జీవించి, మృతిచెంది, పాతిపెట్టబడి, తిరిగిలేచి, రాబోవుచున్నాడు
VGR COUNT-72 ఈ మహా గంభీరమైన, పవిత్ర ఉదయవేళ, ఈ దినమున మేమిచ్చచట కూడియుండుటకు మా హృదయాలలో ఎంత భావన కల్గియున్నామో, మానవ భాషలో అది మేము వ్యక్తపరచుట దేనికైనా బహుదూరముగా అదియున్నది. మా మతము నిజరూపము దాల్చిన సమయమునకు యీ ఉదయం ప్రాతినిధ్యం వహిస్తుంది, ఎందుకనగా ఎవరైతే సర్వమానవ జాతిని విమోచించుటకు వచ్చియున్నాడో, ఆ నీ ప్రశస్తమైన బిడ్డ తిరిగి లేచినది ఇది. ప్రభువా! గంభీరమైన మహోన్నతమైన ఆచరణకై ఈ ఉదయం మేమిక్కడ ఉన్నాము. మరణమును, నరకమును సమాధిని జయించిన అత్యధిక జయవీరులనుగా అది మమ్ములను చేసినది. యిన్ని సంవత్సరములన్ని దాటిపోయిననూ, నిన్ను ఆరాధించుటకై ఈస్టరు ఉదయ ప్రాతఃకాలవేళ మేమింకా కూడుకొనియున్నాము. అందుకొరకై నీకు మేము కృతజ్ఞతలు తెల్పుకుంటున్నాము. ఎందుకనగా ఆయన మరలా వచ్చునని మేము నమ్మియన్నాము.
మేము దీనత్వముతో మా తప్పిదాలు ఒప్పుకొనుచూ, మా పాపముల నిమిత్తమైన ప్రాయశ్చిత్తమును మేము అంగీకరిస్తుండగా మాకు విరోధముగా వ్రాయబడియున్నటువంటి మా అతిక్రమములు, పాపములన్నియు క్షమించమని నీకు మేము ప్రార్థన చేయుచున్నాము. ప్రభువా! మా మధ్యనున్న రోగమును స్వస్థపరచుము. మేము బ్రతుకుటకును మరియు విశ్వసించుటకును నీవు మాకై విడచి పెట్టిన, సమస్త సత్యమునకు పునాదియైన నీ పరిశుద్ధ వాక్యమును మేము చదువుచుండగా మాకు సహాయము చేయుము.
2
ఇక్కడ కూడియున్నటువంటి ఈ గుంపు కొరకే మేము ప్రార్ధించుటలేదు గానీ, సమస్త ప్రవంచములోనున్న వారి కొరకూ వేుము ప్రార్ధించుచున్నాము. ఏలయనగా ఆశతోనున్న నేత్రాలతో, ఆతృతతోనున్న హృదయాలతో ఆయన రాకడకై మేము ఎదురు చూచుచున్నాము. ఈ దినమున మేము అంధకారములోను, అవ్యస్త స్థితిలోను నిలబడియున్నాము. అదెట్లనగా ఒక చపలచిత్తుడు ఒకదానిని ఊదివేయగలడేమో; అతడు చిన్న గుండీని త్రిప్పితే ప్రపంచమంతయు ముక్కలు ముక్కలై ఊదివేయబడును. ఉన్నత అధికారుల ద్వారా, యుద్ధమే యిక మరలా సంభవించినచో అది కొద్ది గంటలు మాత్రమే యుండునని చెప్పబడెను. తరువాత, సంఘము మహామహిమగల పునరుత్థానపు అంచున నిలబడియున్నది; కనుక నిద్రించుచున్న పరిశుద్దులతో కలిసి ఆకాశమందు ప్రభువును ఎదుర్కొనుటకు, నిరంతరం ఆయనతో ఉ౦డుటకు మేము కొనిపోబడెదము.
ప్రభువా! నిన్ను ఆరాధించుటకు మేము వచ్చియున్నాము. ఈ దినమున మమ్ము అంగీకరించుము. చదువుచున్న నీ వాక్యమును, పాడుచున్న పాటలను, సువార్త బోధను ఆశీర్వదించుము. పశ్చాత్తాపుల ప్రార్ధనలు స్వీకరించుము. రోగులకైన ప్రార్థనను వినుము, మరియు నీకు నీవే మహిమ తెచ్చుకొనుము. నీ కుమారుడైన యేసు నామములో వినయముగా అది మేము అడుగుచున్నాము. ఆమెన్.
3
మన లేఖనముల కొరకై, ఈ ఉదయం ఎవరైతే మన౦ చదువుటకు తీయవలెనని కోరుచున్నారో...
మాతో కలసి ఈ ఉదయం పెందలకడనే ఆరాధించవలెనని వచ్చియున్న ఈ మంచి గుంపు ప్రజలకు కూర్చొను స్థలపు గదులు మేము సమకూర్చలేదని తెలుసుకొని మేము చింతించుచున్నాము. పలు-పలు విధాలైన సంఘముల నుండి, పలు రాష్ట్రముల నుండి, చివరికి వివిధ దేశముల నుండి, ఈ మహా దివ్యమైన ప్రభువు ఆరాధనకు యిక్కడ మందిరమందు, ఈ ఉదయం కూడుకొనియున్నాము.
కీర్తనలు పుస్తకము మీరు త్రిప్పాలని నేను ఆశపడుతున్నాను. కీర్తనలు 22. ఒక ఈస్టరు కూడికకై చదువుటకు ఇది యొక అసాధారణమైన స్థలమని నేనెరుగుదును, అయితే దేవుడు అసాధారణమైనవాడు.
4
మరిప్పుడు ఈ కూడిక అయిన తరువాత మీరు మీ యొక్క ఉదయవేళ అల్పాహారమునకు వెళ్ళగలందులకు, షుమారు ఒక గంట సేపు తాత్కాలికంగా నిలుపుచేయుదము. ఆ తరువాత ఆదివారపు బడి ఆరాధన తొమ్మిదిన్నరకు ఆరంభమౌతుంది. ఆదివారం ఆరాధన అయిన వెంటనే, యిక్కడే నీళ్ళకుంట యొద్ద బాప్తిస్మము కూటము యుండును. తరువాత మధ్యాహ్నాము 6 గంటలకు స్వస్థత కూడిక కొరకై ప్రార్థనా కార్డులు యివ్వబడును. మీ ప్రియులెవరైనా అనారోగ్యముతోను, అక్కరలతోను యుండిన వారున్నట్లైయితే, ఈ రాత్రి వారిని తెచ్చుటకు జ్ఞప్తించుకోండి. ఎందుకనగా మనకుండునటువంటి చివరి సమయం యిది - ఏలాగైనా కొద్దిసేపు యుంటుంది. వరుస-వరుసగానున్న కూటముల కొరకై, పశ్చిమ తీరుముగుండా లాస్ ఏంజేల్స్ కు ఉదయం ఐదుగంటలకు నేను వెళ్తున్నాను.
5
కీర్తనలు 22లో, మనం చదువుకుందాము.
నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి?నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా నున్నావు?
నా దేవా, పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రివేళను నేను మౌనముగా నండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు.
నీవు ఇశ్రాయేలు చేయుస్తోత్రముల మీద ఆసీనుడవై యున్నావు.
మా పితరులు నీయందు నమ్మిక యుంచిరి: వారు నీయందు నమ్మిక యుంచగా నీవు వారిని రక్షించితివి.
వారు నీకు మొట్టపెట్టి విడుదల నొందిరి: నీయందు నమ్మిక యుంచి సిగ్గుపడక పోయిరి.
నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడినవాడను.
నన్ను చూచువారందరు పెదవులు విరిచితల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు.
యెహోవా మీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమో
వాడు ఆయనకు ఇష్ణుడు గదా ఆయన వానిని తప్పించునేమో అందురు.
గర్భమునుండి నన్ను తీసినవాడవు నీవే గదా: నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి.
గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము: నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే.
శ్రమ వచ్చియున్నది, సహాయము చేయివాడెవడును లేడు నాకు దూరముగా నుండకుము.
వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని యున్నవి; బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి యున్నవి.
చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్ళ తెరచుచున్నారు.
నేను నీళ్ళవలె పారబోయబడి యున్నాను. నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనమువలె కరిగియున్నది.
నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను. నా నాలుక నా దవడను అంటుకొని యున్నది. నీవు నన్ను ప్రేతల భూమిలోపడవేసి యున్నావు.
