లోకము ద్వారా మోసపరచబడిన సంఘము

లోకము ద్వారా మోసపరచబడిన సంఘము

VGR COUNT-115 .....ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, క్రీస్తులో సమస్తమును మాకు ఉచితముగా అనుగ్రహించబడెను. ప్రభువా! కల్వరిలో యేసు మాకై దయచేసిన ఈ మహాగంభీరమైన అర్పణ వలన, మాకు దయచేయబడిన ధన్యతలను బట్టి, నీకు కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాము. అది మమ్ములను నీతో సహవాసములోనికి తిరిగి పునరుద్దరించుటకు సమాధానపరచెను. “మీరు నాయందు నిలచియుండిన యెడల, నా మాటలు మీ యందు నిలచియుండిన యెడల, మీకేది యిష్టమో అడుగుడి అది మీకనుగ్రహించబడును,” అని వ్రాయబడిన ఈ ఆదరణను, అది యెరుగునట్లుగా చేసెను. ఇందుకొరకై మేము యిప్పుడు కృతజ్ఞలమై యుండి, మరియు మాలోనున్న దానంతటితో అది నమ్ముటకు నీవు మాకు విశ్వాసము దయచేయుమనియు ప్రార్ధించుచున్నాము.

2

ఇపుడు మా మనసులలో ఏమియులేకుండునట్లుగా, ప్రభువా! కాపలాదారుడు మొదలుకొని సంఘకాపరి వరకు దినములోని ప్రతి భారమును, ఈ జీవితంలోని ప్రతి బాధ్యతను ప్రక్కను పెట్టుచున్నాము. అయితే, పరిశుద్ధాత్మ మాతో సంభాషించుటకు, భయభక్తులతో మేము ఆలకించుటకు, తద్వారా మంచిగా యొకటి పరిపూర్తి చేయుటకు, మేము యిక్కడ కూడుకొనుట వలన నిన్ను గూర్చి మరెక్కువగా తెలుసుకొని, వేచియుంటున్నాము. ఏలయనగా, ప్రభువా! ఆ కారణముచేతనే ఈ ఎండ వేడిమి దినమున మేము నిజముగా వచ్చియున్నాము. నీ జీవముగల వాక్యము ద్వారా మాతో మాట్లాడుము. జీవముగల వాక్యము మాలో నివసించి మాలో యుండును గాక. తద్వారా రూపము దాల్చి సారూప్యము పొందెదుము గాక! మా ఆత్మ నూతన పరచబడుట వలన రూపాంతరము చెందిన వారమై లోకమునకు గాక, దేవుని కుమారుని సారూప్యమునకు రూపు దాల్పుదుము గాక. ఓ! మేము తలంచునపుడు మా హృదయములు వణకుచున్నవి. మేము దేవుని కుమారులము కుమార్తెలము అని ఎరుగుటవలన మా ఆత్మలలో ఆనందం పొంగిపోతున్నది. ఆయన రెండవ రాకడ యొక్క చివరి అంచున మేము నిలబడి యున్నాము. అన్ని దేశములు, రాజ్యములు మా పాదముల క్రింద కంపించి పోవుచున్నవి. లోకములో యున్నవన్ని అదృశ్యమైపోవుచున్నవి. అయితే ఆయన ఒక దినమున వచ్చునని, ఎక్కడైతే అంతముయుండదో, ఏది అచంచలమో అట్టి రాజ్యములోనికి ఆయన వచ్చి తీసుకొని వెళ్ళును అని తెలుసుకొనుచున్నాము. ఆ రాజ్యము యొక్క పౌరులమైయున్నామని ఆలోచనచేయుట! ఓ దేవా! నీ వాక్యమను ఉదకము ద్వారా కడుగుట ద్వారా ఈ దినమున పరిశుద్ధాత్మ వలనమా హృదయమును మరియు మా చెవులను సున్నతి చేయుము. ఆయన నామమున, ఆయన మహిమ కొరకై యిది మేము అడుగుచున్నాము. ఆమెన్.

3

ఈ ఉదయము పాఠమును సమీపించుటకు నేను ఆశించుచున్నాను. ఎందుకనగా, స్వస్థత కూటము యున్నట్లయితే, కొద్దిగా బిన్నముగా నేను మాట్లాడగోరియంటిని. అయితే ప్రార్థనా పత్రములు ఎనిమిది నుండి ఎనిమిదిన్నర, తొమ్మిది గంటలవరకు యివ్వబడునని మేము ప్రకటించితిమి. మరి, నేను కొద్ది నిమిషాల క్రితమే బిల్లీ, యింటికి వచ్చి అక్కడ ఏ ఒక్కరూలేరని చెప్పాడు. కాబట్టి అతడు ప్రార్ధనా పత్రములు యివ్వలేదు. కాబట్టి మేము, నేను సంఘము యొక్క దిద్దుబాటు కొరకు ఈ అంశాన్ని తీసుకోవాలని తలంచితిని. లోకము ద్వారా మోసపరచబడిన సంఘము అను పాఠ్యాంశము పైన నేను మాట్లాడగోరుచున్నాను. న్యాయాధిపతుల పుస్తకములో నుండి కొంత చదవవాలెనని నేను కోరుకొంటున్నాను. 16వ అధ్యాయము 10వ వచనము ఆరంభము నుండి కొంత చదువుటకుఆశపడుచున్నాను.

అప్పుడు దెలీలా - ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేనిచేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని సమ్సోనుతో చెప్పగా.

అతడు — పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త త్రాళ్ళతో నన్ను బాగుగా బంధించినయెడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకనివలె అవుదునని ఆమెతో చెప్పెను.

అంతట దెలీలా పేనబడిన క్రొత్త త్రాళ్ళను తీసికొని వాటితో అతని బంధించి - సమ్సోనూ, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటున నుండువారు అంతఃపురములో నుండిరి. అతడు తన చేతుల మీద నుండి నూలుపోగును వలె ఆ త్రాళ్ళు తెంపెను.

అప్పుడు దెలీలా - ఇదివరకు నీవు నన్ను ఎగతాళిచేసి నాతో అబద్ధములాడితివి, నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెల్పుమని సమ్సోనుతో చెప్పగా అతడు - నీవు నాతల జడలు ఏడును అల్లిక అల్లిన యెడల సరి అని ఆమెతో చెప్పెను.

అంతట ఆమె మేకుతో దాని దిగగొట్టి -సమ్సోనూ, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినపుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసికొని పోయెను.

అప్పుడు ఆమె - నా యందు నీకిష్టము లేనప్పుడు - నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళిచేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను.

ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను.

అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజెసి - నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడనై యున్నాను, నా తల మీదికి మంగలకత్తి రాలేదు, నాకు క్రౌరము చేసినయెడల నా బలము నాలోనుండి తొలగిపోయి యితర మనుష్యలవలె అవుదునని ఆమెతో అనెను.

అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని దెలీలా యెరిగి, ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీయుల సర్దారులను పిలిపించి - యీసారికి రండి; ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపెననెను, ఫిలిస్తీయుల సర్దారులు రూపాయిలను చేత పట్టుకొని అమె యొద్దకు రాగా

ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వానిచేత అతని తల మీది యేడు జడలను క్రౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను.

ఆమె - సమ్సోనూ, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడుని ద్రమేలుకొని - యెప్పటియట్లు నేను బయలుదేరి విడజిమ్మకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసేనని అతనికి తెలియలేదు.

4

ఈ పాఠ్యాంశముకొరకైన పాఠము నిమిత్తము, ప్రకటన గ్రంథములోని 2వ అధ్యాయము 21వచనముతో ఆరంభము మరియు 23 వచనములలో నున్నది నేను చదువగోరుచున్నాను.

మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు.

ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారుమనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమలపాలు చేతును.

దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.

ప్రభువు ఆయన ఆశీర్వాదములను చదివియున్న ఆయన వాక్యమునకు తోడు చేయును గాక!

5

సమ్సోను, సంఘమువలె గొప్ప వ్యవహార కార్యక్రమములు కలిగియున్నవాడు. మంచిగా ఆరంభించాడు. అతడు మంచి మార్గముననే ఆరంభించాడు. అతని ప్రారంభము, బలశాలియైన వీరుడుగా పిలువబడ్డాడు. అతడు ఆరంభించి, ఆయన వాక్యములనుగైకొని ఆయన ఆజ్ఞలు గైకొనుట యందు ప్రభువును సేవించుచుండెను. అది యొక విధముగా సంఘమువలె యుండెను. అది ఆరంభమైనపుడు లోక వివరణ వలె మనమిలాగు చెప్పుదము. కుడి పాదము పెట్టి ఆరంభించెను. ప్రభువు యొక్క ఆజ్ఞలు గైకొనుటతో ఆరంభించెను. సమ్సోను ప్రభువును వెంబడించినంత కాలము ప్రభువు సమ్సోనును వినియోగించుకొనెను.

6

ఏలయనగా, దేవుడు ఆయనను వెంబడించిన ఎవరినైనను కాపాడును మరియు వాడుకొనును. అది దేవుని యొక్క బాధ్యత. అయితే మనము ప్రక్కకు తిరిగితే, దేవుని కార్యములకు దూరమైపోతే యిక దేవుడు మనలను వాడుకొనడు. దేవుని ఆజ్ఞల ప్రకారముగా స్థిరులుగా మనము నడచినపుడు, బైబిల్ పుటలలో మనము నిలబడి వ్రాయబడిన వాక్యప్రకారముగా మనము నడచినపుడు, ఆత్మతోను వాక్యము యొక్క సత్యములోను ఆయనను ఆరాధించినపుడు - ఆలాటపుడు ఏ వ్యక్తినైనా దేవుడు వాడుకొనును. అయితే, వారొక అభిమతమును తీసికొని ఒక దాని కొరకు తిరిగిపోయినట్లయితే, ఇక దేవుడు ఆవ్యక్తిని ఎన్నడూ వాడుకొనడు.

7

కాబట్టి సమ్సోను, ఈనాటి సంఘమునకు బహు గంభీరమైన ప్రాతినిధ్యము చేయును. సంఘము ఆరంభమైనపుడు దేవుడు సంఘమును వాడుకోగలిగెను. ఎందుకనగా సంఘము ప్రభువు యొక్క ఆజ్ఞల ప్రకారముగా ఆయన కట్టడలను గైకొని ఆయన ఆజ్ఞలన్నియు నెరవేర్చినది. మరియు, దేవుడు సంఘముతో యుండెను అయితే సంఘము మధ్య ఒక బలహీనమైన స్తానమున్నట్లుగా అది కన్పించినది.

8

జ్ఞాపకముంచుకొనుడి, మనము విహార యాత్రలో లేము. అయితే మనము యుద్ధ భూమిలో ఉన్నాము. అనేక మంది క్రైస్తవులైన వెంటనే, వారికి అవసరమైనదంతా అదేనని, అది యుగయుగములకు అంతటితో సరిపోతుందని, వారు క్రైస్తవులు కనుక ప్రతీదీ సులభముగా సాగిపోతుందని వారు తలంచెదరు. నీ తలలోకి ఎన్నడు అది రానివ్వ వద్దు. ఏలయనగా పోరాడుటకు, విశ్వాసము యొక్క మంచి పోరాటము పోరాడుటకు, నేను క్రైస్తవుడనయ్యాను. సైనిక వరుసలో చేరుటకు నేను క్రైస్తవుడనయ్యాను. మనము క్రైస్తవ సైనికులము. శత్రువు యొక్క పన్నాగములన్నిటిని ఎరుగుటకు, ఏలాగు భద్రత రక్షణ కాపాడుకోవలెనో తెలుసుకొనుటకు, యుద్ధము ఏలాగు చేయవలెనో ఎరుగుటకు మనము తర్ఫీదునొంది ఎదగవలసియున్నది. కేవలము, పరిశుద్ధాత్మ దానిని మనకు బయలుపరచుట ద్వారానే మనమది చేయగలుతాము. మనము యుద్ధమునకు వెళ్ళునపుడు ఇతర దేశాలు మనకు చెప్పినవి, వారి యొక్క కొన్ని భావాలను మనము తీసికోము. పరిశుద్ధాత్మ మనలను నడిపించిన రీతిగాను మరియు ఏ అభిప్రాయాలు మనకు ఏమి యిచ్చునో ఆ ప్రకారముగాను మన స్వంత అభిప్రాయాలు తీసికోవలసియున్నది. ఎందుకనగా ఆయన క్రైస్తవ సైన్యము యొక్క సర్వసైన్యాధిపతియై యున్నాడు.

9

సమ్సోను యుక్తమైనదే చేసెను. ఆరంభించు వరకు అతడు, గొప్పవాడే.(దానిని మనము ఈలాగు పిలచెదము) ఒక రకమైన పోకిరియై పోయెను. తన స్వంత ప్రాంతములో నుండి దిగు వరకు, సమ్సోను పరిహాసాలాడుటకు మొదలు పెట్టెను. ఇశ్రాయేలీయుల అమ్మాయిలతో పరిహాసాలాడుట లేదు. ఫిలిస్తియుల అమ్మాయిలతో సరసాలాడుచుండెను.

ఆలాగు పోలినదానినే సంఘము చేసినది. తన యొక్క స్వంత దానితో అదెన్నడు ప్రేమించ ప్రారంభించలేదు. అది అవిశ్వాసుల వెంటబడి, అవిశ్వాసులతో పరిహాసాలాడుటకు ప్రారంభించెను. అక్కడే మనము, మన అతిపెద్దదైన పెద్ద తప్పు చేసినది. అది కార్యాలు చేయనారంభించగా అవి మంచి కార్యాలు కాకపోయినవి. అది సమ్సోనువలె చెడ్డ సహవాసులను ఉంచుకొనుటకు మొదలు పెట్టినది.

