శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకొనుట

శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకొనుట

VGR COUNT-144 అందరికీ శుభోదయం. “వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్ధించుటకై ఈ ఉదయం మరలా టెబర్నికల్ యొద్ద ఉండుట వలన సంతోషము. ఇది సాధారణంగా ప్రార్ధన కొరకు వివిధ స్థలాలనుంచి వచ్చిన వారికోసం ప్రార్ధించుటకై వీలయినంత తరచుగా లోనికి వచ్చుటకు మేము ప్రయత్నించెదము.

మరియు ఇప్పుడు అతి త్వరలో మేము కాలిఫోర్నియా మరియు పశ్చిమ తీరములోని కూటముల కొరకు బయలుదేరుతాము. పరలోకపు దేవుడు మా యెడల కనికరముగలవాడై, అక్కడ మాకు గొప్ప ఆరాధనలను ఇచ్చునట్లు మీ ప్రార్ధనలను మేము నిశ్చయంగా కోరుచున్నాము.

నిన్ననే వచ్చాను, లేదా నిన్నటి రాత్రి, ఆలస్యంగా, మరియు నిన్న ఒక... సరే, నిన్న మరియు మొన్న నా జీవితంలోని గొప్ప ముఖ్యమైన దినములలో ఒకటి. అక్కడ ఈ భవనంలో ఉన్నవారిలో నిన్న ప్రభువు క్రిందికి వచ్చుటకు సాక్షులుగా ఉన్నవారు, కనీసం ఇద్దరు లేక ముగ్గురిని నేనెరుగుదును. మరియు ఒక గొప్ప అద్భుతమైన సంగతి జరిగినది. ఈ ఉదయం అది మీకు చెప్పుటకు నాకు సమయం లేదు, అయితే వచ్చే ఆదివారం ఉదయం మేము బయలుదేరుటకు ముందు మీకు చెప్పుటకు వర్తమానములో నాకు సమయముండవచ్చును.

దేవుని చిత్తమైతే, కనీసం వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్ధించుటకై ఆదివారం నేను వచ్చెదను. సాధ్యమయితే, శాన్-జోస్, కాలిఫోర్నియాలో జరుగు శాన్-జోస్ కూటమికి, దాదాపు మధ్యాహ్నం మేము బయలుదేరవచ్చును.

2

పశ్చిమ తీరంలో మీ జనులెవరైనా ఉన్నట్లయితే, అది ... నేనెంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ ఘడియ ఇదే కావచ్చునని మేము నమ్ముచున్నాము, నా పరిచర్యలో రాబోవు ఆ మార్పు, మరియు అది ఎంతో సమీపముగా ఉన్నది. అది నిన్న జరుగబోవుచున్నదని నేననుకున్నాను. ఇక అది ఇప్పుడే జరుగునని నేను నమ్ముచున్నాను. మరియు ఇప్పటి వరకూ మనము చూసిన లేక విన్న వాటికన్నిటికీ అది అతీతంగా ఉండును. స్నేహితుడా, ఇప్పుడు నీవు గురుంచుకో, అది “యెహూవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు”గా ఉన్నది.

అందుచేత ఏ క్షణమైనా అది రావచ్చునని మనము ఎదురు చూచుచున్నాము. మరియు మనం.... ఇప్పుడు ఈ కూటమిని వారు జాతర జరుగు మైదానంలో నిర్వహించుచున్నారు. అది నిజమని నేను నమ్ముచున్నాను, కదా, జీన్? కాలిఫోర్నియోలోని శాన్-జోస్ లో జాతర మైదానంలో మరియు అది పది రోజుల కూటమి 20 నుండి 29 వరకూ, శాన్-జోస్ లో ఉండును.

ఇప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసికొని మా కొరకు ప్రార్జించుచూ ఉండండి.

ఇప్పుడు, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్ధించు మరియు వాక్యమును తీసికొని వచ్చు పరిచర్యలు మొదలుపెట్టబోవుచున్నాము గనుక, మనము సమయమునకు వెళ్ళినట్లయితే, మనకు దాదాపు గంటన్నర వ్యవధి ఉన్నది. ఈ ఉదయం మాట్లాడుట కొరకు లేఖనములోని ఒక భాగమును, బైబిల్ నుంచి రెండు చోట్లను ఎన్నుకొన్నాను. కాని మనము మాట్లాడుటకు ముందుగా, ప్రార్థన నిమిత్తమై ఒక క్షణం తలలు వంచుదాము.

3

అత్యంత దయామయుడవైన దేవా, అయోగ్యులైన పిల్లలుగా, దీనంగా, ఈ ఉదయం మేము మీ కృపా సింహాసనమును సమీపించుచున్నాము; అయితే మాకు యివ్వబడిన పరిశుద్ధాత్మ ద్వారానూ, మరియు మాతో నిత్యమూ ఉండు ఆయన సన్నిధి ద్వారానూ, దేవుని యెడల కల్తీలేని విశ్వాసముతో వచ్చుచున్నాము. మరియు మేము దీనంగా వచ్చి ఆయన నామంలో ఏది అడిగినా మా అభ్యర్ధన మాకు అనుగ్రహించబడునని ప్రభువైన యేసు చేసిన వాగ్దానము ద్వారా వచ్చుచున్నాము. అందువల్ల మేము మా సొంత యోగ్యతల వైపు వెనక్కి చూచుట లేదు, ఎందుకనగా మాకలాంటివేమి లేవు; అయితే దేవుని యొక్క కుమారుని ద్వారా, కృప మాకు ఉచితంగా ఇవ్వబడిన కల్వరి యొక్క యోగ్యతల వైపు చూచుచున్నాము. యోగ్యత లేని జనమైన మమ్ములను, దీనునికి ఎంతో సమీపముగా తీసుకొని వచ్చుటకు, ఏకంగా ఆయనతో సంబంధం కలిగియుండునట్లు చేయుటకు, ఆయన కృప ద్వారా కల్వరి యొద్ద ఆయన మా కొరకు చేసిన దానిని గురించి తలంచినప్పుడు, మా కంఠముల నుండి జారు కన్నీటిని మేము పట్టి ఉంచలేము. ఇప్పుడు మేము ఆయనకు కుమారులము, కుమార్తెలమై యున్నాము,

ప్రభువా, మమ్మల్ని మేము సమర్పించుకొనుట కొరకూ, పరిచర్య కొరకూ, మా పాపములను ఒప్పుకొనుట కొరకూ, మరియు దివ్యమైన ఆరాధనలో ఈ చిన్న కప్పు క్రిందికి మేము వచ్చుచున్నాము. వేల సంవత్సరాలుగా ఎదురుచూడబడిన ఆ గొప్ప సంఘటన కొరకు, అనుదినమూ మేము మా హృదయములను సిద్ధపరచుకొనునట్లు, మీరు మాతో ఉండి, మా రాకడ యొక్క సామీప్యమును గూర్చిన లోపలి విషయాలను చూసే దృష్టిని (insight) మాకు ఇస్తారని మేము నమ్ముచున్నాము. నిజంగా ప్రకృతి యావత్తూ విడుదల కొరకు మూలుగుచూ, ఏడ్చుచున్నది. మరియు ప్రభువా, మా యందున్న మా ఆత్మలు, ఇది మా ఇల్లు కాదనీ, మేము యాత్రుకులమూ మరియు అన్యులమనీ ఎడతెగక ఒప్పుకొనుచున్నవి, అయితే దేవుడు నిర్మాతగానూ మరియు కర్తగానూ ఉన్న ఒక పట్టణమును మేము వెదుకుచున్నాము. రానైయున్న ఆ గొప్ప సమయము కొరకు మేము కనిపెట్టుచున్నాము.

4

ప్రభువా, ఈ కూడికలలో మేము ఇక్కడ కూడుకున్నప్పుడు, రోగులూ మరియు వ్యాధిగ్రస్తులైన మీ బిడ్డల గురించి ప్రార్ధించుటకై శ్రద్ధవహించుదుము. మరియు మా మధ్య ఉన్న రోగములనూ మరియు వ్యాధులనూ స్వస్థపరచుటకై, చాలా ప్రత్యేకమైన ఒక రీతిలో మమ్ములను మీరు సంధించమని అడుగుచున్నాము. మరియు ప్రభువా, నిన్న సరిగ్గా సూర్యోదయము తర్వాత, మీతో జరిగిన సమావేశంలో, ఇంతకు ముందు నేను చెప్పుచున్న వాగ్దానము అదే కావచ్చు; ఎలా మీరు దానిని మరలా - మరలా స్థిరపరచారో కదా. మరియు ఆ ఘడియ చాలా సమీపముగా ఉన్నదని మేమనుకుంటున్నాము. ప్రభువా, మీ జనులయెడల మరింత కృపామయముగా ఉండునట్లు, ఈ పరిచర్యను మీరు మార్చే రోజు, అది ఈ రోజే అగును గాక.

మరియు, తండ్రివైన దేవా, ఇప్పుడు మేము ఇక్కడున్న వీరి కొరకు మాత్రమే ప్రార్ధించుట లేదు గాని, ఆత్మీయముగానూ మరియు శారీరకముగానూ అవసరత కలిగియుండి, లోకమందంతటా వ్యాపించి ఉన్నవారికోసము ప్రార్ధించుచున్నాము. ఓ ప్రభువా, వారి హృదయ వాంఛలను నీవు వారికి అనుగ్రహించుము, ఏలయనగా ఈ దినములలో నీ బిడ్డలు పోరాడుచున్నారు. శత్రువు యొక్క అణచివేత చాలా బలముగా ఉన్నది, కాని నీవు అంతకంటే బలవంతుడవు. ఏలయనగా, “మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు,” అని వ్రాయబడియున్నది. మరియు దీని ద్వారా మేము జయించెదము. నీ వ్రాయబడిన వాక్యము ద్వారా మాతో మాట్లాడుము. మరియు ఈ ఉదయం మేము వెళ్ళునప్పుడు, ఎమ్మాయి నుంచి వెళ్ళినవారివలె, “ఆయన త్రోవలో మనతో మాట్లాడుచుండగా, మన హృదయములు మనలో మండ లేదా,” అందుము గాక. వాగ్దానము చేసిన యేసు యొక్క నామములో మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్.

5

ఇప్పుడు నేను ఆదికాండములోని రెండు చోట్ల నుండి చదువుచున్నాను; వాటిలో ఒకటి 24వ అధ్యాయములో ఉన్నది; 56వ వచనము మొదలుకొని ఈలాగు ఉన్నది:

అప్పుడతడు - యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళెదనని చెప్పినప్పుడు.

వారు ఆ చిన్నదానిని పిలిచి, ఆమె యేమనునో తెలిసికొందమని చెప్పుకొని,

రిబ్కాను పిలిచి, ఈ మనుష్యునితో కూడ వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళెదననెను.

కాబట్టి వారు తమ సహోదరియైన రిబ్కాను ఆమె దాదిని అబ్రాహాము సేవకుని..

అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు, వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేలవేలకు తల్లివగుదువు గాక, నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక, అని దీవించిరి.

6

మరియు ఆదికాండము 22వ అధ్యాయములో, 15వ వచనం నుండి ఈలాగు చదువుచున్నాము:

యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రాహామును పిలిచి - ఇట్లనెను,

నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుతీయక ఈ కార్యము చేసినందున

నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్రతీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.

మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానము వలన ఆశీర్విదింపబడును. నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహూవా సెలవిచ్చెను.

ఇప్పుడు చదవబడిన ఆయన మాటలకు ప్రభువు తన దీవెనలను జతచేయును గాక. దీనిని ఒక పాఠముగా పిలవాలంటే, ఈ ఉదయం నా అంశము, వాగ్దానము చేయబడిన గవినికి ముందు పరీక్షించుట; ఇప్పుడు నేను, “శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకొనుట,” అనే అంశమును తీసికొనగోరుచున్నాను.

7

అతడికి ఒక వాగ్దానము నిచ్చినందున, దేవుడు ఆ పితరుని పరీక్షించుచుండెను. మరియు దేవుడు వాగ్దానము చేసినప్పుడు, ఆయన చెప్పిన దానిని లేక ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు ముందు, ఆ వ్యక్తి ఆ వాగ్దానమునకు యోగ్యుడని ఆయన నిశ్చయత కలిగియుండగోరును. కావున అతని సంతతి ద్వారా లోకమంతా దీవించబడునని అబ్రాహామునకు వాగ్దానము చేయబడెను; అతడొక కుమారుని కనుననియు, మరియు ఈ కుమారుని నుండి లోకమంతటినీ దీవించు ఒక సంతతి వచ్చుననియు, మరియు అతనికి ఆ వాగ్దానము ఇయ్యబడినప్పుడు, అబ్రాహాము 75 ఏళ్ళ వృద్దుడు, మరియు అతని భార్యయైన శారా 65 ఏళ్ళ వృద్దురాలు. అయితే అబ్రాహాము దేవుని యొక్క వాగ్దాన విషయమై అవిశ్వాసము చేత తొట్రుపడక, దేవుని స్తుతించుచూ బలముగా ఉండెనని బైబిల్ చెప్పుచున్నది. మరియు దేవుడు పర్యాయము వెంబడి పర్యాయము అతడిని పరీక్షించెను, అయితే ఆ ఆశీర్వాదము నెరవేరుటకు మునుపు అతడు ఆ చివరి పరీక్ష యొద్దకు వచ్చెను.

అబ్రాహాము సంతతి అంతటి విషయములో అది ఆ విధముగానే ఉండును. సరిగ్గా ఆ వాగ్దానము నిచ్చుటకు ముందు, దేవుడు మనకు ఆ చివరి పరీక్ష పెట్టును. ఒకవేళ సాధ్యపడితే, ఇక్కడ నేనొక విషయాన్ని వ్యక్తిగతంగా చెప్పగోరుచున్నాను, కాని దానిని నేను అట్టిపెడతాను. దాని విషయంలో నువ్వు ఎలా స్పందిస్తావో చూడటానికైన ఆ ఆఖరి పరీక్ష. మరియు ఆయన అబ్రాహామునకు ఈ పరీక్ష ఇచ్చినప్పుడు, అతడు మొదలుపెట్టినప్పుడెంత నమ్మకముగా ఉన్నాడో అంతే నమ్మకముగా ఉండుటను అతడు కనుగొనెను. స్వస్థత విషయమైన ఆయన వాగ్దానమును తీసికొనుచున్న మనము, ఇక్కడ నిల్చుని దానిని స్వీకరించినప్పుడు ఉన్నంత నమ్మకముగా ఉన్నయెడల అది ఎలాంటి దీవెనగా ఉండునో కదా, డాక్టర్ ఏమి చెప్పినా సరే, అంతే నమ్మకముగా నిలబడుట.

8

మరియు తన ఏకైక కుమారుని అట్టిపెట్టుకొనక, అతడు దీనిని చేసినప్పుడు తన సాక్ష్యమును నాశనము చేయునట్లు, కత్తిని ఇస్సాకు ఛాతిలోనికి దూయబోయినప్పుడు. తనకు తెలిసిన, తను ఎరిగియున్న భూమియందంతటా, తానొక కుమారుని కనబోవుచున్నానని అతడు సాక్ష్యమిచ్చెను. మరియు ఆ కుమారుడు వచ్చినప్పుడు, వెనక్కి వెళ్ళి మరియు అతని సాక్ష్యము నెరవేరుటకు ఉన్న ఏకైక ఆశను నాశనము చేయమని అతడికి చెప్పబడెను. దేవునియందు అతనికిగల విశ్వాస విషయములో అతడు విధేయుడిగా ఉండుటను దేవుడు చూసినప్పుడు, దేవుడు పరలోకము నుండి చూసి, “నా తోడని ప్రమాణము చేసియున్నాను, నిన్ను దీవించి విస్తరింపజేసెదను, మరియు నీ సంతతి శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకొనును,” అని చెప్పెను. ఏమి వాగ్దానము!

9

మరియు ముందుగా చెప్పబడిన, వాగ్దానము చేయబడిన, ఎదురుచూడబడిన, ఈ కుమారునికి తల్లిగా ఉండవలిసిన రిబ్కా, ఆమె ఎన్నడూ ఎరుగని క్రొత్త మనుష్యుని విషయమై ఆఖరి పరీక్షకు పిలువబడినప్పుడు, పరిశుద్ధాత్మ పనిచేయుటను ఆమె మాత్రమే చూసింది. లేదా పరిశుద్ధాత్మను పనిచేయుటను మాత్రమే ఆమె చూసింది. మరియు ఆమె ఎన్నడు ఎరుగని మనుష్యునికి భార్య యగుటకు ఈ క్రొత్త మనిషితో ఆమె వెళ్ళవలెనా అని ఆమె తల్లిదండ్రులు పూర్తిగా నిర్ణయించలేకపోయినప్పుడు, ఆమె ఆఖరి పరీక్షయొద్దకు తీసికొని రాబడింది. “మనము ఆ చిన్నదానిని పిలిచి, ఆమెనే అడుగుదుము. ఆమె వెళ్ళునా అనునది ఆమె నోటనుండియే తెలిసికొందుము, అవును లేక కాదు.”

దేవుని యొక్క సంతతి అంతటి యొద్దకే అది ఆ విధంగానే తీసికొనిరాబడును. అది నీ నోట నుండి రావలసియున్నది. దేవుడు నీ యొద్ద నుండి వినగోరుచున్నాడు.

