర నామము మాకు లేదు — ఘనమైన, సర్వశక్తిగల యెహోవా దేవా. దేనికిని మేము అర్హులము కాదని ఒప్పుకుంటూ, ఆయన కృప ద్వారా మేము వచ్చుచున్నాము, ఆయన మాకై ప్రాయశ్చితార్ధము చేసినందునకు, మాకై ఆయన చనిపోయియున్నందునను మేము వచ్చుచున్నాము. ఆయన మా పాపములకై ప్రాయశ్చితార్ధము చేసెను. తద్వారా ఆయన మరణమును బట్టి నీ దృష్టిలో నీతిమంతులుగా నిలబడుటకు యోగ్యులమని మేము భావిస్తున్నాము. అదే మా యొక్క విశ్వాసము.
27
కీడైనదియగు దేనికైగాక, మా అందరి కొరకు మంచిదైయుండు దాని కొరకై అడుగుచున్నాము. కాబట్టి ప్రభువైన దేవా! నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. శ్రేష్ఠులైన పురుషులుగా, స్త్రీలుగా, బాలురుగా, బాలికలుగా ఏ విధముగా మేముయుండవలెనో ఎరిగి అర్థం చేసుకొనునట్లు, ఆ స్వరములో నుండి మాతో మాట్లాడండి. అక్కడ దూరానా మరణము దగ్గర గంభీరమైన ద్వారము యున్నదని ఎరిగినవారమై, ప్రతియొక్కసారి మా గుండె కొట్టుకొనునప్పుడు, ఎందులోకి మేము వెళ్ళబోతున్నామో, ఆ గవిని యొద్దకు ఒక్కొక్క ద్వనితో సమీపంగా వచ్చుచున్నాము.
అటు తరువాత, మేమిక్కడయున్నామని ఎరిగిన తరువాత, సమాదాన సంబంధమైన సంధి చేసికొనుటకు తిరిగి ఒక్క తరుణము ఇక యుండదని మేమెరిగియున్నాము. ఇప్పుడు మాకున్నటువంటి ఈలాటి తరుణము తిరిగి మరెన్నడు మాకు రాదు. ఆ గీతను మేమెప్పుడు దాటెదమో ఎరుగనివారమై యున్నాము. ఓ దేవా, మా యొద్దకు త్వరగా వచ్చి, మాకు కావలసియున్న ఇంద్రియాల యొద్దకు మమ్ము తీసుకొని రమ్ము. తద్వారా నిన్నెలా సమీంచవలెనో, నీ యొద్ద మా విజ్ఞప్తి ఎలా తెలియచేసి, నిన్ను అడుగవలెనో మేము తెలుసుకుంటాము. ప్రభువా, అనుగ్రహము చూపండి. మేము అక్కరలతో నున్న ప్రజలము, మరణచాయ లోయలలోను జీవితకాలమంతటిలో మమ్ములను నడిపించు గొర్రెల కాపరిని పిలచుచున్న గొర్రెలము మేము.
28
వృద్దుడైన దావీదు చెప్పినట్లు, ఆ స్థలానికి నేను వచ్చునప్పుడు నేను భయపడను, ఎందుకనగా ఎక్కడైతే వ్యాది, వృద్ధాప్యము, దుఃఖము, మరణము మా నుండి దూరమైపోయి, నిరంతరము స్వతంత్రులుగా యుండెదమో, అట్టి మహిమగల తీరానికి అక్కడ అచంచలమైనవారముగా మా పాదములు నిలిపే వరకు ఆ స్థలముగుండా కాపరి మమ్ములను నడిపించును.
ప్రభువా, మాట్లాడుము. ఒకరికి సంబంధించిన ప్రకాశిస్తున్న నేత్రాలు గల బాలిక ఇక్కడే నా యెదురుగా యుండియున్నది. ఈ తోపుడు కుర్చీలో యుండియున్నది. ఆమెపై నుండి ఈ దినాన, నా దృష్టిని నేను మరల్చ లేకున్నాను. ఈ పోలియో ద్వారా అంతా వంగిపోయియున్నది. ఆమెకది దుష్టుడే చేశాడు. ఓ దేవా, ఆ చిన్న ముద్దు బిడ్డకు విడుదల దయచేయుము. ప్రభువా! అనుగ్రహము చూపుము. ఆమెకు మాత్రమే గాక, ఎవరైతే ఇక్కడ ఎదురుచూస్తున్నారో వారందరికి దయచేయుము. ఈ ఉదయం, వారిని పరిశుద్ధాత్మ ఎత్తైన స్థానమునకు ఎత్తును గాక, తద్వారా ప్రతియొక్క అనుమానపు స్పందనను, ప్రతియొక్క పాపపు అడ్డ గడియను వారు దాటగలుగుతారు. తద్వారా నీ యొక్క పరిశుద్ధాత్మ వీరిపై దిగి, వారిని స్వస్థపరుచును. ప్రభువా, వీటిని దయచేయండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో, నీ మహిమకై మేము ఈ దీవెనలను అడుగుచున్నాము. ఆమేన్.
29
ఈ ఉదయం కొరకై నేను పాఠమును ఎన్నుకొనియున్నాను. కాలమంతా పెద్దలతోనే నేను తీసుకొనినందుకు, పిన్నలైన మీరు నన్ను మన్నించండి. ఈ ఉదయం మీ యొక్క తరగతి ఇక్కడ కాదు. అయితే మీరు కూడా నేనేది చదవాలనుకున్నానో వినాలని నేను ఆశిస్తున్నాను.
I సమూయేలు, 3వ అద్యాయములో నుండి ఈ ఉదయం నేను చదవాలనుకుంటున్నాను. “ఆయన స్వరము వినుము,” అను పాఠము కొరకై తీసికోవాలనుకుంటున్నాను. చిన్న బాలికల కొరకు మరియు పెద్ద బాలికల కొరకు, చిన్న బాలుర కొరకు, మరియు పెద్ద బాలుర కొరకు అందరికి అది సరిపోతుంది. పాఠము గుర్తుంచుకొనుడి: “ఆయన స్వరము వినుము.”
30
I సముయేలు 3వ అధ్యాయము, లేఖనము త్రిప్పుచున్న మీరు, మొదటి పది వచనములు, అది ఇలాగు చదవవలసియున్నవి:
బాలుడైన సమూయేలు ఏలీయెదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్క ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు.
ఓ, ఒక్క నిముషము నేనక్కడ ఆగియుంటె ఎంత బాగుండును. బహుశా మరొకసారి. అది నన్ను సంధించినది. మరొకసారి దానిని నేనా వచనము చదువుతాను.
బాలుడైన సమూయేలు ఏలీయెదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్క ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు.
అప్పుడు దర్శనమనగా ఏంటి? అది నేరుగా వచ్చు ప్రభువు వాక్కు, చూచారా. మరి ప్రభువు యొక్క వాక్యము తటస్థించుటలేదు.
ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని యుండగాను.
దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొనియుండగాను;
యెహోవా సమూయేలును పిలచెను: అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి.
ఏలీ దగ్గరకు పోయి - నీవు నన్ను పిలచితివి గదా నేను వచ్చియున్నాననెను. అతడు నేను పిలువలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా, అతడు పోయి పండుకొనెను.
మరియు యెహోవా మరల సమూయేలును పిలువగా, సమూయేలు లేచి ఏలీయొద్దకు పోయి - చిత్తము నీవు నన్ను పిలచితివి గనుక వచ్చితిననెను. అయితే అతడు నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు; పోయి పండుకొమ్మనెను.
సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు.
యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా. అతడు లేచి ఏలీ
దగ్గరకు పోయి - చిత్తము నీవు నన్ను పిలచితివే, యిదిగో వచ్చితిననగా. ఏలీ - యెహోవా ఆ బాలుని పిలచెనని గ్రహించి.
నీవు పోయి పండుకొమ్ము, ఎవరైన నిన్ను విలచినయెడల - యెహోవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞనిమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి స్థలమందు పండుకొనెను.
తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలచి ఆ రీతీగా - సమూయేలూ సమూయేలూ, అని పిలువగా. సమూయేలు - నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్జయిమ్మనెను.
31
దేవుని యొక్క స్వరము. ఆ దినమున ఆయన స్వరము వినుట అరుదైన విషయం. గమనించుడి, ఏలాటి బహిరంగమైన దర్శనము లేదు. నిజమైన దేవుని స్వరము వినుటయనునది అరుదైన విషయం. ఎందుకనగా ప్రజలు దూరమైపోయారు... ఆ దినాన వారికి ఆలయమున్నది. ప్రభువు యొక్క ఆజ్ఞలను, అది వెంబడించదు. ఏలీ అను పేరుగల దైవ సేవకుడున్నాడు. ప్రజలు ఏమని నమ్మవలెనని కోరుకుంటున్నారో అలాటి కట్టడలనే అతడు బోధించువాడు.
ఈ దినమునకు కూడా అది సమసంబంధముగా లేదా. అతడు ప్రజలకు కేవలము బోధించెడివాడు, మరియు అతడు - అతనికి ఇష్టమైన వాటిని తీసికొనును... అర్పించిన వాటిలో నుండి మాంసములో నుండి శ్రేష్టమైన వాటిని అతని కుమారులు తీసికొనుచుండిరి; అర్పణలే ప్రాముఖ్యమైనవిగా ఆ స్థలము నిలచిపోయెను.
32
సమూయేలు - అతడు ప్రభువు యొక్క ఆజ్ఞలు గైకొనుటలో అజాగ్రత్తగా అతడు యుండిపోయాడు. మరియు నిజమైన వాక్యము అరుదైపోయెను.
ఈ దినాన పద్ధతి ఆ విధంగా యున్నది. మనము మందిరమునకు వెళ్తాము, ప్రజలో గొప్ప ఆతురత మనము గమనిస్తున్నాము. “ఈ సంవత్సరము మా యొక్క సంఘ శాఖను, అనేక మందిగా చేయాలనుకుంటున్నాము. నీ యొక్క ఇంకొక సంఘము నుండి నీ ఉత్తరం తీసుకొనిరా మరియు మాతో కలసిపో.” “44లో ఇంకా ఒక మిలియను ఎక్కువ,” అను నినాదాలు. మరియు అటువంటి అన్ని, ఆ తరువాతి సంఘ శాఖను మించి ఎదుగుటకు ప్రయత్నిము చేయుచున్నవి. అలాగు చేయుట వలన మనము బైబిల్ కు అడ్డ గడియలు వేయుచున్నాము. మనం తప్పిపోయాము మరియు వ్యత్యాసమైన కార్యములు బోధించుటకు ఆరంభించాము.
33
ప్రవక్తలు ఈ దినమును గూర్చి పలికియున్నారు: ఏమనగా వారి బోధను గూర్చి, “మనుష్య బోధలను వారు బోధించెదరు - దేవుని యొక్క బోధ కాదు.” మరియు అటువంటిది ఎంతో మనం చూస్తున్నాము, అదెంతో దూరము వెళ్ళినది, ఎంతవరకు అనగా ఈ దినాన ప్రభువు వాక్కు అరుదైపోవునంతగా, ఒకరు వచ్చి, “యెహోవా ఈలాగు సెలవిచుచున్నాడు” అని చెప్పునది అరుదైపోయినది.
దానిని గూర్చిన ఎంతో అనుకరణ మన మధ్యనున్నది. సాతాను నిజముగా పని మీదనే యున్నాడు. ఎన్నో సంవత్సరాలు అది గతించిపోయినది, అది ప్రభువు యొద్ద నుండి వచ్చినదైతే తప్ప, చెప్పుటకు ప్రజలు భయపడిపోతున్నారు. అయితే, ఈ దినాన, వారు అసలు లెక్క చేయరు. అయితే ప్రభువు యొక్క స్వరాన్ని వినుట, ఒక వ్యక్తి వచ్చి ప్రభువు నాతో మాట్లాడియున్నాడని చెప్పుట, అది అరుదైన విషయమైయున్నది.
మీరు గమనించితే, ప్రజల మధ్య ఇకపై, “ప్రభువు నాతో మాట్లాడియున్నాడు” అని వారు చెప్పుట చాల అరుదు. పురుషులు స్త్రీలు రాత్రంతా ప్రార్థనలు చేయుచుండునప్పుడు, ప్రభువు యొక్క గ్రంధము ద్వారా వారి గృహాలను వారు క్రమపరచుకొనెడివారు. మరియు దేవుడే వారి గృహమునకు ప్రప్రధమమై యుండెడివాడు.
34
చూచారా, ప్రభువు కంటె అనేకమైనవి ప్రాముఖ్యమైనవి మనకు యున్నవి. నీకు ప్రార్ధనా కూటమును కలిగియుండలేవు, ఎందుకనగా శ్రీ. గాడ్ఫ్రే అను ప్రసారము ఈ రాత్రి ఉన్నది. నీకు ప్రార్థనా కూటమును కలిగియుండలేవు, ఎందుకనగా ఈ రాత్రి “వి లవ్ సుసీ” అను అను ప్రసారము మనకున్నది. లేదా కాలమును వృధాపరిచే ఒక రకమైన బుద్ధిహీనమైనది మనకున్నది. ప్రభువు యొక్క స్వరమును ఆలకించుటకు మనకు సమయము లేదు.
క్రైస్తవులని ఎవరైతే చెప్పుకుంటున్నారో, వారు అలాగు మోకరిస్తారు. ప్రభువా నన్ను ఆశ్వీర్వదించుము మరియు నా కుటుంబమును దీవించుము. మమ్ములను భద్రపరచుము, రాత్రి వందనాలు అని ఇలాగున చిన్న ప్రార్ధన చేస్తారు. మరునాడు ఉదయాన్నే లేచి, “దినమంతా మమ్ము నడిపించుము, శుభ దినము” అని చెప్తారు. ప్రభువు కొరకు మనము కనిపెట్టుకొనవలసియున్నది.
మీరు చూచారా, మనమే అంతా మాట్లాడుతాం. తిరిగి ఆయన మనతో మాట్లాడుటకు తరుణమివ్వము. మనం ప్రార్ధించినట్లయితే, దేవుని సన్నిదానంలోకి మన ఆత్మ వచ్చు వరకు ప్రార్ధిదాం, తరువాత నెమ్మదిగా మరియు ఆయన యొక్క స్వరము ఆలకించండి.
35
అయితే ప్రజభువు యొక్క స్వరాన్ని మనయొద్ద నుండి తీసివేయునటువంటి అనేకమైన స్వరములు ఈనాడు యున్నవి. సుఖ భోగవంతమైన స్వరము ఒకటున్నది. అనేకులు అదే ఆలకించుచున్నారు, అక్కడకే వెళ్ళిపోయి మంచి సమయాన్ని అనుభవిస్తారు. వారిలో అనేక మంది క్రైస్తవులని పిలచుకుంటారు. ఒక విధమైన ఒక పాత రాక్-అండ్-రోల్ వచ్చినదా. ఇక దైవికమైన దానిని వారు వినలేరు. “సరే, నేను క్రైస్తవుడను; ఈ రోజు బైబిల్ గ్రంధములోని ఒక వచనము చదవవలసియున్నది, అవును, 'యేసు కన్నీళ్ళు విడచెను.'” అంతే. ముందుకు సాగిపోవుదురు.
అయితే తరువాత నిజముగా వారు దిగి ప్రార్ధించవలసినట్లైయితే... చాలా చాలా సంగతులు వారు చేయవలసియుంటుంది. దేవుని యొద్ద నుండి మన అవగాహనము ఆకర్షించుటకై లోకములో చాలా స్వరాలు యున్నవి.