10

సమ్సోను, ప్రభువు ప్రజల యొక్క సహవాసములో అతడు యున్నంత వరకు, అతడు మంచినే చేశాడు. అయితే చెడ్డ సహవాసముతో అతడు పరిహాసము మొదలుపెట్టగా, అప్పుడతడు యిబ్బ౦దిలో పడిపోయూడు.

ఆ విధముగా సంఘములో ఉన్నది. అనుదినము, సంఘము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు వలన భయభక్తులతో వెంబడించినపుడు, దేవుడు వారిని ఆశీర్వదించెను. మరియు అద్భుతములు, సూచనలు, ఆశ్చర్యకార్యములు సంఘమును వెంబడించినవి. అయితే చెడ్డ సహవాసము లోకముతో అది చేసినపుడు! అతిహీనమైన కార్యము అది చేసినది; అది చేసిన మొదటిది అది సంస్థాపకము చేయుటకు ప్రారంభించినది. మిగతా విశ్వాసుల మధ్య అది సహవాసమును తెంచివేసుకున్నది. కారణం: దేశములు సంస్థాపక మైనవని అవి కనుగొనినవి. అయితే ఈ ఘనమైన సువార్త ఒక్క దేశానికి లేక ఒక్క ప్రజకు సమర్పణ చేయబడినది కాదు సుమా! ఇది “ఎవరైతే ఇష్టమున్నవారిని రానిమ్ము,” అన్ని దేశములకు అన్నిసంతతుల వారికి, అందరు ప్రజలకు సమర్పించబడినది. హద్దులుగల రేఖలను గీయుటకు, దేవుడు మనలను ఎన్నడు సమ్మతించలేదు.

11

అయితే, మనుష్యులు ఆలాగు ఉ౦డాలనుకుంటారు, వారు సమపోలికలు చేసికొనెదరు, లేదా అనుకరణ చేసుకుంటారు. లోకము చేసినట్లు చేయుదురు; వారు చెప్పినటువంటివి చెప్తారు. వారు విజయము సాధించు మార్గములో విజయం సాధిస్తారు. లోకము చేసినట్లు చేసి మనము ఏనాడు విజయం సాధించలేము. మనము ఆయన చేయునట్లుగా కార్యములు చేయుచు, ఆయన కట్టడలను అనుసరించినపుడు మాత్రమే మనము విజయం పొందగలము. మనమెన్నడు లోకమును మాదిరిగా ఉంచుకొనము. టెలివిజన్ ద్వారా సిగరెట్టు కంపెనీ, దాని అమోఘమైన విజయాన్ని సాధించినట్లయితే, బీరు, విస్కీల మంద, టెలివిజన్ సహాయము ద్వారా వారి అమోఘమైన విజయాన్ని సాధించినట్లయితే, సంఘము టెలివిజన్ ద్వారా దాని విజయాన్ని సాధిస్తుందనుటకు అది గురుతులేమి కాదు. సువార్త ప్రకటించుటలోను, దేవుని యొక్క శక్తిలోను, ఆత్మ ఋజువులోను సంఘము యొక్క విజయము దాగియుండును. ఆ టెలివిజన్, సిగరెట్టు కంపెనీకి మరియు యితర కంపెనీలకు ఫలానా, ఫలానపని చేసినది అని మనము చెప్పలేము. ఆ జనములతో పోల్చిచెప్పుటకై ప్రయత్నించుటకు మనకు ఎటువంటి లేఖనము లేదు. మనము ఆలాగు చేసినంతకాలము అనేక సంఖ్య గల ప్రజలను ఆకర్షించగలమేమో! అయితే దేవుడు మనలను నిర్ణయించినది అది చేయుటకు కాదు. మనమంతా రంగురంగులవారము, పైకెగురుచున్నాము. గొప్ప సంస్థాపకములున్నవి, గొప్ప రంగుల విషయాలు జరుగుతున్నవి కనుక అదే విజయమని మనము తలంచుచున్నాము. ఆత్మ సంబంధముగా మాట్లాడినచో, అనుదినము మనపాదములపైన మనము చనిపోవుచున్నాము. ఈ ఉదయము, పరిశుద్ధాత్మ లేని పదిమిలియన్ల మంది బలముగా నిలబడియుండినట్లయితే అది ఏ మేలు చేయదు, మనము పరిశుద్ధాత్మతో నిండియున్న పదిమంది మనతో యున్నయెడల మనకు అది మంచి చేయును. లోకముతో పోలిక మనము చేయవద్దు.

12

మొట్టమొదటి విషయము, సంఘము తనుకు తాను నిర్మాణాత్మకము చేయమొదలుపెట్టినది. మొదటి సంస్థాపకము కాథలిక్ సంఘము, అటు తరువాత లూథరన్ సంఘము వచ్చినది. వారు కాధోలిక్ సంఘమును సంస్థాపకము చేయునపుడు “సమ్సోను! ఫిలిషీయులు నీ మీద పడుచున్నారు,” అను కేక ఒక దినమున వేయబడెను. కాధోలిక్ సంఘము కట్టిన తాళ్ళను సమ్సోను తెంపివేసెను. మరియు మార్టిన్ లూథర్ సంస్థాపకముతో వచ్చెను.

13

అటు తరువాత, దెలిలా చేసినట్టుగా మరొక త్రాడుతో సంఘమును వారు బంధించిరి. మరియు వారు ఆరంభించిరి. దేవుడు పిలచిన మనుష్యలకు బదులుగా, పరిశుద్ధాత్మ చేత పిలువబడిన మనుష్యులను కలిగియుండుటకు బదులుగా, బహుశా వారికి వారి అ, ఆ, ఇ, తెలియదేమో, అయితే వారు క్రీస్తును ఎరుగుదురు. అటు తరువాత సంఘము రాజకీయ వక్తలవలె డంభముగాను, ఆడంబరముగాను తయారై పోయినది వారి యొక్క బోధకులకు వారు “శాస్త్రి పట్టములు” యివ్వవలసి వచ్చెను. ప్రతి యొక్కరు కూడా శాస్త్రి పట్టము కలిగి యుండవలసియుండెను. సంఘమును బంధించు మరియొక త్రాడు అది. మననుష్యులు వెళ్ళిపోయి చదువులు చదువుతారు. “మా సంఘకాపరి శాస్త్రి పట్టము కలిగియున్నాడు,” అని వారి సంఘములు ప్రగల్భాలు చెప్పుటకై ప్రతి వేదాంత పాఠశాల ఉత్తమమైన విద్వాంసుని ఉత్పత్తి చేయుటకు ప్రయత్నము చేయును. మరి, వారేమి చేశారు? - మరొకరికంటె మరింత జనాన్ని సంపాదించుకొనుటకు ప్రయత్నము చేశారు. సరె, దేవుని దృష్టికి అదేమీ అర్థసహితమైనది కాదు.

14

ఏ మనుష్యునికైనను, అతడు లోక జ్ఞానాన్ని సంపాదించ ప్రయత్నించుట, దానితో దేవుని ప్రీతిపరచుట ఏ విధమైన అవసరతయుండదు. అది దేవుని దృష్టికి హేయమైనది. లోకసంబంధమైన కోరికలచేతను, లోక జ్ఞానముచేతను నీవెన్నడు దేవుని సంతోషపరచవు. ఎందుకనగా “అది దేవునికి శత్రుత్వమని,” లేఖనము చెప్పుచున్నది. అతడు దానిని చేయలేడు.

జ్ఞానమంతా కలిగియుండుటకు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయుదురు. వారేమి చేయవలెనో, వారు ఏ మాటలు చెప్పవలెనో, అది మాత్రమే వారు ఎరిగియుందురు. మానవ గుండెల్లో గ్రుచ్చుకొనిపోయి పాపమును పరిశోధించు పరిశుద్ధాత్మ వర్తమానమై బలముతో నిరూపించుటకు బదులుగా, ఆది కేవలము రాజకీయ సంభాషణ అవుతున్నది. రాజకీయ సంభాషణ కొరకై వారు తర్ఫీతు పొందుతారు. మరి మనకది అవసరము లేదు “వాక్యము మనయొద్దకు వచ్చెను, మాత్రమే కాదు గాని... లేక, సువార్త వాక్యముతో మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ యొక్క దృష్టాంతములచేతను మరియు శక్తి చేతను వచ్చెను,” అని పౌలు చెప్పెను. పరిశుద్ధాత్మ యొక్క బలమును ఋజువు చేయుచు, అది సువార్తను తెచ్చెను. అయితే వీరందరు వేదాంత పాటశాలలకు వెళ్ళిపోయి. ప్రజల యెదుట ఏ విధముగా నిలబడవలెనో, ఏ విధముగా వారికివారు కనుపరచుకోవలనో, ఏ విధముగా వస్త్రాలు ధరించవలెనో, ఏ విధముగా ప్రవర్తించవలెనో, ఆలాటి పెద్ద క్రమబద్ధమైన శిక్షణలను వారు నేర్చుకుంటారు. ఎన్నడూ తప్పుడు వ్యాకరణమును వారు వినియోగించకూడదు. ఇపుడు, రాజకీయ సంభాషణకు అది సరిపోతుంది. అయితే, మనమైతే మనుష్యల యొక్క తియ్యని మాటలు వాడకూడదు. పౌలు చెప్పియున్నాడు, “నేను ప్రకటించిన సువార్త ఆ విధముగా రాలేదు. అది పరిశుద్ధాత్మ నూతనత్వముతోను మరియు శక్తిని కనపరచు దృష్టాంతములతోను వచ్చినది.” మీ యొక్క జ్ఞానము లేక మీ యొక్క నమ్మకము మనుష్య జ్ఞానమును ఆధారము చేసికొనకుండునట్లు సరియైన భాషా ఉచ్ఛరణతో రాదు. అయితే అది తిరిగి లేచిన క్రీస్తుయొక్క శక్తిని కనపరచు దృష్టాంతములతో వచ్చినది. “ఆయన పునరుత్తానము యొక్క బలముతో ఆయనను ఎరుగుటయే సువార్త.”

15

ప్రతియొక్కరు ప్రతి సంఘశాఖ మరొకరికంటె తాము కొంచెము తెలివైనవారుగా తలంచుటకు యత్నిస్తారు. “మాకు అమితమైన తెలివిగలవాడున్నాడు,” అని మెతడిస్ట్ వారు చెప్పుదురు. “ మేము - మేమే తెలివైన వారము, ”మేము సాధారణమైన మనిషి వెళ్ళిపోయి సువార్తను ప్రకటించుటకు మేము అనుమతించము,“ అని చెప్పుదురు. అయితే వారు జాగ్రత్తగా ఎంచుకుంటారు. (ఓ దేవా! కనికరము చూపుము) వారిని జాగ్రత్తతో ఎంచుకుంటారు. వారియొక్క ప్రత్యేకమైన ఒక సిద్ధా౦తానికి వారు సాధనముయైతే, అపుడు వారిని ఆలయంలో యుంచెదరు. ఏ విధముగానైనా దేవుడు అతనిని ముట్టలేడు. మనుష్యుని వలన లేక సంఘ శాఖ వలన గాక, పరిశుద్ధాత్మ వలన ఏరబడి, దేవుడు లేపిన ఒక్కరు నాకు బోధచేయటకు ఆశించుచున్నాను.

అంతా తెలివితేటలే! “ఓ దానిని గూర్చి మాకు అంతా తెలుసు,” అని వారు చెప్పెదరు. వారిలో కొందరికి పరిశుద్ధాత్మయొక్క మొదటి అక్షరము కూడా తెలియదు. వారు దానిని తిరస్కరిస్తారు.

16

షుమారు పది సంవత్సరముల క్రిందట కాలిఫోర్నియాలో ఒక దినమున నేను చదివిన చిన్న పుస్తకము నాకు జ్ఞప్తి వచ్చుచున్నది. ఒక పాత పుస్తకశాలలో నేనది తీసికున్నాను. గ్రంధకర్త ఎవరైనది నేను మరచిపోయాను. అది కేవలం పది సెంట్ల చిన్న పుస్తకము మాత్రమే. అది కొద్దిగా చమత్కారముగా తమాషాగా కాన్పించినప్పటికి, అదికొంత మేలైన విచక్షణ కలిగియున్నది. అయితే, దేవునివలె వినిపించిన ఒకదానిని నేను అందులో కనుగొన్నాను. ఆ చిన్న కథలలో యొకటి యీలాగు మొదలైనది. ఒక ఉదయం ఒక పెద్ద కోళ్ళ కొట్టములో తెలియబడిన తెలివినంతా తానే ఎరిగియుంటిననుకొనిన ఒక చిన్న కోడిపుంజు యొక్కటి అక్కడ యున్నది. కాబట్టి అది పెట్టెపైకి ఎగిరిపోయి, తన చిన్న ముక్కుతో పెట్టెను నాలుగు లేక ఐదుసార్లు కొట్టినది. తన చిన్న తలను వెనుకకు విసరి నీవెన్నడు విననంతగా పుంజు కూత కూసినది. మిగతావాటి అవధానమును ఆకర్షించి, “ఈ కోడి దొడ్డికి సంబంధించిన అమ్మలారా, అయ్యలారా! మేమిపుడే రూపొందించిన యొక ఉన్నతమైన విద్యా ప్రణాళిక పైన ఈ ఉదయము మీ అందరితో నేను మాటలాడ ఆశించుచున్నాను,” అని చెప్పినది. తన చిన్న కళ్ళద్దాలు తన ముక్కు మీద నుండి తొలగించుచూ నా యొక్క పఠనాభ్యాసములో నేనెంతో జ్ఞానమును సంపాదించితిని,“ అని చెప్పినది. ఇంకా చెప్పినది ”మరింత జ్ఞానముచేత కోళ్ళమైన మనము ఎంతో బాగుపడగలమని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి, మనము ఒక దొడ్డిలో లేదా రంద్రములో త్రవ్వినట్లయితే, మనము మరింత బాగుగా కూయుటకు, అందమైన ఈకలు మరెక్కువగా పుట్టించుకొనుటకు, మనలను తయారుచేయు ఒక రకమైన విటమినును మనం కనుగొంటాము, అని మీకు చెప్పుచున్నాను. ఓ! అనేక విధములుగా మనకై మనం యింకా అభివృద్ధి చెందుతామో నేను మీకు చెప్పెదను,“ అని చెప్పినది.