కనుక ఆమె పరీక్షించబడినప్పుడు, ఆమె ఒక్క క్షణం కూడా మొహమాటపడలేదు. ''నేను వెళ్తాను,“ అని ఆమె చెప్పింది. అది నాకు నచ్చింది. ''నా మనస్సును సిద్ధపరచుకొననిమ్ము; దానిని అధ్యయనం చేయనిమ్ము” కాదు. ఆమె పూర్తిగా ఒప్పించబడినది. దేవుడు ఆ జనులనే ఉపయోగించుకొనగలడు, దేవుడు తన వాగ్దానమును నెరవేర్చునని నీవు పూర్తిగా ఒప్పించబడినప్పుడు, “నేను వెళ్ళేదనని” చెప్పింది.

10

మరియు అప్పుడు ఆమె జనులు ఎంతటి అభిషేకము కలిగియున్నారంటే, బహుశా అది వారెరుగరు, కాని ఈ అందమైన యూదు బాలికను, ఒంటెనెక్కించి ఒక క్రొత్త దేశములోనికీ, క్రొత్త ప్రజల మధ్యకు పంపించుచుండగా, తమ సహోదరియూ తమ కుమార్తెయు అయిన ఆమెపై తమ చేతులుంచి ప్రవచించిరి... కాని వారిలో ఏదో ఒకటి యున్నది. నీ సంతతి తమ శత్రువు గవినిని స్వాధీనపరచుకొనును గాక. నీవు వేలవేలకు తల్లివగుదువు గాక,“ అని వారన్నారు.

అయితే ఈ రోజు ఆ జాతి జనులు మరియు దేవుని యొక్క ప్రజలు సముద్రము నుండి సముద్రము వరకూ లోకమందంతటా విస్తరించియున్నారు. మరియు ఆ పునరుత్థానములో వారు ఆకాశనక్షత్రముల వలె నుందురు; ఆకాశము గుండా వెళ్ళుచూ తమ స్థానమును తీసికొను ఆ కాంతివంతమైన వెలుగుల వలె. మరియు వారు వచ్చినప్పుడు వారు సముద్రము వలె - లేక సముద్రతీరమందలి ఇసుక వలె నుందురు. వారు వందల కోట్ల కొలది యుందురు.

11

“నీ సంతతి తన శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకొనును” అది దేవుడు ఒట్టుపెట్టి చేసిన వాగ్దానము. అబ్రాహాము యొక్క సంతతి. అంతట, వారు ఆ శరీరములో భాగము గనుక, ఆ తల్లి కూడా ఆ కుమారునిలో భాగమని, ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా చూసి, ఈ జనుల ద్వారా పనిచేయుచున్న ఆ పరిశుద్ధాత్మ అప్పుడు, అతడు, “నీ సంతతి శత్రువు గవినిని స్వాధీనపరచుకొనును గాక,” అని చెప్పెను. అటు పై, ఆయన శత్రువు గవినిని స్వాధీనపరచుకొనునని దేవుడు ప్రమాణము చేయుట, అప్పుడు సజీవ దేవుని యొక్క సంఘాన్ని అది ఏ స్థితిలో ఉంచుతుంది?

మనము క్రీస్తునందు చనిపోయి యుండుట వలన మనము అబ్రాహాము సంతతియై యున్నాము; మనమ అబ్రాహాము సంతతిని సంతరించుకొనినవారమై, ప్రమాణము చేయబడిన అదే వాగ్దానమునకు అతని తోడి వారసులము. మనము అబ్రాహాము సంతానమై అతనికియ్యబడిన ప్రతి వాగ్దానమునకూ వారసులమైయున్నాము. కాని పరీక్షలు వచ్చినప్పుడు, మనము విఫలమగునది అక్కడే. అయితే, అబ్రాహాము యొక్క నిజ సంతతి విఫలమగునని నేను నమ్ముట లేదు, వారునూ అబ్రాహాము నిలిచినంత ధైర్యముగానూ, విధేయముగానూ నిలుచుదురు.

12

దానిని నెరవేర్చుటకు తప్ప, దేవుడు ఏదీ చెప్పజాలడనీ, లేక ఏ వాగ్దానమూ చేయజాలడనీ ఇప్పుడు మనం చూస్తున్నాం. దేవుడై యుండుటకు దానిని ఆయన చేయవలిసియున్నది. ఏళ్ళు గడిచిన తర్వాత, అదే జనులు, వాగ్దానము చేయబడిన ఆ ప్రజలు, అబ్రాహాము సంతతి వారు, ఒక వాగ్దాన దేశములోనికి ప్రయాణమై వెళ్ళుచుండగా, ఒక గవిని వారికి విరోధముగా ఎదురు నిలిచెను; మరియు అతడు తన సొంత సహోదరుడైన మోయాబు; “నీవు నా దేశమును దాటి వెళ్ళవు. నీవు నా దేశము దాటి వెళ్ళకుండా నేను చూస్తాను,” అని అతడన్నాడు.

“మా ఆవులు నీ గడ్డిని తిన్నయెడల, లేక అవి నీ నీటిని త్రాగినయెడల, మేము నీకు వాటి వెల చెల్లించేదమని” ఇతడన్నాడు.

కాని అతడు, “నీవు ఈ దేశమును దాటవన్నాడు.”

అయితే దేవుని వాగ్దానము నెరవేరినది. కావున వారు వెళ్ళి ఈ ప్రజలను శపించుట కొరకు తమ ప్రవక్తయైన బిలామును అక్కడికి తీసుకొచ్చారు. మరియు అతడిలా అన్నాడు. వాగ్దాన సంతతిలోని నీచ భాగాన్ని అతడికి చూపించుటకు వారు ప్రయత్నించారు, కాని దేవుడు అతడికి దానిలోని అత్యున్నత భాగాన్ని చూపించాడు. “ఇశ్రాయేలును శపించువాడు శపించబడును, మరియు అతడిని దీవించువాడు దీవించబడునని” అతడన్నాడు. మరియు ఆటంకము తొలగించబడి, ఇశ్రాయేలు చదును భూములను దాటెను. అతడు తన శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకొనునని దేవుడు వాగ్దానము చేసెను.

13

తర్వాతి సంవత్సరములలో అబ్రాహాము సంతతియై యుండుట వలన, ఈ నమ్మకమైన సంతతి యొక్క క్రమములో ఉన్న దానియేలను పేరుగల ఒకడు వచ్చెను. మరియు జగత్తు పునాది వేయబడక మునుపే తన ప్రవక్తగా ఉండుటకై దేవుడతనిని ఎంచుకొనెను. మరియు అతడు ధైర్యముగా జీవించెను, మరియు అతడు నమ్మకముగా జీవించెను. మరియు అన్య దేశములో కూడా, “వారితో నన్ను నేను అపవిత్రపరచుకొనును,” అని తన హృదయములో నిశ్చయించుకొనెను. అది అబ్రాహాము యొక్క నిజమైన సంతానము. ఒక భిన్నమైన దేశములో జీవించుచూ, భిన్నమైన ప్రజల మధ్య జీవించుచూ, అయినా వాగ్దాన విషయములో ధైర్యముగా నుండుట, “వారితో నన్నునేను అపవిత్ర పరచుకొనను. నేను నమ్మకముగా యుందును.”

అతని తండ్రియైన అబ్రాహామును పరీక్షించినట్లుగా దేవుడతనిని పరీక్షించెను. మరియు, “నీవు మాలో ఒకనివలె ఉండి, మేము ఆరాధించు విధముగా ఆరాధించాలి, లేదా నేను నిన్ను ఆకలిగొన్న సింహాలతో నిండియున్న గుహలోనికి విసిరేస్తానని” రాజు అన్నాడు.

తన తండ్రియైన అబ్రాహాము వలె, దానియేలు, “నువ్వు నన్ను సింహాల

బోనులోనికి విసిరేయవచ్చు గాక, అయినా నేను నీ విగ్రహాలకు నమస్కరించను. నేను నీ నామకార్ధ మతమును తీసికొనను. నేను యెహోవాకు నమ్మకముగా ఉందునని“ చెప్పెను.

మరియు అప్పుడు ఆఖరి ఘట్టం వచ్చినది. రాజు తన మాట నిలబెట్టుకొనెను, అతడు ఆ ప్రవక్తను పట్టుకొని, తీసుకెళ్ళి సింహాల గుహలోనికి విసిరించెను. మరియు దానియేలు యొక్క శత్రువైన సింహాలు ఆ ప్రవక్త యొద్దకు వేగముగా రాగా, దేవుడు తన మాట నిలబెట్టుకొనెను. అతడు తన శత్రువు యొక్క గవినిని అతడు స్వాధీనపరచుకొనెను. ఆ సింహముల ఎదుట ఒక దూతగా దేవుడు నిల్చుని ఆ గవినిని తీసికొనెను. దేవుడు తన మాట నిలబెట్టుకొనెను, “అతడు తన శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకొనును!” దేవుడలాగు చెప్పెను.

14

మరియు ఆ కారణము కొరకు నమ్మకముగా ఉండెదమని తమకు తాము ప్రతిజ్ఞ చేసికొనిన, మరొక ముగ్గురు అక్కడ యుండిరి, వారు నిజముగా అబ్రాహాము యొక్క సంతతి; మరియు వారు షద్రాకు, మేషాకు మరియు అబెద్నగోలు - మరియు వారు పరీక్షించబడిరి. మరియు, “వీణేలు వాయించుచున్న శబ్దమూ, మరియు బూరలు ఊదుచున్న శబ్దము మీరు వినినప్పుడు, మీరు మోకరిల్లనట్లైతే, మీరు వేటికొరకైతే నిలబడుచున్నారో వాటిని విడిచి, మా మతమునకు మీరు తలవంచనట్లయితే. ఏలాగూ మీరు నిండా మునిగారు. మీ మతం మిగతావారి మతం కంటే గొప్పదేం కాదని,” వాళ్ళన్నారు. అది మనం రోజూ వినటం లేదా? కాని, యేసుక్రీస్తు యొక్క మతము భిన్నమైనది. ఆయన యొక్క పునరుత్తాన శక్తి భిన్నమైనది. మనము బిన్నమైన ప్రజలము, అసాధారణమైనవారము, రాజైన యాజక గుంపు. దేవుడు ఆ తేడా కలుగజేయుచున్నాడు.

15

అయితే, “మీరు మాలో ఒకరిగా ఉండవలసియున్నదని!” వాళ్ళు వీరితో చెప్పినప్పుడు. వాళ్ళలో ఒకరిగా యుండుట షద్రాకు, మేషాకు, అబెద్నెగోలకు బాగానే ఉండేది, కాని వారెన్నడూ అన్యులలో ఒకరిగా ఉండరు. ఇప్పుడు, “మీరది చేయునట్లైతే, అగ్నిగుండములోనికి ఇక్కడొక ద్వారమున్నది, దానిని తెరచి మేము మిమ్మల్ని అందులోనికి విసిరేయగలము. అప్పుడు మీరు మాలో ఒకరిగా మారిపోయి ఉంటే బాగుండునని అనుకుంటారని” వాళ్ళన్నారు.

వారు వాగ్దానాన్ని జ్ఞాపకంచేసికొన్నారు. వాళ్ళు వారిని, తిన్నగా, ఆ అగ్నిగుండము లోనికి నడిపించుకెళ్ళారు. మరియు వాళ్ళు ఆ తలుపు తెరిచి, వారి శత్రువైన వారిని దహించివేయగల ఆ జ్వాలలలోనికి వారిని విసిరినప్పుడు - వారు తమ శత్రువు యొక్క గవునులను స్వాధీనపరచుకొన్నారు. ఆ అగ్నిజ్వాలలలోనికి దేవుడు తన కుమారుని పంపి ఆ గాలులను చల్లబరచెను, మరియు ఆ లోపల ఉండగా వారితో ఆయన మాట్లాడెను. దేవుని వాగ్దానము నెరవేరినది. వారు శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకొనిరి. మొదట పరీక్షించబడి, అప్పుడు శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకొనిరి.

16

“ఈ చిన్నవారిలో ఒకరిని మీరు అభ్యంతరపరచుట కంటే, మీ మెడకు తిరుగటి రాయి చుట్టబడి, మీరు సముద్రపు లోతులలోనికి ముంచివేయబడుట మేలు కదా. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారికి అభ్యంతరము కూడా కలుగజేయకుడి. మరియు నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించునని వాగ్దానము చేసినది యేసు కాదా.”

ఆయన ఒక తేడా కలుగజేసెను. ఎవరు నమ్మారు ఎవరు నమ్మలేదనే దానిని ఆయన ప్రదర్శించెను. ఎల్లప్పుడూ మూడు గుంపులు జనులుందురు; అవిశ్వాసి, నటించు విశ్వాసి, మరియు విశ్వాసి. అయితే ఎవరు విశ్వాసి అనేది రుజువు చేయటకు దేవునికొక మార్గమున్నది. విశ్వాసి, దేవుడు నిజమని చెప్పినదానిపైన స్థిరముగా నిలబడును. అవును.

17

ఒక బల-పరీక్ష వచ్చినప్పుడు, తిష్బియుడైన ఆ ఏలియా, మరియు దేవుని కొరకు జీవించువాడు దేశములో తానొక్కడే యున్నాడని అనుకొనెను. మరియు రాజు అతనిని విచారణ చేయబోయెను, వారతనిని వేధించిరి. మరియు రంగులు పూసుకున్న యొజెబెలు అను పేరుగల ఆ చిన్న రాణి అతడి ప్రాణము తీసెదనని బెదిరించెను. మరియు ఆ బల-పరీక్ష సమయము వచ్చినప్పుడు, ఏలియా శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకొనెను మరియు మరలా దేశమంతటినీ తిరిగి దేవుని వైపునకు త్రిప్పెను. దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనును.

18

అబ్రాహాము సంతతియైన ఈ రాజ సంతానపు క్రమమునకు చెందిన మోషే, ఇశ్రాయేలు సంతతిని విడిపించుటకు ఐగుప్తునకు పంపబడినప్పుడు, అతడు చేయుటకు మరియు భూమిని కొట్టుటకూ, కప్పలనూ, ఈగలనూ, చీకటినీ, వడగండ్లనూ, వర్షమునూ, అగ్నినీ కలుగజేయుటకూ దేవుడతనికి సూచనలనూ అద్భుతములనూ ఇచ్చెను - మరియు ఈ అద్భుతములన్నీ చేసిన తర్వాత, అతడు యొహోవా యొక్క హస్తముతో వారిని బయటికి నడిపించినప్పుడు - వాగ్దాన దేశమునకూ అతనికీ మధ్య ఒక గవిని అడ్డోచిన కాలమొకటి వచ్చెను. మార్గంలో అడ్డంగా ఎర్ర సముద్రముండెను. వారు ఫరో సైన్యమునకూ, పర్వతములకూ, ఎడారులకూ మరియు ఎర్ర సముద్రమునకూ మధ్యన చుట్టబడిరి; అయితే మోషే ముందుకు కదిలి తన శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకొనెను - ఆరిన నెల మీద నడిచినట్లుగా, ఎర్ర సముద్రమును దాటెను. “నీవు శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకొందువు.” దేవుడలా చెప్పెను, మరియు అది దానిని స్థిరపరచును!

19

ఆ తర్వాత కొద్దిసంవత్సరాలకి శ్రమలు వచ్చినప్పుడు, సంఘం అస్తవ్యస్తమైపోయింది; ఏదైనా ఒకటి జరగాల్సినట్లుగా జరుగకపోతే, ఒక సంఘంలోని ప్రజలు అలా అవ్వటం చాలా సులువు. దేవుడు దానినలా చేస్తాడు. దేవుడు సంఘంలోనికి ఉద్రిక్తలు తీసుకొస్తాడు, “ఏలయనగా దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుడూ శోధించబడి, రుజవు చేయబడి, పరీక్షించబడవలెను.” వ్యాధి నిన్ను మొత్తుటకు ఆయన అనుమతించును. నిన్ను పరీక్షించి, రుజవు చేసి, నువ్వు నిజముగా అబ్రాహాము సంతతివని లోకానికి చూపించుటకై ఆయన రోగమును నీ మీదికి రానిచ్చును. ఆయన సొంత చిత్తమును బట్టి ఆయన దానిని అనుమతించును. ఆయన ఉపద్రవములను అనుమతించును, స్నేహితులు నీకు విరోధముగా తిరుగుటను ఆయన అనుమతించును. ఆయన వీటన్నిటినీ అనుమతించును, మరియు నిన్ను శోధించుటకై ఆయన అపవాదిని విడిచిపెట్టును, మరియు వాడు నీ ప్రాణము తీసికొనుట తప్ప మిగిలినవన్నీ చేయును. వాడు నిన్ను శ్రమల యొక్క శయ్యపైకి విసరగలడు; నీ పొరుగువానిని నీకు విరోధముగా త్రిప్పగలడు; వాడు దాదాపు ఏమైనా చెయ్యగలడు, మరియు వాడు అది చేయుట దేవుని చిత్తమే. అది మనకు బంగారం కంటే విలువైనదని మనకు బోధించబడినది.

