దేవుడు-పిలిచిన మనిషి
VGR COUNT-268 నెవిల్ సహోదరుడా గోడల ప్రక్కన మిమ్మల్ని అలా నిలబెట్టి యున్నందుకు మన్నించండి. ఒక వ్యక్తిగత సమావేశము నిమిత్తము గంటన్నర ముందు నేనిచ్చట నుండి వెళ్ళితిని. మరియు జనులు ద్వారము నుండి వెళ్ళుచున్నారు. నేను వెలుపల బిల్లీని కలువగా, ఈ మధ్యాహ్నము నుండియే కూటము కొరకై సిద్ధపరచుటకు స్థలము ఏర్పాటైనదని అతను నాకు చెప్పెను. కాబట్టి ఇచ్చట మనకు చిన్న కూటము గలదు. దానిని మేము స్థానిక పత్రికలలో కూడా కనీసము ప్రచురించలేదు.
కావున, మనము కొద్దిసేపు ఒక చిన్న సహవాసము కలిగియుందుము. ఎప్పుడూ పని, పనియంటూ ఉరుకులు, పరుగులతో ఇచ్చట నుండి అచ్చటికి, అచ్చటి నుండి ఇచ్చటికి పరిగెత్తుతూ ఆయాసముతో, ఒత్తిడిగా యుంటూ ఈ పట్టణ ప్రజల జీవనవిధానము ఏ విధముగా యుండునో మీరు ఎరుగుదురు. కాబట్టి నేను ఆ విధమైన దానికి అలవాటు పడితిని. అందువలన సాధ్యమైనంతవరకు అటువంటి ఇబ్బంది లేని ఒక స్థలమునకు నేను వచ్చితిని.
2
మీరు కొద్ది సమయాన్ని మాత్రమే కాకుండా ఇంకా అధికమైన సమయమును దేవునితో గడుపవలెనని మీరెరుగవలెను. మీరు ఆ విధముగా చేయనియెడల, స్వచ్ఛమైన పరిశుద్ధాత్మను కలిగిన వారుగా కూటమునకు రాలేరు. నీవు ఈ విధముగా ఏదో గొప్ప గొప్ప తళుకు బెళుకులతో నేడు నీవు లోపలికి వచ్చిన విధముగా వచ్చిన యెడల, మంచిదే, కాని ఆ విధమైన వాతావరణము ఇచ్చట ఆవరించి యున్నప్పుడు కొన్ని సమయములలో నేను లోపలికి రావటానికి ఇబ్బందిపడుదును, ఇబ్బందిగాను మరియు అభ్యంతరకరముగా అలా నేను లోపలికి ప్రవేశించుట నాకు అది కఠినముగా యుండును. మీరు కొద్దిగా తోసుకుంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ యున్నప్పుడు అది నన్ను అభ్యంతరపరచును, మీరు గమనించండి, నేను ఆ విధముగా లోపలికి ప్రవేశించినప్పుడు, లోపల ఎచ్చటా పరిశుద్ధాత్మను నేను కొనుగొనలేను.
3
కావున, నేను ఎంతో విచారించుదును, ఎందుకనగా జనులు ప్రక్కన చుట్టూ, బయట నిలబడియుందురు. వారు ఇచ్చటకు వచ్చి, లోపల చూచి, వారు కారులో కూర్చొంటూ, మరల వెళ్ళిపోయెదరు.
కొన్ని దినములు రాత్రి కూటముల నిమిత్తము నేను పాఠశాలను ఇచ్చటయున్న ఒకదానిని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. కాని ఈ సమయములలో పాఠశాలలు జరుగుచూ వు౦టవి. కావున అటువంటి సమయము నందు పాఠశాలలో ఏర్పాటు చేయటము కష్టమైన పనిగా యుండును.
4
ఈ లోపల, బయట వున్న వారిని మరియు మీ ప్రతీ ఒక్కొక్కరిని, మీ సహకారము కొరకును, మరియు మీరు చేసిన సమస్త కార్యములను బట్టి నిశ్చయముగా మిమ్మల్ని నేను మెచ్చుకొంటూ, మీకు అభినందనలు చెప్పుటకు నేను ఆశించుచున్నాను. ఈ ఉదయకాలమందు, ఆదివారపు పాఠశాలలో కానుకను కోరకుండానే గతరాత్రి కానుకను నాకు ఇచ్చినందుకు ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుచున్నాను. సహోదరుడు ఫ్రాంక్షీ, మన ప్రియమైన కాపరి నెవిల్ గారితోను మరియు ఇచ్చట వున్న వారితోను దానిని ఆ విధముగా చేసియుండకూడదని చెప్పితిని, కాని ఎలాగైతేనేమి వారు దానిని చేసిరి. కాబట్టి అందునిమిత్తమై దానిమీద ఒక నివేదికను ఇవ్వగోరుచున్నాను.
ఇప్పుడు, ఇది ఒక చిన్న స్థలము, ఒక మూడు వందల మంది కూడా కూర్చోలేని స్థలమైయున్నది. మూడు వందలమంది కూర్చోలేరని నేను అనుకుంటున్నాను. వచ్చిన కానుక మూడువందల ఇరువది నాలుగు డాలర్లు వచ్చినది. ఇంచుమించు ఒక్కొక్కరు ఒక డాలరు చొప్పున వేసినట్లు యగుచున్నది. జనులు వేసిన కానుకలలో నాకు వచ్చిన కానుక నా జీవితమందు ఇదే శ్రేష్టమైన కానుకగా యున్నది. అనగా అది ఒక్కొక్క వ్యక్తికి ఇంచుమించు ఇరువది నాలుగు సెంట్స్ అగుచున్నది. ఒక వ్యక్తి ఇరువది-ఐదు, ఇరువది-ఏడు సెంట్స్ వేయడము అది ఒక గొప్ప కానుకయగును. కాని, ఇది సగటున ఒక డాలరు యగుచున్నది. నిశ్చయముగా అందు నిమిత్తమై నేను దానిని మెచ్చుకొనుచున్నాను.
5
ఈ ఉదయ కాలమున బహుశా నేను తీసుకోను. మీలో కొందరు మీలోయున్న దానిని తెలియజేయాలని అనుకుంటున్నారు. జెల్లీ అను తినుబండారము, పెట్టెనిండా జెల్లీ మరియు కొన్ని బహుమతులు మెట్లపై వుండటము మేము చూచితిమి, అవి మాకు బహుమానముగా ఇచ్చిరి. అందునిమిత్తమై నేను మరియు నా భార్య మీకు కృతజ్ఞతలను తెలుపుకొనుచున్నాము. మనమెరిగినంత వరకు అవన్నియు ఎంతో శ్రేష్టమైనవై దేవుని రాజ్యము కొరకై చేయబడినవి అని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను.
నాకు ఒక గొప్ప పెద్ద స్థలము ఉండిన యెడల చాలాసేపు వుండి అలా ప్రసంగిస్తూ ఈ జనులకు సేవచేస్తూ వుండిపోవాలని నాకు ఎంతో ఆశగాను, ఆలోచనగాను యున్నది, కాని ఈ రాత్రి కూడా కూటము ముగిసిన తరువాత నేను వెళ్ళవలసియున్నది. కాని ఈ రాత్రికి నేను వెళ్ళలేనేమో గాని తెల్లవారు జామున వెళ్తాను. శనివారము రాత్రికి తిరిగి వస్తాను, మరలా ఆదివారము ఉదయము కొలరాడోకి వెళ్ళుదును. మరియు అవి అలా ఒకదాని తరువాత ఒకటి కూటములు జరుగుచున్నవి, అటు తరువాత జనవరి నెలలో నేను విదేశాలలో జరుగు కూటములకు వెళ్ళవలెను, అవి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు కొన్ని ప్రాంతాల గుండా వెళ్ళవలెను. ఇప్పుడు, మీరు నా కొరకు ప్రార్థించవలెను. నిశ్చయముగా నేను మీ ప్రార్థనలను ఆశించుచున్నాను.
6
పిదప, ఈ చిన్న కూటములో మనకొరకు చేసిన గొప్ప కార్యముల నిమిత్తము మనమందరము మహోన్నతుడగు ఆ దేవునికి కృతజ్ఞతలను చెల్లించవలెనని నేను ఆశించుచున్నాను. నా జీవితములో ఈ ఆలయములో దీనికి ముందు జరిగిన ఏ ఇతర కూటములన్నింటికంటెను ఈ కూటములో అది సమయమందే ఎన్నో గొప్ప కార్యములు సాధించబడి యున్నవని నేను నమ్ముచున్నాను. ప్రభువు తన ఆశీర్వాదములను తెరచినట్లుగా అది యున్నది.
ఈ కూటమందు నాకు వచ్చిన ఆ దర్శనము ప్రకారముగా బహుశా నా యొక్క సేవ శ్రేష్టమైన మరియు ఒక గొప్ప పరిచర్యగా మారబోవుచున్నదని నేను తలంచుచున్నాను. మీరు విన్న ప్రకారముగాను ప్రజలగు మీరు కలిగియున్నంత నిశ్చయముగా ఆ రెండు లేదా మూడు పరిచర్యలను గూర్చి ముందుగానే ఊహించి చెప్పబడిన రీతిగా అది అట్లే ఖచ్చితముగా జరుగును. ఈ ఒకటి మాత్రము దానివలె ఒక గొప్ప పరిచర్యగా ఉండును. కాని మొదటి రాత్రియందు జనులను కేవలము బలిపీఠము యొద్దకు పిలిచితిని, తిన్నగా ఆత్మలను వివేచించుటలోకి వెళ్ళిపోతిని, రెండవ రాత్రియందు వారిని గదిలోనికి తీసుకొని వెళ్ళి, తిన్నగా ఆత్మలను వివేచించుటలోకి వెళ్ళాను. గత రెండు రాత్రులకు పిదప, ఈ వేదిక యొద్దకు వారిని తీసుకొని వచ్చితిమి, అలాగే తిన్నగా ఆత్మలను వివేచించుటలోకి వెళ్ళాను.
7
కొన్ని కార్యములను మాత్రము వివరించుచున్నాను, ఒక గ్రుడ్డి సేవకుడు తన చూపును ఈ వేదికయందు పొందుకొనెను. గత రాత్రి, డాక్టరు మరియు ఎవరు ఎరుగలేని వ్యాధియున్న చక్రాల కుర్చీలో కూర్చొనియున్న ఇద్దరు బాలికలు ఇచ్చట యుండిరి. వారి పాదములు పెద్దవిగాను, వారి బొటన వ్రేళ్ళు వంకర్లు తిరిగి నట్లుండినవి, వ్రేళ్ళ వంకరలు తిరిగి యున్నవి. వారికి ఏమి చేయలేని పరిస్థితిలో వారుండిరి. ఆత్మ నన్ను అభిషేకించినప్పుడు నేను వారియొద్దకు వెళ్ళి, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఆ వ్యాధిని శపించితిని, వారు ఆ చక్రాల కుర్చీ నుండి పైకి లేచి నడవసాగిరి. ఈ ఉదయమున ఈ మందిరమునకు వారు నడుచుకొంటూ వచ్చి, అందరి పిల్లలవలె వారు కూడా బాప్తిస్మము తొట్టి దగ్గరకు వచ్చి ఈ ఉదయమున బాప్తిస్మమును తీసుకొనిరి.
8
కొద్ది నిమిషముల క్రితము నేను వాక్యమును ధ్యానించుచుండగా, నా స్నేహితులలో ఒకరగు సహోదరుడు హూవర్, కెంటకీలో సేవ చేస్తున్న సహోదరుడు, వెళ్తూ, నా భార్య దగ్గర ఒక మాటను అతడు చెప్పెను, గత రాత్రి కూటమందు ప్రార్ధనా వరుస క్రమమున జనులలో నుండి వారిని పిలుచుచుండగా, ఏ ప్రార్థనా కార్డు లేక మరి ఏదియు లేని ఒక స్త్రీ, తన కుర్చీలో కూర్చొని కేవలము ప్రార్థించుచుండెను. ఆమె కడుపులో గడ్డలు పెరిగి ఆ గడ్డలు కడుపునంతా ఆక్రమించినందున, ఆమె ఎన్ని దినములుగా ఆహారమును తీసుకోలేదో నేను మర్చిపోయాను. కాని, దేవుడు ఆమెను పిలిచి, ఆమెను స్వస్థపరచెను. ఈ ఉదయ కాలమందు ఆమె లేచి అందరిలాగే అల్పాహారము తిని బాగై, ఈ రాత్రి ఇచ్చటే ఎచ్చటో ఆమె కూర్చొనియున్నది. ఇతరులు దానిని గూర్చి చెప్పిరి. ఓ, మన ప్రభువు జరిగించిన ఈ కార్యములన్నింటిని చెప్పుటకు సమయము చాలదు. కావున, ఏదో ఒక గొప్ప కార్యము సంభవించుటకు సమయము ఆసన్నమైనదనే దానిని గూర్చి మనమెరుగుటవలన మనకు అది ఎంతో ధైర్యమును ఇచ్చుచున్నది.
9
నిన్న సాయంకాలమందు, కూటము తరువాత, వర్తమానము ముగిసిన తరువాత, నిన్న రాత్రి పరిశుద్ధాత్మ జనులను అభిషేకించిన విధముగా గతములో నేనెన్నడూ చూడలేదు, అంతగొప్పగా నేనెన్నడూ చూడలేదు. గతరాత్రి యందే అది ఆ విధముగా జరిగినది. ఇంకా ముందుకు కొనసాగిపోవుటకై వేరొకదాని కొరకై ఈ రాత్రి మనము ఎదురు చూచుచున్నాము కాబట్టి ఇప్పుడు నా కొరకు ప్రార్ధించండి.
దేవుని యొక్క ఆశీర్వదించబడిన వాక్యమును చదవవలెనని నేను ఆశించుచున్నాను. వాక్యమును చదువుటకు ముందుగా మనము మన తలలను వంచి కొద్దిసేపు ఆయనతో మాట్లాడెదము.
10
ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ రాత్రియందు మేము మీ యొద్దకు వచ్చుచున్నాము. బహుశా మా శరీరము కొద్దిగా అలసిపోయివున్నది, గాని మా ఆత్మలు ఎంతో ఉత్సాహంగా యున్నవి. జీవముగల దేవుని యొక్క సూచనలు జరిగించుచూ, నీవు మాతో ఉంటూ, నీవు మాకు ఇచ్చిన నీ యొక్క వాగ్దానము మాకు సాధ్యము కాని మరియు మా ఆలోచనకు అందలేని గొప్ప అత్యధికమైన విస్తారమైన ఆశీర్వాదములును మాకు అనుగ్రహించితివి. మీ కుమారుడగు, ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా మేము విశ్వసించుచూ మీ యందు కృపను కలిగియుండిన మేలు, రెండింతలు ఆత్మతో మరలా మీరు మమ్మల్ని దర్శించవలెనని ఈ రాత్రి యందు మేము కోరుచున్నాము. సువార్తను నమ్ముటకును, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని వారి జీవితములలో పొందుకొనుటకు ఇచ్చట యున్న ప్రతీ వ్యక్తిపై కొలవలేని మీ యొక్క గొప్ప శక్తిని కుమ్మరించబడును గాక. ఈ రాత్రి రక్షింపబడుగోరువారిని రక్షించుము, ప్రభువా, స్వస్థతను పొందుకొనుటకు సిద్ధముగా ఉన్నవారిని స్వస్థపరచుము. ప్రభువా, దీనిని అనుగ్రహించుము.
11
జనులు త్రోక్కిసలాడుకుంటూ తలుపుల యొద్దనే నిలబడియుండుట వలన లోపలికి రాలేక చిన్న సంఘము నుండి వందలకొలది మంది వెనుకకు వెళ్ళిపోవుట మనము చూచుచున్నాము. అది యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఒక్కటే రీతిగా యున్నాడనే దానిని జ్ఞాపకమునకు తీసుకొని వచ్చుచున్నదిగా యున్నది. ఆయన శరీరధారియై ఈ భూమిపై మన మధ్యయున్నప్పుడు ఆ ఇంటియందు గొప్ప జనసమూహము కూడియుండుట వలన, మంచము పట్టిన ఒక వ్యక్తిని, ఆయన యొద్దకు లోపలికి తీసుకొని వెళ్ళుటకు కూడా స్థలము లేనందున వారు ఆ ఇంటి కప్పును తీసి పై నుండి ఆయన యొద్దకు క్రిందికి దింపినట్లుగా, ఆ వ్యక్తి ఏ విధముగా మీ యొద్దకు వచ్చి ఆశీర్వాదము పొందుకొనెనో - అదే విధముగానే ఈ రాత్రి ఇచ్చటయున్న ప్రతీ ఒక్కొక్కరు అలాగు ప్రేమ ఫలమును పొందుకోవలెనని ప్రభువా మేము ప్రార్థించుచున్నాము.
మీ వాక్యమును మేము చదువుచుండగా, దానిని ఆశీర్వదించుము. అది మా మార్గమునకు దీపముగాను, ఒక వెలుగుగాను యుండును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున దీనిని మేము అడుగుచున్నాము. ఆమేన్.
12
ఈ ఉదయమున నేను పిలిచిన ఆ అమ్మాయి గురించి ఇప్పుడే నాకు వివరణ ఇవ్వబడినది. మద్యమునకు బానిస అయిన ఈ అమ్మాయిని చికాగో కూటములో పిలిచితిని. ఆమె వరండాలో కూర్చొనియున్నప్పుడు “ఆమె మద్యమునకు బానిస” అని పరిశుద్ధాత్మ ఆమె గురించి నాకు చెప్పెను. చికాగోలోనున్న ఐదుగురు గొప్ప వైద్యులు ఆమెకు వైద్యము చేసి వదిలేసారు. మద్యమునకు బానిసలగు వారిని విడిపించు ఒక సంస్థ గలదు. అచ్చట కూడా ఈమె పరిస్థితిని చూచి వారు ఏమి చేయలేకపోయిరి. “ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు,” అని ఆమెను పిలిచెను, ఆమె స్వస్థపరచబడినది. అప్పటి నుండి మరలా ఆమె ఎప్పటికిని మద్యమును తాకలేదు.
13
కాల్మెట్ పట్టణములో నివసించుచున్న ఆమె స్నేహితురాళ్ళలో ఒకరైన స్త్రీ, ఆమెకు పైన అదే వరండాలో కూర్చొని యుండెను. ఆ పట్టణము ప్యారిస్, ఫ్రాన్స్ అంచులలో వున్నందున, అన్ని చెడు కార్యములకు ఉనికి పట్టెనటువంటిది. అది ఇంకా బహు చెడ్డదైన ఒక పట్టణము. ఆమె మాదక ద్రవ్యములను అమ్మే ఒక స్త్రీ అనియు, మరియు ఫ్రెడ్ అస్టైల్ అనే దానిలో నర్తకి అనియు ఆమె చెప్పినది. ఆమె తండ్రి దానిని నిరాకరించెను, కాని ఆమె లేచి నిలబడి, “ఆయన నిశ్చయముగా మంచి వ్యక్తి, నాన్న” అని చెప్పినది. ఇప్పుడు ఆమె వివాహితురాలై, ఆమె భర్తతో కలిసి సువార్త సేవలో పాలుపంచుకొనుచున్నది.
రోసెల్లా ఒక మిషనరీ సేవకురాలు ఒక్కొక్క చెరసాలకు వెళ్ళుచూ, మద్యమునకు బానిసలైన వారి యొద్దకు వెళ్ళి వారితో మాట్లాడుచు, వారి కొరకు ఆమె చేయగలిగినదంతా చేస్తూ, ఒక నిరీక్షణ గలదు, ఆ నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తులో గలదని వారికి చెప్పుచూ సేవచేయుచున్నది.
14
ఆమె తన తండ్రి నిమిత్తము ఎంతో బాధను కలిగియున్నది. మొన్నటి దినమున పది నిమిషములు ఆమెకు ఒక వ్యక్తిగత సమావేశము యుండినది. ఆ అమ్మాయి గత నాలుగు లేదా ఐదు సంవత్సరములుగా కూటముల కొరకు ఎంతో సహాయము చేయుచున్నది. ఆ సమావేశము ఏ విధముగాయున్నదని పరీక్షించుచున్న ఆ పది నిమిషాలు వ్యవధిలో ఆమె నాతో ఇలా చెప్పినది. “బ్రెన్హాం సహోదరుడా, నీవు ఏమి చేసిన్పటికీ, నేను నా తండ్రి గూర్చి ఎంతో భారమును కలిగియున్నాను. అతడు నిన్ను ప్రేమించుచున్నాడు, కాని అతడు క్రీస్తు దగ్గరకు మాత్రము రాడు,” అని చెప్పినది.
“రోసెల్లా, దానిని ఏ విధముగా చెయ్యాలని దేవునికి తెలుసు, అతనిని తనవైపు ఏ విధముగా త్రిప్పుకోవాలనేది కూడా దేవునికి తెలుసు,” అని నేనన్నాను. అతడు సున్నపు రాయిని మోసుకొస్తున్న బండి క్రింద శవములా పడియున్నాడని ఇప్పుడే వార్త వచ్చినది. అతడి కొరకు ప్రార్థించెదము. ప్రభువా, విశ్వాసముగల అతని కుమార్తె యొక్క నోటి నుండి వచ్చిన మాటలను ఎరిగినవాడవై ఆ సున్నపురాయి బట్టి క్రింద పడటము దేవుడు పిలిచిన మనిషి వలన అతడు మరణించుటకు హేతువై, మరణము అతనిని అచ్చట బంధించి యుండగా, అది ఆ విధముగా సంభవించకుండా కాపాడుటకు కృపను అనుగ్రమించుము,ఆ సున్నపురాయి బట్టీ క్రింద నుండి అతని ఆత్మవైపు చూస్తూ నీవు దేవుడవైయుండి తన ప్రార్థనకు జవాబును ఇవ్వగలవని నిన్ను జ్ఞాపకము చేసుకొనుచుండగా, అతడు ఆ చేప కడుపులో నుండియు లేదా అగ్ని గుండములో నుండియు, లేదా సింహముల గుహలో నుండియు ప్రార్థనలకు జవాబిచ్చిన అదే దేవునిగా నీవు యున్నావు. నీవు ఇంకా ఏకరీతిగానే యున్నావు. కట్టబడిన ఒక క్రైస్తవునిగా ప్రభువా, నీవు అతనిని తీసుకొనిరా, నీవు ప్రేమించువారికి సమస్తము సమకూడి మంచికే జరుగునని మేమెరుగుదుము. అటువంటి మంచి కార్యములలో ఇది కూడా మంచికే సమకూడి జరుగవలెనని ప్రభువగు యేసుక్రీస్తు నామమున మేము దీనిని మీకు సమర్పించుకుంటున్నాము. ఆమేన్.
15
ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథములో నుండి II రాజులలో నుండి రెండవ అధ్యాయము చదువవలెనని నేను ఆశించుచున్నాను. దేవుని చిత్తమైతే చిన్న పార్యాంశమును, ఒక అంశము కొరకు తీసుకోవాలని అనుకుంటున్నాను.
“యెహోవా సుడిగాలిచేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలీయాయు, ఏలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా,
ఏలీయా, “యోహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ నుండుమని” ఎలీషాతో అనెను. ఎలీషా, “యెహోవా జీవముతోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని,” చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి.
బేతేలులో ఉన్న ప్రవక్తల పుత్రులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు, “యెహోవా నీయొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొనిపోవునని నీవెరుగుదువా?” అని ఎలీషాను అడుగగా అతడు నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను.
పిమ్మట ఏలీయా - “ఏలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని,” ఎలీషాతో అనగా అతడు “యెహోవా జీవము తోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువననెను” గనుక వారిద్దరు యెరికోకు ప్రయాణము చేసిరి.
యెరికోలో నున్న ప్రవక్తల పుత్రులు ఎలీషా యొద్దకు వచ్చి “నేడు యోహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొనిపోవునని నీ వెరుగుదువా?” అని ఎలీషాను అడుగగా, అతడు “నేనెరుగుదును మీరు ఊరకుండుడనెను.”
అంతట ఏలీయా - “యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ వుండుమని,” ఎలీషాతో అనగా అతడు, “యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని” చెప్పెను గనుక వారిద్దరు ప్రయాణమై సాగివెళ్ళిరి.
16
ఆయన యొక్క వాక్యమునకు ప్రభువు తన ఆశీర్వాదములను చేకూర్చును గాక. నేటి రాత్రియందు నేను మాట్లాడు అంశమేదనగా: “దేవుడు-పిలిచిన మానవులు,” ఎంత క్లుప్తముగా దీనిని ముగించవలెనో అంత క్లుప్తముగా ముగించుటకు నేను ప్రయత్నించెదను, ఎందుకనగా మనకు ఇంకా కొద్దిసేపులో పెద్ద ప్రార్ధనా వరుస వచ్చుటకు సిద్ధముగా యున్నది, కాని మనము జీవించుచున్న కాలములను గురించి కొద్దిగా మన దృష్టిని కేంద్రీకరి౦చెదము.
17
“ప్రభువా, మా కాలమునందు మాకు ఉజ్జీవమును అనుగ్రహించుము” అని అంటూ యదార్థ హృదయములతో రేడియోలలోను మరియు వివిధ స్థలములలో నుండి కేకలు వేస్తూ అడుగటము మనకు వినబడుచున్నది. ప్రపంచమంతాయున్న క్రైస్తవుల ఉత్తరముల నుండి మనము ఆ కేకను వినుచున్నాము మరియు అది నీ హృదయమునకు ఏదో ఒకటి చేయుచున్నది. ప్రభువు యొక్క జనులు ఒక ఉజ్జీవము కొరకు ఆశించే ఆ కేకలను వినుట వలన అది ఆత్మను ప్రేరేపించుచున్నది. అది ఆత్మను పైకెత్తుచున్నది, మరియు అది ఆత్మను పునర్జీవింపజేయుచున్నది.
18
“జనులు ఏకముగా కూడి నా నామము ద్వారా అడిగి ప్రార్ధించునప్పుడు పరలోకము నుండి నేను దానిని వినెదను” అని దేవుడు ఒక వాగ్ధానము చేసియుండెను.
