దాక్షావల్లి ఎక్కడ నాటబడాలో మరక్కడే అది నాటబడాలి
VGR COUNT -167 మా హృదయమును అలాగే మా అవపరతలన్నిటిని ఎరిగినవాడవు నీవే. ప్రార్ధన ద్వారా వాటన్నిటిని నీ యొద్దకు తీసికొనువచ్చు అవకాశమును బట్టియు, నీవు అర్థం చేసికొనగలవాడవని, నీ మంచితనమును బట్టి వాటన్నిటిని మాకు అనుగ్రహించెదవని తెలిసియుండుటను బట్టి మేమెంతో సంతోషించుచున్నాము. వాటిని పొందుటకు మేము యోగ్యులము కాదు, కాని కేవలం వాటిని నీవు మాకు వాగ్దానం చేసినందునే వాటిని మేము పొందెదము, ఈ ఉదయవేళ సంఘములో అవసరతలో ఉన్నవారికి, అనారోగ్యంగా వున్నవారికి ఎన్నో విన్నపములున్నవని నేను నిశ్చయముగా చెప్పగలను. గనుక ఇప్పుడే వాటిని వినయముతో నీ యొద్దకు తెచ్చుచున్నాము, వారిలో ప్రతి ఒక్కరి మీద నీ కృపాకనికరములు నిలవాలని అడుగుచున్నాను.
వ్యాధి నుండి కోలుకోనందున ఈ ఉదయకాలం మందిరానికి రాలేకపోయిన వారికొరకు కూడా ప్రార్ధించుచున్నాము. అలాగే ఇక్కడ కూడుకొన్న వారందరి కొరకు కూడా ప్రార్ధించుచున్నాము. వారిప్పుడు కుర్చీలలోను, చక్రాల కుర్చీలలోను, చంక-కర్రలతోను ఉండుటను మేము చూచుచున్నాము. వారికి నీ కృప కావాలి. వారికి సమృద్దిగా దానిని అనుగ్రహించమని, ప్రభువా, మేము ప్రార్థించుచున్నాము. వారిక్కడ నుండి పూర్తిగా స్వస్థపడి ఆరోగ్యవంతులై ఆనందముతో బయటకు వెళ్ళుదురు గాక. తమ బాధలను తెలియజేయని అనేకుల కొరకు, బహుశా వారిలో కొందరు గుండెజబ్బులు గలవారై మరణశయ్యపై వుండి వుండవచ్చునేమో, లేదా క్యాన్సర్ లేదా ఇంకా భయంకరముగా దయ్యము చేత పీడించబడినవారై ఉండవచ్చును. ఈ ఉదయం ఆ దయ్యములన్ని తొలిగిపోవాలని నేను ప్రార్ధించుచున్నాను. వారిచ్చట నుండి బాగుపడి, ఆనందముతో వెళ్ళుదురు గాక.
2
చనిపోబోవుచున్న ఆ చిన్న బాలున్ని మేము జ్ఞాపకము చేసికొనుచున్నాము, నీ కృప లేనిచొ, ఆ పిల్లవాడు క్యాన్సర్ తో చనిపోబోవుచున్నాడని ఒక ప్రియుని ద్వారా మాకు చెప్పబడినది, అయితే నీ కృప పిల్లవానియెడల రానివ్వమని, ఓ ప్రభువగు దేవా, అడుగుచున్నాము, నీ జాలి బిడ్డ మీదకు రానిమ్ము. ప్రభువా, నీ దైవీక చిత్తములో ఉన్నట్లేయితే నిశ్చయము అది ఆ బిడ్డ మీదకు రానిమ్ము, విడుదల దయచేయుము. ఆ బిడ్డ నీ రక్తమును అంగీకరించియున్నాడని, తానొకవేళ చనిపోతే తనను ఎరుపుమయముగా పూడ్చిపెట్టమని, తద్వారా తాను రక్తము చేత కప్పబడితినని అందరు తెలిసికొందురని ఆ బాలుడు చెప్పిన సాక్ష్యమును బట్టి మేమెంతో సంతోషించుచున్నాము. ప్రభువా, అటువంటి చిన్న హీరోల యొక్క ధీరత్వముగల విశ్వాసమును బట్టి, ప్రభువా, నీకు కృతజ్ఞతలు, వారు జీవితగమ్యాన్ని చేరుకొనుటకు ముందుకు సాగుచుండిరి, సిలువను హృదయములోనికి హత్తుకొనుచుండిరి, అక్కడ రక్తపు గుర్తును చూపుచుండరి. ప్రభువా, వీలైతే ఆ చిన్న బిడ్డ ప్రాణాన్ని రక్షించండి, అతడిని బ్రతికించండి. ఇతరుల నిమిత్తం అడుగుచున్నాము.
3
మరలాగే ఈ ఉదయకాల కూటము కొరకు ప్రార్ధించుచున్నాము. ఇంకా ఎవరైనా నిన్ను తమ సొంత రక్షకునిగా ఎరుగకుంటే అట్టివారు ఒకవేళ ఇక్కడున్నట్లైతే, ఒక రక్షకునిగా తమ జీవితములకి నిన్ను ప్రశస్తముగా ఎంచుకొనే విధముగా ఈ దినముండును గాక. ఎవరైతే స్వస్థత కావాలని కోరుచున్నారో, అట్టివారు నిన్నొక స్వస్థపర్చువానిగా కనుగొందురు గాక.
ప్రభువా, ఈ ఉదయకాలము నీవు నీ సేవకుని యొద్దకు వత్తువు గాక. నిన్ను నేను ఒక ప్రసంగీకునిగా కనుగొందును గాక. ప్రభువైన యేసు నామమున వీటన్నిటిని నీకు సమర్పించుచు, వీటికి జవాబునివ్వవల్సిందిగా అడుగుచున్నాము ఆమేన్.
4
ప్రభువు మందిరములోనికీ, జేష్టుల సంఘములోనికి వచ్చుట ఎల్లప్పుడు మనకి ఆనందదాయకం. ఎప్పటివలె నేను ఆలస్యమైతిని. చకచకా నడిచి వస్తే తప్ప ఇక్కడికి చేరలేనేమోననుకొంటిని. భార్యకు ఇదొక మంచి హాస్యం; ఆమె ఇక్కడే ఎక్కడో కూర్చొనియున్నది.
ఈ ఉదయం నేను ఇంటియొద్ద క్రిందిభాగాన ధ్యానించుచుండగా, ఆమె బయలుదేరి చర్చీకి వచ్చేసింది. “బిల్లీ, నేను ఇంటికి తాళం వేసికొని వెళ్తున్నా,” అని చెప్పి వచ్చేసింది. అనంతరం నేను కూడా చర్చీకి బయలుదేరుటకు నా కారు కొరకు గ్యారేజి దగ్గరకు వెళ్ళాను, అయితే వాటి తాళాలు కూడా ఆమె తనతో పట్టుకొనిపోయిందని అప్పుడు నాకు అర్థమైంది. కనుక నేను బయలుదేరే అవకాశము లేకుండా పోయింది. అదోక ఘోరమైన పరిస్తితి.
కొద్దిసేపటి తర్వాత, బిల్లీ కూడా నన్ను పట్టించుకోకుండా వచ్చేసాడు, నేనెంత సేపటికి రాకపోయేసరికి, నా ఆలస్యానికి కారణం తెలిసికొనుటకు అతడే నాకు ఫోన్ చేసాడు.
అప్పుడు నేను అతడితో, “నువ్వు త్వరగా నా దగ్గరకు రా, చర్చికి వచ్చుటకు నాకు ఏ అవకాశం లేకుండెను,” అంటిని. వెంటనే అతడు నన్ను తోడుకొనిపోవుటకు నా దగ్గరకు వచ్చాను... ఎట్టకేలకు ఇక్కడికి చేరుకొన్నందకు నాకు చాలా సంతోషంగా వుంది.
5
కావున నేను ఆలస్యమైతిని. అయితే ఆవలి గట్టుకి మనం చేరినప్పుడు, మీకు తెలుసా, అక్కడ ఇక సమయ మనేది ఎంత మాత్రం ఉండదు, సమయమనే దానిని మరచుట ఆరంభింతుము. అదంతయు నిత్యత్వములో కలిసిపోవును, ఇకెంత మాత్రం కాలమనేది ఉండదు. కాలపరిమితీ అనేది ఇక ఉండనే ఉండదు. ధీర్ఘంగా బోధించిన ఆ రాత్రి పౌలు మనస్సులో బహుశా ఇదే ఉద్దేశ్యం ఉండి ఉండవచ్చును, అప్పుడు వాక్యము వింటున్న ఒక పడుచువాడు, కునికి పైనుండి క్రిందపడి ప్రాణం విడిచెను. పౌలు తన దేహమును అతని దేహముపై ఉంచినప్పుడు, ఆ పిల్లవాని ప్రాణం తీరిగి వచ్చాను.
ఈ ఉదయకాలము, ప్రతిష్టింపబడుటకు ఒక బిడ్డ ఉన్నదని ఇప్పుడే పాస్టర్ నాకు చెప్పినని నేను నమ్ముచున్నాను. ఆ బిడ్డ బహుశా బాలుడో లేక బాలికో, ఎవరైనా సరే ఇక్కడికి ఆ తల్లి తీసికొని వచ్చినట్లయితే మనం ప్రభువుకి ప్రతిష్టించేదం.
చిన్న బిడ్డలను ప్రభువుకి ప్రతిష్టించే కార్యమంటే నాకు చాలా ఇష్టం. (బ్రదర్ నెవిల్, దయతో మీరు ముందుకు రాగలరా?)
6
శుభోదయం సహోదరీ, ఈ చిన్నబాలుని పేరేమిటి? ఫ్రాంక్ వేన్ డాబెన్. ఫ్రాంక్ వేన్ డాబెన్, రాబర్ట్ డాబెన్! మీరేమైనా బంధువులా? ఫ్రాంక్ వేన్ డాబెన్, సరే, బాబు ప్రాయమెంత? ఎనిమిది వారాలా? ఈ కుర్రలోకంలో ఇతడు ఎక్కువ కాలం ఉండలేడు. మంచిది, ఇతడు మీ కలయిక యొక్క ప్రతిఫలము. ఆయన సేవకుడిగా వుండేందుకు ఇప్పుడు నీవితడిని ప్రభువుకి అప్పగించగోరుచున్నావా, అది నిజమేనా? సహోదరి? దేవుడు నిన్ను దీవించును గాక. మంచిది, ఇక్కడ నేను ఒక చిన్న ఐశ్వర్యము ఎత్తుకొన్నాను, నిజంగా చక్కని వాడు. ఆ చిన్న ఫ్రాంక్ డాబెన్ ను ఒకసారి చూడండి.
ప్రియ పరలోకపు తండ్రీ, ప్రభువైన యేసుగా పిలువబడుచు ఒక మనిషిగా నీవు ఈ భూమి మీద నడుచుచున్న దినాలలో వారు నీ యొద్దకి చిన్న బిడ్డలను తీసికొని వచ్చారు. మరి నీవు వారి మీద చేతులుంచి, వారిని ఆశీర్వదించి, ఇలా అంటివి, “చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యుడి, వారిని ఆటంకపర్చకుడి, దేవుని రాజ్యము వీరి వంటిదే.” ఈ తల్లి ఉదయకాలం ఈ బిడ్డను నా చేతులలో వుంచినది, కావున నేను ఇతడిని నీకు సమర్పించుచున్నాను. ప్రభువా, ఈ చిన్న బిడ్డను నీవు దీవించమని ప్రార్ధించుచున్నాను. అతడి గృహమును దీవించండి. క్రైస్తవ గృహములో ఇతడు పెంచబడును గాక. దేవునియందు భయభక్తులు గలవాడిగా ఇతడు పెరుగును గాక. రేపు అనేది వున్నట్లయితే నీ ద్వారా అభిషేకించబడినట్లయితే, ఇతడు నీ సువార్తను ప్రకటించును గాక. దీర్ఘాయువును మరియు ఆరోగ్యములను అనుగ్రహించండి. అతడి తల్లిదండ్రులను ఆశీర్వదించండి. నీవు వాగ్దానము చేసిన ప్రతి మంచి ఈవీ ఈ బిడ్డ మీదకి వచ్చును గాక, ఈ సంఘము యొక్క పెద్దలుగా మాకు ఈ బిడ్డను తల్లి అప్పగించినది. మరిప్పుడు మేము ఇతడిని నీకు సమర్పించుచున్నాము. యేసుక్రీస్తు నామమున నీవు ఈ బిడ్డను దీవించుము. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును గాక చిన్న ఫ్రాంక్. వారెంతో మధురమైన వారని నాకనిపించుచున్నది.
7
అభిషేకం నా మీద ఉన్నప్పుడు నేను వారినిమిత్తం ప్రార్ధించువాడినై యుండవల్సివుంది. ప్రార్ధించబడుటకు మన దగ్గర ఇక్కడ కొన్ని చేతిగుడ్డలున్నవి, అయితే రోగుల కొరకు ప్రార్దించేటప్పుడు, ఆ పరిచర్య చేయునప్పుడు వచ్చే అభిషేకమున్నప్పుడు వీటికొరకు ప్రార్ధించెదను. అవును, అప్పుడు వీటికొరకు ప్రార్ధించటం మంచిదని నా అభిప్రాయం.
ఇక్కడ లోపల నా స్నేహితులలో అనేకులను చూచుట నాకెంతో సంతోషంగా వుంది. ఈ కూటంలో ఆ వెనుక బ్రదర్ చార్లీ కాక్స్ ని చూచుచున్నానని నేను అనుకొనుచున్నాను. మరలాగే లూయిస్-విల్ నుండి వచ్చిన బ్రదర్ జాన్ ఓ బానన్ ను కూడా చూస్తున్నాను. అలాగే నేను గుర్తుపట్టగల అనేకమంది స్నేహితులను చూస్తున్నాను. ప్రభువుని సేవించుటకు ఈ ఉదయకాలం మాతో కూడి వచ్చినందుకు, మాతో మీరు ఉన్నందుకు మేమెంతో సంతోషించుచున్నాము.
కొద్ది దినముల పాటు ఒక ఉజ్జీవమును ఆరంభించుటకు మనమెంతో ఆశగా ఇప్పుడు ఎదురు చూచుచున్నాం. కడవరకు ఇది వుండునట్లుగా మనం ప్రార్థించుచున్నాము, ఒకవేళ దేవుడు ఉజీవము ఇవ్వకపోతే, దానిని మన హృదయములో ఉంచకపోతే, అప్పుడు ఉజ్జీవమనేది మన సొంత ప్రయత్నముల కృషి మూలముగా వచ్చినదైయుండునని నేను భావించుచున్నాను. అలా కాకుండా ఉజ్జీవమును దేవుడే ఇచ్చేటంత వరకు మనం వేచివున్నట్లేతే, ఉజ్జీవమును పంపే సమయము వచ్చినప్పుడు స్వయంగా దేవుడే దానిని పంపియుండినట్లైతే, అప్పుడు ఆయనే మన హృదయములను ప్రేరేపించును. అప్పుడు ఉజ్జీవమును కలిగియుండాలనే తలంపును మనము కలిగియుండెదము.
8
చర్చీ ట్రస్టీలలో ఒకరైన మిత్రుడగు బ్రదర్ ఉడ్ యొక్క తల్లిదండ్రులు ఇక్కడ కూర్చొని యుండిరి. ఈ ఉదయం వారిని కలిగివుండటం మనకి సంతోషం.
నిన్న వీధిలో వెళ్ళుచుండగా, ఈ పట్టణములోనే నివాసమున్న ఒక వ్యక్తి నాకు తారసపడ్డాడు. ఒకరకంగా అతడు కఠినుడనే చెప్పాలి. నేనెల్లప్పుడు అతడిని ఇష్టపడుదును, మంచి బాలుడు, నేను నా భార్య అతని పక్కింట్లోనే జీవించితిమి. అతడొక పాటగాడులాంటివాడు, ఒక సంగీత కారుడు. అతడు అక్కడ కూర్చొనుచూ, నెత్తి మీద పెద్ద కౌబాయ్ టోపి పెట్టుకొని, కాళ్ళతో లయబద్దంగా దరువు వేస్తూ ఫిడేలు వాయించేవాడు. అతడు డబ్ల్యూ.పి.ఏ అనే దాని కొరకు పని చేస్తుండేవాడు. ఒక రోజు ఒక కార్యము జరిగినది, అదెల్లప్పుడు నాకు గుర్తువచ్చేది, నా మనస్సులో అలా ఎంతోకాలం వుండిపోయింది. అది నేనెన్నడు మరచిపోను.
9
అదేమిటంటే అతడికి అనేకమంది సంతానం. పిల్లలందరు పసిప్రాయులు, చక్కని భార్య వుంది. ఒకప్పుడు మనందరివలే వారు కూడా అప్పుడు ఎంతో నిరుపేదలు. డబ్ల్యూ.పి.ఏ వారు పంపే జీతపు చెక్కు కొరకు వారంతా(పిల్లలు) వరసగా మెట్ల మీద నిలబడి వుండటాన్ని నేను చూచితిని. పోస్టుమాన్ దానిని తెచ్చేవాడు, అది వచ్చినప్పుడు వారెంతో సంతోషపడేవారు, ఎందుకనగా మరుసటి దినము ఈస్టరు గనుక తండ్రి యొక్క చెక్కు వచ్చినప్పుడు వారు దానితో ఈష్టరు క్యాండీ, మరలాంటివి కొనుక్కొనేవారు. ఒకవేళ పోస్టుమ్యాన్ ఎప్పుడైనా చెక్కులేకుండా వచ్చినట్లైతే, ఆ పసివారి ముఖము నిరాశపడును, అటువంటి నిరుత్సాహం నన్నెప్పుడు బాధించునట్టు వుండును.
ఎన్నో ఏండ్లు అతనిని నేను చూడలేదు, కాని నిన్న వీధిలో వచ్చుచుండెను, అప్పుడు నేను, నా భార్య కలిసి సూపర్ మార్కెట్ నుండి క్యూకర్ మెయిడ్ దిగువ పట్టణము నుండి వచ్చుచుంటిమి, అప్పుడు అతడిని ముఖాముఖిగా చూచితిమి. అప్పుడు వారు చెప్పిన మొదటి సంగతేమిటంటే, అతడు ఇప్పుడు ఒక క్రైస్తవుడయ్యెనట. అతడు త్రాగుడు మానేసి చాలా ఏండ్లు అయ్యిందట. శ్రీ. లాగ్స్టన్, నీవు ఈ ఉదయకాలం ఇప్పుడు చర్చీలో మాతో కలిసి వుండటం నాకెంతో సంతోషముగా వుంది. ఇండియానాలోని చార్లెస్ టౌన్ నందుగల బ్రదర్ జూనియర్ కాష్ యొక్క సంఘ సభ్యునిగా అతడున్నాడు. చాలా మంచి సహోదరుడు. లోకములో వుండుట కంటే, ఒక క్రైస్తవునిగా ఉండుట ఎంతో శ్రేష్టము. కాదంటారా? ఇప్పుడు, అతడు ప్రభువు మహిమ కొరకు ఆయా కార్యక్రమాలలో పాడుచూ సంగీతమును అందించుచున్నాడని అనుకొంటున్నాను. అతడు దేవుని ఆశ్చర్యకృప యొక్క మరొక చిహ్నమైయున్నాడు.
