ప్రభువు యొక్క శరీరమును వివేచించుట

ప్రభువు యొక్క శరీరమును వివేచించుట

VGR COUNT-182 స్నేహితులారా, సాయంకాలపు శుభములు. అది. కూర్చొనండి.

మరలా ఈ రాత్రి ఇక్కడ ఈ భవనము నందు మంచి క్రైస్తవ జనుల మధ్య ఉండుట చాలా చక్కగానున్నది. మరియు మనము చేయగలిగిన లేక ఆలోచించగలిగిన వాటన్నిటికి పైగా, దేవుడు, ఈ రాత్రి అధికముగాను, విస్తారముగాను పని చేయునని,మనము ఎదురుచూచుచున్నాము. ఆయన నిజమైనవాడని మనము ఎరిగియున్నాము.

2

కూటములలో గత రాత్రి ఎంత మంది స్వస్థత పొందుకొనియున్నాము అనే అనుభూతిని కలిగియున్నారు? ఓ, అది చాలా చక్కగా ఉన్నది. ఈ రాత్రి మిగిలిన వారు స్వస్థపరచబడుదురని మేము ఎదురుచూచుచున్నాము. మరియు మనకు ఇంకా కొన్ని ప్రార్థనా కార్డులు ఉన్నవని నేను అనుకొనుచున్నాను. బిల్లి వాటిని బయటకు ఇవ్వలేదని, అతడు నాతో చెప్పెను, ఎందుకనగా మేము వాటిని తీసుకొనుటలేదు, కాని వాటిలో కొన్ని గత రాత్రివి ఉన్నవి. మరియు వారిలో కొందరు జనులు ఎవరైతే ప్రార్థనా వరుసలో రావలెననుకుంటున్నారో వారు రావచ్చును లేదా వివేచన వరుసలో ఈ రాత్రి కొంతసేపటి తరువాత, మేము వాటిలో కొన్ని ఉపయోగించుకొనవచ్చును.

ఒక వ్యక్తిని స్వస్థపరచునది వివేచన కాదు; అది వారిని పైకి చూచుటకై ఒక స్థితిలోనికి తీసుకొనివచ్చును మరియు యేసు వారి కొరకై ఇంతకు మునుపే చేసిన వారి స్వస్థతను అంగీకరించినట్లుగా అది చేయును. చూశారా, హస్త నిక్షేపణము అనునది చాలా మంచి కార్యము, ఎందుకనగా, అది లేఖనానుసారము. అయితే స్వస్థత పొందుకొనుటకు ఇది ఒక అన్యమార్గము కాదు.

3

ఈ బైబిల్ గ్రంథములో, ఒక యూదుడుండెను.... అతని కుమార్తె చాలా వ్యాధితో మరణములో ఉండెను, మరియు ఆమె చనిపోయెను. మరియు అతడు యేసుతో “నా కుమార్తె చావసిద్ధమై యున్నది, అయితే నీవు వచ్చి ఆమె మీద నీ చేతులుంచుము, మరియు ఆమె బాగుపడును” అని చెప్పెను.

అయితే రోమను శతాధిపతి, అన్యుడు, అతని దాసుడు వ్యాధితో ఉన్నప్పుడు, “నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను; మాటమాత్రము సెలవిమ్ము” అని అతడు చెప్పెను. అదే యేసు యొక్క హృదయమును త్రిప్పినది. అతనిపై చేతులుంచవలెనని కోరలేదు. అతడు కేవలము మాట మాత్రము వినవలెననుకొనెను.

4

మీరు చూడండి, నాకు ఆ కధ ఇష్టము ఎందుకనగా, ఆయన అధికారము కలిగిన ఒక మనిషిగా యున్నాడని ఆ రోమనుడు గుర్తించెను. మరియు అతడు ఒక మనుష్యుని “ఇది చేయు” లేక “అది చేయు” అని చెబితే, అతడు దానిని చేయును. మరియు ప్రభువైన యేసులో అదే అధికారమును అతడు గుర్తించెను. ఎందుకనగా అతను - అతని క్రింద ఉండు ఒక మనిషితో “నీవు వెళ్ళు” లేక “నీవు రమ్ము” అని చెబితే ఆ వ్యక్తి ఆయనకు విధేయుడైయుండును అని అతడు ఎరిగియుండెను. మరియు అన్ని వ్యాధులు మరియు రోగములు ప్రభువైన యేసు యొక్క నియంత్రణలో ఉండెనని అతడెరిగియుండెను; అందుచేత, ఆయన వచ్చి దాసుని పైన చేతులుంచనవసరము లేదు; “మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బ్రదుకును.”

మరియు యేసు ఆశ్చర్యపడి, మరియు ఆయన చెప్పెను, “ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను కనుగొనలేదు.” కాబట్టి, మన అమెరికనులు అటువంటి విశ్వాసమును ఎప్పుడు కలిగియుండెదరో అని ఆ దినమును చూచుటకై నేను నిశ్చయమైన నిరీక్షణ కలిగి జీవించుచున్నాను. “ప్రభువా, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బ్రదుకును.” ఓ, అది ఒక గొప్ప దినముగా ఉండును.

5

అప్పుడప్పుడు, అభిషేకము చాలా బలముగా ఉండినప్పుడు, మరియు అప్పుడప్పుడు, నాకు వేదిక పిలుపు పిలుచు అవకాశము కూడా ఉండదు. కొందరు ఇతర సహోదరులు, బ్రదర్ సులీవన్ లేదా ఇక్కడున్న నా సహోదరులలో కీర్తి కలిగిన కొందరు దానిని గూర్చి జాగ్రత్త వహించుదురు. మన ముఖ్యాంశము కేవలము దైవీక స్వస్థత కొరకేనని ఎవరో ఒకరు చెప్పవచ్చును. దైవిక స్వస్థత అనగా కేవలము చేపలవేటకు వెళ్ళునటువంటిది. చేపకు గాలము నీవు ఎన్నడు చూపించవు; నీవు దానికి ఎర మాత్రమే చూపించెదవు, మరియు అది ఎరను తటాలున లాగుకొని, గాలమునకు చిక్కుకొనును. కాబట్టి దైవిక స్వస్థత కూడా ఆ విధముగానే ఉన్నది. అది ఆకర్షితముగా యున్నది, ఎందుకనగా అది అక్కడ ఒక దేవుడు జీవించుచు మరియు నీ యందు అక్కర కలిగియున్నాడని అది రుజువు చేయుచూ మరియు ప్రదర్శించుచున్నది. మరియు అవిశ్వాసులు దానిని చూచెదరు, వెంటనే అతని కన్నులు దాని పట్టుకొనును, మరియు జీవము కలిగిన దేవుడు ఉన్నాడని ఎరుగును, అంతట అతడు రక్షణ యొక్క వరుసలోనికి వచ్చును. అంతట దేవుడు వెళ్ళి అతనిని నియంత్రించును మరియు అతనిని లోపలకి త్రిప్పును. కాబట్టి, అందుకే, ఈ హేతువు కొరకే దైవిక స్వస్థత యున్నది.

6

ఇక్కడ, బాలురు కొన్ని టేపులు మరియు కొన్ని పుస్తకములు మరియు రికార్డులు మరియు అలాంటివి కలిగియుండి, వారు జాగ్రత్త వహించగల తమ సొంత వ్యాపారమును వారు కలిగియున్నారు. మనకు లేదు.... నా కొరకు, ఆ పుస్తకములను మాత్రమే నేను కలిగియున్నాను మరియు వాటిలో కొన్నింటిని నేను కొనవలసియున్నది. నాకు సంబంధించినవి కొన్ని అక్కడ ఉన్నవి — వర్తమానములు. “నా జీవిత కథ, అనెడి మిగతా పుస్తకములను, మరియు ”దక్షణాఫ్రికాను దర్శించిన ప్రవక్త“ అని పిలవబడే పుస్తకమును బ్రదర్ లిండ్సే దగ్గర కొనియున్నాను. మరియు నాకు సంబంధించి మూడు లేక నాలుగు బోధన పుస్తకములు (వర్తమానములు) ఉన్నవని నేను నమ్ముచున్నాను. డబ్బు కొరకు కాదు, వర్తమానము బయటకు వెళ్ళుట కొరగే వారు వాటిని ఇక్కడ కలిగియున్నారు.

మనము ఆలోచించుదాని కంటే ఇంకా చివరి గడియలో మనము జీవించుచున్నాము, వర్తమానమును బయటకు పంపించవలెను, అదే ముఖ్య విషయము. ఇది కాలము యొక్క అంతమందున్నది. మరియు సంఘము భయంకరమైన స్థితియందున్నది, మరియు మనము జనుల మధ్యలో సూర్యుని వెలుగు అన్ని వైపులా వెదజల్లుటకు ప్రయత్నించుచున్నాము. మనము కలిగియున్న విశ్వాసములోనికి వారిని మార్చుటకు ప్రయత్నించుట లేదు, కానీ ప్రభువైన యేసుకు అతి సమీపముగా జీవించుటకు మరియు ఆయన యందు విశ్వాసముంచుటకును ప్రయత్నించుచున్నాము. వ్యక్తులను ఒక సంఘము నుండి మరొక సంఘమునకు లాగుట కాదు, కానీ ఎక్కువ మందిని ఆ సంఘానికి పంపుటయే మన యొక్క ఉద్దేశ్యము.

7

ఇప్పుడు సాయంకాలపు వర్తమానము కొరకై, మనము వాక్యమును తెరుచు ముందుగా, అది చిన్న వర్తమానము. మేము మిమ్ములను అధిక సమయము ఉంచాలనుకొనుట లేదు, ఎందుకనగా అనేకులు పట్టణము వెలుపల నుండి వచ్చియున్నారు, మీరు మరలా మీ పనులకు వెళ్ళవలసియున్నది. మేము ఇంకా శనివారము రాత్రివరకు వేచి ఉండెదము, ఆ తరువాత ఎక్కువ సమయము ఉంచెదము. అంతట, ఆదివారము నాడు, నీవు 9:30 వరకు ఆదివారపు బడిపాఠమునకై వెళ్ళనవసరము లేదు. కాబట్టి కొద్ది క్షణములు మనము మన తలలు వంచి, వాక్యము కొరకై ప్రార్ధించుదము.

8

ప్రభువా, రానైయున్న అవకాశము కొరకైన తలంపుపై మేము కృతజ్ఞలమై యున్నాము. మరియు జీవించుచున్న దేవునికి మా శిరములను వంచియున్నాము, మరియు ఆయన యొక్క కుమారుడు, ప్రభువైన యేసు యొక్క నామములో మేము తండ్రిని అడిగినట్లయితే, మేము దేనినైతే అడిగితిమో దానిని మేము కలిగియుండెదమని, ఆయన పరిశుద్ధ కుమారుడు, ప్రభువైన యేసు చేత మేము వాగ్దానము చేయబడియున్నామని ఎరిగియున్నాము. మరియు మేము యేసు నామమున వచ్చినట్లయితే, మేము ఆయనతో ఒక పరిచయమును (ఇంటర్వ్యూ) లేదా వినుటను (ఆడిషన్) కలిగియుందుమని మేము నిశ్చయపరచబడి యున్నాము. “నా నామమున తండ్రిని మీరు ఏది అడిగినను, అది ఆయన అనుగ్రహించును” అని ఆయన చెప్పెను. మరియు ఆయన మన మనవులను వినును అనియూ మరియు మనము ఏది అడిగినా అనుగ్రహించును అనియూ ఈ రాత్రి మనము సంపూర్ణమైన నిశ్చయత కలిగియున్నాము, ఎందుకనగా మనము అడిగియున్నవన్నియూ దేవుని యొక్క చిత్తమే అను అనుభూతిని మేము కలిగియున్నాము. ఒక ఖచ్చితమైన స్థలములో ఆయన ఇలా చెప్పియున్నాడు, “మీరు అడుగుట లేదు గనుక మీరు పొందుకొనుటలేదు; మరియు మీరు నమ్ముటలేదు గనుక మీరు అడుగుట లేదు.” ప్రభువా, మేము వచ్చుటకు కారణమేమనగా మేము దానిని నమ్ముచున్నాము. మరియు మీరు జవాబిచ్చెదరని మేము నమ్ముచున్నాము. మరియు మా ప్రార్థనలు మనుష్యులు వినుటకు మాత్రమే కాదు, అయితే మీరు వినుచున్నారనియు మరియు మీరు నిశ్చయముగా మాకు జవాబు ఇచ్చెదరని మేము నమ్ముచున్నాము, ఏలయనగా మీరు వాగ్దానము చేసియున్నారు. మీ చిత్తము మాత్రమే జరుగవలెనని మేము అడుగుచున్నాము.

9

ఇక్కడ ఉన్న ప్రతీ పాపి, నిన్ను వారి రక్షకునిగా ఎరిగిలేరు, ఏదో ఒకటి సంభవించునట్లు లేదా నిన్ను వారి యొక్క రక్షకునిగా అంగీకరించియున్నామని చెప్పునట్లుగా ఈ రాత్రి ఉండును గాక. ప్రభువా, ఈ రాత్రి అలాగు జరుగును గాక.

ఈ రాత్రి పరిశుద్ధాత్మను కలిగిలేనివారు, ఆ ఘడియ కొరకు వేచియుండి, ఎదురుచూచుచున్న వారి యొక్క కన్నుల నుండి పొరలు రాలిపడును గాక, మరియు అప్పుడు వారి యొక్క హృదయాభిలాష వారికి అనుగ్రహించబడును గాక. ఓ ప్రభువా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ ప్రతీ యొక్క హృదయమును నింపును గాక, వారి యొక్క ఆత్మలు ఎంతో ఉత్సాహపడునంత వరకు, అన్ని సందేహములు మరియు మూఢభక్తి వారి నుండి తీసివేయబడునంత వరకు, దేవుని ఆత్మ యొక్క ప్రత్యక్షత (బయలుపాటు) వారితో ఉండును గాక, మరియు పరిశుద్ధాత్మ వారి జీవితములోనికి వచ్చి వారిని దేవుని రాజ్యములోనికి ముద్రించును గాక.

