క్రీస్తు యొక్క పోలికలు
VGR COUNT-191 ఆ మాటలను చెప్పుచున్నప్పుడు అది మీకు ఎంతో మధురముగా... ప్రభువు గృహములో ఉన్నందుకు నేనెంతగానో సంతోషించుచున్నాను. శ్రేష్ఠమైన స్థలము ఒక్కటి మాత్రమే గలదు. అదేమనగా క్రీస్తుతో ఉండుటయగును. అది నిజమే కదా? ఎప్పుడైతే అది... సమస్త కఠినమైన సమస్యలు, శోధనలు మరియు బాధలు గల జీవితము నుండి అవన్నీ తొలగిపోయి ఒక గొప్ప మహిమకరమగు రేపు అనే దినము వచ్చును. ఖచ్చితముగా ఆయనను మనము చూచెదమనే ఆ సమయము కొరకు మనము ఎదురు చూచుచున్నాము.
ఒకానొక దినమున, ఎవరో ఒకరు నా యొద్ద, “బ్రెన్హాం సహోదరుడా, ప్రభువు యొక్క రాకడ అతి సమీపమున ఉన్నది కదా?” అని అడిగిరి.
“నిశ్చయముగా నేను ఆ విధముగానే నమ్ముచున్నాను,” అని నేను చెప్పాను.
“మంచిది, దానిని చాలా కాలము నుండి నేను వింటున్నాను,” అని అతడు చెప్పెను.
“కాని ఒక దినమున ఆ మాటలు చివరిసారిగా వినే సమయము వచ్చును,” అని నేను చెప్పాను. గమనించారా, అది నిజము. ఎందుకనగా, ఏదోక దినమున ఆయన వచ్చును, అదెప్పుడైనా గాని నేను మాత్రము అందుకొరకు సిద్దపడి యుండవలెనని కోరుకొనుచున్నాను.
2
ఒక దినమున కొంతమంది వ్యాపారస్థుల సహోదరుల ఎదుట, ఆ న్యాయవాదుల ఎదుట మరియు అచ్చటున్న అనేకుల ఎదుట, వారిలో ఒకరు, “మీ జీవితములోని లక్ష్యం ఏమిటని,” నన్ను అడిగెను.
“నాకొక లక్ష్యం గలదు,” అని నేను చెప్పాను.
“అదేమిటది,” అని అతడు నన్ను అడిగెను.
“క్రీస్తు కొరకు ఆత్మలను రక్షించవలెను, అదియే నా లక్ష్యం,” అని నేను చెప్పాను. అంతేకాకుండా, నా యొక్క ప్రగాఢమైన వాంఛ ఏదనగా యేసుక్రీస్తు మహిమ పడుటను చూడాలనేది నా ఏకైక కోరిక, అందుకొరకే నేను జీవించుచున్నాను.
ఇప్పుడు ముప్పది-ఒక్క సంవత్సరములుగా దీనత్వముతో ప్రభువు కొరకు నేను పరిచర్య చేయుచూ, కొనసాగుచు, అదే నా సాక్ష్యమైయున్నందుకు నేనెంతగానో సంతోషించుచున్నాను. లక్షల కొలది సంవత్సరములు నేను జీవించినను, అన్ని సంవత్సరములు నాకు ఆయుషు ఉండినను, ప్రతీ నిమిషము ఆయన కొరకే జీవించాలన్నదే నా కోరిక. కావున నేను... నా జీవిత మార్గపు అంతమున ఇక నీవు పరిచర్య చేయుట చాలుయని ఎదోక దినమున నన్ను పంపివేయుదరని ఒకవేళ నేను ఎరిగినను, ఆయన కొరకు జీవించుటనేది ఎంత గొప్ప భాగ్యమది! ఆయన మిక్కిలి వాస్తవమైన దేవుడు మరియు ఎంతో మంచివాడు! ఆయన మరియు నేను ఏకముగా కూడి ప్రశాంతమైన వాతావరణమున సహవాసము చేయుచు ఏకాంత సమయము గడుపుట కంటే వేరేదియు దానికి సాటిలేదని నా జీవిత కాలమున ప్రయాణించిన ప్రయాణములన్నింటిలోను నేను కనుగొన్నాను. అది తప్ప వేరేదియు సాటిలేదని నేను కనుగొన్నాను. అంతకంటే మధురమైన సహవాసము వేరేదియు లేదు. వేరేదేనినైనా ప్రేమించినదానికంటే అదే ఏంతో ఘనమైనది. భార్య, పిల్లలు లేదా దేనినైనా గాని ప్రేమించు ప్రేమకన్న క్రీస్తును ప్రేమించు ప్రేమయే శ్రేష్ఠమైనది. అది ఏంతో శ్రేష్ఠమైనది.
3
ఈ వారమంతా ఈ ఉజ్జీవము కొనసాగుచున్న దానినిబట్టి మనమెంతో సంతోషించుచున్నాము. పర్నెల్ సహోదరుడు మరియు ఇంకా మిగిలిన వారందరూ కొన్ని గొప్ప ప్రసంగములను ఇచ్చట ప్రసంగించుటను విన్నాము. ఈ ఉజ్జీవము జరుగుచున్న ఈ సమయమున మేము నమ్ముచున్నదేమనగా... కొన్నిసార్లు ఉజ్జీవమును తప్పుగా అర్థము చేసుకొనెదరు. ఉజ్జీవము సంఘములోకి కొంతమంది కొత్తవారిని తీసుకొని వచ్చునని కొందరు తలంచెదరు. అలాగు కాదు. ఉజ్జీవము ఫలితములను ఇచ్చును. సంఘములో ఇదివరకే ఉన్న దానిని ఉజ్జీవము పునరద్ధరించును. అర్థమైనదా? దానినే అది తీసుకొని వచ్చును.
ఒకసారి సముద్ర తీరమున నేను నిలిచియుంటిని. దీనిని అనేకసార్లు మీ యొద్ద చెప్పానని నేను అనుకుంటున్నాను. కాని అది చాలా సంవత్సరముల క్రితము జరిగినది. నా జీవితములో నేను మొట్టమొదటిసారిగా చూచుచున్నాను... మంచిది, అదొక సముద్రము కాదు. అది మిచిగన్ చెరువు. ప్రపంచ సమావేశము అచ్చట జరుగుచున్నప్పుడు నేను మరియు హోప్ అచ్చట ఉన్నాము. అది 1922వ సంవత్సరమున జరిగినదని నేను నమ్ముచున్నాను. సహోదరుడా హిగ్గిన్ చికాగోలో జరిగిన ప్రపంచ సమావేశమును గూర్చి చక్కగా నాకు జ్ఞాపకమున్నది.
4
మొట్ట మొదటిసారి అంత పెద్ద చెరువును నేను చూచుట జరిగినది. ఆ దినమున దాని క్రీస్తు యొక్క పోలికలు ఒడ్డున నేను నిలబడి దానియొక్క గొప్పతనమును చూస్తూ అచ్చట నిలబడ్డాను. ఈస్టర్ ఉదయము, అందువలన వారికి అచ్చట సూర్యోదయమున ఆరాధన వుండెను. ఆటుపోటులతో ఆ గొప్ప అలలను చూస్తూండగా. ఓ, అది చూచుటకు ఎంతో సంతోషముగా ఉండెను. దానిని చూచుచుండగా, ఆలోచించుచుంటిని. “చెరువులో ఎక్కువగా నీళ్ళు లేనప్పటీకీ, అది అలాగే ప్రవాహముగా చక్కగా కదులుచుండెను. ఆ చెరువులో నీళ్ళు ఎంత ఉండాలో అంతే ఉన్నవి, దానిలో అంతకంటే ఒక్క చుక్క నీళ్ళు కూడ వచ్చి చేరవని మీరెరుగుదురు.” కాని “గాలి వీస్తూ ఎందుకు ఆ నీటిని కదుపుచూ దానిలో అలలు పైకి క్రిందికి వచ్చునట్లుగా చేయుచున్నది?” అని నేను తలంచితిని. ఆ గాలి చెరువులోవున్న చెత్తనంత త్రోసివేయును, గ్రహించితిరా! దానిలోనున్న చెత్తనంతా తీరమునకు నెట్టి శుభ్రపరచుట కొరకే ఆ అలలు కదులుచున్నవి.
పిదప నేను తలంచినదేమనగా, “ఆ చెరువులో జరుగుచున్న కార్యము ఒక ఉజ్జీవమువలె ఉన్నది.” అర్థమైనదా? దానిలోయున్న చెత్తంతా వెలుపలికి వెళ్ళువరకు గాలి నీళ్ళను కదలించుచూ పైకి మరియు క్రిందికి ఎగసి పడుతున్నట్లుగా చేయుచూ, అలా దానినంతటినీ కదిలించుచున్నది.
మరియు ఉజ్జీవము కూడా అదే విధముగానే ఉన్నది. ఆ ఉజ్జీవము మనలను ప్రభువు యొక్క ఆత్మలోకి నడిపించును, మరియు ఆనందములోకి నడిపించును, మన పొరపాట్లను సరిదిద్దును మరియు ఆయనకు ఇంకా సన్నిహితముగా నడుచునట్లు, మరలా మనలను సమర్పించుకొనునట్లు మరియు ప్రతిష్టించుకొనునట్లుగాను చేసి ఆ సరస్సు ఒడ్డున చేరిన కుప్పవలె మీలోవున్న ఈ లోకము యొక్క సమస్త కార్యములను మరియు సందేహములను ఆ సరస్సులోకి విసిరివేయునట్లుగా మనము చేయవలెను, చూచారా. అప్పుడు ఆ నీటిలో ఉన్నవన్నీ కొట్టుకొనిపోయి శుద్దమై, చక్కగా ప్రవాహించు ప్రవాహముగా అది యుండును. అంతేకాకుండా, అప్పటి నుండి ఆ జీవిత నావ దానిగుండా ప్రశాంతముగా కదులుచూ కొనసాగిపోవును. ఇక మీరు ఎక్కువగా దానిని గూర్చి చింతించనవసరము లేదు, ఎందుకనగా అడ్డుగా ఉన్న ఆ చెత్తంతా కొట్టుకొనిపోయి శుభ్రమై, అదెంతో చక్కగా ఉండును.
5
సరే, ఈ రాత్రి మిమ్మల్ని ఎక్కువ సేపు ఉంచాలని నేను కోరుకొనుట లేదు. ఇది సోమవారము రాత్రి, వారము యొక్క మొదటి రాత్రి. ఇది మనకొక ఉజ్జీవపు రాత్రి. మరియు ఉజ్జీవము ఈ విధముగా కొనసాగుచుండుటనుబట్టి నేనెంతో సంతోషించుచున్నాను.
నాకు చాలామంది స్నేహితులు గలరు. గత కొన్ని వారములలో కొన్ని స్వప్నములు కనినవారిని, వాటిని నాతో చెప్పిన జనులను మరియు కొంతమంది సహోదరులను నేనిచ్చట చూడగలుగుచున్నాను. వాటి అనువాదములు కొరకు ప్రభువు నాకు సహాయపడెను. మన మధ్యలో ఎవరు ఉన్నారో, ఎంతమంది అసలు పరిచయము లేనివారు వున్నారో, ఇంకా ఎవరెవరు వున్నారో నాకు తెలియదు. కాని స్వప్నములకు ఇప్పటికీ ప్రభువు అనువాదము ఇచ్చుచున్నాడు. అది వాస్తవముగా మరియు సంపూర్ణమైనదిగా ఉండును.
ఆయన యోసేపు కాలములో ఉన్న రీతిగానే ఇంకా మారని అదే దేవునిగా ఉన్నాడు. రాజు కలను కనినప్పుడు, ఆ కలకు భావమును యోసేపు చెప్పెను. అది ఖచ్చితముగా సరిపోయినది. వాటిల్లోని కొన్ని స్వప్నములు ఇంకా నేటికి కూడా అట్లే జరుగుతూ ఉన్నవి. వాటి ఫలితములు అలాగే ఇంకా కొనసాగుచునే వున్నాయి. నెబుకద్నెజరు దినములలో దానియేలు...
6
కొన్ని నిమిషముల ముందు ఘనమైన, తగ్గింపుగల మన సంఘ కాపరి ఈలాగు చెప్పెను... మంచిది, ఈ వారమున ఇంకా కొంచెము ఎక్కువగా అతనికి సహాయపడాలని నన్ను అడుగుటకు అతడు ఇష్టపడలేదు. ఎందుకనగా, “బ్రెన్హాం సహోదరుడా, నీవు చాలా అలసటగా ఉన్నావని నాకు తెలుసు, అయినా మేము ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నామని,” అతడు చెప్పెను. అవును, అది చక్కగా ఉండును.
మరియు ఆస్ట్రేలియాలోని, సిడ్నీ కూటములను నేను రద్దు చేయవలసివున్నది, ఎందుకనగా ఈసారి నేను అమెరికా సంయుక్త రాష్ట్రములను విడిచి వెళ్ళుటకు, వేరే కార్యములను చేయుటకు మరియు ఇంకానేక కారణముల వలన, నేను వెళ్ళుటకు అనుమతించే వీసా వారు నాకు ఇవ్వలేదు. కాబట్టి ఈసారి నేను వెళ్ళలేను. మరలా నేను ఎప్పుడు వెళ్తానో నాకు తెలియదు. కాని త్వరలో నేను వెళ్తాను.
కావున మేము ఆ కూటములను కొద్దిగా మార్చి ఏర్పాటు చేయవలసివచ్చెను, నేనిప్పుడు చికాగోకి వెళ్ళుచున్నాను. చికాగోలోని కూటమునకు వెళ్ళుచున్నాను. ఆ కూటములు అచ్చట జరుగునని వారు ప్రకటించిరి. కాని నాకు అది తెలియదు, ఆ సమయమున నేనచ్చట ఉండవలసియున్నది. ఫిజీ ద్వీపమున నేనుండవలెనని ఏర్పాటు చేసిరి. ఆ దీవులలోని అనేకమంది జనులు ఆ కూటమునకు వచ్చెదరని నాకు చెప్పిరి. కాని ఇప్పుడు అచ్చటకు నాకు వీసాను అనుమతించకపోవుటవలన ఆ కూటములలో నేను తీసుకోలేక పోవుచున్నాను. కాని త్వరలో నేను అచ్చటకు వెళ్ళెదను. వారు నా కొరకు ఎదురు చూస్తున్నారు.
7
నేను చికాగోలో ఉండెదను... జీన్, ఆ తేదీలను గూర్చి నీకు తెలుసా? ఆ కూటములను గూర్చి మరియు ప్రకటించిన ప్రకటన గూర్చి మీలో ఎవరికైనా తెలుసా? ఆ కూటములు ఎప్పుడో నాకు అసలు తెలియదు; కాని కొద్దిసేపు ముందే, “ది హెరాల్డ్ ఫెయిత్” అనే పత్రికలో నేను చూచాను. ఆ కూటములు ఈ నెల నాలుగు లేదా ఐదు తేదీలలో ప్రారంభమగునని నేను నమ్ముచున్నాను, లేదా ఆ తేదీలలో ఏదోకటి యుండును, లేదా అవి ఆ తరువాత ఉండవచ్చు, ఇప్పటి నుండి ఇంకో వారము, పది దినములలో ఉండవచ్చును.
నేనెన్నో శ్రమల క్రింద ఉన్నాను, కావున నేను మీ ప్రార్థనలను కోరుచున్నాను.
8
ఇప్పుడు, ఈ రాత్రి, నేనొక లేఖనమును చదువుటకు ఎన్నుకున్నాను, మీరు నాతో కలిసి చదవాలని ఆశించినయెడల, పరి. యోహాను పత్రిక 13వ అధ్యాయములో ఒక భాగమును చదువుదాము. మీ పరిశుద్ధ గ్రంథమును మీ దగ్గర ఉంచుకొని మనము చదువుచుండగా, నాతో చదువుటకు ఇష్టపడువారు చదువ...
ఈ రాత్రి ఈ కూటము ముగించిన వెంటనే ఇచ్చట ఒక వివాహపు. రిహార్సల్ జరుగనున్నది. ఈ కూటము ముగించి మనము వెళ్ళిపోయిన వెంటనే... కావున మనము కొంచెము త్వరగా ముగించుట మంచిది. త్వరగా కాదు గాని, వీలైనంతవరుకు ఈ భవనమును ఖాళీ చేసి ఇచ్చినయెడల యుక్తమగును. పిదప వారు ఆ వివాహపు రిహార్సలును చేయాలని కోరుకొనుచున్నారు. రేపు రాత్రి ఇచ్చట ఒక వివాహము జరుగబోవుచున్నది. ఈ మందిరమునకు వస్తున్న మన సహవాసములోయున్న ఇద్దరు పిల్లలు రేపు రాత్రి వివాహము చేసుకోబోవుచున్నారు. మీకందరికి వారు తెలుసు. మన ప్రియమైన సహోదరుడు డేవిడ్ ఉడ్, మెర్లిన్ జెఫెరీస్ ఆరాధనకు ముందు రేపు రాత్రి ఈ మందిరములో వివాహము చేసుకోబోవుచున్నాడు. కావున ఆ వివాహము కొరకు ముందుగా ఆ రిహార్సల్ చేయబోవుచున్నారు. అదొక అధికారికగాముగా జరుగబోదు; కాని రేపు రాత్రి జరగబోవు వివాహమునకు కొరకు రిహార్సల్ అయి ఉండును.
9
ఇప్పుడు, ఆయన వాక్యమును చదువుటకు ముందుగా మనము ప్రార్థించెదము. తండ్రియగు దేవా, మేమెంతో భయభక్తులతో మీ సన్నిధికి వచ్చుచుండగా, ముందుగా మా సమస్తమునకు చాలునంత నామమగు యేసు నామమును మేము పట్టుకొని, మీరు మా ప్రార్థనను ఆలకించెదరనే నిశ్చయత మాకు గలదు. ఎందుకనగా, “మీరు నా నామమున తండ్రిని ఏది అడినను, దానిని నేను చేతునని,” ఆయన చెప్పెను. కావున, క్రైస్తవ విశ్వాసులుగా మా హృదయములు మమ్మల్ని దోషులుగా తీర్చనియెడల, అప్పుడు మా విన్నపములకు దేవుడు జవాబును ఇవ్వగలడని ఎరిగినవారమై ధైర్యముగా మీ కృపా సింహాసనము యొద్దకు మేము రాగలము.
మా తప్పిదములను మేము ఒప్పుకోలుగా ఒప్పుకొనుట ద్వారా మా జీవితము మీకు సంతృప్తికరముగా ఉండునట్లు మరియు మమ్మల్ని క్షమించు ఆయన నీతిని బట్టి, మా కోరికలు ఈ రాత్రి నెరవేరునట్లుగా మేము ప్రార్థించుచున్నాము. మరియు ప్రభువా, మా గొప్ప వాంఛ ఏదనగా, మీ మహా కృప మాపై కుమ్మరింపబడుటను మేము చూడగలుగుదుము గాక. ఆ కృప మా పాపములను క్షమించుచూ మరియు మా మధ్యనున్న రోగులను స్వస్థపరచును. అంతేకాకుండా, ఒక బయలుపాటు గాని లేదా ప్రవచనము గాని లేదా మీ సంఘమునకు మీరు దేనినైతే చెప్పాలని ఆశించుచున్నారో దానిని మీరు మాతో మాట్లాడుదురు గాక. మా హృదయములు మీ ఆత్మతో నింపబడిన పాత్రలుగా ఉండును గాక. ఈ రాత్రి ప్రాముఖ్యమైన ఆ కేంద్రముతో సన్నిహిత సంబంధమును కలిగినవారమై తద్వారా పరిశుద్ధాత్మ మా హృదయములలో మాట్లాడి మరియు ఆయన సన్నిధిలో మహిమను పొందుకొనుదుము గాక.
10
ప్రభువా, ఇప్పుడు, రోగులందరి కొరకు మరియు అవసరతలోవున్న వారందరి కొరకు మేము ప్రార్థించుచున్నాము. ఇచ్చట వచ్చుటకు ముందుగా మా కార్యదర్శి నా బల్లపై ఈ రెండు రోజులలో దేశము యొక్క పలు ప్రాంతములలో బాధలతోను, మరణావస్థతోను, అత్యవసర స్థితిలోనున్నవారి ఎన్నో పేర్లును పొడుగుగా వ్రాసియిచ్చెను.“ ఈ పేపరులో వ్రాసియున్న ప్రతీ పేరు మీద నా చేతి వ్రేలును ఉంచి నేను ప్రార్థించుచుండగా, ఓ, దేవా, ఈ రాత్రి ఈ సంఘములోనున్న వారితో కలిసి మీ కృపను మరియు దయను ఈ ఒక్కొక్కరి కొరకు నేను బ్రతిమాలుకొనుచున్నాను. వారిలోనున్న ఒక్కొక్కరిని గూర్చి మీరెరుగుదురు. అంతేకాకుండా, వారియొక్క అవసరత ఏమిటో మీరెరుగుదురు.