కనుక ఈ రోజు రాత్రి ఆ విషయమును గూర్చి ఆలోచించుదాము, మరియు ఈ కేకలన్నింటి మధ్య ఆయనకు అనుకూలముగా ప్రవర్తించు మానవులను ఆయన కలిగియుండేంత వరకు దేవుడు ఒక ఉజ్జీవమును పంపడనేది మీరు జ్ఞాపకముంచుకోండి. దేవుడు పిలిచిన మానవుల వంటి మానవులను - దేవుడు తర్ఫీదు చేసిన మానవుల వంటి మానవులని, మనము పొందు కొనేంతవరకు మనము ఒక ఉజ్జీవమును పొందుకోలేము. అది వేదపాట శాలల ద్వారా మరియు విద్య ద్వారా పొందునటువంటి తర్ఫీదు కాదు, కాని రాటుదేలిన విశ్వాసముగల మానవులని, ఆయన యొక్క ఖటోర తర్ఫీదు అనే పాఠశాల నుండి దేవుడు వారిని తీసుకొని వచ్చువాడుగా వారు యుండును. అగ్నిని ఎదుర్కొనుటకు భయపడని మానవులుగా యుండును, దేవుని సన్నిధిలో నుండి వచ్చిన వ్యక్తిగా యుండును, దేవుని శక్తిని ఎరిగినవారుగా, ఆయన యొక్క సర్వశక్తిని ఎరిగినవారుగా, ఆయన యొక్క స్వస్థత శక్తిని ఎరిగిన మానవులుగా వారు యుండును! జీవించుచున్న దేవునిని ఎరుగుటకై కొంతమంది వ్యక్తులు తర్ఫీదును పొందుదురు! వాక్యము ద్వారా వారిని తర్ఫీదు చేయుట మంచిదే, అయితే అక్షరము చంపును; ఆత్మ జీవింపజేయును.
19
ఈ ఉజ్జీవమును మనము పొందుకొనుటకు ముందుగా వర్తమానము మోసుకొని వెళ్ళుటకై, దేవుడు వెలుపలికి పిలిచిన మానవులుగా మరియు తర్ఫీదునిచ్చిన మానవులు, (దేవుడు తర్ఫీదునిచ్చిన మానవులుగా) వారు యుండవలెను. అటువంటి వారి ఎంతటి వ్యతిరేకత యున్నను దానిని గురించి వారు లెక్కచేయరు. అగ్నిగుండమైనను లేదా సింహపు గుహయైనను లేదా అది ఏమైనగాని వాటిని జయించుటకు వారు ఇష్టపూర్వకముగానే వెళ్ళుదురు. వాటిని సంధించుటకు వారు ముందుకు వెళ్ళుటకు సిద్ధపడెదరు, ఎందుకనగా వారు దేవుని సన్నిధిలో ఉంటూ మరియు ఆయన శక్తిని ఎరిగినవారుగా ఉందురు. అది జయమో లేదా అపజయమో ఏదైనాగాని వారు ఎప్పుడూ ఒకేలాగా నిలబడి యు౦దురు. ఆ విధమైన తర్ఫీదును దేవుడు ఆ మనుషులకు ఇచ్చును.
దేవుడు తన యొక్క మనుషులకు ఇచ్చునటువంటి తర్ఫీదు, దేవుడు చేయునటు వంటి విధానమును ఆలోచించిన అది ఎంతో వింతగా యుండును, కాని దేవుడు అట్లే చేయును.
20
మన యొద్ద ఉన్న మనము పాడే ఆ పాటను మీరెరుగుదురు. “కొందరు నీళ్ళగుండా వచ్చితిరి, మరికొందరు జలప్రళయముల గుండా వచ్చితిరి. కొందరు భారమైన బాధలగుండా వచ్చితిరి, కాని అందరూ ఆ రక్తముగుండా వచ్చితిరి,” దేవుడు తన జనులను శుద్ధి చేయుటకై వారిని గొప్ప శ్రమలగుండా నడిపించును మరియు కొన్నిసార్లు అది చేయుటకు సంవత్సరములు పట్టవచ్చును. ఈ రోజు రాత్రి నామట్టుకైతే, కాలమనే శ్రమల గుండా ఏ మానవులైతే వెళ్ళుచున్నారో అటువంటి వారు శత్రువుని ఎదుర్కొనుటకై వారిని మొదట వరుస (యుద్ధ భూమి) యందు నిలబెట్టి వారి కాళ్ళు సడలి పోకుండా ధీటుగా ధైర్యముతో నిలబడుటకై దేవుడు అటువంటి మానవులను తర్ఫీదు నిచ్చుచున్నాడని, నేనిప్పుడే దానిని నమ్ముచున్నాను. సమస్తము నశించిపోయినట్లుగా కొన్ని సమయములందు మనకు కనిపించినను, అయినాగాని వాటన్నింటి మధ్య వారు దేనిని లెక్క చేయకుండా ముందుకు అడుగు వేసుకుంటూ వెళ్ళుటకు జీవముగల దేవుడు వారితో యున్నాడని వారెరిగి గంభీర వదనములతో ముందుకు కొనసాగిపోయెదరు.
21
అనేకమంది జనులు ఉజ్జీవము కొరకు ప్రార్థించుచున్నారు. ఎవరైతే ఆ విధముగా ప్రార్ధించుచున్నారో, వారి సొంత ప్రార్ధనలలో ఆశీర్వాదపు ఊటలను ఆపుచేయలేకపోవుటను బట్టి అది కొన్నిసార్లు నాకు ఆశ్చర్యమును గొలుపుచున్నది. ఎప్పుడైతే వారు దేవునిని నమ్ముటకు భయపడెదరో, ఆయన వాక్యమందు ఆయనను స్వీకరించుటకు భయపడెదరో, ఆయన ఇంకా నేటివరకు జీవిస్తూనే యున్నాడని నమ్ముటకు భయపడెదరో, “ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా యున్నాడు” అని ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథము స్పష్టముగా చెప్పుచుండగా దానిని ఎవరైతే నమ్మరో అట్టి వారు పిరికి వారగుదురు.
22
తెలివైన వారిని, విద్యావంతులను మరియు జ్ఞానవంతులను దేవుడు పిలువనే పిలువడు (చాల అరుదుగా). వారి పాత్రను వారు నిర్వహిస్తారు మరియు వారు గొప్ప మనుషులే, కాని సహజముగా దేవుడు ఎవరైనా ఒకరితో తన కార్యమును చేయించుకోవాలని ఆశించినప్పుడు అతడికి కనీసము అ,ఆ, ఇ, ఈ లు కూడా ఎరిగియుండటమనేది కష్టమే. లేఖనములను పరిశీలించండి. చరిత్రల ద్వారా వెదికి చూడండి, దేవునితో కొంత అనుభవమును కలిగియున్న ఏ వ్యక్తియైనాగాని వారు గొప్ప విద్యావంతులు కారు, కాని విద్యలేని వారిని మరియు పూర్ణహృదయముతో దేవునికి సేవ చేయాలనే వాంఛను మాత్రము కలిగియున్నటువంటి వారినే ఆయన ఎన్నుకొనును. అరక దున్నేవారిని, గొర్రెల కాపరులను, చేపల పట్టు వారిని, వేటగాండ్రను మరియు అట్టివారు ప్రకృతిలో నివసించెడివారుగా యుందురు. ప్రశాంతమైన మరియు నిర్మలమైన వాతావరణమునందు దేవుడు అచ్చటే వారితో మాట్లాడతాడు మరియు అట్టివారినే దేవుడు పిలుస్తాడు.
23
ఒకవేళ వారు దీనిని కనుగొనినయెడల, ఒక గొప్ప జ్ఞానవంతుడను దేవుడు పిలిచినయెడల, అట్టి జ్ఞానవంతుడు చివరకు మరలా తన యొక్క జ్ఞానయుక్తమైన తలంపులతో వెనుకకు వెళ్ళిపోవును. కొద్ది దినముల తర్వాత బహిరంగముగా ప్రత్యక్షమగుచున్న కార్యమందు క్రియ చేయవలసినప్పుడు, అతడు తన జ్ఞానయుక్తమైన తలంపులతో, లోక జనులతో ఏకమైపోయి వారితో వాటిని ఏకీభవిస్తాడు. చిట్టచివరకు దాని ఫలితమేమనిన ఒక సంఘ శాఖలో చేరిపోయి మరియు అన్నింటిని వదిలిపెట్టి మరియు ఒక సంఘ శాఖకు సేవకుడిగా అతడు మారిపోతాడు. అది అంతే, ఆ విధముగా చేసిన వ్యక్తిపై నాకు ఎటువంటి వ్యతిరేకతలేదు. సహజాతీతమైన కార్యము నిమిత్తము ఏదో ఒకదానిని చేయుటకు దేవుడు సిద్దమగునప్పుడు, సహజముగా ఆయన తాను నమ్మగలిగే ఒక వ్యక్తిని తీసుకొని, అతడిని అభిషేకించి మరియు అతడిని వెలుపలికి పంపించినప్పుడు, అతడు తన కర్తవ్యమునందు భయమెరుగనివాడుగా యుండును.
అటువంటి మనుష్యులు ఇప్పుడు మనకు కావలసియున్నది, నిజాన్ని కప్పిపుచ్చి పూతపూసే మేధావులను కాదు కాని, దేవునిలో యున్న ఆయన యొక్క పునరుద్ధరణ శక్తిని ఎరిగిన మనుష్యులు కావలసియున్నది.
24
ఉదాహరణ కొరకు, పరిశుద్ధ గ్రంథమందు ఒక వ్యక్తి గలడు. అతడి పేరు మోషే. అతడు లోక సంబంధమైన సమస్త తర్ఫీదులను పొందియున్నాడు. సమస్త వేదాంత పాండిత్యమును అతడు ఎరిగియున్నాడు. అతడు ఎరుగవలసియున్న సమస్తమును అతడు ఎరిగియున్నాడు. ఒకవేళ అతడికి ఏదైనా విద్య అవసరమైనయెడల, ఇశ్రాయేలులో లేదా ఐగుప్తులో యున్న బోధకులకే అతడు బోధించగలడు. అతడికి ఏదియు అవసరము లేదు. ఐగుప్తీయుల సమస్త జ్ఞానమును అతడు అభ్యసించి యుండెనని పరిశుద్ధ గ్రంథము మనకు తెలుపుచున్నది, అంతెందుకు, వాళ్ళయొక్క మేధావులకే అతడు బోధించగలడు, వాళ్ళయొక్క శాస్త్రవేత్తలకే అతడు బోధించగలడు. విజ్ఞాన సంబంధమైన సమస్య బయలుదేరితే దానిని పరిష్కరించుటకు అతడే పరిష్కారిగా యుండెను. జ్ఞాన సంబంధమైన సమస్య బయలుదేరితే దానిని పరిష్కరించుటకు అతడే పరిష్కారముగా యుండెను. అయినాగాని, అచ్చట ఆ ఏడారియందు అతడు నేర్చుకొన్న ఆ సమస్త జ్ఞానమును అతడిలో నుండి వెలుపలికి గొరిగి తీయుటకు దేవునికి నలుబది సంవత్సరములు పట్టెను. ఆ ఎడారి ఇసుకయందు ఎప్పుడైతే దేవుడు అతడిలోయున్న ఆ సమస్త జ్ఞానయుక్తమైన తలంపులన్నింటిని వెలుపల గొరిగి తీసివేసెనో, అప్పుడు ఆ లోహము మలచబడుటకు సిద్ధముగా యుండెను.
ఆ విధముగానే ఆయన తన మనుషులను తీసుకొని వారిలోయుండు సమస్తమైన భయాందోళనలను మరియు సమస్తమైన వారియొక్క లోకసంబంధమైన జ్ఞానమంతటిని కొట్టి, తీసివేసిన పిదప ఆ గొప్ప పరమ కుమ్మరి వారిని సారె మీద వుంచి వారిని మరలా మలుచుటయే దేవుని యొక్క విధానమై యున్నది. అది యోగ్యమైన పనితనమైయున్నది. అతడే దేవుని యొక్క మనిషులుగా యుండును. దేవునికన్నా గొప్పగా ఒక మనిషిని ఎవరు తర్ఫీదు చేయగలరు? వారిని ఏ విధముగా ఆయన తర్ఫీదు చేయుచున్నాడో గమనించుము.
25
దావీదు అనే పేరుగల ఇంకొక వ్యక్తిని గురించి మనము ఆలోచించుదాము. దావీదు చిన్న బాలుడుగా ఉన్నప్పటి నుండీ దేవుడు అతడిని తర్ఫీదు చేయుచుండెను. ప్రవక్త సమూయేలు అచ్చటికి వచ్చి అతని తలపై నూనెను పోసి, అతడిని అభిషేకించెను, ఎందుకనగా దావీదును ఒక గొప్ప యోధుడుగా దేవుడు తర్ఫీదు చేయబోవుచున్నాడు. అతనికి దేవుడిచ్చిన తర్ఫీదు ఎటువంటిదో చూడండి.
కొన్ని దినముల ముందు (నేను ప్రార్థించుటకై ఎప్పుడూ వెళ్ళే గ్రీన్ మిల్ అను స్థలమందు) వాక్యము ధ్యానించుచుండగా, దావీదుతో దేవుడు ఇలా, “నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొని, నీ తండ్రి యొక్క గొర్రె మందలను నీవు కాయుచుండగా, లోకములోయున్న మనుషులకు గల పేరువంటి గొప్ప పేరును నీకు కలుగచేయుదును” అని చెప్పెను. కఠినమైన తర్ఫీదును దేవుడు దావీదుకు ఇచ్చెనని నేను తలంచుచున్నాను. ఆయన లోక సంబంధమైన ఏదో ఒక పాఠశాలయందు దావీదుకు తర్ఫీదు ఇవ్వలేదు కాని దేవుడు తన యొక్క స్వంత పాఠశాల యందే ఆయన అతడికి తర్ఫీదును ఇచ్చెను.
26
దావీదు ఒక వేటగాడు మరియు ఒక గొర్రెల కాపరి, కీర్తనలలో పచ్చిక బయళ్ళను గురించి మరియు శాంతికరమైన జలములను గూర్చి అతడు రచియించెను, ఎందుకనగా అతడు అచ్చట తానొక్కడే ఏకాంతముగా గడిపెను. లోకసంబంధమైన కార్యములలో అతడు తనను కలుషితము చేసికొనలేదు. లోకసంబంధమైన కార్యములకు దూరముగా యుండు ఒక మనిషినే దేవుడు కలిగియుండును. ఆ విధముగానే ఆయన అతనిని నిమ్మళింపచేయును. తద్వారా అతడు దేవుని యొక్క మెల్లని మరియు సన్నని స్వరమును వినగలుగును. పిదప, అతడు దేవునితో ఎప్పుడైతే సంబంధమును కలిగియుండునో తర్వాత అతడు భయమే లేని ఒక మనిషిగా మారిపోవును. ఎవరేమి చెప్పినను దానిని గూర్చి అతడు లెక్కచేయడు, అతడు దేవుని యొక్క సన్నిధిలో యుండి యున్నాడు. దేవుని యొక్క పునరుత్థాన శక్తిని గూర్చి అతడు ఎరిగియుండును.
అటు తర్వాత, దావీదును మనము గమనించి చూద్దాము. ఒకానొక దినమున ఒక ఎలుగుబంటు వచ్చి అతని మందలోని ఒక గొట్ట పిల్లను అపహరించుటకు ప్రయత్నించునట్లుగా దేవుడు దానికి అనుమతినిచ్చెను. దావీదు ఆ ఎలుగుబంటు నోటినుండి ఆ గొర్రేపిల్లను విడిపించెను. అతడు ప్రార్ధించాడు అనుటకు ఏ సందేహము లేదు; అటు తర్వాత కొద్ది దినముల తర్వాత అతడు తన నోటిద్వారా దానిని చెప్పెను. అతడు ప్రార్ధించి మరియు దేవునిని అడిగెను. అతడు ఆ గొర్రెకు భద్రతను కల్పించవలెను. ఆ గొర్రెను అతడు పోగొట్టుకోలేడు, ఏది ఏమైనాగాని ఖచ్చితముగా అతడు ఆ గొర్రెను కాపాడవలసియున్నది. తన యొక్క ఒడిసెలను తటాలున చేతిలోకి తీసికొని ఆ ఎలుగుబంటును గురిచూచి దానిని చంపెను. ఆ గొర్రెను అతడు రక్షించవలసియున్నది. గమనించారా, ఎందుకొరకు దేవుడు అతడికి తర్ఫీదు ఇచ్చెనో?
27
ఆయన గొర్రెల కాపరులు తన గొర్రెలను కాపాడి రక్షించవలెనని దేవుడు ఆశించుచుండెను, ఆ గొర్రె ఏమని పిలువబడుచున్నను మరియు అతడే ఏ మార్గమున వెళ్ళినాగాని దానితో సంబంధము లేదు. ఆ గొర్రెలను కాపాడుము! అటు తర్వాత దేవుడు ఆ ఎలుగుబంటు ఎదుట దావీదు కనపరచిన ధైర్య సాహసమును చూచెను, కాబట్టి ఆ చిన్న యోధునిని ఎదుర్కొనుటకు ఇంతకుముందు వచ్చిన జంతువు కంటే ఇంకా ఎక్కువ బలముగల జంతువును ఆయన అనుమతించెను, తన మందలోని ఒక గొర్రెను అపహరించు కొనిపోవుటకై ఆయన ఒక సింహమును పంపించెను.
సింహము ఒక క్రూరమైన మృగము. ఒ, ఆఫ్రికాలో నేను వేటాడుచున్నప్పుడు... “జాక్ రాబిన్సన్” అని ఒక పేరును నీవు ఉచ్చరించి ముగించేటప్పటికే ఒక సింహము పదిమందిని చంపివేయగలదు. ఓ, బలమైన, గొప్ప మృగమది! కేవలము ఒక్కసారి గర్జించి మనుషులను అలాగే తినివేయును. ఒక వ్యక్తిపై సింహము దాడి చేసినయెడల, దాని దాడికి అతడు అసలు నొప్పి అనేది లేకుండానే తన ప్రాణాలను వదిలివేస్తాడు. అది ఒక్కసారి గర్జించిందంటే ఆ శబ్దాన్ని వినిన వెంటనే బహు భయముతో అతడు ప్రాణాలను విడుచును. దాని పంజాను అది విప్పిందంటే ఒక నిమిషములో అది పండ్రెండు మందిని చీల్చివేయగలదు.
28
ఒక చిన్న బాలుడిని గురించి ఆలోచించండి. అతడు ఎర్రనివాడని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, అనగా చిన్న వడిసెలను కలిగిన ఒక చిన్న బుడత అని అర్థము. వడిసెల అనగా ఒక చిన్న చర్మపు ముక్కకు ఇరువైపులా త్రాడు వంటి దానితో చేర్చి ముడివేయబడి యుండును. ఇదివరకే తన నోటితో రక్తము యొక్క రుచిని మరిగిన, ఆకలిగొనియున్న ఒక సింహము పరుగున వచ్చి అతడి మందలోయున్న ఒక గొర్రెను దాని నోటితో కరచి పట్టుకొనెను, దావీదు తన తలను పైకెత్తి దేవునివైపు చూస్తూ, “దానిని నేను పోగొట్టుకోలేను, ప్రభువా, నీవు నాకు సహాయము చేయుము,” అని ప్రార్థించెను. తన వడిసెలను తీసుకొని దానితో ఒక దెబ్బతో దానిని పడగొట్టెను. దెబ్బది లేదా ఎనుబది పౌండ్ల బరువుగల ఆ చిన్న బాలుడి ఎదుట ఇంచుమించు ఐదువందల పౌండ్లు లేదా అంతకన్నా ఎక్కువ బరువుగల ఆ సింహము, ఆ చిన్న బాలుడిపై దాడిచేయుటకై మరలా పైకి లేచినది. దావీదు తన నడుమునకు కట్టుకొన్న దట్టీలో వున్న చిన్న కత్తిని బయటికి లాగివేసెను. తన పంజా విప్పి కొన్ని దెబ్బలతోనే పది మందిని సుళువుగా చంపగల ఆ సింహము అతడి ఎదుట పైకి లేచినప్పుడు, దావీదు ఆ సింహపు గడ్డమును పట్టుకొని దానిని అతడు చంపివేసెను.
29
ధైర్యము! దేవునికి పిరికివారు అవసరములేదు. ఆయన వాక్యమును అంగీకరించుటకును మరియు ఆ వాక్యమందు నమ్మకమును ఉంచుటకు నీవు భయపడినయెడల, ఆయన తన కొరకు నిన్ను ఉపయోగించుకొనలేడు. దేనికి తలవంచకుండా దేవుని యొక్క మాటకే తలవంచే ధైర్య సాహసవంతులే దేవునికి కావలయును. అటువంటి వారితోనే ఆయన తన పనిని కొనసాగించును. సంఘము ఏమి చెప్పినాగాని, సంఘ కాపరి ఏమి చెప్పినాగాని, సంఘము దేనికొరకు నిలబడినాగాని వాటితో అతనికి ఏ సంబంధము లేకుండా దేవుని కొరకును, ఆయన నీతికొరకును మరియు ఆయన యొక్క వాక్యము కొరకును అతడు నిలబడును. దేనికొరకై ఆయన జనులు ప్రార్థించుచున్నారో, ఆయన ఆ ఉజ్జీవాన్ని కుమ్మరించుట కొరకై దేవుడు ఈ దినములలో అటువంటి మానవులను పంపించును.
30
ఆ తరువాత సంవత్సరములలో యుద్ధ భూమిలోయున్న తన సహోదరులను కలుసుకొనుటకై అతడు అచ్చటికి వెళ్ళగా, అచ్చట పద్నాలుగు అంగుళముల పొడవైన వ్రేళ్ళు మరియు గొప్ప ఎత్తైన రాక్షసుని వంటి ఉన్నత దేహముగల మనిషి యుండెను. ఆ ఎత్తైన మనిషి అరుచుచూ, కేకలు వేయుచూ, “ఎవరైనా ఒక్కడు వచ్చి నాతో పోరాడుటకు రండి, అతడు నన్ను జయించిన నేను లొంగిపోతాను, మేము మీకు బానిసలమ గుదుము, లేదా నేను గెలిచిన మీరు మాకు బానిసలగుదురు,” అని చెప్పుచుండెను. ఎవరైతే లొంగిపోతారో వారే ఓడిపోయిన వారగుదురు.
దెయ్యము ఆ విధముగా చేయుటకే అది ఇష్టపడును. నీకంటే నీపై తనదే పైచేయి అని ఆ దెయ్యము తలంచినప్పుడు దయ్యము నీతో “దానితో నీవు దానిని పొందుకోలేవు. మెథడిస్టు సంఘములలోను, బాప్టిస్టు సంఘములలోను దైవీక స్వస్థతను గురించి నీవు బోధించలేవు” అని అది చెప్పును మెతడిస్టు ప్రసంగీకులారా ఒక్కసారి దేవుడిని మీరు పట్టుకోండి. మీవలన సాధ్యమో కాదో అని మీరు కనుగొని చూడండి. మీ యొక్క వేదాంత బోధతో మీరు దానిని చేయనే చేయలేరు. ఆయన దేవుడని ఎరిగినవారై మీరు ఆ దేవుని యందు పట్టు కలిగియుండవలెను.
31
పెంతికోస్తు జనులు కొన్ని సంవత్సరముల క్రితము, అచ్చట ఒక మూలలో ఒక గుంపు జనులు నిలబడుకొని యున్నారు, లోపలకు వెళ్ళుటకు అసలు ఒక భవనము కూడా లేదు. కాని మీరు “లైఫ్” అనే పత్రికను మీరు చదివారా? ఒకానొక దినమున వారిని గూర్చి వారేమని చెప్పితిరని తెలుసుకోవలసిన ఒక గొప్ప విషయమేమనగా, ఈ కాలములో అంతకంతకు ఎదిగిపోవుచున్న పెంతెకోస్తు సంఘమును గూర్చి విషయముగా అది యున్నది ఖచ్చితముగా, ఇతర సంఘములన్నీ కలిసి క్రైస్తవులుగా మార్చినవారి సంఖ్యకంటే ఒక్క పెంతెకోస్తు సంఘము మాత్రము మార్చిన వారి సంఖ్య ఎంతో అధికము,“ ఆ విషయమునే లైఫ్ పత్రిక తెలిపినది. ఎందుచేత? వారు కొన్ని కార్యములతో మిశ్రమమైపోయి వుండవచ్చు. అయినాగాని సహోదరులారా, వారు ధైర్యవంతులై అచ్చట నిలబడి, అవును అంటే అవును, కాదంటే కాదు, మరియు నలుపును నలుపనియు, తెలుపును తెలుపనియు ధైర్యముగా చెప్పుచున్నారు. చివరకు ఆ ఉజ్జీవము బ్రద్ధలైపోవును, వారి మధ్యనే అది బ్రద్దలైపోవును. అలాగు అది జరుగక పోవచ్చునేమో వేచి గమనించి చూడండి, ఈ రాబోవు దినములలో వారు బలహీనులై పోవుదురు.
32
సౌలు తన యొక్క సర్వాంగ కవచమును దావీదుకు వేయించుచూ, “దావీదూ, రాక్షసుడువలె వుండే ఇతడితో నీవు పోరాడతానంటున్నావు, కాని, నీవేమో చిన్న బాలుడవు. ఇప్పుడే ఎదుగుచున్న యవ్వనస్తుడవు, అతడేమో తన యవ్వన కాలమునుండే విద్యాబ్యాసము చేసి నేర్చుకొన్న ఒక యుద్దశాలి. కానీ నీవు ... నీవెలాగు అతడితో యుద్దము చేయగలవు?” అని సౌలు అడిగెను.
చిన్నవాడైన ఈ దావీదును గమనించండి. అతడు ఈ విధముగా చెప్పలేదు, మీరు గమనించండి. గౌరవనీయులైన సౌలు గారు, “మా తండ్రి నన్ను వ్యాకరణ పాఠశాలకు, ఉన్నత పాఠశాలకు, కళాశాలకు పంపించ లేదు. అతడితో పోరాడుటకు పి.హెచ్.డి. పట్టము మరియు నాకు జ్ఞానము గలదు” అని ఆ విధముగా అతడు ఎన్నటికి చెప్పలేదు. అతడన్నాడు, “నా యేలినవాడా, నా తండ్రి యొక్క గొర్రెలను నేను కాయుచుండగా అచ్చటకు ఒక ఎలుగుబంటి వచ్చి ఒక గొర్రెపిల్లను పట్టుకొనగా నేను దానిని చంపి వేసితిని, మరియు అలాగే ఒకానొక దినమున ఆ విధముగానే ఒక సింహము వచ్చి ఒక గొర్రెపిల్లను పట్టుకొనగా, దానిని గట్టిగా ఒక్క దెబ్బతో క్రింద పడవేసితిని మరలా అది లేచి నిలబడినప్పుడు దానిని నేను చంపివేసితిని. సింహము మరియు ఎలుగు బంటి యొక్క పంజానుండి నన్ను కాపాడిన ఆ దేవుడు, సున్నతి లేని ఈ ఫిలిష్తియుని చేతిలో నుండి రక్షించగలడు” అని చెప్పెను. దేవుడు తర్ఫీదు చేసిన ఒక మనిషి!
