గిలాదులో గుగ్గిలము

గిలాదులో గుగ్గిలము

VGR COUNT -216 ప్రార్ధన కొరకై మన తలలను వంచుదాము. ఓ ప్రభువా, మా పూర్ణ హృదయముతో నిన్ను ఆరాధించుటకు మరియు సంఘము యొక్క కీర్తనలు పాడుటకు, మరియు మా కృతజ్ఞతాస్తుతులు నీకు అర్పించుట కొరకు మేము నీ సన్నిధిలోనికి వచ్చుట మరొక గొప్ప భాగ్యమైయున్నది, దీనిని బట్టి, ఈ రాత్రి మేము నీకు కృతజ్ఞులము. ప్రభువా, ఈ రాత్రి నీ గ్రంథములలో మమ్మును గూర్చి ఎదైనా తప్పిదము ఉన్నయెడల, మా యొక్క తప్పులను ఒప్పుకొనుచుండగా, నీ కుమారుడైన యేసు యొక్క రక్తము సమస్త దుర్నీతి నుండి మమ్మును శుద్ది చేయును గాక.

మరియు మేము ప్రార్ధించెదము, తండ్రి, ఇక్కడ ఉన్న రోగులను మరియు అవసరతలో యున్నవారి రోగమును ఈ రాత్రి నీవు స్వస్థపరచుదువు. మరియు వారు నిన్ను నమ్ములాగున మీ యొక్క వాక్యమును పంపించండి మరియు వారి యొక్క ఆరోగ్యము కొరకు నీవు సిద్దపరచిన దానిని అనుగ్రహించండి.

2

ప్రభువా, మేము ప్రార్ధించుచున్నాము, ఈ రాత్రి, ఈ కూటమునకు అన్ని ఏర్పాట్లు చేసిన ఈ ఫిలడెల్ఫియ సంఘమును దీవించండి. మా సహోదరుడు మీడ్ దీని యొక్క సంఘ కాపరిని దీవించండి. మరియు ఈ యొక్క యాత్ర కొరకు వారికి అవసరమైన వాటినన్నింటిని వారికి అనుగ్రహించమని మేము ప్రార్ధించుచున్నాము, నీ కృపలో మరియు నీ శక్తిలో మరియు సభ్యత్వములో దీనిని పెంపొందించండి. ఈ రాత్రి ఈ యొక్క సహవాసమునకు, మిగతా సంఘముల నుండి ఎవరైతే వస్తున్నారో వారిని దీవించండి. ఇక్కడ హాజరైన వారందరిని దీవించమని మేము అడుగుచున్నాము.

మరియు మా ప్రియ సహోదరుడైన జోసఫ్, ఇప్పుడు విదేశాలలో సువార్త కొరకు, మమ్ములను విడిచిపెట్టుచున్నాడు. దేవుని యొక్క దూతలు అతనితో వెళ్ళుచూ మరియు అతనికి ఉపదేశించి మరియు అతని యొక్క మార్గమును అతని ముందు సరాళము చేసి, అతడు నడుచుచు తొట్రు పడక, దేవుని యొక్క హస్తము అతనితో ఉండి అతనిని పట్టుకొనును గాక. ప్రభువా, నీకు నీవే మహిమ తెచ్చుకొనుము. మరియు చివరిగా అతని యాత్ర యొక్క ముగింపులో, సమయము ఇక లేనప్పుడు మరియు నిత్యత్వములో కలియునప్పుడు విచ్చిన్నము కాని కుటుంబములుగా, విమోచన గీతములు పాడుచూ, మేమందరము నీ సింహాసనము ఎదుట కలుసుకొనెదము యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చొనవచ్చును.

3

సహోదరుడు జోసఫ్ కొరకైన వీడ్కోలు కూడికలో నాకు ఇవ్వబడిన అవకాశమునుబట్టి ఈ రాత్రి ఇక్కడ ఉండుటకు నేను చాల కృతజ్ఞుడనైయున్నాను.

ఈ వారము మేము వివరించినట్లుగా అది చాల అకస్మాత్తుగా జరిగిన కార్యము... ఓ, ఆ విధానములో మీ ముందుంచవలెనని నేను అనుకోవడం లేదు. పరిశుద్ధాత్మ యొక్క దైవిక నడిపింపని నేను చెప్పగోరుచున్నాను. నిజానికి నేను ఈ వారం ఫిజి దీవులలో ఉండవలెను. మరియు వచ్చే వారము, లేదా రేపు, నేను సిడ్నీ, అస్ట్రేలియాలో ప్రారంభించ వలసియున్నది. కాని ఏదో విధముగా, నేను... ఏదో జరిగినది అక్కడకి వెళ్ళడానికి కొద్ది వారములు దానిని వాయిదా వేయడం జరిగినది.

మన నమ్మకమైన మరియు ప్రియ సహోదరుడు బిల్లిగ్రహమ్ ఇప్పుడు మనలను విడిచి విదేశాలకు వెళ్ళియున్నాడు. మరియు అతనికి అది మంచిదై తిరిగి ఆరోగ్యమును పొంది, కొద్దిగా విశ్రాంతి పొంది అతనికి కలిగియున్న ఆ గొప్ప కూడికలు మరియు అది ఆ సమయములో సంపూర్ణ సువార్తను ఆ దేశమునంతటికి వెదజల్లవలెనని, మరియు మనము ప్రార్ధన చేయుదుము. దేవుడే నిజముగా సహాయము చేయవలెనని, నిశ్చయముగా మీ యొక్క ప్రార్ధనలు మాకు అవసరము, ఈ చికాగో ప్రజలను నా కొరకు ప్రార్థించమని అడుగుచున్నాను. నాకు తెలుసు, అది ఒక కఠినమైన పని, కానీ మేము ఈ పనిని తప్పించుకోవాలని అనుకోవటము లేదు. అది ఎంత కఠినమైనా; మాకు తెలుసు బిల్లి ఎటువంటి పరిస్థితి కలిగి ఉన్నాడో, మరియు ఓరల్ రాబర్ట్ ఎటువంటి పరిస్థితి కలిగి యున్నాడో మాకు తెలుసు. కాని నేను...అదే గనుక నా వంతైతే... నా యొక్క భాగమును పొందుకొనుటకు నేను నిరీక్షించుచున్నాను.

మనము పరలోకములోనున్న మన ఇంటికి అంత సులువుగా ఒక పూల పాన్పు పై వెళ్లలేము.

మిగతా వారందరూ ఆ యొక్క బహుమానము పొందుకోవలెనని యుద్ధము చేశారు;

మరియు రక్తపు సముద్రాల గుండా వారు ప్రయాణం చేశారు.

మాకు పాత పాట తెలుసా. మరియు మనము మన భాగము తీసుకొనుటకు ఇష్టపడుచున్నాము.

4

మరియు కాబట్టి ఇప్పుడు, నేను ప్రార్ధన చేసాను, జోసఫ్, దేవుడు నీతో ఉండును గాక. ఇక్కడ ఒక విషయమున్నది. అది ఈ రాత్రి ఖచ్చితముగా ఆమోదించాలని అనుకోవటములేదు. బహుశా నేను ఇక్కడకు తప్పు సమయములో వచ్చియున్నాను. నేను లోపలకి వచ్చినప్పుడు మరియు నాకు ఇవ్వడానికి వారు కానుకలు స్వీకరించుచున్నారని చెప్పుట వినియున్నాను. అది జోసఫ్ అయ్యుండవచ్చు. దానిని నీవు తీసుకొన్నావా సహోదరుడా, చూశారా.

నేను సహోదరుడు ఆస్బోర్న్ యొక్క సహాయకుడిని కలుసుకోవడం జరిగినది. మరియు అతడు అద్భుతముగా సహోదరుడు రాబర్ట్ లేదా సహోదరుడు ఆ ఈ మధ్యాహ్న కాలమందు అతడిని పిలిచి లేదా అతడు అతనితో మాట్లాడి, అతని యొక్క ఇంటిని నన్ను దర్శించమని నాకొక ఆహ్వానము పంపియున్నారు.

5

సహోదరుడు ఆస్బోర్న్ యొక్క చిత్రపటము ఈ మధ్యాహ్నం ఇక్కడ చూపబడినది, మరియు నాకు తెలుసు దానిని మీరు అభినందిచారని. అది మీరు చూస్తున్నారు మన యొక్క ప్రయత్నములు ఎక్కడ పెట్టుచున్నామో అవి ఎక్కడ మంచిగా కలుసుకొనుచున్నావని. మరియు... సహోదరుడు ఆస్బోర్న్ నా వలె ఒకవేళ అతడు కూడా ఆర్థికముగా ఉన్నవాడు, అయితే బహుశ అతడు కూడా అన్ని సమయములందునూ, విదేశ సేవా పొలములో ఉండును. అమెరికా ప్రజలు ధనమును కలిగియున్నారు. మరియు అక్కడ ఉన్న ప్రజలకు సువార్త అవసరమైయున్నది. మీరు గనుక అది చూస్తే, అందుకే మన హృదయములు రక్తము కారును.

మనము మన యొక్క అమెరికా సహోదరులను ప్రేమిస్తున్నాము. కాని మరియు... అది ఏమిటంటే, క్రీస్తును తెలుసుకోకుండా వారు మరణిస్తున్నారు. ఇక్కడ మీరు కలిగియున్న అవకాశములు వారికి లేవు. మీరు గనుక బొంబాయి మరియు కలకత్తా గురించి తలంచినట్లయితే, అక్కడ పైన మరియు క్రింద ఆ వీధులలో వేలమంది పడుకొని, ఆకలితో చనిపోతూ, మరియు తల్లులు వారి యొక్క చిన్న పిల్లలతో, వారి యొక్క చిన్న కడుపు ఆకలి చేత పైకి ఉబ్బి ఆ తల్లి ఒక్క పెన్ని కొరకో రెండు పెన్నిల కొరకో అడుక్కొనుచూ వారి జీవము నిలుపుట కొరకు ప్రయత్నం చేయుచున్నారు. ఇలాంటిది జరుగుచున్నప్పుడు, నీవు ఏలాగు కూర్చొని మరియు సమాధానముగా తినగలుగుతావు.

6

మీరు ఎప్పుడైనా ఒక్కసారి అలా వెళ్ళండి, అప్పుడు అది వ్యత్యాసముగా ఉంటుంది. అది ఎప్పుడూ చూడనటువంటిది, అయితే అది వ్యత్యాసముగా ఉండును. మరియు ఆఫ్రికాలో, చిన్న నల్లబాలురు ఏది ఎడమ చేయో, ఏది కుడి చేయో, వారికి తెలియదు. జీవితములో ఎన్నడూ స్నానము లేనివారై, మరియు అక్కడ నిలువబడి వారి యొక్క చిన్న చేతులు బయటకు పెట్టి, వారి జీవితములో ఎన్నడూ యేసు పేరు విననివారై యున్నారు. మన పిల్లలు కలిగియున్నట్లు, వారు కూడా యేసుని గురించి వినుటకు అదే హక్కుని కలిగియున్నారు.

అయితే నేను ఎంత త్వరగా వారిని పట్టుకొని మరియు వారికి సహాయం చేయుదునా అనునది నా యొక్క హృదయముపై ఉంచబడినది మరియు నాకు తెలియును. అది సహోదరుడు ఆస్బోర్న్ మరియు సహోదరుడు జోసఫ్ యొక్క భారమని కూడా మరియు ఎవరైతే ఆ విదేశీ పొలములను దర్శిచెందరో వారు ఇంకెప్పుడు ఇంతకు ముందులాగా ఉండరు.

7

మరియు నేను చెప్పవలయునని అనుకొనుచున్నాను. ఈ యొక్క ఫైన్ స్కూల్ యొక్క అధికారులు ఇక్కడ గనుక ఉన్నట్లయితే, ఈ కూడిక ఇక్కడ జరుగుటకు ఈ రాత్రి, ఈ సదవకాశమును బట్టి నేను వారికి ధన్యవాదములను నా యొక్క హృదయపు లోతులలో నుండి తెలుపుచున్నాను, వారిని ప్రభువు అత్యధికముగా దీవించును గాక, మరియు నేను నమ్ముచున్నాను. లేఖనములలో ఈలాగు వ్రాయబడినది, “మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.” ఆ యొక్క ప్రతి ఫలము ఈ స్కూల్ కి వచ్చును గాక!

మరియు ఇప్పుడు మరి కొద్ది రోజులలో అని నేను ఊహించుచున్నాను. నేను క్లీవ్-ల్యాండ్, టెన్సిస్సీలో ఉండెదను, మరియు అక్కడ నుండి, దిగువన ఉన్న క్యాలిఫోర్నియా, మరియు బహుశా ఆ సమయమునకు, సిద్దపడి మరలా విదేశములకు వెళ్ళవచ్చును. మా కొరకు ప్రార్ధించండి. దేవుడు మిమ్ములను దీవించును గాక.

ఇది నేను దర్శించిన అన్ని స్థలములకంటే సహవాసమునకు ఒక మహిమకరమైన సమయముగా ఉండును.

8

మరియు ఇప్పుడు ఈ రాత్రి, మీ యొక్క ఆసక్తిని ఒక వరసలో ఉన్న వచనమునకు అది యిర్మీయా 8:22 ను చదువుటకు ఇష్టపడుచున్నాను.

“గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా; అక్కడ ఏ వైద్యుడును లేడా?”

యిర్మీయా, చాలా వందల సంవత్సరముల క్రితము, పట్టణపు గవిని యెదుట నిలువబడి ఈ ప్రశ్న అడగమని, యెహోవా చేత ఆజ్ఞాపించబడెను: “గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా?” ఇక్కడ ప్రశ్న ఏమిటంటే “ఎందుకు, అప్పుడు,” అతడు చెప్పెను, “నా ప్రజల యొక్క కుమార్తె బాగవ్వలేదా?”

వాక్యము, “ఎందుకు?” దేవుడే ఆ ప్రశ్నను అడిగాడు. ఎప్పుడైతే దేవుడే ఆ ప్రజల కొరకు ఒక మార్గము చేసియున్నాడో, అపాయము నుండి తప్పించుకొనుటకు, లేదా వ్యాధి నుండి తప్పించుకొనుటకు లేదా ఇబ్బందుల నుండి లేదా ఆపదల నుండి తప్పించుకొను ఒక మార్గమును అనుగ్రహించును, మరియు ఆ ప్రజలు దాని నుండి తిరిగి మరియు దానిని తిరస్కరించును, అప్పుడు దేవుడు అడుగుచున్నాడు, “ఎందుకు? నీవు దానిని అంగీకరించకపోవడానికి కారణము ఏమిటి?”

9

లేఖనములో కనుగొనబడిన విధముగా, II రాజుల గ్రంథము మొదటి అధ్యాయములో, ఆహాబు, అవిధేయుడైన సమరయ రాజు చనిపోయాడు. మరియు అతని కుమారుడు అతనికి మారుగా రాజు అయ్యెను. అతడు, తండ్రి హిజ్కియా వలె, దైవభక్తి లేని మనిషి మరియు ఒక రోజు తన వాకిట వసారాలో నడుచుచుండగా, అతడు కిటికీలో నుండి క్రిందకు పడిపోయెను. క్రిందకు పడిపోయి, తనకు తానుగా గాయపరచబడెను, మరియు ఏదో వ్యాధి అతని యొక్క శరీరములో ఉంచబడెను. మరియు అప్పుడు అతడు తన యొక్క ఇద్దరు సైనికులను పిలిచి లేదా మందిరపు రక్షక భటులను, వారిని ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పంపెను, ఆ దేశము యొక్క దేవత, అది చెడు దేవత ఒకదాని వలె... భవిష్యత్తును చెప్పేవారు. మరియు అతడు చెప్పాడు, “మీరు వెళ్ళి బయల్జెబూబు వద్ద విచారించమని, బయల్జెబూబు యొక్క ప్రవక్తల వద్ద, ”ఈ వ్యాధి పొగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో?“ అని.

మరియు వారు ప్రయాణమగుచుండగా, ప్రభువు యొక్క దూత తిషీయుడైన ఏలియా నొద్దకు వచ్చి, దేవుని యొక్క నిజప్రవక్త, మరియు ఏమి జరుగుతుందోయని అతడికి చెప్పాడు. “నీవు లేచి వారి మార్గములో నిలువబడి, మరియు వారిని అడ్డగించుము.”

మరియు అతడు అలాగున చేసాడు. మరియు అతడు వారితో చెప్పెను, “ఇశ్రాయేలీయులలో దేవుడు లేడా? ఇశ్రాయేలీయులలో ప్రవక్త లేడనుకొని ఈ విషయాలన్నీ విచారణ చేయుటకు బయల్జెబూబు నొద్దకు ఎందుకు వెళ్ళావు?”

10

అది ఇశ్రాయేలీయులలో దేవుడు లేడని కాదు, అదియు కాక ఇశ్రాయేలీయులలో ప్రవక్త లేడని కాదు. కాని అది ఇశ్రాయేలీయులలో ఉన్న ఒక నిజ ప్రవక్త యెడల రాజు యొక్క మొండిపట్టు మరియు అతని యొక్క ద్వేషము. అది దేవుడు దాని కొరకు ఒక పరిహారమును ఇవ్వలేదు. అది కాదు అతడు మరి మొండిపట్టు గలవాడై మరియు అతడికి ఏలీయా అంటే ఇష్టములేదు, ఎందుకనగా అతని తండ్రికి జరిగిన ప్రతి కీడును ముందుగా తెలియజేసియున్నాడు, అందుచేత అతడు అతని యొక్క ఇంటి అలవాట్లను చేర్చుకొనినవాడై, దేవుని యొక్క మనిషిని ద్వేషించుటకు, అతనిని తృణీకరించుటకు మరియు తిరస్కరించుటకు మొదలుపెట్టెను.

మరియు నీవు గనుక నిజమైన మరియు సజీవమైన దేవుడిని తిరస్కరించితే, నీవు వెళ్లగలుగుటకు అక్కడ కేవలము ఒకే విషయమున్నది, అది అసత్యమైన దేవుడు లేక ఒక అబద్దపు దేవుడు యొద్దకు అయి ఉన్నది. ఈ దేశపు ప్రజలే గనుక నిజమైన మరియు సజీవమైన దేవుడిని సేవించుటకు తిరస్కరించినట్లయితే, అక్కడ ఒకే ఒక్క విషయం మిగిలియున్నది. వారు అంగీకరించడానికి, అదే అబద్దపు దేవుడు. ఒకవేళ యెహోవాకు ఒక నిజమైన మతము ఉంటే, మరియు ఆ యొక్క మత క్రమములో నడచుటకు ప్రజలు తిరస్కరించినట్లయితే, అప్పుడు వారు చేయుటకు ఒకే ఒక్క విషయము ఉండును. అది వేరోక తప్పు మార్గము కనుగొని, దానిలో నడుచుటయే.

11

మరియు ఇది మనస్సుకు ఎంత బుద్దిహీనముగా కనిపించును, సహేతుకమైన మనస్సుకి అది కారణముకావచ్చు. నీవు ఏదో నిజమైన దానిని తీసుకొనగలిగినప్పుడు అబద్దమైన దానిని ఎందుకు తీసుకొనెదవు? దేవునివైపు వెళ్లుటకు, దేవుడు తన కొరకు ఆ దాహమును మానవునిలో సృష్టించినప్పుడు, తనలో ఉన్న ఆ దాహమును సంతృప్తిపరచుకోవడానికి మనుష్యుడెందుకు లోకకార్యములవైపు పోవుచున్నాడు? అక్కడ దేవునియందు శాంతి, సంతోషము, ఓర్పు, మరియు మంచితనం మరియు దయ ఉంటుండగా అతడు ఎందుచేత త్రాగుడు మరియు జూదముతో మరి ఎక్కువగా త్రాగి మరియు త్రుళ్ళుచూ, తనను తాను సంతృప్తి పరచుకొనుచున్నాడు? మనుష్యుడెందుకు, అతను బయట పడుటకు మరియు నిర్లక్ష్యముగా ఉండుటకు, తనకు తానుగా విషపు మద్యముతో నింపబడుచున్నాడు. అది, తన ఆత్మను హేయమైనదిగా మరియు అతని యొక్క శరీరమును వ్యాధి కలదానిగా చేసుకొనుట ద్వారా తెలుసుకోవాలను కొనుచున్నాడు. జీవముగల దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ నిత్యజీవపు సమాధానము మరియు సంతృప్తి యున్నది.