17

చిన్న కోడి పిల్లలు, తమ చిన్న ఎర్రని జట్టులతో, అరుపులు అరుస్తూ “అతడే మన అభిమాని కాడా?” అని చెప్పినవి. అవి నిజంగా అతనిని అభినందించినవి. ఓ! “అతడెంత విజ్ఞత గల కోడిపుంజు కదా!” అని అనినవి. ఇక్కడ ఈ వేదాంత పాఠశాల బోధకులు కొందరు నాకు జ్ఞాపకము వచ్చుచున్నారు. “ఓ ఎంతటి విజ్ఞానవంతుడో మిగతా కోళ్ళతో చుట్టూ వ్రేలాడుట మనకు అవసరము యుండదు. మనమందరము తప్పక అతని వెంబడి వెళ్ళవలసియుండును.”

సరే చిన్నది తన ప్రసంగమును ముగించకముందే, అటువంటి మెరిసే ఈకలు లేని మరొక చిన్న కోడి, మిగతా కోళ్ళగూటి మందలో నుండి పరుగెత్తి వచ్చి - “అబ్బాయిలూ! ఒక్క నిముషం! రేడియోలో కడపటి ప్రకటన సమాచారము నేనిప్పుడే విన్నాను. కోళ్ళు పౌనుకు నాలుగు సెంట్లు పెరిగినవి. రేపు మనమంతా వధించబడబోతున్నాము. మీ తెలివివలన ఏమి ఉపయోగమౌతుంది?” అని చెప్పినది.

సహోదరుడా! మనము ప్రోగుచేసికున్న తెలివియంతటివలన అది ఏ మేలు మనకు చేస్తుంది. మట్టి యొక్క ఆరు అడుగులమే మనము. అంగుళముల వలన, నిముషాల వలన మనమంతా చనిపోతున్నాము. మన తెలివికి అర్ధం శూన్యం. మనమాయనను ఎరుగవలసియున్నది. అయితే వారు అది చేశారు.

18

కొద్దికాలము క్రితం నేను ఒక చిన్న కానరి (పక్షి) విషయం వివరణ యిచ్చియున్నట్లుగా అతడు తెలుసుకోవలసినంత తెలివిని అతడు తెలుసుకున్నాడని అతడు అనుకున్నాడు. మానవులను గూర్చి మిగతా కానరీలకు తాను చెప్ప కలిగినంతటిని అతడు తెలుసుకున్నాడు. కాబట్టి అతడు (అది) తన గూటి పైకి ఎగిరిపోయి, నరులను గూర్చి ఏ విధముగా అతడు తెలుసుకున్నాడో వారిని గూర్చి మాట్లాడుటకు ప్రారంభించెను. మరియు అకస్మాత్తుగా పర్డు (ఒక స్థలము) నుండి వచ్చిన ఒక పండితుడు నడచుకుంటూ వచ్చి అతనితో బహు నునుపైన మాటలు మాట్లాడుటకు మొదలు పెట్టాడు. మరియు ఇది తన కళ్ళు కొట్టుకుంటూ తల త్రిప్పుకున్నది. ఇపుడు, కళ్ళు కలిగియుండెను, అది పండితుని చూడగలిగెను. అది చెవులను కలిగియుండెను, అతడు అతనివి వినగలిగెను. అయితే బహుశా అతడు మాట్లాడుచున్నది అతనికి తెలియలేదు. ఎందుకని? అతడు కేనరీ మెదడు కలిగియుండెను. అతనికి కేవలం పక్షి మెదడు మాత్రమే యుండియుండెను. అది మాత్రమే అతడు కలిగియుండెను. మానవుని మెదడు అతడు కలిగి యుండలేదు. కనుక మానవులవలె అతడు తలంచలేక పోయెను.

అలాగునే, మానవుడు దేవునివలె ఆలోచన చేయలేడు. నీవు మానవుడవు. కేనరీ పక్షి మెదడు కంటే లోకములోని జ్ఞానమంతా మిన్నయినది కాదు. నీవు చేయునదంతా, అదే నిన్నే గాయము చేయును. నీవు క్రీస్తుయొక్క మనస్సు కలిగి యుండవలసి యున్నది.

19

ప్రజలు వెళ్ళి సంస్థాపకములలో చేరుటలో గల కారణము, క్రొత్త జన్మకు బదులు కరస్పర్శ ప్రత్యామ్నాయము చేయుటకు గల కారణము, వారు జన్మను దాటివేస్తున్నారు. క్రొత్తజన్మ వారికి ఇష్టములేదు. మరియు వారు - బైబిల్ గ్ర౦థములో నుండి మనమది బోధిస్తున్నామని వారికి తెలియును. కనుక దానికి ఒక దానిని వారు ప్రత్యామ్నాయము చేయుచున్నారు మరియు పెంతికోస్తువారు మరెంతో చెడుగా ఒకదానిని ప్రత్నామ్నాయముగా పెట్టుచున్నారు. తరగతి శ్రేణిలో వారది కావాలనుకుంటున్నారు. అదెంతగానో ఉన్నత శ్రేణిలో యుండవలసియున్నది. “మేము కరస్పర్శ చేసి సంఘములో చేరితిమి, మరియు చిలకరింపబడి లేక బప్తీస్మము పొంది,” లేక మరొకటి. క్రొత్త జన్మను గూర్చి భయపడిపోతారు. వారు అలా అలోచి౦చుటను గూర్చి బ్రన్హం టాబర్నికల్ భయపడుచున్నది అని కొన్ని సార్లు నేననుకుంటున్నాను.

20

ఇపుడు, ఒక జన్మ, అది మనందరికి తెలుసు. అది ఎక్కడున్నదని లేదా అది ఏమిటని, దాని విషయాలు ఏమిటని నాకు లెక్కలేదు, అది యొక కలగాపులగం. ఒక తొక్కతిప్ప మీద ఒక బిడ్డ జన్మించినా, కరుకు నేలపైన లేక ఉదారంగుతో అలంకరించిన ఆసుపత్రి గదిలో జన్మించినా, అది ఏలాగైనా కలగాపులగం, ఒక ఆవు దూడ జన్మయైనా, మరిదేని యొక్క జన్మయైనా అది కలగాపులగము.

క్రొత్త జన్మ కలగాపులగం తక్కువైనదేమి కాదు. అయితే, ప్రజలు ఎంతగానో అతుక్కొనిపోయి, “ఎక్కడైతే వారు కరస్పర్శ చేయుదురో అక్కడకే మేము వెళ్తాము. ఎక్కడైతే కేకలు బొబ్బరింతలు పెట్టరో, బలిపీఠమును కొట్టి అరుపులు అరవరో, అక్కడకే మేము వెళ్తాము,” అని అంటారు. నీవు మరింతగా మానవుడవు కావాలనుకుంటావు. ఈ దినమున జన్మ చనిపోవుట, జీవమును తెచ్చుట మనకు కాలసియున్నది!

21

విత్తనము, ఒక పాతబడిన బంగాళ దుంప, ఒక విత్తన సంబంధమైన బంగాళ దుంపను నీవు తీసుకొని నేలలో పెట్టుము. క్రొత్త బంగాళ దుంపలు నీకు వచ్చు వరకు ఆ పాతదైన బంగాళ దుంప కుళ్ళిపోవలసియున్నది. అది మురిగిపోయే వరకు క్రొత్త జన్మను అది ఉత్పత్తి చేయలేదు.

ఒక పురుషుడు గాని, స్త్రీ గాని వారి బుద్ధి కుశలతలు, వారి స్వంత స్వభావము (own self) కుళ్ళిపోయే వరకు కొత్తజన్మను పొందరు. చచ్చి బలిపీఠము యొద్ద మృతమైపోయే వరకు మరియు కేకలు పెట్టి నీ చొక్కాయి కాలరులో నుండి గంజి బయటకు వచ్చే స్థానము నీకు కలుగునపుడు దేవుని ఆత్మ వలన నీవు తిరిగి జన్మిస్తావు. నీవు పెద్ద అరుపులు అరచినా, బాషలలో మాట్లాడినా, కోడి తన తలను ఆడించినట్లు ఆడించినా నాకు లెక్క లేదు. నీవు క్రొత్త జన్మను పుట్టించుచున్నావు. అయితే అందులో మనము మరొకటి ప్రత్యామ్నాయము చేస్తున్నాము; మనకు నాజూకు పద్దతి అవసరము, కచ్చితముగా.

22

గత దినము, శుక్రవారము, నేను నా భార్య అంగడికి వెళ్తున్నాము. దీనిని గూర్చి నేను మోత మోగించాలని కాదు. అయితే మేము వీధిలో నుండి వెళ్ళుచున్నప్పుడు వస్త్రహీనులైన స్త్రీలు ఉంటున్నారు. ఒక ప్రక్కనుండి మరో ప్రక్కకు నా తల త్రిప్పుకొనుచున్నాను. నేను గ్రుడ్డివానిగా నున్నప్పుడు, ఆయన నా కన్నులను స్వస్థపరచినట్లయితే మంచి వాటినే నేను చూచెదనని దేవునికి నేను వాగ్దానము చేసికున్నాను. నా కారులో చిన్న శిలువను వ్రేలాడయుంచుకొనియున్నాను. అటువంటిది నేను చూచినప్పుడు, నేను శిలువవైపు చూచి, “ఓ దేవా! అదే ఆశ్రయ దుర్గము,” అని చెప్పెదను.

నేను ఆ స్త్రీలను చూశాను. మేడా అడిగినది, “ఈ దినమున ఒక్క స్త్రీయైనా క్రిందలంగా ధరించి యుండుట మనం చూడలేదు,” అని. ఇంకా ఆమె అన్నది, “బిల్ ఆమె శరీరముపైగా ఆ చిన్న దారాలు చుట్టుకొని అక్కడున్న ఆ స్త్రీవైపు చూడూ! అది తప్పు అని ఆమెకు తెలియదని నీవనుకొనుచున్నావని నాకు చెప్తావా?” అని అడిగినది. “అది తప్పు అని ఆమెకు తెలియకపోతే అప్పుడామె మతి తప్పిపోయినదే,” అని అన్నది.

“ఒక్క నిముషం, హనీ! ఆమె యొక అమెరికా వాసి, అమెరికా వారు చేయురీతిగనే ఆమె కూడాచేయును.”

23

నేను చెప్పాను. “ప్రియా! కొంచెము కాలము క్రితం నేను ఫిన్లాండ్లో యుంటిని.”

నన్ను కూర్చుండబెట్టిన డాక్టర్ మనినెన్ నేనక్కడ ప్రశ్నించాను. సౌనా అని పిలువబడే ఆరోగ్యవంతమైన స్నానపు గది యొద్దకు మేము వెళ్ళుచుంటిమి. వారు నిన్ను లోపలకు తీసుకొని వెళ్ళి వేడి నీళ్ళు పైన పోయుదురు, లేదా వేడి బండలపైన నీరు పోయుదురు. అది వెంటనే నీకు చెమటను పుట్టిస్తున్నది, తరువాత మంచు నీటిలోనికి నీవు దూకునట్లు వారు నిన్ను చేస్తారు. తిరిగి బయటకు వస్తావు, తరువాత ఒక గదిలోకి నీవు తీసుకొని రాబడతావు, అక్కడ దాదీలు లోపల ఉంటారు. వారు స్త్రీలు వస్త్రాలు లేకుండా, (ఆ దిగంబరులుగా యుండు) పురుషులను రుద్దుతారు. తిరిగి వారిని కొలనులోనికి పంపుతారు. నేను లోపలకు వెళ్ళుటకు యిష్టపడలేదు. “డాక్టర్! మనినెన్ అది తప్పు,” అని నేనన్నాను.

అతడు చెప్పాడు. “సరే, రెవరెండ్ బ్రెన్హాం గారూ! ఆలాగైతే అది తప్పు. ఆలాగైతే స్త్రీకి వస్రాలన్ని తీసివేసి, వస్త్రము లేకుండ బల్లపైన పరుండబెట్టి ఆమెకున్న ప్రతి లైంగిక అవయవమును మీ అమెరికా వైద్యులు పరీక్ష చేయుట ఏంటి? ఆసుపత్రులలో మీ నర్సుల సంగతి ఏంటి?” అని అతడు అడిగాడు.

“సహోదరుడా! మనినెన్, నన్ను క్షమించు, నీవు చెప్పినది నిజం” అని నేనన్నాను.