33
సమస్త తర్ఫీదును పొంది ఏ విధముగా యుద్ధము చేయవలెనో యుద్ధ నైపుణ్యతను ఎరిగిన సౌలు అచ్చట నిలబడియుండెను. కత్తిని గురించి అసలు ఎరగనివాడుగా, ఒక డాలును గూర్చి ఎరగనివాడుగా దావీదు అచ్చట యుండెను. సౌలు వెళ్ళి తన యొక్క గొప్ప పెద్ద సర్వాంగ కవచమును దావీదుకు తొడిగించగా, ఆ చిన్ని దావీదుకు ఆ కవచము యొక్క బరువుకు అతడు కాళ్ళు వంగిపోవుచున్నవి. సౌలు యొక్క వేదాంతసంబంధమైన అంగీ ఒక దేవుని యొక్క మనిషికి సరిపోదని వారు కనుగొనిరి. ఆ అంగీలో దావీదు మునిగిపోయి అది క్రిందవరకూ వ్రేలాడుచున్నది. మన సిద్దాంతములు మరియు ఇతర కార్యములు ఏవి కూడా దేవుడు సిద్ధము చేసియున్నవాటితో ఎన్నటికీ సమానము కాలేవు.
ఓ, మనము ఏ విధముగా అవి మరియు ఇవి ఇంకా అనేక అనేకమైన వాటియందు బేధముగల వారమైయున్నామో అనే విషయములను చెప్పుకుంటూ వెళ్ళవచ్చును, కాని మనము మన పాఠ్యాంశము కొరకై త్వరపడి వెళ్ళుదుము.
34
ఏలీయా, వృద్దుడైపోవుచున్నాడు, త్వరలో అతడు ఈ లోకమును వీడి వెళ్ళిపోతాడని అతడెరిగియుండెను. ఒక యథార్థవంతుడైన మరియు ఒక మంచి మనిషిని దేవుడు కనుగొనెను. అతడి పేరు ఎలీషా, ఇప్పుడు మీరు గమనించినయెడల, ఒకాయన పేరు ఏలీయా, ఇంకొక వ్యక్తి పేరు ఎలీషా.
ఏలీయా ఏ వేదాంత పాఠశాలకో వెళ్ళి లేదా ఆ దినములలో యున్న గొప్ప ఉన్నత పాఠశాలకో వెళ్ళి, ఇంకా వేరే ఏ ఇతర స్థలాలకో వెళ్ళి ఏలీషాను కనుగొనలేదు. అతడు ఏమి చేసెను? ఒక పొలములోకి వెళ్ళి పండ్రెండు అరకల ఎడ్లతో పొలము దున్నుచూయున్న ఒక వ్యక్తిని కనుగొనెను. ఏమిటిది? తిన్నని చక్కటి వరుసలతో అమర్చినట్లుగా ఆ సాళ్ళను ఏ విధముగా నాగలితో దున్నవలెనో ఎలీషాకు తెలియును, రహదారిపై నుండి ఆ పొలమును చూచినప్పుడు చక్కటి గీతలు గీసినట్లుగా నాగలితో సాళ్ళను దున్నటము అతడు ఎరిగియుండి, నాగలిపై చేయివేసినవాడు వెనుదిరిగి చూడకూడదని ఎరిగిన ఒక వ్యక్తిని దేవుడు ఎరిగియున్నాడు. ఎలీషాను పిలిచి అతడిపై తన దుప్పటి వేసిన వెంటనే ఎలీషా దేనిని గురించి ఆలోచించకుండా, కాడి ఎడ్లను తీసి వధించి, బలియర్పించి, అందుకొరకు నా విద్యను పూర్తి చేసి వచ్చేవరకు ఆగుము, లేదా అది, ఇదీ అంటూ వంకర కార్యములు ఏమియు చెప్పకుండా, ఏలీయా పిలిచిన వెంటనే ఏలీషా ఇష్టపూర్వకముగానే వెళ్ళుటకు సిద్ధపడెను. ఎలీషా ఆ విధముగా చేయునని దేవునికి తెలుసు.
35
ఇప్పుడు, దేవుడు అతడికి కొంచెము తర్ఫీదును ఇవ్వవలసియుండెను. పండ్రెండు అరకల ఎడ్లతో ఒక్కడే పొలమును దున్నుచూ, ఆ సాళ్ళ వరుసలపై ఏలాగు తన దృష్టిని కేంద్రీకరించి ఉంచవలయుననే నైపుణ్యమును ఆ ఎలీషా కలిగియుండును. తద్వారా అతనికి కొంచెము ఓర్పును, దేవుడు నేర్చెను. తిన్నగా పొలమును దున్నుటకు ఆ ఎడ్లను నడిపిస్తూ నడుచుటకు సహనమును నేర్పిస్తూ దేవుడు అతనికి తర్ఫీదును ఇచ్చెను. అటుతర్వాత అతడు పరిశుద్ధ గ్రంథమందలి వాక్యముతోను, దేవునితోను ఏకీభవిస్తూ తిన్నని వాక్యమనే గీతయందు నిలబడి యుండునట్లుగా కొంతమంది మనుష్యులకు తర్ఫీదును ఇవ్వవలసియున్నది. దేవుడు కూడా తన పాఠశాల యందు అతడికి కొంచెం తర్ఫీదు ఇవ్వవలసియుండెను.
“ఇప్పుడు, నీవు ఇచ్చటనే నిలిచియుండుము, నేను గిల్గాలుకు వెళ్ళవలసియున్నది. ప్రభువు నన్ను పిలిచెను” అని ఏలీయా చెప్పెను.
ప్రవక్తయగు ఏలీయా తనపై ఉన్న దుప్పటిని తీసి ఎలీషా పై వేసినప్పుడు ఆ అభిషేకము తనపైకి దిగియున్నదనే అనుభూతిని ఎలీషా పొందుకున్న పిదప, “ప్రభువు జీవముతోడు, మరియు నీ జీవముతోడు నేను నిన్ను విడువను,” అని ఎలీషా చెప్పెను.
గిల్గాలుకు వెళ్ళిరి, అది క్రైస్తవునికి మారుమనస్సుతో కూడిన ఒప్పుకోలు మరియు బాప్తిస్మము పొందుకొను స్థలమైయున్నది. “ఇప్పుడు నీవు ఇచ్చటనే నిలచియుండుము. ఇంతవరకు ఇది పొందుకొని నీవు మారుమనస్సు అనే ఒప్పుకోలును మరియు బాప్తిస్మమును పొందుకొన్నావు. ఇంతవరకు ఇది నీకు చాలును. నేను బేతులుకు వెళ్ళుచున్నాను,” అని ఏలీయా అనెను. (బేతేలు, అనగా దేవుని యొక్క గృహము అని అర్ధము)“
36
“ఓ, నేను సంఘమునకు వచ్చాను మరియు సహవాసమును కలిగియున్నాను. ”ఇంతరకు ఇది చాలు“ కదా? అని అనేకమంది అధ్యాపకులు ”ఇంతవరకు ఇది చాలు“ అని సరిపెట్టుకుంటారు.
కాని, ఆలకించండి, ఎలీషా ఆ విధముగా ఆలోచించలేదు. ఇదివరకే అతడు దేవుని యొక్క శక్తితో నింపబడియున్నాడు. ఇంకా ఎంతో అధికమైన శక్తి తనకొరకై యున్నదని అతడు ఎరిగియుండెను. కాబట్టి అతడు, “ప్రభువు జీవముతోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను” అని అనెను. ఓ, నేను ఎంతగానో దానిని ఇష్టపడుచున్నాను!
37
అతడు బేతేలుకు వెళ్ళెను, అది దేవుని యొక్క గృహమైయున్నది, మరియు అచ్చట అతడు కొంతమంది పండితుల గుంపును కనుగొనెను. వారందరు చక్కగా తర్ఫీదును పొందిన ప్రసంగీకులు, వారు ఎలీషా దగ్గరకు వెళ్ళి, “అయ్యా నీకు తెలుసా? నీవు ఒక చిన్న కట్టయొక్క అంచున నిలబడియున్నావు. నీ యొద్ధ నుండి నీ గురువు పరమునకు తీసుకొని పోబడుచున్నాడని నీవు ఎరుగుదువా? ఏలీయా చాలా వృద్దుడు. అతడు ఎక్కువ కాలము బ్రతుకలేడు. ఏలీయాను పరమునకు కొనిపోవుచున్నాడు, నీవేమో అచ్చట వెర్రివాడివలె నిలుచుకొనియున్నావు,” అని చెప్పిరి.
ఇప్పుడు నేను ఇచ్చట ఒక దానిని చెప్పన్విండి. దేవుడిని రుచి చూచిన ఏ వ్యకైనా మానవ-కల్పితమైన తొట్లలో యున్నటువంటి వాటితో అతడు తన దాహమును తీర్చుకొనుటకు ఇష్టపడడు. దానిని అతడు చేయలేడు. ఏ వ్యక్తి అయితే దేవునిని రుచి చూచెనో, వారియొక్క వేదాంత పాఠశాలలో యున్నవారి ప్రవక్తలచే రూపొందించబడిన సమస్త కార్యములతో దేవుని మనిషి యొక్క దాహమును తీర్చలేదు. వారు అతడిని బలవంతము చేయుచున్నారు. ఓ, నీవు ఇచ్చటనే ఉండుము. ఆరు వారములలోనే నీకు పి.హెచ్.డి. పట్టమును ఇచ్చెదము. దానిని పొందుకొనటానికి నాలుగు సంవత్సరములంతటి దీర్ఘకాలపు తర్ఫీదు నీకు అక్కర్లేదు. ఇప్పుడే, నీకు ప్రసంగించుటకు కూడా అవకాశమును ఇచ్చెదము, నీవు మా సిద్దాంతములతో ఏకీభవించి, మా మనిషిగా యున్నయెడల మేము నిన్ను మా సంఘ సంస్థకు పంపించెదము.“ ఒక దేవుని మనిషికి అది తృప్తినివ్వదు. ”నీవు ఇచ్చట మాతో కలసి నాలుగు లేదా ఐదు సంవత్సరములు ఉండినయెడల మేము నిన్ను ఒక సేవకునిగా తర్ఫీదు చేసెదము.“
38
అటువంటి ఒక వ్యర్థమైన కార్యములు చేయుటకు అతనికి సమయము లేదు. అతడు వెళ్ళవలసిన మార్గము ఆ ఊట యొద్దకు, అతడు దాని యొద్దకు వచ్చుటయే అతడు చేయవలసిన పనియైయున్నది. అతని ఆత్మయందు ఆ పరలోకపు రుచిని అతడు కలిగియుండెను. “దేవుడు నీ యజమానుని పరమునకు కొనిపోబోవుచున్నాడు అని నీవు ఎరుగుదువా?” అని వారు అడిగిరి.
అతడేమి చెప్పెనో ఇచ్చట మీరు ఆలకించండి. “అవును, దానిని నేనెరుగుదును. కాని, మీరు ఊరకుండిన చాలు. ఇంకొక అర్ధములో చెప్పాలంటే, మీ ప్రాణములను కాపాడుకోండి, నా దగ్గర దానిని గూర్చి చెప్పుటకు మీరు ప్రయత్నించవద్దు.” నేనేమి చేయవలెనో, ఎచ్చటకు వెళ్ళవలెనో నాకు తెలుసు. దేవా! మాకు అటువంటి మనుష్యులను అనుగ్రహించుము: దేవుని తర్ఫీదు పొందిన మనుష్యులకు అలా గంతులు వేయటము మరియు ఇలా గంతులు వేయటము తెలియదు. “నేనెక్కడికి వెళ్ళుచున్నానో నేనెరుగుదును. దానిని గూర్చి మీరు నాతో మాట్లాడవద్దు. మీరు ఊరక ఉండుడి. నన్ను నిరుత్సాహపరచకండి, ఎందుకనగా అది నన్ను ఏమి చేయలేదు” అని ఎలీషా వారితో అనెను.
39
ఓ, ఒకవేళ ప్రార్ధింపబడిన జనులు అంతమట్టుకు ధైర్యము కలిగియుండినయెడల. “ఓ, అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి. అది నిజము కాదు. మీరు గమనించండి, నీవు మరలా వ్యాధిని పొందుకొనెదవు.”
“మీరు ఊరక వుండుడి; దానిని గూర్చి నాకేమి మీరు చెప్పనవసరము లేదు. నేను ముందుకు సాగిపోతూ వుంటాను. ఉజ్జీవము వచ్చుచున్నది. దేవుడు దానిని వాగ్దానము చేసియున్నాడు.” ఓ, దేవుని యొక్క కుమారులారా ఆ గట్టు యొద్దకు సాగిపొండి, భయము లేకుండా, భయము లేనివారుగా. దేవుని యొక్క వాక్యమునందు ఆయనను పొందుకోండి.
“దేవుడు నా గురువును పరమునకు కొనిపోవుచున్నాడని నేనెరుగుదును, కాని అది కాదు నాకు కావలసినది. నేనేమైయున్నానో నాలో ఆసక్తిని కలిగించుటకు అసలు మీయొద్ద ఏమియు లేదు. ఆ పి.హెచ్.డి. మరియు ప్రవిన్యతలు, ఆ డిగ్రీలు, ఆ సమస్త కార్యములు నన్ను తృప్తిపరచవు. మీరు ఊరకే వుంటే చాలు” అని ఎలీషా చెప్పెను.
“మంచిది, నీవు అచ్చట బ్రద్దలైపోయెదవు.”
“మంచిది, నేను బ్రద్ధలైపోయినా ఫరవాలేదు, బ్రద్దలైపోయెదను, నేను నా కర్తవ్యమందు యున్నాను.” అతడు అలా ముందుకు కొనసాగుచూ వెళ్ళుచున్నాడు.
“నీవు దానిని సాధించలేవు.”
“నేను దానిని దాటి వెళ్ళలేనని నేనెరుగుదును, కాని దేవుడు నన్ను అచ్చటకు తీసుకొని వెళ్ళగలడు,” అని అతడు చెప్పెను.
“మంచిది, ఎలీషా యోర్దాను దగ్గరకు వెళ్ళుచున్నాడు.
“ నేను నా గురువుతో వెళ్ళుచున్నాను!”
40
ప్రతీ ఒక్కొక్కరి జీవితములో యోర్దాను అనుభవమును కలిగి యుండవలెనని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి, ఎలీషా దగ్గరకు వచ్చెను, “ఇప్పుడు, ఏలీషా.... (ఏలీయా, ఏలీషాతో), నీవు ఒక యవ్వనస్తుడవు, (ఒకవేళ అది ఇలాగా కూడా వుండవచ్చును) నీకు అసలు ఎటువంటి విద్య అనేది లేదు.” వృద్ధ ప్రవక్త తన యొద్దనుండి అతడిని దూరంగా వుంచాలని ప్రయత్నించుచుండెను. “నీవు ఒక యవ్వనస్తుడవు, నీకు ఉండవలసిన విద్యార్హత లేదు. అంతెందుకు, అది నిజముగా, నీవెరుగుదువు. అసలు నీవు వ్యాకరణమును, విద్యాభ్యాసమును కూడా చేయలేదు. నీకు తెలిసినదంతా కేవలము పొలమును ఏ విధముగా దున్నవలెనో అది మాత్రమే నీకు తెలుసు. కాబట్టి నీవు పట్టబద్రుడివిగా పట్టమును పొందుకొనుటకై నీవు ఇచ్చటనే నిలిచియుండుట మంచిది. గమనించారా? నీవు ఇచ్చటనే వుండి పట్ట భద్రునిగా పట్టమును నీవు పొందుకొనుట మంచిది,” అని చెప్పెను.
కాని ఎలీషా, దేవునిని తాకిన అతడు, దేవుని యొక్క శక్తివంతమైన అభిషేకమును పొందుకొనినందువలన అతడు ఆ విధముగా అచ్చటనే నిలిచిపోలేదు. అతడు, “దేవుని జీవముతోడు మరియు నీ జీవముతోడు, నేను నిన్ను విడువను,” అని చెప్పెను. అతనికి ఒక ఉద్దేశ్యము కలదు. అతడు దర్శనమును చూచెను. ఏమి జరుగనైయున్నదో అతడు ఎరిగినవాడుగా యున్నాడు.
41
వారిరువురు యోర్దాను దగ్గరకు వెళ్ళిరి. యోర్దాను అనగా “మరణము” అని అర్ధము. ఆ వృద్ధుడు మరియు యవ్వనస్తుడు అచ్చట నిలబడిరి. అది వాస్తవముగా క్రీస్తుకు మరియు సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. ఆ యోర్దాను నది ఒడ్డున వారిరువురు నిలబడియుండిరి. మరణమనే ఆ యోర్దాను నది యూదయ కొండలలో నుండి గలగలమని ఉరకలతో పొంగిపొరలి ప్రవహించుచు వచ్చుచున్నది. ఏలీయా అతడి నెరసిన వెంట్రుకలు వెనుక వ్రేలాడుచుండగా, మసకబారిన అతడి కన్నులతో ఆ యోర్దాను నది ఈ వైపు నుండి ఆ వైపు వరకు ఆ ఒడ్డును చూచుచుండెను. యవ్వనసుడైన ఈ ఎలీషా అతడి యొక్క ప్రతీ కదలికను క్షుణ్ణముగా గమనించుచుండెను. ఒకరేమో, యవ్వనసుడైన ఎలీషా దేవుని యొక్క చిత్తమును కొనసాగించుటకై ఒక దర్శనము కొరకు కాచుకొనియుండగా, ఇంకొకరైన ఏలీయా అవతలి గట్టగు గృహమునకు వెళ్లబోవుచున్నాడు. వారిప్పుడు యోర్దాను దగ్గరే వున్నారు.
42
ఏలీయా అతడు గృహమునకు వెళ్ళబోవుచున్నాడు. ఏలీయా జీవితములో ఒక చేదైన అనుభవమును కలిగియుండెను. ఆహాబు భార్యయగు యెజెబేలు అను ఆ స్త్రీ ప్రసంగీకురాలు. ఏలీయా యొక్క మార్గమును ఒక కరుకు మార్గముగా మార్చివేసినది. అతడు ఆ కరకు రాళ్ళు రప్పలు గల మార్గము గుండా వెళ్ళవలసి వచ్చెను. తద్వారా ఏలీయా నీరసించెను. అతడు మంచి పోరాటమును తాను పోరాడెనని మరియు తన పరుగును చక్కగా తుదముట్టించెనని ఏలీయా ఎరిగియుండెను. ఆ యోర్దాను దగ్గర తన యొక్క పదవీ విరమణను కలిగియుండెను.
కాబట్టి, మీరు గమనిచండి, ప్రతీ విశ్వాసి, నీకు ఉన్నదంతా వదులుకోవలసిన ఒక స్థలమునకు నీవు వచ్చినప్పుడు, ఆ యోర్దాను యొక్క చల్లటి అలలు నీ పాదములను తాకుటను నీవు తెలుసుకొందువు. ఆ యోర్దానును దాటి వెళ్ళుదువా లేదా అచ్చటనే నిలిచి ఉండిపోయెదవా? యోర్దాను అనగా “ప్రత్యేకింపబడుట” -ప్రత్యేకించుకొనుట.
43
ఆ కొండ వెనుక ఆ ప్రసంగీకురాలు నిలబడుకొని ఎలీషావైపు కేకలు వేయుచూ, “నీవు అచ్చటకు వెళ్ళకుండా వుండుట మంచిది. నీవు హద్దు దాటి పోవుచున్నావు” అని అంటున్నారు. వారియొక్క అరుపులను నీవు వినెదవు. నేడు కూడా అటువంటివి నీవు వింటూనే వుంటావు.
కాని ఎలీషా, “దేవుడు దేవుడైయుండి, అతడు దేవుని యొక్క ప్రవక్తయైనయెడల, ఆ ప్రవక్త యొక్క స్థానమును నేను తీసుకొనవలయును, దీనిని నేను చేయుటకు నాకు ఆయన ఆత్మ కావలసియున్నది. నాకు వారియొక్క పాఠశాల అవసరము లేదు. ఒకవేళ పాఠశాల దానిని చేసినయెడల ఆ పాఠశాల వారు ఆ ప్రవక్త యొక్క స్థానమును తీసుకొనును. కాని, దానిని చేయుటకై దేవుడు నన్ను పిలిచెను. అందుకొరకు నాకు ఆయన ఆత్మ కావలసియున్నది!”
ఒక సంఘము యొక్క పాఠశాలలు ఆ స్థానమును మరియు యేసు అనుగ్రహించిన ఆ శక్తిని తీసుకొనినయెడల, ఎన్నో సంవత్సరముల క్రితమె మెథడిస్టు, బాప్టిస్టు, కాతలిక్కు, ప్రెస్బిటేరియన్ సంఘములు దానిని తీసుకొనవలసియుండవలయును — కాని అవి ఎప్పటికి దానిని చేయలేదు. యేసుక్రీస్తు యొక్క ఆత్మను కలిగి యుండండి! ప్రతీ సంఘ శాఖ నిన్ను వెంటాడినను, ప్రతీది నిన్ను వెంటాడినను దేవుని వాక్యముతో ఒంటరిగా నిలబడుము, ఆ యోర్దానును దాటి వెళ్ళుదువు.
44
కాబట్టి ఏలీయా యోర్దాను నదియొద్ద నిలచియుండెను. ఏలీయా ఆకాశమువైపు చూచుచున్నాడు. ఇచ్చటే ఎచ్చటనో తాను దేవునిని సంధించబోవుచున్నాడని అతడు ఎరిగియుండెను. ఆ యవ్వనస్తుని వైపు చుట్టూ ఏలీయా చూచుచూ తనపై కప్పుకొనియున్న దుప్పటిని తీసివేసెను. ఆ దుప్పటిని చేతితో పట్టుకొని యోర్దాను నదిని కొట్టెను. ఎప్పుడైతే అతడు ఆ దుప్పటితో ఆ యోర్దానుని కొట్టెనో అపుడది రెండుగా చీలి దారిని తెరచి ఇచ్చినది. పొడినేలపై వారివురు నడుచుకొంటూ అవతలివైపుకు వెళ్ళిరి.
గమనించండి, యోర్దాను నది ఉధృతంగా పొంగి పొరలుచూ యుండినను, దానిని చీల్చుకొని, మార్గమును కలిగించుకొని వెళ్ళుటకు అచ్చట నీవు ఏదో ఒకదానిని కలిగి యుండవలసియున్నది. ఓ, ఎప్పుడైతే వారు అవతలవైపుకు వెళ్ళిరో, ప్రతీ పొదకు ఒక గుర్రము మరియు ఒక రధము కట్టబడియున్నది. రాజులకు రారాజగు దేవుడు ఏలీయాను తన గృహమునకు తీసుకొని వెళ్ళుటకు పరలోకపు పరివారమును పంపెను. ఏలీయూ జీవితము దానితో సమాప్తమాయెను. తన జీవితమునకు అది చాలినంతగా అది యుండెను. తన ఎనభై లేదా ఇంకా కొంచెము ఎక్కువ వయస్సు గల అతని జీవిత అనుభవములో ప్రజలతో వాదిస్తూ, ఇంకా వారితో విభేదించుచూ వాక్యము నిమిత్తము నిందలను, ఆకలి, దప్పికలు గుండా అంతా శ్రమానుభవమే. అతడు గృహమునకు వెళ్ళుటకు సిద్ధముగా యుండెను.
45
ఏలీయా, ఏలీషాను చుట్టూ చూచెను. ఏలీషా ఒక దర్శనమును చూడవలెనని ఆశించెను. ఓ, అతడు అచ్చటే నిలిచిపోయినట్లైతే పాఠశాల విద్య ఇంకా సమస్తము యుండెడివి. అయితే ఎలీషా వాటన్నింటినీ తన వెనుకనే వదిలేసి వచ్చెను. వారు ఇప్పుడు ఎక్కడికి రాలేరు. దేవుడు తన స్వంత విధానములో ఏలీషాను తర్ఫీదు చేయబోవుచున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఎలీషా ఆ అగ్నిజ్వాలతో కూడిన రధమును, అగ్నిజ్వాలతో నిండిన గుర్రములు, అంతా అగ్నిజ్వాలలతో నిండిపోయి ముందుకు దూసుకు వచ్చుచున్న రధములను అతడు చూచెనో, ఆ దృశ్యము ఎలీషాను ఏదో ఒకదానిని అతడిలో కలుగచేసినది. అతడు ఒక దర్శనమును చూచెను. అవును, సహోదరుడా. ఎప్పుడైతే దేవుడు ఏలీయాను పరమునకు కొనిపోయెనో, ఎలీషా ఏలీయాలోయున్న ఆత్మయొక్క రెండుపాళ్ళ ఆత్మ బలముతో నింపబడినవాడై వెనుకకు వచ్చెను. ఇప్పుడిక అతడు ఒక ఉజ్జీవము కొరకు సిద్దముగా యున్నాడు.
46
ఇప్పుడు ఆ మనిషిని గమనించండి, దానికి ముందు అతడు ఒక వ్యవసాయదారుడు. దేవుడు అతడి పేరును అమర్త్యమైనదిగా మార్చెను. అచ్చటయున్న ప్రవక్తలందరు అతడి చుట్టూ నిలబడి అతడిని గమనించుచుండిరి, ఎలీషాపై దేవుని యొక్క శక్తి క్రుమ్మరింపబడియుండుటచే వారు అతడి పాదముల ముందు తలలు వంచిరి. ఏ పురుషుడు, ఏ స్త్రీయైతే తమ్ముతాము ఈ లోకపు కార్యముల నుండి ప్రత్యేకపరచుకొని మరియు ఆ యోర్దాను నది దాటిన అనుభవము గుండా వచ్చెదరో, అటువంటి వారి పాదముల యొద్ద ఈ లోకము సాగిలపడే ఘడియ ఆసన్నం చేయబోవుచున్నాడు.
సహోదరుడా, సహోదరీ, ఈ రాత్రియందు నీవు ఏమి చేసియున్నాగాని, నీవు ఏమి ఆలోచించుచుండినను, అవి ఏమైనాగాని నిన్ను నీవు ప్రత్యేకపరచుకొని లోకకార్యములను వదలి, దేవునితో ఆ యోర్దానును దాటి రమ్ము. దేవుడు తన స్వంత సేవకొరకు దేవుడే నీకు తర్ఫీదును ఇచ్చును. ఈ ఉజ్జీవమునకు ఒక దినము ముందు మనము జీవించుచున్నాము. కాని తనను స్వీకరించు హృదయముల కొరకు దేవుడు వెదుకుచూ, కనుగొనుటకు ప్రయత్నించుచున్నాడు.