కుక్కులు నన్ను చుట్టుకొని యున్నవి. దుర్మార్గులు గుంపకూడి నన్ను ఆవరించియున్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచియిన్నారు.
నా యెముకలన్నియు నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు.
నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీకొరకు చీట్లు వేయచున్నారు.
యెహోవా, దూరముగా నుండకుము నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము.
ఖడ్గమునుండి మా ప్రాణమును కుక్కల బలమునుండి నా ప్రాణమును తప్పింపుము.
సింహపు నోటి నుండి నన్నురక్షింపుము; గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చి యున్నావు.
నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను.
యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయనను స్తుతించుడి యాకోబు వంశస్తులారా, విూరందరు ఆయనను ఘనపరచుడి, ఇశ్రాయేలు వంశస్దులారా, మీరందరు ఆయనకు భయపడుడి.
ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను.
మహా సమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయనయందు భయభక్తులు గలవారి యెదుట నా మొక్కుబడులు చెల్లించెదను.
దీనులు భోజనముచేసి తృప్తపొందెదరు. యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. విూ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రదుకును.
భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యుజనుల వంశస్దులందరు నీ సన్నిధిని నమస్కారము చేసెదరు.
రాజ్యము యెహోవాదే, అన్యుజనులలో ఏలువాడు ఆయనే.
భూమిమీద వర్ధిల్లుచున్నవారందరు అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు, తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరు ఆయనను సన్నిధిని మోకరించెదరు.
ఒక సంతతివారు ఆయనకు సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు.
వారు వచ్చి, ఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరతురు.
6
చదవబడిన ఆయన వాక్యమునకు ప్రభువు ఆయన ఆశీర్వాదమును తోడు చేయునుగాక! ఈ ఉదయం ఈ సందర్భమునకు నేను ఐదు మాటలు తీసికోవాలని ఆశించుచున్నాను. ఆ ఐదు మాటల మీద నా హృదయంపైనున్నదేదో, ఈ ఉదయం ఆరాధికులైన మీకు తెలియపరచ ప్రయత్నిస్తాను. ఈ ఐదు మాటలు నేను కోరుకుంటున్నాను. జీవించి, మృతిచెంది, పాతిపెట్టబడి, తిరిగిలేచి, రాబోవుచున్నాడు.
నేనేమి చెప్పాలనుకుంటున్నానో, ఈ పాటను వ్రాసిన పద్యకారుడు, దానిని తన గీతికలో విశదముగా వ్యక్తపరచాడని నేననుకుంటున్నాను.
జీవించుచు, ఆయన నన్ను ప్రేమించెను, మృతిచెంది, ఆయన నన్ను రక్షించెను.
పాతిపెట్టబడి, ఆయన నా పాపములను బహుదూరమునకు మోసికొని పోయెను.
తిరిగిలేచి, ఆయన నిరంతం నీతిమంతునిగా తీర్చెను.
ఒక రోజు ఆయన రాబోతున్నాడు, ఓహో, మహిమకరమైన దినము!
7
ఆయనవలె జీవించిన జీవితముగలవారు ఎవ్వరు ఎక్కడా యుండరు. ఎందుకనగా, ఆయన జన్మించినప్పుడు, దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షమాయెను. తండ్రియైన దేవుడు ఏమైయుండెనో ఆ మూర్తిమత్వము ఆయనేయై యుండెను. తండ్రియైన దేవుడు ప్రేమయై యుంటే, ఆలాగైతే ప్రేమయొక్క మూర్తిమంతము యేసే. చిన్నబిడ్డగానున్న ఆయన చిన్నచేతులు తన తల్లి యొక్క మెత్తని చెక్కిళ్ళు తాకినప్పుడే, మొట్టమొదటిసారిగా సమయముననే ఆయన ప్రేమయై యుండెను. ఆయన ప్రేమయై యుండెను.
ఈ దినము ఆయన ప్రేమయై యున్నాడను దానినే అనేకులు గుర్తించలేక విఫలులౌతున్నారనునది నేను తలంచుచున్నాను. “దేవుడు ప్రేమయైయున్నాడు. మరియు ప్రేమించువారెవరో, వారు దేవుని మూలముగా పుట్టినవారు,”
“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అనగా ప్రేమకు అపాత్రులైన వారిని ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”
8
ఆయన యిక్కడ భూమిమీద ఉన్నప్పుడు అనేక విధములుగా ఆయన తన ప్రేమను తెలియపరచెను. నిరాక్షేపముగా ప్రాణముగల ప్రతి ప్రాణిలో ఆయనే మహోన్నతమైన ప్రేమగలవాడనునంత వరకు అది తెలియపరచెను. ఇక్కడ, ఆయన జీవితంలో ఆయన దేవుని తెలియచేయుచుండెడివాడని నేననుకుంటున్నాను. దేవుడు ప్రజలకు తెలియపరచుకొను ఒకే మార్గము ప్రేమ ద్వారా మాత్రమే.
ఆయన దినమున బహుశా బహు నీచమైన స్త్రీలలో యొకరు పట్టుబడగా ఆయన దీనిని చేశాడా? ఒక్కసారిగా వారామెను నేరస్తురాలుగా వారు పట్టుకున్నారు. ఆమె వ్యభిచారమందు పట్టుబడగా బయటకు వెళ్ళు మార్గం యికలేదాయెను. ఆయన యెదుటకు వారామెను యిూడ్చుకొని వచ్చి “ఆమెను ఏమిచేయమని నీవు చెప్పెదవు?” అని అడిగారు.
ఆమె వైపునకు ఆయన తిరిగి “నేనును నిన్ను శిక్షించను. వెళ్ళు యిక పాపము చేయవద్దు” అని చెప్పాడు. ఆమెపై బడిన తోడేళ్ళ మందవలె ఈడ్చి, ఆమె ప్రాణమును తీయుటకు ఆమెపై రాళ్ళు వేసి, వీధుల్లోకి త్రోసివేయుటకు బదులు, ఆయన దయగల మెత్తని హృదయము, ఆమెయున్న పాపములోకి వంగిపోయి “నేను నిన్ను శిక్షించను, వెళ్ళు యికెన్నడు పాపము చేయవద్దు,” అని ఆయన చెప్పెను.
9
మరియు లాజరు సమాధి యొద్దకు వెళ్ళిన మార్గమందు ఆయన యున్నప్పుడు, మానవాళికి దేవుడేమై యున్నది యనునది ఆయన వ్యక్తపరచిన మరొక ఘనమైన సమయం అదియని నేను తలంచుచున్నాను. జరిగిన బహు నీచమైన పాపమును క్షమించు దేవుడు మాత్రమే ఆయన కాదు గానీ; క్షమించగలిగిన ఆయన ప్రేమవలన అపరాధములు తీసివేసి వారిని నిరపరాధులుగా చేయువాడు ఆయన. అయితే మరణము మనలను నిశబ్ధతలోయుంచిన తరువాత, ఆయన యింకా మనలను గూర్చి ఆలోచన గల్గియున్నాడు. ఒక ప్రియమైన వ్యక్తి యొక్క జీవితాన్ని మరణం ఎక్కడైతే మూసివేసినదో ఆ యింటికి ఆయన వచ్చినప్పుడు, మార్గమధ్యమున మార్త మరియలతో బహు విశదముగా దానిని ఆయన తెలియపరచెను. సమాధి దారిన ఆయన యుండినప్పుడే, ఆయన దేవుడై యుండియు, ఆయన మృతులలో నుండి తిరిగి లేచునని యెరిగియుండియు, ఆయన పలికిన ఆ మాటలే ఆతనిని సమాధిలో నుండి పైకి లేపగల శక్తిగలవని ఆయన ఎరిగి యుండెను. అయినను, మార్త మరియ మరియు లాజరును ప్రేమించినవారు ఏడ్చుచుండుట ఆయన చూచి ఆయన ఏడ్చెను అని బైబిల్ తెలియజేస్తుంది, అదేంటి? ఆయన మహోన్నతమైన ప్రేమగల హృదయం! ఆయన ఆ మనుష్యుని చూచినప్పుడు, ఆయన స్నేహితులు బాధ చెందుతున్నప్పుడు వారితో కలిసి ఆయన బాధపడ్డాడు.