24

ఏంటది? అది ఆచారములు. నేను, పారిస్లో యుండినపుడు, స్త్రీలకు పురుషులకు ఒకటే మూత్రశాలలని నేనది నమ్మలేక పోయాను. వీధికి ప్రక్కనే పురుషులకు, స్త్రీలకు విశ్రాంతి గదులు ఉన్నవి. నేనది అర్థం చేసుకోలేకపోతిని. స్త్రీలు నదీ తీరానికి ఈత గొట్టుటకు వెళ్ళినపుడు, అబ్బాయి, అతని ప్రియురాలు బట్టలు మార్చుకొనుటకు గదులేమి వుండవు. వారి వారి ఆఖరి వస్త్రములు తీసివేస్తారు; వెనుకకు తిరిగి చిన్న పేలిక పెట్టుకొని ఈదుటకు వెళ్ళిపోతారు. అది నేను నమ్మలేకపోయాను. అయితే అది అలాగేయుంటుంది. వారు దానినేమి లక్షపెట్టరు. అది ఫ్రాన్స్ యొక్క ఆచారము.

25

ఆఫ్రికాలో, స్త్రీలు పురుషులు, వృద్ధులు, యవ్వనులు అసలు బట్టలు లేకుండా అడవి పొలములలోగుండా నడచుకొంటూ వెళ్తారు. విశ్రాంతి గదులు మొదలయినవి యేనాడు వారు ఎరుగరు. లేదా ఒకరి దృష్టి ఒకరి పైన ఉండదు. అయితే వ్యత్యాసము వారికి తెలియదు. అయితే అది దేశము యొక్క ఆచారము.

అయితే “హనీ! మనం భిన్నమైన వారము. మరొక దేశము నుండి వచ్చిన వారము. మనమిక్కడ యాత్రికులము పరాయి వారము. ఇవన్నీ మనకు అంత చెడుగా కాన్పింపచేయునది అదే. ఏలయనగా అలాటివి ఒప్పుకొని, అంగీకరించి వారు యాత్రికులు పరాయివారు అని, ఉండబోవు ఒక పట్టణము కొరకు వారు ఎదురుచూచుచున్నారని,” బైబిల్ చెప్పుచున్నది.

26

ఇటలీలో, ఫ్రాన్స్ లోను, ఆఫ్రికాలో మరి ఏ దేశములోను యుండిన పురుషుడు లేక స్త్రీ, వారు పరిశుద్ధాత్మ వలన తిరిగి జన్మించితే, ఆలాటివి వారు చేయరు. ఆ బట్టలను వారు ధరించరు. ఆ విధముగా వారు ప్రవర్తించరు. ఎందుకనగా దేనికి దేవుడు నిర్మాణికుడు, పరిపాలకుడై యున్నాడో అట్టి మరియొక దేశమునకు సంబంధిచినవారు వారు. మనము పరలోకము నుండి వచ్చిన వారము. నీలోనున్న ఆత్మ నీ జీవితాన్ని కదలిక చేస్తుంది. నీవు అమెరికా వాసివైనట్లయితే, అమెరికావారు చేసినట్లుగా నీవు చేస్తావు. నీవు ఫ్రెంచి వానివైతే ఫ్రెంచివారు చేసినట్లు నీవు చేయుదువు. మరియు మిగతా వారిని విమర్శిస్తావు. అయితే నీవు దేవునికి సంబంధించిన వాడవైతే, పరలోకమందున్న వారు చేసినట్లుగా నీవు చేయుదువు. ఎందుకనగా నీ ఆత్మ పైనుండి వచ్చినది. అది నిన్ను స్వాధీనపరచుకుంటున్నది.

27

చిన్న దానిని యొకదానిని నీవు చూడవచ్చును. లేఖనములలో ఎవరైతే ఈ నూతన పట్టణమును వెదకి యుండిరో వారు వ్యత్యాసముగా ప్రవర్తించిరి. వారు యాత్రికులును పరదేశీయులని ఒప్పుకోనిరి. అయితే కయూను వైపుననున్నవారు వారు దేశ దిమ్మరులును, భ్రష్టులైయుండిరి. అయితే క్రైస్తవులు యాత్రికులు మరియు పరదేశీయులునై యున్నారు. ఒకదేశ దిమ్మరికి ఇల్లు లేదు, ఒక భ్రష్టుడు భయంకరమైన వ్యక్తి. అయితే ఒక యాత్రికుడు ఒక నిజమైనవాడు, ఒక నిజమైన ప్రాంతము నుండి మరొక దేశమునకు వచ్చువాడు. గృహమునకు అతని దారిని వెదకుచూ, మరొక దేశము నుండి తాను వచ్చితినని, తానొకటి కలిగియున్నాడని అతని జీవితాన్ని బట్టి ఒప్పుకుంటున్నాడు. కారణము ఒకటియున్నది.

28

అయినప్పటికి, ఆలాటివి చేయువారు, అలాంటివి ధరించువారు... నేను నీకు చెప్పెదను: దక్షిణాఫ్రికాలో, ముప్పయి వేలమంది అసలైన అన్యులను, బట్టలు లేకుండ యుండిన గొంగళి పల్లెవాసులను నేను చూచితిని. పదహారు, పద్దెనిమిది, ఇరువై సంవత్సరముల ప్రాయముగల ఆడపిల్లలు, ఒకకుట్టు బట్ట కూడా లేని అబ్బాయిలు, వారి ముఖములకు మట్టి పూసుకొని, రంగులు పూసుకొని అక్కడ నిలబడియుండిరి. వారి ముక్కులలో గుండా ఎముకలు, వారి చెవులకు కట్టె పలకలు వేలాడుతున్నవి. మానవ ఎముకలు లేక మరేవో ఎముకలను వారి తలలలో గ్రుచ్చుకున్నారు. జంతువుల పళ్ళు వారిపైన వ్రేలాడవేసుకున్నారు. లోకములోకి వచ్చినట్లుగానే దిగంబరులుగా వారు యున్నారు, మరి అది వారెరుగరు. అయితే వారు క్రీస్తును స్వీకరించినపుడు బోర్లాపడిపోయారు. పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వారు పైకి లేచి, వారి రొమ్ము భాగాన్ని సిగ్గు కప్పుకొనుటకు వారి చేతులు ముడుచుకున్నారు. వారు వెళ్ళిపోతూ ధరించుకొనుటకు బట్టలు తెచ్చుకున్నారు. ఎందుకు? ఈ లోకానికి వారు యాత్రికులు పరదేశీయులై యున్నారు. హల్లెలూయ! వారు ఆయనకు దూరముగా యుండిరి. ఔనండి.

29

ఓ, ఔను. వీరు తమకు తాము క్రైస్తవులుగా పిలచుకొనుచున్నారు. వారు సంఘములకు సంబంధించియున్నారు. వారు వెళ్ళిపోయి మేము మెతడిస్టులము, మేము బాప్టిస్టులము, మేము పెంతెకోస్తవారము, మేము ఏడవదినపు వారము, మేము ఇది, మేము అది, యింకా యింకొకటి అని చెప్పెదరు. అందులో ఏ ఒక్కటి దానికి సరికాదు. నీ ఆత్మ నీలోనున్న ప్రాణము నీవెవరైనది చెప్పి, నిన్ను కదలించును. “వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు,” అని యేసు చెప్పెను.

30

మొదటిగా సంఘము, ఇశ్రాయేలీయుల వలె తయారైనది. అన్ని అన్య దేశములు రాజును కలిగియుండుట వారు చూశారు. దేవుడు వారియొక్క రాజు, మరియు అన్యదేశములు రాజును కలిగియుండుట వారు చూచిరి. కాబట్టి అన్యరాజ్యములవలె వారుండుటకు వారు ఆశించారు. మరియు వారికి వారు ఒక రాజును కొనితెచ్చుకున్నారు. వారది చేసినపుడు వారు యిబ్బందిలో పడిపోయారు, క్రమక్రమముగా అది లోపలకు వచ్చుటకు ఆరంభమైనది. క్రమేణ లోకము వారి లోపలకు జారుకొనడము ఆరంభమైనది. చివరకు ఆహాబుతో ముగిసినది. ఒక రాజు దానికి కొంచెము సమీపముగా వచ్చుచుండెను, యింకా కొంచెము సమీపంగా వచ్చిరి. చివరిగా వారిలో నుండి ప్రాణము పిండబడినది. అక్కడే వారు బయటకు వెడలిపోయారు. మరి నిజమైన రాజు వచ్చినపుడు, వారు ఆయనను తెలుసుకొనలేదు.

31

సంఘము ఆలాటి దానినే చేసినది. అది దత్తత చేసికొనబడినది. ఇక్కడే నీవున్నావు. అది రాజకీయాలను, విద్యా బుద్దులను దత్తత చేసికున్నది. అది సంస్థాపకములను, సభా సంఘమును, పెద్ద సంఘములను, నిరర్ధక శబ్దాడంబరపు బోధకులను దత్తత తీసికున్నది. మరియు నిజమైన రాజు వచ్చునప్పటికి వారు ఆయనను ఎరుగరు. వారి యొక్క రాజైన సాక్షాత్తు పరిశుద్ధాత్మనే వారు శిలువ వేయుచున్నారు. వారాయనను ఎరుగరు. అయితే వారు ఆయనను ఎగతాళి చేయుదురు, హేళన చేయుదురు. యూదులు వారి మెస్సీయుయెడల చేసినట్లుగా, సంఘము ఆ విధముగనే వారి మెస్సీయకు చేయుచున్నది. అది వారు ఎరుగరు. ఆత్మ సంబంధమైన అంతరంగ దృష్టి వారికి లేదు. ఎందుకనగా వారికళ్ళతో వారేది చూచిరో వాటికి సాక్షాధారాలు లేవు. గొప్ప గొప్ప భవనములు, లోకముతో సరి సమానముగా యుండుటకు కోరుదురు. లోకముతో సరిపోల్చుకొనుటకు మనమెన్నడు ప్రేరేపించబడము. మనలను మనము తగ్గించుకొనుటకు ప్రేరేపించబడియున్నాము.

32

దేవునిలో యొక్కటే పెద్దబాగము అవుతుంది. ఈనాడు పొలములలో స్వస్థత సువార్తికులలో బహు పోటీలు... పోటీ చేసేవారున్నారు. ఒకరు చెప్తారు - “భలే, దేవునికి స్తుతి, నాకు అనేక వేలమంది యున్నారని అంటాడు. నీకున్న దానికంటే పెద్ద కూటమి నాకున్నది.” అది ఏ వ్యత్యాసమును తీసుకొని వచ్చును? మనకు ఒక్కరున్నా లేక ఒక మిలియన్ ఉన్నా వ్యత్యాసమేంటి? దేవుని యెడల మనము నమ్మకముగా యున్నామా? ఆయన వాక్యము యొడల నమ్మకముగా ఉన్నామా? పరిశుద్ధాత్మ యొక్క పరీక్షకు మనం నిలబడుచున్నామా? అది నిజమా? అదియే ప్రాముఖ్యమైన విషయము.

33

అయితే బైబిలు మీద మనం రాజీపడుచున్నాము. ఈ బైబిలు యొక్క ప్రాధమిక సిద్దాంతములపైన, అనేకమంది పెంతెకోస్తువారు రాజీపడుచున్నారు. అక్కడే. భావాలను నేను బాధపరచవలెనని కోరుకొనుటలేదు. నేను నా స్వంత మందిరములో నున్నాను. నేను భావిస్తున్నాను - నా సంఘములో న్యాయమును చేకూర్చగలననే నేను భావిస్తున్నాను. ఎందుకనగా నేను సువార్తను ప్రకటించుచున్నాను. అయితే “తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ” నామములో బాప్తిస్మము అనునది లేదు అని వేలు పదివేలమంది పెంతెకోస్తు బోధకులకు తెలియును. ఎవరైనా ఎక్కడైనా “తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ.” నామములో ఎప్పుడైనా బాప్తీస్మము యిచ్చినట్లుగా నాకు చూపించమని ఆర్చి బిషప్పును మరి ఎవరినైనను నేను సవాలు చేయుచున్నాను. అయితే వారు రాజీ చేకూర్చుకున్నారు. ఎందుకనగా నిర్మాణాత్మక సంఘములు ఆలాగు చేసినవి. క్రొత్త నిబంధనలో చరిత్ర వలన, మూడు వందల సంవత్సరాల వరకు ఏ ఒక్క వ్యక్తి కూడా బాప్తిస్మము పొందినది యేసుక్రీస్తు నామములోనే. అదేమైయున్నది? నిర్మాణాత్మకమైనది. అదే అది చేసినది. రాజీపడుట!

34

ఈ దినమున వీధులలో నుండి వీధి పనివారినందరిని వారు తీసికున్నారు. మందిరములోనుండి వారు కంజరును తీసివేశారు. ఆలయములో నుండి మహిమనంతా తీసివేశారు. వేదాంత బోధలు తెచ్చిపెట్టారు. చిన్న కోడిపుంజు జుట్టు బోధలు; సమాజములో అంతా సున్నపు పూతలు; స్త్రీలు పొట్టి లంగాల బట్టలు ధరించుట, చర్మమునకు అతుక్కున్న బట్టలు కట్టుకొనుట, పురుషులు సిగరెట్లు త్రాగుట, జూదములు ఆడుట, మురికి చెలోక్తులు చెప్పుకొనుట. అది దేవుని ధృష్టికి అవమానము. అది కరుకుగా యున్నదని నాకు తెలుసు. అయితే ఒకరు యొకటి చెప్పుటకు యిదే సమయము. రాజీపడుట, యిచ్చుట, లోకము వలె ప్రవర్తించుట!

ఎవరూ తోడు లేకున్ననూ దేవుని యొకనితోనే, నేనొక్కనిగా నిలబడినా ఫరవాలేదు. నేను లెక్క చేయను. దేవుని బైబిల్ యొక్క సత్యమును నేను బోధించెదను. దాని కొరకే నేను నిలబడతాను. నేను మరణించెదనా, నేను సత్యము కొరకే నిలబడతాను. కచ్చితముగా. మనకు సత్యము కావలసియున్నది. సంఘము బట్టి నేను కొలువను, అయితే దేవుని వాక్య ప్రకారముగా నేను కొలచెదను.

