సమ్సోనూ, నీ బలమెక్కడికి పోయినది?

సమ్సోనూ, నీ బలమెక్కడికి పోయినది?

VGR COUNT-106 [ఒక సహోదరుడు, సహోదరుడు బ్రెన్హాం కొరకు లేఖనము చదువువుచున్నాడు.

“న్యాయాధిపతులు 16వ అధ్యాయములోని 4 నుండి 22 వచనముల వరకు నేను దీనిని చదివిన పిమ్మట మీరు కూర్చొనవచ్చును. ఇది కొంచెము పొడవాటి లేఖనము, కానీ సహోదరుడు బ్రెన్హాం నన్ను దీనిని చదువమని అడిగియున్నారు?

పిమ్మట అతడు శ్రేరేకు లోయలోనున్న దెలిలా అను స్త్రీని మోహింపగా

ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో - నీవు అతని లాలనచేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో, మేమేలాగు అతని గెలువవచ్చునో తెలిసికొనుము; మేము అతని బంధించి అతని గర్వము అణుపుదుము, అప్పుడు మాలో ప్రతివాడును వెయ్యిన్ని నూరు వెండి నాణెములను నీకిచ్చెదమని చెప్పిరి.

కాబట్టి దెలీలా - నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేనిచేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సమ్సోనుతో ననగా

సమ్సోను - ఏడు నిరవంజి చువ్వలతో నన్ను బంధించినయెడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలె అవుదునని ఆమెతో చెప్పెను.

ఫిలిష్తీయుల సర్దారులు ఏడు నిరవంజి చువ్వలను ఆమె యొద్దకు తీసికొని రాగా ఆమె వాటితో అతని బంధించెను.

మాటున నుండువారు ఆమెతో అంతఃపురములో దిగియుండిరి గనుక ఆమె సమ్సోనూ, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనగా, అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు.

అప్పుడు దెలీలా - ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేనిచేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని సమ్సోనుతో చెప్పగా.

అతడు పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించినయెడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలె అవుదునని ఆమెతో చెప్పెను.

అంతట దెలీలా పేనబడిన క్రొత్త తాళ్లను తీసికొని వాటితో అతని బంధించి సమ్సోనూ, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటున నుండువారు అంతఃపురములో నుండిరి. అతడు తన చేతుల మీదనుండి నూలుపోగువలె ఆ తాళ్లు తెంపెను.

అప్పుదు దెలీలా - ఇదివరకు నీవు నన్ను ఎగతాళిచేసి నాతో అబద్దములాడితివి, నిన్ను దేనివలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సమ్సోనుతో చెప్పగా అతడు - నీవు నా తలజడలు ఏడును అల్లిక అల్లినయెడల సరి అని ఆమెతో చెప్పెను.

అంతట ఆమె మేకుతో దాని దిగగొట్టి సమ్సోనూ, ఫిలిష్తీయులు నీ మిద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్రమేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసికొని పోయెను.

అప్పుడు ఆమె - నాయందు నీకిష్టము లేనప్పుడు - నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో చెప్పెను.

ఆమె అనుదినమును మాటలచేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను.

అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి - నేను నా తల్లి గర్భమునుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడనైయున్నాను, నా తలమీదికి మంగలకత్తి రాలేదు, నాకు క్షౌరము చేసిన యెడల నా బలము నాలోనుండి తొలగిపోయి యితర మనుష్యులవలె అవుదునని ఆమెతో అనెను.

అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని దెలీలా యెరిగి, ఆమె వర్తమానము పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి యీసారికి రండి; ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపెననెను. ఫిలిషీయుల సర్దారులు రూపాయిలను చేత పట్టుకొని ఆమెయొద్దకు రాగా.

ఆమె తన తొడమీద అతని నిద్రబుచ్చి, ఒక మనుష్యుని పిలిపించి వానిచేత అతని తలమిది యేడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను.

ఆమె - సమ్సోనూ, ఫిలిష్తీయులు నీ మిద పడుచున్నారనగా అతడ నిద్రమేలుకొని - యెప్పటియట్లు నేన బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు.

అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసికొనివచ్చి యిత్తడి సంకెళ్లచేత అతని బంధించిరి.

అతడు బందీగృహములో తిరగలి విసరువాడాయెను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తలవెండ్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను.“

సహోదరుడు బ్రదర్ బ్రెన్హాంను జనులకు పరిచయం చేయుచున్నాడు: “బ్రదర్ బ్రెన్హాం”]

2

ఈ రాత్రి ఇక్కడ ఉండుట ఎంతో మంచిగా ఉన్నది. మరియు ఈ అత్యంత కృపగల క్రైస్తవ జనుల గుంపును ఉద్దేశించి మాట్లాడుట ఇది ఎంతో ఘనమైన అవకావము మరియు మీ అందరికి శుభాభివందనములు. మరియు నేను ఇక్కడ ఉన్న ఈ దినములు నా జీవితములోనే అత్యంత మహిమకరమైన దినములలో కొన్ని అయ్యున్నవి.

మరియు ఈ ఉదయకాలమున నేను చేసిన తప్పిదమును గూర్చి నా ఒప్పుకోలు నేను చేయుచున్నప్పుడు, సేవకుని తరువాత సేవకుడు, మరియు వ్యాపారవేత్త తరువాత వ్యాపారవేత్త, నన్ను కలిసి ఏడ్చుచూ మరియు ప్రార్థింపబడుటకు అక్కడకు వెనుకకు తిరిగి వెళ్ళగోరిరి. కనుక నేను దానిని ఇష్టపడెదను. అది తెలియబడుచున్నది. ఎంతకాలమైతే ఒప్పుకోలు ఉండునో, మంచిది, ఒక ఉజ్జీవము కొరకు నిరీక్షణ ఉండును, అక్కడ ఉన్నదా? మరియు దాని కొరకు మనము సంతోషించెదము.

మరియు ఇప్పుడు, గతరాత్రి - మన గౌరవనీయుడైన సహో. రాబర్ట్స్ నేరుగా క్రైస్తవ వ్యాపారులకు తన వర్తమానమును అందించెను. కనుక సంఘమునకు నేను చెప్పదలచిన కొన్ని మాటలను చెప్పాలని నేను ఈ రాత్రి తలంచాను, ఎందుకనగా ఇక్కడ అనేకమంది ఆహ్వానించబడిన (స్పాన్సర్ చేయబడిన) సేవకులు ఉన్నారు, వారందరూ కూటములో ఉన్నారు. కనుక సంఘమునకు దానిని అందించాలని నేను తలంచాను. ఈ రాత్రి నా అంశము, “సమ్సోనూ, నీ బలమెక్కడికి పోయినది?”

3

ఒక్క క్షణము ప్రార్ధన కొరకు మనము తలలు వంచెదము. ప్రియ పరలోకపు తండ్రీ, మా హృదయములన్నిటితో, మరియు మా బలమంతటితో మరియు మాలో ఉ న్నవాటన్నిటితో నీ యొక్క దయను కోరుతూ మేము మీ యొద్దకు వచ్చియున్నాము, మరియు నీకు ఇష్టముగా లేని, దేనినైనా ఒకవేళ మేము చేసినా లేక చెప్పినా, లేక కనీసము తలంచినా, ప్రభువా, ఈ సంగతులు కొరకు నీవు మమ్ములను క్షమించుమని, మేము అడిగెదము, ఏలయనగా నిజముగా నీ యొక్క ప్రియ కుమారుడైన ప్రభువైన యేసు యొక్క నీతితో చుట్టబడి, నీ రాజ్యములోనికి స్వీకరించబడుటకు సిద్దపడి, ఒక రోజు నీ యొక్క సన్నిధిలో నిలబడగోరుచున్నాము.

మరియు ఇప్పుడు, మేము మా సరైన మనస్సుతో ఉన్నప్పుడు, మా యొక్క పాపములన్నిటి నిమిత్తము మేము క్షమాపణ అడుగుచున్నాము. మరియు మా జీవితములలో, మేము త్వరగా పిలువబడి మరియు పశ్చాత్తాపపడుటకు కూడా సమయము లేని ఒక సమయము వచ్చును. ఈ రాత్రి మేము ప్రార్థించుచున్నాము. ప్రభువా, మా కొరకు వాక్యము చదువబడియుండగా, పరిశుద్ధాత్మ ఆ మాటలను తీసికొని మరియు మా అవసరతలకు తగినట్లుగా వాటిని మా హృదయములకు పంచి ఇచ్చును గాక.

ప్రభువా, ఈ సభలను నీవు ఇంకనూ ఆశీర్వదించమని, మేము అడుగుచూ ఉన్నాము. తరువాత, ఏదైతే చెప్పబడియున్నదో దానికొరకు నీకు వందనములు తెలియజేయగోరుచున్నాము, గొప్పవారైన మరియు ధైర్యశాలురైన సిలువ యొక్క సైనికుల కొరకు, వారు తమ హృదయము యొక్క యదార్థతను సాక్ష్యములు మరియు వర్తమానముల రూపములో పలికియున్నారు. మరియు చేయబడిన దానంతటి కొరకు, దాని నిమిత్తము మేము కృతజ్ఞులము, మరియు నీవు ఇంకనూ కొనసాగించమని అడుగుచున్నాము.

సహోదరుడు షకారియన్ ను దీవించుము, మరియు క్రైస్తవ వ్యాపారస్తులందరినీ, మరియు ప్రతీ సేవకుడిని, మరియు ఇక్కడ కలిసి సమావేశమైన సంస్థను కూడా. మరియు ఇది పశ్చిమ తీరమున ఏర్పాటు చేయబడిన గొప్ప కూటములలో ఒకటిగా మారును గాక. రానున్న ఒకటి రెండు రోజుల్లో ఇక్కడ ఏదో జరుగును గాక, ప్రభువా, అది మొత్తము కాలిఫోర్నియా రాష్ట్రమునంతటినీ మేల్కొలిపి మరియు వారిని పశ్చాత్తాపమునకు తీసుకొని వచ్చి మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షించు కృప యొక్క జ్ఞానమును తీసికొని వచ్చును గాక. ఈ రాత్రి ఇంకా ముందుకు ఆ పరిశుద్ధాత్మ మాకు సేవ చేయుటకు మేము ఎదురు చూస్తుండగా మమ్ములనందరినీ కలిపి దీవించండి. నీ కుమారుడైన, యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.

4

ఈ వ్యక్తి సమ్సోను, అతడు ఎల్లప్పుడు పాత నిబంధనలో ఒక అసాధారణమైన వ్యక్తిత్వము నాకు అగుపించును. నేను తీసికొని ప్రసంగించుటకు ప్రయత్నించిన మొదటి ప్రసంగము, “సమ్సోను, పరాక్రమశాలియైన బలాఢ్యుడు,” అని నాకు గుర్తున్నది, ఎందుకనగా నేను బలమును ఇష్టపడెదను. మరియు సమ్సోను బలమును కలిగియున్నాడు, ప్రభువు యొక్క బలము.

అతడు ఒక గొప్ప పెద్ద చారిత్రాత్మకమైన ఉన్నత దేహుడు అని నేను నమ్మలేను.. అటువంటి వ్యక్తి పట్టణము యొక్క గవునులను ఎత్తుకొని మరియు కొండపైకి ఎత్తుకొని, లేక తన చేతలతో ఒక సింహమును చంపుట వంటి ద్వారా దేవునికి ఎటువంటి మహిమ ఉండదు. కాని సమ్సోను కేవలము ఒక చిన్నవాడు, మనమేమని పిలిచెదము, మరుగుజ్జు, కేవలము ఒక సాదాసీదా పొట్టివాడు అని నేను నమ్ముచున్నాను. మరియు ఎప్పుడైతే ప్రనభు యొక్క ఆత్మ అతడి పైకి దిగి వచ్చినదో, అక్కడే దేవునికి మహిమ వచ్చినది. దానిని చేయుటకు అతడికి సొంత బలము లేదని వారికి తెలుసు, కనుకనే అది ప్రభువు యొక్క బలమై యుండవలసియున్నది.

దేవుడు తన గొప్ప కార్యములను నెరవేర్చుటకు సామాన్యమైన వాటిని తీసుకొనును. మరియు అవి కేవలము సాధారణమైన సంగతులు... కొన్నిసార్లు ఏవో గొప్పవి కనుగొనడానికి ప్రయత్నించుచున్నప్పుడు, దేవుడు ఉపయోగించాలని కోరుచున్న నిజమైన సంగతిని పైనుండి దాటిపోదుము.