ఈ రాత్రి గృహములలో ఉంటూ కోలుకొనుచున్న వృద్దులను మరియు బలహీనులను, ప్రభువా, మేము మరచిపోలేము. ఓ, ప్రభువగు దేవా, వారిలో అనేకులు మీ రక్తము ద్వారా కడగబడిన మీ పిల్లలై యున్నారు. ఓ, మేము వృద్దులగుచుండగా, మా ప్రియమైనవారు మమ్మల్ని మరచిపోతున్న తరుణములో మాకు ఒకే ఒక్క ఆదరణ గలదు. అదేదనగా, దేవుడు మమ్మల్ని ఎన్నడు మరువడు. మా క్రియలన్నీ జీవగ్రంథమందు నమోదు చేయబడియున్నవి. అవి ఎన్నడూ దేవుని సన్నిధిలో ఉండును. ప్రభువా, ఈ రాత్రి మేము వారికొరకు బ్రతుమాలుచున్నాము.
మా దేశము కొరకు మీ యొద్ద కనికరమును కోరుచున్నాము. ఎవరైతే పాపమును చేయుచున్నారో, తప్పిదములను చేయున్నారో, మద్యంపాన శాలలో మద్యమును త్రాగుచూ దాని మత్తులో ఉన్నారో మరియు పాపము యొక్క పలు రకముల కార్యములలో నిమగ్నమైయున్నారో, ప్రభువా, వారికొరకు మేము మీ యొద్ద క్షమింపగల కృపను వేడుకొనుచున్నాము. మీరు మా భారములను మోయువాడవైనందున ప్రభువా, మా హృదయములు మీ ప్రేమతో మిక్కిలిగా నింపబడియుండును గాక. మీకు సేవ చేయుటయే మా యొక్క లోతైన హృదయ వాంఛ. రక్షింపబడినవారిని చూచుటయే మా కోరికైయున్నదని మేము ప్రార్థించుచున్నాము. చదువుచున్న వాక్యమును మరియు మేము చేయుచున్న సమస్తమును ఆశీర్వదించుము. నమ్రతతో మా తలలను వంచి, మీకు కృతజ్ఞతలను తెలుపుచున్నాము. దీనిని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.
11
ఇప్పుడు, పరి. యోహాను 13వ అధ్యాయమునకు త్రిప్పుదాము. దానిలోని ఒక భాగమును మనము చదువుదాము:
తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్ళవలసిన గడియవచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై, లోకములోనున్న తన వారిని ప్రేమించి, వారిని అంతము వరకు ప్రేమించెను.
వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించియుండెను,
గనుక, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవునియొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవునియొద్దకు వెళ్ళవలసివున్నదనియు
యేసు ఎరిగి, భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి యొక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను.
అంతట పళ్ళెములో నీళ్ళు పోసి శిష్యుల పాదములు కడుగుటకు, తాను కట్టుకొనివున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను.
ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురుయొద్దకు వచ్చినప్పుడు, అతడు - ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను.
అందుకు యేసు - నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యిక మీదట తెలుసుకొందువని అతనితో చెప్పగా.
చదువబడిన వాక్యమునకు ప్రభువు తన ఆశీర్వదములను చేర్చును గాక.
ఈ రాత్రికి నేను తీసుకొనబోవు అంశము కొద్ది సమయము కొరకు నేను తీసుకొనుచున్నాను, ఆ అంశము: “క్రీస్తు యొక్క పోలికలు.” నేను దీనిని అంశముగా తీసుకొనవలెనని కోరుచున్నాను. దీనియొక్క హేతువు... ఒక క్రైస్తవుడగుటకు ఏది అవసరమైయున్నది?
12
దాదాపుగా ఇదొక సువార్తకుడు ప్రసంగించుటకు తగిన అంశము కాదని నేనెరుగుదును. అయినా, ఇది సువార్తకుని ప్రసంగ అంశముగానే వున్నది. ఎందుకనగా, సంఘమనేది ఎలాంటి పురోగతిలో సాగిపోవుచున్నదో దాని యొక్క లోటు పాటులను ఎరుగకుండా అదెన్నటికీ ముందుకు సాగిపోలేదు. ఏదోక విషయమున ఎవరైన సాగిపోవాలనుకుంటే లేదా అసలైన దృఢ విశ్వాసమును కలిగియుండుటకు మొదట వారెచ్చట నిలబడియున్నారో మరియు వారు దానియందు నిలిచిన తరువాత వారేవిధముగా దానియందు నిలకడగా నిలచియుండవలెనో ఎరుగవలసియున్నదని నేను నమ్ముచున్నాను. అదే ప్రాముఖ్యమైనదని నేను నమ్ముచున్నాను. మీరు దేనిలో దూకుచున్నారో ఎరుగకుండా, తెలియని ఏదోక విశ్వాసమందు మీరు తలక్రిందులుగా దూకకూడదు. అదేమిటో దానిని గూర్చి ఎరుగవలయును.
కావున మన విశ్వాసము సరియైన దానియందు అమర్చబడి మరియు సరియైన స్థానమున ఉన్నయెడల, అప్పుడది ఒక స్థిరమైన సంతృప్తినిచ్చును.
13
దీనిని ఒక స్త్రీని ఉదాహరణముగా తీసుకొని చెప్పవచ్చును. ఆమె వివాహము చేసుకొనిన తరువాత, ఆమె తన మొదటి శిశువును కౌగిలించుకొనుటకు ఆత్రుత పడుచుండును. దానిగూర్చి ఆమెకు ఏమియు తెలియకపోయినను అందుకొరకు ఆమె వేచియుండును. కాని ఆమె దానినిగూర్చి ఎంతగానో ఊహించుచు ఎదురుచూచును. కాని దానికి వెనుక, నిర్ణీత కాలములో ఆమె ఒక శిశువును కనలేకపోయినయెడల, తాను తల్లిని కాలేనేమోననే భయము ఆమెను ఆవరించును. కావున ఒక శిశువును కనలేని స్థితికి ఎంతో దూరముగా ఆమెను త్రోసికొనిపోవును, అనగా ఇక ఎన్నటికీ బిడ్డలు జన్మించరనే స్థితికి ఆమె వచ్చును.
ఈ దినములలో కోల్పోయిన ఆ స్థితి నుండి దానికి బదులుగా ఒక కార్యమును వారు చేయుచున్నారు. అది ప్రతీ కాలములోను జరుగుచునేవున్నది. ఒక స్త్రీ ఒక శిశువుకు జన్మను ఇవ్వలేనియెడల లేదా తాను గర్భము ధరించుటకు పరిస్థితిలేదని ఆమె ఎరిగినప్పుడు, ఒక శిశువును తనకొరకు దత్తను చేసుకొనును. కాని ఆ తర్వాత ఏమి సంభవించుననగా, ఆమె గర్భమును ధరించి తానే ఒక స్వంత బిడ్డను కనును.
అది ఆ విధముగానే జరుగుచున్నదని, ఈ విషయము పది మందిలో తొమ్మిది మందికి ఆ విధముగానే దత్త తీసుకున్న పిదప తాము గర్భమును ధరించి బిడ్డలను కనుచున్నారని రుజువైనది. ఎందుకనగా, “ఓ, నేనిక బిడ్డను కనలేనేమో” అనే ఆలోచన మిక్కిలిగా ఒత్తిడి చేయుటవలన అది జరుగుచున్నది. కాని దత్త చేసుకొనుటనేది ఏదో కొంతవరకే తృప్తిని ఇచ్చును. మరియు ఆ స్థితిలోవున్న స్త్రీకి దేవుడు కల్పించిన ఒక మార్గముగా అది ఉండవచ్చునేమో, కాని ఆ తరువాత ఆమె తన స్వకీయ బిడ్డను పొందుకొనుచున్నది, ఎందుకనగా ఒక బిడ్డను దత్తను తీసుకున్న పిదప ఆమెలోవున్న భయము మరియు అందుకొరకు ఊహించుచూ ఎదురుచూచే కార్యములు చివరకు ఆమెను వదిలి పోవుటవలన అది జరుగుచున్నది.
14
అలాగే స్వస్థతను పొందుకొన్నను వారి విషయము కూడా దృశ్యరూపమున చూచే ఒక చిన్న రుజువును వారు చూచినయెడల దానిని పొందుకొనెదరు. ఏలీయా గెహాజీతో చెప్పినదానివలె... “అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదని,” గేహాజీ చెప్పెను. కాని ఏలీయా, విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నదని,“ చెప్పెను. అనగా అతడు రుజువును చూచెను.
అందుచేతనే, “దేవుడ్ని స్తుతించుచూ వెళ్ళుము,” అని నేను జనులతో అనేకసార్లు చెప్పెదను. అర్థమైనదా? ఎందుకనగా, అది దత్తతను చేసుకున్న బిడ్డవలెయున్నది. ఎందుకనగా, తాము స్వస్థతను పొందుకున్నామనే విషయము వారి ఆత్మలోకి వచ్చేంతవరుకు అది వారి శరీర సంబంధ జ్ఞానమై ఉండును. పిదప విశ్వాసము దానిని సరియైన రీతిలో క్రియ చేయుచున్నది.
మీరేమి చేయుచున్నారో మీరు ఎరిగి ఉండవలయును. మీరేమి చేయున్నారో దృఢ విశ్వాసమును మీరు కలిగి ఉండవలయును.
15
అందుచేతనే, “ఓ, క్రైస్తవుడనగా ఏమిటి?” అనే మాటను అనేకసార్లు మనము వినుచుందుము. కొంతమంది ఏదోక సంఘమున చేరేంత వరకే ఉందురు.
“క్రైస్తవుడనగా ఒక సంఘ సభ్యుడు, ఎవరైనా ఒకరిని తమ సంఘమందు చేర్చుకొనుటని,” ఎవరో చెప్పిరి. క్రైస్తవులందరూ దానిని చేయుదరని నేను నమ్ముచున్నాను. కాని అది క్రైస్తవత్వమని నేను నమ్ముట లేదు. అర్థమైనదా? ఒక క్రైస్తవుడు, తానొక క్రైస్తవునిగా మారిన తర్వాత తాను చేయునది అదియే. కాని మీరు దానిని చేయుటవలన దాని అర్థము అది కాదు, అది అతడిని ఒక క్రైస్తవునిగా చేయదు.
పిదప ఎవరో ఒకరు, “అలాగు కాదు, సంఘమునకు వెళ్ళుచూ, వారు ప్రకటించే సిద్దాంతములకు సేవ చేయుచు, సంఘము యొక్క బోధలకు మరియు ఆ కార్యములకు సద్భక్తిని కలిగియుండుట,” అని చెప్పిరి.
అంతేకాకుండా, ఒక సిలువను లేదా ఏదోక దానిని వారిపై ఉంచుకొనుటయే ఒక క్రైస్తవునికి ఆనవాలుగా యున్నదని ఇంకొకరు చెప్పుచున్నారు.
మరియు కొందరు ఈ విధముగా నమ్మేవారు గలరు, అనగా బహుశా వారు, ఒక క్రొవ్వొత్తిని వెలుగించుట లేదా ఏదోక రకమైన ప్రాయశ్చిత్తమును చేయుటయే ఒక క్రైస్తవునికి ఆనవాలని నమ్ముచున్నారు. కేవలము వారు నీటిలో మునగడము లేదా ఏదోక బలిని అర్పించుట లేదా సంఘమునకు ఏదోక మంచి కార్యమును చేయుట లేదా తమ ప్రక్కయింటి వారికి సహాయము చేయుట, ఒక విధవరాలికి వంట చేసుకొనుటకు బొగ్గులను కొనియిచ్చుట లేదా అనాధ పిల్లల కాళ్ళకు చెప్పులను కొనియిచ్చుట... అవి ఒక క్రైస్తవుడు చేయవలసిన కార్యములే. అయినా గాని ఆ క్రియలేవియు వారిని ఒక క్రైస్తవుడిగా చేయవు.
16
మరొకరు తన కారులో క్రీస్తు ఫోటోను పెట్టుకొనుట లేదా తన గృహమున గొడమీద క్రీస్తు ఫోటోను తగిలించుట, అదొక క్రైస్తవునికి ఆనవాలుగా ఉన్నదని చెప్పుచున్నారు. మంచిది, వారి కార్యములన్ని మంచివే, కాని క్రీస్తు ఫోటోను మీరు గృహమున తగిలించుకొనుట వలన నీవు ఒక క్రైస్తవుడవనేది నేను నమ్మను. నీలో క్రీస్తు యొక్క పోలికలను నీవు కలిగియుండుటయే నిన్ను ఒక క్రైస్తవునిగా చేయుచున్నదని నేను నమ్మెదను. బాహ్యముగా మనము చేయు క్రియలు కాదు. మీ అంతరంగములో జరిగే కార్యమే మనమేమైయున్నామనే దానిని అది వెల్లడిపరుచును. అలాగే, ఆయనే మన పోలికైనయెడల, మనము ఆయనవలెనే ఉండవలెను. మరియు మనము ఆయన శరీరము యొక్క సభ్యులమై, ఆయన పోలికలను కలిగి, ఆయనవలే ఉండవలెను. అప్పుడు మన జీవితములు క్రీస్తు యొక్క పోలికను ప్రతిభింభించును. సంఘములో సభ్యునిగా చేరుట కాదు, లేదా సిలువను మనము తగిలించుకొనుట కాదు, లేదా ఉద్రేకము కలిగియుండుట కాదు. కాని జీవించుచున్న దేవుని యొక్క జీవపు సన్నిధిని మన జీవితము ద్వారా మనము ప్రతిభింభించుచూ ఉండవలెను.
17
బంగారమును కరిగించుటకు పూర్వకాలములలో బంగారములోని లోహములను బయటకు తీయుట కొరకు ఇనుమును మరియు గంధక రాయిని ఉపయోగించెదరని ఆ అధికారులు నాతో చెప్పిరి. ఆ గంధక రాయి అసలైన బంగారమువలె చాలా దగ్గర పోలికను కలిగియుండును. ఇప్పటికీ దానిని నకిలీ బంగారమని పిలిచెదరు. కాని దానినుండి బంగారమును బయటకు తీయుటకు ఉపయోగించు పద్దతి ఏదనగా, ఆ బంగారములోని లోహములన్నీ వెలుపలకు వచ్చువరకు దానిని సుత్తెతో కొట్టెదరు. ఇండియన్లు ఆ పద్దతిని ఉపయోగించేవారు. అనగా కంసాలి ఆ పద్దతిని ఉపయోగించును: దానిని తన సుత్తెతో కొట్టుచూ, అటుయిటు దానిని త్రిప్పుచూ కొట్టుచుండును. దానిలో నుండి ఇతర లోహములు బయటకు వచ్చువరకు దానిని అలాగే కొట్టుచూ ఉండును. ఇక దానిలో ఏ లోహము లేకుండా అది శుద్ద సువర్ణముగా మారినదని ఎప్పుడు తెలుసుకొందురనగా ఆ సువర్ణములో కంసాలి తన ముఖము ప్రతిబింభించువరుకు దానిని అటుఇటు త్రిప్పుచూ సుత్తెతో కొట్టుచుండును. అంతేకాకుండా, తన ముఖము దానిలో ప్రతిబింభించుచూ, దానిలో తన ముఖమును చూచుకుంటూ క్షారము చేసుకొనేంతగా, ఆ కంసాలివాడు తన స్వకీయ స్వరూపము దానిలో ప్రతిబింభించేంత వరుకు దానిని కొట్టును.
అలాగే దేవుని యొక్క పరిశుద్ధాత్మ తన సువార్తయనే సుత్తెతో మనలను కొట్టుచున్నప్పుడు, ఈ లోక కార్యములన్ని మనలో నుండి పోయేంతవరకు ఆయన మనలను కొట్టుచూ మరియు ప్రభువగు దేవుని యొక్క పోలికను మనము ప్రతిబింభించువారుగా మారెదము. అప్పుడు మనము క్రైస్తవులగుదుమని నేను విశ్వసించుచున్నాను. “క్రైస్తవుడు,” అనే పదమునకు అర్థమేమనగా, “క్రీస్తు-వలె,” మరియు ఆయనను ప్రతిబింభించుట.
18
ఇప్పుడు, అందుకని మనము పొడవైన గడ్డమును పెంచుకోవాలనే భావము కాదు, చిత్రకారులు చిత్రమునందు ఆ విధముగా చిత్రించుచున్నారు. అలాగే ఆయనకు భుజముల వరకు వెంట్రుకలు ఉన్నట్లుగా వారు చిత్రించుచున్నట్లుగా మనము కూడా అలాగే పొడవైన వెంట్రుకలు పెంచుకోవాలని దాని భావము కాదు, లేదా చిత్రములో వున్న విధముగా, ఆయన అంగీని ధరించిన విధముగా మనము కూడా అంగీని ధరించుట కాదు; ఎందుకనగా మనము వేరొక దినమున జీవించుచున్నాము. ఆయన బాహ్య శరీరమున ఉన్న ప్రకారముగా మనము అలాగే ఆయనవలె ప్రతిబింభించనవసరము లేదు; కాని మన ఆత్మలలో ఆయన ఆత్మ యొక్క పోలికను మరియు ఆయన జీవితము యొక్క వైఖరిని మనము ప్రతిబింభించి తీరవలయును.
అలాగే క్రైస్తవులు సంఘములలో చేరుట లేదా వారి సిద్ధాంతములను వెంబడించుటను నేను విశ్వసించను. మానవ శరీరమున యేసుక్రీస్తును ప్రతిబింభింపజేయుటను నేను విశ్వసించెదను. మనము ఆయన శరీరమున సభ్యులమైయున్నాము. లేఖనము చెప్పుచున్నట్లుగా, మనము ఆయన పోలికను ధరించికొనియున్నాము.
ఇప్పుడు, ఆయన ఏ విధమైన పోలికను కలిగి ఉన్నాడు? ఆయనేదో ఒక గొప్పవానిగా ఉండటానికి రాలేదు. ఆయన గొప్పవాడే, అయినప్పటికీ, ఆయన ఒక సామాన్యమైన సేవకునివలె వచ్చెను. తనకు సేవ చేయుంచుకోవటానికి ఆయన రాలేదు, కాని ఆయనే స్వయముగా సేవ చేయుటకు వచ్చెను. ఈ రాత్రి మన పాఠ్యభాగము ఆయన ఏమైయున్నాడనే దానిగూర్చి ప్రతిబింభించును. నా అంచనా ప్రకారముగా అది ఆయనను మహోన్నతునిగా చేయుచున్నది. అవును, ఆయనే నిత్యమునకు దేవుడైయున్నాడు. ఈ ఆకాశములను మరియు భూమిని సృష్టించినవాడు ఆ దేవుడే. మరియు ఆయన ఈ భూమిపైకి వచ్చినప్పుడు, అతి నీచమైన స్థానమును ఆయన తీసుకొనెను. ఎవ్వరూ కోరుకొనని, అసలు కోరతగని పనియగు పాదములను కడుగు ఒక సేవకుని పనిని ఆయన కోరుకొనెను.
19
పూర్వకాలములలో తూర్పు దేశములందు ఉన్న పనివాళ్ళందరిలోను ఇతరుల కాళ్ళను కడుగు పనివానికే మిక్కిలి తక్కువ జీతమును ఇచ్చెదరు. ఆ దినములలో ప్రధాన రహదారులలో జంతువులతో పాటు ఆ మార్గమున ఉండు చిన్న మార్గముల గుండా వారు కూడా నడుచుకుంటూ వచ్చెదరు. కావున జంతువులు ప్రయాణించి ఆ మార్గమున వెళ్ళుటవలన ఆ మార్గమంతా దుర్గంధముతో నిండియుండును. మరియు దుమ్ము, ధూళి ఎగురుటవలన వారి కాళ్ళు, మరియు పాదములనిండా ధూళితో యుండును. అందుచేత వారిపై భయంకరమైన దుర్గంధము వుండును.