10
విరిగిన నలిగిన హృదయంగలవారి మద్య ఆయన యుండునని నేనెరిగినందులకు నేనెంతో ఆనందంగాయున్నాను. మరియు మన యొక్క దుఃఖములలో మనలను విడిచిపెట్టనివాడు ఆయన. అంతా విఫలమైపోయినప్పుడు, భూసంబంధమైన ఆఖరి ఆశలు అంతమునకు వచ్చినప్పుడు, ఆయన మన ప్రక్కన నిలబడతాడు. ఆయన యింకా దేవుడై యున్నాడు. ఆయన మనలను ప్రేమించును. దేవుని మూర్తిమంతము ఆయన.
ఓ! ఆయన ఆత్మచేత ఆయన ప్రజలునిండారుగా అభిషేకించబడాలని ఆయన ఆకాంక్షిస్తూన్నాడని నేను నమ్ముతున్నాను. ఎంతవరకనగా, మన బాధలలో యిబ్బందులలో ఒకరియొద్దకు ఒకరు వెళ్ళిపోయి, ఆయన ఆత్మవలన మన హృదయాలలో కుమ్మరించబడిన ఆయన జాలి ప్రకారముగా, జీవముగల దేవుని ప్రేమ ఆయన సంఘములో ప్రతిభింబించునట్లుగా దానిని విశదపరచుట. ఆయనేమని చెప్పినది లేక పద్యకారుడు పలికినది దానిని బహువిశదముగా తెలియపరచుచున్నది.
11
దేవుడు ఆయనకు ఆయనేమై యుండెనో అట్టి దానిని మరియు సర్వ-మానవాళికి ఆయన ఏమిచేసినో అట్టి దానిని ఆయన యేసుక్రీస్తులో చూయించెను. ప్రేమకు అపాత్రులై ఎందరుండిరో వారిని ప్రేమించమని, క్షమించమని, ఆయన అభిమతమును మానవజాతికి తెలియపరచెను. ఈ ఈస్టరు ఉదయవేళ ఎంతగా మనము దానికి సంకుచితులమై యున్నామేమోనని నేను ఆశ్చర్యపడుతున్నాను. మనలను ప్రేమించువారిని మనం ప్రేమించగలము. ఆయనైతే ఆయనను ప్రేమించనివారిని ఆయన ప్రేమించాడు.
ఎన్నడెన్నడూ కూడా భూమిని తాకని ప్రేమకు మొదటిసారిగా ప్రాతినిధ్యమును, మహోన్నతమును ఆయనే. మరియు ఆయన ఎవరినైతే పేమించాడో, భూమిపైనున్న అటువంటి వారిచేత ఆయన తృణీకరింపబడెను. ఆయనవలె ఏ మనుష్యుడు ప్రేమించలేడు. ఆయనవలె ఏ మనుష్యుడు ద్వేషించబడలేదు. వారాయనను ద్వేషించారు. వారయనను తృణీకరించి విసర్జించారు. అయితే అలాంటివి ఆయన ప్రేమను నిలుపు చేయలేదు. కడవరిగా, ఆయన జీవించిన ఆ జీవితము, మంచి కార్యములకంటె మరొక దానికొరకై జీవించలేదు. రోగులను స్వస్థపరచి, మంచి కార్యములు చేసి అట్టి జీవితం జీవించిన తర్వాత శిలువలో వ్రేలాడుచు, నేరస్తులను క్షమించెను. శిలువలో ఆయన ఆఖరి శ్వాసతోనున్నప్పుడు వ్రేలాడుతున్న ఆయన పవిత్ర ముఖము ప్రక్కగా నిలబడిన తుచ్చులు అపహసించుచూ ఉమ్మివేయుచుండగా, “తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని” నిండుగానున్న ప్రేమగుండెతో ఆయన కేకవేశాడు.
12
ఆయన గ్రహించగల్గెను. ఆయన దేవుడై యుండి ఆయన గ్రహించును. అందుచేతనే మనము ప్రేమకు నోచుకోని వారమైనను ఆయన మనలను ప్రేమించెను. కారణం; ఆయన దేవుడు, ఆయన తెలుసుకొనును. “జీవించుచు, ఆయన నన్ను ప్రేమించెను”. ఆలాగు జీవించిన జీవితం వేరేలేనేలేదు. ఎందుకనగా ఆయన ప్రేమతో చుట్టబడినాడు.
“చనిపోయి, ఆయననన్ను రక్షించెను.” ఏదేను తోటలోనున్నప్పుడే, దేవుడైన యెహోవా మరణము అగత్యమైనదని కోరెను. పాపమునకు జరిమానా మరణము. ఇక ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. దానిని సరిచేసుకొనుటకు వేరే మార్గముండదు. ఎందుకనగా దేవుడు అతీతుడు. మరియు ఆయన అనంతుడు మరియు ఆకాశానికి భూమికిని తీర్పరి. పాపము యొక్క జరిమానా మరణము. ఒకరికొరకు ఒకరు శిక్షారుణము చెల్లించువారు ఎవరులేరు. ఏలయనగా ప్రతియొక్క మనుష్యుడు, అతడు ఒకవేళ మరొకరికొరకు చనిపోయినప్పటికి, ప్రారంభంలో అతడు నేరస్తుడే. మరొకరికై సహాయంచేయువారు ఎవరు లేరు. ఎందుకనగా మనమంతా నేరస్తులమై యున్నాము. “మనము పాపములో జన్మించి, అతిక్రమమున రూపముదాల్చి అబద్ధములాడుచు లోకములోకి వచ్చి యున్నాము.” ఎక్కడ కూడా ఎలాటి నిరీక్షణారేఖ అనునది లేదు. దేవుని ద్వారా మనము మరణదండనకు పాత్రులమైతిమి. మరియు భూమిపై ప్రాకు ప్రతిజీవియు ఈ శిక్షావిధిక్రింద యుండెను, నీతిమంతులు పుట్టి ఘనమైన కార్యములు చేయగల్గిరి కానీ ఆరంభం నుండే అతడు యొక పాపియైయుండెను.
13
దానికి ఋణము చెల్లించు ఒకే ఓక మార్గముండెను; అది దేవుడే తనకుతాను మరణించుట. కాబట్టి దేవుడు, ఆత్మయై యుండి, మరణించలేడు. అయితే ఆయన శరీర రూపమున వచ్చి ప్రేమ జీవితములో మంచితనమంతా తీసికొని దానిని యిష్టపూర్వకముగా ఒక మహోన్నతమైన అర్పణగా సమర్పించెను. మనమందరము కూడా పాపులమై యుండి లోకమందు మనము రక్షించబడు మార్గము మనకు వేరే లేకుండెను. భూమి మీద కనబడుటకు మాత్రమే ఆయన రాలేదు గాని ఒక అర్పణగా చనిపోవుటకు ఆయన వచ్చెను.
కయూను కంటె బహుశ్రేష్టమైన అర్పణను దేవునికి హెబెలు అర్పించినప్పుడు దానినతడు వ్యక్తపరచినాడు. చిన్న గొర్రె పిల్ల మెడకు ద్రాక్షాతీగ ముక్క చుట్టురా చుట్టి, దానిని బండ యెద్దకు తీసికొనివచ్చాడు. ఆ చిన్నది బండ మీద అక్కడ పరుండ బెట్టబడెను. దాని చిన్న గడ్డమును రాయితో వెనుకకు లాగాడు. దాని చిన్న గొంతుకను తొక్కాడు. అది చచ్చిపోతూ అరుపులు అరుస్తూ రక్తాన్ని చిమ్మినది. దాని చిన్న తెల్లని జడలు రక్తంతో మునిగిపోయినవి. హెబేలు అక్కడ కల్వరిని వ్యక్తపరచాడు.
14
జగత్పునాది మొదలుకొని వధింపబడియున్న దేవుని గొట్టెపిల్ల నేరస్తులైన పాపులయొక్క స్థానాన్ని స్వీకరించుటకు వచ్చెను. నలుగగొట్టబడి చితుకగొట్టబడినది. దూషించబడి ఎగతాళి చేయబడినది. మరియు దేవుడు తప్ప మరి ఏ ప్రాణియు మరణించని మరణమును మరణించెను. రక్తమయమైపోయిన ఆయన జుట్టు, ఆయన భుజములపై నుండి వ్రేలాడుతూ నేలపై చుక్కలుగా కారుచుండెను. పాపపు బ్రతుకు నుండి మానవుని విమోచించుటకై ఆయన చనిపోవలసి వచ్చినప్పుడు, పాపమెంతటి భయంకరమైనదో వ్యక్తము చేయబడెను. ఆ విధముగా మరేది మరణించలేదు. ఆ మరణానికి మరేది నిలబడలేదు. యిూ విధముగా చెప్పబడినది “ఆయన ప్రక్కలోవారు పొడవగా రక్తము నీళ్ళను కారెను”. అని చెప్పబడినది.
