రూకలు లేకుండా లేక వెల లేకుండా
VGR COUNT -151 ఈ ఉదయమున తిరిగి ఆలయమునొద్ద యుండుట, అది నిశ్చయముగా ఒక భాగ్యమైయున్నది. నేను కేవలము ఆశ్చర్యపోవుచున్నాను, వెనుక కూర్చొండియున్నవారు అనేక మంది వినలేకపోవుచున్నారని సోదరుడు నెవిల్ చెప్పియున్నాడు. ఆ వెనుక యున్నవారు, చక్కగా ఇప్పుడు వినగలు చున్నారా? బాగున్నదా? నేను చిన్నవాడను, కాబట్టి నేను ఎక్కువ శబ్దమును చేయవలసియున్నది, కావున నేను ఈ చుట్టూ యున్నానని ప్రజలు తెలుసుకొంటారు.
ఒకప్పుడు నేను పబ్లిక్ యుటిలిటీస్లో పనిచేయుచుండగా, నాకు గుర్తు౦డియున్నది, నేను మెట్ల మీదుగా పైకి వస్తూయుండగా. నేను దానిలో ఇనుప నాడాలను కలిగియున్న అతిపెద్ద బూట్లను ఉన్నతముగా విద్యుచ్చక్తి ప్రవహించు పెద్ద మార్గములగుండా నడుచుటకు, నేను వాటిని ధరించికొనేవాడను. మరియు నేను మెట్లపైకి వచ్చుచున్నాను. మరియు శ్రీమతి. ఇహాల్డ్, స్విచ్ బోర్డు దగ్గర యున్నది, ఆమె నాకు ఒక మిత్రురాలు. అక్కడయున్న శ్రీ. గింతర్, బాగుగా ఆమెను గుర్తుపట్టగలడు. కాబట్టి ఎడిత్ అన్నాడు, నీవు నేను ఎన్నడైనా చూసిన అంత చిన్నవ్యక్తివై యుండి, నీవు గంభీరమైన శబ్దమును చేస్తున్నావు. ఈ పెద్ద మేకులతో త్రోక్కుకొంటూ, మెట్లపైకి వస్తున్నావు.
నేనన్నాను, “సరే, ఎడిత్, నేను ఎంతో చిన్నవాడను, నా చుట్టూ యున్నవారందరూ నేను అక్కడయున్నానని తెలుసుకొనుటకు గాను, నేను ఎంతో శబ్దమును చేస్తాను.”
2
మంచిది, నేను పిలుచుటకు లోనికి వెళ్ళాను. సోదరుడు నెవిల్ నాకు చెప్పియున్నాడు, అదేమనగా మా మంచి స్నేహితుడైన సోదరుడు రాయ్ రాబర్సన్, తన అనారోగ్య కారణమున ఈ ఉదయమున కూటమునకు రాలేకపోయాడని చెప్పియున్నాడు. అతడు పండ్ల వరుసలో ఒక పన్ను వంకరగా వచ్చియున్నది, దాని మూలముగా అతడు జబ్బుపడి జ్వర పీడితుడయ్యాడు. మరియు అతడు దానిని పీకించి వేయవలసియుండెను, అది సరైన మాట అని నేను అనుకొంటాను. మరియు సోదరుడు రాయ్, ఇక్కడయున్న మాకు ఒక తండ్రి వంటివాడు, మరియు మేము ఆయనను ప్రేమిస్తాము. నేనన్నాను, “సోదరుడా రాయ్, కొన్ని నిమిషములలో నేను లోనికి, కూటమునకు వెళ్ళుచున్నాను,” మరియు నేనన్నాను, ఈ ఉదయమున సంఘమును నేను అడుగుతాను, మేమంతా నీ కొరకు ప్రార్ధనచేసాము.“ మరియు రేపు పన్నును తీయించుకొనుటకు అతడు వెళ్ళినప్పుడు అది దానిని శ్రద్ధ వహిస్తుంది. పన్ను వంకరగా పెరిగియున్నది, లేక ఒకరీతిగా పన్ను తప్పుగా ఒక దాని మీదకు ఒకటి వచ్చియున్నది, మరియు వారు దానిని కత్తిరించి తొలగించవలసియున్నది.
3
మీరందరూ ఎరిగియున్నట్లుగా, సోదరుడు రాయ్ ఒక వయస్సులో అనుభవము కలిగిన వ్యక్తి, అతడు రెండవ ప్రపంచ యుద్ధము నుండి వచ్చిన వాడు, అతడు ముక్కలుగా పేల్చబడవలసియుండెను - అది దేవుని యొక్క మంచితనము కాకపోయినటైతే, అతడు జీవించియుండెడివాడు కాదు. ఒక దీర్ఘకాలముగా అతడు, మృతుల మధ్య బయట ఉంచబడెను. చేతులు మరియు కాళ్ళు పేల్చివేయబడి యుండెను, మరియు రెండు ముఖ్యమైన నరములు చచ్చుబడినవి. మరియు వైద్యుడు ఇలా అన్నాడు, “అతడు ఎన్నడైనా జీవిస్తే, అతడు ఒక్క అడుగు కూడా వేయలేడు.” దేవుని కృపను బట్టి, అతడు ప్రతి రోజూ పనిచేయుచున్నాడు, పైకి ఎక్కుచున్నాడు మరియు సమస్తమూ చేయుచున్నాడు. దేవుడు అతని పట్ల ఎంతో మంచిగా యుండియున్నాడు, కారణము అతడు ఒక మంచి మనిషియైయున్నాడు, మరియు మనము అతనిని ప్రేమిసాము. మరియు మనము - మనమే కాదు అందరము.
మనము యదార్ధముగా జీవించినటైతే, దాని భావము ఇబ్బందులన్నింటి నుండి మనము దూరముగా యున్నామని కాదు. నిజానికి ఇబ్బందులన్నియూ మన మార్గమును నడిపిస్తాయి. “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, అయితే వాటన్నిటిలో నుండి దేవుడు అతనిని విడిపించును.” అది మహిమకరమైన భాగము.
4
కావున ఈ ఉదయమున, సహోదరుడు రాయ్ కొరకు మనము ప్రత్యేక ప్రార్థననను అడుగుదాము. ఇంకనూ, ఇక్కడ యున్నవారు ఎవరైనా ప్రార్ధనలో జ్ఞాపకముచేసికొనబడవలెనని కోరుచున్నారా? వారు కేవలము వారి యొక్క చేతిని ఎత్తండి. మంచిది, అది చక్కగా ఉన్నది. ఒక్క క్షణము మనందరము లేచి నిలబడదాము. మనము లేచి నిలబడియుండగా ప్రార్థన చేయుదము.
5
ప్రభువా, ఈరోజు సబ్బాతు యొక్క ఆరంభంలో మేము వచ్చుచున్నాము. మరియు సూర్యుడు ఇప్పుడు దాని యొక్క పరుగును తీసుకొనుచున్నాడు, ఈ వైపు నుండి ఆ వైపునకు ప్రపంచం మీదుగా ఎగిరి వెలుగును మరియు జీవమును తెచ్చుటకు, అది చేయుటకు నిర్దేశించబడిన కార్యములను చేయుటకు పరుగెత్తుచున్నాడు. మరియు కూడిక యొక్క ఆరంభమునొద్ద మేము నీ యొక్క సంఘములో ఒక భాగమైయున్నాము, అది స్వస్థతా కూటములను జరిగించుటకు (శరీరము యొక్క భౌతిక స్వస్థత) అది ముందుకు పిలువబడియున్నది, మన ధన్యుడైన ప్రభువు యొక్క కోరికలను మరియు ఉద్దేశ్యములను నెరవేర్చుటకు గాను అది పిలువబడియున్నది. మరియు ఆయన పొందిన దెబ్బలచేత మనము స్వస్థతనొందాము, మరియు మన అతిక్రమముల నిమిత్తం ఆయన గాయపర్చబడెను. కూడిక యొక్క ప్రారంభంలో మేము అడుగుచున్నట్లుగా అది పాటలతో దాని రెక్కలను ఆడించుట మొదలుపెట్టగా, మా హృదయాలు పైకి లేపబడతాయి, ప్రభువా ఈ ఉదయమున మా ప్రియమైన ప్రశస్త సోదరుడు, నీ దీన సేవకుడైన రాయ్ రాబర్సన్ను మేము జ్ఞాపకం చేసుకొనుచున్నాము. యుద్ధభూమిలో నీవు ఆయన యొక్క ప్రాణమును కాపాడియున్నావని మాకు తెలుసు, నీవు ఆయనకు ఎంతో మంచిగా ఉండియున్నావు. మరియు ఈ ఉదయమున ఆయన బాధింపబడుచు సంఘమునకు రాలేని స్థితిలో ఉన్నాడు.
6
మరియు, ప్రభువా, వారు జాన్ మార్క్ యొక్క గృహములో ప్రార్ధన చేయుచుండగా, అక్కడ చెరసాల గదిలోనికి ప్రభువు యొక్క దూత వచ్చియున్నాడు, పేతురు అక్కడ బంధకములలో యున్నాడు, అక్కడ మర్మయుక్తముగా చెరసాల తలుపులు తెరవబడియున్నాయి, మరియు అతడు బయటకు నడిపించబడెను.
ఓ దేవా, నీవింకను దేవుడవైయున్నావు! ఆ దూతలు ఈ ఉదయమున నీ ఆజ్ఞ చొప్పున నిలబడియున్నారు, ప్రభువా ఈ ఉదయమున, ప్రభువు యొక్క గృహములో మేము ప్రార్ధనచేయుచుండగా, ప్రభవు యొక్క దూతలు సహోదరుడు రాబర్సన్ గృహమునొద్దకు వెళ్ళును గాక. మరియు దేవుని యొక్క దూతలు ఆయనను విడిపించి, ఆయనను స్వస్థపరచి దేవుని గృహములో ఆయన స్థానమును మరల తిరిగి తీసుకొనునట్లుచేయును గాక.
7
ఇబ్బంది ద్వారా రోగులుగా ఉన్న ఇతరులు ఇక్కడకు వచ్చారు. మరియు మేము ఒక వృద్ధ స్త్రీని చూచియున్నాము, ఆమె తన కుర్చీలో కూర్చొనుచుండగా, ఒక చిన్న బిడ్డవలె తన పాదములను మోపి తన చేతులను పైకెత్తియున్నది, ఆమె తన కాళ్ళపై బలహినముగా నడచుచుండెను. ఆమె స్వస్థతనొందుటకుగాను దేవుని యొక్క గృహములోనికి వచ్చియున్నది. ప్రభువా ఆమె తిరిగి బయటకు తన యవ్వన స్థితిలో ఉన్న యవ్వనస్తురాలు వలె చిగురించి నడుచుకుంటూ బయటకు వెళ్ళుటకు సహాయము చేయుము.
మరియు చేతులు ఎత్తిన అనేకమంది, అది వ్రాయబడియున్నట్లుగా, అది ముందే ఉదహరించినట్లుగా, “నీతిమంతునికి కలుగు శోధనలు అనేకము, అయితే వాటన్నిటిలో నుండి దేవుడు అతనిని విడిపించును.” మమ్ములను రోగము నుండి బాధ నుండి విడుదలచేయు విశ్వాసములోనికి విశ్వాసపు హస్తములోనికి ఈ రోజు మేము ఎగిరిపోవుదుము గాక. కూటం ముగించబడినపుడు మా మధ్య ఒక్క బలహీనుడు కూడా ఉండకుండును గాక.
ప్రభువా, ప్రతీ అవిశ్వాసి ఒక విశ్వాసిగా మారునట్లు సహాయం చేయుము. మరియు మేము వాక్యమును ధ్యానించుచుండగా, పరిశుద్ధాత్మడు మా హృదయములలోనికి దానిని తీసుకుని అక్కడ ఉంచి, మరియు అది వాక్యము యొక్క ఫలముగా మారువరకు దానికి నీరు కట్టును గాక. మా తలలు వంచి యేసు నామములో అడుగుచుండగా ప్రభువా దీనిని మా కొరకు చేయుము. ఆమెన్. (మీరు కూర్చొనవచ్చును.)
8
ఈ ఉదయమున ఈ పరిచర్య యొక్క వర్తమానములోనికి మనం ప్రవేశించకముందు, కొంచెం దగ్గరగా మీ మనస్సులలో దీనిని భరించాలని నేను కోరుచున్నాను: మీలో ఎవరైనా అక్కడ సెలవులను కలిగినవారున్నారా, మరియు ఓహియోలోని మిడిల్ టౌన్లో సోమవారం నుండి ప్రారంభమై ఒక వారంపాటు అవి కాంప్ గ్రౌండ్స్ లో కూటములు జరుగుతాయి, మీరు ఈ కూటములలో ఒకదానికైనా హాజరవ్వాలని నేను కోరుచున్నాను.
జెనే? ఆ క్యాంపు గ్రౌండ్స్ యొక్క పేరు నీకు సరిగ్గా తెలియునా? [“అది మిడిల్ టౌన్ నుండి 12 మైళ్ళ దూరములో ఉన్నది,” అని సహోదరుడు జెనే చెప్పుచున్నాడు.“] సులివాన్ సోదరుడా, మిడిల్ టౌన్ ఇక్కడ ఉన్న జఫర్సన్విల్ వలె అది ఒక పట్టణమని నేననుకుంటాను. అది బాస్కెట్ బాల్ ఆటాడు కేంద్రమైయున్నది, సోదరుడు సులివాన్ అక్కడ సంఘకాపరిగా యున్నాడు. సంపూర్ణ సువార్త సంఘములలో ఎవరైనను ఆ క్యాంప్ గ్రౌండ్స్ ఎక్కడున్నదో వారు చెప్పగలరు, 60కి పైగా సంపూర్ణ సువార్త సంఘములు ఈ కూటమునకు సహకరించుచున్నారు.