10

ప్రభువా, కూటము ముగించినప్పటికి, మా మధ్యలో ఒక్క వ్యాధిగ్రస్తుడు కూడా ఉండకుండా ఈ రాత్రి అనుగ్రహము చూపండి. ప్రతి ఒక్కరు స్వస్థత నొందుదురు గాక. వైద్యశాలలో ఉన్నవారిని, ఖైదీలుగా ఉన్న వారిని, చెరలో ఉన్న వారిని, మీ కరుణ యొక్క లోతైన అవసరతను కలిగియున్నవారిని మేము మర్చిపోవుట లేదు. ఓ ప్రభువా, వారితో ఉండండి.

ఈ రాత్రి మేము విడిచి వెళ్ళుచుండగా, మేము శిష్యులు వలె, “నేడు మేము వింతైన కార్యములను చూచితిమి” అని చెప్పుదుము గాక. మరియు మా ఒక్కొక్కరి ఇండ్లకు మేము వెళ్ళుచుండగా, మా హృదయములు మాలో మండలేదాయని చెప్పుదుము గాక. మీ వాగ్దానము ప్రకారముగా మాకు ఈ కార్యములను అనుగ్రహించుము అని మా యొక్క రక్షకుడవైన, మీపై మేము ఆధారపడియున్నాము, మరియు మీ వాగ్దానము ఎల్లప్పుడూ మీ యొక్క చిత్తమైయున్నది. మేము యేసు నామములో దీనిని అడుగుచున్నాము. ఆమేన్.

11

ఈ రాత్రి పరిశుద్ద గ్రంథములో నుండి I కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11 అధ్యాయమును త్రిప్పుటకు మీరు ఇష్టపడినట్లయితే, మనము లేఖనములోని ఒక భాగమును 23వ వచనముతో ప్రారంభించి చదువుదుము:

నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని - యీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది తాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.

కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. (ఇప్పుడు నేను చదవగోరుచున్నాను. ఇరువైలో నా పాఠము. 29వ వచనము నుండి.)

అయోగ్యముగా తిని త్రాగువాడు, ప్రభువు యొక్క శరీరమును గూర్చి అపరాధియగును. (ఇప్పుడు, ఆగండి. నేను తప్పుగా చదివాను.)

ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు. తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. తనకు తాను త్రాగువాడు ప్రభువు శరీరమని వివేచించుట లేదు. (ఈ బైబిల్ గ్రంథము పై నేను ఏడ్చితిని, మరియు దానివలన కొన్ని ప్రదేశములలో అచ్చు పోయినది.)

....ప్రభువు శరీరముని వివేచింపక.

ఇప్పుడు, ఈ రాత్రి నా యొక్క అంశము: “ప్రభువు యొక్క శరీరమును వివేచించుట.”

12

ఇప్పుడు, మన యొక్క నిత్యమైన గమ్యము మనము ఏమి చూచితిమి మరియు మనము ఏమి వింటిమి అనే దాని చేత నిర్ణయించబడలేదు, అయితే మనము ఏమి చూచితిమో మరియు ఏమి వింటిమో, దానిపై మనము ఎటువంటి వివేచనను కలిగియున్నాము అనే దానిపై నిర్ణయించబడినది.

ప్రభురాత్రి భోజనము తీసుకొనుట యందు పౌలు వారితో తర్కి౦చలేదు. వారు చేయుపని సరియే, కానీ వారి వివేచన తప్పు, ఎందుకనగా, ప్రభురాత్రి భోజనము తీసుకొనుట ప్రభువు యొక్క ఆజ్ఞయై యున్నది, అయితే అయోగ్యముగా, ప్రభువు యొక్క శరీరమును వివేచించకుండా తీసుకొనుట, అక్కడే తప్పు జరుగుచున్నది.

13

ఈ క్రైస్తవులు ప్రభురాత్రి భోజనము తీసుకొనుచున్నారు, గాని జీవితమును జీవించుట లేదు. క్రైస్తవ్యమనేది ఒక అనుభవము మరియు ఒక జీవము. మరియు ఈ క్రైస్తవులు వారికిష్టమెచ్చిన జీవితమును జీవించుచున్నారు, వారి యొక్క క్రైస్తవ జీవితమునకు తప్పుడు మాదిరిగా ఉన్నారు. మరియు పౌలు అదే చెప్పుచున్నాడు, “ఈ కారణము చేత మీలో అనేకులు రోగులును, బలహీనులును అగుచున్నారు, మరియు అనేకులు నిద్రించుచున్నారు,” దాని అర్ధము వారు చనిపోవుచున్నారు, ఏలయనగా వారు ప్రభువు యొక్క శరీరమును వివేచించుట లేదు.

మరియు మనలను మనమే క్రైస్తవులుగా పిలుచుకొనుచున్న మనము, ఈ లోకము యొక్క నిందకు పైగా మనము జీవించనంత వరకు, ప్రభురాత్రి భోజనమును తీసుకొను హక్కును కలిగిలేము. మనము ఆ హక్కును కలిగిలేము. క్రైస్తవ్యమునకు మాదిరిగా యుండి, ఎవరైతే సరియైన జీవితమును జీవిస్తున్నారో, వారికే ఈ ప్రభురాత్రి భోజనము.

14

ఈ లోకములో యున్న నీచమైన విషయము ఏమిటంటే, ఒక వ్యక్తి దేనినో అనుకరించుటకు ప్రయత్నించుట, మరియు ఈ దినములలో ఈ లోకములో అలాంటివి చాలా ఎక్కువగా యున్నవి. ఏ నేరము నిమిత్తమైతే కొరింథీ సంఘమును పౌలు గద్దించి యున్నాడో, అదే నేరము నిమిత్తము ఈ దినమున మనము కాదు గాని, ప్రభువు యొక్క శరీరమును వివేచించకుండా, ప్రభువు ఆజ్ఞాపించనిది ఏదో చేయుటకు ప్రయత్నించుట కూడా పాపమై యున్నది. మరియు ప్రభువు యొక్క శరీరము అనగా విశ్వాసులే. అయితే, ఈ దినమున దేవుని యొక్క ఏ వాక్యమును వివేచించకుండా మనము కార్యములు చేయుచున్నాము. మనము చేయుచున్న ప్రతీ పనియందు మనము వివేచనను కలిగి యుండవలసియున్నది. అది దేవుని యొక్క వాక్యముతో కొలవబడవలసియున్నది. క్రైస్తవులు చేసిన మరియు చెప్పినవన్నియు దేవుని వాక్యము చేత కొలవబడవలసి యున్నవి.

15

నేడు, జనులు కొంచెము మార్పు చెందియున్నారు, వారు కొన్నిసార్లు వాక్యము ఏమి చెప్పెనో అనే దాని కంటె, సంఘము ఏమి చెప్పెనో అను దాని పైనే నమ్మకముంచుచున్నారు. మన యొక్క అభిరుచిని వివేచించుటకు, దేవుని యొక్క వాక్యము కలిగియున్న దానికంటె సంఘము శ్రేష్టమైన హక్కులను కలిగియున్నదని వారు నమ్ముచున్నారు. ఉదాహరణకు: సంఘము ఈ విధముగా “అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి” అని చెప్పియుండవచ్చును. మరియు అనేక జనులు దానిని నమ్మెదరు, ఎందుకనగా దేవుని వాక్యమును వ్రాసిన పరిశుద్ధాత్మ కంటె, సంఘమునకు అధికముగా తెలియును అని వారు అనుకొనుచున్నారు. అందుచేత, మనము దేవుని యొక్క కార్యములను వివేచించగల సామర్థ్యము కలిగిలేము.

16

యేసు ఒకసారి ఇలా చెప్పెను, “ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు లేక అర్థము చేసుకొనలేడు,” మరియు మరొక మాటలో చెప్పవలెనంటే, “నీవు తిరిగి జన్మించినంత వరకూ, దేవుని యొక్క రాజ్యమును గురించి నీవు వివేచించలేవు.”

“ఎవరైతే, పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్క అనుభవమును అంగీకరించెదరో వారు,” “మూఢ భక్తి గలవారు” అని జనులు వచ్చి మనకు చెప్పెదరు లేదా “వారు భక్తిహీనమైన పరిశుద్ధ గుండ్రాలు అని పిలువబడునట్లుగా, దెయ్యము సంఘమును ప్రేరేపించినది. నేను ప్రపంచమంతా బోధ చేశాను, అయినప్పటికి నేను ఒక పరిశుద్ధ - గుండ్రాయిని ఎన్నడు చూడలేదు. జీవించుచున్న దేవుని సంఘానికి ఆ పేరు దెయ్యము తగిలించినది.

కొన్నిసార్లు జనులు సరైన వివేచనను కలిగియుండరు. వారు దానికి భయపడుచున్నారు. మన యొక్క ప్రభువు బహిరంగముగా పిచ్చి వ్యక్తిగా పిలువబడెనని నీవు ఎరుగవా? పరిసయ్యులు, ఉన్నత సంఘము, “ఆ మనుష్యుడు మతి పోయినవాడు, ఆయన దెయ్యము పట్టినవాడు, మరియు ఆయన పిచ్చి ట్టినవాడు” అని చెప్పెను. మరియు “పిచ్చి” అను పదమునకు “వెర్రివాడని” అర్థము. మరియు వారు ఆయనను “వెర్రివాడు” అని పిలచినట్లయితే, వారు మరి ఇంకెంతగా ఆయన శిష్యులను పిలిచెదరు!

17

పౌలు అగ్రిప్పతో చెప్పెను, “మతభేదమని, వెర్రితనమని, పిలుచు ఈ మార్గము చొప్పునే, అదే మార్గములో మన పితరుల దేవునిని నేను సేవించుచున్నాను.” ఈ రాత్రి ఆయనతో నా చేతులు కలుపుటకు నేను ఎంతో ఆనందించుచున్నాను. ఈ నవీన సంఘమునకు మూఢభక్తిగా పిలువబడే మార్గములోనే, అదే మార్గములో నేను దేవునిని ఆరాధించున్నాను.

వారు మతభేదము గలవారిగా పిలువబడుచున్నారు, ఎందుకనగా ప్రభువు యొక్క శరీరమును వారు సరిగ్గా వివేచించ లేకపోవుచున్నారు. అదే జీవించుచున్న దేవుని యొక్క సంఘము.

మరియు ఈ రాత్రి సంఘము “పిచ్చి” అని పిలువబడుచున్నది, ఎందుకనగా ప్రజలు వివేచనను కలిగిలేరు. ఒక మనిషి తిరిగి జన్మించినట్లయితే, మరియు నీవు తిరిగి జన్మించియున్నాను అని నీవు నాకు చెబితే, మరియు దైవిక స్వస్థత అనేది దేవుని యొక్క వాగ్దానము అని నీవు నమ్మకపోయినచో, మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనేది ఈ దినములో ఉండు ప్రజల కొరకు అని నీవు నమ్మనట్లయితే, అంతట నీ యొక్క జన్మ తప్పుడు ఆత్మచేత ఆరంభమైనదని నేను చెప్పవలసి వచ్చును. ఎందుకనగా పరిశుద్ధాత్మ ఇలా చెప్పెను, “ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు పిలిచిన వారికందరికిని చెందును.” మీ మేధాశక్తిచేత దీనిని అంగీకరించుచున్నారు. దీనికై జనులు ఎవరో ఒకరు చెప్పు మాటను తీసుకొనుచున్నారు గాని, వివేచనను పొందుకొనుట లేదు. వారు తప్పు, ఒప్పులకు మధ్య తేడాను వివేచించలేకపోవుచున్నారు.

18

ఈ దినమున మనలో యున్న చాలా మంది మానసిక సంబంధమైన యోధులు అని నేను ఆలోచించుచున్నాను... మనము కాదు, కాని అనేకమైన మానసికమైన యోధులు ఉన్నారు. దేవుని యొక్క జనులు ఎన్నడూ గొప్ప మానసికమైన యోధులు కారు. “వెలుగు సంబంధులైన పిల్లల కంటె, లోకములోని చీకటి సంబంధులైన పిల్లలు జ్ఞానము కలిగినవారు” అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. దేవుడు ఆయన ప్రజలను గొర్రెలతో పోల్చెను. వారు జ్ఞానులు మరియు తెలివైనవారు కారు. ఆయన వారిని నడిపించులాగున, వారు ఉండు మార్గములోనే ఆయన వారిని ఉంచెను. నీ యొక్క సొంత మానసికమైన ఆలోచనను ఉపయోగించవలెనని నీవు ప్రయత్నించినట్లయితే, నీవు చేయవచ్చును. వెంటనే అక్కడనే నీవు దేవుని నుండి వేరుపరచబడెదవు. దేవుని యొక్క కుమారులు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుదురు, అయితే మనము జీవించుచున్నది ఒక గొప్ప మానసిక సంబంధమైన దినముగా యున్నది.

19

ఇక్కడ, కొన్ని నెలలు క్రితం, (మీరు దానిని వార్తాపత్రికలో చదివారు). న్యూయార్క్ ప్రాంతములో, వారు ఒక న్యాయవిచారణను కలిగియుండిరి. కొంత కాలము క్రితం ఇద్దరు చిన్న బోధకులు ప్రభువు యొద్దకు నడిపించబడినట్లుగా అనుభూతి చెందిరి; వారు నావలె చిన్న వ్యక్తులు, వారికి ఎ,బి,సిలు కూడా తెలియుట చాల కష్టము. మరియు ప్రభువు వారిని భావి యొద్దకు నడిపించెను. వారు ఒక ఫలానా భవనమును కొనియున్నారు. మరియు వారు అక్కడ పడిపోయిన వారి యొక్క సహోదరులకు దేవుని సువార్తను బోధించుచుండిరి. కొన్ని వ్యాపార సంస్థలు ఆ (భవనములను) కొనుటకు వచ్చెను. చిన్న బోధకులు తప్ప మిగిలినవారు అమ్ముడిపోయిరి. ప్రభువు వారిని అక్కడనే ఉండుమని కోరుచున్నట్లుగా వారు ఒక ప్రత్యక్షతను కలిగియుండిరి, కాబట్టి వారి యొక్క ఆస్తిని వారు పట్టుకొనియుండిరి. మరియు అధికారులు వారిని న్యాయస్థానమునకు ఈడ్చిరి.