5

మరియు నేను చెప్పినట్లుగా, సమ్సోను మరియు దేలీలా సంఘమునకు ఒక గొప్ప మాదిరి. ఈ రాత్రి ఆ విధముగా పోల్చాలని నేను కోరుచున్నాను. ప్రభువును వెంబడించినంత కాలము సమ్సోను ఒక గొప్ప వ్యక్తే. అతడు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించి, దేవునితో నడిచినంత కాలము, దేవుడు అతడిని వాడుకొనెను. మరియు అతడు చేసిన విదముగానే సంఘము చేసెను. సంఘము దేవుని యొక్క ఆజ్ఞలు వెంబడించి, దేవునితో నడిచినంత కాలము, దేవుడు సంఘమును ఉపయోగించుకొనగలడు. కానీ సమ్సోను చేసిన విధముగా, సంఘము కూడా ప్రక్కదారి పట్టినట్లయితే, అప్పుడు దేవుడు ఆ సంఘమును ఇక ఎంత మాత్రమును ఉపయోగించుకొనలేడు. ఆయన పనిచేయుటకు వేరొక దానిని కనుగొనవలసియున్నది, ఎందుచేతననగా ఒక సంఘమైనా, లేక సంస్థ అయినా, లేక ఒక వ్యక్తి అయినా వారు ఆయన యొక్క ఆజ్ఞలలో నమ్మకముగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఉపయోగించుకొనగలడు.

మరియు సమ్సోను చాలా బాగుగా చేసెను. అతడు ఒక మంచి ప్రారంభము కలిగియుండెను. అతడు సరసమాడుట (ఒక వేశ్యతో) ప్రారంభించనంత వరకు అతడు అన్ని బాగుగానే చేసెను. మరియు అతడు సరసమాడుట ప్రారంభించినపుడు అతడు సమస్యలో పడెను. అది అతడు వెనుకకు జారుటకు మొదటి అడుగు. మరియు సంఘము వెనుకకు జారుటకు అదే మొదటి అడుగు, అది అవిశ్వాసితో సరసమాడుట ప్రారంభించినప్పుడు అని నేను నమ్ముచున్నాను. ఈ ఫిలిష్తియురాలైన స్త్రీ ఒక అవిశ్వాసి. మరియు సమ్సోను ఆమె యొక్క అందమునకు ఆకర్షించబడెను. మరియు సంఘము కూడా అదే గొప్ప మాదిరిగా చేసియున్నదని నేను తలస్తున్నాను, ఆకర్షించబడి, అది లోకముతో సరసమాడుటకు ప్రయత్నించి మరియు అది లోకానుసారముగా తననుతాను తయారు చేసుకొనుటకు ప్రయత్నించుచున్నది.

6

సమ్సోను ఒక చెడు సహవాసములోనికి వెళ్ళెను. మరియు మీరు ఎల్లప్పుడు దానిని గుర్తించుకొనవచ్చును, మీరు ఒక చెడ్డ సహవాసములో ఉంటే, మీరు ప్రభువు యొక్క చిత్తము బయట ఉన్నారు. నా పాద దక్షిణ దేశపు తల్లి నాకు చెబుతూ ఉండెడిది, “ఒకవేళ ఈగలు ముసిరిన ఒక కుక్కతో నీవు పడుకొని యున్నట్లయితే, నీవు ఆ ఈగలు తోనే పైకి లేచెదవు.” అది ఒక కఠినమైన భావమైయుండవచ్చు, కాని దానిలో చాలా సాధారణ, ప్రతిదినపు అర్థమున్నది. నీవు లోక సంగతులతో సహవాసము చేస్తూ మరియు ఆత్మీయముగాను మరియు ప్రభువు ముందు దీనుడుగాను ఉండెదనని ఆశించవద్దు. నీవు నీ స్నేహితుల ద్వారా తెలియపరచబడెదవు. ఒకపాత సామెత ఉన్నది, “నీ స్నేహితులను చూపించుము, నీవెవరివో నేను చెప్పెదను.”

మరియు సంఘము ఎప్పుడైతే లోకముతో సహవాసము చేయడం ప్రారంభిస్తుందో, అది ఒక లోకము తప్ప మరేమి కాదు. అది సమ్సోను చేసినట్లుగా సరసమాడుట ప్రారంభించినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము నుండి దేవుని యొక్క సహవాసము నుండి, మరియు దూతల నుండి, మరియు దేవుని యొక్క వారసత్వము నుండి వేరగును.

7

మరియు సంఘము సరసమాడుటను ఎక్కడ ప్రారంభించెను, అది లోక పద్దతులకు అనుగుణముగా మార్చుకొనుటకు ప్రయత్నించ ప్రారంభించినపుడు, లోకము కల్పించుచున్న అవకాశములలో విజయమును చూచినప్పుడు. మరియు లోకముతో పాటు అడుగు వేయుట కొరకు మనము ఎన్నడూ దేవుని ద్వారా నియమించబడలేదు. ఎన్నడూ మనము లోకముకన్నా తెలివైన వారము లేక ప్రకాశవంతమైన వారము కాదు. ఈ లోక రాజ్యమునకు సంబంధించిన పిల్లలు దేవుని రాజ్య సంబంధమైన పిల్లలు కన్నా ఎక్కువ తెలివైనవారు అని లేఖనములలో ఎక్కడో వ్రాయబడినదని నేను నమ్ముచున్నాను. వారు తెలివైనవారు: అది కయీను మరియు హేబేలు సమయము నుండీ అలాగే ఉన్నది.

8

ఇప్పుడు, మనము ఆ పాత పద్ధతిలో యున్న పరిశుద్ధాత్మ యొక్క సహవాసము నుండి దూరమగుట ప్రారంభించాము. మనము సరసమాడుట ప్రారంభించాము. ఒక్కటి మనము చేయుట ప్రారంభించాము, అది మొదటి కాలములో దేవుడు సంఘమునకు ఉపయోగించుకొనుటకు ప్రారంభించినప్పుడు, అప్పుడు వారు చేసిన మొదటి సంగతి, వారు సంఘమును మానవ నియంత్రణలోనికి తీసుకొన్నారు, అదే కాథలిక్ సంఘముగా పిలువబడినది. అదే మొదటి సంస్థ. నేను సంస్థకు వ్యతిరేకము కాదు, ఒకవేళ అది మరొక సంస్థతో కలయులాగున తన గీతలను గీయుచున్నట్లయితే. కానీ ఒకవేళ అది తన సొంత పరిమితులను కలిగియుండి దానిలోనే తననుతాను ఉంచుకొని మరియు సహవాసము లేకుండా, అప్పుడు అది తప్పు.

కాని సంఘము లోక పద్దతులలోనికి మారుటకు ప్రయత్నించుట ప్రారంభించినది. మరియు అది ఎప్పుడైతే కాథలిక్కు సంఘమును వ్యవస్థీకృతము (సంస్థగా మార్చినదో) చేయుట ద్వారా వారు సంఘమును బంధించడగలిగినామని బహుశా ఆ దెయ్యము తలంచియుంవచ్చు, కానీ “సమ్సోను, ఫిలిష్తియులు నీ మీద పండుచున్నారు,” అనే సవాలు వచ్చినప్పుడు, అక్కడ ప్రతీతాడును తెంచివేసి మరియు నీతికరణను ప్రసంగిస్తూ ముందుకు వచ్చిన ఒక మార్టిన్ లూథర్ లేచియున్నాడు. అవును. మరియు సంఘము యొక్క దాగియున్న శక్తి అది కాదని దెయ్యము చూచియున్నది.

9

ఇప్పుడు, అతడి శక్తిని కనుగొనుటే, దెలిలా యొక్క ఉద్దేశ్యము, ఆమె అతడి యొక్క శక్తి కనుగొన్న తరువాత అక్కడ ఆమె అతడిని బంధించగలదు. మరియు దెయ్యము సంఘముతో చేయుటకు ప్రయత్నించుచున్నది, అది శక్తి యొక్క రహస్యమును కనుగొనుట. కాని దేవుడు మార్టిన్ లూథరన్ లేనప్పుడు కాథలిక్కు త్రాళ్ళన్నీ తెగిపోయాయి.

తరువాత ఆమె అతడిని తిరిగి బంధించినది. లోకము అతడిని లూథరన్ సంఘములో బంధించినది. కానీ “ఫిలిష్తియులు నీ మీదకు వచ్చియున్నారు” అనే కేక వినబడినప్పుడు, అక్కడ ఒక జాన్ వెస్లీ లేచియున్నాడు, ఆ శుద్ధీకరణ, కృపయొక్క రెండవ కార్యము. మరియు అది త్రాడును తెంపివేసింది.

మరియు తరువాత వారు దానిని తిరిగి బంధించిరి. మరియు తరువాత అక్కడ వేరొక వర్తమానము వచ్చునది, “ఫిలిష్తియులు నా మీద పడియున్నారు — నీ మీద,” అప్పుడు తరువాత పెంతెకోస్తు గుంపువారు లేచియున్నారు. అది శాఖా సంఘములు మరియు అటువంటి వాటియొక్క అడ్డుబండలు అనే బంధించిన త్రాళ్ళను తెంచివేసినది. మరియు కేవలము బంధింపబడియున్నది. అను దానిని గూర్చి ఇప్పుడు మనము కనుగొన్నాము. అది చాలా విచారకరము, కాని అది సత్యము. మరియు ఇప్పుడు పెంతెకొస్తు సంఘములో మనము కనుగొనగలము, ఇతరులను బంధించుటకు లోకము ఉపయోగించుచున్న అదే సంగతిని, అది పెంతెకొస్తు సంఘమును బంధించుచున్నది. ఖచ్చితముగా.

10

మనము చేయుటకు ప్రయత్నించుచున్న మొదటి సంగతి ఏదనగా, వేరే ప్రజలు చేయుచున్నట్లుగా మనము కూడా పెద్ద ప్రదర్శనలు (కూడికలు) చేయుటకు ప్రయత్నించుచున్నాము, మనయొక్క ప్రసంగీకులు, మన పాస్టర్లు, మన కాపరులను తీసుకొని మరియు వారిలో నుండి డాక్టర్స్-ఆఫ్-డివినిటీలు (డిగ్రీలు) చేయుటకు ప్రయత్నించుచున్నాము. మనకు డాక్టర్స్-ఆఫ్-డివినిటీలు అవసరం లేదు. మనకు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము అవసరము....?... వాటియొక్క అవసరము మన మధ్యలో లేదు. కానీ అక్కడే అది సంఘమునకు బంధించుటకు ప్రయత్నించుచున్నది.

మరియు తరువాత, వారు చేయుటకు ప్రయత్నించుచున్న తరువాత సంగతి ఏదనగా, సంఘము యొక్క దీనత్వము నుండి దూరమగుచున్నారు, దాని యొక్క తగ్గింపు, మరియు బాగా దుస్తులు ధరించే గుంపు లేక బాగా చదువుకున్న గుంపును సంఘములోనికి తీసుకొని వచ్చుచున్నారు. చాలా విద్యను అభ్యసించుటకు మనయొక్క సేవకులను తీసుకొని వారిని ఏదో సెమినరీకి పంపించుటకు ప్రయత్నించుచున్నారు. మీరు దానిని చేసినప్పుడు, మీరు సంఘమును దొంగలించి మరియు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బంధించుచున్నారు. అది ఖచ్చితముగా సత్యము.

11

ఇప్పుడు, వారు ఆ విధముగా చేయుటను మనము కనుగొనెదము. దీనిని నన్ను మీకు చెప్పనివ్యండి. ఎవరో చెప్పుచున్నారు, “మా పాస్టరు ఒకప్పుడు... మేము నిజముగా దేవుని కొరకు పాత అగ్నితో కూడిన ప్రసంగీకుడిని కలిగియున్నాము...” దేవునిచే పిలువబడిన వ్యక్తికి బదులుగా, వారు ఈ రోజు ఆ సెమినరీని పిలుచునట్లు చేయుదురు. వారు డబ్బు కొరకు, ఒక భోజనపు టికెట్టు, లేక ఏదో అడుగుట వారు దానిలోనికి వెళ్ళెదరు.

మన ప్రభువు నుండి నిజముగా అది ఎంత వ్యత్యాసముగా ఉన్నది. ఆయన భూమిపైకి వచ్చినప్పుడు, ఆయన మనందరికీ ఒక ఉదాహరణగా ఉన్నాడు. మరియు ఆయన ఒక సేవకుడైన ప్రభువు: చేయదగినంత హీనమైన పనిని తీసుకొనెను: ఒక పాదములు కడిగే దాసునిగా (పనివాడు) మరియు ఒక సేవకునిగా మారెను... అయినను ఆయన పరలోకపు దేవుడై యున్నప్పటికీ మరియు సేవకునిగా మారెను, తక్కువలో తక్కువగా.

