అనుభవములు

అనుభవములు

ప్రియమైన మిత్రులారా... [టేప్‌పై ఖాళీగా ఉంది.] ఇక్కడ ఒకదాని తర్వాత మరొక అద్భుతం జరిగింది: చెవిటివారు, మూగవారు, గుడ్డివారు, కుంటివారు మొదలైన ప్రతి ఒక్కరూ స్వస్థత పొందారు. పూర్తిగా అంధుడైన వ్యక్తి వేదికపైకి వచ్చాడు, అతని దృష్టిని పొందాడు; అతను వేదిక చుట్టూ నన్ను అనుసరించాడు, ఆడిటోరియం వరుసల మధ్య నడిచాడు. మరియు మరొక గుడ్డివాడు వచ్చి అతని చూపును పొందాడు. అక్కడ, ఓహ్, అక్కడ ముగ్గురు లేదా నలుగురు మహిళలు, యువతులు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు, వారు భయంకరమైన కంటిచూపు సమస్యలను కలిగి ఉన్నారు మరియు అక్కడ వారు నయమయ్యారు.

మరియు ఇద్దరు వైద్యులు ఇక్కడే నా కుడి వైపున నిలబడి, జబ్బుపడిన వారిని చూస్తూ, వారిని పరీక్షించి, ఈ మైక్రోఫోన్ దగ్గరకు వచ్చి, వారు ఖచ్చితంగా చూడగలరని సాక్ష్యమిస్తూ ఉన్నారు... వారు వైద్య రంగంలో వైద్యులు; వారిలో ఒకరు శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలో నిపుణుడు.

2

కాబట్టి దేవుడు దేవుడే. అయన ఇప్పటికీ ఆ గొప్ప ఉన్నవాడుగానే ఉన్నాడు, ఉండేవాడుగా కాదు, ఇప్పుడు ఉన్నవాడు, వర్తమాన కాలం. మరియు ఆయన—నమ్మినవారిని స్వస్థపరచడానికి ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్నాడు. వారు ఏమైయున్నారో దానితో సంబంధం లేదు, కాని నమ్మినవారు మాత్రమే స్వస్థపరచబడతారు. మీరు కేవలం నమ్మాలి.

మీరు నమ్మగలిగితే... దేవుడు ఈ మధ్యాహ్నం మీరు లేచి వికలాంగుడవైనప్పటికీ, మరియు ఈ వేదికపై తిరగడానికి అనుమతించవచ్చు. మీరు నడిచి వెళ్లిపోవచ్చు, సందేహం మరియు అవిశ్వాసం మీ హృదయాన్ని తాకినప్పుడు, మీ మొదటి పరిస్థితి మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది. మరియు మీరు నడిచి వెళ్లి పోయి ఆయనను సేవించకపోతే, ఒక దుస్థితి మళ్ళీ మీ వద్దకు వస్తుంది. అవును. మీరు మీ జీవిత కాలమంతా దేవునికి భక్తితో సేవ చేయాలి, ఆయనను హృదయ పూర్వకముగా నమ్మాలి.

3

మరియు ఇప్పుడు, ఈ రోజు, మేము ఈ మధ్యాహ్నం చాలా సమయాన్ని కలిగి ఉన్నాము, ఎందుకంటే ఈ మధ్యాహ్నం భవనములో ఉన్న ప్రతి ఒక్కరికీ మేము ప్రార్దించబోతున్నాము. ఎందుకంటే, ప్రార్ధన చేయడానికి మాకు సమయం దొరికింది. ఆపై ఫీనిక్స్ ను విడిచిపెట్టడానికి ముందు, బయలుదేరే ముందు, నేను ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించాలనుకుంటున్నాను. మరియు నేను మీతో ఎక్కువగా మాట్లాడను, ఎందుకంటే నేను సమయాన్ని ఇక్కడ ఆదా చేయాలనుకుంటున్నాను. మీకు ఇక్కడ మంచి బోధకులు ఉన్నారు. మీరు ఇక్కడ ఒక చక్కని సేవకుల గుంపును కలిగి ఉన్నారు. మరియు వారు బోధిస్తారు; మరియు మొదటిగా నేను బోధకుడిని కాదు. కాబట్టి మీరు బోధించండి... ఈ సేవకులు ఈ ఉదయం తమ కూడికలలో చేసినట్లుగా మీతో మాట్లాడతారు.

మరియు ఈ ఉదయం సంఘానికి ఎంతమంది హాజరయ్యారు, మీ చేతులను చూద్దాం, భవనములో ఉన్నవారందరూ హాజరయ్యారా? సరే, అది మంచిది. మరియు ఈ రాత్రికి ఎంతమంది హాజరు కావాలని అనుకున్నారు, భవనంలో ఉన్నవారందరిలో, ఈ రాత్రి సంఘానికి ఎంతమంది వెళ్ళబోతున్నారు, మీ చేతులు చూద్దాం? పర్వాలేదు. మీలో మూడవ వంతు మంది వెళ్ళటం లేదు; మీరు ఈ రాత్రి వెళ్తారని నేను ఆశిస్తున్నాను. మీరు ఈ రాత్రి సంఘానికి వెళతారని నేను ఆశిస్తున్నాను. ఎక్కడో ఒకచోట సంఘానికి వెళ్ళండి. ఆదివారం సంఘానికి మరియు ప్రార్ధనా కూడికకు వెళ్లడాన్ని ఎన్నడూ తప్పిపోవద్దు.

4

మరియు ప్రజలారా, ఇక్కడ చిన్న సంఘాలు కలిగి, కష్టపడుతున్నవారు ఉన్నారు. మీ కొరకు నా సలహా ఏమిటంటే క్రీస్తు నిమిత్తము మీకు ఇచ్చిన బాధ్యతలో నిలిచియుండి మీరు చేయగలిగినంత వరకు విశ్వసనీయముగా ఉండి, మీ సేవకునికీ, జరుగుతున్న ప్రతిదానికీ మరియు క్రీస్తు నిమిత్తం మద్దతు నివ్వండి, మరియు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు దేవుడిని గౌరవించగల ఏకైక మార్గం ఒకరినొకరు గౌరవించుకోవడమే. అది సరియైనదేనా?

ఎవరైనా మీ గురించి ఏదైనా మంచి చెప్పాలని మీరు అనుకుంటే, మీరు వేరొకరి గురించి ఏదైనా మంచి చెప్పండి; వారు మీ గురించి మంచి చెబుతారు. మీ ఆహారమును నీళ్ళమీద వేయుము; అది మీ యొద్దకు తిరిగి వస్తుంది. ఆ సహోదరుడు కెనడాలో చెప్పినట్లుగా, అయన, “అవును, సహోదరుడా బ్రాన్హాం: అది వెన్నపూసినట్లుగా.” అని అన్నాడు. కాబట్టి అది సరైనది. మీరు చూడండి, మీరు దానిని కేవలం నీళ్ళమీద వేస్తే, అది వెన్న పూసినట్లుగా తిరిగి వస్తుంది. అదే మార్గం, కాబట్టి అది తిరిగివస్తుంది. కాబట్టి ఇతరులు మీకు ఏమి చేయాలని అనుకుంటున్నారో మీరు వారికి ఆ విధంగా చేయండి. జీవించడానికి అది ఒక మంచి మార్గం.

5

ఇప్పుడు, నేను మీకు కొన్ని అవసరమైన విషయాలను వివరించడానికి కొంత సమయం తీసుకోవాలని అనుకుంటున్నాను. చాలా చోట్ల మా సేవలకు అడ్డంకిగా ఉన్నాయి అనిపించే కొన్ని విషయాలవల్ల మేము ఎక్కువ సమయం గడపలేక పోతున్నామని చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఒక ప్రదేశంలో రెండు, మూడు రోజులు, లేదా మరి కొన్ని రోజులు కంటే ఎక్కువ సమయం ఉండలేను. కూడికలు ముప్పై రోజులు ఉండాలి.

అది ఎక్కువ సమయం అని అనిపించవచ్చు. కానీ నేను దీనిని గమనించాను: రోజు రోజుకి కొత్త ఉత్సాహంతో మరి ఎక్కువ మంది వస్తున్నారు. మరియు ప్రతి రోజూ గుంపు పెరుగుతూ పెరుగుతూ వస్తున్నారు. ఆపై స్వస్థతల యొక్క ఫలితాలు... ఓహ్, దాని మధ్య తేడా పోల్చలేనంతగా ఉంది.

ఇప్పుడు, ఇక్కడ ఇది ఫీనిక్స్ లో జరిగిన కూడిక మాదిరిగానే ఉన్నది; మేము ఒక ఆదివారమును కలిగి ఉన్నాం, 'నేను వచ్చే ఆదివారం తిరిగి వచ్చేలోపే దెయ్యం మీ మనస్సులను చెరపడానికి అవకాశం పొందుతుంది. అవును. మీరు ఒక మేకును తీసుకుని కొట్టాలి, మరియు దానిని కొడుతూనే ఉండాలి. మీరు మేకుపై ఒక దెబ్బ వేసి, దానిని వదిలి నడిచి వెళ్ళిపోయి, మరియు పిల్లలను దానితో ఆడుకోనిచ్చి, ఆపై వచ్చే ఆదివారం తిరిగి వచ్చి మళ్ళీ ఇంకో దెబ్బవేసి అలా చేయలేరు. మీరు ఆ మేకును లోపలికి వెళ్ళేవరకు కొట్టాలి, అలా, దానిని చెక్కలోనికి లంగరు వేయాలి.

6

మంచిది, విశ్వాసం కుడా ఆ విధముగానే ఉంది. మీరు ప్రజలలో దీనిని లంగరు వేయాలి. వారు ఒక ఆదివారం ఇక్కడికి పరిగెత్తుతారు, కొన్ని క్షణాలలో “నేను ప్రార్ధన పొందుకుంటానా?”, అని వారు అశాంతికి లోనవుతారు, వారు దేనికోసం వస్తున్నారో కూడా తెలియకుండ ప్రార్థన వరుసలోనికి పరుగెడుతారు. మరుసటి వారం, కొంతమంది విమర్శకులతో చేరి, “ఆ అక్కడ ఏమీ లేదు. జిమ్ జోన్స్ యొక్క భార్య కొరకు ప్రార్థించారని నాకు తెలుసు. అది ఆమెకు ఏ సహాయం చేయలేదు” అని అంటారు. అది సరైనదే. అది జిమ్ జోన్స్ యొక్క భార్య కోసం కాదు. అది దానిని నమ్మే మీ కోసం. అది విశ్వాసుల కోసం. అది విశ్వాసుల కోసం మాత్రమే. మరియు గుర్తుంచుకోండి, మీకు విశ్వాసం లేకపోతే, అది మీకు ఏ మంచి చేయదు.

ఇప్పుడు, మొదట్లో, ఈ సభామందిరంలో జరిగే కూడికలలో నేను చేస్తున్న పనిని చేయడానికి ఈ వరము నాకు ఇవ్వబడలేదు. అది చేయడం దేవుని దైవిక ప్రణాళికకాదు. ఇవన్నీ వివరించడానికి ఇక్కడ కొన్ని వారాలు ఉండటానికి నాకు అవకాశం కలిగి ఉండటమే దేవుని దైవిక ప్రణాళిక. ఇది ప్రత్యక్షత ద్వారా వస్తుంది.

పగలు, మరియు రాత్రి కాల సమయమందు, నేను ఈ దూతను కలిసినప్పుడు, అతడు నన్ను ఒక ప్రదేశానికి పంపిస్తాడు. అతడు “నీవు ఒక ప్రదేశానికి వెళ్ళు” అని చెబుతాడు. నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఆ ప్రదేశమును చూడలేదు.

7

నేను మీకు ఒక దృష్టాంతం ఇస్తాను, అది అలా ఉంటుంది, మరియు మీరు అర్థం చేసుకోవచ్చు. ఆయన ... నేను ఇక్కడ ఎంత సహజముగా నిలబడి ఉన్నానో అంతే సహజముగా ఆ ప్రదేశానికి వెళ్తాను. బహుశా ఒక స్త్రీ తలుపు ద్వారము వద్ద నన్ను కలుస్తుంది. ఆమె ఎరుపు రంగు చలి కోటును ధరించి ఉంది. మరియు ఆ స్థలములో, పాతబడిన పార ఒకటి పడి ఉంది. నేను గేటులో నుండి వచ్చినప్పుడు నేను దానిని గమనించాను. మరియు ఒక బైబిల్ సింక్ పైన ఉన్నది, మరియు ఎవరో అవిటి వ్యక్తి మంచం మీద పడుకున్నాడు.

మంచిది ఇప్పుడు, నేను ఆ ఇంటికి వెళ్తాను, మరియు నెమ్మదిగా నేను ఆ స్థలాన్ని కనుగొంటాను. మరియు నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు, నేను పెరట్లో ఆ పార పడి ఉండడం చూస్తాను. అవును, ఎరుపురంగు చలి కోటు ధరించి ఉన్న స్త్రీ నన్ను తలుపు ద్వారము వద్ద కలుస్తుంది. నేను లోపలికి వెళ్తాను. కానీ బైబిలు ఆ సింక్ మీద పెట్టి లేదు; అది బల్ల మీద ఉంది. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని నేను చెప్పలేను. ఎవరైనా వారు చేసేది వారికే తెలియకుండా ఆ బైబిలును తీసుకుని సింక్ పైన పెట్టేవరకు నేను వారికి చెప్పలేను. అది జరిగినప్పుడు, అప్పుడు మీరు నిలబడి, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని చెప్పవచ్చు. మరియు.....

8

ఒకరు నా దగ్గరకు వచ్చి, “సహోదరుడా బ్రాన్హాం, నేను బాగుపడతానా?” సహోదరి మీరు బాగవుతారు నేను—నేను—నేను నమ్ముతున్నాను. ఇది— మరొకరు నా దగ్గరకు వచ్చి, “దీని సంగతేమిటి? ఇదిగో ఇక్కడ, మా అంకుల్, ... ఓహ్...” ఎందుకు, ఇది మిమ్మల్ని నిగ్రహం లేకుండా చేస్తుంది. మీరు దానిని అన్ని సమయాలలో మీ మనస్సులో ఉండడానికి అనుమతిస్తే, మీరు త్వరలో ఒక మానసిక రోగి అవుతారు (చూశారా?), దానిని బాగుచేయడానికి ఎంతో సమయం పట్టదు కాని కొన్ని గంటలు సమయం మాత్రమే పడుతుంది. అయితే మంచిది, నాకు దాని గురించి తెలియదు.

కానీ ఈ సభామందిరములో జరిగే కూడికలలో, మేము వాటిని అనుమతించడానికి కారణం, గొప్ప ప్రజల గుంపు. ఇప్పుడు, ఈ దూత చాలా అరుదుగా పంపిస్తుంది ... కానీ, అతను నన్ను ఒక రోగి దగ్గరకు పంపినప్పుడు, పదిహేను సభామందిరముల కూడికలలో మీరు కలిగి ఉండే మహిమ కంటే ఎక్కువ దేవుని యొక్క మహిమ అక్కడ కనిపిస్తుందని నేను గమనించాను. అవును. ఎందుకంటే మీరు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో వెళ్తారు మరియు అక్కడ అది జరుగుతుంది.

9

వినండి. మనము చాలా సమయాన్ని కలిగి ఉన్నాము. నేను మీకు కేవలం ఒక రోగి గురించి చెప్పాలనుకుంటున్నాను, దాని ద్వారా మీకు అర్ధమవుతుంది. ఇటీవలే జరిగింది. నేను మీకు ప్రజల పేర్లు ఇస్తాను, కాబట్టి మీరు వ్రాసుకొనండి. నేను మా అమ్మగారి ఇంట్లో ఉన్నాను. మరియు ఇది చాలా తరచుగా జరుగుతుంది. మరియు నేను గదిలో ప్రార్దిస్తున్నాను. నేను ఇంటికి వెళ్ళడం లేదు, ఎందుకంటే నేను అక్కడ ఒంటరిగా ఉండాలని కోరుకున్నాను. నాకు కేవలం అలా అనిపించింది నేను ఒంటరిగా ఉండాలని కోరుకున్నాను, ప్రార్థించడానికి నా హృదయములో భారం కలిగి ఉన్నాను. మీలో ఎవరైనా ఎప్పుడైనా అలా అనుభవించారా? మరియు నేను ప్రార్థించడం ప్రారంభించాను. మరియు నేను వెళ్ళి, - మంచం మీద పడుకున్నాను. నేను నిద్రపోయాను. మరియు నేను మేల్కొన్నాను; అప్పుడు ఉదయం సుమారుగా సమయం రెండు అవుతుంది. నేను ఇంకా ఆ భారం కలిగియున్నాను. నేను మళ్ళీ ప్రార్థించడం ప్రారంభించాను. నేను ప్రార్థన చేయడానికి నేలపై మోకరించాను. నేను ఒక మూల వైపు అలా చూశాను.

మరియు మేము చాలా పేదవాళ్ళం, మరియు మేము ఒక ... మా తల్లి సాధారణముగా వాటిని ఉతికి లోపలికి తెచ్చి కుర్చీపై ఉంచుతుంది. స్త్రీలు మీరు ఎప్పుడైనా అలా చేస్తారో లేదో నాకు తెలియదు. అయితే వాటిని మూలలో ఉన్న కుర్చీపై కుప్పగా పెడుతుంది.

10

“సరే, పేద వృద్ధ తల్లి, ఉతికిన వాటిని అక్కడ ఉంచింది”, అని నేను అనుకున్నాను, నేను ఆ మూలలో ఒక పెద్ద తెల్లనిది చూసాను. నేను, “మంచిది...” అని అన్నాను మరియు నేను ఆ ఉతికిన వాటిని గమనించాను. నేను ఇదివరకు ఎప్పుడు దానిని గమనించలేదు. కానీ ఆ ఉతికినవి గాలిలో పైకి ఇలా కదులుతున్నట్లు అనిపించింది. సరే, గది చీకటిగా ఉంది అని నేను అనుకున్నాను, మరియు నేను నా కళ్ళను నలుపుకుని, అప్పుడు గమనించాను... నేను ఆ ఉతికిన వాటి వైపు వెళుతున్నానా, లేదా అది నా వద్దకు వస్తోందా అన్నట్లు, ఏదో తెల్లగా కనిపిస్తోంది... , అది గదిలో ఉన్న ఉతికినవి కాదు అని నేను కనుగొన్నాను; అది ఒక తెల్లని పొగమంచుతో ఉన్న మేఘం. మరియు అదినా వద్దకు వస్తుంది.

ఇప్పుడు, గుర్తుంచుకోండి, నేను మీ ముందు ఈ సాక్ష్యం చెప్పినప్పుడు, నేను ఏదో ఒక రోజు తీర్పువద్ద నేను చెప్పే ఈ మాటలకు సమాధానం చెప్పవలసి ఉంది.

11

ఇప్పుడు, మీరు మూఢ భక్తి గురించి బోధించారని నేను గమనించాను. సహోదరుడా, దేవుడు నీ హృదయాన్ని దీవించును గాక. నేను స్వచ్ఛమైన మూఢ భక్తి గురించి తగినంతగా కనుగొన్నాను (అది సరైనది.), మరియు ఇది కేవలం దేవునికి విరోధముగా తాను చేయగలిగినంత వరకు అడ్డగించే దయ్యం యొక్క పనులు మాత్రమే. అవును.

మరియు ఇది సరిగ్గా పైకి వచ్చి, నాకు దగ్గరగా వచ్చింది. నేను ఆ మేఘములోనికి లేదా —లేదా ఏదో ఒక దానిలోనికో వెళ్ళాను. ఏమి జరిగిందో నాకు తెలియదు.

కానీ నేను దాని వద్దకు వెళుతున్నప్పుడు, నేను అక్కడ ఉన్న ఒక చిన్న తెల్లని ఇంటికి వెళుతున్నానని తెలుసుకున్నాను... కొంచెం పొడవైన మూడుగదుల ఇల్లు లేదా రెండు గదుల ఇల్లు, షాట్ గన్ ఇల్లు (ఒక ద్వారము వెనుక మరొక ద్వారము కలిగిన ఇల్లు లేదా చిన్న రేకుల షెడ్డు) అని పిలవచ్చు, కొంచెం తిన్నగా ఉండే ఇల్లు.

12

నేను ముందు ఉన్న గుమ్మములోనికి ప్రవేసించాను, నేను అలా చేసినప్పుడు, నేను నా ఎడమవైపు చూశాను, అది అక్కడ ఎరుపు రంగు మడత కుర్చీ ఉంది. అక్కడ ఒక ముసలి తల్లి ఏడుస్తూ ఉంది. నా కుడివైపున ఒక మడత కుర్చీ ఉంది, మరియు సొగసైన వంపులు గల జుట్టు కలిగిన ఒక యువకుడు అక్కడ ఉన్నాడు. ఒక నల్లని వెంట్రుకలు గల మహిళ తలుపుకు ఆనుకుని ఉంది, ఆమె వంటగది లేదా ఏదో గదిలోకి ఏడుస్తూ లోపలికి వెళ్ళింది. నేను ఇక్కడ మంచం వైపు చూశాను, కొద్దిగా ఇనుముతో చేయబడిన మంచము, మరియు నా జీవితములో నేను చూసిన భయంకరమైన దృశ్యాలలో ఇది ఒకటి. ఒక చిన్నపిల్లవాడు అక్కడ నీలం రంగులో ఉన్న ఒక రకమైన అంగీతో పడుకుని ఉన్నాడు. మరియు అతని తుంటికి తగిలిన గాయం వరకు అతని చిన్న కాళ్ళలో ఒకటి అలా మెలి తిరిగి ఉంది. మరియు ఎడమ కాలు అలా మెలి తిరిగి ఉంది. మరియు ప్రతి చేయి అతని వైపుకు వ్యతిరేకంగా మెలి తిప్పబడి ఉంది. మరియు ఇక్కడ అతని చిన్న ఛాతీపై ఏదో ఉంచబడింది, మరియు అతని చిన్న శరీరం అలా మెలి తిరిగి ఉంది. ఓహ్, ఇది ఒక ... మరియు అతని తండ్రి, పొడవుగా నల్లగా కనిపించే వ్యక్తి ఆ బిడ్డ కొరకు బాగా ఏడుస్తూ నిలబడి ఉన్నాడు.

సరే, నేను, “ఇది వింతగా ఉంది?” అని అనుకున్నాను నేను మా తల్లి యొక్క ఇంట్లో... ఎలా అంటే... వింతగా ఉంది నేను అక్కడ లేను...“ నీవు కలలు కనడం లేదు. నీకు ఒక పగటికల వంటిది. నేను ఇక్కడ అరిజోనాలోని ఫీనిక్స్ లో, ఈ సభామందిరములో ఎంత వాస్తవముగా నిలబడి ఉన్నానో అది అంతే వాస్తవముగా ఉన్నది. మరియు నేను ”ఇప్పుడు, అది వింతగా ఉంది“ అని అనుకున్నాను. మరియు నేను తిరగడం ప్రారంభించాను... దూత ఎల్లప్పుడూ నా కుడివైపున ఉంటుంది. నేను కుడివైపుకు తిరిగినప్పుడు, అక్కడ ప్రభువు యొక్క దూత నిలబడి ఉంది — నా దగ్గరకు వచ్చే ఆ వ్యక్తి. అతను ఎవరు?

13

ఇప్పుడు, గుర్తుంచుకోండి, మీరు దీన్ని పొందుకోండి. సోదరుడు బ్రాన్హాం వెళ్ళినప్పుడు... నాకు ఆయన పేరు ఏమిటో తెలియదు? అతను నాకు ఎప్పుడూ చెప్పలేదు. అతను ఒక పెద్ద మనిషి. అతను రెండు వందల పౌండ్లకు పైగా బరువు ఉంటాడు, తెల్లని దుస్తులు ధరించి ఉన్నాడు మరియు నల్లటి జుట్టును కలిగి ఉన్నాడు. అతడు ఇలా నిలబడతాడు. అతను నా కుడివైపు నిలబడి ఉన్నాడు. మరియు అతను, “ఆ బిడ్డ జీవించగలడా?” అని అడిగాడు.

నేను,“అయ్యా, నాకు తెలియదు” అని అన్నాను.

“నీవు దాని కోసం ప్రార్దించు” అని ఆయన అన్నాడు.

తండ్రి వానిని నా వద్దకు తీసుకువచ్చాడు. నేను నా చేతులను ఇలా ఉంచి దాని కోసం ప్రార్థించాను. అతడు తన తండ్రి చేతుల్లో నుండి దిగాడు, మరియు అది ఆ చిన్న వంకర కాళ్ళలో ఒకదానిపై తాకింది. మరియు అది ఆ చిన్న కాలిపై తాకినప్పుడు, అది బాగైనది. మొదటి కాలు బాగా అయినది. ఇది మరొక అడుగు వేసి, ఎడమ కాలు బాగా అయినది. మరియు అది మూలలోకి వెళ్లి, అది దాని తదుపరి అడుగు వేసింది, మరియు అతని చిన్న శరీరం విప్పబడింది. ఆ బాబు నా వద్దకు తిరిగి నడుస్తూ వచ్చి తన చిన్న చేతులు నాపై ఉంచి, “సహోదరుడా బ్రాన్హాం, నేను సంపూర్ణముగా బాగు చేయబడ్డాను”, అని అన్నాడు.

మరియు నేను, “మంచిది, దేవునికి స్తోత్రం” అని చెప్పాను.

14

ఆ తర్వాత ఈ దూత మళ్ళీ నా కుడివైపుకు నడిచాడు. అతను నన్ను తీసుకువెళ్ళాడు, మరియు నేను ఒక చిన్న పాత కుగ్రామానికి చెందిన రహదారిపై ఉన్నాను. అక్కడ నిలబడి... అతను నాకు స్మశాన వాటికను చూపించాడు. అతను, “దాని నుండి సంఖ్యలను తీసివేయి” అని అన్నాడు. మరియు నేను అలా చేసాను. అతను నన్ను తరువాత ఒక చిన్న పెట్రోల్ బంక్ మరియు పసుపు రంగులో ఉన్న దుకాణం ఉన్న ఒక చిన్న ప్రదేశములో ఉంచాడు. నీలం రంగులో ఉన్న ఒక రకమైన కార్డురాయ్ అంగీతో, లేదా నీలం రంగు అంగీతో పసుపు రంగు టోపీ ధరించి మరియు తెలుపు మీసాలతో ఉన్న ఒక వృద్ధుడు బయటకు వచ్చాడు. ఆ దూత, “అతను నీకు దారి చూపిస్తాడు”, అని చెప్పాడు.

అప్పుడు ఉత్తరం వైపు నుండి తిరిగి దక్షిణo వైపునకు వస్తూ అతను నన్ను ఒక ఇంట్లోకి తీసుకు వెళ్ళాడు. నేను అక్కడ నడిచినప్పుడు, ఒక ... నేను లోపలికి నడిచాను, పాత కట్టెల పొయ్యి ఒకటి అక్కడ ఉంది, వారు కుంపటి అని పిలుస్తారు. మీరు ఇక్కడ అరిజోనాలో వాటిని కలిగి ఉన్నారని నేను అనుకోను. ఒక కుంపటి అంటే ఏమిటో ఎంతమందికి తెలుసు...? మీరు అర్కాన్సాస్ నుండి వచ్చారా? అది అక్కడ వారికి ఎక్కువగా ఉంటాయి. ఎంతమంది అర్కాన్సాస్ వారు ఇక్కడ ఉన్నారు? నేను అనుకున్నట్టే. చూసారా? అయితే సరే.

15

మరియు వారికి [టేపు పై ఖాళీ ఉంది.]...? ...“దేవుడు ఈ గృహమును దీవించును గాక.” వారు ఇప్పుడు ఆధునిక గృహాలలో ఇలాంటి గురుతులు తీసివేసి, అందంగా కనిపించే అమ్మాయిల ఫోటోలు పెట్టుకుంటున్నారు. నేను “దేవుడు ఈ గృహమును దీవించును గాక”, అనే పాత గుర్తును కలిగి ఉండాలనుకుంటున్నాను, మీరు అనుకుంటున్నారా? అవును.

ఆపై... నేను నా ఎడమ వైపున ఒక పెద్ద ఇత్తడి మంచమును గమనించాను, అది ఒక అమ్మాయి లేదా అబ్బాయి అయ్యి ఉండచ్చు. తనకి ఒక మగరూపుగల ముఖం ఉంది. కానీ దానికి పొడవైన జుట్టు ఉందని నేను అనుకున్నాను. ఒక మహిళలాగా గుండె ఆకారములో పెదవులు ఉన్నాయి. మరియు దాని కుడి చేయి ఇలా ఉంది, మరియు ఎడమ కాలు మెలికలు తిరిగింది, పక్కకు మెలి తిరిగింది. మరియు అతను... నేను, “సరే, ఇది వింతగా ఉంది?”, అని అనుకున్నాను నేను, “అది పురుషుడా లేదా స్త్రీనా?”, అని అనుకున్నాను మరియు నేను చూస్తున్నాను.

ఏదో నాతో మాట్లాడటం నేను విన్నాను, నేను ఇక్కడ నిలబడి చూశాను, మరియు ఆ దూత ఇక్కడ నిలబడి ఉంది. “ఇప్పుడు, నీవు వెళ్లి ప్రార్థించు, మరియు మీ చేతులను రెండిటిని తిన్నగా ఇలా చాచి ఈ వ్యక్తి యొక్క కడుపుకు అడ్డంగా ఉంచు,” అని నాతో చెప్పాడు.

16

సరే, నేను, “అమ్మాయి, లేదా అబ్బాయి అయి ఉండచ్చు, ఎందుకంటే అది అమ్మాయి అయితే, ఆమె ఒక యవ్వన స్త్రీ”, అని అనుకున్నాను. అతను నా చేతులను ఆ వ్యక్తి కడుపుకు అడ్డంగా పెట్టమని చెప్పాడు. సరే, నాకు అతను చెప్పేది చేయడానికి ధైర్యం లేదు. నేను నా చేతులను ఆ వ్యక్తి యొక్క కడుపుపై ఉంచి, నేను ప్రార్థించాను.

నేను అలా చేసినప్పుడు, “ప్రభువుకు స్తోత్రం కలుగును గాక” అని ఒక చిన్న స్వరం పలకడం విన్నాను. నేను చూడగా, ఆ ఊచచేయి నిటారుగా ఉండటం నేను చూశాను, దాని కాళ్ళు దాని సాధారణ స్థితికి తిరిగి వచ్చాయి. తను పైకి లేవడం నేను చూశాను. అది అలా లేస్తున్నప్పుడు, ఆమె— పైజామా పైకి లేచింది, మరియు ఆమె యొక్క గుండ్రని మోకాలును బట్టి ఒక అమ్మాయి అని అర్దమైంది. మీకు తెలుసా ఒక మగ మనిషి మోకాలు ఎక్కువ ఎముక ఉన్నట్టు ఉంటుంది. సరే, ఆ అమ్మాయి మోకాలు గుండ్రంగా ఉంది. ఆమె పైజామా పైకి లేచినప్పుడు- అది అలా ఉందని నేను చూశాను. మరియు ఆమె ఖచ్చితంగా బాగయ్యింది.

ఆ సమయములో, ప్రజలు “ఓహ్, దేవునికి కృతజ్ఞతలు” అని చెప్పడం విన్నాను.

సరే, నేను, “ఇది వింతగా ఉంది?”, అని అనుకున్నాను. ఎవరో, “ఓహ్, బ్రదర్ బ్రాన్హాం, ఓహ్, బ్రదర్ బ్రాన్హాం”, అని అరవడం విన్నాను.

నేను, “ఎవరో పిలవడం విన్నాను”, అని అనుకున్నాను.

“ఓహ్, బ్రదర్ బ్రాన్హాం...”

17

నేను— నేను గదిలో నా వద్దకు తిరిగి వస్తున్నాను. నేను నేల మధ్యలో నిలబడి ఉన్నాను. నేను ఎక్కడా లేను అన్నట్టు కనిపిస్తుంది కాని నేను నేలపైనే ఉన్నాను. తలుపు దగ్గరకు ఎవరో వచ్చారు. “లోపలికి రండి” అని నేను చెప్పాను.

ఎవరో ఒక అతను తలుపు తెరిచి లోపలికి వచ్చాడు. అతను, “ఏమైంది?” అని అన్నాడు మరియు నేను... అతను ఏడుస్తున్నాడు అని చెప్పాను. అతను,“సహోదరుడ బ్రాన్హాం, మీకు నేను గుర్తున్నానా?” అని అడిగాడు

నేను, “అయ్యా, లేదు, నాకు గుర్తులేదు” అని చెప్పాను.

అతను, “నా పేరు జాన్ ఎమ్మెల్.”, “సుమారు నాలుగు సంవత్సరాల క్రితం, మీరు నాకు, నా కుటుంబానికి బాప్తిస్మం ఇచ్చారు”, అని అన్నాడు. మరియు ఆయన ఇలా అన్నాడు, “యుద్ధ సమయములో, అక్కడ పౌడర్ ప్లాంట్ వద్ద, మీరు...”

నేను, “నేను ఇప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకున్నాను. మీరు ఒక వ్యక్తిని చంపారు, అవునా”, అని అన్నాను.

అతను, “అయ్యా, అవును. నేను నా పిడికిలితో అతనిని కొట్టాను మరియు పోరాటంలో అతని మెడ విరిగింది” మరియు, “నేను పారిపోయాను” అని అన్నాడు. అతను, “నేను వెనుకబడిపోయాను”, “గత సంవత్సరం, నా చిన్న పిల్లవాడు న్యుమోనియాతో (ఊపిరితిత్తుల వ్యాధితో) మరణించాడు” అని చెప్పాడు. నాకు ఒక చిన్న పిల్లవాడు మిగిలాడు, మరియు మా నగరానికి చెందిన డాక్టర్ బ్రూనర్ అతను ఇప్పుడు న్యుమోనియాతో చనిపోబోతున్నాడని చెప్పాడు.“

మరియు నేను, “అవునా?” అని అన్నాను.

“అవును”. “మీరు అతని కోసం ప్రార్థిస్తారా?” అని అడిగాడు.

“అయ్యా, చేస్తాను” అని నేను చెప్పాను.

అతను, “సరే, నేను గ్రాహం స్నెల్లింగ్ ను తీసుకురావడానికి వెళ్తున్నాను...”. అతను జెఫర్సన్ విల్ వద్ద ఉన్న బ్రాన్హాం టబర్నకల్ వద్ద నా తోటి సహకాపరి అని చెప్పాడు. ఇతను అతని సోదరుడు. అతను, “నేను బ్రదర్ గ్రాహంను మనతో రావడానికి తీసుకువస్తాను” అని చెప్పాడు. మరియు అతను, “చిన్న బాబు...” “నేను ఎక్కడ నివసిస్తున్నానో మీకు తెలుసా?” అని అడిగాడు.

నేను, “అయ్యా, లేదు” అని చెప్పాను.

“నేను ఇండియానాలోని యుటికాకు నాలుగు మైళ్ల ఎత్తులో నివసిస్తున్నాను” అని ఆయన అన్నారు. మరియు యుటికా జెఫర్సన్ విల్ నుండి ఏడు మైళ్ళు దూరంలో ఉంది.

“సరే, నేను వెళ్తాను” అని నేను చెప్పాను.

“సరే, మీ కారు తీసుకోవద్దు, నేను మిమ్మల్ని నా కారులో తీసుకువెళతాను” అని అతను చెప్పాడు.

నేను, “సరే మంచిది”, అని అన్నాను.

18

అతడు బయటకు వెళ్లగానే అమ్మ నన్ను పిలిచి, “హనీ, ఆ వ్యక్తితో విషయం ఏమిటి? అని అడిగింది. అతను వణుకుతూ, పిలుస్తూ, తలుపు ఊపుతూ ఉన్నాడు” అని చెప్పింది.

నేను, “అమ్మా,... ఏదో జరిగింది.” “నేను ఒక దర్శనములో ఉన్నాను” అని చెప్పాను.

ఆమె, “ఓహ్, అవునా?”... “ఏదైనా మంచి విషయమా?” అని అడిగింది.

నేను, “అవును, ఆ వ్యక్తి యొక్క చిన్న పిల్లవాడు నయం కాబోతున్నాడు” అని చెప్పాను.

కాబట్టి కొన్ని క్షణాల్లో, అతను తిరిగి వచ్చాడు, మరియు నేను కారులో ఎక్కాను మేము నేవీ యార్డ్ కు బయలుదేరాము... కాబట్టి దారిలో వెళుతున్నప్పుడు, అతను...

“మిస్టర్ ఎమ్మెల్, కష్టతరంగా ఇప్పుడు మీరు వెనుకబడిపోయారు అని నేను అనుకుంటున్నాను” అని నేను అన్నాను.

19

“అవును, సహోదరుడా బ్రాన్హాం,” “నా గురించి నేను సిగ్గుపడ్డాను. నేను మీ వెంట రావడానికి కూడా సిగ్గుపడ్డాను.” “బాబు రెండు వారాలపాటు అనారోగ్యంతో ఉన్నాడు” అని చెప్పాడు. కాని “నేను— నీ వెంట రావలసివచ్చినందుకు సిగ్గుపడ్డాను”. “డాక్టర్ బ్రూనర్- బాబు చనిపోబోతున్నాడు అని చెప్పాడు” అతను సుమారు రెండు గంటలకు చెప్పి బయలుదేరాడు. మరలా నాలుగు, నాలుగున్నర గంటల సమయం అది. అతను “బాబు చనిపోబోతున్నాడు అని చెప్పాడు. కాబట్టి నాకు తెలిసిన చివరి అవకాశము... వచ్చి తీసుకువెళ్ళడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి” అని చెప్పాడు.

“మిస్టర్ ఎమ్మెల్, మీరు యుటికా పైన నివసిస్తున్నారని చెప్పారు కదా?” అని నేను అడిగాను.

అతను, “అయ్యా, అవును” అని అన్నాడు.

నేను, “మీరు ఒక చిన్న తెల్లని ఇంట్లో నివసిస్తున్నారు, అవునా?” అని అడిగాను.

అతను, “అవునండి” అని చెప్పాడు.

నేను, “ముందు తలుపు మీకు దక్షిణంగా ఎదురుగా ఉందా?” అని అడిగాను.

అతను, “ అవునండి” అని చెప్పాడు.

“ఆ ఇంట్లో నీకు ఎరుపు రంగు మడత కుర్చీ ఉంది, అవునా?” అని అడిగాను.

అతను, “అవునండి”, అని అన్నాడు.

నేను, “ మీకు ప్రక్కన గోడ చుట్టూ ఎర్రని చెక్కముక్కలు, ఇలా, ఒకదానిపై మరొకటి పేర్చబడి ఉన్నాయా” అని అడిగాను.

“అవును” అని అన్నాడు.

నేను, “మీ బాబుకి.. సుమారు మూడు సంవత్సరాల వయస్సు ఉండవచ్చు అని నేను చెబుతాను, మరియు నీలం రంగు కార్డురోయ్స్ దుస్తులు దుస్తులు ధరించి ఉన్నాడా?”

