నా నూతన పరిచర్య

నా నూతన పరిచర్య

VGR COUNT-283 సహోదరుడా, కృతజ్ఞతలు.

మిత్రులారా, శుభోదయం. మనము ఇప్పటికే నిండిపోయి యున్న ఈ టేబర్నికల్ లో, ఈ ఉదయం యిక్కడ ఉండటం కచ్చితంగా ఒక భాగ్యమే.

కాలిఫోర్నియాలోని శాన్-జోస్ లో జరుగబోవు పెద్ద కూటముకై ఎదురుచూస్తూ మేమిప్పటికే సర్దుకొని యున్నాము. ఆరాధన ముగిసిన వెంటనే మేము పశ్చిమ తీరమునకు బయలుదేరబోవుచున్నాము. ఆ తర్వాత, ప్రభువు చిత్తమైతే, క్రైస్తవ వ్యాపారులతో దాదాపు రెండు రోజులపాటు కోకోనట్ గార్డెన్స్ యొద్ద ఉంటాము. పశ్చిమ తీరమున ప్రభువునందు గొప్ప సమయముకై నిరీక్షిస్తున్నాము. సమర్పించువారిలో వారికి ఎనభై రెండు సంఘాలున్నాయి, యింకా శాన్ యోక్విన్ యొక్క రెండు సంస్థలూ, మరియు పశ్చిమ తీరంలోని లోయలన్నీ, అందువలన మేము అక్కడి ఫెయిర్-గ్రౌండ్స్ లో ఉండెదము. మీ మిత్రులెవరైనా ఆ ఆరాధనలలో కొన్నింటికి రాదలచుకుంటే, మీ మిత్రులనూ మరియు బంధువులనూ కలిసికొనుటకు మేము సంతోషించెదము.

2

మరియు మేము నిరీక్షించుచున్నాము. ఇప్పటి వరకూ నేను వెళ్ళిన ఏ కూటము కన్నా ఈ ఉదయం నాకు ఎక్కువ నిరీక్షణ వున్నది, ఎందుకంటే సరిగ్గా ఒకానొకటి జరుగబోవు తరుణము యొద్ద మనమున్నామని నేను నమ్ముచున్నాను. నేను దీని కొరకు ఎదురు చూశాను. ఇప్పుడు మనం సరిగ్గా దాని అంచున ఉన్నామని నేననుకుంటున్నాను - దేవుడు ఈ త్రోవలో తన పిల్లలను పైకి కొనిపోవుటకు సహాయం చేయనైయున్న ఒకానొకటి.

మీకు తెలుసు, “శత్రువు ప్రవాహం వలె వచ్చినప్పుడు దేవుని ఆత్మ అందుకు విరోధముగా ఒక ధ్వజమును నిలబెట్టును” అని బైబిల్ చెప్పినది. దేవుడు తన సంఘమునకు ఒక ఆశీర్వాదమునిచ్చినప్పుడు, అది లోకమునకు సాధారణమగునంత వరకూ వారు ఆ దీవెనతో కొనసాగుదురు, అప్పుడు వారు దానిని కించపరచుట మొదలు పెట్టెదరు. అప్పుడు దేవుని ఆత్మ ప్రవేశించి మరలా ఒక ధ్వజమును నిలబెట్టును, అంతట ఒక ఉజ్జీవము లేక ఒకానొకటి మొదలగును.

అయితే మన గొప్ప నిరీక్షణ యిది - ఈ దినములలో ఒకానొక రోజు దేవుని ఆత్మ యేసుక్రీస్తును తిరిగి భూమి మీదికి పంపును - అప్పుడు యిది పరిపూర్ణమగును. అది అసలైన ధ్వజముగా ఉండును.

3

ఇప్పుడు వారు గోడల చుట్టూ, మరియు భవనమందంతటా నిలబడియున్నారు. నేను నా కారు పార్క్ చేస్తున్నప్పుడు ఒక మనుష్యుని కలిశాను, అతడన్నాడు.... “నేను తాళంతో దీనిని యిక్కడ విడిచి పెడతాను; అప్పుడు నీకు కావల్సినప్పుడు నీవు దీనిని ప్రక్కకు జరుపుకొనవచ్చునని” నేనన్నాను.

“మంచిది, నేను లోపలికి వెళ్ళుటకు ప్రయత్నించితిని; నాకు నిలబడుటకు చోటు దొరకలేదని అతడు చెప్పెను.”

అయితే మన సంఘము ఒక కూటమునకు చాలా చిన్నది. కాని ఈ ఉదయం తప్పించి, ఇక్కడ ఉండుటను గూర్చి గత ఆదివారం మేము ప్రకటించితిమి, మరలా వచ్చి వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించుట, ఇంకా జరుగుచున్న వాటిని గురించి మేము యిప్పుడే చూసిన సంగతుల విషయమై మీకు సూచనలిచ్చుటకు మరియు దేవుని కృపవలన, ఈ ఉదయం దీనికి యింకా చాలా జతచేయబడినవి.

4

ఇప్పుడు ఇతరుల ఎదుట కూడ ప్రభువు యొక్క రాకడ సమీపించుటను గూర్చి త్వరలో రానైయుండుటను గూర్చి మేము బోధించియుంటిమి. మరియు అది మరింత దగ్గరపడుచున్నదని మేము నమ్ముచున్నాము. అవును, అది రోజు రోజుకి దగ్గర పడుచున్నది. కానీ మనం ఆగి, ఈ రోజుల్లో ఒకనొక రోజు దీనిని మనం ఆఖరిసారి వింటామనీ, ఆ తర్వాత ప్రభువైన యేసు వస్తారనీ ఆలోచిస్తే.

భూమి యావత్తూ చెట్లూ, ప్రకృతి యావత్తూ ప్రజలూ, సంఘమూ, సమస్తమూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ, మూలుగుచు, ఆ రోజు కొరకై నిరీక్షిస్తూ ఉన్నది. అంతట తన వేదన ముగియునని ప్రకృతికి తెలుసు. అంతట తమ వేదన ముగియునని జనములకు తెలుసు. మరణము దాని ఆఖరి పట్టు కోల్పోవును, సమాధియూ పాతాళము విజమునందు మ్రింగివేయబడును.

5

సెలర్స్-బర్గ్ నుండి వచ్చి, పాడి, సంగీతం వాయించిన ఈ చిన్న కాపరిని కలిసికొనుటను బట్టి ఈ ఉదయం నేనెంతో సంతోషించాను. అక్కడ కొనసాగుచున్న ఉజ్జీవమును గూర్చి సహోదరులలో ఒకరు చెప్పుచుండిరి. ఇప్పటికే దానిని ప్రకటించుట, మొదలయినవన్నీ వారు చేసియుందురని నేనూహించుచున్నాను. అది చాలా మంచిది. దేవుని రాజ్యము కొరకు వారక్కడ చేయు ప్రతి ప్రయత్నములోనూ ప్రభువు వారిని దీవించవలెననునది నా యధార్థమైన ప్రార్థన.

6

ఇప్పుడు, ప్రభువు యొక్క వాక్యము మనకు అత్యంత విలువైనది. అది మనకు తెలుసు. అందువలన, ఈ రోజు, ప్రభువు యొక్క రాకడకు మనమెంతో సమీపముగా నున్నామని నేను నమ్ముచున్నాను, మరియు రంగములు ఎంతో అవసరముతో యున్నవి...

