ఎందుకు అల్పమైన బెత్లెహేము?

ఎందుకు అల్పమైన బెత్లెహేము?

VGR COUNT -157 ఈ ఉదయకాలమున ఈ వేదికమీద పైన ధరించుకొను కోటును ధరించుట, ఒక విధముగా అది వింతగా కనబడుతుంది, అయితే సంఘము నాకు ఇచ్చిన ఆ చక్కని ఓవర్ కోటును ధరించుటకు నేను ఎంతో సంతోషముగా యున్నాను. మొన్నటి దినమున సహోదరుడు నెవిల్ ఆ చక్కని సూటును ధరించియుండుటను నేను చూసియున్నాను, అది ఆయనకు ఎంతో చక్కగా సరిపోయి యున్నది, మరియు నేను ఇలా తలంచాను, మంచిది, అది చాలా చక్కగా కనబడినది, మరియు సంఘము దానిని గూర్చి మాట్లాడుచున్నది, నేననుకొన్నాను, “నేను కేవలము నా ఓవర్ కోటును వేదిక మీద ధరిస్తాను.”

మీకు తెలుసా, మనము ఎన్నడూ పైకి ఎదుగలేము. మనము ఎల్లప్పుడు... మరియు నేను ఎదుగుట నాకు ఇష్టము లేదు. లూధర్ సహోదరుడా? దాని విషయము ఏమిటి? లేదు, నేను ఎన్నడూ పైకి ఎదుగుట కోరుట లేదు. మనము ఎల్లప్పుడు చిన్నపిల్లలవలె మిగిలి పోవలసియున్నాము.

[నెవిల్ సాహోదరుడు అన్నాడు, “బ్రెన్హాం సోదరుడా, ఈ ఉన్నతమైన శ్రేణికి చెందిన సేవకులలోని ఒకరివలె నీవు అలంకరించుకొనియున్నావని నేను తలంచాను. నేను మూల నుండి నా కంటితో సరిగ్గా చూసియున్నాను, నీవు ఒక అంగీని ధరించియున్నావని నేను తలంచాను.”]

ఆ చక్కని ఓవర్ కోటను బట్టి కృతజ్ఞతలు.

2

మంచిది, అది నేనంటాను - ఒకటి నాకు ఎంతో అత్యవసరముగా కావలసియున్నది, మరియు ఇది నేను ఎన్నడైనా కలిగియున్న శ్రేష్టమైనది. మరియు నిశ్చయముగా నేను దానిని మెచ్చుకొనుచున్నాను. సహోదరుడు రాయ్ రోబర్సన్ (ఈ ఉదయమున ఇక్కడ యున్నాడో లేదో నాకు తెలియదు), ఆ కోటును ఎన్నుకొనుటకు అతడు ఒక కార్యము చేసియున్నాడు. మరియు అది చక్కని ఎన్నికయైయున్నది. మరియు మేము దానిని కలిగియుండుటలో ఎంతో సంతోషపర్చబడ్డాము.

ఈ ఉదయమున సజీవుడైన దేవుని యొక్క గృహములోనికి తిరిగి వచ్చి, ఆయన యొక్క ప్రశస్తమైన వాక్యము చుట్టూ సహవాసము చేయు ఈ అద్భుతమైన సమయములను బట్టి మేము ఎంతో సంతోషపడ్డాము.

3

ప్రభువు చిత్తమైనయెడల, ఇప్పుడు వెంటనే నేను తప్పక విదేశములకు వెళ్ళవలసియున్నది. ఈ వచ్చే నెల నేను విదేశములకు వెళ్ళవలెను అని మీరు “బిజినెస్ మెన్స్ వాయిస్” లో చూచారు అని నేను తలుస్తాను. మేము దూరములో యుండగా మీరందరూ మా కొరకు ప్రార్ధించమని, మీ ప్రార్ధనలన్నిటిని అభ్యర్థించుచున్నాము. నా విదేశముల కూటములు బాగుగా యుండబోవునట్లు కనబడుచున్నది, ఏలయనగా అక్కడ అది బాగుగా తీసుకొంటుంది. అమెరికాలో...

నేను దానిని వినియున్నానని సహోదరుడు మెర్సియర్ కు నేను చెప్పుచున్నాను... మొదటగా అతడు నాకు రికార్డు ప్లేయర్లు ఇచ్చియున్నాడు, నా ప్రసంగములలో కొన్ని దానిమీద రికార్డు చేయబడియున్నది, అప్పుడు నేను గ్రహించాను, ఎన్నడైనా ఎవరైనా నా మాటలు విన్నట్లైతే, అది వారికి దేవుని యొక్క కృపగా యుండవలసియున్నది, కారణము నేను కొంచెము బాగుగా యుండవచ్చునని నేను తలంచాను.

అతడు అది కూడా టేప్ చేయుచున్నాడు. నీవు ఆ భాగమును కత్తరించివేయుము, చూచారా. లేక, అతడు తన యొక్క బొటన వ్రేలును క్రిందకు చూపుచున్నాడు; అది దానిని కత్తిరించి వేయుచున్నదని నేను ఊహిస్తాను.

4

కాని నేను మీకు చెపుతాను, నేను ఎంతో ఆశ్చర్యపోయాను. నా జీవితములో నేను ఎన్నడైన విన్న బహు అధ్వాన్నమైన ప్రసంగము, అది నాదైయున్నది, రికార్డు మీద, అది నిజము. అది నన్ను ఎంతో ఉద్రిక్తునిగా చేసియున్నది, కనీసము నా రాత్రి భోజనమును నేను తినలేకపోయినాను. నేను రోగినయ్యాను, భోజనపుబల్ల యొద్దనుండి వెళ్ళిపోయాను, ఆ రాత్రి నిద్రపోలేకపోయాను.

మరియు నిన్నటి దినమున సహోదరుడు ఉడ్ తో కలసి కెంటకిలోనికి వెళ్ళాము. తిరిగి వస్తూ నేను అన్నాను, “ఉడ్ సోదరుడా, ఎన్నడైనా ఒక మనిషి వచ్చి, నేను మాట్లాడుట ఒక మనిషి వినుటను నేను ఎలా చూడగలను. అది ఎంతో హీనముగా, నాకై నేను అలా దానిని తిరిగి చెప్పుచున్నాను, మరియు, ఓ, వ్యాకరణము తప్పిపోవుట, మరియు విరామ చిహ్నాలు పెట్టుట — అక్కడ అవిలేవు - ఏమీలేవు.” నేను కేవలము.. నాకు తెలియదు. నేనన్నాను, “అది మరొక మార్గములో నన్ను ప్రోత్సహించినది, అది దేవుడైయుండెనని తెలుసుకొనుట, లేనియెడల ఎవ్వరునూ నా మాటలు వినుటకు వచ్చియుండేవారు కాదు.” అది నిజము.

5

నేను సహోదరుడు కాలిన్స్ తో మాట్లాడుచుంటిని. అతడు ఈ స్థలములో యున్నాడని నేను అనుకొంటాను. కాబట్టి నేను అతనితో అన్నాను. అతడు వచ్చినప్పుడు, దానిని గూర్చి నేను అతనితో అన్నాను. అతడు వచ్చినప్పుడు, దానిని గూర్చి నేను అతనితో చెప్పుచుంటిని. నేను చెప్పాను, “కాలిన్స్ సహోదరుడా, నేను యధార్ధముగా...” నేను అన్నాను, “ఒక బోధకుడిగా, నాకు దరిదాపుగా చక్కని 30 సంవత్సరములున్నాయి, అయినా ఒక ప్రసంగము అనగా ఏమిటో నేను తప్పక నిశ్చయముగా ఎరుగవలసియున్నది. నేనన్నాను, ”నేను ఎన్నడైనా వినిన అత్యంత హీనమైన ప్రసంగము నాదే.“

మరియు అతడు ఒక మెథడిస్టు బోధకుడైయున్నాడు, మరియు అతడి సోదరుడు మెథడిస్టు సంఘ శాఖలో ఒక చక్కని మనిషి. మరియు అతడన్నాడు, “మంచిది,” అతడు అన్నాడు, “బ్రెన్హాం సోదరుడా, నేను నీతో చెపుతాను,” అన్నాడు, “నీవు విరామ చిహ్నాలు (Punctuations), మరియు నీ యొక్క వాక్యము సరిగా ముగియకపోవచ్చు, మరియు అలాంటి విషయాలు, కాని,” చెప్పెను, “నీవు పెంతికొస్తు దినమున బోధించిన వ్యక్తిని గూర్చి నీవు ఎన్నడైనా తలంచావా, అతడు కనీసము తన పేరును కూడా వ్రాయలేడు, అతని పేరు పేతురు.” అన్నాడు, “(అతడి ప్రసంగము) అది కుడా సరిగా విరామ చిహ్నాలు పెట్టియుండలేదు అని నేను ఉహిస్తున్నాను.”

6

అయితే నీవు చూడు, ఒక మనిషి యొక్క కన్నులను దానిమీద ఉంచునదేమనగా, మీరు ఈ రేడియో ప్రసారములను వింటారు, మరియు అవన్నియూ ముందుగానే వ్రాయబడినవి, మీరు చూడండి, మరియు వారు వారు దానిని వ్రాయగలరు మరియు దానికి విరామ చిహ్నాలు పెట్టగలరు, కారణము వాటిని వారు చదువుచున్నారు.

చార్లెస్ ఫుల్లర్ ఒక తొట్టె వెనుక నిలబడి, తన వేదిక కొరకు, అలా భోధించుచున్నప్పుడు నేను అతని కొరకు నిలబడియున్నాను. మరియు అతడు చెప్పిన సమస్తమునూ, కింద చూసి చదివియున్నాడు, నంబర్ ఒకటి, నంబరు రెండు, నంబరు మూడు, నంబరు నాలుగు, అని చివరకు ముగించు వరకు చదివియున్నాడు, మరియు దానికి సమయము పూర్తియైపోయినది. అదీ అంతయూ సెన్సార్ చేయబడినది, రేడియో సెన్సార్ చేసినది, మరియు సమస్తమూ.

కారణము, బిల్లీగ్రహం విషయములో కూడా, అతనిది అంతా నేను చూసియున్నాను, వారు కేవలము అక్కడ నిలబడి మాట్లాడతారు, వారు దానిని చదువగలిగినంత తొందరగా దానిని చదువుతారు, మరియు అప్పుడు అది అంతయూ సిద్ధమైనది, కాబట్టి మీరు మాటలకు విరామ చిహ్నాలు పెట్టుటను పొందుతారని నేను ఊహిస్తాను.

7

కాని నాతోయున్న ఇబ్బందియేమనగా, నేను కనీసము దానిని చదువలేను. కాబట్టి నేను దానిని వ్రాసినట్లైతే, నేను దానిని చదువలేనని నాకు నిశ్చయతయున్నది. కాబట్టి ఆయన మనకు ఏమి చేయగలడో చూచుటకు అది అద్భుతమైన కృపయైయున్నది, అది కాదా. కాని దానిని లోనికి ప్రారంభించుటకు, ఈ పాత సంత్సరమును ముగించుటకు, మరొక నూతన సంవత్సరమును ప్రారంభించుటకు, నేను కృతజ్ఞుడనైయున్నాను.

నేను ఒక ప్రార్ధనా వరుసను గూర్చి వినియున్నాను, నేను నిశ్చయముగా ఆ ప్రార్ధనా వరుసను వినుటలో కూడా నేను నిశ్చయముగా తృప్తి చెందియుండలేదు. ఆ రీతిగా నేను ప్రసంగించిన దానిని మరలా నేను వినుట అనునది అది మొదటిసారియైయున్నది, ఒక వర్తమానము కొరకు, నేను నిశ్చయముగా ఆశ్చర్యపడ్డాను. ప్రార్ధనా వరుసలు సరిగా వెళ్ళలేదు. అది నెరవేరుతుందని నేను తలుస్తాను, కొద్ది సమయము తరువాత వారు నమ్మక ముందు ప్రతి ఒక్కరూ వారిని గూర్చి సమస్తమును ఎరుగవలసినవారుగా అది ఆలాగుయుంటుంది, మరియు మొదటి సంవత్సరము ప్రారంభములో నేను దానిని మార్చగోరుచున్నాను. మరియు దేవుడు ఎక్కడ మాట్లాడతాడో అక్కడే సరిగ్గా ప్రార్ధనా వరుసను ప్రారంభిస్తాను. “ఈ వ్యక్తి సరియైన స్థితిలో లేడు,” లేక “అతనితో ఏదో తప్పుయున్నది”; నేను వారితో ఆగుతాను. వారిలో మిగిలినవారందరూ తిన్నగా ముందుకు వెళ్ళనివ్వండి, కారణము ఆ రీతిగా నీకు తగినంతగా దొరకదు, చూచారా. ప్రజలు వారు ఎక్కడ నుండి వచ్చారో, వారు ఎవరైయున్నారో, మరియు వారు ఏమి చేసియున్నారో వారికి తెలుసు. అయితే తిన్నగా దేవునితో వరుసగా లేనిది ఏదో వారు కనుగొంటారు, ఆ సమయమలోనే దానిని ఆపవలసియున్నది, అనుకుందాము, “ఇది అదేయైయున్నది,” చూచారా. కాబట్టి నేను అనుకొంటాను, బహుశా అక్కడ కొంత మార్పు జరుగవలసియున్నది, సహోదరుడా లియో, నేను వాటిని వినియున్నందున, రాబోవు సంవత్సరములో దేవుడు మనకు సహాయము చేస్తాడని నమ్ముచున్నాను.

8

ఇప్పుడు, రాత్రి ఆలయమునొద్ద ఇక్కడ కూటములుయున్నవని నేను నమ్ముచున్నాను. ఈ రాత్రికి సహోదరుడు రుడేల్ తో 62 నెంబరులో ఆ పైన అక్కడ నేను యుండవలసియున్నాను. ఇక్కడ వారు రాత్రి వేచియుండు కూటమును కలిగియున్నారని నేను గ్రహించాను. మరియు సహోదరుడు రుడేల్ ఆ వేచియుండు కూటము కొరకు నన్ను అడిగియున్నాడు, కాని తిరిగి ఆ కూడిక కొరకు ఆలయమునొద్దకు వచ్చుటకు బహుశా నేను ఆలోచించుచున్నాను, కారణము నేను ఎల్లప్పుడు నూతన సంవత్సర వేడుక కొరకు ఆలయమునొద్ద యుండుటకు ప్రయత్నించియున్నాను. ఇక్కడ యున్న సహోదరులతో ఇక్కడకు తిరిగి రావాలని నేను కోరుకొనియున్నాను. కాబట్టి కొంచెముగా ఒక విధముగా నేను రాజీపడియున్నాను, మరియు ఆ పాత 62వ నెంబర్ క్లబ్ దగ్గర నేను సహోదరుడు రుడేల్ తో యుంటాను, ఆ క్లబ్బు ఒక ఆలయముగా మార్పుచెందియున్నది. తరువాత బుధవారము రాత్రికి తిరిగి ఇక్కడ వేచియుండు కూడికలో యుంటాను. మరియు తరువాత, గురువారము, మేము చికాగో వెళతాము, మరియు తరువాత ఇంకా ముందుకు, ఇంకా ముందుకు ఫిలదెల్ఫియాకు వెళతాము, మరియు తరువాత విదేశములకు వెళతాము.

9

ఈ ఉదయమున, మిమ్ములను ఎక్కువ సమయము ఉంచను, కారణము అది మేము ఇంటర్వ్యూను కలిగియున్నాము, మరియు కూటములు ముందుకు కొనసాగుతాయి.

మరియు నేనంటాను, ఇక్కడ జరిగిన చివరి కూడిక నుండి, ఓ, గత చివరి కూడికలో ప్రార్ధనను బట్టి ముందుకు వచ్చిన ఫలితములను బట్టి నేను ఎంతో కృతజ్ఞుడనై యున్నాను. ఆయన ప్రజలు ఏకముగా కూడినప్పుడు, మన ప్రభువు నిశ్చయముగా చేయు కార్యము, అది ఒక అద్భుతముగా యుంటుంది. “ప్రభువు యొక్క నామమును పిలుచువారు, ఏకముగా సమావేశమైనప్పుడు,” అది ఆ విధానములోనే యున్నదని నేను నమ్ముచున్నాను, “మరియు ప్రార్ధించుట, అప్పుడు దేవుడు పరలోకము నుండి వింటాడు.”

కాబట్టి ఇప్పుడు, మనము ఈ వర్తమానము కొరకు అవసరమైన ప్రేరేపణ ఆయన మనకు ఇచ్చునట్లుగా, ఒక్క క్షణము ఇప్పుడు మనము తలలు వంచుదాము.

10

ప్రభువా, తరతరములన్నిటిలో నీవే మాకు ఆశ్రయమును మరియు దుర్గమునైయున్నావు. మా ముందున్న మా పితరులు నీయందు నమ్మికయుంచారు, మరియు వారు నిరుత్సాహపర్చబడలేదు. నీ పరిశుద్దమైన నామమునందు వారు విశ్వాసముంచారు, మరియు వారు ప్రకాశించుచున్న జ్యోతులుగా ముందుకు తేబడియున్నారు. మరియు మేము వారిపైపు చూచుచున్నాము, ఆ కవి చెప్పియున్నట్లుగా - “కాలము యొక్క ఇసుకల మీద పాదముద్రలు; కాలము యొక్క ఇసుకలపై మా భాగములు మాకు పాదముద్రలుగా మా వెనుక విడువబడతాయి.” అప్పుడు నీయందు విశ్వాసముంచినవారు ఎల్లప్పుడు, ఒక్కసారి కూడా తప్పిపోకుండా బయటకు వచ్చినట్లుగా మేము చూస్తాము. వారు విస్తారమైన లోతైన జలములు మరియు గొప్ప శోధనలు మరియు హింసలు గుండా వెళ్ళియున్నప్పటికి, అయినా ఇంకనూ, అంతములో, వారిని జయించువారికంటే మిన్నగా ఎల్లప్పుడు నీవు వారిని బయటకు తీసుకొని వచ్చావు, కారణము నీవు దానిని చేస్తావన్నది నీ యొక్క వాగ్దాన వాక్యమైయున్నది.

