ఒక సంపూర్ణ విడుదల

ఒక సంపూర్ణ విడుదల

VGR COUNT -105 ఈ ఉదయవేళ ఏమి చెప్పాలో తెలియడం లేదు. సోదరుడు ఈగన్ తో నేను వెనకాల కూర్చొని ఉన్నాను, సోదరుడు నెవిల్ ఏదో చెబుతూ నావైపే చూస్తున్నాడు. “మరియు సోదరుడా, ఈగన్, అతడు నన్ను రమ్మంటున్నాడా?” అని అడిగాను.

“ అవును” అని అతడు చెప్పాడు.

ఆ తర్వాత నేను ఒకటి చెప్పుట కొరకై ఈ ఉదయం ఇక్కడకు వచ్చాను. నేను ఆలోచన చేస్తున్నాను అక్కడున్న గాలి ఫంకా నేను మాట్లాడుతుండగా నా స్వరాన్ని బయటికి లాగివేస్తుంది. అది స్వరాన్ని తీసివేసినట్లుగా అనిపిస్తుంది. ఒక స్త్రీకి ఫోనులో ప్రార్ధన చేయుటకు నేను అక్కడ ఉన్నప్పుడు, నేను ఒక సాక్ష్యమును వినుచున్నాను. ఆ స్థలాన్ని గురించి చెప్పడం మర్చిపోయాడు, డాక్టర్ మోరిసన్ భార్యా వద్ద నుండి. నీ కొరకు చేసేదంతా ప్రార్ధన, అని చెప్పి నా చేతులు ఫోన్ పైన పెట్టాను: ఆ ఫోన్ నెంబర్ ఏదో నాకు తెలియదు, దాని మీద నిరీక్షణ ఉంచి పరిశుద్ధాత్మను ఆ స్త్రీ యొద్దకు వెళ్ళమని అర్థించాను. ఆయన ఏమి విన్నారో, అది విన్నారని అనుకొంటున్నాను. చూశారా? వెంటనే దానిని క్రింద పెట్టేసాను. బహుశా ప్రభువు అలాగని అంగీకరించాడేమో, చూశారా. ఆ విధంగా అది ఉత్తమముగా ఉండి ఉండవచ్చును.

2

ఆ తర్వాత అక్కడే ఉండి సాక్ష్యాలు విన్నాను. ఒకరు చెప్పారు - సహోదరీ రూతుకు మతి-స్థితిమితము లేదని సోదరుడు నెవిల్ చెప్పాడనుకొంటున్నాను. దాని కొరకై మనము దేవుని పై ఆధారపడదాము. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు తన ప్రజలను ఎరుగును. ఆయన వారిని గురించి అంతా ఎరుగును.

3

ఆ వెనుకాల ఉన్నవారు బాగా వినగలుగుతున్నారా? వినబడనట్లైతే ఇక్కడ కొన్ని స్థలాలు ఖాళీగా ఉన్నవి. మీరు ఇష్టపడితే స్థలమును మార్చుకోవచ్చును. “ముఖ్యమైన మైక్ ఇదేనా?” ఇక్కడ పెట్టబడి ఉన్నది ముఖ్యమైన మైకా?“ సరే. కొద్దిగా దగ్గరగా ఉంచి చుద్దాం. ”ఇక్కడ త్రిప్పితే ఎలాగున్నది? కొన్నిసార్లు గొంతు బొంగురుపోతుంది, నెమ్మదిగా ప్రసంగిస్తాను. మీరు బాగా వినగలుగుచున్నారా?

4

ఈ విషయాలన్ని తప్పక మనము ప్రార్ధనలలో జ్ఞాపకము చేసుకోవాలి. అక్కడ మహిమకరంగా జరిగిన కూటాల వివరాలను మనము తెలుసుకోవాలి. సహోదరీ రూక్ కొరకు చూస్తున్నాను, ఆమెకు మాదిరిగా కనిస్తున్న మరొక స్త్రీ వైపు నేను చూస్తున్నాను. నేను ఈమెను గూర్చి మాట్లాడుతున్నానేమో అని అనుకొంటున్నాను. ఆమెలాగే వెనకాల కూర్చున్న ఆమె వైపు నేను చూస్తున్నాను. ఆమె సేయింట్ ఎడ్వర్ట్ ఆసుపత్రిలో ఉన్నది.

5

టెన్నిసిలోని, క్లివ్-లాండ్లో, కాలిఫోర్నియాలో కూడా ఎంతో మహిమకరమైన కూటాలు జరిగాయి. ప్రభువు ఎంతగానో దీవించాడు. ఆయన అనేక విషయాలు అక్కడ జరిగించాడు. అందుకొరకై మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. మంచి సమాచారంతో దేవుని వాత్సల్యతతో సహ స్నేహితులతో కలిసి తిరిగివచ్చినందుకు ఆనందిస్తున్నాను. బైబిలు గ్రంధములో వారు అలా చేసారు.

నెవిల్ సోదరుడు.... లేక, బీలర్ ప్రార్ధనను నేను అభినందిస్తున్నాను. ప్రజల కొరకు ఎంతగానో ప్రార్ధించి వారి కొరకు కనికరాన్ని, సహాయాన్ని అడిగి ప్రార్ధించాను. మనము అలాగే చూచుకొంటూ ఉన్నట్లయితే, అంతా అలాగే సాగిపోతునే ఉంటుంది. అందులో వాస్తవమైన నిజాన్ని నీవు కనుగొంటావు. సోదరుడు నెవిల్, డీకన్లను ఈ వేదిక యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు, సంఘము యొక్క చందా కొరకు దేవుని ఆశీర్వాదాల కొరకు ప్రార్ధించమని వచ్చినప్పుడు, ఆ ప్రజలను దీవించమని తన ప్రార్ధనలో దేవుని అడుగుట నేను విన్నాను. ఒకరికి ఒకరు ఎంతగానో ప్రార్ధించారు. ఆ విధంగా పాస్టర్ గారు డీకన్ ల కొరకు, డీకన్ లు పాస్టర్ గారి కొరకు ప్రార్ధించుట విని నేను ఎంతో ఆనందపడ్డాను. ఆ విధంగా సంఘము సహకారంతో సాగిపోతుంటే, ఒకటి జరుగుతుంది. సంఘము ఆ విధంగా క్రమము కలిగి ఉండాలి. అది నాకు ఒక పాఠము యొక్క భావాన్ని అనుగ్రహించినది. కాదేషు వద్ద ఉన్న ఆశీర్వాదాన్ని గూర్చి నేను మాట్లాడితిని. వేగులవారి యొక్క వర్తమానమును నిరాకరించుటను గూర్చి మాట్లాడితిని, అయితే అప్పుడు ఇంకొక దాని గూర్చి మాట్లాడటానికి నా మనసు మార్చుకున్నాను.

6

ఇప్పుడు స్వస్థతను గురించి కొద్దిగా సాక్ష్యము నా యొద్ద ఉన్నది. మా అబ్బాయి బిల్లీని అక్కడ చూస్తానని నిరీక్షించాను. అతడు దానిని తన జేబులో ఉంచుకున్నాడు. అతడు ఈ కూడికలలో మునుపటి కంటే కొంత అభివృద్ధి చెందాడు. అతడు భయపడి బెదరిపోయేవాడు. “ఓ, వెళ్ల కూర్చోండి, వెళ్లి కూర్చోండి,” అని ప్రజలతో చెబుతుండేవాడు. “నేను మీకు ప్రార్ధనా కార్డు ఇస్తాను,” అని చెప్పేవాడు. ఈ మధ్య నేను గమనించినది ఏదనగా, ప్రజలు వస్తున్నప్పుడు ఎంతో బాధపడుతుంటాడు. ప్రార్ధనా కార్డులు అయిపోతే నేను వచ్చి ప్రార్ధించుట కొరకై వారిని ఒక గదిలో ఉంచేవాడు.

7

ఆఖరిగా చికాగోలో ఇలాంటి విషయాలు జరిగాయి, అతడు వచ్చినటైతే నేను అవి చదివేవాడను. నేను ఇంతవరకు అబ్బాయిని చూడలేదు. నేను ఈ ఉదయవేళ ఇక్కడకు వస్తున్నానని అతనికి తెలియదు. నేను పెద్ద వ్యాధిని గురించి తలంచి దాని విధానం ఇలా ఉంటుందని తలస్తున్నాను. ఆ వ్యాధి గూర్చి ఉత్తరం కావాలి. అది పత్రికలలో గుర్తించబడిన ఉత్తరం, (నేను ఎన్నడూ అది వినలేదు), మదుమేహవ్యాధి కలిగిన స్త్రీకి ఓరల్ రాబర్ట్ ప్రార్ధన చేసాడు మరియు ఆమె చనిపోయెను, దానిని పత్రికలు విమర్షించినవి. అమెరికా దేశం యొక్క చట్టాలు, అధికారంలో ఉన్నవారిని గూర్చి నేను విన్నాను. అది సరిపోదేమో అని అనుకొంటున్నాను. వైద్యులు విడిచిపెట్టిన వారందరికి, ఓరల్ రాబర్ట్ ప్రార్ధన చేయగా వారందరు స్వస్థత పొందారు. వారిని గూర్చి పత్రికలలో వ్రాస్తే అనుమానమే. మరలా చూసినట్లయితే అనుమానమే, గమనించారా. అది వారు చేయలేరు. ఆ విధంగా దయ్యం వారిని తలక్రిందులు చేస్తుందేమో అని నేను అనుకున్నాను. వారు తీర్పు దినమున లెక్క అప్పచెప్పవలసియున్నది. అయితే చనిపోతున్న వేలమందికి ఓరల్ రాబర్ట్ ప్రార్ధన చేసాడు. దేవుడు ఆ ప్రార్ధనను అంగీకరించాడు, వారు బాగున్నారు.

8

మీరు చూశారా, ఈ విషయాలలో వారు యదార్ధత చూపించలేదు. వారి పక్షాన అనగా విమర్ష బాగానే వారు తెలియజేసారు. మరో పక్షాన వారు తెలియజేయలేదు. జరుగుతున్న విషయాలను గూర్చి ఎప్పటికప్పుడు తెలియజేయు బాధ్యత చర్చి వారి పై ఉంటుందని నేను అనుకొంటున్నాను. అప్పుడు నేను ఇలా అనుకున్నాను, మానవులు ఒకరి యెడల ఒకరు బాధ్యత కలిగియుంటే, ఒకరు స్వస్థత పొందితే నిజంగా స్వస్థత పొందితే అమెరికా దేశములోని ప్రతీ ప్రార్ధనను పేపరులో వ్రాయవలసి ఉంటుంది. అయితే నీవు అలా చేయుటకు వాటిని నీవు అద్దెకు తీసుకోలేవు. లేదు, అలాంటి దానిని నీవు(అద్దెకు) తీసుకుంటే వారు ఎగతాళి చేసి, గేలిచేసి త్రిప్పికొడతారు. అయితే ఏదైనా విమర్ష ఉన్నట్లయితే ఈ దేశము తీర్పులోనికి వెళ్లనైయున్నదని అది తెలుపుతుంది. అవును. తీర్పు ఉంటుంది. దానిని తప్పించుకొనుటకు మరొక మార్గము లేదు. వారి తలలుపైన నిప్పులు కుప్పలుగా వారు కూర్చుకొంటున్నారు. అలాంటి పద్ధతులను పరిత్యజించే పద్ధతులు అవి. వార్తాపత్రిక యొక్క పద్ధతి ఏమిటంటే, మంచివి గాని చెడ్డవిగాని జరిగిన వాటిని ప్రజలకు తెలియజేయుటయే. వారి యొక్క నియమావళిని వారు విడిచిపెడుతున్నారు. వారి నియమావళిని వారు విడిచినట్లైతే వారి ఉద్దేశానికి సరిగ్గా వారు పరిచర్య చేయలేరు.

9

అలాగే సంఘములో కూడా దానియొక్క నియమావళికి దూరమైతే అవి ఎప్పటికి పరిశుద్ధులకు పరిచర్య చేయలేవు. మనము ఏకముగా కలిసి ఉండాలి, ఐక్యతతో ఉండాలి. ఒకే మనస్సు ఒకే భావం కలిగి ఉండాలి, లేనట్లయితే మనము దేవుని సేవించలేము లేక ప్రజలను సేవించలేము. బైబులు యొక్క ధర్మములపై ఆదారపడి ఏక మనసు, ఏక ఆత్మ కలిగి ఉండకపోతే, ఆయనను నిజంగా సేవించలేము. దేవుడు వేటిని సరైనవని చెప్పాడో అలాంటి వాటిపై ఆధారపడకపోతే దేవుని సేవించలేము. మనము ఎప్పుడూ వాటిపైనే ఆధారపడవలసి ఉన్నది.

10

చికాగోలో బిల్లి నన్ను ఒక గదిలో ఉంచి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి ఊపిరితిత్తులలో క్యాన్సర్తో ఉండి తన భార్యతో సహా అతని యొద్దకు వచ్చాడు. చనిపోతున్న స్థితిలో ఉన్నాడు. అతని భార్య పోలియో వ్యాధితో తోపుడు బండిలో కూర్చున్నది. ఊపిరితిత్తులలో క్యాన్సర్ ఉండుట వలన నిలబడలేని స్థితిలో ఉన్న తన భర్త యెడల జాగ్రత్త తీసుకొనుటకు ప్రయత్నిస్తున్నది. “నన్ను క్షమించండి,” అని బిల్లీ అన్నాడు. “నేను సంతోషంగా ప్రార్ధనా కార్డు ఇస్తాను,” ఇంకా చెప్పాడు, “నా యొద్ద ఒకటి కూడా మిగలలేదు,” అని అన్నాడు.