9
అక్కడ ఆ క్యాంప్ గ్రౌండ్లో ఎన్నో కుటీరములు ఉన్నవని, వాటి ద్వారా అనేక మంది ప్రజల పట్ల శ్రద్ధవహించవచ్చునని వారు నాకు చెప్పారు. మరియు కూటములు సోమవారం నుండి శనివారం వరకు 6 దినములు జరుగుతాయి. అయితే ఆదివారమున కూటము ఉండదు, ఎందువలన అనగా ఇతర సంఘములు వారి వారి క్రమమైన ఆరాధనలను కలిగియుంటూరు, బహుశా స్వస్థతా కూటములు ఉంటాయి లేక ప్రతీ రాత్రి రోగుల కొరకు ప్రార్ధన చేయుట ఉంటుంది. మరియు ప్రతి ఒక్కరు ఆహ్వానించబడియున్నారు. అది ఆగష్టు 10 తారీఖున ప్రారంభమై 15వ తారీఖు వరకు, సోమవారం నుండి శనివారం వరకు కూటములు ఉంటాయి. మరియు మీరు సెలవులను కలిగియున్నట్లైతే, మరియు మీకు సెలవులు వస్తున్నట్లైతే, మంచిది, మీరు ఆ మార్గంలో వాటిని గడుపగోరినట్లైతే నిశ్చయంగా మిమ్మలను కలిగియుండుటకు సంతోషిస్తాము.
10
క్రైస్తవ బాప్తిస్మం పొందని వారందర్నీ నేనింకా వారిని ప్రోత్సాహపర్చునది ఏమనగా మీరు ఈ ఉదయమున ఇక్కడే ఉండి దాన్ని తిరిగి ఆలోచించండి. మరియు దాదాపుగా 45 నిముషములలో అని నేననుకుంటాను, ఇప్పుడు ప్రారంభం కాబోయే బాప్తీస్మము కూటమునకు మీరు సిద్ధంకండి. అది సంఘమునొద్ద ఉంటుంది.
రక్షణ కొరకు అది అవసరమైనదని మేము తెలుసుకొనగలిగిన వారమై, క్రైస్తవులు క్రైస్తవ బాప్తీస్మమును పొందవలెనని మొగ్గుచూపుచూ వారిని ప్రోత్సహించుచున్నాము. ఆయన తన సంఘమునకు ఇచ్చిన చివరి ఆజ్ఞలో, ఆయన చివరి ఆజ్ఞలో అది వ్రాయబడినది. లేక చివరిగా ఆయన సంఘమునకు ఆజ్ఞాపించినదేమనగా, ఆయన ఇలా అన్నాడు, “మీరు సర్వసృష్టికి వెళ్ళి సమస్త జనులకు నా సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీస్మము పొందువాడు రక్షింపబడును.” కాబట్టి మనము ముంచబడుట ద్వారా బాప్తీస్మం పొందడం అవసరమైయున్నది.
11
యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడని వారి హృదయములలో ఒప్పించబడిన ఏ ఒక్కరికైనా ఈ సేవను చేయుటలో మేము సంతోషిస్తాము, ఆయన పాపులను రక్షించుటకు చనిపోయాడనీ, ఆయన నిన్ను రక్షించుటకే చనిపోయాడని, పాప క్షమాపణ కొరకు ఆ నామములోనికి బాప్తీస్మం పొందుటకు మీరు రావలెననియు, మీ పాపములు క్షమించబడినవి అని నమ్ముచూ, నీవు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యునిగా మారియన్నావనియు, ఇప్పుడు నీ స్థానమును తీసుకుంటావనియు మనము లోకమునకు చెప్పుచున్నాము.
12
మీరు వెళ్ళుటకు ఏ ఆలయము లేని యెడల మాతో మీరు సహవాసము చేయుటకు మేము సంతోషిస్తాము. ఇక్కడ మాకు సభ్యత్వం లేదు. ప్రతీ సంఘశాఖకు, క్రీస్తు శరీరమంతటికి ఇది ఒక తెరువబడిన ఆలయమై యున్నది. మేము ఒక అంతఃగత సంఘము (మేము ఏ శాఖకు చెందని ఒక స్వతంత్ర సంఘము - తర్జుమాదారుడు), మరియు వారు ఎవరైనప్పటికి, ఏ రంగుయైనప్పటికి, ఏ తెగయైయున్నప్పటికి లేక ఏ ఆచారమై యున్నప్పటికీ, మేము ప్రజలందరి కొరకు తలుపులు తెరుస్తాము. ప్రతి ఒక్కరికీ స్వాగతము, “ఇచ్చయించు వానిని రానిమ్మ.” మీకు ఏ ఇతర ఆలయము లేనియెడల మీరు వచ్చి మాతో సహవాసము చేయుటను మేము సంతోషిస్తాము. నీకు అవసరమైనదంతయు అదియే, కేవలం ఉన్నపాటునే మీరు రండి తెరువబడిన హృదయముతో రండి, మీ భుజములకు చక్రమునకు ఆనించండి, మరియు దేవుని యొక్క రాజ్యం కొరకు మేము ముందుకు నెట్టుచుండగా మాకు సహాయపడండి. కారణము ఆ ఘడియ ఎంతో సమీపంగా ఉన్నది, బైబిల్లో వ్రాయబడిన సంగతులన్నియు తప్పక నెరవేర్చబడతాయని మేము నమ్ముతాము.
13
సందేహం లేదు, మొన్నటి దినమున ఐక్యరాజ్యసమితిలో, ఒక కెనడా వారాపత్రిక ద్వారా, నా స్నేహితుని ద్వారా నాకు ఉదహరించబడినట్లుగా, కృశ్చేవ్ యొక్క ప్రకటనను మీలో అనేక మంది చదివియన్నారు. అతడన్నాడు, “ఒక దేవుడు అక్కడున్నట్లైతే ఆయన ప్రారంభంలో చేసినట్లుగానే పెట్టుబడుదారులైన మిమ్మలను తుడిచివేసి తన ఆలయమును మరల శుద్ధి చేయును.” కాబట్టి దానిని మీరిప్పుడు వరుసల మధ్య చదవండి. “ఆయన తన ఆలయమును మరల కడిగివేయుటకు సిద్ధంగా ఉన్నాడు.” ఒక క్రూరమైన కమ్యూనిష్ణు అలాటి సంగతి చెప్పుటయా? అతడు దేనినో ఆలోచించియున్నాడు. అది నిజము. ఆదియందు పెట్టుబడిదారులే ఇబ్బందికి కారణమైయున్నారు. మనము పెట్టుబడిదారులము.
14
మన ప్రియుడైన సంఘకాపరి సహోదరుడు నెవిల్ ఆయన టెలివిజన్ ప్రసారములో ఒక విషయమును ఎత్తి చూపుటను నేను వినియున్నాను.. లేక రేడియో ప్రసారంలో, మొన్నటి దినమున, అది పదే పదే నా మనస్సులో తిరుగులాడినది. నేను దాన్ని మరచిపోజాలను. గత రాత్రి దాన్ని గూర్చి నేను నా స్నేహితుడైన ఒకరితో నేను ఉదహరించియున్నాను. మరియు అది ఇదే, అక్కడ పరిశుద్దాత్మడు భూమ్మీద నుండి తీసివేయబడిన తర్వాత, బేధమేమియు తెలియకుండా, ఆ నామకార్ధ సంఘము అలాగే ముందుకు వెళ్ళిపోవును, నీవు ఎన్నడైనా వినియున్నావా. మీలో ఎంత మంది దానిని విన్నారు? అది వింతగా లేదా? వారికి పరిశుద్ధాత్మడు తెలియదు. కాబట్టి అది ఎప్పుడు వెళ్ళిపోయినదో వారెరుగరు మరియు వారు తిన్నగా ఆలాగునే ముందుకు వెళతారు, ఆ చివరి వ్యక్తి క్రీస్తు శరీరములోనికి ముద్రించబడినపుడు వారింకను ముందుకు వెళుతూ ప్రజలు మారు మనస్సు పొందునట్లు ప్రయత్నిస్తారు. ఏలయనగా అది ఏమైయున్నదో వారికి తెలియదు. వారు ఉండియున్న రీతిగానే వారి యొక్క నామకార్ధపు మతములలో వారు ముందుకు కొనసాగుతారు. ఇప్పుడు, అది నాలో నాటుకున్నంతగా మీలో నాటకొనకపోవచ్చు. అయితే అది నిజముగా ఒక వింతగా ఉన్న వ్యాఖ్యానం. మతసంబంధమైన విధులలో వారు దాని నుండి దూరముగా వెళ్ళిపోయారు, చివరకు పరిశుద్ధాత్మను తప్పిపోవునంత వరకు వారు వెళ్ళిపోయారు. ఏలయనగా ఆరంభము నుండియే అది ఏమిటో వారికి తెలియదు.
15
దేవా మాపై కనికరము చూపము. సోదరుడా ఈ జీవితములో నేనెలా జీవించగోరుచున్నానంటే, నా ఆశ ఏమనగా కనీసం కొంచెం కూడా ఆయనను దుఃఖపరచకుండా ఉండుటయే, అది నా హృదయమైయున్నదని నేనెరుగుదును. ఆయన్ను దుఃఖపర్చేది ఏదో ఒక దానిని నేను తప్పక చేయవచ్చు, అయితే ఒక్క క్షణంలోనే దానిని నేను గురుపట్టగలను.
ఆయన లేనపుడు మనం ఒంటరిగా ఉందాం, ఆయన ఇక్కడ లేనప్పుడు నేనిక్కడ ఉండుట నాకిష్టం లేదు. అప్పటికి నేను వెళ్ళిపోగోరుచున్నాను, అవునండి, కారణము కరుణాపీఠం మీద అక్కడ రక్తం లేదు. అది చీకటిగా, నల్లగా పొగతో ఉంటుంది. ఆ పవిత్రస్థలంలో అక్కడ ఆ సమయంలో నీ కేసును వాదించుటకు ఏ న్యాయవాదియు ఉండడు. లేఖనము దానిని మీకు చెప్పుచున్నదని మీకు తెలుసా? ఆ పవిత్ర స్థలం పొగతో నిండియున్నది. కరుణాపీఠం మీద అక్కడ రక్తం లేదు, అప్పుడు అది తీర్పుయైయున్నది.
ఈ తొలకరిలో ఏదో సమయంలో కొన్ని రాత్రులు ఉజ్జీవమును ప్రభువు మనకు ఇచ్చినట్లైతే బాగుంటుంది. నేను నా మనస్సులో ఉద్దేశించియున్నాను, నేను ప్రకటన గ్రంధమును ఒక పఠనము కొరకు తీసుకొనగోరుచున్నాను. తిన్నగా క్రిందకు ఆ ప్రకటన గ్రంధములోనికి ముందుకు వెళ్ళుదాము.
16
ఇప్పుడు ఈ దినమున ప్రార్ధి౦చబడుట కొరకు అనేక మంది వచ్చియున్నారు. మరియు ఈ కార్యలయము ఈ రోజు లేక ఈ వారమంతయు మూసివేయబడియున్నది. మరియు కొందరు ప్రజలు లోనికి వచ్చియున్నారు, అక్కడ వారికి ప్రార్ధి౦చబడుటకు బయట అవకాశం దొరకలేదు, కారణము ప్రార్థనా కార్డులను ఇచ్చు కుర్రవాళ్ళు 1 లేక 2 దినముల విశ్రాంతి కొరకు వెళ్ళిపోయారు. వారు చేయవలసిన పని ఎంతో ఉన్నది; వారి సొంతపని, ఆలయం పని, నా ఫోన్ కాల్స్ సమస్తము వారు చేయవలసి యున్నది. అది వెంటనే నిన్ను నీ నరముల ఉద్రిక్తతలోనికి తీసుకుని వెళుతుంది. కాబట్టి అది ఆ కారణమును బట్టియే అప్పుడప్పుడు నేను ఎక్కడికో బయటకు వెళ్ళి ఏదో ఒక వేరైన పనిని చేయాలి, మరియు వారును దానిని చేయుచున్నారు, కాబట్టి వారు నన్ను పిలిచియున్నారు. నేనన్నాను, “అది బాగుగానే ఉంటుందని నేను తలంచాను.” మరియు కొన్ని క్షణములలో రోగుల కొరకు ప్రార్ధన చేయబోవుచున్నాము.
17
దేవుని వాక్యంలో నుండి కొంత భాగం చదవాలని తలంచాను. ఇప్పుడు మీ బైబిల్ ఉన్నట్లైతే మనం యెషయా గ్రంధము వైపు తిరుగుదాము. మీ బైబిల్ ను తీసుకుని దాన్ని చదవాలని నేను కోరుచున్నాను. నేను చదువుతాను. 1 లేక 2 వచనాల కంటే ఎక్కువగా మనము చదువుట లేదు. అయినను అది దేవుని యొక్క నిత్యమైన, అమర్త్యమైన వాక్యమైయున్నది. అది ఎన్నడూ గతించదు. యెషయా గ్రంధము 55వఅధ్యాయం, “నిత్యమైన రక్షణ.”
“దప్పిగొనిన వారలారా, నీళ్ళ యొద్దకు రండి రూకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి.
ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్ధము భుజించుడి. మీ ప్రాణము సారమైనదానియందు సుఖింపనియ్యుడి.
చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును.
కొన్ని క్షణముల పాటు ఈ అంశం మీద నేను మాట్లాడగోరుచున్నాను. “రూకలు లేకుండా లేక వెల లేకుండా.”
18
మన దినమున అనేకమైన ఉల్లాసపరచు కార్యములు ఉన్నవి. ప్రజలను ప్రలోభపెట్టు అనేకమైనవి మనము పిలచు “ఆనందాలు (pleasures) ” ప్రజలందరికి, అన్ని వయస్సుల వారికి యున్నవి.
