నా జీవిత కథ
VGR COUNT-306 ప్రార్థన కొరకై ఒక్క క్షణము తలలు వంచుకుందాము.
కృపాభరితుడవగు మా పరలోకపు తండ్రీ! మా దేవుడవును, రక్షకుడవైన నిన్ను సమీపించుట నిజముగా అది మాకు భాగ్యమై ఉంటున్నది. నీవు ఎంత ఘనుడవో అనే ఈ అద్భుతమైన పాటను వినుచున్నప్పుడు, అది మమ్ములను వణికింపజేస్తుంది, ఎందుచేతననగా నీవు ఘనుడవని మేము ఎరిగియున్నాము. నీవు మాట్లాడుచుండగా ఈ మధ్యాహ్నవేళ నీ గొప్పతనము మా యెడల నూతనమైనదిగా ప్రత్యక్షపరచమని మేము వేడుకొనుచున్నాము. అనేక సంవత్సరాల తరువాత ప్రప్రథమముగా నేను నా గత జీవితములోనికి, వెనుకకు వెళ్ళుటకు ప్రయత్నించుట అది నా వంతైనది. ఈ ఘడియకు నాకు ఏమి అవసరమైయున్నదో అందు నిమిత్తము నీ బలము నాకనుగ్రహించుమని ప్రభువా, నేను ప్రార్థించుచున్నాను. జీవితములోని నా పొరపాటులన్నీ, ఇతరులను నీ యొద్దకు ఎంతో సమీపస్తులుగా చేయు ఎక్కుతున్న రాళ్ళగా అవి వారికి వుండును గాక. ప్రభువా, దీనిని అనుగ్రహించండి. కాలమనే ఇసుకపై యున్న అడుగుజాడలను పాపులు చూసివారు నీ యొద్దకు నడిపించబడుదురు గాక, ప్రభువైన యేసు నామమున ఇవి మేము విన్నవించుకుంటున్నాము. ఆమేన్.
మీరు కూర్చొనవచ్చును.
2
[సహోదరుడు గ్లోవర్, మీరు వర్తమానమును ప్రసంగించుటకు ముందుగా ఈ చేతి రుమాళ్ళ కొరకు ప్రార్థించగలరా? అని సహోదరుడు బ్రెన్హాం గారిని అడుగుచున్నాడు.]
మంచిది. ధన్యవాదాలండి. ఈ పరిశుద్ధ సహోదరుడు గ్లోవరును కొన్ని సంవత్సరాల నుండి నేను ఎరిగి యున్నాను. గత సాయంకాలపు వేళలో కొంతసేపు అతనితో గడుపు తరుణము నాకు లభ్యమైనది, కొంత విశ్రాంతి కొరకై మంచము పట్టానని అతను నాతో చెప్పియున్నాడు. ఇప్పుడు 75 సంవత్సరాల వయస్సులో మరలా అతడు ప్రభువు యొక్క పరిచర్యకు తిరిగి వచ్చుచున్నాడు. నేను అది వినకముందు, నేను సంపూర్తిగా అలసిపోలేదు. నేను అలసిపోయానని నేను అనుకున్నాను, అయితే నేను ఆలాగున్నానని అనుకోవటంలేదు. ఒక విధమైన కవరులో కొన్ని చేతి రుమాళ్లను పెట్టి అతడు ఇక్కడ వుంచి యున్నాడు, అవి అక్కడ లోపలవున్నవి, ముందుగానే జాగ్రత్త పరచియున్నారు.
3
ఇప్పుడు రేడియో లేదా ఇచ్చట ఉండి దానిని ఆలకించుచున్న ఎవరైనా ఈ చేతి రుమాళ్ళలో ఒకటి ఆశించేవారు, అది కావాలని కోరేవారికి లభించును (ఏంజిలస్ అనే ఆలయము వారు మీరు ఎప్పుడు అడిగినాగాని వాటిని విరామమనేది లేకుండా పంపుచున్నది.) ఏంజిలస్ టెంపుల్‌కు మీరు వ్రాయగలిగితే దానికై వారు ప్రార్థన చేస్తారు; ఎందుచేతనంటే అది దేవుని యొక్క వాగ్ధానమై యున్నదని నేను మీకు నిశ్చయతను ఇచ్చుచున్నాను.
మీలో ఎవరైనా ఒకరు నాయొద్ద ప్రార్థించుకోవాలని ఆశపడితే అందునుబట్టి నేను ఎంతో సంతోషించెదను. మీరు తపాలా కార్యాలయపు పెట్టె (Post Office Box) “జెఫర్‌సన్‌విల్” అని మాత్రము రాస్తే చాలును జెఫర్‌సన్‌విల్ అనే విధముగా ఉచ్ఛరణ చేయబడుతుంది. జెఫర్‌సన్‌విల్, ఇండియానా లేదా పోస్టాఫీస్ బాక్స్, మీకు జ్ఞాపకానికి రానట్లైతే ఊరకే జెఫర్‌సన్‌విల్ అని వ్రాయండి. అది చిన్న నగరము. దానియొక్క జనసంఖ్య 35,000 అక్కడ వున్న ప్రతి ఒక్కరికి నేను తెలుసును. కాబట్టి మేము సంతోషముతో చేతిరుమాళ్ళను ప్రార్థన చేసి మీకు పంపుతాము.
4
ఇవి చేయుట ద్వారా మనము గొప్ప విజయమును సాధించెదము, ఎందుకనగా... దానితో మీరు చిన్న ఉత్తరము రూపమున ఉన్న చిన్న కాగితమును మీరు పొందుకుంటారు. ప్రపంచములో వున్న ప్రజలందరూ ప్రతి ఉదయము 9 గం॥లకు, 12 గం॥లకు, 3 గం॥లకు ప్రార్థిస్తారు. లోకమంతట వున్న ప్రజలు ఈ ప్రార్థనా విజ్ఞాపన కొరకు ప్రార్థించుటకై రాత్రి సమయములలో ఎవరెవరు ఏయే సమయములలో వారు మేల్కొని ప్రార్థించెదరో మీరు కొంచెము ఊహించి చూడండి. కావున, మీ యొక్క అనారోగ్యము కొరకు, ఈ పరిచర్య కొరకు ఒకే సమయమందు వేలవేల, పదివేల మందికి పైగానే విజ్ఞాపించుచు దేవునియందు ప్రార్థించుచు వుండెదరు, కావున దేవుడు ఈ విజ్ఞాపనలను వినకుండా త్రోసివేయలేడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన రీతిగా నాకు, మాకు ఏ విధమైన కార్యకలాపాలు లేవు. మేము ఒక్కపైసా ధనమును కోరుట లేదు. మీకేదైనా సహాయం చేయటానికి అందుకే మేము ఇక్కడ వున్నాము.... మరొకరు మరొకరి చేతిరుమాళ్ళ మూట తీసికొని వస్తున్నారు.
5
నీవు వాటిని పంపాలని మీరు ఆశిస్తే, చేతి రుమాలు మీ యొద్ద లేనట్లైతే, అలాగైతే మీరు మాకు వ్రాయండి. ప్రార్థించిన చేతిగుడ్డ మీకు అవసరమయ్యే సమయము ఒకవేళ ఇప్పుడు కానట్లయితే, అది ఎప్పుడు అవసరమౌతుందో అంతవరకు దానిని పరిశుద్ధ గ్రంథము అపోస్తుల కార్యము 19వ అధ్యాయమునందు పెట్టి భద్రపరచుకోండి. అది ఒక చిన్న తెల్లని రిబ్బను గుడ్డవంటిది, మేము మీకు పంపించెదము. మరియు మొట్టమొదటిగా మీరు మీ పాపములను ఎలా ఒప్పుకోవాలి అనునది వుంటున్నది. (వందనాలు) దేవుని యొద్ద మీ పాపములను ఏ విధముగా ఒప్పుకోవాలి. మొదట మిమ్ముల్ని మీరు దేవుని యొద్ద సరిదిద్దుకోకుండా మీరు దేవునియొద్ద ఏదైనా పొందుకోవాలని ఏ మాత్రము ప్రయత్నించకూడదు. గమనించారా? పిదప మీ పొరుగువారిని మరియు మీ సంఘకాపరిని లోపలికి పిలవాలని దీనియందు ఆజ్ఞాపించినట్లుగా నీవు చేయవలెను. ఎవరి మీదైనా మీకు హృదయములో వ్యతిరేకతవున్నట్లైతే మొట్టమొదట వెళ్ళి సరిచేసికొని తిరిగి రా, ఆ తర్వాత ప్రార్థించు. నీ కుటుంబములో ప్రార్థనా కూడిక జరిగించు. ప్రార్థించి మీకు పంపించబడిన ఈ చేతి రుమాలును నీ వస్త్రపు లోపలి భాగాన వుంచుకో, పిదప దేవునియందు విశ్వాసముంచుము. ప్రతిదినము లోకమంతట వున్న ప్రజలు ప్రతి మూడు గంటలకొకసారి గొలుసు ప్రార్థన చేస్తూ, విజ్ఞాపించుచు ఉండెదరు.
6
ఖచ్చితముగా అది ఉచితముగా ఇవ్వబడుచు అది మీ కొరకై యున్నది. కాబట్టి కేవలము ప్రార్థించిన వస్త్రములు కావలెనని వ్రాసి పంపించిన చాలును. మేము ఇది, అది చేశాము, లేదా మా కార్యక్రమములు అవి, ఇవి అని మీకు వ్రాస్తూ మిమ్మల్ని మేము ఇబ్బంది పరచము. మా కార్యక్రమములకు మీ ఆదరణ ఉండిన చాలును, కాని వేరేవిధమైన ఎటువంటి ఆదరణను మేము మీనుండి ఆశించుటలేదు. గమనించితిరా? కాబట్టి మీరు... అదేదో మీ యొద్ద నుండి మీ ఇంటి చిరునామాను పొందుకొని మీ నుండి ఏదో మేము ఆశించుట కాదు గాని, మేము మీ కొరకు ఏ విధముగానైనా సహాయపడవలయుననే ఉద్ధేశ్యముతోను మరియు ప్రభువు యొక్క పరిచర్యను ఆ విధముగా చేసికుంటూ ముందుకు కొనసాగిపోవాలనేదే మా యొక్క ప్రయత్నమై యున్నది.
మనము ఇప్పుడు తలలు వంచుకుందాము. మీరు రేడియో ప్రాంతముల యందు వుంటూ ఈ ప్రసంగమును ఆలకించుచున్నట్లయితే మీ చేతి రుమాళ్ళు అక్కడ పెట్టండి. మేము ప్రార్థిస్తుండగా మీ యొక్క సొంత చెయ్యి దానిమీద పెట్టండి.
7
కృపాభరితుడవగు, ప్రభువా! ఈ చిన్న మాటలను మీ యొద్దకు మేము తీసికొని వచ్చుచున్నాము. బహుశా అందులో కొన్ని ఒక బిడ్డ ధరించు చిన్న చొక్కాయి అయి వుండవచ్చునేమో లేక లోపల వేసుకునే చిన్న చొక్కాయి లేక చిన్న బూటులు కావచ్చునేమో, రోగ వ్యాధులతో నున్న వారి యొద్దకు చేరబోతున్న ఒక చేతి రుమాలు కావచ్చునేమో, అవి ఏమైనా కాని ప్రభువా, వ్యాధిగ్రస్తుల కొరకై బాధలలో వున్నవారికొరకై దీనిని మేము మీ వాక్యానుసారముగా చేయుచున్నాము. అపోస్తులల కార్యములు అనే పత్రికలో మేము చదివిన రీతిగా, నీ దాసుడైన పౌలు శరీరము యొద్దనుండి చేతి రుమాళ్ళు, వస్త్రములువారు తీసికొనిరని, ఎందుచేతననగా నీ ఆత్మ పౌలు మీద ఉన్నదని వారు నమ్మిరి. అపవిత్రాత్మలు ప్రజలలో నుండి వెళ్ళిపోయెను. వ్యాధి, బాధలు వారిని విడిచిపోయెను, ఎందుకనగా వారు నమ్మియుండిరి. ఇప్పుడు మేము పరిశుద్ధుడైన పౌలు కాదని గ్రహిస్తున్నాము, ప్రభువా! అయితే నీవు ఇంకా అదే యేసువై యున్నావని మేము ఎరిగి యున్నాము. ఈ జనుల యొక్క విశ్వాసాన్ని నీవు ఘనపరచుమని మేము ప్రార్థన చేస్తున్నాము.
8
ఇది ఈ విధముగా ఒకప్పుడు చెప్పబడి యున్నది, ఇశ్రాయేలీయులు చిక్కులో ఇరుక్కుపోయివుండిరి. సముద్రము వారి ముందున్నది, పర్వతాలు ఇరువైపుల వున్నవి,ఫరోసైన్యం సమీపిస్తుంది. ఆ సమయమునందు జరిగిన సంఘటనను బట్టి ఒకరు ఇలాగు అన్నారు, కోపోద్రేకముతో నిండిన కన్నులతో దేవుడు అగ్ని స్థంభం నుండి తొంగి చూడగా సముద్రము భయపడి తనకుతాను ఒక చాపలా చుట్టుకొనిపోతూ ముడుచుకుపోయి వాగ్ధాన భూమికి ఇశ్రాయేలీయులు దాటుటకై దారిని చేకూర్చినది.
ఓ ప్రభువా! మరలా తిరిగి చూడు. నీ యొక్క జీవవాక్యమునకు జ్ఞాపకార్థముగా ఈ మూటలు వ్యాధులతోవున్న శరీరములపై పెట్టునప్పుడు తిరిగి తొంగిచూడు. ఈ ప్రాయచిత్తార్థ బలికై ఎవరు చనిపోయారో అట్టి నీ కుమారుడైన యేసు రక్తము గుండా నీవు చూచునప్పుడు వ్యాధులు లేక జబ్బులు భయపడిపోవును గాక, శత్రువు భయపడి ప్రక్కకు తొలగిపోగా; “వాటన్నింటికి పైగా” సమస్తమునూ దాటుకుంటూ ఈ ప్రజలు ఆ వాగ్ధానము యొద్దకు ముందుకు కొనసాగి పోవుదురు గాక, “ఆరోగ్యముతో నేను వర్ధిల్లాలనేది నీ యొక్క ఆశయైయున్నది.” దానిని అనుగ్రహించుము. మా హృదయమందు ఆ ఉద్ధేశ్యమును గలవారమై తండ్రీ వీటిని వారియొద్దకు పంపించుచున్నాము. యేసుక్రీస్తు నామమున మేము వాటిని పంపు చున్నాము. ఆమేన్.
సహో॥ గ్లోవర్ వందనాలు, వందనాలండీ!
9
ఈ ఉజ్జీవము యొక్క భాగము ముగింపు సమయమున ఈ రాత్రి యుండగా ఇది దూరవాణి (Radio) ద్వారా ప్రసారము చేయబడుచున్నదో లేదో నాకు తెలియదు; అయితే (అలా కానట్లైతే) రేడియో విను ప్రేక్షకులతో నేను చెప్పాలనుకుంటున్నాను, అనేకానేక సంవత్సరాలలో నేను జరిగించిన ఉన్నత శ్రేణి కూడికలలో ఇది ఒకటి అని నేను చెప్పుచున్నాను. చాలా కాలము తర్వాత ఇది ఎంతో ధీటైన, ఆరోగ్యకరమైన లేక హేతుకరమైన, అతి ప్రియమైన సహకారంతో కూడిన కూడికయై యున్నది.
10
[ఒక సహోదరుడు ఈ విధముగా సహోదరుడు బ్రెన్హాం గారితో చెప్పుచున్నాడు, “మేము ఇది వినుటకై రేడియోల దగ్గర 4:15 నిమిషముల నుండి ఉన్నాము. వారు మీ మాటలను ఆలకించుచున్నారు, దక్షిణ కాలిఫోర్నియా అందంతట ఉన్నవారు, దాని ప్రక్కన ఉండు ద్వీప కల్పముల యందుండు ప్రజలు మరియు ఓడలయందుండు వారు ఆలకించుచున్నారు. వారు ఈ ప్రసంగమును ఆలకించుచున్నారని మాకు వర్తమానము అందినది. కాబట్టి గొప్ప జనసమూహము, వేల పదివేల మంది జనులు నీ వర్తమానము వినుటకై ఉన్నారు.”] అయ్యా! మీకు కృతజ్ఞతలు. అది చాలా మంచిది. అది వినుట సంతోషము. దేవుడు మిమ్ములనందరిని దీవించును.
నేను ఎల్లప్పుడు కూడ ఏంజిలస్ దేవాలయము గురించి నా హృదయములో ఎంతో ఆప్యాయతను కలిగియున్నాను, ఎందుచేతననగా అది యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ సువార్తకై నిలబడుతుంది. అది నాకు ఎంతో వ్యక్తిగతంగా ఒక స్వంత స్థలముగా అనిపిస్తున్నది. ఇచ్చట వున్నవారిలో కనబడే చక్కటి ఆత్మను బట్టి ఈ కూటము అయిపోయిన తరువాత ప్రతి ఒక్కొక్కరిని కలుసుకోవాలనిపించుచున్నది. ముందు ఎప్పటిలాగా ఉన్నదానికంటే, ఇప్పుడు నేను మీలో ఒకనిలాగా ఉన్నట్లనిపించుచున్నది. దేవుడు మిమ్ములను దీవించును, అది నా యొక్క ప్రార్థన. మీ దయకొరకై ధన్యవాదములు.
11
నేడు మీతో కొద్దిసేపు నా యొక్క జీవిత కథను గూర్చి మాట్లాడవలయునని కోరు కుంటున్నాను. అది నాకు కఠినమైన కార్యముగా ఉండును. అనేక సంవత్సరములుగా చెప్పుటకు ప్రయత్నించాను, కానీ ఈ విధముగా చెప్పుట ఇదే మొదటిసారిగా వున్నది. వివరముగా నేను చెప్పాలనుకున్నాను, చెప్పలేక ఏదో కొద్ది భాగమును మాత్రము చెప్పుటకు సమయము సరిపోయెడిది. నా జీవితములో నేను అనేక పొరపాట్లను, అనేక తప్పిదమైన కార్యములను నేను చేసితిని. రేడియో ద్వారా వినుచున్న మిమ్మల్ని మరియు ఇచ్చట కూటములో యుండి వినుచున్న మిమ్మల్ని నేను కోరుకునేది ఏమనగా, నా యొక్క పొరపాట్లను మీరు అడ్డు బండలుగా తీసుకొనకుండా ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు మిమ్మల్ని అత్యంత సన్నిహితముగా తీసుకొనివచ్చు మెట్లుగా వాటిని మీరు తీసుకొనవలయునని నేను కోరుకుంటున్నాను.
12
అటు తరువాత ఈ రాత్రి స్వస్థత కూడిక కొరకై ప్రార్థన కార్డులు ఇవ్వబడును. స్వస్థత కూడిక అని మాట్లాడుచున్నప్పుడు మేము ఒకరిని స్వస్థపరచబోవుచున్నామని అర్థము కాదు, కాని మేము ఒకరికి ప్రార్థించబోవుచున్నామని అర్థము. దేవుడు స్వస్థత కార్యములు చేయును. ప్రార్థనకు జవాబు దయచేయుటకు ఆయన నాయెడల ఎంతో కృపా సంపన్నుడై వున్నాడు.
కొద్దికాలము క్రితమే ఒక ఖ్యాతి గాంచిన సువార్తికుని యొక్క మేనేజరుతో నేను కార్య నిర్వహకునితో మాట్లాడుచుంటిని. ఈ సువార్తికుడు రోగులకు ఎందుకని ప్రార్థన చేయడు అని ఒకసారి అడగబడినది. ఆ సువార్తికుడు నా కూటముల కార్యనిర్వహకునితో ఇలా చెప్పాడు, “ఈ సువార్తికుడు దైవిక స్వస్థతను నమ్ముతాడు, అయితే అతడు రోగులకై ప్రార్థించుట ఆరంభిస్తే అది అతని పరిచర్యకు అభ్యంతరం కలుగజేస్తుంది, ఎందుచేతననగా, అతడు సంఘముల ద్వారా ఆర్థిక స్థోమతను పొందుకుంటున్నాడు.” కాబట్టి ఆయనను ఆర్థికముగా పోషించే అనేక సంఘాలు మరియు వారిలో అనేకమంది దైవిక స్వస్థత నమ్మరు అని అన్నాడు. కనుక నేను ఆ సువార్తికుని గౌరవిస్తూ ఘనపరుస్తున్నాను, ఎందుకంటే అతడు తనయొక్క స్థానాన్ని, అతని విధినిర్వహణను కాపాడుకుంటున్నాడు.
కాబట్టి అతని యొక్క స్థానాన్ని నేను తీసికోలేదు. నా యొక్క స్థానాన్ని అతడు తీసికోగలడని నాకు సందేహమే. దేవుని యొక్క రాజ్యంలో మనందరికి ఒక స్థానమున్నది, మనమంతా ఏకముగా కలుపబడి యున్నాము. పలువిధములైన వరములుగలవారమై యున్నాము, అయితే ఆత్మ ఒక్కటే. పలురకముల ప్రత్యక్షతలు, నేను చెప్పునదేమనగా, ఆత్మ ఒక్కటే అనే దానిని గూర్చి చెప్పుచున్నాను.
13
ఇప్పుడు కూటములు ఈ రోజు రాత్రి 6.30 నిమిషములకు ప్రారంభమగును. గాయకుల బృ౦దము వారు పాటలను ప్రారంభించెదరని వారు చెప్పిరని నేను తలంచుచున్నాను. వెలుపల ప్రాంతమందు రేడియోలో మీరు ఆలకించుచున్నయెడల దీనిని ఆలకించుటకు లోపలకు రండి. అది ఎల్లప్పుడు కూడా ఎంతో మనోహరముగా ఉండును.
ఆ తర్వాత ఈ కూటము అయిన వెంటనే ప్రార్థనా కార్డులు ఇవ్వబడునని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ కూటము ముగిసిన వెంటనే మీరు ఇక్కడ వుండి ప్రార్థనా కార్డు కోరితే అచ్చట ప్రార్థనా అట్టలు ఇవ్వబడును. నా కుమారుడు ఇంకా మెర్సియార్ (Merciar) లేక మిష్టరు గోడ్ (Goad) ప్రార్థనా కార్డులు ఇస్తారని కొద్ది క్షణాల క్రితమే నాకు అక్కడ తెలుపబడినది, అయితే మీ యొక్క స్థానాలలోనే వుండండి. కూడిక అయిన వెంటనే మీరు మీ స్థలాలలోనే వుండండి, కూటము ముగించిన పిదప మీరు మీ కుర్చీలలోనే వుండండి. ఇచ్చట వున్న బాలురు వరుస క్రమమున మీ యొద్దకు వచ్చి ఎంత త్వరగా ప్రార్థనా కార్డులు పంచి ఇవ్వాలో అంత త్వరగా ఇస్తారు. ఆపై వసారయందు, క్రిందైన లేదా నేలమాళిగనందైనా మరెక్కడైనప్పటికీ మీరు అలాగే మీ స్థానాలలో వుండండి. అబ్బాయిలు వచ్చి ప్రార్థనా కార్డులకై మీరెక్కడ వున్నారని వారు వచ్చి తెలుసుకుంటారు. ఈ రాత్రి రోగుల కొరకు మేము ప్రార్థన చేయబోవుచున్నాము. ప్రభువు నా తలంపులను మార్చనట్లైతే, తండ్రిని మాకు చూపించినట్లైతే, అది మాకంతే చాలు అను అంశమును ఈ రాత్రి నేను మాట్లాడాలని ఆశపడుచున్నాను.
14
నా జీవిత కథను గూర్చి ఆరంభించుటకై ఈ మధ్యాహ్న వేళ పాఠ్యాంశము కొరకై హెబ్రీ పుస్తకములోగల 13వ అధ్యాయము నేను చదవాలని ఆశపడుచున్నాను. 12వ వచనమని చెప్పుచున్నాను. అది ఆరంభించుకుందాము:
కావున యేసుకూడ తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను.కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి @ఆయన యొద్దకు వెళ్ళుదము.నిలువరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు, కాని ఉండబోవుచున్నదాని కోసము ఎదురు చూచుచున్నాము.
ఇప్పుడు ఇది ఒక మూల అంశము. ఇచ్చట గమనించండి, ఎందుకనగా ఇది జీవిత కథయైనను లేక ఒక మానవునికి సంబంధమైనది ఏది అయినను, ప్రత్యేకించి ఒక మానవుని యొక్క గత కాలపు జీవితము, నాలాంటి వానికి సంభవించిన సంఘటనలు ఎంతటి చీకటిమయమైనదైనను మనము దానిని మహిమపరచకూడదు. అయితే మనము లేఖనములను చదివిన యెడల దేవుడు దీవించునని తలంచుచున్నాను. నా తలంపు ఏమనగా, నిలువరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు, కాని రాబోవుచున్న దానికోసము ఎదురు చూచుచున్నాము.
15
లాస్ఏంజిలస్ పట్టణమును మీరు ఎంతగానో ఇష్టపడుదురని, నాకు తెలుసు అలాగుండడానికి మీకు హక్కు ఉన్నది. అది గంభీరమైన, అందమైన నగరము. దాని యొక్క పొగమంచు ఇంకా అది ఏమైనప్పటికి అది అందమైన నగరము, మంచి వాతావరణము. అయితే ఈ పట్టణము నిలువరమైనదిగా వుండదు, దీనికి ఒక అంతమున్నది.
నేను రోమ్ నగరమునందు, దానిని పరిపాలించిన గొప్ప చక్రవర్తులు, అది ఎన్నటికీ నాశనమవ్వదని వారు తలంచిన పట్టణములందు అచ్చట నిలబడి గమనించితిని. కాని అవి నాశనమయి, కుప్పకూలిపోయిన స్థలములను మీరు కనుగొనవలయుననిన మీరు అచ్చట ఇరవై అడుగుల లోతుగా త్రవ్వితేగాని వాటి ఆనవాలులు మీకు కనబడవు. ఫరో చక్రవర్తి నిర్మించిన గొప్ప రాజ్యములుగల స్థలములయందును నేను నిలబడి గమనించితిని. ఆ గొప్ప ఫరోలు అచ్చట వారు పరిపాలించిరని కనుగొనుటకు ఆ స్థలమును చాలా లోతుగా త్రవ్వి చూడవలసి ఉండును. మనమందరము కూడ మన యొక్క నగరాన్ని గూర్చి, మనము యున్న స్థలాన్ని గూర్చి తలంచుటకు ఇష్టపడతాము, అయితే జ్ఞాపకముంచుకోండి, అది నిలువదు.
16
నేను చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు ఒక పెద్ద గంగిరేగు చెట్టు వంటి చెట్టు యొద్దకు వెళ్ళుతూ ఉండేవాడను. మా గ్రామ ప్రాంతమందు విస్తారమైన గట్టి కలపఉండేది. ఈ గంగిరేగు చెట్లు మరియు పంచదార గంగిరేగు చెట్లు మా గ్రామములో ఉండెడివి. మేము వాటిని “గట్టి గంగిరేగి చెట్టు” మరియు “మెత్తని గంగిరేగు చెట్టు” అని పిలిచేవారము. పెద్ద బ్రహ్మాండముగా ఉండే ఈ చెట్టు చాలా అందముగా ఉండెడిది. నేను పొలములలోను, గడ్డి వాములలో ఉండి పనిచేస్తూ, పని అంతా అయిపోయిన తరువాత వెళ్ళేటప్పుడు నేను ఈ పెద్ద చెట్టు యొద్దకు వెళ్ళుటకు ఇష్టపడేవాడను. వెళ్ళి దీని క్రింద కూర్చొని పైకి చూసేవాడను.పెద్ద మ్రాను కలిగి గాలిలోకి విరజిమ్మిన దాని యొక్క పెద్ద గంభీరమైన కొమ్మలను నేను చూడగలిగాను. నేను అన్నాను, “చూడు ఈ వృక్షము ఇక్కడ వందల, వందల సంవత్సరములై ఉంటుంది,” అని నేను నమ్ముచున్నాను. ఈ మధ్యనే ఆ పాత చెట్టును చూడటానికి తటస్థించినది. అది కేవలము మొద్దుబారిపోయినది.
“మనకిక్కడ నిలువరమైన పట్టణము లేదు.” ఇక్కడ ఈ భూమి మీద నిలువరమైనదిగా ఉండునది నీవు ఏమీ చూడలేవు, దానికి ఒక అంతము ఉండవలసి ఉన్నది. మర్త్యమైన ప్రతి ఒక్కటీ అమర్త్యతలోకి దానిని విడిచి పెట్టవలసి ఉంటున్నది. గనుక మనము ఎంత మంచిగా మన రాజమార్గములు నిర్మాణము చేసికొన్నప్పటికీ, మన నిర్మాణాలు ఎంత మంచిగా మనము తయారు చేసికొన్నప్పటికీ, ఏదైననూ అది గతించి పోవలసినదే, ఎందుకనగా ఇక్కడ నిలువరమైనది ఏదీ లేదు. కేవలము కనబడనివి అది మాత్రమే నిలుచును.
17
మేము నివాసమున్న ఇల్లు నాకు జ్ఞాపకమున్నది. అది మట్టితో పాత వాసాలతో సందు సందులుగా ఉండెడిది. ఒకవేళ మట్టితో చిల్లులు చిల్లులుగా ఉండే ఇండ్లను అనేక మంది చూచి ఉండక పోవచ్చును. అయితే అది అంతే, మట్టితో చిల్లులుగా చేయబడినది, ఆ పాత ఇంటికి పెద్ద దూలాలు ఉండేవి. ఆ ఇల్లు వందల సంవత్సరాలు అలాగే ఉంటుందని నేను అనుకున్నాను. అయితే చూడండి, అది ఈ దినాన గృహ నిర్మాణ ప్రణాళికలో ఉండిపోయినది. అది ఎంతో వ్యత్యాసకరమైనది. ప్రతిదీ మారిపోతూ ఉంది.
18
అయితే నేను మా నాన్నను గమనిస్తూ ఉండేవాడను. ఆయన పొట్టిగా,లావుగా, బలముగా ఉండే మనిషి. నేను ఎరిగినంత వరకు ఆయన బలమైనటువంటి చిన్న మనిషి. మొద్దులతో ఎప్పుడూ పనిచేస్తుండే మిస్టర్ కోట్సును నేను కలిశాను. అతడు మొద్దులు మోసేవాడు. ఒక సంవత్సరము క్రితమే మిస్టర్ కోట్సు నా యొక్క మంచి స్నేహితులలో ఒకడాయెను. మరియు మొదటి బాప్టిస్ట్ చర్చి యొక్క సంఘ పెద్దగా ఉండెడివాడు. అతడన్నాడు, “బిల్లీ, నీవు నిజముగా శక్తిమంతుడవైన మనిషివి కావలసియున్నది”
“లేదు, నేను కాలేను మిస్టర్ కోట్స్,” అన్నాను.
అతడన్నాడు, “నీవు నీ తండ్రి వెంట ఉన్నట్లయితే, నీవు అలా అవుతావు అన్నాడు.” “140 ఫౌండ్ల బరువుగల మా తండ్రిని నేను గమనిస్తూ ఉండేవాడిని. 900 పౌండ్ల, బరువుగల దూలము ఆయన ఒక్కడే మోసుకుంటూ బండి మీద వేసేవాడు.” దానిని ఏ విధముగా మోయవలెనో, దానిని గూర్చి చక్కగా ఆయన ఎరిగినవాడు. ఆయన బలమైన వాడుగా ఉండెవాడు. మా అమ్మ భోజనమునకు పిలువగానే వెంటనే ఆయన తన కాళ్ళు చేతులు కడుగుకొని వచ్చి భోజనము చేయుటకు సిద్ధమయ్యేవాడు.
19
ఇంటి ముందు భాగాన బయట ఒక పాత యాపిల్ చెట్టు మాకున్నది, ఆ తరువాత వెనుక వరకు మూడు, నాలుగు చిన్నవి ఉన్నవి. మధ్య ఉన్న చెట్టుకు ఒక పాతపడిపోయి పగిలిపోయిన పెద్ద అద్దం చూసుకొనుటకు అచ్చట ఆ చెట్టుకు వ్రేలాడుతూ ఉండెడిది. ఆ చెట్టుకు ప్రక్కన కొన్ని వంగిన సీలలు దానికి కొట్టి యుండెడివి. వడ్రంగి పని చేసే కొంతమంది దానిని ఆలకించుచున్నారు, కాబట్టి అది ఎందుకనేది మీరు ఎరుగుదురు, అది “కోటు తగిలించుకోవటానికి” అద్దం దాని స్థలములో ఉంచుట కొరకై అది వంచియున్నది. అక్కడ ఒక పాత తగరపు దువ్వెన ఉన్నది. పాతకాలపు తగరపు దువ్వెన మీలో ఎంతమంది చూశారు? నేను దానిని అట్లే చూడగల్గుచున్నాను.
