ఇచట నీవేమి చేయుచున్నావు?

ఇచట నీవేమి చేయుచున్నావు?

VGR COUNT -163 సహోదరుడా, నెవిల్! ధన్యవాదములు మీకు ఈ ఉదయం నేను చెప్పినట్లుగా ప్రభువు యొక్క మందిరానికి వచ్చుటయనునది అది ఎల్లవేళల మంచిది. గతదినము, నా యింటిలో పాడినటువంటి ఒక పాటను పాడుటకు, ఈ రాత్రి యిక్కడున్న ఒక చిన్న కుమారిని పిలువాలని ఒక విధమైన భావన కల్గియున్నాను. ఆమె, యింకా ఆలస్యమైతే అందుకై మనకింకా సమయముందని నేననుకుంటున్నాను. ఆ చిన్న పాటను నీవక్కడ పాడితివి. కుమారి జఫరీస్, నీవేమనుకుంటున్నావ్? పాట పాడుచున్నప్పుడు నేను లోపలకు వచ్చి, అది విన్నాను మరియు అది నేను ఎంతో యిష్టపడ్డాను. తిరిగి అది పాడమని నిన్ను అడుగుటవలన నేను నిన్ను ఇబ్బంది పెట్టుట లేదని అనుకుంటున్నాను. “ఆయన పేరు నాకు చెప్పు” లేక ఆలాటిది మరియొకటి. అది అదేనా? దానిని మరలా నేను వినుటకు ఆశపడుతున్నాను. మీరందరు కూడా అది సంతోషిస్తారని నాకు తెలుసు.

2

[“ఆయన పేరు మరలా నాకు చెప్పు” అను పాటను సహోదరి జఫరీస్ పాడుచున్నది.]

ఓ! నేనది సత్యమైనదిగా నమ్ముతాను. ఆయన నామము నేను ప్రేమిస్తాను. ఆ చిన్న స్త్రీ అది పాడుచున్నప్పుడు ఆ విధముగా తలంచుటకు కారణమేదో మీకు తెలుసా? నా యొక్క చిన్నారి కుమార్తె రెబ్కాకు, ఆమె పాఠశాలలోని బాల్య మిత్రురాలు మరియు నిన్న ఉదయం గదిలో వెనుక యుండి ఒకటి చేస్తున్నాను. ఆ పాటను నేను విన్నాను. నేననుకున్నాను, “సరె ఒక సారి ఆలయంలో ఆమె దానిని పాడుటకు నేను అనుమతిస్తాను,” అని నేననుకున్నాను.

3

పిల్లలను రహదారిన, పాఠశాలకు నేను తీసుకొని వెళ్తూ పాట పాడుటను గూర్చి ఆమెతో మాట్లాడాను. “నేను పైకెత్తుతాను.” అదే మాటలతో నేనది చెప్ప లేక పోవచ్చును అని ఆమె అన్నది. అయితే “నిన్నటి రాత్రి నేను లేచాను, లేక, పడకలోనేయుండి, ఆ పాటను గూర్చి ఆలోచన చేస్తున్నాను. మరియు అంతటి ఆశీర్వాదమును నేను పొందుకున్నాను,” అని ఆమె చెప్పినది.

మంచిది, ప్రత్యేకముగా ఇలాంటి వర్గంలో, ఈ నగరంలో పరిశుద్దాత్ముడు వారిని దీవించాడని మాట్లాడాలంటే (నిజంగా) ఒక యౌవన ఆడపిల్లకు అది అసాధారణమైనదని నేను అనుకోనుచున్నాను. మనకింకా అటువంటి యౌవన బాలికలు అనేకమంది కావాలి. మనకు కావలసియున్నది. కొద్ది నిముషాల కితం ఇక్కడే ఇప్పుడే పాడినటువంటి ఈ మరొక బాలిక కూడాయున్నది. ఆమె యొక్క పేరు నాకు తెలియదు. అయితే, ఆ చిన్న బిడ్డలు, చిన్న యౌవన బాలికలు పాడుతూ ఆనందిస్తున్నారు.

4

మనము వేయు అడుగులు మరొకరికి అవి మాదిరియగునని, మీకు తెలుసా ? నిజంగా అవియుంటివి.

కొద్ది సంవత్సరాల క్రితం ఒక పాతకథ. ఇంగ్లా౦డులో ఒక మనిషి ఉన్నాడు. క్రిస్మస్ సమయంలో అతడు వెళ్ళిపోయి ఒక సహవాస సూచనగా కొద్దిపాటి స్నేహ పూర్వకమైన త్రాగుడు త్రాగుదామనుకున్నాడు. మరియు అతని యిరుగు పొరుగు వారి యొద్దకు వెళ్ళిపోయాడు. బహుమతులు యిచ్చిపుచ్చుకుంటున్నాడు. ప్రతి యొక్కరు అతనితో అంటున్నారు, “జాన్ ! ఇది కొంచెం త్రాగు” అని. ఒక చిన్న గుక్క యిక్కడ మరియు చిన్న గుక్క అక్కడ త్రాగాడు. నిజంగా అతడు మత్తెక్కి పోయాడు. మరియు తనయొక్క యింటిదారిన ఆరు అంగుళాలమంచు వచ్చేసింది. చిన్నవాడైన అతని యొక్క కుమారుడు అతనిని వెంబడిస్తున్నాడు. అతనిని అతడు ఎత్తుకోలేకపోయాడు. అతడు బాగుగా త్రాగియున్నాడు. అతడు తన యింటి దారిలో ఉన్నాడు. అతడు చుట్టూ తిరిగి చూడడం తటస్తించినది. అతని యొక్క చిన్న కుమారుడు సంపూర్తిగా మంచులో దొర్లుకొని పోతున్నాడు. “కుమారుడా! ఎందుకని నీవు మంచులో దొర్లుతున్నావు ?” అని అడిగాడు ఇతడు.

“నాన్నా! నేను నీ అడుగు జాడలను వెంబడించుటకు ప్రయత్నం చేస్తున్నాను,” అని అతడన్నాడు.

ఇతడు ఆ చిన్న బిడ్డను చంకల్లోకి ఎత్తుకొని “దేవా, ఈ దినము మొదలుకొని మరొక సారి పానీయాన్ని నేను స్వీకరించను,” అని అన్నాడు.

ఒకరు నీ యొక్క అడుగుజాడలను అనుసరిస్తున్నారు. ఊయల నుండి కల్వరి వరకు ఆ సరళమైన దారిననే నడుద్దాం. అవే అడుగుజాడలు. మనము నడుచుటకు వాటిని కల్గియుందాం.

5

ఇప్పుడు, ఈ రాత్రి ప్రభు-రాత్రి-భోజనపు రాత్రియని నాకు తెలుసు. వాక్యములో నుండి మీతో మాట్లాడుటకు నాకు కొద్దిగా సమయముంటుంది. మరియు నేను - ఆయనను గూర్చి మాట్లాడుటకు నేను యిష్టపడతాను. ఎందుకనగా ఆయన నాకు ఎంతో వాస్తవమైనవాడు.

కొంచెంకాలం క్రితం ఒక చిన్న విషయాన్ని నేను చదువుచుంటిని. తిరిగి ఆడపిల్లలను గూర్చి ఆలోచన చేయుదము. అది పశ్చిమ ప్రాంతమున జరిగినది. అది గర్జన చేస్తూ ఎత్తైన గాలులు వీచుచున్న తుఫాను రాత్రి అది. అక్కడ కొందరు ప్రార్థనా కూటము జరిగించుకుంటున్నారు. ఎవరైతే ప్రార్థనా కూటమును నడిపించుచుండెనో, ఆమె చాలా ఆకర్షనీయమైన స్త్రీ ఆమె, అపాయకరమైన స్థితిలో యుండునని ఆమె తలంచలేదు. ఎందుకనగా వీధికి మూలగా యున్న ఒక చిన్న నగరములో ఆమె నివసిస్తున్నది.

సహజంగా రాత్రి సమయాలలో వీధులలో చాలా మంది ప్రజలుంటారు. ప్రార్థనా కూటము ముగించబడగనే, ప్రభువుకు వారు పాటలు పాడుతారు. వారి హృదయాలు ఆనందంతో నిండిపోయినవి. కొంచెం సమయం క్రితం సహోదరుడు బీలర్ సాక్ష్యము చెప్పుచూ అనుభూతిని పొందినట్లుగా సంపూర్తిగా వారు ఆలాగున్నారని అనుకుంటాను. వారెంతో సంతోషంగా యుంటారు. ఆనందాన్ని పట్టుకోలేక పోయారు. వారి యొక్క పంక్తిలో నుండి ఒక వైపునకు వెళ్ళిపోతారు.

6

ఆఖరు “ఆమేన్” చెప్పునప్పటికి వారి యింటి మార్గాన్ని వారు తయారు చేసుకుంటారు. (ఈ) చిన్న యౌవన స్త్రీతన కోటు తీసుకొని, కాలర్ పైకి లాక్కొని ముందు కోటుత్రాడు బిగించుకొని వీధిలోకి వెళ్ళిపోయినది. చలితో నున్న ఆ రాత్రి, ప్రతి యొక్కరిని కూడా వారి స్వంత ఇటిలోని చలిమంట యొద్దకు నడిపించినదని ఆమె తెలుసుకున్నది. ఆమె ఒక్కతె మాత్రమే వీధి బయట యుండెనని ఆమె తెలుసుకున్నది. ఆమెను ఓక అపాయము వెంటాడుచున్నట్లు అది కన్పించినది.

రాబోతున్న సంగతులను గూర్చి, అట్టి అపాయముల నుండి తప్పించుకొనుటను గూర్చి మనలను పరిశుద్ధాత్మ హెచ్చరించుచున్నందుకై నేనెంతో ఆనందంగా యుంటాను, అది మీకు తెలుసా?

మరియు ఆమె భయపడిపోతానని అసలు అనుకోలేదు. లేదు, నేను ఎన్నడు ఒంటరికాను, అను పాత-పాటను ఆమె పాడుకుంటున్నది. ఆమెను ఎవరూ యిబ్బంది పెట్టరు అన్నట్లుగా ఆమె వెళ్ళిపోతుంది. నగరం మధ్యలోకి వెళ్ళిపోయినది. అయితే అకస్మాత్తుగా పెద్ద భయం మరల అక్కడ పుట్టుకువచ్చినది. సమీపంగా ఒకరు నిలబడినట్లు ఆమె చూచినది. నిజంగా భయంకరంగా కన్పించుచున్న ఒక పురుషుడు, ఆమెవైపే చూచుచు అతని చేతులు ఈ విధంగా పెట్టుకొని అక్కడ నిలబడియున్నాడు. ఆమె వైపే వస్తున్నాడు.

7

తప్పించుకొనుటకు యిక దారిలేదు. ఇది నిజమైనకధ. కాబట్టి ఆమె పరుగెత్తలేదు. అతడామెను పట్టుకోగలడు. చేయవలసిన ఒకే ఒక విషయం. ఆమె కేకలు పెట్టలేదు. ఆమె యొక్క శరీరాన్ని వీధిలోనుండి ఎత్తివేయునంతగా గాలులు బలంగా వీస్తున్నవి. ఎవరిని ఆమె కేకవేయలేదు. మంచు అలా అంధకారం చేసివేసినది. చేయవలసినది ఒకటే యొకటి మాత్రమే. అది ప్రార్థన చేయుట. కాబట్టి ఆమె స్వరంలో ఆమె ఆరంభించినది. గుసగుసలాడునట్లుగా దేవునికి ప్రార్ధిస్తుంది.

అదెక్కడ నుండి వచ్చినదో ఆమెకు అది తెలియదు అని ఆమె చెప్పినది. అయితే అకస్మాత్తుగా, ద్వారం ప్రక్కగనే, పెద్ద కుక్క నిలబడియున్నది. దాని వెంట్రుకలు పొడుచుకొనియున్నవి. ఆమె ప్రక్కకు నడచి వచ్చినది. ఆ పురుషుడు ఎక్కడున్నాడో ఆ ప్రక్కకు వచ్చినది. గుర్రుగుర్రుమని భయంకరంగా అరుపులు అరుస్తూ ఆ పురుషుని వెంట వెళ్ళినది. వీధిలోని పురుషుడు వెళ్ళిపోయిన వెంటనే, కుక్క వెనుకకు తిరిగి, తిరిగి వచ్చి ద్వారం యొద్ద పండుకొన్నది.

దేవుడు తనయొక్క స్వకీయులను గూర్చి జాగ్రత్త తీసుకొనును. దేవుడు, కొన్ని మారులు చిట్ట-చివరకు ఒక కుక్క ద్వారానో లేక ఒక జంతువు ద్వారానో లేదా ఒక విధమైన యొక మార్గము ద్వారానో ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క భద్రతను చూపించుటకై ఆయన కార్యము చేయును. అనుదినము నేను నా యొక్క పాపములు ఒప్పుకొనుచుండగా, అవి ఆయనయొక్క రక్తము క్రిందయున్నవను నిశ్చయతతో నా యొక్క పాపములకు క్షమాపణగలదని నేనాయనను ఎరిగియున్నందుకు ఎంతగానో ఆనందిస్తున్నాను.

8

ఈ ఉదయం వర్తమానములో, నేను నరికేవానిగాను లేక కొంచెం కరుకుగా కన్పించవచ్చును. అయితే స్వస్థత కూడిక కొరకై అది యంత పెద్ద పాఠము కాదు. అయితే, ఇది ఎరుగుట కొరకు నాకు చాలా కాలం పట్టినది. సహోదరుడా టోనీ: ఒక మనిషి అతడు చేయుటకు నడిపించబడుటకు అతడు అలాగే చేస్తున్నట్లయితే దాని మిగతా విషయాన్ని దేవుడు ఒక ప్రవీణత మార్గముతో జాగ్రత తీసుకుంటాడు. మొదటి సారి, యిక్కడ అది ఆలాగే జరిగింది. సహజంగా, మేము ప్రార్థనా అట్టముక్కలు యిస్తాము మరియు ప్రజలను నిలబెడతాం. ఆయితే, సంపూర్తిగా అది ముగించుటకు ఎంత మంది భవనములో క్రొత్తవారున్నారు, అని అడుగునట్లు పరిశుద్ధాత్మ చేయును. మరియు ఆ తరువాత వారికి వారి యొక్క కోరికలను ఆయన తెలియపరచును. మరియు - మరియు వారి యొక్క స్వస్థత, తదితర మైనవాటిని ప్రకటించును. ఆలాగు చూపించుటకు వెళ్ళును. “అర్పణ అర్పించుటకంటె విధేయత చూపుట శ్రేష్టము. పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించుటకంటే. మాట వినుట శ్రేష్టము.”