ఈ చిన్న సంఘమును మీరు దీవిస్తారని ఈ దినమున మేము ప్రార్థన చేయుచున్నాము. దానియొక్క కాపరియైన మా మంచి సోదరుడు, సహోదరుడు నెవిల్ మరియు ఆయన కుటుంబమును దీవించండి. ఈ వచ్చుచున్న సంవత్సరములో మీరు ఆయనతో యుండాలని, ఎంతో గొప్పగా నీవు ఆయనను అభిషేకించాలని మరియు ప్రతిమార్గములో నీవు ఆయనను దీవించాలని మేము నిన్ను అడుగుచున్నాము. ఆయన కుటుంబములోని వారందరికి ఆరోగ్యము నిమ్ము, ఎదుగుచున్న పిల్లలను బలపరుచుము. సోదరుడు నెవిల్ ను బలముగాను మరియు ఆరోగ్యముగాను యుంచుము.

11

ఈ సంఘమును మరియు దానిలోని ప్రతి సభ్యుని దీవించుము. ధర్మకర్తల బోర్డును దీవించుము, నిజమైన ధైర్యముగల దేవుని మనుషులుగా మేము ఎలా వారిని ప్రేమిస్తామో, మరియు డీకన్ బోర్డును దీవించుము, వారు కూడా ధైర్యముగల నీ యొక్క సేవకులైయున్నారు. మరియు ఇక్కడకు వచ్చియున్ను ప్రజలందరిని బట్టి, ప్రభువా, మేము వారిని బట్టి నీకు కృతజ్ఞులము. ఎన్నో సంవత్సరములుగా, ఈ చిన్న పాత గుంట, ఒక కలుపు మొక్కల మాసికగా యుండి, ఇప్పుడు దేవుని రాజ్యము కొరకు ఒక వెలుగును చూపు గృహముగా తయారుచేయబడి యుండియున్నదని ఎరుగుట నా హృదయమునకు మంచి భావన కలిగిచుచున్నది. దేవా, యేసు తిరిగి వచ్చువరకు అది నిలబడియుండునని నేను ప్రార్ధన చేయుచున్నాను. ఇక్కడయున్న ఎన్నో గొప్ప ఆత్మలు, గొర్రెపిల్ల యొక్క రక్తములో కడుగబడి, ఆ దినమున ముందుకు వచ్చుదురు గాక. దానిని దయచేయుము.

ప్రభువా, ఈ ఉదయమున నీ ధన్యమైన వాక్యమును మేము తెరువబోవుచుండగా, దానియొక్క పుటలను ఒక అంశము కొరకు వెనుకకు త్రిప్పుచుండగా, మాకు తెలుసు, నీవు మాత్రమే దానియొక్క సందర్భమును ఇవ్వగలవు. మరియు దేవా, నీ వాక్యమును నీవు అభిషేకించుమని మేము ప్రార్థన చేయుచున్నాము. అది తిన్నగా ప్రజల యొక్క హృదయములలోనికి వెళ్ళి, వారికి మేలు చేయును గాక. అవిశ్వాసుల నుండి విశ్వాసులను తయారు చేయుము. మరియు క్రైస్తవులను బలపర్చుము; రోగులను బాగుచేయుము; నిరుత్సాహపడిన వారికి ధైర్యమును దయచేయుము; మరియు నీకే మహిమను తెచ్చుకొనుము. ప్రభువా, దీనిని చేయుట కొరకు, మాట్లాడు పెదవులను మరియు వినువారి యొక్క చెవులను సున్నతి చేయుము. యేసు నామములో మేము దానిని అడుగుచున్నాము. ఆమేన్.

12

గత ఆదివారము నుండి నా హృదయములో పడిన ఒక చిన్న అంశమును నేను ప్రకటించుచున్నాను. యేసును చూచుటకు వచ్చిన జ్ఞానులను గూర్చి, వారు తూర్పు నుండి పడమరవరకు వారు వెంబడించిన నక్షత్రమును గూర్చి నేను మాట్లాడుచుంటిని. అది చదువుతూయుండగా, నేను ఒక లేఖనమును తాకాను, ఒక జైలులోని కూడికను బట్టి, అప్పుడు క్రిస్మస్ వేడుకకు నేను ఇక్కడకు చేరుకొనలేను. నేను అనుకొన్నాను, ఈ రోజు, “ఎందుకు అల్పమైన బెత్లెహేము?” అను అంశమును గూర్చి మాట్లాడాలని కోరుకొన్నాను.

ప్రవక్తయైన మీకా గ్రంధము నుండి, చిన్న ప్రవక్తలలో ఒకరు, 5వ అధ్యాయము 2వ వచనమును నేను చదువగోరుచున్నాను. అది ఇలా చదువుతుంది:

“బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును; పురాతనకాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.”

అక్కడ లేఖనము మీద ఒక మచ్చను నేను కలిగియున్నాను, ఆ కారణమును బట్టియే, ఆ మాట ఏమైయుండెనో, ఆ సమయమునకు నేను చెప్పలేకపోయాను.

13

పాలస్తీనాలోని ప్రదేశములన్నిటిలో మరియు అక్కడ ఎన్నో గొప్ప పట్టణాలు యున్నాయి, మరియ వాటియొక్క ప్రాంతములు, చరిత్రలో ఎంతో ఎక్కువగా పేరున్న విద్యగల పట్టణములుగా అవి కనబడుచున్నాయి. మరియు చక్కగా కోటతో బలపర్చబడినవి, అతిపెద్ద పట్టణములు. దేవుడు ఎందుకు తనయొక్క కుమారుని జన్మస్థలముగా యుండుటకు చిన్న బెత్లెహేమును ఎన్నుకొనియున్నాడు? అక్కడ ఎన్నో అతి గొప్పవి యున్నవి. మరియు, ఉదాహరణకు, చరిత్రాత్మకమైన జ్ఞానముగల యెరుషలేము, గర్వముగల యెరుషలేము, అక్కడయున్న వాటన్నిటికి అది ముఖ్య-పట్టణమై యున్నది. మరియు అది పాలస్తీనాలోని పట్టణములలో అతి పొడవైన పట్టణములలో ఒకటి. మరియు ఎందుకు దేవుడు తన కుమారుని యొక్క జన్మస్థలముగా యుండుటకు, అతి చిన్న బెత్లెహేము ఊరును ఎన్నుకొన్నాడని మనము ఆశ్చర్యపడతాము.

అయితే లేఖనము చెప్పియున్నట్లుగా, “దేవుడు ఏది చేయాలని ఉద్దేశిస్తాడో, అది జరిగించబడుతుంది. మరియు అది అక్కడయున్నది, దేవుడు ముందుగానే అది మార్గములోయుండుటకు నిర్ణయించియున్నాడు, లేనియెడల అది ఎన్నడూ ఆ విధానములో యుండియుండేది కాదు. మరియు అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయములో అక్కడ లేఖనము చెప్పుచున్నది, ఏదియు ఆకస్మికముగా జరుగులేదు. దేవుడు సమస్తమును ఎరిగియున్నాడు. అది అలా జరుగుటకు కేవలము అది జరగులేదు. అది అలాగైయుండెను, దేవుడు దానిని ఆ విధానములో సిద్దము చేసియున్నాడు.

14

మరియు అప్పుడు, పరిమితితో కూడిన చిన్న మనస్సులతో దానిని ఆలోచించుట ప్రారంభించినప్పుడు, “ఆ గొప్ప పరలోకపు రాజు, ఒక రాజధాని వంటి పట్టణమును కాక, ఎందుకు అలాటి ఒక చిన్న స్థలాన్ని ఎన్నుకొన్నాడు?” వేరొకదానికి బదులుగా....

కనీసము ఆత్మసంబంధమైన వృత్తాంతము కలిగిన ఎన్నో స్థలములు అక్కడయున్నాయు. ఉదాహరణకు, వాటిలో కొన్ని షిలోహు వంటివి యున్నాయి. షిలోహు ఇశ్రాయేలు వారికి ఒక అతి ప్రాచీనమైన ఆరాధన స్థలముగా యున్నది, వారు అక్కడికి ఏటేటా వచ్చేవారు. ఈ గొప్ప స్థలములోనే దేవుని యొక్క మందసము విశ్రమించియున్నది. మరియు అలాగైతే, షిలోహులో ఆయన ఎందుకు జన్మించలేదని నేను ఆశ్చర్యపడతాను?

15

తరువాత అక్కడ గిల్గాలు యున్నది, అది మరొక గొప్ప ఆత్మసంబంధమైన ఆరాధనా స్థలమైయున్నది. ఎందుకు దేవుడు ఆయన గిల్గాలులో జన్మించుటకు ఇష్టపడలేదు?

మరియు అక్కడ మరొకటియున్నది, అదే సీయోను, సీయోను పర్వత శిఖరముపై యున్నది. మరియు అలాగైతే యేసు ఎందుకు సీయోనులో పుట్టియుండలేదని మనము ఆశ్చర్యపోతాము, కారణము అది ఒక గొప్ప చరిత్రాత్మకమైన స్థలమైయున్నది, అక్కడ గతించిన యుగములగుండా ప్రభువు తన ప్రజలను దీవించియున్నాడు.

బహుశా ఆయన సీయోనును గాని, లేక గిల్గాలును గాని, లేక షిలోహును గాని, లేక ఇతర స్థలములలో, వారు గొప్ప దీవెనలు మరియు ఉపదేశములు పొందిన స్థలములలో ఒకదానిని ఎన్నుకొని యుండవలసినట్లుగా అది కనబడుతుంది.

అక్కడ హెబ్రోను వంటి గొప్ప పట్టణములు యున్నవి. ఒక ఆశ్రయపురముగా, ఒక సురక్షితమైన స్థలముగా, ఒక మనిషి కోరుకొను స్థలముగా అది యుండియున్నది. అక్కడ రామోత్గిలాదు యున్నది, అది ప్రజలు వచ్చు మరొక ఆశ్రయపురము, అది ఆయన జన్మించుటకు తగిన స్థలముగా యున్నది.

16

బహుశా, నేను దానిని గూర్చి ఆలోచించుచుంటిని, నేను ఆయనను కాదేషు-బర్నియాకు తెచ్చియుండేవాడను, కారణము అక్కడ తీర్పు పీఠముయున్నది, మరియు ఒక ఆశ్రయ స్థలముయున్నది. బహుశా ఆయన జన్మస్థలమునకు నేను ఆయనను ఆ దేశమును తెచ్చియుండవచ్చు, లేక బహుశా మనము వేరే కొన్ని పట్టణములను మనము ఎన్నుకొనేవారము.

అయితే, మీకు తెలుసా, కనీసము చిన్న ప్రాధాన్యత లేనివి బైబిలులో ఎంతో అర్ధవంతముగా యున్నవి. యేసు దానిని చెప్పియున్నాడని నేను నమ్ముచున్నాను, అదేమనగా, “మీరు ధర్మశాస్త్రములోని బరువైనవాటిని చేస్తూ, మీరు వాటిని దాటిపోతారు, దానికంటే, ”మీరు చిన్నవాటిని దాటివెళ్ళిపోతారు.“ మరియు కొన్నిసార్లు, చిన్నవే పెద్దవాటిని ఏకముగా పట్టుకొనియుంటాయి. అయితే, సమస్తము యంత్రములోని చక్రము యొక్క పల్లు, ఖచ్చితముగా దేవుడు నిర్దేశించియున్న విధానములో దేవుడు పిలిచియున్నట్లుగా సరిగ్గా, అవి తిరుగుతాయి. అక్కడ వాటిలో ఒకటి తన స్థానమును పోగొట్టుకొనదు. దేవుడు అన్నిటిని ముందుగానే నిర్ణయించియున్నాడు, మరియు అది తప్పక సరిగ్గా ఆ స్థానమును తాకవలెను.

17

మనము అలాటి విశ్వాసమును పొందియున్నప్పుడు, వీటన్నిటి వెనుక ఎవరున్నారు? అని మనము ఆలోచించుటకు ప్రారంభిస్తాము. ఈ గొప్ప దేవుని యొక్క క్రమమును త్రిప్పుచున్న, ఆ ముఖ్యమైన స్పింగ్ ఏమిటి? అది పరిశుద్ధాత్మయైయున్నాడని మనము కనుగొంటాము. కార్యములు చేయుటకు అది మనుషుల చేతులలోనికి విడిచిపెట్టబడలేదు; కాని పరిశుద్ధాత్మ యొక్క చేతులలోనికి అది విడిచిపెట్టబడినది. మరియు ఆయనే ముఖ్యమైన స్ర్పింగ్ అయి యున్నాడు, పరికరములోని మిగిలిన భాగములన్నిటిని ఆయన పొందగలిగినట్లైతే, అది పరిపూర్ణముగా పనిచేస్తుంది మరియు దేవుని యొక్క సమయమును ఖచ్చితముగా పాటిస్తుంది.

అప్పుడు మనము దానిని చూస్తాము, మనము గొప్ప కార్యములను చూస్తున్నప్పుడు మరియు మనము ఎలా వాటిని కలిగియున్నామోనని, అప్పుడు మనము మన మనస్సులో ఆశ్చర్యపోతాము; మరియు అప్పుడు దానిని ఆలోచించుట అది ఈ దినమున మనకు ఎంతో ఆధరణను ఇస్తుంది, బహుశా మనము ఒక చిన్న గుంపు ప్రజలమైయున్నట్లైతే, బహుశా మనము లోకమునకు ప్రఖ్యాతిగాంచినవారము కాకపోయినను, పెద్ద సంఘములకు మరియు సంఘ శాఖలకు, ఇంకనూ దేవుడు కొన్నిసార్లు ఆ చిన్న సామాన్యమైన వాటిని వాడుకొంటాడు.

18

కారణము అది లేఖనములో కూడా వ్రాయబడినది, “చిన్న మందా, భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమైయున్నది.” ఎలాటి ఆదరణ! నిశ్చయముగా యేసు చిన్న బెత్లెహేములో జన్మించవలసియున్నదని నాకు తెలుసు, అట్లు చిన్న మందగా యున్నవారికి తండ్రి తన రాజ్యమును అనుగ్రహించును, కారణము అది వ్రాయబడినది. మరియు లేఖనమంతయూ ప్రేరేపణ ద్వారా ఇవ్వబడినది, మరియు లేఖనము నిరర్ధకము కాదు. అవి తప్పక నెరవేరవలసియున్నది. కాబట్టి అది ఒక చిన్న మందయే రాజ్యమును ఎన్నుకొంటుంది, ఒక చిన్న నమ్మకమై విశ్వాసులగుంపు అని దానిని ఎరుగుట మనకు నిరీక్షణను ఇస్తుంది. నేను తప్పక చెప్పాలి, ఆ మందలో లేక ఆ చిన్న మందలో నేను ఒకడనైయున్నానని నేను నమ్ముచున్నాను.

మరియు దేవుని యొక్క వాగ్దానము ద్వారా ఇశ్రాయేలీయులు ఎలా పాలస్తీనాకు వచ్చియున్నారో మనలో దరిదాపుగా అందరికి అది పరిచయమైన గాధ. మరియు ఆ గొప్ప యెహోషువ ప్రతి గోత్రమునకు వారి స్వాస్థ్యమును పంచిపెట్టియున్నాడు అని మనము ఎరుగుదుము.

19

అది నిశ్చయముగా... వాటినుండి నిజమైన భావమును పొందుటకు, తిన్నగా ఈ అంశముపై నిలిచియుండుటకు, ఒక మార్గములో ఈ విషయములన్నిటిని వరుసగా చేర్చుటకు, ఇప్పటి నుండి 6 గంటల వరకు మనము సమయమును కలిగియున్నట్లైతే; సమయము మనకు లేదు, సరిగ్గా 30 లేక 40 నిమిషములు మనకు సమయమున్నది. కాబట్టి ఉన్నతమైన విషయములను మనము సరిగ్గా తాకవలసినయున్నది, మనము ముందుకు సాగిపోవుచుండగా, బైబిలును పఠించువారైన మీకు, పరిశుద్దాత్ముడు మిగిలిన దానిని మీ హృదయములో యుంచునని నేను నమ్ముచున్నాను.

మీకు తెలుసా, ఎలా ఆ భాగములను పాలస్తీనాలో యెహోషువ వాటిని ప్రేరేపణ ద్వారా వారికి కేటాయించియున్నాడో. మరియు ఆ పితరుల యొక్క హెబ్రీ తల్లులు, వారియొక్క ప్రసవ వేదనలో, ఆ బిడ్డలు జన్మించుచున్నప్పుడు, ఆ బిడ్డలను కనుచుండగా, ఆ పితరులు ఈ చివరి దినములలో ఖచ్చితముగా ఎక్కడ స్థిరపడతారో, ఆ తల్లులు ఉచ్చరించియున్నారు.

ప్రేరేపణ గూర్చి మాట్లాడండి, ఈ బైబిలు ప్రేరేపించబడినది! ఎంతో చిన్నదైనా, సరిగ్గా ప్రతి చిన్న లేఖనము, ఆ గొప్ప చిత్రములో ప్రతిది ఎంత విశిష్టమైనదిగా యున్నది. దానిలోని సమస్తమూ, ప్రతి మాట ప్రేరేపించబడినది, మరియు దానిమీద ఆత్మల యొక్క గమ్యము వ్రేలాడుచున్నది, ఎందుకనగా అది అమర్త్యుడైన మరియు నిత్యుడైన దేవుని యొక్క వాక్యమైయున్నది.