ఆ తరువాత అక్కడ ఒక చిన్న కడుగుకొనే బల్ల ఉన్నది, చిన్న బల్లదానికి చిన్న వంకర కాళ్ళు పెట్టి చెట్టుకు అతికించి యున్నది. ఒక పాత పంపు మేము నీళ్ళు కొట్టుకొనుటకు ఉండేది. ఆ పాత చెట్టు క్రింద మేము ఉతుకుకొనేవారము. అమ్మ తరచుగా భోజనపు గోతాలను తీసుకొని దానితో తుడుచుకోవడానికి తువ్వాళ్ళు చేసేది. ఎవరైనా ఎప్పుడైనా భోజనపు గోతాలను ఒళ్ళు తుడుచుకోవడానికి తువ్వాలుగా వాడారా. నేను ఇప్పుడు ఇంటి వద్దనే ఉన్నట్లుగా భావిస్తున్నాను. పాత పెద్ద కరుకైన తువ్వాళ్ళుగా అవి ఉండెడివి. ఆమె చిన్న బిడ్డలగు మాకు స్నాము చేయించేటప్పుడు ప్రతిసారి అమ్మ వాటితో నా ఒళ్ళు రుద్దుతూ తుడిచేది. తడి ఎచ్చట లేకుండా మా ఒళ్ళంతా బాగా రుద్దుతూ తుడిచేది. ఆ పాతపట్ట నాకు జ్ఞాపకమున్నది. ఆమె కొన్ని తీగెలు లాగి తెచ్చి దానిని అలంకరించినట్లుగా చిన్న చిన్న తెరలను చేసింది.
20
ఎంతమంది ఎప్పుడైనా గడ్డిపరకల పడకపైన పండుకున్నారు? మంచిది. చెప్పగలరా. పొట్టుతో చేయబడిన దిండులు మీలో ఎంతమందికి తెలుసు? సహో॥ గ్లోవర్స్, ఇప్పుడు నేను ఇంటివద్ద ఉన్నాను. నిజము, గడ్డి పరకల పడక, వాటినుండి దూరమై ఎంతో కాలము కూడ అవలేదు. అందులో నిద్రపోతే ఎంతో చల్లగా ఉండెడిది. తరువాత శీతాకాలములో పాత ఈకల పడకను వారు తీసుకొని దీనిపైన అది ఉంచుతారు మీకు తెలుసా! తరువాత పాత పట్టముక్కను మాపై కప్పుతారు, ఎందుకంటే మంచుగాలి వీచేటప్పుడు ఇంటి రంధ్రములలో గుండా మంచుగాలి లోపలికి ప్రవేశించెడిది. మీకు తెలుసు కదా! ఆ మంచు గాలిని అడ్డుకొనే పాత చిన్న గులక రాళ్ళతో చేయబడిన పూరాకు పలకలు చల్లగా మారిపోయి దానిగుండా మంచు కారిపోతూ, ఆ చల్లదనము లోపలికి ప్రవేశించే దానిని గూర్చి మీరెరుగుదురు. అదంతా నాకు బాగా జ్ఞాపకమున్నది.
21
తరువాత నాన్న ఒక క్షవరు మొక్క కుంచె వాడుతుండేవాడు. ఈ విషయము మీకు ఆసక్తిగా ఉంటుంది. అది జొన్నకంకి పీచుతో చేయబడినది. ఒక క్షవరం చేసుకొనే కుంచె (Shaving Brush) జొన్న కంకి పీచుతో తయారు చేయబడినది. అమ్మ తయారు చేసిన క్షవర జలపు సబ్బును ఆయన తీసుకుంటాడు. జొన్న పీచు కంకితో చేయబడిన కుంచెతో ఆ సబ్బును ముఖముపై పూసుకొని, పాతదైన పెద్ద మంగలి కత్తితో క్షవరం చేసుకుంటాడు. ఆదివారమున కాగితపు ముక్కను తీసికొని తన చొక్కా కాలర్‌కు అతికించుకుంటాడు. వారు ఆ రోజులలో సన్నని చొక్కా కాలర్‌లను ధరించెడివారు. దానిని ఈ విధముగా మెడచుట్టూ ఉండే చొక్కా కాలర్‌ను వేసుకొనేవారు. తన చొక్కాయి కాలర్‌కు నురుగు అంటకుండా ఉండునట్లుగా, ఆ విధముగా ఆ కాగితపు ముక్కలను ఆ కాలర్‌కి అతికించుకునేవాడు. మీరు ఎప్పుడైనా చూశారా!
22
ఆ క్రింది భాగానే ఒక పురాతనమైన నీటి ఊట ఉండుట నాకు జ్ఞాపకమున్నది. అక్కడ నుండి మేము నీళ్ళు తెచ్చుకునే వాళ్ళం. అచ్చటి నుండి నీళ్ళు తెచ్చుకుని ఎండిపోయిన గుమ్మడికాయను నీళ్ళలో ముంచి తీసుకొనుటకు ఒక తెడ్డుగా చేసి ఉపయోగించుకొనెడి వారము. గుమ్మడి కాయ తెడ్డును మీలో ఎంతమంది చూశారు? సరే, మీరు ఎంతమంది కెంటకీ నుండి వచ్చారు? అలా కెంటకీ వాళ్ళను చూడండి, ఇక్కడ ఓ నేను సరిగ్గా...... నేను అనుకున్నాను, అక్కడ అంతా ఓకేలు, ఆర్కేలు అని అనుకున్నాను, కానీ చూచుటకు కెంటకీ లోపల నుండి కదలివచ్చినట్లుగా ఉన్నది. సరే వారు కొన్ని నెలల క్రితము నూనె కొరకు సమ్మె చేశారు, మీకు తెలుసు కదా! బహుశా వారిలో కొందరు ఇటు వచ్చుచున్నారు.
23
ఈ తరువాత నాకు జ్ఞాపకమున్నది, నాన్న భోజనము చేయుటకు వచ్చినప్పుడు, ఆయన తన చొక్కాయి చేతులు పైకి ముడుచుకొన్నప్పుడు చిన్నగా ఉన్న ముంచేతులు కడుక్కోవడానికై చేతులు పైకి లాక్కొని ఆయన ముఖంపైకి నీళ్ళు చల్లుకున్నప్పుడు, ఆయన చిన్న చేతుల ఆ కండరాలు ఉబ్బుతూ ఉండేవి. నేను చెప్పాను, మీకు తెలుసా! “మా నాన్న 150 సంవత్సరాలు బ్రతుకుతాడని, ఆయన చాలా బలమైన మనిషి. కానీ ఆయన 52 సంవత్సరాలకే చనిపోయాడు.” చూచారా? “నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు.” అది వాస్తవము. మనము నిలువరముగా ఇక్కడ ఉండలేము.
24
ఇప్పుడు మనమంతా కూడా చిన్న యాత్ర చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యొక్కరికి నాకున్నట్లుగా ఒక జీవిత కథ ఉంటుంది. మరియు ఒక్కొక్కసారి జ్ఞాపకార్థ వీధిలో, వాటిని జ్ఞాపకముచేసుకుంటూ విహారయాత్ర చేయుట మంచిది. మీకలా అనిపించుట లేదా? కొద్దిగా వెనుకకు వెళ్ళు, మనము కొద్ది సేపు వెనుకకు వెళ్ళుదాము, చిన్న బిడ్డలకున్నఒక విధమైన అనుభవమువలె.
ఇప్పుడు, నా జీవిత కథలో ఇది మొదటి భాగము. దీనిని కొద్దిగా చక్కగా సవరించి చెప్పెదను, ఎందుకంటే అది పుస్తకంలో ఉన్నది, మీలో అనేకులు ఆ పుస్తకం కలిగియున్నారు.
25
నేను కెంటకీలోని అక్కడ ఆ పర్వతాలలో, ఒక చిన్నకొండ మీద వున్న గుడిసెలో నేను జన్మించాను. మేము నివాసం ఉండటానికి ఒకే ఒకగది యుండేది. నేల మీద పరచుకొనుటకు ఎలాంటి గొంగళి లేక కంబళి, తివాచి లేదు, చివరికి నేల మీద చెక్క కూడా లేదు, అది కేవలము వట్టిగా ఉన్న నేల మాత్రమే ఉండెడిది. ఒక మొద్దు, దానికి మూడు కాళ్ళుండెడివి, అదియే మాకు బల్లగా ఉండెడిది. నరికిన చెట్టు యొక్క ఆ మొద్దు పై భాగమున మా యొక్క బల్లచుట్టూ ఆ చిన్న బ్రన్హాంలంతా అక్కడ గుంపుగా చేరతారు. ఆ పాత చిన్న గుడిసె ఎదుట, బయట బురదలో దొర్లాడుతూ ఉండేవారము. ఆ జంతువుల గుంపు బురదలో దొర్లాడినట్టుగా మేము చిన్న సహోదరులంతా దొర్లాడుతుండేవారము. మేమందరము తొమ్మిది మంది పిల్లలము. ఒక చిన్న ఆడపిల్ల, ఆ గుంపు అబ్బాయిల మధ్య ఆమెకు నిజముగా కష్టతరమైన సమయమే. ఆ దినాల్లో మేము చేసిన దానికి ఈ రోజు మేము ఆమెను గౌరవించవలసి యున్నది. ఎక్కడకు ఆమె మాతో రాలేకపోయేది, మేము ఆమెను వెనుకకు తరిమే వారము. ఆమె ఒక ఆడపిల్ల కాబట్టి ఆమెకు సాధ్యమయ్యేది కాదు, దానిని మీరెరుగుదురు. కాబట్టి మేము.....
26
జ్ఞప్తించుకొండి, బల్ల వెనుక మాకు రెండు కుర్చీలు ఉండేవి, వారు వాటిని తాటతో తయారు చేసారు. అలా పాత హిక్కొరి లేత చెట్లను ఒకటిగా కలిపి దాని క్రింద హిక్కొరి తాటతో అతికించి యుండెడిది. ఎవరైనా హిక్కొరి తాట కుర్చీని మీరు చూశారా? అమ్మ చెప్పుట నేను ఇంకా వినగలుగుచున్నాను. తరువాత దినములలో మేము నేలకు చెక్కను అమర్చిన తరువాత ఆ చెక్కపై మా అమ్మ కూర్చొనియుండగా; ఆ చిన్న బిడ్డలను ఆమె తొడపై ఇలా ఉంచుకొని, ఆ పాత కుర్చీలో ఊగుతూ నేలపై శబ్దము చేస్తూ ఆమె ఊపుతూ ఉండేది. ఆమె బట్టలు ఉతుకుచున్నప్పుడు లేక ఇంకొకటి ఏదైనా చేస్తున్నప్పుడు, నీళ్ళను తెచ్చుటకు చెరువు దగ్గరకు ఆమె వెళ్ళినప్పుడు అటువంటి సమయములలో చిన్న పిల్లలమగు మేము ఇంటిలో నుండి బయటకు రాకుండా ఉండునట్లు ఆమె తలుపు దగ్గర ఉన్న ద్వారము వద్ద ఆ కుర్చీని అడ్డముగా పెట్టి వెళ్ళెడిది. అచ్చట ఆ ద్వారము దగ్గర ఆ కుర్చీ అడ్డముగా ఉన్నందువలన దానిని త్రోసికొని ఎవరము వెలుపలకు వెళ్ళలేకపోయేవారము. అది నాకు జ్ఞాపకమున్నది, ఆమె కుర్చీని క్రిందపెట్టి తలుపుకు అడ్డంగా గజిబిజిగా పెడుతుంది. ఆమె ఆ నీళ్ల ఊట యొద్దకు నీళ్ళు తీసుకొని వచ్చుటకు వెళ్ళినప్పుడు అలాంటి సమయాలలో బిడ్డలు బయటకు రాకుండా అలా చేసేది.
నేను పుట్టినప్పుడు అమ్మకు 15 సంవత్సరాల వయస్సు, నాన్నకు 18 సంవత్సరాల వయస్సు. తొమ్మిది మంది పిల్లలలో నేను జ్యేష్ఠుడను. నేను ఉదయం పుట్టినానని వారు నాకు చెప్పారు....
27
మేము చాలా పేదవారము, పేదలలో నిరుపేదలము. ఆ చిన్న గుడిసెలో మాకు చివరకు ఒక చిన్న కిటికీ కూడా లేదు. దాన్ని తెరవడానికి ఒక చిన్న చెక్క తలుపు దానికుండెడిది. నీవెప్పుడైనా అలాంటిది చూశావేమోనని నాకు అనుమానము. ఆ గుడిసెకు ఒక కిటికీ బదులుగా ఈ చిన్న తలుపునే తెరిచి ఉంచాలి, పగలు సమయములలో దానిని తెరచి మరియు రాత్రి సమయములలో దానిని మూసి వేస్తాము. ఆ దినములలో మేము వెలిగించుకోవటానికి ఇప్పుడు ఉండే ఇటువంటి విద్యుత్ దీపాలు మాకు ఉండెడివి కావు. మీరు పిలిచే “ఒక నూనె దీపం మాకుండెడిది.” నూనె దీపాలంటే మీరెప్పుడైనా చూశారో లేదో, నాకు తెలియదు. సరే ఏమిటవి. మీరు ఎప్పుడైనా కర్ర మొద్దును కాల్చారా? పైన్ కర్ర మొద్దును తీసుకొని దీనిని వెలిగించి దానిపైన మూత పెడితే అది మండుతుంది. కొంచెము పొగ వస్తుంది, దాని పొగ రాకుండా ఉండుటకు వాటికి ఎటువంటి సాధనాలు లేవు. కాబట్టి గుడిసెంతా పొగతో నిండిపోయి ఉండేది. మీరు ఎప్పుడైనా కొన్నారా?
28
నేను 1909వ సం॥ ఏప్రిల్ 6వ తేదీన నేను జన్మించాను. ఎందుకో తెలుసా, అది నన్ను కొద్దిగా 25 పై చిలువ వచ్చేస్తుంది. కాబట్టి ఆ దినమున ఉదయకాలమందు నేను జన్మించానని అమ్మ చెప్పినది. మాకు వైద్యులు వుండేవారు కారు, కావున అచ్చట ఒక మంత్రసాని ఉండెడిది. ఆ మంత్రసాని ఎవరో కాదు, మా నానమ్మ. నేను పుట్టగానే ఏడ్వడము మొదలు పెట్టాను, నా తల్లి నన్ను చూడాలని ఆశించినది. అప్పటికింకా ఆమెకు ఏ పిల్లలూ లేరు. తెల్లవారు ఝామున అయిదు గంటలకు కిటికీ తెరవగానే ఆ చిన్న పొద ప్రక్కన ఒక రాబిన్ పిట్ట కూర్చొని వున్నది. నా జీవిత కథ అనే నా పుస్తకంలో మీరు ఒక చిన్న బొమ్మను చూసి యున్నారు. ఆ రాబిన్ పిట్ట అచ్చట కూర్చొని తనలో ఉన్న దానంతటితో పాట పాడుచున్నది.
29
నేనెప్పుడూ కూడ రాబిన్ పిట్టలను ఇష్టపడతాను. రేడియో ప్రాంతాలలో వున్న అబ్బాయిలు నా పక్షులను కాల్చివేయకండి.... మీరు గమనిస్తున్నారా! అవి అవి నా యొక్క పిట్టలు. రాబిన్ గూర్చి ఎప్పుడైనా పురాతన కథ విన్నారా? దానికి ఏ విధముగా ఆ ఎర్రటి రొమ్ము భాగము కలిగినదని విన్నారా? నేను ఒక నిమిషము, ఒక్క క్షణము నిలుపు చేస్తాను. ఆ ఎర్రటి రొమ్ము భాగము దానికి ఎలాగు వచ్చినది. ఒకానొక దినమున రాజులకు రాజు సిలువలో చనిపోతూవున్నాడు, ఆయన వేదన పడుచుండగా, ఎవ్వరూ ఆయన యొద్దకు వచ్చుటకు మనస్కరించ లేదు. ఆయనకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. అక్కడకు గోధుమ రంగు పిట్ట సిలువలో నుండి ఆ సీలను లాగుటకు ఆశపడుచున్నది, అది సిలువ యొద్దకు ఎగురుతూ వచ్చి ఆ సీలలను ఊపుతూవున్నది. వాటిని బయటకు లాగటానికి అది చాలా చిన్నది. దాని చిన్న రొమ్మంతా ఎర్రగా రక్తమయమై పోయినది, అప్పటి నుండి కూడ దాని రొమ్మంతా ఎర్రగా వుంటుంది. అబ్బాయిలు దానిని కాల్చివేయవద్దు, దానిని అలాగే వుండనివ్వండి.
అది కిటికీ ప్రక్కన కూర్చొని రాబిన్‌లు పాడినట్లుగా కిచకిచమని ధ్వని చేస్తుంది. నాన్న కిటికీ వెనుకకు వేసాడు. కిటికీ తలుపును వారు వెనుకకు నెట్టినప్పుడు, పటములో మీరు చూస్తున్న విధముగా ఆ వెలుగు సుడులుగా తిరుగుచూ కిటికీలో గుండా వచ్చి పడకపైన వ్రేలాడుతూ వున్నదని అమ్మ చెప్పినది. ఏమి చెప్పవలెనో నానమ్మకు తెలియలేదు.
30
మేము మత సంబంధమైన దానికి సంబంధించిన వారముకాము. నా యొక్క ప్రజలు కాథలిక్కులు. రెండు వైపులా కూడా నేను ఐరిష్ వాడను, నా యొక్క తండ్రి ఖచ్చితముగా ఐరిష్ బ్రన్హాం, నా తల్లిది హార్వే ఆమె యొక్క తండ్రి చెరోకీ ఇండియన్‌ను పెండ్లి చేసికున్నాడు. తద్వారా ఐరిష్ రక్తము యొక్క వరుస క్రమము కొద్దిగా తెగిపోయినది. అమ్మ, నాన్న ఆలయానికి వెళ్ళేవారు కాదు. వారు సంఘమునకు వెలుపల వివాహము చేసుకొనిరి. మరియు వారికి భక్తిసంబంధమైన దానితో ఏ సంబంధమును కలిగియుండలేదు. అచ్చట ఆ కొండల ప్రాంతంలో కనీసం ఒక్క కాథలిక్ ఆలయము కూడా లేదు. కాబట్టి ఆరంభ దశలోనే ఒక నివాసము కొరకై వారు అచ్చటకు వెళ్ళి స్థిరపడిరి. అచ్చటనుండే ఇద్దరు బ్రెన్హాంలు వచ్చారు. ఆ ఊరు నుండే కుటుంబ వంశావలి మొత్తము బ్రెన్హాం సంతానమంతా వచ్చినది.
31
వారు ఆ కిటికీని తెరచినప్పుడు, వెలుగు లోపలికి ప్రవేశించి అచ్చటకు వచ్చి నిలబడింది. ఆ సమయమున ఏమి చేయాలో వారికి అర్థము కాలేదు. ఈ సంఘటన సంభవించిన సమయమందే, నాన్న అతని కొరకు భుజముపై వేసుకొను వస్త్రమును కొనుక్కొని తెచ్చుకున్నాడు, అని అమ్మ చెప్పింది. అతడు కట్టెలను నరుకువానిలా, మొద్దులను ఆ రోజులలో మోసేవారు, ఆ విధముగా అతడు తన భుజముపై వస్త్రమును వేసుకొని అచ్చట నిలబడి ఉండెను. ఆ వెలుగును బట్టి వారికి భయము కలిగెను.
32
పది దినముల తరువాత ఎన్ని దినముల తరువాతనో కాని వారు నన్ను “ఫాజిమ్ కింగ్ డమ్,” అని పిలువబడే చిన్న బాప్టిస్టు ఆలయమునకు తీసుకొని వెళ్ళిరి. ఆ బాప్టిస్ట్చర్చికి అదే పేరు కలిగి ఉండెడిది. అక్కడక్కడ ఆ స్థలాలకు తిరుగుచు వెళ్ళేవాడు ఆ బోధకుడు. పాత కాలము బాప్టిస్టు బోధకుడు, రెండు నెలలకు ఒకసారి అక్కడకు వస్తుండేవాడు. ఆ సమయమందే జనులచ్చటకి వచ్చి ఒక చిన్న ఆరాధనను జరుపుకునేవారు. కొన్ని పాటలు పాడతారు, ప్రతీసారి అలా తిరుగుతూ వుండే ఆయన వారికి ప్రతీసారి వాక్యము బోధించేవాడు. అతనికి వారు ప్రతి సంవత్సరము ఒక గోదాము నిండా గుమ్మడి కాయలు, కొన్ని వస్తువులు ఇచ్చుచుండెడివారు. ప్రజలు అతనికి ఇచ్చుటకు ప్రోగు చేసెడివారు. ఆ వృద్ధుడైన బోధకుడు వచ్చి చిన్న పిల్లవానిగా వున్న నాకు ప్రార్థన చేసాడు. అదే నేను మందిరానికి వెళ్ళిన నా ప్రథమ యాత్ర.
33
సుమారు రెండు సంవత్సరములు ఆ పైన వయస్సువున్నప్పుడు మొదటి దర్శనము నాకు కలిగినది.
పర్వతము చుట్టూ వున్నవారు ఆ వెలుగు వచ్చిందని చెప్పారు. కనుక దానిని గూర్చి నానా విధములుగా మాట్లాడసాగారు. అది ఖచ్చితముగా వారు ఇంటిలో ఉండే అద్దముపై సూర్యకాంతి పడుటవలన దాని ద్వారా ప్రతిబింబించిన ప్రతిబింబము, అని అందరూ అన్నారు. అయితే ఇంటిలో ఎలాంటి అద్దము లేనేలేదు. సూర్యుడు ఉదయించలేదు, అది తెల్లవారు జామున సమయము అయిదు గంటల సమయమది. ఆ విధముగా వారు దానిని గూర్చి ఏదేదో చెప్పుకుంటూ పిదప దానిని గూర్చి మర్చిపోయారు. నాకు ఇంచుమించు మూడు సంవత్సరముల వయస్సున్నప్పుడు.....
34
ఇప్పుడు, నేను యధార్థవంతుడనై యుండవలసి యున్నది. నేను చెప్పుకుంటానికి ఇష్టమైన విషయాలున్నవి, నేను వాటిని చెప్పటానికి ఇష్టపడుట లేదు. నేను దాటవేయాలనుకుంటున్నాను. అయినప్పటికి సత్యము చెప్పుటలో అది నీ పక్షమున సత్యమైతే లేదా నీ ప్రజల పక్షముగా అది సత్యమైతే నీవు తప్పక చెప్పవలసి యున్నది. దానిని గూర్చి యధార్థముగా వుండు, అప్పుడు అది ఎల్లప్పుడూ ఒకే విధముగా ఉండును.
భక్తిపరమైన విషయాలకు నా తండ్రి ఎంతో దూరంగా వుండే ఒక వ్యక్తి. ఆ కొండ ప్రాంతములలో నివసించేవాడుగా ఎప్పుడూ త్రాగుతూ మత్తులోనే వుండెడివాడు. ఆయన వుండే ప్రాంతములో ఎప్పుడూ ఏదో గొడవ జరుగుచూ ఇద్దరు లేక ముగ్గురు గొడవపడుతూ ఒకరి నొకరు కాల్చుకుంటూ, చంపుకుంటూ మరియు కత్తులతో ఒకనినొకరు నరుక్కుంటూ వుండే వారు. ఆ కొండ ప్రాంతములలో ముఠా గొడవలులాంటివి జరుగుచూ వుండేవి. అటువంటి గొడవలలో ఒకసారి, మా నాన్న ఏదో ఒక సమస్య ఎదుర్కోవలసి వచ్చినది. ఇటువంటి ముఠాలో ఒక ముఠాకి మా నాన్నయే నాయకుడిగా వుండేవాడు, ఎందుకనగా మా నాన్న యొక్క స్నేహితుడైన ఒకరిని ఎదుటివారు ఒక కుర్చీతో కొట్టారు. అప్పుడు నాన్న స్నేహితుడు హఠాత్తుగా జరిగిన ఈ సంభవముతో ఆ దెబ్బకు క్రిందకు పడిపోగా, ఆ ఎదుటి వ్యక్తి తన దగ్గరయున్న కత్తితో నాన్న స్నేహితుడిని గుండెల్లో పొడవబోయాడు, ఆ సమయమందే నాన్న జోక్యం చేసుకోవలసివచ్చినది. అది నిజముగానే ఒక భయంకరమైన పోట్లాటైయుండును, ఎందుకనగా అచ్చట వుండే బర్క్‌విల్లేకు అది ఎంతో దూరము, ఎన్నో మైళ్ళ దూరమువుండేది. నాన్నను బంధించుటకు వారు ఒక గుఱ్ఱము మీద ఒక న్యాయాధిపతిని పంపించారు.
35
కాబట్టి ఆ మనిషి మరణ స్థితిలో పడియున్నాడు. అతనికి సంబంధించిన వారు ఒకవేళ వినుచూవుండవచ్చును. అతని పేరు నేను చెప్పబోవుచున్నాను. విల్ యార్‌బౌ, బహుశా అతని కుమారులు కొందరు కాలిఫోర్నియాలో ఉన్నారనుకుంటున్నాను. అయితే అతను ఎద్దు లాంటి బలశాలి అయిన మనుష్యుడు. అతడు తన సొంత కుమారుని కంచెకు కట్టే తీగతో చంపినాడు. కాబట్టి అతను చాలా బలమైనవాడు దుర్మార్గుడు కాబట్టి అతనికి, మా నాన్నకి పెద్ద పోరాటం జరుగుచున్నది. కత్తులతో పోట్లాట జరిగినది. ఆ వ్యక్తిని దాదాపుగా మానాన్న చంపేసినంత స్థితికి అతను గురైనాడు, కాబట్టి అతను కెంటకీను విడచి పారిపోవలసివచ్చినది. నది దాటి ఇండియానాకు వచ్చాడు.
36
ఆ సమయమున కెంటకీ దగ్గర లూయిస్‌విల్లే అన్న ఊరిలో నాన్నకు ఒక అన్నయ్య జీవిస్తూ వుండేవాడు. అతడు కెంటకీలో లూయిస్‌విల్లే నందు ఉండే నేలకు అంటించు చెక్కలను కోయు కర్మాగారమునందు సహాయ పర్యవేక్షణ అధికారిగా ఉండేవాడు. కాబట్టి నాన్న తన అన్నయ్యను కనుగొనుటకు అచ్చటకు వెళ్ళెను, 17 మందిలో నాన్న చిన్నవాడు. కాబట్టి తన పెద్దన్నను కలుసుకుంటానికి వెళ్ళి అక్కడే నిండుగా ఒక సంవత్సరము గతించిపోయినది... అతడు తిరిగి రాలేక పోయాడు, ఎందుకంటే చట్టము అతనికొరకు ఎదురుచూస్తూ వున్నది. కాబట్టి తరువాత మరియొక పేరుతో సంతకము చేయబడిన ఒక ఉత్తరము నాన్న వద్ద నుండి వచ్చినది. తన యొక్క విషయములను గూర్చి ఆమె ఏ విధముగా తెలుసుకోవలయునో, అనే దానిని గూర్చి అమ్మకు దానిలో వ్రాయబడియున్నది.
37
అటు తరువాత ఒక రోజు ఒక నీటి ఊట ఈ చిన్న గుడిసె వెనుకనే ఉండెడిది. ఒక రోజు నాకు జ్ఞాపకమున్నది, ఆ సమయమందు... నాకు నా తర్వాత తమ్మునికి పదకొండు మాసాలు వ్యత్యాసము, అతను ఇంకా పాకుతూనే ఉండెను. ఒక పెద్దరాయి నా చేతిలో పెట్టుకొని ఉన్నాను, ఆ పాత బురదలో ఆ రాయి వేయుట ఎంత కష్టమో నేను అతనికి చూపించుటకు ప్రయత్నము చేయుచుంటిని. ఎచ్చటయితే నీటి ఊట భూమిపై పారుతూ ఉండెనో అది ఎండిపోయి అచ్చట ఆ నేలంతా బురదగా మారిపోయినది, నా చేతిలో ఒక పెద్దరాయిని తీసుకొన్నాను, ఆ రాయిఎంత పెద్దదో దానిని ఆ బురదలోకి విసరటము ఎంత కష్టమో అని నా తమ్ముడికి చూపించుటకు నేను ప్రయత్నించుచుండగా, ఒక పక్షి చెట్టుపై నుండి పాడుచూవుండే పాట నాకు వినబడినది, నేను ఆ చెట్టుపైకి చూచుచుండగా ఆ పక్షి అలా పాట పాడుకుంటూ ఎగిరిపోయినది. నేను అలాగే చూస్తుండగా ఒక స్వరము నాతో మాట్లాడినది.
అసలు నీవు దానిని ఎలా ఎరుగగలిగావు మరియు ఆ వయస్సులో జరిగినది అసలు ఎలా నీకు జ్ఞాపకమున్నది, అని నీవు ఆలోచించుచున్నావని నాకు తెలుసు. అయితే ప్రభువైన దేవుడు నా యొక్క తీర్పరి. ఆకాశము, భూమి అందులో ఉన్నదంతా నేను సత్యము చెప్పుచున్నానని ఎరుగును.
38
ఆ పక్షి, ఎగిరిపోయిన తరువాత చెట్టు మీద ఆ పక్షి ఎచ్చట ఉండెనో అచ్చట నుండి స్వరము వినబడినది. గాలి ఒక పొదకు తాకినట్లుగా అది ఉండెను. “న్యూ ఆల్బానికి దగ్గరగా ఉండు ఒక పట్టణమందు నీవు నివసించెదవు,” అని ఆ స్వరము చెప్పినది. మూడు సంవత్సరముల నుండి ఇప్పటివరకు న్యా ఆల్బాని నుండి మూడుమైళ్ళ లోపు దూరములో ఉండే ఇండియానా యందు ఆ స్వరము చెప్పినట్లుగా నేను నివసించితిని.
నేను వెళ్ళి ఆ విషయాన్ని, దాన్ని గూర్చి అమ్మకు చెప్పాను. నేను కేవలం కలకన్నాను, లేక మరేదో అని ఆమె అనుకున్నది.
తరువాత మేము ఇండియానాకు కదిలిపోయాము నాన్న శ్రీ. వాతెన్ అను ఒక ధనవంతుడి వద్ద పనిచేయుటకు వెళ్ళాడు. వాతెన్ మద్యము కార్మగారానికి యజమానుడుగా వుండెను. ధనవంతుడు మరియు అతడు అనేక పారిశ్రామిక కర్మాగారాలయందు భాగస్తుడుగా ఉండెడు వాడు. లూయిస్‌విలీ కోలోనెల్స్‌లో అతడు ఒక కోటీశ్వరుడు. మరియు బేస్‌బాల్ అనే క్రీడను ఆడే క్రీడా స్థలము ఇంకా ఎన్నో అతడికి స్వంతముగా ఉండెడివి. మేము అచ్చటకు దగ్గరలోనే నివసించుచుండెడివారము. నాన్న ఒక పేదవాడుగా ఉండెడివాడు. అతడు పేదవాడుగా ఉన్నప్పటికీ, త్రాగుబోతుగా త్రాగుతూ ఉండెడివాడు, కాబట్టి విస్కీని తయారు చేయుటకు అతడు వెళ్ళేవాడు.
మా ఇంటిలో అందరికంటే నేను పెద్దవాడిని, కాబట్టి పని యొక్క భారము నాపై పడినది. విస్కీని తయారు చేయునప్పుడు, ఆ బట్టీలో ఉండు పదార్థమునకు వేడి ఎక్కువ అవ్వకుండా ఉండుటకై ఆ బట్టీలో నేను నీళ్ళను నింపుతూ ఉండాలి. అది తయారు చేసిన తరువాత నాన్న దానిని అమ్మేవాడు. తయారు చేయబడిన బట్టీలు రెండు లేక మూడు ఉండెడివి, ఇప్పుడు ఆ భాగమును చెప్పుటకు నేను ఇష్టపడుటలేదు, కాని అది సత్యము.
39
నేను ఆ ధాన్యపు కొట్టునుండి ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్ళిన ఆ సమయము నాకు జ్ఞాపకమున్నది. ఆ స్థలమునకు వెనుక ఒక కొలను ఉండేది. ఆ కొలనులో నీళ్ళు గడ్డకట్టి మంచు గడ్డలుగా ఉండుట వలన అచ్చటి వారు ఆ మంచు గడ్డలను ముక్కలుగా కోసెడివారు. మీలో అనేకులకు అది జ్ఞాపకముండును. వారు ఆ మంచు గడ్డలను కోయునప్పుడు రంపపు పొట్టులో వాటిని ఉంచెడివారు. ఆ విధముగా శ్రీ. వాతెన్ మద్యము కర్మాగారము వారు ఆ దేశములో దానిని భద్రముచేసెడివారు. నాన్న ఒక మోటారు వాహనమునకు అనగా వారియొక్క సొంత వాహనమునకు బండిని నడుపువాని పని చేసెడివాడు. ఆ సమయమందు ఈ కొలను చేపలతో నిండివుండెడిది. వారు మంచు (ఐస్) గడ్డలను కోసి లోపలికి తీసుకొనివచ్చి రంపపు పొట్టులో వాటిని ఉంచెడివారు. పిదప ఎండాకాలమందు ఆ మంచుగడ్డలు కరిగిపోయి ఆ నీటి క్రింది భాగమునకు వెళ్ళిపోవుట వలన, ఆ నీళ్ళు శుభ్రముగా తేటగా మారిపోతాయని నేననుకుంటున్నాను. అది చూచుటకు ఒక పెద్ద మంచుగడ్డల సరస్సువలే కనపడుతూ, ఉండును. ఆ నీటిని వారు ఉపయోగించుకొనెదరు. కాని త్రాగుటకు ఆ నీళ్ళను ఉపయోగించరు, కానీ నీటిని, పాలను ఇంకా తదితర వాటిని చల్లగా ఉంచుటకు ఈ నీటిని వారియొక్క చేద (బక్కెట్లలో) పోసి వాటిచుట్టూ ఉంచెదరు.