36
నిన్నటి రోజు, నా భార్య నేను కొన్ని సరకులను తెచ్చుకొనుటకై సూపర్-మార్కెట్ కు వెళ్ళవలసియుండెను. (నేను త్వరపడుచున్నాను, ఎందుకనగా నియామకాలు మొదలగువాటికి నాకు ఆలస్యమైపోయింది, కనుక చాలా త్వరగా తొందరపడుచుంటిని), సగం నిద్రపోతూ ఒక చిన్న అబ్బాయి అక్కడ నిలబడియున్నాడు. పురుషునికి సంబంధించిన ఒక తరహా చిన్న ప్యాంటు తొడుక్కొని ఒక చిన్న అమ్మాయి అక్కడకు వచ్చినది. వారు తప్పక, ఎందుకనగా అవి పురుషులకై తయారుచేయబడినవి. “అది స్త్రీ ధరించుటయనునది దేవుని దృష్టికి హేయము,” అని బైబిల్ చెప్పుచున్నది. ఇక్కడ పెదవులకు మరింత రంగులు పూసుకొనియున్నది. ఆమె కన్నులు సగం నిద్రతో యున్నవి. ఆమె, “ఫలానా-ఫలానా వాడు ఎక్కడ?” అని ఆ చిన్న పిల్లవానిని అడుగుచున్నది.
“నాకెలా తెలుసని నీవడుగుచున్నావు?” అని ఇతడడిగాడు.
“ఈ ఉదయం ఆరు గంటల వరకు నేను లోపలకు వెళ్ళలేదు, నీకు గుర్తుందా,” అని ఆమె అన్నది. ఆమెకు పండ్రెండు సంవత్సరములు మించియుండలేదు.
37
మన మాదిరియైన యేసు, పండ్రెండులో, “నేను, నా తండ్రి పనుల మీద యుండవలెనని మీకు తెలియదా” అని చెప్పెను.
ఈ దినాన దేవుని యొక్క స్వరము అరుదైనదనియనుట ఆశ్చర్యమేమిలేదు. అనేకమైన రకరకములైన స్వరముల చేత, అది మెతకబడిపోయినది. మసక కలుగచేయునటువంటి వాటివలన తీసివేయబడినవి. మనము దేవుని యొక్క స్వరమును వినకుండలేనంతగా మన ఇంద్రియాలను నిస్సత్తువ చేయనంత స్థానమునకు అది రావలసియుండెను. నీవు స్త్రీవి, పురుషుడవని గ్రహించుటకు మమ్ములను మేము కదలించవలసియున్నది, మరియు నీవు దేవుని యొక్క సృష్టివి. నీవు ఆయనను సేవించుటకు ఇక్కడ నిలుపడియున్నావు. సాతాను యొక్క స్వరము మరియు అబద్ద ప్రవక్తలు... “ఓ, నవనాగరికత కలిగియుండుడి,” అని చెప్తారు.
38
నేను మాట్లాడుచున్నప్పుడు... కొద్ది దినాల క్రితం, నేను మందిరమునకు వస్తున్నాను, మరియు నా రేడియో త్రిప్పాను. వారు, సంఘాలలో సాధారణ మోతాదులో మద్యము సేవించండి అని వారు లూయిస్-విల్ లో తమ పిల్లలకు బోధించుట, ఆ కార్యక్రమములో నేను విన్నాను. వారిని నవనాగరికులుగా చేయుట, కావున వారు అమితముగా వెళ్ళరు.
ఓ, త్రాగుటను గూర్చి కాదు - క్రీస్తును గూర్చి వారు వారికి బోధించవలసియున్నది. అది ఏ ఇంటినైనా పడగొట్టి, నాశనం చేసి, కీడును కలుగజేస్తుంది. విస్కీ మత్తులో సగం మునిగిపోయి, వారియొక్క మనస్సులు పొగత్రాగుటచేతను, రాత్రంతా త్రాగి, తూలుతూ, విరిగియున్న కుటుంబంతో దేవుని యొక్క స్వరము ఎలా మాట్లాడగలదు?
39
దేవునికై ఎవరు ఎదురుచూస్తారో, వారు ఆయన సన్నిధానంలోకి వచ్చెదరు. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చుటయనగా, హిమముతోను, సుమధుర సువాసనగల పూల చెట్లున్న స్థలములోకి అరుణోదయవేళ వచ్చినట్లుగా యుండును. అలాంటి వ్యక్తి యొక్క సన్నిధిలోకి నీవు వచ్చినప్పుడు, వారు దేవునితో కూడా యున్నవారని నీవు తెలుసుకుంటావు.
40
ఈ ఉదయం వచ్చుచూ, నా భార్య నాతో ఈలాగు చెప్పినది, “బిల్లీ, ఇది చెప్పుటయనేది ఎవరిని నేను పొగడుచున్నానని కాదు నా భావము” అని అన్నదామె. అయితే ఆమె చెప్పినది, “గడచిన రాత్రి” (లేక ఒక రోజు రాత్రి అని నమ్ముచున్నాను), ఆమె చెప్పినది, “ఒక రాత్రి ఒక చిన్న అమిష్ స్త్రీ ప్రక్కన కూర్చొన్నాను — తన తలకు చిన్న టోపి పెట్టుకొని ఒక చిన్న స్త్రీ కూర్చొనియున్నది.” ఆమె చెప్పినది, “ఆమె క్రీస్తుతో కూడా ఉండిన స్త్రీయని చెప్పగలవు, ఎందుకనగా ఆమె ఎంతో మధురముగా ఉన్నది. ఆమె ఆత్మ మృదుత్వమును కలుగజేయునది. ఆమె నేత్రములు స్పష్టముగా యున్నవి” అని చెప్పినది. వెనుక దాచుటకు ఏ పాపము లేక మరేదియు లేదు. ఆమె దేవుని సన్నిదానంలో యున్నది. విస్కీ పొగాకు చేతను, లోకంలో నున్న అన్ని రకాల వాటి చేతను ఆమె ఇంద్రియాలు మొద్దుబారలేదు. ఆమె తన బైబిల్ చదువుట వలనను, దేవుని వాక్యమును పఠనము చేయుటవలనను, దేవుని సన్నిదానంలో నుండి విశ్రాంతి పొందుకున్నది.
41
అయితే, నవనాగరికత గల అమెరికావారమైన మనం ఏం చేస్తున్నాము! వేదిక వెనుకనున్న అబద్ధ ప్రవక్తలు అది బాగుగానే యున్నదని చెప్పుచున్నారు. ఇది చెప్పుటకు నేనొక భావమును కలిగియుంటున్నాను (ఒకవేళ నేను తప్పైతే, దేవుడు నన్ను క్షమించును గాక.), చాలా మందికి దేవుడు తెలియదని నేను రూఢిగా నమ్ముచున్నాను. సమాజము దాని యొక్క కాపరి కంటె ఉన్నతముగా ఎన్నడూ జీవించదు.
“మందలను ఎంతగానో చెదరగొట్టు ఈ కాపరులు,” అని లేఖనము చెప్పటలో ఆశ్చర్యము లేదు. “వారికి శ్రమ. వారే ఫలము లేని కొమ్మలైయున్నారు, అవి పెరికివేయబడి మరియు కాల్చబడును.”
42
ఈ దినమున ప్రజల యొక్క ఇంద్రియాలను నిస్సత్తువ కలిగించు అనేకమైనవి కలవు. ఓ, అయితే వాటన్నిటి మధ్య ఈ రోజు లోకంలోని ప్రతి యొక్క స్వరము యుండినను, శక్తిహీనతను కలిగించు ప్రతిది యున్నప్పటికి కూడా (వాటిలో కొన్ని ఆహ్లాదాన్ని కలిగించు స్వరములున్నవి; వాటిలో కొన్ని ఆశ చూపి వంచించు పాపభూయిష్టమైన స్వరములున్నవి), అయితే దాని యొక్క ప్రతి అల్పమైనది యుండినప్పటికిని, దేవుని యొక్క సత్యము ఇంకా నిలచియున్నది. “నా యొక్క స్వరము ఎవరు ఆలకిస్తారో, వారు నన్ను వెంబడించుదురు.”
స్త్రీ మరియు పురుషులు ఎవరైతే దేవుని యొక్క స్వరమును ఆలకించెదరో, దేవుని స్వరమును వినుట కొరకై వారి చెవులను తెరచే ప్రతి యొక్కరితో మాట్లాడుటకు దేవుడు ఇంకా ఎదురు చూచుచున్నాడు.
43
ఒక కాపరియైన మనుష్యుడు... ప్రజలు అనేక సార్లు, “నీవు ఇది చేయలేవు? నీవు పరుగెత్తలేవు? నీవు ఇది చేయలేవు?” అని చెప్పుదురు.
“ఓ, నేనది చేయుటకు ఇష్టపడుచున్నాను. అయితే విషయాలు, నేను సక్రమముగా చేయగలనో లేదో అందుకొరకై దేవుని యొక్క సన్నిధిలో నేనుండవలసియున్నది.”
అప్పుడు ప్రజలు, “ఓ, సహోదరుడు బ్రెన్హాం, ఈ ఏకాంతవాసులలో ఒకడు,” అని చెప్పుదురు. అది అది కాదు. నేను ప్రజలను ప్రేమిస్తున్నాను. అయితే వారిలో వేల మంది ఉన్నారు. అయితే వారికి నేనేమి చెప్పవలనో, ఆయన నాకు చెప్పుటకు నేనాయనతో నిలబడవలసియున్నది. ఒక్కడో, కేవలము వినుము; ఆయన నీకై ఒకటి యుంచియున్నాడు మరియు దానిని నీవు ఎరగాలని ఆయన ఆశించుచున్నాడు.
కాపరి, ఎల్లప్పుడు అధికమైన పనులతో, అవిశ్రాంతిగా యుండవద్దు; అయితే నీవు ఆయన సన్నిధానములో యుండి, ఆయన స్వరమును కొరకు ఆలకించుము. దేవుడు ఎల్లప్పుడు ఆయన మాట నిలబెట్టుకొనును. కాలమెంత దయనీయ స్థితియందున్నప్పటికి, దానిని గూర్చి నీ సంఘము వ్యతిరేకముగా బోధించినప్పటికి, ఆయన స్వరమును ఆలకించుటకు ఇష్టపడుము. ఎవరైనా ఇష్టత కలిగియుంటె యేసుక్రీస్తు ఆ యొక్క మెల్లని చిన్న స్వరముతో ఇంకా మాట్లాడుటకు ఇష్టత కలిగియున్నాడు. మనకు మనము నెమ్మదిగా యుండినట్లయితే, ఆయనది చేయుటకు ఇంకనూ సిద్ధముగా యున్నాడు.
44
అయితే మనము పరుగులు తీస్తాము, కలవరం చెందుతాము, “ఓ, పాస్టర్ గారు, ఈ సంఘములో నేను చేరవచ్చా?” అని అడుగుతారు.
“ఏ సంఘములో నుండి నీవు వచ్చావు?”
“ఫలానా-ఫలానా.”
“సరే, నీ లేఖ తీసుకొనిరా!” ఓ, మై!
“నేనీ సంఘములో చేరవచ్చా?”
“ఓ, అవును, ముందుకు రమ్ము మరియు నీటితో కొద్దిగా నీకు చిలకరింపు చేస్తాము మరియు పుస్తకములో నీ పేరు వ్రాస్తాము, మరియు నీవు కుడిచేయి సహవాసమును నీవు పొందుకోగలుగుతావు.”
ఎందుకు, మెసొనిక్ లాడ్జీ దానికంటె ఉత్తమమైన క్రమమునే కలిగియున్నది. అది నిజం. మెసొనిక్ లాడ్జీ మరియు ఇతర లాడ్జీలు అన్నియు మంచివే, కాని అది ఇంకనూ దేవుని యొక్క ఇల్లు కాదు. దేవుడు మాట్లాడునది అక్కడే. ఈ యొక్క లాడ్జీలు నిన్ను నీతిగలవానిగా చేయుటకు ప్రయత్నము చేయును. అయితే, దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను నీతిమంతునిగా చేయును.
45
ఇప్పుడు, దానికొక నీతిశాస్త్ర క్రమము యున్నది. దేవుడు ఒక నూతన జన్మను నీకై యుంచియున్నాడు. అయితే ఆయన యొక్క మెల్లని చిన్న స్వరమును ఆలకించుము. ఎవరైతే క్రైస్తవులుగా పిలువబడుచున్నారో, అట్టి మీలో ఒక్కొక్కరు ఆయన ఎదుట మీకుమీరు నెమ్మదిగా యుండుడి. బట్టలు ఉదుకుకొనుట దానికి ఆటంకముగా ఉండవద్దు. పనులు చేసుకొనుటకు దానికి ఆటంకముగా ఉండవద్దు. దేనినైన ఆటంకముగా ఉండనీయకుము. నీవేమి చేయుచున్నావో ఎవరు ఎరుగుటకు అనుమతించవద్దు. నేరుగా ఆయన యెదుటకే వెళ్ళుము. అడవులలో ఎక్కడైనా ఒక చోటికి వెళ్ళుము. రహదారి ప్రక్కకు వెళ్ళిపో. రహస్య స్థలములోనికి వెళ్ళిపోయి, తలుపు వేసుకొనుము. పిల్లలు పాఠశాలకు వెళ్ళిన తరువాత, అక్కడ మోకరించు. ప్రతియొక్క చోట నుండి వచ్చిన ప్రతి విధమైన స్వరాలను నీవు విన్నావు. అయితే క్రిందకు దిగు మరియు ఆ స్వరాలన్నీ నిశ్శబ్దమగువరకు అక్కడే యుండు. నీవు పైకి లేచుటకు ప్రారంభిస్తావు. అది నిన్ను మారుస్తుంది. అది ఈ చిన్న సమూయేలుకు చేసినట్లుగా అది నిన్ను వ్యత్యాసమైనవానిగా చేస్తుంది. అది త్వరగా నీవు చేసినట్లయితే, అది నీకొకటి చేస్తుంది. నీవు ఏ విధముగా యుండవలసియున్నదో, అది నిన్ను ఆలాగున చేస్తుంది. నీవు యుండవలసిన క్రైస్తవునివలె నిన్ను మార్చును.
46
ఒక దినము గడచువరకు, ఈ ఆధునిక దినము యొక్క వెనుకకు, మనం వెళ్ళుదము. అన్ని కాలములలోను అన్ని విధములైన జీవన గమనములు గల మనుష్యుల మధ్యకు, ఈ యొక్క దేవుని స్వరము వచ్చెను. నీవు వ్యవసాయధారుడైవైనప్పటికి, నీవు చెప్పులు కుట్టేవాడవైనప్పటికి — నీవు ఏమైయుండినప్పటికి — దేవుడు ఇంకనూ మాట్లాడుతాడు. నీవు పాపివైనను, నీవు వేశ్యవైనను, వ్యభిచారిణివైనను, నీవు త్రాగుబోతువైనను, (ఏమి) నీవు స్థానిక సంఘ సభ్యుడవైనను — నామమాత్రపు వాడవైనను; నీవు ఏమైనప్పటికి, ఇంకనూ దేవుని యొక్క స్వరము నీతో మాట్లాడుటకు వేచియున్నది.