శ్రీ. లాగ్స్టన్, దయచేసి ఒకసారి లేచి నిలబడగలరా? ఏమనుకోకండి... ఇతడు ఒకప్పుడు త్రాగుబోతు. మీకు తెలుసా, ఇతడు ఒకప్పుడు వీధుల్లో ఫిడేలు పొయించేవాడు. అయితే ఇప్పుడు అదంతయూ దేవుని రాజ్యము వైపు త్రిప్పబడినది. ఇక్కడ బయట అతడు ఇలా అనుచున్నాడు “ప్రభువా, దీని కొరకు వందనములు.”
10
ఓ, నిన్న శ్రీ. ఉడ్ తో నేను చెప్పుచుంటిని. నేనన్నాను, “నీవు మరియు తల్లి ఆవలిగట్టుకి చేరినప్పుడు, నీ ఇంటికి చేరినప్పుడు, మరి ఒక శుభోదయాన నీవు నిజంగా ఆనందముగా ఉన్నప్పుడు, ఆ అందమైన కొండల ప్రక్కన, ఆ పల్లమునందు మరటువంటిదానికి చేరినప్పుడు, ఆ వరండాలో నిలిచినప్పుడు, ఆ చోటంతా ప్రతిధ్వనించునట్లు ఈ విధంగా పాడుదును.
ఆశ్చర్యకరమైన కృప, మధురమైన స్వరము,
నా వంటి నీచుని రక్షించెను!
ఒకప్పుడు నేను నశించినవాడను, కాని ఇప్పుడు కనుగొనబడితిని,
ఒకప్పుడు గ్రుడ్డివాడిని, కాని ఇప్పుడు చూచుచుంటిని.
నేను శ్రీ. ఉడ్ తో, “మంచిది, అమ్మ భుజం తట్టి దేవునికి స్తోత్రం, 'ఆ పాత బ్రెన్హాం దీనిని చేసెను. అదిగో ఆ దిగువ ఉన్న ఇంటిలో అతడు ఉన్నాడు,'” అని అన్నాను. నేను అక్కడకి చేరుకున్నట్లైతే, అది కేవలం ప్రభువైన యేసు యొక్క ఆశ్చర్యకరమైన కృప అయి ఉన్నది.
11
వాక్యమును తెరుచుటకు ముందు ఒక నిమిషం మనమంతా శిరములు వంచుదుమా.
ప్రభువా, మేము ఒక పిల్లల గుంపువలె వున్నాము. మాకు కూడా సగటు అక్కరలు, మరియు అన్ని రకాల భావాలు, మరియు సహవాసము, మొదలగువాటిని మేము కలిగియుంటిమి. ఇప్పుడు కూటములలో అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టం తప్పిపోని దేవుని వాక్యమును చదువుట అనే దాని యొద్దకు వచ్చుచున్నాము. ప్రతిమాట ద్వారా నీవు మాతో మాట్లాడమని, ప్రభువా, నిన్ను అడుగుచున్నాను. అది బయటకు వెళ్ళి, జనుల హృదయములలో నాటబడి, అది దేనిని ఉద్దేశించెనో దానిని అనగా, ఆ పంటను కోయునట్లు చేయుము, గొప్ప పరిశుద్ధాత్మ మా మధ్యకు వచ్చి చదువబడే ఈ మాటలను తీసికొని మా అందరికి వాటిని విరిచి పంచును గాక, ఆయన నిమిత్తం వీటిని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
12
కీర్తనలు 80లో నుండి ఒక భాగమును నేను చదువగోరుచున్నాను.
“ఇశ్రాయేలునకు కాపరీ, చెవియొగ్గుము మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము.
ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అనువారి యెదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింపరమ్ము.
దేవా, చెరలో నుండి మమ్మును రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము.
యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, ఈ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరానిచ్చెదవు?
కన్నీళ్ళు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్ళు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు.
మా పొరుగువారికి మమ్ము కలహకారణముగా జేయుచున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మును అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మును రప్పించుము. మేము రక్షణ పొందునట్లు వీ ముఖకాంతి ప్రకాశింపజేయుము.
నీపు ఐగుప్తులోనుండి యొక ద్రాక్షవల్లివి తెచ్చితివి అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి.“
ఈ ఉదయకాలం నా అంశం కొద్దిసేపు ప్రభువు దానిని అనుమతిస్తే, “ద్రాక్షవల్లి ఎక్కడ నాటబడాలో మరక్కడే అది నాటబడాలి,” అను దాని మీద ఉండబోవుచున్నది.
13
లేఖనాలలో అనేకచోట్ల దేవుడు తన ప్రజలను అనేకరీతులుగా పోల్చి చెప్పటం ఆశ్చర్యంగా వుండును. ఈ మద్యనే ఒక చోట దేవుడు స్వయంగా తానే తల్లి-పక్షిరాజుగా వుండి, మనల్ని తన పిల్ల-పక్షిరాజులుగా పోల్చుకొనుటను చెప్పుకొన్నాం.
ప్రతీది చక్కగా ఇమిడి వుండునని నా నమ్మకం. క్రితంసారి నేను దానిమీద బోధించినప్పుడు, దానివిషయమై నాకొక ఉత్తరం వచ్చినది. ఆ గొప్ప పట్టణము, మీలో అనేకులకి అదీ తెలియును, అది ఒహాయో రాష్ట్రంలో వున్నది, అచ్చట సేవకుల సమితి నా కూటములను కరాఖండితముగా తృణీకరించెను, ఎందుకనగా దేవుడు ఒక మనిషిని భూమికి పునాదులు వేయనప్పుడే ఎన్నుకొన్నాడని నేను చెప్పే బోధ వారికి నచ్చలేదు, దానిని వారు అంగీకరించలేదు. చూడండి, దేవుడు దేవుడుగా పిలువబడాలంటే, ఆయన దేవుడుగా వుండాలంటే, ఆయన నేడును అలాగే ఎల్లప్పుడు ఒకేలా ఉండవల్సివుంది. జగత్తు పునాదికి ముందే ఆయన నన్ను ఎరిగియుండకపోతే మరి ఆయన దేవుడుగా ఉండజూలడు. ఈ మూఢ నమ్మకముపై మీలో అనేకులు ఫెయిర్ గ్రౌండ్స్ నందు, తదితర చోట్ల చదివియున్నారు. అయితే వారిలో కొందరు నా పరిచర్య మీద ఎగిరిపడ్డారు.
14
మీలో ఎవరైనా, ఎప్పుడైనా పురాణగాధను చదివారా, దానిని చదివే విధానం ఎరిగియున్నారా, పురాణ(కల్పన)గాధ (Myth: అనగా వాస్తవంగా ఉన్నట్టు వుంటుంది, కాని అది వాస్తవం కాదు.) మరి లేఖనాలలో యెన్నై యంబ్రేలు అనువారు కూడా మోషేకి విరోధంగా నిలబడి మోషే చేసినట్టే వారు కూడా తమ కర్రలను నేల మీద వేసి పాములుగా వాటిని మార్చినట్టు మనం చూడగలం. మోషే తెగుళ్ళను పిలిచాడు. మరి వారు కూడా అలాగే తెగుళ్ళను పిలిచారు. ఆయితే వచ్చిన ఆ తెగుళ్ళను వారు తీసివేయలేకపోయారు. వారు స్వస్థపర్చలేకపోయారు, కారణం స్వస్థపర్చగలిగేది కేవలం దేవుడు మాత్రమే. వారు తెగుళ్ళనైతే పిలువగలిగారు కాని తీసివేయలేకపోయారు. అయితే ఆ పనిని మోషే చేయగలిగాడు.
చివరి బలపరీక్ష వచ్చినది, అక్కడ మోషేకి దేవుడేమి చెయ్యమని చెప్పాడో మోషే సరిగ్గా దానినే చేసెను. ఈ లోకము, అందున్న ప్రతీది చివరికి ఒక గొప్ప బలపరీక్షకు వచ్చునని ఎరుగుదుము. బైబిల్ చెప్పుచున్నది, “యన్నే, యంబ్రే అనువారు మోషేని ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సును కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై, సత్యమును ఎదురింతురు. అయినను వారి అవివేకమేలాగు తేటపడేనో అలాగే వీరిది కూడా అందరికి తేటపడును.” ఇది నెరవేర్చబడవల్సిన ప్రవచనము, ఇరుప్రక్కల ఎదురించుటను నీవు చూడవచ్చును.
15
దేనిని చెయ్యమని దేవుడు చెప్పినో, సరిగ్గా దానినే మోషే చేసెను. అతడు కర్రను నేలమీద పడవేయగా ఆది పాము అయ్యెను. అలాగే ఈ జోతిష్యులు బయటకు వచ్చి, తమ చేతికర్రలను నేల మీద పడసిరి, అవి కూడా పాములయెను.
మోషే తన జ్ఞానము యొక్క, మరియు బలము యొక్క ముగింపు దశలో ఉండెను. దేవుడు అక్కడికే మనల్ని రావాలని దేవుడు కోరుచున్నాడు. మనం మార్గము యొక్క ముగింపుకి రావల్సి ఉంది. అప్పుడు ఆయన రంగం మీదకి వస్తాడు. అది సరిగ్గా ఆయనవలే ఉన్నది.
ఈ ఉదయం బహుశా నీవు బాగా జబ్బుగా పడి వుండొచ్చును. నీవింక బ్రతుకవని వైద్యులు చేతులెత్తి ఉండొచ్చును. మునిగిపోతున్న వ్యక్తి చిన్న పుల్ల పట్టుకొనట్టు, మనం దానిని పొందుటకు ప్రయత్నించు విధానములో వుండును... మానవపరంగా మనం చేయవల్సిన ప్రయత్నాలన్ని చేయుదుము. కాని ఇక ఆశల్లేవు అనేచోటుకి వచ్చినప్పుడు, దైవిక స్వస్థతను నమ్మనోడు కూడా ఇక తప్పక దానిని నమ్మి తీరాల్సిందే. వారికి ఇంక వేరే మార్గం లేదు.
మోషే తన మార్గము చివరనుండెను, అప్పుడు దేవుడు రంగప్రవేశం చేసి, మిగతా సర్పములన్నిటిని తన సర్పము మ్రింగివేయునట్లుగా చేసెను. అప్పుడు అతని సర్చము ఇక ఎన్నడూ లేకుండెను.
16
ఇప్పుడు, గొప్ప సంవేదనాత్మక(జ్ఞాన)దృష్టిలో, అలాగే పురాణ-గాధలో, మరలాగే ఆధ్యాత్మిక కోణంలో.... నేను నా అంశాన్ని ఆరంభించుటకు ముందు, దేవుని సహాయం వలన ఈ సంగతిని మీకు తేటపర్చెదను. దయ్యము సంగతులను సరైనవిగా చూపించును, కాని అవి సరైనవి కావని ఎల్లప్పుడు నిరూపణ అగుచుండెను.
ఇప్పుడు, వారికి కనబడు ఈ ఆత్మల యొక్క చిత్రములను ఎన్నడు వారు పొందలేకపోయారు, ఎందుకనగా నిజానికి అవక్కడలేవు. కాని ఆయన దేవుడు అని విజ్ఞాన శాస్త్రము రూపించే ఒక సమయం వచ్చినప్పుడు, ఫోటోలు తీసికొనేందుకు ఆయన అనుమతించెను; అది ఎన్నటికి వ్రేలాడుతూనే వుండును. దానిని పరీక్షించినవాడు ఇలా అన్నాడు, వెలుగు ఆ లెన్సు కోణములను తాకింది; వాస్తవంగానే ఆ వెలుగు అక్కడ వుండినది; అది మానసిక శాస్త్రం కాదు. కావున మీరు చూచారా దేవుడు చేసినది ఎప్పటికి నిలచియుండును.
మోషే సర్పము మిగతా వారి సర్పములను మింగివేసినది. దానిని ఆయన తన చేతుల్లోకి తీసికొని పట్టుకోగలడు, కాని వారి సర్పములు ఆ కట్టెలోనే వుండిపోయెను.
దయ్యము చేసేదంతా ఒక పురాణ-గాధ; దేవుడు చేసేది నిశ్చయంగా వాస్తవం. కావున ఇది మీ హృదయములలో దృడంగా లోతుగా నాటబడాలని నేను కోరుచున్నాను. ఒక వ్యక్తిని దేవుడు రక్షించినప్పుడు, అతడు రక్షించబడతాడు. వెనక్కి పడిపోవుటను గూర్చి చింతించకము, నీవు నశింపువు. దేవుడు చేసేదేదైనా అది నిత్యమైనదిగా ఉండును. నీవు రక్షించబడినావని నమ్మునట్లు దయ్యములు నిన్ను భ్రమపర్చును, అయితే దేవుడు నిన్ను వాస్తవంగా రక్షించినప్పుడు, అది నిలిచినంత కాలం నీవు దానిని కలిగియుండెదవు, ఎందుకనగా నీవు నిత్యజీవము పొందుకొంటివని యేసు చెప్పెను. “నా మాటలు విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు, వాడు ఎన్నడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి యున్నాడు.” దేవుడు ఏ విధంగా నిత్యమైనవాడిగా యుండియున్నాడో, అదియు అలానే వుండియుండెను, ఎందుకనగా అది ఆయన వాక్యమైయున్నది.
17
దేవుడొక్కడే. వేరే వాటిలోకి అయన కలగలుపు కాడు. ఆయన విభాగింపబడడు. దేవుడు దేవుడైయున్నాడు. “నా యెదుట ఏ దేవుడును నీవు కలిగియుండరాదు,” అనేది ఆజ్ఞలలో మొట్టమొదటిది. చూశారా, నీటిని నూనెను కలిపి నీవు పనిచేయించజూలవు. ఉంటే అది నూనెగానైన ఉండాలి, లేదంటే నీరుగానైన ఉండాలి. మరి దేవుడు ఇంకను అదే దేవునిగా ఉండెను, మనమొక మతమును కలిగియున్నాము. “ఒకప్పుడు దేవుడు దీనిని చేసాడు, నేడయితే అది చేయడు,” అని అందురు. అలా నీటిని నూనెను ఒకటిగా కలిపి ప్రయత్నించెదము, ఎందుకనగా “ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని,” లేఖనము సెలవిచ్చుచున్నది. అవిశ్వాసమును, విశ్వాసంతో అది కలపజాలదు. మనం దేవునియందు విశ్వాసముంచాము. అది నిత్యమైనది, అవిశ్వాసమనేది ఎప్పుడు వుంటూ వచ్చినది, అది ఏదేను తోటలో నుండి పుంటూవచ్చింది. ఆయన ప్రజలు ఎల్లప్పుడు దీనిని నమ్మాలని దేవుడు కోరుచున్నాడు. ఆయన తన ప్రజలయందు ఎల్లప్పుడు తన్నుతాను కనబరచుకోవాలని కోరుచున్నట్టు నీవు దేవున్ని నమ్మాలి. దేవుడొక ఆత్మ.
18
పరిశుద్ద యెహాను 15 మొదటి వచనంలో యేసు చెప్పెను, “నేను ద్రాక్షవల్లిని మీరు తీగెలు.” ఇప్పుడు ద్రాక్షావల్లితో తీగెలు కలుపబడియుండెను. ఆయన ఎల్లప్పుడు తన జునులతో మమేకమైయుండ ప్రయత్నించును, ఆయనెల్లప్పుడు తన జనుల మధ్య తన మహిమను కనబరచగోరును.
సరే, ఇక్కడ దావీదు మొర్రపెట్టుచు ఇలా అనుచుండెను, “ప్రభువగు దేవా, మరలా మా యొద్దకు తిరిగి రమ్ము. మేము పాపము చేసి, నీ యొద్దనుండి తొలిగిపోతిమి. కెరూబులకు బలిపీఠముకు మధ్య నివసించువాడా, మరలా మా మీద ప్రకాశించుము.” ఒకప్పుడు ఆయన తమ మధ్య ఉన్న దేవుడని, ఆయన అదేరీతిగా ఉన్న దేవుడని అతడు ఎరిగియుండెను. జనులు తమ్మును తాము ఆ దేవుని నుండి వేరుచేసికొన్నారు. మరి ఆయన ఇంకను అదే దేవుడిగా ఉన్నాడని దావీదు ఎరిగియుండెను.
వారు వేరైనందున దేవుడు ఇంక ఎంతమాత్రం వారి మీద ప్రకాశించజాలడు. ప్రకాశించే శక్తి ఆయనలో లేదని కాదు దానర్థం; కేవలం జనులు తమ పాప నడలతను బట్టి దేవుని కృపాకనికరముల నుండి దూరముగా జరగుట వలన ఆయన ప్రకాశించలేకుండెను.
19
అప్పుడు దావీదు మనం అంశం యొద్దకు వెళ్ళుచుండెను. కీర్తన 80:7. “నీవు ఐగుప్తులోనుండి ఒక ద్రాక్షావల్లిని తుంచి తీసికొని బయటకు తెచ్చితివి, దానిని మంచి భూమిలో నాటితివి,” అని అతడు పలికెను. అది ఇశ్రాయేలీయులైయుండెను, ఐగుప్తులో ఉండిన దేవుని ప్రజలు, వారు మంచి ద్రాక్షావల్లి, వారు దేవునిచే ఎన్నిక చేయబడినవారు. మంచి ద్రాక్షావల్లి అనేది మంచి స్ధలములో నాటబడకపోతే, అది మంచి ఫలములను ఫలించదు. ద్రాక్షావల్లి అనేది ఎక్కడ నాటబడినదో దానిమీద దాని ఫలములు ఫలించుటమనేది ఆధారపడి ఉండును. దేవుడు ఇశ్రాయేలీయులను నిష్పలభూమీలో నుండి తెచ్చాను.
ఇది నేటి స్థితికి అద్దం పడుతుంది. మనమొక భూమిలో పుంటిమి, అందులో అనేకమంది గొప్ప మరియు మంచి విశ్వాసులుండిరి, మరి వారంలో అన్ని రకములైన సంఘశాఖ సంఘాలలో కలగలుపులైపోయిరి. వివిధ శాఖల నుండి, వివిధ రకములైన జీవన విధానముల నుండి వారు వచ్చి యున్నారు. అందుచేతనే నా సేవాపరిచర్యలో నేనెన్నడూ ఒక వ్యక్తిని నడిపించటాన్ని లేక ఫలాని శాఖవైపు మొగ్గుచూపటాన్ని నేను చేయలేదు, ప్రతి సంఘశాఖలో కొందరు మంచి ప్రజలున్నారు, వారు దేవునిచేత ఎన్నిక చేయబడి, పిలువబడిన ప్రజలుగా వున్నారు.
20
ఇశ్రాయేలీయలు ఐగుప్తులో వుండినంత మాత్రాన వారిని నీవు ఖండించుదువా? వారు కేవలం తప్పైన త్రోవలో మాత్రమే ఉండియున్నారు. వారి పాపములు వారిని దేవుని యొద్ద నుండి వేరు చేసినవి. వారు ఐగుప్తులో నాటబడియున్నారు.
నేడు సంఘాలలో అనేకులు అలానే వున్నారు: మంచి జనులు తప్పైన చోట్ల నాటబడిరి. ఇప్పుడు, నీజమైన విశ్వాసి క్రీస్తునొద్దకు తీసికొనిరాబడి ప్రభువు చేసే అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచనలను నమ్మని ఒక పెద్ద శాఖలో నాటబడినట్లైతే, అతడెంత నిజమైన క్రైస్తవుడైనా, క్యాథలిక్కయినా, బాప్టిస్టయినా, పెస్పిటేరియనైనా, యెహోవా సాక్ష్యులైనా మరి దేనికి చెందినా వ్యర్ధమే. ఆ సంఘంలో నిజమైన దేవుని ద్రాక్షవల్లి ఉండొచ్చును, కాని శాఖ సిద్దాంతాలు ఆ ద్రాక్షవల్లిలోని జీవమును వేరుచేయును. అందుచేత అది మంచి ఫలములను ఫలించనేరదు.