47
గమనించండి, పౌలు అను పేరుగల ఒక మనిషిని దేవుడు కనుగొనెను. ఓ, స్వనీతిగల ఒక పరిసయ్యుడుగా యుండెను. దేవునికి ఒక శిష్యుడుగా మారుటకు ముందు ఆ రీతిగానే ఆయన పౌలు ద్వారా పనిచేయించవలసియుండెను. ప్రతీ యుగములలోనున్న మనుష్యులలో ఆయన చేసిన క్రియను గమనించి చూడండి, ఆయన ఆ మనుష్యులను తీసుకుని వారిలోయున్న వేదాంత సారమును బయటకు తీసివేయవలసియుండెను. దర్శనమును చూచిన వెంటనే పౌలు, ఆ గొప్ప ఇశ్రాయేలీయులలో తాను నేర్చుకొన్న గొప్ప ఉపాధ్యాయుడగు గమాలియేలు యొద్దకు వెళ్ళుటకై యెరూషలేముకు వెళ్ళలేదు. ఈ దర్శన విషయమును గూర్చి చర్చించుటకై పౌలు గమలియేలు యొద్దకు వెళ్ళలేదు. అంతెందుకు, అసలు యెరూషలేముకు కూడా వెళ్ళలేదు. ఎప్పుడో పద్నాలుగు సంవత్సరముల తరువాత వెళ్ళెను. కాని అతడు ప్రార్ధనా కూటము కొరకు ఐగుప్తునకు వెళ్ళెను. అచ్చట క్రొత్త నిబంధనలో అనేక పత్రికలను వ్రాయుటకై దేవుడు అతడిని అచ్చట యుంచెను. దేవుడు మనుష్యుల కొరకై ఎదురు చూచుచుండెను. ఆ క్రొత్త నిబంధన వ్రాయుటకు ఆయనకు ఎవరో ఒకరు కావలసియున్నది. కాబట్టి అందుకొరకు పౌలును ఆయన ఎన్నుకొనెను. అతనిలో యున్న సమస్త వేదాంత పాండిత్యమును ఆయన తీసివేసెను. క్రీస్తును ఎరుగుటకై తానెరిగియున్న సమస్తమును నేను మరచిపోవలసివచ్చెనని పౌలు చెప్పెను.
దేవునిని ప్రేమించే భయమెరుగని పురుషునిలో నుండి మరియు స్త్రీలో నుండి సమస్తమును తీసివేసి మనలను వట్టివారిగా చేయుటకు దేవుడు నేడు ప్రయత్నించుచున్నాడు. మరియు దేవునితో మనము నిలచియుండి, ఆ వేరుచేయు గీతను (యోర్దాను) దాటి అవతలి వైపుకు వెళ్ళినప్పుడు తన మహిమ కొరకు మనలను ఉపయోగించుకొనును.
48
నీవు కఠినముగా ఆలోచించవలసిన ఘడియ ఇదియేనని నేను ఆశించుచున్నాను. నీవు ఈ స్థలమును ఎన్నటికీ దాటనియెడల, ఆ గీతను దాటి ఇవతలికి ఎన్నటికి రానియెడల అక్కడే నీవు నిలబడుతూ, “మా అమ్మ ఒకానొక సంఘమునకు చెందినది,” అని నీవు చెప్పినయెడల, నీవు చేరవలసిన గమ్యస్థానమునకు నీవు చేరలేవు, గమనించావా. యుద్ధభూమిలో ముందు వరుసలో నిలబడుటకే నేడు దేవుడు పురుషులను మరియు స్త్రీలను పిలుచుచున్నాడు. ఆయన వారిని గిల్గాలుకు పిలుచుటలేదు లేదా ఆయన వారిని యెరికోకు లేదా బేతేలుకు పిలుచుట లేదు. వారు నశించిపోవుదురు. కాని ఆయన యేసుతో కలిసి ఆ యోర్దాను దాటుటకు వారిని పిలుచుచున్నాడు. ఆయన నిన్ను తీర్చిదిద్ది మరియు నిన్ను తన స్వశక్తి అనే పాఠశాల నుండి ఆయన నిన్ను తీసుకొని రాగలడు.
49
ఇప్పుడు, ఇచ్చట ఆయన ఏమి చేయుచున్నాడో గమనించండి, తన కుమారుని యొక్క ఆత్మను క్రిందికి పంపుచున్నాడు. గత రెండువేల సంవత్సరములుగా లోకము చూడనటువంటి సూచనలను, అద్భుత కార్యములను మరియు ఆశ్చర్యకరమైన కార్యములను ఆయన జరిగించుచున్నాడు. ప్రభువు దూత పటమును, అగ్నిస్తంభము యొక్క పటమును లోకము నందలి విజ్ఞాన శాస్త్రము కెమెరా ద్వారా బంధించినది. ఆ చిత్రము వాషింగ్టన్, డి.సిలో ఈ రాత్రి మత సంబంధమైన చిత్రములను కలిగిన స్థలమందు వ్రేలాడుచున్నది. ఈ ఫోటో విజ్ఞాన శాస్త్రము మూలముగా నిరూపించబడిన ఏకైక సహజాతీతమైన చిత్రముగా ఇది యున్నది. అదే విధమైన సూచనలను మరియు అద్భుత కార్యములను ఆయన చేయుచునేయున్నాడు.
అది ఏమిటది? అదియే యోర్దానును దాటుట. ఒంటరిగా దేవునితో నడువుము. ఆయన యొక్క స్వంత శుద్ధిచేయు కొలిమిలో యుండుము. ఆ మహోన్నతుని కుమ్మరి యొక్క చక్రమందు యుండుటకు, ఆయన నిన్ను మలచుటకు నిన్నునీవు సమర్పించుకొనుము. నేటిరాత్రి యందు మనము ప్రార్థించుచుండగా, మనము ఆ స్థలము యొద్దకు వచ్చుచుండగా, ఆయన యొక్క చక్రమునందు నిన్ను నీవు సమర్పించుకొని, “ప్రభువా, ఇదిగో నేను ఇచ్చటయున్నాను, నన్ను మలచండి మరియు మీ చిత్తానుసారమైన పాత్రగా నన్ను మలుచుకోండి,” మరియు దేవుడు దానిని చేయును. ఒక్క క్షణము ప్రార్ధన కొరకు మనము మన తలలను వంచుదాము.
50
ప్రార్థనకు కొద్దిగా ముందు, లోపల మరియు వెలుపలయున్న జనుల యొద్ద ఈ ప్రశ్న అడగవలెనని నేను ఆశించుచున్నాను: ఈ రాత్రి సమయమున యదార్థముగా ఎంతమంది యేసుతో కలిసి ఆ యోర్దాను యొద్దకు వెళ్ళుటకు ఆశించుచున్నారు. ఆ యోర్థానుని దాటిన తర్వాత నీవొక దర్శనమును చూచెదవు మరియు అసలు వాస్తవముగా దేవుడంటే ఎవరనే దానిని నీవు చూచెదవు. ఆ విధముగా చూడాలని ఆశించేవారు, మీ చేతులను పైకి ఎత్తుతారా. దేవుడు మిమ్ములను దీవించును గాక. కేవలము గమనించండి; ఈ భవనములో రెండువందల హస్తములు పైకి లేపబడియున్నవని నేను ఊహించుచున్నాను.
ఏదో వేద పాఠశాలకు కాదు, ఆ యోర్దాను యొద్దకు వెళ్ళండి. ఎలీషా సరిగ్గా అక్కడే దానిగుండా దానిని దాటియున్నాడు. “నీవు ఇచ్చటనే వుండుము,” అని వారనిరి.
“ఈ మానవ-కల్పితమైన కార్యములు నాకు అక్కర్లేదు,” అని అతడు చెప్పెను. దేవుని కొరకు దాహమును కలిగిన ఒక వ్యక్తికి, మనుష్యుల కల్పితములు ఆ దాహమును తీర్చలేదు. ఆ జీవపు ఊట యొక్క నీళ్ళను నీవు త్రాగేంతవరకూ. ఏ వేదపాఠశాల అనుభవముగాని, ఏ కళయందు పట్టముగాని, లేదా మొదలగునవి ఏమియు ఆ దాహమును ఎన్నటికీ తీర్చలేవు.
51
మీ చేతులను పైకెత్తిన వారు, ఇప్పుడు నాతో కలిసి ప్రార్ధించండి.
ప్రియమైన దేవా, ఈ కూటములో కొద్ది నిమిషములు, ఈ భవనము చుట్టూ వున్న గోడల వెలుపల, కిటికీలకు ఆనుకొని పురుషులు, స్త్రీలు, బాలురు మరియు బాలికలు నిలబడియున్నారు. వేడిగాయున్నను వారిలో ఏదో ఒకటి అచ్చట నిలబడినట్లు చేసినది. వారియొక్క దృష్టిని నీవు ఆకర్షించితివి, లేనియెడల వారు వెళ్ళిపోయియుందురు, లేనియెడల ఆ విధముగా వారు అచ్చట నిలబడియుండలేరు. కాని, ప్రభువగు దేవా, వారు కేవలము మానవ మాత్రులు. మా గౌరవనీయులైన మాజీ మేయరు, ఉపరాష్ట్రపతి యొక్క ప్రసంగము వింటూ, అతడు మరణించెనని వార్తా పత్రికలలో మేము చదివితిమి. ఇంకొకరు ఒక బంతి ఆటయందు ఒకానొక రాత్రియందు ప్రముఖ వ్యక్తి చనిపోయెనని వింటిమి. వారి ఆత్మలు నేటి రాత్రియందు ఏదో ఒకచోట యున్నవి. దేవా, ఏదో ఒక దినమున మేము కూడా చనిపోవలసినదే. అదే విధముగా కాకపోయినా, మేము కూడా వెళ్ళిపోవలసినదే.
52
తాము ఏదో ఒక సంఘమునకు చెందినవారమని చెప్పుకొనుటకు కాదు కాని, దేవుడు తమయొద్ద ఏమి ఆశించుచున్నాడో దానిని ఎరుగుటకు జనులు వారంతటవారే ముందుకు వచ్చుదురు గాక! పరిశుద్ధాత్మతో నింపబడిన జనులును, మరలా నూతనముగా జన్మించిన వారును, దేవుని చేతిలో మలచబడిన వారును, పరిశుద్ధాత్మ అనే అగ్నిలో పుటము వేయబడినవారును, మరియు దేవునిచే ముద్రింపబడిన జనులను యోర్దాననే గీతను దాటిన మనుష్యులను — దేవునిచే పిలుపబడిన మనుషులనే నీవు కోరుకొనుచున్నావు. ఉజ్జీవము కొరకు ప్రార్థించుచున్న బిల్లీ గ్రహం గారు మరియు అనేకుల ప్రార్థనను బట్టి నీవు మాకు ఉజ్జీవమును పంపించెదవని మేము నమ్ముచున్నాము. తమను ప్రత్యేకించుకొన్నవారిని, వేదాంత పాఠశాలలకు దూరముగా యున్న వారిని, మానవ స్వకీయ-కల్పిత మార్గములకు దూరముగాయున్నవారిని, దేనికి భయపడనివారిని, నీ దివ్యమైన గుణలక్షణములు గలవారిని, నిన్ను నమ్మిన వారిని మరియు నీ వాక్యమునందు నీవున్న ప్రకారముగా అంగీకరించేవారిని అటువంటి జనులను నీవు తీసుకొనెదవు.
53
దేవా, ఇప్పుడు నిలబడుకొనియున్న వారిలో అనేకులు లోకసంబంధమైన కార్యములన్నింటిని అమ్మివేసి మరియు వారికున్నదంతా ప్రభువైన యేసుకు సమర్పించి తమ తప్పిదములన్నింటిని ఒప్పుకోలు అనే స్థలముగా పరిగణింపబడు గిల్గాలుకు త్వరపడి వెళ్ళి, క్రైస్తవ జీవితమును ప్రారంభించెదరు గాక! వారియొక్క వేదాంత పాఠశాల యొక్క వేదాంతమనే పాత పనికిరాని వారి సిద్దాంతములతో మునిగిపోయున్న ఆ ప్రవక్తల సమూహమును లెక్క చేయకుండా దానికన్నా అతీతమైన బయలుపరచబడిన దర్శనము కొరకు తర్వపడి ఆ యోర్దాను యొద్దకు వెళ్ళి, దానిని దాటినప్పుడు వారు సజీవుడైన దేవుడు ఇంకనూ జీవించుచున్నాడని వారు కనుగొనుదురు గాక!
ఒకానొక దినమున దోతాను యొద్ద ఆ ప్రవక్త చుట్టూ చూచినప్పుడు అదే అగ్నిమయమైన దూతలు మరియు అగ్నిమయముతో ని౦డిన రధములు అచ్చట యుండుట మనము కనుగొంటిమి. ప్రభువా, వారు ఇంకా నేటి రాత్రియందు ఇచ్చటే యున్నారు. ప్రభువా, నీ పురుషులను పిలువుము; నీ స్త్రీలను పిలువుము, నీ బాలురను, నీ బాలికలను పిలువుము. వారి హృదయాలలో శాంతిని పొందుకొనుటకు నీవు మాట్లాడుము మరియు వారు లోకమనే కార్యములన్నింటికి పైగా దాటి వచ్చుటకు మాట్లాడుము. మీ నామ మహిమార్ధమై మేము యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
54
కొద్దిసేపు నిశ్శబ్దముగా ఆరాధించుటకై పాటను పాడవలెనని నేను ఆశించుచున్నాను:
నీ చిత్తానుసారమైన మార్గమున, ప్రభువా,
నీ చిత్తానుసారమైన మార్గమున,
నన్ను నీ హస్తములలో వుంచుకొనుము!
సంపూర్ణముగా నీ ఆధీనములో ఉంచుకో,
నీ చిత్తానుసారముగా నన్ను మలచి మరియు దీర్చుము పిదప,
నేను నీ కొరకై వేచియుండగా,
నేను నీకై సమర్పించుకొనుచుండగా,
ఒక క్రమముతో ఇప్పుడు అందరము కలసి పాడుదాము.
ఇప్పుడు ఈ పాట పాడుచుండగా,
(దేవుని కొరకై మిమ్మల్ని మీరు ప్రతిష్టించుకోండి.)
నీ చిత్తానుసారమైన మార్గము,
ప్రభువా, నీ చిత్తానుసారమైన మార్గము!
నీ హస్తములలో నన్ను ఉంచుకొనుము
సంపూర్ణముగా నన్ను నీ ఆధీనములో ఉంచుకొనుము
నేను వేచియుండగా,
సంపూర్ణముగా నన్ను నీకే సమర్పించుకొనుచుండగా
నీ చిత్తానుసారము నన్ను మలచి మరియు నన్ను దీర్చుము.
చక్కగా ఇప్పుడు ఆరాధించెదము. చుట్టు ప్రక్కల చూడకుము, కేవలము దేవునిని మాత్రము చూడుము.
నీ చిత్తానుసారము - నీ చిత్తానుసారము, ప్రభువా!
(నిజమైన భావముతో దానిని పాడండి.)
నీవు కుమ్మరివి; నేను మట్టిని.
నేను వేచియుండగా సంపూర్ణముగా నన్ను సమర్పించుచుండగా,
నీ చిత్తానుసారము నన్ను మలచి, నన్ను దీర్చుము.
55
ఇది చాలా బాగుందని నేను నమ్ముచున్నాను. దేవునిని ఆరాధించడము మీరు ఇష్టపడుచున్నారా? వర్తమానము ముగించబడినది. ఇప్పుడు మన తలలను వంచి ఒక్క నిమిషము ఆ పాటను మరలా పాడుచూ ఆరాధించెదము. నీ హృదయాంతరంగములో నుండి భావము నెరిగి పాడండి.
నీ చిత్తానుసారము, ప్రభువా!
నీ చిత్తానుసారము!
నీవు కుమ్మరివి; నేను మట్టిని.
నేను నీకై వేచియుండగా సంపూర్ణముగా
నన్ను నీకే సమర్పించుచుండగా,
నీ చిత్తానుసారము నన్ను మలచి - నన్ను దీర్చుము.
56
ఇచ్చటయున్న ప్రతీ చిన్న పిల్లలను, వృద్దులను, పురుషులను మరియు స్త్రీలను నీ సన్నిధిలో యుండగా ఇప్పుడే పరిశుద్ధాత్మ వారిలోవున్న విశ్వాసము పనిచేయునట్లుగా చేసి, వారిలో వున్న అనుమానములన్నింటినీ, సమస్త చిన్నచిన్న అపజయములన్నింటిని తీసివేసి - నీ చిత్తానుసారముగా వారిని మలుచుకొనుము. ప్రభువా! దీనిని అనుగ్రహించుము. వారు నీ యొక్క గొప్ప మలచే చక్రమునందుండగా, మరలా మమ్మల్ని ప్రతిష్టించుకొనుటకై మరియు మలచుటకై ఆ చక్రమందు మా ఆత్మలను దానిపై వుంచుము. నీ కుమారుడగు యేసుక్రీస్తు నామమున, ఓ దేవా, దానిని అనుగ్రహించుము. ఆమేన్.
57
నేను దానిని చాలా ప్రేమించుచున్నాను, మీరు ప్రేమించుటలేదా? ఓ, ఎంతో చక్కటి పరిశుద్ధాత్మ అనుభూతిని కలిగించుచున్నది. ఓ, కరుకైన ఈ వర్తమానము పిదప మధురమైన ఆ పరిశుద్ధాత్మ యొక్క అనుభూతి! అది వాక్యము ద్వారా వచ్చును. ఆ పాట యొక్క ఒక పల్లవిని నేను పాడెదను లేదా దానిని ప్రయత్నించెదను.
అది రక్తమును కార్చుచున్నది; అవును, అది రక్తమును కార్చుచున్నది.
ఇది పరిశుద్ధాత్మ యొక్క సువార్త, అది రక్తమును కార్చుచున్నది.
సత్యము కొరకై మరణించిన ఆ శిష్యుల యొక్క రక్తము;
ఈ పరిశుద్ధాత్మ యొక్క సువార్త రక్తముతో కారుచున్నది.
పరిశుద్ధాత్మ యొక్క ప్రణాళిక కొరకై మొదట ఒకరు చనిపోయిరి.
అతడే బాప్తిస్మమిచ్చు యోహాను, కాని అతడు ఒక మానవునివలె చనిపోయెను;
అటు తర్వాత ప్రభు యేసు వచ్చెను; వారు ఆయనను సిలువ వేసిరి.
మానవుల పాపముల నుండి రక్షించు ఆత్మను గూర్చి ఆయన బోధించెను.
అచ్చట పేతురు, పౌలు మరియు పరిశుద్ధుడైన యోహాను ఉన్నారు.
ఈ సువార్త వెలుగును ప్రకాశించుటకై వారు వారి జీవితములను ధారపోసిరి.
ఆ ప్రాచీన ప్రవక్తలవలె వారి రక్తముతో వీరి రక్తమును కలిపియున్నారు.
కావున నిజమైన దేవుని యొక్క వాక్యము యదార్ధముగా చెప్పబడినది.
పాపమునకు వ్యతిరేకముగా అతడు బోధించినప్పుడు వారు సైఫనును రాళ్ళతో కొట్టిరి.
అతడు వారిని ఎంతో కోపోద్రీకులుగా చేసినందున వారు అతని తలను పగులకొట్టిరి.
కావున ప్రాణాధారమైన రక్తములో అతడు చనిపోయెను, తన ఆత్మను అప్పగించెను.
ఇతరులను కలుసుకొనుటకు వెళ్ళిపోయెను, అది బ్రతికించెడు ఆత్మయై యున్నది.
బలిపీఠం క్రింద యుండు ఆత్మలు, “ఇంకా ఎంతకాలము”? అని మొర్రపెట్టుచున్నవి.
తప్పు చేసిన వారినందరిని ప్రభువు శిక్షించుట కొరకై;
అయితే అచ్చట ఇంకా మరికొందరు వారియొక్క ప్రాణాధారమైన రక్తము ఇవ్వబోవుచున్నారు.
ఈ పరిశుద్ధాత్మ సువార్త కొరకు మరియు ఆ రక్తవర్ణమైన ప్రవాహము కొరకు.
(ఇప్పుడు అందరము కలిసి.)
అవును, అది రక్తముతో కారుచున్నది; అది రక్తముతో కారుచున్నది.
ఈ పరిశుద్ధాత్మ సువార్త, అది రక్తముతో కారుచున్నది.
అది సత్యము కొరకు మరణించిన ఆ శిష్యుల యొక్క రక్తము,
ఈ పరిశుద్ధాత్మ సువార్త రక్తముతో కారుచున్నది.
58
వారు ఎవరై యున్నారు? దేవునిచే తర్ఫీదు ఇవ్వబడి మరియు పిలువబడిన మనుషులై ఉన్నారు. దేవుడు తన వాక్యమును ఒక పిరికివానిలో యుంచి ఏ విధముగా అతడిని ఉపయోగించగలడు? అతడొక పిరికివాడు. ఆ కారణముచేతనే వారికి దానిని గురించి ఏమియు తెలియదు. ఏ మనుష్యులైతే భయపడరో, పరిశుద్ధాత్మ ద్వారా ఎవరినైతే దేవుడు సున్నతి చేసెనో అటువంటి వారిలో దేవుడు నివసించును. దేనిని లెక్క చేయకుండా వెంటనే అతడు తన సాక్ష్యమును తన రక్తముతో ముద్రించును. ఎందుకనగా క్రీస్తులో అతడు నివసించుచున్నాడు. “నా మట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, మరియు చావైతే లాభము.” వారు ఆ విధమైన భావముతోనే జీవిస్తూ ముందుకు కొనసాగిపోయెదరు. ఆమేన్.
59
ఇప్పుడు ప్రార్ధనా వరుసను ప్రారంభించే సమయమైనది. ఇది ముందుగా జరుగు ప్రార్ధనా వరుస. సరిగ్గా ఎనిమిది గంటల ఇరువది నిమిషాలయినది. కాని మనము జనుల కొరకు ప్రార్థించాలని ఆశించుచున్నాము. ఇప్పుడు మిమ్మల్ని నేను దీనిని కోరుచున్నాను... మనము చేసిన ఈ ప్రసంగమంతటినీ దేవుడు తానే స్వయముగా పలుకబడిన ఒక్క మాటతో దీనిని సమానముగా సరిపోల్చలేము.
ఇప్పుడు ప్రార్ధనా వరుసను ప్రారంభించెదము. మనము అందరికొరకు ప్రార్థించెదమని వాగ్దానము చేసితిమి. దేవుని చిత్తమైతే దానిని మనము చేసెదము. ప్రతీ రాత్రి వెలుపల మేము ప్రార్థనా కార్డులను పంచి పెట్టుచున్నాము. దీనిలో దీనిని చెప్పాలనుకొంటున్నాను. ఆత్మ వివేచన ద్వారా ప్రతి రాత్రి కొంతమందిని మనము పిలిచి ఆ జనులలో ఉన్న కార్యములను వివేచించి చెప్పి, వారు తాము స్వస్థత పొందుకున్న తరువాత కొంతమంది జనులు ఆ రాత్రికే వారి గృహములకు వెళ్ళిపోవుచున్నారు. ఆత్మ కుమ్మరింపు జరుగుటవలన మరలా గొప్ప ప్రార్ధనా వరుస కనబడుచున్నది. అందులో అనేకులు స్వస్థతను పొందుకొని వెళ్ళిపోవుచున్నారు. మరలా మరుసటి రోజు రాత్రి చూచినయెడల ఇంకా ఎక్కువ ప్రార్ధనా కార్డులను ఇవ్వవలసివచ్చుచున్నది.
60
నేను పొరపాటు పడనియెడల, ఆ వెనుక ప్రక్కన నిలచియున్న ఆ సహోదరి ఫెన్నీ విల్సన్ సహోదరిని నేను చూచుచున్నాను అనుకుంటున్నాను? ఆ స్త్రీ గురించి నాకు జ్ఞాపకమున్నది, పదిహేడు సంవత్సరము క్రిందట. ఓ, అంతకంటే ఎక్కువే, ఇరువది సంవత్సరములు... 1932, క్షయ వ్యాధితో మరణించుచున్న సమయము, ఆమె మరణించునని ఈ పట్టణపు వైద్యుడు చెప్పెను. ఆమెకు రక్తస్రావము వ్యాధి. ఆమెకు వేసిన దుప్పట్లు మరియు సమస్తము రక్తముతో తడిచిపోవుచున్నవి.
ఆ ఉదయకాలమున ఆమె యొక్క భర్త మరియు కుమార్తె నా యొద్దకు వచ్చిరి. మేము ఆమె యొద్దకు వెళ్ళి, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్ధించితిమి. ఆ తరువాత కొద్ది దినముల తర్వాత చల్లని చలికాలములో ఆ నదియందు ఆమెకు నేనే ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమునిచ్చితిని. ఆ చల్లని వస్త్రములతో పాత ఎద్దుల బండిలో ఎక్కి వచ్చినది. నేటి రాత్రి ఇంకా ఆమె జీవముతోనే యున్నది, ఎందుకనగా దానిని క్రీస్తు చేసెను. ఈ జనుల మధ్య అనేక సంవత్సరముల తరువాత మొదటిసారిగా నేను ఆమెను చూచుచున్నాను. దేవుడు ఇంకా జీవించుచునేయున్నాడు. అది నిజము. “ఎందుకనగా, నేను జీవించుచున్నాను గనుక మీరు కూడా జీవించెదరు” అని ఆయన చెప్పెను.
61
ఇప్పుడు, నేను దీన్ని చెప్పాలనుకుంటున్నాను, ఏ సందర్భముగా ఇది చెప్పుచున్నానో, ఇది ఏమిటని మీకు తెలియనియెడల, నేను చెప్పేది నాకే తెలియకపోతే, “అసలు, ఏమి చెప్పారో నాకైతే అదేమీ అర్థమవ్వలేదు,” అని చెప్పుకుంటూ మీరు మీ దారిన వెళ్ళిపోయెదరు.
ఇప్పుడు, నా సారాంశము ఏమిటంటే యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగానే యున్నాడు. ఇప్పుడు ఆయన ఏకరీతిగా యున్నయెడల, ఆయన యొక్క ప్రతీ నియమములు అదే శక్తితో, అదే బలముతో, ఆయన కలిగియున్న సమస్తములో ఆయన మారనివాడుగానే యున్నాడు. ఆయన భూమి మీద యున్నప్పుడు, గ్రీకు దేశపువారు ఒకసారి అచ్చటకు వచ్చి, “అయ్యా, మేము యేసును చూడాలని ఆశిస్తున్నాము,” అని చెప్పిరి.
ఎవరైనా, ఎప్పుడైనా యేసును గురించి వినినయెడల ఏ పురుషుడైనా లేదా ఏ స్త్రీ అయినా ఆయనను చూడాలని ప్రతీవారు వాంఛను కలిగియుందురని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకరీతిగా లేనియెడల మనము ఆయనను చూడలేము; కాని ఆయన ఏకరీతిగానే యుండినయెడల మనము ఆయనను చూడగలము, లేనిచో ఆయన ఏదో తప్పిదము చెప్పినట్లుగా ఉండును. “కొంచెము కాలమైన తరువాత లోకము ఇక ఎన్నడూ నన్నెంతమాత్రము చూడదు. అయినను మీరు నన్ను చూచెదరు, నేను (వ్యక్తిగత సర్వనామము) నేను మీతో యుండెదను, యుగాంతము వరకు నేను మీలో ఉంటాను.” ఆయన చేసిన అదే క్రియలను యుగాంతము వరకు మీరు చేసెదరని యేసు తన సంఘముతో వాగ్దానము చేసెను.