47
ఎనభై సంవత్సరాలు నిండినవాడైన మోషేను గూర్చి ఇప్పుడు నేను ఆలోచన చేస్తున్నాను. ఎనభై సంవత్సారాలు వేదాంత విద్య తర్ఫీదును అతడు కలిగియున్నాడు, మరియు అతడు లేఖనములను ఎరిగియుండెను; వాటిని బాగుగా ఎరిగినవాడు అతడు. తనయొక్క ప్రజలకు అతడు విమోచకుడు కాబోతున్నాడను వాగ్దానమును అతడు కలిగియుండెను. అయితే, లేఖనములు ఎరిగియుండినవాడైనను మరియు ఆ దినమున ఉన్నటువంటి, ఆనాటి ఆధునిక సంఘపు నామమాత్రపు సంఘ సభ్యునిగా యుండినవాడై, విషయాన్ని తన స్వంత హస్తాల పైకి తీసుకొని మరియు దానిని చేయుటకు ప్రయత్నించెను: ఒక ఐగుప్తియుని అతడు చంపెను.
48
దేవుని స్వరాన్ని ఆలకించకపోతే నీవేమి చేయుదువో నీవు చూచావా? దానిని నీవు గజిబిజి చేస్తావు. ఈ ఉదయం, “నీవు బాప్తిస్మము పొందవద్దు,” అని అపవాది చెప్పును. మరొకరు, “ఓ, దానిని తరువాత చేయుము,” అని చెప్పుదురు. “నీవేమి చేస్తున్నావో అది నీవు బాగుగా ఎరుగవలెను,” అని ఒకరు చెప్పుదురు. “నీవు మంచి సమయాన్ని కోల్పోబోవుచున్నావని,” మరొకరు చెప్పుదురు. దానిని స్థిరపరచు ఒకే ఒక్క మార్గము, దానితో దేవుని వాక్యము నోద్ధకు వెళ్ళుము. అయితే ఈ దినమున ప్రజలు అది చేయుటకు ఆశ కలిగియున్నట్లుగా అగుపించుట లేదు.
49
మోషే, రబ్బీల కంటె ఎక్కువ ఎరిగనవాడైయున్నాడు. అయితే వారు నులివెచ్చని, చల్లని స్థితిలోయుండిరి. జమ్ముచెట్ల మధ్య అతడెలాగు దాచిపెట్టబడినది, ఏ విదముగా పెద్ద మొసళ్ళ అతనిని పట్టుకోలేకపోయినవి, అనునది అతని తల్లి అతనికి చెప్పిన కధయంతా అతడు విన్నాడు. ఆ చిన్న బిడ్డ ఆ కాలువలో ఏలాగు తేలిపోతూ వెళ్ళినది అతడు విన్నాడు... పెద్ద మొసళ్ళ బాగుగా బలిసిపోయినవి. (ఇది చిన్న పిల్లల కొరకు.) ఆ యొక్క చిన్న పిల్లలను తినుట ద్వారా అవి బలిసిపోయినవి. వారికి వంకరి ముక్క స్త్రీలున్నారు. వారు స్త్రీ రక్షకభటులు, ఏనాడు వారు బిడ్డలను కనినవారు కాదు. బిడ్డయెడల ప్రేమంటె వారికి తెలియదు. మరి, వారక్కడకు అలాగు వెళ్ళిపోయి, ఆ చిన్న బిడ్డలను చంపుదురు. నదిలో వారిని విసరివేస్తారు. ఆ చిన్న పిల్లలను బట్టి ఆ పెద్దవైన మొసళ్ళ బాగుగా బలిసిపోయినవి.
అయినను, తల్లి, ఆమె యొక్క బిడ్డను మరణములోనే యుంచుటకు ఆమె గుండెలో దేవుడు దానిని పెట్టియుండెను. క్రీస్తుకు అదియొక పోలికయైయున్నదనుట మీరు చూచుటలేదా? నేరుగా ఆయన మరణములోకే వెళ్ళిపోయెను. ఆ ముసలివైన మొసళ్ళలలో ప్రతియొక్కటి, నదిలో ప్రవహించి వెళ్ళిపోతున్న ఆ చిన్న బుట్ట యొద్దకు వచ్చెను. అవి ఎందుకు ఆలాగు చేయలేదో మీకు తెలుసా? ఎందుకని ఆ చిన్న బిడ్డను అవి తినలేకపోయినవో, మీకు తెలుసా? అక్కడొక దేవదూత కూర్చుని యుండి యుండెను. “ఇక్కడ నుండి వెళ్ళిపో.”
ఎందుకని ఆయన ప్రజలను కనిపెట్టుటకు దేవుడు, ఆయన దూతకు ఆజ్ఞ ఇచ్చెను. బిడ్డా! నీవు భయపడవద్దు. దేవుడు నిన్ను కనిపెడుతున్నాడు. సాతాను నీకు ఒకటి చేయుటకు ప్రయత్నించవచ్చును, కాని దేవుడు గొప్పవాడు.
50
కాబట్టి, ఆ చిన్న గంప యొద్ద నుండి అన్ని మొసళ్ళ బెదిరి పారిపోవలసియుండెను. మోషే, ఈ విషయాన్ని ఎరిగినప్పటికి కూడా, నలభై సంవత్సరాలు తర్ఫీదు కలిగినవాడై యుండినప్పటికి కూడా, ఆ తరువాత అరణ్యములో యుండెను. ఇంకా తన హస్తాలతో కార్యాన్ని తీసికొనుటకు ప్రయత్నించాడు.
చేయమని దేవుడు ఏది చెప్పియున్నాడో, అది బైబిల్ గ్రంధమని మనకు తెలుసు. అయినను, మనము, “సరే, దీనిని ఈ విధంగా చేస్తాము. అద్భుత కార్యాలు జరుగు దినములు ఇకలేవు. వాటిని మేము ఇక చూడము, అని మాకు తెలుసు. అద్భుత కార్యాములు దినములు గతించిపోయినవి అని నమ్ముతున్నాము. ముంచడం, చిలకరించుట మంచిది. మరియు తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ - ప్రభువైన యేసు నామము నామము వలె మంచిది. కనుక మేము... కాబట్టి వారిలో మిగతా వారంతా ఆ విధంగానే చేయుచున్నారు, కాబట్టి మేము కూడా అలాగే చేస్తాము,” అని చెప్పుదుము.
51
మోషే ఒక సైనిక సంబంధమైన మనుష్యుడు. అతడొక సైనిక సంబంధమైన మనుష్యుడైయుండి, అతడు తర్ఫీదునొందిన మార్గమున, తన హస్తాలతో ఆ ఐగుప్తీయులను తాను చంపగలనని అతడు తలంచియుండెను; దేవుడు ఏమి చేసియున్నాడో, అదే చేయుట యందు నమ్మకంగా యుండుము.
అదెప్పుడైనా ఆలోచించావా? ఒక్క మనుష్యుని చంపినందుకు ప్రతి ఒక్కరు మోషేను నిందించిరి. అతడు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము చేత తిరిగి వచ్చి సమస్తాన్ని చంపినప్పుడు, దానిని గూర్చి ఎవరూ ఏమి మాట్లడలేదు. అతడు ఫరో యొక్క సైన్యాన్నంతా చంపాడు. అయితే దేవుడు అందులో ఉన్నాడు. మొదటి దానిలో దేవుడు లేడు.
52
అటు తరువాత, మోషే, సంఘ వేదాంతమునంతా వదలివేశాడు - రాబోవు ఫరో అతడే కావలసినవాడై యుండెను. దేవుని ఎరుగని వానిగానే అతడింకాయున్నట్లు కనుగొంటున్నాము. అయితే, ఒక ఉదయవేళ, ఎడారి వెనుకటి భాగానా, ఎనభై సంవత్సరాల వృద్దుడైన ఒక మనిషిగా, అతని మీసాలు క్రిందకు వ్రేలాడుతున్నవి. అతడొక మండుచున్న పొదను చూశాడు. ఏమి జరగనైయున్నదో అది చూచుటకు అతడు వెనుకకు తిరిగాడు. అతడు పొద యొద్దకు చేరునప్పటికి, ఒక స్వరాన్ని అతడు విన్నాడు. దేవుడు అతనితో మాట్లాడక మునుపు, ఆయన అతనిని నలభై సంవత్సరాలు యుంచవలసి వచ్చెను.
దేవుడు మనతో మాట్లాడునట్లుగా మనం పది నిమిషాలు నిమ్మళంగా యండలేము. ఈ దినము యొక్క గడబిడలు, గజిబిజిలు చేస్తుంటాము.
అయినను, మోషే నలభై సంవత్సరాల తరువాత ఆ పొద సన్నిదానంలో అక్కడే నిలబడ్డాడు. అతనిని పిలచిన ఆ ఒక్క స్వరము వలన దాని తరువాత, అతడు బోధించబడిన ఎనభై సంవత్సరాల తర్ఫీదులన్నిటి కంటె, ఐదు నిముషాలలో దేవుని గూర్చి మరెక్కువగా అతడు ఎరిగియుండెను. అది అతనిలో ఒక వ్యత్యాసకరమైన మనిషిని తయారుచేసినది. సమూయేలు చేసినట్లుగా, ఆయన యొక్క స్వరమును ఆలకించుటకు నీవు ఎక్కువ సేపు నిలబడినట్లయితే, అది నిన్ను ఒక వ్యత్యాసకరమైన పురుషునిగాను, ఒక వ్యత్యాసకరమైన స్త్రీనిగాను అది చేయును.
53
నెమ్మదిగా నిలువబడుము. ఉద్రేక పడవద్దు. దేవుని యొద్దనుండి ఒకటి నీకు కావాలునుకున్నట్లయితే, ఆయనను అడుగు. అలాగే నిలువబడి, ఆలకించుము. దానిని గూర్చి ఆయన ఏమని చెప్పబోతున్నాడో చూడూ.అలాగు నీ హృదయాన్ని తెరచి, “ప్రభువైన యేసూ, అది ఏమైయుంటుంది?” అని అడుగు. అక్కడే, అలాగే నిలువబడు. మొదటి ఐదు గంటలలో ఆయన జవాబు చెప్పనట్లయితే, అలాగైతే, మరొకదానికై కనిపెట్టు. ఈ రోజు ఆయన జవాబు ఇవ్వకపోతే అలాగైతే, రేపు ఆయన జవాబు చెప్తాడు. ఈ వారం ఆయన జవాబు ఇవ్వకపోతే, తరువాత ఆయన జవాబిస్తాడు. ఆయన జవాబు ఇచ్చు వరకు అక్కడే నిలబడు. “అవును, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే” అని నీ హృదయంలో చెప్పు ఆయన స్వరమును విను. అలాగైతే, అదంతా అయిపోయినది. అప్పుడు స్థిరపరచబడినది, చూచారా. “నీ పాపములన్ని క్షమించు ప్రభువును నేనే, వెళ్ళి ఇక ఎన్నడు పాపము చేయకు. నేను నిన్ను శిక్షించను, నీవు స్వేచ్చగా వెళ్ళు; నీవు బాగునే ఉన్నావు. అయితే, ఆ స్వరము పలికినది నీవు విన్నావని నీవు నిశ్చయతను కలిగియుండు. మోషే అది విన్నాడు. అతడు మార్పు చెందిన మనుష్యుడు.
54
ప్రవక్తయైన యెషయాను చూడూ. ఒక యవ్వనునిగా, అతడు దానిని ఎరిగినవాడాయెను. వారియొక్క దినాలలో ఘనముగా అభిమానించగల రాజైన ఉజ్జియా యుండి యుండెను. అతడొక నీతిమంతుడు, ఒక మంచి మనిషి అతడు యెషయాను ప్రేమించెను, ఎందుకనగా అతడొక ప్రవక్తయని అతనికి తెలుసు. కాబట్టి అతడు రాజు యొక్క భుజముపై ఆనుకున్నాడు. అతనికేది కావలసియున్ననూ, ఎందుకనీ, ఉజ్జియాయే దానిని తనికిచ్చెడివాడు. ఏ సమయములోనైనా, అతనికి ఏది కావలసియున్నా, ఎందుకని, మంచి రాజు దానినతనికి ఇచ్చెడివాడు.
అయితే రాజు మరణించిన ఒక సమయం వచ్చినది. అభివృద్ధి అనునది ఎల్లప్పుడూ కూడా ప్రజలను నాశనము చేస్తుంది. చెప్పుటకది ఇబ్బందికరమైన విషయమే. అయితే అభివృద్ధి మనిష్యుని దేవునికి దూరస్తునిగా చేస్తుంది. బైబిల్ గ్రంధములో, దేవుడు ఒక చోట, ఇదే వరుసలో యుండు ఒక దానిని మాట్లాడియుండెను. “నేను నిన్ను ఆశీర్వదించి సమృద్దిగా నీకు అనుగ్రహించితిని. నీవు దరిద్రుడవైయుండి, నీకు ఏమిలేనప్పుడు, నేను నీ యొద్దకు రాగా, నీవు నా మాట విని నీవు నన్ను సేవించితివి. అయితే నేను నిన్ను ఆశ్వీర్వదించి, విస్తారముగా నీకివ్వగా, అప్పుడు నీవు నా యొద్ద నుండి తల త్రిప్పుకుంటివి,” అని ఆయన చెప్పెను.
55
అమెరికా చేసినది అదే: వారి తలలు త్రిప్పుకున్నారు. అదే సంఘములు చేసినది. నీవు ఒక మూలను కూర్చుంటావు మరియు అందమైన గొప్ప భవనాలు నీకున్నవి మరియు మిలియనుల డాలర్లు పెడతావు. ప్రతీదీ కూడా ఎంతో సులభంగా జరిగిపోతుంది. దేవుని యొక్క స్వరము వినుటకు నీకు సమయం లేదనుటలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే అది తీసివేయబడు ఒక సమయం వచ్చువరకు వేచియుండు. అప్పుడు దానిని వినుటకు నీవు ఆశపడతావు. ఇప్పుడు అంతా మంచిగాయన్నది. అయితే, ఆ విధముగా యుండనటువంటి ఘడియ రాబోవుచున్నది.
కాబట్టి యెషయా, రాజు యొక్క భుజముపై ఆనుకున్నాడు. అతడు అభిమానించగల యవ్వనస్తుడు, మరియు ఈ యవ్వనస్తునిలో మంచి ఆత్మయుండెను. కాబట్టి రాజు అతనిని ప్రేమించెను. ఒక దినమున అతని యొద్ద నుండి ధనఘనతలు తీసివేయబడినవి. రాజు మృతి చెందాడు. రాజు చనిపోయిన తరువాత యెషయా వంటరియై పోయాడు. ఆ తరువాత అతడు చుట్టూ చూచుటకు మొదలుపెట్టాడు. అందరూ కూడ రాజువలె లేరని అతడు తెలిసికున్నాడు.
56
ఈ విధముగానే, ఈ యొక్క దినాలలో ఈ వివిధ సంఘముల సంయుక్త బంధము నుండి నీవు నెట్టివేయబడతావు. ఒక సంస్థావనకు నీవు సంబంధించియుండవలసిన ఒక సమయం వచ్చును లేదా నీవు ఆరాధన చేయలేవు. అది అలాగుండునని లేఖనము చెప్పునది నీకు తెలుసు. ఇప్పుడు వారు నిన్ను ఎగతాళి చేస్తారు. అయితే, ఒక వెలివేయు కాలము వచ్చును, ఎందుకనగా మృగము యొక్క ముద్ర తప్పక వచ్చును. నీవు సంఘములు సమాఖ్యకైనా చెందియుండాలి.— రోమ్ లో నున్న మృగమువలె — లేదా నీవు ఏ మాత్రము ఆరాధనే చేయలేవు. లేఖనము చెప్పునది అదే.