15
అది కొంచెం కాలం క్రితమే. దీనిని గూర్చి నేనొకరితో మాట్లాడుచుంటిని. అదియొక శాస్త్రవేత్త అన్నాడు. “అది ఆలాగు జరుగుటకు ఒకటే యొకటున్నది. అది రోమా ఈటెద్వారా కాదు ఆయన చనిపోయినది. రక్తము లేకపోవుట వలన కాదు ఆయన చనిపోయినది. ఎందుకనగా ఆయన దేహములో యింకా రక్తమున్నది. ఆయన చనిపోయినది ఎందకనగా, రోమా ఈటె వలన కాదు; లేక ఆయన చేతులలో దిగగొట్టబడిన సీలల ద్వారా కాదు. లేక ఆయన తలపైన పెట్టిన ముళ్ళ కిరీటము వలన కాదు. కానీ, వ్యసనమువలన ఆయన చనిపోయెను. ఎందుకనగా ఆయన తన స్వకీయుల యొద్దకు ఆయన వచ్చెను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఎవరిని విమోచించుటకై ఆయన చావవలసియుండెనో, ఆ ప్రాణులను ఆయన ఎరిగి యుండెను. వారాయన ముఖమున ఉమ్మివేసిరి. మనుష్యుల వలన ఆయన విసర్జింపబడినవాడాయెను.”
16
ఆయన కల్వరిలో ఏడ్చి మొరలిడిన “నాదేవా, నీవు నన్నెందుకు విడనాడితివి?” అను అదే స్వరముతో దావీదు ఎనిమిది వందల సంవత్సరముల క్రితం అది జరుగక మునుపు, కేకవేసెను.
పాపము ఎంతటి ఘోరమైన విషయాన్ని చేయునో కదా! అది మానవుని దేవునికి వేరు చేస్తుంది. మన పాపములకొరకై అర్పించబడవలసిన పాప-పరిహారార్థబలి ఆయన. దేవుని సన్నిధిలోనుండి ఆయన వేరు చేయబడెను. పాపము ఆయనను వేరుచేసెను. మన పాపములను దేవుడు ఆయనపై మోపెను. దేవుని నుండి ఆయన వేరు చేయబడెను. అందుకని ఆయన నీవు నన్నేల విడనాడితివి? అని కేకవేసెను. ఎందుకనగా ఆయన మరువబడెను. మరియు ఈ స్థలమును ఆయన స్వీకరించెను. ఆయన ప్రజలు చూచిరి. వారికై ప్రాణమును అర్పించుటకు వారిరక్షకునిగా ఆయన వచ్చెను. వారాయనను తృణీకరించిరి. అది ఆయనను ఎంతగానో వ్యసనము కలుగజేసెను. ఎంత వరకనగా రక్తము నీళ్ళు వచ్చునంతగా; ఆయన దేహంలోని రసాయనాలు వేరై పోయేంతగా అది ఆయనెంతగానో పగిలిన హృదయంగల వానిగాచేసెను.
17
అదేమైయుండెనో మానవుడు ఎన్నడూ ఎరుగడు. ఆ కారణం చేతనే ఆ విధమైన మరణమును యింకొకరు పొందియుండుట ఎక్కడా యుండదు. నీవెంతగా చిత్ర వధ చేయబడినది; కొయ్యబండలలో నీ పాదములు ఎంతగా పెట్టినది; లేక నిన్ను అంగుళములుగా కోసినది, లేక అంగుళములుగా నిన్ను కాల్చినది నాకు లెక్కలేదు. అటువంటి మరణం నీవు పొందలేవు. ఎందుకనగా నీ యొక్క నిర్మాణము అలాగుండదు. ఆయన దేవుడైయుండవలసియున్నది. మనుష్యునికన్న మిన్నయై ఆయన యుండవలసి యున్నది. అది ఆలోచన చేసినచో, దేవుడే మరణించాడు. లోకము కొరకై ఆలాంటి వేధనతో గుండెపగిలినవానిగా ఆయన చనిపోయెను. చివరకు రసాయన ప్రక్రియలు ఆయన దేహములో జరుగునంతగా, అది నీలో జరుగలేదు. నీవా విధముగా బాధపడలేవు. ఆ రకమైన వేదనను నీవు పొందుకొనుటకు నీకు వేరే మార్గం లేదు. కనుక ఒక్కరు మాత్రమే అది చేయగలరు. మరి దానిని ఆయనే చేసెను.
18
ప్రేమ, మంచి చేయుట తప్ప మరొక్కటి ఎరుగని ఆ ప్రశస్త ప్రాణి, ఆకాశము భూమికి మధ్య పైకెత్తబడి, దిగంబరిగా చేయబడి, కలత పలుకబడిన మాట చెందినవాడై అక్కడ వ్రేలాడుచూయుండెను. నీవు వస్త్రహీనుడుగా చేయబడితే నీవెలాగుంటావో ఆలోచన చేయ్! అక్కడ దేవుడు ఎలా వ్రేలాడుచున్నాడో ఆ తడబాటులు నీ వెరుగుతావు. శిలువ వేయుట యనునది చిన్న విషయమేనని నాకు తెలుసు. ఆయన చుట్టూ ఏదో యొకటి చుట్టియుండినట్లుగా అని వున్నది. అయితే వారది చేయలేదు. అది కేవలం శిలువపైన పెట్టుట. లేదా చిత్రకారుడు అది అక్కడ పెట్టియున్నాడు. వారాయన బట్టలు ఆయన పైనుండి తీసివేశారు. ఆయనపైన ఒక అంగీయున్నది. మరి వారది ఆయనపైనుండి చించి దానికొరకు చీట్లు వేశారు. ఈయన ఎంతగానో తడబాటు పడ్డాడు. అయినప్పటికి, ఆయన దేవుడై యుండి నిలబడవలసియుండెను. పాపులు ఆయన ముఖమున ఉమ్మివేశారు. సిగ్గు యొక్క నిఘూడతను ఎరిగి యుండియు, దిగంబరిగా ప్రజల యెదుట చావవలసియుండెను. అటువంటి ప్రభావము ఆయనపై పడి, నీళ్ళు రక్తము వేరగునంతగా అది జరిగినది. ఆశ్చర్యమేమి కాదు... పగులుచున్న రాళ్ళు అంధకారమౌతున్న మేఘాల మధ్య నా రక్షకుడు తన తలను వాల్చి మృతిచెందెను. అయితే తెరచిన తెర పరలోకపు ఆనందానికి, ముగింపు లేని రోజుకు మార్గమును బయలుపరచెను.
19
నిజం! ఆయనే అది చేయవలసియుండెను. అడ్డు-తెర మానవునికి దేవునికి మధ్య వ్రేలాడుచుండెను. ఆ తెరచిన తెర పరలోకపు ఆనందానికి ముగింపులేని దినమునకు మార్గమును బయలు పరచెను. కల్వరి అనగా యొకటి అనగా మనం వ్యక్తం చేయుదానికంటె మించినది. నిజం!
జీవించుచు ఆయన నన్ను ప్రేమించెను, మృతిచెంది ఆయన నన్ను రక్షించెను
పాతిపెట్టబడి ఆయన నా పాపములను బహుదూరమునకు మోసికొనిపోయెను.
ఇప్పుడది శిక్షించబడియున్నది. పాపమునకు యిక పట్టులేదు. “అది సమాప్తమైనదని” శిలువలో ఆయన ఎప్పుడు కేకవేసెనో, అప్పుడే పాపము చనిపోయినది. యిప్పుడది మృతిపో౦దినది. అది అయిపోయినది. అది శక్తి హీనమైపోయినది. అది ప్రాణములేనిదై పోయినది. ప్రజలారా! అది ఆలోచన చేయుడి! మానవులకు శత్రువగు ఆ పాపము, అది చనిపోయి నిర్జీవమై పోయినది. దానికిక శక్తిలేదు. అది చేయలేదు. సూర్యుడు తన దర్శనాన్ని మూసివేశాడు. నక్షత్రాలు ప్రకాశించలేదు, భూమి నలుపుగా మారిపోయినది అని అనుటలోఆశ్చర్యమేమి లేదు. అదంతా విమోచించబడినది.