ఈ రోజు, దేవుడు ఒక వ్యక్తిని కొంచెము ఆశీర్వదించి మరియు అతడికి ఒక మంచి సంఘమును ఇవ్వగలడు, మరియు అతడు కూడా పరిచర్య (సేవ) చేయించుకొనబడేంత వరకూ అతడు తృప్తి చెందలేడు. అది ఒక ఆత్మీయ రోగము యొక్క సూచనను చూపిస్తూ ఉన్నది. బలహీనమైన వారికే యేసు పరిచర్య చేసెను. ఎవరైతే రబ్బీ అవ్వాలని, డాక్టర్ రెవరెండ్ అని కోరుకుంటారో... ఓ, ఆ స్వార్థపరులు, భక్తిహీనులు, దెయ్యపు పేర్లు... మనము సహోదరులము, మరియు మనము ఈ లోకమునకు చెందినవారుము కాము. కానీ ప్రజలు కోరుకొనునది అదే. మరియు వారు మీటింగు లేక దేనికైనా వచ్చినప్పుడు మరియు వారు రొమ్ము విరుచుకొని నడుచుచూ మరియు వెళ్ళుచుందురు, మరియు మీరు ఆ ప్రజలకు ఎంతో గొప్ప గౌరవములను, ఇవ్వవలసియున్నది. మనకు ఒకరి నుండి మరొకరికి ఎటువంటి గౌరవములు అవసరము లేదు. ఒకవేళ నేను ఎటువంటి గౌరవములైనా కోరుకుంటే, నిజమమైన గౌరవమునిచ్చే దేవుని నుండి అది రావాలని నేను కోరెదను.

మీరు ఒకరి నుండి మరొకరు ఆ ఘనతను (మర్యాదను) కోరుకొనినయెడల ఏ విధముగా నీవు విశ్వాసమును కలిగియుందువు? అది పంటలో నున్న సారమును తీసివేసినది. అది సంఘము యొక్క దాగియున్న శక్తిని తీసివేయుచున్నది; అది జనులలో నుండి పీల్చివేయబడుచున్నది. మనము లోకమువలె నటించుటకు ప్రయత్నించుచున్నాము.

12

ఇప్పుడు ఈ సంగతలను గూర్చి నేను ఎటువంటి వ్యతిరేకతను కలిగిలేను, కాని ఎంత త్వరగా అయితే — ఆ పొగాకు కంపెనీలు మరియు సిగరెట్లు, మరియు కోకా-కోలా వారు మరియు ఇతర కంపెనీలు, బీరు, వారు టెలివిజన్ కార్యక్రమాలు తీసి మరియు వారు వాటిని వ్యాప్తి చేయడం మనము గమనించగలము. మంచిది, త్వరగా వాటిని మనము ఆకర్షించుటకు ప్రయత్నించెదము. ఇప్పుడు, అది... నేను దానికి వ్యతిరేకముగా ఏమి చెప్పుట లేదు, కాని లోకముతో పోటీపడుట కొరకు మనము ఇక్కడలేము. సువార్తను ప్రకటించుటకు మనము ఇక్కడ ఉన్నాము. ఒక హోటన్టాట్ (ఆఫ్రికాలో ఒక జాతి ప్రజలు) వాడకి ఒక ఐగుప్తు రాజును గూర్చి తెలినంతగా కూడా దేవుని గూర్చి తెలియని ఒక గుంపు వివేకము కలిగిన ప్రజలు కూర్చిండియుండుట వలన అది ఏ మంచి చేయును? దేవుని యొక్క ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన వారెవరో, దేవుడని వారి రక్షకుడిగా ఎరిగి మరియు పరిశుద్ధాత్మకు ఏ విధముగా దారినివ్వవలెనో తెలిసినవారు, వారు మనకు అవసరమై యున్నారు.

13

ఈ రోజు మొత్తముగా సంఘము, మనము ఒక చాలా క్లిష్టమైన స్థితిలో ఉన్నాము. ఒకవేళ వారి జీవితాలలో వారు ఒక దేవుని యొక్క పిలుపును కలిగి ఉంటే, మరియు అటువంటి మన సేవకులను వారు తీసుకొని, మరియు వారిని ఎక్కడికో పూత పూసెడి (చచ్చినవారి శరీరము పాడవ్వకుండా ఉంచుటకు వ్రాసెడి ఒక ఔషదపు పూత) స్థలమునకు పంపించివేసి మరియువాక్యమును ప్రసంగించి మరియు ప్రజలను పరిశుద్ధ గ్రంథములోని విశ్వాసమునకు మరియు పరిశుద్ధాత్మలోకి తీసుకొని వచ్చుటకు బదులు నింపివేసి, ఒక కట్ట సిద్దాంతములు మరియు మానసిక శాస్త్రమును వారికి బోధించి, ప్రజలకు బోధించుట కొరకు, వారు ప్రారంభించవలసియున్న దాని నుండి, వారిని దేవుని నుండి దూరముగా తీసుకొని వెళ్ళిపోవుచున్నారు. ఖచ్చితముగా అక్కడకే మన విద్యాకార్యక్రమాలు మనలను తీసుకొని వచ్చి యున్నవి...?.. దేవుడు విద్య ద్వారా తెలియబడడు. సైన్సు ద్వారా కూడా తెలియబడడడు. ఏ లోక సంగతి ద్వారా కూడా ఆయన తెలియబడడు. మరియు మీరు నమ్ము విశ్వాసముతో మాత్రమే దేవుడు తెలియబడును.

14

ఏదెను తోటలో ఒక జ్ఞాన వృక్షము (మంచి చెడ్డలు తెలివినిచ్చు) ఉన్నది, మరియు మానవుడు పూర్తిగా ఆ జ్ఞాన వృక్షమునకే వ్రేలాడుచున్నాడు. గుర్తుంచుకొనండి, నీవు ఆ జ్ఞానవృక్షము యొక్క మొదలు దగ్గరే జీవించుచున్నంత కాలము, దాని నుండి పడుతున్న పండును తినుచూ, నీవు జీవవృక్షము నుండి దూరముగా ఉన్నావు. నీవు ఒకేసారి రెండు వృక్షముల యొద్ద ఉండలేవు. మీరు మేధావులైన ఉన్నతులను, తయారు చేయగలరు (అది నిజము.) మరియు గొప్ప తత్వవేత్తలు, కానీ మనకు అటువంటి తత్వవేత్తలు అవసరము లేదు. మనకు సంఘములో దీనులైన తిరిగి-జన్మించిన క్రైస్తవులు అవసరము.

అది ప్రతీ సంఘశాఖ వారి సేవకులను కొంచెము ఉన్నత స్థితి కొరకు చదువు నేర్పుటకు ప్రయత్నించడం నాకు జ్ఞాపకము వచ్చుచున్నది, సంఘములోనికి మరికొంత మంది మంచి మేధావుల గుంపును తీసుకొని వచ్చుచున్నారు. వారు ఇప్పుడు భవనములోనే ఉత్తమమైనవి నిర్మించనున్నారు, పెంతెకొస్తు వారు, కొంతమంది లక్షలాది డాలర్లలతో వాటిని నిర్మిస్తూ మరియు ప్రభువు ఇప్పుడే వచ్చుచున్నట్టుగా ప్రసంగించుచున్నారు. కానీ అది ఏ రకముగాను నాకు బోధపడుట లేదు. చూశారా? కానీ వారు దానిని చేసెదరు, ఎందుకనగా లోకము దానిని చేయుచున్నది, ఎందుకనగా మిగిలినవారందరూ దానిని చేయుచున్నారు. తక్కిన వారందరూ ఏమి చేయుచున్నారనునది మనము పట్టించుకొనము; దేవుని ముందు యధార్థముగా జీవించుము; అదియే ముఖ్యసంగతి.

15

కానీ ఏదెను తోటలో దెయ్యము మానవుని యొక్క శిరస్సును ఎన్నుకొన్నది. దేవుడు అతని హృదయమును ఎన్నుకొన్నాడు. మరియు ఇప్పుడు దెయ్యము వివేకము (తెలివి) గలిగిన వారిలోనికి వచ్చి మరియు వాటియొక్క మతమును మేధావుల యొద్దకు తీసుకొని వచ్చాడు. మీ వివేకముతో దేవున్ని ఎన్నడూ ఎరుగలేదు; మీరు మీరు ఆయనను ఒక క్రొత్త-జన్మ ద్వారా తెలుసుకొనవలెను, తిరిగి-జన్మించుట అనునది హృదయములో నుండి వచ్చును.

జీవపు డంబము, శరీరాశ, నేత్రాశ (కన్ను ఏమి చూడగలుగునో)... కాని దేవుడు లోపలికి వచ్చినప్పుడు, ఆయన ఒక మానవుని యొక్క హృదయములోనికి వెళ్ళి మరియు తన యొక్క కన్నుల చూడలేని వాటిని విశ్వాసము ద్వారా నమ్మునట్లు చేయును, “ఏలయనగా విశ్వాసము నిరీక్షింపబడు వాటియొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువనైయున్నది.” దెయ్యము కేవలము దానిని త్రిప్పివేసియున్నది. మరియు వాడు పెంతెకొస్తు సంఘమునకు దానిని చేయుచున్నాడు.

సంవత్సరము వెంబడి సంవత్సరము నేను వారిని చూచుచున్నాను, మిగతా ఇతర సంఘములను దించివేసి మరియు వాటిని బంధించినట్లుగా ఇవి కూడా తిన్నగా అదే స్థితిలోనికి పడిపోవుచున్నవి. అది ఖచ్చితముగా సత్యము. తెలివి, తెలివి, మనమడుగునది అంతయూ జ్ఞానమే. మరియు వారు ఎక్కువ జ్ఞానము పొందుకుంటే, వారు బాగుగా మాట్లాడగలరని వారు తలంచెదరు, మంచి విద్యను ఉపయోగించెదరు, మానసిక శాస్త్రము మాట్లాడెదరు. మరియు వారది చేయుచున్నప్పుడు, వారు ప్రజలను దేవుని యొక్క పరిశుద్ధ బైబిలు నుండి దూరముగా తీసికొని పోయెదరు. వారిని జీవము మరియు విశ్వాసము నుండి దూరముగా తీసికొని పోవుచున్నారు.

16

ఇప్పుడు, కొంత కాలము క్రితము ఇక్కడ లాస్ ఏంజెల్స్ లో నేను చదువుచున్న ఒక చిన్న పుస్తకమును గూర్చి జ్ఞాపకము వచ్చుచున్నది. నీవు... దీనిని అగౌరవంగా భావించవద్దు, కానీ అది ఇప్పుడే నన్ను తాకియున్నది. అది దానిలో — దానిలో కొంత మంచి ఇంగిత జ్ఞానము కలిగియున్నది, అయితే అది కొంచెము ఈలాగు ఉన్నది: అది ఒక రకమగు కోడి పెట్టి మరియు ఒక మెరుస్తున్న కన్నులు కలిగిన పుంజుగా ఉన్నది, ఒక ఉదయం, ఒక పెట్టె పైకి ఎగిరి, మరియు తన ముక్కుతో ఆ పెట్టెను నాలుగు లేక అయిదుసార్లు పొడిచినది, మరియు “గౌరవనీయులైన పురుషులారా మరియు స్త్రీలారా, మీ అందరికి ఈ ఉదయం ఒక ఉపదేశము ఇవ్వాలనుకొనుచున్నాను, నేను చాలా జ్ఞానము సంపాదించాను అని మీకు చెప్పాలనుకుంటున్నాను” అని చెప్పెను, “దీనిని ఉత్తమమైన దానిగా మనము ఎలా నడిపించవలయునో, మరియు మనమందరము అందమైనది ఈకలు కలిగియుండుటకు ఏమి చేయవలెనో అంతయు నాకు తెలుసు.”

మరియు ఇతర చిన్న కోడి పిల్లలు తమ చిన్న చిన్న ముక్కులతో వ్రేలాడుచూ, గట్టిగా అరిచెను, “అతడు చాలా అందముగా ఉన్నాడు కదా?” మంచిది, అది కొద్దిగా సెమినరీ ప్రసంగీకులను గూర్చి నాకు జ్ఞాపకము చేయుచున్నది.