20

మరియు ఆ తల్లులు సహితము, బిడ్డ జన్మించినప్పుడు మరియు ఆమె (ఆ తల్లులు) వారి స్వరములను ఉచ్చరించిరి, వందల సంవత్సరముల తరువాత వారు వాగ్దాన దేశములో ఎక్కడ యుంటారో వారిని వారి స్థానములో యుంచేను. మరియు యెహోషువ దానిని ఎరుగకపోయినను, ఇంకనూ అదే ప్రేరేపణ ద్వారా వారు ఎక్కడ యుండవలసియున్నారో, అక్కడే వారిని ఖచ్చితముగా యుంచెను.

యెహోషువ, భూభాగమును విభజించుచున్నప్పుడు, యూదా యొక్క భాగమును విభజించెను. మీరు భౌగోళిక పటము మీద దానిని గ్రహించినట్లైతే, అది భౌగోళికముగా సాధారణ సముద్రమునకు పశ్చిమముగా, ముఖ్య-పట్టణమైన యెరుషలేముకు దక్షిణముగా కొన్ని మైళ్ళ దూరములో యున్నది. మరియు యూదా గోత్రము వారు, వారి యొక్క భాగమును పొందుచున్నప్పుడు, లేక అతని భాగము, ఆ దేశములో అతని యొక్క అధికారమునకు లోబడిన ప్రదేశము అని మనము దానిని పిలుద్దాము, అది వింతగాయున్నది, అయితే ఈ చిన్న పట్టణము కనీసము పేర్కొనబడలేదు: బెత్లెహేము. ఇంకను అది అక్కడ యుండియున్నది, కారణము ఆ అబ్రహాము... రిబ్కా ఆ స్థలములో పాతిపెట్టబడియున్నారని నేను నమ్ముచున్నాను. అయితే అది తప్పక ఒక విధమైన చిన్న గ్రామమైయుంటుంది, కారణము మీరు యెహోషువ 5వ అధ్యాయమును చదివినట్లైతే, అక్కడ యూదా అధికారము క్రింద ఏలుబడిలో, చిన్న గ్రామములు మరియు చిన్న పట్టణములుగా అక్కడ 115 పెద్ద పట్టణములు పేర్కొనబడినవి. మరియు బహుశా, అది విభాగించబడినప్పుడు, ఆ బెత్లెహేము ఎంతో చిన్నదైయున్నది, బహుశా ఒకటి లేక రెండు ఇళ్ళు ఉండవచ్చు, అది కనీసము స్వాస్థ్యములో పేర్కొనబడలేదు. మరియు అది ఎన్నడూ నిజముగా ఎరుగబడినదిగా బయటకు రాలేదని మనము కనుగొంటాము....

21

దానిని కనుగొన్న వ్యక్తి కాలేబు యొక్క కుమారుడు, అతని పేరు సల్మాను, అతడు దానిని కనుగొన్నాడు. అతడు దానికి తండ్రియై యున్నాడని బైబిల్ చెప్పియున్నది. దాని భావము, బెత్లెహేమును స్థాపించినవాడు ఆయనేయైయున్నాడు. మరొక మాటలో చెప్పాలంటే, అతడు ఆ స్థలమునకు కదలివచ్చి ఒక విధమైన వ్యాపారమును ప్రారంభించియున్నాడు, ఒక వ్యాపారసంబంధముగా, ఒక వ్యాపారమును చేసియున్నాడు, మరియు ఆ విధంగా అది పైకి ఎదిగియున్నది. తరువాత మనము కనుగొనునది ఏమనగా, దానికి నిజమైన కారణము, అక్కడ ఉన్న సమస్త దేశములన్నియు ఆ చిన్న భూభాగము పట్ల అసూయపడెను; అది దక్షిణముగా, తూర్పుగా కొంచెం మరియు కొంచెము ఏటవాలుగా మునుకోలవలె విస్తరించి ఉంటుంది. మరియు అది పాలస్తీనా భూభాగమంతటిలోనే అత్యంత సారవంతమైన స్థలమైయున్నది. అది మొక్కజొన్నకు మరియు గోధుమల పంటకు నడికట్టుగా ఉన్నది, మరియు అక్కడ గొప్ప ఒలీవ తోటలున్నవి, దాని మీద ఆ బెత్లెహేము భాగములో, లేక పాలస్తీనాలో ఆ యూదా సంస్థానము అంతములో అలాంటివన్నీ ఉన్నవి.

22

తరువాత మనము కనుగొనునది ఏమనగా, అది వేశ్యయైన రాహాబు యొక్క గృహముగా కూడా మారియున్నది. ఇశ్రాయేలు యోర్దాను నది యొక్క సరిహద్దు మీదగా పాలస్తీనాలోనికి దాటినప్పుడు, వేశ్యయైన రాహాబు యొక్క కథతో మనకు పరిచయమున్నది, ఈ ఉదయమున ఇప్పుడు కొన్ని నిమిషముల పాటు ఆమెను మనము చిత్రీకరిద్దాము. ఆమె ఒక యవ్వన స్త్రీగా, ఒక సౌందర్యమైన యవ్వన యువతిగా ఉన్నది, దురదృష్టవశాత్తు ఆమె యొక్క జీవితములో ఒక అన్యురాలిగా ఒత్తిడి చేయబడి, ఆమె జీవించుచున్న ఆ జీవితములోనికి ఆమె బలాత్కారముగా నెట్టబడియున్నది. మరియు అనేకసార్లు ప్రజలు వారు జీవించుచున్న ఆ జీవితములోనికి వత్తిడి చేయబడతారు.

23

మొన్నటి రాత్రి ఒక జైలు శిక్షను అనుభవించుచున్న ఒక మనిషిని చూచుటకు నేను జైలుయొద్ద యుండియున్నాను. మరియు నేను తన చేతికి నా చేతిలోనికి తీసి పట్టుకొని, అతనితో మాట్లాడియున్నాను. మరియు నేనన్నాను, “అలాటి కార్యమును నీవు ఎలా చేసియున్నావు?” అతడు నా చేతిని పట్టుకొనియుండగా, అతడు మాట్లాడుట ప్రారంభించాడు. మరియు అతడు ఏమి చేసియున్నాడో దానిని చేయుటకు అతడు వత్తిడి చేయబడ్డాడు. నేనన్నాను, “నీవు దానిని చేయుటకు వత్తిడి చేయబడిన కారణమును బట్టి నీవు దానిని అనుమతించావు. నీవు దానిని చేయవలసిన పనిలేదు. ఏ మనిషి త్రాగనవసరములేదు.” నేనన్నాను, “నాకై, నేను ఒక ఉద్రిక్తతలో ఉన్నాను, అయితే అలా ఉండవలసిన అవసరములేదు.”

24

మరియు ఈ యవ్వన స్త్రీ, ఆమె ఇశ్రాయేలును గూర్చి మొదటగా విన్న తరువాత, దేవుడు ప్రార్ధనకు జవాబిచ్చు దేవుడైయున్నాడని; ఆయనకు ప్రార్ధన చేయుటయే కాక, తిరిగి ఆ ప్రార్ధనకు జవాబిచ్చు దేవుడైయున్నాడు. అద్భుతములు చేయు ఒక దేవుడున్నాడనీ, ఆయన సూచక క్రియలు చేస్తాడని, ఆయన సముద్రములను ఎండిపోవునట్లు చేస్తాడనీ, మరియు ఆకాశము నుండి ఆహారమును వర్షింపచేసియున్నాడని, ఆమె వినియున్నప్పుడు - ఆమె హృదయము వణుకుట ప్రారంభమైనది. మరియు ఆమె యొద్దకు వెళ్ళిన ఆ ఇద్దరు బోధకుల ద్వారా ఆమె తన మొదటి వర్తమానమును విన్నప్పుడు, ఆమె తన హృదయమంతటితో ఆ వర్తమానమును అంగీకరించియున్నది. మరియు ఆమె వర్తమానమును అంగీకరించిన కారణమునుబట్టి, తనయొక్క ఇంటి భద్రత కొరకు ఒక ఎర్రని దారమును ఆమె యొక్క కిటీకీకి కట్టినది.

25

నేను తప్పక ఇక్కడ కొంత కలపాలి: మీకు తెలుసా, ఆమె అన్యసంఘమునకు మాదిరిగా ఉన్నది? ఆమె ఒక అన్యురాలైయున్నది, ఆమె ఒక అన్య సంఘమునకు మాదిరిగా ఉన్నది. వారు వర్తమానమును విన్నప్పుడు మనమందరము ఆత్మసంబంధమైన వ్యభిచారములో ఉండి, పరలోకపు దేవునికి వ్యతిరేఖముగా అన్నిరకములైన చెత్తతో, అన్నిరకములైన సంఘ శాఖలతో, మరియు సంఘములతో - ఆత్మసంబంధమైన జారత్వమును జరిగించుచుంటిమి. అయితే అక్కడ ఒక దేవుడు ఇంకనూ జీవించియున్నాడని మనము విన్నప్పుడు, ఆయన అద్భుతములు చేయగలవాడని మనము విన్నప్పుడు, వెంటనే మనము వర్తమానమును అంగీకరించియున్నాము.

ప్రభువైన యేసు రక్తము అక్కడ అన్వయించబడినది, అదే ఎర్రటి దారమును తయారు చేసినది. మరియు దానియొక్క వివరణలోనికి వెళ్ళకుండా ఉండుటకు, మీకు తెలుసా ఎలా బహిరంగముగా ఆమె ఆ దారమును కిటికీకి కట్టియున్నదో; రక్తము బహిరంగముగా బయట ప్రదర్శించబడినది. ఆ విధానములోనే బహిరంగముగా రక్తము తప్పక అన్వయించబడవలసియున్నది, బయట గోడకు రక్తము వ్రేలాడుట చూపునదేమనగా, లోపల ఏదో కార్యము జరిగియున్నదని దాని భావము. ఆ విధానములోనే ఈ ఉదయమున, క్రీస్తులో ఒక నిజమైన విశ్వాసియూ ఉన్నాడు; బయట ప్రభువైన యేసు రక్తము ప్రదర్శించబడియున్నది, అది చూపునదేమనగా - లోపల ఏదో సంభవించియున్నది.

26

మరియు దేవుడు దానిగుండా క్రిందికి చూచునప్పుడు, దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడి, బూరలు ఊదుట ప్రారంభమైనప్పుడు, ఒక జ్ఞాపక చిహ్నముగా అక్కడ ఒక ఎర్రని దారము వ్రేలాడియుండుటను దేవుడు చూచెను. రక్తము మీదుగా దాటిపోవుటను అది ఎల్లప్పుడు ఆయనను సంతోషపరచినది. “నేను ఆ రక్తమును చూచినప్పుడు, నేను మిమ్మును దాటిపోయెదను.” ఆయన దానిని చూచియున్నాడు. ఆ స్థలము కుదిపివేయుట ప్రారంభమైనప్పుడు మరియు పరిశుద్దాత్ముడు భూమిని ఉరుములతో వణికించి, గోడలను క్రిందికి పడవేసినప్పుడు, అది 20 అడుగుల మందముగల గోడలు, కాని ఆ ఎర్రనితాడు ఎక్కడ వ్రేలాడుచున్నదో, ఒక్క రాయి కూడా దానిమీద పడలేదు. అది ఒక నిజవిశ్వాసికి చూపునదేమనగా - అది ఒక నిజదేవుని యొక్క కాపుదలయైయున్నది. నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ అది లెక్క కాదు, ఆయన నిన్ను కనుగొనినప్పుడు - నీవు ఎర్రని దారమును కేవలము అంగీకరించినప్పుడు, అది బైబిల్ గుండా అల్లిక వేయబడుతుంది.

27

తరువాత ఆమె ఇశ్రాయేలీయులలో ఒకతిగా లోనికి తేబడినప్పుడు, ఆమె ఒక మనిషితో ప్రేమలో పడినది, ఆయనే యూదాని ఏలు ఒక రాజకుమారుడైన సైన్యాధిపతి. ఆయన ఇశ్రాయేలు సేనల యొక్క సైన్యాధిపతియైయున్నాడు. ఆయన పేరు సల్మాను. సరిగ్గా రాజైన సొలొమోను వలె. అతడు సైన్యాధిపతియైయుండెను, ఆమె ప్రేమకలాపములో పడినది, అతడు యూదాను ఏలు ఒక యువ రాజైయున్నాడు. మరియు చివరిగా ఆమె అతనిని వివాహమాడినది. మరియు ఇశ్రాయేలీయులలో ఆమెకు ఆస్తి నియమించబడినప్పుడు, ఆమె మరియు ఆమె ప్రియమైన భర్త, బెత్లెహేములో నివసించిరి.

28

ఇప్పుడు అది తెరువబడుటను మీరు చూస్తారు, మీరు చూచుట లేదా? చూడండి, ఒక యూదునికి ఆమె ఒక అన్యవధువైయుండి, ఆమె బెత్లెహేములో జీవించుట మనము చూడగా, అది తెరువబడుతూ ఆరంభమగును. ఎందుచేత? కారణము అద్భుతములు చేయు దేవునియందు ఆమె విశ్వాసముంచినది. మరియు ఆమె ఎక్కడ నుండి వచ్చియున్నదో మనము చూడగా, ఆమె చెడ్డ పేరుగల గృహమునుండి, వేశ్యాత్వపు గృహమునుండి ఆమె బయటకు తేబడియున్నది. ఆమె మార్పుచెందుట ద్వారా, మరియు దేవునియందలి ఆమె యొక్క తప్పిపోని విశ్వాసమును బట్టి, ఒక వేశ్యాగృహము నుండి అందమైన బెత్లెహేము గృహమునకు ఆమె తేబడినది. ఎలాటి బేధము!

మనమందరికి అది ఆ మార్గములోనే చేసినది. ఒక అవిశ్వాసపు గృహము నుండి, నిరుత్సాహముల నుండి మరియు అనైతికకార్యముల నుండి, మరిము సమస్తము నుండి; క్రీస్తులో ఒక స్థానమునకు మనలను తెచ్చియున్నది, అది ఎంతో రమ్యముగా ఉన్నది. హేళనపూర్వకమైన దానినుండి, గంభీరమైన స్థానమునకు వచ్చినది, మన యొక్క మార్పు ద్వారా బేధము తెచ్చునది అదియే. మరియు మీరు చూడగలరా, ఆమె యూదా ఇంటిలోని ఒక సైన్యాధిపతియైన రాజకుమారుని వివాహము చేసికొనినది? ఆ సైన్యాధిపతి క్రీస్తునకు ప్రాతినిధ్యము వహించియున్నాడు, ఆయన తన కొరకు ఒక అన్యవధువును తీసుకొనియున్నాడు. ఒక హీనమైన అత్యంత హీనమైన స్థలము నుండి ఆ దేశములోని ముఖ్యమైన అతి శ్రేష్టమైన స్థలమునకు పైకి తేబడినది, మన వర్తమానములో ముందుకు వెళ్ళుచుండగా - దానిని మనము చూస్తాము. అది తప్ప మరి ఏదియు ఆలాగు ఉండదని అది రుజువుచేస్తుంది. వారు ఒక అన్యవధువుకు మాదిరిగా ఉన్నారు.

29

మరియు మనము కనుగొనునదేమనగా, సల్మాను దానిని నిర్మించియునట్లుగా వారు బెత్లెహేములో ఒక ప్రియమైన గృహమును కలిగి యుండిరి, మరియు అది ఒక గొప్ప స్థలముగా సారవంతమైన భూభాగముగా మారియున్నది. అక్కడ ఉన్న ఆ గొప్ప గోధుమై ఉన్న దేశమును గూర్చి తలంచుట ఎంత రమ్యముగా ఉన్నది, అది ప్రపంచమునకు రొట్టెల గృహముగా ఉన్నది. మరియు అది సత్యముయైయున్నది! ఆశ్చర్యము కాదు, యేసు అక్కడ జన్మించవలసియుండెను, కారణము ఆయన జీవాహారమై యుండెను! అన్ని దేశములు, దేశములన్నియు వారియొక్క మొక్కజొన్న కొరకు మరియు వారియొక్క గోధుముల కొరకు సారవంతమైన ఆ భూములను కలిగియున్న బెత్లెహేమునకు వారు రావలసియుండిరి. మరియు మీరు చూడండి, ఆ చిన్న కార్యము, ఇలా చెప్పుచున్నది, “ఓ, అది గోధుమ యొక్క దేశమైయున్నది,” ఇంకను దాని భావము వేరుగా ఉన్నది. మీరు చూడండి, ఆ అన్యుడైన రాజకుమారుడు, లేక యూదుడైన ఆ రాజకుమారుడు ఆయన స్థిరపడు స్థలము కొరకు ఆయన జీవించుట కొరకు ఆయన యొక్క అన్యవధువును తిరిగి బెత్లెహేము తీసుకొని వెళ్ళుచున్నాడు, అక్కడ సమృద్ధిగా ఆహారమున్నది.

ఈ గొప్ప ప్రేమ కార్యము ద్వారా మరియు విశ్వాసమునకు గొప్ప విధేయత ద్వారా మనము కనుగొనునదేమనగా, వేశ్యయైన రాహబు ద్వారా, ఆమె సల్మానుకు ఒక కుమారుని కన్నది, మరియు ఆ కుమారుని పేరు బోయజు. మరియు ఇప్పుడు ఇక్కడ ఈ గొప్ప అనుసంధానములో మరొక గొప్ప కథలోనికి ముడివేయుటను గూర్చి మనము పరిచయమును కలిగియున్నాము, మరియు సల్మాను మరియు వేశ్యయైన రాహబు నుండి బోయజు బెత్లెహేములో పుట్టియున్నాడు.