అతను, “మీరు ఎప్పుడైనా అక్కడ ఉన్నారా?” అని అన్నాడు.

నేను, “ఉహ్, ఉహ్, మీరు అనుకునే విధంగా నేను అక్కడ లేను” అని చెప్పాను.

అతను, “సరే, బ్రదర్ బ్రాన్హాం,...” అని అన్నాడు

నేను, “మరియు- బాబు శ్వాస కూడా కష్టముగా తీసుకుంటున్నాడు, అవునా?” అని అన్నాను.

అతను, “అది అలాగే ఉంది” అని అన్నాడు.

“యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీ బిడ్డ బ్రదుకుతాడు” అని నేను చెప్పాను.

అతను, “బ్రదర్ బ్రాన్హాం?” అని అన్నాడు.

మరియు నేను, “సరే, అది ... ఎలా...”

“మీరు మా ఇంట్లో ఎప్పుడూ లేరు కదా?”

నేను “కొన్ని క్షణాల క్రితం నేను అక్కడ ఉన్నాను” అని చెప్పాను.

అతను, “సరే, సహోదరుడా బ్రాన్హాం, నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు” అని అన్నాడు.

నేను, “లేదు సహోదరుడా ఎమ్మెల్.... అది ఒక దర్శనం”, అని అన్నాను.

మరియు నేను, “చింతించకండి, మీ బాబు జీవిస్తాడు” అని చెప్పాను.

20

అతను తన వద్ద ఉన్న ఆ పాత మోడల్-టి ఫోర్డ్ కారును బ్రేకు వేసి ఆపి, చేతులను, సోదరుడు గ్రాహం చుట్టూ ఒకటి మరియు నా చుట్టూ ఒకటి వేసాడు. మరియు నేను ఎప్పుడూ నా జీవితములో ఒక మనుష్యుడు ఇంతగా ఏడ్చుచూ పశ్చాత్తాపపడటం వినలేదు.

“దేవా, నా గురించి నేను సిగ్గుపడుతున్నాను” అని అతను చెప్పాడు. అతను, “మీరు నన్ను క్షమిస్తే, నేను ఎప్పటికీ, ఎప్పటికీ మీకు వెనుతిరుగను,” అని అన్నాడు. అక్కడే, అతను క్రీస్తుకు తన హృదయాన్ని తిరిగి ఇచ్చాడు...మేము పదిహేను నిమిషాలు అక్కడ ఉన్నాము, మరియు అతను ఏడుస్తున్నాడు. మరియు అతను దేవుడు అతనిని క్షమించాడు అనే భావన అనుభవించాడు.

అతను పైకి వెళ్లి, ఇంట్లోకి నడిచాడు. నేను లోపలికి ప్రవేశించిన వెంటనే, నేను తల్లిని చూశాను.

21

ఇప్పుడు, ఇక్కడ ఎల్లప్పుడూ మీ వంతు రాకముందే మీరు తొందరపడి మాట్లాడవచ్చు. నేను ఈ కేసును తీసుకువచ్చాను, నేను ఇక్కడే దాదాపుగా తప్పిపోయాను, మరియు ఏదో జరగడానికి కారణమయ్యాను. మీరు ఏమి చేస్తున్నారో మీరు గమనించుకోవాలి.

నేను, గదిలోకి నడిచాను, అక్కడ చిన్న బాబు పడుకొని ఉన్నాడు. అక్కడ చెక్కముక్క ఉంది. మడత కుర్చీ ఉంది. మరియు నాతో ఉన్న మనిషి బ్రదర్ గ్రాహం స్నెల్లింగ్... [టేపు పై ఖాళీ ఉంది.]

దేవుడు తొందరలో లేడు, మనమే తొందరపడతాము, దేవుడు కాదు. నేను, “మీకు విశ్వాసం ఉంటే ఇప్పుడు ఆ బాబుని నా వద్దకు తీసుకురండి” అని అన్నాను. వారు... [టేపుపై ఖాళీ ఉంది .] మరియు తల్లి.... ఒక కాగితం ముక్కను తీసుకుని ముక్కుదగ్గర పెట్టి, ఆ శ్వాస ముక్కు నుండి బయటికి వదిలేది పీల్చుకునేది చూసి చెప్పవచ్చు ఆ బాబు చాలా కష్టముగా బ్రతుకుతున్నాడు అని. అది అంత చెడ్డదిగా ఉంది.

సరే, నేను చూసిన దాని మెలితిరిగిన శరీరం ఏమిటంటే అది న్యుమోనియా (ఊపిరితిత్తుల వ్యాధి). కనబడుతున్న దానిని బట్టి , ఇక్కడ వరకు అంతా చచ్చుబడిపోయింది, ఈ ఒక్క స్థలములోనే బాబు ఊపిరి తీసుకుంటున్నాడు. మెలికలు తిరిగినట్టుగా కనిపించిన సూచన అదే. “ఇక్కడికి తీసుకురండి” అని నేను చెప్పాను.

మరియు వారు అతనిని అక్కడికి తీసుకు వచ్చారు. మరియు, నేను వాడి కోసం ప్రార్థించినప్పుడు, ఏదైనా, అది ఇంకా దిగజారిపోయింది. అతని చిన్న కళ్లుమూతలు పడుతున్నాయి; నాలుక బయటకు వచ్చింది; ఆ చిన్న తల వెనక్కి పడింది.

సరే, నేను, “ఆగండి, ఏదో తప్పు జరిగింది” అని ఆలోచించాను. నేను నా జీవితములో ఎప్పుడూ ఆ ఓటమి చూడలేదు ఎందుకంటే బైబిలు ఎంత నిజమో అది కూడా అంతే నిజం. దేవుడు దాని గురించి మాట్లాడాడు. ఏదో... మీరు దానిని అనుమానించే అవకాశమే లేదు.. “ఒకవేళ మీకు విశ్వాసం ఉంటే...” మీరు మనుషులను సంప్రదించాల్సిన అవసరం లేదు. అది అప్పటికే సర్వశక్తిమంతుడైన దేవుడు పలికాడు. ఇది జరగబోతోంది.

22

నేను ఏదో తప్పు జరుగుతుందని అనుకున్నాను, మరియు నేను ఆలోచించ సాగాను, “ఎందుకు, ఇంట్లో ఒక వ్యక్తి కనిపించటం లేదు అని. మరియు ఏదీ క్రమబద్ధంగా లేదు.” ఈ ముసలి తల్లి...ఇక్కడ ఎవరూ కళ్లజోడు ధరించిన వారు లేరు. ఆమె ఎక్కడ ఉంది? సరే, నేను అనుకున్నాను, “మంచిది, ఇప్పుడు, ఆ...”

మరియు వారు చిన్న బిడ్డను అక్కడికి తీసుకెళ్లారు, మరియు వాడు ఊపిరి తీసుకొనలేకుండా ఉక్కిరిబిక్కిరి అయ్యాడు, [సహోదరుడు బ్రాన్హాం ఉక్కిరిబిక్కిరి అయిన శబ్దాలు చేస్తాడు.] తల్లి, తండ్రి, వాడి యొద్దకు పరుగెత్తుకుంటూ వెళ్ళి వారు పనిచేయడం ప్రారంభించారు, ఆ అక్సీజన్ పైపులు ముక్కుపై ఉంచారు. మరియు వారిద్దరూ అరుస్తూ బిడ్డను ఒంటరిగా విడిచిపెట్టారు. సోదరుడు గ్రాహం ఇదివరకులాగే దానితో పనిచేయడం ప్రారంభించాడు....ఇప్పుడు వాడి చిన్న శరీరం ఎంతో నీలం రంగులో బిగుతుగా ఉండిపోయింది. ఊపిరి తిత్తులు ఇప్పటికే... ఊపిరితిత్తులు పట్టేసినట్టు అయిపోయాయి. వాడు మరి ఎక్కువగా బిగిసిపోయి, ఊపిరితిత్తులు ఉబ్బిపోయి ఉండటం వల్ల చిన్న పక్కటెముకలను బయటికి తోస్తూ ఊపిరి అందుకోలేక బాగా ఆయాసపడుతున్నాడు.

నేను, “ఓహ్, మై... తల్లి అక్కడ లేదని నాకు తెలుసు. నేను తప్పిపోయినట్లు- నాకు తెలుస్తుంది- దేవుడు విఫలుడయ్యాడు.

23

కాబట్టి వారు అప్పటి నుండి సూర్యుడు ఉదయించి ఆ ఉదయకాల వెలుగు వచ్చేవరకు ఆ బాబుతో పనిచేశారు. నేను మరో మాట మాట్లాడలేదు. నేను ఒక్కమాట కూడా మాట్లాడలేకపోయాను. నేను వారికి చెప్పలేకపోయాను. కానీ నేను ఆ మడత కుర్చీ చూశాను; నేను ప్రతిదీ చూశాను.

అయితే అప్పుడు సహోదరుడు స్నెలింగ్ పనికి వెళ్ళే సమయం అయింది. కాబట్టి, మిస్టర్ ఎమ్మెల్ అతన్ని ఇంటికి తిరిగి తీసుకెళ్లబోతున్నారు. అతను, “సహోదరుడా బ్రాన్హాం, మీరు వెళ్ళాలనుకుంటున్నారా?” అని అన్నాడు.

మరియు నేను, “అయ్యా లేదు. నేను ఇక్కడే ఉంటాను” అని చెప్పాను. మరియు నేను, “ఓ దేవా” అని అనుకున్నాను. నేను, “నన్ను క్షమించండి. నన్ను క్షమించండి” అని ప్రార్థిస్తున్నాను.

24

అది... సరే, రెండు లేదా మూడు ఆదివారాల క్రితం, ఇక్కడ నిలబడి నేను ఏదో చేసినపుడు ఏమి జరిగిందో మీకు గుర్తుందా. అదే కార్యము... ఓహ్, అది... నేను — నేను మానవత్వాన్ని చూసాను, మరియు నేను దేవుడు ఏమి చెబుతున్నాడో చూసి వేచి ఉండడానికి బదులు ఎవరో చెప్పేది వినడానికి ప్రయత్నించాను. మీరు నా కోసం ప్రార్థించండి. మీ ప్రార్థనే నాకు కావాలి. ఇప్పుడు, నేను నా హృదయమును మీ కొరకు తెరిచియున్నాను, 'ఎందుకంటే... ఈ రోజు ఇక్కడ జీవితంలో మనం కలవడం ఇదే చివరిసారి కావచ్చు.

అప్పుడు, నేను వెనక్కి తిరిగాను, మరియు నేను -ఏమి చేయాలో నాకు తెలియలేదు. అతను, “సరే, సహోదరుడా బ్రాన్హాం, మాతో ప్రయాణించాలనుకుంటున్నారా?” అని అన్నాడు.

“లేదు, నేను ఇక్కడ వేచి ఉంటాను” అని నేను చెప్పాను. దేవుడు నా ప్రార్థన విని నన్ను క్షమిస్తే, ఆ బాబుకు అవకాశం ఉంది అని నాకు తెలుసు. అయినప్పటికీ... ఏదీ సరిగ్గా వరుసలో లేదు. మరియు...

ఇప్పుడు, అది మీకు పెద్ద విషయంలాగా అనిపించకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో, మొత్తం అంతా అదే. ఇది చివరి వరకు (ఫుల్ స్టాప్ వరకు) సరిగ్గా ఉండాలి. అవును. మరియు అతను, “సరే...”

25

సహోదరుడు స్నెలింగ్, “సరే, నేను వెళ్ళాలి, ఎందుకంటే నేను పనికి వెళ్ళాలి” అని అన్నాడు. అక్కడ పామోలివ్ పీట్ కంపెనీ ఉంది, అతను కోల్గేట్ వద్ద ట్రాక్టర్ నడుపుతుంటాడు. కాబట్టి ఆయన — ఆయన తన కోటు ధరించాడు. మరియు నేను, “ఓహ్, అతను వెళ్లిపోతే, నేను ఇక్కడ రెండు లేదా మూడు రోజులకి అతను తిరిగి వచ్చేవరకు ఇక్కడే ఉండిపోవలసి ఉంటుంది” అని అనుకున్నాను. ఎందుకంటే దర్శనంలో ఉన్న సొగసైన వంపుల జుట్టు ఉన్న వ్యక్తి అతనే అని నాకు తెలుసు.

సరే,స్నేహితులారా, నేను ఎలా ఆలోచించానో మీకు తెలియదు. ఆ తీర్పు దినమున మనం కలుసుకుని, నేను మైకుకు దగ్గరగా ఉండి చెబుతున్న ఈ మాటలకు నేను సమాధానం ఇవ్వాల్సిన రోజు వరకు మీకు ఎప్పటికీ తెలియదు.

నేను— నేను మడత కుర్చీలో కూర్చున్నాను. మరియు సూర్యుడు ఉదయిస్తున్నాడు. అక్కడ విపరీతమైన చలి ఉంది. అది శీతాకాలం. మరియు నేను అక్కడ ఉన్నాను. సహోదరుడు ఎమ్మెల్ తన కోటు, మరియు అతని పెద్ద బరువైన టోపీ ధరించాడు. మరియు సహోదరుడు స్నెల్లింగ్ తన కోటు మరియు చలికి కప్పుకునేవి కలిగి ఉన్నాడు. మరియు బయటకు వెళ్ళడం ప్రారంభించారు. మరియు అతను... సహోదరుడు ఎమ్మెల్ తన భార్యతో మాట్లాడుతున్నాడు. మరియు నేను కిటికీ వద్ద ఉండి, ఇలా, కిందకి చూస్తున్నాను. మరియు ప్రక్కన ఇంటి చుట్టూ ఉన్న ఒక చిన్న మురికైన పాత కాలిబాట మార్గమును నేను గమనించసాగాను. అక్కడే ఆ బాబు యొక్క అమ్మమ్మ ఆ కాలిబాట గుండా రావడం నేను చూసాను. ఆమె కళ్ళజోడు కలిగి ఉంది.

ఓహ్, అప్పుడు మీరు ఎలా భావిస్తారో మీకు తెలియదు. నేను, “ఓహ్, ఇప్పుడు వారు వెళ్ళకపోతే.” “దేవా, నేను మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపగలను” అని అనుకున్నాను.

26

మరియు ఆ స్త్రీ ఎల్లప్పుడూ ముందు ద్వారం వద్దకు వస్తుంది. అక్కడే వారు ముందు ద్వారంద్వారా సందర్శిస్తారు. కానీ ఆ ఉదయం, నా కారు అక్కడ లేదు, ఆమె అల్లుడు కారు మాత్రమేఉంది. బాబు పరిస్థితి బాగా లేకపోవడంతో ఆమె ఉదయం కొంచెం సేపు వెళ్ళిపోయింది. ఆమె కొంత సమయం నిద్ర పోవడానికిఇంటికి వెళ్ళింది. మరియు ఆమె వెనుక ద్వారం గుండా వచ్చింది. నేను ఏమీ చెప్పలేకపోయాను. నేను కేవలం అక్కడ ఉండి చూడవలసి వచ్చింది, ఎందుకు?

కానీ నేను ఆ స్త్రీ రావడం గమనించి చూసినప్పుడు నేను ఎలా భావించానో మీకుతెలియదు. నేను అది ఆమె అని గుర్తించాను. నా జీవితంలో నేను ఆమెను ఇంతకు ముందు ఎన్నడూచూడలేదు. కానీ ఆమె అలా దాటి వెళ్ళడం చూసినప్పుడు నేను ఆమె అని గుర్తించాను. నేను, “ఓ దేవా. ప్రభువుకు స్తోత్రం” అని అనుకున్నాను.

మరియు బ్రదర్ స్నెల్లింగ్... వారు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మరియు ఆమె వంటగది తలుపు తీసి వచ్చి మధ్య ద్వారం దగ్గరకు వచ్చి తలుపు తట్టింది. మరియు ఆమె అలా ఆ పని చేయకపోతే, దర్శనం ఇంకా పూర్తి అయిఉండేది కాదు. ఆమె కూతురు ఎవరు వచ్చారో చూసి తలుపు తీయడానికి వెళ్ళింది. అది ఆమె తల్లి.

మరియు ఆమె, “బాబు ఎలా ఉన్నాడు? ఏదైనా మెరుగుపడిందా?” అని అడిగింది.

మరియు శ్రీమతి ఎమ్మెల్, “లేదు, అమ్మా, లేదు” అని చెప్పింది. మరియు ఆమె తన చేతిని అలా పైకి విసిరి, అలా, ఆమె తలను గోడకు ఆనించి, ఏడుస్తుంది. మరియు దర్శనములో అది ఆ విధముగానే ఉంది.

27

సరే, నేను బ్రదర్ స్నెలింగ్ ఉండాల్సిన మడత కుర్చీమీద ఉన్నాను. నేను అక్కడ నుండి లేచి, ఈ విధంగా నడుస్తూ, ఏం జరుగబోతుందో అని ఆశ్చర్యపోయాను. నేను “ఆమె ఈ ఎరుపు కుర్చీలో కూర్చోవలసి ఉంది” అని అనుకున్నాను. మరియు నేను కొంచెం సేపు అక్కడ నిలబడ్డాను. నేను ఆశ్చర్యపోయాను. బ్రదర్ స్నెలింగ్, ఆమె ఏడవడం చూసి అతను కూడా ఏడవడం ప్రారంభించాడు. అతను తన టోపీని తీసి, మడత కుర్చీ మీద కూర్చున్నాడు.

నేను, “ఓహ్, కేవలం ఇంకొక్క కార్యము జరగవలసి ఉన్నది” అని అనుకున్నాను.

అన్నీఎక్కడ ఉన్నాయో చూడటానికి నేను చుట్టూ చూశాను. మరియు ఆ స్త్రీ , ఆమె... ఓహ్, ఆమె తన చిన్న చేతి సంచిని కింద పెట్టి, మడత కుర్చీలో వెనుకకు కూర్చుని, కళ్ళజోడు తీసి, వాటిని తుడవడం ప్రారంభించింది , సరిగ్గా దర్శనములో ఉన్న మాదిరిగా జరగడం నేను చూశాను.

28

అప్పుడు నా దగ్గర ఏదో నిలబడి ఉన్నట్లు నాకు అనిపించింది. ఆయన అక్కడ ఉన్నాడని నాకు తెలుసు. నేను, “బ్రదర్ ఎమ్మెల్” అని అన్నాను. మరియు అతను నా వైపు చూశాడు. “మీకు ఇంకా నాపై నమ్మకం ఉందా?” అని నేను అడిగాను.

“సహోదరుడా బ్రాన్హాం, నేను నిన్ను హృదయపూర్వకముగాప్రేమిస్తున్నాను” అని ఆయన అన్నాడు.

నేను, “నేను ఇప్పుడు మీకు చెబుతున్నాను; కొద్దిసేపటి క్రితం నేను చేసిన పనికి క్షమించండి. అప్పుడు దర్శనం ఇంకా పూర్తి కాలేదు. కానీ ఇప్పుడు, మీరు ఇప్పటికీ నాపై విశ్వాసం కలిగి ఉన్నారని చూపించవలసియున్నది.” మీరు నమ్మితే... ఆ బిడ్డ ఎంతో బలహీనముగా ఉన్నాడు. “మీకు ఇప్పటికీ నాపై విశ్వాసం ఉంటే, బాబుని తీసుకురండి” అని చెప్పాను. [టేపు పై ఖాళీ ఉంది.]

... [ టేపుపై ఖాళీ ఉంది.] “...? ... దర్శనం.కొద్దిసేపటి క్రితం నేను చేసిన పనికి క్షమించండి. మీ సేవకుని క్షమించి, యేసుక్రీస్తు నామమున ఈ బిడ్డను స్వస్థపరచండి.”

29

నేను ఇలా చెప్పినప్పుడు చిన్న పిల్లవాడు తన తండ్రి చుట్టూ చేతులు వేసి, “అయ్యో నాన్న, ఓ నాన్న. ఓహ్, ఇంట్లో ఆనందాల కీచులాటలు చెప్పనక్కర్లేదు. ఇక... పరుగు మొదలుపెట్టారు.

నేను, “ఇప్పుడు అతన్ని మళ్ళీ మంచం మీద పడుకోబెట్టండి; అతను కోలుకోవడానికి మూడు రోజులు పడుతుంది, ఎందుకంటే అతన్ని మూడు దశల్లో (రోజుల్లో- టిటి దారుడు) బయటకు తీసుకువచ్చారు.”

నేను తిరిగి వెళ్లి జరిగిన విషయాన్ని గుంపుకు వివరించాను. మరియు మూడవ రోజు, “ఇప్పుడు, నేను దాని గురించి ఏమీ వినను, మూడవ రోజు, అక్కడకు వెళ్ళు” అని చెప్పి, అతను నేలపైకి వచ్చి తన చిన్న చేయి వేసి, “బ్రదర్ బ్రాన్హాం, అతను ఎలా ఉండేవాడో చూడండి. అది 'నేను బాగున్నాను' అని చెప్పదు.

కాబట్టి, దాన్ని చూడటానికి ఎంత మంది అక్కడికి వెళ్లారో మీరు ఊహించవచ్చు: మొత్తం సంఘం వెళ్ళింది. రోడ్డు నిండా కార్లు ఉన్నాయి. మరియు నేను ఎవరినీ విడిచిపెట్టమని అడగలేదు. ఇది దేవుని నుండి అని నేను మొదట అతని వద్దకు వెళ్ళవలసి వచ్చింది (అర్థమైందా?) వారు అక్కడ గుమిగూడారు.

30

నేను తలుపు దగ్గరకు వెళ్లి కొట్టాను మరియు అమ్మ చిన్న వంటగదిలోకి తిరిగి వచ్చింది. ఆమె పరుగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి, తలుపు తెరిచి, “ఓ, బ్రదర్ బ్రాన్హాం, మీరు ఉన్నారు. లోపలికి రండి.” “అతనిలో తేడా చూడు” అంది.

అతను చాక్లెట్ మిల్క్ తాగుతున్నాడు మరియు అతనికి చాక్లెట్ మిల్క్ మీసాలు ఉన్నాయి, మీకు తెలుసా. మరియు అతను నేలమీద నడుచుకుంటూ వచ్చాడు. అక్కడ అందరూ నిలబడి కిటికీల నుండి ప్రతిదీ చూస్తున్నారు. అతను బయటకు వెళ్ళాడు మరియు నేను ఏమీ మాట్లాడకుండా నేలపై నిలబడ్డాను. అతను నా దగ్గరకు వచ్చి, తన చిన్న చేతులను నా వైపుకు చాచి, “బ్రదర్ బ్రాన్హాం, చూడండి? నేను బాగానే ఉన్నాను,” అన్నాడు.

31

నేను మిగిలిన వాటి గురించి చెప్పడం మొదలుపెట్టాను. రెండు వారాల తరువాత, నేను నా ఆఫీసు నుండి బయలుదేరినప్పుడు. సాధారణంగా, మేము మా మెయిల్‌లను (సందేశాలు) ఉంచే పావురం రంధ్రాల వంటి విభాగాలను కలిగి ఉంటాము. కానీ అక్కడ చాలా మంచి వ్యక్తి అయిన హెర్బర్ట్ స్కాట్, “బ్రదర్ బ్రాన్హాం,” “మీరు వెళ్ళే ముందు, ఇక్కడ నా డెస్క్‌పై (నేను పెట్రోలింగ్‌లో ఉన్నాను...)” “నాకు మీ కోసం ఒక ఉత్తరం వచ్చింది డెస్క్.”

“తీసుకుంటాను” అన్నాను. మరియు మా స్థానిక కార్యాలయం పై అంతస్తులో ఉన్నందున నేను మా కార్యాలయం యొక్క ప్రధాన భాగానికి వెళ్లడానికి మెట్లు దిగడం ప్రారంభించాను. నేను బయలుదేరుతున్నాను, నేను చూస్తుండగా, లేఖలో ఏదో వింత గమనించాను. ఉత్తరం వైపు నడిచి ఉత్తరం అందుకొని అది ఎవరిది అని చూసాను. తెరిచి చూసాను. మరియు నేను, “సరే, నేను మీకు చెప్తాను.”

32

అక్కడ చూస్తే, “నేను శ్రీమతి హెరాల్డ్ నెయిల్ను” అని వ్రాసి ఉంది. ఆమె, “గౌరవనీయులైన బ్రాన్హాం, నాకు బాధపడుతున్న పదహారేళ్ల వయసున్న ఒక అమ్మాయి ఉన్నది.” మరియు, “ఆమె కొంత కాలముగా బాధపడుతుంది, ఆర్థరైటిస్ (ఎముకల సమస్య) ఈ బాధకు తోడైంది.” మరియు, “ఆమె పగలు రాత్రి ఏడుస్తున్నది” మరియు, “నేను మెథడిస్ట్ సంఘానికి చెందిన దానిని అని చెప్పింది.— ......” ఒక్క నిమిషం ఆ స్థలం యొక్క పేరు ఏమిటంటే అది ఇండియానాలోని సేలం అని ఉంది.

ఇండియానాలోని సేలం దగ్గర నుంచి వచ్చినవారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? అక్కడ ఎవరో ఉన్నారు. సహోదరి, ఇండియానాలో మీరు ఏ భాగం నుండి వచ్చారు? ఇండియానాలో ఏ భాగం? సేలం? సేలం, ఇండియానా. ఓ...మీకు హెరాల్డ్నెయిల్ తెలుసా? మీకు హెరాల్డ్ తెలుసా? మంచిది ఆమెకు తెలుసు అక్కడ. ఇప్పుడు, అదే సాక్ష్యం. ఇప్పుడు, మనము ఇక్కడే కలిగి ఉన్నాం. కూడిక ముగిసిన తరువాత నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. అది... ఇప్పుడు, నేను మీకు అది ఎక్కడ ఉందో చెబుతాను... అది సౌత్ బోస్టన్. సౌత్ బోస్టన్ ఎక్కడ ఉందో మీకు తెలుసా? అది... సరే మంచిది. ఇప్పుడు, మనము సాక్ష్యాలతో సహా కథను కలిగి ఉన్నాము. మరుసటి రోజు, నేను ... నేను ప్రజలు దగ్గరగా ఉండటం ఇష్టపడతాను. అయితే సరే.

33

ఇప్పుడు, నేను—నేను ఈ ఉత్తరాన్ని కిందకు తీసుకువచ్చాను. అందులో ఇలా ఉంది, “ఇండియానా లోని సేలం, లేదా సౌత్ బోస్టన్ లో నివసిస్తున్నాను.” మరియు, “మా కాపరి వచ్చి, అతను మాకు ఇలా చెప్పారు ... మేము ఒక ప్రార్థనా కూటము కలిగి ఉన్నాము, ఎవరో మాకు 'యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు' అనే చిన్న పుస్తకాన్ని తీసుకువచ్చారు.” మరియు, “మేము స్వస్థత గురించిన ఆ చిన్న పుస్తకాన్ని చదువుతున్నాము, ఈ చిన్న అమ్మాయి కోసం ప్రార్థించమని మీ కొరకు కబురు పంపడానికి నా హృదయంలో ఏదో కదిలింది.” అనుకోకుండా, ఆమె ఏ రాత్రి అయితే నాకు ఇచ్చిందో, అదే రాత్రి నాకు దర్శనం కలిగింది. చూశారా? ఇప్పుడు, దానితో సరి చూడండి.

నేను ఇంటికి వెళ్ళాను; నేను భార్యకు “ఇదిగో ఇది చూడు” అని చెప్పాను.

ఆమె “అవును”. “ఓహ్, అది ఆ దర్శనం అదే కదా అవునా?” అని అన్నది.

“అది అదే” అని అన్నాను.

ఆ రాత్రి సంఘములో జరిగిన ప్రార్థనా కూడికకు; నేను వెళ్లి, చూపించాను. అందరూ వెళ్ళాలని కోరుకున్నారు. మరియు అక్కడ బ్రేస్: యాడ్ బ్రేస్ పేరుతో కొంతమంది ఉన్నారు.

34

నేను చాలాసార్లు వారి కోసం చూశాను. నేను... వారు ఈ కూడికలో ఉండి ఉండవచ్చు. టెక్సాస్ నుండి యాడ్ బ్రేస్ అని ఎవరైన ఉన్నారా? లేదా అతను తెలిసిన ఎవరైనా ఉన్నారా? శ్రీమతి. బ్రేస్, వారు స్వస్థత పొందడానికి అక్కడికి వస్తారు. ఆమె క్షయ వ్యాధితో ఉన్నది. కాబట్టి వారు వెళ్ళాలనుకున్నారు.

మరియు, “ఇప్పుడు, మొదటిగా, సౌత్ బోస్టన్ ఎక్కడ ఉంది?” అని నేను అడిగాను. అది ఎక్కడ ఉందో ఎవరో నాకు చెప్పారు.

కాబట్టి... నేను న్యూ ఆల్బనీకు వెళ్ళాను. అక్కడ వెనుక ఉన్నవారికి హూసియర్ తెలుసా? నేను న్యూ ఆల్బనీకి దిగువన, మరియు క్రింది ప్రదేశాలకు వెళ్ళాను. మరియు అక్కడ సౌత్ బోస్టన్ కి బదులుగా న్యూ బోస్టన్ ఉంది. సరే, నేను సౌత్ బోస్టన్ గురించి ఎప్పుడూ వినలేదు. నేను, “సరే, ఇప్పుడు - ఇప్పుడు, న్యూ బోస్టన్, అది వింతగా ఉంది, కదా” అని అనుకున్నాను. సరే, నేను తిరిగి వస్తాను.

మరియు నది వద్ద, వైస్ హార్ట్ పేరుతో ఒక పాత మత్స్యకారుడు అక్కడ ఉన్నాడు. అతను, “సౌత్ బోస్టన్ ఈ మార్గంలో లేదు... మీరు ఇండియానాలోని సేలంవైపు వెళ్ళండి” అని చెప్పాడు.

35

కాబట్టి, నేను వేరే మార్గము కోసం హెన్రీవిల్ వరకు వెళ్ళాను. మరియు వారు నన్ను అక్కడ హెన్రీవిల్ లో మరొక రోడ్డు తీసుకోమని చెప్పారు. హెన్రీవిల్నుంచి ఆ రోడ్డు ఎక్కడికి వెళ్తుందనే విషయం మీకు తెలుసు, అని నేను ఊహిస్తున్నాను. అది ఒక బురద రహదారి. సరే నేను...నేను ఆ చిన్న పాత కంకర రోడ్డుపై తిరిగి వచ్చాను మరియు వెళుతూ ఉన్నాను. మరియు ఒక చిన్న పాట ఉంది ... అది పెంతెకోస్తు ప్రజలు నాకు ఒక పాట నేర్పించారు-అది:

దాదాపు ప్రతిచోటా ప్రజలు ఉన్నారు,

ఎవరి హృదయాలు అయితే మండుతున్నాయో.

పెంతుకొస్తు మీద పడిన అగ్ని,

అదే వారిని కడిగి, పరిశుద్ధపరిచింది;

ఓహ్, ఇది ఇప్పుడు నా హృదయంలో మండుతోంది,

ఓహ్, ఆయన నామమునకు మహిమ!

నేను వారిలో ఒకడినని చెప్పగలిగేందుకు చాలా సంతోషంగా ఉంది.“

మీరు ఎప్పుడైనా విన్నారా? సరే, వారు నాకు ఆ పాట నేర్పడానికి ప్రయత్నించారు. ఇప్పుడు, అక్కడ దాని గురించి ఏదో ఉంది, మరియు వారు... కుంటి వారు నడిచారు అన్న దాని గురించి ఏదో అలాంటిది చెప్పారు. మరియు అది బాగానే ఉందని అనుకున్నాను.

“రండి, మళ్ళీ దాన్ని పాడుదాము” అని నేను చెప్పాను. మరియు మేము అలా పాడుతూ ఉన్నాము.

36

అకస్మాత్తుగా, నన్ను ఏదో తాకింది నేను దాదాపు పక్షవాతానికి గురయ్యాను. నేను -నేను అనుకున్నాను... బహుశా నేను అనారోగ్యముతో ఉన్నాను అనుకున్నాను. మరియు నేను కారును ఆపాను. మరియు నేను ఒక చిన్న కొండపై ఉన్నాను. మరియు నా ఎడమవైపున ఒక చర్చి ఉంది. నేను, “బహుశా నేను ఒక చర్చిని దాటుతుండగా, అది ప్రభువు దూత అయి ఉండవచ్చు” అని అనుకున్నాను. మరియు నేను బయటకు వచ్చి కారు వెనుక చుట్టూ తిరిగాను. మరియు నేను పాత ఫోర్డ్ కారును కలిగి ఉన్నాను. నేను నా పాదాన్ని వెనుక భాగం డిక్కీపై ఉంచి నేను అక్కడ నిలబడి ఉన్నాను.

37

మరియు ఆమె దానిని అక్కడకు తీసుకువచ్చింది, మేము సమాధి రాళ్ళపై పేర్లను మరియు సంఖ్యలను తనిఖీ చేసాము మరియు అది సరిగ్గా అదే స్థలం. నేను, “ఇదే ఆ రహదారి. మనము ఇప్పుడు సరైన రహదారిలో ఉన్నాము. మరియు ప్రభువు దూత నన్ను ఇక్కడ ఆపింది” అని అన్నాను. దానిని గమనించకుండా నేను సరిగ్గా దాని ద్వారానే వెళ్ళాను. చూశారా? బంకర్ హిల్ స్మశానం ఎలా ఉంటుందో మీకు తెలుసు. నేను నా జీవితములో ఆ దేశంలో ఎప్పుడూ లేను, దాని గురించి ఏమీ తెలియదు. కాబట్టి నేను అలా వెళ్తూ ఉన్నాను. అక్కడ ఉన్న ఒక చిన్న పెట్రోల్బంక్ పక్కన నిలబడి ఒక వ్యక్తి సిగరెట్ కాల్చుతున్నాడు, నేను అతనిని కలిసాను.

నేను,“సౌత్ బోస్టన్‌కు వెళ్ళే దారి ఇదేనా?” అని అన్నాను.

అతను, “అయ్యా అవును. నేరుగా వెళ్ళండి” అని అన్నాడు..

“హెరాల్డ్ నెయిల్ పేరుతో అక్కడ ఎవరైనా మీకు తెలుసా?” అని నేను అన్నాను.

“తెలుసండి.”

అయితే సరే. నేను అలా కొనసాగి వెళ్తూ ఉన్నాను. వారు, “ఇప్పుడు ...”

నేను, “ఇప్పుడు, నేను ఆ స్థలానికి వెళ్ళగానే ...(సౌత్ బోస్టన్ అనే స్థలానికి.) నీలిరంగు అంగీతో ఉన్న ఒక వ్యక్తి బయటకు వస్తాడు. అతను తెల్లటి మీసముతో పసుపు కార్డురోయ్ టోపీని కలిగి ఉంటాడు. ” నేను, “అతను పసుపు రంగుతో ఉన్న చిన్న దుకాణం నుండి బయటకు వస్తాడు” అని అన్నాను.

మరియు ఆమె ... శ్రీమతి - శ్రీమతి. బ్రేస్, “సరే, సహోదరుడా బ్రాన్హాం నేను ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు ... ”నేను వెనుక వారి పేర్లను గురించి ఆలోచించినప్పుడు నేను ఇంక ఏమి చేస్తానో కూడా నాకు తెలియదు.“ అని అన్నది. ఆమె దాన్ని అధిగమించలేకపోయింది. ఆమె అలాంటిది ఎప్పుడూ చూడలేదు.

38

కాబట్టి మేము అలా ముందుకు వెళ్ళాము. నేను కిందకు వెళ్ళాను.... మేము కొన్ని మలుపుల గుండా వెళ్ళాము. దాని ద్వారా నేను అక్కడ రహదారిపై గందరగోళ పడ్డాను. మరియు నేను తోటివారితో అంటున్నాను, అతను “సరే, ఇండియానా గురించి మీకుతెలుసు కదా. మీరు మీ కుడి వైపుకు మరియు మీ ఎడమ వైపుకు మలుపులు తిరుగుతూ ఉండాలి” అని అన్నాడు. దాని ద్వారా నేను వేరొక మలుపు తీసుకుని ఉండవచ్చు. సరే ఏమైనప్పటికినీ, “ఈ మార్గములో నేరుగా వెళ్ళండి” అని అతను అన్నాడు.

అక్కడ నిలబడి ఉన్న మరొక వ్యక్తి, “మీరు కేవలం నాలుగు లేదా ఐదు మైళ్ళు దూరంతో సౌత్ బోస్టన్‌కు చేరుకుంటారు ” అని అన్నాడు.

నేను కారు నడుపుతున్నాను. మేము మాట్లాడుతున్నాము. కొంతసేపటి తర్వాత, నేను ఒక చిన్న ప్రదేశమును దాటి వెళ్ళాను. నేను, “అదిగో అదే స్థలం. అక్కడే ఉంది. ” మీకు తెలుసా, దారిలో ఒక విశాలమైన ప్రదేశం, ఒక చిన్న ఊరి దారిలాగా ఉంది. నేను, “అదే స్థలం, అక్కడే. అదిగో పసుపు రంగులో ఉన్న దుకాణం. చూడండి” అని అన్నాను.

మేము కొంచెం దూరం వెళ్ళాము. దుకాణం నుండి నీలిరంగు దుస్తులతో (భుజాల పట్టీలు కలిగి డెనిమ్ ప్యాంటుతో చేసిన దుస్తులు), పసుపు కార్డురోయ్ టోపీ మరియు తెల్లటి మీసాలతో ఒక వ్యక్తి అడుగు పెట్టాడు. శ్రీమతి బ్రేస్ ఆమెకు తెలియకుండానే కారులో కళ్ళు తిరిగి పడిపోయింది.

39

నేను, “అదిగో అక్కడ ఉన్నాడు. అతనే ఆ వ్యక్తి” అని అన్నాను. నేను, “ఇప్పుడు, చూడండి, అతను చమత్కారముగా వ్యవహరిస్తాడు, ఎందుకంటే... ప్రభువు యొక్క శక్తి అతనికి చాలా దగ్గరగా ఉంది” అని అన్నాను. మరియు నేను అతనికి దగ్గరగా కారును తీసుకువెళ్లాను; నేను, “అయ్యా.” “హెరాల్డ్ నెయిల్ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడో మీరు నాకు చెప్పాలి” అని అన్నాను.

మరియు అతని పెదవులు అలా తడబడుతూ “అవును అయ్యా”, “మీరు ఇక్కడే ఈ దారి గుండా వెళ్ళి, కిందకి తిరగండి. అది కుడి వైపున ఉన్న మూడవ ఇల్లు, అక్కడ కొండపై పెద్ద ఎర్రటి ధాన్యపు కొట్టు ఏర్పాటు చేయబడి ఉంటుంది ” అని చెప్పాడు.

నేను, “అలాగా” అని అన్నాను.

అతను, “ఎందుకు?” అని అన్నాడు.

మరియు నేను, “అతనికి చాలా జబ్బుపడిన లేదా అలా ఏదో ఒకదానితో బాధపడుతున్న కుమార్తె ఉందా?” అని అన్నాను.

“అవును” అన్నాడు.

నేను, “ఆమె స్వస్థత పొందబోతోంది” అని అన్నాను.