20

ఇస్సాకుతో కొండమీదనున్న అబ్రాహాము సంగతేంటి, వాగ్దానము అతడికియ్యబడెను; మరి తన విధేయత వలన, తన జ్ఞానము వలన, యొహోవాయందలి తన విశ్వాసము వలన; దానివలననే, కేవలం దాని వలననే, దేవుడు క్రిందికి చూసి, “అతడి సంతతి గవినిని స్వాధీనపరచుకొనును. ఈ సంగతులను జరిగించునని నా తోడని ప్రమాణము చేసియున్నననెను.” ఒకనితోడని ఆయన ప్రమాణము చేయుటకు అంతకంటే గొప్పవాడు లేడు, అయితే ఆయన తనతోడని తనను బట్టి తానే ప్రమాణము చేసెను. అంతట, ఆయన అబ్రాహామును ఆఖరి ఘట్టము వరకూ పరీక్షించినయెడల; ఆయన నిన్నూ నన్నూ కూడా ఆ చివరి క్షణము వరకూ పరీక్షించవలసియున్నది - సమస్తమూ నీ నుండి దూరమై, నీవు ఒంటిరిగా నిలువవలసిన, ఆ నిర్ణయ కాలము వరకూ, హల్లెలూయా! అంతే.

21

ఒంటరిగా నిలబడు. ఆ బయటికి నడిచి, “ఆయన నన్ను నరికేసినా నేనాయనను నమ్ముతానని చెప్పు. అది అబ్రాహాము సంతానము. వాగ్దానము నిచ్చునది ఆయన. మిగిలినవారు ఏమి చెప్పినా అనవసరం, వారు ఏమి చేసినా అనవసరం - ”నేనూ నా ఇంటివారూ యెహోవాను సేవించెదము.“ అన్నాడు. ఆ అనుభవంలో ఏమీ లేదు, అది వట్టి ఉద్రేకమని మిగిలినవారంటే - ”నేనూ నా ఇంటివారూ యెహోవాను సేవించెదము.“ సరిగ్గా ఇక్కడే నేను పౌలు తరపున నిలబడి, ”మతభేదమనబడిన ఈ మార్గముననే నేను మన పితరుల దేవుని ఆరాధించుచున్నానని చెప్పగోరుచున్నాను. సంఘములోనికి ప్రగల్బాలు పలికేవారు వచ్చినప్పటికీ, సంఘములోనికి వక్రీకరించువారు వచ్చినప్పటికీ, అన్నిరకాల అబద్ధ ప్రవక్తలూ ఉన్నప్పటికీ, సంఘములోని జనుల మధ్యకు ప్రతి విషయమూ వచ్చినప్పటికీ, మరియు పొరుగునా, మరియు ప్రతి విషయములో; అయితే నేనునూ, నా ఇంటివారు ప్రభువును సేవించెదము. వారందరూ రావటం మానేసినా, సంఘం చల్లబడి, పట్టికొనివారిగా అయినప్పటికిని; నేనూ నా ఇంటివారూ, మేము ప్రభువును సేవించెదము. ఒకరికొకరు ప్రార్థన చేయబడి స్వస్థపడకపోయిననూ, దానితో దీనికేం సంబంధం లేదు; ఎందుకనగా నేను, నా ఇంటివారూ యెహూవాను సేవించెదము! ఆ శోధనలు మరియు శ్రమలు.

22

మనుష్యులు తప్పిపోనివారు కాదు, కాని దేవుడు తప్పు చేయడు. మనిషి, నీవొక మనిషిపై నీ దృష్టినుంచుము, అతడు తప్పు చేయును. ఉద్దేశ్యపూర్వకంగా కాకపోవచ్చును, కాని అతడు అది చేయును. నీ విశ్వాసమును మనిషి నుంచి విదిలించివేయుటకై, అతడు ఆలాగు చేయుటను దేవుడు అనుమతించును. మన విశ్వాసము మనిషి యొక్క జ్ఞానమందు లేదు, కాని యేసుక్రీస్తు యొక్క పునరుత్తాన శక్తియందున్నది. అబ్రాహాము యొక్క నిజ సంతానము తన వాగ్దానమును అక్కడే విశ్రమింపజేయును, ఎందుకనగా పరిశుద్ధాత్మను పొందినప్పుడు మాత్రమే వారు అబ్రాహాము యొక్క సంతతికాగలరు. మరియు అబ్రాహామునందున్న అదే విశ్వాసము విశ్వాసిలోనికి వచ్చును. ఏది జరిగినప్పటికీ, లేక ఎంత విరుద్ధముగా ఉన్నప్పటికీ అనవసరం - విశ్వాసి సూటిగా నడచి వెళ్ళను.

23

వేగుల వారు వెనక్కి తిరిగివచ్చి “ఓ, ప్రయత్నం చేయటం మూర్ఖత్వం. మరియు ముందుకు వెళ్ళటం అనవసరం, ఎందుకనగా అక్కడున్న ఆ జనులు ఉన్నతదేహులు, వారికి గొప్ప ప్రభుత్వములున్నవి, మరియు వారికి ఈటెలున్నవి - అంతెందుకు, వారిప్రక్కన మనం మిడతల వలె అగుపడుచున్నాము,” అన్నారు.

నాకు తెలియదు గాని, యొహోషువా ఒక చిన్న మరుగుజ్జుని (మూలభాషలో “runt” - చిన్న పందిపిల్ల) నేను నమ్ముచున్నాను, కొంచెం చిన్న పొట్టి మనిషి, అతడొక చిన్న పెట్టెలాంటి దానిమీదికి దూకి, “అయ్యలారా, సహోదరులారా, వారిని జయించుటకు కావల్సిన వారికంటే మనమొక్కువ,” అని యిరవైలక్షల మందితో చెప్పుటను నేను చూడగలను. ఎందుకు? అక్కడ అబ్రాహాము యొక్క విత్తనమొకటి యున్నది. దేవుడు ఆ వాగ్దానము నిచ్చెను. అది వారి సంపద. దేవుడు వాగ్దానము నిచ్చెను. ప్రత్యర్థి ఏనప్పటికీ అనవసరం, “దేవుడు దానిని మనకిచ్చెను గనుక మనం దానిని స్వాధీనపరచుకొనగలం,” అని అబ్రాహాము యొక్క నిజ సంతానము చెప్పెను.

24

ఈ ఉదయం నువ్వు అక్కడే నిలబడు. సజీవ దేవుని యొక్క సంఘము అక్కడే నిలబడుతుంది. వేరెవరో ఏమీ చెప్పినా నేను లెక్క చేయను, డాక్టర్ ఏం చెప్పినా, ఏది ఏమైనా, అవిశ్వాసి ఏమీ చెప్పినా - త్రోవలో ఎదురయ్యే ప్రతిదానికీ, మనం దానిని మించిన వారమే. శత్రువు ఏదైనా లెక్క లేదు, దేవుడు వాగ్దానము చేసెను. అది వారిది, వారి స్వాస్థ్యము.

స్వస్థత నీ స్వాస్థ్యము. రక్షణ నీ స్వాస్థ్యము. పరిశుద్ధాత్మ నీ స్వాస్థ్యము. మరియు అది అలా కాదని దేశములోని వేలమంది గొప్ప బోధకులు చెప్పుచున్నారు. కాని అది ఆలాగేనని అబ్రాహాము యొక్క సంతతికి తెలియును. వారు తిన్నగా లోనికి దూసుకెళ్ళి శత్రువు యొక్క గవనులు స్వాధీనపరచుకొందురు. వారది చేయుదురని దేవుడు చెప్పెను. అది ఒక వాగ్దానము కనుక వారు దానిని నమ్ముచున్నారు. “అతని సంతతి శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకొనును.” ఇప్పుడు, పరీక్షలూ, శ్రమలగుండా వెళ్ళుదురు.

25

మరియు యొహోషువా అక్కడ నమ్మకముగా నిలబడెను. “వారెంత పెద్దవారైనా నాకు లెక్క లేదు; వారి దగ్గర ఎలాంటి ఈటె ఉన్నా నేను లెక్క చేయను; వారి పట్టణముల గోడలు ఎంత ఎతున్నా, అది ఎంత గొప్పదైనా - ఆ ద్వారము దేవుని బిడ్డల యొక్క సంతతి చేత స్వాధీనపరచుకొనబడునని మన వాగ్దానము - మరియు మనం వారిని పట్టుకొనుటకు అక్కడికి వెళ్ళుచున్నాము. మనము వారిని మించినవారము” అని ఆ పొట్టివాడు చెప్పెను. ఓ, అదీ, ఆ నిజమైన సంతతి.

వారిలో శారీరక సంతతిగా జన్మించిన అనేకులు, “దానిని మనము అసలు చేయలేము. అది ప్రయత్నం చేయవల్సిన అవసరం లేదు. వారు మనకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు; మనము వారికి సరితూగము; మనం ప్రతీదీ అయ్యున్నాము,” అన్నారు. లేదు - అతడు - వారు కంటికి కన్పిస్తున్న దానిని చూశారు, మరియు యెహోషువ దేవుడు చెప్పిన దానిని చూశాడు.

26

అబ్రాహాము యొక్క సంతతి భౌతికమైన సంగతులలో దేనినీ చూడదు. వారు ప్రభువు చెప్పిన దానిని చూచెదరు. అదే వాగ్దానము. అబ్రాహాము భౌతికమైన వాటిని చూసినయెడల ఏమగును - నూరేళ్ళ వయస్సున్న ఆ స్త్రీని, ఆమెకు తొంభై, మరియు వందేళ్ళ వయస్సున్న తననూ చూసుకొనినయెడల - మరియు ఆమె ఒక చిన్న బాలికగానూ, అతడొక చిన్న బాలునిగానూ ఉన్నప్పటి నుండీ ఆమెతో జీవించినా సంతతి కలుగలేదు. అతడు ఆ సంగతులను చూడలేదు. అవి లేనట్లుగానే అతడు చూసెనని అతడు చెప్పెను, ఏలయనగా అతడు దేవుడు చెప్పిన దానిని మాత్రమే చూసెను. “అబ్రాహామా, నేను నిన్ను దీవించి, శారా ద్వారా నీకొక సంతానము నిచ్చెదను.” మరియు అతడు దానిని నమ్మొను. నీవు ప్రత్యర్థి వైపు చూడొద్దు; మనము దేవుడు చెప్పినదానిని చూచెదము. దేవుడు దానిని చెప్పాడు, అది దానిని స్థిరపరచును.

27

కావున యోర్దాను యొద్దకు వచ్చినప్పుడు, యెహోషువ సైన్యాధిపతిగా నియమించబడినప్పుడు - వారు నీటి ఒడ్డునకు వచ్చి ఆవలనున్న యెరికోను చూడగలిగిరి - అయితే యెహోషువ తన సైన్యమును సిద్ధపరచుకున్నప్పుడు వారి మార్గములో ఒక గవిని యుండెను మరియు ఆ గవిని పేరు యోర్దాను. అయితే దేవుని వాగ్దానము ప్రతి గవిని యొద్ద చెల్లును. అది ఏ ద్వారమైనప్పటికీ, దేవుని వాగ్దానము నిజమగును (నెరవేరును). “అతడు తన శత్రువు యొక్క గవునులను స్వాధీనపరచుకొనును.” అది దానిని స్థిరపరచును. ఆ ఉదయం అతడు యోర్దాను యొద్దకు వచ్చినప్పుడు, బహుశా, దెయ్యము ప్రతి చోటా తుఫాను మేఘాలు కమ్మింపజేసియుండును, ఆ పెద్ద పాత బురద నీరు దొర్లుకుంటూ వచ్చియుండును, ఒక వరద వలన పొలములు తుడిచిపెట్టుకుపోయి యుండునని నేను నమ్మబోవుచున్నాను. కాని యొహోషువ, “మీరు దేవుని మహిమను చూచెదరు; సిద్ధపడుడి,” అని చెప్పెను. మరియు వారు తమను తాము పరిశుద్ధపరచుకొని సిద్ధపడిరి, సమస్తమూ విరోధముగా అగుపడు సమయములో సిద్ధపడుట. అయితే వారు, “నేను అతనికి గవినిని ఇచ్చెదను” అని దేవుడు ప్రమాణము చేసినట్టి అబ్రాహాము సంతతి వారు. అతడు యోర్దాను యొద్దకు వచ్చెను; అది అతడి గవిని, మరియు అతడు దానిని స్వాధీనపరచుకొనెను.

ఒకానొక ఉదయం నేను కూడా ఆ చివరి గవిని యొద్దకు రావల్సియున్నది. నీవు కూడా యోర్దాను యొద్దకు రావలిసియున్నది, అయితే అబ్రాహాము సంతతి గవినిని స్వాధీనపరచుకొనును. అది ఏమైనప్పటికీ, అతడు శత్రువు యొక్క ప్రతి గవినినీ స్వాధీనపరచుకొనును.

28

వారందరూ గొప్ప మనుష్యులు; వారు క్రమములో చనిపోయిరి. అయితే చివరికి ఒక రోజున యూదా బెల్లెహేములో, ఆ రాజసంతానము పుట్టెను, మిగిలిన వారందరూ ఈ సంతానము యొక్క ఛాయలు. ఈ రాజ సంతానము ఒక మనుష్యునివలన జన్మించలేదు గాని, ఆయన ఒక కన్యక ద్వారా జన్మించెను - మరణమునూ పాతాళమునూ జయించు శక్తిని తన నరములలో కలిగియుండెను. దేవుడొక వాగ్దానము చేసెను. ఒక సాధారణ మానవుడు దానిని చేయలేడు, కాని దేవుడొక వాగ్దానము చేసినట్లైతే - కొన్ని నిమిషాల క్రితం అబ్రాహాము యెదుట ఉన్న అదే దేవుడాయన - యెహోవా యీరే, గవినిని స్వాధీనపరచుకొనుటకు ప్రభువే మార్గమేర్పరచును. దానిని మనం ఎలా చేయబోతున్నాము? యొహోషువా చనిపోయెను, మోషే చనిపోయెను, వారిలో మిగిలినవారూ చనిపోయిరి, కాని దేవుడు, “అతడు శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకొనునని” చెప్పెను. అతడు మరణమునెలా స్వాధీనపరచుకొనబోవుచున్నాడు? పనులు చేయుటకు ఆయనకొక మార్గమున్నది. “అతడు తన శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచు కొనును.”

29

ఆ రాజసంతానము జన్మించెను. మనవలె ప్రతి విధముగానూ అతడు శోధించబడెను. మీరు శోధింపబడవలసిన విధముగానే, ఆయన కూడా యుండెను. ఆయన పరిశుద్ధాత్మను పొందిన తర్వాత, వెంటనే ఆ దెయ్యము ఆయనను తీసికొని నలభై దినములూ, నలభై రాత్రులూ ఆయనను శోధించుటకై అరణ్యమునకు కొనిపోయెను. మరియు ఆయన బయటికి వచ్చినప్పుడు... ఆయన మరణించినప్పుడు వాళ్ళు ఆయన చేతులలో మేకులు కొట్టి, ఆయన ముఖము పై ఉమ్మివేసిరి. ఆయన ప్రతి రోగమునూ అనుభవించెను. అయితే ఆయన ఈ భూమిపై ఉన్నప్పుడు, తాను రోగమును జయించగలనని ఆయన రుజువు చేసెను. పేతురు భార్య యొక్క తల్లి జ్వరముతో ఉన్నప్పుడు, ఆయన ఆమె చేతిని ముట్టగా ఆ జ్వరము ఆమెను విడిచి వెళ్ళెను. ఆ గవిని యొద్ద కుష్ఠువాడు, “అపరిశుద్ధుడను. అపరిశుద్ధుడను! నీ చిత్తమైతే నీవు నన్ను పూర్ణునిగా చేయగలవన్నప్పుడు.

“నాకిష్టమే, నీవు పూర్ణుడవగుమని” ఆయన చెప్పెను. ఆయన జయించి మరియు కుష్ఠురోగము యొక్క గవినిని స్వాధీనపరచుకొనెను. ఆయన జ్వరముల గవినిని స్వాధీనపరచుకొనెను. ప్రతి స్వభావమూ ఆయనకు లోబడునట్లు ఆయన చేసెను. ఆయన అబ్రాహాము యొక్క సంతానమైయుండెను; వాగ్దానము ఎవరికైతే చేయబడెనో, ఆ రాజ సంతానము - ఆయనవలననే అబ్రాహామునకూ, మరియు అతడు మొదలుకొని రాజసంతానము వరకూ, మరియు ఆయన తర్వాతి వారందరికీ దేవుని వాగ్దానము నిజము. ఆయన వ్యాధిని జయించెను, ఆయన శోధనను జయించెను. శత్రువు ఆయన ముఖము పై ఉమ్మివేసి, ఆయన చెంపపై కొట్టినప్పుడు, ఆయన తన రెండవ చెంప చూపించెను. వారు ఆయన ముఖము నుండి గడ్డమును లాగి, ఆయనపై ఉమ్మివేసినప్పుడు, ఆయన తిరిగి వ్యసనపడలేదు. ఆయన శోధన యొక్క గవినిని జయించి దానిని స్వాధీనపరచుకొనెను.

అలా ఉండగా, “నా కోపం నన్నలా చెయ్యనివ్వదని” నువ్వంటావు. అబ్రాహాము యొక్క సంతానమా, అవునయ్యా, ఆయన దానిని నీ కొరకు జయించెను.