సాధారణంగా, పెరుగుదల అరికట్టబడిన ద్రాక్షావల్లినుండి, మంచి భూమీలో నాటబడిన ద్రాక్షవల్లి నుండి ఎటువంటి ఫలములను నీవు పొందెదవు? కేవలం కారు ద్రాక్షాలు (కాని ఫలములు) తప్ప, ఆపిల్స్ వలె అవి బయటకు వచ్చును, కాని అవి ముండ్లుగలవై(ముడతలు పడినవై) పురుగులు తిని వేసినవిగా ఉండును. అని అన్ని రకముల కీటకాలకి ఆస్పదమగును. ఒక మంచి ఆరోగ్యకరమైన ద్రాక్షవల్లికి పిచికారి కూడా అవసరంలేదండీ. అది తనకి హానికరమైన వాటన్నిటిని తట్టుకొని నిలబడగలిగినంత ఆరోగ్యకరముగా ఉండును.
తిరిగి-జన్మించిన క్రైస్తవుడు కూడా మరలాగే వుండును. వారికి ప్రొద్దస్తమానం పిచికారి చేయనవసరంలేదండీ. వానిని బుజ్జగించాల్సిన పని లేదు. ఈ లోక సంబంధమైన అపకీర్తికరమైన క్రియలన్నింటిని త్రోసివేయుటకు ఆత్మసంబంధముగా వారు తగినంత ఆరోగ్యకరముగా ఉండెదరు. వారు నిజమైన దానితో పోషింపబడి జీవింతురు.
21
కొన్నిసార్లు ఒక చెట్టు... ఎడారిలో నాటబడిన మొక్కకి తగినంత తడి అందకపోతే, అది ముండ్లు (ముడతలు) ఫలములు ఫలిస్తుంది; ద్రాక్షవల్లికి రావల్సిన పండుగా అది కనబడదు.
నా సహోదరి, సహోదరులారా, నేటి సంఘాల పరిస్తితి కూడా అంతే వుంది. పాపి లోపలికి వచ్చును, తర్వాత, బహుశా కొద్దిగ పశ్చాతాపము నొంది, వెళ్ళి బైబిల్ చదువును, మందిరానికి వెళ్ళును. గొప్ప మధురమైన ఆపిల్ పండ్లు, లేక ద్రాక్షపండ్లు కనుగొనుటకు బదులుగా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవము సంఘములో తిరిగి ఉత్పత్తి చేయకుండా, కేవలం చిన్న ముండ్లు (ముడతలు) గల పండ్లను, పురుగులు తీసివేసిన పండ్లును, శాఖ సంబంధమైన పండ్లను, వింతపోకడ ఆలోచనలను అది ఉత్పత్తి చేయును. “మేము బాప్టిస్టులము, మేము దీనిని పొందుకొన్నాం, మేము మెథడిస్టులం మేము దీనిని పొందుకొన్నాం.” దేవుని హస్తములు సముద్రము నుండి సముద్రము వరకు, ఆదరి నుండి ఈదరి వరకు చాపబడి కడపడి (భూదిగంతములు దిగువనున్న) పొడిని కూడా రక్షించును. అయితే మేము వెళ్ళు చోట్ల అదే మేము కనుగొందుము.
22
మరలాగే, కీర్తనలో తిరిగి దావీదు చెప్పినట్టు అది వుంది. అపహాసకులతోను, భక్తిహీనులను కలవక, వారితో కూర్చుండక, వారితో జతచేరనివాడు ధర్యుడు. అపహాసకులు ఏమందురు మీకు తెలుసా, “అద్భుతములు జరిగే రోజులు ఏనాడో అయిపోయాయి. పరిశుద్ధాత్మ బాప్తీస్మము పొందటమనేది అంతా బూటకం.” అలా మాట్లాడనివాడు ధన్యుడు. అటువంటి మాటలకి దూరంగా జరుగువాడు ధన్యుడు, ఆ రెంటిని వారు కలవగలరు.
ప్రభువు బలమును తృణీకరించేవారితో ఎంతమాత్రం కలవక, అటువంటివాటికి దూరంగా జరుగువాడు ధన్యుడు. బైబిల్ చెప్పుచున్నది, “అటువంటి వారిలో నుండి బయటకి రండి, ఒక దినము వచ్చును, అప్పుడు జనులు నమ్మక ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధలు, దేవునికంటే సుఖానుభవములు నెక్కువగా ప్రేమించువారుగాను, పైకి భక్తిగలవారివలే వుండియు దేవుని శక్తిని ఆశ్రయింపనివారుగాను ఉందురు; అట్టివారికి నీవు విముఖుడవై యుండుము.”
23
ఇటువంటి అపహాసకులతో, పరిహసించువారితో, తమదే నిజమైన సంఘమని చెప్పుకొనుచు, “వారు మతపిచ్చి గుంపు” అని హేళనగా మాట్లాడువారితో కలవక, వారికి దూరంగా ఉండేవాడు ధన్యుడు.
అతడు నీటికాలువల యోరన నాటబడిన చెట్టువలె వుండును.“ ఎన్నుకొనే స్థలములో దేవుడతని ఉంచెను. ”అతడి ఫలము వాడదు. చక్కగా ఆకులు వేసి తనకాలమందు ఫలమిచ్చును.“
దావీదు ఎంత చక్కని పదజాలాన్ని వాడాడో చూడండి. “ఈ మనుష్యుడు ధన్యుడు. అతడు నాటబడును,” కేవలం ఖాళీగా కూర్చోడు. మీకు తెలుసా, నాటేది ఏదైనా సరే దానిని చూడటం నాకిష్టం. ఇప్పుడు, ఐగుప్తులోనున్న ఇశ్రాయేలు అక్కడ నాటబడలేదు. వారు కేవలం అక్కడ పెట్టబడియున్నారు. అది వారియొక్క అసలైన స్థానిక నివాసం కాదండీ.
క్రైస్తవుడైన ఒక వ్యక్తి తన నిత్య గమ్యమునకై ఒక సంఘశాఖ. సిద్దాంతమును ఆధారం చేసికొన్నయెడల అతడు తన యొక్క సరైన చోటులో నిలబడియుండలేదు. విడుదలనొంది స్వేచ్చగా, ఒక దేవుని బిడ్డగా, దేవుని ఆరాధించుటకు అతడు పుట్టియున్నాడు. కాని అతడు ఒక సిద్దాంతం క్రిందవున్నాడు, అతడు తన ఫలమును ఫలించవచ్చును. అయినప్పటికి అతడిలో ఏదో పుండి దానిని చేయునట్లు ఆశపడుచుండును. “నీటికాలువల యోరన నాటబడిన చెట్టువలే అతడుండును.” కాలువలు (నదులు అని ఇంగ్లీష్ బైబిల్లో వుంది - అనువాదకుడు), కాలువలు అనేది, బహువచనం; నీరు, అనేది ఏకవచనం; నదులన్ని కలిపి ఒక దగ్గరకే చేరుకొంటాయి.
24
ఇంకోమాటలో, లేఖనాలయందున్న మనిసిగి అతడు ఉండును, అతడు దేవుని వాక్యమంతటిని నమ్మును. అతనియొక్క అంతరంగములో నుండి శక్తి మరియు తొమ్మిది ఆత్మ వరములు ఒక దేవున్ని బట్టి అక్కడ ప్రవహించును. కొందరు కేకలు వేయుటను నమ్మరు. ఎందుకనగా వారు ఆత్మ సంబంధమైన ఆనందమును పొందుకోలేదు, పొందితే, జీవజలము యొక్క ఆనంద ప్రవాహం అతనిలో నుండి పొర్లిపారును.
బ్రెన్హాం టాబర్నికల్లో వున్న, అదీయే పూర్తి సంగతియైయున్నది, ఎందుకనగా ఆ అవిశ్వాసం మరియు లోకము యొక్క సంగతులు ప్రజలను బంధించియుండెను. ఆ కారణము చేతనే వారు ఆత్మీయ ఎదుగుదల లేకుండిరి. మన దేశంలో చిక్కంతా అదేయయి ఉన్నది, మన సంఘములో ఉన్న చిక్కంతా అదే అయుద్నది. వారికి ఆనందం లేదు. ప్రభువు యొక్క ఆనందం వారిని విడిచిపోయింది. లేఖనాలలో ఒకసారి ఇలా వ్రాయబడినది, ఈకబోదు అను హెబ్రీ పదమునకు అర్థం, “ప్రభువు సన్నిధి విడిచిపోయినది.”
మన సంఘాల పరిస్తితి కూడా అలానే వుంది, ఎందుకనగా మనం మొదటి పునాదిని విడచిపెట్టి, సిద్దాంతాలలోను, శాఖలలో మనల్ని మనం స్థాపించుకొని, దేవునితో మనకున్న అనుభవాలను ఎండిపోవునట్లు లోకపు సంగతులను అమమతించియుంటిమి.
25
ఓ, నాతో కలిసి ఆరిజోనాకి రండి. అనేక సంవత్సరాల పాటు నేను సంచరించిన ఆ ఎడారి స్థలాలకి మిమ్మును కూడా తీసికెళ్ళనివ్వండి. ఎడారి(అరణ్యము)లో నున్నదంతా ముళ్ళేనండీ. అక్కడ నీవు ఏ చిన్న చెట్టు దగ్గరకు వెళ్ళినా, ముళ్ళ కంపలేనండీ. వెళితే, అవి నిన్ను అంటుకొంటాయి. ఏంటీ సంగతి? అని ముళ్ళుగా ఎందుకయ్యాయి? వాటికి తగినంత నీరు అందనందునే, అవి ముళ్ళు అయ్యాయి. అందుకే అవి అలా ఎండిపోయాయి. నీరు లేనందునే అవి ముళ్ళ అయ్యాయి.
జీవజలపు ఊట నుండి తొలగిపోయిన సంఘము యొక్క పరిస్తితి కూడా అలాగే వుండెను. రక్షణానందం నుండి తొలగిపోతే, ప్రభువగు దేవుని యొద్దనుండి తొలగిపోతే, అప్పుడా వ్యక్తి అటుకునే ఒక ముళ్ళు అగును, ఇతరుల తప్పులు పట్టుచూ, గ్రుచ్చుచూ వుండును. అలాంటి వ్యక్తి దగ్గరకి నీవు వెళ్ళి వాక్యం మాట్లాడితే, ఇలా అంటాడు, “నేను ప్రెస్పిటేరియన్, నేనొక మేథడిస్టుని, నేనొక ఫలాన-ఫలాన. అటువంటి వర్తమానము గూర్చి నాకు నువ్వు చెప్పొద్దు.” ఒక ముళ్ళు, దానికి ఫలము లేవు.
అదే మొక్కను అనగా (కాక్టస్) బ్రహ్మజెముడు మొక్క ఎడారి మొక్కను తీసికొని, ఉత్పత్తి కొరకు నీరు సమృద్ధిగా వున్న నేలలో నాటుము, అప్పుడు దాని మీదున్న ముళ్ళని ముడతలు విడిచి, మెత్తని ఆకులగును, ఫలములు ఫలించును.
26
నేడు సంఘము యొక్క పరిస్తితి ఏమిటి? అదొక సంస్థాగతమగు శాఖలో పెట్టబడి యుండెను, అందుచేత అది దానితో వున్న సిద్దాంతములతో బంధించబడెను, కావున సంతోషం దానికి లేకపోయెను, కొద్దిపాటి ఉజ్జీవమున కలిగి యుండేందుకు కొద్దిగా ప్రోక్షించబడెను. నిజానికి ఉజ్జీవమును కలిగివుండుటకు దానికేం కావాలి, అది అపహాసకులు, అవిశ్వాసుల మధ్యలోనుండి లేచి వచ్చి, నీటికాలువల యోరను నాటబడాలి, అప్పుడే దానికి ఉజ్జీవం. రక్తములో నిండియున్న ఒక ఊటయున్నది, ఇమ్మానియేలు రక్తనాళములో నుండి అది ఉబికి వచ్చి యున్నది. అందులో పాపులు, అవిశ్వాసులు మునిగిరి, ఆ రక్త ప్రవాహాములోనికి ప్రవేశించి, తమ అపవిత్ర మరకలన్నిటిలో నుండి కడుగబడి శుద్ది అయ్యిరి.
“నీటి కాలువల యోరను నాటబడిన ఒక చెట్టు,” అని దావీదు పలికెను. ఓ, ఒక బ్రహ్మజెముడు (ఎడారిమొక్క) ద్వారా దేవుడు తన్నుతాను ప్రవహింపకొనజాలడు. ఇప్పుడు, నీరు జీవమును సూచిస్తున్నది. అరణ్యములో మోషే అతడు బండను కొట్టెను, మరి నశించిపోతున్న జనులకి అది జీవజలములను ఇచ్చెనని మీకు తెలుసా. మరి యేసు ఇలా అన్నాడు, “అరణ్యములో మోషే బండను కొట్టినట్లు, మనుష్యకుమారుడు కూడా అలానే పైకెత్త బడవలెను.” ఆయన కొట్టబడెను.
27
జీవము, రక్త కణములో వుండును. ఆ కణము భంగపర్చకబడకపోతే మరియు పగులగొట్టబడకపోతే అందులో నుంచి జీవము బయటకు రాలేదు.
దేవుడు ఇశ్రాయేలీయులను బయటకు తెచ్చినప్పుడు ఒక దేశముగా, ఆయన వారికొక పరీక్ష నిచ్చెను. అవిశ్వాసుల మద్యలో నుండి, అనగా, ఐగుప్తు దారి మద్యలో నుండి ఆయన వారిని త్రుంచెను. మరియు వారిని తన కనికర కృపా సంపత్తి చొప్పున పక్షిరాజు రెక్కల మీద, ఆ గొప్ప పక్షిరాజు, మోషే ఆయా చోట్లకి నడిపించెను, వారిని సరైన స్థితిలోకి తెచ్చుటకు, దానిని దాటించుటకు ప్రయత్నించియుండెను. నలుబది ఏళ్ళు ఆతడు వారిని నడిపించెను, అరణ్యములో పోషించెను. మరియు అతడు వారిని సరైన చోటునకు తెచ్చుటకు తగిన చోటును, మంచి చోటునకు, ఒక ఎన్నిక చేసికొనే చోటునకు తెచ్చెను; అరణ్యములో ఆయన వారికి తన అద్భుతములను సూచనలను మరియు ఆశ్చర్యకార్యములను నలబై ఏళ్ళపాటు చూపించెను. తాను దేవుడనని కనబర్చుకొనుటకు ఆయన తన ప్రవక్తల ద్వారా అద్భుతములను, సూచక క్రియలను అనుగ్రహించెను. ఆయన తప్ప సముద్రాన్ని ఎండిపోవునట్టు చేయువాడు మరెవడు? ఐగుప్తును మొత్తువాడు అయన తప్ప మరెవరు? అదున తప్ప చెయ్యి పైకి ఎత్తగల ధైర్యవంతుడెవడు? వాటన్నిటిని మధ్యలో (వీటన్నిటి ద్వారా), తాను దేవుడనని స్వయంగా ఆయనే కనబరచుకొనెను. నిశ్చయంగా, తన ప్రజలకి ఆయన తన్నుతాను కనబర్చుకోవాలని కోరెను.
28
ఈ మేకలయొక్కయు, దూడలయొక్కయు, గేదలయొక్కయు, గొర్రెలయొక్క రక్తముచేత పాలస్తీనా భూబాగాన్నంతటిని ఆయన ముంచివేసెను. కాని జనులు ఇంకను నిలదొక్కుకొనకుండెను; అది సరిపోకుండెను; ఎందుకనగా జంతువుల యొక్క రక్తము, రక్త కణము పగులగొట్టబడి, జంతుజీవము తిరిగి వచ్చెను, అయితే అది మానవుని జీవమునకు సాటిరాదు.
అయితే ఒక దినాన, దేవుడు తన జనులను, తన ముందేర్పాటులో వున్న సంఘమును రక్షించాలని నిర్ణయించుకొనెను. స్వయంగా ఆయనే దానిని చేయవలెను, ఎందుకనగా వారిని ఆయన జగత్తు పునాది వేయబడకమునుపే తనకొరకు నిర్ణయించుకొనెను.
మనిషి ఓడిపోవును, ఎప్పుడూ ఓడిపోవుచునే ఉండును. ప్రారంభమునుండే అతడు ఓడినవాడు, మరియు ఎల్లప్పుడు అతడు ఓటమినొందినవాడే. దేవుడు, తన ముందు నిర్ణయంలో, తన గొప్ప అనంతమగు మనస్సులో ఒక నిజమైన ద్రాక్షవల్లిని నాటాలని ప్రణాళిక వేసికొనియుండెను. మరి ఆయన ఈ భూమ్మీద ఒక ద్రాక్షవల్లిని, ఒక నిజమైన నీతివంతమైన ద్రాక్షవల్లిని నాటెను, ఒక సంఘశాఖను కాదండీ, ఒక సంఘమును కాదండీ, ఒక సిద్దాంతమును కాదండీ, కాని ఒక నరుని, అనగా తన్నుతానే ఒక నరునిగా ఈ భూమ్మీద నాటుకొనెను. ఆయన తన సమాధానమున, తన బలపరాక్రమమును, తన గొప్ప దేవుని దూతను కనబరిచెను, గొప్ప యెహోవా ఆయనతో వుండెను, మరియు దైవత్వము యొక్క సర్వసంపూర్ణత ఆయనయందు నివసించెను.
ప్రజలు ఆయనను నమ్మలేదు, ఆయనను సందేహించిరి, కారణం ఆయన వారి సిద్దాంతాలకు తగినట్టుగా వుండలేదు. చివరిగా, వారు అయనను కల్వరి తట్టుకు నడిపిరి. అక్కడ ఆ ప్రశస్త దైవకుమారుని యొక్క రక్తకణము, స్వయంగా యెహోవా నివసించిన ఆ శరీరము యొక్క రక్తకణము పగులగొట్టబడెను.
29
అక్కడొక ద్రాక్షవల్లి బయటకు వచ్చెను. దానియొక్క మొదలు మహిమలో నుండి అరంభమైనది, జీవముగల దేవుని సంఘమును ఉత్పత్తి చేయుటకు, తన పునరుత్థాన శక్తి ప్రభావములు కనబర్చుటకు దానియొక్క కొమ్మలు భూమ్మీదకి ప్రాకియున్నది. మరి అటువంటి సంఘమును, అనగా జీవము గల దేవుని యొక్క ద్రాక్షవల్లి కాదనుటకు ఈ స్త్రీ, పురుషులేవరండీ? జీవించుటకు జగదుత్పత్తికి ముందుగానే పట్టుకొనిన తన ముందు నిర్ణయపు కొమ్మలను కనబర్చుటకు, ఎన్నటికిని తప్పిపోని తన సంఘముతో కూడిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిత్య సన్నిధిని కాదనుటకు వీరెవరండీ? ఆయన తన వారిని తిరిగి లేపుదునని ప్రమాణం చేసెను.