40
నేను పాఠశాల నుండి వచ్చి వెంటనే, ఆ సారా బట్టీలకు నీళ్ళు తెచ్చి వాటిని నింపాలి. నాకేమో చేపలను పట్టడం అంటే చాలా ఇష్టం. నాతోటి పిల్లలు ఆ సరస్సు దగ్గర ఆడుకుంటూ, చేపలు పట్టుకుంటూ సంతోషంగా వుంటారు. నేనేమో ఈ నీళ్ళను మోస్తూ ఆ బట్టీలను నింపుచూ ఉంటూ వారిని చూస్తూ, అరుస్తు, బిగ్గరగా ఏడుస్తూ ఉండెడివాడిని. కాని సారాయిని కాయుట చట్టరీత్యా నేరము, కాబట్టి నేను ఎవరికి చెప్పుకోలేక నోరు మూసుకొని ఉండెడివాడిని. అది నాకు ఎంతో బాధగా ఉండెడిది. నేను నా మొండికాళ్ళతో నడుచుకొని వెళ్ళేది నాకు జ్ఞాపకమున్నది. నా కాలి బ్రొటనవేలికి మట్టి అంటుకోకుండా ఉండడానికి మొక్కజొన్నపై ఉండు తొక్కలను తీసుకొని ఆ తొక్కలను ఆ బొటనవ్రేలికి టోపిలాగా చుట్టుకొనెడి వాడను. మీరెప్పుడైనా ఆ విధముగా చేశారా? ఈ మొక్కజొన్న తొక్కను తీసుకొని నీ బ్రొటనవేలుకు చుట్టుకొని ఒక దారముతో దానిని కట్టవలెను. అది నా బ్రొటనవేలికి ఒక తాబేలు యొక్క తలలా కనబడుచూ చుట్టుకొనియుండును. నా కాళ్ళకు చెప్పులు లేవని మీరు ఎరుగుదురు. ఈ విధముగా నా బొటన వ్రేలికి మొక్కజొన్నతో చేసుకొన్నతొడుగును కట్టుకొని వెళ్ళుట వలన నేను ఏ దారిని వెళ్ళానో నా అడుగు జాడలను బట్టి వారు నన్ను కనిపెట్టవచ్చును. నాకు ధరించుకొనుటకు ఏ పాదరక్షలు లేవు. మాకెవరికి కాళ్ళకు పాదరక్షలుండవు. చలికాలమందు ఎవరైనా పాదరక్షలు ఇస్తే వాటిని వేసుకొనేవారము, కానీ ఎవరో ఒకరు మాకు ఆ సమయములో పాదరక్షలు ఇచ్చెడివారు. ధరించుకొను వస్త్రములు కూడా ఎవరైనా మాపై దయ తలచి ధర్మముగా ఇస్తే, వాటినే ధరించుకొనెడివారము.
41
నేను చేపలను పట్టడానికి వెళ్ళుటకు ఆశపడుచూ ఆ చెట్టు క్రింద అలాగే నిలబడి ఏడుస్తూ, అరుస్తూ అచ్చటనే కూర్చుండిపోయాను. (అది సెప్టెంబరు నెల) అర-గ్యాలన్ అంత పొడవు వున్న బట్టీలకు ఆ చిన్న బెల్లపు నీటి బక్కెట్లతో చాలా నీళ్ళు నింపవలసియుండును. కానీ నాకేమో ఏడు సంవత్సరములు వయస్సు మాత్రమే. పెద్ద తొట్టిలో నీటిని పోసి మళ్ళీ వెళ్ళి పంపుతో నీళ్ళను కొట్టి ఈ బక్కెట్లలో నింపుకొని ఆ తొట్టి నిండేవరకు పోయవలెను. మాకు వాడుకకు ఉండే నీళ్ళు అవి మాత్రమే. ఆ దినమున రాత్రి మా నాన్న మరియు ఇంకో వ్యక్తి మొక్కజొన్న సారాయి (విస్కీ)ని మా ఇంటి దగ్గర వారిరువురు కలిసి తయారు చేసెదరు.
42
అది “ఊ...జ్...ఊ...జ్...జ్... ”లాంటి శబ్ధముతో వినబడినది (ఇప్పుడు అంత శబ్దముగా ఉండదని నేను నమ్ముచున్నాను). అది ఒక ప్రశాంతమైనదిగా ఉండెను, నేను చుట్టూ తిరిగి చూశాను. దానిని మీరు ఒక చిన్న తుఫాను వచ్చేటప్పుడు వీచే గాలివంటిదని మీరు పిలుస్తారని నేను నమ్ముచున్నాను. ఆకులు రాలు కాలమునందు మొక్కజొన్న పొలములలో ఆకులను మొదలగు వాటిని వారు ఏరెదరు. ఆ కాలమందే ఆకులు చిగురింప ప్రారంభమగును. మా ఇంటికి మరియు ధాన్యపు కొట్టుకు కొంచెం దూరములో అడవిలో వుండు ఒక తెల్లని బూరుగ చెట్టు క్రింద నేను నిలబడియున్నాను. ఆ శబ్ధమును నేను ఆలకించాను. ఈ గదిలో ఉన్నట్లుగా అక్కడ అంత నిశ్శబ్ధముగా ఉండినది. నేను చుట్టూ తిరిగి చూశాను, ఎక్కడా ఆకులు గాలికి కదిలే శబ్ధము కాని, మరేదియు వినబడుటలేదు. “ఆ శబ్ధము ఎచ్చట నుండి వచ్చుచున్నది,” అని నేను తలంచితిని. ఆ సమయమునందు నేనొక చిన్నపిల్లవాడిని, అది ఇంకా, ఇంకా ఎక్కువ శబ్ధముతో వినబడసాగినది.
43
అచ్చటనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాను. మళ్ళీ బక్కెట్లను తీసుకొని ఏడుస్తూ, అరుచు కుంటూ ఆ చిన్నదారిగుండా నడుస్తూ వెళ్ళుచున్నాను. కొన్ని అడుగులు మాత్రమే నడచి వెళ్ళాను. ఆ పెద్ద చెట్టు యొక్క కొమ్మల నుండి; ఓ, మై, ఆ చెట్టు క్రింద ఒక సుడిగాలి శబ్ధమువలె ఏర్పడినది. దానిని చూడటానికి నేను వెనక్కి తిరిగాను, ఆ చెట్టునుండి కొంచెము దూరములో ఇంకొక సుడిగాలి వీచింది. ఆ సుడిగాలి ఆ చెట్టును పట్టుకొని దాని కొమ్మలను, ఆకులును బీభత్సముగా కదిలించుచూ ఆడించుచున్నవి. అదేదో ఒక వింతగా నేను అనుకోలేదు, ఎందుకనగా ఆ సంవత్సరమున ఆకులురాలే కాలమందు అటువంటి సుడుగాలులు ఏర్పడతాయి (మేము వాటిని “సుడిగాలులని” పిలిచెదము.) ఆ సుడిగాలులు దుమ్మును, ధూళిని అలా పైకి లేపుతాయి. ఈ ఎడారి ప్రాంతములందు మీరు వాటిని చూడగలరు — అదే విధముగానే అవి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను దానిని గమనించి చూడసాగాను, కాని ఆ సుడిగాలి ఆ చెట్టును పట్టుకొని వదులుటలేదు. సాధారణముగా అటువంటి సుడిగాలి ఒక నిమిషము మాత్రమే ఉండును, పిదప అది వెళ్ళిపోతుంది. ఈ సుడిగాలి అచ్చట రెండు లేదా అంతకన్న ఎక్కువ నిమిషములు దానిని పట్టుకొనియున్నది.
44
కాని నేను ఆ చిన్నదారిగుండా నడుచుటకు ప్రారంభించితిని, మళ్ళీ ఇంకోసారి దానివైపు చూచుటకు వెనక్కి తిరిగి చూశాను. నేను అలా వెనక్కి తిరిగి చూసినప్పుడు నేను ఇప్పుడు మాట్లాడుచుండగా వినబడుచున్న శబ్ధమువలె ఒక మనిషి మాట్లాడు ఒక శబ్ధము వినబడినది. “ఎన్నడు నీవు మద్యము త్రాగకూడదు, పొగత్రాగకూడదు, లేదా ఏ విధముగానైనను నీవు నీ శరీరము అపవిత్రపరచుకోవద్దు. నీవు పెద్దవాడవైనప్పుడు, నీవు చేయవలసిన ఒక పరిచర్య నీకున్నది,” అని చెప్పెను. ఆ స్వరము నన్ను చంపేసినంతగా భయమును కలిగించినది. ఒక చిన్న పిల్లవాడు దానిని ఏ విధముగా అనుభవించివుండును. ఒకసారి మీరు ఊహించి చూడండి. ఆ బక్కెట్లను అక్కడ పడవేసి ఎంత గట్టిగా అరవాలో అంత గట్టిగా నా గొంతును చించుకొంటూ, ఏడుస్తూ, అరుచుకొంటూ ఎంత వేగముగా పరిగెత్తుకుంటూ వెళ్ళగలనో అంత వేగముగా పరుగెత్తుకుని ఇంటికి వెళ్ళాను.
45
ఆ ప్రాంతమందు నల్లత్రాసు పాములున్నవి, అవి చాలా విషపూరితమైనవి, అమ్మ అనుకున్నది దారి ప్రక్కన వచ్చుచున్నపుడు బహుశా నేను ఆ పాము మీద నా పాదంపెట్టి యుండవచ్చునని తలంచి నన్ను కలుసుకొనుటకు పరుగెత్తుకుంటూ వచ్చినది. నేను అరుస్తూ ఆమె చేతులలోనికి ఎగిరి దూకాను. ఆమె హత్తుకుని ముద్దు పెట్టుకుంటూ ఆమె చెప్పినది, “ఏమిటి విషయం? పాము నిన్ను కరచినదా, వళ్ళంతా నన్ను తడిమి చూస్తూ అడిగింది.”
నేను చెప్పాను “లేదమ్మా ఆ చెట్టు క్రింద మనిషి వున్నాడు.”
“ఆ, బిల్లీ, బిల్లీ, రా,” అని ఆమె అన్నది. “నీవు అక్కడ కొద్దిసేపు ఆగి నిద్రపోయావా?” అని ఆమె అడిగినది.
“లేదమ్మా, ఆ చెట్టు దగ్గర ఒక మనిషి వున్నాడు, నన్ను మద్యపానం సేవించవద్దు, పొగత్రాగవద్దు” అని ఆయన చెప్పాడు.
46
“మూన్‌షైన్ అనే పేరుగల విస్కీని” తయారు చేయుటకు ఆ సమయమందు నేను ఆ బట్టీలలో నీళ్ళను నింపుచున్నాను. “ఎన్నడూ మద్యమును సేవించవద్దు లేదా ఏ విధముగా నైనను నీ శరీరమును నీవు అపవిత్రపరచుకొన వద్దు,” అని ఆయన చెప్పెను. అది పాపమని మీరెరుగుదురా? నా యొక్క చిన్నతనము నుండి ... యవ్వనము నందు కూడా ఏ స్త్రీతో తప్పిదమును చేయలేదు. సాధ్యమైనంత వరకు అటువంటి కార్యమునందు ఒక్కసారి కూడా నేను నేరస్థుడను కాను. అటువంటి పాపపు కార్యముల నుండి ప్రభువు నన్ను తప్పించుచు నాకు సహాయము చేసెను. నేను చెప్పుచున్న ఈ విషయము నుండి మీరు దానిని కనుగొనగలరు. కాబట్టి అప్పుడు “మద్యమును ఎన్నడూ సేవించవద్దు, లేదా పొగ త్రాగకూడదు, లేదా ఏ విధముగానైనను నీ శరీరమును నీవు అపవిత్రపరచుకోకూడదు, నీవు పెద్దవాడవైనప్పుడు నీవు చేయవలసిన ఒక పరిచర్య నీకు కలదు,” అని ఆ స్వరము పలికినది.
సరే, నేను దానిని అమ్మతో చెప్పాను, ఆమె నావైపు చూచి నవ్వినది. నేను అలా మూర్ఛపడిపోయాను. ఆమె వైద్యుడిని పిలిచినది, వైద్యుడు చెప్పాడు, “అతడికి నరముల బలహీనత అంతే,” అని అన్నాడు. కాబట్టి ఆమె నన్ను పడక మీద పడుకోబెట్టినది. అప్పటి నుండి నేను ఎన్నడు కూడ ఆ చెట్టు యొద్దకు తిరిగి వెళ్ళలేదు. నేను భయపడిపోయాను, ఆ తోట యొక్క ఇంకొకవైపు నుండి వెళ్లేవాడను, ఎందుకనగా చెట్టుపైన ఒక మనిషి ఉన్నాడని, ఆయన నాతో మాట్లాడతాడని నేను తలంచాను, గొప్పదైన, నిఘాడమైన స్వరము.
47
ఒకనెల తరువాత ఇంటిముందు భాగాన నా తమ్ముళ్ళతో కలిసి నేను గోలీలు ఆట ఆడుచున్నాను. ఆకస్మాత్తుగా ఒక వింతైన భావన నా మీదకు వచ్చినది. ఆటను వదిలేసి అచ్చట వున్న ఒక చెట్టు ప్రక్కన కూర్చున్నాను. ఆ సమయము నందు మేము ఓహియో నది ఒడ్డు ప్రక్కనే నివసించుచుండెడి వారము. నేను జఫర్‌సన్‌విల్ వైపు చూసాను, నదికి అడ్డంగా నది ఆ చివరి నుండి ఈ చివర వరకు ఒక వంతెన వేయబడటం నేను చూశాను. నేను చూచుచుండగా 16 మంది మనుష్యులు (వారిని నేను లెక్కపెట్టాను) ఆ వంతెనను నిర్మించుచున్నప్పుడు ఆ నదిలో పడి వారి ప్రాణాలు కోల్పోయారు. నేను త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మతో చెప్పాను. ఆమె నేను నిద్రలో కలను కన్నాననుకున్నది, కాని దానిని వారు మరచి పోకుండా నేను చెప్పిన దానిని మనస్సులో భద్రం చేసుకున్నారు. ఆ తరువాత 22 సంవత్సరములకు మున్సిపల్ వారు ఆ నదిపై ఒక వంతెనను (మీలో అనేకులు ఆ నదిని దాటునప్పుడు, ఆ వంతెన మీదుగా దాటుకొని వచ్చెదరు.) నిర్మించారు, అదే స్థలమందు దానిని నిర్మించేటప్పుడు 16 మంది మనుష్యులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు.
అది ఖచ్చితముగా సంపూర్ణమయిన ఒక సత్యమైనందువలన అది ఎన్నటికి విఫలమవ్వదు. ఇచ్చట మీరు మీ కన్నులతో ఏ విధముగా చూస్తున్నారో, అది కూడా ఎల్లప్పుడూ అదే విధముగా సత్యముగా ఉండును.
48
నేను నరముల బలహీనత గలవాడనని వారు తలంచేవారు. నరముల బలహీనత గల వాడినే అది నిజము. ఆత్మ సంబంధమైన కార్యములయందు ఆసక్తి కలిగియున్న వారిని మీరు గమనించి చూచినట్లైతే, వారు చూచుటకు నరముల బలహీనతగలవారుగానే కనబడెదరు.
కవులు, ప్రవక్తలు, ఆయనను వర్ణించిన విధానమును గమనించండి, “ఇమ్మానుయేలు నరములలో నుండి ప్రవహించిన రక్తపు ఊట,” అనే ప్రసిద్ధిగాంచిన పాటను విల్లియం కౌపర్ వ్రాసెను. ఆ పాటను మీరు ఎరుగుదురు గదా! ఆ విల్లియం కౌపర్ గారి సమాధి దగ్గరకు కొద్ది దినముల క్రితము వెళ్ళి చూశాను. సహోదరుడు జూలియస్ మాతో కూడా ఆ సమాధియొద్ద యుండెను. ఆ పాటను రచించిన అతడి నుండి ఆత్మ ప్రేరణ తొలగిపోయిన తరువాత అతడు తాను ఆత్మహత్మ చేసుకోవటానికై నదిని వెదికాడు, గమనించండి, ఆ ఆత్మ అతడి నుండి తొలగిపోయనది. కవులు మరియు రచయితలు వంటి ప్రజలు ... వారు ప్రవక్తలు కాదని నా భావము.
49
ఏలీయా వైపు చూడు, అతడు ఆ పర్వతముపై నిలబడి పరలోకం నుండి అగ్నిని పిలిచాడు, మరియు పరలోకం నుండి వర్షాన్ని పిలిచాడు. తరువాత ఆత్మ అతని విడిచిపెట్టిన తర్వాత, ఒక స్త్రీ బెదిరింపునకు భయపడి పారిపోయాడు. నలుబది దినముల తరువాత దేవుడతనని ఒక గుహలో కనుగొని పట్టుకొని వెనుకకు తీసుకొని వచ్చెను.
యోనాను చూడు, నీనెవెకి బోధించుటకు ప్రభువు అతన్ని అభిషేకించి తగినంత ప్రేరణ ఇచ్చాడు.సెయింట్ లూయిస్ అంత విస్తీర్ణముగల పట్టణము అది. ఆ పట్టణములో గోనెపట్ట కట్టుకుని మారుమనస్సు పొందునంతగా ప్రకటించాడు. తరువాత ఆత్మ అతన్ని విడిచిపెట్టిన తరువాత, అతనికి ఏమి జరిగినది? ఆత్మ అతన్ని విడిచిపెట్టిన తరువాత అతడు పర్వతం మీదకు వెళ్ళిపోయి, తన ప్రాణాన్ని తీసుకోమని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. గమనిస్తున్నారా, అది ఆత్మ ప్రేరేపణ. ఈ విషయాలు జరుగుచున్నప్పుడు, అది నీకు ఒకటి కలుగజేస్తుంది.
50
పిదప నేను ఎదుగుచు పెద్దవాడినగుచున్నాను. నేను ఒక యవ్వన ప్రాయములోనికి అడుగుపెట్టాను. (నేను దానిని త్వరగా చెప్పి ముగిస్తాను.) తరువాత నేను యవ్వనస్తుడను కావలసియున్నది. నేను యవ్వనస్తుడైన తరువాత అందరివలె యవ్వన పురుషులకు ఆలోచనలు నాకు ఉండెను. బడికి వెళుతూ యవ్వన బాలికను నేను చూశాను, అది మీకు తెలుసు! నాకు చాలా సిగ్గు తెలుసా! అందరూ చిన్నబ్బాయిలవలె, ఎలాగైతేనేమి నాకు ఒక చిన్నమ్మాయి స్నేహితురాలు దొరికింది. సుమారు ఆమెకు 15 సంవత్సరాల అని నేననుకుంటున్నాను. ఓ, ఆమె అందంగా ఉన్నది, ఓ, ఆమె కళ్లు పావురపు కళ్ళవలే యున్నవి, ఆమె పళ్ళు ముత్యాలవలె యున్నవి, ఆమె మెడ హంస మెడవలె వున్నది, ఆమె నిజంగా అందంగా యున్నది, ఓ, ఆమె కళ్ళు పావురపు కళ్ళవలే యున్నవి, ఆమె పళ్ళు ముత్యాలవలె యున్నవి, ఆమె మెడ హంస మెడవలె వున్నది; ఆమె నిజంగా అందంగా యున్నది.
51
మరొక చిన్నవాడు, అతడు నేను స్నేహితులము, కనుక మేము అతని నాన్న యొక్క పాత టీ ఫోర్డు కారు సిద్ధము చేసుకొని ఆ అమ్మాయిలతో కారులో కలసి షికారు వెళ్ళుటకై ఒక తారీఖును నిర్ణయించుకున్నాము. ఆ విధముగా వారితో కలసి షికారుకు బయలుదేరాను. మా కారుకు కావలసినంత పెట్రోలును నింపుకొన్నాను. వెనుక చక్రాలు పైకెత్తి వంపు ఇరుసుతో దానిని మేము సరిచేయవలసి యుండెను, వంపుటిరుసు అంటే మీకు ఎప్పుడైనా జ్ఞాపకమున్నదో లేదో నాకు తెలియదు. అయితే మేము చాలా బాగా ఆనందముగా వెళ్ళిపోతున్నాము.
నా జేబులో కొద్దిగా నికిల్ డబ్బులున్నవి, మేము ఒక చిన్న స్థలంలో ఆగిపోయాము... నీవు ఒక నికిల్‌కు తొడ మాంసపు రొట్టె కొనగలవు, కాబట్టి ఓ, ఇప్పుడు నేను ధనవంతుడను, ఎందుకంటే ఆ నలుగురికి ఆ రొట్టెను కొనగలిగే అంత డబ్బు నా దగ్గర ఉన్నది. గమనించారా? మేము రొట్టె ముక్క తిని కోకు త్రాగాము. నేను ఆ సీసాలను వెనుకకు తీసుకుంటున్నాను. నాకు ఆశ్చర్యం కలిగింది, నేను బయటకు వచ్చిన తరువాత నుండి (స్త్రీలు మెల్లగా కృప నుండి తొలగిపోవుతున్న కాలమది లేదా స్త్రీలగా జీవించే మంచి సంస్కారము నుండి తొలగిపోయే కాలమది), ఆ చిన్న పావురము (నా స్నేహితురాలు) ఒక సిగిరెట్టును త్రాగుచున్నది. నాకు ఒకటి ఆశ్చర్యం కలిగించింది.
52
పొగత్రాగే స్త్రీ గురించి నేనెల్లప్పుడు ఒక అభిప్రాయమును కలిగియున్నాను. కాలములు గతించుచున్నను ఆ అభిప్రాయము నుండి కొంచెము కూడా మార్చుకోను. అది నిజం. ఆమె చేసే నీచమైన పని అది. అది ఖచ్చితంగా నిజం. ఈ విధముగా చెప్పుచున్నందుకు సిగరెట్ కంపెనీ వారు నా మీద నేరము మోపవచ్చును, కానీ నేను మీకు చెప్పుచున్నదేమనగా, అది దెయ్యము యొక్క తంత్రముగా ఉన్నది. ఈ దేశము కలిగి యున్నటువంటి క్రూర హంతకుడు మరియు దేశమునకు పట్టిన వినాశనముగా అది ఉన్నది. నా కుమారుడు పొగ త్రాగేవాడిగా వుండుట కంటెను, ఒక మద్యము త్రాగే త్రాగుబోతుగా ఉండటమే కొంచెము మేలుగా వుండును. అది నిజము. నా భార్య సిగరెట్టును త్రాగుచున్నట్లుగా నేను చూచుటకంటెను, మద్యము త్రాగి మత్తులో నేలపై పడియుండుటను చూచుటయే నాకు కొంచెము మేలుగా వుండును.
53
ఇప్పుడు నాలోవున్న ఈ దేవుని ఆత్మ, అది దేవుని యొక్క ఆత్మయై యుండినయెడల (మీరు ఒక ప్రశ్నను అడగవచ్చు), మీరు అక్కడికి వచ్చి చేరుటకు సిగరెట్టు త్రాగే అలవాటును కలిగియున్న మీకు బహుకొద్ది అవకాశమే గలదు, ఎందుకనగా ఆ వేదికపై ఉన్నప్పుడు మీరు ప్రసంగమును గమనించిన యెడల... ఆ సిగరెట్ నిమిత్తము ఆయన ప్రతిసారీ ఇంతగా గద్దించుచున్నప్పుడు, అది చాలా భయంకరమైన కార్యమైయున్నది. దానిని వదలి ఆ అలవాటు నుండి తొలగిపొండి. స్త్రీలగు మీరు ఆ అలవాటు నిమిత్తము నేరస్థులై యున్నయెడల, దయచేసి క్రీస్తు నామమున ఆ అలవాటును మానుకోండి, దాని నుండి బయటకు రండి అది మిమ్మల్ని నాశనము చేయును. అది మిమ్మల్ని చంపివేయును. అది ఒక బండి నిండా బరువైన సామానులతో నింపబడియుండు బండంత బరువుగల ఒక కేన్సర్ వ్యాధిని కలుగజేయును.
వైద్యులు మిమ్మల్నిహెచ్చరించుటకు ప్రయత్నించెను. అలాగైతే మరి వారు ఎలాగ దానిని అమ్మగలుగుచున్నారు. “మీరు మందుల కొట్టుకు వెళ్ళి నేను 50 సెంట్ల ఖరీదు చేసే కేన్సర్ వ్యాధిని కొనాలనుకొంటున్నాను,” అని అడగండి. వారు మిమ్మల్ని చెరసాలలో వేసి మూసివేస్తారు. 50 సెంట్ల విలువగల సిగరెట్లు నీవు కొనినట్లైతే నీవు అదే కొనుచున్నావు. వైద్యులు అలాగే చెబుతున్నారు, ఓ, ఇది డబ్బు పిచ్చి దేశం. అది ఎంతో నీచమైనది. అది ఒక హంతకుడి వంటిది. అది రుజువు చేయబడినది.
54
ఆ అందమైన హుషారైన అమ్మాయి ఈ సిగరెట్టు ఆమె చేతిలో ఉండుట నేను చూచినప్పుడు అది నన్ను చంపినంతగా చేసినది, ఎందుకంటే నేను “ఆమెను ప్రేమించానని” నిజముగా అనుకున్నాను.
నేను “స్త్రీ ద్వేషకుడను,” అని పిలువబడుచున్నాను. మీకది తెలుసా! ఎందుకనగా, నేనెల్లప్పుడు ఒక విషయము నిమిత్తము స్త్రీలకు విరోధిగా వున్నాను. కానీ సహోదరీలారా మీకు విరోధిని కాను, కానీ నేను నవ నాగరికతతో నిండిన స్త్రీ అలవాట్లకు వ్యతిరేకిని. అవును, అది నిజమే. మంచి స్త్రీలు మంచిగా ఉండవలెను.
55
అయితే నా తండ్రి యొక్క బట్టీ అక్కడ పని జరుగుచుండుట నాకు జ్ఞాపకము. అందువలన నేను వెళ్ళి నీళ్ళు ఇంకా మొదలగు వాటిని అచ్చటికి మోసుకుని వెళ్ళుచుండెడి వాడిని. యవ్వన స్త్రీలు, 17 లేక 18 సంవత్సరములు దాటని వారు అక్కడ ఇప్పుడు నా వయస్సులో నున్న పురుషులతో అక్కడ వుండి ఆ యవ్వన స్త్రీలు కలసి మద్యము త్రాగుచుండెడి వారు. అంతేగాకుండా బాగా మత్తుగా మత్తులో మునిగిపోయిన ఆ స్త్రీలను మత్తులో నుండి మేలు కొలుపుటకు వాళ్ళకు నల్ల కాఫీని పట్టించి లేపేవారు, ఎందుకంటే ఆ స్త్రీలు వెళ్ళి తమ భర్తలకు రాత్రి భోజనము సిద్ధపరచుటకొరకై వారిని ఆ విధముగా లేపవలసి యుండెడిది. ఓ, అలాంటి ఒక నీచమైన విషయమది, అందువలన వారిపై నాలో అలాంటి ఒక వ్యతిరేక భావము ఏర్పడినది. “వారిని కాల్చి చంపాలనుకున్నా ఒక మంచి శుభ్రమైన తుపాకీ గుండుకు (తూటా) కూడా వారు అర్హత లేనివారు.” అది నిజము. అందుకే అటువంటి స్త్రీలను నేను ద్వేషించెదను. అది నిజము. ఇంకా సరిగ్గా అదే విషయమును గూర్చి తలంచుకుంటూ ఉండుటకై నేనిప్పుడు ప్రతి కదలికను గమనించుచు ఉండవలసి యున్నది.
56
కాబట్టి ఒక మంచి స్త్రీ పురుషుని యొక్క కిరీటంలో ఒక ఆభరణం వంటిది. ఆమె ఘనపరచబడవలెను. నా తల్లి ఒక స్త్రీ, నా భార్య ఒక స్త్రీ, వారు మంచివారు, ప్రేమగలవారు. నాకు వేలవేలమంది క్రైస్తవ సహోదరీలు వున్నారు. నేను వారిని ఉన్నత భావంతో గౌరవిస్తాను. తల్లిగా, ఒక నిజమైన రాణిగా దేవుడు వారిని ఎందుకు సృష్టించెనో వారికిచ్చిన స్థానమును వారు గౌరవించినయెడల అది వారికెంతో శ్రేష్టముగా ఉండును. దేవుడు పురుషునికి అనుగ్రహించిన వాటిల్లో శ్రేష్ఠమైనది ఒకటి ఏదనగా, అది అతడి యొక్క భార్యయే యగును. పురుషునికి ఒక స్త్రీ నిజమైన భార్య అయినట్లైతే, ఆ పురుషునికి రక్షణ తరువాత ఆమె అతడికి ఒక బహు శ్రేష్ఠమైన కార్యమగును. అట్లు ఆమె లేనియెడల సొలోమోను చెప్పిన రీతిగా, “ఒక మంచి స్త్రీ పురుషుని యొక్క కిరీటములో ఒక మంచి ఆభరణమగును.” ఆమె ఒక నీచమైన ప్రవర్తన గలదైతే లేదా చెడ్డ స్త్రీ అయిన యెడల, ఆమె అతడి రక్తములో నీరువంటిది అగును అది వున్నవాటిల్లో కంటే బహునీచమైన సంభవముగా వున్నది. అది నిజము. కాబట్టి ఒక మంచి స్త్రీని... భార్యగా కలిగియున్నట్లైతే సహోదరుడా, నీవు ఎక్కువగా ఆమెను గౌరవించవలసియున్నది. అది నిజము. ఆ విధముగా బహు ఉన్నత గౌరవముతో నీవు ఆమెను గౌరవించ వలసియున్నది. ఒక మంచి స్త్రీ! చిన్న పిల్లలారా, తన ఇంటి పట్టున ఉంటూ నీ గురించి బాధ్యతను వహిస్తూ, ఎంతో బాధ్యతతో నీ వస్త్రములను ఉదికి చక్కగా సిద్ధము చేసి మిమ్ములను పాఠశాలకు పంపించుచు, ప్రభు యేసును గూర్చి మీకు బోధించుచు, ఒక మంచి ప్రేమగల ఒక తల్లిని మీరు కలిగియున్నట్లైతే, ఓ పిల్లలారా, మీ హదయమంతటితో సంపూర్తిగా ఆ తల్లిని మీరు గౌరవించి, ప్రేమించవలసియున్నది. మీరు ఆమెను ఘనపరచవలెను, అవునండి, ఎందుకనగా ఆమె ఒక నిజమైన తల్లి.
57
కెంటకీ పర్వత ప్రాంత అక్షరాస్యతను గూర్చి వారు మాట్లాడతారు. మీరిక్కడ పాత బొంతకు అతుకులు వేసుకున్నట్లుగా అది కనబడును. అక్కడ వున్న వృద్ధ తల్లులు ఇక్కడకు హాలివుడ్‌కు వచ్చి మీ బిడ్డలను ఎలా పెంచవలెనో నవీన తల్లులకు బోధించగలరు. తల వెండ్రుకలంతా చిందరవందరగా చేసికొని పెదవులకు రంగులు పూసికొని (దానిని మీరేమని పిలుస్తారు), వారు ముఖములకు రంగులను పూసుకొని, వారి వస్త్రములు ఒక ప్రక్కగా బాగా నలిగిపోయి రాత్రంతా త్రాగి చిందులు వేస్తూ ఎచ్చటో గడిపి ఆ తరువాత ఎప్పటికో అర్థరాత్రి ఆ ఆడ పిల్లలు ఇంటికి వచ్చినయెడల, ఓ సహోదరుడా, ఆ కెంటకీ తల్లి ఏమి చేస్తుందంటే హిక్కరి చెట్టులో వున్న మంచి లావుపాటి కొమ్మను విరచికొని చేతితో పట్టుకొని ఆ కుమార్తెను బాదిందంటే మరెన్నడూ ఆ అమ్మాయి ఆ విధముగా చేయుటకు వెళ్ళదు. సహోదరుడా! నీతో చెప్పుచున్నాను. అటువంటి క్రమశిక్షణ నేర్పగల తల్లులు ఎక్కువగా ఉన్నట్లైతే, హాలీవుడ్ చుట్టూ వున్న ఈ ప్రాంతాలన్నీ బాగుపడేవి, ఈ దేశము బాగుపడేది. అది నిజము. “నవీనముగా వుండుటకు ప్రయత్నించటమనేది,” అది దెయ్యము యొక్క పన్నాగాలలో ఒకటైవున్నది.
58
ఈ చిన్నమ్మాయిని నేను చూచినప్పుడు నా గుండె రక్తమయమై పోయినది. “అయ్యో! అభాగ్యురాలు” అనుకున్నాను.
ఆమె అడిగింది. “బిల్లీ, నీకు సిగరెట్టు కావాలా! వద్దు, నేను పొగత్రాగను” అని చెప్పాను.
“నీవు నాట్యమాడనని చెప్పావు,” అని ఆమె అడిగినది. నాట్యమాడుటకు వెళ్ళాలని వారు ఆశించుచున్నారు, నాకేమో అదంటే ఇష్టముండదు. సైకామోర్గ గా ర్డెన్ అనే నాట్యమాడే స్థలము ఒకటి అచ్చట వున్నది. అచ్చటకు వెళ్దామని వారు చెప్పారు.
“లేదు, నేను నాట్యము చేయను,” అని చెప్పాను.
“నాట్య చేయటం తెలియదు. పొగత్రాగవు, మద్యమును త్రాగవు, ఏదీ చేయకుండా అసలు నీకు ఏ సరదాలు తెలియకుండా ఎలాగ వుంటున్నావు?” అని అమ్మాయి అడిగింది.
