సుమెయోను మరియు అన్న
VGR COUNT-89 దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేస్తాడని మనము ఎదురు చూస్తున్నాము. యెరూషలేమునందు ఈ రాత్రి మన దృశ్యమును తెరవబోవుచున్నాము. గత సాయంకాలము మనము దేనిని గూర్చి మాట్లాడితిమో అది సంవత్సరము క్రితమే మాట్లాడితిమి. అదేమనగా యేసు ప్రభువుయొక్క జన్మమును గూర్చి ఈనాడు మనము కలిగియున్న ప్రసార సాధనములవలె ఆ దినములలో సమాచారమును వ్యాపింపచేయుటకు ఏ సాధనములు లేవు. వారికి టెలివిజన్లు లేవు, ముద్రణ యంత్రములు లేవు మరియు తదితర సాధనములు ఏమియు వారు కలిగియుండలేదు. ఏదైన సమాచారము తెలుపవలెనన్న వారికిగల ఏకైక మార్గము ఏదనగా పెదవుల నుండి ఇతరుల చెవులకు తెలుపుట ద్వారానే.
అచ్చట సుమెయోను అను పేరుగల ఒక వృద్ద వ్యక్తి యుండెను. దైవజనుడిగా మనము పిలువబడే ఒక యాజకుడిగా అతడు ఆలయమందు ఉండెను. అతడు దేవునిచే అభిషేకించబడిన సేవకులలో ఒకడిగా ఉన్నాడు. ప్రతీ కాలమందు దేవుడు తనకు సేవకులను కలిగియున్నాడు. ఆయన హస్తములను ఉంచబడిన లేదా హృదయమందు ఆయన వాక్యమునుగల ఎవరో ఒక సేవకుడిని ప్రతీకాలమందు దేవుడు తన కొరకు కలిగియున్నాడు. కొనిసార్లు ఆయన స్వల్ప సంఖ్యగల వారి వద్దకు వచ్చును, కొన్నిసార్లు ఒకే ఒక వ్యక్తి దగ్గరకు ఆయన వచ్చును. కానీ ఎల్లప్పుడూ ఆయన కొరకు ఎవరో ఒకరిని ఆయన కలిగియుండును.
2
ఈ సుమెయోను ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుచూ ఎదురుచూచువాడు. ఆయన ఏమిచేస్తానని అతడితో ఆయన చెప్పెనో దేవుడు ఆ కార్యము చేయుట కొరకు అతను కనిపెట్టుచూ ఉండెను. అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక వ్యక్తిగా ఉండెను, ప్రభువువైన క్రీస్తును చూడకముందు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మత చేత బయలుపరచబడి ఉండెను. దానిని నమ్ముటకు అతడు హక్కును కలిగి ఉన్నాడు.
తన యాజక సహెూదరులలో అనేకమంది అతడిని హేళన చేస్తూ ఎన్నో పేర్లు పెట్టి పిలిచినను అతడు ఆ మాటలను తన తలలోకి ఎక్కించుకోకుండా వాటిని లెక్కచేయలేదు. అది ఏమై ఉండవలయును? కాలము యొక్క ప్రారంభము నుండి వారు మెస్సయ్య కొరకు ఎదురుచూచుచున్నారు. వారు ఇంతకుముందున్న పరిస్థితుల కంటే వారిప్పుడున్న పరిస్థితి ఘోరముగా ఉన్నది. ఇటువంటి పరిస్థితులలో ఆయన ఎలాగు రాగలడు?
ఆయన తన ఆశ్చర్యమైన క్రియలను చేయుటకు, ఆయన మర్మయుక్తమైన మార్గమందును, దేవుడు తన స్వకీయమైన మార్గమందును ఆయన క్రియ చేయును అనేది మీరు గమనించవలయును. “నీవు ఆలోచించని ఘడియలో, దేవుని కుమారుడు వస్తాడు” మరి అది ఇప్పుడు అద్భుతమైన సమయము కాదా!
3
తన జనుల హృదయాలు ఆయన చేయబోవు కార్యము నిమిత్తమై ఏకమయ్యేంత వరకు ఆయన ఎన్నడూ ఏ కార్యమును చేయడనేది మీరు గమనించవలయును.
ఎన్నుకొనబడిన వారిని బయటకు పిలుచుచుండటయే ఇప్పుడు ఆయన చేయుచున్న కార్యమని నేను నమ్ముచున్నాను. అన్ని రకముల గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్తలను, గొప్ప విమానములను, తినుటకు కొదువలేకుండా గొప్పగా వర్ధిల్లచున్న స్థితిలో ఇప్పుడు ప్రపంచము ఉన్నది. “ఓ,” “ఇప్పుడు మమ్ములను నాశనము చేయుటకు ఏదీ లేదు, కేవలము ఇప్పుడు మేము జీవించుటకు సిద్దపడుచున్నాము” అని వారు చెప్పుచున్నారు. నీవు ఆలోచించని ఘడియలో దేవుని కుమారుడు వస్తాడు.
4
ఆయన ఏమి చేయుచున్నాడో దానిని నీవు చూడలేకపోవుచున్నావా? ఆనాడు ఆయన చేసిన అదే విధముగా తాను ఎన్నుకొనిన సంతానమును వెలుపలకు పిలుచుచూ ఆయన వారిని ఏకముగా సమకూర్చుచున్నాడు. సుమెయోను, జకర్యా, ఎలిజబెత్, బాప్తిస్మమిచ్చు యోహాను, నిర్ణయించబడిన ఏదో ఒక కార్యము జరుగునని అచ్చట వారు సిద్ధపడుచున్నారు.
ప్రపంచము యొక్క మరో భాగములోను మరియు మతసంబంధ సమూహానికి చెందిన వారి మధ్యలో కూడా వారు తాము ఇప్పుడు అంతమునకు వచ్చియున్నామని ఎరిగియున్నారు. కాని వారు మూర్ఖులై ఉన్నారు.
పరిశుద్ధాత్మ దేనినిగూర్చి చెప్పియున్నదో, దేనినిగూర్చి ఆయన మాట్లాడి యుండెనో వారెరుగుదురు. దానిని నమ్ముటకు అతనికి హక్కు గలదు. దానిని గూర్చి ఆ విధముగా పరిశుద్ధాత్మ చెప్పినట్లయితే, ఇక దానికి తిరుగు లేదు.
5
అదే విధముగా నేడు నేను దానిని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానము మనము కలిగియున్నాము. మరియు చివరి దినాలలో, ఆయన తన యొక్క ఆత్మను కుమ్మరించును. సంఘమును ఏకముగా సమకూర్చుటకు ఆయన సంఘమును పిలుచును. ఆయన గొప్ప సూచనలు మరియు అద్భుతాలు చూపును. అవి ఆయన వాగ్దానము చేసిన మాదిరిగానే ఉన్నాయని, వాటిని మనము చూస్తున్నామని నేను నమ్ముతున్నాను. కావున మనము మూఢ భక్తిగలవారమని పిలువబడుచున్ననూ అందుకొరకై మనము ఎదురు చూస్తున్నాము. అయినప్పటికిని, రెండు పరిశుద్ధాత్మలు లేవు. కేవలము ఒకే ఒక్క పరిశుద్ధాత్మ ఉన్నది. అదే పరిశుద్ధాత్మ ఈ మనుష్యుడికి వాగ్దానము చేసెను, ఆయన మనకు కూడా ఒక వాగ్దానము ఇచ్చి ఉన్నాడు. దానిని మనము నమ్మియన్నాము. లోకము ఏమన్ననూ దానితో మనకు ఏ సంబంధము లేదు. మనము దానిని నమ్ముచున్నాము. దేవుడు తన వాగ్దానమును నిలబెట్టుకుంటాడు. ఆయన ఎల్లప్పుడూ అలాగనే ఉండెను. ఆయన ఎల్లప్పుడూ ఆ విధముగానే చేసెను.
6
ఇప్పుడు, యేసు ఒక చిన్న పసిబాలుడుగా యుండగా, ఎనిమిది దినముల తరువాత సున్నతి కొరకై ఆయనను తప్పనిసరిగా యెరూషలేము దేవాలయమునకు తీసుకొని వెళ్ళవలసి ఉన్నది. ధర్మశాస్త్రము ప్రకారము, తల్లి తనను శుద్ధిచేసుకొన వలసిన దినములు గడిచినపుడు అర్పణను చెల్లించవలసియుండెను.