35

అయితే, దెలీలా, ఆమె సమ్సోనుకు బలముగలదని ఎరిగియుండెను. నీవు గమనించావా? మరియు ఆ బలమెక్కడ యున్నదో ఆమెకు తెలియదు. ఆ బలమేమిటో ఆమె చెప్పలేదు. అయితే ఒక గొప్ప బలమును సమ్సోను కలిగియుండెను. దానిని ఎరగాలని ఆమె ఆశపడినది. దేలీలా, తన అందముతో ఆకర్షించుచూ సమ్సోను వెంటబడినది. ఓ! నిజముగా ఆమెకు ఆమె లైంగిక వస్తాలు ధరించినది. ఈ దినముననున్న చిన్న నవ యవ్వనుల వలె ఇంకా మొదలైన వారివలె, అణచుకొన్న నవ్వుతో నుండి అతని యెదుటకు వెళ్ళినది. సమ్సోనును తనవైపు ఆకర్షించు ప్రయత్నములతో తన వస్రాలను తీసివేయు విధముగా ప్రవర్తించినది.

36

అటువంటి దానినే లోకము సంఘమునకు చేసినది. ఇపుడు నీ యొక్క మహాబలమెక్కడ?

“సరే, మనము నిర్మాణాత్మకము చేసినట్లయితే, అది బలమును పగులగొట్టును.” కథోలిక్ సంఘము అదే చేసినది.

“అయితే సమ్సోను! ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు.” మరియు ఒక లూథర్ బయటకు వచ్చెను.

తరువాత మరలా వారు నిర్మాణాత్మకము చేశారు. “మరొక త్రాడుతో నీవు నన్ను బంధించినట్లయితే, అది నన్ను పట్టుకొనును.” కనుక వారు ఆలాగుచేశారు.

“సమ్సోనూ! ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు?” ఏమి జరిగినది? వెస్లీ బయటకు వచ్చి త్రాళ్ళు తెంపివేసెను.

“ఇపుడు నీవు నన్ను అన్ని విధములును మోసం చేశావు. సమ్సోనూ! నేను నిన్ను ప్రేమించానని నీకు తెలియదా? సరే, నీ హృదయములో నుండి సత్యమును నాకు చెప్పుము.”

“సరే మరొక త్రాడులో నన్ను నీవు బంధించుము.”

“సరే, యిపుడు మనమది చేయదము.” అదేమైయున్నది? అది సంఘ శాఖల త్రాడు.

“నీవు నన్ను స్వతంత్రునిగా యుండనీవ్! నాకెటువంటి సంఘశాఖ లేదు. ఆలాగైతే నేను నీకు చెప్పెదను, నీవు నన్ను పగులగొట్ట వలసియున్నది.” కనుక, బయటకు వచ్చినది పెంతెకోస్తులు. నీ యొక్క బలమెక్కడ? “ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు.” మరియు అతడు మరలా త్రాళ్ళను తెంచివేశాడు.

37

అయితే, ఎప్పుడేమి జరిగినది? అది పెంతెకోస్తువారికి, వారి యొక్క సంఘ కాపరులకు, కొందరికి శాస్త్రి పట్టములు అది కలిగించినది. మెతడిస్తువారు లేక బాప్టిస్తువారు లేక వారిలో మిగతావారు వారికి యుండినట్లుగా పాటశాలలు, ఆచార క్రియలు వీరు కూడా కలిగియున్నారు. మందిరము లోపలకు వెళ్ళు; “ఆమెన్” అనునది నీవు వినలేవు. ఉత్తర ధృవమున యుండిన ఎస్కిమోలు గుంపు వలె చల్లగా యుందురు. చల్లని, నులివెచ్చని వారు. “సమ్సోనూ! ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు!”

అమెరికా! ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు! ఆత్మ యొక్క ఏకత్వము ఎక్కడ? పెంతెకోస్తు యొక్క ఏకత్వం ఎక్కడ? అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, యునైటెడ్, దేవుని సంఘము, మరియు, ఇదీ, అదీ, మరొకటి. ప్రతి యొక్కటి వివిధములైన మూఢ నమ్మకములు. ఇది దానితో ఇది దానితో నీవు నగరములోకి వెళ్ళి ఒక ఉజ్జీవము జరిగించలేనంతగా మనమెంతో విరిగిపోయి ఉన్నాము. ఒక సంఘము దానికి ఉత్తరవాదత్వమిచ్చినట్లయితే, వారిలో మిగతా వారు చివరకు హాజరుకారు కూడా. అమెరికా! కమ్యూనిష్ణులు నీ మీద పడుచున్నారు.

38

మన బలమెక్కడ? మన యొక్క ఘనత ఎక్కడ? అదేంటి? దేవుని శక్తికి బదులుగా మనము మనుష్య జ్ఞానము కొరకై వెంటబడిపోయాము. ఎందుకని? మన యొక్క బోధకులు, తదితరులు మనకున్నారు. ఎంతో గట్టిగా గంజి బెట్టినట్లుగా ఉంటారు. మనమెంతో మెడవంచని వారు గాను గంజి బెట్టిన వారు గాను మనలను వారు నిర్మాణము చేశారు. ప్రజలు అంతవరకు సంఘములో కేకలను నీవెపుడైనా విన్నావా? ఎవరూ ఏడ్వటము నీవు వినవు? ఏడ్చువారి బల్ల అడుగు మట్టమున పెడతారు. సంఘములో ఎటువంటి మహిమ లేదు. మనమంతా చేయునది ఎంత గట్టిగా వెనుకకు అనుకోవలెనో అంతగా ఆనుకుంటాము. మనము స్వతంత్రులము కాదు. మనము బంధించబడినవారము. దయ్యము దాని యొక్క నవ నాగరికత గల దయ్యాలతో, జీవముగల దేవుని సంఘమును బంధించియున్నది. ఔనది నిజం! సంఘములో బలము యుండదు. స్వతంత్రత లేదు. ప్రజలెంతగానో ముడుచుకొని గంజివలె యుంటారు. ఎందుకని? దేవుడు పెంతెకోస్తు ప్రజల మధ్యకు వచ్చి ఆయనే దేవుడని కనపరచుకొని, ఆయన పునరుత్తానపు ఆయన సూచకక్రియలు ఋజువుపరచగలడు. అది చివరకు వారిని కదించలేదు కూడా. మహిమ! ఎందుకని? అది అవమానకరము. దేశమును దాటి నేను వెళ్ళితిని. దేవుడు కార్యాలను చేయుచు సూచనలు జరిగించుచున్నాడు. ప్రజలు కూర్చొని “సరె, అది బాగుగానే యుందనుకుంటాను. అది జరుగునని నాకు తెలుసు,” అని అంటారు. అది వారిని కదిలించదు. ఎందుకని? వారు దెలీలా చేత, లోకముతో బంధించబడ్డారు. వారు సంకెళ్ళలోనున్నారు.

39

ఇపుడు వారు చివరకు వారిని లోపలకు చేర్చుకున్నారు. సమాఖ్యలో వారిని బంధించారు. “సమ్సోనూ ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు. దానిని గూర్చి నీవేమి చేయబోతున్నావు?

“ఓ! మనకు పెద్ద సంఘ శాఖలున్నవి.” నిజమే! “మనకు ఎన్నడు లేనటువంటి గొప్ప సభ్యత్వమున్నది.” అయితే ఆత్మ ఎక్కడ? పరిశుద్ధాత్మ ఎక్కడ?

అదే, దయ్యము చేసినది. సంఘమును అది వశపరచుకున్నది. “నా యొద్దకు రమ్ము నీవు దీనిని చేసినట్లయితే చాలు. యిక్కడనే నీవు పెద్ద మందిరమును సంపాదించుకుంటావు,” అని సంఘమును అది వశీకరణ చేయుచునే యున్నది. నీవు కలిగియున్నటువంటి మూఢుడైన బోధకుని నీవు వదలుకొని బుద్ది కుశలత గల శాస్త్రి పట్టాగల మనుష్యుని నీవు తెచ్చుకున్నట్లైయితే, పెద్ద ఆడంబరమైన ఆలయాన్ని మనం కడతాము; మిగతావారివలె మనము ఉంటాము,“ అని సంఘమును అది వశీకరణ చేయుచున్నది. అది నీకు సిగ్గుచేటు! దానికంటే కాఫీ గింజలలో నుండి కాఫీని వేరుపరచలేని ఒక మనిషిని కలిగియుందును, అయితే పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని శక్తిచేత రాజీపడనివాడై యుండవలెను.

40

అయితే, ఓ! అదెంతగానో అంటుకొనిపోవును, ఎంతవరకనగా ఒక దీనుడైన పరిశుద్ధుడు కూటములలో విరిగిపోయి భాషలతో మాట్లాడి లేదా కొద్దిగా కేకలు పెట్టును లేదా ఏదో ఒకటి చేయును. మిగతా వారందరు మూడులుగా చుట్టూ కూడెదరు. “అదేమిటి? సరె. ఆశ్చర్యమెందుకు? ఒకచోట ఒక మూఢ భక్తుడు తప్పక పడియుంటాడు.” అది నిజమే! నీకు తెలుసా! ఒక దీనుడైన భక్తుడు లోపలకు వచ్చి వారి చేతులు పైకెత్తుటకు తృప్తిగా ఆనందించును. అరచి, ప్రభువుకు స్తుతి చేయును. మరొకరు సువార్త ప్రకటనకై “ఆమెన్” అని అరచును. వారిలో మిగతా వారు వెనుకకు తిరిగి అతడు చెప్పినది చూచెదరు. అది పెంతెకోస్త వారు. విషయమేంటి? నీవు మెతడిస్తువానివలె, బాప్టిస్తువానివలె మాదిరిగా యుంటున్నావు. కథోలిక్ మాదిరిగా వారున్నారు. కథోలిక్ నరకము మాదిరిగా యున్నది. మరి అన్ని కలసి, నరకమును పోలియున్నవి! అవును.

41

దేలీలా నిన్ను పెద్ద సంఘములలోకి, ఆందమైన విద్యావంతులైన సేవకులలోకి, వశీకరణం చేస్తున్నది. తరగతి శ్రేణి ప్రజలలోకి నిన్ను తీసికొని వెళ్ళుచున్నది. “సరే, ఇది తెలుసా! ఇక్కడున్న ఫలానా-ఫలానా అతడు కోటీశ్వరుడు; అతడు మన సమాజములోకి వచ్చినట్లైయితే చాలు....” ఓ, మై! అతడు తిరిగి జన్మించనట్లైయితే, ఆలాగైతే అక్కడ యుండుటకు యోగ్యుడైనవాడు కాదు. అతనికి మిలియన్ల డాలర్లు ఉండినా నాకు లెక్క లేదు. అతనికి నలభై కాడిలాక్స్(కార్లు) యుండినప్పటికి, అతనికేమి యుండినప్పటికి అతడు తిరిగి జన్మించవలసి యున్నది, అతడు నేరుగా క్రొత్త జన్మలోనికి రావలయును. పరిశుద్ధాత్మ వలన పునర్జన్మనొంది, క్రొత్త జన్మతో అక్కడ నుండి బయటకు వచ్చి, చీమిడి కార్చుకుంటూ (నన్ను క్షమించడి) అరుపులు అరుస్తూ, కేకలు పెడుతూ, మిగతావారు చేసినట్లుగా చేస్తూ, అతడు దానిని కలిగియున్నాడని తరువాత ఋజువు చేయుటకు ఒక జీవితాన్ని జీవించవలెను. ఆమెన్! అదీ నీకు కావలసియున్నది.

“సమ్సోనూ! ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు.” కమ్యూనిస్తులు నీ మీద పడుచున్నారు. లోకము నీ మీద పడుచున్నది. దయ్యము నీ మీద పడుచున్నది.

42

వారు తిరిగి వెళ్ళిపోయి దేవుని యొక్క ఆత్మ అద్భుతములు చెయుట మరియు ఆయన పునరుత్తాన సంబంధమైనవి చేయుట, యేసు వాగ్దానము చేసినవి ఏవో వారు చూచెదరు, అవి “మీకు తెలుసా! సహోదరుడు బ్రెన్హాంకు ఎంతో ఆలోచనలు చదువుట ఉన్నదని అనుకుంటున్నాను. నా సంఘకాపరి అది దయ్యం అని చెప్పాడు,” అని వారు చెప్పుదురు.

దీనుడవై, వేషదారియగు మోసపోయిన అవిశ్వాసివి, అంతా దిద్దబడి యున్నావు, గొర్రె బట్టలు ధరించిన తోడేలువు నీవు! “మీరు నన్ను ఎరిగియున్నట్లయితే, నా దినమును మీరు ఎరుగుదురు,” అని యేసు చెప్పియున్నాడు. అయితే లోకములోని మిగతా వారి వలె మిమ్మలను చేయటకు ప్రయత్నించు సౌలు యొక్క గుంపును మీరు కలిగియున్నారు.

వాక్యము మీద రాజీపడక, సత్యమునే ప్రకటించి, పరిశుద్ధాత్మ బాప్తిస్మముపై నిలబడు దైవజనుల గుంపు మనకు కావలసియున్నది.

అయితే లోకము ఏమి చేసినది? అది నీ బలమునంతా క్షవరము చేసినది. నీవు నాజీరుగా, పెంతెకోస్తుగా జన్మించావు. అయితే లోకము నిజముగా నీ బలమును క్షవరము చేసినది. ఇపుడది మిగతా వారి వలె ఎంతో అంటుకొనిపోయినది.