అతడు చెప్పెను, “సరే కుమారుడా, అంతా సరియైనదే. మేము ఇక్కడకు వచ్చుటకు ప్రయత్నించాము, కాని మాకు అది సాధ్యము కాలేదు,” అని అతడు (బిల్లీ తో) చెప్పెను.

“నీవు ఏమి చెయ్యాలో నేను చెబుతాను,” అని బిల్లీ అన్నాడు. “డాడిని బయటకు తీసుకొని వెళతాను. మరలా నేను ఆయనను లోపలకు తీసుకొని వస్తాను. నీవు ఆ వర్తమానం విన్న తర్వాత నేను వెళ్ళుచున్న గదిలోనికి నీవు నీ భార్య రండి - ప్రార్ధించుట కొరకై నేను ఆయనను తీసుకొని వస్తాను. నేను ఆ విధంగా చేస్తాను.”

“ఓ, అది ఎంతో మంచిది బాబు. అది మంచిది,” అని అతడు అన్నాడు. అక్కడ ఒక గుణలక్షణము ఉన్నది. అది మంచిది, చూచారా.

11

ఆ రాత్రి బిల్లీ అక్కడకు వెళ్లిన తర్వాత బిల్లీ చెప్పిన దానికి అది వ్యతిరేకమైపోయింది. ఊపిరితిత్తుల్లో గుండా రక్తము ప్రవహిస్తున్న అతని భావమరిది అక్కడ ఉన్నాడు. కడుపులో అల్సరు వ్యాధితో బాధపడుతున్నట్లు వంటి అతని మరదలు కూడా అక్కడే ఉన్నది. సహాయాన్ని కోరుతున్నట్లుగా వారు అక్కడకు వచ్చి వీరితో నిలబడి ఉన్నారు. గమనించండి... గది అంతా నిండిపోయినది. మీరు గమనిస్తున్నారా? మేము ప్రార్ధించుకొంటూ అలా వెళ్ళుచున్నప్పుడు, పోస్టు కార్డు ద్వారా ఒక ఉత్తరం వచ్చింది. ఆ మనిషికి ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ సంపూర్ణంగా బాగైనదని ఆ ఉత్తరంలో ఉంది. తోపుడు కుర్చిలో ఉన్న అతని భార్య బాగైనది. మునుపు ఎలాగున్నదో, ఆ విధంగానే ఉన్నది. ఊపిరితిత్తులలో సంపూర్ణంగా క్షయవ్యాధితో ఉన్న వ్యక్తి సంపూర్ణంగా బాగయ్యాడు. అతని భార్య అల్సర్ నుండి బాగైనది. నలుగురూ ఒకే సారి స్వస్థత పొందుకున్నారు. అలాంటి దానిని వార్తా పత్రికలలో ప్రచురించుట మీరు చూశారా? అది నాకు అనుమానాన్ని కలిగిస్తుంది. ఓ, అయితే దేవుడు ఎప్పటికీ దేవుడే. ఆయన తన సొంత మార్గాల ద్వారా కార్యాలను చేస్తాడు, అవును కాదా, ఆయన ఎంతో దయాళుడు. ఆయన దేవుడై ఉన్నందుకు మనమెంతో సంతోషిస్తున్నాము.

12

మేము ఎరిగిన ఒక చిన్న బోధకుని గూర్చి మేము మాట్లాడుకొంటున్నాము. అతడు అలా వెళ్ళుచూ రోగుల కొరకు తదితరుల కొరకు ప్రార్ధిస్తుండేవాడు. అతడు లూయిస్-విల్లోని ఆస్పత్రిలోనికి వెళ్లి క్షయవ్యాధితో ఉన్న ఒకరికి ప్రార్ధించాడు, ఆమె చనిపోయినది. ఆ అబ్బాయి ఇలా అన్నాడు, “అహా! అవసరం లేదు... దేవుడు... ఆయన మాటను ఆయన నిలబెట్టుకోవాలి,” అని అన్నాడు. “బైబులు చెప్పినట్లుగా అభిషేకించి, అనగా నూనెను పోసి ప్రార్ధన చేసాను. ఆయన మాటను ఆయన నిలబట్టుకోకపోతే, ఆయన దేవుడు కాదు. అది కేవలం పుస్తకం మాత్రమే,” అని చెప్పాడు.

దేవుని నీవు ఎరిగినంత వరకు అది జరగకపోతే అలాగే అనిపిస్తుంది. అది లేఖనంలో భాగం మాత్రమే, అయితే అది మొత్తం లేఖనం కాదు. వ్యక్తి యొక్క విశ్వాసం మీద ఆధారపడుతుంది, చూచారా.

13

అనేక విషయాలు జరుగుతున్నాయని నా భార్యకు చెప్పాను. అవి అక్కడ ఉండునని నాకు తెలుసు, అంతమున ఏమి జరగనై ఉన్నదో నాకు తెలియదు. అదే మార్గాన నేనూ వెళ్లవచ్చు. ఆయన కనికర హస్తాన్ని నా మీద నుండి తొలగించినట్లయితే అదే మార్గమున నేనూ వెళతాను. ఆయన కనికర హస్తాన్ని నా పైన ఉంచి నన్ను నడిపించినంత కాలము నేను వెళుతుంటాను. నా చిన్న బిడ్డ అయిన షారోను గూర్చిన దర్శనము నాకు వచ్చినప్పుడు, “అక్కడ గదిలో ఉన్నది ఎవరు?” అని మిడాను అడిగాను.

14

గత దినాన మార్గమున వెలుతూ, మూర్ఛపోవుదునేమో అని అనుకున్నాను, వీధిలో కూర్చొని ఉన్నాను. ఆమెను గూర్చిన దర్శన వృత్తాంతం మీకు తెలుసు. నా ప్రక్కకే వస్తునట్లుగా నేను చూసాను. ఆ దర్శనంలో ఉన్నట్లుగానే జఫర్సన్-విల్ వీధిలో నుండి ఒక యవ్వన బాలిక వస్తుంది. నా రెండు చేతులతో అలా కలిపి నేను పట్టుకున్నాను. నా చిన్న షారోను వలే ఆ దర్శనంలో నాకు కనిపించింది; అప్పుడు ఆమె యవ్వనస్తురాలై ఉన్నది.

ఆ దర్శనంలో ఆ ఉదయం ఆమె మహిమలో ఉన్నట్టు కనిపించింది. ఆ దర్శనం అయిన తర్వాత హోప్ నా బుజాల పైన ఆమె చేతులు పెట్టి ఇలా చెబుతుంది, “బిల్లీ భయపడవద్దు, మేము చాలా మంచిగా ఉన్నాము.” నేను ఆత్మహత్య చేసుకుందామనుకొంటున్నాను. “నేను బాధపడను అని నీవు నాకు వాగ్ధనం చెయ్యి,” అని ఆమె చెప్పెను.

“హోప్, నేను వాగ్దానం చేయలేను, ఎందుకనగా నేను విచారంగా ఉన్నాను. నేను అలా చేయలేను,” అని చెప్పాను.

15

నేను ఆ దర్శనంలో నుండి మేల్కోన్నాను, చీకటిగదిలో నిలబడి ఉన్నాను. దర్శనం కాదు, ఊహ కాదు, అయితే ఆమె హస్తాలు నా చుట్టూ ఉన్నాయి. ఆమె నన్ను మెల్లగా తడుతుంది. ఇలా కాదు ఒక్క నిమిషం ఆగు, అని తలస్తున్నాను. ఆ దినాలలో ఏమి చెప్పాలో తెలియలేదు, ఒక దర్శనం; నేను దానిని ఒక బ్రమ అని పిలువాలనుకొంటున్నాను. ఆమె చేతులు అలాగే ఉన్నవి. ఏది అని నేను అంటున్నాను. “హూప్ నీవు ఇక్కడ ఉన్నావా?”

“నా గురించి, షారోను గురించి బాధపడనని వాగ్దానం చెయ్యవా,” అని ఆమె అడిగింది. “నేను రహదారి చివర ఉన్నాను. ఆత్మహత్య చేసుకొనుటకు నేను సంసిద్ధంగా ఉన్నాను.” నేను వాగ్దానం చేస్తున్నాను,“ అని నేను చెప్పాను. ”నేను వాగ్దానం చేస్తున్నాను,“ అని నేను చెప్పాను. ఆమె నన్ను హత్తుకొని చేతులతో బుజ్జగించినది. ”హోప్ ఎక్కడున్నావు?“ అని నేను అడిగాను. నేను మేల్కోని దీపానికున్న గొలుసు లాగాను. ఆమె ఎక్కడ కుర్చున్నదో, అని అటు, ఇటు అన్ని కుర్చీలు చూసాను. దేవుడు రుపాంతర కొండపై మోషే, ఏలియాలకు కనిపించినప్పుడు, ఆయన ఎలా దేవుడై ఉన్నాడో, అలాగే ఈనాడు ఆయన దేవుడై యున్నాడు. ఆయన ఇంకను దేవుడై ఉన్నాడు.

16

మనము అనేక శ్రమలు ఇబందులు ద్వారా వెలుతూ ఉండవచ్చు. అయితే గుర్తించుకోండి, అది ఎరిగినవారు ఒకరు ఉన్నారు. మార్గానికి వెలుగు నిచ్చి దానిని వాస్తవికం చేయువారు ఒకరున్నారని గుర్తించుకోండి. తెర వెనుకాల ఏమున్నదో నేను ఎరుగను. అయితే ఒకటి మాత్రము నేను ఎరుగుదును. ఉన్నతమైన గురియొద్దకే నేను పరుగెత్తుతున్నాను. ఒకానొక దినాన ముఖాముఖిగా ఆయనను దర్శించు సందర్భము కొరకై నేను అనుదినము బ్రతుకుతున్నాను. ఆయన కృప ద్వారా రక్షించబడిన కధను గూర్చి చెప్పుటకై నేను జీవించుచున్నాను. ఆ దినము కొరకై నేను జీవిస్తున్నాను. వెనుకున్న వాటిని విడిచి, ముందున్నవాటికై సాగిపోతాను, ముందుకే సాగి వెళ్ళుదును.

17

నాకు ఈ మందిరం కావాలి. మీరు మీ పాదాలపై ఉండండి, ఉన్నత పిలుపు యొక్క గురి యొద్దకే మీరు పరుగెత్తాలని నేను ఆశిస్తున్నాను. మిమ్మును ఏమి చేసినప్పటికి బందము కలిగి ఉండండి, ఒకే గుంపు సంబంధులుగా ఉండండి. ఎల్లప్పుడు చాచిన హస్తాలతో ఉండి ఒకరిని లోపలకు తీసుకొని రండి. అయితే మనము కలిగి ఉన్న విశ్వాసమునందు ఆశక్తితో పోరాడండి. దానికి ఏ ఒక్క కోణములో కూడా దూరము కావద్దు. నేను ఆయన యొక్క సేవకుడినని మీరు నమ్మినట్లయితే, ఇది దేవుని యొక్క ప్రణాళిక అని నమ్మండి. అది ఎన్నడు కూడా పెద్ద గుంపు కాలేదు. అది ఎప్పుడూ తక్కువ సంఖ్యగా ఉంటుంది. ఎల్లప్పుడు ఆ విధంగానే ఉన్నది. ఎల్లప్పుడు కూడా ఆ విధంగానే ఉంటుంది. అయితే గుర్తించుకోండి, ఇది ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. “చిన్నమందా భయపడకుడి, రాజ్యము మీకు అనుగ్రహించుట తండ్రి ఇష్టమైయున్నది.”

18

మన సంఘములో కార్యనిర్వాహక వర్గము ఒకటి ఉన్నది, ధర్మకర్తలు (ట్రస్టీలు), డీకన్ లు, ఆదివారపుబడి పర్యవేక్షకుడు, పాస్టర్ గారు. అలా మన సంఘము ఒక క్రమములో ఉన్నది. మీరు ఈ విధంగా కార్యనిర్వాహక అధికారులు పాస్టర్ గారిని ఎన్నుకున్నారు. నేను కేవలము సామాన్యమైన పర్యావేక్షకుడను. సలహాలు ఇచ్చుటకు నేను ఉంటాను. మీ పాస్టర్ గారిని మీరు ఎన్నుకుంటారు. మీ డీకన్ లను మీరు ఎన్నుకుంటారు. మీ ధర్మకర్తలను మీరు ఎన్నుకుంటారు. మీ సంఘములో నున్న ప్రతి కార్యనిర్వాహక అధికారిని మీరు ఎన్నుకుంటారు. ఆ వ్యక్తుల పక్షాన ఉండుట మీ బాధ్యత అవుతుంది, చూచారా, వారు తప్పిదాలు చేయవచ్చు. వారు శరీరులు, వారు కేవలం మానవులు, వారు పొరపాట్లు చేస్తారు. అమెరికా దేశ అధ్యక్షుడు పొరపాటు చేస్తే, అమెరికా దేశ అధ్యక్షుడుగా ఉండవద్దు, అని తోలివేస్తామా? అది మరచిపోయి కొనసాగిస్తాము. ఇప్పుడు ఆ విధంగా మన సంఘము ఉ౦డాలి. కొద్ది సమయం క్రితము డీకన్ ల నిమిత్తం ప్రార్ధిస్తున్న వారి పార్ధనను నేను వింటిని. తలుపు యొద్ద ఉండి ధర్మకర్తల సాక్ష్యాలను నేను వినుచుంటిని. మీరందరూ ఏ విధంగా ఏకమనస్కులై ఉన్నది వినుచుంటిని. ఆ విధంగానే ఉండండి. సభ్యులైన మీరు — ధర్మకర్తలు, డీకన్ లు, పాస్టర్ గారి ప్రక్కనే నిలబడండి. గుర్తించుకోండి, ఇది మీరు ఏకీభవించినప్పుడు, గుర్తించుకోండి ముక్కలు చెక్కలు చేయడం సాతాను పని. అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. అది ఎప్పుడూ అలాగే ఉండగలదు. మీ అధికారుల పక్షమున మీరు ఉండండి. ఆ సంగతే నేను మాట్లాడుచున్నది.

