గొంగళిపురుగులు, మిడుతలు, పసరుపురుగులు, చీడపురుగులు
VGR COUNT -253 సహోదరుడు నెవిల్ గారు ధన్యవాదములు. వారు ఆ చిన్న మైక్రోఫోన్ ను కదుపుచున్నారు.... లేదా, దాని ధ్వని పరిమాణము. అందరూ సరిగా వినగలుగుచున్నారా? మంచిది. ధన్యవాదములు. పార్కింగ్ చేయకూడని స్థలములో ఒక సహోదరుడు తన కారును ఉంచడము వలన వారు దానిని తీయమన్నందున కొద్దిపాటి అంతరాయం కలిగినదని నేను భావిస్తున్నాను. అది అదే అయి యున్నాడు. ఇక్కడ? నేను దీనిని తీసివేస్తే ఎలాగున్నది, మీరు సరిగా వినగలుగుచున్నారా. “మనము తప్పుడు పొదలలో మొరుగుచున్నాము,” అను పాత కెంటకి సామెత వలె ఉన్నది. నేను ఈ మైక్రోఫోన్ని పరిశీలిస్తున్నాను, నేను కోరుకున్నటువంటిది ఇదే. ఇప్పుడు అంతా బాగున్నది. సహోదరుడా జీనీ ధన్యవాదములు. ఇప్పుడు ఈ రోజు.....
2
గత వారమో, అంతక ముందు వారమో ఒహియోలోని మిడిల్-టౌన్ లో జరిగిన కూడికకు సంబంధించిన నివేదికను మీకు తెలియజేయడానికి మాకు చాలా సంతోషముగా ఉన్నది. మాకు అది చాలా అద్భుతమైన సమయం. అక్కడ మాతో ఉ౦డిన సంఘములు ఏమంత పెద్దవి కావు, అది పట్టణమునకు ఎనిమిది లేక తొమ్మిది మైళ్ళ దూరంలో చటేక్వా అనే ప్రదేశము. అయితే కూర్చునుటకు అది పూర్తిగా నిండుకొన్నది, కొన్ని వేల కొలది ప్రజలతో అక్కడ కిక్కిరిసి పోయినది. గుంపులను లెక్కించుట నా ఉద్దేశ్యము కాదు. ప్రధానమైనది మరియు జరిగిన మంచి సంగతి ప్రభువు మాతో కలసి కొనియున్నారు. గొప్ప ఫలితాలను అది తీసుకొని వచ్చినది. మా కొరకై దీనిని చేసిన ప్రభువు స్తుతింపబడును గాక.
నా జీవితములో కలిసిన వారిలో చాల అద్భుతమైన ప్రజలు ఆ గ్రామములో ఉన్నారు. కెంటకీ సరిహద్దుకు చాలా సమీపంలో ఉన్నప్పటికీ వారు తొంబది-తొమ్మిది శాతము కెంటకీవారు అని నేను చెప్పవచ్చు. అక్కడ అంతా కెంటకీమయం. సహోదరుడు సులీవన్ గారు అన్నారు, “సహోదరుడా బ్రెన్హా౦ మీకు తెలుసా, ఈ చిన్న లోయ అంతా కెంటకీ వారే?”
మరియు నేను, “అది నాకు తెలియదు” అన్నాను.
ఆయన, “అవును, వీరంతా వారే,” అన్నారు.
3
మరియు ఆ కూడికలో ఒక రాత్రి ఇలా ప్రశ్నించాను, కెంటకీ నుండి ఎంతమంది వచ్చియున్నారు, మీ చేతులు ఎత్తండి?“ అని. అంతా పరిశీలించాను వేరేచోట నుండి ఎవరైనా వచ్చారేమోనని, కానీ అందరూ కెంటకీ వారే.
ఎన్నో నివేదికలు మరియు ఫలితాలు అద్భుతమైనవి. నిన్నటి దినమున నా వద్దకు ఒక పెద్ద మనిషి వచ్చి, జరిగిన కొన్ని సంగతులను నాకు తెలియజేశాడు. విభిన్నమైన సాక్ష్యములు, అనేక ఉత్తరాలు వస్తున్నాయి.
4
ఆ పెద్దాయన ఇప్పుడూ ఈ ప్రసంగాలను రికార్డు చేసుకుంటూ మరలా ఇక్కడే ఉన్నారు, మరియు ఒక రాత్రి ఆయన అన్నారు — నేను గతరాత్రి అని నమ్ముచున్నాను — ఒక చిన్న పక్షిరాజుపై ప్రసంగిస్తున్నప్పుడు, నేను వివేచించుచున్న సమయంలోనో, సంఘములో ఉన్నప్పుడో అతను నాకు చెప్పలేదు. అతను మాత్రము శ్రోతల గుంపులో నుండి వచ్చి ఈ మాటలు చెప్పారు. పరిశుద్దాత్మ అతనితో మాట్లాడుతూ తను పల్లెటూరు నుండి కాక ఇండియానా, ఇండియానాలోని ఏదో ప్రాంతము నుండి వచ్చెనని పరిశుద్ధాత్మ అతనితో మాట్లాడుచూ, “ నీవు ఇక్కడ నీ కొరకు నిలబడలేదు. కొన్ని నెలల వయస్సు, బహుశా మూడు నెలలు నీ బిడ్డ కొరకు ఇక్కడ నిలబడ్డావు.” మరియు ఆ బిడ్డ గుండె బయటకు తీసి శస్త్రచికిత్స చేయించవలసియున్నది. ఇది ఎంత దయనీయ పరిస్థితి ఉన్నది; ఆ చిన్న ఊపిరితిత్తులు, ఛాతి తీవ్రంగా వాచి ఉన్నదని; అతని చిన్న కడుపు లోపలికి పడిపోయి ఉన్నదని. సందేహింపక ఇంటికి వెళ్ళమని చెప్పాడు; మరియు అతను సందేహించకుండా ఉ౦టే, అతని బిడ్డ చక్కగా ఉండుట కనుగొంటాడు.
5
ఇక్కడున్న ప్రక్క గదిలోనే ఆ సాక్ష్యము ఉన్నది, ఆ పసి బిడ్డ ప్రేక్షకుల సమూహములోనే ఉన్నదని అనుకొనుచున్నాను. ఆ బిడ్డ ఊపిరితిత్తులు మామూలుగా మారాయి. ఆ చిన్న పొట్ట యధాస్థితికి వచ్చినది. ఇక్కడ ప్రసంగములను టేపు చేస్తున్న వ్యక్తి తన తల్లిని, తండ్రిని, తన పొరుగు వారిని మరియు ఆ పసి బిడ్డను తెచ్చి గదిలో ఉంచారు. “ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు!” అనే టేపును పెట్టాడు. వేదిక పైకి వచ్చి ఇలా చెప్పాడు, “పరిశుద్దాత్మ గదిలోనికి వచ్చినది, ఆ బాలున్ని సరిచేసినది. అక్కడ చిన్న బాలుడు ఆడుతూ, పాడుతూ ఉన్నాడు.” వైద్యులు శస్త్రచికిత్స చేయనక్కర లేదు, ఎలాంటి శస్త్రచికిత్స అవసరంలేదు. ఆ పసి బిడ్డకు ప్రభువే ఆయన యొక్క గొప్ప శక్తితో శస్త్రచికిత్స చేశాడు. ఆ చిన్న బిడ్డ అక్కడే చిన్నమంచం మీద కూర్చొని, ఆడుతూ - పాడుతూ ఉన్నాడు, బిడ్డయొక్క తల్లిదండ్రులు అక్కడే కూర్చొని ఉన్నారు. ఈ విషయమై సందేహము కలిగిన పొరుగువాడు అక్కడే ఉన్నాడు. ఇది అపోస్తలుల విశ్వాసము కాకపోతే, మరింకెంటో నాకు తెలియదు.
6
ఆ ద్వారము వద్ద యేసుక్రీస్తు తన అపొస్తలులైన పేతురు, యోహానుల ద్వారా ఆ కుంటివారిని స్వస్థపరచిన సంగతి బైబిల్ ద్వారా మీరెరుగుదురు ఎవరూ దానికి వ్యతిరేకముగా ఏమీ చెప్పలేకపోయిరి, ఎందుకనగా ఆ స్వస్థత పొందిన వ్యక్తి అక్కడ సాక్ష్యముగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ఇంకనూ జీవించుచున్నాడు. ఆయన నామము స్తుతినొందును గాక! ఇది ఈ రోజుల్లో ఎంత గొప్ప ఆదరణ! అనేక సాక్ష్యములలో ఇది కేవలము ఒకటి మాత్రమే. ఈ రోజుల్లో కూడా అలాంటి గొప్ప దేవుని, అద్భుత క్రియలను మనము కనుగొనగలము, ఎందుకనగా ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన నామములో ఈ ఉదయకాలమున కూడుకొనగల ధన్యత మనము కలిగియున్నందులకు ఎంతో కృతజ్ఞులము.
ఏ స్థితిలో మనలను పిలిచెనో ఆ స్థితిలో దేవుని సేవించుటకు ఒక ప్రదేశము నుండి మరియొక ప్రదేశమునకు మేము చేయు ప్రయాణము కొరకు ప్రార్ధించండి. మేము కేవలము ఈ గుడారము నుండియే గాక దేశమంతటి నుండి ఆనందించుచున్నాము.
7
సహోదరి ధన్యవాదములు. అది చక్కని విధేయతతో కూడినటువంటిది. పరలోకమందున్న ఆ గొప్ప దేవుడు నీవు ఈ పని చేయుటను గమనించుచున్నాడు. ఆ స్త్రీ కన్నా కొంచెము చిన్న వయసు గల స్త్రీ ఇక్కడ కూర్చొని ఉన్నది. ఆ స్త్రీ నేను పుట్టుక ముందు నుండియే ప్రభువు సేవలో ఉన్నది. ఆమె భర్తకు యాబది కన్నా ఇంకా చాలా ఎక్కువ సంవత్సరాలు, సువార్త పనిలో అనుభవం ఉన్నది. ఏ సువార్తను బోధించుటకు నేను నిలబడితినో, ఆ సువార్తను ఆయన బోధించుటలో ఆయనకు సహకరించుటకు ఆమె బొగ్గుల ఘనిలో పనిచేయుచున్నది. వయసులో పెద్దదైన స్త్రీ తన ముఖము నుండి కారుచున్న చెమటను తీసివేయుటకు ఎలాంటి విసనకర్ర లేక నాకు ముందుగా కూర్చొని ఉన్న;. వయసులో చిన్నదైన ఒక స్త్రీ లేచి వచ్చి ఆమె కొరకు ఒక విసనకర్ర తీసుకొచ్చినది. కాబట్టి ఈ ఉదయ కాలము ఇలాంటి వారితో సమావేశమవడము నాకు చాలా సంతోషకరము. నేను క్రైస్తవుడుగా ఉండటం, మరియు క్రైస్తవులతో సమావేశమవడము నాకు సంతోషము కలిగి౦చును.
8
ఇప్పుడు మన దేశము అంతటిలో చాలా వేడిగా ఉన్నది. ఆకురాలు కాలము కొరకు మనము ఎదరుచూస్తున్నాము. అది వచ్చినప్పుడు వాతావరణం చల్లబడును, కాలిఫోర్నియా శాన్-జోస్లో ఆ గొప్ప మైదానంలో ఒక పెద్ద కూటమును జరిగించెదము. అక్కడ గతంలో ఎవరో కూటమును నిర్వహించారో మనము పెద్దగా పట్టించుకోలేదు గాని, వారే ఆ గొప్ప మైదానంలో మరియొక మారు నిర్వహించబోతున్నారు. మీకు మీరక్కడ దగ్గరలో ఉండినట్లయితే, లేదా మీ స్నేహితులకైనా కూటమునకు రమ్మని రాయండి. రావడానికి వీలు కుదరనట్లయిన, కనీసం ప్రార్ధించండి.
9
నేను తెలియజేసినట్లుగా ఈ రోజున మీ అందరితో కలసి ప్రభువునకు ప్రార్ధనలు, యాచనలు సమర్పించవలసి ఉన్నది. మన మధ్యలో కొత్త వారెవరైనా ఉ న్నట్లయితే, దయచేసి క్షమించాలి, మా వద్ద వేడిని చల్లబరిచే యంత్రాలేమి లేవు. ఈ లోకపరంగా మేము చాలా బీద సంఘము, కానీ విశ్వాస పరంగా దేవుని రాజ్యములో చాలా ధనికులము. ఈ చిరు దర్శనము కొరకు మీకు సుస్వాగతం, మీరు మరలా ఒకసారి వచ్చి మాతో ఉండాలని నా ప్రార్ధన. ఒకానొక రోజున మేము ఒక మంచి సంఘము కలిగి ఉంటామని ఆశిస్తున్నాము.
10
యేసు ప్రభువు త్వరగా వచ్చుచున్నాడని మేము నిజముగా పూర్ణహృదయముతో నమ్ముచున్నందున, ఈ రోజున చర్చి బిల్డింగుల కొరకు ఎక్కువగా ఖర్చు చేయలేము, సువార్తికులు సువార్త చేస్తూ, చెప్పులు లేక రోజుకొక మారే భోజనం చేస్తూ ఉంటే, ఏలాగున మనము మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి చర్చి భవనములు కట్టగలం? అలా చేస్తూ క్రీస్తు రెండవ రాకడ సమీపించిందని ఎలా చెప్పగలము? మనం బయటకు వెళ్ళి ఈ తరమునకు మనము చేయగలిగినది చేద్దాం. అలాంటిది ఏదైనా ఉన్నట్లయితే, వారు సమాధానము ఇస్తారు; దీని కొరకు మనము సమాధానము ఇవ్వవలసియున్నది. కష్టపడి అనేకులు సువార్త పని చేస్తుంటే మనం మిలియన్ డాలర్లతో నిర్మించిన సంఘ భవనముల వద్దకు వెళ్ళలేము.
మంచిది, దేవుని గృహము చక్కగా ఉండాలి. అది ఒక పవిత్రమైన చిన్న ప్రదేశమై ఉండాలి. ఏదీ ఎక్కువగా లేకుండా, వీలైనంత సౌకర్యవంతముగా, చక్కగా ఉండునట్లు చేయాలి, మనము గ్రహించలేము గనుక అతిగా ఏదీ ఉండకూడదు.
11
మనము ప్రార్ధించడానికి, లేఖన పఠనానికి ముందు ఈ ఉదయకాలమున మామూలు ప్రసంగం కాక ఒక మంచి ఉపన్యాసం చేయదలచాను. సాధారణంగా ఇలాంటి ఉపన్యాసాలను మా స్థానిక సంఘములో చేస్తాను. మనం సంఘ శాఖకు చెందినవారము కాము. స్వభావ రీత్యా మనము ఏ శాఖకు చెందిన వారము కాదు. ఏ మత శాఖకు సంబంధించిన సంఘానికి మనము అనుబంధము కాదు, కానీ ప్రపంచంలోని అన్ని సంఘ శాఖల విశ్వాసులతో సహవాసమును కలిగి ఉన్నాము. ఈనాడు ఈ చిన్న సంఘాన్ని గూర్చి ప్రపంచంలోని అనేకులు ఎరుగుదురు. ఈ ప్రసంగాల టేపులు వారు చిన్నవిగా కత్తిరించినప్పటికీ, మేము సువార్త పనిని ప్రోత్సహించుచున్నాము, (ఎన్ని ప్రపంచ దేశములకు?) పంతొమ్మిది విదేశాలకు ఈ వర్తమాన టేపులు వెళ్ళుచున్నవి.
12
పంతొమ్మిది దేశాలు ఈ వర్తమాన టేపులను తీసుకొని వారి స్వభాషలోనికి తర్జుమా జరిగించుచున్నారు. నేను బోధించుచున్న రీతిగానే మరియొకరు అక్కడ నిలబడి దానితో ప్రసంగించుచున్నాడు. దేవుడంటే తెలియని గుడిసెలలోనికి, ప్రదేశాలకు వెళ్ళి అన్యులకు ఆఫ్రికా, దక్షిణ అమెరికా మరియు ప్రపంచమంతటా వారు ప్రసంగించుచుండగా, లక్షల కొలదిగా ప్రభువు యొద్దకు వచ్చుచున్నారు. అనేకులు స్వస్థత పొందుకొనుచున్నారు. అందుకే మేము భవనాలపైన, ఇంకా ఇతర వాటిపై గురి పెట్టక వర్తమానములపై గురిపెడుచున్నాము.
13
నేను ఇక్కడ ఉన్నప్పుడు, నేను కేవలం ప్రసంగించుచున్నాను. కానీ బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, సంఘ సిద్దాంతాలు బోధించను, ఎందుకనగా పరిస్థితులను కష్టతరం చేస్తుంది. ప్రజలు నా సిద్దాంతం సరికాదని, ఇంకా ఏవో చెప్తుంటారు. నేను మెథడిస్ట్ సిద్ధాంతాన్ని బోధిస్తే, బాప్టిస్టు వారు దానిని తిరస్కరిస్తారు. నేను బాప్టిస్టు సిద్దాంతాన్ని బోధిస్తే, లూథరన్ వారు తిరస్కరిస్తారు. పెంతెకోస్తు వారికి భోదిస్తే, నాజరీన్ వారు తిరస్కరిస్తారు. నేను నాజరీన్ వారి సిద్ధాంతాన్ని బోధిస్తే, చర్చి-అఫ్-గాడ్ సంఘపు మత శాఖ వారు ఆమోదించరు. కాబట్టి సేవలో బయటి ప్రపంచానికి వెళ్ళినప్పుడు, ఏ మతశాఖ వారైనా సరే, ప్రతి విశ్వాసిని నీవు ఆహ్వానించగలగాలి. దేవుని ఆత్మ వలన నీవు తిరిగి జన్మించినవాడవుగా ఉన్నంతకాలము, నీవు ఏ మతశాఖకు చెందిన విశ్వాసివైనా, నీవు మా సహోదరుడవు మరియు సహోదరివి. మేమెల్లప్పుడూ అలాగు కొనసాగుట మా ఉద్దేశ్యము.
14
దేవుని చిత్తమైతే, ఈ రోజు మన స్థానిక సంఘములో ప్రసంగిస్తాను: సంఘము దేని కొరకు నిలబడవలెనో, ఆ బైబిల్ సిద్దాంతముపై మన సంఘము నిలబడియున్నదని, మనమెందకు ఇలాగు చేయుచున్నామో అను దాని గూర్చి ప్రసంగిస్తాను. మేము అలాగు చేయుచున్నప్పుడు కొందరి హృదయాలలో మేము సందేహం కలిగించువారముగా ఉ౦డవలెనని కాదు. కొంత మంది, “నేనెన్నడూ అలా బోధింపబడలేదు, లేదా ఇలా బోధింపబడలేదని,” చెప్పుదురు. [సహోదరుడు బ్రెన్హా౦ ఒకరికి, “ధన్యవాదములు” చెప్పుచున్నారు. ]
15
మరి మీకు అలా జరుగుచున్నట్లయితే, మేము సంఘ సిద్దాంతములను గూర్చి మాట్లాడుచున్నటువంటి వాటిని మీరు కానీ, మీ సంఘము కానీ నమ్మనట్లయితే, మేమేదో అపరాధం చేసినట్లు కాదు. ఎందుకనగా విజయవంతమైన క్రైస్తవ్యానికి మొదటి మెట్టు ఏమనగా, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందాడని చూపించడమే, దీనత్వము, దేవుడిచ్చిన నిజమైన దీనత్వము అది వినయముతో ఇవ్వబడవల్సినది. కానీ సిద్ధాంతం లేని సంఘము జెల్లీ చేప లాంటిది; దానికి వెన్నెముక ఉండదు. కావున మనము వెన్నెముక కలిగియుండవలసియున్నది. వెన్నెముక మాత్రమే కాదు గాని, దంతాలను కూడా కలిగియుండవలసియున్నది, ఎందుకనగా దేవుని సంఘము జీవాహారాన్ని భుజింపవలెను.
16
నేను చేసే కొన్ని ప్రకటనలు కొందరికి ఇబ్బందికరముగా ఉండవచ్చు, ఒకవేళ నేను కొద్దిగా కఠినముగా చెప్పినట్లయితే, దయచేసి తప్పుగా అర్ధము చేసుకొనవద్దు. బైబిల్ నుండి బోధించేటప్పుడు, మీతో కఠినంగా ఉ౦డాలని నా ఉద్దేశ్యం కాదు. ఏ ఇతర ఆచారాలు కలిగియుండక గత ముప్పది సంవత్సరాల నుండి నేను వాక్యమును పరిశోధిస్తున్నాను. ఇక్కడ కూర్చొన్న వారిలో ప్రెస్బిటేరియన్లు, కాథలిక్, బాప్టిస్టు, పెంతెకొస్తు, నాజరీనువారు, చర్చి-అఫ్-గాడ్ వారు, ఫిలిగ్రీమ్ హోలినెస్ వారు ఉన్నారు. ప్రతి సంఘము వారు తమ స్వంత సిద్ధాంతాన్ని కలిగియున్నారు. దానిని ఆటంకపరచాలని నాకు లేదు, కాని నేను కేవలం లేఖనాలను బయటకు తీసి మరియు లేఖనాలనే బోధించాలని కోరుతున్నాను. అప్పుడు మీరంతా నేను కఠినత్వాన్ని కలిగి లేనని అర్ధం చేసుకుంటారు. ప్రేమతో, ఆప్యాయతతో, జాలితో నేను వీలైనంత చక్కగా లేఖనాలను మీకు వివరిస్తాను.
17
ఈ ఉదయ కాలపు అంశము చాలా పెద్దది, నేను తొందరపడగోరుట లేదు. నేను దేనిని తెలియజేయాలనుకున్నానో, వీలైనంత వరకు నా సమయం తీసుకుని దానిని వివరించాలని కోరుచున్నాను.
చాలాసార్లు కూటములలో కొందరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, “ఆయన దేనిని నమ్ముచున్నాడు? ఆయన ఇంకా బాప్తిస్టువాడా? లేక పెంతెకొస్తువాడా? భాషలలో మాట్లాడుట గూర్చి ఆయనకు నమ్మకముందా? ఇతడు దీనికి చెందినవాడా? లేక ఇతడు దానికి చెందినవాడా? ఆయన పరిస్థితి ఏమిటి? ఆయన నిత్య-భద్రతకు చెందినవాడా? లేక, ఆయన ఏమిటి?” మరియు మీరు ఏమైయున్నారో కేవలం దానిని ప్రస్తావించండి, వారు వివాదానికి కారకునివలె విడిచిపెడతారు. ఏదీ ఏమైనా, వారు వినడం, పట్టించుకోవడం మానివేయరు, కానీ వారు ఇప్పుడే నిన్ను విడిచిపెడతారు.