30

మరియు ఆయన విసిగించబడినప్పుడు, ఆయన తిరిగి కోపపడలేదు. ఆయన పరిహసించబడినప్పుడు, ఆయన మౌనము వహించెను. ఆయన దెయ్యమని పిలువబడినప్పుడు, ఆయన మౌనము వహించెను. ఆయనకు ఒకే పని యుండెను, మరియు ఆది ఆ తండ్రి పని, ఆయన దానిని చేయుచూ కొనసాగెను. ఆఖరికి, వారాయనను ఒక శిలువ యొద్దకు తీసుకెళ్ళారు. మృత్యువు ఆయనను ఎదుర్కొనవలసి వచ్చెను. వారిలో మిగిలినవారందరూ, సముద్రములనూ, ప్రకృతినీ, సింహములనూ, అగ్నినీ, ప్రతిదానినీ జయించిరి - చావును తప్ప. అయితే, తన మొదడులో, తన నరాల్లో చావును జయించే శక్తి మసలుతున్న ఒకడు ఇక్కడుండెను. కావున వారు, ఆయన చేతులను తీసికొని, సాగదీసి, మేకులతో ఆయనను ఒక శిలువకు కొట్టిరి. వారాయనను కొట్టి, ఆయన ఎముకలు కనపడునట్లుగా చీరివేసిరి. అయితే ఆయన చేసినప్పుడు, వారు చేయగలిగినదంతా చేసినప్పుడు, మరణమాయనను తాకి, “ఇప్పుడు, యెహూషువాను స్వాధీనపరచుకున్నట్లుగా నేను, నిన్ను స్వాధీనపరచుకుంటాను. దానియేలును స్వాధీనపరచుకున్నట్లుగా నిన్ను స్వాధీనపరచుకుంటాను. నేను నిన్ను మరణించునట్లు చేయుదును గనుక నేనిది చేయుదుననెను.”

31

మరియు సూర్యుడు తనను గూర్చి తాను సిగ్గుపడునట్లుగా ఆయన చనిపోయెను. ప్రకృతి సిగ్గునొంది పనిచేయలేకపోవునంతగా ఆయన చనిపోయెను. మధ్యాహ్న వేళ సూర్యుడస్తమించెను, నక్షత్రములు బయటికి రాలేదు. మధ్యాహ్న వేళ నీ ఎదుటనున్న చేతిని నీవు చూడలేనంతగా ధాతవులు (పంచ భూతములు) నల్లబడునట్లు ఆయన చనిపోయెను. “ఆయనతో పాటు నేను కూడా చనిపోవుదును గాక” అని ప్రకృతి అనుటను నేనూహించుకోగలను.

సహోదరుడా, అప్పుడు ఆయన ప్రశస్తమైన ఆత్మని ఆ అపవాది అడుగులేని పాతాళపు అగాధములలోనికి పంపించినది. అక్కడ గవునులు తెరుచుకున్నవి, అయితే ఆయన మూడవ రోజు తిరిగి వచ్చెను, దానిని జయించెను. ఆమేన్. “అతని సంతతి శత్రువు గవినిని స్వాధీనపరచుకొనును.” మరణమును జయించెను, ఆయన నరకమును జయించెను. ఆ మొదటి ఈస్టరు ఉదయాన ఆయన సమాధిని జయించెను. మరియు ఇప్పుడు, మనలను ప్రేమించిన ఆయన ద్వారా, జయశాలుల కంటే ఎక్కువైయున్నాము.

32

పెంతెకోస్తు దినాన, అన్యజనుల గుండా కొనసాగుటకై ఆయన పరిశుద్ధాత్మను పంపెను; ఒక వాగ్దాన సంతతిని బయటికి తీయుటకు, వెలివేయబడినవారైన అన్యజనుల కిచ్చుటకు, వారికి పరిశుద్ధాత్మనిచ్చుటకు, వారిని వాగ్దానములోనికి తెచ్చుటకు ఇప్పుడు, సమస్త రోగములనూ జయించుటకు మనకు హక్కున్నది. మనము దానిని జయించనక్కర లేదు; అది ఇప్పటికే జయించబడినది. మనము కేవలం వాగ్దానాన్ని స్వతంత్రించుకొని (మనకు చెందినదని ప్రకటించి (claim) - తర్జుమాదారుడు), వెళ్ళి దానిని తీసుకోవటమే. అది ఇప్పటికే జయించబడినది. మరణము జయించబడినది, నరకం జయించబడినది, వ్యాధి జయించబడినది, శోధన జయించబడినది, దెయ్యములన్నియూ జయించబడినవి, నరకం జయించబడినది, మరణం జయించబడినది, ఆ సమాధి జయించబడినది. దానిని స్వాధీనపరచుకొనుచూ, మనము గవిని యొద్ద నిలబడియున్నాము. ఒక్క గుండు కూడా పేల్చవల్సిన అవసరం లేదు. దాని వెల ఇప్పటికే చెల్లించబడినది.

33

అతడి శత్రువు, అతడు తన శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకొనును. ఎంతమంది? వందలకోట్లమంది. అతడు తన శత్రువు యొక్క గవినిని, ప్రతి శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకొనును. ఆయన మృతులలో నుండి లేచెను. ఆయన దానిని మనకిచ్చెను గనుక మనము దానిని స్వాధీనపరచుకొనియున్నాము. అది ఒక ఉచిత కానుక మరియు అది మాత్రమే కాక, ఆయన చేసినదంతా ప్రతి గవినినీ జయించెను, వ్యాధిని జయించి, ఆ గవినిని స్వాధీనపరచుకొనెను. మనము చేయవలసినదల్లా, గవిని యొద్దకు వెళ్ళి “ఆ జయశాలియైన యేసుక్రీస్తు నామములో,” అనుటయే. ఆమేన్.

చనిపోవల్సిన సమయం వచ్చినప్పుడు, మరణము, “అతడు తన మతమును వెనక్కి తీసికొనునట్లు నేను చేయుదును” అని అనును.

“నజరేయుడైన యేసుక్రీస్తు నామములో యోర్దానూ! వెనక్కి దొర్లు.” అబ్రాహాము యొక్క సంతతి గవినిని స్వాధీనపరచుకొనును.

అంతెందుకు, వారు తన తలను ఖండించుటకు సిద్ధపడుతున్నప్పుడు, అబ్రాహాముకు ఒక సంతతియైన పౌలు, “మరణమా, నీ ముల్లెక్కడ? సమాధీ, నీ విజయమొక్కడ? యేసుక్రీస్తు ద్వారా మాకు విజయము నిచ్చుచున్న దేవునికి కృతజ్ఞతలు, అనెను.

అతడు తన శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకొనును, తీసికొనును. అతడు ఆ గవినియొద్ద కొట్టుకొనడు; అతడు దానిని జయించి తీసికొనును; అతడు దానిని స్వాధీనపరచుకొనును. అది ఆయన సొంత శక్తియందు.

34

ఈ ఉదయం సజీవ దేవుని యొక్క సంఘములో సమస్తరోగములనూ స్వస్థపరచుశక్తి యున్నది. సమస్త శోధనను అధిగమించు శక్తి సజీవ దేవుని సంఘములో ఉన్నది. పాపమును మార్చి దానిని విసిరిపేసి, పరిశుద్ధాత్మ బాప్తిస్మము స్వీకరించు శక్తి ఈ ఉదయం సజీవ దేవుని యొక్క సంఘపు స్వాధీనములో ఉన్నది. యేసుక్రీస్తు యొక్క సంఘములో, “నా నామములో మీరేది అడిగిననూ అది మీకు ఇవ్వబడును. కొద్దికాలమైన తర్వాత లోకము (విత్తనము కాదు; తిరిగి జన్మించని విత్తనము) నన్నిక చూడదు. అయినా మీరు నన్ను చూచెదరు, ఏలయనగా నేను మీతో మరియు చెప్పాలంటే - మీ యందు యుగాంతము వరకూ ఉంటాను.” ఏమిటి? ఆ రాజసంతతి. “నేను చేసిన క్రియలు మీరునూ చేసెదరు. నేను మీతో ఉన్నానని నేనే స్వయంగా రుజువుపరచుకొందును, ఏలయనగా నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును.” “అతడు తన శత్రువు యొక్క విత్తనమును స్వాధీనపరచుకొనును. అతడు అతని సంతతి తన శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకొనును.” అది ఏ గవినైనా అనవసరం, అది వ్యాధియైనా, శోధనైనా, పాపమైనా, అది ఏమైనప్పటికీ, అది జయించబడింది. మరియు అబ్రాహాము యొక్క సంతతి దానిని స్వాధీనపరచుకున్నది.

35

ఇప్పుడు మనం జయశాలికంటే ఎక్కువైయున్నామని తెలిసికొని ఈ ఉదయం మీరు సంతోషించుట లేదా, జయశాలికంటే ఎక్కువ. ఓ, దేనిగురించి పోరాడవల్సిన అవసరం లేదు. పోరాటము ముగిసినది; ఈలవేయబడినది; జెండా ఎగరవేయబడినది; మరియు ప్రతి పాపపు కుప్ప మధ్యలో, ప్రతి రోగపు గది మధ్యలో, ఒక జయశాలియైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా ఆ పాత రాటుదేలిన శిలువ నాటబడినది. మనము చేయవల్సినదల్లా నమ్మటమే, చూసి బ్రతకటమే. “నేను మీతో ఉంటాను; నేను రుజువు చేస్తాను. చివరి రోజుల్లో జనం వచ్చి ”ఓ అదలా ఉండేది! అంటారు. కాని నేను మీతో ఉంటాను, నేను ఈ భూమిపై ఉన్నప్పుడు చేసిన అవే క్రియలు, నేను మీయందుండి అదే పనిచేస్తాను. అప్పుడు మీకు తెలియును. వారు నన్ను చూచెదరు. ఆ నా ప్రజలు నన్ను చూచెదరు. అబ్రాహాము యొక్క సంతతి నన్ను చూచును. వారు నన్ను తెలిసికొందురు. వారు నన్ను గుర్తుపట్టెదరు. వాళ్ళు చేసినట్లుగానే ఇతరులు నన్ను బయెల్జెబూబని పిలిచెదరు, కాని నేను మీతో ఉండుట వలన మీరు నన్ను తెలిసికొందురు. మీరు నన్ను చూచెదరు, మీ కళ్ళతో నన్ను చూచెదరు. నేను యుగాంతము వరకూ మీతో ఉండుట వలన మీరు నన్ను చూచెదరు. నేను చేయుచున్న ఇవే క్రియలు నాయందు విశ్వాసముంచువాడునూ చేయును. అవే రకమైన క్రియలు!“

36

మరియు ఈ రోజు, నిలబడి జయించుటను చూసే భాగ్యము, సజీవ దేవుని యొక్క సంఘానికున్నది; పునరుత్తానుడైన యేసుక్రీస్తు, సజీవ దేవుని యొక్క కుమారుడు, తన సంఘములో జీవించుచూ, ఇప్పుడు నిలబడి, ఆయన చేసిన అదే పనిని మరలా చేయటం. అప్పుడూ మనం ప్రతి శత్రువు యొక్క గవినినీ స్వాధీపరచుకొందుము.

నా సహోదరుడా, ఈ ఉదయం నీకొక శత్రువు ఉన్నట్లయితే, కేవలం నీవు అబ్రాహాము యొక్క సంతతివైతే, ఇది విన్న తర్వాత, ఆ గవినిని నీ ఎదుట ఉంచగలిగినన్ని దెయ్యములు పాతాళంలో లేవు. అది తెరచుకొనును. అది ఏదైనా నాకనవసరం, నువ్వు వాగ్దానమునొందిన సంతతిగా అక్కడికి నడిచి వెళ్ళి, “దీనిని నా కొరకు నేను స్వతంత్రించుకొనుచున్నాను. ఇది నాది, ఎందుకనగా యేసును తిరిగి లేపెదననీ, యేసు ద్వారా దీనిని నేను జయించెదననీ దేవుడు వాగ్దానము చేసెను; మరియు నేను ఆజయశాలియైన యేసుక్రీస్తు నామములో వస్తున్నాను. వెనుకడువేయు. ఈ త్రోవగుండా నేను వెళ్తున్నాను,” అని చెప్పు. ఆమేన్. “అతడు శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకొనును.” అయితే ప్రభువైన యేసు యొక్క రక్తంతో కప్పబడి, నీ కేడెము మెరుస్తుండగా, నీ భుజములు వెనక్కి చాచి అక్కడ నిలబడు - శత్రువు దానిని గుర్తిస్తాడు.

37

మీ అవసరత ఉన్నట్లైతే, మనము ప్రార్ధించుచుండగా ఆయనతో మాట్లాడండి. ఈ ఉదయం ఇక్కడ ఉన్నవారలారా, మీ తలలు వంచియుండగా, మీకేదైనా అవసరమున్నట్లైతే - మీ చేతిని యేసు వైపుకెత్తి మీ హృదయంలో దానిని చెప్పెదరా. మీ హృదయంలో, “ప్రభువా, మీకు నా అవసరం తెలుసు. ”అతడు శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకొనునని“ బైబిలు చెప్పుచున్నదని ఈ ఉదయం నేను వినియున్నాను. నేను ఆ గవినిని స్వాధీనపరచుకొనుటకు వచ్చుచున్నాను. బహుశా నాకు కోపం ఉండవచ్చు, బహుశా నాకు పరిశుద్ధాత్మ అవసరమై యుండవచ్చు, పాపం నన్ను కట్టిపడేసింది. నాకు అవసరం ఉన్నది, అయితే ఇప్పుడు నేను ఆ గవిని యొద్దకు వచ్చుచున్నాను. ఈ ఉదయం నేను దానిని తీసుకొనబోవుచున్నాను; అది నా గవిని. నేను వస్తున్నాను గనుక నాకు ఇవ్వు,” అని చెప్పండి.

38

ఆశీర్వదించబడిన ప్రభువా, ఈ చేతులన్నింటినీ నీవు చూశావు, మరియు ఇది నీ వాక్యమని నీవెరుగుదువు ప్రభువా. నేను కేవలం లేఖనములను ఉటకించాను - బైబిలులోని వ్యక్తులు, ఏ విధంగా రాజ్యములను లోబరచుకొనిరో, నీతిక్రియలు జరిగించిరో, అగ్నిని - అగ్ని యొక్క హింసను ఆర్పితిరో ఖడ్గము యొక్క అంచునుండి ఎలా తప్పించుకున్నారో, ఎలా సింహాల నోళ్ళు మూయించారో, మరియు స్త్రీలు ఏ విధంగా తమ మృతులను తిరిగి పొందితిరో, మరియు అనేక సంగతులు - ఎందుకనగా మీరు దానిని వాగ్దానము చేశారు. ఇది మీ వాగ్దానము, “అతని సంతతి, అబ్రాహామూ, నీ సంతతి శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకొనును.” మరియు నీవు నీ వాగ్దానము నిలబెట్టుకుంటావు.

ప్రభువా, వారి హృదయ వాంఛలను ఇప్పుడు వారికిమ్ము. ఇక్కడి నుంచి వారు ఒక భిన్నమైన వ్యక్తిగా బయటికి వెళ్ళుదురు గాక. ఆ రాజసంతానము వారికొరకు జయించెను గనుక వారు జయశాలులని ఎరిగి వారు వెళ్ళుదురు గాక. ఆ రాజరికపు రాజు, కన్యకకు జన్మించి ఆయన వచ్చినప్పుడు, మరణము మట్టుకు ఆయన ప్రతి శత్రువును జయించెను. కావున స్వయంగా మరణం కూడా అబ్రాహాము యొక్క సంతతిని బయపెట్టజాలదు. ఆఖరి శత్రువు ఆ రాజ్యములోనికి ప్రవేశించు ఆఖరి దేవుని బిడ్డ యొక పాదముల క్రింద ఉంచబడిన తర్వాత, ఒక మహిమకరమైన శరీరంలో, మరింత మహిమకరమైన విధంగా తిరిగి వచ్చి, మేము భూమిని స్వతంత్రించుకొందుమను వాగ్దానము మాకు కలదు.

39

ప్రభువా, పాపులు తమ చేతులను పైకెత్తి యున్నట్లైతే వారిని రక్షించుము. వెనకి జారుతున్నవారికి, వారు దిగజారువారిగా ఉండవల్సిన అవసరం లేదని తెలియజేయండి. దిగజారుడు గవినిని అతడు స్వాధీనపరచుకొనగలడు. బహుశా ఆ కోపముగలవాడు, లేక ఒక బూతుల మురికి నాలుక, లేక ఒక మోహించు హృదయము, ఒక ధనాపేక్షల ఒక హృదయము, లేక ఒక మురికి సంగతి - ఆ గవినిని వారు స్వాధీనపరచుకొనగలరని వారికి తెలియజేయుము. ప్రభువా, బహుశా అది వ్యాధి, రోగము కావచ్చును; వారు ఆ గవినిని స్వాధీనపరచుకొనగలరు. “ఎందుకనగా, మన అతిక్రమ క్రియలనుబట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములనుబట్టి ఆయన నలుగగొట్టబడెను; మన సమాధానార్ధమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బలచేత మనము స్వస్థపరచబడితిమి.” ఈ ఉదయం మేము జయశీలులమైయున్నాము. దీనిని అనుగ్రహించండి ప్రభువా, దానంతటికీ అదనంగా, ఆయన ద్వారా చేయబడిన ఆ గొప్ప పని, ఆయన ఇంకా మనతో ఉండుట. అది తాను చేసెదనని ఆయన వాగ్దానము చేసెను. “కొద్దికాలమైన తర్వాత లోకము నన్ను చూడనేరదు, అయినా నేను యుగాంతము వరకూ మీతోను, మరియు మీ యందును, ఉంటాను గనుక మీరు నన్ను చూచెదరు.” తండ్రీ, ఈ ఉదయం, ప్రతిఒక్కరికీ నిన్నునీవు బయలుపరచుకొనుమని నేను ప్రార్ధించుచున్నాను. దీనిని మేము యేసు నామంలో అడుగుచున్నాము. ఆమేన్.