43

మనమేది చేయబోవుచున్నాము? ఏమి జరగబోవుచున్నది? ఈ పాఠము ముగింపుకు ఒక మహిమకరమైన విషయాన్ని నేను ఆలోచించగలను.

సమ్సోను బంధించబడినపుడు, మనకు ఉజ్జీవము యుండదు. మన నమ్మకమైన సహోదరుడు బ్రిల్లీ గ్రహం “మన దినములోని ఉజ్జీవము” అని చెప్పినది వినుము. “మన దినములోని ఉజ్జీవము,” అని ఓరల్ రాబర్ట్స్ అరచినది వినుము! “మన దినములోని ఉజ్జీవము,” అని మిగతావారు చెప్పినది వినుము. మనము బంధించబడియుండగా, ఏ విధముగా ఉజ్జీవము మనకు కలుగును? మన సంస్థాపకములతోను, పారంపర్య ఆచారములతోను వరిశుద్ధాత్మను మనము బంధించియున్నాము. మనకు పరిశుద్ధాత్మ ఉజ్జీవము ఉండలేదు. ఆమెన్. వాతావరణముతో అది వేడిగా కాల్చునని నాకు తెలియును. అయితే అది సత్యమే. నీవు ఎంతగానో గంజిగా అంటుకున్నపుడు, బంధించబడి నీవు యుండినపుడు, పరిశుద్ధాత్మ ఉజ్జీవముమనకేలా కలుగుతుంది? వారికున్నది “పైకి భక్తి” యని బైబిల్ చెప్పుచున్నది. “పైకి భక్తి గల వారివలెయుండి దాని శక్తిని ఆశ్రయించని వారు.” దేనిశక్తిని? సంస్థాపక సంఘపు శక్తినా? లోకపు శక్తినా? సంఘపు శక్తినా? పరిశుద్ధాత్మ యొక్క శక్తిని సంఘము యొక్క రహస్య స్థలము. అదే సంఘము పాత కాలపు పరిశుద్ధాత్మ పద్దతికి బదులుగా విద్యావంతులైన బోధకులను, అందమైన పెద్ద భవనాలను దత్తత తీసికున్నట్లైయితే, వారు తిరిగి మిషనులో యుండుట శ్రేయస్కరమౌతుంది. ఆమెన్. నిజమే. ప్రజలు పరిశుద్ధాత్మను ఆర్చివేసి దానిని బందించివేసి, దానిని గూర్చి భయపడుచున్నపుడు పరిశుద్ధాత్మ యొక్క ఉజ్జీవమును నీవెలాగు పొందుకోగలుగుతావు? అక్కడే యిబ్బంది యిమిడియున్నది.

44

“ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు.” సమ్సోను చెరసాలలోనుండగా ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకున్నది...

అతనిని వారు పట్టుకున్నపుడు వారు మొదటిగా చేసినదేంటి? ప్రప్రధమముగా అతనిని వారు బంధించారు. అతని బలమును వారు తీసివేశారు, అతని రహస్యమును వారు కనుగొనిరి. వారు నీ రహస్యమును తెలుసుకున్నారు. నీ రహస్యమును లోకము కనుగొనినది. ఇపుడు మీ వెంట్రుకలను బోడిచేసికొను స్త్రీలైన మీరు; అది లోకము వలె అయిపోయినది. లోకమువలె ప్రవర్తించు పురుషులైన మీరు; అదంతా ఫరవాలేదు. తమాషాలు చెప్పుచూ, మురికి చలోక్తులు విసరుతూ బయటకు వెళ్ళిపోయి కొన్ని సిగరెట్ల త్రాగుతారు. పొరుగు వారి భార్యలతో పారిపోతారు. మీ పనులను కాపాడుటకై కొద్దిగా సహవాస మద్యమును సేవించుచూ తదితరమైనవి చేయుచుందురు. దానికంటె నా కడుపు మీదనే నేను పడుకొని మరియు సోడా బిల్లలు భుజించి, కాలువ నీరు త్రాగి, ఏ రకమైన ఉద్యోగమునకైనను రాజీపడక దేవుని యెదుట పరిశుద్ధముగా నిలవబడతాను. ఔను! అది నిజం! దేవుని యెడల సత్యముగా నిలబడుము.

45

“సమ్సోను! ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు.” బ్రన్హం టాబర్నికల్ వారలారా! లోక నైజాలు మీ మధ్యకు ప్రాకివచ్చుచున్నవి. దానిని గూర్చినదేంటి? మీ రహస్యమును మీరు బహిరంగము చేసుకున్నారా? కొద్ది సంవత్సరాల క్రితం అక్కడ రంపపు పొట్టులో మీరు దొరలి పొర్లుతున్నపుడు దేవుడు మీకు దయచేసిన రహస్యమును మీరు బహిరంగం చేశారా? సాంఘికమైన ఆచారయుక్తమైన ఆరాధన చొచ్చుకొని వచ్చుటకు, అనుమతించి యుంటిరా? మీకేమి జరిగినది? దేవుడు దిగి వచ్చి అద్భుతమును జరిగించగలడు. నేరుగా శ్రోతల సభలోనికి వెళ్ళి వారి హృదయాలలోని రహస్యాలను తెలియజేసి, తదితరమైనవియు చేయగలడు. రోగ బాధలలోనున్న వారిని స్వస్థపరచి అద్భుతాలు, సూచక క్రియలు జరిగించినా, మరియు పరిశుద్ధాత్మ వలన వీలైనంత గట్టిగా ఆయన వాక్యమును బోధించినా, ప్రజలు చెప్తారు, “ఆ! అది సరేనని అనుకుంటున్నాను. మేము ఎక్కువగా అలసిపోనంత వరకు, ఎప్పుడో ఒక్క సారి వినుట మేము ఆనందిస్తాము.” అదీ బ్రన్హం టాబర్నికల్. ఆ ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు.

46

వాక్యము బోధించునపుడు అది యిలాగు యుండెడిది, పాతకాలపు భక్తులు కన్నీళ్ళతోనున్న కన్నులతో, లేచి నిలబడి వెక్కివెక్కి ఏడుస్తు, బహుశా ఒక్క మాట కూడ పలుకలేక రెండు మూడు సార్లు అటు ఇటు తిరిగి కూర్చుండిరి. ఎంతగానో పరిశుద్ధాత్మతో నింపబడిరి! వాక్యము వారిని పోషించెను. “మన్యుషుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవించును.” బ్రన్హం టాబర్నికల్ వారలారా! పీలిస్తీయులు మీ మీద పడుచున్నారు.

పెంతెకోస్తువారలారా, ఫిలిస్తీయులు మీ మీద పడుచున్నారు.

సందేహము లేదు ఫిలిస్తీయులు మిమ్ములను పట్టుకున్నారు, మిగిలిన మిమ్ములను, చాల కాలం క్రితం, మీరు ఎప్పుడైతే మీకై మీరు ఏదీ లోపలకు రాకుండా గట్టిగా నిర్మాణము చేసికున్నారు అప్పటికే నీవు ఒక ప్రెస్బిటేరియనువు, బాప్టిస్తువు, మెతడిస్తువు, కథోలిక్వు లేక మరేదో. మిగిలిన వారితో నీకు ఏ అవసరము లేకపోయెను.

47

కావున, మన దినమున ఉజ్జీవమా? నియమబద్ధమైన ఉజ్జీవ కారుడు లోకమువలన బంధి౦చబడియుండగా మనము అది ఏలాగు పొందగలము? లోకము ఎక్కడయుండునో అక్కడకు దేవుడు రాడు. దాని మీదనే నీవు ఆధారపడగలుగుతావు. లోకముతో నీవు సాంగత్యము కలిగియున్నావు. అలాగైతే అది - ఆలా౦టప్పుడు అదంతా అదేయౌతుంది. లోకము నీ లోపలకు చొచ్చుకొని వచ్చుటకు నీవు అనుమతించితే, లోకము వలె నటించుటకు నీవు వెళతావు. ఆలాటప్పుడు నీవు సమాప్తమైపోయావు. అయితే, నీవు లోకము వలన కలిగిన ప్రతి సంకెళ్ళను నీవే తెంపుకొని దేవుని యొద్దకు నీవు వచ్చినట్లైయితే, తిరిగి నీవు రెక్కలు కొట్టుకొను వరకు దేవుడు నిన్ను వాడుకొనును.

నా యొక్క వర్తమానమును ముగింపు చేయుటకు ఈ ఉదయము యిక్కడ ఒకే ఒక నిరీక్షణ నాకున్నది. అది యిది, “సమ్సోను బంధించబడియుండగా, క్రొత్తదైన జడల జట్టు పెరిగిపోయినది.”

48

దేవా, మా కొరకు ఆత్మ యొక్క ప్రత్యక్ష ఋజువులలో, పరిశుద్ధాత్మ శక్తి ఆమె లోపలకి రాగలిగిన మరొక సంఘమును అంత్యకాలమునకు కొంచెం ముందుగా పంపుము. మార్కు 16 సంఘమును వెంబడించును. అపో. కా 2:4; అపో. కా. 2:38 అదంతా కూడా సంఘమునే వెంబడించును. సూచక క్రియలు అద్భుతాలు అపోస్తులులను వెంబడించినవి. ఆయన పునరుత్తానపు సూచనలు వారిని వెంబడించెను. మనము చెరసాలలో యుండగనే, ఆఖరి పెద్ద చావు దెబ్బ కొరకు నిజముగా ఒక చోట యొక పంటను దేవుడు పెంచుచున్నాడు. ఇక్కడ ఈ ఉదయము, నా క్రైస్తవ స్నేహితుడా! అది నీవు కావచ్చును. పెరుగుచున్న అది నీ యొక్క బలము కావచ్చును. ఇది ఏ ప్రాంతానికి వెళ్ళునో అక్కడ, నీ బ్రతుకు ఒక ఆత్మీయ బలమును ఎదిగింపజేయునట్లుగా ఈ వర్తమానము నీ పద్ధతులకు పోషక పదార్ధములను తెచ్చునట్లు ఉపయోగపడుతుందని ఈ ఉదయం ఈ వర్తమానమునకై ప్రార్ధన చేయుచున్నాను.

మనము తలలు వంచి ప్రార్ధించుకుందాము.

49

ఓ ప్రభువైన దేవా! ఆకాశమునకు భూమికి సృష్టికర్తా, నిత్యజీవమునకు మూలకర్తా మరియు ప్రతి మంచి యీవికి మరియు ఆత్మ సంబంధమైన వరమునకు ప్రధాతా! ఈ ఉదయము ఈ మాటలను తీసికొని వారి యొక్క హృదయములలో పెట్టుము. మరియు ప్రభువా! వాటికి నీరు కట్టుము. ప్రజలు ఈ సంగతుల విషయమై ప్రార్ధించి, లోకము సంఘమును వశపరచుకొనినదని, చివరకు దాని బలమును, దాని రహస్య స్థలమును, రహస్యమెక్కడ యుండునో దానిని తెలుసుకొని దానిని క్షారము చేసియుండెనని చూచెదరు గాక. ఒకనాడు విజయము కొరకై కేకలుపెట్టిన వారిని; ఒకప్పుడు విజయము పొందిన వారిని తీసికొని, వారిని క్షారము చేసి టెలివిజన్ కార్యక్రమములు చూచుటకు బుధవారము యింటి దగ్గరే యుంచుచున్నది. వారి హృదయములలోనున్న సంతోషమును తీసివేసి, దేవుని కొరకై వారు కలిగియుండవలసిన ప్రేమకంటే అధికమైన లోక ప్రేమను వారికి యిచ్చియున్నది. వారికి ఎంతో లోకమును, లోక సంబంధమైన వాటిని, సువార్తను బోధించు దానికంటె మరెక్కువైన లోకపు వేడుకలను ఎక్కువ కోరికలను పుట్టించినది. పెద్ద గుంపు లేకపోతే, పెద్దది జరగకపోతే, వశీకరణ నిర్వాహకములు లేకపోతే; అలాగైతే ఆత్మకు ఆనందబాష్పాలు తీసికొని వచ్చునది, తిరిగి దైవిక స్వస్థతను తెచ్చునది, సంఘమునకు అపొస్తలుల వరములను పునరుద్ధరణ చేయునది, ఈ దినపు మెస్సీయ, తిరిగి లేచిన క్రీస్తును తెచ్చునటువంటి పాతకాలపు సువార్త యిక(వారికి) అవసరంలేదు.

50

అయితే, ఇశ్రాయేలు నిజమైనరాజును వెంబడించలేకుండ యండునట్లుగా, వారి యొక్క రాజుల చేత వారు బంధించబడిరి. నిజమైన రాజు, ఆయనే వచ్చినపుడు వారాయనను గుర్తెరుగలేదు. ఆ విధముగా ఈ రోజు కూడా యున్నది. ఓ వ్రభువా! మహిమగల రాజు పరిశుద్ధాత్మ రూపమున అగుపించియుండెను, ప్రభువా! అది వారు ఎరుగలేదు. దానిని వారు గుర్తించలేదు. దానిని వారు గ్రహించలేనంతగా వారెంతగానో నిర్మాణాత్మకము చేసికొనిరి. ఎందుకనగా అది వారి సంస్థాపకములో లేదు. ప్రభువా! ప్రజలకై దయ్యం చేసిన పని యిది.