30

మరియు మనము కనుగొనునదేమనగా, అనేక సంవత్సరముల తరువాత నయోమి ఆ దేశమును విడిచిపెట్టి మొయబీయులతో కాపురముండుటకు వెళ్ళినది, మరియు వారక్కడ ఉన్నప్పుడు చెడుగు వారిని బాధించి యున్నది. ఆమె మిగిలిన తన విశ్వాసులందరితో ఉన్న సహవాసము నుండి బయటకు వెళ్ళిపోయి, మరొక దేశములో, మరొక ప్రజమధ్య ఒక వెనుకజారిన స్థితిలో ఆమె తనకుతానుగా సహవాసము చేసినది. మరొకమాటలో, ఆమె నిజమైన విశ్వాసుల సంఘమును విడచిపెట్టి కొద్దికాలము లోకములో ఉండుటకు ఒక సామాజిక సంఘములో చేరుటకు వెళ్ళినది, వారు ఏది చేసినా ఫర్వాలేదని చెప్పువాటియందు విశ్వాసము కలిగియున్నారు. అక్కడ ఆమె తన భర్తను పోగొట్టుకున్నది.

అది ప్రతిసారీ ఒక భౌతికమైన మరణముగా ఉండవలసిన పనిలేదు, నీవు ఆయనను ఒక ఆత్మసంబంధమైన మరణము ద్వారా నీవు ఆయనను పోగొట్టుకొంటావు, లేక నీ భార్యను పోగొట్టుకుంటావు. మంచి మూలాధారములపై నిలిచియుండుట మంచిది. మిగిలినవారందరు ఎలా కనబడినప్పటికి లెక్క కాదు, వారు ఎంత పెద్దవారైనప్పటికి లెక్క కాదు, వారి సంఘములపై వారు ఎంత చక్కని శిఖరములను కలిగియున్నప్పటికీ లెక్క కాదు, లేక వారు ఎంత పెద్ద గంటలను కలిగి యున్నప్పటికినీ లెక్క కాదు. నీవు ఎక్కడ రక్తము క్రింద కప్పబడియున్నావని ఎరిగియుంటావో, అక్కడే నీవు నిలిచియుండుట మంచిది. ప్రజల పాపములను ఎక్కడ రక్తము కప్పియున్నదో, అక్కడ నీవు నిలిచియుండుట మంచిది. మీరు ఒకరినొకరు కోల్పోవచ్చు మరియు వాటన్నిటికంటే ఎక్కువగా ప్రభువైన యేసునే మీరు కోల్పోతారు, మరియు దండముతో బయటకు వెళ్ళిపోతారు.

తరువాత మనము కనుగొనునదేమనగా, ఆమె పిల్లలు చనిపోయారు, (ఆమె ఇద్దరు కమారులను పోగొట్టుకున్నది), మరియు ఆమె తిరిగి ఇంటికి ప్రయాణమైనది, కారణము ఆ పట్టణములో ఆ సమయములో అక్కడ ఉజ్జీవపు ఆత్మలేదు.

31

ఓ, కొన్ని నిమిషములపాటు నేనిక్కడ ఆగినట్లైతే బాగుంటుందని భావిస్తాను! ఎలా నేను దానిని పైకి ఏరి తిన్నగా దానిని మీకు చూపించగలనో! గతించిన ఎన్ని సంఘములు రక్తము క్రింద ఉన్నప్పటికీ లెక్క కాదు; నీవు నిలిచియుండవలసిన స్థలము అదియే. లోపల లేక బయట పైన కానీ లేక క్రింద కానీ, మందముగా ఉన్న లేక పలుచగా ఉన్న, అది ఎక్కడ ఉన్నప్పటికీ - రక్తము క్రింద నిలిచియుండుము. అయితే నయోమి ఆపైకి వెళ్ళి మరొక గుంపుతో చేరుట మంచిదని ఆమె తలంచినది, కారణము వారు ఇబ్బందులను కలిగి ఉండిరి. ఆత్మసంబంధమైన ఆహారము అక్కడ లేకుండెను. అయితే దేవుడు దానిని పునరుద్ధరిస్తాడు, “నేను దానిని పునరుద్దరిస్తాను అని ప్రభువు చెప్పియున్నాడు.” అది ఎక్కడ నుండి వచ్చియున్నదో, ఆ పొలములోనే నిలిచియుండుము.

32

కాబట్టి ఆమె తిరిగి ఇంటికి వెళ్ళుటకు ఆశపడుట ప్రారంభమైనదని మనము కనుగొంటాము, కారణము అక్కడ ఒక గొప్ప ఉజ్జీవము బ్రద్దలైయున్నదని వారు వినియుండిరి. మరియు మీరు గమనించినట్లైతే, “యవల కాలములో” నయోమి తిరిగి వచ్చినది అని బైబిల్ చెప్పియున్నది, సరిగ్గా పంట కాలములో ఆమె వచ్చియున్నది. మరొక మాటలో, గొప్ప ఉజ్జీవము జరుగుచున్నప్పుడు, ఆత్మసంబంధముగా దానిని అన్వయించినట్లైతే - ఆ ఋతువులో ఆమె సరిగ్గా తిరిగి వచ్చియున్నది. ఏమి మిగిలి యుండలేదు; ఆమెకు ఏమియులేదు.

మరియు ఓర్పా ఆమె కుమారుల భార్యలలో ఒకతి, ఆమె దేనిని త్యాగము చేయవలసియున్నదో చూచినది, ఒక అధునాతన సంఘమునకు మాదిరిగా ఉన్నది, “నేను అక్కడకు వెళ్ళినట్లైతే, నేను నా డాన్సులకు దూరమై పోతాను, నేను గొప్ప సమయమును, నా సాంఘిక సమాజములను పోగొట్టుకుంటాను.” అప్పుడు ఆమె ఏడ్చి తన అత్తను ముద్దుపెట్టుకొని వెనుకకు తిరిగి వెళ్ళిపోయెను.

33

అయితే ఇక్కడ ఒక చక్కని చిత్రము ఉన్నది: అక్కడ రూతు అను పేరుగల ఒకతి ఆమెతో ఉన్నది, ఆమె మరొక కోడలు, మరలా అన్యవధువుకు అది ఒక మాదిరిగా ఉన్నది; ఆమె కూడా అత్తగారిని ముద్దుపెట్టుకొని ఇలా అన్నది, “నేను అన్నిటిని విడిచిపెడతాను. నేను నీతో వస్తాను. నీ ప్రజలే - నా ప్రజలు, నీ దేవుడే - నా దేవుడుగా ఉండును గాక. నీవు ఎక్కడ చనిపోతే - నేను అక్కడనే చనిపోవుదును, నీవెక్కడ సమాధి చేయబడితే - నేను అక్కడే సమాధి చేయబడతాను.” అది అంతే, దేవుడు కోరునది అదియే, ఆ సరిహద్దు కాదు, సగము మార్గము కాదు; కానీ ఒక పరిపూర్ణమైన దేవుని యొక్క రాజ్యమునకు ఒక సంపూర్ణమైన సమర్పణయైయున్నది. ఆమె ఆమెను ముద్దు పెట్టుకొని యున్నది.

కాబట్టి ఆమెను నిరుత్సాహపరచుటకు నయోమి ఇలా అన్నది, “నీవు నీ ప్రజల యొద్దకు తిరిగి వెళ్ళుట మంచిది, నేను వృద్దురాలను, మరియు నాలో ఇంకా ఎంతమాత్రము పిల్లలులేరు. మరియు ధర్మశాస్త్రము ఏమైయున్నదనగా ఆమె ఒక కుమారుని కొరకు కనిపెట్టవలసియుండెను. మరియు ఆమె అన్నది, ”అలాగైతే నాకు ఏ మాత్రము పిల్లలు లేరు. మరియు నేను ఒక భర్తను కలిగి ఒక కుమారుని కలిగియున్నట్లైతే, నీవు అతనిని వివాహము చేసుకొనడానికి నీవు చాలా పెద్దదానివైపోతావు, కాబట్టి నీవు నీ ప్రజల యొద్దకు తిరిగి వెళ్ళుము.“

కాని రూతు అన్నది, “నేను వెనుకకు వెళ్ళను!” విశ్వాసము — వేరు పారినది, నాటబడినది! పరిపూర్ణమైన విశ్వాసము — రూతు హృదయములోనికి వచ్చియున్నది. ఆమె అన్నది, “నేను తిన్నగా నీతోనే వస్తున్నాను.” మరియు రూతు ఆమెను హత్తుకొనినది, ఆమెతోనే నిలిచియున్నది. “నీవు ఎక్కడ యుండబోవుచున్నావో - నేనును అక్కడనే యుండబోవుచున్నాను.” దానిని నేను ఇష్టపడుచున్నాను.

34

అది ముందుకు వెళుతూయుండగా, మనమందరము ఆ కధతో పరిచయమును కలిగియున్నాము, ఈ గొప్ప బోయజు, కోత యజమానియై యున్నాడు, మరియు అతడు నయోమికి రక్తసంబంధియైయున్నాడు. మరియు అతడు రూతును ఆ చిన్న పనిలో కనుగొన్నాడు. ఆమె ఏరగలిగే ప్రతి చిన్న పరకను ఏరుచూ, గోధుమలు కలిగిన వాటినుండి పరిగెను ఏరు కొనుచున్నది, ఆమె వాటిని పట్టుకొనియున్నది, కారణము అవి ఆమెకు జీవమైయున్నాయి. బోయజు కోత యజమానుడైయున్నందున, అతడు కోయువారితో, అప్పుడప్పుడు కొన్ని పిడికెళ్ళు ఆమె కొరకు విడిచిపెట్టమని చెప్పెను. మరియు సంతోషముతో ఆమె వాటిని పరిగే ఏరుకొనుచుండెను. మరియు ఆమె ఆ దినమున గొప్పగా వాటిని తన కొంగునిండుగా వాటిని కాడల నుండి ఏరుకొన్నది. కోత యజమానియైన బోయజు, బయటకు వచ్చి, రూతు వైపు చూసినప్పుడు, ఆమె యొక్క నమ్మకత్వమును చూసినప్పుడు, అతడు ఆమెతో ప్రేమలోపడెను.

గమనించండి, బోయజు క్రీస్తుకు మాదిరిగాయున్నాడు. అతడు ఎక్కడ యుండియున్నాడు? బెత్లెహేము. రూతు ఎక్కడకు వచ్చియున్నది? బెత్లెహేము. ఆమె ఎక్కడ పరిగె ఏరుకొనుచున్నది? బెత్లెహేము. ఇక్కడ దీనికి యున్న ఆత్మసంబంధమైన ఆ ప్రాముఖ్యతలన్నిటిని చూడండి, మరియు సంభవించబోవుచున్న ఈ గొప్ప దృశ్యము యొక్క మునుపటి వృత్తాంతమును చూడండి? దేవుడు, ఆదినుండియే దానిని ఎరిగియున్నాడు!

35

ఆమె తప్పక ఏమి చేయవలసియున్నదో, ఆమె తన అత్తగారిని ప్రశ్నించుట ప్రారంభించెను. మరియు, చివరిగా, రూతు బోయజును వివాహము చేసికొన్నది. ఒక అన్యురాలు తిరిగి ఒక రాజకుమారుని యూదాలో వివాహము చేసికొన్నది, మరియు ఆమె బెత్లెహేములో స్థిరపడినది. “ఓ, నీవు, అల్పమైన బెత్లెహేమువు, పాలస్తీనాలోని ముఖ్యమైన పట్టణములన్నిటిలో నీవు అల్పమైనదానవు కావు? అయితే ఆయన కుమారుడు అక్కడ జన్మించుటకు, పురుతాన కాలము మొదలుకొని శాశ్వతకాలము, అది దేవునిని సంతోషపరచినది.”

ఆయన అన్ని సంగతులను ఎరిగియున్నాడు, మరియు ఆయన దానిని తిన్నగా సరిగ్గా పనిచేయునట్లు చేయును. మరియు అక్కడ రూతు బోయజును వివాహము చేసికొన్నది. రూతు మరియు బోయజు వివాహము చేసికొన్నప్పుడు; ఆ గొప్ప కధలోనికి వెళ్ళుటకు మనకు సమయమున్నట్లైతే బాగుంటుంది, రూతు మరియు బోయజు వివాహము చేసికొన్నప్పుడు, అది అన్ని యుగములలోకంటే అతి గొప్ప ప్రేమ దృశ్యమైయున్నది. మీకు గుర్తున్నదా...

ఇక్కడ ఒక్క నిమిషము మనకు ఆగుదాము. సరిగ్గా దానిగుండా దాటిపోవుట ఎంతోమంచిది!

36

రూతు ఒక అన్యురాలు. అన్యులకు ఏ విధమైన స్వాస్థ్యము లేనట్లుగా, ఆమెకు కూడా యూదునితో ఏ స్వాస్థ్యమును లేదు. కాబట్టి, నయోమి నిజానికి దానిని స్వతంత్రించుకోవాలి. కాబట్టి, ఆమె తన యొక్క మొదటి ఆస్తినంతయూ పోగొట్టుకొనినది. ఆమె వస్తువులన్నియూ బహిరంగ వేలములో వేలము వేయబడినవి. అందుచేత, ఆమె బహిష్కరించబడినదై, దూరముగా వెళ్ళిపోయినది.

ఇప్పుడు ఆమె తిరిగివచ్చినప్పుడు, అక్కడ ఎన్నడైనా ఆమె పోగొట్టుకొనిన స్వాస్థమును విడిపించు ఒకే ఒక వ్యక్తి అక్కడ యున్నాడు; అక్కడే తిన్నగా ఆమె యొక్క రక్తసంబంధి. మరియు బోయజు దానిని ఎరిగి యుండెను, కాబట్టి అతడు ఒక మార్గముగుండా పనిచేసి, ఈ అన్యబాలికను తన భార్యగా పొందవలసియుండెను. అతడు ఏమి చేయవలసియుండెను? నయోమి యొక్క స్థిరాస్తినంతయూ అతడు కొనవలసియుండెను, ఈ స్థిరాస్థిలోనికి వెళ్ళుటకుగాను, అది నయోమి స్థిరాస్థిలో రూతు ఒక భాగమైయుండెను. మరియు దానిని కొనగలిగే ఒకే ఒక వ్యక్తి ఎవరనగా, అతడు ఒక సమీపబంధువైయుండాలి, దగ్గర రక్తసంబంధి. అది విమోచనా నియమమైయుండెను.

37

మరియు క్రీస్తు ఎన్నడైనా వెనుకకు జారిన ఇశ్రాయేలు యొక్క స్థిరాస్థిని కొను ఒకే మార్గమేమనగా, అతనికి ఒక రక్తసంబంధీగా మారుటయే. దేవుడు మానవాళిని రక్షించగలిగే ఒకే ఒక మార్గమేమనగా, దేవుడే స్వయంగా శరీరధారియై యుండవలసియుండెను. మరియు యేసు మానవాళికి రక్తసంబంధిగా (సమీపబంధువు) మారిన దేవుడైయున్నాడు. ఆయన ఇమ్మానుయేలైయుండెను. ఆయన మనకు రక్తసంబంధీగా మారెను. ఆయన దేవదూతల యొక్క పోలికను ధరించలేదు, కానీ ఒక దాసుని స్వరూపమును ధరించి, పాదములు కడిగి, జీవిం... నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, అయితే ఆయన తలవాల్చుకొనుటకు సహితము ఒక స్థలము లేకుండా ఉండెను. ఆయన భుజించాడు, ఆయన నీరు త్రాగాడు, ఆయన ఏడ్చియున్నాడు, మిగిలిన మనుష్యులవలె - ఆయన నవ్వి యున్నాడు. మరియు ఆయన దేవుడైయున్నాడు, ఒక ప్రవక్త కాదు. ఆయన దేవుడై యుండెను, కారణము నశించిన మానవాళిని రక్షించుటకుగాను ఆయన మన రక్తసంబంధీగా మారవలసియుండెను. కాబట్టి, బోయాజు, ఈ గొప్ప మాదిరిలో బెత్లెహేమునొద్ద; మానవాళికి రక్తసంబంధీగా ఉండవలసి - ఎక్కడ జన్మించియుండెనో చూడండి.

38

మరియు తరువాత ఈ గొప్ప బోయజు విమోచన చేసినప్పుడు, ఆమె పోగొట్టుకున్న స్థిరాస్థినంతయు విమోచించియున్నానని చూపుటకు ఆయన ఒక బహిరంగ సాక్ష్యమును ఇవ్వవలసియుండెను. కాబట్టి అతడు బెత్లెహేము యొక్క గవినియొద్దకు వెళ్ళి, మరలా అదే ఆ చిన్న పట్టణము, మరియు అతడు ఆ పట్టణములోని పెద్దలను పిలిచి ఆ దినమున వారందరికి తెలియబడునట్లుగా నయోమి పోగొట్టుకున్నదంతయూ అతడు తిరిగి వెనుకకు తెచ్చెను. అతడు సమస్తమును తిరిగి కొనెను మరియు అతడు తన చెప్పు తీసి, ప్రజలముందు దానిని పైకి విసిరి ఒక గురుతుగా దానిని చూపెను. “ఎవరైనను ఏదైనను ఒక కారణమును చెప్పవలసియున్నట్లైతే - ఇప్పుడే చెప్పండి, కారణము ఆమె పోగొట్టుకొన్న సమస్తమును నేను తిరిగి విమోచించియున్నానని చెప్పుటకు ఇది ఒక జ్ఞాపకపు చిహ్నమైయున్నది.”