కాబట్టి, ఈ రాత్రి కొద్దిక్షణాలు మాట్లాడుటకై ఒక చిన్నలేఖనమును నేను యిక్కడ ఎన్నుకున్నాను. మనమది చేయకముందు, ప్రార్థనలోఒక క్షణం తలలు వంచుకుందాం.

9

ప్రభువా! నీవు యుగయుగములు దేవుడవైయున్నావు. నీ యెదుటకు మేము ప్రార్థనా మార్గములో వచ్చుటకు మేము కల్గియున్న తరుణమును బట్టి నీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. నా నామమును బట్టి మీరు నన్నేది అడిగినను, నేను చేసెదనని, అది మా కొరకైన వాగ్దానమని మొదట మేమెరిగియున్నాము. నీవు మా మనవికి అనుగ్రహము చూపుతావని నిశ్చయతను మేము కల్గియున్నాము.

ముందుగానే ఎంతో జరిగిపోయింది. ఈ రాత్రి, మేము కూటము ముగించి యింటికి వెళ్ళిపోయినట్లయితే, “ఇక్కడ యుండుట మంచిది” అని చెప్పు విధముగా మేము భావించునట్లు అదియుంటుంది. శ్రోతల మధ్య పాడిన ఈ సీయోను పాటలు వినుట! ప్రార్థనలో వారి ధ్యానములలో మరియు వారి పాటలలో వారి యొక్క పలుకులు ప్రజలు పలుకుట వినుట వలనను; యిక్కడే యుండుట మంచిదని అని మేము చెప్పగలము. మీ హృదయములలో ఆనందించు, ఆత్మ సంబంధమైన పాటలు పాడుచు అని లేఖనము చెప్పినట్లుగా అదియుంటున్నది. ఈ నవ యవ్వన చిన్నారుల పాటలు వినుట వలన అలాగున్నది. మా యొక్క సహోదరుడు బీలర్ ద్వారా ఈ రాత్రి అది వ్యక్తం చేయబడినట్లుగా మేము జీవించుచున్న ఈ చీకటి ఘడియలో సీయోను పాటలు వారు పాడుట ఎంతటి ధన్యతయో గదా ! నిన్నే విధముగా మెచ్చుకొనియుండెనో, మరియు నీవేమేమి చేసియుంటివో మరియు నీవు అతనిని ఎంతగా అంగహీనతనుండి లేపితివో, ఆ ముంజేయి లేకుండా అతడేమి చేయాలో అతను అది యిప్పుడు గ్రహించుట యనునది సహోదరుడు బీలర్ నీకు వ్యక్తము చేయుట వినుట. మేము నీ యొక్క కృపా బలముల వలననే భద్రపరచబడియున్నామని అది చూపుచున్నది.

10

ప్రభువా! ఈ రాత్రిలో మేమందరము జాగ్రత్తగా యుందుముగాక ! ఎందుకనగా, మేము జాబితాను తయారుచేసికొను సమయము యిదేనని, పరీక్షచేసికొను సమయము ఇదేనని నేను అనుకుంటున్నాను. ఎందుకనగా నిష్క్రమించు సమయం ఎప్పుడౌతుందో మాకు తెలియదు. అది మేము తలంచని దానికంటె ముందు కావచ్చునేమో కాబట్టి ఈ రాత్రిలో మా యొక్క మార్గములు మరియు తలంపులను మేము పరిశీలించుకుంటున్నాము.

మరియు వాక్యములో నుండి కొద్ది క్షణాలు నీవు మాతో మాట్లాడమని మేము ప్రార్ధిస్తున్నాము. అటు తరువాత జరుగు ప్రభు-రాత్రి-భోజనపు కూటములో మరలా మమ్ము ఆశీర్వదించుము. ఈ కోషెరు రొట్టెయొక్క విరచిన ముక్కలను మరియు ద్రాక్షా రసమును మేము తీసికొనుచుండగా, పాప-క్షమాపణ కొరకైన నీ యొక్క విరువబడిన శరీరమునకు, చిందించిన రక్తమునకు పోలికయైయున్నది.

మాకత్యంత ప్రియమైన కాపరి ఈ రాత్రి బాగుగాలేడు. అయితే మా యొక్క టెలిఫోను సహ సంభాషణలో దానినతడు బలిపీఠముపై పెట్టియుండెను. ప్రభువా! నీవది స్వీకరించితివని నిశ్చయంగా నేను నమ్ముతున్నాను. తరువాత కూడా అతని కొరకై నేను ప్రార్థనను అర్పించాను. ఎందుకనగా మేమతనిని ప్రేమిస్తున్నాము మరియు అతడు మాకు అవసరమైయున్నాడు. అతని కొరకు, అతని కుటుంబం కొరకై మేము ప్రార్ధిస్తున్నాము మరియు యిక్కడున్న ప్రతి కుటుంబం కొరకు మరియు ఈ రాత్రి చెప్పబడిన, చెప్పబడకుండిన ప్రతి యొక్క విజ్ఞప్తి కొరకు కూడా ప్రార్ధిస్తున్నాము. మిగిలిన కూటమంతటిలో మమ్ములను దీవించుము. నీ కుమారుడైన యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

11

ఇక్కడ లేఖనములయందలి కొద్ది భాగమును నేను చదువాలని ఆశపడుచున్నాను. మొదటి రాజులు 19 లో 9వ వచనము ఆరంభము నుండి అది కనుగొనుచున్నాము.

అచ్చట ఉన్నయొక గుహలో చేరి బస చేసెను. యోహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై - ఏలీయా, యిచ్చట నీవేమి చేయుచున్నావని అతని నడుగగా

అతడు - ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి, సైన్యములకధిపతియు దేవుడునగు యోహోవా కొరకు మహా రోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను...

అందుకాయన - నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చెను. అంతట యెహోవా ఆవైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను; శిలలు ఛిన్నాభిన్నములాయెనుగాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు.

ఈ భూకంపమైన తరువాత మెరుపు పట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను.

ఏలీయా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలచెను. అంతలో ఏలీయా, ఇఛ్ఛట నేనేమి చేయుచున్నావని యొకడు పలికిన మాట అతనికి వినబడెను.

కొద్దిక్షణాల కొరకై నేనొక పాఠమును తీసికొనుటకు ఆశించుచున్నాను: “ఇచట నీవేమి చేయుచున్నావు?”

12

ఏలీయా అది యొక కఠోరమైన దినముగా గడిపాడు. అతడు కర్మెలు పర్వతముపై యుండియుండెను మరియు ప్రభువు యొక్క మహిమ దిగివచ్చుట అతడు చూశాడు. ఆకాశమునుండి అగ్ని దిగివచ్చుటకు అతడు ప్రార్ధి౦చాడు. అటు తరువాత భూమి పైకి వర్షము వచ్చుటకును ప్రార్ధి౦చాడు. ఇట్టి తీవ్రతతో కూడిన వీటన్నిటిలోను, అతని యొక్క నరములు బలహీనపడిపోయినవి. ఓ ! అతన్ని గూర్చి నేనెంతగా తలంచవలసియున్నదో!

వెనుకబడిపోయిన దేశపు ప్రజలకు బోధించుట, ఇక్కడే, ప్రధమంగా మనం అతనిని చూస్తున్నాము. ఆమె యొక్క మార్గమును కోరుకున్న ఆ యొజెబెలుకు బోధించుట. దేవుని విడచిపెట్టి, ఆయన ఆజ్ఞలన్నీటిని, ఆయన యొక్క వాగ్దానాలను విడచిపెట్టి మరచిపోయిన స్థానమునకు ప్రజలు వచ్చారు. ఇక ఆయన కట్టడలను గైకొనరు, ఆయన యెడల జాగ్రత్తే వారికి లేదు.

ఏలీయా వీటన్నిటి మద్య అతడు రాజీపడలేదు. తన యొక్క ఒప్పుకోలుకు సత్యముగా తాను నిలబడవలసివచ్చెను. ఓ! ఈ దినానికది ఎంతగా ప్రతిబింభించుచున్నదో!

13

యొజెబెలు అను పేరుగల ఒక రాణిని అక్కడే వారు కల్గియున్నారు. ఆమె యొక్క విడ్డూరమైన జీవన నవీన నాగరికత మార్గాన ఇశ్రాయేలీయులనందరిని ఆమె త్రోవ తప్పించినది. వ్యభిచరించుటకు మరియు చెడ్డ కార్యములు వారు జరిగించుటకు ఆమె కారకురాలైనది. ఈ దినమునకు అది యొక మంచిపోలికగా లేదా?

అయితే, వాటన్నిట మధ్య ఏలీయా యుండి యుండెను. అయినప్పటికి ఇశ్రాయులీయులలో అనేక మంది, వారిలో వేల వేలమంది రాజీపడిపోయారు. నవీన నాగరికత జీవన నడవడిలో జీవించుటకు ఆశపడ్డారు. అయినప్పటికి, ఏలీయా రాజిపడలేదు, యొజెబెలు, ఆమె ఏమి చేయవలసియున్నది, ఆమె యొక్క స్థానమేదో అతడామెకు తెలియజేశాడు, ఓ ! ఆమె ఆ యొక్క ప్రవక్తను ద్వేషించినది. అయితే, ఆ విధముగనే అతనిని ఆమె, తన యొక్క కాపరియని ఒప్పుకొనలేదు.

అతడు బాప్టిస్టుగాని, ప్రెస్బిటేరియన్గాని లేక అది ఏదైనను, ఒక ప్రజల యొద్దకు దేవుడు - పంపిన మనిషిని, సంఘకాపరిగా వారందరియొద్దకు పంపినప్పుడు ఓ! చాలాసార్లు వారది అంగీకరించరు. దేవుడు ఆయన మనిషిని ఆయన అభిషేకించును. అతడు రాజీపడడు. ప్రజలు కొన్ని సార్లు అతనిని ద్వేషిస్తారు. ఎందుకనగా సత్యము కొరకై అతడు నిలబడతాడు. అయితే, అయినప్పటికి ఆ ఘడియకు అతడు దేవుని యొక్క కాపరి.

14

ఓ! ఆమె అతనిని తిరస్కరించినది. ఆమె అతనిని చంపుటకు చేయగలిగినది ఏదైనచేయగలదు. అయినను అతడు దేవుని యొక్క నియమ నిబంధనలకు దేవుని యొక్క పద్దతులకు అతడు నమ్మకస్తుడుగాయుండెను. ఆమె యొక్క నవ-నాగరికత సంబరాలు, సాంఘిక కార్యకలాపాలు మరియు ఆమె యొక్క ముఖమునకు రంగులు పూసుకొనుట, ఆమె ధరించు వస్త్రములు, ఆ దేశాన్ని కలుషితం చేసినవి. వృద్దుడైన ఏలీయా నిమ్మళంగా లేడు. ఆమె ఎక్కడున్నదో నేరుగా ఆ స్థానాన్ని ఆమెకు తెలియజెప్పాడు.

దేవా, యింకా ఎక్కవ మంది ఏలీయాలను ఈ దినమున మా కొరకు పంపుము. అదెంత బాధగా మాకగుపించినా ఫరవాలేదు. పాపముతో రాజీపడకుండ సత్యమును బోధించు వారిని పంపుము. ప్రతియొక్క ప్రజల సముదాయములోను, లోక కార్యకలాపాలయందు రాజీపడని సేవకులు ఆయనకున్నారు.

15

నవీన నాగరికత ప్రవృత్తి పద్దతులను ఏలీయా యిష్టపడలేదు. కాబట్టి అతడు దేవునికి నమక్కస్తుడుగా నిలబడ్డాడు. ముఖాముఖిగా ఎదుర్కొను సమయం వచ్చినది. ముఖాముఖిగా కలసికొనునది మరలా వచ్చినది. అన్నిఅద్భుతాలు జరుగు దినములు గతించిపోయినవి యని వారు తలంచుచుండగా, అద్భుతాలు అనునటువంటివి జరుగవు అని కూడా వారు తలంచుచుండగా, అది నమ్మిన ఒకడు అక్కడ యున్నాడు. అతడు కర్మెలు పర్వతము పైన నున్న ఏలీయా, “మీ యొక్క ప్రవక్తలనందరిని తీసుకొనిరండి. యిక్కడ పర్వతం యొద్దకు వారిని తీసుకొనిరండి; ఎవరు దేవుడైనది మనము ఋజువు చేద్దాం” అని అతడు అన్నాడు. ఈ లేఖనమును నేను యిష్టపడుతున్నాను.

ఓ! ఏదైన ఒక స్థలము, కాలము, అనునవి యుండవలసి వచ్చినట్లయితే, నిజమైన దేవునిశక్తి ఋజువు కావలసివచ్చినట్లయితే, అది ఈ రోజే యౌతుంది. దేవుడు ఏమైయున్నది మనం ఋజువు చేద్దాం. విద్య యనునది స్వాతంత్ర్యానికి శ్రేష్టమైనదియైనదైతే అదెందుకు పనిచేయదు? సామాజిక సామర్ధ్యతలు తదితరమైన విశ్రేష్టమైనట్లయితే అదెందుకు పనిచేయదు?

మన యొక్క సహ పనివారిగా (లేక మిత్రులుగా) యుండుట కొరకై యితర దేశాలకు మనము చెల్లింపులు చేస్తున్నట్లయితే. మరి వారు తమ మడిమలను మనకు వ్యతిరిక్తముగా (లేక మిత్రులుగా) యుండుట కొరకై యితర దేశాలకు మనము చెల్లింపులు చేస్తున్నట్లయితే. మరి వారు తమ మడిమలను మనకు వ్యతిరేకముగా ఎత్తినట్లు మనము చూస్తున్నాము. ఎంత త్వరగా వారదిచేయాలో ఆలాగు వారు చేస్తున్నారు. డబ్బు చేత నీవు స్నేహాన్ని కొనుగోలు చేయలేవు. స్నేహమనునది దేవుని యొక్క వరము.

గొప్ప గొప్ప సంఘాలు, గొప్ప సందేశకులు మార్గదర్శకులుగా ఉన్నట్లయితే, మరి ఎందుకని మనలోదేవుని నమ్మినవారు ఎక్కువ మంది లేరు? ఎందుకని మనమింకా వెనుకబడిన వారిగా వెనుకకు జరుగుతూ ఉన్నాము విధ్య సంబంధిత ప్రణాళికలు, తర్ఫీదునొందిన వేదిక బోధకులు, ఎంతగానో నిపుణత నొందిన సంగీత పాటగాళ్ళు మనకున్నట్లయితే, ఎడతెరపు లేకుండ ఎప్పుడు కూడా మనము దేవునికి దూరమై పోతున్నాము. కాబట్టి అది పనిచేయదు.