మరి నేడు ఆయన తన సంఘములో ప్రభావంతమైన ఆయన యొక్క పునరుత్థాన మహిమ జీవించుచుండెను.. “నేను ద్రాక్షవల్లని మీరు తీగెలు,” గుండె కొట్టుకొను ప్రతిసారి యేసుక్రీస్తు నామము గుండా, అది సంఘములోనికి ప్రవహించుచుండెను. “నా నామమున మీరు నన్నేమి అడిగినను, దానిని నేను చేతును. నేనెప్పుడు మీతో ఉందును, యుగ సమాప్తి వరకు ఉండెదను.”
30
అందుకే పెంతుకోస్తునాడు పేతురు ఇలా చెప్పుటలో ఆశ్చర్యములేదు, “మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పాందుడి, అప్పుడు మీరు ద్రాక్షవల్లిలో ఉన్న జీవముతో నింపబడెదరు.” మనము ఆయనతో అంటుకట్టబడితే, పరిశుద్ధాత్మ ఆయన నామమును ధరింపజేయును. ఆయన దేవునితో అంటుకట్టబడెను, ఎందుకనగా ఆయనే వేరు మరియు దేవుని చిగురైయుండెను.
ఆయన భూమ్మీదికి వచ్చెను; భూమి ఆయన ద్వారా కలిగెను. ఆయన లోకములోనికి వచ్చెను, మరియు లోకము ఆయనను ఎరుగకుండెను. మరిప్పుడు, రక్తము చిందించుటకు ఆయన మరణించియుండెను, రక్తనాళము పగులగొట్టబడెను. తద్వారా అనగా యేసుక్రీస్తు రక్తము ద్వారా నేడు ఒక సంఘమనేది శుద్దిచేయబడి, క్రమములో పెట్టబడి యుండెను. ద్రాక్షవల్లి యొక్క జీవమగు, ద్రాక్షవల్లి యొక్క నిత్యజీవమగు, ఆ గొప్ప పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మ జీవముగల దేవుని సంఘములోనికి ప్రతి సభ్యునిలో ప్రవహించగలుగును.
31
వారు వింత వ్యక్తులని, ప్రత్యేక జనమని చెప్పుటలో ఎంతమాత్రం ఆశ్చర్యంలేదండీ, వారు వింత క్రొత్తగా ప్రవర్తింతురని అనుటలో ఆశ్చర్యములేదండీ, ఈ లోకములో వారికిక ఎలాంటి వ్యవహార సంబంధాలు వుండవండీ, ఎందుకనగా వారు చనిపోయి క్రీస్తునందు పాతి పెట్టబడిరి, మరలాగే నూతన జీవముకై లేపబడిరి, ఆత్మీయ పునరుత్థానంను ఆనందించుటకు ప్రధమ ఫలముగా లేపబడిరి, తద్వారా పరిశుద్ధాత్మ ప్రతీ సభ్యునిలోనికి వెళ్ళి, ఐగుప్తులో నుండి ద్రాక్షవల్లిని ఆయన తీసికొని వచ్చినప్పుడు చూపిన అదే మహిమను విశ్వాసి ద్వారా చూపునట్లు చేయును.
ఇప్పుడు, కారుద్రాక్ష అనేది కూడా వున్నది. II రాజుల గ్రంథంలో దానిని గూర్చి బైబిలు చెప్పుచున్నది. మీరు గమనించారా, ఈ ప్రసంగీకుడు కొన్ని బటాణి గింజల వంటి వాటిని ఏరుకొనుటకు బయటకు వెళ్ళెను, అయితే కొన్ని కారు ద్రాక్షలు(పిచ్చికాయలు) దొరికినవి, కావున, ఎరుగక పొరపాటున వాటిని తీసికొని వచ్చెను. అవి వారియొక్క సెమనెరీకి దగ్గర్లోనే మొలిచినవి, ఎందుకనగా వారిది ఒక ప్రవక్తల పాఠశాల, కనుక అతడు చేదు కాకరకాయలాంటి కొన్నింటిని ఒడి నిండా వేసికొనివచ్చి అసలైన మంచి కూరగాయలతో ఉడుకుతున్న జావ(అంబలి) కుండలో వాటిని వేసెను. “ఆ కుండలో చావున్నదని,” వారు కేకలు పెట్టిరి.
సహోదరుడా, ఏపుగా పెరిగిన ఒక కారుద్రాక్షవల్లి వున్నది, సిద్దాంతముల చుట్టూ, సంఘశాఖల చుట్టూ అది పెరిగినది. మరి, అది అక్కడ పెరిగినప్పుడు, ఆత్మీయానందాన్ని అది రానీయకుండా ఆపివేసినది. ఆ ప్రక్రియ జరిగిన వెంటనే ఆ ద్రాక్షవల్లి చనిపోయినదని మీకు తెలుసా.
32
అయితే తన ద్రాక్షావల్లి చనిపోకూడదని దేవుడు నిర్ణయించుకొనెను, కనుక ఆయన దానిని ఆ సిద్ధాంతాల నుండి త్రుంచి, పరిశుద్ధాత్మతో దానిని నింపి, యేసుక్రీస్తు నామములో దానిని పెట్టి యుండెను. అక్కడ ఆ సంఘము ప్రవహించుచూ, సంతషించుచూ, జీవముగల దేవుని సన్నిధిని అనుభవించుచూ, ఆయన యొక్క కదలికను గమనించుచూ, మరియు ఆయన మీద వున్నప్పుడు ఏఏ కార్యాలనైతే జరిగించియుండెనో సరిగ్గా వాటినే జరిగించుచుండెను.
ఎందుకని? ఎందుకనగా ఆయన యొక్క కొమ్మలు, ఆయన యొక్క సంబంధం, ఆయన వేరు, ఆయన ఆరంభము అంతయు దేవుడే. జగత్తు పునాది వేయబడకమునుపే ఆయన వధించబడిన గొర్రెపిల్ల అయి యుండెను. జగత్తు అనేది ఉండక మునుపే ఆయన దేవునిలో ఉండెను. ఆయన దావీదు యొక్క వేరు - చిగురును, ఉదయ నక్షత్రమును, లోయలోని పద్మమునై యున్నాడు. అదంతయు ఆయనే అయి యుండెను.
ఆయన యొక్క వేర్లు దేవునిచుట్టూ, ఆయన సింహాసనం చుట్టూ, దేవుని రాజ్యము చుట్టును అల్లుకొని యుండెను. ఆయన వేర్లు చుట్టు కప్పుకొనియుండెను. ఆయన జీవము భూమ్మీద వ్యాపించి యుండెను. ఆ ద్రాక్షవల్లిలో నుండి కొమ్మలు వేయునట్టుగా ఆయన తన జీవమును పంపెను, ఆయన నిన్న, నేడు, నిరంతరం, ఒకటేరీతిగా వున్నాడని, భూమ్మీద వున్నప్పుడు జరిగించిన అవే కార్యాలను తన సంఘము చూపించునట్లు ఆయన వేర్లు తిరిగిపోయి మరలా అందులో నుండి ప్రవహించెను.
33
జీవముగల దేవుని సంఘమా ఇది సత్యమని నమ్ముము, ఆయనక్కడ ఉన్నాడు. నిజమగు దేవుని ఆత్మ విశ్వాసిలో కదిలినప్పుడు ఏ లేఖనము గూర్చి అతనికి చెప్పినా, దానికతడు “ఆమేన్” చెబుతాడు, ఎందుకని? బైబిల్ వ్రాసిన పరిశుద్ధాత్మయే అతనిలో వుండి, అతని జీవము గుండా ప్రవహించుచుండును, కనుక అతడు తన చుట్టూ ఎవరెవరు కూర్చొన్నారా, లేక ఎవరెవరు ఏదేది అనుకొనుచున్నారా అనే దానిని లెక్కచేయడు; అతడెల్లప్పుడు వాక్యముతోనే వుండును.
అబద్దమైనది కూడా వున్నది, అది చేదుగా వుంటుంది. అది కారు ద్రాక్షనుండి కాయును. అది పరిమాణంలో పెద్దదిగానే ఉండొచ్చును, భూమియందంతటను వ్యాపించియుండొచ్చును. కాని, అది మృతతుల్యమైనదే.
అది అనేక మందిలో వ్యాపించియుండెను. కాని గర్తుంచుకోండి, “ఆహారము” దానిని తిరగి జీవమునొద్దకు తెచ్చును. త్రుంచి ఒక మంచి భూమిలో అనగా క్రీస్తు యేసులో నిలుపును.
ఆయన వాక్యమందున్న ప్రతీది నీకు “ఆమేన్” అవును గాక, అప్పుడు దేవుని ఆత్మ అప్పుడు ఆత్మీయానందం నదివలే పారును. నీటికాలువల (నదులు) యోరను నాటబడిన ఒక చెట్టువలే ఆ మనుష్యుడుండును. అతడి ఆకులు వాడబారవు. అపహాసకుల యొద్ద గాని, అవిశ్వాసుల యొద్దగాని, ఈ లోకసంబంధమైన వాటి చొప్పున జీవించే ఒక భక్తిహీనుని యొద్దగాని అతడు కూర్చొనడు, గాని తన కాలమందు ఫలము ఇచ్చువాడిగా అతడుండును.“ ఏ రకమైన ఫలము తెచ్చును? క్రీస్తునందు నీవు నాటబడితే, ఆత్మసంబంధమైన ఫలములను, పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ ఫలములను నీవు ఫలిస్తావు. పరిశుద్ధాత్మ నీలో నివసించును.
34
బావి యొద్ద స్త్రీ మనకు సుపరిచితమే. ముగింపుగా దీనిని చెప్పుకొందాం. ఆయనను ఆమె చూసినప్పుడు....
ఆయనొక సాధారణమైనవాడిగా తనకి కనబడినట్టు ఆమె అనెను. ఆయనలో ఆమెకు ఆకర్షణీయంగా ఏమియు కనబడలేదు. “మనమతని చూచి ఆపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు. ఆయనకి మనం మన ముఖమును త్రిప్పికొంటిమి,” అని లేఖనము చెప్పెను. అదే పనిని నేడు కూడా వారు చేసిరి. ఆత్మ సంబంధముగా ఆత్మఫలములను వారు సరిగా ఫలించకపోతే, దేవునికి సంబంధించిన సంగతుల విషయంలో సరిగా అభివృద్ధి నొందకపోతే, అట్టివారికి క్రీస్తు సురూపము లేనివాడిగా అగును. వారికి ఆయన ఆ విధంగా కనబడును. “ఒక పరిశుద్ద గుండ్రాళ్ళ గుంపుగా, సరైన మతిలేని పిచ్చి ప్రజలగుంపుగా వారికి కనబడును.”
కాని విశ్వాసి ఆయితే దానిని హత్తుకొనును. అది నిత్యజీవము. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవడు ఎడబాపలేడు. అది మరణమైనా, దుఃఖమైనా, అది కరువైనా లేదా ఇంకేదైనా సరే, మనల్ని విడదీయలేదు. మనం ఆయన యొక్క నిత్యభద్రత యందు గట్టిగా కట్టబడియున్నాం. ఆయన ఆ సిలువను హత్తుకొన్నప్పుడు మనము అక్కడ వున్నాము.
35
ఆ స్త్రీ చెప్పినది. అప్పుడు.... ఆయన ఒక ప్రశ్న అడిగెను, “నాకు దాహమునకియ్యగలవా?”
అందుకామె, “యూదుడవైన నీవు - సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావు, ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు కదా,” అని అనెను.
“కాని నీవు నన్ను ఎరిగియుంటే...” అని ఆయన అనెను. మరో మాటలో చెప్పాలంటే, “జీవజలపు ఊటకి నీవెంత దగ్గరగా వున్నావోనన్న సంగతిని నీవు తెలిసికోగల్గితే, చేదుకొనుటకు నీవింత దూరం కూడా రావల్సిన పన్లేకుండానే నేను నీకు నీరు ఇస్తాను. సమరయులగు మీ యొక్క చోటును నేను మార్చుదును.”
పాపులగు మిమ్మును తీసికొనివస్తాను. ఒక అవిశ్వాసి దానిని నమ్మడు. “ఈ ఉదయకాలం కేవలం నిన్ను త్రుంచునట్లుగా నీవు అనుమతిస్తే చాలు, నేను నిన్ను నీటి కాలువల యోరను నాటెదను, అని ఆయన పలుకుచున్నాడు, పరిశుద్ధాత్మ బాప్తీస్మము ద్వారా నేను నిన్ను ఒక స్థానములో వుంచెదను. తద్వారా నేను చెప్పే ప్రతిమాటను సత్యమని నీవు నమ్మొదవు. ఈ ఉదయం కేవలం నిన్ను త్రుంచుటకు నన్ను అనుమతించుము. అప్పుడు నీవొక మంచి కొమ్మవగుదువు. ఇక నీవెంత మాత్రం ఆ కారుద్రాక్షాకి చెందియుండాల్సిన పన్లేదు. నీవు ఇక్కడికి చెందియుండునట్లుగా కేవలం నిన్ను త్రుంచునట్లు చేయనిమ్ము అప్పుడు నేను నిన్ను నా నామమందు నాటెదను, ఎందుకనగా ప్రతిమాట సత్యము, ప్రతీ దైవీక వాగ్దానము సత్యమైయున్నది. ఒక్క నీటికాలువల యోరను, అనగా, ఒక్క దేవుని యందు నేను నిన్ను నాటెదను. మరి నీవు నీ కాలమందు ఫలము నిచ్చెదవు. నీ ఆకులు వాడిపోవు, మరియు నీవు ఏది చేసినా వర్ధిల్లుతావు. నిలుచుటకు ఏ ఇతర చోటులేకున్న నీవు మాత్రం నిలబడేదవు. వాగ్దానం చేసినది దేవుడని నీవు ఎరుగుటను బట్టి నీవు ఎలాగైనా సరే నిలదొక్కుకొందువు.
ఆయన ఇలా అంటున్నాడు, “నేను నిన్ను త్రుంచనిమ్ము (పెరికివేయనిమ్ము), మరియు ఇచ్చట ఈ నీటికాలువలను నాటనిమ్ము, అప్పుడు నీవు కనుగొనుటకు ఆ సిద్దాంతాలున్న ఆ చోట్లుకి, శాఖల చోట్లలకి పరుగులు తీయాల్సిన పని వుండదు మరి. అక్కడ నీవు దానిని కనుగొనలేవు, ఎలాగైన సరే చిన్న చిన్న బక్కెట్లుతో హడావిడిగా వచ్చి కొద్దికొద్దిగా త్రాగుచూ మరలా వచ్చి కొద్దికొద్దిగా త్రాగుచున్న ఎండిపోయిన ఈ పాత బావి యొద్దనుండి నిన్ను త్రుంచనిమ్ము, నిత్యము ఊరే జీవజలపు బుగ్గలలో నుండి నిత్యజీవమును, సంతోషమును నేను నీకిత్తును. నీ కొరకు నేను దానిని చేయనిమ్ము,” ఈ విధంగా పాపియగు ఆ స్త్రీతో క్రీస్తు చెప్పెను.
మరి ఈ ఉదయకాలం సరిగ్గా సంఘముతో కూడా ఆయన అదే చెప్పుచున్నాడు. దేవుడున్నాడని నీకు తెలుసా, దేవుడున్నాడని నీవు నమ్ముచున్నావు. కాని కష్టాలొచ్చినప్పుడు ఏదో నీ విశ్వాసాన్ని త్రుంచివేస్తుంది. నీవు ఎడారిలో వున్నట్టుగా వుండును. ఆత్మసంబంధమైన ఆనందం లేకుండపోతుంది.
36
పెంతెకోస్తునాడు వారెలాగైతే చేసియున్నారో అలానే నీకు చేయాలనిపించును. వారు కలిగియున్న ఆనందాన్ని నీవు కూడా కలిగియుండాలని నీకు అనిపించట్లేదా? చెట్టు యొక్క మొదటి కొమ్మలోకి దేవుడు తన జీవమును పోసినప్పుడు, ఆ చెట్టు మద్యం త్రాగిన వారివలే చేయనారంభిచెను. ఆత్మావేశం క్రింద వారు ఊగినట్లు (తూలునట్టు)గా వుండిరి. ప్రియమైన కన్య మరియ, పరిశుద్ద స్త్రీలవలే ఆమె కూడా ఆక్కడ మద్యం త్రాగినవారివలే చేయనారంభించింది. ఓ, ఆమె పరిశుద్ధాత్మను పానముగా సేవించినది. ఆమె మాట్లాడుటకు ప్రయత్నించినది, కాని ఆమె మాట్లాడలేకపోయినది. ఆమె పెదవులు నత్తి నత్తిగా పలుకుచున్నవి. తత్తరపాటు పెదవులు అనగా తడబాటు మాటలు, ఏదో చెప్పాలని ప్రయత్నించటం. ఆమె ఎంతగానో పరిశుద్ధాత్మ పూర్ణురాలయ్యెను. దానిని ఆమె చెప్పలేకపోయెను. [సహోదరుడు బ్రెన్హాం నత్తి మాటలు అనుకరించుచుండిరి.] నత్తి మాటలు, మరియు అకస్మాత్తుగా వేరొక బాషలో వారు మాట్లాడసాగిరి.
కనీసం తన పేరును కూడా “పేపరు మీద వ్రాయటం చేతకాని ఒక చిన్న బోధకుడు, సబ్బు పెట్టి లాంటి దానిమీదికి, లేక ఒక దానిమీదికి ఎగిరి దుమికెను. సరే, అక్కడున్న అవిశ్వాసులు ఇలా అనటం మొదలు పెట్టారు, ”వీరు మద్యం సేవించారు. వారు పరిశుద్ద గుండ్రాళ్ళ గుంపు.“ ఈ చిన్నవాడు లేఖనాన్ని చేతపట్టుకొని, ఒక సిద్ధాంత పుస్తకాన్ని కాదండీ, లేఖనాన్ని పట్టుకొని, ఇలా అన్నాడు, ”ఇశ్రాయేలు మనుష్యులారా, ఇశ్రాయేలు కాపరస్తులారా, ఇది మీకు తెలియును గాక, మీరనుకొనుచునట్టు వీరు మద్యం సేవించిన మత్తులు కారు, ప్రొద్దుపొడిచి జామయినా కాలేదు; యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిని సంగతి ఏమనగా, 'అంత్యదినములలో ఇది నెరవేరును, నా ఆత్మను నేను కుమ్మరించెదను' అని దేవుడు సెలవిచ్చెను. ఇదిగో మీరు చూస్తున్న వీరిని ప్రభావితం చేసినది అదేనండీ.“
మానవ-కల్పిత సిద్ధాంతాల నుండి త్రుంచబడి, నదివలే అనందంపారే జీవపు ఊటలు యోరను నాటబడుటకు నీవు ఇష్టపడుదువా? క్యాన్సర్ తో నింపబడ్డాడు, అయినా పరిశుద్ధాత్మను పొందుకొన్నాడు, అటువంటి ఆ చిన్న బాలుని ముందు మరణం సహితం నిలబడలేకపోయెను. తాను చనిపోవుదునని వైద్యులు అతనికి తేల్చి చెప్పారు.
అతడి తండ్రి, “నీవు భయపడుచున్నావా?” అని అడిగాడు.