అతని పేద పాత బుగ్గలపై కన్నీళ్లు కిందకు కారడం ప్రారంభించాయి. మరియు మేము వెనుకకు తిరిగి చూసాము. సహోదరుడు బ్రేస్ సహోదరి బ్రేస్‌తో మాట్లాడుతున్నాడు మరియు అతని చేతితో ఆమె ముఖమును తుడుస్తున్నాడు. మరియు మేము మళ్ళీ ముందుకు తిరిగి, తిరిగి పైకి వెళ్లి, రహదారిపైకి కిందకు వెళ్లి, ఆ స్థలం ఉన్న చోటికి వెళ్ళాము.

40

ఒక భారీ శరీరము కలిగి ఉన్న మహిళ, శ్రీమతి నెయిల్ ఇంటి నుండి బయటకు నడుస్తూ వచ్చింది. మరియు ఆమె, “పుస్తకములో మీ చిత్రం చూడటం ద్వారా మీరు సహోదరుడు బ్రాన్హాం అని నాకు తెలుసు” అని అన్నది.

నేను, “అమ్మా. అవును” అని అన్నాను.

ఆమె, “లోపలికి రండి” అన్నది.

మేము లోపలికి వెళ్ళాము. కాబట్టి వారు నాతో నడుస్తూ లోపలి వచ్చారు. మేము అక్కడ ఉన్న సందులోకి తిరిగాము. మరియు మేము ... ద్వారములోకి ప్రవేశించినప్పుడు, “గదిలో ఏముందో ఇప్పుడు చూడండి” అని అన్నాను. మీరు ద్వారములోనికి రాగానే, అక్కడ పెద్ద పాత స్టవ్ (కుంపటి) ఉంది. “దేవుడు మా గృహమును దీవించును గాక” అనే ద్వారపు పలక ఉంది. పెద్ద పందిరి మంచం ఉంది. అక్కడ పడుకున్న అమ్మాయి, ఒక గరుకుగా కనిపించే మగరూపంతో, ఆమె చేతులు ఆర్థరైటిస్‌ (కీళ్ళ నొప్పులతో), మరియు ఆమె పాదం అలా ఉన్నది. మరియు ఎరుపు బొమ్మలతో పసుపు కాగితం ఉన్నది.

శ్రీమతి బ్రేస్ ఏమి జరిగిందో చూసినప్పుడు ఆమె మరోసారి కళ్ళు తిరిగి పడిపోయింది.

41

ఆపై అక్కడ ఏదో వింత జరిగినట్లు అనిపించింది. నా ఆత్మ, లేదా నా ఉనికి, లేదా ఏదో బయటికి వెళ్ళినట్లు అనిపించింది. మరియు ఆ యువతి కడుపుపై​​నా చేతులు వేసినది నాకు గుర్తుంది. మరియు నేను, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సహోదరి, నీవు బాగుపడతావు” అని చెప్పి ప్రార్థన చేయడం ప్రారంభించాను.

నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు, “ప్రభువుకు స్తోత్రం” అని ఒక చిన్న స్వరం చెప్పడం విన్నాను. మరియు అది ఆ యువతి. ఆమె ఆ బాధతో పగలు మరియు రాత్రి ఏడుస్తూ ఉంటుంది. నేను గమనించినప్పుడు, ఆమె చేయి తిరిగి సాధారణమైంది, ఆమె పాదం నిటారుగా ఉంది, మరియు ఆమె పైకి లేచినప్పుడు, ఆమె పైజామా ఆమె గుండ్రని మోకాలు కనిపించే అంత పైకి లేసింది. మరియు శ్రీమతి బ్రేస్ దానిని చూసినప్పుడు, ఆమె మళ్ళీ కళ్ళు తిరిగి నేలమీద పడిపోయింది. కాబట్టి అతను, “అమ్మా, అమ్మా” అని అన్నాడు.

అమ్మాయి గది నుండి బయటికి వెళ్లి, ఆ ఊచకాలు కలిగి మరియు ఊచ చేతితో జుట్టును దువ్వుకుని దుస్తులు ధరించి తిరిగి వచ్చింది. మరియు ఆమె ఈరోజు ఇండియానాలోని సేలంలో నివసిస్తోంది.

సహోదరి, మీరు ఆమెను ఎరిగియున్నారా? మీ పేరు ఏమిటి? లారెల్. ఇండియానాలోని సేలం నుండి వచ్చారా. మీకు శ్రీమతి నెయిల్ తెలుసా? మీకు ఆ అమ్మాయి తెలుసా, ఆమె బలహీనత గురించి తెలుసా? ఇక్కడే సాక్షి ఉంది.

ఇప్పుడు, ప్రతి ఒక్కరూ “ప్రభువుకు స్తోత్రం” అని చెప్పండి.

ఈ దేశంలో మీరు ఏమి చేస్తున్నారు? ఇది మంచి ప్రదేశం, అవునా? అవును ఇది నిజంగా మంచి ప్రదేశం. ఇది చాలా మంచిది. ఇండియానాలోని సేలం నుండి.... కేవలం మా ఇంటికి ముప్పై మైళ్ళు లేదా ముప్పైమూడు మైళ్ళు, అని అనుకుంటున్నాను.

ఇప్పుడు, మీరు చూశారా? ఈ పనులను చేయటానికి దేవుడు తన మార్గాన్ని ఏర్పాటు చేసిన సందర్భాలలో ఇది ఒకటి.

42

నేను సమయం తీసుకోగలిగితే, నాకు కొంత సమయం దొరికితేనా మనస్సులో ఉన్న దాన్ని మీకు చెప్పనివ్వండి. మనము దీన్ని చేయగలమని అనుకుంటున్నాను. మీరు వినాలనుకుంటే “ఆమెన్” అని చెబుతారా? వాటి గురించి మాట్లాడటం మీకు విసుగు కలిగిస్తుందా? మీరు దానిని వినాలనుకుంటే, “ఆమెన్” అని చెప్పండి. [సమాజం “ఆమెన్” అని చెప్పింది.]

అది అర్కాన్సాస్‌లోని లిటిల్ రాక్ వద్ద జరిగింది. అర్కాన్సాస్ లిటిల్ రాక్ యొక్క కాపరి జి. హెచ్. బ్రౌన్, ఎంతమందికి తెలుసు. ఇక్కడ వెనుక ఎవరో తిరిగి ఉన్నారు? అయితే సరే. మీకు అతను తెలుసా?

ఇప్పుడు, మీరు ఈ సాక్ష్యం అతని కోసం వ్రాయండి. ఇప్పుడు, మీరు ఈ సాక్ష్యం ఈ వ్యక్తి కోసం వ్రాయాలనుకుంటే, మీరు చేయాల్సిన మొదటి కార్యము, అక్కడ ఉన్న స్త్రీని చూడండి. ఆపై ఇండియానాలోని సౌత్ బోస్టన్‌లో ఉన్న శ్రీమతి హెరాల్డ్ నెయిల్‌కు రాయండి. లేదా మరొకరికి, యుటికా, ఇండియానా, ఆర్ఎఫ్డి (RFD 2) నుండి మిస్టర్ జాన్ ఎమ్మెల్ కు వ్రాయండి. మరియు ఈ సాక్ష్యం కోసం మీరు ఈ వ్యక్తికి వ్రాయాలనుకుంటే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను, 505 హికోరి స్ట్రీట్, లిటిల్ రాక్, అర్కాన్సాస్ నుండి ఇది రెవరెండ్ జిహెచ్ బ్రౌన్. నేను దీన్ని వీలైనంత త్వరగా చేయడానికి ప్రయత్నిస్తాను, మరియు మనము ప్రార్థన వరుసను ప్రారంభించినప్పుడు ప్రార్ధన చేసుకుందాము.

43

ప్రార్థన కోసం ఈ రోజు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, చూద్దాం?

[టేపుపై ఖాళీ ఉంది.]

ప్రార్థన వరుసకు సరిపోయినంతగా. అనుకోకుండా మేము దానిని నిర్వహించలేకపోయాం అని భావిస్తున్నాను...? .... ఇది ప్రజల యొక్క విశ్వాసం పైన ముడిపడిన దానిగా చూస్తున్నాను.

కాని ఆయన నన్ను ఏ ప్రదేశానికైనా పంపినప్పుడు, స్నేహితులారా, నేను ఆ వ్యక్తి తన సమాధిలో ఉన్ననూ, యాభై సంవత్సరాలుగా చనిపోయినప్పటికినీ, నేను పట్టించుకోను; వారు మళ్ళీ పైకి లేస్తారు. ఎందుకంటే దేవుడు అప్పటికే మాట్లాడాడు. ఇది జరగాలి. మరియు ... స్నేహితులారా, ఇప్పుడు, నేను ఇక్కడ ఎంత సహజముగా నిలబడి ఉన్నానో అది అంత సహజముగా ఉంది. బైబిల్ ఇలా చెప్పింది, “ఇద్దరు లేక ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచ బడవలెను.” అది సరియైనదేనా? ఇప్పుడు, మీరు అడగండి.

44

ఇప్పుడు, వరములు పని చేయాల్సిన మార్గం అదే. చూశారా?ఇప్పుడు, మీరు దీనిని గమనించాలని నేను కోరుకుంటున్నాను. నా హృదయపూర్వక ప్రార్థన ద్వారా ఈ వరము నాకు రాలేదు. హృదయపూర్వక ప్రార్థనల ద్వారా వరములు రావు. వరములు దేవుని చేత ముందే నిర్ణయించబడతాయి. అవి నిర్ణయించబడి పంపబడతాయి.

ఇక్కడ మునిసిపల్ వంతెన వద్ద. సహోదరి, జెఫర్సన్‌విల్నుండి లూయిస్‌విల్ వరకు దాటి వెళ్ళే మునిసిపల్ వంతెన ఎక్కడ ఉందో మీకు తెలిసి ఉండకపోవచ్చు, అవునా?

ఇరవై రెండు సంవత్సరాలు, నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, కేవలం ఐదు సంవత్సరాల వయస్సులో, లేదా ఆరు సంవత్సరాల వయస్సులో, నేను నీరు తెస్తుండగా, దేవుని యొక్క దూత ఆ పొదల్లో కనిపించినప్పుడు ... నేను దీనిని చెప్పడం మీరు విన్నారా?

సరే, ఆ రెండు వారాల తరువాత, నేను నా చిన్న సోదరుడితో గోళీలు ఆడుతున్నాను. నేను అనారోగ్యానికి గురయ్యానని అనుకున్నాను, ఏదో ఒక నిజమైన చమత్కారమైన అనుభూతి నాకు కలిగింది. నేను వెళ్లి ఒక చెట్టు ప్రక్కన ఉన్నాను. నేను నది వైపు చూసాను, అక్కడ నది అవతల ఒక పెద్ద వంతెన ఉంది. నేను ఆ వంతెన నుండి పదహారు మంది పడి మునిగిపోయిన వారిని లెక్కించాను. నేను వెళ్లి నా తల్లికి చెప్పాను. ఆమెకు అది నేను చూశాను అని చెప్పాను. మరియు వారు నేను వెర్రితనముతో మాట్లాడుతున్నాను లేదా ఏదో అనుకున్నారు. నేను కొంచెం నరాల బలహీనతతో కూడిన రోగము కలిగిన బాలుడిని అని వారు భావించారు.

ఆ సమయం నుండి ఇరవై-రెండు సంవత్సరాల తరువాత, అదే మైదానములో అవతల మునిసిపల్ వంతెన నిర్మించారు మరియు దానిపై పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు. చూశారా? అది మరేది కాదు ... ఇది దేవుడు పంపినది. మీ ప్రార్థనలు దానిని తీసుకు వచ్చాయి. చూశారా?

45

మరియు ఈ భవనంలో దైవ ప్రవక్తగా పిలుచుకునే వ్యక్తి ప్రస్తుతం ఇక్కడ ఉండవచ్చు. అతను లేచి; విషయాలను గురించి మాట్లాడవచ్చు. సాధారణంగా మూడభక్తి ఈ విషయాలను అనుసరిస్తుంది. జాగ్రత్త వహించండి. అది రాకముందే నేను మీకు హెచ్చరిస్తున్నాను. కానీ దేవుడు తన వరములను గురించి సాక్ష్యమిస్తాడు. అది సరియైనదేనా? దానికి ఆయన సాక్ష్యం చెబుతాడు.

ఇప్పుడు, గమనించండి. మరియు దీనిని దగ్గరగా చూడండి. ఆ ... అర్కాన్సాస్ లోని లిటిల్ రాక్ వద్ద ఆమె వెనుకనే ఉన్న ఆ పిచ్చిని గురించి, ఆ మహిళయొక్క స్వస్థత గురించి నేను మీకు చెప్పాను. దాని గురించి నేను చెప్పడం మీకు గుర్తుందా.

నన్ను బ్రదర్ బ్రౌన్ వచ్చి తీసుకువెళ్తారు అని మెంఫిస్, టెన్నిస్సీ నుండి నాకు ఫోన్ వచ్చింది.

మెంఫిస్, టెన్నిస్సీ నుండి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? టెన్నిస్సీ చుట్టూ ఉన్న ప్రాంతముల నుండి ఎవరైనా? చాల మంది ఉన్నారు. నేను అక్కడ కొన్ని టెన్నిస్సీ కార్లను చూసి, నేను అనుకున్నాను... సరే, ఇది మెంఫిస్ వద్ద ఉంది, మరియు ఇది మీ పోస్ట్ మాస్టరుకు జరిగింది. మరియు ... ఎవరైనా, సహోదరి, సహోదరులారా, అర్కాన్సాస్ లో ఆ స్థలం పేరు ఏమిటి? అది అదే. ఎక్కడైతే ఆ పాల్ మోర్గాన్ యొక్క కుమార్తె... వాల్నట్ రిడ్జ్, అర్కాన్సాస్. వాల్నట్ రిడ్జ్ చుట్టూ ప్రాంతాలలో ఉన్నవారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? అర్కాన్సాస్‌లోని వాల్‌నట్ రిడ్జ్ వద్ద పాల్ మోర్గాన్ ఎంతమందికి తెలుసు చేతులు ఎత్తండి? సరే, మీకు ఇపుడు దాని గురించి తెలుస్తుంది. మంచిది. వాల్నట్ రిడ్జ్, అర్కాన్సాస్ ...

46

వాల్నట్ రిడ్జ్ కేసు వచ్చినప్పుడు నేను అర్కాన్సాస్‌లోని కార్నింగ్ వద్ద ఉన్నాను. అర్కాన్సాస్‌లో వారి పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. వాతావరణం వారిని అక్కడ ఆపదు; వారు కేవలం వారిని తీసుకు వస్తారు. మరియు వారు వారిని వీధుల్లోనూ, సంఘం చుట్టూ, పాస్టర్ ఉండే ఇంటి చుట్టూ ఉంచుతారు. నేను అప్పుడు పగలు మరియు రాత్రి ముందుకెళుతుండేవాడిని. నాతో ఇప్పుడు అదే కార్యం జరుగుతుంది. చూశారా? నేను కేవలం కుప్ప కూలిపోయాను. వారికి ముగింపు సమయాలు లేవు, సంఘాలు నన్ను అక్కడ రాత్రంతా ఉండనిచ్చేవారు.

అందువల్ల అక్కడ ఒక ఫోన్ మోగుతూనే ఉండేది. లిటిల్ రాక్ వద్ద శ్రీమతి నెల్లీ రిగ్స్ మీకు తెలుసా? లేదా - ... లిటిల్ రాక్ కాదు, కార్నింగ్వద్ద? సరే, ఆమె వచ్చే ఫోన్ కాల్ కు సమాధానం ఇస్తుండేది. ఆమె, “సరే, అయ్యా, మేము ఆయనను తీసుకురాలేము.” “ఆయన ఇప్పుడే ఒక మంచము దగ్గరకు తీసుకు వెళ్ళాము” అని చెప్పింది.

మరియు ఆ వ్యక్తి నిరంతరం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి “నేను అతనితో మాట్లాడనివ్వండి” అని అన్నాను.

ఆమె, “అది పాల్ మోర్గాన్” అని చెప్పింది.

47

సహోదరుడా, అతను ఏమిటి? అర్కాన్సాస్‌లో అతను ఏమి చేస్తుంటాడు? అక్కడ ఒక విభాగంలో పన్ను వసూలు చేస్తుంటాడు. అయితే ... అప్పుడు అతను అదే అని నేను అనుకోను, అవునా? గుమస్తా, నగరం - లేదా ఒక జిల్లాలో గుమస్తా.

అయితే నేను ఫోన్‌ దగ్గరకు వెళ్ళాను. “నేను వాల్నట్ రిడ్జ్ వద్ద ఒక ప్రదేశంలో గుమస్తాగా ఉన్నాను” అని అతను చెప్పాడు, అది నేను ఉన్నచోట నుండి డెబ్బై మైళ్ళ దూరంలో ఉంది. మరియు “అయ్యా, నేను దేవుని గొప్ప క్రియలు గురించి విన్నాను” అని అన్నాడు. “నా కుమార్తెలో ఒక అద్భుతం చేయాలని నేను కోరుకుంటున్నాను” అని అన్నారు.

నేను, “మిస్టర్. మోర్గాన్, ”నేను ఏ అద్భుతం చేయలేను“. ”దేవుడే స్వస్తపరిచేవాడు“ అని చెప్పాను.

అతను, “సరే, అయ్యా నేను విన్నాను...” “చూడండి”, “మా అమ్మాయి చనిపోతోంది”, “ఆమె- ఆమె చాలా తీవ్రమైన స్థితిలో ఉంది. ఆమె జీవించాలని మేము ఆశించడం లేదు కాని కేవలం - మరో రెండు మూడు గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి.” మరియు , “నేను మా అమ్మాయిని ప్రేమిస్తున్నాను”. “ఆమె నాకున్న ఒక్కగానొక్క కూతురు. ఆమె వయస్సు సుమారు పన్నెండు సంవత్సరాలు.” మరియు, “నేను మిమ్మల్ని రావాలని కోరుకుంటున్నాను”, అని అన్నాడు.

నేను, “మిస్టర్ మోర్గాన్, నేను రావడానికి సంతోషిస్తాను. కానీ అయ్యా ఇక్కడ చూడండి.” “ఇదిగో ఇక్కడ ప్రజలు చిన్న పిల్లలతో వాకిలిలో నిలబడి ఉన్నారు. మరియు వారు రాత్రంతా వర్షంలో ఇక్కడ నిలబడి ఉన్నారు.” “వారు ఎక్కడికీ వెళ్లలేకపోయారు” అని నేను చెప్పాను.

మరియు అతను — అతను, “అయ్యా, నాకు తెలుసు.” “నేను దానిని అభినందిస్తున్నాను” అని అన్నారు. కానీ, “మీరు కూడా ఒక తండ్రి, అవునా?” అని అన్నాడు.

“అయ్యా, అవును” అని నేను చెప్పాను.

48

అతను, “ఒకసారి ఆలోచించండి. ఆ తల్లులు, వారి పిల్లలు చనిపోవడం లేదు.” “వారికి వేర్వేరు కార్యాలు ఉండవచ్చు.” కానీ, “నా బిడ్డకు న్యుమోనియా (ఊపిరితిత్తుల వ్యాధి ) వచ్చింది. మరియు నేను తీసురాగలిగిన ఉత్తమ వైద్యుడు ఆమె మరో మూడు గంటల కన్నా ఎక్కువ బ్రతుకదని చెప్పారు” అని అన్నాడు.

నేను, “అయ్యా, సరే. కాని నేను మూడు గంటల్లో కూడా అక్కడికి చేరుకోలేను” అని చెప్పాను.

“కానీ సహోదరుడా బ్రాన్హాం, మీపై ఒత్తిడి కోసం నేను నా అధికారాన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నానని అనుకోవద్దు” అని అతను అన్నాడు.“ మరియు మిస్టర్ మోర్గాన్ మంచి వ్యక్తి. అతను చాల కాలం, కూడిక అంతటిలో మమ్మల్ని అనుసరించాడు, సోదరుడా కిడ్సన్, అవునా. అతను, ”మీరు ఇప్పుడే వస్తే,“,”నేను ఇప్పుడు... మీకు తెలియదు...“ ”అయ్యా, వారి పిల్లలు, వారు రాత్రంతా నిలబడి ఉన్నట్లయతే“ ”బహుశా వాళ్లు- ఇంకొంచెం సేపు వేచి ఉండవచ్చు. కానీ నా బిడ్డ ఉండలేదు“ మరియు నేను సుమారు పన్నెండు సంవత్సరాల క్రితం ఒక చిన్న అమ్మాయిని కోల్పోయాను. ఇది చాలా కాలం క్రితం నాకు స్వస్థత వరం రాకముందు, మా మొదటి అమ్మాయి మరణించింది, అని అన్నాడు.

49

ఆ చిన్న అమ్మాయి చనిపోబోతున్నదని, ఆయన ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. [టేపుపై ఖాళీ ఉంది.], “సరే, సహోదరుడా బ్రాన్హాం, మీరు అక్కడికి వెళ్లలేరు, హనీ.” “మై”, “మీరు దాదాపుగా చనిపోయినట్లే ఉన్నారు” అని అన్నాడు.

నేను, “సరే, నన్ను మీ... [టేపుపై ఖాళీ ఉంది] చిన్న ప్లైమౌత్ అనబడే కారులో వెనుక అలా పడుకోనివ్వండి” అని అన్నాను మరియు అర్కాన్సాస్ ద్వారా ఆ హైవే నుండి గంటకు డెబ్బై మైళ్ల వేగంతో వెళ్ళాము.

మరియు రహదారిలో, నేను ప్రార్థిస్తున్నాను. మరియు దేవుని యొక్క దూత కొద్ది సమయం కారులోకి దిగివచ్చింది “ఈ మాట అతనితో చెప్పుము. ' యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు' జలములు స్పష్టంగా పారుచున్నవి, 'అదే అతనికి నేను ఇస్తున్న మాట” అని చెప్పింది.

ఆయన వెళ్లిపోయినప్పుడు, నేను ఇప్పుడు ఎంత మెలకువగా ఉన్నానో అంతే మెలకువగా ఉన్నాను. మరియు నేను అరుస్తూ, ప్రభువును స్తుతిస్తూ వెళ్తున్నాను, సహోదరుడు జాన్సన్ “ఏమైంది?” అని అడిగాడు.

సహోదరుడా జాన్సన్, “ప్రభువు దూత ఇక్కడ ఉన్నాడు”, అని నేను చెప్పాను.

అతను, “ఓహ్, సహోదరుడా బ్రాన్హాం...” మీకు తెలుసా... మీలో ఎవరికైనా సహోదరుడు జాన్సన్ తెలుసా, అతను చాలా మంచి వ్యక్తి. అతను తన బ్రేకును లాగి కారుని ఆపి, అతను ఏడవడం ప్రారంభించాడు.

నేను, “ఇప్పుడు ముందుకు వెళ్ళండి. అలా ముందుకు వెళ్తూ నేరుగా వెళ్ళండి” అని అన్నాను.

50

మేము అక్కడికి చేరుకున్నప్పుడు, అర్కాన్సాస్ లోని ప్రజలు ఒకరినొకరు ప్రేమిస్తారు. మరియు వారు పాల్ మోర్గాన్ ని ప్రేమిస్తున్నారు. మరియు అక్కడ చివరి మాట కోసం వేచి ఉండి, ఆ ప్రైవేటు ఆసుపత్రి చుట్టూ, ప్రతిచోటా కేవలం ప్రజలు గుమిగూడారు. అందరూ ప్రేమించిన ఆ చిన్న అమ్మాయి చివరి మాటలు కోసం వారు రాత్రంతా అక్కడ ఉన్నారు.

కానీ అది ఎలా అనిపించిందో మీకు తెలియదు. అక్కడ నుండి దిగి జనసమూహం ద్వారా నెట్టుకుంటూ వెళ్ళడం ప్రారంభించాం. అక్కడ నిలబడి ఉన్న వైద్యులలో ఒకరు ఇక్కడ ఉన్నారు. వారు ద్వారం వద్ద ఉన్నారు. వారు ఇక లోపలికి అనుమతించరు, కానీ మెట్ల వరకు వెళ్లగలిగాము. మరియు వారు వేచి ఉన్నారు; ప్రతి ఒక్కరూ వారిని ఎంతో ప్రేమించారు.

అతను,“మీరు రెవరెండ్ బ్రాన్హాంమా?” అని అడిగాడు.

“అయ్యా, అవును, నేనే” అని చెప్పాను.

అతను, “మిస్టర్ మోర్గాన్ మీ కోసం వేచి ఉన్నాడు” “నేను మీకు గది చూపించనా?” అని అడిగాడు.

“అయ్యా, చూపించండి”. “చిన్నది ఇంకా జీవిస్తున్నదా” అని నేను అన్నాను.

మరియు అతను, “ఉన్నది” అని చెప్పాడు.

ఆపై దారిలో మేము వైద్య పట్టభద్రుడిని కలిశాము. “ఈయన రెవరెండ్ బ్రాన్హాం, మిస్టర్ మోర్గాన్ ఈయన కోసం వేచి ఉన్నాడు” అని అతను చెప్పాడు.

... సరే, ఆ పట్టభద్రుడు తిరిగి వెళుతూ, నాతో, “సహోదరుడా బ్రాన్హాం మీరు ఇక్కడే ఉంటారా?” అని అడిగాడు.

నేను, ఉంటాను. “మొదట నేను తండ్రి మరియు తల్లిని చూడాలనుకుంటున్నాను” అని అన్నాను.

“ఎందుకు వారు గదిలో ఇద్దరు నుర్సులను కలిగి ఉన్నారు, మరియు వారు అమ్మాయికి ఆక్సిజన్ ఇస్తున్నారు” అని అన్నాడు.

51

వారు ఆమెను ఒక ప్రాణ వాయువును పీల్చేందుకు వీలుగా తయారు చేసిన గుడారములాంటి సాధనములో ఉంచలేకపోయారు, వారు ఆమెను ఒక రబ్బర్ మాస్క్ పెట్టి ఉంచవలసి వచ్చింది. ఇప్పుడు, ఇక్కడ ఒక వైద్యుడు ఉంటే, నేను ఇంతకు ముందు ఎన్నడూ అలాంటిది చూడలేదు. వారు దానిని అక్కడ ఉంచి, ఆక్సిజన్ ను (ప్రాణ వాయువును) బలవంతముగా ఆ పాపలోనికి పంపిస్తున్నారు. మరియు ఆమె కొంత ఊపిరి తీసుకుంటుంది ... [సహోదరుడు బ్రాన్హాం ఉదహరిస్తున్నాడు.] అప్పుడు వారు మళ్ళీ ఆమెపై ఆ మాస్కును ఉంచుతారు, తరువాత మళ్లీ ఆక్సీజన్ సంఖ్య కిందకిపడిపోయినప్పుడు, నర్సు దానిని తీసుకొని, దానిని మళ్ళీ లోపలికి పంపిస్తుంది, మరియు వారు ఆ విధంగా ఆమెను సజీవంగా ఉంచుతున్నారు.

నేను తలుపు తట్టడం ప్రారంభించినప్పుడు, ఓహ్, నాకు సమీపంలో ఏదో నిలబడినట్టు అనిపించింది. అక్కడ నిలబడి ఉన్న సోదరుడు జాన్సన్ తో “బ్రదర్ జాన్సన్, లోపలికి రావద్దు. నన్నుఒంటరిగా వెళ్ళనివ్వండి” అని అన్నాను.

నేను తలుపు వద్దకు వచ్చాను. ఒక నర్సు తలుపు తెరిచింది. ఆమె, “మీకు ఏమి కావాలి?” అని అడిగింది.

నేను, “నేను సహోదరుడు బ్రాన్హాంను. నేను చూడాలనుకుంటున్నాను...” అని అన్నాను.

“లోపలికి రండి” అని చెప్పింది. నేను లోపలికి నడిచాను.

మిస్టర్ మోర్గాన్, “మీరు సహోదరుడు బ్రాన్హాం?” అని అన్నాడు.

నేను “అవును” అని చెప్పాను.

మరియు అతను వెంటనే వచ్చి నా పైన చేతులు ఉంచి. మీకు తెలుసా, అతను ఒక గొప్ప మంచి వ్యక్తి. అతను, సహోదరుడు బ్రాన్హాం“, ”నేను సరిగ్గా జీవించడానికి ప్రయత్నిస్తున్నాను. నేను —నేను సరైనదే చేయడానికి ప్రయత్నిస్తున్నాను. దేవుడు నా బిడ్డను ఎందుకు తీసుకుంటున్నాడో నాకు తెలియదు“ అని అన్నాడు.

నేను, “ సహోదరుడా మోర్గాన్, ఉద్రేకపడకండి” అని అన్నాను.

నేను నర్సు వద్దకు నడిచి వెళ్ళాను. మరియు ఆమె, “మేము ఈ ఆక్సిజన్ను కొనసాగించాలి” అని చెప్పింది.

నేను, “ఫర్వాలేదు. మీరు అలా చేయాలని కోరుకుంటున్నాను” అని చెప్పాను.

52

ఆ చిన్న పిల్ల పడుకుని ఉంది, ఇలా వంగిపోయి ఉంది. నేను నా చేతులను ఆమెపై ఉంచి, “ఇప్పుడు, ”మీరు మరియు తల్లి దేవునికి సేవ చేస్తామని, దాని గురి౦చి మీరు ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యమిస్తామని తండ్రితో వాగ్దానం చేస్తారా?“ అని అన్నాను.

“మేము చేస్తాం.”

నేను, “భయపడవద్దు. నా వద్ద మీ కొరకు ఒక మాట ఉంది, ఎందుకంటే నేను మీ బిడ్డ కోసం ప్రార్థించిన తరువాత అది ప్రభువు నుండి వచ్చింది. ”నేను బిడ్డపై చేతులు పెట్టి, యేసుక్రీస్తు నామమున పిలిచాను. మరియు నేను అలా చేసినప్పుడల్లా, వారు ఆమె ముక్కుపై ఆక్సిజన్ ఉంచాల్సిన అవసరం లేదు. నేను వెనక్కి తిరిగి, “మిస్టర్ మోర్గాన్, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు”, “చాలా మంది వైద్య నిపుణులు ఉన్నారు మీ బిడ్డ చనిపోబోతున్నదని ప్రకటించారు. కాని యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీ బిడ్డ బ్రదుకుతుంది.”, “ఆమె కోలుకుంటుంది. మరియు ఇక్కడ మీ కొరకు మాట ఉంది. 'జలములు స్పష్టముగా పారుతున్నాయి' దీనిని మీ జీవిత కాలమంతయు గుర్తుంచుకోండి” అని అన్నాను.

మీవద్ద సాక్ష్యం లేదు, అవునా? లేదు. మరియు ఆయన నోటరీ ద్వారా సంతకం చేశాడు.

ఆపై నేను భవనం నుండి బయటకు నడిచి వెళ్ళాను. మరియు మూడవ రోజున, ఆ పాప బడికి వెళ్ళింది. ఆమె స్వస్థపరచబడింది. చూశారా ?

53

ఇప్పుడు, లిటిల్ రాక్ వద్ద, వారు నన్ను రమ్మని కబురు పంపారు... అక్కడ ఆ వ్యక్తి పేరు ఏమిటి? అక్కడ పోస్ట్ మాస్టర్... అది ఎవరైనప్పటికీ, ఆ వ్యక్తి మెంఫిస్ నుండి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసని, నేను ఊహిస్తున్నాను. అతను-అతను పొడవైన వ్యక్తి. కానీ ఏదేమైనా, నేను ఇక్కడ వివరణల ద్వారా వెళ్ళినప్పుడు, మీకు తెలుస్తుంది. ఆ కెన్ని అనే వ్యక్తి అతనితో ఉన్నాడు.

మరియు వారు ఈవ్యక్తి చనిపోబోతున్నాడని అతని కోసం ప్రార్థించడానికి నేను అక్కడికి రావాలని కబురు పంపారు.

సరే, నేను మొదటిగా వెళ్ళే విమానమునకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. మరియు త్వరగా వెళ్ళడానికి బదులు... ఇంకా వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాను, మరియు నేను ఆ సూట్ బట్టలను సర్దుకుంటున్నాను. మరియు గాలి గదిలోనికి వస్తున్నట్టు ఏదో నేను విన్నాను, వస్తూ వెళ్తూ ఉంది, వ్యూ , వ్యూ, వ్యూ, వ్యూ. [సహోదరుడు బ్రాన్హాం ఉదహరిస్తున్నాడు.] నేను, “ఓ, ఈ రోజు గాలి చాలా ఎక్కువగా ఉంది” అని అనుకున్నాను. నేను నా చొక్కా ధరించాను, కోట్లు మరియు వస్తువులను పెట్టుకున్నాను. నేను పాడుతున్నాను. మరియు ఆ వ్యక్తి చనిపోతున్నాడని, సహోదరుడు బ్రౌన్ నేను అక్కడికి వెళ్ళడానికి సిద్ధం చేస్తున్నాడు.

54

డాక్టర్ జనరల్ పాటన్ వద్దకు వెళ్ళిన వ్యక్తి...మీకు అతను గుర్తున్నాడా? వారు ఈ వ్యక్తి కోసం అతన్ని విమానంలో అక్కడికి తీసుకువచ్చారు. ప్రతీదీ అతను చనిపోతున్నాడని చెప్పింది, అతనికి ఊపిరి తిత్తుల సమస్య కూడా ఉంది. “అతను చనిపోబోతున్నాడు. మనిషి బాగుపడలేడు, ”ఆయాసం, ఆయాసకరమైన ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నది అని చెప్పారు. కాబట్టి నేను నా కోటు ధరించడం ప్రారంభించాను, మరియు నేను సహోదరుడు బ్రౌన్ ఎప్పుడైనా తీసుకువెళ్ళడానికి రావచ్చు అని అనుకుంటున్నాను.

మరియు వారు వాహనం పొందలేకపోయారు... కాబట్టి మిస్టర్ కెన్నీ వేగంగా వెళ్ళే కారులో వచ్చాడు. మీకు తెలుసా, అతను అక్కడ చట్ట సంబంధమైన ఒక అధికారి, ఆయన వద్ద కారుపైన ఎరుపు లైటు, సైరన్ ఉన్నాయి. అతను, విమానం తప్పిపోకుండా ఉండడానికి అతను నన్ను తీసుకువెళ్ళడానికి త్వరగా బయలుదేరి వచ్చాడు.

55

నేను అక్కడ గదిలో ఏదో గిర్రున తిరుగుతూ ఉండటం చూశాను. మరియు నేను ప్రార్ధన చేయడానికి మోకరించాను. నేను అలా చేసిన తరువాత ప్రభువు దూత, “అక్కడికి వెళ్లకుము. అతని సమయం దగ్గర పడింది” అని మాట్లాడింది. అయితే సరే. నేను లేచి నా కోటును తీసివేసాను. కొన్ని క్షణాలలో, వారు తలుపు వరకు వచ్చారు. మరియు సహోదరుడు కెన్నీ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి , “సహోదారుడా బ్రాన్హాం?” అని అన్నాడు.

“అవును” అని చెప్పాను. మరియు సహోదరుడు బ్రౌన్ అతనితో ఉన్నాడు. ఇప్పుడు, మీ అందరికీ సహోదరుడు బ్రౌన్ తెలుసు, లేదా మీలో ఎవరైనా ఈ సాక్ష్యాన్ని రాయాలనుకుంటున్నారా. అతను నాపైన చేయి వేసి, “ఓహ్, నేను విశ్వాసం ద్వారా తెలుసుకున్నాను” అని అన్నాడు. “అతను పాల్మోర్గాన్ యొక్క వ్యక్తిగత స్నేహితుడు” అని చెప్పాడు, “అతనికి తన కుమార్తె గురించి తెలుసు.” మరియు, “వాస్తవానికి, అతను ఇప్పుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు.”కానీ, “మీకు తెలుసా, అతను నా ప్రియమైన స్నేహితుడు” అని అన్నాడు.

“కానీ అయ్యా, మీరు తిరిగి వచ్చినప్పుడు మీ స్నేహితుడు వెళ్లిపోతాడు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ మనుష్యుడు చనిపోబోతున్నాడు” అని నేను చెప్పాను.

56

సరే, మీరు కేవలం... [టేపుపై ఖాళీ ఉంది ] “సరే, పరిశుద్ధాత్మ నన్ను వెళ్ళకూడదు అని హెచ్చరించింది. అతను కొన్ని క్షణాల క్రితం గదిలో నాతో మాట్లాడాడు.”

అతను, “కానీ సహోదరుడా బ్రాన్హాం,” “వారు కేవలం ... అతని భార్య చెప్పింది... వారు కేవలం ...మీకు తెలుసా వారు ఒక పెద్ద సంఘం నుండి వారి సంఘములోనికి వెళ్తున్నారు ...,.” మరియు, “మీరు కేవలం వస్తే..., ”మీరు ఆమెకు ఎంతో చేసిన వారు అవుతారు“ అని అన్నాడు.

నేను, “కానీ అయ్యా, నేను సహాయం చేయలేను. నేను దేవుని చిత్తానికి వ్యతిరేకముగా వెళ్ళలేను. నేను వెళ్ళలేను” అని అన్నాను.

అతను, “అంటే నా స్నేహితుడు చనిపోతాడని మీరు అంటున్నారా?” అని అన్నాడు.

“మీరు తిరిగి వచ్చినప్పుడు అతను చనిపోయి ఉండవచ్చు”. “ఏదేమైనా, మీరు ఏ సమయం వరకు తిరిగి వస్తారు?” అని నేను అన్నాను.

“ఈ రాత్రి ఎనిమిది గంటలకు తిరిగి వస్తాను” అని అన్నాడు.

నేను, “ఉదయం నాకు కాల్ చేయండి. నేను ప్రార్థిస్తుంటాను.”, “నాకు అతనిపై ఆసక్తి ఉంది. మరియు ఆయన ఎప్పుడు మరణించినా నాకు తెలియజేయుము.”,“ అతను మరణించినప్పుడు, మీరు ఉదయం నాకు ఫోను చేసి అతని పరిస్థితి నాకు తెలియజేయండి, మరియు మీరు వెళ్ళేసరికి అక్కడ అతను మరణించినట్లయితే నాకు తెలియజేయండి. మరియు ఈ రాత్రి నాకు ఫోను చేయవద్దు, ఎందుకంటే నేను కూడికలో ఉంటాను. మరియు నాకు కాల్ చేయవద్దు, ఎందుకంటే, ఉదయం రెండు మూడు గంటల వరకు కూడిక నుంచి రాకపోవచ్చు” అని చెప్పాను.

సరే, అతను ఏడవడం ప్రారంభించాడు. అతను, “నా స్నేహితుడు. నా స్నేహితుడు” అని ఏడుస్తూ తిరిగి వెళ్ళాడు.

57

సరే, నేను ఆ రాత్రి కూడికకు వెళ్ళాను, మరియు ఆరాత్రే ఆ పిచ్చిపట్టిన మహిళ స్వస్థపరచబడింది. చూసారా? తిరిగి వెళ్లి పడుకున్నాను. నేను లోపలికి వెళ్ళేటప్పుడు సమయం రెండు అయ్యింది.