యవ్వనస్తులను సంతోషపరచుటకు ఆ ప్రలోభపెట్టు కార్యములు ఉన్నవి, అవే అధునాతన నృత్యములు, రాక్-అండ్-రోల్ పార్టీలు, మరియు దానితో వెళ్ళు సంగీతములను వారు కలిగియున్నారు. అదంతయు ప్రలోభపెట్టుకై వారు ఉల్లాసముగా గడుపుట కొరకు యున్నది.
ఒక గృహంలోని పిల్లవాడు ఎంత చక్కగాపెంచబడినను నాకు లెక్కలేదు, అతడు ఎంత చక్కగా మంచి చేయుటకు నేర్పబడినను ఆ పిల్లవాడు క్రొత్త జన్మ యొక్క అనుభవమును లెక్కించకపోయినట్లైతే, ఎంతో వేగముగా అతడు వినిన వెంటనే రాక్-అండ్-రోల్ సంగీతము అతన్ని పట్టుకుంటుంది, ఏలయనగా అతనిలో స్వాభావికముగా, ఒక శరీరసంబంధమైన ఆత్మ జన్మించి అతనిలో యున్నది, మరియు దయ్యము యొక్క శక్తి ఈ దినమున ఎంత గొప్పగా ఉన్నదంటే చివరకు అది ఆ చిన్న బిడ్డ యొక్క ఆత్మను పట్టుకుంటుంది.
19
అలాగైతే క్రొత్త జన్మను తిరస్కరించిన పెద్దవారికి అది ఎంతో ఎక్కువగా పట్టుకుంటుంది. ఎందుకనగా కేవలము నీ జీవితము మార్పు చెందియున్నది. నీవు క్రొత్తగా మార్పు చెంది దేవుని రాజ్యములోనికి నీవు జన్మించియున్నావు, అయితే నీవు ఎంత భక్తిగా ఉన్నప్పటికీ అది నీ లోపల మార్పు చెందనంత వరకు, నీ సహజ-స్వభావము ఇంకను లోక కార్యములపై ఉంటుంది. నీవు భక్తిగా ఉంటావు మరియు ఆరాధన చేస్తావు, అయితే అది ఇంకను నిన్ను ఆకర్షించు ఒక విధమైన శక్తిగా అది ఉంటుంది. ఎందుకనగా ఈ ప్రాచీన పురుషుని యొక్క పాపము మరియు అతని యొక్క కోరికలు నీలో ఇంకను చనిపోయి ఉండలేదు.
అయితే ఒక్కసారి నీ హృదయ సింహాసనమును క్రీస్తు తీసుకోగానే, ఆ కార్యములు ఇక నిన్ను బాధించవు; అది ఎంతగానో ఉన్నతముగా ఉన్నది.
20
ఆ మనిషి యొక్క పేరును నేను చెప్పలేను, ఎందుకనగా నేనతని పేరును ఇప్పుడు ఆలోచించలేక పోవుచున్నాను, అయితే మీలో అనేక మందికి అతను తెలియును. అక్కడ ఒక ద్వీపము ఉన్నదని అక్కడి మగవారు పొంచియుండేవారు, మరియు స్త్రీలు బయటకు వచ్చి పాడుచుండెడివారు. మరియు వారి పాటలు వారికి ఎంతగా ఆశ చూపేవంటే ఓడలు మీదుగా ప్రయాణం చేస్తూ ఆటు దాటి వెళ్ళు ఓడ నావికులందరూ ఆ ద్వీపంలోనికి వచ్చేవారు, మరియు అప్పుడు అక్కడ ఉన్న దాడి చేయు సైనికులు ఆ నావికులను పట్టుకుని వారిని చంపివేసేవారు. మరియు ఒక నిర్ణీతమైన ఒక గొప్ప మనిషి అటు దాటి వెళ్ళగోరియన్నాడు. మరియు అతడు అతని నావికులందర్ని ఆ తెరచాప కొయ్యకు కట్టివేసి వారు అరవకుండా నోళ్ళలో గుడ్డలు కుక్కి వారు వినకుండా చెవులలో దూది పెట్టాడు, మరియు ప్రయాణమై వినుటకు వెళ్ళెను. మరియు ఆ స్త్రీలు బయటకు వచ్చి, నృత్యముచేయుచు, పాడుచుండెను. మరియు, ఓ, అది ఎంతో గొప్పగా యుండెను, తనకుతానే వారినుండి కాపడుకొనుటకు కొయ్యకు కట్టుకొనెను. ఆ స్త్రీలు “లోనికి తిరగండి! లోనికి తిరగండి!” అని కేకలు వేయుచు౦డిరి. అయితే నావికులు, ఆ పాటలను వినలేకపోయెను, వారి చెవులు వినకుండా దూది పెట్టబడియుండెను.
21
అటు తర్వాత వారు ఒక నిర్ణీతమైన స్థలములో ఓడను ఆపారు, అక్కడ వారి ముసుగులను తీసి వారి చేతి కట్లను విప్పి, వారి చెవులలో ఉన్నదూదిని తీసివేశారు. అక్కడ వీధులలో నడుస్తూయుండగా, ఆ సంగీత విద్వాంసుని యొక్క సంగీతము ఇది వరకు అక్కడ ఉన్న స్త్రీలకంటే ఎంతో అత్యున్నతముగా ఉండెను, మరల అతడు దాన్ని దాటిపోవుచుండగా, వారన్నారు, “ఓ, గొప్ప నావికుడా, మేము మరల నిన్ను ఆ ఓడ కొయ్యకు కట్టవచ్చునా?”
అతడన్నాడు, “వద్దు నన్ను స్వేచ్చగా ఉండనివ్వండి. నేను ఎంతో గొప్ప మాధుర్యమైన దానిని విన్నాను. చివరకు అది నన్నెన్నడు కలత చెందినివ్వదు.”
ఆ విధానములోనే ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుడు ఉన్నాడు, రాక్-అండ్-రోల్ కంటే మరియు ఈ లోకములోని విలాసముల కంటే ఎంతో ఉన్నతమైన ఒక దానిని మీరు కనుగొనియున్నారు. వారు పరిశుద్ధాత్మ ద్వారా ఆహ్లాదమును పొందుచున్నారు. అది ఎంత గొప్పగా యున్నదంటే, చివరకు దానికి లోకము మృతమైయున్నది.
22
నీవు తక్కువ ఖరీదు విలాసములకు వెళ్ళినపుడు, నీవు తప్పక ఎక్కువ మొత్తంలో డబ్బును అక్కడకు తీసుకొని వెళ్ళాలని నీవు తప్పక గుర్తుంచుకోవాలి. తన బాల్యస్నేహితురాలను ఈ పార్టీలకు మరియు ఈ డాన్సకు తీసుకొను వెళ్ళు ఒక యవ్వనస్తుడు, తన యొక్క వారపు రాబడిలో ఒక గొప్ప మొత్తమును దానికి చెల్లించబోవుచున్నాడు. మరియు ఈ వృద్ధ ప్రజలు ఆనందమును కనుగొనుట కొరకు బీరు షాపులకు వెళ్ళి త్రాగి ఆ వారము యొక్క దుఃఖములను వారు త్రాగివేయుచున్నారు. వారు పెద్ద మొత్తములో డబ్బును అక్కడ చెల్లించబోవుచున్నారు. వారు దాని నుండి దేన్ని పొందుచున్నారు. గుండెపోటులు తప్ప వేరే ఏది పొందుటలేదు.
23
మరియు గుర్తుంచుకో ఒకానొక దినమున నీవు తప్పక దేవునితో పరిష్కరించుకొనవలసియున్నది, “పాపము యొక్క జీతము మరణము.” దాని ద్వారా ఈ భూమి మీద నీవు ఏమియు సంపాదించలేవు. అది ఒక తప్పుడు బ్రాంతియైయున్నది. త్రాగుడు కేవలం విచారాన్ని నీకు జతచేస్తుంది. పాపము మరణం మీద మరణమును మాత్రమే నీకు కలుపుతుంది. నీ యొక్క చివరి చెక్కు దేవుని నుండి ఎడబాటుయైయున్నది, శాశ్వతముగా అగ్ని గుండములోనికై యున్నది. నీవు నష్టమును తప్ప ఏ లాభమును ఆర్జించలేవు.
అప్పుడు దేవుడు వచ్చి ఈ ప్రశ్నను అడుగచున్నాడు. నిన్ను సంతోషపరచని వాటి కొరకు నీ డబ్బును ఎందుకు ఖర్చు పెడతావు. నీవు ఎందుకు ఆ పనిని చేస్తావు?
మనుష్యులు దాన్ని చేయుటకు కారణం ఏమిటి? వారికి కలిగి యున్నదంతయూ ఖర్చుపెడతారు. వారు సంపాదించగలిగినదంతయు, మద్యపానమును కొనుటకు, మరి కొందరు స్త్రీలతో పరుగెత్తుటకు, లేక ఏదో లోకసంబంధమైన శరీర కోర్కెల కొరకు ఖర్చు పెడతారు.
అయితే బైబిల్లో మనకు చెప్పబడియున్నది, మనము దేవుని యొద్దకు పిలవబడియున్నాము, మరియు నిత్యమైన సంతోషమును మరియు నిత్యజీవమును రూకలు లేకుండా, లేక వేల లేకుండా కొనుటకు.
24
ఆ కార్యములు నిన్ను సంతోషరచలేవు, మరియు వాటి యొక్క అంతము నిత్యమైన మరణమైయున్నది. అది నీ యొక్క డబ్బునంతా ఏకముగా పోగుచేయుటకు అది వెలకడుతుంది. ఒక పెద్ద వ్యక్తిగా లేక అనుభవించువానిగా, లేక ఒక తమాషా కుర్రవానిగా, లేక అది నీవేదైయున్నప్పటికి, లేక ఒక ప్రఖ్యాతిగాంచిన బాలికగా లేక అది ఏమైయున్నప్పటికి అది నీకు వెల కడుతుంది. దాన్ని చేయుటకు నీవు సంపాదించినదంతయూ ఏకముగా కూడి దానికి ధర కడుతుంది. చాలా అత్యున్నతమైన రీతిలో వస్త్రములను ధరించడం, మరియు లోకము చేయునట్లు కార్యములు చేయుట, అది కేవలం నిత్యమైన నాశనమును కొసుకొనుటకు ఒక చెక్కుయై యున్నది.
25
అప్పుడు దేవుడు చెప్పియున్నాడు, “ఎందుచేత?” తీర్పు దినమున దాన్ని మనం ఎందుకు చేశామని ప్రశ్నించబడుచున్నాము? మన జవాబు ఏమైయున్నది? ఒక క్రైస్తవ రాజ్యం అని చెప్పుకొను అధునాతన అమెరికా యొక్క జవాబు ఏమైయుండబోవుచున్నది? అది వారు ఒక క్రైస్తవ దేశము అని ఎవరు చెపుతారు? ఒక్క సంవత్సరం యొక్క కాలములో ఆహారము కంటే ఎక్కువ డబ్బు అక్కడ విస్కీ కొరకు ఖర్చు పెట్టబడుచున్నది. “ఈలాటి కార్యముల కొరకు ఎందుకు మీ డబ్బును ఖర్చుపెడతారు?” అయినను ప్రభుత్వపువారు నిన్ను కారాగారమునకు పంపుదురు, బహుశా నీవు 5డాలర్ల విలువైన సొమ్మును ఏదో ఒక ధార్మిక సంస్థకు లేక ఎవరో కొందరు మిషనరీలను విదేశాలకు పంపుటకు నీవు కర్చుపెట్టినందుకు వారు నీ నుండి పన్నులను పొందుటకుగాను, మనము ఒక దినమున ప్రభుత్వముచే అడుగబడతాము “నీవు దానిని ఎందుకు చేశావు?”
26
మనము ఒక క్రైస్తవ దేశమైయున్నాము. వారి యొక్క స్నేహమును కొనుటకుగాను వారికి కోట్లాది రూపాయలను మనం పంపుచున్నాము. ఇప్పుడు వారు దానిని క్రిందకు త్రోసివేయుచున్నారు. కృశ్చేవ్ చెప్పుటలో ఆశ్చర్యం లేదు, “అక్కడకు దేవుడున్నట్లైతే తన యొక్క రాజ భవనమును ఆయన మరొకసారి శుబ్రముగా ఊడ్చివేస్తాడు. అన్యులు మన మీదకు అవమానమును తెచ్చుటకు అలాటి ప్రకటనలను చేయుచున్నారు. అది ఎలాటి ఒక హాస్యాస్పదమైన విషయం! మరియు మనము మనలను క్రైస్తవులమని పిలుచుకునుచున్నాము.
దేవుడన్నాడు, “వచ్చి రూకలు లేకుండా వెల లేకుండా నిత్యజీవమును కొనండి.” నిత్యము జీవించుటకు జీవితము, మనము మన వీపులను దాని మీదికి తిప్పి ఆయన ముఖము మీదే నవ్వుచున్నాము. ఆ దినమున మనము ఏమి చేయబోవుచున్నాము? ఏమి సంభవించబోవుచున్నది.
దేవుడు మనము చేయుటకు కార్యములు, మరియు మనకు డబ్బును యిచ్చుచున్నాడు, మరియు ఆయన మనలను ఆకాశము క్రింద అత్యంత ధనిక దేశముగా మనలను చేశాడు, అలాగైతే మనం ఆ డబ్బుతో ఏమి చేశామని దేవుడు మనలను అడగబోవుచున్నాడు. మనలను సంతోషపరచని కార్యముల కొరకు మనము ఎందుకు డబ్బు ఖర్చు పెట్టాము. దేశమునకు మాత్రమే కాదు అది వ్యక్తులకు కూడా; పైసా నుండి లక్షల డాలర్ల వరకు ప్రతి ఒక్కరికీ ఇవ్వబడినవి.