“వారు చేపలను పట్టడము మరియు వేటాడటం వంటివి నేనిష్టపడుదును,” అని నేను చెప్పాను. వాటిల్లోఏదీ ఆమెకిష్టముండదు.
సరే, “నీ సిగరెట్టును తీసికొని త్రాగు,” అని ఆమె అన్నది.
“వద్దు నీకు కృతజ్ఞతలు నేను పొగత్రాగను,” అని నేను చెప్పాను.
59
నేను ఆ ఇనుప చట్టము మీద నిలబడియున్నాను. పాత కాలపు ఫోర్డు కారులకు జరుగుడు బల్ల ఒకటుండేది. నేను బల్లపై నిలబడి యున్నాను. వెనుక సీటులో ఆమె, నేను కూర్చొని యున్నాము. ఆమె అన్నది, “నీవు సిగరెట్టు త్రాగకూడదనే నీ భావమా, ఆడ పిల్లలమైన మాకే మీ కంటే ఎక్కువ ధైర్యమున్నదే,” అని అన్నదామె.
నేను చెప్పాను, “లేదమ్మా, నేనది చేయాలని,” అనుటలేదు.
“నీవు ఒక ఆడంగివాడు (నపుంసకుడు)గా వున్నవని” ఆమె చెప్పినది. ఆ మాట ఆలకించగానే దానిని ఓర్చుకోలేక, ఓ, ఇక లాభంలేదు, చెడ్డవాడుగా మారిపోవాలనుకున్నాను, ఎందుకంటే నేను ఒక ఆడంగివాడుగా వుండాలని ఆశించుటలేదు, ఒక బాక్సర్‌లా, ప్రతి పోటీలో గెలుస్తూ గొప్ప బాక్సర్‌ని అవ్వాలన్నదే నా జీవిత ధ్యేయం. నన్ను చూసి ఆమె “ఆడంగివాడు” అని అన్నది.
60
ఆ మాట నేను భరించలేకపోయాను,
కాబట్టి “ఆ సిగరెట్టును నాకివ్వు,” అని అరిచాను. ఆ సిగరెట్టును నా చేతిలోకి తీసుకొన్నాను, “నేను మగాడినా కాదా అనేది ఆమెకు చూపిస్తాను,” అని చెప్పాను. ఆ సిగరెట్టును నా పెదవి మీద పెట్టుకొని అగ్గి పుల్లను కాల్చుటకు ప్రారంభించితిని. ఇప్పుడు మీరెరుగుదురు... మీరేమనుకున్నా గాని కేవలము సత్యమును చెప్పుట నా బాధ్యతగా ఉన్నది. ఈ పరిశుద్ధ గ్రంథమును నా చేతిలోకి తీసుకొన్నది ఎంత నిజమో అంతే నిశ్చయముగా ఆ సిగరెట్టును త్రాగాలని నేను నిశ్చయించుకున్నాను. ఎప్పుడైతే ఆ సిగరెట్టును కాల్చుటకు ఆరంభించితినో, వెంటనే “ఊ... ఊ... ష్...!” అని ఒకలాంటి శబ్ధము నాకు వినబడింది. గమనించండి, అయినా గాని మళ్ళీ ఆ సిగరెట్టును కాల్చాలని ప్రయత్నించాను. దానిని నా పెదవులలో వుంచలేకపోయాను. నేను ఏడ్వటం మొదలు పెట్టాను, దానిని క్రింద విసరి వేసాను. వారంతా నా వైపు చూసి నవ్వటం మొదలు పెట్టారు; నేను ఇంటికి వెళ్ళిపోయాను, పొలంలోకి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ వున్నాను. అది భయంకరమైన జీవితము.
61
నది ఒడ్డును అటూఇటూ తిరుగుతూ విస్కీని సీసాలలో పోయుటకు సీసాలను వెతుక్కుంటూ ఒక్కొక్క సీసాను ఏరుకుంటూ ఆ నది ఒడ్డున వాటి కోసము తిరుగుచున్నాను. 12 సీసాలకు వారు ఒక నికెల్ (డబ్బులు) ఇచ్చెదరు. నాన్న నాతోనే వున్నాడు, ఆ సీసాలలో విస్కీని కొలతగా పోయటానికి ఒక సీసాను తీసుకొని ఆ సీసాతో మిగతా సీసాలలో ఇంచుమించు పండ్రెండు ఔన్సులంత కొలత అని నేను అనుకున్నాను. ఆ విస్కీని వాటిలో పోసెడివాడు, అచ్చట ఒక పెద్ద చెట్టు క్రిందపడియున్నది. నాన్న మరియు ఆయనతో శ్రీ డార్న్ బుష్ అనే అతడువున్నాడు. అతడికి ఒక మంచిచేసుకొని అతడిపడవను నడపాలని ఆశించాను. దానికి మంచి చుక్కానీ వుండెడిది, మా పడవకైతే అసలు చుక్కానీ లేదు. పాత చెక్క బద్దెలను ఉపయోగిస్తూ పడవను నడుపుకుంటూ వచ్చేవారము. అందువలన అతడి పడవను నడపాలని నేను ఆశించాను... నాన్న విస్కీని కాచేటప్పుడు ఉపయోగించే బక్కెట్లను అతడు తయారుచేస్తూ వాటికి చిల్లులు పడితే వెల్డింగ్ పెట్టి బాగుచేస్తూ ఇచ్చుచుండెడివాడు. వారిరువురూ వారి కాళ్ళను ఆ చెట్టు మొద్దుపై చాచుకొని ఆనుకొని కూర్చొని యున్నారు. మా నాన్న తన చేయిని వెనుక జేబులో పెట్టి విస్కీవున్న చిన్న పొడవాటి సీసా బయటకు తీసాడు, దానిని అతనికందించాడు. అతడు కొద్దిగా త్రాగాడు, అతడు నాన్నకు అది తిరిగి ఇచ్చాడు, అతను త్రాగాడు, చెట్టు ప్రక్కనే వున్న చిన్న చెట్టు వేరు దగ్గర కూర్చున్నాడు. మిష్టర్ డాన్‌బుష్ దానిని తీసికుని “బిల్లీ, ఇదుగో నీకే,” అని చెప్పాడు.
“వందనాలు, నేను త్రాగను,” అని నేను చెప్పాను.
బ్రెన్హాం కుమారుడవై యుండి త్రాగవా? అని అతడు అడిగాడు, ఇంచుమించు మీ కుటుంబములో అనేకులు ఒకరినొకరు కాల్చుకొని చంపుకుంటూ హత్యలకుగురై చనిపోయారు. అటువంటి బ్రెన్హాం కుటుంబములో జన్మించిన నీవు తాగ్రవా? అని అతడన్నాడు.
“వద్దండీ” అని నేనన్నాను.
ఏంటీ, త్రాగవా, నేను ఒక “ఆడంగివాడిని” (నపుంసకుడిని) పెంచాను, అని మా నాన్న అన్నాడు.
62
మా నాన్న నన్ను ఒక ఆడంగివాడు అని పిలుస్తున్నాడు, “ఆ సీసా నాకివ్వు” అని నేనడిగాను. దానిని త్రాగటానికి నిశ్చయించుకుని నేను దానిపై బిరడాను లాగివేసాను. నేను త్రాగటానికి దానిని పెకెత్తినప్పుడు “ఊ... ఊ... ష్...” అనే ధ్వని నా చెవులకు వినిపించింది. ఇక నేనేమి చేయలేకపోయి ఆ సీసాను వాళ్ళకే ఇచ్చివేసి పొలము వైపుగా చాలా వేగముగా ఏడ్చుకుంటూ పరిగెత్తుకొని వెళ్ళిపోయాను. ఏదో ఒకటి అటువంటి చెడు కార్యములను నన్ను చేయనీయకుండా అడ్డుకునేది. గమనించారా! నేనేదో మంచివాడిని అని నేను చెప్పుకోలేను, ఎందుకంటే అలాంటివి చేయాలని నేను నిశ్చయించుకొనేవాడిని. అయితే అది దేవుని కృప, ఆశ్చర్యకరమైన కృప, అది నన్ను చేయకుండా కాపాడినది. నాకై నేను వాటిని చేయాలనుకున్నాను, అయితే నేను వాటిని చేయుటకు ఆయన నన్ను అనుమతించలేదు.
63
ఆ తరువాత నేను సుమారు 22 సంవత్సరాల వయస్సులో వుండగా నేను ఒక అమ్మాయిని కనుగొన్నాను. ఆమె చక్కనిది. ఆమె ఆలయానికి వెళ్లే అమ్మాయి. జర్మన్ లూథరన్ అనే ఆలయమునకు వెళ్ళేది. ఆమె పేరు హోప్ (Hope) ఆమె ఒక మంచి అమ్మాయి, ఆమె పొగత్రాగదు, మద్యపానం సేవించదు, నాట్యం చేయదు లేక ఏమీ చేయదు — మంచి అమ్మాయి. నేను ఒక పాత ఫోర్డ్‌కారు కొనేంత డబ్బు నా యొద్ద వున్నది. ఆ విధముగా ఒకరినొకరము మనస్తత్వాలను తెలుసుకొనుటకై అనేక చోట్లకు వెళుతూ అనేక కార్యములను సంభాషించు కొనుచూ మాట్లాడుకునే వాళ్ళము. ఆ కాలమందు లూథరన్ ఆలయము అచ్చట ఉండేది. వారికేదీ దగ్గరగా లేనందువలన వారు హూవర్టు పార్కు అనే స్థలమునుండి ఇచ్చటకు వచ్చారు. ఆ కాలమందు ఏ లూథరన్ చర్చి మూసివుండెడిది కాదు. వాళ్ళు అక్కడ హూవర్టు పార్కుకు వెళ్ళారు.
64
కాబట్టి మిషనరీ బాప్టిస్టు చర్చిలో ఒక దైవ సేవకుడు వుండేవారు. అతని పేరు డాక్టర్. రాయ్ డేవీస్, ఆయనే నన్ను ఆ మిషనరీ బాప్టిస్టు చర్చిలో ఒక సేవకుడిగా నియమించినది. నన్ను గురించి మరియు డాక్టర్. రాయడేవిస్ గురించి సహోదరుడు ఉప్సాగారే దగ్గర మాట్లాడి మా యొద్దకు ఆయన సహోదరి ఉప్సాగారే పంపించినది. ఆయన సంఘమునందు ప్రసంగించుచుండెను, ఈ సంఘమే అచ్చట ఉండు మొట్టమొదటి బాప్టిస్టు సంఘముగా ఉండెడిది. మొట్టమొదటి బాప్టిస్టు సంఘము ఇదే అని నేను అనుకోలేదు, ఎందుకంటే అది జఫర్‌సన్ విల్ మిషన్ బాప్టిస్టు సంఘముగా పిలువబడినది. ఆ సమయమునందు సహోదరుడు ఉప్సా గారు ప్రసంగించుచుండెను. రాత్రి పూట మేము మందిరానికి వెళ్ళి వచ్చే వారము, మేము తిరిగి వస్తాము. నేను ఎన్నడూ సంఘములో చేరలేదు, కాని ఆమెతో కలసివెళ్ళుటకు ఇష్టపడ్డాను. నేను సంఘమునకు ఎందుకు వెళ్ళాలనుకున్నానంటే ఆమెతో కలసి వెళ్ళాలనే తలంపుతో నేను వెళ్ళేవాడిని. నేను చాలా యధార్థముగా వుండాలి.
65
కనుక ఆమెతో వెళుతూ ఉండేవాడను, ఆమె మంచి కుటుంబము నుండి వచ్చినామె, నేను యిలాగు ఆలోచన చేసేవాడను, “మీకు తెలుసా, మీకు తెలుసా? ఆ అమ్మాయి యొక్క సమయాన్ని నేను వృధా చేయకూడదు, అది మంచిది కాదు, ఎందుకంటే ఆమె మంచి అమ్మాయి. మరి నేను పేదవాడను.....” మా నాన్న ఆరోగ్యం పాడైపోయినది. ఎంతో మంచి ఇల్లు, నేల మీద మంచి కంబళ్ళు ఉండినటువంటి గొప్పవారు అలాంటి అమ్మాయిని పోషించడానికి నాకు వేరే మార్గము లేదే.
66
నేను ప్రప్రథముగా చూచిన నేలపై వేసే కంబళి నాకు జ్ఞాపకమున్నది. అదేదో నాకు అర్థం కాలేదు. ఆ కంబళిని చూసి దానిమీద నడవకుండా దాని ప్రక్కగుండా నేను నడిచివెళ్ళితిని. నా జీవితములో నేను చూచిన అందమైన వస్తువు ఇదే అని నేననుకున్నాను. “అలాంటి అందమైన తివాసీ నేలపై ఏలాగు పరవగలరు” అని నేననుకున్నాను. నేను చూచిన మొట్టమొదటి కంబళి అదే. అది “పరిచే కంబళి,” నేలపై పొరపాటనుకుంటాను. ఒక విధంగా వత్తివలెయుండి, ఒక రకమైన “జల్‌తారు” అల్లిక యుండి నేల మీద పరుస్తారు. ఆకుపచ్చ, ఎరుపుతో యుండి దాని మధ్యలో పెద్ద రోజా పువ్వులు వంటి చక్కగా అల్లిన అందమైన వస్తువుగా అది వుండును.
67
కాబట్టి నాకు జ్ఞాపకమున్నది, నా మనస్సులో నేనిలా నిర్ణయించుకున్నాను. నన్ను పెళ్ళి చేసికోమని అడగటమా లేదా ఒక మంచి వ్యక్తి ఆమెను పెండ్లి చేసుకోవడానికి ఆమె మార్గములో నుండి నేను తొలగిపోవటమా, ఆమెను పెండ్లిచేసుకొను వ్యక్తి అతడు ఆమెను చక్కగా పోషించి చక్కగా చూచుకొను వ్యక్తిగా ఉండాలి. నేను ఆమెను చక్కగా పోషించి చూచుకోగలనా? ఒక గంటకు ఇరువది సెంట్లను మాత్రమే నేను సంపాదించుచుండగా ఆమెను ఎలా మంచిగా పోషించుచు చూచుకోగలను? మా నాన్నగారి ఆరోగ్యం క్షీణించి పోయినందువలన ఇంటికి పెద్దవాడుగా కుటుంబమంతటి బాధ్యత నాపై పడింది, కనుక నాకది కష్టకాలము.
68
కాబట్టి నేనిలా అనుకున్నాను, “నేను చేయకలిగినది ఒకటే ఒకటి నేను నీతో మాట్లాడుటకు మళ్ళీరానా? అని ఆమె దగ్గర చెప్పటమే మంచిదని నేను అనుకొన్నాను, ఎందుకంటే ఆమె యొక్క జీవితము నేను పాడు చేయాలని అనుకోవటం లేదు. అంతే కాకుండా ఆమె నాతో స్నేహము చేయుచున్నందువలన నేను ఎక్కువగా ఆమె గురించి ఆలోచించుచున్నాను.” “ఎవరైనా ఒక మంచి వ్యక్తి ఆమెను పెండ్లి చేసుకొని చక్కని కుటుంబముగా వారు జీవించిన యెడల ఎంతో బాగుంటుందని” నేను అనుకొన్నాను. ఒకవేళ నేను ఆమెను పెండ్లి చేసుకొనలేక పోయినను ఆమె ఎచ్చట ఉన్నను సంతోషంగా ఉన్నదని నేను ఎరుగగలను అని అనుకొన్నాను.
కానీ నేను ఆమెను వదులుకోలేను అని తలంచాను. నేను ఎంతో ఆందోళనకు గురి అయ్యాను. ఆ దినములలో దానిని గురించే నేను ఎక్కువగా ఆలోచించుచూ ఉండేవాడిని. నన్ను పెళ్ళి చేసుకుంటావా అని ఆమెను అడగడానికి ఎంతో సిగ్గుపడేవాడిని. “నేను వెళ్ళి ఆమెను అడిగేస్తాను” అని ప్రతిరోజు నేను నా మనసులో అనుకునేవాడిని. ఎందుచేత అలా అయిపోతున్నాను, రంగు రంగుల సీతాకోక చిలుకలు వంటి, మధురమైన అనుభూతులు లేదా మీలో కూడా కలిగినటువంటి ఒక విధమైన ఆహ్లాదము, సహోదరులందరికి దాదాపుగా అందరికీ ఆ అనుభూతులను మీరు కూడా కలిగియుందురు. అది ఎంతో వింతైన అనుభూతి. ఆ అనుభూతి కలగగానే ముఖమెంతో వేడెక్కిపోతుంది. మరి అంతెందుకూ, నాకైతే తెలియదు, ఆమెనేమో అడగలేకపోతున్నాను.
ఎలాగు నేను ఆమెను వివాహము చేసుకున్నానా? అని మీరు ఆశ్చర్యపోతున్నారు కదా! ఎలాగని మీకు తెలుసా? నేను ఒక ఉత్తరమును ఆమెకు వ్రాసి ఆమెను అడిగాను. ప్రియమైన కుమారి వద్దు, ఇంకా ఎక్కువగా ప్రేమను బయలుపరచు విధముగా ఆ పదము వుండాలి. అదేదో ఒడంబడిక కాదు కదా. ఎంత చక్కగా ఆ ఉత్తరమును వ్రాయాలో అంత చక్కగా ఆ ఉత్తరము వ్రాయాలనుకున్నాను.
69
ఆమె తల్లి అంటే నాకు కొంచెము భయము. ఆమె కొంచెము కరుకుగా యుండేది, అయితే ఆమె యొక్క తండ్రి మర్యాదస్తుడైన డచ్ మనిషి. మంచి వృద్ధుడు. అతడు రైల్వే శాఖలో బండ్లు నడుపువారి సహోదరత్వానికి కార్యనిర్వాహకుడు. వారి కాలంలో అతడు నెలకు 500 డాలర్లు సంపాదించేవాడు. అతడి కుమార్తెను వివాహము చేసుకోవాలనుకున్న నేనేమో గంటకు 20 సెంట్లను మాత్రమే సంపాదించుచున్నాను. కాబట్టి ఆమెను వివాహము చేసుకోవటమనేది జరగని పని అని అనుకున్నాను. ఆమె తల్లిని చూడటానికీ... మంచిదే, గొప్పవారి సమాజములో మెలిగే ఒక పెద్ద తరహా స్త్రీగా ఆమె వుండును. సాంప్రదాయ ఆచారములు వంటివి వెంబడించని భావముగల స్త్రీ వలె ఆమె తల్లి వుండెడిది. కాబట్టి ఏ విధముగానూ ఆమె తల్లి వలన నాకేమీ ప్రయోజనము లేదు. నేనేమో ఆ పాత కాలమునాటి సామాన్యమైన పల్లెటూరి పిల్లవానిగా వున్నాను. పెద్ద ఆస్థిపరుడైన ఉన్నత శ్రేణికి చెందినవాడు తన కుమార్తెకు భర్తగా వుండాలని ఆమె తలంచెడిది. ఆ తల్లి యొక్క తలంపు సరియైనదే. నేను కూడా అభిప్రాయపడితిని, కానీ అప్పట్లో నేను దానిని అలా అనుకోలేదు.
70
“ఏ విధముగా ఈ కార్యము చేయవలయునో నాకేమీ అర్థముకాలేదు. ఆమె యొక్క తండ్రిని అడగలేను, ఖచ్చితముగా ఆమె యొక్క తల్లిని అడగలేను. కాబట్టి నేను ఆమెనే మొదట అడుగుతాను,” అని నేననుకున్నాను. కాబట్టి నేను ఒక ఉత్తరము వ్రాసుకున్నాను. పని చేయుట కొరకై దారిన వెళుతూ ఆ ఉదయము తపాల పెట్టెలో దానిని వేసాను. మేము బుధవారం రాత్రి మందిరానికి వెళ్ళనై యుంటిమి. అది సోమవారము ఉదయము, నేను ఆమెను పెళ్ళి చేసికుంటానని ఆమెకు చెప్పుటకు ఆదివారమంతా ప్రయత్నం చేసాను. అలా ఆమె యొద్ద దానిని అడగటానికి తగినంత ధైర్యము నాకు చాల లేదు.
ఆ ఉత్తరమును తపాలా పెట్టెలో వేశాను. ఆ రోజు నేను పనిచేసుకుంటూ “ఆ ఉత్తరము ఆమె యొక్క తల్లి చేతికి అందిందంటే ఏమవుతుందో,” అని అనుకొన్నాను. ఆ ఉత్తరము ఆమె తల్లి చేతికి అందిందంటే ఓ, మై! ఒక నేనంతే, నా పనియైపోతుంది, ఎందుకంటే నేనంటే అసలు ఆమెకు లెక్కలేదు. దానిని తలంచుచు నాకు వళ్ళంతా చెమటలు పట్టాయి.
71
బుధవారం రాత్రి వచ్చినప్పుడు “ఓ, నేను అచ్చటికి ఎలా వెళ్ళగలను. ఒకవేళ ఆమె తల్లి చేతికి ఆ ఉత్తరము అందిందంటే ఆమె నన్ను పట్టుకొని నాకు గుణపాఠం నేర్పుతుంది, కాబట్టి అది ఆమె చేతిలోనే పడలేదనుకుంటా,” అని నేను తలంచాను. కాని ఉత్తరము మీద “హోప్” అనే పేరులోనే చిరునామా వ్రాశాను, హోప్ లేదా “ఆమె యొక్క పేరు నేను ఆ ఉత్తరము మీద హోప్,” అని వ్రాసినందువలన ఆమె తల్లి దాన్ని తీసుకొని ఉండదు అని నేననుకున్నాను.
కావున నేను మందిరము లోపలికి వెళ్ళకుండా, వెలుపలనే ఉండి, నా కారు హారనుకొట్టి ఆమెను బయటకు పిలవడమే మంచిదని నేను అనుకొన్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి ఆ అమ్మాయినిపెళ్ళి చేసుకుంటానని అడిగే ధైర్యము లేని నాలాంటి పిరికివాడిని, ఏ సంపాదనా లేని నాలాంటి వాడికి అలా చేయుట మంచిది కాదని అనుకున్నాను, ఎందుకంటే అది చాలా అపహాస్యముగా, సిగ్గుచేటుగా అనిపించింది. అవును, ఖచ్చితముగా అలాగే.
72
కాబట్టి నేను వెళ్ళి నా కారును ఆపాను, కారును రుద్ది, రుద్ది దానిని మెరుస్తున్నట్లుగా తుడిచాను. నేను వెళ్ళి ఆ ఇంటి తలుపును తట్టాను. ఆమె తలుపును తట్టాను, ఆమె తల్లి తలుపు తెరచింది. అంతే, గుండె వేగముగా కొట్టుకుంటున్నది. ఊపిరిని పీల్చలేనంత పనైపోయింది. “శ్రీమతి బ్రూంబాక్ గారు ఎలాగున్నారు,” అని నేనడిగాను.
“ఎలాగున్నావు విల్లియం,” అని ఆమె అడిగినది.
“ఓ, ఆమె నన్ను విల్లియం అని పిలిచింది,” అని సంతోషపడి పోయాను.
“లోపలికి రా” అని ఆమె నన్ను పిలిచింది.
“వందనాలు అమ్మా” అని చెప్పి, నేను లోపలికి ప్రవేశించి, “హోప్ సిద్ధంగా వున్నదా,” అని నేను అడిగాను.
అప్పుడే, ఇంటి గదిలో నుండి హోప్ ఎగురుకుంటూ వచ్చింది. ఆమెకు సుమారు 16 సంవత్సరముల వయస్సు గలది. “హాయ్, బిల్” అని పిలిచినది.
“హాయ్, హోప్, చర్చికి వెళ్ళడానికి సిద్ధపడ్డావా,” అని నేను అడిగాను.
“ఒక్క నిమిషములో సిద్ధమవుతాను,” అని ఆమె చెప్పినది.
“ఓ, మై! అది ఆమెకి చేరలేదు, ఆమె దానిని అందుకోలేదు; మంచిది, మంచిది! హోప్ ఆ ఉత్తరాన్ని అందుకోనంత వరకు చాలా మంచిది, ఎందుకంటే ఆమె నా పేరుతో జవాబు వ్రాసి యుండెడిది,” అని నేననుకున్నాను. కాబట్టి నేనెంతో సంతోషించాను.
73
పిదప మందిరమునకు వెళ్ళి తరువాత, “ఒకవేళ ఆమెకు ఆ ఉత్తరము చేరినదా” అనే ఆలోచన మళ్ళీ నాలో మొదలయ్యింది. డా॥ డేవిస్ గారు ఏమి ప్రసంగించుచున్నారో అది నా చెవిన పడుటలేదు. నేను ఆమెను చూస్తూ, “ఏమైనా గాని నేను ఆమెను వదులుకోలేను, ఆమెను మరువలేను, ఇందు నిమిత్తము నేను సమస్యలను ఎదుర్కొనక తప్పదు,” అని నేను తలంచాను.
ఆరాధన ముగించిన తరువాత ఇరువురము వీధి గుండా నడుచుకుంటూ వెళ్ళాము. ఇంటికి వెళ్ళటానికి ఆ పాత ఫోర్డుకారు దగ్గరకు వెళ్ళాను. చంద్రుడు వెన్నెల కాంతితో ప్రకాశిస్తుండగా ఆ కాంతిలో ఆమె చాలా అందముగా ఉన్నది. ఆమె వైపు చూచుకుంటూ అలా నడుస్తూ వెళుతున్నాను. నేను ఆమెను చూస్తూ “ఆమెను నా సొంతం చేసుకోవటం నాకెంతో ఇష్టం, కానీ అది సాధ్యమవునా,” అని నేను తలంచుచున్నాను.
74
కావున ఇంకా కొంచెము ముందుకు నడిచిన తరువాత మరలా ఆమె వైపు చూచి, “ఈ రాత్రి సమయమున నీవు ఎలాగ ఉన్నావు,” అని నేను అడిగాను.
“నేను బాగానే వున్నాను,” అని ఆమె చెప్పినది.
ఆ పాత ఫోర్డ్ కారును ఆపి క్రిందికి దిగాము. ఆమె ప్రక్కగా నడుచుకుంటూ ఆమె ఇంటిమూల వరకు వెళ్ళాను. అలా ఆమె ఇంటివరకు వెళ్ళి ఆ ఇంటి తలుపు దగ్గర ఆగాము. “ఆమెకు ఆ ఉత్తరము అంది ఉండదు, కాబట్టి ఆ ఉత్తరము గురించి నేను మరిచిపోవటము మంచిది, ఎందుకంటే ఈ విధముగా ఆమెతో మాట్లాడుతూ ఉండటానికి ఇంకొక వారము నేను కృపను కలిగి వుంటాను,” అని నేను మనసులో అనుకున్నాను. కావున నాకెంతో సంతోషంగా వున్నది.
“బిల్లీ,” అని ఆమె పిలిచినది.
“ఆ, ఏంటి,” చెప్పు అని అడిగాను
“నీ ఉత్తరము నాకు అందినది,” అని ఆమె చెప్పినది. ఓ, మై!
దేవా! అవును, అందినది, అని ఆమె చెప్పి మళ్ళీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా నడుచుకుంటూ ఆమె వెళ్ళుచున్నది.
“ఓ స్త్రీ ఏదో ఒకటి చెప్పు, నన్ను మర్చిపొమ్మను లేదా దాన్ని గూర్చి నీ అభిప్రాయం నాకు చెప్పు అని తలంచాను.”
“నీవది చదివావా?” అని అడిగాను.
“అవును, చదివాను”, అని ఆమె అన్నది.
ఆడవాళ్ళు ఏ విధంగా మిమ్ముల్ని సంశయమునందు పడేసి మిమ్మల్ని గందరగోళం చేస్తారని మీకు తెలుసా? అది ఏవిధంగా ఉన్నదని నా భావన కాదు, గమనిస్తున్నారా. ఎలాగైతేనేమి, మీకు తెలుసు గదా! “ఆ విషయమై ఏదో ఒక సమాధానము చెప్పవు నన్నెందుకిలా చేస్తున్నావు,” అని నేను అలాగే అయోమయముగానే వుండి పోయాను. “ఉత్తరము చదివావా,” అని నేను అడిగాను.
“అవును చదివాను,” అని చెప్పినది.
75
కావున మేము దాదాపుగా వారి ఇంటి తలుపు వరకు వచ్చేశాము, “బిల్లీ, ఆ ఇంటి వసారా వరకు వెళ్ళకు, ఎందుకంటే నీవు వాళ్ళను దాటుకొని పరుగెత్తుకొని వెళ్ళలేవు, కాబట్టి ఆమె ఏమి చెప్పాలనుకుంటున్నదో దానిని ఇప్పుడే ఇక్కడే లోపలికి వెళ్లేముందే అడిగి తెలుసుకో,” అని నేను నా మనసులో అనుకున్నాను. అందుకే నేను ఆ తలుపు దగ్గర ఆగిపోయి ఆమె జవాబు కోసము ఎదురు చూచుచున్నాను.
“బిల్లీ, నీవు కోరుకున్నట్లుగానే నేను కూడా ఆశించుచున్నాను, నేను నిన్ను ప్రేమించుచున్నాను,” అని ఆమె చెప్పినది. ఆమె యొక్క ఆత్మను దేవుడు దీవించును గాక! ఇప్పుడు ఆమె మహిమలో ఉన్నది. “నేను నిన్ను ప్రేమిస్తున్నాను,” అని ఆమె చెప్పినది. మనము మన తల్లిదండ్రులకు దానిని చెప్పవలసి యుంటుంది, నీవు అలాగు అనుకోవట్లేదా అని అన్నదామె.
“ప్రియమైనదానా (హానీ), ఈ విషయములో బాధలను, వేదనలను మనిద్దరము సగం, సగం, పంచుకుందాము.” ఈ విషయాన్ని నేను మీ నాన్నగారితో చెబుతాను, నీవు మీ అమ్మగారితో చెప్పు, ఆ విధముగా మీ అమ్మగారితో చెబుతాను, నీవు మీ అమ్మగారితో చెప్పు, ఆ విధముగా మీ అమ్మగారిలో వున్న చెడు భావపు వేరును తీసివేయుటకు ప్రారంభించుదాము, అని నేను అన్నాను.
“సరే, మంచిది నీవు మొదట మా నాన్నగారితో చెప్పు,” అని ఆమె నాతో చెప్పింది.
“సరే అలాగే, ఈ ఆదివారము రాత్రి నేను ఆయనతో చెబుతాను,” అని అన్నాను.
76
ఆదివారం రాత్రి వచ్చినది, మందిరం నుండి ఇంటికి నేను ఆమెను తీసుకొనివచ్చాను. ఆమె నావైపే చూస్తుంది, నేను చూశాను, అది 9:30 ని॥లు, అది నేనెళ్ళుటకు సమయం, కనుక చార్లీ తన బల్లయొద్ద కూర్చొనిటైపు చేసుకుంటున్నాడు. మిసెస్ బ్రంబాక్ ఒక మూలన కూర్చొని ఉండి ఒక విధమైన కొక్కెములు గలపుల్లతో ఏదో చేస్తుంది. చిన్న వస్తువులకు కట్లు కడుతుంది, తెలుసా, అది మీకు మీరేమని పిలుస్తారో తెలియదు, కనుక ఆ విధమైనదేదో ఆమె చేస్తున్నది. హోప్ నావైపే చూస్తూ ఉన్నది, బొమ్మ తల మడచి ఆమె నావైపే చూస్తున్నది. తన తండ్రిని కదల్చమని ఆమె భావన. “ఒకవేళ నేను ఆయనను అడిగి అంగీకరించకపోతే,” అని నేను తలంచుచున్నాను. “నేను వెళ్ళిపోవటమే మంచిది,” అని అనుకొని తలుపు దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళటము ప్రారంభించితిని.
77
తలుపు దగ్గరకు వెళ్ళుచున్నాను. ఆమె నాతో తలుపు దగ్గరకు వచ్చుచున్నది, ఆమె ఆనవాయితీగా ఎల్లప్పుడు తలుపు దగ్గరకు వచ్చి గుడ్‌నైట్ అని చెప్పుతుంది.
కాబట్టి నేను తలుపు దగ్గరకు వెళ్ళుచుండగా, “మా నాన్నగారిని అడిగావా,” అని ఆమె నన్ను అడిగింది. నేను మళ్ళీ వెనుకకు వెళ్ళాను,
నీవు నాన్న గారిని బయటకు పిలువుము, అని చెప్పినది. కావున నన్ను అక్కడ వుండమని ఆమె వెనుకకు వెళ్ళి పోయినది.
“చార్లీ?” అని నేను పిలిచాను.
ఆయన తల త్రిప్పి “ఏంటి బిల్లీ?” అని అడిగెను.
“ఒక్క నిమిషము నేను మీతో మాట్లాడాలి,” అని చెప్పాను.
“ఖచ్చితముగా మాట్లాడవచ్చు,” అని ఆయన చెప్పి తన బల్లయొద్ద నుండి వచ్చెను. శ్రీమతి బ్రూంబాక్ ఆయనవైపు, నావైపు, హోప్ వైపు చూసింది.
“ఆ బైట వరండాలోకి వస్తారా,” అని నేను ఆయనతో అన్నాను.
“అలాగే, నేను బయటకు వస్తాను,” అని ఆయన అన్నాడు. కావున ఆయన అచ్చటవున్న వరండాలోకి వచ్చాడు.
“ఈ రాత్రి ఎంతో ఆహ్లాదముగా ఉన్నది కదా అని,” నేను అన్నాను.