39

ఓ, ప్రభువు నామము స్తుతించబడును గాక! మరియు మన రక్తసంబంధియైన నజరేతువాడగు యేసు వచ్చినప్పుడు, ఆయన బెత్లెహేములో పుట్టెను. ఆయన గొల్గొతా శిఖరముపై నిలబడి ఆకాశమునకు భూమికి మధ్య పైకి లేపబడినవాడై, మానవాళి పతనములో పోగొట్టుకున్న సమస్తమును తిరిగి విమోచించినట్లు ఒక జ్ఞాపక-సూచనను ఆయన చూపెను. ఎన్నడైనా మనుష్యులు ఎలా దైవిక స్వస్థతను, ఆయన శక్తులను, ప్రభువైన యేసు యొక్క పునరుత్థానమును, ఆయన బహిరంగ సూచనగా కల్వరి నొద్ద దానిని చూపినప్పుడు - ఎలా వారు కాదనగలరు, అదేమనగా, “నేను సమస్త మానవాళిని వారు ఎన్నడైనా పోగొట్టుకున్న సమస్తమును నేను విమోచించియున్నాను,” పతనములో మనము పోగొట్టుకున్న సమస్తమును, మన ఆత్మను ఆయన విమోచించెను, మన శరీరమును ఆయన విమోచించెను. మన రక్తసంబంధియైన విమోచకుడు ముందుకు వచ్చి, మరియు శరీరధారియై మన మధ్య నివసించాడు, మరియు గురుతును ప్రతిపాదిస్తూ ఇలా అన్నాడు, “అది సమాప్తమైయున్నది.” ఏది సమాప్తమైయున్నది? సమస్తము సమాప్తమై యున్నది. మనము తిన్నగా మన స్వాస్థ్యములోనికి నడిచి వెళ్ళుచున్నాము. దినములు ముందుకు వెళ్ళుచుండగా, మనము దగ్గరగా మరియు ఇంకా దగ్గరగా మనము నడుచుచున్నాము.

40

బోయజు మరియు నయోమి... వారికి వివాహమైన తరువాత కొంతకాలానికి వారు ఒక కుమారుని కన్నారు, అతడు వంశావళికి ఎక్కువగా జతచేయబడ్డాడు, మరియు అతడు ఓబేదుయై యున్నాడు మరియు అతడు ఒక కుమారుని కనెను, అతడే యెషయి, మరియు యెషయి ఎనిమిదిమంది కుమారులను కలిగియుండెను.

గొప్ప ప్రవక్తయైన సమూయేలు సీసాలో నూనె తీసుకొని, ఆ గొప్ప ప్రవక్త - యెషయి ఇంటికి వెళ్ళి, ఇలా అన్నాడు, “నా ప్రజలను ఏలుటకు మరియు వారికి సేవ చేయుటకు దేవుడు నీ కుమారులలో ఒకనిని ఎన్నుకొని యున్నాడు.” ఆ బయట వెనుక పొలములో ఒక చిన్న గొర్రెల దొడ్డిలో ఒక చిన్న ఎర్రనివాడైన, గజిబిజిగా కనబడుచున్న ఒక బాలుడు బయటకు తేబడియున్నాడు, అతడే దావీదు. పెద్దవానినుండి అతడు కడసారివాడై యున్నాడు. మరియు సమూయేలు అక్కడ నిలబడియున్న తన సహోదరులందరి సముఖములో అభిషేకపు తైలమును అతనిపై కుమ్మరించెను, మరియు దేవుడతనిని రాజుగా అభిషేకించియున్నాడని రుజువు చేసెను. అది ఎక్కడ జరిగియుండెను? బెత్లెహేములో. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ! ఆశ్చర్యం లేదు, బెత్లెహేములో అతడు రాజుగా అభిషేకించబడెను.

41

మరియు దావీదు జన్మించిన స్థలము కూడా బెత్లెహేముయై యుండెను. అందుచేత ఆయన యొక్క అతి గొప్ప కుమారుడైన యేసు కూడా బెత్లెహేములోనే జన్మించవలసియుండెను, కారణము అవి ఎంతో దగ్గరగా ఉన్న ఒక అల్లికయైయున్నది, ఇద్దరి మధ్య, ఆయన తండ్రి మరియు కుమారుని మధ్య, ఆయన ఈ గొప్ప కుమారుడైన వ్యక్తి. కేవలము కుమారుడు మాత్రమే కాక, ఆయన దావీదుకు వేరు మరియు చిగురైయుండెను. ఆయన దావీదుకు ముందే ఉండియున్నవాడు, ఆయన దావీదు తరువాత కూడా ఉన్నాడు, ఆయన శాశ్వత కాలము నుండి శాశ్వతకాలము వరకు ఉన్నవాడు. కాని శరీరానుసారముగా, ఈ కార్యములన్నియూ నెరవేరవలసియున్నది, ఆయన దావీదు యొక్క కుమారుడైయుండెను. అనేక సంవత్సరముల తరువాత ఇదే బెత్లెహేములో ఈ చిన్న విసర్జించబడిన పట్టణములో ఆయన జన్మించవలసియున్నది.

42

అయితే సమయమంతటిగుండా మీరు దానిని గమనించారా? ఎవరు అర్ధము చేసుకోనట్లుగా ఉన్నా ఒక బలమైన మర్మముగా ఒక గొప్ప మర్మముగా అది అక్కడ పనిచేయుచుండెను. మరియు ఈ దినమును కూడా దేవుని యొద్ద బెత్లెహేములో అది కూడా ఆలాగుననే ఉన్నది. ఎవరు గ్రహించనట్లుగా కనబడుచున్న అది, అక్కడ మర్మమైన గురుతుగా పనిచేయుచున్నది. అది ప్రజలయొక్క తలల మీదుగా వెళ్ళు ఒక కార్యమైయున్నది. ఏమి జరిగినా, ఏమి చెప్పబడినా, వారు దానిని గ్రహించలేనట్లుగా కనబడుచున్నది. మరియు మర్మయుక్తముగా జరిగిన కార్యములలోని ఆ భాగమును ప్రజలు చూచి ఇలా అంటారు. ఓ, “మంచిది అది బాగానే ఉన్నదని నేను ఊహిస్తాను,” అని వారు ముందుకు వెళ్ళిపోతారు, అయితే వారు దానిని గ్రహించలేదు. వారు దానిని పట్టుకొనలేరు. వారు దానిని అర్ధము చేసుకొనలేరు. యూదాలోని బెత్లెహేములో దేవుడు దానినే చేయుచుండెను. ఈ చిన్న చిన్న కార్యముల ద్వారా ఆయన పనిచేస్తూ, చివరకు అది ఒక పెద్ద తలగా వచ్చుటకు ఆయన పనిచేసియున్నాడు.

43

దావీదు, ఓ, చిన్న బాలుడుగా ఉండి అతడు అభిషేకించబడినప్పుడు, అతడు చూచుటకు ఒక ఎర్రనివాడుగా ఉండెను, అయితే అతనిలో ఏదో నిజమైనది దేవుని కొరకు అతడు తప్పక కలిగియుండెను. అక్కడ అతడు ఒక చిన్న కుర్రవాడు, కుటుంబములోనే అతి చిన్నవాడు, మిగిలిన కుర్రవాళ్ళందరు గొప్ప పెద్ద చక్కని మనుష్యులుగా మంచి బట్టలు ధరించి వారి తలల మీద కిరీటములు పెట్టుకొని చక్కగా కనబడుచున్నారు. అయితే దేవుడు ఏమి చూస్తాడో ఆయన అక్కడ చూపియున్నాడు: ఆయన బయట వేషమును చూడడు, కాని మనిషి యొక్క అంతరంగమును చూస్తాడు. ఆయన అతని హృదయమువైపు చూచియున్నాడు. దావీదు హృదయములో ఏమి యున్నదో ఆయన ఎరిగియుండెను. ఒక కిరీటము అతనిపై ఎలా కనపడునో అది లెక్క కాదు. ఆయన ఒక మనిషిని కనుగొనుచున్నాడు, తన చిత్తానుసారమైన మనిషిని ఆయన ఎరిగియుండెను, అనగా ఆయన హృదయానుసారుడైన వ్యక్తిగా దావీదు ఉండగోరుచున్నాడు. ఆ కారణమును బట్టియే అభిషేకపు తైలమును ఆయన దావీదుపై పోయుచుండెను. దావీదు అనగా భావము “ప్రియమైనవాడు.”

44

మరియు అనేక సంవత్సరముల తరువాత మన ప్రియుడైన యేసులో అది ఎంతో చక్కగా ప్రాతినిధ్యం వహించియున్నది; ఆయన దావీదు కుమారుడు, వాగ్దానము చేయబడిన కార్యములన్నిటిని ఆయన వచ్చి నెరవేర్చ వలసియుండెను. ఇదంతయు ఈ చిన్న పట్టణమైన బెత్లెహేములో సంభవించి యున్నది. మరియు అదే చిన్న యూదయకొండ మీద దావీదు తన గొర్రెల మందను కాచియుండెను, మరియు అనేక సంవత్సరముల తరువాత ఆ యూదయ కొండల మీద కనబడుచున్న బెత్లెహేము మీదే దేవుని దూతలు వారియొక్క మొదటి క్రిస్మస్ గీతమును ఆయనకు పాడిరి. మొదట క్రిస్మస్ గీతము, “దావీదు పట్టణములో నేడు రక్షకుడైన క్రీస్తు మీ కొరకు పుట్టియున్నాడు. యెరుషలేము అయిన ఆ పెద్ద సంఘములో ఆ పాట పాడలేదు; లేక అది గిల్గాలులో కాదు; లేక అది షిలోహులో కాదు, అక్కడ వారు ఎల్లప్పుడు శాఖసంబంధమైన మతసంబంధమైన ఆరాధనలు కలిగియుండిరి. కాని వారాపాటను బెత్లెహేములోనే పాడిరి, అక్కడే దేవుని యొక్క ఆత్మ మర్మమైన రీతిలో కదులుచూ ఒక దానిని ముందుకు తెచ్చుచుండెను. అది అక్కడేయై ఉండెను.

45

అది అక్కడకే క్రీస్తు రావలసియుండెను. అది అక్కడే యుండెను. తిన్నగా అక్కడే ఆ చిన్న పట్టణములోనే ఒక రాజు పుట్టిన, ఆ కన్యకయైన తల్లి - తల తొలిచూలు కుమారునికి జన్మనిచ్చియున్నది. అది ఆయన తలదాచిన స్థలమైయున్నది, ఆ చిన్న కోటలో రాజులకు-రాజు మరియు ప్రభువులకు-ప్రభువు తలదాల్చెను. అక్కడకు సమూయేలు అభిషేకపు తైలమును కుమ్మరించుటకు వచ్చుటయే గాక, దేవుడు ఆయన మీద, దేవుడు లోకము మీద ప్రభువైన క్రీస్తును కుమ్మరించెను. దేవుని దూతలు ఆయన రాకడను రాజదూతలుగా ప్రకటించినవి, రాజైన దావీదుకు ఎన్నో సంవత్సరముల తరువాత వచ్చిన ఆయనకు ఆ కొండ ప్రక్కన గొర్రెల కాపరులకు పాటలు పాడినవి. దేవుని యొక్క మర్మమును చూడండి, అది ఎంత గొప్పదైయున్నదో?

ఆ గొప్ప గోధుమలు పండు కేంద్రములో ఆయన జన్మించెను, అవి గోధుమలు ముందుకు వచ్చునప్పుడు, అవి జీవమునకు ముఖ్యమైన ఆధారములైయున్నవి. మరియు ఆయన జీవాహారమైయుండెను. “జీవాహారమును నేనే. నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడు నిత్యజీవముగలవాడు, అతడు తీర్పులోనికి రాక - మరణము నుండి జీవములోనికి దాటియున్నాడు, అతడు ఎన్నడూ చనిపోడు.”

46

బెత్లెహేము. బేతేలు అను పేరు, బెత్; హెబ్రీ భాషలో బెత్ అనగా భావము “ఇల్లు.” ఎల్ అనగా దానికి నిలబడునది, ఎలోహిం (Elohim), దానియొక్క సంకేతాక్షరము, ఎలోహిం అనగా భావము “దేవుడు.” బెత్, ఎల్ అనగా ఎలోహింయై యున్నది, అనగా దేవుడు, దేవుని యొక్క ఇల్లు, అక్కడే జీవాహారము యుంచబడియున్నది. ఎల్, హెమ్, దానిని ముగిస్తుంది. మీ (ఎల్) ను తిరిగి (ఇ) తో తీసుకొని రండి, దాని భావము “ఒక జీవపు రొట్టె, హెబ్రీ భాషలో బెత్ అనగా ఇల్లు, ఎల్ అనగా దేవుడు, ఎలోహిం సంకేతాక్షరము. తరువాత ఎల్, ఎమ్ అనగా ”రొట్టె.“ ఆయన ఏమైయున్నాడు? ”దేవుని రొట్టెల ఇల్లు.“ బెత్ అనగా ఇల్లు, ఎలోహిం అనగా దేవుడు; ఎల్, ఎమ్ అనగా రొట్టె. ”దేవుని రొట్టెల ఇల్లు,“ దాని భావము బెత్లెహేము.

47

అక్కడగాక మరి ఏ స్థలములో ఆయన పుట్టగలడు? అయితే అది ఆ ప్రవక్తకు తప్ప ప్రతిఒక్కరికి మరుగుపర్చబడినది; అతడన్నాడు, “ఆయన బెత్లెహేములో నుండి వస్తాడు.” వారు యెరుషలేములో చూచుచుండిరి; షిలోహు వంటి పెద్ద స్థలములన్నిటిలో వారు చూచుచుండిరి; వారు ప్రతిస్థలములో చూచుచుండిరి. అయితే ఆయన బెత్లెహేము నుండి వస్తాడు, కారణము అది జీవమునకు దేవుని యొక్క రొట్టెల గృహమైయున్నది. ఆయన దేవుని యొక్క రొట్టెల గంపయైయున్నాడు. లోకమునకు, ఆయన అక్కడ యుండి యున్నాడు, బెత్లెహేములో జన్మించియున్నాడు. ఆయన ఏ స్థలము లోనూ జన్మించలేడు. ఆయన తప్పక ఎందుకు బెత్లెహేములో జన్మించవలసియున్నదని ఈ వారములో దానికి సంబంధించిన అనేక ఆత్మసంబంధమైన వివిధమైన

అంశములను గూర్చి నేను చదువుచున్నప్పుడు. అక్కడ ఎన్నో గొప్ప కార్యములున్నవి. నేను ఈ చిన్న స్థలములను తాకినప్పుడు, పరిశుద్దాత్ముడు నన్ను ఎత్తుకొనిపోయెను. మరియు నేను ఇలా అన్నాను, “ఓ దేవా, అది చాలును. నేను ఇప్పుడు దానిని చూస్తాను.”

ఆయన బెత్లెహేములో తప్ప మరి ఎక్కడను జన్మించలేడు. అది ఆ దేశము యొక్క జీవాహారమైయున్నది. అక్కడనుండి వచ్చిన ఇశ్రాయేలు వారందరికి అది జీవాహారమైయున్నది. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము ఆయనే, ఆత్మసంబంధమైనమన్నా; బెత్లెహేము నుండి రావలసియుండెను, జీవాహారము బాట, జీవాహారము యుండే స్థలము. బెత్లెహేము, రొట్టెను తయారు చేయు స్థలము. ఇప్పుడు, యేసు జీవాహారమై యున్నందున, “ఒకడు దీనిని తినినయెడల, అతడు ఎన్నడూ చనిపోడు.”

48

మరొక గొప్ప సంఘటనను నేను ఇక్కడ ఎత్తి చూపుటను నేను మర్చిపోలేను, అదేమనగా, దావీదు ఒక పారిపోయినవాడిగా యుండియున్నప్పుడు, దావీదు బహు సంకట సమయములో యుండియున్నాడు. అతడు ఇది వరకే అభిషేకించబడియున్నాడు. అతడు ఏమైయుండబోవుచున్నాడో అతడు ఎరిగియుండెను. దేవుడు ఆ రీతిగా చెప్పియున్నాడు. మరియు ఇంకనూ అతడు ద్వేషించబడ్డాడు. అతడు రెండు గొప్ప లోతైన నిప్పుల మధ్య అతడు నిలబడియున్నాడు; ఫిలిస్తీయులు ఒకవైపున అతనిని వెదుకుచున్నారు, ఇక్కడ మరొకవైపున సౌలు అతనిని వెదుకుచున్నాడు. మరియు అతడు ఒక రాజ్యములేనివాడుగా యుండియున్నాడు.

సరిగ్గా సంఘము ఈ దినమున నిలబడియున్నట్లుగా, నిజమైన సజీవుడైన జీవముగల దేవుని సంఘము ఏ శాఖ లేకుండా లేక మరేదియులేకుండా నిలబడియున్నట్లుగానే, అతడు నిలబడియున్నాడు. ఆమె ఒంటరిగా నిలబడియున్నది, కాని ఇంకనూ ఆమెపై అభిషేకము కుమ్మరించబడియున్నది. ఆమె ఏమైయున్నదో ఆమె ఎరిగియున్నది.

49

లోకములో ఎన్నడైనా అది ఎలా నెరవేరుతుంది, దయ్యము రెండువైపులా యున్నది, దావీదు వైపు తరుముచున్నది? అతడు అరణ్యములోని రహస్య స్థావరాలలో మరియు గుహలలో అతడు ఆశ్రయమును పొందియున్నాడు, అతనివలె నమ్మునటువంటి కొద్దిమందితో, ఒక చిన్న నమ్మకమైన యోధుల గుంపుతో అతడు దాగుకొనుటకు ప్రయత్నము చేయుచున్నాడు. అయితే అతడే రాజు అవుతాడని ఆ మనుషులు నమ్మియున్నారు.