అది సోమవారము ఉదయమని అనుకుందాము. మన సన్నివేశము యెరూషలేము ఆలయము దగ్గర ఉన్నది. అది ఒక రద్దీగా ఉండు దినముగా ఉన్నందువలన ఆలయమునకు కుడిచేతి ప్రక్క ప్రార్థనా వరసవలె వరుసగా జనులు నిలబడి ఉండుటను నేను చూచుచున్నాను. అక్కడ పాలస్తీనాలో 20 లక్షల మంది యూదులు ఉన్నారు, 24 గంటలలోపు జన్మించిన అనేక మంది పిల్లలు అక్కడ ఉన్నారు. ప్రతీ దినము, ఎంతో మంది తల్లలు తమ శుద్దీకరణ నిమిత్తము అర్పణలను అర్పించుటకునూ మరియు తమకు జన్మించిన మగ పిల్లలకు సున్నతి చేయించుటకొరకు పెద్ద వరుసలో నిలబడియుండిరి.
7
అచ్చట నిలబడియున్న వరుసను మనము చూద్దాము. అది ఉదయము 9 గంటల సమయమై ఉండును, ఆ తల్లలందరూ వరుసలో నిలబడి ఉన్నారు. చేతితో అల్లిన చొక్మాయిలను ధరించిన చూడముచ్చటగా ఉన్న అందమైన పసిబిడ్డలుగా వారున్నారు. ఆ విధముగా ప్రతి ఒక్క తల్లి తమ బిడ్డను సిద్ధపరచుకొని తీసుకొని వచ్చి ఆ వరుసలో నిలబడి యుండిరి. వారిలో చాలా మంది గొర్రెపిల్లలను అర్పిస్తున్నారు. గొర్రెపిల్ల అర్పణ అనేది గొప్పవారి అర్పణగా ఉన్నది. కాని అనుదిన కూలి పని చేసుకొనే పేదవారి అర్పణ రెండు గువ్వలు లేక రెండు పావురములై ఉన్నవి.
ఆ వరుసలో గమనించండి, అక్కడ పద్దెనిమిది ఏళ్ళు దాటని చిన్న బాలిక ఉన్నది. ఆమె ఆ వరుసలో నిలబడి యుండగా ఆమెను చూసి మిగతా వారందరూ ఆమెకు దూరముగా జరిగి నిలబడియుండిరి. “బుద్ధిలేని వాళ్ళుగా ఆమె దగ్గరకు వెళ్ళి నిలబడవద్దు. ఆమె చెడు ప్రవర్తనగలది. ఎందుకంటే పవిత్ర వివాహ సంబంధమునకు విరుద్ధముగా ఆమె ఆ బిడ్డను కన్నది, కాబట్టి ఆమెకు దూరముగా నిలబడండి. ఆమెతో మాట్లాడడానికి, పలకరించుటకు మనకు తగదు.” అని ఒకరికొకరు గుసగుసలాడుచున్నారు. కాని మరియకు, ఆ బిడ్డ ఎక్కడి నుండి వచ్చేనో ఆమెకు తెలుసు, ఆయనే దేవుని కుమారుడని ఆమెకు తెలుసు.
8
ఈ దినము మాదిరిగా, ఈ రాత్రి మనము దేవునిని నమ్ముచున్నందు వలన, సహజాతీతమైన దానిని నమ్ముచున్నందువలన జనులు మనలను చూసి మూఢ భక్తిగలవారని అంటున్నారు. మనల్ని గూర్చి వారేమి ఆలోచించినను లేక వారేమి చెప్పినను మనకు అనవసరము. వారేవిధముగా ప్రవర్తించుచున్నారో, వారి పోకడ ఏమిటో మనము చూస్తున్నాము. మనము విద్యలేని పేద పామరుల వంటివారమని వారు తలంచుచున్నారు. కానీ, ఆ సహజాతీతమైనది ఎచ్చటినుండి వచ్చినదో, మన హృదయాలలో దేనిని మనము పొందుకొనియున్నామో దానిని గూర్చి మనము ఎరుగుదుము.
ఆ వరుసలో నిలబడియున్న తల్లల చేతులలో ఉన్న పసివారు చేతితో అల్లిన చొక్కాయిలను ధరించుకొని ఉన్నారు. కానీ, ఈ చిన్నపిల్లవాడు సామాన్యమైన పాత గుడ్డలతో చుట్టబడి ఉన్నాడు.
9
ఆయన దేనితో చుట్టబడియున్నాడో అనే దానిని నేను సరిగ్గా అర్ధం చేసుకొన్నట్లైతే ఆయన శిశువుగా జన్మించినప్పుడు ధరించుకొనుటకు ఏ వస్త్రములు లేనేలేవు. ఆయన భూమ్యాకాశములను సృష్టించినప్పటికీ ఆయన ఒక గోడ గల గుహయందు, పశువుల కుడితి తొట్టిలో జన్మించెను. అచ్చట ఆయనకు కప్పుటకు ఏ వస్త్రములు దొరకనందువలన, కాడిమాను వలన ఎద్దు మెడకు గాయం అవ్వకుండా ఉండుటకు కట్టు పీలికల వంటి గుడ్డలను వారు తీసుకొని వాటితో ఆయనను చుట్టినారు. అటువంటి సామాన్యమైన పాత పీలికల వంటి గుడ్డలతో ఇచ్చట ఆయన చుట్టబడి ఉన్నాడు.
10
ఇతరులకు ఆయనను చూచుటకు సౌందర్యముగా, సొగసుగా కనబడకపోయినను, ఆయన తల్లికి ఆయన ఒక ఆభరణమై ఉన్నాడు. ఆయన ఎవరో ఆమెకు తెలుసు కాబట్టి, ఈ రాత్రి అదేవిధముగా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఆయనను వారి హృదయలోతులలో పట్టుకుంటారో వారికి ఆయన ఒక ఆభరణము.
వారు అలా ముందుకు జరుగుచుండగా....
దేవుడు వాగ్దానం చేసినట్లయితే, దేవుడు తన వాగ్దానమును నిలబెట్టుకుంటాడు. దేవుడు సుమెయోనుకి ఒక వాగ్దానం చేసియున్నాడు. అతడు క్రీస్తును చూసేంతవరకు మరణించడనే వాగ్దానమును అతడు పొంది ఉన్నాడు. అదే పరిశుద్ధాత్మ నాకునూ, నీకునూ వాగ్దానము చేసి ఉన్నాడు.
11
మనము అతడివైపు చూద్దాము. అతను తాను ధ్యానించే గది యందు పరిశుద్ధ గ్రంథమును తీసుకొని దానిని ధ్యానించుచుండగా అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ “సుమెయోను లేచి నిలబడుము” అని చెప్పెను. నేను దానిని ఇష్టపడతాను.
దేవుడు తాను చేసిన వాగ్దానం పట్ల దయకలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ క్రియచేయుటలో ఉండెను. అదే పరిశుద్ధాత్మ ప్యూర్టోరికో అనే స్థలమగు ఇచ్చట ఇప్పుడు క్రియచేయుచున్నది.
12
“కరడు కరడును పిలుచుచున్నది” అని దావీదు అనెను. లోతైన ఒక పిలుపు ఎచ్చట ఉండునో దానికి స్పందించే ఒక లోతు (హృదయము) అచ్చట ఉండి తీరవలయును. అది ఈ విధముగా ఉండును. ఒక వృక్షము పెరగాలంటే మొట్టమొదట అది పెరుగుటకు కావలసిన నేల లేదా భూమి ఉండవలయును. చేపకు పొలుసులు లేదా రెక్కలు ఉండుటకు ముందు [సహో బ్రెన్హాం తన తర్జుమాదారునికి దానిని గూర్చి వివరించుచున్నాడు.] ఆ పొలుసులు లేదా రెక్కలు ద్వారా చేప ఈదవలెననిన మొదట దానికి నీళ్ళు కావలయును, లేదా అట్ల నీళ్ళు లేకపోతే ఆ చేపకు పొలుసులు ఉండనవసరం లేదు.