మరుసటి రోజు ఉదయం, నేను గదిలో మేల్కొన్నాను... ఇప్పుడు, మీరు దీనిని జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నాను, ఇప్పుడు, తద్వారా మీరు సహోదరుడు బ్రౌన్ నుండి కథను పొందవచ్చు. నేను గదిలో అలా మేల్కొన్నప్పుడు, నేను కేవలం .... మరియు నేను అనుకున్నాను, “ఓ, ఇది పగటి వెలుగు.” మరియు అక్కడ ఒక మహిళ నా మంచం పక్కన ఉంది. సరే, నా గది గడియ వేసి ఉంది. నా తలుపు గడియ వేసి ఉంది. ఆమె లేత గోధుమ రంగు సూట్ కలిగి ఉంది. ఆమె బూడిద రంగుజుట్టును కలిగి ఉంది. స్త్రీలు వేయిస్ట్ అని పిలిచే ఆ తెల్లని ప్యాంటు ఆమె వేసుకుని ఉంది. దానిని సూట్ అని పిలుస్తారు అని నేను అనుకుంటున్నాను, అంతేనా, ఒకే రంగులో కోటును కలిగి ఉండే దుస్తులు వాటిని సూట్ అని అంటారు? కాబట్టి ఆమె అక్కడ ఉంది. మరియు ఆమె -ఆమె చాలా విచారంగా పక్కకు తిరిగి ఉంది.

మరియు నేను... నేను పైకి లేచాను; నేను, “ఎందుకు, ఇక్కడ ఉంది అని. ఆ మహిళ ఇక్కడికి ఎలా వచ్చింది. తలుపు గడియ వేసి ఉంది, మరియు ఇక్కడ తాళము ఇక్కడే ఉంది. మరియు ఆ మహిళ అక్కడ ఉంది” అని అనుకున్నాను. మరియు నేను “మేడమ్...” అని అనడానికి పైకి లేవడం మొదలు బెట్టాను.

నేను అలా చేసినప్పుడు, నేను ఇక్కడ తిరిగి చూశాను, మరియు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. మరియు అతను పొడవైన మనిషి, లేత రంగు సూట్, బూడిద రంగుజుట్టుతో, ఎరుపు రంగు టై ధరించాడు. అతను కేవలం చాలా విచారంగా కనిపిస్తున్నాడు. ఆమె అతని వైపు చూసింది, మరియు అతను కొంచెం అలా నవ్వాడు. మరియు వారు ఒకరినొకరు చూసుకున్నారు.

58

నేను, “సరే, ఇది ఏమిటి?” మరియు నేను సరిగ్గా పైకి లేచాను ... స్నేహితులారా, నేను మిమ్మల్ని ఇక్కడ చూస్తూ ఎంత సహజముగా ఉన్నానో అంతే సహజంగా ఉంది (దేవుడే నా తీర్పరి.), నేను, “సరే, ఇదేమిటి?” అని అన్నాను. నేను పైకి చూశాను, మరియు నేను ఎక్కడో ఒక సంఘములో ఒక వేదికపై నిలబడి ఉన్నాను. సరే, నేను....? ...నేను నిద్రపోతున్నానా లేదా ఏమిటి అని చూడటానికి నా వేలిని కొరికాను.

ఇది ఒక దర్శనము కాదు అని నేను చూశాను. మరియు నేను దానిని చూశాను, మరియు అప్పుడు అది పోయింది...అది మసకబారి వెళ్ళిపోయింది. మరియు వారు ఒకరినొకరు చూసి నవ్వుకోవడం నేను చూశాను. మరియు వారు నావైపు తలవంచి, ఒకరినొకరు చూసి నవ్వుతూ, అలా తమ తల వంచి ఉన్నారు. మరియు వారు గదినుండి అలా మసకబారుతూ వెళ్ళిపోయారు.

59

సరే, నేను లేచి, నేను ప్రార్థి౦చాను. మరియు నేను, “దేవా, నాకు వారు తెలియదు. దీని అర్ధం ఏమిటి? బహుశా ఈ రోజు ఆ వివరణతో ఎవరైనా వచ్చిఉండవచ్చు” అని అనుకున్నాను. కొన్నిసార్లు నేను ప్రజలు ఆ విధంగా కూడికకు రావడం చూస్తుంటాను. నేను అన్నాను, “ఇప్పుడు, నేను వారిని చూసినప్పుడు...” నేను చాలాసార్లు వెళ్లి, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, లేచి నిలబడు” అని చెప్పడాన్ని మీరు విని ఉంటారు. చూశారా? 'ఎందుకంటే దేవుడు అప్పటికే దాని గురించి మాట్లాడాడు. అది జరగాలి. మరియు నేను,“సరే, ఎవరో అలా ఉండి ఉంటారు” అని అనుకున్నాను.

కాబట్టి నేను— నేను, “సరే, నేను బైబిలు చదువుతాను,” అని అనుకున్నాను, అది నా వద్ద ఉన్న ఇదే బైబిలు. నేను, “ప్రభువా, ఈ ఉదయం నా కొరకు నేను చదవడానికి మీ బైబిలులో ఏది ఉంచారు.” నేను ప్రభువు వాక్యమును చదవడానికి ఇష్టపడతాను. నేను నా చేతిని ఇలా తీసి, దానిని బైబిల్ పై ఉంచి, దానిని తెరిచాను. మరియు యెషయా అతని సమయం వచ్చిందని హిజ్కియా వద్దకు ప్రకటించడానికి పంపించబడిన చోట అది తెరుచుకుంది. హిజ్కియా తన ముఖమును గోడతట్టు త్రిప్పుకుని ప్రభువును ప్రార్థించాడు. మరియు ప్రభువు తన స్వరమును విని తిరిగి వచ్చి యెషయాతో, ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్షును ఇచ్చెదనని అతనికి చెప్పమని చెప్పెను.“ మీకు గుర్తుందా? ”సరే, ఇది వింతగా ఉంది?“ అని నేను అనుకున్నాను. సరే ఈ లేఖనం... నేను ఆ విషయం మర్చిపోయాను- అక్కడ ఆ కేసు అయిపోయింది. ”ఇది వింతగా ఉంది, కదా“ అని నేను అన్నాను.

60

మరియు ఆ సమయములో, ఫోన్ మోగింది. నేను, “సరే, అది సహోదరుడు బ్రౌన్ నాకు సహాయం చేయడానికి నన్ను తీసుకుని వెళ్ళడానికి నాకు ఫోను చేస్తున్నారు. మీకు తెలుసా... అక్కడ, అతనితో ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నారు. ”అతను నన్ను అల్పాహారం కోసం తీసుకురావడానికి వస్తున్నాడు అని అనుకున్నాను. మరియు నేను ఫోను లేపి తీసుకున్నాను. నేను “హలో” అని అన్నాను.

అతను, “హలో. సహోదారుడా బ్రాన్హాం?” అని అన్నాడు.

నేను, “అయ్యా అవును నేనే. సహోదరుడా బ్రౌన్, మీరు ఎలా ఉన్నారు?” అని అన్నాను.

అతను, “నేను సహోదరుడు బ్రౌన్ కాదు. నేను మెంఫిస్లో బ్రదర్ కెన్నీ” అని అన్నాడు.

నేను, “ఓహ్”, నేను ఎక్కడ ఉన్నానో మరియు ఏ గదిలో ఉన్నానో (చూసారా?), సహోదరుడు బ్రౌన్ కి తప్ప ఎవరికీ తెలియదు అని అనుకున్నాను. అయితే సహోదరుడు కెన్నీకి కూడా తెలుసు అని నాకు తెలిసింది. “అవును” “సరే, మీకు ఎలాంటి వార్త వచ్చింది?” అని నేను అడిగాను.

61

అప్పుడే ఆ దర్శనం ఏమిటో నా మనస్సులో వెలిగింది. మరియు అతను, “సరే, సహోదరుడా బ్రాన్హాం, మేము రాత్రంతా ఏర్పాట్లు చేసాము. అతను వెళ్లిపోతున్నాడని మేము అనుకున్నాము.”, “...వారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు.” “వారు ఎప్పుడైనా చివరి నిమిషం కోసం చూస్తున్నారు” అని అన్నాడు. “సహోదరుడు బ్రాన్హాం,...... మీరు సంవత్సరం మొదటిలో జోన్స్ బోరోకు వెళ్ళినప్పుడు మీ తరువాత కూడికలో నా భార్యను పరిగణనలోకి తీసుకోమని అడుగుతున్నాను” అని అతను అన్నాడు. “ఆమెను తీసుకుని వచ్చి, కూడికలో ఉంచమంటారా?” అని అన్నాడు..

“అయ్యా, మీరు తీసుకుని రాగలరు” అని నేను చెప్పాను. కానీ నేను, “మీరు చెప్తున్నారు....?

అతను, “అవును,” “అతను చనిపోతున్నాడు” అని అన్నాడు.

“అతని భార్య ఉందా?” అని నేను అడిగాను.

“అవును ఉంది” అని అన్నాడు.

నేను, “అతని భార్య ఎప్పుడైనా గోధుమ రంగు సూట్లాంటి దుస్తులు ధరించి, తెల్లటి ప్యాంటు కలిగి ఉందా. ఆమె ఒక రకమైన బూడిద జుట్టు గల మహిళనా?” అని అన్నాను.

“ఖచ్చితంగా” అని అన్నాడు.

నేను, “అతను ఎప్పుడైనా లేత రంగు సూట్ ధరించాడా? అతను బూడిద రంగు జుట్టును కలిగి, మరియు ఎరుపు టైను అతను ధరించాడా?” అని అన్నాను.

“అతను అన్ని సమయాల్లో దుస్తులు ఆ విధముగానే ధరిస్తాడు. ఎందుకు? మీకు అతను తెలుసా?” అని అన్నాడు.

నేను, “అయ్యా, అవును. అతని భార్యను ఫోన్ దగ్గరికి రమ్మని చెప్పండి” అని అన్నాను.

అతను, “సరే, సహోదరుడా బ్రాన్హాం, వారు అతనుఏ సమయంలోనైనా వెళ్ళిపోతాడు అని చూస్తున్నారు” అని చెప్పాడు.“

“సరే, ఫోన్ దగ్గరకు రమ్మని చెప్పండి” అని నేను చెప్పాను.

సరే, “అతను చనిపోతాడని మీరు చెప్పారని నేను ఇప్పటికే ఆమెకు చెప్పాను.” అని అతను అన్నాడు.

“కానీ ఆమె ఫోన్ దగ్గరకు రావాలని నేను కోరుకుంటున్నాను” అని నేను చెప్పాను.

ఆమె ఫోన్ వద్దకు వచ్చింది, నేను “హలో” అని అన్నాను. మరియు నేను మాట్లాడేది ఆవిడతోనేనా అని అడిగాను.

“అవును” అని అన్నది.

మరియు నేను, “సరే, నేను సహోదరుడు బ్రాన్హాం” అని చెప్పాను.

“సరే”. “విన్నాను, సహోదరుడా బ్రాన్హాం” అని అన్నది.

నేను, “కానీ చూడండి, సహోదరి. మీరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారా?” అని అన్నాను.

“అంటే ఏమిటి?” అని ఆమె అడిగింది.

నేను, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీ భర్త బ్రదుకుతాడు”, “మీరు - మీరు ...మీరు నమ్ముతున్నారా?” అని అన్నాను. మరియు నేను సమాధానం వినలేదు. నేను, “మీరు నమ్ముతున్నారా?” అని అడిగాను. నేను సమాధానం వినలేకపోయాను.

62

నేను అనుకున్నాను... ఆమె మూర్ఛపోయింది ఎవరో అక్కడ లేపి తీసుకువెళ్ళడం నేను విన్నాను. ఆమె నేలపై పడిపోయింది. కాబట్టి, సహోదరుడు కెన్నీ ఫోన్ తీసుకున్నాడు, “సహోదరుడా బ్రాన్హాం ఏమైంది? ఆ స్త్రీ మూర్ఛపోయింది” అని అన్నాడు.

నేను, “నేను యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆమె భర్త జీవించబోతున్నాడు అని ఆమెతో చెప్పాను” అని అన్నాను.

అతను, “ఏమిటి?” అని అన్నాడు.

“అవును, అతను జీవించబోతున్నాడు” అని నేను చెప్పాను. “నేను కొన్ని క్షణాల క్రితం నా దర్శనములో అతనిని చూశాను. అతనిని వర్ణించాను. ఆమె జీవించబోతోంది... లేదా అతను జీవించబోతున్నాడు” అని అన్నాను.

అతను, “ఓహ్, నేను మీతో పాటు రావచ్చా?” అని అన్నాడు.

నేను, “తదుపరి వచ్చే విమానాన్ని కలవండి. నేను అక్కడ ఉంటాను” అని అన్నాను.

63

[టేపుపై ఖాళీ ఉంది] ... ఆ హాస్పిటల్ కు వెళ్ళాను... [టేపుపై ఖాళీ ఉంది] ...? ... వైద్యులు అక్కడ ఉన్నారు. నేను లోపలికి నడిచి వెళ్ళాను. ఇక్కడ అతని సోదరి హాల్ లోకి వచ్చి, ఆమె, “ఇక్కడ పరిశుద్ధమైన దొర్లే బోధకుడు ఇక్కడ ఉన్నాడు, మరియు నా సోదరుడు అక్కడ చనిపోతున్నాడు. ఆ తలంపు ఒక అవమానం అని నేను అనుకుంటున్నాను” అని చెప్పింది.

ఓహ్, అది సాధ్యం కాలేదు... ఏదీ దానిని ఆపలేదు. అది ఆపడానికి సరిపోయే పిశాచులను ఆ దెయ్యం నరకం నుండి బయటకు పంపలేకపోయింది. ఆపగలిగేది ఏదీ లేదు. ఏదీ లేదు. ఇది ఖచ్చితంగా ఉంటుంది. అంతే. అది జరిగిపోయింది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. అది ఉంది. ఓహ్, నేను అక్కడ నడవటానికి ఎలా భావించానో మీకు తెలియదు.

హాల్ లోకి నడిచాను, ఇక్కడ నుండి ఒక నర్సు బయటకు వచ్చింది. నేను, “అమ్మా అక్కడ ఎవరైనా ఉన్నారా?” అని అడిగాను.

మరియు ఆమె, “అవును, అక్కడ ఇద్దరు వైద్యులు ఉన్నారు” అని చెప్పింది.

“బయటకు వెళ్లమని వారికి చెప్పండి” అని నేను చెప్పాను. ఓహ్, మై. ఓహ్, మై. నేను ఎలా భావించానో మీకు తెలియదు.

గదిలో, కేవలం ఇద్దరు ఉన్నారు. లోపలకి నడిచి వెళ్ళాను...

స్నేహితులారా, మీరు... మీరు ఇలా ఆలోచిస్తున్నారు అని నాకు తెలుసు... మీలో కొందరు నన్ను మత పిచ్చిగల వానిగా తీర్పు తీర్చవచ్చు, కాని ఎవరి యెదుట అయితే నిలబడతానో ఆ దేవుడే నా తీర్పరి. అలా గదిలోకి నడిచి వెళ్ళాను, మరియు మీకు తెలుసా ఆ వెటకారమైన చూపుతో ఆ వైద్యులు బయటకు వెళ్ళారు. లోపలికి నడిచాను, మరియు ఒక పేద వృద్ధ సహోదరి, ఆమె మూర్ఛ పోబోతున్నది. మరియు నేను, “ఇప్పుడు ఆందోళన చెందవద్దు” అని చెప్పాను.

64

నా దగ్గర పెద్ద పైచొక్కాయి లేదు, నేను సహోదరుడు బ్రౌన్ దగ్గర అరువు తీసుకున్నాను. మరియు నా జేబులో ఈ బైబిల్ ఉంది. మరియు ఆ పైచొక్కాయి నాకు చాలా పెద్దది అయింది; నేను కేవలం దానిని నేను అంత చెడ్డగా కనబడకుండా ఉండటానికి తీసుకెళ్లాను.... అది చల్లని వాతావరణం. కాబట్టి నేను పైచొక్కాయిని కుర్చీపై పెట్టి, ఆమెతో, “ఇప్పుడు, మీరు వెళ్ళి బైబిల్ తీసుకొని ఒక లేఖనం తీయండి, నేను అక్కడ చూసినట్టుగా యెషయా గ్రంధములోనుండి అని చెప్పాను. ఆమె దానిని చదవడం ప్రారంభించింది.

నేను అతని వైపు చూశాను, మరియు బురద రంగులో కనిపించే అతని కళ్ళు, మీకు తెలుసా, అతని కళ్ళు నుండి ఆ నీరు బయటకు వస్తోంది. అతని నోరు వెనక్కి తిరిగి ఉంది; ఆయన చెవులు అలా ఉన్నాయి. అతను ఆ ఆక్సిజన్ డేరా (ప్రాణ వాయువును పీల్చేందుకు తయారు చేయబడిన సాధనము) కింద అక్కడ పడుకున్నాడు. మరియు...

65

ఆక్సిజన్ డేరా లోకి చేరుకుని అతని చేతిని పట్టుకున్నాను. అక్కడ ఆ కంపనాలు తగులుతున్నాయి. మరియు నేను అతనిని కొంచెం కదిలించాను. “అయ్యా, నా మాట వినబడుతుందా?” అని అడిగాను.

“అతను అక్కడ రెండు రోజులుగా అపస్మారకముగా ఉన్నాడు”అని ఆమె చెప్పింది.

నేను, “నేను చెప్పే ఒక్క మాటకూడా మీరు సందేహించడంలేదు, అవునా?” అని అన్నాను.

ఆమె, “అయ్యా, లేదు. నేను ఒక విషయాన్ని కూడా సందేహించడం లేదు” అని అన్నది. ఆమె ఒక మంచి దీనురాలైన మహిళ.

నేను అతని చేతిని పట్టుకున్నాను. నేను, “ప్రియమైన దేవా, ఈ ఉదయం దర్శనములో నాతో మాట్లాడారు, ఈ వ్యక్తులు అర్కాన్సాస్ లోని జోన్స్ బోరోలో కూడికలో నన్ను కలవనైయున్నారు అని నాకు తెలుసు... నేను ఆ వేదిక మీద నిలబడి ఉండగా వీళ్ళే ఆ స్త్రీ మరియు పురుషుడు.”, “ఇప్పుడు, దేవుని దూతని మాట్లాడనివ్వండి” అని అన్నాను. కంపనం ఆగినదని నేను భావించాను. నేను ప్రార్థిస్తూనే ఉన్నాను.

అతను నా చేతిని పట్టుకున్నట్లు నేను భావించాను. దేవుడు అక్కడ ఉన్నాడని నాకు తెలుసు. అతను నా చేతిని కొంచం గట్టిగా నొక్కి పట్టుకున్నట్లు నేను భావించాను. నేరుగా, నేను పైకి చూశాను, మరియు అతను తన పెదవులను తడపడం నేను చూడటం మొదలు పెట్టాను. ఆమె ఇంకా మంచం దగ్గర ఏడుస్తూ ఉంది. మరియు నేను కొంచెం సేపు వేచి ఉన్నాను, నేరుగా అతను అలా చూడటం నేను చూశాను. “నేను మీకు తెలుసా?” అని అడిగాను.

66

మరియు వెంటనే పైకి లేచి; చూసింది. అతను అతని చేతిమీద ఇలా, నన్ను చూస్తూ అతని తలను పైకి లేపడం ఆమె చూసింది. “నేను తెలుసా?” అని అడిగాను.

“తెలుసు, మీరు సహోదరుడు బ్రాన్హాం” అని చెప్పాడు.

ఓ, ఆమె దాదాపు ఆ ఆక్సిజన్ గుడారం గుండా వెళ్లి. ఆమె, “నాన్న, నాన్న, నాన్న, నాన్న,” అని పిలుస్తూ, అతనిని అలా పట్టుకుని, వెళ్లి అతనిని హత్తుకుంది. అలా వారు చేస్తుండగా నేను గది నుండి జారుకుని, మెట్లు దిగి వెళ్ళి, విమానంలోకి తిరిగి వెళ్ళిపోయాను. నేను విమానం వద్దకు బయలుదేరినప్పుడు, అసెంబ్లీస్అఫ్ గాడ్ వారు అక్కడ చాలా మంది ఉన్నారు, వారు ఎక్కడవారో నాకు తెలియదు... వారు వరుసగుండా వెళుతున్నారు. వారిలో పోలియో కలిగిన ఒక చిన్న అమ్మాయి ఉంది. వారు ఆమెను పియానో వాయించుటకు మోసుకుని తీసుకు రావలసి వచ్చింది.

నేను దీని తరువాత ప్రయాణములో విమానంలో ఆగినప్పుడు ...అక్కడ నేనొక రెస్టారెంట్లో ఉన్నాను, మరియు ఆ అమ్మాయి వచ్చి నా పక్కన కూర్చుని. “సహోదరుడా బ్రాన్హాం మీకు నేను గుర్తుకు ఉన్నానా?” అని అడిగింది.

నేను అనుకున్నాను... నేను కొన్ని క్షణాలు నేలపై మూర్ఛపోయాను. మరియు నేను, “లేదు, మేడమ్. లేదు” అని చెప్పాను.

ఆమె, “మీరు నా కొరకు ప్రార్థించారు. నేను అక్కడ పోలియో కేసుతో వచ్చాను...? ... .” మరియు అక్కడ... [టేపుపై ఖాళీ ఉంది ]

67

మూడవ రోజున ఆ తర్వాత రెండవ రోజు ఆ వ్యక్తి మంచం మీద నుండి లేచి. గడ్డము గీసుకుని, అల్పాహారం కోసం హామ్ మరియు గుడ్లు తింటూ, ఇంటికివెళ్లి, తిరిగి తన పనికి వెళ్ళాడు. అతను ఇప్పుడు అక్కడ నివసిస్తున్నాడు. ఎందువల్ల? అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు గనుక. నా ఉద్దేశ్యం ఏమిటో చూడండి?

ఇప్పుడు, ఫీనిక్స్ ప్రజలారా, అది ఏమిటో ఇక్కడ చూడండి. దేవుడు ఈ వరమును ఖచ్చితముగా పనిచేయడానికి అలా ఉద్దేశిస్తాడు. అందరూ, మీకు ఇది అర్థమైందా? మీకు అర్ధం అయితే, “ఆమెన్” అని చెప్పండి. [సంఘం “ఆమెన్” అని అంటున్నారు.]. ఇప్పుడు, గుర్తుంచుకోండి, ఆ వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని పొందడానికి అతనికి వ్రాయండి. రెవరెండ్ జి.హెచ్. బ్రౌన్, 505 విక్టర్ స్ట్రీట్, లిటిల్ రాక్, అర్కాన్సాస్. మరియు మరొకటి హెరాల్డ్ నెయిల్, సౌత్బోస్టన్, ఇండియానా. మరియు జాన్ ఎమ్మెల్, యుటికా, ఇండియానా, ఆర్ ఎఫ్ డి 2. ఇప్పుడు, ఆ సాక్ష్యముల కోసం...ఒకదాని తరువాత మరొకటి.

68

ఇప్పుడు ప్రభువు దూత అలా మాట్లాడుతున్నప్పుడు, దాని ముందు నిలబడేది ఏదీ లేదు. అది పరిపూర్ణమైనది... అప్పుడు నా విశ్వాసం సంగతి ఏమిటి? అవును, ఇది జరుగుతుందని నాకు తెలుసు. దాని గురించి ఇంక ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు; అది జరుగుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయి ఇరవై సంవత్సరాలు సమాధిలో ఉండి, ఆయన “అక్కడికి వెళ్లి మాట్లాడు” అని చెప్పినట్లయితే, ఆ ప్రార్థన సమాధానం లేకుండా తిరస్కరించబడకముందే పరలోకము దాని పరిధి దాటి కదిలింపబడుతుంది అని నేను నమ్ముతున్నాను. దేవుడు దానిని చేస్తాడు. ఎప్పుడంటే అది నిజముగా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అయినప్పుడు.

ఇప్పుడు, మేము ఈ కూడికలకు వచ్చినప్పుడు, నేను కంపనాలను గుర్తిస్తాను. కొన్నిసార్లు నేను ఆ కంపనాలను గురించి అడిగినట్లయితే దేవుడు నా ప్రార్థనను గౌరవిస్తాడు. అతను వాటిని పంపివేస్తాడు. అది నిజం. కానీ మీకు మరియు దేవునికి మధ్య ఏదైనా ఉంటే, మరియు మీరు దానిని సరిగ్గా చేయలేకపోతే...అది ఒకవేళ మీ విశ్వాసమే బలహీనంగా ఉండి, మీరు దానిని దూరంగా వెళ్ళగొట్టడానికి నెమ్మది వరుస కోసం వేచి ఉన్నట్లైతే ... ఒకవేళ మీ విశ్వాసం సరైనదిగా లేకపోతే, అది (ఆ జబ్బు) మీకు తిరిగి వస్తుంది. నేను వారి కోసం ప్రార్థించాను గనుక అది వేరే చోటుకి మారుతుంది. నేను దాన్ని మీ దగ్గరకి రాకుండా ఉంచాను. కానీ వరుస గుండా వచ్చిన వారి కోసం నేను ప్రార్థించి, మరియు వారిని వేరే చోట ఉంచి, పదిహేను నిమిషాల్లో తిరిగి వారిని తనిఖీ చేయడానికి వెళ్ళినప్పుడు, అది మళ్ళీ వారిపై తిరిగి వస్తుంది. చూశారా?

69

మీకు ఏ మంచినైనా చేయగలిగింది మీ విశ్వాసం, మీ నమ్మకం, దేవుని మీద మీ విశ్వాసం మాత్రమే. నా ఉద్దేశ్యం ఏమిటో చూడండి? విశ్వాసం లేకుండా, ఇది అసాధ్యం. అది నిజమేనా? ఇప్పుడు, మీరు బాగవుతారు అని మీరు హృదయ పూర్వకముగా నమ్మి అలాంటి దాని గుండా మీరు వచ్చినట్లయితే, మీరు బాగవుతారు. మీరు నమ్మకపోతే, ఏమి జరిగినప్పటికీ అది బాగుపడదు. మీరు దానిని హృదయ పూర్వకముగా నమ్మితేనే తప్ప మీరు స్వస్థత పొందుకోలేరు.

ఇప్పుడు, చూడండి. నేను తెల్లచొక్కా ధరించానని మీలో ఎంతమంది చెబుతారు? నేను తెల్ల చొక్కా ధరించాను అని బయట ఉన్నవారు ఎంత మంది చెబుతారు? నేను తెల్ల చొక్కా వేసుకున్నాను అని మీకు ఎలా తెలుసు? మీరు చూస్తున్నారు కాబట్టి. అది మీకు తెలిసిన ఏకైక మార్గం. ఇది తెల్లగా ఉందని మీరు నిస్సందేహముగా ఉన్నారా?

మంచిది ఇప్పుడు, చూడండి. దృష్టి అనేది శరీరం యొక్క భావన. అది నిజమేనా? చూపు అనేది ఇంద్రియాలలో ఒకటి. శరీరమునకు ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? చూపు, రుచి, స్పర్శ, వాసన మరియు వినికిడి. ఆత్మకు ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? రెండు: విశ్వాసం మరియు సందేహం.

మీరు ఇద్దరు వ్యక్తులు ఒకదానిలో ఉన్నారా? మీ ఆత్మ...ఆత్మ యొక్క స్వభావం మీ మనసు. కానీ ఇప్పుడు, మీరు శరీరం మరియు ఆత్మ అయ్యి ఉన్నారు. అది సరియైనదేనా? మీరు ఒక శరీరం, మాంసం, మరియు మీరు లోపల ఉన్నవారు, తరువాత, ఆత్మ అయి ఉన్నారు. అది నిజమేనా? అయితే సరే. లోపలి మనిషి వెళ్ళిపోతే; వెలుపల ఉన్న మనిషి చనిపోతాడు అది సరియైనదేనా? [టేపుపై ఖాళీ ఉంది.]

70

నేను దాన్ని పొందుకున్నాను అని అనుకుంటున్నాను...?... ఇప్పుడు...? ... అయితే సరే. ఇప్పుడు, ఇక్కడ చూడండి. ఇప్పుడు నా ముందు నిలబడి ఒక వ్యక్తి ఉన్నాడని నేను నమ్ముతున్నాను, మరియు అతను ఒక నల్లటి కోటు ధరించి యున్నాడు. నేను చెప్పింది నిజమేనని ఎంతమంది అనుకుంటున్నారు? [టేపుపై ఖాళీ ఉంది.] ఒక తెల్లచొక్కా వేసుకున్నాడు. నేను చెప్పింది నిజమేనని మీరు నమ్ముతున్నారా? అయితే సరే. ఇప్పుడు, కొంచెం ఆలోచించండి అతను అక్కడ నిలబడి ఉన్నాడని నాకు తెలుసు. నేను అతడిని చూసాను. అది సరియైనదేనా? అతన్ని చూడటంద్వారా మాత్రమే కాకుండా అతను అక్కడ ఉన్నాడని నేను ప్రపంచానికి చెప్పగల ఇతర మార్గం ఏదైనా ఉందా? అది ఒక్కటే మార్గం, అవునా?

ఇప్పుడు, ఇక్కడ చూడండి. ఇప్పుడు, నేను ఆ వ్యక్తిని చూడలేదు, చూసానా? కానీ అతను ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. అతను అక్కడ నిలబడి ఉన్నాడని నాకు ఎలా తెలుసు? నేను అతనిని భావిస్తున్నాను. ఆ భావన యొక్క అనుభూతి ఉన్న ఎవరికైనా అదే విషయం తెలుస్తుంది. ఇప్పుడు, బహుశా అతను నాతో వాదన కలిగి ఉండవచ్చు...నేను అతనిని చూడలేదు అని. కానీ నేను అతనిని భావిస్తున్నాను. నేను అతనిని అనుభూతి పొందలేదు, అయినప్పటికీ నేను అతనిని చూస్తున్నాను. ఆ ఇంద్రియాలు చూడండి? అవి సూటిగా ఉంటాయి, అవునా? అవి ఖచ్చితమైనవి, మీరు పరిపూర్ణత అని దేనినయితే పిలుస్తారో, ఆ విధానములో వారు పరిపూర్ణులై ఉన్నారు.

71

కానీ నేను అక్కడ తప్పు చేయగలనా? ఖచ్చితంగా నేను చేయగలను. నేను రంగులు గుర్తించలేని దృష్టి లోపం గలవాడనై ఉండవచ్చు. మీరు రంగులు గుర్తించలేని దృష్టి లోపం కలిగి ఉండవచ్చు. అయ్యా అవును. ఇది పూర్తిగా భిన్నంగా ఉండవచ్చు. అతను తెల్లచొక్కా ధరించి ఉండకపోవచ్చు. మీరు చూడకపోవచ్చు... కానీ మీరు ప్రమాణం చేసి చెప్పగలరు. నేను అతనిని అనుభూతి చెందుతున్నానా? అతను అక్కడ నిలబడి ఉన్నాడు అని నేను చెబుతాను, ఎందుకంటే నేను అతనిని భావిస్తున్నాను. చూశారా? కానీ నేను దానికి వ్యతిరేకంగా తప్పుగా చెప్పవచ్చు. అయినప్పటికినీ, నాకు తెలుసు, అతను అక్కడ నిలబడి ఉన్నాడని నా హృదయపూర్వకముగా నమ్ముతున్నాను, ఎందుకంటే భావన యొక్క అనుభూతి అతను అక్కడ ఉన్నాడని చెప్తుంది.

ఇప్పుడు, మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. (పియానో వద్దకు నడిచి వెళ్ళారు.) నాకు మరొకభావం ఉంది. మీరు దీనిని గమనించాలి అని కోరుకుంటున్నాను. అయితే... (పియానో పైన కింద స్వరాలు వాయిస్తున్నారు.) [ఒక సహోదరుడు పియానోపై స్వరాలు వాయిస్తాడు.] నేను సంగీతం విన్నాను. గదిలో సంగీతం ఉంది. (కేవలం వాటిని నొక్కుతూ ఉండండి, సహోదరుడా, కేవలం పైనకింద స్వరాలను వాయించండి.) అది ఎంతమంది వింటున్నారు? అది ఎంతమందికి తెలుసు...నేను చూసానా? నేను భావిస్తున్నానా? నేను రుచి చూసానా... [టేపుపై ఖాళీ ఉంది ] నేను వాసన చూస్తున్నానా...[టేపుపై ఖాళీ ఉంది] అది అక్కడ మోగడం నాకు ఎలా తెలుసు? నేను విన్నాను. అదే వినికిడి. చూశారా ?

72

ఇప్పుడు, నాకు తెలుసు ఎవరైనా వచ్చి, మీకు అది వినపడటంలేదు అని అనవచ్చు. అవును నాకు వినపడుతుంది. సహోదరుడా, మరొకసారి దాన్ని వాయించండి. నాకు తెలుసు, నాకు వినబడుతుంది. మీకు వినబడుతుందా? ఎందుకు? మీరు వింటున్నారు కాబట్టి. మీరు చూడలేరు, కాని వినగలరు. మీరు సంగీతం చూడలేరు, అవునా? మీరు సంగీతమును రుచి చూడలేరు, భావన పొందలేరు, అవునా? కాని అది సంగీతం అని ఎలా తెలుస్తుంది? మీరు వింటున్నారు. అది సరైనది.

సరే, సహోదారుడా, విశ్వాసం అనేది నిరీక్షింపబడువాటి యొక్క నిజ స్వరూపం, మీరు చూడలేని, రుచి చూడలేని, భావన లేని, వాసన చూడలేని, వినలేని వాటికి రుజువునై యున్నది. కానీ మీకు తెలుసు. అది విశ్వాసం.

ఓహ్, దేవుడు మీ హృదయాలను దీవించును గాక. నేను మీకు చూపించగలుగుటకు కోరుకుంటున్నాను. స్నేహితులారా, ఇక్కడ చూడండి, ఇది స్పస్టముగా ఉంది. ఆ చొక్కా తెల్లగా ఉందా? సరే, మీరు నమ్మితే స్వస్థత అక్కడే కలుగుతుంది [టేపుపై ఖాళీ ఉంది]

నిజ స్వరూపం, మీరు కాదు... చాలా మంది కేవలం ఆశ కలిగి, “ఓహ్, నేను నమ్ముతున్నాను నేను బాగవుతాను” అని అంటారు. ప్రతి వెయ్యి మందిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి విశ్వాసం యొక్క మొదటి సూత్రం తెలియదు. అవును. విశ్వాసానికి బదులుగా వారికి ఆశ ఉంది. విశ్వాసం స్పష్టముగా ఉన్నది.

73

ఓహ్, మీరు అది జరుగుతుంది అని తెలుసుకున్నప్పుడు. ఈ మధ్యాహ్నం మీరు స్వస్థత పొందబోవుతున్నారు అని మీకు తెలిస్తే... మీకు విశ్వాసం యొక్క భావన ఉంటే... ఇక్కడే ఉంది, పొందుకోండి. ఈ వరము దేవుని నుండి వచ్చినదని మీ విశ్వాస భావన మీకు ప్రకటిస్తే, మీరు స్వస్థత పొందబోతున్నారు. అది తెల్ల చొక్కాయే అని మీ దృష్టి ఎంతవరకు ప్రకటించిందో, మీరు దాటి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితముగా పొందుతారు. నా ఉద్దేశ్యం ఏమిటో చూడండి?

ఇప్పుడు, మీరు మానవ భాగాన్ని విశ్వసించగలిగితే, మానవాతీతమైన భాగాన్ని ఎందుకు నమ్మకూడదు? మీరు శరీరాన్ని నమ్మగలిగితే, ఆత్మను ఎందుకు నమ్మకూడదు? ఆత్మ శరీరముకంటే ఉన్నతమైనదిగా ఉన్నది. ఆమేన్. అక్కడే ఉంది. నా ఉద్దేశ్యం ఏమిటో చూడండి? ఇది విశ్వాసం, నిరీక్షింపబడువాటి యొక్క నిజ స్వరూపము.

74

చూడండి. ఇది ఇది కాదు..., “నేను నమ్ముతున్నాను, నేను అనుకుంటున్నాను” ఇది కాదు. మీకు అది తెలుసు. ఇది నిరీక్షింపబడువాటి యొక్క నిజ స్వరూపం, మీరు చూడలేని, రుచి చూడలేని, భావన లేని, వాసన చూడలేని, వినలేని వాటికి రుజువునై యున్నది. మీరు నమ్మితే, అది ఎలాగైనా అది ఉంటుంది.

కొంతమంది వెళ్లిపోయి, “సరే, నేను పోయిన వారము ప్రార్థించబడ్డాను. నాకు ఏ మాత్రం మెరుగుపడినట్లు అనిపించడం లేదు.” హా. బహుశా ఎప్పటికీ అనిపించదు. అవును. మీరు దానిని నమ్మాలి...

యేసు ఎన్నడూ, “మీరు దాన్ని అనుభూతి చెందారా?” అని అనలేదు ఆయన, “మీరు నమ్మారా?” అని అన్నాడు మీరు నమ్మండి. మరియు మీకు తెలుసు మీకు విశ్వాసం ఉంది. అప్పుడు ఈ దూత యొక్క ప్రత్యక్షత వచ్చినప్పుడు, అలా జరగకుండా ఆపటానికి అక్కడ నరకములో నుండి దయ్యాలు కూడా సరిపోవు.

ఇప్పుడు, మీరు వెళ్లి, “సరే, నేను ప్రార్థించబడ్డాను మరియు నేను రెండు లేదా మూడు వారాలుగా సరిగా లేను. ఏ మాత్రం మెరుగు పడలేదు” అని చెప్పవద్దు. ఆ విషయం గురించి ఏమాత్రం పట్టించుకోవద్దు. మీరు ఇది నిజంగా దేవుని నుండి వచ్చిన వరము అని నమ్మితే, పైకి లేవండి మరియు మీరు ఎలా భావిస్తున్నారో పట్టించుకోవద్దు,వెళ్ళి సంతోషిస్తూ, దేవుణ్ణి స్తుతించండి. అది పోయింది. అంతే. అది మీకు తెలుసు.

75

కడుపు సమస్యతో నేను స్వస్థత పొందినప్పుడు, నా కడుపును పట్టుకుని అక్కడకు వెళ్ళినట్లు నాకు గుర్తుంది. మరియు నేను ప్రార్థించబడినప్పుడు, నా కోసం ప్రార్దించడానికి స్వస్థత యొక్క వరమును కలిగి వారు లేరు. సంఘ పెద్ద నన్ను నూనెతో అభిషేకించారు. అతను నాకు చెప్పాడు... నేను బైబిలులో చదివాను. దేవుని వాక్యం సరైనదని నేను చూసాను. మరియు అతనికి హక్కు ఉందని నాకు తెలుసు. అతను బాప్టిస్ట్ బోధకుడు అయినప్పటికీ వచ్చి నన్ను అభిషేకించి, “బైబిలు అలా చెప్తుంది” అని చెప్పాడు. అతను కొంత నూనె నా తలపై పోసి. “ఇప్పుడు, నీవు నమ్ము నువ్వు స్వస్థత పొందుకుంటావు” అని చెప్పాడు.