విజ్ఞాన శాస్త్రం చేసిందేంటి ? విజ్ఞాన శాస్త్రమును గూర్చి మీరు యిలాగు చెప్తారు “దానిని, దీనిని అది విజ్ఞాన శాస్త్రము చేయు సమయం వచ్చును” అని వారు చేసినదేంటి? ప్రపంచం మొత్తమును నాశనము చేయనంతగా వారు మనలను తీసికొనివచ్చారు. వారేమి చేయుచున్నారు? ప్రపంచమును వారు బాగుచేయుటకు బదులుగా దానిని వారు పగులగొడుతున్నారు.

16

ఈ మధ్యనే సంయుక్త రాష్త్రముల యొక్క బాలలు సంభందితమైన యఫ్. బి.ఐ. వారికి సంబంధించిన నాయకుడైన అల్ ఫెర్రర్, అతని కార్యాలయములో నేను౦టిని. అక్కడ షూటింగ్ గేలరీలో (తుపాకీ పేల్చు నిర్వహణ స్థలము) అతనిని యేసు క్రీస్తు యెద్దకు నడిపించిన తరువాత అతడు అడిగాడు: సహోదరుడా బ్రాన్హం! నేను బాప్టిస్ట్ వాడను. నీవు బాప్టిస్ట్ వాడవని నేను విన్నాను,“ అని అడిగాడు.

“అవునండి,” అని నేను అన్నాను.

“అయితే, నీవు మాట్లాడుచున్న పరిశుద్ధాత్మను నేను పొందలేదు” అని అతడన్నాడు. “అది నాకు కూడా సంబంధించినదని నీవనుకుంటున్నావా?” అని అడిగాడు.

“అవున౦డి,” అని నేను చెప్పాను.

అతడు చెప్పాడు : “సరే, నేకొక మంచి గదిని ఒక మంచి అద్దె యింటిలో ఏర్పాటు చేస్తాను. అక్కడ ఆ గదిలోకి నీవు నేనూ వెళ్దాం, బహుశా అ అద్దె గదిలోకి ఆయన వచ్చి ఆయన ఆత్మతో అతడు నింపునేమో” అని అతడడిగాడు.

“నీవు ఒక అద్దె గదిలోకి రానవసరం లేదు” అని నేను చెప్పాను.

“సరే, ఆయన నన్నెక్కడ కలసికొంటాడు ?” అని అడిగాడు.

“ఇక్కడే,” అని నేను చెప్పాను.

“ఈ నిర్వాహకలోకి ఆయన రాడు. అక్కడ ఒక షూటింగ్ గాలరీలోకి ఆయన వస్తాడా ? అని అతడడిగాడు.

“ఒక్కని కోసం ఆయన చేప కడుపులోకి, ఆయన వెళ్ళిపోయాడు; యింకొకరికొరకై అగ్ని గుండములోకి ఆయన వెళ్ళిపోయాడు, ఆయనను నీవు కలసికొను ఏ స్థలములోనైనా ఆయన నిన్ను కలసికొనును,” అని నేను చెప్పాను.

ఖచ్చితం నిన్ను కలసికోవాలని దేవుడు కోరుచున్నాడు. అందును గూర్చి ఆయన నీతో మాట్లాడాలని ఆశించుచున్నాడు. నీవెక్కడున్నా, ఆయన నీయొద్దకు వస్తాడు.

17

యొజెబెలు, దేశమును కలుషితము చేసినది, ఏలీయా మానసిక ఆందోళన మితిమీరి పోయినది. దేవుడు ఇంకా దేవుడే అని అద్భుతము ద్వారా ఆయన జవాబివ్వగలడని అతడు ఋజువు చేయుట కొరకై అతడు గొప్ప అద్భుతకార్యాలు సూచనలు కొండపైన చేశాడు. తత్ఫలితంగా అదేమి తెచ్చినది ? తన స్వంత ప్రాణానికే బెదిరింపు తెచ్చినది. ప్రపంచవ్యాప్త ఉజ్జీవము తెచ్చుటకు బదులు, అదేమి తెచ్చినది? అది అతని యొక్క ప్రాణానికి బెదిరింపు తెచ్చినది. యొజెబెలుకు ఆహాబు యీ సంగతులన్ని చెప్పినప్పుడు “ఒక వేళ దేవుడు నాకు గొప్ప అపాయము కలుగచేయునుగాక. రేపు రాత్రికి అతని తలను నేను నరకకపోయినట్లయితే,” అని ఆమె అన్నది.

18

ఏలీయా, దేవుని తన యొక్క హృదయములో యుంచుకొనినవాడై దేవుడు యింకా దేవుడేయైయున్నాడని ప్రజలకు అతడు చూపించ ప్రయత్నించెను. అది విస్పోటనమువలె అతని పైకి వేరే ఫలితాన్ని యిచ్చెను. అతడు దానిని విని అరణ్యములోకి పారిపోయాడు. అక్కడతడు ఆదరణను ఆపేక్షిస్తూ బదరీ వృక్షము క్రింద అక్కడ పరుండెను. అతడు తనయొక్క సేవకుని వదలివేసి, అతని విడచిపెట్టాడు.

ఇప్పుడు, మన యొక్క కథ వివిధములైన మూడు స్థానములకు వెళ్ళుచున్నది. ఒకటి - కర్మెలు పర్వతము; తరువాత బదరీ వృక్షము క్రింద మరియు మూడవ స్థానము దేవుడు అతనిని కలసికున్నది, అతడిక్కడ గుహలోయున్నాడు.

19

ఇది యొక ఎంతో విచిత్రమైన విషయం. ఇక్కడ, కాపరికి మరియు ఇతర సేవకులకు తెలుసు. గమనించు ! నీ యొక్క కర్మెలు పర్వతం అనుభవం తరువాత నీవు బదరీ వృక్షము యొక్క స్థానమునకు నీవు వెళ్ళుచున్నావు. ఒక మనుష్యుడు ఒక ఆశీర్వాదమును పొందిన తరువాత మరియు దేవుని శక్తి క్రుమ్మరించబడిన తరువాత మరియు నీకొకటి జరిగిన తరువాత, చూడూ ! సాతాను అడుగుల గురుతు మీదనే యుంటాడు. జ్ఞాపక ముంచుకో, ఆ తరువాత రోజు, ఆదివారం మంచి దినముగా అనుభవించిన తరువాత సోమవారం, అది కఠినమైనది కాబోతున్నది. ఎందుకంటె, ఆ ముందటి దినమున పరిశుద్ధాత్మ నీలో నింపిన నమ్మకము నంతటిని నీలోనుండి తీసివేయుటకు అతడు చేయగల్గినదంతా అతడు చేయబోతున్నాడు.

కాబట్టి, ఏలీయా చాలా ముఖ్యమైన దినముననే కలిగి ఉండెను. ఏలాగైతేనేం ధైర్యహీనుడై పోయాడు అతడు. ప్రవక్తలందరు వెర్రివారిగా ప్రకటించబడ్డారు. యేసుక్రీస్తు వెర్రివాడిగా ప్రకటించబడ్డాడు. అపోస్తలులలో ప్రతి యొక్కరు ప్రజల చేత వెర్రివారుగా ప్రకటించబడ్డారు. ఎందుచేతనగా వారి యొక్క పరిచర్య వలన వారిని మతిపోయిన వారలగా ప్రజల వలన అనుకొనబడినంతగా ఎంతో అతీతమైయుండెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవించు ప్రతి యొక్కరు హింసలు పొందుదురు. నీవు వ్యత్యాసకరమైన వాడవైపోతావు.

20

క్రితం, తన యొక్క గురుతును గూర్చి సహోదరుడు బీలర్ చెప్పినట్లుగా నీవు క్రొత్తగా జన్మిస్తావు. క్రీస్తులో నీవు నూతన సృష్టివైపోతావు. పాత విషయాలన్ని గతించిపోతవి. లోకం యొక్క ప్రకృతి సంబంధమైనవన్ని నిన్ను ఇక పట్టుకోలేవు. మరియు మరణములో నుండి జీవములోనికి నీవు దాటినప్పుడు నీవు కూడా వాటిపైన పట్టు కల్గియుండవు. దేవుడు ఒక మనుష్యని పట్టుకున్నప్పుడు, మొదటిగా ఆయన ఆలయంలో చేయునదేదనగా లోక కార్యకలాపాలలో నుండి పరిశుద్ధతలోకి అది వచ్చుట, మరియు ఆయన మరణములో నుండి జీవములోకి దానిని తెచ్చుటయౌతుంది. అదే తిరిగి జన్మించుట; అదే నూతనత్వము. దాని యొక్క ఊహలు నూతనమైనవి. ఈ దినమున మనకు కావలసినది ఆలాటి ఉజ్జీవము, నిజముగా అది సత్యము.

ఓహో! ఆత్మ యొక్క లోతులో మునిగినస్థితిలో మనమున్నాము. మనము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు మరియు ఆత్మ సంబంధమైన పైకి ఎదుగుదలను మనము కల్గియున్నాము. అయితే అది యిక మనకు అవసరంలేదు. మనకు ప్రజల హృదయాలలో జీవముగల దేవుని యొక్క ఆత్మ ఉజ్జీవం మనకు కావాలి. ఆత్మ యొక్క క్రిందకు మనుగడలు లేక ఆత్మ మేల్కొల్పులు ఎక్కువ మనకు అవసరం లేదు. మనకు ఉజ్జీవం కావలసియున్నది. అనగా, మనమేమి కల్గియున్నామో దానిని ఉజ్జీవపరచునది మనకు కావాలి. ఆత్మ సంబంధమైన మేల్కొల్పులు కాదు. కొన్ని సార్లు అవి మిశ్రిత జనాంగాన్ని తెచ్చుటకు హేతువౌతుంది. అయితే, చెరిగి, వణికింపజేసి యింకా అన్నింటిని కత్తిరించివేయునటువంటి ఉజ్జీవం మనకు కావాలి.

21

సముద్ర తీరమున నిలబడినట్లుగా అది యుండును. కొన్ని వారముల క్రితము అక్కడ పెర్టో రికోలోనున్నటువంటి సహోదరులతో నేను మాట్లాడుచుంటిని. అదేదనగా ఆ యొక్క గొప్ప సముద్రమును మరియు గొప్ప తుఫానును నేను చూచినప్పుడు అలలు ఈ మందిరమున కంటె ఎత్తుగా ఉన్నవి. నేను చెప్పాను, “అదేంటో మీకు తెలుసా? అందులోనున్నది అది నిశ్శబ్దంగా యున్నప్పటికంటె ఒక్క చుక్క నీటి బొట్టు కూడా, తప్ప మీరేమికాదు.” అయితే ఆ చిలుకుట, ఎగిరిపడుట ఏంటి? మరి దాని యొక్క అర్థమేంటి? దానిలో నుండి ఆ పనికిరాని చెత్తనంతా అది ఒడ్డుకు త్రోసివేస్తుంది.

అదే సంఘానికి కావలసియున్నది. అందులో నుండి సమస్తమైన లోక సంబంధమైన దానినంతటిని లోక కార్యక్రమాలను కదిలింపజేయు ఒక ఉజ్జీవం కావలసియున్నది. మరియు దానియొక్క విశ్వాసుల హృదయాలలో పవిత్రత, దేవుని యొక్క పరిశుద్దత, దీనత్వమును తిరిగి తెచ్చునటువంటి ఉజ్జీవం (కావలిసియున్నది). ఎందుకని ? పురుషులు - తమకు తామే సరియనుకుంటారు. వారు, వారి యొక్క ఆత్మలో ఒక్క సారి కూడా ఉజ్జీవాన్ని పొందరు. వారు తమకు తామే నిర్వాహకము చేసికున్నవారలుగాను, స్వనీతిపరులుగాను, గంజిబెట్టినట్లు బిగుసుకున్న వారిగాను, ఎంతో ప్రకృతి సంబంధులుగా, వ్యత్యాసపరులుగా తయారైపోతారు?

వారు చదువుతారు మరియు పఠనము చేస్తారు, అది మంచిదే. అయితే అందును గూర్చి కాదు మనం మాట్లాడుచున్నది. వాక్యమును గూర్చి మీకెంతో తెలుసు. వాక్యమును గూర్చి ఎరిగియుండుట మంచిది. అయితే వాక్యము యొక్క గ్రంధకర్తను గూర్చి ఎరుగుట యింకా మంచిది. ఔనా ! నీవు విడచిపెట్టు ఆ అల్పమైనదియగు యొకటి, ఆ యొక్కటే హృదయంలో యుండి, నీవేమౌదువో దానిని అది చేయును. అదీ సంగతి.

22

ఏలాగైనను, ఎలీషా, అతని యొక్క ధైర్యక్షీణతలు, అంచుకు వచ్చినవియని నీకు చెప్తున్నాను. నేనెల్లపుడు అతని గూర్చి జాలిపడతాను. ఎలాగైనా అతని ధైర్యం కృంగిపోవుటకు సంసిద్దమై పోయినది. మరియు యేజేబేలు నుండి వచ్చిన ఆ గట్టి దెబ్బను సమాప్తము చేసినది. తరువాత అతడు పరుగుతీశాడు, అడవికి పారిపోయాడు. బదరీ వృక్షము క్రింద పడుకున్నాడు.

ఓ! బదరీ వృక్షము యొక్క ఆ అనుభవం (ఏలాంటిదో) ! మనలో అనేక మంది బదరీ వృక్షము క్రింద అనుభవాన్ని కనుగొనియుంటాము. నాకు నేనుగా అక్కడకు చేరాను. అనేక సార్లు అట్టి స్థలములో ఏమి చేయవలయునో అది నీకు తెలియదు. నీవు కలత చెందుతావు. నిజంగా యిప్పుడు దాని క్రిందనే నేనున్నాను, “ఓ దేవా! నేనేమి చేయాలని నీవు కోరుచున్నావు?” అని నేను ఆశ్చర్యపడుతున్నాను.

ప్రజలు బదరీ వృక్షము క్రింద యుండినటువంటి ఏలీయావలె యుంటారు, మీకు తెలుసా? వారు నిద్రపోవాలన్నట్లుగా యుంటారు. నేను లోకములో యున్న వారందరి కంటే ఎంతో అలసిపోయిన అనేకులకు నేను బోధ చేశాను. ప్రజలు ఎంతగానో అలసిపోయి యుంటారు. వారు మానసికంగా ఎంతో వత్తిడి కల్గియుంటారు. ఎంతవరకనగా ప్రతి చోటయున్న పిచ్చి-ఆసుపత్రులు, పిచ్చి-వాళ్ళ పాఠశాలలు నిండిపోయేంతగా వారు యుంటారు. వారు దేనిని నమ్మవలెనో, వారికి ఏది కావలయునో వారికే తెలియనంతగా, అంతటి భయభీతి స్థితికి వారు వెళ్ళిపోయారు. కేవలం వారు పండుకొనియున్నారు. ఏమి చేయవలెనో వారికి తెలియదు. ఓ! అదెంతటి విషాదకరమైన దృశ్యం!