12

ఆయనే లోయలో లిల్లీ పుష్పమై ఉంటుండగా ప్రతి పురుషుడు మరియు స్త్రీ సిగరెట్టు పొగ పీల్చడం ద్వారా వారి యొక్క నరములను శాంతింపజేయుటకు ప్రయత్నము చేయుచున్నారు. ఓఫీయమ్ ఎక్కడ నుండి వచ్చుచున్నది? లిల్లీ పుష్పము నుండి. అక్కడ నుండియే ఓఫీయమ్ వచ్చుచున్నది. మరియు ఆయనే లోయలో లిల్లీపుష్పము. మరియు ఆయనే నరముల ఒత్తిడి నుండి నిన్ను విడిపించుటకు అవసరమైయున్నాడు. నీవు పొగత్రాగవలసిన అవసరములేదు. అది నిన్ను చంపివేయును. నేను అనుకొనుచున్నాను, “రీడర్స్ డైజెస్ట్” అది చెప్పుచున్నది, ఈ సంవత్సరము పొగ పీల్చడం ద్వారా నూటముప్పై-మూడు వేల మంది అమెరికన్లు చనిపోయియున్నారు. మీరు దేవుని ఇంటిలోనికి రాగలిగి మరియు శాంతి, మరియు విశ్రాంతి కనుగొనగలిగినప్పుడు, మీ యొక్క నరములను నెమ్మది చేసికొనుటకు మీరు ఎందుకు అది చేయుచున్నారు?

చూస్తుంటే అక్కడ ఏదో మానసికముగా తప్పున్నది, హిజ్కియాతో ఉన్నట్లుగానే దానికి కారణం నీలో నీవు ఏదో సృష్టించుకొనియున్నాను, “ఓ, నేను చర్చికి వెళ్ళాలి అనుకోవడం లేదు. నేను ఆ రకమైన మనిషివలె ఉండాలనుకోవటం లేదు, నేను గనుక సిగరెట్లు విడిచిపెట్టవలసి వస్తే మరియు నా త్రాగుడు విడచిపెట్టాలి అనుకుంటే మరియు... అలాంటి మతము నాకు వద్దు.”

మంచిది, అది హిజ్కియా వలె ఉన్నది, దేవుని యొద్ద నుండి వినుటకు అతడు ఇష్టపడకపోయిన యెడల, అప్పుడు అతడు తప్పుడిది ఏదో వినవలసి వస్తుంది.

13

ఈ రోజు కూడా ప్రజలు ఈ విధముగా ఉన్నారు... అది అలాగే ఉన్నది. ఒక డాక్టరు యొక్క కార్యాలయము తలుపు ఎదురుగా ఒక మనుష్యుడు చనిపోవుచున్నాడు, అతని వ్యాధిని నయం చేయడానికి మందును ఆ భవనములో ఉన్న వైద్యుడు కలిగియుండగా, కాని అతడు దానిని తీసుకోవడానికి నిరాకరించుచున్నాడు. ఒక మనుష్యుడికి వ్యాధి కలిగియున్నట్లయితే, వైద్యుని యొద్ద దానిని నివారించడానికి కావలసిన మందు కలిగి ఉండవచ్చు, మనుష్యుడు ఆ వైద్యుని యొక్క తలుపు ఎదురుగా పడియుండవచ్చును. కాని అతడు తిరస్కరించి దానిని తీసుకొనకపోయినచో, అతడు ఆ తలుపు మెట్ల దగ్గరనే చనిపోవును. మీరు వైద్యునిని నిందించలేరు. అతడు గనుక వచ్చి, దానిని తీసుకొననిచో ఆ వైద్యుడు అతనికి ఔషధము ఇచ్చును. అది అతనిని బాగుచేయును, కాని అది వైద్యుని యొక్క వైఫల్యము కాదు, అతడు ఔషధము కలిగి యుండెను, కాని ఆ మనిషి దానిని తీసుకొనుటకు మెడ వంచని వాడైయుండెను. అప్పుడు అది ఎవరి వైఫల్యము?

కాబట్టి నేడు అలానే ఉన్నది, చాలా మంది ప్రజలు చర్చి ఎదురుగానే చనిపోవుచున్నారు, ఆ మెట్లపై, ఒక విధమైన కుర్చీలపై, పాపముతోనే చనిపోవుచున్నారు, ఎందుకనగా వారు గిలాదులో ఉన్న దేవుని యొక్క గుగ్గిలమును స్వీకరించుటకు తిరస్కరించుచున్నారు. వారందరూ వారి పాపములలోనే చనిపోవుచున్నారు, కారణం వారు దానిని తిరస్కరించుట వలన, అక్కడ అది లేక పోవుట కారణం కాదు గానీ, వారు కేవలం దానిని తిరస్కరించుటను బట్టే. అప్పుడు వారు ఏమి తీసుకుంటారు? దానికి బదులుగా ఏదో ఒక తప్పైన దానిని వారు తీసుకొనవలసియుండును, ఎందుకనగా అక్కడ ఎవ్వరూ లేరు, ఎందుకనగా అది అక్కడే ఉన్నది. కాని పురుషులు మరియు స్త్రీలు కేవలం దానిని తీసుకొనుటకు తిరస్కరించుచున్నారు, మరియు వారు చనిపోవుచున్నారు, సంఘములో చనిపోవుచున్నారు, కూడికలలో కూర్చొని రాత్రి తరువాత రాత్రులు దేవుని యొక్క ప్రవక్తలు ప్రేరేపింపబడి, దేవుని యొక్క వాక్యమును, “మీరు తప్పక మరలా తిరిగి జన్మించాలని,” భయము లేకుండా ప్రకటించుచున్నారు. పురుషులు మరియు స్త్రీలు ఒక విధమైన కుర్చీపై అమర్చబడి మరియు చనిపోవుచున్నారు మరియు వారు నిరాశతో క్రిందికి మునిగిపోవుచూ దేవుని నుండి దూరమగుచున్నారు. కృప మరియు రక్షణ లేదని కారణం కాదు గాని, దానిని పొందుకొనుటకు వారు తిరస్కరించుచున్నారు.

14

“గిలాదులో గుగ్గిలము లేదా? అప్పుడు ఎందుచేత నా ప్రజల యొక్క కుమార్తె ఎందుకు రోగియై యుండెను? ఈమెకు పరిచర్య చేయుటకై అక్కడ వైద్యుడు లేడా?” ఖచ్చితముగా ఉన్నాడు. దేవుడు ఇంకా తన ప్రవక్తలను కలిగి యున్నాడు. దేవునికి ఇంకా గుగ్గిలము కలదు. మరియు దేవుని కుమార్తె ఇంకా రోగియై దాని నుండి కుదర్చబడలేదు. కాని అక్కడ గుగ్గిలము లేదని కాదు, అక్కడ ప్రవక్త లేడని కాదు, కాని కారణము ఏమిటంటే; కుమార్తె ఆ ఔషధమును తీసికొనుటకు తిరస్కరించినది. అది సత్యము.

ఔషధము, మీరు గనుక ఆ ఔషధమును తిరస్కరించినట్లయితే, అప్పుడు అక్కడ ఇంకేమియూ చేయబడదు.

15

ఇప్పుడు, ఔషధము పరీక్షించబడాలి. వారు ఆ ఔషధమును తీసుకొని... ఎప్పుడైతే వారు ఒక విష పదార్ధమును (మందు) కనుగొంటారో, అది ఏదో ఒక రోగము కొరకని తలంచినప్పుడు మొదటిగా వారు గిని పిగ్ పై (ఒక రకమైన ఎలుక వంటి పెంపుడు జంతువు మరియు ప్రయోగశాలలో ఉపయోగపడే జంతువు) ప్రయత్నించెదరు. మరియు ఆ విషపదార్ధమును తీసుకొని, చాలాకాలం వరకు దానిపై పనిచేసి, వారు ఆ గిని పిగ్ పై ప్రయోగించి, దాని యొక్క ప్రతి చర్యను గమనించుదురు. అది గనుక ఆ చిన్న గిని పిగ్ ని గాయపరచకపోతే, అప్పుడు వారు మనుష్యులపై ప్రయోగించెదరు.

కాని ఔషధము చంపుటకు అవకాశం ఉంది. ఒకానొక ఔషధం అది ఒక మనిషికి సహాయము చేయును, ఇంకొకరిని అది చంపవచ్చును. కాబట్టి నీవు దానిని గమనించవలసి యున్నది. ఎందుకనగా.... అది కొన్నిసార్లు నీవు ఏమి చేయుచున్నావో అనే నిశ్చయత నీవు ఎరిగి యుండవలసియున్నది. మరియు ఆ వైద్యుడికి అది తెలుసు అది ఎలాగు ఇవ్వాలో, అది నీకు ఇవ్వబడుతుంది, ఎవరో ఒక్కరు యందు నమ్మకం నీకు కలుగుతుంది.

16

మరియు ఇప్పుడు గుండె జబ్బును గురించి ఎక్కువగా మనము వినుచున్నాము. వారు చెప్పుచున్నారు, గుండె జబ్బు అమెరికాలో అదే మొదటి స్థానమును ఆక్రమించినది. చంపుటలో గుండె జబ్బు కాదు ఎక్కువగా చంపేది; అది పాపమే మొదటిగా అమెరికాను చంపేది పాపమే. ఔషధము... కొంత సమయము వరకు నీ శరీరమునకు నీవు ఒక మాసికను వేసికొనగలగవచ్చు. మరియు ఆ శరీరము ఏ విధముగానైనా చనిపోతుంది. అది తిరిగి భూమి యొక్క ధూళికి వెళ్ళిపోవును. కాని ఆ ఆత్మ ఎక్కడో ఒక చోట నిరంతరం జీవించును. చంపేది అదే, ప్రాణమునకు అదే పాపము. అదే అమెరికాలో ఎక్కువగా మరణము తీసుకువచ్చెడిది.

చాలామంది ప్రజలు చెప్పెదరు, “నేను దీనిని చేయవలెను. నేను దానిని చేయవలెను.”

ఎవరో ఒకరు నాతో ఇలాగు చెప్పారు ఈ మధ్యకాలములో, “బిల్లీ, నేను క్రైస్తవునిగా ఉండుటను ప్రేమించుచున్నాను, కాని నా దగ్గర ఒక అలవాటు ఉన్నది. అది నా తండ్రి నుండి వారసత్వముగా వచ్చినది.” మరియు అతడు చెప్పెను, “ఆ అలవాటు పేకాట ఆడటం మరియు జూదము ఆడటం.” అతడు చెప్పెను, “మరే అలవాటు కన్నా ఇది చాల అధ్వానమైనది.” మరియు ఈ విధముగా చెప్పాడు, “నేను మాత్రము పేకాట ఆడెదను.”

17

కొద్ది కాలము క్రితం నేను ఒక స్త్రీతో మాట్లాడాను, మరియు ఆమె చూడటానికి చాల దుర్భలమైన స్థితిలో ఉన్నది. ఆమె యొక్క యవ్వన దినములలో ఆ ప్రకటన టెలివిజన్ లో మరియు వ్యాపార ప్రకటన బోర్డులపై ఒక అందమైన స్త్రీ సిగరెట్టు త్రాగుచున్నట్లుగా యుండెడిది. మరియు ఆ కంపెనీ వారు ఇలాగు చెప్పారు. అది నిన్ను సన్నగా చేయునని, వారు ఆ విధముగా తమ యొక్క సిగరెట్టును ప్రజలకు అమ్మియున్నారు.

అది నిన్ను సన్నగా చేయును, ఎందుకనగా నీవు చనిపోవుచున్నావు. అది టి.బి. మరియు క్యాన్సరే నిన్ను సన్నగా చేయును. ఆమె చెప్పినది “నేను సిగరెట్టు మాత్రము పీలుస్తాను, నేను దానికి బానిసైయున్నాను.”

మంచిది, నీవు దానికి ఒక బానిసై యుండనవసరము లేదు. గిలాదులో గుగ్గిలము ఉన్నది. క్రీస్తులో గుగ్గిలము ఉన్నది. దాని కొరకు ఒక నివారణ ఉన్నది. నీవు దానిని చేయనక్కరలేదు. నీవు ఇంకా త్రాగనవసరము లేదు. నీవింకా పొగ పీల్చనవసరము లేదు. నీవింకా జూదమాడనవసరం లేదు. మీరు వీటిని చేస్తున్న కారణం, ఎందుకనగా నీవు ఆ నివారణను తిరస్కరించావు. బాగుచేసే నివారణను నీవు తీసుకునేంత వరకు నీవు చర్చి మెట్లపై చనిపోతావు. సంతృప్తిపరచేది అదే. అదే పాపమును దూరముగా తీసివేసేది.

వారు చెప్పుచున్నారు, “నేను దానికి సహాయం చేయలేనని.” నీవు దానికి సహాయం చేయగలవు.

18

మనుష్యుడే గనుక ఆ వైద్యుని మెట్లపై పడియుండి, “ఓ, నాకు తెలుసు, అతడు ఔషధము అక్కడ కలిగియున్నాడు, ఈ వ్యాధి నుండి నన్ను అది బాగుచేస్తుందని, కాని నేను లోనికి వెళ్ళలేను.” నీవు ఎందుకు లోనికి వెళ్ళలేవు? మరియు ఈ విషయములో నీ యొక్క ఆత్మ యొక్క పాపము కొరకు నీవెన్నడైననూ బోధింపబడ్డావా మరియు లోనికి లాగబడ్డావా. కాని ఇంకా ప్రజలు అది చేయలేరు.

పాపము అంటే ఏమిటి? అది నీ యొక్క అపనమ్మకమే. నీవు గనుక దేవునిని నమ్మినట్లయితే, నీవు ఎంత త్వరగా కల్వరి యొద్దకు పరుగెత్తెదవో, అంత త్వరగా కల్వరి యొద్దకు వెళ్తావు. అపనమ్మకము కొరకు దేవుని యొద్ద ఒక పరిహారమున్నది. ఈ రోజులలో దైవిక స్వస్థతను గూర్చి ప్రజలు నమ్మకపోవడములో ఆశ్చర్యము లేదు, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గూర్చి వారు నమ్మరు, ఎందుకనగా అపనమ్మకము నుండి వేరగుటకై వారికి ఇంకా టీకాలు వేయబడలేదు.

19

ఇప్పుడు, డిఫ్తీరియాకు (కంఠవాతము) మందులేని కాలము ఒకటున్నది, మందు లేనప్పుడు చాలా మంది చనిపోయారు. టైఫాయిడ్ జ్వరమునకు మందు లేని కాలమున్నది, కానీ వారు ఈ రోజు వాటన్నిటి కొరకు మందును కలిగియున్నారు.

మరియు ఒకప్పుడు మీ పాపముల నిమిత్తం గిలాదులో గుగ్గిలము లేదు, కాని ఇప్పుడైతే గిలాదులో గుగ్గిలము ఉన్నది. ఈ రోజు మరి ఈ రోజు కూడా దావీదు ఇంటిలో దావీదు పట్టణమునందు దేవుని ఇంట్లో, ఒక ఊట ఉన్నది. తెరువబడి కడుగుకోవడానికి మరియు అపరిశుద్ధమును అంతా శుభ్రమగుటకు, “ఇమ్మానుయేలు యొక్క రక్తనాళములో నుండి ఒక ఊట నిండి యుండి ప్రవహించుచున్నది, ఎక్కడైతే అవిశ్వాసులు ఆ ప్రవాహము క్రింద మునుగుదురో వారి యొక్క పాపపు మరకల నుండి విడిపించబడుదురు.”

20

దేవుని స్వరూపమందు చేయబడిన పురుషులు మరియు స్త్రీలు, నిలువబడి దేవుని వాక్యము సత్యము కాదని చెప్పెదరా. మరియు వారు ఇది అవునా - కాదాయని వారు దీనిని అనుమానంగా చెప్పెదరు. దాని కొరకై ఒక్క ఊట జాగ్రత్త వహించుచున్నది.

ఒక ప్రశ్నాపూర్వక సంభాషణలో వారితో ఈ రోజు మాట్లాడుతుండగా ఒక మనిషి మరియు అతని కుమారుడు వచ్చియున్నారు. “మీరు ఇంకెప్పుడూ, ఇంకెప్పుడూ ముందుకు వేళ్లలేరు, ఎంతవరకంటే నీవు నిజముగా సంతృప్తిచెందే వరకూ, మరియు నీకు నీడంతా అనుమానము కూడా లేనప్పుడు, నీవు దేవుని యొక్క చిత్తములో నడుస్తున్నావని తెలుసుకుంటావు,” అని నేను చెప్పాను. అప్పుడు, నీవు ఎప్పుడైతే నీవు దేవుని యొక్క చిత్తములో మరియు ఆయన మార్గములో నీవు నడుస్తున్నావని తెలుసుకుంటావో, ఇంక మరేదియు నిన్ను ఆపలేదు, ఎందుకనగా నీవు ఎక్కడ నిలబడియున్నావో నీకు తెలుసు. నీవు వెళ్ళుచున్న మార్గము నీకు తెలుసు. నీ మనస్సులో నీవు ఏమి కలిగియున్నావో నీకు తెలుసు; దేవుని యొక్క చిత్తము ఏమిటని, మరియు అప్పుడు నీవు దానిని చేయగలవు.

21

ఇప్పుడు, పాత నిబంధన కాలములో దేవుడు, పాపము కొరకు ఒక ఏర్పాటును చేసినప్పుడు ఇది చాలా ఖచ్చితముగా లేదు, ఎందుకనగా ఆయన దానిని, గిని పిగ్ మరియు వాటి వలే ఉన్న జంతువుల త్యాగపూరిత బాధ క్రింద పెట్టియున్నాడు. రక్తకణము బ్రద్దలైనప్పుడు మరియు జంతువు యొక్క ప్రాణము తీసుకున్నప్పుడు ఆరాధకుని యొద్దకు తిరిగి రాగల ఆత్మ ఆ జంతువులలో లేదు.

కాని ఇప్పుడు దేవుని యొద్ద నిజమైన నివారణ ఉన్నది. మరియు నీ వింక ఏమి ఊహించుకోనవసరము లేదు. అది ప్రతి వారికి సహాయము చేయును, ఎందుకనగా “జీవ జలముల యొద్దకు ఎవరైతే వస్తారో మరియు దానిని ఉచితముగా తీసుకొనెదరు.” అది ఒకరికి సహాయము చేసి మరియొకరిని చంపదు, అది ప్రతి ఒక్కరికి సహాయము చేయును: “ఇచ్చయించు వారు ఎవరైనా రావచ్చు.” అవిశ్వాసులు అందరూ ఆహ్వానించబడ్డారు, వారికి వారే తమ తమ పాపములు కడుగుకొని మరియు అపనమ్మకము నుండి విడిపింపబడెదరు. అది ఖచ్చితమైన నివారణ, నీ కొరకు దేవుడు రెండింతల నివారణను కలిగియున్నాడు.

22

ఇప్పుడు, అది ప్రశ్నించబడినది. కాని ఒక రోజు, ఆ యోర్దాను దిగువన ఒక పాత బోధకుడు, అక్కడ క్రింద నిలబడి ఒక చిన్న ఒంటి చర్మపు ముక్కను అతని మొలచుట్టు చుట్టుకొని, అడవి మిడతలను, తేనెను అతనికి ఆహారము.... దేవుడు గిని పిగ్ ని పంపలేదు, కాని ఆయన తన సొంత కుమారుని ఆ యొక్క మందును పరీక్షించుట కొరకై పంపెను. మరియు అతడు బాప్తిస్మము పొందిన వెంటనే పరలోకము తెరువబడి, మరియు దేవుడే పావురపు ఆకారమువలె, పరలోకము నుండి దిగుచూ, మాట్లాడి మరియు చెప్పెను, “ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాననెను.” ఆయన పైకి వచ్చినది...

అది ఏమి చేస్తుంది? పాపము అని పిలువబడే ప్రతి దానిలో నుండి ఆయనకు (టీకా వేయబడి) మందు వేయబడెను. మనవలె ఆయన అన్నివిధములు శోధింపబడినవాడై, పాపములేనివానిగా యున్నాడు. మరియు ఆయన యొక్క మరణములో, ఆయన మానవునివలే చనిపోయెను, ఒక మనిషివలె కాని ఆ యొక్క మందు ఈస్టర్ ఉదయమున మంచిదని రుజువు పరచబడినది. మరణములో నుండి మరియు మరణము యొక్క బంధకముల నుండి విడిపించబడి, మరియు పాతాళపు యొక్క ముద్రల నుండి ఆయనను లేపినది. మరియు ఆయన నిత్యజీవము యొక్క ఈ మందు (టీకా) రుజువుపరచుటకు తిరిగి లేచియున్నాడు. అది చనిపోయిన వారిని లేపుతుందని, దేవుడు తన సొంత కుమారుని ద్వారా నిరూపించియున్నాడు.

