హఠాత్తుగా, రహస్యముగా సంఘము వెళ్ళిపోవుట

హఠాత్తుగా, రహస్యముగా సంఘము వెళ్ళిపోవుట

VGR COUNT-173 అటువంటి పరిచయ వాక్యము, ఎవరికైనా మంచి అనుభూతినిచ్చేలా చేస్తుంది, అవును కదా?

అది సరే. మనము వాక్యము తెరవడానికి ముందు ఒక్క క్షణం ప్రార్థన కొరకు మనమందరము మన తలలు వంచెదము.

ప్రభువా, ఆ పాతవారు చెప్పినట్లుగా మేము చెప్పెదము, “ప్రభువు యొక్క మందిరమునకు వెళ్ళెదము అని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించితిని.” ఆరాధనలో, ఈ రోజు, ఇక్కడ ప్రభువు యొక్క సమూహముతో ఉండుట కంటే, మనము మరే మేలైన స్థలమును కనుగొనలేము. మరియు బహుశా, బయట, వర్షము కురుయుచున్నప్పటికీ, మరియు బహుశా విచారములు మరియు సంగతులు ఉన్నప్పటికీ, కానీ అప్పుడుండవేమో మేము నీ సన్నిధిలో ఉన్నప్పుడు, మేము ఈ సంతృప్తి యొక్క ఆనందమును కలిగియున్నాము, మాకు మేలైనది నీవు అర్ధము చేసుకొని మరియు ప్రతీది మంచి కొరకు పని చేస్తున్నావని మేము ఎరుగుదుము.

2

ఎవరైతే ఈ కూడికకు రాలేకపోయారో ఈ ఉదయకాలమున వారి కొరకు ప్రత్యేకమైన ఆశీర్వాదమును మేము అడిగెదము. వాతావరణమును మరింత బాగుగా లేకపోతే, చాలామంది, బహుశా, వచ్చియుండెడివారు. కానీ ప్రజల కొరకు రూపించబడిన ఈ కార్యక్రమములు, మరియు రేడియోలో సేవకులను వినుట, నీ వాక్యమును చదువుట ద్వారా వారు ఆదరణను పొందెదరు గాక.

కృతజ్ఞతలోను, మరియు ప్రార్ధనలోను, మరియు కీర్తనలలోను ఆయనకు సేవ చేయుటకు, ప్రభువు యొక్క వాక్యమును వినుటకు, ఎవరైతే దైవికమైన సన్నిధిలో ఉన్నారో, ఈ ఉదయకాలమున వచ్చుటకు వారి యొక్క కష్టమును నీవు ప్రత్యేకించి దీవించమని మేము అడుగుచున్నాము.

3

మరియు దేవా, ప్రార్ధించబడుటకు దూరప్రాంతముల నుండి వచ్చి, మరియు ఇప్పుడు ఎదురుచూచుచున్నవారు, ఎవరైతే రోగముతోను మరియు అవసరతతోను ఉన్నారో వారి యొక్క శరీరములను నీవు తాకమని మేము అడుగుచున్నాము. మరియు నీవు మాపై చూడమని, మరియు మాతో మాట్లాడమని మేము అడుగుచున్నాము, మేము ఎవరమైతే ఈ ఉదయకాలమున ఇక్కడ ఉన్నామో మేము మా సొంత పరిస్థితిపై ప్రతీ క్షణము జాబితాను తయారు చేసుకొనవలెను. “నన్ను శోధించు,” ప్రవక్తలలో ఒకడు చెప్పెను, “నన్ను శోధించి, మరియు ఒకవేళ నాలో చెడు ఉన్నదేమో చూడుము.”

మరియు అప్పుడు, ప్రభువా, ఆ శోధనలో, ఒకవేళ మాలో చెడు ఉన్నదని నీవు మమ్ములను ప్రభువా, మా పాపములను మరియు మా అతిక్రమములను - మేము దీనముగా ఒప్పుకొనుచున్నాము. మా పాపములకు మరియు మా అతిక్రమములకు ప్రాయశ్చిత్తముగా నుండుటకై చనిపోయిన, నీ కుమారుడైన, యేసు వైపు నీవు చూచినప్పుడు మమ్ములను నీవు జ్ఞాపకము చేసుకొనమని మాత్రము అడుగుచున్నాము. ఈ ఉద్దేశ్యము కొరకే చనిపోయాడని, మరియు తిరిగి లేచాడని, మేము దానిని ఒప్పుకొని మేము దానిని నమ్మియుండగా, ఈ ఉదయకాలమున, దీనిని చేయు గొప్ప భాగ్యమును మేము కలిగియుండేవారము. ప్రభువా, దీనిని అనుగ్రహించండి. వ్రాయబడిన నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మీ నుండి వినాలని ముందుకు మేము ఎదురుచూస్తున్నాము. యేసు నామములో మేము ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.

4

థెస్సలోనికయులకు వ్రాసిన పత్రిక, 5వ అధ్యాయము నుండి చదువుటకు ఈ ఉదయకాలమున మేము లేఖనములను త్రిప్పగోరుచున్నాము. మరియు ఈ ఉదయమున, ప్రార్ధనా విన్నపములను కూడా నేను కలిగియున్నాను, ఆ జాబితా. ఈ ప్రసంగ కూడిక అయిన వెంటనే ప్రార్ధన చేయబడును.

నేను నమ్ముచున్నాను, ఒక్క క్షణము కొరకు, ఎవరైతే మీ బైబిల్లును తెరుస్తున్నారో, I థెస్సలోనికయులు 5వ అధ్యాయము వైపు త్రిప్పుదాము, మరియు కొద్ది క్షణములు కొరకు చదివెదము. నన్ను క్షమించండి, మీరు మీ బైబిల్ లను తెరుస్తుండగా, వారి యొక్క వేరు వేరు తరగతుల కొరకు పిల్లలు ఇంకా విడిచిపెట్టబడలేదు. చిన్నపిల్లలైన మీరు మరియు యవ్వనస్తులు, మీరు తిన్నగా ఇప్పుడు మీ తరగతులకు వెళ్ళెదరా, మరియు మీరందరూ. తిన్నగా మీ తరగతులకు వెళ్ళండి.

మరియు ఒకవేళ ఇప్పుడు నీవు చదువగలిగితే, లేక మీ పరిశుద్ధ గ్రంథములను I థెస్సలోనికయులు 5వ అధ్యాయమునకు తెరవండి. మరియు ఒకవేళ ఆ సమయములో ధర్మకర్తల బోర్డు హాజరవుటకు సాధ్యపడిన ఎడల, కూడిక ముగిసిన తరువాత కొద్ది క్షణములు, నేను వారిని చూడగోరుచున్నాను, ఒక పని మీద, ధర్మకర్తల కార్యాలయములో. మరియు ఒకవేళ వారు లేకపోతే, ధర్మకర్తల కార్యాలయములో, ఈ రాత్రి కూడికకు కొంచెము ముందు, నేను వారిని చూడగోరుచున్నాను అని ఎవరైనా ఆ మాటను వారికి చెప్పండి.

5

ఇప్పుడు ఒక మూలాంశము కొరకు, ఈ ఉదయమున దీనిని ఒక అంశముగా నేను తీసుకొనగోరుచున్నాను: “హఠాత్తుగా రహస్యముగా సంఘము కొనిపోబడుట.” బహుశా, నన్ను తిరిగి దానిని ప్రకటించనివ్వండి, ఎందుకనగా ఏ వ్యాఖ్యల పైనా ముందుగా ధ్యానించే అంత సమయమును నేను కలిగిలేను, కానీ కొంచెము తొందరపడుచున్నాను. నిన్నటి దినమున మనము ఆలస్యమయ్యాము, మరియు నిజముగా ఆలస్యమయ్యేంత వరకూ గతరాత్రి ప్రవేశింపలేకపోయాము. మరియు ఈ ఉదయ కాలమున ఇక్కడకు త్వరపడుచుండగా, ఇది నా మనస్సులోనికి వచ్చినది. మరియు బహుశా, తరువాత, ఎవరికో మంచిని చేసే దానినేదో నేను పట్టుకొనగలను. ఈ అంశమును నేను ప్రేమించెదను, “హఠాత్తుగా, రహస్యముగా సంఘము లాగివేయబడుట.” మరియు ఇప్పుడు I థెస్సలోనికయులు 5వ అధ్యాయము.

సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు.

రాత్రివేళ దొంగ ఏలాగువచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.

లోకులు - నెమ్మదిగా ఉన్నది. భయమేమియు లేదని చెప్పుకొనుచుండగా, గర్భిణి స్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు.

సహోదరులారా, ఆ దినము దొంగవలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు.

మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు; మనము రాత్రివారము కాము, చీకటివారము కాము.

కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము.

నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు.

ఇప్పుడు, పేజికి అడ్డముగా మీరు చూడాలని నేను ఆశిస్తున్నాను, అది I థెస్సలోనికయులు 4వ అధ్యాయము 16వ, 17వ మరియు 18వ వచనములకు మీ పరిశుద్ధ గ్రంథములో ఇది భౌగోళికముగా ఏర్పాటు చేయబడినది.

ఏలయనగా ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువే స్వయముగా దిగివచ్చును: క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు.

ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము: కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము.

కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.

పరిశుద్ధమైన ఆయన వాక్యము చదువుట యందు ప్రభువు తన ఆశీర్వాదములను జతపరుచును గాక.

ఈ ఉదయకాలమున రోగులకు పరిచర్య చేయుటకు వచ్చిన నేను ఇటువంటి ఒక అంశము పైన మాట్లాడుట, ఇది ఒక అపూర్వమైన సంగతి. కానీ భౌతికమైన రోగము కన్నా ఒక గొప్ప రోగమున్నది. మరియు మనము బాగుగా ఉండుట అనునది మరింత ముఖ్యమైయున్నది, ఎందుకనగా ఈ గొప్ప సంఘటన అది జరుగబోవుచున్నది, అది కనీసము ప్రభువు నందు నిద్రించినట్లుగా ఉండును; అది, మరణము, దానిని మనము ఎరిగి యుండెదము.

6

సిద్ధపడియుండుట మంచిది. ఒక బాగుగాయున్నవానిగా ఉండి, ప్రభువుతో వెళ్ళుటకు సిద్ధపడి లేకుండా ఉండుటకు బదులు, నేను ఒక రోగిగా ఉన్ననూ, ప్రభువు కొరకు సిద్ధముగా ఉండెదను. కానీ, ఏది ఏమైనప్పటికీ, ప్రాణము మరియు శరీరము, మనము రెండూ బాగుగా మరియు సిద్ధముగా ఉండాలని దేవుడు చాలా ఇచ్చయించుచున్నాడు. ఏలయనగా ఆయన మన అతిక్రమములన్నిటిని మన్నించెను, మరియు మన రోగములన్ని టిని స్వస్థపరచెను. ఆయన బహుళ ఉద్దేశ్యముల కొరకు మరణించెను.

మరియు అప్పుడు, ఈ రోజు “హఠాత్తుగా, మరియు రహస్యముగా,” అనే ఈ అంశముపై నేను ఆలోచిస్తూ ఉన్నాను. నేను దానిని ఇష్టపడెదను. ప్రజలు ఈ రోజు ఎలా జీవించుచున్నారనగా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడకు కొంచెము ముందు, ఆయన ఒక దూతల యొక్క సమూహమును అన్ని వార్తాపత్రికల యొద్దకు పంపి, మరియు ఒక సంవత్సరము లేక అలాగు, ప్రపంచ వ్యాప్తముగా దానిని ప్రకటించి, వార్తాపత్రికలో, అది, “ఫలానా ఫలానా తేదిన, యేసు వచ్చును,” అని ప్రకటించును మరియు దానిని రేడియోల ద్వారా ప్రసారము చేసి, మరియు దానిని టెలివిజన్లలో, మరియు అన్ని చోట్లా, ఆయన వచ్చుచున్న ఆ దినము మరియు ఆ ఘడియ. మరియు ఆ విధముగానే ఈ రోజు ప్రజలు జీవించుచున్నారు.

7

అయితే దేవుడు తన వాక్యములో చెప్పెను, అది, రాత్రి వేళ దొంగ వచ్చినట్లుండును. ఒకవేళ ఆ విధముగా అయినచో, ప్రజలు చెప్పెదరు, లోకము ఈ రోజు తలంచుచున్నట్లుగా, “ఓ, మంచిది, ఇంకా చాలా సమయము ఉన్నది. నేను... అది బాగుగా ప్రకటించబడును.” మరియు, కానీ, మీరు చూడండి, అది ప్రకటింపబడుతుంది, కానీ అది ఒక రహస్య ప్రకటన. అది కేవలము ఎవరైతే వినుటకు ఇష్టపడుచున్నారో వారికే. ఎవరైతే దానియందు శ్రద్ధ కలిగి యుండగోరుచున్నారో మరియు, ఇంకా, ప్రభువును ప్రేమించువారు.

పౌలు ఇలా చెప్పినప్పుడు, “నా కొరకు నీతి కిరీటముంచబడియున్నది, నీతి గల న్యాయాధిపతియైన ప్రభువు ఆ దినమున దానిని నాకు అనుగ్రహించును,” అని అతడు చెప్పినదానిని ఇప్పుడు నేను తలంచుచున్నాను. మరియు తరువాత అతడు ఆపివేసెను (మీరు గమనించారా.) మరియు చెప్పెను, “నాకు మాత్రమే కాదు, కానీ ఆయన ప్రత్యక్షమగుటను (appearing) ప్రేమించు వారినందరినీ.” ఒకవేళ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ప్రేమించినట్లయితే!

8

సాధారణముగా లోకములో ఈ రోజు, ప్రభువు ప్రత్యక్షమగుటను ఏదో ఒక భయంకరమైన, దారుణమైన కార్యముగా ప్రజలు తలంచుచున్నారు. ఓ, లోకము దాని యొక్క.... “దానిని గూర్చి నాతో మాట్లాడవద్దు,” అని వారు చెప్పెదరు. ఆ విషయములను గూర్చి వారు తెలుసుకొనగోరరు. వాటిని వారు పట్టించుకొనరు; కేవలము ఈ రోజు గడిచినదా లేదా. కానీ ఎవరైతే ప్రభువును ప్రేమించెదరో, ఆయన ప్రత్యక్షపరచబడుటనూ ప్రేమించెదరు.

ఒకవేళ మీ ప్రియమైన వారిలో ఒకరు, వృద్ధులైన మీలో కొందరు, మీ తల్లి ఎక్కడికైనా వెళ్ళినచో, లేక మీ తండ్రి, లేక మీ బిడ్డ, మరియు వారు అనేక సంవత్సరములు దూరముగా ఉండినచో, మరియు వారు ఏ క్షణమైన ప్రత్యక్షమగుదురని మీరు ఎరిగియుంటే? ఎందుకు, మీరు మీ ఇల్లంతటినీ శుభ్రపరచియుందురు. మీరు సిద్ధపడి మరియు ఆ మార్గములో చూచుచుందురు, ఏలయనగా కారు లైటు వెలిగిన ప్రతీసారీ, అది వారే అని మీరు తలంచెదరు.