ఇప్పుడే నేను కొందరు సహోదరులతో మాట్లాడుచుంటిని. ఇప్పుడు నా పరిచర్యలో అధికభాగము విదేశములలో నియమింపబడునని నేను నమ్ముచున్నాను. సరిగ్గా క్రిస్మస్ తర్వాత మేము ఆఫ్రికాను గూర్చి ప్రణాళిక వేయుచున్నాము, అలాగే ఆస్ట్రేలియా మరియు అనేక యితర ప్రదేశములు కూడా, ఇప్పుడు ప్రభువు కదిలి మా కొరకు మార్గములు తెరచుచున్నాడు. చాలా కాలముగా ప్రపంచవ్యాప్తంగా మాకు ఆహ్వానములు వచ్చినవి. మీరందరూ మా కొరకు ప్రార్ధించినట్లయితే, సరిగ్గా క్రిస్మస్ ముగిసిన వెంటనే మేము వాటిని తీసికొనగలము.

7

ఇక్కడ యిప్పుడు నా యెదుట దేవుని యొక్క వాక్యము తెరువబడి యున్నది. ఇప్పుడు నేను కాగితములను మరలా తెరిచాను, ఏలయనగా భౌతికముగానూ మరియు దేవుని సహాయము చేతనూ నేను దానిని చేయగలను - ఈ బైబిల్ని తెరువగలను. కాని ఆ విషయములను తెరచుటకు నేను సమర్ధుడను కాను. అది చేయగల్గిన వాడొక్కడే; ఆయన దేవుడు మాత్రమే. పరిశుదాత్మ ద్వారా వ్రాసినవాడు ఆయన మాత్రమే మరియు ఆయన మాత్రమే మనకు పరిశుద్ద గ్రంథమును తెరువగలడు. మరియు దానిని మనం చదువుచుండగా - ఆయన మన హృదయములను తెరచి దీనిని మనకు తెలియజేయునని నేను నమ్ముచున్నాను.

ఈ ఉదయం నేను చాలా క్లుప్తంగా యుండెదను. మొదట, నేను మాట యిచ్చినట్టుగా, గత కొన్ని రోజులుగా నా పరిచర్య యొక్క మార్పు విషయమై జరిగిన సంగతులను నేను మీకు చెప్పెదను. ఆ తర్వాత నాకొక సంక్షిప్తమైన పాఠమున్నది. తర్వాత మనము రోగుల కొరకు ప్రార్థించెదము. మరియు బాప్తిస్మమున్నదని నేను నమ్ముచున్నాను, ఎందుకంటే తొట్టి నింపబడియుండుట నేను చూశాను.

అయితే మనము ముందుకు వెళ్ళెముందు, యిప్పుడొక క్షణం ప్రార్థన నిమిత్తమై మన తలలు వంచెదము. ఇక్కడ మీకు దేవుడవసరమగును అని, స్పృహ ఉన్నవారిలో ఎందరు తమ చేతులను దేవుని తట్టు ఎత్తేదరోయని నేననుకుంటున్నాను, మరియు అలాగు చేయుట యందు, “ప్రభువా, నన్ను జ్ఞాపకము చేసికొనుము. నాకు ఫలాని-ఫలాని అవసరమున్నదని” చెప్పువారు.

8

మనం ప్రార్ధన చేసుకుందాం. ఓ ప్రభువా, దేవుని యొక్క సన్నిధిలోనికి నిశ్శబ్దంగా రావలసియున్నదని మేము గ్రహించుచున్నాము, నిశ్శబ్దంగా, “ఏలయనగా దేవుని యొద్దకు వచ్చువాడు, ఆయన ఉన్నాడనియూ, తనను శ్రద్ధగా వెదకు వారికి ప్రతిఫలమిచ్చువాడనియు నమ్మవలెను.” ఓ, దేవా, ఆత్మ యొక్క నిశ్శబ్దంలో మేము మీ సింహాసనము యొద్దకు వచ్చుచున్నాము.

మరియు మీ ముందు మా హృదయములను మేము ఎత్తుచున్నాము. మరియు ప్రభువా, వాటిని వెదకండి“ అని పలుకుచున్నాము. మా యందు అపవిత్రమైనదేదైననూ ఉన్న యెడల, ప్రభువా, తూర్పు నుండి పడమర అంత దూరంగా దానిని తొలిగించుము. ఇంకా మా హృదయములలో అతిక్రమమేమైన ఉన్నయెడల, మా ప్రార్థనలకు జవాబు దొరకకుండా ఆటంకపరచునదేదైన, ప్రభువైన యేసు రక్తము మా ఆత్మ నుండియూ మరియు మా హృదమునుండియూ ప్రతి మరకనూ తొలగించనియ్యమని మేము ప్రార్ధిస్తున్నాము. ఏలయనగా ”నా హృదయములో నేను అతిక్రమమును ఉంచుకున్నయెడల, ప్రభువు నా మనవి ఆలకింపడుయని“ వ్రాయబడియున్నది.

మరియు చేతులు పైకి లేవగా నీవు చూచితివి, మా భౌతికమైన కన్నులకు అవి వారి హృదయముల అవసరములకు ప్రాతినిధ్యము వహించినవి. ఓ ప్రభువా, నీవు వాటిలో ప్రతి ఒక్కదానికీ బదులిచ్చెదవని మేము ప్రార్ధిస్తున్నాము. అవసరతలో ఉన్నవారు అనేకులున్నారు.

9

ఇంకా ఈ ఉదయం, జనుల ఈ సమాజము నెదుట మీరు ఈ సాన్-జోస్ కూటమును జ్ఞాపకము చేసికొనవలెనని నేనుకోరుచున్నాను. ప్రయాణము చేయవలసియున్న వందల మైళ్ళు, మంచు బిందువులునూ, మంచునూ మా ఎదుటనున్నవి. ఓ ప్రభువా, మాకు సహాయము చేయుము. అయితే ప్రభువా, మాయందున్న దానంతటితో నీ జనులకు సహాయము చేయుటకునూ, తప్పిపోయిన వారు నిన్ను తమ రక్షకునిగా కనుగొన సహాయము చేయుటకునూ, బలహీనులకూ మరియు గ్రుడ్డివారికి సహాయము చేయుటకునూ, మమ్ములను వెంబడించు యితరులకు మార్గము సరాళము చేయుటకునూ, ప్రభువు యొక్క నామములో మేమక్కడికి వెళ్ళుచున్నాము.

మా చిన్న సంఘమునూ మరియు దాని కాపరి, మా సహోదరుడు నెవిల్ ను, ధర్మకర్తలందరినీ, పెద్దలనూ, సామాన్యులందరినీ, ఉపదేశకులందరినీ, సంబంధమున్న వారినందరినీ దీవించండి. అది మాత్రమే కాదు గాని, యిక్కడ ప్రాతినిధ్యము వహించబడిన సంఘములన్నిటినీ , సెలర్స్-బర్గ్ లో నిలబడిన ఆ యవ్వనుల నిమిత్తము ప్రభువా, మీరు మీ చేతిని చాపమని, మేమడుగుచున్నాము ప్రభువా, సెలర్స్-బర్గ్ లో సజీవ దేవుని యొక్క బలమైన ఒక సంఘమును నీవు లేపుదువు గాక. ప్రభువా, దీనిననుగ్రహించుము.

10

వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుము, గ్రుడ్డివారికి చూపునిమ్ము, బలహినులకు శక్తినిమ్ము, అవసరమైన వారికి రక్షణనిమ్ము. ఈ ఉదయం మేము మీ వాక్యమును చదువుచుండగా, పరిశద్ధాత్మ వచ్చి వాక్యమునందు ప్రవేశించి మా హృదయములకు అది సజీవమును దయ చేయును గాక. బాప్తిస్మము పొందవలసియున్న వారిని దీవించుము. నీటిలో నుండి వారు లేచినప్పుడు, వారు పరిశుద్ధాత్మను పొంది దేవుని మహిమపరతురు గాక. ప్రభువా, నీవే మహిమ పొందుము.