ఎవరినైనా ఒకరిని కలుగుసుకొనుటకు వచ్చినప్పుడు, ఆ దుర్గంధముతో అతడు వారిని కలువలేడు. రహదారిపైయున్న ధూళి మరియు చెమటవలన అతడి పై చెడు వాసన వచ్చును. గుర్రపు శాలయందు వచ్చు దుర్గంధమువలె అది యుండును. కాబట్టి, మొదటగా అతడేమి చేయుననగా, అక్కడ ఒక చిన్న ఆవరణమును కలిగి ఉండును. అది ఆహ్వానించు ఆవరణముగా ఉండును. అచ్చట అతి తక్కువ జీతమును తీసుకొను ఒక వ్యక్తి ఆ స్థలమున ఒక బానిసవలే నిలిచి ఉండును. అచ్చటకు వచ్చిన అతిధులకు బానిసవలేవుండు ఈ వ్యక్తి అతిధి యొక్క పాదములను కడిగి, అతనికి వేరొక జత చెప్పులను తీసుకొని వచ్చి అతడి పాదములకు తొడుగును. ఆ పాదములకు సరిపడు పాదరక్షలను అతనికి తొడుగును. ఆ తరువాత ఆ అతిధికి సుగంధ ద్రవ్య తైలమును పూయును. ఆ తైలము అతడికి పూసిన తరువాత అప్పుడు అతడు తన స్నేహితుని కలుసుకొనుటకు లోపలికి ప్రవేశించును. ఎందుకనగా ఇంతకు ముందు ప్రయాణము చేస్తూండగా దారి పొడుగునవున్న ధూళి, దుర్గంధము మరియు చెమటతో అతడు కంపుకొట్టుచూ ఉండెను. ఆ యజమానుడు తన దగ్గర పనిచేయు వారందరికంటే అతిధుల పాదములను కడుగువానికి చాలా తక్కువ జీతము ఇచ్చును.
మరియు పరలోకపు దేవుడు తన్నుతాను తగ్గించుకొని.... అన్నింటిలో గొప్పవాడు, అత్యంత తక్కువగా మారెను.
20
పేరుకు క్రైస్తవుడనని చెప్పుకుని ప్రతిబింభించే క్రైస్తవుడినిబట్టి నేడు ఎంత బేధముగా ఉన్నదో చూడండి. ఎంత బేధముగా ఉన్నది. అంతెందుకు, పేరుకు క్రైస్తవుడినని చెప్పుకునే వాడు కూడా నేడు సేవ చేయవలెనని కోరుచున్నాడు. ఓ, తానేదో ఒక గొప్ప వ్యక్తినని అతడు తలంచుటకు ప్రారంభించును. అదెంతటి బేధమును అతడి నుండి కలిగించుచున్నది... ఆయన ప్రతిబింభించవలెను. ఆయన సేవ చేయుంచుకొనుటకు రాలేదు కాని సేవ చేయుటకే ఆయన వచ్చెను. “మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెను.”
కావున, “నేను గొప్పవాడిని, కాని నీవు పనికిమాలినవాడవనే” విధముగా నవీన బాణిలో నేడు మన క్రైస్తవత్వము ఉండుటను మనము చూచుచున్నాము. ఓ, అది తప్పు. అలాగు ఉండకూడదు. మనము క్రైస్తవత్వమును తప్పుడు విధానమున ప్రతిబింభించుచున్నాము. ఆ విధముగా మనము చేయుటను దేవుడు ఇష్టపడడు. మనము “యేసువలె నేను ఉండవలెనని,” పాట పాడెదము. కాని మన హోదాని లేదా గర్వాన్ని తగ్గించుకునే పరిస్థితి వచ్చినప్పుడు మరియు ఆయనవలె మనము చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, మనకంటూ మనము ఒక హద్దును వేసుకొనుచున్నాము. ఆ విధముగా చేయుటవలననే తమను తాము వేరుచేసుకొనుటకు మానవుడు సంఘ శాఖలను ఏర్పరచుకొనిరి. లేఖనము చెప్పుచున్న ప్రకారముగా, వారిలో ఆత్మ లేకపోవుటయే కారణమగుచున్నది. “మేము ఈ ఈ సంఘమునకు చెందినవారము, అది పెద్ద సంఘము. అదొక మంచి సంఘము, మా సంఘ శాఖ చాలా పెద్ద సంఘ శాఖ అని,” తమను తాము ప్రత్యేకపరచుకొనుచున్నారు.
అది యేసువలె క్రియ చేయుట కాదు. అది ఆయన ప్రేమను మరియు ఆయన యొక్క వ్యక్తిత్వమును ప్రతిబింభింపజేయదు. వీధులలో తిరిగే వేశ్య యొద్దకు, బిక్షగాడి యొద్దకు, దేశదిమ్మరి యొద్దకు వంటి చాలా దీనుల యొద్దకు ఆయన వచ్చెను. వారితోపాటు ఆయన కూడా ఆ ధూళి మురికిలో ఉండెను. అదే క్రైస్తవ జీవితము. ఆయనను ప్రతిబింభించవలసిన విధానము అదే యగును.
21
ఓ, “ఆ దినములు గతించిపోయినవి,” అని జనులు చెప్పే మాటలను గూర్చి నేనెరుగుదును. అది గతించిపోలేదు. క్రీస్తు ఇప్పటికీ క్రీస్తుగానే ఉన్నయెడల, ఆయనలో యున్న ఆయన యొక్క ఆత్మ ఇప్పటికీ మీలో యున్న పరిశుద్ధాత్మగా ఉండినయెడల, అది మిమ్మల్ని కూడా ఆ స్థానమును తీసుకొను వెళ్ళునట్లుగా చేయును.
కాని నేడు, మనము భిన్నమైనవారమని మనలను గూర్చి మనము తలంచుటకు ప్రయత్నించుచున్నాము. “మనలో ఒకరియెడల ఒకరు ప్రేమను కలిగియున్నప్పుడు మనము ఆయన యొక్క శిష్యులమని మానవులందరు ఎరుగుదురని,” ఆయన ప్రార్థించిన ఆ ప్రార్థనకు అదెంత దూరముగా యున్నదో చూడండి. ఒకరియెడల ఒకరు ప్రేమను కలిగివుండుటకు బదులుగా, మనము ఒకరితో ఒకరు పోట్లాడుకొనుచున్నాము, మనము ఒకరిని ఒకరు ద్వేషించుకొనుచున్నాము. ఎందుకనగా, కొన్ని విషయములను మనము అంగీకరించలేకపోవుట వలననే. మరియు మనము బయటకు వెళ్ళి ప్రతి ఒక్కొక్కరిని నిందించుచున్నాము. అర్థమైనదా, మనము... అలాగు చేస్తు ఇప్పటికీ మనల్ని మనము క్రైస్తవులమని హక్కుతో చెప్పుకొనుచున్నాము. మేము పరిశుద్ధాత్మతో నింపబడినవారమని హక్కుతో చెప్పేవారే ఇలాగు ఇతర క్రైస్తవులను గూర్చి చెడుగా చెప్పెదరని నేనెరుగుదును. వాస్తవముగా వారు అటువంటివి చేయ్యకుండుట యుక్తమైనదైనను వారు వాటినే చేయుచున్నారు.
22
ఇప్పుడు సహోదర, సహోదరీలారా, మనము అటువంటి ఆత్మను కలిగివుండినయెడల, అసలు మనమింకా క్రైస్తవులమే కాదనే తలంపును మన మనస్సులో కలిగియుందుము. మనమెంతగా ఒప్పుకోలును కలిగియున్ననూ లెక్క లేదు; మనలో ఏదైతే గలదో అదే లెక్కలోకి వచ్చును. ప్రజలందరిని ప్రేమించే ప్రేమ మనలో లేకుండా మనము క్రైస్తవులము కాదు. ప్రజలతో మనము భిన్న అభిప్రాయమును కలిగియుండవచ్చు, కాని యేసు వారిని చూచి ఈలాగు చెప్పలేదు, “పరిసయ్యులగు మీరందరూ గమనించండి, మీరందరూ పాతాళమునకు వెళ్ళెదరు, దీనివలన, దానివలన మరియు ఇతర విషయములవలన పరలోకమునకు వెళ్ళుటకు మీకు అవకాశమే లేదు. అంతేకాకుండా, నీవు ఒక పరిసయ్యుడవు కాబట్టి, నీకు అవకాశము లేదు,” అని చెప్పలేదు. కాని ఆయన వారియొద్దకు వెళ్ళి, వారికొరకు ఆయన సేవ చేయుచు, వారికి ఆయన సహాయము చేసెను. సాధ్యమైనంత వరకు సమస్తము వారికి ఆయన సహాయము చేసెను.
కాని నేటి విద్యలు, సంఘ సభ్యత్వము వంటివి మరియు లోక కార్యములతో ఏకముగా కట్టబడి సంఘమున ఆత్మ సంబంధమైన కార్యములు ఉండవలసిన స్థానమున శారీరక సంబంధమైన తెలివితేటలను తీసుకొనివచ్చిరి. ఆత్మ ద్వారానే తప్పనిచ్చి వేరే దేనిద్వారా దేవుని యొద్దకు నీవు వెళ్ళలేవు. దేవుని యొద్దకు మానవుడు రాగల ఏకైక మార్గమేదనగా, అది కేవలము పరిశుద్ధాత్మ ద్వారానే రాగలడు. “మొదటగా తండ్రి ఒకనిని ఆకర్షించితేగాని ఏ మానవుడు నా యొద్దకు రాలేడు,” అని యేసు చెప్పెను. క్రైస్తవులారా, అదెంత సత్యమైనదో అదంత వాస్తవముగాను యున్నది. ఈ రాత్రి ఒక చిన్న పుస్తకమును తీసుకొని దానిని మన హృదయములో ఉంచుకొని, ఇప్పుడు ఈ విషయములను పదిలపరచుకొందాము.
23
దీనిని ఆలోచించుదాము. ఓ, మాలో సమస్త జ్ఞానము ఉన్నదని కొంతమంది హక్కు కోరుచున్నారు. ఆలాగు చెప్పే వాళ్ళు మనయొద్ద గలరు, “ఇప్పుడు కొంచెము ఆగండి...” వారు పటభద్రులుగా, పరిశుద్ద తండ్రులుగా (Holy Fathers) వుండుటకు, ఇంకా అటువంటి వాటిని కలిగివుండుటకు వారు ఇష్టపడుదురు. కాని వీటన్నింటిని ఎరిగివుండి, మీరు సమస్త జ్ఞానమును కలిగియున్నను, ప్రేమించగల ఆత్మ మీకు లేనియెడల, అందువలన మీకు ఏ ప్రయోజనము లేదు. “నేను సమస్త జ్ఞానమును కలిగియున్నను ప్రేమలేనివాడనైతే వ్యర్ధుడను,” అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. అలాగే, “అటువంటి ఉజ్జీవ కూటమునకు నేను వెళ్ళను, ఎందుకనగా వారు విద్యలేని పామర జనులు, అటువంటి వారితో నేను ఏ సంబంధమును కలిగియుండను,” అని ఏవరైనా చెప్పిన, మనము కలిగియున్న జ్ఞానము మనకు ఏ మంచిని చేయగలదు? అసలు వారికి అ, ఆ, ఇ లు తెలిసినా లేక తెలియక పోయిన, దానితో ఏ సంబంధము లేదు గాని వారు నిశ్చయముగా క్రీస్తును ఎరుగగలరు.
చాలా క్రింద స్థాయికి వెళ్ళుటకు మీకు సాధ్యమవ్వదు. దేవుడు అటువంటి తగ్గింపు ఆత్మను నాలో ఎల్లప్పుడు ఉంచును గాక. అదెంతటి విషయమైనా ఫర్వాలేదు... చాలా క్రింద స్థాయియైనను, అతడేమి విశ్వాసించుచున్నాడో, అతడు దేనిని విశ్వసించుటలేదో, అదేమి సిద్దాంతమైనా, ఏ రంగైనా లేదా ఏదైనాగాని నా చేయిని చాచి అతనికి సహాయము చేయుటకే నేను ఇష్టపడుదును. నిశ్చయముగా, అటువంటి ఆత్మ నాలో ఉండవలెనని నేను కోరుకొనెదను. ఇతరులకంటే నేనెంతో బాగున్నావని నేనెన్నడు తలంచను. నా ఛాతీని ముందుకు చూపించుచూ, గర్వముతో నిలబడి, “నేను లోపలికి ప్రవేశించేటప్పుడు జనులందరూ లేచి నిలబడవలెను” లేదా “అందరికంటే నేనే గొప్ప కూటములను జరిపించుచున్నానని” చెప్పవచ్చును. నేను దేవుడు చేసిన బంక మట్టిని తప్ప వేరే ఏమైయుండగలను? నన్ను నేను తగ్గించుకొనెదను గాక. తద్వారా ఆయన యొక్క జీవితము నాలో నుండి ప్రతిబింభించవలెను. క్రైస్తవులందరూ ఆ విధమైన తలంపునే కలిగియుందురు గాక. జ్ఞానమనేది, నేను ఒట్టివాడిననే తగ్గింపు స్థానమునకు మనల్ని తీసుకొని వచ్చును.
24
ఒక ఉదాహరణకు, ఒక గూడు నిండా కానరీస్ (Canaries) అనే పక్షులు అచ్చట ఉండెను. ఆ గూడు ఈ మందిరమంతటి పెద్దది. ఒక చిన్న కానరీ పక్షి ఆ గూడులో నుండి పైకి ఎగురుచూ, “గౌరవనీయులారా, మీ అందరికీ నేనొక విషయము చెప్పాలని కోరుకొనుచున్నాను. మీ అందరికంటే నేను కొంచెము ఉన్నతమైనవాడిని. మీరు చూడండి, మానవులందరిని గూర్చి సమస్తమును ఎరిగిన నేనొక కానరీ పక్షిని.” ఓ, దానినినంతటిని నేను వివరించి చెప్పగలను. ఆ స్త్రీ ఈ గృహము గుండా నడచి వెళ్ళుటను నేను చూచితిని. పిల్లలు ఆడుకొనుటను నేను చూచితిని. వాటన్నింటిని గూర్చి నేనెరుగుదును. ఇప్పుడు, మీరందరూ నా మాటను ఆలకించండి,“ అని చెప్పెను.
ఆ పక్షి తనయొక్క చిన్న మెదడను ఉపయోగించి గర్వంగా మాట్లాడుచున్న ఆ సమయమున ప్రిన్సెటన్ విశ్వవిద్యాలయములో విద్యను అభ్యసించిన, వ్యాకరణములో మేధావియైన ఒక వ్యక్తి లోపలికి ప్రవేశించెను. ఆ వ్యక్తి తనకు గల వ్యాకరణ పాండిత్యముతో ఆ చిన్న కానరీ పక్షితో మాట్లాడుటకు ఆరంభించెను. ఆ చిన్న పక్షి తనకంతా తెలుసన్నట్లుగా అతడు చెప్పే మాటలకు తన తలను అటు ఇటు త్రిప్పుచున్నదని నేను ఊహించగలుగుచున్నాను. అదొక ప్రక్కనుండి ఆలకించుచూ మరల ఇంకొక ప్రక్కగా తన తలను త్రిప్పుచూ ఆలకించుచుండెను. కాని ఆ చిన్న పక్షికి ఈ వ్యక్తి దేనిని గూర్చి మాట్లాడుచున్నాడో ఏమి అర్థమవ్వలేదు. అయినప్పటికీ అతడు చెప్పుచున్న మాటలను ఆ చిన్న పక్షి ఆలకించుచు, అతడిని చూస్తు అతడి మాటలకు తలను ఆడించుచుండెను. కాని ఆ పక్షికి తనకు గల జ్ఞానముతో అదేమైనా చేయగలిగిందా? ఏమియు చేయలేకపోయెను. ఎందుకనగా, ఆ వ్యక్తి ఏమి మాట్లాడుతున్నాడో దానిగూర్చి ఆ పక్షికి ఏమియు తెలియదు. ఎందుచేత? అదొక కానరీ పక్షి, దానికెంత మెదడుగలదో అంతవరకే అది. దానికి మానవునికి గల మెదడంత మెదడు లేదు. ఒక కానరీ పక్షిగా తనకున్న తెలివెంతో అంతవరకే అది దానిని అర్థము చేసుకోగలదు.
25
ఆ విధముగానే మానవుడు కూడా. నీవెంతటి జ్ఞానవంతుడవైనా నేను లెక్క చేయను. మనము ఇప్పటకీ ఆ కానరీ పక్షివంటి మెదడనే కలిగియున్నాము, ఎందుకనగా మనము కేవలము మానవులముగానే ఉన్నాము. ఆత్మ ద్వారా, బయలుపాటు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారానే దేవుడిని ఎరుగగలము. మన శరీరసంబంధమగు తెలివి తేటలతో మనమెప్పటకీ ఆయనను అర్థము చేసుకోలేము. మీ జ్ఞానముతో మీరు మాట్లాడవచ్చు, కూటములలో జ్ఞానయుక్తమైన ప్రసంగములను చేయవచ్చు, మనస్తత్వ జ్ఞానముతో చాలా చక్కగా మాట్లాడాలని మీరు మాట్లాడినను జనులు దేవుడిని ఎరుగునట్లు చేయుటకు అదెన్నటికీ ఉపయోగపడదు. ఆ జ్ఞానముతో వారు దేవుడిని తెలుసుకునేలాగు చేయలేరు.
కన్నీటితో సమర్పించుకుని, ఒక చెంపమీద కొడితే ఇంకొక చెంపను చూపించే పాతకాలపు జనుల భక్తిని గూర్చి చెప్పి, దానిని మీరు వివరించవచ్చు. కాని క్రీస్తును తన జీవితములో ప్రతిబింభించే ఒక మనిషి మరియు తనను తాను తగ్గించుకొనిన వాడే ఒక క్రైస్తవుడగును. దేవునితో నడిచే ఒక మనిషి యేసువలె ప్రవర్తించును.
26
అయితే, మీరు చూడండి, ఆ చిన్న పక్షి దానిని అర్థము చేసుకోలేదు. అయినా దానిని అర్ధము చేసుకోగలనని అది తలంచెను - ఎందుకనగా దానిని అర్థము చేసుకునే విధముగా అది రూపించబడలేదు. మేధావియగు ఇతడి జ్ఞానముతో ఆ చిన్న పక్షియొక్క జ్ఞానముతో సరిపోల్చి చూడలేము.
ఆ విధముగానే మన జ్ఞానమును దేవుని జ్ఞానముతో సరిపోల్చలేము. మిక్కిలి మితమైన మన జ్ఞానముతో అనంతమైన జ్ఞానముతో ఏ విధముగా సరిపోల్చగలము, లేదా మిక్కిలి మితమైన జ్ఞానముగల మనము అనంతమైన జ్ఞానముగల ఆ దేవునితో మనము సరిపోల్చుకోగలమా? దేవుని యొక్క మహా గొప్ప అనంత జ్ఞానము ముందు మానవుని జ్ఞానము అసలు కంటికి కనబడలేనంత సూక్ష్మమైనది.
ఆ మానవుని మాటలను ఆ పక్షికి అర్ధమవ్వాలంటే దానికి గల ఏకైక మార్గమేదనగా అది తననుతాను సమర్పించుకొని, దానిని అంగీకరించి, ఆ మానవుడు దానినేమేమి చేయాలని కోరుకొనునో వాటన్నింటిని అది చేయవలసియున్నది.
27
మనము దేవుడిని ఎరుగుటకు గల ఏకైక మార్గమేదనగా, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును వెంబడించుటయే యుక్తమైనది. అదే పాత-కాలపు విధానమగును. అదే దేవుని ప్రణాళిక కూడా. అదెల్లప్పుడూ దేవుని ప్రణాళికగానే ఉండెను. అది ఎప్పుడూ దేవుని ప్రణాళికగానే ఉన్నది. “శక్తి చేతనైననూ, బలముచేతనైననూ గాక, నా ఆత్మ చేతనే ఇది జరుగునని ప్రభువు సెలవిచ్చెను.” దీనిలోనుండే అది వచ్చుచున్నది.
లాంగ్ ఫెల్లో అనే అతడు ఒకసారి ఈలాగు చెప్పెను: “విజయమును సాధించుటకు గల మార్గము ఏమిటనే విషయమును కనుగొని దానిని గూర్చి మాట్లాడుట యుక్తము, మాట్లాడిన ఆ విలువైన మాటలు యుక్తమైనవి, అట్లయితే వాటినట్లే పట్టుకొని ఉండుము.” నిశ్చయముగా. అలాగే ఏదైన ఒకదానిగూర్చి మాట్లాడబడుచున్నది, విజ్ఞాణ శాస్త్రముచేత నిరాకరించబడిన దానిగూర్చి ఏదైనా మాట్లాడియుండిన, అది యోగ్యమైనదైన యెడల దానిని అట్లే పట్టుకొని యుండుడి.