యెషయా ప్రలాపించినట్లుగా నీవు ఏడ్వవలసియున్నది. అతడు ఆలయంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడతడు గ్రహించాడు. అతడు తనయొక్క చేతులు పైకెత్తి, “ఓ, ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులుగలవాడను,” అని చెప్పెను.“ నీవు మంచివాడవని నీవు తలస్తున్నావు. అయితే ఆ సమయం వచ్చువరకు కనిపెట్టు, ”నేను అపవిత్రమైన ప్రజల మధ్య నివసించువాడను.“ అప్పుడతడు నిరుత్సాహపడిపోయాడు. ఈ విషయాన్ని గూర్చి నీవు నిస్పృహ చెందినప్పుడు ఒకటి జరుగుతుంది. నీవు చాలినంతగా నిస్పృహ చెందియుండలేదు.
57
“ఓ, సరే, నేను సంఘములో చేరాను; అది సరిపోతుంది.” అయితే దానిని గూర్చి నీవు నిస్పృహ చెందవలసియున్నది. నిజముగా, దేవుడు అవసరమైయున్నాడు. “నీతి కొరకు ఆకలి దప్పికగలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు,” అని యేసు చెప్పియున్నాడు. అయితే ఎంతకాలము నీవు లోకములోని సంగతులు ద్వారా నీవు తృప్తి చెందుతావో అంతవరకు దేవుడు నీతో ఎలాగు మాట్లాడగలడు? “దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడలేదు,” అని నీవు చెప్తావు. ఎందుకని? ఆయన మాట్లాడాలని యున్నాడు. అయితే లోకకార్యకలాపాల వలన నీవు నిండిపోయుయున్నావు. అదే ఈనాడు మనమధ్యనున్న విషయం: మనము మన సమయమునంతా లోకకార్యకలాపాల మీద ఉంచుతాము. మరియు లోక భోగాల మీద ఉంచుతాము, మరియు దేవునికి ఏలాంటి సమయం ఇవ్వము. అది నిజం.
58
ఇప్పుడు, యెషయా నిరాశపడిపోవడం మనం చూస్తున్నాము. అతడెంతో అరుపులు అరుస్తూ అతని యొక్క పాపములు, ప్రజల యొక్క పాపములు ఒప్పుకొన్నాడు. అతడు ఒప్పుకొని పశ్చాత్తాపపడుచుండగా, అతనికి పైగా ఒక శబ్దం విన్నాడు. అతడు పైకి చూచినప్పుడు, ఆలయంలో ముందుకు వెనుకకూ ఎగురుచున్న సెరూపులు అక్కడ యుండుట చూశాడు. వారి ముఖములపైన రెక్కలు కప్పియున్నవి. వారి పాదములపైన రెక్కలున్నవి. రెక్కలతో ఎగురుచూ “సర్వశక్తిమంతుడైన దేవుడగు ప్రభువు, పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు” అని పెద్దగా అరచుచుండిరి.
ఒకటి జరిగినది. యెషయా నిరుత్సాహపడిపోయాడు. దేవుడు విధి నిర్వహణలోకి వచ్చాడు. “నేను అపవిత్రమైన పెదవులుగలవాడను,” ఎందుకనగా స్వరము నాతో మాట్లాడెను, అని యెషయా పెద్దగా అరిచాడు. అది అతనిని మార్చినది.
“ఎవరు మా నిమిత్తము వెళ్ళుదురు?” అని స్వరము అడిగెను. “ఎవరు వెళ్తారు, ఈ వేదాంత పండితుల గుంపు మధ్యకు వెళ్ళిపోయి వారి మధ్య నిలువబడుటకు ఎవరు ఇష్టపడతారు? ఎవరు ఈ దినాన వెళ్ళిపోయి నేనింకా దేవుడనైవున్నానని చెప్పెదరు? ఎవరు వెళ్ళి మరియు వారి యొక్క అపవిత్రతను గద్ధించెదరు. ఎవరు వారి సంఘ శాఖలను చించివేసి, జీవముగల దేవుని యొక్క బలమును తిరిగి కట్టెదరు? ఎవరు వెళ్ళెదరు?”
“ప్రభువా, నేను వెళ్ళకముందు నేను సరిచేయబడవలసియున్నది” అని యెషయా చెప్పెను. ఈ చిన్న భయభీతులు, మరియు ఈ ఒడుదుడుకులు అతనిని విడిచిపోవలసియుండెను.
59
ఆ విధముగనే, దేవుడు పిలచిన ప్రతి వ్యక్తి యుండవలసియున్నది. నీవు తిరిగి జన్మించవలసియున్నది. మార్పుచెంది, నూతన వ్యక్తిగా తయారుకావలసియున్నది. ఒక ఊహకాదు, కాని నీ గుండెలో నుండి ఒకటి నిజముగా జరుగవలసియున్నది.
దేవదూతలలో ఒకరు... “మీరు అడిగినట్లయితే మీకు ఇయ్యబడును.” దేవదూతలలో ఒకరు ఇత్తడి బలిపీఠమ యొద్దకు వెళ్ళిపోయి, పటకారు తీసుకొని అక్కడకు చేరుకొని మండుచున్న అగ్ని కొరివిని తీసికున్నాడు. యెషయా యొద్దకు పరుగు తీసుకుంటూ వెళ్ళిపోయి, అతని నోటిలో దానిని పెట్టాడు.“ ”ఇప్పుడు నీవు శుద్దుడవైయ్యావు; వెళ్ళు, వాక్యము మాట్లాడు“ అని చెప్పెను.
ఆ స్వరము వినిన తరువాత యెషయా మార్చబడ్డాడు. తరువాత, అతని యొక్క చివరి దినాలలో, సంపూర్ణముగా ఒక బైబిల్ గ్రంథమునే అతడు వ్రాసెను. అతడు ఆదికాండముతో ఆరంభించాడు మరియు ప్రకటనతో ముగించాడు. అక్కడ బైబిల్ గ్రంధములోని అరువై-ఆరు పుస్తకములున్నవి. అక్కడ ఆరువై-ఆరు అధ్యాయములతోనున్న యెషయా (పుస్తకము). ఎందుకు? దానినతడు చూచిన సమయము ఎంతో అవశ్యకమైయుండెను, ఎందుకనగా అతడు నిరాశ చెందెను.
60
గతరాత్రి అతనిని గూర్చి మనం మాట్లాడినట్లుగా, బబులోనులో దానియేలు యుండెను. బబులోనులోని సిద్దాంతములతో తాను, అపవిత్రుడు కాకూడదని, అతడు తన హృదయంలో ఉద్దేశించుకున్నాడు. అయితే ఒక దినమున, అక్కడే దానియేలు ఒక అవసరములో యుండియుండెను. అతనికి లేఖనము యున్నప్పటికిని, దేవుని యొక్క స్వరము అతడు వినుటకు ఆశ కలిగియుండెనని అతనికి తెలుసు. అయితే, దేవుని యొక్క స్వరము వినుటకు అతనికి అవసరమాయెను. అతడు ఆ నదియొద్దకు వెళ్ళాడు. అతడేదో ఆ విధంగా వెళ్ళిపోయి, తన రధమును అక్కడ నిలుపుచేసికొని చెట్లలో మోకరించి, “ప్రభువైన దేవా, నీ మాట నేను వినాలనియున్నాను. నీవు ఎక్కడ ఉన్నావు?” అని చెప్పలేదు. లేదు, ఆ విధముగా నీవు చేయకూడదు.
61
యెషయా తన రధమును తీసుకున్నాడు, రధసారధులను తీసికున్నాడు. నదియొద్దకు వెళ్ళిపోయి వారిని వెనుకకు పంపివేశాడు. అతడు విను వరకు అక్కడే అతడు యుండబోతున్నాడు. అదీ మార్గము. దానిని గూర్చి అతడు నిరాశ చెందాడు. “ఇదే దానియేలు, నీవు ఇది చేయ్; దానియేలూ నీవు ఇది చేయ్,” అని అతనితో చెప్పుటకు ప్రయత్నించు సైనికులందరి యొద్ద నుండి, ఖగోళ శాస్త్రజ్ఞులందరి యొద్ద నుండి, జ్ఞానులందరి యొద్ద నుండి, వేదాంత పండితులందరి యొద్ద నుండి అతడు దూరముగా ఉండవలసియున్నది. అయితే, అలాంటి దాని యంతటినుండి అతడు దూరంగా యుండవలసియున్నది. ఆ విధముగా నీవు చేయవలసియున్నది. అతడు నదియొద్దకు వెళ్ళిపోయి, ఇరువై-ఒక్క దినములు అతడు అక్కడ యుండి, ప్రభువు దూతతో పోరాడుచుండెను. అయితే, అతడు నీళ్ళవైపు చూచెను అని మనకు చెప్పబడినది. అక్కడే అతడు ఒక దేవదూత నిలబడి తన పాదము భూమి మీదను మరియు సముద్రము మీదకు పెట్టియుండుట అతడు చూశాడు. అతడు చేతులు పైకెత్తి నిరంతరము సజీవుడగు ఆయనతో ఒట్టపెట్టుకొని, “దానియేలు చూచిన సంగతులు నెరవేరునప్పుడు ఇక సమయముండదు,” అని చెప్పుట వినెను. దేశము యొక్క కీడును బట్టి అతడు ఇరువై-ఒక్క దినములు ఆలస్యము చేసెను.
62
పారశీక దేశపు రాజు దినాలలో, దేశము యొక్క కీడును బట్టి ఆయన ఇరువై-ఒక్క దినములు ఆలస్యము చేసినట్లయితే, ఈ రోజు ఆయన ఏమి చేయును? ఎంతకాలము ఆయన ఆలస్యము చేయును? అయితే, మృతతుల్యము కాని ఆ విశ్వాసము, మానవ హృదయములోనున్న ఆకలి, కోరిక, దేవునితో వద్దు అని చెప్పదు, కాని ఆకాశము నుండి దేవుడు మాట్లాడు వరకు పట్టుకొనియుండును.
దీనితో నీవు ఆటలాడలేవు, ఈ సువార్తతో నీవు ఆటలాడలేవు. అది ఆటలాడునది కాదు. అది పదికి పది సార్లు గురిని తాకవలసియుంటున్నది. అది సంపూర్ణమై యుండవలసియున్నది, లేదా అది సరికాదు మరియు అది పని చేయదు. అది సంపూర్ణమై యుండవలసియున్నది.
63
దానియేలు ప్రార్ధించాడు. బైబిల్ గ్రంధములో మనము కనుగొంన్నాము, బహుశా 8వ అధ్యాయము అపోస్తలుల కార్యాములలోని 7 లేక 8 అద్యాయంలో, సౌలు అను పేరు కలిగిన, ఒక చిన్న స్వీయ-నిర్మాణికుడైన పరిసయ్యుడు వ్యక్తి... ఓ, అతడు ఒక వేదాంత పండితుడైయుండెను. అతడు గమలియేలు యొద్ద కూర్చొని బోధనభ్యసించినవాడు. ఆ దినాన వేదాంత పండితుల ప్రకారముగా లేఖనములు ఎలాగుండవలెనో ఆలాగుండునట్లుగా, వాటిని అట్టి విధముగా ఎరిగినవాడు. ఓ, స్వీయ-శైలి, స్వీయ-నిర్మాణికుడు! ఆత్మసంబంధమైన ఒక దానిని ప్రజలు చేయుచుండుట అతడు చూశాడు. మరి అతని యొక్క మానవ-నిర్మిత వేదాంతం దానికి విజోడు కాలేదు. ఈ దినానికి ఎంతటి సరిపోలిక! ప్రజలలో అనేకులైనవారు, తమ హృదయంలో నమ్మకస్తులును విధేయులై యుంటారు. తిరిగి-జన్మించినవారిని, అది వారు మాట్లాడుచున్న పిచ్చివారని వారు తలస్తారు. దైవిక స్వస్థత మరియు పరిశుద్ధాత్మ యొక్క శక్తి, అది వారు మాట్లాడుకొను ఎదో సంగతి అని వారు అనుకుంటారు. అయితే అది నిజం.
64
కాబట్టి, ఒక దినమున అతడు సంఘము యొక్క బిషప్పు యొద్ద నుండి కొన్ని అధికార తాకీదులు తీసికొని తన జేబులో పెట్టుకొని, ఎవరైతే కేకలు పెడుతూ అరుపులు అరుస్తూ పైకి-క్రిందికి ఎగురుతూ, అన్యబాషలలో మాట్లాడుతూ మరియు రోగులను స్వస్థపరస్తున్నారో... “ఏంటి, అదంతా దయ్యాల మంద,” అని వేదాంతులు అంటున్నారు. “అక్కడకు వెళ్ళి, వారిని బందించి, వారిని తిరిగి సంకెళ్ళలో తీసికొని రమ్ము.”
“అలాగే బిషప్పు గారు! నీ చిత్తం.” ఓ, మై!
ఓ, అతడు ఒక గొప్ప మనుష్యుడు. అతనికి డి.డి.లు, పి.హెచ్.డిలు యున్నవి, మీకు తెలుసా. కాబట్టి గుర్రంపై నుండి ఎగిరి దూకాడు. తన యొక్క సహచరులకు దూరంగా వెళ్ళిపోయాడు. అయితే షుమారు మధ్యాహ్నా వేళలో అతని యొక్క రహదారిన ఒకటి అతనిని నేలను పడవేసినది. ఒక పిచ్చివానివలె నురుగు కార్చుకుంటూ అతడు నేలకు దొర్లాడాడు. “సౌలా, సౌలా, నీవు నన్నెందుకు హింసిస్తున్నావు?” అని ఒక స్వరము చెప్పుట అతడు విన్నాడు. అదేమైయుండెను? ఒక వేదాంత పండితుడు అతనితో మాట్లాడుట కాదు, అయితే “నీవు నన్నెందుకు హింసించుచున్నావు?” అను ఆకాశము నుండి వచ్చిన స్వరము అది.
65
అతడు నేల పైన దొర్లిపోయాడు. అతని యొక్క నుదుటయంతా నిండుగా మట్టికొట్టుకొని పోయినది. బహుశా, చెంపలపై నుండి కన్నీరు కారుచుండెనేమో. “ప్రభువా, నీవు ఎవరు?” అని అతడు అడిగాడు. అతడు తన కన్నులు తటాలున తెరచినప్పటికి అతడు గబ్బిలం మాదిరిగా గ్రుడ్డివాడైపోయాడు. అక్కడే అతని యెదుటనే, పెద్ద అగ్నిస్తంభము నిలబడియుండెను. అందులో నుండి ఒక స్వరము వచ్చి, “నేను నీవు హింసించుచున్న యేసును. మానవ-నిర్మితమైన నీ బోధ తప్పు,” అని చెప్పెను. అదేంటి? బహిరంగమైన ఒక దర్శనం అచట కలిగెను. దేవుని యొక్క వాక్యము వాస్తవికత దాల్చెను. ఓ, సహగోదరులారా, అలాంటివి మరిన్ని ఈ దినాన మనకు కావలసియున్నవి.
ప్రభువుకు నేను ధన్యవాదములు చెల్లించాలని కోరుచున్నాను: గతించిన రాత్రి, తోపుడు కుర్చీలో కూర్చున్న ఆ చిన్న ఆడపిల్లలు ఈ రోజు తోపుడు కుర్చీలు లేకుండ నడచుకుంటు వెళ్ళుచున్నారు. కావున వారు వెళ్ళుచున్నారు. ప్రభువు మిమ్ములను దీవించును గాక.