40

ఇది నిజమని మీరు నమ్ముచున్నారా, ఇది నిజమని ఖచ్చితంగా నమ్ముతున్నారా, మీ హృదయంలో ఇసుమంత సందేహం కూడా లేకుండా? ఇప్పుడు దీనిని గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్మ యొక్క క్రియ ఎంత సామాన్యంగా ఉంటుందంటే, అది తెలివిగల బుర్రను గందరగోళపరుస్తుంది. ప్రతి... నాకున్న అత్యంత సామాన్యమైన విషయములు. పరిశుద్ధాత్మ ఇది చేయుట నేను చూశాను; అది అలా ఉండుటను నేనెందుకు ఆలోచించుట లేదని నేనంటాను. నేను, నా సొంత మెదడుని వాడవలసివస్తే, “సరే, అది సరికాజాలదు,” అని నేనంటాను. కాని ప్రతిసారీ అది సరియైనదే. ఆయన అంత సామాన్యముగా పనులు చేయును. మరియు తన ప్రజలకు తనను తెలియపరచుకొనుటకు ఆయన క్రియలను చేయును. దేవుడు తన ప్రజలతో ఉన్నాడు. ఆయన తన ప్రజల మధ్య ఉన్నాడు. ఆయన వారిని ప్రేమించుచున్నాడు, వారి కొరకు పనిచేయగోరుచున్నాడు, వారికి సహాయము చేయగోరుచున్నాడు, కేవలం ఆయన ఏమి చేసెనో అదే తప్ప, ఏమి చేయనైయున్నాడో అది వారికి తెలుపగోరుట లేదు. ఆయన ఇప్పటికే దానిని చేసియున్నాడు; అది నీది. అది నీకు చెందినది. అది ఆయన సంఘమునకు మన తండ్రియెన దేవుని నుండి ఒక ఉచిత కానుక.

41

ఇప్పుడు, దానియేలు కాలంలో మాదిరిగా, హెబ్రీ బిడ్డల కాలంలో మాదిరిగా, మరియు ఈ ఉదయం మనం చెప్పుకున్న అనేకుల కాలాల్లో. తెలివిగల మెదడు ఎంతగా మెలికపడిపోతుందో కదా, చూడండి. ఆ గొప్ప తెలివిగల లోకాన్ని అధిగమించడం ఇప్పుడెంత కష్టమో, ఆ దినమునా అంతే కష్టముగా ఉండెను. అది ఎల్లప్పుడూ శత్రువై యుండెను, వారు చూసే తీరూ వారి ఆధునిక శాస్త్రమూ మొదలైనవి, ఈ రోజు మొదడుకి ఎంత క్లిష్టంగా ఉన్నాయో, అప్పుడూ అంతే క్లిష్టంగా ఉండేవి. చూడండి, అది ఇదే. అయితే, “దేవుడు నిజం. దేవుడి మాట సత్యం,” అని ధైర్యం చేసి నిలబడేవారు ఎల్లప్పుడూ ఉన్నారు.

మరియు, ఆయన జయించెను గనుక నీవు జయించనక్కర్లేదు. నీవు చేయవల్సిన ఒకే ఒక్కటి, అక్కడికెళ్ళి ద్వారంలో నిలబడి, “ఇది నాది. ఇది నాది. నా రక్షణ, దేవుడు దీనిని నాకిచ్చాడు. నాకు పరిశుద్ధాత్మ కావాలంటే, దేవుడు దానిని నాకిచ్చెను. వాగ్దానము నాకునూ, మన పిల్లలకూ, దూరస్దులందరికీ, ప్రభువు పిలచినవారందరికీ,” అనటమే. అందుకే నేను కేవలం నిలిచి....

42

వివేచన మరియు మొదలైనవాటితో ఉన్న నా ఈ పరిచర్య ఇది. ఇక త్వరలో ముగిసిపోవును. ఓ, ఇది ఎల్లప్పుడూ ఉంటుంది కానీ, ఇది త్వరలో ముగిసిపోతుంది, ఎందుకనగా ఇంతకంటే ఒక గొప్పదానిలోనికి వెళ్ళుచున్నాము, చూశారా. ఇది పైకి వెళ్ళుచున్నది; చెయ్యిపట్టుకొనుట నుండి వివేచనకు, మరియు ఇప్పుడు మరొకటి చేయుటకు సిద్ధపడుచున్నది. చూశారా. దీనిని చూశారా? దీనిని చూసి ఇది నిజమని తెలిసికొనండి. చూశారా, అది నిజమనీ, మరియు అది ఇంకా గొప్పగా, పైకి, మేలుకై ఎదుగుననీ నాకు తెలుసు. నిశ్చయంగా, ఎందుకు, ఆయన దానిని వాగ్దానము చేసెను; మరియు ఆయన వాగ్దానము చేసిన దానిని ఆయన చేయును. తన వాగ్దానమందు ఆయన విఫలము కానేరడు. మరియు అదేంటి? నీ కొరకు ఆయన ఆ గవినిది స్వాధీనపరచుకొనెనని నీకు తెలియజేయుటకై నీతో సదా జీవించియున్న ఆయన సన్నిధి.

ఆయన రాజసంతానమై యుండెను; ఆయన తప్ప వేరెవ్వరూ ఆ గవునులు స్వాధీనపరచుకొనలేరు. ఆ వెనుక ఉన్నవారందరూ ఆయన రాకడ యొక్క నీడలు, అయితే ఆయన వచ్చినప్పుడు పోరాటమంతటినీ ముగించెను. గెత్సేమనె యొద్ద, మరియు కల్వరి యొద్ద పోరాటము ముగించబడినది. మరియు ఇప్పుడు మనము జయశాలులుగా (విజేతలుగా) నిలబడియున్నాము. చూడండి, చేయుటకు పోరాటమేమీ లేదు. మనం... పోరాటం ముగిసినది; అది మన సొంతము, అ౦తే. తన చేతిని పైకెత్తి, “అతని సంతతి శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకొనునని నన్ను బట్టి నేను ప్రమాణము చేయుచున్ననని” చెప్పిన మన తండ్రియెన దేవుని ద్వారా, దాని విషయమై ఇవ్వబడిన హక్కుపత్రము, ఒక వ్రాయబడిన సంచకరువు. మరియు అది ఇక్కడ ఉన్నది; అది ఇప్పటికే తీసికొనబడినది. “మన అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడెను; ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థపరచబడితిమి.” అది ఇప్పటికే చేయబడినది. అది ముగించబడిన క్రియ, మనము దానిని పొందియున్నాము. “మరియు నేను చేయు క్రియలు మీరునూ చేసెదరు. ”ఈ ఉదయం ఆ రాజు మనతో ఉన్నాడు. ఆయన గొప్ప ఆశీర్వాదములు, ఆ పరిశుద్ధాత్మ మనపై కదలాడుట. ఆ మహిమకరమైన అనుభూతిని అనుభూతి చెందుట, అది ఖచ్చితంగా దేవుని వాక్యము యొక్క క్రమములో ఉన్నదని ఎరిగియుండుట; దేవుడు మన తండ్రియని తెలిసికొనుట ఒక అద్భుతమైన ఆదరణ నిచ్చును.

43

ఈ ఉదయం అతడు ప్రార్ధనా కార్డులు పంచిపెట్టాడా. ఇప్పుడు నేను నమ్ముతున్నాను. టేబర్నికల్ కి జనులు తప్ప ఎవరూ లేకపోతే ప్రార్థనా కార్డులు ఇవ్వొద్దనీ, ఈ ద్వారములో క్రొత్తవారు పది, పదిహేను లేక కొందరు ఉన్నట్లయితే వారికొరకై ప్రార్ధించుట కొరకు ప్రార్ధనా కార్డులు పంచిపెట్టమనీ నేనతనితో చెప్పాను. ఈ ఉదయం మాతో ఉన్న క్రొత్తవారెంత మంది, మీ చెయ్యి ఎత్తండి? ఓ, నిశ్చయంగా వారు పదిహేను లేక ఇరవై మంది ఉన్నారు. సరే. మనం ఈ ప్రార్ధనా కార్డులను క్రమంలో ఉంచి, వారిని వేదిక యొద్దకు తీసుకొద్దాం. చూడండి, నేను టేబర్నికల్ జనుల గురించి చెప్పుటకు కారణం, వారు ఇక్కడి వారు.

వివేచన, గురుంచుకోండి, నేను దీనిని చెప్పుచున్నాను; వివేచన త్వరలో ముగింపుకు చేరుకొనును. ఆ మార్గంలో అది మరింత గొప్పగా, మరింత శ్రేష్టంగా ఉండును. అక్కడ అది ఉండెను, అది నాకు తెలుసు. చూడండి, నిన్న మరియు అంతకు ముందు రోజూ అది జరిగినప్పుడు, నాతో నిలబడియున్న యిద్దరు సహోదరుల వైపు నేను ఇప్పుడు చూస్తున్నాను. చూశారా, మరియు ఇప్పుడది వరుసగా మూడు సార్లు జరిగినది. అది ఇప్పుడే సమీపముగా ఉన్నదనుటకు ఒక ధృవీకరణ, చూశారా, జరగటానికి సిద్ధంగా ఉన్నది.

44

ఇప్పుడు, ప్రభువా, నీవు దేవుడవు, మరియు మేము నీ సేవకులము. నీ వాక్యము కొరకు, మరియు మా హృదయములను దీవించిన మీ పరిశుద్ధాత్మ కొరకూ, మీకు మేము కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. మరియు ఇప్పుడు, మేము సంతోషంగా ఉన్నాము; మేము జయశాలులమని యెరిగి ఇక్కడ కూర్చొనియున్నాము. ఇప్పటికే మేము శత్రువు యొక్క గవునులన్నీ స్వాధీనపరచుకొనియున్నాము. అది మాకు ఇయ్యబడినది, మరియు మా చేతిలో అసలైన తాళంచెవి (master key) యున్నది. యేసుక్రీస్తు యొక్క నామము శత్రువు యొక్క ప్రతి గవినినీ మూయును (un-open). ఈ తాళంచెవి తీసుకో, యేసు నామమనే ఈ తాళం చెవి తీసుకొని, ఏ వాగ్దానానికైనా నిన్ను దూరం చేస్తూ బంధించిన శత్రువు యొక్క ప్రతి గవినినీ మూసెయ్, మరియు దేవా, ఈ ఉదయం ఈ తాళం చెవితో, యేసు నామములో, రోగులూ మరియు వ్యాధిగ్రస్తుల ద్వారములు తెరవటానికి మేము వస్తున్నాము. ఏలయనగా ఆయన వాక్యములో, “నా నామములో వారు దెయ్యములను వెళ్ళగొట్టుదురు. వారు క్రొత్త భాషలలో మాట్లాడుదురు. ఒకవేళ వారు సర్పములను పట్టుకొన్నట్లైతే, లేక విషకరమైనదేమైనా త్రాగినా, అది వారికి హానిచేయదు. వారు రోగులపై చేతులుంచినప్పుడు వారు కోలుకుందురు” అని వ్రాయబడి యున్నది. ఆ విషయములు నిజమని మేమెరుగుదుము. మరియు ప్రభువా, ఈ ఉదయం, ఈ ప్రజలు, శరీరధారియై మా మధ్య నివసించుచున్న వాక్యము యొక్క ప్రత్యక్షతను చూడగలుగుట ద్వారా, ఆయన మా అతిక్రమముల నిమిత్తము గాయపరచబడెననీ, ఆయన పొందిన గాయముల చేత మేము స్వస్థపరచబడితిమనీ గ్రహించి, వారు దానిని అంగీకరించి, ఇబ్బందుల నుంచీ స్వస్థత పొందుదురు గాక. దీనిని మేము యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

45

టెడ్డి, నీవు మౌనంగా మరియు మెల్లగా, “కేవలం నమ్ముము” అను పాటను వాయిస్తావా. మరియు ఇప్పుడు. ఏంటి? వారు ఒకటి నుంచి మొదలుపెట్టవచ్చునా? నంబర్ 1, ప్రార్థనా కార్డు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మరియు 10, లేక అక్కడ ఉన్నదేదో అది. సరే. నీవు లేవగలిగినట్లయితే, నిశ్శబ్దంగా ఇటు ప్రక్కకు రాగలవా? హూ! మనం నెంబర్ 1, నెంబర్ 2 చూద్దాం. ప్రార్ధనా కార్డు నెంబర్ 1 ఎవరి దగ్గరుంది? హు? నెంబర్ 2? సరేనయ్యా. నెంబర్ 3, నెంబర్ 1, నెంబర్ 2. ఒకటో నెంబర్ ప్రార్ధనా కార్డు ఎవరియొద్ద ఉన్నది? హు? నెంబర్ 2? సరేనయ్యా నెంబర్ 3, నెంబర్ 4 నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7, నెంబర్ 8, నెంబర్ 9, నెంబర్ 10.

వారు వచ్చి వారి స్థానాల్లో నిల్చుంటుండగా, మీలో మిగిలిన వారిని నేను ఈ ప్రశ్న అడగదల్చుకున్నాను. ఎంతమంది. ఇక్కడ రోగులైన వారిలో టేబర్నికల్ జనులెవరైనా ఉన్నారా? టేబర్నికల్ జనులు, మీ చేతిని పైకెత్తండి. దాదాపు ఐదు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది లేక తొమ్మిది చేతులు. టేబర్నికల్ వారు కాక, మా మధ్యకు క్రొత్తగా వచ్చినవారెవరైనా ఉంటే, మీరు ఆరాధన ముగిసిన తర్వాత వచ్చియుండుట వలన మీ వద్ద ప్రార్ధనా కార్డు లేకపోయినా సరే, మీ చేతిని పైకెత్తుతారా? ఈటేబర్నికల్ కి రానివారిలో, దేవుని అవసరం ఉన్నవారెవరైనా మీకు వ్యాధి ఉండి, ప్రార్ధనా కార్డు లేక, ప్రార్థనలో జ్ఞాపకం చేసికొనబడుగోరుచున్న టేబర్నికల్ సభ్యులు కానివారెవరైనా, ప్రతి వ్యక్తీ, దయచేసి మీ చేతిని పైకెత్తైదరా? సరే. అది మంచిది. సరే.

46

కొద్ది నిమిషాల పాటు మీరెంత మర్యాదగా ఉండగలరో అంత మర్యాదగా ఉండమని ఇప్పుడు నేను మిమ్మల్ని కోరుచున్నాను. ఆ తర్వాత మనం నేరుగా మొదలుపెడదాం. బిల్లీ, ఇప్పుడు నీకు అక్కడ ఎంత చోటుందో చూద్దాం? సరే, అది. నెంబర్ 10 అక్కడ ఉన్నారా? నేను ఒకటి నుంచి 10 వరకూ పిలిచాను. 11, 12, 13, 14, 15, ఇప్పుడు వారిని నిలబడనివ్వు వారి నెంబరు 10, 11, 12, 13, 14, 15, అయితే, వారిని నిలబడనివ్వు. సరే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఒకటి నుండి పదిహేను లోపు వారు దాదాపు యిద్దరు తక్కువయ్యారు. 15, 16, 17, 18, 19, 20.

ఓ, ఒక్క నిమిషం ఆగండి. టేబర్నికల్ కి చెందని వారికి మాత్రమే ప్రార్ధనా కార్డులివ్వమని నేనతడికి చెప్పాను. అది నిజం, చూశారా, ఎందుకనగా అది (చూశారా?) వివేచన యగును. “ఈ జనులు టేబర్నికల్ కి వచ్చువారు,” అని జనం అంటారు. చూడండి, నేను మీకు చెప్పుచున్నాను. ఇంతకు ముందెప్పుడు ఇక్కడికి రానివారెంత మంది? మీ చేతులు చూడనివ్వండి. ఇంతకు ముందెప్పుడూ నా కూటములలో ఒకదానికైననూ రానివారు. ఇప్పుడు, సరే, ఒక్క నిమిషం, బ్రదర్ టెడ్డీ.