1872 వ సంవత్సరమున అమెరికా ఐక్యరాజ్యముల యొక్క వైద్య సంఘము స్నానపు తొట్టెల (bath tub)ను ఉపయోగించవద్దని చెప్పిన విషయమును మీరెరుగు దురా? అవి ఖచ్చితముగా అశుద్దమైనవని, వాటివలన వ్యాధులు వ్యాపించునని వారు చెప్పిరి. స్నానపు తొట్టెలు — చివరకు వారు అక్కడికి వచ్చిరి.
28
గొర్రెపిల్ల యొక్క రక్తమున కడుగబడుటయనే పూర్వకాల విధానపు సువార్తను గూర్చి మనమిప్పుడు మాట్లాడుకొనుచున్నాము. అది చూచుటకు పూర్వకాలపు విధానముగానే కనిపించవచ్చును. కాని అతి త్వరలో లేదా తర్వాతైనా వారు దాని యొద్దకు రావలసియున్నది. అదొక యోగ్యమైన విషయము. నీకున్న సమస్తముతో దానిని గట్టిగా పట్టుకొని వుండుము. రక్తముతో కడుగబడు మార్గము అదేయగును. అది మానవునిని శుద్ధీకరించును. మద్యము త్రాగుచూ, పొగను త్రాగుచూ, ఊరంత తిరుగుచూ, అన్నింటిని చేయుచు సంఘమునకు వెళ్ళుటచేత తమను క్రైస్తవులని చెప్పుకొనెదరు. కాని ఒక మానవ జీవితములో పరిశుద్ధాత్మ ఉండిన శుద్దమైన, నిష్కలమైన దేవుని కుమారుడగు యేసుక్రీస్తును అది ప్రతిబింభింపజేయును.
అందుచేతనే నేడు ప్రజలు నూతన జన్మ అనుభవమును నిరాకరించుచున్నారు. ఓ, నూతన జన్మంటూ వారు పిలిచే విధానములో వారు దానిని కలిగియున్నారు. అదెలాగుననగా, “సంఘ కాపరి యొద్దకు నేను వెళ్ళి, కరచాలనము చేసితిని,” అనే విధానముగా అది ఉన్నది. కాని అది నూతనముగా జన్మించుట కాదు. ఆ కారణము చేతనే వారు దానిని అంగీకరించరు. ఏదోక జ్ఞానయుక్తమైన మాటలను ఆలకించుటకే వారు వచ్చుచున్నారు. కాబట్టి వారు అటువంటి సంఘములలోకి వెళ్ళి చేరుచున్నారు. “ఒకడు క్రొత్తగా జన్మించితేనేగాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని,” దేవుడు చెప్పెను. నీవెంతటి మేధావియైనను దానికి సంబంధము లేదు, లేదా నేను చాలా మంచి క్రైస్తవుడనని నీవెంతగా హక్కు కోరిననూ నీవు మరలా నూతనముగా జన్మించి తీరవలయును.
“అట్లైతే బ్రెన్హాం సహోదరుడా, ఏదైనా ఒక చిన్న సంఘమునకు నేను వెళ్ళవలెనా?” అని నీవు అడగవచ్చు. దాని అర్థము అది కాదు. నీవు వెళ్ళి నూతన జన్మ అనుభవమును పొందుకొనవలెను. నీవు మరలా నూతనముగా జన్మించవలయును.
29
ఇదొక మిశ్రమ జనాంగ కూటముగా ఉన్నది. నేనొక దానిగూర్చి చెప్పబోవుచున్నాను. జననము అనగా ఏమిటి? గడ్డి పరకలమీద జన్మించిన జననమైననూ, లేదా నేలపై జన్మించిన ఒక జననమైననూ, లేదా వైద్యశాల గదిలో గులాబీ రంగు పట్టుతో అలంకరించబడిన దాని మీద జన్మించిన జననమైననూ, ఏదైనను అది రోతగానే ఉండును. దానిని మీరు అర్థము చేసుకోండి. అది నిజము.
ఆ విధముగానే నూతన జన్మ ఉండును. అది రోతగానే ఉండును. కావున దానిని అర్థము చేసుకోండి. కాని అది జీవమును ఉత్పత్తి చేయుచున్నది. ఆమేన్. అది జీవమును ఉత్పత్తి చేయుచున్నది. ఏ విధమైన జీవము ఉత్పత్తి చేయుచున్నది? అది సేవకుని జీవితము నుండి నిన్నునీవు తగ్గించుకొనేంతగా మరియు నిన్నునీవు పరిత్యజించునట్లు జీవమును ఇచ్చుచున్నది. అది అలాంటి జీవమగును.
“ఓ, కాని వారు ఏడ్చుచూ, బలిపీఠమందు బూ-హు అని కేకలు వేయుచూ మరియు అరుచుటను నేను చూచానని,” వారు చెప్పెదరు. నిశ్చయముగా. ఎందుకనగా, వారు జన్మించిరి, కావున చూచుటకు రోతగా వుండును. మీరు ఎచ్చటకు వెళ్ళినను నేను లెక్క చేయను. మీ ముఖముపై కన్నీళ్ళు కారుచూ ఉండవచ్చు, మీ కళ్ళు ఎర్రగా ఉండవచ్చు, ఆ బలిపీఠమును మీ చేతులతో కొట్టుచూ మీ చేతులు ఎర్రగా మారిననూ, అయితే అదొక జన్మించుటగును. అది ఏదోక కార్యము నీలో జరిగించి, అది నిన్ను ఒక సేవకునిగా చేయును, అది నిన్ను మలిచి నూతన జీవముతో నూతన సృష్టిగా మార్చి, నీకొక పోలికను ఇచ్చును. మీరు నూతనముగా జన్మించి పైకి లేచినప్పుడు, అది రోతగానే ఉండును, కాని నీవు మరలా జన్మించితివి. నీవెచ్చటవున్నాగాని దానితో ఏ సంబంధము లేదు. నూతన జీవమును ఉత్పత్తి చేయును. అదొక నూతన పోలికతో యుండు జీవమునిచ్చును. అది నీలోవున్న సేవకుడిని వెలికి తీసుకొని వచ్చును. పిదప నీవు దేవుని కొరకు సేవ చేయుటకు కోరుకొనెదవు. మనము ఒకరికొకరు సేవ చేయుచూ, ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండుటను యేసు ఇష్టపడును. మనము ఒకరికొకరము సేవ చేయుటయే మనము ఆయనకు సేవ చేయుటయగును.
30
ఇప్పుడు జ్ఞాపకముంచుకోండి. తన పై శ్రద్ద చూపాలని ఒక రోగి మాత్రమే కోరుకొనును. రోగి మాత్రమే తన కొరకు అలాగు కోరుకొనును. వారు తమపై శ్రద్ధ చూపాలని రూఢిగా కోరుకొనెదరు. మీరు ఒక ప్రసంగికుడిని చూచినప్పుడు... కేవలము ఒక ప్రసంగికుడి గురించి మాత్రమే కాదు గాని ప్రతీ సంఘ సభ్యుని ఉద్దేశించి నేను దీనిని చెప్పుచున్నాను. ఏమనగా, కొంత మంది, “నేను గొప్పవాడిని,” అందరూ నన్ను చూడండి అని అందరి దృష్టిని ఆకర్షించునట్లు చేయుదురు. అలాగు ఎవరైతే చేయుదురో, దీనిని గుర్తించుకోండి, వారు ఆత్మ సంబంధమైన ఒక రోగియగును. అందరి దృష్టి వారిపై ఉండాలని వారు ఆశించెదరు. అటువంటి వారికే దేవుని ఆత్మ యొక్క దృష్టి వారిపై యుండుట అవసరమైయున్నది. ఎందుకనగా “అందరికంటే నేను గొప్పవాడిని మరియు నీవు చాలా చిన్నవాడివి,” అనే తలంపు నుండి, వారియొక్క గొప్ప ఆలోచనల నుండి, వారియొక్క స్వార్థము నుండి, మరియు వారియొక్క ఉద్దేశ్యముల నుండి దేవుని ఆత్మ వారిలో నుండి తొలగించి వాటినుండి వారికి ఆత్మీయ స్వస్థతను అది అనుగ్రహించును. పరిశుద్ధాత్మ మన అందరినీ సమానముగా చేయుచున్నది. మిక్కిలిగా ఆత్మ సంబంధమైన రోగము — రక్తహీనత...
రక్తహీనత అనగా ఏమిటో మీకు తెలుసా? అదేమనగా, రక్తహీనతతో అసలు రక్తమే లేని రోగియని అది సూచించుచున్నది. వాళ్ళు సరిగ్గా నడువలేరు, వారెప్పుడూ ఇటూ-అటూ-ఇటూ తడబడుచూ అడుగులు వేసుకొంటూ వెళ్ళెదరు.
మన సంఘములోని అనేక సభ్యుల యొక్క పరిస్థితి నేడు అలాగే ఉన్నది. వారు రక్తహీనతనే రోగము గలవారు. కల్వరి యొక్క రక్తము వారిలోకి ఎక్కించవలసియున్నది. వారికి విలువైన రాజవంశ రక్తమును రక్త మార్పిడి ద్వారా అనుగ్రహించి, తద్వార వారిని పూర్వకాల విధానమున నడుచునట్లుగా, మరియు పరిశుద్ధాత్మ ద్వారా ముంచబడి దేవుని యొక్క మార్గమున వారు నడుచునట్లుగా చేయును. అది వారు జీవించుట కొరకు ఏదోక దానిని అనుగ్రహించును. తమ ప్రభువు యొక్క పోలికతో వారు నడుచునట్లు అది వారికి నమ్మకమును కలుగజేయును.
31
నా మట్టుకు, నేను ఎవరివలే ఉండవలెననే ఒక అవకాశము నాకు లభించినయెడల, నేను ఆయనవలె ఉండవలెనని కోరుకొనెదను. ఆయన ఒక గొర్రెల కాపరిగా ఉండుటకే వచ్చెను. అలాగే ఆయన ఒక గొర్రెల కాపరిగానే ఉండెను. ఒక కాపరి మందకు వెనుక వెళ్ళువానిగా ఉండును.
ఒక ప్రసిద్ది చెందిన చిత్రము, ఇచ్చట మన గోడల మీద అది లేదని నేను తలంచుచున్నాను. కానీ ఆ చిత్ర పటమును నా గదిలోవున్న గోడకి తగిలించి దానినే చూస్తూ ఉంటిని, దానిని చిత్రించిన చిత్రకారుని పేరు ఇప్పుడు నేను చెప్పలేను. దానిలో వున్నదేమనగా, ఆ గొర్రెల కాపరి తనకున్న వంద గొర్రెలలో ఒకటి తప్పిపోగా, తొంభై-తొమ్మిది గొర్రెలను వదిలి పెట్టి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కొరకు వెదకుటకు వెళ్ళును. అప్పుడు అతడేమి చేయుచున్నాడు? అతడు అచ్చటున్న అరణ్యములోకి వెళ్ళి దానినంతటా వెదికెను. చెట్లమధ్య వెదుకుచుండగా, ముండ్లువలన అతడు గాయమగును, అపాయములగుండా వెదుకుచూ వెళ్ళును. ఆ రాత్రంతా దానిని అతడు వెదకుచూ చివరకు కొండకు ఆ ప్రక్క ఒక చిన్న పొదలో అది చిక్కుకొని వ్రేలాడుచుండగా, ఆ కాపరి తన ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా అతడచ్చటకు వెళ్ళి, వ్రేలాడుచు కొండపై నుండి క్రింద పడిపోయే స్థితిలోయున్న ఆ గొర్రెను కాపాడి తీసుకొని వచ్చెను. పిదప తానే దానిని తీసుకొని క్రీస్తు యొక్క పోలికలు తిరిగి అచ్చటకు వెళ్ళును. వేరొక చిత్రకారుడు అదే చిత్రము తాను చిత్రించిన దానిలో ఆ కాపరి దానిని తన ఇంటికి తీసుకొని వెళ్ళునట్లుగా చిత్రించెను.
ఇపుడు, ఆ గొర్రెల కాపరి తన చెయ్యిని చాచి, ఆ గొర్రె యొక్క అడుగు భాగమున పెట్టి దానిని ఎత్తుకొని తనపై వేసుకొని వెళ్ళునట్లుగా అది కనబడును. కాని ఆత్మ ఆ చిత్రకారుని కుంచెమును పట్టుకొని ఏ విధముగా దానిని చిత్రించినదో మీరు గమనించితిరా? ఆ కాపరి, ఆ గొర్రెను తన చేతుల మీద ఎత్తుకోలేదు గాని, దానిని తన భుజముల మీద వేసుకొని ఎత్తుకొని వెళ్ళునట్లుగా చిత్రించెను.
32
ఒక కాపరి ఏ విధముగా తన గొర్రెల విషయమై శ్రద్దను కలిగియున్నాడో ఇప్పుడు మీరు గమనించవలెనని నేను కోరుచున్నాను. ఆ విధముగానే యేసు, ఆయన దెయ్యములను వెళ్ళగొట్టినప్పుడు దానిని దేవుని యొక్క వ్రేలితో వాటిని వెళ్ళగొట్టితినని ఆయన చెప్పెను. దెయ్యము మిమ్మల్ని ఇబ్బంది పెట్టుచుండినయెడల, దేవుడు చేయు ఏకైక కార్యమేదనగా, ఆయన తన చేతి వ్రేలితో వెళ్ళగొట్టుటకు ఆ దెయ్యము బహు అల్పమైనవాడు, దానిని ఆయన నీ నుండి వెళ్ళగొట్టును. ఒక గొర్రె ఇంటికి వచ్చినప్పుడు...
ఒక మనిషి యొక్క బలమైన భాగమేది? అది అతని యొక్క భుజములు. మీరు ఒక మనిషిని గమనించినయెడల, అతడి భుజముల భాగము పెద్దవిగా యుండును. ఆ భుజములపైనే అతడు బరువైన భారమును మోయును.
కావున ఆయన గొర్రెను ఎత్తుకొని, అది ఆయన భుజములపై చుట్టుకొనియుండగా, ఆయన దానిని తన భుజములపై వేసుకొని గంభీరముగా నడుస్తూ వెళ్ళును. దేవుడు తప్పిపోయిన ఒక చిన్నదానిని మరలా తీసుకొని వచ్చుటకు తన సర్వశక్తులను ఉపయోగించును. కాబట్టి దెయ్యమును నాశనము చేయుట చాలా సులభము. ఎందుకనగా, ఆయన దానిని కేవలము తన చిటికిన వ్రేలుతో పారద్రోలును. ఆయన ఒక కాపరి.
33
కనబడకుండా దారి తప్పిపోయి తిరుగుచున్న వాటిని కనుగొనుటకై కాపరి వాటిని వెదుకుచూ వెళ్ళవలెను. స్పష్టముగా చెప్పాలంటే, “పాష్టర్,” అనే పదముకు అర్ధమేమనగా, “కాపరి” అని అర్థము. కొన్ని సమయములలో సంఘములో ఒక మూర్ఖుడు లేదా సభ్యులు చిన్న గుంపులుగా ఏర్పడి సమస్యలు సృష్టించెదరు. ఒక గుంపు ఒక వైపు నుండి వెళ్ళును మరియు వేరొక గుంపు వేరొక వైపు వెళ్ళుటకు ప్రయత్నించును. ఒక నిజమైన కాపరి ఆ మూర్ఖుని యొద్దకు లేదా ఆ గుంపుల యొద్దకు వెళ్ళి, ఏమి చేయును? వారిని మరలా తీసుకొని వచ్చి మందలోకి చేర్చును. ఒక నిజమైన యదార్ధమైన సంఘ కాపరి ఏమి చేయును? వాటిని వెదుకుచూ అతడే బయలుదేరి వెళ్ళును. ఎందుకొరకు, అతడు వాటికొరకు వెదుకుచూ వెళ్ళును? తప్పిపోయిన వాటిని వెదకి మరలా మందలోకి తీసుకొని వచ్చుట కొరకు వెళ్ళును. అతడేమి చేయుచున్నాడు? ఆ ఆత్మను సంపాదించుటకై ప్రయత్నించుచూ, ఒక నిజమైన మంచి కాపరి యొక్క పోలికను అతడు ప్రతిబింభించుచున్నాడు. వారు ఏదోక స్థలమందు దారి తప్పిపోయినయెడల సహోదరుడా, ఒకే రాత్రిలో వారు ప్రపంచమునే చిన్నాభిన్నము చేయుదురు. వారిని సరిగ్గా క్రమములోకి తీసుకొని వచ్చుటకై ఆ సంఘ కాపరి తిన్నగా వారియొద్దకు వెళ్ళి, ఆ ఆత్మను సంపాదించి మరలా సరైన మార్గము వైపుకు త్రిప్పును. అతడే మంచి కాపరియై యుండును. అతడే యేసుక్రీస్తు పోలికను ప్రతిబింభించువానిగా ఉండును.
సహోదరుడా, అది మత భేధము అని నాకు తెలుసు, దానినే మూఢభక్తి అని కూడా అంటారు. కాని నేటి రాత్రికి నేనొక నిర్ణయమును తీసుకోవాలనే అవకాశము వచ్చినయెడల, ఆయనవలె నేను ఉండాలనేదే నా నిర్ణయముగా ఉండును. నా జీవితమున నాకేదైనా ఒకటి అవసరమైనయెడల, అది కేవలము ప్రభువగు యేసు యొక్క పోలికను ప్రతిబింభించునదిగానే ఉండును. అదే నా జీవితము.
34
నేను వెళ్ళుచున్నాను, రేపు రాత్రికి... ఈ వివాహమునకు తరువాత అరణ్యములోకి నేను వెళ్ళుచున్నాను. అచ్చట ఉండాలనేది నా ఉద్దేశ్యము, ఎందుకనగా ఇప్పుడున్న దానికన్నా ఇంకా దేవునికి దగ్గరగా నడువవలసియున్నదనే ప్రేరేపణ నా అంతరాత్మలో నుండి నాకు కలుగుచున్నది... ఏదో కేవలము నేను నడవాలని కాదు గాని... ఆయన ముందు చక్కగా నడుచుటకు నేను ప్రయత్నించెదను. అనగా ఆయనతో సన్నిహితముగా నడవాలనేదే నా కోరిక. బ్రెన్హాం గూడారము ఉజ్జీవమును కలిగియుంటే అదే సమయమున నామట్టుకు నేను కూడా ఆ ఉజ్జీవమును కలిగియుండాలని కోరుకొనుచున్నాను. కేవలము భవనములో మాత్రమే ఉజ్జీవము ఉండాలని నేను కోరుకొనుట లేదు గాని, అది నాలో సంభవించాలని నేను ఆశించుచున్నాను. ఆయనకు ఇంకా సన్నిహితముగా నేను నడువవలెనని ఆశిస్తున్నాను.
నాలో నుండి క్రీస్తును ప్రతిబింభింపజేయుటకై ఇంకా అత్యధికమైన పరిశుద్ధాత్మ నాలో నింపబడాలని నేను ఆశిస్తున్నాను. నేను ఆయనవలె ఉండాలని కోరుకొనుచున్నాను. ప్రతీ నిజ క్రైస్తవుడు ఆయనవలెనే ఉండాలనే కోరుకొనెదరని నాకు తెలుసు. అదే నా హృదయ వాంఛ; యేసువలే ఉండుట. ఆయనను నా యొక్క.. నేను ఆశించునదేమనగా, ఆయన నా యొక్క.. నేనేమై ఉండాలని నేను ఆశించుచున్నానో, ఆ మాదిరి ఆయనే. గమనించండి, ఆ మాదిరిని తీసుకొని ఆ పోలికగానే పరిశుద్ధాత్మ నన్ను చేయును గాక. పరిశుద్ధాత్మకు నన్నునేను సమర్పించుకొనుటయే నేను చేయగలిగిన యుక్తమైన కార్యమగును.