27
మనుష్యులు ఒకరినొకరు చంపుకొనుచుండెను..... ఈ మధ్యలో నేను ఒక వ్యాసంలో చదివాను, అక్కడ ఇద్దరు కుర్రవాళ్ళు ఒక వేటాడే గుడారంలో పనిచేయున్నారు. ఒకతనికి అయిదుగురు పిల్లలు, మరొకతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు ఉద్యోగములో నుండి తిసివేయబడవలెను. వారిలో అయిదుగురు పిల్లలను కలిగిన వ్యక్తి, ఇద్దరు పిల్లలు కలిగిన వ్యక్తి కంటే పని అవసరత ఎక్కువగా అతనికి యున్నదని భావించెను; మరియు అతనిని వేటకు తీసుకు వెళ్ళెను, మరియు అతనిని వీపు వెనుక తుపాకీతో కాల్చి చంపెను.
డబ్బు: ఆ విధమైన దేశము అలాటి భావన కలిగిన వారము ఆ విధమైన ఆత్మ ప్రజలను ఏలుచున్నది.
అప్పుడు క్రొత్త జన్మ ఎంత అవసరమైయున్నదో నీవు చూడగలవు. “నీవు తప్పక తిరిగి జన్మించవలెను. అది తప్పక నా యొద్దకు రండి రూకలు లేకయే కొనండి!”
నాకు డబ్బు లేదు అని నీవు చెప్పలేవు, నీకు ఏ డబ్బు అవసరము లేదు. అది ఉచితంగా ఇవ్వబడియున్నది.
28
అమెరికావారగు మనము “దేనినైనా డబ్బు చెల్లించి కొనుటకు” మొగ్గు చూపుచున్నాము. “మాకు డబ్బు ఉన్నది, మేము వేలపెట్టి కొనుచున్నాము,” అది మన యొక్క నినాదమైయున్నది. ఇతర దేశములకు మన డాలర్ల నోట్లను ప్రకాశింపచేయుచున్నాము, అది చాలా దుస్తితి. నడచి చూచినట్లైతే, ఈకలు కట్టుకొని బిదవారైన పర్యాటకులు వచ్చుట చూచినపుడు అమెరికావారు వారికి ఆహారమును అమ్ముచు. అది దేవుని దృష్టిలో మురికిగా ఎంతో బాధాకరముగా యున్నది. అది పరలోకమునకు మన మార్గము కొనలేదు. అయితే అమెరికాలో ప్రతియొక్క దానికి మనము వేల చెల్లించవలసినది.
మీరు భోజన శాలకు వెళ్ళి మీ ఆహారమును భుజిస్తారు. మరియు బల్లపై నీకు సేవచేసిన స్త్రీ కొరకు మీరు కొంత డబ్బును ఉంచని యెడల, ఆమె తన కనుబొమ్మలను కోపముతో చిట్లిస్తుంది, కంపెనీ ద్వారా ఆమెకు జీతం చెల్లించబడుటచేత ఆమె అక్కడ పనిచేస్తుంది. మరియు నీ బిల్లులో కనీసం పది శాతము నీవు ఇవ్వవలసియున్నది. నీవు అలా చేయని యెడల ఆమె నిన్నొక పిసినిగొట్టవానిగా చూస్తుంది. ఆమె తన యొక్క జీతమును పొందుచూ అలా ప్రవర్తిస్తుంది. అలా చేయుట ఒక అవమానము మరియు సిగ్గుచేటు అని నేను తలుస్తాను. ఈ దేశం మీదికి అది చాలా దయనీయమైన తీర్పు అని నేను తలుస్తాను. మంచి ప్రజలుగా ఉండవలసినవారు, మంచి స్థలములు, దానిని అనుమతించవు. అయితే అదంతయు ఒక పెద్ద ఆత్మలోనికి వెళ్ళుచున్నది.
29
ఒకసారి నేను ట్రైన్లో ప్రయాణం చేయుచున్నాను. మరియు ఒక బరువులను మోయు వ్యక్తి (పోర్టర్). నేనొక చిన్న బ్రీఫ్ కేసును ఒక చేతితో మరొక చేతితో సూట్ కేసును మరియు నా చంకలో ఒక క్షవరము చేసుకొను సంచి ఉన్నది, మరియు నేను నడిచి వెళ్ళుచున్నాను. ఆ పోర్టర్ నా యొద్దకు నడుచుకుంటూ వచ్చి ఇలా అన్నాడు, “నేను వాటిని మోసి పెట్టనా?”
నేనన్నాను, “ఓ, నేను తిన్నగా ఆ రైలు నొద్దకే వెళ్ళుచున్నానండి, నీకు చాలా వందనములు,” అది దరిదాపుగా ఓ, 30 గజముల దూరంలో యున్నది.
అతడన్నాడు, “నేను వాటిని తీసుకొస్తాను,” మరియు ఆ వ్యక్తి చిన్న వస్తువులను తీసుకొని ముందుకు నడవసాగాడు.
సరే అతడు ముందుకు వచ్చినపుడు నేననుకున్నాను, బహుశ, అతడు చెల్లించబడియున్నాడని, నేనెరిగియున్నాను, అయితే నేనతనికి అర్థడాలరు ఇచ్చియున్నాను. బహుశా అతడు నా వస్తువులను దాదాపు ఒక నిమిషం పటు కలిగియున్నాడు; అనుకుందాం ఈ ఆలయం చివరిలోపుగా, అతడు వాటిని బండిలో ఉంచాడు. నేను మొదట ట్రైన్ మీద అడుగుపెట్టి వాటిని అందుకున్నాను. నేనతనికి అర్థడాలరు ఇచ్చాను.
అతడన్నాడు, “ఒక్క నిమిషం!”
నేనన్నాను, “అయ్యా అదేమిటి?”
అతడన్నాడు, “నేను మీ కొరకు మూడు బ్యాగులను మోశాను.”
నేనన్నాను “అవునండి, అది సత్యమే. తప్పు ఏమిటి?”
అతడన్నాడు, “నా కనీసం ఛార్టీలు ఒక బ్యాగును మోస్తే 25 సెంట్లు, అయితే నీవు నాకు ఇంకా 25సెంట్లు ఇవ్వవలసియున్నది.
చూడండి అది అమెరికా వాదము, ప్రతిదానికీ మనం చెల్లి౦చాలీ!
30
నీవు నీ కారు మీద ప్రయాణం చేస్తుండగా అది ఒక గుంటలో పడినటైతే, దాన్ని బయటకు తీయుటకు నీకు ఎవరైనా అవసరము. నీవు వారికి చెల్లించుటకు సిద్ధపడాలి, ఎందుకనగా వారు దాని కొరకు నీకు వెల కట్టబోవుచున్నారు. ఏదైనా బ్రద్దలయినట్లైతే వారు వచ్చి నిన్ను తీసుకొని వెళతారు అతడు మైలుకి ఇంత అని నీ మీద ఛార్జీ వేస్తాడు. మరియు ఒక వ్యవసాయదారుడు 10 సార్లలో 9 సార్లు తన ట్రాక్టర్ను బయటకు తోసినపుడు అది దాని కంటే ఇంకా హీనంగా ఉంటుంది.
నీవు చేయించుకొనే ప్రతి పని కొరకు నీవు తప్పక వెల చెల్లించవలసియున్నది. ప్రతిదీ “డబ్బు చెల్లించు! డబ్బు చెల్లించు!”
అయితే ఇంకను పాపము ఎంత పెద్ద గుంటలో నిన్ను త్రోసినది! పాపమనే గుంట నుండి ఎన్నడైనా ఎవరు బయటకు నిన్ను తీయగలరు? అయితే దేవుడు నిన్ను పాపమనే గుంట నుండి డబ్బు లేకుండా, వేల లేకుండా, నిన్నెవరూ బయటకు తీయలేనపుడు ఆయన నిన్ను బయటకు తీస్తాడు.
చెడిపోయిన నీ కారును లాగుటకు వారికి ప్రియమైనంత సొమ్మును నీవు చెల్లించుకపోయినట్లైతే నీవు ఆ గుంటలోనే ఉండిపోతావు. నీవు డబ్బును తప్పక కలిగియుండటమా - లేక గుంటలోనే ఉండటమా.
31
అయితే నీవెన్నడైనా పడియున్న అతిహీనమైన గుంట దయ్యము నిన్ను పడద్రోసినది: పాపము మరియు అవిశ్వామనే గుంటలోనికి. దేవుడు డబ్బు లేకుండా వెల లేకుండా ఇష్టపూర్వకముగా నిన్ను బయటకు లాగగోరుచున్నాడు. అయితే నీవింకనూ పాపములోనే కొట్టుకుంటూ ఆ గుంటలోనే యుండి, కనీసం నీవు ఆయనను పిలువక పోయినట్లైతే.
ఆ బ్రద్దలైన కారును బయటకు తీసినపుడు సాధారణంగా వారు ఒక పెద్ద గొలుసును ఆ గుంటలో ఉన్న దాని మీదికి వేస్తారు, దాన్ని ఆ బంపర్ చుట్టూ ముడివేస్తారు. అప్పుడు బయటకు లాగడం ప్రారంభిస్తారు. మరియు ఆ కారు యొక్క శక్తి లాగుట ప్రారంభించినపుడు దాని మోటార్లు పనిచేయుట ప్రారంభిస్తాయి మరియు నిన్ను బయటకు లాగుతాయి.
32
దేవుడు పాపమనే గుంటలో నిన్ను కనుగొనినపుడు, మరియు ఆయన నిన్ను పిలుచుటను నీవు వినినపుడు ఆయన కల్వరిలో చుట్టూ చుట్టబడిన దేవుని ప్రేమ అనే గొలుసును క్రిందికి పంపి మరియు దాన్ని నీ హృదయంలో గాలం వేసి, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అక్కడ ఉంచి నిన్ను పైకి లాగడం ప్రారంభిస్తాడు. మరియు దానికి నీకు ఏ ఖర్చు అవ్వదు. అయినా ఇంకను మనం పాపము అనే గుంటలోనే పడియున్నాము. ఏలయనగా మన జేబులోని డబ్బులతో దాని వెలను మనం చెల్లించలేము. అమెరికావారగు మనము మన జేబులోని డబ్బులతో దాన్ని చెల్లించగలమని మనము అనుకొనుచున్నాము, అయితే దాన్ని నీవు చేయలేవు. అది డబ్బు లేకుండా లేక వెల లేకుండాయైయున్నది. సంఘములో దాన్ని నీవు చెల్లించలేవు. యేసు దాన్ని శిలువలో చెల్లించియున్నాడు! అయితే ప్రజలు దాన్ని గూర్చి సిగుపడుచున్నారు. వారు దానిని తమ మార్గంలో ఆశించుచున్నారు. దాన్ని నీవు స్వీకరించుటకు దేవుడు ఒక మార్గమును కలిగియున్నాడు, మరియు నీవు దాన్ని తీసుకున్నట్లైతే, అది ఉచితమైనది.
33
సాధారణంగా వారు నిన్ను గుంటలో నుండి బయటకు లాగినపుడు, నీవు నీ దేహమంతట గీరుకొనిపోయి ఉంటావు. నీవు వైద్యశాలకు వెళ్ళవలసియున్నది. మరియు వారు నీ కొరకు పని ప్రారంభించక ముందు ఒక్క పని కూడా చేయకముందు వారు ఇలా అడుగుతారు, “ఈయన బిల్లును ఎవరు చేల్లించబోతున్నారు? మేము ఆ గాయములను కుట్లువేసినట్లైతే, మేముదానిలో నూనె పోసినట్లైతే, రక్తం విషమై నీకు హాని కలుగకుండా నీకు సూది మందు ఇచ్చినట్లైతే ఎలాటి ఆరోగ్య భీమ భద్రతను నీవు కలిగియున్నావు?” వారు ఏ ఒక్క పని కూడా చేయక ముందే అది తప్పక డబ్బు వరుసలో ఉండవలసియున్నది!
34
అయితే ప్రభువు తన ప్రేమ అనే గొలుసును నీ హృదయం చుట్టూ వేసి, మరియు పాపమనే గుంటలో నుండి ఆయన నిన్ను లాగును, విరిగిన ప్రతి హృదయమును ఆయన బాగుచేస్తాడు, పాపమునంతటిని తీసివేసాడు. మరియు దాని బిల్లు ఇక ఎంత మాత్రము నీకు వ్యతిరేఖంగా గుర్తు౦డకుండా మరచిపోవుట అను సముద్రములో దాన్ని వేయును. “డబ్బు లేకుండా, వెల లేకుండా, రండి.” నీవు ఎంత హీనముగా కోయుబడినవ్పటికీ నీవు ఎంతహీనముగా చితకకొట్టబడినప్పటికీ, నీ కుటుంబము ఎంత చేసినప్పటికీ, నీవు ఏమి చేసినప్పటికీ, దానికి వెల లేదు. ఆయన నీ గుండెపోటులను స్వస్థపరచి, నీ దుఃఖములన్నిటిని తీసివేయును. “మన పాపములను బట్టి ఆయన గాయపర్చబడెను; మన అతిక్రమముల కొరకు ఆయన నలుగగొట్టబడెను; మన సమాధానార్ధమైన శిక్ష ఆయన మీద పడెను; మరియు ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందాము.” అదంతయూ ఉచితమే.
మరియు దానిని మనము పొందుకోము, ఎందుకనగా మనము తప్పుడు ఆత్మ యొక్క ఆధిపత్యములో ఉన్నాము. దేశము యొక్క ఆత్మ ఆధిపత్యములో యున్నాము, ప్రపంచము యొక్క ఆత్మ; దేవుని ఆత్మచేత నడిపి౦బడుటకు బదులుగా, పరిశుద్ధాత్మకు బదులుగా, అది నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది, మరియు బైబిల్ను యదార్థంగా చేస్తుంది.