19

ఇంకా ఈ ఉదయవేళ వార్తల బోర్డు నుండి ఒకటి విన్నాను. సభ్యుల యొక్క సమావేశము వారి అధికారములను గూర్చి వినుచుంటిని. అది వార్తలు తెలిపే బోర్డునందున్నది. ధర్మకర్తలు, అధ్యక్షులగు రాబర్సన్ కొరకు నేను ఒక ప్రతిని నా యొద్ద ఉంచుకున్నాను. సోదరుడు కాలిన్స్ యొక్క కాపీ కూడా నా దగ్గర ఉన్నది. అతడు డీకన్ బోర్డుకు అధ్యక్షులుగా ఉంటారు. వీరందరిని కూడా లేఖనభాగం ఆధారంగానే నియమించడమైనది. వారు చేయవలసిన లేఖన విధులను వారు కలిగి ఉండాలి. ధర్మకర్తలకు వారి సొంత కార్యాలయాలు ఉన్నవి. డీకన్ లకు వారి సొంత కార్యాలయాలు ఉన్నవి. ఆదివారపుబడి పర్యవేక్షకునికి, వారి సొంత కార్యాలయం ఉన్నది. మరియు పాస్టర్ గారు మందకు ముఖ్యమైనవాడు.

20

వీటిలోని ప్రతి ఒక్క విషయము అవి సర్వ సాధారణమే. మీ యొక్క సమావేశాలు ఒకదానికొకటి కలిసి ఉండవు. అయితే అది ఎవరికి వారికే కార్యనిర్వహణ అవుతుంది. ఏదైనా వారికి సమర్పి౦చవలసిన విషయం ఉంటే తప్ప డీకన్ లకు, ధర్మకర్తలతో సంబంధం లేదు. అలాగే వీరు కూడా ధర్మకర్తలు భవనం మీద ఆర్థిక విషయాల మీద ఉంటారు. వారికి డీకన్ లతో సంబంధం లేదు. డీకన్ లు సంఘానికి పోలీసులులాంటి వారు, మరియు వారు పాస్టర్ గారికి సహకారులు. సర్వ ఆస్తి మీద ధర్మకర్తలు బాధ్యత కలిగి ఉంటారు. దాని యొక్క ఆత్మసంబంధమైన దానంతటికి ధర్మకర్తలు బాధ్యులు కాదు. దాని యొక్క ఆర్ధిక సంబంధమైన దానంతటికి డీకన్ లు బాధ్యులు కాదు. అది తప్పనిసరి అవుతుంది. ఆదివారపుబడి పర్యవేక్షకుడు - ఆదివారపుబడి మీద బాధ్యత వహిస్తాడు. కాబట్టి నేను ఇంకా వ్రాసుకొని టైపు చేసి, ఆ వ్రాతల బోర్డునందు సిద్ధపరచి ఉంచాను.

21

సంఘము యొక్క సిద్ధాంతము ఏంటో దానిని ఫ్రేమ్ లో ఉంచబోతున్నాము దానిని ఫ్రేములోయు౦చి మందిరంలో ఉంచుతాం. దేనికొరకు మనము నిలబడతామంటే, దేనికి మనము స్థిరులమై ఉంటామంటే సంఘ నియమము, సిద్ధాంతం కొరకు మనము స్థిరులమై ఉంటాము. సంఘముగా ఉండుట, అనగా మనము ఒక సిద్ధాంతమును కలిగి ఉండుటయే.

మనము దేనిమీదనో గీచుకొని దేనికొరకో మేము ఉన్నామని చెప్పుటలేదు. ప్రజలతో మనము సహవాసం చేయుట లేఖనభాగాల ద్వారా దేవుడు మనలను అనుమతించువరకు మనము సహవాసము చేస్తాము. ఒకే మనస్సు ఒకే హృదయము కలిగి సంఘీభావం కలిగి, దేవుని కొరకు సాగిపోతాము. ఆ విధంగా ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. ఇప్పుడు మనము ప్రార్ధించుకొని మరియు వాక్యాన్ని తెరుద్ధాము.

22

ఓ, ప్రశస్తమైన ప్రభువా, మేము ఇప్పుడు దైవవాక్యాని సమీపిస్తున్నాం లేక నీ వాక్యమును పఠనము చేయబోతున్నాము. మా యొక్క అక్కరలు కొలది, నీ యొక్క పరిశుద్ధాత్మ మాకు అనువాదం చేయును గాక. కృపచేతనే మేము నీ బిడ్డలమై ఉన్నామని నీవే మమ్ము పిలిచావని ఎరిగినవారమై, ఆలాగు మాట్లాడి, మరియు దాని ప్రకారము ప్రవర్తించి మరియు జీవించుదుము గాక. సంఘములో ఇలాంటి సహవాసము ఉండును గాక. ఘనమైన కదలికతో మేము ఇప్పుడు కేంద్రీకృతులమై ఉన్నామని ఎరిగి, ఇతరితర సేవకులు బయట పొలములోనికి అలాంటి వారు రావాలని మేము తలంచుచున్నాము. ప్రపంచమందలి పలుపలు ప్రాంతాలకు నీవు పంపినప్పుడు అక్కడ విశ్వాశాన్ని స్థిరపరచడానికి స్వీకరించుట కొరకై తర్ఫీదు పొంది, సంసిద్ధత చూపు ఒక సేవకుని పొందుదుము గాక. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన విశ్వాసము స్థిరమై స్థిరత్వముతో నిలిచిన ఆ విశ్వాసము ప్రపంచాన్ని చుట్టిముట్టును గాక. ప్రభువా, దయచేయండి. మేము ఒకనాడు నీకు ప్రతష్ఠ చేసిన ఈ గడ్డి గుడిసె ఇక్కడ అది ఒక మందిరమై నిలబడును గాక. అందులో నుండి సేవకులు, మిషనరీలు, ఉపదేశకులు, సువార్తికులు, సర్వ ప్రపంచానికి పంపబడుదురు గాక.

23

ఈ ఉదయవేళ జబ్బుగా ఉన్నటువంటి సహోదరుడు, సోదరి స్టిక్కర్ ప్రత్యేక ఆశీర్వదము కొరకై ప్రార్ధిస్తున్నాను. మేమందరము ఇలాంటి శోధనల గుండా వెళ్ళవలసి ఉన్నదని మేము ఎరిగియున్నాము. దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుడు శిక్షించబడి పరీక్షించబడవలెను. వాటిని చులకనగా తీసుకున్నట్లయితే, వెనుదిరిగిన వారమై, మేము దేవుని బిడ్డలము కాక దుర్భిజులమవుతాము. సోదరి, సహోదరుడు స్టిక్కర్ తన విధినిర్వహనలో నిర్వీర్యులు కాకుండా, వారికి బలమును శక్తిని అనుగ్రహించండి. వారు ఏ భోజనం బోంచేయ్యాలని ఆశిస్తున్నారో, అందుకై మీ హస్తము అనుగ్రహము చూపును గాక. మాకు అలాంటివి తెలియదు, కాని నిజ క్రైస్తవుడంటే ఎవరనేది ఆఫ్రికా పల్లెవాసుల ఎడల నీవు కనపరచిన ఘనకార్యమే ఇది చేయగలదు. అనుగ్రహము చూపండి ప్రభువా. ఇప్పుడు నీ చిత్తమే నెరవేరును గాక.

24

పాస్టర్ గారైన నెవిల్ ను ఆశీర్వదించండి. గతములో నీవు కనపరచిన రీతిగానే గొర్రెలకు కాపరిగా చేయమని ప్రార్ధిస్తున్నాము. ప్రభువా, ఎంతో బాధతో బాధపతున్నటు వంటి అతని ప్రియమైన భార్యను మేము మరచుటలేదు. తల్లి లేని బిడ్డల గుంపుతో సహోదరుడు నెవిల్ తో ఉంచాలని శత్రువు ఆశిస్తున్నాడు. విశ్వాసంతో మేము నిలబడి శత్రువుకు సహోదరికి మధ్యన యేసుక్రీస్తు రక్తమును ఉంచుతున్నాము. ప్రభువా, నీ యొక్క ఆత్మ ఆమెపై అధికముగా ఉండును గాక. ఈ అంధకార సంబంధమైన లోయలో ప్రతి యొక్క స్త్రీ అలా నడుచుటకు నిర్ణయించబడియున్నారని తెలుసుకొందురు గాక. ఆమెతో నీవు ఉండాలని ప్రార్ధిస్తున్నాము. ఆ చిన్న బిడ్డను ఆశీర్వదించండి. ఇప్పుడు ఆమె భయభీతిలో నిండియున్నది. ఆ కుటుంబం కొరకై పరిశుద్ధాత్మ అన్ని కాలువలలోను వాత్సల్యత ద్వారముగా ఉండును గాక.

25

మా ధర్మకర్తల బోర్డు వారిని దీవించండి. అక్కడ ఉన్నటువంటి సోదరుడు వుడ్, సోదరుడు ఈగన్, సోదరుడు రాబర్సన్ మొదలగు వారందరిని ఆశీర్వదించండీ ప్రభువా. డీకన్ లను, ధర్మకర్తలను సంఘములోని వారందరిని దీవించండి. వారి యొక్క కాలపరిమితిలో పరిశుద్ధతతోను, నీతితోను నిన్ను సేవించుదురు గాక. మేము అలా ఉండాలని ప్రార్ధిస్తున్నాము ప్రభువా. క్రిత కాలంలో పనిచేసిన వారిని దీవించు ప్రభువా. ప్రభువు యొక్క ప్రేమతోను, ఆత్మతోను, ఐక్యతతో ఉండు సంఘమని మేము తెలియబడులాగున, మీరు సదా మాతో ఉండమని ప్రార్ధిస్తున్నాము. మా అక్కర కొలది, నీ వాక్యాన్ని మాకు పంచి పెట్టమని ఇప్పుడు మేము ప్రార్ధన చేస్తున్నాము. వ్రాయబడిన నీ వాక్యమును మేము చదువుచుండగా, మీరు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.

26

నేను ప్రార్ధనలో ఇలా తలంచుచుంటిని, నూతనమైన ధర్మకర్తల బోర్డువారి కొరకు తదితరుల కొరకు వారి ఆశీర్వదము కొరకు ప్రార్ధిస్తూ తలస్తూ ఉంటిని, ఇక్కడ కూర్చొని ఉన్న సోదరుడు ఫ్లీమన్ మరియు సమోదరుడు డిక్మన్ మొదలగు వారిని గూర్చి తలంచుచుంటిని. క్రితం వారు మంచి పరిచర్య చేసారు. వారి నమ్మకమైన పరిచర్య నిమిత్తం మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. ప్రభువు నిత్యము వారితో ఉండి, వారిని ఆశీర్వదించును గాక. ముందుగానే చదవాలని ఆశించాను. వార్తల బోర్డునందున వాటిని రానున్న సమావేశాన్ని గుర్తుచేసుకోండి.

27

వారు ఈ ఉదయం ఇక్కడ ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నది, (నేను ఇలా చెప్పెదను), గతకాలము నందు, ఇప్పుడు కూడా నాకు ఎంతో ప్రశస్తమైన వ్యక్తి కెనడాలోని, సస్కేచవాన్ నుండి వచ్చిన మంచి సహోదరుడు ఫ్రెడ్-సాత్మన్ మరియు అతని భార్య మనతో ఉండి, మన దేశమందు పరవాసులుగా ఉంటున్నారు; అయితే మన సహవాసమునందు అతడు ప్రశస్తమైన సోదరుడు. ఫ్రెడ్-సాత్మన్ అక్కడ కూర్చొని ఉన్నాడు. నేను కెనడాలో ఉన్నప్పుడు ఆ సమావేశాలకు ఆయన బాధ్యత వహించేవాడు.

ఇంకొక సోదరుడు కూడా క్రితం కెనడా వాసులే, అతడు ఒక వ్యాపార వేత్త దేవునికి విస్తారంగా ఇచ్చుటలో ఇంకొకరికి చేతకాదని లోకానికి రుజువు పరుచుకున్నాడు. అతను అతని అనుచరుడు ఒక భవనం స్థలం ఆర్థిక విషయాల కొరకై ఒక సంస్థను ఏర్పాటు చేసారు... లేక (విదేశీ సువార్తకు) ఏర్పాటు చేసారు. ఒక కూటము కొరకు ఓక్లాండకు వారు నన్ను పిలిచారు. ధనము ఉన్నదని వారు చెప్పారు, వారి సంస్థను బట్టి వారు దానినంతటిని భరిస్తారు.

28

సోదరుడు ఫైడ్ మరియు నేను కొంత డబ్బు కోసం ప్రయత్నించాము. అది సోదరుడు ఫ్రెడ్ దగ్గర ఉన్నది. అది వ్యక్తిగతంగా నేను ఉంచుకోలేదు. కనుక ఎలాంటి కానుకలు పట్టకుండా మేము దానిని కెనడా వారికి ఇవ్వవలెనని నిశ్చయించుకున్నాము. అయితే అది అంతా సానుకులం కాలేదు. కూటాలు బాగానే జరిగాయి, ఎందుకనగా ఒక కానుక కూడా పట్టలేదు. 100 బిలియన్ డాలర్స్ ధనము కలిగి సంఘము యొక్క స్థితి ఎంత ఉన్నప్పటికి నాకు అనవసరం. నీవు దేవుని కొరకు కానుక స్వీకరించవలసి ఉన్నది. అది ఆరాధనలో ఒక భాగము, అట్టి దానిని నీవు దొంగిలిస్తున్నావు. ధనము తదితరమైన వాటికి నేను ఎంత దూరంగా ఉంటున్నానో, ఒక వ్యక్తి నేరస్తుడని నేను తెలుసుకున్నప్పుడు నీవు అది నేరమని అంగీకరించాలి సుమా, ఎందుకనగా నేను మరియు సహోదరుడు ఫ్రెడ్ దాని యొక్క వికృత రూపాన్ని ఎంతో తేటతెల్లగా మేము చూశాము.