23

నా సహోదరుడా! ఇటు విను! నీవు అది త్రాగలేవు. నీవు అది అరవలేవు. అది నిస్సత్తువై పోయేంత వరకు నీవు కార్డులు ఆట ఆడలేవు. నిద్రపోవుటకై ప్రయత్నించుటకు నీవు వేయి సార్ల కునుకుపాటు పడగలవు. నీవు అది చేయలేవు. మన యొక్క సమస్త విధాలైన స్వల్పమైన నివారణలు, అది చేయు ఒకే యొకటేదనగా గురుతులకు సహకరించటమే. వ్యాధికి నివారణ మనకు కావలసియున్నది. మనకు. లోకములో యున్నటువంటి మానసిక వైద్య బృందము దానిని బాగుచేయలేదు. (సహోదరుడు బ్రెన్హాం వేదికను మూడుసార్లు తట్టెను -సంపా) అది కేవలం గురుతుల లక్షణాలకు మాత్రమే సహకరిస్తుంది. నివారణ యేసుక్రీస్తు రక్తమే. సముద్ర తీరాన విశ్రాంతి తీసుకొనుట కాదు. ఒక ధ్యాన-శ్లోకము.. ధ్యాన-శ్లోకముల గీతాలాపనకై పాటకమేళంలోకి వచ్చుట కాదు. అదే ఈ దినాన మనము చేయుటకు ప్రయత్నం చేయునది. అది పాడుటకువచ్చుట.

“ఓ! జోన్స్ వలె యుండుటకు మనము సిద్ధపడుట.” మరియు మనము వ్యత్యాస కరమైనది చేయుటకు మనం ప్రయత్నించుట, దానిని విజ్ఞాన వంతమైనదిగా చేయుటకు ప్రయత్నించుట. దానిని చేయు ఒకే ఒక మార్గమున్నది, అదేదనగా నిజాలను ఎదుర్కొనుట. ఔనది నిజం!(సహోదరుడు బ్రెన్హాం వేదికను రెండుసార్లు తట్టెను - సంపా) ఓహో, నీవు తబ్బిబ్బులైపోయి కలతచెందితే, సంఘములో చేరవద్దు. క్రీస్తునొద్దకు రమ్ము అది మాత్రమే నివారణయౌతుంది. క్రొత్త పుటపై మనస్సుపెట్టవద్దు; కొత్త పుటను త్రిప్పవద్దు. నూతన జీవమును పొందుకో, క్రీస్తే జవాబుదారి సుమా!

24

అక్కడ బదరీ వృక్షము క్రింద అతడు పరుండియుండెను. ఏమి చేయవలెనో అతనికి తెలియలేదు. అతని ధైర్యస్థితి విచ్చిన్నమైపోయినది. అతడు వణికిపోతున్నాడు. అతడు ఏడుస్తున్నాడు, అందుకు సందేహం లేదు. అతడు భయంకర స్థితిలో ఉండిపోయాడు. మనలో అనేకమంది ప్రత్యేకించి కర్మెలు పర్వత అనుభవం తరువాత ఆ స్థలాలను తాకియుంటాము.

నిన్నటి దినము అందును గూర్చి ఒకరు నన్నడిగారు. అది ఏలాగుంటుంది. మనమేమై మనం ఏమిచేయవలసియున్నది? ఆ సమయంలో మనకేమి జరుగుతుంది ? చేయవలసినది ఒకటే ఒకటున్నది, దేవునికి నిన్ను అప్పజెప్పుకొనుము. ఒక మనిషి తనకు తానుగా అతిగా పనిచేయగలడు;

ఒక మనిషి పరిమితికి తక్కువగా చేయగలడు అది నాకు తెలుసు. ఈ మనుష్యుడు ఆహార అవసరతలో యున్నాడని దేవునికి తెలుసు. అతడు తినుటకు ఒకటి కావలసియున్నదని ఆయనకు తెలుసు. అతడెక్కడైతే పరుండి యున్నాడో, యిక్కడ ఈ స్థలములో అతనికై దేవుడు ఒకటి చేయవలసియుండెను. బదరీ వృక్షము క్రిందకు వచ్చు ప్రతియొక్కరికి దేవుడు ఒకటి చేయవలసి యుండెను లేదా అతడు ముక్కలు చెక్కలు యౌతాడు, దూరాన ఆయన యొక్క సేవకుడు చెట్టు క్రింద పండుకొనియుండి ఏమిచేయవలెనో ఎరుగకయుండినట్లయితే, ఆయన అది చేయవలసియున్నది. ఆయన ఆజ్ఞాఉత్తర్వులను అతడు కొనిపోతున్నాడు. ఏలీయా అన్నాడు, “ఓ ప్రభువా, నేను చనిపోతాను” అని.

25

ఒక కూటములో నుండి నేను బయటకు వచ్చిన తరువాత ఆ అనుభవాలను నేననుభవించాను. బోధించి, బ్రతిమిలాడి ఒప్పింపజేసిన తరువాత, దేవుని దూత కూటములోకివచ్చి అద్భుతాలు సూచక క్రియలు చేసిన తరువాత, నేను అలసిపోయినట్లుగా అగుపించాను. బయట కారులో కూర్చొనియుంటిని. “అది మానసికతత్వ శాస్త్రము అందును గూర్చి ఏమి లేదు. అదేమికాదు. అదంతా బుద్ధిహీనత” అని వారు చెప్పుట నేను విన్నాను.

ఓ! తరువాత బదరీ వృక్షము క్రిందకు నేను ప్రాకుకుంటు వెళ్ళితిని “ప్రభువా! నీవెందుకు - ఇది చేయుటకు నన్నెందుకు అనుమతించితివి? ఏమి జరిగినది?” అని నేను ఆలోచించాను. అయితే, మనమంతా అట్టి అనుభవాలను ఎదుర్కొనవలసియున్నది. అయితే ఆయన దాసుని యెడల యెహోవా వాత్సల్యత అది ! దేవుడు నీ శ్రమలను ఎరుగును. ఇది తెలుసుకో! అందును గూర్చి అంతా ఆయనకు తెలుసు.

26

కాబట్టి ఆయన దిగివచ్చును. ఆయన యొక్క సేవకునికి కొంచెం విశ్రాంతి కావాలని ఆయనకు తెలుసు. కనుక, కొద్దిసేపు అతడు నిద్రపోవునట్లుగా ఆయన చేశాడు; అతడక్కడ పండుకొని, తిరిగి పొందుకొనుటకై కనిపెడుతున్నాడు లేక చనిపోవుటకై ప్రార్థిస్తున్నాడు. “ప్రభువా, నాకంటే ముందుగ నా పితరులు చనిపోయారు. ఇప్పుడు నా ప్రాణమును తీసికో, నేను చేయగల్గినదంతా చేశాను. నేను మంచి పోరాటం పోరాడితిని. నా పరుగు తుదముట్టించితిని.” అయితే చేయవలసిన పని యింకా యున్నది. దేవుడు తన ప్రవక్త లేకుండా చేయడు. అతనికి యింకా పనియున్నది.

మనమెంతగా మొరపెట్టినను ఇదీ అదీ లేక యింకొకటి తలంచినప్పటికి దేవుడు మనలను సంపూర్తి చేయు వరకు ఏదీ మనలను తీసికొనలేదు. అది ఎరిగినందులకు నేనెంతో ఆనందంగా ఉన్నాను.

27

నేనొక సారి చేసినట్లుగా, కొన్ని సార్లు నీవు అలాగు భావిస్తావు. ఆత్మహత్య చేసికొనుటకు చిన్న తుపాకినా తలకు పెట్టుకున్నాను. అయితే నేనది చేయలేక పోయాను. నేనెక్కడైతే పనిచేస్తున్నానో అట్టి విద్యుత్ వాహక త్రాడుపై పెట్టుటకైనా చేతి మేజోడును తీశాను. అయితే అది నేను చేయలేకపోయాను. ఒకటి గట్టిగా పట్టుకున్నది. ఏలీయూతో యుండిన అదే దేవుడు ఈ దినమున ఉన్న దేవుడు. ఆయన నన్ను బదరీ వృక్షం క్రింద యుండుట చూశాడు. నా భార్య బిడ్డ అక్కడ దూరమున సమాధిలో యున్నారు, నా యొక్క తండ్రి, నా సహోదరుడు అందరు అక్కడయున్నారు. నేను నేనుగా వెళ్ళనైయున్నాను. నేను బదరీ వృక్షము క్రింద పరుండియున్నాను. అది కఠోరమైనది. నేను ప్రక్కకు వచ్చి ఒక స్థలానికి చేరుకున్నాను, నా మెదడు పగిలిపోవుటకై నా తుపాకిని సంసిద్దపరచుటకు ప్రయత్నించాను, అలా అది చేయులేదు. గమనించారా! యింకా జరగవలసిన పని ఉన్నది. ఒకటి జరగవలసి యున్నది. దేవుడు ముగించలేదు. ఆయన ఎల్లప్పుడు జాగ్రత్త తీసుకుంటాడు.

28

దీనుడవై శోధించబడి, అలసటలో నున్న సేవకుడా! ఆయన అతనిని చూశాడు. అతడెక్కడున్నాడో ఆయనకు తెలుసు. ఈ రాత్రిలో నీవెక్కడున్నావో ఆయనకు తెలుసు. బహుశా నీవు బదరీ వృక్షము క్రింద యుండియుండవచ్చు అంతా అయిపోయియుండ వచ్చును. అయితే జ్ఞాపకముంచుకో! నీవెక్కడున్నావో ఆయనకు తెలుసు. మొత్తాన్ని మనం తిరిగి బిగించనవసరం లేదు.

అక్కడ క్రింద, దక్షిణాదిన ఆ వృద్ధురాలైన రంగు జాతి స్త్రీ చెప్పినట్లుగా యుంటుంది. ఆమెకొక ఆకస్మికమైన ప్రమాదం జరిగినది. ఒక కారు ఆమెను కొట్టినది. అది ఆమెను విపరీతంగా గాయపరచినది. మరియు వకీలు “నష్టమునకు నీవు వ్యాజ్యం వేస్తావా?”అని అడిగాడు.

“న్యాయచట్టాలా? వద్దు బాబూ,” అని ఆమె అన్నది.“నాకెంతో నష్టము కల్గినది, నాకు మరమ్మతు కొంత చేయించుకోవాలి,” అని ఆమె చెప్పినది.

ఆమె ఈ జనముతో మరియు ఈ సంఘముతో మరియు ఈ రాత్రి నరకానికి బంధీయైన ఈ అమెరికాతో ఆమె మాట్లాడుచున్నదని నేను తలస్తున్నాను. అది వెనుకబడి పోవుటకాదు, అది అసలు అయిపోయినది. అది కాదు - అది నరకమునకు రహదారిపై నుండుటకాదు; అది ఎప్పుడో నరకమును కలసికొన్నది. అదితప్పి పోవుటకాదు, తప్పిపోబోతున్నది కాదు; అదెప్పుడో తప్పి పోయినది. నష్టముల ప్రమాదాలకు దానిపైన వ్యాజ్యమేయనవసరం లేదు; దానికి మరమ్మతు అవసరమైయున్నది. అది నిజం! నీవు ఎక్కడున్నావో ఆయనకు తెలుసు. నీవెక్కడ పండుకొనియున్నావో ఆయనకు తెలుసు.

29

ఆయన దేవదూతను పంపాడు. దేవదూత ఆతనిని ముట్టాడు. అతడు తిరిగి నిద్రపోయాడు. అతడు మేల్కొన్నప్పుడు, అక్కడకొన్ని జొన్న రొట్టెలున్నవి, లేక ఒక విధమైన కాల్చిన రొట్టెలున్నవి, అతని ప్రక్కనే పెట్టబడియున్నవి. ఆయన చెప్పాడు, “ఏలియ! లేచి భుజించు” అని. ఆయన సేవకుని యెడల ఆయన కృప ఉన్నది. చూశారా ! ఆయన అతనికి విశ్రాంతి యిచ్చుచున్నాడు.

మీకు తెలుసా! “మీరు ఇటు అరణ్యములోకి రండి మనం కొద్ది సేపు విశ్రాంతి తీసుకుందాము,” అని యేసు చెప్పాడు. నీకు విశ్రాంతి అవసరంలేదని కొందరు ఈ కుర్రవాళ్ళు తలస్తున్నారు. త్వరగా వారు అలసిపోవుట కూడా మనం చూస్తున్నాము. వారు విశ్రాంతి తీసికొనకపోతే ఎక్కడో ఒక చోట వారు పడిపోవుట వారు కనుగొంటారు. అక్కడే మన సహోదరుడైన బిల్లీగ్రహం ఈ రాత్రి యున్నాడని నేను అనుకుంటున్నాను, గురిని అధికమించుటకు ప్రయత్నించుట.

ఈ మానవ దేహాలు బలమైనవే, అయితే వాటికి విశ్రాంతి కావలసియున్నది. కనుక, నీవు కొద్దిగా విరామము తీసికొని, ఒక చోటికి వెళ్ళు, “అతడు బోధకుడు అని అనుకుంటాను, అతన్ని చూడూ! దూరాన ఏటి యొద్ద చేపలు పడుతున్నాడు, లేక అలాటిదేదో చేస్తున్నాడు,” అని చెప్తు నిన్ను వారు విమర్శ చేస్తారు. అయితే అదేం విషయం కాదు. యెహోవా తన వారిని జాగ్రత్త తీసికొనును.

30

అతడక్కడ, బదరీ వృక్షము క్రింద అలసిసొలసి పోయినవాడై పరుండియుండగా, అతని భయాన్ని దేవుడు నిమ్మళపరచాడు. అతనికి ఆయన ఆహారంపెట్టాడు. ఆయన అతనిని తిరిగి మేల్కొల్పాడు, తిరిగి అతనికి ఆయన ఆహారం పెట్టాడు. మరల అతనిని నిద్రపుచ్చాడు. ఆ రొట్టెలలో ఏమి యున్నదాయని తరచూ నేను ఆశ్చర్యపోతుంటాను, తెలుసా! ఆ రొట్టెలలో నుండి ఏ విధమైన విటమిన్లు అతడు పొందుతున్నాడా? యని, అయినప్పటికి, అక్కడ ఏమియుండినప్పటికి, నలుబది పగళ్ళు నలుబది రాత్రులు అది అతనికి సరిపోయినది. ఆ రొట్టెల బలము చేత అతడు సాగిపోయాడు.