35
సెమినరీలయందు, మరియు ఎవరో ఏదో నాకు చెప్పాలనుకునే విషయములయందు నేను ఆసక్తి చూపను. సిలువ ఆకారములోయున్న ప్రతిమను ముద్దు పెట్టుకొనుట, లేదా హృదయాన్ని చీల్చి దానిగుండా సిలువను చూపించుట, లేదా మరణించిన వారికి ప్రార్థనలు చేయుటవంటి వాటిని నేను లెక్క చేయను. విల్లియం బ్రెన్హాంను పరిశుద్ధాత్మ అత్యధికముగా తన ఆధీనములోకి తీసుకొను ఆ ఒక్క విషయమున మాత్రమే నేను ఆసక్తిని కలిగియుందును. నాకు చెందిన సంఘముకంటే ఇంకా గొప్ప సంఘమున చేరుటయందు నేను ఆసక్తి కలిగిలేను. ఆ జ్యేష్ట పుత్రుడగు — జీవముగల దేవుని యొక్క నిజమైన సంఘమునకు నేను చెందినవాడిని. నేను దానిలో జన్మించితిని. నేనెవరినైతే ప్రేమించుచున్నానో, ఆ క్రీస్తుని ప్రతిఫలింపజేయుటకు నా జీవితములో ఇంకా అత్యధికమైన పరిశుద్ధాత్మను కలిగియుండాలని నేను కోరుకొనుచున్నాను. దానిని పొందుకొనుటకు అదెంతటి సమతలమైన స్థితియైనా లేదా ఏ స్థాయియైనా గాని దానిని గూర్చి నేను లెక్క చేయను. అందుకొరకు నేను ఇచ్చటకు వెళ్ళవలసినా, అచ్చటకు వెళ్ళవలసినా, మూఢభక్తిగల వాడినని చెప్పినా, పరిశుద్ద గుండ్రాయి అని పిలిచినా లేదా అదేమైనా గాని దానిగూర్చి నేను లెక్క చేయను; కాని నేనింకా ఎక్కువగా ఆయన యొక్క జీవితమును నా ద్వారా ప్రతిఫలింపజేయాలనేదే నా కోరిక. ఏ సరిసమమైన స్థితిలోనైనా వర్ధిల్లిచూ రావలనే విషయమున నాకు ఆసక్తి లేదు; పరిశుద్ధాత్మయందే నేను ఆసక్తిని కలిగియున్నాను. కాబట్టి ఆయన ఉన్నట్లుగానే ఆయనకంటే ఇంకా ఎక్కువగా నేనొక సేవకునివలె, ఒక దాసునివలె ఉండెదను. ఆయన ప్రభువు యొక్క దాసునిగా ఉండెను.
ఆయన తనకు సేవ చేయించుకొనుటకు లేదా పరిచర్య చేయించుకొనుటకు రాలేదు. తనకు సేవ చేయించుకొనుటకు ఆయన రాలేదు గాని, ఆయనే ఇతరులకు సేవ చేయుటకు వచ్చెను. ఆయన ఒక దాసుని స్థానమును తీసుకొనెను. పరలోకపు రాజు ఆ స్థానమును తీసుకొనినయెడల, ఆయన శరీరము యొక్క సభ్యులమగు మనమందరము కూడా అలాగే చేద్దాము. ఏదో వ్యత్యాసముగా ఉండుటకు కాదు గాని, ఆయన సన్నిధిలో మనల్ని మనము విధేయులుగా సమర్పించుకొనుటకై. దానిగూర్చి ఈ లోకము ఏమి చెప్పినా గాని లేదా లోక జ్ఞానముగల జనులు ఏమి చెప్పినా దానిగూర్చి అసలు పట్టించుకోవద్దు. అత్యధికమైన పరిశుద్ధాత్మను పొందుకొని, యేసువలె ఉండుము. విధేయులై, నమ్రతతో, అణకువతో ఉండండి. మీరు ఆయన స్థానమును తీసుకోండి, న్యాయతీర్పున ఆయన మీ స్థానమును తీసుకొనును.
36
ఒక్క నిమిషము మనము మన తలలు వంచుదాము. ఈ రాత్రి ఈ భవనములో వున్న ఈ మందిరము యొక్క సభ్యులు మరియు వేరే సంఘ సభ్యుల చేతులను నన్ను చూడనివ్వండి. ఈ సంఘమని నేను చెప్పినప్పుడు నా దృష్టిలో ఒకే ఒక్క సంఘము మాత్రమే గలదని భావము. అదేమనగా, నూతనముగా జన్మించిన సంఘమగును. అనగా జ్యేష్ఠపుత్రుని యొక్క సంఘము. ఈ లోకము యొక్క ఆత్మతో జన్మించినవాడు కాదు గాని, దేవుని యొక్క ఆత్మతో జన్మించిన యేసుక్రీస్తు యొక్క సంఘము. “దేవా, నన్ను యేసువలే చేయుము. నన్ను మలచుము, ఓ, దేవా,” అని చెప్పుచూ తమ చేతులను పైకెత్తే గుంపును నన్ను చూడనివ్వండి. మీ హృదయములను దేవుడు దీవించును గాక. “హిమము కంటే తెల్లగా ఉండునట్లు నన్ను కడుగుము.”
“ప్రభువా, నా జీవితము చిన్న, చిన్న వంపులతో మరియు మెలికలతో నిండియున్నది. పార్నెల్ సహోదరుడు, నెవిల్ సహోదరుడు, కోల్లిన్స్ సహోదరుడు చక్కని సేవకులు మరియు ఇంకానేక సహోదరులు ప్రసంగించిన ప్రసంగములను నేను కూర్చొని ఆలకించుచుంటిని. కాని ప్రభువా, నేటి రాత్రియందు నేను ఈ నిర్ణయమునకు వచ్చితిని. వారు నాకేమి చెప్పుచున్నారు? నేను గ్రహించునట్లుగా వారు నాకేమి చెప్పుటకు ప్రయత్నించుచున్నారు? నేను యేసువలే ఉండాలని నాకు చెప్పుటకు వారు ప్రయత్నించుచున్నారని చూడగలిగితిని. దానిని చేయుటకు నాకు వేరే మార్గము లేదు. నేనొక చిరుత పులిని. నాపై మచ్చలు గలవు. ఒకవేళ నేను వాటిని నాకినయెడల, ఆ నల్ల చుక్కలు ఇంకా ప్రకాశముగా కనబడును. అవి ఈ లోకమునకు ఇంకా బాగా స్పష్టముగా కనబడును.”
“ప్రభువా, నన్నునేను త్వజించునట్లుగా చేయుము. ఈ లోకమునకు అది ఏ విధమైన అసహ్యమైనదిగా కనబడినను దానిని నేను లెక్క చేయను. దేవుని యొక్క ఆత్మతో నేను మరలా జన్మించాలని కోరుచున్నాను. ప్రభువా, మీరు నాకు కావలెను. నన్ను ఈ రాత్రి మీ పరిశుద్ధాత్మతో నింపుము. నన్ను కడుగుము, శుద్ధీకరించుము. యేసుక్రీస్తు యొక్క రక్తముతో నన్ను శుద్దీకరించుము. ప్రభువా, నన్నునేను త్వజించి మిమ్మల్ని నాలో కనుగొనునట్లుగా నన్ను శుద్ధీకరించి మరియు నన్ను నింపుము.”
37
ఓ ప్రభువగు దేవా, ఆకాశములను మరియు భూమిని సృష్టించిన సృష్టికర్త, యేసు ప్రభువును మృత్యువు నుండి మరలా తీసుకొని వచ్చినవాడా, నిత్యజీవమైన దేవుని యొక్క ఉజ్జీవింపజేయు ఆత్మ ద్వారా ఆయనను తీసుకొని వచ్చినవాడా, మీరు నివసించిన ఆ శరీరమును లేపి మరియు దానిని పరలోకపు సింహాసనమునకు పైకి ఎత్తినవాడా... ఆయన ఈ భూమిమీదున్న అతి సామాన్యుల యొద్దకు, వేశ్య యొద్దకు వచ్చెను, మరియు అతి సామాన్యమైన దాసునిగా మారి, సామాన్యమైన పట్టనమునకు వెళ్ళితివి, నిరుపేదలైన అతి సామాన్యమైన జనులతో వ్యవహరించితివి, అల్పమైన పేరును పొందుకొనితివి, మరియు దరిద్రులకంటే మిక్కిలి దరిద్రునిగా మారితివి, ప్రకృతిలో వున్న వాటికైనా; పక్షులకు గూడులు గలవు, నక్కలకు బొరియలుగలవు, కాని తలవాల్చుటకు దేవుని కుమారునికి స్థలము లేకపోయెను. అయినను యధార్థమైన దాసునిగా ఉజ్జీవింపజేయు శక్తి ఆయనను గౌరవించునట్లు, మనకు ఒక మాదిరిగా ఉండునట్లు ఆయన తనను ఒక దాసునిగా చేసుకొనెను. ఆ జీవింపజేయు శక్తి ఆయనను పాతాళము యొక్క అగాధములో నుండి పైకి లేపినది, సమాధిలో నుండి ఆయనను బయటికి తీసుకొని వచ్చెను. అనగా ఆ శరీరమును బయటికి తీసుకొని వచ్చెను. దానిని ఆకాశ మహాకాశములయందు అమర్చెను. ఆ మహాకాశములో నుండి ఆకాశములను ఆయన తొంగి చూచునంతగా మహోన్నతమైన ఉన్నత స్థానమునకు ఆయన హెచ్చించబడెను. ఆకాశములందున్న మరియు భూమిపై యున్న ప్రతీ నామముకంటే ఆయనకు ఘనమైన నామము ఇవ్వబడెను.
38
ప్రభువా, మేము ఆయన ఆత్మను పొందుకొనెదము గాక. ఇచ్చటున్న ప్రతీ హృదయమందు ఆ ఆకలిని కలిగియుందురు గాక. ప్రభువా, పైకి ఎత్తిన చేతులను మీరు చూచితిరి. ఉపదేశములను చెప్పుటకు, లేదా సంఘములో చేరుటయందు, లేదా ఆ విషయములు, లేదా ఈ విషయములు గూర్చి వివాదించుట వంటివి వ్యర్థమైనవి, కాని మా హృదయములలో విధేయతనుగలవారమై, దేవుని యొక్క పోలికకు అనుగుణముగా మేము ఉండునట్లు చేయుము, ప్రభువా. పరిశుద్ధాత్మ ద్వారా అది జరుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మమ్మల్ని ఆ పోలికగా చేయును గాక. మేము ఈ విధముగా ఉండాలని మరియు మేము ఈ విధముగా ప్రవర్తించాలనే జ్ఞానయుక్తమైన తలంపును కలిగియుండుట కాదు గాని... అది దత్తను తీసుకున్న బిడ్డ వంటిదగును. కాని, ప్రభువా, ఒక నూతన-జన్మ, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించునట్లు అది మాలో యధార్థముగా జరుగును గాక. అది మా ఆత్మను పునర్జీవింపజేయుట ద్వారా రూపాంతరపరచి ఆయనవలె మమ్మల్ని మార్చును గాక, ప్రభువా, నా ప్రార్థనను ఆలకించుము, అది దుర్బలమైనది, ప్రభువా, అది దుర్భలమైనదని నేనెరుగుదును.
చేతులను పైకి ఎత్తిన వారికొరకు మాత్రమే నేను ప్రార్థించుట లేదు గాని, నా చేతులను కూడా నేను పైకి ఎత్తియున్నాను. నన్ను ఆయనవలె మార్చుము. దేవా, మీరు నన్ను ఏమి చేయాలనుకున్నా ఫర్వాలేదు, ఏ స్థితిలో నుండి నేను వచ్చినను, నన్ను ఆయనవలె మార్చుము. నేను యేసువలె ఉండాలన్నదే నా హృదయ వాంఛ. ప్రభువా, దానిని అనుగ్రహించుము. నాకు మాత్రమే కాదు గాని, ఈ రాత్రి ఇచ్చటున్న వారందరికి దానిని అనుగ్రహించుము. తండ్రి, దీనిని అనుగ్రహించుము, దీనిని యేసు నామమున మేము అడుగుచున్నాము. ఆమేన్.
39
సంఘ సభ్యునిగా ఉండుట సరే. దానికి వ్యతిరేకముగా చెప్పుటకు ఏమియు లేదు, లేదా ఆ విషయములను గూర్చి చెప్పుటకు ఏమి లేదు. కాని సహోదరుడా, ఒక క్రైస్తవునిగా జీవించుటనగా క్రీస్తు యొక్క పోలికకు అనుగుణముగా ఉండుటగును. జీవించు ప్రతిరూపాలుగా మనము ఉండవలెనని ఆశించవలెను. చలనము లేని ఒక ప్రతిరూపము కాదు గాని యేసు ప్రభువు యొక్క పోలికను కలిగియుండవలెను.
ఒక చిన్న పాటను నేను పాడుటకు మీరు నాకు ఇప్పుడు సహాయము చేయవలెనని కోరుచున్నాను. నాకు తెలియదు; దానిని నేను పాడలేను, కాని మీరు దానిని పాడగలరు. “యేసువలె ఉండుటకు నాకు సహాయము చేయుమనే” పాట. మీలో ఎంతమంది ఈ పాటను విన్నారు? ఆ విధముగానే మనమందరము ఉండాలని మనము ఆశించుచున్నామని నేనెరుగుదును. కాబట్టి ఆయనను కీర్తిస్తూ ఆ పాటను పాడుదాము. గొప్ప పరిశుద్ధాత్మ ఇచ్చట ఉన్నదని గ్రహించు గ్రహింపును నేను కలిగియున్నాను. మీరు దానిని మరుగుపరచలేరు. “నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు,” అని దావీదు చెప్పెను. ఆయన ప్రతీచోటకు వెళ్ళగలడు. కావున ఇప్పుడు ఈ రాత్రి ఆయన ఇచ్చట ఉన్నాడు. ప్రతీ కదలికను గూర్చి ఆయనకు తెలుసు. ప్రతీ క్రియను, మనము చేయు సమస్తమును, ప్రతీ చూపును, ప్రతీ తలంపును ఆయన ఎరుగును. వాటన్నింటిని గూర్చి ఆయన ఎరుగును. మీరు దానిని నమ్ముట లేదా? కాబట్టి...
నేను యేసువలె ఉండవలెను, యేసువలె నేను ఉండవలెను,
భూమిపై ఆయనవలె నేను ఉండాలని ఆశించుచున్నాను.
నా జీవిత ప్రయాణ కాలమంతా భువి నుండి మహిమ వరుకు
ఆయనవలె నేనుండాలని మాత్రము అడిగెదను.
మీరు ఆలాగు ఉండాలని ఆశించుట లేదా? ఇప్పుడు దీనిని ఆలకించండి.
బెత్లహేము యొక్క పశువుల తొట్టిలో నుండి ఒక అపరిచితుడు వచ్చెను,
భూమిపై నేను ఆయనవలె ఉండవలెను;
నా జీవిత ప్రయాణ కాలమంతా భువి నుండి
మహిమ వరుకు
ఆయనవలె నేనుండాలని మాత్రము అడిగెదను.
40
ఇప్పుడు నా మనస్సు ఏమి తలంచుచున్నాదో మీకు తెలుసా? నిన్న సంఘము యొక్క పాత లెక్కల పుస్తకాన్ని నేను తీసి చూచాను. దానిని నేనింతవరకు అసలు చూడలేదు, యదార్థముగా చెప్పుచున్నాను, దానిని చూడడము అదే మొదటిసారి. మందిరము మొదటగా ప్రారంభించినప్పుడు దానిని ఉపయోగించవలసి వచ్చెను.
అందులో సహోదరుడు సీవార్డ్ పేరు గలదు. సహోదరుడు జార్జ్ డిఆర్క్, సహోదరుడు వెబ్బర్, మరియు ఇంకా అనేకుల పేర్లు కూడా అందులో గలవు. దాని క్రింద చిన్న ఆదివారపు పాఠశాలల తరుగతులను గూర్చి చూచాను. ఆ ఆదివారపు పాఠశాలల ఐదు తరగతులలో వచ్చిన కానుక ఒక-డాలర్-అరువది సెంట్లు వచ్చినదని చూచాను, ఈ మందిరమందు ఇచ్చట వందల మంది కూర్చొనియున్నారు, వచ్చిన కానుక ఒక్క-డాలర్-అరువది సెంట్లు, చూచారా.
పిదప నేను నేటి దినము యొక్క పట్టికయున్న పుటను త్రిప్పి చూచాను, “ఎంత మంది అవతల గట్టుకు వెళ్ళిపోయారో?” అని నేను తలంచాను. సహోదరుడు ఫ్రాంక్ బ్రాయ్ పేరును అందులో నేను చూచాను, మై... అది నా స్వంత మావయ్య పేరు. ఆ పాత-తరము వారందరి పేర్లును నేను చూచాను: శ్రీమతి. వెబ్బరు, వారందరూ పాతవారు. వారందరూ నిచ్చెన ఎక్కి, పైకి వెళ్ళిపోయారు. వారందరూ అవతల గట్టుకు వెళ్ళిపోయారు.
41
ఇచ్చట మేము నిలబడియున్న ఆ సమయము నాకు జ్ఞాపకమున్నది. మరియు, “ప్రభువగు దేవా, మా మందిరము చూచుటకు చక్కగా ఉన్నను, మేము ఒక భవనమును కట్టాలని తలంచుచున్నాము. అయితే ప్రభువా, అప్పుడు మమ్మల్ని ప్రేమించినదానికంటే ఇప్పుడు ఎక్కువగా మమ్మల్ని మీరు ప్రేమించుచున్నారా?” అని నేను తలంచాను. లేదు, ఆయన ఆలాగున చేయును అని నేను నమ్ముటలేదు. ఆ కాలమున మేము లేచి నిలబడి పాడుచున్నప్పుడు, “నా జీవిత ప్రయాణ కాలమంతా నేను ఆయనవలె ఉండుటను మాత్రమే వాంఛించెదనని,” పాడెదము. ఆ వృద్దుడగు జార్జ్, తన కాలర్కున్న బొత్తమును తీసి యుంచును, ఎందుకనగా చెమట అతడిపై కారిపోవుచూ ఉండును, పాట పాడుచుండగా తన చేతిలోయున్న చేతిరుమాలును గాలిలో ఊపుచూ పాడుటను నేను చూస్తూండేవాడిని. వారు చేతులను పైకెత్తి తమ చేతిరుమాళ్ళను ఊపుచూ కన్నీళ్ళు కార్చుచూ పాడుచూ వుండే ఆ పాత పరిశుద్దుల యొక్క ముఖములను నేను చూడగలుగుచున్నాను. “ఓ, బాలుడా, ఆ విధముగా జనులను ఏకమనస్సుతో ఉండునట్లుగా నీవేట్లు చేయగలిగితివి?” అని భవనముగుండా నడుచుకుంటూ ప్రసంగికులు నన్ను అడిగెదరు.
“అందుకొరకు నేను చేసినదేమియు లేదు,” అని చెప్పెదను. వారు ఆ పాత రంపపు పొట్టులో బల్లపై కూర్చొని తమ హృదయాంతరంగములో ఎచ్చటో ఒక చోట క్రీస్తును కనుగొని, దేవుని యొక్క పోలికతో రూపాంతరము చెంది, ఆ రూపముగానే రూపింపబడిరి. ఆయన ఎంత మధురమైన సువాసనగల రక్షకుడని రాత్రంతా వారి ప్రార్థించే ప్రార్థనలు ఎడతెగకుండా పైకి దూపమువలె పోవుచుండును. కొన్నిసార్లు మేము లోపలికి ప్రవేశించి, ఒకరి గృహమునకు ఒకరు వెళ్ళెదము, రాత్రంతా ప్రార్థించి, ప్రొద్దుగుంకిన తరువాత మేము గృహమునకు వెళ్ళేవారము.
42
అటువంటి నిష్కపటమును ఇప్పుడు అసలు కనుగొన లేకపోవుచున్నాము. అటువంటి నిష్కపటము వంటివన్నీ గతించిపోయినట్లుగా కనబడుచున్నవి. దానికి కారణమేమిటి? కారణమేమిటి? మనము కలిగియుండిన ఆ మొదటి ప్రేమకు మరలా మనము తిరిగి వెళ్ళెదము:
యేసువలె నేను ఉండవలెను, యేసువలె నేను ఉండవలెను,
ఈ భువిపై నేను ఆయనవలె ఉండాలని ఆశించుచున్నాను.
నా జీవిత ప్రయాణ కాలమంతా ఈ భువి నుండి ఆ మహిమ వరుకు,
దానిని మాత్రమే నేను ఆయనను అడిగెదను.
యధార్థముగా మీరు అలాగే ఆశిస్తున్నారా? చేతులను పైకెత్తి మనము పాడుదాము.
ఆయనవలె నేనుండవలెను, నేను ఆయనవలె ఉండవలెను.
(ఆయన పోలికకు అనుగుణముగా),
(ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగియుండండి) ఆయనవలె ఉండవలెను.
(మనము ఆయన శరీరము యొక్క సభ్యులమైయున్నాము.
మనము ఆయనవలెనే ఉండవలెను).
నా జీవిత కాల ప్రయాణమంతా
ఈ భువినుండి ఆ మహిమ వరుకు.