అది మృతిచెందినది. అది సమాధి చేయబడినది. అది నిర్జీవమై పోయినది. దానియందు యిక జీవము లేనేలేదు. ఆలాగైతే అది పాతిపెట్టబడవలసి యున్నది. ఏది పాతిపెట్టబడినది? - దేవుని శరీరము పాతిపెట్టబడినది. ఏలయనగా అది పాపపరిహారార్థబలి. అది కాల్చబడిన గొర్రెపిల్ల, అది అతిక్రమముల అగ్నిచేత అది కాల్చబడినది. పాప రహితమైన ఆ గొర్రెపిల్ల, పాపమనగా తెలియనిది అది. ఏలాటి పొరపాటు ఎరుగని దేవుడు; ఆయన ప్రాణము యివ్వబడెను; అక్కడే పాపపరిహారార్థబలి వ్రేలాడుచుండెను. “పాతిపెట్టబడి, ఆయన నా పాపములను బహుదూరమునకు వెూసి కొనిపోయెను.” ఆయన తప్పక పాతిపెట్టబడవలసి యుండెను. శరీరము, పాపపరిహారార్థబలి తప్పక పాతిపెట్టబడవలసియుండెను.
20
అందుచేత కొద్దిసేపైన తరువాత అనేకమంది ఒకరి తరువాత ఒకరు ఈ నీళ్ళకుంట యొద్దకు యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందుటకు నడచుచు వెళ్ళుదురు. ఎందుకని? ఒకటి జరిగినది కాబట్టి, “అది సమాప్తమైనది” అని ఆయన చెప్పగా, ఆ శరీరములలో నుండి వచ్చిన ఆ ఆత్మ మనశరీరములలోని పాపమును శిక్షించెను. ఇక ఎన్నడు జ్ఞప్తియుండకుండునట్లుగా దానిని మనం పాతిపెట్టవలసియున్నది. అది ఆలాగున్నందుకు నేనెంతో ఆనందంగా యున్నాను.
ఏదైనా చనిపోయినప్పుడు, అది దాచబడుతుంది. అది దృష్టికి కన్పించదు. “మరియు పాతి పెట్టబడి, ఆయన నా పాపములను బహుదూరమునకు మోసికొనిపోయెను.” దేవుడు, మనపాపములను యిక చూడలేకున్నాడు; ఏలయనగా అవి పాతిపెట్టబడినవి. అవెక్కడ పాతిపెట్టబడినవి? మరిచిపోవుటయను సముద్రములో మరిచిపోవుటయను సముద్రమును గూర్చి ఆలోచనచేయ్! దేవుడు వాటిని యిక ఎన్నడు జ్ఞప్తించుకొనడు. ఏందుకనగా అవి చచ్చిపోయినవి. మరియు పాతి పెట్టబడినవి. అవి యికఎన్నటికి జ్ఞాపకమునకు రావు. దేవుని జ్ఞాపకములో అవిలేవు.
21
ఈ “పాతిపెట్టుటలో” యింకా ఆయన పాత నిబంధనకు పోలికయైయుంటున్నాడు. వారికి రెండు కలవు. పరిశుద్ధస్థలము శుద్దీకరణ సమయమున పాపపరిహారార్ధబలి వారికుండెను. ఆ పాపపరిహారార్థ బలికై వారు రెండు మేకలను తీసుకుంటారు. ఒక మేక చంపబడుతుంది. మరొకటి; చనిపోయిన మేక యొక్క పాపములు జీవించియున్న మేకపైన పెట్టబడతవి.
జ్ఞప్తించుకోండి! యేసు గొర్రెయైయుండెను. ఆయన గొర్రె పిల్ల ఆయితే ఈ సందర్భమందు ఆయన మేకగా మారెను. ఆయన నీతిమంతుడు. ఎందుకనగా ఆయన దేవుడు, గొర్రె. అయితే ఆయన మేకగా వచ్చెను, -పాపము. ఆయన నీ కొరకు నా కొరకు పాపపు బలియవుటకై గొర్రె నుండి మేక - ఒక మేకగా వచ్చెను.
22
రెండు జంతువులకును యేసు పోలికగాయున్నాడు. రెండు మేకలకు. ఎందుకనగా, ఒకటి ఆయన చనిపోయెను; ప్రాయశ్చితార్ధమునకై ఆయన చనిపోయెను. రెండవది; ప్రాయశ్చితార్ధమువలననైన పాపములు విడిచిపెట్టే మేకపైన పెడతారు. యింకా, విడిచి పెట్టబడు మేక ప్రజల పాపములను భరించుటకై, ప్రజల పాపములను తీసుకొని అరణ్యములోకి ఎంతో దూరము వెళ్ళిపోయెను. అదేంటి? అది మన ప్రభువైన యేసు యొక్క మరణము, పాతిపెట్టబడుట. మరణించుట! “జీవించుచు, ఆయన నన్ను ప్రేమించెను, మృతినొంది, ఆయన నన్ను రక్షించెను. పాతిపెట్టబడి ఆయన నా పాపములు బహుదూరమునకు మోసికొనిపోయెను.” ప్రజల పాపములను ఆయన తనపైన వేసికొని నేరుగా వాటిని అగాధము యొక్క అతి తక్కువ స్థలమునకు వెూసుకొనిపోయెను. ఆయనే పాప పరిహారార్థబలియాయెను. ప్రజల పాపములు ఆయనపైన యుండెను. వారి కొరకు ఆయన చనిపోయాడు. ఇంకా పాపములు ఆయనపైన పెట్టబడినవి. మన పాపములు ఆయన బహుదూరమునకు వెూసి కొనిపోయాడు. ఎంతవరకనగా దేవుడు యిక ఎన్నడు చూడకుండునంతగా తీసికొనిపోయాడు. అది ఆలోచించు! ఓ, సంఘము “అటువంటి రక్షకునికై హల్లెలూయా” అని అరుపులు అరవగలదు.
23
మన పాపములు క్షమించబడుట మాత్రమే కాదు గాని, అవి యిక ఎన్నడూ జ్ఞాపకము లేకుండునట్లుగా మరచిపోవుటయను సముద్రంలో పాతి పెట్టబడినవి. “పాతిపెట్టబడి ఆయన, పాపములను బహుదూరానికి వెూసికొనిపోయెను.” అవి యిక ఎన్నడూ జ్ఞాపకముండవు. ఏలయనగా అవి దేవుని కన్నులకు కనపడవు. అవి విరిగిపోయినవి. అవి విడాకులు తీసుకొన్నవి. అవి ఆర్పివేయబడినవి. యిక ఎన్నడూ దేవుడు వాటిని జ్ఞాపకముంచుకోడు. ఏంటి? మన పాపములు యిక ఎన్నడూ జ్ఞాపకముండవని దానినెరిగినందుకు, ఈ ఉదయం సంఘము ఆనందించవలసియున్నది. ఎటువంటి పునరుత్థానము లేనటువంటి ఆవల సమాధిలో మరచిపోవుటయను సముద్రములలో అవి వేయబడివున్నవి. అవి నిరంతరము చచ్చిపోయినవి, మరిచిపోబడినవి. యిక ఎన్నడూ జరగనవిగా అవియున్నవి. “మృతినొంది ఆయన నన్ను రక్షించెను. అయితే, పాతిపెట్టబడి ఆయన నా పాపములను బహుదూరమునకు వెూసికొనిపోయెను”. అవి మరచిపోవుటయను సముద్రంలోనికి వెళ్ళునంతగా ఆయన వాటిని అంతవరకు మోసికొనిపోయెను. ఓ! అవన్ని మన మధ్య మరి ముఖ్యముగా నిజంగా నమ్మబడుచున్నవియని అది మనకు తెలుసును, - మరియు అవి మరిముఖ్యముగా, నిజమేయైవున్నవి. అవి దేవుని నత్యము. అవన్ని కూడ మానవ ఉచ్చరణకు అతీతములైయున్నవి. అలాటి వాటికొరకై మన కృతజ్ఞతలు మనమేనాడు తెలియపరచలేము.
24
అయితే, ఆ ఈస్టరు! “తిరిగిలేచి, ఆయన ఉచితముగా నిరంతరము నీతిమంతునిగా తీర్చెను”.
జీవించుచూ, ఆయన నన్ను ప్రేమించెను. చనిపోయి ఆయన నన్ను రక్షించెను.
పాతి పెట్టబడి, ఆయన నా పాపములను బహూదూరమునకు మోసికొనిపోయెను.
(అదంతా నిజమే)
అయితే, తిరిగిలేచి, నన్ను నీతిమంతునిగా తీర్చెను.