పిదప మీకు తెలిసిన మొదటి విషయము, అతడు ఇంకా ఇలా చెప్పుచూ ముందుకు వెళ్ళెను, “అందమైన ఈకలను పెంచుకొనుటకు మనము ఉపయోగించవలసిన సరైన రకమగు విటమిన్లను గూర్చి నాకు తెలుసు. మరియు తరువాత మనము జీవించుటకు కావలసిన సరైన రకమగు — జీవించుటకు ఒక ఉత్తమమైన స్థలము, ఇక్కడ,” అని చెప్పుచుండెను.

మరియు ఆ చిన్నవాడు సరిగ్గా తన ప్రసంగము మధ్యలో ఉన్నప్పుడు, ఒక చిన్న పుంజు ఆ సమావేశము బయటనుండి పరుగెత్తుకొని వచ్చియున్నది, అతడి పైన ఎక్కువ ఈకలు కూడా లేవు. మరియు అతడు చెప్పాడు, “ఒక్క నిమిషము, నా కుమారుడా.” అతడు (ఆ పుంజు) చెప్పెను, “నేను ఇప్పుడే చివరి తాజా సమాచారమును వినియున్నాను: కోడి (మాంసము) ధరలు పౌండు పైన నాలుగు సెంట్లు పెరిగాయి, మరియు రేవు మనమందరము వధించబడుటకు పోవుచున్నాము.” కనుక నీ జ్ఞానము ఏ మంచి చేయును. నీవు దేవునితో సరిగా ఉండుటయే మంచిది, అదే ముఖ్య విషయము.

17

ఒక చిన్న కానరీ పక్షి ఒకసారి తన కొమ్మపై కూర్చొని మరియు అతడు ఇలా చెప్పెను, “మనయొక్క ఈ చిన్న శాఖా సంఘములో, నేను ఇక్కడ కానరీ పక్షులన్నిటిలో ఒక తెలివైనవాడును. నేను చాలా జ్ఞానమును సంపాదించితిని, ఎంతవరకంటే, మానవుల గూర్చి నాకు అంతయూ తెలుసు. వారు మనకంటే ఉన్నతమైనవారు, అని వారు చెప్పెదరు, కాని దానినంతటిని గూర్చి నేను ఎరుగుదును.” మరియు అదే సమయములో, విశ్వవిద్యాలయము నుండి ఒక ఆచార్యుడు లేచి, మరియు చెప్పాడు, “చిన్న అల్పమైన లెక్కలో లేని వాడవైన నీవు...” మరియు కొని గొప్ప మాటలు చెప్పడం ప్రారంభించెను. మరియు కొన్ని గొప్ప మాటలు చెప్పండి ప్రారంభించెను. మరియు ఆ చిన్న కానరీ పక్షి తన కళ్ళను రెపరెపలాడించుచూ మరియు తదేకముగా చూచుట ప్రారంభించెను. అవును, అతడు ఏమి మాట్లాడుచెండెనో అతడు ఎరుగకుండెను. మరియు అతడు ఆ చిన్న కానరీ పక్షితో మాట్లాడుట ప్రారంభించెను. ఇప్పుడు, అది అలాగని ఆ చిన్న కానరీ పక్షి చూడలేకపోవుట కాదు. అతడు కన్నులు కలిగియుండెను. అతడు వినలేడు అని కాదు, ఎందుకనగా అతడు చెవులను కలిగియుండెను. కానీ అతడు అర్థము చేసుకొనలేక పోవుటకు కారణము, అతడు ఒక చిన్న కానరీ పక్షి మెదడును కలిగియుండెను. కనుకనే అతడు మానవులను అర్థము చేసుకొనకుండెను.

ఇప్పుడు, మన యొక్క చాలా సెమినరీ బోధ మరియు జ్ఞానము ఆ విధముగానే ఒక కానరీ పక్షి మెదడుకు ఎక్కువని నాకు తోచుచున్నది. దేవుని యొక్క మర్మములను జ్ఞానము ద్వారా మనము అర్థము చేసుకోలేము, ఎందుకనగా పరిశుద్ధాత్మ అది బయలుపరచిన రీతిగా మాత్రమే అది బయలుపరచబడును. ఈ విధనమున చాలా ఎక్కువ కానరీ పక్షి మెదడు యొక్క బోధయే ఉన్నది: దాని గూర్చి వారు ఎరిగియున్నదంతా, మరియు మీకు ఏమియూ తెలియదని తెలుసుకొనుట. ఎందుకనగా సర్వశక్తుడైన దేవుని యొక్క అపరిమితమైన మనస్సును మనయొక్క చిన్న పరిమితమైన మనస్సులు అర్థము చేసుకొనగలవు? దానిని నేను అర్థము చేసుకొనలేకపోయాను, ఏ విధముగా మనలనము మనము ఆ విధముగా గుంపుగా చేసుకొనెదము. ప్రజలు ఈ విధముగా సంగతులను చేసి మరియు ప్రజలను సంస్థగా మార్చుటకు కారణము, మరియు ఒక టెలివిజను కార్యక్రమము చూచుట కొరకు వారిని త్వరగా పంపించివేయుట, వీటన్నిటితో ఒకే ఒక సంగతి నాకు తోచుచున్నది: వారికి దేవుడు తెలియదు, మరియు క్రొత్త-జన్మ కొరకు ఏదో ప్రత్యామ్నాయము కొరకు వారు ప్రయత్నించుచున్నారు. అది వారు దాటుకొని పోవుచున్నారు.

18

బైబిలు కొత్త-జన్మను గూర్చి బోధించుచున్నదని మనమందరము ఎరిగియున్నాము. మరియు క్రొత్త-జన్మకు బదులుగా కరచాలనములు మరియు ప్రతీదీ వారు చేయుచున్నారు, కానీ అది ఎన్నడూ క్రొత్త జన్మయొక్క స్థానమును తీసుకొనలేదు. అది ఒక అనుభవమై యుండవలెను, ఒక తిరిగి-జన్మించిన అనుభవము.

ఎటువంటి జన్మ అయినా ఒక గందరగోళము అని మనము ఎరిగియున్నాము. ఒక బిడ్డ జన్మించినప్పుడు, అది నేలపైన అయినా, అది ఒక పొట్టు కుప్ప అయినా, లేక అందముగా అలంకరించబడిన ఒక ఆసుపత్రి గది అయినా, అది ఒక గందరగోళమే. కాని అది జీవమును తెచ్చును. క్రొత్త-జన్మ అనగా అదే; అది ఒక గందరగోళము, కానీ అది జీవమును తెచ్చును. అది ఒక శైలి కాదు, లేక అలంకరణ కాదు, లేక మత సిద్ధాంతముల ప్రకటన కాదు; అది పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము, మరియు నిజముగా విశ్వసిస్తున్న సంఘము యొక్క రహస్యమదే. తిరిగి-జన్మించుట.

ఓ, మీరు బలిపీఠముపై నుండి పైకి లేచి, ఏడుస్తూ, మరియు. భూప్-ఊహ్, మరియు కీచు కీచుమని అరచుచూ, మరియు చొంగ కార్చడం నేను ఎరుగుదును, కాని అది జీవమును తెచ్చును. అది నీలో ఉన్న సారమును బయటకు తీసివేయును. మీరు ఉండవలసిన విధముగా అది మిమ్ములను ఏదో చేయును. అది లోకమంతటినీ మరియు బిరుసుతనమును నీలో నుండి తీసివేయును. మరియు ఈ రోజు మనము కొంచెము నడిచి మరియు “యేసును నా స్వంత రక్షకునిగా నేను తీసుకొనెదను,” అని మనము చెప్పెదము. అది ఎన్నడునూ క్రొత్త-జన్మ యొక్క స్థానమును తీసుకొనదు, స్త్రీలు మరియు పురుషులు బలిపీఠము యొద్దకు వచ్చినప్పుడు మరియు వారెక్కడ ఉన్నారో వారు మరచిపోయి మరియు వారు చుట్టూ ఎవరు ఉన్నారో, వారు నిజముగా (తమకు తాము) చనిపోయి మరియు తిరిగి-జన్మించేంత వరకూ సంపూర్ణ రాత్రి కూడికలు మరియు పరిశుద్ధాత్మ యొక్క శక్తి సంఘములోనికి తిరిగి వచ్చుట, అదే ఈ రోజు మనకు ఆ మంచి పాత-కాలపు పరిశుద్ధ పౌలు యొక్క ఉజ్జీవము అవసరమై యున్నది, మరియు పరిశుద్ధ గ్రంథ పరిశుద్ధాత్మ ప్రసంగ శక్తిలో తిరిగి వచ్చుట, సామాన్యతలో ప్రసంగిస్తున్నప్పటికీ అది పునరుత్థానపు శక్తిలో ఉన్నది.

గొప్ప అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా, “నేను జ్ఞానమైన మాటలతో మీ యొద్దకు రాలేదు గానీ — మీ యొక్క విశ్వాసము మనుష్యుల యొక్క జ్ఞానముపై నిర్మించబడినది, కానీ మీ యొక్క విశ్వాసము పరిశుద్ధాత్మపై నిర్మింపబడాలని - నేను పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ప్రసంగిస్తూ వచ్చాను. సంఘమునకు ఈ రోజు అదే అవసరము. మరియు మనము వేరే సంగతులను ప్రత్యామ్నాయముగా తీసుకొని మరియు ఉన్నతమైన వారుగా, మరియు బిరుసుగా, గంజిపెట్టిన వారముగా అగుట వలన, మనము అసలైన రహస్యమును పోగొట్టుకొనుచున్నాము, మరియు మన జడలు గొరిగి వేయబడుచున్నవి. అది ఖచ్చితముగా నిజము.

19

ఓ, దానిని ఎలా చేయవలయునో దెలిలా ఎరిగియుండెను. కేవలము ఏమి చేయవలెనో ఆమె ఎరిగియుండెను. గత దినము, గత శనివారము, కొన్ని సరకులు తెచ్చుకొనుటకు నా భార్య మరియు నేను కిరాణా కొట్టుకి వెళ్ళుచున్నాము. నేను దీనిపైనే వేలాడనుకోవడము లేదు. దీని కొరకు ఒక భయంకరమైన పేరును కలిగియున్నానని నాకు తెలుసు, కానీ అది తప్పైతే, అది తప్పే. సంగతులు తప్పుగా జరుగుచున్నప్పుడు నీవు సమాధానముగా ఎలా ఉండగలవు? ఈ రోజు సంఘము యొక్క విషయమేమిటి, అది పూర్తిగా ఆడంగిగా మారిపోయినది. దేవుడు ఆడంగివాడు కాదు. దేవుడు దేవుడే.

మన రోడ్డుపై మన చిన్న పట్టణములో, మేము సుమారుగా కనీసము రెండువందల మంది స్త్రీలను దాటుకొని వచ్చితిమని నేను తలంచాను, మరియు వారిలో ఒక్కరు మాత్రమే స్కర్టును ధరించి యున్నారు. మిగతా వారందరూ స్త్రీలు ధరించునట్లుగా చిన్న పాత అనైతిక దుస్తులు ధరించియున్నారు. మరియు నా భార్య నాతో చెప్పినది, ఆమె చెప్పినది, “బిల్లీ, ఆ స్త్రీ తాను దిగంబరినని ఆమె ఎరుగదు అని నీవు నాకు చెప్పాలనుకుంటాన్నావా?” ఇంకా చెప్పెను, “ఒకవేళ ఆమె ఎరుగకుంటే, అప్పుడు ఆమె మతిస్థిమితము కోల్పోయినట్లే; ఆమె పిచ్చిది.” అది నిజము.

మరియు నేను చెప్పాను... నేను చెప్పాను, “హనీ, లేదు, ఆమె కేవలము ఒక ఆమెరికన్ అయియున్నది. ఆమె కేవలము ఆమెరికా ఆచారమును వెంబడించుచున్నది.”

ఆమె (నా భార్య) చెప్పెను, “కానీ చూడుము. అంటే, ఆ స్త్రీలు చేయుచున్నదో ఆమె ఎరుగుదని నీవు నాకు చెప్పదలచావా?...”

నేను చెప్పాను, “లేదు, ఆమెకు తెలియదు. ఆమె కేవలము ఆమెపై ఆమెరికా యొక్క ఆత్మను కలిగియున్నది.” మరియు నేను చెప్పాను, “నేను ఫిన్లాండ్ లో ఉన్నప్పుడు, వారు నన్ను ఒకానొక స్థలమునకు తీసుకొని వెళ్ళారు...” ఒకవేళ ఎవరైనా ఒక ఫిన్లాండ్ దేశస్థుడు ఇక్కడ కూర్చొని ఉంటే, నేను ఈ పదమును సరిగా చెప్పలేకపోవచున్నాను: సాండా. అది ఒక స్నానము, ఒక ఫిన్లాండ్ దేశపు స్నానము. నేను ఆ స్థలమునకు వెళ్లినప్పుడు, అక్కడకు వెళ్ళవద్దు అని పరిశుద్ధాత్మ నాతో చెప్పెను. మరియు అక్కడకు వెళ్లినప్పుడు, అక్కడ పురుషుల యొక్క శరీరములను తోముటకు స్త్రీలను వారు కలిగియున్నారు. కనుక నేను డాక్టర్ మన్నినెతో చెప్పాను, “అది సరియని నీకు అనిపించుచున్నదా?” అని నేను అడిగాను.