దానిని మాత్రమే నేను ఆయనను అడిగెదను.
నీవు నిజముగానే ఆ భావముతోనే దానిని పాడుచున్నావా? “ఆమేన్” అని చెప్పండి. అది మధురమైన ఆత్మగా ఉన్నది కదా? లోకములోనున్న దేనినైనను నేను ఎరుగుటకంటే, ఆ మధురమైన ఆత్మను నేను కలిగియుండుటకే ఆశించెదను. ఈ లోకపు మోజులన్నింటిని, మీ సమస్త బుద్ధి కుశలతలను, మీ వైద్యులందరిని, మీ బోధకులను, బిషప్పులను, పరిశుద్ధ తండ్రులనేవారిని ఇంకా ఈ లోకములో ఉన్నవాటన్నింటిని మీరు తీసివేసి నాకు యేసును మాత్రము ఇవ్వండి. అది నిజము. నేను యేసును ఆ పాతకాలమున చేసిన భక్తి విధానమున కలిగివుందును గాక. నా హృదయాంతరంగమున నేను ఆయనను కలిగివున్నట్లు అనుభూతిని చెందుచున్నాను. నేను జీవించే జీవితమును గమనించండి, ఆయనకు సేవ చేయాలనే నా వాంఛనలను చూడండి. అణుకువ, నమ్రత, మరియు వినయము, విధేయతలను చూడండి. మనకు కావలసినది అదే. స్నేహితుల్లారా, అది... అదే యేసు. అదే పరిశుద్ధ గ్రంధము యొక్క యేసు. జ్ఞానముతో యేసును ఎరుగుట కాదు గాని, ఆత్మ సంబంధముగా యేసును ఎరిగియుండవలెను.
43
ఈ రాత్రి ఆయన ఇచ్చట ఉన్నాడు. వ్యాధితో మరియు అవసరతతో ఎంత మందియున్నారో మీ చేతులను పైకి ఎత్తండి? క్రీస్తు అవసరతగలవారు, రోగులగు మీరు, ప్రార్థన కొరకు ఆశించేవారు, మీ చేతులను పైకి చూపించండి. అప్పుడే ఎవరెవరు చేతులను ఎత్తిరో నేను చూడగలను. మంచిది, అలాగే రోగియైయున్న వేరొకరి కొరకు ప్రార్థించాలని మీ హృదయాలలో ఎంత మంది ఆశించుచున్నారు? మీరు చేతులను పైకి ఎత్తి చూపించండి. సరే, మంచిది. అచ్చట అనేకులు గలరు.
యేసు ఇంకా మారనివాడుగానే ఉన్నాడని ఎంతమంది విశ్వసించుచున్నారు? బయట, ప్రార్థన కార్డులు మేము ఇచ్చుటకు లేవు. నేను... ప్రార్థనా కార్డులు అచ్చట లేవు, అచ్చట ఉన్నాయా? అచ్చట వాటిని ఇచ్చుచున్నారని నేను అనుకొనుట లేదు. యేసు, మన రక్షకుడు. ఈ రాత్రి మన యొద్దకు రాగలడని మీరు విశ్వసించుచున్నారా? ఆయన పోలికను ప్రతిఫలింపజేయవలెనని నేను మాట్లాడాను మరియు మనము పాట పాడాము. ఆ విధముగానే ఆయన వచ్చి ఇచ్చట నిలబడియుంటే ఆయనేమి చేయును? యోహాను 4వ అధ్యాయములో ఆయన చేసినట్లుగా ఆ బావియొద్దకు వచ్చిన స్త్రీతో ఆయన మాట్లాడుతూ, ఆమె హృదయములో ఏమి వున్నదో ఎరిగి, దానిని గూర్చి ఆయన ఆమెకు వివరించి, దానిని ఆమెకు చెప్పెను. తద్వారా ఆయన మెస్సీయా అని ఆమె గుర్తించెను, ఆనాడు ఆయన చేసిన విధముగానే ఈనాడు కూడా ఆయన చేయునని నీవు తలంచుచున్నావా? మీరు దానిని నమ్ముచున్నారా? ఆయన అదే మారని యేసుయని, ఆయన అదే మారని ప్రధానయాజకుడని మీరు నమ్ముచున్నారా? [టేపులో ఖాళీ గలదు.] .... దేవుని యొక్క హస్తము?
44
ఒకానొక దినమున ఆయన నడుచుకుంటూ వెళ్ళుచు అచ్చట ఆనాడు ఆయన చేసిన దానిని, ఈ రాత్రి కూడా ఆయన అదే యేసుగా ఉన్నాడని మీరు విశ్వసించుచున్నారా? అక్కడ ఏ ప్రార్థనా వరుస ఏర్పాటు చేయలేదు. కాని రక్త స్రావముతో బాధపడుచున్న ఒక దీన స్త్రీ అచ్చట వుండెను. ఆయనను తాకుటకు ఆమె ఆ గుంపులోవున్న వారిని తోసుకుంటూ ముందుకు వెళ్ళవలసివచ్చెను, అలాగే వాళ్ళను త్రోసుకుంటూ ముందుకు వెళ్ళుచూ ఆయన వెనుక వెళ్ళి ఆమే నిలిచెను. ఆమె ఆయన వస్త్రపు చెంగును తాకిన వెంటనే, “ఎవరు నన్ను తాకిరని,” ఆయన చూట్టూ చూస్తూ అడిగెను. స్నేహితుడా, ఆ యేసు నేడు కూడా అదే మారని యేసుగా ఉన్నాడని మీరు విశ్వసించుచున్నారా? ఆమె హృదయములోవున్న వాంఛను... గమనించండి, ఆమె భయపడినది. అచ్చట నుండి వెనుకకు వెళ్ళి, తనను మరుగు చేసుకున్నది. ఆమె అచ్చటే వేచివుండెను. యేసు, “నన్ను తాకినది ఎవరని,” అడిగెను.
అపోస్తులుడగు పేతురు, “ప్రభువా, ప్రతీ ఒక్కరు నిన్ను తాకుచుండగా, నన్నెవరు తాకిరని ఏలాగు అడుగుచున్నావని,” ఆయనను గద్దించెను.
“అవును, కాని తాకిన విధానములో బేధము గలదు. ప్రభావము నా నుండి వెళ్ళినది. నేను దానిని గ్రహించితినని,” యేసు చెప్పెను. ఆ దీన స్త్రీని కనుగొను వరకు చుట్టూ సమూహములోనున్న వారందరిని ఆయన చూచుచుండెను. ఆయన ఆమెను కనుగొని, ఆమెకు రక్తస్రావము వ్యాధిగలదని, ఆమె విశ్వాసమే ఆమెకు స్వస్థతనిచ్చినదని ఆమెతో ఆయన చెప్పెను. అది యేసు కదా?
ఈ రాత్రి మిమ్మల్ని మీరు తగ్గించుకొని పరిశుద్ధాత్మ ద్వారా మన ఆత్మను నూతన పరచుకొనుట ద్వారా రూపాంతరము చెంది, తద్వారా మన పెదవులను, మన కనులను, మీ విశ్వాసమును, మరియు నా విశ్వాసమును సమర్పించుకొనిన ఈ జనసమూహము నుండి ఆయన వచ్చి మీలో సంచరించి మరియు నాలోను సంచరించుచూ తన వాక్యమును నెరవేర్చును గాక. అంతేకాకుండా, మనము చేయు ఒప్పుకోలును మన పక్షమున విజ్ఞాపనము చేయు మనయొక్క ప్రధానయాజకుడు ఆయనే. ఆయన దేవుని కుడిపార్వమున ఆసీనుడై మనము ఒప్పుకునే ఒప్పుకోలుకై మధ్యవర్తిత్వము చేయుచున్నాడు. ఆయన భూమిమీద ఉన్నప్పుడు తన అనుభూతి ద్వారా మన బలహీనతలను ఏ విధముగా ఎరిగెనో, ఆ విధముగానే ఆయనను తాకగల ఒక ప్రధానయాజకునిగా ఆయన మనకున్నాడు. మీరు దానిని విశ్వసించుచున్నారా? అదే మారని యేసు....
45
మీ కొరకు లేదా ఇంకా వేరెవరికొరకైనా ఇచ్చట ఎంతమంది అవసరతను కలిగియున్నారు. మీలో కొంతమంది నాకు తెలియదు, మీ అవసరత ఏమిటన్నది నాకు తెలియదని ఎరిగిన వాళ్ళు మీలో ఎంతమంది గలరు? నేను దానిని ఈలాగు చెప్పెదను. మీ అవసరత ఏమిటని లేదా మీ అభ్యర్థన ఏమిటని మరియు మిమ్మల్నిగూర్చి నేనెరుగను. కాని యేసు ఇచ్చట యుండి తానే మీ యొక్క కార్యమును రుజువుపరచి, ఆయన తనను మనకు కనపరచుకొని, యేసుక్రీస్తుగా ఆయన ఉన్నప్పుడు ఏ విధముగా క్రియ చేసెనో అదే విధముగానే ఇప్పుడు కూడా క్రియ చేయునని మీరు నమ్ముచున్నారా? దానిని మీరు విశ్వసించుచున్నారా? అయితే మీ చేతులను పైకి ఎత్తేదరా? ఇప్పుడు మిమ్మల్ని నేనెరుగనని మీ అందరికీ తెలుసు, గమనించారా. మీరు నాకు తెలియదు.
సరే, చూద్దాము. మొదటగా మనమెచ్చట మన దృష్టిని కేంద్రీకరించవలెనో చూద్దాము. ఇప్పుడు భయభక్తిని కలిగివుండండి. దీనిని ఆయన చేసినయెడల మీ హృదయమంతటితో ఆయనను విశ్వసించెదరా? దీనిని నేను అలాగే గ్రహించుచున్నాను. నేను ఈ వేదిక పైకి మిమ్మల్ని పిలిచి, నా చేతులను మీపై పెట్టెదను. క్రియ చేయుచున్నది నేను అని మాత్రము మీరు నమ్మవద్దు. యేసు ఇచ్చట ఉన్నాడని నేను నమ్ముచున్నాను. ఆయన యొక్క పోలికతో యున్న ఏదోక ప్రతిమ లాంటిది మనయొద్ద ఉండకూడదు గాని, మనమే ఆయన యొక్క పోలికతో ఉండవలెను. ఆ యేసుని మనము పొందుకోవాలని మనము ఆశించుచున్నాము, ఆశించుచున్నాము కదా? మనము ఆయనవలె పోలికను కలిగి ఉండాలని... సరే, మంచిది.
46
ఇప్పుడు ప్రభువా, ఇచ్చట ఒక గొప్ప నివేదిక గలదు. కాని ప్రభువా, ఆ వాగ్దానమును చేసిన వారు మీరే. ఇప్పుడు, మేము ఇంకా ముందుకు సాగిపోవలెను. కావున ఇప్పుడు ఏదోకటి చేసి తీరవలయును. మేము సంఘ శాఖకు చెందినవారము కాకపోవుటచేత మేము శ్రమలకు గురియైన ఒక చిన్న గుంపు ప్రజలమై, లోక జ్ఞానమును కలిగియున్న గొప్ప సంఘములు మాలో అనేకుల్ని వెలుపలికి త్రోసివేసినవి. ఒకవేళ మేము అచ్చటకు వెళ్ళినా, వారివలె మేము వస్త్రములను ధరించలేకపోవుచున్నాము. మరియు వేరే విషయమేమనగా, లేఖనములు చెప్పుచున్న విధముగా, మేము ఆత్మ ప్రేరేపణతో ఆశీర్వదించబడి, లేచి నిలబడి వాక్యమునకు “ఆమేన్” అని చెప్పినయెడల, వారు మావైపుకు తిరిగి చూచి, మా యొద్దకు వచ్చి వెంటనే మమ్మల్ని వెలుపలికి త్రోసివేయుచున్నారు. అనేకులకు అచ్చట ఆహ్వానము లేదు, వారియొక్క శరీర రంగును బట్టి కొందరికి ఆహ్వానము లేదు. వారియొక్క సిద్దాంతమును బట్టి కొందరిని ఆహ్వానించుటలేదు. కొందరు మిమ్మల్ని అత్యధికముగా ప్రేమించుటను బట్టి వారికి ఆహ్వానము లేదు. ఆ విధమైన ఆహ్వానము లేనివారెవరనగా, వారు ఆత్మతో నింపబడినవారు; వారు ఈ లోకపు కార్యములకు చచ్చినవారు, మరియు వారు నూతనముగా జన్మించినవారు. కాని వారు నూతన జీవమును పొందుకొనినవారు, పరిచారకుని యొక్క జీవమును పొందుకొనినవారు.
కాని మేమిచ్చట మీరు అనుగ్రహించిన ఈ చిన్న కప్పు క్రింద కూడియున్నాము, అందుకొరకు మేము మిమ్మల్ని అభినందించుచున్నాము. ప్రభువా, ఇప్పుడు, నీవు క్రీస్తువని, మారనివారని, ఆ మహోన్నతుని గురించే మేము మాట్లాడుతున్నామని మేము ఎరుగుదుము గాక. మరియు ఆయన ఈ భూమిమీద ఉన్నప్పుడు ఏ విధముగా క్రియలను చేసెనో, అదే క్రియలను ఇప్పుడు ఆయన చేయునని ఎరుగుట కొరకే ఆయన ప్రసన్నత ఇప్పుడిచ్చట గలదు. వాటిని వారు చూచి తద్వారా దానిని విశ్వసించుదురు గాక, తండ్రీ, దానిని అనుగ్రహించుము, దానిని యేసు నామమున మేము అడుగుచున్నాము. ఆమేన్.
47
మీరు అడుగునదేదో అది మీకు అనుగ్రహింపబడునని మీరు విశ్వసించుచున్నారా? విశ్వాసమనగా ఏమిటి? విశ్వాసమనగా సత్యము. విశ్వాసమనేది ఏదోక దానిని రూఢిగా మీరెరుగు కార్యమైయున్నది. విశ్వాసమనేది మీరేదో ఊహించు కార్యము కాదు. విశ్వాసమనగా మీరు దేనినైతే ఎరిగితిరో (చూచారా), ఆ ఎరిగిన కార్యమనేది మీ అంతరాత్మలో నుండి వచ్చుచున్నది. నన్ను ఎరగనివారు మరియు నన్ను ఎరిగినవారు ఎవరైనాగాని మీలో ఏదైన ఒక విన్నపమువున్నయెడల, మరలా మీ చేతులను పైకి ఎత్తగలరా? అందునుబట్టి నాకు ఒక అవగాహన కలుగునని నేను కోరుచున్నాను. ఇచ్చటున్న అనేకులు నాకు పరిచయము లేనివారు. మంచిది. ఆ విధముగా ప్రతీ చోట గలరు. నాకు పరిచయమున్న వారితో మాట్లాడుటకు నేను ఇష్టపడను, ఎందుకనగా “ఆయనకు వారు తెలుసని,” చెప్పెదరు. కాని నాకు అసలు పరిచయము లేనివారు అనేకుల చేతులు పైకి ఎత్తబడియున్నవి.
ఇప్పుడు యేసు ప్రభువు దీనిని అనుగ్రహించినయెడల, మిగిలిన వారు మీ హృదయమంతటితో దానిని విశ్వసించి, మీ స్వస్థతను మరియు అదేమైనా గాని, దానిని మీరు స్వీకరించెదరు గాక. ఇప్పుడు, మన హృదయములలో నుండి ప్రార్థించెదము, “యేసు, మా సందేహమంతటినీ మా నుండి తీసివేయుము.” విషయమేమిటంటే యేసు ప్రభువు సందేహించలేదు. మనము ఆయన పోలికను కలిగివున్నయెడల, మనము విశ్వసించెదము. ఆయన దేవుడిని విశ్వసించెను. ఆయన దేవుని చిత్తమును చేయుటకే వచ్చెను. మనుష్యులేమన్నను లేదా ఎవరేమన్నను దానిని ఆయన లెక్క చేయలేదు. తన తండ్రికి దాసునిగా ఉండుటకు మాత్రమే ఆయన వచ్చెను. తన తండ్రి తనలో నివసించెను. మనము దేవుని యొక్క దాసులుగా ఉండుటకే వచ్చితిమి, పరిశుద్ధాత్మ మనలో నివసించుచున్నది. మనము ఆయనకు సేవ చేయాలన్నదే మన వాంఛయైయున్నది.
48
ఒక నల్ల జాతీయురాలగు స్త్రీపై నా దృష్టిని నేను కేంద్రీకరించబోవుచున్నాను. ఆమె అచ్చట వెనుక ప్రక్కన కూర్చొని ఉన్నది. నేను ఆమెను ఎరుగను అని ఆమె తన చేతులను పైకి ఎత్తినది. అందుచే అది... సరే, అచ్చట ఇద్దరు గలరు. సరే, మంచిది. స్త్రీలగు మీలో ఎవరికి నేను తెలియదు, లేక నాకు మీరెవరో తెలియదు. అది నిజమైతే, నాకు మీరు తెలియదని మీ చేతులను పైకి ఎత్తండి, మీ చేతులను పైకి ఎత్తగలరా? సరే, సరే మంచిది. మనము ఒకరికొకరము పరిచయము లేనివారము.
లేఖనములలో ఈ విధముగా చెప్పబడియున్నది... కారణమేమనగా, మీరు నల్ల జాతీయులని నేను గమనించితిని. అర్థమైనదా? పరిశుద్ధ గ్రంథములో ఒకచోట ఒక స్త్రీ గలదు, పరి.యోహాను 4వ అధ్యాయములో ఆ సందర్బము గలదు. యేసు ఒక బావియొద్దకు వెళ్ళెను, అచ్చట ఒక సమరయ స్త్రీ ఉండెను. ఆమె ఒక భిన్నమైన జాతికి చెందినది.
ఆమెలో వున్న సమస్య ఏమిటో కనుగొనేంత వరకు ఆయన ఆమెతో కొన్ని నిమిషములు మాట్లాడెను. దానిని ఆయన కనుగొని ఆమెకు గల సమస్య ఏమిటో ఆమెకు చెప్పెను. ఆయన ఆమె యొక్క సమస్యను ఆమెకు తెలిపినప్పుడు, ఆమె, “అయ్యా, నీవు ఒక ప్రవక్తవని గ్రహించుచున్నాను. మెస్సీయ వచ్చునని, ఆయన వచ్చినప్పుడు ఈ కార్యములు మాకు చెప్పునని మేము ఎరుగుదుము,” అని చెప్పెను. కాని ఆయన ఎవరో ఆయనను గూర్చి వారు అర్థము చేసుకోలేకపోయారు, అంతెందుకు, “నీవు ఎవరవని?” ఆమె ఆయనను అడిగినది.
“నీతో మాటలాడుచున్నది నేనే ఆయనని,” యేసు చెప్పెను.
ఆమె ఏ నగరము నుండి వచ్చినదో అచ్చటకు తిరిగి వెళ్ళి, “మీరు వచ్చి నేను చేసినవన్నియు, నేను చేసిన తప్పులను నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయనే ఆ క్రీస్తు కాడా?” అని ఆమె చెప్పెను.
49
స్త్రీలగు మీరు దానిని ఎప్పుడైనా చదివితిరా? నిశ్చయముగా అది పరి. యోహాను 4వ అధ్యాయములో గలదు. సరే, యేసు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగాయున్నయెడల, మీరు నాకు 20 గజముల దూరములో నిలచియున్నారు.. లేదా, కూర్చొని ఉన్నారు. మీరు దేనిని ఆశించి ఇచ్చటకు వచ్చితిరో, మారని ఆ యేసు మన మధ్య ఉండి మాట్లాడి దానిని బయలుపరచునని మీరు విశ్వసించుచున్నారా? మీకు నేను సత్యమును చెప్పినయెడల, ఈ పరిశుద్ధ గ్రంథము నిజమైనదగును, ఆయన దానిని చేయగలడు. ఆయన దానిని చెయ్యగలడు, కదా? ఆయన దానిని చేసినయెడల మీరు దానిని విశ్వసించగలరా?
ఆ చివరన కూర్చొని ఈ విధముగా నావైపు చూచుచున్న ఆ స్త్రీ, ఆమె వెనుక వీపు భాగమున నొప్పితో బాధపడుచున్నది. కావున ఆ బాధ నుండి ఆమె స్వస్థతను కోరుకొనుచున్నది. అది ఖచ్చితముగా నిజము. అది నిజమైనయెడల, ఆ చివరన ఉన్న స్త్రీ, నీ చెయ్యి పైకి ఎత్తుము.