“అవును, చాలా బాగుంది,” అని ఆయన అన్నాడు.
ఆయన నా వైపు చూస్తూ, “అవును అలాగే వున్నది,” అని అన్నాడు.
“నేను ఎంతో కష్టపడి పనిచేస్తున్నాను, నా చేతులు కాయలు కాచి పోయినవి,” అని నేను అన్నాను
“బిల్లీ, నీవు ఆమెను వివాహము చేసుకోవచ్చును. ఓ, నీవు ఆమెను నీ స్వంతం చేసుకోవచ్చు,” అని ఆయన అన్నాడు.
78
ఓ, “ఆ మాటలు నాకెంతో బాగుందని” తలంచాను. “చార్లీ, మీరు నిజముగానే చెప్పుచున్నారా?” అని నేను అడిగాను. “ఆమె ఒక గొప్ప ఇంటిలో పెరిగిన నీ కుమార్తె అని నేను ఎరుగుదును,” అని నేను చెప్పాను.
ఆయన నా దగ్గరకు వచ్చి నా చేతులు పట్టుకుని బిల్లీ, “ఆలకించుము, ఒక మనిషి జీవితములో అన్నిటికి డబ్బువుంటే మాత్రమే చాలదు” అని ఆయన అన్నాడు.
“చార్లీ గంటకు నేను 20 సెంట్లు మాత్రమే సంపాదిస్తాను, అయితే ఆమెను నేను ప్రేమించాను, ఆమె నన్ను ప్రేమించినది. చార్లీ, నేను నీకు వాగ్ధానము చేస్తున్నాను. నేను ఆమెను పోషించటానికి నా చేతులంతా కాయలు కాచేంత వరకు కష్టపడి పనిచేసి చక్కగా చూసుకుంటాను. నేను ఆమె యెడలఎంత నమ్మకస్తుడుగా ఉండాలో, అంత నమ్మకస్తుడుగా ఉంటాను.”
“బిల్లీ, నీ మాటలను నేను నమ్ముచున్నాను. కానీ, బిల్లీ నేను చెప్పేది ఆలకించుము, కేవలము డబ్బును సంపాదించుచు ధనవంతులుగా వుండటమే ఆనందము కాదు. ఆమెకు, నీవు ఒక మంచి భర్తగా ఉండటమే ఆనందము, నీవు ఆ విధముగా వుంటావని నేను నమ్ముచున్నాను, అని ఆయన నాతో చెప్పాడు. ”మీకు కతజ్ఞతలు, చార్లీ, నేను ఖచ్చితముగా అలాగే చేస్తాను,“ అని నేను చెప్పాను.
79
కాబట్టి మాకు పెళ్ళయిన తరువాత మా యొద్ద ఏమీ లేవు. ఇల్లు చక్కదిద్దుకుంటానికి మా యొద్ద ఏమీలేవు. మా యొద్ద 2 లేక 3 డాలర్లు ఉన్నవి. మేము ఒక ఇల్లును అద్దెకు తీసుకున్నాము, దాని అద్దె నెలకు 4 డాలర్లు అది రెండు చిన్న గదుల స్థలమది. ఒకరు మాకు పాతదైన మడత మంచము ఇచ్చారు, పాత మడత మంచము ఎవరైనా చూశారేమోనని నేనాశ్చర్యపడుచున్నాను. వారు దానిని మాకిచ్చారు. నేను సేర్స్ మరియు రొబాక్స్‌కు వెళ్ళి ఒకచిన్న బల్ల, నాలుగు కుర్చీలు తెచ్చాను, అవి రంగులు పూసినవి కావు. అప్పటికి మా దగ్గర వున్న వస్తువులు అవి మాత్రమే పాత సామానులు అమ్మే శ్రీ వెబర్ అనే పాత సామాన్లు అమ్మే అంగడి దగ్గరకు వెళ్ళి వంట చేసుకునే ఒక పాత స్టౌను 75 సెంట్లకు కొని తెచ్చాను. ఒక డాలర్ మరెంతో ఖర్చుపెట్టి తడికలతో మేము ఇల్లు చక్కపరచుకున్నాము. నాకు జ్ఞాపకమున్నది. ఒక కుటు౦బానికి కావలసిన సామానులు మేము సమకూర్చుకున్నాము. నేను కొన్న కుర్చీలకు త్రిపత్రికమనే గఱికతో ఒక రంగును వేశాము. ఆ విధముగా మేమెంతో సంతోషముగా జీవిస్తున్నాము. ఒకరి కోసము ఒకరు అలా మేమిద్దరము సంతోషముగా జీవించటమే మాకు కావలసియున్నది. అదే మాకు చాలు. ఆయన యొక్క కనికరము మరియు ఆయన యొక్క వాత్సల్యము వలన భూమిపై జీవించే బహు ఆనందకరమైన ఒక జంటగా మేము జీవించితిమి.
భూ సంబంధమైన సుఖ సౌకర్యములతో నిండిన ఎన్ని వస్తువులు నీవు కలిగియుండినను, అది నిజమైన సంతోషము కాదు గాని, దేవుడు నీ కొరకై కేటాయించిన భాగమునందు నీవు ఎంత సంబంధము కలిగియున్నావో, దానిలో ఎంతగా మిళితమైపోయి యున్నావో అదియే ఒక నిజమైన ఆనందముగా నీకు వుండును.
80
పిదపకొంచెం కాలము తరువాత, దేవుడు దిగి వచ్చి మా చిన్న గృహమును ఆశీర్వదించెను, దేవుడు మాకు ఒక కుమారుడను అనుగ్రహించెను. అతని పేరు బిల్లీపాల్, ఈ రోజు రాత్రి ఇచ్చట ఈ కూటములో వున్నాడు. మరలా కొన్ని దినముల తరువాత ఇంచుమించు 11 నెలల తరువాత దేవుడు మరలా మమ్మల్ని ఆశీర్వదించి, ఒక చిన్న కుమార్తెను అనుగ్రహించెను. ఆ చిన్న పాప పేరు షారోన్ రోజ్, ఆ పేరు షారోన్ యొక్క రోజా. అది దాని నుండి వచ్చినది.
కొంత ధనమును దాచుకొని కొన్ని దినములు సెలవులను గడుపుటకు వెళ్ళాను. పావ్పావ్ అనే స్థలమునకు చేపలను పట్టుటకై నేను వెళ్ళుచున్నాను. అది నాకు జ్ఞాపకమున్నది, పిదప మార్గ మధ్యములో నేను తిరిగి వచ్చుచుండగా ...
81
ఈ సమయమునందు నేను మారుమనస్సు పొందిన కార్యమును నేను వదిలేసాను, నేను మారుమనస్సు పొందితిని, డా॥ రాయ్ డేవిస్ గారి ద్వారా నేను సేవకుడిగా అభిషేకించబడితిని. అది మిషనరీ బాప్టిస్టు సంఘములో జరిగినది, నేను ఒక సేవకుడినై ఒక చిన్న సంఘమును కలిగి ప్రసంగించటము ప్రారంభించితిని. ఆ సంఘము జఫర్‌సన్‌విల్‌లో ఉన్నది, కావున ఆ చిన్న సంఘమునకు ఒక కాపరిగా యుండెడివాడిని.
నా దగ్గర ఏమీ డబ్బులేదు. జీతమేమీ తీసుకోకుండా 17 సంవత్సరములుగా నేనా సంఘములో కాపరిగా వుంటిని. ఒక్క పైసా కూడా నేను తీసుకోలేదు, కానుకను తీసుకోవటమందు నాకు నమ్మకము లేదు. అసలు కానుకలను పట్టడానికి ఒక్క కానుక పళ్ళెము కూడా ఆ సంఘములో లేదు. దశమ భాగములు మరియు నా ఉద్యోగము ద్వారా నేను పొందుకున్న కొంత డబ్బు, ఇంకా మొదలగు వాటిని వేయటానికి సంఘమునందు ఆ భవనమునకు వెనుక ఒక చిన్న పెట్టె ఉండెడిది. ఆ చిన్న పెట్టెమీద ఇలా వ్రాసి ఉండెడిది, “ఈ చిన్న వారికి మీరేమి చేసితిరో దానిని నాకే మీరు చేయుచున్నారు,” ఆ విధముగానే సంఘము వాటిని చెల్లించెడిది. పది సంవత్సరములుగా మేము తీసుకున్న అప్పును చెల్లించవలసి యున్నది. ఆ అప్పును రెండు సంవత్సరములలోనే తీర్చేశాను, దాని కొరకు నేను ఎటువంటి కానుకను తీసుకోలేదు.
నా యొద్ద కొంత డబ్బు ఉన్నది, అది నా సెలవులో సెలవులను గడుపుటకై నేను దాచుకున్న డబ్బు. నా భార్య కూడా ఉద్యోగము చేసెడిది, ఫైన్ అనే చొక్కాయిలను తయారు చేసే కర్మాగారములో ఆమె పనిచేసేది. ఆమె ఎంత చక్కటి అందమైనది. ఈ రోజు ఆమె యొక్క సమాధి ఒకవేళ మంచు కప్పబడి ఉండవచ్చేమో, కాని ఆమె ఇంకా నా హృదయములోనే ఉన్నది. నేను నా సెలవులో చేపల వేట కొరకు ఆ సరస్సుకు వెళ్ళాలని, ఆమె ఎంతో కష్టపడి పనిచేసి ఆ సెలవులను నేను గడపటానికి నాకు తగినంత డబ్బును సమకూర్చి ఇచ్చినది, నాకు జ్ఞాపకమున్నది.
82
నేను ఆ సరస్సు నుండి తిరిగి వచ్చుచుండగా మిషవాక మరియు సౌత్‌బెండ్ గుండా ఇండియానాకు వచ్చుచుండగా మార్గములో కార్లు వెనుక “జీసస్ ఓన్లీ” అనే పదము అంటించుకొని వెళ్ళుచున్న వాహనములను నేను చూడటము ప్రారంభించితిని. ఆ విధముగా వ్రాసుకొని అంటించుకుని వెళ్ళుచున్న వాహనములను నేను గమనించటం ప్రారంభించితిని. సైకిళ్ళు, ఫోర్డు కార్లు, కడిల్లా కార్లు, ఇంకా అనేక వాటి మీద ఈ విధముగా 'జీసస్ ఓన్లీ' అనే పదము ఉండటము నేను గమనించితిని. కాబట్టి నేను కూడా వాటిని వెంబడించుచు వెళ్ళగా అచ్చట ఒక పెద్ద సంఘము యొద్దకు అందరు వచ్చి చేరుచుండిరి. వారు పెంతెకోస్తువారు అని నేను కనుగొంటిని.
వారు నేల మీద పడి దొర్లుచూ నోటిలో నురుగులు కార్చుకొనే “పరిశుద్ధ దొర్లుచుండే సమూహము,” అని నేను వారిని గూర్చి వింటిని. వారిని గూర్చి అంతా వారు నాతో చెప్పిరి. కాబట్టి దానితో నాకేమీ పనిలేదనుకున్నాను.
కావున వారు ఈ విధముగానే అచ్చట లోపల చేయుచుండుటను నేను వినుచున్నాను. “విశ్వాసముతో లోపలికి వెళ్ళి చూద్దాము,” అని నేను తలంచుచూ నా పాత ఫోర్డు కారును వెలుపలనే నిలిపివేసి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాను. మీ జీవితములో ఎల్లప్పుడూ మీరు వినే పాటలన్నింటిని వారు పాడుచుండిరి. అచ్చట రెండు పెద్ద సంఘములు ఒక్కటిగా కలిసి ఉండటము నేను కనుగొన్నాను. పి.ఎ. అఫ్ జే.సి.కి చెందిన సంఘము మరియు పి.ఎ. అఫ్ డబ్లుకుకి చెందిన సంఘములుగా అవి పిలువబడుచున్నవి. ఆ పాత సంఘశాఖను గురించి జనులగు మీరు ఎరిగే యుందురు. ఆ రెండు పెద్ద సంఘములు ఇప్పుడు కలిసిపోయి ఒక్క సంఘముగా యునైటెడ్ పెంటికాస్తల్ చర్చ్ అని పిలువబడుచున్నది. వారి బోధకుల యొక్క ఉపదేశములను కొన్నింటిని నేను ఆలకించాను. వారు ఆ వేదికయందు నిలబడి యేసును గూర్చి, ఆయన ఎంతటి గొప్పవాడో మరియు ఆయన యొక్క సమస్త మహోన్నతమైన కార్యములను గూర్చి మరియు “పరిశుద్ధాత్మ బాప్తిస్మమును” గూర్చి వారు ఉపదేశించెదరు. “వారు దేనిని గూర్చి ఉపదేశించుచున్నారని,” తలంచుచుంటిని.
83
అటు పిదప, పైకి ఎగిరి దూకి అన్యభాషలలో మాట్లాడటం ప్రారంభించెను. అటువంటి దానిని నా జీవితములో నేనెన్నడును వినలేదు. ఈ ప్రక్కన ఒక స్త్రీ దేవునిని స్తుతిస్తూ తన శక్తి కొలది పరిగెత్తటం ప్రారంభించినది. “దేవా అసలు వీళ్ళకు సంఘములో ఏ విధముగా ప్రవర్తించాలో తెలియదా?” అని నేను తలంచితిని. అరుస్తూ, కేకలు వేస్తూ మరియు ఏడుస్తూ ఒకే గోలను చూచి, “అసలు వీళ్ళు ఎటువంటి జన సమూహము?” అని నేను తలంచితిని. కాని మీకు తెలుసా, అందులో ఏదో ఒకటి ఉన్నది, చాలాసేపు నేను అచ్చట కూర్చున్నాను, బాగానే ఇది ఉన్నది అని అనిపించినది. చూచుటకు ఇదేదో ఒక నిజమైన అనుభవముగా కనిపించినది. నేను వారిని గమనించటం ప్రారంభించాను, అలా దాని లోపలికి వెళ్ళాను. “కొద్దిసేపు వీళ్ళతో గడుపుదాము, ఒకవేళ ఏదైనా తేడాగా కనిపించినట్లైతే ఆ తలుపు తీసుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోదాము, ఎందుకంటే ఆ తలుపుకు దగ్గరే నేను ఉన్నాను. నా కారును ఎక్కడ ఉంచానో నాకు తెలుసు, ఆ మూలనే దానిని ఉంచాను,” అని నేను అనుకున్నాను.
84
అచ్చటయున్న ప్రసంగీకులు, వేద పండితులు మరియు విద్యార్థుల యొక్క ప్రసంగాలను నేను వినటము ప్రారంభించితిని, “పరవాలేదు,” చక్కగానే ఉన్నది అని నేను అనుకున్నాను.
రాత్రి భోజనమును భుజించు సమయము అది, కాబట్టి, “అందరూ వచ్చి భోజనము చేయవలెను,” అని చెప్పారు.
“కొంచెము ఆగు, నేను ఇంటికి వెళ్ళటానికి డెబ్బది ఐదు సెంట్లు మాత్రమే యున్నవి,” అని నేను తలిచాను. ఆ డబ్బులు కూడా కారుకి పెట్రోలు వేయటానికి సరిపోతాయి. సరిగ్గా ఇంటి వరకు వెళ్ళవచ్చును. నా యొద్ద పాత ఫోర్డు కారు కలదు, అది చాలా మంచి పాత ఫోర్డు కారు. అదేమి అంత పాత పాడైపోయిన కారు కాదు, కొంచెం పాతపడిన కారుగా కనబడును అంతే. ఒక గంటకు ఆ ఫోర్డు కారు ముప్పది మైళ్ళ దూరము వేగముతో వెళ్ళుతుంది. అంటే ఇటు పదిహేను మైళ్ళ దూరము మరియు అటు పదిహేను మైళ్ళ దూరము, కాబట్టి రెండువైపులా కలిపితే ముప్పది మైళ్ళు అవుతుంది. కావు, “కొద్దిగా బయటకు వెళ్ళి... ఈ రాత్రి కూటము కొరకు ఉండటము మంచిది,” అని నేను అనుకున్నాను.
85
ఏ సంఘ శాఖకు చెందినవారైనా సరే, ప్రసంగీకులు అందరూ ఈ వేదిక యొద్దకు రావలెనని అతడు చెప్పెను. అచ్చట రెండు వందలమంది ప్రసంగీకులు వచ్చి చేరారు, నేను కూడా అచ్చటికి వెళ్ళాను. అప్పుడు “మీరందరూ ప్రసంగించుటకు మనకు సమయము లేనందువలన” “వేదిక పైకి వచ్చి మీరెచ్చట నుండి వస్తున్నారు, మీ పేరేమిటని చెప్పండి,” అని అతడు చెప్పాడు.
“విల్లియం బ్రన్హాం, బాప్టిస్టు సంఘము, జెఫర్‌సన్‌విల్, ఇండియానా అని,” నా సమయం ఆసన్నమైనప్పుడు నా గురించి చెప్పి, వేదికనుండి దిగిపోయాను.
అచ్చట వున్నవారందరూ “పెంతెకోస్తువారము, పెంతెకోస్తువారమని డబ్లుకు చెందిన పి.ఎ. వారము, కి చెందిన పి.ఎ వారము, డబ్లు పి.కి చెందిన పెంతెకోస్తువారము” అని మిగతా వారందరూ వారిని పరిచయము చేసుకొనిరి.
నేను అలానడుచుకుంటూ వెళ్తూ, “నేను వీరి మధ్య అసహ్యమైన బాతుపిల్లలా వున్నానని నేను అనుకొన్నాను.” కావున వెళ్ళి కూర్చొని, వేచి యున్నాను.
86
అచ్చట ఆ దినమున మంచి యవ్వన ప్రసంగీకులు యుండిరి. వారు ఎంతో బలముగా ప్రసంగించిరి. “ఈ రోజు రాత్రికి మనమధ్య ప్రసంగించపోవుచున్నది... ” వారు ఆయన “పెద్ద” అని పిలుస్తారని నేను నమ్ముచున్నాను. వారి సేవకులను వారు “గౌరవనీయులు” అని పిలుచుటకు బదులుగా “పెద్ద సంఘ పెద్ద” అని పిలుస్తారు. ఆ వేదికపైకి ఒక నల్లజాతీయుడగు వృద్ధుడిని తీసుకొని వచ్చారు. అతడు పాత కాలపు బాణిలో యున్నాడు. ప్రసంగీకుల కోటును ధరించుకొని యున్నాడు. అటువంటి దానిని మీరు చూచియుండరని నేను అనుకుంటున్నాను. కోటుకు వెనుక భాగమున పావురము తోకవంటి పొడువుగా యుండును, ఆ కోటు మెడచుట్టూ వైలట్ రంగు కాలర్‌ను కలిగియుండును. తెల్లటి గుండ్రముగా తల మీద నెరసిన వెంట్రుకలను అతడు కలిగియుండెను. ఆ వృద్ధ దీన ప్రసంగీకుడు ఈ విధముగా అచ్చటకు వచ్చెను. వేదికపైకి ఎక్కి చుట్టూ తిరిగి చూస్తాడు. అచ్చటకు వచ్చిన ప్రసంగీకులందరూ యేసుక్రీస్తు ఎంతటి గొప్పవాడో, ఆయన ఎంత మహోన్నతుడో వంటి కార్యములను గురించి బోధించి దిగిపోయిరి. అయితే ఆ వృద్ధ ప్రసంగీకుడు యోబు గ్రంథము నుండి తీసుకొని, “ఉదయ నక్షత్రములు ఏకముగా కూడిపాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాయిని వేసినవాడెవడు? లేదా నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి?” ప్రసంగించడం ప్రారంభించాడు.
ఆ దీన వృద్ధ ప్రసంగీకుడు, “ఒక యవ్వన ప్రసంగీకుడిని వేదిక పైకి పంపించి ప్రసంగించమనకుండా ఈ వృద్ధుడిని ఎందుకు అనుమతించారు?” అని నేను తలంచాను. ఆ స్థలమంతా జనసందడితో కిక్కిరిసి పోయినది. “ఎందుకని అలా వాళ్ళు చేయలేదు,” అని నేను తలంచాను.
87
అప్పుడు ఆ వృద్ధ ప్రసంగీకుడు, భూమి మీద ఏమి జరుగుచున్నదనే దానిని గూర్చి ప్రసంగించుటకు బదులుగా పరలోకమందు ఎప్పుడూ ఏమి జరుగుచున్నదనే దానిని గూర్చి ప్రసంగించుట ప్రారంభించెను. అతడు దేవుడిని సృష్టి ఆరంభమునకు తీసుకొనివెళ్ళి రెండవ రాకడ ద్వారా ఆయనను మరలా క్రిందికి వర్ష ధనుస్సు గుండా క్రిందికి దించెను. అటువంటి ప్రయోగమును నా జీవితములో నేనెన్నడునూ ఆలకించలేదు! ఆ సమయమునందు దేవుని ఆత్మ అతడిని లాగినది. అతడు అంత ఎత్తుకు గాలిలో ఎగిరి తన రెండు పాదములను, చేతులతో చప్పట్లు కొట్టునట్లుగా గట్టిగా కొట్టి, తన భుజములను వెనుకకు నెట్టి ఆ వేదిక యొక్క అంచు వరకు వెళ్ళి, “నేను ప్రసంగించుటకు చాలినంత వేదికను మీరు నాకు సిద్ధపరచలేదు,” అంటూ రయ్యిన దిగి వెళ్ళిపోయెను. ఇచ్చటయున్నఈ వేదిక యందు నాకున్న స్థలము కంటే అతడికి అచ్చట ఇంకా ఎక్కువగా యుండెను.
“ఒక వృద్ధుడైనటువంటి అలాంటి వ్యక్తిపైనే ఆత్మ అంతటి ప్రభావము కలిగి క్రియ చేసినయెడల, అదే ఆత్మ నాపైకి వచ్చినయెడల, అది మరెంత ప్రభావముతో నాయందు క్రియ చేయును,” అని నేను తలంచితిని. “నేను కూడా అటువంటి దానిని కొంచెం కలిగి యుండవలెనని నేను ఆశించాను.” ఆ వృద్ధ ప్రసంగీకుడు అలా అచ్చటకు వచ్చెను, మొదట అతడిని నేను చూచినప్పుడు బాధపడ్డాను, కాని అతడు ప్రసంగించి వెళ్ళిపోయినప్పుడు నా గురించి నేను బాధపడ్డాను. అతడు అచ్చట నుండి వెళ్ళుచుండగా నేను అతడివైపే చూస్తూ ఉండిపోయాను.
88
ఆ రాత్రి నేను బయటకు వెళ్ళాను, “మరుసటి ఉదయమున నా గురించి నేను ఎవ్వరికి చెప్పకుండా, తెలియనివ్వకుండా జాగ్రత్తపడాలి,” అని నేను తలచాను, కావున నేను అచ్చటికి వెళ్ళాను. ఆ రోజు రాత్రి నా చొక్కాయిని ఇస్త్రీ చేసిన దానిలా యుండునట్లు బాగా అదిమిపెట్టాను. అచ్చటయున్న మొక్కజొన్న తోటకు వెళ్ళి అచ్చట నిద్రపోయాను. వెళ్ళి కొన్ని తినుబండారాలు తినుటకు తెచ్చుకొన్నాను. ఒక నికెలు డబ్బులు వెచ్చించి వాటన్నింటిని కొన్నాను. అచ్చట ఒక నీటి కొళాయియుండెను, అచ్చట నుండి నీళ్ళను తెచ్చుకొన్నాను, నాకు తెలుసు అవి కొంతసేపటికే సరిపోతాయి. కాబట్టి మరలావెళ్ళి ఇంకా కొద్దిగా నీళ్ళను తెచ్చుకొని త్రాగాను, ఆ తినుబండారములను భుజించాను, మళ్ళీ కొద్దిగా నీళ్ళు త్రాగాను. మొక్కజొన్నతోటకి వెళ్ళి కారులోని రెండు సీట్లను తీసుకొని నా యొక్క గీతలు వేసిన దూదిదారముతో చేసిన ఫాంటును రెండు సీట్ల మధ్యన పెట్టి వాటిని ఇస్త్రీ వేసినట్లుగా అదిమి పెట్టాను.
ఆ రాత్రియందు, ఆ చక్కటి రాత్రంతా నేను ప్రార్థన చేసాను. “ప్రభువా, లోపలికి ప్రవేశించిన ఈ కార్యములు గూర్చి ఏమిటి?” “ఇటువంటి భక్తిపరులను నా జీవితములో నేనెన్నడును చూడలేదు,” అని ప్రార్థించాను. “అసలు ఇదేమిటని వీటిని గూర్చి నేనెరుగుటకు నాకు సహాయము చేయుము,” అని అడిగాను.
89
మరుసటి ఉదయమున నేను అచ్చటకు వెళ్ళాను. ఉదయకాలపు అల్పాహారమునకు వారు మమ్మల్ని ఆహ్వానించారు. వారితో వెళ్ళి కలసి భుజించాలని నేను ఇష్టపడలేదు, ఎందుకంటే ఏ కానుకను వేయుటకు నా దగ్గర డబ్బులు లేనందువలన వెళ్ళి భుజించాలనిపించలేదు. మరుసటి ఉదయమున నేను లోపలికి ప్రవేశించినప్పుడు (నేను నా దగ్గరవున్న వాటినే భుజించాను) వెళ్ళి కూర్చున్నాను. అచ్చట మైకులను అమర్చారు. అంతకు ముందు మైక్రోఫోన్‌ను నేనెన్నడునూ చూడలేదు, అందువలన వాటిని గూర్చి భయమేసింది. అది ఏదో తీగతో వ్రేలాడుచున్నది, అది క్రిందకు వ్రేలాడుచున్నట్లు యున్నది. వ్రేలాడుచున్న మైకుల్లా అవి యున్నవి. “గత రాత్రియందు వేదికపైకి వచ్చి పరిచయము చేసుకున్న బాప్టిస్టు యవ్వన ప్రసంగీకుడు ఇచ్చట ఉన్నాడు,” అని మైకు ద్వారా పిలువబడినది.
“ఇప్పుడు నేనేమైనా చేయుట మంచిది,” అని నేను అనుకున్నాను.
“ఈ వేదిక మీద నిలబడు వారందరికల్లా, అతడే చాలా యవ్వన ప్రసంగీకుడు. అతడి పేరు బ్రెన్హాం. అతడు ఎచ్చట ఉన్నాడో మీకెవరికైనా అతని గూర్చి తెలుసా? అతడిని రమ్మని చెప్పండి, ఈ ఉదయకాలమందు అతడే ప్రసంగించాలని మేము ఆశిస్తున్నాము,” అని అతడు చెప్పాడు.
90
ఓ! నేను చిన్న బనియనులాంటి చొక్కాయిని మరియు గీతల ఫేంటును వేసుకొనియున్నాను, మీకు తెలుసు, బాప్టిస్టులమగు మనము ప్రసంగించునప్పుడు వేదికనొద్దకు వెళ్ళాలంటే కోటువేసుకొనే వెళ్ళాలని మనము అనుకుంటాము. కాబట్టి ఏమి చేయలో అర్థమవ్వక అలాగే కూర్చుండిపోయాను. సరిగ్గా అదే సమయమున... వారు ఆ కూటమును ఉత్తరము వైపున సిద్ధపరచారు, ఎందుకంటే అది మరియొక్క అంతర్జాతీయ సమావేశ కూటమైయున్నది, ఎందుకంటే అది దక్షిణ భాగము వైపున జరిగిన యెడల నల్లజాతీయులు పాల్గొనకూడదు. కాని నల్లజాతీయులంతా అచ్చట ఉండిరి, నేనేమో దక్షిణప్రాంతానికి చెందినవాడిని కాబట్టి మిగిలిన వారి కంటే నేనే కొంచెము ఫర్వాలేదని నాకు అనిపించింది. ఆ ఉదయకాలమందు ఒక నల్ల జాతీయుని ప్రక్కన కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడినది, కాబట్టి నేను అతడి ప్రక్కన కూర్చొని అతడివైపు చూశాను. అతను “ఒక సహోదరుడు” అని నేను తలంచాను.
“విల్లియం బ్రెన్హాం ఎచ్చట ఉన్నాడో ఎవరికైనా తెలుసా?” అని అతడడిగాడు. నేను నా కుర్చీలో నుండి ఈ విధముగా వంగినట్లుగా దాగుకున్నాను. రెండవసారి ప్రకటించుచున్నారు, ఆ బైట ఎచ్చటైనా ఉన్నట్లుగా ఎవరికైనా తెలుసా? (చిన్న మైకును ఈ విధముగా లాగి) అతడడిగాడు. “విల్లియం బ్రెన్హాం ఎచ్చటైనా కనపడినట్లైతే అతడితో చెప్పండి, ఉదయకాలమందు ఈవేదికపై అతడే వచ్చి వర్తమానమును ప్రసంగించాలని, అతడు దక్షిణాన వున్న ఇండియానా నుండి వచ్చిన ఒక బాప్టిస్టు ప్రసంగీకుడు,” అని అతడు చెప్పాడు.
91
ఎలాగో ఎవరికీ నా గురించి తెలియదు అని కుర్చీలోనే ఒక బాతులా మెడను వంచుకొని అలాగే మరుగుగా కూర్చొనియున్నాను.
ఆ నల్లజాతి అబ్బాయి నా వైపు చూస్తూ, “అతడు ఎచ్చట ఉన్నాడో నీకు తెలుసా?” అని అడిగాడు.
ఇప్పుడతడితో నేను అబద్ధమునైనా చెప్పాలి, లేదా ఏదో ఒకటైనా చెయ్యాలి. కావున నీవు “ఇక్కడే నెమ్మదిగా కూర్చొ,” అని నేను అతడితో చెప్పాను.
“అలాగే, అయ్యా” అతడన్నాడు.
“నేను మీతో ఒక విషయం చెప్పవలెను, నేను నే... నేనే అతడిని,” అని చెప్పెను.
అయితే “ఆ వేదికపైకి అచ్చటకు వెళ్ళు,” అని అతడన్నాడు.
“వద్దు, వద్దు, ఊరకుండము,” ఇప్పుడేమి చెప్పవద్దు అని అతడితో నేను అన్నాను.
మళ్ళీ ఒక నిమిషము తరువాత వాళ్ళు మైకు దగ్గరకు వచ్చి విల్లియం బ్రెన్హాం ఎచ్చట యున్నాడో, ఎవరికైనా తెలుసా? అని అడుగుచున్నాడు.
“అతడు ఇక్కడే వున్నాడు, ఇదిగో ఇక్కడ వున్నాడు!” అని ఆ నల్లజాతి అబ్బాయి గట్టిగా అరుస్తూ చెప్పాడు. ఓ, దేవా! ఇక అప్పుడు అలా బనియన్ వంటి చొక్కాయిని ధరించియున్న నేను పైకి లేచి నిలబడ్డాను. ఇక్కడ నేను ...
92
“బ్రెన్హాం గారు వేదికపైకి రండి, మీరు వర్తమానమును ప్రసంగించాలని మేము ఆశిస్తున్నాము,” అని అతడు అన్నాడు. ఓ, ప్రసంగీకుల అందరి ముందు, అంతమంది జనులముందు నిలబడాలా? మెల్లగా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాను, నా ముఖము ఎర్రబారిపోయినది, నా చెవుల కాలిపోవుచున్నవి, ఒక మామూలు ఫ్యాంటు మరియు బనియను లాంటి చొక్కాయిని ధరించుకొనియున్నాను అలా నడుచుకుంటూ వెళ్తున్నాను, ఎన్నడు చూడనటువంటి ఒక మైక్రోఫోన్ ఎదుట నిలబడి బాప్టిస్టు ప్రసంగీకుడు ప్రసంగించవలెను. మీరు గమనించారా?
నేను వేదికపైకి ఎక్కి నిలబడ్డాను. “మంచిది దానిని గురించి నాకేమి తెలియదు”, నేను తడబడుచున్నాను, చాలా భయమనిపించింది. లూకా వ్రాసిన పత్రిక 16వ అధ్యాయము తీసుకున్నాను, ఆ భాగము నుండి నేను ఒక అంశము తీసుకున్నాను. “అప్పుడతడు పాతాళములో నుండి తన కన్నులను పైకి ఎత్తి మరియు అరిచాడు.” కావున నేను ప్రసంగించుట ప్రారంభించాను, ఇప్పుడు ప్రసంగించుటకు నాకు కొంచెం బాగానే అనిపించుచున్నది. “ధనవంతుడు పాతాళంలోయున్నాడు, అతడు ఏడుస్తున్నాడు” అని చెప్పాను. ఆ చిన్న మూడు పదములవంటి అనేక ప్రసంగములు నాయొద్ద గలవు. “మీరు దీనిని విశ్వసించుచున్నారా?” “బండతో మాట్లాడుము,” మీరు నేను వాటిపై ప్రసంగించిన ప్రసంగములు వినియున్నారు, “అప్పుడతడు ఏడ్చెను,” అను అంశము కూడా నా యొద్ద గలదు. “అచ్చట ఏ పిల్లలు లేరు, ఖచ్చితముగా పాతాళములో వాళ్ళు వుండరు, అప్పుడు అతడు ఏడ్చెను,” అని నేను చెప్పాను. “అచ్చట ఏ పుష్పములు లేవు, అప్పుడతడు ఏడ్చెను. అచ్చట దేవుడు లేడు, అప్పుడతడు ఏడ్చెను. అచ్చట క్రీస్తు లేడు, అప్పుడతడు ఏడ్చెను,” పిదప నేను ఏడ్చాను. ఏదో ఒకటి నన్ను ఆవరించినది. ఓ, దేవా, తర్వాత, ఏమి జరిగినదో నాకు తెలియదు, కాని మళ్ళీ నేను నా స్వాధీనములోకి వచ్చి చూచినప్పుడు నేను వెలుపల నిలబడియున్నాను. అచ్చటయున్న జనులు కేకలు వేస్తూ, అరుస్తూ మరియు ఏడుస్తూ యుండిరి. నాకు మరియు అచ్చటయున్న వారికి అది ఒక భయము మరియు భక్తితో నిండిన సమయముగా ఉండెను.