18
ఎప్పుడూను ఎక్కడ కూడా, నా కూటములలో సహోదరుల మధ్య వ్యత్యాసము తెలిసికొనలేదు. నేనెప్పుడూ ప్రభువును గూర్చి, రక్షణను, ఆయన రెండవ రాకడను మరియు దైవికమైన స్వస్థతను గూర్చి భోధిస్తాను. ఏ సంపూర్ణ సువార్తికుని హృదయాన్ని అది గాయపరచదు.
ఇక్కడ సంఘములో మాకు మా సొంత సిద్ధాంతమున్నది. ఇక్కడకు వచ్చుచున్న సోదరుల ద్వారా అది బయటకు వెళ్ళును, “సహోదరుడు బ్రెన్హా౦ ఫలానా-ఫలానా సంగతులు చెప్పారు,” అని అనుకుంటూ ఉంటారు. మాకొక సిద్దాంతం తప్పక ఉండాలి.
19
ఇప్పుడు, ఇటీవల జరిగిన ఒక కూడికలో, ఒక సేవకుల సమూహంలో వారు, “విశ్వాసి యొక్క భద్రత కొరకు డబ్బు దాచుకోవటం, లేదా ఉంచుకోవటాన్ని సహోదరుడు బ్రెన్హాం నమ్ముతారా?” అని అడిగినప్పుడు, మా కార్యదర్శులూ అక్కడ ఉన్నారు. ఈ విషయమే చాలా ఉత్తరాలు వచ్చాయి. మంచిది, ఇది న్యాయపరమైన గుంపువారు అడిగిన ప్రశ్న అని నాకు తెలుసు. దీనిని గురించి చెప్పటము నాకు కష్టతరము; జవాబిస్తే త్వరగా విభేదిస్తారు. మరియు మీరు దానిని నమ్మినా లేక నమ్మకపోయిన, ఏ వ్యత్యాసమును తీసుకోని రాదు; మీరు రక్షింపబడినంత కాలము, అదే ప్రధానమైనది. నేనేమి సమాధానము చెప్పలేదు. ఎందుకనగా ప్రజలతో సహవాసము కొనసాగించే విషయములో నేను వారికి సమాధానం చెప్పుటకు నిరాకరించినందున, వివిధమైన పదహారు సంఘముల వారు వారి ఆర్థిక సహాయాన్ని నిలిపివేశారు.
20
ఇప్పుడు సంఘములో ఈ ఉదయ కాలము, నేనేమి నమ్ముచున్నానో, ఎందుకు నమ్ముచున్నానో మీకు వివరించాలని కోరుచున్నాను. ప్రార్ధన చేసుకుందాం.....
ప్రభువా, నీ ప్రేమకు సూచనగా మీరు యేసును అర్పణగా మా కొరకు అర్పించి, మరల ఆయనను మరణము నుండి లేపియున్నారు. ఆయన ఒక ప్రత్యేకమైన గుంపును, పిలువబడిన వారిని వాక్యమను ఉదకస్నానము ద్వారా పవిత్రపరచుచున్నారు. మరియు మేము ఓపికతో ఆయన యొక్క రెండవ రాకడ కొరకు ఎదురుచూస్తున్నాము. మాకు తెలుసు, ప్రజల దృష్టిలో అనేక ఆచారాలు, అనేక సంఘ శాఖలు ఉన్నాయి. తండ్రీ, దేవా, వారిలో ప్రతి ఒక్కరిని దీవించాలని మేము ప్రార్ధిస్తున్నాము. అనేక విషయాలలో మేము విభేధించినప్పటికీ, క్రైస్తవులుగా, తోటి సహోదరులుగా వారితో చేతులు కలిపి పనిచేస్తాము. చేతులు మాత్రమే కాదు గాని, మా మనసులు కలిసి పనిచేస్తాము. దేవుడిని ఉపేక్షించు ఈ కాలములో ప్రజలు మూర్ఖులై, గర్వాంధులై దేవుని కన్నా ఈ లోక సుఖాలను ప్రేమించు ఈ సమయములలో మేము కలసి పనిచేయాలి. ఓ, దేవా, మీ పరిశుద్దాత్మ మమ్ములను కలసికట్టుగా ఉంచాలని, అనుదినము మేము అలాగున ఉండాలని మీకు ప్రార్ధించుచున్నాము. ప్రభువా, ఈ ఉదయకాలమున రోగులను స్వస్థపరచుము.
21
నీటి బాప్తిస్మము తీసుకొనవల్సిన వారు కొందరున్నారు. వారింతక మునుపు పరిశుద్ధాత్మను పొందక పోయినట్లయితే, వారిని పరిశుద్ధాత్మతో నింపండి. వారు ఈలోక సంబంధమైన విషయాలకు మూయబడి, దేవుని ఆత్మతో నింపబడుదురు గాక. దేవుని ప్రేమలో అందరితో సహవాసమును కలిగి ఉందురు గాక.
ప్రభువా, ఒక చదువు లేని, పేదనైన నన్ను సర్వలోకంలోని దేశాలకు నీవు నన్ను పంపియున్నట్లు. మరియు ఇంకా, ప్రభువా, నా హృదయములో నమ్ముచున్నాను, నేను నమ్మియున్న ఈ సంగతులు, బైబిల్ ద్వారా బోధించబడి, ప్రస్తుతము నిలబడియున్న దేవదూత ద్వారా నిర్ధారించబడిన మీ మాటలని నమ్ముచున్నాను. అనేక సమయాలలో ప్రజలు నన్ను రాజీపడేవాడని అనుకొనుచున్నారు. నీవే నా హృదయానికి తీర్పరివి. మొదట్లో యూదా మతాన్ని బోధించిన పౌలును, తన జాతివారు నమ్మలేదు. ప్రజల నమ్మకాన్ని చూరగొన్నాకే ఆయన సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాడు. ఆయన వాక్యము ఉప్పు వేసినట్లు రుచిగా ఉండునట్లు మొదట ప్రజల హృదయాలను గెలుచుకోవాలి. మేము ప్రార్థిస్తున్నాము, ఓ దేవా, మా సంభాషణలను, మా సహవాసములను ఉప్పుతో, ప్రభువైన యేసు రక్తముతో, పరిశుద్ధాత్మతో రుచిగా చేయండి. మేము పిలువబడిన ప్రజలుగా ఉండి, ఈ లోక జనులు మా జీవితాలను పరిశీలించి, వారు కూడా మావలే దప్పి గల వారిగా చేయండి. తగ్గించుకొను వారముగా మీ ప్రేమతో, ఆత్మతో మమ్ములను నింపండి. ఒకరినొకరు ప్రేమించుటను బట్టి దేవుని కుమారుల వలె కనబరచుకొనుటకు, మా అందరి ఐక్యత కొరకు ఈ ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్.
22
వాతావరణం ఒక విధంగా వేడిగా ఉన్నది. ఇక్కడ ఫుట్-ఫ్యాన్ (క్రింద ఉండే ఫ్యాన్) ఉన్నది. ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. మంచిది. పరిశుద్ద లేఖనముల నుండి చదవాలని కోరుచున్నాను. [సహోదరుడు బ్రెన్హాం మరియు సహోదరుడు బ్రెన్హా౦ మరియు నెవిల్ ఇరువురు సంభాషించుకొనుచున్నారు.]
23
నాతో కూడా మీరు యోవేలు గ్రంథమును తిప్పవలెనని కోరుచున్నాను. ఈ కూడిక కొరకు అనేక లేఖనాలను కొన్ని సందర్బాలను వర్తమానము కొరకు చదువుతాను. మొదటిగా, యోవేలు మొదటి అధ్యాయం మొదటి వచనము నుండి ముందుకు చదువుదాము. యోవేలు 1:1-4. ఆ తర్వాత రెండవ అధ్యాయము 25 నుండి 27 వరకు చదువుదాము.
పెతూయేలు కూమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యోహోవా వాక్కు
పెద్దలారా, ఆలకించుడి, దేశపు కాపురస్థులారా, మీరందరు చెవియొగ్గి వినుడి, ఈలాటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలోగాని జరిగినదా?
ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికిని తెలియజేయుదురు.
గొంగళిపురుగులు విడిచినదానిని మిడుతలు తినివేసియున్నవి; మిడుతలు విడిచినదానిని పసరుపురుగులు తినివేసియున్నవి; పసరుపురుగులు విడిచినదానిని చీడపురుగులు తినివేసి యున్నవి.
24
ఇప్పుడు రెండవ అధ్యాయము 25 నుండి 27 వరకు చదువుదాము.
ఈ మీరు కడుపార తిని తృప్తిపొంది మీకొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగులును పసరుపురుగులును చీడపురుగులును అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును. నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీయులమధ్య నున్నవాడను నేనేయనియు,
నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలిసికొందురు, నా జనులు ఇక నెన్నడను సిగ్గునొందకయుందురు.
25
రోమీయులకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము 24, 25 వచనములను నేను చదువుదును.
ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను!
అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి...
రోమీయులకు వ్రాసిన పత్రిక, మూడవ అధ్యాయము, నాల్గవ వచనం మొదటి భాగంలో ఇలా ఉన్నది.
“ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు.”
26
ఇప్పుడు ఈ విషయాలను గూర్చి తీక్షణంగా ఆలోచన చేద్దాం. జరిగిన తప్పిదములను పునరుద్ధరించుటకు, ఒక కాలము వచ్చునని నేను నమ్ముచున్నాను. అది మనలో ఉన్నదని సంపూర్ణంగా నమ్ముతూ గొప్ప సువార్తికులుగా ఉండిన బిల్లీ గ్రహామ్, ఓరల్ రాబర్ట్స్ ఇంకా యెందరో ప్రసిద్ది చెందిన వారు తమ విశ్వాసాలను, గొప్ప విధేయతను కనబరిచినవారై, మన సమయాలలో ఉజ్జీవము కలగాలని ప్రయత్నించారు. మరియు దేవుని పిల్లలైన మీరు మన కాలములో ఉజ్జీవము కొరకు ప్రార్ధిస్తున్నారు. మన కాలము యొక్క ఉజ్జీవము కొరకు వేలకొలదిగా ప్రార్ధనలు ప్రతి గంటకు దేవునిని చేరుచున్నవి. అది లేఖనాలలో వ్రాయబడింది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి, తమ చెడు మార్గములను విడిచినయెడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును. ఈ రోజుల్లో దేవుని కుమారులు కూడుకొని ప్రార్ధించినా, ఉజ్జీవము రాకపోయినట్లయితే, అప్పుడు తప్పక మనలో ఎక్కడో ఎదో లోపమున్నది.
27
ఇప్పుడు, నీవు చట్టము యొక్క నియమము ప్రకారం ఏ పనినైనా చేసినప్పుడు మాత్రమే కార్యములు జరుగునని జ్ఞాపకముంచుకో. విశ్వంలోని శక్తులన్నీ ఆ విశ్వము యొక్క చట్టం ప్రకారం పని చేస్తాయి. గ్రహాల నియమం ప్రకారమే గ్రహాలు కదులుతాయి. సూర్యుని చుట్టూ భూమి తిరుగుటను బట్టే సూర్యోదయం కలుగును. ఆ చట్టంలో ఇవ్వబడిన ప్రణాళిక చొప్పున ప్రతి ఒక్కటీ పనిచేయవలసి ఉంటుంది. దేవుడు ప్రతిదీ చేస్తూ వాటికొక చట్టాన్ని చేసారు. దానికివ్వబడిన నియమం ప్రకారమే అది పని చేస్తుంది, మరొక విధానంలో అది పని చేయదు.
28
సైకిల్ గొలుసును గుండ్రని పళ్ల చక్రము పై ఉంచుతాము. అపుడు సైకిలును నడుపులాగున నీవు చేయగలవు. వెనుక ఉన్నటువంటి పళ్ళ చక్రానికి సమాంతరముగా ఇంకొక పళ్ళ చక్రాన్ని ఉంచినపుడు మాత్రమే ఆ సైకిలు గొలుసును సరిగా పనిచేయించగలవు. అప్పుడు ఆ గొలసులో ఉన్న చిన్న రంద్రాలు, చక్రానికి ఉన్న నొక్కులతో సరిగ్గా కలసినప్పుడు నీవు దానితో ఎక్కడికైననూ వెళ్ళగలవు.
మనము ఎక్కడో తప్పుడు పళ్ల చక్రమును కలిగియున్నామని నేను రూఢీగా చెప్పగలను. మనము జీవించుచున్న ఈ ఘడియలో సంఘము చాలా నెమ్మదిగా కదులుచున్నది. ఎక్కడో తీవ్రమైన తప్పు ఉన్నది. ప్రభువు యొక్క సమీప రాకడ దినమందు మనము కూర్చుని, చదివి, తప్పేమిటో, దాని కారణమేమిటో తెలిసికొను అవసరతను చూపించుచున్నది. కారణము తెలిసికొనేంతవరకు నీవు చికిత్స కనుగొనలేవు.
29
నీవు వైద్యుని వద్దకు వెళ్ళి మరియు “నాకు తలనొప్పి, కడుపులో జబ్బు అని చెప్పినప్పుడు.” ఆయన నీకు చిన్న యాస్ప్రిన్ లేదా ఇంకా ఏదో ఇచ్చి పంపించి వేస్తారు, ఆయన నిన్ను వదిలించుకోవాలి అని చూస్తున్నాడు. నిజమైన వైద్యుడైతే ఏ అవయవము అదుపు తప్పిందో దాని కారణం తెలిసేంత వరకు పని చేస్తాడు.
దేవుని రాజ్య విషయంలో కూడా అదే వర్తిస్తుంది. సమస్య ఎక్కడ ఉన్నదో కనుగొని అక్కడ నుండి పని ప్రారంభించాలి.
30
లేఖనాలు వైద్యుడు ఇచ్చే ఔషధ చీటీ లాంటిది.
ఒక వైద్యుడు కానీ, శాస్త్రవేత్త కానీ చాలా కష్టపడి నీ శరీరములోని టైఫాయిడ్ జ్వరము లాంటిది లేక ఇతర వ్యాధిని కలిగించు క్రిమిని చంపుట కొరకు ఔషధమును కనుగొంటారు. ఆ టైఫాయిడ్ క్రిమిని చంపుటకు నీకు ఆ ఔషధమును చాలా జాగ్రత్తగా ఎక్కించాలి. ఆ ఔషధము తగినంతగా ఇవ్వకుంటే అది ఆ రోగికి సహాయపడదు మరియు మోతాదును మించి ఇచ్చినట్లయితే ఆ రోగిని చంపుతుంది. డాక్టరు సూచించిన మోతాదు ప్రకారము ఔషధముల కొట్టువాడు ఇవ్వవలసియున్నది.
31
అందువలన, ఈ రోజు సంఘములో ఏదైనా తేడా ఉంటే నా ఉద్దేశ్యం ప్రకారము అది అభివృద్ది చెందవలసిన ప్రకారము అభివృద్ది చెందుట లేదు. ఖచ్చితమైన తప్పును కనుగొనుటకు మనము వెనుక ఔషధముల చీటీ దగ్గరకు వెళ్ళవలసినది. సంఘానికి ఏదో వ్యాధి ఉంది, అది పాపమనే రోగము. వైద్యుని సూచనలను కనుగొనవలసి యున్నది, మరియు మన పాస్టర్లు అనే ఔషధపువారు వైద్యుడు సూచించిన ప్రకారం మందులు ఇస్తున్నారో లేదో చూసుకోవాలి. మరియు గుర్తుంచుకొనండి, వ్యాధిగ్రస్తున్ని చంపకుండునట్లు, గుర్తించి ఇవ్వబడిన లేఖనములకు నీవేమి కలుపకూడదు. ఒకవేళ కొందరు మందుల వ్యాపారి వారు దేవుని మందుల చీటీకి ఏమైనా కలిపినట్లయితే? అలా చేస్తే, వారు ఆ పాపిని తన పాపములోనే చంపునట్లగును.
32
“మంచిది, వారు యదార్థవంతులని,” నీవు చెప్పవచ్చు, అలాంటి సాకులేవి అనుమతించబడవు.
కొన్ని సంవత్సరముల క్రితము ప్రభుత్వ అనుమతి కలిగిన ఔషధము వాడు ఇచ్చిన కార్బోలిక్ యాసిడ్ వలన ఒక మనిషిని చంపింది. అతడు యధార్థవంతుడే, గత కాలములో పురాతన క్రైస్తవులు కనబరిచిన యదార్థతను నేను ఈ అన్యుల మధ్యలో చూస్తున్నాను. చూచుటకు వారు అన్యులైనప్పటికినీ తమ పిల్లలను నీటిలో ఉండే ఒక మొసలి లాంటి జంతువుకు విసిరి జల దేవతకు బలి ఇస్తున్నారు. అటువంటి యదార్ధతను నేను క్రైస్తవుల మధ్యలో కనుగొనలేదు. ప్రజలు చీలలపై పండుకొనుటను మరియు వారు కాళ్ళ ఎముకలను విరగగొట్టడం నేను చూశాను. వారు తమ పిల్లలను తీసుకొని మరియు వారు చిన్నవారు, వారిని కోసి రక్తము కారునట్లు చేస్తారు. కొన్నిసార్లు వారి యొక్క ప్రాణములను కూడా తీస్తారు. చాలా గొప్ప యధార్దత అందులో ఉన్నది, కానీ వారు చేసేది తప్పు.
33
ఇప్పుడు మనము యోబును... లేదా యోవేలును గానీ పరిశీలిద్దాము. వారు మనకు మంచి పునాదిని ఇచ్చారు, మనము ధ్యానించుట కొరకు దానినే తీసుకొనగోరాము. “ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి... వారు తమ బిడ్డలకును, ఆ బిడ్డలు రాబోవు తరము వారికిని వేరొక తరము వారికి అలాగున వారు తెలియజేయుదురు (అన్యజనులైన వారికి). ఇశ్రాయేలీయులకు ఇలాగే చెప్పబడింది.”
అన్యులుగా ఉన్న మన జీవితాలలో యోవేలు చెప్పిన ఈ మాటలు అన్యులైన మనము స్వీకరించినందున నెరవేరాయి. “ గొంగళిపురుగులు విడిచిన దానిని మిడుతలు తినివేశాయి, మిడుతలు విడిచిన దానిని పసరుపురుగులు తినివేశాయి,” అలాగు ముందుకు వెళ్తుంది.
మరియు ఈ పురుగులు..... నీవు గనుక పురుగులకు సంబంధించిన పుస్తకాన్ని పరిశీలించినట్లయితే ఇవన్నీ దాని జీవిత కాలములోని నాలుగు దశలలో ఉన్న ఒకే పురుగుకు చెందినవి. గూడులా అల్లబడినది లార్వా దశలో ఉన్న గొంగళి పురుగేనని మనందరికి తెలియును. అది ఆ తర్వాత పొదిగి, సీతాకోక చిలుకగా మారుతుంది. అది సీతాకోక చిలుకగా మారకముందు అది గొంగళిపురుగే, తర్వాత దశలే మిడుత, పసరుపురుగులు; అవన్నీ ఒకే పురుగు. ఇప్పుడు అది ఏమైనప్పటికి...
34
ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మొదటి దశలో అది చీడ పురుగు, ఆ తర్వాత గొంగళి పురుగు, అది తుమ్మెదగా మారుతుంది. చివరికి అదే పసరుపురుగుగా మారుతుంది. అది ఏ దశలో ప్రారంభమైనా ఈ రోజుల్లో సమస్యకు కారణమవుతుంది. మనం లేఖనముల వద్దకు వెళ్ళి ఎలా ప్రారంభమైందో చూద్దాం.
35
ఇప్పుడు, మనకు తెలియును మొదట మనకు ఏ పదార్థం ఇవ్వబడిందో దేవుని సంఘమును నిర్మించడానికి ఆ పదార్థంతోనే సంఘమును నిర్మించగలము. మనకున్నదంతా అదే. ఇది, శక్తివంతమైనదని నాకు తెలుసు, ఇది టేపులో ఉన్నది; ప్రపంచంలోని వందల కొలది ప్రజలు దీనిని వింటారు. కానీ దేవుని సంఘము అనే భవనాన్ని మనం నిర్మించక మునుపు ఆ పురుగులు తినివేసిన దానిని మనం పునరుద్దరించవలసి ఉన్నది. మనము వెనకకు వెళ్ళి ఆ చీడపురుగులు యేమి తినివేసెనో కనుగొనవలసి ఉంది. ఆ దేవుని ద్రాక్ష తోట.... ఆయన ద్రాక్షవల్లి; మనము తీగలము. సంఘము తన గతంలోని అసలైన శక్తిపై నిలబడుటకు మనం వెనకకు వెళ్ళి దానిని తినివేసిన పురుగేదో తెలుసుకోవాల్సి ఉన్నది. ఆ స్థితికి సంఘము పునరుద్దరించాల్సి ఉంది, లేనట్లయితే అదెన్నటికీ తన పూర్వవైభవాన్ని, శక్తిని పొందుకోలేదు.
36
చెట్టు బెరడును తిని వేసిన మరలా బెరడు వస్తుంది. మొదట దానిపై బెరడును రానివ్వు. దానిపై బెరడు వచ్చేంత వరకు నీవు ఆపిల్ పండ్లను పొందలేవు. ఎందుకనగా ఆ బెరడే జీవ-ధారయైయున్నది, ఆ జీవ-ధారయే, జీవనాధారము.
మరియు లేఖనములు, దేవుని పరిశుద్ధ గ్రంధము, ఏ సంఘమునకైనా జీవనాధారమైయున్నది. మేడిచెట్టు బెరడు నుండి ద్రాక్షచెట్టు జీవరసాన్ని ఎలా రప్పిస్తావు? అది పనిచేయదు. మనకు ద్రాక్ష బెరడే కావాలి. మనకు అసలైన బెరడే కావాలి. ఆ ద్రాక్ష యొక్క బెరడును తిరిగి మరల పొందుకునే ఒకే ఒక మార్గం దేవుడే స్వయముగా దానిని వృద్ది చేసినప్పుడు.