20

మరియు ఒక గొప్ప తెలివైనవారిలో ఒకరైన న్యాయవాది గ్రీన్ వెల్ ను వారు పట్టుకొని పంపిరి, మరియు అతడు ఆ చిన్నవాళ్ళను వారికి వారుగా సిగ్గుపడునట్లుగా చేసెను. ఆ చిన్న వ్యక్తులు సమాధానము చెప్పలేనంతగా, అతడు విద్యావేత్తవలె తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించెను. నూయార్క్ లో ఉన్న అత్యుత్తమమైన న్యాయవాదులలో గ్రీన్వాల్ కూడా ఒకడైయున్నాడు. మరియు వారు ఆ చిన్న వ్యక్తులను ఎంతగానో గంధరగోళము చేసిరి, ఏమి చెప్పవలెనో వారికి తెలియలేదు. చివరకు ఆయన “ఒక సైగ చేసి మరియు మీ గురించి మీరేమి చెప్పెదరు?” అని అన్నాడు.

మరియు ఆ చిన్న బోధకులలో ఒకడు పైకి లేచి, మరొక వ్యక్తి చేతులను అతడు పట్టుకొని, అతడు “అయ్యా, మేమెరిగిన ఒకే ఒక విషయము; ప్రభువు ఈ భవనమును తీసుకొనమని మాకు చెప్పెను” అని అనెను.

మరియు న్యాయవాది గ్రీన్ వెల్, “ఇక్కడే, దానిని నిలుపు చేయుము. ఈ సమస్యలోనికి (కేసులోనికి) ఏ ప్రభువు మాకు అవసరము లేదు” అని చెప్పెను. రెండు వారములు గడిచిన తరువాత, ఒక విమానము వంతెన క్రింద నుండి వెళ్ళుటకు ప్రయత్నించి మరియు చల్లటి మంచు నీటిలోనికి అది మునిగిపోయెను. మరియు అక్కడ న్యాయవాది గ్రీన్ వెల్, నీటిలో పడిపోయి, పెనుగులాడుచూ మరియు చనిపోవుచుండెను. ఆ పరిస్థితులలో, దేవుడు రంగము మీదకి రావలెనని అతడు అనుకున్నట్లయితే, నేను ఆశ్చర్యపడెదను!

21

విషయమేమిటి? ఆ చిన్న బోధకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిరి అనియు మరియు దేవుని యొక్క చిత్తమును కలిగియుండిరనియు, అతడు ప్రభువు యొక్క శరీరమును వివేచించలేకపోయెను. మనము మానసికమైన యోధులుగా ఉండనవసరము లేదు. మనము ప్రభువు యొక్క దీనమైన సేవకులుగా మరియు ఆయన శరీరమును వివేచించువారుగాను ఉండవలసిన వారమైయున్నాము. మరియు అతని యొక్క యుక్తి, తెలివితేటలు, విద్య అన్నియూ... మీకు తెలియునా, బైబిల్ “నేను అభిషేకించిన వారిని అభ్యంతరపరచు మీరు, మీ మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవారై మిక్కిలి లోతైన సముద్రములో పడవేయబడుట మేలు” అని చెప్పెను. అతడు ప్రభువును రంగము మీదకు పిలుచుటకు చాలా సమయమున్నదని నేను అనుకొనుచున్నాను, అయితే అతడు ప్రభువు యొక్క శరీరమును వివేచించలేదు.

22

కొన్నిసార్లు తెలివిగల అమెరికనులమైన మనము మంచి నుండి చెడును వివేచించుటకు చాలినంత వివేచనను కలిగియున్నామా అని నేను ఆశ్చర్యపడుదును. ప్రత్యేకముగా యువకుల న్యాయస్థానము మన యొక్క బిడ్డల కొరకై మనము మంచి - లను వివేచించు శక్తిని కలిగిలేమని నిరూపించెను. మరియు వారు మంచి మానసిక వైద్యుని జవాబును కలిగియుండినట్లుగా కనిపించినది. ఉదాహరణకు ఈ విధముగా: బాలుడు తన తండ్రి యొద్దకు వచ్చి తన తలను ఊపుచూ, తన చిన్న పాదములను కొట్టుకొనుచూ, ఏడ్చుచూ వచ్చి “నాన్న, నీవు ఏమి చెప్పినా నాకు అనవసరము. నాకు వేగముగా వెళ్ళు మోటారు సైకిలు కావలెను” అని చెబితే. (ఓ, విశేషమైన అమెరికా.)

మరియు ఆ తండ్రి “అలాగే చిన్నవాడా, దానిని నేను నీకు కొనియిచ్చెదను” అని చెప్పును.

“ఎందుకు నీవు ఇలా చేసితివి?” అని నీవు ఆ తండ్రితో చెప్పినచో,

“ఓ, నేను అతనిని ప్రేమిస్తున్నాను” అనును.

తండ్రులు, మీరు గుర్తుంచుకొనండి, ఒకానొక దినమున చిన్నవాడు పెరిగి పెద్దవాడై, అతడు పెండ్లి చేసికొనును, మరియు ఒక కుటుంబమును కలిగియుండును. అతడు కోరుకున్నదంతా, అతని మార్గములో చేయునట్లు, పెంచబడిన ఆ బాలునితో కలసి జీవించుచున్న ఆ భార్యకు దేవుడు సహాయము చేయును గాక — అసత్యము నుండి సత్యమును వివేచించలేడు. అది ప్రేమ కాదు. అది పూర్తిగా బుద్ధిహీనత. బైబిల్ సత్యమైయున్నది. “బెత్తము వాడని వాడు, తన కుమారుని పాడుచేయువాడు.

23

చిన్న ఫేనీ తన తల్లి యొద్దకు వచ్చెను. మరియు ఆమె రాక్-అండ్-రోల్ నాట్యములకు వెళ్ళగోరెను. మరియు అది చేయకూడదని ఆమె తల్లి ఆమెతో చెప్పును. “అయితే, ఓ, తల్లీ, నా యెడల నీవు చాలా క్రూరముగా ఉన్నావు.” సందేహము లేదు, నీవు ఫేనీ ని ప్రేమించుచున్నావు, కావున నీవు ఆమెను వెళ్ళనిచ్చితివి. ఆమె బయట నేరగాళ్ళ మధ్యకు వెళ్లి, అలాంటి బుద్ధిహీనత; మరియు ఆమె పెదవులకు అసభ్యముగా రంగుల నేరుకొని వచ్చెను, దానిలో ఏ హాని లేదు అని నీకు అబద్ధము చెప్పును. అటువంటి దానిని భార్యగా చేసుకొనబోవు పురుషుని యందు దేవా, కనికరము చూపండి. అసత్యము నుండి సత్యమును వివేచించుట. మనలను మనమే వివేచించుకొనలేము.

24

కొన్నిసార్లు మన యొక్క సొంత శరీరము కొరకు, ముఖ్యముగా ప్రభువు యొక్క శరీరము కొరకు అసత్యము నుండి సత్యమును మనము వివేచించగలిగినట్లయితే, నేను ఆశ్చర్యము చెందెదను. మన సొంత శరీరముల గురించి మనము అసత్యము నుండి సత్యమును వివేచించలేము. దినము వెంబడి దినము, వారము వెంబడి వారము, నెల వెంబడి నెల మరియు సంవత్సరము వెంబడి సంవత్సరము శాస్త్రవేత్తలు పరిశోధనాశాలలో పనిచేసి మరియు ఒక పెద్ద నివేదికను తయారు చేసిరి మరియు ప్రతీదియూ, వాణిజ్య ప్రకటనలతో తెలియజేసిరి. మరియు “క్యాన్సర్ ఒక అట్టపెట్టి ద్వారా కలిగెను” అని హెచ్చరించిరి. మనుష్యులు, రెండువందల-డెబ్పై లేక వెయ్యి మంది అమెరికనులు ఈ సంవత్సరము పొగత్రాగుట చేత చనిపోవుదురు అని చెప్పిరి. అయినను మీరు పొగత్రాగుచున్నారు. మన యొక్క సొంత శరీరములను మనము వివేచించుకొనలేకపోయినచో, ప్రభువు యొక్క శరీరములోని, పరిశుద్ధాత్మను ఎలా వివేచించగలము?

25

నిన్నటి దినమున శాస్త్రవేత్త తన పరిశోధనలో కనుగొని ప్రచురపరచిన దానిని నీవు చూచితివా? “పొగత్రాగినంత మాత్రము చేతనే క్యాన్సర్ రాదు, కాని ఏభై శాతము ఇతర ఏది తీసికొనినను వచ్చుటకు చాలా అవకాశము ఉన్నది” అని అతడు చెప్పెను, మరియు నీవు ఇంకా పొగత్రాగుచూనే యున్నావు.

కొంత కాలం క్రితం, ఒక స్త్రీ నన్ను కలిసినది, నేను దానిని ఎదుర్కొన్నప్పుడు నాకు అది చాలా కష్టముగా అనిపించినది. ఆమె సహజముగా పొగత్రాగే అలవాటు గల స్త్రీ, నా జేబులో ఒక చిన్న ప్రకటనను పెట్టి, ఆమె ఇలా చెప్పెను, “నీవు ఇంటికి వెళ్ళునప్పుడు ఇది చదవమనెను.”

నేను చెప్పాను, “మీకు ధన్యవాదములు. ఇప్పుడే నేను దానిని చదివెదను” అని నేను బయటకు తీసి, చదవటం మొదలుపెట్టాను.

“ఒక బోధకుడు బలిపీఠము మీద పొగత్రాగుటకు వ్యతిరేకముగా మాట్లడుట అనేది మర్యాద కాదు. దానితో చేయుటకు నీకేమి పనిలేదు” అని చెప్పినది.

“తప్పగు దేనిని గురించి అయినా వ్యతిరేకముగా మాట్లాడుట అనేది నా యొక్క పని (బాధ్యత)” అని నేను చెప్పాను. ఏదైన తప్పు ఒప్పులను వివేచించలేని బోధకునికి దేవుడు చాలినంతగా సహాయము చేయును గాక. పరిశుద్ధాత్మ చేత ఒక బోధకుడు ఆయన జనులకు అవసరమగు దానిని వివేచించలేనట్లయితే. దేవుడు చెప్పెను, “ఈ శరీరము పరిశుద్ధాత్మ యొక్క ఆలయమైయున్నది. దీనిని మీరు పాడుచేసిన యెడల, నేను వానిని పాడుచేయుదును.” మనము దానికి వ్యతిరేకముగా బోధింపవచ్చును. దానివలన వచ్చు సమస్య ఏమనగా, వారు సిగరెట్టు త్రాగు అనేక మంది బోధకులను కలిగియున్నారు. అదే విషయమైయున్నది. అవును. మరియు వారు వారి యొక్క సమూహమునకు ఇది చెప్పుటకు భయపడెదరు, ఎందుకనగా వారు దోషులని వారు ఎరుగుదురు.

26

సరిగా వివేచించుట; సరిగా వేరుచేయుట. విస్కీలు, ఆల్కహాలు: “ఎందుకు,” “అది ప్రమాదకరము,” అని వారు చెప్పెదరు, మీ టెలివిజన్ తెరల యందంతటా, మీ వార్త, ప్రకటన పలకల యందంతటనూ, పెద్ద క్యాన్లతో బీరులు పట్టుకొని అందమైన యవ్వన స్త్రీలు త్రాగుచున్నారు. వారి ఆరంభము ఎప్పుడో వారు మీకు చూపుచున్నారు. దాని నుండి వారిని కొద్దిగా మనము పరిశీలన చేద్దాం. అది వారి మనస్సులను మత్తయిన విషముతో నింపును. పిచ్చిని పెంచుట ఘోరమైన కార్యము అది యవ్వనస్తుల మద్య వ్యభిచారమునకు కారణమగుచున్నది. నేడు, సంఘాలు కూడా “మితముగా త్రాగుము” అని అనేకులైన వారికి బోధించుచు, అభ్యసించుచున్నారు. అది సత్యమని మీకు తెలియును. ఇంటి యొద్ద తమ యవ్వన బిడ్డలకు మరియు తలిదండ్రులకు “మీ పిల్లలను త్రాగానివ్వండి, ఏ విధముగానైనను వారు త్రాగెదరు, కాబట్టి మితముగా త్రాగుటను వారికి నేర్చించండి” అని చెప్పుచున్నారు. బైబిల్ దానిని ఖండించుచున్న ది. అది సరి కాదు. “దాని కంటె ఎక్కువ వివేచన లేని మనిషికి లేదా సంఘమునకు దేవుడు సహాయము చేయును గాక. వారు అసత్యము నుండి సత్యమును వివేచించలేరు.

27

ఓ, ఒక భయంకరమైన దినమున మనము జీవించుచున్నాము. “ప్రభువు శరీరమును వివేచించుము.” మన సంఘములలో, నేడు మన సంఘ జనుల మధ్య, మన స్త్రీలు ప్రవర్తించు విధము చాలా సిగ్గుగా ఉన్నది. వారిలో చాలా మంది పొట్టి దుస్తులు, అసభ్య వస్త్రాలు ధరించుచున్నారు. అది చాలా పాపభరితము. ఒక స్త్రీ నాతో చెప్పెను, మరియు అనేకులు నాతో చెప్పారు, “బిల్లీ, నీవు దాని గురించి మాట్లాడుట విడిచిపెట్టుట శ్రేష్టము” అని చెప్పారు. లేదండి. నేను స్తంభములకు చెప్పవలసి వచ్చినను, నేను సత్యమునే చెప్పెదను. అది సరియే. అది సరియే. అది సత్యము. (సమాజము చప్పట్లతో ఆదరించుచున్నారు.) ధన్యవాదములు. అది తప్పు, మరియు అది పాపభరితము.

ఒక స్త్రీ నాతో ఇలా అన్నది, ఆమె చెప్పెను, “నేను పొట్టి దుస్తులు ధరించను. నేను ప్యాంటు వంటి వస్త్రములు ధరిస్తాను.”

“అది మిక్కిలి నీచమైనది” అని నేను చెప్పాను. పరిశుద్ధ గ్రంథము “ఒక పురుషుడు ధరించు వస్త్రము, ఒక స్త్రీ ధరించిన యెడల, అది దేవునికి హేయమైన కార్యముగా యున్నది” అని చెప్పెను. అది సత్యము. అవిగాక యితర దుస్తులు తయారుచేయుట లేదనునది సాకు. అయితే కుట్టుమిషన్లు మరియు పరికరాలు ఇంకా అమ్ముచున్నారు.