93
నేను అచ్చట వెలుపలికి వచ్చినప్పుడు ఒక పెద్ద టెక్సాస్ టోపి పెట్టుకొని, మంచి బూట్లను వేసుకొని నా యొద్దకు నడుచుకుంటూ ఒకాయన వచ్చెను. నేను సంఘ పెద్దను ఫలనా-ఫలానా,“ అని చెప్పెను. అతడు ప్రసంగీకుడు, కౌబాయ్ బూట్లను మరియు కౌబాయ్ వస్త్రములను ధరించుకొనియుండెను.
“నా యొక్క సాధారణమైన ఈ వస్త్రములు మరీ అంతేమి అసహ్యముగా లేవులే,” అని తలంచాను.
నా దగ్గర నిలబడియున్న అతడు, “నీవు టెక్సాస్ పట్టణమునకు వచ్చి అచ్చట ఒక ఉజ్జీవ కూటమును జరిపించవలయును,” అని అడిగాడు.
“ఓహ్, మొదట కొంచెం దానిని అలా వుంచండి అయ్యా, కొద్దిసేపు దానిని అలాగే ఉంచుదాము,” అని నేను అతడితో అన్నాను.
కొద్దిసేపటికి ఇంకొక వ్యక్తి గోల్ఫ్ క్రీడను ఆడేటప్పుడు వేసుకొన్న వస్త్రములతో నా యొద్ద నిల్చెను, అచ్చట వారు గోల్ఫ్ ఆటను ఆడతారని మీకు తెలుసు, కాబట్టి అతడు అలాంటి వస్త్రములు ధరించుకుని నా యొద్దకు వచ్చి, “నేను సంఘ పెద్దను, నా పేరు ఫలానా-ఫలానా, నేను మియామి నుండి వచ్చాను. నేను నిన్ను ఇష్టపడుచున్నాను,” అని అనెను.
అతడి వస్త్రధారణను చూచిన తరువాత, “ధరించిన వస్త్రములకు ఏమి ప్రాముఖ్యత లేదు కాని ... సరే,” మంచిది అని నేను అనుకున్నాను.
94
కావున వారియొక్క ఆహ్వానములన్నింటిని తీసుకొని నా గృహమునకు వెళ్ళితిని. నా భార్యను చూచాను. “నీవు పాడే పాటను బట్టి నీవు చాలా సంతోషముగా వున్నట్లు కనబడుచున్నది, దానికి కారణమేమిటి, బిల్లీ!” అని ఆమె అడిగినది.
“ఓ, పంట యొక్క శ్రేష్ఠమైన భాగమును నేను పొందుకున్నాను నేను చూచిన వారిలో అందరికంటే శ్రేష్ఠమైన వారిని నేను చూచాను. వారు చేయుచున్న భక్తి విషయములో వారేమి సిగ్గుపడని జన సమూహము.” ఓ, జరిగిన దానినంతా ఆమె దగ్గర చెప్పాను. “ప్రియమైనదానా, నా వైపు చూడు, వెంట, వెంటనే పొడుగునా చాలా ఆహ్వానాలు ఉన్నాయి, ఆ జనులు నన్ను ఆహ్వానించుచున్నారు,” అని నేను ఆమెతో చెప్పాను.
“వారు ఎటువంటి దొర్లువారు అనేది నాకు తెలియదు, కానీ వారు ఏదో ఒక దానిని కలిగియున్నారు, అది నాకు కావలసియున్నది,” అని నేను చెప్పాను. గమనించారా? ఖచ్చితముగా అది మనకు కావలసియున్నది. “ఒక తొంభై సంవత్సరములు గల వృద్ధుడు ఒక యవ్వనుడు వలె ప్రసంగించాడు. అటువంటి ఒక ప్రసంగమును నేను ఎన్నడూ నా జీవితములో వినియుండలేదు.” అంతెందుకు, “ఒక బాప్టిస్టు ప్రసంగీకుడు ఆ విధముగా ప్రసంగించడము నేను ఎన్నడూ చూడలేదు.” “వారు ప్రసంగించేటప్పుడు గుక్క తిప్పకుండా మాట్లాడుతూ, శ్వాసను బిగపట్టుకుని, వారి మోకాళ్ళను నేలవరకు వంచుతూ, వాళ్ళు పైకి అలాగే లేస్తూ బిగపట్టుకొనియున్న శ్వాసను వదలి గాలిపీల్చుకొని ప్రసంగించుచుండెను ఆ ప్రసంగమును మీరేరెండు భవనాలు దాటి ఇంకా దూరముగా వెళ్ళినా కూడా ఆ ప్రసంగమును వినగలిగేలా అంత గట్టిగా ఊపిరిని బిగపట్టుకుంటూ బిగ్గరగా ప్రసంగించెదరు, ఆ విధముగా నేనెన్నడూ నా జీవితములో వినలేదు.” “వారు అన్యభాషలలో మాట్లాడుచుండగా ఇంకొకరు దానికి అర్థము చెప్పెదరు. అటువంటి కార్యమును నా జీవితములో నేను ఎన్నడునూ విని యుండలేదు,” కావున “నీవు నాతో కూడా అచ్చటకు వచ్చెదవా” అని నేను ఆమెను అడిగాను.
“నా ప్రియుడా, నేను నిన్ను వివాహము చేసుకొన్నప్పుడు, మరణము మనల్ని విడదీయు వరకు నేను నీతోనే వుందును.” “నేను నీతో వస్తాను, వారితో చెప్పు, నేను వస్తానని, అని ఆమె చెప్పినది.
సరే, అయితే నేను మా అమ్మతో చెప్పుతాను, నీవు మీ అమ్మతో చెప్పు,“ అని నేను అన్నాను. నేను వెళ్ళి మా అమ్మతో చెప్పాను,
“మంచిది, ఖచ్చితముగా బిల్లీ, దేవుడు నిన్ను దేని కొరకైతే పిలిచెనో దానిని నీవు చేయవలయును, వెళ్ళి దానిని అలాగే చెయ్యి,” అని మా అమ్మ చెప్పినది.
95
కావున, శ్రీమతి బ్రూంబాక్ గారు, నన్ను పైకి రమ్మని చెప్పినది. “నేను పైకివెళ్ళగా నీవు మాట్లాడేది దేనిని గూర్చి” అని ఆమె అడిగినది
“ఓ, శ్రీమతి బ్రూంబాక్ గారు, మీరు అటువంటి జనులను అసలు చూడలేదు” అని నేను చెప్పాను.
“నీ మాటలను ఆపు, నీ మాటలను ఆపు,” అని అన్నది ఆమె,
“అలాగే అమ్మా, నన్ను మన్నించండి,” అని నేనన్నాను.
“నీకు తెలుసా, వాళ్ళు, పరిశుద్ధ దొర్లు గుండ్రాళ్ళ సమూహమని,” ఆమె అడిగినది.
“లేదమ్మా. దాని గురించి నాకు తెలియదు, వాళ్ళు నిజముగా మంచి చక్కని ప్రజలు,” అని నేను చెప్పాను.
నీవు వాళ్ళను గురించి అలాగు అనుకుంటున్నావా? “అటువంటి వాళ్ళ మధ్యలోకి నా కుమార్తెను మా నుండి విడదీసి తీసుకొని వెళ్ళాలని నీవు ఆలోచించుచున్నావా?” “మిగతా సంఘాలన్నీ అది పిచ్చోళ్ళతో నిండిన ఒట్టి చెత్త తప్ప మరేమీ కాదని బయటకు తోసేసిన అటువంటి సమూహము మధ్యకు నా కుమార్తెను అసలు నీవు తీసుకొని వెళ్ళకూడదు,” అని ఆమె అన్నది.
కాని “శ్రీమతి బ్రూంబాక్ నీకు తెలుసా, ప్రభువు ఆ జనుల యొద్దకు నేను వెళ్ళుటకు ఇష్టపడుచున్నాడని, నా హృదయములో నేను ప్రేరేపించబడుచున్నాను,” అని అన్నాను.
“నీవు నీ సంఘమునకు వెళ్ళు, వాళ్ళు నీకు ఒక కాపరికి కావలసిన గృహమును ఏర్పరచి ఇచ్చేంత స్థితికి నీవు వచ్చేవరకు ఒక బుద్ధిగల మనిషిలా ప్రవర్తించు, అక్కడకు మాత్ర౦ నీవు నా కుమార్తెను తీసుకొని వెళ్ళకూడదు,” అని ఆమె చెప్పినది.
“అలాగే అమ్మా,” అని నేను చెప్పి, వెనుకకు తిరిగి బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోతుండగా.
96
హోప్ ఏడుస్తుంది, ఆమె వెలుపలికి వచ్చి “బిల్లీ, అమ్మ ఏమి చెప్పిందో ఆ మాటలను పట్టించుకోకు నేను నీతోనే ఉంటాను,” అని ఆమె అన్నది దేవుడు ఆమె హృదయమును ఆశీర్వదించును గాక!
“ఓ, అదేమీ పర్వాలేదులే, ప్రియమైనదానా,” అని నేను అన్నాను.
ఇక ఆ విషయమును నేను అలాగే వదలివేశాను. అటువంటి జనులసమూహము మధ్యకు తన కుమార్తెను పంపించుటకు ఆమె అనుమతించలేదు. “ఎందుకంటే, వాళ్ళంతా ఒట్టి చెత్త తప్ప మరేమీ కాదు,” అని వాళ్ళను గురించి అనెను. కాబట్టి దానిని నేను అలాగే వదలివేశాను. నేను నా జీవితములో చేసిన చాలా తప్పిదమైన కార్యము అదియే. అదే బహు తప్పిదమైన కార్యము.
97
కొన్నాళ్ళ తరువాత, కొన్ని సంవత్సరముల పిదప, పిల్లలు ఎదుగుచున్నారు. ఒకరోజు... 1937 సంవత్సరమున వరద ముంచుకొచ్చింది. అంతా వరద నీరుతో నిండిపోయినది. ఆ సమయమందు ఇళ్ళు కూలిపోయి అందులో చిక్కుకొనిపోయినవారిని, వరద నీటిలో చిక్కుకొని పోయినవారిని రక్షించుటకై గస్తీ తిరుగుచూ రక్షించేవానిగా నేను నియమింపబడియుంటిని. నా స్వంత భార్య వ్యాధిగ్రస్తురాలై యున్నది. ఆమె నిమోనియా అనే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బహుగా క్షీణించిపోయినది. ఎప్పుడూ చూపించే వైద్యశాల రోగులతో కిక్కిరిసిపోయి నిండిపోయినందువలన అందులో ఆమెను వుంచలేకపోవుటచే ఆమెను వెలుపలికి తీసుకొని వచ్చి అచ్చట వున్న ఒక ప్రభుత్వ వైద్యశాలయందు ఆమెను చేర్పించాము. మళ్ళీ వాళ్ళు నాపని నిమిత్తము నన్ను పిలుచుట వలన ఇక నేనెప్పుడూ ఆ నదిపైనే పడవ నడిపేవాడిగా వుండేవాడిని, కావున వరదలలో చిక్కుకొని పోయినవారిని, ప్రమాదములో వున్నవారిని రక్షించుటకు నేను ప్రయత్నించేవాడిని.
98
చెస్ట్‌నట్ అనే వీధియందు “ఒక గృహములో చిక్కుకుపోయిన తల్లీ బిడ్డలను కాపాడుటకు అచ్చటకు వెళ్ళాలి,” అని వారునన్ను పిలిచి చెప్పిరి. “నీ మోటారు పడవతో నీవు అచ్చటకి వెళ్ళి వాళ్ళను నీవు రక్షించగలవా,” అని అడిగిరి.
“నాకు సాధ్యమయినంతవరకు దానిని చేసెదను,” అని నేను చెప్పితిని.
ఆ అలలకు ఎదురుగా నా పడవను నేను నడుపుకుంటూ, వరద నీటికి అడ్డంగా వేసిన కట్ట తెగిపోయినది. ఓ, దేవా... అందువలన ఆ వరద ప్రవాహమునకు ఆ పట్టణము కొట్టుకొనిపోయినది. నాలోయున్న శక్తినంతా ఉపయోగిస్తూ నా శాయశక్తులా ప్రయత్నించుచూ వీధులగుండా, చిన్నచిన్న సందుల గుండా ఆ ప్రాంతానికి వెళ్ళుటకు ప్రయత్నించుచున్నాను. వాళ్ళు నివసించుచున్న ఆ గృహమునకు దగ్గరకు చేరుకుంటున్నాను, అచ్చట ఒక పాత స్థలమందు నీళ్ళు కుమ్మరించుచున్నవి. ఎవరో అరుస్తున్న కేకలు నాకు వినిపించినది. ఒక తల్లిగా అచ్చట వసారాలో నిలబడి యుండుటను నేను చూశాను, పెద్ద గుండ్రనివంటి వస్తువులు ఆ విధముగా దొర్లుకుంటూ పోతున్నాయి. ఆ ప్రవాహాన్ని తాకుకుంటూ ఆ ప్రక్కనుండి ఈ ప్రక్కకు మళ్ళీ వచ్చి ఈ ప్రక్క నుండి అటు ప్రక్కకు వెళ్తూ నాకు సాధ్యమయినంత వరకు ప్రయత్నించుచు ఆమె యొద్దకు వెళ్ళుచున్నాను. ఆ యింటి తలుపు దగ్గర లేదా వసారా దగ్గర వున్న స్తంభమునకు సరియైన సమయమునకు నా పడవను ఆపి దానికి కట్టాను. నేను పరుగెత్తుకొని వెళ్ళి అచ్చటయున్న ఆ తల్లిని ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను పట్టుకొని బయటకు తీసుకొచ్చాను. నేను నా పడవను కట్టు విప్పి వారిని పడవలో ఎక్కించుకొని వెనుకకు తిరిగాను. క్రింద ప్రక్కగా వున్న దారిగుండా వెలుపలికి వచ్చి వారిని ఒడ్డునకు చేర్చుటకు ప్రయత్నించితిని. నేను ఆమెను ఒడ్డుకు చేర్చునంతవరకు... అది పట్టణమునకు ఇంచుమించు మైలున్నర దూరమంత దూరము గలదు. నేనచ్చటికి వెళ్ళి చేరినప్పుడు ఆ తల్లి స్పృహ కోల్పోయినది, ఆమె నా బిడ్డ, “నా బిడ్డ అని కేకలువేస్తూ అరుస్తూ ఏడ్చుచున్నది.”
99
ఆమె తన ఇంటిలో తన బిడ్డను వదిలేసి వచ్చినదేమో అని నేను తలంచితిని. ఓ, దేవా, ఆమె యొక్క పిల్లలు ఆమెను జాగ్రత్తగా చూచుకొనుచుండగా మళ్ళీ నేను నా పడవను త్రిప్పి వెనుకకు వెళ్లుచూ ఆ ఇంటికి వెళ్ళాను. నేను వచ్చి కనుగొనినదేమనగా... ఆమె యొక్క బిడ్డ ఎచ్చట వున్నదో తెలుసుకొనవలెనని ఆమె ఆశించుచున్నది. ఆ బిడ్డ తల్లి పాలు త్రాగునంత చిన్నబిడ్డగా ఉండునని ఆమె చెప్పినట్లుగా నేను తలంచుచుండగా, అచ్చటేమో మూడు సంవత్సరముల వయస్సు గల ఒక బిడ్డ యుండెను.
నేను ఆ స్థలమునకు తిరిగి వెళ్ళి చేరాను, అచ్చట ఏ బిడ్డను నేను కనుగొనలేక పోతిని, ముందు వసారా కూలిపోయి మునిగిపోయినది. నేను వేగముగా పరుగెత్తుకొని వెళ్ళి పడవయందున్న చిన్న చెక్క ముక్కను లాగిపట్టుకొని పడవ యొద్దకు వెళ్ళి దాని కట్టు విప్పాను.
100
ప్రవహించుచున్న ఆ ప్రవాహపు వరద నీటి లోతుకు అది నన్ను తీసుకువెళ్ళినది. అప్పుడు సమయము రాత్రి 11:30 నిమిషములు కావచ్చుచున్నది, మంచు కురియుచున్నది, వడగండ్ల వంటి ఐస్ముక్కలు పడుచున్నవి. ఆ పడవయంత్రము యొక్క తాడును లేదా తీగను లాగుచూ పడవను నడిపించాలని ప్రయత్నించగా, ఆ పడవ యొక్క యంత్రము పనిచేయలేదు. ఆ యంత్రము యొక్క తీగతో ఎంతగా లాగుచూ ప్రయత్నించిననూ, ఆ యంత్రము పనిచేయలేదు. మళ్ళీ ప్రయత్నించాను, దానిలో నుండి విదుచ్ఛక్తి మండుటలేదు. ఆ నీటి ప్రవాహము యొక్క వేగము నన్ను క్రిందికి తోసి వేసినది. మళ్ళీ ఎంతో కష్టముతో బలముగా ఆ తీగను పట్టుకొని లాగుచున్నాను. ఓ, నా పని అయిపోయినది, ఇవి నాకు అంతిమ ఘడియలు అని నేను అనుకొన్నాను. అవును, అది అలాగే ఉండినది. నేను బలముగా ఎంతో కష్టపడుతూ, లాగుచూ ఓ ప్రభువా ఈ విధమైన ఒక మరణముతో నేను మరణించకుండగా దయచేసి నాకు సహాయము చేయుము అని అంటూ ఆ పడవ యంత్రము యొక్క తీగను లాగాను మరియు లాగాను.
దేనిని గూర్చి మర్చిపోయానో, అది మరలా నా తలంపులలోకి వచ్చుచున్నది. నీవు వెళ్ళకూడదని నిర్ణయించుకొన్న ఆ చెత్త సమూహమును గూర్చిన విషయమేమైనది? అనే మాటలు నా హదయమును తట్టుచున్నవి. గమనించారా, హుష్...
101
మరలానా చేతిని ఆ పడవ మీద పెట్టి, “దేవా, నాయందు కనికరమును కలిగియుండుము ఇటువంటి స్థితిలో నా భార్యను, నా కుమార్తెను వదలి దూరమగుటకు అనుమతించకుము, వాళ్ళు అచ్చట వ్యాధితో పడియున్నారు. దయచూపుము!” అని అడిగాను. నేను మళ్ళీ ఆ పడవ పనిచేసేలా దానిని లాగుటకు ప్రయత్నించగా, అది పనిచేయలేదు. అచ్చట క్రింద నీటి యొక్క ప్రవాహ ఉధృతి ఎక్కువగుచున్నది. దాని శబ్ధమును వినగలుగుచున్నాము. కేవలము కొద్ది నిమిషములు మాత్రమే ఉన్నవి. ఓ, అవును, ఆ సమయమందు అలాగే అది ఉన్నది. అప్పుడు “ప్రభువా, నీవు నన్ను క్షమించినయెడల దేనినైననూ నేను చేసెదనని నేను మీకు వాగ్ధానము చేయుచున్నాను,” అని నేను చెప్పాను. ఆ పడవలోనే మోకాల్లూని ప్రార్థించాను. ఆ సమయమందు మంచి తుఫాను నా ముఖముపైన పడుచున్నది. నేను ఏమి చేయవలెనని నీవు ఇష్టపడుచున్నావో, అది ఏమైనాగాని దానిని నేను చేసెదను అని ప్రభువుతో చెప్పాను. మరలా ఆ యంత్రము యొక్క తీగను లాగాను, అది పనిచేసింది, దానిలో వున్న పెట్రోలునంతటిని త్రిప్పి వదిలాను. చివరకు పడవ కదలి ఒడ్డుకు వెళ్ళి చేరినది.
గస్తీ తిరిగే బండిని కనుగొనుటకు నేను వెళ్ళి చూశాను. అప్పుడు నేను తలంచి చూశాను... అచ్చట వారిలో కొంతమంది, “ప్రభుత్వ వైద్యశాల ఉన్నపళంగా వరద ప్రవాహమునకు కొట్టుకొనిపోయినది,” అని చెప్పిరి. నా భార్య, నా కుమార్తె, ఇద్దరు పిల్లలు అచ్చట లోపల ఉన్నారు.
102
నాకు సాధ్యమైనంత వరకు ఎంతో కష్టపడి ప్రభుత్వ వైద్యశాలవైపు వెళ్ళుటకు ప్రయత్నించాను. ఆ దారి పొడవునా ఆ ప్రాంతమంతా దాదాపు పదిహేను అడుగుల లోతుకు నీరు నిండిపోయి వున్నది. అచ్చట ఒక మేజరు ఉన్నాడు. “మేజరుగారు ప్రభుత్వవైద్యశాల ఏమైనది?” అని నేనడిగాను.
“బాధపడవద్దు, దానిలో నీకు సంబంధించిన వారెవరైనా ఉన్నారా?” అని అతడన్నాడు.
“అవును, వ్యాధిగ్రస్తురాలైన నా భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు,” అని అన్నాను.
“వారందరిని వెలుపలికి తీసుకొని వచ్చేశాము, వారందరూ ఒక అద్దెకు తీసుకున్న వాహనమునందు ఎక్కి చార్లెస్ టౌను అనే ఊరి వైపుకు వెళ్ళుచున్నారు” అని అతడన్నాడు.
నేను పరిగెత్తుకొని వెళ్ళి నా కారులోనికి ఎక్కాను, నా పడవ దానికి వెనుక ఉంచాను. అచ్చటకు పరుగెత్తుకొని వెళ్ళాను. అచ్చటయున్న కాలువలు రెండున్నర లేదా మూడు మైళ్ళంత వెడల్పుగా యుండినవి, రాత్రంతా అలా వెళ్ళుచు ఎలాగైనా వెళ్ళి చేరాలని ప్రయత్నించాను, “వారిలో కొందరు, వాహనాలు, అద్దెకు తీసుకొని అందులో వెళ్ళుచున్న ఆ వాహనము లేదా అనేక బండ్లు వరదకు కొట్టుకొని పోయినవి,” అని అంటున్నారు.
నేను వరద నీటికి ప్రవాహములో చిక్కుకొని ఒక చిన్న ద్వీపములా వుండు దానియందు నిర్జీవముగా మూడు దినములు ఎటూ కదలలేక అలాగే కూర్చుండిపోయాను. నా అత్తగారు చెప్పిన మాటనుబట్టి, వారు ఒట్టి చెత్త సమూహము! వ్యర్థులు, అనే దానిని గూర్చి ఆలోచించటానికి నాకు చాలా సమయము ఉండినది, “నా భార్య ఎచ్చట యున్నది?” అనే ప్రశ్న నాలో మెదులుచూనే ఉండినది.
103
చివరకు నేను ఆమెను కనుగొన్నాను, కొన్ని దినముల తర్వాత ఆ స్థలము యొద్దకు వెళ్ళి, ఆమె యొద్దకు వెళ్ళాను. ఆమె ఇండియానాలో వున్న కొలంబస్ వరకు వెళ్ళి అక్కడ బాప్టిస్టు ఆడిటోరియంను ఒక వైద్యశాలగా మార్చి రోగుల కొరకు ప్రభుత్వము వారి మంచాలను అచ్చట అమర్చిరి. ఆమె అచ్చట వున్నదని తెలిశాక హృదయమును కొట్టుకుంటుండగా పరిగెత్తి, పరిగెత్తి అక్కడ వెతుకుచూ, ఇక్కడ చూస్తూ, ఇక్కడ చూస్తూ వుండగా ఓ, అచ్చట ఒక మంచము మీద క్షయవ్యాధి సోకి పండుకొని యున్నది.
తన సన్నని చేతిని పైకెత్తుతూ, “బిల్లీ.”
అని దీన స్వరముతో “ప్రియమైనదానా” అని అంటూ పిలువసాగాను.
“నేను చూచుటకు భయంకరముగా వున్నాను,” అవును, కదా? అని అడిగింది.
“లేదు, నీవు నా ప్రియమైనదానవు, నీవు ఎప్పటిలాగా అందము గానే వున్నావు,” అని నేను చెప్పాను.
104
ఆమెను కాపాడవలెనని వారియొద్ద వున్న సమస్తమైన వాటితో మేము సుమారుగా ఆరు నెలలు జాగ్రత్తగా చూసుకున్నాము. ఆమె ఇంకా చాలా బలహీనురాలై క్షీణించిపోవుచున్నది.
ఒకానొక దినమున నేను గస్తీ తిరుగుచుండగా రేడియోలో ఒక ప్రకటన నాకు వినపడినది,. ఆ రేడియోలో నన్ను పిలుచుచున్నారు. “విల్లియం బ్రెన్హాం త్వరగా వైద్యశాల యొద్దకు వెళ్ళవలయును. నీ భార్య మరణ స్థితిలో వున్నది,” అని ప్రకటించుచున్నారు. ఎంత త్వరగా వైద్యశాల యొద్దకు వెళ్ళాలో అంత త్వరితముగా నేను అచ్చటకు వెళ్ళాను. ఎర్రని బల్బు వెలిగించుకుంటూ, సైరను మ్రోగించుచు బహువేగముగా వెళ్ళాను. ఆ వైద్యశాలయందు నేను అలాగే నిలబడిపోయాను, మరియు లోపలికి ప్రవేశించాను. చిన్నప్పుడు బాలురుగా వున్నప్పుడు ఒకటిగా చేపలు పట్టుచూ, ఆడుచూ, పాడుచూ వుండే నా యొక్క స్నేహితుడు శ్యామ్ అడియార్ వైద్యశాల గది నుండి బయటకు వచ్చుచున్నాడు.
కొద్ది దినముల క్రితము నా యొక్క దర్శనమునందు డాక్టర్. శ్యామ్ అడియార్ గురించి మరియు అతడి వైద్యశాలను గురించి చూచి చెప్పాను. ఆ దర్శనమును గూర్చి సందేహించుచు అది జరిగినదా లేదా అన్నది మీరు తెలుసుకోవాలని ఆశించినయెడల, మీరు అతడికి ఫోన్ చేసి దాని ద్వారా మీరు తెలుసుకొనవచ్చును.
105
అతడు ఆ విధముగా విచారముగా తన టోపిని తన చేతిలో తీసుకొనివచ్చుచుండెను. నన్ను అతడు చూడగానే అతడు ఏడ్వటం ప్రారంభించెను. అతని యొద్దకు పరిగెత్తుకొని వెళ్ళి నా చేతులలో అతడిని చుట్టుకున్నాను. అతడు తన చేతులను నా మెడపై వేసి, బిల్లీ, ఆమె వెళ్ళిపోయినది అని చెప్పాడు. నన్ను మన్నించు, నాకు సాధ్యమైనంతవరకు కాపాడుటకు ప్రయత్నించాను. ప్రసిద్ధమైన డాక్టర్లు ఇంకా సమస్తము ద్వారా చేయగలిగినదంతా చేశాను, అని చెప్పాడు.
“శ్యామ్, ఖచ్చితముగా ఆమె వెళ్ళిపోదు,” అని నేను చెప్పాను.
“లేదు, ఆమె వెళ్ళిపోయినది,” అని అతడన్నాడు
“లోపలికి వెళ్ళవద్దు, బిల్లీ,” అని అన్నాడు.
“వద్దు, వెళ్ళకు, దయచేసి లోపలికి వెళ్ళకు,” అని అన్నాడు.
“లోపలికి వెళ్ళుటకు నన్ను అనుమతించు,” అని నేను అడిగాను.
“సరే. నేను నీతో వస్తాను,” అని అతడన్నాడు.
“లేదు, నీవు ఇక్కడే వుండు, ఆమె యొక్క ఆఖరి గడియలలో నేను ఆమె యొద్ద ఉండవలెను,” అని నేను అన్నాను.
“ఆమె స్పృహలో లేదు,” అని అతడన్నాడు
106
నేనా గదిలోనికి వెళ్ళాను, నర్సు అక్కడ కూర్చుని యున్నది ఆమె కూడా ఏడ్చుచున్నది, ఎందుకంటే ఆమె, హోప్ ఇద్దరూ పాఠశాల స్నేహితులు ఆమెను చూడగా ఆమె ఏడ్చుచున్నది. ఆమె చేతిని పైకెత్తి, నడుచుకుంటూ వెళ్ళిపోయినది.
హోప్ వైపు చూశాను, ఆమెను కదిపాను, 120 ఫౌండ్ల బరువుగల ఆమె ఇప్పుడు అరువది ఫౌండ్ల బరువుకు దిగజారిపోయి సన్నబడిపోయినది నేను మళ్ళీ ఆమెను కదిపాను, ఒక వంద సంవత్సరముల వరకు నేను ఒకవేళ బ్రతికి ఉన్నట్లయితే ఏమి జరిగినదో అప్పటి ఆ సంఘటనను నేను ఎన్నడూ మరచిపోను, ఆమె నా వైపు తిరిగి ఆ అందమైన పెద్ద కళ్లు నా వైపు చూచుచున్నవి. ఆమె నవ్వినది, “మళ్ళీ నన్ను వెనుకకు ఎందుకు పిలిచావు, బిల్లీ!”
ప్రియమైనదానా, ఇప్పుడే నా చేతికి డబ్బు వచ్చినది అని అన్నాను.
107
నేను పనిచేయవలసి యుండెను, వందల డాలర్ల కొలది వైద్య ఖర్చుల నిమిత్తము అప్పులపాలయి పోయాము ఆ డబ్బును చెల్లించుటకు మాయొద్ద ఏమిలేదు అందుకే నేను పనిచేయవలసి వచ్చినది. ప్రతిరాత్రి రెండు లేదా మూడు సార్లు నేను ఆమెను చూసేవాడిని. ఆమె అప్పుడు ఆ స్థితిలోనే ఉండినది.
“నన్ను ఎందుకు వెనుకకు పిలిచావు అని అంటున్నావు అలా ఎందుకని అంటున్నావు,” అని నేను అడిగాను.
“నీవు దీనిని గురించి ప్రసంగించావు, దీనిని గూర్చి నీవు మాట్లాడావు, నీవు ప్రసంగించావు కానీ, దీనిని గూర్చి భావన ఏమిటన్నది నీవు ఎరుగక యున్నావు” అని ఆమె నాతో చెప్పినది.
“నీవు దేనిని గూర్చి మాట్లాడుచున్నావు,” అని నేను అడిగాను
“పరలోకము” అని ఆమె అన్నది. చూడు, కొంతమంది జనులు పురుషులో లేక స్త్రీలో లేక అలాంటివారు కొంతమంది తెల్లని వస్త్రములు ధరించుకొని నా యొద్దకు వచ్చి భద్రముగా అవతలగట్టున వున్న గృహమునకు నన్ను తీసుకొని వెళ్ళిరి. అచ్చట నాకెంతో ప్రశాంతముగా మరియు సమాధానంగా ఉండినది, అందమైన పెద్ద పక్షులు ఈ చెట్టు నుండి ఆ చెట్టుకు ఎగురుచూ ఉన్నవి నేను ఇచ్చటే ప్రక్కనే ఉన్నట్లుగా తలంచవద్దు, బిల్లీ, నీవు చేసిన పొరపాటును నేను చెబుతాను క్రింద ఇలా కూర్చో అని అన్నది. కానీ నేను అలా కూర్చోకుండా మోకాళ్ళపైనే అలాగే వుంటూ ఆమె యొక్క చేతులను నా యొక్క చేతులతో గట్టిగా పట్టుకొనియున్నాను. “మనముఎచ్చట పొరపాటు చేశామో నీకు తెలుసా,” అని ఆమె అడిగినది.
“అవును, నా మధురమైన హృదయమా, నాకు తెలుసు,” అని నేనన్నాను.
“ఆ ప్రజలు నిజమైనవారు, మనము మా అమ్మ చెప్పిన మాటలను వినకుండా వుండవలసినది,” అని ఆమె చెప్పినది.
“అవును, అది నాకు తెలుసు,” అని నేను అన్నాను.
“నీవు వారి యొద్దకు వెళ్తానని నాకు వాగ్ధానము చెయ్యి, ఎందుకంటే వాళ్ళు నిజమైనవారు. కావున వారి యొద్దకు వెళ్ళుము, నా పిల్లలను వారివలె పెంచు, నేను నీకొకటి చెప్పవలయును, నేను చనిపోవుచున్నాను, కాని చనిపోవుటకు నేనేమీ భయపడుట లేదు, అది అది ఒక అందమైన స్థలము, కాని ఒక కార్యమేమనగా నిన్ను విడిచి వెళ్ళిపోవడమే నేను ఇష్టపడుటలేదు బిల్లీ, నీవు ఈ ఇద్దరి పిల్లలను పెంచుతావని నాకు తెలుసు, అయినా నీవు ఒంటరిగా వుండనని వాగ్ధానము చెయ్యి మరియు నీవు ఒంటరి వాడివిగా వుంటూ నా పిల్లలను ఇటుఅటు తిరుగుచూ వుండే అనాథలుగా ఉంచనని నాకు వాగ్థానము చెయ్యి అని ఆమె అడిగినది. ఇరువది ఒకసంవత్సరముల వయస్సుగల ఒక తల్లి యొక్క మంచి జ్ఞానవంతమైన కోరికగా అది వున్నది.