అతడన్నాడు, “నేను సిద్ధంగా వున్నాను, నేను సిద్ధంగా వున్నాను. ఈ లోకానికి ఒక సాక్ష్యమును ఇచ్చుటకు, నన్ను ఒక ఎరుపు రంగు దానితో పూడ్చి పెట్టండి, తద్వారా యేసుక్రీస్తు రక్తము క్రింద నేను కప్పబడియుంటినని ఈ లోకం తెలుసుకొంటుంది.” అది చేసేది అదేనండీ. నది ప్రవాహంవలె ఆనందం, మరణం యెదుటే స్వేచ్చగా నడిచిపోగలదు, లోకము యెదుటే నడిచిపోగలదు, శోధన యెదుటే నడిచిపోగలదు, విమర్శల యెదుటే నడిచిపోగలదు మరియు ఒక దూతవలే ప్రకాశింపచేయగలదు. ఎందుచేత? ఎందుకనగా నీ జీవితం నీ సొంతం కాదు, నీవు మృతిపొందితివి, యేసుక్రీస్తు నామములో పాతిపెట్టబడితివి, మరియు క్రొత్త జీవితం కొరకు తిరిగి లేపబడితివి. ఆయన నీ గుండా తన ఆశీర్వాదములను ప్రవహింపచేయగలడు, మరియు ద్రాక్షవల్లితో అంటుకట్టబడినవాటితో కొమ్మలను తీసికొనిరాగలడు. “నిర్ణయించుకొనే ఒక చోట నేను వారిని పెట్టుదును.” తన కుమారుడే ఆ చోటని దేవుడు చెప్పెను.
37
నీవు క్రీస్తులోనికి ఎలా రాగలవు? క్రీస్తులోకి ఎలా ప్రవేశించాలని పెంతెకోస్తు దినాన పేతురు చెప్పెను? అతడిలా చెప్పెను, “మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తం మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీస్మము పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్థులందరికిని అనగా, ప్రభువగు మన దేవుడు తనయొద్దకి పిలిచినవారికందరికి చెందును.” ఆ పిలుపులో నీవు కూడా చేర్చబడితివి. “మారుమనస్సు పొందుడి, పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తీస్మము పొందుడి. ఆ వాగ్దానం నీకు కూడా చెందియున్నది.” ఓ, సహోదరుడా, నిజమగు దేవుని ఆత్మ దాని మీద ప్రవహించుచూ, అది సత్యమేనని చెప్పును.
చేదు కాయలను గూర్చి మరియు కారు ద్రాక్షలను గూర్చి జాగ్రత్తగా ఉండుము, (వాటిని కని పెట్టుము). అయితే నిజమైన దేవుని ఆత్మ నిర్ణయించుకొనే చోటున నాటబడాలని కోరుచుండును, ఎక్కడైతే ఆత్మఫలములు ఫలించు...
38
యేసు ఎప్పుడు దానిని చేయగలిగాడు? ఆయన ఇలా అన్నాడు, “ఆ స్త్రీ అంగీకరించుటకు ఇష్టపడినప్పుడు....” ఆమె అన్నది, “ప్రభువా, నాకు ఆ నీరు ఇమ్ము, నాకు ఆ నీరు కావాలి.”
“నీ పాతకుండను అక్కడ విడిచి పెట్టుము. నీకు అటువంటి నీటికుండ ఇకెంతమాత్రం అవసరం లేదు. నీ సిద్దాంతానికి కావల్సిన లేఖ నీకేమాత్రం అక్కర్లేదు. నీవు నీ యొక్క స్వీయ-శైలి ప్రెస్పిటేరియన్, బాప్తిస్టు, మెథడిస్టు, పెంతెకోస్తు విధానంలాంటి వాటన్నిటిని విడిచిపెట్టుము. ఇక్కడ వున్న ఊట యొద్దకు రమ్ము, నదీప్రవాహంవలె పారే ఆనందమును నీలో ఎంతో ఎక్కువగా నేను నింపెదను,” అని అన్నాడు.
నల్లజాతి వృద్దుడొకరు ఇలా అనేవాడు, “నదీ ప్రవాహంవలే సమాధానమును నేను పొందుకొన్నాను, దివారాత్రులు అది ప్రవహించును. ఎంతవరకు అనగా తుదకు మరణమనేది నీ ముందు నిలబడినా సరే, అది నీలో ప్రవహించుచునే యుండును.
పౌలు ఇలా అన్నాడు, “మరణమా నీ ముల్లెక్కడ? పాతాళమా, నీ విజయమెక్కడ? యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమిచ్చుచున్న దేవునికే స్తోత్రం.” నిశ్చయంగా.
39
ఆమె ఆయనవైపు చూచినది. ఆరాధించే చోటును గూర్చి ఆమె ఆయనతో మాట్లాడసాగినది. మరి ఆయన ఆమెని అడిగాడు, “నీవు వెళ్ళి, నీ భర్తను తీసికొనిరా. (”దేవుడింకా సజీవంగా వున్నాడని నేనామెకి తెలిపెదను. నేనే ద్రాక్షవల్లిని.“) నీపు వెళ్ళి, నీ భర్తను తీసికొనిరా.”
“ఏందుకు, నాకు ఏ భర్త లేడే,” అని ఆమె బదులిచ్చినది.
“నీవన్నది నిజం. నీకు అయిదుగురు భర్తలుండిరి. ఇప్పుడు నీవు ఎవరితో జీవించుచున్నావో, వాడు నీవాడు కాదు,” అని ఆయన అనెను.
ఆమె తిరిగినది. అది ఏమిటి? ఆమె జీవితము ఆ పాత సిద్ధాంత వృక్షము నుండి త్రుంచివేయబడి - జీవముతో అంటుకట్టబడినప్పుడు, మొట్టమొదటిసారిగా దైవ హృదయ స్పందననేది ఆమె యొక్క కొమ్మలలో ప్రవహించెను. “అయ్యా, నీవొక ప్రవక్తవని నేను నమ్ముచున్నాను. మెస్సీయా వచ్చినప్పుడు ఈ కార్యములను చేయునని నేనెరిగియున్నాను.”
అందుకాయన “ఆయనను నేనే. ఆయనను నేనే.”
అంతట ఆమె ఆ పాత సిద్ధాంతములను అక్కడే విడిచిపెట్టినది. ఆమె తాను వెళ్ళ గలిగినంత వేగంగా వెళ్ళి ఆ వార్తను చాటెను (వ్యాపింపజేసెను). “నేను చేసిన వాటన్నిటిని నాకు తెలిపినవానిని చూచుటకు రండీ. మనం ఎదురు చూచుచున్న మెస్సీయా ఈయన కాడా? మెస్సీయా దైవాభిషిక్తుడు. దేవునిగా ఇమ్మానుయేలు ప్రవక్తగా, దేవుడుగా,” ఆయనను గుర్తించితిని.
“నేను ద్రాక్షవల్లిని, మీరు తీగెలు.”
“మంచిది, యూదులగు మీరు యెరూషలేములో దేవున్ని ఆరాధించెదరు. అక్కడ మీకొక పెద్ద చర్చివున్నది. మరియు సిద్దాంతమున్నది,” అని ఆమె అనెను.
ఆయనిలా అన్నాడు, “అది నాకు తెలుసు.”
ఆమె చెప్పెను, “మేము ఈ పర్వతము మీద ఆరాధించెదము.”
“అది నాకు తెలియును, కాని ఒక సమయము వచ్చుచున్నది, అది వచ్చేయున్నది. కనుక ఆ యెరూషలేము సిద్దాంతములు, లేదా ఈ సమయర సిద్దాంతములు ఇక ఏ మాత్రం పనిచేయవు. దేవుడు ఒక ఆత్మ గనుక ఆయనను ఆరాధించగోరువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధింపవలయునుని” ఆయన అనెను.
40
అదే ఆ ఎదిగిన కొమ్మ: సత్యము. “మారుమనస్సు నొందుడి, పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీస్మము పొందుడి,” దానితో అనగా, ఆ కొమ్మతో నీవు కలువబడవలయును. వీటిని, అవే కార్యాలను నీవు కలిగియుండెదవు, ఎందుకనగా దేవుడు నీ ద్వారా ప్రవహించును, కనుక ఆనంద ప్రవాహములు, సమాధానము, ధీర్ఘశాంతము, విశ్వాసము, మంచితనము, సాత్వికము, దీనత్వము నీ యొద్దకు తెచ్చును, అది నీకు ఇచ్చును, తయారు చేయును... తోడేలు స్వభావాన్ని మార్చివేయును, నీలో వున్న గొర్రె స్వభావాన్ని అది బయటకు తెచ్చును. అది నిన్ను ఒక దిక్కుమాలిన రాబందు నుండి, మాధుర్యమైన పావురముగా చేయును.
చూచారా, జీవముగల దేవుని ఆత్మయే నీ స్వభావాన్ని మార్చివేసేది. కనుక అప్పుడే ఆయనలోనికి రమ్ము, అయనలో అంటుకట్టబడుము మరియు ఆయన తీగలలో ఒక దానివగుము. ఒక దినాన.... ఈ విధమైనదానిలోవున్న జీవనాధారం (ప్రాణాధారం) ఎదో కాదు గాని, అది క్రీస్తు జీవమైయున్నది. అది పరిశుధాత్మయై యున్నది. అది దేవుని రాజ్యముతో లంగరు వేయబడినది. ఒక దినాన దేవుడు ఆ నిత్య కొమ్మ మీదికి వచ్చును. ఆ చెట్టును ఆయన తిరిగి లేపినప్పుడు, క్రీస్తునందుండి మృతులైన వారిని ఆయనతో వెంటబెట్టుకొని వచ్చును. నీటి కాలువల యోరను నాటబడిన మొక్క ఎన్నటికి పచ్చగా వుండును, వాడిపోదు, ఆకులు రాలిపోవు...
41
నా ప్రియ స్నేహితుడా, ఈ ఉదయకాలం, దాని యొక్క కొమ్మ నీ యొద్దకి చాపబడియున్నది, కావున దానిని స్వీకరించుము, నీ పాపములో నుండి త్రుంచివేయబడుము, నీ అవిశ్వాసములో నుండి, నీ యొక్క సిద్ధాంతములో నుండి త్రుంచివేయబడుము. నీవు నీ సంఘమును విడిచిపెట్టమని నేను చెప్పుటలేదు. నీవు సంఘముతోపాటే నిలిచియుండుము, కాని క్రీస్తునొద్దకు రమ్ము, అవును, అది అంతే. నీవు రక్తముతో నిండియున్న ఊట యొద్దకు రానంతకాలము నీవు ఏ సంఘానికి వెళ్ళినా ప్రయోజనమేమి లేదండీ. ఆయన జీవమును పొందుకోండి, అది నిన్ను ఎత్తనీయుము, ఈ లోక కార్యములన్నిటిలో నీవు మృతతుల్యమైనంత వరకు అది నీలో నుండి ఇహలోక వాంఛలన్నింటిలో నుండి నిన్ను పైకెత్తనియ్యుము. “లోకమును, లోకములో వున్నవాటిని ప్రేమించువానిలో దేవుని ప్రేమ నిలువదు.” గుమ్మడికాయ జీవమును నీవు ద్రాక్షవల్లీలోకి ఎక్కించజాలవు? ద్రాక్షఫలములను లెక్కింపజాలవు, చూశారా. నీవు క్రీస్తు సంబంధివైతే, క్రీస్తుకి సంబంధించిన కార్యాలనే నీవు ప్రేమించెదవు, నీవు ఆత్మలో నింపబడెదవు. ఆయన ద్రాక్షవల్లి, మీరు తీగెలు. సమరయ స్త్రీకి జరిగినట్టుగా, ఈ ఉదయకాలం ఆయనను నీవు స్వీకరించుము, మరియు ఆయన జీవములో నీ జీవమును ఉండనిమ్ము, నూతన సృష్టిగా నిన్ను చేయనిమ్ము, ఒక నిమిషం పాటు మనం శిరములు వంచుచుండగా.
42
ప్రార్ధించడానికి ముందు, మీలో ఎవరైనా చేతులు పైకెత్తి ఇలా చెప్పగలరా, “నా కొరకు ప్రార్థించండి, సహోదరుడా. నేను క్రీస్తుతో కలపబడగోరుచున్నాను.” దేవుడు మీ హృదయమును దీవించును గాక. ఓ, అది అద్భుతం. “క్రీస్తులోనికి నేను కలపబడగోరుచున్నాను, తద్వారా నా జీవితం ఆయన కొరకు ప్రకాశించును. నా భయములన్నిటిలో నుండి, సందేహములన్నిటిలో నుండి, నిరుత్సాహములన్నిటిలో నుండి, సిద్దాంతములన్నిటిలో నుండి నన్ను బయటికి తీయండి. ఈ ఉదయకాలం ఆయనలో నన్ను నాటండి, అక్కడే నదివలే సమాధానం నాకు దొరుకును. నేనెంతో ఉద్రిక్తుడనై యున్నాను. నేనెక్కడకి పోవుచున్నానో నేనెరుగను. నేనెల నిలబడుదునో నేనెరుగను. అక్కడ నన్నుంచుము.”
ఇప్పుడు, మనం శిరములు వంచియుండగా, ప్రార్థన కొరకు చేతులు పైకెత్తగలిగిన వారంత నిలువబడగలరు. కేవలం... మీరున్న చోటనే, మేమంతా మీ కొరకు ప్రార్థించెదము. ఎందుకనగా... ఇప్పుడే దయచేసి నిలబడండి, అలాగైనట్లయితే మీ కొరకు మేము ప్రార్ధించగలుగుదుము.
43
[టేపు మీద ఖాళీ వున్నది.] ... వారిలో నుండి నిరాశంతా తీసివేయండి. [టేపు మీద ఖాళీ వున్నది.] ... దుష్టుల సహవాసములోనున్న వారిని నేడే నూతన వెలుగులో నడుచుటకు అనుమతినిమ్ము ప్రభువా, “అడుగుడి మీరు పొందెదరు, వెదుకుడి మీకు దొరుకును. తట్టుడి మీకు తీయబడును,” అని నీవు చెప్పావు. ఇప్పుడు వారు తట్టుచున్నారు. ప్రభువా, వారు దానిని పొందుకొననిమ్మని నేను అడుగుచున్నాను. మరెన్నడూ ఏ సందేహములేనంతగా వారి జీవితములు నేడు మారును గాక. ఆ దినమున వారు నీ యొద్దకు, గృహమునకు వచ్చెదరు గాక. ప్రభువా, వారు ఈ ఉదయకాలమున నిలబడియున్నారు. ఇప్పుడు వారు తమ తోటివారితో కలిసి నీ కొరకు నిలబడియున్నారు. అలాంటి కార్యమును చేసినవారికోసం నేను దేవునియెదుట మరియు ఆయన పరిశుద్ధ దూతల యెదుట నిలుతును. అయితే నా విషయమై ఎవడైతే సిగ్గుపడునో, ఆ దినాన నేను వాని విషయమై సిగ్గుపడుదును,“ అని నీవు పలికియున్నావు. ప్రభువా, ఈ ఉదయమును వారెంత మాత్రం వారు సిగ్గుపడుటలేదు, వారు నిలబడియున్నారు. ఇప్పుడు నీవు నీవిచ్చిన వాక్యాన్ని నిలుపుకొనుము. నీ ఆత్మతో వారిని నింపుము, రాబోయే లోకంలో సేవచేసే జీవితమును వారికి ప్రసాదించుము. ఎన్నడూ తప్పిపోని ప్రభువైన యేసు సన్నిధిని బట్టి ఇప్పటి నుండే వారు ఆనందించుదురు గాక. వారిని నీకు అప్పగించుచున్నాను. యేసు నామమున. ఆమేన్.
దేవుడు నిన్ను దీవించును గాక. ఒకరినొకరు కరచాలనం చేసికొనుడి. మీకు అందుబాటులో వున్నవారితో దగ్గరగా వున్నవారితో కరచాలనం చేయుడి.
ఒక ఊట వున్నది.... (ఇప్పుడు వర్తమానం ముగించబడినది.
ఇప్పుడు ప్రభువుని ఆరాదించుడి. అలా మీరు కండ్లు మూసి.)
రక్తము,
ఇమ్మానుయేలు రక్తనాళములో నుండి (అది దేవుడే, అనగా ఇమ్మానుయేలు.)
మరి పాపులు, అవిశ్వాసులు అందు మునిగి...
త్వరగా, పరుగెత్తి రండి.
తమ పాప డాగులన్ని పోగొట్టుకొనిరి.
పోగొట్టుకొనిరి ....
కేవలం ఇప్పుడు ఆత్మలో ఆయనను ఆనందించుడి. మీ హృదయం స్వేచ్చగా ఉండనీయుడి. నీవు ఏ సంఘానికి చెందియున్న నేను లెక్క చేయను. కేవలం నీ హృదయంలో, “ప్రియదేవా నీకు కృతజ్ఞతలు,” అని చెప్పుము.
మరి పాపి ఆ ప్రవాహములో మునిగి,
వారి అపరాధములన్ని పోగొట్టుకొనుము.
44
క్రైస్తవులైన మీరు, మీ చేతిని పైకెత్తవల్సినదిగా ఇప్పుడు నేను కోరుచున్నాను, విశ్వాసులారా మరియు దీనిని నాతో కలిసి పాడండి.
విశ్వాసమును బట్టి నేను ఆ ఊటను చూచుచున్నాను.
నీ గాయములలో నుండి స్రవించే సరఫరా,
ఇప్పుడు ఒక సిద్ధాంతము కాదు, గుర్తుంచుకోండి.
విమోచించు ప్రేమ నా అంశమాయెను,
మరణము వరకు అది నిలుచును
మరది... అది నా యొక్క. . .
మరణము వరకు, విమోచించు . . .
కాని విమోచించు ప్రేమ, నా అంశమయ్యెను,
మరణము వరకు అది నిలుచును.
45
నీ అర్ధం ఆయనేగా? “ఆమేన్” చెప్పండి. నీవైపు నా విశ్వాసము చూచుచున్నది.“
ఈ ఉదయం మీలో ఎంతమంది రోగులుగా, అవసరతలో ఉన్నవారుగా ఉన్నారు? ఆత్మీయ సహాయం తర్వాత మీకు భౌతికసహాయం అవసరమైయున్నది. అలాగైతే మీరు మీచేతిని పైకెత్తిచూపుడి, తద్వారా మాకు అర్ధమగును “బ్రదర్ బ్రెన్హాం నేను అవసరతలో వున్నాను. నేను ఇక్కడ వున్నాను, నేను అనారోగ్యములో ఉన్నాను. నేను ఇంకా భాగపడలేదు. నేనెంతో ప్రయత్నించాను. నేను డాక్టర్ యొద్దకి వెళ్ళాను. నేను చేయాల్సిందంతా చేసాను, అయినప్పటికి నాకేం జరుగలేదు. నావల్ల కావట్లేదు. అయితే దేవుడు నన్ను బాగుచేయునని నేను నమ్ముచున్నాను,” అని అందురా. దానిని మీరు నమ్ముదురా? అది ఆయన యొక్క వాగ్దానము.
ఇప్పుడు, నీటికాలువలు యోరన మీరు నాటబడియున్నారా? ఏ నీరు? అది కొట్టబడిన క్రీస్తు, ఆ బండలో నుండి నీరు ప్రవహించుచున్నది. మరణములో నశించిపోతున్న జనులను రక్షించుటకు క్రీస్తు కొట్టబడెను, మరియు ఆయన శరీరములో నుండి పరిశుద్ధాత్మ బయటకు వచ్చెను. అందువలన నశించిపోతున్న జనులు చనిపోకుండా, నిత్యజీవము పొందులాగున, నీవు... బిన్నమైన కార్యాలెన్ని వున్నవి.