అది ఆయన యొక్క శరీరములో ఉన్నప్పుడు మరియు ఆయన చుట్టూ అక్కడ తిరుగుచూ, ఆయన రోగులను స్వస్థపరచెను. దేవుని చేత ఇవ్వబడిన దర్శనముల ద్వారా ఆయన చేయుచుండెను. ఆయన పరిశుద్ద యోహాను 5వ అధ్యాయము 19వ వచనములో చెప్పెను, “కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను, తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును అలాగే చేయును.” తండ్రి తన దర్శనము ద్వారా ఏమి చేయమని చెప్పాడో, అదే ఆయన చేసాడు.

23

మరియు అప్పుడు, దేవుని యొక్క రక్తము ద్వారా నిరూపింపబడిన తరువాత, ఆయనే పాపముల నుండి బాగుపరచి మరియు శోధనా సమయమందు నిన్ను కాపాడువాడని... అది మాత్రమే చేయగలదని కాదు గాని, గిలాదులో ఉన్న గుగ్గిలము ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా అద్భుతములు అది చేయగలదు. అదే కాదు గాని, నీవు చనిపోయిన తరువాత, మరియు నీవు సమాధిలో నిద్రించినప్పుడు అది నిన్ను తిరిగి లేపుతుంది. ఆ రక్తమే నిన్ను బయటకు లాగును.

అదే గిలాదులో గుగ్గిలము, దేవుడు తన కుమారునికి ఇచ్చిన పరలోకపు గుగ్గిలము, టీకా మందు వేయుట ద్వారా రుజువును తీసుకొని వచ్చుటకు, ఔషధము కొరకు గిని పిగ్ కాదు, కాని పరలోకము నుండి కుమారుడు ఆయన ఏమైయున్నాడని రుజువు పరచబడినది. మరియు అది ఆయన తీసుకొని, మరియు ఆత్మ ద్వారా అభిషేకించబడి మరియు దేవుడే ఆయన యందు ఉండి అద్భుతములు మరియు సూచనలు జరిగించుచున్నాడు. అప్పుడు ఆయన తనలో ఉన్న మానవ జీవమును ఆ కల్వరిపై చంపెను. మరియు ఆయన చనిపోయి, సమాధి చేయబడి, మరియు అక్కడ మూడు పగళ్ళు, రాత్రులు పడియుండెను. కాని ఆ మూడవ దినమున, ఆయన మరణపు యొక్క కట్లను తెంపి మరియు లేపబడెను. ఏలయనగా అతడు చెప్పెను, “ఈ యొక్క టీకా, ఈ గుగ్గిలము చివరి దినములలో మరలా నన్ను లేపును. మూడు రోజుల తరువాత అది నన్ను లేపును.”

24

ఇప్పుడు, ఆయన తన శిష్యులకు ఆజ్ఞాపించెను. మరియు ఆయన చెప్పెను, “బోధించబడటానికి నేర్చుకొనుటకు సెమినరీల యొద్దకు వెళ్ళవద్దు, కాని టీకా మందు పరలోకము నుండి పొందుకొనువరకు యెరుషలేములోనే యుండి కనిపెట్టండి. అది నీ కొరకు జాగ్రత్త తీసుకొనును. అది ఆ శోధన సమయమందు నిన్ను పట్టుకొనును. మరియు ఈ యొక్క టీకాతో (మందు) నీవు ఎప్పుడైతే అభిషేకించబడతావో, అదియే నిత్యజీవము. ”మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్ము ప్రతివానికి ఈ టీకా వేయబడును. నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడును.“

సహోదరుడా, సహోదరి, ఎందుకనగా ప్రపంచ సమూహములు చీకటిలోను, పాపములోను ఉన్నవి. కారణము గిలాదులో గుగ్గిలము లేదని కాదు; కారణము ఏమిటంటే, దానిని తీసికొనుటకు ప్రజలు తిరస్కరించుచున్నారు. ఆటలు ఆడే స్థలముల నుండి జూద శాలల నుండి పురుషులను తీసుకొనే శక్తి దానికి లేదని కారణము కాదు గాని; అది ఎందుకనగా మీ హృదయములో దేవుని కృపకు చోటు లేకపోవుటను బట్టి, అది మిమ్ములను సరిగా జీవించనట్లుగా సరిగా ప్రవర్తించనట్లు సరిగా ఉండనట్లు చేయును; ఎందుకనగా దానిని తీసికొనుటకు వారు తిరస్కరించుచున్నారు.

25

అందుచేత కుమార్తె, దేవుని కుమార్తె, సంఘము చాలా రోగి అయి ఉన్నది. ఈ వ్యాధికి సంబంధించిన వైద్యులు లేరని కారణం కాదు. సత్యమును చెప్పే ఒక బోధకుడు, మరియు దానిని బోధించే వారిని మనము కలిగియున్నాము, అనేక మందిని. ఎందుకనగా కుమార్తె దానిని తీసుకొనుట లేదు. చాలా ఎక్కువ మందును మనము కలిగియున్నాము. కాని ఈ ప్రజలు సంఘములలో పాపముతో చనిపోవుచున్నారు. వారు ఆ తలుపు మెట్లపై చనిపోవుచున్నారు. వారు ఆ సంఘము గుండా సాగిపోవుచూ చనిపోవుచున్నారు. కారణము వారు ఆ టీకాను (మందు) తీసుకొనుటకు తిరస్కరించుచున్నారు.

ఇప్పుడు, దాని తరువాత, ఆ నూట-ఇరవై మంది ఆ మేడ గదిలో కూడుకొనిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడియున్న ఇల్లంతయూ నిండెను. మరియు నూట-ఇరవై మంది మరణము నుండి, మరియు పాపము నుండి, వారిపైకి వచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా టీకా మందు వేయబడిరి. వారు బయలు వెళ్లిన ప్రతీ చోట, బోధించుచూ, సూచనలు...

అవి ఏరకమైన సూచనలు? ఆయన కలిగియున్న అవే రకమైన సూచనలు. పరమవైద్యుడు, వారి ప్రభువైన యేసుని వెంబడించిన, అదే రకమైన సూచనలు అవే నిత్యజీవము యొక్క సూచనలు.

ఒక మనుష్యుడు మరణపు నీడ క్రింద పడియుండెను. వారు ప్రభువైన యేసు యొక్క వాక్యమును చెప్పియున్నారు. మరియు అతని పాదములు మోపబడెను. అతడు జీవమును పొందుకొనెను. ఎందుకు? ఎందుకనగా అతనికి ఇవ్వటానికి వారు ఏదో కలిగి యున్నారు. “వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను.” ఆయన వచ్చినప్పుడు యేసుని వెంబడించిన అదే విధమైన సూచనలు, అదే విధముగా గిని పిగ్ రక్తము రుజువని, గుగ్గిలము (మందు) నిజమని, రుజువు చేసినది.

26

దానిని రుజువు చేయుటకు వచ్చిన ఆయన వెనుక ఏమియూ దాచుకొనలేదు. కాని ఆయన పరిసయ్యులకు బోధించెను, మరియు వారిని వేషధారులని, గడ్డిలో పాములని పిలిచెను. ఆయన ప్రజలలో జనాదరణ పొందవలెనని బయటకు వెళ్లలేదు. “ఆయన తన సొంత వారి యొద్దకు వచ్చెను. మరియు స్వకీయులే ఆయనను చేర్చుకొనలేదు. ప్రతీ సమయములోను అదే విధానమైయున్నది.” మరియు ఇంటి యజమానుని బయల్జెబూబు, అని వారు పిలిస్తే, ఆయన యొక్క శిష్యులను ఇంక ఎంతగా ఏమని వారు పిలిచెదరు? ఈ యొక్క టీకా మందు వారికి ఏమి చేస్తుందో ఆయన వారికి చెప్పాడు. అది వారిని వింతైన వారిగా, మరియు అసాధారణమైన వారిగా, ప్రపంచమునకు అర్థము కాని వారుగా చేస్తుందని. కాని వారు దేవుని యొక్క దృష్టిలో మిగుల విలువైన వారిగా ఉన్నారని, ఇది ఆయన యొక్క సొంత ప్రజలను రక్షించడానికి ఆయన పంపించిన రక్తమైయున్నది.

యేసు కలిగిన అవే సూచనలు, మరియు అద్భుతములు వారు కూడా కలిగి యున్నారని మనము కనుగొన్నాము. మరియు ఆయన ఇలాగు చెప్పెను, “నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” నిత్యజీవము యొక్క అవే సూచనలు...

27

ఆ రోజులలో ఎవరైతే నిత్యజీవము కలిగి ఉన్నారో వారి యొద్దకు ఆ జీవము సూచనలు తీసుకువచ్చినట్లయితే, అదే నిత్యజీవము ఈ రోజు కూడా అదే చేయును. గిలాదులో గుగ్గిలము ఇంకా ఉన్నట్లయితే, అది ఇక్కడ ఉన్నదా? ఆ దినములు గతించిపోయినవా? వారు వెళ్ళిపోయారా? తన సంఘము కొరకు దేవుడు ఆ టీకా (మందు) నుండి పరుగెత్తి యున్నాడా? అది ఆయన చేశాడా? ఆయన గనుక చేస్తే సంఘమునకు దుఃఖము. కాని ఆ పెంతెకొస్తు దినమున వారు ఆ విధముగా కేకలు వేయుచు మరియు దేవునిని స్తుతించుచుండగా, అక్కడ ప్రశ్న తలెత్తినది. “మనుష్యులారా, మరియు సహోదరులారా టీకా మందు వేయించుకొనుటకు మేమేమి చేయవలెను?”

మరియు వైద్యుడైన సీమోను పేతురు ఒక మందుల చీటి వ్రాసి ఇచ్చెను. మరియు అతడు చెప్పాడు, “ఈ మందుల చీటి మీకు మంచి చేయును. మరియు మీ పిల్లల కొరకు మరియు ప్రతీ తరము వారికి మన దేవునిచేత ఎందరు పిలువబడుదురో, వారందరికీ ఈ మందుల చీటి ఉపయోగించ వచ్చును. మీలో ప్రతీ ఒక్కరూ మారుమనస్సు పొంది, మీ యొక్క పాపముల క్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీకు టీకా (మందు) వేయబడును. దేవుని యొక్క మందైన పరిశుద్ధాత్మ అను వరమును మీరు పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికిని అనగా ప్రభువైన మన దేవుడు ఎంతమందిని పిలిచెనో వారికందరికీ చెందును.”

28

ఈ రాత్రి యేసులో గుగ్గిలము ఉన్నది. యేసుక్రీస్తు నామములో గుగ్గిలము కలదు. “నా తండ్రి నామమున మీరు ఏమి అడిగిననూ అది మీకు అనుగ్రహించబడును.” గిలాదులో గుగ్గిలము కలదు. “నా నామమున మీరు దయ్యములను వెళ్లగొట్టుదురు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందెదరు.” గిలాదులో గుగ్గిలము ఉన్నది.

మీరు గనుక త్రాగుడు, జూదమాడుట నుండి విడుదల పొందలేకపోతే, ఆ దురాత్మయే నిన్ను ఆ విధముగా చేయుచున్నది.

ఓ స్త్రీ నీవు నీతిమాలిన బట్టలు వేసికొని, వీధులలో తిరుగుచున్నావు. ఆ దయ్యపు ఆత్మచేత నీవు పట్టబడినట్లయితే, నిజానికి నీవు శుద్ధురాలివిగా ఉండవచ్చును, కానీ తీర్పు దినమందు జారత్వము కొరకు నీవు సమాధానము చెప్పవలసిన దానవైయున్నావు. యేసు చెప్పెను, “ఎవరైననూ ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆ సమయమందే నీ హృదయమందు నీవు ఆమెతో వ్యభిచరించియున్నావు.” ఆ విధముగా నీవు గనుక నిన్ను నీవు చూపించుకొనినచో దానికి నీవు జవాబు చెప్పవలసినవాడవైయున్నావు. జారత్వము కొరకై ప్రతీ మనుష్యుని ముందు నీవు నిలువబడిన దానికి నీవే దోషివి. దేవుని ముందు నీవు జవాబు చెప్పవలసిన దానవైయున్నావు.

29

ఓ మనుష్యుడా నిన్ను నీవు దాని నుండి తొలగించుకోలేవా? చుట్ట అలవాటు నుండి మరియు త్రాగుడు అలవాటు నుండి మరియు జూదమాడు అలవాటు నుండి మరియు దానిని నీవు చేయవలసిన పనిలేదు, ఎందుకనగా అక్కడ గిలాదులో గుగ్గిలము ఉన్నది.

ఇక్కడ కూర్చోని యుండి నా యొక్క బోధను ఈ రాత్రి వినుచూ ఉన్న ఒకరు చికాగోలో త్రాగుబోతుగా ఉండెను. ఒక చిన్న స్త్రీ, త్రాగి దౌర్భాగ్యమైన గబ్బిలాల వంటి ఆకారముగల కన్నులు గలదై ఇక్కడ కూర్చోని ఉన్నది. కాని ఒక రాత్రి గిలాదులో గుగ్గిలమును ఆమె కనుగొన్నది. మరియు ఇప్పుడు తాగ్రుబోతుల మధ్య మిషనరీయై పనిచేయుచున్నది.

గిలాదులో గుగ్గిలము ఉన్నది. అది నీ కొరకే. గిలాదులో వైద్యుడు ఉన్నాడు. కాని ప్రజలందరూ రోగులైయున్నారు. దానికి కారణము, విరుగుడును వారు తీసుకోవటం లేదు.

దానిని గూర్చి ఆలోచించండి. అది కాదు ఎందుకనగా... ఇప్పుడు, తీర్పు నొద్ద దేవుడు చెప్పబోవుచున్నాడు, “మంచిది, నా యొద్ద గుగ్గిలము లేదు.” ఆయనే దానిని కలిగియుండెను. మరియు ఆ మందుల చీటి వారిని పిలచుచున్నది. “ఎవరైతే... అది మీకునూ, మీ పిల్లలందరికీ, దూరస్తులందరికీ మన ప్రభువైన దేవుడు ఎందరిని పిలచెనో వారికందరికి.” నీవు గనుక దానిని స్వీకరించుటకు సిద్దముగా ఉన్నట్లయితే ఇక్కడ గుగ్గిలము సమృద్ధిగా ఉన్నది. ప్రార్ధన కొరకు మన తలలు వంచియుంటుండగా దానిని గూర్చి ఆలోచించండి.

30

దయగలిగిన దేవా, మరణములో నుండి మా ప్రభువైన యేసును తిరిగి వెనుకకు తీసుకొని వచ్చినవాడా, మా యొక్క శుద్దీకరణ కొరకు ఆయనను పైకి లేపెను. మరియు నీ వాక్యము నందు పరిపూర్ణమైన నమ్మకము కలిగి ఈ యొక్క గొప్ప పాపము నుండి, అవిశ్వాసము నుండి బాగవుటకై ఈ రాత్రి ఆ ఖాళీ సమాధిని మేము చూస్తున్నాము. అది మన ప్రభువు చేత వాగ్దానము చేయబడి మీరు ఏమైతే కోరుకుంటున్నారో, మీరు ప్రార్ధించునప్పుడు మీరు నమ్మి, దానిని పొందుకొనండి. అది మీరు పొందుకొని యుండండి. కాని ప్రజలకు నీ యొక్క గుగ్గిలము అవసరమై యున్నది. గిలాదులో గుగ్గిలము వారి యొక్క హృదయములలో పోయబడి, గొప్పదైన, దేవుని రాజరిక పరిశుద్ద తైలము, అది పరిశుద్ధాత్మ అని పిలువబడుచున్నది. అది ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతీ ఆత్మలో పూర్తిగా నింపబడును గాక. పెంతెకొస్తు దినమందు అపోస్తులుడైన పేతురు ద్వారా వ్రాయబడిన ఆ మందుల చీటి ద్వారా, వారి హృదయములలో పశ్చాత్తాపమును, వారి ఆత్మలకు విశ్వాసమును, పుట్టించి, వారు అత్యధికమైన సంతోషముతో ఉచ్చరింపశక్యము కాని మాటలలో మరియు మహిమతో నింపబడిన వారై యుండెదరు గాక. ప్రభువా, దానిని అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో మేము అడుగుచున్నాము.

31

మన యొక్క తలలు వంచియుండగా, నేను మిమ్ములను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడగవలయునని యున్నాను. ఎంతమంది ఇప్పుడు ఆ ఊట యొద్దకు రావలయునని ఉన్నారు? యేసులో ఉన్నరీతిగా, నీలో నిండుగా దేవుడు ఆ పరిశుద్ధాత్మను ఉంచవలెనని, ఎంతో మంది ఆ శోధన నుండి విడిపించబడవలెనని, నీవు ఏదో రుచి చూచిన పొగాకు కంటేను, త్రాగిన దాని వలన కలిగిన సంతోషము కంటేను, సంఘమునకు వెళ్లుట కంటే ఎంతో సంతోషమునిచ్చే, దానిని పేకాట ఆడటం ద్వారా నీవు ఆ విధముగా కలిగియున్నావు. నీవు అది కలిగి యుండుటకు దానిని ప్రేమించావు. పాపము నుండి విడిపించబడి స్వేచ్చగా ఉండుటకు నీవు దానిని కలిగియుండవచ్చు. ఎందుకనగా నీవు శోధింపబడలేదు అని కాదు, కాని ప్రతీ ఒక్క శోధనలో ఆయనే దానిని తప్పించే మార్గమును చేయును. నీవు ఆ టీకాను (మందు) తీసికొనుటకు ఇష్టపడేదవా? ఈ రాత్రి క్రీస్తులో గుగ్గిలము కలదు. ఆ పెంతెకొస్తు దినమందు ఆయన చేసినట్లు, అది నీ హృదయమందు పోయబడుటకు నీవు ఆయనను ప్రేమిస్తావా? నీవు గనుక ప్రార్థనలో గుర్తించుకొనవలయుననినచో నీవు నీ చేయి పైకెత్తుదువా? మరియు ఈ విధముగా చెప్పెదవా, “ప్రభువా, నాపై నీ ఆత్మ కావాలి.” దేవుడు నిన్ను దీవించును గాక. ఆయన ప్రతి హస్తమును చూచును. ప్రతీ ఒక్కరి ఉద్దేశ్యములు ఆయనకు తెలియును. ప్రతి హృదయము ఆయనకు తెలియును.

32

ప్రభువా, నీవు ఆ హస్తములను చూచుచున్నావు. నీ ద్వారా ప్రవక్త అయిన యిర్మియా, ఆజ్ఞాపించబడినాడు. ఓ ప్రభువా, మందిరపు తలుపుల యొద్ద నిలువబడి మరియు వారిని బయటకు పిలువుము. “గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా?” పాపముచే సంఘము అంతా వ్యాధిగ్రస్తమైయున్నది. ఆయన చెప్పెను, “అక్కడ ఏ వైద్యుడునూ ఆ గుగ్గిలము కలిగి పరిచర్య చేయడానికి లేడా? అప్పుడు అక్కడే గాని గుగ్గిలమును మరియు పరిచర్య చేయువాడు ఉన్నట్లయితే, అప్పుడు సంఘము ఎందుకు బలహీనముగా ఉన్నది?” ఈ రాత్రి ప్రభువా దానిని అనుగ్రహించండి. ఎవరైతే ఈ ప్రపంచములో రోగులై మరియు వారి జీవితాలలో రోగులై మరియు వారి పాపములలో మరియు వారి యొక్క అపనమ్మకములో మరియు కలవరపడిన వారిని మరియు సంశయములు కలిగినవారిని... వారి యొక్క హృదయములను నీవు ఎరుగుదువు. ఓ ప్రభువైన దేవా, ఈ రాత్రి ఆ గుగ్గిలమును వారిపై వ్రాయండి. ఆ మాధుర్యమైన పరిశుద్ధాత్మ, మరియు పాపమును తీసివేసి మరియు పాపము నుండి స్వేచ్ఛగా నడచుటకు వారికొక ఆశను పుట్టించి, ఆ శోధన యొక్క సమయమందు ఆయన యొక్క సుముఖములో మమ్ములను నిలుపును గాక.

అది అలాగే జరుగును గాక, ప్రభువా, ఈ రాత్రి దైవికమైన సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ అలాగు ఆ అపోస్తులుల వలే ఆ పెంతెకొస్తు దినమందు వారు పొందుకొనిన మరియు వారికి ఇవ్వబడిన ఆ మందుల చీటి పొందుకొనియున్నట్లుగా ప్రతి ఒక్కరు ఆ ఆలోచనను మరియు బైబిలు అంతటి ద్వారా గుర్తించబడిన, మాకివ్వబడిన ఆ యొక్క అపోస్తలుల మందుల చీటీని అనుసరించుదురు గాక. మరియు పౌలు తరవాత కూడా, ఆ సమయమందు పుట్టిన వాడు, ప్రయాణములో చివరికి వచ్చి, మరియు వారు అతని భుజముల నుండి శిరస్సు వేరుచేయబోవుచుండగా, మరియు మరణము అతని ముఖముపై ఆశ్చర్యముగా చూస్తూ, మరియు సమాధి చెప్పెను, “పౌలు నిన్ను రూపు మారుస్తాను,” అని చెప్పినది.