వాటిలో కొన్ని నాకు ఈ రాత్రి కావలసియున్నదని దేవునికి తెలుసు. వాటిలో కొన్ని ఈ సంఘానికి కావలసియున్నదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ప్రక్కకు రా! లోకమునకు దూరంగా యుండు; కొంచెము సేపు విశ్రాంతి తీసికుందాం. కొద్ది సేపు మాట్లాడుకుందాము.

విశ్రాంతి తీసికుంటానికి నీకు సమయం లేదని నీవు చెప్తావు. అదే, యొకసారి జాన్ వెస్లీ చెప్పాడు. “విశ్రాంతి తీసుకుంటానికి నేను భయపడుతున్నాను. విశ్రాంతి తీసికొనుటకు నాకు సమయం లేదు,” అని అతడన్నాడు. మరి ఈ విశ్రాంతులు నీవు తీసికొనకపోయినట్లయితే నీకై నీవే పగిలిపోతావు.

31

ఆ తరువాత నలబది రాత్రింబగళ్ళు అతడు సాగివెళ్ళాడని మనము కనుగొంటున్నాము. అతడక్కడ యుండుట దేవుడు గుర్తించాడు. లేక తిరిగి గుహలోనికి తీసికొని వచ్చాడు. అతనియొక్క అవధానమును దేవుడు ఆకర్షింపగోరాడు. కాబట్టి, ఒక పెద్ద తుఫాను అటు వచ్చినది. అది పర్వతాన్ని పగులగొట్టినది. రాళ్ళు ముక్కలు చెక్కలైపోవునంతగా అదెంతో శక్తివంతమైనది. అయితే దేవుడు ఆ తుపానులో లేడు. దేవుడు చేయకముందు అది అలాగు వెళ్ళిపోయినది. అటు తరువాత ఒక గొప్ప భూకంపం వచ్చి భూమిని వణికింపజేసినది. అయితే, అయినను ఆ భూకంపములో దేవుడు లేడు, మరియు అగ్ని వచ్చినది. అయితే ఆ అగ్నిలో (మెరుపు)లో దేవుడు లేడు. అటు తరువాత మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వచ్చినది. ఆ స్వరములో దేవుడుండెను.

32

సహోదరుడా, సహోదరీ, ఎంతోకాలం నుండి నేను గుహలో యుంటున్నాను. నీవు కూడా వాటిని ఎరిగియున్నావు. ఎరిగినట్లయితే జరుగుట, చుట్టు ప్రక్కలనున్న అనేకములైన భూకంపములు వణికించుట, విస్తారమైన శబ్దములు, గడబిడలు యింకా అటువంటివి మరియు పెద్ద కూటములు మొదలైనవి యుంటున్నవి. అయితే దానిలో నుండి దేవుడెక్కడ?

ఆ కారణంచేతనే ఈ ఉదయం నేనేం చేసితినో నేను చెప్పియుంటిని. స్వస్థత కూటముకంటె లోతైనది యొకటి యుండవలసియున్నది. భాషలతో మాట్లాడువరముకంటె లోతైనది యొకటి యుండవలసియున్నది. బలమైన శక్తి వంతమైన గాలికంటె లోతైనది ఓకటి యుండవలసియున్నది. గాలి వెళ్ళిపోయినది, అయితే దేవుడు అందులో లేదు. దేశమంతట కూడా బలమైన గాలులు మనకున్నవి; ఉద్రేకాలు మనకున్నవి, మరియు ముఖముపైన రక్తమున్నది. మరియు చేతుల్లో రక్తమున్నది. అన్ని విధాలైన గురుతులు మనకున్నవి. అయితే దేవుడు ఎక్కడున్నాడు?

33

ఎలీషా కనిపెడుతున్నాడు. అతడు ప్రవక్తయైయుండిననప్పటికి, అయితే అతడది ఆలకించాడు. వాటిలో ఉజ్జీవములను అతడు సమపోలికగా సరిచూచుటలేదు. దేశంలో పెద్దదైన గుడారమును వేయుటకు అతడు వెళ్ళలేదు. టెలివిజన్ ద్వారా లేక మనము పిలచు ఆలాటి వాటి ద్వారా అతడు జరిగించుటకు వెళ్ళిపోలేదు.

విస్తారమైన ఈ గడబిడలంతటిని ఆ శబ్దములు వినుచున్నందుకు, అమెరికా అపరాధభావముతో యుంటుంది. ఓ! మేము శబ్దములు ప్రేమిస్తాము. అయితే దేవుడు శబ్దములో లేడు. అవి గౌరవప్రధమైనవి, మరి యితరమైనవి అయినప్పటికి, దేవుడు శబ్దంలో లేడు.

అది ఆలాగున యుండినప్పటికి, ఆఫ్రికా వారు టాం-టాంలు మోగిస్తారు. అటువంటి శబ్దములు, తాళ ధ్వనులు, నీవు ఎన్నడును వినియుండవు. దేవుడు అందులో లేడు. మనకు బలమైన ఈదురు గాలులున్నవి. మనకు అన్ని విధములైన అగ్ని మెరుపులు, భూకంపములు, వణుకుడులు, గంభీరమైన ఉజ్జీవాలు, అలాటివి మనకుయున్నవి. దేవుడు అందులో లేడు. అందులో అది యుండినట్లయితే, దానికదే కనుపరచుకొనును. అయితే దాని తరువాత మెల్లని స్వరము వచ్చినది అప్పుడు, ఆ స్వరములో దేవుడుండెను.

34

స్నేహితులారా! దానినే ఈ దినాన నేను తలంచుచున్నది. మనమెంతో ఆ శబ్దమంతటితో మనమెంతగానో కొనసాగిపోతుంటాము. కాబట్టి అమెరికా శబ్దమును ప్రేమిస్తుంది. చూడూ! వారేమి చేస్తున్నారో? ఎంత పెద్దగా ఈ పాత రేడియోలు త్రిప్పవలెనో అంతగా త్రిప్పుతున్నారు. రాకెన్ రోల్ మరియు బూగీ - ఊగీ, యింకా ఆ విధమైన వాటన్నిటిలో త్రిప్పుతున్నారు. ఎంతో పెద్ద శబ్దంతో వారవి పెట్టవలసియున్నది. ఈ శబ్దమంతా రోజంతా నీ చెవులను పగులగొట్టు నంతగా యుంటుంది.

మరియు ఆలయంలో కంజర్లు మనం కొడతాము; పైకి క్రిందకు పరుగులు తీస్తాము. మరియు అరుపులు అరుస్తూ బొబ్బరింతలు బెడుతూ, అరపులు అరస్తూ ఆ విధంగా మంచి సమయాన్ని కల్గియుంటాము. దానికి వ్యతిరేకం ఏమిలేదు. అయితే అందులో దేవుడేడి? అది మనకు చేసినదేంటి? అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ గాడ్, పెంతెకొస్తు ఐక్యత ఏకత్వమని పిలవబడునని, మరియు రకరకములైన యితర ఈ చిన్నచిన్న సంఘ-శాఖలన్ని ముక్కలుగా మనలను చెసినవి. దేవుడు అందులో లేడు. అది దేవుని ముందు నడుచునది. అది యొక చట్రము.

35

నామకార్ధమైన క్రైస్తవ్యాన్ని ఈనాడు నీవు చూచితే, ఆలయాలకు వెళ్ళు ప్రజలు మరియు - మరియు ఈ విధమైన గొప్పతనమును తెల్పునట్టి జీవితాలు జీవిస్తారు. మరియు బయటకు వెళ్ళిపోయి స్వస్థతను తృణీకరిస్తారు. దేవుని యొక్క శక్తిని తృణీకరిస్తారు. సమర్పణతో కూడిన బ్రతుకును తృణీకరిస్తారు. నిన్ను మూఢ-భక్తిగలవాడని పిలుస్తారు. జ్ఞాపకముంచుకో! అదే చట్రం అంటే, అది సహోదరుడా, ఉడ్స్! నీవు దానిని పరంజా అని పిలుస్తావని అనుకుంటున్నాను. అది బూటకం అది బయట చుట్టూ యుండు చట్రం. భవన నిర్మాణం చేయుటకు దేవుడు మాత్రమే దానిపైన నిలబడతాడు. దేవునికి మహిమకలును గాక! అది కేవలం ముక్కలైపోయే బూటకపు చట్రము మాత్రమే.

మనం చప్పట్ల కొడుతూ “దేవునికి మహిమ కలును గాక! అని అంటాం. నీవు కేకపెట్టావా, నీవు అది పొందుకున్నావు” అని చెప్తాం, మెతడిస్టు వారు, నాజరీనులు అది చెస్తారు. అది వారికి లేదని వారు తెలుసుకున్నారు.

“చప్పట్ల కొట్టు భాషలు మాట్లాడే వరకు కేకలు పెట్టు, నీవు దానిని పొందుకుంటావు,” అని పెంతెకొస్తు వారు చెస్తారు. మనకది లేదని మనం తెలిసికున్నాము. ఇంకొకటి విడిచిపెట్టబడినది. దేవా! నేనది ఎక్కడ కనుగొనగలనో ఆ గుహ యొద్దకు నన్ను తీసికొని వెళ్ళుము.

36

ఆ మెల్లని స్వరమును పొందుకోనేదము, జీవితంలో మధురమైన యొక దానిని పెట్టునటువంటి అలాటి దాని యొద్దకు, ఆ నిమ్మళమైన మెల్లని స్వరము యొద్దకు మన వెళ్దాము, అది యొక విశిష్టమైనది. నీవు మనుష్యుల భాషలతోను మరియు దేవదూతల భాషలతోను మాటలాడినను అది నీకు లేనట్లయితే, నీవు వట్టి వాడవు. నీవు ప్రవచించినప్పటికి, భాషలతో మాట్లాడినప్పటికి మరియు అద్భుతాలు సూచక క్రియలు చూపించినప్పటికి, యి౦కా అద్భుతాలు జరిగించి గొప్ప సూచక క్రియలు చేసినప్పటికి నీవు వట్టివాడవు. అయితే ఆ చిన్న నిమ్మళమైన మెల్లని స్వరము అక్కడ లేనట్లయితే నీవు వట్టివాడవే, అది లేఖనము చెప్తుంది, అదే యిప్పుడు మనం ఆలకించుచున్నది. మనము ఉరుములను కలిగియుంటివిు. మనము వెురుపులను కల్గియుంటిమి. బలమైన గాలులు, భూకంపములు మనకుండెను. అయితే, దేవా! నిమ్మళమైన మెల్లని స్వరము మా కొరకై పంపుము, అదే మాకు కావలసియున్నది.

37

సహోదరుడా, వినుము. ఆ యొక్క నిమ్మళమైన మెల్లని స్వరము, మాట్లాడినటువంటి ఒక నిమ్మళమైన మెల్లని స్వరము మనకు అవసరమైయున్నది. “ఆయన యొక్క స్వరమును మీరు సంత వీధులలో వినలేదు. ఆయన కేకలు వేయుట మీరు వినలేదు,” అని యేసు చెప్పెను. ఆయన మన యొక్క మాదిరి. ఆయన వైపు చూడుడి ! ఆయన యొక్క ఆత్మ ఆయన యొక సాధుత్వముగల పావురముతో పోల్చబడెను.

గంభీరమైన సంగతులు, అవి నిమ్మళమైన సంగతులు. స్నేహితులారా! అది మీకు తెలుసా? వినుడి! సూర్యుడు, భూమీపైన జీవించు ప్రతి ప్రాణికి జీవమును యిచ్చును. జీవశాస్త్రములో, మొక్కలు, చెట్ల యింకా మొదలైన వాటి జీవనాధారమునకు అది జీవమును యిచ్చును. అది జీవమును పుట్టించును. సూర్యుడు, దానిని చేయును. మరియు మిలియన్ల గాలన్ల నీటిని భూమిలోనుండి అది పీల్చగలదు. నీటి కొళాయిలో నుండి చిన్న బొక్కెన మనం లాగినదానికంటె తక్కువ శబ్దం అది చేయును. ఔనా? అవి పెద్ద సంగతులు. చిన్నచిన్న విషయాలు పెద్ద విషయాలైయున్నవి. భూమి భ్రమించుట నీవెన్నడైన వింటావా? గ్రహములు వాటి కక్ష్యలు దాటుచున్నప్పుడు వాటి శబ్దములను నీవెప్పుడైన విన్నావా ? ఒక్కటైనా నీవెప్పుడైనా విన్నావా? అవి పెద్దవి. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు నీవెప్పుడైనా విన్నావా?

38

ఓహో! మనకు పెద్ద పెద్ద శబ్ద ధ్వనులు మనకు ఉ౦డవలసియున్నవని మనం తలస్తున్నాము. కొట్టుటకు యిత్తడి కట్టు మనకవసరమైయున్నది. ఎంతో పైకి ఎగురుట - క్రిందకు దుముకుట మనకున్నవి. లేదా మనకు మంచి కూటం మనకు జరుగలేదు. ప్రతి యొక్కరు కూడా పైస్థానంలోనే యుండవలెనని అనుకుంటాం. వారు వారి చప్పట్ల కొడుతూ, యింకా ఏవో చేస్తారు. సంగీతం, రాగతాళములతో కొనసాగాలని అనుకుంటాం. ప్రతి యొక్కరు కూడా దారి సందులలో పైకి - క్రిందకు పరుగులు తీస్తారు. మనకదియున్నది. అది చేసినమేలేంటి? అదెక్క యున్నది? ఈ దినాన మనకది ఎక్కడ నుండి వచ్చినది? ఒక గందరగోళ గుంపులో అదియున్నది. ఒక సంఘశాఖల గుంపులో విరిగిపోయి సహోదరత్వం పాడైపోయినది. నిజంగా ఆలాగు అయిపోయినది.

అది పాతదైన గొంగళి పురుగు, చీడ పురుగు. ఆరంభంలో యుండిన అన్ని పురుగులు అక్కడున్నవి. యోబు చూశాడు, లేక యోవేలు వాటిని చూశాడు. గొంగళి పురుగులు విడిచినదానిని - పసరు పరుగులు తినివేసినవి. పసరు పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసినవి. యింకా మొదలైనవి. ఎంతవరకనగా కొట్టివేసిన చెట్టు మొద్దు మనం కలిగియుండు వరకు అవి తినివేసినవి. అయితే లేఖనం చెప్పుచున్నది: “నేను మరల యిచ్చెదను. యెహోవా యీలాగు సెలవిచ్చుచున్నాడు,” అని! మనమొకదాని కొరకు ఎదురుచూచుచున్నాము.