దేవుని యొక్క సమ్సోను, ఎవరైతే ఆశతో యుండి ఆక్రందన చేయుచూ, విజ్ఞాపణ చేయుచు, పట్టుకొనియున్న నిజ హృదయము గలవారు దానిని పట్టుకొందురు గాక. ప్రభువా! ఈ క్రొత్త పంట ఎదుగు వరకు, తిరిగి అక్కడ సీయోనులో ఉల్లాసము మరలా కలుగు వరకు, గుర్తెరిగి అర్థం చేసికొనగల గుంపు పుట్టుకొనివచ్చు వరకు, దానితోనే వారు నిలచియుందురు గాక. మెస్సీయను, లోకమునకు మరుగు చేయబడిన మర్మమైన బలమును చూడగలిగినదానిని యిపుడు వారు అర్ధము చేసికొనరు. ప్రభువా! వారు దీనిని చూచునట్లుగా అనుగ్రహము చూపుము. ఏలయనగా, దానిని యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమెన్.

51

[టేపుమీద ఖాలీ - సంపా.]

....యిపుడే నీ బలమును,

ఓ ప్రభువా, యిపుడే నీ బలము పంపుము,

మరియు ప్రతి యొక్కరికి బాప్తిస్మము యిమ్ము.

మేడగదిలో వారుండి,

వారందురు ఒక్క భావంతో యుండిరి,

పరిశుద్ధాత్మ దిగి వచ్చినపుడు

అది మన ప్రభువు వలన వాగ్దానము చేయబడినది.

ఓ ప్రభువా! యిపుడే నీ బలమును పంపుము,

ఓ ప్రభువా! యిపుడే నీ బలమును పంపుము;

ఓ ప్రభువా! యిపుడే బలమును పంపుము

మరియు ప్రతి యొక్కరికి బాప్తిస్మము యిమ్మ.

నేనెంతగా ఆయనను ప్రేమించెదనో! ఆయన బలమును యిపుడే పంపుము. వారందరు ఒక్క మనస్సుతో మేడగదిలో యుండిరి. లోకమంతా వారిలో నుండి ఖాళీచేయబడినది. వారు ఖాలీయైపోయిరి. మరియు పరిశుద్దాత్మ వచ్చినది.

ఈ రోజు వారు చెప్తారు, “రండి సంఘములో చేరుడి, పుస్తకములో నీ పేరు వు౦చు,” అని లేదా, “క్రిందకు వంగి క్రీస్తు దేవుని కుమారుడని నేను ఒప్పుకొనుచున్నానని లేచి నిలువబడు,” అని చెప్తారు. నిజం! దయ్యము కూడా ఆలాటి దానినే చేయును. యూదా బాప్తిస్మము పొందినపుడు దయ్యము బాప్తీస్మము పొందినది. యూదా వెళ్ళిపోయి సువార్తను ప్రకటించినపుడు దయ్యము వెళ్ళిపోయి సువార్త ప్రకటించినది. అయితే దయ్యం పరిశుద్ధాత్మను పొందలేదు. అది అదే. ఎటువంటి అనుమానపు చాయ లేకుండా సునిశ్చయమైనది ఎరుగుట, ఎక్కడైతే దాచబడిన బలముయున్నదో, అట్టి ఆ పునరుత్తానమును ఎరుగుట యౌతున్నది. ఆమెన్.

52

ఆయన యిక్కడే యున్నాడు. మెస్సీయ పైన ఉన్న అదే పరిశుద్ధాత్మ యింకా ఆయన సంఘములో యున్నాడు. ఆయన ఎన్నడూ విడిచిపోడు. “నేను మీతో ఉందును, మీలో ఉందును, యుగపర్యంతము మీతో ఉందును. నేనక్కడ యుండెదను. నేను చేయు కార్యములు మీరును చేయుదురు. నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక వీటికంటె మరి గొప్పవియు మీరు చేయుదురు.”

అయితే, లోకము దానితో రాజీపడును: “ఓ! ఆ దినములు గతించిపోయినవి!” దానినే దయ్యం నీవు చేయాలని కోరుచున్నది. వారు నిన్ను తలుకుబెలుకులు చేయాలని కోరుకుంటూన్నారు. బాప్తీస్మము నీవు పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు... “ఓ అక్కడ జరుగుచున్నదంతా నేను నమ్మను,” అని నీవు చెప్పవచ్చు. ముందుకు వెళ్ళిపోయి, జీవించు ముందుకు సాగిపోయి నీ పాపములో నీవు జీవించు, నీ పాపములో జీవించుము. అయితే నీవు కుళ్ళిపోయే వరకు, నీ స్వంత తలంపులతో నీవు కుళ్ళిపోవు వరకు, నీవు నీ స్వంత ఆడంబరములలో నీవు కుళ్ళిపోయే వరకు, తిరిగి జన్మించి, పునర్జన్మము పొందు వరకు లోపలకు వెళ్ళిపోయిన దానికి ఆ నూతన జీవము సంపూర్తిగా వ్యత్యాసముగా యుండును.

53

ఒక జొన్న గింజ పసుపు రంగుతో లోపలకు వెళ్ళిపోయి, అది ఆకుపచ్చగా పైకి వచ్చును. మూత పెట్టబడినదై, గట్టిగా యండి లోపలకు వెళ్ళును. అది మొత్తగా వంగినదై, గాలికి ఊగులాడును. ఓ! మహిమ!. హల్లెలూయ!గాలులు వీచుచున్నపుడు, గింజ ఏమి చేయలేదు. దానికదే కదలుచూ చెంచలమైపోవును. అయితే ఆ చిన్న రెమ్మలు వంగుతూ ఆనందిచును. తరువాత పెరిగి తనకదే బలము పొందుకొనును. గింజ కుళ్ళి చనిపోవువరకు అది రెమ్మలుగా మారవు. చనిపోవుట మాత్రమే కాదు అవి కుళ్ళిపోవును. ఇక, ఎన్నడు తిరిగి రావు. అయితే వాటిలో నుండి ప్రాణము వచ్చును.

కొంచెము సేపటి క్రితము నేను చెప్పినట్లుగా జన్మ అనునది భయంకరమైన, మురికి విషయము. మురికిలో మురికి అయితే, అక్కడే ప్రాణము యుండియుండునది. నీకై నీవు మురికిగా లెక్కించుకొని నీ మెతడిస్టు, బాప్టిస్టు, పెంతెకోస్తు మూఢ నమ్మకముల మురికిని నీవు లెక్కించి, బలిపీఠము యొద్ద చనిపోతే, అప్పుడు క్రొత్త జీవము లోపలకు వచ్చును. దానికి పైగా పరిశుద్ధాత్మ నిన్ను యుంచును; నీవు దేవుని చూచెదవు.

54

ఒక మహిమకరమైన దినమున మనము ఆయనను చూచెదము. మానవ చూపునకు అందుబాటులో లేని ఆవల ఒక దినమున మనము ఆయనను చూచెదము. మీరు దానిని నమ్ముతారా? ఒక దినమున మానవ దృష్టికి ఆవల, సంతసకరమైన రేపు అనునది నాకై ఎదురుచూచుచున్నది.

గత రాత్రి యిక్కడ మూలన నేను నిలబడియున్నాను. చిన్న రబ్బీ లాసన్ను, నేను చూచినట్లు అనుకున్నాను. ఇక్కడే అతడు యుండినప్పుడు, తన పాతదైన కేను కర్రతో నన్ను తన మెడతో లాగాడు, తన కేను కర్ర నా మెడచుట్టూ చుట్టి యిక్కడ బలిపీఠము యొద్దకు నన్ను లాగి ఆ పాట పాడాడు. “అక్కడ నా కొరకు ఒకటి ఎదురు చూచుచున్నది.” [టేపు మీద ఖాలీ-సంపా.]

55

ఒకటి జరిగినది! అది లోకమును బయటకు తీసివేసినది. సంగతులు వ్యత్యాసముగా అగుపించుటకు ఆరంభించినవి. ఈ అమెరికా ప్రజలు చేయుచున్న వాటిని గూర్చి ఎంతగానో నేను వ్యధ చెందితిని. స్త్రీలు పురుషులు, సంవత్సరము వెంబడి సంవత్సరము, ఎల్లపుడూ వారికి వారు పాపములోనికి పడిపోవుట చూడగా, నేను ఎంతగానో భగ్నత చెందిన వాడనైపోతిని. రెండు లేక మూడు సార్లు దానిని గూర్చి వ్యధ చెందితిని. నిన్నటి రోజు “నేనిక ఎన్నడూ వ్యధ చెందను. ఆలాగు అది యుండునని నీ వాక్యము చెప్పియున్నది. అయితే నేను హద్దులో నిలబడి నాలోయున్న దానంతటితో దానికి వ్యతిరేకముగా పలుకుతాను,” అని దేవునితో చెప్పితిని.

56

నిన్నటి దినమున, ఆడవిలోకి వెళ్ళే దారి వెనక, నా గుహయగు గ్రీన్ మిల్ యెద్ద నిలవబడి దినమంతా చేశాను. షుమారు మూడు గంటలకు, గుహలో నుండి బయటకు వచ్చి పెద్ద రాయిపై నిలువబడి చూచుచుంటిని. సూర్యుడు అస్తమించుచుండెను. పర్వత శిఖరంపై యుండిన చెట్ల వెనుక నుండి సూర్యుడు క్రిందకు కదలి వెళ్ళుట నేను చూశాను. లోయలోని వాగులోగుండా మిగతా వాటివైపు నేను చూచుచుండగా, పెద్ద ఆకుల కుప్ప నిమ్మళంగా దానిపైన యున్నది. నేను అడిగాను, “ప్రభువా! ఒక దినమున మోషేను నీవు బండ సందులో దాచితివి మరియు నీవు అతనిని దాటిపోతివి. ఎందుకనగా అతడు అలసిపోయెను. అయితే నీవు దాటి వెళ్ళితివి. ”అది మనుష్యుని వీపు వలె అగుపించెనని,“ అతడు చెప్పెను. ”బండ సందులో నన్ను దాచిపెట్టు ప్రభువా.“ అదే సమయంలో నాకు ప్రక్కగా పొదలలో కదలుచున్న చిన్న గాలి వచ్చినది. అది నేరుగా వచ్చి నా ప్రక్కకు వచ్చినది. ఒక కొద్ది గాలి కదలి వెళ్ళి అడవిలోకి వెళ్ళిపోయినది. నేనక్కడే నిలబడి యున్నాను.

........................................................

ఒకానొక దినమున, మర్త్యమైన జీవిత చక్రములు

నిశ్శబ్దంగా నిలచిపోవును. ఎక్కడ, ఎప్పుడు యనునది దేవునికే తెలియును,

అప్పుడు నేను సీయోను కొండపైకి నివాసముండుటకు వెళ్ళేదను.

ఒక దినమున మర్త్యమైన దానికి అందని సుదూరాన,

ఒక దినమున ఎక్కడ లేక ఎప్పుడు అనునది దేవునికే తెలియును.

(ఏమి జరుగబోవుచున్నది? ఆమె ముగించబోతున్నది. ఈ చిన్న చక్రములు తిరిగి పోతున్నవి)

మర్త్యమైన జీవిత చక్రములు నిశ్శబ్దంగా నిలచిపోవును.

అప్పుడు మనము సీయోను కొండపైకి నివాసముండుటకు వెళ్ళేదుము.

సొగసైన శకటము క్రిందకు వ్రేలాడును,

గృహమునకు నన్ను తీసికొని వెళ్ళుటకు వచ్చుచున్నది;

సొగసైన శకటము క్రిందకు వ్రేలాడును,

గృహమునకు నన్ను తీసికొని వెళ్ళటకు వచ్చుచున్నది.

నేను వెళ్ళక ముందే నీవు అక్కడకు చేరుకుంటే,

గృహమునకు నన్ను తీసికొని వెళ్ళుటకు వచ్చుచున్నది;

సహోదరుడు బోస్వర్త్కు, తదితర

నా స్నేహితులందరికి చెప్పుము,

గృహమునకే నన్ను తీసికొని వెళ్ళుటకు వచ్చుచున్నది,

క్రిందకు వ్రేలాడును . (ఆమె ఒక దినమున క్రిందకు దిగి నన్ను పైకెత్తును)

(ప్రతి చెట్టు మండును;

దేవుని దూతలు, అగ్ని రధము)

గృహమునకు నన్ను తీసికొని వెళ్ళుటకు;

సొగసైన శకటము క్రిందకు వ్రేలాడును,

గృహమునకు నన్ను తీసికొని వెళ్ళుటకువచ్చుచున్నది.

57

ఈ ఒకానొక దినములలో, నా మరణ ఘడియలోని ఆడుగు భాగమందలి ఈ ఒకానొక దినములలో ఆయన వచ్చుటకై నేనెదురు చూచెదను. ఔనది నిజము!

నేను యోర్గాను వైపునకు చూశాను, నేనేమి చూశాను

గృహమునకు నన్ను తీసికొనిపోవుటకు వచ్చుచుండుట;

(వృద్దుడైన ఏలీయా యోర్గాను వైపునకు చూచినట్లు)

తోజోవంతమైన దేవ దూతలు నా వెంట వచ్చుచుందురు.

గృహమునకు నన్ను తీసికొని వెళ్ళుటకు నాకై వారు వచ్చియున్నారు.

సొగసైన శకటము క్రిందకు వ్రేలాడును,

క్రిందకు దిగి వచ్చును, గృహమునకు నన్ను తీసికొనిపోవుటకు వచ్చుచున్నది;

సొగసైన శకటము క్రిందకు వ్రేలాడును,

గృహమునకు నన్ను తీసికొనిపోవుటకు వచ్చుచున్నది.

58

శుభప్రధుడైన ఈ రధ సారధి ప్రభువైన యేసు, జీవిత నావయగు పురాతన సీయోను ఓడ యొక్క చోదకుడు. భవనంలో కదలుతూ, మాట్లాడుచున్నాడు. ఆయన సన్నిధి యిక్కడ యున్నది. సమాధిలో నుండి ఆయనను తిరిగి లేపిన అదే పరిశుద్ధాత్మ యిక్కడే యున్నాడు.