62
ఇప్పుడు ఆయన “కొద్ది కాలము,” లోకము నన్ను ఇక నన్నెంతమాత్రము చూడదు, అని చెప్పెను. మంచిది అలాగైతే, మనమేలాగు ఆయనను చూడగలము? ఆయన మనలోయున్నయెడల మనము ఆయన ఆత్మను చూడగలము. మరియు ఆత్మ ఆయన ఏ కార్యములను చేసెనో అదే కార్యములను అది చేయును, లేదా అట్లు చేయనియెడల ఆ ఆత్మ అదే ఆత్మ కాదు. “నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలైయున్నారు.” మనం ఆయనలో వున్నా ... ఆ తీగెలు ద్రాక్షావల్లిలో యుండినయెడల, ఆ ద్రాక్షావల్లి ఏ రకమైన ఫలములను ఇచ్చునో అదేరకమైన ఫలములను ఆ తీగెలు కూడా ఇచ్చును. మంచిది, మొదటి ద్రాక్షావల్లి వచ్చినది... మొట్టమొదటిగా పెంతెకోస్తు అనే తీగె ఆ ద్రాక్షావల్లిలో నుండి వచ్చినది. అదేమనగా దర్శనములు, దేవుని శక్తి, స్వస్థతలు, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము, గొప్ప సూచక క్రియలు మరియు అద్భుత కార్యములు. దాని తరువాత వచ్చే తీగె కూడా అదే రకమైన తీగగా యుండును. దాని చిట్టచివర వరకు అదే రకముగా వుండును. యేసు అలాగే దానిని గూర్చి చెప్పియుండెను.
ఇప్పుడు, నిన్న ఆయన ఏమైయున్నాడో మనము చూచెదము. ఆయన నిన్న ఏమైయున్నాడో దానిని మనము చూడగలిగినయెడల... (సమయము లేని కారణముచేత ఇప్పుడు దానిని నేను చిన్నగా, ఒక ఐదు నిమిషములు దానిని గూర్చి చెప్పెదను.) ఆయన నిన్న ఏమైయున్నాడనే దానిని గూర్చి మనము చూచినయెడల, అప్పుడు ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏమైయుండునో మనము చూడగలము. అది చాలును కదా?
63
ఇప్పుడు, ఆయన ఈ భూమి మీద యున్నప్పుడు, ఆయన మెస్సీయాగ వచ్చి బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మమును పొందుకొనెను. అంతవరకు ఆయన ఇంకా ఏ క్రియలను చేయలేదు. అటు తరువాత ఆయన తన ప్రారంభ పరిచర్యలో ప్రవేశించెను. ఎవరి కొరకు ఆయన పంపబడెను? యూదులు కొరకు.
ఇప్పుడు ప్రపంచమందు మూడు రకాల తెగల ప్రజలు మాత్రమే ఉన్నారని మనము ఎరుగుదుము. అవేమనగా యూదులు, అన్యులు, మరియు సమరయులు - అనగా షేము, హాము, మరియు యాపెతు యొక్క జనులు — యూదులు, అన్యులు మరియు సమరయులు. మీకు జ్ఞాపకమున్నదా, పెంతెకోస్తు దినమున పరలోక రాజ్యపు తాళపుచెవులను కలిగి పేతురు యూదులను పిలిచెను. “మీలో ప్రతీవాడు మారుమనస్సును పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమును పొందుడి.”
64
ఫిలిప్పు వెళ్ళి సమరయుల యొద్ద ప్రసంగించెను. వారందరూ నమ్మి మారుమనస్సును పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమును పొందిరి. పరిశుద్ధాత్మ వారి మీదకు దిగలేదు. పేతురు తాళపుచెవులను కలిగియుండెను. అతడు వచ్చి వారిమీద చేతులను వు౦చినప్పుడు, వారు పరిశుద్ధాత్మను పొందుకొనిరి.
కొర్నేలి ఒక అన్యుడు, అతడికొక దర్శనము కలిగెను. చర్మకారుడగు ఒకని ఇంటిలో సీమోను పేతురు అను ఒక మనుష్యుడు గలడని అతడిని పిలుచుకొని రమ్మని ఒక మనుష్యుని పంపెను. అప్పుడు పేతురు అచ్చటికి వెళ్ళినప్పుడు, “పేతురు ఇంకా మాట్లాడుచుండగానే పరిశుద్ధాత్మ వారిపై దిగెను. అప్పుడు పేతురు, ఆదిలో మనవలె పరిశుద్ధాత్మ పొందిన వీరిని ఎవరైనా నీళ్ళకు ఆటంకపరచగలరా?” అని అనెను. ప్రతి కొమ్మ ఒకే దానినుండి పుట్టుకొచ్చును, గమనించారా.
65
యేసు వారిని సంధించినప్పుడు, ఆయన అన్యుల కొరకు రాలేదు. అది ఎంతమందికి తెలుసు? తన శిష్యులు అన్యజనుల మధ్యకు వెళ్ళుటకు ఆయన ఆటంకపరచెను. అది ఎంతమందికి తెలుసు? మీరు అన్యజనుల మార్గమున వెళ్ళక నశించుచున్న ఇశ్రాయేలు గొర్రెల యొద్దకే వెళ్ళ౦డి, మీరు వెళ్ళుచూ, “పరలోక రాజ్యము సమీపించుచున్నదని,” నశించుచున్న ఇశ్రాయేలు గొర్రెలకు చెప్పండి“ అని అనెను.
ఆ దినమున ఆయన రాకకై ఎందరు ఎదురుచూచుచున్నారు? అన్యజనులు కాదు; మనము విగ్రహారాధికులము, అంగ్లోసాక్సనులము. మనము రోమీయులము, సూర్యుడు మొదలగు వాటిని ఆరాధించెడి వారము. మనము ఏ మెస్సీయా కొరకు ఎదురు చూడలేదు. కాని యూదులు మరియు సమరయులు ఆయన కొరకు ఎదురు చూచిరి. ఆయన కొరకు ఎదురు చూచువారికి ఆయన తననుతాను ఏ విధముగా వారికి వ్యక్తపరచుకొనెను. ఇప్పుడు పరిశుద్ధ యోహాను మొదటి అధ్యామునకు వెళ్ళి చూద్దాము, కొద్దిసేపు వెళ్లి చూద్దాము మరియు శ్రద్ధగా ఆలకించండి.
66
మొట్టమొదటిసారిగా తీసుకొనిరాబడిన యూదుడు, ఆంద్రేయ మార్పుచెందిన తరువాత, తన సహోదరుడగు సీమోను పేతురును కనుగొని, యేసు ముందుకు సీమోనుని అతడు తీసుకొని వచ్చెను. యేసు అతడి పేరును మరియు అతని తండ్రి పేరు ఏమైయున్నదో చెప్పెను. అది ఎంతమందికి తెలుసు? ఆ మనిషికి జరిగిన సంఘటన గురించి మీరేమి అనుకొనుచున్నారు. ఆ మనిషి చేతిలోనే తదుపరి దినములలో పరలోకపు రాజ్యపు తాళపుచెవులను కలిగియుండెను. తానే మెస్సీయానని ఆయనే దానిని రుజువుచేసి చూపించెను. ఇప్పుడు త్వరగా ఫిలిప్పు మారుమనస్సు పొందిన తరువాత వెళ్ళి, నతానియేలును కనుగొనెను. అది ఆ కొండలను దాటి ముప్పది మైళ్ళ దూరములో అతడు నివశించుచున్నాడు. ఫిలిప్పు నతానియేలు ఇంటికి వెళ్ళి, “ఓ, శ్రీమతి నతానియేలూ, నతానియేలు ఎక్కడ ఉన్నాడు?” అని ఫిలిప్పు అడగటము నేను వినగలుగుచున్నాను.
“ఓ, అతడు వెలుపల ఒలీవ తోటలో ఉన్నాడు,” అని చెప్పినది.
వేగముగా పరిగెత్తుకొని వెల్తూ, నీవెచ్చట వున్నావు?“ అతడు అతడిని ఒక చెట్టు క్రింద కనుగొనెను. ఆ చెట్టు క్రింద నతానియేలు ప్రార్థించుచుండెను. అతడు ప్రార్ధన ముగించువరకూ ఫిలిప్పు వేచియుండెను. ”నతానియేలు నీవెలాగు వున్నావు? నీ పంటలు ఎలా పండినవి?“ అని అనవసరపు మాటలు ఫిలిప్పు అతడితో పలుకలేదు. ఓ, అతడి యొద్ద ఒక వర్తమానము కలదు! యేసును సంధించిన ప్రతీ మనిషి అదే విధముగా యుండును. వ్యర్ధమైన మాటలు మాటలాడుటకు ఫిలిప్పుకు సమయము లేదు. ”వచ్చి, మేమెవరిని కనుగొంటిమో చూడుము: యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసును మేము కనుగొంటిమి!“ అని అతడు చెప్పెను.
67
ప్రార్థన నుండి లేస్తూ నతానియేలు తన వస్త్రములను దులుపుకొనుటను ఇప్పుడు నేను చూడగలుగుచున్నాను. “ఫిలిప్పు, నీవు మంచి వాడివని మరియు యధార్థవంతుడవని నేనెరుగుదును, నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా? మెస్సియా రావలయుననినయెడల ఆయన యెరూషలేములోని సంఘము ద్వారా రావలెనని నీవెరుగుదువు,” అని నతానియేలు అనెను. (నేడు ప్రజలు ఆ విధముగానే భావిస్తున్నారు, చూచారా.) “ఆయన యెరూషలేము నుండి రావలసియున్నది. గత కూటమునందు కయప దీనిని గురించి ఏమి ప్రకటించలేదు. కావున వేదాంతులు ఎవరూ దీనిని గురించి ప్రకటించలేదు. కావున నీవేమో యదార్థవంతుడవని నేనెరుగుదును. అయ్యో, ఆ లోతైన గోతిలో నీవేలాగు పడిపోతివి?”
“ఓ, లేదు, నీవు వచ్చి చూడుము,” అని ఫిలిప్పు అనెను.
“దానివలన ఏమైనా ప్రయోజనము వున్నదా...?” అని నతానియేలు అనెను.
68
ఏ మనిషి చెప్పలేని శ్రేష్టమైన జవాబును ఫిలిప్పు అతడికి ఇచ్చెను, “నీవే వచ్చి చూడుము.” వారు మాట్లాడుకుంటూ వెళ్ళుచుండగా, పిలిప్పు నతానియేలుతో ఈ విధముగా చెప్పుటను నేను వినగలుగుచున్నాను, “అసలు ఏమి జరిగిందో నీకు తెలుసా? అచ్చట వున్న వృద్దుడైన బెస్తవాడు అతడియొద్ద చేపలను కొని, ఆ కొన్న రసీదుపై సంతకము కూడా పెట్టడానికి తెలియని అతడు నీకు గుర్తున్నాడా?”
“అవును.”
అతడి పేరు సీమోను అనుకుంటున్నాను“ అని నతానియేలు అనెను.
“అవును అతడే,” అని ఫిలిప్పు అనెను.
“మొన్నటి దినమున మెస్సీయా యెదుటకు అతనిని తీసుకొచ్చి నిలబెట్టెను. అతనిని ఆయన చూచిన వెంటనే, ఆయన. 'నీ పేరు సీమోను, నీ తండ్రి పేరు యోనా' అని చెప్పెను. అది నాకేమి ఆశ్చర్యమును కలుగజేయలేదు, కాని నీవు ఆయన యొద్దకు వచ్చినట్లైతే నీవెవరవని ఆయన నీకు చెప్పలేడు!”
“ఆ ఒక్క నిమిషము ఆగుము, నేను కాదు” అని అతడన్నాడు.
69
కాబట్టి, వారు మరుసటి దినమున అచ్చటకు చేరిరి, మరియు ఎప్పటిలాగానే వ్యాధిగ్రస్తులకు ప్రార్ధిస్తూ యేసు ప్రార్ధనా వరుసయందుండెను. నతానియేలు ఆ ప్రజల గుంపులో కలిసిపోయాడు, యేసు తలయెత్తి చూస్తూ, ఫిలిప్పు ఒక వ్యక్తిని తీసుకొని ప్రక్కగుండా వచ్చుట చూచెను, అతని వైపు యేసు చూచి, “ఇదిగో ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటము లేదు,” అని అతడు అనెను.
ఇది వింతైన సిద్దాంతమే? ఆయన నిన్న యున్న యేసు. ఆయన నేటి దినమునయున్న యేసు, ఆయన ఒకే రీతిగా యున్నయెడల, ఆయన ఈ దినమునయున్న యేసై యుండును. ఆ వ్యక్తి అచ్చట ఆగిపోయెను. నేను నతానియేలును చూడగలుగుచున్నాను... ఫిలిప్పు నతానియేలును గిల్లుచూ, “నేను నీకు చెప్పాను చూసావా? నేను నీకు ఏమి చెప్పాను?” అని అనెను.
70
నతానియేలు, “రబ్బీ...” (అనగా బోధకుడు, లేదా నేటి దినమందు ఏమి పిలిచినాగాని, హెబ్రీ భాషలో దానికి బోధకుడు అని అర్ధము) “రబ్బీ, నీవు నన్ను ఎప్పుడు చూసావు? నన్ను గూర్చిన విషయములు నీకేలాగు తెలియును? నా జీవితములో నేనెన్నడూ నిన్ను చూడలేదు? నేను ఒక ఇశ్రాయేలీయుడునని నీవేలాగు ఎరుగుదువు? నేను నీతిమంతుడనని, యధార్థవంతుడనని, మరియు సత్యవంతుడనని నీకేలాగు తెలియును? నీ జీవితములో నన్నెడునూ చూడలేదే! నీకేలాగు నా గురించి తెలియును?” అని అడిగెను.
“ఫిలిప్పు వచ్చి నిన్ను పిలువకముందే, నీవు ఆ చెట్టుక్రింద వున్నప్పుడే నేను నిన్ను చూచితినని” ఆయన చెప్పెను. నిన్నటి దినమున ఆ కొండనుండి ముప్పది మైళ్ళ దూరములోనున్న నన్ను చూచిన నీ కన్నులు ఏమి కన్నులై యుండును?
ఇప్పుడు, అతడు ఏమి చెప్పెను? “రబ్బీ, నీవు దేవుని కుమారుడవు; ఇశ్రాయేలీయుల రాజువు” అని అన్నాడు.
71
దానిని ఆ యూదులు గుర్తించియుండినయెడల .... ఇప్పుడు కొద్దిగా ఆగండి, అతడు ఎన్నుకొనబడిన యూదుడు. ముందుగా ఎన్నుకొనుటయందు ఎంతమందికి నమ్మకము గలదు? ఓ, అనేకమంది దానిని ఎన్నటికీ పొందుకోలేరని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్న దానిని గమనించితిరా? కాని, ఆ మనిషిలో దేవుని ఆత్మను కలిగియుండెను, దానిని అతడు ఒప్పుకొనెను. “రబ్బీ, నీవు దేవుని కుమారుడవు; ఇశ్రాయేలీయుల రాజువు,” అని అతడు చెప్పెను.
అయితే, ఆనాడు అచ్చటయున్న వేదాంతపండితులు, యాజకులు మరియు గొప్ప బోధకులు నిలబడి ఆయన చెప్పిన దానిని వినుచున్నారు. వాళ్ళేమన్నారో మీకు తెలుసా! “ఆయన సోదె చెప్పువాడు. బెయల్జెబూబు ఆత్మ ఆయనలో వున్నది” అని వారు చెప్పిరి.
దానిని వారు అందరికీ వినబడేట్లు మాట్లాడలేదు. లేదు, లేదు; యేసు వారివైపు తిరిగి, వారిని చూచి ఇలా అనెను, “మీరు నన్ను అలాగే పిలువవచ్చును, ఆ తలంపుతోనే ఉండండి, కాని పరిశుద్ధాత్మ వచ్చు కాలము ఒకటి సమీపించుచున్నది. అదే కార్యములను ఆయన చేయుచున్నప్పుడు మీరు ఒక్కమాట పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మాట్లాడినయెడల, దానికి ఆ లోకమందైనాగాని, రాబోవు లోకమందైనా గాని పాపక్షమాపణ యుండదు.”
అలాగైతే ఇట్టి కార్యములను గూర్చి మనమేమి మాట్లాడుచున్నాము?
72
వారు యూదులు. వారే నిజమైన సత్యవంతులైన మరియు యదార్థవంతులైన యూదులు, ఆయన మెస్సీయా అని వారు నమ్మితిరి. బోధకులు మరియు వేదాంత పండితులు వారి గురించి ఏమందుము? సర్పము యొక్క బీజము దానిని గూర్చి మనమెరుగుదుము. “మీరు మీ తండ్రియైన అపవాదికి చెందినవారని” వారిని గూర్చి ఆయన చెప్పెను. వారెంతటి తెలివైన వారైనను, జ్ఞానవంతులైనను, పరిశుద్ధులైనను వారిని గూర్చి అలాగే ఆయన చెప్పెను. వారు ఒక గడ్డి పరకను కూడా వారు కదిలించలేని వారు. సబ్బాతును వారు ఆచరించెదరు. మాంసమును వారు భుజించరు. వారు పరిశుద్ధమైన మనుష్యులు, అయినప్పటికినీ ఆయన ఎవరు అనేది వారు చూడలేకపోయారు, ఎందుకనగా వారు మానవుల ద్వారా తర్ఫీదును పొందినవారు. దేవుడు తన మనుష్యులకు ఆయనే కరుకైన తర్ఫీదును ఇచ్చును. అది నిజము, దేవుడు పిలిచిన మనుష్యులు!
73
పిదప ఒక దినమున... అలాగే ఆయనను గూర్చి యూదులు తలంచిరి. ఆ విధముగా ఆయన కూడా తనను యూదులకు బయలుపరచుకొనెను. అది లేఖనము అని ఎంతమంది దానిని ఎరుగుదురు. సరే, మంచిది. ఆయన తనను, యూదులకు ఆ విధముగా బయలుపరచుకొనినయెడల, నిన్నటి దినమున యేసు యూదులలో ఆ విధముగానే ఉండియుండును. “సమరయులు ఆయన రాకడ కొరకై ఎదురు చూచుచున్నారని,” నీవు చెప్పితివి, అవును, వారు ఎదురు చూచిరి, కాని అన్యజనులు కాదు; కేవలము సమరయులు మాత్రమే ఎదురు చూచుచుండిరి.
ఆయన మొదటిగా సమరయులను సంధించినప్పుడు, సమరియు దారిగుండా ఆయన వెళ్ళవలసివచ్చినది. పండ్రెండు గంటల సమయమున ఆయన అచ్చట ఆగి, ఆహారమును తీసుకొని వచ్చుటకై ఆయన తన శిష్యులను పంపివేసెను. అచ్చటయున్న ఒక బావియొద్ద ఆయన కూర్చొనియుండగా, ఒక స్త్రీ అచ్చటకు వచ్చినది. ఆమె చెడు ప్రవర్తన కలిగిన ఒక స్త్రీ, వీధులలో తిరుగు స్త్రీ మీరెరుగుదురు. ఈ లోకమందు ఒక వ్యభిచార స్త్రీగా యుండెను. కొంచెము నీళ్ళు చేదుకొనుటకు చేతిలో యున్న చేదను త్రాడుతో బావిలో వేసినది. “స్త్రీ త్రాగుటకు నీళ్ళు ఇవ్వుము అడుగుచున్న ఒక స్వరమును ఆమె వినెను.”
ఆమె చుట్టువైపుల చూస్తూ అచ్చట మధ్య-వయస్కుడైన యూదుడు కూర్చొనియుండుట చూచెను. ఆయనకు కేవలము ముప్పది సంవత్సరములు ఇంచుమించు ఉ౦డును, కాని పరిశుద్ద గ్రంధము ఆయనను చూచుటకు ఏబది సంవత్సరములు గలవాడుగా యున్నాడని చెప్పుచున్నది. “నీకు ఇంకా ఏబది సంవత్సరములు కూడా నిండలేదు గాని, నేను అబ్రహామును చూచియున్నానని ఏల చెప్పుచున్నావు?” “అబ్రహాము కంటే ముందుగా నేను ఉన్నవాడినని” ఆయన చెప్పెను. గమనించితిరా? ఆయన చేయు సేవ నిమిత్తము, ఆయన యొక్క మానవ శరీరము ఆ విధముగా ఎక్కువ వయస్సున్నవానిలా చూచుటకు కనబడుచున్నది.
74
స్త్రీ చుట్టూ చూచుచున్నది, ఆయన ఒక యూదుడని ఆమెకు తెలుసు. “అయ్యా, యూదులు ఈ విధముగా సమరయుల దగ్గర అడగరు. వారికి మాకు మధ్య ఎటువంటి సంబంధము లేదు,” అని ఆమె చెప్పెను.
“నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడొ అదియు నీవు ఎరిగియుంటే, నీవు ఆయనను దాహమునకిమ్మని అడుగుదువు, ఆయన నీకు జీవజలమును ఇచ్చినయెడల ఇచ్చటకు వచ్చి నీళ్ళను తీసుకొని వెళ్ళవు,” అని ఆయన ఆమెతో చెప్పెను. ఆయన ఏమి చేయుచున్నాడు? ఆయన ఆమె యొక్క ఆత్మను తాకుచుండెను, గమనించితిరా. గమనించండి; ఇప్పుడు ఆయన తనను తాను సమరయులకు బయలుపరచుకొనుచుండెను.
“మీరేమో యెరూషలేమునందు ఆరాధించవలెను” అని మీరందురు, మేమేమో “ఈ కొండమీద ఆరాధించవలెను” అని చెప్పెదము అని ఆమె అనెను.
“ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు — కాని ఆత్మతోను, సత్యముతోను ఆరాధింతురు, తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు,” అని ఆయన చెప్పెను. ఆయన ఏమి చేయుచున్నాడు? ఆమె యొక్క ఆత్మను పట్టుకొనుచున్నాడు.
75
కొద్దిసేపు అయిన తర్వాత, ఆమె యొక్క సమస్య ఎక్కడ యున్నదో ఆయన కనుగొనిన పిమ్మట. ఆమె యొక్క సమస్య ఏమిటని ఎంతమందికి తెలుసు? ఆమెకు ఐదుగురు భర్తలు వుండిరి, మరియు ఇప్పుడు ఇంకొకడైన ఆరవవానితో ఆమె జీవించుచున్నది. కాబట్టి, “స్త్రి, నీవు వెళ్ళి ఇచ్చటకు నీ భర్తను తీసుకొని రమ్ము,” అని ఆయన చెప్పెను.
“నాకు ఏ భర్త లేడు,” అని ఆమె చెప్పెను.
“అవును, అది నిజము. నీకు ఐదుగురు భర్తలుండిరి. ఇప్పుడు నీవు ఇంకొకనితో జీవించుచున్నావు, అతడు నీ భర్త కాదు,” అని ఆయన చెప్పెను.
ఆమె నివ్వెరపోయి, ఆయననే చూస్తూ వుండిపోయినది. ఇప్పుడు, “నీవు బయల్జెబూబు, అయ్యా, నీవు సోదె చెప్పువాడవు” అని ఆమె చెప్పలేదు. ఆమె వేశ్యయైనను ఇచ్చట జెఫర్సన్ విల్ లో యున్న సగం మంది ప్రసంగీకులకు దేవునిని గురించి తెలిసినదానికంటే ఇంకా ఎక్కువగానే దేవుని గురించి ఆమెకు తెలుసు. అవును, అది వాస్తవము — “అయ్యా, నీవు ఒక ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను” అని ఆమె చెప్పెను. గమనించండి; “ఒక ప్రవక్త” ఈ మాట వెనుకకు వెళ్ళి మీరు దానిని కనుగొనినయెడల, మోషే చెప్పిన “ఆ ప్రవక్తను” గూర్చి అది వర్తించును. చూచారా, “ప్రభువు, మీ దేవుడు, నాలాంటి ఒక ప్రవక్తను మీ మధ్యలేపును అని మోషే చెప్పియుండెను. ”నీవు ఒక ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను“ అని ఆమె చెప్పెను. వేరే ఏ మార్గమున ఆయనను ఆమె ఎరుగలేనని ఆమె ఎరిగియుండెను. ”అయ్యా, నీవు ఒక ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను“ అని చెప్పెను. (ఇప్పుడు ఇక్కడ వినండి.) ”మేము సమరయులము,“ (ఇప్పుడు యూదులు కాదు, సమరయులు) మెస్సీయా వచ్చునప్పుడు ఆయన మాకు సమస్తమును తెలియజేయునని మేము ఎరుగుదుము. చూడండి, ఎటువంటి విధమైన ఒక సూచనను వారు ఎదురుచూచుచున్నారు. మెస్సీయా యొక్క సూచనను ఎదురు చూచుచున్నారు. ”మెస్సీయా వచ్చునప్పుడు ఆయన మాకు సమస్తమును తెలియజేయును, కాని నీవెవరవు?“ అని ఆమె అడిగెను.
“నీతో మాటలాడుచున్న నేనే ఆ మెస్సీయాను” అని ఆయన చెప్పెను.
ఆ స్త్రీ తన చేతిలోయున్న ఆ కుండను విడిచిపెట్టి, ఊరిలోనికి పరిగెత్తుకు వెళ్ళి, “మీరు వచ్చి నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన మెస్సీయ్యా కాడా?” అని ఆమె చెప్పెను.
76
అప్పుడు అది మెస్సీయ్యా యొక్క సూచనగా అది యుండినయెడల, నేడు కూడా అది మెస్సీయ్యా యొక్క సూచనగానే యుండి యుండవలయును. ఇప్పుడు జ్ఞాపకముంచుకోండి, ఆ సూచన ఏ ఒక్కసారి కూడా ఏ అన్యుజనులు ఎదుట చేయబడలేదు. అది నిషేధించబడినది. ఎందుచేత? అన్యజనులు రెండువేల సంవత్సరములుగా “సంఘ శాస్త్రమును” కలిగియున్నారు. కాని ఇప్పుడు అన్యజనుల కాలము సమాప్తమగుచున్నది. కమ్యూనిష్టులైన రష్యా భూమిని అంతము చేయుటకై నీ వైపు గురిపెట్టి యుంచిన ఒక బాంబును పెట్టియున్నది. భయపడవద్దు, అది వచ్చుచున్నది. పరిశుద్ధ గ్రంథము ఆ విధముగానే చెప్పియున్నది. దీనిపైన నీ పేరు వ్రాసియున్నది. సమస్త దేశము ఒక్క నిమిషములోనే బూడిదైపోవును. అది సంపూర్తిగా నాశనమైపోవును.