39

మన యొక్క కేకలన్ని కూడా, ప్రపంచం మొత్తాన్ని మనం మార్పు చేయుటకు చాలినన్ని బొబ్బరింతలు, శబ్దములు మనం చేశాము. చాలినంత ఆనందోత్సవాలు, కేకలు కొనసాగింపులు మనకున్నవి. ఎంత వరకు అవిచేసినవి. అది సంఘమును కట్టలేదు. సంఘశాఖలను అది కట్టినది. అహంకార ఆలోచనలతోను, బిగుసుకున్న చొక్కాయిలతోను బయటకు వెళ్ళు మనుష్యులను అది తయారు చేసినది.

అట్టి వాటిని నేనిష్టపడను. వేదిక నొద్ద నుండి వెళ్ళిపోయి, “ఓ!అతనిని చూడూ! అతడు రాకుమారుడు. అతడేలాగు బట్టలు ధరించియున్నాడో చూడూ! అంతా నునుపు చేసికున్నాడు. అతడు అచ్చు అక్షరములు తదితరమైనవి ఏలాగు పలుకవలెనో అతనికి తెలుసు,” అది కాదు దేవుడు కోరునది.

ఒక దినమున, ఒక ప్రవక్త అనుకున్నాడు. ఒక సేవకుని అతడు అభిషేకము చేయబోతుండెను. “అతడు కుటుంబంలో పెద్దవాడు; అతడు బాగుగానే కన్పిస్తున్నాడు,” అని అతడన్నాడు. అయితే దేవుడు అతనిని తృణీకరించాడు.

40

అదేంటో నాకు తెలియదు అని ఆలాగు నిలువబడుటకు రాజకుమారులు నీకు యుండనవసరంలేదు. నీవు ధరించు వస్రాలు కాదు. లేక నీవు మాట్లాడు వాగ్దాటి కాదు. అది నీలోపల ఉన్నయొకటి, ఆ దేవుని యొక్క స్వరము. అదే అదియైయున్నది.

ప్రవక్త యింకొకరి యొద్దకు కదలి వెళ్ళాడు. “అది అతడు కాదు. దేవుడు అతనిని నిరాకరించాడు.” ఇంకొకరిని దాటి వెళ్ళి పోయాడు. “నీకు యింకొకరులేరా?” అని అడిగాడు.

“మాకొక చిన్న ఎర్రనివాడున్నాడు. ఇక్కడే వెనుక గొర్రెలు మేపుతూ, కొండ ప్రాంతమందున్నాడు” అని చెప్పాడు. అతడే దావీదు.

ఎర్రని తలకట్టు, పుట్టుమచ్చల ముఖముగల ఈ చిన్న వానిని అక్కడకు వారు తెచ్చారు. కొద్దిగా వంగిన భుజాలు, గొర్రెచర్మము చుట్టూ చుట్టుకొనియున్న చిన్నవాడు అతడు. “అది అతడే,” అని దేవుడు చెప్పాడు.

41

నీ యొక్క ఎత్తయిన రూపము, బిగించిన చొక్కాయిలు దేవుని యొద్ద ఎన్నికకు రావు. నీవు డి.డి.డి. పి.హెచ్డి., లేక రెండు ఎల్డిలు కావచ్చును. నీవు బిషప్పువు, పోపు లేక యింకేమైన కావచ్చు. అయితే, లేని దానిని తీసికొని ఒకటిగా చేయుటకు

అది దేవునికే తగును. నీవు వట్టివానిగా ఎంతవరకుంటావో, అప్పుడు దేవుడు ఒకటి యౌతాడు. నీవు మార్గమునకు అవతలెంతవరకుంటావో, అప్పుడు దేవుడు లోపల ప్రవేశిస్తాడు. అయితేనీవు ఎంతగానో నిండిపోయినవానిగాను, గంజి పెట్టినవానిగాను యుండి, నీవే పెద్దవని, నీవే అతి శ్రేష్టుడవుగా నుండినట్లయితే నీవు పొందుకోవలసిన దానిని నీవు పొందుకోలేవు. అది దేవుని యెదుట దీనత్వంతో కూడిన హృదయం. సహోదరులారా, అది మనకు తెలుసు. ఖచ్చితం.

నిజముగా నీవు ఎప్పుడు సూర్యుడు ఉదయించుట చూడలేదు, లేక వినలేదు. నీవెన్నడు అది వినలేదు. నీవెన్నడైనా బయటకు వెళ్ళి రాత్రిపూట మంచు బిందువులు పడుట నీవు విన్నావా? అదిలేకుండా మనమేమి చేయగలుతాము? చూశారా! అది తీసికోదు. ఇప్పుడు యొకటి మీకు చెప్తాను; అది యింకా పారెడి నీళ్ళ ధ్వని కాదు అంత పెద్ద ధ్వనిని చేయునది. పైకి-క్రిందకు ఎగురుతూ అందులోనుండి నక్షత్రాల అందాన్ని ప్రతిబింభింపచేయును. లోతుగాను, నిమ్మళంగాను నున్న చిన్నచెరువు నక్షత్రాల అందాన్ని ప్రతిబింభింపజేయును.

42

ఈ రాత్రి మనకు ఏమి కావలసియున్నది? మన లోపల ఉన్నటువంటి లోతైన, ఐశ్వర్యవంతమైన అనుభవం యొకటి మనకు కావలసియున్నది... దానికి - దానికి అరుపులు అరవనవసరం లేదు, అయినను మనము చేయవచ్చు. అయినను మనము కేకలువేయుటకు ప్రాధాన్యం చూపవచ్చు. అది భాషలతో ఎన్నడు మాట్లాడకపోవచ్చును, అయినను అది యుండవచ్చును. అయితే, మనము మన యొక్క ప్రాధాన్యం దానిపై పెడతాము. (టేపు మీద ఖాళి - సంపా.)

అది, బిల్లిగ్రహం కూటమునకు ఓరల్ రాబర్ట్ కూటమునకు లేక నా యొక్క కూటమునకు హాజరుకాక పోవచ్చును. నీవు అది చేయనవసరం లేదు. అది కల్గియుండవలసినదేదనగా దేవుని యొక్క నిత్యమైన ప్రేమ అనూహ్యత కలియుండవలసియున్నది. అతని లోపలనున్న ఆ యొక్క ఆత్మ నీవేమై యున్నావో దానిని చేస్తుంది.

ఈ ఉదయం అదే నేను మాట్లాడుచున్నది. సంఘమును, ముందు-వెనుకకు కల్వరి వైపునకు అదే నేను లాగుచున్నది. నీవు భాషలు మాట్లాడి యుంటివని, లేక లేఖనములును గూర్చి నీకు బాగుగా తెలుసునని లేక ఎవరివో ఒకరివి పుస్తకాలు నీవు చదివితివని, ఎదుటివాని కంటె నీకు ఎక్కువ తెలుసునని నీవు తలంచవద్దు. “పట్టణములో జరిగిన హేయ-కృత్యములను గూర్చి ప్రలాపించుచున్నవారికి గురుతు వేయమని,” ఆయన చెప్పెను. మన పట్టణములలో ఈ రాత్రి ఎవరిని ఆయన గురుతువేయునది?

43

చూశారా? అది ఆత్మయొక్క లోతు; పైపైవిషయం కాదు, అది హిక్కొరీ పైనున్న గుళ్ళ కాదు. అది మంచిదే. అది గుళ్ళలోపల నున్న హికొరి పండు. నీవు ఖాళీగానున్న పెద్ద గుళ్ళను పెంకును కల్గియున్నావు. అక్కడ క్రింద మరేమి నీకు లేదు. ఈ యొక్క రాత్రి మనకేమి కావలసియున్నది. దేవుని ప్రేమయొక్క లోతైన విషయాలు కావలసియున్నది.

ఏలీయా, ఆ మెల్లని నిమ్మళమైన స్వరమును వినినప్పుడు, ఏదియు అతనిని భీతిపరచలేదు. ఆ సమస్తమైన దానిలో నుండి నీవేమి విని యుంటివి? కొద్ది దినాలలో నీవు వెళ్ళబోతున్నావు. బిల్లీ గ్రహం బోధను నీవు వినియుంటివి; ఓరల్ రాబర్ట్స్ బోధను నీవు వినబోతున్నావు. గొప్ప వారగు మనుష్యులు, యితరులును గూర్చి వారి బోధను నీవు వింటావు. ఆ మనుష్యులను గూర్చి వ్యతిరిక్తత ఏమిలేదు. వారు దేవుని యొక్క సేవకులు.

అయితే శబ్దమును వినవద్దు సుమా; ఆ యొక్క మెల్లని నిమ్మళమైన స్వరమును విను! నీలోనున్న బుద్ధిహీనతనంత తీసివేయునటు వంటినరుని హృదయము లోపలకు వచ్చు ఆ ఒక దాని యొక్క నిగూఢత అది. అది నీ లోపల నుండి లోకమునంతా తీసివేస్తుంది. లోకకార్యకలాపాలను నీవు ద్వేషించి, దేవుని కార్యములను నీవు ప్రేమించునట్లుగా అది చేస్తుంది. అది నిగూఢత, అది దేవుని నిత్య మహిమను ప్రతిబింభించు నక్షత్రముల సరస్సు; కళ్ళకు కన్నీళ్ళను తీసికొనివచ్చు వస్తువు అది; నిండైన మహిమతో యుండి చెప్పనశక్యమైన ఆనందాన్ని తెచ్చునది అది; అన్ని విషయాలు నిన్ను నిప్పులునిగా చేయునప్పుడు నిన్ను నిలబెట్టునది అది; అది చేయును. రోగము కల్గినప్పుడు చివరకు మరణమే అది ఆసన్న మైనప్పుడు, అందులోనున్న దేవుని యొక్క ఆశీర్వాదములను అది యింకా ప్రతిబింభింపజేస్తుంది. ఆ చిన్న సరస్సు లోతైనది మరియు ఆకాశములను కాంతివంతముగా కన్పింపజేస్తుంది. గళ-గళ ధ్వనులు నీటి శబ్దములు కాదు. గళ-గళ ధ్వనులు చేయు నీళ్ళు ఎక్కువ లోతుగా యుండవు. నిమ్మళమైన నీళ్ళు లోతుగా ప్రవహించును.

44

స్నేహితులారా! అది మనము జ్ఞాపకముంచుకొని ప్రభు-రాత్రి-భోజనపు బల్ల యొద్దకు మనము వచ్చుచుండగా, ఈ రాత్రి దేవుడు మనకు సహాయము చేయును గాక! బాహటంగా మనమేమి చేసియున్నామని కాదు; ఎన్ని మంచి కార్యములు చేసియుంటున్నామని కాదు.“సరే, సహోదరుడా, బ్రెన్హాం! నేను ఆలయానికి వెళ్ళుచున్నాను. నా శక్తి కొలదిగా నేను మంచిగా జీవించుటకు ప్రయత్నిస్తున్నాను,” అని చెప్తావ్. మంచిదే! సహోదరుడా, అందును గూర్చి ఏమి వ్యతిరిక్తత లేదు. “సహోదరుడా, బ్రెన్హాం! నేను భాషలతో మాట్లాడాను. ఆత్మలో నేను అరుపులు అరచాను.” అదీ మంచిదే. సహోదరుడా, నేను మాట్లాడునది అదికాదు. అది యింకా అది కాదు. నేను చెప్పుచున్నది అదీ కాదు.

ఐశ్వర్యవంతమైన, రాజార్హమైన ఒకటియగు ఆ నిమ్మళమైన మెల్లని స్వరమును గూర్చి నేను మాట్లాడుచున్నది. ఒక పాపియైన కుర్రవాడు లేచి బలిపీఠము యొద్దకు వచ్చుచుండుట; అట్టిదానిని అనేక సంవత్సరాల క్రితం పెద్దవారైన తల్లులు వారి చెక్కిళ్ళపై నుండి కన్నీరు కార్చుకుంటూ ఈ వరుసలలో గుండా వారు వచ్చుచుండుట నేను చూచుచుండెడి వాడను.

ఈ దినాన నేను వేదిక పిలుపు యిస్తాను; మరియు ఒక కుర్రవాడు వచ్చుట చూస్తాను. వారు కూర్చొని జిగురు నములుతూ బుడగలు తెచ్చుకుంటున్నారు. విషయం ఏమైయుంటుంది? అది వినుటను నీవు వదులుకున్నావా? నీవు వినినదేంటి? “నీవు ఏమి వినుచున్నావు?”

45

మనము అంత్యకాలములో యున్నాము. టెలివిజన్లో నీవు వింటున్నావు. రేడియో నీవు వింటున్నావు. నీ యొక్క పత్రికలలో, నీ కాగితాలలో నీవు వింటున్నావు. ఒక దినాన ఈ దేశమునంతా అది గిరగిరా త్రిప్పబోతుంది. దీనిని వినబోతున్నావు నీవు? నీ రేడియో పైన రోజంతా ఆ బుద్ధిహీనతను కొనసాగిస్తున్నా ఆ భయపెట్టు హెచ్చరికలు వినబోతున్నావా? బాంబులు లేక తుపాకి గుండ్లు వేయబోతున్నారని వినుటకై ఎదురు చూస్తున్నావా? అట్టి వాటిని నేను వినను. (సహోదరుడు బ్రెన్హాం తన చేతులతో ఒకసారి చప్పట్ల కొట్టెను - సంపా) “నమ్మకమైన నా మంచి దాసుడా నీవు బాగుగా నిర్వర్తించితివి. పైకి రా,” అను చెప్పు స్వరమును నేను ఆలకించుచున్నాను. నీవేమి వినుచున్నావు?

మనము లోక సంగతులనన్నిటిని మరియు అటువంటివాటినన్నిటిని ఎంతో యిష్టంగా వినుటకు మనమెంతగానో ఆతృత గల్గియుంటామని నేననుకుంటాను. ఆ నిమ్మళమైన మెల్లని స్వరము మనము వినలేకున్నాము.

“అలా సంఘములో చేరితే చాలు అది సరిపోతుంది,” అని మన సంఘకాపరులు చెప్పుట మనము వినుచున్నాము. “భాషలు మాట్లాడితేచాలు. అదంతా అయిపోతుంది” యని వారిలో కొందరు చెప్పుట మనం వినుచున్నాము, “పెద్దగా కేకలు బెట్టు అదంతా అయిపోయినది” అని వారిలో మరి కొందరు చెప్తారు. నీవు ఏవిధముగా యుండవలసియున్నదో అలాగు నిన్ను చేయునటువంటిది, జీవితంలో అనూహ్యమైనదియు, ఐశ్వర్యవంతమైనదియునగు యొక దానిని పెట్టునటువంటి మెల్లని నిమ్మళమైన చిన్నదైన ఆ స్వరమును నీవు వినలేవు.