ఇప్పుడు, అమ్మా నీ గురించేమిటి? నీవు కూడా విశ్వాసించుచున్నావు కదా? ఆమెకు ప్రక్కనవున్న ఆమె, నీవు కూడా నాకు పరిచయము లేనిదానివని నీవు చెప్పితివని నేను అనుకుంటున్నాను. నీకు తలయందు సమస్య గలదు, మరియు నీ చర్మ సమస్య కూడ గలదు. అది నిజమైతే నీ చేయిని పైకెత్త గలవా? ఇప్పుడు మీరిద్దరు స్వస్థతను పొందుకున్నారు, మీ గృహములకు మీరు వెళ్ళండి, మీ విశ్వాసమే మిమ్మల్ని బాగుచేసినది.
ఈ రాత్రి యేసు ఇచ్చట ఉన్నాడని మీరు నమ్ముచున్నారా? మీలోవున్న కొంతమంది మరియు ఈ భవనములో వున్న మిగిలిన వారికిగల సమస్య ఏమిటి? ఇంకా ఎక్కడైనా అవసరతగలవారు ఉన్నారా? విశ్వసించండి.
50
ఇచ్చట కూర్చుని ఒక స్త్రీ ప్రార్థించుచున్నది. ఆమె ఒక యోధురాలు; ఆమె నాకు తెలుసు. కాని నేను సహాయము చేయలేను, ఎందుకనగా ఆ వెలుగు ఆమెపై వ్రేలాడుచున్నది. ఆమె పేరు శ్రీమతి బ్రూస్. శ్రీమతి బ్రూస్ గారు, మీకున్న సమస్య ఏమిటన్నది నేనెరుగను. ఒకసారి ఇచ్చట నీవు క్యాన్సర్ వ్యాధి నుండి స్వస్థతను పొందుకున్నావు. కాని సరిగ్గా ఆ తలుపు దగ్గర, నేనెప్పుడూ చూడలేదు గాని ఇదే మొదటిసారి. నీవు ఆ తలుపు దగ్గర నిలిచియున్నావు, నీలోవున్న సమస్యను గూర్చి ఎవ్వరికీ తెలియదు, గాని నీకు మరియు నీ వైద్యుడుకు మాత్రమే అది తెలుసనే ఏదోక విషయము గూర్చి పరిశుద్ధాత్మ నాతో చెప్పెను. అది నిజము, అది నిజమే కదా? ఇప్పుడు నీలోవున్న సమస్య ఎమిటనేది ఆయన నాకు చెప్పగలడని నీవు నమ్ముచున్నావా? నిన్ను నేను ఎరుగుదును. అయితే నీ సమస్య ఏమిటనేది నాకు తెలియదు. దానిని గూర్చి నాకు ఏ అవగాహన లేదు, ఎందుకనగా క్యాన్సర్ వ్యాధినుండి నీవు స్వస్థత పొందితివి. కాని నేనేమి చెయ్యలేను, ఆ వెలుగు నీపై వ్రేలాడుచున్నది. అది సరిగ్గా నీపై వ్రేలాడుచున్నది.
ఇప్పుడు, ఎవరో ఒకరు పైకి లేచుటను నేను చూచుచున్నాను. అది నిన్ను గురించి కాదు, అదెవరో క్యాన్సర్ వ్యాధితో బాధపడుచున్న వారికొరకు. అది ఖచ్చితముగా సత్యము. పిదప నేను ఒక స్త్రీని లేదా ఏదోక దానిని చూచుచున్నాను. ఆమె ఒక పాపి లేదా ఏదోకటై యున్నది... త్రాగుడు లేదా ఏదోక అలవాటు గలదు. వారు దానినుండి విడుదలను పొందుకోవాలనే ఆశతో నీవు రెండు చేతిరుమాళ్ళను తీసుకొని వచ్చితివి. వాటిపై నా చేతులును ఉంచి ప్రార్థించాలని నీవు వాటిని తీసుకొచ్చితివి. దానిని “ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” ఖచ్చితముగా నిజము. ఇప్పుడు దానికి తీర్పరి నీవేయగుదువు. అది నిజమే కదా? అది సరియైతే, నీ చేయిని పైకి ఎత్తుము.
51
ఇచ్చట నేను ఎరుగని వారు ఎవరో కూర్చొని ఉన్నారు, మీ చేయిని పైకి ఎత్తండి. నేను ఎరుగని ఎవరో ఒకరు. ఇచ్చట ఉన్నారు. అదేమిటది? నీ చేతులను మరలా ఒకసారి ఎత్తండి. అచ్చట ఆ మూలలో వున్నవారు. అచ్చట నలుగురు, ఐదుగురు కూర్చొని ఉన్నారు. నేను ఆయన సేవకుడినని మీరు నమ్ముచున్నారా? మీరు చూచుచున్నదేదో అది దేవుని యొక్క ఆత్మ ద్వారా క్రియ చేయుచున్నదని మీరు నమ్ముచున్నారా? మీరు నమ్ముచున్నారా? మీరు నమ్మినట్లయితే...
చిన్న టోపీని పెట్టుకొని నా వైపు చూస్తు ఒక స్త్రీ కూర్చొని ఉన్నది. కళ్ళకు అద్దములు పెట్టుకొని, తెల్లని రంగుతో కనబడే చెవిపోగులను పెట్టుకొని... అవును. నీ కొరకు నీవు రాలేదు, ఇంకొకరికొరకు వచ్చావు. వారు అపాయ స్థితిలో వైద్యుశాలలో వున్నారు. శరీరములో లోపలి భాగములో రక్త స్రావము జరుగుచున్నది. ఆ వైద్యశాల న్యూ-అల్బెనిలో ఉన్నది. అది నిజము. పరిశుద్ధాత్మ ఈలాగు సెలవిచ్చుచున్నది.
యవ్వన స్త్రీ, నీవు నీ చేతిని పైకి ఎత్తెదవా, ఈ ప్రక్కన ఈ విధముగా నన్ను చూస్తూవున్న ఆ స్త్రీ, నీవు నన్ను నమ్ముచున్నావా? నీ హృదయములో ఒక కోరిక కలదు కదా? దేవుడు దానిని నాకు బయలుపరచునని నీవు నమ్ముచున్నావా? సరే. అంతేకాకుండా, నీవు వేరే ఎవరికోసమో ప్రార్థించుచున్నావు. వారి కళ్ళల్లో కంటి పొర లేదా శుక్లము గలదు. అందువలన వారు తాము గ్రుడ్డివారమైతామని భయపడుచున్నారు. అది నిజము. ఇప్పుడు ఆమె కొరకు నీవు విశ్వసించినయెడల, ఆమె గ్రుడ్డిది అవ్వదు. నీవు దానిని విశ్వసించినయెడల.
52
తిన్నగా ఆ చివరన వెనుక ప్రక్క ఉన్న ఆ స్త్రీ, తన చేయిని పైకి ఎత్తిన స్త్రీ వెనుకవున్న ఆమె, నీకు నరముల బలహీనత గలదు. అది నిజము. ఆ నరాల బలహీనత నీ గొంతులో గలదు. అవును, నిజము. అది ఉన్నది కదా? అవి నీకున్నయెడల నీ చేతులను పైకి ఎత్తుము. అచ్చటున్న స్త్రీ నీతోనే నేను మాట్లాడుచున్నాను. అది నిజమే కదా?
ఆమె ప్రక్కనవున్న స్త్రీ గురించేమిటి? నీవు కూడా నీ చేయిని పైకి ఎత్తుము. అచ్చటున్న ఆ సహోదరి? అచ్చటున్న వృద్దురాలగు నీవు నీ చేయిని పైకి ఎత్తుము. సరే. నీకున్న కీళ్ళవాతము వ్యాధి కొరకు ప్రార్థించాలని నీవు ఆశించుచున్నావు. అది నిజము, అది నిజమే కదా? నీ చేతులను పైకి ఎత్తుము. నీవు నమ్ముచున్నావా?
ఎవరో ఒకరు - ఎవరో మందిరమునకు వెనుక ఉన్నవారు విశ్వసించుము. విశ్వాసమును కలిగియుండుము.
ఒక స్త్రీ సరిగ్గా నా వైపే చూచుచున్నది, ఇచ్చటున్న ఇద్దరు స్త్రీల మధ్యనుండి ఆమె నన్ను చూస్తున్నది; తన వేలును నోటిలో పెట్టుకొనివున్నది. అప్పెండిసైటిస్ వ్యాధి వలన శస్త్ర చికిత్సకు సిద్ధమగుచున్నది. అది ఖచ్చితముగా నిజము. అది నిజమైనయెడల, అమ్మా, నీ చేయిని పైకి ఎత్తుము. ఆమె అచ్చటున్నది.
53
మీరు నమ్ముచున్నారా? అదేమిటి? అదెవరో కాదు, అది యేసుక్రీస్తు, దేవుని కుమారుడు. మీ హృదయమంతటితో మీరు విశ్వసించుచున్నారా? ఇపుడు, ఒక్క నిమిషము, సహోదరి.
నేను యేసువలె ఉండవలెను, యేసువలె నేను ఉండవలెను.
భూమిపై నేను ఆయనవలె ఉండాలని ఆశించుచున్నాను;
నా జీవిత ప్రయాణ కాలమంతా భువినుండి దివివరుకు,
ఆయనవలె నేనుండాలని మాత్రము నేను అడిగెదను.
54
ఇపుడు, నేటి దినమున సంఘము యొక్క నిర్జీవత్వమును మీరు చూడగలుగుచున్నారా? యేసు ప్రభువు యొక్క దినములలో అది సంభవించియున్నయెడల ఏమి జరిగియుండును? బావి దగ్గరవున్న ఆ స్త్రీ చాలా అత్యుత్సాహంతో తన కడవను అచ్చట పడవేసి ఊరిలోకి వెళ్ళినది. “మెస్సీయ ఇచ్చట ఉన్నాడు,” అని ఆమె చెప్పినది. కాని నేడు...అవును. ఒక నూతన జన్మ అనుభవమును పొందుకొనుటకు బలిపీఠము యొద్దకు వచ్చుటకు నీకు ఉండవలసినంత అందోళన నీలో లేదు. కావున నీలో ఏదోకటి ఎచ్చటో తప్పిదము ఉన్నది. ఆ పరిశుద్ధాత్మను ఇచ్చట ఈ స్థలమునకు పంపించి తద్వారా ఒక ఉజ్జీవము కలుగునట్లు చేయును గాక. యేసుక్రీస్తు యొక్క పోలిక, అది చేయుటకు అయన యొక్క ప్రతిబింభము ఈ ప్రజల మధ్య సంచరించుచున్నది, ఏమిటి సంగతి? ఏదోక కొరత గలదు. మనకు ఒక ఉజ్జీవము అవసరమైయున్నది.
ఇంకా ఎంతమంది రోగులు ఉన్నారో, మీ చేతులను ఎత్తండి. అది వ్యాధియైన మరియు అవసరతయైనా గాని. మీ చేతులను ఒకరిపై ఒకరు ఉంచండి. మనము ప్రార్థించెదము. ఇప్పుడు త్వరగా, మీ చేతులను ఒకరిపై ఒకరు ఉంచండి. స్వస్థతను పొందుకొనుటకు మీరు సిద్ధముగా ఉండండి. మీరు దీనిని మీ హృదయమంతటితో విశ్వసించినయెడల, సరిగ్గా ఇప్పుడే మీరు స్వస్థతను పొందుకోగలరు.
55
నేను ఆశ్చర్యపోయాను. మేము ఒక స్త్రీ గురించి మాట్లాడుకొనుచుంటిమి, ఒక కాన్పు గురించి. ఒక బిడ్డ కావాలని ఆశించుచూ వేదిక యొద్దకు వచ్చిన ఒక స్త్రీకి సంభవించిన దానిని నా జీవితమున నేనెన్నడూ చూడలేదు. ఏమి సంభవించినదనగా, నేను ఆమెను చూచుచుండగా, అది సంభవించెను. ఆమె కోరుకొనుచున్న కోరిక వాస్తవమైనది. “అమ్మా, నీవు ఒక బిడ్డ కోసము ఎదురుచూచుచున్నావని,” నేను ఆమెను అడిగితిని.
“అవును, బ్రెన్హాం సహోదరుడా,” అని ఆమె చెప్పినది.
నలుబది-తొమ్మిది సంవత్సరముల వయస్సుగల ఒక స్త్రీ నాకు తెలుసు. ఇప్పుడు ఆమెకు చిన్న మగ పిల్లవాడు గలడు. ఇంచుమించు పదహారవ సంవత్సరము అప్పటినుండి తన జీవిత కాలమంతా తన భర్తతో ఈమె జీవించుచున్నది. ఈమెకు నలుబది-తొమ్మిది సంవత్సరములప్పుడు మరియు అతనికి ఏబదికిపైగా ఉన్నప్పుడు, ఆమెతో, “ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు,” అని చెప్పిన వెంటనే... అది నిజము. “నీవు ఒక శిశువును పొందుకొనెదవని,” చెప్పాను. అది వినిన తరువాత ఆమె తన గృహమునకు వెళ్ళి, పుట్టబోవు ఆ శిశువు కొరకు వస్త్రములను కొనెను. మూడు సంవత్సరములకు తరువాత ఏబది-రెండు సంవత్సరముల వయస్సులో, ఆమె వాంఛించిన మగ శిశువుకు ఆమె జన్మనిచ్చెను.
ఎందుచేత? దానిగూర్చి పలికినప్పుడు ఆమె దానిని వినెను. అది నెరవేరునని ఆమె ఎరిగియుండెను. అదేమి చేయును? పలికిన ఆ మాట ఆమెను సరియైన అభిప్రాయమును కలిగియుండునట్లుగా చేసెను. ఒకవేళ ఈ... పరిశుద్ధాత్మ ఈ విధముగా వచ్చి మరియు ఈ కార్యములను గూర్చి జనుల యొద్ద మాట్లాడుటకు ఎంతో యుక్తమైనదిగా యున్నది. ఇప్పుడు నీవు సరియైన అభిప్రాయమును లేదా దృక్పధమును కలిగియున్నయెడల, స్వస్థత కలుగును.
56
ఓ ప్రభువా, నీవు దేవుడవైయున్నావు, నీవు నిరంతరము దేవుడవైయున్నావు. నీవు ఈ భూమిపైకి వచ్చునప్పుడు శేషించిన ఒక చిన్న గుంపు మాత్రమే నీ కొరకు ఉండునని నీవు వాగ్దానము చేసినందుకు మేమెంతో సంతోషించుచున్నాము. ఏది వచ్చినా లేదా ఏది వెళ్ళినా గాని దానితో సంబంధము లేకుండా ఆయన రాకడ కొరకు సిద్దపడియుండు జనులు ఉందురు. దేవునికి దశమ-భాగములను ఇచ్చు మానవులు ఉందురని మరియు దశమ-భాగములనిచ్చు జనులు మా మధ్య ఉందురని మేమెరుగుదుము. బహుశ సమస్త లోకము యొక్క పంటలోను, కాలముల గుండా పిలువబడినవారిలో, ఎన్నుకొనబడినవారు పదిలో ఒక భాగమని మేము చెప్పవచ్చును.
ఓ తండ్రి, ఇచ్చట మీ కొరకు మేమందరము కూడి పనిచేయుచూ, పట్టణముల గుండా వెదుకుచూ పాపులను నీ యొద్దకు తీసుకొనివచ్చుటకు ప్రయత్నించుచున్నాము. దేవుని యొక్క రాజ్యము కొరకు ఏదోకటి చెయ్యాలని మేము ప్రయత్నిస్తూ ప్రార్థించుచున్నాము... మేము పట్టణములోకి వెళ్ళుచున్నాము, మేము అచ్చటున్న నిర్లక్ష్యమును గమనించితిమి. దానిని మేము చూచితిమి. సాదొమలో, లోతు వున్న రీతిగా, అనుదినము అది మా ఆత్మలకు విసుగుగా ఉన్నది. ఏమనగా, స్త్రీలు పొగను పీల్చుచు మరియు మద్యమును త్రాగుచూ, ఆ మైకములో త్రుళ్ళుచూ నడుచుచూ, అసహ్యముగా వస్త్రములను ధరించుటను మరియు పురుషులు వ్యామోహముతో తిరుగుచూ మేము క్రైస్తవులమని చెప్పుకొనుచున్నారు... ఓ, సొదొమ యొక్క పాపము... ప్రభువా, మా హృదయములు దుఃఖపడుచున్నవి.
57
ఓ, ప్రజలు ఆ విధముగా ఉండి, తమ ఆత్మలను శుద్దీకరించుకొని, ఆ ఆత్మలు దేవునికొరకు అగ్నితో మండుకొనుచు యేసుక్రీస్తు యొక్క రక్తమును పొందని అయోగ్యులుగా ఉన్నప్పుడు మా విశ్వాసము అట్టడుగు స్థితికి దిగజారిపోవుటలో ఏ ఆశ్చర్యము లేదు. అయినప్పటికీ, దానిని వారు పొందుకొనరు. ఆ మూలలో చిన్న సంఘములు తంబురాలను మీటుచూ మరియు డ్రమ్స్ వాయించుచూ వారు... జీవించుచున్న దేవునియొక్క పరిశుద్ధులను మనము తీసుకొని వచ్చుచున్నప్పుడు వారు తమ కార్లలో కూర్చొని మనల్ని చూచి నవ్వుచుందురు.
ఓ, ఎంతగా మనము... వాయిద్యములను వాయించు కొంతమంది కొరకు, ఎచ్చటో ఒక చోట సువార్తను ప్రకటించుచున్న వారికొరకు, ప్రజల కోసము తమ కరములను చాచుచున్న వారికొరకు తండ్రి మీకు కృతజ్ఞతలు. ప్రభువా, దీనిని అనుగ్రహించుము. మేము ప్రార్థించుచుండగా, ఇప్పుడు మహోన్నతమైన మీ పరిశుద్ధాత్మ మరియు దూతలు ఇచ్చట ఈ సంఘమున తమ స్థానములలో నిలబడియున్నారని మేము ఎరిగియున్నాము. దేవా, ప్రతీ పాపమును క్షమించుము.
వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ రాత్రి ఇచ్చట ఉన్నారు. అనేకులు ఆ విధముగా ఉన్నారు. మీ సేవకుని ద్వారా ప్రభువా, మీరు మిమ్మల్ని ఇచ్చట కనబరచుకొనితివి, అచ్చట వెలుపల అనేకులు దగ్గరకు వచ్చుచూ, కేకలు వేయుచు పిలుచుచూ మరియు లాగుచుండిరి. ప్రభువా, మీరు ఒక్కరు మాత్రమే ఈ క్రియలు చేయుటకు అనుమతించగలరని మీరెరుగుదురు. నీవు దేవుడైయున్నావు, నీవొక్కడివే దేవుడవు. ఆ క్రియలను నీవు చేస్తావని మాకు వాగ్దానమును చేసిన ఉద్దేశ్యము కొరకే నీవు ఈ క్రియలు చేయుచున్నావు. నీవు చెప్పిన ప్రకారముగా సంఘమునకు ఇదియే ఆఖరి సూచనయైయున్నది. అంత్యకాలము ఇచ్చటయున్నది.
58
మరియు “నేను వచ్చునప్పుడు భూమిమీద విశ్వాసమును కనుగొనెదనా?” అని నీవు ఈ ప్రశ్నను అడిగితివి. “సంఘ సభ్యులను నేను కనుగొనెదనా? ఉపదేశములను నేను కనుగొనెదనా? యధార్థతను నేను కనుగొనెదనా?” అని నీవెన్నడు అడుగలేదు. కాని “నేను వచ్చునప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనెదనా?” అని నీవు అడిగితివి. ప్రభువా, రోగులగు ఈ ప్రజలు... వారియొక్క విశ్వాసమనే ముడి వదులు చేయబడును గాక. వారియొక్క కలవరములు, సందేహములు మరియు భయములు వారినుండి పారద్రోలబడును గాక. ఇప్పుడే వారియొక్క విశ్వాసమనే ముడి వదులు చేయబడును గాక. వారి విశ్వాసపు ముడి వదులు చేయబడినయెడల, వ్యాధులు నుండి విముక్తిని పొందెదరు, వారిపైయున్న దయ్యము యొక్క పట్టును వదిలి వాడు పారిపోవును మరియు సర్వశక్తిమంతుడగు దేవుని శక్తి ద్వారా వారు విడుదలను పొందెదరు గాక. పరిశుద్ధాత్మ ప్రతీ హృదయములోకి చొచ్చుకొని పోవును గాక. ప్రతీ ఆత్మ పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుకొనును గాక. ప్రభువా, దీనిని అనుగ్రహించుము. నేను దీనిని అడుగుచున్నాను. ఈ రాత్రి ఇచ్చటున్న వారిలో ఎవరెవరిని దయ్యము వేధించుచున్నదో, ఆ దయ్యము వారినుండి వదిలి పోవును గాక. యేసుక్రీస్తు నామమున, సాతానా, ఈ ప్రజలను వదలి వారినుండి పారిపొమ్ము. దేవుని యొక్క సేవకునిగా, ఈ ప్రజల నిమిత్తము, వారికొరకు కనికరమును కోరుచూ నేను ఎలుగెత్తి అడుగుచున్నాను. ఆమేన్.