29

సోదరుడు ఫ్రెడ్ ను విడిచి నేను మీ యొద్దకు, ఓక్లాండ్ కు వస్తున్నప్పుడు సహోదరుడా బోర్డర్స్, “నీవు అది చేయవా చందా పట్టె పాత్రను వినియోగించి చందా స్వీకరించు, అవి ఎంత వచ్చినప్పటికి నీ ఫౌండేషన్ నిధిలో మరొక కూడిక కొరకు ఉంచుకో,” అని చెప్పాను.

కూటములు ముగియక ముందు సోదరుడు బోర్డర్స్ మరియు అతని స్నేహితుడు నాయొద్దకు వచ్చి ఇలా చెప్పాడు, “మేము కూటాలకు ఎంతైతే వినియోగించామో అది ముందుగానే పట్టాము,” అని అన్నారు.

ఆ తరువాత కొన్ని రోజుల క్రితము కాలిఫోర్నియాలోని సాన్-జోస్ లో ఒక కూటము ఏర్పాటు చేసారు. ఆ లోయలో అతనికి 60 లేక 70 సంఘాలు ఉన్నాయనుకొంటున్నాను. రకరకాల విశ్వాసముగల వారంతా ఐక్యతతో చేసుకొంటున్నారు. అద్భుతమైన కూటము మన ముందున్నది. తిరిగి నవంబర్ మాసములో అది వస్తుంది. సహోదరుడు బోర్డర్స్, సోదరుడు ఫ్రెడ్ వెనుక కూర్చొని ఉన్నారు. మీరు మాతో ఉన్నందుకు సంతోషము. ఈ మనుష్యులు మీ అందరికి కొత్తవారు కావచ్చు, అయితే పరిచర్య పొలములో వారు నాకు ఎంతో ప్రశస్తమైన సోదరులు. మనము ఏ విశ్వాసం కొరకు నిలబడ్డామో, ఆ విశ్వాసం కొరకు వీరు తీవ్రంగా పోరాడేవారు. సోదరులారా, దేవుడు మిమ్మును దీవించును గాక. ఈ ఉదయవేళ ఈ పాత మందిరంలో మీరు ఉన్నందుకు మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. ఇది చూడటానికి గంభీరమైనది కాదు. మనము ఎరిగిన విషయం ఒకటి ఉన్నది. దేవుడు ఇక్కడ ఉన్నాడు, మీరు చూచారా. అందుకొరకై మేము ఆనందిస్తున్నాము. ఇంకా మరికొందరు ప్రశస్తమైన సోదరులు కూడా ఉన్నారు. మనతో నేడు ఉన్నవారిని గూర్చి సమావేశము అయిన తరువాత తెలియపరుస్తాను.

30

రానున్న కొద్ది దినాలను గూర్చి నేను ఆశిస్తూ ప్రార్ధిస్తున్నాను. ప్రభువు చిత్తమైతే నేను వెళ్ళాలని తలస్తున్నాను. అలా నడిపించబడుతున్నాను. (నేను అది ప్రకటన చేయలేదు), ఓహాయో అందలి తదుపరి కూటము సహోదరుడు సులివెన్ తో కలిసి క్యాంప్-గ్రౌండ్ లో ఉంటిమి, కొద్దికాలములోనే ఇలా జరుగుతాయి. అది కేవలం 100 మైళ్ల దూరమని నేను అనుకొంటున్నాను, నేను, జీన్, ఆ విధముగ ఉండు ఏదో అని ఊహించుచున్నాను. మీరు సెలవులకు వెళ్లకపోతే, ఇది మీకు శుభప్రదమైన యాత్ర అవుతుంది. ప్రభువు మనలను ఎలా నడిపిస్తే అలా జరుగుదుము గాక. సహోదరుడు సులివెన్ చాలా మంచివాడు. అతనిని మనము ఎంతైనా అభినందించవచ్చును. ఆయన నగరానికి పూర్వపు మేయర్ గారు. పక్కా పాతకాలపు కెంటకీ వాస్తవ్యులు అని చెప్పగలను. కెంటకీ పర్వత శ్రేణిలో మేమిద్దరము అక్కడ పెంచబడ్డాము. నిన్న అతనిని కలిసినప్పుడు, అతడు నాతో ఇలా అన్నాడు, “బిల్లీ, నీవు ఇంకా అలా నీ మెడకు ఇంగువ ఉంచుకున్నావా?” అని అడిగాడు. దానిని బట్టి అతడు ఎంతటి కెంటకీ వాడో మీరు గమనించగలరు. ఇక్కడ నా కెంటకీ సహోదరుడుతో ఎలాంటి అమర్యాద నాకు లేదు. సోదరుడు జెఫర్స్ మొదలగు వారిని గూర్చి, నేను కూడా ఒక కెంటకీ వాడినే తెలుసా? మనము ఎవరుమనేది నేను మీకు చెబుతాను, మనము కెంటకీ వారము కాదు, మనము అమెరికా వారము కాదు; మనము యాత్రికులము మరియు ప్రయాణికులము, రానున్న పట్టణము కొరకు ఎదురుచూస్తున్నవారము.

31

పాఠము కొరకై నిర్గమకాండములో నుండి కొద్ది నిమిషాలు చదువుకుందాము. 23వ అధ్యాయం 20వ వచనం నుండి 23వ వచనమును కలిపి చదువుకుందాము. ఈ ఉదయవేళలో నేను ఈ విధంగా ఒక పాఠ్యాంశాన్ని తీసుకోవాలని ఆశిస్తున్నాను: “ఒక సంపూర్ణమైన విడుదల.” ఎక్కువ సేపు మాట్లాడను. ఆ పుస్తకాన్ని ఆ అధ్యాయాన్ని మీరు తీసి ఉంచాలని నేను ఎదురుచూస్తున్నాను.

ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను.

ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. [ఆ దూత ఎవరైనది సభికులు అర్ధం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను.] ... నా నామము ఆయనకున్నది.

అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని, నేను చెప్పినది యావత్తు చేసినయెడల; నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధియునై యుందును.

ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్లుచు, అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వియులు, యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను.

32

కొద్ది నిమిషాలు మనము మాట్లాడుకొనుచుండగా, ఆయన వాక్యాన్ని ప్రభువు ఆశీర్వదించును గాక. మీరు ప్రార్ధించండి, “ఒక సంపూర్ణమైన విడుదల,” అను ఈ పాఠమును గూర్చి నేను ఆలోచన చేస్తున్నాను. సంఘము తక్కువ సంఖ్యతో ఉంటుంది. అది ఎప్పుడూ కూడా కొద్ది మంది సభ్యులతోనే ఉంటుంది. యేసు వచ్చు వరుకు అలా ఉంటుంది. అది దేవుడు అనుగ్రహించిన ధన్యతలతో జీవిస్తుంది. ఇది జీవముగల దేవుని సంఘమని మనము గ్రహించినట్లయితే, అది బ్రెన్హాం టాబర్నికల్ కాదు, అయితే బ్రెన్హాం టాబర్నికల్ కేవలం అందులోని భాగం మాత్రమే. దేశమంతట అటువంటి అనేక ఆలయాలు ఉన్నవి.

33

సోదరుడు స్నెల్లింగ్ కు ఈ రాత్రి బాప్తిస్మ కార్యక్రమము ఉన్నది, అది ప్రకటించబడినదని సోదరుడు కార్టిస్ చెప్పాడు, లేక అతనికి అది ఉన్నదని గత దినమున నాతో చెప్పాడు. అతనికి బాప్తిస్మ కార్యక్రమము ఉన్నది. ఇంత వరకు ఎవరైనా బాప్తిస్మం పొందకపోయినట్లయితే, సహోదరుడు స్నెల్లింగ్ ప్రేమతో, సంతోషంతో దానిని ఈ రాత్రి జరిగిస్తారు, ఎందుకు తీసుకోకూడదు, అది యుటికా (ప్రాంతము) యందలి హోలీనెస్ టేబర్నికల్లో జరుగును. సోదరుడు జూనియర్ జాక్షన్ న్యూ-ఆల్బనీ లో ఉన్నాడు. అలాంటి సంఘాలు దేశమందంతటా అనేకం ఉన్నాయి. మనము ఓడిపోయిన పక్షమున అంతో, ఇంతో ఉన్నాము.

ఈ ఉదయవేళ సోదరుడు నెవిల్ వెనుక ప్రకటించుట నేను విన్నాను. అది నా మనసులోకి వస్తుంది. అది ఏదనగా, విమోచనకు ప్రజలు దూరమగునట్లుగా అనిపిస్తుంది. ప్రజలు అది చూస్తునట్లుగా కనిపిస్తుంది. అందుచేత వారు ఒక ప్రక్కకు నెడుతున్నారు. “ఓ, మంచిది, దేవుడు అది చేయగలడు.” అయితే అది ఆ విధానము కాదు.

34

ఇప్పుడు, మోషే దేవుని చేత పిలువబడినప్పుడు అతడు సంపూర్ణంగా, పరిపూర్ణంగా ప్రవక్త అయి ఉన్నాడు. దేవుడు ఒక మనిషిని ఏదైన చేయుటకు పంపినపుడు, అతనికి అవసరమగు ప్రతిదానితో సంపూర్ణముగ వానిని సిద్ధం చేయును. దేవుడు ఒక మనిషిని ఉపదేశకుడుగా ఉండుటకు పిలిచినయెడల, ఉపదేశించుటకు ఆయన అతనిలో ఒకటి ఉంచును. ఆయన అతనిని ఒక బోధకునిగ ఉండుటకు పిలిచినయెడల, ఆయన అతనిలో బోధించుకు ఒకటి ఉంచును. ఆయన అతనిని ప్రవక్తగ ఉండుట కొరకు పిలిచినయెడల, అతడు దర్శనాలు చూచుటకు మరియు ప్రవక్తగా ఉండుటకు, ఆయన అతనిలో ఒకటి ఉంచును. దేవుడు ఎల్లప్పుడు తన మనిషిని సంపూర్ణముగ సిద్ధము చేస్తాడు. ఆయన ఐగుప్తులోనికి మోషేను పంపినపుడు, ఆయన అదే చేసెను. ఆయన అతనిని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పుట్టించాడు. ఆయన వానికి ఒక ప్రత్యేక పద్ధతిలో చదువు చెపించి, అతనిని చెక్కుకొని, అతనిని మలుచుకున్నాడు. అతనిని ఆ విధంగా చేసెను. వందల సంవత్సరాలకు పూర్వము ఆయన అబ్రహామునకు వాగ్దానం చేసెను. అతడు ప్రజలను విడిపించును. (విమోచించును) అని ఆయన చెప్పెను. మోషే ఎలా ఉండబోతున్నాడో దానిని గురించి ఆయన తన మనస్సులో ఉంచుకున్నాడు. ఆ విధంగానే మోషే సంపూర్ణముగా ప్రవక్త అయి ఉన్నాడు.

35

అప్పుడు నీవు క్రైస్తవుడవైతే, ఆ తరువాత అతడు నీవలే ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా సగం క్రైస్తవులుగా చేయడు. దేవుడు సంపూర్ణ క్రైస్తవులుగా చేస్తాడు. దేవుడు బోధకులను, సగం బోధకులుగా చేయడు, అయితే బోధకుడు సగం బోధకుడు కావచ్చును. దేవుడు తన పిల్లలను క్రైస్తవులుగా చేస్తాడు, అయితే వారు సగం క్రైస్తవులు అవుతారు. వారు ఆ విధంగా ఉండుట దేవుని ఉద్దేశ్యము కాదు. దేవుని యొక్క ప్రణాళికలో వారు తమ స్వంత మార్గాలను కలగోరు గంపగా చేసుకుంటారు. అదే వారిని ఆ విధంగా ఉండునట్లు చేస్తున్నది. సగం క్రైస్తవులుగా ఉండుటకు దేవుడు చేయుటలేదు. దేవుడు సగం బోధకులుగా ఉండుటకై అలా చేయుటలేదు. ఇటు, అటు రెండు విదాలుగా రాజీపడటం లేదా ఆయనే మనకు సంపూర్ణంగా మధ్యలో నిలబడుట కొరకై అంగీకరిస్తారు.

ఇప్పుడు, మోషే, దేవుడు మోషేను సంపూర్ణ విడుదల కొరకు సంపూర్ణ ప్రవక్తగా చేసాడు. మోషే సంపూర్ణంగా దేవుని హస్తాలకు అప్పగించుకున్నాడు. ఆ కారణము చేతనే ఆయన అతనిని ఆ విధంగా చేసాడు. దేవుడు అతనిని నమ్మునంతగా, అతడు దేవునికి సమర్పణ చేసుకున్నాడు.

36

ఈ ఉదయవేళ, క్రైస్తవులైన మనము మన స్వంత ఇష్టములను, మనము ఆయనకు సమర్పణ చేసుకున్నట్లయితే, దేవునికి మనలను మనము సంపూర్ణంగా అర్పణ చేసుకున్నట్లయితే, దేవుడు మనలను నమ్మునంతగా మనలను మనము సంపూర్ణంగా అర్పణ చేసుకున్నట్లయితే. నేను ఆశ్చర్యపోతున్నాను, ఆయన మనలను ఉంచిన ఆ స్థలములో దేవుడు మనలను నమ్మగలిగినంత వరకు అప్పగించుకొనవలెను. ఈ ఉదయవేళ నన్ను గూర్చి నేను ఆశ్చర్యపడుతున్నాను. దేవుడు నన్ను నమ్మినట్లుగా నేను ఆయనకు ఎంతగానో అర్పణ చేసుకుంటే, సహోదరుడు నెవిల్ ను దేవుడు నమ్మినట్లుగా అతడు సమర్పణ చేసుకుంటే, ధర్మకర్తలు, డీకన్ లను, సంఘ సభ్యులందరిని ఆయన నమ్మినట్లుగా సమర్పణ చేసుకుంటే, అది ఆశ్చర్యకరమైన విషయం కాదా? మనకి ఒక విధి నిర్వహణా స్థానమున్నది.