మా ఆత్మలనూ, మా ఆలోచనలనూ, శుద్ధిచేసికొనుటకై ఈ ఉదయం మేము కూడుకొనియుండగా, మునుపెన్నడైనా ఉన్నదానికంటే ఎక్కువ సంకల్పంతో మిమ్మును సేవించుటకు, ఈ ఉదయం మేము టేబర్నికల్ నుండి బయటకు వెళ్ళుదుము గాక. లక్షలమంది “హోసన్నా హోసన్నా!” యని పాడుచుండు మహిమనందు మీ గృహమునొద్ద మీ సింహాసనము చుట్టూ చేరి మేము కలిసికొనువరకూ, మేము కలిసికట్టుగా, దగ్గరగా అల్లుకొని పరిశుద్ధాత్మ చేత కట్టబడి జీవించుదుము గాక. ఒక్కరూ తప్పిపోకుండా మేమందరమూ అక్కడ ఉందుము గాక. ప్రభువా, దానిని అనుగ్రహించుము. ఆ సమయము వరకూ మమ్ములను మీ ఆత్మచేత నింపి, మిమ్ము సేవించుచూ ఆరోగ్యముగానూ సంతోషముగానూ ఉంచుము. యేసుక్రీస్తు నామములో మేము ఈ సంగతులను అడుగుచున్నాము. ఆమేన్.

11

ఇప్పుడు మనం పరిశుద్ధ మార్కు గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రారంభించి చదువుచుండగా, ప్రభువు తన దీవెనలను జత చేయును గాక. ఆ తర్వాత, నేను మన పాఠంలోనికి వెళ్ళెదను. ఇది నేను మీకు చెప్పదల్చుకున్న దాని నిమిత్తమై చదువుట.

అంతట వారు వచ్చినప్పుడు....

నన్ను మన్నించండి; సమయం ఆదా చేయటకై నేను 10వ వచనం యొద్ద ప్రారంభించగోరుచున్నాను, 11వ అధ్యాయం యొక్క 10వ వచనం.

వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడు గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.

ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి, చుట్టూ సమస్తమును చూచి, సాయంకాలమైనందున పండ్రెండు మందితో కూడ బేతనియనుండి వెళ్ళెను.

మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని.

ఆకులుగల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, దాని మీద ఏమైనను దొరకునేమో అని వఛ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా, ఆకులు తప్ప మరేమియు కనబడలేదు; ఏలయనగా అది అంజూరపు పండ్లకాలము కాదు.

అందుకాయన - ఇకమీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి.

వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి, దేవాలయములో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్లగొట్టనారంభించి, రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మవారి పీటలను పడద్రోసి!

దేవాలయము గుండ ఏ పాత్రయైనను ఎవనిని తేనియ్యకుండెను.

మరియు ఆయన బోధించుచు - నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను.

శాస్త్రులును ప్రధానయాజకులును ఆ మాట విని, జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి, ఆయనకు భయపడి, ఆయన నేలాగు సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి.

సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరెను.

ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా, ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలు కొని ఎండియుండుట చూచిరి.

అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని - బోధకుడా, యిదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయెనని ఆయనతో చెప్పెను.

అందుకు యేసు వారితో ఇట్లనెను - మీరు దేవుని యందు విశ్వాసముంచుడి.

ఎవడైనను ఈ కొండను చూచి - నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి, తన మనస్సులో సందేహింపక - తాను చెప్పినది జరుగునని నమ్మినయొడల, వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను.

12

ఎంతటి దయగల వాగ్దానము. మరియు అది కచ్చితంగా నిజం. ఇది నన్ను ఆశ్చర్యపరచినది, లేక నేను దానిని చెప్పవలసినట్లుగా, చాలాకాలం పాటు అది నన్ను ఆశ్చర్యపరచినది. “అది ఎలా కాగలదు?”

ఒక సారి, చాలా సంవత్సరాల క్రితం, నేను ఈ టేబర్నికల్ యొద్ద భోదించడం ప్రారంభించిన మొదటిలో, నేను “పాతాళము” అనే మాట చూశాను. నేను చాలా సార్లు దాని ప్రస్తావనకై వెదికాను, అది గ్రీకులో నరకంగా (hades) ప్రస్తావించబడింది, “సమాధి” యని దాని కర్థము. ఏమి చెప్పవలెనో నాకు తెలియలేదు, ఎందుకంటే తీర్పు దినమున నేను మనుష్యుల ఆత్మల విషయమై బాధ్యుడను కాగోరుట లేదు. అందువలన సత్యమేమిటో కనుగొనువరకూ నేను దానిని వెదికితిని. నేను దానిని గురించి సత్యమును తెలిసికొను వరకూ, దాదాపు నాలుగైదు సంవత్సరాల పాటు నేను “పాతాళము” అను అంశమును ముట్టలేదు.

13

ఆ తర్వాత ఈ లేఖనం నన్ను అంతకంటే ఎక్కువగా ఆశ్చర్యపరిచింది, ఎందుకంటే యిది చాలా అద్భుతమైనది, వేరెవ్వరూ గాక యేసుక్రీస్తే అలాంటి వాగ్దానము చేయుట. ఆయన తన శిష్యులతో, “మీరేమి చెప్పినా మీరు పొందగలరు. మీరు ఈ పర్వతముతో పెల్లగించబడి సముద్రములోనికి తొలగించబడుము” అని మీ హృదయంలో సందేహింపక, మీరు చెప్పినది జరుగునని నమ్మిన యెడల, మీరు చెప్పినది మీరు పొందగలరు“ అని చెప్పెను.

ఓ, మనము ఆ మాటలను జాగ్రత్తగా గమనించినట్లయితే: “మీరేమి అనెదరో దానిని మీరు పొందగలరు,” నేనేమి చెప్పెదనో కాదు, “కాని నీవు ఏమి చెప్పితివో, నీవు చెప్పిన దానిని నీవు పొందగలవు.”

ఏళ్ళ తరబడి నేను దానిని గురించి ఆలోచించితిని. నేను ప్రతి నిఘంటువునూ, వ్యాఖ్యానమునూ, తర్జుమానూ, ఆఖరికి డూయే ముద్రణను కూడా వెదికితిని. ప్రతి తర్జుమాదారుడూ దానినిలాగే తర్జుమా చేసెను - “నీవేమి చెప్పుదువో దానిని నీవు పొందగలవు.”

అందువలన, అది లేఖనముతో వ్రాయబడినదా లేదా యని నాకు తెలియును. నాకు లేఖనమంతా సత్యమే. నేను దానిని సరిగా విభజించలేక పోయినప్పటికీ, అయిన అది సత్యమే.

14

అందువలన, కొన్ని సార్లు మనము సంగతులను చూడదగిన సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆ సంగతులను దేవుడు మనలను చూడనిచ్చునని నేను నమ్ముచున్నాను. ఆయన ఈ దీవెనలను పట్టియుంచును. ఈనాడు మనం ఆస్వాదిస్తున్న దీవెనల వలె - మన పితరులు వాటిని ఆస్వాదించలేదు. అది వారికి రుతువు కాదు.