28

ఒక స్త్రీ అటువంటి వస్త్రములతో తనను తాను ధరింపచేసుకున్నచో, వ్యభిచారము చేసిన దానిని బట్టి తీర్పు దినమున ఆమె సిగ్గుపడవలసివచ్చును. నీవు నీ భర్తకో లేక బాయ్ ఫ్రెండ్ కో లిల్లీ పుష్పమంత శుద్ధముగా కనపడవచ్చును గాక, కానీ యేసు “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును” అని చెప్పెను. కాబట్టి, నిజానికి నీవు ఏ తప్పిదము చేసియుండకపోవచ్చును, అయితే నిన్ను నీవు ఆ విధంగా వస్త్రము ధరింపచేసుకున్నట్లయితే, నిన్నునీవు ఆ పురుషునికి కనపరచుకొనినట్లయితే; అతడు వ్యభిచారము చేసిన దాని నిమిత్తము జవాబు చెప్పవలసినవాడైయున్నాడు, మరియు నింద నీదే అగును. ప్రభువు యొక్క శరీరమును వివేచించకుండా, సంఘము దానిని అనుమతించుచున్నది. ఎంత దయనీయము!

29

వారు జుట్టులు కత్తిరించుకొనుచున్నారు. “ఒక స్త్రీ తన తల వెంట్రుకలు కత్తిరించుకున్నట్లయితే, ఆమె భర్త ఆమెకు విడాకులు ఇచ్చు హక్కును కలిగియున్నాడు” అని బైబిల్ చెప్పెను, ఎందుకనగా ఆమె సత్యవంతురాలు కాదు. “ఆమె తన శిరస్సుని అవమానపరచెను” అని ఆయన చెప్పెను. అది సరియేనా? స్త్రీకి శిరస్సు పురుషుడు.

అది కఠినమైనదని నాకు తెలియును, కాని మనకు వివేచన అవసరమైయున్నది. వాక్యము చేత మనము వివేచించవలసిన అవసరము ఉన్నది. వాక్యము సత్యము. వాక్యమును తీసుకొనుము. దేవుని వాక్యము ఎల్లప్పుడును సత్యమే.

30

జనులు ఏమి ఆలోచించుచున్నారు, మన మేధావులు ఏమి చెప్పుచున్నారు, మన మానసికవేత్తలు ఏమి చెప్పుచున్నారు అను దాని చేత మనము వివేచించలేము. దేవుడు ఏమి చెప్పుచున్నాడు అను దాని చేత మనము కొనసాగవలసియున్నది. “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటవలనను జీవించును.” “ప్రభువు శరీరమని వివేచింపక, మీలో అనేకులు బలహీనులును, రోగులునైయున్నారు; చాలా మంది నిద్రించుచున్నారు.” మరణించుచున్నారు, ఆత్మీయమరణము. ఐగుప్తును తాకిన ఆఖరి తెగులు మరణము. సంఘమును తాకబోవు ఆఖరి తెగులు ఆత్మీయమరణము. నేడు మనకు అవసరమైనది ఏమిటనగా, వివేచించుట కొరకై ఆత్మ సంబంధమైన మేలుకొల్పు, ఆత్మసంబంధమైన మేలుకొల్పు.

31

ఓ, ఈ జనులు మంచి అభిప్రాయముతో, దీనిని చేయవచ్చును గాక. దక్షిణమున నివసించుచున్న మనిషి, మరుసటి దినమున వైద్యుని దగ్గరకు వెళ్ళేను, ఆ మనిషికి ఇచ్చిన సల్ఫ్యూరిక్ ఆమ్లము అతనిని చంపెను. అతనికి మంచి అభిప్రాయమే ఉన్నది. తాను సరేనని అతడు అనుకున్నాడు, కాని అతడు తప్పుడు వివేచనను కలిగియున్నాడు. తాను ఇచ్చిన మందును తానే వివేచింపలేకపోయెను.

చిన్న బాలిక వీధి గుండా నడిచి వచ్చుచున్నది, మరియు ఒక చిన్న పిల్లిపిల్లను ఆమె కనుగొన్నది. అది పుర్తిగా తడిసిపోయి, సగం గడ్డకట్టుకుపోయినది. మరియు ఆమె దానిని తీసుకొని, అది వెచ్చదనము పొందుకొనుటకై కొలిమి తలుపు తెరచి దానిని కొలిమిలో పెట్టిన విధముగాయున్నది. ఆమె తలంపు చాల మంచిదే, కానీ ఆమె వివేచన చాలా తప్పైనది. నేను చేయను... మన యొక్క సొంత మానసికమైన వివేచనలతో మనము పిల్లిపిల్లను ఉడకపెట్టుచున్నాము. మనము గమనించుట లేదు.

32

కమ్యూనిష్టులు మన యొద్దకు వచ్చుచున్నారు. లోకము మన యొద్దకు వచ్చుచున్నది. మన సంఘములు బ్రద్దలగుచున్నవి. మనుష్యులు తమకు తామే ప్రభువు యొక్క శరీరమును వివేచించుట విభజించుకొనుచూ, తమకు తామే విడిపోవుచూ, విశ్వాసములేనివారుగా అగుపించుచున్నారు. అనవసరమైన సిద్ధాంతములతో జుట్టును విరజిమ్ముకొనుచున్నారు. మనము ఆత్మీయ వివేచనను కలిగియున్నట్లుగా, దేవుడు పరిశద్ధాత్మను తిరిగి పంపునంత వరకు మనమందరము కలసికట్టుగా ఒకే హృదయముతో ఉపవాసముండి మరియు ప్రార్థించుదము.

అంత్యకాలము ఆసన్నమగు ఘడియ ఇప్పుడే వచ్చియున్నది. మనము ప్రభువు యొక్క రాకడ ఛాయలలో ఉన్నాము, మరియు సంఘము దాని వివేచించుటలేదు. మీరు ఆలోచించు దాని కంటే మనము చివరి ఘడియలలో జీవించుచున్నాము.

ఈ రాత్రి మిడిల్టౌన్లో పౌలు మరణములో నుండి లేచినట్లయితే, నీవు మండుచున్న పొద గురించి మాట్లడెదవు; పగటి వెలుగు ఉండగానే, వెర్రివానిగా లేక అడవి మనిషిగా వారు అతనిని జైలులో ఉంచెదరు. ఆ మనిషి పరిశుద్ధాత్మతో నింపబడెను, మరియు ఆ మార్గములో జరగబోవు కార్యములను చూచి, సమయము సమీపముగా యున్నది అని అతడు ఎరిగియుండెను. అక్కడ ఒక ఉజ్జీవము ఉండవలసియున్నది లేక ఆయన చెప్పినది వినుటకు వారు జైలుకు రావలసియున్నది. అది సరే.

33

ఇప్పుడు, యేసు చెప్పెను, మరియు అంత్యదినములలో, ప్రభువుయొక్క రాకడ ముందుగా, భూమి మీద గొప్ప అద్భుతములు, సూచక క్రియలు సంభవించును అని బైబిల్ చెప్పెను. మరియు సంఘము తత్త్వజ్ఞానము చేతను, అన్ని రకములైన వేదాంతము చేతను, శిక్షణ చేతను మరియు విద్యాభ్యాసము చేతను చచ్చినదై యుండి, ఇంకను అది ఆ కార్యములను వివేచించలేకపోవుచున్నదని మీకు తెలియును.

యేసు ఆయన దినములలో సంఘమునకు చెప్పలేదా? “ఆకాశవైఖరిని మీరు వివేచించగలరు, కాని ఈ కాలపు సూచనలను మీరు వివేచించలేరు. కాబట్టి మీరు నన్నెరిగి ఉంటే, మీరు నా దినమును ఎరిగియుందురు.” సంఘము యొక్క విడుదల ఘడియలు, వారు దానిని వివేచించలేకున్నారు.

34

మనమాలాగున... ఏదో తప్పిదము ఉన్నది. క్రైస్తవులమని తమ్మును తాము పిలుచుకొనుచున్న ప్రతియొక్కరి గురించి, నేను సంఘమంతటిని గూర్చి మాట్లాడుచున్నాను. దేవుడు కదులుట ఆరంభించెను. మరియు ఆత్మసంబంధమైన కార్యములు సంభవించుచున్నవి, జనులు రక్షించబడి మరియు పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు; అనేక వేలకొలది జనులు క్రైస్తవులమని తమకు తామే పిలచుకొను వారు దాని నుండి వెనుకకు లాగబడుచున్నారు. మరియు అది, “ఓ, అదిగో పరిశుద్ధ - గ్రుండాయిలు” అని చెప్పుచున్నారు. మీరు ఆత్మ సంబంధమైన వివేచనను పొందుకొనలేదు. కనుక, పరిశుద్ధాత్మ చేసిన ప్రతి ఒక్కటియూ, పరిశుద్ధ గ్రంథములో లిఖించబడినవి. లేఖనము చేత అన్ని విషయములను తీర్పు తీర్చుడి, అందుకొరకే మన వివేచన సరియా కాదా అని చూచుటకై మనము వివేచించుచున్నాము.

“యేసు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు” అని బైబిల్ చెబితే, నేను దానిని నమ్మెదను. ఒకవేళ బైబిల్.... “నేను చేయు కార్యములు మీరు చేయుదురు” అని యేసు చెబితే, నేను దానిని నమ్మెదను. మరియు “పరిశుద్ధాత్మ ప్రతీ తరము వారికి చెందును, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందును” అని బైబిల్ చెబితే, కరచాలనము దాని స్థానము, తీసుకొనును అను దానిని నేను నమ్మను. అదే పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడి, అదే సూచనలు, అదే అద్భుతములు చూపించుటను నేను నమ్ముచున్నాను.

35

మన యొక్క ఆత్మ వాక్యముతో సాక్ష్యము కలిగియున్నప్పుడు, మనము పరిశుద్ధాత్మను పొందుకొనియున్నామని ఒక శ్రేష్టమైన సాక్ష్యమును మనము కలిగియుందుము. మనలను మనము క్రైస్తవులమని పిలుచుకొనుచూ, మరియు మేము ఆత్మతో నింపబడియున్నాము అని చెప్పుకొనుచూ, మరియు అన్ని యుగములలోను యున్న విశ్వాసుల మీద పరిశుద్ధాత్మ బాప్తిస్మము కుమ్మరించబడుటను మేము చూచుచున్నాము అని చెప్పి మరియు, “అది వేరొక యుగమునకు చెందినదని” మన ఆత్మ మనకు చెబితే, మీరు తప్పిదములో ఉన్నారు. అది సరే.

యేసుక్రీస్తు నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని బైబిల్ చెప్పినప్పుడు; మన ఆత్మ - “లేదు, ఆయన మరణించెను, ఆయన చనిపోయెను” అని చెప్పినట్లయితే; అక్కడ ఏదో తప్పిదమున్నది. “నేను చేయు క్రియలు మీరును చేయుదురు. ఇదిగో, యుగ సమాప్తి వరకు నేను మీతో సదాకాలము ఉందును” అని యేసు చెప్పెను. మరియు మన ఆత్మ దాని నుండి వెనుకకు లాగినట్లయితే, మనము పరిశుద్ధాత్మను పొందుకొనలేదు. కాబట్టి, పరిశుద్ధాత్మ ఆయన వ్రాసిన ప్రతి మాటకు “ఆమేన్” అని చెప్పును.

ఇప్పుడు, మానవ జ్ఞానము నిన్ను దాని నుండి వెనుకకు లాగును, అయితే పరిశుద్ధాత్మ ఆయన యొక్క సొంత మాటకు “ఆమేన్” అని చెప్పును. ఆయన తప్పకుండా చెప్పును. మరియు ఆయన వెదకుచున్నాడు, మరియు వేటాడుచున్నాడు మరియు ఆయన తనకుతాను ఒకనిలో ఉండుట కొరకై ఎవరో ఒకరిని కనుగొనుటకు ప్రయత్నించుచున్నాడు. ఆయన దానిని వెదకుటకై దీర్ఘశాంతము కలిగియున్నాడు.

36

ఆయన యొక్క మంచితనమును నీవు ఖాళీ చేయుచున్నావని తలంచవద్దు. ఒక అర అంగుళము పొడవు ఉన్న చిన్న చేప పసిఫిక్ మహాసముద్రము మధ్యలో ఉండి, ఈ విధముగా “నేను ఈ నీటిని మితముగా త్రాగుట చాలా మంచిది; అది తరిగిపోవును అను దానిని నీవు ఉహించగలుగుచున్నావా?” అది ఎంత బుద్ధిహీనతగా యుండుననగా, నీవు దేవుని యొక్క మంచితనము అంతయు ఖాళీచేయబడునని నీవు అలోచించినంతగా యుండును. “మీ సంతోషము సంపూర్ణమగునట్లు, నీవు విస్తారముగా అడుగుము.” ఆయన వాగ్దానము చేసిన దేనియందైనను దేవుని నమ్ముము. అది మీది.

37

పాతనిబంధన యొక్క ప్రవక్తలు, దానియేలు మరియు ఇతరులు, “అంత్యదినములలో వారి దేవుడిని ఎరిగిన ఆ ప్రజలు, గొప్ప అద్భుతమైన కార్యములు చేయుదురు” అని వారు చెప్పెను. అది ఒక వాగ్దానము. మానసికమైన వారు ఆ అద్భుతములు చేయువారిని చూచినప్పుడు, వారు “ఓ, అది మనస్తత్వ శాస్త్రము; అది మనస్సులను చదివే ఒక శాస్త్రము. అది దెయ్యము యొక్క పని” అని చెప్పెదరు. కానీ పరిశుద్ధాత్మ “ఆమేన్, అది సత్యము” అని తిరిగి జవాబు ఇచ్చును. సరైన వివేచన. వారు దానిని వాగ్దానము చేసియున్నారు. యేసు దానిని వాగ్దానము చేసెను. “నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక, నేను చేయు క్రియలు మీరునూ చేయుదురు, వాటి కంటె మరి గొప్పవియూ మీరు చేయుదురు” అని యేసు చెప్పెను.