47

ఇప్పుడు, నేనిది చెప్పటం మంచిది, అయినా, ఈ కూటములు ఎలా జరుగుతాయనేది మీరందరూ వినే ఉంటారు, మీరు విన్నారా? జనులందరూ కూటములకు వచ్చినవారేనా? చూడండి, మన ప్రభువైన యేసు ఈ భూమిపై ఉన్నప్పుడు, తాను స్వస్థపరచువాడనని ఆయన చెప్పుకోలేదు. నిశ్చయముగా ఆయన అబ్రాహాము యొక్క సంతతియై యుండి ఆ వాగ్దానమును తనతో కలిగియుండెను. తండ్రి చూపించేంత వరకూ తానేమీ చేయలేదని ఆయన చెప్పెను. అది నిజమేనా? “ఏమి చేయవలెనో తండ్రి నాకు చూపించువరకూ నేనేమీ చేయలేనని” ఆయన చెప్పెను. “తండ్రి నాకు చెప్పేంత వరకూ” కాదు; “తండ్రి నాకు చూపించేంత వరకూ,” పరి. యోహాను 5:19, “తండ్రి ఏది చేయుట నేను చూతునో, కుమారుడునూ దానిని ఆలాగే చేయును.”

ఇప్పుడు, ఆయన వచ్చినప్పుడు, ఆయన పరిచర్య ప్రారంభములో, ఆయన తీసుకెళ్ళబడిన తర్వాత - ఆత్మీయముగా మాట్లాడినట్లైతే ఆయన దావీదు సంతానమని మనము కనుగొనుచున్నాము - యోహాను బాప్తిస్మము యొద్ద పరిశుద్ధాత్మ ఆయన పైకి దిగివచ్చినప్పుడు ఆయన మెస్సీయా అయ్యెను. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఆయన జన్మించినప్పుడు ఆయన దేవుని కుమారుడు. ఆయన కన్యక ద్వారా జన్మించిన దేవుని కుమారుడు. కాని ఆయన మెస్సీయా ఎప్పుడయ్యెను, అది పరిశుద్ధాత్మ ఆయన మీదికి దిగి వచ్చినప్పుడే, ఎందుకనగా “మెస్సీయా” అనగా “అభిషేకించబడినవాడు,” చూశారా. ఆ పరిశుద్ధాత్మ ఆయన పైకి వచ్చినప్పుడు, ఆయన అభిషిక్తుడయ్యెను. గొర్రెపిల్ల మరియు పావురముల గురించి నేను బోధించుటను మీరు విన్నారు. తర్వాత మనము కనుగొనుచున్నాము. ఆయన నలభై రోజుల శోధన తర్వాత, బయటికి వచ్చెను.

48

మరియు ఆయన పరిచర్య ఎలా ప్రారంభమై ఎలా ముగిసినది? ఆయన పరిచర్యలో, ఆంద్రేయ అను పేరుగల ఒకడు, మృత్యుకారుడైన తన సహోదరుడగు సీమోనును కనుగోని యేసు నొద్దకు తీసికొని వచ్చెనని కనుగొనుచున్నాము. మరియు, “నీ పేరు సీమోను. నీ తండ్రి పేరు యోనా యికపై నీవు పేతురు అనబడుదువు.” దానర్ధం “చిన్న రాయి” అని యేసు అతనితో చెప్పెను. అది మీకు గుర్తుందా? మరియు యేసు తనతో చెప్పిన దానిని గూర్చి ఈ వ్యక్తి ఎంతో ఆశ్చర్యపోయెను. ఇప్పుడు, మెస్సీయా అది చేయవలసియుండెనా? అది తెలిసినవారెంతమంది, “ఆమెన్” అనండి. ఆయన ఆ దేవ - ప్రవక్తగా ఉండవల్సియున్నది. అవునయ్యా, “ప్రభువైన మీ దేవుడు నావంటి ఒక ప్రవక్తను మీ మధ్య లేపును. ఆ ప్రవక్తను విననివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడునని” మోషే చెప్పెను.

49

ఆయన ఆ తర్వాత, ఇప్పుడు మనం కనుగొనుచున్నాము. ఆయన తన సొంతవారియొద్దకు వచ్చెను. వారెవరు? స్వభావసిద్ధమైన యూదులు. మరియు తన సొంతవారు ఆయనను స్వీకరించలేదు, అందువలన అప్పుడాయన.... ఇప్పుడది అన్యజనుల యొద్దకు వెళ్ళవలసియున్నది, చూడండి, ఎందుకనగా తన సొంతవారు ఆయనను స్వీకరించలేదు. “అయితే ఆయనను స్వీకరించిన వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన శక్తిననుగ్రహించెను.” కావున ఇప్పుడాయన అన్యుల వైపు తిరిగియున్నాడు, మరియు రెండువేల సంవత్సరాలుగా అలా ఉన్నాడు. అయితే ఇప్పుడాయన చేసిన క్రియలను గమనించండి.

50

మరియు ఇది జరుగుట చూసిన తర్వాత ఫిలిప్పు వెళ్ళి నతానియేలును కనుగొని, తానెవరిని కనుగొన్నదీ, మరియు ఆయన చేసినది నతానియేలుకు చెప్పెను - మరియు అది అతడిని ఆశ్యర్యపరచెను. దానినతడు నమ్మలేకుండెను, అయితే అతడు ఆయన ఎక్కడ ఉన్నాడో కనుగొని ప్రభువైన యేసు సన్నిధిలోనికి వచ్చినప్పుడు, ఆయన యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు, యేసు, “ఇదిగో కపటము లేని ఒక ఇశ్రాయేలీయుడు,” అని చెప్పెను.

ఇప్పుడు, నీవక్కడ నిలిచియుండినట్లైతే, ఆయన ఎవరై యున్నారనేది అర్థం చేసికొనుటకు సరిపడునంత ఆధ్యాత్మికంగా నీవుండెడివాడివని నీవనుకొనుచున్నావా? నీవది చేసియుండెడివాడివని నీవనుకొంటున్నావా? ఇప్పుడు చూడండి. చూడండి, ఆ మనిషి, కేవలం ఒక అపరిచితుడు, అక్కడ అతడొక మత్స్యకారుడు కావచ్చును. ఆయన ఒక వడ్రంగి, ఆయన వడ్రంగియే. ఈ నడివయస్కుడైన వడ్రంగి అక్కడ నిలిచియుండగా, ఈ మనిషి అక్కడికి వచ్చెను. ఆయన అతడిని చూచి, ఇక్కడున్న మనుష్యులలో ఒకని వలె, “ఇదిగో, కపటము లేని ఒక ఇశ్రాయేలీయుడని చెప్పెను. సరే, అతడొక ఇశ్రాయేలీయుడని ఆయనకెలా తెలుసు? అతడి వస్త్రధారణను బట్టి కాదు, ఎందుకనగా వారంతా ఒకే విధమైన వస్త్రధారణ చేస్తారు. అతనిలో ఏ కపటము లేదు.” అతడు కపటములేని మనిషని ఆయనకెలా తెలుసు?

అందుచేత ఈ మనుష్యుని అది ఆశ్చర్యపరచినది; ఒక నిజమైన విశ్వాసిగా, “రబ్బీ,” లేక సహోదరుడా, బోధకుడా, ఉపదేశకుడా, “అసలు నీవు నన్నెప్పుడు చూశావని?” అనెను. చూడండి, అతడాయనను ప్రశ్నించుచుండెను.

“ఫిలిప్పు నిన్ను పిలవక మునుపు, నీవు ఆ చెట్టు క్రింద ఉన్నప్పుడు, నేను నిన్ను చూశాను,” అని ఆయన చెప్పెను.

“నీవు దేవుని కుమారుడవు. నీవు ఇశ్రాయేలు రాజవు” అని అతడన్నాడు.

“నేను నీకిది చెప్పినందుకు ఇప్పుడు నీవు నన్ను నమ్ముచున్నావా; ఇప్పుడు నీవు దీనికంటే గొప్ప సంగతులను చూచెదవని” యేసు చెప్పెను.

51

మరియు ఆ కారణము చేతనే సజీవ దేవుని యొక్క సంఘము దీనికంటే ఒక గొప్ప సంగతిని చూచునని నేను నమ్ముచున్నాను, త్వరలో, చూశారా, ఇది నేరుగా దానిలోనికి ప్రవేశించబోతుంది, ఎందుకనగా వారు దీనిని నమ్మియన్నారు. సంఘ శాఖల ఆటంకముల వలన దీనిని తిరస్కరించిన వారు ఇక ఎన్నడైనా దేనినైనా నమ్ముతారనేది నాకు అనుమానమే. చూశారా? నీవు వెలుగులో నైనా నడుస్తావు లేదా గ్రుడ్డివానిగానైనా ఉంటావు. కాంతి గ్రుడ్డితనము కలుగజేయును, లేక త్రోవ చూపును.

52

నేను లిబర్టీ విగ్రహం దగ్గర చిన్న పక్షులను చూశాను. (థామ్ సహోదరుడా, నీవక్కడికి వెళ్ళినప్పుడు దానిని తప్పకుండా చూడు. చూశారా), అక్కడ దానికి విరోధంగా అవి తమ బుర్రలు కొట్టుకుంటాయి. “విషయమేంటి?” అని నేనన్నాను.

“తుఫానులో వెలుగును వెంబడించి సురక్షిత స్థలానికి వెళ్ళే బదులు, అవి ఆ వెలుగును ఆర్పే ప్రయత్నం చేసి తమను తాము చంపుకుంటున్నాయని” చెప్పెను.

నీవు వెలుగుకు విరోధంగా కొట్టినప్పుడు జరిగేది అదొక్కటే, ఆధ్యాత్మికంగా నిన్ను నీవు చంపుకుంటావు. ఆయన ఆ వెలుగులో ఉన్నాడు. కనుక, కేవలం ఆ వెలుగులో నడుచుకొనుడి, అప్పుడు మనం ఒకరితో ఒకరు సహవాసం కలిగియుందుము, సంఘములన్నీ నమ్మి కొనసాగి దేవుని దీవెనలను ఆస్వాదించును. అది అద్భుతంగా ఉండదా?

53

ఆ సమరయ స్త్రీ వచ్చినప్పుడు చూడండి. ఇప్పుడు, ఆమె ఒక సమరయురాలు, యూదురాలు కాదు, సమరయురాలు. మరియు ఆయన, “నాకు దాహమునకిమ్మనెను.” మరియు ఆసంభాషణ కొనసాగినది. ఇప్పుడు ఇది క్రొత్తగా వచ్చినవారి కొరకు మరియు సంభాషణ కొనసాగినది.

ఇప్పుడు ఆయన మెస్సీయ్యా అని ఆమెకు తెలియదు. ఆయన కేవలం ఒక మనుష్యుడు, ఒక యూదుడు. ఆమె మొదట ఎలా మాట్లాడిందో చూడండి; “ఎందుకు, యూదలైన మీరు ఒక సమరయ స్త్రీతో ఇలా మాట్లాడుట ఆచారము కాదని ఆమె యనెను. మనకు ఒకరితో మరొకరికి సంబంధములు లేవని,” ఆమె చెప్పెను.

“కాని నీతో మాట్లాడుచున్నదెవరో నీవెరిగినయెడల, నీవు నన్ను దాహమునకిమ్మని యడుగుదువు, మరియు నీవిక్కడికొచ్చి చేదుకొననవసరము లేని నీళ్ళు నేను నీకిచ్చెదనని,” ఆయన చెప్పెను.

ఎందుకు, “ఇప్పుడు, ఒక్క నిమిషం” అని ఆమె అనెను. “మేము ఈ పర్వతము మీద ఆరాధింతుము, మరియు యూదులైన మీరు యెరూషలేములో ఆరాధింతురని” ఆమె చెప్పెను.

యేసు, “మీరు యెరూషలేములోనైనను, ఈ పర్వతము మీదనైనను ఆరాధించక - ఆత్మయందు ఆరాధించు ఘడియ వచ్చుచున్నది; ఏలయనగా దేవుడాత్మయైయున్నాడు, మరియు ఆయనను ఆరాధించువారు ఆత్మయందును, సత్యమందును ఆరాధించవలసియున్నదని” చెప్పెను. చూశారా.

54

సరే, ఆమె సమస్య ఎక్కడున్నదో కనుగొను వరకూ ఆయన ఆ సంభాషణను కొనసాగించెను. ఏంటి. ఆమె సమస్యేంటో మీకు తెలుసా? ఆ బావియొద్దనున్న స్త్రీ యొక్క వ్యవహారమేమిటో ఎవరికైనా తెలుసా? ఆమెకు చాలామంది భర్తలుండిరి, కాదా? కావున ఆయన, “వెళ్ళి నీ భర్తని తీసుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను.”

“నాకు యే భర్తా లేడని,” ఆమె చెప్పింది.

“అది నిజం. నీకు ఐదుగురుండిరి, మరియు ఇప్పుడు నీవు ఎవరితో అయితే జీవిస్తున్నావో అతడు నీవాడు కాడనెను.”

ఆమె అన్నది, “అయ్యా!” ఇప్పుడామెను గమనించండి. “అయ్యా, నీవొక ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను.” మీరు ఆ ప్రక్కన వ్రాసిన దానిని చదివినట్లయితే, మూల భాషలో “అయ్యా, నీవు.... నీవు ఆ ప్రవక్తవని గ్రహించుచున్నానని కనుగొనగలరు. [మీకు గుర్తుందా, బైబిల్ ”ఆ ప్రవక్త“ అంటూ ఉంటుంది?] ”నీవు ఆ ప్రవక్తవా?“ అది ఏ ప్రవక్త? ఒకరు లేచునని మోషే ఎవరి గూర్చి చెప్పెనో ఆయన, ”నీవు ఆ ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. ఇప్పుడు, మెస్సీయ్యా వచ్చినప్పుడు ఈ క్రియలు చేయునని మాకు బోధించబడినది, మరియు మేమెరుగుదుము.“ అది మెస్సీయా యొక్క సూచనగా ఉన్నది, ఆమె సమస్య ఏమిటో కనుగొనుట, అవునా? ”మెస్సీయ్యా వచ్చినప్పుడు ఈ సంగతులు మాకు చెప్పునని మేమెరుగుదుము. కాని నీవెవరవు?“ అన్నది.

“నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను,” అని ఆయన చెప్పెను.

55

ఆమె తన నీటి-కుండను విడిచిపెట్టింది. ఆమె తన గుండె పట్టుకొని, తన చేతులను ఛాతిపై పెట్టుకొని, గంతులేస్తూ, “వచ్చి, నేను చేసిన పనులు నాతో చెప్పిన ఒక మనుష్యుని చూడండి. ఆయన స్వయంగా మెస్సీయ్యా కాడా? ఒకడు వచ్చునని బైబిల్ చెప్పినది ఈయన గురించే కాదా? అతడొక యూదుడు, అక్కడ కూర్చొనియున్నాడు, కేవలం ఒక సాధారణ మనిషి, అక్కడ ఒక వడ్రంగి వలె అగుపడుచున్నాడు. కాని నేను ఐదుగురు భర్తలను కలిగియుంటినని అతడు నాతో చెప్పాడు, మరియు అది నిజమని మీకందరికీ తెలుసు. ఆయన మెస్సీయ్యా అవ్వవల్సియున్నది,” అంటూ పట్టణంలోనికి పరుగెత్తినదని నేననుకుంటున్నాను. అది నిజమేనా?

56

ఇప్పుడు, యేసు చెప్పెను, “కొద్దికాలమైన తర్వాత, కొంచెం కాల వ్యవధి తర్వాత, లోకము ఇక నన్ను చూడదు. అయినా మీరు నన్ను చూచెదరు, ఏలయనగా నేను మీ మధ్యను, మరియు మీ యందును ఉందును. మరియు నేను చేసిన క్రియలు మీరునూ చేతురు. నేనిక్కడ చేసిన వాటికంటే మీరు మరియొక్కువ చేతురు, ఎందుకనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళి పరిశుద్ధాత్మ రూపంలో తిరిగి వచ్చెదను.” ఆ బలి చెల్లించబడినది, ఆ రాజసంతతి మరణించి, ఆ రాజసంతతి తిరిగి లేచెను. ఇప్పుడు దానిని విశ్వసించుట ద్వారా సంఘము నీతీకరించబడి నిలిచియున్నది, మరియు ఆ రాజ సంతానము ఈ ప్రజలలోనికి వచ్చి వారిని సహవారసులుగా - దేవుని యొక్క కుమారులూ మరియు కుమారైలుగా చేయగలదు.

57

ఇప్పుడు, ఈ ప్రార్ధనా వరుసలో లేని మిగిలిన వారికి, ఆ ప్రజలకు కార్డులివ్వమని నేనతనికి చెప్పాను. ఈ ఉదయం నేనతడికి ఫోను చేసినప్పుడు. అతడు నాకు ఫోన్ చేసి, “నాన్నా అక్కడికెళ్ళి కొన్ని కార్డులివ్వమంటావా?” అన్నాడు.

“టేబర్నికల్ బయటివారు కనీసం పదిమంది ఉంటే,” అని నేనన్నాను.

ఇప్పుడు, కొన్నిసార్లు టేబర్నికల్ లో నేను వారిని పిలచి వారికి ప్రార్ధనా కార్డులిస్తాను. మీరు వెనక్కి వచ్చి, “సరే, అతడు వారినెరుగును, వారు టేబర్నికల్ వారు. అతడికి వారి పరిస్థితి తెలియును. నిశ్చయంగా,” అందురు.

అంతట నేను తిరిగి, “కేవలం టేబర్నికల్ బయటి వారే రండి. సరే, ప్రార్ధనా వరుసలోనికి ప్రవేశించువారు, టేబర్నికల్ వెలుపటి వారైన మీరే, అందును.