15

నేను ప్రార్థన చేసుకుంటున్న ఆ మిల్లు యొద్ద నుండి ఇదే బల్ల యొద్దకు నేను తిరిగి వచ్చిన ఆ రాత్రి పరిశుద్ధాత్మ, నేను జ్ఞాపకం చేసుకోగలను. “కుంటివారు నడిచెదరు, గ్రుడ్డివారు చూచెదరు, రాజులూ మరియు ప్రధానులూ ప్రార్ధనకై పిలిచెదరు. అది సహోదరుల మధ్య ఒక ఉజ్జీవమును మొదలు పెట్టును, ప్రభువు యొక్క రాకడకు ముందు అది ప్రపంచమంతటినీ చుట్టు” నని తన ఆత్మ చేత, ప్రపంచమంతటి కొరకూ ఆయన నాకు ఆజ్ఞనిచ్చెనని యిక్కడ కూర్చొనియున్నవారిలో అనేక జనులకు చెప్పితిని.

దానిని నమ్ముట కష్టముగా యుండెను. దానిని నమ్ముట నాకు కష్టముగా యుండెను. కాని జరిగినది అదే. ఇది అదే క్రియను చేసినది. ఈ రోజు ప్రపంచమంతటా పరిశుద్ధాత్మ జ్వాలలు మండునంత మట్టుకు. ఇండియా, ఆఫ్రికా, ఆసియా, ఐరోపా అంతటా, ప్రతిచోటా పునరుత్తానుడైన క్రీస్తు యొక్క శక్తి యొక్క ఉజ్జీవము చేత, ఆత్మ చేత నింపబడిన పరిశుద్ధాత్మ జనులు లోకమును మండించుచున్నారు - కుంటివారు నడుచుచున్నారు, గ్రుడ్డివారు చూచుచున్నారు, చెవిటి వారు వింటున్నారు, మూగవారు మాట్లాడుచున్నారు. దేవుడు దీనిని వాగ్దానము చేసెను గనుక అన్ని రకముల ఆశ్చర్యకరమైన అద్భుతములు జరుగుచున్నవి. మరియు దేవుని యొక్క వాగ్దానము సత్యమై యున్నది.

16

వీటిని గురించి నేను ఆలోచించుట మొదలు పెట్టినప్పుడు, నాతో మాట్లాడుచున్న వానితో అడుగకుండా ఉండలేను. నాకు కొదువగా ఉండెను.

ఏదో చిన్న పట్టించుకోని, నిరక్షరాస్యుడైన వ్యక్తిని దేవుడు తీసికొనవలసి యుండెనని నేననుకుంటున్నాను, ఎందుకంటే దానియందు, ఆయన, దేవుడు ఏమి కాని దానినే, బయటకు విసిరివేయబడిన దానిని తీసుకోనును... దేవుని ప్రజలను నేనలా పేమించునట్లు చేయునదదే. వీరిని వారు పరిశుద్ధ గుండ్రాళ్ళు లేదా అనుచితమయినవారిగా వెలివేయుదురు. అయితే అప్పుడే దేవుడు వారిని పైకెత్తి వారితో ఒకానొకటి చేయును. ఆయనకు అది యిష్టము. అదే ఆయన దేవుడని చూపించును: ఏమి కాని దానిని తీసికొని దాని నుండి ఒకానొకటి చేయును. నా వంటి ఒక పాపిని తీసుకొని ఒక క్రైస్తవునిగా చేయును. దేవుడు యొక్క హస్తము!

17

సామర్థ్యమును గురించి నేనాయనను పశ్నించితిని. నేను రోగుల కొరకు ప్రార్థించవలసియున్నదని ఆయన నాకు చెప్పెను. మరియు ఆజ్ఞ ఏదనగా: జనులు నమ్మనట్లుగా యధార్థముగా యుండుము, అంతట ప్రార్ధన యెదుట ఏమియు నిలువజాలదు. ఇక్కడున్న మీలో అనేకులకు అది జ్ఞాపకముండును. ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యములో అది ముద్రించబడినది.

“నాకు చదువు లేక యుండగా నేను దానినెలా చేయగలను?” అని నేనడిగాను. “మోషేకివ్వబడినట్లుగా నీకు రెండు సూచనలివ్వబడును. వాటిలో ఒకటి మోషే చేతి సంబంధమైన దాని వలె యుండును - ఆయన దానిని కుష్టము నుండి స్వస్థతనకు మార్చెను” అని ఆయన చెప్పెను. నా చేతిని ప్రజల మీద ఉంచుట వలన కూడా అదే జరిగినది. ఆ తర్వాత అది తనను తానే ఎలా బయలుపరచుకొనెనో, అంతట, “నీవు వారి హృదయ రహస్యములను తెలిసికొందువని” ఆయన చెప్పెను.

అప్పుడు నేను, “అందుకే నేనిక్కడ వున్నానని చెప్పితిని.”

ఆయన చెప్పిన.... అంతట, ఆయన నాకు లేఖనములను వివరించెను, ఓ, అప్పటి నుండి బైబిల్ నాకు ఒక క్రొత్త పుస్తకమైనది. దానిని నేను భిన్నముగా చూచితిని, భిన్నముగా దర్శించితిని. ఒకటి జరిగినది.

ఆ పై, కొంత కాలం తర్వాత, “నీవు యధార్థముగా వుండి, దీనుడవైయుండి, ధనమూ మొదలగువాటికి దూరంగా వుంటే, అంతట అది నిన్ను దీవించుచూనే యుండును, మరియు నీవు పైకి ఎక్కుచూయుందువని” ఆయన చెప్పెను.

18

పెద్ద బిరుదులు తెచ్చుకొను, అలాంటి గొప్ప పదవులలోనికి వెళ్ళు మనుష్యులను మనమెన్నోసార్లు చూస్తాము, కాని కొన్ని సార్లు, ఎతైనదియని దేవుడు పిలుచునది దానిని కాదు. యోహాను బోధిస్తూ వచ్చినప్పటి సంగతి మీకు గుర్తుందా? “ప్రతి పర్వతమూ అణచవలెను, మరియు ప్రతి లోయ ఎత్తు చేయవలెనునని” బైబిల్ ముందుగా చెప్పెను, చూశారా. అది వచ్చినప్పుడు, పరలోకము నుండి అగ్ని రథములతో అది వచ్చునని మీరనుకొందురు. కాని, ఒక గొర్రె చర్మములో చుట్టబడిన దీన నరుడు యోర్దాను తీరమున బోధించుట గాక, అది మరేమిటి? కనీసం ఒక సంఘంలో కూడా కాదు, ఆ మురికి తీరముల యొద్ద. కాని దేవుడు దానిని “గొప్పది” అని పిలిచెను.

యేసు తన శిష్యులతో దానిని చెప్పినప్పుడు - “ఒక స్త్రీకి జన్మించిన వానిలో బాప్తిస్మమిచ్చు యోహానంతటి గొప్పవాడు ఒక్కడూ లేడు. మీరు రాజులనందరినీ, ప్రవక్తయగు దావీదునూ, యింకా సొలోమోను యందున్న అతని ఘనత అంతయూ తీసికొనుడి; అవి యోహానును కనీసం తాకలేదు. అయినప్పటికీ, తన తల వాల్చుకొనుటకు అతనికి స్థలము లేకపోయెను.