ఇప్పుడు కొంత కాలము క్రితం అమెరికాలో నేను వార్తా పత్రికలో చదివాను, ఎక్కడో ఒక చిన్న బాలుడు బడిలో తన పెన్సిల్కి ఉన్న రబ్బరును (ఎరైజర్) తినుచున్నాడు. అతని తల్లి ఆశ్చర్యపోయినది. ఒక దినాన ఆమె బయటకు వెళ్ళి ఆమె వచ్చి చూడగా తన ఇంటి వరండాలో ఆ బాలుడు సైకిల్ను త్రోక్కుటకు ఉపయోగించే పెడల్కు ఉండు రబ్బరు తినుట కనుగొన్నది అందుకని ఆమె అతడిని వైద్యుని దగ్గరకు తీసుకొని వెళ్ళినది. వారు అతనిని వైద్యశాలకు తీసుకొని వెళ్ళారు, అతని శరీరమును పరీక్షించారు, వైద్యుడు ఇలా అనెను “ఇతని శరీరములో సల్ఫర్ అవసరత ఉన్నది.”
అచ్చట సల్ఫర్ అనే పదార్థము అవసరమై ఉన్నయెడల మొదట ఆ సల్ఫర్ అనే పదార్థము అచ్చట ఉండవలసి యున్నది. ఎందుకనగా అచ్చట ఏదో ఒక పదార్ధము ఉంటేనే ఆ పదార్థము యొక్క అవసరతగల మరొకటి దానిని స్పందించుటకు అచ్చట ఉండును.
13
వినండి, ఇటువంటివి, అచ్చట ఒక సృష్టి జరిగిందంటే దానికి ముందే ఆ సృష్టిని సృష్టించుటకు అచ్చట ఒక సృష్టికర్త ఉండవలెను కనుక ఈ రాత్రి ఈ సమూహమునందు దైవీక స్వస్థతకొరకై ఆకలి కలిగియున్న ఎవరో ఒకరు ఇచ్చట ఉన్నట్లైతే ఆ దైవీక ఊట ఇచ్చట ఎక్కడో తెరువబడి ఉన్నదని అది చూపించును లేదా అట్లు లేని యెడల అసలు నీవు ఎన్నటికీ ఆ ఆసక్తిని కలిగి లేవని చూపించును. నీవు దేవుని శక్తిని చూడాలని ఆసక్తిని కలిగి ఉంటే అక్కడ ఎక్కడో దేవుని శక్తి వుంటుంది.
14
పరిశుద్ధ గ్రంథములో దైవీక స్వస్థతను హక్కుకోరు విధముగా ఒక లేఖనము కూడా లేదని చెప్పినను, మీ ఆత్మలను వెలుపలకు పిలుచుచూ స్వస్థపరచు దైవీక స్వస్థత ఇంకనూ అచ్చట కలదు. అదే కరుడు కరుడను పిలుచుచున్నది. ఆ లోతైన స్వరము (కరుడు) నిన్ను పిలిచినందువలెనే దానికి స్పందించుచు నీవు ఇప్పుడు ఇచ్చట ఉన్నావు. సుమెయోనుకు వాగ్దానము చేసిన అదే పరిశుద్ధాత్మ నిన్ను స్వస్థపరచు శక్తి ఇచ్చట కలదని అదే పరిశుద్ధాత్మ నీతో చెప్పుచున్నది. సుమెయోనును నడిపించిన పరిశుద్ధాత్మ ఈ నగరం చుట్టు ప్రక్కలనుండి, ఈ కొండలు దాటి వచ్చిన మిమ్మల్ని కూడా అదే పరిశుద్ధాత్మ ఇచ్చట ఉన్న ఈ వాగ్దానము యొద్దకు నడిపించెను. “అంత్య దినములలో నేను నా ఆత్మను ప్రజలపై కుమ్మరించుదును. సూచనలు మరియు అద్భుతాలు జరుగును.” అదే పరిశుద్ధాత్మ తన వాగ్దానమును నిలబెట్టుకొనును.
ఇప్పుడు, క్రీస్తు ఈ ఆలయమునందు ఉన్నట్లైతే, ఎవరైతే ఆయన వాగ్దానమును నమ్ముచున్నారో, అప్పుడు పరిశుద్ధాత్మ వారిని ఇచ్చటకు నడిపించి వారు ఆయనను చూచునట్లుగా చేయుట ఆయన యొక్క కర్తవ్యమై ఉన్నది. కావున ఈ రాత్రి సమయమందు క్రీస్తు ఇచ్చట ఉన్నటైతే, ఆయన యొక్క శక్తివంతమైన కార్యములను చూచుటకు క్రీస్తును ప్రేమించే ప్రజలను ఆయన తన ఆత్మ ద్వారా ఇచ్చటకు నడిపించును.
ఇప్పుడు మనం సుమెయోనును చూద్దాం,
15
అతను దేవాలయములో వెనుక కూర్చొని చదువుచున్నాడు, “పైకి లేచి, నడువుము” అని పరిశుద్ధాత్మ చెప్పెను. ఆ వరుసలో ఎంతమంది ఉన్నారని నేను లెక్కించుచున్నాను.
దేవుని కుమారులు, దేవుని ఆత్మచేత నడిపించబడతారని మీరు నమ్ముచున్నారా? మీరు తెలివితేటలు గలవారుగా ఉండవలసిన అవసరము లేదు, మిమ్మలను నడిపించే ఆ ఒక్కరి మీద, మీరు నమ్మకం కలిగియుంటే చాలును.
16
ఒకసారి నాకు గుర్తున్నది, నేను డల్లాస్, టెక్సాస్ నుండి వస్తున్నాను. నేను గృహమునకు వచ్చుచుండగా తుఫాను ముంచుకొచ్చినది. విమానము టెన్నీసిలోని మెంఫీస్ దగ్గర క్రిందకు దించారు, మరునాటి ఉదయము వరకు వారు నన్ను ఒక హెూటల్లో ఉంచారు. “మనము ఏడు గంటలకు బయలు దేరుతాము, లిమౌసిన్ అనే అతడు ఆరు గంటల సమయమందు వచ్చి మిమ్మలను తీసుకొని వెళ్తాడు” అని వారన్నారు అంతా మంచిది, ఆ రాత్రి నేను కొన్ని ఉత్తరములు వ్రాశాను.
ఆ మరుసటి ఉదయమున నేను లేచి, నేను వ్రాసిన ఉత్తరాలను తపాలా పెట్టెలో వేయుటకై అచ్చట ఉన్న ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్ళుట ప్రారంభించితిని. పరిశుద్ధాత్మ వచ్చి “ఆగుము, వెనుకకు తిరిగి, మళ్ళీ వెనుకకునడుస్తూ వెళ్ళుము” అని నాతో చెప్పెను. నేను నా గడియారమును చూసుకొన్నాను, నేను అలా నడుస్తూనే ఉన్నాను.
17
ఆ నగరములో పెద్ద ప్రాంతమును దాటి దిగువనున్ననది దగ్గరకు. (నల్లని రంగుతో ఉన్న ప్రజలను ఇక్కడ మీరేమని పిలుస్తారు) దిగువ ప్రాంతములో ఎక్కడైతే నీగ్రోలు నివసించుతారో అక్కడకు నడచుకుంటూ వెళ్ళాను. అలానడుస్తూ, ఒక వీధిగుండా వెళ్ళుచున్నాను. పరిశుద్ధాత్మ “అలానడుస్తూ ముందుకు వెళ్ళుతూ ఉండుము” అని నాతో చెప్పెను. మనము పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాము అనే దానిని మీరు నమ్ముతారని నాకు తెలుసు. నేను, నా చేతి గడియారమును చూసుకున్నాను, అప్పుడు దాదాపుగా ఏడుగంటలయ్యింది. పరిశుద్ధాత్మ నాతో “నడుస్తూ ఉండుము” అనెను.
ఒక చిన్న పాత ఇల్లు, ఆ ఇంటి గేటు మీద వంగి ఆనుకొని లావుగా ఉన్న ఒక స్త్రీ అక్కడ ఉన్నది. నేను ఆమె దగ్గరకు వెళ్ళుట ప్రారంభించాను.
“సేవకుడా, శుభోదయము” అని ఆమె అనెను.
నేను తిరిగి ఆమె వైపు చూసి, “నేను సేవకుడినని మీకు ఎలా తెలుసు?” అని అడిగాను,
“నీవు వస్తున్నావని నాకు తెలుసు” అని ఆమె అన్నది. దేవుడు ఇరుప్రక్కల క్రియ చేయును. ఈ విధముగా వేల సార్లు జరిగియున్నది. ఈ ఒక్కదానిని మీకు చెప్పుచున్నాను. ఎందుకంటే ఇది నా హృదయమందు ఉన్నది.