ఆ తిరిగిలేచుట అనగా ఏంటి? బాకీ చెల్లించబడినది అనుటకు అది దేవుని పత్రం. “తిరిగిలేచి ఆయన నన్ను నిరంతరము ఉచితంగా నీతిమంతునిగా తీర్చెను.” ఓ, ఎటువంటి రక్షకుడు! తిరిగిలేచెను. దేవుడు చేసినదేంటి? ఒక మానవుడు చనిపోగలడు, ఒక మనుష్యుడు పాతిపెట్టబడతాడు. అయితే ఈస్టరు, వాటిన్నిటికంటే మహాఘనమైనది. ఎందుకనగా అది దేవుని యొక్క ఆమోదించబడిన చేవ్రాలు. “నా యొక్క చట్టములు కలసికొనినవి, నాయొక్క కోరికలు కలసికొనినవి.” - అది ఆయనే, “మృతులలో నుండి ఆయన ఆయనను లేపెను. తిరిగి లేచి, ఆయన నిరంతరము ఉచితముగా నీతిమంతులునుగా తీర్చెను.” ఆయన పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక!
25
భావోద్రేకాలు అది తీసికొనివచ్చును అని అను దానిలో ఆశ్చర్యపడనవసరము లేదు. మానవ హృదయం దానికి పట్టదు అనుటకు ఆశ్చర్యపడనవసరము లేదు. ఓ, “మేము ఉచితముగా నిరంతరం నీతిమంతులుముగా తీర్చబడితిమి” యని దూరాన నిలబడి మన విజయమందు విశ్వాసముతో చెప్పగలము. ఎందుకనగా ఆయన చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, మరియు ఈస్టరు ఉదయమున దేవుడు ఆయనను తిరిగి లేపాడు. కనుక, ఆయన చేసినవన్నీ, అవి అంగీకృతమైనవని దేవుడు చూపించాడు. ప్రతీది ఉచితముగా చెల్లించబడినది. ఇప్పుడు నీవు ఉచితముగా వెళ్ళిపో. “తిరిగి లేచి ఆయన నిరంతరం ఉచితముగా నీతిమంతునిగా తీర్చెను.” ఓ, ఆయన తిరిగి లేచినప్పుడు, ఆ ఘనమైన దినమును ఎవ్వరు ఏనాడు తలంచలేదు. ఇంకా పాత నిబంధన భక్తులు పరదైశులో “హల్లేలూయా” అని కేక వేయుచుండగా దేవదూతలు అది చూశారు. ఆకాశ ఆకాశములలో దేవదూతలు దేవునికి స్తుతులు పాడి ఆనందించారు. “తిరిగిలేచి ఆయన నీతిమంతులుగా తీర్చెను....” ఆకాశము వణికిపోయినది, భూమి వణికిపోయినది, పరదైసు వణికిపోయినది, పరలోకము వణికిపోయినది. ఆ ఘనమైన స్వరము బయలు వెడలినప్పుడు సమాధిలోనుండి పైకి ఆయన లేచెను. “తిరిగి లేచి ఆయన నిరంతరము ఉచితముగా నీతిమంతులుగా తీర్చెను.” ఓ, మై!
26
ఆయన ఏమి చేసియున్నాడో, దూరాన ఆ ఆశ్చర్యమైన కృపను మనము చూచినప్పుడు ఆయనలో చనిపోయిన పరిశుద్ధులు ఇది పాడగలరు. గమనించారా? ముద్రించబడి దేవుని అనుమతి అంగీకారమును! “కొంచెము కాలము అయిన తరువాత లోకము నన్నెడూ చూడదు. అయినను మీరు నన్ను చూతురు. ఏలయనగా నేను మృతులలో నుండి లేచి మీతో ఉందును, మీలోను ఉందును. యుగసమాప్తి వరకు మీతో కూడా ఉందును. దేవుడు చెప్పినది, సత్యమని ఒక నిర్ధారణగా, మరియు నేను చెప్పినది సత్యమేనని ధృవీకరణకు. అది యేసు చెప్పెను.” “నేను పరిశుద్ధాత్మ రూపమున వచ్చెదను. నా నివాసము మీతో ఉంచెదను. మీతో సదా కాలము ఉండెదను.” అలాగయినట్లయితే ఆ పునరుత్థాన నిరీక్షణను తమ హృదయాలలో ఎవ్వరు కలిగియుందురో ఆ పరిశుద్ధులు ఇది పాడగలరు.
ప్రకాశవంతమైన మేఘరహితమైన ఆ ఉదయమున
క్రీస్తు నందు మృతులు తిరిగిలేచినప్పుడు,
ఆయన పునరుత్థాన మహిమపంచబడును;
ఆకాశపు ఆవల ఆయన ఏర్పరచబడినవారు వారి గృహములకు చేరునప్పుడు
(పరిపూర్ణ నిశ్చయతతో, దేవుని ముద్రతో
దేవుని యొద్దనుండి వచ్చిన వ్రాయబడిన ప్రతితో)
అక్కడ హాజరుపట్టీ పిలువబడునప్పుడు, నేనక్కడయుండెదను.
ఓ, ఎంత గొప్ప రక్షకుడు! ఓ, వారు చెప్పుటలో ఆశ్చర్యము లేదు కదా!
జీవించి, ఆయన నన్ను ప్రేమించెను, మృతి చెంది, ఆయన నన్ను రక్షించెను.
పాతిపెట్టబడి, ఆయన నా పాపములను బహుదూరమునకు మోసికొనిపోయెను.
ఓ! తిరిగి లేచి, ఆయన ఉచితంగా నిరంతరం నీతిమంతునిగా తీర్చెను.
27
పాపములు క్షమించబడినవి. ఈ అర్పణలన్ని కూడా వట్టికదలైపోయేవి; ఈ అర్పణలన్నియు విఫలమైపోయేవి. అయితే ఈస్టరు ఉదయమున ఆయన తిరిగిలేచినప్పుడు, ఆయన దానిని అంగీకరించాడని దేవుడు రుజువు చేశాడు. మానవ హృదయం హల్లెలూయా తీసుకొని వచ్చుననుటలో ఆశ్చర్యమేమికాదు సుమా! మరణపు ముఖమున మనుష్యులను అది నిలబెడుతుంది అనుటలో అతిశయోక్తి లేదు. అవి లేకున్నప్పటికి, లేనివాటిని వున్నట్లుగా పిలచును. ఎందుకని? “తిరిగి లేచి ఆయన నీతిమంతులుగా తీర్చెను.” ఆయన తిరిగి లేచియున్నాడని నీకెలా తెలియును? ఏలాగనగా, మన హృదయాలలో ఆయన తిరిగి లేచి, ఉచితంగా నిరంతరం నీతిమంతులుగా తీర్చాడు!
28
నలభై దినముల తర్వాత, ఆయనక్కడ నిలబడి ఆయన పిల్లలతో మాట్లడుతున్నాడు. భూమ్యాకర్షణ శక్తి దానిపట్టును కోల్పోవుటకు ఆరంభమైనది. కార్యములు సమాప్తమైనవి. ఋణము చెల్లించబడినది. ఆయన చేతిలో పత్రమున్నది, అది దేవుని పత్రము. ఆయన బిడ్డలున్నారు; అది సంఘము, విశ్వాసులు. పాపమంతా జయించబడినది. మార్గము సరాళము చేయబడినది. ఆయన భూమిపైన యిక యుండలేడు. ఇక్కడ మనలను పట్టుకున్నదేంటి? భూమ్యాకర్షణశక్తి భూమ్యాకర్షణశక్తి పగులుటకు ఆరంభించినది, దాని బంధమును అది పోగొట్టుకున్నది. ఎందుకని? అప్పటికి అదంతా ముగిసిపోయినది. ఏం జరిగినది? ఆయన భూమి నుండి ఎత్తబడుటకు మొదలుపెట్టాడు.