కానీ అతడు మరణము యొక్క ముఖమును చూస్తూ, “ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరియు సమాధి, నీ విజయమెక్కడ? కానీ యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును అనుగ్రహించుచున్న దేవునికి వందనములు.” ఆ గుగ్గిలము, ఆ టీకా మందు, మనకు తెలుసు ఆ మరణము మనలను బంధించదు అని... మనము ఒక చెంచా అంత దూళి అయినా, దేవుడు పలుకగానే మనమందరమూ లేపబడెదము. మమ్ములను ప్రావీణ్యతను పొందు మార్గములో దీవించమని ఈ రాత్రి మేము ప్రార్ధించుచున్నాము. నీ యొక్క ప్రియమైన చేతులు ప్రతి యొక్క హృదయమును తాకి, మరియు వారి యొక్క ప్రాణములలో నీ యొక్క స్థానమును తీసికొని, మరియు ఈ రాత్రి నుండే వారిని నడిపించనిమ్ము. వారు యధార్ధముగా వారి చేతులను పైకెత్తియున్నారని, నేను నమ్ముచున్నాను. మరియు నాకు తెలియును మీరు చెప్పారని, “ఎవరైతే నా యొద్దకు వచ్చెదరో, నేనెన్నడూ వారిని త్రోసివేయను.” నేను ప్రార్ధించుచున్నాను, ప్రభువా, ఎప్పుడయితే వారు చేతులను పైకెత్తియున్నారో, నీకు అప్పగించుకోవలయునని సిద్దపడియున్నారో, వారి యొక్క పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు నీవు వ్రాసి యున్నావని, మరియు నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వారిని నింపమని, యేసు కొరకై నీ నామములో అడుగుచున్నాము. ఆమేన్.

33

మనము రోగుల కొరకు ప్రార్ధించక ముందు ఇప్పుడు ఒక చిన్న పాటను పాడెదము. “ఓ, నేను యేసుని ఎలాగు ప్రేమింతును.” మన అందరికి అది తెలుసు అని నేననుకొనుచున్నాను. మనము ఈ పాటను పాడుకొనుచూ ఆరాధించుచుండగా....అది మంచిది, సంగీతమును వాయించే వారు ఆ స్వరమును వాయించుచుండగా.

ఓ, నేను యేసుని ఎలాగు ప్రేమించుదును.

ఓ, నేను యేసుని ఎలాగు ప్రేమించుదును.

ఓ, నేను యేసుని ఎలాగు ప్రేమించుదును.

ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించాడు.

ఇప్పుడు, ఇక్కడ ఉన్న విశ్వాసులందరూ, ఈ రెండవ వరుసకై వారు తమ చేతులు పైకెత్తండి, “నేను ఎన్నడనూ ఆయనను విడచిపెట్టను.” మీ చేతులు పైకెత్తి; మీ యొక్క ప్రతిజ్ఞను ఆయనతో చేయుడి.

నేను ఎన్నడునూ ఆయనను విడచిపెట్టను,

నేను ఎన్నడునూ ఆయనను విడచిపెట్టను,

నేను ఎన్నడునూ ఆయనను విడచిపెట్టను,

ఆయనే మొదటిగా నన్ను ప్రేమించాడు.

ప్రభువు మిమ్ములను నిండుగా దీవించును గాక.

34

రోగుల కొరకు ప్రార్ధించే ముందు, నేనొక చిన్న ప్రకటన చేయవలెనని యున్నాను. నేను ఆశించుచున్నాను, ఈ యొక్క అన్ని విషయాలు ఈ రాత్రి ఇక్కడ ఉన్న మీరందరూ మీ హృదయములో నమ్ముచున్న వారందరూ మీరు ప్రభువుని ప్రేమించుచున్నారని, మరి యేదో మీకు జరిగియున్నది, ఎక్కడైనను మీకు సంపూర్ణ సువార్త సంఘము దొరకునని ఆ సంఘము మీకు సంపూర్ణ సువార్తను బోధించునని, దేవుని యొక్క శక్తిని ఆయన యొక్క పునరుత్థానమును గూర్చి బోధించును. ఆ ప్రజలందరితో మీరు కలుసుకొని మీ గృహమునే ఒక సంఘముగా చేసుకోండి. వీధులలో మరియు ఆ చుట్టు పక్కల తిరుగవద్దు; మీ యొక్క ఇష్టప్రకారము ఎక్కడైతే దేవుని యొక్క సువార్త మరియు దేవుని యొక్క శక్తి తెలియ చేయబడుచున్నదో అటువంటి ఒక మంచి చర్చి వెత్కుకొని, మరియు క్రీస్తులో ఉన్న ఆ నిత్యజీవపు సూచనలు ఎక్కడ ఉండునో, అక్కడకు వెళ్లండి.

35

క్రీస్తు చెప్పెను, “నేను ద్రాక్షవల్లిని, మీరు తీగెలు.” మరియు ద్రాక్షవల్లీ నుండి ఆ మొదట వచ్చిన కొమ్మలో పెంతెకొస్తు అనే ద్రాక్ష తీగె మరియు అది బయలు వెడలి సువార్తను బోధించి, సూచనలు మరియు అద్భుతములు ప్రభువైన యేసును వెంబడించినట్టు, సంఘముతో కూడా అవి వెంబడించెను. ఒకవేళ ఆ ద్రాక్షవల్లీ ఆ రకమైన కొమ్మను ఉత్పత్తి చేసినట్లయితే, ఆ మొదటిది, మరియు దాని తరువాత అదే రకమైన దానిని ఉత్పత్తి చేయును. మరియు ఆ యొక్క కొమ్మలో నుండి వచ్చిన ప్రతీ తీగ మొదటి దానివలే ఉండును. వాటికి వ్యత్యాసములు ఉండబోవు, ఎందుకనగా మొదట కొమ్మకు సహాయము చేసిన అదే జీవము చివరి కొమ్మకు కూడా సహాయము చేయును. మరియు మొదటి కొమ్మలో నుండి వచ్చిన అదే రకమైన ఫలము (ద్రాక్షలు) చివరి కొమ్మలో కూడా ఉండును.

ఇప్పుడు, యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఆయన ఎన్నడూ నేను స్వస్థపరచువాడనని చెప్పుకొనలేదు. అది అందరికి తెలుసు. ఆయన చెప్పెను, “నా యంతట నేను చేయలేదు గాని, నాలో నివసించుచున్న తండ్రియే ఈ కార్యములు చేయుచున్నాడు.”

36

నా యొక్క బోధలో నేను ఏమి చూపించాను? గుగ్గిలము, పరిశుద్ధాత్మయే పావురమువలె ఆయన మీదికి వచ్చెను, ఆయనలోనికి వెళ్లాను, మరియు ఆయన దేవుని ద్వారా నింపబడెను - ఆయనే దేవుడు. దేవుడే ఆయనలో కొలతలేనివానిగా యుండెను. ఆయన మనలో కొలతగలవానిగా యుండెను. మనము దత్తపుత్రులముగా స్వీకరించబడ్డాము. కాని వారివలె మనము పిల్లలం. ఈ యొక్క పెద్ద సరస్సులో నుండి చెంచెతో నీళ్ళను బయటకు తీస్తే, ఆ పెద్ద సరస్సులో యున్న రసాయనములే ఈ చెంచాలో కూడా ఉండును. కాని ఇది దానంత కాదు.

ఇప్పుడు, మనము ఆయన బయటకు వెళ్లిపోవడం కనుగొనునట్లయితే, ఒక నిమిషము ఆయన యొక్క పరిచర్యను గమనిద్దాము. మరియు మనము హెబ్రీ 13:8 చూచినట్లయితే, “యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు.” మొదటి కొమ్మ ఆ యొక్క పండును కాచినట్లయితే, మనము చూద్దాం ఆయన ఏమైయున్నాడు మరియు ఆ మొదటి కొమ్మ ఎలాంటిదని అది ఏ కొమ్మయై యున్నదో మనము చెప్పెదము.

37

పరిశుద్ద యోహాను 1వ అధ్యాయములో మనము యేసును కనుగొనెదము. ఆయన పరిశుద్ధాత్మచేత నింపబడిన వెంటనే, అరణ్యములో నుండి వచ్చెను, అంద్రెయ అనే పేరు గల వ్యక్తి మార్పు చెంది మరియు వెళ్ళి తన సహోదరుడైన సీమోనుని కనుగొనెను. మరియు సీమోను ప్రభువైన యేసు సముఖములోనికి వచ్చెను, మరియు యేసు ఆయనెవరో అతడితో చెప్పెను, అతని పేరు ఏమిటని మరియు అతని తండ్రి పేరు ఏమిటని చెప్పెను. యోహాను సువార్త 1వ అధ్యాయము. అది ఆ జాలరులను విస్మయమొందించెను. మరియు ఆయన అతనితో మాట్లాడెను, “నీ పేరు సీమోను, మరియు నీవు యోనా కుమారుడవు, కాని ఇక నుంచి నీవు పేతురు అని పిలువబడెదవు,” “చిన్న బండ” లేదా “చిన్న రాయి” అని దానికి అర్థము.

తక్షణమే దాని తరువాత, అక్కడ ఒకతను నిలువబడి యుండెను. అతని పేరు ఫిలిప్పు. మరియు ఇది చూచిన తరువాత ఉత్తేజము చెంది అతడు బయలుదేరి ఆ కొండచుట్టూ పదిహేను మైళ్లు దూరములో ఉన్న అతని సహోదరుడైన నతనయేలును కనుగొనెను, అతని యొక్క స్నేహితుడు, ఆ చెట్టు క్రింద, ప్రార్ధించుచుండెను, మరియు అతనితో చెప్పెను, “వచ్చి చూడు, మేము మెస్సీయను కనుగొంటిమి,” అని చెప్పెను.

38

అతడు తిరిగి వచ్చుచుండగా, అతడు మాట్లాడుట ప్రారంభించి, పేతురును గూర్చి ఆయన ఏమి మాట్లాడాడో, తన తండ్రి యొక్క పేరును పిలవడం గూర్చి చెప్పాడు. మరియు అతడు ప్రభువైన యేసు యొక్క సుముఖములోనికి వచ్చినప్పుడు, యేసు అతనివైపు చూచి మరియు చెప్పెను, “ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు.” ఆయన యొక్క పరిచర్య ప్రారంభములో, అది పరిశుద్ధ యోహాను 1వ అధ్యాయములో....

ఎప్పుడైతే అతడు చూశాడో, అతడు చెప్పెను, “బోధకుడా, నేను నీకు ఎలా తెలుసు? నిన్ను ఇంతకుమునుపెన్నడూ చూడలేదే, మరియు నీవేన్నడూ నన్ను చూడలేదు. నేను నిజముగా ఇశ్రాయేలీయుడను, కపటము లేని మనుష్యుడనని నీకు ఏలాగు తెలియును. అది నీకు ఏలాగు తెలియును?”

“ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని,” ఆయన చెప్పెను.

39

నిన్నటి దినమున యేసు ఆ రీతిగా ఉండెను. మరియు ఈ విశ్వాసి ఇప్పుడు ఏమని చెప్పెను? నమ్ముటకు అతడిని దేవుడు పిలవకుండా ఏ మనుష్యుడూ నమ్మలేడు. నీవు కూడా ఆ రీతిగానే.....

ఆ కూడికలు మూడు తరగతుల ప్రజలను ఉత్పత్తి చేసినవి. ఒక వర్గము వారు అవిశ్వాసులు, తరువాత వారు నటించు-విశ్వాసులు, మరొకరు విశ్వాసులు. అదే మూడు రకముల ప్రజలను, సువార్త తీసుకుని వస్తుంది. అది ఎల్లప్పుడు మోషే కాలము నుండి, మరి ఆ దారియంతట అది, ఆ ఏదేను తోట నుండి: కయీను ఒక నటించు-విశ్వాసి; హేబేలు, ఒక విశ్వాసి. అది అలాగే ఆది నుండి ఉన్నది.

మరియు అతడు “ఎప్పటి నుండి నన్ను ఎరిగియున్నావు?” అనెను. ఆయన చెప్పెను, “ఫిలిప్పు నిన్ను, పిలువక మునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచితిననెను.” ఎల్లప్పుడూ అతడు అక్కడే ఉండును. కాని ఆయన అతడిని కూటమునకు రాకముందే చూచెను మరియు అతడు ఏమి చేయుచున్నాడో అతనికి చెప్పెను.

నతనయేలు, “బోధకుడా, నీవు నిజముగా దేవుని కుమారుడవు, నీవు ఇశ్రాయేలు రాజువు,” అని ఆయనకు ఉత్తరమిచ్చెను.

40

కాని అక్కడ ఆయన వెనకాల కొంతమంది నిలబడి వారి హృదయములో, “ఈ మనుష్యుడు దయ్యము పట్టినవాడు, బయల్జెబూబు వలన ఇతడు అన్నియు చెప్పుచున్నాడు,” అని అనుకొనిరి.

మరియు యేసు వారి యొక్క ఆలోచనలు మరియు వారు ఏ విధముగా ఆయనను గూర్చి తలంచుచున్నారని గ్రహించి, ఆయన వారి వైపు తిరిగెను. ఇప్పుడు, బైబిలు ఈలాగు చెప్పెను, వారు గట్టిగా బయటకు చెప్పలేదు కాని వారు తమ హృదయములలో అనుకొని యున్నారు. మరియు యేసు, వారి హృదయాలను ఎరిగినవాడై ఆయన వారివైపు తిరిగి చెప్పెను, “మీరు నా గురించి చెప్పుచున్న దానిని గూర్చి నేను మిమ్ములను క్షమిస్తాను. కాని ఒక దినము వచ్చును, పరిశుద్ధాత్మ వచ్చి అవే కార్యములు చేయును. దానికి విరుద్ధముగా ఒక మాట పలికిననూ ఈ యుగమునందైననూ, రాబోవు యుగమందైననూ క్షమాపణ లేదు.”

41

పరిశుద్ద యోహాను 4వ అధ్యాయములో, ఆయన సమరయ గుండా వెళ్ళవలసినవాడైయున్నాడు. మరియు సమరయలో ఒక స్త్రీ నీళ్ళు కొరకు బయటకు వచ్చెను. ఆమె ఒక చెడ్డ పేరు గలిగిన స్త్రీయని మనము నమ్ముచున్నాము. యేసు తన శిష్యులను పట్టణములోనికి పంపెను, ఎందుకనగా ఏమి జరగబోతున్నదోయని, దానిని గూర్చి ఆయనకొక దర్శనము ఉన్నది, ఎందుకనగా దానిని తరువాత ఆయన వారికి చెప్పెను.

మరియు ఆ స్త్రీ నీళ్లను తీసుకొనుటకు చేదుట ప్రారంభించినది. మరియు ఆయన దాహమునకు నీళ్లు ఇమ్మని ఆ స్త్రీని అడిగెను.

మరియు ఆమె విస్మయమొంది, యూదుడైన ఈయనను చూచుటకు వెనుకకు తిరిగినది, మరియు ఆమె చెప్పెను, “యూదులైన మీరు ఈ విధముగా సమరయులను అడుగుట ఆచారము కాదు గదా, ఎందుకనగా మనము ఒకరికొకరము సంబంధం కలిగిలేము, ఒక వేర్పాటు,” అని చెప్పెను.

ఆయన చెప్పెను, “కాని నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగియుంటే నీవు నన్ను అడుగుదువు, మరియు నేను నీకు నీళ్లు ఇచ్చెదను. నీవు చేదుకొనుటకు ఇక్కడకు రావని చెప్పెను.”

ఆమె, “అయ్యా, యీ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే,” అని చెప్పెను.

42

ఆయన ఏమి చేయుచున్నాడు? ఆమెతో సంభాషణ కొనసాగించుచున్నాడు. చివరిగా, తండ్రి ఆమె హృదయములో ఉన్నదానిని బయలుపరచెను. ఎంత మందికి తెలుసు, ఆమె హృదయములో ఏమి ఉన్నదని? ఆమె ఏమి చేసింది? కాబట్టి యేసు చెప్పెను, “నీవు వెళ్ళి, నీ పెనిమిటిని పిలుచుకొని యిక్కడికి రమ్ము,” అని ఆమెతో చెప్పెను.

“నాకు పెనిమిటి లేడు,” అని ఆమె చెప్పినది.

ఆయన చెప్పెను, “'నాకు పెనిమిటి లేడని' నీవు చెప్పిన మాట సరియే, ఎందుకనగా నీకు ఐదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు; సత్యమే చెప్పితివనెను.”

ఇప్పుడు, ఆమె ఏమి చెప్పినది? “నీవు బయల్జెబూబు?” కాదు. ఆమె చెప్పెను, “అయ్యా! నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను.” ఇప్పుడు, మాకు తెలుసు, మేము సమరయులము. మెస్సీయ వచ్చునప్పుడు ఈ సంగతులు మాకు తెలియచేయునని మాకు తెలుసు. కాని నీవు ఎవరవు?“

“నేనే ఆయనను,” అని ఆమెతో చెప్పెను.

మరియు ఆమె పట్టణములోనికి పరుగేత్తెను. ఆమె వర్తమానమును వినండి: “వచ్చి చూడండి, నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. ఈయన మెస్సియ కాడా?” వారు బయలుదేరి వచ్చి ఆయనను నమ్మెను. అది నిజమేనా?

43

ఇప్పుడు, వారు యూదులు మరియు అన్యులు, హాము మరియు షేము ప్రజలు. తరువాత యాపేతు ప్రజలు; అదే మనము. అప్పుడు అన్యులు క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టుకొని యుండలేదు. యూదులు మరియు సమరయ వారు మాత్రమే కనిపెట్టియుండిరి. ఇప్పుడు యూదులు మరియు సమరయులు ఒక వైపు ఉన్నారు, ఎందుకనగా వారు ఆయనను పూర్తిగా తిరస్కరించారు. వారిలో మిగిలిన కొద్దిమందిని (శేషము) మాత్రమే దేవుడు తీసికొనెను. మరియు ఇప్పుడు అది అన్యులైయున్నారు. రెండు వేల సంవత్సరములుగా ప్రభువు రాకడ కొరకు వారు వేచియున్నారు. దేవుడు నమ్మదగిన దేవుడైయున్నాడు, మరియు ఈ సంగతులు మెస్సియ వచ్చే ముందు జరుగబోవునని వాగ్దానము చేసియున్నాడు, ఎందుకనగా అది ఆయన యొక్క ఆత్మ ఒత్తిడి వల్ల వచ్చి, సంఘమును సిద్ధపరచుచున్నది. ఆ గుగ్గిలము మరలా తిరిగి గిలాదులోనికి వచ్చును.

44

ఇప్పుడు, పరిశుద్ద యోహాను 5వ అధ్యాయములో యేసు చెప్పెను (తరువాత అధ్యాయము), ఆయన ఆ ద్వారము గుండా పోవుచుండగా, అక్కడ ఒక మనుష్యుడు కుంటివాడై పడియుండగా, చాలా మంది కుంటివారు, శక్తిలేని ప్రజలు, వేలమంది యున్నారు. ఆయన బేతస్థ కోనేటి క్రిందకు దిగివెళ్ళెను. మరియు ఆయన చుట్టు చూచెను; తండ్రి చేత దర్శనము చూపబడినవాడై, అక్కడ ఒక మనుష్యుడు పడియుండుట ఆ చిన్నపాటి పడకను కలిగి ఒక రకమైన జబ్బుతో పడియుండెను. ముప్పై-ఎనిమిది సంవత్సరములు అచ్చట పడియుండెను. మరియు ఆయన ఆ చిన్నపాటి పడకపై పడియుండిన ఈ మనుష్యుని కనుగొనేంత వరకు గ్రుడ్డివారిని, కుంటివారిని, బలహీనులను వీరిగుండా వెళ్లుచూ - అందరినీ దాటియున్నాడు. మరియు ఆయన అతనిని “స్వస్థపడగోరుచున్నావా,” అని అడిగెను.

అతడు, “నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు,” అని చెప్పెను.

ఆయన చెప్పెను, “నీ పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్లుము.”

మరియు ఆ మనుష్యుడు ప్రశ్నించలేదు. అతడు తన పరుపెత్తుకొని మరియు తన ఇంటికి వెళ్లెను.