క్రీస్తు యొక్క చెప్పనశక్యమైన మహదైశ్వర్యమును ప్రకటన చేయుట కొరకై ఎటువంటి రాజీపడకుండా ఉండుటయే దేవుని యొక్క సేవకుని విధి అది. అతడు బోధకుడిగా పిలువబడినట్లైతే, అతడు బోధకుడిగా ఏ వ్యక్తి కోసము ఏ ఒక్క విషయాన్ని అతడు దాచడు.

37

సంఘ సభ్యుడు, ఒక సభ్యుడుగా ఉండుట కొరకు అతడు పిలువబడినట్లయితే, అలాంటప్పుడు అతడు రాజీపడడు. మనము పేకాట ఆడకూడదని సంఘము నమ్మినట్లయితే, అలాంటప్పుడు ఆ సంఘ సభ్యుడు పేకల కట్ట కూడా ముట్టుకోడు. తాగుడు అలవాటును మనము నమ్మము లేక అనుమతించము. తాగుడు అలవాటు నుండి పూర్తిగా అతడు మరలు కుంటాడు. జూదమాడుట పొగత్రాగుట మొదలైన వాటియందు మనం నమ్మిక కలిగి ఉన్నట్లయితే, సంఘ సభ్యుడనే వాడు ఎన్నడు కూడా అది ముట్టుకొనడు. అప్పుడు దేవుడు సంపూర్ణ విడుదల అనుగ్రహిస్తాడు. ఆయనకు మనము సంపూర్ణంగా సమరణ చేసుకున్నట్లయితే, ఆయన దానిని అలా చేస్తాడు. ఆయన హస్తాలకి సంపూర్ణంగా మనము సమర్పణ చేసుకుంటే, అప్పుడు దేవుడు మనయందు జీవించగలడు. మహిమా నిరీక్షణకు కర్త అయిన క్రీస్తు మార్గంలో మనము చేరుకుంటున్నప్పుడు మనలో నుండి ఆయన కనిపిస్తాడు, ప్రతిబింబిస్తాడు. అలాంటప్పుడు మన తలంపులు ఆయన తలంపులవుతాయి. క్రీస్తు చుట్ట తాగాడని నీవు తలస్తున్నావా? క్రీస్తు మధ్యం సేవిస్తాడని, పేకాట ఆడతాడని నీవు ఊహించగలవా?ఊహించలేవు. కాబట్టి అలాంటప్పుడు ఆయన ఆత్మలో నీ ఆత్మ భాగమై ఉంటే, నీ యొక్క ఒప్పుకోలును బట్టి అది ఉండాలని ఆయన కోరుతున్నాడు. అయితే దయ్యం వచ్చి స్వాధీనపరచుకునేటట్లుగా నీవు అనుమతిస్తున్నావు. అన్ని సమయాలలో నీవు అలాంటి పనులు చేస్తున్నప్పుడు, నీ హృదయాంతరంగంలో అది తప్పు అని నీకు తెలుస్తుంది. ఒక సంఘ సభ్యుడు మరో వ్యక్తితో వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, అది తప్పని నీకు తెలుసా? మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయవలెనని ఆజ్ఞ ఇవ్వబడినది, కాని ఒకరి కొరకు ఒకరు వ్యతిరేకంగా మాట్లాడమని కాదు, అయితే ఒకరినొకరు ప్రేమించమని చెప్పబడినది. ఎవరైనా కృంగినట్లయితే అతనిని పైకి లేపండి. అతనికి సహాయం అందించండి. అలాంటివి మనలను ఐక్యతగల విశ్వాసులుగా చేస్తున్నాయి. మనము దానికి లోబడకపోతే దేవునికి మనము లోబడము. మనము దేవునికి దుఃఖము కలుగ జేస్తున్నాము. అందువలన మన సంఘము మన సంఘ ప్రజలు అభివృద్ధి చెందరు. సంఘము ముందుకు సాగలేదు, ఎందుకనగా మనము అనైక్యత కలిగి ఉంటున్నాము. యేసు చెప్పెను, “కొంత పులిసిన పిండి ముద్దంతటిని పాడు చేస్తుంది.”

38

సంఘము యొక్క బోర్డువారు, అనగా డీకన్ లు వచ్చి, “మేము క్రొత్త మందిరాన్ని కట్టాలనుకొంటున్నాము,” అని చెప్పినట్లయితే, అది డీకన్ ల యొక్క ఆలోచనైతే, ధర్మకర్తలు ఆలోచన చేసి అది చేయడానికి ధనము లేదని చెప్పినటైతే, ఆ సంగతి సాధారణ సభికుల యొద్దకు తీసుకొని రాబడుతుంది. అది మనమందరము, సంఘమంతా సార్వభౌమాధికారము కలిగి ఉంటుంది. ఆ తరువాత కొత్త మందిరం కొరకు ఓటు చేసినట్లయితే, మనమందరము ఆ కొత్త మందిరం కట్టుట కొరకు సహకరించవలసి ఉంటుంది.

వాస్తవంగా, నాకు క్రొత్త మందిరమును గూర్చి వారే నేరుగా వచ్చి చెప్పినప్పుడు ఆ తలంపును నేను వ్యతిరేకించాను. అవును. “కొత్త మందిరం వాస్తవంగా మాకు అవసరం లేదు, అని నేను అన్నాను. నేను చాలా త్వరగా ఇక్కడ నుండి వెళ్లనైయున్నాను. ఆయన నాకు చూపించినది నెరవేర్చబడుచునట్లయితే, కొత్త మందిరంతో మనకు ఏమీ అవసరం? మనకు డబ్బు లేదు.”

39

ఆ తరువాత నేను వచ్చి సంఘము యొక్క అభిప్రాయాన్ని గూర్చి నేను అభిప్రాయపడ్డాను. సంఘములో అనేక మంది మందిరం కావాలనే కోరిక కలిగి ఉన్నారు. అలాంటప్పుడు నేను ఏమి చేయగలను. నా యొక్క స్వంత ఆలోచనలని అర్పణగా చేసి అవి సంఘములోనే వేసాను. అవునది వాస్తవం. మనమది చేద్దాము. అలా మన అభిప్రాయాలు తెలుపుకున్నట్లయితే, మనమది చేయగలము. బైబులు కాలమందు ఆ మార్గము అలా ఉన్నది. సంఘము యొక్క అభిప్రాయాలు తెలుపు మార్గము ఉండెను. సార్వభౌమాధికారం వివిధ వర్గాల ప్రజలను ఏకీభవింప చేస్తుంది. ఐక్యతలో బలమున్నది. అందుకని నేను ఇలా చెప్పాను, తప్పనిసరి సంఘము యొక్క కోరిక ఇలాగునట్లయితే, దేవుడే ఇష్టము చూపుతుంటే, నా ఒక్కని యెడల కాకుండా ప్రజలందరి యెడల అధికార, అంగీకారాన్ని ఆయన కలిగి ఉన్నాడు, ఎందుకనగా అది అలా కాదు, అని చెప్పడానికి నాకు ఏ దర్శనము లేదు. అందువలన సంఘముతోనే కలిసి, మేము సంఘముతోనే సాగిపోతాము. నేను వెనుక ఉండి చేయగల సహాయాన్ని సంఘానికి చేస్తాను.

40

సంఘమందలి ప్రతి క్రైస్తవ వ్యక్తి యొక్క అభిప్రాయము అది కావలసి ఉంటుంది. అది మనలను ఏకము చేసి సంఘీభావాన్ని చేకూరుస్తుంది. సంఘము దేనికొరకైతే దాని అభిప్రాయ అంగీకారాన్ని అనుమతిస్తుందో, దానికి మనము నిలబడాలి. ఇలా చెప్పవచ్చు సంఘములో ఏదైనా మార్పు చేయాలని వారు తలంచినట్లయితే, ఆ పిదప ధర్మకర్తలు అలా కావాలని కోరినట్లయితే, డీకన్ లలో ఒకరు చేయాలనుకున్నట్లయితే, ఏదైనా మార్పు చేయాలని వారు అనుకొని సంఘము ఎదుటకు అది తీసుకొనిరాగా, దానిని సంఘము ఏకీభవించాలి. సంఘము యొక్క అభిప్రాయానికి, మన యొక్క అభిప్రాయానికి ఏదో కొద్దిగా తేడా ఉన్నట్లయితే, ఆ అభిప్రాయాన్ని మనము వదులుకోవాలి. మన యొక్క ఐక్యతకు ఒక్కటే ఒక మార్గమున్నది. నీవు వెళుతున్న మార్గమునందే ఐక్యత కలిగి ఉండి ఈ సంఘము వెళ్ళుచునట్లయితే, మనము సంఘీభావము కలిగి ఉంటే, అది ఆయన చేస్తున్నదానికి అతీతమై ఉంటుంది. మనము సంఘీభావము కలిగి ఉండాలి. ఒకరియెడల ఒకరు అలా ఉండాలి. ఆ విధంగా దేవుని యొక్క హస్తాలలో ఉండవలసియున్నది.

41

ఆ తర్వాత మనము నమ్మదగిన దేవుని యొక్క వాక్యమును బోధించగల ఒక మనుష్యుని తీసుకోవాలి. ఆ మనిషి అలా చేయనట్లయితే, అలా చేస్తే ఇంకొకరిని తీసుకోవాలి. అలా మనము చెయ్యాలి. మంచివాటి కొరకు ధర్మకర్తలు నిలబడనట్లయితే, మంచిదానికై నిలబడు మరొకరిని ఎన్నుకొనుట నీ బాధ్యత అవుతుంది. అది మీరు చేసిన తర్వాత దాని కొరకు నిలబడుడి. అది మీకు ఇవ్వబడినది దానిపై నిలబడండి మనమందరము ఒకే ఒక దాని కొరకు నిలబడుతున్నాము; అది ఏదనగా అది దేవుడే!

ఒక సభ్యుడు తప్పు చేస్తే అతనిని నెట్టివేయవద్దు; అతనికి సహాయం చేసి అతనిని పైకి తియ్యండి. అతను దగ్గరకు చేరి అతనితో సంభాషణ చేయండి, ఆ విధంగా లేఖనము తెలియజేస్తుంది. మనము ఒక తప్పిదము చేస్తే దేవుని యొద్దకు చేరలేము. మనము దేవుని యొద్దకు వెళ్లక ముందే మనము ఎవరిని గాయపరిచామో వారి యొద్దకు వెళ్లవలెను.

42

నేను అలా చేయవలసి ఉన్నది. నేను తప్పు చేసానని నాకు తెలుసు. నేను అబద్ధమాడను. నా భార్య అబద్ధమాడటానికి కారకుడినవుతున్నాను. నేను ఇక్కడ సంఘములో అది చెప్పాననుకొంటున్నాను. అది కొద్ది దినాల క్రితమే, 6 వారాలవుతుంది. న్యాయవాదులు ఆ విచారణ విషయమై నన్ను ఎంతగానో గాయపరిచారు. చివరకు నేను ఎక్కడ ఉన్నానో నేను తెలుసుకోలేనంతగా నన్ను గాయపరిచారు. నేను మధ్యాహ్నం భోజనం చేయుట కొరకై నేను ఆఫీసు నుండి ఇంటికి వెళ్లాను. టెలిఫోన్ నెంబర్ మోగింది. మిడా జవాబు ఇచ్చుట కొరకై ఫోన్ దగ్గరకు వెళ్లింది. ఆమె చేయి దానిపైన పెట్టి, “మాట్లాడుతున్నవారు న్యాయదియే,” అని అన్నది.

నేను సాయంకాల వేళ నడవలేకపోయాను. నా తల వూడిపోయినట్లుగా ఉన్నది. మనస్సు తిరిగిపోతుంది. నాతల అటు ఇటు, ఇటు అటు వూగుతున్నది. “నేను సహించలేను” అని అన్నాను. నేను ఎగిరి దూకి ఇక్కడ లేను,“ అని చెప్పి ఇంటి వెనకకు వెళ్లిపోయాను.

నేను తిరిగివచ్చినప్పుడు ఆ విషయాలు గూర్చి మిడా తన మనస్సాక్షి నొచ్చుకున్నది. ఆమె ఏడుస్తూ తలుపు దగ్గర నన్ను కలుసుకున్నది. బిల్లీ, అలా చేయడం మంచిపనేనా,“ అని నన్ను అడిగింది.

ఇక నీవు ఏ విధంగా ఉంటావో నీకు తెలుసు, నీవు ఎలా ఉంటావో నాకు తెలుసు. “ఆ సమయంలో నేను అక్కడ లేను,” అని చెప్పాను. అందువలన దేవుడు నన్ను గద్దించాడని నాకు తెలుసు. “నేను ఇక్కడ లేను కదా,” అని చెప్పాను.

అతడు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నీవు ఇక్కడ ఉన్నావు,“ అని ఆమె అన్నది.

43

ఆ రోజు మధ్యాహ్నవేళ వ్యాధితో ఉన్న ఒక అబ్బాయికి ప్రార్ధించుటకు బయలుదేరుతున్నాను. ఇంట్లో నుండి బయటకు అడుగు పెట్టక ముందే మరలా ఫోన్ మోగింది. చిన్నవాడైన జోసఫ్ పరిగెత్తుకొంటూ వెళ్లి, ఫోన్ పట్టుకొని, “డాడీ, నీవు ఇక్కడ లేవని చెప్పమంటావా?” అని అన్నాడు. పాపము ఎంతటి వినాశనాన్ని కలుగజేస్తుందో చూడండి. చివరకు అది ఎటువంటి కుటుంబం అవుతుంది?