9

మరియు సంఘము కూడా ప్రభువు యొక్క రాకడ కొరకు ఆ విధముగానే ఎదురుచూడవలసియున్నది. అన్నీ క్రమములో, అన్నీ సిద్ధపడి, ఆయన వచ్చిన వెంటనే వెళ్ళుటకు సిద్ధముగా ఉండి మరియు అన్నీ సర్దుకొని ఉండవలసియున్నది, ఎందుకనగా “అది ఒక్క క్షణములో, కనురెప్ప పాటు కాలములో జరుగును.” అది ఎంత సమయమో ప్రయత్నించి చూడండి, మీ కన్ను రెప్ప ఆడించు సమయమును తీసుకొనును, అంత వేగముగా సంఘము యొక్క ఎత్తబాటు జరుగును.

మీకు తెలుసు, ప్రభువు ఉపయోగించు తంత్రములనే శత్రువు ఎల్లప్పుడూ ఉపయోగించుచుండును. మీకు తెలుసు, దేవుడు ఒక నీతిగల సంఘమును కలిగియుండ బోవుచున్నాడని, మరియు ఆయన చేయబోవు సంగతులను వాడు చూచినప్పుడు, శత్రువు కూడా అదే పన్నాగమును ఉపయోగించినది. వాడు ఒక సంఘము కలిగియుండి, మరియు చాలా భక్తిపరులైన ఒక జనాంగమును అతడు కలిగియున్నాడు. వారు భక్తిపరుల వలె, మునివేళ్ళపై ఉన్నారు, ఎందుకనగా వాడికి తెలుసు క్రీస్తు యొక్క సంఘము కూడా ఆ విధముగానే ఉన్నది.

10

మరియు అతడు సైనిక జీవనములో కూడా దానిని చేశాడు. కొద్ది కాలము క్రితము నేనొక వ్యాఖ్యానమును చదివాను, పెరల్ హర్బర్ (అమెరికాకు చెందిన హవాయి ద్వీపములలో ఒక ముఖ్య నౌకాశ్రయము) పై ఆకస్మిక దాడి. అదేమీ ఖచ్చితముగా ఏదో తెలియని దాడి కాదు. జపానీయులు దానిని చేసెదరని అప్పటికే వారు హెచ్చరింపబడ్డారు. కానీ విచారకరమైన విషయము ఏమనగా, వారు ఆ హెచ్చరికను నిర్లక్ష్యము చేసిరి. వారు సూచనలను చూశారు, మరియు జపాన్ సైన్యము తమను తాము సంసిద్ధము చేసుకొనుచున్నారు, మరియు పెద్ద ఓడలు యుద్ధ సామాగ్రితో నింపబడుచున్నవి, మరియు ఆకాశములో ఆ ముప్పు ఉన్నది. మరియు వారు ఖచ్చితముగా ఆ దండయాత్ర క్రమములో ఉన్నారు. కానీ వారు దానిని పట్టించుకొనలేదు.

ఈ రోజు సంఘముతో కూడా అదే కార్యమైయున్నది. సంఘము తీర్పు యొక్క వరుసలో ఉన్నది, కానీ వారు ప్రభువు యొక్క రాకడను నిర్లక్ష్యము చేయుచున్నారు. కనుక మీరు ఆయనను నిందించలేరు.

11

వారు చెప్పిరి, అంతర్జాతీయముగా అలజడి రేగినప్పుడు, చుట్టూ, పెరల్ హర్బలో, జపాన్ వారు ఏక్షణమునైనా దాడి చేయొచ్చు, మరియు వారి యొక్క పెద్ద నౌకాదళమంతా సముద్ర భాగముపై కొలువుదీరి మరియు నెమ్మదిగా కదులుచూ నిదానముగా పెరల్ హర్బర్ వైపు వచ్చుచున్నదని, దానిని చూసి వారు కేవలము నవ్వుకొనిరి. మరియు “ఓ, బుద్దిహీనత. మీరు భయపడువారు, ఆందోళన చెందే మీరు, ఏదో సమస్యను గూర్చే మీరు ఆలోచించెదరు,” అని చెప్పిరి.

మరియు రాత్రి, తరువాత ఉదయము జరగబోవు ఆ గొప్ప దాడికి ముందు, ఒక గొప్ప నాట్యము, లేక పెరల్ హర్బలోనే ఒక గొప్ప పెద్ద విందు ఇవ్వబడెను. మరియు ఆ జపనీయులు వచ్చుచున్నారని ఎంతగా చెప్పుటకు ప్రయత్నించిననూ, వారు ఇంకనూ ఆ హెచ్చరికను తీసుకొనలేదు.

12

కొద్ది నిముషములు వాటి పైన మనము చూచెదము. ఒక చిన్న రేడియో ప్రసారము వచ్చుచున్నది. ఒక స్వస్థతా కూడికను గురించి ప్రచురించునట్లుగా, వార్తాపత్రికలో ఒక చిన్న మూల, కేవలము ఒక చిన్న స్థలములో, సముద్రపు భాగముపై జపానీయులు మార్గములో ఉన్నారు, ఒక గొప్ప నౌకాదళము ఆ మార్గమున వచ్చుచున్నది. “బుద్దిహీనత”, మిగిలిన వారు చెప్పుచున్నారు. “అటువంటి సంగతులను గూర్చి మేము వినము. దేనిని బట్టి మమ్మును భయపెట్టుటకు ప్రయత్నించుచున్నారు?”

13

మరియు పిదప మనము కనుగొనియున్నాము, రాత్రి సమీపించుచున్నప్పుడు, ఇళ్ళ దగ్గర నేను చూడగలుగుచున్నాను, ఆ పట్టణమును విడిచి బయటకు వెళ్ళిపోవుటకు ప్రయత్నించుటకు బదులు, ఏమి, ఆ యవ్వన బాలికలందరూ కొత్త దుస్తులు ధరిస్తూ, మరియు అటువంటివి. వారు కలిగియుండబోవు ఆ గొప్ప పెద్ద ఉత్సవమునకు వెళ్ళుచున్నారు. మరియు, ఇంకా, సైన్యములోని అధికారులందరూ, పెద్ద త్రాగుబోతు విందుకు, సైనికులందరూ ఈ విందుకు హాజరవ్వవలెనని చిన్న చిన్న అనుమతి పత్రము వ్రాయుటలో తీరిక లేక ఉన్నారు. మరియు ఈ విందు కొరకై, వారికున్న శ్రేష్ఠమైన బీరు తెచ్చుటలో, మరియు వారి ద్రాక్షారసము మరియు ఇతర ఆహార పదార్ధములు కొరకు పెద్ద పెద్ద వాహనములన్నీ గిరగిర తిరుగుతూ మరియు పెద్ద శబ్ధము చేస్తూ ఉన్నాయి. మరియు సమయమంతా, జపానీయుల సైన్యము అక్కడ వారి మార్గములో ఉన్నది, మరియు వారు హెచ్చరికను వినుటలో విఫలమయ్యిరి.

మరియు సూర్యుడు అస్తమించుట ప్రారంభించగానే, మరియు వారందరూ ఒక గొప్ప ఆవరణములాంటి ప్రదేశములో సమకూడవచ్చారు. బహుశా ఏదో ప్రక్క నుండి, అక్కడ మద్యమును ఇచ్చు స్థలమును సిద్ధము చేయువాడు లేక ఎవరో, ఇలా చెప్పియున్నారు, “మీరు ఆ పుకారును విన్నారా?” అని చెప్పారు.

“లేదు, నేను దానిని విన్నానని నేను నమ్ముట లేదు,” తనతో మాట్లాడిన వానితో చెప్పాడు.

“ఓ, ఒక జపానీయుల సైన్య సమూహము ఈ దారిలో వచ్చునని ఏదో చెప్పుచున్నారు.”

మరియు ఎవరో మధ్యలో వచ్చి ఆ సంభాషణను ఆపివేసియున్నారు. మరియు ఒక యవ్వన, అల్లరి పిల్ల అక్కడకు ఎగురుకుంటూ వచ్చెను, మరియు తన యొక్క పాదమును నాట్యము చేయు స్తంభముపై ఉంచి, “ఓ దిగులు చెందే మందమతులారా, మనము ఒక మంచి సమయమును కలిగియుండుట కొరకే ఇక్కడ ఉన్నాము మరియు యుద్ధమును గురించి మాట్లాడకూడదు?” అని చెప్పెను.

14

బహుశా ప్రభువు యొక్క రాకడను గూర్చి లోకమంతా ఈ రోజు అలాగే చెప్పుచుండుట లేదా! “పాత తరహా మనుష్యులైన మీరు, పాత కాలపు వారు, మీరు ఆ విధముగా బట్టలు ధరించి మరియు ప్రవర్తించుటకు మరియు మీరు చేయు విధముగా చేయునట్లు చేసినది ఏమిటి?

కానీ మనము ప్రభువు యొక్క ఆ రహస్యమైన, ఆకస్మికమైన ఆగమనము కొరకు చూచుచున్నాము. ఏలయనగా గాలిలో ఏదో ఉన్నది, పరిశుద్ధాత్మ యొక్క ఒక వర్తమానము, రాకడ సమీపములో ఉన్నది అని అదే మనకు చెప్పుచున్నది.

అప్పుడు పెద్ద విందు జరుగుచున్నప్పుడు, మరియు, ఓ, ఆ రాత్రి ఒక భయంకరమైనదిగా ఉండియుండవచ్చు. ఎందుకనగా ఇలా చెప్పబడినది, ఆ రాత్రివేళ ఏదో సమయమందు, వారు ఒక యవ్వన స్త్రీని తీసుకొని, ఒక అందముగా నిర్మించబడిన యవ్వన బాలిక, మరియు ఆమె నుండి తన వస్త్రములను తీసివేసి, మరియు కేవలము ఒక చిన్న అంగవస్త్రముతో ఆమెను ఒక చిన్న వాహనముపై వేసి, మరియు ఆ విధముగా ఆమెను వీధులలో పరుగెత్తించి యున్నారు, ఒక మంచి సమయమును కలిగియున్నారు. మరియు ఆ సమయమంతా, జపానీయులు ముందుకు సాగుచూ, కదిలి వచ్చుచున్నారు.

మరియు ఆ తరువాత రోజు ఉదయము, విధి నిర్వహణలో ఉన్న వ్యక్తులు, మరియు విమానపు సంకేతాలను గమనించువారు, మరియు మొదలగువారు, అందరూ రాత్రంతా బయటే ఉండిరి, త్రాగి, మరియు ఈ స్త్రీలతో వెనుక పరుగెడుతూ మరియు ఆ విధముగా, చాలా మత్తుగా ఉండి మరియు తరువాత రోజు ఉదయము నీరసించిరి, ఆ పెద్ద విందు నుండి, విధి నిర్వహణలో వారు నిద్రపోయేంతగా మత్తులైరి.

15

మరియు ప్రభువు యొక్క రాకడలో కూడా ఆ విధముగానే ఉండునని నేను భయపడుచున్నాను. సంఘము ఎక్కువగా, లోకసంగతులతో త్రాగి మత్తులై, ప్రభువు యొక్క రాకడయందు, విధి నిర్వహణలో వారు నిద్రమత్తులయ్యెదరు.

మరియు అప్పుడు పట్టణము పైన విమానాలు ఎగిరియున్నవి, మరియు బాంబులు విడువబడినవి, మరియు వారు ఆ పట్టణమును - నేలమట్టుకు కూల్చివేసియున్నారు. ఎందుకు? ఎందుకనగా ఆ హెచ్చరికను వారు విసర్జించిరి గనుక. మరియు ఆ యవ్వన స్త్రీ, మిగతా వారందరితో పాటు, ఆ జపాన్‌కు చెందిన క్రూరమైన సైనికులు అక్కడకు పరుగెత్తి, బలవంతముగా వారిని వీధులలోనికి లాగి, మరియు కత్తులతో వారిని ముక్కలు ముక్కలు చేసిరి, తరువాత, మరియు ఆ విధముగా. ఏలయనగా ఒకవేళ నీవు హెచ్చరికను పట్టించుకొనకపోతే, కేవలము ఒకే ఒక సంగతి మిగులును, అదే తీర్పు.

ఓ, ఒకవేళ ఈ అమెరికా దేశము ఎన్నడైనా దాని యొక్క హీనమైన దశలో ఉన్న ఎడల, అది ఇప్పుడే అయ్యున్నది, దాని యొక్క అనైతికతలోనూ, దాని యొక్క బేధములోను! తీరము నుండి తీరము వరకు సువార్త ప్రసంగించబడెను. మరియు సూచనలు మరియు అద్భుతములు చేయబడెను. మరియు గొప్ప ఆశ్చర్య కార్యములు చేయబడెను, మరియు వారు హాస్యము చేయుచూ, పట్టించుకొనకుండా, త్రాగుచూ, వారి యొక్క విలాసములతో కొనసాగుచూ ఉండిరి.

16

అమెరికా దేశములోని ప్రొటెస్టెంట్ సంఘముల యొక్క రెండు లక్షల బలిపీఠములలో, ఈ రోజు ఆ బలిపీఠములలో మనకు అవసరమైనది ఏమిటనగా ప్రభువు యొక్క ప్రవక్తలు, మనము ప్రసంగించుచున్న ఈ తరము యొక్క పాపపు ప్రజల పైకి దేవుని యొక్క తీర్పు అనే పిడుగులను కురిపించుటకు భయపడనివారు. “దుష్టతరమా!” అని కేకవేసి చెప్పిన యెషయా వంటి ప్రవక్తలు మనకు అవసరమై యున్నారు. మరియు అతడు ఏ విధముగా ఆ తరమును ఖండించి, మరియు రాబోవుచున్న తీర్పులను గూర్చి అతడు చెప్పియున్నాడు.

కానీ, నేడు, మన సేవకులలో చాలామంది ఆ విషయములను చెప్పుటకు భయపడుచున్నారు. హెచ్చరికను గూర్చి ప్రత్యక్షముగా సాక్ష్యము ఇచ్చుటకు భయపడుచున్నారు, ఏలయనగా దాని యొక్క వెల వారి యొక్క ఉద్యోగములు. వారు వారి యొక్క శాఖా సంఘములను విడిచి పెట్టవలెను, వారి ప్రసంగ వేదికలను విడిచి పెట్టవలెను. మరియు వారు బయటకు వెళ్ళవలయును, బహుశా, మరియు వేరొక సంఘములో లేక మరొకచోట వేరొక స్థానమును తీసుకొనవలయును. కానీ అటువంటి వారిని మన ప్రసంగ వేదికలపై కలిగియుండుట అది చాలా విచారకరము. జాన్ వెస్లీ వంటి వ్యక్తులు మనకు అవసరము, సంస్కరణలు ప్రారంభములో, మార్టిన్ లూధర్. సమస్తమును ఇచ్చివేయుటకు నిశ్చయించుకొని, మరియు యేసుక్రీస్తు యొక్క సత్య సువార్త కొరకు సాక్షిగా, ఒకవేళ అది ఈ జీవితమును విడిచి పెట్టవలసి వచ్చినా, మరియు తమను తాము లోబరుచుకొనిన, పౌలు వంటి వ్యక్తులు మనకు అవసరము.

17

ఈ రోజు, ఏమిటి, ఆ చదువు మరియు మానవ సమాజములు మరియు సమాజముల యొక్క చిన్న చిన్న ఉద్రేకములు, సున్నితమైన అంశములు, మరియు వారి సొంత అనుభూతులు, సంఘములోని పరిశుద్ధాత్మ యొక్క స్థానమును తీసుకొన్నవి. ఈ రోజు, మనకు ఏమి అవసరము, అమెరికా పై కేకవేయుటకు (హెచ్చరించుటకు), దేవుని ద్వారా పంపబడిన, పరిశుద్ధాత్మ యొక్క శక్తితో దేవుని ద్వారా నింపబడిన వారు, తప్పైయున్న దానిని గూర్చి వ్యతిరేకముగా కేకవేయుటకు భయపడనివారు, మరియు రాబోవుచున్న తీర్పును గూర్చి ప్రజలను హెచ్చరించేవారు.