కావున, దేవుని దృష్టియందు గొప్పవాడవగుటకు ఈ లోకము నందు నీవు ధనవంతుడవూ, బలవంతుడవూ కానవసరం లేదు. నీవు నీ హృదయంలో దీనుడవుగా ఉండాలి, అంతే. మరియు దేవుడు దానిని “గొప్పతనం” అనును; ఆయన తననుతాను తగ్గించుకొన గలిగినంత గొప్పవాడు. ప్రతి విషయమునకూ నిందను స్వీకరించి తననుతాను తగ్గించుకొనువాడు ఒక గొప్ప వ్యక్తి. అది గొప్పతనం.

19

దేవుడు చెప్పినది ఇదే యని అంతట మనము కనుగొందుము. అంతట అది మొట్ట మొదటి సారి యిక్కడ ఈ ప్రసంగపీఠము యొద్ద నుండి ప్రకటించబడింది. అది ఏమి చేయునని అది చెప్పెనో సరిగ్గా అది దానినే చేసెను.

అప్పుడు పెంతుకొస్తు సంఘము వచ్చినది, ఉజ్జీవమును పట్టుకొనినది. మరియు యిప్పుడు ప్రపంచమంతటిలో వేగంగా ఎదుగుచున్న సంఘము పెంతెకొస్తు సంఘమే, గత ఏడాది, వారు, పదిహేను లక్షల మంది మారినట్లుగా నమోదయినది - అది సంఘ శాఖల వెలుపట వున్న మనలను లెక్కించకుండా, మిగిలిన ప్రొటస్టెంటు నుంచి మారిన వారినందరినీ మరియు క్యాథలిక్కు నుండి మారిన వారినందరినీ లెక్కించినది. ప్రపంచమందంతటా క్యాథలిక్కునకు మారిన వారు నాలుగు-లక్షల-డెబ్బై-అయిదువేలు లేక దాని దరిదాపులో ఒక సంఖ్య మాత్రమేనని నేను నమ్ముచున్నాను. కాని పెంతుకొస్తు పదిహేను లక్షలకు వెళ్ళినది. దేవుడు తన సంఘమును సిద్ధపరచుచున్నాడు.

విద్యలేని, తక్కువ స్థాయి మనుష్యులు, ఆత్మ యొక్క అభిషేకం యొక్క శక్తిలో, ఏ విద్యయూ మరేదియూ లేకనే వెళ్ళి, క్రీస్తు యొక్క వెదక సాధ్యము కాని సమృద్ధిని ప్రకటించుచున్నారు. దేవుని దృష్టిలో అదే గొప్పది.

20

ఈ సంగతులన్నీ మండించుచున్నవనీ పరిశుద్ధాత్మ ఆయన మాటకు కట్టుబడియున్నాడని మనము గమనించుచున్నాము. దాదాపు ఐదేళ్ళ పాటు చేతితో జనులను తీసికొనిన తర్వాత, రాణి పట్టణములైన కెనడాలోని రెజీనాలో, ఒక రాత్రి, ఒక మనిషి వేదిక పైకి నడిచి వచ్చాడు - అంతట, ఆత్మ ఎదుట అతని జీవితము ఎంతగా తెరువబడవచ్చునో అంతగా తెరువబడినది. ఆయన వాగ్దానము చేసినట్లుగా అక్కడ వివేచన యుండినది.

అది ప్రపంచమంతటా జరిగినది. అది ప్రపంచమంతటికీ తెలియనంతంగా, దాదాపు ప్రపంచమంతటియందూ, అనేకనేక భాషలలో అది ముద్రించబడినది. అంతట శత్రువు లోపలికి వచ్చి దానిని ఎగతాళి చేస్తూ, “అది ఆలోచనలను చదువుట” అనెను. అంతట దానికి అనుకరణలు వచ్చి అలాంటి ఇతరములన్నీ వచ్చెను. కాని దానంతటి మధ్యన దేవుడు, నేరుగా అలాగే కొనసాగెను. దేవుడు తన విధేయ వాగ్దానమునకు కట్టుబడి యుండెను. ప్రతిసారి ఆయన అలా వుండును.

21

ఆ తర్వాత ఒక రోజున, కొందరు మనుష్యులతో - వుడ్స్ మరియు అతని సోదరునితో - ఆడెల్ హాలో యొద్ద నేను చేపల వేటకు వెళ్ళియుంటిని. వారు యెహోవా సాక్షులైయుండి, అంతకు ముందే మారుమనస్సు పొంది విశ్వాసములోనికి బాప్తిస్మము పొందితిరి. ఆ తీరమున మేము చేపలు పట్టుచుండగా.... చాలా సార్లు ఈ కథను నేను మీకు చెప్పియుంటిని.

ఇప్పుడు మన ధర్మకర్తలలో ఒకరైన శ్రీ. వుడ్ - బ్యాంక్స్ వుడ్ - తమకు యింటిలో చేసిన రొట్టె ముక్కలనూ మరియు వెన్ననూ తినిపించుచుండిన ఒక వృద్ద సహోదరి గూర్చి చెప్పెను. ఆమె చర్చ్-ఆఫ్-గాడ్ కు చెందినది. “లైల్, మనము వెళ్ళి మనము రక్షించబడితిమని ఆమెకు చెప్పవలసియున్నదని,” తన సోదరునితో చెప్పెను.

మీకు తెలుసు, మనం చెప్పగలిగిన సంగతులలో కొన్ని మాత్రమే పరిశుద్ధాత్మకు నచ్చును. మనము దానిని చెప్పినప్పుడు కొన్ని సంగతులు మాత్రమే ఆయనను సరిగ్గా మెప్పించెను.

“మీరేమి అంటున్నారో” మీరు గమనించాలని నేను కోరుచున్నాను. ఏమి అనవలెనో మనం సరిగ్గా కనుగొనగలిగినట్లయితే! మీ మాటలు మీకు తీర్పు తీర్చును, మీ మాటలు మిమ్మును ఖండించును, లేక మీ మాటలు మిమ్మును దీవించును.

22

మరియు, ఆ సృహ లేకయే, బ్యాంక్స్ సరియైన మాటను అని యుండి యుండవచ్చు. అతడు అది అనిన వెంటనే... మా దగ్గరున్న ఎర అయిపోవటం వల్ల గాలానికి ఎర తగిలించాలని ఒక ఫ్లైలైన్ (కీటకము వలె భ్రమపరచు ముల్లును కలిగి యుండు ఒక గాలము)తో బూగిల్ చేప కొరకై వేటాడుతూ నేను పడవ వెనుక వైపు కూర్చోని యుంటిని. ఈ చిన్న చేపలను పట్టుకొని ట్రోట్ లైన్ (పెద్ద చేపలను పట్టు గాలము) కొరకై వాటిని బకెట్లో పెట్టుచుంటిని. మరియు బ్యాంక్స్ ఆ మాట చెప్పినప్పుడు, అకస్మాత్తుగా నన్నేదో తాకినది. అతడు సరియైన మాట చెప్పెను. అంతట పరిశుద్ధాత్మ పలికి, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,” రాబోవు కొన్ని గంటలలో ఒక చిన్న జంతువు యొక్క పునరుత్తానము జరుగును, మీరు దానిని కనుగొందురని“ చెప్పెను.

అది మేము బయలుదేరక ముందు, నా చిన్నబ్బాయి గట్టిగా పిసికి, దాని ఊపిరి పోగొట్టి నేల మీద పడేసిన ఒక పిల్లి పిల్ల యగునని నేననుకొంటిని. అది అదే యగునని నేననుకొంటిని.