45

తక్షణమే, ఏమి జరిగినది? దానిని బట్టి యూదులకు ఒక తప్పు దొరికినది. కాబట్టి వారు యేసును ప్రశ్నించిరి. మరొక మాటలో చెప్పాలంటే, “ నీవెందుకు మిగతా వారిని స్వస్థపరచలేదు? నీవే ఒక గొప్ప స్వస్థపరచువాడవు గదా! మిగతావారందరినీ బాగుచేయమని చెప్పెను.”

అది పరిశుద్ద యోహాను 5:19లో ఆయన ఏమి చెప్పాడో వినండి, “నిశ్చయముగా, నిశ్చయముగా, నేను మీతో చెప్పుచున్నాను, ”తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు. కాని తండ్రి వేటిని చేయుట ఆయన చూచునో, వాటినే కుమారుడును అలాగే చేయును.“

యేసు మన పాపముల కొరకు చనిపోక ముందు చెప్పెను, అదే మన యొక్క ప్రాయశ్చిత్తర్దము, కాబట్టి పనిని కొనసాగించుటకు గిలాదులోని గుగ్గిలము మన యొద్దకు తిరిగి రావలసియున్నది, ఆయన చెప్పెను, “నేను చేయు క్రియలే మీరు కూడా చేయుదురు. వీటికంటే మరి ఎక్కువగా మీరు చేయుదురు, ఎందుకనగా నేను తండ్రి యొద్దకు వెళ్లుచున్నాను. కొద్ది కాలము వరకు ఈ అవిశ్వాస లోకము నన్ను ఎన్నడూ చూడనేరదు. అయితే, మీరు నన్ను చూతురు (సంఘం, విశ్వాసులు), నేను (వ్యక్తిగత సర్వనామము) మీతోను, మీలోను, యుగాంతము వరకు ఉందును.”

46

ఆయనే యేసు, దేవుని కుమారుడు, ఆయన ఇంకా కల్వరిలో చనిపోవుట ద్వారా, తన యొక్క రక్తము చిందింపబడి, సంఘమును పవిత్రపరచి, మరియు దానిని ఒక క్రమములో ఉంచి, మరియు ఆయన పెంతెకొస్తు దినమందు ఎలాగు చేసెనో, ఆ విధముగానే ఆయన యొక్క ఆత్మను తిరిగి సంఘములో ఉంచియున్నాడు. మరియు ఆ పెంతెకొస్తు సంఘము ముందుకు వెళ్లియున్నది, ఆ మొదటి సంఘము, మరియు యేసు చేసిన రీతిగా అదే రకమైన సూచనలు ప్రదర్శించియుండెను, ఎందుకనగా దేవుడే వారితో ఉండెను, వారితో పనిచేయుచుండెను, వాక్యమును సూచనలతో రుజువు పరుస్తూ సాగిపోవుచుండెను.

ఇప్పుడు, ప్రభువా, ఇది నీ యొక్క ఆరాధన, ఇది నీ సంఘము. వీరందరూ నీ జనులు; వరములు నీవి. వీరందరూ రోగులు మరియు అవసరత గలవారు. నీ యొక్క ఆత్మ చేత ప్రభువా, నీ యొక్క గుగ్గిలముతో, ప్రతి ఒక్కరి గుండా మరియు ప్రతి రోగియైయున్న వ్యక్తి గొప్ప వైద్యుని యొక్క మెట్లపై పడియున్నవారు, ఈ రాత్రి వారు చూచి మరియు అర్ధము చేసుకొందురు. ఆయన చనిపోలేదు, ఆ గొప్ప వైద్యుడు, కాని ఆయన మరణములో నుండి పైకి లేపబడెను, మరియు ఆయన తన సంఘములో జీవిస్తున్నాడు. మేము దీనిని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

47

ఇప్పుడు, ఇక్కడ నుండి ఆయనను మాట్లాడనివ్వండి, మరియు ఆయన సజీవుడు కాడో ప్రకటింపనియ్యుడి. ఇప్పుడు, లేఖనములు దానిని ప్రస్తావించుచున్నవని మనకు తెలుసు. కాని ఆయన తన యొక్క వాక్యమును నిలబెట్టుకొనునా? ఆయన దేవుడైతే, ఆయన తన వాక్యమును నిలబెట్టుకొనవలయును. లేఖనములు సరైనవి కాకపోతే, మహ్మదీయుల నుండి మనము ఖురాన్ తీసికొని ఆరాధించెదము, లేదా జైనుల నుండి, లేక సిక్కుల నుండి లేక మనము ఆశించిన ఏ మతమైనా. కానీ క్రైస్తవ్యము తప్ప ప్రపంచములో ఉన్న అన్ని మతములు తప్పు.

నేను ఒక చేతిలో బైబిలు, మరి ఒక చేతిలో ఖురాన్ కలిగి నిలబడి, మరియు మహ్మదీయుల యాజకులను ముందుకు రమ్మని సవాలు చేసితిని. అవును, అయ్యా! దేవుడు దేవుడే. ఆయన ఏలియా యొక్క దేవుడు. ఇంతకు మునుపు ఉన్న విధముగా ఆయన ఈ రోజు అదే దేవునిగా ఉన్నాడు. ఒకవేళ ఆయన అప్పుడు దేవుడైయుంటే, ఆయన ఇంకనూ దేవుడే.

48

కాబట్టి, ఇప్పుడు మనము ప్రార్ధనా వరుసలోనికి వెళ్ళుటకు తొందరపడవద్దు. భక్తిపూర్వకముగా, వరుసగా రండి. కార్డు 1 సంఖ్యతో మనము ప్రార్ధనా వరుసను ప్రారంభించుకొందాము. అదియేనా... అది సంఖ్య 1తో ప్రారంభించుకొందాము. [టేపు పై ఖాళీయున్నది.]

ఒక రోజు ఆమె గొప్ప సమస్యలలో ఉంటుండగా యేసు, ఆ స్త్రీ విషయములో ఏ విధముగా ఉన్నాడో, అదే విధముగా నీయందు శ్రద్ధగలవాడై యున్నాడని నీవు నమ్ముటలేదా?

ఇప్పుడు, నీ దగ్గర ప్రార్ధనా కార్డు లేకపోయినను ఇప్పుడు, బహుశా ఇప్పుడు నీవు రోగివై యుంటుండగా... అది చూస్తుంటే నీ సమస్యలు రెండింతలై యుండ వచ్చును. కాని యేసు ఎల్లప్పుడూ రెండింతల శ్రమలు కలిగిన వారి యొద్దకు వస్తాడు. దానిని మీరు నమ్ముట లేదా?

మరియు ఆమె చాలా జబ్బుగా ఉండెను. కనుక ఒక ఉదయము, ఆమె తలవాకిట కూర్చొని అల్లికల వస్తువులు తయారు చేయుచుండెను మరియు ఆమె చూచినది, ఒక చిన్న పడవ ఆ నదిలో అల్లాడుచున్నది, లేక గలిలయ సముద్రములో ఆమె చూస్తుండగా, పండ్రెండు మంది..... పదమూడు ఖచ్చితముగా, సరస్సు వైపు ఆ వెదురు చెట్ల దగ్గర దిగియున్నారు. మరియు ఆ దారి గుండా పడవ వచ్చుచుండగా, మరియు ప్రజలందరూ బయటకు వచ్చుటకు మొదలు పెట్టియుండగా, అక్కడ ఏదో ఆమె హృదయాన్ని అంటిపెట్టుకొని ఆమెను ఆ క్రింద ఉన్న సముద్రపు దరికి లాక్కొని వచ్చెను. ఆమె ఎప్పుడైతే అక్కడకు వచ్చినదో, అక్కడే ఆ గలిలయలో ఉన్న ప్రవక్తను కనుగొనెను.

49

ఓ, ఆయన మత భేధము గలవాడిగా పిలువబడెను. ఆయన, “మతి-స్థిమితము లేనివాడని” పిలువబడెను. మీలో ఎంతమందికి తెలియును, యేసు ఒక పిచ్చిపట్టినవాడని ప్రకటించియున్నారని? అతడు నిజముగా అలాగే యున్నాడు. మీలో ఎంతమందికి తెలియును, అపోస్తలులు ప్రతీ ఒక్కరూ పిచ్చిపట్టిన వారిగా పిలువబడ్డారని? ఖచ్ఛితముగా యేసుక్రీస్తు ఒక పిచ్చిపట్టిన వాడిగా ప్రకటించబడ్డాడు. “నీవు పిచ్చివాడవు మరియు దయ్యమును కలిగిన వ్యక్తిగా ఉన్నావని మాకు తెలుసు.” పిచ్చి అంటే ఏమిటి? వెర్రి, అస్థిరత.

పౌలు, “పౌలా, నీవు పిచ్చివాడవు. అతి విద్యవలన నీకు పిచ్చిపట్టినది,” అని అన్నారు.

అయితే అతడు చెప్పెను, “వారు మతభేదమని పేరుపెట్టు ఆ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను.” పౌలు పక్షమున నిలవబడవలెనని నేను ఇష్టపడుతున్నాను. దేవుని రాజ్యములో అతనితో ఒక సహపౌరుడనై యుండుటకు, మరియు ఇక్కడ అతనితో బాధింపబడుచూ మరియు ఆయనతో అక్కడ ఏలువాడనై యుండవలెనను కోరుచున్నారు. మతభేదము, వెర్రి అని పిలువబడుచున్న ఆ దారిలోనే.

50

మరియు ఆ చిన్న స్త్రీ క్రిందకు వచ్చియున్నది. బహుశా అక్కడ ఆమె యొక్క సంఘ సభ్యులు ఉండవచ్చును. మరియు వారు ఆమెను ఎగతాళి చేసియుండవచ్చును. కాని ఆమె తలంచినది, యేసు నిజముగా దేవుని కుమారుడని. అయితే ఆమె చెప్పెను, “ఆయన పరిశుద్దుడు; ఆయన దేవుని నుండి వచ్చెను. ఒకవేళ నేను ఆయన యొక్క వస్త్రపు చెంగును మాత్రము ముట్టుకొన్నట్లయితే, నేను స్వస్థపరచబడెదనని నేను నమ్ముచున్నాను.” అది సత్యమేనా? కాబట్టి ఆమె ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొనేంత వరకు ఆమె ఒత్తిడికిలోనై ముందుకు త్రోయబడినది.

మరియు ప్రతి ఒక్కరూ ఆయనతో కరచాలనం చేయుచున్నారు. “బోధకుడా! శుభోదయం,” అనుచూ (రెవరెండ్, అది ఏమైనా, ఉపదేశడా, పాస్టర్) ఆయనను హత్తుకొనుచుండెను.

అయితే యేసు అకస్మాత్తుగా ఆగిపోయెను. ఆ చిన్న స్త్రీ భయపడెను, కాబట్టి ఆమె ఇప్పుడు మీరు ఉన్నట్లు జనులలో కూర్చోనుటకు పరుగెత్తుకొనిపోయెను అని అనుకుందాము. యేసు చుట్టూ చూచి, “నన్ను ఎవరు తాకెను,” అని అడిగెను.

మరియు పేతురు చెప్పెను, “ఎందుకు, ప్రభువా, అందరు నిన్ను తాకుచున్నారు, 'నన్ను ఎవరు తాకియున్నారని?' నీవు ఏలాగు చెప్పగలవు. ప్రతి ఒకరు నిన్ను తాకుచున్నారు.”

ఆయన చెప్పెను, “కాని నేను బలహీనము చెందానని నేను కనుగొన్నాను. ప్రభావము నాలో నుండి బయలువెడలెను.” ఇంకొక మాటలో, వారందరూ తాకుచున్నారు అది సరియే, కాని వారందరూ సరియైన విధానములో తాకుట లేదు. నేను బలహీనుడనయ్యానని నేను కనుగొన్నాను. అదే గనుక ఆయనను బలహీనుడుగా చేసిట్లయితే, అది మనకు ఏమి చేయును? కృపచేత రక్షింపబడిన ఒక పాపి? ఈ విధముగా “వీటికంటే మరి ఎక్కువగా మీరు చేయుదురు,” అని ఆయన గనుక చెప్పనట్లయితే, మనము ఎలాగు నిలబడగలము.

51

“గొప్పవి” అనేది కింగ్-జేమ్స్ తర్జుమా, కాని గ్రీకు తర్జుమాలో అయితే “ఎక్కువ” మీరు గొప్పవి చేయలేరు. ప్రకృతిని ఆపగలుగునంత వరకు ఆయన చేశాడు. మరియు చనిపోయినవాడిని తిరిగి లేపుట. గొప్ప కార్యములు చేయడానికి ఏమి లేవు కాని ఎక్కువగా చేయుదురు, ఎందుకనగా ఆయన... గుగ్గిలము, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ, గుగ్గిలము ఈ భూమియంతట వ్యాపించియున్నది ఆయన సంఘములో, “వీటికంటె మరి ఎక్కువగా చేయుదురు, ఎందుకనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను.” ఆయన తన్నుతాను ప్రతి విశ్వసితో విభాగించుకొనెను. మీరు దానిని నమ్ముటలేదా? ప్రతి విశ్వాసి, ఆయన ఆత్మను ఆయన ప్రతి ఒక్క విశ్వాసితో విభాగించెను. “మరియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, వీటికంటే మరి ఎక్కువగా మీరు చేయుదురు.”

ఇప్పుడు, ఆ స్త్రీ ఆయన యొక్క వస్త్రమును ముట్టెను, మరియు ఆయన చుట్టు చూస్తున్నాడు. ప్రతీ ఒక్కరూ “నేను కాదు. నేను కాదు.”

మరియు చివరగా, ఆయనలో గొప్ప శక్తి యుండెను, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ప్రజలలో ఉన్న ఆలోచనలు మరియు వారి మనస్సులను కనుగొనుచుండెను. కాబట్టి ఆయన జనులను చూస్తున్నాడు, ఆ చిన్న స్త్రీ ఆలోచించుచుండెను. “ఓ, నేనేదో తప్పు చేసియున్నానని. బహుశా చేసి ఉండవచ్చు. తప్పు నా వలన జరిగియుండవచ్చు. కాని ”ఓ, పభువా, నీకు తెలియును అది నాకు అవసరము అని.“

మరియు యేసు ఆమె వైపు చూచి, ఆమెతో యేసు చెప్పెను, నీ యొక్క రక్తస్రావపు సమస్య స్వస్థత నొందెను, ఎందుకనగా ఆమె నమ్మినది. ఆయన ఆమెను ఆ జనులలో నుండి బయటకు తీసుకొని వచ్చి మరియు ఆమె యొక్క పరిస్థితిని తెలిపెను.

52

ఇప్పుడు, నీవు బయట అక్కడ ఉండి, ప్రార్ధన కార్డు లేకుండా నీవు చెప్పవచ్చును, “ఓ, నేను అక్కడ నిలువబడియుండగా నేను కూడా అదే చేయాలని నేను కోరుదును. కాని అయ్యో, ఆయన చనిపోయి వెళ్ళిపోయాడు.” ఓ, లేదు. ఆయన తిరిగి లేచాడు. ఆయన చనిపోలేదు, కాని ఆయన ఎల్లప్పుడూ జీవించియున్నాడు. మరియు లేఖనములు..... మీలో ఎవరైనా బైబిలు విద్యార్థులు లేదా ఉపాధ్యాయులు లేదా తత్వవేత్తలు, క్రొత్త నిబంధన గ్రంథములో, హెబ్రీ గ్రంథములో లేఖనములు చెప్పుచున్నవి. అది ఇప్పుడే, యేసుక్రీస్తే మన ప్రధానయాజకుడై మన యొక్క బలహీనతల ద్వారా ఆయన అనుభూతి చెందుచున్నాడు.

నీవు గనుక ఆయనను తాకితే ఆయన ఎలాగు ప్రతిస్పందించును? ఆయన అదే యేసు అయితే, ఆయన చేసినట్లే అదే రీతిగా ఆయన స్పందించును, ఎందుకనగా ఇంకో విధంగా ఆయన చేయలేదు. కాబట్టి, ఈ రాత్రి ఆయన వైపు నీవు చూడుము, ప్రార్ధన కార్డు లేకుండగా, ఇక్కడ ఉన్నవారిలో ఎంతమందికి ప్రార్ధన కార్డులు లేవు, మరియు నిన్ను స్వస్థపరచుటకు యేసు నీకు కావాలి అన్నవారు, ఎక్కడ ఉన్నప్పటికీ మీ చేతులు పైకి ఎత్తండి. ఇప్పుడు, నీవు కేవలము ఆయనను చూడుము.

53

గర్తుంచుకోండి, నేను మీ సహోదరుడను. నిన్ను స్వస్థపరచడానికి నా దగ్గర ఏ ఒక్కటి లేదు. నేను కేవలం ఒక మనిషిని. స్వస్థపరచడానికి నా దగ్గర ఏ శక్తులూ లేవు. ఏ ఇతర మనుష్యుల యొద్ద స్వస్థపరచడానికి ఎటువంటి శక్తి లేదు. దైవిక స్వస్థత చేసేడివాడు అనునది ఏదీ లేదు. కాని దైవిక స్వస్థతతో పాటు మరే రకమైన స్వస్థత లాంటిది ఏదీ లేదు. దేవుడు మాత్రమే సృష్టించగలిగినవాడు, మరియు నీవు సృష్టించకుండా స్వస్థపరచలేవు.

నీవు నీ చెయ్యని విరుగ గొట్టుకొన్నప్పుడు, వైద్యుడు ఏమియు నీ చెయ్యని బాగుచేయలేడు; ఆయన నీ చెయ్యని సరిచేయును. దేవుడే దానిని స్వస్థపరచును, చూశారా. వైద్యుడు పెరుగుదలను తీసివేయును, కాని దేవుడు ఒక కణమును సృష్టించి దానిని తిరిగి స్వస్థపరచును. మందులు స్వస్థపరచనేరవు. అది కేవలము ప్రకృతికి సహకరించును. దేవుడే సృష్టికర్త, సృష్టించువాడైయున్నాడు. కాబట్టి దైవిక స్వస్థత తప్ప వేరే ఇతర స్వస్థతలేదు.

ఎప్పుడైతే దైవిక స్వస్థత లేదని ప్రజలు చెప్పుదురో, వారు దానిని త్రిప్పివేసియున్నారు, అక్కడ మరే స్వస్థత లేదు, కాని దైవిక స్వస్థత ఉన్నది. దేవుడు చెప్పెను, “నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే.” ఆయన మాటలు ఎన్నడు విఫలము కావు.

54

ఇప్పుడు, మీ యొక్క చెదరని ఏకాగ్రతను నేను కోరుచున్నాను, ఏ ఒక్కరిని కదలకుండా ఉండాలని అడుగుచున్నాను. నిజముగా భక్తిగలవారై, నిశ్శబ్దంగా ఉండి మరియు భక్తిపూర్వకముగా ఉండుడి. మరియు గమనించండి, నమ్మండి, ప్రార్ధించండి. విశ్వాసము కలిగి యుండండి. కేవలము నమ్మండి.

ఇప్పుడు, కేవలము మీ మనస్సులో ఊహించుకొనండి. ప్రభువైన యేసు ఈ యొక్క సభికుల మధ్యకు కనిపించే శరీరములో వచ్చుచున్నాడు. ఇప్పుడు, దానిని చూడగలుగునట్లుగా మీరు ప్రయత్నించండి.

ఇప్పుడు, నేను రోగుల కొరకు ప్రార్ధించబోవుచున్నాను. కాని అది... అది మీరు చూచుటకు, ప్రజలు కొద్ది సేపటి క్రితం తమ చేతులు పైకెత్తినారు, వారు ఎన్నడూ కూడికలో యుండనటువంటి వారు...

ఇప్పుడు, మనము ప్రారంభించేముందు ఈ ప్రశ్నను మిమ్ములను అడగాలనుకొనుచున్నాను. ఇప్పుడు, ఈ ప్రార్ధన వరుసలో ఉన్న ఎవరైనా సరే, ఈ ప్రార్ధన వరుసలోనికి రావాలి అనుకున్న వారయితే, ప్రతి ఒక్కరు తెలుసుకోవలసినది, నేను వారితో ఇక్కడ ఆపి - పరమందున్న పరిశుద్ధ దేవుడు గనుక నాకు వారి జీవితములో ఉన్న పాపమును గూర్చి బయలుపరచితే, నేను చేయుదును... ఈ కూడికలో మీలో అనేక మంది ఉండిరి, వారి పాపము ఎక్కడ ఉన్నదో చూచి, వారిని బయటకు పిలిచి మరియు వారికి చెప్పును. ఎంతమంది దానిని చూశారు, మంచిది, అప్పుడు, చూడండి, మీరు ఆ సంగతులను గమనించండి.