నేను, ఆమెవైపు చూసి, “అమ్మా నేను సేవకుడనని మీకు ఏలా తెలుసు” అని అడిగాను.
ఆమె “గత రాత్రి నేను ప్రార్ధనలోఉన్నాను. నాకు ఒక కుమారుడు ఉన్నాడు. ప్రభువు ద్వారా అతను నాకు ఇవ్వబడ్డాడు. పరిశుద్ధ గ్రంథములో షనేమియురాలైన స్త్రీ ఒక బాలుడు కావాలనుకునుటను నీవు ఎప్పుడును చదవలేదా? మరియు ప్రవక్త ఎలీషా ఆమెను దీవించెను. ఆమెకు ఒక కుమారుడు కలిగెను” అని చెప్పెను.
“ఆ సంగతి నాకు జ్ఞాపకమున్నది” అని నేనన్నాను.
ఆమె చెప్పెను “నేను అటువంటి స్త్రీని. దేవుడు నాకు ఒక కుమారుడును ఇచ్చెను. కానీ నన్ను క్షమించుము, అతడు చెడు సాంగత్యములో పడిపోయి లైంగికపరమైన ఒక సుఖవ్యాధితో మంచం పట్టాడు, దేవునిలో ముందుకు అడుగు వేస్తూ వెళ్ళుటకు బదులుగా వెనుక అడుగు వేసిపడిపోయిన స్థితిలో ఆ వ్యాధి వలన మరణించుటకు సిద్ధముగా ఉన్నాడు. రెండు రోజులక్రితము వైద్యుడు వచ్చి ”ఇతను ఇక బ్రతుక లేడు. ఇతని గుండెలోని నాళమును (నరమును) ఈ వ్యాధి తిని వేసినది“ అని అన్నాడు. అతడు మరణమును సమీపించుచూ అచ్చట మంచం మీద పరుండి ఉన్నాడు. అతడు నా కుమారుడు, అతడు ఆవిధముగా మరణముతో పోరాడుచూ మరణావస్థలో ఉండుటను నేను చూస్తూ అతడి దగ్గర నిలబడియుండలేక ఆ బాధను భరించలేక నిన్న రాత్రంతా నేను ప్రార్థించాను. ”ఓ, ప్రభువా, నా కుమారుడు బ్రతుకునట్లుగా నీవే స్వస్థపరుచుము, ఆనాటి ఏలీయా ప్రవక్తవంటి ఏలీయా ప్రవక్తను ఇప్పుడు నీవు కలిగియున్నావా?“ అని ప్రార్ధించి నిద్రపోయాను. ఈ తెల్లవారుజామున మూడు గంటలకు ప్రభువు నాతో, లేచి గేటు దగ్గర నిలువుము ఒకరు వీధులలో నడుచుకుంటూ వస్తారు” అని చెప్పెను, ఈ దినమున తెల్లవారక ముందే నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. నేను మీరు వచ్చుట చూశాను..
“అమ్మా, నా పేరు బ్రెన్హాం. నేను రోగుల కొరకు ప్రార్ధన చేస్తాను. నీవు ఎప్పుడైన నా గురించి వినియున్నావా?” అని నేనన్నాను.
ఆమె చెప్పెను, “లేదు, రెవరెండ్ బ్రెన్హాం, నేను నీ గురించి వినియుండ లేదు.”
నేను ముందుకి నడిచి, నా చేతిని ఆమె వీపు మీద వేయగా అది మంచువలన తడిగా ఉన్నది. తన తలకు మగవారి అంగీని కట్టుకొనియున్నది. కన్నీటి బిందువులు ఆమె నల్లటి చెంపలపై నుండి కారుచుండెను. “మీరు లోనికి వచ్చేదరా?” అని ఆమె నన్ను అడిగింది.
18
ఆమె ఆ చిన్న గేటును తెరిచినప్పుడు, నేను ఆ చిన్న రెండు గదులు గల గుడిసెలోనికి వెళ్ళాను. క్రింద నేలమీద పరచుటకు కంభళి అక్కడ లేకపోవుటను నేను చూశాను, కేవలము ఒక చిన్న మంచము, కానీ ఆ ద్వారము మీద “దేవుడు మా గృహమును దీవించును” అనే గుర్తు కలదు.
నేను, రాజ భవనములలో రాజుల కొరకు ప్రార్థన చేశాను, మరియు లోకములోని గొప్పవైన గృహములలో ప్రార్థనను చేసే అవకాశం కూడా నాకు కలిగినది. కానీ ఆ ఉదయము, ఆ చిన్న గుడెసెలో పొందుకొన్నటువంటి స్వాగత అనుభూతిని నేను నా జీవితంలో ఎప్పుడూ పొందుకోలేదు.
షుమారు 180 పౌండ్ల బరువుగల ఒక యవ్వనస్తుడు అచ్చట ఆ పడక మీద పరుండి యుండుటను నేను చూశాను. అతని చేతిలో దుప్పటి ఉన్నది, అతను మూలుగుతూ “ఇది చీకటి” అంటూ అతను గొణుగుచున్నాడు.
మరియు నేను, ఆమెను ఈ విధముగా అడిగాను, “అతను ఏమని అంటున్నాడు?”
“అదే, రెవరెండ్, అతడు తప్పిపోయాడు, చెప్పినదానినే రెండు రోజులుగా అదే చెప్పుచున్నాడు. అతడేమీ మాట్లాచున్నాడో అతనికే తెలియటలేదు అతడు సృహలో లేడు. కానీ, అతడు తాను సముద్రము మీద ఉన్నట్లుగా అనుకుంటున్నాడు. అతడి శరీరం చల్లబడి మరియు ఇంకా చల్లబడిపోయి నల్లగా అయిపోయినాడు. అతడు తప్పిపోయాడు. ఏదో ఒక పడవ మీద ఉన్నట్లుగా అతడు తలంచుచున్నాడు. అతడు వెళ్ళిన జీవమార్గము నుండి దారి తప్పిపోయి దానిని కనుగొనలేకపోవటము వలన అతడు దేవుని కనికరము కొరకు ఏడుస్తున్నాడు. రెవరెండు గారు, దానిని మీరు చూడగలుగుచున్నారా? అందువలన నేను వచ్చి దేవుని వద్ద ప్రార్ధించితిని. ”అమ్మా నేను రక్షించబడ్డాను“ అని నా కుమారుడు చెప్పాలని, ”అతడు ఆ ప్రభువు గృహమునకు చేరుట నేను చూసి సంతోషించాలని నేను కోరుకొనుచున్నాను“ అని ఆమె చెప్పినది.
“నేను స్వస్థత కొరకు ప్రార్థన చేయానా?” అని నేనన్నాను.
ఆమె దానిలో ఆసక్తిని కనపరచలేదు. ఆమెకు స్వస్థత గురించి ఏమియు తెలియదు. ఆమె కేవలము అతను రక్షించబడాలని కోరుకుంటుంది. ఆమె, అతని యొక్క నుదిటి మీద ముద్దు పెట్టుకొన్నది. ఆమె “నా కుమారుడా, దేవుడు నిన్ను దీవించును” అని చెప్పెను.
19
అవమానముతో, పాపములో పడి మంచము పట్టిన అతడి గురించి ఆలోచించండి. అతడు పాపములో పడి రోగియైనను ఆ తల్లి దానిని పట్టించుకొనకుండా, అతడిని ప్రేమిస్తూనే ఉంది, అతడు ఇంకనూ ఆ తల్లికి ఒక ముద్దుల కుమారుడుగానే ఉన్నాడు.
యేసు చెప్పిన ఆ ప్రేమ ఎటువంటిది, “తల్లి తన కుమారుడిని మరిచిపోవచ్చును, కానీ నేను నిన్ను ఎన్నడునూ మరచిపోను” అని దేవుడు చెప్పెను. ఓ, ఈ రాత్రి దేవుడు ఎటువంటు ప్రేమను ఈ లోకము కొరకు కలిగియున్నాడు.
“సాహోదరీ ప్రార్థించు” అని నేను అన్నాను. మేము మా మోకాళ్ళ మీద మోకరిల్లియున్నాము, ఓ, ఆ ప్రార్ధన గూర్చి నేను చెప్పాలి, ఆమె ఎంతగా దేవుని ఎరిగి యున్నదనే దానిని నేను తెలుసుకున్నంతగా కన్నీటితో ఆమె ప్రార్థించింది. నేను ఏడ్చాను, పిదప ఆమె పైకి లేచి తనపై ఉన్న వస్త్రముతో తన కన్నులను తుడుచుకొని, “ఇప్పుడు మీరు ప్రార్థించెదరా” అని ఆమె నన్ను అడిగింది.