29
“మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ-సృష్టికి సువార్తను ప్రకటించుడి” ఆయన పెదవులలోని పలుకై అది బయలువెడలెను. “సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మనివాడు శిక్షింపబడును. నమ్మినవారివలన ఈ సూచక క్రియలు జరుగును. నా నామమున వారు దురాత్మలను వెళ్ళగొట్టుదురు. వారు క్రొత్త భాషలు మాట్లాడుదురు. వారు పాములను ఎత్తి పట్టుకొనినప్పటికి లేదా మరణకరమైనది ఏది త్రాగినను వారికది హాని చేయదు. వారు రోగుల విూద చేతులుంచినప్పుడు, వారు స్వస్థత నొందుదురు. ఎందుకనగా నేను జీవించుచున్నాను. భూమ్యాకర్షణ శక్తి నా నుండి తొలగిపోయినది. పాపమునకు పట్టులేదు. నేను మీ నిమిత్తము చనిపోయాను. దేవుడు దానిని ఋజువు చేశాడు. మరియు పునరుత్థాన పత్రము యిచ్చాడు. ఎందుకనగా నేను జీవించుచున్నాను కనక మీరునూ జీవింతురు. ఒక దినాన నేను మరలా వస్తాను.”
30
ఒకానొక రోజు ఆయన రాబోవుచున్నాడు. ఓ. మహిమగల రోజు. తరువాత ఒకటి...... జీవించి, మృతిచెంది, పాతి పెట్టబడి, తిరిగిలేచి, రాబోవు చున్నాడు. ఈ దినమున సంఘము యొక్క నిరీక్షణ అది!
జీవించి, ఆయన నన్ను ప్రేమించెను. మృతిచెంది, ఆయన నన్ను రక్షించెను
పాతిపెట్టబడి, ఆయన నా పాపములను బహుదూరమునకు మోసికొని పోయెను.
తిరిగి లేచి, ఆయన ఉచితముగా నిరంతరం నీతిమంతునిగా తీర్చెను.
ఒకదినాన ఆయన రాబోవుచున్నాడు. ఓ మహిమగల దినము!
అదేంటి? ఐదు అక్షరాల్లో ఐదు విషయాలు J-e-s-u-s.
జీవించి, ఆయన నన్ను ప్రేమించెను. మృతిచెంది, ఆయన నన్ను రక్షించెను
పాతిపెట్టబడి, ఆయన నా పాపములను బహుదూరమునకు మోసికొని పోయెను,
తిరిగి లేచి, ఆయన ఉచితముగా నిరంతరం నీతిమంతునిగా తీర్చెను.
ఒక దినాన ఆయన రాబోవుచున్నాడు. ఓ మహిమగల దినము!
ఆయన రెండవ రాకడ కొరకు మనము ఎదురుచూచుచున్నాము!
ప్రకాశవంతమైన మేఘరహితమైన ఈ ఒకానొక ఉదయవేళలో
క్రీస్తునందు మృతులు తిరిగిలేవగా,
ఆ పునరుత్థానపు మహిమ పంచి పెట్టబడును;
ఆకాశపు ఆవల
ఆయన ఏర్పరచుకున్నవారు వారి గృహాలకు చేరునప్పుడు,
అక్కడ హజరు పట్టీ పిలువగా, నేనక్కడ ఉంటాను!“
ఎందుకని? నేను రశీదుపట్టి కల్గియున్నాను. ఆయన లేచియున్నాడు. నీకెలా తెలుసు? ఆయన నా హృదయములో జీవించుచున్నాడు. ఆయనను నమ్మిన సంఘపు హృదయంలో ఆయన జీవించును.
31
స్నేహితులారా! దానిని ఆలోచించుడి. మనం తిరిగి వెళ్ళిన వెంటనే బాప్తిస్మపు కార్యక్రమముకై వేడి నీళ్ళతోనున్న నీటి కుంట కొద్ది నిమిషాలలో సంసిద్ధంగాయుండును. ఒక క్షణం, మనమిప్పుడు తలలు వంచుకుందాము.
ఈ అర్పణ అంగీకరించుటకు చాలినంతదని యింకా ఒకరు లేక అనేక మంది మన మధ్య యున్నారాయని ఈ రోజు నేనాశ్చరపడుతున్నాను. మీ యొక్కఆత్మ శుద్దీకరణను అంగీకరించుటకు దేవుడు మీ హృదయంతో వింతగా మాట్లాడినప్పుడు, మిమ్మలను ప్రార్ధనలో జ్ఞాపకము చేసికోవాలని మీరు యిష్టపడితే.
32
జ్ఞాపకముంచుకోండి. క్రొత్త టోపీలను, క్రొత్త బట్టలను ధరించు సమయము కాదు మనం జరిగించుకొనునది (అవి మంచివే), అది ఒక క్రొత్త దానికి గురుతు; దేవుడు యొక క్రొత్తదానిని చేసాడు. అది మంచిది. అది మాత్రమే కాదు. ఈస్టరు దాని అర్థంకాదు. లేక ఈస్టరు, కుందేళ్ళను వేటాడుట లేదా మిటాయి గుండ్లు యింకా చిన్న తెల్లని కోళ్ళు మొదలైనవి తినుట కాదు. సహోదరుడా! భావం అది కాదు.
ఈస్టరు ఒక జయోత్సాహమై యుంటున్నది. ఆయన స్వంత కుమారుని మృతులలో నుండి తిరిగిలేపి, భూమిపైన దేవుడనుగ్రహించిన విజయమది. “ఆయనయందు విశ్వానముంచు ప్రతివాడు, నశింపక, నిత్యజీవముపొందుట.”
33
మీ స్వంత బ్రతుకులో పునరుత్థానము యుండగలదు. మీరు దానిని పొందకపోతే, మీరు తలలు వంచియుండగనే, “దేవా! పునరుత్థానజీవము అది నా హృదయంలో యుండులాగున నన్ను జ్ఞాపకముంచుకో” అని చెప్పుచు ఈ ఉదయం నీ చేయెత్తి చెప్పగలవా? “సహోదరుడా బ్రెన్హాం! నేను చేయిఎత్తుచుండగా నాకై ప్రార్ధించు” అని నీ చేయెత్తి చెప్పగలవా? ప్రభువు నిన్ను దీవించును. ప్రభువు నిన్ను దీవించును. ప్రభువు నిన్ను దీవించును. “సహాదరుడా, నాకై ప్రార్ది౦చుము. ఈ పునరుత్థానజీవము నేనూ అంగీకరించుచున్నానని.” యింకా ఎవరైనా మీ చేయిపైకెత్తి చెప్పగలరా!
ప్రకాశవంతమైన మేఘరహితమైన ఆ ఉదయవేళ
(అది ఆలోచనచేయ్, మీరు పాడుచున్నప్పుడు)
క్రీస్తు లేచును ఆయన పునరుత్థానపు మహిమ పంచబడును,
ఏర్పరచుకున్న వారు ఆవల తీరాన కూడుదురు
దురాన అక్కడ హాజరు పట్టి పిలువబడునప్పుడు, నేనక్కడయుండెదను.
దూరాన అక్కడ హాజరుపట్టీ పిలువబడునప్పుడు
దూరాన అక్కడ హాజరుపట్టీ పిలువబడునప్పుడు
(ఇప్పుడు నీకది నిశ్చయంలేదా
యిప్పుడే సరిచేసికో)... అక్కడ పిలువబడునప్పుడు,
దూరాన అక్కడ హాజరుపట్టీ పిలువబడునప్పుడు, నేనక్కడయుండెదను.
యజమానునికై పని చేయుదుము
(ఇది నూతనమైన పరిశుద్ధులు.) సూర్యుడు,
మనం సంభాషించెదము...
ఇప్పుడు, దేవుని కొరకు ప్రమాణం చేయాలని కోరు క్రైస్తవులైన మీరు, ఎక్కువగా పనిచేయాలని కోరు మీరు, ముందుకు రండి. ఆయనవైపు చేయెత్తండి.
దూరాన అక్కడ హాజరుపట్టీ పిలువబడునప్పుడు, నేనక్కడయుండెదను.
దూరాన అక్కడ హాజరుపట్టీ పిలువబడునప్పుడు,
దూరాన అక్కడ హాజరుపట్టి పిలువబడునప్పుడు,
దూరాన అక్కడ హాజరుపట్టి పిలువబడునప్పుడు,
దూరాన అక్కడ హాజరుపట్టి పిలువబడునప్పుడు, నేనక్కడయుండెదను.
34
ప్రియమైన దేవా! యిక్కడున్న ప్రతి హృదయము నీవు చూచియున్నావు. అభిమతములు ఆశయములు నీవే యెరుగుదువు. కటాక్షమునకై నేను ప్రార్ధిస్తున్నాను. దేవా! అది దయచేయుము. ఈ ప్రజలకు కటాక్షమును కనబడజేయుమని ప్రార్ధిస్తున్నాను. ఈ ఘడియ ఆరాధనకొరకై ఈ ఉదయం వారు వచ్చియున్నారు. అది మేము పలికినట్లుగా నీ వాక్యమును వినుటకై ఈ స్థలమునకు వారు వచ్చియున్నారు.