38

పరిశుద్ధాత్మ చేత, అంత్యదినములో పౌలు వాగ్దానము చేసెను, సంఘము దూరముగా పడిపోవును. వారిలో మిలియన్ల మంది పడిపోవుదురు. చిన్నాభిన్నమై పడిపోవు సమయము వచ్చును. పురుషులు అనురాగరహితులు, అతిద్వేషులు అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, వాటి విషయమై పడిపోవుచున్నారు.“ సరైన వివేచనను కలిగిలేరు. ”ఓ“, ”అది కమ్యూనిష్ణులు“ అని మీరు చెప్పెదరు.

అది, క్రైస్తవులని పిలువబడిన వారు. తరువాత వచనమును గమనించుము. “పైకి భక్తిగలవారివలె ఉండియూ, దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు? ఆత్మీయమైన వివేచన లేదు. నీవు ఆత్మీయ వివేచనను కలిగియున్నట్లయితే, పరిశుద్ధాత్మ నీ మీద యుండును, నీవు ఆత్మీయ వివేచనను కలిగియుందువు. అది దేవుని యొక్క ప్రతి వాగ్దానానికి ”ఆమేన్“ అని చెప్పును.

39

ఆ దినములు అలాగుండునని పౌలు చెప్పెను.

దానిని మనము కలిగియున్నాము. అది ఇక్కడనే యున్నది. అది మన మీద యున్నది. మరియు మనము దానిని చూచి, పరిశీలన చేశాము. అన్ని చోట్ల నుండి దానిని మనము వినుచున్నాము. మరియు మనము ఏమి చేయుదుము? అది మనలను ఒక చోటకు తీసుకువచ్చుచున్నది. “ఆ దినము సమీపించుచున్నదని మీరు మరి ఎక్కువగా చూచినపుడు, మనకు మనము ఒక దగ్గరగా కూడుకొనెదము” అని బైబిల్ చెప్పుచున్నది. ఒక ఉజ్జీవము వెంబడి మరొక ఉజ్జీవము ఉండును. మరియు దేవుని మహిమ యొక్క జయోత్సవ జ్వాల ప్రతి స్థలములోను మరియు ప్రతి సంఘములోను నిర్మింపబడును (ప్రజ్వలించును). ఎక్కడైతే అన్ని సంఘములు ఏక హృదయముతో మరియు ఏకాత్మతో వారికి వారు ఒక దగ్గర కూడుకొని మరియు వారి యొక్క మానవ కల్పిత తత్త్వజ్ఞానమును మరచి మరియు ఆత్మీయ శక్తి, ఆత్మీయ వివేచనకై దేవుని యొద్ద మొర్ర పెట్టెదరో, వచ్చే ఆ గొప్ప కలయిక. అటువంటి ఘడియ మనకు అవసరమైయున్నది.

40

నేను, అంత్యకాలమును ఎరుగుటకు (గత రాత్రి నేను దానిని తాకిన విధముగా) ఒక దినమును యేసు మనకు దయచేయును అని చెప్పియుండవవచ్చును. “లోతు దినములలో జరిగినట్టుగా, మనుష్యకుమారుని రాకడ యందును జరుగును” అని యేసు చెప్పెను. ఇప్పుడు, అది సరియేనని నీ యొక్క ఆత్మ వివేచించుచున్నదా? “లోతు దినములలో జరిగినట్టుగా.” గుర్తుంచుకొనండి, లోతు అమెరికాకు ఒక సాదృశ్యముగా యున్నాడు. ఇది నిరూపించబడెను. సొదొమ యొక్క పాపమేమిటి? నీచమైన వంకరతనము, మనదైన ఈ అమెరికా దేశములో, పురుషుని యొక్క స్వాభావిక ధర్మము వంకర చేయబడినంతగా, స్త్రీలు వారిని వారు ఎంతో నీచమైన స్థితికి దిగజార్చుకొనుచున్నారు.

కొన్ని వారముల క్రితం, క్రైస్తవ వ్యాపారవేత్తల కూడిక యొద్ద, లాస్ ఏంజిల్ పట్టణమందు నేను యుంటిని. మరియు వారి యొక్క వ్రాయబడిన కాగితములలో ఒక దానిని నేను తీసుకొని చూచితిని. అక్కడ పరిశోధకులలో ఒకరు వంకరతనము (నీచమైన మార్గము) మరియు పురుష సంయోగులు, గత సంవత్సరము కంటె ఇరవై శాతము ఎక్కువాయెను“ అని చెప్పెను.

41

“సొదొమ దినములలో ఉ౦డినట్టగా” అని యేసు చెప్పెను. పోలీసులు, హంతకులు మొదలైనవి అన్ని అన్నివేళలా విడిపోవుచూ, అబ్బాయిలు (పురుషులు) ఒకరితో ఒకరు భార్య భర్తలుగా కలసి జీవించుచున్నారు; స్త్రీలు కూడా అలాగునే జీవించుచున్నారు. వంకర చేయబడిరి. వారి యొక్క మనస్సులు, అసభ్యకరమైన మనస్సులు, ఏలయనగా వారు ఆత్మీయ వివేచనను కలిగిలేరు. అంతయు మురికియు మరియు కామవాంఛై యున్నది. మరియు ఒకరితో ఒకరు గానీ, వారికి వారు గానీ తృప్తి పడుటలేదు. కనీసము వారు పెండ్లి చేసుకొనుటలేదు. వారు కేవలము తీసుకొని మరియు బయటకు వెళ్ళుచున్నారు. వారు వంకర చేయబడిరి. అంత్యదినములలో అలాగుండునని యేసు చెప్పెను, మరియు ఇక్కడ అలానే ఉన్నది.

42

మరియు మీరు జ్ఞాపకము చేసుకొనండి. సోదొమ దినములలో మీ పరిచారకులలో మరియు బైబిల్ విద్యార్థులలో ఎవరైనా, దీనితో మీరు ఏకీభవించెదరని నేను నమ్ముచున్నాను. డాక్టర్ స్కోఫీల్డ్ మరియు ఉపదేశకులలో చాలామంది, చార్లెస్ ఫుల్లర్ మరియు మిగిలిన వారు. భూమి మీద ఉండు గొప్ప విద్యావంతులు, మిగతా వారు కూడా దానితో ఏకీభవించిరి. ఆత్మీయ సంఘమునకు, ఆత్మకు అబ్రహాము పోలికగా ఉన్నాడు. ప్రకృతి సంబంధమైన లేక శరీరసంబంధమైన సంఘమునకు లోతు పోలికగా ఉన్నాడు. అతడు తనలో నీతి ఉన్నప్పటికి, అతడు సొదొమలో పాపములోనే ఉండెను, అయితే అతడు దానితో కలగలుపైయున్నాడు. మరియు గుర్తుంచుకొనండి, అక్కడకు ఇద్దరు మానసికమైన బోధకులు సొదొమకు బోధ చేయుటకు వెళ్ళియున్నారు. వారు ఎటువంటి అద్భుతము చేయలేదు కేవలము వారిని గ్రుడ్డివారినిగా చేసిరి. మరియు సిలువను గూర్చిన బోధ ఒక అవిశ్వాసిని గ్రుడ్డివానిగా చేయును. బిల్లిగ్రహం మరియు వారి యొక్క గొప్ప కూటములు చేసినది అదియే. అది వారిని చాలా నీచమైనదిగా చేసినది.

43

కొన్ని వారముల క్రితం బిల్లిగ్రహం, (మీరు దానిని వినియున్నారు) ఆయన ఇంగ్లాండ్ నగరములో నడుచుకొని వెళ్ళుచున్నప్పుడు గుర్తించియున్నాడు. ఎక్కడైతే ఆయన ఆ గొప్ప ఉజ్జీవ కూటమును కలిగియున్నాడో, ఆ పార్ములో నుండి తన భార్యను తీసుకొని బయటకు రావలసిన పరిస్థితి వచ్చియున్నది, ఏలయనగా అతడు ఎక్కడైతే ఉజ్జీవ కూటము కలిగియున్నాడో, ఆ బహిరంగ ప్రదేశములో, స్త్రీ పురుషులు లైంగికమైన కార్యములు చేయుచున్నారు.

అది ఏదైనా మంచిని చేయునా? ఒక మానసిక సంబంధమైనది కాదు. అది దేవుని యొక్క మహా ఉగ్రతను పిలుచుచున్నది, మరియు ఈ లోకములో వ్యత్యాసమును చూపించుటకు పరిశుద్ద అగ్ని పరలోకము నుండి దిగివచ్చినది, మరియు అది అలా యుండదు. జనులు ఏదో ఒక గొప్ప కార్యము సంభవించునని ఎదురుచూచుచున్నారు, మరియు ఇప్పటికే ఏదైతే వచ్చినదో దాని యొక్క అంతమందు మీరు ఉన్నారు. అన్య సంఘమునకు చివరి సూచనలు ఇవ్వబడినవి. సంఘము ఎత్తబడిన పిదప యూదులు దానిని కలిగియుందురు, అయితే మనము అన్యుల కాలము యొక్క అంతమందు ఉన్నాము.

44

ఇప్పుడు, నేను ముంగించుటకు ముందుగా, నేను దీనిని చెప్పవలసి యున్నది. ఆత్మీయమైన సంఘముతో మాట్లాడుటకు ఆ వెనుక నిలబడిన వ్యక్తి ఎటువంటి వాడైయున్నాడో నీవు గమనించితివా? తన వీపు భాగమును గుడారమునకు వెనుకగా త్రిప్పి, ఒక క్రొత్తవానిగా తనను చేసుకొనెను. మరియు “నీ భార్యయైన శారా ఎక్కడ?” అని అడిగెను.

మరియు “ఆమె గుడారములోయున్నది” అని అతడన్నాడు.

“అబ్రహామా, నేను నీకిచ్చిన వాగ్దానము ప్రకారము, నేను నిన్ను దర్శించబోవుచున్నాను” అని చెప్పెను. మరియు ఆయన - శారా, లోలోపల, తనలో తాను నవ్వుకొనెను.

మరియు “ఆమె ఎందుకు నవ్వినది?” అని ఆ దూత అడిగెను.

“సొదొమ దినములలో ఎలాగుండెనో, మనుష్యకుమారుని రాకడ దినములలో అలాగుండును” అని యేసు చెప్పెను.

45

ఇప్పుడు, మీకు అర్థమవుచున్నదా? ఎందుకు ఇటువంటి ఒక పరిచర్య కేవలము సంపూర్ణ సువార్త జనుల యొద్దకు వెళ్ళుచున్నదో నీకు అర్థమవుచున్నదా? అది ఎక్కడికి వచ్చుచున్నదో మీరు చూచుచున్నారా? నేను ఒక సాదారణ బాప్టిస్టు సంఘములో ఎదిగి, మరియు మిషనరీ బాప్టిస్టు బోధకుడిగా నియమించబడితిని. అయితే ఏదో నా హృదయమును తాకినప్పుడు, అది దేవుని యొక్క వాక్యమని నేను వివేచించగలిగాను. మరియు ఆయన దానిని ప్రత్యక్షపరచియున్నాడు.

“బిల్లీ, నీవు పరిశుద్ద గుండ్రాయివి, అటువంటి ఒక చెత్తను ఎవ్వరు వినరు” అని వారు నాతో అన్నారు.

“దేవుడు దానిని పంపినట్లైనచో, దానిని వినుటకు ఎవరినో ఒకరిని ఆయన కలిగియుండును అని దేవుడు బైబిల్లో వాగ్దానము చేసెను” అని నేను చెప్పాను. అది సరియే.

46

మనము జీవించుచున్న కాలములను వివేచించండి, ప్రభువు యొక్క శరీరమును వివేచిద్దాం, మనము అది చేయకపోతే, ఆత్మీయముగా మనము చనిపోయెదము. మరియు అది సత్యమైనచో, మరియు పరిశుద్ధాత్మ మనతో యున్నది, మరియు ఆయన రాకడకు కొంచెము ముందు, ప్రభువు రాకడ యొక్క చివరి సూచనను మనము పొందుకొనియున్నాము. గుర్తించుకొనండి, అది సొదొమ కాలిపోవుటకు ముందు, అది కాలిపోవుటకు కొన్ని గంటల ముందు.

47

నేడు, నేను నమ్ముచున్నాను.... అమెరికన్లకు కృచ్చేవ్ ముందు రోజు ఏమి చెప్పెనో మీరందరూ వినియున్నారు. మీరు దానిని మీ యొక్క వార్తాపత్రికలలో చదివియున్నారు. ఇక్కడ ఆయన వివరణ ఉన్నది, మీరు స్వాభావికమైన వివేచనను కలిగియున్నచో, మీరు దానిని పట్టుకొనెదరు. “అక్కడ దేవుడు ఉన్నట్లయితే, ఆయన మీ పెట్టుబడిదారులతో ఈ మందిరమును ఊడ్చి మరియు శుభ్రము చేయుటకు వెళ్ళుచున్నాడు” అని ఆయన చెప్పెను. దాని అర్థమేమిటో మీరు చూచితిరా, మీరు చూడ లేదా? మరియు ఆయన సత్యవంతుడైయున్నాడు. ఒక అన్యుడు, ఒక దెయ్యము, ఒక అనుకరణకర్త ఆ భయములను బయటకు పారవేయవలసి యున్నది. అయినను వారు నిద్రపోవుచూ, పాపముచేయుచూ, త్రాగుచూ, కేవలము దానిని అశ్రద్ద చేయుచున్నారు, ఎందుకనగా వారు ప్రభువు యొక్క శరీరమును గూర్చిన ఆత్మీయ వివేచనను కలిగిలేరు. ఎటువంటి దినమున మనము జీవించుచున్నాము!

48

సహోదరీ మరియు సహోదరుడా, నా ప్రియమైనవారగు మీకు, పక్షపాతిగా యుండుటకు నేను ప్రయత్నించుట లేదు. నేను మీకు కేవలము సత్యమును చెప్పుచున్నాను. నేను కేవలము బైబిల్ కొరకే బాధ్యత కలిగియునాను మరియు నేను మీకు చెప్పుచున్నాను: ఆయన యొక్క సేవకుడుగా లేక ఆయన యొక్క ప్రవక్తగా నన్ను మీరు నమ్మినట్లయితే, నేను మికు సత్యమునే చెప్పుచున్నానని మీరు నమ్మండి. అంతము సమీపమునే ఉన్నది. ఎంత సమీపమన్నది నాకు తెలియదు, మరియు ఏ ఒక్కరికి తెలియదు; అయితే ఆయన రాకడ యొక్క ఛాయలలో మనము జీవించుచున్నాము అని నేను ఎరిగియున్నాను.