77
గమనించండి. దేవుడే దానిని చేయుచున్నాడు. వారు ఒక స్వతంత్ర ఏకాధిపత్యము గలవారిని, వారు అన్యజనుల గుంపని నేనెరుగుదును. కాని గత దినములలో ఇశ్రాయేలీయులను సరిచేసి చక్కదిద్దుటకై అన్యదేశములను దేవుడు పైకి లేపలేదా? రష్యా మరియు కమ్యూనిజము భూమి మీదయున్న ప్రజలను నిర్మూలించుటకే దేవుని చేతిలో వాడబడుచున్న ఒక సాధనముగాయున్నది అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, కాని అది సంభవించుటకు ముందుగా ఎత్తబడుట జరుగును. అది సంభవించుటకు ముందుగానే సంఘము అవతలి గృహమునకు కొనిపోబడును. అది అంత సమీపముగా యున్నయెడల, ఎత్తబడుట ఇంకా ఎంత సమీపముగా యుండును? దానికంటే ఇది ఎంతో సమీపముగా యుండును.
కాబట్టి మీరు గమనించిన, ఇందు నిమిత్తమై నేనెంతగా ప్రసంగించవలెనో అంత కఠినముగా, నాకు సాధ్యమైనంత కఠినముగా ప్రయాసపడుచూ ప్రసంగించుచున్నాను. ఎన్నుకొనబడిన వారిని దానియొద్దకు త్రోయుచూ, స్త్రీ యొక్క బీజమును ఆకర్షించుచూ దానిని వెలుపలికి తీయుచూ, తద్వారా సర్పము యొక్క బీజము శిక్షింపబడునట్లుగా దేవుడు తాను చేయవలసినదంతా ఆయన చేయుచున్నాడు. అది ఎంతో వాస్తవముగా యున్నది. దానినే ఆయన చేసెదనని వాగ్దానము చేసెను.
78
ఇప్పుడు, యూదుల ఎదుట మరియు సమరయుల ఎదుట యేసు తానే తనను బయలుపరచుకొనుటకై తాను చేసిన సూచనలు, మనయెదుట ఆయన అదే సూచనలు చేయనియెడల ఆయన న్యాయవంతుడు కాడు. “మేము మెథడిస్తులము, మేము బాప్తిస్తులము, మేము కాథలిక్కులము, మేము ప్రెస్పిటేరియనులము” అని మనము చెప్పుకుంటున్నట్లు ఆయన మనలను అలాగే వదిలి వేయునా? ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నయెడల, మొదటిసారి ఆయన చేసిన విధముగానే అదే సూచనలతోను, అద్బుత కార్యములతోను ఆయన రావలయును. మనము ఆ దినమునకు వచ్చియున్నాము. ఇప్పుడు మనము ఆ దినముల యొద్దకే వచ్చియున్నాము. పరిశుద్ధ గ్రంథము ద్వారా, సాక్ష్యముల ద్వారా, ఆత్మ ద్వారా, విజ్ఞాన శాస్త్రము ద్వారా, సమస్తము ద్వారా, అవి ఇచ్చట వున్నవని అది రుజువు పరచుచున్నది. దీనిని చూచునట్లుగాను మరియు దానిని ప్రజలలోనికి వెళ్ళునట్లుగా చేయుటకు ఓ, నాకు బలము యుండవలెనని నేను ఆశించుచున్నాను.
79
ఇచ్చట జెఫర్సన్ విల్ లో యున్న ప్రజలు మీరు నా జనులు, నేను మీతో కూడా పెంచబడితిని, నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను. నేనొక మతోన్మాదినని మీరు నన్ను తలంచవద్దు. నేను ముందుగా చెప్పబడిన ఆ సంగతులను గురించి ఆలోచించారా? 1937వ సంవత్సరము నందు వరదలు వచ్చునని చెప్పినప్పుడు, ఇచ్చట సంఘములో వున్న మీరు అప్పుడు నవ్వితిరి. స్పింగ్ వీధిలోనికి 22 అడుగుల ఎత్తువరకు వరదనీరు మంచివేయునని ఆరు నెలలకు ముందుగా నేను చెప్పితిని. “ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడని” ఏదైనా ఒక కార్యమును గూర్చి చెప్పి, అది చెప్పినట్లుగా ఆ విధముగా జరుగకుండా ఎప్పుడైనా తప్పిపోయినదా? అది ఖచ్చితముగా నిజము. ఆయన చెప్పిన విషయము ఏదైన జరుగకుండా తప్పిపోయినవి ఏవైనా యున్నవా? ఎన్నడూ లేదు; అది సత్యము. అది ఇంకా సత్యముగానే యుండును. అది ఎల్లప్పుడునూ సత్యముగానే యుండును.
80
ప్రార్థన కొరకు వంద లేదా అంతకంటే ఎక్కువ మంది ఇచ్చట వున్నారని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి వాళ్ళందరిని మనము తీసుకొని రాలేము. ఒక్కొక్కసారిగా మనకు సాధ్యమైనంత వరకు మనము చేద్దాము. అందరూ ఇచ్చటకు వచ్చువరకూ ప్రార్ధిస్తూ అందరిని ఇచ్చటకు రానిద్దాము.
ఇప్పుడు, నేను ప్రారంభించాలని ఆశిస్తున్నాను. బిల్లీపాల్ ఇచ్చట లేడా?వెనుక వున్నాడా? అతనిని ఇచ్చటకు రమ్మనండి. ప్రార్ధనా కార్డులను ఎన్ని ఇచ్చెనో నేను చూడవలయును. నీవు ఏ ప్రార్ధనా కార్డులను ప్రార్థనా కార్డును చూచుకోండి. అది 'Q' ఒకటి నుండి వందవరకు మంచిది. ఒకేసారి అందరిని మనము తీసుకొని రాలేము. ఒకసారి కొంతమందిని పిలిచి ప్రార్ధించుచుండగా, మరలా కొంతమందిని మనము పిలిచెదము. కొందరికి ప్రార్ధించేంత వరకూ ఒకరి వెంబడి ఒకరు అందరూ రావలయునని మేము ఆశిస్తున్నాము.
81
ఇప్పుడు గమనించండి, వెలుపల మరియు లోపల ప్రతీ ఒక్కొక్కరూ దీనిని ఆలోచించాలని నేను ఆశిస్తున్నాను. ఈ కూటమును ముగింపుతో ఈ సంఘమునకు కాపరియగు నెవిల్ కు నేను మిమ్మల్ని అప్పగించుచున్నాను, నెవిల్ ను దేవునికి అప్పగించుచున్నాను. సహోదరుడు నెవిల్ ఇచ్చట వున్నాడు. “వెనుక ఉన్నవారినందరిని నేను ఆహ్వానించుచున్నాను. సహోదరుడు నెవిల్ ఒక ధీరుడైన సైనికుడు. అతడు ఒక నిజమైన క్రీస్తు యొక్క సేవకుడు, ఒకప్పుడు మెథడిస్తు బోధకుడు, ఆస్బరి వేదాంత కళాశాల నుండి వచ్చిన ఒక విద్యార్థి అని నేను అనుకుంటున్నాను. వేదాంత పాఠశాల యందును, తత్వశాస్త్రము యందు తర్ఫీదును పొంది, వారు బోధించు బోధనయందు అన్నింటిలోను అతడు అనుభవముగలవాడు. కాని ఒకానొక దినమున ఏదో ఒక భిన్నమైనదానిని ఎరిగినవాడై తానున్న హద్దును దాటి రావలసిన స్థలమునకు వచ్చి చేరెను. అతడు ఈ సంఘమునకు కాపరి, దేవుని ఆత్మతతో నింపబడిన మనిషి, ఒక నిజమైన బోధకుడు మరియు ఒక నిజమైన వేదాంత పండితుడు, ఈ పట్టణ ప్రజలకు మరియు ఈ ప్రాంతపు వారికి నేను మీకు చెప్పుచున్నదేమనగా, మీకు సంఘము లేనియెడల, ఒక నిజమైన సువార్తను వినవలెనని మీరు ఆశించినయెడల - సహోదరుడు నెవిల్ యొద్దకు వచ్చి వినండి. నేను దేనికొరకై నిలబడుచున్నానో, దానికొరకే అతడు కూడా నిలబడును. నిశ్చయముగా అతడు ఒక ధీరుడైన సైనికుడు. ఇచ్చటయున్న మనమందరము సహోదరుడు నెవిల్ ను ప్రేమించుచున్నాము. ఎంతోకాలముగా అతడు మాతో ఇచ్చట వుంటున్నాడు. మనము అతనిని ప్రేమించుచున్నాము.
82
పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు యేసుక్రీస్తు మరలా ఈ రాత్రికి ఇచ్చటకు వచ్చినట్లైతే, ఈ భూమి మీద ఆయన వున్నప్పుడు యూదుల యెదుట మరియు సమరయుల ఎదుట ఆయన చేసిన అదే క్రియలు, అన్యజనులమైన మన ఎదుట ఆయన అదే క్రియలను చేయును. “నా పూర్ణహృదయముతో నేను నమ్ముచున్నాను మరియు ఇచ్చట దీనిని నేను అంగీకరించుచున్నాను,” అని మీలో ఎంతమంది చెప్పగలరు? నీవు ఏ సంఘమునకు చెందియున్నావో దాని గురించి లెక్క లేదు. దానితో ఏ సంబంధము లేదు...
“నన్ను మెథడిస్తు సంఘమును వదిలివేయమని నీవు కోరుచున్నావా?” అని మీరు అనవచ్చు
“లేదయ్యా.”
“బాప్తిస్టు సంఘమును వదిలివేయమంటున్నారా?”
“లేదయ్యా.” మీరు కోరుకొనుచున్న ఏ సంఘమునకైనా మీరు వెళ్ళవచ్చును. ప్రతి సంఘములలోను దేవుడు ఆయన బిడ్డలను కలిగియున్నాడు. ఖచ్చితముగా, ఆయన కలిగియున్నాడు. ఒకవేళ వారిలో నీవు కూడా ఒకనిగా కూడా యుండవచ్చును. బ్రెన్హాం గుడారములోనున్న సభ్యుల వలె నిన్ను కూడా ఒక సభ్యునిగానే నేను నిన్ను ప్రేమించెదను. వేరొక సంఘమునకు చెందిన సభ్యుడవన్న ఏ బేధమును నాకు కలిగించదు. ఎందుకనగా, ప్రతిచోటయున్న నా పరిచర్య ద్వారా దీనిని నీవు తెలుసుకొందువు. మీరు ఎటువంటి గురుతును కలిగియున్న దానితో ఏ సంబంధము లేకుండా దేవుడు తన బిడ్డలను ప్రేమించునని నేను నమ్ముచున్నాను. నీ హృదయములో ఏమియున్నదనే దాని మీదనే అది ఆధారపడియున్నది. కాని మేము మీ యొక్క సహవాసమును ఆహ్వానించుచున్నాము. మీరు రావలెనని ఆహ్వానించుచున్నాము.
83
ఇప్పుడు, ప్రతి ఒక్కొక్కరికి తెలుసును. మరియు జెఫర్సన్ విల్ లో నున్న ప్రజలగు మీరెరుగుదురు, ముందుగా చెప్పబడిన విషయములను గూర్చి జరిగిన కార్యములు గురించి, ప్రవచించిన అనేక కార్యములు గురించి మరి అవన్నియు ఒక్కొక్కటిగా ఎంతో పరిపూర్ణముగా నెరవేరినవని ఎరుగుదురు. అవన్నియు నిజమని జెఫర్సన్ విల్ లో యున్న మీలో ఎంతమందికి అది తెలుసు. ఇప్పుడు ఇచ్చట చుట్టూయున్న వారందరూ ఎరుగునట్లు మీ చేతులను పైకి ఎత్తండి. పట్టణమునకు వెలుపల నుండి వచ్చిన ప్రజలగు మీకు నేనేమి చెప్పుచున్నానో మీకు అర్థమగుచున్నదా? ఈ పట్టణమునకు వెలుపల నుండి వచ్చి నా కూటములలో కలిసికొని నేను ముందుగా చెప్పిన కార్యములు చెప్పినట్లుగానే ఖచ్చితముగా జరిగినవాటిని చూచిన బయటవారగు మీరు, ఈ జెఫర్సన్ విల్ లో నున్న ప్రజలు చూచునట్లుగా మీ చేతులను పైకి ఎత్తండి, చూచారా? “ఇద్దరు లేదా ముగ్గురు నోట పలికిన సాక్ష్యము ప్రతీ మాటను స్థిరపరచునని,” పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ప్రపంచమంతటా అది జరుగుచునే యున్నది. అట్లైన దేనికొరకై మనము కనిపెట్టుకొని యున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రతిదీ మనము మన హస్తములలో కలిగియున్నాము. ఆయన సమస్తమును మనకు ఉచితముగా అనుగ్రహించెను.
84
ఇప్పుడు, ప్రార్ధనా వరుసను మనము ప్రారంభించెదము. యేసుక్రీస్తు ఈ రాత్రి ఇచ్చట దానిని జరిగించును. ఆ వెలుగు, దృశ్యరూపములో ప్రత్యక్షమైన ప్రభువైన యేసు యొక్క పటమును గూర్చి మీకు ఎంతమందికి తెలుసు? అనుభవ రీతిగా దానిని గూర్చి మీ అందరికీ తెలుసు. అది వాషింగ్టన్ డి.సి.లో గత కొన్ని సంవత్సరములుగా కలదు. దానిని ప్రసిద్ధిగాంచిన ఎడ్లర్ హూవర్ట్ ద్వారా ఆ పటము తీయబడి, జార్జ్ జె.లేసి అనే వ్రేలి ముద్రల నిపుణుల ద్వారా అది నిజమైనదని రుజువు చేయబడి కాగితముపై అతడు వేసిన సంతకము మనయొద్ద గలదు. నీవు చేయునది మానసిక శాస్త్రము మరియు మనుష్యుల యొక్క మనస్సును చదువుట అనే ఒక భావమును ఒకప్పుడు అతడు కలిగియుండెను. “కాని, బ్రెన్హాం సోదరుడా, కెమెరా యొక్క యాంత్రిక కన్ను మానసిక శాస్త్రమును పట్టుకోలేదు, కెమెరా యొక్క లెన్స్ ను వెలుగు తాకినది? అని అతడు చెప్పెను, ఆ పటము క్రింద దానిని గూర్చి సమస్తము వ్రాయబడి, ప్రచురించబడినది ఆ వెలుగు ఆ కెమెరా లెన్స్ ను తాకినది.
85
వందలకొలది మందికి ఆ నదియొద్ద నేను బాప్తిస్మమును ఇచ్చినప్పుడు, మొట్ట మొదటిసారిగా జనుల ముందు ప్రత్యక్షమైన ఆ వెలుగును చూచిన మీరు, ఎంతమంది ఇంకా జీవించియున్నారు? ఈ భవనములో వారెవరైనా వుంటే, మీ చేతులను పైకెత్తండి. ముగ్గురు లేదా నలుగురు చేతులు ఎత్తబడినవి. వారు ఇంకా జీవముతో యున్నారు. కొన్ని సంవత్సరముల క్రితము ఆ నదియొద్ద ఆ వెలుగు ప్రత్యక్షమై క్రిందికి దిగి వచ్చినప్పుడు దేవుని వర్తమానము వచ్చినది. ఇంకను ఆయన మారనివాడుగానే యున్నాడు! ఆ స్వరము అచ్చట ఏమి చెప్పినదో, అది దానిని చేసినది అదేమనగా, నేను ప్రసంగించుచూ చేయుచున్న నా పరిచర్య క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందుగా ప్రపంచమంతటా గొప్ప ఉజీవమును ప్రారంభించుటయేయగును. అది ఏమి చేసినదో దానిని గమనించండి. గమనించితిరా? దాని నుండి బయటకు వచ్చిన వారే ఓరల్ రాబర్ట్ మరియు ఇంకా తదితరులు, అర్థమయ్యిందా? ప్రపంచ మంతటా ప్రతి దేశమునకు, ప్రతి జనులకు మరియు ప్రతి భాషకు అది వ్యాపించినది. గొప్ప స్వస్థతా కూటములలో ఆ ఉజ్జీవము అగ్నిజ్వాలలై మండుచున్నది, చూచారా. లోపల, వెలుపల మరియు మీరు ఎక్కడయున్నను క్రీస్తును స్వీకరించుటకై ఇప్పుడు మీరు సిద్దముగా వుండండి. ఈ రోజు రాత్రియందు మీరు సిద్ధముగా యున్నారా?
86
ఇప్పుడు, నన్ను నేను ప్రభువగు యేసుక్రీస్తునందు సమర్పించుకొనుచున్నాను. తద్వారా నన్ను నేను పరిపూర్ణముగా పరిశుద్ధాత్మకు అప్పగించుకొనుటచే యేసుక్రీస్తు మాత్రమే మహిమపడును గాక! నన్ను కాదు, కాని యేసుక్రీస్తును మాత్రమే ఈ పట్టణమునందును, వెలుపల యున్న ఈ జనులును, నా జనులును, నా స్నేహితులు నేను ప్రసంగించిన సువార్త పరిపూర్ణముగా సత్యమని ఎరుగుదురు గాక. ఆయన ఆత్మద్వారా మరియు ఆయన వాక్యము ద్వారా అది సత్యమని నిరూపించుటకు యేసుక్రీస్తు ఇచ్చట వున్నాడు.
87
మంచిది, వాళ్ళని ఒకేసారి పిలిచెదమా, మనము ఒకటి నుండి ప్రారంభించెదము. 'Q' ఒకటి. అది ఎవరిదగ్గర యున్నది? ఒకవేళ మీ వలన లేచుటకు వీలుపడకపోతే ఇచ్చటయున్నపెద్దలు మిమ్మల్ని తీసుకొని వచ్చెదరు. మీ అందరి దగ్గరికి ఒక్కొక్కరి యొద్దకు మేము వచ్చెదము. 'Q' ఒకటి. సహోదరుడు హికర్సన్, బిల్లీపాల్ లేదా కొంచెం వుండండి. సహోదరుడు డాక్ వారికి సహాయము చేయును. 'Q' సంఖ్య ఒకటి, అది ఎవరైనాగాని మీ చేతులను పైకి ఎత్తండి. అది 'Q' అని మీరు నిశ్చయముగా చెప్పగలరా? మంచిది, ఓ, క్షమించండి. సరే, మంచిది పైకి రండి. ఎలా రావాలో చూపించండి. ఆ ప్రక్క నుండి ఈ వైపుకు రండి. 'Q' సంఖ్య ఒకటి. సరే, మంచిది.
సంఖ్య రెండు, దయచేసి మీ చేయినిపైకి ఎత్తండి. సరే మంచిది, అమ్మా ఇచ్చటకు రండి మంచిది. తిన్నగా ఈ వైపుగా ఇచ్చటకు రండమ్మ. ఆ వెనుక అమ్మా మీరు ఆమెకు దారి ఇవ్వండి. అచ్చటయున్న బాలురు మరియు సహాయకులు మీకు సహాయము చేసెదరు.
88
'Q' సంఖ్య మూడు, మీ చేతినిపైకి ఎత్తండి. సంఖ్య మూడు? సంఖ్య మూడు ఎవరి దగ్గర యున్నను మీరు చేతిని పైకి ఎత్తండి. అచ్చటకు వెళ్ళుచున్న ఆమె దగ్గర ప్రార్థనా కార్డు వున్నదా చూడండి. ఆ ప్రార్థనా కార్డు నీదగ్గర లేదా? [ఆ స్త్రీ తన కార్డును వేరొకరికి ఇవ్వాలని కోరుచున్నది - ఎడిటర్.] నీవు అలా చేయకూడదు. లేదు, మేము ఏమి చెప్పుచున్నామో దానిని పాటించుచూ అలాగే దానిని పట్టుకొనియుండవలెను. ఎలాగైనా మేము ఆ బాలుడను చూచెదము. చూచారా? కార్డు మీదయున్న సంఖ్యను పిలిచినప్పుడే నీవు రావలయును. ఆ బాలుడును పిలిచినప్పుడు ఆ బాలుడు రావలయును. చూచారా? సరే, మంచిది.
సంఖ్య ఒకటి, రెండు మరియు సంఖ్య మూడు ఎవరి దగ్గర వున్నది! మీ చేతిని పైకి ఎత్తండి. సంఖ్య మూడు, సంఖ్య నాలుగు. అమ్మా, నీవు ఎవరైనా గాని అలాగు చేయాలని నీవు ఆశించినది అది మీ యొక్క గొప్ప మనస్సును తెలుపుచున్నది. చూచారా, కాని మీ యొక్క సంఖ్య పిలుచునప్పుడు, అప్పుడు వాళ్ళు వచ్చెదరు. ఒకవేళ వారిని పిలువకపోయినను ఎలాగైనను మేము వారియొద్దకు వెళ్ళెదము. చూచారా, మీ స్థలములోనే మీరు వుండాలని మేము కోరుచున్నాము. దానిని బట్టి మీకు మీ స్థలము లభ్యమగును. మీకు అర్థమయ్యిందా? సరే, మంచిది.
సంఖ్య మూడు. సంఖ్య నాలుగు, సంఖ్య. 'Q' సంఖ్య ఐదు. మీ చేతిని పైకి ఎత్తండి. ఒక యవ్వన స్త్రీ వెనుకయున్నది. సంఖ్య ఆరు. మంచిది యవ్వనస్తుడా, సంఖ్య ఏడు. ఆ వ్యక్తి ఇచ్చట యున్నాడు. సంఖ్య 8...
89
మనము దీనిని చేయవలయును. మీరు దానిని చేయలేరా, మీరు సమస్తమును గందరగోళముగా చేసేస్తారు. “అందరూ ప్రార్దించబడాలని ఆశిస్తున్నాము” అని మీరు అంటున్నారు. మేము ఎందుకొరకు ఈ విధముగా క్రమ పద్దతిని కొనసాగించుచున్నామని మీరు చూడాలని ఆశించినయెడల, మేము మీకు ఒకదానిని చూపిస్తాను.
ప్రతి ఒక్కొక్కరు ఇచ్చటకు వచ్చి, ప్రార్థించబడాలని ఆశించే వారందరూ మీ చేతులను పైకి ఎత్తండి. ప్రతి ఒక్కొక్కరు మీరు ఎవరైనా పరవాలేదు. అక్కడ చూడండి. మీలో ఎవరు ముందుగా రావలయును? అచ్చట ఎవరో ఒకరు ముందుగా రావలసియున్నది.
బిల్లీ ఇచ్చటకు వచ్చి కార్డులన్నింటిని తీసుకొని మీముందే వాటిని కలిపివేసి ఎవరెవరికి ప్రార్థనా కార్డులు కావలయునో వారికి ఒక్కొక్కటి ఇచ్చినయెడల, మీ కార్డు సంఖ్య ఐదు, ఆరు లేదా ఏదైనా రావచ్చు మరియు మేము ఏదో ఒక సంఖ్య నుండి ప్రారంభించెదము, అది ఎక్కడ నుండి ప్రారంభించినా అందులో ఏ వ్యత్యాసమువుండదు. కొన్ని సమయములలో వేదిక మీదికి వచ్చిన వారికంటే ముందే క్రింద గుంపులో కూర్పునియున్న జనులలో కొందరు నిజముగానే స్వస్థతను పొందుకొనుచున్నారు. మేమిద్దరము పరిచయములేనివారమే, అని ఎంత మందికి తెలుసును. మంచిది, నిశ్చయముగా, దీనికి దానితో ఏ సంబంధము లేదు.
90
సంఖ్య ఆరు ఆయన వచ్చాడా, సంఖ్య ఏడు. సంఖ్య ఎనిమిది. ఎవరి యొద్ద ఎనిమిది గలదు? దీనికిముందే యున్నదా? సంఖ్య తొమ్మిది. ఎనిమిది, సంఖ్య ఎనిమిది. దానిని పొందుకోవాలని మేము కోరుచున్నాము. ఒకవేళ వెలుపల వున్నవారిలో ఎవరైనా ఒకరు వుండ వచ్చును. మీ చేయిని పైకి ఎత్తండి లేదా వెలుపల వున్నవారు లోపలికి ప్రవేశించలేకపోయిన యెడల ఏదో ఒక కార్యమును చేసి తెలుపండి. సంఖ్య ఎనిమిది, సహోదరుడు కాలిన్స్, అక్కడ సంఖ్య ఎనిమిది వెనుక ఎవరి దగ్గరైనావున్నదా! వుండి లోపలికి ప్రవేశించుటకై ప్రయత్నము చేయుచున్నారేమో చూడుము. ప్రార్ధనా కార్డు మనము దీనిని చేయవలయును. మీరు దానిని చేయలేరా, మీరు సమస్తమును గందరగోళముగా చేసేస్తారు. “అందరూ ప్రార్ధి౦చుకోవాలని ఆశిస్తున్నాము,” అని మీరు అంటున్నారు. మనము దీనిని చేయవలయును. మీరు దానిని చేయలేరా, మీరు సమస్తమును గందరగోళముగా చేసేస్తారు. “అందరూ ప్రార్ధి౦చుకోవాలని ఆశిస్తున్నాము,” అని మీరు అంటున్నారు. సంఖ్య ఎనిమిది. సంఖ్య తొమ్మిది. ప్రార్ధనా కార్డు సంఖ్య తొమ్మిది. మీ చేతిని పైకి ఎత్తండి. ఒకవేళ వారు వెలుపలికి వెళ్ళారేమో, లోపలికి రాలేక పోవుచున్నారేమో? వారు వచ్చినయెడల వరుసలో నిలబెట్టండి.
సంఖ్య పది. నీ చేతిని పైకి ఎత్తుము. ఆ వ్యక్తి అచ్చట వెనుకవైపు వున్నాడు. అయ్యా, రండి. మిమ్మల్నిచూచి లోపలికి పిలుచుటకు ఆనందించుచున్నాను. కాల్ళు తిమ్మిర్లు పట్టనంతగా నీవు అచ్చట నిలబడియున్నావు. సంఖ్య పది. సంఖ్య పదకొండు. ఎవరి దగ్గరైతే ప్రార్ధనా కార్డు 'Q' సంఖ్య పదకొండు వున్నదో వాళ్ళు మీ చేతినిపైకి ఎత్తండి, మంచిది. పండ్రెండు, 'Q' సంఖ్య పండ్రెండు. సరే మంచిది. పండ్రెండు. పదమూడు, పదమూడు దయచేసి మీ చేయిని పైకి ఎత్తండి. అప్పుడే నేను మిమ్మల్ని చూడగలను. ప్రార్ధనా కార్డు పదమూడు, 'Q' సంఖ్య పదమూడు. పద్నాలుగు, పదిహేను! బిల్లి ఎన్ని కార్డులను వెలుపల ఇచ్చిరి, వంద ప్రార్థనా కార్డులనా? పదమూడు, పద్నాలుగు, పదిహేను ప్రార్ధనా కార్డుಲು కనబడుటలేదా? ప్రార్ధనా కార్డు పదమూడు, పధ్నాలుగు, మరియు పదిహేను మీరు వున్నారా? పదిహేను, పదహారు, పదిహేడు, పద్దెనిమిది, పంతొమ్మిది, ఇరవై, మొదట 'Q' తరువాతది 'J' తీసుకొనెదము. తరువాత వరుస ప్రకారముగా వెళ్ళుము. మొదట వాళ్ళు వాటన్నింటిని సరిచేయుటకు ప్రయత్నించుచున్నారని నేను తలంచుచున్నాను. మనము మొదట వారిని పిలిచిన తరువాత మిగతా వారిని పిలిచెదము.