అతడు చెప్పాడు, “మీ యొక్క అమెరికన్ వైద్యులు ఒక స్త్రీని బల్లపై పరుండబెట్టి మరియు వారిని వస్త్రహీనులుగా చేసి మరియు వారిని పరీక్షించుట ఎంత సరైనదో, అది అంతే సరైనది.” కనుక మీరు చూడండి, “ఆడబాతుకు ఏదైతే ఆహారమో, మగబతుకు కూడా అదే ఆహారము.” చూశారా? కుండ పాత్రను నీవు నల్లదానవు అని పిలువలేదు.

మరియు ఆ తరువాత నీవు ఫ్రాన్స్ కు వెళ్లినప్పుడు, అక్కడ - పురుషులు, స్త్రీలందరూ ఒకే మూత్రశాలను ఉపయోగించెదరు. నీవు ఆఫ్రికాలోనికి వెళ్ళినప్పుడు, అడవి లోపలికి చీకటి భాగములోనికి వెళ్ళినప్పుడు, వారు - వారు ఎటువంటి వస్త్రములను ధరించరు. కానీ ఇక్కడే ఏమిటి: అది దేశము యొక్క సంప్రదాయము. ఆమె చెప్పెను, “మరి మనము అమెరికన్లము కాదా?”

నేను చెప్పాను, “లేదు, ఏలయనగా మనము వేరొక దేశము నుండి వచ్చియున్నాము. ఇక్కడ మనము యాత్రికులము మరియు పరదేశులమై యున్నాము. రాబోవుచున్న ఒక్క పట్టణము కొరకు మనము ఎదురుచూచుచున్నాము. నేను చెప్పాను, ”మనము జన్మించియున్నాము కనుక.... మన ఆత్మ వేరొక దేశము, పరలోకము నుండి వచ్చియున్నది. అక్కడ పరిశుద్దత, మరియు దేవుడు, మరియు నీతి పరిపాలించును మరియు ఏలును. మరియు మనము యాత్రికులము మరియు పరదేశులమని మనము ఒప్పుకొనుచున్నాము. మనము ఒక పట్టణము కొరకు ఎదురుచూచుచున్నాము, దాని శిల్పి మరియు నిర్మాణికుడు దేవుడే.“

20

మనము ఈ లోక సంగతుల కొరకు ఎదురుచూచుట లేదు. మరియు దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు, అది వారిని మార్చివేయును. అది నన్ను బలపరచును. నీలోపల ఉన్న జీవము నిన్ను బలపరచును. మరియు ఈ రోజు లోకము యొక్క సంగతి ఏమిటి, అది చాలా లోకానుసారముగా తయారైనది. మనకు మానవునిలో హృదయములో పరిశుద్ధాత్మ అవసరమై యున్నది. దానిని చేయుటకు అది క్రొత్త-జన్మను తీసుకొనును. ఆ వ్యక్తిని మార్చివేసి, అతడిని, లేక ఆమెను ఒక నూతన సృష్టిగా మార్చివేయును.

ఆఫ్రికా చిట్టడవులలో, వారు ఈ లోకమునకు వచ్చినప్పుడు దిగంబరిగా నిలబడుటను నేను అక్కడ చూచాను, మరియు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారిపైకి వచ్చినప్పుడు, వారి యొక్క దిగంబరత్వమును కప్పుటకు, వారు చేతులు కట్టుకొని మరియు వస్త్రములు కనుగొనేంత వరకూ నడిచిపోయిరి. మరియు మనలను వారు నాగరికులు అని పిలిచెదరు, మరియు ప్రతీ సంవత్సరము మనము ఇంకా ఎక్కువగా బట్టలను తీసివేయుచూ, పరిశుద్ధాత్మను కలిగియున్నామని చెప్పుకొనుచున్నాము. పరిశుద్ధాత్మ ఒకరిపై ఒక రకముగా, మరొకరిపై మరొక రకముగా పనిచేయదు.

అయితే నన్ను చెప్పనివ్వండి, అది అమెరికా అయినా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, అది ఎక్కడైనా - ఒక పురుషుడు లేక స్త్రీ దేవుని యొక్క రాజ్యము ద్వారా తిరిగి-జన్మిస్తే, అతడు నూతన సృష్టిగా మారి మరియు లోక సంగతులను ఆపివేయును. అవి అతడికి చనిపోవును; ఏలయనగా అతడు చనిపోయెను మరియు అతడి యొక్క జీవము క్రీస్తు ద్వారా దేవునిలో దాచిపెట్టబడెను, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడెను. ఈ రోజు మనకు ఒక ఉజ్జీవము, ఒక కదలిక, ఒక పాత తరహా పెంతెకొస్తు ఉజ్జీవము అవసరమై ఉన్నది. ఇటువంటి పెద్ద శవాల గదిలో జీవిస్తూ మన ద్వారా దేవుని యొక్క ఆత్మ దుఃఖపడుటకు బదులుగా, ఒక తంబూరను తీసుకొని మూలకుపోయి, తంబూరాలను వాయించుచూ ఉండుట చాలా శ్రేష్టమైయున్నది. దెయ్యము దొంగిలించుటకు మరియు ఎత్తుకొనిపోవుటకు వచ్చును. అది ఎలా చేయవలయునో దానిని మాత్రమే వాడు ఎరిగియుండెను.

21

రాజులు... ఇశ్రాయేలు, వారు మొదట తాము వెనుకకు జారుటకును ప్రారంభించినప్పుడు, అలా జారులాగున చేసినదేమిటి? వారు ఐగుప్త నుండి బయటకు వచ్చినప్పుడు, వారు పరలోకపు రాజు ద్వారా నడిపించడిరి. దేవుడే వారి రాజు. అది వారి శక్తి యొక్క రహస్యము. దేవుడే వారి రాజు గనుక, అదే వారి యొక్క విజయ రహస్యము. కానీ వారు స్థిరపడిన తరువాత వారు ఏమి చేసిరి? అదే పెంతెకొస్తు సంఘము యొక్క మాదరి.

చాలా సంవత్సరాలు క్రితము, దేవుడే రాజుగా ఉన్నప్పుడు, మనము కూడికకు వచ్చి మరియు దేవుని యొక్క శక్తి కుమ్మరింపబడినప్పుడు, మనము కేకలు వేశాము, మనము చుట్టూ ఎగిరాము, మనకు ఎటువంటి సిగ్గూలేదు. కానీ మనము మెథడిస్టులు ఏ విధముగా చేస్తున్నారో, మరియు బాప్టిస్టులు ఏ విదముగా చేస్తున్నారో, ప్రిస్బిటేరియన్లు, ఏ విధముగా చేస్తున్నారో గమనించుట ప్రారంభించాము. మనము మెథడిస్టులు, బాప్టిస్టులు, లేక ప్రెస్బిటేరియన్లు కాదు; మనము దేవుని ఆత్మ ద్వారా జన్మించిన పెంతెకొస్తువారమై యున్నాము. అటువంటి సంగతి దేనితోను మనలను మనము బంధించుకొనేవారము కాదు.

కానీ లోకము నీ రహస్యము ఎక్కడున్నదో కనుగొనుట ప్రారంభించినది. ఆ శక్తిని చేయునది ఏమిటి? ఈ వ్యక్తులు ఏమి చేయుచున్నారు? అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి చెప్పుటకు ప్రయత్నించుచూ మరియు వారు కనుగొనుచున్నారు; “దైవిక స్వస్థత అనునటువంటిది ఏమియూ లేదు. మరియు ఇక్కడున్నదంతా అరుస్తూ మరియు ప్రభువును ఘనపరచడము, మరియు ఈ సూచనలు మరియు ఆశ్చర్య కార్యములు సరి కాదు.” మరియు అది ఎందుకనగా వారు దేవునిని ఎరుగరు. వారు ఎన్నడూ తిరిగి-జన్మించలేదు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది - ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరము ఒకేరీతిగా ఉన్నాడు, మరియు ఆయన శక్తి కూడా అదేరీతిగా ఉన్నది. దానిని గూర్చి నాకు చెప్పుటకు వారు చాలా ఆలస్యమయ్యారు; నేను దానిని అనుభవించాను, మరియు నేను ఏమి మాట్లాడుచున్నానో నేను ఎరిగియున్నాను. ఆయన ఇంకనూ దేవుడే మరియు ఆయన ఎల్లప్పుడూ దేవునిగానే ఉండును, మరియు ఆయన పెంతెకొస్తు దినాన్న ఉన్న రీతిగానే ఆయన ఈ రాత్రి ఈ భవనములో ఖచ్చితముగా అదే రీతిగా ఉన్నాడు. మనము అవే ఆశీర్వాదములు, అదే సంగతిని కలిగియున్నాము. ఒకవేళ ఆయన ప్రజలను అదే స్థితికి తీసుకొని వచ్చినయెడల, అదే సంగతి ప్రతీసారి పనిచేయును.

22

అది వాతావరణము; అది నీ వాతావరణము. నీవు ఒక గుడ్డును తీసుకొని మరియు దానిని ఒక పొదుగు యంత్రము క్రింద పెట్టెదవు. అది కూడ అదే రీతిగా కోడిపిల్లను ఉత్పత్తి చేయును. ఎందుకు? ఎందుకనగా ఆ గుడ్డును పొదిగేలా చేసేది ఆ వాతావరణమే. అది ఖచ్చితముగా. ఒకవేళ ఒక బాప్టిస్టు, లేక పిస్బిటేరియను, కాథలిక్కు లూధరన్, ఆ జీవపు జన్యువును గనుక తీసుకొన్నట్లయితే, ఆ దేవుని యొక్క వాక్యమును వారి హృదయములోనికి తీసుకొని, సరైన వాతావరణములోనికి తీసుకొని సరైన వాతావారణము లోనికి... కాని సంఘము ఏమి చెప్పుచున్నదో వారు పట్టించుకొనరు. లోకము ఏమి చెప్పుచున్నదో వారు పట్టించుకొనరు. వారు ఆ సంగతి జీవములోనికి రావలెనని కోరెదరు. దేవుని ఖచ్చితముగా బయటకు లాగి పెంతెకొస్తు దినాన్న ఆయన చేసినట్లుగా, ఆ వ్యక్తిపై ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరించును, ఎందుకనగా ఆయన దేవుడు. కానీ మనలను మనము సంస్థగా చేసుకొనుట ద్వారా, మరియు ఒకరి నుండి మరొకడు త్రోసివేసుకొనుటను ద్వారా, మరియు శక్తిని నిరాకరించుట ద్వారా, మరియు అటువంటి వాటి ద్వారా మనము చేయలేము. మనము ఎన్నడూ దానిని చేయలేము.

ఆ కారణము చేతనే ఇక్కడ ఈ క్రైస్తవ వ్యాపారస్తులను నేను ఇష్టపడెదను. ఇంకనూ ఆత్మను కలిగియున్న ఒక స్థలమునకు నీవు వచ్చెదవు. ఇప్పుడు, నేను - నేను... వారు స్వేచ్ఛాపరులు. చెప్పుకోవాలంటే ఒకరి ఎంగిలిని ఒకరు తినేంత వారుగా వారందరూ కలిసిపోయిరి. వారు పరిపూర్ణముగా ఒక సహవాసము. వారు పరిపూర్ణముగా ఒకరినొకరు ప్రేమిస్తూ, మరియు వారు దేవున్ని ప్రేమించెదరు, మరియు వారు లోక సంగతులను లేక పోకడలను గూర్చి పట్టించుకొనరు. ఈ రోజు మనకు అవసరమైనది ఏమనగా, అందరూ కలిసి వచ్చుట (ఏకత్వము). దూరముగా పొండి; నీ నుండి దెయ్యము ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని దొంగిలించనియ్యకము. మనకు అవసరమైన సంగతి అదే. సంఘమునకు జీవము అదే. దానిని తీసివేస్తే మరియు నీవు లాడ్జిని (బసచేసే గృహము) కలిగియున్నట్లే. మనకు ఒక లాడ్జి అవసరము లేదు. అది ఒక లాడ్జి కావాలనుకొనే ప్రజలకు. మనకు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన ఒక సంఘము కావలెను. మరియు క్రీస్తే దానికి రాజై యున్నాడు. ఇప్పుడు నేను భక్తిపూర్వకమైన అనుభూతిని కలిగియున్నాను. అవును. ఎందుకనగా... దేవుడు ఒక్కరిని, ఒక్క సంఘమును, తిరిగి-జన్మించిన, నింపబడిన, రక్తముతో కడగబడిన, ఆత్మతో నింపబడిన, దోషములన్నీ తొలగిపోయిన దానిని కలిగియుండును. “కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు, శరీరము ననుసరింపక ఆత్మననుసరించి నడుచకొనువారు.”