మనము ఏదో ఒక దానిని చేసి దానిపై ఉంచలేము; అది పని చేయదు. ఏ మనుష్యుని యొక్క పథకము పని చేయదు. అవి దేవుని మార్గములను తొలగించును లేదా అది ఎన్నటికినీ జీవించలేదు. మనుష్యుని యొక్క పథకాలు పనిచేయవు. ఆ చెట్టు చుట్టూ ఒక గుడ్డను చుట్టి “దాన్ని పెరగనీ,” అని చెబుతావు. ఆ గుడ్డ ముక్క దేవుని ప్రణాళిక కాదు. జీవనాధారమైన బెరడే కావాల్సి ఉంది. మరియు అది వేళ్ళ నుండి వచ్చినప్పుడు, పురుగులు దానిని తినక ముందు ఆ చెట్టు కలిగియున్న అదే జీవమును ఉత్పత్తి చేస్తుంది.
37
స్వస్థతా కూటాలు లేనందుకు ఆశ్చర్యపడవద్దు. సంఘాలు చీల్చబడటము వింతేమీ కాదు. ఒకరికొకరు అసమ్మతిని కలిగి ఉండుట కూడా ఆశ్చర్యం అక్కరలేనిది. అటువంటి ఇజాలు, మనమధ్య ఉండుటలో ఆశ్చర్యములేదు, ఎందుకనగా నిజమైన ఫలములైన, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహము అనే నిజమైన ఫలములను మనము ఫలించుటలేదు. చెట్టు నుండి జీవనాధారము వేరుచేయబడింది. మనము గుడ్డలు, ఆచారాలు, సిద్ధాంతములు ద్వారా లేదా మరేదైనా ప్రత్యామ్నాయ బెరడుల ద్వారా, ఆ జీవాన్ని మరలా తీసుకు రాలేము. అది సర్వశకుడైన దేవుని శక్తిని తీసుకొని ఆ చెట్టు తిరిగి తన పూర్వస్థితికి వచ్చును.
యేసు లేఖనములలో ఇలాగు చెప్పలేదా? “మీరు కన్నులుండియూ చూడరు, చెవులుండియూ వినలేరు.” వారు కేవలం దానిని చేయలేకున్నారు. దేవుడు అతనికి బయలుపరచకుండా, ఏ వ్యక్తీ దేవుని వద్దకు... లేదా క్రీస్తు వద్దకు రాలేడు.
38
ఒక రోజున నేను మాట్లాడుచున్నప్పుడు, మరియు మేము లేఖనాలను గూర్చి ఆలోచిస్తున్నాము. ప్రజలు దానిని ఎందుకు చూడలేకపోతున్నారు? అదే నా ఆలోచన. ఎంత తేటగా ఉన్నా, దానిని గూర్చి ఎంతగా బోధించబడినా, దేవుడు తనకుతానుగా బయలుపరచేంత వరకూ నీవు దానిని ఎన్నడును చూడలేవు. అది ఎంత తేటగా ఉన్నాను నాకు లెక్క లేదు. బైబిలు అంతా మరియు జీవముగల దేవుని సంఘమంతా ఆత్మీయ వాక్యము యొక్క బయల్పాటు పైనే నిర్మించబడెను. హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని ఎందుకు అర్పించాడు? హేబేలు కయీనును ఎందుకు అనుసరించలేదు? అతడు ఒక గొప్ప అందమైన సంఘమును కలిగియు౦డెను. అయితే అది అతనికి బయలుపరచబడెను.
39
యేసు రూపాంతర కొండ దిగి వచ్చుచున్నప్పుడు, ఆయన వారితో “మనుష్యు కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని ప్రశ్నించెను?”
ఒకడు “ఏలియా” అనియు మరియొకడు “నీవు ప్రవక్తవని చెప్పుకొనుచున్నారని,” చెప్పెను
ఆయన అడిగెను, “మీరైతే నేను ఎవరని చెప్పుకొనుచున్నారు?”
అప్పుడు పేతురు, “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని,” చెప్పెను.
అందుకు యేసు “సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, రక్తమాంసములు దీనిని నీకు బయలు పరచలేదు. నీవు ఏదో పుస్తకాలు చదివి లేదా వేదాంత విద్య ద్వారా, లేదా కొంత మానవ కల్పిత సిద్దాంతముల ద్వారా నేర్చుకోలేదు, గానీ పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెను. ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవు.” అది దేవుని వాక్యము యొక్క ఆత్మీయ బయలుపాటు యొద్ద నీవున్నావు!
40
మత్తయి సువార్త 11వ అధ్యాయములోనే, 12వ అధ్యాయములోనో ఒక చోట యేసు ప్రభువు ఎన్నో అద్భుతములు సూచక క్రియలు చేసినప్పటికీ ఆయన మెస్సియా అని ప్రజలు నమ్మలేకపోయిరి. అందుకే యెషయా ఇలా అన్నాడు, “కనులుండియూ వారు చూడలేరు, చెవులుండియూ వారు వినలేరు.” వారు పండితులైనప్పటికినీ, మత విషయాలలో ప్రముఖులైనప్పటికినీ, వారు పరిశుద్దులైనప్పటికినీ, ఎలాంటి లోపము, ఎలాంటి నిందలేనప్పటికీ వారు వినలేరు, చూడలేరు. చిన్న దోషం వారిలో కనిపించినా కనికరము లేకుండా వారు రాళ్ళతో కొట్టబడేవారు. ఎవరూ వారిపై వేలెత్తి చూపలేరు. వారు రాత్రిపగలు, తరతరములూ లేఖనములు చదివినప్పటికీ దేవుడు వారి కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను.
“అది దేవుడే చేసెనా?” అని అడుగవచ్చును, ఆయన అదే చెప్పెను.
41
దేవుడు ఏమి చేయాలని అనుకుంటాడో అదే చేయును. ఆయనకు ఏమి చేయాలో మనమాయనకు చెప్పలేము. దేవుడు చిత్తము నెరవేర్చుటకు “దేవుడు ఫరోను లేపి, అతని హృదయమును కఠినపరచి, అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెనని,” పౌలు రోమా తొమ్మిదవ అధ్యాయములో చెప్పలేదా? ఏశావు మరియు యాకోబు విషయంలో ఆ బాలుడు ఇంకా పుట్టక మునుపే, దేవుడు ఏశావును తృణీకరించెను. మీరు చూడండి, సమస్తమును దేవుని యొక్క గొప్ప ఎన్నికను బట్టి జరుగుచున్నది. ఆయన నిద్రించువాడు కాదు. ఆయన ఖచ్చితముగా ఎరుగును.
మనుష్యుని యొక్క పైకి కనిపించే నిజాయితీని, యధార్ధతను బట్టి తీర్పు తీరుస్తాము. మనము సంఘములను వాటి యొక్క అభివృద్దిని బట్టి మనము తీర్పు తీరుస్తాము. మనము ఆ సువార్తీకులను తీసుకుంటాము, ఎందుకనగా వారు గొప్పవారని. అది కాదు.
“ఆకాశమును భూమియు గతించును గాని, నా మాటలు ఏ మాత్రమును గతింపవు.”
చీడపురుగు వదిలిన దానిని గొంగళిపురుగు తినెను. ఎక్కడో ఒక చోట పొరపాటు ఉంది, ఎందుకనగా ఆయన నిత్యమైనవాడైయున్నలాగున ఆయన వాక్యమును నిత్యమైనదై యున్నది. దేవుడేలాగు తనకుతాను తప్పిపోడో, ఆయన వాక్యము అలాగే తప్పిపోదు.
42
ఎక్కడో ఒక చోట పొరపాటు ఉన్నది, కాబట్టి మనము ఇప్పుడు వెనుకకు వెళ్ళేదము. ఇప్పుడు మనము ఏర్పరచిన ఆధారమునొద్దకు తిరిగి వెనుకకు వెళ్ళేదము, రోమా 3:4ను చుద్దాము: “ప్రతిమనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు.”
ఇప్పుడు ఈ విషయాన్ని చూద్దాం, మీరు వినాలని నేను కోరుచున్నాను. దేవుడే సత్యవంతుడు. ఎవరేమి చెప్పినప్పటికీ దేవుని వాక్యాన్నే అనుసరిద్దాం. జీవముగల దేవుని సంఘాన్ని తినివేసిన ఈ పురుగులను గూర్చి లేఖనాలలో నేను చదివిన నాలుగు వేర్వేరు సంగతులను తీసుకుందుము. దేవుని ద్రాక్షావల్లిని, కుంటిదానిగా, లేక మోడుబారిన దానిగా చేసినవి.
43
మనమందరం అంగీకరిస్తాము, మెథడిస్టులైన మీరు అంగీకరిస్తారు, బాప్టిస్టులైన మీరు అంగీకరిస్తారు, ప్రెస్బిటేరియన్లు, పెంతెకొస్తు వారు, నాజరీన్లు, మీరందరూ అంగీకరిస్తారు. ఈ గుడారపు వారమైన మేమును, “అక్కడ ఏదో తప్పిదమున్నదని అంగీకరిస్తాము!” మరియు మిగిలిన వారివలె ఈ గుడారపువారమైన మేము కూడా దోషులమే, “మేలైనది చేయనెరిగియూ, అది చేయనివానికి పాపము కలుగును.”
ఇప్పుడు మరలా వెనుకకు వెళ్ళెదము, నేను నాలుగు పేర్లు తిసుకొనెదను. నాకు లేఖనములు తెలిసినంత వరకు, ఈ పురుగులు సంఘమును తన మొదటి, నిజస్థితి నుండి తినివేశాయి.
44
ఇప్పుడు మొదటి సంగతి, సంఘము పెంతెకొస్తు దినమున స్థాపించబడింది. ఆ పెంతెకొస్తు దినమున సంఘము ప్రారంభమైనప్పుడు, పేతురు ప్రారంభోత్సవ ప్రసంగాన్ని బోధించాడు. సంఘము జన్మించినప్పుడు, క్రైస్తవ సంఘము పెంతకోస్తు దినమునాడు జన్మించెను. మరియు దేవుడు అనంతుడైతే, అనంతమైనవాడు ఎన్నడూ మారడు; ఆయన యొక్క సంఘము ఆదిలో ఎలాగున్నదో, అలాగే ఉండును. దానిని మీరు అంగీకరిస్తారా? సంఘము ఎలాగు ఉండెనో, ఎప్పటికీ అలాగే ఉండవలెను.
అయితే మనుష్యుడు తన సొంత అనువాదమును పెట్టి దానికి అతుకు వేశాడు. దేవుని వాక్యమును అనువదించడానికి ఎన్నడూ నీవు ప్రయత్నించవద్దు. అది ఏమి చెపుతుందో కేవలం అలాగునే చెప్పుము, అది ఏమైననూ నేను లెక్క చేయను, కేవలము దానిపై నిలువుము, అంతే. దేవుని వాక్యమును మార్చవద్దు. బైబిల్ లో చెప్పుబడియున్నట్లుగా, “వాక్యమునకు ఏ వ్యక్తిగత అనువాదము అవసరములేదు.” అలాగు చెప్పడానికి మనకు ఎలాంటి హక్కు లేదు; మనము కేవలము దానిని చదివి మరియు కేవలము ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి, మరియు వ్రాయబడియున్నవిధముగా విశ్వసించాలి. అది ఎంత హాస్యాస్పదముగా అనిపించినా, నేను లెక్కచేయను, దానిని నమ్ముము, ఏమైనప్పటికీ!
45
ప్రసంగ వేదిక సరదాగా నవ్వుకునే స్థలము కాదు. అది యధార్ధతకు నిలయం. ఇది నేను నవ్వులాటకు చెప్పేది కాదు. నా ఉద్దేశ్యము నాతో చెప్పినది మీకు వివరించడమైయున్నది. అక్కడ ఒక వృద్ధుడైన నల్లజాతి సహోదరుడు దక్షిణాన ఉ౦డేవాడు, బైబిల్ ను కట్టిపెట్టి ఉంచేవాడు, అతని యజమాని అతన్ని అపహాస్యం చేస్తూ, “నువ్వు చదవలేవు కదా, మరెందుకు దానిని కట్టి మూసి ఉంచావు?” అన్నాడు.
ఆయన అన్నాడు, “నేను దానిని విశ్వసిస్తున్నాను, అందుకని దానిని మూసి ఉ౦చుతాను” అని జవాబిచ్చాడు. అది నిజమైన కారణమే. నేను చదవలేక పోయినప్పటికీ అందులో ఏదో సరియైనది ఉన్నదని నమ్ముతాను. దాని వెలుపలి అట్టపైన, “పరిశుద్ధ గ్రంధము” అని వ్రాయబడి ఉన్నందున దానిని కూడా విశ్వసిస్తాను అని చెప్పాడు.
ఆయన అన్నాడు, “ఏదైనా బైబిల్ చేయమంటే నీవు దానిని చేస్తావను కుంటాను?”
ఆయన చెప్పాడు, “ ఔనండి, నీవు బైబిలు నుండి నాకు చదివి వినిపిస్తే అది దేవుని ఆజ్ఞ అయితే నేను తప్పక చేస్తాను.”
అతను అన్నాడు, “నేను ఒకవేళ బైబిల్లో నుండి దేవుడు ఆ పెద్దరాతి గోడలోనుండి దూకమని చెబితే, ఆ గోడకు రంధ్రం లేకపోతే నీవు ఏమి చేస్తావు?
దానికి జవాబుగా, “బైబిల్లో నుండి దేవుడు నన్ను గోడ మీద నుండి దూకమని చెప్పినట్లయిన, నేనక్కడికి వెళ్ళేలోగా ఆయన రంద్రం చేస్తారు.” మరియు అది సరియే.
దేవుడు చెప్పిన తరువాత, అది ఎంత హాస్యాస్పదంగా కన్పించినా కాని, దాని గురించి నీవు ముందడుగు వేయాలి! అపుడు మిగతా అంతట గూర్చి చూచుకొనుటకు ఆయనకు సంబంధించినది, అది ఆయన పని. అడుగు వేయుట నీ పనియైయున్నది.
46
కనీసం కొన్ని నిమిషాలు మీతో కొన్ని మొదటి సంగతులు చెప్పాలనుకుంటున్నాను. మనము పునాదిని కనుగొన్నాక ద్రాక్షావల్లి అయిన ఆ అసలైన పునాది యొద్దకు మనము వెళ్ళాలి. దానిలో ఏదైనా లోపమున్నట్లయితే మరలా వెనుకకు వెళ్ళి సమస్య యేమిటో తెలుసుకోవాలి.
మన సంఘము నుండి బయటకు వెళ్ళిన కొన్ని సంగతులలో మొదటి సంగతి ఒకటి మీకు తెలియజేస్తున్నాను; ప్రధానమైన ఒక సంగతి విశ్వాసము. ఆ రోజుల్లో కలిగి ఉన్నట్లుగా ఈ రోజుల్లో ప్రజలు విశ్వాసం కలిగి లేరు. ఒక విధమైన పసర పురుగు వారి విశ్వాసము యొక్క జీవనాధారాన్ని తినివేసింది. వారు దానిని మార్చేశారు. ఈ రోజు వారి విశ్వాసము ఒక పెద్ద సంఘము మత శాఖపై ఉన్నది. కాని మనకు యాకోబు మూడవ వచనములో ఈ విధముగా చెప్పాడు:
“ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన విశ్వాసము నిమిత్తము [ఒక విశ్వాసము కాదు; ఒకే విశ్వాసము] మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను.” [ఈ విశ్వాసము ముప్పది-మూడు సంవత్సరముల ముందు అప్పగించబడినది.]
47
“అది నా విశ్వాసమునకు వ్యతిరేఖమని” ప్రజలు చెబుతారు. విశ్వాస మొక్కటే, ప్రభువు ఒక్కడే, బాప్తిస్మము ఒక్కటే. నీవు ఒక విశ్వాసమును కలిగి యుండవచ్చునేమో, కానీ మాకు ఒకే విశ్వాసము కావాలి. విశేషముగా పోరాడాలి, “దాని గురించి తర్కించు; నిలబడుట, దాని కొరకు నిలబడుము.”
ఈ పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన విశ్వాసము నిమిత్తము పోరాడాలి.
వారెప్పుడు పరిశుద్ధులుగా పిలువబడ్డారు? వారు ఎప్పుడు పరిశుద్ధ పరచబడ్డారు. పరిశుద్ధాత్మ వారిని పరిశుద్ధపరచింది, వారు పరిశుద్దులుగా పిలువబడ్డారు. ఇప్పుడు యేసు యొక్క పెంపుడు సోదరుడగు యూదా చెప్పుచున్నాడు. “పరిశుద్దులకు ఒక్కసారే అప్పగింపబడిన విశ్వాసము నిమిత్తము విశేషముగా పోరాడాలి అని కోరుచున్నాను. ఎప్పటికీ విశ్వాసాన్ని జారవిడువవద్దు!”
పరిశుద్ధుల యొక్క విశ్వాసం, ఆచారములోగానీ, మతశాఖలలో గానీ, చర్చి భవనాలపై కానీ, సహవాసాలలో గానీ కాదు గానీ, అది జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నది. వారికి రోగులను స్వస్థపరచుటకు, దయ్యములను వెళ్ళగొట్టుటకు, అద్భుతములు చేయుటకు విశ్వాసము కలదు. యేసు చేసిన గొప్ప వాగ్దానములన్నిటినీ, ఆ మొదటి సంఘము తనలో కలిగియున్నది. అది దాని జీవనాధారము.
48
నేను ఏమీ చెప్పుచున్నానో జాగ్రత్తగా వినండి. సజీవుడైన దేవుని యొక్క నిత్య-సన్నిధి ఏ సంఘానికైనా లేదా ఏ గుంపు ప్రజలకైనా అది జీవనాధారమైయున్నది. ఆ సజీవుడైన దేవుడు మన మధ్య ఉండటం, ఆదిలో వారేమి చేసారో అలాంటివి మనమూ చేయగలుగుటకై పెంతెకొస్తు దినమున దేవుని ఉనికి అద్భుతములు సూచిక క్రియలు, మహాత్కార్యములు, తెచ్చినట్లైతే దేవుని యొక్క మహిమ వారిని బిగ్గరగా అరిచి, అన్య భాషలలో మాట్లాడే వరకు ప్రజలను తీసుకువచ్చి, మరియు మరియు విశ్వాసము కొరకు హతసాక్షులుగా అవ్వడము వాటిని కలుగజేసింది, మనము విశ్వాసము కొరకు మరణము వరకు విశేషముగా పోరాడుదము, అది మనలను స్వతంత్రులనుగా చేయును. విశేషముగా దానిగురించి పోరాడుడి. పుస్తకాలు చదవడం ద్వారానో, మానవ-నిర్మిత సిద్ధాంతము వలనో మేము అసత్యముతో రాజీపడము. ఆచారాలపైనో, లేక ప్రార్ధనా పుస్తకముల, లేక ఎవరో ఎదో చెప్పుట వలననో మేము రాజీపడము.
క్రీస్తు రక్తముతో కూడిన నీతికి ఏ మాత్రము
తగ్గకుండా నా విశ్వాసం నిర్మించబడినది;
నా ప్రాణమంతయూ ఇచ్చివేసినప్పుడు,
ఆయనే నా నిరీక్షణ, నా ఆధారము,
క్రీస్తనే బలమైన బండపైన నేను నిలబడుతాను
మిగిలిన అన్ని పునాదులు, మునిగిపోయే ఇసుక సౌధాలు,
49
క్రీస్తు తప్ప వేరొక సిద్దాంతము లేదు, ప్రేమ తప్ప వేరొక చట్టము లేదు, బైబిల్ తప్ప వేరొక గ్రంధము లేదు. ఏ సిద్దాంత గ్రంధాలు వద్దు! దీనిని బైబిల్ మాత్రమే చెప్పవలెను, ప్రతి సారీ మనం ఆదికాండము నుండి ప్రకటన గ్రంధము వరకు బైబిల్ చెప్పినది కాక మరొకటి చెప్పకూడదు. ప్రతి చిన్న విషయములోనూ దానినే అనుసరించాలి. మరియు వాక్యము యొక్క ప్రతి భాగములోనూ నేత వేయాలి. అలా చేయకపోతే అప్పుడు దాని గురించి నేను తప్పుడు తర్జూమా ఇచ్చినట్లు అవుతుంది, ఎందుకనగా దేవుడు తన సొంత వాక్యమును విభేదించలేడు. ఇది ప్రతీ చిన్న తునకకు అదే విషయమును చెప్పనటైతే!
ఇక్కడ ఒక చొక్కా ఉన్నట్లయితే అది ఏ దారము నుండి అది నేయబడినది. అది దేనితో చేయబడినదో దానితోనే చేయబడింది. దీనిని తెలుపు చేసినది ఇదే. సంఘమనగా అదియే అది. ఒక స్వచ్ఛమైన, తిరిగి జన్మించిన, మచ్చయైననూ, ముడుతయైననూ లేని సంఘముగా ఉండబోవుచున్నట్లయితే, పెంతెకొస్తు దినమున, పరిశుద్ధాత్మ అనుభవముతో, మండుతూ ఏ నారతో నైతే నేయబడినదో అదే రకమైన నారతో అది నేయబడాలి. కుళ్లిపోయినదాని ముక్కను నీవు కలుపకూడదు, జనపనార ముక్కను దానికి కలుపకూడదు, అది పని చేయదు. అది దానిని పాడుచేయును.
50
ఒక విధమైన పాతదైన పసరుపురుగు వచ్చి ఆ విశ్వాసమును తినివేసింది. వారు పైకి లేచి ఇలా చెబుతారు, “నేను పరిశుద్ధ సంఘాన్ని విశ్వసిస్తాను, రోమన్ క్యాథలిక్ సంఘాన్ని విశ్వసిస్తానని చెబుతారు.” నేను దానియందు నమ్మిక యుంచుదును...
దేవుని కుమారుడైన యేసుక్రీస్తును నేను విశ్వసిస్తాను. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన పునరుత్థాన శక్తి, విశ్వాసము నాలో ఈ రోజు జీవించుచున్నది. ఎందుకనగా ఆయన జీవించుచున్నాడు, అందుచేత నేనునూ జీవించుచున్నాను, ఏదో ఒక సిద్ధాంతమును బట్టి కాదు, ఒక మత శాఖను బట్టి కాదు; కానీ క్రీస్తు జీవించుచున్న దానిని బట్టి మరియు నేను క్రీస్తులో ఉన్నాను. నేను ఆయనను బట్టి ఆయనతో, ఆయన ద్వారా జీవిస్తున్నాను. ఆయన జీవము నా ద్వారా వ్యక్తమగుచున్నది. అది అలా జరుగనట్లయిన, నేను ఆయన వాడనని చెప్పను. ఆయన కేవలము నా శిరస్సును మాత్రమే కాదు; నా హృదయమును, నా ప్రతి కదలికను, నా సమస్తమును దానిలోనికి నేయుచున్నాడు.