ఆ బెదిరింపులను మీరు చూచుటలేదా? వారు ఏమి పొందుకున్నారో మీరు చూడండి. ఈ దేశము త్రాగుటకు, హేళనచేయుటకు ప్రయత్నించుచున్నది. మీరు దానిని చేయలేరు. దేవుడు వారికి గోడమీద చేవ్రాతను చూపగలడను ఆధ్యాత్మిక వివేచనను గైకొనకుండునట్లు నీవు దానిని చేయుచున్నావు. అది అక్కడనే యున్నదని మనము ఎరుగుదుము. మీరు కోరుకున్నట్లయితే, ఇంటి యొద్దనే లేదా హాలీఉడ్ టెలివిజన్, మరియు వాటితో సహవాసము చేయుచూ, మీరు హస్యమును పేల్చవచ్చును. అయితే నిజముగా తిరిగి జన్మించిన పురుషుడు లేక స్త్రీ పరిశుద్ధాత్మ యొక్క వివేచన కలిగియుండి, సంఘములో తన స్థానమును కనుగొని, ఆరాధించుచూ మరియు మొర్రపెట్టును, మరియు పాపులను లోపటికి తీసుకు వచ్చుటకై ప్రయత్నించుచూ, అతని యొక్క జీవితములో అన్నియూ చేయును. నిశ్చయముగా.

49

అది దేవుడు అయినచో, మీరు గనుక వివేచనను పొందుకొనియున్నట్లయితే, దానిలో మీ యొక్క హృదయమును పెట్టెదరు. పనిచేయుము, కేవలము వెళ్ళి “అవును, అది నేను నమ్ముచున్నాను. అది సత్యము, అది మంచిదే. ఆమేన్,” అని నీవు చెప్పవద్దు. ఇంటికి వెళ్ళుము. పనికి వెళ్ళండి. మీరు వివేచనను పొందుకొనియున్నారు. పగలున్నంత వరకు పనిచేయుము, రాత్రి వచ్చుచున్నది. అప్పుడెవడును పని చేయలేడు. ద్వారము తెరువబడియుండగనే మనము పని చేయవలసియున్నది. ఇటువంటి కూటములను కలిగియున్నప్పుడే మనము పనిచేయవలసియున్నది. మన యొక్క ప్రియమైన వారిని లోపలకు తీసుకొని రండి. వారిని సువార్తలోనికి తీసుకొని రండి. మన యొక్క సహోదరులను, పొరుగువారిని తీసుకొద్దాం. దేవుడు అలాంటి జనుల కొరకు చనిపోయెను. మనము వారిని గూర్చి చాలినంత పట్టింపు కలిగియుండి, మన యొక్క చేతులు రక్తము కారేంత వరకు పనిచేయదము. మనము చేయనిచో, మనము ఖాళీగానే తిరిగి వచ్చెదము.

50

ఆ వెనుక కొంత కాలము క్రితము కెంటకీ నందు ఇక్కడ ఒక చిన్న బాలిక, ఈ మధ్యనే ఆ కొండల వెనుక ఆమె చనిపోయినది. దాదాపు ఎనమండుగురు పిల్లలుండెను. పన్నెండు సంవత్సరాల వయస్సు గల ఒక చిన్న బాలిక వారందరిలో మధ్యలో పుట్టినది. ఆమె యొక్క అక్క చెల్లెలు మరియు అన్నదమ్ములు చాలా సోమరులు, వారు యే పనియు చేయరు, మరియు ఆమె యొక్క తల్లి, భయంకరమైన క్షయ రోగము చేత చనిపోవు స్థితిలో పడియుండెను. మరియు మిగిలిన వారు వృధాగా కాలయాపన చేయుచూ, తిరుగుచూ, ఆటలాడుచూ, ఈత కొట్టుచూ ఉండగా, ఆ చిన్న బాలిక, ఆమె తన యొక్క తల్లిని గురించి జాగ్రత్త వహించుచూ, శుభ్రపరచుచూ, వంటచేయుచూ, మరియు బట్టలు ఉతుకుచూ యున్నది.

చివరకు, ఆమె యొక్క తల్లి మరణించినది, ఆ తరువాత ఆ చిన్న బాలిక అదే పనిని కొనసాగించవలసి వచ్చినది, ఏలయనగా మిగిలిన వారు పనిచేయుటలేదు. మరియు ఆమె పనిచేయుచూ, పనిచేయుచూ, పనిచేయుచూ చివరకు, ఆమె తినుటకు సరియైన ఆహారము లేక పౌష్టికాహర లోపముతో ఒక భయంకరమైన వ్యాధికి లోనైనది. ఆమె యొక్క చిన్న శరీరము క్షీణించిపోయినది. ఆమె చనిపోవు స్థితిలో యున్నది.

51

ఒక ఆదివారపుబడి బోధకుడు ఆమె యొద్దకు వచ్చెను, “నీవు క్రైస్తవురాలివా”? అని అడిగెను. “అవును, నేను క్రైస్తవురాలిని” అని ఆమె అన్నది.

“నీవు ఏ సంఘశాఖకు చెందినదానవు?” అని అడిగెను.

“నేను ఏ సంఘశాఖకు చెందినదానను కాను” అని ఆమె చెప్పినది

“అలాగైతే నాకు చెప్పు, ఈ లోకములో నీవు యేసుక్రీస్తును ఏ విధముగా కలుసుకొనగలవు? నీవు ఏ సంఘమునకు చెందినదానవని, నీవు ఆయనకు ఏమి చూపించబోవుచున్నావు?” అని అడిగెను.

“నేను కేవలము నా చేతులను ఆయనకు చూపించెదను, ఆయనే అర్ధము చేసుకొనును” అని ఆమె చెప్పినది.

ఇప్పుడు, ఇక్కడ జరుగుచున్న ఇటువంటి కూటములను మనము చూచినప్పుడు, మన అందరిని ఆ విధముగానే ఆయన చూడనైయున్నాడు అని నేను అనుకొనుచున్నాను. ఆయన మన యొక్క హస్తములను చూడనైయున్నాడు. మరియు దానిని గురించి మనము ఏమి చేసియున్నాము అనేది చూచును, ఆత్మీయ వివేచన. “ప్రభువు యొక్క శరీరమును వివేచించ లేకపోవుట.” మనము ప్రార్ధన చేసుకొందాము

ఆ యొక్క హస్తములు పని చేయుచుండవచ్చును, మరియు అవి పని చేయుచున్నవని మీరు ఎరిగియున్నారు, వాటిని దేవుని వైపునకు ఎత్తి, ఆయన యొక్క సేవకై ఆ హస్తములను శుద్దీకరించమని మనము ప్రార్ధించుచుండగా, ఆయనను మీరు అడుగలేరా? మీ హస్తములను పైకి ఎత్తండి.

52

ప్రభువా, ఆ యొక్క హస్తముల వైపు చూడండి. మరియు ప్రభువా, నావి కూడా ఒక కఠినమైన సైనికుడిగా నేను రావలెననుకొనుచున్నాను. నేను ఖాళీ చేతులతో రావలెననుకొనను. నేను మరణించినంత వరకు బోధించాలనుకుంటున్నాను. అంత్య-ఘడియ సమీపముగా యున్నది మరియు రాత్రి ఛాయలు వచ్చుచున్నవని నేను ఎరిగియున్నాను గనుక నేను లాగబడుటకు వినయముతో వేడుకొని, ఉపవాసముండి, ప్రార్ధించగోరుచున్నాను. ప్రభువా, నీ రాకడ యొక్క సూచనలు అధికముగా చూచులాగున నా కన్నులు తెరవండి. మీరు వాగ్దానము చేసిన ఆ గొప్ప సూచనలతో, ఈ రాత్రి, జనుల హృదయములు మండించండి.

ఈ లోకము గురించి ముందుగానే చెప్పబడినవి మేము చూసినప్పుడు, మరియు పాపాత్ముల మొర్రను వినినప్పుడు, ఆయన రాజధానులను తుడుపుపెట్టనై యున్నాడు. వారు అది చేయుటకు బాంబులను కలిగి యున్నారు అని మేము గ్రహించియున్నాము; కేవలము ఏదో మూఢభక్తి గల వ్యక్తి దానిని తాకవలసియున్నది. మీ యొక్క సంఘము సిద్ధపడునంత వరకు వినయముతో మీరు పట్టుకొనుచున్నారు. ప్రభువా, ఈ రాత్రి ఇక్కడ ఏమి యున్నది, మమ్ములను సిద్ధపరచండి. మా యొక్క హృదయములు సేవలో పెట్టండి. నీవు మరణము నుండి తిరిగి లేచియున్నావని మేము నమ్ములాగున మీ యొక్క సన్నిధిని మాకు చూపించండి. అదే యేసుగా, నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా మీరు ఇక్కడనే యున్నారని మా యొక్క ఆత్మ వివేచించుచున్నది. మి యొక్క సంఘము ద్వారా పనిచేయుట కొరకు, స్వస్థపరచుట కొరకు మరియు రక్షించుట కొరకు, పరిశుద్ధాత్మ యొక్క రూపములో మీరు ఇక్కడనే యున్నారు. దేవుని యొక్క కుమారుడు, యేసుక్రీస్తు నామమున ఈ జనులను మరియు నన్నును మీకు సమర్పించుకొనుచున్నాను. ప్రభువా, మా మనవులను వినండి. ఆమేన్.

53

ఓ, ఆయన యొక్క మంచితనము కొరకు, ఆయన యొక్క కరుణ కొరకు, నేను నిజముగా శుద్దీకరించబడినట్లుగా అనుభూతి చెందుచున్నాను. అది నా హృదయములో ఉన్నది. నేను దాని చెప్పవలసి వచ్చినది. నా మెథడిస్టు, బాప్టిస్టు, లేక పెంతెకొస్తు సహోదరులను నేను నొప్పించుటలేదని నేను తలంచుచున్నాను. నేను అలా చేసినట్లయితే, మిమ్ములను నొప్పించాలని నా ఉద్దేశ్యము కాదు. నేను కొద్దిగా మిమ్ములను, పురికొల్పవలెనని, మేలుకొల్పవలెనని అనుకుంటున్నాను. మనము అంతము యొద్ద యున్నాము. ప్రభువు యొక్క శరీరమును గూర్చి వివేచనను కలిగిలేకపోవుట; తమకు తామే వేరైపోవుచూ, విశ్వాసము లేనివారుగా కనిపించుచున్నారు. సమయమనునది ఉన్నప్పుడే సరిగ్గా ఇప్పుడే మీలో ప్రతియొక్కరు మాకు అవసరము. నాకు మీరు అవసరము మరియు మీకు నేను అవసరము. మనమిద్దరము దేవునికి అవసరము. మన యొక్క హృదయములను, ప్రయత్నములను కలుపుదాం, ఎందుకనగా మనము నాజరీను, పిలిగ్రీమ్ హోలీనెస్, కేథోలిక్, ప్రెస్బిటేరియన్, పెంతుకొస్తు లేక మనమేదైనప్పటికి అలాగున ఆలోచించవద్దు. క్రైస్తవులుగా ఉందాం. ప్రభువు యొక్క శరీరమును వివేచిద్దాం మరియు మన యొక్క చేతులను ఒక నీచమైన పాపి యొద్దకు చాపి, వారిని గొర్రెల దొడ్డిలోనికి తీసుకొని పోయెదము. అదే నా దీన ప్రార్ధన.

54

సొదొమకు వచ్చిన ఆ దేవుని యొక్క దూత, అతడు వచ్చెను. మరియు ఆయన వాగ్దానము చేసెను. గుర్తుంచుకొనండి, అదే దూత దిగి వచ్చెను. అది దేవుడై యున్నాడు అని ఎవరయిన ఎరుగుదురు. అది ఆ శరీరము కాదు, ఏలయనగా ఆ శరీరము దూత ఆయి ఉన్నది.

కొద్దిసేపటి క్రితం, నేను ఎవ్వరికో, “అది దేవుడని” నేను చెప్పాను. ఆయన చెప్పెను (ఒక బోధకుడు), అతను, “ఓ, ఇప్పుడు, సహోదరుడా బ్రెన్హాం, ఆ మనుష్యుడు దేవుడైయున్నాడు, దానిని నీవు నమ్మవు” అని చెప్పెను.

“ఆయన దేవుడు! అబ్రహాము, ఆయనను దేవుడు అని చెప్పెను” అని నేను చెప్పాను. అతడు ఆయనను, “ఎలోహిం” అని పిలిచెను. ఆయన సర్వశక్తిగల దేవుడు. ఆయన మరియు ఇద్దరు దేవదూతలు.

“మంచిది, ఆయన ఒక శరీరములో నివసించెనని నీవు తలంచుచున్నావు?” అని అతను చెప్పెను.

“అది చాలా సులభం” అని నేను చెప్పాను. మనము పదహారు మూల కణములతో చేయబడ్డాము; పెట్రోలియం, కాప్మిక్ వెలుగు, మరియు కాలియం, పొటాష్, మొదలగునవి. దేవుడు కేవలము తన చేతి నిండా ఆయనను కూడగట్టి, ఆయన బయలు వెళ్ళెను, “వ్యూ”, గాబ్రియేలూ అందులోనికి వెళ్ళు, “వ్యూ”, మిఖాయేలూ, అందులోనికి వెళ్ళు అని చెప్పెను. మరియు తన కొరకు ఒకటి చేసుకొనెను. “సొదొమ యొక్క పాపము పరిపక్వమైనదని నేను వినియున్నాను. క్రిందకు వెళ్ళి చూద్దాం. మనకు మనమే వెళ్ళి చూద్దాం, అబ్రహాము బోధించుచున్నాడు మరియు ఇతరులు బోధించుచున్నారు. మనలను మనము చూచుకొనుటకు వెళ్ళెదము.”