దేవుడు మరే రీతిగానూ ఈ దేశమును తీర్పు నుండి తప్పించుకొననియ్యడు. ఒకవేళ దేవుడు ఆ రీతిగా చేయదలచినచో, ఆయన సొదొమ మరియు గొమొర్రాలను పైకి లేపి, వారు అంత చెడ్డవారైనప్పటికీ మరియు వాటిని నీటిలో ముంచివేసినందుకు వాటికి క్షమాపణ చెప్పవలసియుండును. దేవుని యొక్క దృష్టిలో మనము ఏ మాత్రము మినహాయింపు కాదు. మన యొక్క రాజకీయములైనా, మన యొక్క ప్రభుత్వమును గురించి అయినా, ఈ రోజు మనము ఏమి సాధించాము; పునాది నుండి పైకప్పు వరకూ అవి కుళ్ళిపోయినవి. దేవునిలో తప్ప ఎక్కడనూ న్యాయము లేదు.

ఓ, మనము చెబుతాము, మనము ఐక్యరాజ్యసమితిపై ఆధారపడ్డాము అని, మరియు అయిదు సంవత్సరముల ముందు కన్నా మంచిగా, ఐక్యరాజ్యసమితిలోని దేశములలో, ఏభై-ఒక్క శాతము కమ్యూనిస్ట్ దేశములున్నవి. సజీవ దేవుని యొక్క వాక్యము పైన తప్ప మరి దేనిపైననూ ఆధారపడలేము. ఇప్పుడు దేనిపైననూ మనము ఆధారపడియుండలేము, ఏ రాజకీయముల పైనా.

18

గత మూడు లేక నాలుగు నెలల నుండి నేను విచారణలను ఎదుర్కొనుచున్నాను, తీవ్రమైన ఒత్తిడిలో, ఏదో తప్పు చేయుచున్నాను అని నా పై నేరము మోపుటకు ప్రయత్నించుచున్నారు, కూడికల కొరకు, ఈ గుడారము ద్వారా డబ్బులను ప్రక్కదోవ పట్టించుచున్నాను అని. అవి, ఇక్కడ మన ధర్మకర్తల బోర్డు ఆ తీర్మానముపై సంతకము చేసియున్నారు. మరియు వారిలో ఏ వ్యక్తియూ ఎన్నడూ నా కూడికలకు హాజరు కాలేదు కానీ నా కూడికలలో, తీసుకొనిన ఈ డబ్బు ఎందుకొరకని నేను బహిరంగముగా ప్రకటించియున్నాను.

మరియు వారు ఇప్పుడు చెప్పుచున్నారు, ఎందుకనగా నేను సంఘము ద్వారా పెట్టిన దానిని బట్టి, నేను ప్రభుత్వమును మోసగించుటకు ప్రయత్నించుచున్నాను, మరియు దాని కొరకు, నన్ను కాన్సాస్ లోని ఫోర్ట్ లీవెన్ వర్త్ లో ఇరవై సంవత్సరములు (శిక్ష) వేయగోరుచున్నారు.

నేను చెప్పాను, “మన న్యాయస్థానములలో అక్కడ వ్రాయబడినది ఏమిటి, 'న్యాయము'? అంటే కనీసము అక్కడ వ్రాయబడినది కూడా లేదు.” చెప్పాను, “అంతా మీ సొంతవారే నాకు చేయమని చెప్పినప్పుడు, నేను దానిని చేశాను. మరియు వారు ఎంతమాత్రము ఇక ప్రభుత్వముతో లేరని ఇప్పుడు మీరు చెప్పుచున్నారు.”

19

ఏ విధముగా మీరు చెప్పగలరు? మీరు ఒకదానిని పరిష్కరించి మరియు దానిని రుజువు చేసెదరు, తరువాత వారు మరొక సంగతిని త్రవ్వి తీసెదరు. అది మాత్రమే కాదు, కానీ వారు స్థిరముగా లేరు.

నేను ఈ ప్రకటనను ఫెడరల్ న్యాయస్థానాలలో చేసియున్నాను. నేను చెప్పాను, “ఒకవేళ కమ్యూనిజము దానిలో గనుక క్రైస్తవ్యమును కలిగియుంటే, నేను ఒక కమ్యూనిస్టువాడిగా ఉండేవాడిని.” కానీ నేను అలా ఉండలేను, ఎందుకనగా అది క్రైస్తవ్యమును తృణీకరించును. కనుక పట్టుకొనుటకు నాకు ఒక చేయి ఉన్నది, అది దేవుని యొక్క మారజాలని హస్తము, ఆయన సత్యమును మరియు ఘనతను గౌరవించునని ఎరిగియున్నాను. అదే న్యాయములో, ముందుకు రావలసియున్నది.

కానీ ప్రభువు యొక్క రాకడలో తప్ప, ఎక్కడను ఏ ఆశలు లేవని మీకు తెలియజేయుచున్నాను.

ఓ, అటువంటి దినములో మనము జీవించుచున్నాము, అటువంటి ఒక భయంకరమైన సమయము! ప్రతీ భౌతికమైన సంగతి, కనీసము సంఘము కూడా, సంఘ సభ్యులు, సంఘ శాఖా సంస్థలు, వారు వారి యొక్క చిన్న చిన్న బేధములను గూర్చి కూడా ఎక్కువ పట్టింపును కలిగియున్నారు, కనీసము వారు ఒకరితో నొకరు సహవాసము కూడా చేయరు, మరియు ప్రభువు యొక్క రాకడ సమీపముగా ఉన్నదనే హెచ్చరికను కూడా తీసుకొనరు.

20

బిల్లీ గ్రాహం, మరియు జాక్ షుల్లర్, మరియు ఓరల్ రాబర్ట్స్ వంటి వ్యక్తులు, మరియు చాలా మంది గొప్ప సువార్తికులు, మరియు చార్లెస్ ఫుల్లర్, వారు ప్రపంచవ్యాప్తముగా సువార్త చేసియున్నారు. ప్రభువు యొక్క రాకడను గూర్చి హెచ్చరించుటకు, వారు చేయగలిగినదంతయూ చేశారు. మరియు ఆ సొంతవారు, సరైన దానిని చేయుటకు ప్రయత్నించుచున్న ఆ వ్యక్తులు, అటువంటి వారిని మన సొంత ప్రభుత్వమే ముక్కలుగా చీల్చివేయుటకు ప్రయత్నించుచున్నది.

నేను ఎవరితోనో చెప్పాను, “మిస్టర్, ఇరవై-ఎనిమిది సంవత్సరముల నా జీవితము, సరైన దానిని చేయ ప్రయత్నించుటకు, దేవుని యొక్క బలిపీఠముపై పెట్టియున్నాను. మరియు ఒకవేళ దేనిలోనైనా నేను ఎవరినైనా తక్కువ చేసియున్నానని, లేక నా జీవితములో దేనినైనా దొంగిలించానని, ఎవరైనా వచ్చి నా కళ్ళల్లోనికి చూసి చెప్పమని నేను అడుగగోరుచున్నాను. దేవుని యొక్క కృపను బట్టి, నేను తేటగా ఉన్నాను.”

అంటే మరేమాత్రము, దానికి, నీ యొక్క వేలు విరుచుట దానికన్ననూ “ఏ విధముగానైనా, నీవు నేరస్తుడవు! మరియు నీ సంఘములో నీవు నియంతవు! నీవు వేలు మెటిక విరిస్తే, నీ సంఘము నీవు వారికి చేయమని చెప్పిన దానిని వారు చేయుదురు!”

“ఓ,” నేను చెప్పాను, “ప్రజలు ఎంత అన్యాయస్తులుగా ఉందురు?”

అతడు చెప్పాడు, “వారి గృహములు కాలిపోయినప్పుడు నీవు ప్రజలకు బహుమతులు (సామాగ్రి) పంచియున్నావు. విధవరాండ్రకు వందలాది డాలర్లు ఇచ్చి, మరియు వారి అద్దెలు చెల్లించి, మరియు అటువంటివి చేయుట కొరకు నీవు ఇచ్చిన చెక్కులు ఇవిగో.” చెప్పాడు, “నీవు ఆ విధముగా అటువంటివి చేయబోవుచున్నావని నీ యొక్క సంఘ బోర్డు దగ్గరకు వెళ్ళి నీవు చెప్పియున్నావా?”

నేను చెప్పాను, “లేదయ్యా.”

“నీవు ఎందుకు చెప్పలేదు?”

నేను చెప్పాను, “దేవుడు నాకు చెప్పెను, ఆయన వాక్యములో, 'నీ కుడిచేయి చేయునది నీ ఎడమచేతికి తెలియకూడదు.'”

అతడు చెప్పాడు, “అయితే నీ యొక్క కేసును నీవు బైబిలు ద్వారా వాదింప ప్రయత్నించుచున్నావు, మరియు మేము నిన్ను ఒక చట్టము ద్వారా తీర్పు తీర్చబోవుచున్నాము.”

నేను అడిగాను, “ఏది గొప్ప చట్టము, మనుష్యునిదా లేక దేవునిదా?” నేను దేవుని యొక్క చట్టమునే తీసుకొనెదను!

21

రెండు సంవత్సరముల క్రితము, నేను నా విరామ సెలవుపై ఉండి, నేను వెనుకకు వచ్చుచున్నాను. ఇక్కడ ఇండియానాలో వేగనియంత్రణ చట్టములు పగటివేళలో గంటకు అరవై-అయిదు మైళ్ళు, మరియు అది విశాల జాతీయ రహదారులపైన, విశాల రహదారులు. మరియు సూర్యుడు అస్తమించిన తరువాత రాత్రివేళ అది గంటకు అరవై మైళ్ళు. కాన్సాలో కూడా ఆ విధముగా ఉన్నది. ఇల్లినాయిలో కూడా ఆ విధముగా ఉన్నది. కొలరాడోలో కూడా ఆ విధముగా ఉన్నది. ఇడాహోలో కూడా ఆ విధముగా ఉన్నది. వ్యోమింగ్ లో కూడా ఆ విధముగా ఉన్నది.

మంచు తుఫానులో అనేక దినములు మంచు చరియలు విరిగిపడిన దానిలో చిక్కుకున్న తరువాత, నేను వెనుకకు తిరిగి వచ్చుచున్నాను; మరియు అప్పుడే నేను ఒక పెద్ద జింకను వేటాడి, మరియు దానిని నా యొక్క స్నేహితులకు ఇచ్చుట కొరకై, నేను నా ఇంటికి వెళ్ళే దారిలో ఉన్నాను. మరియు నా వెనుకనే వచ్చుచున్న మరియొక మంచు తుఫానులో ఇరుక్కొనకుండా నేను వేగముగా వెళ్ళుటకు ప్రయత్నించుచున్నాను, లేకపోతే మళ్ళీ నేను ఆగిపోవలసివచ్చును, మరియు మాంసము పాడగును.

మరియు నేను వ్యోమింగ్ ను దాటుకొని, మరియు నెబ్రస్కాలోనికి ప్రవేశించాను. మరియు నేను ఆ రోడ్డులో ముప్ఫై మైళ్ళ దాటి వచ్చాను. మరియు హఠాత్తుగా, నేను వెనుకకు తిరిగి చూచాను, మరియు పోలీస్ వారి యొక్క ఎర్రబుగ్గ లైటు వెలగడం నేను చూశాను. మరియు నేను నా జీవితములో ఎన్నడూ అరెస్ట్ అవ్వలేదు. కనుక, నేను అలా సాగిపోయాను. నేను క్రిందకి చూచాను. నేను గంటకు అరవై మైళ్ళ వేగముతో వెళ్ళుచున్నాను, ఏదైనా పట్టణము నుండి ముప్ఫై లేక నలభై మైళ్ళ దూరముగా ఉన్నాను. మరియు అలా రహదారిపై వెళ్ళుచున్నాను, పెద్ద నాలుగు-లైన్ల రహదారి. మరియు, నేను గమనించాను, గంటకు అరవై మైళ్ళు. నేను వెనుదిరిగి చూశాను, మరియు అతడు నా వెనుకనే ముందుకు సాగుచూ వచ్చుచున్నాడు. మరియు అలా నేను గమనించాను.

22

మరియు ఎర్రబుగ్గలైటు ఆరి వెలుగుచూ ఉండడం నేను చూశాను, మరియు నేను అనుకొన్నాను, “సరే, ఎందుకు అతడు నన్ను దాటిపోవడము లేదు? అతడికి కావలసినంత ఖాళీ ఉన్నది.” మరియు నేను అలా ఎదురుచూస్తూ ఉన్నాను. నేను నా కారు అద్దము క్రిందకు దింపాను, మరియు నేను ఒక సైరన్ కూతను విన్నాను. మంచిది, నేను అనుకొన్నాను, “నేను దొరకగలిగినంత దూరము వచ్చేశాను.” మరియు అతడు ముందుకు వచ్చి నన్ను ఆపివేసియున్నాడు. నేను కారులో నుండి క్రిందకు దిగాను. నేను అనుకొన్నాను, “బహుశా నా యింటి యొద్ద నుండి, నా భార్య లేక కుటుంబము నుండి వచ్చిన ఏదైనా వార్తను నేను రేడియోలో వినలేకపోయియుండవచ్చు.” నేను ఉండగలిగినంత అమాయకముగా ఉండి, కారులో నుండి క్రిందకు దిగాను.

“నేను నిన్ను ఎందుకు ఆపానో అని నీవు ఆశ్చర్యపడుచున్నావని నేను ఊహించుచున్నాను?” అని అతడు అడిగాడు.

“అవునయ్యా,” అని నేను చెప్పాను.

మరియు అతడు చెప్పాడు, “నీవు వేగపు నిబంధనలను అధిగమించియున్నావు.” “నీవు ఎంత వేగముతో వెళ్ళుచున్నావో నీకు తెలుసా?” అని అడిగాడు.

నేను చెప్పాను, “అవునయ్యా, నేను గంటకు అరవై మైళ్ళ వేగముతో వెళ్ళుచున్నాను,” అని చెప్పాను.

అతడు చెప్పాడు, “అది నిజము. మరియు అది చట్ట వ్యతిరేకము.”

నేను చెప్పాను, “అది లోపల అరవై అయిదు కాదా?”

“లేదండి.” “ఇక్కడ యాభై-అయిదు. నీవు వేగ పరిమితికి అయిదు మైళ్ళు దాటి వెళ్ళుచున్నావు,” అని చెప్పాడు.

“ఓ,” నేను చెప్పాను, “నన్ను క్షమించండి. నేను దానిని గమనించలేదు.”

చెప్పాడు, “నీ యొక్క డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వు. నీ యొక్క లైసెన్ను నాకు చూపించుము.”

మరియు వాటిని నా జేబులో నుండి నేను తీశాను. మరియు దాని పైన 'రెవరెండ్' అనే పదమును చూసిన వెంటనే అతని కళ్ళు అగ్గి నిప్పులా మారాయి. అతడు వెంటనే తన పుస్తకమును తీసి మరియు ఇరవై-నాలుగు డాలర్ల మరియు యాభై సెంట్లకు నాకు ఒక టికెట్ వ్రాయుటకు ప్రారంభించాడు.