ఆయన తనకుతానే వాక్యమును బట్టి అల్లుకొనును. వాక్యం ఒక చోట ఒకటి, మరోచోట మరొకటి చెప్పదు. నాకు తెలుసు అది అలా వ్రాయబడియున్నది, అది ఆ విధముగా ఒక ఉద్దేశ్యం కొరకు వ్రాయబడియున్నది. యేసు ఇలా చెప్పి, దేవునికి కృతజ్ఞతలు తెలియజేసెను: నీవు జ్ఞానులకును, వివేకులకును ఈ సంగతులను మరుగుపరచి నేర్చుకొను పసిబాలురకు బయలు పరచియున్నావు. అలాగు చేయుట దేవుని ఉద్దేశ్యమై యున్నది.
51
ఆయన వద్దకు పాపి వచ్చుటకు ఎందుకు అనుమతించెను? ఆయన రక్షకుడైయున్న ఉద్దేశ్యం కొరకు ఆయన పాపిని అనుమతించవలసియున్నది. ఆయన పాపము కన్నా అధికుడు. ఆయన పాపమయ్యేవాడు కాదు, సాతానును ఆ మొదటి పాపము చేయుటకు అనుమతించే వాడు కాదు, లేక నీతిని పాపముగా మార్చనిచ్చేవాడు కాదు. దేవుడు రక్షకుడైనందున అలా అనుమతించాడు. ఆయన స్వస్థపరిచేవాడు కనుక మనుష్యులను రోగాలకు అనుమతించాడు. ఆయన న్యాయవంతుడైనందున ఆయన ప్రతి మనిషి ఎదుట జీవవృక్షమును, మరణవృక్షమును ఆదాము, అవ్వకు వలె ఉంచారు, లేకపోతే అది ఆదాము మరియు అవ్వల ముందు దానిని ఉంచి తప్పు చేసిన వారుగా ఉంటాడు. ఇప్పుడు అది మీ భాద్యత.
52
ఇప్పుడు, గమనించండి,
విశ్వాసము నిజమైన విశ్వాసము, మన సంఘాలను తీసుకొని పరిశీలిద్దాము. మన పెంతెకొస్తు వారిని చూడండి, బాప్టిస్టు వారిని, ప్రెస్బిటేరియన్లను, నాజరీన్ లను, ఫిలిగ్రీమ్ హోలీనెస్ మరియు బ్రెన్హాం గుడారము, మనమందరమూ ఆ విశ్వాసము నిమిత్తము విశేషముగా పోరాడనందులకు దోషులమైయున్నాము.
బ్రెన్హాం గుడారములో ఒక చిన్న గడబిడ రావచ్చు. (నేను సొంత గృహములో ఉన్నాను గనుక ఇప్పుడు మీ గురించి మాటలాడగలను), కొందరు ఒక వైపు, మరికొందరు ఇంకొక వైపు ఉండి, పెత్తనం చేసే చిన్న గుంపుగా సమకూరవచ్చు. అది పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించపడిన విశ్వాసము నిమిత్తము పోరాటమంటారా? అపొస్తులుల సిద్ధాంతము వలె ఉన్నదా? లేదండి సోదరా, వారు అననీయ, సప్పీరాలను పోలియున్నారు. దేవుడు ఇప్పటికి మారని దేవునిగానే ఉన్నాడు. అది నిరూపించబడుట మనము చూచాము.
53
విశేషముగా పోరాడుట లేదు!
ప్రజలు బయటకు వెళ్లి ఇలా చెబుతారు, “నా విశ్వాసము అద్భుతములను గూర్చి బోధించదు. వారు అద్భుతములు జరిగే రోజులు గతించిపోయాయని బోధిస్తారు.” అప్పుడు నీవు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన విశ్వాసము నిమిత్తం పోరాడుటలేదు.
[టేపు పై ఖాలీ..] ... మూఢత్వపు గుంపు, కానీ యధార్ధమైన పరిశుద్దాత్మ వరము ఉన్నదని నేను నమ్ముతాను. దాని కొరకు మేము విశేషముగా పోరాడతాము. అది సరి, దానిని మేము నమ్ముతాము. పరిశుద్దులు భాషలలో మాట్లాడతారు.
“నేను దైవికమైన స్వస్థతను నమ్మను,” అని వారు చెప్పుదురు. నేను మూఢభక్తి యొక్క గుంపును విశ్వసించను. అయితే మేము దేవుడున్నాడని, ఆయన రోగులను స్వస్థపరచునని, మరియు ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని విశ్వసించుచున్నాము.
54
అనేకులు వివేచించుటను నమ్మరని చెప్పుట నేను చాలాసార్లు చూశాను. కానీ నేను నిజముగా వివేచించే దేవుని ఆత్మ ఉన్నదని, జ్ఞానమునకు సంబంధించిన వరము ఉన్నదని, అది మాట్లాడును, పిలుచునని మరియు అది ప్రతి సారి పరిపూర్ణమైనదని నమ్ముతాను. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన విశ్వాసము నిమిత్తము మేము విశేషముగా పోరాడుచున్నాము.
కలలున్నాయని నాకు తెలుసు, కడుపు నిండా తిన్నటువంటి తాజా మాంసాలు, సమృద్దిగా తిన్న వేరే ఇతర వాటి వలన నీవు పీడకలలు కన్నావు. నీవు గంతులు వేయుచూ దానిని దర్శనమని పిలుస్తున్నావు.
దేవునికి సంబంధించి నిజమైన యధార్ధమైన దర్శనం ఉంది. అది సరియైనది! దేవుడు దానిని వాగ్దానం చేసారు. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన అది చేస్తాడు, మరియు అది ఎన్నడూ తప్పిపోదు. బైబిల్ ఇలా చెప్పుచున్నది, “మీలో ఒకడు ఆత్మ సంబంధి గానీ, ప్రవక్త గానీ, ఉన్నయెడల అతడు పలికిన మాట నెరవేరినయెడల నేనతనితో ఉన్నాను గనుక ఆయన మాట వినుడి; ఆ మాట నెరవేరనియెడల అతని మాట వినవద్దు, ఎందుకనగా అతనొక అబద్ధ ప్రవక్త.” దేవుడు అబద్దమాడనేరడు. దేవుడు ఎల్లప్పుడూ సత్యమునే చెబుతారు. అది ఆలాగు ఉండును గాక. ఇప్పుడు అది సత్యము అని మనము కనుగొ౦టిమి. కొన్ని సంగతులు...
55
ఆ రాత్రి అక్కడకు వెళ్ళినటువంటి పౌలును చూడండి, ఉన్న అవకాశాలన్నీ సన్నగిల్లాయి. అలలు ఎగిసిపడుతున్న ప్రతిసారి, మెరుపులు మెరుస్తూ ఉండగా సాతాను పళ్ళికిలిస్తూ ఎగతాళి చేస్తున్నాడు. “నేనిక్కడ ఈ అపోస్తలుని ముంచి వేస్తానని ” చెప్పుచున్నాడు. నీటితో నిండిన ఆ చిన్న పాత ఓడ, పద్నాలుగు రాత్రుళ్ళు, పద్నాలుగు పగళ్ళు ఆకాశంలో నక్షత్రములు కనిపించని పరిస్థితి. ఆ చిన్న పాత ఓడ అటు ఇటు ఊగుతూ కొట్టుకొనిపోయే పరిస్థితి. అతని వెనుక ఒక గొలుసు లాగబడుతూ, అలాంటి స్థితిలో కూడా పౌలు గారు సువార్తను బోధించాలనెడి ఆశ. హల్లెలూయ!
కొందరు కప్ప, చిన్న పురుగులను తినునట్లుగా మేముండనట్లయిన మేమెవర్నీ మాట్లాడనివ్వము. మేమెప్పుడూ ఏదో విషయం చెబుతూ ఉంటాము. అలా చెప్పడం విశ్వాసము నిమిత్తము విశేషముగా పోరాడటము అవుతుందా? బ్రెన్హా౦ గుడారములో వారంతా మొదట తిన్నగా చేయబడాలి, అలాగే పెంతేకొస్తువారు, బాప్టిస్టువారు, నాజరీన్లు. ఆ కారణము వల్లనే మనము ఒకేచోట ఉన్నాము. మనము యధార్థవంతులముగా మరియు నిజాయితీగలవారముగా లేము. ఆ విషయాన్ని మనము ముఖాముఖిగా ఎదుర్కొన్నప్పుడు అది కదలిక లేని పరిస్థితిని కలుగచేసి ఎప్పుడూ దేవునిలో ఉండేలా చేస్తుంది. ఆ విశ్వాసము పరిశుద్దులకు ఒక్కసారే అప్పగింపబడినది.
పాత గొంగళిపురుగు, పసరుపురుగు వచ్చి దానిని తినివేశాయి. “ఓ, అద్భుతములు జరుగు కాలము గతించిపోయాయి. నీవు ఇది చేయకూడదు, అది చేయకూడదు,” అని చెప్పుదురు.
56
ద్రాక్షవల్లి నుండి దేవుడు మొదటి తీగను కలుగజేసినట్లయితే, ఆ పెంతెకొస్తు తీగ శక్తితో, దర్శనములు, ప్రత్యక్షతలు, స్వస్థతలు, శుద్దీకరణలు, పరిశుద్ధాత్మ ఉంటాయి. ఆ తర్వాత తీగ కూడా నిశ్చయముగా అలాగే ఉండాలి. ద్రాక్ష చెట్టుకు కొత్త తీగ పుట్టిన ప్రతి సారి మొదటి తీగవలే ఉండాలి. గత రాత్రి నేను సహోదరులకు చెప్పినట్లు, ద్రాక్షవల్లి గుమ్మడి కాయలు కాయదు, గుమ్మడి చెట్టు ద్రాక్ష కాయలు కాయదు. అది నిజము. ద్రాక్షావల్లిలో ఏ జీవమైతే ఉన్నదో, దానినే ఉత్పత్తి చేయును.
57
ఆ ద్రాక్షావల్లిలో క్రీసు ఉన్నట్లయితే మరియు ఆ వ్యక్తిలో క్రీస్తు జీవం ఉన్నట్లయితే, అది యేసువలె ఉండును, ఆయన ఫలములను ఫలించును. అది ఆయన ఆత్మ. అది ఆత్మ కార్యములను కాక మరి వేరేమియు చేయదు. ఆయన జీవమే గనుక, ఆ జీవాన్నే మరల ఉత్పత్తి చేస్తుంది. వేరొక దానిని నీవు ఉత్పత్తి చేయజాలవు. అది ఆయనవలెనే ప్రవర్తించును, ఆయనవలెనే మాట్లాడును, ఆయనవలెనే నడుచును, ఆయనవలెనే స్వస్థపరుచును, ఆయనవలెనె దర్శనాలు చూస్తుంది; ప్రతిసారి, పరిపూర్ణముగా సరిగ్గా ఆయన జీవాన్నే ఉత్పత్తి చేస్తుంది, ఎందుకనగా అది ఆయన జీవము.
మీరు కేవలము పై పెంకు లాంటి వారు. మానవుడు కేవలం నీటి పైపు లాంటివాడు; అతను నీరు కాదు, అతను కేవలము ఒక పైపు. అతని నుండి నీటిని తీసివేస్తే, తుప్పు పడతాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి అది, మనలో ప్రతి ఒక్కరమూ ఎప్పుడో ఒక అనుభవము కలిగినవారమై ఇప్పుడు తుప్పుపట్టియున్నాము. నీటిని ప్రవహించనీయుడి; అది జీవనాధారాన్ని కొనసాగనిస్తుంది.
58
నా తోటి బోధకుడు బోధించగా ఒక సారి విన్నాను. ఒక పంది దొర్లాడి ఆ నీటినంతటినీ మురికి చేసిందని చెప్పాడు. దీనిని గూర్చి బైబిల్ నేర్పే అత్యుత్తమైన పాఠమేదనగా, ఆ పందిని నీటిలో నుండి తీసివేయుటయే. మంచి నీటి ఊట కలిగిన చోటుకు నీవు వెళ్ళవచ్చు, అది కొండ నుండి ప్రవహించుచూ ఉండవచ్చు, నీరంతా మురికే; ఆ పందిని నీటి నుండి తీసివేయాలి, అప్పుడు నీరు శుభ్రంగా ఉంటుంది.
మనము అనేక విషయములలోనుంచి బయటకు రావాల్సి ఉంది, ఇమ్మానుయేలు నుండి తీయబడిన రక్తపు ఊట క్రింద పాపి మునిగినట్లయితే దోషపు మరకలు, ఉపేక్షలు, వదరుబోతుతనాలు, మొదలగునవి అన్నీ శుభ్రము చేయబడతాయి.
59
పదహారు మంది సేవకులు, వారు విశ్వసించుచున్నారు గనుక.... దేవుడు తన సంఘమును ఉంచి దానిని కాపాడుచున్నాడని, నేను విశ్వసిస్తున్నట్లుగా వారనుకొనుచున్నారు. లేఖనమేమి చెప్పుచున్నది, “నా మాట వినువాడు,” కేవలము వినువాడని దాని అర్థము కాదు. వినుటకు, చూచుటకు ఎవరి చెవులను మరియు కనులను దేవుడు తెరిచాడో ఆ వినువాడని అర్థము. దేవుడు అతని కన్నులు మరియు చెవులు తెరిచేంతవరకు ఏ మనుష్యుడు దీనిని చేయలేడు. “నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” అతనికి ఏమి జరుగబోవుచున్నది? దేవుడు అబద్దమాడేనా? లేక ఆయన సత్యమును చెప్పేనా?
60
“ఓ, పరిశుద్ధాత్మను పొంది రక్షించబడుము, మరియు రేపు నీవు తప్పిపోయినట్లయితే నరకానికి వెళ్లుదువు,” అనే మనుష్యుని మాట నిజమా? ఆ బుద్దిహీనమైన మాటలను ఎంత మాత్రము నమ్మకుము. అది అబద్దము.
ఎప్పుడైతే నీవు తిరిగి జన్మిస్తావో, నీ పూర్తి స్వభావము వేరుగా మార్చబడుతోంది. ఎప్పుడైతే ఒక మనుష్యుడు క్రీస్తులో నాటబడతాడో, ద్రాక్షవల్లి జీవము అతనిలోనికి వస్తుంది, అతడెంత మాత్రము, ఎన్నడును గుమ్మడికాయలను ఫలించడు. ఆయనకు ఒక కొమ్మను అంటుకట్టవచ్చును, కానీ పొరపాటు ఉందని ఆయనకు తెలుసు. అది తొలగించబడేంత వరకు ఆయన అక్కడే పడి ఉండి మూలుగుతూ ఉంటాడు. అది ఆయనకు చాలా భారము, నేలకు తాకు వరకు అది ఆయనను క్రిందికి వంచుతుంది. పైకి ఎదుగుట ఆయనకు ఇష్టము. ద్రాక్షవల్లికి గుమ్మడికాయను వ్రేలాడదీయలేము.
గమనించండి. ఓ, విశ్వాసము కొరకు పోరాడటం! ఊరికినే పోరాడటం కాదు గానీ, జీవ, మరణాల మధ్య విశేషముగా పోరాడటం. ఒక దాని నుండి మరొక దానికి దూకుతూ ఉంటాము. చాలా కాలం నీవు దానిపై నిలిచి ఉండవచ్చు.
61
మనము చర్చించాల్సిన వేరొక విషయము, సహోదర ప్రేమ. ఇది కూడా ద్రాక్షవల్లి నుండి తినివేయబడింది. “మీరు ఒకని యెడల ఒకరు ప్రేమగల వారైనయెడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలిసికొందురని” యేసు చెప్పెను.
మంచిది, ఇప్పుడు ఒక మాదిరిని చూద్దాం. ఒక వ్యక్తి నేను నమ్మేదానిని నమ్మాడనుకుందాము. నేను ఆయనను ప్రేమిస్తున్నాను గనుక ఆయన సంఘానికే వెళ్ళి ఆయన నమ్మే దానినే బోధిస్తాను. మిగతా వాటన్నిటినీ వదిలేద్దాం. ఫలములను బట్టి వారెవరో తెలుసుకుంటాం. వారు దానిని నమ్మనట్లయితే వారికిక సహోదర ప్రేమ లేనట్లయితే, తొలగిపోతారు, విభేధిస్తారు, నశించిపోతారు. “నాకు దానితో చేయుటకు ఏమీ ఉండదు!” నా యొద్దకు వచ్చి దాని గూర్చి ఎందుకు నాతో మాట్లాడవు? నేను దేనిని విశ్వసించుచున్నానో నీవు ఎరుగవు. నేను దేనిని విశ్వసించుచున్నానో అది ఎలాంటి వ్యత్యాసము కలిగించును? నేను విశ్వసించునది యేసుక్రీస్తే! నాకు తెలిసినంత వరకూ ఏ కూడికలోనూ చేదు అనుభవంతో ముగియలేదు. కానీ సహోదర ప్రేమ లోపించుట నీవు గమనించగలవు.
పౌలు గారు I కొరింథి పదమూడవ అధ్యాయంలో “సహోదర ప్రేమను కొనసాగించనియ్యుడి” అని చెప్పారు. కాని సహోదర ప్రేమ తీసివేయబడినది. ఇప్పుడు గమనించండి, ప్రతిసారి....
62
ఇప్పుడు, శ్రద్దగా వినండి, మనము బలమైన ఆహారంలోనికి వెళ్ళుచున్నాము. ప్రతి సారి దయ్యం చెట్టు నుండి ఏదో ఒకటి తీసివేస్తూ ఉంటాడు — మనం బెరడు అంటాము, పురుగు బెరడును తినివేస్తుంది — అతడు దాని చుట్టూ మానవ-నిర్మిత గుడ్డను చుట్టినప్పుడు, ఆ చెట్టు జీవ-ధారలను దాని యొక్క ఫలములలోనికి పంపలేదు. అది యిక ఎటువంటి ఫలములను ఫలించలేదు; అవి నేలపై పడిపోవును. మానవ-కల్పితమైన అనేక సిద్ధాంతములుండుట వలన మనము ఈ రోజుల్లో ఉజ్జీవాన్ని పొందలేకపోతున్నాము, అది ఎక్కువైనా మనవ-నిర్మిత సిద్ధాంతము. ఏదో ఒక పాత గుడ్డ ముక్క ద్వారా జీవనాధారము పయనించదు; దాని జీవ-ధార తిరిగి వెనక క్రింద నేలకు పడిపోతుంది. ఈ కారణమును బట్టి మన ఉజ్జీవములు విఫలమవుతున్నాయి.
63
ఒకప్పుడు తాను గొప్ప ఉజ్జీవము పొందిన ప్రదేశం గూర్చి బిల్లీగ్రహా౦ గారు ఒక రోజున చెప్పారు. ఏ ప్రదేశములోనైతే తాను ప్రసంగించాడో, అక్కడ ఉన్న ఉద్యానవనము నుండి తన భార్యను వెలుపలకు తీసుకురావలసి వచ్చెను, ఎందుకనగా ఆ ఉద్యానవనములోనే స్త్రీ, పురుషులు అనైతికంగా జీవించుచున్నారు. కారణం ఏమిటి? దేవుడు ఇచ్చు బెరడు స్థానములో మానవ-నిర్మిత పాత గుడ్డలు; జీవాన్ని తీసుకొని రాలేవు!
మానవ-నిర్మిత సిద్దాంతములతో సంఘము చుట్టబడినప్పుడు, తీగలలోకి అవి దేవుని శక్తిని పంపించలేవు. “అద్భుతాలు జరిగే రోజులు గతించిపోయెనని చెబుతారు.” ఆ చెట్టును నేలకొరిగేలాగా చేయును. నన్ను వెర్రివాడవనుకొనుచున్నావని నాకు తెలుసు; నేను వెర్రివాడనైతే, అలాగే ఉండనిమ్ము, అలాగుండుటకు సంతోషిస్తాను, చూచారా. అది పడిపోవును.
దేవుని యొక్క వాక్యం, దేవుడు ఇక్కడ చెప్పిటన్లయితే, “నేను ప్రభువును, నేనెన్నటికీ మారనివాడను.”
“మంచిది, ఈ రోజున దానిని ఆయన మార్చివేశాడు” అని ఆ గుడ్డ ముక్క చెప్పును. దానిని తీసివేయును. అది ఆరంభమైన తొలి దినాలలో, వారికి మతశాఖలు లేనప్పుడు, మత శాఖల వలన సహోదరులను పునరుద్ధరించుటకు మనిషి ప్రయత్నించాడు. మత శాఖల వలన సహోదర ప్రేమ తొలగిపోయినది.
64
నాకొకసారి చూపించండి, దేవుడెప్పుడైనా ఒక సంస్థను కలిగి ఉండటం కాని, ఒక మత శాఖను కలిగి ఉండటం కాని. ఒక మతశాఖ పడిపోయి ఇంకెప్పుడైనా లేవగలగటం ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు చూశారా? ఈ విషయాన్ని నేను ఇక్కడకు వచ్చినప్పటి నుండి చదువుతూనే ఉన్నాను. హతసాక్షుల గూర్చి రాయబడిన ఫోక్స్ పుస్తకాన్ని నేను చదివాను. జోసెఫస్ రాసిన పుస్తకాన్ని చదివాను. హిస్లాప్ రాసిన “రెండు బబులోనులు” అనే పుస్తకాన్ని చదివాను. పెంబర్ రాసిన “ప్రారంభ దినాలు” అనే పుస్తకాన్ని చదివాను. పెంతెకొస్తు తర్వాత “నైసీన్ ఫాదర్స్” అనే పుస్తకాన్ని కూడా చదివాను. బైబిల్లో దేవుడు ఎన్నడు మత సంస్థను ఏర్పాటు చేయమని ఆజ్ఞాపించలేదు. మనము మత శాఖలను నియమిస్తే దేవుని చిత్తము నుండి బయటకు వచ్చినట్లే!
65
“సంఘ శాఖగా” పిలవబడిన పసరుపురుగు, దాని చుట్టూ పీలికను చుట్టుట ద్వారా, అసలైన సహోదర ప్రేమ బెరడును తినివేసి మతశాఖగా మార్చివేసింది. దేవుని జీవము ఇక్కడకు వ్రేళ్ళ ద్వారా వస్తుంది, ఆ వ్రేళ్ళు దావీదు వేరు చిగురు, అది తిరిగి పరిశుద్ధాత్మ ద్వారా ప్రారంభమైనప్పుడు మత శాఖ చెబుతుంది, “అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి, ఈ రోజు నీవు భాషలలో మాట్లాడనక్కర లేదు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనేదే లేదని చెబుతారు. దైవీక స్వస్థత లేదంటారు. అదెప్పుడో జరిగిపోయిందని చెబుతారు.” ఇక్కడ కొమ్మలు, ఫలములను బాధపరచుచున్నవి.