అది చేసినదేది? అ ప్రకృతి సంబంధమైన స్వరముతో అక్కడ మాట్లాడిన అదే యేసు, ఈ దినమున ఇంకనూ మాట్లాడును.
66
“సౌలా, సౌలా, నీవు నన్నేలా హింసించుచున్నావు?” సౌలు మార్పుచెందిన మనుష్యుడు. గలిలయలో నడుచుచు మాట్లాడిన దేవుని యొక్క జీవముగల స్వరమగు ఆయన స్వరమును, ఈ దినమున ప్రజలు చూచి వినినట్లయితే, వారు తప్పక మార్చబడతారు. ఓ, అది తప్పక జరుగుతుంది. “సౌలా, సౌలా, నీవు నన్నెలా హింసించుచున్నావు?” అది ఏమి చేసినది? ఆయన అతనిని సెమినరీ పాఠశాలకు తీసికొని వెళ్ళి, ఒక క్రొత్త సిద్దాంతమును బోధించెనా? లేదు, ఆయన చేయలేదు. ఆయన ఏమి చేశాడు? ఆయన అతనితో మాట్లాడాడు. మరియు అక్షరాల ఒక స్వరము మేఘములో గుండా మాట్లాడుచుండెను. అదేంటి? సీనాయి కొండ మీద ఉరిమినటువంటి అదే దేవుడు.
67
కూటములలో పరిశుద్ధాత్మ ఎక్కడికి వచ్చునో అట్టి స్థలములలో, మానవ స్వరము మారుట మీరు వినియుంటారు. ఎబిసి కూడా ఎరుగనివారు, అయితే క్రీస్తు ఆ స్వరమును తీసికొని సర్వశక్తిమంతుడగు దేవుని మర్మములు మాట్లాడును. ఇప్పుడు ఆయన సన్నిధిలో కూర్చుండియుండిన ప్రతి యొక్క పురుషుని మరియు స్త్రీని అది మార్చవలసియున్నది.
“నేను స్వరమును వింటిని” అని అతడు చెప్పుచున్నాడు. ఓ, మనమెంతగానో నిద్రమత్తులో యున్నాము. అంతకంటే వివరముగా చెప్పవలసిన అవసరము లేదు అని నేను అనుకొనుచున్నాను. అయితే మన యొక్క ఆలయాలలో మనమెంతో కునుకుపాటుతో యున్నాము. మన వేదాంతములో, మన ఆలోచనలలో, మన జీవిత నడవడిలో అలాగున్నాము, ఎంతవరకనగా ఆ స్వరము మాట్లాడినప్పుడు దానిని ఆలకించుటకు మనము తప్పిపోవుదుము.
68
వారంటారు, “ఓ, అది మనస్సులను చదువుట కావచ్చును, అది కావచ్చును.... మీకు తెలుసా. అది ఇది, అది లేక మరొకటి కావచ్చును.”
ఒకవేళ మోషే ఇలాగు చెప్పినట్లయితే, “ఆ పొదల్లో దయ్యము కావచ్చు అని నేను ఆశ్చర్యపోవుచున్నాను.” మోషేకు ఎటువంటి ప్రశ్నలేదు: అతడు స్వరమును విన్నాడు. “ఓ, అది కేవలము నా మనస్సాక్షి నాకు చెప్పుచుండవచ్చునేమో” అని నీవు చెప్పినట్లయితే. నీవు దేవుని బిడ్డవైనట్లయితే, అది ఆయన యొక్క స్వరమని నీవు తెలుసుకుంటావు. “నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు నా స్వరము వినును.” వారు ఎరుగుదురు.
69
అక్కడ, పేతురు అను పేరుగల మరొకడు ఉన్నాడు. అతడు రక్షించబడ్డాడు మరియు ఆత్మతో నింపబడినవాడు. అతడు, ఇంకా పెద్దల ఆచారములను పట్టుకొని వ్రేలాడాలని కోరుచుండెను. అతడు ఎరిగినదంతా ఇక్కడ వాక్యములో యున్నది. ఒక రోజు, అతడు ఇంటిపైన, “ఏ మాంసము తినవద్దు, మరియు సబ్బాతులు,” తదితరమైన పారంపర్యాచారములను అతడు పాటించగోరెను. ఎంతో మంది మంచి వ్యక్తులు ఇంకనూ అలంటి విషయాలను పట్టుకొని వ్రేలడుటకు ప్రయత్నము చేయుచున్నారు.
70
మరియు ఒక రోజు ఇంటి పైన మేడ గదిలో అతడు యుండగా, “నేను పవిత్రపరచినదానిని నీవు అపవిత్రమైనదిగా చెప్పవద్దు,” అని చెప్పిన ఒక స్వరము విన్నాడు. దేవుడు, ఇక్కడున్న ఈ లోయలో ఒక బోధకుల గుంపును ఆయన తీసికోవాలని నేను కోరుకుంటున్నాను, మరియు మనము పిచ్చివారము కాదని వారు ఎరుగునట్లు చేయును గాక. మనము పరిశుద్ధ గుండ్రాళ్ళము కాదని, మనమొక చెత్త గుంపు కాదని ఎరుగునట్లు చేయును గాక. అది జీవముగల దేవుని యొక్క ఆత్మ. పురుషులు మరియు స్త్రీలు ఆయన యొక్క మంచితనమును త్రాగారు, అది యొక మంత్రము కాదు లేక మానసిక - మనస్సులను చదువుట కాదు. అది జీవము గల దేవుని యొక్క ఆత్మ. పెద్దలారా, మీ యొక్క ఆచారాలను విడిచిపెట్టుడి, జీవము గల దేవుని యొక్క స్వరమును ఆలకించుడి.
అది మిమ్ములను మార్చివేస్తుంది. హింసించువారిలో ఒకరిగా మీరు మారరు. వారిలో ఒకరివంటివారు మీరు అవుతారు. మీ సిద్దాంతముల అడ్డుకట్లను మీరు దాటి, సుదూరానున్న ఆయన సన్నిధానంలోకి మీరు తేలునంతగా వచ్చినట్లయితే, ఎదో ఒకటి జరుగుతుంది. అద్భుత కార్యాలు జరుగు దినములు గడిచిపోయినవని, మీరు నమ్మరు. అవి ఇక్కడే యున్నవని మీరు నమ్ముతారు, ఎందుకనగా ఒక కార్యము మీపై ప్రదర్శింపబడును. ఖచ్చితముగా, ఒక మనుష్యుని మార్చుటకు! దేవుని యొక్క స్వరము ఎల్లప్పుడూ చేయునది అదే: అది పురుషులను మరియు స్త్రీలను మార్చి, వారు ఏలాగుండవలెనో అలాగుండునట్లు చేస్తుంది. పాఠశాలలు మరియు ఉపాధ్యాయులు చేయునది కాదు గాని, దేనికొరకై దేవుడు దేనిని ఆదర్శంగా చేసియున్నాడో - అట్టిదానిని చేయును. స్వరము మాట్లాడుచున్నది. “నేనొక స్వరమును వింటిని.”
71
ఓ, వ్యక్తిగత అనుభవాలలో నేను వెళ్ళుటకు ఇష్టపడుతున్నాను. మీలో అనేక మంది పురుషులు మరియు స్త్రీలు ఆయన స్వరము వినినవారైతే, వ్యక్తిగత సాక్ష్యాలు ఇచ్చుటకు మీరెంతో ఆశిస్తారు. అక్కడ కెంటుకీ పర్వతాలలో, నేనొక చిన్నపిల్లవానిగా యండినపుడు, నేను విన్నది అదియని నాకు జ్ఞాపకమున్నది; చెట్టు మీద ఒక పక్షి కూర్చొనియున్నది అని నేననుకున్నాను, అయితే పక్షి ఎగిరిపోయినది. “భయపడవద్దు, ఎందుకనగా ఒక దినమున ఇక్కడ నుండి నీవు వెళ్ళిపోయి న్యూ-ఆల్బని అను పట్టణము దగ్గరగా నీవు నివాసముంటావు,” అని ఆయన చెప్పెను.
“పొగత్రాగవద్దు, లేక మద్యపానం సేవించవద్దు, లేక స్త్రీలతో నీ శరీరమును అపవిత్రపరుచుకోవద్దు మరియు మొదలుగునవి; నీవు పెద్దవాడైనప్పుడు నీ కొరకు ఒక పనియున్నది,” అని ఆయన చెప్పినప్పుడు ఆయన స్వరము నేను విన్నాను.
ఓ, ఆయన ఇంకా అదే ప్రభువైన దేవుడైయున్నాడు. గంట గంటకు నీ యొక్క చిన్న గదిలో, నీ యొక్క ప్రార్థనా గదిలో ఆయన నీతో మాట్లాడుట నీవు వింటావు; శ్రోతలు ఎదురుగా రా, బహిరంగముగా ప్రజల యెదుట మాట్లాడు. దేవుని యొక్క స్వరము, సమూయేలు దినాలలో అదేంతో అరుదైపోయెను (ఈనాడు ఇంకా కరువైపోయెను) ఎందుకనగా బహిరంగ దర్శనం అక్కడ లేదు కనుక.
పేతురు స్వరమును విన్నాడు, అది అతని యొక్క వేదాంతమంతా మార్చివేసినది. కులహీనులైన ఒక పామరుల గుంపుని ఎవరిని గూర్చి అతడు అనుకున్నాడో, అట్టి అన్యజనుల యొద్దకు నేరుగా వెళ్ళాడు. అయితే దేవుని యొక్క స్వరము — అతని యొక్క బోధకాదు — జీవముగల దేవుని స్వరము అతనిని మార్చినది.
72
ఇప్పుడు మరొక్కరు మాత్రమే. బైబిల్ గ్రంధములో, ఒకప్పుడు ఒక మంచి మనుష్యుడు ఒకడున్నాడు. వ్యక్తిగతముగా యేసుతో పరిచయమున్నవాడు, ఆయనను ప్రేమించినవాడు, ఆయన యందు విశ్వాసముంచినవాడు, ఆయనను ఆరాధించినవాడు, ఆయనతో కలిసి ఆటలాడినవాడు, ఆయనతో కొండలకు వెళ్ళినవాడు, ఆయనతో చేపలు పట్టుటకు నదికి వెళ్ళినవాడు. అతడొక మంచి మనుష్యుడు.
ఒక రోజు యేసు వెళ్ళిపోయిన తరువాత అతని గదిలోకి దొంగిలించుటకు మరణము వచ్చెను. అతడును, అతని యొక్క సహోదరీలైన మార్త మరియు మరియ సాంప్రదాయ సంబంధమైన పురాతన సంఘమును విడిచిపెట్టారు. వారాయనను ప్రేమించారు కనుక వారు బయటకు వచ్చారు. మరియు ఆయన మెస్సీయ అని నమ్మిరి. ఆలాగు చేయుటవలన సంఘము వెంటనే వారిని వెలివేసినది.
ఈ యవ్వనస్తుడు చనిపోయేంతగా ఎంతో వ్యాధిగ్రస్తుడై చనిపోయాడు, మరియు పాతిపెట్టబడి నాలుగు దినాలు అయినవి. అప్పుడు వేదాంత బోధలు ఏమి చేయగలిగినవి? అప్పుడు తన యొక్క సంఘము ఏ మేలు చేయగలిగెను? అయితే దేవుని యొక్క స్వరము భూమి మీద యుండెను. ఆయన లాజరుతో మాట్లాడాడు. చనిపోయిన లాజరు సమాధిలో కుళ్ళిపోయియుండెను. ఆయన స్వరమును విన్నాడు. బయటకు వచ్చాడు, తిరిగి బ్రతికాడు.
73
ఒకప్పుడు నేను పాపములోను, అతిక్రమములోను చనిపోతిని. మీరు ఒకప్పుడు పాపములో, అతిక్రమములో చనిపోతిరి. అయితే, “ప్రయాసపడి భారము మోయుచున్న వారలారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి ననుగ్రహించెదను,” అని చెప్పినది అది దేవుని యొక్క స్వరమే.
అంగవిహీనులతో మాట్లాడి, అతని చక్కగా నిలబెట్టిన స్వరమును నేను చూచితిని. గ్రుడ్డివానితో మాట్లాడి, అతని కళ్ళు తెరచిన, దేవుని యొక్క స్వరమును నేను చూచితిని. చనిపోవు వారికి, క్యాన్సరుతో మొత్తబడిన వారు కుష్టువ్యాధితో నున్నవారు, పరిపూర్ణ ఆరోగ్యవంతులై తిరిగి వారి ఆరోగ్యవంతమైన శరీరమును వారు పొందుకొనుటను నేను చూశాను. ఆయన, త్రాగుబోతులతోనూ, మతిభ్రమించినవారితోనూ, వెలివేయబడినవారితోనూ, దేశదిమ్మరులు, త్రాగుబోతులు గుంపులతో ఆయన మాట్లాడుట నేను చూశాను. వారు మంచి నడవడిగల స్త్రీలుగాను, మంచి పురుషులుగాను, జీవముగల దేవుని భక్తులుగాను మారుట నేను చూశాను, ఎందుకనగా దేవుని స్వరము వారితో మాట్లాడెను.
74
ఈ దినమున దాని కొరకే మనము వినుచున్నది. దీనిని చెప్పి నేను ముగిస్తాను. ఒక సమయం రాబోవుచున్నది, తిరుగుతూ యుండు నీ ప్రాణము నీ శరీరములో నుండి తీసివేయబడుతుంది, అది ఒకచోట దాని గమ్యములో — దూరాన చీకటిలో తిరుగుతూ యుంటుంది లేక దేవుని యొక్క రొమ్ము భాగములోనో యుంటుంది — ఆ స్వరము తిరిగి మాట్లాడుతుంది. “సమాధులలో నున్నవారు ఆయన స్వరమును విని బయటకు వచ్చెదరు.” కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందలపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు,“ అని బైబిల్ గ్రంధము చెప్పుచున్నది.
75
నీ మనస్సును నీవు నిర్ధారణ చేసికొను సమయం, బహుశా ఈ ఉదయం కావచ్చును. టెలివిజన్ చెప్పు దానిని వినబోతున్నావా, లేక వార్తాపత్రిక చెప్పునది నీవు వినబోతున్నావా, లేక వేదాంత పండితులు చెప్పునది వినబోతున్నావా, లేక దేవుడు చెప్పినది వినబోతున్నావా. ఒక ప్రజగా నేను మీతో చెప్పుచున్నాను, “దేవుడు చెప్పినది కాకుండా ఎవరేది చెప్పినను వినవద్దు. ఆ నిమ్మళమైన చిన్న స్వరము కొరకు కనిపెట్టు, మరియు ఆయన నిన్ను మార్చును.”
“సహోదరుడా బ్రెన్హాం, నేను నమ్ముటకు ఇష్టపడుతున్నాడు. నేను నమ్ముటకు ఆశిస్తున్నాను. నేను కొన్ని విషయాలు చేయుటకు కోరిక కలిగియున్నాను,” అని చెప్తావు. అయితే నీవు చేయలేవు. ఎందుకని? ఎంతో కాలము నుండి నీవు వదలిపెట్టుట లేదు. ఎచ్చటయితే సందేహాలు వెడలిపోవునో ఆ స్థలానికి నీవు రాలేదు. ఎక్కడైతే సందేహాల్ని నివృత్తియగునో, అట్టి స్థానములోకి నీవు ప్రవేశించునప్పుడు, అప్పుడు నీవు స్వతంత్రుడవు, “నా బిడ్డా, నేను నీ రక్షకుడను. నా బిడ్డా, నిన్ను స్వస్థపరచువాడను నేనే. ఇవన్నీ నీవు చేయనవసరం లేదు. నీవు స్వతంత్రుడవగుటకు నేను చనిపోతిని,” అని దేవుడు చెప్పు స్వరమును నీవు వినగలవు. అయితే ఈ యొక్క కంపనములో, అన్ని రకములన స్వరములతో మిళితమై నీవు క్రింద ఉన్నంతకాలము, కేవలము వాటన్నిటి నుండి దూరముగా వెళ్ళుము.