23

నీవు క్రీస్తులోనికి ఏలాగు వచ్చెదవు? ఒక్క ఆత్మ ద్వారా ఒక్క శరీరములోనికి మనమందరు బాప్తిస్మము పొందియున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా. అదే రహస్యము. దెయ్యము దానిని పట్టుకొన్నది. ఏ విధముగా లోపలికి వచ్చి మరియు నిన్ను దొంగిలించవలెనో అతడు ఎరిగియున్నాడు - నీలో నుండి దొంగిలించుట - సంస్థగా మారి. నీవు, చెప్పెదవు, “మంచిది, మనము ఆ గుంపునుండి ప్రత్యేకమైనవారము; మనము ఒక మంచి ప్రసంగీకుల గుంపును కలిగియున్నాము.” చిన్న సెమినరీ (బోధకుడు) వైన నీవు, పోషకాల ద్వారా పోషింపబడి, సెమినరీలో జన్మించిన కోడి పెట్ట, నీకు తెలుసా - నీవు ఒక వేయించే పాత్ర కొరకు నడిపించబడుచున్నావని? లోకములో దేనికొరకు నీవు అరచుచున్నావు? చూశారా? ఈ రోజు నీకు అవసరమైనది ఏమిటి, ప్రజలకు క్రీస్తులో నిత్యజవమును ప్రసంగించుటకు ఆ పాత తరహా మంచి పరిశుద్ధాత్మ బాప్తిస్మము కావాలి, ఏలయనగా ఆయన అప్పుడున్న రీతిగానే ఇప్పుడు ఈ రోజు కూడా జీవించుచున్నాడు. ఏమి మంచి అందమైన ఈకలు ఏమి చేయును మరి ఆ జ్ఞానము, ఆ చిన్న కోడిపిల్లలన్నియు ఒకే రీతిగా ఇక్కడ వస్త్రములు ధరించి మరియు అటువంటి సంగతులు, నీవు వేయించే పాత్ర కొరకు నడిపించబడుచున్నావని నీవు గ్రహించుచున్నావా? అది నీకు ఏ మంచి చేయును? నీ జ్ఞానమంతా దేనికొరకు లెక్కించబడును?

ఈ రోజు మనకు అవసరమైనది ఏమనగా, అటువంటి సంగతి నుండి దూరమై మరియు పరిశుద్ధాత్మ యొద్దకు వెనుకకు తిరుగుట; తిరిగి దేవుని యొక్క శక్తి యొద్దకు తిరుగుట; తిరిగి ఆ పాత తరహా కూడికకు తిరుగుట, తిరిగి ఆ సంపూర్ణరాత్రి ప్రార్థనా కూడికల వైపుకు తిరుగుట, మరియు ప్రార్థించుట, మరియు మన స్వచిత్తమునకు మరణమగునంత వరకూ నిలుచుట. అదే మనకు కావలసినది.

దేలీలా, లోకము, పెంతుకొస్తు సంఘము యొక్క రహస్యమును కనుగొన్నది: “ఒకవేళ నేను ఆమెను ఉన్నత తరహా దానిగా చేసి, మరియు ఆమెకు గొప్ప పెద్ద సంఘములను ఇచ్చి మరియు ఆమెకు అందమైన సంప్రాదాయ ప్రసంగీకులను ఇచ్చినట్లయితే, అది ఎక్కువ కాలము ఉండదు, అంతవరకూ నేను ఆమెను బంధించి ఉంచగలను.” మరియు కొంచెము దానిని పట్టుకొన్నది. అది నిజము. వాడు దానిని చేశాడు.

24

ఓ, మై, ఇశ్రాయేలు, వారు స్థిరపడినప్పుడు... వారు కదులుచున్నప్పుడు, అంతయూ సరే. వారు కదులుతూ ఉన్నంత కాలము అంతా సరియే, కాని వారు పాలస్తీనాకు వెళ్ళి మరియు అక్కడ స్థిరపడినప్పుడు, అప్పుడు వారు ఫిలిష్తియుల వలె మరియు అన్య ప్రపంచము వలె ప్రవర్తించుట ప్రారంభించిరి. వారొక రాజును కోరుకొన్నారు. మరియు వారు సౌలును వారియొక్క రాజుగా అంగీకరించిన తరువాత, వారు దేవున్ని తమ రాజుగా త్రోసివేసిరి. మరియు మనము సంఘ శాఖల యొక్క అడ్డుగోడలను, మరియు కరచాలనములు, మరియు పరిశుద్ధాత్మకు బదులుగా అత్యున్నతమైన సంగతులను అంగీకరించినప్పుడు, అవును మనము దేవున్ని మన రాజుగా తృణీకరించుచున్నాము.

ఏమి జరిగినది? అది చివరకు వారిని ఒక ఆహాబు యొద్దకు నడిపించినది, పూర్తిగా వెనుకకు జారునంతగా, మరియు ఆయన వచ్చినప్పుడు వారి యొక్క నిజమైన రాజును గుర్తించుటలో వారు విఫలమయ్యారు. మరియు ఈ రోజు సంఘములు చేసినవి అవే. వారు ఈ ఇతర వేదాంతము, మరియు సిద్ధాంతము, మరియు మానసిక శాస్త్రము, మరియు ఈ ఇతర సంగతులన్నిటిని అంగీకరించిరి, పరిశుద్ధాత్మను పొందుకొనుటకు బదులుగా... మరియు ఇప్పుడు రాజు సంఘము మధ్యన ఉన్నాడు. మరియు వారు దానిని ఎరుగరు. వారు దానిని తిరస్కరించిరి, అక్కడ యేసును వారు తిరస్కరించినంత ఖచ్చితముగా, ఈ రోజు సంఘము ఆయనను తిరస్కరించుచున్నది. ఎందుకు? ఎందుకనగా వారు ఒక భూసంబంధమైన రాజును అంగీకరించిరి.

25

దేవున్ని ఎరిగి సంఘములను కాయు కాపరులకు బదులుగా మీరు చదువుకొన్న ప్రంగీకులను అంగీకరించుచున్నారు. తనకు కలిగియున్న చదువంతటితో క్రీస్తును ఎరుగకుండిన వాని కన్ననూ - ఒకవేళ అతడు క్రీస్తును ఎరిగి, తనకు అ,ఆలు కూడా రాని ప్రసంగీకుని యొద్దకే నేను నా కుటుంబమంతటిని పంపించెదను. దానిని పొందుకొనుటకు వారు పాఠశాలకు వెళ్ళేదరు. కానీ సంఘము అనునది ఒక విద్యా కారక్రమములో లేదు; అది పరిశుద్ధాత్మ యొక్క శక్తి మరియు ప్రదర్శనలో ఉన్నది. ఈ రాత్రి సంఘమునకు అవసరమైనది అదే. అది సరియే. ఆ సంగతుల నుండి దూరమవ్వుము.

కానీ, ఓ, దెలిలా, నీకు తెలుసా ఆ మొదటి సంగతి... సమ్సోను ఆ మొదటిగా ఆగకూడదు. దెలీలా తన కళ్ళతో అతడిని చూసి సరసమాడినప్పుడు అతడు తన తలను త్రిప్పుకొని మరియు ముందుకు కొనసాగియుండవలెను. హవ్వ ఒక్క క్షణము ఆగినది మరియు ఆమె ఇబ్బందులలో పడినది. సమ్సోను ఒక్క క్షణము ఆగియున్నాడు మరియు ఇబ్బందిలో పడ్డాడు. మరియు లోకము సంఘమునకు గాని లేక వ్యక్తిగతముగా గానీ ఏదైనా పరిచయము చేసినప్పుడు, ఆగవద్దు; కొనసాగుతూ ఉండుండి. అదే ఈ రాత్రి సంఘమునకు అవసరము, ఈ జ్ఞానమునకు, ఉన్నతమైన గర్వము (హోదా) లకు ఆగిపోక, పరిశుద్ధాత్మలో కొనసాగుతూ ఉండుము. ముందుకు కొనసాగుతూ ఉండుము, కొనసాగుము.

26

మనము చెప్పినప్పుడు, “మంచిది, ఇప్పుడు, మన శాఖా సంస్థయే పెద్దది,” దానితో చేయునది ఏమియూ లేదు. “ఓ, మా సంఘమునకు పట్టణ మేయరు వచ్చుచున్నాడు.” అది కూడా దానితో చేయుటకు ఏమీ లేదు, ఎవ్వరు వచ్చినా గానీ. సంగతి ఏమనగా, క్రీస్తు రావలెను; ఆయనే సంఘములో ఉండాలని మనము కోరుకొనెదము. అది ఒక పొలములో సువార్త అయినా లేక అది ఒక రాజభవనమైనా, క్రీస్తు ఎక్కడ ఉంటె అదే ఆ సంఘమునకు గృహము, ప్రజలకు గృహము.

కానీ దెలీలా ఆమె కొంచెము నిజమైన యుక్తిని ప్రదర్శించవలసి యున్నది, ఎందుకనగా ఆమె సమ్సోనును ఆపవలెను. అతడు దేవుని యొక్క శక్తిమంతుడు మరియు అతడు రహస్యమైన శక్తిని గలవాడని ఆమె ఎరిగియున్నది. ఇప్పుడు, ఆమె అతడిని ఆపుటకు ఆమె అన్ని రకముల ప్రయత్నముల ద్వారా ప్రయత్నించినది. మంచిది, అదే లోకము సంఘమునకు చేసినది. అది అన్ని రకముల యుక్తులను ప్రయత్నించినది. మీరు దీనిని చేయగలరు, లేక మీరు ఇక్కడ శ్రేష్ఠమైన వారుగా ఉండొచ్చు. మీరు దీనిని చేయవచ్చు, దానిని, మరియు అటువంటివి, మరియు సంఘము దాదాపుగా చనిపోయే స్థితికి వచ్చినది.

మనము కలిగియుండవలసిన కూడికల వంటివి కలిగిలేము. ప్రజలు ఈ రోజు మాట్లాడుచూ ఉన్నారు. బిల్లీ గ్రహం మరియు సహోదరుడు ఓరల్ రాబర్ట్స్, నేను మేమందరము, మేము మా దినములలో ఉజ్జీవమును గూర్చి మాట్లాడుటకు ప్రయత్నించుచున్నాము. సంఘము లోకముతో బంధింపబడి యున్నంత కాలము మేము ఏ విధముగా ఉజ్జీవమును కలిగియుండగలము? సమ్సోను బంధింపబడియున్నప్పుడు మీరు దానిని ఎలా చేయగలరు? రహస్యము తెలియపరచ్చబడినది మరియు దేవుడు అతని శక్తిని తీసివేసియున్నాడు. ఇకలేదు... ప్రజలకు అది ఒక స్థలమునకు రావలసియున్నది... ఈ పొదుగు యంత్రపు ప్రసంగీకులు ఒక స్థలమునకు రావలసియున్నది, మనము కూడా నిటారు మెడలు కలిగియున్నంతగా (మెడ వంచని) నిజాయితీ కలిగిన ప్రజలు కొంతమంది ప్రార్థన ద్వారా విజయము పొందే మంచి పాత పరిశుద్ధులను చూసి అపహాస్యము చేయుచున్నారు; కేకలు వేయుట విన్నప్పుడు; లేక భాషలతో మాట్లాడుట చూచినప్పుడు; లేక — లేక పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కొంత ప్రదర్శింపబడుట, మరియు పిదప, క్రైస్తవులు అని పిలుచుకొనుచున్న ప్రజలు, ఆ ప్రజలను చూసి అపహాస్యము చేయుచున్నారు. ఏమిటి సంగతి? అది... అక్కడ జరిగిన కార్యము ఏమనగా, శక్తి అంతా గొరిగివేయబడినది.