I యోహను పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చెబుతుంది, “మన హృదయము మనయెడల దోషారోపణచేయనియెడల, దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము.” మన హృదయము మనలను దోషులుగా చేసినట్లయితే, దేవుని యెడల ఎలా మనకు నమ్మకం ఉంటుంది. పాపము ఉనంతకాలము, అనగా ఒప్పుకోలు కలుగనట్లయితే, ఆయన మన మనవి వినడు అని మనకు తెలుసు. అది గొప్ప విషయం, అయితే ఈ విషయాలు సంఘానికి కావాలి.

44

ఆ తర్వాత ఆ బాలుని కొరకు ప్రార్ధించాను. ఆ బిడ్డ మీద చేతులు పెట్టుటకు ప్రారంభించగానే, ప్రభువు నన్ను గద్ధించి, “నీవు అబద్ధం చెప్పావు. ఆ బాలుడు కొరకు ప్రార్ధించుటకు నీవు పాత్రుడువు కాదు,” అని అన్నాడు.

నేను ఆ వ్యక్తి వైపు తిరిగి, “అయ్యా, ఇక్కడే వేచియుండండి, నేను ఒకటి సరిచేసుకొని వస్తాను,” అని నేను అన్నాను.

నేను ఆఫీసుకి వెళ్లి, న్యాయవాదిని పిలిపించి, నేను ఇలా చెప్పాను, “చూడండి, నేను అబద్ధం చెప్పాను. నా భార్య అబద్ధం ఆడుటకు కారకుడినయ్యాను. నేను ఇక్కడ లేనని ఆమె చెప్పింది. నేను ఇంటి వెనుకకు పరిగెత్తుకొని వెళ్లాను,” అని నేను ఆ విషయాన్ని ఒప్పుకున్నాను.

అతడు వచ్చి నా భుజాలపై చేతులుంచి ఇలా చెప్పాడు, “సహోదరుడా బ్రెన్హా౦, ఎల్లప్పుడు నీ మీద నాకు విశ్వాసమున్నది. ఇప్పుడైతే అప్పటి కంటే ఎక్కువ విశ్మాసమున్నది.” తన తప్పిదాలను సరిచేసుకునే మనుష్యుడు,“ అని ఆయన అన్నాడు.

అతనితో నేను ఇలా చెప్పాను, “నేను ఒక బిడ్డ కొరకు ప్రార్ధిస్తుంటిని ప్రభువు నా హృదయమును గద్దించాడు, ఎందుకనగా నేను తప్పు చేసాను.

ఆ తర్వాత రోజు నా భార్య అడిగింది, నీవు ఎక్కడకు వెళుతున్నావు?“ అని అడిగింది.

“నా గుహ దగ్గరకు వెళుతున్నాను,” అని చెప్పాను.

45

ఎక్కడికైతే సంవత్సరాలు తరబడిగా వెలుతున్నానో, ఆ చార్లెస్-టౌన్ కు ఆవల ఉన్న నా గుహకు వెళ్లాను. నేను అక్కడకు చేరుకొని దినమంతా ప్రార్ధించాను, “ఓ దేవా, అలాంటి కార్యమును నేను ఎన్నడు చేయకుండా ఉండుటకు నాకు సహాయం చేయండి. ప్రభువా, నన్ను క్షమించు, ఎందుకనగా వ్యాధిగ్రస్తుల మీద చేతులుంచి ప్రార్ధించగానే, నేను దోషిగా గద్ధించబడితిని. సాయంకాలం మూడు గంటల వరకు, అలా ప్రార్ధించి బయటకు వచ్చాను. ఒక పెద్ద రాయి బయట ఉన్నది. ఆ రాయి పై కూర్చొని తూర్పు దిశగా చూస్తూ, చేతులెత్తి ప్రభువును స్తుతించాను. అక్కడ చాలా నిశ్శబ్దంగా ఉన్నది. నేను ఇలా చెప్పాను, ప్రభువా, నీకు అంగీకారమైతే మోషేను బండ సంధులలో నీవు ఉంచినప్పుడు, నీవు అతనిని దాటి వెళ్లితివి. అది నరుని యొక్క వీపు బాగముగా కనిపించినది. ”ప్రభువా, నీవు మరలా అది చేస్తావా?“ అని అడిగాను. తద్వారా నన్ను క్షమించావని తెలుస్తుంది. ఇంకా నేను ఇలా చెప్పాను, ”నీ అనుగ్రహము చూపించి, నా హృదయంలోనికి రండి. నేను మానసికంగా గొప్ప బలవంతుడను కాదు,“ అని చెప్పాను. ”ఎందుకనగా నాకు విద్యలేదు, నేను నీ పరిచర్య చేయ ప్రయత్నిస్తున్నాను,“ అని చెప్పాను. ”నా హృదయమును నీవు ఎరిగియున్నావు,“ అని అన్నాను. ”నేను అలాంటిది చేయాలని నా తలంపు కాదు. నా తల వూడిపోతున్నట్లుగా అనిపిస్తుంది. నేను భయపడిపోయాను. సాతానుడు పట్టుకొనిన ఒక క్షణములో నేను అది చేసాను. నీవు నన్ను క్షమిస్తే, నన్ను చూడనివ్వండి,“ అని అడిగాను.

46

దేవుడే నా యొక్క తీర్పరి, నా ప్రక్కనే ఉన్న ఒక చిన్న స్థలములో ఉన్న పొద గాలివలన కదులుతున్నది. నేను ఎక్కడ ఉన్నానో ఆ గృహ ప్రక్క నుండి వచ్చింది. అడవులు గుండా ఆ చెట్ల గుండా వెళ్లిపోయినది. ఓ సోదరుడా, సమస్త జ్ఞానానికి మించిన సమాదానము నన్ను ఆవరించినది. నేను ఏడ్చాను, కేక వేసాను, పెద్దగా అరిచాను. నా పాపాలు క్షమించబడినవని నేను తెలుసుకున్నాను. చూచారా, నేను దేవునితో అనైఖ్యతచెంది ఉంటిని; నేను ఆ బిడ్డకు విమోచన ఇవ్వలేకపోతిని.

47

ఆ మరుసటి దినమే చికాగో నుండి ఒక మనుష్యుడు వచ్చాడు, అతడు గొప్ప వ్యక్తి, అప్పుడే కేతలిక్కు నుండి మార్పుచెందినవాడు. అతనికి గుండె కవాటాలు ఉబ్బి లోపలి గొట్టము లావైనది, ఎంతో కాలము నుండి వారు దానిని కత్తిరించి వేయాలనుకుంటున్నారు, అయితే అలా చేయడానికి అతను అంగీకరించలేదు. చిట్ట చివరకు సంభాషణ సమావేశం జరిగినది. ఆ సమావేశంలో అసలు ఎక్కడ ఈ జబ్బు ఉన్నదో తెలుసుకుందామని నిశ్చయించుకున్నారు. అతడు లోపలకు రాకముందే అతడు కేతలిక్కు సంఘములో చిన్న బాలుడై ఉన్నప్పుడు వేదికయొద్ద తన జీవితంలో తాను చేసిన దానిని పరిశుద్ధాత్మ గుర్తుచేసాడు. అతడు అన్నాడు, “అది సత్యమే. అది నిజంగా సత్యమే. అది నాకు వ్యతిరేకమైనదని మీరు అనుకొంటున్నారా?” అని అన్నాను.

“నీ బ్రతుకులో నీడను మాత్రమే నేను చూస్తున్నాను,” అని అన్నాను.

అతడు తిరిగి వెళ్లి వైద్యునితో, “సరే, మంచిది, అన్ని సంసిద్ధం చేయుడి శస్త్రచికిత్స చేద్దాము,” అని అన్నాడు.

“మునుపు ఉన్నటువంటి దానినే మరలా పరీక్షిద్దాము,” అని వైద్యుడు అన్నాడు. అందులో అతడు చూచి, “నీకు శస్త్రచికిత్స అవసరం లేనే లేదు,” అని అతడు చెప్పాడు.

48

చూడండి, “మన హృదయము మన యెడల దోషరోపణ చేసినట్లయితే.” మనకు సంపూర్ణ విడుదల కావాలి. మనము సగం సంఘముగా ఉండకూడదు. మనము నిజమైన సంఘముగా ఉందాము లేదా సంఘము లేకుండా ఉందాము. మనము నిజమైన క్రైస్తవులుగా ఉందాము లేకుంటే ఏనాటికీ క్రైస్తవులుగా ఉండవద్దు. మనకు సంపూర్ణ విడుదల కావాలి. మన అలవాట్ల నుండి, మన పాపముల నుండి సంపూర్ణ విడుదల కావాలి. మన యొక్క నిర్లక్ష్యము నుండి మనము ఏమి చేసామో వాటన్నిటి నుండి మనకు సంపూర్ణ విడుదల కావాలి. తద్వారా ప్రజలు ఈ సంఘానికి ప్రార్ధన చేయించుకోవడానికి రాగా, ఈ చిన్న మంద ఇక్కడ కూర్చుంటారు. ఒకవేళ 100 లేక 200 మించకపోవచ్చు, అయితే వారు సంపూర్తిగా దేవుని హస్తాలలో ఉంటారు. అప్పుడు మనము ప్రార్ధించినప్పుడు ఆకాశము నుండి దేవుడు ఆలకిస్తాడు. “నేను ఆయన యందు నమ్మిక ఉంచాను, అని చెప్పు ఒకరు దేవునికి అవసరం. రుగ్మతతో ఉన్న ఈ సేవకునిని జెఫర్సన్ విల్లో ఉన్న బ్రెన్హాం టేబర్నికల్ కు పంపగలను మరియు ఆ ప్రజలందరూ ఏకమనస్సుగలవారు,” అని దేవుడు తన యొక్క హస్తాలలో ఉంచుకున్న ఒక మనిషి దేవునికి కావాలి. ఒకటి జరిగి తీరుతుంది.

49

మంచిది, మనకున్న స్థితిగతులలో ఆయన మన కొరకు ఏమి చేసాడో చూడండి. మనము ఏక మనస్సుగలవారమై, ఏక హృదయంతో ఉంటే ఆయన ఏమి చేస్తాడో చూడండి. సోదర ప్రేమతో మన హృదయాలు ఏకము చేసుకోవాలి. సంఘ అధికారులకు, సంఘ కాపరులకు లోబడుడి. కాపరి దేవునికి లోబడతాడు. అప్పుడు సంఘ కాపరి ద్వారానే దేవుడు సంఘములో పని చేస్తాడు. అప్పుడు అందరం కలిసి దేవుని రాజ్యము కొరకు ఒక బాగముగా పని చేయవచ్చు. మనము ఐక్యతతో సమాజంగా ఉన్నట్లయితే, అప్పుడు దేవుడు ఆలకిస్తాడు. దేనికొరకు, భీతిచెందవద్దు. దేనికొరకు అధైర్యపడవద్దు.

ఇప్పుడు, ఆ దేశాన్ని స్వాధీన పరుచుకొనుటకై దేవుడు అలాంటి వ్యక్తిని అభిషేకించాడు. మోషే సంపూర్ణమైనవాడు; రాజీపడే మనుష్యుడు కాదు. గడబిడలు, బొబ్బరింతలు వచ్చినప్పుడు అతడు రాజీపడలేదు. అలాంటిదే దేవుడు మన యెడల కోరుతున్నాడు.

50

ఒక విధంగా ఫరో ఇలా అంగీకరించాడు, “మోషే, మీరందరూ వెళ్లవచ్చు, అయితే మీ బిడ్డలను విడిచి వెళ్లండి, లేదా ఇక్కడ మీ పశువులను కొన్నింటిని విడిచి వెళ్లండి,” అని చెప్పెను.

క్రైస్తవుడు ఆ విధంగా ఉండాలని దయ్యము ఆశిస్తున్నది. “నీవు సంఘములో చేరడం మంచిదే అయితే జోన్స్ ను మాత్రము క్షమించవద్దు. నీవు వారిని తీసుకొని వచ్చుట మంచిదే. నీవు సంఘానికి వెళితే వెళ్ళు, కాని నీవు పొగత్రాగు అలవాటును విడిచి పెట్టకు సుమా... నీ తాగుడు అలవాటును నీ దొంగతనాలను, నీ అబద్ధాలను విడిచిపెట్టవద్దు. నీ తప్పులు పట్టే అలవాట్లు చాడీలు చెప్పే దానిని నీవు విడిచి పెట్టవద్దు. కేవలం సంఘములో చేరితే చాలు.”

అయితే మోషే రాజీపడేవాడు కాదు; అతనికి సంపూర్ణ విడుదల కావాలి. “చిట్ట చివరకు ఒక్క డెక్క కూడా విడిచి పెట్టము,” అని చెప్పెను. “మేము ప్రభువును ఆరాధించడానికి వెళ్లినప్పుడు మాకు కలిగిన వాటన్నింటిని తీసుకొని వెళ్ళెదము.”

51

ఆ విధంగా సంఘము ఉండవలసి ఉన్నది, “మేము నీతిని తీసుకొని వెళతాము, మేము పరిశుద్ధతను తీసుకొని వెళతాము; మేము పరిశుద్ధాత్మను తీసుకొని వెళతాము, మేము ఐక్యత గలవారిని తీసుకొని వెళతాము, మేము వేదిక యొద్దకు వెళ్లినప్పుడు అలా వెళతాము. మేము వాస్తవమైన గుంపు, మేము ఏదీ వదిలి పెట్టము. మేము సమస్తము తీసుకుంటాము. ఎటువంటి డెక్క కూడా వెనుకబడటానికి వీలులేదు.” మీకు తెలుసా, మరియు దయ్యము ఓడిపోవు వరకు ప్రజలు ఆ విధంగా ప్రార్దించగలరు.