వారు ఏలాటి ప్రార్థనా అట్టలు యివ్వలేదు, నేనెరుగని వారు, పట్టణమునకు బయటవారు, అనగా ప్రార్ధనగోరువారు ఎవరైనా యిక్కడున్నారా? నెనెరుగని వారు. మీ చేతులు పైకెత్తుడి. నాకు తెలియని వారు మీచేతులు పైకెత్తుడి. మీరు అక్కడున్న నీవు, అక్కడ వెనుక మీసాలున్న ఆ చిన్నవాడు; అక్కడ ఆ విధంగా చేయిపైకెత్తాడు. ఆ! నీవూ! నీ చేయి పైకెత్తితివా? మంచిది. వెనుకనున్న మీరందరు. సరె. మీరందరు నాకు అపరిచితులు. ఆ ప్రభువైన యేసు, యిక్కడున్న మందకు ఆయనే కాపరి. ఆయన వాగ్దానములు సత్యమని మీరు నమ్ముతున్నారా? ఆయన ఆయన సంఘమును అభిషేకించును. మరియు “నేను చేయు కార్యములు మీరునూ చేయుదురు. నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక యింత కంటే గొప్ప కార్యములు మీరు చేయుదురు. వీటికంటె గొప్పవి.” మీరది నమ్ముచున్నారా?

59

నన్ను ఎరుగనని నీవు నీ చేయిపైకెత్తితివా? నీ హృదయములో ఏమున్నదో దేవుడు చెప్పగలడని ఆయన వస్త్రమును ముట్టిన స్త్రీ యెడల ఆయన జరిగించినట్లుగా నాతో ఆయన మాట్లాడగలడని నీవు నమ్ముచున్నావా? మన బలహీనతలు వహించిన ప్రధాన యాజకుడు ఆయనేయని నీవు నమ్ముచున్నావా? నీ యొక్క పరిస్థితిని దేవుడు నాకు బయలు పరిచినట్లైయితే, నేనాయన ప్రవక్తనని నీవు నమ్ముతావా? ఆయన సన్నిధి యిక్కడ యున్నదని అందువలన అది ఆయన అనుమతించెనని నీవు అది నమ్ముచున్నావా? నీవు నీ భార్య కొరకై ప్రార్ధిస్తున్నావు. ఆమె తుంటి విరిగిపోయినది. తొడ ఎముక పైభాగము స్థానము తప్పినది. అవునది నిజం. అది నిజమైతే, లేచి నిలబడు. ఆమె ఆరోగ్యంగా యుండుట వెళ్ళి చూచెదవు. ఆమెన్.

అక్కడ వెనుకనున్న నీవు లేచి నిలబడినచిన్నవాడవు, మీసాలున్న నీవు నీ సంగతేంటి? నీ నిండు హృదయంతో నీవు నమ్ముతున్నావా? నీ బలహీనతను దేవుడు నాకు తెల్పగలడని నీవు నమ్ముతున్నావా? నీ కుమారుడు సరియౌతాడని నీవు నమ్ముతున్నావా? నీవూ? నీకోక అబ్బాయి ఉన్నాడు, అతనికి మెదడుకు సంబంధమైన పక్షవాతము. ఔనది నిజమా నీవు కెంటకీ నుండి వచ్చితివి. అది నిజమైనట్లయితే, నీ చేయి పైకెత్తు, నీవు నాకు తెలియదు. ఔను కదా. నేను తెలిసినట్లయితే. ఈ విధముగా నీ చేయి పైకెత్తుము. మనము యొకరికొకరము ఎరుగనివారము. ఔనది నిజము దేవుని నమ్ముట. నీవు నమ్ముతున్నావా? నీవు నమ్ముకున్నట్లుగానే, నీవు నమ్మిన విధముగనే నీ అబ్బాయిని కనుగొందువు. నీ గుండెలో అది ఆలాగు ఉంచుకొనుము.

60

యిక్కడ ఎవర చేతులెత్తినవారు! నాకు తెలియని వారు.... అది నీవేనా? సరే. అయ్యా! దేవుని ప్రవక్తనని నన్ను నీవు నమ్ముతున్నావా? [“ఆమెన్” అని ఆ మనుస్యుడు చెప్పెను - సంపా.] నీ నిండు గుండెతో నీవు చేస్తున్నావా? నీవు పైకి లేవనవసరము లేదు. అక్కడే నిలబడితే చాలు. మంచిదయ్యా! నీ బాధ ఏంటి? నీవు చెక్కర మధుమేహం నీకున్నది [“ఔనది నిజం”] మరి అది నీ పాదమును బాధపరుస్తున్నది [“అవును”] నీవు ఓహియో నుండి వచ్చావు. [“అవును”] నీ పేరు మిస్టర్. మిల్లర్ [“ఔనది నిజము”] ఇంటికి తిరిగి వెళ్ళుము. ఆరోగ్యము పొందుకొనుము. సరే నీ నిండు హృదయముతో నమ్మము. మంచిది.

నీవది నమ్ముచున్నావా? నీవు నమ్మినట్లయితే!

ఇక్కడే కూర్చొని యుండిన స్త్రీ, నీ చెయిపైకెత్తితివా? పెద్ద స్త్రీ కళ్ళద్దాలు పెట్టుకొని యున్నది. నీ నిండు హృదయంతో నీవు నమ్ముతున్నావా? నీవు నమ్ముతావా? దేవుని సేవకుడనని నన్ను నీవు నమ్ముతున్నావా? నీవు? సరే, నీ బాధ ఏదో దేవుడు నాకు చెప్పినట్లయితే నీవు నమ్ముతావా? గుండె జబ్బు ఔను. అది నిజమైతే నీ చేయిపైకెత్తుము. మంచిది.

61

నీ తరువాత ప్రక్కనున్న యిక్కడున్న స్త్రీ, పైకిలేచి యున్నావు. గుండె; కాని అది వాస్తవముగా నీ యొక్క కళ్ళు. ఆమె నాకు తెలియును. మంచిది, నీవు నమ్మినట్లయితే!

అక్కడ వెనుక భాగమున, తరువాత మనిషి, అక్కడ వెనుకనున్న నీకు గుండె జబ్బు ఉన్నది మరియు చర్మపు వ్యాధి యున్నది. దేవుడు నిన్ను బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? అయ్యా మీరు నమ్ముచున్నారా?

అక్కడ వెనుక భాగమున, యొక చోట ఒక మనుష్యుడున్నాడు. చేతులు పైకెత్తాడు. మిస్టర్. స్కూబెర్ట్. సరెనండి. నీవు నమ్ముతావా? అది నీ కళ్ళ కొరకు కూడా, ఔను కదా. అక్కడ కూర్చొనియున్న అక్కడే దూరాననున్న నీ తల్లి కొరకు కూడా నీవు ప్రార్ధన చేయుచున్నావు. అది నిజమైతే నీ చేయిపైకెత్తుము. మనము అపరిచితులము. మంచిది, అది నిజము. నీవు నమ్మినట్లయితే నీవు పొందుకుంటావు!

62

తిరిగి లేచిన యేసుక్రీస్తు భవనంలో ఉన్నాడు. ఆయన మారనివాడు. అది నీకేమి చేయును? నీలోనున్న బలమునంతా లోకములో ఎండిపోచేయుటకు అనుమతించితివా? మహిమకలుగును గాక! నాకు క్రొత్త జన్మ కావలెను. నాకు క్రొత్త జీవము కావలెను. ఏ సమతలములో వచ్చినా నేను లెక్కచేయను. ఒక పరిశుద్ధ గుండ్రాయి కాగలిగినా, ఏదయినను నేను కాగలిగినట్లయితే, అది వచ్చుట ఏ సమతలములోనైనను నేను లెక్కచేయను. ఇపుడు నా పైన యుండినట్లుగానే నిజమైన పరిశుద్ధాత్మను నేను కోరుకుంటున్నాను. నేనది కాపాడు కొనుటకు ఆశపడతాను. లోకములో నున్న అన్నిటికంటె దానినే నేను కలిగియుంటాను. అమెన్! నీవు నమ్ముతావా? ఆయన యిక్కడే యున్నాడని నీవు నమ్ముతావా?

అలాగైతే, ఒకరిపై ఒకరు చేతులు పెట్టండి. ఆయన చేయగల మరొక దానిని నాకు చెప్పండి. ఏది లేదు. ఇప్పుడు విశ్వాసముంచుము. అది అయిపోయినదని నమ్ముము.

63

ప్రభువైన దేవా! భూమ్యాకాశముల సృష్టికర్తా! నిత్యజీవమునకు మూలకర్తా! మరియు ప్రతి మంచి యూవుల ప్రధాతా! ప్రభువా! భవనము సువాసన కొట్టుచున్నట్లుగా ముందు వెనుకలకు ఊగుతున్నట్లుగా నీ ఆత్మ ఎంతగానో యిక్కడ క్రుమ్మరించబడుచున్నది. ప్రభువా! ప్రజలు ఎందుకని దానిని అర్థంచేసుకొనరు? వారు లోకములో ఎంతగానో కలసిపోయి, ఎంతో చల్లగా, నులివెచ్చగా గంజివలె అయిపోయి, యికెన్నడు నిన్నెరుగని వారైపోయారా? ప్రభువైన దేవా! ఈ యొక్క శక్తి ప్రతి యొక్కరిని తాకును గాక! మరియు ప్రతి రోగి స్వస్థతనొంది, ప్రతి పాపి రక్షించబడి, దేవునికి మహిమ వచ్చును గాక. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నేనడుగుచున్నాను. ఆమెన్.

64

మీరది నమ్ముచున్నారా? మీ చేతులు పైకెతుడి. మీ స్వస్థతను అంగీకరించుచున్నారా? దేవుడు మిమ్మ దీవించును. ఇపుడు మీరు వెళ్ళిపోయి, మీరు నమ్మిన విధముగా అది కనుగొందురు. అది ఆ విధముగనే యుండును. దర్శనాలు యితరులపై వచ్చుట నేను చూచుచున్నాను. ఔనది నిజం. తిరిగి ఈ రాత్రికి నేను రావలసియున్నది.

ఇపుడు మీరు నమ్మకపోతే, మీరెన్నడు నమ్మరు. ఔనది నిజం. యేసు ఒక పర్యాయము అది చేశాడు. మరి వారన్నారు, “నీవు... మెస్సీయ వచ్చునని మేమెరుగుదుము. ఆయన దీనిని మాకు చెప్పును.” అని ఆమె చెప్పినది. “మెస్సీయు అది చేయునని నేనెరుగుదును. అయితే నీవెవరవు?”

ఆయన చెప్పెను, “ఆయనను నేనే.”

అటు తరువాత ఆమె పట్టణములోనికి పరుగెత్తి “రండి, నేను ఏమైయుంటినో మరియు నేనేమి చేసితినో ఎరిగిన మనుష్యుని చూడుడి. ఈయన మెస్సీయ కాడా?” అని చెప్పినది.

“ఈ సంగతులు అంత్య దినములలో మరలా రూపముదాల్చునని ఆయన చెప్పియున్నాడు. సంఘము సత్యమును ప్రకటించును; అది వాక్యముపైన నిలబడును. దేవుని ఆజ్ఞలన్నిటిని అది చేయును. లోకముతో అది సఖ్యత కలిగియుండదు. అక్కడ నుండి నేను కదలుచూ అవే కార్యాలను చేయుదును.”

65

అయితే ఆయన చెప్పియున్నాడు, “వారు గర్వాంధులు, మూర్ఖులు, దేవునికంటే సుఖానుభవమునెక్కువగా ప్రేమించువారు, అతిద్వేషులు, అపవాదకులు, పైకి భక్తిగలవారివలె యుందురు.” ఎంతో భక్తిగా యుంటారు, ఆలయాలకు వెళ్తారు. “పైకి భక్తిగల వారివలె యుండి దాని శక్తిని ఆశ్రయించనివారు. అట్టి వారికి విముఖడవై యుండుము.”

ప్రజలారా మీరూ! సంఘములో మీరెక్కడ యుండినప్పటికి, యిపుడు ఆయన పిలచిన వారగు మీరూ; దర్శనము నా యొద్ద నుండి వెడలిపోయినది. అది మీదని నేనెరుగకయుండి, నేను మీతో చెప్పినది అది సత్యమైనట్లైయితే, అది ఎవరైనప్పటికి మీ చేతులు పైకెత్తుడి. సంఘమంతా కూడా; ప్రతివ్యక్తి, మంచిది. గమనించితిరా? వారెవరో తెలియదు, ఎన్నడు వారిని చూడలేదు. అయితే యిక్కడున్న పరిశుద్ధాత్మ ఆయనకు వారెవరో తెలియును. అది నేను కాదని మీరు గ్రహించుట లేదా?

66

వినుడి! ఆయన దానిని నాకు అధీనము చేసినట్లయితే, వాక్యము యొక్క సత్యముతో ఆయన నన్ను నమ్మును, ఎందుకనగా సత్యము వాక్యము ద్వారానే వచ్చును. మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికిని ఆనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలచిన వారికందరికిని చెందును. మీరది నమ్ముచున్నారా? కొద్ది సమయములో బాప్తీస్మపు కార్యక్రమమున్నది.

మనము తలలు వంచుకుందాము. వారు బాప్తీస్మము కొరకై సిద్దిపాటు చేయుచుండగా సంఘకాపరిని ప్రార్థించమని అడుగుతాను. బాప్తీస్మపు కార్యము ఉన్నదని నేననుకుంటున్నాను. మంచిది.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...