59
ఇప్పుడు మీలోవున్న సమస్తముతోను, మీ హృదయమంతటితోను యేసుక్రీస్తు నేడు ఈ భూమి మీదనున్న జనుల మధ్య తననుతాను ప్రతిబింభించుకొనుచున్నాడని మీలో ఎంతమంది విశ్వసించుచున్నారు? మీరు ఆయనను ప్రేమించుచున్నారా? అట్లైతే, మనమందరము కలిసి ఈ పాత పాటను పాడుదాము, “నేనాయనను ప్రేమించుచున్నాను, నేనాయనను ప్రేమించుచున్నాను. ఎందుకనగా, ఆయనే మొదటగా నన్ను ప్రేమించెను.” ఇప్పుడు మనము నిలబడియుండగా అందరము కలిసి పాడుదాము. ఇప్పుడు ప్రతీ ఒక్కొక్కరు, అందరూ కలసి పాడుదాము. ఆ పాట ఎంతమందికి తెలుసు? మీ చేయిని పైకెత్తండి. “నేనాయనను ప్రేమించుచున్నాను.” ఇప్పుడు ఆయనను స్తుతించెదము.
రోగులందరూ, బాధలలో ఉన్నవారందరూ, ఇప్పుడు మీరు లేచి నిలబడండి. మీ స్వస్థతను మీరు పొందుకోండి. నేను విశ్వాసించుచున్నాను. మీ హృదయమంతటిలో సరియైన రీతిలో మీ విశ్వాసము క్రియ చేయుటకు ప్రయోగించినయెడల క్రీస్తు యొక్క దేవుడు, ఎవరి సన్నిధైతే ఇచ్చట ఉన్నాదో...
ఆయన ఏమి చేయుచున్నాడు? తన పోలికకు అనుగుణముగా మనలను మలచుచున్నాడు. గమనించారా, ఆయన ఆత్మ ఇచ్చట మీకు తనను ప్రతిబింభింపజేయుచున్నది. వాటిని చేయుచున్నది నేను కాదని మీరెరుగుదురు. ఆ ప్రజలను గూర్చి నాకేమి తెలియదు. ఎవరైతే తమ చేతులను పైకి ఎత్తిరో అచ్చటున్న వారిని నేనెరుగను. వారికి కూడా నన్ను తెలియదని తన చేతులను పైకెత్తి చూపించిరి. కాని వారినిగూర్చి దేవునికి తెలుసు.
అదేమిటది? క్రీస్తు తనను తాను ప్రతిబింభించుచేయుట. మీ విశ్వాసముతోనే దానిని మీరు విశ్వసించవలెను. మీరు చూచుచున్న చిత్ర పటములోవున్న ఆ దూత ద్వారా నాకు ఆయన రుజువుపరచబడిన సేవలోని నా విశ్వాసమే అది. ఆ చిత్ర పటము మత సంబంధమగు భవనమందు తగిలించియున్నది. తద్వారా ప్రపంచమంతా ఆ చిత్రము గురించి తెలుసుకొనుచున్నారు.
60
ఇశ్రాయేలీయుల ప్రజలను అగ్నిస్తంభము నడిపించెను, ఆ అగ్నిస్తంభమే శరీరము దాల్చినప్పుడు, ఆ రూపము దేవుని యొక్క కుమారునిగా పిలువబడెను. “నేను దేవుని యొద్ద నుండి వచ్చితిని మరియు దేవుని యొద్దకే వెళ్ళుచున్నాను. నేను మరలా దేవుని యొద్దకే వెళ్ళుచున్నాను,” అని ఆయన చెప్పెను.
ఆయన మరణించి, సమాధి చేయబడి, మరియు పునరుత్థానుడైన పిదప దమస్కు వెళ్ళు మార్గమున అదే అగ్నిస్తంభము రూపమున ఆయన పౌలును సంధించెను, ఆ వెలుగువలన పౌలు తన కనులను కోల్పోయెను. “ప్రభువా, నీవెవరవు?” అని పౌలు అడిగెను.
“నేను యేసు. మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టము,” అని ఆయన చెప్పెను. కొంత కాలమైన తర్వాత లోకము (సంఘశాఖ క్రమము, లోకము క్రమము, సంఘ సభ్యుల క్రమము మరియు ఇంకానేకములు) నన్ను మరెన్నడును చూడదు. కాని “మీరు నన్ను చూతురు, యుగ సమాప్తివరకు నేను మీతోను, నేను (వ్యక్తిగత సర్వనామము, మారని అదే యేసు) మీలోను ఉండెదను. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని,” యేసు చెప్పెను. ఆమేన్.
నేనాయనను ప్రేమించుచున్నాను,
నేనాయనను ప్రేమించుచున్నాను.
ఎందుకనగా ఆయనే మొదటగా నన్ను ప్రేమించెను.
నా రక్షణ కొనెను
కల్వరి వృక్షము పైన.
61
ఓ, మనము మరలా దీనిని పాడుచుండగా మెథడిస్టులు, బాప్టిస్టులు, పెంతెకోస్తులు, నాజరీస్, పిలిగ్రమ్ హోలీనెస్, చర్చ్-ఆఫ్-గాడ్ మరియు మీరందరూ మీకు ముందున్న వారికి, మీకు వెనుక ఉన్నవారికి, మీకు ప్రక్కన ఉన్నవారికి మీరు కరచాలము చేయాలని నేను కోరుచున్నాను. దీనిని ఇప్పుడు మనము చేయుచుండగా మనమందరము కలిసి:
నేనాయనను (సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక.)
ప్రేమించుచున్నాను.
ఎందుకనగా ఆయనే మొదటగా నన్ను ప్రేమించెను.
నా రక్షణ కొనెను
కల్వరి వృక్షము పైన.
ఇప్పుడు, ఇదియే పునరుత్థానము యొక్క క్రమమగును: “ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము.”
ఇప్పుడు మనము ఒకరినొకరము కలిసి, ఒకరి కరములను ఒకరు పట్టుకొని కరచాలము చేద్దాము. ఇప్పుడు మనము ఆయనను అభినందించెదము.
నేనాయనను ప్రేమించుచున్నాను,
నేనాయనను ప్రేమించుచున్నాను.
ఎందుకనగా ఆయనే మొదటగా నన్ను ప్రేమించెను.
నా రక్షణ కొనెను
కల్వరి వృక్షము పైన.
62
ఒక యవ్వన స్త్రీ వరుసనుండి వెలుపలికి వచ్చి, బలిపీఠము యొద్దకు వెళ్ళి మోకరిళ్ళి దుఃఖముతో ఏడ్చుచున్నది. అదే విధమైన పశ్చాత్తాప మనస్సాక్షితో ఇంకా ఇచ్చటెవరైనా ఉన్నారా? ఆమెతో కలిసి మీరు కూడా మోకరించగలరా? మీరు తిన్నగా ఇచ్చటకు వచ్చి ఆమె ప్రక్కన ఒక స్థలమును మీరు ఎన్నుకొనినయెడల మేము సంతోషించెదము. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. సరిగ్గా ఈ సమయమున ఇంకా ఎవరైనా ముందుకు రాగలరా? అది సరి.
నేనాయనను ప్రేమించుచున్నాను (ప్రభువా, నన్ను మలుచుము, సృజించుము.),
నేను (కుమ్మరి గృహముకు వెళ్ళండి,
ఇంకా వేరేవరైనా ఇచ్చటకు రావాలనుకుంటున్నారా?)
ఎందుకనగా ఆయనే మొదటగా నన్ను ప్రేమించెను.
నా రక్షణ కొనెను
కల్వరి వృక్షము పైన.
ఓ, ఆయన అద్భుతమైనవాడు కదా? దివ్యమైన ప్రభువా, ఈ యవ్వన స్త్రీని నీవెరుగుదువు. నాకు తెలియదు. కాని ఏదోక విచిత్రమైన కార్యము కొన్ని నిమిషములకు ముందు ఆమెను తాకినది, అందువలన జనసమూహము నుండి వెలుపలికి వచ్చి, ఏ ఒక్కరి బలవంతము లేకుండానే ఈమె బలిపీఠము యొద్దకు వచ్చినది. ఆమెను తాకినది ప్రభువా నీవే. తనకు ప్రియమైనవారు, తనకు ప్రక్కన ఉన్నవారు ఆమె చుట్టూ తమ చేతులను పైకి ఎత్తి, మీ దయను కోరుచూ, మీ మార్గదర్శకత్వము కొరకు మరియు ఆమె ఆత్మీయ బలమును పొందుకోవాలని అడుగుచుండగా, ఆమె ఈ బలిపీఠము యొద్దకు వచ్చి మోకరిళ్ళి యున్నది. ప్రభువా, అది నెరవేరును గాక. అది వ్రాయబడియున్నది, ఇప్పుడు అది అట్లే జరుగును గాక. మీ ఎదుట నిజాయితీగా ప్రవర్తించువారికి మీరు మంచి ఈవులను అనుగ్రహించకుండా ఉండలేరు. మిమ్మల్ని ప్రేమించువారికి, మరియు మిమ్మల్ని వెంబడించు వారికి మీ యొక్క వాగ్దానములు, “అవును మరియు ఆమేన్” అనునట్లుగా యున్నవి. వాగ్దానము చేయబడిన దేవుని వాక్యము తప్ప వేరేదియులేదు గాని, అంతకంటే ఈ సమయమున ఈ యవ్వన స్త్రీ హృదయములో దేవుడు సరిగ్గా ఇప్పుడే అత్యధికమైన ఆశీర్వాదములను కుమ్మరించుటకు చిత్తమైయున్నాడనే విషయమును నిశ్చయముగా ఆమె ఈ రాత్రియందు ఎరుగునట్లుగా చేయును గాక. అటువంటి బహు సంతృప్తికరమైన భాగము ఆమెకు అనుగ్రహించబడును గాక. ఆమె బలిపీఠము యొద్ద మోకరిల్లియుండగా, ఆమె హృదయములో వాంఛించున్న కార్యములను పరిశుద్ధాత్మ ఆమెకు అనుగ్రహించును గాక. ప్రభువా, దీనిని అనుగ్రహించుము, దీనిని యేసుక్రీస్తు నామమున మేము అడుగుచున్నాము.
ఆయనే మొదటగా నన్ను ప్రేమించెను.
నా రక్షణ కొనెను
కల్వరి వృక్షము పైన.
63
[బ్రెన్హాం సహోదరుడు వేదిక యొద్ద ఉన్నవారి కొరకు ప్రార్ధించుటకు మైక్రోఫోన్ దగ్గర నుండి దూరముగా జరిగెను.] ప్రియమైన దేవా, ఈమె బహుగా ప్రేమించుచున్న తనకు చెందిన ప్రియమైన వారికొరకు వాంఛించుచున్న వాంఛను అనుగ్రహించబడును గాక. ఈ సమయమున ఆయన మాత్రమే చెయ్యగల క్రియలను ఆ మహోన్నతమైన పరిశుద్ధాత్మ క్రియను చేయును గాక. వీటన్నింటిని మీకు మేము సమర్పించుకొనుచు మరియు మీ ప్రేమ యొక్క కనికరమనేది జీవము కంటే శ్రేష్ఠమైనదని ప్రార్థించుచున్నాము. దావీదు, “నీ కృప జీవముకంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును,” అని చెప్పెను. ఆమె హృదయ వాంఛలను ఆమెకు అనుగ్రహించుము ప్రభువా, ఈ సంఘ సభ్యులుగా, నీ సేవకునిగా మరియు ఈ భవనములో యున్న ఇంకా ఇతర సేవకులు అందరము కలిసి యదార్థముగా ఆమె యొక్క విన్నపము కొరకు దీనిని యేసుక్రీస్తు యొక్క నామమున మేము అడుగుచున్నాము. ఆమేన్. సహోదరీ దానిని హక్కుతో అడిగి పొందుకొనుము. దేవుడు నిన్ను దీవించును గాక.
64
ఇప్పుడు, ఈ ప్రజలు తమను సమర్పించుకొనుచున్న ఈ సమయమున... ప్రభువుకు తమను సమర్పించుకొనుచుండగా, ఈ భవనమునందు ఆయన ఆత్మ సంచరించుచున్న ఈ సమయమున, మనము ఒక్క నిమిషము అలాగే నిలబడి ఉందాము. బలిపీఠము యొద్దకు వచ్చిన వారిని పాస్టర్లు చూచుకొందురు. ఇప్పుడు మనము కొద్దిసేపు ప్రార్థనలో ఉందాము. ఆయన వచ్చుచున్నాడు. ఇప్పుడు మనము పాడుదాము. ఆయన ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు. మనము ప్రార్థించుటకు మన తలలను వంచుదాము.
నా రక్షణ కొనెను
కల్వరి వృక్షము పైన.
నేనాయనను ప్రేమించుచున్నాను,
నేనాయనను ప్రేమించుచున్నాను.
ఎందుకనగా, ఆయనే మొదటగా నన్ను ప్రేమించెను.
నా రక్షణ కొనెను
కల్వరి వృక్షము పైన.
నేను నమ్మగలను, నేను నమ్మెదను, నేను నమ్ముచున్నాను.
నేను నమ్మగలను, నేను నమ్మెదను, నేను నమ్ముచున్నాను.
నేను నమ్మగలను, నేను నమ్మెదను, నేను నమ్ముచున్నాను.
ఇప్పుడు యేసు నన్ను రక్షించునని.
నేను నమ్మగలను, నేను నమ్మెదను, నేను నమ్ముచున్నాను.
నేను నమ్మగలను, నేను నమ్మెదను, నేను నమ్ముచున్నాను.
నేను నమ్మగలను, నేను నమ్మెదను, నేను నమ్ముచున్నాను.
ఇప్పుడు యేసు నన్ను రక్షించునని.
నేను ఆయన వాక్యము ద్వారా ఆయనను నమ్మెదను.
నేను ఆయన వాక్యము ద్వారా ఆయనను నమ్మెదను.
ఆయన రక్షణను నాకు ఉచితముగా ఇచ్చుచున్నాడు.
మరియు నేను ఆయన వాక్యము ద్వారా ఆయనను నమ్మెదను.
నేను నమ్మగలను, నేను నమ్మెదను, నేను నమ్ముచున్నాను.
65
యవ్వనస్తుడా, ఇప్పుడు గమనించుము. దేవునితో బహు సన్నిహితముగా నడవాలనుకుంటున్నావా? దానిని ఆయన నీకు అనుగ్రహించునని నమ్మెదవా? నీ హృదయమంతటితో నీవు దానిని నమ్మినయెడల, నీవు దానిని పొందుకొనెదవు. మీరు దానిని విశ్వసించి మరియు దానిని అంగీకరించెదరా?
........ నమ్ముము;
యేసు ఇపుడు నన్ను రక్షించును.
ఆయనను ప్రేమించువారందరు, మీ చేతులను పైకి ఎత్తండి, “నాలోవున్న సమస్తముతో నేనాయనను ప్రేమించెదనని” చెప్పండి. నాలోవున్న నా సమస్తముతో. ఆయన అద్బుతమైనవాడు కదా? ముగింపు ప్రార్థన కొరకు మనము మన తలలను వంచియుండగా, రేపు రాత్రి మనకు ఆరాధన కలదని గుర్తుంచుకోండి.
నేను మిమ్మల్ని అడగాలనుకొనుచున్నదేమనగా... ఇప్పుడు మీకు సాధ్యమైనయెడల, మీకు సాధ్యమైనంత త్వరగా, మీ రక్షణ కొరకు దేవుని దగ్గరగా జీవించాలని ఆశించుచూ మీ చేతులను పైకి ఎత్తిన మీలో ప్రతీ ఒక్కొక్కరు దానిని పొందుకున్నామని మీరు విశ్వసించండి. మీరు దానిని అనుభూతిచెందనియెడల, దత్తను తీసుకొన్న ఆ శిశువునే ఉదాహరణను తీసుకోండి. అర్థమైనదా? అది జీవితమున నిజ రూపము దాల్చేవరుకు దానిని నేను విశ్వసించుచున్నానని చెప్పుచూనే ఉండండి.
స్వస్థతను స్వీకరించిన మీరు ఏ విధమైన భిన్నమైన అనుభూతిని చెందనియెడల... “సహోదరుడా బ్రెన్హాం గారు, దానిని కదిలించగల తగిన విశ్వాసము ఇప్పుడు నాకు లేదని,” మీరు చెప్పవచ్చు. అయినా దత్తపుత్రుని యొక్క విధానమును అనుసరించి దానిని పొందుకోండి. తద్వారా, “ప్రభువా, నేను స్వస్థపరచబడ్డాను. నేను దానిని విశ్వసించుచున్నాను,” అని చెప్పుచూ ఉండండి. అది సంభవించును. అందుకు తగిన అనుకూలమైన మనస్సును మీరు కలిగివుండండి. (మీరు చూచారా?), అప్పుడు మీ విశ్వాసము యుక్తమైనదిగా ఉండును. దానిని అది పొందుకొనును. మీ హృదయమంతటితో మీరు దానిని కేవలము విస్వసించండి.
66
ఇప్పుడు, రేపు రాత్రి ఆరాధన 7:30 నిమిషములకు ఆరంభమగును. అనగా యధాప్రకారముగా రేపటి రాత్రి ఆరాధన ఆరంభమగును. మరియు ఈ వారములోని ప్రతీ రాత్రి ఆరాధన అదే సమయమున ఆరంభమగును. సహోదరుడు నెవిల్ మరియు ఇతర దైవ సేవకులు ప్రసంగించు ప్రసంగములను వచ్చి ఆలకించండి. మేమందరము కలిసి ఒక ఉజ్జీవమును తీసుకొని వచ్చుటకు ప్రయత్నించుచున్నాము. దేవుడు మిమ్ములను దీవించును గాక. మేము దానిని తీసుకొని రాలేము. కాని మీ ప్రార్థన ద్వారా, వచ్చుట ద్వారా, మీరిచ్చట హాజరవుట ద్వారా మీరు ఆ ఉజ్జీవమును మానుండి పొందుకొనెదరు. మీరు వచ్చి, ఇచ్చట కూటములలో కలుసుకోవలెను. దేవుడు మీకు తోడై ఉండును గాక.
ఇప్పుడు, నేను కోరుకొనుచున్నదేమనగా, ఈ ఆరాధన ముగించిన వెంటనే మీకు సాధ్యమైనంత త్వరగా... ఈ భవనము నుండి వెలుపలికి వెళ్ళిపోండి. ఎందుకనగా, వివాహ కార్యము కొరకు ముందుగా అరగంట అభ్యాసనము చేయవలసియున్నది. మరియు దానిని ఇచ్చట సిద్ధపరచుటకు కొంతమంది పని చేయుదురు. కావున ఇప్పుడు మన తలలను మనము వంచుదాము. వెనుకవున్న ప్రజలతో సహోదరుడు జూనియర్ జాక్సన్ మాట్లాడుటను నేను ఆలకించితినని నమ్ముచున్నాను. జూనియర్ జాక్సన్ సహోదరుడా, ఈ రాత్రి మీరు ఇచ్చట ఉన్నారా? న్యూ-ఆల్బనీ మెథడిస్టు సంఘము నుండి వచ్చే సహోదరుడు... లేదా... సరే, మంచిది. సహోదరుడు జాక్సన్, ప్రార్థించి ఈ కూటమును ముగించెదవా?
[సహోదరుడు జూనియర్ జాక్సన్ ప్రార్థించి కూటమును ముగించెను.] [టేవులో ఖాళీ కలదు.] ...వివాహమునకు సంబంధించిన వారు ఇప్పుడు త్వరగా ముందుకు రావలెను. ప్రభువు మిమ్ములను దీవించును గాక. మేము మిమ్మల్ని రేపు రాత్రి మరలా కలుసుకునెదము.
దుఃఖమును మరియు వేదనను కలిగియున్న బిడ్డా
సంతోషము మరియు ఆదరణను అది నీకు అనుగ్రహించును...