35
కొద్దికాలం క్రితం, నేనొక నాస్తికునితో మాట్లాడుచుంటిని. అతడన్నాడు, “మిస్టర్ బ్రన్హం దాన్ని ఆలోచించు. ఈ జీవితము యొక్క కష్టాలు, మనము కలిగియున్నది ఆ ఒక్కటి మాత్రమే, ఆ పాత యూదా వ్రాతల ద్వారా మనం రక్షించబడ్డామా.”
ఓ, నేనన్నాను, “అయ్యా, బహుశా నీవు కలిగియున్నదంతయు అది మాత్రమే కావచ్చు, అయితే నేను తప్పక దానికంటే ఎక్కువైన దానిని కలిగియున్నాను. అయితే దానిని వ్రాసి, దాన్ని ఋజువు చేసి దాని యొక్క ప్రతీ వాగ్దానమును యదార్థంగా చేసిన వాని యొక్క ఆత్మను నేను కలిగియున్నాను.” దాన్నెలా తీసుకోవాలో అతనికి తెలియలేదు.
చూడండి, నీవు తప్పక వచ్చి రూకలు లేకుండా, వెల లేకుండా దాన్ని కొనవలసియున్నది. నీకు ఎలాంటి కర్చూ లేదు. ఇచ్చయి౦చు వారందరికీ అది ఉచితమైయున్నది, వచ్చు వానిని రానిమ్ము. దేవుడు నిన్ను గుంటలో నుండి లాగును.
36
శృంగారమనే దేవాలయం వద్ద ఉన్న ఆ మనిషి వలె, తల్లి గర్భము నుండి మొదలుకొని అతడు గుంటలో పడియున్నాడు, దెయ్యం ద్వారా అతడు కుంటివానిగా చేయబడ్డాడు. అతని యొక్క జీవనోపాధి ఏమనగా దారి వెంబడి వెళ్ళే ప్రజలను ధర్మం అడుగుటయే, ఆ ఉదయమున అతడు ఆ ద్వారమునొద్ద కూర్చునియుండగా ఇద్దరు పెంతెకొస్తు బోధకులు నడిచి వచ్చుటను అతడు చూశాడు. వారి యొద్ద ఒక చిల్లిగవ్వ కూడా లేదు, ఏలయనగా అతడన్నాడు, “వెండి బంగారములు నా యొద్ధ లేవు” ఒక డైమ్, అనగా ఒక అతి చిన్న వెండి రూకయైయున్నది. “వెండి బంగారములు నా యొద్ధ లేవు.”
ఆ మనిషి ఈ విధంగా తలంచియుండవచ్చును అని నేను అనుకుంటున్నాను, “నేను నా గిన్నెను తీసుకోవల్సిన పనిలేదు.” బహుశా అతడు తగినంత డబ్బును కూడబెట్టుటకు ప్రయత్నించుచుండెను. అతనికి 40 సంవత్సరములు, బహుశా అతడు వైద్యులు అతనికి రెండు చంక కర్రలు చేయునట్లుగా తగినంత డబ్బును కూడబెట్టుటకు అతడు ప్రయత్నించుచుండెను, ఎందుకనగా నడుచుటకు అతడు చీలమండలలో బలహీనతను కలిగియుండెను. వైద్యులు అతనికి ఒక ఆధారమునిచ్చుటకు ముందుగా అతడు వరుసలో నిలబడియుండి డబ్బును కలిగియుండవలెను. మరియు నిశ్చయంగా ఏమియు లేని ఈ పెంతెకొస్తు బోధకుల వైపు తన గిన్నెను అతడు ఎత్తి పట్టవలసిన అవసరత లేకుండెను. వారి వలన ఏదైనా డబ్బులు దొరుకునేమో అనే అవకాశం చాల తక్కువ.
37
అయితే అతడు వారి ముఖములోనికి చూసినపుడు! ఒకరు యవ్వనస్తుడు మంచి యవ్వనప్రాయంలో మరియు ఎర్రనిరంగుతో వెలుగుచున్నాడు, మరొకరు వృద్ధుడు మరియు ముడతలు పడినవాడు; పేతురు, మరియు యోహాను ఆ ద్వారము నొద్దకు వెళ్ళగా ఆ యవ్వన ప్రాయములో ఉన్న మనిషిలో ఏదో అతడు చూసెను, ఆ ప్రకాశించుచున్న ఎర్రని రంగు ఒక సాధారణమైన వానికంటే కొంచెం గొప్పగా ఉండెను. ఆ ముడతలుగల చర్మము కింద, గలలియ సూర్యుడు ఆ వృద్ద జాలరి యొక్క ముఖమును ఎర్రగా మాడ్చి వేసినదిగా అతడు చూసెను. అయినను వారిలో “చెప్పనాశక్యముగాని ఆనందము, మరియు నిండైన మహిమతో యుండెను.” కొంత భిన్నమైన దానిని ఎదో అతడు వారిలో చూచెను.
నీకు తెలుసా, క్రైస్తవ్యమును గూర్చి అక్కడ ఏదో ఉన్నది, అది ప్రజలను భిన్నంగా కనబడునట్లు చేస్తుంది. వారు ప్రపంచమంతటిలో చక్కని ప్రజలైయున్నారు.
38
మరియు ఆయన తన గిన్నెను ఎత్తి పట్టుకొనెను.
వృద్ధుడైన అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు, “వెండి బంగారములు నా యొద్ధ లేవు? మరొక మాటలో ”నీవు ఏ విధమైన చంకకర్రలు కొనుటకు నేను సహాయపడలేను, వెండి బంగారు నాణెములు మా యొద్ధ లేవు, అయితే నేను అలాటి వాటిని కలిగియున్నట్లైతే!“ తేనెయు రక్షణ యొక్క ద్రాక్షరసము అను ఆనందములను ఆయన నుండి ఈ వ్యక్తి కొనుక్కోవలసి ఉండెను. పెంతెకొస్తు నుండి దానికి రెండు, లేక మూడు దినములకు ముందే అతడు అక్కడకు వచ్చియుండెను. అక్కడ అతనికి ఏదో సంభవించినది.
యవ్వనస్తుడైన యోహాను దానికి గొప్ప “ఆమేన్” చెప్పి ఆకస్మికముగా కదిలి అతని ముఖములోనికి చూసెను.
ఏమి జరిగినది? ఆ సానుభూతి అను గొలుసు, ఆయన యొక్క కరుణ ఇలా చెప్పినది, “నేను రోగుల మీద కరుణ కలిగియున్నాను,” అదే ఆత్మ ఆ వృద్దుడైన జాలరి హృదయములో చోటుచేసుకున్నది. “డబ్బు విషయమైతే నా యొద్ద ఏమియు లేదు, అయితే నా యొద్ద ఒకటున్నది, అది దాని స్థానమును ఒక పదిలక్షల సార్లు తీసుకొనును. అలాటిది నా దగ్గర ఉన్నది!”
39
ఇప్పుడు గురుంచుకోండి, పేతురు ఒక యూదుడై యున్నాడు, మరియు సహజంగా వారు డబ్బును ప్రేమిస్తారు, అయితే ఈ యూదుడు మార్పుచెంది యున్నాడు. “అలాటివి నాకున్నట్లైతే నేను నీకు అమ్మి వేస్తాను.
అయితే అలాటివి నాకున్నట్లైతే నేను నీకు వాటిని ఇచ్చివేస్తాను! నా జేబులో ఒక రూక కూడా లేదు. ఒక రొట్టె ముక్కను కూడా నేను కొనలేను, లేక నేను ఏమికూడా కొనలేను. కనీసం, నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. అయితే నేను కలిగియున్న దానిని నీవు స్వీకరించినట్లైతే, నేను దాన్ని నీకిస్తాను, ఏలయనగా అది నాకు ఇవ్వబడినది.“ అదే మనకు అవసరమైయున్నది. ”అలాటిది నాకున్నట్లైతే నీకిస్తాను.“
“అయ్యా! నీవేమి కలిగియున్నావు?”
“వెల లేకుండా పాలను, తేనెను అమ్ము ఆయనను నేను యెరిగియున్నాను. నేను దానిని నీకిస్తాను. దానికి నీవు నాకు ఏమి బాకీ ఉండవు. నీవు దానిని స్వీకరించగలిగినట్లైతే, నేను నీకు దానిని ఇస్తాను. నీకు వెలకట్టే వారివలె కాదు, అయితే నీకు ఇచ్చువారివలె ఇస్తాను.”
40
ఎందుకనగా, “మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి.” అది దానికి మూడు రోజుల క్రితము ప్రభువు చేత ఆజ్ఞాపించబడియున్నది: “మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను బోధించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును, నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు, వారు క్రొత్త భాషలతో మాట్లాడుదురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, వారు సర్పములను ఎత్తి పట్టుకొన్నప్పుడు, అవి వారికి హాని చేయవు. మీరు ఉచితముగా పొందియున్నారు, ఉచితముగా దానిని వారికి ఇయ్యడి.” ఆ యూదుడు మార్పు చెందియున్నాడు!
అమెరికాలో మనకు అవసరమైనది ఏమనగా మత ఆచారాలు నిర్వహణకు బదులుగా, దాని స్థానమును పరిశుద్ధాత్మ తీసుకొనుటయే. “మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి.”
“నేను కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, లేచి నడువుము,” సృష్టికర్త యొక్క మార్పుచెందని నామములో విశ్వాసము! ఆశ్చర్యము లేదు, అతడు గంతులు వేయుచూ, ఎగురుచు దేవుని మహిమపరచుచూ యుండెను!
41
ఓ గొప్ప కార్యములు నీకు తెలుసా? బహుశా అతడు నలబై సంవత్సరముల నుండి వేచియుండి కొంత డబ్బును సంపాదించి చంక కర్రలను కొనుక్కొనుటకు ప్రయత్నించుచున్నాడు, అయితే దానిని అతడు చేయలేకపోయాడు. అయితే తిన్నగా ఎంతో తిన్నగా ఎదురుచూడని సమయంలో, మరియు ఎదురుచూడని అల్పులైన మానవుల ద్వారా అతడు కోరిన దానిని పొందియున్నాడు. దేవుడు దానిని ఆ విధానంలో దాన్ని చేసినందుకు నేనె౦తో సంతోషిసాను.
ఒక రాత్రి, ఒక చిన్న పరిశుద్ధ గుండ్రాళ్ళు అని పిలువబడు వ్యక్తుల నుండి డబ్బు చేత కొనలేని దానిని నేను కోరుకున్న దానిని నేను కనుగొనియున్నాను. విద్య లేని పామరులు, చదువు లేనివారు, సరైన వస్త్రధారణ లేని ప్రజలు, నీగ్రోలని పిలువబడే వారు, బయట నేలమీద మార్పు చెందిన ఒక చిన్న కొట్టు ఉన్నది, నేలపై, నేను ఒక వెలను కనుకొన్నాను, ఒక ఆభరణము; ఆ నల్లటి చీకటి వంటి ముఖము కలిగిన వ్యక్తి నా ముఖంలోనికి చూచి ఇలా అన్నాడు, “నీవు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందియున్నావా?,” ఓ, అది నేను పొందాలని కోరుకుంటున్నాను. నేను అలాటి వారి మధ్యలో నేను దాన్ని కనుగొనుటకు ఎదురు చూడలేదు, అయితే నాకవసరమైన దాన్ని వారు కలిగియుండిరి.
42
ఈ దినమున ఐక్యరాజ్యసమితి మనం కలిగి ఉన్న దానిని వారు అంగీకరించరు, అయితే వారికవసరమైనది అదియే. కృశ్చేవ్, మిగిలిన వారందరికి క్రీస్తు, పరిశుద్ధాత్మయొక్క బాప్తీసం అవసరమై యున్నది. అది వారి అస్తవ్యస్థముగా ఉన్న స్థానములను మార్చివేస్తుంది. ద్వేషించుచున్న మనుష్యులను అది సహోదరులుగా మారుస్తుంది. అది దురాశను, ద్వేషాన్ని మరియు కలహమును నీలో నుండి తీసివేస్తుంది, మరియు ప్రేమను, సంతోషాన్ని సమాధానం, మంచితనాన్ని మరియు కృపను నీతో ఉంచుతుంది.
అవును, ఎదురుచూడని స్థలములలో నీవు వేటికొరకైతే ఎదురు చూస్తున్నావో వాటిని నీవు అక్కడ కనుగొంటావు.
43
ఇశ్రాయేలు యొక్క ప్రజలు అరణ్యంలో వారి యొక్క పెదవులు రక్తం కారుచుండగా దాహం కొరకు వారి నాలుకలు నోటిలో నుండి బయటకు వ్రేలాడుచుండగా, వారు (ఐగుప్తులో దోచుకున్నవాటి) అన్నింటి వల్ల వారికి ఏం ప్రయోజనం కలుగుతుంది? ఒక చిన్న చల్లని గుక్క నీరు కోసం వారు ఐగుప్తీయుల నుండి దోచుకున్నదంతయూ ఇచ్చేసినా అది దొరుకుతుందా! అరణ్యంలో వారి యొక్క నాయకులు ఊట నుండి ఊటకు గుంటల్లో నుండి నీళ్ళ మడుగుల యొద్దకు వారిని నడిపారు, అయినను అవన్నియు ఎండిపోయినవి.
అప్పుడు వెల లేకుండా డబ్బు లేకుండా అది వచ్చినది! ఆ స్వరము ప్రవక్తతో ఇలా మాట్లాడి చెప్పినది, “ఆ బండతో మాట్లాడుము,” అది అరణ్యంలో ఎంతో ఎండిపోయిన బండ, నీరంటే దానికి ఎంత దూరంగా ఉంటుందో అక్కడ వెల లేకుండా డబ్బు లేకుండా వారి దాహం తీర్చబడినది. “బండతో మాట్లాడుము.” “బండకు చెల్లించుటకు కాదు,” అయితే “బండతో మాట్లాడుము!”