76
ఒకప్పుడు నేను పైన పర్వతాలపైనయున్న సమయం నాకు జ్ఞాపకమొస్తున్నది. ఆ అనుభవాలను నెనెన్నడూ మరచిపోను. ఇక్కడే, షుమారు పది సంవత్సరాల క్రితం (లేదా మరెక్కువ కాలము), గుర్రాలపైన వారు ఉప్పు పెట్టునప్పుడు, శ్రీ. జఫరీస్ గారి పశువులను గుంపుగా సమకూర్చుటకు నేను సహకరిస్తూయుండేవాడను. వాటికి నేను సహకరించువాడను. ఎక్కడైతే, పశువులు అవి రాగలవో, అట్టి వాటిని ఎరుగునో, ఎక్కడైతే నేను వాటిని పరుండబెట్టగలనో అట్టి వాటియొద్దకు నేను తీసికొని వస్తాను. అక్కడ వెనుక, (మానవ సంచారమునకు ఖచ్చితంగా డెబ్భయి మైళ్ళుంటుంది... లేక, ముప్పయి మైళ్ళు, ముప్పయి-అయిదు, కలరడో క్రెంబ్లింగ్కు అది బహుశా నలభై మైళ్ళు యుంటుంది) అక్కడ ఆ చిన్న నగరము యొక్క జనాభా షుమారు ఏడు ఎనిమిది వందలు తాకుతుంది.
77
నా గుర్రమును అక్కడ నేనుంచాను; నా యొక్క జీను సంచులను దింపాను. మేము చూడగలము.. బైనాక్యులర్స్ వలన జంతువులను మేము కనిపెడతాము. నా యొక్క గుర్రమును ఆ కొక్కెమునకు తగిలించాను, మరియు ఆ లాగు బండి గుర్రము వెనుక ఉన్నది... మరియు దానిని లాగు గుర్రము ముందు ఉన్నది.
నేను కొండలపైకి వెళ్ళిపోయాను మరియు అదెంతో అందంగాయన్నది. అది వసంత రుతువు. దూరాన చిన్న తరంగాలుగా ప్రవహిస్తున్న నీటిని నేను గమనిస్తూ లోయలవైపు నేను చూస్తున్నాను. అది మిట్ట మధ్యాహ్నపు వేళ నేను వాటిని గమనిస్తుండగా, నన్ను పులకింతలు చేసిన ఒక దానిని నేను చూశాను.
ఒక వృద్ధ పక్షిరాజు తల్లిపక్షి, తన గూటిలో నుండి తన బిడ్డలను తీసికొనుట నేను చూశాను. తన బిడ్డలు తన రెక్కలపైకి అది చేర్చుకొనువరకు వాటిపైన, వాటి చుట్టూ తన రెక్కలను రెపరెప కొట్టుతూయుంది. ముందుగానే అవి గూటిలో నుండి బయటకు వచ్చినవి. అయితే, ఆమె వాటిని లోయలోకి తీసికొని వెళ్ళినది. అంత క్రితం ఎన్నడూ అక్కడ అవి లేవు. కేవలం ఎగురుట మాత్రమే అవి నేర్చుకుంటున్నవి. కాబట్టి ఆమె వాటిని అలా పోనిచ్చింది. అవి ఆలాగు వెళ్ళిపోయి, గడ్డిని కొరుక్కుంటూ ఎంత నిర్భయంగా యుండాలో, అంత నిర్భయంగా ఒకదానిపైకి ఒకటి గెంతులు వేస్తున్నవి.
78
నేనక్కడ కూర్చొని, “నిజంగా విశ్వాసముంచిన క్రైస్తవ గుంపు అదే కదా?” వారు నిర్భయంగా యుంటారు, దేనికి వారు భయపడరు, ఎందుకనగా అమ్మ వాటి వెనుకకు వెళ్ళిపోయి వాటిని కనిపెట్టుటకై రాయి మీద కూర్చొనియున్నది.“ ఓ, అదెంతో మార్పును కలిగించినది.
“నేను పరిశుద్ధాత్మ పొందినట్లయితే, ఫలానా సంఘ కాపరి ఏమనుకుంటాడో, ఫలానా బిషప్పు ఏమని చెప్పునో,” అని నీవు ఆలోచన చేస్తే. వారేమని చెప్పినా నేను లెక్కచేయను. యేసు చనిపోయెను, మహిమ ప్రాకారములకు ఆయన ఎక్కిపోయాడు. ఆయన ఆకాశ మహాకాశములలో కూర్చున్నాడు. ఏదీ నిన్ను భయపడునట్లుగా చేయలేదు. ఆయన కన్ను పిచ్చుకను చూచుచున్నది. ఆయన నన్ను గమనించుచున్నాడు. నిన్ను గమనించుచున్నాడు అని నాకు తెలుసు.
79
తరువాత అక్కడ... ఈ చిన్నపిల్లలను గలిబిలి చేయుటకు అక్కడకు ఒక తోడేలు లేక మరొకటి వచ్చినట్లయితే, గమనించు; అవి రాకపోవుట మంచిది. ఆమె తోడేలును తన చేతితో పట్టుకొని... తన పంజాతో పట్టుకొని, అతనిని అనేక వేల అడుగుల ఎత్తునకు తీసికొనిపోయి అక్కడ వదిలిపెడుతుంది. గాలిలో ఎక్కడ భాగాలతో అక్కడ విడిపోతుంది.
ఆ చిన్నవాటికి ఏది భయము కలుచేయదు; ఆమె వాటిని కనిపెట్టుకొని ఉన్నది. ఏదీ నీకు భయభీతిని కలుగజేయలేదు. దేవునిని ఆయన వాక్యములో స్వీకరించుటకు భయపడవద్దు. కేవలము సడలింపు చేసికో మరియు విశ్వాసముంచుము మరియు నమ్ముము. ఆయన నిన్ను కనిపెడుతున్నాడు. నీకు భీతిని గలుగచేయు దేనినైనను ఆయన ముక్కలు ముక్కలుగా చేయును. ఓ, అది నీపై దాడిచేయవచ్చును, అయితే అది నీకు హాని చేయలేదు.
అన్ని విషయాలకై.... వాటికి ఆయన అనుమతించును. అది తప్ప మరొకటి కాదు, ఎందుకనగా ప్రభువును ప్రేమించువారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఏ అపాయము నీ మీదికి రాదు.
80
కాబట్టి, కొద్దిసేపటి తరువాత, తుఫాను వచ్చినది. తుఫాను ప్రారంభం కాగానే, ఆ ఉత్తర ప్రాంతములో, ఎంతో త్వరగా కొద్దిగా మెరుపులు, గంటకు ఆరవై లేక డెబ్బయి మైళ్ళు గాలులు వీచినవి. ఆ పెద్ద తల్లి పక్షిరాజు పెద్దగా కేకపెట్టి, ఆ లోయలోబడి వెళ్ళిపోయినది. ఆ పెద్ద కేక, అదేం చేసినది? ఆ చిన్న పక్షిరాజు పిల్లలు తమ తల్లి స్వరము ఎరుగును.
ఆయన చెప్పెను, “నా గొర్రెలు నా స్వరము వినును.” అపాయము ముందున్నది. ఒక మొద్దు క్రిందకు వెళ్ళుటకు అవి ప్రయత్నించలేదు. ఒక దిబ్బ కుప్ప క్రిందకు వెళ్ళుటకు అవి ప్రయత్నించలేదు. అవి కేవలము తల్లి కొరకు వేచియున్నవి.
అదే క్రైస్తవుడు చేయవలసియున్నది: దానిని గూర్చి దేవుడు ఏమి చేయబోవుచున్నాడో చూచారా.
81
మరియు ఆ పెద్ద తల్లి భూమిని తాకినప్పుడు, వాటి పెద్ద పాదములతో ఆలాగు చేసినప్పుడు పెద్ద విమానము క్రిందికి దిగివచ్చినట్లుగా ఆమె దిగినది. ఆమె తన మెడను గాలిలోకి చాచి పెద్దగా అరుస్తుంది. ఆమె ఆ పెద్ద రెక్కలను చాపుతుంది. ఒక మొన నుండి మరొక మొన వరకు షుమారు పదునాలుగు అడుగులుంటున్నది; ఈ స్తంభం నుండి ఆ స్తంభం వరకు వెడల్పు ఉంటుంది. ఆ చిన్న పక్షిరాజు పిల్లలన్ని ఎంత త్వరగా పరుగెత్తాలో అంత త్వరగా పరుగెత్తి, వాటి తల్లి రెక్కల మీదికి ఎగిరి దూకినవి. అవి నేరుగా అక్కడకు చేరుకొని, వాటి పంజాలతో పట్టుకున్నవి, వాటి చిన్న ముక్కులతో అక్కడున్న ఈకలలో ఒకదానిని గట్టిగా పట్టుకున్నవి. తల్లి ఆ రెక్కలలో ఎలాటి తొనుకుడు లేకుండా, పైకెత్తి వాటిని తీసికొని గాలిలోకి వెళ్ళిపోయినది. రాబోతున్న తుఫాను నుండి తప్పించుటకై ఆమె నేరుగా బండలలోకి వెళ్ళిపోయినది.
ఓ, సహోదరుడా, తుఫాను త్వరగా రాబోతున్నది. ఆయన స్వరము విను! “బబులోను నుండి బయటకు రా, ప్రత్యేకముగా యుండుడి. వారి పాపములలో పాలిభాగస్తులు కావద్దు, నేను మిమ్మును చేర్చుకొందును. మీరు నా యొక్క కుమారులు, కుమార్తెలైయుందురు. నేను మీ దేవుడనై యుందును,” అని అది మిమ్ములను పిలచుచున్నది.
82
ముగింపులో, మనం తలలు వంచుకుందాం.
[సమాజములు నుండి ఒకరు ప్రవచించిరి.] ఆమేన్. అది మీరు విన్నారా. సంఘములో ప్రవచనమని దానినే మనం పిలుచునది.
83
“ప్రభువైన దేవా, నా యందు కనికరము చూపము. నేను సంఘములో చేరినప్పటికీ, నేను ఒప్పుకోలు చేసినప్పటికీ, అయితే నీ యెదుట ఏలాగు నిశ్శబ్దముగా యుండవలెనో, నన్ను నడిపించి, నాకు బోధించు నీ యొక్క స్వరము ఏలాగు వినవలెనో నాకు తెలియదు. చెవికి వినబడు స్వరముతో నీవు నాతో మాట్లాడితే, ఏమి చేయాలో నాకు తెలియదు. నీవు నాతో మాట్లాడి, నా త్రోవలకు దారి చూపునట్లు, నిన్ను నేను తెలిసికోవాలని నేను ఆశపడుతున్నాను” అని చెప్పువారు, ఇక్కడ ఈ ఉదయం ఎవరైనా ఉన్నట్లయితే, (ఇక్కడ ఉన్నారు అని నాకు తెలుసు.)
“దేవా, నా యందు కనికరము చూపము” అని చెప్పుచూ, మీ చేతులు ఇప్పుడు పైకెత్తగలరా? ప్రతి యొక్క చోట, ప్రతి యొక్క చోట్ల, చేతులు పైకెత్తబడినవి. ప్రభువు మిమ్ములను దీవించును. వాటిని అలాగే పైకెత్తియుంచుడి. మంచిది. “ప్రభువా, నా యెడల కనికరము చూపుము; నీవు నాకెంతో కావలసియున్నది.” ముగించకముందు ఇంకా ఎవరైనా యున్నారా? అక్కడ, వెనుక, అమ్మా, ఇంకా వెనుకునున్నవారు మరియు వరుసలో నున్నవారు, మొదలగువారు. దేవుడు మీ హస్తాలను చూస్తూయున్నాడు. చివరకు వేదికపై నున్నవారిని, చుట్టనున్నవారిని దేవుడు చూస్తున్నాడు.
84
“ఏలీ, నీవు నన్ను పిలిచితివా ?” అని సమాయేలు అడిగాడు.
“లేదు, నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు” అని ఏలి చెప్పెను. స్నేహితుడా, నీ హృదయంతో మాట్లాడినది, అది నేను కాదు. అది దేవుడు. “నీ దాసుడు ఆలకించుచున్నాడు, దేవా, నీ భద్రతలోకి నన్ను తీసికోనుము. ఈ దినము నుండి నన్ను నీవానిగా చేసికొమ్ము,” అని తిరిగి నీవు చెప్పుము.
నిత్యుడగు దేవా, ఆత్మ ప్రియుడా, అన్నిటికి సృష్టికర్తా, సమాయేలుతో మాట్లాడిన ఆ స్వరము, సౌలుతో మాట్లాడినది, పేతురుతో మాట్లాడినది, దానియేలుతో మాట్లాడినది, మరియు యెషయాతో మాట్లాడినది, యుగయుగాలలో మాట్లాడినటువంటి దేవుని యొక్క మెల్లని ఆ స్వరము, ఈ ఉదయవేళ మందిరములో తిరిగి మాట్లాడెను. పాపులు, సంఘ సభ్యులు, ఆశాభంగము చెందినవారు బహుశా ముప్పయి, లేక నలభై, లేదా ఏభై హస్తాలు; వారు తమ చేతులు పైకెత్తారు. గతించిన రాత్రి వారిలో చాలా మంది వినబడిన నీ యొక్క స్వరమును వారు విన్నారు. మరిప్పుడు, ఈ ఉదయం అదే స్వరము వారి హృదయాలలో ఎంతో ప్రగాఢముగా మాట్లాడెను. పరలోకము వైపు వారి చేతులేత్తుట ద్వారా వారు తప్పు చేశారని చెప్పుచూ, వారు సరిచేసికోవాలని కోరుకుంటున్నారని వారి చేతులు పైకెత్తియున్నారు.
85
“నా తండ్రి వానిని మొదట ఆకర్షించితేనేగాని ఎవడు నా యొద్దకు రాడు. నా యొద్దకు వచ్చు వారందరికి నేను నిత్యజీవము అనుగ్రహించెదను. అంత్యదినమున వానిని లేపెదను,” అని నీ వాక్యములో నీవు చెప్పితివి. తండ్రీ, నీవే అది వాగ్దానము చేసితివి. ఎవరైతే తమ చేతులు పైకెత్తియున్నారో, నిత్యజీవమును, నిత్యానందమును, వారికి అనుగ్రహించమని నీ దాసునిగా నీకు ప్రార్ధిస్తున్నాము. వారు బ్రతుకు దినములన్నియు నీ కొరకే వారు జీవించుదురు గాక, వారి జీవిత యాత్ర మార్గమంతమున ప్రభువు యొక్క ఆనందములోకి ప్రవేశించుదురు గాక. తండ్రీ, అనుగ్రహము చూపుము, యేసు కొరకు మరియు యేసు నామములో దినిని అడుగుచున్నాము. ఆమేన్.
86
మీలో ఎంతమంది ఆయనను నిండు హృదయంతో, నిండైన హృదయంతో ప్రేమిస్తారు.