నేను,“...? ... దేవా, నేను హృదయపూర్వకముగా అడుగుతున్నాను. నన్ను బాగుచేయండి. ”నేను తినడం ప్రారంభించడానికి నేరుగా ఇంటికి వెళ్ళాను. నేను మూడు, నాలుగు నెలల నుంచి బార్లీ వాటర్ మరియు ఎండు ద్రాక్ష రసమును మాత్రమే తాగుతున్నాను. డాక్టర్, “ఒక్క ముద్ద గట్టి ఆహారము తింటే నీవు అప్పుడే చనిపోతావు ” అని అన్నారు. నేను ఏమి చేసానో మీకు తెలుసా? నేను ఇంటికి నేరుగా వెళ్ళాను, మరియు మాకు విందు కోసం మొక్కజొన్న రొట్టె, బీన్స్ మరియు ఉల్లిపాయలు ఉన్నాయి.

మీరు ఎప్పుడైనా అలా తిని ఉన్నారో లేదో నాకు తెలియదు. అది చాలా బావుంటుంది. నేను ఇప్పుడైనా దానిని కొంత తినగలను. మరియు .... నా తల్లి ఒక పెద్ద మొక్కజొన్నతో చేసిన రొట్టెను కాల్చారు. మరియు నేను ఎల్లప్పుడూ మంచి జిడ్డుగా ఉండే ఆ మూలనున్న ముక్కను పొందుతాను, మీకు తెలుసా అది పెళుసుగా (విరుచుటకు సులువుగా ఉండే భాగము) ఉంటుంది.

కాబట్టి మేము రొట్టె విరచుటకు తగిన బాప్టిస్ట్ వారుగా ఉన్నాము. మీకు తెలుసా, మేము దానిని కోయము. యేసు రొట్టెను విరిచి ఆశీర్వదించాడు. కాబట్టి మేము దానిని తీసుకుని ముక్కలుగా విరుస్తాము. కాబట్టి నేను...

76

మా తల్లి ... మనము ఇంట్లో ఎప్పుడూ ప్రార్థన చేయలేదు అని అన్నది. మరియు నాన్న ... నాన్న ఒక కాథలిక్. అయితే నేను - “ఇప్పుడు, నేను ఆహారం కోసం ప్రార్ధించబోతున్నాను” అని అన్నాను.

ఆ పేద ముసలి తండ్రి అంతగా ఏడవటం నేను ఎప్పటికీ మరచిపోలేను. మరియు తల్లి, “నీవు మతాన్ని కలిగిఉన్న దాన్ని బట్టి నాకు అభ్యంతరము లేదు, కానీ... అది నిన్ను చంపుతుందని డాక్టర్ చెప్పారు” అని అన్నది.

నేను, “కాని నేను బ్రతుకుతాను అని దేవుడు చెప్పాడు” [టేపుపై ఖాళీ ఉంది] “నేను ఒకవేళ చనిపోతే ...?... [టేపు పై ఖాళీ ఉంది] మరియు నేను ఒకవేళ చనిపోతే, నేను దేవునితో ఇలా చెప్పాను. ”నేను నీ గృహానికి వచ్చాను. నేను ద్వారము వద్ద నిన్ను కలిసినప్పుడు, నీ వాక్యమును నమ్ముతూ చనిపోయాను అని.“ ”నేను వైద్యులను చాలా కాలం అనుసరించాను. వారు నాకు ఏ మంచి చేయలేరు“ అని అన్నాను.

మరియు నేను ఆ పెద్ద బీన్స్ నోటినిండా తీసుకున్నాను మరియు ఉల్లిపాయ తీసుకున్నాను, ఆ మొక్కజొన్నయొక్క రొట్టెను పెద్ద ముక్క కొరికి, మరియు నేను తినడం ప్రారంభించాను. మరియు నేను నమిలాను. ఇది చాలా రుచిగా ఉంది, కొంచెం సరదాగా ఉంది, కానీ...ఒక సంవత్సరం పైగా గట్టి పదార్ధము ఏదియు నేను తినలేదు. మరియు నేను మొదటి ముద్ద మింగినప్పుడు, ఇక్కడ అది మళ్ళీ తిరిగి వచ్చేసింది. నేను అలా చేసినప్పుడు, నేను అది రాకుండా ఉండటానికి నా చేతిని నా నోటిపై అడ్డు పట్టుకున్నాను. నేను మరొక ముద్దను తిన్నాను అలా నేను మొత్తం ప్లేట్లో ఉన్నదంతా అయిపోయే వరకు తిన్నాను. నేను టేబుల్ వద్ద నుండి లేచినప్పుడు, నేను నా చేతితో పట్టుకుని లేవవలసిన పరిస్థితి వచ్చింది. యాసిడ్ ఎంత పుల్లగా ఉంటుందో అంత పుల్లగా ఉంది.

మా తల్లి డాక్టర్ ను పిలిచి. “అతను చనిపోతాడు. అంతే. ఒక నోటి ముద్ద అతడిని చంపుతుంది. అంతే...” అని చెప్పింది.

మీకు తెలుసా, ఇక్కడ నేను, నడుస్తూ వెళుతున్నాను. ఆమె, “నీకు ఎలా ఉంది?” అని అడిగింది.

నేను, “అద్భుతం, బాగున్నాను” అని చెప్పాను.

“నువ్వు చనిపోబోతున్నావు” అని ఆమె చెప్పింది.

“లేదు, అమ్మా”. నేను వీలైనంత వేగంగా మింగాను. మీకు తెలుసా వేడి నీరు నా నోటిలో నుండి వెళ్ళి, మరియు అదంతా లోపలికి వెళ్ళడం చూశాను అని నేను చెప్పాను. నేను గదిలోకి వచ్చాను, నేను నడుస్తూ వెళ్తూ ఇలా అన్నాను,

నేను నమ్మగలను, నమ్ముతాను, నమ్ముతున్నాను

నేను నమ్మగలను, నమ్ముతాను, నమ్ముతున్నాను

నేను నమ్మగలను, నమ్ముతాను, నమ్ముతున్నాను

యేసు నన్ను ఇప్పుడు స్వస్థపరుస్తాడని.

మీ వాక్యమున చొప్పున తీసుకుంటాను,

మీ వాక్యమున చొప్పున తీసుకుంటాను,

నా హృదయ పూర్వకముగా నమ్ముతూ అలా....

77

నేను చాలా బలహీనంగా ఉన్నాను, నేను దాదాపు మంచం మీద అలా పడిపోయాను, “ఓహ్, కృప, కృప” అని అనుకున్నాను, మరియు నేను మరుసటి రోజు లేచాను, తెలుసా, నేను వీధిలో నడిచి వెళ్ళాను, ఓహ్, నేను ఏదీ పట్టించుకోలేదు. అమ్మ లోపలికి వచ్చింది. ఆమె రాత్రంతా నన్ను చూసింది, మీకు తెలుసా, నేను ఖచ్చితంగా చనిపోతానని భావించింది. మరుసటి రోజు ఉదయం, ఆ బీన్స్ అక్కడే అదే చోట పెట్టి ఉన్నాయి. “ఏం కావాలి?” అని అన్నారు.

“నాకు మరికొన్ని బీన్స్ మరియు మొక్కజొన్న రొట్టె కావాలి” అని నేను చెప్పాను. అవును...ఓహ్, దయ్యం దాని నుండి నన్ను మోసం చేయలేదు. చేయలేదు, చేయలేదు. దేవుడు అలా చెప్పాడు.

మరియు బైబిలులోని ప్రతి వాగ్దానం నాది,

ప్రతి అధ్యాయం, ప్రతి వచనం, ప్రతి వరుస.

(అది సరైనదా?)

నేను ఆయన దైవిక వాక్యాన్ని నమ్ముతున్నాను,

పుస్తకంలోని ప్రతి వాగ్దానం నాది.

అవును. ఆయన—ఆయన... “విలియం బ్రాన్హాంకు” అని చెప్పలేదు కాని, “నమ్మిన ప్రతీవానికి” అని అన్నాడు. విలియం బ్రాన్హాంలు వందమంది ఉండవచ్చు. కానీ, “నమ్మిన ప్రతీవానికి,” అని అంటే, నాకు తెలుసు అది నాది. అవును. నేను కేవలం ఇదే చెప్పాను, “నేను నిన్ను నమ్ముతున్నాను అని.” అయ్యా, అవును. మరియు నేను ప్రారంభించి, వీధిలోకి వెళ్ళాను... “సహోదరుడా బ్రాన్హాం, నీకు ఎలా అనిపిస్తుంది?” అని అడిగారు.

మరియు నేను, “అద్భుతం” అని చెప్పాను... నోటి నిండా బీన్స్ వేసుకుని, వాటిని తిరిగి మింగుతూ వీధిలోకి వెళ్ళేవాడిని. లేదు, లేదు. నేను వాటిని ఉమ్మివేయలేదు. కాదు. వాటిని మింగివేసాను. ప్రభువు వాటిని ఆశీర్వదించును గాక. అవి నావి. అలా వెళుతూ...

అక్కడకు వెళ్లగానే, “హలో, సహోదరుడా బ్రాన్హాం”అని చెప్పేవారు.

నేను, “హలో” అని చెప్పేవాడిని.

“నీకు ఎలా ఉంది?”

“అద్భుతం.”

78

ఎవరో చాలా కాలం క్రితం నాతో ఇలా అన్నారు,“సహోదరుడా బ్రాన్హాం, మీరు అబద్ధం చెప్పారు.” లేదు, నేను చెప్పలేదు. లేదు, నేను చెప్పలేదు.

నా శరీరం ఎలా అనుభూతి చెందిందని వారు నన్ను అడుగుతున్నారు; నా విశ్వాసం ఎలా ఉందో నేను సమాధానం ఇస్తున్నాను. ఇది అద్భుతంగా ఉంది. అవునండి . నా విశ్వాసం అత్యద్భుతంగా అనిపించింది, ఎందుకంటే నేను దేవుడిని వాక్యములో పొందుకున్నాను. నాకు ఎలా అనిపించినా నేను పట్టించుకోలేదు. నాకు ఇంకా తేనుపులు వచ్చినా, నేను అప్పటికీ చెప్పగలను నాకు స్వస్థత కలిగింది అని. ఆమేన్. అవును. నిశ్చయముగా, ఎందుకంటే దేవుని వాక్యం సరైనదే. మీరు నమ్ముతున్నారా? మనము దీనిని పాడుకుందాము.

పరిశుద్ధ గ్రంధములోని ప్రతీ వాగ్దానము నాకే చెందును,

ప్రతీ అధ్యాయము, ప్రతీ వచనము, ప్రతీ వరుస.

ఆయన యొక్క దైవిక వాక్యమందు నేను నమ్మికయుంచుచున్నాను,

పరిశుద్ధ గ్రంధములోని ప్రతీ వాగ్దానము నాకే చెందును,

ఇప్పుడు అనారోగ్యం కొరకు ప్రార్థింపబడే వారందరూ, నాతో కలిసి పాడండి.

పరిశుద్ధ గ్రంధములోని ప్రతీ వాగ్దానము నాకే చెందును,

ప్రతీ అధ్యాయము, ప్రతీ వచనము, ప్రతి వరుస.

ఆయన యొక్క దైవిక వాక్యమందు నేను నమ్మికయుంచుచున్నాను,

పరిశుద్ధ గ్రంధములోని ప్రతీ వాగ్దానము నాకే చెందును,

మనం ఏమి చేయాలి?

కేవలం నమ్మిక మాత్రముంచుము, నమ్మిక మాత్రముంచుము,

(మీరు చేయాల్సిందల్లా అంతే.)

సమస్తము సాధ్యమే, కేవలం నమ్మిక మాత్రముంచుము.

79

నేను పాటల నాయకుడి అంతటి వాడిని కాదు. కానీ మీరు దీనిని నమ్మాలని నా హృదయములో నేనెరుగుదును. అది సరియైనదేనా? అయితే సరే. ఇప్పుడు, సహోదరుడా, దానిపై మాకు ఒక స్వరము ఇవ్వండి మరియు మేము దానిని అందుకుంటాము. మంచిది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మళ్ళీ.

కేవలం నమ్మిక మాత్రముంచుము, నమ్మిక మాత్రముంచుము,

సమస్తము....

బైబిలు అలా చెప్పింది అవునా? దేవుడు అలా చెప్పలేదా? ఆయన మీకు వరమును వాగ్దానం చేయలేదా? అవి ఇక్కడ ఉన్నాయి. ఇతరులు స్వస్థత పొందుకుంటున్నారు, మీరు పొందుకోలేరా? మీరు? మీరు? మీరు పొందుకోలేరా?

కేవలం నమ్మిక మాత్రముంచుము

సమస్తము సాధ్యమే, (అవును సాధ్యమే, దేవునికి స్తోత్రము)

కేవలం నమ్మిక మాత్రముంచుము.

ప్రభువా, నేను ఇప్పుడు నమ్ముతున్నాను (మీరు?), ప్రభువా, నేను నమ్ముతున్నాను,

సమస్తము సాధ్యమే, ప్రభువా, నేను నమ్ముతున్నాను,

ప్రభువా, నేను నమ్ముతున్నాను, ప్రభువా, నేను నమ్ముతున్నాను

సమస్తము సాధ్యమే, ప్రభువా, నేను నమ్ముతున్నాను.

వినండి. నేను చేయలేకపోతే...? ... [టేపుపై ఖాళీ ఉంది]... తీర్పు వద్ద, నేను ఇప్పటికీ ప్రతి వాగ్దానం నిజమే అని నమ్ముతున్నాను అని చెబుతాను. ఇది సరైనది. మీరు నమ్ముతున్నారా? అయితే సరే.

80

మన తలలు వంచుకుందాం. ఇప్పుడు మీరు, సహోదరుడా, ఒక స్వరమును వాయించండి. వారు ప్రార్థనకు సిద్ధపడుతుండగా ఇప్పుడు మన తలలు వంచుదాం.

మా పరలోకపు తండ్రి , పుస్తకంలోని ప్రతి వాగ్దానాన్ని బట్టి మేము ఈ రోజు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రజల కొరకును మరియు వారిలో నివసించడానికి వారి స్వాస్థ్యమైన పరిశుద్ధాత్మను మీరు క్రిందకు తీసుకుని వచ్చినదానిని బట్టి మీకు ధన్యవాదాలు. మరియు దేవా, వారు దయకలిగి మా కొరకు తలుపులు తెరిచారు కాబట్టి, ప్రతి ఒక్కరూ రక్షించబడి ఆ దినమున నీ రాజ్యములో మీరు వారిని కలిగి ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించండి. ఈ నగర వైద్యులను ఆశీర్వదించండి. సంస్థలు, నర్సులందరినీ ఆశీర్వదించండి.

దేవా, నేను ఇక్కడ బలహీనపడి బాధలో ఉన్న మానవాళికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నానని ప్రజలు తెలుసుకోనివ్వండి. నేను ఇక్కడ మరే ఇతర కారణం కోసం కాదు కానీ ఈ లోతుకు పోయిన కళ్ళు, అనారోగ్యం, మరణిస్తున్న ప్రజలకు సహాయం చేయడానికి మాత్రమే ఉన్నాను. మరియు ఓ దేవా, అన్ని అనారోగ్యములను మరియు వ్యాధులను స్వస్థపరిచే ఒక మనోహరమైన క్రీస్తును వారికి పరిచయం చేయడానికి ప్రయత్నిస్తుండగా, ఎవరైనా ఆ రకమైన దానికి వ్యతిరేకంగా చెడుగా ఎలా చెప్పగలరు?

81

ప్రభువా, మీ సేవకులను ఆశీర్వదించండి. వారు మండే అభిషేకం గలవారై ఉండును గాక. మరియు ఒక పాత కాలపు పునరుద్ధరణ ఇప్పుడు ఫీనిక్స్ లో జరుగునుగాక, మరియు “అరిజోనాలోని ఫీనిక్స్ కు రండి, పరిశుద్ధాత్మ మళ్ళీ అక్కడ కుమ్మరి౦చబడుతోంది, ప్రజలలో గొప్ప సూచక క్రియలు, అద్భుతాలు జరుగుతున్నాయి” అని దేశమంతా చెప్పుకునే స్థలముగానూ, అది సంఘము నుండి సంఘమునకు, ఈ స్థలము నుండి మరో స్థలమువరకు వెళ్ళును గాక. ఓ దేవా, నేను ఈ చిన్న నగరమును నేను ఎంతో ప్రేమిస్తున్నాను. మరియు ప్రభువా, మీరు దానిని ఉంచాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, దానిని దయచేయుము, ఆ పాత కాలపు ఉజ్జీవమును పంపించండి.

తండ్రి, ప్రతి ఒక్కరినీ స్వస్థపరచండి. మరియు, నేను ప్రజలకు స్పష్టం చేయడానికి ప్రయత్నించిన మీ దూత, నేను ఆయన మాట్లాడుతున్నప్పుడు మాత్రమే మాట్లాడగలను. ప్రజల విశ్వాసం కోసం మాత్రమే నా ప్రార్థన. కానీ ఓ దేవా, ఈ మధ్యాహ్నం వారు ఈ వరుస ద్వారా సమకూడుచుండగా, నమ్మడానికి వారు విశ్వాసం కలిగి ఉండును గాక. కొన్ని వందల మంది ఉన్నారు. మరియు వారు దాటి వెళుతుండగా, వారు స్వస్థపరచబడును గాక, మరియు మీకే సమస్త స్తుతియు మహిమయు ఆరోపిస్తూ, మీ మహిమ కొరకు మీ నామమున మేము అడుగుచున్నాము. ఆమేన్.

82

ఇప్పుడు, వారు ప్రార్థన వరుసను పూర్తి చేస్తుండగా ఒక చిన్న వీడ్కోలు పాట కోసం, సహోదరుడా, మాకు ఒక స్వరము ఇవ్వండి, “ఆయన నీకొరకు శ్రద్ధవహిస్తున్నాడు.” మీరు? “ మీకు తెలుసా, ఆయన మీ కోసం శ్రద్ధ వహించాడు”.

ఆయన...

ఇదే నేను మీ కొరకు పాడాలనుకుంటున్నాను, మరియు ప్రతి ఒక్కరూ, మీరు ఇప్పుడు తిరిగి నా కోసం పాడండి. ఇది ఎంత మందికి తెలుసు? “ ఆయన నిన్నుగూర్చి జాగ్రత్త వహించును,” మీ చేతులను చూద్దాం? (సరే. ఇప్పుడు మమ్మల్ని నడిపించండి. మంచిది.)

ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును,

ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును;

సూర్యకాంతులతోనూ లేక ఛాయలతోను,

ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును.

మనందరం కలిసి ఇప్పుడు పాడదాం. అందరూ.

ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును,

ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును;

సూర్యకాంతులతోనూ లేక ఛాయలతోను,

ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును.

83

వినండి. ఈ నడక మార్గం మధ్యలో ఉన్నవారు మీ కోసం పాడనివ్వండి. నాతో పాడండి, ఇక్కడ నడక మార్గం మధ్యలో ఉన్నవారు మాత్రమే. పాడండి.

ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును, (వారు మీ అందరి కోసం పాడుతున్నారు)

ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును;

సూర్యకాంతులతోను లేక ఛాయలతోను,

ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును.

నిలబడగలగే రోగులందరూ, అనారోగ్యంతో ఉన్న వారందరూ, ప్రార్ధనా వరుసలో ఉండబోయేవారందరూ నిలబడండి, పాడండి. ఇప్పుడు, మీరు ఇక్కడ మంచిగా ఉన్న ప్రజలు, మీరు మరియు నేను కలిసి అనారోగ్యంతో ప్రార్ధనా వరుసలో ఉండబోయే వ్యక్తుల కోసం పాడుదాం.

ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును,

ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును;

సూర్యకాంతులతోను లేక ఛాయలతోను,

ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును.

ఆయన.....

84

ఇప్పుడు, వెనక్కి తిరిగి మీ పొరుగువారితో కరచాలనం చేయండి. ప్రతి ఒక్కరూ పాడండి “ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును.” మీకు అండగా నిలబడి ఉన్న ఎవరితోనైనా కరచాలనం చేయండి.

ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త, (సరే. ఇప్పుడు తిరిగి మంచిగా కరచాలనం చేయండి.)

ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును; (మరొకసారి పాడుదాం.)

ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును,

ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును;

సూర్యకాంతులతోను లేక ఛాయలతోను,

ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును.

మనమందరం “ఆమేన్” అని చెపుదాం. అందరూ. ఇది మిమ్మల్ని బాధించదు. ఇప్పుడు, “ప్రభువుకు స్తోత్రం” అని చెప్పండి. అందరూ...ప్రభువుకు స్తోత్రం. ఇప్పుడు, మనము “నేను నా పొరుగువారిని ప్రేమిస్తున్నాను” అని అందరూ కలిసి చెప్పడం విందాం. [సమాజం ఇలా చెబుతోంది, “నేను నా పొరుగువారిని ప్రేమిస్తున్నాను.”] “ఈ సమయం నుండి, నేను క్రీస్తు యొక్క సేవకునిగా ఉండటానికి ప్రయత్నిస్తాను.” ఈ సమయం నుండి నేను క్రీస్తు సేవకునిగా ఉండడానికి ప్రయత్నిస్తాను.

ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును, (ఓ దానిలోనికి రండి)

ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును;

సూర్యకాంతులతోను లేక ఛాయలతోను,

ఆయన నిన్ను గూర్చి జాగ్రత్త వహించును.

85

సహోదరుడా స్వరమును నెమ్మదిగా వాయించండి. ఇప్పుడు, మనం తలలు వంచుకుందాం. మీ రాష్ట్ర గవర్నర్ తీవ్రమైన పరిస్థితిలో ఉన్నారు, మరియు ఇప్పుడు అతని కోసం ప్రార్థించమని నాకు సమాచారం పంపించారు. వంచండి..... [టేపుపై ఖాళీ ఉంది.] ఓహ్, తండ్రి, మాతో చాలా ప్రేమగా సహకరిస్తున్నారు. ప్రజలపై అధికారముగా, ఎత్తైన స్థానములలో పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి....

దేవా, ఇక్కడ అరిజోనాలోని మా గవర్నర్ ప్రాణాలను కాపాడండి. దేవా, మేము అతనిని ప్రేమిస్తున్నాము, మరియు మాకు తెలుసు నీవు ఆయనను ఈ రాష్ట్ర ప్రజల మీదను, దేశ విషయముల మీదను పర్యవేక్షకునిగా ఉంచియున్నావు. మరియు మీరు మీ దూతను ఇప్పుడే అతని వద్దకు పంపి, మేము ఇప్పుడు అతని కోసం ప్రార్థిస్తున్నాము అని అతనికి తెలియజేయుమని నేను ప్రార్థిస్తున్నాను. మరియు దేవా, మా ప్రార్థనకు సమాధానం ఇవ్వండి, మరియు అతను వెంటనే కోలుకొనును గాక. అతను క్షేమంగా ఉండి, అతని జీవిత కాలమంతయు మిమ్మల్ని ప్రేమించును గాక. దానిని మంజూరు చేయండి తండ్రి. నేను గవర్నర్ ప్రాణాలను కాపాడమని సజీవుడైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను. ఆమేన్.

ఇప్పుడు, మీరు అందరూ కూర్చోవచ్చు. ధన్యవాదాలు.

[ఒక సహోదరుడు ప్రార్థనా మార్గములో ఉన్న ప్రజలకు, అందుకు వచ్చిన వారికి సూచనలు ఇస్తాడు.]

ప్రార్ధనా అవసరత గవర్నర్ ఓస్బోర్న్ నుండి వచ్చింది.

86

సరే. ఇప్పుడు, ప్రతి ఒక్కరూ ఇప్పుడు నిజమైన భక్తితో ఉండండి. మేము ప్రార్థనా వరుస ప్రారంభించబోతున్నాము. మరియు నడిపించేవారు మీకు తెలుసు వరుసను ఎలా కదిలించాలో. నేను చేయగలినంత వరకు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తాను.

ఇప్పుడు, ఏమి జరిగిందో నేను మీకు చెబుతాను. ఇప్పుడు, వరుసలో ఏమి జరుగబోతుందో నాకు తెలియదు, కానీ నేను మల్బరీ పొదలో ఏదో వణుకు ఉంది అని భావిస్తున్నాను. అవును. ఇది ఒక ... మనకు ఎనిమిది లేదా పది రోజులు ఉంటే అప్పుడు మీరు ఇంకా ముందుకు ఎదగగలరని మరియు మీరు ఇక్కడ ఇంకా పొందుకోవాలని కోరుకుంటున్నాను. అవును.

ఇప్పుడు, సమయం నాలుగు-ముప్పై అయింది. ఇప్పుడు, మనము ఏ సమయానికి బయటకు వెళ్తామో నాకు తెలియదు. ప్రతి ఒక్కరూ ప్రార్థించబడే వరకు మేము ఉంటాము. అవును. కాబట్టి ఇప్పుడు, నేను అలా చేయాలనుకుంటున్నాను. మరియు నేను మీ దయను బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే, నేను ఇప్పుడు అభిషేకం క్రిందకు వెళ్ళినప్పుడు, దాని కింద నుండి బయటకు రావాలని నేను కోరుకోను. చూశారా ? మరియు మీ దయను బట్టి మీలో ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

87

మీరు ఇప్పటికీ నన్ను మీ సోదరుడిగా ప్రేమిస్తున్నారా...?... మంచిది, నేను ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మరియు మీపై పరిపూర్ణ నమ్మకముతో ఉన్నాను. అలాగే మీరు నాపై నమ్మకముతో ఉన్నారని నేను నమ్ముతున్నాను. మనము మళ్ళీ ఒకరినొకరు చూసే వరకు, దేవుడే మనలను చూచునుగాక, మన మధ్య ఉండును గాక. మరియు అది తీర్పు వద్దనే అయితే, మనము ఆ జీవవృక్షము కింద ఉంటాము, మరియు వెయ్యి సంవత్సరాలు నేను మీతో మాట్లాడాలని నేను ప్రార్థిస్తున్నాను. అవును. కాబట్టి దేవుడు ఇప్పుడు మిమ్మల్ని దీవించును గాక.

ఇప్పుడు, మీరు ఇంటికి వెళ్ళవలసి వస్తే, మీరు లేచినప్పుడు, భక్తితో వెళ్ళండి. కానీ అది దుష్ట శక్తిని వెళ్ళగొట్టుట అయితే....

కొన్నిసార్లు నేను ఒక వ్యక్తిని అనుభూతి చెందుతాను, వారు నా వద్దకు వచ్చినప్పుడు, నేను విశ్వాసం యొక్క ఒత్తిడిని నాకు వ్యతిరేకముగా రావడాన్ని అనుభూతి చెందుతాను. బహుశా వారు గుడ్డివారు, లేదా చెవిటివారు, లేదా మూగవారు కావచ్చు. నేను ఆ ఒత్తిడిని నాకు వ్యతిరేకంగా అనుభూతి చెందుతున్నప్పుడు, అది విశ్వాసం అని నాకు తెలిసినప్పుడు, నేను సాధారణంగా అలా ఆగిపోతాను. ఎందుకంటే వారితో ఏ సమస్య ఉన్నప్పటికీ, ప్రజలకు అది జరగాలని విశ్వాసం కలిగి ఉన్నట్లైతే,... కానీ నేను ఆ విశ్వాసాన్ని అనుభూతి పొందలేకపోతే, నేను విశ్వాసం యొక్క ప్రార్థనను అడిగి వారిని వెళ్లనిస్తాను. నా ఉద్దేశ్యం ఏమిటో చూడండి? మీకు అర్దమయిందా.

88

సరే. ఇప్పుడు, ప్రతి ఒక్కరూ మీ తల వంచి ప్రార్థనలో ఉండండి.

ప్రియమైన దేవా, మా సహోదరీలు ఇప్పుడు దాటి వెళుతుండగా. ఆమె భావాలకు అనుగుణంగా కాకుండా ఆమె విశ్వాసమును బట్టి వెళ్ళనివ్వండి. ఆమె వెళ్లి యేసుక్రీస్తు నామమున స్వస్థత పొందుగాక. అమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక.

ఇప్పుడు, ఇక్కడ సహకరించగల సేవకులందరూ వెంటనే ఈ వరుస దగ్గర ఇక్కడకు వచ్చి ఈ వ్యక్తులతో మాట్లాడి మరియు మీరు చేయగలిగితే వారి కోసం ప్రార్థించమని నేను కోరుకుంటున్నాను. అందరూ, సహకరించగలిగే సేవకులు ఆ ప్రార్థనా వరుస వద్ద ఉండి ప్రార్దించండి. సహోదరుడా, ఆ సేవకులందరి ప్రార్ధన దేవుడు వింటాడు.

యేసు, మా సహోదరి మీద కనికరము చూపి ఆమెను స్వస్థపర్చుము. ప్రభువా, దానిని మంజూరు చేయండి. యేసుక్రీస్తు నామమున, ఇది స్వస్థపరచబడును గాక. అమ్మా, మంచిది. ఇప్పుడు సంతోషముగా వెళ్ళండి.

సహోదరుడా, దేవుడు ఇన్ను దీవించును గాక. మీరు తీవ్రమైన స్థితిలో ఉన్నారు. మీరు గ్రహించారా?

89

ఓ దేవా, నేను ఇప్పుడు కొద్ది సేపటి క్రితం డాక్టర్ సాక్ష్యముతో ఇచ్చిన ఆ ఎక్స్-రే గురించి ఆలోచిస్తున్నాను. ఆమె ఊపిరితిత్తుల్లో సగానికిపైగా పాడైపోయాయి, మరియు ఎక్స్-రే అలా చూపిస్తుంది. ఇప్పుడు... ఇక్కడే ఫీనిక్స్ లో...ఇప్పుడు, ఆమె తదుపరి ఎక్స్-రే పరీక్ష వ్యాధి లక్షణాలు లేనట్టుగా చూపిస్తుంది. ఓ క్రీస్తు, దయచేసి ఆ అందమైన రాష్ట్రం ఓహియో నుండి ఇక్కడ ప్రార్థింపబడడానికి వచ్చిన నా పొరుగువాడైన ఈ వ్యక్తిపై దయ చూపండి.

ఓ దయ్యమా, యేసుక్రీస్తు నామమున అతని నుండి బయటకురా.

ఇప్పుడు ప్రియమైన సహోదరుడా, మీరు అక్కడ నా పొరుగువారు. సందేహించకండి. మీ కంపనం ఆగిపోయింది. ఇప్పుడు, మీరు అది నమ్మగలిగితే... మీరు అనుభూతి పొందారా? మంచిది. దేవుడు నిన్ను దీవించును గాక.

“ప్రభువుకు స్తోత్రం” అని చెపుదాం. ప్రతిఒక్కరూ, ప్రభువుకు స్తోత్రం. ఈ వ్యక్తి మా ఇంటి పక్కనే ఉంటాడు, ప్రార్ధించబడడానికి ఓహియో నుండి వచ్చాడు.

90

సరే, ఇప్పుడు, మీ తలలు వంచండి. ఓహ్. ఇక్కడ ఫీనిక్స్లో ఉన్న మీకు ఈ రకమైన భావన ఎందుకు కలుగలేదు. ప్రజలకు స్వస్థత చేకూర్చడానికి ఈ రకమైన భావన మీకు అవసరం. ఇప్పుడు, ప్రతి ఒక్కరూ, మీ తల వంచండి.

అయ్యా, ఒకవేళ ఏదీ జరగకపోతే మీరు జీవిత ప్రయాణం ముగింపుకు చాలా దగ్గరగా ఉన్నారని మీకు తెలుసా. అయ్యా, మీరు ఎక్కడ నివసిస్తున్నారు? ఫెన్నెల్. అయితే సరే. ఇప్పుడు విశ్వాసం కలిగి ఉండండి. సందేహించ వద్దు. కేవలం విశ్వాసం కలిగి ఉండండి. నేను మీకు ఏమి చెప్పానో గుర్తుందా? కేవలం మీ హృదయపూర్వకంగా నమ్మండి.

పరలోకపు తండ్రి, నేను ఇప్పుడు క్యాన్సర్ తో ఉన్న నా సహోదరుడి కోసం ప్రార్థిస్తున్నాను. అతని జీవితమును ఈ పెద్ద దెయ్యం క్యాన్సర్ ద్వారా తినివేస్తున్నది. మీరు మాత్రమే ఆ దయపు శక్తి (ఆక్టోమస్)ని తీసివేయగలరు, ఆ దయ్యము, తనశక్తులను, చేతులను చాచి, ఈ మనిషి నుండి ఆ జీవమును తినివేస్తున్నది. తండ్రి, అతను మా సహోదరుడు. మరియు మేము మీ పిల్లలుగా మీ వద్దకు వస్తున్నాము.

ఓ దయ్యమా, యేసుక్రీస్తు నామమున అతని నుండి బయటకురా.

సహోదరుడా, నీకు నీవుగా నా చేతిని చూడవచ్చు. అది పోయింది. సంతోషముగా వెళ్ళు. దేవుడు నిన్ను దీవించును గాక...

ఓ నజరేయుడైన యేసు, ఈ భయంకరమైన శక్తుల చేత ఇబ్బందిపడుతూ బాధపడుతున్న మా సహోదరికి మీరు సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను.

ఓ సాతానా, యేసు క్రీస్తు నామమున ఈ స్త్రీ నుండి బయటకురా... [టేపుపై ఖాళీ ఉంది] యేసుక్రీస్తు నామములో నేను దానిని అడుగుతున్నాను. దేవుడు నిన్ను దీవించును గాక.

91

సహోదరి, దేవుడు నిన్ను దీవించును గాక. తండ్రి, ఇప్పుడు మేము ఈ మహిళ యొక్క ఆశీర్వాదం కోసం అడుగుతున్నాము, మేము అడుగుతున్న దానికి అర్హమైనది అని నేను నమ్ముతున్నాను; ఈమె మీ సేవకుడైన మా సహోదరుని యొక్క భార్య. మరియు ఆమె నిరంతరం ఇక్కడ సేవలో ఉపయోగించబడుతుంది. తండ్రి, ఆమె చక్కటి సహకారానికి ప్రతిఫలంగా, ఈ రోజు ఆమెను స్వస్థపరచుము. మీ సేవకుడి ప్రార్థన మీరు వింటారా? దేవా, మీరే నన్ను హెరాల్డ్ నెయిల్ యొక్క ఇంటికి పంపారు, మీరే, నన్ను యుటికా వరకు, సహోదరుడు ఎమ్మెల్ యొద్దకు పంపారు, మరియు లిటిల్ రాక్ వద్ద ఉన్న వ్యక్తి యొద్దకు, మరియు వివిధ ప్రదేశాలకు, మీరే వీటిని చేశారు, మేము ఇక్కడ తొందరపడుతుండగా మీ సేవకుడి యొక్క ప్రార్థన వినండి మరియు ఈ రోజు దీని నుండి స్త్రీకి విముక్తి దయచేయండి. నేను యేసుక్రీస్తు నామమున దీనిని అడుగుతాను. ఆమెన్.దేవుడు నిన్ను దీవించును గాక సహోదరి ఔట్ల. భాదపడకు,నేను నమ్ముచున్నాను నీవు మంచిగా వుండబోతున్నవు .

92

మంచిది. నేను సహోదరి అవుట్ లా నుండి ఒక సమాచారము విన్నాను. నిన్న రాత్రి నేను ఆమెను ఆమె యొక్క సహోదరి కోసం ప్రార్థించడానికి పరుగెత్తించాను, ఆమె చాలా తీవ్రమైన స్థితిలో ఉంది. మరియు ఆమె అభివృద్ది పొందుతోంది, మెరుగు పడుతోంది, మరియు చిన్న స్పానిష్ బాలుడు, చిన్న సహోదరుడు జోసెఫ్ ... నేను ఈ రోజు అతనిని చూడలేదు. నేను వెళ్ళే ముందు జోసెఫ్ ను చూడాలని నేను కోరుకుంటున్నాను. చిన్న స్పానిష్ బాలుడు ఉన్న గదిలో మీరు నన్ను తీసుకువెళతారా, అక్కడ ఉన్న ఆ బాలుడు మెదడు నలిగిపోయి, ఇంకా ఏదో దానిద్వారా చనిపోతున్నాడని వారు భావించారు. చిన్న పిల్లవాడు తిరిగి స్పృహలోకి వచ్చి, స్వస్థత పొంది, హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళాడు.

ఇప్పుడు ప్రార్దిస్తూ ఉండగా మీ తలలు వంచండి. (మీరు ఇక్కడ అడగవచ్చు.)

93

తండ్రి, ఇప్పుడు మా సహోదరుడు క్షేమముగా ఉండడానికి సహాయం చేయమని మిమ్మును ప్రార్థిస్తున్నాను. సాతానా, యేసుక్రీస్తు నామమున ఆ అబ్బాయిని విడిచిపెట్టుమని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. అక్కడ నరాల సమస్య వెళ్ళిపోయింది. నా ప్రియమైన సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక, విశ్వాసముతో ఇంటికి వెళ్ళు.

మీరు మీ చెవిలో ఆ చెవిటి యంత్రము ధరించడం నేను చూస్తున్నాను. దీనితో పనిలేకుండా మీ స్వస్థత మీకు ఇవ్వడానికి, దేవుడు నన్ను దీని కొరకే పంపాడని మీరు నమ్ముతున్నారా? మీరు నేను చెప్పేది వినలేకపోతున్నారా? సహోదరుడా, అయితే సరే.

పరలోక తండ్రి, ఈ వ్యక్తి ఇప్పుడు తన చెవుల్లో ఈ బూరతో ఇక్కడ నిలబడి ఉన్నాడు, మరియు మీరు మాత్రమే అతనిని విడిపించగలరు. ఈ పాత యంత్రముతో అలసిపోయాడు. ప్రజలు తనను తేరి చూడటముతో అతను అలసిపోయాడు. మరియు మీరు అతనికి విముక్తి ఇవ్వడం కోసం ఇక్కడ ఉన్నారు. ప్రియమైన దేవా, మాట్లాడండి.

దయ్యమా, యేసుక్రీస్తు నామమున ఈ మనుష్యుని నుండిబయటకు రా.

వినబడుతుందా? వినబడుతుందా? మీరు ఇప్పుడు మీ తలను ఎత్తవచ్చు. ఆ వ్యక్తి తన బూరతో నేను మాట్లాడేది కూడా వినలేకపోతున్నాడు. వినండి. వినబడుతుందా? [ఆ వ్యక్తి “అయ్యా, అవును” అని జవాబిచ్చాడు.] నేను మాట్లాడేది వినబడుతుందా? [“అయ్యా, అవును.”] అతను కొద్ది సేపటి క్రితం తన బూరతో నేను చెప్పేది వినలేకపోయాడు. నేను చెప్పేది సరిగ్గా వినబడుతుందా? [“అయ్యా, అవును.”] దేవునికి స్తోత్రం. ఆమేన్.

“ప్రభువుకు స్తోత్రం” అని ప్రతి ఒక్కరు చెబుదాం. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. ప్రభువును స్తుతిస్తూ వెళ్ళండి. దేవుడు నిన్ను దీవించును గాక. నా సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. ఓహ్.