స్వస్థపరచుదునని దేవుడు వాగ్దానము చేసెను, “మన యతిక్రమములనుబట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాదానార్ధమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలిగినది.” నదులు, ఒక్క నీటి యొక్క నదులు(కాలువలు), అది పరిశుద్ధాత్మ, అక్కడున్నారు. మొదట, అపోస్తులలు, ప్రవక్తలు, బోధకులు, సువార్తీకులు, కాపరులు: వీరంతా ఒక్క నీటి యొక్క నదులు(కాలువలు).
46
“వరములు నానా రకములుగా వున్నవి. కొందరు ప్రవచించుటకు పిలువబడిరి; కొందరు స్వస్థపర్చు వరము నిచ్చుటకు పిలువబడిరి; అదే ఆత్మ ద్వారా కొందరికి జ్ఞానమున్నది; కొందరు బుద్దివాక్యము; కొందరు బాషలలో మాట్లాడుదురు; కొందరు దానికి అర్థం చెప్పుదురు: ఇవన్నీ ఒక్క ఆత్మ ద్వారానే జరుగుచుండెను.” I కొరింథి 12. ఏమిటది? నదులు, అనేక నదుల నీరు. నీరనేది ఒక్కటే, కాని అది పారే నదులు అనేకం. అదే రీతిగా ఒక్క పరిశుద్ధాత్మే అనేక వరములను, ఆశీర్వాదములను అంతటా జరిగించుచుండెను. గొప్ప వరములను సహితం ఆయనే ఇచ్చేది, స్వస్థత వరములు, రక్షణ వరములు, నీ సంఘములో మరియు జనుల మధ్య పనిచేయు పరిశుద్ధాత్మ వరములు. నదులు! నదీ ప్రవాహంవలే ఆనందం ఉబుకుట, అదెంత చక్కగా వుందో చూడండి!
నా విశ్వాసం నీవైపు చూచుచున్నది,
ఓ కల్వరి గొర్రెపిల్ల,
దైవీక రక్షకా;
ప్రార్దించుచుండగా వినుము,
నా పాపములన్ని తీసివేయుము,
ఈ దినము నుండి,
సంపూర్ణునిగా చేయి!
47
ఇప్పుడు, ప్రభువా, అది మా ప్రార్ధన. మేము త్వరపడుట లేదు. ఇది విశ్రాంతి(సబ్బాతు). ఇది నీవు చేసిన దినము. దీనమెల్లా మేము నిన్ను ఆరాధించాలి. “దివారాత్రులు,” అని కవి అన్నాడు, “దూతలు నిన్ను చూస్తూనే వుంటారు.” ఇప్పుడు వారు మాకు సమీపముగానే ఉన్నావని మేము భావించుచున్నాము.
తండ్రియైన, దేవా, ఎంతో ఖచ్చితమైన దాన్ని గూర్చి నేను మాట్లాడాను. అయితే నేను దీనిని చేయలేదు... నా హృదయాన్ని పరిశోధించు ప్రభువా. ఒకవేళ నేను దీనిని దుర్బుద్దితో చేసివుంటే, దయతో నన్ను క్షమించుము. అయితే నీ ద్రాక్షవల్లి మీదున్న ప్రేమ చేత, నీ తీగెల మీదున్న ప్రేమ చేతనే నేను దీనిని చేసితిని. గుర్తుంచుకోండి ఇక్కడ ఎవరైనా గొప్ప గొప్ప శాఖలతో అనుసంధానమై (గుర్తించబడి) అందులో నుండి బయటకు రమ్మని నేను వారిని అడుగుటలేదు; వారి సిద్దాంతాలలో పాతుకుని పోవద్దని మాత్రమే నేను వారిని అడుగుచున్నాను, వారు నీ యొద్దకు వచ్చి, విడిపింపబడి, సరిచేయ బడాలని, ఆత్మ దానిమీద పోయబడాలని కోరుచున్నాను. అప్పుడు వారి సంఘము మరింకా శ్రేష్ఠమైన సంఘముగా నీవు దేనికొరకైతే వచ్చుచున్నావో, అట్టి విధమైన మచ్చ, డాగు, కళంకమేది లేని గొర్రెపిల్ల రక్తముతో కడుగబడిన ఒక ఆత్మీయ సంఘముగా కావాలనే కోరుచున్నాను, మరియు ప్రభువా నేను ప్రార్ధించుచున్నాను.
తండ్రీ, నేటి తెలివితేటలుగల ఈ లోకము దానిని నుండి ఎంతో దూరం తొలగిపోయింది. వారు గొప్ప గుంపులవైపు, కారు ద్రాక్షలాంటి గొప్ప సంఘాలవైపు చూచుచున్నారు. కాని ప్రభువా, మేమైతే, ఆ తీయ్యని పండుతోనే అతుకబడి యుంటిమి, ఆత్మఫలముతోనే, అది మా ఆత్మలకి మాధూర్యమును తెచ్చుచున్నది.
48
ప్రార్ధన చేయించుకొనుటకు ముందుకి వచ్చుచున్న ఈ రోగులను దీవించమని మేము అగుచున్నాము. ప్రభువా, అయోగ్యమైన ఈ కొమ్మను నీ రక్తము చేత కడిగి శుద్దిచేయమని మరోమారు అడుగుచున్నాను. నీ ఆత్మ దాని ద్వారా కుమ్మరింపబడి, నీవు ఆనాడు బావివద్ద స్త్రీతో మాట్లాడిన అదే దేవుడవని, జీవముగల దేవుడవని చూపించెదము. ప్రజలు ఎటువంటి గందరగోళము చెందకుండునట్టు, పరిశుద్ధాత్మ నిజముగా ఎక్కడైతే నిలిచియుండగలదో అక్కడ, అనగా విశ్వాసి హృదయంలో, కొన్ని సంఘములలో కాదండీ, విశ్వాసి హృదయములో మాత్రమే నివసించునని తేటగా తెలియబడును గాక. తండ్రి, దానిని దయచేయండి. గత కాలములో ఏ విధముగానైతే నిన్నునీవు కనపర్చుకొన్నానో మరదే రీతిగా ఇప్పుడు కూడా నిన్నునీవు కనపర్చుకొనమని నీ కొరకు నేను వేచియున్నాను. యేసు ద్వారా నిన్నునీవు కనపర్చుకొన్నావు, మేము శుద్ది అగుటకు ఆయన మా కొరకు చనిపోయెను, ఆయనలో వశించిన అదే ఆత్మ మా ద్వారా కూడా పనిచేయుచూ అదే ఫలితములను తీసికొని వచ్చునట్లు చేయుము. తండ్రి, దానిని అనుమతించండి. నీ కుమారుడగు యేసు యొక్క మనోహరమైన నామమున వీటిని నీకు సమర్పించుచున్నాను. ఆమేన్.
నీ నుండి నేను ఎన్నడూ తప్పిపోకుండా చేయుము.
49
మంచిది, టెడ్డీ కేవలం నమ్ముము. ఇప్పుడు, కేవలం ఎంతమంది... కొన్ని ప్రార్థనా కార్డులను ఇచ్చినట్లు బిల్లీ చెప్పియున్నాడు. ఇప్పుడు, మనం ఇక్కడ వుండియున్నాం, ఇది ఇరుకుగా వున్నందున, మన మధ్యలోకి వచ్చిన క్రొత్తవారిని నిలబడమని అడుగుదుము. అలాగే పరిశుద్ధాత్మ వారియొక్క సంగతులను ఆ విధంగా వివేచించునట్లుగా చేయుటకు అనుమతించెదము. ఎన్నోసార్లు మనమలా చేసాం.
ఇప్పుడు, కొద్దివారాల క్రితం ఒకరిలా అన్నారు, “జనులు దానిని గ్రహించటం చాలా కష్టం, కనుక వారిని ప్రార్ధనా వరుసలోనికి తెమ్ము.”
కావున మేము... పరిశుద్ధాత్మ జనులలోనికి వెళ్ళి, ప్రతి ఒక్కరిని సంధించిన సంగతిని మీలో ఎందరు ఎరిగియున్నారు? అది నిశ్చయం. ఇప్పుడు, కొన్ని ప్రార్థనా కార్డులు ఇవ్వమని నేను బిల్లీతో చెప్పాను, అలాగైతే కొద్ది గుంపులుగా వారిని చేసి వారి కొరకు ప్రార్ధించవచ్చును. చూశారా, దానిని అలా చేయవచ్చును. ఆ తదుపరి, ఇది అయిన వెంటనే, మీలో ఎవరైనా బాప్తీస్మము పొందగోరినట్లయితే, అట్టివారి కొరకు వారికొక కూటముండును. దాని తేది, స్థలం కొద్ది నిమిషాల్లో మీకు తెలియపర్చబడును.
50
మొదట దీని గురించి మనం చెప్పుకొన్నాం. ఈ ద్రాక్షవల్లిని గూర్చి ఈ దేవుని స్వాస్థ్యము గూర్చి మాట్లాడుకొన్నాం. ఇప్పుడు అదే నిజమైతే, అప్పుడు నిశ్చయంగా, ఆ ద్రాక్షవల్లికి మనం ముందుగా నిర్ణయింపబడిన కొమ్మలగుదుము, అప్పుడు అదే పరిశుద్ధాత్మ మనగుండా కూడా చేయును. మరియు అది అలా జరిగినట్లైతే, ఆయన ద్వారా అది ఎలాగైతే కార్యములు జరిగించెనో, సరిగ్గా దానిని ఇక్కడ జరిగించును, ఎందుకనగా అయన ద్రాక్షవల్లి అయియున్నాడు; మనం తీగలుగా వున్నాం. ద్రాక్షవల్లిలో ఉండిన జీవము దాని కొమ్మలు సజీవంగా ఉండు నిమిత్తం దాని కొమ్మలలో కూడా వుండవల్సి వుంది. అసలైన ద్రాక్షవల్లి ఎలగైతే ఫలమిచ్చి యున్నదో, సరిగ్గా అలాంటి ఫలమునే ఇది ఇవ్వనట్లైతే, అప్పుడది సరైనది కాదని అర్ధం. చెప్పుటకు నేను ప్రయత్నించేదంతా అదేనండీ. అది అదే జీవమును కలిగియుండవలసియున్నాది.
ఇప్పుడు, ప్రార్థనా కార్డులు ఎందరు కలిగియున్నారు. దయతో మీరు మీ చేతిని పైకెత్తండీ. మంచిది. ఎక్కడి నుండి ఆరంభించాలి, ఒకటి నుండి యాభైకా, లేదా ఒకటి నుండి వందకా? లేదా ఎందరికి తెలుసు? ఇంతక ముందు ప్రార్ధనా కార్డులు వున్నవా... ఆగండి. ఇప్పుడు, ఒకటో నంబరును ఎవరు కలిగియున్నారు? ఒకటవ నంబరు ప్రార్ధనా కార్డును కలిగియున్నవారు ఇక్కడ వున్నారా? ఉన్నారా? మంచిది, మరలాగైతే ఎక్కడి నుండి ఆరంభిద్దాం, యాభై నుండి? ఓ ఇక్కడ ఒకటి నుండి యాబై వరకు?
సరే, మంచిది. అక్కడ నిలబడి ఒకటవ నంబరును గమనిద్దాం. రెండవ నంబరు. రెండవ నంబరు. మంచిది, అక్కడ నిలబడండి. నంబరు మూడు, ప్రార్థనా కార్డు నంబరు మూడు. వారు ఈ కట్టడములో వున్నారా? వారు లేచి నిలబడగలరా? దయతో మన్నించండి, ఆయా చోట్లనుండి వారు నిలబడియున్నారు. నంబరు మూడు, ఓ స్త్రీ ఇక్కడికి రాగలవా? నాల్గవ నంబరు. నాల్గవ నంబరు ప్రార్ధనా కార్డుని ఎవరు కలిగియున్నారు. ఉన్నపాటునే అక్కడికి వెళ్ళండమ్మ, నంబరు నాలుగు, నేను చూసాను? అది మీరేనా... నంబరు నాలుగు ఎవరు? మంచిది. నంబరు ఐదు, నంబరు ఆరు, ఏడు, ఎనిమిది, నంబరు ఎనిమిది. తొమ్మిది. ఇప్పుడు ఇక్కడ ఆగండి. నంబరు ఎనిమిది, తొమ్మిది.
51
కొందరు బహుశా బయటకి వెళ్ళివుండొచ్చును, ఒక్కరైనా ఉండొచ్చును, నంబరు తొమ్మిది. నంబరు పది, నంబరు పదకొండు, నంబరు పన్నెండు, పదమూడు, పద్నాలుగు, పదిహేను. నాలుగైదు లేరనుకొంటా. వారు వస్తారు. బహుశా బయటకు వెళ్ళి ఉండొచ్చు. వారిలో ఎవరైనా లోనికి తిరిగి వచ్చినయెడల నీవు చేయగల్గితే వారిని వరుసలోనికి చేర్చండి, బ్రదర్ టేలర్, వారి యొద్ద ప్రార్ధనా కార్డులున్నాయో లేదో నీవు గమనించి చూడుము. అలాగే వారు ఎక్కడో వెనుక భాగాన వున్నారేమో గమనించి చెప్పుము.
ఇప్పుడు, మీరు పూర్తిగా భయభక్తులు కలిగివుండాలని, ఉండగల్గినంతగా భయభక్తి కలిగి ఉండాలని నేను కోరుచున్నాను.. ఇక్కడ కొందరు రోగులుగా వుండి కూడా ప్రార్ధనా కార్డులను లేకుండా వున్నారా? దయతో అట్టివారు మీరు మీ చేతిని పైకెత్తి ఇలా చెప్పగలరా? “నేను రోగిగా వున్నాను మరియు అవసరతలో వున్నాను, కాని నాకు ఏ ప్రార్ధనా కార్డు అందలేదు.” మంచిది. ఇప్పుడు మీరు ఈ తట్టు చూడుడి మరియు నమ్ముడి. మంచిది. (ఇప్పుడు, బ్రదర్ టెడ్డీ, చాలా నెమ్మదిగా వాయించుము.)
52
ఇప్పుడు, ఒకవేళ ఈ ప్రజలు లోనికి రానియెడల, ఏదో ఒకచోట మనం ప్రార్ధనా వరుసను కొనసాగిద్దాం, అయితే వారికి అవకాశం ఇచ్చుటకై మనం వేచివుందాం.
ఇప్పుడు, నేను చెప్పిన ప్రతీది వాస్తవమో కాదో నిరూపించబడే సమయం వచ్చినది, “అన్నిటిని పరీక్షించి మేలైనదీ చేపట్టుడి,” అని బైబిల్ చెప్పట్లేదా. ఇప్పుడు అయితే... దేవుని ద్రాక్షవల్లియగు యేసు సంఘానికి నిత్యజీవమును తెచ్చెను, ఆ ద్రాక్షవల్లి యొక్క తీగలుగా మనం ఉంటిమి.
చూశారా, ఆయన ఇశ్రాయేలీయులను పాలస్తీనాలో నాటెను. అది పనిచేయలేదు. వారు ఎలా మారారంటే... వారి ఫలములు ఆహారమును పనికిరాని పుట్టగొడుగువలె ఎండిపోయేను. రాత్రికిరాత్రే అది పెరిగెను, సరైనది కాదని చూపెను, దానికి నిత్యజీవము లేకపోయెను.
కాని యేసుక్రీస్తునందున్న ఫలములు శాశ్వతకాలం నిలిచియుండును. అవి అలా వుండవల్సిందే. ఆయనలో వున్న ఆయనాత్మ నేటికిని సజీవముగా ఉన్నట్లైతే, అది పిచ్చి పుట్టగొడుగులాంటి సంఘ శాఖలాగ వుండదు. ఇదివరకు ఎలాగైతే జీవమును సరఫరా చేసేనో సరిగ్గా అలానే ఆయన నేటికిని చేయును, దానిని మీరు నమ్ముచున్నారా? ఇప్పుడు, “ఓ, ఆ కార్యాలు మరొక దినానికి చెందినవి. ఓ, ఈ దినమునకు ఇలా వుండాలి,” అని అవి చెప్పినట్లేతే, ఈ ఉదయమున నీవు త్రుంచివేయబడుదువు. అది వాస్తవం. అది నిజమైన జీవము, అది నిజమైన క్రీస్తు.
53
రోగులను స్వస్థపర్చుటకు ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడని నీవు ఏ మాత్రమైనను సందేహింపక విశ్వసించి, నమ్మిక యుంచియున్నావు. ఇప్పుడు, ప్రార్దనా కార్డు లేనివారు హృదయమంతటితో కేవలం నమ్ముడి, అప్పుడు దేవుడు నీవు అడుగువాటిని దయచేయును, దేవుడు వాటిని జరిగించును. ఇప్పుడు ఎందరు దానిని నమ్ముదురు?
ఇప్పుడు, మరొక సంగతిని కూడా నేను మిమ్మును అడుగగోరుచున్నోను. దేవుడు అలాంటి వాటిని జరిగించినట్లైతే... ఇప్పుడు ఈ ప్రార్థనా వరుసలో నాకు తెలిసినవారెవరైనా ఉన్నారేమో చూద్దాం. నాకు తెలిసిన వారు ఎవరూ లేరు. అవును, సిస్టర్ లాగ్స్టన్. నీవు సిస్టర్ లాగ్స్టన్దే కదా? అవును కదా? ఓ, నీవు వరుసలో లేవా, సరే. మన్నించండీ. వారందరూ నాకు క్రొత్తని నేననుకొనుచున్నాను. అది నిజమే కదా. అది నిజమే కదా? మీ గురించి నాకేమి తెలియదు. నేను చెప్పింది వాస్తవమైతే, మీ చేతిని పైకెత్తి చూపండి. అక్కడ, అదెలా జరిగెను? అది ఎలా జరిగింది, అలా వచ్చి మరి ఎవరికి పడితే వారికి వాటిని ఇచ్చి యున్నట్టుంది, ఇప్పుడు టాబరికల్ల్ లో ఏ ఒక్కరు లేరు. గతములో ఇలా ఎన్నడూ జరిగినట్టు నేననుకోవట్లేదు.
54
ప్రార్ధనా కార్డు లేనివారు వినండి, ఒకసారి ఒకామె గుంపులో జోరబడి నెట్టుకొంటూ వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టి ఇలా అన్నది, “నేను నమ్ముచున్నాను. యాజుకుడు లేక మరెవరు చెప్పిన నేను లెక్క చేయను, నేను ఆయనను నమ్ముచున్నాను. నేను ఆయన వపు చెంగును ముట్టిన చాలు, నేను పూర్తిగా బాగుపడుదును.” మీకు ఆ కథ తెలుసు? ఆమె ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. మరి ఆయన ఆమె వైపు తిరిగి, ఆమె యొక్క రక్తస్రావం ఆగిపోయెననని చెప్పెను. ఆమె విశ్వాసమే ఆమెను బాగుచేసెను.