ఈలాగు, ఇటు వంటి చిన్న స్థలములో... నేను కొద్దిగా ఆలస్యం చేస్తున్నాను. అయితే “మనము పరలోక స్థలములలో క్రీస్తు యేసుతో కూడా కూర్చొనియున్నాము” అని బైబిల్ గ్రంధము చెప్పుచున్నది. పరిశుద్ధాత్మ వచ్చి, వాక్యములోకి వెళ్ళిపోయి, సభికులందరిలో గుండా కదలి వెళ్ళును. అది వారిని ఊడ్చివేసి వారిని మార్చివేయునప్పుడు, నీవు దానిని అలాగు గమనించుము. నేను చెప్పినట్లుగా, ఉద్రేకాలను నేను నమ్ముతాను. నిజమే. అయితే చూడండి, ఉద్రేకాలు నిన్ను మార్చవు. నీ యొక్క ఉనికిలోని నీతినియమాలు అది తాకునంతగా ఉద్రేకాలు అంతవరకు వెళ్ళవలసియున్నవి. అదే పాపయుక్తమైన దానినుండి నిన్ను మార్చును...
పాపియనగా ఎవరు? ఒక అవిశ్వాసి. ఈ రోజు అనేకమంది వ్యక్తులు పట్టభద్ర డిగ్రీ పొందుకుంటారు. దానికి తోడు డాక్టరు డిగ్రీ, దానికి తోడు పి.హెచ్.డి., ఎల్.ఎల్.డి. లు వారి పేరుతో పెట్టుకుంటారు, అయిననూ వారు పాపులే; ఆదికాండము నుండి ప్రకటన వరకు బైబిల్ ఎరిగినవారే; వేదికయొద్ద బోధ చేస్తారు, అయినను వారు అవిశ్వాసులు. “నమ్మనివానికి శిక్ష ముందుగనే విధింపబడెను,” అని బైబిల్ చెప్పుచున్నది.
87
ఈ దినానికి పరుశుద్ధాత్మ యున్నడా అని వారిలో ఒకరిని అడుగు? “ఏంటి, అసలు లేదు.” దైవిక స్వస్థత యున్నదని నీవు నమ్ముతున్నావా..?“ ”ఏంటి, అసలు లేదు.“ అలాంటప్పుడు అతడు అవిశ్వాసి. అది నిజం.
పరిశుద్ధాత్మ నీలో యున్నట్లయితే, ఆయన స్వంత వాక్యమునకు ఆయన సాక్ష్యం పలుకడా? దేవుడు ఏది సత్యమని చెప్పియున్నాడో, దానికి వ్యతిరేకముగా నీలోనున్న ఆత్మ సాక్ష్యం పలికినట్లయితే, అది క్రీస్తు ఆత్మ కాదు. నీవు చర్చి-అఫ్-క్రైస్ట్ కు సంబంధించియుండవచ్చును, కాని నీవు క్రీస్తువాడవు కాదు. దేవుడు చేసిన ప్రతి వాగ్దానానికి, నీ ఆత్మ, “ఆమేన్” అని చెప్పునంత వరకు నీవు క్రీస్తుకు సంబంధించినవాడవు కావు. ఆయన వాగ్దానము చేయగా...
పెంతెకొస్తు దినమున పేతురు చెప్పెను, “మీలో ప్రతి యొక్కరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందెదరు.”
88
అయితే అది ఇంకొక దినమునకని ఆత్మ చెప్పినట్లయితే.. లేఖనము ఏమని చెప్పినది? “ఈ వాగ్దానము మీకును (యూదులు), మరియు మీ పిల్లలకును, మరియు దూరస్తులందరికిని (అన్యజనులు), అనగా మన ప్రభువైన దేవుడు ఆయన యొద్దకు పిలిచిన వారందరికి చెందును.” అదే వాగ్దానము.
“నేను దాక్షావల్లిని, మీరు తీగలు,” అని ఆయన చెప్పెను. అది తీగ యొక్క సిద్దాంతము అయినట్లయితే... మొదట తీగ, రెండవ తీగ అదే సిద్దాంతమును కలిగియుండవలసియున్నది. అదే సిద్దాంతము అదే ఫలితాలను పుట్టించవలసియున్నది. ద్రాక్షవల్లి నుండి వచ్చు ప్రతి యొక్క తీగ (కొమ్మ) అటువంటి దానినే ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఉదయం నేను ఆనందంగా ఉన్నాను. జీవముగల దేవుని యొక్క ఆత్మ ఇంకా ప్రజలతో మాటాలాడుచు, ముచ్చటించుచూ, ఆయన వాక్యమును నిర్ధారించుచున్నదని అది నేను ఎరిగినందుకు నేనెంతో ఆనందంగా యున్నాను.
89
కొద్ది క్షణాలలో మనము బాప్తిస్మపు కార్యక్రమమునకు వెళ్ళనైయున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామములలో కాకుండా, మరి ఏ విధముగానైనా ముంచడం జరిగినా, చిలకరించినా, నీరుళ్ళ క్రుమ్మరించినా, నీకు ఆలాగు జరిగినట్లయితే, నీటి యొద్దకు వచ్చుటకు నీవు సవాలు చేయబడ్డావు.
ఇప్పుడు, “సహోదరుడా బ్రెన్హాం, నాతో నీవు చెప్పుచున్నావని నీ యొక్క భావమా...?” అని నీవంటావు. అవును, సహోదరుడా. చిలకరించుటను గూర్చి బైబిల్ మాట్లాడుటలేదు. ఎవరైనా ఎప్పుడైనా చిలకరించబడినట్లుగా బైబిల్లో ఏ స్థలమందులేదు. ఇప్పుడిది జ్ఞాపకముంచుకొనుము, ఈ బల్లను ఈ వారమంతా నేనడిగాను: వారి యొక్క పాపక్షమాపణ నిమిత్తము బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా ఒక్క వ్యక్తి చిలకరించబడినట్లు నాకు చూపించు; వారి పాపక్షమాపణకై ఎప్పుడైనా నీళ్ళు పోసియుండిరో నాకు చూపించు; లేదా వారి పాపక్షమాపణ కొరకై తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఎప్పుడైనా బాప్తిస్మము తీసికున్నారో నాకు చూపించు. బైబిల్ గ్రంథములోని అన్ని పుటలలో ఏ వ్యక్తియైనా, ఎక్కడైనా చిలకరించబడలేదు, నీరు క్రుమ్మరించిబడలేదు, లేక తండ్రి, కుమార, పరుశుద్ధాత్మ నామములో బాప్తిస్మము తీసికోలేదు. లేదండి.
90
బాప్తిస్మమిచ్చు యోహాను వలన ఒకప్పుడు బాప్తిస్మము తీసికున్నవారు కొందరక్కడున్నారు. వారు ఏ నామములో కూడా బాప్తిస్మము తీసికున్నవారు కాదు. యేసుకు బాప్తిస్తమిచ్చిన అదే మనిషివలన వారు బాప్తిస్మము పొందియున్నారు.
అయితే, అపోస్తలుల కార్యము 19లో, పౌలు వారిని కలసినప్పుడు, వారు వచ్చి తిరిగి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము తప్పక తీసుకోవలెననియు, లేదా వారు పరిశుద్ధాత్మను పొందలేరనియు వారితో చెప్పెను.
వారు బాప్తిస్మము పొందక ముందే, పరిశుద్ధాత్మ పొందియుండిరని కొందరిని పేతురు కనుగొనినప్పుడు, వారికి ఆజ్ఞాపించి, యేసుక్రీస్తు నామములో వారికి బాప్తిస్మము పొందేవరకు అతడు వారితోనే నిలచిపోయెను.
స్నేహితుడా, అది నిజం. “సహోదరుడు బ్రెన్హాం, యేసు మాత్రమే, అను దానికి సంబంధించినవాడని” అనేక మంది చెప్తారని నాకు తెలుసు. అది తప్పు. నేను లేఖనమునే నమ్ముతాను. నేను ఏ సంస్థాపక సంఘమునకు సంబంధించినవాడను కాను. ఏమైనను 'జీజస్ ఓన్లీ' వారు, ఆ విధముగా బాప్తిస్మమివ్వరు. వారు కేవలము యేసు నామమున బాప్తిస్మమిస్తారు. “ప్రభువైన యేసుక్రీస్తు,” అని బైబిల్ చెప్పుచున్నది. చాలా మంది యేసులున్నారు. అయితే ఒకే ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు యున్నాడు, చూచారా. క్రీస్తు మెస్సీయా అయి యున్నాడు, చూచారా. మరియు అది నిజం.
ఇప్పుడు, స్నేహితులారా, ఇప్పుడు ఈ ఉదయం ఇక్కడ ఉన్న మీరు, మీరు ఆ విధముగా బాప్తిస్మము పొందకపోయినట్లయితే, దేవుని యొక్క మెల్లని చిన్న స్వరము మీ ఆత్మలో ఎంతో లోతుగా మాట్లాడును గాక. బిషప్పు ఏమి చెప్పినప్పటికి, ఏ సంఘము ఏమి చెప్పినప్పటికి, ఏది ఏమని చెప్పినప్పటికిని, వచ్చి ప్రభువుకు లోబడుడి, అది మీకు నా యొక్క ఆజ్ఞ.
91
బాప్తిస్మము కార్యక్రమము కొరకు సిద్ధపరచుటకు, ఇప్పుడు సహోదరుడు నెవిల్ ఈ గది లోపలకు వెళ్తాడు. మరియు ఎవరైతే వస్తువులు సిద్ధపరచుకున్నారో వారు, పెద్దలలో కొందరు నాతో వస్తారు. ఒక్క నిమిషంలో నేను మీతో అక్కడ యుంటాను. అయితే, “నా రక్షకుడు నన్ను పిలువగా నేను వినుచున్నాను.” అనునది మనం పాడుచుండగా, ఇప్పుడు వచ్చుచున్నవారు, రావాలని కోరుచున్నాను. ఏ సంఘానికి చెందియున్నానని వ్యత్యాసం లేకుండా ఆయనతో నేను నడిచెదను. ఆయనతో నేను నడిచెదను. వారెవరైనది వ్యత్యాసం లేక, నిరంతరం ఆయనతో నేను వెళ్ళుదును.“ ఆ పాట ఇప్పుడు పాడుతూ వెళ్తామని నేను ఆశించుచున్నాను. పురుషులు ఈ గదిలోకి, స్త్రీలు ఈ గదిలోకి, మనం పాడుచుండగా ఆ దారులలో వెళ్తారు. తరువాత ఒక్క క్షణంలో, మనం అధికారికంగా విడిచిపెట్టబడతాము. సరే, అందరం కలిసి.
నా రక్షకుడు, పిలువగా, నేనాలకించ గలుగుచున్నాను.
ఇప్పుడు, పురుషులు ఇటు వెళ్తారు. స్త్రీలు ఇటు పైగా వెళ్తారు.
..........నా యొక్క.......
కొందరు స్త్రీలు దయచేసి ఇక్కడకు ఆ స్త్రీలతో వెళ్తారు,
నా రక్షకుని నేను వినగలుగుచున్నాను, (నీవేమి విన్నావు?
ఆయన స్వరమును?)
“నా సిలువనెత్తుకొని వెంబడించుము, నన్ను వెంబడించుము.”
ఎక్కడ ఆయనయుంట... (అది నిజంగా నీ యొక్క భావమా?)
నేను వెంబడింతును,
ఆయన నన్నెక్కడకు నడిపించునో నేను వెంబడించుదును,
ఆయన నన్నెక్కడకు నడిపించునో నేను వెంబడించెదను,
నేనాయనతో వెళ్ళుదును, దారినంతా ఆయనతో యుండెదను....
92
స్నేహితుడా, నేను ఇది చెప్పినట్లుగా, నేను స్వరమును వింటిని. స్వరము, దేవుని యొక్క స్వరముగా మాట్లాడకపోతే ఇక్కడే అది తప్పుడు స్వరము. అయితే, “నా గొర్రెలు నా స్వరము వినును.” నీవేలాగు రాగలుగుతావు? నీవు వచ్చిటకు కారణం ఇక్కడున్నది, ఎందుకనగా, “భూమికి పునాది వేయబడకముందే నీ యొక్క పేరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంధమందు వ్రాయబడియున్నది.” అలాగని, బైబిల్ చెప్పుచున్నది.
కూర్చొనియుండిన వ్యక్తిని గూర్చి ఆలోచించు, అది సువార్త సత్యమని ఎరిగి, ఆయనను ఒకటి వారిని ఇంకా పట్టుకొనియున్నది; బహుశా వారి పేరు అక్కడ పెట్టబడలేదేమోయని ఎరిగినవారై. అలాగైతే ఏంటి? “వారు నన్ను వ్యర్ధముగా ఆరాధించుచున్నారు.” వ్యర్ధముగా?
“ఓ, నేను నమ్మకస్తుడను” అని నీవు చెప్తావు. “నేను నమ్మకముగా...” వారు చేయుటకు ఒక్క సంగతి కూడా లేదో. “మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్ధముగా ఆరాధించుచున్నారు.”
93
బైబిల్ గ్రంథములో ఎవరు కూడా చిలకరించినవారు, నీళ్ళు కుమ్మరించిన వారు, లేక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమిచ్చినవారు ఎవ్వరూ లేరని నేను మీకు చెప్పియున్నాను. పరిశోధించు. పరిశీలించు. అది అలాగున్నట్లయితే, ఈ రాత్రి వేదికయొద్దకు వచ్చి నాకు చూపించు. అలాటప్పుడు, నీవు ఆ విధముగా చేసినట్లయితే, నీవు మనుష్యుని యొక్క పారంపర్యాచారమును అనుసరించుచున్నావు. “సరే. నీవు పైకి వచ్చి, నీ ఒప్పుకోలును నీవు చేయుము. అప్పుడు పరిశుద్ధాత్మను నీవు పొందుకుంటావు” అని ఎవరైనా నీతో చెప్పినట్లయితే, అది తప్పు, అది మానవ-నిర్మిత సిద్ధాంతము.
అబద్ధపు నీటి బాప్తిస్మము ఒకటి యున్నది. అబద్ధపు పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఒకటి యున్నది. దయ్యము దానిని అనుకరణ చేయుచున్నది, ఎందుకనగా అతడు మతసంబంధమైనవాడు. కయూను, అతని తండ్రి, అది మనకు బోధించబడినట్లుగా అతడు మత సంబంధమైనవాడైయుండెను. సర్పము యొక్క సంతానము ఇంకా కొనసాగుచునేయున్నది. క్రీస్తు ద్వారా వచ్చిన స్త్రీ యొక్క సంతానము ఇంకా కొనసాగుచునే యున్నది. “అయితే, నా తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును రాలేడు.”
94
ఈ ఉదయం ఇక్కడ కూర్చున్న కొందరు, బైబిల్ ప్రకారముగా కాకుండా, మనుష్య ఆచారము ప్రకారముగాను, తప్పుడుగాను బాప్తిస్మము పొందియున్నారని మీకు తెలుసు. అది ఆలోచించండి. ఒప్పుకోలు యొక్క మీ మొదటి జన్మే తప్పు. మీరు వెనుకకు వెళ్ళి, సరిగా ప్రారంభించకపోతే, మీరు ఏలాగు నిజమైనది కాగలరు? ఆరంభము నుండి అది అలాగులేదు అనునది ఈ వారంలో నేను బోధించినది మీకు జ్ఞాపకమున్నదా.