66
ఒక మంచి ఆరోగ్యముగా ఉన్న చెట్టుపై మందులు చల్లనక్కరలేదు. మనము పదే-పదే ఎందుకు మందులు చల్లుతాము. పురుగులను చంపడానికే కదా! ఎందుకు మనమలా చేస్తాము? చెట్టు ఆరోగ్యముగా లేదు గనుక, అది ఆరోగ్యముగా ఉ౦డకపోవడానికి గల కారణమేమిటి? విభిన్న ఆచారాలు మరియు మత శాఖలు ఆ జీవనాధారాన్ని సంపూర్తిగా తినివేసాయి. ఖచ్చితంగా మెథడిస్టు వారు, బాప్టిస్టు వారు, ప్రెస్బిటేరియన్లు, పెంతెకొస్తు వారు ఆ చెట్టులోని జీవనాధారాన్ని తినివేసి, ప్రత్యామ్నాయ మత శాఖ కొరకు ప్రయత్నం చేస్తూ రాజకీయం చేస్తున్నాయి. ఇతర విశ్వాస గుంపులలోనికి, రాజకీయాలలోనికి మరియు ఆచారములోనికి మనం చేరాలని దేవుడు కోరుటలేదు. దేవుడు మనలను తన పరిశుద్ధాత్మ ద్వారా, తన కుమారుని ద్వారా మన హృదయములోని పాపాలను తీసివేసి క్రీస్తు నందు ఐక్యపరచుచున్నాడు. సహోదరుడా, సహోదరి అది నిజము.
67
క్రీస్తు మరణ, మరియు పునరుత్థానముల తరువాత అపోస్తలుల మరణించిన మూడువందల సంవత్సరముల తరువాత వారు నైసీన్ ఆలోచన సభను పెట్టారు. అప్పుడు వారు మొట్టమొదటి సంస్థ అయిన రోమన్ క్యాథలిక్ ను స్థాపించిరి. “క్యాథలిక్” అనగా విశ్వవ్యాప్తమైనది దాని నుండి లూథరన్ సంఘం వచ్చినది, దాని నుండి వెస్లీ సంఘం వచ్చినది, దాని నుండి పెంతెకొస్తు సంఘము వచ్చినది. ఇవన్నియు, ఉపమార్గాలు లాంటివి. నాజరీన్లు, ఫిలిగ్రీమ్ హోలినెస్ వారు, బాప్టిస్టు ఇవన్నీ చిన్న చిన్నవి. ఇవన్నీ దాని నుండి వచ్చినవే. అవన్నీయు తిరుగుబాటు చేసినవే, చీలికలే. దేవుడు ఒక సంఘమును ఆశీర్వదించినప్పుడు వెంటనే వారు దాని చుట్టూ కంచె వేస్తారు. ప్రతి కంచె పడగొట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు.
68
నేను మొదటిగా పడమటి వైపు వెళ్ళుచున్నప్పటి రోజులు నాకు గుర్తున్నవి. అది కన్సాస్ లో గోధుమలు నూర్చే రోజులు. పశువులు కాసుకొనే ఆ బాలురకు ట్రాక్టర్ గూర్చి గానీ, గోధుమ చేను వేయడం గాని తెలియదు. వారికి కేవలం పశువుల మేపుకోవడమే తెలుసు. మరియు మేము వెళ్ళి వాహనములు తీసుకురావడం మరియు గోల్ఫ్ ఆట స్థలమందు ఉంచటం, మరియు వారు గోల్ఫ్ ఆట ఆడుతున్నప్పుడు ధరించే మోకాళ్ళ వరకు ఉండే, పాత చిన్న ప్యాంటులను ధరింపచేయటం, మరియు అటువంటి వన్నీ. టోపీ నుండి పొడవాటి తెల్లజుట్టు వ్రేలాడుతున్న వృద్ధులైన వారిని నేను చూచియున్నాను. వారిని చూడండి, బంధించిన వారిగా తీసుకువచ్చి, గోధుమలు సాగుచేయు వారిగా, మరియు అటువంటి వన్నీ (గుర్రము మీద కూర్చొన్నప్పుడు కాలు పెట్టుకొనే దానిలో అతని కాలు బిగించటం, మరియు అతని టోపీ కిందకు లాగటం), స్థలము చుట్టూ కంచె పెట్టడము, అతను నిలబడలేడు; ఒక చట్రములో ఉండటం అతనికి ఏమీ తెలియదు. దేవుని ద్వారా మరియు తనకుతానుగా విశాలపరిధిలో ఉన్నవాడు, తన టోపీ క్రింద నుండి నెరసిన వెంట్రుకలు వ్రేలాడుచున్నవి. ఏడుస్తూ కన్నీళ్ళతో కేవలము దానిని క్రిందకు లాగి చెప్పెను. “ ఈ సంగతులతో నేను నిలబడలేను” అని సూర్యాస్తమయం వైపు స్వారీ చేశాడు.
69
దేవా, ఈ రోజు మాకు సహాయము చేయుము, మత శాఖలు, మత సిద్ధాంతము ద్వారా ఉన్న కంచెలలో మేము నిలబడకుండా మరియు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన కదల్చబడని విశ్వాసముతో, సూర్యాస్తమయం వైపు స్వారీ చేయుచూ, సహోదర ప్రేమతో ఈ ఆచారాలను మరియు కంచెలను క్రిందకు పడగొట్టి, “మేము సహోదరులము క్రీస్తుయేసు నందు మేము ఒక్కటిగా ఉన్నాము అని చెప్పే యాత్రికులను పొందుకొనుటకు సహాయము చేయుము. ”దేవుడేమి చెప్పితే దాని వెనక మేము ఆమేన్!'“ అని చెబుతాము. అలాంటి మనుష్యులను మాకు ఇవ్వండి.
70
ఔను, ఆచారాలు! ప్రీ-నైసీన్ తండ్రి అని పిలుచుకొంటూ ఉంటారు. వారందరూ కలిసి ఒక మండలిగా ఏర్పడి దానిలో వారు పొదిగి క్యాథలిక్ సంఘమును ఏర్పరచారు. క్యాథలిక్ అనగా విశ్వవ్యాప్తమైన సంఘము అని అర్థము. దేవుని సంబంధమైన చిన్న సంఘాలను చీల్చి వేసింది. అవన్నీ ఒక మతముగా, ఒక సంఘముగా ఉండుటకు బలవంతం చేసింది.
వారు ఒక చేతిపై ఒక ఎద్దు బొమ్మను, మరొక చేతిపై మరొక ఎద్దు బొమ్మను, సిలువ బొమ్మను మనుష్యుని ముందు వ్రేలాడదీసి, క్యాథలిక్ మతాన్ని పుచ్చుకోవడానికి దానిని ముద్దు పెట్టుకొని మోకాళ్ళూనమని చెబుతారు. ఒక ఎద్దును ఒకవైపు, మరొక ఎద్దును మరొక వైపు, మనిషిని ఒక వైపుకు లాగుతారు. ఒక స్త్రీ వెంట్రుకలు తీసుకొని పీపాలో వేసి, ఆ స్త్రీని, సిలువను ముద్దాడమని కోరతారు. ఆమె ముద్దాడనట్లయితే ఆమె తల మీద నిప్పు ముట్టించి ఆమెను తగల బెడతారు. ఆ సిలువను ముద్దాడేలా చిత్రహింసలు పెడతారు. ఇనుప స్త్రీ అని పిలవబడే కొయ్యలతో ఒత్తుతారు. ఇది “క్రైస్తవ మతమని” పిలుచుకుంటూ ఉంటారు.
71
కనురెప్ప వాల్చకుండా హతసాక్షులు దానిపై నిలబడ్డారు. అతనెక్కడ నిలబడ్డారో అతనెరుగును. అతనెవరిని విశ్వసించాడో ఎరుగును. ఆయన వాగ్దానము చేశాడు గనుక అంత్యదినమున ఆయన లేపునని వారి విశ్వాసము. పాత గుడ్డలాంటి మానవ-కల్పిత సిద్ధాంతములకు మొక్కడం కన్నా, ఆ కొయ్యలపై చావడమే మంచిది. హల్లెలూయ!
అదే స్థలములో నన్ను చావనీయండి. నా తరములో దేవుడు గనుక రానట్లయితే, యేసుక్రీస్తు, ఆయన సంఘము మరియు ఆయన వాక్యము నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవని విశ్వసిస్తూ, పసురుపురుగులు తినివేసిన ఆ కొయ్య మీదనే చనిపోతాను. ఇక్కడున్న సంఘ శాఖలు మరియు ఆచారాల పురాతన బెరళ్ళన్నీ నన్నొక వివాదాస్పదున్నిగా కత్తిరించి పడవేసినవి, గనుక అన్ని తీగలలో దానిని ఉత్పత్తి చేయలేకపోవచ్చును. అది నిజమేకావచ్చు. అయిననూ విశ్వాసముతో ఆ కొయ్యమీదనే నిలబడి, “దేవుడు తన సంఘమును దాని పూర్వ స్థితికి వచ్చే వరకు పునరుద్దరించు ఆ ఘడియ వచ్చుచున్నది!” అని కేకలు వేస్తాను.
72
మూడవ విషయం, ఇది బహుశా మిమ్మును బాధింవచ్చును; అలా ఉండకూడదు అని కోరుచున్నాను. వారు తీసివేసిన అతి గొప్ప జీవ-ధారను గమనించండి. ఆ వ్యవస్థను స్థాపించే సమయంలో ఆ జీవపుపొరను తొలగించేశారు. మొదటిగా వారి మధ్య సహోదర ప్రేమ ఉన్నట్లయితే వారికొక సంస్థ అవసరత ఉండేది కాదు మరియు సహోదర ప్రేమ లేదని ఎరిగి కూడా సహోదర ప్రేమను పొందలేక పోయారు లేదా వారు వారి యొక్క బలాన్ని నూతన పరచమని ప్రభువు పై ఆధారపడవలసి యుండెను. కాని “యెహోవా కొరకు ఎదురుచూచుచు వారు నూతన బలము పొందుదురు.” దేవుని వాక్యమునకు బదులు వారు ఒక సంస్థను తీసుకున్నారు.
73
ఒక ఐదు-వందల-యాభై సంవత్సరముల తర్వాత లూథరన్ ఆ సంస్థ నుండి బయటకు వచ్చెను. ఆయనేమి చేశాడు? చుట్టూ తిరిగి వచ్చి వారేమి చేశారో అదే చేశాడు. దాని నుండి కాల్విన్ వచ్చాడు. వెస్లీ దాని నుండే వచ్చాడు. వెస్లీ నుండే బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్లు, నజరీను, పెంతెకొస్తు వారి దాకా వచ్చారు. పెంతెకొస్తు వారి తర్వాత ఇంకెవరు? క్రీస్తు యొక్క రాకడ అనుకుంటాను. ఎందుకనగా మిగతా వారు ఏమి చేశారో, పెంతెకొస్తు వారు అదే చేశారు.
74
వారు అది చేస్తారని ప్రకటన 12వ అధ్యాయము తెలియజేస్తుంది. ఆమె వ్యభిచారిణి, వారు వేశ్యలు. క్యాథలిక్ సంఘము ఒక వేశ్యగా I కొరింథి 12వ అధ్యాయము చెబుతుంది. దాని కుమార్తెలు అంతే. ఇప్పుడు వారు పురుషులు కారు. ఆమె కుమారులని ఆయనెన్నడూ చెప్పలేదు, ఆమె కుమార్తెలు అని ఆయన చెప్పాడు. పరిశుద్ధ గ్రంధములో సంఘమును స్త్రీతో పోల్చబడినది. ఆమె కుమార్తెలు వేశ్యలు, చూశారా, ఆ విషయాన్ని గమనించండి. ఆమె ఎలాంటి వేశ్య? అది దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా ఆత్మీయ వ్యభిచారం చేస్తుంది. పరిశుద్దులకు ఒక్కసారే అప్పగింపబడిన విశ్వాసము నిమిత్తము పోరాడకుండా వెనకకు వెళ్ళి దేవుని వాక్యమును తీసికొనకుటకు బదులు, మత శాఖల గుడ్డలను పట్టుకొనెను.
75
నేను ఇటీవల ఒక యాజకునితో మాట్లాడాను. ఆయన చెప్పారు, “బైబిల్ ఏమి చెప్పినా నేను లెక్కచేయను, మేము సంఘమై యున్నాము.”
నేను, “అది దేవుని యొక్క వాక్యము,” అని అన్నాను.
అతడు, “మేము దానిని చేసితిమి,” అనెను.
నేనతనితో, “ఎందుకు అది అంతగా మార్పు చెందినది? బైబిల్ చెప్పేది ఒక్కటి కూడా మీ సంఘములో బోధించరు.” నేను ఒక అమ్మాయికి ఇటీవల యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము ఇచ్చానని చెప్పాను.
ఆయన, “నీకు తెలియునా, క్యాథలిక్ సంఘము కూడా ఒకప్పుడు అలాగే ఇచ్చేది” అని అనెను.
నేనతనితో, “ఎప్పుడు? నాకు తెలిసిన సంఘము యొక్క చరిత్ర కూడా ఉన్నది, అక్కడే పడియున్నవి.”
అతడు “మేము మా క్యాథలిజంను నమ్ముతాము,” అన్నాడు.
“మరి చరిత్ర సంగతి ఏమిటి?” అని నేను అడుగగా.
ఆయన, “చరిత్ర ఏమి చెప్పుచున్నదో మాకు లెక్క లేదు; మేము క్యాథలిజంను నమ్ముతాము” అన్నాడు.
నేనన్నాను, “జార్జ్ వాషింగ్టన్ కానీ, అబ్రహాంలింకన్ గానీ ఉన్నారని నీకు ఎలా తెలుసు. యాత్రికులైన తండ్రులు గూర్చి నీకు ఎలా తెలుసు?”
“మనము చరిత్రను నమ్ముతాము కనుక.”
76
నేను అన్నాను, “చివరి అపొస్తలుడు చనిపోయిన మూడు-వందల-అరవై సంవత్సరముల వరకు రోమన్ క్యాథలిక్ సంఘము ఉనికినే కలిగిలేదు.” “తప్పు బాప్తిస్మమునకు పునాది వేసిన వారు, వారే గనుక వారెన్నడూ క్రీస్తు నామములో బాప్తిస్మమియ్య లేదు.”
ఆయన చెప్పారు, “మంచిది, ఒక నిమిషం ఆగండి! మాకు సంఘముగా ఉ౦డుటకు మాకు హక్కు ఉంది. దేవుడు ఆయన సంఘములో ఉన్నాడు గనుక మాకేమి కావాలో అది చేస్తాము.”
నేను అన్నాను, “ఆయన తన వాక్యములో ఉన్నాడు, సంఘములో కాదు.”
సంఘము దేవుని వాక్యముతో విభేదిస్తే, అక్కడ ఏదో పొరబాటు ఉన్నది. “ప్రతి మనుష్యుడు అబద్ధికుడు, దేవుడు సత్యవంతుడు కాక తీరడు,” అది నిజము. దేవుని వాక్యమునకు తిరిగి వెళ్ళు. పసరుపురుగులు ఏమి తినివేసినవో చూడు?
77
జీన్, నైసీన్ ఫాదర్స్ సమయంలో ఏమి జరిగిందో తెలుసా? అది నీకు కూడా తెలుసు. ఆ గొప్ప మండలి ఒక వాదన చేసింది: “దేవుడు ఒక్కడా? ముగ్గురా? తండ్రి, ఒక దేవుడు; కుమారుడు, రెండవ దేవుడు; పరిశుద్ధాత్మ, మూడవ దేవుడు.” అప్పుడు వారు ముగ్గురు దేవుళ్ళు అనే సిద్దాంతాన్ని ప్రతిపాదించారు. మీరు దానిని నమ్మకపోతే, నా దగ్గర నైసీన్ ఫాదర్స్ పుస్తకమున్నది. దాని నుండి ఇప్పుడే చదువుతాను. వారది చేశారు, “ముగ్గురు దేవుళ్ళు.”
కేవలము ఒకే దేవుడున్నాడు! ఒకే ఒక దేవుడున్నాడు! ఆయనే దేవుడైన యెహోవా, ఉన్నవాడను అనువాడను; ఆల్పాయు, ఒమెగాయు, ఆదియూ - అంతమునై యున్నాడు!
78
వారు దానినిప్పుడు కలిగియున్నారు, దానిని చేయు క్రమములో వారింకేదో కలిగి దానితో వెళ్ళారు. మరియు దానిని చేయు క్రమములో, “తండ్రియైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు” అని చెప్పుటకు ప్రయత్నించారు. ఇపుడు, ఖచ్చితముగా అలాంటిదేమీ లేదు. అది ముగ్గురు దేవుళ్ళు కాదు. అది అన్యత్వము.
అది ఒక్క దేవుని యొక్క మూడు కార్యాలయములై యున్నవి. తండ్రి స్థానములో...
దేవుడు ఒంటరిగా సంచరించినప్పుడు, పరిశుద్ధుడు; ఆయన యొక్క చట్టములు ఆయన యొక్క నీతియే, ఆయనను పరిశుద్ధునిగా చేసెను. ఆయన మనుష్యులలో ఉండాలని, మనుష్యులతో కలిసి ఆరాధించాలని, మనుష్యులచేత ఆరాధించబడాలని, ఆయన కోరెను. ఆయన మనుష్యుల వద్దకు రావాల్సి ఉ౦ది. ఆయన అది చేసి మరియ అనే చిన్న కన్యకను కమ్ముకొనెను. ప్రభువైన దేవుడు చేసెను, మరియు ఆమె గర్భములో ఒక కణమును, రక్తపు కణమును సృష్టించెను. ఆ రక్తపుకణము అనేక కణములను వృద్ది చేసి క్రీస్తుయేసు అను ఒక మనుష్యుని తీసుకొచ్చెను.
సర్వశక్తుడైన దేవుడు, ఆ తండ్రి అతనిలో నివసించెను. యోహాను ఆయనకు బాప్తిస్మమిచ్చు సమయంలో ఆయన పరిశుద్ధాత్మను పొందినప్పుడు. యోహాను, “ఆకాశము నుండి పరిశుద్ధాత్మ పావురము వలే దిగివచ్చుట నేను చూచితినని మరియు ఒక స్వరము, ”ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నివసించుటకు నేనానందించుచున్నానని“ చెప్పెను. దేవుడు నాతో ఉన్నాడు, ”నేనును తండ్రియును ఏకమై ఉన్నామని యేసు వారితో చెప్పెను. నేను తండ్రియు ఒక్కటే. తండ్రి నాలో నివసించుచున్నాడు.“ కానీ ఈ లోకమును తనతో సమాధాన పరచుకొనుట కొరకు ఆయన కుమారునిలో ఉన్నాడు.
79
మరియు ఏకత్వపు సహోదరులారా, మీలో చాలా మంది మీ వేలు ఏ విధంగా ఒక్కటిగా ఉన్నదో, ఆ విధముగానే దేవుడు ఒక్కటిగా ఉన్నాడని మీరు ఆలోచించుటకు ప్రయత్నించినప్పుడే తప్పు మార్గమునకు మరలియున్నారు. ఆయన తనకు తానుగా తండ్రిగా వుండలేడు. ఆయన ఉండలేడు.
కానీ ఆయన దేవుడే. ఆ దేవుడే యెహోవా, ఆత్మాస్వరూపి; క్రీస్తు అనే గృహములో ఆయన నివసించెను. ఆయన తన ప్రాణాన్ని అర్పించినప్పుడు ఆత్మను అప్పగించుకున్నాడు. ఆయన నిష్కళంకమైన రక్తమును చిందించుట ద్వారా, ఆయన నాలోను మరియు మీలోను నివసించునట్లు మనలను పవిత్రపరిచెను. మరియు పరిశుద్ధాత్మగా మనతో ఉన్న ఆ దేవుడే, యెహోవా దేవుడై యుండెను. “ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో, మీలో కూడా ఉందును మరియు నేను చేసిన క్రియలను మీరునూ చేతురు.”
ఎక్కడైతే గొంగళి పురుగులు, పసరుపురుగులు, తినుటకు ప్రారంభంచెనో అది తండ్రియైన దేవుడు మహిమలో కూర్చున్నాడనియు కుమారుడైన దేవుడు ఆయన కుడిపార్శమున కూర్చున్నాడనియు చూపుటకు ప్రయత్నించుచున్నారు.
80
దేవుని యొక్క కుడి చేతిని గూర్చి బైబిల్ లో ఇలా ఉన్నది. “ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను.” రాళ్ళతో కొట్టబడిన ఫిలిప్పో లేక స్తెఫను చెప్పాడు. దాని అర్థము దేవునికి కుడిచేయి ఉందని కాదు, క్రీస్తు ఆయన కుడిచేతిపై నిలబడియున్నాడని కాదు. దాని భావము ఏదనగా, గొప్ప శక్తితో కూడిన అధికారం కుడిచేతిలో ఉన్నదని అర్థము. “పరలోక మందును, భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి యున్నది” అని యేసు చెప్పెను. ఆయన ఆ అధికారముతో ఉండెను. ఆ దేవుడే క్రీస్తులో ఉన్నాడు. ఈయన ఆయనలో ఉన్నాడు. బైబిల్ ఈ విధముగా చెప్పుచున్నది, “ఏలయనగా దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది.” నీవు వారిని ముగ్గురు బిన్నమైన దేవుళ్ళుగా చేయ ప్రయత్నించినప్పుడు, నీవంటి అన్యుడు ఇంకొకడు ఉండడు.
81
ఇప్పుడు ఇది మనలను గిల్లును. నాల్గవదిగా: వారు ముగ్గురు దేవుళ్ళను కలిగినప్పుడు, వారి ముగ్గురు దేవుళ్ళకు సంబంధించి, బాప్తీస్మము అనువర్తింప చేయవలసి యున్నది; కావున మత్తయి 28:19 ఉపయోగించి, సాతాను వారి కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను. “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.” దాని విషయములో సాతాను వారి కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను.
ఇప్పుడు దానిని అలా ఉంచండి. ఇక్కడ నేను ఒక మేకును దిగగొట్టాలని అనుకుంటున్నాను, అది బాధించును, కానీ నీవు వినాలని ఆశిస్తున్నాను. అది సత్యము. దేవుడు నీకు సహాయముగా ఉంటాడు.... నీవు కేవలము లేఖనాలనే పరిశోధించు. నీవు బైబిల్లో ఎక్కడైనా, ఎవరైనా, ఎప్పుడైనా “తండ్రి, కుమార, పరిశుద్దాత్మ నామములో” బాప్తిస్మము ఇచ్చినట్లుగా కనుగొనలేవు. ఎవరైనా, ఏదైనా ఒక్క లేఖనము చూపించండి? ఎవరైనా ఆలాగు బాప్తిస్మము తీసుకున్నారని?