91
మీరేమందురు? అవును. మీరు గమనించండి. వెలుపల మేము ప్రార్థనా కార్డులను ఈ ఉదయకాలమందు ఇచ్చితిమి. ఒకవేళ జనులు మరలా తిరిగి రాలేకపోయి వుండవచ్చును. సరే మంచిది.
మనము మెల్లగా ప్రారంభించెదము. మీరిప్పుడు అచ్చట వరుస క్రమములో చక్కగా నిలబడియున్నారా? సరే మంచిది, ఇప్పుడు పదిహేను, పదహారు, పదిహేడు, పద్దెనిమిది, పంతొమ్మిది, ఇరవై ఎవరి దగ్గర వున్నవి? “Q” సంఖ్య ప్రకారము. ఇరువది-ఒకటి, ఇరువది-రెండు, ఇరువది-మూడు, ఇరువది-నాలుగు, ఇరువది-ఐదు. ఇప్పుడు సిద్ధముగా వుండండి. వీరికి ముగించిన వెంటనే మీరు సిద్ధముగా వుండండి. ఇచ్చట వరుస నిండుగా జనులు వున్నారు. వీరికి ముగించిన వెంటనే వారి యొద్దకు వచ్చెదము. వెంటనే వరుసగావున్న వారియొద్దకు వచ్చెదము. అటు తరువాత “J” కార్డు నుండి మేము వదిలిన సంఖ్య నుండి చివరి సంఖ్య వరకు మేము వెళ్ళెదము.
ఇప్పుడు, నిజమైన భయ భక్తులతో కొద్దిసేపు మీరు ఉండవలయును. మనకు కూర్చొనుటకు వీలైనంత స్థలము ఉండినయెడల బాగుండును. దానిని చేయుటకు ఏదైన మార్గమువున్నయెడల బాగుండును. కాని...
92
ఇప్పుడు, మీరు చాలా భయభక్తులతో వుండవలయును. ఇంకా సమయము కలదు. తొమ్మిది గంటలు అగుటకు ఇంకా పది నిమిషములు కలదు. ఇంకా అర్థగంటలో కూటము ముగించబడును. కావున ఇది కూటము యొక్క ముగింపు సమయముగా యున్నది. మరియు ఇప్పుడు బహు భయభక్తులను కలిగియుండండి; చాలా నిశ్శబ్దముగా యుండవలయును; ఇటు అటు తిరుగుచూ ఉండకూడదు. మీలో ఎంతమంది దగ్గర ప్రార్ధనా కార్డులు లేకపోయినను ప్రార్థించబడాలని మీరు ఆశించుచున్నారు? మీ చేతులను పైకి ఎత్తండి. మంచిది, ఎచ్చట చూచినను పైకెత్తిన చేతులు కనబడుచున్నవి. మీ దగ్గర ప్రార్థనా కార్డులు లేనియెడల, నేను మీకు కొన్ని లేఖనములను ఇవ్వాలని ఆశించుచున్నాను.
93
ఒకానొకసారి మన ప్రభువు చనిపోయిన ఒక చిన్నదానిని బ్రతికించుటకు వెళ్ళుచుండెను. ఇంకా ఆ అమ్మాయి చనిపోయి యుండలేదు. ఆ చిన్నది జక్కయ్య కుమార్తె, ఒక స్త్రీ తన హృదయములో ఇలా అనుకొన్నది, “ఈయన పరిశుద్దుడైన మనిషని నేను నమ్ముచున్నాను, ఈయన మెస్సీయాయని నేను నమ్ముచున్నాను.” మరియు ఆమె రక్తస్రావపు వ్యాధితో అనేక సంవత్సరములుగా బాధపడుచుండెను. ఆమె జనుల గుంపులో నుండి దూసుకుపోవుచూ, ఆయన యొక్క వస్త్రములను తాకినది. ఆ కథను మీరు చదివి వుంటారు కదా? యేసు ఆగి, “నన్ను ముట్టినదెవరు,” అని అడిగెను.
ఈ గుంపులో అనేకమంది నిన్ను ముట్టుచుండగా, “నన్నెవరు తాకినది” అని నీవెలా అడుగుచున్నావని పేతురు యేసును చూచి చెప్పెను.
ఆయన “ప్రభావము నాలోనుండి బయటకు వెళ్ళినది, (బలము) ప్రభావము నాలోనుండి బయటకు వెళ్ళినది,” అని చెప్పెను. చూచారా, అది నీకు ఏమి చేయును? దర్శనము — “నేను బలహీనుడనైతిని; బలము నాలోనుండి బయటకు వెళ్ళినది.” ఆ స్త్రీని కనుగొనేంత వరకు ఆయన జనులందరి చుట్టూ చూచుచుండెను. ఆమె భయపడినది. తాను ఏదో తప్పు చేసితినేమో అని ఆమె భయపడినది. కాని ఆయన ఆమెవైపు చూచి, ఆమె యొక్క రక్తస్రావము వ్యాధిని గూర్చి ఈలాగు చెప్పెను, “నీ విశ్వాసమే నిన్ను రక్షించినది,” అని అన్నాడు. అది సత్వమని ఎంతమందికి తెలుసు?
94
పరిశుద్ద గ్రంథపు పండితులైన మీరు “యేసుక్రీస్తు మన ప్రధానయాజకుడని, ఆయన ఇప్పుడు మన ప్రధానయాజకుడై యుండి, మన బలహీనతలతో ముట్టగలిగినవాడుగా ఆయన ఉన్నాడని,” పరిశుద్ధ గ్రంథము చెప్పుట లేదా? ఎంతమంది దానినెరుగుదురు. ఆయన ప్రధానయాజకుడైయుండి, ఇప్పుడు మన బలహీనతలతో ఆయనను మనము తాకవచ్చును. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉండినట్లైతే ఆయన ఏ విధముగా క్రియ చేయును? ఆనాడు ఏ విధముగా క్రియ చేసెనో, నేడును అదే విధముగా క్రియ చేయవలసియుండును. అది నిజమేనా. ఇప్పుడు ఆయనకు మానవ శరీరము లేదు, ఎందుకనగా అది ఇప్పుడది దేవుని యొక్క కుడి పార్శ్వమున గలదు. అయితే ఆయన క్రియ చేయుటకు మన శరీరములు ఆయనకు గలవు. వాటి ద్వారా ఆయన క్రియ చేయును. ఆయన ఆత్మ మన ద్వారా క్రియ చేయుచున్నది. ఆయన చెప్పినట్లుగానే, “నేను మీలోను, మీతోను ఉండెదను; నేను చేసిన క్రియలను మీరును చేయుదురు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన వీటికంటెను మరి ఎక్కువ క్రియలను మీరు చేయుదురు.” మన స్థానములో ఆయన నిలబడెను, చూచారా. అయితే ఆయన తన ఆత్మతో మనలను అభిషేకించెను.
95
జనసమూహములోయున్న మీరు ఇటువైపు చూడండి. కేవలము ఒక బ్రెన్హాం సహోదరుడుగా నన్ను మీరు చూడవద్దు. “ప్రభువగు యేసు, నీవు మా ప్రధానయాజకుడవైయున్నావు, ఈ భవనములో నీవు ఉన్నావు, నా బలహీనములతో నేను నిన్ను తాకాలని కోరుచున్నాను. నేను వ్యాధితో ఉన్నాను, సహోదరుడు బ్రెన్హాంను నీ ఆత్మ ద్వారా నా వైపుకు తిప్పి, ఆ స్త్రీతో ఆనాడు నీవు చెప్పిన రీతిగా, నాతో చెప్పి దానిని నిరూపించుము. అది నాకు చాలును,” అని మీరు చెప్పండి. దానితో ఆ సమస్య పరిస్కారమగును. అది ప్రభువైన యేసుక్రీస్తు నామములో దానిని చేయుటకు, నేను మీ విశ్వాసమును సవాలు చేయుచున్నాను.
ఇప్పుడు దానిని గమనించండి, అది ఆ విధముగా సంభవించనట్లైతే, మీరు దేవునిని అడగండి. ఇప్పుడు మీరు భయభక్తులతో వుండండి. ఇప్పుడు అది నిజమా, కాదా అని చూద్దాము.
96
మీతో వ్యాధిగ్రస్తులను తీసుకొని రండి లేదా.. ఈ మనిషేనా? సరే మంచిది! ఈ భాగములో ఈ వరుసయందు ఇతడే మొదటివాడు...
ఎంతోమంది జనులు ఇచ్చట గలరు. ఇచ్చట జఫర్సన్ విల్ లో వున్న వారిని ప్రక్కగా వుంచి, ఈ పట్టణమునకు వెలుపల నుండి వచ్చిన వారిని లోపలికి తీసుకొని వద్దాము. లోపలికి రావాలని మీరు ఒకరినొకరు తోసుకుంటున్నారు, ఎందుకనగా ఈ వరసలో ఈ విధముగా నిలబడియున్న వారిలో జెఫర్సన్ విల్ లో యున్న జనులైతే సహోదరుడు బ్రెన్హాం గారికి ఈ ప్రాంతమంతటా వుండువారెవరో బాగా తెలుసు“ అని చెప్పుదురు. ఖచ్చితముగా, అది నిజము కాబట్టి విషయము అదే. కాని వారు ఆఫ్రికా, ఇండియా, ఆసియా, ఐరోపా ప్రపంచములోనున్న ఇతర స్థలములను వారు చూచియుండలేదు. కాని నాకు దానిని గూర్చి తెలియదు...
97
ఈ వరుసలో ఇచ్చట నిలబడియున్న వారందరూ చూచుటకు నాకు పరిచయము లేనివారుగా యున్నారని నేను నమ్ముచున్నాను. మీరందరూ నాకు పరిచయము లేనివారేనా? అలాగైతే మీరు మీ చేతులను పైకి ఎత్తండి. సరే, అది మంచిది. ఈ జనసమూహములో యున్న మీలో ఎంతమంది నాకు పరిచయము లేనివారు, లేదా మీకు ఏమి ఇబ్బందులు గలవో నేనెరుగనని ఎంతమందికి మీకు తెలుసు? ఎవరైనాగాని దానిని గురించి అక్కర్లేదు? నిశ్చయముగా, మీకు తెలియదు. కాని ఆయనకు తెలుసును. ఆయన చేయునని నేను చెప్పుట లేదు, కాని ఆయన దానిని చేసినయెడల, అప్పుడు ఆయన ఇచ్చట వున్నట్లు అది తెలియును.
ఇప్పుడు, ఇచ్చట ఈ వ్యక్తి మేము ఒకరినొకరికి అన్యులమని తన చేతిని పైకి ఎత్తేనని నేను నమ్ముచున్నాను. మేము అన్యులము. నా జీవితములో నేనెన్నడూ నిన్ను చూడలేదు. ఇప్పటివరకు ఇతడు తన జీవితములలో నన్నెన్నడూ చూచియుండలేదు. ఈ భవనములోకి వచ్చిన తరువాత ఇదియే మొట్టమొదటిసారిగా మేము ఒకరినొకరము చూచుకొనుచున్నాము.
98
ఫిలిప్పు నతానియేలు దగ్గరకు వెళ్ళుటయు, నతానియేలును తీసుకొని వచ్చుటయు, మరియు నతానియేలు యేసు ముందుకు వచ్చి నిలబడియుండు ఒక పరిపూర్ణమైన దృశ్యము ఇచ్చట గలదు. ఇతడు నతానియేలు, నేను యేసుక్రీస్తును అని భావము కాదు. దానిని ఆలాగు తలంచవద్దు. కాని అనేక సంవత్సరములకు పిదప అప్పుడు ఇవ్వబడిన ఒక వాగ్దానముగా ఇది యున్నది. ఇప్పుడు ఒకరినొకరము ఎరుగని, ఎన్నడూ సంధించని ఇద్దరు వ్యక్తులము ఇచ్చట వున్నట్లుగా, అప్పుడు కూడా ఒకరినొకరు ఎరుగని ఇద్దరు వ్యక్తులు అచ్చట వుండిరి. యేసుక్రీస్తు ఏకరీతిగా ఉన్నట్లైతే, ఇతడు తన ఆత్మను ఆ విశ్వాసమునకు లోపరచుకొనునట్లు సమర్పించుకొనునట్లైతే, నా వలన నా ఆత్మను విశ్వాసముతో క్రీస్తుకు లోపరచుకొనునట్లు, సమర్పించుకొనునట్లైతే, ఆ దైవీక వరము ద్వారా పరిశుద్ధాత్మ అదే అద్భుతమును చేయును. అది నిజమేనా? అది సహజాతీతమైనది.
“అది ఒక అద్భుతము,” చెప్పెదరు.
అతనిని ఎన్నడూ చూడనట్లయితే, నేనెలాగు అతడిని ఎరిగి యుండెదను? ఇచ్చట నా చేతులు గలవు. మేము ఒకరినొకరము ఎన్నడూ సంధించలేదు. మొట్టమొదటిసారిగా మేము ఇచ్చట నిలబడియున్నాము. నాకు తెలియదు, కాని అతని గూర్చి దేవుడెరుగును. ఇప్పుడు జ్ఞాపకముంచుకోండి, నాకోసం ప్రార్ధించండి.
కొన్ని సమయములలో ఆత్మ అభిషేకమును కలిగివున్నప్పుడు, అది ఎంతో బలముగా క్రియచేయును, ఈ సమయము నందు అటువంటి కార్యము జరిగేంతవరకూ మీరు చాలా భక్తితోను, విధేయతతో కూర్చొని వుండండి; ప్రార్థించుచూ; దానిని గమనించండి.
99
నేను నిన్ను ఎరుగను, కాని నీవు ఏదో ఒక కారణముచేత ఇచ్చటకు వచ్చావు, అదేంటో నాకు తెలియదు. కాని అదేమైనాగాని నీకు ఏది కావాలో యేసు ప్రభువు నీవు చెప్పకుండానే దానిని నాకు బయలుపరచినయెడల, అప్పుడు నేను చెప్పిన రీతిగా: ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా వున్నట్లుగా అది యుండును. నీవు దానిని నమ్ముచున్నావా? సరే, మంచిది ఇప్పుడు జనులారా మీరు దానిని నమ్ముచున్నారా? పరిశుద్ధ గ్రంథములో ఆయన చెప్పిన రీతిగా ప్రభువు దానిని చేయును.
ఇప్పుడు, ఒకటి పరిశుద్ధ గ్రంథములో వున్న సత్యమును చెప్పేవానిగానైనా నేను ఇచ్చట నిలబడి వుండవలయును లేదా పరిశుద్ధ గ్రంథములో చెప్పిన వాగ్దానమును అది నిలబెట్టుకోలేనిదిగానైనా అది వుండవలయును, లేదా నేను ఒక వేషధారిగానైనా వుండవలయును; వీటిల్లో ఏదో ఒకటిగా యుండవలయును, చూచారా. అది నిజము. నీవు ఎక్కడ నిలిచియున్నవో చూడుము? ఎన్నోవేలమంది జనులు ఎదుటను, విమర్శకులు మరియు అనేకులు ఎదుట వాటిని నేను చేసియున్నాను. ఆయన వాగ్దానమును చేసినయెడల, ఆయన చేసిన ఆ వాగ్దానమును ఆయన నెరవేర్చునని నేను ఎరుగుదును.
అది సరిగ్గా ఇప్పుడు ఇచ్చట ప్రారంభమగుటను నేను చూచుచున్నాను. వేదికల మీద చుట్టూ ప్రజలు ఉండుటను నేను చూస్తాను. కాని బయట జరుగు కూటములలో ఎన్నడూ చుట్టూ ఎవరూ ఉండరు. ఇచ్చట వ్యాధిగ్రస్తులు వున్నారు. ఆ ఆత్మ అభిషేకము కుమ్మరింపబడుట ప్రారంభించగానే దానిని మీరు తెలుసుకోగలరు. అదేమనగా, అది పరిశుద్ధాత్మ. ఇప్పుడు బహు భయభక్తితో వుండండి; మనము మాట్లాడునట్లు, ఇప్పుడు ఒక నిజమైన భయభక్తితో వుండండి.
100
అవునయ్యా, యేసు ప్రభువు మన ఇద్దరిని ప్రేమించుచుండెను. మన ఇద్దరి కోసం మరణించెను. ఇది మన ఇద్దరి మొదటి పరిచయము... నీకు ఒక అవసరత వుండినయెడల, నీ అవసరత ఏదై యున్నదో దేవుడు దానిని అనుగ్రహించగల చాలినంత సమర్దుడుగా ఆయన వున్నాడు, ఎందుకనగా ఆయన దానిని వాగ్దానము చేసియుండెను. కాని ఇప్పుడు, ఈ మనిషి తన హృదయమందు యదార్ధముగా వుండినయెడల, ఏదో ఒకటి తనలో జరుగుచున్నదని అతడు ఎరుగగలడు. ఆ జరుగుచున్న కార్యమేమిటన్నది తాను ఆలోచించలేడు. కాని ఆ పఠములో మీరు చూచుచున్న ఆ దూత ఇతనికి దగ్గరగా, ఇంకా దగ్గరగా సమీపించుచుండగా ఇతడు నా నుండి కనుమరుగైపోవుచున్నాడు. ఇప్పుడు ఈ మనిషి గుండె జబ్బుతోను మరియు మధుమేహ వ్యాధితోను బాధపడుచున్నాడు. అది నిజము. అది “ఆత్మ ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” అది నిజమైతే, నీ చేతిని పైకి ఎత్తుము.
101
నేనెన్నడూ నిన్ను చూచి యుండలేదు, కాని, నీ గురించి నేనెలాగు ఎరుగగలుగుచున్నాను? ఏదో ఒక మార్గము, అదేమనగా నిన్ను ఆయన ఎరిగిన అదే రీతిగా అది యున్నది. అది నిజమా? కూర్పునియున్న మీరు దానిని నమ్ముచున్నారా? ఇప్పుడు ఎందుకు మనము ఇచ్చట కొద్ది సమయమును వినియోగించుకోకూడదు, దానివలన అది ఊహకాదని - అది సత్యమని మీరు తెలుసుకుందురు. మనము ఏదైనా ఒక కార్యమును తీసుకొందుము. పరిశుద్ధాత్మ ఏదైనా ఒక విషయమును గూర్చి బయలుపరచునేమోనని మనము చూద్దాము. ఇచ్చట నిలబడియున్న ఈ మనిషితో ఒక్క నిమిషము మనము మాట్లాడుదాము. ఒకవేళ అతని జీవితములో ఏదో ఒక విషయము వుండవచ్చును లేదా అతని జీవితములో ఏదో ఒక ఇబ్బంది గలదేమో; నాకు తెలియదు. నేనేమి చెప్పియున్నానో నిజముగా నాకు తెలియదు. నేను తెలుసుకోవాలంటే ఇచ్చట వున్న ఆ టేపు రికార్డర్ వేసి ఆలకించాలి, ఎందుకనగా అది ఒక దర్శనము; అతను ఎచ్చట వున్నాడో మీరు చూడండి. అవును, ఇప్పుడు నేను దానిని చూడగలుగుచున్నాను; ఇచ్చట నిలబడియున్న ఈ మనిషి రక్తములో ఏదో లోపము కలదు. అది మధుమేహ వ్యాధి గలదు; అవును, అది మధుమేహము. అతడికి మధుమేహ వ్యాధి గలదు; అది గుండె జబ్బు వరకూ తీసుకొని వచ్చినది, దానివలన అతని గుండె బలహీనతకు దారి తీసినది. అది కొద్ది కాలముగా అతనికి గలదు. ఇతడు ఈ పట్టణమునకు చెందినవాడు కాడు. కాని ఇండియానా పట్టణములో బోర్డెన్ అని పిలువబడే స్థలమునకు దగ్గరలో ఇతడు నివసించుచున్నాడు. నిన్ను బోర్డెన్ అనే స్థలమునందు చూచుచున్నాను. నీవు బోర్డెన్ అనే స్థలమునుండి వచ్చితివి. ఇది “ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు.”
102
నీ జీవితములో ఇంకా ఏదో ఒక ఇబ్బంది గలదు. ఇప్పుడు ఇచ్చట ఇంకొకటి కనబడుచున్నది. ఈ దర్శనములో ఒక స్త్రీ కనబడుచున్నది. ఏలయనగా నీవు ఒక... ఆమె నీ భార్య ఆమెకు కూడా స్వస్థత అవసరమైయున్నది. ఆమె ఏదో ఒకరకమైన దగ్గుతో బాధపడుచున్నది. ఆమెకు ఉబ్బసం వ్యాధి గలదు.
నీ జీవితములో ఒక తప్పిదము గలదు. నీవు ఏదో చేయుటకు ప్రయత్నించుచున్నావు. నీవు పెంతెకోస్తు యొక్క విశ్వాసములో గలవు, ఎందుకనగా నీవు పెంతెకోస్తు కూటములో అరుస్తూ, చేతులతో చప్పట్లు కొడుతూ వుండుటము నేను చూచుచున్నాను. నీవు ప్రయత్నించు... నీవు పొగ పీల్చెదవు. సిగరెట్టు పొగను పీల్చుచున్నావు, దానిని వదలివేయాలని నీవు ప్రయత్నించుచున్నావు. అది ఖచ్చితముగా నిజము, అది “ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” అది సత్యము. అది నిజము కాదా? ఖచ్చితముగా, అది నిజము ఆయన ఇచ్చట ఉన్నాడని నీవు నమ్ముచున్నావా? నీ స్వస్థతను అంగీకరించుటకు సిద్దముగా వున్నావా? మన తలలను వంచుదాము.
ప్రభువగు దేవా, ఇప్పుడు ఇచ్చట ప్రసన్నమైయున్నవాడా, మృతులలో నుండి యేసుక్రీస్తును లేపినవాడా, ఈ వ్యక్తి దేవుని యొక్క ఆశీర్వాదములు తనపై నిలిచియుండుటకై ఇచ్చట వున్నాడు, అతని హృదయ వాంఛను నీవు అతనికి అనుగ్రహించవలెనని యేసుక్రీస్తు నామమున మేము ప్రార్థించుచున్నాము. ఆమేన్
నీవు నీ గృహమునకు తిరిగి వెళ్ళి, నీవు నమ్మినట్లుగా అది వున్నదో లేదో కనుగొనుము. నీవు నమ్మినట్లుగానే అది యుండును. దేవుడు నిన్ను దీవించును గాక
103
మీరు నమ్ముచున్నారా? ఈ పరిశుద్ధ గ్రంథమును వ్రాసినవాడగు సర్వశక్తిమంతుడగు దేవుడు, ఆయన యొక్క ఆత్మ ఇచ్చట ప్రసన్నమైయున్నది. ఈ నిమిషము వరకు ఈ వ్యక్తిని నేను నా జీవితములో ఎన్నడూ చూడలేదని అతడు ఎరుగును. కాని ఒక్క విషయమును నేనెరుగుదును. అదేమనగా, పరిశుద్ధాత్మ ఇప్పుడు ఇచ్చట గలదు. అతడి బాధ ఏమిటో నేనెరుగను. ఆయన ఏమి చేయునో నేనెరుగను, కాని ఆయన ఇచ్చట వున్నాడని నేనెరుగుదును.
ఈ స్త్రీయేనా? సరే, మంచిది. మనము ఒకరినొకరము ఎరుగము కదా? ఒకవేళ కూటములలో నీవు నన్ను చూసి వుండవచ్చును, కాని నేను నిన్ను ఎరుగను. అది నిజము. సరే, ఇప్పుడు నీవు ఏదో ఒక కార్యము నిమిత్తము ఇచ్చటకు వచ్చావు. ఈ స్త్రీ ఒక క్రైస్తవురాలిగా వుండవచ్చు, లేదా లేకపోవచ్చును. ఈమె ఒక విమర్శకురాలై వుండవచ్చు, ఒకవేళ ఈమె అలాగుండినయెడల ఏమి జరుగుచున్నదో గమనించి చూడండి. ఈమె ఎందుకొరకు వచ్చినదో నాకు తెలియదు.
104
నా తల్లి, వృద్ధురాలు, ఈ భవనములో ఎచ్చటో ఒకచోట కూర్చొనియున్నది. నేను ఆమెను బాధపెడతానని మీరు అనుకుంటున్నారా? ఒక వంచకుడుగా నేను ఆమె యొద్దకు వచ్చెదనని మీరు అనుకుంటున్నారా? నిజముగా ఆ విధముగా చెయ్యను. అలా చెయ్యడముకంటే ఈ వేదికను దిగి నడుచుకుంటూ నేను ఇంటికి వెళ్ళిపోవడము మంచిది. నేను వర్తమానమును ప్రసంగించితిని. కాని, అదంతా వర్తమానముతోనే పోవునని కాదు. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా వున్నాడు. దానిని గూర్చి లోకము ఏమి చెప్పినాగాని దానిని పట్టించుకోవద్దు; ఏది ఏమైనాగాని ఈ వర్తమానముతోనే మనము నిలచియుండవలెను. దానిని చేయమని దేవుడు చెప్పెను.
105
నిజముగా నేను నిన్ను ఎరుగను. వందలకొలది మరియు వందలకొలది జనులు గల ఈ కూటములో నీవు కూర్చొనియున్నాగాని నిన్ను ఎరుగుటకు నాకు ఏ మార్గము లేదు. కాని యోహాను సువార 4వ అధ్యాయములో మొట్టమొదటి సారిగా ఒక పురుషుడు, ఒక స్త్రీని సంధించే ఒక దృశ్యము గలదు. మన ప్రభువు సమరయ స్త్రీని సంధించుట. వారి మధ్య సంభాషణ జరిగినది. ఆయన ఆమె యొక్క ఆత్మను తాకెను. తద్వారా, ఆమెయందుగల తప్పిదమును ఆయన ఎరిగెను. దానిని ఆయన ఆమె యొద్ద చెప్పగా, అప్పుడు ఆమె ఆయన మెస్సీయాయని గుర్తించగలిగెను. నీవు కూడా అదే కార్యమును చేసెదవా? నీవు చేయుదువా. ఈ కూటములో వున్న జనులు — అక్కడ ఉన్న ప్రతియొక్క స్త్రీ, అదే కార్యమును చేయుదురా? దేవుడు దానిని అనుగ్రహించును గాక!