నేను అడిగాను, “నీవు నాకు ఒక టికెట్ ఇవ్వబోవుచున్నావా?” (జరిమానా విధింపబోవుచున్నావా).

చెప్పాడు, “అవును నీవు నిజము చెప్పియున్నావు! నేను నీకు ఒక టికెట్ ఇవ్వబోవుచున్నాను.”

“సరే,” నేను చెప్పాను, “అయ్యా, అది సరే.

కానీ నేను ఏమీ చూడలేదు.“

అతడు చెప్పాడు, “ఓ, ఆ రాష్ట్ర రహదారి ప్రక్కన ఒక సూచన బోర్డు ఉన్నది. నీవు దానిని చూసియుండవలెను.”

“మంచిది”, నేను చెప్పాను, “నేను ఫోర్డ్ కారులో కూర్చొని ఉన్నాను, మంచు తుఫాను, నాలుగు రోజుల నుండి, మరియు అయ్యా, అటువంటి దానిని ఎన్నడూ నేను చూడలేదు.”

మరియు అతడు చెప్పాడు, “అది సరే. నీ దగ్గర ఏదైనా డబ్బు ఉన్నదా?”

నేను చెప్పాను, “కేవలము పన్నెండు డాలర్లు.”

“మంచిది,” అతడు చెప్పాడు, “దానిని చెల్లించేంత వరకూ నీవు ఇక్కడే ఉండబోవుచున్నావా.” దాదాపుగా రాత్రివేళ పదిగంటలు లేక పదకొండు.

నేను చెప్పాను, “అయ్యా,” అంతా నేను అతడికి చెప్పాను, ఏది తప్పో, మాంసము మరియు మొదలగునవి. అది అతడికి ఏమియూ కాదు. కనుక నేను వారికి ఆ డబ్బు పంపెదనని, నేను ఒక నమ్మకమైన ప్రకటనపై సంతకము చేయవలసియున్నది.

23

నేను ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ చిన్న పట్టణము యొక్క జడ్జి గారికి నేను వ్రాసాను, ఆ చిన్న భూస్వామికి దానిని నేను పంపవలసియున్నది. మరియు నేను అతడికి చెప్పాను. “అయ్యా, నేను ఇరవై .... సుమారు ఇరవై సంవత్సరములు,” ఆ సమయములో, “ప్రభువు యొక్క సేవలో ఇరవై-ఆరు సంవత్సరములు ఉన్నాను, నేరస్తులను ప్రభువైన యేసు వైపునకు త్రిప్పుటకు ప్రయత్నించాను, ఒక అధికారిగా నీ యొక్క జీవితమును కాపాడుటకు ప్రయత్నించి, మంచి సమాజములను తయారు చేయుటకు ప్రయత్నించాను, మరియు జీవించుటకు ఒక మంచి స్థలము, మరియు మన కుటుంబములకు సమాధానము. ఆ సేవలో ఇరవైకు పైగా సంవత్సరములు నేను గడిపియున్నాను. మరియు నేను కొంచెము నీ గీత దాటియున్నాను. దాని కొరకు నీవు నన్ను క్షమించవలయునని నేను అనుకొనుచున్నాను,” అని నేను చెప్పాను. “కానీ నీ అధికారి కనీసము కనికరించుట లేదు. అది, బహుశా అది అతడు చేసియుండవచ్చును, మరియు తన విధులను నేరవేర్చవచ్చును.

“అయితే నేను నిన్ను అడుగుచున్నాను, ఒక జడ్జిగా. అది ధనము గురించి కాదు; అది నియమమును గురించి. నేను కట్టినటువంటి మొదటి జరిమానా, మరియు అది సంఘము ద్వారా, ప్రజలు నేను జీవించుటకు నాకు ఇచ్చిన ధనము నుండి వచ్చినది,” అని నేను చెప్పాను. “ఒకవేళ దాని కొరకు మీరు నన్ను క్షమించుటకు దయ చూపగలిగిన ఎడల, దానిని నేను అభినందించెదను. ఏదేమైనా నోటరీ చేయబడిన చెక్కు ఇదిగో, అది సరిపోతుందని నీవు ఎరిగియుండవచ్చును,” అని చెప్పాను.

సహోదరుడా, దానిపైన అడ్డముగా తన పేరు వ్రాసి మరియు దానిని తీసుకొనెను, కరడు గట్టినట్లు. ఎందుకు? ఎందుకు? మరియు అప్పుడు, క్రుళ్ళిన రాజకీయముల ద్వారా, మరియు మతపరమైన పక్షపాతము, కొందరు హత్య నుండి తప్పించబడెదరు. అది అలాగున్నది. దేవుడు తన సంఘమును అటువంటి సంగతుల క్రింద ఎక్కువ కాలము ఉండనియ్యడు. మరియు లోకము చెడిపోయినది. మరియు రాజకీయములు చెడిపోయినవి. మరియు సంఘము చెడిపోయినది.

24

మనకు ఏమి కావలెను, దానిని గూర్చి చేయుటకు, దేవుని భయము కలిగిన ప్రజలందరూ సమకూడి మరియు ప్రభువు యొక్క నామమును పిలుచుట కావలెను. బ్రెన్హాం గుడారము చేయవలసినది అదే. ఓ, నేను కేవలము గమనిస్తూ మరియు చూచుచున్నప్పుడు నా ముందు ఎన్నో ఉండుటను నేను చూస్తున్నాను. మనము ఇక్కడ ఎంత కష్టపడగలము అను దాని గురించి ఆలోచించినప్పుడు, సంఘము ఏ విధముగా పోవుచున్నదని, ప్రజల యొక్క విలువలను వారు ఏ విధముగా విడిచిపెట్టారో, జీవించుటకు వారిని ఏ విధముగా విడిచిపెట్టుచున్నారు, మరియు రాక్-అన్-రోల్ సంగీతములకు మరియు నాట్యములకు వెళ్ళుచూ, మరియు వారికి నచ్చిన విధముగా దుస్తులు ధరించుచూ, మరియు ప్రతీది, మరియు ఇంకనూ ఆ విధముగానే కొనసాగుచున్నారు, రాజీపడుచున్న ప్రసంగీకులు.

మనకు పాత-తరహా, దేవునిచే-పంపబడిన, అది ఎవరిని గాయపరిచినా గానీ సత్యమునే చెప్పే పరలోకములో జన్మించిన ప్రసంగీకులు అవసరమై యున్నారు. యోహాను వలె, అతడు చెప్పాడు, “చెట్ల వేరున, గొడ్డలి పెట్టబడియున్నది.” “మరియు మంచి ఫలములు ఫలింపని ప్రతీ చెట్టు నరికివేయబడి మరియు అగ్నిలో వేయబడును.” మరియు మనము జీవించుచున్న ఈ చెడ్డ స్థితిలో, దేవుని యొక్క తీర్పులను మందుగుండు ఆయుధములుగా ఉపయోగించి, ప్రేలుడును సృష్టించి, నాశనము చేసే అటువంటి ప్రసంగీకులు మరియు ప్రవక్తలు మనకు కావలయును.

దాని వెనుక నిమురుట ద్వారా మీరు పాపమును తీసివేయలేరు. ప్రజలకు విద్యను నేర్పించుట ద్వారా మీరు పాపమును తీసివేయలేరు. మన కార్యక్రమములు కూలిపోయి మరియు విఫలమైపోయినవి. పాపమునకు ఒకే ఒక్క పరిహారమున్నదని, మరియు, అది, క్రీస్తే ఆ పరిహారము. మేథో సంబంధమైన ఒప్పుకోలును బట్టి క్రీస్తు కాదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క బాప్తీస్మము ద్వారా, ఒక క్రొత్త జీవితము మరియు ఒక పునరుత్పత్తి కొరకు. అదే పాపమునకు కేవలము పరిహారము, ఒక దేశమునకు కేవలము పరిహారము. సంఘమునకు కూడా అదే ఒకే ఒక్క పరిహారము. ప్రజలకు కూడా అదే ఒక్క పరిహారము.

25

ఇక్కడ కొంత కాలము క్రితము, ప్రయాణము చేయు మీలో అనేక మంది అక్కడ ఉన్నారని నేను ఊహించుచున్నాను. పశ్చిమానికి వెళ్ళు నా యాత్రలో, చాలాసార్లు నేను రాత్రంతయూ అక్కడ గడిపాను. మరుసటి వారము నేను వెళ్ళవలసియున్నది, ఒక విశ్రాంతి, ప్రభుత్వము నుండి ఉపశమనము పొందుటకు వెళ్ళవలసియున్నది. వారు నన్ను ఇక్కడ పట్టియుంచారు. ఎక్కడికైనా, ఒకవేళ వారు నన్ను పంపివేసిన ఎడల, వారు ఇక్కడే నన్ను పట్టుకొనగలరు. మరియు రెండు మూడు కూటముల కొరకు నేను పశ్చిమ తీరమునకు వెళ్ళవలసియున్నది. మరియు దేవుని చిత్తమైతే, నేను ఆర్కాన్సాలోని, వెస్ట్-మెంఫిస్ అనే ఈ చిన్న పట్టణము గుండా వెళ్ళవలసియున్నది. అది టెన్నెస్సీలోని, మెంఫిస్ నుండి వచ్చు నదీ తీరమున ఉన్నది.

మరియు ఈ ప్రాంతములో వారు ఒక రేసు కోర్టు కొరకు, జూదశాల కొరకు ఇరవై-అయిదు లక్షలు ఖర్చు చేయగోరుచున్నారు. పతనమవుటకు, మరియు కలుషితము చేయుటకు, మరియు ఆత్మలను నరకమునకు పంపుటకు ఇరవై-అయిదు లక్షల డాలర్లు.

మరియు బిల్లీగ్రామ్, ఓరల్ రాబర్ట్స్, నా వంటి వారిని పట్టుకొని, మరియు క్రీస్తు యొక్క కారణము కొరకు శ్రమపడు వారిని పట్టుకొని, సంఘ పరముగా న్యాయమైన ధనమును పంపే వారిని, మరియు వారిని ఇరవై సంవత్సరములు ఫెడరల్ చెరసాలలో వేయగోరుచున్నారు. ఆ విధముగా ప్రవర్తించుట అది ఎల్లప్పుడూ లోకము యొక్క తీరు అయ్యున్నది.

నేను చెప్పాను, “ఫెడరల్ చెరసాలలో శిక్ష అనుభవిస్తున్న సహోదరులు నాకు ఉన్నారు.”

మరియు న్యాయాధిపతులలో ఒకరు అడిగారు, “ఫెడరల్ చెరసాలలోని సహోదరులు ఉన్నారా?”

నేను అన్నాను, “అవును నేను కలిగియున్నాను.” అడిగాడు, “వారు ఎవరు?”

నేను చెప్పాను, “వారిలో ఒకరు సహోదరుడు యోహాను, ఆల్కాట్రా లో, పత్మాసు ద్వీపములో. మరియొకరు సహోదరుడు పౌలు, రోమను ఫెడరల్ చెరసాలలో. మరియు సహోదరుడు దానియేలు, అతడు కూడా చెరసాలలో ఉండెను.” మరియు సహోదరుడు యేసేపు, ఎందుకనగా అతడు చేయనిదానికి నేరము ఆరోపించబడినవాడై, సంవత్సరములు సేవ చేసెను, ఫోతీఫర్‌నకు ఒక నిజమైన సేవకునిగా ఉండుటకు ప్రయత్నించెను; మరియు అతడి భార్య అతనిపై నేరము మోపెను. మరియు అతడు నిందించబడెను, మరియు సంవత్సరముల పాటు చెరసాలలో ఉంచబడెను, ఎంతవరకనగా అతడి యొక్క జుట్టు మరియు మీసాలు పెరిగిపోయేంత వరకూ, ఇంకనూ అతడు ఫరో ముందుకు తీసుకొని వెళ్ళుటకు అతడికి గెడ్డము గీయవలసి వచ్చెను. ఖచ్చితము.

దేని కొరకు? ఏదైనా తప్పు చేసెనా? క్రీస్తు యొక్క కారణము కొరకు! ఖచ్చితముగా. మరియు తరువాత ఒక రేసు కోర్టు కొరకు రెండున్నర మిలియన్ డాలర్లు ఖర్చుబెట్టెను, కలుషితము చేసి మరియు పాడు చేసి మరియు ఆత్మలను నరకమునకు పంపించుట కొరకు. దేవుడు త్వరగా వచ్చుచున్నాడని పలుకుచూ!

26

కానీ ఆర్కాన్సాస్ ప్రజలు దానికొరకు ఏదో చేసెను. ప్రతీ సంఘము, నేను అనుకొనుచున్నాను, వారి గుంపులో తొమ్మిది లేక పది వేర్వేరు సంఘ శాఖలున్నవి, వారందరూ సమకూడి మరియు చెప్పారు, “అది తప్పు! మేము దానిని కలిగియుండము.” మరియు వారొక ప్రార్ధనా కూటమును ఏర్పాటు చేశారు, మరియు వారు గొలుసు ప్రార్ధనలను చేసెడివారు, పగలు నుండి పగలుకు, మరియు రాత్రి నుండి రాత్రికి. మరియు ఆ న్యాయాధిపతులు మరియు ఫెడరల్ మనుష్యులు, వారందరూ తరువాత రోజు ఉదయం కోర్టుకు వెళ్ళారు, దానిని పరిష్కరించుటకు, దానిని నిర్మించగలరా లేదా అని, వారు ఎదుర్కొన్నారు, మరియు అది ఓడిపోయినది. ప్రార్ధన సంగతులను మార్చివేయును.

27

లోకము ఎంత కుళ్ళిన స్థితిలో ఉన్ననూ, మన దేశము ఎంత కుళ్ళిపోయిననూ, మన దేశము, మన ప్రజలు; మన ప్రార్ధన సంగతులను మార్చివేయును. కానీ మనమిక ఎంత మాత్రము ప్రార్ధనా కూడికల యందు ఆసక్తిని కలిగిలేము. మనకు మనము చేయవలసిన అనేక సంగతులు కలవు, కనుక మనం ఆలోచిద్దాం.

మరియు తరువాత, అది మాత్రమే కాదు, ఆ రేసు కోర్టు నిషేధింపబడెను, కానీ ఆర్కాన్సాస్ రాష్ట్రములో, సంవత్సరములు సంవత్సరముల వరకు అటువంటిది ఏమియునూ లేదు, మరియు వారు ఉపయోగించకుండునట్లుగా ఇది కొనసాగినది. ఎందుకు? ఎందుకనగా ఆయన పేరు పెట్టి పిలువబడిన ప్రజలు వారికి వారు సమకూడి మరియు ప్రార్ధించెదరు.

ఓ, ఒక సామూహిక పిలుపు, ఒక సిద్ధబాటు ఈ రోజు మనకు అవసరమైయున్నది. మరియు ప్రసంగీకునిపై ఆధారపడకుండా, కానీ నీవు, దేవుని ముందు ఒక వ్యక్తిగతమైన వాడిగా, ఈ క్షయమైన దాని నుండి తప్పించుకొనుటకు, నిన్ను నీవు ఆ ప్రభువు యొక్క రాకడ కొరకు సిద్ధపరచుకొనుము. వారు నిన్ను ఏమని పిలిచినా గానీ, మరియు నీపైన ఏ చర్య తీసుకున్నా, అది దేవున్ని కొంచెము కూడా మార్చలేదు. దేవుడు అదే రీతిగా దానిని చేయును. ఆయన మనపై ఆధారపడి మరియు ఎదురుచూచుచున్నాడు. ఓ, మై !