20
“ప్రభువా, నేను ఇప్పటికే రెండు గంటలు ఆలస్యంగా ఉన్నాను. నా విమానము వెళ్ళిపోయినది, నేను నీ ఆత్మను అనుసరించాను. నీవు నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చావో నేను ఎరుగను, ఓ ప్రభువా, నీవు ఇంకనూ దేవుడుగానే వున్నావు. నేను కేవలము నీ యొక్క సూచనలను పాటించి వచ్చాను. నేను చూడాలని మీరు ఆశించినవారు వీరేనా?” అని ప్రార్థించాను.
ఆ సమయములో, “అమ్మా ఇంట్లోకి వెలుగు వస్తున్నది” అనే ఒక మనిషి స్వరమువంటి స్వరముతో అతడు అన్నాడు. ఐదు నిమిషముల తర్వాత అతను తన తల్లితో కలసి మంచముపై ఒక ప్రక్కగా కూర్చొని ఉన్నాడు, అతని తల్లి మరియు నేను దేవునిని మహిమ పరచాము.
రెండు సంవత్సరముల తర్వాత, నేను మరొకసారి పడమరవైపునకు వెళ్ళుచు౦డగా, ఈసారి నేను రైలులో వెళ్ళుతున్నాను. రైలు బండిలో సాండ్విచ్ (రెండు రొట్టెల ముక్కల మధ్య మాంసము వంటివాటిని పెట్టి ఉంచు ఆహార పదార్ధము)ను కొని తినాలంటే నాకు అంత ఎక్కువ ధర చెల్లించాలంటే మనస్సు అంగీకరించలేదు. అందువలన వాటిని కొనుటకు బదులుగా ఇంకా తక్కువ ధరలో అమ్మే హామ్ బర్గర్స్ అనే వాటిని కొని తినాలంటే రైలు బండి ఏదైనా ఒక స్టేషన్కు చేరి ఆగే వరకు నేను ఎదురుచూడాలి. రైలు బండి స్టేషన్లో ఆగిన తరువాత నేను బండి దిగి హామ్ బర్గర్ని కొనుటకు వెళ్ళాను. ఆ రైలు మెంఫీస్ అనే స్థలం దగ్గర ఆగింది. ఎవరో గట్టిగా అరుస్తూ నన్ను పిలుచుచున్నారు. ఎర్ర టోపీని పెట్టుకొని సామానులు మోసుకొని వెళ్ళే ఒక యవ్వనస్తుడు నన్ను పిలుచుచున్నాడు.“హాలో, రెవరెండ్ బ్రెన్హాం గారు,” అని పిలుచుచున్నాడు. నేను అటు తిరిగి చూశాను, ఇటు తిరిగి చూశాను, అటు ప్రక్క నుండి ఒక యవ్వనస్తుడు నా దగ్గరకు వచ్చుచున్నాడు, “మీకు నేను జ్ఞాపకము ఉన్ననా?” అని ఆ యవ్వనస్తుడు అడిగాడు.
నేను అన్నాను “లేదు.”
“ఒక సంవత్సరము క్రితము మీరు మా ఊరికి వచ్చారు, అక్కడ మా అమ్మని మీరు కలిశారు, మీకు జ్ఞాపకము ఉన్నదా?” అని అతడు అడిగినాడు.
“అవును,” నీవు ఆ యవ్వనస్తుడవే కదా! నాకు జ్ఞాపకము ఉన్నది.“ అని నేను అన్నాను.
“అవును, ఆయవ్వనస్తుడిని నేనే. స్వస్థతను మాత్రమే పొందుకోలేదు కానీ, ఇప్పుడు నేను ఒక క్రైస్తవుడిగా మారిపోయాను” అని అతడు అన్నాడు.
21
నేను ఆ ఉదయమునందు ఆ యవ్వనస్తుడికి ప్రార్ధించి ఆ గృహము నుండి బయలుదేరి ఒక కారు మాట్లాడుకొని విమానాశ్రయమునకు త్వరపడి వెళ్ళాను మరియు నేను అక్కడకు వెళ్ళేటప్పటికి, రెండున్నర గంటలు ఆలస్యమైనది. ఆ విమానములో ప్రయాణించే వారి పేర్లను పిలుస్తూ ఆఖరిగా ఆ పిలుపును విమానము బయలుదేరుటకు సిద్దముగా ఉన్నది అని నా పేరును పిలుచుచున్నారు. దాని గూర్చి ఆలోచించండి, దాని గూర్చి ఆలోచించండి.
ఆమె తన పేరు కూడా వ్రాయలేని, విద్యలేని, పామరురాలైన, ఆ పేద స్త్రీ యొక్క విశ్వాసపు ప్రార్థన ద్వారా ఆకాశములో చక్కగా వెళ్ళుతున్న విమానమును కూడా దేవుడు ఆమె కొరకు ఆ విమానమును ఏదో చేసి దానిని ఎక్కడ దించాలో సరిగ్గా అచ్చట ఆయన దించాడు. మనము ఆత్మచేత మాత్రమే నడిపించబడినట్లైతే.
22
సుమెయోను ఆత్మ ద్వారా నడిపించబడుచూ ఆ వరుస దగ్గరకు వెళ్ళుచున్నాడు. అసలు అతడు అచ్చటకు ఎందుకు వెళ్ళుచున్నడో అతనికి తెలియదు, ఆత్మ నడిపింపుతో అలా నడుచుకుంటూ వెళ్ళుచున్నాడు. అతను స్త్రీలు నిలబడిన ఆ వరుస దగ్గరకు వెళ్ళెను. ఇక్కడ ఆ వరుసలో దిగువకు అతను వచ్చెను. చుట్టబడిన వస్త్రములో చిన్న బాలుడిని కలిగియున్న ఆ చిన్న స్త్రీ ముందుకు రాగానే అతను ఆగెను.
భూమ్యాకాశములను సృష్టించిన సృష్టికర్త శరీరధారిగా ప్రత్యక్షమవ్వగా ఎటువంటి మంచి వస్త్రములు కూడా ధరింపచేయలేని స్థితిలో ఆ స్త్రీ చేతిలో ఒక చిన్న బాలుడుగా ఆయన ఉన్నాడు. పాత చిరిగిపోయిన చింపిరి గుడ్డలతో ఆయన చుట్టబడియున్నాడు. ఇప్పుడు దానిని గురించి ఆలోచించండి.
ఆయనే అట్లుండగా ఇక మనమెంత? మనకున్నఅర్హత ఎంత? మనమెదో గొప్పగా మనల్ని గురించి అనుకుంటాము, గాని కేవలము దేవుని కృప ద్వారానే మనము ఈ విధముగా ఉన్నాము, మనము ఏమీ లేని వట్టివారము.
23
మరియు సుమెయోను ఆగెను. పరిశుద్ధాత్మ ఖచ్చితముగా ఇలాగు చెప్పి ఉండవచ్చును. “సుమెయోను, ఆగుము. నేను, నీకు ఒక సూచన చూపించబోవుచున్నాను.” అతను తన తలను త్రిప్పి చూడగా ఆ బాలుడుయున్నచోటికి పరుగెత్తి ఆ పసి బాలుని తన చేతిలోనికి తీసుకొని ఎత్తుకొని “ప్రభువా, ఇప్పుడు నీ మాట చొప్పన సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, నీ మాట చొప్పన, నీ రక్షణ నేను నా కన్నులారాచూచితిని” అని చెప్పెను.