“ఓ వారిని మేమెరుగమని టేబర్నికల్ అన్నది. వారి సమస్యేమిటో మనమెరుగము. అతడు దానిని గురించి అబద్ధము చెప్పుచుండెనేమో.” చూశారా.

అప్పుడు, “ఎవరూ రావద్దు. అక్కడ కూర్చొనియున్న టేబర్నికల్ కి చెందనివారిని పరిశుద్ధాత్మయే యెంచుకొననిమ్మని,” నేనందును. అయినా మీరు అలా.....

58

దేవుని యొక్క కుమారునిగా ఉండుటకు అతడు ముందుగా ఏర్పరచబడకపోతే, ఒక మనుష్యుని దేవుని యొద్దకు తెచ్చుటకు ఏ మార్గమూ లేదు. అది చేయుటకు ఏ మార్గమూ లేదు. “నా తండ్రి అతడిని ఆకర్షిస్తేనేగాని ఏ మనిషీ నా యొద్దకు రాలేడని యేసు చెప్పెను. మరియు అదే నిజం. ఆయన చేసిన ప్రతిదానికీ, ఏదో ఒకటి విరోధముగా ఉండవలసియుండెను; మరియు ఇలా చేస్తే, ఇది వెనుకటి వలె అలా ఉండవలిసి యుండెను. చూడండి, అది కేవలం అవిశ్వాసమే అయినను జ్ఞానము దాని పిల్లలను బట్టి తీర్పు పొందును. కావున మీరు, మీరు చూడండి.

ఇప్పుడు ఇక్కడ, ఈ సమాజములోని ప్రజలకు నేనిది చెప్పుటకు ప్రయత్నించుచున్నాను. యేసుక్రీస్తు ఆ రాజ సంతానమని. అది మనము కాదు; అది ఆయన. మనము కేవలం దానికి వారసులం, కాని సమస్తమునూ మనవి.

59

సీమోను వచ్చిన ఆ దినమున మీరక్కడ నిలిచియున్నట్లైతే ఏమగును, ఆయన చేసిన మొదటి క్రియ యిదే.

మరియు ఇప్పుడు ఆయన చేసినట్లైతే ఈ ప్రజలకు అదే మొదటి క్రియ అగును; ఇంతకు ముందెన్నడూ వారు దీనిని చూడలేదు.

కాని ఒక కాగితపు ముక్కపై తన పేరున సంతకము చేయుటకు కావల్సిన విద్య కూడా లేని, చేపలుపట్టు ఒక ముసలివాడైన, సీమోను వచ్చినప్పుడు. అతడు విద్యలేనివాడు మరియు పామరుడని బైబిల్ చెపున్నది. (“మరియు” ఒక సముచ్చయము - conjunction), పామరుడూ మరియు విద్యలేనివాడు, రెండూను. మరియు, అంతట ఆయన సూచనలోనికి నడిచి వెళ్ళినప్పుడు - యేసు ఎదుట, “నీ పేరు సీమోను” అని యేసు చెప్పెను. అతడేమనుకున్నాడని మీరనుకుంటున్నారు? మీరక్కడ నిలిచియున్నట్లైతే మీరేమనుకునేవారు? “మరియు నీ తండ్రి పేరు యోనా, ఇకపై నీవు పేతురనబడుదువు.” నీవేమనుకునేవాడివి? ఆ మనుష్యుడు అతని తలంపులను చదువుచున్నాడా? సరే, మీరేమనుకున్నారు? అది మెస్సీయ్యా యొక్క సూచనయని మీరనుకొనియుందురా?

60

ఒక కాలంలో అది మెస్సీయ్యా యొక్క సూచనైతే, రెండవ కాలంలోనూ, మూడవ కాలంలోనూ, నాల్గవ కాలంలోనూ, ప్రతి కాలంలోనూ ఆలాగే అదే మెస్సీయ్యా యొక్క సూచనగా ఉండవలసియున్నది, ఎందుకనగా దేవుడు మారజాలడు. మరియు మెస్సీయ్యా దేవుడైయుండెనని ఎందరికి తెలియును? నిశ్చయంగా అది అభిషేకించబడినదైయుండెను. కావున ఆయన మారలేడు. ఆయన ఆలాగే ఉండవలసియున్నది.

ఆ కారణముచేతనే ఆయన యూదులకిచ్చిన అదే సాక్ష్యమును సమరయులకునూ ఇవ్వవలసి వచ్చెను, ఎందుకనగా మూడు జాతులుగా ఉన్న ప్రజలు, హాము, షేము మరియు యూపెతు యొక్క జనులై యున్నారు; యూదుడు, అన్యుడు, మరియు సమరయుడు.

61

ఇప్పుడు, మీరు పరిశుద్ధాత్మను గమనించారా? రాజ్యమునకు తాళం చెవులు పేతురు కలిగియుండెనని ఎందరు గమనించారు? పెంతెకోస్తు దినాన యూదుల కొరకు అతడు దానిని తెరిచాడని మీరు గమనించారా? ఫిలిప్పు వెళ్ళి సమరయులకు బోధించాడు, మరియు వారికి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమిచ్చాడు; అయితే ఇంకా పరిశుద్ధాత్మ వారి మీదికి రాలేదు; వారు పేతురు కొరకు కబురు పంపి అతని తీసుకొని రావల్సివచ్చెను, అతడు వారిపై తన చేతులుంచినప్పుడు, వారు పరిశుద్ధాత్మను పొందిరి. అది నిజమేనా? కొర్నేలి ఇంటివారు — అన్యులు దానిని పొందిరి. అప్పట్నుంచి అదంతా అంతే. ఇప్పుడామె అందరికి తెరవబడియున్నది. కనుక, అదీ సంగతి. చుడండి, అతడు దానిని తెరవవలసియుండెను. కార్యములు చేయుటకు దేవునికి పద్ధతులున్నవి.

62

ఇప్పుడు, ఈ ఉదయం, సంతతికి వాగ్దానము చేసినవాడు, మరియు సంతతి ఇక్కడ కూర్చొనియున్నట్లయితే. మీలో ప్రతి ఒక్కరూ అని నేను నమ్మగోరుచున్నాను. సంతతి ఇక్కడ కూర్చొనియున్నట్లైతే, నిశ్చయంగా ఆసంతతి వాగ్దానమును చూచును. ఇప్పుడిక్కడ నిల్చుని చేతులెత్తినవారిలో ప్రతిఒక్కరూ, ఇ౦తకు ముందెన్నడూ కూటములకు కూడా వచ్చియుండలేదు. వారు నాకు క్రొత్తవారు. వారిలో ఒక్కరిని కూడా నేనెరుగను. వారిక్కడికి రాగా, కొద్ది నిముషాల క్రితం బిల్లీ వారికి ప్రార్ధనా కార్డు ఇచ్చాడు, మరియు వారిక్కడ నిలబడియున్నారు. మీ వద్ద ప్రార్ధనా కార్డులు లేవనీ, మరియు మీరిక్కడ క్రొత్తవారిగా ఉన్నారనీ తెలుపుతూ, ఆ వెలుపట ఉన్న మీలో చాలామంది మీ చేతులనెత్తారు. దానితో దీనికేం సంబంధం లేదు. ఆ వాగ్దానానికి మీరు వారసులని మీరు నమ్మండి చాలు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థపరచబడ్డారని మీరు నమ్మండి చాలు, దానిని మీ హృదయమంతటితో నమ్మి - ఆయనను కనిపెట్టండి.

ఈ వరములో ఉన్న ఒకే ఒక్కటి మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకొనుటయే. నేనేమీ చెప్పను; చెప్పటం ఆయన వంతు. మరియు ఇది ఆయన యొక్క ప్రవచనాత్మయైతే, ప్రవక్త ఎల్లప్పుడూ “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుని” కలిగియుండెను. అది ఎల్లప్పుడూ సరియై యుండెను. మరియు సిద్దాంతపరమైన ప్రశ్నకు ఆస్కారం లేదు, ఎందుకనగా అది దేవుడైతే, అది బైబిల్ తో క్రమపడియుండవల్సియన్నది. దేవుడు ఒకానొకటి చెప్పి, తర్వాత దాని విషయమై వెనక్కి మళ్ళుట గానీ, దానిని వంకర త్రిప్పుట గానీ చేయజాలడు. అది ఎల్లవేళలా అదే విషయంగా ఉండవలసియున్నది.

63

ఇప్పుడు, అక్కడున్న నీవు, నీలో ఉన్నదానంతటితో నీవు నమ్ముచున్నావు; నీవు నమ్ము. ఇప్పుడు, ఎంత మాత్రమూ కదలోద్దు. ఇప్పుడు ప్రతిఒక్కరూ నిజంగా నిశ్చలంగా కూర్చోండి. మీరెంత నెమ్మదిగా మరియు మృదువుగా ఉండగలరో అలా. ఈ ఉదయం ఇక్కడ నిలబడిన మొదటి వ్యక్తి ఒక పురుషుడగుట తటస్థించినది. ఇప్పుడు, మనము ఈ లేఖనమును తీసికొనబోవుచున్నాము.

ఇప్పుడు నేనెక్కడ నిలబడ్డానో మీరు చూస్తున్నారా? ఎందరు దానిని అర్థం చేసికొనగలరు? నా జీవితంలో ఎన్నడూ నేను, నా కన్నులు మోపని పురుషులూ మరియు స్త్రీలు ఇక్కడ నిలబడియున్నారు. వారు కనీసం కూటమునకు కూడా ఎన్నడూ రాలేదు; మరియు వారెక్కడ నిల్చున్నారో మీరు చూస్తున్నారు. ఏమి జరగబోతుందో వారికి తెలియదు; ఏమి జరగబోతుందో నాకు తెలియదు. కాని దేవుడు దానిని వాగ్దానం చేసెను. అతడు ఇస్సాకును చంపుటకు కత్తిని బయటికి తీసినప్పుడు ఏమి జరుగనైయుండెనో అబ్రాహామునకు తెలియదు, కాని దేవుడతనికి వాగ్దానము చేసెను. అది దానిని స్థిరపరచును.

64

ఇప్పుడు, ఇక్కడ ఒక మనుష్యుడు నా యొద్ద నిలబడియున్నాడు, అతడిని నేనెన్నడూ చూడలేదు, అతని గురించి ఏమీ తెలియదు. మేము ఒకరికొకరం అపరిచితులం. మేము ఒకరినొకరు ఎరుగము. దేవుడు మా ఇద్దరినీ ఎరుగును. ఇప్పుడు, ఒక దివ్యమైన వరము చేత, కేవలం ఒక వరము చేత... ఇప్పుడు, ఆ వరములు మీయందు జన్మించును, జగత్తు పునాది వేయక మునుపు, దేవుడు ముందుగా ఏర్పరచెను. అది ఎంతమందికి తెలుసు? కావున నేను వరమును తీసికొనుట లాంటిదేమీ లేదు, దేవుడు దానిని ఎన్నుకొనెను. అంతే. నేనెన్నడూ దానిని ఎన్నుకోలేదు; ఆయన దానిని ఎన్నుకొనెను, చూశారా. పాత నిబంధనలోని ప్రవక్తలూ, మరియు వివిధ ప్రజల వలె, వారు దానిని చేయుటకు ముందుగా ఏర్పరచబడిరి, ఇది చేయుటకు.

65

ఇప్పుడు, ఈ మనుష్యుడు రోగియైతే, నేనతనిని స్వస్థపరచలేను. ఒకవేళ అతడు అవసరం కలిగియున్నట్లైతే, నేనతనికి సహాయం చేయగలనా - లేదా అనేది, అతనికి ఏమి అవసరం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అది నేను చేయగలిగిన చిన్న సహాయమేదైనా అయితే, ఏమి, నేను దానిని సంతోషంగా చేయుదును. బహుశా, అతనికి కోపం యుండివుండవచ్చు. బహుశా, అతడు క్రైస్తవుడు కూడా కాకపోవచ్చు. బహుశా అతడు క్రైస్తవుడు కావచ్చు. బహుశా అతడు వేషధారి కావచ్చు. నాకు తెలియదు. బహుశా అతడు తనను తాను ఏదో ఒకటిగా కనపరచుకొనుటకై లోనికి జారివచ్చిన రహస్య చొరబాటుదారుడై యుండవచ్చు, ఏమి జరుగుతుందో గమనించండి; కేవలం ఏమి జరుగుతుందో చుడండి, చూచారా. నాకు తెలియదు....

కాని, చూడండి, మీరిక్కడ నిలబడండి, దేవుడు ఒక వాగ్దానము చేసెననీ; మరియు దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనునని యెరిగి, అప్పుడు మీరు పరిపూర్ణంగా నిలబడగలుతారు. సరిగ్గా ఇప్పుడే ఈ జనుల మధ్య దేవుడు తన వాగ్దానము నిలబెట్టుకొనినట్టితే, ఈ వెలుపట, ఆ బయట కూర్చొనియున్న ఎంతమంది మీ హృదయమంతటితో దీనిని నమ్మబోవుచున్నారు, మీ హృదయమంతటితో దీనిని నమ్మబోవుచున్నారా? అయితే మీరు కేవలం నమ్మండి.

66

ఇప్పుడు, మనం చూద్దాం, మనమొక లేఖనమును తీసికొందాం. ఇప్పుడు సీమోను పేతురు ప్రభువైన యేసు నొద్దకు వచ్చెను. మరియు ప్రభువైన యేసు నొద్దకు వచ్చిన పిమ్మట, అతడెవరో ప్రభువైన యేసు అతడికి చెప్పెను, మరియు అతని జీవితమును గూర్చిన సంగతులను అతనికి చెప్పెను. సరే, అదే యేసు ఈ రోజు జీవించుచున్నాడు. ఆయన మృతుల నుండి లేచెనని మీరు నమ్ముచున్నారా? అది ఎల్లప్పుడూ ఉండినట్లే, మెస్సీయ్యా ఆత్మ ఈ రోజు సరిగ్గా ఆయన సంఘములో జీవించియున్నదని మీరు నమ్ముచున్నారా? సరే.

ఇప్పుడు, శ్రోతలలో ఉండి ప్రార్ధనా కార్డు లేనివారు, మీరు ఇటు వైపు చూసి, “ప్రభువా!” అని చెప్పండి. శ్రోతల యొద్ద ప్రార్థనా కార్డులు ఏలాగూ లేవు, వారిక్కడ నాయొద్ద నిలబడియున్నారు. శ్రోతలలో ఉన్న మీరు, “ప్రభువా, నన్ను తాకుము,” అనండి. ఏమి జరుగుతుందో కనుగొనండి. ఏమి జరుగుతుందో మనం చూద్దాం.

67

అయ్యా, ఇప్పుడు, మీకు సహాయము చేయుటకు లోకములో ఒక మార్గమున్నట్లైతే, అది నేను చేయుదును. చూడండి, నేను కేవలం, ఇక్కడ మేము కేవలం అపరిచితులం, మరియు నేను మొట్టమొదటిసారిగా నిన్ను ఎదుర్కొంటున్నాను. అయితే ఒక సేవకుడిగా, సత్యము చెప్పి యేసుక్రీస్తు యొక్క సాక్షిగా యుండవల్సిన బాధ్యత నాకున్నది. ఇప్పుడు, మీరు నాకు ఏమీ చెప్పవద్దని నేను కోరుచున్నాను. ఆయనను అది చేయనిచ్చి కేవలం అది నిజమా - కాదా యని మీరు నాకు బదులిచ్చిన యెడల చాలునని నేను కోరుచున్నాను. క్రీస్తులో ఉన్న దేవుడైన యేసు యొక్క శరీరము ద్వారా ఆయన చేసిన క్రియను అదే విధంగా, ఈ వేదికయొద్ద, ఈ శరీరము ద్వారా చేసినట్లైతే.... “నా యందున్న తండ్రి నాకు కనపరచువరకూ నేనేమీ చేయను. నేనేమి చేయవలెనో ఆయన నాకు చెప్పునని” యేసు చెప్పెను. కావున ఆ స్త్రీకి చెప్పినది యేసు కాదు; ఆయన యందున్న తండ్రి ఆ స్త్రీకి చెప్పెను. సీమోను పేతురు ఎవరనేది ఎరిగినది యేసు కాదు; ఆయన యందు నివసించుచున్న తండ్రి, సీమోను పేతురు ఎవరనేది ఎరిగియుండెను. అదీ సంగతి, చూశారా, అది విషయం.