82
చూడండి, మీరు చెప్పుదురు, “ఆ దెయ్యము తీసుకోని.....” దయ్యము ఆ లేఖనమును తీసుకొని, దానిలో లేని వేరొక దానివలె చూపించును.
యేసుతో కూడా వాడు అలాగు చెప్పలేదా? “నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు.” ఆయన పాదము ఎన్నడూ రాతికి తగలలేదు. అయితే లేఖనములో చెప్పని దానిని ఆయనకు చూపించుటకు దయ్యము ప్రయతించుచున్నది.
ఆయన చురుకైనవాడైయుండెను, ఆయన దేవునితో నింపబడియుండెను, దేవుడు ఆయనలో ఉండెను. మరియు దేవుడు, మనుష్యునిలో ఉండి, ఆయనను ప్రత్యక్షపరచుకొనెను. ఖచ్చితముగా.
83
నేను మిమ్ములను మత్తయి 28:19 వద్దకు తీసుకొని వెల్లెదను, “మీరు వెళ్లి సర్వలోకమునకు, సమస్త జనులకు బోధించుడి, తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమీయుడి.....”
ఇప్పుడు గమనించు ఏ విధంగా క్యాథలిక్ సంఘం నుండి, త్రిత్వవాదము వచ్చినదో బైబిల్లో ఎక్కడా లేదు, నైసీన్ తండ్రుల మతమునకు ముందు ఎక్కడా లేదు. వారిలో ప్రతి ఒక్కరూ, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందారు, వారిలో ప్రతియొక్కరు. అది మొదట క్యాథలిక్ సంఘము నుండి ప్రొటెస్టంట్ సంఘములోనికి వెళ్ళింది.
ఇప్పుడు, దేవుడు నీ కన్నులను తెరవకుండా, నీవు దానిని ఎలా చూడగలవు? నీవు చూడలేవు. ఇప్పుడు శ్రద్దగా వినండి. దీనిని చూచుటకు దేవుడు నీకళ్ళను తెరవాలని ప్రార్థన చేస్తున్నాను.
84
ఇప్పుడు నేను మత్తయి 28:19 వద్దకు తీసుకొని వెల్లెదను. “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్దాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమీయుడి.” నీవు ఎలా బాప్తిస్మము పొందియున్నావు, “తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్దాత్మ యొక్కయు నామములోనా?” అది లేఖనములలో కూడా వ్రాయబడలేదు. నాకు కొందరు పురుషులు కావలెను...
మీరు చెబుతారు, “దీవించబడిన పరిశుద్ధ త్రిత్వము.” దేవుని బైబిల్ పేజిలలో ఎక్కడైనా “త్రిత్వము” అనే పదాన్ని నాకు చూపించండి. అది మానవ-కల్పిత పథకము, దేవుని పరిశుద్దాత్మ యొక్క జీవ-ధారను తీసివేయుటకు, సంఘపు వారు చుట్టిన పాత మురికి గుడ్డ లాంటిది. అలాంటిది ఏమియూ లేదు. మీరు కనుగొని నా యొద్దకు రండి. నీవు కనుగొనినట్లైతే, ఒక క్రైస్తవునిగా దానిని చేయుటకు బద్దుడిగా ఉండుట నీ విధి. దేవుని పరిశుద్ద లేఖనములలో అది లేదు. “తండ్రి, కుమార, పరిశుద్దాత్మ అనే భావన పాతాళము నుండి ఉద్భవించింది. ముగ్గురు దేవుళ్ళు, అలాంటిది ఏమీయు లేదు.
ఇప్పుడు నేను దేవుని యొక్క పితృత్వాన్ని నమ్ముతాను, నేను దేవుని కుమారత్వాన్ని నమ్ముతాను, దేవుని పరిశుద్ధాత్మను నమ్ముతాను, అయితే ప్రతి కాలములో అదే దేవుడు. ముగ్గురు దేవుళ్ళు కాదు!
85
ఇప్పుడు, “తండ్రి యొక్క నామములో!” తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మయొక్కయు, నామములలో బాప్తిస్మము ఇవ్వమని బైబిల్ ఎన్నడూ చెప్పలేదు. వెళ్ళి బాప్తిస్మము ఇవ్వమని యేసు చెప్పెను. తండ్రి యొక్క నామములో కాదు, కుమారుని యొక్క నామములో కాదు, పరిశుద్దాత్మ యొక్క నామములో కాదు. ఇది వారిని వ్యక్తులుగా చేస్తుంది; కాని అది కాదు. కానీ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనికి. చూశారా?
86
ఇప్పుడు ఇక్కడ చూడండి అభిషేకించబడిన అపొస్తలులు, పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మను పొందటానికి వెళ్తున్నారు. వారు నేరుగా పెంతెకొస్తు దినమున వెళ్ళి పరిశుద్ధాత్మను పొందారు. అప్పుడు సంఘము ప్రారంభించబడినది, వారేమి చేయబోతున్నారు? మొదటి సంగతి బయటకు రావాలి, మొదటి ఔషధముల చీటి రాయబడాలి. వైద్యుడైన సీమోను పేతురు గారు మొదటి ఔషధముల చీటిని రాశారు, ఎందుకనగా యేసు పేతురుకు పరలోకపు తాళపుచెవులు ఇచ్చెను. “నీవు దేనిని బంధించుదువో, ఏ ఔషధముల చీటి నీవు భూమి మీద రాసెదవో, నేను దానిని ఔషధముల కొట్టులో స్వీకరిస్తాను. దానిని వ్రాయుము, నేను దానిని అంగీకరిస్తాను!”
87
అతడేమి చేశాడు?
జనులు ఆ శబ్దము వినినప్పుడు, వారనుకున్నారు, “దీని భావము ఏమిటో?” కొందరు భాషలతో మాట్లాడుతున్నారు. వారన్నారు, “మేము దేవుని గొప్ప కార్యములు వినుచున్నాము.”
పేతురు యేమి చెప్పెను? “మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.”
ఇప్పుడు వారేమి చేశారు? వారు ఇక్కడ ఔషధముల చీటీలో లేని దానిని “తండ్రి, కుమార, పరిశుద్దాత్మ” అని కలిపారు. అది ఔషధముల చీటిలో లేదు. అది నిజము. వారు ఇంకేమి కలిపారు? నీవు బయటకు వెళ్ళి వారిలా చెయ్యనక్కర్లేదని చెబుతారు. “బాషలలో మాట్లాడటం, ఇంకా ఇతర అనేక సంగతులు చేయుట నీకేమి సంతోషాన్ని, శక్తిని ఇవ్వలేవు” అని చెబుతారు. వాటిని నీవు చేయాల్సిన పనిలేదు, ఒప్పుకోలు చేసి, అలా కరచాలనం చేస్తే చాలు. అది సాతాను యొక్క మరింత విషపూరితమైన ఔషధము! వారు ఔషధములు తీసుకున్నప్పుడు వారిని అది అలాగు చేయించితే, మిమ్మల్ని కూడా అలాగే చేయించుతుంది. ఆయన ఔషధముల చీటి తీసుకో. కచ్చితముగా సరి! పసరుపురుగులు విడిచిన దానిని, చీడపురుగులు తినివేసెను.
88
ఇప్పుడు గుర్తుంచుకొనుము, పరిశుద్ధ గ్రంధములో ఏ వ్యక్తి యేసుక్రీస్తు నామములో తప్ప వేరొక నామములో బాప్తిస్మము పొందలేదు. యూదుడైనా, అన్యుడైనా, ఎవరైనా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందాల్సిందే. చివరి అపొస్తలుడు చనిపోయిన మూడువందల సంవత్సరముల వరకు ఎవరైనా “తండ్రి, కుమార, పరిశుదాత్మ” నామములో బాప్తిస్మము పొందినట్లు, ఎవరైనా సరే నాకు చూపించమని నేను సవాలు విసురుతున్నాను. నా ముందు కనిపించే నా పదివేళ్ళ కన్నా, అది ఇంకా స్పష్టమైనది. దేవుడు నీ కన్నులను తెరవకుండా, నీవు దానిని చూడలేవు. అది సరియైన బయలుపాటు కాకపోతే, “తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమిమ్మని,” చెప్పబడిన పది రోజులకే ఎందుకు పేతురు, “యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మము పొందమని చెప్పాడు.” అలాంటి బయలుపాటే ఆయన పొందాడు! అదిగో సంఘం కొద్ది దూరంలో ఉన్నది. త్రిత్వ వాదులు తప్పు బయలుపాటును కలిగియున్నారు. వారు ఆ జీవ-ధారను వాడుట లేదు. వేరొక గుడ్డలను తీసి ఆ చెట్టుకు చుడుతున్నారు, అది దేవుని జీవాన్ని పడదోస్తుంది; అది రోగిని చంపివేస్తుంది! ఇంకా ఎన్ని విషయాలలోకి మేము వెళ్ళగలము, మీ ఆచారాలు మరియు పద్ధతులు, అది ఏమి చేసినది!
89
ఈ ఒక్క విషయాన్ని నన్ను స్పష్టం చేయనీయండి. మీరు వెళ్ళి ఒక్క నిమిషము మీ బైబిల్ తెరచి చూడండి, కావున చిన్న పిల్లలు కూడా అర్ధం చేసుకొనునట్లుగా, మేము దానిని ఎంతో సులభముగా గ్రహించునట్లుగా చేశాము. మత్తయి మొదటి అధ్యాయము త్రిప్పండి. మీరు మత్తయి 28:19 కలిగియున్నారు. మత్తయి 1:18ని చూడండి. ఇక్కడ చూడండి.
మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ నా ఎడమ వైపున ఉన్న తండ్రి. కుమారుడు మధ్యలో పరిశుద్దాత్మ కుడివైపున. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క తండ్రి ఎవరు? తండ్రియైన దేవుడు. అవునా? మీరందరూ దానిని నమ్ముతారా? నేను కూడా కచ్చితముగా తండ్రియైన దేవుడు, యేసుక్రీస్తు తండ్రి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ.
90
నేను లేఖనముల నుండి చదువుచున్నాను. మీరు ఇంటికి వెళ్ళిన తరువాత చూడండి, లేదా ఇప్పుడే చూడండి. “యేసుక్రీస్తు జననవిధ మెట్లనగా,” మత్తయి 1వ అధ్యాయములో చూడండి. నీవు ఒక కథల పుస్తకము చదివే మాదిరిగా, మత్తయి 28:19 చదవండి. ఒక కథల పుస్తకం జాన్ మరియు మేరీ ఎప్పుడూ సంతోషంగా ఉన్నారు. ఇక్కడ జాన్ మరియు మేరీ ఎవరు? పుస్తకం మొదటిలోకి వెళ్ళి జాన్ మరియు మేరీ ఎవరో తెలుసుకోండి. అయితే ఆయన చెప్పాడు, “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మయొక్కయు, నామములోనికి వారికి బాప్తిస్మమీయుడి.”
నేను మిమ్ములను కొన్ని సంగతులు అడుగుతాను, “తండ్రి” అనేది ఒక పేరా? [సమాజము “కాదు” అని చెప్పింది.] అది ఖచ్చితముగా కాదు. కుమారుని యొక్కయు. “కుమారుడు” అనేది పేరా? [కాదు.] తండ్రి లాగే కుమారుడు కూడా ఒక బిరుదు. “పరిశుద్ధాత్మ ” అనేది పేరా? [కాదు.] అది ఒక బిరుదు. పరిశుద్ధాత్మ కూడా అదే.
నీవు అనవచ్చు, “పరిశుద్ధాత్మ ఒక నామవాచకం.” మనిషి కూడా అంతే. చూడండి, నేను ఒక మానవుడను, అయితే నా పేరు “మనిషి” కాదు.
91
అది అదే అయి యున్నది, అది పరిశుద్దాత్మ. అది దాని యొక్క పేరు కాదు; అది అదే అయి యున్నది. తండ్రి అనేది కూడా పేరు కాకపోతే, పరిశుద్దాత్మ అనేది పేరు కాకపోతే, కుమారుడు అనేది కూడా పేరు కాకపోతే; అప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్క పేరేమిటి? [సమాజం, “ప్రభువైన యేసుక్రీస్తు” అని చెప్పుచున్నది.] ఖచ్చితంగా! ఖచ్చితంగా! ఇప్పుడు, చూడండి, తండ్రి అనేది పేరు కాదు.
ఆయన చెప్పెను, “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమీయుడి.” పేతురు వెనుకకు తిరిగి, “అది యేసుక్రీస్తు నామము” అని చెప్పాడు. ఇప్పుడు బైబిల్ అంతటా వారు ఖచ్చితముగా అదే పద్దతిని అనుసరించారు.
92
ఇప్పుడు వారు ఏమి చేశారు? సంఘపు వారు, అనువాదకులు ఏమి చేశారు? సంస్థలు ఏమి చేశాయి? మిగతా వారితో ప్రసిద్ది చెందుటకు, ఆ మతశాఖపు పాత గుడ్డలను చుట్టి వేసారు. ఒక వేళ నేను ఉప్పు బిస్కెట్లు తిని, మరియు నదిలో నీరు త్రాగి, మరియు హతసాక్షిగా ఉండవలసి వస్తే, దేవుని సత్యము కొరకు నిలబడి కొయ్యమీద మరణిస్తాను. అది నిజము. ఎవరైనా సరే మా పోప్ అయినా, బిషప్ అయినా, సాధారణ వ్యక్తి అయినా దానితో నిలబడగలరా? ఔనండి. విషయం ఏమిటి? పసరుపురుగులు ఏమి విడిచి పెట్టెను, మెథడిస్టులు విడిచిన దానిని, బాప్టిస్టులు తినివేసిరి; బాప్టిస్టులు విడిచిన దానిని పెంతెకొస్తు వారు తినివేసిరి. ఎలాంటి స్థలము, జీవనాధారాలన్ని పోయెను! (ఇది కేవలము ఒక చిన్న విషయమే.)
93
ఇప్పుడు, “తండ్రి, కుమార, పరిశుద్దాత్మ ఎవరు?” “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్దాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమీయుడి.” తండ్రి అనేది పేరు కాదు, కుమారుడు అనేది పేరు కాదు, పరిశుద్ధాత్మ అనేది పేరు కాదు. ఏ పేరును గూర్చి మీరు మాట్లాడుతున్నారు? అది జాన్ మరియు మేరీల కథ లాంటిది. అది ఏమిటో కనుగొనడానికి వెనుకకు వెళదాం. “యేసుక్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత, వారేకము కాకమునుపు, ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను.” (ఏమిటి) “పరిశుద్ధాత్మ.”
దేవుడు ఆయన యొక్క తండ్రి అని నీవు చెప్పాలనుకుంటున్నావు. దేవుడు ఆయనకు తండ్రి ఎలా కాగలడు, మరియు పరిశుద్ధాత్మ ఆయనకు తండ్రి ఎలా కాగలడు? త్రిత్వవాదులారా చూడండి, మీరు ఏకత్వాన్ని అపహాస్యం చేస్తున్నారా? కుండ వేరొక పాత్ర మసిగా ఉన్నది అని అనలేదు. ఇక్కడ చూడండి. నా ఉద్దేశ్యాన్ని గమనించారా?
94
“యేసుక్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను” అని చెప్పాడు. “తండ్రియైన దేవునికి” దానితో ఏ సంబంధం లేదు. తండ్రియైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరు కాకపోతే యేసు ప్రభువు వారికి ఇద్దరు తండ్రులు ఉన్నట్లు. మన రక్షకుడు ఇద్దరు తండ్రులకు జన్మించిన అక్రమ సంతానమౌతారు. “యేసుక్రీస్తు జననవిధ మెట్లనగా... ఆయన పరిశుద్ధాత్మ వలన జన్మించెను!” నీవు దానిని నమ్ముచున్నావా? తండ్రియైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఇద్దరూ ఒక్కటే, లేకపోతే ఆయనకు ఇద్దరు తండ్రులున్నట్లు.
95
ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయూ జరిగెను. ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు పేరు పెట్టుదురు (అది ఆయనే), “యేసు” ఇమ్మానుయేలు అనగా ఏమిటి? [దేవుడు మనకు తోడైయుండునని అని సంఘము చెప్పుచున్నది.] తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క పేరు ఏమిటి? [ప్రభువైన యేసుక్రీస్తు]. నిశ్చయంగా! “ఆయన [”యేసు“] అని పిలవబడతాడు, ఎందుకనగా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును.”
ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ పేరు ఏమిటి? తండ్రి అనేది పేరు కాదు, కుమారుడు అనేది పేరు కాదు, పరిశుద్ధాత్మ అనేది పేరు కాదు. ప్రభువైన యేసుక్రీస్తే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ; దేవుని యొక్క ఆ మూడు కార్యాలయాలు శరీరములో, ఒకే వ్యక్తిలో ప్రత్యక్షపరచబడినది! హల్లెలూయ! సహోదరా, అది సత్యము! తీర్పు దినమున దానిపై నిలబడగలుగునట్లు నాకు సహాయం చేయ్యి దేవా!
96
మరియు ఆ పసరుపురుగు ఏమి చేసింది? తండ్రియైన దేవుడు పరలోకములో యున్నాడని, కుమారుడైన దేవుడు యిక్కడ సింహాసనము మీద కూర్చున్నాడని, పరిశుద్ద దేవుడు.... ఆశ్చర్యము లేదు, మనము ఎక్కడికీ వేళ్ళలేము!
దేవుడు నీలోను, నీతోను ఉన్నాడు! “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉందును. నేను చేయు క్రియలను మీరు కూడా చేయుదురు.” మరియొక వ్యక్తి కాదు, కాని అదే పరిశుద్దాత్మ, అదే వ్యక్తి, అదే దేవుడు. యేసు, ప్రభువైన యేసుక్రీస్తు, తనకుతాను ప్రత్యక్షపరచుకొనుటకు దేవుడు నివసించిన గుడారమే యేసుక్రీస్తు, ఎందుకనగా ఆయన ఆత్మయై ఉన్నాడు.
ఇప్పుడు, యేసు నిత్యుడై ఉండలేదు. దేవుడు నిత్యుడైయుండెను. దేవుడు ఒక శరీరమును తీసుకొనెను గనుక ఇప్పుడు యేసు నిత్యుడు.
97
జగత్తుకు పునాది వేయబడక మునుపు ఒక సమయముండెను, దేవుడు నన్ను గూర్చి ఆలోచన చేసినప్పుడు నేను నిత్యుడనై ఉంటిని, జగత్తుకు పునాది వేయబడక మునుపే, నా పేరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో వ్రాయబడినది. అలాగే నీ పేరు కూడా, అది ఒక ఇసుక రేణువైనా లేకమునుపు వ్రాయబడినది. అది బైబిల్ లో ఉ౦దని ఎంతమందికి తెలుసు? జగత్తుకు పునాది వేయబడక మునుపే, నీ పేరును దేవుడు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో ఉంచాడని ఎంతమందికి తెలుసు? అప్పుడు దేవుని ఆలోచనలో, అప్పుడే మనము దేవుని రాజ్యములోనికి జన్మించియున్నాము.
నా తల్లిదండ్రుల పరిశుద్ద వివాహబంధం ద్వారా ఒక రోజున, ఒక శరీరము వచ్చెను. వారు నన్ను కనగా, ఇదిగో, నేను శరీరధారిగా విలియం బ్రెన్హా౦ రూపములోనికి వచ్చాను. ఇప్పుడు మీరు నన్ను విలియం బ్రెన్హా౦ అనే మనిషిగా ఎరుగుదురు. దేవుడు తన మనసులోని ఆలోచనలలో, వ్యక్తీకరణలో నన్ను విలియం బ్రెన్హా౦గా ఎరిగెను.
98
వాక్యము అనగా ఏమిటి? వ్యక్తపరచబడిన ఆలోచనయే వాక్యము. “అతడిని రానిమ్ము,” అని ఆయన పలుకగా నేను వచ్చాను. “మరలా అతడిని రానిమ్ము” అని పలుకగా, మరలా వచ్చెదను. ఔనండీ. అది ఒక ఆలోచన; వ్యక్తపరచబడిన ఆలోచనయే వాక్యము.
దేవుడు ఇప్పటికే తన వాక్యమును ఇచ్చెను, అది ఆయన ఆలోచనే, దానిని ఆయన వ్యక్తపరిచాడు. ఆయన పలికితే అది జరుగును. “కలుగును గాక,” అంటే అది కలుగును. సర్వశక్తుడైన యెహోవా దేవుడున్నాడు. ఇప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహించెను. (దీనిని బయటకు తీసివేయుటకు, వారు తప్పుడు బాప్తిస్మము తీసుకొని రావలసివచ్చెను.) మీరు చూడండి, అది మరుగుపరచబడియున్నది. లోకము దానిని చూడదు, మరియు అది చూడనేరదు.
99
ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ముగించుటకు ఇంకా చాలా సమయం ఉ౦డగానే ప్రార్థన వరస కలిగి ఉందాము. మంచిది. నేను అనుకున్నదాని కంటే ఎక్కువ సమయము దానిపై గడిపాను. ఇప్పుడు కేవలము ఒక్క నిమిషము, నేను మరియొక విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను.
కాబట్టి, “తండ్రి, కుమార, పరిశుద్దాత్మ” ఒక నిజమైన దేవుడు. ఆయనకు ఒకే పేరు ఉన్నది; ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన జన్మించినప్పుడు యేసు క్రీస్తుగా జన్మించారు. క్రీస్తు అనగా, “అభిషిక్తుడు.” ప్రభువు అనగా “అధిపతి.” మరియు అప్పుడు దేవుడు దిగి వచ్చి ఆయనలో నివసించాడు, అది ఆయనను తండ్రి, కుమార, పరిశుద్దాత్మగా చేసెను; ఆల్ఫాయు, ఒమేగాయు, ఆదియూ, అంతము; భూత, భవిష్యత్తు, వర్తమాన కాలములో ఉన్నవాడు; దావీదు వేరు, చిగురు మరియు సంతానము; వేకువచుక్క, మొదటి వాడు, కడపటి వాడు. అది ఆయనే!