అది సత్యమని మీకు తెలియున్నా? మంచిది, ఈ ఉదయకాలమున కూడా ఆయన అదే ప్రధానయాజకుడిగా ఉన్నాడు. దేవుని సింహాసనము యొద్ద ఆయన ఉన్నాడు. ఆయన వాక్యము, ఆయన యొక్క తీగెల జగత్తు పునాది వేయబడక మునుపే దేవుని వాక్యము అనేది దేవుని సింహాసనముతో లంగరువేయబడి యుండెను. దానిని మీరు నమ్ముచున్నారా? జీవమైయున్న యేసుక్రీస్తును అది తెచ్చినది. ఆయన ద్వారా కొమ్మలు వచ్చెను. అది జీవమును తెచ్చుచుండెను. అది సింహాసనములో నుండి వచ్చినది. అది నిజమేనా? ఆయన పరమందున్న మహోన్నతుని కుడిపార్వమున ఆసీనుడైయుండుటే ఆయన కొమ్మల స్థితియై యున్నది. తద్వారా ఆయన సంఘము ద్వారా అదే జీవమును తీసికొని వచ్చుచుండెను. మన బలహీనతలయందు మనతో సహానుభవము గల ప్రధానయాజకుడు ఆయన. అది వాస్తవం. కాదంటారా? మీ పూర్ణహృదయములో మీరు నమ్ముదురా?
ఆయన అది చేయునని, రోగులగు మీలో ఎందరు దానిని అంగీకరించెదరు? మీరంతా? (ఇప్పుడు, టెడ్డీ..)
55
ఇప్పుడు ఇక్కడొక స్త్రీ నిలబడియున్నది. ఆమె చేయి పైకెత్తి యున్నది. ఆమె ఎవరో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు నేనెన్నడు ఆమెను చూడలేదు, దేవునికది తెలియును. బహుశా ఆమె ఈ పట్టణవాసి అయి యుండవచ్చునేమో, నేనెరుగను. ఇక్కడ ముప్పాతిక శాతం మంది జనులు నాకు తెలియనివారే. కొత్తవారు లోనికి వచ్చారు. నేను దిగువ పట్టణానికి వెళ్ళుచుండే వాడిని; అక్కడ ప్రతిఒక్కరిని నేనెరుగుదును. ఇప్పుడైతే నాకు ఎవరు తెలియదు, ఎందుకనగా ఎందరో వచ్చియున్నారు.
ఆ స్త్రీ ఎవరో నాకు తెలియదు. అలాగే నేనెవరోనన్నది ఆమెకు కూడా తెలియదు. అయితే ఆ ద్రాక్షవల్లిలలో ఏ జీవమైతే యుండియున్నదో, అదే జీవము తీగెలో కూడా వుండి, అవే కార్యాలు తెచ్చునని వాగ్దానము చేసెను.ద్రాక్షవల్లి తెచ్చిన అదే జీవము.. “నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును. వాటికంటే మరీ గొప్పవి చేయును.” అది లేఖనమేనా? పరి. యోహాను 14:8. మంచిది.
56
ఇప్పుడు, ఆయన చేసిన కార్యములు, బావియొద్ద స్త్రీతో మాట్లాడి, ఆమె జీవితంలో దాగిన సంగతులను చెప్పెను. ఈ ఉదయకాలం అదే పరిశుద్ధాత్మ ఇక్కడ సంఘములో పనిచేసినయెడల, మరియు అదే పరిశుద్ధాత్మ ద్వారా ఈ స్త్రీతో మాట్లాడి, ఆమె ఇచ్చటికి ఎందు నిమిత్తం వచ్చియున్నదో, ఆమె జీవితంలో ఏదీ కార్యాలు జరిగియున్నవో, లేక ఇంకా ఏఏ సంగతులున్నవో నిశ్చయంగా తెలుపును, అవి ఏమీటో పూర్తిగా తెలియదని ఆమె ఎరిగియున్నది.. ఎందుకనగా మేమేరుపురం ఒకరినొకరం పరిచయస్తులం కాదు. ఆమెను చూడటం ఇదే మొదటిసరి; ఆమె కేవలం ఇక్కడ నిలబడినది. పరిశుద్ధాత్మ కొంచెం కూడా తప్పిపోకుండా అంతటిని అనుగ్రహించును. ఇక్కడ దేవుని వాక్యము వాగ్దానం చేయబడింది. ఇక్కడ మనమిరువురం ఇలా నిలబడియున్నాము. మనం ఇంతక ముందెన్నడూ పరిచయస్తులము కాదు; ఒకరిని ఒకరు ఎన్నడు చూడలేదు. పరిశుద్ధాత్మ దానిని బయలుపరిచిన యెడల, ద్రాక్షవల్లిలో జీవము ఉన్నట్టే, తీగెలో కూడా జీవము నేటికిని వున్నదని, ఆ తీగె ద్వారా అది ప్రవహిస్తుందని రుజువగును. ప్రభువగు దేపుడు దానిని అనుమతించును గాక.
ఇప్పుడు, దేవుని రాజ్యము నిమిత్తం ఇక్కడున్న ప్రతి ఆత్మను యేసుక్రీస్తు నామమున నా స్వాధీనంలోకి తీసికొనుచున్నాను.
57
ఇప్పుడు, ప్రతిఒక్కరు భక్తిగా ఉండుడి. ప్రతి ఒక్కరూ. స్త్రీ, పురుషులుగా మనం మొట్టమొదటిసారి కలిసాము. ఇది లేఖనములో పున్నదాని వలే వున్నది. దేవుడు దీనిని ఎందుకు అనుమతించుచున్నాడు, బహుశా తీర్పు దినాన జనులు సాకులు చెప్పుట వీలు లేకుండా వుండేందుకే. ఈ ఉదయమున ఇంకా ఎవరైనా క్రీస్తులో నాటబడకుండా, ఆయన కృపానికరములు ఎరుగకుండా, వాక్యము ప్రకటించబడిన తర్వాత, ఈ చొటును విడిచిపోయినట్లయితే, తీర్పు దినాన, అది లేకుండా, వారు చాలా తక్కువ అవకాశమును కలిగియుందురు. ఆయన ఆత్మ...
చూశారా, బోధించుటకు ఒకటే సంగతున్నది. ఒకవేళ ఆయన చారిత్రాత్మకమగు దేవుడైతే, అప్పుడు ఏదైతే చేశాడో, అది చరిత్రగానే మిగిలిపోవును. కాని అలాకాక ఆయన నిజంగా ద్రాక్షవల్లిగా, మనం లీగలుగా వుంటే, అపుడు ఆయనలో మనము భామముగా వుండేదము. ద్రాక్షవల్లిలో వున్న జీవము, తగల గుండా ప్రవహించును, చూశారా. కనుక అది జీవమును తీసుకొని రావల్సివుంది. “నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రీయులు చేయును,” అది ఆయన వాగ్దానము చేసాడు.
58
ఇప్పుడు, మీరు రోగిగా వుంటే, మరియు అది నాకు తెలియదు. కాని మీరు రోగిగా వుంటే, నేను బాగుచేయలేను, ఎందుకనగా ఆయన ఇదివరకే దానిని చేసి ముగించాడు. ఆయన ఇక్కడ వున్నాడని, ఇక్కడున్న ఆయన సన్నిధి నీకు తెలియునట్లు చేయును. అప్పుడు దానిని అంగీకరించుటకు నీ విశ్వాసం లేపబడును, చూశారా. ప్రేక్షకులకు తెలుపుకొనే విధానమదేనండీ. ఈ స్త్రీకి అది ఏమి చేయునో మీలో ప్రతి ఒక్కరికి అదే చేయును. ఇప్పుడు దానిని విశ్వసించండి, ఎందుకనగా, “మన దోషముల నిమిత్తం ఆయన గాయపర్చబడెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలిగియున్నది.” ఇదివరకే మనం స్వస్థపడితిమి. చాలాకాలం క్రితమే, రెండువేల సంవత్సరాల క్రితమే, రక్షణ మరియు స్వస్థత వచ్చియుండెను.
ఇప్పుడు, నీవు ఇలా అడగవచ్చును. “బ్రదర్ బ్రెన్హాం, దేనిగూర్చి నీవు మాట్లాడుచున్నావు?” పరిశుద్ధాత్మ ఏమి చెప్పెనో దానినే నేను చూస్తున్నాను. ఆమె ఎవరో నాకు తెలీదు. ఇప్పటి వరకు జరిగిన కూటములన్నిటిలో ఇదే అతి కష్టమైన కూటమి, ఎందుకనగా క్రీస్తు కూడా అదే చెప్పియున్నాడు, “ప్రవక్త తన స్వదేశంలో తన జనులమధ్య ఘనముగా ఎంచబడడు...” చూశారా? ఆయన తన స్వకీయుల యొద్దకి వెళ్ళెను, అయితే అనేకమైన కార్యములు ఆయనక్కడ చేయజాలకపోయెను. ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు, ఇక్కడున్న ఈ చిన్న గుంపును బట్టి కాదండీ. నా సంఘము, వారు నన్ను ప్రేమించుచున్నారు మరియు నన్ను నమ్ముచున్నారు. కాని బయటి నుండి వచ్చినవారే దీనికి కారణం మరియు అది అలాగుండునని దేవుని వాక్యము చెప్పెను. అయితే దానిని కనుగొనుటకు దేవుని ఆత్మ నన్ను అభిషేకించునట్లుగా కొద్దిసేపు ఆగుదును...
ఇప్పుడు, ఆమె తన శరీరమందు ఒక ఆత్మను కలిగియున్నది. ఒక రోజు ఆత్మ దేహమును విడిచిపోవును, అప్పుడు దేహము కుళ్ళిపోవును. ఆత్మ దానిని దయచేసిన దేపుని యొద్దకి తిరిగిపోవును.
ఇక్కడ ఒక ఆత్మ నిలబడియున్నది. అది ఈ దేహమునకు ప్రతినిధిగా వుండెను. ఇప్పుడు, ఈ ఆత్మలు ద్రాక్షావల్లితో నిలిచియుండినచొ, అది...
59
అది ఏమిటి? యేసు యెదుటకి ఒక ఆత్మ వచ్చినటైతే, దానిలో ఏదైనా లోపం వుంటే, ఆయనలో వున్న ఆత్మ దానిని బయలుపరిచెను, చూశారా. అక్కడున్న స్త్రీ, అది ఆమెకి బయలుపరచబడినప్పుడు, ఆమె దానిని అంగీకరించిది, మరియు ఇలా అన్నది, “నీవు తప్పకుండా మెస్సీయావైయుండవచ్చు.” ఆయన వచ్చినప్పుడు వీటిని మాకు తెలుపునని మేమెరిగియుంటిమి.“
పేతురు, అక్కడికి అతడు వచ్చినప్పుడు, ఓ, ఆంద్రేయ చెప్పేది అతడికెంతో ఆశ్చర్యము కలిగించెను. అతడన్నాడు, “ఆయనే మెస్సీయా,” అంతట అతడు ఆయన యొద్దకి వచ్చినప్పుడు, ఆయన ఇలా అనెను, “నీ పేరు సీమోను. నీవు యోనా కుమారునివి.” అది అతడికి సరిపోయినది, చూశారా. అనేవరోనన్న సంగతి అతడికి తెలియదని ఆయనకి తెలుసును.
కాని నీవు ఎవరో ఆయనకి తెలుసును. నీవు ఎవరివో నాకు తెలియదు, కాని ఆయనకి తెలుసును. నీ గురించి నాకేమి తెలియదు, కాని ఆయనకు అంతా తెలుసు. ఇప్పుడు, అది ఇక్కడ ఉన్నది. ఇప్పుడు, దేవుని ఆత్మ ఇక్కడ, ఈ బలిపీఠం మీద వుంది. ఇప్పుడు, ఏదో జరిగిందని నీకిప్పుడు తెలుసా. నరముల ఉద్రిక్తత స్తితితో నీవు ఇక్కడికి వచ్చావు. అది నిజము. నీకు కీళ్ళనొప్పులు కూడా వున్నాయి. అది నిజము.
నీవు నమ్ముదువా? ఈ స్త్రీని నా జీవితంలో నేనెన్నడూ చూడలేదు. ఇప్పుడు, అది మాధూర్యం కదా, నిజం కాదా... దీనిని అనుభూతి చెందుటకు నీవు కట్టుబడియున్నావని నాకు తెలుసు. నేను దానిని చూచుచున్నాను. బహుశా? మధురమైన ఆత్మవలే వున్నది. ఒక పురుషుడు ఇక్కడికి వచ్చినట్టు నేను చూస్తున్నాను. అది నీ సహోదరుడు. అతడి కొరకు నీవెంతో ఎక్కువగా ప్రార్ధించుచున్నావు. నేనొక యవ్వనుడిని, యవ్వనుడిని చూస్తున్నాను. ఖచ్చితంగా, అతడొక సేవకుడిగా వుండెను. అది నీ కుమారుడే. ఆత్మీయంగా అతడికొక సమస్య వుంది. చాలా దూరము నుండి నీవిక్కడికి వచ్చియున్నావు. నీవు దక్షిణప్రాతం నుండి వచ్చావు. నీవు టెన్నిస్సీకి చెందిన దానివి. నీపేరు శ్రీమతి. హేబర్. నీవు విన్నపించిన దానిని నీవు పొందుకొన్నావు. దేవుడు దానిని నీకు అనుగ్రహించియున్నాడు గనుక తిరిగి వెళ్పుము.
60
ఇప్పుడు, కనీసం నేను ఆ స్త్రీని ముట్టనే లేదు. పరిశుద్ధాత్మయే దానిని చేసెను. ఇప్పుడు అది అంతే, బైబిల్లో కూడా సరిగ్గా ఇలానే జరిగింది. ఆ స్త్రీ అన్నది, “నీవు తప్పకుండా మెస్సీయావి.” ఇప్పుడు దీన్ని బట్టి నేను మెస్సీయాని నేను చెప్పట్లేదండీ, దాని అర్ధము మెస్సీయాలో వుండి చేసిన అదే ఆత్మ ఇప్పుడు ఇక్కడ వుండి దీనిని జరిగించెను. మనము కేవలము స్త్రీ మరియు పురుషులమే. అది మెస్సీయా ఆత్మ అయి యున్నది.
ఇప్పుడు, నీవు దానిని పొందుకొనుము; ఆ పాత అవిశ్వాసములో నుండి త్రుంచబడుము. ఆయన యందు నాటబడుము, చూశావా, ఇప్పుడే. నిన్నునీవు ప్రోత్సాహించుకొని ఇలా చెప్పుము, “ప్రభువైన యేసూ, నీవు దేవుని కుమారుడవై ప్రధానయాజకుడిగా ఉన్నత స్థలములో మహోన్నతుని కుడిపార్శ్యమున కుర్చొనియున్నావని బ్రదర్ బ్రెన్హాం ఇప్పుడే చెప్పియున్నాడు; జగత్తు పునాది వేయబడక ముందే నీవు నిర్ణయించబడితివి, ఈ లేఖనములను తెచ్చుటకు నీవు వధించబడితివి. సగం విశ్వాసినగు నేను నమ్ముటకు ప్రయత్నించుచుంటిని, అయితే పూర్తిగా నమ్మునట్లు నన్ను చేయుము. నీ వస్త్రపు చెంగును ముట్టుకోనిమ్ము; ఆయన ద్వారా నీవు నాతో మాట్లాడుము.” ప్రేక్షకులుగా కూర్చొన్న మీరు కూడా అలానే చెప్పుడి, “నీవు నిన్న, నేడు, నిరంతరం, ఒకటేరీతిగా ఉన్నట్లయితే, అవిశ్వాసపు తలంపులన్నీ ప్రక్కకునెట్టి నా విశ్వాసము చేత నిన్ను తాకనిమ్ము, నిన్ను తాకనిమ్ము.”
61
మనమిరువురం ఒకరికొకరం క్రొత్త అని ఒప్పుకొని నీవు నీ చేయి ఎత్తావని నేను నమ్ముచున్నాను. సరే, ఇప్పుడు ప్రభువైన యేసు నీ సమస్యను, ఇంకా నీ యొక్క మిగతా విషయాలను నాకు బయలుపరచునని, తద్వారా జీవాధారము అనగా ఈ సంఘము వాస్తవంగా దేవునియందు నాటబడియున్నదని నీవు నమ్ముదువా? “నేను తండ్రియందు వున్నానని, తండ్రి నాయందు వున్నాడని, మీయందు నేను ఉన్నానని, నాయందు మీరు వున్నారని ఆ దినమున మీరు తెలిసికొందురు.” చూశారా, ఆ దేవుని జీవము యేసుక్రీస్తు నామము సంఘములోనికి ప్రవహించుచు మనల్ని ఏకము చేయుచున్నది.“ చూచారా, మనం తీగలము. మనం ఆయనకి ప్రాతినిధ్యం వహించుచున్నాము. నీవు దానిని నమ్మితే, ఆ కాలులో వున్న సమస్య తొలగిపోతుంది. దానిని నీవు నమ్ముదువా? మంచిది. నీవు దానిని కలిగియుండొచ్చును. అక్కడున్న నీ భర్త కూడా స్వస్థపడును. అతడికి హెర్నియా వ్యాధి వుందని నీవు అనుకొనుచున్నావు. మరియు అయ్యా, నీవు స్వస్థత నొందినట్టుగా నమ్ముదువా? నీవు నమ్ముతావా? ఆలాగే మీకొక కూతురున్నది. మరి ఆ కుమార్తెకి ఆత్మీయమైన సమస్య ఉన్నది. మీరు ఉత్తరదిక్కు నుండి ఇక్కడికి వచ్చారు. మీరు రహదారి గుండ వచ్చారు; ఆస్టిన్ నుండి మీరు వచ్చారు. నీ పేరు శ్రీమతి. వైట్. ఇది ”యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,“ అయియున్నది. ఆస్టిన్ కు తిరిగి వెళ్ళుము మరియు ఇప్పుడు నమ్ముము, స్వస్థత పొందుకొనుము. సంపూర్ణముగా బాగుపడుము. నీ హృదయ వాంఛను దేవుడు ఇచ్చుచున్నాడు.
62
నమ్ముట నీవలనైతే, సమస్తము సాధ్యమే. జీవము... క్రీస్తు యొక్క జీవమ తీగెలో. ఆ తీగ బ్రెన్హాం టాబర్నికల్ కాదు, ఆ తీగ విల్లియం బ్రెన్హాం కాదు. ఎవరైతే అవిశ్వాసము మండి వేరుచేయబడి ఆయన యందు నాటబడుదురో వారే ఆ తీగ.
నీపు కూడా నీ చేతిని పైకెత్తినావని నేను అనుకొనుచున్నాను, మనం ఒకరికొకరం పరిచయస్తులము కాదు. నీవెవరివో నాకు తెలియదు. అయితే నీవు ఎవరివో దేవునికి తెలుసు. నీ కొరకు నీవిక్కడికి రాలేదు; బిడ్డ కొరకు వున్నావు. ఆ బిడ్డ మీద వెలుగు వ్రేలాడుచుండుటను నేను చూచుచున్నాను. నీ బిడ్డ యొక్క సమస్య ఏమిటనే దానిని దేవుడు నాకు బయలుపరిస్తే, నేనాయన ప్రవక్తనని, నేను నీతో చెప్పేది సత్యమని నీవు సమ్మగలవా? నీవు నమ్ముదువా? బిడ్డకి గుండె సంబంధిత సమస్య వుంది. కవాటము లాంటిది వుందని వైద్యుడన్నాడు. అది పరీక్షించబడినది. ఉన్న పాటునే ఆసుపత్రిలో చేరమన్నారు. అది నిజం. నీవు ఇక్కడ జఫర్సన్-విల్, ఫుల్టన్ వీధికి చెందియున్నావు. అది నిజము. మరియు నీ పేరు శ్రీమతి. బెర్క్హార్ట్ — ఐరిన్ బెర్క్హార్ట్. బిడ్డ బాగుపడతాడని నమ్మి, వెళ్ళుము.