55

మరియు వారు ఎక్కడకు వచ్చిరి? ఎన్నికైన వారి యొద్దకు. ఒకరు వెనుక ఉండిపోయి, అబ్రహాముతో మాట్లాడెను, మరియు అబ్రహాము ఆయనను “ఎలోహిం” అని పిలిచెను. పెద్ద అక్షరములో “ఎల్”ను గమనించండి. అది సరి కాదా? చూడండి. ప్రభువైన యెహోవా దేవుడు, ఆయన రక్తమాంసములు గల శరీరములో యుండెను. దేవుడు ఏమైయున్నాడో నీవు కనీసము గుర్తించలేదు. దేవుడు కేవలము “వ్యూ” అనెను. ఆయన దేవుడని నేను ఎరిగియుండుటను బట్టి నేను సంతోషించుచున్నాను. ఈ దినములలో ఒకానొక రోజు, నేను ఏమీ కాకుండా ఉండవచ్చును, బహుశా నేను అగ్నిపర్వత ధూళివలె ఉండవచ్చును, కానీ ఆయన పలుకగా, మరలా నేను జీవమును పొందుకొనెదను. ఆయన దేవుడైయున్నాడు.

56

కొంత కాలము క్రితం నా భార్య “బిల్లీ, నీకు బట్ట తల వచ్చుచున్నది” అని చెప్పెను.

“నేను వాటిలో ఒక్కటి కూడా పోగొట్టుకొనను” అని నేను చెప్పాను.

“అయితే అవి ఎక్కడున్నవి?” అని ఆమె అడిగెను.

“నేను వాటిని పొందుకొనక ముందు అవి ఎక్కడున్నవో నాకు చెప్పు, అవి నా కొరకు ఎక్కడ వేచియున్నావో నేను చెప్పెదను” అని నేను చెప్పాను. అది సరియే. నీ తలలో ఒక వెంట్రుక కూడా కుళ్ళిపోదు, పరలోకము యొక్క దేవుడు ఎవరైతే అన్నిటిని నియంత్రించుచున్నారో ఆయన, “విలియం బ్రెన్హాం” లేదా ఇంకెవరైనా, “ముందుకు రావలయును” అని పిలుచును. మరియు నేను ఆయన యొక్క పోలికలో వచ్చెదను. హల్లెలూయా! ఈ రాత్రి, అదే దేవుడు. పరిశుద్ధాత్మ చేత, షెకీనా మహిమతో మన మధ్య నివసించుచుండెను, ఆయన చేసిన అదే సహజాతీత సూచనల ద్వారా తనను తాను రుజువు పరచుకొనుచున్నాడు.

నేడు ద్రాక్షతీగ, ద్రాక్షాపండ్లను ఫలించినట్లయితే, అది రేపు కూడా ద్రాక్షా పండ్లనే ఫలించును. అది ద్రాక్షావల్లి అయినచో, అది ఎల్లప్పుడు ద్రాక్షాపండ్లనే ఫలించును. మానసికమైన దాని క్రిందకు మనమెన్నడూ వెళ్ళము. పరిశుద్ధాత్మ చేత మనము లోపటికి రావలసియున్నది, ఏలయనగా అటువంటి ఆత్మను మాత్రమే పరిశుద్ధాత్మ సంఘము ఫలించును: ఆత్మ యొక్క ఫలములు, మరియు మనలో క్రీస్తు యొక్క జీవము.

57

అదే దేవదూత ఇక్కడున్నది, సొదొమ మరియు గొమొర్రాను నాశనము చేయుటకు వెళ్ళు ముందు ఒక సాక్షిగా ఉన్నది.

ఇప్పుడు, చూద్దాం. ఎంత మంది ప్రార్ధనా కార్డులు కలిగియున్నారు? మీ హస్తములను పైకి ఎత్తండి. అక్కడ నలభై లేదా యాభై యున్నవి. ఎంత మంది ప్రార్ధనా కార్డులు కలిగిలేరు? మీ హస్తములను పైకి ఎత్తండి. ఎందుకు, అక్కడ మూడంతల మంది యున్నారు. సరియే. ఏదో చేయుటకు నేను అనుభూతి చెందుచూ నడిపించబడుచున్నాను. ఎవరికి ప్రార్థనా కార్డులు లేవో వారు తీసుకొనండి. ఎవరికి ప్రార్ధనా కార్డులు ఉన్నవో, బహుశా. మంచిది, వారు లోనికి రాగలరు. కానీ ఈ వివేచనను మేము ప్రార్ధనా కార్డులు లేనివారి కొరకు చేయాలనుకుంటున్నాము. ఎవరికైతే ప్రార్థనా కార్డులు లేక వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో, వారు మరల మీ చేతులను పైకి ఎత్తండి, ఎందుకనగా మీరు ఎవరు అని నేను ఒక ఆలోచనను కలిగియుందును.

58

ఇక్కడ ఒక ప్రదర్శనయున్నది. నేను మీకు సత్యమును చెప్పానని మీరు నమ్ముచున్నారా? ఇది సత్యమని తెలుసుకొనుటకు, మీరు ఆత్మీయ వివేచనను కలిగియున్నారని నమ్ముచున్నారా? ఇక్కడకు మనము రావలసిన ఆవశ్యకత లేదు. నేను స్వస్థపరచువాడను కాను. నేను ఒక మనిషిని. నేను మీ యొక్క సహోదరుడను. ఆయన ఇక్కడ ఉన్నాడని, మీరు గనుక గుర్తించినట్లయితే, క్రీస్తే మీ స్వస్థపరచువాడు.

ఇప్పుడు, ఇది నిన్ను స్వస్థపరచుటకు వచ్చుచున్నట్లయితే, ఈ కోటును ధరించి ఆయన ఇక్కడ నిలువబడి యున్నట్లయితే, ఆయన నిన్ను స్వస్థపరచడు, ఎందుకనగా ఆయన ఇంతకు ముందే దానిని చేసియున్నాడు. ఆయన క్రీసై యున్నాడని మాత్రమే ఆయన రుజువు చేయును. దీనిని నీవు ఏ విధముగా ఎరుగుదువు? ఆత్మ యొక్క ఫలము చేత ఆయనను నీవు ఎరుగగలవు. ఆయన ఎటువంటి జీవితమును?

ఆయన ఇక్కడ ఉన్నప్పుడు, ఆయనే మెషయా అని రుజువు పరచుకొనుటకు, ఆయన ఏమి చేసెను? ఆయన పేతురు, యోహాను... లేదా పేతురు మరియు నతనయేలు మరి వారందరికి ఆయన చూపించుకొనినప్పుడు, వారు ఏమైయున్నారో, వారెక్కడి నుండి వచ్చియున్నారో చెప్పినప్పుడు, అదే, యూదులకు ఆయన సూచనైయున్నది. అదే వారి యొక్క యుగ సమాప్తి అక్కడ మరొక తరగతికి చెందిన జనులు ఆయన రాకడ కొరకు ఎదురుచూచుచున్నారు, వారే సమరయులు, వారు సగం యూదులు మరియు సగం అన్యులు. ఆయన భావి యొద్ద ఆ స్త్రీతో ఆమె పాపముల గురించి చెప్పెను, మరియు అది మెషయా యొక్క సూచనగా ఆమె గుర్తించినది.

“మెస్సయా ఈ విషయములు మాకు తెలియజేయును అని మేము ఎరుగుదుము, అయితే నీవెవరవు? అని ఆమె అన్నది.

“నేనే ఆయనను” అని ఆయన చెప్పెను.

59

ఇప్పుడు, ఆయన అన్యుల యొద్దకు వెళ్ళలేదు, ఆయన వెళ్ళెనా? అన్యులు ఆయన కొరకు ఎదురు చూచుట లేదు. దేవుడు అనంతుడు అని ఎంత మంది నమ్ముచున్నారు? మంచిది, నిశ్చయముగా, ఆయన అనంతుడు. తరువాత ఆయన ఇక్కడ ఒక విషయము చెప్పి, ఇక్కడ ఒక కార్యము చేసి మరియు అక్కడ ఇంకొక కార్యము చేయడు. ఆయన నీతిమంతుడైయున్నాడు. ఆయన అదే కార్యమును చేయును. ఆయన శ్రేష్టమైన ప్రణాళికను కలిగియుంటే, ప్రారంభములోనే ఆయన దాని చేసియుండును; దేని కొరకైన దేవుడు రంగము మీదకు పిలువబడినట్లయితే, అక్కడే ఆ తీర్పును ఆయన చేయును. ఒక పాపి ఎప్పుడైన దేవునికి మొర్రపెట్టగా, దేవుడు అతని విశ్వాసము యొక్క యోగ్యతను బట్టి అతని రక్షించినచో, ఆయన తరువాత పాపిని కూడా అలాగనే రక్షించును, మరియు తరువాత పాపిని, మరియు తరువాత పాపిని అలాగే చేయును. ఆయన అదే సమయమున చేయవలసి ఉండెను, లేదా ఆయన మొదటి పాపిని రక్షించినప్పుడే ఆయన తప్పు చేసినవాడగును.

60

స్వస్థత చేత అదే విషయమును చేయవలసి వచ్చును. ఆయన ఇప్పటికే ఆ పనిని ముగించియున్నాడు. నీవు గుర్తించవలసిన ఒకే ఒక విషయము ఏమిటంటే ఆయన ఒక కల్పితము కాదు. ఆయన చారిత్రాత్మక దేవుడు కాదు. ఆయన వర్తమానములో (ప్రస్తుతమందు) యున్న దేవుడు, యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఇప్పుడే ఆయన ఇక్కడనే యున్నాడని నీవు నమ్ముచున్నావా? దానిని నీవు వివేచించగలవా? ఈ సభికులకు నేను తిరిగి నా వెనుక (వీప) భాగమును చూపించగోరుచున్నాను. ఇప్పుడు, నేను ప్రార్ధించుచున్నాను.

ఈ వర్తమానము యొక్క ముగింపులో, ఈ రాత్రి నేను, ఏదైతే చెప్పానో పరిశుద్ధాత్మ దానిని నిరూపించును, యేసు చెప్పిన అవే సూచనలు సొదొమకి ఇవ్వబడినవి, ఈ తరము వారికి కూడా ఇవ్వబడును. “సొదొమ దినములలో ఎలాగుండెనో, మనుష్యకుమారుని రాకడ యందును అలాగుండును.” అప్పుడు ఇక్కడ ఎటువంటి ఆత్మ యున్నదో నీవు వివేచించగలవు.

61

వ్యాధిగ్రస్తుడై యుండి మరలా ప్రార్థన కార్డు లేకుండా ఉన్నది ఎవరు? మేము ప్రార్థనా కార్డులు పొందగోరుచున్నాము. మేము అందరికొరకు ప్రార్ధించగోరుచున్నాము.

ఇప్పుడు, ఎవరు ఏదైయున్నారో నేను మీకు చెప్పలేను. దేవుడు ఎరిగియున్నాడు. మొదటిగా, నేను పరిశుద్ధాత్మ అను ఒకరిని కనుగొనవలసియున్నది.

ఇప్పుడు, మీలో ప్రతి ఒక్కరూ, మీరు ప్రార్ధన చేయటం ప్రారంభించండి, “ప్రభువా, ఇప్పుడు నా యందు కనికరము కలిగి నాకు సహాయము చేయండి” అని చెప్పండి. మరియు ఆయన చేస్తానని చెప్పిన విధముగా ఆయన చేయును.

ఆయన యొక్క సూచన కొరకు కేవలము నేను కనిపెట్టుచున్నాను. ఇశ్రాయేలు యొక్క పిల్లలను వెంబడించు, ఒక అగ్నిస్తంభముగా నేడు యేసు యున్నాడని ఎంత మంది ఎరిగియున్నారు? “నేను దేవుని యొద్ద నుండి వచ్చియున్నాను, దేవుని యొద్దకే వెళ్ళుచున్నాను.” ఆయన చెప్పినది అదేనా? మరియు దమస్కు మార్గములో, పౌలు ఆయనను కలిసికొనినప్పుడు, ఆయన ఏమైయున్నాడు? ఆ గొప్ప వెలుగు, అగ్నిస్తంభమై యున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన నేడు ఒకేరీతిగా యున్నాడు. పరలోకములో ఆయన సింహాసనమునందు దేవుని యొక్క కుడిపార్శ్వమున యేసు యొక్క శరీరము ఉంచబడును; అయితే ఆయన యొక్క ఆత్మ ఇక్కడ భూమి మీద ఉండి, ఆయన పనిని సంపూర్ణము చేయుచూ, ముగించుచున్నది. మరియు యేసుక్రీస్తు శరీరములో నివసించిన అదే ఆత్మ సొదొమ మరియు గొమొర్రా యొద్దకు దిగివచ్చిన దూతలో కూడా అదే ఆత్మ ఉన్నది. మీరు దానిని నమ్ముచున్నారా? అదే దేవుడు, అదే వ్యక్తి ఇశ్రాయేలు సంతతిని కూడా వెంబడించెను.

62

యేసు చెప్పెను, “అరణ్యములో కొట్టబడిన బండను నేనే. మీ పితరులు మన్నాను తిని మరియు వారు చనిపోయిరి; పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. జీవాహారమును నేనే. ఆ బండను నేనే.”

“ఎందుకు, నీకింకను ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రహామును చూచితివని నీవు చెప్పుచున్నావు.”

“అబ్రహామునకు ముందే నేను ఉన్నాను” అని ఆయన చెప్పెను.

“నేను” అనేది ఎవరు? ఆ పొదలో ఉన్నది, మండుచున్న వెలుగు. అది మోషేతో మాట్లాడినది. ఈ రాత్రి ఆయన అదే యేసుగా యున్నాడు. అది ఒక ప్రకటన. అది కాదా? దానిని నేను సవాలు చేయుచున్నాను. ఏ విశ్వాసియైన దానిని నమ్ముమని నేను సవాలు చేయుచున్నాను.