44
ఆయన ఇంకా ఈ రాత్రి ఆ బండగా యున్నాడు. సొమ్మసిల్లిన స్థలములో ఆయన ఒక బండగాయున్నాడు. ఆ సొమ్మసిల్లిన దేశంలో నీవు ప్రయాణం చేస్తున్నట్లైతే, ఆ బండతో మాట్లాడుము! ఆయనకు నీవు చెల్లించవలసిన పని లేదు; ఆయనతో మాట్లాడుము! ఆపత్కాలములో ఆయన ఒక నమ్ముకొనదగిన సహాయకుడు. నీవు రోగిగా యున్నట్లైతే, ఆ బండతో మాట్లాడుము! నీవు పాపరోగముతో యున్నట్లైతే, ఆ బండతో మాట్లాడుము! నీవు చింతతో యున్నట్లైతే, ఆ బండతో మాట్లాడుము!
చూడుము, అది ఎక్కడైనను ఉన్నట్లుగా కనబడుచున్నది. ఆ చిన్న స్థలములలో అది ఆ ఊటల యొద్ద నీరు లేనట్లుగా కనబడుచున్నట్లైతే, ఆ కొండల మీదను నీరు లేనట్లుగా కనబడుచున్నట్లైతే, బండ యొద్ద నీరున్నది. మానవుడు త్రోసివేస్తూ తలంచుచున్న వాటిని దేవుడు చేస్తాడు. ఆ బండ అరణ్యంలోని ఒక అత్యంత ఎండిపోయిన స్థలమైయున్నది, అయితే “బండతో మాట్లాడుము,” అని ఆయన అన్నాడు.
45
ఈ దినమున ప్రజలు ఎంతో మోసగించబడియున్నారు. ఈ దినమున కొందరు కొన్ని ప్రార్ధనలు వల్లించి కొన్ని ప్రార్ధనలు చెప్పుటకు యజమానికి కొంత చెల్లించినట్లైతే, వారి మార్గానికి చెల్లింపు జరుగుతుందని వారనుకొనుచున్నారు; వారెక్కడో ఒక పెద్ద ఆలయమును నిర్మించినట్లైతే లేక శరీరాశలో జీవించుచున్న ఒక ధనవంతుడు ఆ ఆలయం కొరకు డబ్బు చెల్లించినట్లైతే, అతని కొరకు ఎవరైనా ప్రార్ధించినట్లైతే, అది సరిపోతుందని అతడు తలుస్తాడు, దేవునికి నీ మురికి డబ్బులు అవసరం లేదు. నీ నుండి ఆయన కోరినదంతయూ నీ జీవితం మరియు నీవు ఆయనతో మాట్లాడుటయే. దేవుడు నీకు డబ్బిచ్చియున్నాడు; నీకు సంతుష్టినియ్యని వాటి కొరకు దాన్ని ఖర్చుపెట్టవద్దు. నిన్ను సంతోషపరిచేవాటి కొరకు వాటిని ఖర్చుపెట్టుము. అయితే నీకు నిజమైన సంతుష్టి కావాలంటే, నీవు బండతో మాట్లాడు వరకు నీవు దాన్ని పొందలేవు.
డబ్బు లేకుండా లేక వెల లేకుండా ఆయన జీవజలములను తెచ్చియున్నాడు. వారు త్రాగియున్నారు, వారి ఒంటెలును త్రాగియున్నవి, మరియు వారి పిల్లలును త్రాగియున్నారు, మరియు ఇంకను అది ఎడారిలో ప్రవహించుచున్న ఊటగా యున్నది.
అలాగునే ఈ దినమున ఈ అలసిపోయిన దేశములో, నశించుచున్న ప్రజలకు ఆయన బండగా యున్నాడు. “ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవము పొందుతాడు.”
46
గమనించండి, ప్రతీ రాత్రి వారు ఆహారమును గూర్చి తిరుగులాడే పనిలేదు. ప్రతి రాత్రి వారికి తాజాగా ఆహారము తేబడియున్నది.
మనము ఈ దినమున బయటకు వెళ్ళి ఒక రొట్టెముక్కను తెచ్చుకుంటాము. నీవొక అడుకునేవాడవైతే నీవు ఒక కొట్టు యొద్దకు వెళ్ళి ఇలా చెబితే, “నా కొక రొట్టె కావాలని కోరుచున్నాను.”
అతడంటాడు, “మొదటిగా నీ పావలా చూపించు. దాన్ని కొనుటకు తప్పక 25 పైసలు ఉండవలసియున్నది.
నీవు దాన్ని పొందినపుడు నీకు ఏమి వచ్చినది? అది ఒక చిన్న ఆహారమైయున్నది, అయితే అది ఎన్నడైనా గోధుమ ఉత్పత్తి చేయు అతి హీనమైన పదార్ధమును నీవు కలిగియున్నావు. వారు దానిలోని నూనెనంతా విటమిన్లన్నియు తీసివేసి వాటిని పందులకు వేస్తారు. దాన్నొక ముద్దగా కలిపి కొంచెం నూనె కలిపి మురికి చేతులతో మురికిగా ఆ రొట్టెను తయారు చేస్తారు. ఆ బేకరీలలో నుండి నీవు కొన్న ఆ రొట్టెలో కొన్నిసార్లు వెంట్రుకలు, అసభ్యమైన వస్తువులు, అనేక మురికి పదార్ధములు ఆ బేకరీలలోని రొట్టెలలో పడతాయి. పాపులైన ప్రజలు సుఖవ్యాధులు గలవారు మరియు సమస్తము దానిలోనికి మిశ్రమమగుచున్నది. అది ఎలాగు తయారుచేయబడినదో నీవు చూసినట్లైతే కనీసం నీవు దాన్ని తినవు. మరియు ఇంకను నీవు 25 పైసలు చెల్లించనట్లైతే అది నీకు రాదు.
47
ప్రతీ రాత్రి డబ్బు లేకుండా వెల లేకుండా దేవదూతల ద్వారా తయారుచేయబడిన ఆహారముతో ఆయన వారిని పోషించాడు. మరియు ఈ దినమున నీవు జీవమిచ్చుటకు, ఆత్మ సంబంధమైన జీవమిచ్చుటకు పరలోకము నుండి దిగి వచ్చిన ఆ రొట్టె క్రీస్తును సూచిస్తుంది.
మరియు దేవుడు తన పిల్లలకు ప్రతి రోజు ఒక క్రొత్త అనుభవమును ఇచ్చియున్నాడు. మీరు గుర్తుంచుకోండి, వారు ఆ రొట్టెను దాచుకొన్నట్లైతే అది బూజుపట్టినది.
దాన్ని గూర్చి ఒకరిలా చెప్పుటను మీరు వింటారు, “సరే, నాకున్నది.... నేను నీకు చెబుతాను, నేనొక లూథరన్. నేనొక ప్రెస్బిటేరియన్ను, ఒక బాప్తిస్ట్. నేనొక పెంతికొస్తును,” అది కేవలం మురికి చేతులతో చేయబడిన రొట్టె. అక్కడ దానికున్నదంతయూ అదియే, మురికిగా, మురికి చేతులతో చేయబడినది.
అయితే ఒక సాక్ష్యమును ఒక అనుభవమును నీవు తాజాగా విన్నప్పుడు, “ఈ ఉదయమున ప్రార్ధనలో పరిశుద్ధాత్మడు నా ఆత్మకు తాజాగా బాప్తీస్మమును ఇచ్చియున్నాడు,” ఓ, సోదరుడా, అది దేవదూతల ఆహారమైయున్నది. ప్రతి రోజు తాజాగా పరలోకం నుండి ఆయన వారిని పోషించుచున్నాడు.
దీవేనపు జల్లులు మాకు కావాలి!
మన చుట్టూ కనికరపు జల్లులు పడుచున్నవి,
అయితే ఆ జల్లుల కొరకు మనం బ్రతిమలాడుచున్నాము.
ఓ, అవును, ప్రభువా క్రీస్తు యొక్క జీవపు రొట్టెను పరలోకం నుండి తాజాగా క్రిందికి పంపుము. దానిని నా హృదయంలో ఉంచుము, మరియు నన్ను ఆయన సన్నిధిని అనుభవించనిమ్ము.
48
నిశ్చయంగా, వారు కృతజ్ఞులైయుండిరి. వారు వందనస్తులుగా యున్నారు. దేవుని ఆత్మ ద్వారా పుట్టిన యే పురుషుడైనా, యే స్త్రీయైనా, మరియు పరిశుద్ధాత్మ పొందినవారు ఎల్లప్పుడు వారు కృతజ్ఞులుగా ఉంటారు. ఏది సంభవించినను లెక్క కాదు. నీవింకను కృతజ్ఞుడవై ఉంటావు.
ఆ కొండల మీద జన్మించియున్న చిన్న గుడ్డి బాలుడైన బెన్నీ దరిదాపుగా 8 నెలల వయస్సులో అతని కన్నుల మీద శుక్లములు ఎదుగుట ప్రారంభమైనవి. అతని యొక్క తల్లిదండ్రులు పేదవారు ఒక పెద్ద మట్టి కొండ మీద వారు నివసిస్తున్నారు. మరియు అతడు చూడగలుగునట్లు ఆ చిన్న బెన్నీ కన్నులకు ఆపరేషన్ చేసినట్లైతే, అది అతన్ని రక్షించునని వారు ఎరిగియున్నారు. ఇప్పుడు, ఆ బాలునికి 12 సంవత్సరముల వయస్సు వచ్చినది. ఆ తల్లిదండ్రులు ఒక్క సంవత్సరములో వారికి తగినంత ఆహారం సంపాదించుట వారికి కష్టముగా ఉన్నది. ఆ పిల్లవాని ఆపరేషన్ కొరకు వారు వెల చెల్లించలేదు.
49
ఆ చుట్టు ప్రక్కలవారందరూ, ఆ చిన్న బెన్నీ గ్రుడ్డివాడుగా ఆ చిన్న పిల్లలతో అతడు ఆడుకొనుటకు ప్రయత్నం చేయుటను వారు చూసియున్నారు; అతడు ఏమి చేస్తున్నాడో అతడు దానిని చూడలేడు. వారు అతని గూర్చి చింతించారు. మరియు వారిలో ప్రతి ఒక్కరు, ఆ సంవత్సరం కొంత అధికమైన పంటను పండించారు. వారు ఆ ఎండలో కొంచెం కఠినంగా శ్రమించారు. మరియు తొలకరిలో ఆ పంటలను వారు అమ్మివేసినపుడు వారు ఆ డబ్బును తీసుకుని చిన్న బెన్నీని ట్రైన్ ఎక్కించి, వారు డాక్టర్ నొద్దకు అతనిని పంపారు.
వారు జయకరంగా అతనికి ఆపరేషన్ చేశారు. మరియు అతడు ఇంటికి తిరిగి వచ్చినపుడు ట్రైన్ దిగగానే ఇరుగుపొరుగు వారందరూ అతని చుట్టూ ప్రోగైనారు. అతని చిన్న ప్రకాశమైన కన్నులు మెరియుచున్నవి. అతడు వారి ముఖములను చూచుచుండగా అతడు కేకలు పెట్టి ఏడ్వడం ప్రారంభించినాడు.
అక్కడ ఉన్న కండక్టర్లలో ఒకరు ఇలా అన్నారు, “కుమారుడా ఆ ఆపరేషన్ కొరకు నీకు ఎంత ఖర్చైనది?”
అతడన్నాడు, “మిస్టర్ అది ఎంత ఖర్చయినదో నాకు తెలీదు, అయితే నేనెంతో సంతోషంగా ఉన్నాను, ఎందుకనగా ఎవరైతే వేల చెల్లించియున్నారో వారి ముఖములను నేను చూడగలుగుచున్నాను.
50
ఆ రీతిగానే మనం భావిస్తాము. అది దేవునికి ఎంత ధర అయినదో నాకు తెలియదు, అయితే తనకు కలిగిన శ్రేష్టమైన దానిని నాకు ఇచ్చాడు, అది ఆయన కుమారుడే. ఈ ఆత్మసంబంధమైన దృష్టిని కలిగి ఉండుటను బట్టి నేను ఎంతో కృతజ్ఞుడనైయున్నాను. నేను ఆయన ముఖంలోనికి చూసి ఆయన నా కొరకు చనిపోయాడని నేను తెలుసుకుంటాను. అది ఆయనకు ఎంత ధర అయినదో నాకు తెలీదు. ఆధరకు అంచనా వేయు మార్గం మనకు లేదు. ఆ వెల ఎంతో పెద్దది. అది ఎలాగో నేను మీకు చెప్పలేను. అయితే నేను కృతజ్ఞుడనైయున్నాను. నేను కృతజ్ఞుడను, ఎందుకనగా, ఒకప్పుడు నేను గ్రుడ్డివాడను, అయితే ఇప్పుడు నేను చూడగలుగుచున్నాను.
ఇరవై ఐదు సంవత్సరముల క్రితం, మాయో సోదరులు నా సమయం అయిపోయినది అని చెప్పియున్నారు, నేనిక ఎంత మాత్రము జీవించనని వైద్యులు నాకు చెప్పారు. ఈ దినమున నేను సజీవునిగా ఉన్నాను, అది దేవునికి ఎంత ధర అయినదో నాకు తెలీదు. అయితే నేను సజీవునిగా ఉన్నందుకు కృతజ్ఞుడనైయున్నాను.
ఒకప్పుడు నేను పాపిని, పాపములో, హృదయవేదనలతో, మరణకరముగా మరణించియున్నాను. అయితే ఈ దినమున మరణము నా విజయమైయున్నది. హల్లెలూయ! నేను ఆయన ముఖమును చూడగలుగునట్లు కేవలం అది నన్ను ఆయన సముఖమునకు తెచ్చినది. ఆయన దానిని ఒక ఆపరేషన్ ద్వారా మార్చియున్నాడు. ఆయన నా హృదయమును తీసుకుని ఒక నూతన హృదయంగా చేశాడు. ఏదో సంభవిచియున్నదని నాకు తెలుసు.