ఒక మూలలో ఒక వృద్దురాలైన అంధురాలగు ప్రవక్తిని అచ్చట ఒక ప్రక్కన కూర్చొనియుండెను. ఆమె పేరు అన్న అనే 84 సంవత్సరాలగు వృద్దురాలు ఆమెకు కనుచూపు లేదు. ఆమె ఎల్లప్పుడూ ఉపవాసములతో మరియు ప్రార్థనలతో గడుపుచూ ఆత్మతో బహుగా నింపబడియుండెను. అప్పుడు పరిశుద్ధాత్మ “అన్నా లేచి నిలబడుము” అని చెప్పెను. ఆమెకు కనుచూపు లేకపోయినను ఆత్మ నడిపింపు ద్వారా పసిబాలుడుయున్న ఆ జనులుగల వరుస వైపుగా నడుచుకొని వెళ్ళుచున్నది. ఆత్మ తనను నడిపించుట ద్వారా అచ్చటకు చేరినది. కనుచూపు లేని గ్రుడ్డిదానిగా ఆమె ఎక్కడకు వెళ్ళుచున్నదో ఆమెకు తెలియక పోయినను, ఆమె ఎచ్చటకు వెళ్ళుచున్నదనేది కాదు గానీ, ఆమె ఆత్మద్వారా అచ్చటకు నడిపించ బడుచున్నదనేది ప్రాముఖ్యము. ఈ రాత్రి మనల్ని అదే పరిశుద్ధాత్మ నడిపించుచున్నది. మీరు దేవుని ఆత్మద్వారా నడిపించబడుచున్నంత వరకు మీరు ఎచ్చటకు వెళ్ళుచున్నారనే దానితో ఏ సంబంధము ఉండదు. ఆమె మరియ దగ్గరకు వచ్చినది. ఆయన ముఖమును ఆమె చూసినది. ఆమె తన చేతులను పైకెత్తెను. పరిశుద్ధాత్మ ఆమె మీదకు వచ్చి ప్రవచించుట ప్రారంభించెను.
దేవుని కుమారులను మరియు కుమార్తెలను ఆత్మద్వారా నడిపించుటకు అదే పరిశుద్ధాత్మ ఇచ్చట ఈ రాత్రి యందు ఉన్నాడు. అదే విధముగా ఆయన మిమ్ములను ఈ రాత్రి నడిపించవలెనని మీరు కోరుకుంటున్నారా?
24
మనము మన శిరస్సులను వంచుదాము. మనము ప్రార్ధించే ముందు, ప్రార్థనలో మీ తలలు వంచియున్నవో లేదో అని తెలిసికోవాలనుకుంటున్నాను. “సహెూదరుడా బ్రెన్హాం, ప్రార్థనలో నన్ను జ్ఞాపకము చేసుకొనుము” అని చెప్పు ఎంతమంది మీ చేతులను పైకెత్త౦డి. మై, వేలకొలదిమంది.
ఓ ప్రభువా, మేమందరము భూ సంబంధులము, నీవెక్కడనుండైతే మమ్ములను తీసియున్నావో, మేము ఆ ధూళి వైపు మా ముఖములను త్రిప్పియున్నాము. యేసు క్రీస్తు రాకడ ఆలస్యమైతే ఒక దినాన మేము తిరిగి ఆ ధూళిలోకే వెళతాము. కానీ, ఓ దేవా, నిత్యజీవనమును మా హృదయాలకు ఇవ్వుము. ఒక దినాన యేసు వచ్చినప్పుడు, మేము ధూళిలో ఉన్నను, నీతిసూర్యుడు స్వస్థతను కలిగియున్న తన రెక్కలతో లేచినప్పుడు, ఈ మర్త్యుడు అమర్త్యతను పొందుకొనును, మనము పునరుత్తానము చెంది మధ్య ఆకాశమునందు కొనిపోబడి ఆయనను సంధించెదము. ప్రతీ ఒక్కరికి నిత్యజీవమును అనుగ్రహించుము. దీనిని మేము యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
25
పరిశుద్ధ గ్రంథము నుండి అద్భుతమైన, ఆసక్తికరమైన కథలను మనము చదువుచున్నందుకు నేనేంతగానో ఆనందించుచున్నాను. ఇది కేవలము చారిత్రాత్మకమైన ఒక దేవుని యొక్క చరిత్ర మాత్రమే కాదు గానీ నేటికి జీవించుచున్న మారని దేవుని యొక్క చరిత్రగా ఇది ఉన్నది.
ఇచ్చట ప్రార్థించుటకు ప్రార్ధనా వరుసకు స్థలము లేదని నేను నమ్ముచున్నాను. ఆ ప్రార్థనా అట్టలను వెలుపల వారు ఇచ్చిన యెడల రేపు రాత్రి మనము వారి కొరకు ప్రార్థించెదము. ఈ స్థలమంతా నిలబెట్టి ప్రార్థించుటకు మన దగ్గర ప్రార్థనా అట్టలు లేవని నేను నమ్ముచున్నాను. కాబట్టి ప్రార్థనా అట్టలు లేకుండానే ప్రతీ ఒక్కరి కొరకు ప్రార్థించుటకై ఒక అవకాశమును మీరు కలిగి యందురు.
ఇప్పుడు నీవు నమ్ముము. [సహోదరుడు బ్రెన్హాం అనువాదకుడితో మాట్లాడుచున్నారు.] మీరు వారికి వివరించియున్నారా? యేసు క్రీస్తు మీకు ఏమని వాగ్దానము చేసెనో కాపరి దానిని గురించి మీకు వివరించి ఉండును. ఆయన మారని అదే యేసుగా నేడు యుండిన యెడల ఆయన ఎల్లప్పుడూ అదే విధముగా ఉండును. ఆయన వాగ్ధానము సత్యము, ఆయన అప్పుడు చేసిన మాదిరిగానే నేడు కూడా చేస్తాడు. ఇంతక ముందు ఆయన ఇచ్చట చేసిన కార్యములను చూసిన వారు ఎంత మంది ఇచ్చట ఉన్నారు? ఎంత మంది ఆ విధముగా చూడనివారు ఇచ్చట ఉన్నారు. మీ చేతులను పైకెత్తండి. కేవలము సగము మంది.
26
ఆయన చేసిన ఏ కార్యములను చూడకుండానే చాలా మంది కొద్ది క్షణముల ముందే ఆయనను మీ రక్షకుడిగా అంగీకరించిరి. అది అద్భుతము. మంచిది. ఇప్పుడు మారని అదే దేవుడిని మీరు అంగీకరించిరి. ఆయన మీకు చేసిన వాగ్దానమును ఆయన నిలబెట్టుకుంటానని ఆయన చెప్పెను.
ఇప్పుడు క్రొత్తవారి కొరకు దీనిని చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ఒక కాపరిగా ఈ భూమి మీదకు వచ్చినప్పుడు, పేతురును ఆయన వద్దకు తీసుకొని వచ్చినప్పుడు, ఆ పేతురు ఎవరో ఆయనకు తెలుసు, అతడెవరో, అతడి గూర్చి మరియు అతడి తండ్రి పేరు ఏమిటో కూడా ఆయన చెప్పెను. అది నిజము. ఒక నిజమైన యూదుడు, ఒక నిజ విశ్వాసి, ఆయనను చూచి, “నీవు దేవుని కుమారుడవు” అని చెప్పెను.
ఫిలిప్పు ద్వారా నతానియేలు ఆయన యొద్దకు తీసుకురాబడెను. అతడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, అతను ఎవరో అతనికి చెప్పెను, అతను ఎక్కడ ఉంటాడో చెప్పెను. తరువాత అతను “రబ్బీ, నీవు దేవుని కుమారుడవు” అనెను.
సంఘములోని చాలా మంది ప్రజలు ఆయనను చూసి “ఆయన దెయ్యము, బయల్జేబూబు” అన్నారు. ఆయనను గూర్చి వారు వారి హృదయాలలో ఆ విధముగానే తలంచిరి. వారు దానిని హృదయములో తలంచిరి గాని బయటకు చెప్పలేదు. యేసు వారి ఆలోచనలను బయలుపరచెను. ఆయన ఇలా అనెను. “దాని నిమిత్తము నేను మిమ్మలను క్షమిస్తాను. కాని, ఒక దినాన పరిశుద్ధాత్మ వచ్చి ఇవే కార్యములను చేయును. ఒక్క మాట దానికి వ్యతిరేకముగా మాట్లాడినా మీకు ఈ లోకములో గాని రాబోవు లోకములో గాని క్షమాపణ లేదు.”
27
ఆయన సమరయ ప్రజలను కనుగొనెను. మీకు జ్ఞాపకమున్నదా, ఆయన అన్య జనుల యొద్దకు వెళ్ళలేదు, కేవలము సమరయుల యొద్దకు మరియు యూదుల వద్దకు హాము ద్వారా వచ్చిన సంతానం యొద్దకు, మరియు షేము ద్వారా వచ్చిన సంతానము వద్దకు వెళ్ళెను. అన్య జనులమైన మనము యాపేతు సంతానము.