కాని తర్వాత ఉదయం మేము పడవలో కూర్చోనియుండగా, మాకు ఆశ్చర్యము కలుగునట్లుగా... బ్యాంక్స్ యిక్కడ వున్నాడని నాకు తెలుసు. లైల్ కూడా. బ్యాంక్స్, లైల్ యిక్కడ వున్నారా? లేదా, లైల్ నీవిక్కడుంటే నీ చేతిని పైకెత్తు, అతడు వచ్చును, ఎల్లప్పుడు అతడు మాతోనే యుండును.

23

అతడు ఒక పొడవైన గాలపు ముల్లుతో ఒక చేపను పట్టుకొనెను. అతడొక చిన్ని బూగిల్ చేపను పట్టెను. అది గాలపు ముల్లునంతటినీ మ్రింగివేసెను. అంతట అతడు ఆ చిన్న చేపను చేతితో పట్టుకున్నాడు. ఆ గాలమును దాని నోటినుండి బయటకి లాగుటకు బదులు - అది ఎంతో లోతుకు దిగియుండెను - అతడు దానిని లాగి వేసెను. అతడు దాని పొట్టనూ, ప్రేగులనూ, మొప్పలనూ, అన్నింటినీ నేరుగా దాని నోటి నుండి బయటికి లాగెను. అంతట అతడు దానిని ఆ బయట నీటిపై విసిరి వేసెను - చేపలు పట్టుటకు ఎరగా అంతకు ముందు రాత్రి మేము వంద లేక అంతకంటే ఎక్కువ అలాంటి చిన్న చేపలను కోసియుంటిమి.

ఆ చిన్నది నాలుగైదు సార్లు వణికి తన చిన్న నోటిని వాడుటకు ప్రయత్నించినది, దాని మొప్పలు మొదలైన వాటితో అది నిండియుండుట వలన అది దానిని వాడలేక పోయినది. “చిన్నదానా, నీ పనయిపోయిందియని” లైల్ అన్నాడు.

మంచిది, నేను దాని గురించి ఏమి ఆలోచించక చేపలు పట్టడం కొనసాగించాను. అప్పుడు, దేవుడు ఎంతో వింతైన క్రియలు చేయును. అకస్మాత్తుగా, ఆ అడవి పైనుండి ఒకానొకటి వస్తుండుటను నేను అనుభూతి చెందితిని. పరిశుద్ధాత్మ క్రిందికి దిగివచ్చి “లేచి నిలబడుమనెను.” “ఆ చిన్న చేపతో చెప్పుము, అది తిరిగి జీవము పొందుననెను.” అది చచ్చి అరగంట పాటు అక్కడ తేలియాడుచుండెను, ఆ వెనుక కలుపు మొక్కలలోనికి వెళ్ళియుండెను.

“చిన్న చేపా, ప్రభువైన యేసు నామములో నేను నీకు జీవమునిస్తున్నానని” నేనంటిని. ఆ చిన్న చేప బోల్తాపడి, తిరగబడి, ఆ నీటికో ఎంత గట్టిగా వెళ్ళగలదో అంత గట్టిగా వెళ్ళినది.

24

ఏమి చేయాలో తోచక నేనక్కడ నిలబడియుంటిని. “మన మిక్కడ వుండటం మంచిదని” బ్రదర్ బ్యాంక్స్ వుడ్ అన్నాడు.

అప్పుడు లైల్, “అది నా గురించి, ఎందుకనగా చిన్నదానా నీ పనయిపోయిందియని నేను అన్నందుకు” అన్నాడు. అతడు ఉద్రేకానికి గురయ్యాడు,

“కాదు, అది కాదని నేను చెప్పితిని. నేను లైల్ ను ఓదార్చుటకు ప్రయత్నించుచుంటిని. అది కాదని నేను చెప్పితిని.

అంతట ఈ లేఖనము నాకు మరలా గుర్తుకువచ్చినది. ప్రార్థించుటకు కనీసం వందమంది మూర్చరోగం గల చిన్నపిల్లల్ని నేను ఆ పట్టిక పై కలిగియుంటిని - లూకేమియా, క్యాన్సర్, మరియు క్షయ కలిగిన ప్రజల్ని తినివేయబడిన, గ్రుడ్డి, చెవిటి మరియు మూగవారినీ. నా యింటి యొద్ద కాగితం వెంబడి కాగితం వారితో నిండియున్నవి. ఒక దయగల దేవుడు, ఒక పాత, ప్రాధాన్యత లేని చిన్న చేపపై తన శక్తిని ఉపయోగించుట కంటే దానిని అనుగ్రహించియుండవచ్చునని యనిపించును. అయితే ఆయనే దేవుడైయున్నాడు.

25

ఒక చిన్న అంజూరపు చెట్టు పై తన బలమునుపయోగించుటకు బదులు ఆ ద్వారము నొద్దనున్న కుష్ఠువారిపై ఆయన తన శక్తినెందుకు వాడలేదు? అదేమి చేయుటకు? ఆయన పట్టించుకొనునని దేవుడు చూపించగోరుచున్నాడు. ఆయన సమస్తమునూ ఎరుగును. అంజూరపు చెట్టుకును ఆయన దేవుడై యున్నాడు. చేపలపై ఆయన దేవుడై యున్నాడు. సృష్టిపై ఆయన దేవుడై యున్నాడు. సమస్తము పైనా ఆయన దేవుడై యున్నాడు; ఆయన ఆసక్తి కనబరచనంత చిన్నది గాని, ప్రాధాన్యత లేనిది గాని, ఏదీ లేదు.

మనము అల్పులమూ, ప్రాధాన్యత లేని వారమూ అయినప్పటికీ, మనమాయన కొరకు ఒకానొకటి చేయుట యందు దేవుడు ఆసక్తి కలిగియున్నాడని మనము గ్రహించులాగున, తన మహిమను కనబరచుటకు ఆయన యిష్టపడును.

రాత్రింబగళ్ళు నేను విశ్రమించలేనంత గట్టిగా అది నన్ను తాకినది. అది జరిగి రెండేళ్ళయినది, మరియు అది నన్ను ఎడతెగక వెంటాడినది. ఓ, దానిని గురించి నేనేమియా అనలేను, ఎందుకంటే ఆ ప్రాయశ్చిత్తము నందు నేను దాని నుంచలేనని“ నేననుకున్నాను.

“నీవేమి చెప్పినా అది జరుగును. నీవు పలికిన దానిని నీవు పొందగలవు.”

అయితే యిక్కడి ఇదే ప్రసంగ పీఠము నొద్ద నేను నిలబడి ఆ లేఖనమును చదివి వెళ్ళినప్పుడు, దాని నుండి వెనుకాడి వెనక్కు మళ్ళియుంటిని, ఏలయనగా దాని నుపయోగించుటకు నేను భయపడియుంటిని.

నీవేమి చేయచున్నావో నీవెరుగకపోతే నీవు విశ్వాసమును కలిగియుండలేవు.

26

కొంత కాలం క్రితం ఒక వ్యక్తి నా యొద్దకు వచ్చెను, “సహోదరుడా బ్రెన్హాం, ఒక క్రైస్తవుడు పొగాకు కాల్చుట తప్పని నీవనుకుంటున్నావా?” యని అతడనెను.

“నువ్వు నన్నెందు కడుగుచున్నావని?” నేనంటిని. నీ మెదడులో ఒక ప్రశ్న ఏదైనా వుంటే, దానినలాగే విడిచి పెట్టుము. ఎన్నడూ.....“

నీవు సరియని నీకు పరిపూర్ణమైన నిశ్చయత కలుగువరకూ నీవు విశ్వాసము కలిగియుండలేవు. నీడలన్నీ తొలగిపోయిన తర్వాత, అప్పుడు నీవు విశ్వాసమునూ మరియు నమ్మకమునూ కలిగియుండగలవు. నేను దేనిని గురించి మాట్లాడుచున్నానో నేనెరుగకుండుట వలన, నేను బయటకి నడిచి వెళ్ళి, ఆ లేఖనమును బోధించలేకపోతిని. అయినా గాని, అది ప్రభువునదని నేనెరిగియుంటిని.