“దానిని నేను వాగ్థానము చేయలేను హోప్” అని నేను అన్నాను.
“దయచేసి నాకు వాగ్ధానము చేయండి” అని ఆమె అడిగినది “ఒక కార్యమును నేను నీతో చెప్పవలయును, ఆ తుపాకీ గురించి నీకు జ్ఞాపకమున్నదా?” అని ఆమె అడిగినది తుపాకులంటే నాకు భలే పిచ్చి, ఒకరోజు నీవు ఆ తుపాకీని కొనాలని ఆశించావు, కానీ, నీ దగ్గర అప్పుడు దానిని కొనుటకు సరిపోయినంత డబ్బు లేనందువలన నీవు దానిని కొనలేకపోయావు, అని చెప్పినది.
“అవును,” అని నేను అన్నాను.
“ఒక్కొక్క నికెలుగా కొంత డబ్బును పొదుపు చేసివుంచాను, దానిద్వారా ఆ తుపాకీని కొని నీకివ్వాలని అనుకున్నాను. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి, మడత మంచం దగ్గర చూడు, దానిపైన ఉండు కాగితపు ముక్క క్రింద చూడు, అక్కడ నేను దాచివుంచిన ఆ డబ్బును నీవు కనుగొనగలవు. ”ఆ తుపాకీని కొనుక్కుంటానని నీవు నాకు వాగ్థానము చెయ్యి“ అని ఆమె అడిగినది.
ఒక డాలరు డెబ్బది అయిదు సెంట్లు(నిక్కెలలో) అచ్చట వుండుటను నీవు కనుగొనినప్పుడు నేను ఏ విధమైన అనుభూతిని చెందెదనో మీరు ఎరుగలేరు పిదప నేనాతుపాకీని కొన్నాను.
108
నీవు నాకు ఒక జత మేజోళ్ళను (స్త్రీలు ధరించుకొనే) కొని తెచ్చుటకై డౌన్‌టవున్‌కి వెళ్ళుటయు, ఫోర్ట్‌ఫైన్ అనే ఊరికి మనము వెళ్ళినది నీకు జ్ఞాపకమున్నదా? అని ఆమె నన్ను అడిగినది.
“అవును” అని నేను అన్నాను.
నేను చేపలు పట్టుటకు వెళ్ళి తిరిగివచ్చి లోపలికి ప్రవేశించాను. ఫోర్టువైన్ అనే స్థలమునకు మనము వెళ్ళవలయును అని ఆమె చెప్పినది. కానీ నేను ఆ రోజురాత్రి ప్రసంగించవలసియున్నది. నీకు తెలుసా, రెండు రకముల మేజోళ్ళు అచ్చట గలవు. ఒక దానిని “చిఫాన్” అని అంటారు. రెండవ దానిని ఏమందురు? రేయాన్ అని అందురు, అని ఆమె నాతో చెప్పినది. అది అంతేకదా! రేయాన్ మరియు “చిఫాన్ వాటిల్లో చిఫాన్ రకపు మేజోళ్ళను కొన్నింటిని నాకు కొని తీసుకొని రావలయును. పై వరకు వేసుకునే పొడుగుగా వుండు మేజోళ్ళు కావాలి” అని ఆమె చెప్పినది. ఆ మేజోళ్ళ యొక్క పై భాగమున వెనుక ప్రక్కన దానియొక్క చిన్నపేరు దానియందు వుండునని మీరు ఎరుగుదురు గదా! స్త్రీల యొక్క వస్త్రముల గురించి అసలు నాకేమియూ తెలియదు.
నేను ఆ విధముగా వెళుతూ “చిఫాన్, చిఫాన్, చిఫాన్” అని చెప్పుకుంటూ దానిని మరచిపోకుండా వుండటానికి ఆ విధముగా ప్రయత్నించుచూ, “చిఫాన్, చిఫాన్, చిఫాన్” అని చెప్పుకుంటూ వెళుతున్నాను.
“ఎవరో ఒకరు హలో, బిల్లీ!” అని పిలిచారు.
“ఓ, హాలో, హలో, చిఫాన్, చిఫాన్, చిఫాన్” అని అంటూనే వున్నాను.
నేను మూల చివరవరకూ వెళ్ళాను, శ్రీ స్ఫాన్ గారిని నేను కలిశాను. “హయ్ బిల్లీ, పేర్చ్ అనే ఒక రకపు చేప ఆ చివరవుండు వారధి యొక్క స్థంభమును అటు ప్రక్క భాగమును ఇప్పుడు కొరుకుంటూ వెళ్ళుటను నీవెరుగుదువా!” అని అతడు నన్నడిగెను.
“నిజముగానా!” అని నేను అడిగాను
“అవును.”
నేను అతడిని విడిచి వెళ్ళేటప్పుడు దాని పేరు ఏమిటని మరచిపోయాను! అని తలంచాను. అప్పటికే నేను దానిని మరచిపోయాను.
109
కావున నేను ఎరిగిన తెల్మాఫోర్ట్ అనే ఒక అమ్మాయి టెన్‌సెంట్ అనే అంగడిలో పనిచేయుచున్నది. స్త్రీల యొక్క మేజోళ్ళను వారి అంగడిలో అమ్ముతారని నాకు తెలుసు, కావున నేను అచ్చటకు వెళ్ళాను.
“హాయ్, తెల్మా” అని నేను పిలిచాను.
“హాయ్, బిల్లీ, ఎలా వున్నావు? హోప్ ఎలాగున్నది,” అని ఆమె అడిగినది.
“ఆమె బాగున్నది, హోప్ కొరకు ఒక జత మేజోళ్ళు కావాలి తెల్మా” అని నేను చెప్పాను.
“హోప్‌కు సగం మేజోళ్ళు వద్దు,” అని ఆమె నాతో చెప్పెను.
“అవును”, అలాంటివి ఆమెకు నచ్చవు అని నేను అన్నాను.
అందుకు ఆమె అలాగైతే నీవు అడిగేది పొడువుగా వుండి పైవరకు ధరించెడు వంటివి మేజోళ్ళు అడుగుచున్నావా? అని అడిగినది.
“ఓ, అవును, ఖచ్చితముగా అలాంటిదే అని అనుకుంటున్నాను అని చెప్పాను. నేను నా తెలివితక్కువ తనమును చూపించేశాను.”
“ఎటువంటి వాటిని ఆమె ఆశించుచున్నది,” అని ఆమె అడిగినది.
“ఓహో, మీ యొద్ద ఎటువంటి రకములు గలవు,” అని నేనడిగాను.
“మంచిది, మాయొద్ద రేయాన్ వంటివి వున్నవి,” అని ఆమె చెప్పినది
110
థేయాన్‌కు మరియు చిఫాన్‌కు వుండు తేడా ఏమిటో నాకు తెలియదు. వాటి రెండు పేర్లు ఉచ్ఛరణ శబ్ధము ఒకేలాగ వున్నది. “అదియే నాకు కావలయును,” పొడవుగా వుండు రకము కావలయును అని నేనడిగాను. కాని నేను కొనవలసినవి కొనకుండా పొరపాటున వేరే లాంటివి కొన్నాను. అది ఏమిటి. హోప్ అడిగిన రకము వేరు, ఇవి వేరేలాగా వున్నవి.
వాటి ధర ముప్పది సెంట్లు మాత్రమే, ఇరువది లేదా ముప్పది సెంట్లు మాత్రమే, సగము ధరకే ఆమె వాటిని నాకు ఇచ్చినది. సరే మంచిది, “రెండు జతలు నాకివ్వు” అని అడిగాను.
111
నేను ఇంటికి వెళ్ళి, ప్రియమైనదానా, “స్త్రీలగు మీరు పట్టణములో తిరిగి తిరిగి బేరము మాట్లాడుకుంటారు,” అన్నాను. దానిని ఏ విధముగా విమర్శించవలయునో దానిని గూర్చి మీరు ఎరుగుదురు. కావున ఇచ్చట చూడు, నీవు ఒక జత ధరకు కొనేదానిని నేను అదే ధరకు రెండు జతలను తీసుకొని వచ్చాను, చూడు? అని నేను ఆమెతో అన్నాను. అదే నాయొక్క స్వంత స్వార్థము అని అన్నాను, నీకు తెలుసా, “వీటిని తెల్మా నాకు అమ్మింది.” “ఆమె ఒకవేళ వాటిని నా కోసము సగం ధరకే ఇచ్చి యుండవచ్చు” అని అన్నాను.
“నీవు షిఫాన్ తెచ్చావా?” అని ఆమె అన్నది
“అవును” రెండు రకముల పేర్లు ఉచ్ఛరణ శబ్ధము నాకు ఒకేలాగ వినిపిస్తుంది. ఆ రెండు పేర్లకు ఉన్నతేడా నాకు తెలియలేదు.
112
అప్పుడు ఆమె, “బిల్లీ అని పిలిచినది. పిదప, (ఆమె ఫోర్టువైన్‌కి వెళ్ళినప్పుడు, నేను వింతగా ఆలోచించాను, ఆమె వెళ్ళి వేరొక జత మేజోళ్లను కొనవలసి వచ్చినది.) ”ఆమె, నీవు తెచ్చిన వాటిని నేను మీ అమ్మకు ఇస్తాను“ అంతే కాకుండా, ”ఆ మేజోళ్ళు వృద్ధ స్త్రీలు ధరించేవి“ అని ఆమె చెప్పినది. ”నేను అలా చేసినందుకు బాధపడుచున్నాను“ అని నేను ఆమెతో అన్నాను.
“ఓ, అదేమీ పర్వాలేదు, ప్రియుడా,” అని ఆమె అన్నది.
“ఒంటరిగా జీవించవద్దు” అని చెప్పినది. అప్పటి నుండి ఇంకా కొన్ని గంటలలో ఏమి సంభవించబోవుచున్నదనే దానిని గూర్చి ఆమెకు తెలియకపోయినది. దేవదూతలు ఆమెను తీసుకుని వెళ్ళుచున్నప్పుడు ఆమె యొక్క మృదువైన చేతులను నేను పట్టుకొని యున్నాను.
113
నేను ఇంటికి వెళ్ళిపోయాను, ఏమి చేయాలో నాకేమీ అర్థమవ్వలేదు. రాత్రియందు అలాగే నేలపైనే నిద్రపోయాను. అప్పుడు ఏదో చప్పుడు... ఒక చిన్న ఎలుక అని అనుకుంటున్నాను. ఒక పాత గది యందు మేము కొన్ని కాగితములను వుంచాము. వాటికొరకై అది చప్పుడు చేయుచున్నది. నా కాళ్ళతో తలుపును మూశాను, అచ్చట ఆమె యొక్క లోపలి వస్త్రము, అచ్చట శవములను భద్రపరచు గదిలో యొక ప్రక్క వ్రేలాడుచు, ఆ శరీరము అచ్చట పెట్టబడియున్నది. ఒక చిన్న శబ్ధముతో ఎవరో ఒకరు నన్ను పిలిచారు, “బిల్లీ?” అది సహోదరుడు ఫ్రాంక్‌బ్రాయ్, “నీ కుమార్తె మరణస్థితిలో యున్నది” అని చెప్పెను.
“నా కుమార్తె?” అని నేను అన్నాను.
“అవును, షారోన్‌రోజ్” అని చెప్పాడు, “ఇప్పుడు వైద్యులు అచ్చటే వున్నారు, క్షయ వ్యాధి మెదడుకంతా వ్యాపించినది. అది ఆమె తన తల్లి యొద్ద పాలను త్రాగుట ద్వారా సోకినది, ఆ బిడ్డ మరణించుచున్నది” అని చెప్పాడు.
114
నేను నా కారును తీసుకొని అచ్చటకు వెళ్ళాను, మృదువైన చిన్న బిడ్డ మధురమైనది అచ్చటయున్నది, వారు ఆమెను వైద్యశాలకు తీసుకొని వెళ్ళుచున్నారు.
నేను ఆమెను చూచుటకు వెలుపలికి వచ్చాను. అప్పుడు శామ్ అచ్చటకు వచ్చి, “బిల్లీ, నీవు ఆ గదిలోకి వెళ్ళవద్దు. నీవు బిల్లీపాల్‌ను గురించి కొంచెం ఆలోచించి చూడవలయును.” ఆమె చనిపోబోవుచున్నది“ అని అన్నాడు.
“వైద్యుడా, నేను నా కుమార్తెను చూడవలయును,” అని నేను అడిగాను.
“వద్దు, నీవు లోపలికి వెళ్ళవద్దు,” అని అనెను. “ఆమెకు మెదడునందు క్షయ వ్యాధి సోకినది, బిల్లీ, నీవు దానిని మరలా బిల్లీపాల్‌కు అంటిస్తావు,” అని చెప్పాడు.
115
అతడు వెలుపలికి వెళ్ళేవరకు నేను వేచి యున్నాను. నా కుమార్తె చనిపోవుటను చూస్తూ నేను ఉండలేక పోవుచున్నాను. ఆమె యొక్క తల్లి అచ్చట సమాధి చేయువాని యొద్ద యున్నది. అతిక్రమ దారులయొక్క మార్గము బహుకష్టమైనదని నేను మీకు చెప్పుచున్నాను. శామ్, నర్సు వెళ్ళిపోయిన తరువాత నేను మెల్లగా తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్ళాను. నేను క్రిందకు దిగి నేలమాలిగకు వెళ్ళాను. అది చాలా చిన్న వైద్యశాల. ఆమె ఒంటరిగా అచ్చటయున్నది. నా కుమార్తె కన్నులు చుట్టూ ఈగలు ముసురుచున్నవి. వారు ఒక చిన్న, “దోమతెర” అని మనము చెప్పేటంత చిన్న తెరను ఆ బిడ్డ కళ్ళపై వేసి వుంచిరి. కొద్దిగా వ్యాధి వలనవచ్చు ఈడ్పుతో ఆమె యొక్క కాళ్ళు పైకి క్రిందికి ఆ విధముగా కదులుచుండగా, ఆమె యొక్క చిన్న చేతులు ఆ ఈడ్పు వలన కదులుచూ వున్నవి. నేను ఆమె వైపు చూచాను, ఎనిమిది నెలలకు తగిన ఆకారముతో బొద్దుగా, అందముగా ఆమె ఎదిగియున్నది.
116
ఆమెయొక్క తల్లి ఎప్పుడూ ఆనవాయితీగా అచ్చట వెలుపల ముక్కోణములాంటి మూడు కొనలుగల దాని మీద కూర్చోబెట్టును, దానిని మీరెరుగుదురు, నేను వచ్చేటప్పుడు ఆమెను అలా మూలను కూర్చోబెట్టును. నేను నా కారు యొక్క హారన్‌ను మ్రోగించగానే, నా కుమార్తె,“ గు, గూగూ, గూగూ ”అని అంటూ నా యొద్దకు రావాలని ఆశించేది. ఇప్పుడు, ఇచ్చట నా ప్రియమైనది మరొక పడకలో పడుకొని యున్నది.
ఆమె వైపు చూస్తూ “షార్రీ, నాన్నను నీకు తెలుసా? నేను నాన్నను నీకు తెలుసా, షార్రీ?” అని నేను పిలిచాను. నా బిడ్డ చూచినప్పుడు...ఆ వ్యాధి వలన ఆ బిడ్డ బహుశా వేదనను అనుభవించుచుండుట వలన ఆమె యొక్క అందమైన చిన్న నీలిరంగు కన్నులలో ఒక కన్ను వంకరగా తిరిగిపోయియున్నది. ఆ దృశ్యము నా హృదయమును తునాతునకలుగా చేసినది.
నేను మోకాళ్ళూని, “ప్రభువా, నేనేమి చేశాను? వీధి మూలలో నేను నీ సువార్తను ప్రసంగించలేదా? నాకు తెలిసినంతవరకు నేను చేయగలిగిందంతా నీకొరకే చేశాను కదా? దీనిని నాకు విరుద్ధముగా పట్టుకొని యుండకుము. వారిని చెత్తతో సమానమైన సమూహము అని నేనెన్నడూ నా నోటి ద్వారా అనలేదు. అది ఆమె వారిని చెత్తతో సమానమైన సమూహము, అని చెప్పినది ఇదంతా ఇలా జరిగినందుకు నేను బాధపడుచున్నాను. నన్ను క్షమించుము, నా కుమార్తెను నా నుండి తీసుకొని వెళ్ళిపోకు,” అని ప్రార్థించాను. నేను ఆ విధముగా ప్రార్థించుచుండగా, ఒక నల్లని వంటిదేదో నేను చూచుచున్నాను.... నల్లని దుప్పటి లాంటిది లేదా నల్లని వస్త్రములాంటిది క్రిందకు దిగుచున్నది. నా ప్రార్థనను ఆయన నిరాకరించాడని అప్పుడు నాకు అర్థమయ్యింది.
117
అది నా జీవితములో బహువేదనతో, కష్టముతో, అసలు నమ్మకమనేది లేని ఒక సమయముగా యుండినది. నేను పైకి లేచి నా కుమార్తెను చూచినప్పుడు, అప్పుడు ఆ సమయమందు నా తలంపులలో..... నా మనస్సులో సాతాను ఈ విధముగా మాట్లాడటం ప్రారంభించినది. “నీవు ఎంత కఠినముగా దేవుని సేవచేస్తూ ఆయన సువార్తను ప్రకటించావు, ఆ విధముగానే చక్కగా ఆయన కోసము జీవించావు, కాని ఇప్పుడు నీ స్వంత కుమార్తె మరణస్థితిలో యుండగా, నీవు క్లిష్టమయిన పరిస్థితిలో వుండగా ఆయన నిన్ను మరచిపోయాడు?” అని అంటున్నది.
అవును, అది నిజమే కదా! “ఆయన నా కుమార్తెను కాపాడకపోయిన యెడల అప్పుడు ఇక నేను కూడా చెయ్య.....” అని అంటూ ఇంకా నామాటలను సగములో ఆపేశాను. అసలు ఏమి చేయాలో నాకు అర్థమవ్వలేదు. అప్పుడు నేను చెప్పగలిగాను ప్రభువా, “నీవే నాకు ఆ కుమార్తెను అనుగ్రహించావు, నీవే ఆమెను తీసుకున్నావు. ప్రభువు యొక్క నామమునకు స్తుతి స్తోత్రములు, నీవు నన్ను కూడా తీసుకోవాలనుకుంటే తీసుకో అయినా గాని నేను నిన్ను ప్రేమిస్తాను,” అని చెప్పాను.
నా చెయ్యిని నా బిడ్డపై వుంచి, “నా మధురమైన హృదయమా నిన్ను దీవించుచున్నాను. నాన్న నిన్ను పెంచాలనుకున్నాడు, నా హృదయమంతటితో నిన్ను పెంచాలని అనుకున్నాను. ప్రభువుని ప్రేమించుదానివలె నిన్ను పెంచాలని నేను ఆశించాను. కాని, నా మధుర హృదయమా, దేవదూతలు నీకొరకై వచ్చారు. నీ చిన్న దేహమును తీసుకు వెళ్ళి నాన్న నీ తల్లి చేతులలో పెట్టబోవుచున్నాడు. నీ తల్లితోనే నిన్నుకూడా పూడ్చి పెట్టబోవుచున్నాను. ఏదో ఒక దినమున నాన్న వచ్చి నిన్ను కలుస్తాడు. అంతవరకు అక్కడ నీ తల్లితో నా కొరకై వేచియుండుము అని చెప్పాను.”
118
ఆమె తల్లి మరణించుచున్నప్పుడు “బిల్లీ, దేవుని సేవయందు నిలబడు” అని ఆమె చివరగా ఆమె ఆ మాటలను నాతో చెప్పినది. నేను నిలబడతాను అని అన్నాను.
“ఆయన వచ్చునప్పుడు నేను ఆయన సేవయందు నిలిచియున్నయెడల నేను పిల్లలను నాతో తీసుకొనివచ్చి ఆయనను కలుస్తాను. అట్లులేనియెడల నేను కూడా నీ ప్రక్కన పూడ్చి పెట్టబడతాను. నీవు గొప్ప ద్వారము గుండా కుడి ప్రక్కగా వెళ్ళు, వారందరూ లోపలికి ప్రవేశించటాన్ని నీవు చూచినప్పుడు అచ్చట నిలబడి, బిల్లీ! బిల్లీ! బిల్లీ! అని అంటూ గట్టిగా అరుస్తూ పిలుచుచున్నప్పుడు, అప్పుడు నేను నిన్ను సంధించెదను,” అని చెప్పాను. ఆమెను ముద్దుపెట్టుకుని వీడ్కోలు తీసుకున్నారు. ఇప్పుడు నేను ఈ యుద్ధ భూమియందు యున్నాను. ఇదంతా సుమారు ఇరువది సంవత్సరములకు ముందు జరిగినది. నేను నా భార్యతో నా యొక్క దినములను లెక్కించుకుంటూ ఆ దినముకై ఎదురుచూచు చున్నాను, నేను వెళ్ళి ఆమెను సంధించెదను.
119
నేనునా కుమార్తెను తీసుకుని, ఆ బిడ్డ చనిపోయినప్పుడు, ఆమెను తన తల్లి చేతులలోనే పెట్టాను, మేము వారిని సమాధి తోటకు తీసుకుని వెళ్ళాము. సహోదరుడు స్మిత్ ప్రసంగించుచుండగా నిలబడి నేను వింటున్నాను మెథడిస్ట్ ప్రసంగీకుడు సమాధి కార్యక్రమము ప్రసంగించుచుండెను, “బూడిదకు బూడిదగా, మట్టికి మట్టిగా” (“హృదయమునకు హృదయముగా” అని నేను అనుకున్నాను), ఆమె వెళ్ళిపోయినది.
అటుపిదప అది జరిగిన కొన్ని దినములకు మా చిన్న కుమారుడిని ఒక ఉదయ కాలమందు ఆ సమాధియొద్దకు తీసుకుని వెళ్ళాను. అతడు ఒక చిన్న బాలుడుగా ఉండెను.
అందువలన అతడు నన్ను వదలి వుండలేడు మరియు నేను కూడా అతడిని వదలివుండలేను. నేను, అతడి తల్లి ఇద్దరము కలిసి అతడికి స్నానము చేయించేవాళ్ళము. నేను అతడి పాలు త్రాగే సీసా తీసుకుని వెళ్ళేవాడిని, (అతడి పాలను వేడిచేయుటకు రాత్రి సమయమునందు మేము మంటను మండించే స్తోమత లేదు), కావున ఆ సీసాను నా యొక్క నడుము క్రిందపెట్టి, నా శరీరము ద్వారా కలిగే వేడి ద్వారా దానిని వేడిచేసేవాడిని.
మేము స్నేహితులులాగేనే విడిచి వుండలేకుండా ఒకరినొకరము హత్తుకుని వుంటాము. ఈ దినములలో ఏదో ఒక దినమున సేవను విడిచి నేను వెళ్ళునప్పుడు, అతడి హస్తములలో ఈ వాక్యము నిచ్చుటకు నేను ఇష్టపడుచున్నాను. మరియు “బిల్లీ, నీవు వాక్యములో ముందుకు సాగిపోవుచూ దానితోనే నిలిచియుండుము,” అని నేను అతడితో చెప్పెదను. ఎప్పుడూ ఈయన తన కుమారుడినే హత్తుకొని వుంటూ ప్రతి చోటకు తీసుకు వస్తాడని కొంతమంది జనులు ఆశర్యపోతూ ఉంటారు. అతడు వివాహము చేసుకున్నను ఇంకా కూడా అతడిని నేను విడిచి యుండలేను. అతడిని హత్తుకొని వుండమని హోప్ చెప్పిన మాటలను ఇప్పటికి నేను మరచిపోకుండా జ్ఞాపకము చేసుకుంటూ వుంటాను. మేము స్నేహితుల్లాగానే హత్తుకుని వుంటాము.
120
నేను పట్టణములో పనిమీద వెళుతున్నప్పుడు, నా చేతిలో అతడు త్రాగే పాలసీసాను పట్టుకొని వెళ్ళేవాడిని, ఎందుకంటే ఎప్పుడు ఏడ్వటము మొదలుపెడతాడో నాకు తెలియదు. ఒక దినమున వెనుక పెరట్లో అతడు నడుచుకుంటూ వెళ్ళుచుండగా, అచ్చట... హోప్ అతడు ఏడుస్తుండేటప్పుడు అతడిని బుజ్జగించుచూ, లాలించుచూ ఏడ్పును ఆపేది, అటువంటి సమయమున పొగ వలన శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుచున్నది — కేవలము ఆమెది చిన్న వయసు, మీకు తెలుసా — అచ్చట వెనుక వున్న పెరట్లో పాత ఓక్చెట్టు ఉన్న స్థలమందు ఇటు అటు నేను నడుస్తుండగా, బిల్లీపాల్ తల్లి కోసము ఏడవటము మొదలు పెట్టాడు. అతడిని బుజ్జగించుచూ, లాలించి తీసుకుని వెళ్ళుటకు నా దగ్గర ఏ అమ్మా లేదు, అతడిని నేను ఎత్తుకొని “ఓ ప్రియమైనదానా” అని నేను అన్నాను.
“నాన్న అమ్మ ఎక్కడ వున్నది? మీరు అమ్మను ఆ భూమిని త్రవ్వి అందులో పెట్టావు కదా!” అని బిల్లీ నన్ను అడిగాడు.
“లేదు, బంగారం, అమ్మ బాగానే వున్నది, ఆమె పరలోకమందువున్నది,” అని నేను అన్నాను.
121
ఒక్కరోజు మధ్యాహ్న సమయమునందు అతడు ఏదో నా దగ్గర చెప్పాడు, ఆ మాటలు నన్ను చంపేసినట్లు అనిపించినది, సాయంకాల సమయములందు అతడు ఎక్కువగా ఏడుస్తూ ఉండేవాడు. అందువలన అతడిని నా వీపు పైకి ఎక్కించుకుని తిరిగేవాడిని. నా భుజములమీద ఎక్కించుకుని తిరిగేవాడిని, అతడిని మెల్లగా నిమురుతూ, బుజ్జగించుచూ వున్నాకూడా, “నాన్నా, దయచేసి అమ్మను తీసుకొని రా, వెళ్ళి ఇప్పుడు ఇక్కడకు తీసుకునిరా అని ఏడుస్తూ అడిగేవాడు.”
“బంగారమా, అమ్మను నేను తీసుకుని రాలేను, ప్రభువు యేసు...” అని చెప్పెను.
“అమ్మను నా కోసము పంపించమని, నాకు అమ్మ కావాలని ప్రభుయేసుతో చెప్పు” అని చెప్పేవాడు.
“నా బంగారమా, నువ్వు, నేను అచ్చటకు ఏదో ఒక రోజున వెళ్ళి ఆమెను చూసెదము” అని చెప్పాను.
“అవునా, నాన్నా, నిజమా అని అతడు ఏడ్పును ఆపి అడిగాడు.
“అవును” అని నేను చెప్పాను.
“ఆ మేఘమునందుపైన అచ్చట నేను అమ్మను చూశాను,” అని అతడన్నాడు.
ఓ, అది నా హృదయాన్ని బద్దలు చేసి చంపేసినట్లనిపించినది! ఆ మేఘము నందు అచ్చటపైన నేను అమ్మను చూశాను ఆ మాటలను తలంచుకుంటూ ఇంచుమించు నేను స్పృహ కోల్పోయాను. నేను ఆ చిన్నవానిని నా భుజములయందు ఎత్తుకొని నా తలను క్రిందకువాల్చి అతడిని ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్ళాను.
122
దినములు గతించిపోయినవి, అయినా దానిని నేను మరచిపోలేను. ఇంటికి వెళ్ళకూడదని నేను ఉద్యోగము చేయుటకు ప్రయత్నించాను, ఎందుకంటే అది ఒక గృహములాగా అనిపించలేదు. నేను వేరే ఎక్కడైనా వుండాలని అనుకునేవాడిని, మాకు అచ్చట ఏమీ లేదు. కేవలము విరిగిపోయిన పాతకలప వస్తువులు తప్ప ఏమియు లేదు, అయినాగాని నేను ఆమె కలిసి సంతోషముగా జీవించినది ఏదో ఒకటి అచ్చట గలదు. అదియే ఆ గృహమై యున్నది.
నేను ఒక దినమున ప్రజాసేవ కార్యక్రమములయందు ఉద్యోగము చేస్తూ వున్నాను. నాకు జ్ఞాపకమున్నది, పాత విద్యుత్ తీగ తెగిపోయి క్రిందకు వ్రేలాడుచుండగా దానిని బాగుచేయుటకు ఒక తెల్లవారు ఝామున “ఆ విద్యుత్ స్తంభము పైకి నేను ఎక్కాను. నేను ఆలా పైకి ఆ స్థంభము మీదకు ఎక్కినప్పుడు దాని నీడ సిలువ ఆకారములో కనిపించుచున్నది.” (నేను నా కుమార్తెను మరణించుటకు అనుమతించలేను, నా భార్య చనిపోతూ వుండటము నేను చూస్తూ వుండలేను, నా కుమార్తె చనిపోతూ వున్నది ఆ బిడ్డ చాలా చిన్నబిడ్డ). నేను ఆ స్థంభముపైన ఉండి పాటను పాడుచున్నాను, ద్వారముగా యున్న ఆ కొండమీద పాత గరుకైన సిలువ నిలబడినది ఆ విద్యుత్ ట్రాన్స్ఫారమ్ నుండి విద్యుత్ ప్రసరించే తీగలు క్రింద వరుసలో, పై వరుసలో ఆ విధముగా స్థంభమునకు అమర్చబడి యుండునని మీరు ఎరుగుదురు. నేను విద్యుత్ స్థంభము మీద ఉన్నాను. నా వెనుక భాగమున సూర్యుడు ఉదయించుచు పైకి రావటము నేను చూస్తున్నాను, కాబట్టి నా రెండు చేతులను చాపి సిలువవలె ఆ కొండమీద యున్న శిలువ గుర్తులా వుంచాను. అవును, “నా పాపముల నిమిత్తమే ఆయనను అచ్చట ఆ విధముగా కొట్టారు,” అని నేను తలంచాను.
123
“షారోన్, నా ప్రియమైనదానా, నిన్ను చూడాలని నాన్న ఎంతగానో ఆశించుచున్నాడు, నా ప్రియమైనదానా, ఎంతో చక్కటి అందమైన చిన్న పాపవగు నిన్ను మరలా నా హస్తములలో హత్తుకుని, హత్తుకుని ముద్దాడాలని నేను ఎంతగానో ఆశించుచున్నాను” నీ గురించి నేను మర్చిపోయినంతగా అయోమయములోకి నేను వెళ్ళిపోయాను. ఆ విధముగా అనేక వారములు గడిపాను. నా చేతికి తగిలించుకొనియున్న రబ్బరు గ్లౌసును తీసివేశాను. ప్రక్కన 2,300ల వోల్టుల విద్యుశ్చక్తి సామర్థముగల తీగలు కలవు. ఆ స్థంభము మీద కూర్చొనియున్న నేను కరెంటుషాకు తగలకుండా ఉండటానికి చేతికి వేసుకుని యున్న నా చేతి గ్లౌసును తీసివేసి, దేవా దీనిని చేయుటకు నేను ఇష్టపడుటలేదు, నేను ఒక పిరికివాడిని అని చెప్పాను. కాని, షార్రీ, నాన్న నిన్ను మరియు అమ్మను ఇంకా కొద్ది నిమిషములలో వచ్చి చూడబోవుచున్నాడు, ఆ 2,300 వోల్టుల సామర్థముగల విద్యుశ్చక్తియందు నా చేతిని పెట్టడానికి నా చేతికియున్న గ్లౌస్‌ను తీసివేయడానికి లాగుచున్నాను. అలా చేస్తే ముక్కలైపోతాను... ఎందుకనగా నా శరీరములో ఒక్క చుక్క రక్తము కూడా మిగిలియుండదు. కాబట్టి నేను నా చేతికి యున్న గ్లౌసును లాగుటకు ప్రయత్నించుచుండగా ఏదో ఒకటి ఆ సమయమునందు జరిగినది. నాకు మరలా స్పృహ వచ్చి చూచినప్పుడు నేలమీద కూర్చొని నా రెండు చేతులను ముఖముపై వుంచుకొని ఏడ్చుచున్నాను. అది దేవుని యొక్క కృప, అట్లు లేనియెడల ఇచ్చట నేను ఇప్పుడు స్వస్థతా కూటములను జరిపేవాడిని కాదు. ఆ కృప నిమిత్తము నేను నిశ్చయతను కలిగియున్నాను. నన్ను నేను కాపాడుకోలేదు గాని, అది ఆయన యొక్క వరమును ఆయనే కాపాడుకొనెను.
124
నేను నా గృహమునకు బయలుదేరి వెళ్ళాను. నా పని సామాగ్రిని వదిలివేసి వాటిని దూరముగా వేశాను. వారి యొద్దకు వెళ్ళి నేను “నా గృహమునకు వెళ్ళుచున్నాను,” అని అన్నాను.
నేను ఇంటికివెళ్ళి చుట్టూ చూసినప్పుడు నాకు వచ్చిన ఉత్తరములు తీసుకున్నాను. ఎక్కువ చలిగా వున్నందువలన లోపలికి వెళ్ళిపోయాను. మాకున్నది ఒక చిన్నగది మాత్రమే. ఒక చిన్న మంచము మీద పండుకుని గడ్డకట్టే మంచు లోపలికి వచ్చుచున్నది. ఆ గదిలో పాతపొయ్యి ఒకటివుండినది. ఆ ఉత్తరములు తీసుకుని, వాటిని చదువుట ప్రారంభించితిని. మొట్టమొదటగా వాటిల్లో నేను చూసిన కార్యమేమనగా క్రిస్మస్‌కు చిన్న పొదుపు, “కుమారి షారోన్ రోజ్ బ్రెన్హాంకు అని వ్రాసియుంచిన అందులో ఎనభై సెంట్లు కలవు.” అది ఆ విధముగా అచ్చట వున్నందువలన మళ్ళీ నేను దుఃఖముతో ఆ పాతస్థితికి వెళ్ళిపోయాను.