ఇప్పుడు, ఆయన సమరయ స్త్రీని కనుగొన్నప్పుడు, ఆయన ఇలా అనెను, “వెళ్ళి నీ భర్తను తీసుకుని ఇచ్చటకు రమ్మ,” ఆయన, ఆమె హృదయములో ఏమున్నదో కనుగొనెను.
ఆమె “నాకు ఏ భర్త లేడు” అనెను.
“నీకు ఐదుగురు భర్తలుండిరి”
ఆమె ఇలా అనెను, “అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు ఈ సంగతులను తెలియచేయును, కానీ నీవెవరవు?”
యేసు, “నీతో మాటలాడుచున్నది నేనే ఆయనను” అనెను.
ఆమె నగరములోనికి వెళ్ళి “బయటకు రండి నేను చేసిన కార్యములను తెలియజేసిన ఈ మనుష్యుడను చూడుడి. ఈయన మెస్సయ్యా కాడా?” నిన్నటి దినమున మెస్సయ్యాను ఎరుగుటకు అది సూచనగా ఉన్నట్లయితే, నేడు కూడా ఆయన అదే మెసయ్యాగా ఉన్నట్లయితే, ఆయన అదే క్రియలను అదే విధముగా చేయును.
28
జన సమూహమును త్రోసుకుంటూ ఒక స్త్రీ ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన వస్రము యొక్క అంచును తాకినది. ఆమెకు రక్తస్రావమునకు సంబంధించిన సమస్య ఉన్నది. ఆమె తిరిగి జన సమూహములోనికి వెళ్ళి పోయినది. ఇది క్రొత్తగా వచ్చినవారికి ప్రయోజనముగా ఉండుటకు నేను చెప్పుచున్నాను.
గమనించండి, దేవునియొక్క వాగ్దానము గూర్చి నేను అబద్ధము చెప్పుచున్నానని మీరు తలంచుట లేదు కదా? ఆయన చేసిన వాగ్దానము విఫలమవ్వునా? ఆయన వాగ్దానం చేసిన యెడల దానిని ఆయన నిలబెట్టుకొనునని మీరు ఎరుగగలరు.
ఇప్పుడు ఆమె ఆయన వస్రమును తాకినది. అచ్చట ఉన్న జన సమూహములో అందరూ ఆయనను తాకుచున్నారు. కానీ ఆ స్త్రీ ఆయనను తాకిన వెంటనే యేసు ఆగి, “నన్ను తాకినది ఎవరు?” అని అడిగెను. అచ్చట ఉన్నవారందరూ “మేము కాదని” అనిరి. “ఎవరో ఒకరు నా వస్రములను తాకిరి, నేను బలహీనము చెందాను, ప్రభావము నాలో నుండిబయలు వెళ్ళెనని” ఆయన చెప్పెను. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూసెను. ఆయన ఆమెను కనుగొనెను. ఆయన ఆమెను చూసి ఆమెకు రక్తస్రావ రోగము కలదని మరియు ఇప్పుడు ఆమె యొక్క విశ్వాసము ఆమెను స్వస్థపరచినదని చెప్పెను. హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో ఏ విధముగా యేసుక్రీస్తు ఒక ప్రధాన యాజకుడిగా ఉన్నాడో అనే దానిని పరిశుద్ధ గ్రథంలో చెప్పుచున్న కథతో మీరు బాగా పరిచయము కలిగినవారు.
ఆయన ఒక్కడు మాత్రమే ప్రధాన యాజకుడు మరియు ఆయన మాత్రమే దేవునికి మరియు నరునికి మధ్యవర్తియై ఉన్నాడు. అది నిజము. ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి మధ్యవర్తిత్వము చేయుచున్నాడు. హెబ్రీలకు వ్రాసిన పత్రికలో పరిశుద్ధ గ్రంథము ఇలా చెప్పుచున్నది. “మన యొక్క బలహీనతలతో మనము తాకగలిగే ప్రధానయాజకుడు ఆయనే.
29
ఆయన మారని అదే ప్రధాన యాజకుడిగా ఉన్నట్లయితే మీరు ఆయనను తాకగలిగితే, ఆయన మారని అదే రీతిగా క్రియ చేయును. ప్రార్థన అట్టలు లేని వారై, రేపటి దినమున ప్రార్ధనా వరసలోకి ఇచ్చట ఉన్నవారు ఎంత మంది రాలేకపోవుదురో వారందరూ మీ చేతులను పైకెత్తి మహిమలో ఉన్న ఆయనను నీ విశ్వాసము ద్వారా ఆయనను నీవు తాకగలవని నీవు నమ్ముము. సరే, మంచిది.
ఇప్పుడు నీవు దానిని నమ్మని యెడల. ఇప్పుడు, ఇదియే బలపరీక్ష. ఒకటి దేవుని వాక్యము సత్యమై ఉండాలి లేదా అసత్యమై ఉండాలి. నేను దేవుని యొక్క నిజ సాక్షిగా ఉండాలి లేదా దేవుని యొక్క అబద్ధపు సాక్షినై యుండాలి. ఆయనే దీనికి సాక్షిగా ఉండి, ఆయనే న్యాయాధిపతియై తీర్పు తీర్చును.
30
మీలో ఎవరూ నాకు తెలియదు. ఇప్పుడు నిజమైన భయభక్తులతో దేవుని యందు నమ్మకము కలిగి యుండుడి. ఇటు, అటు కదలవద్దు. కేవలం భయభక్తులతో కొన్ని క్షణములు ప్రార్థించుచూ ఉండండి. (నా వివరణ కొరకు ఇప్పుడు మీరు సిద్ధంగా ఉండండి) నేను ఏ స్థానమందున్నానో దానిని మీరు ఖచ్చితముగా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. కానీ నేను దేవుని నమ్ముచున్నాను. క్రైస్తవ మతము మాత్రమే నిజమైన మతమని మీరు తెలుసు కొనునట్లుగా నేను దీనిని చేయుటకు ఆయన నన్ను పంపెను.
వెలుపల ఆ మూలలో ఒక బాలికతో కూర్చుని ప్రార్థించుచున్న ఒక స్త్రీని నేను చూచుచున్నాను. (నీవు నీ తలను పైకి ఎత్తగలవా) ఆ బాలికకు సరిగ్గా మాట్లాడలేని సమస్య కలదు. మీరు నమ్మినటైతే ఆ బాలిక స్వస్థతను పొందుకోగలదు. ఆ బాలిక చక్కగా మాట్లాడాలని నీవు ఆశించినయెడల మీ తలలను పైకి యెత్తండి. అది మంచిది. ఆ బాలిక వైద్యుడి యొద్దకు కూడా వెళ్ళి పరీక్షించుకొనెను. ఆ వైద్యుడు ఏమి చెప్పెననగా, “ఆ బాలికకు గొంతుకలోని టాన్సిల్స్ (Tonsils) లను తొలగించుటకు శస్త్రచికిత్స చేయవలయును. యేసు ఆ బాలికను స్వస్థపరచుననే నమ్మకముతో నీవు ఆ బాలికను ఇచ్చటకు తీసుకుని వచ్చావు. కాబట్టి నేను దేవుని యొక్క సేవకుడినని నీవు యెరిగి ఉండవలయును. ఆ బాలిక అమ్మమ్మ నీ ప్రక్కన కూర్చొని యున్నది. ఆమె తల్లి బయట చివర కూర్చొని యున్నది. అమ్మమ్మ ఆమెకున్న కడుపు నొప్పి సమస్య కొరకు ప్రార్థించుచుచున్నది. నేను దేవుని యొక్క సేవకుడినని ఆమెకు తెలిసియుండ వచ్చును. అది నిజము. నేను చెప్పునది నిజమని నీ హృదయమంతటితో నమ్ముచున్నావా? నేను నీకు తెలియదు. సరే మంచిది. సందేహించకుండా ఇంటికి వెళ్ళుము, అవన్నీ బాగవుతాయి. నీవు నమ్మవలయును.
31
ఇక్కడ ఒక పురుషుడు నా యెదురుగా కూర్చునియున్నాడు, మరియు అతను ప్రార్థన చేస్తున్నాడు. అతనికి కడుపునకు సంబంధించిన సమస్య ఉన్నది. అతని భార్య అతని ప్రక్కన కూర్చుని యున్నది. అమెకు స్త్రీలకు సంబంధించిన సమస్య యున్నది. నీ హృదయమంతటితో నీవు నమ్మినట్లైతే అప్పుడు నీవు స్వస్థత పొందుకోగలవు. నీవు నమ్మగలవా? నీ చేతిని పైకెత్తగలవా? సరే మంచిది. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచును. లేచి నిలబడి బాగవుము. ఆమేన్.