28

కొంతమంది ప్రజలు చెప్పెదరు, “మంచిది, నేను ఆదివారము ఉదయమునే ఆలయమునకు వెళ్ళెదను. మా కాపరిని నేను వినెదను, అతడు ఒక మంచి బోధకుడు.”

అది మంచిదే. దానిని నేను అభినందించెదను. మరియు అది మీరు అమెరికా అయినా, ప్రపంచమైనా, అది ఎవరైనా. కానీ బలిపీఠము నుండి ఒక మంచి వర్తమానము కన్నా మిన్నయైన దానిని అది కోరును. అది నీ జీవితమును తీసుకొనును. సిద్ధపడుట కొరకు, అది నిన్ను తీసుకొనును. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, మరియు 7వ వచనములో, పరిశుద్ధ గ్రంథము దానిని చెప్పుచున్నది, (క్రీస్తు యొక్క వధువును గూర్చి మాట్లాడుచూ), “ఆమె తనను తాను సిద్ధపరచుకొనియున్నది.” ఆమె తనను సిద్ధము చేసుకొని యున్నది. మరియు మీరు, ఈ వధువులో ఒక సభ్యునిగా, నిన్ను నీవే సిద్ధపరచు కొనవలసియున్నది.

29

కొద్దికాలము క్రితము, ఒక సేవకుడు ప్రసంగించుచున్నాడు. మరియు చాలా సుదీర్ఘ కాలము నుండి అతడి సంఘమునకు హాజరవుచున్న ఒక వ్యక్తి ఉన్నాడు. మరియు ఆ రోజు ఉదయము అతడు బలిపీఠము యొద్దకు వచ్చాడు. మరియు అతడు చెప్పాడు, “పాస్టరు, నేను గత రాత్రి చేసిన దాని కొరకు, ఇప్పుడు నేను ప్రభువైన యేసుకు లోబడగోరుచున్నాను మరియు నేను నా సాక్ష్యము ఇవ్వగోరుచున్నాను.”

మరియు పాస్టరు చెప్పారు, “మంచిది, జాన్, దానిని గూర్చి వినుట నిజముగా నాకు సంతోషమై యున్నది. చివరగా నీవు నిర్ణయము తీసుకొని మరియు నిన్ను నీవు ప్రభువుకు ఇచ్చుకొనుటకు వచ్చావని తెలుసుకొనుటకు సంతోషించుచున్నాను, ఎందుకనగా మేము నీ భావములను గాయపరచగోరుట లేదు, కానీ నీవు చాలా చెడ్డవాడివని మాకు తెలుసు. మరియు నీవు నీ కుటుంబముతో తప్పుగా ప్రవర్తించావని మాకు తెలుసు. నీ డబ్బుతో జూదమాడియున్నావు, మరియు ఆ డబ్బును . త్రాగివేసి యున్నావు, మరియు ఒక భయంకర జీవితమును జీవించావు, మరియు నీ కుటుంబమును విడిచి పెట్టావు. మరియు ఈ ఉదయము, అది నా హృదయమునకు ఆనందము కలుగజేసియున్నది, ఆయనను సేవించుటకు, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మారి, ఇప్పుడు ముందుకు వచ్చి మరియు నిన్ను నీవు ప్రభువైన యేసుకు సమర్పించుకొనుటను బట్టి ఆనందించుచున్నాను.”

అతడు చెప్పాడు, “వందనములు, పాస్టరు.”

అతడు చెప్పాడు, “పిదప ఏమిటి... నిన్ను నేను ఏదో అడుగగోరుచున్నాను. నేను ఏ ప్రసంగము ప్రసంగించాను, లేక ఏ పాఠ్యాంశము నేను ఉపయోగించాను, మరియు, లేక సంఘములో ఏ పాట పాడిరి, కీర్తనలలో, నీవు ఈ విధముగా నిర్ణయించుకొనుటకు వీటిలో ఏది నిన్ను చేసినది?” మరియు ఆ వ్యక్తి అతడి ముఖములోనికి చూచి, కన్నీళ్ళు అతడి చెంపలపై కారుచుండగా, అతడు చెప్పాడు, “పాస్టరు, అది నీ ప్రసంగములలో ఏదీ కాదు, అవి ఎంత మంచిగా ఉండినప్పటికీ. అది పాటల గుంపు పాడిన దానిని బట్టి కాదు, లేక ప్రత్యేక గీతములు, అవి ఎంత మంచిగా ఉండినప్పటికీ.”

అతడు చెప్పాడు, “అయితే నీవు ఈ నిర్ణయము ఎందుకు తీసుకున్నావో ఈ సంఘమునకు చెప్పగలవా?”

అతడు చెప్పాడు, “క్రైస్తవుడైన ఒక వ్యక్తితో నేను పనిచేయుచున్నాను, మరియు నేను అతడిని అనేకమైన మాటలు అనియున్నాను. అతడిని ఒక పరిశుద్ద బండరాయి అని పిలిచాను. అతడిని ఒక మత మూఢుడు మరియు ప్రతీది అని యున్నాను, మరియు అవి అతడిని కొంచెము కూడా కదిలించలేదు. కానీ అతడు అటువంటి జీవితము జీవించాడు. చివరికి, నా హృదయములో, అంతా, అతడు ఒక స్థానము సంపాదించాడు, నేను ఆ వ్యక్తి వలె ఉండగోరాను. మరియు ఆ కారణము చేతనే నన్ను క్రీస్తు యొద్దకు నడిపించమని అతడిని అడిగాను. అతడు సేవించుచున్న క్రీస్తు నాకు కావాలి.”

30

మీరు చూడండి, దేవుడు పాష్టరు ద్వారా పనిచేయును, తన సంఘమును సిద్ధపరచుటకు. ఆయన పాటల ద్వారా పనిచేయును, తన సంఘమును సిద్ధపరచుటకు. మరియు తన సంఘమును సిద్ధపరచుటకు ఆయన నీ ద్వారా పనిచేయును. ఒకవేళ నీ పాష్టరు విఫలమైతే, మరియు తరచుగా విఫలమవుతూ ఉంటే, నీవు వేరొక పాష్టరును వెదికెదవు. త్వరగా దానిని చేసెదవు. ఒకవేళ నీ పాటలపాడు గుంపు సరిగా పాడనట్లయితే, లేక మీ ప్రత్యేక గీతములు బాగోలేనట్లయితే, ఆ సంగీతము నడుపుచున్న దర్శకునితో చెప్పెదవు, “ఇక ఎన్నడూ వారిని పాటలు పాడుటకు అనుమతించవద్దు. పాడుటను బట్టి, వారు నన్ను ఉద్రేకమునకు గురయ్యేలా చేయుచున్నారు.”

కానీ ఒక వ్యక్తిగా నిన్ను గూర్చి ఏమిటి? నీ యొక్క దైనందిక జీవితములో నీవు ఏ విధముగా విఫలమగుచున్నావు? నీవు దేవునితో ఏవిధముగా సరితూగగలవు, నీవు ఏ విధముగా ఉండవలెనని దేవుడు చెప్పాడు, కొండ పైన ఉన్న ఒక ప్రకాశిస్తున్న దీపమా? యేసును ఎరుగకుండా, ఆ మార్గమున ఎవ్వరూ ప్రయాణము చేయలేరు, కానీ నీ చుట్టే తిరుగుచుందురు. నీవు ఏ రకమైన జీవితమును జీవించుచున్నావు, అంటే అవమానకరమైన, మరియు హెచ్చింపబడుచున్న, వ్యత్యాసకరమైన వాటిలో ఒకటా? లేక, క్రీస్తులో నీవు కనుగొన్న ప్రేమ మరియు సమాధానమును గూర్చి నీవు మాట్లాడగలవా? “ఆమె తనను తాను సిద్ధపరచుకొనియున్నది.”

31

నేను నీకు చెడుతనమును చూపించాను; మరియు సమయము, నన్ను ఎన్నడూ విఫలము చెయ్యదు, కాలముల గుండా వెళ్ళుటకు, మరియు ప్రతీసారీ అది చూపించును, బబులోనులో వలె అల్లరి జరుగుచున్న ఆ రాత్రి, మరియు నాట్యమాడుచూ మరియు త్రాగుచూ, మరియు అటువంటివి, మరియు ఏమి జరిగినది. మరియు కాలమంతటి గుండా ఆ విధముగానే జరుగుచున్నది. ప్రతీ కాలములోను సూచనలు మరియు ఆశ్చర్య కార్యములతో, అంతటి ప్రజాదరణ మధ్యలో సంగతిని ఎదిరించి, మరియు దేవుని కొరకు ఒంటరిగా నిలబడుటకు దేవుడు పిడుగుల్లాంటి ప్రవక్తలను కలిగియున్నాడు.

అది మాత్రమే కాదు, కానీ ఒకవేళ నేను చిన్న సైఫను యొక్క కాలము గూర్చి మాట్లాడినట్లయిన, ఒక ప్రవక్త కాదు, ఒక పాస్టరు కాదు, కేవలము క్రీస్తు యొక్క శరీరములో ఒక సభ్యుడు. ఏ విధముగా ఈ చిన్నవాడు ఆ ఉదయం ఆ సన్హెంద్రియ సభ ముందు నిలబడ్డాడు, మరియు ఎవరైతే తనను నిందించుచున్నారో వారితో మాట్లాడి, మరియు చెప్పాడు, “మెడవంచని వారలారా, హృదయము నందు మరియు చెవుల నందు సున్నతి లేని వారు. మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను నిరోధించెదరు. మీ పితరులు చేసినట్లుగానే, మీరునూ చేయుచున్నారు.”

అతడు ఒక పాస్టరు కాదు. నీ పాస్టరే అంతయూ చేయవలెనని నీవు ఆశించలేవు. మీ యొక్క ధర్మకర్తల బోర్డు అంతయూ చేయవలెనని నీవు ఆశించలేవు, లేక మీ డీకను బోర్డు. నీకు నీవే సిద్ధపడవలసియున్నది. అది ఒక వ్యక్తిగత వ్యవహారము. మరియు గుర్తించుకొనుడి, ఆయన రాకడ హఠాత్తుగా ఉండును, సంఘము కనురెప్ప పాటులో వెళ్ళిపోవును. మరియు ఒకవేళ ప్రతీచోటా మనము పాపము చూస్తున్న ఎడల, మరియు తీర్పు వేచియుండగా, మరియు దేవుని ఉగ్రత యొక్క యుద్ధనౌకలు వచ్చుచున్నవి, ఏ విధముగా వీటిని మనము తప్పించుకొనగలము?

32

సూచనలు కనబడుచున్నవి. యేసు వచ్చుచున్నాడు. మరియు గొప్ప అద్భుతములు జరుగుచున్నవి.

ప్రతీ మైలు రాయి కూడా త్వరలో ఆయన ప్రత్యక్షమగుటనే సూచిస్తున్నది. మరియు అది ఒక క్షణములోనే జరుగును. మనము ఏ విధముగా నిలబడియున్నామో, ఈ ఉదయము, మనలను పరిశీలన చేసుకొందామా? ఒకవేళ ఈ ఉదయము మనము మాట్లాడినచో, ఆర్బాటము మరియు దేవుని యొక్క బూరతో, ఈ ఉదయము, ప్రభువైన యేసు ఆకాశముల నుండి దిగివచ్చినచో, ఒక సంఘముగా, మనము సిద్ధపడియున్నట్లుగా కనుగొనబడగలమా? ఎవరైతే తమను తాము సిద్ధపడియున్నామని రుజువుపరచబడ్డారో, మరణము నుండి తిరిగి లేచిన వారితో, జతకలయుటకు, ఒక వ్యక్తిగా, మనము సిద్ధపడియున్నట్లు కనుగొనబడగలమా?

మనము సిద్ధపడియున్నప్పటికీ లేకపోయినప్పటికీ, ప్రభువైన యేసు, ఆయన యొక్క నిర్ణయింపబడిన కాలములోనే వచ్చును. మనము సిద్ధపడియుండవలెను, మరియు ఇప్పుడే మనము దానిని చేయవలెను. ఎదురు చూసే సమయము కాదు. మనము కాలమును సద్వినియోగము చేసుకొని మరియు సిద్ధపడవలెను.

33

కొంత కాలము క్రితము, ఒక కథ (ముగించే ముందు) నన్ను తాకినది, నేను చాలా చాలా సంవత్సరముల క్రితము దానిని విన్నాను. ఈ ప్రభువు యొక్క రహస్య రాకడ; సంఘము హఠాత్తుగా, రహస్యముగా కొనిపోబడుట. గమనించండి! “ఇద్దరు పొలములో ఉండెదరు; నేను ఒకరిని తీసుకొని మరియు ఒకరిని విడిచి పెట్టెదను. మంచము పైన ఇద్దరు ఉండెదరు; నేను ఒకరిని తీసుకొని మరియు ఒకరిని విడిచి పెట్టెదను.” అది ప్రభువు యొక్క రాకడ ఏదో ప్రత్యేకమైన మూలన కాదు గానీ అది విశ్వవ్యాప్తమై యుంటుంది అని అది చూపించుచున్నది. “ఒకరు పొలములో ఉండి పనిచేసుకుంటూ ఉందురు,” పగటి సమయము. “మరొకరు మంచముపైన, పడుకొనియుందురు,” ప్రపంచమునకు మరొక ప్రక్క. అది ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, మరియు దేవుని యొక్క బూరతోను వచ్చు, విశ్వవ్యాప్తమైన ఎత్తబాటుగా అది ఉండును. మరియు క్రీస్తు నందు మృతులైన వారు లేచెదరు. మరియు ఆమె రహస్యముగా కొనిపోబడును. ఓ, నేను దానిని ప్రేమించుచున్నాను! గొప్ప పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, మరియు వధువు తనను తాను సిద్ధపరచుకొనియున్నది, స్వయముగా ఆమెకు కూడా తెలియని, ఆ రహస్యమైన క్షణము కొరకు ఎదురుచూచుచున్నది. కానీ ఆమె సిద్ధపడి, మరియు వస్త్రములు ధరించి, మరియు దాని కొరకు ఎదురుచూచుచున్నది.

34

మనము లోకములో ఆయన యొక్క సూచనలను చూస్తున్నాము, ఆమె తీర్పునకు సిద్ధపడి యున్నది. సంఘములో సూచనలు మరియు అద్భుతములు, గొప్ప సంగతులు జరుగుచూ ఉండుటను మనము చూస్తున్నాము. మనము ఎటువంటి ప్రజలుగా ఉండవలసిన వారమైయున్నాము. ఏలయనగా ఆయన ఎప్పుడు వచ్చుచున్నాడో మనము ఎరుగము గనుక, ఆ క్షణము మనము సిద్ధపడియుండవలెను. “నీ ప్రభువు ఎప్పుడు వచ్చునో ఆ నిమిషమైననూ లేక ఘడియయైననూ నీవు ఎరుగవు గనుక, నీవు సిద్ధపడియుండవలెను.” సిద్ధపడి యుండుము! ఏలయనగా, అప్పుడు నీవు సిద్ధపడలేవు, నీవు సిద్ధపడలేవు అని ఆయన చెప్పియున్నాడు.