నీవు జీవించియున్నప్పుడు, నీవంటి జీవితం మరొకటి లేకుండెను. చనిపోయినప్పుడు, ఆవిధముగా మరణించగలవాడవు నీవు ఒక్కడవు మాత్రమే. నీవు సమాధి చేయబడినప్పుడు, నీవు మా పాపములను బహుదూరానికి మోసికొనిపోతివి. ప్రజల పాపములు నీ మీద భరించుకొని మరచిపోవుట యను సముద్రములోకి వాటిని తీసుకొనిపోతివి. అయితే తిరిగి లేచి, నిరంతరం నీతిమంతులుగా నీవు చేసితివి. మరియు ఈ దినమున నీ రాకడకై ఎదురుచూచుచు మేము నిలబడియున్నాము.
35
దేవా! వారిని ఆశీర్వదించుము. మాకు సహాయము దయచేయుము. మాకు యింకా మరింత సమయంలేదని మేము గ్రహించుచున్నాము. ఏలయనగా అది ద్వారము నొద్దనేయున్నది. మరి ఏదైనా. శాస్త్రవేత్తల మాటప్రకారముగా యిప్పటినుండి ఒక గంటలో దేశములు యిక యుండబోవుయని. దేవా! ఆయన రాకడయొక్క తీవ్రతలో యున్నాము, అది సంఘపు నిరీక్షణ. ఈ ఈస్టరు ఉదయవేళ దానిపై మేము నిలబడియున్నాము. అనేక వేలమంది ఆఘడియకై ఎదురుచూచుచు భూమిలోని ధూళిలో దూరాన పరుండియున్నారు. బలిపీఠము క్రింద నున్నవారి ఆత్మలు “నాధా యిక ఎన్నాళ్ళు? యెందాక?” అని అరచుచున్నారు. నీవు మాతో మాట్లాడమని, దేవా! నేను ప్రార్ధన చేయుచున్నాను. భూమిపైన మేము ఎప్పుడు ఏది చేసినను అదేమి లేదు. అది చాలా కొంచెమే. అది మేము జ్ఞాపకముంచుకొందుముగాక. ఇప్పుడు మేము చేయగల్గినది యొక్కటె. అది నీ రాకడకై ఎదురుచూచుట. మరియు ప్రతి యొక్కరికి చెప్పుట. వర్తమానము అత్యవసరమైయున్నది. నీవు ఏ సమయములోనైనా వచ్చునట్లుగా మేము దానిని త్వరగా ప్రజల యొద్దకు తీసికొనిపోదుముగాక. వారు మాట్లాడుచున్న ఈ బాంబులు, ఈ క్షిపణులకు ముందే, భూమిలో పెట్టబడి వేలవేలగానున్నవి అవి. ఒక నిమిషపు సమయంలో వర్షపు జల్లుగా కాగలవు. ప్రభువా! నీవు వచ్చెదనని వాగ్దానము చేసియుంటివి. నీ ప్రజలను స్వీకరించుము. అది ఆవిధముగనే యుండును ప్రభువా! కాబట్టి, ముఖ్యముగా ఏ సమయములోనైనా ఒక పునరుత్థానము, సంఘానికి ఒక ఈస్టరు యుండగలదు. క్రీస్తు ద్వారా ఈ పావపు జీవితము నుండి నిత్యజీవమునకు ఒక పునరుత్థానము౦టున్నది. మా ప్రార్ధనలు ఆలకించుము.
36
ఈ రోజు, మేము తదితర కూటములలోనికి వెళ్ళుచుండగా, ఆదివారపు-బడి ఉపదేశము లోనికి మేము వెళ్ళుచుండగా, ఓ ప్రభూవా! అనేకుల అనేకుల హృదయాలు వింతగా హెచ్చరిక చేయబడునట్లు మరలా మాట్లాడుము. ఈ ఉదయం, ఈ ఈస్టరు ఉదయం, ప్రభువైన యేసుతో కలసి పాతి పెట్టబడుటకు, ఆయన అర్పణను అంగీకరించుటకు డజన్లుకొలదిగా ఈ కోనేటి యొద్దకు వచ్చుదురు గాక. వారు ఏ సంఘమునకు చెందియున్నారని, ఏ మత సంబంధమైన శాఖతో వారు సహవాసము చేసినారని అనికాదు. దాని అర్థం ఏమి లేదు. అయితే వారు అర్పణను అంగీకరించారా? మరియు ఆయన మాస్థానములో మా కొరకు మరణించాడు. మా పాపములు ఆయన తీసికొని వాటిని పాతిపెట్టాడు. మేము ఒంటరిగానే ఆయనలో నిలబడియున్నాము. మా సంఘములు మా పాపములు పాతిపెట్ట లేదు. మాస్వంత జీవితము మా పాపములు పాతిపెట్టలేవు. అయితే మరచిపోవుట యను సముద్రములో క్రీస్తు మా పాపములు పాతిపెట్టెను. దేవా! ఈ విషయములు నీ దృష్టికి మహిమగలవిగా యుండునట్లు అనుగ్రహము చూపుము.
37
అటు తరువాత ఈ రాత్రి, నీవు నీ పునరుత్థాన బలముతో వచ్చి, ప్రభువా! మరెన్నడు కదలించబడని రీతిగా ఈ చిన్న స్థలమును కదలింపచేయుము. సూచనలు అద్భుతాలు అగుపించును గాక. రెండు ఆదివారముల క్రితం జరిగినట్లుగా ఎంతో అద్భుతముగా రోగులు, బాధతో నున్నవారు స్వస్థతనొందురు గాక! అది మరలా ఈ రాత్రి యుండాలని, నీ మహిమకై జరగాలని మేము ప్రార్ధిచుచున్నాము ప్రభువా!
ఇపుడు మా అతిక్రమములు క్షమించుము. ప్రభువా! ఇది మాలో కొందరికి నిజమైన ఈస్టరుగాను, మరియు ఒక నిజమైన ఈస్టరుగా మా కందరికియుండును గాక. ఈస్టరు ఆశీర్వాదము ఎన్నడు ఎరుగనివారు కొందరున్నారు. ఒక నూతనమైన నిరీక్షణతో, ఒక నూతనమైన జీవముతో ఈ దినమున క్రీస్తు వారి హృదయాలలో ఉద్భవించినదిగా అదియగును గాక! కల్వరిని వారికి చూయించి నడిపించుము. యేసు నామములో యిది మేము అడుగుచున్నాము. ఆమెన్
38
[టేపు పైన ఖాళీ] ఎంతమంది మీరు ప్రభువును ప్రేమిస్తున్నారో?, అలాగు మీ చేయిపైకెత్తుడి. అదెంత అద్భుతం!
సహోదరుడా మెక్ డోవెల్ ప్రతిష్ఠ చేయబడవలసిన బిడ్డ మీ యొద్ద యున్నదని నేను విన్నాను. ఆదివారపు బడి కూడికకు నీవు తిరిగి వస్తావు? రాగలవా? సరె. అదెంతో మంచిది, మనమెప్పుడు, బిడ్డలను ప్రతిష్ఠ చేస్తామో అప్పుడు. యింకా ఆసమయముకై నీవేమి యితరత్రా తలంచక పోతే, అది మంచిది.
కొద్ది నిమిషాలలో, ఇప్పుడు మనము కూటమునకు ముగింపు యివ్వబోతున్నాము. తద్వారా మీ స్థలాలకు మీరు వెళ్ళిపోయి విూ ప్రాతఃకాలవేళ పలహారం పుచ్చుకొని తిరిగి మరలా వచ్చుటకు. మీరిక్కడ యున్నందులకు మేము సంతోషంగా యున్నాము.
ఇప్పుడు మనం నిలువబడదాం. ప్రకాశమానమైన మేఘ-రహితమైన ఆ కొద్ది క్షణాల క్రితం మనం పాడిన అదే పాటను. ఎంత మంది తమలో ఆ నిరీక్షణ కల్గియున్నారు. మీచేయి చూపుడి. నిలుబడుడి. ఆమెన్.
ప్రకాశవంతమైన మేఘ-రహితమైన ఆ ఉదయవేళ
క్రీస్తు నందు మృతులు లేచుదురు,
ఆయన పునరుత్థాన మహిమ పంచబడును.
భువిలో రక్షించబడిన వారు కూడునప్పుడు.... (మరొక 6 నిమిషములు).