52

ఆ విధంగా మోషే, అతని వర్గం వారు అలా చేసారు. వారు అక్కడకు చేరారు మరియు రక్తము క్రిందకు వారు వచ్చారు. రక్తము క్రిందకు వారు వచ్చేవరకు వారికి సంపూర్ణ విడుదల లేనేలేదు. మోషే తనకు తాను దేవునితో ఐక్యం చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులైతే అలా కాదు, వారు ఇంకా పాపమందే ఉన్నారు, మరియు వారు మోషేను చూచి సణిగారు. “నీవు ఎందుకు ఇది చేస్తున్నావు? నీవు ఇంతా మా మీదకి ఎక్కువ బాదలు తెస్తున్నావు,” అని అన్నారు; ఎందుకనగా ఫరో వారి యొక్క ఇటుకలను రెండంతలు ఎక్కువ చేసాడు. మోషే సంపూర్తిగా దేవుని హస్తాలలో ఉన్నాడు. దేవుని గొర్రెలను కాయుట కొరకై (తన స్వంత గొర్రెలను కాయుట మానివేసాడు). అతడు తనకు తానుగా సంపూర్తిగా విడుదల పొందాడు; జనులైతే సంపూర్ణ విడుదల పొందలేదు, ఎందుకనగా వారిలో ఇంకా సణుగులు, గొణుగులు ఉన్నాయి.

53

ఒక రాత్రి గొర్రెపిల్ల చంపబడాలని దేవుడు నిశ్చయించాడు — అది క్రీస్తుకు సాదృశ్యము — రక్తములో హిస్సోపులో, రెల్లులో (అది చాలా సాధారణమైనది, తగ్గింపు గలది) ముంచి; గడప పై కమ్ములకు పక్కలకు పూసిరి; అదే ఇశ్రాయేలీయులు సంపూర్ణంగా విడుదల పొందుటయే ఉన్నది, ఒక డెక్క కూడా విడిచి పెట్టబడకూడదు. వారికి కలిగినదంతా విడిపించబడినది. వారి కుటుంబాలు, వారి ప్రియులు, ఆ రక్తము క్రిందకు వచ్చినప్పుడు వారు సంపూర్తిగా విడిపించబడిరి.

54

అప్పుడే సంఘము సంపూర్తిగా విడుదల పొందుతుంది, ఎప్పుడైతే నీవు రక్తము క్రిందకు వస్తావో అప్పుడే సంపూర్ణంగా విమోచించబడతావు. నీ యొక్క పాపములు ఎప్పుడైతే రక్తము క్రిందకు వస్తాయో, నీ పొగత్రాగు అలవాటు, నీ పేకాట అలవాటు, నీ మోసం చేయు అలవాటు, నీ దొంగతనపు అలవాటు, నీ అబద్ధపు అలవాటు - ప్రతీదీ రక్తము క్రిందకు వచ్చినప్పుడే, సంపూర్ణమైన విడుదల కలుగుతుంది. నీవు ఎవరి యెడలైనా పొరపాటు చేసావా? వారి దగ్గరకు వెళ్లి సరిచేసుకో. నీవు దానిని రక్తము క్రిందకు తీసుకొని రాలేవు; అది నిలబడదు. నీవు తీసుకొని రావాలంటే చేయుటకు ఒకటి అనుమతించును. నీకు నీవుగా నిండారుగా రాబడినప్పుడే సంపూర్ణ విమోచన కలుగుతుంది. నీవు ఎన్నడు మునుపు ఎరుగనటువంటి స్వాతంత్రం నీకు కలుగుతుంది. ఎప్పుడైతే నీవు రక్తము క్రిందకు తీసుకొని రాబడతావో, అప్పుడు ఆ రక్తము నిన్ను దేవుని రాజ్యము కొరకు అడ్డగించుకొనుటకై తీసుకొని వస్తుంది. అప్పుడే నీకు నిజమైన సంపూర్ణ విడదల కలుగుతుంది.

55

యేసు సంపూర్ణంగా మనుష్యుడే, మనిషి మాదిరిగానే ఆయన ఏడ్చాడు; ఆయన మనిషి మాదిరిగానే భుజించాడు; ఆయన మనిషి మాదిరిగానే అయ్యాడు. ఆయన యొక్క భౌతిక ఉనికి యందు, ఆయన సంపూర్ణంగా మనిషై ఉండెను. ఆత్మయందు ఆయన సంపూర్ణంగా దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయనలో ఉన్న ఆత్మకు శరీరాన్ని లోబరిచాడు. చూడండి మనవలే ఆయన అన్ని విషయాలలో శోధించబడ్డాడు. ఆయన మనుష్యుడు, దేవదూత కాదు. ఆయన ఒక మనుష్యుడై ఉండెను, మనకు ఉన్నట్లుగానే శోధనలు, ఆశలు ఆయనకు ఉండెను. ఆయన అలా చేసెనని బైబిల్ తెలియజేస్తుంది. ఆయన మనుష్యుడు, శోధనకు అతీతుడైన దేవదూత కాదు. హెబ్రీ 1:4లో ఇలా చెప్పబడినది, “దేవదూతల కంటే ఆయన తక్కువ వానిగా చేయబడెను.” ఆయన మనుష్యుడు, సంపూర్ణంగా మానవుడు. మానవుడిని సంపూర్ణంగా విడుదల చేయుట కొరకై దేవుడు సంపూర్ణ మానవుడిని తీసుకున్నాడు, ఆయన యొక్క ఆత్మతో ఆయనను నింపెను; కొలతలేని పరిశుద్ధాత్మ ఆయలో ఉండెను. మనవలే ఆయన శోధించబడెను. ఆయన సంపూర్తిగా దేవుడై ఉండెను. చనిపోయిన వారిని తిరిగి ఆయన బ్రతికించినప్పుడు ఆయన దానిని రుజువు చేసాడు. ఆయన ప్రకృతిని నిమ్మలపరిచాడు, బలమైన గాలులను గద్ధించి సముద్రమును నిమ్మలపరిచాడు. ఆయన చెట్లతోను మొదలైన వాటితో ఆయన మాట్లాడినప్పుడు, అవి ఆయనకు లోబడెను. అంతరంగమందు ఆయన దేవుడు. ఆయన నరుడు కావలసి వచ్చెను, ఎందుకనగా ఆయన మానవుడు, ఆయన సంపూర్ణంగా, నిండారుగా తన్నుతాను (మనిషి వలే) అప్పగించుకొనెను. దేవుని పరిచర్య కొరకై దేవుని హస్తాలకు ఆయన అప్పగించుకొనెను.

56

ఆయన మనకు మాదిరియై ఉండెను, మనము స్త్రీ మరియు పురుషులము. మనము క్రైస్తవులము. ఆయనే మన మార్గదర్శి, మనలను మనము సంపూర్ణంగా పరిశుద్ధాత్మ హస్తాలకు అప్పగించుకుందాము. దేవుని రాజ్యం యొక్క పౌరులమగుట కొరకై అలా అప్పగించుకుందాము.

ఆయన సంపూర్ణంగా మనుష్యుడు, ఆయన సంపూర్ణంగా దేవుడు, అయితే ఆయన తన భౌతిక అవయవాలను అర్పణ చేసుకున్నాడు. ఆయన యొక్క స్వంత ఆలోచనలు, ఆయన యొక్క స్వంత క్రియలు, ఆయన యొక్క స్వంత బద్రతను అర్పణ చేసాడు. నా తండ్రికి సంతోషము కలిగించేవే నేను చేయుదును,“ అని చెప్పాడు. అక్కడే మీరున్నారు. మానవుల నుండి ఆయన సంపూర్తిగా తపించబడ్డాడు. యాజకులు ఆయన యొద్దకు వచ్చి గొప్పవారు ఆయన యొద్దకు వచ్చి, ”రబ్బీ, ఫలానా-ఫలానా,“ అన్నారు. వారి సంబంధాలకు వారి సంఘ శాఖలు ఆయనకు లంచమివ్వాలని ప్రయత్ని౦చారు, ఆయన సంపూర్ణంగా విడిపించబడ్డాడు, ఎందుకనగా ఆయన దేవుని యందు నమ్మిక ఉంచాడు.

కీర్తనీయుడు ఇలా చెబుతున్నాడు, “ఆయన నాయందు సంపూర్ణంగా నమ్మిక ఉంచాడు కనుక నీవు ఆయనను తపించితివి.” చూశారా? “ఆయన నాయందు నమ్మిక ఉంచాడు కనుక కుక్కల బలము నుండి నా ప్రాణప్రియుని నేను విమోచించెదను.”

57

మనము జీవిత యాత్ర అంతమందు ఆఖరి గడియలకు, ఆ సమయానికి వచ్చినప్పుడు — అది నాకు కావాలి; అది మీకు కావాలని నాకు తెలుసు — ఆయన అలా నన్ను గూర్చి చెప్పాలి, “మరణ కోరల నుండి నేను అతనిని తప్పి౦చెదను, ఎందుకనగా అతడు నాయందు నమ్మిక ఉంచాడు. ఆ పునరుత్థాన ఉదయవేళ నేను ఆయనను సమాధి నుండి విడిపించెదను. ఆయన శరీరములో ఉన్న ఆత్మను సంపూర్ణంగా విడిపించెదను, ఎందుకనగా ఆయన నాయందు నమ్మిక ఉంచాడు.

58

యేసు కార్యాలని సంపూర్ణమైనవే, ప్రతీదీ సంపూర్ణమైనదే, సంపూర్తిగా విడిపించబడెను. కుష్ఠ రోగి సంపూర్ణిగా విడిపించబడెను. రక్తస్రావం గల స్త్రీని, రక్తస్రావము నుండి సంపూర్తిగా విడిపించెను. ఆ పాప ప్రాయశ్చిత్తార్ధ దినాన పాపము నుండి లోకమును సంపూర్తిగా విడిపించెను. సంఘమును ఆయన విడిపించెను. ఇక మనము దరిద్రులుగా నివసి౦చనవసరంలేదు. ఇక పడిపోయిన జీవితమును జీవించనవసరంలేదు, ఎందుకనగా ఆయన దయ్యాన్ని ఓడించాడు. కాబట్టి ఆయన సమస్తమైన ఆధికారములను, బలములను, సమస్తమైన వాటిని ఆయన పాదముల కింద ఉంచెను. అవి నీ మీద అధికారము చేయుటకు చట్టరిత్యా అధికారము లేదు. మనము పరిశుద్ధాత్మతో నింపబడిన క్రైస్తవులము. సాతానుకు మానపై అధికారము లేదు. క్రీస్తు మనలను విడిపించెను, సంపూర్తిగా విడిపించెను; కీడు నుండి మనలను విడిపించెను, పాపము నుండి మనలను విడిపించెను,(చెడు)అలవాట్ల నుండి విడిపించెను, (చేడు) మాటల నుండి మనలను విడిపించెను, దుష్టత్వము నుండి పలు విధములైన మురికి క్రియల ను౦డి మనలను విడిపించెను. మనలను సంపూర్తిగా విడిపించి, ఆయన పరిశుద్ధ హస్తాలలో మనలను పెట్టెను, అదే సర్వ సంపూర్ణమైన విమోచన.

59

మన రోగములకు ఆయన విడుదల ఇచ్చును. మన రోగముల నుండి ఆయన విడిపించును, అందుకొరకై మనకు క్రీయాశీలత కలదు. హల్లేలూయ! “మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, ఆయన పొందిన దెబ్దల చేత మనకు స్వస్థత కలిగినది.” ఆయనే మన స్వస్థపరచువాడు. అందుచేతనే పోలియో జబ్బుతో ఉన్న ఆ స్త్రీ, కాన్సర్ తో మృత్యువాత పడుచున్న భర్తను జాగ్రత్తగా చూచుకొనుటకు ప్రయత్నము చేయుచున్నది, ఆమె దేవుని యొక్క సన్నిదానంలోని మండలమునడకు నడచినది. ఆమెకు విశ్వాసము కలదు. వైద్యులు తమ సాయశక్తుల తమ పనిని తాము చేసారు, కావున ఆమె దేవుని యొక్క నియమావళిని పాటించి మరియు సంపూర్తిగా విడిపించబడినది.

60

శిష్యులు సంపూర్తిగా విడిపించబడ్డారు, కచ్చితంగా సంపూర్ణంగా విడిపించబడ్డారు. ఎందుకని? ఎందుచేతననగా సర్వసంపూర్ణంగా పరిశుద్ధాత్మను పొందినప్పుడు వారు విమోచించబడ్డారు. నీవు కేవలం సంఘ సభ్యునిగానే ఉండి పాస్టర్ గారితో కర స్పర్శ చేసిసప్పుడు లేక ఎగిరి కేకలు వేసి భాషలతో మాట్లాడి, ఏదో చిన్న అనుభూతిని పొందుట ద్వారానా; హృదయంలో ద్వేషము ఉంచుకొని, వింత కార్యాలను చేస్తూ అబద్ధాలు చెబుతూ, సిగరెట్లు తాగుతూ, స్త్రీ వ్యామోహంతో ఉంటారు; ఒకటి ఇంకా జరగలేదు; ఒకటి ఏదో తప్పున్నది, “లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించకుడి, వానిలో దేవుని ప్రేమ ఉండదు.” నీవు పొరపాటుగా నడిపించబడితివి. “మీరు వారి ఫలముల వలన వారిని మీరు తెలుసుకుంటారు.”