106
అవును, ఈ స్త్రీ నరముల బలహీనతతో బాధపడుచున్నది. ఎన్నో సంవత్సరముల నుండి ఆమె దానిని కలిగియున్నది. అయినను నేను ఆమెను ఒక యవ్వన స్త్రీగా చూస్తాను, అయితే అది కాదు ముఖ్యమైన విషయము, నేను ఆమె కొరకు ప్రార్థన చేయవలెనని ఆమె కోరుచున్నది. కీళ్ళవ్యాధి ఆమెను కుంటిదానిగా చేసినది. దానికొరకే నీవు నన్ను ప్రార్ధించమని కోరుచున్నావు.
ఇప్పుడు, నీవు నమ్ముచున్నారా? ఇంకా కొంచెము ఎక్కువగా ఆమెతో మాట్లాడుదాము. పరిశుద్ధాత్మ మనకు దానిని చేయును గాక. ఈమె నిజముగా పరాయి దేశము నుండి వచ్చియున్నది. ఆమె పేరు హేన్సన్. అది నిజము. నార్వేవాసి లేక స్వీడిష్ వాసి, నీవు ఈ పట్టణము నుండి వచ్చినదానవు కావు. కాన్టన్ అను పిలువబడు పట్టణము నుండి నీవు వచ్చియున్నావు. విస్తారమైన గోధుమలు పండే గొప్ప దేశమైయున్నది. అది మినిసొటా. నీవు అక్కడనుండియే వచ్చియున్నావు. అది సత్యము. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళుము; నీవు స్వస్థపడియున్నావు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపర్చియున్నాడు. ప్రభువు నీ పట్ల చేసిన మంచి కార్యములను ప్రజలతో చెప్పుము.
107
మనము ఒకరికి ఒకరము అపరిచితులము అని నేననుకొంటాను. నీవు ఎవరో నాకు తెలియదు. అయితే ప్రభువు నిన్ను ఎరుగును. నీవు ఏదో ఒక ఉద్దేశ్యము కొరకు ఇచ్చట ఉన్నావు, నాకు తెలియదు. ఇక్కడ ఎందుకొరకు యున్నావో, ప్రభువైన యేసు నాకు బయలుపర్చినట్లైతే, అది సత్యమో కాదో నీవు తెలుసుకుంటావు. నేను ఇక్కడకు వచ్చి ఇలా చెప్పినట్లైతే, “నీవు రోగివైన స్త్రీవి.” నిశ్చయముగా, నీవు ప్రార్ధనా వరుసలో నిలబడియున్నావు మరియు నీవు రోగివని అది చూపుతుంది.
108
నీవు కాలేయములో ఒక ఇబ్బందిని కలిగియున్నట్లు ఆ పరీక్ష చూపుచున్నది. ఆయన అది ఒక కాలేయపు జబ్బు అని చెప్పియున్నాడు. అది సత్యము ఒక నిమిషము ఆమెతో మాట్లాడుతాను. యేసుక్రీస్తును నీవు నమ్ముచున్నావా, ఆ బావి యొద్ద స్త్రీతో మాటలాడిన యేసుక్రీస్తు అదేరీతిగా, నేడు ఉన్నాడని నమ్ముచున్నావా? నీవు చక్కని ఆత్మను కలిగి యున్నట్లు కనబడుచున్నది. నీవు ఇక్కడ వ్యక్తివి కాదు. నీవు తూర్పున ఉన్న ఓహయో నుండి వచ్చియున్నావు. అది సత్యము. అది ఓహయోలోని దాటూన్ నుండి నీవు ఇక్కడికి వచ్చియున్నావు. అది సత్యము నేను ఒకటి చూస్తున్నాను. నీవు మరొకరి కొరకు ప్రార్ధన చేయుచున్నావు; అది ఒక బాలుడైయున్నాడు. అతడు గుండె జబ్బును కలిగియున్నాడు. ఆ బాలుడు కడుపులో అల్సర్ కలిగియున్నాడు, అంతేకాకుండా బాలుడు నరముల బలహీనతతో కూడా బాధపడుచున్నాడు. అది సత్యము. మరియు నీవు ఇతని ఆత్మ కొరకు ప్రార్ధన చేయుచున్నావు, కారణం అతడు రక్షించబడలేదు. అది “ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” అది నిజము, అది నిజమేనా? [అది నా కుమారుడైయున్నాడు.] నీవు స్వస్థపడియున్నావు, తిరిగి వెనుకకు వెళ్ళుము. చక్కగా ధైర్యముగా ఉండమని అతనితో చెప్పుము, యేసుక్రీస్తు ......
109
ఓ స్త్రీ నీవు ఎవరవో నాకు తెలియదు. నీవు నాకు తెలియదు. దేవునికి నీవు తప్పక తెలియును. నీ ఇబ్బంది ఏమిటో దేవుడు నాకు చెప్పినట్లయితే, ఆయన సత్యమైయున్నాడని రుజువు చేస్తే ఆయన సేవకునిగా నీవు నన్ను నమ్ముతావా? చూడు, నేను ఏమి చేయగోరుచున్నాను, అనగా ఈ ప్రార్ధనా వరుసగుండా వచ్చుచున్న ప్రజలు ఆయన ఇక్కడ యున్నాడని చూచునట్లు చేయుచున్నాను.
ఈ కూటములో ఏదో సంభవించియున్నది. అక్కడ ఇద్దరు స్త్రీలు కళ్ళద్దములు పెట్టుకొని నిలబడియున్నారు. వారియొక్క రోగములతో ఎవరో ఒకరు ఆయనను ముట్టియున్నారు. నేను ఆ స్త్రీని కొంచెము చూడగలిగినట్లయితే.... నీ చెవి బాధ ఇప్పుడు వెళ్ళిపోయినది. ఈ స్త్రీ వైపు చూడండి. ఎంతగా ఆమె ఈ స్త్రీ వైపు చూచుచున్నదో చూడండి. వారు అక్కడ నిలబడియున్నారు. నేను వారిని చూస్తున్నాను. అయితే ఒక్కరు ఈ కార్యము జరుగునట్లుగా చేయుచున్నారు మరియు మరొకరికి ఏమియు చేయుట లేదు. దానికి కారణం ఏమనగా, ఈ స్త్రీ మరియెవరి కొరకో నిలబడి యున్నది. అది సత్యము మరియు ఆ స్త్రీ నీ యొక్క పోరుగు ఇంటి వ్యక్తి, ఆమె కీళ్ళ జబ్బును కలిగియున్నది. మరియు నీవు ఆమె కొరకు నిలబడియున్నావు. మరియు నీవు ఆమె కొరకు ప్రార్థన చేయుటను నేను చూస్తున్నాను, కారణం ఆమె రక్షించబడలేదు. నీవు ఆమె కొరకు ప్రార్ధన చేయుచున్నావు. అది ఒక ధైర్యసాహసముగల కార్యము. ఇప్పుడు చేతిలో వున్న ఆ చేతిరుమాలును ఆమె మీద ఉంచుము దానిని అనుమానించవద్దని మరియు ఆమె జీవితమును క్రీస్తుకు లోపరచమని ఆమెతో చెప్పుము, అప్పుడు ఆమె కీళ్ళ జబ్బు ఆమెను విడిచిపెడుతుంది.
110
ఏడ్చుచున్నావా, సహోదరి.
నీవు దేవునిని నమ్ముతావా? నేను ఆయన సేవకుడినైయున్నానని నీవు నమ్ముతావా? నీవు దేని కొరకు ఏడ్చుచున్నావో మరియు నీ ఆశ ఏమైయున్నది? దేవుడు దానిని నాకు చెప్పగలడని నీవు నమ్మగలవా, నీవు అది నమ్మినట్లయితే, నీ చేతిని ఎత్తుము. ఆ పగుళ్ళు అతనిని విడిచిపెట్టుచున్నది అని నీవు నమ్మగలవా? నీవు దానిని నమ్మినట్లయితే అది వెళ్ళిపోతుంది. కేవలం విశ్వాసమును కలిగియుండుము. అనుమానించవద్దు.
నీవు ఎలా వున్నావు? మనము ఒకరికి ఒకరము క్రొత్తవారమై యున్నామని నేను ఊహించుచున్నాను. ప్రభువైన యేసు మన ఇద్దరిని ఎరుగును. నీవు ఒక బలిష్టమైన యవ్వన స్త్రీవి. అయితే నీ కొరకు నీవు ఇక్కడకు రాలేదు. ఒక వైద్యశాలయందున్న ఒక పడక నా కళ్ళముందుకు వచ్చుటను నేను చూచుచున్నాను. అమె నీ తల్లియైయున్నది. నీవు ఆమె కొరకు ప్రార్ధన చేయుచున్నావు. మరియు ఆమెను మరణపు నీడ ఆవరించబడియున్నది. ఆమె కణితులతో మరియు పిత్తాశయపు వ్యాధితో బాధపడుచున్నది. మరియు... ఆమెకు కేన్సర్ కూడా ఉన్నది. ఒక నల్లని ఛాయగల క్యాన్సర్ నీవు ఏడ్చుచు తుడుచుకొను ఆ చేతిరుమాలును తీసుకొని ఆమె మీద వుంచుము. ప్రభువు నామమును బట్టి పిలవండి మరియు అనుమానించవద్దు. నీవు అనుమానించని యెడల, దేవుడు ఆమెను అక్కడ నుండి బయటకు తెస్తాడు మరియు ఆమెను బాగు చేస్తాడు. ఇప్పుడు, దానిని అనుమానించవద్దు. ప్రభువు నామములో వెళ్ళి, ఆయనను నమ్ముము.
111
క్రీస్తు జీవించుచున్నాడని మీరు నన్ను నమ్మగలుగుచున్నారా? అక్కడ ఏదో.... ఓ, అది ఒక స్త్రీ, తిన్నగా ఆ వెనుక కుర్చీలో కూర్చొనియున్నది. ఆమె తల నొప్పితో బాధపడుచున్నది. మరియు ఆమె ప్రభువుకు ప్రార్థన చేయుచున్నది, ఆ చిన్న బిడ్డ కొరకు శ్రద్ధ వహించుటకు ప్రయత్నము చేయుచున్నది. సహోదరి, ఆయన నీ ప్రార్ధన విన్నాడు. ఇప్పుడు ఆ వేదన, బాధంతా తీరిపోయినది. దానిని బట్టి దేవునికి స్తుతి చెల్లించుటకు ఓ స్త్రీ నీ పాదముల మీద నిలబడుము. దానిని బట్టి దేవునికి స్తోత్రము చెల్లించుము.
చూశారా, ఆమె దేనిని తాకియున్నది? ఆమె ఎన్నడు నన్ను తాకలేదు. అయితే ఆమె ఆ ప్రధానయాజకుడిని తాకియున్నది. ఆ స్త్రీ ఎవరో నాకు తెలియదు; నా జీవితంలో ఎన్నడూ ఆమెను నేను చూసియుండలేదు. అయితే దేవుడు వెంటనే ఆమెను స్వస్థపరిచాడు. అటువంటి కార్యములే యేసును నిన్న, నేడు, ఏకరీతిగా వున్నవాడుగా చేస్తుందా? నిశ్చయముగా, అది చేస్తుంది. నీవు నమ్మగలిగినట్లయితే, నమ్మువారికి సమస్తము సాధ్యమే.
అది శ్రోతలను తాకియున్నది; ఎవరో ప్రార్థన చేయుచున్నారు. చూడండి, ఎక్కడ బలము పైచేయిగా వుండునో దానిపై అది ఆధారపడియున్నది. ఎక్కడ ఆత్మ... నేను కేవలము వెంబడించగలను, మరియు ఆయన చెప్పినదే నేను చెప్పుదును. నాకు తెలియదు.
ఏడుస్తూ తన కండ్ల అద్దము ధరించిన ఆ స్త్రీ ఎవరు. ఆమె ఏడ్చుచున్న కారణము ఏమనగా, కాబట్టి దేవుని ఆత్మ ఆమె మీద వున్నది. అది అక్కడ యున్నది. నీవు ప్రేవుల జబ్బుతో బాధపడుచున్నావు. విశ్వాసమును కలిగివుండుము, అది నిన్ను విడిచి వెళ్ళుతుంది మరియు ఎన్నడు మరలా అది నీ యొద్దకు రాదు.
ఆ స్త్రీ ఎవరో నాకు తెలియదు. నేను ఎన్నడు ఆమెను చూచి యుండలేదు. ఆమె నన్ను తాకలేదు, గాని ఆమె ప్రధానయాజకున్ని తాకియున్నది. నీవు నమ్మగలిగినట్లయితే
112
అది మరొక స్త్రీని తాకినది. ఎవరైన కోరినట్లయితే, ఇటు చూడండి. ఈ స్త్రీ వైపు చూడండి, ఆమె ఏడ్చుచున్నది. అక్కడ మరొక స్త్రీని చూడండి, ఆమె మామూలుగా కూర్చునివున్నది. ఆమె ప్రక్కగాయున్న మరొక స్త్రీని చూడండి, ఆమె ఏడ్చుచున్నది. ఆమె గుండె జబ్బును కలిగియున్నది. అక్కడ ఒక చిన్న స్త్రీ కూర్చొనియున్నది, ఆమె తన ముఖమును చిట్లి౦చుకొనుచు నా వైపు చూచుచున్నది. అవును. అది నిజము. నీవు గుండె జబ్బును కలిగియున్నావు. నీవు కలిగిలేవా? అది నీ నుండి వెళ్ళిపోయినది. నీ విశ్వాసము అగ్నితో దేవునిని తాకినది. మరియు నీవు ఆయనను తాకియున్నావు. ఓ, ఇది అద్భుతము!
తన తలను వంచి ప్రార్ధనచేస్తూ అక్కడ తిన్నగ కూర్చొనియున్న స్త్రీని చూడండి. నెరసిన వెంట్రుకలు కలిగిన స్త్రీ, నేను యెరగని స్త్రీ అక్కడ కూర్చొనియున్నది. అవును నేను చుట్టూ తిరిగి ఆమె వైపు చూచియున్నాను. ఆమె పిత్తాశయ వ్యాధితో బాధపడుచున్నది. అది ఆమె నుండి తొలగింపబడవలెనని ఆమె దేవునికి ప్రార్థన చేయుచున్నది. “ప్రభువా, ఆయనను నన్ను పిలవనియ్యండి,” అని ఆమె ప్రార్ధన చేయుచున్నది. నిజము. అది నిజమైతే, నీ చేతిని ఎత్తుము. నీవు ప్రార్ధన చేయుచున్నావని నాకు ఎలా తెలిసినది? అది నీ నుండి వెళ్ళిపోయినది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది. ఇంటికి వెళ్ళుము, శుద్దురాలువు కమ్ము.
నీవు నమ్ముచున్నావా? నీవు నమ్మగలిగినట్లయితే, సమస్తము సాధ్యమే. అయితే నీవు నమ్మవలసియున్నది.
113
ఇంకనూ ఆ స్థలములో అది కదులుచున్నది... లేక అది అక్కడ యున్నది.
అక్కడే, ఆ చివరి నుండి రెండవ స్త్రీ, అత్యధికమైన రక్తపోటుతో బాధపడుచున్నది. నీ హృదయమంతటితో నీవు నమ్మినట్లయితే, సహోదరి, ఇంతటితో అది పోయినది. నీవు దేవునిని నమ్ముతావా? ఆయనను ఆయన వాక్యమును తీసుకొనుము. మంచిది. నీ చేతిని ఎత్తుము దానికొరకై నీవు ప్రార్థన చేయుచున్నావు, “ప్రభువా, ఈ అత్యధికమైన రక్తపోటుతో వున్న వ్యక్తి పక్కన వున్న నన్ను పిలవనిమ్ము,” నేను నీకు క్రొత్తవాడనైయున్నాను. అది నిజమైయున్నట్లయితే నీ చేతిని ఆడించుము. మంచిది, అది నీ నుండి అది వెళ్ళిపోయి యున్నది. ఇంటికి వెళ్ళుము. మరియు స్వస్థత పొందుము. అది ఏమైయున్నదో నీవు చూడగలవా? అది విశ్వాసము, నీవు దానిని నమ్మగలిగినట్లయితే! మీరు నమ్మగలుగుచున్నారా? ఆ బయట వున్న ప్రజలను చూడండి, వారికి ప్రార్ధనా కార్డులు లేక ఏమియు లేవు. నీవు నమ్ముటకు సిద్దపడుచున్నావా? ఆయన భూమి మీదనున్నప్పుడు ప్రభువైన యేసు ఆ విధముగానే చేసియున్నాడా?
ఇక్కడ. ఇతడేనా... ఈ మనిషి వచ్చుచున్నాడు? మంచిది. బ్రెన్హాం గుడారములో వున్న మీ అందరికి అది ఏమి చేయుచున్నదో మీకు తెలియదు. ఇప్పుడు, ఈ చేతిపైన ఇక్కడ చూడండి. చూడండి? ఆ రీతిగా నాకు రాదు మీకు తెలుసు. అది ఏమైయున్నది? అది దేవుని యొక్క ఆత్మ అది అభిషేకమైయున్నది. అభిషేకము అనగా భావమేమిటో అనేకమంది ప్రజలకు అర్థము కాదు. దానిని కేకలువేయుట అని వారు అనుకొంటారు. అది సంతోషము. శక్తి గౌరవప్రదంగా వస్తుంది. అది ప్రభువు యొక్క సంతోషమైయున్నది. ఇది ప్రభువు యొక్క శక్తియైయున్నది. అతడిని స్వస్థపరచును, అతడిని బాగుచేయును.
గతరాత్రి కూర్చొనియున్న ఆ చిన్న కుంటి బాలికకు, గ్రుడ్డి మనిషికి, ఇతరులకు మరియు ప్రతిచోట అంతట ఉన్నవారికి అది ఆయన ఏమి చేసియున్నాడో చూడండి.
114
అయ్యా, మీరు ఎలా వున్నారు? మనము ఒకరికి ఒకరము క్రొత్తవారైయున్నామని నేను అనుకుంటున్నాను. మనము ఒకరిని ఒకరము యెరగనివారై యున్నాము. మీరు నాకు తెలియదు, మరియు నేను మీకు తెలియదు? అది నిజమైనట్లయితే, మీ చేతిని ఎత్తండి. మంచిది. మనము మొదటిసారిగ కలుసుకొనుచున్నాము. ఇప్పుడు మర్యాదగ వుండండి.
ఇక్కడ ఒక మనిషి యున్నాడు, అతడు మరియు నేను... నా కంటె అతడు ఎక్కువ చిన్నవాడు. దేవుని ముందు ఇదే మొదటిసారిగా కలుసుకొనుట అని మా ಇద్దరి చేతులను ఒకరికి ఒకరము పైకి లేపుచున్నాము. యేసుకు ఆ మనిషి ఎవరో తెలుసు. అక్కడ అతను నిలబడియున్నాడు మరియు తప్పక ఏదో లోపము అతనిలో వున్నది. అది ఏమిటో నాకు తెలియదు. అనేకమంది సాక్షుల ద్వారా నేను సత్యమును చెప్పియున్నాను అని దేవుడు రుజువు చేసియున్నాడు, అయితే నేను నీకు సత్యము చెప్పినట్లయితే, “ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత పొందియున్నాము.” ఇది ఎప్పుడో జరిగిపోయిన ఒకదానిని గురించి చెప్పుచున్నది. ఈ కార్యములను పొందుకొనుటకై నీవు తప్పక ఆ కరుకైన విశ్వాసము కలిగివుండాలి. ఈ రాత్రి కేన్సర్ ఇక్కడ అదృశ్యమగుటను మీరు చూడండి. ఇప్పుడు, దానినుండి వచ్చుచున్న సాక్ష్యములను మీరు గమనించండి.
వారిపై ఉండు ఆ నల్లటి నీడలు మరణమైయున్నది. నీ ప్రియమైన వైద్యుడు నీ జీవితమును రక్షించుటకు అతడు చేయగలిగిన ప్రయత్నము అంతటిని చేసాడు. అయితే దేవుడు ఏదైనా చెప్పినప్పుడు, అంతటితో ఆ సమస్య తీరిపోవును, అది నేను కాదు, నేను దానితో చేయగలిగినది ఏమియు లేదు.
ఇప్పుడు, ఇంకా అక్కడ 200 మంది ప్రార్ధింపబడవలసినవారున్నారు. ఇప్పుడు ఒక్క క్షణం నేను విశాంతి తీసుకుంటాను. తరువాత మనము ప్రజల కొరకు ప్రార్థన చేయుటకు ప్రారంభం చేద్దాము. వారిని పెకి తీసుకొని రండి. ఒక వరుసగుండా వారిని పరిగెత్తించవద్దు, అయితే ఇక్కడ నిలబడి వారి కొరకు ప్రార్ధనచేస్తూ వుండండి. ప్రార్ధింపబడవలెనని కోరిన ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్ధింపగోరుచున్నాను. అయితే శ్రోతలగుండా మరియు వేదిక మీద వున్నవారు, యేసుక్రీస్తు ఇక్కడ వున్నాడని మీరు గుర్తించాలని నేను కోరుచున్నాను మీరు అందరు ఆ విషయము ఎరిగియున్నారా? ప్రతి ఒక్కరు అది ఎరిగియున్నారు.
115
ఇప్పుడు, అది శాశ్వతంగా మీ మనస్సులో స్థిరపడవలెను. ఈ మనిషి మరియు నేను ఇక్కడ దేవునికి మా చేతులను ఎత్తుచున్నాము. ఇది మొదటిసారిగా మేము కలుసుకొనుట. ఆయన ఈ మనిషి యొక్క హృదయ రహస్యములను చెప్పియున్నట్లయితే ఆ బావి యొద్ద ఆ స్త్రీకి ఆయన చేసిన విధంగా లేదా ఫిలిప్పుకు ఆయన చేసిన విధంగా, లేక పరిచర్యగుండా ఆయన ఎక్కడైనా చేసినట్లుగా, ఆయన దానిని చేసినట్లయితే అది పరిపూర్ణంగా ఆయనేనని, అది ప్రభువైన యేసు అని అనే విషయము మీ అందరికి సంపూర్ణముగా రుజువు అవుతుందా?
అయ్యా, అది రుజువు అవుతుందా? నీ ఇబ్బంది ఏమిటో నాకు తెలియదు. నేను తెలుసుకొనే మార్గము లేదు. నీవు ఒక క్రైస్తవుడవో లేక ఒక పాపివో నాకు తెలియదు. నేను నీకు చెప్పలేను. ఆయన చెపుతారు. దేవుడు చెపుతాడు. అయితే నేను నీకు చెప్పలేను. అయితే అది నాకు దేవుడు చెప్పినట్లయితే.... నీవు ఒక క్రైస్తవుడవై వున్నావు. అవును, ఏలయనగా నా మీద ఉన్న ఆత్మ యొక్క అభిషేకము నీ యొక్క ఆత్మను పట్టుకొనగానే అది దానికి స్వాగతం పలుకుచున్నది. కాబట్టి నీవు ఒక క్రైస్తవుడవై వున్నావని నేను ఎరుగుదును. మరియు నీవు ఒక లోతైన నీడ క్రింద వున్నావు, అది నీ రక్తములో ఉన్న ఇబ్బంది. నీవు వైద్యుల యొద్దకు వెళ్ళియున్నావు. మరియు వారు నీకు ఒక శస్త్ర చికిత్సను చేయవలెనని వారు అనుకుంటున్నారు మరియు ఆ ఆపరేషన్ ఇద్దరు వైద్యులు ఒకరితో ఒకరు సంప్రదించుకొనుటను నేను వినుచున్నాను మరియు వారు నీ దేహములో నుండి ఒక అవయవమును బయటకు తీసివేయవలెనని వారనుకొనుచున్నారు. అది ప్లీహముగా పిలువబడుచున్నది. అది నిజము. నీవు ఈ పట్టణవాసివి కాదు. అయితే నీవు మరొక గొప్ప పట్టణము నుండి వచ్చియున్నావు. అక్కడ ఒక గొప్ప మతసంబంధమైన కళాశాల ఒకటియున్నది. అది విటాన్, మరియు నీ పేరు కారల్ రోడ్స్, కారల్ రోడ్స్ గా అది పిలువబడుచున్నది, మంచిది. అయ్యా, నీ హృదయమంతటితో నీవు నమ్మియున్నట్లయితే నీవు ఇంటికి వెళ్ళవచ్చును, దేవుడు నీ జీవితమును కాపాడుతాడు. నీవు దానిని నమ్ముతావా? మనము ప్రార్ధన చేద్దాం.
ప్రభువైన యేసు, ఇప్పుడు మా సోదరుడు నుండి ఈ దుష్ట దెయ్యమును నేను బయటకు వెళ్ళగొట్టుచున్నాను. మరియు యేసుక్రీస్తు నామములో, దేవుని మహిమ కొరకు అతడు జీవించును గాక. ఆమేన్. సోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. సంతోషముగా, నీ దారితో నీవు వెళ్ళుము.
116
మీలో ఎంతమంది మీ హృదయమంతటితో నమ్ముతారు. ఇప్పుడు ప్రార్ధింపబడగోరువారు అంతమట్టుకేనా? సరే, మంచిది. మంచిది, నీ వెన్నునొప్పి నీవు అక్కడ నీవు కూర్చొని వుండగానే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినది. కాబట్టి నీవు కోరినట్లయితే సంతోషంగా నీ మార్గములో వెళ్ళుము. “మంచిది ప్రభువునకు వందనములు,” అని చెప్పుకొనుచు వెళ్ళుము.
నీవు వెళ్ళి, నీ రాత్రి భోజనమును భుజించుము. ప్రార్ధన వరుసలో వస్తూ వుండగా నీ కడుపునొప్పి నిన్ను విడిచిపెట్టి వెళ్ళినది. కాబట్టి నీవు నీ మార్గముగుండా నీవు వెళ్ళవచ్చును. కేవలము నీవు నీ హృదయమంతటితో నమ్ముము.
నీవు దానిని నమ్మినట్లయితే కీళ్ళ నొప్పులు నిన్ను బాధించదు. సహోదరుడా, నీవు కోరియున్నట్లయితే తిన్నగా, ఆనందిస్తూ దేవునిని స్తుతిస్తూ వెళ్ళుము.
మంచిది. మీ హృదయమంతటితో మీరు నమ్ముచున్నారా? మీలో ఎంతమంది దేవునిని నమ్ముచున్నారు? ఇప్పుడు ఇంకా కొంచెము ఒక అడుగు ముందుకు కొనసాగి వెళ్ళిపోవుచున్నాను.