125
నేను వేటగాళ్ళకి కావలివానిగా ఉద్యోగము చేసేవాడిని, నేను లేచి నాదగ్గర వున్న చిన్న చేతి తుపాకీని దానియొక్క ఒరలో నుండి బయటకు తీసి నాచేత్తో పట్టుకొని, “ప్రభువా, ఇంకా కూడా నేను ఈ విధముగా ప్రాణముతో ఉండలేను, నేను చచ్చిపోతున్నాను. ఇంత బాధ నేను భరించలేను,” తుపాకీలో వున్న చిన్న బటన్‌ను వ్రేలితో నొక్కుతూ నా తలకు ప్రక్కన గురిపెట్టి పట్టుకుని మంచముపై ఆ చీకటి గదిలో మోకాళ్ళుని ప్రార్థించుట ప్రారంభించితిని. “పరలోకమందున్న మా తండ్రీ, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము జరుగును గాక!” అని ప్రార్థించాను. ఆ తుపాకీ యొక్క చిన్న బటన్ ఎంత గట్టిగా వ్రేలితో నొక్కాలో అంత గట్టిగా నొక్కుతూ ఆ తుపాకీని ప్రేల్చుటకు ప్రయత్నించుచున్నాను. ప్రార్థించేటప్పుడు, పరలోకములో జరుగునట్లు ఈ భూమియందు జరుగును గాక. మా యొక్క అనుదిన ఆహారమును మాకు అనుగ్రహించుము అని ప్రార్థించి ఆ తుపాకీని నొక్కుతూ పేల్చగా అది పేలలేదు!
“ఓ, దేవా, నన్ను ముక్కలు ముక్కలు బ్రద్ధలు చేయాలనుకుంటున్నావా? అని నేను తలంచాను. నేనేమి చేసాను? నన్ను చనిపోవుటకు కూడా నీవు అనుమతించుటలేదు? ”చేతిలో యున్న తుపాకీ నేల మీదకు విసిరివేసాను, అది క్రిందకు పడగానే ఆ గదిలోనే అది ప్రేలిపోయినది, “దేవా, నేనెందుకు మరణించకూడదు, ఈ భయంకరమైన బాధలో నుండి నేనెందుకు విడుదల పొందుకోకూడదు? అటు పిదప, ఇక నేనేమి చేయలేక అలాగే వుండిపోయి, నీవు నా కొరకు ఏదైనా ఒకటి చేసి తీరవలయును” అని అడిగి, అలాగే క్రిందపడిపోయి పాత మురికి గదిలో ఏడ్చుటకు ప్రారంభించితిని. నేను అలాగే నిద్రలోకి వెళ్ళిపోయాననుకున్నాను. నేను నిద్రలో వున్నానో లేక ఏమి జరిగినదో నాకేమి తెలియదు.
నేనెల్లప్పుడు పడమరవైపుగా వుండాలనే ఇష్టపడతాను. ఇచ్చటయున్న వారు ధరించుకొనే టోపిలో ఒకటి నేను కూడా ధరించాలని ఆశిస్తాను. మా నాన్నగారు ఆయన యొక్క యవ్వన కాలములో గుర్రములను తన అదుపులోకి తీసుకొనేవాడు. వారియొక్క టోపీలను నేను ధరించుటకు ఇష్టపడేవాడిని. పశ్చిమతీరపు వారి బాణిలో వుండు ఒక మంచి టోపీని, నేను ఇష్టపడే ఒక మంచి రకపు టోపీని మొన్న ఒకానొక దినాన డేమోస్ షకరియన నా కొరకు తెచ్చెను.
126
అడవిపచ్చిక బయళ్ళగుండా నేను నడుచుకుంటూ వెళ్ళుచున్నాననుకుంటున్నాను, “అప్పుడు నాలుగు చక్రముల వాహనమునందు ఒక చక్రము అందున విరిగిపోయినది. ఆ కళ్ళమునందు అమ్మకమునకు అని గురుతుకలదు” అనే పాటను పాడుకుంటూ వెళుతున్నాను. ఆ విధముగా చాలా దూరము నడుచుకుంటూ వెళుచుండగా, ఒక పాత నాలుగు చక్రములు పెద్ద బండి కట్టబడి యుండుట నేను గమనించాను, చూచుటకు పెద్ద గట్టి పాత్ర వంటిది అయియుండినది. ఒక చక్రము విరిగిపోయియున్నది, అది బ్రద్ధలైన నా కుటుంబమునకు ఉదాహరణముగా అది కనబడుచున్నది. ఇంకా దానికి దగ్గరగా నేను వచ్చినప్పుడు, అచ్చట నేను చూచినప్పుడు అందమైన చక్కటి యవ్వన బాలిక, ఇరువది సంవత్సరములువుండును, హిమమువలె తెల్లగా మెరుస్తున్న తలవెంట్రుకలు, నీలి కన్నులు గలిగి, తెల్లటి వస్త్రములను ధరించుకొని అచ్చట నిలబడియున్నది. ఆమెవైపు నేను చూచి, “నీవు ఎలాగున్నావు” అని నేను ఆమెను అడిగాను. ఆ విధముగా ముందుకు సాగిపోయాను.
“హల్లో, నాన్నా అని” ఆమె అన్నది.
“నేను వెనుకకు తిరిగి, నాన్నా? నీవు ఒక యవ్వన స్త్రీ వై యుండి... నీవు నన్నువలె నా వయస్సును కలిగియుండి నన్ను నీవేలాగు నాన్నా అని పిలుచుచున్నావు నేనేలాగు నీకు నాన్నను అవ్వగలను?” అని అడిగాను.
“నాన్నా, నీవెచ్చటయున్నావో నీకు తెలియుటలేదా?” అని ఆమె అడిగినది.
“నీవేమి అంటున్నావు అని” నేను అడిగాను.
“ఇది పరలోకము, భూమి భూమ్మీద యున్నప్పుడు నేను నీ చిన్న పాపను, షారోను” అని ఆమె చెప్పినది.
“ఏమిటది? ప్రియమైనదానా, నీవు కేవలము చిన్న పాపవే కదా?” అని నేను అడిగాను.
“నాన్నా, భూమిపై చిన్నపిల్లలుగా వున్నను వారిచ్చట చిన్నపిల్లలుగానే వుండరు, వారు అమర్త్యులు, వారికి వృద్ధాప్యము రాదు లేదా యవ్వన ప్రాయమునుండి వారు ఎదగరు” అని ఆమె చెప్పినది.
“మంచిది, షారోను, ప్రియమైనదానా నీవు చాలా మంచి అందమైన యవ్వన స్త్రీగా వున్నావు” అని నేను చెప్పాను.
“అమ్మ నీ కొరకు ఎదురుచూచుచున్నది” అని ఆమె చెప్పినది.
“ఎక్కడ” అని నేను అడిగాను.
“అదిగో ఎత్తుగా అక్కడవున్న నీయొక్క నూతన గృహమునందు అని” ఆమె చెప్పినది.
నూతన గృహమా? బ్రెన్హాంలు దేశదిమ్మరులు గదా! వారికి గృహములు వుండవు గదా! వారు కేవలము... “సరే మంచిది, ప్రియమైనదానా, వారికి ఏ గృహము లేదు” అని నేను అన్నాను.
“అయినను, నాన్నా, మీకొరకు ఇచ్చట పైన ఒకటి సిద్ధపరచబడియున్నది.” అని ఆమె చెప్పినది.
అనగా అది ఒక చిన్న బిడ్డ అనే అర్థములో నేను చెప్పుట లేదు, కానీ అది నాకెంతో వాస్తవముగా యున్నది. వాటన్నిటిని మళ్ళీ తలంచుకుంటూ వుంటుంటే గతించిపోయినవన్నియు మరల జ్ఞాపకములోనికి వచ్చుచున్నవి. నాన్నా, ఇచ్చట నీ కొరకు ఒకటి సిద్ధపరచబడియున్నది, అని చెప్పెను. అచ్చట నా కొరకు ఒకటి గలదని నేనెరుగుదును. ఏదో ఒక దినమున నేనచ్చటకు వెళాతాను. నా అన్నయ్య బిల్లీపాల్ ఎక్కడ అని ఆమె అడిగినది.
“అతడిని శ్రీమతి. బ్రాయ దగ్గర కొద్ది నిమిషములు ముందే వదలివచ్చాను,” అని నేను చెప్పాను.
“అమ్మ నిన్ను చూడాలని ఆశించుచున్నది,” అని ఆమె చెప్పినది.
127
నేను వెనుకకు తిరిగి చూడగా గొప్ప పెద్ద భవనాలు అచ్చట వున్నవి.మరియు దేవుని యొక్క మహిమ వాటిపైకి వచ్చి వాటి చుట్టూ వున్నది. “నా గృహము, మధురమైన గృహము” అనే పాటను దేవదూతల పాట బృ౦దము పాడుట నేను విన్నాను. పొడవైన మెట్లపైకి ఎంత వేగముగా నేను ఎక్కవలయునో అంత వేగముగా నేను ఎక్కుటకు ప్రారంభించితిని. అచ్చట ఒక తలుపు దగ్గరకు నేను వెళ్ళి చేరగా ఆ తలుపు దగ్గర హోప్ నిలబడి వున్నది, ఒక తెల్లని వస్త్రము ధరించుకొని, పొడవైన వెనుక క్రింద వరకు వ్రేలాడే ఆమెయొక్క నల్లని తలవెంట్రుకలు గలదై అచ్చట నిలబడి యున్నది. ఆమె తన చేతులను పైకి ఎత్తి, నేను ఉద్యోగము నుండి లేదా వేరే ఏ కార్యము నిమిత్తమైనా వెళ్ళి అలసటగా నేను ఇంటికి వచ్చి చేరినప్పుడు ఆమె ఎల్లప్పుడు అదే విధముగా తన చేతులు పైకి ఎత్తుతుంది ఆమెను నా చేతులతో పట్టుకున్నాను.
“ప్రియమైనదానా, షారోనుని అచ్చట క్రింద నేను చూశాను. ఆమె ఒక మంచి యవ్వన స్త్రీవలె మారిపోయినది.
“ఆమె ఆవిధముగానే అయిపోయినది గదా?” అని నేను అడిగాను.
“అవును, బిల్లీ, అంటూ తన చేతులను నా చుట్టూవేసి బిల్ అని అంటూనా భుజములపై తన చేతులను వేసి నా వీపును నిమురుతూ, మెల్లగా తట్టుచూ నా గురించి మరియు షారోను గురించి నీవు ఇకమీద బాధపడకూడదు” అని ఆమె అన్నది.
“ప్రియమైనదానా, ఆ విషయమును నేను మరచిపోలేను అని నేను అన్నాను.
“నీవున్న పరిస్థితికంటే షారోను మరియు నేను ఇచ్చట చాలా బాగున్నాము. మా గురించి ఇకమీదట అసలు నీవు బాధపడకూడదు. బాధపడనని నీవు నాకు వాగ్ధానము చేస్తావా?” అని ఆమె అడిగినది.
“హోప్, నీవు లేకుండా, షారోను లేకుండా నేను ఒంటరివాడిగా జీవించలేకపోతున్నాను. ఒంటరితనమును నేను భరించలేక పోతున్నాను, బిల్లీపాల్ ఎప్పుడూ నీ కొరకు ఏడుస్తూనేవున్నాడు, అతడిని ఏమి చేయాలో నాకేమీ అర్థమవటము లేదు,” అని నేనన్నాను.
“బిల్లీ, అవన్నీ చక్కబడతాయి, ఇక మీదట నా గురించి నీవు బాధపడనని నాకు వాగాన్ధనము చెయ్యి, అని ఆమె అడిగినది. అలా కొద్దిసేపు కూర్చోకూడదా?” అని ఆమె నన్ను అడిగినది. నేను చుట్టూ తిరిగి చూడగా అచ్చట ఒక పెద్ద కుర్చీ వున్నది.
128
ఇప్పుడు, దీనిని ముగించుచుండగా, దీనిని మీకు చెప్పాలని అనుకుంటున్నాను, నీకు ఒక కుర్చీని కొనవలయునని ప్రయత్నించిన విషయము నాకు జ్ఞాపకమునకు వచ్చినది. మేము ఉదయ అల్పాహారమును భుజించేటప్పుడు ఉపయోగించే కాళ్ళు నేలకు ఆనించినట్లు ఉండే మామూలు పాత కలప కుర్చీలు మాత్రమే యుండెడివి, వెనుకకు త్రోసి చక్కగా వెనుకకు ఆనుకొని కూర్చొనే విధముగా యుండే ఒక కుర్చీని ఒకటి మేము కొనగలిగితిమి. సులువుగా, హాయిగా ఆనుకొని విశ్రాంతిని తీసుకొనే విధముగా యుండు కుర్చీ అది దానియొక్క ఖరీదు పదహేడు డాలర్లు. కావున మూడు డాలర్లును వారికి కట్టి ఆ కుర్చీని తీసుకొని వారంవారం ఒక డాలరు కట్టే విధముగా దానిని మేముకొన్నాము. ఓ, నేను ఇంటిలోకి వచ్చినప్పుడు... రోజంతా కష్టపడి పనిచేసి, అర్థరాత్రి వరకు వీధులలో తిరుగుచూ ఎక్కడెక్కడ ప్రసంగించుటకు అవకాశము గలదో అచ్చటంతా నేను ప్రసంగించేవాడిని.
ఒకరోజు ఆ కుర్చీకి కట్టవలసిన ఖాతాను కట్టలేకపోయాను. దానిని మేము సరిగా కట్టలేక పోయాము. ఆ విధముగా కట్టలేనందు వలన రోజు రోజుకి దాని యొక్క ఖాతా పెరిగిపోయి, ఒక రోజు వాళ్ళు వచ్చి నాకున్న ఆ కుర్చీని వారు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రిని నేనెన్నడూ మరచిపోలేదు. ఆమె నా కొరకు చెర్రీపై అనే పదార్థము వండినది. ఆ కుర్చీ విషయమై నేను చాలా నిరుత్సాహపడతానని ఆమెకు తెలుసు. ఆ రాత్రి భోజనము ముగించిన తర్వాత ప్రియమైనదానా, ఈ రోజు రాత్రి నీవు ఇంత చక్కగా వున్నందుకు కారణమేమిటి? అని నేను అడిగాను.
“ప్రక్కింటి అబ్బాయిలను పిలచి గుంటను త్రవ్వి చేపలను పట్టుటకు దానికి ఎరగా ఉపయోగించే కొన్ని పురుగులు వేసివుంచాను. మనము కొద్దిసేపు ఆ నది దగ్గరకు వెళ్ళి చేపలను పట్టుకొని వద్దామని నీకు అనిపించుట లేదా?” అని ఆమె నాతో అన్నది.
అవును, వెళ్దాము, కాని ... అని నేను అన్నాను.
129
ఆమె దుఃఖమును నిలుపుకోలేక ఏడ్వటము ప్రారంభించినది. ఏదో జరగరానిది జరిగినదని నాకు అర్థమయ్యింది. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చినది, ఎందుకంటే ఆ కుర్చీని అమ్మిన వాళ్ళు వచ్చి ఆ కుర్చీని తీసుకొని వెళ్ళిపోతామని నాకు ముందుగానే వారు తెలియపరచారు. వారమునకు ఒక డాలరు చొప్పున మేము ఆ ఖాతాని కట్టుకోలేక పోయాము. దానిని చెల్లించుటకు మాకు కుదరలేదు. మేము ఆ ఖాతాని కట్టుకోలేక పోయాము, దానికి చెల్లించుటకు మాకు కుదరలేదు. ఆమె తన చేతులను నా చుట్టూ వేసి, నేను ఆ తలుపు దగ్గరకు వెళ్ళి చూడగా అచ్చట నా కుర్చీ లేదు.
“అచ్చటపైన ఆమె నా యొద్ద బిల్లీ, నీకు ఆ కుర్చీ జ్ఞాపకమున్నదా?” అని అడిగినది. అవును,
“ప్రియమైనదానా, నాకు గుర్తున్నది,” అని నేను అన్నాను.
“నీవు దాని గురించి ఆలోచించుచూ వుండేవాడివి, అవును కదా?” అని ఆమె అడిగినది
“అవును.”
“దీనిని వాళ్ళు ఇచ్చట నుండి తీసుకొని వెళ్ళలేరు. దీనియొక్క ఖరీదు చెల్లించబడినది. ఒక నిమిషము ఇందులో కూర్చో, నేను నీతో మాట్లాడాలని ఆశించుచున్నాను,” అని ఆమె అన్నది.
“ప్రియమైనదానా ఇవ్వన్నీ నాకేమి అర్థమవుటలేదు,” అని నేను చెప్పాను.
“నాకు వాగ్ధానము చెయ్యి, మా గురించి ఇకమీదట నీవు ఎంతమాత్రము బాధపడవని నాకు వాగ్ధానము చెయ్యి బిల్లీ, మళ్ళీ నీవు ఇప్పుడు వెనుకకు వెళ్ళిపోవాలి, మా గురించి ఇకమీదట ఎంతమాత్రము బాధపడనని నాకు వాగ్ధానము చెయ్యి” అని ఆమె అడిగినది.
“హోప్, దానిని నేను చేయలేను” అని నేనన్నాను.
130
మళ్ళీ నేను క్రిందికి వెళ్ళుటకు వచ్చేసాను, నా గది అంతా చీకటిగా వున్నది. నేను చుట్టూ చూసాను, అనుభూతులు నన్ను చుట్టుకొని వున్నట్లుగా అనుభూతిని చెందాను. “హోప్, నీవు ఈ గదిలో వున్నావా!” అని అరిచాను.
“ఆమె నన్ను మెల్లగా చేతులతో తట్టుచూ నా వీపు నిమురుచున్నది. బిల్లీ, నీవు నాకు దానిని వాగ్ధానము చేస్తావా? ఇక మీద నీవెంత మాత్రము బాధపడనని నాకు వాగ్ధానము చెయ్యి,” అని ఆమె అడిగినది.
“నేను నీకు వాగ్ధానము చేయుచున్నాను,” అని నేను అన్నాను.
అటుపిదప రెండు లేదా మూడుసార్లు నా వీపును తట్టింది, తరువాత ఆమె వెళ్ళిపోయినది. నేను ఎగిరి దూకి లైటును వేసాను, గదంతా ప్రతీచోటా, ప్రతీ మూలను నేను వెదికాను, కాని ఆమె వెళ్ళిపోయినది. కాని ఆమె కేవలము అప్పుడే గదిని వదలి వెళ్ళిపోయినది. ఆమె వెళ్ళిపోలేదు, ఆమె ఇంకా జీవిస్తూనే యున్నది. అలా ఒక క్రైస్తవరాలుగా యుండినది.
131
బిల్లీ మరియు నేను కొద్దికాలము క్రితము పుష్పములను తీసుకొని ఈస్టర్ ఉదయమున తన తల్లి కొరకు, తన చెల్లెలు కొరకు తీసుకొని వెళ్ళాము. ఆ సమాధి యొద్ద నిలబడ్డాము. అప్పుడు చిన్నవాడైన బిల్లీపాల్ ఏడ్వటము ప్రారంభించెను, నాన్న, నా తల్లి అచ్చట క్రింద వున్నది అని ఏడువసాగెను.
“లేదు, ప్రియమైనవాడా, ఆమె అచ్చట క్రిందలేదు, నా చెల్లెలు కూడా అచ్చట క్రింద లేదా. ఇచ్చట అది మూయబడిన ఒక సమాధి మాత్రమే మన ముందు యున్నది, కాని సముద్రమునకు అవతలి ఒడ్డునకు వెళ్ళిన యెడల అచ్చట తెరవబడిన ఒక సమాధిగలదు. అచ్చటే ప్రభుయేసు పునరుత్థానుడయ్యెను. ఏదో ఒక దినమున ఆయన వచ్చును, నీ చెల్లెలను మరియు నీ అమ్మని తనతో కూడా తీసుకొని వెళ్ళును,” అని నేను చెప్పాను.
స్నేహితులారా! నేను యుద్ధ భూమియందు యున్నాను. ఇంతకంటే ఎక్కువగా నేను చెప్పలేను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక! ఒక్క నిమిషము మనము తలలు వంచుదాము.
132
ఓ ప్రభువా, అనేక సమయములలో ప్రభువా, ఈ కార్యములన్నియు చాలా సులువుగా వచ్చుచున్నవని వారు అనుకొనునప్పుడు, దానిని బట్టి జనులు వీటిని అర్థము చేసుకోలేకపోవుచున్నారనేది నేనెరుగుదును. కాని ఒక గొప్ప దినము వచ్చుచున్నదని, యేసు వచ్చునని, అప్పుడు ఈ దుఃఖములన్నియు తుడిచి వేయబడును. పరలోకపు తండ్రీ, అందుకొరకై మేము సిద్ధపడియుండుటకు మీరు మాకు సహాయము చేయవలెనని నేను ప్రార్థించుచున్నాను.
ఆ ఆఖరి వాగ్ధానమును ఆమెకు వాగ్ధానముచేసి నేను ఆమె యొక్క బుగ్గపై ముద్దును పెట్టుకున్న ఆ ఉదయ కాలమందు నేను ఆ దినమందు ఆమెను వచ్చి సంధించెదనని చెప్పాను. ఆ దినము ఆసన్నమైనప్పుడు ఆమె అచ్చట నిలబడి బిగ్గరగా నా పేరును పిలుస్తూ నన్ను ఆహ్వానిస్తుందని నేను నమ్ముచున్నాను. అప్పటి నుండి నేను చేసిన వాగ్ధానమునకు యధార్థ ముగా నేను జీవించుచూ, ప్రభువా ప్రపంచమంతటా తిరుగుచూ, అనేక విధములైన స్థలములయందు ఈ సువార్తను తీసుకొని వెళ్ళుటకు నేను ప్రయత్నించుచున్నాను. ఇప్పటికి వృద్ధుడనై నేను నీరసించిపోతూ కృ౦గిపోయాను. చివర ప్రసంగమును ప్రసంగించి ఈ దినములలో ఏదో ఒక దినమున నేను ఈ పరిశుద్ధ గ్రంథమును మూయబోవుచున్నాను. నేను చేసిన ఆ వాగ్ధానమునకు నమ్మకస్తుడుగా యుండుటకు దేవా, నన్ను కాపాడుము. ప్రభువా, నీ కృపను నా చుట్టూ వుంచి నన్ను భద్రపరచుము. ఈ శరీరసంబంధమైన జీవిత కార్యముల వైపు నేను చూడకుండా అవతలి గట్టు యందుండు ఆత్మ సంబంధమైన కార్యములవైపు నేను చూచునట్లుగా సహాయము చేయుము. నీయందు యధార్థముగా యుండుటకై నాకు సహాయము చేయుము. చాలా సుళువైన, సుఖవంతమైన పట్టు పాన్పులపై గడిపే జీవితమును నేను కోరుకోకుండా, వద్దు ప్రభువా, శ్రమలయందు నా క్రీస్తు అచ్చట మరణించునట్లుగా, ఇంకా అనేకులు అదే శ్రమలగుండా మరణించినట్లు, నేను ఎటువంటి సులువైన సుఖ జీవితమును నేను కోరను. కేవలము మీకొరకై బహుయధార్థముగా, ప్రభువా, మీకు నమ్మకస్తుడుగా వుండునట్లు చేయుము. జనులను నీ యొద్దకు నడిపించునట్లుగా వారు నన్ను ప్రేమించునట్లుగా చేయుము. ఏదో ఒక దినమున సమస్తము సమాప్తమైన పిదప ఎల్లప్పుడు పచ్చగా వుండు వృక్షముల క్రింద మేమందరము చుట్టూ ఏకముగా కూడెదము. నేను ఆమెయొక్క చేతిని పట్టుకొని ఏంజలస్ ఆలయము యొక్క జనులను మరియు మిగతా అందరినీ చూపించుకుంటూ ఆమెతో నడుస్తూ ముందుకు సాగిపోతాను. అప్పుడది ఒక మహిమగల గొప్ప సమయముగా అది యుండును.
ఇచ్చటయున్న ప్రతి ఒక్కొక్కరిపై నీ యొక్క కృపయుండునట్లుగా నేను ప్రార్థించుచున్నాను. ప్రభువా, ఇచ్చట వున్నవారిలో ఇంకా అసలు మిమ్మల్నిఎరగని వారు కూడా వుండవచ్చును. ఒకవేళ ఆ సముద్రమునకు అవతలి గట్టున వారు ప్రేమించుచున్నవారు అచ్చట వుండ వచ్చును. మరియు వాగ్ధానము వారి ద్వారా నెరవేర్చకుండా ఉండినయెడల, ప్రభువా, దానిని వారు ఇప్పుడే నెరవేర్చునట్లుగా చేయుము.
133
మేము మా తలలను వంచియుండగా, ఈ మధ్యాహ్న సమయమునందు ఈ గొప్ప ఆడిటోరియం నందు యుండుటనుబట్టి నేను ఆశ్చర్యపోవుచున్నాను. సహోదరుడు బ్రెన్హాం, నేను ప్రేమించిన వారిని నేను కూడా వచ్చి సంధించవలెనని వారు కూడా ఆనది అవతలి గట్టున నేను ప్రేమించువారు ఒకరు ఉన్నారని చెప్పుటకు ఎంతమంది ఇష్టపడుచున్నారు? ఒకవేళ అచ్చటకు వచ్చి వారిని సంధించెదనని నీవు వారికి వాగ్ధానము చేసి యుండవచ్చు. ఒకవేళ నీ తల్లి సమాధి యొద్ద ఆ దినమున నీ తల్లికి ఆఖరి వీడ్కోలు నీవు చెప్పినప్పుడు, ఒకవేళ నీ ప్రియమైన చిన్న చెల్లెలు లేదా నీ తండ్రి సమాధి యొద్ద ఆ దినమందు ఆఖరిగా నీవు వీడ్కోలు చెప్పి నేను మిమ్మల్ని వచ్చి సంధించెదనని నీవు వారికి వాగ్ధానము చేసియుండవచ్చును. అందుకొరకు నీవు ఇంకా సిద్ధపడి యుండని యెడల ఇదిగో ఈ తరుణమే. ఇదే మంచి అవకాశమని నీవు గుర్తెరిగి ఇప్పుడే దానిని నీవు చేయగలవా?
ముక్కలు ముక్కలుగా చెప్పిన ఈ ప్రసంగమునుబట్టి నన్ను క్షమించండి. కాని, స్నేహితులారా మీరు వాస్తవాన్ని గ్రహించలేదా! సమర్పించుకొనుట అనగా ఏమిటో నీవెరుగవా! జీవిత కథలో అదేమంత కష్టమైనది కాదు.
134
ఎంతమంది మీ చేతులను పైకెత్తి, ఇచ్చటకు నడుచుకుంటూవచ్చి ప్రార్థించుకొనుటకు ఇష్టపడుచున్నారు, “నేను ప్రేమించిన నా యొక్క ప్రియమైనవారిని వెళ్ళి సంధించాలని ఎంతమంది చెప్పుచున్నారు?” మీ చేతులను పైకి ఎత్తండి, ఈ జనులను మధ్యనుండి లేచి ఇచ్చటకు రండి. మీరు దానిని చేయుదురా? ఇంకా ఎవరైనా అందుకొరకు సిద్ధపడనివారు వుండినయెడల, అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాకా? అచ్చట వృద్ధుడైన ఒక వ్యక్తి వచ్చుచున్నాడు, ఇంకా అనేకులు వచ్చుచున్నారు. నీయంతట నీవు కదిలిరా, పైన వసారాలోయున్న జనులలో నీవు నీ ప్రక్కన వారిని దాటుకొని అలా ముందుకు కదిలిరమ్ము, లేదా అచ్చటే లేచి నిలబడుము. ఇప్పుడు ప్రార్థించుచుండగా నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పుచూ మీలో ఎందరు ఇష్టపడుచున్నారు. అవును అలాగే నీ కాళ్ళ మీద నీవు నిలబడుము అలాగే మంచిది. ప్రతీచోటా, ఆ అవతలి గట్టున నా ప్రియమైన తండ్రి వున్నాడు, నా ప్రియమైన తల్లి యున్నది, లేదా ఇంకా ఎవరో ఒకరు గలరు, నేను వెళ్ళి వారిని చూడాలి. ఆ సమాధాన స్థలమందు నేను వెళ్ళి వారిని సంధించవలయును అని చెప్పుటకు ఆశించువారు మీ కాళ్ళమీద మీరు నిలబడి, “దానిని నేను అంగీకరించుచున్నాను,” అని చెప్పండి.
135
అమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక! అచ్చట వెనుక వున్నవారు దేవుడు నిన్ను దీవించును గాక! ఆ పైన ఉన్నవారు దేవుడు నిన్ను దీవించును గాక! ఇక్కడ వున్న అయ్యా, ప్రభువు నిన్ను దీవించును. అవును అలాగే పైన వసారాలోవున్న వారు ప్రభువు మిమ్మల్ని దీవించును, చుట్టూ నిలబడండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇచ్చట మరియు మన హృదయాలలో కదలాడుచుండగా సమస్తము బ్రద్దలు చేయును గాక!
ఈ దినమున సంఘమును బద్ధలు చేయుటకు ఏది అవసరమై యున్నదో నీవు ఎరుగుదువా! మనము కుమ్మరి వాని ఇంటికి వెళ్ళవలసిన వారివలె యున్నాము. మన పెడసరమైన ఇంటిలో చేయబడిన వేదాంతతత్వము కొన్ని సమయములలో అంతగా బాగుండదు. మనకు ఇప్పుడు కావలసినదేమనగా ప్రాచీనకాలపు పద్ధతిలో యుండు బ్రద్ధలు చేయటము, మన హృదయములలో నిజమైన మారుమనస్సు, దేవుని నిమిత్తము సున్నితముగా లేదా మృదువుగా వుండుటకు మనకు అవసరమైయున్నది. ఇప్పుడు లేచి నిలబడుటకు సిద్ధపడినవారు ఇంతమందేనా?
మనమందరమూ ప్రార్ధన కొరకు మన తలలు వంచుదము.
136
ఓ, ప్రభువా, విశ్వాసముద్వారా నమ్ముచున్న మమ్మల్నందరిని నీతిమంతులుగా చేయుట కొరకై ప్రభు యేసును మృతులలో నుండి లేపి మరల తీసుకువచ్చినవాడా! ప్రభువా, మిమ్మల్ని అంగీకరించుటకు ఇప్పుడు ఎవరైతే లేచి నిలబడియున్నారో వారికి క్షమాపణను అనుగ్రహించమని నేను ప్రార్థించుచున్నాను. ఓ ప్రభువా,వారు మిమ్మల్ని తమ స్వంత రక్షకుడుగా, రాజుగా మరియు ప్రియమైన వాడుగా అంగీకరించారు, వారికొరకు నేను ప్రార్థించుచున్నాను. అవతలి గట్టున ఒకవేళ వారియొక్క తల్లి లేదా తండ్రి లేదా ఎవరైనా ఒకరు వచ్చి వుండవచ్చును. కాని ఒక విషయము బహునిశ్చయమైయున్నది, అదేమనగా అచ్చట వారి కొరకు ఒక రక్షకుడు వున్నాడని, ఆయన వారి పాపములను మన్నించి మరియు వారి అతిక్రమములన్నింటిని తుడిచి వేసి, మరియు ఆత్మలను గొర్రెపిల్ల యొక్క రక్తములో కడగబడినవై, ఇకమీదట వారు సమాధానముతో జీవించెదరు.
ఏదో ఒక మహిమకరమగు దినమున ఇవన్నియు సమాప్తమైనప్పుడు, మేమందరమూ ఏకముగా మీ యొక్క గృహమునందు వచ్చి కూడెదము. అచ్చట ఇక మీదట విడిపోని కుటుంబములుగా మా కొరకు అవతలి గట్టున ఎదురుచూచున్న మా ప్రియమైన వారిని మేము సంధించెదము. మేము వీరిని మీయొద్ద సమర్పించుచున్నాము. ప్రభువగు యేసు నామమున ఆమేన్.
137
దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరెచ్చట నిలబడియున్నారనే దానిని సేవకులు చూచుచున్నారని నేను ఖచ్చితముగా నమ్ముచున్నాను. ఇంకా కొద్ది నిమిషములలో వారు మీతో యుందురు.
ఇప్పుడు ఎవరైతే ప్రార్థనా అట్టలను పొందుకోబోవుచున్నారో, సహోదరుడు జిన్ మరియు లియో ఎచ్చటయున్నారు? వాళ్ళు వెనుక వున్నారా? ఇంకా కొద్ది నిమిషములలో వారు ఆ ప్రార్థనా అట్టలను ఇచ్చెదరు. ప్రార్థనా అట్టలు వెలుపల ఇచ్చెదరు, సహోదరుడు ప్రార్థన చేసి కూటమును ముగించెదరు. వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించుటకై కేవలము కొద్ది నిమిషముల తరువాత మరలా మనము ఇచ్చటకు వచ్చెదము. సరే మంచిది, సహోదరుడా!