55

కాని ఇప్పుడు, గుర్తించుకొనండి, నిన్ను క్రమపరచుటకు దేవుడు గనుక నీ మీదకు రోగము వచ్చుటకు అనుమతించినట్లయితే, మరియు దేవుని ముందు నీవు క్రమపరచడానికి నీవు తిరస్కరించినట్లయితే, నీవు ప్రార్ధన వరుస నుండి తప్పుకో. నీవు ఇక్కడ వరకూ రావద్దు, ఎందుకనగా నీవు ఇంకా చెడ్డగా తయారగుదువు. నీవు గనుక పాపియైనయెడల, నీ పాపమును ఒప్పుకొనకపోతే, నీ ప్రార్ధన కొరకు దేవుని ముందుకు వచ్చి నీవు సరిచేసుకొని దేవుని యొద్దకు రమ్ము.

ఇప్పుడు, నేను ప్రజలను స్వస్థపరచను, నేను కేవలము ప్రజల కొరకు ప్రార్ధించెదను. కానీ ఇక్కడ వ్యాధిగలవారు ఎవరైనా ఉన్నట్లయితే, దేవుని వాక్యము ద్వారా నేను చెప్పగలను, నీవు స్వస్థపరచబడ్డావు, మన యొక్క అతిక్రమముల నిమిత్తము యేసు గాయపరచబడ్డాడు. మరియు ఆయన పొందిన దెబ్బలచేత నీవు స్వస్థపరచబడియున్నావు. నీవు రక్షించబడ్డావు.... ఆయన మన కొరకు చనిపోవడం చేతనే ప్రతీ పాపి రక్షించబడ్డాడు. ఆయన దానిని పరిష్కరించెను. లోకపాపమును మోసికొనుపోవు దేవుని యొక్క గొర్రెపిల్ల, యేసు చెప్పెను, “అది సమాప్తమైనది.” అది ముగించబడినది. ఇప్పుడు, ఒకే విషయము దానిని అంగీకరించుటే నీవు చేయవలసిన కార్యమైయున్నది.

56

ఇప్పుడు, ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది. అనుకుందాము, ఈమె మొదటిదైయున్నది, నేను ఏదైతే మాట్లాడియున్నానో దానిని గూర్చి ఒక అందమైన చిత్రమువలె, యోహాను సువార్త 4వ అధ్యాయము: యేసు, ఒక మానవుడు, ఒక యూదుడు; ఒక స్త్రీ, సమరయ దేశపు సమరయురాలు. వారు మొదటిసారిగా కలుసుకున్నారు. ఇప్పుడు, ఇది కూడా మరల సరైన చిత్రముగా కనబడుచున్నది; ఒక తెలల్ల జాతి మనిషి, నల్లజాతి స్త్రీ మొదటి సారిగా కలుసుకున్నారు, అదే విషయం, రెండు జాతుల ప్రజలు. కాని దేవుడు అన్ని జాతుల మీద దేవుడై యున్నాడని యేసు ఆమెకు తెలుపుచున్నాడు. మన యొక్క రంగులు, మనమెక్కడ లేపబడ్డాము, మనమెక్కడ తిరిగి యున్నామో, వాటినన్నింటిని గూర్చి కాదు, దానితో ఏమియు లేదు. దేవుడు ఒకే రకమైన రక్తమును తయారు చేసెను, మనుష్యులందరిలోను: పసుపు, గోధుమ వర్ణము, నలుపు, తెలుపు అది ఏమైనా గాని, మనమందరం ఆదామును బట్టి ఒక్క రక్తములో నుండి వచ్చాము. మరియు మన జాతుల వ్యవహారములతో దేవునికి ఎటువంటి సంబంధము లేదు. ఆయనే సమస్త సృష్టిని చేసినవాడు.

ఉదాహరణకు మనము ఒకరికొకరం క్రొత్తవారము. ఇదే మన యొక్క మొదటి కలయిక. మన ఇరువురము దేవునికి తెలుసు.

కానీ ఇక్కడ ఒక అందమైన బావి యొక్క చిత్రపటము మరలా ఇచ్చట ఉన్నది. ఇప్పుడు, ఆ స్త్రీకి నేను ఎవరో తెలియకపోతే, నాకు కూడా ఆమె ఎవరో తెలియదు. మేము ఇరువురము మొదటిసారి కలుసుకొని యున్నాము. ఆయన బైబిలులో చేసినట్లుగా, ఇప్పుడు ఈ వేదికపై దేవుడు ఏదైనా చేయగలిగితే, నేను మీతో మాట్లాడుతున్న విధముగా, మీలో ఎంతమంది నమ్ముదురు. ఆయనే ఇక్కడే ఉన్నాడని మరియు మీరు దానిని అంగీకరించుదురా? అది సరియే.

57

అది నేను కాదు, అని గుర్తించుకోండి, పరిశుద్ధాత్మ..... ఇప్పుడు, అది గనుక జరిగితే, మీరు మీ అభిప్రాయమును తీసుకొనండి. ఇక్కడ రెండు విషయములు మీరు చెప్పవచ్చును, అది చేయగలరు. అది సహజాతీతమైనది, ఎందుకనగా ఆ స్త్రీ నాకు తెలియదు; ఆమెకు కూడా నేనెవరో తెలియదు. మేము ఇరువురము మొదటిసారిగా ఇక్కడ కలుసుకొనియున్నాము. దేవుడు ఇంకా గిలాదులో గుగ్గిలము కలిగియున్నాడని మీరు చూడండి. యేసు మరణము నుండి లేచి మరియు తన సంఘము ద్వారా కార్యములు చేయుచున్నట్లయితే, ఇప్పుడు ఆయన సంఘము ద్వారా ఆ కార్యములను చేయనివ్వండి. చూడండి, అది దేవుని మాట. పణంగా పెట్టబడినది నా మాట కాదు; పణంగా పెట్టబడినది ఆయన మాట. వాగ్దానము చేసినవాడు ఆయనే, నేను కాదు.

అప్పుడు రెండు విషయాలు మీరు చెప్పవచ్చు: మీరు గనుక విమర్శించు స్థితి తీసికొని మరియు అది చేసినది దురాత్మయని మీరు చెప్పవచ్చును. మీరు గనుక చేస్తే, మీరు ఎన్నటికి ఈ లోకములో లేక రాబోతున్న లోకములో కూడా క్షమించబడరు అని యేసు చెప్పెను. అది దేవుడు అని నీవు గనుక నమ్మినట్లయితే, అప్పుడు మీరు ఏదైతే అడుగుతారో దానిని మీరు పొందగలరు.

58

నీవు వ్యాధిగ్రస్తురాలివని నాకు ఏ మాత్రము తెలియదు. కాని నీవే ఊహించుకొనుము. మరియు నేను వచ్చి చెప్పినట్లయితే, “మంచిది, ఆమె ప్రార్ధన వరుసలో ఉన్నది, ఎందుకనగా ఆమె అనారోగ్యముగా ఉన్నది.” మరియు నేను చెప్పుచున్నాను, “ స్త్రీ, నా చేతులు నీపై ఉంచగోరుచున్నాను. నీవు వెళ్ళుము మరియు నీవు బాగవుతావు.” అది సత్యము (చూచారా?), ఎందుకనగా దేవుడే ఆ అనుమతి ఇచ్చియున్నాడు. “వారు రోగులపై తమ చేతులు ఉంచినప్పుడు, వారు స్వస్థత నొందెదరు.” కానీ నేను చేసిన బోధపై నీకింకా ప్రశ్న ఉన్నది. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. మీకింకా ప్రశ్న మిగిలి ఉన్నది, “ఆయన వాక్యము సత్యమేనా? అది సత్యమేనా?” కాని ఇప్పుడు, ఆయన వచ్చి నన్ను అభిషేకించినట్లయితే, ఇక్కడకు వచ్చి అదే కార్యములు గనుక ఇక్కడ ఆయన ప్రదర్శించినట్లయితే, నీ హృదయములో ఏమి ఉన్నదో నన్ను చెప్పనివ్వండి. నీవు ఇక్కడ ఎందుకు ఉన్నావని, లేదా మీకు తెలిసిన దానిని ఏదో కొంత విషయము, నాకు తెలియును ఏమిలేదని, అప్పుడు నీవు తెలుసుకో, అదే మెస్సియ అయి ఉన్నాడని అది నీవు నమ్ముచున్నావా? అది ఆయనని? సమరయలో ఉన్న ఆ స్త్రీ ఏమి చెప్పినది, ఆమె వెళ్లి వారి ప్రజలకు చెప్పినది, “రండి, నాతో చెప్పిన ఆ మనుష్యుడిని చూడండి...” ఇప్పుడు నన్ను కాదు, సహోదరుడు బ్రెన్హాం, మీ సహోదరుడై యున్నాడు, కాని ప్రభువైన యేసును సమాధిలో నుండి లేపిన అదే దేవుడు ఆయన సంఘము ద్వారా పనిచేయుచున్నాడు. మీరు దానిని నమ్ముచున్నారా? చెప్పగలమని సమూహములో ఉన్నవారు చెప్పుచున్నారు. ప్రభువు దానిని అనుగ్రహించు గాక: అది నా ప్రార్థన.

59

ఇప్పుడు, ఆ స్త్రీతో మాట్లాడిన యేసువలే నేను నీతో మాట్లాడుచున్నాను. ఆయన చెప్పాడు, “ఈ దాహమునకిమ్మని.” నేను చెప్పాను, “ఇక్కడకు రండి.” చూడండి, యేసు మరియు స్త్రీ మాట్లాడినట్లు కేవలము మనము మాట్లాడుచున్నాము. మరియు నేను గ్రహించుచున్నాను. నీవు ఒక క్రైస్తవురాలివని; నీవు ఒక విశ్వాసివి. అది నిజము. ఎందుకనగా నీ యొక్క ఆత్మ కదులుతుండగా, నేను..... ఇప్పుడు, నీవు ఒక విమర్శకురాలివి లేదా అవిశ్వాసివి కావచ్చు, చూశారా. కానీ స్వాగతించే అనుభూతి చెందుటకు నీ ఆత్మ కదులుచున్నది. వారు కలిగియున్న ప్రభువు యొక్క దూత చిత్రమును నీవు ఎప్పుడయినా చూశావా.....

ఓ, వందల మంది దానిని చూచియున్నారు, మీరు చూడలేదా, జనులారా. ఇప్పుడు, మీరు ఆ చిత్రపటమును చూచియున్నారు. ఇప్పుడు ఆ వెలుగు నాకును, ఆమెకు మధ్యను నిలువబడి యున్నది. మీరు దానిని చూస్తున్నారు. నీవు దానిని చూశావా... దానిని చూడు. మంచిది, ఆ స్త్రీ కడుపు సమస్యతో బాధపడుచున్నది. అది గనుక సత్యమైతే, నీ చెయ్యి పైకి ఎత్తుము. ఇప్పుడు, నీవు నమ్ముచున్నావా?

60

ఇప్పుడు, నీవు చెప్పవచ్చును, “సహోదరుడా బ్రెన్హాం ఆ స్త్రీ ద్వారా నీవు ఊహించి యుండవచ్చును.” మంచిది, అది ఒక ఊహ మాత్రము అయితే అది మనము చూడవచ్చును. పరిశుద్ధాత్మ ద్వారా... ఎందుకనగా ఆమె ఒక క్రైస్తవురాలు, అది ఇలాగు చెప్పబడుచున్నది. అది ఒక ఊహ కాదు.

ఆమె హృదయములో ఏదో యున్నది, ఎవరి కొరకో ఈమె ప్రార్ధించుచున్నది. ఆమె నీ యొక్క తల్లి. ఆమె నీ తల్లి. ఆమె ఇక్కడ లేదు. ఆమె ఈ దేశములో కూడా లేదు. ఆమె ఓహాయోకు చెందినది. అది సత్యము. మరియు ఆమె గాల్ బ్లాడర్ సమస్యతో బాధపడుచున్నది. అది సత్యము. నీవు ఇక్కడ దానవు కావు. నీవు వాకిగాన్, ఇల్లినాయికు చెందిన దానవు. నీ పేరు మిసెస్. పేయినీ. ఇంటికి వెళ్ళు. నీవు ఏమి అడిగావో అదే పొందుకున్నావు. నీ యొక్క విశ్వాసమే నిన్ను బాగుచేసినది. నమ్ముట నీవలనైతే....

61

అయ్యా, దీనిని గూర్చి నీవు ఏమి అనుకొనుచున్నావు. నీవు వెళ్ళి తినగలిగితే, నీ యొక్క భోజనము చేయుము, ఆ కడుపు సమస్య నుండి విడుదల కమ్ము. అది మంచిది, వెళ్ళి మీ రాత్రి వేళ్లలో తీసుకొనే అల్ఫాహారము తీసుకొనుము.

నీవు నమ్ముచున్నావా, ఆ యొక్క కీళ్ల నొప్పులు నిన్ను విడిచి వెళ్లిపోవునని? మరియు నీవు మంచిగా ఉందువు గాక. నడవడం ప్రారంభించు, చెప్పుము, “ప్రభువైన యేసు, నీకు వందనములు.”

సహోదరి, రమ్ము. నీవు మెట్లు ఎక్కి ఇక్కడకు వచ్చేసరికి, నీ వెన్ను సమస్య నిన్ను విడచిపెట్టినదని నీవు నమ్ముచున్నావా? దేవునిని స్తుతించుచూ వెళ్లుము.

చాలా కాలము నుండి నిన్ను బాధించుచున్న ఆ యొక్క నరముల బలహీనత ఇప్పుడు అది నిన్ను విడిచిపోవునని నీవు నమ్ముచున్నావా? రోడ్డుపై పోవుచూ సంతోషముగా ఉండుము.

కేవలము విశ్వాసము కలిగి దేవుని యందు నమ్మకముంచుడి. మీరు దానిని నమ్ముదురా. ఆమేన్.

ఒక నిమిషము గమనించండి. సమూహములో ఏదో జరిగినది. ఒక మనుష్యుడు వెళ్లిపోవుచుండెను, అక్కడ నడుస్తున్నాడు. ఇటువైపు తిరగండి, అయ్యా. అక్కడ ఏదో ఇప్పటివరకూ నిన్ను సరిగ్గా తాకలేదు. ఎవరి కొరకో నీవు ప్రార్ధించుచున్నావు. అది సత్యము. నీవు సమూహములను విడిచి పెట్టినప్పుడు, ఇక్కడ నుండి వదలి వెళ్లినప్పుడు, నీవు కొద్దిగా నిరుత్సాహపడ్డావు. నీ భార్య ఒక భయంకర పరిస్థితిలో ఉన్నది. అది సత్యము. ఆమె ఇక్కడ లేదు. ఆమె ఒక నరముల బలహీనతతో బాధపడుచున్నది. అది ఆమె కాదా? బెన్టన్ హార్బరుకు తిరిగి వెళ్లు; దేవుడు ఆమెను బాగుచేయునని నమ్ముము.

62

ఇది మీరు తెలుసుకోవలయును, అక్కడ వెనుక ఒక మనిషి కూర్చొనియుండెను, అతడు తిరిగి అతని వెనుక అక్కడ తన స్నేహితుడితో చెప్పెను, అతడు కూడా బెన్టన్ హార్బరు నుండి వచ్చెను. మరియు అతడు తన పాస్టర్ కొరకు ప్రార్ధించుచుండెను. అతడికి నరముల వ్యవస్థ దాదాపు పనిచేయడం లేదు. అది “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.”

దేవునిని నమ్ముటకు మీ విశ్వాసమును నేను సవాలు చేయుచున్నాను. కేవలము ఇప్పుడు విశ్వాసమును కలిగి యుండండి. భక్తిపూర్వకంగా ఉండండి మరియు మీ హృదయమంతటితో నమ్మండి.

నమ్మండి, సహోదరి, గుండె సమస్య అది నిన్ను వదలిపోవును, మరియు నీవు ఇంకెప్పుడూ దానితో బాధపడవు. నీవు నమ్ముచున్నావా? క్రీస్తునందు సంతోషించుచూ వెళ్ళు.

రమ్ము, చిన్నవాడా. నీవు నమ్ముచున్నావా, నీ ముఖముపై అది విడిచిపోవునని? ప్రభువా, యేసు నామములో. సందేహించవద్దు. నీవు అతనిని స్వస్థపరచుదువని, అతని కొరకు నేను ప్రార్థించుచున్నాను. ఆమేన్.

రమ్ము, సహోదరి, నీ హృదయమంతటితో ఇప్పుడు నమ్మండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము, నా సహోదరి కొరకు ప్రార్ధన చేయుచున్నాను. ఆమేన్.

63

“ఇప్పుడు, బైబిలు చెప్పెను, ఈ సూచనలు మిమ్మును వెంబడించును. ఈ యొక్క దర్శనములు నన్ను చాలా బలహీనపరచును, నేను వాటి క్రింద తొట్రుపడుదును. మీరు చూశారా, నేను ఒక నిమిషము ఆపవలయునని అనుకొనుచున్నాను. అది మంచిది. నీతో ఉన్న తప్పు ఏమిటనేది నాకును తెలియునని నీకు తెలుసు, కాని నీకు చెప్పవలసిన అవసరము లేదు. నమ్ముచున్నావా? నీవు నమ్ము, నేనే గనుక...నీవు నమ్మినట్లయితే, నాకు తెలుసు నీతో ఉన్న తప్పు ఏమిటని? మంచిది, నీవు వెళ్లి రాత్రి భోజనమును తీసుకొనుము. నీ కడుపు సమస్య నిన్ను విడిచిపోయెను. నీవు వెళ్లవచ్చును.....

చూడుము, కేవలం విశ్వాసం కలిగియుండు. నీ హృదయమంతటితో నమ్ము. ఇప్పుడు దర్శనముల కొరకు నీవు చూడవద్దు. కారణము అది నన్ను చాలా బలహీనునిగా చేయుచున్నది. ఈ ప్రార్ధనా వరుస ముగిసేలోపు నేను వెళ్ళిపోవాలి.

అది నీవు నమ్ముచున్నావా? నీలో ఉన్న సమస్యను గూర్చి దేవుడు నాకు బయలుపరచునని నీవు నమ్ముచున్నావా?

అయితే ప్రజలు ఆలోచించరు అది ఒక్కరికేనని లేదా మరేదో... జనసమూహములో ఉన్నవారు ప్రార్ధనా కార్డులు లేనివారు, నిజముగా నమ్మండి, దేవుని యందు విశ్వాసముంచండి. సందేహించవద్దు. నమ్మండి. సమూహములోని వారిని నమ్మనివ్వండి. నీవు కలిగియున్న దానికొరకు ప్రార్ధించు. పరిశుద్ధాత్మ నన్ను పిలుచుట కొరకు నేను ఒక వెలుగు కొరకు కనిపెట్టుచున్నాను.

64

ఇక్కడ కుడి వైపున వెనుక కూర్చొని యున్న ఒక స్త్రీ ఆమె తలవంచుకొనియున్నది. ఆమె రెండవది. నేను చూస్తున్నాను. ఎవరో కనబడుచున్నారు నా ముందు. అది ఒక మనుష్యుడు. తన సహోదరుని నరముల ఆమె ప్రార్ధించుచున్నది. అది సత్యము. పైకి లే, స్త్రీ అది గనుక సత్యమైతే, నీ కాళ్ళు పై నిలువబడుము. అది సత్యము. అది మంచిది. ఇప్పుడు, నీవు ఏమి అడిగావో అది పొందుకొనియున్నావు. నేను నీకు తెలియదు, నువ్వు నాకు తెలియదు. కాని అది ఖచ్చితంగా నీవు దేనికొరకు ప్రార్ధించావో, అది సత్యమేనా? అదే గనుక సత్యమైతే, నీ చెయ్యిని పైకెత్తు, దానిని జనసమూహములో ఉన్నవారు చూతురు. అది మంచిది? ఇంటికి వెళ్లి, మరియు నీవు విశ్వాసించిన మార్గములో దానిని కనుగొనుము. ఆమేన్.

ఇంకా ఎవరైనా ప్రార్ధించి మరియు నమ్మండి.

నీవు నాకు తెలియదు. మనము ఒకరికొకరము క్రొత్తవారము. నీవు ఎందుకు ఇక్కడ ఉన్నావో, నీ మనస్సులో ఏమి ఉందో, దేవుడు గనుక నాకు బయలుపరచితే - నేను ఆయన యొక్క ప్రవక్తనని... లేదా ఆయన సేవకుడని? నీవు నమ్ముదువా? అప్పుడు అది నేను కాదు. నా తల్లికి నీయంత వయస్సు ఉండును. మరియు నేను ఏ విధముగానైనా ఉండగలను. కానీ ఎవరో ప్రియమైన తల్లికి ఒక వంచకుడిగా ఉండలేను. నీవు ఇక్కడ ఉన్నది నీ కొరకు కాదు. ఎవరి కొరకో నీవు ఇక్కడ ఉన్నావు. అది నీ మేనల్లుడును గూర్చి. అతడు ఓహాయోలో ఉన్నాడు. ఆయన యుద్దమందు గాయము నొందెను, నిజముగా నరముల వ్యాధి, తలపై దెబ్బచే గాయము నొందెను. మరియు అతని తరుపున నీవు ఇక్కడ నిలువబడి యున్నావు. పరమందున్న దేవుడు నీకు బహుమానము ఇచ్చును గాక, మరియు క్రీస్తు నామములో ఆయన బాగుగా ఉండుట నీవు కనుగొందువు. ఆమేన్.