35

మీలో ఎంతమంది, బహుశా అందరూ, ఆ కన్యకలను గూర్చి చదివియున్నారు? కొంతమంది బుద్ధిగలవారు మరియు కొంతమంది బుద్దిలేనివారు. కన్యక అనగా “స్వచ్ఛత.” వారందరూ మంచివారే. ప్రతీ ఒక్కరూ, కన్యక, దేవుని యొక్క శుద్దీకరింపబడిన పాత్రలు. కానీ ఎవరికైతే వారి దీపములలో నూనె ఉన్నదో, లోపలికి వెళ్ళిరి, మరియు తక్కినవారు బయట విడిచిపెట్టబడిరి. వారందరూ కన్యకలే, ప్రతీ ఒక్కరూ. ఏ తప్పిదమునకైననూ, మీరు వేలు ఎత్తి చూపెట్టలేని ప్రజలు. వారు, ప్రతీ ఒక్కరూ, ప్రభువు యొక్క రాకయందు నమ్మిక యుంచారు. ఆయనను ఎదుర్కొన వెళ్ళుటకు సిద్ధపడ్డారు, కానీ వారిలో కొందరు తమ నూనెను అవ్వగొట్టుకున్నారు.

నీ సంగతి ఆ విధముగా ఉండనియ్యవద్దు. నీ దీపములో నూనెను ఉంచుకొనుము. నూనె అనగా ఆత్మ, పరిశుద్ధాత్మ. నీలో ఎన్నడూ దానిని తరిగిపోనివ్వద్దు. నీలో ఎప్పుడైతే నీ ప్రేమ చల్లారిపోతుందని భావిస్తావో, క్రీస్తు పట్ల నీవు కలిగియున్న యదార్ధత మరియు ఆ కారణము, వెంటనే నీవు తైలపు ఊటయైన ఆయన యొద్దకు పరుగెత్తుము, మరియు నీ కొరకు పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపును కొనుక్కొనుము.

మన దేశము పోయినది, నైతికముగా పాడైపోయి మరియు కూలిపోయినది. మన రాజకీయములు, పాడైపోయి మరియు చెడిపోయినవి. మన నాయకులు, ఓ దేవా, దానిని గూర్చి మనము ఏమి చేయగలము? నీవు ఒక మంచి వ్యక్తిని లోపల పెట్టియుండవచ్చు, మరియు అతడు చెడిపోయిన వ్యక్తిగా బయటకు వచ్చును. ఇప్పుడు మనము ఒకే వ్యక్తిని తీసుకొనిరాగలము; అది ప్రభువైన యేసే. ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధపడెదము.

36

ముగింపులో కొద్ది సంవత్సరముల క్రితము నేను విన్న ఒక చిన్న కధను గూర్చి చెప్పగోరుచున్నాను. సంఘము యొక్క ఈ హఠాత్తైన, త్వరితమైన ఎత్తబాటు! ఇప్పుడు మీరు చెప్పెదరు, “ఫలానా సంగతులు జరుగును, అప్పుడు నేను సిద్ధపడెదను.” ఇప్పుడే సిద్ధపడుము. ఇప్పుడే నేను మీకు పెరల్ హర్బర్ మరియు హెచ్చరికను వినుటకు తిరస్కరించిన అనేకమైన స్థలములను సంబోధించాను. దానిని వినుటకు వారు నిరాకరించిరి. ప్రజల పైన దైవికమైన తీర్పు తప్ప ఏదియూ మిగలలేదు.

ఇప్పుడు, క్రీస్తులోనికి వెళ్ళలేని వారందరూ దేవుని యొక్క ఉగ్రతలోనికి మరియు దైవికమైన తీర్పులోనికి వెళ్ళెదరు. దయచేసి దానిని మీ ఎడల జరుగనివ్వవద్దు. బ్రెన్హాం గుడారము ఏమి వదిలివేసిననూ ఫరవాలేదు, నీవు ఎన్నడూ దానిని విడిచి పెట్టవద్దు. నీవు క్రీస్తు యొక్క సేవకునిగా ఉండుము. క్రైస్తవ ప్రపంచము ఏమి చేసినను ఫరవాలేదు, నీవు క్రీస్తు యొక్క సేవకునిగా ఉండుము. అది బ్రెన్హాం గుడారమునకు కాదు, లేక అది ఏ సంఘమునకు కాదు. అది నీకు చెందినదే, ఒక వ్యక్తిగతమైన వానిగా, ప్రభువు యొక్క రాకడ యందు సిద్ధపడుటకు. నీవు సిద్ధపడి యుండవలెను. నేను సిద్ధపడి యుండవలెను. నా సొంత అడుగులను నేనే తుడుచుకొందును. నీ అడుగులను తుడుచుకొనవలసినది నీవే. నావి నాకు ఒంటరిగా విడిచిపెట్టుము; నేను మీవి ఒంటరిగా విడిచి పెట్టెదను. నీ వస్త్రమును నీవే సిద్ధపరచుకొనవలసియున్నది.

37

కొలరాడో లోని ఉత్తర భాగములో, పర్వత శ్రేణుల దగ్గర, ఒక గొప్ప పశువుల కాపరి కలడు, మరియు అతడు ఒక పెద్ద పచ్చిక మైదానమును సొంతముగా కలిగియున్నాడు.

మీ అందరికీ తెలుసు, నా జీవితములో నేను కూడా కొంచెము పశువుల కాపరి పని చేశాను, గుర్రపు స్వారీ మరియు మొదలగునవి చేశాను. ఒక పిస్టల్ నా నడుము ప్రక్కన ఉండి, మరియు ఒక రైఫిల్ గుర్రపు జీను పైన పెట్టబడియున్నప్పుడు, నేను పాత టెక్సాస్ చక్రాల ముల్లు ఉన్న కాడిపైన కూర్చొనియుండగా, దేవుడు నన్ను పిలిచిన పిలుపులలో ఒక పిలుపు వచ్చెను; ఆ చెట్లు గాలి వీయుచూ ఉండడం నేను వినినప్పుడు, శబ్దము వంటి ఒక స్వరము చెప్పెను, “ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావు?” నేను పైకి నక్షత్రాల వైపు చూస్తున్నప్పుడు, మరియు ఆ ముసలివాడు, ఒక పాత కౌబాయ్ టెక్సాస్ నుండి వచ్చి, ఒక కాగితపు ముక్కతో దువ్వెన గుండా ఈల ఊదడం వారు వినియున్నారు.

నా రక్షకుడు మరణించిన ఆ సిలువ యొద్ద,

పాపము నుండి శుభ్రపరచుటకు అది అక్కడే నేను ఏడ్చాను;

అక్కడే నా హృదయమునకు ఆయన రక్తము రాయబడినది;

ఆయన నామమునకే మహిమ!

నేను దుప్పటిని నా ముఖముపైగా లాగుకొని మరియు నన్ను నేను దాచియుంచు కొనుటకు ప్రయత్నించితిని, ఎందుకనగా దేవుడు ఆ కొండలలో నుండి క్రిందకు చూచుచున్నాడు.

ఆ పచ్చిక బయళ్ళలో ఒక దానిలో, ఆ గొప్ప ప్యాకింగ్ కంపెనీలు తమ పశువులను కొని, వాటిని కొండలలోనికి తోలుకొని వచ్చి, మరియు వర్ష ఋతువులో, వాటికి పిల్లలు పుట్టిన తరువాత వాటిని బయటకు తీసుకొని వచ్చి, మరియు వాటికి ముద్ర వేసెదరు, మరియు ఆ పాత మందలోని కొన్నింటిని అమ్మివేసెదరు, మరియు కోడెలను అటువంటి వాటిని. మరియు ముందుకు వెళ్ళి, వారి పశువుల యొక్క గొప్ప మందలను పోగుచేయుదురు.

38

మరియు ఈ ఫలానా మైదానములో, యజమాని, లేక సంరక్షకుడు, అక్కడ మనము ఏమని పిలిచెదము, “ముఖ్యుడు,” ఫోర్‌మ్యాన్. అతడికి ఐదుగురు కుమార్తెలు కలరు. వారు అందరూ అందమైన స్త్రీలు, యవ్వనస్తులు, ఒంటరివారు. మరియు అక్కడ ఒక చిన్న బాలిక ఉన్నది, ఈ యవ్వనరాండ్రకు ఆమె చెల్లె వరుస, ఆమె యొక్క తల్లిదండ్రులిద్దరూ మరణించిరి. మరియు తన యొక్క పిన తండ్రితో నివసించుటకు ఆమె అక్కడకు తీసుకొనరాబడినది.

మరియు ఆ బాలికలు, రంగులతో ఉన్న కుచ్చులు కలిగిన పొడవాటి గౌన్లు వేసుకునేవారు, మీకు తెలుసు, మరియు వారందరూ. మరియు ఈ దీన చిన్న బాలికను తీసుకొని, ఆమె ఏదో ఒక జంతువు అన్నట్లు ఆమెతో ప్రవర్తించెడివారు. కష్టమైన పని అంతయూ ఆమె పైనే మోపబడేది. ఆమె పాత్రలను కడిగేది. ఆమె శుభ్రము చేసేది. ఆమె పడకలను సర్దేది. ఆమె అంతయునూ చేయవలసియుండెను.

మరియు వారు నగిషీ పెట్టబడిన చేతి వేళ్ళతో, చేతులు మరియు గోళ్ల అందమును తీర్చెడి పద్ధతితో, వారి పెదవుల పైన మెరుపుతో, మరియు అన్నీ అలంకరించుకొని, మీకు తెలుసు, ఒక సొగసరి వలె దూరముగా ఉండెడివారు. మరియు ప్రత్కేకించి ఎప్పుడైతే వారు, చికాగో నుండి, ఆ ప్యాకింగ్ కంపెనీ యజమాని యొక్క యవ్వనస్తుడైన, ఒక్కడే కుమారుడు ఆ పచ్చిక మైదానమును దర్శించుటకు వచ్చుచున్నాడని వినియున్నారో, అప్పుడే ఈ విధముగా చేసియున్నారు. ఓ, వారు మంచి దుస్తులు ధరించి మరియు సిద్ధపడ్డారా! ఆహ్! వారు మంచి దుస్తులు ధరించియున్నారా!

39

మరియు ప్రతీ రాత్రి సంభాషణ ఈ విధముగా ఉండెడిది, వారు ఈ యవ్వనస్తుడుని వశపరచుకొని మరియు అతడిని వివాహము చేసుకొనెదరు. అప్పుడు తమకు తామే ఆ పచ్చిక మైదానమును సొంతము చేసుకొందురు, ఎందుకనగా కుమారుడే ఆ ఆస్తియంతటికీ వారసుడవుతాడు. కాబట్టి వారు తమను తాము సిద్ధపరచుకొనిరి.

కనుక, మీరు చూడండి, ఒక సిద్ధపాటు చేయవలసియున్నది. నిన్ను నీవు సిద్ధపరచుకొనుము, సంఘములో చేరుట ద్వారానో లేక మరేదో, అది అంతయూ కాదు కావలసినది. నీవు నీ దీపములో నూనెను కలిగియుండవలెను, చూశారా. కేవలము మీ వస్త్రములు, చెప్పుచున్నవి, “మేము ఒక పెద్ద సంఘమును కట్టెదము. మేము ఒక మంచి శాఖా సంస్థకు చెందినవారము. మేము దేవుని కొరకు ఒక చిన్న వాయిద్యమును కొనెదము. మేము జారబడే కుర్చీలను చేయించెదము.”

దేవుడికి అవసరమైనది అది కాదు. దేవుడికి అవసరమైనది నీతి అయ్యున్నది, తన కుమారుడైన, క్రీస్తు యేసు యొక్క నీతి. అదియే వస్త్రములు, ఏలయనగా బైబిలు చెప్పుచున్నది, “వారు ధరించిన తెల్లని వస్త్రములు, పరిశుద్దుల యొక్క నీతి అయ్యున్నవి.”

40

కనుక ఆ యవ్వనస్తుని రాక కొరకు తమను తాము సిద్ధపరచుకొనెదమని ఆ బాలికలు తలంచారు. అయినప్పటికీ, ఆ పేద చిన్న చెల్లెలు....

ఎక్కడో వెలివేసినట్లు ఉండుట నాకు జ్ఞాపకము వచ్చుచున్నది. మీరు ఆమెను అభినందించగలరు. ఆమె ఒక అందమైన స్త్రీ. కానీ, ఓ, మై, ఆమె ఒక అందమైన చిన్న బాలిక, కానీ ఆమె కనీసము వారి మధ్యలో ఒక బంధువుగా కూడా లెక్కింపబడలేదు.

ఇప్పుడు, ఈ రోజు, సంఘ శాఖల ముందు, అదే నిజమైన సంఘము యొక్క వాస్తవమైన చిత్రమైయున్నది: కనీసము లెక్కింపబడలేదు, ఒక ఐక్య సంఘ సమాఖ్య గుంపు, ఒక బయటకు త్రోయబడిన గుంపు.

కనుకనే ఆ దీన చిన్న బాలిక పని చేసుకొనుచూ ముందుకు సాగిపోయినది. మరియు ఆ యవ్వన పురుషుడు వచ్చినప్పుడు, వారు దానిని ఎరుగరు, కానీ అతడు ఒక భార్యను వెదుకుటకు వచ్చెను. అందమైన అలంకరణతో బొమ్మలా తయారై, మరియు, ఓ, మీకు తెలుసు, బార్ రూముల చుట్టూ తిరుగుతూ, మరియు కాడిలాక్ కార్లలో తిరుగుతూ, మరియు వేర్వేరు సంగతులతో నిలుచున్న ఆ పట్టణపు బాలికలను చూసి అతడు నీరసించి మరియు అలసిపోయాడు. వారు దానిని చూసి నీరసించి మరియు అలసిపోయారు. “నేను పశ్చిమమునకు వెళ్ళి మరియు నా నిజమైన పిల్లలకు నిజమైన తల్లి కాగల ఒక నిజమైన బాలికను నా కొరకు వెదకెదను. మరియు ఆ మహిళామండలి, మరియు ఆ కుట్టు సమాజములు మరియు అనేకమైన సంగతులు అంటూ తిరిగేవారు కాదు, కానీ ఒక నిజమైన తల్లిలా ఉండునది,” అని అతడు తలంచాడు.

అతడు అక్కడకు వెళ్ళినప్పుడు అతడు ఏమి కనుగొన్నాడు? అయితే అతడు చికాగోలో దేనినైతే ఖండించాడో అదే సంగతిని.

ఒకవేళ ప్రభువైన యేసు ఒక సంఘమును కనుగొనునా అని నేను తలంచుచున్నాను, కేవలము ఒక సంఘశాఖ, కేవలము ఒక పేరుతో, “ఒక సంఘము,” దీపములలో నూనె లేకుండా, వెళ్ళుటకు సిద్ధపడనివారు? ఓ, వారు మంచి అందమైన వస్త్రములు కలిగియున్నారు. వారు పెద్ద పెద్ద ఆలయములు కలిగియున్నారు, ఈ పెద్దది, ఆ పెద్దది మరియు అన్ని సంగతులు. కానీ దేవుడికి అవి అవసరము లేదు. ఆయనకు వ్యక్తిగతముగా నీవు కావలెను. వారు మంచి ఉత్తమమైన పాస్టర్లను కలిగియుండవచ్చు, వారు ఉత్తమమైన డీకను బోర్డులను కలిగియుండవచ్చు, కానీ నీవు నూనెను కలిగియుండుట ఆయనకు కావలెను. ఆయన ఆ నూనెగల వధువును ఎత్తుకొని పోవుటకు వచ్చుచున్నాడు.