ఈ రోజున విశ్వాసులును ఆలాగుననే యున్నారు, ఒక చోట నుండి మరొక చోటుకు దాగుకొనినవారివలెయున్నారు, అయితే ఇంకనూ ఎవరు రాజు కాబోవుచున్నారో వారు ఎరిగియున్నారు. ఎవరు అధ్యక్షుడు కాబోవుచున్నారో నేను లెక్క చేయను. ఆయన వచ్చుచున్నాడని మనకు తెలుసు. విజ్ఞాన శాస్త్రము అనుచున్నది, “వారు ఒక మనిషిని నిర్మించగలరు. వారు దానిని చేయగలరు. మరియు వారు ఒక కుందేలును తీసుకొని, మరియు దాని పుప్పొడిని తీసుకొని మరొక కుందేలును వారు ఆ విధముగా చేయగలరు,” అని దేవుని వాక్యమును తప్పు అని చెప్పుటకు వారు ప్రయత్నించుచుండగా,“ వారు దానిని అధిగమించి దానిని చెప్పుటకు ప్రయత్నించుచుండగా, వారు ఇదివరకు చూచినదానికంటే ఇంక దూరము చూస్తున్నారు. ఇంకనూ, అక్కడ ఒక దేవునిని నమ్ము ప్రజలుయున్నారు, వారు ఇదివరకు ఎన్నడైనా చేసినట్లుగానే దానిని తట్టుచున్నారు. ఏది వచ్చినప్పటికి మరియు ఏది వెళ్ళినప్పటికి లెక్క కాదు, వారు ఇంకనూ దేవునియందు విశ్వాసముంచియున్నారు. దేవుడే సరియైయున్నాడు. వారు దేవుని యొక్క మారని హస్తములను పట్టుకొనియున్నారు. యుద్దము మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో, రోగము మరియు మరణము మధ్యలో, మరియు సమస్తము మధ్యలో, వారు ఇంకనూ మారని దేవుని హస్తములను పట్టుకొనియున్నారు. ఆయన వచ్చుచున్న రాజు అని వారు ఎరిగియున్నారు.

50

ఈ దినమున, ప్రజలు వారిని చూసి ఎగతాళి చేస్తారు, వారిని పరిశుద్ద గుండ్రాళ్ళు అని, వారు కోరిన సమస్తముతో వారిని పిలుస్తారు. అయితే ఆ దేవుని యొక్క యోధులు, వారి విధినిర్వహణకు నమ్మకముగా యుంటారు. “స్వస్థపరిచే గుంపు,” అని మరియు “ఒక మూఢుల గుంపు,” అని పిలిచినప్పటికి, లేక వారు ఏమని పిలిచినప్పటికి లెక్క కాదు; వారు రాజునే అంటిపెట్టుకొనియుంటారు. ఆయన అధికారముతో వచ్చుచున్నాడని వారికి తెలుసు. వాళ్ళు ఆయన నామమును వ్యర్థముగా పలికినప్పటికి, వారిని వెక్కిరించి మరియు తమాషా చేసినప్పటికి, ఆయనను నమ్మినవారిని “బహిష్కరించబడినవారు, వెనుకపడిన గుంపు,” అని వారిని పిలిచినప్పటికి - అది వారిని ఎంతమాత్రము బాధించదు; వారు వారి విధినిర్వహణకు నమ్మకముగా నిలిచియుంటారు.

51

దావీదుతోయున్న యోధులు తిన్నగా వారు దావీదుతో నిలబడియున్నారు. ఒక ఫిలిష్తియుడు వచ్చినట్లయితే, అతడు యుద్ధము చేయవలసియుండెను. అది ఎవరైయున్నప్పటికి, వారు అతనికి ప్రతివైపుయుండి, దాడి చేయుటకు వారు సిద్దముగాయున్నారు. దీనుడైన దావీదు, తన మనస్సులో, అంతా గందరగోళములో; అతడు అనుకొనుచున్నాడు, “ప్రభువా, అది ఎలా జరుగుతుంది?”

మీకు తెలుసా, నాయకులు ఎలాటి కార్యములగుండా వెళ్ళుచున్నారో, సంఘమునకు తెలియదు. దేవుని యొక్క వాగ్దానములు, వాగ్దానము చేయబడియున్నవని మీరు తలంచినప్పుడు, అలాగైతే ఎందుకు అవి నెరవేరవు? వారు వాటిని సంఘమునకు చెప్పరు, వారు సహవాసము చేయుచున్నవారితో వాటిని చెప్పరు, అయితే అక్కడ ఒక నిజమైన నాయకుని యొక్క హృదయములో ఎన్నో కలవరములున్నాయి.

52

దావీదు అక్కడ కూర్చొనియున్నాడు, అతని గొంతు ఎండిపోవుచుండెను, అది వేసవి మధ్యకాలమైయున్నది. దావీదు మరియు సౌలు మధ్య బేధమునుబట్టి ఫిలిష్తియులు దానిని అవకాశముగా తీసుకొనిరి. మరియు ప్రతి స్థలములో సౌలు, దావీదు కొరకు వెదుకుచుండెను. మరియు ఫిలిష్తియులు కూడా అతని కొరకు వెదుకుచుండిరి, మరియు తరువాత ఇశ్రాయేలీయుల కొరకును ఫిలిష్తియులు వెదుకుచుండిరి. ఒక గందరగోళముగాయున్న సమయమును గూర్చి మాట్లాడండి; ఇప్పుడు యున్నట్లుగానే అది సరిగ్గాయున్నది. ఈ చిన్న స్థలములో దావీదు ఆశ్రయమును పొందాడు, ఈ చిన్న స్థావరములో, అతడు వెళ్ళగలిగే ప్రతి దానిలోనికి వెళ్ళాడు, ఆ చిన్న రహస్య స్థావరాలను అతడు మరుగుగా చేసికొనియున్నాడు. ఆ ఎండవేళలో అతడు ఆ కొండపైకెక్కి మంచి ఎండాకాలము మధ్యలో, ఆ వేడి ఎంతో తీవ్రముగా యుండెను, అతని గొంతు మాడిపోవుచున్నది, అతని హృదయములో నిరాశలు మరియు భయములు, మరియు తిరుగులాడుచున్నాడు. “ఓ, దేవా, అది ఎందుకు ఇలాయున్నది? నీవు ఆ అభిషేకమును నా మీద క్రుమ్మరించియున్నావు. నన్ను నేను ఎన్నికచేసికొన్నందువల్ల కాదు, కాని నీవు నన్ను ఎన్నుకున్నావు. అదిగో ఆ గొర్రెలు కాయు పని నుండి నీవు ఎందుకు నన్ను పిలిచావు, మరియు ఇది ఇస్తానని నీ ప్రజలకు సేవ చేయాలనీ నాకు చెప్పావు, ప్రతి చోట నీవు నాన్ను నిప్పుల మధ్య ఉంచావు?” అది అతని హృదయము గుండా వెళ్ళుచుండెను.

53

అతడు ఆ కొండ మీద కూర్చొని క్రిందకు చూశాడు, మరియు ఫిలిష్తియులు తిన్నగా బెత్లెహేములోనికి వచ్చి దానిని ముట్టడివేసియున్నారు, అది అతని చిన్న గృహము. అప్పుడు, అతని యొక్క చిన్న పట్టణము శత్రువు యొక్క ఆధీనములో వారి పాలన క్రింద యున్నది. అంతమాత్రమే కాదు, అతని సొంత తండ్రి ఇల్లు, యెషయి గృహము, ఫిలిష్తియుల క్రింద దాస్యములో యున్నది. అక్కడ అతని సొంత దేశము, అతని సొంత సంఘము, అతనికి వ్యతిరేఖముగా యున్నది. ఇక్కడ శత్రువుతో అతడు పోరాడుచున్నాడు. ఇక్కడ అతడు సంఘ ప్రజలతో పోరాడుచున్నాడు. అతడు దానిని చేయుటకు వత్తిడి చేయబడ్డాడు.

అనేకసార్లు మనము చేయకూడని కార్యములు చేయుటకు, మనము చెప్పకూడని సంగతులు చెప్పుటకు మనము వత్తిడి చేయబడతాము (ఒక నిజమైన ఆత్మసంబంధమైన సేవకుడు), అయితే అతడు దానిని చేయుటకు వత్తిడి చేయబడ్డాడు. అతడు తన పక్షమునువహించి మరియు అతని రంగులను చూపవలసియున్నది. “ప్రభువు యొక్క తిరస్కరించబడిన కొద్దిమందితో నేను నా మార్గమును తీసుకొంటాను,” అని ఆ పాట రచయిత చెప్పెను.

54

కాబట్టి ఆ ఎండ రోజు అతడు అక్కడయుండియున్నాడు, ముందుకు మరియు వెనుకకు నడుచుచున్నాడు, ఆ పొడవైన లోయగుండా చూస్తున్నాడు, అది దిగువ నుండి వెనుక వరకు 25 మైళ్ళు యున్నది. అక్కడ తన సొంత తండ్రి గృహము ఫిలిష్తియుల చేతిలో బందీగా యున్నది. అదిగో ఆ దూరములో సౌలు యున్నాడు. మరియు తిన్నగా వాటి మధ్య కూర్చొని, చూడండి, పక్షములు వహించుటకు, ఈయన ఇక్కడకు వచ్చాడు. చెప్పాలంటే, ఇశ్రాయేలు అంతయూ బ్రద్దలైపోయిన గొప్ప సమయమును అతడు చూస్తున్నాడు, సంఘము వివిధమైన శాఖలుగా బ్రద్దలైపోయినది. ఏమి చేయవలెనో అర్ధముకాక, దావీదు ఆ వెనుక నిలబడియున్నాడు, మరియు ఇంకనూ ఆయనపై అభిషేకము నిలిచియున్నదని అతడు ఎరిగియున్నాడు. ఆ అభిషేకము అక్కడ యున్నదని వారు ఎరిగియుండిరి. దావీదు రాజు కాబోవుచున్నాడని వారు ఎరిగియుండిరి. హల్లెలూయ!

55

ఎవరు రాజు కాబోవుచున్నాడో మనము ఎరుగుదుము. ఎవరు అధ్యక్షుడు కాబోవుచున్నాడు అన్నది లెక్క కాదు. ఎవరు రాజు కాబోవుచున్నారో నాకు తెలుసు. ఆయన రాజు కాబోవుచున్నాడు. నిలబడుటకు ఏదో అవసరమైయున్నదని నాకు తెలుసు, అయితే దేవా, సంఘ శాఖలకు మరియు సమస్తమునకు నా కన్నులను మూసివేయుము. అదిగో, ఆత్మ సంబంధమైన దృష్టి ద్వారా దానిని చూడుము, ఆయన రాబోవుచున్న రాజు అని నేను ఆయనను సేవిస్తాను. అది మరణమైనను, నన్ను చనిపోనిమ్ము. అది నా కుటుంబమైనా, అది ప్రియమైనవారైనా, అది నా యొక్క సంఘ శాఖయైనా, అది సమస్తమైనను: నన్ను క్రీస్తును సేవించనియ్యండి. నేను ఆయనతో నిలిచియుంటాను. వారు దేవుని యొక్క యోధులు, దావీదుతో యున్నవారివలె నేను ఉంటాను, ఏ సమయములోనైనా నడిచి వెళ్ళుటకు, వారు తమ ఖడ్గములపై చేతులను యుంచియున్నారు. ఆ విధముగానే దేవుని యొక్క యోధులు యుంటారు, సిద్దముగా!

56

“సాంఘిక మర్యాద కొరకు నీవు కొంచెము మద్యపానమును తీసుకొనవలెను,” అని శత్రువు అంటాడు.

“నేను అపవిత్రమైన దానిని ముట్టను.” ఆమెన్! అక్కడే శత్రువు యున్నాడు. అక్కడే దానియొక్క యోధుడున్నాడు.

“నీవు నమ్మునటువంటి ఆ పాత పరిశుద్ద గుండ్రాయి చెత్తను నీవు ఎందుకు వ్యతిరేకించవు?”

“నేను దేవునిని నమ్మియున్నాను. నేను దేవునికి నమ్మకముగా నిలబడతాను!” నీవు అక్కడేయున్నావు. అక్కడే యోధులుయున్నారు.

“ఓ, అక్కడ దైవిక స్వస్థత అనువంటిది ఏదియులేదు.”

“నీవు దానినేనా యోచించేది. నాకు దానికంటే ఇంకా బాగా తెలుసు,” చూడండి.

“పరిశుద్దాత్మ బాప్తిస్మము అనువంటి కార్యము అక్కడ లేదు. ఆ రోజులు గతించిపోయినవి.”

“అదేనా నీవు తలంచేది. నేను ఇదివరకే దానిని పొందియున్నాను; దానిని గూర్చి నీవు నాకు చెప్పుటకు అది ఎంతో ఆలస్యమైనది.”

57

ఆ చిన్న పాత ఎర్రగా కనబడు బాలునిపై అభిషేకముయున్నదని వారికి తెలుసు. అతడు రాజు కాబోవుచున్నాడని వారికి తెలుసు.

కాని దావీదు, తన సొంత మనస్సులో నిరాశ చెందియున్నాడు. నేను ఊహించగలను... ఒక్క నిమిషము, మనము అతనిని గమనిద్దాము: బయటకు వెళ్ళి వెనుకకు కూర్చొనియున్నాడు, మరియు క్రిందికి చూస్తూ ఆలోచిస్తున్నాడు, “నా సొంత ప్రియమైన పట్టణము, బెత్లెహేము, అక్కడ దానిని చూస్తున్నాడు, అక్కడ దేవుని యొక్క గొప్ప కార్యములు సంభవించియున్నవి; అక్కడ నా తండ్రి యొక్క తండ్రి, ఆయన తండ్రి యొక్క తండ్రి అక్కడ జన్మించి యున్నారు; అక్కడ నా అమ్మమ్మ-అమ్మమ్మ-అమ్మమ్మ-అమ్మమ్మ, అదిగో, యూదాను కను సమయములో ఆమె పలికినది, నేను ఆ గోత్రము నుండియే వచ్చియున్నాను, అదిగో అక్కడ ఏదో సహజాతీతమైనదియున్నది. ఆమె వారి స్థానమును పలికినది. మరియు అక్కడ యెహోషువ ఆ కుమారుని, తిన్నగా ఆ స్థలములో యుంచియున్నాడు. మరియు దానిగుండా ఈ కార్యములన్నియు వచ్చియున్నవి. అది తప్పక ఆలాగుయుండవలెను. నేను ఒక గొర్రెలను కాయు కాపరిని, మరియు నా తలపై నీవు నూనెను పోసియున్నావు. నేను రాజును అవుదునని నీవు చెప్పియున్నావు. నేను నిన్ను నమ్మియున్నాను. ఆమెన్.”

తరువాత అతడు వెనుకకు వెళ్ళి, అక్కడ క్రిందకు చూసి, తలంచుకున్నాడు, “మంచిది, అదిగో నేను జన్మించియున్న, నా యొక్క ఆ చిన్న పట్టణములో, నేను అక్కడ ఆ చిన్న గుంపుతోయున్నాను, అవి మంచి పాత రోజులు.”

58

మెథడిస్టువారు వారి యొక్క పాతరోజులను వెనుకకు తిరిగి చూచుకొంటే అది బాగుంటుంది, వారు కొద్దిమందిగా యున్నప్పుడు, దూరముగాయున్న ఆ చిన్న గదుల మధ్యలో అమెరికాలో, దేవుని యొక్క శక్తిక్రింద వారు పడిపోయియున్నారు, మరియు అప్పుడు వారి ముఖముల మీద నీరు చల్లబడెడిది. బాప్టిస్టువారైన మీరు కూడా, మీరు ఎక్కడనుండి వచ్చి యున్నారో తిరిగిచూస్తే అది బాగుంటుంది, మరియు మిగిలినవారందరూ. పెంతెకొస్తువారైన మీరు, మీరు ఎక్కడనుండి వచ్చియున్నారో తిరిగిచూస్తే బాగుంటుంది. అది సత్యము.

యుద్దము యొక్క వేడి మధ్యలో దావీదు ఆలోచించుట ప్రారంభించాడు, ఓ, ఆ రాత్రులు నాకు గుర్తున్నాయి, అప్పుడు నేను అదిగో ఆ కొండ ప్రక్కన పరుండియున్నాను. ఆ నక్షత్రములను నేను గమనించుట నాకు జ్ఞాపకమున్నది, అదిగో అవి పైకి ఎలా కదిలియున్నవో, మరియు దేవుడు ఎలా నా చిన్న బాల్యహృదయముతో మాట్లాడియున్నాడో, ఒక దినమున నేను ఎంతో ఆత్మలో యున్నప్పుడు నాకు గుర్తున్నది, నేను మేఘములను మరియు పచ్చిక బయళ్ళను చూస్తూ, చివరకు నేను ఇలా కేకలువేసి, ఆత్మలో ఇలా పాడాను:

యెహోవా నా కాపరి; నాకు లేమి కలుగదు.

గాంఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను: నీవు నాకు తోడైయుందువు;....

59

ఓ, మై! ఇక్కడే అతడు తిన్నగా, అప్పుడే మరణపు కోరలలో, రెండువైపులా యున్నాడు. “అవును, గాఢాంధకారపులోయలో నేను సంచరించినను! ఆ పాత మంచి రోజులు, అప్పుడు దేవుని ఆత్మ నాతోయున్నది, దేవుడు నాతో యున్నాడు! నేను ఆయనకు స్తుతులు పాడాను. నేను ఆయనలో ఆనందించాను..

“ఒకసారి నాకు గుర్తున్నది, ఆ పాత చిన్న సింహము, ఒక ఉదయమున పైకి లేచి నా గొర్రెలలో ఒకదానిని పట్టుకొన్నది. మరియు దేవుని యొక్క ఆత్మ నా మీదకు వచ్చియున్నది, నేను వెళ్ళి దానిని లాగి ముక్కలుగా చేశాను. ఆ విడుదల నాకు జ్ఞాపకమున్నది. ఓ, ఆ సాయంకాలము నేను గుర్తుచేసికొనగలను, సరిగ్గా సూర్యుడు అస్తమించక ముందు ఒక ఎలుగుబంటి లోనికి వచ్చి ఒక గొర్రెను పట్టుకొన్నది, నేను దానిని చంపియున్నాను. అవి గొప్ప విడుదల!”