27

గత రెండేళ్ళుగా ఎక్కడో, ఏదో ఒకానొకటి యున్నదని ఈ వేదిక నుండి నేను ఎడతెగక చెప్పుట వినియుంటిమని, మీలో అనేకులైన జనులు నాకు సాక్ష్యము. నేను చేరుకుంటున్నాను; అది చేతికందునంత సమీపముగా యున్నదని నాకు తెలుసు. నేను దానిని గ్రహించలేకపోవుచున్నట్లు అనిపించుచున్నది.

“నాకక్కడొక లేఖనము తగిలినది, నేనేమి చేయవలెనో నాకు తెలియుటలేదని నేనందును, ఏలయనగా లేఖనములు...” ఓ, నీవొక అనువాదమును సంపాదించవచ్చును.... నన్నెవరైనా అడిగినట్లయితే, వారికి నేనొకానొకటి చెప్పిదానిని వేరొక దాని మీదికి మళ్ళించి, నేను నడిచి వెళ్ళిపోవుదును. కాని ఆ విషయము నెదుర్కొనుటకు....

పరిశుద్ధాత్మ బాప్తిస్మము సరియా, కాదా? అనే విషయమును మనమెదుర్కొనవలసి వచ్చినట్లుగానే: యేసుక్రీస్తు నిన్నా నేడూ, నిరంతరమూ ఏకరీతిగా ఉన్నాడా యను అంశమును మనమెదుర్కొనవలసి యున్నది. అది సరియూ కాదా? దానిని మనమెదుర్కొన వలసియున్నది. దేవుని వాక్యమెల్లప్పుడూ సత్యమని మనము తెలిసికొనవలసి యున్నది.

28

అలా అది పైకి క్రిందికి ఊగినది. అది నా మెదడులోనికి వచ్చును, నేను దానిని వదిలించుకొనలేకపోతిని. మరియు నేను వెళ్ళిన ప్రతి చోటికీ, ఎడతెగక అది నా యొద్దకు వచ్చును - “నీవు పెల్లగింపబడి సముద్రములో పడద్రోయబడుమని నీవు ఈ పర్వతముతో చెప్పి, నీ హృదయమునందు సందేహింపక, నీవు చెప్పినది నెరవేరునని నమ్మినట్లయితే, నీవు చెప్పినది నీవు పొందగలవు.”

“ప్రభువా, అదెలా జరుగగలదు? అది చెప్పునది నేనైతే. నేను. అది పలుకునది నేను గనుక దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు. కావున, నీవు పలికినది గాక వేరొకటేదియూ నేను పలుకలేను. లేఖనములను బట్టియే నేను దీనిని చెప్పుచున్నానని” నేననుకొంటిని.

మరియు సమస్తమునూ ఆ ప్రాయశ్చిత్తమందున్నవి. ప్రాయశ్చిత్తము బయట ఏ ఆశీర్వాదములూ లేవు, ఎందుకంటే ఆ ప్రాయశ్చిత్తము వెలుపట మనము పాపులము. ప్రతి ఒక్కరి కొరకూ అది సార్వజనీనమైనదైతే, అప్పుడు ప్రతి ఒక్కరూ రక్షించబడుదురు. అయితే ఆ ప్రాయశ్చిత్తమునందలి దీవెనల పట్ల నీకున్న దృక్పథమే ఆ దీవెనలను నీకు తెచ్చును.

రక్షణవలె, దేవునికి సంబంధించినంత వరకూ, యేసు చనిపోయినప్పుడే నేను రక్షించబడితిని. అయితే ఆయన దేవుని కుమారుడని నేనంగీకరించి ఆయనను నా రక్షకునిగా అంగీకరించు వరకూ అది నాకు ఏ మేలూ చేయదు. ప్రతి లేఖనమూ అంతే.

అది నీ కొరకని దేవుడు నీకు బయలు పరిచితేనే, దైవీక స్వస్థత నీ కొరకు అవుతుంది. కానీ, అనుకోకుండా నీవు దానిని కనుగొనలేవు. అది బయలుపరచుట ద్వారా రావలసియున్నది. “ఆయన పొందిన గాయముల చేత నీవు స్వస్థపడితివని అది బయలుపరచబడినప్పుడు, సాతాను చేయగలిగినది కూడా ఏదీ లేదు. సెలర్స్ బర్గ్ వాడైన మన యవ్వన సహోదరుడు చెప్పినట్లు, ఒకానొకటి బయలు పరచబడినప్పుడు, నిశ్చయంగా, ”దెయ్యములన్నియూ దానిని కదిలించలేవు.“

29

గమనించండి. “నీవు యింటి వద్దనున్నప్పుడు, నీవు ప్రతి ఉదయమూ, నీ తుపాకీ తీసుకొని వేటాడుటకై అడవిలోనికి వెళ్ళుచున్నావెందు?” అని గత ఆకురాలు కాలములో అనేకులు నాతో యనిరి.

ఆయన పట్టణమునకు దేవుడైయున్నట్లుగానే, అడవికిని దేవుడైయున్నాడని మీరు తెలిసికొనవలెనని నేను కోరుచున్నాను. ఆయన ఇక్కడ ఎంతగా దేవుడో, అక్కడా అంతే దేవుడు, అయితే దేవుడు ఎల్లప్పుడూ వారి సామర్థ్యము, యింకా దానిని బట్టియే మనుష్యులతో వ్యవహరించును. నిశ్చలమైన నీళ్ళ యొద్ద, పచ్చని గడ్డి భూముల యొద్ద దావీదుతో వ్యవహరించినట్లు - ఎందుకనగా అతడొక గొర్రెల కాపరి, బయలుపరచుటకూ, ఒకానొక దానికి ఆయనకు వేర్వేరు మార్గములున్నవి.

ఒక ఉదయమున, నిజంగా పెందలకడనే, దాదాపు నాలుగు గంటలకు లేచి, నేను ఉడుతలు వేటాడుటకై అడవిలోనికి బయలుదేరుదును. నా భార్య నాతో, “బిల్లి, వేటాడుటయందు నీకు ఎన్నడూ విసుగు కలగదా?” అని అన్నది.

చూడండి, ఈ యుద్ధము ఒంటరిగా జయించబడును. నా భార్యకిది అర్ధం కాదు. నాకిది అర్ధం కాదు. కాని యిదొక పోరాటము. నీవు ఒంటరిగా నిలబడవలసియున్నది. నీతో ఎవ్వరూ నిలబడలేరు. కేవలం నీకూ యేసుకూ మాత్రమే స్థలమున్నది.

అపార్ధము చేసికొన్నారా? నిశ్చయంగా, “అక్కడున్న నా చిన్నపిల్ల రెబెకా కూడా. నేనెప్పుడైనా ఒక మనిషిని పెళ్ళి చేసుకుంటే, ఎప్పుడైనా అతడు వేట ఊసెత్తితే, నేనతణ్ని చేసుకోనని” తను చెప్పింది. “నా తల్లి ఏమి అనుభవించిందో నాకు తెలుసు. భర్త ఆ బయట కూటములలో ఉంటాడు; అతడు యింటికి తిరిగి రాగానే, ఆ పాత తుపాకీ లేక గాలం పట్టుకుని అడవిలోకి వెళ్లిపోతాడు” అన్నది.