46

ఒక గోదుమ మొక్క ఒక గోదుమును పుట్టించదు. ఎందుకనగా అది ద్రాక్షా తీగ మీదయున్నది. లేక దంటుపైన యున్నది. ఒక గురుగు కూడా దంటు మీదనే యున్నది. గోదుమును పుట్టించాలంటే ఆ యొక్క ద్రాక్షావల్లిలో నుండి అది జీవమును తీసికొనవలసియున్నది. దానిపైన పడు నీళ్ళు ఆ రెంటిని నీటితో తడుపుతుంది. అందులోని రెండు కూడా సంతోషించును. అందులోని రెండు కూడా ఎదుగును.

స్త్రీ పురుషులు పెద్ద కేకలు పెడుతూ, దేవుని స్తుతిస్తూ భాషలతో మాట్లాడుతూ మరియు సంఘమునకు సంబంధించి యుంటారు; ఆత్మలో నాట్యం చేస్తారు, దశమ భాగాలు చెల్లిస్తారు. ఎదుగగలుతారు. అయినప్పటికి కూడా ఆ మెల్లని నిమ్మళమైన దేవుని యొక్క స్వరము యొక్క ఐశ్వర్యవంతమైన, అనూహ్యమైన ప్రేమ వారి హృదయాలలో ఉండలేదు. “ఒక అర్పణగా కాల్చబడుటకు నా శరీరమును నేనిచ్చినప్పటికి ప్రేమ లేనివాడనైతే నేను వట్టివాడను. బీదల పోషణకై నా యొక్క అన్ని వస్తువులు నేనిచ్చినప్పటికి నేనింకా వట్టివాడను. పర్వతమును కదిలించు విశ్వాసము నాకున్నది. నేనింకా వట్టివాడను. నేను మనుష్య భాషలతోను, దేవ దూతల భాషలతోను మాట్లాడుదును. ఇంకా నేను వట్టివాడను.”

చూశారా! నీ యొక్క అభిమతమును మార్చి స్వభావాన్ని వ్యత్యాసకరముగా చేసి, మరియు క్రీస్తులో నిన్ను క్రొత్త సృష్టిగా చేయునది నీ హృదయాంతరంగంతో మాట్లాడు మెల్లని నిమ్మళమైన స్వరము అది.

47

నీవేమి వినుచున్నావు, స్నేహితుడా? నీవు విను దానిని బట్టి అది ఆధారపడియుంటుంది. ఇక్కడ నీవు వినుచున్నట్లయితే. ఎలాంటి వ్యాఖ్యలు ఏమి లేవు. ఎటువంటి ప్రతిస్పందన లేదు. అయితే, నీవు వినుచున్నట్లయితే ఎక్కడైతే పదివేల మంది కూడుకున్నారో అట్టి యొకచోటనున్న గొప్ప ఉజ్జీవాన్ని గూర్చి వినినట్లయితే, ముందుకు వెళ్ళు ఒక తప్పుడు దానిని నీవు వినుచున్నావు. “నేను వెళ్ళిపోయి చూస్తాను. వారికి పెద్ద గుంపుయున్నారని వారు చెప్పారు”. అదెలాటి కొద్ది వ్యత్యాసమైన చేయదు. పందెముల బాటలు అవి పట్టుకొన్నవి. ప్రతీది కూడా దానిని కల్గియున్నది. రాకన్-రోల్ దాన్ని కల్గియున్నది. “నేను వెళ్ళుచున్నాను. నేనొక దానికై వెళ్ళుచున్నాను”. నీవు, దేనికొరకైనా వెళ్ళినట్లయితే..

ఆ మెల్లని నిమ్మళమైన స్వరము కాకుండా మరేదైనా నీవు వినినట్లయితే, తిరిగి గుహలోపలకు వెళ్ళిపో! మనం సంసిద్ధపడే వరకు తిరిగి బదరీ వృక్షము క్రిందకు వెళ్ళు. నీకై నీవు నిశ్శబ్దంగాయండి, కనిపెట్టు, ఉరుములు రానీయ్! భూకంపం భూమిని కదలింపచేయనీయ్! బలమైన గాలి వెళ్ళనీయ్! అగ్ని విరజిమ్మనీయ్! అదేమైన ఫరవాలేదు. ఆపాటను నేను జ్ఞప్తిచేసికుంటున్నాను.

హృదయాలు మండుచున్నప్పుడు ఎలా కనిపెట్టాలో, ప్రభువా! నాకు బోధించు:

నా గర్వాన్ని తీసివేసుకొని, నీ నామమున ప్రార్ధి౦చనీయ్!

నా నేత్రాలు నీ మీదనే యున్నవి; నా విశ్వాసాన్ని పునరుద్దరింపజేయుము

ఈ భూమిపైన నేనేమైయుండాలని నీవు కోరుతావో, అలాగు నన్నుండనీయ్!

(నేను చేయగోరునది అదియే.)

ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూచెదరో, అట్టి వారి బలము నూతనత్వము నొందును;

వారు పక్షిరాజువలె పైకి ఎగురుదురు,

(మీరు అది నమ్ముతున్నారా?) (సభవారు“ఆమేన్” అని చెప్పిరి - సంపా)

వారు అలయక పరుగెత్తుదురు,

సొమ్మసిల్లక సాగిపోదురు,

ప్రభువా, నాకు బోధించు, ఏలాగు కనిపెట్టవలెనో నాకు బోధించుము.

48

ఉరుములు రానీయ్, నిప్పు చెరగనీయ్, “ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి, బదరీ వృక్షము క్రింద నుండి రండి. మీ యొక్క గుహలోనుండి రండి,” అని చెప్పు ఆ మెల్లని నిమ్మళమైన స్వరము నన్ను విననిమ్ము!

నా విశ్వాసమునకు ముసుగు వేయాలనుకుంటున్నాను. ఆయన రక్తంలో ముసుగు వేసుకొని నడచుకుంటు వెళ్ళు “ఔను, ప్రభువా, ఇప్పుడు నేను నమ్ముచున్నాను,” అని చెప్పాలనుకుంటున్నాను.

49

ప్రార్థించుకుందాము. ఓ! ప్రభువా, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తా! నిత్యజీవానికి ప్రదాతా మరియు ప్రతి మంచి యిూవిని ప్రసాదించు దాతా! మా యెడల వాత్సల్యతను కనుపరచుము. ప్రభువా! వినుటయను అవసరతలో మేమిప్పుడు నిలబడియున్నాము. ప్రభువా, మా యొక్క స్వరములు పైకి వచ్చినవి. ఇప్పుడు మనము అనేకములైన స్వరాలు వినియున్నాము.“ ఇక్కడకు రండి, ఈ సంఘమునకు రండి. మీరు మా సంఘములో చేరినట్లయితే ఎంత బాగుంటుంది! నగరములో శ్రేష్టమైన వర్గము మేమే. మంచి వస్త్రములు ధరించెడి వారము మేమే, పట్టణము యొక్క మేయరు మా యొక్క స్థలమునకే వస్తారు” అని అనేక మంది అదే చెప్పుచున్నారు. ప్రభువా, వారి యొక్క కూటములలో అనేకమంది రాజ్యాధిపతులైన పరిపాలకులు మొదలైన వారు వచ్చి ఉపన్యాసాలు యిచ్చుచున్నారు. ఓ దేవా అందుకు భద్రముగా నన్నుంచుము ప్రభువా! గుహలో నన్ను దాచిపెట్టుము, ప్రభువా నేను ఎదురుచూచెదను గాక! పరిపాలకుడగు అధిపతి చెప్పినదానికి నేనెట్టి భద్రత తీసికోను? నా రక్షకుని యొక్క మెల్లని నిమ్మళమైన స్వరము నేను వినవలెనని కోరుకుంటున్నాను. నా బలము నూతనమగుటకు నేను నీకై కనిపెడుతుండగా, కనిపెట్టుటకు ఓ! ప్రభువా! నాకు సహాయము చేయుము.

వారు నీకై కనిపెట్టినవారై వారియొక్క విశ్వాసము నూతనత్వము పొందుకొని, మరియు వారు నూతన బలమును పొంది, పక్షిరాజులవలె రెక్కలతో పైకెగురునట్లు ప్రభువా, ఈ సంఘమునకు సహాయము చేయుము. ప్రభువా, వారు విందురుగాక! శబ్దముకై కాదు; పెద్ద అరుపులకై కాదు; గానీ, నిమ్మళమైన చిన్న స్వరమును విందురు గాక!

50

ప్రభువా! కనిపెట్టుట కొరకై మరి కొద్ది దినాలలో దూరాననున్న గుహలోనికి నేను ఎక్కి వెళ్ళుచున్నాను. ఓ దేవా! నాకు సహాయము చేయుము, ప్రభువా! లోక-విషయాలలో, నన్ను గుడ్డివానిగా చేయుము. ప్రజా పలుకుబడి కోసము, లేక ఒక ప్రజల ఘనత కోసము, లేక ఒక ప్రఖ్యాతి కోసము లేక ఈ లోకము యిచ్చునటు వంటి ఏదైన వ్యర్ధమైన దాని కోసము నన్ను అంధునిగా జేసి, నా చెవులకు చెవుడు కలుగజేయుము. ఆ నిమ్మళమైన మెల్లని స్వరము వినువరకు, ప్రభువా! నేనక్కడనే యుందును గాక! ప్రభువా! అటు తరువాత పక్షిరాజురెక్కలపై ఎక్కుచూ, నీ సేవకుడు ముందుకు వచ్చును గాక! ప్రభువా, దానిని అనుగ్రహించుము.

ఈ చిన్న సంఘమును దీవించుము. మా సహోదరుడు నెవిల్ను దీవించుము. ప్రభువా! అతని కడుపులోనున్న వ్యాధిని తీసివేయుము. అతని యొద్ద నుండి దానిని తరిమివేయుము. ప్రభువా, అతనినిని యంత్రణలో యుంచుము. నూతనత్వముతో అతడు తిరిగి యిక్కడకు వచ్చును గాక, “వారు నూతన బలము పొందుదురు,” ప్రభువా! అనుగ్రహము చూపుము.

మా యొక్క పాపములు క్షమించుము. ప్రభువా! యిప్పుడు మేము ప్రభు-రాత్రి-భోజనపు బల్ల యెద్దకు వచ్చుచున్నాము. “ఎవరైతే ప్రభువు శరీరమని వివేచింపక దీనిని అయోగ్యముగా తింటారో, త్రాగుతారో, అట్టివారు, శిక్షావిధికై తిని త్రాగుచున్నారని,” నీవు చెప్పియుంటివి. ప్రభువా! మా యొక్క హృదయములను, మా ఆత్మలను పరిశోధించుకొనుటకు మాకు సహాయము చేయుము. మమ్ములను గూర్చి ఏదైన అపవిత్రమైనది ఉన్నదేమో మమ్ములను పరీక్షించి చూడుము. ఉండినట్లయితే, ఓ దేవా!దీనత్వముతో నీకై కనిపెట్టుచుండగా, మమ్ములను క్షమించుము. నీ కుమారుడైన యేసు నామములో యిది మేము అడుగుచున్నాము. ఆమేన్!

51

నా మోకాళ్ళపై నేనుండి కనిపెట్టుటకు ప్రభువా, నాకు భోదించుము.

నీ యొక్క నీ స్వంత మంచి సమయంలో

నా విన్నపములకు నీవు జవాబిచ్చెదవు (ఔనది నిజము)

ఇతరులు చేయువాటిపైన ఆధారపడకుండునట్లు నాకు నేర్పుము,

అయితే నీ యొుద్ద నుండి వచ్చు జవాబు కొరకై ప్రార్థనలో నేను కనిపెడతాను.

పరలోకము నుండి వచ్చు ఒక జవాబు: అదే నాకు కావలసియున్నది. ఆయన యొక్క స్వరమును నేను వినగోరుచున్నాను, కార్యాలయ అధికారి స్వరము కాదు. మేయర్ యొక్క స్వరముకాదు; రాజ్యపరిపాలకుని స్వరము కాదు; బిషప్పు స్వరము కాదు. ప్రభువా! నీ యొక్క స్వరము నేను వినగోరుచున్నాను. “ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి” అని దీనత్వము తోను, సాధుత్వముతోను నా హృదయంలో మాట్లాడుచున్న ఆ పరిశుద్దాత్మే ఔను ప్రభువా, ఇప్పుడు మేము బదరీ వృక్షము క్రింద పరుండియున్నాము. ఆయన ఏమి చెప్పునోయని చూచుచూ మేము కనిపెడుతున్నాము.

52

యిప్పుడు మీలో ఒక్కొక్కరిని ప్రభువు ఆశీర్వదించియున్నాడు. ప్రార్థనలో జ్ఞాపకముంచుకోమని ఎంతమంది కోరుచున్నారు? మీ చేతులు పైకెత్తుట ద్వారా మమ్ము చూడనివ్వండి. “ప్రభువా, కనిపెట్టుటకు నాకు నేర్పుము. నాకు నేర్పుము నేను - నేను నా గర్వమును మరచిపోదును గాక! ఈ విధముగా యితరులు కొనసాగి పోతూ, గొప్ప కార్యములను చేయుచు, నా గర్వమును నేను దిగజార్చుకొని నీ నామమున ప్రార్ధిస్తాను. ఇతరులు చేయువాటిపైన ఆధారపడక, నీ యొద్ద నుండి వచ్చు ఒక జవాబు కొరకు ప్రార్థనలో కనిపెట్టుటకు నాకు నేర్పుము,” అని చెప్పండి.

ఏలీయా చేసినట్లుగా చేయుదము. అక్కడతడు వేచి చూశాడు. అతడు ఉరుము శబ్దము విన్నాడు. అతడు మెరుపు శబ్దము విన్నాడు; బండరాళ్ళు పడిపోవుట అతడు విన్నాడు. అతడు అగ్ని శబ్దము విన్నాడు. అతడు గాలి శబ్దము విన్నాడు. అయితే, అతడు ఎదురుచూచుచున్నది అది కాదు. చివరకు అది ప్రవక్తను కదిలించలేదు కూడా, అది దాటిపోవుటకు అతడు అనుమతించాడు. అయితే, నిమ్మళమైన మెల్లని స్వరమును అతడు వినినప్పుడు, అతని దుప్పటిని అతడు తీసికొని, అతని ముఖమునకు కప్పుకొని గుహ చివరి భాగమునకు వెళ్ళిపోయాడు. “వెళ్ళు! అక్కడ క్రిందనున్న బండ మీద నిలబడు,” అని ప్రభువు చెప్పాడు. అదే, నేనూ వినాలని ఆశిస్తున్నాను, “బండ మీద నిలబడు.”