41

మరియు అతడు, ఈ బాలుడు, వారిని చూచి, అతడు నిరుత్సాహము చెందెను. మరియు ఆ రాత్రి వారు ఏదో ... ఒక దానిని కలిగియున్నారు. ఆ రోజులలో, చాలా కాలము క్రితము, వారు దానిని “చార్లెన్” అని పిలచేవారు, అది ఒక రాక్-అండ్-రోల్ సంగీతము వలె ఉండేది. మరియు వారు అటువంటి ఒక పెద్ద విందును జరుపుకోనున్నారు. మీలో చాలామంది ఆ పాత చార్లెన్ డ్యాను జ్ఞాపకముంచుకొని ఉంటారు, వెనుక నేను ఒక చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు, నేను అక్కడ ఉన్నాను.

మరియు కనుక వారందరూ తమ చిన్న నలుపు మరియు తెలుపు రంగు గల దుస్తులను కలిగియున్నారు, మీకు తెలుసు, .... చేయుటకు. ఓ, అది “చార్లెన్స్” మరియు “బ్లాక్ బాటమ్” అని పిలువబడును. అలాగనే వారు పిలుచుచున్నారు. మరియు వారు రెండు అంచెల దుస్తులను ధరించి, మరియు ఈ డ్యాన్సు చేయబోవుచున్నారు.

42

కానీ, అటువంటి వాటిని గూర్చి ఈ బాలుడు నిరుత్సాహపడెను. అతడు ఒక నిజమైన బాలిక కొరకు వెదకుచుండెను, కనుక వారి యొక్క విందు నుండి అతడు జారుకొనెను. ఆయన వారిని గమనించుచుండెను; వారిని చూచుటకు ఆయన లోపలికి వెళ్ళెను.

నాకు తెలిసిన అటువంటి వేరొక కుమారుడు కలడు. మరొక కుమారుడు మీ సంఘమునకు వచ్చును. అతడు దేవుని కుమారుడు, ఆయన అక్కడికి వచ్చును. ఆయన చుట్టూ చూచును. మంచి అందమైన వస్త్రములు ధరించిన మిమ్ములను ఆయన చూచును. మీరు ఒక మంచి సభ్యుడని ఆయన ఎరిగియుండును. కానీ ఆయన సంఘము యొక్క సాధారణమైన క్రమముల కన్నా మరేదో విభిన్నమైన దాని కొరకు ఆయన చూచుచున్నాడు.

కనుక అతడు చుట్టూ చూచినప్పుడు, కొంత సమయము తరువాత, అతడు చాలా నిరుత్సాహము చెందెను. ద్వారములో నుండి అతడు బయటకు నడిచెను. మరియు వెనుకకు వెళ్ళుచూ, వెన్నెలలో నడుస్తూ, ఇంటివైపు నడుచుచూ వెళ్ళెను, ఎవరో కూనిరాగము తీయడం అతడు విన్నాడు. మరియు అతడు చుట్టూ చూచాడు. మరియు ఇక్కడ ఈ చిన్న బాలిక ఒక పెద్ద పాత్రతో మురికి నీటిని మోయుచుండెను, రాత్రి వేళ, వట్టి కాళ్ళతో, ఆ పాత్రలోని నీళ్ళను పారబోయుటకు వచ్చుచుండెను. మరియు అతడు ఆమెను చూచిన వెంటనే, మరెవరో చెప్పెను, “అది ఆమెయే. అది ఆమే.”

కనుక అతడు ఆ దారిలో ఉండెను. మరియు ఆమె ఆ కంచెను దాటి బయటకు వచ్చినప్పుడు, ఎందుకు, అతడు అక్కడ నిలబడియుండెను. మరియు ఆమె దాదాపుగా స్పృహ కోల్పోయెను. అతడు అడిగాడు, “నీవు ఎలా ఉన్నావు?” మరియు అతడు అడిగాడు, “నీ పేరేమిటి?”

మరియు ఆమె తన పేరును అతడికి చెప్పెను. మరియు అది ఆ పచ్చిక మైదానపు యజమాని యొక్క అదే పేరు.

చెప్పెను, “అది ఏలాగో నాకు అర్ధము కావడము లేదు ... ఆయన మీ తండ్రా?”

ఆమె చెప్పెను, “లేదు. నేను కేవలము కుమార్తె వంటిదానను, మీరు చూడండి. నా తండ్రి మరియు ఆయన వారిరువురు సహోదరులు. నేను అదే పేరును కలిగియున్నాను. కానీ నేను... అది, అతడే యజమాని.”

43

నీవు సంఘము యొక్క పేరు కలిగియుండవచ్చు, బ్రెంహాం గుడారమనే పేరును కలిగియుండవచ్చు, లేక మెథడిస్టు, లేక మీరు ఏ సంఘమునకు వెళ్ళినా గానీ. స్నేహితుడా, అది ఏమీ కాదు. చూశారా, అది ఏదో విభిన్నమైనది; అది నీ గుణలక్షణము. దేవుడు దానినే చూచుచున్నాడు. నీవు మెథడిస్టు అయియుండవచ్చు. నీవు బాప్టిస్టు అయియుండవచ్చు. నీవు ప్రెస్బిటేరియన్ అయియుండవచ్చు. అది కాదు; దేవుడు చూచునది వ్యక్తిత్వము మాత్రమే. కేవలము భూసంబంధమైన వ్యక్తిత్వము కాదు, కానీ పరిశుద్ధాత్మ వ్యక్తిత్వము. “నమ్మిన వారిని ఈ సూచనలు వెంబడించును,” అని మార్కు సువార్త 16వ అధ్యాయములో యేసు చెప్పెను.

ఆమె చాలా కలిగియుండెను అది అతడు ఆమెతో మాట్లాడగలిగెను. మరియు ఆమె తన చిన్న శిరస్సును వంచుకొని, మరియు ఆమె ఇంటిలోనికి పరుగెత్తెను.

అతడు అక్కడ వారము లేక రెండు వారములు ఉండెను, మరియు అతడు చుట్టూ చూచెను, ప్రతీ చోటా. మరియు అతడు ఎన్నడూ మాట్లాడలేదు, కానీ అతడు ఆమెను గమనించుచుండెను. మరియు అతడు వెళ్ళిపోయే ముందు రాత్రి (అతడు మరుసటి ఉదయము వెళ్ళవలసియుండెను), వారు మరొక పెద్ద విందును చేసుకొనుచున్నారు. మరియు అతడు ఆమె కొరకు చూచెను. అతడు ఆమెను కనుగొనలేకపోయెను. మరియు ఆమె పాత్రలను మరియు అటువంటి వాటిని కడుగవలసియుండెను, కావున, అక్కడ పారవేయబడిన మురికి పని అంతా చేయవలసి యుండెను అని అతడు ఎరిగియుండెను.

44

మరియు ఆ విధముగానే ఆ నిజమైన దేవుని సంఘము ఒక సమయమున దానిని తీసుకొనవలసియుండెను: ఆ మురికి పని. ప్రతీ చెడ్డ పేరు, మరియు వారిపైన వేయదగిన మురికి అంతా వేయబడును. ఆమె ఒక గొప్ప ప్రత్యేకమైన మచ్చలు కలిగిన మిగిలినవాటి కన్నా రూపములో విభిన్నమైనది పక్షి. మరియు తక్కిన పక్షులన్నియూ చుట్టూ చేరి మరియు ఆమెను వెంట పడుచుండెను. అదంతయూ సరే. ఆమె యొక్క పేరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో ఉన్నది. ఎగిరిపోవుటకు ఒక రోజు ఆమె తన యొక్క గొప్ప రెక్కను చాచును. ఆమె సిద్ధముగా ఉన్నది. ఆ మచ్చలు ఆమెపై చిలకరింపబడిన క్రీస్తు యొక్క రక్తపు మరకలే. మీరు మీ బైబిలు గ్రంథములో దానిని చదివియున్నారు.

మరియు ఆ బాలుడు ఆ రాత్రి బయటకు వచ్చుచున్న ఆ చిన్న స్త్రీని పట్టుకున్నాడు. అతడు చెప్పాడు, “నేను నిన్ను గమనించాను. ఎవ్వరికీ తెలియదు నాకు తప్ప.” అతడు చెప్పాడు, “ఒక భార్యను వెదుకుట కొరకు నేను ఇక్కడకు వచ్చాను. మరియు నేను చూచిన దానంతటిలో, నీవే తగినదానవు.”

ఆమె ఎటువంటి అనుభూతి చెందును? యజమాని యొక్క కుమారుడు ఒకవేళ ఆమె తన భార్యగా ఉండగలదా అని ఇప్పుడు ఆమెను అడుగుచున్నాడు. ఆ ఆ బాలికలు ఒక్కసారి వారి కిటికీలో నుండి చూచి మరియు బయటకు చూచినప్పుడు వారు ఏ విధముగా అనుభూతి చెందియుందురో ఒక్కసారి ఊహించండి, వారు తమ పెద్ద అందమైన గౌన్లు మరియు కుచ్చుల దుస్తులతో వశపరచుకోవాలనుకున్న ఆ పురుషుడు, ఆ విధముగా ఆ చిన్న, త్రోసివేయబడిన బాలికతో, చేతులు కలిపి ఆ విధముగా కొనసాగుచుండుట వారికి ఎట్లుండును.

మరియు అతడు చెప్పాడు, “నీవు నన్ను పెండ్లాడెదవా?”

“ఓ”, ఆమె చెప్పినది, “అయ్యా, నేను యోగ్యురాలను కాను.”

45

ఆ విధముగానే నిజమైన సంఘము దానిని గూర్చి అనుభూతి చెందును, “నేను యోగ్యురాలను కాను. నేను ఒకవేళ నేను నీ పాత్రలను కడుగగలిగిన చాలును, అది సరిపోవును.” నీవు ఆ స్థానము తీసుకొనుటకు ఇష్టపడుచున్నావా? ఆ విందులోని పాత్రలను నీవు కడుగగలవా? నీవు మూఢభక్తి గలవాడు అని పిలువబడుటకు ఇష్టపడుచున్నావా? లేక, ప్రభువు కొరకు త్రోసివేయబడిన కొద్ది మందితో ఆ మార్గమును తీసుకొనుటకు ఇష్టపడుచున్నావా? నీవు ఇష్టపడుచున్నావా? నీ యొక్క పని దగ్గర, “ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు ఒక మూఢభక్తి గలవాడు, ఎందుకనగా అతడు మద్యము త్రాగడు, అతడు పొగత్రాగడు, అతడు నాట్యమాడడు, అతడు స్త్రీలతో పరుగెత్తడు,” అని ముద్రింపబడుటకు, నీవు ఇష్టపడుచున్నావా? “తన శిరస్సును క్రిందకు దించుకొనగల ఒక స్త్రీ ఉన్నది, ఆమెవలె నడుచును, పట్టణము గుండా. ఆమె మన ఎవరితో కలవదు....” నీవు ఆ మార్గమును తీసుకొని, ప్రభువు యొక్క రాకడ కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకొనుటకు ఇష్టపడుచున్నావా?

ఒకవేళ నీవు ఇష్టపడితే, నీవు ఆయన వచ్చుట కొరకు ఎదురుచూచుచూ ఉందువు. ఆయన రాకడయందు నీవు ఆనందించెదవు. ఒకవేళ లేకపోతే అది ఒక భయంకరమైన సంగతి. ప్రభువు యొక్క రాకడ నీవు తలంచుటకు అది చాలా కృపగలిగిన క్షణము. “ఆయన ప్రత్యక్షమగుటను ప్రేమించు వారందరూ.”

46

కాబట్టి, అతడు వెళ్ళిపోయినప్పుడు, ఒక ఖచ్చితమైన సమయమునకు తిరిగి వచ్చెదనని అతడు ఆమెతో చెప్పెను. అతడు చెప్పెను, “నీవు ఎప్పుడైతే ... చూచుటను ప్రారంభింతువో.” అది శీతాకాలము. “ఎప్పుడైతే ఆ చెట్లు చిగురించుటను ప్రారంభించునో, దూరముగా, ఆ ముళ్ళ చెట్లు మరియు మిగిలినవి ఒక క్రొత్త జీవమును తీసుకొనుటకు ప్రారంభించినప్పుడు,” చెప్పెను, “అప్పుడు వసంత ఋతువులో నేను తిరిగి వచ్చెదను.”

నేను గ్రహించాను, (అది సత్యమని నేను చెప్పను), కానీ ఆ బాలిక ఆమె కష్టమునకు ఒక వారమునకు కేవలము ఒక డాలరు మరియు డెబ్బె-అయిదు సెంట్లు పొందుకొనెను. కానీ దానిలో ప్రతీ రూపాయిను ఆమె పొదుపు చేసెను. ఎందుకు? జరుగనైయున్న వివాహము కొరకు ఆమె సిద్ధపడుచున్నది. ఆమె యొక్క పెండ్లి వస్త్రము కొరకు ఆమె యొక్క ధనమును ఆమె ఆదా చేయుచున్నది. ఏలయనగా అతడు చెప్పెను, “నేను తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ ఈ పచ్చిక మైదానములోనే మనము వివాహము చేసుకొనెదము.”

సంవత్సరమంతా ఆమె యొక్క ధనమును ఆమె పోగుచేసెను. ఆమె సంతోషముగా ఉండెను. పాత్రలను కడుగుటను ఆమె పట్టించుకొనలేదు. బట్టలను ఇస్త్రీ చేయుటయైననూ, లేక గృహమును తుడుచుటయైననూ, లేక మరేమైననూ ఆమె పట్టించుకొనలేదు. ఆమె ఆ మైదానపు యాజమానునికి నిశ్చయము చేయబడినది.

ఒక నిజమైన క్రైస్తవుడు, లోకము ఏమి చెప్పిననూ మనమేమి పట్టించుకొనెదమూ? ఒకవేళ త్రోసివేయబడుటకైననూ మరియు నిరాకరింపబడుటకైనూ అయిన ఎడల మనమేమి పట్టించుకొనెదము? “సాత్వికులు ధన్యులు; వారు భూమిని స్వతంత్రించుకొనెదరు.” యజమానుని కుమారుడు వచ్చుచున్నాడు, ఒక రోజు, మరియు మనము ఒక వివాహపు విందుకు వెళ్ళనైయున్నాము. ఒకవేళ ఆయన ప్రత్యక్షమగుటను నీవు ప్రేమించిన ఎడల, అది ఎటువంటి వ్యత్యాసమును మనకు తీసుకొని వచ్చును?

47

దీనంతటి తరువాత... దినములు గడిచినవి. ఆ చిన్న కుమార్తెలు, ఆ చిన్న చెల్లెళ్ళు, ఆమెను పరిహసమాడిరి, ఆమె చుట్టూ నాట్యమాడిరి, మరియు తక్కినవన్నీ చేసిరి. “మంచిది,” చెప్పెను, “ఓ పనికిమాలినదానా! ఒకవేళ ఆయన... నీకు తెలియదా. ఎందుకు, అతడునూ మిగిలిన పురుషుల వంటి వాడే. ఆయన నీతో సరసమాడు చుండెను.”