“నేను ఆయనకు స్తుతులు పాడినప్పుడు - నా బాల్యదినములలో, నేను నా గొర్రెలను కాయుచుండగా నాకు గుర్తున్నది. ఓ దేవా, నన్ను తిరిగి ఆ స్థలమునకు తీసుకొని వెళ్ళుము. ఆ మొదటి ప్రేమకు నన్ను తీసుకొని వెళ్ళుము. నా గొర్రెల యొక్క దండమును తిరిగి నాకు ఇచ్చుటకు తీసుకొని పొమ్ము. తిరిగి నా గొర్రెల మందను నాకిమ్ము. ఆ వెనుక నన్ను ఒంటరిగా యుండనిమ్ము, నిన్ను ఆరాధించనిమ్ము.”

60

అది కొన్నిసార్లు మనము యోచిస్తాము. అయితే మనము యుద్దము యొక్క వేడిలోయున్నాము. తప్పక ఏదో జరగవలసియున్నది. ఒకప్పుడు మేము పిల్లలమైయున్నాము. ఇప్పుడు మేము ఎదిగినవారము. ఆ యుద్దము ముందుకు కొనసాగుతున్నది. నాకు గుర్తున్నది, రంపపు పొట్టు నేల మీద పొంగినప్పుడు ప్రజలు కేకలువేసి అరిచారు. మరియు నీవు ప్రజల కొరకు ఎక్కడకు వారిచుట్టూ చేరుకోలేకపోయేవాడవు, అయితే అది ఈ దినమున అలాలేదు. యుద్దము కొనసాగుతున్నది. ఓ! అది విలియం బ్రెన్హాం కాదు, ఆ చిన్న బాలబోధకుడు ఇక ఎంతమాత్రమును కాదు. నీవు తప్పక ఒకదానిని ఉత్పత్తి చేయవలసియున్నది. అవునండి, అక్కడ తప్పక అది భిన్నముగా యుండవలసియున్నది. అది సమయమైయున్నది. యుద్దము కొనసాగుచున్నది. వేడి ఉదృతమగుచున్నది. ఆ గ్రంధములో వ్రాయబడిన ప్రతి ఒక్కరూ, ఆ ప్రజలు, విమోచించబడు సమయమైయున్నది. ఇప్పుడు సమయము వచ్చియున్నది.

61

దావీదు, తన నిరాశలన్నిటితో ముందుకు మరియు వెనుకకు నడుస్తూ ఆలోచన చేయుచున్నాడు. “ఓ, ఈ ఎండవేళ! అయ్యో! ఓ, అది ఎంతో వేడిగాయున్నది! సౌలు ఈ మార్గము నుండి రావచ్చు! చుట్టూ ప్రతిచోట సైన్యములున్నవి. మరియు మనము ఇక్కడ ఈ గుహ ద్వారమునొద్ద కూర్చొని యున్నాము. మరియు, ఇంకనూ, అభిషేకపు తైలము నా మీద యున్నది. ఇది ఎలా జరగుతుంది? ఓ, నేను నీళ్ళు త్రాగితే బాగుంటుంది. అప్పుడు అతని మనసు వెనుకకు, బెత్లెహేము యొక్క గవునుల యొద్దకు వెళ్ళింది. అక్కడ ఒక బావియున్నది. అక్కడ యున్నటువంటి నీరు ఎక్కడనూ లేదు.

మీకు తెలుసా, పాలస్తీనా కొంత చెడ్డ నీరును కలిగియున్నది. వారు చెడ్డ వీటిని కలిగియున్నారు. మరియు వారు ఇంకనూ ఆ నల్లటి నీటి ద్వారా జ్వరమును, అలాటివి వారిలో కలిగియున్నారు. మరియు దానిలోని మొత్తమూ క్షారగుణము కలిగిన విషపూరితమైన నీరు, అది నిన్ను చంపివేస్తుంది.

62

అయితే బెత్లెహేము ఈ సంస్థానములో నీటి పీఠము కూడా. బెత్లెహేము కలిగియున్న నీరుకంటె మంచి నీరు ఎక్కడనూ లేదు. దావీదు ఇలా తలస్తూయుండేవాడు, “నేను నా యొక్క గొర్రెలను తీసుకొని ఉదయమున బయలుదేరినప్పుడు, నేను ఆ పాత నీటి బావిగుండా వెళుతూ, దాని నీరు త్రాగేవాడను. ఓ, ఎంత చల్లని నీరు, ఎంత తియ్యని నీరు, మరియు ఎలా అది దాహమును తీర్చేదో!”

ఇప్పుడు అతని గొంతు ఎండిపోవుచున్నది, ఇంకనూ అతడు అభిషేకించబడినవాడు. “ఓ, నేను కేవలము ఆ నీరు త్రాగితే బాగుంటుంది!” ఇప్పుడు అతని యోధులు... అతడు, అతని యొక్క నిరాశలో కేకలు వేశాడు. “ఓ, అతని యొక్క బాల్యదినములను గూర్చి మరియు అతని విజయములను గూర్చి అతడు కలకంటున్నాడు, మరియు అతడు ఇప్పుడు కూర్చొనియున్న స్థలములో నిప్పుల మధ్య ఇక్కడ కూర్చొనియున్నాడు, అతడు అరిచాడు, ”ఓ, ఎవరైనా నాకు బెత్లెహేము నీళ్ళను తెస్తారా!“

63

ఇప్పుడు, అతని యొక్క యోధులు అతని యొక్క ఆలోచనను అనువదించలేరు, కాని సోదరుడా, వారు వారియందున్న సమస్తముతో అతని ప్రేమించియున్నారు. అతని అతి చిన్న కోర్కె వారికి ఒక ఆజ్ఞగా యుండెను. అతని బలమైన యోధులలో ముగ్గురు వారి ఖడ్గములను దూసి వారి గుడారములనుండి బయలుదేరి వారి దారిని 25 మైళ్ళు నరుకుకొంటూ వెళ్ళారు. దావీదు, వారు వెళుతూయుండగా, సందేహము లేదు, అతడు ఆశ్చర్యపడ్డాడు, “వారు ఎక్కడయున్నారు? వారు ఏమిచేసి యున్నారు? వారు ఎక్కడకు వెళ్ళారు? వారు వారి యొక్క ప్రాణములను సాహసము చేయుచున్నారని వారికి తెలుసా?” 25 మైళ్ళు దారిగుండా ప్రతిచోట సైనికులు అకస్మాత్తుగా దాడిచేయు స్థలములో వారున్నారు, వారు తిన్నగా మరణపు కోరలలో యున్నారు. వారి ఖడ్గములు మెరయుచున్నవి, మరియు వారి డాళ్ళు పేల్చి వేయుచున్నవి; అయితే వారి మనిషి, అతడు రాజు అవుతాడని వారు నమ్మినవారి సోదరుడు, నీరును కోరియున్నాడు.

64

ఓ, సోదరుడా, ఈ దినమునయున్న యోధులు అనుమానములు, అవిశ్వాసము మరియు నామకార్ధ భక్తిగుండా, దేవునియొక్క సన్నిధిని తాజాపర్చుటకు, ఆయన కోర్కెలకు వారీ ఖడ్గములతో వారి మార్గముగుండా కోయగలరా, అని నేను ఆశ్చర్యపడుచున్నాను? “ఆయన కోర్కెలలో అతి చిన్నది; అది ఆఫ్రికా దేశమైనా, ఇండియా దేశమైనా, అది వీధిగుండా యైనా, అది ఎక్కడయైయున్నప్పటికి! ప్రభువా, నీ కనీసపు చిన్న కోర్కెలు నాకు ఆజ్ఞగా యున్నాయి.” అలాటి యోధులే అతని ప్రక్కన నిలబడి యున్నారు. “వారు నన్ను పరిశుద్ద గుండ్రాయి అని పిలిచినా, నా పేరును తలవంపులుగా చేసినా, వారు నన్ను వీధులలో తన్నినా, అది నాకు లెక్క కాదు. నీ కోర్కెయే నాకు ఆజ్ఞయై యున్నది.” వారే నిజమైన సైనికులు.

65

వారు ఏమి చేశారు? వారు ఆ బావి నొద్దకు వెళ్ళువరకు వారి మార్గముగుండా పోరాడుచు వెళ్ళారు. వారు ఒక బక్కెటుతో నీళ్ళను ముంచి యున్నారు. మరియు ఇక్కడవారు, వారి మార్గమును తిన్నగా ఇరువైపులా కుడి నుండి ఎడమకు నరుకుకొంటూ వారు దావీదు సముఖమునకు తిరిగి వచ్చియున్నారు. వారన్నారు, “నా ప్రభువా, ఇవిగో నీళ్ళు!” ఓ, మై! ఏమిటి? ఒక అవమానమునకు గురైన మనిషి సంఘము ద్వారా ద్వేషించబడిన వ్యక్తి, రాజు ద్వారా ద్వేషించబడిన వ్యక్తి, ఫిలిషీయుల ద్వారా ద్వేషించబడిన వ్యక్తి, దరిదాపుగా ప్రతిచోట ద్వేషించబడిన వ్యక్తి. అయితే ఆయనను వెంబడించిన ఒక చిన్న గుంపు, అతడు రాబోవుచున్న రాజు అని ఎరిగియుండిరి.

66

ఈ దినమున, నేను నిన్ను ఎరుగుదును. మేము గొప్ప పాటలు పాడుతాము, మేము గొప్ప ఆలయములు నిర్మిస్తాము, ప్రతిచోట మేము గొప్ప జాతీయ గీతములను మేము కలిగియున్నాము, మేము ఆ రీతిగా ఆయనను స్తుతిస్తాము అని వారు చెప్పుచున్నారు, కాని యేసు అన్నాడు, “మనుషుల ఆజ్ఞలు దైవోపదేశములని మీరు బోధిస్తూ, మీ హృదయములలో మీరు నాకు దూరముగా యున్నారు.” పరిశుద్దాత్ముడు లోనికి వచ్చి సంఘములో యేసుక్రీస్తు యొక్క సన్నిధిని కనపరుస్తూ, ఏదైనా చేయనియ్యండి, వారు నిన్ను తలుపు బయటకు తన్నివేస్తారు.“ మనుషుల కట్టడలను దైవోపదేశములుగా వారు బోధిస్తూ, వారు నన్ను వ్యర్ధముగా ఆరాధించుచున్నారు, వారు ఆరాధిస్తారు, అయితే వారు దానిని వ్యర్ధముగా చేస్తారు.”

అయితే వారు అతనిని నమ్మిన యోధులైయున్నారు. ఆత్మ సంబంధమైన గ్రహింపుతో, అదిగో బెత్లెహేములోవలె, అక్కడ యోధులు దానియొద్ద నిలబడియున్నారు, చూచారా.

67

దావీదు, ఈ నీళ్ళతోయున్న బక్కెట్ ను పట్టుకొన్నాడు. అతడు దానివైపు చూశాడు. మరియు బైబిలు చెప్పియున్నది, అతడు వాటిని నేలపై కుమ్మరించి ఇలా అన్నాడు, “దానిని త్రాగుట నాకు దూరముగా యుండును గాక, కారణము వీరు, నా... నీ యోధులు అదిగో అక్కడకు వెళ్ళి నాకు నీరు తెచ్చుటకు వారి ప్రాణమునకు సాహసించియున్నారు. అది ఆ మనుషుల యొక్క రక్తము. నేను దానిని చేయలేను.” మరియు వారి ప్రాణములను తెగించి తెచ్చిన ఈ తియ్యని నీరు, వారు శత్రువు దారిగుండా బ్రద్దలు చేసికొనివాటిని తెచ్చుటకు అక్కడకు వెళ్ళియున్నారు, దావీదు వాటిని నేలమీద ప్రభువుకు స్వేచ్చారణగా కుమ్మరించెను. అది హీనము కాదు; అది కేవలము లేఖములను నెరవేర్చుచున్నది.

68

కారణము యేసు కూడా బెత్లెహేము నుండి వచ్చియున్ననూ, ఆయన జీవాహారమైయున్నాడు, మరియు ఆయన జీవజలము కూడా. నిశ్చయముగా, అది ఆయనేయైయున్నాడు, మరియు ఆయన ఏమి చేసియున్నాడు? ఆయన దావీదులోను మరియు యోధులలోను ప్రాతినిధ్యము వహించియున్నాడు, కారణము ఆయన రాజుయైయుండి, మరియు యోధుడై యుండి, ఆయన వచ్చి శత్రువు పాళెములగుండా వెళ్ళియున్నాడు. ఆమెన్! మరణమును, సమాధిని మరియు పాతాళమును జయించి, తన స్వరక్తమును, యోహాను 3:16 నెరవేరునట్లుగా క్రుమ్మరించెను.

దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక, నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

అది, ఆయన నీరు ఇచ్చుటను ప్రాతినిధ్యమువహించుట కాదు, కాని ఆయనే నీరైయున్నాడు; నశించుచున్న ప్రజలు జీవము పొందునట్లుగా, ఆయన దానిని ఎలా చేశాడు? తన సొంత రక్తము ద్వారా, దానిని బయటకు కుమ్మరించుట దానిని వలకపోయుట కాదు. అది ఒక ఊహించని సంఘటనయై యున్నది. ఆయన కల్వరిలో దానిని ఉచితముగా కుమ్మరించియున్నాడు, శత్రువు యొక్క ప్రతిదారిగుండా ఆయన వెళ్ళిన తరువాత, లోకమునకు రొట్టెలగంపగా యుండునట్లు ఆయన తన జీవమును కుమ్మరించెను.

మరియు ఊట రక్తముతో నిండియున్నది,

ఇమ్మానుయేలు రక్తనాళముల నుండి తీయబడినది,

పాపులు ఆ ప్రవాహము క్రింద మునిగినప్పుడు,

వారి దోషపు మరకలన్నియూ పోగొట్టుకొంటారు.

69

ఆ కారణమునుబట్టియే ఆయన బెత్లెహేములో జన్మించి యున్నాడు. అందుచేతనే ఆయన రావలసియుండెను, కారణము అది ఆహారమునకు కేంద్రమైయున్నది, జీవాహారము. అది నీటికేంద్రమై యుండెను. అది ఏమిటి? జీవజలము. మరియు యేసులో ఆ రేండూయున్నవి, జీవాహారము మరియు జీవజలము, అందుచేత ఆయన వచ్చి బెత్లెహేములో జన్మించవలసియుండెను. “యూదా బెత్లెహేమువైన నీవు, గొప్ప ప్రధానులలో అల్పమైనదానవు కావు?నీవు ఒక సాధారణమైన చిన్న బోధకుడవు, నీవు ఒక చిన్నవాడవు; అయినను నీ నుండి ప్రధాని వస్తాడు, పురాతనకాలము మొదలుకొని శాశ్వతకాలము నుండి శాశ్వత కాలము వరకు. ఎల్లప్పుడు శాశ్వతకాలము నుండి శాశ్వతకాలము వరకు ఎల్లప్పుడును ఆయనముందు నడకలు వెళ్ళుచున్నవి.”

ఆ కారణమునుబట్టియే ఆయన యూదా బెత్లెహేములో జన్మించవలసియుండెను. అది ఆయనను ఊయల ఊపినది. మరియు, నా సోదరుడా, ఆయన ఈ దినమున ఊయల ఊపగోరు స్థలము ఆయన కోరునది ఏమనగా, నీ సొంత జీవిలో నీ యొక్క సొంత హృదయములో నీ నుండి ఆయన ప్రదర్శింపబడగోరుచున్నాడు. జీవజలములు నశించుచున్న ప్రజలకు, మరియు ఆకలితో చనిపోవుచున్న ప్రజలకు జీవాహారము. ఆయనే జీవాహారము మరియు జీవజలము, అవి రెండూ మనిషి జీవించుటకు ప్రాముఖ్యమైనవి, అవే రొట్టె మరియు నీరు, అది వాగ్దానము చేయబడియున్నది, నిశ్చయముగా.

70

ఒక్క క్షణము మనమ తలలను వంచుదాము, అలా చేయుచుండగా, మీ చెక్కుచెదరని దృష్టిని నేను కోరుచున్నాను. నీవు ఎన్నడైనా బెత్లెహేముకు వెళ్ళియున్నావా, ఈ ఉదయమున? నీవు ఎన్నడూ బెత్లెహేము వెళ్ళియుండకపోతే...

అది బెత్లెహేము యొక్క ఎఫ్రాతా గా పిలువబడినది కూడా. బెత్లెహేము యొక్క ఎఫ్రాతా. ఎఫ్రాతా అనగా భావము “వేరు” (హెంప్) అను మాట నుండి అది వస్తుంది, హెంప్ అనగా భావము “వేరు.” మరియు పురాతన జిల్లా అక్కడ ఎఫ్రాతా గా పిలువబడినది, “అది జీవమునకు ఆరంభము.” క్రీస్తు అన్నాడు, “మీరు నాయందు నిలిచియున్నట్లైతే! నేను ద్రాక్షావల్లిని, మీరు తీగెలు.” సమస్త జీవమునకు ఆయనే వేరు.