65

నీవు గనుక నమ్మినట్లయితే, సమస్తమును సాధ్యమే. రండి, ఇప్పుడు, నమ్మికయుంచండి. సందేహించవద్దు. నమ్మండి. కేవలము భక్తిపూర్వకముగా ఉండుము మరియు నమ్ముము.

రండి, అయ్యా. ప్రభువా, క్రీస్తు నామములో నేను ప్రార్ధన చేస్తున్నాను, నీవు మా సహోదరుని స్వస్థపరచుము. ఆమేన్.

మంచిది. రండి, సహోదరి, నీవు...?

నీవు ఇక్కడ నన్ను దాటుకొని వెళ్ళుచుండగా, సహోదరుడు బ్రెన్హాం వలే నన్ను దాటిపోవద్దు. నేను కేవలము ఒక సహోదరుడను, చూశారా. కానీ నీవు ఇక్కడకు వచ్చుట ద్వారా, క్రీస్తు నిన్ను ఏమి చేయమని చెప్పుచున్నాడో, దానిని నీవు నెరవేర్చుచున్నావని తెలుసుకుంటావు. నీ ఆశీర్వాదమును స్వీకరించు, ఎందుకనగా దానిని ఆయన నీకు వాగ్దానము చేశాడు. చూడు, దానిని నేను నీకు ఇవ్వలేను. ఆయన యొక్క వరము ద్వారా నీవు ఎందుకు ఇక్కడ ఉన్నావు, అని నేను నీకు చెప్పగలను, కానీ... నేను నిన్ను స్వస్థపరచలేను.

అది నీకు తెలుసు, నీకు తెలుసు కదా? అయితే నీవు అది నమ్మినట్లయితే దానిని నీవు పొందుకుంటావు, నీ కీళ్ళనొప్పులు నిన్ను విడచిపోవును. నీవు దానిని నమ్ముచున్నావా? మంచిది, నీవు వెళ్లి, నీ హృదయమంతటితో నమ్ముము.

66

అది మంచిది. నీవు తప్పక నమ్మవలెను. సహోదరి, నీవు జీవిస్తున్నట్లయితే, క్యాన్సర్ నిన్ను చంపవచ్చు, కానీ నీవు గనుక నమ్మినట్లయితే, దేవుడు దాని నుండి నన్ను స్వస్థపరచును? ప్రభువా, యేసుక్రీస్తు నామములో, ఈ స్త్రీని స్వస్థపరచుము. ఆమేన్.

నీవు నమ్ముచున్నావా, సహోదరి? దేవుడు, యేసుక్రీస్తు నామములో మా సహోదరికి స్వస్థత అనుగ్రహించండి. ఆమేన్.

ప్రభువా, యేసుక్రీస్తు నామములో, ఈ మనుష్యునికి స్వస్థత అనుగ్రహించండి.

రమ్ము సహోదరి, నీవు నమ్ముచున్నావా సహోదరి? నీవు నమ్ముచున్నావా? నీవు వెళ్ళుచున్నప్పుడు ఆ యొక్క కీళ్ల నొప్పుల నుండి విడుదల పొంది మరియు నీవు బాగవ్వబోవుచున్నావు? నీకు మిగతావి కూడా ఉన్నవి, కాని అదే పెద్ద సమస్య నీకు. ప్రభువా, యేసు నామములో, ఈ స్త్రీ యొక్క స్వస్థత కొరకు అడుగుచున్నాము. ఆమేన్.

అది మంచిది, సహోదరి. చేతి కర్ర సహాయముతో నీవు నడుచుట మేము చూస్తున్నాము. మరియు మనకు తెలుసు దేవుడు మాత్రమే నిన్ను స్వస్థపరచును అని. నేను అది చేయలేను. కానీ, నీ కొరకు నేను ప్రార్థించినట్లయితే నీవు నమ్ముచున్నావా, దేవుడు నిన్ను తొందరగా బాగుచేయునని? ఇక్కడకు రండి. ప్రభువా, నేను ఈ స్త్రీ పై నా చేతులు ఉంచుతున్నాను. ఒక రోజు యెరుషలేము వీధులలో నుండి లాగబడుచున్నప్పుడు, భరించువాని యొక్క రక్తముతో కూడిన అడుగుజాడలతో అ పాత కఠినమైయున్న సిలువ బయటకు లాగబడుచున్నప్పుడు, ఆ బరువు క్రింద ఆయన పడిపోయెను. ఆయన చిన్న బలహీన శరీరము పడిపోయెను. మరియు కురేనీయుడైన సీమోను వచ్చి సహాయము చేసి ఆ సిలువను చుట్టెను. ఇక్కడ ఆయన పిల్లలలో ఒకరు, చేతికర్ర సహాయముతో కుంటుతూ ఇక్కడకు వచ్చెను. యేసుక్రీస్తు నామములో నా చేతులను ఆమె పై వేయుదును. ఆమె బాగుపడును గాక. ఆమేన్. సహోదరీ దేవుడు నిన్ను దీవించును గాక. ఆయన నిన్ను స్వస్థపరచి మరియు బాగుచేయును గాక.

67

రండి, సహోదరుడా. నేను ప్రార్ధించుచుండగా ఈ యవ్వన సహోదరుడికి దేవుడు స్వస్థతను అనుగ్రహించు గాక. యేసుక్రీస్తు నామములో, అతడు త్వరగా కోలుకొనును గాక. ఆమేన్.

రమ్ము సహోదరి, నీవు నాకు తెలుసు. నేను నమ్ముచున్నాను. సహోదరి డోమిక్ స్నేహితురాలివి నీవు కాదా. అది మంచిది, సహోదరి. ఓ ప్రభువా, ఈ చిన్న నీ సేవకుడు స్వస్థత కొరకు నీ వైపు చూస్తున్నాడు, ఎలాగు మీకు వందనములు తెలుపగలము.... ఆ యొక్క చిన్న సమూహములో, ఆ భయంకరమైన క్యాన్సర్ ను నీవు బయటకు తీసివేసియున్నావు. మరియు నేను ఆమె కొరకు ప్రార్ధించుచున్నాను, ప్రభువైన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆమెను స్వస్థపరచుము మరియు ఆమెను బాగుచేయుము. నీ ఆత్మ ఇక్కడ ఉండగా, ఇప్పుడు మా సహోదరి దానిని చేరుకొనునట్లు మరియు ఆ దేవుని యొక్క వరమును పొందుకొనును గాక. క్రీస్తు నామములో ఆమేన్. ప్రియ సహోదరి దేవుడు నిన్ను దీవించును గాక.

అది మంచిది, రండి. ఇప్పుడు, చిన్న స్త్రీ, అది ఒక అవమానము. అది గుండె బలహీనత నిన్ను ఆ విధముగా చేయుచున్నది. కానీ నీవు క్రీస్తుని సేవించవలెనని కోరుచున్నావు. నీవు బాగుగా ఉండుటకై అదే నీకు కావాలి. ఆయనను సేవించాలంటే? ఇక్కడకు రమ్ము. నీ కొరకు ప్రార్ధించెదను. నా కొక చిన్న కుమార్తెయున్నది. రిబ్కా నీయంతే ఉన్నది. ప్రియమైన దేవా, నేను చిన్న రిబ్కాను ఇంటి యొద్ద వదిలి పెట్టి ఈ అమ్మాయి కొరకు ప్రార్ధించడానికి ఇక్కడకు వచ్చియున్నాను. ప్రభువా, ఆమెను కనికరించు, మరియు ఆమె స్వస్థపడునట్లు అనుగ్రహించండి. మేము నీవిచ్చిన సూచనలను బట్టి మా యొక్క చేతులను రోగులపై వేయుచున్నాము, మీరు వాగ్దానము చేసారు, నమ్మిన వారివలన ఈ సూచనలు వెంబడించును అని, దాని ద్వారా వారు స్వస్థత నొందుదురు. ఇప్పుడు, అలాగు జరుగును గాక, దీవెన నొందు సహోదరి, నీవు త్వరగా బాగవ్వు. ప్రభువైన యేసు నామములో ఆమేన్.

68

దేవుని యందు విశ్వాసముంచుడి. భక్తిపూర్వకముగా ఉండుడి. సందేహింపవద్దు.

ఓ క్రీస్తువైన దేవా, నా సహోదరిని స్వస్థపరచు నేను నా చేతులను ఆమె పై వేయుచున్నాను. యేసు నామములో స్వస్థపరచమని అడుగుచున్నాను. ఆమేన్. సహోదరి ఇప్పుడు నమ్ముము. సహోదరి సిమ్స్, నాకు నీవు తెలుసు. ప్రభువైన దేవా, ఈ ప్రియమైన స్త్రీ నా కొరకు భోజన పదార్ధములను సిద్ధపరచేది, నా యందు దయకలిగియుండెడిది, నీ వాక్యములో నీవు చెప్పియున్నావు, కనికరము చూపువానియందు నేను కనికరము చూపుదును. “మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక (అది నాకు చేసితిరి) నా యొక్క చిన్నవారికి, అది నాకు చేసినట్లే. నీ యొక్క బహుమానము పోగొట్టుకొనవు. ఆమె యొక్క హృదయపు కోరికను మీరు తీర్చండి. యేసు నామములో ఆమేన్.

సహోదరుడు సిమ్స్, దేవుడు నిన్ను దీవించును. తండ్రివైన దేవా, సహోదరుడు సిమ్స్, కొరకు నేను ప్రార్ధించుచున్నాను, ఏమనగా అతనికి అనుగ్రహించుము అతని యొక్క హృదయపు కోరికను, మరియు ఆ దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రభువా, అతనికి దయగలవాడై మరియు కనికరము చూపినట్లు కనికరము చూపువారియెడల నీవు కనికరము గలవాడై యుండెదవు. అనుగ్రహించండి తండ్రి. అతని హృదయములో ఉన్న ఆశను యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్. సహోదరుడా, నిన్ను దీవించును.

కేవలం నమ్మండి. సందేహింపవద్దు. నమ్మండి. మీరు నమ్ముచున్నారా? బయట ఉన్న ప్రజలు?

69

ఆ వైపున ఉన్న ఆమె తన చేతులు పైకి ఎత్తిన స్త్రీ నీకు కంటిలో ఒక సమస్య ఉన్నది. అది యేసుక్రీస్తు ద్వారా అది బాగుపడునని నమ్ముచున్నావా. ఇక్కడ బయట వరుసలో కూర్చొనియున్న నీవు ఆయన చేయగలడని నీవు నమ్ముచున్నావా? అవును. అది మంచిది.

అక్కడ పాదముల సమస్యతో, అక్కడ కూర్చొనియున్న నీవు నమ్ముచున్నావా, అది దేవుడు నిన్ను బాగుచేయునని? అది మంచిది. అది నీవు పొందుకొనియున్నావు. నీ హృదయమంతటితో నమ్ముము.

ఇప్పుడు, నీవు గనుక నమ్మినట్లయితే... ఆమె యొక్క చేతులు పైకి ఎత్తియున్న ఆ స్త్రీ అక్కడ, చూడండి. అదే ఆమె...

ఇప్పుడు, నీ చేతులను ఈ స్త్రీ పై, ఇక్కడ ఉన్న రెండవ స్త్రీ పై, ఆ స్త్రీ పాదముల సమస్యతో, మీరు ఇరువురు ఒకరిపై ఒకరు చేతులు వేసుకోండి. ఒకరుపై ఒకరు చేతులు వేసుకొనియుండగా మేము ప్రార్థించెదము. అది మంచిది, మీరు చేతులు వేసుకొనియుండగా.... అది మంచిది. ప్రభువైన దేవా, వారు విశ్వాసులు లేక వారు ఎన్నడు యేసును ముట్టియుండ లేదు. తండ్రి, నేను ప్రార్ధించుచున్నాను, నీవు వారి యొక్క హృదయపు కోరికను వారికి అనుగ్రహించమని, వారిని బయటకు పిలచియున్న ప్రధానయాజకుడిని వారు ముట్టియున్నారు. యేసు నామములో వారిని స్వస్థపడెదరు గాక. ఆమేన్. సందేహించవద్దు. ఇంటికి వెళ్ళి మరియు దేవుని రాజ్యము కొరకు మంచిగా ఉండుము. ఆమేన్.

70

ప్రార్థించవలెనన్నా స్త్రీవి నీవేనా? ఆయన సేవకుడని నీవు నన్ను నమ్ముచున్నావా? మనము ఒకరికొకరము పరిచయము లేనివారము? నీ హృదయములో ఉన్న రహస్యమును దేవుడు నాకు బయలుపరచునని నీవు నమ్ముచున్నావా? నీవు నిజమైన విశ్వాసివి. స్త్రీ సమస్యను గూర్చి నీవు ఇక్కడ ఉన్నావు. ఆ సమస్య అది పిల్లలు పుట్టుట ద్వారా. నీవు శ్రీమతి. మ్యాక్ కులోద్. నీవు ఇంటికి తిరిగి వెళ్ళుము, నీవు బాగవుతావు. యేసుక్రీస్తు నిన్ను త్వరగా బాగుచేయును.

రమ్ము, సహోదరి, దానిని నమ్మండి, ఓ ప్రభువైన దేవా, కనికరము చూపండి మరియు నా సహోదరిని స్వస్థపరచండి, యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

రమ్ము, నా సహోదరి, ప్రియ తండ్రి, దేవా, నా చేతులను నా సహోదరి పై వేయుచున్నాను. యేసు నామములో ఆమె యొక్క స్వస్థత కొరకై.

ఇప్పుడు, సంఘము ప్రార్ధించబోవుచున్నది. ఈ యొక్క రోగుల కొరకు ఇక్కడ ఉన్న వారి కొరకు ప్రార్ధించ మొదలుపెట్టండి.

తండ్రియైన దేవా, నేను చేతులు వేస్తున్నప్పుడు నేను బలహీనపరచబడుచున్నాను. యేసు నామములో నా సహోదరిని స్వస్థపరచు. ఆమేన్.

రండి, నా సహోదరుడా, ప్రభువా, యేసుక్రీస్తు నామములో, అతని యొక్క హృదయపు ఆశను తీర్చండి. ఆమేన్.

సర్వశక్తిమంతుడైన దేవా, నా సహోదరి వచ్చుచుండగా, యేసుక్రీస్తు నామములో ఆమెకు స్వస్థత అనుగ్రహించండి. ఆమేన్.

సహోదరి నీవు వచ్చుచున్నావా, నరముల బలహీనతల నుండి విడుదల పొందుము. ఇప్పుడు నిజముగా సాగిపోండి, ఏమైనప్పటికీ నీవు స్వస్థపరచబడ్డావు, నీవు...

అది మంచిది, రండి, ఎప్పుడైతే నేను ఆమెకు నరముల బలహీనతల నుండి అని చెప్పానో, అది నీకు కూడా జరుగును. కాబట్టి నీవు వెళ్లవచ్చును. నీ నరముల బలహీనత కూడా ముగించబడినది. నీ హృదయమంతటితో ఇప్పుడు నమ్ముము.

71

రండి ఇప్పుడు, అక్కడే విశ్వాసముంచండి. దేవుడిని నమ్మండి. భక్తిపూర్వకముగా ఉండి ప్రార్ధించండి.

ప్రభువైన దేవా, నేను నా చేతులను ఆ స్త్రీ పై వేయుచున్నాను, ఎందుకనగా అది మా ప్రభువు ద్వారా ఆజ్ఞాపించబడినది. ఇక్కడ ఎవరైతే ఉన్నారో, అది సువార్త ద్వారా తెలియజేయబడినది. మా సహోదరి స్వస్థపరచబడును గాక. ఆమేన్.

రమ్ము, ప్రియమైన సహోదరి, ఇక్కడ ఉన్న అనేక మంది ప్రజలు బాధపడుతున్నట్లుగా నీకు కూడా వ్యాధి ఉన్నది. దానితో బాధపడుచున్నావు. నరముల బాధ ఎంత మంది అక్కడ బాధింపబడుచున్నారో నీవు చూడాలనుకుంటున్నావా?

ఇక్కడ ఎంతమంది నరముల సమస్యచేత బాధపడుచున్నారో, మీ చేతులను పైకి ఎత్తండి? చేతులు పైకి ఎత్తండి, మిమ్ములందరిని ఏ విధముగా పిలువగలము చూడండి?

కానీ మీరు నమ్ముచున్నారా? అది మంచిది. ప్రభువైన యేసు నామములో నా సహోదరి బాగుపడును గాక. ఆమెన్. దేవుడు నిన్ను దీవించును. [ఆ సహోదరి సహోదరుడు బ్రెన్హాంతో మాట్లాడుచుండెను.] అది సత్యమేనా? మేము ఖచ్చితముగా దానిని చేయుదుము, సహోదరి. అది ఇంతకు ముందే ఆమెకు తెలుపబడినది. మంచిది. వారిలో కొంతమందిని ఇక్కడ వారు కలిగియున్నారు. కొద్ది నిమిషములలో వారిని మేము తీసుకొని వారి కొరకు ప్రార్ధించెదము. సహోదరి, దేవుడు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును గాక.

72

రమ్ము, ప్రియ సహోదరి, ఇప్పుడు, మరణము నుండి యేసుని లేపిన మా ప్రభువా నేను ప్రార్ధించుచున్నాను. అది మా సహోదరికి అనుగ్రహిస్తావని ఆమె యొక్క హృదయపు కోరికను ఆమె భక్తిపూర్వకముగా వరుసలో వేచి నిలువబడి యున్నది. నేను ఈ విశ్వాసపు ప్రార్థనను క్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్. దీవించు గాక, సహోదరి. ఇప్పుడు సందేహపడవద్దు. నీ హృదయమంతటితో నమ్ముము.

మరియు కృప కలిగిన దేవా, నేను నా చేతులను ఈ సహోదరి పై వేయుచున్నాను. ఆమె యొక్క జీవితములో నుండి అనేక మార్లు ఆమెను లేపి, ఆమె తీసుకొనుచున్న ఊపిరిని నీవే ఇచ్చావు. నీ హస్తముతో నీవు పట్టుకొన్నావు. నీ కుమారుడైన యేసు నామములో నా చెయ్యి ఆమె పై వేయుచున్నాను, ఆమె స్వస్థపడును గాక. ఆమేన్. ఆమేన్. అది మంచిది సహోదరి. దేవుడు నిన్ను దీవించును గాక.

రండి, నా ప్రియ సహోదరి. బహుశా నీవు అనుకొనుచున్నావు. నీకు కొద్దిగా ముసలితనం వచ్చిందని, కాని నీవు అలా లేవు. అతనికి-డెబ్బది అయిదు సంవత్సరములు వచ్చేంత వరకు దేవుడు ఎన్నడూ అబ్రాహామును పిలువలేదు. తరువాత అతనికి వంద సంవత్సరములు వచ్చినప్పుడు వాగ్దానమును నెరవేర్చాడు. కాబట్టి నీవు ఇప్పుడు స్వస్థత పొందగలవు. ప్రభువైన దేవా, ఈ యొక్క సహోదరి యొక్క వాంఛను తీర్చండి. ఆమేన్. దీవెన నొందు సహోదరి.

రండి, ప్రియ సహోదరి. నీ కొరకు ప్రార్ధన చేయుచున్నవారిని ఒక్కసారి చూడుము. నీవు బాగవ్వవలెను. ప్రభువా, నేను ప్రార్ధించుచున్నాను. నీవు ఆమెను స్వస్థపరచెదవని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్.

73

భక్తిపూర్వకముగా రండి, సహోదరి, నమ్మండి. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. తండ్రీ, జీవపు వాక్యమును ఆమె తన చేతితో పట్టుకొని యుంటుండుగా, యేసు నామములో ఆమె కోరిక నిమిత్తము అది ఆమెకు వాస్తవమగును గాక.