51
మినిసొటా రాష్ట్రంలో, గత ఆకురాలు కాలములో, వార్తా పత్రికలో వ్రాసెను, అక్కడ ఒక కుర్రాడు సైకిల్ తీసుకుని ఆ ఉదయమున సంఘములో ఆదివారపు బడికి వెళ్ళియున్నాడు, అయితే మరొక యవ్వనస్తుడు తన పొరుగున ఉన్నవాడు, అతనికి ఆదివారపు బడి అంటే పెద్ద లెక్కలేదు; అతడు తన బాల్య స్నేహితురాలను వెంటబెట్టుకుని స్కేటింగ్ చేయుటకు వెళ్ళాడు. మరియు అతడు ఎదిగినవాడు. మరియు అతడు పలుచటి మంచు నీటిలోనికి జారి పడిపోయినాడు. దానిని ముందు ఆ ఉదయమే అతడు తన బాల్య స్నేహితురాలితో వెళ్ళుచుండగా, ఈ కుర్రవానిని చూచి నవ్వి ఇలా అన్నాడు, “ఆలయమునకు వెళ్ళుచున్న వాళ్ళు తెలివి లేని ఒక మూఢుల గుంపు.” మరియు అతడు మంచు నీటిలో పడిపోయినపుడు, అతని బాల్య స్నేహితురాలు అతనికి కొంత దూరంగా యుండెను. ఆమె తేలికగా ఉన్నది కాబట్టి ఆమె పడకుండా తప్పించుకొనెను. అయితే ఎప్పుడైతే అతడు వచ్చి ఆ మంచు మీద చేతులు పెట్టినప్పుడు, అతడు పక్షవాతం వచ్చి, మంచులో పడి ఉన్నాడు.
అతని బాల్య స్నేహితురాలు అతనిని చేరుటకు ప్రయత్ని౦చెను, అయితే ఆమె ఎంతో బరువుగా ఉన్నది; మరి ఆమె ఆ మంచును పగులునట్లుగా చేయునని “వెనుకకు వెళ్ళు! వెనుకకు వెళ్ళు! నీవును పడిపోతావు మరియు మనమిద్దరము పడిపోతాము,” అని ఆమెను చూచి అరిచాడు. అతను కేకలు వేసాడు, కానీ అతని ఏమియు సహాయం దొరకలేదు.
52
కొద్ది సమయానికి ఆ కొండ మీద నుండి సైకిల్ తొక్కుకుంటూ ఆ చిన్న బాలుడు బైబిల్ను చేతిలో పట్టుకొని వచ్చుచుండెను. ఇతడు ఆ కేకలు విని తన సైకిల్ను వేగంగా తొక్కుకుంటూ అతని యొద్దకు వెళ్ళెను. ఈ కుర్రవాడు తన బైబిల్ను క్రింద పెట్టి ఆ మంచులో అతని యొద్దకు పరుగెత్తాడు. తన పొట్టతో ఆ మంచుపై ప్రాకుచూ తనపైనున్న మంచి బట్టలతో ప్రాకుకుంటూ చివరిగా ఆ మనిషి యొక్క చేతులను పట్టుకొని ఆ మంచులో నుండి అతడు బయటపడు వరకు అతనిని పైకి లాగుచుండెను. అతడు పరుగెత్తుకుంటూ వెళ్ళి ఒక కారు కొరకు జెండా ఊపాడు. వారు ఒక ఆంబులెన్సు పిలచి అతనిని ఆసుపత్రీకి తీసుకుని వెళ్ళారు.
అతడు వెళ్ళి అంబులెన్స్ కొరకు, గుండె నిమ్మ రాకుండా వైద్యులు వ్రాసిన ఇంజెక్షన్స్ కొరకు మరియు తదితరమైన వాటి కొరకు డబ్బు చెల్లించాడు. తర్వాత అతడు ఈ చిన్న కుర్రవాని యొద్దకు వచ్చాడు. అతడన్నాడు, “కుమారుడా, నేను నీకు ఎంత అచ్చియున్నాను.”
ఆ కుర్రవాడు అన్నాడు, “ఏమియు అచ్చిలేవు.”
అప్పుడతడు అనెను, “నేను నా జీవితమనే నీకు అచ్చియున్నాను.” దాని గురించి ఆలోచించు. డబ్బు దాని వెల చెల్లించలేదు. అది అతని జీవితమైయున్నది.
53
ఆ రీతిగానే మనం దేవుని పట్ల తప్పక ఆ భావం కలిగియుండాలి. మన మార్గమును దేని ద్వారానో కొనుట కాదు; అయితే మన జీవితములనే మనం దేవునికి అచ్చియున్నాము, పాపమనే గుంటలో పడి మనం చనిపోతూ, మునిగి యున్నప్పుడు, దేవుడు తన యొక్క చేతులను మన చుట్టూ విసిరియన్నాడు.
నేను పాపంలో లోతుగా మునిగిపోవుచుంటిని,
సమాధానకరమైన ఒడ్డుకు దూరంగా ఉంటిని,
చాలా లోతుగా లోలోపట తుప్పు పట్టిపోతిని,
మునిగిపోతూ, ఏ మాత్రం పైకి లేవలేని ఓడనైతిని,
అయితే సముద్రపు యజమానుడు
నిరాశలో ఉన్న నా కేకను విన్నాడు,
నీళ్ళలో నుండి నన్ను పైకి లేపి యున్నాడు
ఇప్పుడు నేను క్షేమంగా ఉన్నాను.
నా జీవితమును నేను ఆయనకు అచ్చియున్నాను. నీ జీవితమును నీవు ఆయనకు అచ్చియున్నావు. నీవు ఆయనను సేవించుటకు, నీ జీవితమును నీవు ఆయనకు అచ్చియున్నావు. దానిని ఇచ్చుటకు కాదు, నీ సంఘశాఖను గూర్చి ఇటు అటు తిరుగుచు గొప్పలు చెప్పుకొనుట కాదు, మరియు ఇతరులను విమర్శించుటకు కాదు; అయితే వారిని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జ్ఞానమునకు తెచ్చుటకు, వారిని రక్షించుటకు మరియు ఇతరులను సేవించుటకే.
54
ముగింపులో తప్పిపోయినన కుమారుని గూర్చి ఇది చెప్పాలి. అతడు తనకున్న ఆస్తినంతయు దుర్వ్యాపారములతో పాడుచేసి మరియు అతడు ఇంటికి వచ్చుచున్నప్పుడు. అతడు ఒక పందుల దొడ్డిలో ఉంచబడి నాడు, మరియు అతనికి బుద్ధి వచ్చినది. మరియు అతడన్నాడు, “నా తండ్రి ఇంట అనేకమంది సేవకులు సమృద్ధిని కలిగియున్నారు, మరియు విడిచిపెట్టుటకు తగిన౦త ఉన్నది, మరియు నేనైతే ఇక్కడ దేని కొరకు చనిపోవుచున్నాను.” అతడు ఒక వేళ ఇలా చెప్పుటకు ప్రయత్నిస్తే, “నాకు కొంత డబ్బున్నట్లైతే నేను పాడుచేసిన దాన్ని మరలా నా తండ్రికి నేను తిరిగి చెల్లిస్తాను, అని అనుకుంటే?” అయితే తన తండ్రి యొక్క స్వభావం అతనికి తెలుసు, మరియు అతడన్నాడు, “నేను లేచి నా తండ్రియొద్దకు వెళతాను.”
తండ్రి ఎన్నడూ ఇలా చెప్పలేదు, “కుమారుడా, ఒక్క నిమిషం ఆగు, నీవు తిరిగి నా డబ్బును తీసుకొనివచ్చుచున్నావా?” లేదు, అతని పాపములను బట్టి అతనికెన్నడూ ధర కట్టలేదు. అతడు తిరిగి వచ్చినందుకు ఆయన సంతోషించియున్నాడు. అతనికి బుద్ధి వచ్చినందుకు తండ్రి ఆనందపడ్డాడు, ఏలయనగా అతడు అతని కుమారుడైయున్నాడు. అతడు తన సొంత కుమారుడై యున్నాడు. అతడు అతని సొంత బిడ్డ దారిగుండా ఇంటికి వచ్చినందుకు అతడు సంతోషించియున్నాడు. ఇప్పుడు, అతని పాపమును తండ్రి లెక్కించలేదు, అయితే అతనికి బుద్ధి వచ్చినందుకు సంతోషించాడు. మరియు అతడన్నాడు, “నేను నా దేవుని యొదుటను, నా తండ్రి యొదుటను పాపం చేసియున్నాను, నేను లేచి ఆయన యొద్దకు వెళతాను.”
మరియు అతడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరుగెత్తుకొని పోయి అతనికి ముద్దుపెట్టెను. మరియు అతడన్నాడు, “క్రొవ్విన దూడను వధించుడి,” డబ్బు లేకుండా, “శ్రేష్టమైన, అంగీని తీసుకుని రండి,” డబ్బు లేకుండా “ఉంగరాన్ని తెండి,” డబ్బు లేకుండా, “ఆ ఉంగరాన్ని అతని చేతికి పెట్టండి. మనము తిని త్రాగి సంతోషి౦చెదము, ఏలయనగా, ఈ నా కుమారుడు తప్పిపోయాడు మరియు ఈ యేడు దొరికాడు. అతని చనిపోయాడు మరియు ఈ యేడు బ్రతికాడు. దాన్ని గూర్చి మనమందరం సంతోషి౦చెదము.”
55
స్నేహితులారా ముగింపులో దీన్ని చెప్పనివ్వండి. కేవలం నిన్ను తృప్తిపరచునది, నిజమైనవి అక్కడ ఉన్నవి, అక్కడ కేవలం మంచి వస్తువులు ఉన్నవి, అవి డబ్బుతో కొనబడలేవు. యేసుక్రీస్తు ద్వారా అవి ఉచిత వరములై యున్నవి: నీ ఆత్మ యొక్క రక్షణ, సంతోషము. వచ్చి భుజి౦చుడి, మరియు సంతుష్టినొందండి.
ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనియ్యుడి.
చెవియొగ్గి, నా యొద్దకు రండి: మీరు వినినయెడల మీరు బ్రతుకుదురు; నేను మీతో నిత్యనిబంధన చేసెదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును.
56
శాశ్వతమైనవన్నియు, మంచి వస్తువులన్నియు, రమ్యమైన వస్తువులన్నియు, నిత్యమైన వస్తువులన్నియు, ఉచితమైయున్నవి.
వాటికి నీకు ఏ వెలయు లేదు. ఈ గ్రంధము యొక్క ముగింపులో ఇలా వ్రాయబడియున్నది, అది చెప్పుచున్నది, “ఇచ్చయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకోననిమ్ము, దప్పిగొనిన వానిని రానిమ్ము, డబ్బు లేకుండా వేల లేకుండా.” సంతుష్టి కలుగజేయని దానికొరకు మీరు రూకలెందుకు వెచ్చించెదరు, నిజమైనవే నిన్ను సంతోషపరుస్తాయి, అవి ఉచితము, వెళ్ళు అవి నీ ద్వారా దాచబడినవి కావు?
మనం ప్రార్తన చేదాం.
57
ఇప్పుడు ప్రార్ధనలో మనం మౌనంగా ఉండగా, ఈ ఆవరణములో ఈ ఉదయము, ఈ ఊటలో నుండి త్రాగినవారెవరైనా ఇంకా ఈ లోకసంబంధమైన కోరికలు మీలో ఉన్నట్లైతే, మీరు మా యొక్క స్థలమును మార్చుకొనగోరినట్లైతే, ఈ ఉదయమున నీ ద్రవ్యమును మార్పిడి చేసుకొనగోరుచున్నావా? నీవు దేవుని నుండి కొనగోరుచున్నావా? - డబ్బు లేకుండా, వెల లేకుండా - తేనే మరియు పాలు, ద్రాక్షరసము యొక్క సంతోషములు? మీ చేతిని ఎత్తి ఇలా చెప్పగలరా, “సహోదరుడా బ్రన్హం మీరు ప్రార్ధన చేయుచుండగా, నన్ను జ్ఞాపకం చేసుకోరా?” అయ్యా, ప్రభువు మిమ్మలను దీవించును. అయ్యా, ప్రభువు మిమ్మలను దీవించును. అయ్యా, ప్రభువు మిమ్మను దీవించును. సహోదరీ, ఎవరైనా ఇతరులు అక్కడ ఇలా చెప్పగలరా, “బ్రన్హం సోదరుడా నీవు ప్రార్ధన చేయుచుండగా నన్ను జ్ఞాపకం చేసుకోరా?”
58
యవ్వనస్తులైన మీలో కొందరు, అవును, మీ జీవనోపాధిని వ్యర్థంగా ఖర్చు పెట్టియున్నారు. నీ తల్లి, నీ కొరకు ప్రార్ధన చేసిన గంటలు, నీ తండ్రి, నీకు చేయబడిన ఉపదేశమంతయు, అయినా ఇంకను నీవు దాన్ని ప్రక్కకు త్రోసివేసి, దెయ్యం యొక్క గుసగుసలు వినుటకు నీ చెవిని త్రిప్పావు. ఇప్పుడు లోకసంబంధమైన కార్యములను, లోకసంబంధమైన సంగీతమును నీవు ఆశించుచున్నావు. మరియు ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు పందుల దొడ్డిలో అతనికి బుద్ది వచ్చిన రీతిగా, నీకు బుద్ధి వచ్చుచున్నది. సోదరీ, సోదరుడా నీ చేతిని ఎత్తి ఇలా చెప్పగలవా? “దేవా నన్ను గుర్తుచేసుకొనుము. ఈ ఉదయమున నాకు బుద్ధి కలుగజేయుము. నన్ను తండ్రి ఇంటికి రానిమ్మ?” అది నీకు ఒక్క రవ్వంత కూడా ఖర్చు కాదు. ఆయన నీ కోసం ఎదురుచూస్తున్నాడు. నీవు ఏది చేసినప్పటికీ లెక్క కాదు, “మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడతాయి, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చువలె తెల్లబడతాయి.” దైవిక సన్నిధిలో ఉన్న వారందరూ చేతులు ఎత్తగోరు వారందరు.