కానీ దేవుని కుమారుడు సరసమాడడు. “ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తేనే తప్ప, అతడు ఎంత మాత్రమును...” నీవె ఎంత అందముగా కనిపించినప్పటికీ, నీవు ఏ సంఘమునకు చెందినా, దేశములో నీవు ఏ హోదా కలిగియున్నా నేను పట్టించుకొనను. నీవొక రాజకీయ నాయకుడివి కావచ్చు. నీవు ఫెడరల్ ప్రభుత్వములో ఉండియుండవచ్చు. నీవు కేథలిక్కు, ప్రెస్బిటేరియన్, లేక నీవు కోరిన ఏ సంఘములోనైనా ఉండవచ్చు. కానీ, అది, “ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తేనే తప్ప, నీవు ప్రవేశింపవు. మరియు నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును.” నేను ఆయన వాక్యమునే చెప్పుచున్నాను.

48

చివరగా ఆ ఘడియ వచ్చినప్పుడు, ఆమె దీనిని చూచుట ప్రారంభించినది, చిగుర్లు చెట్ల పైన రావడం ప్రారంభించెను. ఆయన ఏ సమయములోనైనా అక్కడ ఉండునని ఆమె ఎరిగియుండెను.

మరియు అతడు చెప్పెను, “దానిని సూర్యాస్తమయ సమయములో చేయుటకు నేను ప్రయత్నించెదను, కాబట్టి మనము వివాహము కాబడి మరియు ఎగిరిపోవుదుము.”

మరియు ప్రతీ సాయంత్రము, సూర్యాస్తమయమున, ఆమె వెళ్ళి, తనను తాను మొత్తము సిద్ధపరచుకొని, ఆమె యొక్క చిన్న పెండ్లి వస్త్రమును తొడుగుకొని, మరియు ద్వారము దగ్గర ఎదురుచూచుచుండెను. మరియు ఈ చిన్న కుమార్తెలు వచ్చి మరియు ఆమెను చూచి నవ్వుచుండిరి, మరియు ఆమెను పరిహాసమాడుచుండిరి, మరియు “దీన, వెర్రి, అమాయకపుదానా. వీటన్నిటిని సొంతము చేసుకున్న ఆ పురుషుని గూర్చి ఆలోచించడమే, అతడే అధ్యక్షుడు, కంపెనీకి, అది కాకుండా, అటువంటి వ్యక్తి కమారుడు ఒక పాత్రలు కడుగుకొనే పనిమనిషిని వివాహము చేసుకొనునా!”

ఆయన సద్గుణము కొరకు చూచుచుండెను, వస్త్రములు కాదు. అవసరమైన వస్త్రములన్నిటిని కొనగలిగిన ధనము అతడి దగ్గర ఉన్నది.

నీవు ఎంత పెద్ద పెద్ద అందమైన సంగతులు కలిగియున్ననూ దేవుడు పట్టించుకొనడు. ఆయన సమస్త ప్రపంచమును కలిగియుండెను. కనుక, ఆయనకు సద్గుణము కావలెను. ఆయనకు వాస్తవమైనదేదో అవసరమైయున్నది.

మరియు కాబట్టి, చివరగా, ఒక సాయంత్రము, ఆమె అక్కడ నిలబడియున్నప్పుడు, మరియు వారు ఆమెను చూసి నవ్వుచూ మరియు ఆమెను అపహాస్యము చేయుచున్నప్పుడు, మరియు ఆమెను చూసి వెర్రిదానా అని చెప్పుచున్నప్పుడు, హఠాత్తుగా కొన్ని డెక్కలు ఎగురుచూ దుముకుచూ వచ్చుచున్న శబ్దమును వినిరి. ఏమి జరిగినది? కొండ ప్రక్కగా ఒక గుర్రపు బండి వచ్చినది. ఇప్పుడు, ఒక గుర్రపు బండి అనగా ఒక చిన్న వాహనము, పైకప్పు లేకుండా, పశ్చిమమున చాలా ప్రసిద్ధిగాంచినది. మరియు గుర్రములన్నియూ గల గల శబ్దముతో వచ్చుచున్నవి. కొండపై నుండి, ఈ వాహనము వచ్చినది, మరియు అది గేటు ఎదుట ఆగినది. మరియు ఆమె పరుగెత్తుకొని వెళ్ళినది. ఆమె చెప్పెను, “నీవు వచ్చెదవని నాకు తెలుసు.”

49

ఏదో రోజు సంఘము అలా ఉండును.

ఆయన యొక్క చేతులలోనికి ఆమె వాలిపోయెను, మరియు అతడు చెప్పెను, “ప్రియా, గత సంవత్సరము నేను ఇక్కడ నుండి వెళ్ళినప్పటి నుండి నేను ఇక్కడ ఈ మైదానము దగ్గర ఒక వ్యక్తిని ఉంచాను, నీవు చేసిన ప్రతీ దానిని గూర్చి అతడు నాకు సమాచారము తెచ్చెను.

ఈ గుడారములో దేవుడు ఒక వ్యక్తిని ఉంచాడు, ఈ ఉదయము, ఆయన పరిశుద్ధాత్మ అని పిలువబడును నీ హృదయ రహస్యములను ఆయన ఎరుగును. నీవు చేసిన ప్రతీదానిని గూర్చి, లేక నీవు ఏమి ఆలోచించావని ఆయనకు తెలుసు. నీవు చేయు ప్రతీదానిని గూర్చి ఆయన తండ్రికి చెప్పును. ఆయన వర్తమానమును పైకి మరియు క్రిందకి తీసుకొనివచ్చును.

అతడు చెప్పెను, “మరియు నీవు ఎదురుచూచావని, మరియు పనిచేసావని, మరియు సహనముతో నీవు కష్టపడి పనిచేసియున్నావని, నా రాక కొరకు ఎదురుచూస్తూ ఉన్నావని అతడు నాకు చెప్పెను. ఇప్పుడు, నీవు చాలా కాలము నుండి ఒక బానిసగా ఉన్నావు. కానీ ఇప్పుడు నీ శ్రమ దినములు ముగిసినవి. నేను ఆ సేవకుడిని వెంట తీసుకొని వచ్చాను. నీవు తిన్నగా ఈ గులాబీ తీగల గుండా నడచి వస్తూ నా భార్యవగుదువు.” అతడు ఆమెను ముద్దు పెట్టుకొనెను, ఆమె యొక్క వ్రేలునకు వివాహపు ఉంగరము తొడిగెను, మరియు ఆమెను పైకెత్తి మరియు ఆ వాహనములో కూర్చొండబెట్టెను, తన చేతిని ఆమె చుట్టూ వేసెను. ఆమె తన యొక్క భార్యగా నివసించుటకు, దేశములో పేరుగాంచిన, చికాగోలోని ఔటర్ డ్రైవ్ లో ఉన్న ఈ క్రొత్త పెద్ద భవంతికి తీసుకొనిపోయెను.

50

ఎందుకు? ఆమె సిద్ధముగా ఉన్నది. ఆయన కోరుకొనినట్లుగా ఉన్న స్త్రీ వలె ఉండి మరియు ఆ రకముగా ఆమె జీవించెను. అది రెప్పపాటున జరిగెను.

మరియు ఆ ఆకస్మికమైన, రహస్యమైన ప్రభువు యొక్క రాకడ, అది జరుగబోవుచున్నదని లోకమునకు తెలియదు, కానీ మనకు తెలుసు. అది సమీపమున ఉన్నది. పెరల్ హర్బర్ (నౌకాశ్రయము)లో బట్టలు ఊడదీసేసిన స్త్రీ వలే ఉండవద్దు, నీవు అవమానపరచబడెదవు. తనను తాను సిద్ధపరచుకొనిన, మరియు తన సద్గుణములను నిలుపుకొనిన, మరియు ప్రభువు కొరకు ఎదురుచూస్తూ ఉన్న ఆ స్త్రీ వలే ఉండుము, ఎందుకనగా అది ఒక రహస్యమైనది మరియు ఆకస్మికమైనది.

ఆ సంగతులను నీవు తలస్తూ, రానైయున్న ఆయన వైపు మన తలలు వంచెదము.

51

మనము ఆయనతో మాట్లాడుటకు ముందు, ప్రతీ వ్యక్తి తనకు నచ్చిన రీతిగా, ప్రతీ స్త్రీ, బాలుడు లేక బాలిక. మరియు నేను ఆయనతో మాట్లాడుచున్నప్పుడు మరియు ఆయన యొక్క రహస్య వ్యక్తిని ఎరిగినవానిగా, మీ కంటితో మీరు చూడలేనివాడు, కనుక అతడు ఒక రహస్య వ్యక్తి (ఏజెంటు) దీవింపబడి పరిశుద్ధాత్మ ఈ భవనములో ఉన్నది. ఈ ఉదయము, తండ్రి ముందు ఆయన మిమ్మును జ్ఞాపకము చేసుకొనకవలెనని మీరు కోరుచున్నారా, మరియు మీరు సిద్ధపడి ఆయన వచ్చినప్పుడు ఆయనతో వెళ్ళవలెనని కోరుచున్నారా? ఒకవేళ అలాగైన ఎడల, నీవు నీ చేతిని పైకెత్తగలవా? ప్రభువు నిన్ను దీవించును. వాస్తవముగా భవనములో ఉన్న ప్రతీ చేయి అని నేను ఊహించుచున్నాను; నాది, కూడా. “నీవు నాకు కావలెను, పరిశుద్ధాత్మ, నా పైన చూడుము. నేను ఆయన యొక్క నిరాకరించబడిన ప్రజల పక్షమును తీసుకొనుచున్నాను. నేను వెళ్ళగోరుచున్నాను, సిద్ధపడగోరుచున్నాను. నేను ఇప్పుడే సిద్ధపడగోరుచున్నాను, ఎందుకనగా ఈ కూడిక ముగియక ముందే ఆయన రావచ్చును.”

దేశములు ముక్కలగుచున్నవి,

ఇశ్రాయేలు మేల్కొనుచున్నది,

ప్రవక్తలు ముందుగా చెప్పిన సూచనలన్నియూ;

అన్యుల దినములు లెక్కించబడినవి,

శ్రమలన్నీ గురి పెట్టబడియున్నవి;

“త్రోసి వేయబడినవారలారా,

మీ గృహమునకు తిరిగి రండి.“

విమోచనా దినము సమీపించియున్నది.

మనుష్యుల హృదయములు భయముతో నిండుచున్నవి;

దేవుని యొక్క ఆత్మతో నింపబడియుండుము,

మీ దీపములు శుభ్రపరచుకొని తేటగా ఉంచుకొనుము.

పైకెత్తి చూడుము, మీ విమోచన సమీపముగా ఉన్నది.

అంజూరపు వృక్షము ఎదుగుచున్నవి;

ఇశ్రాయేలు పునరుద్ధరింపబడుచున్నది.

52

ఓ దేవా! అంజూరపు చెట్టు చిగురించుచున్నది, ఇశ్రాయేలీయులు ఒక దేశముగా తిరిగి వచ్చుచున్నది! మరియు ఈ ఉదయమున మన కాపరి ఇశ్రాయేలును గూర్చి ప్రార్థించమని చెప్పుట నేను వినినప్పుడు, అది చిగురించుచున్నది అని మీరెరుగరా? ఆయన ఆ సమయమునే రావలసియున్నది. ఆ అర్ధరాత్రికి మూడు నిముషములు, ఆ అంశము నేను చూస్తున్నప్పుడు, నా యొక్క క్రింద అంతస్తులో, నా యొక్క సొంత కెమెరా లేక ప్రాజెక్టరులో చూస్తున్నప్పుడు, ప్రపంచము నలుమూలల నుండి ఆ వృద్ధ కుంటివారైన యూదులు, ఓడలలోనూ మరియు ప్రతీ దానిలో నుండి వస్తూ ఉన్నారు. ఇంటర్వ్యూ తీసుకొనేవాడు అడిగాడు, “మీ స్వదేశములో చనిపోవుట కొరకే, మీరు స్వదేశమునకు వచ్చుచున్నారా?”

అతడు (యూదుడు) చెప్పాడు, “లేదు, మెస్సియాను చూచుట కొరకు వచ్చుచున్నాము.”

అంజూరపు చెట్టు ఎదుగుచున్నది.

(మీరు దానిని చూడలేకున్నారా?

విమోచనా దినము సమీపముగా ఉన్నది.)

అబద్ధపు ప్రవక్తలు అబద్ధములు చెప్పుచున్నారు,

దేవుని యొక్క సత్యమును వారు నిరాకరించుచున్నాడు;

క్రీస్తుయైన యేసే మన దేవుడని;

మనము ఎక్కడ ఉన్నామో మనము చూచుట లేదా?

అపొస్తలులు ఎక్కడ నడిచిరో మనమూ అక్కడ నడిచెదము.

విమోచనా దినము సమీపమాయెను,

జనుల హృదయములు భయముతో కలవరపడుచున్నవి;

(దానిని గూర్చి ఆలోచించుము!)

దేవుని యొక్క ఆత్మతో నింపబడియుండుము,

మీ దీపములను శుభ్రపరచుకొని చక్కబరచుకొనుము,

పైకెత్తుకొనుము! మీ విమోచన సమీపమాయెను.

53

ప్రభువైన దేవా, ఈ గొప్ప క్షణములో, నేను ఈ సమాజము వైపు చూస్తున్నప్పుడు, మరియు ఎర్రబారిన ముఖములు మరియు కన్నీరు గారుచున్న చెంపలు, పరిశుద్ధాత్మ, అయిన ఆ గొప్ప రహస్య ఏజెంటు సమీపముననే నిలబడియున్నాడని మేము గుర్తెరిగియున్నాము. ఇప్పుడు ప్రభువు యొక్క త్రోసివేయబడిన ప్రజల యొక్క పక్షమును తీసుకొనుము. ఒకవేళ మన పొరుగు వారి మధ్యలోను, ప్రజల మధ్యలోను, సంఘము మధ్యలోను, లేక మరిదేని మధ్యలోనైననూ చిన్న చిన్న సంశయములు ఉన్న యెడల, అవి మనతో ఏ సంబంధమునూ కలిగిలేవు. ఇక ఎంతమాత్రములో సంగతులతో మన యొక్క వస్త్రములను మలినము చేసుకొనవద్దు. ఏలయనగా నీవు ఏదో ఒక రోజు ఒక్క క్షణములో, కనురెప్పపాటు కాలములో వచ్చెదవు, ఆ హఠాత్తెన, రహస్యమైన నీ సంఘము యొక్క ఎత్తబాటు. నీవు ఏదో సమయమున ఆ కొండపై వచ్చెదవు, వర్షధనస్సు క్రిందగా, సంఘమును కొనిపోవుటకు, ఏలయనగా లేఖనము చెప్పుచున్నది, “దేవుని బూర మ్రోగును. మరియు క్రీస్తు నందు మృతులైన వారు లేతురు. మరియు సదాకాలము ప్రభువుతో ఉండుట కొరకు వారితో పాటుగా, మధ్యాకాశములో, ప్రభువును కలుసుకొనుటకు పోవుదుము. కాబట్టి, నా సహోదరులారా, ఈ మాటలతో మీరు ఒకరినొకరు ఆదరించుకొనుడి.” ఈ ఉదయకాలమున ఈ సమాజములో ఉన్నవారి హృదయములలో అది గింగురు లెత్తును గాక. ప్రభువు నామములో మేము నిన్ను స్తుతించెదము. ఆమేన్.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...