100
ఓ, పసరుపురుగు ఏమి విడిచి వెళ్ళింది! దేనిని ఆరాధిస్తున్నావో తెలియకుండా నీవు ఎలా ఆరాధిస్తావు? నీలో పరిశుద్ధాత్మను పొందకుండా నీవు ఆత్మీయకముగా ఎలా ఉ౦డగలవు? కొన్ని సంఘ ఆచారాల గుంపుతో మీరు బంధింపబడినట్లయితే, అవి మిమ్ములను సంఘస్థులవలె, గౌరవప్రదంగా, మతపరమైన వారి వలె చేసేస్తాయి. అవన్నీ మంచి నైతిక చర్యలే.
కానీ సహోదరుడా, నిజమైన పరిశుద్ధాత్మ ద్వారా నీవు తిరిగి జన్మించవలసి యున్నది, కేవలం దేవుని యొక్క వాక్యమువలనే అది వచ్చును. నిజమైన దేవుని వాక్యము నీలోనికి వచ్చినప్పుడు, అది కేవలం సత్యమును మాత్రమే వ్యక్తపరుస్తుంది. ఆయన, అనగా, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును, ఆయన సత్యమును బయలుపరచును. నేను మీకు చూపిన వాటిని ఆయన తీసుకుని, నేను మీకు చెప్పిన విషయాలు, మరియు అవి మీకు చూపును. పరిశుద్ధాత్మ అది చేయును. ఆయన ఏమి చేయును, ఆయన అక్కడే ఉన్నాడు.
101
చీడపురుగు విడిచిన దానిని, గొంగళిపురుగు తినివేసెను. క్యాథలిక్ వారు విడిచిన దానిని, లూథరన్ వారు తినిరి. లూథరన్ వారు విడిచిన దానిని, మెథడిస్టు తినిరి. మెథడిస్టు వారు విడిచిన దానిని, పెంతెకొస్తు వారు తినిరి. అది ఎక్కడకు వెళ్ళింది? ఈ పాపాల మిశ్రమము, ఈ సంగతులు అన్నీ, బోధలు మిగతా వాటిన్నింటిని గూర్చి కూడా చెప్పవచ్చు. కరచాలనం, చిలకరింపు మొదలగునవి.
ఎవరైనా చిలకరింపు గూర్చి విన్నారా? బైబిల్ లో దానిని నాకు చూపించు. పైన నీటిని కుమ్మరించడము మీరు విన్నారా? బైబిల్లో మీరు నాకు చూపించండి. బాప్తిస్మం అనే మాట “బాప్టిజో” అనే పదం నుండి వచ్చినది. దాని అర్థం “ముంచబడుట మరియు పాతిపెట్టబడుట.” అది దేవుని యొక్క సత్యవాక్యమై యున్నది. అది నిజం. ఓ, మనకు సమయం ఉన్నట్లయితే, చెప్పుకుంటూపోతే ఎన్నో అబద్ద సంగతులను గూర్చి చెప్పుకొనవచ్చును!
102
ఈ విషయాన్ని నా ప్రియమైన జనులతో చెబుతున్నాను. వినండి. తీర్పు రోజున నేను మీతో కూడా నిలబడతాను. నేను సమాధానం చెప్పవలసి ఉంది. నేనెన్నడూ ఒక మత పరమైన గుంపుకు సమాధానం ఇవ్వనక్కరలేదు. దేవా! నాకు సహాయం చేయండి. నేను బైబిల్ కు సమాధానం చెప్పాలి. నేను నిలబడేది ఆ గ్రంథమును బట్టియే.
పరిశుద్ధ గ్రంథములో ఎక్కడా కూడా భావావేశాలు లేకుండా, భాషలు మాట్లాడకుండా, చప్పట్లు కొట్టకుండా, దేవునికి స్తుతులు చెల్లించకుండా, ప్రవచనాలు చెప్పకుండా, ప్రత్యక్షతలు పొందకుండా, పరిశుద్ధాత్మను ఎవరూ, ఎక్కడా పొందుకోలేరు. వారలా ఎప్పుడు బోధకుని దగ్గరకు నడుస్తూ వచ్చి కరచాలనం చేసి పోలేరు.
అలా పొందడం పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేదు. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందకుండా, మరొక విధంగా పొందడం బైబిల్లో ఎక్కడా లేదు.
త్రిత్వాన్ని గూర్చి బోధించుట బైబిల్లో ఎక్కడా లేదు. అది ఎప్పుడును, “ఒక్క దేవుడు.” “ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.” తండ్రి కాదు, కుమారుడు కాదు, పరిశుద్ధాత్మ కాదు గానీ, “నేనే దేవుడను.” ఎల్లప్పుడు, ఆయనే దేవుడు! ఆయన ఎల్లప్పుడు దేవుడైయుండెను, ఆయన ఎల్లప్పుడు దేవుడై యుండును.
103
నీవు ఒక సమాజమునకు, సంఘ శాఖకు వచ్చి వారికి సహోదర ప్రేమను చూపించుటకు ప్రయత్నించి, వారిని రక్షణలోనికి లాగుటకు చేయగలిగినదంతా చేసినప్పుడు, మిగతా దానిని దేవుడే చేయనిమ్ము; బైబిల్ సత్యములపైన నీవు నిలువబడి యున్నందుకు వారు నిన్ను వెలివేయుదురు. ఇది కేవలము దేవుని పిల్లలు కూటములకు వచ్చి, రక్షించబడుకుండునట్లుగా సాతాను చేసే నీచ కుతంత్రమే అయి ఉన్నది. అది నిజము.
104
స్థిరమైన బండలాంటి దేవుని వాక్యమున్నది. నేను ఎవరినైనా, ఎప్పుడైనా వారు కోరినట్లయితే సహోదర ప్రేమలో వారితో కలిసి వెళతాను, నేను చెప్పిన వాటిలో ఒక్కటియైననూ బైబిల్ సత్యములలో లేనట్లయితే నాకు చూపుమని మిమ్మును కోరుచున్నాము. ఔనండి. అది నిజము. ఇప్పుడు మీరు దాని కొరకు నిలబడుటవలన, మీరు వెలివేయబడ్డారు. అది ఆ విధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. దేవుడు ఆ విధంగా ఉంటుందని చెప్పెను.
ఆయనను కూడా వాళ్ళు అదే చేశారు. ఈ విషయాలు నీవెక్కడ నేర్చుకున్నావు? నీవు ఏ పాఠశాల నుండి వచ్చావు? నీవు ఎవరవు? పరిసయ్యుడవా? సద్దూకయ్యుడువా? ఆయన సజీవుడైన దేవుని కుమారుడై ఉన్నాడు, ఆయన వారిలో ఎవరి పక్షమూ వహించలేదు.
105
దేవా, నాకు సహాయము చేయుము. ఒంటరిగా నిలబడి (నేను నిలబడితే, ఆ విధానములోనే నిలబడాలి) సత్యము చెప్పుటకై నాకు చాలినంత వివేకాన్ని, సరైన సిద్దాంతాలను, మానవత్వాన్ని, క్రీస్తును కలిగియుండులాగున దయచేయండి అవునండీ, నేను సరిగా అయిదుగురికి సువార్తను బోధిస్తే, దానిని వినగలిగిన మిలియనుల జనులను పొందగలను. సత్యమును చెప్పండి! నేనెన్నడూ రాజీపడలేదు. నేను దీనిని కోరుకున్నాను, ఎందుకనగా ఆయన పునరుత్థానము యొక్క బయల్పాటు ఆయన మాటవల్లే ప్రత్యక్షపరచబడుచున్న గొప్ప ఆచారములు, వ్యవహారముల చేత బందించబడిన దీనజనులు అక్కడ ఉన్నారు. సుగంధ ద్రవ్యముల చేత అలంకరించబడిన శవముల వలే సిద్ధాంతరీకరించబడ్డారు.
106
దేవుడు మీ హృదయమును దీవించును. నేను మిమ్ములను ఆ పరిస్థితులల్లో వదిలి వేయను. దేవుడు చెప్పిన దానినే నేను మీకు చెబుతాను. “కానీ నేను గొంగళిపురుగు తినివేసిన దాని నుండి నేను మిమ్ములను పునరుద్దరిస్తానని, చీడపురుగు, పసరుపురుగు తినివేసిన దాని నుండి మిమ్మును పునరుద్దరిస్తానని, ప్రభువు చెప్పుచున్నాడు!” కాబట్టి సహాయం చేయండి, నేను ఈ ప్రవచనాన్ని ప్రవచిస్తున్నాను. ప్రభువు రాక మునుపు, నిజమైన అపొస్తలుల విశ్వాసం, నిజమైన అపొస్తలుల బోధ, నిజమైన బైబిల్ ఆత్మ, తినివేయబడినది మరలా పెరగడానికి తమ మార్గంలో ఉన్నాయి.
107
పెంతెకొస్తు వారు ప్రారంభించి ఉండవల్సింది. కానీ వారు ఏమి చేశారు? దాని చుట్టూ వలయం గీసి పేర్లు పెట్టడం ప్రారంభించారు. ఆయన దానిని నరికి వేశాడు. అది కచ్చితముగా సరి. దేవుడు వరములను పంపుతున్నప్పుడు, వినయముతో కూడిన ఆ చిన్న వాటిని నాకూ ఇచ్చెను. వారు కొనసాగుతున్నారు, వారు నన్ను “కడవరి - వర్షపు కుమ్మరింపు” అను మాటతో ఉండమన్నారు; దాని నుండి ఒక సంస్థను తయారుచేసి వచ్చి వారి సమాజములో చేరమని నన్ను కోరిరి.
అక్కడ వ్రేలాడుతున్న ప్రతి తీగ మధ్యలో నేను నిలబడియున్నాను. చెట్టు కొయ్య వద్దే ఉండి, “ఇదే పునాది! మీకేమాత్రము జీవమివ్వని ఆ పాత గుడ్డను తీసి పారవేయండి. అప్పుడు నీవు ప్రవచనాలను, వివేచనలను, ఆత్మను కలిగి ఉ౦టావు, ఎప్పుడైతే నీవు నిజమైన ద్రాక్షావల్లి వద్దకు, నిజమైన జీవము వద్దకు వస్తావో అప్పుడు నీవు శక్తిని, పునరుద్దరించబడిన నిజ సంఘమును తిరిగి పొందుతావు” అని చెప్పుచున్నాను.
108
ఊరికే పడిపోయే ఒక గుడ్డ పీలిక ద్వారా అది రాదు. మరియొక రోజు అని పదే-పదే చెప్పినా అది ఎన్నటికీ రాదు. అది ఎప్పటికీ ఒకే విధంగా ఉండును. ఆయన ఆల్ఫాయు - ఒమేగాయు, ఆదియూ - అంతమునై ఉన్నాడు. నిశ్చయంగా. “ఈ బండపై నా సంఘమును కట్టుదును, మరియు పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు,” అనే దాని కొరకు మీరు పునాది యొద్దకు తిరిగి రావలసియున్నది.
స్నేహితులారా, దేవుడు మిమ్ములను దీవించును గాక! నేను కొంచెము అరిచే వానిగా ఉన్నానని, కొంచెము క్రమము తప్పిన వానిగా ఉన్నానని, నా గురించి మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు, కానీ నేను అలా కాదు. నేను వాక్యమునకు సంబంధించిన క్రమములోనే ఉన్నాను అని తలంచుచున్నాను.
109
ఏ ఆత్మ అయితే పరిశుద్ధ గ్రంథమును వ్రాసినదో, ఆ దేవుని ఆత్మ ఇక్కడ ఉన్నది. పరిశుద్ధ గ్రంథమును వ్రాసిన ఆత్మ బైబిల్ లోని వాక్యమును మాట్లాడినప్పుడల్లా “ఆమేన్” అని చెప్పును. “ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెనని చెపితే, దేవుని యొక్క నిజమైన ఆత్మ ”ఆమేన్“ అని చెబుతుంది, అదే సత్యము. బైబిల్ గనుక యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని చెప్పినట్లయితే, ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడా, మీలో కూడా ఉందును అని చెప్పినట్లయితే, దేవుని నిజమైన ఆత్మ ”ఆమేన్“ అని చెబుతుంది. అది నిజమైన ఆత్మ అయిన యెడల అప్పుడు ఆత్మ యొక్క నిజమైనశక్తిని బయలుపరచును తనతంట తానే ప్రత్యక్షమగును. మీరు విన్న వాక్యమును పరిశుద్ధ గ్రంథముతో సరి చూడండి. దాని కార్యములను పరిశీలించండి. దాని క్రియలను పరిశీలించండి.
110
ఎన్నడూ బాప్తిస్మము పొందని, పొందవల్సిన వారెవరైనా ఇక్కడ ఉన్నారా? బాప్తిస్మము కావాలని కోరుతున్నారా? మీ చేతిని చూపించండి. మంచిది.
బాప్తిస్మములేమీ లేనట్లయితే, రోగుల కొరకు ప్రార్థన చేస్తాము. ఇక్కడ రోగులు ఎవరైనా ఉన్నారా? ప్రార్థన అవసరత కావలసిన వారు మీ చేతులు చూపించండి. ప్రార్థన అవసరత కావాల్సి ఉండి, క్రొత్తగా వచ్చిన వారు ఎందరున్నారు? మీరు నాకు తెలియదు. మీకు నేను కొత్త, మంచిది. రోగులు మరియు బాధించబడుచున్న వారలారా? మీరెవరో నాకు తెలియదు.
ఆయనే దేవుడైనట్లయితే, నేను బోధించిన వాక్యమునకు ఆయనే దేవుడైతే: యేసు ఇలా అన్నాడు, “నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” అది ఏమైయుండెను? తిరిగి మనుష్యుని నుండి ఒక దేహము నుండి, వెనకకు మళ్ళీ అగ్ని స్థంభముగా మారెను. దమస్కు మార్గములో ఆయనను పౌలు కలుసుకొన్నప్పుడు, ఆయన ఏమైయున్నాడు? అగ్ని స్థంభము. అది సరియేనా? ఔను ఖచ్చితంగా. ఆయన ఈ రోజు ఏమైయున్నాడు? ఆ పటములో ఆయన ఏమైయున్నాడు?
111
“ఓ, నీవది చెప్పవచ్చు సహోదరుడా బ్రెన్హా౦,” అని మీరు చెప్పుదురు,
అది నిజముగా దేవుని యొక్క రుజువైతే, ఇది అదే అగ్నిస్తంభమైనట్లయితే, ఆ యేసుక్రీస్తే అయితే — ఆయన ఆత్మ నాలోనికి వచ్చినది అని నేను ప్రకటించుచున్నాను — ఇది ఆయన చేసిన అదే కార్యములను చేయును. సంఘ శాఖల ఆచారాలు ఏమి చెప్పుచున్నను దానిని లక్ష్యపెట్టక ఆయన చెప్పిన ప్రతీ వాక్యముతో ఏకీభవించును. ఆయన పలికిన అదే వాక్యమును అది పలుకును.
వారి అవిశ్వాసము ఆయనను ఆపలేదు. వారి ఆచారాలు మరియు మత శాఖలు, ఆయన ఎప్పుడు ఎవరి పక్షము వహించలేదు. దేవుని ద్వారా విన్నటువంటి స్వచ్ఛమైన వాక్యమును బోధించెను. ఆయన నిశ్చయంగా ఆయన ఒంటరిగా నిలబడెను. ఖచ్చితముగా, ఆయన చేసెను. ఆ కల్వరిలో, ఆయనతో నిలబడువారు ఒక్కరును లేరు. ఆయన ఒంటరిగా నిలబడెను.
112
నీవు దేవుని కొరకు నిలబడుటకు దాని మూల్యమెంతైనా నీవు ఒంటరిగా నిలబడతావు. అది నీవే! ఈ లోకము కాదు, నీ సంఘము కాదు, నీ మత శాఖ కాదు. దేవునికీ నీకు మధ్యలో ఎవ్వరూ కాదు, నీవే. అది ఏమైనను నేను లెక్క చేయను....
బ్రెన్హా౦ గుడారము వారు కోరినది ఏదైనా చేయవచ్చు. వారు దేవుని నమ్మాలని నేను కోరుచున్నాను, వారి కలిసి రావాలని నేను కోరుచున్నాను. వారలా లేనట్లయితే, ఎలాంటి చిన్న విషయాలలో నేను వారితో రాజీపడను. నేను దేవుని కొరకు నిలబడతాను!
“మెథతడిస్టులు అంటారు, బ్రెన్హాం నీవు ఏమి చేస్తావు? త్రిత్వవాదులైన పెంతెకొస్తు వారు? నేను వారిని ప్రేమిస్తున్నానని నిరూపించాను. నేను వారి వద్దకు వెళ్ళాను, అసెంబ్లీస్-అఫ్-గాడ్ మరియు చర్చి-ఆఫ్-గాడ్ లోనికి పంపించబడ్డాను.
113
“నీవు ఏకత్వ విషయాన్ని విభేదిస్తున్నావు, ఎందుకనగా వారియొక్క ”ఏక“ విషయమై.” ఔనండి. యేసుక్రీస్తు తండ్రిని కలిగియున్నాడు, ఆయన దేవుడై యున్నాడు. వారు “యేసు” నామములో బాప్తిస్మమిస్తారు. నేను “ప్రభువైన యేసుక్రీస్తు” నామములో బాప్తిస్మము ఇస్తాను. బైబిల్లో అనేక మంది “యేసులు” ఉన్నారు, కానీ “ప్రభువైన యేసుక్రీస్తు” ఒక్కరే ఉన్నారు, చూచారా. “యేసు” నామములో కాదు; అయితే “ప్రభువైన యేసుక్రీస్తు నామములో.” ఆయనే తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ.
“నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచువరకు నీవు ”నా కుడి పార్శ్వమున కూర్చుండుమని“ ప్రభువు, నా ప్రభువుతో చెప్పెను.” కుమారుడైన, యేసుక్రీస్తు; క్రీస్తు, లోగోస్, ఆదియందు వాక్యమై దేవుని నుండి బయటకు వచ్చెను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. మీరు అక్కడే ఉన్నారు.
114
ఆ విషయమును బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను! ఆయన వాక్యమును, ఆయన ఆత్మ వ్రాసినది అని తెలుసుకోవడానికి నా హృదయం ఎంతగానో ఉల్లసిస్తున్నది. వాక్యమును రాసినటువంటి ఆత్మ వాక్యముతో ఏకీభవిస్తూ జీవనాధారాన్ని నిరూపిస్తూ, దానంతట అదే దేవుడు మీతో ఉన్నాడని బయలుపరుస్తుంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆయన వాక్యమును గూర్చి సత్యమును చెప్పాను. గుడారములోని జనులారా, వేరే సమయములలో మీకొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైనది, ఈ రోజు నేను కొంచెము ఎక్కువ సమయం తీసుకున్నాను, కొన్ని బాప్తిస్మములున్నాయని నేను అనుకుంటున్నాను.
115
చూడండి, పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నట్లయితే, ఆయన మిమ్ములను స్వస్థపరచును. మన వాకిండ్లలో ఉన్న కొత్తవారు స్వస్థపరచబడవలెనని నేను కోరుచున్నాను, వారు వ్యాధిగ్రస్తులు, బాధించబడుచున్నవారు. వారికి నేను దేవుని సత్యమును చెప్పినట్లయితే, పరిశుద్ధాత్మ ఎప్పుడూ ఒకే రీతిగా ఉండినట్లయితే, నాకు వారు తెలియనప్పటికీ ఇక్కడ అనేక వ్యాధిగ్రస్తులు, రోగులు ఉన్నారు, ఆయన నాకు బయలుపరచగలడు. అది మారని పరిశుద్ధాత్మ అయినట్లయితే, ఆ పసరుపురుగులు తినివేసిన ఆ చిన్న మొద్దు ఇంకా ఉన్నట్లయితే, ఆయన దానిని జత చేయును.
సంఘ ఆచారాలు, “ఓ, అదేమి సరికాదని, అది సాతానుకు చెందినది. అదేదో జోస్యం చెప్పడం, జాతకం చెప్పడం,” అని చెప్పుదురు.
ఆయన గురించి వారదే చెప్పారు. “ఇంటి యజమానుని బయెల్జెబుబు అని పిలిచినట్లయితే శిష్యులను ఇంకా ఎంత ఎక్కువగా పిలుస్తారు?” నిజమే. అలాగు పిలవడం ఇంకను ఆగలేదు. అదింకా ఎక్కువైపోతుంది.
116
ఆయన ఇంకనూ దేవుడేనా? ఆయన నిన్న, నేడు, నిరంతరం మారనివాడా? ఆయన తన వాక్యమును గౌరవిస్తాడా? ఆయన గౌరవి౦చును.
మీరింకను యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకోనట్లయితే, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుట అవసరమని నేను మిమ్ములను బలవంతం చేయుచున్నాను. సంఘానికి చెందిన ఆ పాత గుడ్డలు ఏమి చెప్పుచున్నవో నేను లక్ష్యపెట్టను. అది మత....
నేను పరిశుద్ధ గ్రంథమున్న వారితో చదివించుట ద్వారా ఎంతో మందిని సరియైన మార్గములోనికి తెచ్చాను, ఒక్క నిమిషం ఇక్కడకు వచ్చి “తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము ఇవ్వడం ఎలా వాక్యానుసారమైనదో మీరే చూపించండి.
బ్రెన్హా౦ గారు, “అది నాకు తెలుసు, అది నా మీద పెట్టకండి అని,” కొందరు చెబుతారు.
“మీ సిద్ధాంతమును బలపరచే, ఏ ఒక్క దానినైనా బైబిలు గ్రంథము నుండి చూపించండి” అని నేనన్నాను.
117
ఏ నామమున బాప్తిస్మము పొందని వారు కొందరున్నారు. వారు వచ్చి పరిశుద్ధాత్మను పొందుటకు ముందు తిరిగి బాప్తిస్మము పొందవల్సి ఉంది. ఎంతమందికి తెలుసు? పౌలు గారు ఎఫెసీ పైతట్టు తీర ప్రాంతాలకు వెళ్తూ ఆయన బాప్టిస్టు వారిని కనుగొన్నారు. అపొల్లో అను పేరు కలిగిన ఒక మంచి కాపరిని వారు కలిగియున్నారు అతను మార్చబడిన న్యాయవాది, అపొల్లో. “విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా?” అని వారిని నడుగగా.
వారు, “పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి.”
అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందారని పౌలు ప్రశ్నించెను, కింగ్ జేమ్స్ పరిశుద్ధ గ్రంథములో “దేని కొరకు” అని ఉంది. దాని మొదటి దానిలో మీరు చదివినట్లైతే, అది “ఎలా” అని ఉంది. “దేని కొరకు” అనగా, అదే అర్ధం. “మీరు ఎలా బాప్తిస్మము పొందారు?”