68

ఇప్పుడు నేను నీకు చెప్పగలను, నీవొక క్రైస్తవుడివి, అవునయ్యా, ఎందుకనగా వెచ్చగా చలించుచున్న ఆహ్వానించు ఆత్మ నీ యొద్ద ఉన్నది. మరియు అతడొక విశ్వాసి, అతడొక క్రైస్తవుడు. నీకు కడుపులో బాధను కలుగచేయు ఒక భయము వలన నీవు బాధపడుచున్నావు. [ఆ రోగి “అది నిజము” అని చెప్పెను.] అది నిజమేనా? [“అది నిజము”] ఇప్పుడది ఖచ్చితం. అదెలా? అది నాకు ఎలా తెలియును? ఎన్నటికైనా నేను దానినెలా తెలిసికొనగలను? ముందెన్నడూ మేము ఒకరినొకరం చూసియుండలేదు. అది నిజం, కాదా? నీ గురించి వేరే ఏదైనా ఆయన నీకు చెప్పవచ్చును. నేను మీకు చెప్తాను; ఇక్కడ ఏదో ఒకటున్నది. నేను నీ ప్రక్కన ఒక స్త్రీని చూచుచున్నాను. ఆమె నీతో ఉన్నది; అది నీ భార్య, ఆమె కూడా ఒక సహాయము యొక్క అవసరము కలిగియున్నది. [“అది నిజము.”] అవునయ్యా, నీ భార్య సమస్య ఏమిటో దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముచున్నావా? [“నాకు తెలుసు, ఆయన తెలుపగలడు.”] సరేనయ్యా, ఆమెకు గుండె సమస్య ఉన్నది, సంక్లిష్టతలు. [“అవునయ్యా.”] అది నిజం, కాదా? భయం కూడా? [“అది నిజము.”] అవునయ్యా. ఇప్పుడు, నీవు ఈ పట్టణపు వాడివి కాదు; నీవు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు, ఈ మార్గము గుండా సిన్సినాటీకి వెళ్ళు, అది నిజం. నీవు ఓహైయోలోని సిన్సినాటీ నుండి వచ్చావు. [“అవునయ్యా.”] నీ పేరు మిలికెన్. తిరిగి వెళ్ళు, తిరిగి ఇంటికి వెళ్ళి స్వస్థపడు. ప్రభువు నిన్ను దీవించగా నీవు స్వస్థపరచబడుదువు. నీవునూ, నీ భార్యయూ దేవుడు నిన్ను దీవించును గాక. అయ్యా, రమ్ము నీవు నమ్ముచున్నావా? కేవలం నమ్ముము; సందేహించవద్దు.

ఇప్పుడు మర్యాదగా ఉండండి, ఇప్పుడు ప్రతిఒక్కరూ నిజంగా శ్రద్ధగా ఉండండి మాట్లాడవద్దు. చూడండి, పరిశుద్ధాత్మ ఎంతో దీనమైనది. అది ఎందరికి తెలుసు. నిజంగా చాలా సున్నితము, పరిశుద్ధాత్మ, చూశారా, ఏ చిన్న ఆటంకమైనా ఆయనను ఇబ్బంది పెట్టును.

69

డాక్టర్లు ప్రకారం, నీవిప్పుడే గుండె సమస్యతో మరణించవలసియున్నది. [“అవును.”] అది నిజం. శ్రీ. మోస్లే. [“అవును.”] నీవు షికాగో నుండి ఇక్కడికి వచ్చావు. నీ పేరు యొక్క మొదటి భాగం థియొడోర్. [“అవును.”] నీవు దేవుని నమ్ముచున్నవా? [“అవును.”] అయితే ఇంటికెళ్ళి జీవించు, మరియు యేసుక్రీస్తు నామములో చక్కబడు. దేవుడు నిన్ను దీవించును గాక.

నీవు దేవుని నమ్ముచున్నావా? [“కచ్చితముగా. అవునండి.”] నీ కాలిలో ఒక పరిస్థితి వల్ల నీవు బాధపడుచున్నావు. నీవు కూడా ఊరి బయటిదానివే. [“అవునండి.”] నీవు కెంటకీలోని ఓవెన్స్-బోరో నుండి వచ్చావు. నీ పేరు శ్రీమతి ల్యాంబ్. [“అవును.”] తిరిగి ఇంటికి వెళ్ళి చక్కబడుము.

సరిగ్గా అక్కడే కూర్చొనియున్న ఆ స్త్రీ, కూడా ఓవెన్స్-బోరో నుండి వచ్చినదే, ఆమెకు రొమ్మునందు ఇక్కడ చీము పట్టిన ఒక వాపు ఉన్నది, రేపు దానిపై శస్త్రచికిత్స జరుగవలసియున్నది. వెళ్ళు, విశ్వసించి జీవించుము.

అయ్యా, మీరు నమ్ముచున్నారా? మనమొకరికొకరం అపరిచితులం. నీ పేరు శ్రీ. గిల్మోర్, అది నిజం. నీవు ఆ గొప్ప చర్చ్-ఆఫ్-గాడ్ ఉద్యమం ఉన్న ఇండియానాలోని ఆండర్సన్ నుండి వచ్చావు. అది నిజం. పాక్షికంగా వ్యాధిగ్రస్తమైన నీ కుమార్తె కొరకు నీవిక్కడ నిలబడ్డావు. ఆమె పాక్షికంగా పక్షవాతం పాలైయ్యింది. నీవు నమ్ముచున్నావా? అయితే ఇంటికెళ్ళి నీవు నమ్మిన విధంగా ఆమెను కనుగొనుము. సరే. దేవుడు నిన్ను దీవించును గాక. విశ్వాసము కలిగియుండుము, నమ్ముము.

70

అయ్యా? నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా. నీవు ఇండియానా పోలీస్ నుండి వచ్చావు. నీవు సువార్త యొక్క పరిచారకుడవు. ఆమె నీ భార్య. ఆమె కూడా బాధపడుచున్నది. ఆమెకు అన్నవాహికలో సమస్య ఉన్నది. డాక్టరు.... గుండె సమస్య ఉన్నది, కొంచెం వణుకుతో కూడిన భయం. ఆమెకు తన యందు చెవుడు ఉన్నదని నేను చూస్తున్నాను. ఇటు రమ్ము, నీకు కృతజ్ఞతలు. ఓ చెవిటి ఆత్మా, ఈ స్త్రీ నుండి బయటికి రమ్మని సజీవ దేవుని ద్వారా, యేసుక్రీస్తు నామంలో నేను నిన్ను ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడు, నేను మాట్లాడునది నీకు మామూలుగా వినపడుచున్నదా, మీరిద్దరూ ఇ౦టికి వెళ్ళి, చక్కగా ఉండగలరు. తిరిగి మీ ఇ౦టికి వెళ్ళండి. నీవు నన్ను వినుచున్నావు, నీవు ఆరోగ్యంగా ఉన్నావు. మరియు నీవు మామూలుగా ఉంటావు.

నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా? కేవలం దేవునియందు నమ్మకముంచుము నమ్ముము.

ఆ పాత కిళ్ళ నొప్పులు మరియు అలాంటిదంతా చాలా చెడ్డ సంగతి. దేవుడు నిన్ను స్వస్థపరచునని నీవు నమ్ముచున్నావా? అయితే తిన్నగా అక్కడి నుండి క్రిందికి నడుచుకుంటూ వెళ్ళు; “ప్రియమైన యేసు ప్రభువా నీకు కృతజ్ఞతలు” అనుచూ, ఆయన నామమును స్తుతిస్తూ ఇంటికి వెళ్ళు. దానిని నేనంత తొందరగా పట్టుకోవడానికి కారణం, ఈ స్త్రీ కూడా అదే కిళ్ళ నొప్పులు కలిగియుండుట. మరియు దేవుడు నిన్ను స్వస్థపరచునని నీవు నమ్ముచున్నావా? సరేనయ్యా, అయితే, తిన్నగా అక్కడి నుండి క్రిందికి నడుచుకెళ్ళి, “ప్రభువైన యేసూ, కృతజ్ఞతలు,” అని చెప్పి ఇంటికి వెళ్ళు. సరే, సహోదరీ, అలా తిరిగి వెనక్కి వెళ్ళు మరియు నీ మోకాళ్ళ గట్టిదనం, మరియు నీ గుండె సమస్యా మొదలైనవి, కేవలం తిరిగి వెనక్కి ఇంటికి వెళ్ళుము, మరియు, “ప్రభువైన యేసూ, నీకు కృతజ్ఞతలు” అని చెప్పి బాగుపడుము. నీలో ఉన్న సమస్తముతో నమ్ముము.

71

మీరు నమ్ముచున్నారా? ఆ వెలుపటి సంగతేంటి, మీ జనంలో కొందరు, మీరు నమ్ముచున్నారా?

అక్కడ కూర్చొనియున్న నల్ల తలగల మూర్చరోగము గల చిన్న స్త్రీ, దేవుడు నిన్ను బాగుపరచునని నీవు నమ్ముచున్నావా? దానిని నీవు స్వీకరించుచున్నావా? సరే, నీవు స్వీకరించినట్లైతే, ఆయన అది చేయును.

ఇక్కడ ఒక బోధకుడు కూర్చొనియున్నాడు. దేవునితో మరింత దగ్గరగా నడవగోరుచున్నాడు, అయ్యా, నీవు కోరుట లేదా? దేవుడు నీ కొరకు అది చేయునని నీవు నమ్ముచున్నావా? నీ చేతిని పైకెత్తి, “నేను దానిని స్వీకరించుచున్నానని చెప్పు.

ఇక్కడ కూర్చొని తన చేతిని క్రిందికి విసిరిన ఈ స్త్రీ ఆమె తనకున్న ఒక ఆధ్యాత్మిక సమస్య గురించి ఆలోచిస్తున్నది. అది నిజం.

ఇక్కడొక చిన్న స్త్రీ తాను బిడ్డను కందునా లేదా అని అలోచించుచున్నది. అది నిజం. నీవు కూటములలో ఒకదానిలో ఉంటివి. మరియు బిడ్డను కందువని దేవుని ద్వారా నేను నీకు వాగ్దానము చేసితిని నేను చేయలేదా? సరే, అయితే ఇంటికి వెళ్ళి దానిని పొందుము. ఇక ఎంత మాత్రమూ దానిని గురించి చింతించవద్దు.

72

మీరందరూ మీ హృదయమంతటితో నమ్ముచున్నారా? మీలో ప్రతిఒక్కరూ నమ్ముచున్నారా? అబ్రాహాము యొక్క సంతతి గవినిని స్వాధీనపరచుకొనును, శత్రువు యొక్క గవినిని. యేసుక్రీస్తు ద్వారా మీరు అబ్రాహాము యొక్క సంతతియేనా? మీరయినట్లైతే, మీ చేతులు పైకెత్తండి. మరియు మీ చేతులు మీ పొరుగువారిపై ఉంచండి, మీ పొరుగు వారిపై, ఒకరిపై ఒకరు. ఒకరిపై ఒకరు మీ చేతులనుంచండి. ఇప్పుడు, ఆ గవినిని స్వాధీనపరచుకొనండి; అది మీది. అది మీకు చెందినది. విశ్వాసముతో కూడిన ప్రార్ధన రోగులను రక్షించును; దేవుడు వారిని పైకి లేపును. సరే, మీ సొంత పద్ధతిలో ప్రార్ధి౦చండి. మీ సంఘములో మీరు చేయునట్లుగా ప్రార్ధించండి. మీతో ఉన్న జనుల కొరకు ప్రార్ధించండి. కేవలం ఒకరిపై ఒకరు మీ చేతులను ఉంచి ప్రార్ధించండి.

73

ప్రభువైన యేసూ, ఆ రాజసంతానము యొక్క గొప్ప సర్వశక్తివంతమైన నామములో మేము వచ్చుచున్నాము, నీవు గొర్రెపిల్లను ఏర్పరచిన పర్వతము మీద అతనికి వాగ్దానము చేసిన ఆ అబ్రాహాము యొక్క సంతానము నామములో మరియు ఆ అరణ్యములో నీవు గొర్రెపిల్లనుంచితివి, ఒక మర్మయుక్తమైన సంగతి, నిన్న నీవు ఆ ఉడుతలను ఉంచినట్లుగానే. ఓ ప్రభువా, నీవు శక్తిని, ఒక విశ్వాసమును పంపించి, ప్రతి బీజముగా... అని నేను ప్రార్ధిస్తున్నాను. వారు చేయుదురని నాకు తెలుసు ప్రభువా, ఎందుకనగా “అబ్రాహాము యొక్క సంతతి” అని నీవు చెప్పావు. మరియు ఆ సంతతి కాకయే ఆ సంతతిగా నటించుచున్న వారెవరైనా ఇక్కడ ఉన్నట్లయితే, వారి ఉద్దేశ్యమును, లేక వారి నటనను క్షమించండి; మరియు సజీవ విశ్వాసముతో పరిశుద్ధాత్మ ఇప్పుడే వారి ఆత్మను మండించును గాక, పరిశుద్ధాత్మ ప్రతి హృదయములోనికీ చొచ్చుకెళ్ళి ఇక్కడున్న ప్రతిఒక్కరినీ స్వస్థపరచును గాక, వారు ఒకరిపై ఒకరు తమ చేతులనుంచారు. ఆ రాజ సంతానము చెప్పెను, “విశ్వసించువారిని ఈసూచనలు వెంబడించును. వారు రోగులపై చేతులుంచిన యెడల వారు స్వస్థత నొందుదురు.” మరియు ఆ వాగ్దానము చేసినవాడు సరిగ్గా ఇప్పుడే, తానిక్కడ ఉన్నానని కనబరుచుకొనుచూ ఉన్నాడు. మరియు తమ చేతులను ఒకరిపై ఒకరు ఉంచిన ఆ సంతతి అక్కడున్నది. “నమ్మువారిని ఈ సూచక క్రియలు వెంబడించును.” పరిశుద్ధాత్మవారి చేతుల గుండా, వారి హృదయములలోనికీ, వారి శరీరములలోనికీ దూసుకెళ్ళి దైవీక సన్నిధిలో ఉన్న ప్రతిఒక్కరినీ స్వస్థపరచును గాక. ప్రభువా, దానిని అనుగ్రహించండి. నేను ఆ అపవాదిని గద్దించుచున్నాను; అవిశ్వాసమంతటినీ నేను గద్దించుచున్నాను; ప్రతి దురాత్మనీ నేను గద్దించుచున్నాను; ప్రతి వేషధారినీ నేను గద్దించుచున్నాను; దేవుని వాక్యమునకు విరోధముగా ఉన్న ప్రతి దానినీ నేను గద్దించుచున్నాను. మరియు సరిగ్గా ఇప్పుడే విశ్వాసము ద్వారా, ప్రజల యొక్క హృదయములలో, పరిశుద్ధాత్మ తన స్థానమును తీసికొనును గాక, మరియు యేసుక్రీస్తు యొక్క నామములో, ప్రతి వ్యాధీ, ప్రతి రోగమూ, ప్రతి బాధ ఆ జనులను విడిచిపెట్టును గాక. ఆమేన్.

74

ఇప్పుడు, అబ్రాహాము సంతానమా, మీరు ఆ రాజవంశమై యున్నారు; మీరే ఆ వాగ్దానము. దేవుని యొక్క కృప మరియు సహాయము చేత, మీలో ఎంతమంది మీ చేతినెత్తి, “నేనడిగినది నేను పొందుకున్నానని చెప్పగలరు. మీకు కృతజ్ఞతలు. అంతే. వాగ్దానమున్నది అందుకొరకే. మిమ్మల్ని రక్షించిన యేసుక్రీస్తు ద్వారా మీరు సమస్తమునకూ వారసులగుట కొరకే ఆ వాగ్దానమియ్యబడినది. ఆయన నిన్ను పాపము నుండి రక్షించెను; ఆయన నిన్ను వ్యాధి నుండి రక్షించెను; ఆయన నిన్ను మరణము నుండి రక్షించెను; ఆయన నిన్ను నరకము నుండి రక్షించెను; ఆయన నిన్ను సమాధినుండి రక్షించెను.

“కాని బ్రెన్హాం సహోదరుడా, మనమందరమూ సమాధిలోనికి వెళ్ళుదుమని” నీవందువు. కాని ఆ సమాధి మనల్ని పట్టియుంచజాలదు. ఆయన కూడా దానిలోనికి వెళ్ళెను, కాని అది ఆయనను పట్టియుంచలేకపోయెను. నిశ్చయంగా అది ఆయనను పట్టియంచజాలదు.

“సరే, బ్రెన్హాం సహోదరుడా, నేను ఎంతగానో శోధించబడుచున్నాను,” ఆయన కూడా శోధించబడెను. అయితే శోధన నుండి ఆయన నిన్ను రక్షించెను.

“మమ్ములను శోధనలోనికి నడిపించక, దుష్టుని నుండి మమ్ము విడిపించుము.” ఆయన దానిని చేసియుండెను. అదంతా మీది. యేసుక్రీసు ద్వారా ప్రతీదీ మీది. ప్రతి దానినీ ఆయన మీకు ఉచితంగా ఇచ్చుచున్నాడు. దానికి ఎలాంటి చెల్లింపుగానీ మరేదీ లేదు. సరిగ్గా ఇప్పుడే అది నీది. దీనిని బట్టి నీవు సంతోషించుట లేదా? ఆయనను బట్టి నీవు ఆనందించుట లేదా? దేవునికి కృతజ్ఞతలు.

75

ఇప్పుడు, ఈ రాత్రి ఆరాధనలు ఉండును; అది ఈ రాత్రి ఏడూ-ముఫ్ఫైకి. మీకు తెలుపమని మీ కాపరి తెలియజేస్తాను. రండి, అలా వచ్చెయ్యండి. ఇప్పుడు, వచ్చే ఆదివారం ఉదయం, టేబర్నికల్ యొద్ద, లేక ఎక్కడైనా, రోగుల కొరకు ప్రార్ధించుటకు నేను తిరిగి వచ్చెదను.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...