27

లూథరన్ల కాలములో అదే జరిగియున్నది. లూథర్ సరైనవాడే, కాని వారు అక్కడ ఒక క్రొత్త పాఠశాలను కలిగియున్నారు. లూథరు మాట్లాడిన దానిని ఆ సంగతులన్నీ తీసివేయుట ప్రారంభించినది. చూశారా? గొరిగివేసినది... వెస్లీ దినములలో కూడా అదే సంగతి: దైవిక స్వస్థతను కలిగియున్నారు, మరియు వేర్వేరు అద్భుత కార్యములు, మరియు అటువంటివి; శుద్దీకరణను ప్రసంగించెను. కానీ కొత్త గుంపులు వచ్చినప్పుడు, అవన్నీ గొరిగివేయుట ప్రారంభమయ్యెను (చూశారా?), జడలను కనుగొన్నారు. మరియు ఈ చివర దినములలో పెంతెకొస్తు సంఘములో ఉన్న పరిశుద్ధాత్మ సంగతి కూడా అదియే, అది జడలను గొరిగివేయడం ప్రారంభించెను. రహస్యము: స్థలము కనుగొన్నది, ప్రార్థనా కూడికలను ఆపివేసెను. నేను ఒక పెంతెకొస్తు సంఘమును ఎరుగుదును (నేను ఇక్కడ ఉన్నప్పటి నుండి, కొంచెము దానికి సంబంధించిన వారితో మాట్లాడుచున్నాను.), ఒక టెలివిజను కార్యక్రమము చూచుట కొరకు బుధవారము రాత్రి పదిహేను నిముషముల ముందు ఆ పెంతెకొస్తు సంఘము వారిని విడిచిపెట్టుచుండెను. ఒక టెలివిజను కార్యక్రమము చూచుట కొరకు వారినందరినీ క్రింది అంతస్తులోనికి తీసికొని వెళ్ళుచున్నారు.

28

గత దినమున ఒక సేవకుడు నాకు చెప్పుచున్నాడు, అతడు సాయంత్రపు భోజనమును తినుటకు ఒక వ్యక్తితో వెళ్ళెను, మరియు వారు ఆ భోజనమును సిద్దపరచుచుండగా, ఈ సేవకుని యొక్క భార్య వెళ్ళి, వారికి భోజనమును సిద్ధపరచుటకు ముందు, “వి లవ్ సుసీ” అనే టి.వి. కార్యక్రమమును (లేక అటువంటిది) చూచుటకు వెళ్ళెను.

సహోదరుడా, నేను చెప్పుచున్నాను అది వచ్చినప్పుడు, అది గృహ జీవితమును చూపించుచున్నది... బాల నేరస్తులను మనము కలిగియుండుటలో ఆశ్చర్యము లేదు. రహస్యము కనుగొనబడుటలో ఆశ్చర్యమేమియూ లేదు. అది ప్రజలలో నుండి పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము తీసివేయబడినది, వారు దేవుని యొద్దకు తిరిగి వచ్చుటకు బదులుగా - వారు లోక సంగతుల కొరకు వెళ్ళిపోవుచున్నారు. ఆగుము. చూడుము, వినుము. ప్రభువు యొక్క రాకడ దగ్గరలో ఉన్నది. మన యొక్క జ్ఞానము ఏ మంచి చేయును? మన యొక్క పెద్ద పెద్ద భవనములు మనకు ఏ మంచి చేయును? మనయొక్క జ్ఞాన సంబంధమైన మాటలు ఏమి చేయును? అది...

ఆ దినమున యేసుక్రీస్తు యొక్క రక్తము తప్ప ఏదీ నిలువదు, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము ద్వారా ఆయన రక్తములో కడగబడి మరియు ఆయన యొక్క నీతి వస్త్రము కప్పుకొన్నది మాత్రమే (నిలుచును). సంఘము దానిని కోల్పోయినప్పుడు, అది గతించును. మరియు అది ఊపిరాడని స్థితికి వెళ్ళుట నీవు చూచెదవు, సణుగుకొనుచూ, మాట్లాడుతూ.... పరిశుద్ధాత్మ మనయొక్క సిద్ధాంతముల ద్వారా మరియు మన సంస్థల ద్వారా, మరియు మన లోక పోకడలతో దుఃఖపడును. అవన్నియూ దేవుని దృష్టిలో అసహ్యములని మీకు తెలుసా? ఒక మంచి కడుగబడిన శుభ్రము చేయబడిన సంఘము, ఒక నిజమైన సూటిగా ఉన్న, వందశాతము దేవుని కొరకు ఉన్న, ఎటువంటి సిగ్గులేకుండా, ఎటువంటి వెనుకకు జారుట లేకుండా ఉన్న సంఘము మనకు అవసరమైయున్నది. లోకము ఏమి చెప్పినను మనము పట్టించుకొనము: మనము దేవున్ని కలిగియున్నాము, మరియు మనము శ్రద్ధ వహించునదంతయూ ఆయన కొరకూ, మరియు ఆయన మన హృదయములో ఉన్నాడు, మరియు ఆత్మతోను మరియు సత్యముతోను మనము ఆయనను ఆరాధించెదము. ఆయన సంఘములో దేవుడు కోరుకొనునది అదియే.

29

దైలీలా అతడికి ఒక సంగతి చూపించుటలో, మరియు మరొక సంగతి, మరియు మరొక సంగతి చూపించుటలో చాలా కఠినమైన సమయమును కలిగియున్నది, చివరికి అతడు ఆమె వలలో పడెను. మరియు సంఘము లోక సంగతుల కొరకు పడిపోయెను. మరియు మొదటి సంగతి మీకు తెలుసా, అది ఒక స్థలమునకు పడిపోయెను. అక్కడ దైవిక స్వస్థత సంఘమును విడిచిపెట్టి వెళ్ళిపోయెను.

నేను కూడికలకు వెళ్ళుదను, మరియు ప్రభువు, ఆయన యొక్క పునరుత్థానము యొక్క రుజువు మరియు ఆత్మ యొక్క వివేచన అను చిన్న వరమును నాకు ఇచ్చుట ద్వారా... మరియు ఆ సంగతులు జరుగును, మరియు పెంతెకొస్తు వారు “ఆహ్, అది అంతయూ సరేనని నేను ఊహించుచున్నాను...” అని కూర్చొని మరియు చెప్పుటను నేను విన్నాను. పరిశుద్ధాత్మ యొక్క శక్తి అంతగా కదులుతూ ఉన్న ఒక తిరిగి-జన్మించిన క్రైస్తవుడు, లోక సంగతులతో మృతమై అంతగా కూర్చొని ఉండుటను నీవు ఊహించగలవా?

దేవునితో సరియగుటకు పాపులు బలిపీఠము యొద్దకు వచ్చుట ప్రారంభించెదరు, మరియు క్రైస్తవులు అక్కడ కూర్చొని నమిలే గమ్ను నములుచూ, వారువైపు చూచెదరు. అదియే నిజము. బాప్టిస్టు సంఘములో, అది అలాగు ఉన్నప్పుడు, నేను అక్కడున్న పాత కెంటకీ బాప్టిస్ట్ నుండే వచ్చియున్నాను. ఎందుకు, ఒక పాత పాపపు బాలుడు బలిపీఠము యొద్దకు ప్రారంభమగును, అతడి మెడచుట్టూ ప్రతీ తల్లీ ఉండును. అతడు బలిపీఠము యొద్దకు వెళ్ళక మునుపు వారిగుండా రావలసియున్నది. ఏమిటి సంగతి? వారు రహస్యమును గొరిగివేసిరి: వారు ప్రార్థనా జీవితము నుండి దూరమయ్యారు; వారు పరిశుద్ధాత్మ నుండి దూరమయ్యారు.

30

కూస్తున్న కోడిపెట్టలు, చదువుకున్న కానరీ పక్షులు, కానరీ పక్షి మెదడుతో, దేవుని యొక్క అనుకూల మరియు ప్రతికూలతలను నీకు వివరించుటకు ప్రయత్నించును. నీవు ఆ మారములో దేవున్ని ఎరుగలేవు. నీవు తిరిగి-జన్మించినప్పుడు మాత్రమే ఆయనను ఎరిగియుందువు. ఆ ఒక్క రీతిగా మాత్రమే నీవు నిత్యముగా ఆయనను ఎరిగియుండగలవు. దేవుడు ఇంకనూ దేవుడే. ఆయన ఎప్పుడూ ఉన్న రీతిగానే, ఈ రోజుకు కూడా ఆయన దేవుడైయున్నాడు. ఆయన పర్వతముపై ఏలియాతో ఉన్న అదే దేవుడు. ఆయన సింహపు బోనులో దానియేలుతో ఉన్న అదే దేవుడు. ఆయన ఇంకనూ... ఆయన పెంతెకొస్తు దేవుడు. ఆయన సంఘములో ఉన్న దేవుడు.

కనుక, ఈ రాత్రి మన యొక్క హోదాలన్నిటి నుండి మరియు లోకపు పోకడల నుండి దూరమై, తిరిగి, దేవుని యొద్దకు తిరిగి వచ్చుటే మనకు అవసరమైయున్నది. పరిశుద్ధాత్మ యొద్దకు తిరిగి రమ్ము. గతరాత్రి ఇక్కడ మీరు కలిగియున్నటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థనల యొద్దకు తిరిగి రమ్ము.

31

ఈ మలుపుపు నాకు తెలుసు; అది కష్టము. ఇవి చేయుటకు ఇష్టపడను. మీరు - ప్రజలైన మీరు... పెంతెకొస్తు డాలర్లు నా పిల్లలను పోషించును. పెంతుకొస్తు డాలర్లు అన్యులకు ప్రసంగించుటకు నన్ను ప్రపంచము చుట్టూ త్రిప్పును. నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను, కానీ ఆ కారణము చేతనే నేను మిమ్ములను తిట్టియున్నాను మరియు నేను చేసిన విధముగా కొనసాగాను. లోకము లోపలికి రావడము నేను చూశాను, నేను రోషము కలిగియున్నాను. ఒకవేళ నా భార్య వేరేవానితో సరసమాడుట నేను చూచినప్పుడు, వెంటనే నేను ఆమెను సరియేయుటను మీరు చూచెదరు. మరియు అది నిజము. అది ఎందుకనగా, నేను ఆమెను ప్రేమించుచున్నాను. మరియు సంఘము లోకములో సరసమాడుటకు నేను చూచినప్పుడు, అది నాలో నుండి దేనినో రేపును; నేను నిశ్శబ్దముగా కూర్చొనలేను; నేను ఏదో ఒకటి చెప్పవలసియున్నది. మీరు నన్ను ఏ విధముగానైన పిలువవచ్చు, నేను దానిని బయటకు త్రోసివేయవలసినదే. నేను సంఘము నందు రోషము కలిగియున్నాను; అది లోకముతో సంబంధము కలిగియుండుటను నేను కోరుకొనను. దేవా, ఆమె ఎన్నడూ లోకముతో సాంగత్యము కలిగియుండకుండునట్లు ఆమెను ఆపుము. టిన్ పాన్-ఆలీలో (ఒక ప్రాంతము) ఆమె స్వేచ్చగా ఆరాధించవలెనన్నచో ఆమెను స్వేచ్ఛగా ఉండనిమ్ము. ఆమె ఆత్మలో స్వేచ్ఛగా ఉన్నంత కాలము, ఆమెను ఒంటరిగా ఉండనిమ్ము.

ఆమెకు సెమినరీలు ఏమి అవసరము లేదు, మరియు సమాధుల దొడ్లు లేక దానితో వచ్చునవన్నీ, ఆమెకు కావలసినదల్లా పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము మరియు తిరిగి నింపుదల. దావీదు చెప్పెను, “నా రక్షణను పునరుద్ధరించుము, నా రక్షణానందమును తిరిగి నాకు అనుగ్రహించుము. సంఘము దానిని కోల్పోవుచున్నది. మరియు అది చాలా విచారకరము, కాని వారు ఏ విధముగానైనా దానినే చేయుచున్నారు. మరియు దేవుని యొక్క శక్తి ఇక ఎంత మాత్రమును సంఘమును కదిలించదు; అది వారికి చాలా మామూలుగా మారిపోయినది. వారు చుట్టూ వెళ్ళి చెప్పెదరు, ”మంచిది, అది చాలా బాగున్నది, ఊ-హ్.“ అలా వెళ్ళుదురు. మై, పశ్చాత్తాపము కొరకు అది మనలను మోకాళ్ళ పైకి నడిపించవలసియున్నది. అది కన్నీళ్ళను తీసుకొని రావలసియున్నది. అది రక్షణను లేక ఆత్మలను జయించుటకు తీసుకురావలసియున్నది. అది తప్పక... ప్రభువు యొక్క రాకడ మనలను మరింతగా ముందుకు తీసుకొని వెళ్ళి మరియు మనము ప్రతీ వీధి మూలలోను ఉండి, ఎవరికైనా చెప్పుటకు ప్రయత్నించవలెను. దాని కొరకు ఏదైనా చేయుము. తరువాత అది చేయుటకు చాలా ఆలస్యమైపోవును.