ఇది నాకు పరలోకము వంటిది,

అవును, ఇది నాకు పరలోకము లాంటిది;

నేను యోర్దాను దాటి కనాను యొక్క అందమైన భూమికి చేరుకున్నాను,

మరియు ఇది నాకు పరలోకములాంటిది.

94

ఇప్పుడు, మేము ప్రార్థిస్తుండాగా, ప్రతి ఒక్కరూ తలలు వంచండి.

ఓయేసు, మీరు మాత్రమే మా సహోదరిని స్వస్థపరచగలరు. తండ్రి, ఈ రోజు ఆమె వినికిడి ఆమెకు అనుగ్రహించండి, మరియు ఆమె నరాలు, ఉబ్బి మెలికలు తిరిగిన నరాలు ఎండిపోవును గాక. నిత్యమైన దేవా, యేసుక్రీస్తు నామమున దానిని అనుగ్రహించండి .

ఓ దయ్యమా, యేసుక్రీస్తు నామమున స్త్రీ నుండి బయటకురా.

వినబడుతుందా? వినబడుతుందా? అమ్మా, నేను చాల నెమ్మదిగా మాట్లాడుతున్నాను. సరే, మీరు మీ తలలను ఎత్తవచ్చు. వినబడుతుందా? వినబడుతుందా? “ఆమేన్” అని చెప్పండి. [ఆ స్త్రీ “ఆమేన్” అని చెబుతోంది.] ప్రభువుకు స్తోత్రం. [“ప్రభువుకు స్తోత్రం.”] ఇప్పుడు, నేను నెమ్మదిగా మాటలాడుతున్నాను. క్షమించండి. చూడు, నేను వింటున్నది అదే. చూడు నీకు అర్దం కాలేదు. అది అదే. నీవు అలా చేసిన వెంటనే (మీరు చూశారా?), ఎవరైనా దానిని చూస్తారు... లేదా వారు అలా చేస్తారు (చూశారా?), కొన్నిసార్లు వారు “సరే, ఇది అదే” అని అంటారు. అందుకే నేను నిన్ను త్వరగా ఆపాను (మీరు చూశారా?), తద్వారా నీకు అర్ధమవుతుంది. వినబడుతుందా? ఆమెకు నేను మాట్లాడేది బాగానే వినబడుతుంది. “సౌత్ డకోటా” అనండి. సౌత్ డకోటా. ఆమె కొరకు ప్రభువుకు స్తుతులు తెలుపుదాం. సహోదరి, దేవుడు నిన్ను దీవించును గాక.

ఓహ్. ఆయన ఈ రోజు చేస్తాడని నేను భావించాను. అవును. ఓహ్, మీరు అతనిని ప్రేమించడం లేదా? “ఆమేన్” అని చెప్పండి. అయితే సరే. ఇప్పుడు, వారు వస్తుండగా, ప్రతి ఒక్కరూ, మీ తలలు వంచి ఉంచండి.

95

సహోదరుడా, నేను దేవుణ్ణి అడిగితే, ఆయన ఈ క్షయవ్యాధి నుండి మిమ్మల్ని స్వస్థపరుస్తాడని మీరు నమ్ముతున్నారా? ప్రియమైన దేవా, చెవిటివారు వినగలిగేలా, లేదా గుడ్డివారు చూడగలిగేలా, మూగవారు మాట్లాడగలిగేలా, మీరు మాత్రమే చేయగలరు, ఈ క్షయవ్యాధి నుండి మా సహోదరుడిని మీరు స్వస్థపరచగలరు. తండ్రీ, మీరు దానిని మంజూరు చేయమని నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున అది అతనిని విడిచిపెట్టును గాక.

సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. ఇప్పుడు, చూడండి. ఇదే- మీ విశ్వాసమే, సామాన్యమైన ప్రార్థన; ఎక్కువ సేపు ప్రార్థన కాదు. దీనిని చేస్తుంది మీ విశ్వాసమే (మీరు చూశారా?). చూశారా?

96

[టేపుపై ఖాళీ ఉంది] ... మీరు నన్ను అలా వెనుక తాకండి. అదే సమయంలో వెళ్ళేవి కొన్ని వందలు ఉన్నాయి, మరియు మహిళ యొక్క ధ్వని బాగుంది. కొనసాగించుము. నీవు నమ్మితే నీవు బాగవుతావు.

దేవా, తండ్రీ, ఈ చిన్న బిడ్డను మీరు స్వస్థపరుస్తారని, బాగుచేస్తారని నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో మీరు దానిని స్వస్థపరచుమని ప్రార్దిస్తున్నాను. మరియు గుండె సమస్యతో బాధపడుతున్న తన తల్లిని ఆశీర్వదించండి. దేవా, ఇది వారికి కొత్త దినముగా ఉండును గాక. వారు సంతోషిస్తూ ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళి బాగు చేయబడును గాక, యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను. ఆమేన్.

అమ్మా, మీ హృదయపూర్వకముగా మీరు నమ్ముతున్నారా? మీ బిడ్డ బాగుపడతాడు, మరియు మీరు నమ్మగలిగితే మీరు కూడా.

దేవా, ఇప్పుడు ఇక్కడ నిలబడి పూర్తిగా చెవిటిగా ఉన్న మా సహోదరుడిని స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఇప్పుడు అతనికి స్వస్థత ఇవ్వమని నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున నేను దానిని అడుగుతున్నాను.

నేను దీన్ని దాటబోతుండగా, మరియు మీరందరూ అతనిని అక్కడ గమనించండి, ఇప్పుడు ఏమి జరుగుతుందో చూడండి. మేము వారిని దాటేటప్పుడు ఇప్పుడు వీరిలో ఇద్దరు ముగ్గురిని గమనించండి.

97

దేవా, ఈ పిత్తాశయ సమస్యతో ఉన్న నా ప్రియమైన సహోదరుడిని మీరు స్వస్థపరచుమని నేను ప్రార్థిస్తున్నాను, మరియు అతను బాగుపడడానికి అనుమతించండి. యేసుక్రీస్తు నామమున నేను ప్రార్థిస్తున్నాను. అయ్యా, దేవుడు మిమ్మును దీవించును గాక. ఇక్కడ అదే జరిగింది. మీకు ఇప్పుడు అర్దమైంది, వెళ్ళండి. దేవుడు... ఓహ్. అతను వెంటనే దాని దర్శనము చూశాడు. మై, మై. అది ఉచితం.

దేవా, మీరు మా సహోదరిని స్వస్థపరచుమని నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నేను అడుగుతున్నాను. ఆమేన్.

సహోదరి, మీరు నమ్మితే. దేవా, ఈ గొంతు సమస్యతో ఉన్న సహోదరిని మీరు స్వస్థపరచుమని నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున నేను దానిని అడుగుతున్నాను.

సహోదరి, దేవుడు నిన్ను దీవించును గాక. మీరు ఆమెను స్వస్థపరచుమని నేను ప్రార్థిస్తున్నాను, తండ్రి... యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను. ఆమేన్. దాని గురించి నాకు ఎప్పుడూ తెలియదు. ఆమెను ఆశీర్వదించండి...? ... ఇప్పుడు...?... అవును. అయ్యా దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు ఈ గుండె సమస్యతో ఉన్న ఈ చిన్నబిడ్డను ఆశీర్వదించండి. మీరు దానిని స్వస్ధపరచుమని నేను ప్రార్థిస్తున్నాను, తండ్రీ, మరియు అది బాగుపడనివ్వండి. నేను యేసుక్రీస్తు నామమున దాని స్వస్థత కొరకు దాని మీద చేతులు వేస్తున్నాను. తండ్రీ, ఈ తల్లిని ఆశీర్వదించండి. యేసు నామములో ఆమెకు సంతోషకరమైన, ఆరోగ్యమైన జీవితమును ఇవ్వండి. చిన్న సహోదరి, దేవును నిన్ను దీవించును గాక.....?....

98

దేవా, చిన్న కండర పరిస్థితితో ఇక్కడ బిగుసుకుపోయి (కదలలేకుండా), అతని చిన్న నీలి కళ్ళతో పైకి చూస్తున్న ఈ పేద బాలుడు ఇక్కడ ఉన్నాడు, ఓ దేవా, మీరు మాత్రమే దీన్ని చేయగలరు.

సాతానా, యేసుక్రీస్తు నామమున బాలుడిలోనుండి బయటకురా.

ఎవరో తల పైకి ఎత్తారు. స్నేహితులారా, మీ తల క్రిందికి దించి ఉంచండి. ఇది సరిగ్గా తిన్నగా వెనక్కి వస్తుంది. సహోదరుడా తోరా, అది నా చేతిని అక్కడ ఎలా తిప్పిందో మీరు చూశారా...? ...

హనీ నీవు నమ్ముతున్నావా? ప్రతి ఒక్కరూ మీ తలను వంచి ఉంచండి. తండ్రీ, ఈ చిన్న బాలుడిపై దయ చూపించి, ఈ కండర పరిస్థితి నుండి స్వస్థత అనుగ్రహించండి. మీరు మాత్రమే దీనిని చేయగలరు.

ఓ సాతానా, అతని నుండి బయటకు రా. యేసుక్రీస్తు నామమున మరియు ఆయన పరిశుద్ధ దూత ద్వారా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను.

హనీ, ఇప్పుడు, నా వైపు నడవండి, మీ పాదాలను ఇలా పైకి క్రిందికి కదిలించు...? ...ఇదిగో నీవు చేయగలుగుతున్నావు. నీ చేతులను పైకి కిందకు కదిలించు. ఇప్పుడు, ఇలా ఉంచు.... పర్వాలేదు. ఇప్పుడు, నీవు వెళ్ళగలిగినంత గట్టిగా మెట్లు దిగు. (సభికులారా, మీ తలలు ఎత్తండి.) నీవు ఇక బిగుసుకుపోయి లేవు. చూడు, మెట్ల మీద దిగి నడువు. “ప్రభువుకు స్తోత్రం” అని చెపుదాం.

అందరమూ, “ప్రభువుకు స్తోత్రం,” అని చెబుదాం.

అది సరైనది. ఇప్పుడు మెట్లు ఎక్కి పైకి తిరిగి రా. పైకి తిరిగి రా; ఏది వాటిని చూపించు. ప్రతి ఒక్కరూ, “ప్రభువుకు స్తోత్రం” అని చెబుదాం. ఇప్పుడు వెనక్కి తిరిగి, ఇక్కడ కుడి వైపుకు వెళ్ళు, కేవలం ఇటు వైపు కిందకు వెళ్ళు. “ప్రభువుకు స్తోత్రం” అని చెపుదాం. సరే, ఇప్పుడు భవనంలో ప్రతిచోట తలలు వంచండి, 'ఎందుకంటే మేము ప్రార్థించడానికి ఇక్కడ కొన్ని వందల మంది ఉన్నారు. ఇప్పుడు, మీ తలలు వంచి నిజమైన భక్తితో ఉండండి.

99

తండ్రీ, మీరు మాత్రమే ఈ సహోదరుడి కడుపులో పుండును స్వస్థపరచగలరు. తండ్రీ, మాకు తెలుసు, నేను కొన్ని క్షణాల క్రితం నా కడుపులో దాదాపు క్యాన్సర్ వంటి ఒక పెద్ద రక్తపు పుండును గురించి మాట్లాడుతున్నాను. కానీ నేను మీ వాక్యములో పొందాను. మా సహోదరుడు కూడా అలా చేసి, యేసుక్రీస్తు నామమున స్వస్థపరచబడును గాక. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక.

దేవా నా ప్రియమైన సహోదరుడిని ఆశీర్వదించండి. తండ్రి, మీరు అతని శరీరాన్ని స్వస్థపరచుమని నేను ప్రార్థిస్తున్నాను. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. ఇప్పుడు సంతోషముతో వెళ్ళండి.

ప్రియమైన తండ్రి, మీరు ఇప్పుడు మా సహోదరిని స్వస్థపరచుమని నేను ప్రార్థిస్తున్నాను. ఆమె యేసుక్రీస్తు నామమున బాగుపడి ఇక్కడ నుండి సంతోషంగా వెళ్ళునుగాక. ఆమేన్. సహోదరి, మీరు బాగుపడాలని అనుకుంటున్నారా? మీ మార్గములో సంతోషoగా వెళ్ళండి. ఇప్పుడు దాని గురించి మర్చిపోండి. విశ్వాసం కలిగి ముందుకు సాగండి.

ప్రియమైన తండ్రి, మీరు ఈ స్త్రీని స్వస్థపరచుమని నేను ప్రార్థిస్తున్నాను. మరియు ఆమె కల్వరిని దాటి వెళ్ళుతుండగా, ఇత్తడి సర్పాన్ని, లేదా కదల్చబడిన కోనేటి నీరును, లేదా అంతకంటే ఎక్కువ, దాని ద్వారా వెళ్ళినట్లు వెళ్ళకుండునుగాక. తండ్రీ, దానిని అనుగ్రహించండి , యేసుక్రీస్తు నామమున, నేను దానిని అడుగుతున్నాను. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించును గాక. మీరు స్వస్థపరచబడతారని మీరు నమ్ముచున్నారా? అది మీ......కిడ్నీల సమస్య....సహోదరీ, దేవుడు మిమ్మును దీవించును గాక.

100

దేవా, ఈ బలహీనముగా ఉన్న ఈ చెవిటి స్త్రీ ఈ అంగవైకల్య శరీరముతో ఇక్కడ నిలబడి ఉంది, దయనీయముగా అంతయు లాగివేయబడి ఉన్నది, ఈ మధ్యాహ్నం ఆమె అక్కడ కూర్చుని ఉండటాన్ని చూసినప్పుడు, ఆమెకు విశ్వాసం ఉందని భావించాను. కాబట్టి తండ్రీ, రక్షించడానికి రండి, మరియు ఆమెను బంధించిన ఆ దయ్యం బయటికి వచ్చును గాక.

ఆమెను విడిచిపెట్టమని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున ఆమె నుండి బయటకు రా.

తండ్రీ, వందనములు.

ఆమె పొందుకుంది. మీరు చూశారా. నా మాట వినగలుగుతున్నారా?అయితే సరే. ఇప్పుడు మీరు మీ తలను ఎత్తగలరా.

నేను ఆమె గంతులు వేయడం చూశాను. మీకు — ఏమి జరిగిందో మీకు తెలుసు, అవునా? వినబడుతుందా? ఆమేన్. ఇక్కడకు రండి, మీరు కీళ్ళ వాతముతో ఇక బిగిసుకుపోయి లేరు. [టేపుపై ఖాళీ ఉంది ]

ఇప్పుడు, ఆమె నన్ను దయనీయముగా చూస్తోంది.... నేను అక్కడ నిలబడి ఉన్నాను. నేను అక్కడ నుండి వస్తున్న ఆమె విశ్వాసాన్ని అనుభవించాను. నేను...నా రెండు చేతులను మీ చెవుల లోపల ఉంచాను. మరియు నేను నా చేతులు అలా వెనక్కి కుదిపినప్పుడు, ఒక క్షణంలో ఆమె వినికిడి పొందడం జరిగింది. అమ్మా, సరే, మంచిది.

సరే, అందరూ మీ తలలు వంచండి. ....

ప్రియమైన తండ్రి, మీరు ఆమె శరీరాన్ని స్వస్థపరచి ఆమెను బాగు చేయాలని మా సహోదరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. ప్రియమైన దేవా, అనుగ్రహించండి, ఈ గొంతును స్వస్థపరచి, ఆమె కళ్ళు బాగు చేయండి. యేసుక్రీస్తు నామములో తండ్రి, దానిని అనుగ్రహించుము. సహోదరి, దేవుడు నిన్ను దీవించును గాక. మీరు నమ్ముతున్నారా? మీరు నమ్మితే మీరు దానిని కలిగి ఉంటారు…[టేపుపై ఖాళీ ఉంది]

101

దేవా, మా సహోదరిపై కనికరము చూపుము, ఈ కడుపు మంట నుండి మీ కుమారుడైన, యేసు క్రీస్తు నామములో స్వస్థపర్చుము. అమ్మా, దేవుడు మిమ్మును దీవించును గాక. మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? మీ హృదయపూర్వకముగా? అయితే సరే మీరు దానిని పొందుకుంటారు.

సర్వశక్తిమంతుడైన దేవా, ఈ ఆరోగ్యకరమైన వాతావరణంలో కూడా, దయనీయముగా నిలబడి ఉన్న ఈ వ్యక్తి క్షయవ్యాధితో చనిపోబోతున్నాడు. ఇది మీ శక్తిని తీసుకుంటుందని మాకు తెలుసు, తండ్రీ, మరియు ఈ కొద్ది ఆశీర్వాదములో అతను నిలబడి, కేవలం సాధారణ పిల్లలకున్న విశ్వాసం ద్వారా దాటి వెళ్లి స్వస్థపరచబడునుగాక. ఆయన స్వస్థత కోసం యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక, నా సహోదరుడా. సంతోషిస్తూ వెళ్ళండి. మీరు ఎలా భావిస్తున్నారు అనే దానిగురించి ఎలాంటి శ్రద్ధ పెట్టవద్దు, బాగుపడండి.

దేవా మా సహోదరిపై కనికరం చూపించి, ఈ నరాల బలహీనతనుండి ఆమెను స్వస్థపరచుమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను. ఆమేన్. సహోదరి, ఇప్పుడు మీరు బాగవుతారు? మీరు దాని గురించి ఆందోళన చెందాల్సినపని లేదు. అది పోయింది. అవును. సంతోషముగా వెళ్లoడి. పర్వాలేదు.

102

తండ్రీ, మీరు మా సోదరిని స్వస్థపరచి, ఆమెను బాగుచేయుమని నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున ఆమె తన హృదయములోనుండి ఆనందించుచు ఈ వేదికను విడిచిపెట్టును గాక. ఆమేన్. సహోదరి, మీరు నమ్ముతున్నారా? డోర్సా, అది సరైనదేనా? ఒక చక్కని పేరు. సరే. ఇప్పుడు, డోర్సా, సంతోషముగా వెళ్ళండి.

సహోదరి, దేవుడు మీ కోసం దానిని వెళ్ళిపోయేలా చేస్తాడని మీరు నమ్ముతున్నారా? తండ్రి, ఈ ఉక్కిరిబిక్కిరి చేసే ఆత్మతో ఉన్న మా సహోదరి కోసం ప్రార్థిస్తున్నాను. అది ఆమెను విడిచిపెట్టి, ఆమెను ఇక ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ఉండును గాక. యేసు నామములో నేను దానిని గద్దిస్తున్నాను. చిన్న సహోదరి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఏమిటి? ఓహ్, అది ఇంకా చూపిస్తుందా? ఇప్పుడు ఇక ఉండదు.

చెప్పండి, ఒక్క క్షణం మీ కళ్ళు తెరవండి. ఈ అమ్మాయికి గొంతువాపు వ్యాధి ఉంది, అది ఆమె గొంతులోనుండి ఇక్కడే అదృశ్యమైపోయింది. ఇదిగో ఇక్కడ- కనిపించే గొంతువాపు. అమ్మా, అది సరైనదేనా? ఇక్కడ చూడండి. మింగండి. అందరం, “ప్రభువుకి స్తోత్రం” అని చెపుదాం. అమ్మా, దేవుడు మిమ్మును దీవించును గాక...?... మీరు బాగయ్యారు.

103

మీ వయస్సు ఎంత? నేను ఆయనను అడిగితే దేవుడు నా ప్రార్థన వింటాడని మీరు నమ్ముతున్నారా? ఎందుకు, మీరు ఇప్పటికే స్వస్థత పొందుకున్నారని నేను నమ్ముతున్నాను. నేను నా హృదయపూర్వకముగా నమ్ముతున్నాను. దేవుడు, ఈ స్త్రీని దీవించునుగాక. తండ్రీ, ఆమె విశ్వాసం ఆమెను కాపాడిందని నా హృదయపూర్వకముగా నేను నమ్ముతున్నాను. యేసు నామమున నేను వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మా, మీరు ఈ వరుసకు నడిచి వచ్చినప్పుడే మీరు స్వస్థపరచబడ్డారు.

మిత్రులారా, మీరు కళ్ళు తెరవాలని నేను కోరుకుంటున్నాను. నేను— విశ్వాసము కరువైన స్థలం ఇది అని చెప్పాను, కానీ నేను ఈ మధ్యాహ్నం గొప్ప స్థలమని నమ్ముతున్నాను. ఈ అమ్మాయి నేను ఆమె చేతిని పట్టుకోకముందే స్వస్థపరచబడింది. ఇప్పుడే... నేను ఏదో కదలాడడం భావించాను, మరియు అమ్మాయి స్వస్థపరచబడింది.

ఒక వింత అనుభూతి మీకు కలిగింది, అవునా? అమ్మా, నీవు స్వస్థపరచబడ్డావు. సరే. మీరు నా మాటను గురుతు చేసి పెట్టుకోండి, అది సరైనదేనా అని చూడండి. ప్రభువును మహిమపరచండి.

104

చూడండి, ప్రియమైన స్నేహితులారా. మిమ్మల్ని స్వస్థపరచేది నా ప్రార్ధన కాదు; దేవునిపై మీకున్న విశ్వాసమే, మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. ఇది కేవలం దాటి వెళ్ళడానికి మరియు నమ్మడానికి ఒక సాధారణ భాగం. మరియు గుర్తుంచుకోండి, నేను మీకు చెప్పాను, దేవుని దూత మరియు నా చేతిలో నా బైబిల్ పట్టుకున్నాను. నేను నిజాయితీగా ఉంటే ప్రార్థన ముందు ఏదియు నిలబడలేదని, మరియు ప్రజలు నన్ను నమ్ముతారు అని ఆయన నాకు చెప్పాడు. అదే మీరు చేయాల్సింది: స్నేహితులారా, కేవలం నమ్మి ఇక్కడికి రండి, మరియు మీరు దానిని పొందుకుంటారు. మరియు మీరు నమ్మితే, అలా వ్యవహరించండి. వెళ్లి సంతోషించండి మరియు సాక్ష్యమివ్వండి, ప్రజలకు చెప్పండి. ఖచ్చితంగా, విశ్వాసం మీరు అనుకునేది కాదు; మీరు కలిగి ఉన్నది, మీరు నమ్మేదే విశ్వాసము(నిజమేనా?). ఇప్పుడు, ప్రార్థిస్తుండగా తలలు వంచండి. ఓహ్, ఇది బాగా జరుగుతుంది. ఇది ఇలాగే ఉంటుందని నేను దేవునిలో నమ్ముతున్నాను.

తండ్రీ, మీరు మా సహోదరుడిని ఆ ఆయాసము నుండి స్వస్థపరుస్తారని యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను. అయ్యా, దేవుడు మిమ్మును దీవించును గాక. మీరు నమ్ముతున్నారా? మీరు పొందుకుంటారు.

105

అమ్మా, మీరు నమ్ముతున్నారా? దేవా, ఈ స్త్రీని మరియు ఆమె మృదువైన హృదయాన్ని ఆశీర్వదించండి. నేను యేసు నామమున ఆమె ఇప్పుడు స్వస్థతపొంది సంతోషిస్తూ వెళ్ళాలని ప్రార్దిస్తున్నాను. ఆమేన్. సహోదరి, దేవుడు మిమ్మును దీవించునుగాక..

దేవా, ఇక్కడ కీళ్ళ వాతముతో అంగవైకల్యము కలిగి నిలబడిఉన్న మా సోదరుడిని ఆశీర్వదించండి. ఓ దయ్యమా, యేసుక్రీస్తు నామమున అతనిని విడిచిపెట్టు. ఇప్పుడు ఇతన్ని నడిపించండి. మంచిది, ఇప్పుడు, మీరు కీళ్ళ వాతముతో ఇక వికలమై లేరు. మెట్లు దిగండి. మెట్లు దిగి నడవండి. అదిగో అక్కడ అతను వెళుతున్నాడు. అతనిని చూడండి.

అందరమూ, “దేవునికి స్తోత్రం,” అని చెపుదాం. ప్రతి ఒక్కరు, ఇప్పుడు, మీ తలలు కిందకి దించండి.

106

దేవా, నత్తిగా ఉన్న ఈ బాలుడిని స్వస్థపరచుమని నేను ప్రార్థిస్తున్నాను. అది ఇప్పుడే ఈ బలిపీఠము వద్ద వదిలి వెళ్లిపోవును గాక. ఈ నత్తిని నేను యేసు క్రీస్తు నామమున గద్దిస్తున్నాను. “ఆమేన్” అని చెప్పండి. [ఆ అబ్బాయి “ఆమేన్” అని చెబుతాడు.] దేవునికి స్తోత్రం. [“దేవునికి స్తోత్రం.”] డాడీ. [“డాడీ.”] అమ్మా. [“అమ్మా.”] ఇది వినండి. ఆమేన్. [ఆ అబ్బాయి “ఆమేన్” అని చెబుతాడు.] డాడీ. [“డాడీ.”] అమ్మా. [“అమ్మా.”] “ దేవునికి స్తోత్రం” అని చెపుదాం ప్రతి ఒక్కరూ. వెళ్లండి...? ...

తండ్రి, సహోదరిపై దయ చూపండి మరియు ఈ అధిక రక్తపోటు నుండి ఆమెను స్వస్థపరచండి, మరియు తండ్రి ఆమె అలసిపోయి, బలహీనముగా ఉంది. ఆమె ఈ రోజు ఇంటికి వెళ్లి యేసు నామములో బాగవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. సహోదరి, మీరు? మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? “ప్రభువైన దేవా, నీవు నన్ను స్వస్థపరిచావని నేను హృదయపూర్వకముగా నమ్ముతున్నాను, నేను దాని గురించి సంతోషిస్తున్నాను.” దాని గురించి మీరు ఈ విధంగానే భావిస్తున్నారా? మీ మార్గములో సంతోషిస్తూ వెళ్ళండి.

107

తన దృష్టిని కోల్పోతున్న ఈ వ్యక్తిని దేవుడు దీవించును గాక. అతని...? ... [టేపుపై ఖాళీ ఉంది] ... మీ కంటి చూపును మీరు కోల్పోడంలేదు. ఇప్పుడు భవనం చుట్టూ చూడండి. ఇక్కడ వేదిక మీద నిలబడి ఉన్న ద్వారపాలకుని చూడండి. అయ్యా, మీ చేతిని పైకి ఎత్తండి. అతను ఎన్ని వేళ్లు చూపిస్తున్నాడు? మీరు అతని చేతులు చూడగలరా? సహోదరుడా, అది ఖచ్చితంగా సరైనది. మీరు సరిగ్గా చెప్పారు. మీకు ఏమి జరిగిందో చూడండి? దేవుడు మీ విశ్వాసానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. అయితే సరే...? ....

దేవా, ఈ తల్లి దయనీయముగా ఇక్కడ నిలబడి ఉంది, ఆమె మీ మహిమ కొరకు స్వస్థత పొందాలని కోరుకుంటుంది. ఆమె యొక్క గొప్ప విశ్వాసం ఇప్పుడు మీ వైపు చూసి, అన్నిటినీ పక్కన పెట్టి, ఆమె హృదయపూర్వకముగా మిమ్మల్ని నమ్మి, యేసుక్రీస్తు నామములో స్వస్థత పొందుకొనును గాక. ఆమేన్. సహోదరి, దేవుడు మీ కోరికను మీకు అనుగ్రహించు గాక....

తండ్రి, చెవిటితనముతో ఉన్న ఈ అమ్మాయిని స్వస్థపరచమని నేను మీకు ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో, ఆమె ఇప్పుడు తన వినికిడిని పొందుకొనును గాక. సహోదరుడా, ఇప్పుడు, ఆమె మాటలు పరిశీలించండి.

దేవా, యేసుక్రీస్తు నామములో మీరు ఆమెను స్వస్థపరచమని నేను మా సహోదరి కోసం ప్రార్థిస్తున్నాను.

దేవా, యేసుక్రీస్తు నామమున ఈ శ్వాస నాళముల వాపును స్వస్థపరచుము.

యేసు నామమున నా సహోదరుని కడుపు సమస్యను స్వస్థపరచుము.

108

ఈ చిన్న అమ్మాయిని స్వస్థపరచుము, తండ్రీ, నేను యేసు నామములో ప్రార్థిస్తున్నాను. అమ్మా, మీరు నమ్ముతున్నారా?

ఏమిటి...? ... మెల్ల కళ్ళు ఉన్నాయి. అమ్మా, లోక పాపాల కోసం , స్వస్థత కోసం యేసుక్రీస్తు మరణించాడని మీరు నమ్ముతున్నారా? అయితే సరే. తల వంచoడి...?... నేను దీన్ని చేయగలనని మీరు నమ్ముతున్నారా? వేరే రంగు ప్రజలు నా కూడికలకు ఎక్కువ రారు. కానీ మీరు నమ్ముతున్నారా, మీరు నన్ను నమ్ముతున్నారా...? ... [టేపుపై ఖాళీ ఉంది] సహోదరి, దేవుడు నిన్ను దీవించును గాక. మీ కుమార్తె ఇప్పుడు స్వస్థత పొ౦దుకుంది.

పరలోకపు తండ్రీ, నేను ఇప్పుడు అర్కాన్సాస్ లోని జోన్స్ బోరోలో ఆ గుడ్డితనముతో నల్లజాతి అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను, ఆమె నా పాత చిరిగిపోయిన కోటును పట్టుకుని, “నన్ను దాటిపోవద్దు” అని ఎలా చెప్పిందో ఆలోచిస్తున్నాను. తండ్రి, మీకు వారు తెలుసు. నీవు మా అందరి కోసం మరణించినట్టుగానే ఈ నల్లజాతి వారి కొరకు కూడా మరణించావు. మరియు మనమందరం క్రీస్తుయేసులో ఒకటే. మీరు వ్యక్తులను బట్టి గౌరవించరు.

109

ఇప్పుడు, వారు ఒక మెల్ల కళ్ళు, ఆయాసం, తలలో సమస్య ఉన్న అమ్మాయిని తీసుకువచ్చారు. ప్రభువా, ఆమెను బాగు చేయడానికి నీవు ఇక్కడ ఉన్నావు. ఆ ఉదయము మీరు యెరూషలేములో శిలువను మోస్తూ పడిపోయినప్పుడు కురేనీయుడైన సీమోను, ఆ నల్లజాతి మనిషి వచ్చి మీ శిలువను భరించడానికి సహాయపడ్డాడు. దేవా, మీరు అర్థం చేసుకున్నారని నాకు తెలుసు. మరియు ఇక్కడ ఫీనిక్స్ లో ఈ ప్రజలకు మీరు వ్యక్తులను బట్టి గౌరవించరు అని నిరూపించడానికి, నేను వీటిని మెల్ల కళ్ళను యేసుక్రీస్తు నామమున గద్దిస్తున్నాను. ప్రతి ఒక్కరూ, ఇప్పుడు, మీ తలలను వంచి ఉంచండి.

సర్వశక్తిమంతుడైన దేవా, మీరు దేవుడు మరియు నేను నీ సేవకుడవై యున్నాను అని ఈ రోజు తెలియజేయండి, నీవు మాత్రమే జీవము గల దేవుడవని, నన్ను అభిషేకి౦చి నన్ను పంపావని, వాటిని గూర్చి మీరు నాకు బయలుపరచిన మాటలు తప్ప నా అంతటిగా నేను ఏది మాట్లాడను అని ప్రజలు తెలిసికొనునుగాక. కాబట్టి, దేవదూత, మీరే నన్ను వెళ్ళమని, నేను నిజాయితీగా ఉంటే, ప్రజలు నమ్ముతారని; ప్రార్ధన ముందు నిలబడేది ఏమీ ఉండదు అని చెప్పారు... నేను దీనిని అడుగుతున్నాను. నేను ఫీనిక్స్ నుండి బయలుదేరుతున్నాను. మరియు ప్రభువా, నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను. మీరే దేవుడని మరియు నేను మీ సేవకుడను అని నిరూపించండి.

ఓ దయ్యమా, నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ నుండి బయటకు రా.

110

హనీ, మీ చిన్న కళ్ళు మూసి ఉంచండి. ఇప్పుడు, మీ తల ఎత్తండి, కానీ మీ కళ్ళను మూసి ఉంచండి. (ప్రతి ఒక్కరూ మీ కళ్ళు మూసుకుని ఉండండి.) ఇప్పుడు, నెమ్మదిగా కళ్ళు తెరవండి, నా వైపు చూస్తూ, నెమ్మదిగా ఇప్పుడు, నాలాగా. ఇదిగో సరిచేయబడ్డాయి. అయితే సరే. ఆమె కళ్ళు తిన్నగా సాధారణంగా ఉన్నాయి. ఇక్కడ ముందు చూడండి, ఎవరైనా చూడాలనుకుంటే... చూడండి. సభికులను చూడండి. సహోదరి, ఇక్కడ చూడండి...? ... సరిగ్గా ఉన్నాయి. మంచిది. “ప్రభువుకు స్తోత్రం” అని అందరూ చెపుదాం.

అయ్యా, అవును. అమ్మా, తల సమస్య కూడా పోయింది. అంతా బాగానే ఉంది. ఆమెని చూడండి...? ...

ఓహ్, మై. మీరు యేసుని ప్రేమిస్తున్నారా? అవునా? అది చక్కగా బాగానే ఉంది. ఇప్పుడు ఆ ప్రేక్షకులను అక్కడ చూడండి. స్నేహితులారా, ఇప్పుడు, ఇక్కడ చూడండి. ఆమె కళ్ళు, మెల్ల కళ్ళు...? ... మీరు చూస్తున్నారా, నా వేళ్ళు చూడండి. ఇప్పుడు, మీరు...? ... మీరు నా వేలితో పాటు మీ కళ్ళను కదిలించండి. మీరు మీ కళ్ళతో ఇదే చేయాలని నేను కోరుకుంటున్నాను...? ... అలా. దగ్గరగా...... వెనుకకు మరియు ముందుకు. ఇప్పుడు ప్రజలు చూడగలిగేలా పైకి లేపండి. పరిపూర్ణముగా చేయబడ్డాయి. దేవునికి స్తుతులు చెల్లిద్దాం.

తండ్రి, మీరు ఇక్కడ ఉన్నారు...? ... నీ వాక్యం...? ...నీకే మహిమ. మరియు తండ్రి, ఈ చిన్న అమ్మాయిని ప్రతిరోజూ మీ చిత్తములో ఉంచుమని నేను ప్రార్థిస్తున్నాను, యేసు నామములో అడుగుతున్నాను, ఆమేన్. దేవుడు నిన్ను దీవించును గాక. ఇప్పుడు పరిగెత్తి మరియు ప్రభువు మీ కోసం చేసిన దానిని ప్రజలకు చెప్పండి.

సరే. ఇప్పుడు మీ తలలు వంచండి. ప్రార్థించబడాల్సిన వారు చాలా ఉన్నారు.

111

దేవా, ఈ తల్లి ప్రక్కను సృష్టించిన మీరే బిడ్డను తీసుకున్నారు. ఇప్పుడు, ఇక్కడ ఆమె ప్రక్కలో ఒక దుస్థితి ఉంది. నేను ఇప్పుడు ఆ దుస్థితిని గద్దిస్తున్నాను. మహిళను విడిచిపెట్టు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను నిన్నుగద్దిస్తున్నాను. ఆమె నుండి బయటకు రా. ఇది ప్లీహ లోపము అని నేను అనుకుంటున్నాను, కానీ అది ఆగిపోయింది. వెళ్ళండి ... మీరు ఎక్కడ నివసిస్తున్నారు? సహోదరి, మీరు దేవునికి సాక్షిగా ఉండండి... [టేపుపై ఖాళీ ఉంది.]

స్వస్థత పొందడానికి వచ్చారు. ఓహ్, ఇప్పుడు నాకు సహాయం చేయండి. [టేపుపై ఖాళీ ఉంది.] క్షయ వ్యాధి ఈ వ్యక్తిని తాకింది... ఓహ్, సాతానా, నీవు దీన్ని ఎందుకు చేసావు? యేసుక్రీస్తు నామములో అతనిని విడిచిపెట్టు. ఇప్పుడు, స్నేహితులారా, కేవలం ఒక క్షణం, ఇది మనిషిని పట్టుకుని ఉంది.

అయ్యా, నా వైపు చూడండి. మీరు ఎంతకాలం నుండి దీనితో బాధపడుతున్నారు? నలభై నాలుగు. బహుశా సభికులలో కొందరు ఎప్పుడూ కంపనాన్ని చూసి ఉండకపోవచ్చు. వారు దీనిని చూడాలని నేను కోరుకుంటున్నాను. కేవలం ఒక క్షణం పక్కకు జరగండి.

సరే, సభికులారా, మీ తలలు ఎత్తండి. క్షయవ్యాధి కంపనం ఉంది. ఆ తెల్లని మచ్చలు నా చేతిపై లేచి పడటం చూడండి? ఎరుపు, ఈ చేయి ఎంత తెల్లగా కనిపిస్తుందో చూడండి? దీనిని చూడండి. ఇక్కడ చూడండి, తెల్లని మచ్చలు వచ్చి వెళ్ళటం చూడండి? మీరు చూశారా?అయ్యా, నా ఉద్దేశం ఏమిటో చూడండి? ఒక నిమిషం ఇక్కడ చూడండి. అయ్యా, ఇప్పుడు, దేవుడు దానిని మీ నుండి తీసివేస్తే, అది ఆగుతుంది, మరియు నా చేయి ఇలా ఉంటుంది. రెండిటి మధ్య చాలా తేడా ఉంది. అవునా? ఇప్పుడు, మీరు నా చేతిని చూడండి, మరియు ఇక్కడ రోగి అయిన మీరు నా చేతిని చూడండి. ఇది ఇలా పోయినట్లయితే (మరియు నేను దానిని కదిలించను.), మరియు ఇది అంతా పోయినట్లయితే, అదే మీకు సాక్ష్యం. అప్పుడు ఏదో జరిగింది, అవునా? ఖచ్చితంగా ఏదో జరగడం మీరు చూస్తారు. ఇప్పుడు, ప్రతిచోటా తలలు వంచండి.

112

సర్వశక్తిమంతుడైన దేవా, ఆకాశాన్ని, భూమిని చేసిన వ్యక్తి మీరే. మీరే మనిషి శరీరాన్ని తయారు చేసినది. మరియు ఈ దయ్యం ఈ యువకుడి ప్రాణాలను తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఓ యేసు, మీరు అతనికి సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నారు. సహాయము చేయుము తండ్రీ, నీవే క్రీస్తువై ఉన్నావని, నీవు క్రీస్తువై ఉన్నావు నేను నీ దాసుడనని తమ జనులలో, మరియు వారి చుట్టూ ఉన్నవారు తెలుసుకొనును గాక. అందువల్ల, నేను యేసుక్రీస్తు నామమున ఈ దయ్యాన్ని కలుసుకోవడానికి వస్తున్నాను.

క్షయవ్యాధి అనే దయ్యమా, వాని నుండి నీవు బయటకు రా; నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. మనిషిని విడిచిపెట్టు.