ఇక్కడ వెనుక కూర్చుని ఇటువైపే చూస్తున్న ఒక పురుషుడు, కడుపుకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడు. అయ్యా, నీవు నమ్మినట్లైతే, ఆ చివరలో కూర్చున్న రెండవ వ్యక్తి, నీవు స్వస్థపరచబడ్డావు. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచాడు. అంతా మంచిది. నమ్ముము.
ఎవరో ప్రార్ధన చేస్తున్నారు. అది ఒక పురుషుడు. అతనికి నరములకు సంబంధించిన సమస్య ఉన్నది. అతను నిద్రపోలేడు. అతను నిద్ర మధ్యలో లేస్తు౦టాడు. అతనికి క్యాన్సర్ వచ్చినది. అతను భయపడుతుంటాడు. నీవు దానిని గురించి మరిచి పొమ్ము ఈ రాత్రి నీవు ప్రశాంతముగా నిద్ర పోవచ్చును. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తాడు.
32
నాకు, మీరు ఒక సహాయము చేయగలరా, దేవుడు మిమ్మలను స్వస్థపరుచుట చూశాక, మీ వెనుక ఉన్న స్త్రీ, నీవు ఏదో ఒక రకమైన బాధతో బాధపడుచున్నావు. ఎప్పుడూ ఏదో ఒక మానసిక ఆందోళనతో బాధపడుతున్నావు. స్త్రీ లేచి నిలబడుము. అది నిజము. సహెూదరుడా, మీ చేతులను ఒకరి మీద ఒకరు ఉంచండి. యేసుక్రీస్తు నామములో, నేను దురాత్మను గద్ధిస్తున్నాను. సాతానా నీవు బయటపడ్డావు. యేసుక్రీస్తు నామములో ఆ స్త్రీ నుండి బయటికి రమ్ము. ఆమేన్, ఇప్పుడు నీవు బాగయ్యావు, నీవు వెళ్ళవచ్చును. ఆ దురాత్మ ఆ స్త్రీ మీదకు వచ్చినది. అది మరలా తిరిగి వచ్చినది!
ఆమె వెనుక ఒక స్త్రీ ప్రార్ధిస్తూ ఉన్నది. ఆమె యొక్క బాలుడు ఆమె ప్రక్కనే అచ్చట కూర్చుని ఉన్నాడు. ఆమె కుమారుడికి కూడా మానసిక సమస్య యున్నది. ఆ కుమారుడి కొరకు అతడి తల్లి ప్రార్థించుచున్నది. లేచి నిలబడుము. నీ చేతిని నీ కుమారుడి మీద ఉంచుము. యేసుక్రీస్తు నామములో, అది అతనిని వదిలి వేయును గాక, హల్లేలూయా! కేవలము నమ్ముము. విశ్వాసము ఉంచుము.
33
మీ ముందర ఇక్కడే ఒక స్త్రీ యున్నది. ఆమెకు వెన్నెముక సమస్య యున్నది. ఆమె అనేక సమస్యలతో బాధపడుతున్నది. ఆమె ఆకారము విహీనముగా ఉన్నది. ఆమె నన్ను గమనిస్తున్నదని నేను అనుకోవడం లేదు. వాండా ఓర్టెజ్. ఓర్టెజ్ నా మాటలను ఆలకించుచున్నావా? నీ కాళ్ళ మీద లేచి నిలబడుము. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తాడు.
నీవు నమ్మినట్లైతే, ఆమె అక్కడ ఉన్నది, ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడి ఉన్నది. ఆమెకు బాగైయున్నది. వారు దేనిని తాకి యున్నారు? నన్ను కాదు. వారు ప్రధాన యాజకుడిని తాకి యున్నారు, పరిశుద్ధాత్మలో యేసుక్రీస్తు యున్నాడు. సుమెయోనుని అదే ఆత్మ నడిపించెను.
ఇక్కడ వెనుక మళ్ళీ చివరలో కూర్చుని ఉన్న ఒక స్త్రీ ఉబ్బసం రోగముతో బాధపడుతున్నది. నీ కాళ్ళ మీద లేచి నిలువుము. అది మంచి విశ్వాసము. కానీ ఒక విషయము, నీకు ఎంతో అవసరమై ఉన్నది. అదేమనగా యేసుక్రీస్తును నీ స్వంత రక్షకుడిగా నీవు అంగీకరించవలయును. నీవు ఆయనను నీ స్వంత రక్షకుడిగా అంగీకరించెదవా? అదే ఒక పాపికి కావలసిన నిజ విశ్వాసము. నీ చేతులెత్తి, రక్షణను పొందుకొనుము. నీ పాపములు క్షమింపబడును. సమాధానముతో వెళ్ళుము. హల్లేలూయా!
34
ఆ స్త్రీ వెనుకనే ఒక పురుషుడు ప్రార్ధన చేస్తున్నాడు. అతనికి నరముల సమస్య యున్నది. అతని భార్య అతని ప్రక్కన కనిపిస్తున్నది. ఆమెకు మధుమేహ వ్యాధి ఉన్నది. అది నిజము. నీ కాళ్ళ మీద లేచి నిలబడుము. యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును.
ఆ స్త్రీ మాదిరిగానే మరొక స్త్రీ అక్కడ ఉన్నది. నీ కాళ్ళమీద లేచి నిలువుము. నేను నీకు తెలియదు, నీవు నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తుకు నిన్ను గూర్చి తెలుసు. దేవుడు, నీ సమస్య ఏమిటో నాకు చెప్పినట్లైతే, నేను ఆయన ప్రవక్తను అని నీవు నమ్ముతావా? నీ చేతులను పైకెత్తుము. నీకు స్త్రీల సమస్య ఉన్నది. నీవు వైద్యుడిని కలిశావు. ఆ వైద్యుడు నీకు శస్త్రచికిత్స చేయాలి అని చెప్పెను. అది నిజము. నీవు నన్ను నమ్ముతావా? నీవు ఏ సంఘమునకు చెందినదానవో నేను చెప్తాను. నీవు బాప్తిస్టు సంఘమునకు చెందినదానవు. నీ చేతులను పైకెత్తుము.
35
ఆమె ప్రక్కన ఒక పురుషుడు కూర్చుని ఉన్నాడు. అతను వీర్యగ్రంధి (Prostate) సమస్యతో బాధ పడుతున్నాడు, రాత్రులు పైకి లేస్తాడు. నీవు నమ్ముతావా. [టేపు మీద ఖాళీ ఉన్నది.] అది నిజము. నీ కాళ్ళ మీద లేచి నిలువుము. నీ హృదయమంతటితో నమ్మము. బాగవుము, గృహమునకు వెళ్ళుము.
వరసలో దిగువన కూర్చున్న. అక్కడ కూర్చున్న వారి మీద నల్లటి నీడ ఉన్నది. మీరు నమ్మండి. నీవు నమ్ముచున్నావా? నీ స్వస్థతను నీవు అంగీకరించుము, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచునని నీవు అంగీకరించుము. హల్లెలూయా!
36
ఇప్పుడు మీరు నమ్ముతారా? ఇప్పుడు, యేసుక్రీస్తు, దేవుని కుమారుడని మీరు నమ్ముతారా? ఇప్పుడు మీరు నమ్మినట్లైతే ప్రతి ఒక్కరూ స్వస్థపడతారు; మీరు నమ్మినట్లైతే, మీరు లేచి మీ కాళ్ళమీద నిలబడండి. ఓ, ప్రభువా ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు నామములో స్వస్థపరుచుము. ఓ, ప్రభువా, నీ సేవకుడి ప్రార్థనను ఆలకించుము. సాతానుని సవాలు చేయుటకు నేను ఇక్కడకు వచ్చియున్నాను. నీవు బయటపడ్డావు. కేవలము నీవొక అబద్ధకుడివి. యేసుక్రీస్తు నిన్ను ఓడించెను. మా మీద నీకు ఎటువంటి చట్టపరమైన హక్కులు లేవు. నీవు ఓడించబడ్డావు. యేసుక్రీస్తు నిన్ను ఓడించెను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బయటకు రమ్ము.