ఒక స్వరము నీతో మాట్లాడుట నీవు వినగలిగినట్లయితే, అది దేవుడు. ఎందుకనగా లేఖనమునకు అది విజోడుగానున్నది. అది అలాగులేనట్లయితే, అటువంటప్పుడు ఒక విధమైన తప్పుడు స్వరం నీతో మాట్లాడుతున్నది. అయితే, నిజమైన స్వరము బైబిల్ యొక్క నియమాలను వెంబడించుమని నీకు తెల్పుతుంది. ఎటువంటి చిలకరింపు కాదు, నీళ్ళు పైన పోయుట కాదు, ఏ అబద్ధము కాదు. నేరుగా వచ్చి బైబిల్ నియమాల యొద్దకు నడిపించును.
ప్రతి దానిని అది స్వీకరించినట్లయితే, స్నేహితులారా, అది చేయుడి, అదెంతటి వెలయైనా నాకు అనవసరం, ప్రభువైన యేసును వెంబడించుటకై ప్రతి దానికి నేను ప్రక్కన పెడతాను. “నా స్వరము వినుడి. నా గొర్రెలు వినును మరియు అవి నా యొద్దకు వచ్చును. నా యొద్దకు వచ్చువారందికి నేను నిత్యజీవమునిచ్చెదను. మరియు అంత్యదినమున వానిని లేపెదను. అది నిజం. అది ఇక్కడే, లేఖనములో సరిగ్గాయున్నది. దాని రుజువును ఎవరును వ్యతిరేకించలేరు. అది నిజం. దానిని ఎవరూ కాదనలేరు. అది ఇక్కడే యున్నది. ఆత్మ యొక్క బలములో యేసు చేసిన కార్యములు చేయుచూ, అది ఇక్కడే యున్నది. ఆయన ఇక్కడే యున్నాడు. ఆయన పఠములో ఉన్నాడు, అదే అగ్నిస్తంభము కదలుచున్నది, అదే ఫలములు, అదే ఆత్మ, అదే భావోద్వేగాలను కలిగియుండి, అదే కార్యాలతో, అదే సూచక క్రియలతో, అదే అద్భుతాలతో ఆయన ఇక్కడేయున్నాడు. అక్కడే నీవున్నావు.
95
ఈ ఉదయం దేవుని స్వరము విను. “సమూయేలు,” అని స్వరము పిలిచినది.
“అవును, ప్రభువా. అవును, ప్రభువా, నేనిక్కడయున్నాను. ఇక్కడ నీ దాసుడున్నాడు. ఇక్కడ నీ దాసుడు యున్నాడు. నేను నిన్ను వెంబడించెదను” అని చెప్పబడెను.
అమ్మా, దేవుడు నిన్ను దీవించును. “సహోదరుడా, బ్రెన్హాం, నీవది చాలా బలమైనదిగా చేస్తున్నావు” అని నీవు చెప్పవచ్చు. అది బలమైనదిగా యుండాలనే నా భావం. అది జీవ-మరణముల మధ్యనున్నది, కాబట్టి నేను దానిని బలమైనదిగా చేయవలసియున్నది.
ప్రభువు మీతో యుండుగాక, అది నా యొక్క విధేయతతో కూడిన ప్రార్థన. ఇప్పుడు, భవనంలోని వస్తు సామాగ్రిని ఇక్కడ నుండి వారు కదిలించకముందు... తద్వారా మీరు బాప్తిస్మము చూడగలరు, అన్నివేళలలో స్థలము తెరువబడి యుంటుంది. నేను చదువునది - మీరది చూచునట్లుగా లేఖనములో నుండి సరిగ్గా కొంత నేను చదవాలనుకుంటున్నాను.
96
యేసుక్రీస్తు (పరిశుద్ధు మత్తయి 16వ అధ్యాయంలో అని నేననుకుంటున్నాను) “పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను: నీవు భూలోకమందు దేనిని బంధించుదువో, అది పరలోకమందును బంధింపబడును; భూలోకమందు దేనిని విప్పుదువో, అది పరలోకమందును నేనది విప్పెదనని” అని చెప్పెను. మీ అందరికి అది తెలుసు కదా?
పెంతెకొస్తు దినమున, దేవుని యొక్క రాజ్యము దాని బలము యొక్క సర్వసంపూర్ణతతో వచ్చినది, మీరది నమ్ముచున్నారా?
పేతురు నిలబడియుండెను.... యేసు మృతులలో నుండి లేచినప్పుడు, రాజ్యము యొక్క తాళపుచెవులు ఆయన యొద్ద లేవు. అది నిజమేనా? ఆయన యొద్ద మరణము యొక్కయు, పాతాళ లోకము యొక్క తాళములు వున్నవి, రాజ్యము యొక్క తాళపుచెవులు కాదు. అతడు బోధ చేయుచూ ఇక్కడ అతడు చెప్పినది ఇదే. మరియు ఈ సంగతులు వారు వినుచుండిరి. వారి హృదయాలు కఠినపరచుకున్నారు. అదే, ఇక్కడ పేతురు నిష్కర్తగా చెప్పినది. లేఖనములు నేను చదువుచుండగా, జాగ్రత్తగా వినుడి. తద్వారా మీరు గ్రహించగలుతారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం.
97
జ్ఞాపకమున్నదా, “ఆరంభము నుండి అది ఆలాగులేదు,” అను ప్రసంగము వినుటకు మీలో ఎంతమంది ఇక్కడున్నారు? మనము ఆరంభమునకు వెనుకకు వెళ్ళిపోయి బాప్తిస్మమనగా ఏంటో, బాప్తిస్మమనగా నిజముగా ఏమైయున్నదో చూచెదము. ఏ విధముగా మనము బాప్తిస్మము పొందవలసియున్నది? చిలకరింపా, క్రుమ్మరించుటా, లేక, “తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ” యొక్క నామమునా? జ్ఞాపకముంచుకో, ఎక్కడైనా, ఏ సమయములోనైనా, ఏ వ్యక్తియైనా, ఏనాడైనా చిలకరింపచేసినట్లుగా, క్రుమ్మరింపచేసినట్లుగా; లేక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము - ఏ దైవసేవకుడు గానీ, ఏ బిషప్పు గానీ, ఏ వ్యక్తి గాని ఇచ్చినట్లు ఒక్క లేఖనము నాకు చూపించమని నేను సవాలు చేయుచున్నాను.
అది బాహాటమైన విషయం. అది లేఖనములలో లేదు. లేదు, అది ఒక అబద్ధము. మూఢభక్తిగా చేయబడినది, కాథలిక్ సంఘము ద్వారా ప్రారంభించబడినది.
98
ఆఖరి శిష్యుడు మరణం తరువాత, షుమారు ఆరు వందల సంవత్సరములకు కాథలిక్ సంఘము ద్వారా చిలకరింపు ఏర్పాటైనది. అదే సమయంలో, “తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ” ఆమోదించబడినది, ఎందుకనగా కాథలిక్ వారు పలు విధములైన దేవుళ్ళను ఆరాధిస్తారు. దేవుని యొక్క కార్య నిర్వాహకములను త్రిత్వముగా వారు చేశారు. ముగ్గురు దేవుళ్ళు కాదు, “తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ.” అది అన్యత్వము. దేవుడు ఒక్కడే.
“నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఓ ఇశ్రాయేలు వినుము, ప్రభువైన నేను నీ దేవుడను, ఒక్క దేవుడను.” “మీ దేవుడు ఎవరు: తండ్రి, కుమారుడు, లేక పరిశుద్ధాత్మ?” అని యూదులు మనలను అడిగారు. వారిలో ఒక్కరైయుండాలి. అదే దేవునిలో పనులు జరిగించిన మూడు కార్యనిర్వాహకములై ఆయనను ఆయనే బయలుపరచుకొనుట. మొదట, తండ్రిలో - తాకలేము, పర్వతము పైన వ్రేలాడుచుండెను, చివరకు ఒక ఆవు లేక జంతువు తాకినచో, చంపబడవలెను. తరువాత ఆయన దిగి వచ్చెను, ఎందుకనగా ఆయన ఆరాధింపబడగోరెను.
99
ఆయన మనుష్యునికి సమీపముగా వచ్చెను, ఎందుకనగా ఆయన మనుష్యకుమారుడాయెను. దేవుడు ఆయనలో యుండెను. ఆయన అది చేసినప్పుడు, ఆయన చెప్పెను, “కొంత కాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నెడు చూడదు; అయితే మీరు నన్ను చూతురు. నేను, (వ్యక్తిగత సర్వనామము) నేను మీతోను మీలోను యుగపర్యంతరము ఉందును.”
“నేను దేవుని యొద్ద నుండి వచ్చితిని” అని చెప్పెను. ఏంటి? అగ్నిస్తంభము. “నేను దేవుని యొద్దకు వెళ్ళుచున్నాను.” ఆయన వెళ్ళెను. ఆయన చేశాడు. తరువాత ఆయన అది చేసినప్పుడు, ఆయన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళెను.
ఈ ఉదయం మన యొక్క పాఠములో, పౌలు, దమస్కు మార్గమున నుండుట మనము చూశాము. మార్గములో ఆయన పౌలును కనుగొన్నాడు. అతనిని నేలకు మొత్తాడు. పౌలు పైకి చూశాడు. ఆయన ఏమైయుండెను? అతని కళ్ళను పొగోట్టిన ఒక వెలుగై, తిరిగి అగ్నిస్తంభమాయెను.
భూమి మీద యేసు ఉన్నప్పుడు, ఆయన ఏమి చేశాడో చూడండి మరియు స్త్రీతో ఆమె యొక్క పాపములను గూర్చి చెప్పెను. ఇతరమైనవన్నీ చేసెను మరియు “మొదట తండ్రి నాకు చూపించనిది నేనేది చేయను,” అని ఆయన చెప్పెను.
“ఎందుకు నీవు అక్కడకు వెళ్ళిపోయి, అక్కడ యున్న వారిని స్వస్థపరచకూడదు?” అని వారు ఆయనను అడిగారు. ఎక్కడైతే కుంటివారు, అంగవిహీనులు, నడవలేనివారు, గ్రుడ్డివారు యున్నారో అట్టి పెద్ద సమూహములో గుండా వెళ్ళుచున్నాడు. సమాస్యతో నున్న ఒకనిని లేక ఒక విధంగా యుండి పడకపై పరుండియున్న వానిని ఆయన స్వస్థపరచాడు.
“వారినందరినీ నీవెందుకు బాగుచేయకూడదు....?” అని వారు అడిగారు.
“మరి నిశ్చయముగా...” (పరిశుద్ధ యోహాను 5:19) ఆయన చెప్పెను, “తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”
100
ఈ కడవరి దినాలలో ఆయన మరలా ఇక్కడకు వచ్చాడు. శాస్త్ర సంబంధమైన లోకము అది కాదనలేదు. సంఘము అది కాదనలేదు. తిరిగి అది ఇక్కడే ఉన్నది. సంఘములోకి వచ్చి అవే సంగతులు చేయుచున్నది. ఆత్మ....
ఆత్మతోను సత్యముతోనూ ఎవరైతే ఆరాధించెదరో వారిని దేవుడు కోరుచున్నాడు. ఇక్కడే ఆయన ఉన్నాడు. పెంతెకొస్తు దినమున ఆయన ఏమి చెప్పాడో ఇక్కడున్నది. పేతురు బోధిస్తున్నాడు.
ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. [మనము సాక్షులమేనా?]
కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడి... పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది, మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించియున్నాడు.
దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు; అయితే అతడిట్లనెను - నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని, ప్రభువు నా ప్రభువుతో చెప్పెను.
మీరు సిలువ వేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను.
101
వారు ఈ మాట విని (అది భక్తిగల ప్రజలైయుండిరి), వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని. “సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును అపోస్తలులను అడుగగా? మనం, కొంచెం ముందుకు వెళ్ళి మేలు చేద్దామా...?” కాదు, కాదు. గమనించు, పేతురు; నీవు రాజ్యపు తాళపుచెవులను కలిగియున్నావు. నీవు వారికి ఏమి చెప్పెదవు... “భూమి మీద నీవు బంధించినప్పుడు పరలోకములో నేనది బంధించెదను,” అని దేవుడు చెప్పెను.
పేతురు - “మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికినీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికి చెందునని వారితో చెప్పెను.”
102
మరొక లేఖనము. దాని తరువాత ముప్పయి-రెండు సంవత్సరములకు ఇక్కడ 19వ అధ్యాయంలో పౌలు:
.... పౌలు పై ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి, కొందరు శిష్యులను చూచి,
మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారినడుగగా
బాప్టిష్టులైన మీరు, అది మీలో లోతుగా పోనియ్యుడి. “మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా?” అది ఒక జన్మ. ఒప్పుకోలు కాదు.
... పరిశుద్ధాత్తడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి.
అప్పుడతడు - అలాగైతే... మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా? [యోహానును బట్టి వారు బాప్తిస్మము పొందియుంటిరి.]
....అందుకు పౌలు - యోహాను మారుమనస్సు విషయమైన [పాపక్షమాపణ కొరకు కాదు, మారుమనస్సు విషయమై], - వెనుకవచ్చు వానియందు, అనగా యేసునందు మీరు విశ్వాసముంచవలెను.
వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి.
తరువాత పౌలు వారి మీద చేతులుంచగా, పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు బాషలతో మాటలాడుచు మరియు దేవుని మహిమపరచిరి.
103
ఇప్పుడు మిమ్మును తీసికొని వస్తాను. పౌలు తన పత్రికను ముగించుచు, గలతీ 1:8.
... మీరు ముందుగా వినునది కాకుండా మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చినయొక దూతయైనను ప్రకటించినయెడల అతడు మీయెడల శాపగ్రస్తుడవును గాక.
కొరింథీయులు 14వ అధ్యాయం, 38వ వచనము ఇలాగు చెప్పబడినది. మీ కొరకై ఇది కూడా తీసికుంటాను.
ఎవడైనను తాను ప్రవక్తననియైనను లేక ఆత్మ సంబందియైనను తలంచుకొనినయెడల... నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు ధృడముగా తెలసికొనవలెను.
ఎవడైనను తెలియనివాడైతే తెలియని వాడుగానే యండనిమ్ము.
104
దానిని గూర్చి మనం ఏం చేయబోతున్నాము? ప్రతి యొక్క రుజువు... నా సంఘము ఏమి అనుకొనినా, లేక నా యొక్క తల్లి ఏమి తలంచినా నేను నీ స్థలములో యుండి క్రైస్తవ బాప్తిస్మము ప్రకారముగా బాప్తిస్మము పొందలేదు. నా ప్రభువు ఏది ఆజ్ఞ ఇచ్చాడో అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.
ప్రభువైన యేసూ, ఇప్పుడు అది నీదేయైయున్నది. ప్రతి హృదయంలో నీవు కార్యము చేయమని నేను ప్రార్ధిస్తున్నాను. ఎవరైతే కుంటలో బాప్తిస్మము పొందుటకై సంసిద్ధంగా యుండియున్నారో అట్టి వారు, నీ కొరకై కనిపెట్టుచుండగా, పరిశుద్ధాత్మను దయచేయుము, ప్రభువా, ఆ దినమున నేను నేరస్తుడగా నుండకుండా, ప్రతివారి రక్తము నుండి విడుదల పొందుటకు. ఒక ఆచారముకై నిలబడక, లేక ఒక సంఘ శాఖకై నిలబడక లేక, ఒక వ్యవస్థకై నిలబడక - నీ వాక్యపక్షముగా నిలబడినవాడనై ఈ గుంపును యేసు నామములో నీకు అప్పగించుచున్నాను. ఆమేన్.