53

సరె, మంచిది. ఇప్పుడు సంస్కర్ణ యొక్క సమయము యిది. ప్రభువు మిమ్ములను దీవించును గాక! ఇది మనము చేయకముందు, చేతులు పైకెత్తిన ప్రతి యొక్కరికి నిజముగా దేవుడు వారితో మాట్లాడవలెనని కోరిన వారికి యిక్కడేయుండి మొదటిగా ప్రార్థన చేయాలనుకుంటున్నాము. ఈ రాత్రిలో, యిక్కడ ఎవరైనా బదరీ వృక్షము క్రిందనున్నారా ? మీ చేయి పైకెత్తండి. నిజమే. నిజమే! మనమున్నాము.

మీలో చాలామంది గుహలో యుండి కనిపెడుతున్నారు. ఇవన్ని జరిగి కొనసాగియుండుట మీరు చూశారు. బిల్లి గ్రహం, ఓరల్ రాబర్ట్స్, టామీ ఆస్బన్, టామీ హిక్స్ వారియొక్క ఉజ్జీవము మరియు నా యొక్క గొప్ప ఉజ్జీవములు జరిగించబడుట వినియుంటారు. అయితే, అయితే, అదేక్కడున్నది? స్వరము ఎక్కడ? “నేను జస్పప్లతో కలసి కేకలు పెట్టాను. నేను - సంగీత సితారాలతో కలసి ఆత్మలో నాట్యమాడాను. ఈ మిగతావన్ని నాకున్నవి. అదంతా నేను చేశాను. అయితే దానిని బట్టి నేను విరామము తీసుకోలేనంతగా నుండి, నన్ను పిండినట్లుగా జేసి, నశించిన ఆత్మలకై నాలో భారమును పెట్టిన ఆ ఒక్కటి ఏది ? సహోదరుడా బ్రెన్హాం,” అని నీవు అంటావు.

ఆ రకమైన యొక్కటే లోపలకు వెళ్ళునది. అదే బైబిల్ చెప్తు౦ది, “ఆ పట్టణములో జరుగు హేయకృత్యముల గూర్చి మూల్గులు విడుచుచు ప్రలాపించుచున్న వారిని మాత్రమే గురుతు వేయుము,” స్నేహితులారా! అదే మనకు కావలసియున్నది. తిరిగి ప్రార్ధి౦చుకుందాము.

54

ప్రభువా! దయచేసి ప్రభువా! ఓ -నేనెంతగానో పాటలు పాడియుండ వచ్చును. నేనెంతో బోధ చేసియుండవచ్చును. నేనెంతో ఏడ్చి యుండవచ్చును. అయితే నేనెన్నడు ఎంతో ఎక్కువగా ప్రార్ధి౦చలేదు. ఓ దేవా, నన్ను పరీక్షించి పరిశోధించుము.

లోతైన సెలయేరులను గూర్చి, అవి ఏ విధంగా నక్షత్రాలను ప్రతిబింభింప జేయునో అందును గూర్చి కొద్ది సేపటి క్రిందట మాట్లాడితిని. “శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుము,” అని ప్రవక్త దావీదు పలికినట్లు ప్రభువా, నీ ఆత్మ యొక్క లోతులో మమ్ములను యుంచుము;

చిన్నగా తొణుకు నీటిలో కాదు. ప్రభువా! అక్కడున్న శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుము. నన్ను నెమ్మదిగా యుంచుము. నేను భయపడుతున్నాను. నేను తబ్బిబ్బులైపోయాను.

నేనెరిగినంత వరకు, నన్నుచేయమని నీవేమి చెప్పావో ప్రతిదీ నేను చేశాను. బోధిస్తూ కన్నీరు కార్చుచు, బ్రతిమిలాడుతూ, దేశాన్ని దాటిపోయాను, ప్రపంచాన్ని చుట్టాను. అదే నీవని చూపించుటకు ఆ మెస్సీయ యొక్క గురుతును తెల్పుటలో నీవు నమ్మకస్తుడవైయుంటివి. ప్రభువా, అదే, అది చేయుచుండెను, మనుష్యుడు కాదు. అందుకొరకై నేను కృతజ్ఞడను. అయితే ప్రభువా, ఈ రాత్రి నేను బదరీ వృక్షము క్రిందనున్నాను. “వారెందుకు మారు మనస్సు నొందరు? ప్రభువా! ఎందుకని ఈ అమెరికా యిది చూడలేకున్నది?” అని నేను ఆశ్చర్యపడుతున్నాను. ఆమె యొక్క ఇంద్రియాలు నిస్సత్తువైపోయినవా? సంఘము ఎంతో గట్టిగా నిర్మాణాత్మాకమైనదా? వారు సహకరించరు. విమర్శించుట తప్ప యింకేమీ వారు చేయరు.

అయితే, ఈ రాత్రి, అప్పుడు ఏలీయాకు ఏలాగో అలాగేనున్నది. నిజంగా చెట్టు క్రిందనే నేను యున్నాను. బయలుకు మోకరించని వారు యిూంకా ఏడు వేలమంది నీకున్నారు. ప్రభువు యొక్కరాకడకై ఎదురు చూచువారు భూమిమీద యింకా నీకు అనేక మంది భక్తులున్నారు.

ఓ ప్రభువా, మా యెడల కనికరము చూపుము. మమ్ములను పరీక్షించుము, నీ యొక్క కొలత బద్దలో మమ్ములను యుంచుము. మమ్ములను మేము చూచుకున్నట్లయితే, మేము తేలిపోతున్నాము. ఓ ప్రభువా! అలాగైతే మా యొక్క పాపముల నుండి మమ్ము కడుగుము. మేము ఎలాగు యుండవలెనని నీ యొక్క అభీష్టమో, అందుకై మమ్ములను చేయుము. ఈ ఆలయంలోని ప్రతివ్యక్తికి అది అనుగ్రహించుము. యేసు నామములో మేమిది అడుగుచున్నాము. ఆమేన్.

55

అది ప్రభు-రాత్రి-భోజనము యొక్క సమయం కాబోతున్నది. దేవుడు మిమ్ములను ఆశీర్వదించాలని మేము ప్రార్ధిస్తాము. ఎవరైతే వెళ్ళవలెనని యున్నారో వారందరు, మరియు ప్రభు-రాత్రి-భోజనము తీసికోవద్దనుకునే వారు వెళ్ళండి, యిక్కడ బుధవారంరాత్రి మనము కలుసుకుంటాము. ఇక్కడే మరలా కలసికుంటాము.

నా కొరకు ప్రార్ధి౦చుటకు మరచిపో వద్దు. ఇప్పుడు దాని అవసరతను నేను కల్గియున్నాను. తదుపరి కొద్ది దినములకు ప్రార్థనా అవసరత నేను కల్గియుంటున్నాను. దానిని తేలికగా తీసికోవద్దు. అయితే మీ హృదయములలో నన్నుంచుకొని నాకై ప్రార్ధి౦చుడి. మీ యొక్క ప్రార్థనలు నాకు కావలసియున్నది. మిలియన్ల ఆత్మల యొక్క వ్యత్యాసమును గూర్చి చేయవలసిన తీర్మానములున్నవి. ఒకటి జరుగవలసి యున్నది. నా యొక్క స్వంత బలముతో నేనెంత వరకు వెళ్ళగలనో నేను వెళ్ళి పోయాను. నాకు నాకై నాకు - దేవుని యొక్క దర్శనం కావలసియున్నది. ఇతరుల కొరకు ఆయన నాకు చూపించును. అయితే, నాకు -నాకు యొకటి యుండవలసియున్నది. అది నాకు అవసరము. నా కొరకు ప్రార్ధి౦చండి. మీరు ప్రార్ధి౦చినట్లయితే ఆయన దానిని పంపును.

56

ఈ దినమున చుట్టూ నడుపుకుంటు, నేను చుట్టూ చూస్తున్నాను. సహోదరుడా రాయ్! నీ యింటికి వెలుపట నేనున్నాను. నేను లోపలకు రావాలని అనుకోలేదు. అక్కడ కారు యొకటి పెట్టియుండినది. నీకు, సహోదరి స్లాటర్కు దర్శిస్తానని వాగ్దానం చేశాను. మేడా, నేను చుట్టు (బండి) త్రిప్పుకుంటుయున్నాము. “సరె, కొంచెంసేపైన తరువాత మనం తిరిగి వద్దాం,” అని నేను చెప్పాను. అయితే నేను నిమగ్నుడనై పోయి తిరిగి రాలేదు. రహదారిపైన చుట్టూ తిరుగుతూ, “ఓ దేవా, ఒకటి తప్పక జరిగియుండవలసియున్నది. ఎక్కడో యొక చోట నిన్ను నేను పట్టుకోవలసియున్నది అని తలంచుచున్నాను.

కాలం నెట్టుకొనివస్తుంది. చీకటి కమ్ముకున్నది. చివర కాలం యిక్కడేయున్నది. మద్య-రాత్రికి ముందు ఒక్క నిముషమువలె యున్నది. చూడండి: శత్రువు యొక్క సన్నిధి గగుర్పాటు, భీతి-భావాలు, భయాందోళన స్థితిగతులు, లోకము యొక్క వత్తిడి, అది నీ యొక్క అంతమేనని అది తెలియకయున్నారు. చూశారా! ఓ! ఇప్పుడు పక్షిరాజు రెక్కలతో పైకెగురుదాం. నిన్న, నేడు, యుగయుగములు ఒక్కటే రీతిగా నున్న ఆయన కౌగిటిలోకి ఎగిరిపోదాం.

57

ఇప్పుడు ఎవరైతే ప్రభు-రాత్రి-భోజనమునకు యుండ వలెనని కోరుకుంటున్నారో ఈ సహవాస సమయంలో మీరుండుటకు మేము ఆనందిస్తాము. మొదటి కొరింధీ, 11వ అధ్యాయం అనుకుంటాను, మీ యొద్దయున్నది. ఇప్పుడే మీకై అది చదవాలని నేనున్నాను. తరువాత సహోదరుడు నెవిల్, అంగీకరిస్తే, (మొదటి కొరింథీ 11:23-32 వరకు సహోదరుడు నెవిల్ చదువుచున్నాడు.-సంపా)

నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని

కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి - యిది మీ కొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని - యీ పాత్ర నా రక్తమువలనైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకముచేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

మీరు ఈ రొట్టెను తిని, యిూ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.

కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును.

కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగుచేసి ఆ రొట్టెను తిని, ఆపాత్రలోనిది త్రాగవలెను.

ప్రభువు శరీరమని విచేచింపక తినిత్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.

ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగలునైయున్నారు. చాలా మంది నిద్రి౦చుచున్నారు.

అయితే మనలను మనమే విమర్శించుకొనిన యెడల తీర్పు పొందక పోదుము.

మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము,

ఎటువంటి వివరణ దానికి అవసరం లేదు. అది యిూలాగే యుంటుంది. “మనము అయోగ్యముగా తిని త్రాగినట్లయితే, ప్రభువు శరీరమని వివేచింపక పోతే, మనకు మనమే శిక్షావిధిని తిని త్రాగుచున్నాము. ఈ కారణం చేతనే, మీలో అనేకులు బలహీనులు రోగులైపోతున్నారు. చాలా మంది నిద్రించుచున్నారు”. చూశారా! ఎప్పుడనగా ప్రభు-రాత్రి-భోజనము మనము తీసుకున్నప్పుడు. ప్రతి యొక్క క్రైస్తవుడు తప్పక ప్రభు-రాత్రి-భోజనము తీసికొనవలసియున్నది. అది నీ యొక్క విధి. అది కన్పించుకొనుట యౌతుంది. గమనించారా ? “మీరు దానిని తీసికొనకపోయినట్లయితే, నాతో మీకు పాలు లేదు,” అని యేసు చెప్పాడు, చూశారా? అయితే “ఎవడైతే అయోగ్యముగా తిని త్రాగుతాడో, అట్టివాడు తనకు తానుగా శిక్షను తిని త్రాగుచున్నాడు”. అదేదనగా, నీవుయింకా బయట లోకంతోనున్నట్లయితే మరియు లోక కార్యములు చేయుచున్నట్లయితే, ప్రభు-రాత్రి-భోజనము నీవు తీసికొనుట ప్రజలు చూస్తారు. నీవు తప్పు చేస్తున్నావు. నీవు కేవలం నీకే అవమానమును తెచ్చుకుంటున్నావు. అది నీకు మాత్రమే హాని కలుగజేస్తుంది. అది దేవునికి హాని చేయుటకాదు. అది నీకు హాని చేస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి వారికివారే పరీక్షించుకొనవలెను.

58

మనము ఈ పవిత్రమైన సమయమును సమీపించకముందు, నా బ్రతుకును పరిశోధించమని దేవుని అడుగుము. నేను నీ కొరకు పొరపాటు ఏదైన చేసినట్లయితే, అందుకై నన్ను క్షమించు. అది చేయవలెనని నా భావము కాదు. ఆయన దానిని నాకు బయలుపరచినట్లయితే, నేనది సరి చేసికుంటాను. నీ కొరకు నేనటువంటిదే అడుగుతాను.

“మీరు కూడివచ్చునప్పుడు ఒకరినొకరు కనిపెట్టుకొని యుండుడి! అని చెప్పబడినది. అనగా, ఒకరికై ఒకరు కనిపెట్టుకొనుడి. మరియు ఒకరికై ఒకరు ప్రార్ధి౦చుడి.” మనము ఈ ప్రభు-రాత్రి-భోజనము తీసికొనగోరుచున్నాము. మరి మనమది చేయనట్లయితే, ఆయనలో మనకు భాగము లేదు. అదీ ఆయన చెప్పియున్నది. మొదట... లేక పరిశుద్దుడైన యోహాను, 6వ అధ్యాయం.

59

ఇప్పుడు, కొద్దిగా ప్రార్ధిద్దాం. నిశ్శబ్దంగా, నేను మీ కొరకు ప్రార్ధిస్తుండగా. మీరు నాకై ప్రార్ధి౦చండి. [సభలోని వారు నిశ్శబ్దముగా ప్రార్ధిస్తుండగా, సహోదరుడు బ్రెన్హాం నెమ్మదిగా ప్రార్ధిస్తున్నాడు - సంపా]

ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించుము, ప్రభువా, క్షమాపణ కొరకైన ప్రార్ధన యిది. క్షమాపణకై ప్రార్ధిస్తున్నాము. కనికరము కొరకై మేము ప్రార్ధిస్తున్నాము. ఇది మమ్మును క్షమించుము, ప్రభువా, ఇది నీ వాక్యములో వ్రాయబడినట్లుగా “మా యెడల అపరాధము చేసినవారిని మేము క్షమించిన రీతిగా మా అపరాధములను క్షమించుమని శోధనలోకి తేక కీడు నుండి మమ్ము తప్పించుము. ఏలయనగా నీవే రాజ్యము, బలము మహిమయు నిరంతరము నీవేయైయున్నావు. ఆమేన్”

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...