నీవు ఎన్నడూ బెత్లెహేముకు, ఎఫ్రతా బెత్లెహేమునకు రానట్లైతే, ఈ ఉదయమున రమ్ము. మరియు ఆయనను నీ రక్షకుడిగా స్వీకరించుము, మరియు ఆయన నీ పాపములను క్షమిస్తాడు. మీరు మీ చేతులను ఆయనకు ఎత్తుతారా? మరియు ఇలా చెప్పుతారా, “ప్రభువైన దేవా, ఇప్పుడు నా పట్ల జాలిని చూపుము. ఇప్పుడు, నేను ఇక్కడ, నా హృదయమంతటితో యేసు నొద్దకు వచ్చుచున్నాను. నేను నీ యొక్క బెత్లెహేమునొద్దకు, నీళ్ళ యొద్దకు మరియు జీవాహారమునొద్దకు వచ్చుచున్నాను. ఇప్పుడు నేను ఆయనను నా వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరిస్తాను. ఆ వెనుక యున్న యవ్వనస్థుడా, ప్రభువు నిన్ను దీవించును. ప్రభువు నిన్ను దీవించును. చిన్నవాడా, ప్రభువు నిన్ను దీవించును.

71

అక్కడ మరొకరు యున్నారా? చెప్పండి, “ఇప్పుడు నేను వచ్చుచున్నాను; నా చేతులలో ఏదియు లేదు. నేను నిలబడి దప్పిగొనుచున్నాను, నా గొంతు ఎండిపోయినది. ఎక్కడకు వెళ్ళి నిజమైన జీవమును కనుగొనాలి అని నేను తిరుగులాడుచున్నాను. నేను తిరుగులాడుచున్నాను, నేను సంఘములలో చేరియున్నాను.” సహోదరీ, ప్రభువు నిన్ను దీవించును గాక. “నేను సంఘములో చేరియున్నాను, నేను సమస్తమును ఎలా చేయాలో నేను ఎరిగినట్లుగా చేసియున్నాను. బ్రెన్హాం సోదరుడా, అయితే నేను ఇంకను ఎన్నడూ ఆ జీవమిచ్చు వనరులను తాకియుండలేదు. ఇప్పుడు నేను దానిని స్వీకరించుటకు, ప్రభువా, వచ్చుచున్నాను.” ఆయన నీ కొరకు ఇక్కడ యున్నాడు. నీవు నీ చేతిని ఎత్తగలవా? చెప్పు, “ప్రభువా, అది నేనే, నిలబడి అవసరతలో యున్నవాడను.” మనము ప్రార్ధించుచుండగా, ప్రభువు మిమ్ములను దీవించును గాక.

72

ఓ, ప్రభువైన దేవా, బహుశా నీవు వాటి గురుతులతో అక్కడ వాటినియుంచిన ప్రకారము, లేఖనముల నుండి ఈ చిన్న విరిగిపోయిన వర్తమానమును తెచ్చియున్నాను. “అది జ్ఞానులకు మరియు వివేకముగల వారికి మరుగుగాయుండి, నేర్చుకొను పసిబాలురకు అది బయలుపర్చబడినది.” ఎలా ఆ చిన్న బెత్లెహేము, వాటన్నిటిలో అది చిన్నది! ప్రవక్త ఎలా దానిని చెప్పియున్నాడు? “నీవు ప్రధానులలో స్వల్పమైనదానవు కావు?” ఆ చిన్న ప్రాముఖ్యతలేని స్థలమునుండి ఇశ్రాయేలును ఏలు అధిపతిని తెచ్చుటకు, అది ఎంతో దేవునిని సంతోషపర్చినది. ప్రభువైన దేవా, ప్రభువైన యేసు యొక్క ఎర్రని రక్తపు ప్రవాహము ద్వారా కడుగబడిన ఆ చిన్న ప్రజల గుంపు నుండి, ఆ గుంపు ద్వారా, ఎక్కడో, ప్రభువా, ఈ ప్రపంచమంతటనుండి, క్రీస్తును నీవు తిరిగి తెస్తావు, ఆయన ఇనుప దండముతో దేశములను ఏలుతాడు.

తండ్రివైన దేవా, నీకు ప్రార్థన చేయుచున్నాను, ఇక్కడ హాజరై యున్న ప్రతి ఒక్కరిపట్ల కనికరమును చూపుము, మరియు మేము నీ యొక్క బెత్లెహేమునకు వచ్చుదుము గాక. “ఓ నమ్మకమైనవారలారా, రండి, బెత్లెహేమునకు రమ్మని మనము పాడుచుంటిమి.” ప్రభువా, అదిగో ఆ చిన్న పట్టణమునకు అది వెళ్ళుట అని వారు చూచుట కాదు, అది ఒకప్పుడు ఒక గురుతుగా యున్నది. అయితే వారు యధార్ధతకు, యేసుక్రీస్తు నొద్దకు, దేవుని యొక్క జీవాహారమునకు మరియు జీవజలమునకు వారు వచ్చుదురు గాక.

చేతులను ఎత్తిన వీరిని ప్రభువా, ఇప్పుడే నీ రాజ్యములోనికి స్వీకరించండి. కారణము విశ్వాసము ద్వారా వారు ఆయనను స్వీకరించారు. విశ్వాసము ద్వారానే వారు తమ చేతులను ఎత్తియున్నారు. మరియు విశ్వాసము ద్వారానే నీవు వారిని స్వీకరిస్తావని నేను నమ్ముదును, వారు నయోమివలె దూరముగా వెళ్ళకుండా ఎన్నడూ తప్పిపోకుండా ప్రభువా, వారిని బెత్లెహేము నొద్దయుంచుము. సమయము బహుశా కఠినముగా మారినప్పుడు వారు తిన్నగా బెత్లెహేమునొద్ద నిలిచియుందురు గాక. రానురాను అది బాగుంటుంది, ప్రభువా దానిని దయచేయుము.

73

రోగముతో యున్నవారిని మరియు బాధించబడుచున్నవారి పట్ల కనికరమును చూపుమని నేను నీకు ప్రార్ధన చేయుచున్నాను. ప్రభువా, ఇక్కడ యున్న వీరికి నీ యొక్క స్వస్థతా స్పర్శ అవసరమైయున్నది. ఓ, ప్రభువా, బెత్లెహేమును ఆమె యొక్క పూర్వపు మహిమకు నీవు పునరుద్దరించావు. ఇబ్బంది సమయములో, ఆమె రోగముతో ఉన్నప్పుడు, నీవు ఆమెను పునరుద్దరించావు. నీవు తిన్నగా తిరిగి నయోమిని యవలకోత కాలములో ఆమెను తెచ్చియున్నావు, మరియు ఇప్పుడు, తండ్రి, ప్రతి నయోమిని, ఇక్కడయున్న ప్రతి ఒక్కరిని, అవసరములో యున్నవారిని తిరిగి తెమ్ము అని మేము ప్రార్ధించుచున్నాము. దేవా, నేను ప్రార్ధన చేయుచున్నాను. అది సరిగ్గా యవలకోత కాలమైయున్నది. ఆ కనబడిన గొప్ప యవలరొట్టె, ఆ కొండ మీదుగా దొర్లుకుంటూ, శత్రువు యొక్క పాళెములో పడినది. దేవా, ఇప్పుడు ఈ కట్టడము లోనికి ఆ గొప్ప యవల రొట్టెను తెమ్మని, నేను ప్రార్థన చేయుచున్నాను, మరియు అది ప్రజల రోగమునకు మరియు వారి పాపమునకు ప్రాయచిత్తముగా యుండును గాక. మరియు నీ దైవిక సన్నిధిలో ప్రతి ఒక్కరిని స్వస్థపర్చుము.

ప్రభువా, బహుశ అది నా యొక్క వ్యక్తిగతమైన భావనయైయున్నది, అయితే నీవు సమీపముగా యున్నావని, నీవు ఎంతో ఇక్కడ సమీపముగా యున్నావనియు నేను భావించుచున్నాను. నీవు ఇక్కడ యున్నావని నేను నమ్ముచున్నాను. మరియు ప్రజలను బట్టి నేను ఇది చెప్పుట లేదు. నీవు మనిషి యొక్క హృదయమును ఎరిగినవాడవు. ఆ యోధుల వలె ఎలాగైనా వారును ఈ ఉదయమున ఆ దర్శనమును పట్టుకొంటారని ప్రభువా, నేను ప్రార్ధన చేయుచున్నాను. అదే నీ యొక్క గొప్ప సర్వశక్తి, నీ యొక్క గొప్ప శక్తి, నీ యొక్క గొప్ప సన్నిధి. నీవు ఎవరనగా - దేవుని కుమారుడవు, రాజువు, అభిషేకించబడినవాడవు; నీవు మా మధ్యయున్నావు; వారు దాని యొక్క సన్నివేశమును, వారియొక్క ఆత్మలలో పట్టుకొందురు గాక, మరియు వారి యొక్క రుగ్మతలన్నిటినుండి వారు స్వస్థతనొందుదురు గాక. నేను దానిని వారిమీద యుంచుచుండగా, నీ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్ధన అడుగుచున్నాను. ఆమెన్.

74

నేను దేవుని నమ్ముచున్నాను, ఆయన మాటలన్నియు నమ్ముచున్నాను, ఆయన వాక్యములో ప్రతిభాగము దైవికముగా ప్రేరేపించబడినదని నేను నమ్ముచున్నాను. ఆయన “ఎప్పుడో యుండియున్నవాడు,” కాదని, అయితే ఆయన ప్రస్తుతము యున్నవాడని, “నేను ఉన్నవాడను,” ఎల్లప్పుడు జీవించుచున్న ఆయన సన్నిధి. ఇక్కడయున్న ఈ ప్రజలమధ్యలో, ఇప్పుడే తిన్నగా నేను దానిని నమ్ముచున్నాను.

చేతులను ఎత్తిన మీరు, ఒక సంఘమును కనుగొనండి, “యేసుక్రీస్తు నామములో, దేవునిని పిలుస్తూ, మీ పాపములను కడిగివేసుకొంటూ, బాప్తిస్మమును పొందండి,” ఆయన త్వరగా వచ్చుచున్నాడని కూడా నమ్మండి. ఆయన రెండవ రాకడలో ఆయన ప్రత్యక్షము కావలసియున్నది.

రోగులను స్వస్థపర్చుటకు, మరియు అవసరతలో యున్నవారిని బాగుచేయుటకు ఆయన సన్నిధి ఇక్కడ యున్నదని నేను నమ్ముచున్నాను. ఒకరి తరువాత ఒకరు మీరు ప్రార్ధించబడనవసరములేదు. మొన్న రాత్రి ప్రజలకు నేను దానిని ఋజువు చేశాను, ఏమి సంభవించియున్నదో వారికి నేను చూపగోరాను.

75

అక్కడ ఒక ప్రత్యేకమైన యవ్వనస్తుడు యున్నాడు, అతడు అక్కడ కూర్చొని, ఇప్పుడు తిన్నగా నావైపు చూస్తున్నాడు, ఎన్నో దినముల నుండి అతడు పడక మీదయున్నాడు. అతడి గొంతు వాచియున్నది, చివరకు అతడు ఏమియు తినలేడు. అతని జ్వరము ఎంతో అధికముగా యున్నది. మరియు అతడు తన తల్లి మరియు తన తండ్రితో చెప్పాడు, “పంపండి, బ్రెన్హా౦ సోదరుడు వచ్చి, నా కొరకు ప్రార్ధించమనండి.” ఎలాగైనా వారికి నన్ను ఇబ్బంది పెట్టుట ఇష్టము లేదు, కారణము నేను తీరికలేని స్థితిలో యున్నాను. మరియు ఏదో వారి గృహమునకు వెళ్ళుటకు నన్ను నడిపించినది.

అక్కడ కూర్చొనియుండగా, ఆ యవ్వనస్తునికి వారు ఒక ప్లేటును, ఒక మృదువైన గుడ్డును, మరేదో, కొన్ని మృదువైన చిక్కుడు గింజలను మెత్తగా నలిపి పెట్టుటకు ప్రయత్నించారు. మరియు అతడు దానిని మ్రింగుటకు ప్రయత్నించుచుండెను. అతడు వాటిని మ్రింగివేసి, తన వ్రేలితో వాటిని నలిపెను. అతని పండ్లు అన్నియూ వాచియున్నవి, మరియు చీము వాటినుండి కారుచున్నది. మరియు ఆ రీతిగా అతడు వాటిని తన చేతితో నుజ్జు చేయాలనుకొన్నాడు, మరియు ఆ రీతిగా తన గొంతులోనికి పెట్టుకోవాలని ప్రయత్నించాడు. అతడు ఒకటి లేక రెండు సార్లు కొరికాడు, ఇంకా ముందుకు వెళ్ళలేకపోయాడు, వెనుకకు వాటిని నెట్టాడు.

76

నేను ప్రార్ధన చేయకుండా అక్కడ కూర్చొనియున్నాను. అక్కడ ఏమి జరగుచున్నదో, ఒక చిన్న విషయము అది, నీవు ప్రతి ఒక్కరికి దానిని చెప్పలేవు. లేదు. నేనన్నాను, “ప్రభువా, ప్రభువా, ఇప్పుడు ఈ సంవత్సరము ముగియుటకు అది దగ్గరగా యున్నది. అక్కడ ఒకటి ఏదో కొత్తది వచ్చు చున్నది. ప్రభువా, నన్ను... అది ఇదియేనా? అది ఇదియేనా?” మరియు నేను దానిని చెప్పుట ప్రారంభించగానే, మరియు నా హృదయములో ఇప్పుడు దానిని చెప్పు, “నీవు ఇక్కడయున్నావని నాకు తెలుసు.” ఆ యవ్వనస్తుడు ముందుకు వంగి మరొకసారి కొరికాడు, మరొకసారి కొరికాడు, మరొకసారి కొరికాడు, మరియు ఆ ప్లేటునంతా ఖాళీ చేశాడు, మరియు తన కారులో ఎక్కి వెళ్ళిపోయాడు.

ఓ, ఆయన దేవుడైయున్నాడు, చూడండి, ఆయన సన్నిధి, ఆయన సన్నిధి. అది... అది ఆయనను హాజరుపరుస్తుంది.

77

మొన్నటి దినమున వారు అతని యొక్క తాజా చిత్రమును తీసినప్పుడు, అతడు అక్కడ నిలబడియుండుటను నేను చూశాను, నేను దానివైపు చూశాను, నేననుకొన్నాను, “మంచిది, వాటిమీద ప్రభువు యొక్క దూతను నేను చూసియున్నాను, మరియు అది అద్భుతముగా యున్నది.” అది ఉదయము మూడు గంటల సమయము. ఆయన నన్ను లేపి మరియు చెప్పెను, అది ఏమైయుండునో, మరియు నాకు దానిగురించి సమస్తము వివరించెను, కవచము దానిమీద ఎలాయున్నదో సమస్తమూ నాకు చూపించాడు, నేను ఎన్నడూ దానిని చూడలేదు. నేను వెళ్ళి దానిని తీసుకొని, దానివైపు చూశాను, మరియు అది అక్కడయున్నది. నేను ఇదివరకు ఎన్నడూ దానిని చూసియుండలేదు. ఓ, అది ఎలాటి భావనను నాకు తెచ్చియున్నదో, ఆయన హాజరైయున్నాడని ఎరుగుటకు ఒక ఆదరణ.

ఆయన ఇక్కడయున్నాడు, సరిగ్గా ఆయన యొక్క సన్నిధి. ప్రభువు యొక్క సన్నిధి రోగులను బాగుచేయుటకు అక్కడయున్నది. ప్రభువు యొక్క సన్నిధి రోగులను బాగుచేయుటకు ఇక్కడ యున్నది. పాపులకు ఒప్పుదలను కలిగించుటకు ప్రభువు యొక్క సన్నిధి ఇక్కడయున్నది. ఆయన యొక్క ప్రజలమధ్యలో ప్రభువు యొక్క సన్నిధి యున్నది, మరియు ఆయన దేవుని యొక్క బెత్లెహేము, సమృద్ధియైన రొట్టె మరియు సమృద్ధియైన నీరు. నేను ఎంతో సంతోషముగా యున్నాను (మీరు సంతోషముగా లేరా?) ఏలయనగా మనము వచ్చి తిని, శాశ్వతముగా జీవించుటకు మనకు ఒక స్థలమున్నది.

78

ఇప్పుడు, ప్రభువు మిమ్ములను దీవించును. సోదరుడా, నీవు ఏదైనా చెప్పగోరుచున్నావా? [సహోదరుడు నెవిల్ “లేదు” అనుచున్నాడు.] ఒక్క క్షణము మనము మన పాదముల మీద నిలబడుదాము. మన పాతసెలవు పుచ్చుకొను పాట, “యేసు నామమును నీతో తీసుకొని వెళ్ళుము.”

మీలో ఎంత మంది ప్రభువును ప్రేమిస్తున్నారు? మనము చేతులను ఎత్తియుండగా, మీ చేతులను పైకి ఎత్తి చూపండి. ఇప్పుడు దించండి, మీ ప్రక్కన నిలబడిన ఎవరితోనైనా కరచాలనము చేయండి. చెప్పండి, “యాత్రికుడా, దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును.” అది బాగున్నది, తరువాత చుట్టూ, మంచిది. ఆ రీతిగా మీరు ప్రతి ఒక్కరితో పరిచయమును కలిగియుంటారు. మంచిది.

ఇప్పుడు, తిన్నగా పరలోకమువైపు చూస్తూ, ఈ పాటను ఇప్పుడు మనము పాడుదాము.

యేసు నామమును నీతో తీసుకొనుము.

శ్రమలో ఇబ్బందిలోయున్న బిడ్డా;

అది సంతోషమును, ఆదరణను నీకు ఇస్తుంది,

నీవు ఎటు వెళ్ళినా దానిని తీసికెళ్ళు.

ప్రశస్తమైన నామము (ప్రశస్తమైన నామము)

ఓ, ఎంత మధురము!

భులోకపు నిరీక్షణ, పరలోకపు ఆనందము,

ప్రశస్తమైన నామము (ప్రశస్తమైన నామము)

ఓ, ఎంత మధురము!

భులోకపు నిరీక్షణ పరలోకపు ఆనందము.

(ఇప్పుడు గుర్తుంచుకొండి...)

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...