“ఏ వ్యక్తి అయితే యేసుకు బాప్తిస్మమిచ్చాడో, ఆ యోహానే మాకు బాప్తిస్మము ఇచ్చాడు.” అది మంచి బాప్తిస్మము. “నీటిలోనికి వెళ్ళి, ఆయనే, బాప్తిస్మమిచ్చాడు.... యోహాను.”
“ఆ బాప్తిస్మము పనిచేయదని,” పౌలు గారు ఎందుకు చెప్పారు? ఇప్పుడు అది ఏ మేలు చేయదు. ఆయన వచ్చాడు, సిలువ వేయబడ్డాడు. బాప్తిస్మమిచ్చు యోహాను ఇచ్చిన బాప్తిస్మము మారు మనస్సుకే గాని, పాప క్షమాపణ కొరకు కాదు. రాబోవు యేసుక్రీస్తును మీరు నమ్ముకోవాలని అని చెబుతూ వచ్చాడు. దీనిని వారు వినినప్పుడు, నీటిలోనికి వచ్చి మరలా వారు యేసుక్రీస్తు నామములో తిరిగి బాప్తిస్మము పొందిరి. పౌలు వారి మీద చేతులుంచగా, అప్పుడు వారు ప్రవచించారు మరియు భాషలలో మాట్లాడారు, ఎందుకనగా పరిశుద్ధాత్మ వారి మీదకు దిగెను. అది సరి. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకొనని వారిని తిరిగి బాప్తిస్మము పొందమని పౌలు బలవంతపెట్టాడు.
అదే చెప్పుటకు నాకు హక్కు కలదు, ఇది అదే సిద్దాంతము.
118
గలతీ 1:8లో పౌలు ఏమి చెప్పెను? ఇప్పుడు, ఆయన అది చేశారు. ఎంతమందికి తెలుసు అది సత్యమని, “ఆమేన్” చెప్పండి. మరియు ఆయన చెప్పాడు, “పరలోకము నుండి వచ్చిన దూతయైనా” సంఘము నుండి లేదా మత శాఖ నుండి వచ్చిన బోధకుడైనా! పరలోకము నుండి వచ్చిన దూత మరియొక సువార్త ప్రకటించినట్లయితే, అతడు శాపగ్రస్తుడు అగును గాక! నేను ఇంతకముందు చెప్పినట్లుగా మరలా చెబుతాను. మేము లేదా పరలోకము నుండి వచ్చిన దేవదూత గాని, ఇప్పుడున్న సువార్త గాక వేరొక సువార్తను బోధీచినట్లయితే. పసరుపురుగు దానిని ఎక్కడ తిన్నదో పరిశీలించండి. చూచారా? ఇప్పుడున్న సువార్తగాక మరియొక సువార్తను ఏ దూతయైనా ప్రకటించినట్లయితే, శాపగ్రస్తుడు అగును గాక!“ అది నిజము. అతడిని ఎంత మాత్రమును లక్ష్యపెట్టకుడి.
ఏ సేవకుడైనాగాని, ఏ మిషనరీ అయినా గానీ, ఏ సువార్తీకుడైనా, మీ యొద్దకు వచ్చి, యేసుక్రీస్తు నామములో గాక మరియొక విధంగా బాప్తిస్మము పొందుటకు బలవంతము చేసినట్లయిన, పౌలు చెప్పినట్లుగా నన్ను చెప్పనీయండి, వాడు శాపగ్రస్తుడు అగును గాక. ఎవరైనా వచ్చి, “బోధకునితో కరచాలనం చేస్తే నీవు పరిశుద్ధాత్మను పొందుతావు,” అని చెప్తే, వాడు శాపగ్రస్తుడు అగును గాక! పరిశుద్దాత్మ నూతన జన్మకు సంబంధించినదైనందున, వారు స్వంత విదానాలను కలిగి ఉండకూడదు.
119
నేనింతకముందు చెప్పితిని, ఎవరకైన తెలుసు, పుట్టుక అనేది గందరగోళము, అది ఎక్కడ జరిగినా, నేను లెక్క చేయను. అది కొట్టు, లేదా గిడ్డంగిలో జరిగినా, ఇంటిలో జరిగినా, ఆసుపత్రిలో జరిగినా, బాగా అలంకరించబడిన గదుల్లో జరిగినా, అది గందరగోళము. పుట్టుక అనేది ఎల్లప్పుడూ ఒక గందరగోళమే.
క్రొత్తజన్మ కూడా ఒక చిక్కుముడే. ఏడ్వడము, పొర్లాడడం, నత్తి-నత్తిగా మాట్లాడటం ఎన్నో జరగాలి. అది చిక్కుముడి అయినా అది జీవాన్ని తెస్తుంది. దీనిని చేయుటకు ఏకైక మార్గము ఇదే.
నీవు కరచాలనం చేయడం లేదా ఏదో సంఘ శాఖ పుస్తకములో నీ పేరు రాసుకొని, “భూమ్యాకాశములకు సృష్టికర్తయైన తండ్రి యందు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నందు, పవిత్రసంఘమైన రోమన్ క్యాథలిక్ సంఘమునందు, పరిశుద్ధుల సహవాసమందు విశ్వసించుచున్నానని” చెప్పవద్దు. ఆ విధంగా నీవు చేసినట్లయితే, నీవు ఆత్మీయవాది గుంపుకు చెందిన వాడవని సాక్ష్యమిస్తున్నావు.
120
చచ్చినవారితో ఎవరు సహవాసము కలిగియున్నా, అది ఏమైనా నేను లక్ష్యపెట్టను, వారు సాతాను సంబంధులే. దేవునికి నరునికి మధ్య ఒకే ఒక మధ్యవర్తి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు అను నరుడు. ఆయన మృతుడు కాదు గానీ సజీవుడు! ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఆయన మరణం నుండి లేచాడు. మిగిలిన క్యాథలిక్ పరిశుద్ధులు మరియు ప్రొటెస్టంట్ పరిశుద్దులు, ఇంకా ఎందరున్నా, వారందరూ చనిపోయి సమాధులలో ఉన్నవారే. వారు మహిమలో ఉండి ఉండవచ్చు. వారు పరిశుద్దలయినట్లయితే, వారు అక్కడ ఉన్నారు. వారెక్కడున్నను నేను లక్ష్యం చేయను; నీవు వారితో సహవాసము చేస్తున్నట్లయితే, ఖచ్చితముగా నీవు దేవుని చట్టాలను ఉల్లంఘించి మరియు పరిశుద్ధుడు కాని ఒక దయ్యముతో కలసి వెళ్ళుచున్నావు. నిస్సందేహంగా! బైబిల్ అలా చెప్పుచున్నది.
121
పసరుపురుగు దానిని కూడా తినివేసింది. ఈ పరిశుద్ధునితోను, ఆ పరిశద్దునితోను, పరిశుద్ద యూదాతోను, సిసీలియా అనే పరిశుద్ధునితోను సహవాసము పెట్టుకోకుండా తన నిజమైన సజీవుడైన ఆత్మ ద్వారా దేవుడు దానిని తిరిగి పునరుద్దరించ బోవుచున్నాడు. అది యేసుక్రీస్తు యొక్క ఆత్మ తిరిగి వచ్చి, అదే పనిని తిరిగి చేయుటకు తన్నుతాను ప్రత్యక్షపరచుకొనును. “నేను తిరిగి పునరుద్దరించెదనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.” దేవా, ఈ దినమున నీకు కృతజ్ఞతలు చెల్లి౦చుచున్నాను. ఇక్కడ సంఘపు తీగలో కొద్దిగా నూతన జీవము చిగురిస్తున్నది; అది తనకుతానుగా ప్రత్యక్షపరచుకొనుచున్నది. ప్రభువు రాకడకు ముందే, సంపూర్ణ సంఘమును దేవుడు మరలా పూర్తి స్థాయిలో పునరుద్ధరించును.
122
ప్రభువైన యేసు, ఈ కూటము నీది. వాక్యమును బోధించువరకు మాత్రమే నేను బాధ్యుడ్ని. అది ఇప్పుడు జరిగినది. అది నీ హస్తములో ఉన్నది, ప్రభువా. అది వెలుగులో ప్రకటించబడినది, ఈ కార్యములు మీరు స్వీకరిస్తారని నేను క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను ప్రభువా. ఎవరి మనస్సాక్షి అయిన గాయపరచబడినట్లయితే, అది గిలాదు తైలము ద్వారా స్వస్థపరచబడును గాక. ప్రభువా, ఇక్కడ కూర్చున్నవారిలో ముగ్గురు దేవుళ్ళ నామములో చిలకరించబడినా, క్రుమ్మరించబడినా, లేక ముంచబడినా, వారు తమ తప్పులను గ్రహించుదురు గాక, ప్రభువా. నేనెంతగా బోధించగలిగినా లక్ష్యము లేదు.
సరి, నీవును అదే విషయమును బోధించి మరియు అదే చేసితివి, అయినను వారి కన్నులింకా గ్రుడ్డివే. “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు.” నీవు బోధించినా, అద్భుతాలు చేసినా, నీవే మెస్సియవని నిరూపించుకున్నా, వారు అలాగే ఉందురని యెషయా చెప్పెను.
123
నేను ఈ రోజు ఈ మాటలు చేర్చబోతున్నాను, నీవెన్నో కార్యాలు చేసినప్పటికీ నీవు నిజమైన వాక్యాన్ని బయటకు తెచ్చినప్పటికీ, అపొస్తలులు వేసిన పునాదిని తిరిగి తెచ్చినప్పటికీ, దానిని ఒక సవాలుగా ఉంచినప్పటికీ, అదే సత్యమని, యేసు ప్రభువు భూమి మీద ఉండగా చేసిన అద్భుతకార్యములు చేసినప్పటికీ ఏమి జరుగుతుంది? వారు నమ్మరు. యెషయా చెప్పినట్లుగా, ఆత్మ ద్వారా పౌలు పలికెను, “ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తలిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్కులు, గర్వాంధులు, దేవునికంటే సుఖానుభవమునెక్కువగా ప్రేమించువారు. అటువంటి వారికి విముఖుడవై వుండుము.”
124
ప్రభువా, మీకు మీరే ప్రత్యక్షపరచుకొని మరియు మీ వాక్యమును ఇప్పుడే మా మధ్య జీవింపచేయుమని ప్రార్ధిస్తున్నాను. యేసు నామమున మేము దీనిని అడుగుచున్నాము. ప్రభువా, మీరు దానిని జరిగించినట్లయితే వారందరూ నమ్మెదరు. మా ఆత్మ మీకు అప్పగించబడినదని నమ్ముచూ, ఈ గుడారము నుండి ఈ ఉదయమున నడచి వెళ్ళుదుము. మీ వివేచన కొరకు మేము చూచుచుండగా, దానిని వారికి పంపి, ప్రతి హృదయముతో మాట్లాడండి. ఆ నిజమైన జీవము పరిశుద్ధాత్మను ఎడబాసినటువంటి ఈ చిన్న తీగలోనికి రానీయండి. ఓ, ప్రభువా, నీ వాక్యమే సత్యమని అది సాక్ష్యమిచ్చునట్లు దానిని శక్తితో నింపండి. ప్రతి ఒక్కరూ అబద్దీకులు, నీవే సత్యవంతుడవు, ఎన్ని వ్యతిరేఖతలు వచ్చినా మీరే సత్యము. చంపినా, వెలివేసినా, ఎన్ని ఉద్యమాలు జరిగినా, నీవు ఒకరినే తీసుకొని నిలబెడతావు; ఆ బీదలైన దేవుని పిల్లలు ఎలాగైనా బయటకు వస్తారు. ఏది ఏమైనా వారు వచ్చి వాక్యము వింటారు.
“నా గొర్రెలు నా స్వరము వినును, అన్యుని అవి వెంబడి౦చవు.” నీ స్వరము, మొదటిసారి నీ గొర్రెను పిలిచినట్లుగా, అది మరలా పిలచుచున్నది. అన్యుని అవి వెంబడి౦చవు. నీ స్వరము, గొర్రెలను పిలచిన అదే స్వరము, “మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి,” అని చెప్పినట్లయితే. నీ గొర్రెలు ఈ రోజును అదే స్వరము వినును. వేరొకడు, “ఓ, అవి అంత్యక్రీస్తు మాటలని చెప్పి, మీరు తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్దాత్మయొక్కయు, నామములో బాప్తిస్మము పొందమని చెబితే,” ఆ కొత్తవారిని అవి అనుసరించవు. వారు నీ స్వరమును ఎరుగుదురు. నీ క్రియల కొరకు వారు ఎదురుచూచుదురు. తండ్రీ అవన్నీ దయచేయుదురని ప్రార్థిస్తున్నాను. నీ కార్యములను అనుసరించునట్లు నీ స్వరము మాట్లాడినది. యేసు నామములో. ఆమేన్.
125
[ఒకరు అన్యభాషలలో మాట్లాడుచున్నారు.]
ఇప్పుడు, పరిశుద్దాత్మ సంచరించుచున్నది. ఈ ప్రజలవైపు నా వెనుక భాగమును చూపించబోవుచున్నాను. ఇప్పుడు ఈ గుడారములో ఉన్న ప్రజలను; నేను ఈ వైపు తిరుగుట మంచిది. ఈ గుడారమునకు సంబంధించిన వారిని నేను కోరుటలేదు; ఇంతకు ముందెన్నడూ ఇక్కడికి రానివారిని నేను కోరుచున్నాను, వేరొక పట్టణము వారు, మీరు ఎక్కడ ఉన్నారో నేను చూచునట్లు, రోగులైయున్నవారు, మరలా మీ చేతులెత్తండి. పరిశుద్ధాత్మ ఇప్పుడు స౦చరించును గాక. నేనెరుగనటు వంటి ప్రజలారా.
126
వారు ప్రార్థనా కార్డులు కలిగియున్నారా? ఏమైనా ప్రార్థనా కార్డులు ఇచ్చియున్నారా... [టేపు పై ఖాలీ.]..... వారు తాకియున్నారు.
ఆయన దానిని కనీసం రెండుసార్లు చేయనీయండి. బైబిల్ చెప్పెను, (ఎంత మంది సాక్ష్యులని చెప్పింది?) “ఇద్దరు లేక ముగ్గురు.” ఔనా? ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యుల నోటి ప్రతి మాట స్థిరపరచబడును.“ అప్పుడు ఇతరులు నమ్ముతారు. నీకు దేనిని గూర్చి అవసరత ఉన్నా దానిని ఇప్పుడే నమ్మండి.
ఆయన దానిని చేసినట్లయితే నీవు చేస్తావా? నీ చేయి పైకెత్తుము, చెప్పుము, “విశ్వాసము ద్వారా నేను పొందుతాను, నేను కేవలము నా చేయి పైకెత్తుతాను. ఇక్కడున్న వారిలో ఎంతమంది చెప్పగలరు, ”దానిని ఇంతకముందు చూడకపోయినా, నేను కూడా విశ్వాసము ద్వారా చేయగలను.“ మీ చేతులెత్తి చూపించండి. దానిని నేను విశ్వాసము ద్వారా పొందుకొనెదను, అని చెప్పుము. ఇక్కడ గమనించండి.
నేనెక్కడ నిలబడ్డానో మీరు చూసారా? ఇప్పుడు ఇక్కడ ఒక సవాలు ఉంది. ఇప్పుడు, ఆయన దేవుడైనట్లయితే, ఆయన తనకుతాను ప్రత్యక్షపరచుకొంటారు. ఇది నిజము కానట్లయితే, నేను అబద్ధికుడను, ఒక అబద్ధ ప్రవక్తను; మీరెన్నడూ వినుటకు నా వద్దకు రావద్దు, ఎందుకనగా నేను అబద్ధ ప్రవక్తను, నేను యేసు కొరకై ఇచ్చిన సాక్ష్యం సరికాదు. నేను బోధించే వాక్యము సత్యము కాదని నీవు నిరూపించలేవు ..... [టేపు పై ఖాలీ.]
127
అమ్మా, నీవు ఈ గుడారము నుండే వచ్చారు కదా? ఓ చిన్న తెల్లటి టోపీని ధరించి నీ చేయి పైకెత్తి యున్నావు. ఔను, మీరు ఇక్కడివారే. నేనది చూచినప్పుడు, ప్రజలు ఆ దర్శనాన్ని లాగుచున్నారు. నేరుగా వారిపైగానే నిలబడి ఆ దర్శనాన్ని చూస్తున్నాను.
అయితే నాకు తెలియని వారు నాకు కావాలి. అమ్మా, ఈ చేతి రుమాలు అలా పైకి చూపుతున్న నీవు, ఈ గుడారములో ఉన్న నీవు వేరొక పట్టణం నుండి వచ్చావా? ఒక్క నిమిషం నీ పాదములపై నిలబడుము. ప్రార్థన చేస్తూ నీవు కూర్చొన్నప్పుడు, అకస్మాత్తుగా ఏదో ఒక వింత అనుభవం నీకు కలిగింది. అది ప్రభువు యొక్క దూతయై ఉన్నాడు. ఇప్పుడు ఆయన నీ ప్రక్కనే నిలబడియున్నాడు. నీలో ఎదో ఆయనను తాకింది. అది ఏదో నాకు తెలియదు. కానీ నీవు వేరే పట్టణం నుండి వచ్చావు. నీవు లూయిస్-విల్ లేదా, టెనిసి లేదా మరేదో పట్టణం నుండి వచ్చారు. అది దేవునికి తెలియును. దేవుడు గనుక నీ హృదయ రహస్యాన్ని బయలు పరచినట్లయితే, నీవు దేవుని వాక్యమును అంగీకరించి, ఆయన చెప్పినట్లు అన్నీ.....? ఆమెన్.
128
మీరు చూస్తున్నట్లుగా, ప్రజలంతా ఆ స్త్రీ వైపే చూస్తున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ, ఆయన ఇంకా పరిశుద్ధాత్మ అయినట్లయితే, ఆయన దానిని తెలియజేయనీయుడి. భయపడకండి. ఆయన దేవుడు. ఆయన వాక్యమును నేరవేర్చును, ప్రతి వాక్యము.
ఆ స్త్రీ నరములకు సంబంధించిన బలహీనతతో బాధపడుతుంది. అది నిజమైతే నీ చేయ్యిని పైకెత్తు, నీకు గుండె సమస్య కూడా ఉంది. అదీ బలహీనమైనదే. నీవు పడుకున్నపుడు, అది చాలా చెడ్డగా నిన్ను బాధిస్తుంది. ఊపిరి ఆడకుండా చేస్తుంది. నీకొకసారి శస్త్రచికిత్స జరిగింది. అది ఇంకా నయం కాలేదు. ఔనా? నీవు ఓహియో నుండి వచ్చావు. నీ హృదయంలో ఏదో బాధ ఉన్నది. అది నీ కుమార్తా? మరొకటా? నీ కుమార్తె తప్పిపోయినది. “ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు,” ఓ స్త్రీ, వెళ్ళి నీవు అడిగిన దానిని పొందుకో. నీవు దేనినో తాకియున్నావు. నీవు నమ్ముచున్నవా?
చేతులెత్తిన వారిలో అలాంటి వారు ఇంకెవరైనా ఉన్నారా?
129
నీ హృదయరహస్యములు దేవుడు నాకు బయలుపరచగలడని నీవు నమ్ముచున్నావా? ఈ ఉదయం నేను బోధించే దేవుడు, ఆ దేవుడే అని నమ్ముచున్నావా? నీపై చీకటి చాయ వ్రేలాడుచున్నది, అది క్యాన్సర్. దేవుడు నిన్ను స్వస్థపరచగలడు అని నమ్ముచున్నావా? నీవు ఓహియోలోని లెబనాన్ నుండి వచ్చిన నీవు తిరిగి వెళ్ళుము. బాగుపడుము, యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుము.
ఇక్కడ నిలబడి ఉన్న ఈ చిన్నది, చర్మానికి దద్దుర్లు కలిగి ఉన్నది. కొంచెం భయానికి గురయ్యావు, ఔనా? నీవు దానిని జయించబోవుచున్నావు. నీవు బాగుపడబోవుచున్నావు, తర్వాత కలుసుకొందాము. ఇంటికి వెళ్ళి చక్కగా ఉండుము.
కొద్ది నిమిషముల క్రితం ఇక్కడ నిలబడి ఉన్న వ్యక్తి ఎవరు? వెనక ఎక్కడో ఒక వ్యక్తి నిలబడెను. దయచేసి నిలువబడుము. నీ సమస్య ఏమిటో యేసుక్రీస్తు నాకు తెలియచేయగలడని నీవు నమ్ముచున్నావా? నీవు అంగీకరించుచున్నావా? నీ మెడలో ఉన్న గడ్డ తొలగిపోగలదని నమ్ముచున్నావా? నీ పక్కనే నీ భార్య కూడా కూర్చొని ఉన్నది, ఆమె నరాల సమస్యతో బాధపడుతున్నది. అది కూడా నిజమే. మీరంతా ఓహియో నుండి వచ్చిన వారే. సోదరుడా, నీ చేతిని ఆమెపై ఉంచుము.
ప్రభువా, వారు స్వస్థత నొంది సంతోషముతో ఇంటికి వెళ్ళుదురు గాక! యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్.
130
[టేపు పై ఖాలీ....] మీ ప్రక్కన మరొకరు ఉన్నారు. నేను వాక్యమును చెప్పుచున్నాను. నేను దేవుని వాక్యమును చెప్పుచున్నాను, నా మాటలు కావు . నీవు ఇప్పుడు దానిని నమ్ముచున్నావా? నమ్మువారందరు, “ఆమేన్” చెప్పండి. దేవుని వాక్యము ప్రత్యక్షపరచబడియున్నది, అది సత్యము. ఇప్పుడు మీరు తలలు వంచండి.
ప్రభువా, ఈ ప్రజల కొరకు ప్రార్ధన చేయుచు నేను యేసుక్రీస్తు నామములో మీ వద్దకు వచ్చియున్నాను. ప్రభువా, ఆలస్యమైనది. అది మేము ఊహించిన దాని కన్నా ఇంకా ఆలస్యమే; క్రీస్తు రాకడ సమీపముగా ఉన్నది. మీ కృపా బాహుళ్యతలు విస్తరించాలని మేము ప్రార్ధిస్తున్నాము. ప్రభువా వారి స్వస్థతను వారికి అనుగ్రహించండి. నేను అపవాదిని ఖండించుచున్నాను; దేవుని వాక్యపు వెలుగులో ఆయన దేవుని కుమారుడని, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు; ఆ యొక్క నీటి బాప్తిస్మము యేసుక్రీస్తు నామములోనే సత్యమైయున్నది.....