అయ్యా, నేను తల ఎత్తడానికి ముందు, లేదా కళ్ళు తెరవడానికి ముందు, నా చేయి తెల్లగా మారుతోంది, అవునా? మంచిది. ఇప్పుడు, ఇక్కడే ఉంది. (ఇప్పుడు, ప్రేక్షకులైన మీరు, మీ తలలు ఎత్తవచ్చు.) అయ్యా, ఇప్పుడు, నేను ఎన్నడూ నా చేతిని కదిలించలేదు అని మీకు తెలుసు. అది అదే విధంగా ఉంది, అవునా? మరియు ఇది అంతటా ఎరుపుగా ఉంది దానిపై తెల్లటి మచ్చలు (అది సరైనదా?), రావడం మరియు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు, ఇది కేవలం అక్కడ ఉన్న దాని మాదిరిగానే కనిపిస్తుంది, అవునా? అవును. ఇప్పుడు, సహజాతీతమైనది జరిగింది, అవునా? కంపనాలు ఆగిపోయాయి. ఇప్పుడు, మీరు మీ హృదయపూర్వకముగా నమ్మినట్లైతే, మీకు మీరు నిటారుగా నిలబడి, దేవుడు మిమ్మల్ని స్వస్ధపరుస్తాడని, మీరు బాగవుతారు అని సాక్ష్యమిస్తూ, సంతోషముగా వీధుల్లోకి వెళ్ళండి. నా సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. పర్వాలేదు. “ప్రభువుకు స్తోత్రం...” అని చెపుదాం.

113

ఇప్పుడు, ప్రతి ఒక్కరూ... ప్రార్థించడానికి ఇంకా ఎంత మంది మిగిలి ఉన్నారు? ఎంత మంది అక్కడ నిలబడి ఉన్నారో చూద్దాం. ఇప్పుడు, చూద్దాం. ఇప్పుడు, ఇప్పుడు మీ సంఘాల కోసం తొందరపడుతున్న వ్యక్తులకు, ఇప్పుడు సమయం ఐదు అవుతుంది. సమయం ఐదు అవుతుంది. నా గడియారం సరిగానే చూపిస్తుందా? సహోదరుడా, అది అంతేనా...? ...ఐదు గంటలకు.

నాకు అవకాశం దొరికింది కాబట్టి, నేను బ్రదర్ ఫాల్క్ నర్, బ్రదర్ అవుట్ లాకు, సోదరుడు గార్సియాకు, బ్రదర్ ఫుల్లర్ కు మరియు ఈ సోదరుడు నేను మీ పేరు గుర్తుచేసుకోలేకపోతున్నాను, సరే, ట్రూమన్, ట్రూమన్, మరియు వివిధ ఇతర సేవకులకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.... ఇది...?... బల్లార్డ్, సోదరుడు బల్లార్డ్ ఈయన సేవకుడేనా? మరియు మిగిలిన వారందరూ ... సోదరుడు గార్సియా, మరియు అందరూ... ఇక్కడ బ్రదర్ గార్సియా నావెనుక ఉన్నారు. మరియు ప్రతిచోటా సహకారం అందించే సేవకులందరికి... సహోదరుడు బీమోన్స్ మెసా నుండి వచ్చారు. ఎక్కడ... అతను ఎక్కడ నుండి? ఇతను? కెమెరాతో ఇక్కడ ఉన్న వ్యక్తి. సరే. మేము అతనికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాము. ఈ సహోదరులందరికి, మీ సభ్యులందరికి, ఫీనిక్స్ సమావేశాల్లో మాకు సహకరించిన ప్రతి దానికి. ఆ సేవకులందరికి మనమందరం చప్పట్లు కొడదాం, ప్రతి ఒక్కరూ. మంచి ప్రశంసలు అందుకోడానికి వారు అర్హులు. అవునండి.

ఫీనిక్స్లో మీకు అలాంటి సేవకులు లభించినందుకు నేను ఖచ్చితంగా సంతోషిస్తున్నాను. మై, మీరు గొప్ప ఉజ్జీవ ఐక్యత కూడికలు కలిగి ఈ సభా మందిరములను మరియు అన్నిటినీ ప్రజలతో నింపి, బలిపీఠము యొద్దకు ప్రజలు తీసుకువస్తారని ఆశిస్తున్నాను.

114

నేను సహోదరుడు షర్రిట్ తో మాట్లాడాను. నేను విడిచిపెట్టడానికి ఇష్టపడని మరొకవ్యక్తి ఉన్నాడు. వినండి. జాన్ షర్రిట్ వంటి వ్యక్తితో ఫీనిక్స్ ఆశీర్వదించబడిందని నేను అనుకుంటున్నాను. దాని గురించి మీరందరూ ఏమనుకుంటున్నారు? ఆమేన్. అది సరియైనదేనా? అతనికి కూడా చప్పట్లు కొడదాం, ఎందుకంటే అతను నాకు సహోదరుడు. అది నిజం. ... ఇంక ఇప్పుడు...అవును, బ్రదర్ గిబ్సన్, నేను అతని భార్యను మర్చిపోలేకపోయాను. అవును. ఆమెది ఒక అందమైన చిన్న పాత్ర, కేవలం, “మంచిది, అవును” అని మాత్రమే మాట్లాడింది. ఆమె మంచి వంట మనిషి.

మరియు ఆమె ఒక సహోదరిలాగా ఉన్నది, మరియు సహోదరుడిగా నేను వారికి మరియు వారి చిన్న పిల్లలకు కృతజ్ఞుడనై ఉన్నాను.

మంచిది, నిజానికి ఇదే. మీ అందరిని బట్టి నేను దేవునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. అంతా బాగుంది. మరియు నేను ఈ మధ్యాహ్నం ఇక్కడ ఈ ఆత్మ యొక్క ఆహ్వానమును చూసినందుకు ఖచ్చితముగా కృతజ్ఞుడనై ఉన్నాను. మీరు నమ్మాల్సిన ఒక ప్రదేశమునకు వచ్చినప్పుడు, లోపలయినా బయటయినా, అప్పుడు ప్రభువు దిగి వస్తాడు. అది సరైనదేనా? మరియు స్నేహితులారా, నేను కేవలం కృతజ్ఞుడను; ఫీనిక్స్ లో ఈ కూడిక ఇప్పుడు మనకు జరిగిన గొప్ప సమావేశాలలో ఒకటిగా ఉంది. అవును.

115

ఇప్పుడు, మీ తలలు వంచి ఉంచండి, మరియు మేము ప్రతిఒక్కరి కోసం ప్రార్థించడానికి ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడు, మీరు... మీ సంఘానికి ఆలస్యం చేయవద్దు. సంఘానికి వెళ్లాల్సిన మీరు, మీరు వెళ్ళండి. ఇప్పుడు మీరు సంఘాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే... కానీ మీరు సంఘానికి వెళ్ళకుండా ఉండగలిగితే, ఎందుకు, మీరు ఉండండి. మీరు కొంచెం ఎక్కువ సేపు ఉండగలిగితే, మిమ్మల్ని మీరు స్వాగతించుకోండి.

మనము కలుసుకునే వరకు, గుర్తుంచుకోండి, దేవుడు మీలో ప్రతి ఒక్కరినీ దీవించును గాక. ఇప్పుడు, మీరు ప్రార్థిస్తుండగా, సహోదరి, వీలైతే సంగీతం కొనసాగించండి.

దేవా ఈ మహిళను దీవించండి. ఆమెలో ఉన్న ఈ సమస్య నుండి యేసు నామములో స్వస్థపరచుమని నేను ప్రార్థిస్తున్నాను'. ఆమేన్. సహోదరి దేవుడు నిన్ను దీవించును గాక. మీరు ఇప్పుడు బాగుపడబోతున్నారు?

దేవా, దయ చూపండి... ఓహ్, వేచి ఉండండి, ఆమెకు ఎక్కువ ఉంది...? ... ఓహ్, సహోదరి. నేను చేస్తాను- నేను మీ కోసం ప్రార్థించే వరకు అది ఏమిటో మీకు చెప్పను. మీరు... మీరు నమ్ముతున్నారా?

సర్వశక్తిమంతుడైన దేవా, స్త్రీని కరుణించి ఆమె శరీరాన్ని స్వస్థపరచండి. ఓ దయ్యమా, ఆమె నుండి బయటకు రా. యేసుక్రీస్తు నామములో నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను.

సహోదరి, మీరు ఇప్పుడు ఆ విశ్వాసాన్ని ఉంచండి. ఇది ఆగిపోయింది. చూడండి? మీతో తప్పిదము ఏమిటో మీకు తెలుసా? మీరు ఇప్పుడు భయపడటం లేదు. మీరు బాగుపడబోతున్నారని మీకు తెలుసు, అవునా?. అయితే సరే. మీకు దాని గురించి అనుమానం ఉందా?ఇప్పుడు, నమ్మకముతో వెళ్ళండి. [టేపుపై ఖాళీ ఉంది]?

116

క్యాన్సర్ తో ఇక్కడ ఉన్నారు. మరియు ఇక్కడ చిన్నపిల్లవాడు న్యుమోనియా (ఊపిరి తిత్తుల వ్యాధి) యొక్క అంచుల్లో ఉన్నాడు, మరియు తన చిన్న రుమాలును ప్రార్థన కొరకు పంపాలనుకున్నాడు. తండ్రి, వారు పౌలు శరీరం నుండి, చేతి రుమాలును లేదా పై బట్టను తీసుకున్నారు అని మాకు బోధించబడింది. మరియు మేము పవిత్ర వ్యక్తి అయిన పౌలు వంటి వారము కాదు అని తెలుసు. కానీ స్వస్థత చేసింది ఆయన కాదు, అది ముందు వెళ్లి ప్రజల విశ్వాసాన్ని కదిలించిన మీ ఆత్మ అని మేము గ్రహించాము. నేను ఈ రుమాలును ఈ మధ్యాహ్నం తన శరీర స్వస్థత కోసం ఆ చిన్న పిల్లవాడికి పంపిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున, అతను మరియు అతని తల్లి ఆరోగ్యముగా, చాలా సంవత్సరాలు సంతోషముగా ఉండును గాక. ఆమేన్. సహోదరి, సంతోషిస్తూ వెళ్ళండి. దేవుడు నిన్ను దీవించును గాక.

ఓ దేవా, మా ప్రియ సహోదరిని కరుణించి ఆమెను స్వస్థపరచుము. యేసు క్రీస్తు నామములో దీనిని అడుగుచున్నాను. సహోదరీ, దిగులు పడకండి. మీరు బాగవ్వబోతున్నారు. అమ్మ, దేవుడు నిన్ను దీవించును గాక.

అల్సర్ ఉంది, అవునా? సరే. మీరు సహోదరుడు గార్సియస్ సంఘానికి వెళ్తారా. ఓ, మీరు అలా చేయలేరు..... మంచిది. మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు అవునా? పరలోకపు తండ్రి, మధ్యాహ్నం కడుపులో అల్సర్ తో బాధపడుతూ ఇక్కడ నిలబడి ఉంది, మీకు మాత్రమే దానిని ఎలా తీసివేయాలో తెలుసు. తండ్రి, ఆమె భక్తిపూర్వకంగా వచ్చి ఉన్నది. మరియు మీరు ఆమెకు సహాయం చేయుమని ప్రార్థిస్తున్నాను.

ఓ అల్సర్ అనే దయ్యమా, యేసు నామములో ఈమెను విడిచి పెట్టమని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. అమ్మా, ఇప్పుడు నీవు దిగులు పడవలసిన అవసరం లేదు. నీ అల్సరు బాగు చేయబడుతుంది. నీవు మంచిగా ఉంటావు. సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక.

117

పరలోకపు తండ్రి, మా సహోదరిని నీవు స్వస్థపరచి బాగుచేయమని ఈమె కోసం ప్రార్థిస్తున్నాను. సాతానా, యేసు నామములో ఈ స్త్రీ నుండి బయటకు రా. ఆమె కోసం ఎదురు చూస్తున్న ఆమె భర్తను దేవుడు దీవించును గాక. అతని యొక్క భార్య తన స్వస్థత నిమిత్తమై కేకలు వేస్తూ దేవుని స్తుతిస్తూ తిరిగి వెళ్ళును గాక. అతను కూడా లేచి కేకలు వేస్తూ దేవుడిని స్తుతించును గాక. అదే గడియలో అతను సరిచేయ బడటం ప్రారంభిస్తాడు. అమ్మా, మీరు వెళ్ళండి. సందేహించవద్దు. సంతోషిస్తూ వెళ్ళండి.

ఓ దేవా, ఇక్కడ నిలబడి ఉన్న ఈ చిన్న పిల్లవాని యొక్క శరీరమును స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఏది తప్పో , మీకు తెలుసు, తండ్రి, యేసు నామములో మీరు అతనిని బాగు చేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్. బాబు, దేవుడు నిన్ను దీవించును గాక.

దేవా, ఈ స్త్రీని దీవించండి. తండ్రి, ఆమె శరీరమును స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాను. ఆమె అంగవైకల్యంతో ఈ అమ్మాయి చేత ఇక్కడికి నడిపించబడడం మేము చూస్తున్నాము. కానీ మీరు మాత్రమే ఆమెను బాగు చేయగలరు. ఆమె కోసం నా ప్రార్థన ఆలకించుమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో, తండ్రి, సాతాను ఈ గద్దింపును పొందును గాక. అమ్మా, మీరు మీ హృదయపూర్వకంగా ఎంత నమ్మ గలరు? మంచిది. యేసు నామములో మీరు ఇంటికి వెళ్ళి క్షేమంగా ఉండును గాక. ఆమెన్.

118

దేవా, మా సహోదరుని కరుణించి, తండ్రీ, ఆమెను స్వస్థపరచుము. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నామములో ఆమె స్వస్థత కొరకు అడుగుతున్నాను. ఆమెన్. అమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక. ఏమిటి? ఏంటది? మీ కంపనాలు ఆగిపోయాయి. అది ఏమిటి....... చూడండి, . అది మిమ్మల్ని విడిచి పెట్టింది. అది ఏమైనప్పటికీ (చూశారా?), అది పోయింది. ఆ కంపనాలు వెళ్ళిపోయినప్పుడు, అది (పోయింది)....... మీరు నమ్ముతున్నారా.....?.....సరే, సంతోషిస్తూ వెళ్లి సంతోషముగా ఉండండి. మంచిది......?..... అమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక.

మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రియమైన ఆత్మ ఇక్కడ తన చేతి కర్రతో నిలబడి ఉంది: ముసలితనముతో, మరియు ఆరోగ్యము గురించి విసిగిపోయి ఉంది. కానీ ఆమె ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి మీరు ఇక్కడ ఉన్నారు. యేసు నామములో దానిని అనుగ్రహిస్తారని ప్రార్థిస్తున్నాను. ఆమెన్. అమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక.

దేవా, గుండె సమస్యతో బలహీనంగా ఉన్న ఈ సహోదరుని స్వస్థపరచుము. ఓ దేవా, ఈ స్త్రీ వ్యాధితో, బలహీనమైన ఆత్మతో, నీవు అన్ని ఎరిగినవాడవు. ఆమె బాగుపడగోరుచున్నది. ఆమె స్వస్థత కొరకు యేసు నామములో అడుగుచున్నాను. సహోదరి, దేవుడు నిన్ను దీవించును గాక. సంతోషిస్తూ వెళ్ళండి, మీరు బాగవుతారు.

దేవా, నా సహోదరిని ఈ గుండె సమస్య నుండి స్వస్థపరుస్తావు అని ప్రార్థిస్తున్నాను. తండ్రి, దీనిని అనుగ్రహించండి. మీ కుమారుడైన యేసు క్రీస్తునామములో అడుగుతున్నాను. సహోదరీ, నమ్మకముతో వెళ్ళండి.

119

దేవుడు నిన్ను దీవించును గాక. ఏమైంది? చేతికా? కాళ్లల్లో ఎముక మృతమైపోయింది. ఇప్పుడు, చూడండి సహోదరీ, మీ వయస్సు ఎంత? పదిహేడు సంవత్సరాలు, చిన్న అమ్మాయి. నీవు ఫినిక్స్ నుండి వచ్చావా? కాలిఫోర్నియా నుండి. ఇప్పుడు, చూడు. నీవు నీ హృదయపూర్వకముగా నమ్మినట్లయితే.... మీరు దేవునికి సేవ చేయబోతున్నారు. అదే మీరు చేయాలని అనుకుంటున్నారు, అవునా? నీవు క్రైస్తవురాలివా? నువ్వు క్రైస్తవురాలివి. క్యాల్షియం ఎముకలోనికి రావడం ప్రారంభించి, దానిని జీవములోనికి తీసుకుని వచ్చి, సాధారణ ఎముకలాగా దేవుడు దాన్ని చేసినట్లయితే నీవు దేవునికి సేవ చేయాలనుకుంటున్నావు? నీవు కాలిని దేవుని సేవ కొరకే గాని, నృత్యము చేయుటకు ఉపయోగించవు. అవునా? నీవు చేస్తావు. మంచిది. నీ చేతిని నాకు ఇవ్వు.

తండ్రి, ఈ యువతి, మీరు చేసిన అనేక కార్యములు గురించి విని ఉన్నది అనడానికి ఏ సందేహం లేదు. అయితే ఇప్పుడు, ఆమె శిధిలమై పోయింది. దేవుని ప్రేమించువారికి సమస్తము సమకూడి జరుగును అని మాకు బోధించబడినది. అయితే ఇప్పుడు, ఆ ఎముక స్వస్థపరచబడదు; ఆమె కాళ్లల్లో అది మృతమైనది. ఓ దేవా, ఈమె కేవలం చిన్న అమ్మాయి. ఈమెపై దయ చూపండి. ఆమె ఎన్నడూ నృత్యం చేయనని నాకు వాగ్దానం చేసింది, మరియు ఆమె... తండ్రి, ఆమె మీకు ఇంకెప్పుడూ నృత్యము చేయనని మరియు ఈ కాలు నీ మహిమ కొరకు తప్ప వేరే దాని కొరకు ఉపయోగించని వాగ్దానం చేస్తున్నది. ఇప్పుడు, సర్వశక్తివంతుడైన దేవా, నీవే జీవమునకు ఆధారమై ఉన్నావు, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునామములో, ఈ మధ్యాహ్నం ఆమె బాగుపడడానికి ఆ ఎముకకు జీవము ఇమ్మని, యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను. ఆమెన్. సహోదరీ, నేను ఇక్కడ నిలబడి ఉన్నాను అని నేను ఎంత దృఢంగా నమ్ముతున్నానో, అంతే దృఢముగా దేవుని ఆశీర్వాదం నీకు వచ్చి ఉన్నది, మరియు నీవు ఒక సాధారణ, మంచి అమ్మాయిలాగా అవుతావు అని నమ్ముతున్నాను. నీ పేరు ఏమిటి? రోమ్. కాలిఫోర్నియాలో ఏ భాగం నుండి వచ్చావు?కాలిఫోర్నియాలోని రెడ్ లాండ్స్ నుండి. మంచిది. నీవు రాస్తావా...[టేపులో. ఖాళీ.స్పాట్]

120

[టేపుపై ఖాళీ ఉంది].... తొమ్మిది అంశాల వారీగా అది శరీరముగా ఉంటుంది. జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు మనము వాటికి దగ్గరగా వున్నాము. ఇప్పుడు, మీరు దానిని తెలుసుకోవాలి. నేను దాన్ని చేయలేను. మరియు నేను భయపడుతున్నాను, వారి కూడికలలో నుండి కొంతమంది సేవకులను ఉంచబోతున్నాను. మరియు మేము ఇంకొంత మంది ప్రజల కోసం ప్రార్ధించడం ప్రారంభించబోతున్నాము....

చూడండి. మిమ్మల్ని స్వస్థపరిచేది నా ప్రార్థన కాదు. నేను ఇప్పటికే మీ కోసం ప్రార్థించాను. దేవునిలో మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరచేది. ఇప్పుడు, చూడండి. అవును నేను ప్రజలు ఇక్కడికి తీసుకువచ్చి ఆ ఆత్మలను వెళ్ళగొట్టడం మరియు అలాంటి కార్యాలను చేస్తాను. మీరు దాన్ని చూడవచ్చు.

మరియు ఇప్పుడు నేను మీకు చెప్పాను, నేను నా జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇది విఫలం కావడం చూశాను. అది రెండు లేదా మూడు ఆదివారాల క్రితం నేను ఇక్కడ బలిపీఠం మీద నిలబడి ఉండగా, నేను దేవుని అడిగాను ఒకవేళ నేను అద్భుతాలు చేయకూడదు అని ఆయన అనుకుంటే, వాటిని జరగనివ్వకూడదు అని. ఆరోజు చూసినవారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? సరే. నేను బలిపీఠంపై సమయం తీసుకున్నప్పుడు కార్యాలు స్వస్థపరచబడక పోవడం, అదే నా జీవితంలో నేను చూసిన ఏకైక సమయం. మరియు ఆయన నన్ను ఆపడానికి అనుమతించాల్సి వచ్చింది. ఆయన ఆపినప్పుడు, నేను ఆపుతాను. ఆయన నన్ను ఆపకపోయిన యెడల......

121

ఆయనకు నేను ఏమి వాగ్దానం చేశానో మీకు తెలుసా? నేను ఆయన సాక్ష్యం కోసం వేచి ఉంటాను అని వాగ్దానం చేసింది ఎంతమందికి గుర్తుంది? మరియు అది సరైనది. అప్పటి నుండి నేను అలా చేశాను. మరియు అప్పటినుండి, నిజముగా అంతకుముందు కంటే ఎక్కువ అద్భుతాలు ప్రదర్శించబడ్డాయి. కాబట్టి దేవుని అనుగ్రహాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. మరియు నేను అలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు, అవునా? మీలో ప్రతీ ఒక్కరూ నేను అలా ఉండాలని కోరుకుంటున్నారు. మరియు నేను ఇంకొద్ది కాలం జీవించాలని ఆశపడుతున్నాను.

సహోదరీ సహోదరులారా, మీరు ఆ శక్తులలో ఒక దాన్ని బయటకు పంపినప్పుడు అది ఐదు వందల మంది కోసం ప్రార్థించడం కంటే ఎక్కువ బలాన్ని మీ శరీరము నుండి తీసుకుంటుంది. మీ నుండి ఏదో బయటకు వెళుతుంది; మీరు కేవలం దాన్ని గమనించాలి. కొద్దిసేపటి క్రితం, ఆ చిన్న పిల్లవాడు, తన చిన్న కాళ్లతో నడుచుకుంటూ వచ్చి నా ముందునిలబడి ఉన్నాడు. ఆ చిన్న కళ్ళల్లో కన్నీటితో, నా వైపు చూసి, అలా నవ్వాడు, ఎందుకు, విశ్వాసం అక్కడ కదలాడుతుంది, అలాంటి విశ్వాసపు చారను మీరు కనుగొంటారు. అక్కడ ఏదో జరగాలని నాకు తెలుసు. ఏం జరిగిందో మీరు చూశారా? ఖచ్చితంగా. సాతానుకు వాడు ఇంక వదిలేయాలి అని తెలుసు. ఆ చిన్న పిల్లవాడు అనేకమంది పెద్ద వారిలాగా కఠినంగా లేడు. ఇప్పుడు, కేవలం నమ్మకముతో విశ్వాసం ఉంది.

122

మరియు మనము.... ఇప్పుడు, ప్రజలు దాటుతూ, వరుసగుండా వెళ్లబోతున్నారు. మీలో ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థించాలి అనుకుంటున్నాను. ప్రార్థించకుండా మిమ్మల్ని దాటి పోవాలని కాదు కానీ మీ కొరకు ప్రార్ధించాలని అనుకుంటున్నాను. నేను మీతో ఒక చిన్న ప్రార్థన కలిగి ఉండాలని కోరుకుంటున్నాను, కానీ మనము ఒక స్థిరమైన నడకను, అలా ప్రారంభించవలసి ఉంటుంది.

ఇప్పుడు, సేవకులారా, మీరందరూ ఇక్కడ లేచి నిలబడండి. ఇక్కడికి రండి, ఇక్కడకు కొంతమంది వచ్చినప్పుడు మీరు చేయగలిగితే వారిని తనిఖీ చేయండి. మరియు ఒకవేళ, వారు పొందుకో లేకపోతే, మంచిది, వారిని వెనక్కి పంపివేయండి. ఎందుకు, మేము చేయగలిగినంత వరకు ఉత్తమమైనది చేస్తాం. సరే.

ఇప్పుడు, ప్రతి ఒక్కరు, కేవలం ప్రార్థనలో ఉండండి. మరియు మీరందరూ వరుసలోనికి రండి, లేదా ద్వారపాలకులు మీకు చెప్తారు, మరియు వచ్చే వరుస గుండా మనం ప్రారంభిద్దాం. ఇప్పుడు, మీ అందరికీ మీరు దేనికొరకు ప్రార్థించబడుతున్నారో మీకు తెలుసు గనుక, ప్రతిఒక్కరూ నేను ప్రార్థిస్తుండగా మీ తలలు వంచండి. ప్రతి ఒక్కరు....

123

సర్వశక్తిమంతుడైన దేవా, తండ్రి, ఈ ప్రజలలో చాలామంది ఈ రాత్రి సంఘానికి వెళ్లడానికి వేచి ఉన్నారని మీకు తెలుసు. మరియు రక్షించబడే ప్రియమైన వ్యక్తిని కలిగి ఉండవచ్చు. మరియు దేవా, ఆ ఇత్తడి సర్పం ఎవరి కోసం ప్రార్థించలేదు అని నేను గ్రహించాను. ఆ సమస్యాత్మకమైన నీరు ఎవరి కోసం ప్రార్థించలేదు. యేసు యొక్క వస్త్రపుచెంగును తాకిన ఆ మహిళ ప్రార్థించబడలేదు. పేతురు యొక్క నీడలో వేయబడిన వారు ప్రార్థించబడలేదు. పౌలు శరీరం నుండి రుమాలును వారికోసం తెచ్చుకొని ఉంచుకున్నవారు ప్రార్థించబడలేదు. కానీ దేవా, వారు మీ వరమును నమ్మి గుర్తించారు కాబట్టి వారు బాగుపడ్డారు.

ఇప్పుడు, తండ్రి, ఇక్కడ ఫీనిక్స్ లో ఉన్నవారు మాత్రమే కాదు, ప్రపంచమంతటికీ తెలిసిన, మీరు ఏర్పరుచుకున్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. ఇక్కడ మీ బలహీనమైన, విధేయుడైన, నిరక్షరాస్య సేవకుడు ఇక్కడ నిలబడి ఉన్న దాన్ని బట్టి కాకుండా, మీరు గౌరవించిన మీ యొక్క వరమును బట్టివారు వచ్చును గాక. మరియు తండ్రి, నేను దాని గురించి చేయగలిగేది ఏదీ లేదు అని మీకు తెలుసు. ఈ వర్తమానం ప్రపంచంలోనికి వెళ్ళడానికి నేను పిలువబడలేదు. తండ్రి అది మీరే. నేను కేవలం విధేయత చూపి మీరు చెప్పినది చేశాను, మీరు దానిని జరిగేలా చేశారు.

124

ఇప్పుడు, ప్రియమైన దేవా, ప్రజలు నమ్మడానికి సాధారణ పిల్లలకు ఉన్న విశ్వాసం ఉంటే చాలు అని చూచి మరియు నిన్ను విశ్వసించి అంగీకరించుగాక. మరియు వారు సమకూడి వస్తుండగా, రోగిగా ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్కరూ ఇక నుండి ఇంటికి వెళ్ళును గాక. వారు ఈ భవనం నుండి బయటకు వెళ్లగానే, మరియ తన జీవమును అనుభూతి చెందడానికి ముందు ఏ విధముగా అయితే వీధుల్లోకి సాక్ష్యం ఇస్తూ వెళ్ళిందో ఆ విధముగానే తమ చేతులను పైకెత్తి వారి స్వస్థత నిమిత్తమై నిన్ను స్తుతిస్తూ వెళ్ళును గాక. ఆమె పురుషుని యెరుగకుండ ఒక బిడ్డను కలిగి ఉండబోతుందని ఆమెకు తెలుసు.

మరియు తండ్రి, దూత చెప్పింది కాబట్టి ఇది సరి అయినదే అని నాకు తెలుసు. మరియు మీరు దానిని ప్రకటించారు అని తెలుసు. ఒకవేళ అలా కాకపోతే, మీరు దాని గురించి సాక్ష్యం ఇచ్చి ఉండేవారు కాదు. ఒకవేళ అది మూఢ భక్తి అయితే, అది త్వరలోనే పడిపోయి ఉండేది. కానీ ఇప్పుడు, మీరు ప్రపంచవ్యాప్తంగా దానిని తీసుకున్నారు.

ఇప్పుడు, ప్రియమైన దేవా, ఈ మధ్యాహ్నం ప్రజలు, ప్రతి ఒక్కరు చూచి, నమ్మి, ఈ వరుసగుండా వచ్చి స్వస్థత పొందును గాక, మరియు కొద్దిరోజుల్లో వారు కోలుకొని, “దేవా నన్ను స్వస్థపరచినందుకు వందనాలు” అని సాక్ష్యం రాయునుగాక. ప్రభువా, ఈ నగరం అంతటా, ప్రతి చోటా, దేశంలోని అన్ని ప్రాంతాలలో ఇది ఒక హెచ్చరిక ధ్వనిగా ఉండును గాక. ప్రతి ఒక్కరి కొరకు నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్ధిస్తున్నాను, ఆమెన్.

125

తండ్రి, యేసుక్రీస్తు నామములో మా సహోదరిని స్వస్థపరచుము.

తండ్రి, యేసుక్రీస్తు నామములో మా సహోదరిని స్వస్థపరచుము.

తండ్రి, యేసుక్రీస్తు నామములో మా సహోదరుని స్వస్థపరచుము. ఇతను ఈ చక్రాల కుర్చీనుండి లేదా తోపుడు బండి నుండి బయటపడి సంతోషిస్తూ యేసు నామంలో ఇంటికి వెళ్ళు గాక. ఆమెన్. అయ్యా, మీరు నమ్ముతున్నారా. మీరు అడిగిన దానిని మీరు పొందుకుంటారు. మీరు ఒకవేళ నమ్మకపోతే మీరు దాన్ని పొందడం అసాధ్యం. నా ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక.

దేవుడు ఈ చిన్న అమ్మాయిని దీవించును గాక. తండ్రి, మీరు ఆమెను స్వస్థపరుస్తారని ప్రార్థిస్తున్నాను.

ఓ యేసు, ఈ తల్లిని దీవించుము. ఆమె స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను.

మా సహోదరుని దేవుడు దీవించును గాక....... [టేపు లో ఖాళీ ఏర్పడింది].

ఓ, ఈమెకు తెలియదు. ఈమె ఒక స్పానిష్ మహిళ. చూశారా? ఆమె కష్టంగా వింటున్నది. కానీ నాకు తెలుసు......?..... [టేపులో ఖాళీ ఏర్పడింది]......?.....

126

దేవా....(విషయం ఏమిటి? ఓ, నిజమా?) ఓ యేసు, నా ప్రియ సహోదరుడిని నీవు స్వస్థపరచి బాగు చేస్తావని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, యేసు నామములో అతడు ఈ భవనం నుండి చేతులు పైకెత్తి, కేకలు వేస్తూ, సంతోషిస్తూ వెళ్ళును గాక.

తండ్రీ, మా ప్రియ సహోదరుడిని యేసు నామములో స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాను.

తండ్రీ, ఈ చిన్న అబ్బాయిని, క్షీణించిన కంటిచూపు నుండి స్వస్థపరచుమని యేసు నామములో ప్రార్ధిస్తున్నాను.

మా ప్రియ సహోదరుడిని కీళ్ల వాతం నుండి స్వస్థపరచమని అడుగుతున్నాను.

మరియు తండ్రీ, మా సహోదరుని ఆయాసం నుండి స్వస్థపరచుమని యేసు నామములో ప్రార్ధిస్తున్నాను.

బాబు, దేవుడు నిన్ను దీవించును గాక. నీవు ఇక్కడి నుండి వెళ్ళిన తరువాత నీవు బాగుపడబోతున్నావు. అది నీకు తెలుసా? తెలుసు. నీవు కాలు నుండి తారాగణాన్ని తీసివేసి నీవు మళ్ళీ సాధారణ అబ్బాయిలాగా ఉండబోతున్నావు.

127

సర్వశక్తిమంతుడైన దేవా, ఇతని శరీరమును స్వస్థపరచును.

....?.... పోయిన ఫిబ్రవరి నెలలో ఇతను కాలు విరగ్గొట్టుకున్నాడు. ఇది సగం మట్టుకు సరిచేయబడింది. ఈ అబ్బాయి ఎవరో నాకు తెలీదు, కానీ ఇతను వస్తున్నప్పుడు నేను ఎలా అతని విశ్వాసమును గుర్తించాను? చూశారా? ఆ విశ్వాసమును నేను ఎలా గుర్తించాను? ఎందుకంటే, దేవుని యొక్క దూత, ఆ పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నది. చూశారా? ఇతని కళ్ళు ఎంత పరిపూర్ణంగా ఉన్నాయో చూడండి.

మనం అందరం, “ప్రభువుకు స్తోత్రం,” అని చెబుదాం. కొంతమంది అంటారు, “అది ఎక్కువ కాలం ఉంటుందా అని?” మీరు నమ్మినట్లయితే. మీరు నమ్మినంత కాలం అది ఉంటుంది. అది సరిఅయిన దేనా? ఇదిగో ఇక్కడ. ఓ, మై. ఫినిక్స్ లోని ప్రజలందరూ, ఆ అబ్బాయిని ప్రశంసించండి. మై, సరే మంచిది. అతని చిన్న కాలిని కూడా గమనించండి. ఎందుకంటే, పరిపూర్ణ విశ్వాసం ద్వారా అతను పొందుకున్నాడు.... అతని గురించి ఒక్క మాట అయినా మాట్లాడటానికి నా వద్ద ఏమీ లేదు. అతను అలా దాటి వెళ్ళిపోయినా ఇదే జరిగి ఉండేది. నీవు మంచి పురుషునివలె అవ్వబోతున్నావు.

సరే. ప్రతి ఒక్కరూ, తలలు వంచండి.

తండ్రీ, మా సహోదరి యొక్క స్వస్థత కొరకు యేసు నామములో ప్రార్ధిస్తున్నాను.....

128

కళ్ళు కూడా లేకుండా ఆ వెనకాల గదిలో ఉన్నవారు.....అది వండాలియాలో జరిగింది. సరే. వారి కోసం ప్రార్థిస్తుండగా ఇప్పుడు అందరం తలలు వంచుదాం.

ఒక రకమైన భావోద్వేగానికి గురి అవుతున్నారు, అవునా యవనస్థుడా? ప్రియ పరలోకపు తండ్రీ, వారు చాలా మైళ్ల దూరం నుండి వచ్చి ఉన్నారు. మరియు మీ చిత్తమైతే కొద్దిరోజుల్లో మేము అందమైననా రాష్ట్రం మీదుగా విమానములో వెళ్తాము. తండ్రీ, ఈ సహోదరుని స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాను. మరియు అతను తిరిగి వెళ్ళినప్పుడు, సంతోషిస్తూ వెళ్ళును గాక. ఈ భావోద్వేగం కుదుటపడి, అతను వీధిలో నడుస్తూ మీ సేవకుడు చేసిన మాదిరిగా సాక్ష్యమిస్తూ ప్రజలకు, “ఒకప్పుడు నేను భావోద్వేగం కలిగి ఉన్నాను. కానీ ఇప్పుడు నన్ను చూడండి. నేను బాగయ్యాను, ఎందుకంటే ప్రభువైన యేసు నన్ను స్వస్థపరచాడు” అని చెప్పును గాక. సాతానా, యేసు నామంలో అతనిని విడిచి పెట్టు.

సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. సంతోషముగా వెళ్ళు. సరే. యవ్వనస్ధడా నీవు మంచి విశ్వాసము కలిగి ఉన్నావు. నీవు దేవుని యొద్ద నుండి ఆశీర్వాదమును పొందుకోబోతున్నావు.

ఓ దేవా, వారు చెప్పినట్లుగా ఇక్కడ పూర్తిగా చెవిటితనంతో ఉన్న ఈ వ్యక్తి కోసం ప్రార్థిస్తున్నాను. ఈ మధ్యాహ్నమే నీవు అతనికి వినికిడి దయ చేస్తావని ప్రార్థిస్తున్నాను. ప్రియ తండ్రీ, దానిని మంజూరు చేయండి. యేసుక్రీస్తు నామములో దీనిని అడుగుతున్నాను. ఆమెన్.

ఇప్పుడు సహోదరుడా హూపర్, మీరు ఇతనిని తనిఖీ చేయాలని కోరుకుంటున్నాను. కొంత సమయం అతనిని ఇక్కడ ఉండనివ్వండి. ఈ చేతిపై అతని కంపనాలు వస్తున్నాయి. అతనిని కొద్ది సమయంలో తనిఖీ చేయాలని కోరుకుంటున్నాను. ఒకవేళ అతను పొందుకోకపోతే..... అతనిని కొంత సమయం నిలబడనివ్వండి. అతనిని తనిఖీ చేయండి.

129

ఓ దేవా, మా సహోదరి మీద కనికరం చూపి, తండ్రీ, ఈ భావోద్వేకము మరియు ప్లీహము సమస్య నుండి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుము. చూశారా? సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక. సంతోషంగా వెళ్ళు. వెళ్లి సంతోషంగా ఉండు.

ఓ యేసు, మా సహోదరిని నీవు స్వస్థపరుస్తావని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో దీనిని అడుగుతున్నాను. ఆమెన్. ఇప్పుడు విశ్వాసంతో ఉండండి.

చిన్నసహోదరీ, ఆ హాస్పిటల్ లో ఉండి చనిపోతున్న ఒక సహోదరుడిని నేను కలిగి ఉన్నాను. అతను ఎప్పటికీ బాగవ్వలేడు అని వారు చెప్పారు. అతను ఆ కుర్చీలో నుండి ఎప్పటికీ బయటికి రాలేడు. ఇప్పుడు అతను విన్యాసాలు ప్రదర్శించేవాడు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని నీవు నమ్ముతున్నావా? నీవు మంచి విశ్వాసం కలిగి ఉన్నట్లు చూస్తున్నాను... క్యాథలిక్. చాలావరకు ప్రతిసారి క్యాథలిక్ వారు స్వస్థపరచబడతారు, ఎందుకంటే వారు దర్శనం చూస్తారు.

పరలోకపు తండ్రీ, ఈ చిన్న మహిళ కీళ్ళవాతపు జ్వరంతో ఇక్కడ నిలబడి ఉన్నది, మరియు తండ్రీ, ఆమె నమ్మకంతో ఉండాలి అని బోధింపబడింది. నీవు ఆమె పై దయ చూపి స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాను. సాతానా, నీ నరకపు శక్తి, ఏదైతే ఈ బిడ్డ యొక్క జీవితమును తీసివేయడానికి ఆమెను బంధించి, ఆమె గుండెపోటుకు కారణం అయిన నీవు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆమె నుండి బయటకు రా.

అమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక. నీకు ఇది చాలా వింతగా అనిపించి ఉండవచ్చు. నీ గుండెలో ఎప్పుడైనా నీవు దడను కలిగి ఉన్నావా... బహుశా ఇది ఆ భాగము వరకు వెళ్లి ఉండకపోవచ్చు. నాయొక్క సహోదరుని గుండె యొక్క మూడు కవాటాలు తెరుచుకున్నాయి. ఇప్పుడు నీవు బాగవ్వబోతున్నావు. సంతోషంగా వెళ్ళు.

130

ఓ దేవా, గుండె పరిమాణము పెరిగి ఉన్న మా సహోదరిపై దయ చూపించండి. మీరు మాత్రమే ఆమెను స్వస్థపరచగలరు. యేసుక్రీస్తు నామములో మీరు దానిని అనుగ్రహిస్తారని ప్రార్థిస్తున్నాను. ఆమెన్. సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక.

నేను ఇప్పుడే ఒక ప్రకటన చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి ఒక చిన్న క్యాథలిక్ అమ్మాయి వచ్చింది, కీళ్ళవాతపు జ్వరం కోసం ఆమె ప్రార్థించబడింది. ఆమె ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు. కానీ ఆమె స్వస్థపరచబడింది. అవును. ఈ వ్యక్తి కొద్దిసేపటి క్రితం ఈ బలిపీఠం వద్దకు తిరిగి వచ్చింది. ఒక చిన్న క్యాథలిక్ అమ్మాయి....ఆమె ఎక్కడికి వెళ్ళింది?

సహోదరీ, సరే. మంచిది. అలాంటి ఒక విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అది తిరిగి వచ్చినట్లు నేను భావిస్తున్నాను. మీరు కిందికి వెళ్లేటప్పుడు అది మిమ్మల్ని వదిలిపోతుంది...

దాని నుండి బయటకు వచ్చినప్పుడు మీకు విచిత్రమైన భావన, ఒక రకమైన అసాధారణమైన భావన, ఒక వింతైన భావన ఉందా? అదే అది.

అక్కడే ఆమెను విడిచిపెట్టింది. అది ఈ వైపుగా తిరిగి రావడం నేను భావించాను. ఆ వచ్చింది.... ఇప్పుడు అది వింతగా ఉంది అని మీరు అనుకోవచ్చు. నేను తప్పు అయితే ఆమెను గమనించి చూడండి.

అందరం, “వందనాలు దేవా,” అని చెబుదాం.

131

నేను మీకు చెప్తున్నాను, క్యాథలిక్ ప్రజలు ఆ దర్శనాన్ని చూసేంతగా తీసుకువెళ్తుంది. మీరు చూస్తే, అది ఏమిటో ఇక్కడ ఉంది. క్యాథలిక్ వారు..... నా ప్రజలు కాథలిక్ వారు. మా అమ్మ మా నాన్న కూడా. మా యాజకుడు ఏది చెప్పినా అది సత్యం అని నమ్మేలా మేము బోధించబడ్డాము. చూడండి, వారు నన్ను నమ్మాలి. వారు దేవుని నమ్ముతున్నారు. ఎంత మంది దేవుని నమ్ముతున్నారు? మీ అందరూ. ఖచ్చితంగా. సరే ఇప్పుడు, దేవుని సామర్ధ్యత గురించి ప్రశ్న లేదు. దేవుని దూత నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుందా లేదా అన్నదే ప్రశ్న. చూశారా? మరియు క్యాథలిక్ వారు వారి యాజకుడు చెప్పినది సత్యమని నమ్మేలా బోధింపబడ్డారు. మరియు వారు ఈ కార్యాలు, అద్భుతాలు, జరుగుట చూసినప్పుడు, వారు స్వస్థపరచబడుతున్నారు. వారి హృదయపూర్వకంగా నమ్ముతారు. మరియు వారు...... వారు నమ్ముతారు.

మా అత్త - మా గొప్ప అత్త, అంటారియోలోని మాంట్రియల్ లో ఒక మత సంఘమును స్థాపించింది.

ఇప్పుడు, ప్రతి ఒక్కరూ, మీ తలలు వంచండి....

మనం ఇప్పుడు ఎంత దూరం వెళ్ళాము? మనము ఇంకా ఎంతమంది కోసం ప్రార్థించవలసి ఉంది? పైకి ఎత్తిన చేతులు చూద్దాం. నేను— నేను అన్ని సమయాల్లో ఎక్కువ మందిని పొందుతున్నాను అని చెప్పవచ్చు. నేను అన్ని సమయాల్లో ఎక్కువ మందిని పొందుతున్నాను. మంచిది, సహోదరుడా, సమయం ఎంత అయిందో చూద్దాం..

ఇక్కడ ప్రార్థించబడాలని కోరుకున్నవారు ఈ రాత్రి సంఘానికి ఎంతమంది వెళ్లాలనుకుంటున్నారు, సంఘానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నవారు; ఈ రాత్రి సంఘానికి వెళుతున్నవారు, మీరు చేతులు పైకిలేపండి చూద్దాం.

132

ఓహ్, మై, సహోదరుడా. మనము దీని గురించి ఏదో ఒకటి చేయాలి. అవును. మీ ప్రజలలో కొందరు సహోదరులు కూడా ఉన్నారు, వారు, మీలో కొందరు సేవకులు అవునా? సహోదరుడు గార్సియా, మీ ప్రజలలో కూడా, ఉన్నారని నేను ఊహిస్తున్నాను.

అయితే సరే. ఇప్పుడు, విశ్వాసం కలిగి ఉండండి. నేను ప్రార్థించబోతున్నాను, మరియు వారిని ఆశీర్వదించమని దేవుణ్ణి అడగండి. మనం ప్రారంభించాలి... [టేపుపై ఖాళీ ఉంది] ఓహ్, అవును, నేను చూస్తున్నాను. అలాగా. అయితే సరే.

అయితే సరే. ఇప్పుడు, మేము వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ నమ్మకంతో ఉండండి...

సహోదరుడు గార్సియా, ఇక్కడ ఉన్న సహోదరుడు, నేను మీ పేరు మర్చిపోయాను. మీరు సేవకులు అని నాకు తెలియదు. బల్లార్డ్? సహోదరుడా, మీరందరూ, ఇప్పుడు ఇక్కడ దిగండి. సహోదరుడు అవుట్ లా మరియు మీరు అందరూ, ఈ ప్రజల కోసం మీ హృదయపూర్వకముగా ప్రార్థన చేయండి. మరియు వారు ముందుకు వచ్చేలా ప్రోత్సహించండి. ఇప్పుడు, సహోదరుడా, మీరు ఇక్కడ నిలబడి వారి వ్యాధులను తెలుసుకుని, మరియు మీరు వారిని పరీక్షించండి....

తండ్రీ, మా సహోదరుని యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుమని ప్రార్దిస్తున్నాను.

దేవా, బలహీనముగా గుడ్డితనంతో ఉన్న యీ స్త్రీని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్వస్ధపరచుమని ప్రార్దిస్తున్నాను.

ప్రియమైన దయకలిగిన దానా. ఎంత కాలము నుండి నీవు గుడ్డిగా ఉన్నావు? మూడు సంవత్సరాలు. సహోదరీ, అక్కడ ఉన్న లైట్లను చూడండి. లైట్లను చూస్తున్నారా? చూస్తున్నారా? ఇప్పుడు, ఇక్కడ ఉన్న ఈ లైట్లను చుడండి. మీరు మీ చూపు పొందుకుంటారు అని నమ్మండి, మరియు మీరు పొందుకుంటారు. అయ్యా, మీరు ఆమెతో ఉన్నారా? ఆమె మీ భార్యనా?

133

ఓ దేవా, ఆశీర్వదించబడిన తండ్రి. ఈ పేద మహిళ తన స్వస్థత కోసం ఇక్కడ నిలబడి ఉంది. ఇప్పుడు కనికరం చూపించండి. తండ్రీ, కొన్ని క్షణాల్లో ఆమె చూపు పొందుకొనును గాక. ఆమె ఈ లైట్లను చూచును గాక. మరియు ఆమె యేసు నామములో మీ స్వస్థత యొక్క సాక్ష్యం కలిగి ఉండును గాక. ఆమేన్. నేను ఆమెను చూడగలిగేలాగ ఇక్కడ కాసేపు కూర్చోండి. అప్పుడు నేను ఆమెను కొన్ని క్షణాలలో తనిఖీ చేస్తాను.

ఇప్పుడు, మీ తలలు వంచి ఉంచండి. ఇక్కడ ఒక చెవిటితనంతో ఉన్న స్త్రీ ఉన్నది.

దేవుడు మా సహోదరీని దీవించి యేసుక్రీస్తు నామములో ఆమెను స్వస్థపరచును గాక. ఆమేన్.

134

ఒక క్షణం ఆగండి. నేను ఇక్కడ దీని కోసం ప్రయత్నించబోతున్నాను. నేను రెండు ఆత్మలు అక్కడ కలిసి పోరాడుతున్నట్లు అనుభూతి చెందాను. ఈ అమ్మాయి చెవిటి మరియు మూగది...? ...అని నాకు అనిపిస్తుంది. ఆమెకు వినడం లేదా మాట్లాడటం అనేది ఏమి తెలియదు. ఇప్పుడు, మీ తల వంచండి. ప్రతి ఒక్కరూ నిజమైన భక్తితో ఉండండి. నేను ఆమె అర్థం చేసుకునేలా చేయగలనేమో చూస్తాను.

ప్రియమైన తండ్రి, ఈ చిన్న అమ్మాయి, చెవిటి మరియు మూగ దానిగా పుట్టింది. ఆమెకు మాట్లాడటం లేదా వినడం గురించి ఏమీ తెలియదని మేము గ్రహించాము. కానీ మీరు మాత్రమే ఆమెకు వాటిని అనుగ్రహించగలరు. ఇప్పుడు ప్రియమైన దేవా, నాకు సహాయము చేయుము. ఈ చెవిటి మరియు మూగ ఆత్మపై అధికారం కలిగి ఉండటానికి నాకు సహాయం చేయండి. ప్రియమైన దేవా, యేసు క్రీస్తు నామములో దానిని అనుగ్రహించండి.

ఓ చెవిటి, మూగ ఆత్మవైన నీవు, యేసుక్రీస్తు నామమున బాలిక నుండి బయటకు రా.

[సహోదరుడు బ్రాన్హాం చప్పట్లు కొడతారు.] వినిపిస్తుందా? ఆమెకు వినపడటం లేదు...? ... ఇప్పుడు, మీ తలలు వంచి ఉంచండి. ఆమేన్. మీరు. చూశారా? ఆమేన్. [ఆ అమ్మాయి “ఆమేన్” అని చెబుతో౦ది.] హనీ, మంచిది. డాడీ. [“డాడీ.”] మీ తలలను ఎత్తండి. పుట్టుకతోనే చెవిటి మరియు మూగగా ఉంది. ఇక్కడ చూడండి. వినిపిస్తుందా? [“ఇది నేను చెప్పేది విను.”] [సహోదరుడు బ్రాన్హాం చప్పట్లు కొడతాడు.] వినిపిస్తుందా?[“అవును.”] వినిపిస్తుందా? అందమైన చిన్న అమ్మాయి. ఆమేన్. [“ఆమేన్.”]

135

ఇప్పుడు, మీరు చూడగలరా? నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. గమనించండి. ఇక్కడ జరిగింది ఇదే. చూడండి, ఇది... మీరందరూ దీనిని గమనించారా అని నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మేము దీనిని ముగించాలని అనుకుంటున్నాం, మీకు తెలుసా, కూడికలకు వెళ్ళాలని అనుకుంటున్నాం. నేను ఆత్మను అడిగిన తరువాత లేదా మందలించిన తరువాత మీరు గమనించారా, నేను ఎల్లప్పుడూ కొన్ని క్షణాలు ఖచ్చితంగా నిశ్శబ్దంగా ఉంటాను? కూడికలలో ఎవరు గమనించారు, మీ చేతులు చూడనివ్వండి. మీరు దానిని గమనించారా?

ఇప్పుడు, ఇది అదే. ఆ సమయంలో నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పదాలు మూడు ఉన్నాయి. చూశారా? మరియు అవి బైబిల్ యొక్క మూడు ఉన్నత పదాలు. భూమ్మీద ఉన్న ఏ మర్త్యుడికి కూడా తెలియదు. చూశారా? మరియు నేను వాటిని అడిగినప్పుడు, అప్పుడు నేను ఆ కిందకి దిగేదాన్ని అనుభూతి చెందుతాను, అప్పుడు అది తిరిగి వచ్చి ఒక ప్రదేశాన్ని కదిలిస్తుంది. అప్పుడు...? ... స్వస్థత జరుగుతుంది. నేను అలా చెప్పడానికి కారణం అదే. చూశారా? అదే జరుగుతుంది.

136

ఇప్పుడు, తద్వారా మీరు వరుస గుండా వచ్చి నన్ను దాని గురించి ప్రశ్నించకుండా ఉండడానికి నేను అలా చేశాను. కాబట్టి అది నిజం. ఇప్పుడు, నేను గద్దించినప్పుడు మీరు చాలా సార్లు గమనించారని నాకు తెలుసు, నేను కొన్ని నిమిషాలు నిశబ్దంగా నిలబడి, దూత నన్ను పలకమని చెప్పిన ఈ మూడు పదాలను మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను. అప్పుడు అది తిరిగి వచ్చిందని నేను భావిస్తే, అది పూర్తయిందని నాకు తెలుస్తుంది.

మనతో ఉన్న ఈ అమ్మాయికి అదే జరిగింది. మరియు నేను ఎప్పుడూ దేని గురించి ఏదీ చెప్పకపోవడానికి కారణం అదే, 'ఎందుకంటే ఆమె స్వస్థత పొందుకున్నదని నాకు తెలుసు'. ఆమె నుండి శక్తి పోయింది. ఇప్పుడు, వాస్తవానికి ఆమెకు మాట మాట్లాడటం అంటే ఏమిటో తెలియదు; వినికిడి అంటే ఏమిటో ఆమెకు తెలియదు. ఆమె కేవలం ఇలా ప్రారంభించాలి...

137

ఒరెగాన్ లోని ఆ సంస్థ నుండి వచ్చిన ఏడుగురిని గురించి, వారిలో ఐదుగురు కాలిఫోర్నియా వైద్య పరీక్షల ద్వారా ఉత్తీర్ణులయ్యారు అని దానిగురించి నేను మీకు చెప్పానా? అది ఎంతమందికి గుర్తుంది? నేను అక్కడ ఉన్న వారి చిత్రాలను చూపించడానికి అక్కడే నా గుప్పిట్లో ఉంచుకున్నాను. ఉహ్-హుహ్. స్వస్థత పొందారు అని పక్కన రాసుకోండి. పుట్టుకతోనే చెవిటి మరియు మూగగా ఉండి, ఒరెగాన్ పరీక్షల ద్వారా ఉత్తీర్ణులయ్యి, కాలిఫోర్నియా వైద్యులు ద్వారా కూడా ఇంటికి వెళ్ళారు.....

ఓహ్, మై, ఆయన అద్భుతమైనవాడు, అవునా? ఖచ్చితంగా అవును. దేవునికి స్తుతులు చెల్లించుదాం. విన్నారా? విన్నారా? విన్నారా? ఆమేన్...

వందనాలు సహోదరుడా. సరే. మేము ప్రార్దిస్తుండగా, ఇప్పుడు ప్రతి ఒక్కరూ తల వంచండి.

తండ్రి, యేసుక్రీస్తు నామములో మా సహోదరిని స్వస్థపరచుము.

దేవా, మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా సోదరిని స్వస్థపరచుమని నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.

దేవా, యేసుక్రీస్తు నామమున మా సహోదరిని స్వస్థపరచుము.

ప్రియమైన దేవా, యేసు నామమున మా సహోదరిని స్వస్థపరచండి.

దేవా... [టేపుపై ఖాళీ ఉంది] అతనిపై దయ చూపి, అతని శరీరాన్ని స్వస్థపరచుము... [టేపుపై ఖాళీ ఉంది.]

138

నజరేయుడైన యేసుక్రీస్తు నామమున. అయ్యా, ఇప్పుడు మీ వద్ద ఉన్న క్షయవ్యాధి వెళ్ళిపోడానికి ఒక ద్వారము నివ్వండి. ఒక అసాదారణమైన అనుభూతి కలిగింది, అవునా. సహోదరుడా, దేవుని యొక్క దూత దగ్గర నిలబడి ఉంది. మళ్ళీ మీ రోజులు తక్కువగా ఉన్నాయి అని మీరు గ్రహించారు. మీకు జ్వరం, మంట కూడా ఉంది. చింతించకండి. నమ్మకంతో వెళ్ళండి. మీరు ఇప్పుడు బాగవుతారని నమ్ముతున్నారా? యేసుక్రీస్తు నామమున మీరు దానిని పొందుదురుగాక. అతను ఎక్కడ నివసిస్తున్నాడు? గ్లెండేల్. ఇప్పుడు, అయ్యా, సందేహించకండి. మీరు డ్రైవరా? అయ్యా, ధన్యవాదాలు. వేచి ఉన్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక.

తండ్రీ, మీరు ఆయనను యేసుక్రీస్తు నామమున స్వస్థపరచుమని నేను ప్రార్థిస్తున్నాను. అయ్యా, సందేహించకండి. నమ్మకముతో వెళ్ళండి.

దేవా, ఈ స్త్రీని స్వస్థపరచుమని, యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రీ.

తండ్రీ, ఈ మనిషిని స్వస్థపరచుము, యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రీ.

యేసు నామములో మా సహోదరుడిని స్వస్థపరచుము తండ్రీ... [టేపుపై ఖాళీ ఉంది.] ...? ....

139

చెప్పండి, స్నేహితులారా. విశ్వాసం గురించి మాట్లాడాలంటే, ఈ చిన్న పిల్లవాడు ఇక్కడ గులాబీ రంగులో నూకలు నూకలుగా యేర్పడ్డ కనురెప్పలతో నిలబడి ఉన్నాడు. అవి అతని నుండి అదృశ్యమయ్యాయి. నేను అతనిని ఇక్కడ ప్రజల ముందు ఉంచగలను. ఇక్కడే ఇది చూడండి. అతని కళ్ళు చూడండి. చూశారా? పరిపూర్ణముగా స్పష్టంగా ఉన్నాయి. నూకలు నూకలుగా యేర్పడ్డ కనురెప్పలతో ఇక్కడ వేదిక మీద నిలబడి ఉన్నాడు. స్నేహితులారా, అది నిజం. దేవుడు ఇక్కడ ఎక్కడో నిలబడి ఉన్నాడని మీకు తెలుసా? దేవుని యొక్క దూత.

బాబు, అక్కడ అనారోగ్యముతో పడుకున్న వ్యక్తికి చూపించు. కొద్దిసేపటి క్రితం గులాబి రంగులో ఉన్న నీ కళ్ళు ఇప్పుడు అవి స్పష్టంగా ఉన్నాయి అని అతనికి చూపించు.

అయ్యా, ఇక్కడ ఈ చిన్న పిల్లవాడు మీకు సాక్ష్యం చెప్పడానికి వస్తున్నాడు.

సహోదరుడా హూపెర్, నూకలు నూకలుగా యేర్పడ్డ కనురెప్పలతో ఉన్న ఆ చిన్న పిల్లవాడు తక్షణమే స్వస్థత పొందాడు.

ఇప్పుడు, మీరు దీన్ని ఎంతగా నమ్ముతున్నారో నాకు తెలియదు, కానీ నేను చెప్పేది నిజం కాకపోతే నేను ఎవరి ముందు అయితే నిలబడతానో ఆ దేవుడు నా ప్రాణాలను తీసుకొనును గాక. నేను చిన్న వాని వైపు చూసినప్పుడు, గులాబీ రంగులో ఉన్న ప్రదేశం అతని చిన్న తల పైనుండి వెళ్లి అక్కడ నుండి అదృశ్యమైంది. అది నిజం.

“ప్రభువుకు స్త్రోత్రం” అని చెబుదాం.

దేవా, నా ప్రియమైన సహోదరిని స్వస్థపరచుము. ఆమె ఇప్పుడు సంతోషిస్తూ వెళ్ళి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థత పొందును గాక. ఆమేన్. సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక. మరియు మీరు దానిని పొందుకుంటారు...? ...

140

నీటితో ఒక చిన్న అమ్మాయి. (సరే.) సహోదరీ, నేను దేవుణ్ణి అడిగితే, దేవుడు చేస్తాడు అని మీరు నమ్ముతున్నారా? ప్రియ పరలోకపు త౦డ్రి, నేను ఈ ప్రియమైన చిన్న అమ్మాయిపై చేతులు వేసి, దేవా, మీరు స్వస్థపరచాలని ప్రార్థిస్తున్నాను. ఆమె ఈ ఘడియ మొదలుకుని సరిచేయబడి, తల క్రిందికి దించి సాధారణముగా ఉండును గాక. మరియు పిల్లవాడు... సాధారణ బిడ్డగా ఉండును గాక. నేను ఈ ఆశీర్వాదమును మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను. ఆమేన్. ఇప్పుడు, సందేహించవద్దు. ఈమె మీ బిడ్డనా? మీ సోదరి యొక్క బిడ్డ. ఇప్పుడు ఆమె బాగుపడుతుందని మీరు నమ్ముతున్నారా? సహోదరీ, నేను ఆమె నుండి వినాలనుకుంటున్నాను. అతను ఒక సహోదరుడు. [టేపుపై ఖాళీ ఉంది.]

141

ఓ దేవా, ఈ బిడ్డ నుండి కనురెప్పల సమస్యను మీరు గద్ది౦చుమని నేను ప్రార్థిస్తున్నాను. ఓ దయ్యమా, యేసుక్రీస్తు నామమున ఇతని నుండి బయటకురా. మరియు అది వదిలి పోయింది. ఇక్కడ చూడండి. అతని కళ్ళ నుంచి గులాబీ రంగు పూర్తిగాపోయింది. హనీ, ఇక్కడ చూడు. భవనంలో ఒక వైద్యుడు ఉంటే, మీరు అతనిని స్వేచ్ఛగా పరీక్షించవచ్చు. బాబు, కిందకి పరిగెత్తు. మీరు డాక్టర్ అయితే, అతని చిన్న కళ్ళని ఒక్కసారి చూడండి. కొన్ని క్షణాల క్రితం గులాబీ రంగు కనురెప్పల శోధన కలిగి ఇక్కడ నిలబడి ఉన్నాడు.

“ప్రభువుకు స్తోత్రం” అని చెపుదాం. ప్రభువుకు స్తోత్రం.

వారు అనారోగ్యంతో ఉన్నారా, వారు సోదరులా? ఇద్దరు చిన్న పిల్లలు, వారు సోదరులు. [ఆ స్త్రీ ఇలా అంటుంది , “వారి సహోదరికి అది ఉంది. ఆమె అక్కడ ఉంది.”] అది సరియైనదేనా. ఆమేన్. సహోదరీ, మీరు ఎక్కడ నివసిస్తున్నారు? అది సరియైనదేనా? మంచిది, వారు ఖచ్చితంగా విశ్వాసంలో పెంచబడ్డారు. సరే, అది బాగానేఉంది. అది... చూడండి, బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము. అది సరియైనదేనా?

142

ఆమె— వారి తల్లి ఫెబ్రవరి నెలలో ఆస్త్మా నుండి స్వస్థత పొందింది. అది ఇక్కడ ఫీనిక్స్ లో జరిగిందా? ఇక్కడే ఫీనిక్స్ లో, ఆస్తమా నుండి స్వస్థత పొందింది. మీరు ఇక్కడ ఉన్నారు. స్నేహితులారా చూడండి?

స్వల్పమైన వాటిని మన వెనుక విడిచి పెట్టి,

కాలమనే ఇసుక రేణువులపై పాద ముద్రలు... [టేపుపై ఖాళీ ఉంది].

(అది సరైనదా?)

మరొకదానిని సూచించుచున్న పాదముద్రలు,

జీవితం అనే ప్రధాన ఏటిలో పయనిస్తూ,

దూరమైన మరియు విరిగిన సహోదరుని కొరకు,

చూచుట ద్వారా హృదయమును వెనుకకు తెచ్చును.

పరలోకపు త౦డ్రి, ఆమె తనతో వచ్చి ధైర్యహృదయముతో ఆమె స్వస్థత కోసం నీ వైపు చూస్తున్న ఈ సహోదరిని స్వస్థపరచుమని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో మీరు దానిని మంజూరు చేయమని ప్రార్థిస్తున్నాను.

తండ్రి, ఈ రుమాలును, మరియు ప్రజలను ఆశిర్వదించండి, మరియు యేసుక్రీస్తు నామములో నేను వారి శరీరమును స్వస్థపరచుమని అడుగుతున్నాను.

అయితే, 'నేను దాన్ని మర్చిపోయే కన్న ముందు ఇది అడగనివ్వండి. ఇక్కడ ఎంతమంది రుమాలును ప్రార్థించాలని కోరుకుంటున్నారు? ఇక్కడ ఎంతమందికి కావాలో చేతులుచూద్దాం. నేను మీకు వివరించాను. చూశారా? ఎందుకు, మీరు ఇప్పుడే నాకు ఉత్తరం వ్రాయండి. నేను ప్రార్దిoచాల్సిన అవసరం లేదు. కానీ దానిని బ్రాన్హాం హీలింగ్ క్యాంపైన్, పోస్ట్ఆఫీస్ బాక్స్ 325, జెఫర్సన్ విల్ కు ఉత్తరం పంపండి మరియు మీరు దానిని ఎలా ఉపయోగించాలో సూచనలతో ఒక వస్త్రాన్ని పంపుతారు.

143

ప్రతి ఉదయము తొమ్మిది గంటలకు మీ హృదయము మీద చేయివేసి ప్రార్థనాపూర్వకముగా ఆ పని చేయండి. మొదట ప్రార్దించబడిన వస్త్రపు ముక్కను, మీ వస్త్రములోపలి భాగమున మీ హృదయము మీద దానిని పెట్టి, మీ చేతిని మీ హృదయం మీద ఉంచి, తొమ్మిది గంటలకు, పన్నెండు గంటలకు, మధ్యాహ్నం మూడు గంటలకు ప్రార్థించండి. మీ తప్పులన్నింటినీ ఒకరితో ఒకరు ఒప్పుకోండి; పొరుగువారిని పిలిచి ప్రార్థన చేయండి మరియు ప్రార్ధనా కూటాలు పెట్టండి. మీరు బాగవుతారు. చూశారా? సూచనలు మీకు పంపబడతాయి. కేవలం నా పేరు, జెఫర్సన్ విల్, ఇండియానా అని పంపండి మరియు మీరు దానిని పొందుతారు.

అయితేసరే. మీ తలలు వంచండి. తండ్రి, ఈ ప్రియమైన నెరసిన వెంట్రుకలు గలిగి ఇక్కడ కూర్చున్న తల్లిని మీరు స్వస్థపరచుమని నేను ప్రార్థిస్తున్నాను. క్రీస్తును సమాధినుండి లేపిన దేవుని శక్తి ఆమెను ఈ వీల్ చైర్ నుండి రప్పించుగాక, మరియు ఆమె కోసం ఈ ఆశీర్వాదమును ఉచ్ఛరిస్తుండగా, యేసుక్రీస్తు నామమున ఆమెను మంచి మహిళగా చేయండి. ఆమేన్. సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక.

కేవలం ఒక సెకండు ఇక్కడ ఆగండి. ఈ బలహీనముగా ఉన్న మహిళ స్పృహ తప్పి పడిపోయింది. ఓహ్, మై. అమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు అక్కడ పడి ఉన్నారని నాకు తెలుసు. ఇప్పుడు, చూడండి. దేవుడు మీ ప్రియమైన హృదయాన్ని ఆశీర్వదిస్తాడు. మీరు కేవలం ఒక యవ్వన స్త్రీ... మీరు ఈ విధంగా ఒక గంట పాటు పడుకుని ఉన్నారని మీకు తెలుసు. ఓహ్, మై. వారు...మీకు తెలుసా, నేను మీ కోసం చేయగలిగిన దాన్ని చేయాలని నేను కోరుకుంటున్నాను, ... నేను మీనుండి దానిని (సమస్యను) బయటకు లాగి, “ఇదిగో ఇదే. మీరు చూశారా?” అని చెప్పి ఉండేవాడిని. మరియు దానిని మీనుండి దూరంగా విసిరేసేవాడిని. చూశారా? నేను అలా చేయాలని కోరుకున్నాను. కానీ సహోదరీ, మీరు జీవించడానికి నాకు తెలిసిన ఒకే ఒక విషయం ఉంది. మరియు మీరు చాలా, చాలా ... [సహోదరి, సహోదరుడు బ్రాన్హాంతో మాట్లాడుతుంది.] అందుకే ఆ విశ్వాసం మీ నుంచి లాగింది. ఇప్పుడు, మనము సరైన ప్రదేశాన్ని తాకబోతున్నాము.

144

గత శీతాకాలంలో, ఆమె అర్కాన్సాస్ లోని బూనెవిల్లే వద్ద ఉన్నప్పుడు...? ... ఆమె బూనెవిల్లే, అర్కాన్సాస్ వద్ద ఉంది, నేను... అది ఎక్కడ ఉంది? అర్కాన్సాస్లోని కార్నింగ్ వద్ద ఉన్నాను... మీరు అర్కాన్సాస్ నుండి వచ్చారా...ఈ మహిళ ఆర్కాన్సాస్ నుండి వచ్చింది. మరియు ఆమె ఎప్పుడైనా, దేవుడు మేము కలుసుకొనుటకు అనుమతించాలని ప్రార్థించింది. మరియు —మరియు ఎవరో బయటకు వెళ్లి ఆమెను ఇక్కడకు తీసుకువచ్చారు. సహోదరీ, మీరు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు? అరిజోనాలోని సుపీరియర్ వద్ద ఉంటున్నారు. మరియు దేవుడు దానిని అనుమతి౦చాడు. ఇదే ఆ ఘడియ అని నేను నమ్ముతున్నాను, మీరు నమ్ముతున్నారా? ఈ చిన్న, బలహీనమైన మహిళ ఇక్కడ చనిపోతూ పడి ఉంది. అది సాధ్యమైనంత ఖచ్చితంగా ఉంది...?...

ఇప్పుడు, స్నేహితులారా, మీలో కొందరు చాలా కాలం వేచి ఉన్నప్పటికీ. ఈ మహిళతో కేవలం కొంత సమయం ఉండనివ్వండి, ఉండనిస్తారా?

అమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇద్దరు చిన్న పిల్లలు. మై మై. మీ భర్త మీతో ఇక్కడ ఉన్నారా? సహోదరీ, దేవుడు మిమ్మును దీవించును గాక. నేను... నేను దేవున్ని అడిగితే మీరు బాగవుతారని మీరు నమ్ముతున్నారా? ఇంత సమయం మీరు వేచి ఉన్నారు. మరియు ప్రియమైన సహోదరి, “యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు” అనే నా చిన్న పుస్తకం మీరు పొందియున్నారా. వాటిలో ఒకటి ఎప్పుడైనా చదివారా? ఇవ్వగలిగితే ఆమెకు దానిని ఇవ్వండి.......?.......మరియు మీరు నలభై పౌండ్ల బరువుతో ట్యూబర్క్యులర్ ఉన్న మహిళ, జార్జి కార్టర్ యొక్క సాక్ష్యమును చదవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు, ఆమె నా మిల్టౌన్ బాప్టిస్ట్ సంఘంలో పియానో వాయిస్తుంది. ఆమె సుమారు వంద నలభై ఐదు, యాభై పౌండ్లు బరువు ఉంటుంది. ఇప్పుడు, విశ్వాసం కలిగి ఉండండి. నేను నా హృదయపూర్వకంగా దేవుడిని అడగబోతున్నాను.

145

ప్రియమైన దేవా, ఎందుకో నాకు తెలియదు ఈ మధ్యాహ్నము అక్కడ ఉన్న ఆ బలహీనమైన దృశ్యాన్ని నేను చూసినప్పుడు, ఆ చిన్న, సన్నని, సున్నితమైన స్త్రీ ఆ స్థలములో అటూ ఇటూ దొర్లుతూ మరియు దాదాపు చనిపోయిన స్థితిలో ఉండి, మరియు ఆమె ఊపిరితిత్తులు పోవడం చూసాను. డాక్టర్లు చేయగలిగినదంతా చేసారు. ఆమె ఆసుపత్రిలో ఉంది. మరియు ఆమె గురించి ఏదో ఉంది, తండ్రీ, ఆమె దయనీయమైన చూపు, నా దృష్టిని ఆకర్షించింది ఎందుకంటే ఆమె నిజాయితీగా ఉంది. ఏదైనా చేయకపోతే వెంటనే ఆమె చనిపోతుందని ఆమెకు తెలుసు. ఓ దేవా, నేను వేడుకుంటున్నాను. ఓ, నేను మిమ్మల్ని అడగడానికి నా హృదయపూర్వకంగా మీ ముందు తల వంచుతున్నాను. దేవదూత, ఆరాత్రి గదిలోకి వచ్చి నాకు ఈ విషయాలు మీరే చెప్పారు... నేను దానికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నించాను. ఓ, మీరు దయచేసి ఈ బలహీనమైన పేద మహిళను కరుణించగలరా. ప్రియమైన దేవా, మీ గొప్ప శక్తిని చూపించండి. ప్రజలు దీనిని చూసి మిమ్మల్ని నమ్మడానికి కాదు కాని, నీమహిమకొరకు, ఈ పేద స్త్రీ యొక్క జీవితములో ఉన్న పిల్లల నిమిత్తము. ఓ, ప్రియమైన దేవా, ఆమెకు సహాయం చేయండి. నేను నా హృదయమంతటితోనూ, ప్రాణమంతటితోనూ ఆమె బాగుపడడానికి అనుమతించమని పిలిచినప్పుడు, మీ సేవకుడి ప్రార్థన వినండి. తండ్రీ, అనుగ్రహించండి. నీ సేవకుడిని ఆమెనుండి విననివ్వండి. ఇప్పుడు, ఆమె బరువు పెరగడం ప్రారంభించింది; ఆమె ఇప్పుడు బాగా ఉంది. ఓ, తండ్రీ, అనుగ్రహించండి. ఆమె తన జీవితాంతము మీకు సేవ చేస్తుంది, అనుమతించబడినప్పుడు దీని గురించి సాక్ష్యం ఇస్తుంది. మీరు మహిళా జీవితమును విడిచిపెడితే, మా ప్రశంసలను చూపించడానికి మేము చేయగలిగినదేదైనా చేస్తాము. నేను దానిని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను. ఆమేన్.

146

అమ్మా, నేను ... మీ గురించి నేను ఇష్టపడేది ఏదో ఉంది. మరియు నేను... నేను మీకు ఇది చెప్పాలి. మీరు దాని కొరకు ఎదురు చూచుచుండగా.....కరడు కరడును పిలచుచుండగా. ఇప్పుడు, మీరు నమ్మండి. మీరు బాగుపడబోతున్నారు అని నా హృదయపూర్వకంగా నేను నమ్ముతున్నాను. ఇప్పుడు, మీరు వెళ్ళి ఆయనకు సేవ చేయండి...? ... మీరు చేస్తున్నారు...తండ్రీ , దేవుడు మిమ్మును దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అది...మంచిని తీసుకోండి, ప్రియమైన సహోదరుడా. ప్రభువు నిత్యము మీ ధైర్యసాహసాలను బట్టి మిమ్మల్ని దీవించును గాక.

మీ దృష్టి ఎప్పుడైనా దేనినైనా పిలిచిందా? ఆ బలహీనమైన చిన్న మహిళ. సరే. మీలో ప్రతి ఒక్కరూ తలలు వంచండి.

దేవా, ఇక్కడ చెడు కళ్ళతో ఉన్న ఈ స్త్రీని కనికరించండి. వినుట ద్వారా విశ్వాసం కలుగును. మరియు ఆమె ఇప్పుడు ఇక్కడకు వచ్చి తన కళ్లజోడు కూడా తీసివేసింది, ఎందుకంటే ఏదో జరుగబోతోందని ఆమె నమ్ముతోంది. తండ్రీ, అనుగ్రహించండి. ఆమె నిరాశ చెందక, యేసుక్రీస్తు నామములో స్వస్థత పొందును గాక. దేవుడు నిన్ను దీవించును గాక.

దేవా, నా సహోదరిని కరునించి యేసుక్రీస్తు నామమున ఆమెను స్వస్థపరచండి. ఇది బాగవ్వబోతుందని మీరు నమ్ముతున్నారా?

దేవా, మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న నా చిన్నసహోదరుడిని దీవించండి. అది అతనిని ఇక బాధించకుండా తండ్రీ, అతను బాగుపడును గాక. యేసునామమున నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. బాబు, ఇప్పుడు, నీవు బాగవ్వబోతున్నావని నమ్ముతున్నావా? ఆహ్? అయితే సరే.

147

దేవా, ఈ ఎముక సమస్యతో ఉన్న మా సహోదరుడినిపై కనికరము చూపించండి. అతను ఈ భవనం నుండి, గంతులు వేస్తూ, దూకుతూ, దేవుణ్ణి స్తుతిస్తూ వెళ్ళునుగాక. నేను ఎముకల సమస్యను యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాను. అయ్యా, నమ్ముతూ వెళ్ళండి. సంతోషంగా బయటకు వెళ్లండి, మీరు దానిని పొందుకుంటారు.

ఓ దేవా, మా సహోదరిని కరుణించి, ఈ కేన్సర్ ను౦డి ఆమెను స్వస్థపరచండి. యేసుక్రీస్తు నామములో నేను దీనిని అడుగుతున్నాను. సహోదరీ, దేవుడు నిన్నుదీవించును గాక. మీరు ఇప్పుడు మీ హృదయపూర్వకంగా నమ్ముతున్నారా? ఖచ్చితంగా ఉండి సాక్ష్యమివ్వండి మరియు దేవుని మహిమ గురించి ప్రజలకు చెప్పండి.

దేవా, ఈ ప్రియమైన, వృద్ధాప్యములో అలసిపోయి ఈ వరుసగుండా వస్తున్న ఈ తల్లిని మీరు స్వస్థపరచుమని నేను ప్రార్థిస్తున్నాను. నేను యేసుక్రీస్తు నామములో ఆమెపై చేతులు ఉంచాను.

దేవా, మన సహోదరుని మీద దయచూపి, యేసు నామమున తండ్రీ, ఆయనను స్వస్థపరచుము.

దేవా, మా సహోదరి మీద కనికరము చూపి, తండ్రి, యేసునామమున ఆమెను స్వస్థపరచుము.

దేవా, ఈ బలహీనమైన హృదయాన్ని స్వస్థపరచుము. ఓ క్రీస్తు, సమస్త దుఃఖమును తీసివేయుమని, నేను యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను

దేవా, నా సహోదరుడిని స్వస్థపరచుము. యేసుక్రీస్తు నామమున నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.

అది సరియైనదేనా? మీ...

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...