అవసరతలో ఉన్నవారు, రోగులుగా ఉన్నవారు, చెప్పండి, “నేను ఒక గుంటలో పడియున్నాను, సాతాను నన్ను గుంటలో పడవేసినది. వాడు నన్ను కుంటివానిగా, రోగిగా చేసినాడు, ఈ ఉదయమున దేవుని యొక్క విశ్వాసమనే గొలుసు నీ హృదయంలో వేయబడి, ఆ శృంగారమనే దేవాలయం వద్ద ఉన్న మనిషిని పైకి లాగినట్లుగా, నేనును ఈ గుంటనుండి లాగబడవలెనని ఆశించుచున్నాను. మీ చేతులను ఎత్తండి దేవుడు మీతో ప్రతి ఒక్కరిని దీవించును గాక!
59
ప్రభువా, ఈ ఘడియలో తమ చేతులను ఎత్తి పాపక్షమాపణ కొరకు వచ్చినవారిని నీ యొద్దకు తెచ్చుచున్నాను, నీవు దేవుడవైయున్నావు మరియు నీవే దేవుడవు. వారు ఎక్కడ కూర్చొనియున్నారో అక్కడే తిన్నగా నీవు వారితో మాట్లాడియున్నావు. అక్కడే వారు తప్పయై ఉన్నారని నీవు ఒప్పించియున్నావు, వాక్యము దాని స్థలమును కనుగొనినపుడు పరిశుద్ధాత్మడు మాట్లాడుట ప్రారంభించి ఇలా చెబుతాడు, “నీవు తప్పుయై యున్నావు. తిరిగి తండ్రియైన దేవుని వైపు మళ్ళుము.” ఎక్కడ సమృద్ధి ఉన్నదో, ఎక్కడకు వారు ఏమియు తేవల్సిన అవసరం లేదో, ఆ తండ్రి యొక్క గృహమునకు వచ్చుటకు, ఈ భూసంబంధమైన పందుల దొడ్డి నుండి వారు పైకి రావాలని చూపుతూ, తమ చేతులను ఎత్తియున్నారు. ఆ కవి చక్కగా చెప్పియున్నట్లుగా, తెచ్చుటకు నా చేతిలో ఏమియు లేవు కేవలం నీ సిలువను హత్తుకొనుచున్నాను.“ తియ్యగా, దీనముగా, ఒప్పించబడినవారు రావచ్చును, వారి జీవితములను అర్పించవచ్చును. నీవు శ్రేష్టమైన అంగీని తెచ్చియున్నావు, మరియు వారిచేతులకు ధరింపజేయుటకు ఉంగరాన్ని తెచ్చియున్నావు. వారిని వధింపబడియున్న మన్నాతో పోషించుము. ప్రభువా, దాన్ని దయ చేయుము.
60
రోగులుగా మరియు పీడింపబడుచున్నవారు; అవసరతలో ఉన్నవారు. సాతానుడు వారిని గుంటలోనికి త్రోశాడు, సందేహం లేదు, శస్త్రచికిస్త కొరకు డబ్బు లేని స్థితిలో. సందేహం లేదు, బహుశా అనేకమందికి శస్త్రచికిస్త చేయుట కష్టం. బహుశా, అతనికి ఎంతో డబ్బు ఉన్నప్పటికీ, వైద్యుడు కనీసం ఆ ఇబ్బందిని తొలగించలేడు. అయితే నీవు దేవుడవై యున్నావు. ఇక్కడ హాజరైయున్న పరిశుద్ధాత్మ అభిషేకం క్రింద ఈ ఘడియలోనే, నేను ప్రార్ధన చేయుచున్నాను. ప్రతి ఒక్కరినీ స్వస్థపరచుము. వారి శిరస్సు నుండి పాదముల వరకు ప్రతీ అణువులో వారు స్వస్థపడుదురు గాక.
వారికి సంతోషం లేకుండా, వారికి రక్షణ లేకుండా, వారు దాన్ని ఎంత మాత్రము అనుభవించలేవు; దావీదు పూర్వం చెప్పినట్లుగా, “రక్షణానందాన్ని తిరిగి నాలో పుట్టించుము.” వారు చీకటి నుండి నిరాశ నుండి వారు సంతోషాన్ని ఆనందాన్ని పొందుదురు గాక. ఏలయనగా అలసట చెందిన దేశములో నీవొక బండవైయున్నావు. దెయ్యము ప్రతీ విధమైన వ్యాధితో మిస్సైల్ వలె వారికి గురిపెట్టి కొట్టుచుండగా, తుఫాన్ సమయంలో నీవొక ఆశ్రమమై యున్నావు. అది ఈ దినమున అలా జరుగును గాక, దేవా, దానిని యేసు నామములో మేము అడుగుచున్నాము. ఆమెన్.
61
మృదువుగా, మెల్లగా యేసు పిలుచుచున్నాడు,
నిన్ను నన్ను పిలుచుచున్నాడు;
మనం పాపం చేసియున్నప్పటికీ, ఆయన కనికరమును
క్షమాపణను కలిగియున్నాడు,
నీ కొరకు నా కొరకు క్షమాపణ
“ఇంటికిరండి...” ఇప్పుడు మీరు వేదికనొద్దకు వచ్చి మోకరించగోరినట్లైతే, మేము మీతో కలిసి ప్రార్ధిస్తాము, మిమ్మలను అభిషేకిస్తాము, మేము చేయగలిగినదేదైనా మీకు చేస్తాము. మీకు స్వాగతం
...ఆలసినవారు ఇంటికి రండి.
మృదువుగా, మెల్లగా యేసు పిలుచుచున్నాడు!
ఓ పాపి ఇంటికిరా, యేసు పిలచుచున్నాడు!
మీరు ఆయనను ప్రేమిస్తారా? టెడ్డీ నీవొక రాగమును వాయించగలవా, “నేను ఆయనను ప్రేమించుచున్నాను, నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఏలయనగా ఆయన మొదట నన్ను ప్రేమించి యున్నాడు,” నీవు దాన్ని పొందగలవా?
62
ఒక్క క్షణము, ఈ ఆరాధన యొక్క క్రమమును మార్చుచుండగా మనము ఆయన మహిమ కొరకు పాడుదాము. ఇది ఆరాధనయైయున్నది. వర్తమానం ముందుకు వెళ్ళినది. మీరు దాన్ని స్వీకరంచినందుకు సంతోషం. అది మీకు మేలు చేయాలని ప్రార్ధి౦చండి, అది మాట్లాడుటలో అది నాకు మేలు చేసినది. మీతో మాట్లాడుటకు నాకివ్వబడిన అదే ప్రేరేపణ, మీతో మాట్లాడుతుంది. మీరు అదే ప్రేరేపణతో అది లోనికి పంపబడి యున్నట్లుగా మీరు దాన్ని స్వీకరిస్తారు. మంచిది.
నేను ఆయనను ప్రేమించుచున్నాను, (మనం పాడుచుండగా, మీ కన్నులను మూసి, మీ చేతులను పైకెత్తండి), నేను ఆయనను ప్రేమిస్తాను.
ఏలయనగా మొదట ఆయన నన్ను ప్రేమించెను
మరియు నా రక్షణను
కల్వరి మ్రాను మీద కొన్నాడు.
ఇప్పుడు మన తలలను వంచుదాము, దానిని ఆలాపి౦చుదము, [సహోదరుడు బ్రన్హం, నేను ప్రేమించుచున్నాను అని ఆలాపించుచున్నాడు - సంపా] మీరు ఆయనను ప్రేమిస్తారా? ఆయన మీ హృదయానికి యదార్థంగా లేడా? అక్కడ ఆయన్ను గూర్చి ఒక ప్రత్యేకమైనది లేదా, అక్కడ ఆయన ఎంతో నిజమైనవాడు కాడా? “నేను ఆయనను ప్రేమిస్తాను. ఏలయనగా మొదట ఆయన నన్నుప్రేమించెను.” కల్వరి నుండి ఆయన తన జీవమును నా హృదయంలోనికి క్రుమ్మరించి దానికి గాలం వేశాడు.
63
మరువద్దు, సహోదరుడు డ్రమ్మండ్ ఈ రాత్రి ప్రభురాత్రి భోజనంలో మనతో మాట్లాడతాడు. మీరు ప్రభువును ప్రేమించినట్లైతే, మీరు క్రిందికి వచ్చి మాతో ప్రభురాత్రి భోజనమును తీసుకోండి. ప్రభువు చిత్తమైనయెడల నేను మీతో ఇక్కడ ఉంటాను. అది సహోదరుడు టోని జాబెల్ యొక్క అల్లుడు, సహోదరుడు ఆఫ్రికా నుండి వచ్చిన ధామ్, అతని కుమారుడు చక్కని కుర్రవాడు, చాలా చక్కని స్థిరమైన క్రైస్తవుడు, చక్కని చిన్న బోధకుడు.
ఏలయనగా మొదట ఆయన నన్ను ప్రేమించెను
మరియు కల్వరి మ్రాను మీద
నా రక్షణను కొన్నాడు.
మనము తలలు వంచియుండగా పియానోలో ఆ పాట అలానే కొనసాగుతుంది.
64
ప్రభువైన యేసు, మేము మరొక కూటములో ప్రవేశించుటకు స్థిరపడుచుండగా, ప్రభువా మా హృదయాలతో మాట్లాడియున్న పరిశుద్దాత్మను బట్టి నీకు వందనములు. మీరు మాకు దీన్ని చేసినందును బట్టి, ప్రభువా మేము సంతోషిస్తాము. మరియు నీ వాక్యము వ్యర్థంగా తిరిగిరాక అది ఏ ఉద్దేశ్యం కొరకు పంపబడినదో దానిని నీ వాక్యం నెరవేర్చును గాక, నిజమైన వస్తువులు, శాశ్వతమైన వస్తువులు, దేవుని నుండి వచ్చునని యెరిగియుండునట్లు అది మా హృదయాల్లో నిలిచియుండనిమ్ము. నశించే వాటి కొరకు మా జీవితంలో జీవమరణ పోరాటాల కొరకు వాటికొరకు మేము పెనుగులాడుచున్నాము, అయితే వెల లేని వాటి కొరకు, నశించని వాటి కొరకు ప్రభువా, మేము పోరాడుదము గాక. వెల ఉచితంగా చెల్లించబడినది, మరియు ఒక ఆహ్వానము బలవంతం చేయుచున్నది, “ఇచ్చయించు వానిని రానిమ్మ.”
65
ప్రభువా, ఈ ఆరాధనలో ముందు భాగాన్ని దీవించండి, దాన్ని దయ చేయుము. ఈ రాత్రి మమ్ములను కలుసుకొనుము. బాప్తీస్మము పరిచర్యను దీవించుము. అక్కడ ఒక గొప్ప కుమ్మరింపు ఉండును గాక. నీ ప్రియ కుమారుడైన ప్రభువైన యేసు నామంలోనికి బాప్తీస్మము పొందు ఈ ప్రజలు పరిశుద్ధాత్మతో నింపబడుదురు గాక. మరియు చేతులు ఎత్తిన ఈ ప్రజలు ఈ ఉదయమున వారి పాపముల విషయమై మీరు మారు మనస్సు పొంది వారు వచ్చి బాప్తీస్మము వస్త్రములతో ముందుకు వచ్చి, కొలనులోనికి ముందుకు వెళ్ళి; వారి పాపములు క్షమించబడియున్నవని లోకమునకు ఋజువు చేయుదురు గాక; ఎవరైతే బాప్తీస్మము పొందుతారో వారు క్షమింపబడును. ప్రభువా, దాన్ని దయచేయండి.
66
ఈ రాత్రి నీ సింహాసనం నుండి తాజాగా వర్తమానం తెచ్చుచుండగా సహోదరుడు డ్రమ్మండ్ను దీవించుము. నీ పరిశుద్ధాత్మతో ఆయనను అభిషేకించుము. మేము ప్రభురాత్రి భోజనమును తీసుకొనుచుండగా మాతో ఉండుము. మా హృదయములు శుద్ధంగా మరియు స్వచ్చముగా, ఏ విధమైన అపవిత్రత మాలో లేకుండును గాక. ప్రభువైన యేసు రక్తము మా పాపమంతటి నుండి మమ్మును కడుగును గాక. ప్రభువా దాన్ని దయ చేయుము. రోగమును మా మధ్య నుండి తొలగించి, మాకు సంతోషాన్నిసమాధానాన్ని ఇమ్ము. యేసుక్రీస్తు ద్వారా మేము దాన్ని అడుగుచున్నాము. ఆమేన్.
నేను ప్రేమిస్తున్నాను (మీరు ఆయనను ప్రేమిస్తారా?
మీ చేతులను ఆయనకు ఎత్తండి.) నేను ఆయనను ప్రేమిస్తున్నాను
ఏల.... (ఇప్పుడు ముందుకు వెళ్ళి
మీ ప్రక్కన ఉన్న వారితో కరచాలనం చేయండి). మొదటిగా నన్ను ప్రేమించెను.
[స్పష్టం లేని మాటలు] నేను ఆయనను ప్రేమిస్తున్నాను.
మరియు కొనేను ..... (అది మంచిది మీ చుట్టూ తిరిగి
కరచాలనం చేయండి). రక్షణ
... కల్వరి మీద.
మంచిది, నెవిల్ సోదరుడా, ఆయన వాక్యముతో లేక ఏదైనా.