63

అక్కడ చిన్న స్త్రీ కుర్చొని యున్నది, ఆమె యొక్క టోపిపై చిన్న తెల్లని వస్తువుయున్నది. నీవు ప్రార్ధనా కార్డు కలిగియున్నావా? నీవు రోగిగా యున్నావా? మనము ఒకరికి ఒకరము క్రొత్తవారము కాదా? దేవుడు మన ఇద్దరిని ఎరిగియున్నాడు. మీరు చూడగలిగినట్లయితే, అక్కడ ఆ స్త్రీ వెలుగున్నది, అది ఆమె పైనే తిరుగుచూ యున్నది. ఆమె ప్రార్థన చేయుచున్నది. అది నిజమేనా? పైకి ఇక్కడకు వచ్చుటకు నీకు ఎటువంటి అవకాశము లేదు, కాని నీవు ప్రార్ధన చేయుచున్నావు, ఎందుకనగా కేవలము దానికి క్రిందగా ఒక నల్లటి నీడను నేను చూచుచున్నాను; అది మరణము. మరణఛాయ ఆ స్త్రీని కమ్ముకున్నది. ఆమెకు క్యాన్సర్ యున్నది. దేవుడు నిన్ను స్వస్థపరచగలడని నీవు నమ్మగలవా? రొమ్ము క్యాన్సర్ మరియు ఒక వైద్యుడు దానిని పరీక్షించుటను నేను చూచుచున్నాను, మరియు దానిని శస్త్రచికిత్స చేయుటకు నేను ప్రయత్నించుచున్నాను అని అతడు నీకు చెప్పుచున్నాడు. నీవు శస్త్రచికిత్స చేయించుకొనుటకు సిద్ధముగా యున్నావు. మరియు నీవు ఒక వేదిక మీద నుండి లేదా ఇంకేదో దాని మీద నడుచుటను నేను చూచుచున్నాను. నీవు ఒక బోధకురాలివి, స్త్రీ బోధకురాలివి. ఇది “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” స్త్రీ, అది సత్యమేనా? ఆయన ఏదైతే చెప్పెనో, అది సరియేనా? అది సరి అయినచో నీ పాదములపై లేచి నిలువబడుము.

ఇప్పుడు, నీవు నమ్ముచున్నావా?... ఆమె ఆయన యొక్క వస్త్రమును తాకినది — తాకినది అదే యేసుని అని నీవు వివేచించగలవా? నన్ను కాదు, ఆయనను. ఆ స్త్రీని నేను ఎరుగను. ఆమె నన్ను ఎరుగదు. మా ఇద్దరిని దేవుడు ఎరిగియున్నాడు. సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక.

64

దర్శనములో నేనొక స్త్రీని చూచుచున్నాను. ఆమె ప్రార్ధించుచున్నది. ఆమె ఒక యవ్వనస్తురాలు. ఆమె ఇక్కడ కూర్చొన్నది. అక్కడ బిడ్డ గురించి ఏదో యున్నది. అది... ఆమె కోరినది. కాదు, ఆమె ఒక బిడ్డను కలిగియున్నది. ఓ, ఆమెకు గర్భస్రావము జరిగినది; అదే జరిగియున్నది: ఒక చనిపోయిన బిడ్డ ఆమె కెంటకీ నుండి వచ్చినది. ఆమె పేరు మార్టిన్, శ్రీమతి మార్టిన్ గారు మీరు ఎక్కడ ఉన్నారు? అవును, ఒక పసుపు రంగు వస్త్రము ధరించెను. అది సత్యము. స్త్రీ, అవును కదా? అది అలాగైతే, నీ పాదములపై నిలువబడుము. ఆ స్త్రీని నేను ఎరుగను. అయితే దేవుడు ఆమెను ఎరిగియున్నాడు, మరియు ఆమె అక్కడున్నది. ప్రభువైన దేవుని నామము దీవించబడును గాక.

ఆమె వెనుకనే ఒక స్త్రీ కూర్చొన్నది. ఆమెకు మూలవ్యాధి యున్నది. ఆమె నల్లటి వస్త్రము ధరించిన సూలకాయురాలివలె యున్నది. ఆమె కుడివైపున ఒక సమస్యను కలిగియున్నది. స్త్రీ, నీవు ప్రార్థన కార్డు కలిగియున్నావా? నీవు కలిగిలేవా? నీకు అది అవసరము లేదు. ఏదో ఒక దానిని తాకుటకు నీవు విశ్వాసమును కలిగియున్నావని నీవు నమ్ముచున్నావా? నీవు నన్ను ఎన్నడు తాకలేదు. నీవు ఆయనను తాకితివి. సరియే. అంతట నీ చేతి రుమాలుతో, నీ యొక్క హస్తమును ఎత్తి, నీ స్వస్థతను అంగీకరించుము. యేసుక్రీస్తు నామమున ఇంటికి వెళ్ళి, మంచిగా ఉండుము.

65

ఇక్కడ చూడుము. ఇక్కడ వెనుక ఒక చిన్న స్త్రీ గళ్ళుగా కనిపించే వస్త్రము ధరించి అక్కడ యున్నది. ఆమె తన యొక్క తల వంచియున్నది. ఆమె తన తండ్రి కొరకు ప్రార్థించుచున్నది. అతడు కాలేయ సమస్యతో భాదపడుచున్నాడు. సహోదరీ, దేవుడు ఆయనను స్వస్థపరచును అని నీవు నమ్ముచున్నావా? దానిని నీవు నమ్ముదువా? అయితే దానిని నీవు పొందుకొనగలవు.

స్త్రీ, అది ఆమె అని ఆమెతో చెప్పుటకు ఆమెకు నీవు ఎంతో దయకలిగిన దానిగా యు౦దువు. అది నీవు చెప్పుటకు కారణమేమనగా, నీ యొద్ద నుండి కూడా పరిశుద్ధాత్మ కదిలివెళ్ళినది. అది సరియే. నీవు ప్రార్థనా కార్డు కలిగియున్నావా? నీవు కలిగిలేవా? నీకు అది అవసరము లేదు. నీవు తల్లి కొరకు ప్రార్థించుచున్నావు. మరియు రేపు రాత్రి ఆమెను నీవు సంఘమునకు తీసుకొని వచ్చుటకు ఆలోచించుచున్నావు. అది సరి. అలాగున చేయవలసిన అవసరము లేదు. ఆమెపై నీ హస్తములను పెట్టి, ప్రభువైన యేసు నామమును పిలువుము. నీవు దానిని నమ్మినట్లయితే, ఆమె బాగుపడును.

66

మీ యొక్క విశ్వాసమును నేను సవాలు చేయుచున్నాను. ప్రార్థనా కార్డు లేకుండా, నమ్మవలెనని కోరుకొనుచున్న వారు ఎవరు మిగిలి ఉన్నారు?

ఇక్కడ ముందు కూర్చున్ననీవు, నేను దేవుని ప్రవక్తనని నీవు నమ్ముచున్నావా? ఒక ప్రవక్త ఆ యుగమునకు వర్తమానికుడై యున్నాడు. నేను దేవుని యొక్క వర్తమానమును కలిగియున్నానని నీవు నమ్ముచున్నావా? దానిని నీవు చేయుదువా? నేను నిన్ను ఎరుగను, అయితే దేవుడు నిన్ను ఎరిగియున్నాడు. దేవుడు నీ యొక్క సమస్యలను నాకు చెప్పినట్లయితే, ఆయనను నీ యొక్క స్వస్థపరచువానిగా అంగీకరించెదవా, అది ఆయనే అని నమ్మెదవా, అప్పుడు దానిని నీవు వివేచించగలవు. నేను నీతో మాట్లాడుచున్నప్పుడు, ఇప్పుడు నీ యొక్క ఆత్మ ఆయనను తాకినట్లయితే, అప్పుడు నీ యొక్క స్వస్థతను నీవు అంగీకరించెదవు. నీవు అంగీకరించెదవా? అది నీ చాతీపై మచ్చలు గల కంతి, మరియు ఇంకా నీవు ఒక బోధకునివి. అది సరియే. అది “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు” అయి ఉన్నది. దేవుని నమ్ముము!

67

నా వీపు బాగమును నేను త్రిప్పుచున్నాను. ప్రార్ధించండి. చూడండి, ఆయన అదే దూత అయినచో, చూడండి, వాగ్దానము చేసిన అదే దేవుడు, ఆయన యొక్క వెనుక భాగమును గుడారము వైపునకు ఆయన త్రిప్పినప్పుడు, మీలో కొందరు ప్రార్ధించండి, ప్రభువైన దేవుడు ఆయన దూతను పంపించి, మరియు సొదొమ - అంతము సమీపముగా యున్నది అని రుజువు చేసెను.

ఓ, ప్రభువైన దేవా, ఈ రాత్రి మీ యొక్క దూతను పంపించండి, అదే వివేచనను దయచేయండి, ఎందుకనగా అది మీ కుమారుని యొక్క వాగ్దానము మరియు ఆ విధముగా ఉండనియ్యండి.

నా ముందు ఒక స్త్రీ నిలబడియున్నది, మరియు ఆమె తలపడిశముతో బాధపడుచున్నది. ఆమె ఈ కోణములో వెనుక యున్నది, ఆమె యొక్క విశ్వాసము ఆమెను లాగుచున్నట్లుగా నాకు అనిపించుచున్నది. ఆమె పేరు శ్రీమతి విలే. ఆమె ఎక్కడ యున్నది? చూద్దాం. ఇక్కడే ఎక్కడో ఆ వెనుక యున్నది. ఆ స్త్రీ ఏదియేమైనప్పటికి. అక్కడ. స్త్రీ, అది సత్యమేనా? అది సరే. ఇంటికి వెళ్ళి, బాగుపడుము.

దేవునియందు విశ్వాసము కలిగియుండుము. ఎక్కడో మీలో కొంత మంది ప్రార్థించుచున్నారు. ఓ ప్రభువా, దేవునిగా మీ సామర్థ్యమును, ఎరుగుదుము గాక.

68

అక్కడ ఒక స్త్రీ నా ముందు నిలబడియున్నది, ఆమె జనసమూహములో ప్రార్థించుచూ ఉన్నది, మరియు ఆమె ఇబ్బందులతో యున్నది. ఆమె ఎరుపు మరియు తెలుపు గడుల వస్త్రము ధరించినది. ఆమె పేరు శ్రీమతి లేక్, శ్రీమతి లేక్, మీరు ఎక్కడున్నారు? ఎక్కడున్ననూ, మీ పాదములపై నిలబడండి. దేవుడు నిన్ను దీవించును గాక. ఇంటికి వెళ్ళి, మంచిగా ఉండుము. నీ విశ్వాసము నిన్ను రక్షించినది.

అదే మారని యేసు. అదే దేవదూత. ప్రభువు యొక్క శరీరమును వివేచించుటకు, నీవు వివేచనను కలిగియున్నావా? నేను మీకు సత్యమునే చెప్పుచున్నానని నీవు నమ్ముచున్నావా? దాని గురించి క్రీస్తు సాక్ష్యము ఇచ్చుచున్నాడని అని నీవు నమ్ముచున్నావా? అది నీవు నమ్మినట్లయితే, నీ హస్తములను పైకి ఎత్తుము. ఈ విధముగా కరచాలనము చేయుటకు ఇక్కడ ఎంత మంది విశ్వాసులు ఉన్నారు? అంతట, దేవుని ప్రవక్తనని మీరు నన్ను నమ్ముచున్నారా? మీరు చిన్న పొల్లు కూడా సందేహము లేకుండా ఉండుము. దేవుని వైపునకు ఊపుచున్న మీ యొక్క హస్తములను తీసుకొని, నీకు ప్రక్కన ఉన్న వారిపై వేయండి, మరియు మీరు దేవుని యొక్క మహిమను చూచెదరు. ఆయన చేయగలినదంతయూ అదే. మీరు ప్రభువు శరీరమును వివేచించగలగుచున్నారా? ఆయన ఆత్మ ఇక్కడే యున్నదని మీరు వివేచించగలుగుచున్నారా? “నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును. వ్యాధిగ్రస్తులపైన వారి చేతులుంచినప్పుడు, వారు స్వస్థత నొందుదురు.”

69

భూమి మరియు ఆకాశములను సృజించిన ప్రభువైన దేవా నిత్యజీవమునకు కర్తా, ఇక్కడున్న ప్రతీ విశ్వాసి సాతాను బంధకములలో నుండి విడిపింపబడును గాక. వారు ఒకరి చేతులు ఒకరిపై వేసియున్నారు, మరియు వారు విశ్వాసులైయున్నారు. వారు దేవుని యందు విశ్వాసము కలిగియున్నారు మరియు మీరు దానిని చేయుదురని వారు నమ్మిక కలిగియున్నారు. ఓ ప్రభువా, మీ మాటలు, అంత కంటె ఎక్కువగా వాగ్దానములు విఫలము కావు మరియు మీ వాగ్దానములు, ఏమనగా “వారు వ్యాధిగ్రస్తులపై వారి చేతులు ఉంచినప్పుడు, వారు స్వస్థత నొందెదరు.”

ఇప్పుడు, బాధను కలిగించు చెడ్డ దెయ్యమైన సాతానా, ఈ ప్రజలను ధూళిలోనికి కొట్టుచున్నదానా, జీవించుచున్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో వారిని నీవు విడిచిపెట్టినట్లు, నేను ఆజ్ఞాపించుచున్నాను. యేసుక్రీస్తు నామమున వారిలో నుండి బయటకు రమ్ము.

70

ఇప్పుడు, ఒకరి మీద ఒకరు చేతులను వేయండి మరియు విశ్వాస ప్రార్థనను ప్రార్ధించండి, మరియు మీరు దేవుని యొక్క ఆత్మను అనుభవించినప్పుడు, అది మీకు దేవుని యొక్క వాగ్దానమని దానిని వివేచించండి. దేవుని శక్తి మీలో కదులుచున్నదని అనుకున్నవారందరునూ, మీ పాదములపై నిలబడి మరియు మీ స్వస్థతను అంగీకరించండి. విశ్వాసులైన మీరందరు, మీ పాదముల పై నిలబడి, యేసును మీ సొంత స్వస్థపరచువానిగా అంగీకరించుమని, యేసుక్రీస్తు నామములో నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. మంచములపై, చక్రాల కుర్చీలో నున్న మీరు, ఎక్కడ ఉన్నా పైకి రండి. పైకి లేవండి. దేవుని నమ్మ౦డి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో, స్వస్థత పొందుకొనుడి. మంచములపై నుండి, చక్రాల కుర్చీలో నుండి, మరియు అన్ని విధములైన వాటి నుండి వారు పైకి లేచుచున్నారు.

అది సరియే, బ్రదర్ సులీవన్.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...