32

మనము ఒక నిరీక్షణను కలిగియున్నాము, అప్పుడు... నేను ముగిస్తున్నాను, ఇది చెప్పి: మనము ఒక నిరీక్షణను కలిగియున్నాము. వారు సమ్సోనును బంధించినప్పుడు, అక్కడ కొత్త జడలు ఎదగడం ప్రారంభించెను. నేను దేవునికి ప్రార్థిస్తున్నాను, ఆయన ఇక్కడే ఎక్కడో వాటిని ఎదగనిచ్చును, ఆ ఫిలిష్తియులను అంతకు ముందెన్నడూ కదల్చబడని రీతిగా అది వారిని కదుల్చును. దేవుడు దానిని కలిగియుండునని నేను నమ్ముచున్నాను. ఒకవేళ సంఘములను తీసుకొని ఆయన దానిని చేయనిచో, ఆయన క్రైస్తవ వ్యాపారులను తీసుకొని ఆయన చేయును. ఆయన మరేదో చేయును. కానీ ఒక శక్తి యొక్క విభ్రాంతి ఉండును, పరిశుద్ధాత్మ యొక్క రహస్య శక్తి తిరిగి ఎదిగినది, అన్నిటికంటే ఖచ్చితముగా మరియు చివరి దినములలో అది తన పనిని తాను చేయును. ప్రభువా, అది బయటకు వచ్చునప్పుడు మేమందరము ఆ శక్తితో లెక్కించబడుటను మాకు అనుగ్రహించుము. మనము ప్రార్థించెదము.

33

ప్రార్థించెడి ముందు, మీ శిరస్సులు వంచి యుండగా, మీ సహోదరుడుగా నేను ఈ ప్రశ్నను మిమ్ములను అడుగాలనుకొనుచున్నాను, మిమ్ములను ప్రేమించువానిగా, కేవలము ఈ విషయములను చెప్పెదను, మిమ్ములను భుజముపై తట్టుట కాదు, కానీ మీరు దేవునితో సరియగుదురు అని. మీలో ఎంతమంది అంతకముందు మీరున్న ఆ అనుభవమును కలిగియుయుండాలని అనుకుంటున్నారు, ఆత్మలో తిరిగి నింపుదల, ఇలా చెబుదాము, “సహో. బ్రెన్హాం, ఇప్పుడే నా గూర్చి ప్రార్థించండి, దేవుడు నా బలమును పునరుద్దరించును గాక?” దేవుడు మిమ్ములను దీవించును. మీ చేతులను చూడండి, ప్రతీచోటా. “దేవా, నా బలమును పునరుద్ధరించుము.” ఓ, ఎంత ఆశ్చర్యము. “నన్ను తిరిగి కల్వరి యొద్దకు తీసుకొని వెళ్ళుము. ఈ లోక సంగతులన్నిటినీ నేను విడిచి పెట్టెదను గాక. నేను సమస్తమును విడిచి మరియు నిన్ను హత్తుకొందును గాక.”

“ఒక్కడు సమస్తమును విడిచిపెట్టకుండా మరియు తన సిలువనెత్తుకొని ప్రతీదినము... అది త్యాగపూరితమైన నడక. అది ఈ లోకానుసరాముగా నీవు నడిచెడి నడక కాదు. క్రీస్తే నీకు మాదిరి. ప్రతీదినము మృతిచెంది మరియు యేసుతో నడువుము. ఓ, నా ప్రశస్త స్నేహితుడా, ఆయన దానిని మీకు అనుగ్రహించును గాక.

34

ఓ.. ఇప్పుడు మీరు మీ తలలు వంచినప్పుడు, మీరు ఏమి కోరుకుందురో వాటిని మీ మనస్సులో పెట్టుకొనండి. “దేవా, నన్ను తిరిగి తీసుకొనుము. అది ఎంత వెల అయినప్పటికీ నేను పట్టించుకొనను. అది ఏమైనప్పటికీ నేను పట్టించుకొనను. నేను, ఇక ఎంత మాత్రము, లోకముతో సరసమాడను. నేను వాస్తవముగా ఉండగోరుచున్నాను,” అని చెప్పుము. సంఘము ఒక వేళ అది దేవునితో వెళ్ళవలసిన రీతిగా వెళ్ళినచో, మన మధ్యలో ఎటువంటి అలజడులు మరియు బాధలు ఉండవు. మనము మన పాములను ఒప్పుకొనవలెను. మనము చేయవలసి... “మన పాపములు” మీరు చెప్పెదరు, “మంచిది, నేను ఏ తప్పిదమును చేయను. నేను త్రాగను. నేను...” అది కాదు; కొన్నిసార్లు, అది తిరస్కరణ. అది దేవునితో ముందుకు కదులుట కాదు. అది పరిశుద్ధాత్మతో క్రియ చేయుట కాదు. అది దేవుడు నీకిచ్చిన దానికి నీరు పెట్టుట కాదు. నీవు దానిని దుఃఖపరచుచున్నావు.

ఒక స్త్రీ గతరాత్రి నా యొద్దకు వచ్చి మరియు ఆమె నాకు చెప్పెను; “సహో. బ్రెన్హాం, నేను చాలా నీరసముగా ఉన్నాను,” ఆమె చెప్పినది, “నాకు శక్తి లేదు, ప్రార్థన ఇక లేదు. నేను - నా ప్రార్థనా జీవితము నా నుండి వెళ్ళిపోయినది,” అని ఆమె అన్నది. “మరియు నేను వృద్ధురాలనై పోవుచున్నాను, మరియు నేను ఈ విధముగా వెళ్ళిపోవాలనుకోవడము లేదు,” అని చెప్పినది. చూశారా? ఆ ఆత్మను నీ నుండి దూరపరచుట. ఆయనను ఇప్పుడే నీ యొద్దకు రానిమ్ము,

35

ప్రభువైన యేసు, ఈ గుంపు ప్రజలను నీ యొద్దకు తీసుకొని వస్తున్నాను, కఠినమైనప్పటికి, ప్రభువా వాక్యముతో, రెండంచుల గల ఖడ్గము వలె కోయును, వచ్చుచూ మరియు వెళ్ళుచూ. కానీ, ప్రభువా, అవి ఆ సంగతులే మేము ఎవరిమో మమ్ములను తయారు చేయునవి. అది పరిశుద్ధాత్మే సున్నతి చేయునది, లోకపు చర్మమును కత్తిరించునది, మరియు మాకు నూతన జీవమును ఇచ్చును. అది — అది ఈ జన్మలోనే, ప్రభువా విత్తనము భూమిలో పడియున్నట్లుగా. ఆ విత్తనము చనిపోయి మరియు కుళ్ళిపోయేంత వరకూ... మరియు అది కుళ్ళిపోయినప్పుడు, అప్పుడు కొత్త జీవము బయటకు వచ్చును. క్రీస్తు కొరకైన జ్ఞానయుక్తమైన ఆలోచనలు కుళ్ళిపోయేంతగా చనిపోవలసియున్నది. క్రొత్త-జన్మ కేవలము చనిపోయినప్పుడు మాత్రమే చచ్చును. మరణము మరియు జీవము కలిసి నడుచును.

మరియు, తండ్రి, మేము గ్రహించుచున్నాము ఆ క్రొత్త గింజ వచ్చినప్పుడు, భూమిలోనికి వెళ్ళు ఆ పసుపు గింజ అది గట్టిపడి మరియు జీవము కోల్పోయి మరియు ప్రత్యేకమైనది అది చనిపోయి మరియు అది కుళ్ళిపోయినప్పుడు, పిదప ఒక చిన్న పచ్చన మొలక బయటకు వచ్చును. అది క్రిందకు వెళ్ళిన దానివలె ఉండదు. కానీ అది పైకి వచ్చినప్పుడు, అది మృదువైనదిగా (ఎటుపడితే అటు వంగెడిదిగా) ఉండును. గాలి దానిని విసరును, మరియు అది మృదువైనది. అది ఒక కొత్త జీవమువ; అది విభిన్నమైన రంగు. మరియు ఆ విధముగానే జీవములేని సంఘ సభ్యులు సిలువ కంద పడినప్పుడు, మరియు అతడు తన సొంత జ్ఞానయుక్తమైన ఆలోచనలకు కుళ్లిపోవును. కానీ ఆ స్థితిలో నుండి క్రొత్త జీవము బయటకు వచ్చినప్పుడు, అప్పుడు అది బయటకు వచ్చినప్పుడు అది పూర్తి భిన్నముగా ఉండును. అతడు సజీవుడు; అతడు ఎదుగుచున్నాడు; అతడు వాక్యమునకు మరియు ఆత్మకు అనువైనవానిగా ఉండును. ఎప్పుడైతే ఆత్మ గాలివలె అతడిపైకి వీచినప్పుడు, అతడు ఆత్మానుసారముగా కదులుతూ మరియు అల్లాడును, అంతకు ముందు నిటారుగా మరియు బిరుసుగా ఉండినవాడు కదులును.

36

దేవా, ఈ రాత్రి అనుగ్రహించుము, చేతులెత్తిన ప్రతీ వ్యక్తిలో, పరిశుద్ధాత్మ క్రొత్త జీవమును సృష్టించును గాక. మరియు మేమందరమూ, ప్రభువా, మేము మా స్వచిత్తముకు చనిపోవుచున్నప్పుడు, పెంతుకొస్తు వారమని మేము చెప్పుకొనుచున్నప్పుడు, ఒక పెంతెకొస్తు అనుభవము మాపై కుమ్మరింపబడును గాక. మా సొంత - సొంత ఆలోచనలు చనిపోవును గాక, మరియు పరిశుద్ధాత్మ మమ్మును స్వాధీనపరచుకొని మరియు దేవుడు మమ్ములను ఏ విధముగా ఉండగోరియున్నాడో - ఆ విధముగా చేయును గాక. మాలో సృష్టించుము, ప్రభువా, ఒక కోరిక, ఒక రోషము, ప్రభువా, సువార్త చేయుటకు ఒక రోషము మరియు ప్రసంగించుటకు, మరియు సాక్ష్యమిచ్చుటకు, మరియు పగలు మరియు రాత్రి కొనసాగుటకు ఏదో ఒకటి చేయుట, ఎందుకనగా అది మనం ఊహించిన దానికన్నా ముందే అయియున్నది.

త్వరలోనే, యేసు వచ్చును. మరియు ఒకవేళ ఆయన రాకపోతే, మన జీవితములు త్వరలోనే ముగియును. మరియు నిత్యత్వమంతా, మనము ఇంకా ఎక్కువగా ఎందుకు చేయలేదని ఆలోచించెదము. మనము అక్కడ కూర్చొని ఉన్న ఆ సమయపు గంటలు ఎందుకు ఉపయోగించుకొనలేదు, నింపబడి, మరియు వెళ్ళి, మరియు బద్దకముగా కూర్చొనియున్నాము? ఎందుకు బయటకు వెళ్ళి మరియు దానితో ఏదో ఒకటి చేయలేదు?

దేవా, రాబోయే రాత్రిలో ఈ కూడిక పరిశుద్ధాత్మ ద్వారా కదిలింపబడును గాక. ప్రభువా, అనుగ్రహించుము, ఈ కూడికకు వచ్చిన ప్రతీ వ్యక్తి వారిలో ఏదో జరిగేంత వరకూ ఈ కూడికను విడిచిపెట్టకుందురు గాక. ఈ రెండు లేక మూడు రాత్రుల యొక్క ప్రసంగములు ద్వారా విత్తబడిన విత్తనము, సూచనలు మరియు అద్భుతములు, మరియు దేవుని యొక్క ఆశ్చర్యకార్యముల ద్వారా, మరియు పరిశుద్ధాత్మ యొక్క తాజా బాప్తిస్మము ద్వారా నీరు పెట్టబడును గాక, స్త్రీలు మరియు పురుషులు జీవము యొక్క క్రొత్తదనముతో లేచుదురు గాక. ఎవరైతే నిలకడగా ఉన్నారో, కొత్త ఆశను తీసుకొందుకు గాక, ఆయన తిరిగి వచ్చునట్లుగా క్రీస్తుతో ముందుకు కొనసాగుతూ కార్యములను పూర్తి చేసెదరు గాక. ప్రభువా, దానిని అనుగ్రహించుము, యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...