ఇప్పుడు, చిన్న స్త్రీ, నీ యొక్క వంకరయైన కాళ్లను చూచియున్నాము. అది బహుశా పోలియో మరియు మీకు తెలుసు, అది దేవుడే బాగుచేయును. ఓ, ఆయన బాగుచేయడం ఎంతమంది చూశారు. కొంత కాలక్రితం, ఇక్కడ ఒక చిన్న స్త్రీ కొరకు ప్రార్ధన చేసాను, చాలా కుంటితనము, ఆమెకు రెండు ఊత కర్రలు యున్నవి. ఆ రాత్రి ఆమె ఒక మంచం పై పరుండి యున్నది, వారు ఆ ఊత కర్రలు తీసివేసినప్పుడు, మరుసటి ఉదయం ఆమె తల్లి మూర్చపోయినది. ఇక్కడకు ఆమె ఈ నేలపై నడుచుకుంటూ వచ్చియున్నది, సామాన్యముగా మరియు సంపూర్ణముగా, ఆ రాత్రే దేవుడు ఆమె పరుండియున్న మంచం పైకి వచ్చి ఆమెను సంపూర్ణముగా స్వస్థపరచెను. ఓ ప్రభువా! నేను నా చేతులను ఈ యవ్వన బాలికపై వేయుచున్నాను. ప్రభువా, నీవు గనుక ఆమెకు సహాయము చేయకపోతే ఆమె ఎల్లప్పుడూ వంకరగానే ఉంటుంది. నా హృదయపూర్వకముగా శక్తివంతమైన ప్రార్థన ఆమె కొరకు నేను నీకు ప్రార్ధించుచున్నాను. అదే రీతిగా ఈ అమ్మాయికి కూడా జరుగును, మరియు ఈమె కూడా యేసుక్రీస్తు నామములో స్వస్థత నొందును గాక. ఆమేన్. దీవెననొందు సహోదరి మరియు అడిగిన దానిని ఆమెకు దయచేయండి. నీవు అది నమ్ముచున్నావా, నీవు కాదా? ఆయన ఎప్పుడూ నిన్ను విఫలము కానివ్వడు.

74

రండి, సహోదరి. సర్వశక్తిమంతుడైన దేవుడు, నేను చేతులను నా సహోదరి పై వేయుచున్నాను, ఆమె స్వస్థత కొరకు యేసుక్రీస్తు నామములో. ఆమేన్. ఇప్పుడు నమ్మండి.

మీరు నమ్మండి, ప్రియ సహోదరి? ప్రభువా, నా చేతులు ఆమెపై వేయుచున్నాను. ఆమె ఇక్కడకు రావడం ద్వారా, మనుష్యుని యొద్దకు కాదు, కాని దేవుని యొద్దకు మేము ప్రార్ధించుచున్నాము, తండ్రి, యేసు నామములో ఆమెను స్వస్థపరచుము. ఆమేన్.

ప్రభువైన దేవా, ఈ చిన్న స్త్రీని దీవించుము, ఆమె స్వస్థపరచబడును, మరియు ఆమె యొక్క ప్రియమైన వారి కొరకు ఆమె యొక్క హృదయములో ఉన్న దానిని అనుగ్రహించండి, యేసు నామములో. ఆమేన్. ఇప్పుడు, చూడండి, ఆయనకు అన్ని తెలుసు. మంచిది. సహోదరి, నీవు నమ్ముచున్నావా?

తండ్రియైన దేవా, మా సహోదరిపై నా చేతులు ఉంచి మరియు భక్తిపూర్వకముగా అడుగుచుండగా, యేసు నామములో ఆమెను స్వస్థపరచుము. ఆమేన్. సహోదరి, దేవుడు నిన్ను దీవించును గాక.

రండి, ఇప్పుడు నీకు కలిగిన కీళ్లనొప్పుల నుండి విడుదల పొంది మరియు బాగుపడగోరుచున్నావా? కేవలం ఆయనను నమ్మండి. అది మీరు పొందుకుంటారు. ప్రభువా, యేసు నామములో, ఆమె యొక్క కీళ్ళ నొప్పులను స్వస్థపరచి, ఆమె యొక్క హృదయ కోరికను తీర్చండి. ఆమేన్.

రండి, నా సహోదరి. తండ్రియైన దేవా, ఈ స్త్రీ యొక్క చేతిని పట్టుకొనుచుండగా, నీవు ఆమెను స్వస్థపరచమని ప్రార్ధన చేయుచున్నాను. ప్రభువా, యేసు నామములో. ఆమేన్. సహోదరి, దేవుడు నిన్ను దీవించును గాక.

తండ్రివైన దేవా, నేను ఈ స్త్రీ యొక్క చేతిని పట్టుకొని యున్నాను, ఆమె చేతి స్పర్శ వలన, ఆమె కష్టించి పనిచేసియున్నదని నేను అనుభూతి చెందగలుగుచున్నాను. ఓ ప్రభువైన దేవా, ఆమె బహుమానము వచ్చును గాక. ఆమె యేసు నామములో స్వస్థపరచబడును గాక. ఆమేన్.

75

రండి. ఒక గ్రుడ్డి సహోదరుడు, దేవుడు గ్రుడ్డివారికి చూపు నిచ్చును. మీరు అది నమ్ముచున్నారా, నీవు అది నమ్మవా, అయ్యా? నీకన్నులు తెరవగలుగుటకు మరి ఏదైనా దారియుంటే, దానిని చేయుటకు సంతోషించుచున్నాను. నేను మీ కన్నులు తెరువలేను; నేను కేవలము ఒక మానవుడను. కానీ దానిని చేయమని దేవునికి ప్రార్ధించగలను, ఆయన దానిని చేయగలడు, నీవు నమ్ము. మరియు ఆయన నీకు దానిని అనుగ్రహించును. గ్రుడ్డివాని కొరకు ఈ జనసమూహముల వారు నీతో కలసి ప్రార్ధించెదరు.

ప్రియమైన దేవా, ఈ మనుష్యుడు చీకటిలో కూర్చొనియున్నాడు. కాని నీవు ఆ గవిని ద్వారము గుండా ఒక రోజు వచ్చినప్పుడు ఒక గ్రుడ్డివాడు కరుణ కొరకు అరచినాడు. నీవు అతనితో కేవలము మాట్లాడి మరియు చెప్పావు, “చూపు పొందుకొనుమని.” మరియు నీవు తిరిగి ఆ మార్గము గుండా వెళ్ళియున్నావు. నీవు ఎంతో దూరము వెళ్ళక మునుపే, ఆ మనుష్యుడు గమనించుచుండగానే అతడు చూపు పొందుకొనియున్నాడు. అతడు సంతోషించుట ప్రారంభించాడు, మరియు నిన్ను వెంబడించుట ప్రారంభించాడు, దేవునిని స్తుతించుచున్నాడు. ఓ ప్రభువైన దేవా, యేసును మాకు బదులుగా మరణించడానికి ఎవరు పంపారు, అది మా యొక్క అవినీతి క్రియలను బట్టి మాలో ఆరోపించబడటానికి కాదు, కాని ఆయన యొక్క నీతిక్రియలను బట్టి మాకు ప్రాయశ్చితార్ధము కలుగుటకై ఈ రాత్రి, నేను, నీ యొక్క లాభాపేక్షలేని సేవకుడిగా నా చేతులను ఈ గ్రుడ్డివానిపై పెట్టుచున్నాను. అతడు చూపు పొందుకొనును గాక. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. దేవుడు అది నీకు అనుగ్రహించును నా సహోదరుడా, నమ్ముచూ వెళ్ళుము, నీవు నమ్మితే అది నీకు జరుగును.

76

తండ్రివైన దేవా, యేసు నామములో, నీ మహిమార్ధమై ఈ స్త్రీకి స్వస్థతను అనుగ్రహించండి. ఆమేన్.

మీరు గనుక నమ్మనట్లయితే అన్ని కార్యములు.... నాతో మీరు నమ్ముచున్నారా? ప్రతి సందేహము మీ హృదయములలో నుండి ఎగిరిపోయేనా? అవిశ్వాసమంతయూ పోయెను.

అక్కడ ఆ ఎర్ర రంగు టోపి పెట్టుకొని నల్లజాతి స్త్రీ కూర్చొని తన కడుపు యొక్క స్థితిని బట్టి ప్రార్థించుచున్నది. నీ యొక్క స్వస్థతను, నీవు పొందుకొనగలవు. అది మంచిది.

అది దానిని చేసినది. నాకు ఆ స్త్రీ తెలియదు; నేను ఎన్నడు ఆమెను చూడలేదు. నీవు చెప్పవచ్చు, “అది ఎలాగు జరుగును, సహోదరుడా బ్రెన్హాం.” నాకు తెలియదు. ఆ స్త్రీ అక్కడ కూర్చొనియుండి ప్రార్ధించుచున్నది. ఆమెను అడగండి. మరియు ఆమె దేనినో తాకినది. మరియు అది జరిగినప్పుడు, ఆ వెలుగు వెళ్ళడం నేను చూశాను, మరియు ఒక దర్శనము కలిగినది; స్త్రీ కడుపు నొప్పితో, వెనుదిరుగుచున్నది! సమృద్దిగల ఆహారమును తీసుకోవడం వల్ల ఆమెకు అనారోగ్యం మరియు వాంతులు మరియు ఆమె పళ్ళపై ఆమ్లములు మరియు అలాంటివి కలిగియున్నది. అది ఒక్క జీర్ణకారియైన అల్సర్, కాని ఆమె ఇప్పుడు బాగవబోవుచున్నది. ఆమె...

మంచిది, ఆమె వైపు చూడండి. ఆమె ఇరవై... పదిహేను గజముల దూరంలో ఆమె ఉన్నది. మేము ఒకరికొకరము తెలియని వాళ్ళం. ఏమి జరిగినది? నేనెన్నడూ ఆమెను చూడలేదు. ఆమె సన్ను తాకలేదు, తాకినదా? కానీ ప్రస్తుతమున్నదేనినో ఆమె తాకినది. అది ఏమిటి? బైబిలును నెరవేర్చుటకు, మన యొక్క తప్పిదముల యొక్క అనుభూతి నుండి మన ప్రధానయాజకుడే మనలను తాకెను. అక్కడ ఆ స్త్రీ కూర్చొనియున్నది. ఆమె యొద్ద ప్రార్ధనా కార్డు లేదు; ఆమె ఆ వరుసలోనే నిలువబడియున్నది. కాబట్టి, ఆమె కేవలము నమ్మడం ప్రారంభించినది. మరియు ఏమి జరిగినది? ఏదో జరిగినది.

77

రక్త స్రావముగల, ఒక స్త్రీ యేసుని ముట్టుకున్నప్పుడు, అదే మాదిరిగా జరిగినది. ఆయన వెనుకకు తిరిగి, “ఎవరో నన్ను తాకియున్నారు,” అని అడిగాడు. మరియు ఆమెను కనుగొనేంత వరకు ఆయన చుట్టూ చూచియున్నాడు, మరియు చెప్పాడు, “నీ విశ్వాసమే నిన్ను బాగుపరచెను.” నీ స్రావము ఆగిపోయినది. ఇప్పుడు, అదే యేసు, నేను కాదు... ఆమె ఆయనను తాకినది. నేను మానవుడను. నాకు ఆమె తెలియదు. నేను నిజంగా..... మేధావిగా....

కాని పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు. ఎవని గురించి నేను మాట్లాడియున్నానో, ఆ గుగ్గిలమే సంఘమునకు ఇవ్వబడినది. ఆమె ప్రధానయాజకుడిని తాకినది. మరియు ఆయన తిరిగి అది ఏమైయుండెనో చూపియున్నాడు. ఇప్పుడు, ఆ యేసు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉండువాడు. కాడా? బ్రదర్ బ్రెన్హాం నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉండువాడు కాడు, గానీ యేసుక్రీస్తు మాత్రమే నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉండువాడై యున్నాడు. అది ఆయనే అది ఆయన యొక్క హృదయమంతటితో ప్రేమించుచున్న, మనము దీవించబడిన పరలోకపు తండ్రియై ఉన్నాడు. మీరు ఆయనను ప్రేమించుచున్నారా.

78

ఇప్పుడు, అదియేనా? ఓ, నన్ను క్షమించు, సహోదరి. నీవు రోగులలో ఒక దానివి. అది మంచిది. మనము కూడా కొత్తవారము, కాదా?

ఇప్పుడు ఇక్కడ, ఒక నిమిషము. మిగిలినవారు, ఇక్కడ ప్రార్ధన వరుసలో ఆఖరి వారు, కాని స్వస్థత పొందేవారిలో ఆఖరివాడు కాదు.

ఒకవేళ మనము ఒకని కొకరము క్రొత్తవారము అయితే.... అది మరలా తెల్లవారు మరియు నల్లవారి యొద్దకు, నేను నీకు తెలియదు. నీవు నాకు తెలియదు. అది గనుక సత్యమైతే ప్రజలు నిన్ను చూచెదరు? మనము ఎన్నడూ కలుసుకొనలేదు. ఇదే మొదటిసారి. కాని ప్రభువే గనుక నీ హృదయములో ఉన్న రహస్యమును నాకు బయలు పరచినట్లయితే, ఆయనే దానిని చేయుచున్నాడని, నీవు నమ్ముదువా?

ఇక్కడ ఉన్న జనసమూహము ఇప్పుడే ఆయనను అంగీకరించుదురా, అది మీ హృదయములో ఉన్న రహస్యము ఆయనకు మాత్రమే తెలుసును, అది నీకు చెప్పబడుతుందని? చూడండి, ప్రార్ధనా వరుసలో ప్రార్ధనా కార్డులతో నిలువబడియున్న జనులు, జనసమూహములలో కార్డులు లేనివారు, అది ఏమీ కాదు. కానీ అది.. అది నన్ను బహుగా నీరసించులాగున చేయుచున్నది.

ఆ స్త్రీ ఆమె మోకాళ్లలో సమస్య ఉన్నది. అది ఏమిటంటే నిజముగా దురదలు మరియు మంటలు. మరియు నీవు వైద్యుని దగ్గరకు వెళ్లావు. కాని వైద్యులు దీనిని గూర్చి ఏమియూ చేయలేకపోయారు. నీవు ఎవరైయున్నావో దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముచున్నావా? మిసెస్. హోవెల్, ఇంటికి వెళ్లు; అది నిన్ను విడచిపోవును. యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును.

79

ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీ హృదయమంతటితో నమ్ముచున్నారా? ఇక్కడ ఎంత మంది విశ్వాసులు ఉన్నారు, ఇప్పుడు మీరు మీ చేతులు పైకెత్తి చెప్పండి, “నేను నమ్ముచున్నాను.” ఇప్పుడు, బైబిలు ఏమి చెప్పుతుందో నేను చెప్పుచున్నాను. బైబిలు ఈ విధముగా చెప్పెను, “నమ్మిన వారివలన ఈ సూచక క్రియలు జరుగును.”

ఇప్పుడు, రోగులైన వారు మీ చేతులను పైకెత్తండి. ఇప్పుడు, మీ చేతులను ఒకరిపై ఒకరు వేయండి. మీరు విశ్వాసులైతే మీ చేతులు ఒకరిపై ఒకరు వేయండి. చూడండి, అది కేవలము నా కొరకు కాదు; అది సంఘమైయున్న ఆయన కుమార్తె కొరకు. “ఎందుకు నా కుమార్తె బాగుపడుట లేదు? గిలాదులో గుగ్గిలము ఉన్నట్లయితే, వైద్యుడు ఉన్నట్లయితే, మరి ఎందుకు నా కుమార్తె బాగుపడుట లేదు?” చూడండి, ఇప్పుడు అది అంతా ఇక్కడే ఉన్నది. వైద్యుడు ఇక్కడ ఉన్నాడని నీవు నమ్మెదవా? పరిశుద్ధాత్మ అయిన గుగ్గిలము ఇక్కడ ఉన్నదని నీవు నమ్మెదవా? అప్పుడు, కేవలము దానిని స్వీకరించుము.

ఇప్పుడు, మీ చేతులు ఒకరిపై ఒకరు వేసికొనండి. ఇప్పుడు, మీ కొరకు మీరు ప్రార్ధన చేసికోవద్దు. మీరు ఎవరిపై చేయి వేశారో వారి కొరకు ప్రార్ధన చేయండి. వారు మీ కొరకు ప్రార్ధన చేస్తారు. మరియు అదే విధముగా మీలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థపరచును. ప్రార్ధించడం కొరకు మీరు సిద్దముగా ఉన్నారా? ఇప్పుడు ఒకరిపై ఒకరు చేతులు వేసుకొని; మన తలలను వంచుదాము.

80

ప్రభువా, అది అక్కడ కూర్చోని ఉన్న పురుషులు మరియు స్త్రీలు నది ఇవతలవైపు ఇంకెన్నడూ కలవకుండా ఉండుటకు ఒక అవకాశము ఉన్నది. కానీ నేను ఆ చివరి దినము వద్దకు వచ్చినప్పుడు, మరియు ఇప్పుడు నిలువబడిన రీతిగా మేమందరమూ నీ సన్నిధిలో నిలువబడవలసి యుండగా, నా పూర్ణహృదయముతో నీ సత్యమును ప్రజలకు నేను చెప్పియున్నాను. అది నీ యొక్క వాక్యములో నుండి జతచేయుచూ పరమునకు కొనిపోబడక మునుపు నీ ద్వారా పలుకబడిన ఆ చివరి మాటలు. లేఖనములో ఉన్న ప్రకారము. మీరు చెప్పారు, “నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించును.” మరియు చివరి మాటలు అది నీ పెదవుల నుండి చెప్పబడుచున్నది, “మీరు గనుక రోగులపై చేతులు వేసినచో వారు స్వస్థతనొందెదరు.”

ఇప్పుడు, ఈ రాత్రి ఈ స్కూల్ యొక్క ఆడిటోరియంలో, చాలా మంది విశ్వాసుల చేతులు రోగులపై వేయబడియున్నవి. మరియు వారు ప్రార్ధించుచున్నారు. మరియు ఓ దేవా! మమ్మును వినండి, మరియు నీవు ప్రార్ధనకు జవాబు ఇచ్చువాడవని, ఈ సమయములో చేయబడుచున్న ప్రతి ప్రార్ధనను, ఈ ప్రజలలో ఉన్న ప్రతీ ఒక్కరి జీవితములో మరియు శరీరములో ఉన్న వ్యాధి యొక్క శక్తి ఈ రాత్రి విరుగగొట్టబడును గాక. అప్పుడు ఆయన చేసిన విధముగా పరిశుద్ధాత్మ ఇప్పుడే ఒక ప్రత్యేకమైన మార్గములో మాట్లాడును గాక. మరియు క్రీస్తు జీవించుచున్న దేవుని కుమారుడని, ఆయన మరణించలేదని, ఆయన ఎల్లకాలము జీవించుచున్నాడని, మరియు ఆయన మనతో ఉన్నాడని, ప్రజలు తెలిసికొందురు గాక. ఆయన యొక్క సన్నిధి మరియు శక్తి ఈ ప్రజల గుండా మరియు ప్రతి వ్యక్తి పెదవులపై మరియు ప్రతి ఒక్కరిలో బయలు వెళ్ళును గాక. పరిశుద్ధాత్మ యొక్క శక్తి వెళ్ళుచూ మరియు వ్యాధుల యొక్క బంధకములను తెంపి, మరియు వారినందరిని విడుదల చేసి వారిని దీవించును గాక. నీ యొక్క సేవకుడి యొక్క ప్రార్ధనను వినుము ప్రభువా, మరియు నేను ఆజ్ఞాపించుచున్నాను. వారి శరీరములలోని ప్రతీ వ్యాధిని ప్రతి ఒక్కరిలో నుండి వెడలిపోవునని యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్.

81

అందరూ యేసును వ్యక్తిగతముగా స్వస్థపరచువాడిగా స్వీకరించినవారు మరియు దేవుడు మీ శరీరమును స్వస్థపరచియున్నాడని, నమ్మినవారు, ఈ యొక్క గొప్ప స్వస్థపరిచే ప్రభువైన దేవుని యొక్క శక్తికి సాక్షముగా మీ యొక్క పాదములపై నిలువబడండి. నీవు ఇంకా కుంటివాడిగా ఉన్ననూ, అది ఎటువంటి లోపమైననూ నీ పాదములపై లేచి నిలువబడి, నీ స్వస్థతను అంగీకరించుము.

అది మంచిది, జోసెఫ్.

నీ హృదయమంతటితో మీరు గనుక నమ్మినట్లయితే, మీ చేతులు పైకెత్తండి. పరిశుద్ధాత్మ యొక్క ఆజ్ఞలో, సజీవమైన దేవుని యొక్క వాక్యము ద్వారా, మీలో ప్రతీ ఒక్కరు మీ విశ్వాసమును బట్టి స్వస్థత పొందియున్నారని పలుకుచున్నాను. యేసుక్రీస్తు నామములో, దేవుడు మిమ్ములను దీవించును గాక. సంతోషించుచు మరియు వెళ్ళండి.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...