61

మనమందరము కూడా పరిశుద్ధాత్మతో ఐక్యత కలిగినవారమై ఉండాలి అని కోరుదుము. ప్రతి సభ్యుడు ఒకరి యెడల ఒకరు ఐక్యత కలిగినవారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడినది; ప్రతి అవినీతి నుండి మనలను కడిగి వేస్తుంది; లోక కార్యాల నుండి మనము విడిపించబడియున్నాము. “మీరు ఒకరి యెడల ఒకరు ప్రేమ కలిగి ఉండుట ద్వారా ఇందు మూలముగా మీరు నా శిష్యులని తెలియబడుదురని,” యేసు చెప్పెను. ఒక సభ్యుని కొరకు మరొక సభ్యుడు మరణించునంతవరకు ప్రేమను కలిగి యుండుట.

62

బాహ్య ప్రపంచంలో ఒక చెడు ప్రారంభముకాగానే, ఏదో ఒక అమ్మాయి వచ్చి ఇలా చెబుతుంది, “ఇదిగో ఇలా చూడు, నీవు ఇది అది చేసినట్లయితే బాగుండును, అది చేస్తే బాగుండును, ఇది వేసుకుంటే బాగుండును లేక అది, లేక ఆ పరిశుద్ధ గుండ్రాళ్ళ నుండి నీవు ప్రక్కకు తప్పుకో,” అని ఏదో చెబుతుంది.

మనము దేవునితో ఎంతో ఐక్యత కలిగి ఉన్నాము! “మంచిది, సహోదరుడా బ్రెన్హాం, అది ఎంతో ఎక్కువైన శోధన.” అయితే ఆ ఉద్దేశ్యం కొరకే క్రీస్తు చనిపోయాడు. దయ్యం ఓడిపోయినది. మనకు సంపూర్ణమైన విడుదల కావాలి. పరిశుద్ధమైన, నిర్మలమైన, నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తముతో కడగబడిన సంఘము మనకు కావాలి. పరిశుద్ధాత్మతో నింపబడి, అద్భుతములు, ఆశ్చర్య కార్యాలను చేయగలిగిన సంఘము మనకు కావాలి. [టేపు పై ఖాలి.].... ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన విడుదల కావాలి.

63

ప్రియమైన దేవా, సంపూర్ణంగా విడిపించబడిన సంగతులను నీవు అంగీకరించావు. కళంకములతో ఉన్న అర్పణలను నీవు అంగీకరించవు. ఒక వ్యక్తి జీవితంలో పాపముండగా, ఆ వ్యక్తి ప్రార్ధనను నీవు అంగీకరించవు. ప్రభువా, నీవు అలా చేయవు. గతించిన కాలంలో నీవు అలా చేయలేదు. నేడు నీవు అది చేయవు. అర్పణ నిష్కళంకమై ఉండవలసియున్నది. ప్రభువైన దేవా, మమ్ములను మేము బలిపీఠము పై అర్పణగా చేసుకొంటున్న జీవితాలుగా అర్పణ చేసుకుంటున్నప్పుడు, ప్రభువా మాలో నుండి సమస్త నిందాస్పదమైన పాపములను తీసివేయండి. నేను సంపూర్తిగా నా యొక్క శరీరమును, నా యొక్క ప్రాణమును, నా యొక్క ఆత్మను, నా కార్యకలాపాలను అప్పజొప్పుకొంటున్నాను. వేదిక యొద్ద ఈ సంఘముతో కలిసి అలా అప్పగించుకొంటువున్నాను. నీ రక్తము చేత మమ్ములను కడగండి. మేము చేసిన ప్రతి పాపమును క్షమించండి. ఆ యొక్క గొప్ప పరిశుద్ధాత్మ మాలో విస్తారంగా నివసించును గాక, ఈ ఉదయవేళ ఈ మందిరంలో నుండి ఆయన యొక్క సన్నిది మాతో వచ్చును గాక. తద్వారా ఆయన మమ్ములను మన్నించాడని తెలుసుకోగలము. “మాకు వ్యతిరేకంగా పాపము చేసిన వారిని మేము క్షమించినట్లు, మా అపరాధములు క్షమించండి.” ప్రభువా, అనుగ్రము చూపండి.

ప్రభువా, మాకు సమీపంగా రండి, మమ్ములను ఆశీర్వదించండి, తిరిగి ఈ సాయంకాలం మేము కలిసేవరకు మమ్ములను బద్రపరచండి. మీరు మమ్ములను తోసిపుచ్చకుండా ఉండులాగున మేము పరిశుద్ధ హృదయాలతో శుద్ధ హస్తాలు గలవారమై మేము తిరిగి వచ్చుదుము గాక. ప్రభువా, ఏ విషయంలోనైనా మాకు నిండైన విమోచన కావాలి. అది లోకానికి మమ్ములను వెలుగుగా చేస్తుంది; కుంచము క్రింద పెట్టబడిన దీపము కాక, కొండపైన పెట్టబడిన దీపమై ఉంటుంది, కాని కొండ మీద ఉన్న దీపము, అది ప్రజల పాదములకు మంచి వెలుగు, మంచి దానివైపు నడిపించుటకు కొండ మీద ఉన్న దీపము ప్రజల పాదములకు వెలుగుగా ఉంటుంది. తండ్రీ, అనుగ్రహము చూపండి. ఆయన మహిమ కొరకై యేసు నామమున ప్రార్ధిస్తున్నాము. ఆమేన్.

64

సోదరుడా డాక్ నిన్ను అడగాలనుకొంటున్నాను, ఆయన వెనుక ఉన్నాడని అనుకొంటున్నాను, లేక ఎవరైనా డీకన్ లు ఇక్కడ ఉన్నారా, సంఘము ఇది పఠణము చేయును. డాక్, ఇక్కడకు వచ్చి దానిని వార్తల బోర్డులో ఉంచండి. తిరిగి వెలుతున్న ప్రజలు దీనిని చూచెదరు. సోదరుడు కాలిన్స్ ఇక్కడ ఉన్నట్లయితే... సోదరుడు కాలిన్స్ లోపల ఉన్నాడా? అతనికి ఇంకొకటి ఇవ్వండి.

అయ్యా, మంచిది, అది ఏంటో మనం చూద్దాము... [సోదరుడు బ్రెన్హాం మాట్లాడుట ఆపిరి.] ఒకరు మాట్లాడాలని కోరుతున్నారు. అది ఎల్లప్పుడూ అంగీకారమే, మేము దానిని సంతోషంగా అంగీకరిస్తాము. నన్ను కలుసుకునే సందర్శనా సమయాలు ఉన్నవి. చూడండి, మీరు చేయవలసినది ఏదనగా, మా నెంబరు పిలవాలి మా ఇంటి దగ్గర చాలా గందరగోలంగా ఉంటుంది. సంఘానికి అది తెలుసు. ఇది కొత్త విషయమా? దానిని గురించి సంఘానికి తెలుసు... చిన్న కాగితపు ముక్క ఉంటుంది. సంఘములోనికి వచ్చే వారికొరకై అది ఉంచుతాను. చూడండి, ఎందరో ఉన్నారు. అందరి యెడల మనము జాగ్రత్త తీసుకోలేము. వారు వరుస సంఖ్యలో రావాలి. చూడండి, మీరు కేవలం బట్లర్ 2-1519. చూడగలిగిన ప్రతి సభ్యుడు కావలసిన వారు ఎవరైనా, నేను ఎప్పుడూ కూడా ప్రజలను సందర్శించడానికి ఆనందిస్తాను, అయితే మనకు క్రమము ఉన్నది. ముందుగానే కొందరు పిలువబడ్డారు, చాలా మంది ఉన్నారు. చూడండి మనము ఒకరి వెనుక ఒకరు రావాలి. అటు-ఇటు, అలా-ఇలా కాకుండ ఇంటికి వెళ్లిన వారు నిరాశపడ్డారు. ప్రతీవారికి క్రమముంటుంది. దానిని గూర్చి ఇప్పుడు మనము మాట్లాడుతున్నాము ప్రతిదానికి క్రమమున్నది. ఈ ప్రియమైన వారిని చూడటానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. కేవలం బట్లర్ 2-1519, -1519, పిలిస్తే చాలు మిస్టర్ మెర్సియర్ లేక మిస్టర్ గోయెద్ ఒకరు మీకు ఫోన్లో జవాబిస్తారు. మీరు ఎప్పుడు కలవాలో మీకు తెలుపుతారు. శీతల వాతావరణం ఉన్న స్థలం అక్కడ ఉంటుంది. ప్రజలను లోపలకు స్వీకరించి వారి కొరకు ప్రార్ధిస్తాము. మేము అది చేయుటకు తప్పక ఆనందిస్తాము.

65

నేను మందిరానికి రావడం లేదని, ప్రజలు నన్ను గురించి ఏమని తలస్తున్నారంటే, నేను ప్రజలకు అందుబాటులో లేకుండా దూరమవుతున్నానని అనుకొంటున్నారు; కాని అది కాదు. నేను తప్పక క్రమములో ఉంటాను. చూచారా, అలాగే ఉండాలని నేను కోరుచున్నాను, పక్షపాతము చూపించడానికి కాదు. ప్రతి ఒక్కరికి ఏ వ్యక్తి అయిన ఎక్కడ ఉన్నా ఏ స్థలమైన, చూశారా, రంగు, జాతి, ఏదీ అడ్డురాదు. మేము నేరుగా ప్రజల యొద్దకు వచ్చి వారిని కలుసుకుంటాము. వారికి అక్కడ ఉన్నాదా? అది జరిగే వరకు ప్రజలతోనే ఉంటాము. కూటాల గూర్చిన వివరాలు తెలుసుకొని దానిని చూచి ఖాళీ చేసుకుంటాము; అది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. అదే మార్గము, అది అలాగేనని నేను అనుకొంటున్నాను. ప్రతి ఒక్కరికి అలాగే ఉండును. అందుచేత, ఎవరి యెడల పక్షపాతమనేది లేదు.

66

ఈ ఉదయవేళ రోగులుగా ఉండి ప్రార్ధన చేయించుకోవడానికి ఎవరైనా వచ్చారా? మంచిది ఎవరూ లేరా? ఆరాదించుట కొరకై మంచి పాట ఒకటి పాడుకుందాము. ఈ ఉదయం ఏం పాడుకున్నాము? “నా పాపములను ఏది తీసివేస్తుంది?” యేసు రక్తము కాక మరొకటి కాదు. టెడ్డి, అది నీకు వచ్చా?[ఒక సోదరి రోగిగా ఉన్న మరొక సహోదరి గురించి ప్రవక్తతో చెబుతుంది.] సరే, సోదరి. ఆమెకు ఇప్పుడే ప్రార్ధించాలా? నేను ఆ స్త్రీ కొరకు ప్రార్ధించబోతున్నాను. ఆ స్త్రీ పై చేతులుంచి ప్రార్ధించనైయున్నాను. నిశ్శబ్దంగా ఒక్క నిమిషం నాతో తలలు వంచండి.

67

ప్రియమైన దేవా, ఎంతో బాధతో ఉన్న ఒకామె అక్కడ ఉన్నది. మా సోదరి దేహము సమర్పించినది, మరియు ఇతరులతో సహా క్యాన్సర్ ను తీసివేయుటకై, ఇతరుల కొరకు ఖాలీలో నిలబడి ఉన్నది. అయితే ప్రభువా, నీవు ఆమెకు విడుదల చేకూర్చుము. కొన్ని దినాల క్రితము అవి తెలియబడినప్పుడు ఆమెను ఆమె తెలుసుకొనును గాక. అది నీ యొద్ద నుండే వచ్చి యున్నదని తెలుసుకొనును గాక. నేను ఆమె పై చేతులుంచి మరొక స్త్రీకి కనికరము కొరకై ప్రార్ధిస్తున్నాను. దేవుని కృప పరిశుద్ధాత్మ శక్తి, ఆ హృదయాలపై కుమ్మరింపబడును గాక. ప్రభువా, మొదటిగా మాకు తెలియజేయండి, అప్పుడు మేము దేవుని దయ కలిగి ఉన్నామని తెలుసుకుంటాము. మాకు దేవునితో సమాధానమున్నది. మేము అడిగినది పొందుకుంటాము, ఎందుకనగా మాకు శిక్షావిధి లేదు, ప్రభువా అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్ధిస్తున్నాము. ఆమెన్. మీకు కృతజ్ఞతలు. మంచిది.

నా పాపమును కడుగునది ఏది?

యేసు రక్తము తప్ప మరొకటి కాదు;

నన్ను మరలా సంపూర్ణునిగా చేయునది ఏది?

యేసు రక్తము తప్ప మరొకటి కాదు.

ఓ, ప్రశస్త రక్తము

అది నన్ను హిమము వలే తెల్లగా మార్చును;

వేరొక ఊట నాకు తెలియదు,

యేసు రక్తము తప్ప మరొకటి లేదు.

68

ఎంత మంది తమ యొక్క పాపములు ఆ రక్తము క్రింద ఉన్నవి అని తలంచుచున్నారు? మనము మన హస్తములను పైకి ఎత్తి పాడెదము.

నా పాపమును కడుగునది ఏది?

యేసు రక్తము తప్ప మరొకటి కాదు;

నన్ను మరలా సంపూర్ణునిగా చేయునది ఏది?

యేసు రక్తము తప్ప మరొకటి కాదు.

ఓ, ప్రశస్త రక్తము,

అది నన్ను హిమము వలే తెల్లగా మార్చును;

వేరొక ఊట నాకు తెలియదు,

యేసు రక్తము తప్ప మరొకటి లేదు.

నీవు ఆయనను ప్రేమిస్తున్నావా?

ఓ, నేను యేసును ప్రేమిస్తున్నాను,

ఓ, నేను యేసును ప్రేమిస్తున్నాను,

(ఇప్పుడు దానితో నిలచియుండుడి, ఇప్పుడు; ప్రతి ఒక్కరు.

దేవుని పట్టుకొని యుండుడి) ఓ, నేను యేసును ప్రేమిస్తున్నాను,

ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను.

ఆయనను నేను ఎన్నడూ విడువను...

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...