నమ్ముట నీవలనైతే, సమస్తము సాధ్యమే, కేవలం నమ్మితే చాలు.
63
ఇక్కడ కూర్చొనియున్న ఈ స్త్రీకి నరములన సమస్య. అవును. దానిని నీవు మరిచిపొమ్ము. ఇప్పుడు నీవు పూర్తిగా బాగుపడి ఇంటికి వెళ్ళదవు. నమ్ముట నీవలనైతే...
ఈ విధంగా నీ చేయి పైకెత్తుము, నీకు వెన్ను సమస్య వున్నది. దేవుడు నిన్ను బాగుచేస్తాడని నీవు నమ్ముదువా? నీవు నమ్మి దానిని అంగీకరించెదవా? ఆలాగైతే పూర్తిగా స్వస్థపడి ఇంటికి వెళ్ళుము. యేసుక్రీస్తు నిన్ను పూర్తిగా బాగుచేయును.
నీకు కిడ్నీ సమస్య వుంది. అయ్యా, నీవు అడిగిన దానిని నీవు పొందితివి గనుక ముందుకు వెళ్ళుము. దేవుడు నిన్ను దీవించును గాక.
దేవునియందు విశ్వాసముంచుము. సందేహపడకుము.
వర్ణజాతి స్త్రీ... వారు ఇద్దరు. ఆ చివరన, అక్కడ వుండిరి, కంఠములో పెరిగినది, కంఠములో, నీ పూర్ణహృదయముతో నమ్ముము. అమ్మా, నీవు నమ్ముదువా? అక్కడ ఆడవాళ్ళ టోపి ధరించిన స్త్రీ, నీవు నమ్మతావా? నీ చేయి పైకెత్తు, మంచిది, తిరిగి ఇంటికి వెళ్ళుము. అది నిన్ను విడిచిపోవును.
ఈమెకంటే చిన్నదగు ఒక యవ్వన స్త్రీ అక్కడ వున్నది. నీవెవరివో నేనెరుగను; దేవుడు నిన్ను ఎరుగును. ఆయన నిన్ను పూర్తిగా బాగుచేస్తాడని నీవు నమ్ముదువా? మంచిది, న్యూ-ఆల్బానీ నుండి వచ్చిన కుమారి పెరల్ అలెన్, పూర్తిగా బాగుపడుము. యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును. దానిని నమ్ముచూ వెళ్ళుము. నీపు బాగుపడుదువు.
దేపునియందు విశ్వాసముంచుడి. మీరు పూర్ణహృదయములో నమ్ముదురా? ఇప్పుడు, అది కాదు... ఓ, అక్కడ సమస్తము జరుగుచున్నది. స్నేహితులారా, నమ్ముట నీవలనైతే.
64
ఆయ్యా, మీరు బాగున్నారా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నీవు నమ్ముదువా? నేనాయన ప్రవక్తనని నమ్ముదువా. నేను చెప్పుదానిని నీవు నమ్ముదువా... అది సత్యమో, కాదో తెలుస్తుంది. ఈ ఉదయకాలము నేను బోధించినది సత్యమని నీవు నమ్ముదువా? దానిని నీవు నమ్ముతావా. ఒక మంచిదాని కొరకు నీవిచ్చట ఉన్నావు. పొగత్రాగుట అనే దురలవాటు నుండి విడుదల పొందుటకు నీవిచ్చట ఉన్నావు, నీవు దానిని చూసి అసహ్యించుకొని, దానినుండి విడుదల నొందాలని అనుకొనుటను నేను చూస్తున్నాను. అది వాస్తవం. వినుము, నీ భార్య నిమిత్తం ప్రార్ధన కోరుచున్నావు. ఆమె ఒక రకమైన మానసిక రుగ్మతితో బాధపడుచున్నది. శ్రీ. కోర్ట్రాక్, నీవు కెంటకీ రాష్ట్రం, ఓన్సుబరో నుండి వచ్చితివి. మరి వెంటనే అక్కడికి తిరిగి వెళ్ళుము. మరొక దానిని ముట్టవద్దు. యేసుక్రీస్తు నిన్ను పూర్తిగా బాగుచేసాడు. ప్రభువు నామములో వెళ్ళుము; అది నిన్ను విడచిపోవును.
నీవు నమ్ముచున్నావా?
65
ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చుచున్న ఇతడు, అయ్యా, కేవలం నీ చెయ్యి నా మీద వేయుము. నీ వెన్నులో వున్న సమస్య తొలగిపోయింది. దేవునికి స్తుతులు చెల్లించుకొనుచు, నమ్ముచు అక్కడకి తిరిగి వెళ్ళుము.
నీవు భోజనం చేయగోరుచున్నావా? నీవు నమ్మితే కడుపు సమస్య తీరిపోవును. నీవు దానిని నమ్ముచున్నావా? అయితే నీ దారిన పొమ్ము. “ప్రభువా, నీకు కృతజ్ఞతలు” అని అనుచు స్తుతించుము.
మీలో ఎందరు పూర్ణహృదయముతో నమ్ముచున్నారు?
దేవుడు నిన్ను దీవించును గాక. నీ వెన్ను సమస్య కూడా. ఆ విధంగా, “ప్రభువా నీకు కృతజ్ఞతులు,” అని చెప్పుకొంటు, నీవు అలా వెళ్ళుము.
ఇక్కడున్న అనేకులకున్నట్టే నీకు కుడా సమస్య వుంది. అది నరములకు సంబధించింది. అది గుండె నరములకు సంబంధించినది, గుండె సమస్య అది.
నీవు పూర్ణహృదయముతో నమ్ముము. అక్కడ వున్న వారిలో ఎంతమందికి గుండె నరములకి, ఇంకా మొదలగు సమస్యలున్నవి? ఇప్పుడు మీరు మీ చేతిని పైకెత్తండి. ఇక్కడ చూడండి. దానిని మీరు దానిని ఎలా పిలుస్తారు, చూశారా. నీవు పూర్ణహృదయంతో నమ్ముదువా? నీవు కూడా? మంచిది, యేసుక్రీస్తు నామమున స్వస్థపడి వెళ్ళుము. ఏ మాత్రము సందేహపడకు. నీకు ఏదైతే చెప్పబడిందో, అదంతా సత్యమని నమ్ముము. నీవు స్వస్థపడావని సమ్ముము; నీవు అడిగిన దానిని నీవు కలిగియుండెదవు. మిగతా వారు కూడా అలానే చెయ్యండి. ఇంకా ఇక్కడున్న ఎంతమంది దానిని పొందుకొనియున్నారు? మంచిది, అయ్యా, అక్కడున్న ఎంతమందికి దేవుని అవసరత పుంది? మీరు మీ చేతిని పైకెత్తి చూపండి. మరి చెప్పు, “నేను....”
66
చూడండి. దానిని పొందుకోండి. నేనైతే ఎవ్వరిని స్వస్తవర్చలేను. నేనొక మనిషిని. ఒకవేళ క్రీస్తు ఇక్కడ నిలబడియున్నా, ఆయన కూడా ఎవ్వరినీ స్వస్థపర్చలేదు, ఎందుకనగా ఆయనొక ప్రణాలికను సిద్దము చేసియున్నాడు, ఆ ప్రణాలిక ఏమనగా ఆయన నీ కొరకు చనిపోయెను అని నీవు నమ్ముటయే, దానిని బట్టి నీవు స్వస్థపడగలవు. అదొక్కటే మార్గం. అది విశ్వాసము ద్వారా కలిగే స్వస్థత. విశ్వాసము నీ కొరకు క్రీస్తు వెల చెల్లించాడని నమ్ముము. దానిని ఇప్పుడు ఎంతమంది గ్రహించారు? మంచిది, ఎంతమంది దానిని అంగీకరించెదరు? మంచిది, మనం ప్రార్థించబోవుచుండగా, ఒకరి మీద ఒకరు చేతులుంచుకొనుడి. ఒకరి మీద మరొకరు చేతులుంచి ప్రతీ ఒక్కరు ప్రార్ధన చేద్దాం.
సహోదరి, ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళి కూర్చోండి. ఇప్పుడు దేవుడు దీవించును గాక. పూర్తిగా స్వస్థతనొందుకోండి. అవును, అది నిజము. అది నరముల ఉద్రిక్తత, కాని అది నిన్ను విడిచిపోవును. ఇప్పుడు అక్కడికి సడుచుకొంటూ వెళ్ళండి, అది అలా ఆగునేమో చూడండి... భిన్నమైన అనుభూతి ఆరంభమైనదా, అలా అనిపించట్లేదా. అయ్యా, నీవు ఇక్కడే నిలబడి స్వస్థపడియుంటివి. ఏ సహాయం లేకుండా అతడెలా నడిచాడో నీవు గమనించుము, చూచారా. మరిప్పుడు, నీవు బాగుపడ్డావు. ఆరోగ్యము నొందినవానిగా నీపు ఇంటికి వెళ్ళుము. ప్రభువు నిన్ను దీవించును.
67
ఒకరి మీద ఒకరు చేతులు వేసి.. చూశారా, మనకి ఎక్కువ సమయం లేదు; దాదాపు మధ్యాహ్నాం అయ్యింది, ఇంకా బాప్తీస్మపు కార్యక్రమంను కూడా మనము కలిగియున్నాము.
నిశ్చయంగా, నిశ్చయంగా, దేవుని గొప్ప జీవము, తానిక్కడ అమోఘమగు రీతిన ఉన్నట్టు తన్నుతాను చూపుకొన్న గొప్ప పరిశుద్ధాత్మ, దేవుని సింహాసనము నుండి జీవము ప్రవహించుచూ వచ్చి తీగెలలో ప్రవహించుచున్నదని చూపుచుండెను. దానిని మీరు నమ్మరా? అలా కానటైతే, ఇక్కడికి వచ్చిన ఏ ఒక్కరిని నేనెన్నడు స్వస్థతలోనికి నడిపించలేను. వారి విశ్వాసం దానిని చేసెను, కారణం సత్యమనేది వారికి చెప్పబడియున్నది. నీవిక్కడ అట్లు పున్నట్లైతే, అది నీకును అదే చేయును.
ఇప్పుడక్కడ వున్న మీరు, మీకవసరమైన దానిని ఆయన మీకు బయలుపర్చుచున్నాడు. ఇప్పుడు మనం ప్రార్ధనలో వుండగా, అందరూ కలిసి ప్రార్ధించుచుండగా, చెప్పబడిన ప్రతీ మాట సత్యమని మీరు నమ్మితిరి, కనుక ఏమి జరుగనైయుండునో గమనించుడి; మీరు స్వస్థపడుదురు. ఇప్పుడు, ఒకరికొకరు ప్రార్ధించుకోండి.... నీ కొరకు నీవు ప్రార్ధించుకోవద్దు; ఎవరైతే నీ మీద చేతులుంచిరో ఆ వ్యక్తి నిమిత్తం ప్రార్ధించు; అలాగే ఆ వ్యక్తి నీ కొరకు ప్రార్ధించనిమ్ము. ఒకరికొకరు ప్రార్ధించుకొనుము.
68
అలా చెయ్యమని బైబిల్ చెప్పినది. “నేను చేయు క్రియలు మీరును చేయుదురు” అని ఏ బైబిలైతే చెప్పినది, మరదే బైబిల్, “నమ్మిన వారివలన ఈ సూచక క్రియలు కనబడును. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు బాగుపడుదురు,” అని కూడా చెప్పియున్నది. ఇప్పుడు వాగ్దానం చేసిన దేవుడు దానిని నేరవేర్చును, దానియందు నాటబడితే, అనగా నీటి కాలువల యోరను నాటబడితే, ఇక అది దైవీక సన్నిధిని తీసికొనివచ్చును, ప్రతి వాగ్దానమును నీకు కలుపును. నీటి కాలువల యోరను నాటబడిన మొక్కవు నీవు. ఆ ఒక్క నీరు క్రీస్తు, ఆయన పరిశుద్ధాత్మ. స్వస్థత అనేది ఉంది; రక్షణ అనేది వుంది; సంతోషమనేది ఉంది; దీర్ఘశాంతము, దయాళత్వము, సాత్వీకము, ఓర్పు, మొదలైనవన్నీ పున్నవి. ఆ ఒక్క నామములోనే అన్నీ రకముల వరములు ఇమిడియున్నాయి. “నా నామమున మీరు తండ్రిని ఏమి అడిగినా, దానిని నేను చేతును.”
ఇప్పుడు, నీవు చేతులుంచిన వ్యక్తి మీద యేసు నామములో ప్రార్ధించుము. నేను, మీ కొరకు, మీ అందరి కొరకు ప్రార్ధించెదను. ఇక్కడున్న పరిశుద్ధాత్మ ప్రతీ వ్యక్తిని స్వస్థపర్చును గాక.
69
ప్రభువా, నీ కృప ఇంకను మా ప్రతిఒక్కరి మీద నిలిచియుండనిమ్మని మేము అడుగుచున్నాము. ప్రతిఒక్కరు వారికి తెలిసినట్లుగా ప్రార్ధించుచున్నారు. గలలియ తీర ప్రాంతములో ఎలాగైతే, జీవము గల దేవుని ఆత్మ వాస్తవికత దాల్చినదో, అదే రీతిగా ఇక్కడ కూడా జరిగెనని వారు చూచియున్నారు. గలలీయ సముద్ర తీరప్రాంతమునకు పేతురు వచ్చినప్పుడు, తానెవరో అనేదానిని పేతురుకి యేసు చెప్పినట్లే అదిక్కడ వాస్తవికత దాల్చినది. నతానుయేలు వచ్చినప్పుడు, అంతకముందు రోజు తానెక్కడ వున్నాడో అను దానిని ఆయన చెప్పినట్టే ఇక్కడ వాస్తవికత దాల్చినది. సమరయ ద్వారము యొద్ద లేదా బావి దగ్గర జరిగిన వాస్తవికత వలె ఇది వున్నది. “ఇది జీవముగల దేవుని ఆత్మ,” అని జనులు రూఢిగ చెప్పగలరు.
ప్రభువా, విశ్వాస సహితమగు ప్రార్ధనను ప్రతీఒక్కరు, వారి ప్రక్కనున్న వారి కొరకు చేయుటకు తగిన మనసును, విశ్వాసమును, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని దయచేయండి. ప్రభువా, ఎవరైతే ప్రక్కవారి మీద చేతులుంచిరో, ఆ యొక్క వ్యక్తికి మార్పులేని విశ్వాసమును దయచేయమని ఇప్పుడు నేను అడుగుచున్నాను. మరి, అది వారికి ఫలితముగా ఉండొచ్చును. ఓ, అది అలాగుండనిమ్ము, ప్రభువగు దేవా, అది అలాగుండనిమ్ము. వారిని ఒకరి తర్వాత ఒకరిని ఈ వేదిక మీదకి, అదే ఫలితము కొరకు తీసికొనిరావచ్చును, అయినా అది దేవుని మీద, వారియొక్క వ్యక్తిగత విశ్వాసము మీద ఆధారపడి వుంది.
70
మరి ఇలా వ్రాయబడింది, “నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థతనొందెదరు.” ఓ ప్రభువా, ఈ ఉదయకాలము నీ వాగ్దానము ప్రతి ఒక్క విశ్వాసియెడల నెరవేర్చుము. ఇప్పుడే పరిశుద్ధాత్మ ప్రతి ఒక్క రోగి శరీరములోకి ప్రవేశించి, రోగ రుగ్మతలన్నిటిని తీసివేయును గాక. దేవుడు వారిని పూర్తిగా బాగుచేసాడనే నిశ్చయతను కలిగియుంటిమన్న దైవవిశ్వాసముతో వారు అనందముగా కేకలు వేయుదురు గాక. దేవుడు మమ్మును పూర్తిగా బాగుచేసాడనే విశ్వాసముతో, సంతోషముతో వారు ఈ టాబర్నికల్ నుండి బయలు వెళ్ళుదురు గాక. నీ స్వస్థత శక్తిని గూర్చి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది సాక్ష్యములు పలుకుచున్నట్లు, వారు కూడా ఒక రోజు ఇక్కడికి తిరిగి వచ్చి సంతోషముతో, ఆనందంగా సాక్ష్యములు పలుకుదురు గాక. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రజల కొరకైన ఈ ప్రార్ధనను మేము చేయుచున్నాము. దేవుని వెలుగు తేజరిల్లి, అందరిని స్వస్థపర్చును గాక. ఆమేన్.
నేను నమ్ముదును, నమ్మగలను, నమ్ముచున్నాను;
నేను నమ్ముదును, నమ్మగలను, నమ్ముచున్నాను;
నేను నమ్ముదును, నమ్మగలను, నమ్ముచున్నాను
ఇప్పుడే యేసు నన్ను బాగుచేసాడని నమ్ముచున్నాను.
దీనిని మీరు చేయుదురా? మీ చేతిని పైకెత్తుడి.
నేను నమ్ముదును, నమ్మగలను, నమ్ముచున్నాను;
నేను నమ్ముదును, సమ్మగలను, నమ్ముచున్నాను;
నేను నమ్ముదును, నమ్మగలను, నమ్ముచున్నాను
ఇప్పుడే యేసు నన్ను బాగుచేసాడని నమ్ముచున్నాను.
71
[టేపు మీద ఖాళీ.] దానిని నమ్ముడి. నేను ప్రజల గృహములను దర్శించినప్పుడు, నా కొరకు వారు మంచి భోజన పధార్దములు సిద్దపర్చుదురు. ఒకనాడు నేను ప్రభువుతో అన్నాను, “నేను నమ్ముచున్నాను, నేను నమ్ముచున్నాను.”
ఓ, మై. నా పొట్టనిండా మంచి ఆహారం కలిగి నేను వీధి వెంబడి వెళ్ళుచు, ఇలా పాడుదును:
“నేను నమ్ముదును, నమ్మగలను, నమ్ముతున్నాను;
(అది పైకి వచ్చుటకు ప్రయత్నించగానే; దానిని నేను వెనక్కి నెట్టెదను.)
నేను నమ్ముదును, సమ్మగలను, నమ్ముచున్నాను;
నేను నమ్ముదును, సమ్మగలను. నమ్ముచున్నాను;
ఇప్పుడే యేసు నన్ను బాగుచేసాడని నమ్ముచున్నాను.
అవునయ్యా. అది ఇరవై-అయిదేళ్ళ క్రితం మాట. అప్పటి నుండి ఆయన నా యెడల వాస్తవముగా వుండెను. అందును బట్టి నేనెంతో కృతజ్ఞునిగా పుంటిని. మీకు కూడా ఆలాగునే అగును కాక. దేవుడు నిన్ను దీవించును గాక.
ఇప్పుడు, ఇంకొద్ది నిమిషములలో వారు బాప్తీస్మ కార్యక్రమమును కలిగియుందురని నేను అనుకొనుచున్నాను, అవును, అది వుంది, ఇంకా ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తీస్మము పొందకపోతే, అట్టి వారికి కూటమి అనంతరమో లేక కొద్దిసేపు అలానే వారిని ఉంచడమో అనే దానిని తెలిపెదము, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తీస్మమును ఎవరైనా పొందగోరితే దయతో మీరు మీ చేతిని పైకెత్తి చూపగలరా. ఒకటి, రెండు, మూడు, నాలుగు. మంచిది. సిద్దపాటు నిమిత్తం స్త్రీలు ఈ వైపు నుండి వెళ్ళండి, పురుషులు ఇలాగు వెళ్ళండి. మరలా మనం మరొకసారి ఆ పాటను పాడుచుండగా, నేను...