“అది కోరుకుంటావా లేక ఒక పేకల కట్టగానీ, ఒక గోధుమ రంగు జుట్టు భామను గాని తీసుకొనిపోయేవాడిని కోరుకుంటావా? నీ అభిప్రాయం తేల్చుకోయని” నేనన్నాను.

ఆ రోజు నేను తిరిగి వచ్చిన తర్వాత, “డాడీ, అందుకు నేను క్షమాపణ కోరుచున్నాను. వేటాడుట యిష్టపడు నీవంటి మనిషిని పెళ్ళి చేసికొనుటయే నేను కోరుకుంటున్నాను, అయితే నేనూ అతడితో వేటకు వెళ్తాను” అని ఆమె చెప్పినది. “నేనూ అతడితో బయటకెల్తానని ఆమె చెప్పినది.”

“సరే, అదీ మంచిదే. దాని గురించి కొంచెం మీ అమ్మతో నువ్వు చెప్పగలిగితే బావుండునని నేననుకుంటున్నానని” నేనన్నాను.

30

కాని ఆ అడవిలో ఏదో వున్నది. నేను దేవుని గురించి తెలుసుకున్న మొదటిలో, నేను పశ్చాత్తాప పడగోరితిని. ఎలా పశ్చాత్తాపపడాలో నాకు తెలియదు. ఆయనతో ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. అందువలన నేను కూర్చొని ఆయనకొక ఉత్తరం రాసి నన్ను క్షమించమని ఆయన నడిగితిని. అదెలా చేయాలో నాకు తెలియకుండెను. అడవిలో ఆ బయట నాకు ఏదో అన్పించిందని నాకు తెలిసి దానినొక చెట్టునకు తగిలించితిని - అడవిలో నేనాయనను చూసిన చోటికి ఆయన దిగివచ్చినప్పుడు, ఆయన దీనిని చదివి, ఆయనను సేవించనందుకు నేను బాధపడుచున్నాననీ మరియు నా పాపమును ఆయన క్షమించవలెనని నేను కోరుచున్నాననీ, ఆయన నా ఉద్దేశ్యమునర్థము చేసికొనులాగున. ఆపై నన్ను గూర్చి నేను సిగ్గుపడి దానిని తీసుకొంటిని. “ఆయనొక మనిషైతే, ఒక మనిషి వలె అర్ధము చేసికొనును; ఆయన నా సృష్టికర్తయని” నేనంటిని.

ఆ తర్వాత నేను షెడ్డులోనికి వచ్చి ఒక మనిషివలె ఆయనతో మాట్లాడుట మొదలు పెట్టితిని, మరియు ఒక మనిషి వలె ఆయన నాకు బదులిచ్చెను.

31

తర్వాత అది... ఇక్కడ నేను కొన్ని తేదీలు వ్రాసుకొనియున్నాను. అక్టోబరు 12న... 15న వ్యోమింగ్లో జింకల వేట కాలము ప్రారంభము కానుండెను. 12న నేను వేటాడగలిగిన చివరి రోజు, మరియు మేము 12న బయలుదేరనైయుంటిమి. నా ఉద్దేశ్యము - శనివారమైన 10న మేము అడవిలో ఉంటిమి. ఆదివారమున, 11వ తేదిన నేను భోదించితిని. సోమవారమున, సహోదరుడు సాధ్మన్ మరియు వెనుకవున్న బ్రదర్ రాబర్సన్ మరియు మేమందరమూ కూటమునకు లేక వ్యోమింగ్లో జింకల వేటకు బయలు దేరితిమి.

10న, ఉదయమున - అది... ఆ తర్వాత 18న ఇండియానాలోని ఆ కాలము (వేటాడు కాలము - తర్జుమాదారుడు) ముగియును, మాకు యిక ఉడుతల వేట ఉండదు. అందువలన, “నేను బయటికి వెళ్ళుట యిదే చివరి సారి” అని నేనంటిని. అందువలన మేమొక గుంపును సమకూర్చి వాటిని అడవి చుట్టూ చెదరగొట్టితిమి. నేను ఆ వెనుక సేలమ్ వద్ద, నేను వెళ్ళుటకు యిష్టపడు చోటికి వెళ్ళితిని. వేట రుతువు ఆలస్యమయ్యెను. ఉడుతలు తక్కువగా యుండెను. నేను తరచుగా బయటకి వెళ్ళి, ఒక్కొక్క సారి ఒక్కొక్క ఉడుతను తెచ్చుకొంటిని.

32

అందువలన ఈ ఉదయం నేను మరలా అదే అడవికి వెళ్ళితిని. అంతట గాలి లేచెను. అది వీచుట ప్రారంభించెను. వేటాడేవారెవరికైనా, అది మంచి రోజు కాదని తెలియును. నేను అడవంతా వేటాడినా, ఒక్క ఉడుతా కనబడలేదు, వినబడలేదు. నేను ఒక కాలువ అడుగునకు వెళ్ళి యింకొక చిన్న అడవి ప్రదేశమును కనుగొనుట మొదలుపెట్టితిని. నేను యీ చిన్న అడవి దగ్గరకి వెళ్తుండగా, అక్కడ చాలా కోండాగోగు చెట్టు మరియు లోకస్ట్ చెట్టు ఉండెను. వాటి ఆకులన్నీ రాలి కేవలం ఒక మొండి మొద్దు మాత్రమే మిగిలెను.

అలా రెండు సికమోర్ చెట్ల పక్కన, ఇప్పుడు, ఉడుతలు సికమోర్ల దగ్గర ఉండవు. కాని, నేరుగా దాని పైన చెట్ల మధ్యగా తళుక్కుమన్న ఒక ఉడుతను నేను చూసినట్లు, అది నా ముందు మెరిసినట్లు నాకనిపించింది. ఐతే అది చాలా వేగంగా పరుగెత్తింది. “సరే,” వేటాడవలసిన అవసరం లేదు ఈ బయట జనం ఉన్నారు. ఈ చిన్న అడవి ప్రక్కనే రైతులు జొన్న కోస్తున్నారు. ఉడుతలిక్కడ ఉండవని నేననుకున్నాను.

33

అందువల్ల నేను ఆ రెండు చెట్ల మధ్యన కూర్చుని, ఆ వెచ్చటి ఎండలో నా పాదములను ఒక దానిపై మోపి, రెండవదాని మీదికి వాలి, వెనక్కి జారబడితిని. “నేనొక కునుకు తీస్తాను. తర్వాత బ్రదర్ బ్యాంక్స్, బ్రదర్ సాద్మన్, యింకా కుర్రాళ్ళను చేరుకుని, ఈ త్రోవ వెంట తిరిగివెత్తానని నేననుకుంటిని. నేనక్కడ కూర్చుని ఉండగా.. [బ్రదర్ బ్రెన్హాం దగ్గుచున్నారు.] నన్ను మన్నించండి. అక్కడ నేను చెట్టు కింద కూర్చుని ఉండగా, వెచ్చటి ఎండ నాపై పడుచుండగా, సౌకర్యముగా నేనలా క్రిందకి వ్రాలినప్పుడు, ”నీవు పెల్లగించబడి సముద్రములో పడద్రోయబడు అని నీవా పర్వతముతో చెప్పి, నీ హృదయమందు సందేహింపక నీవు చెప్పిన సంగతులు నెరవేరునని నీవు నమ్మినయెడల, నీవు పలికిన దానిని నీవు పొందవచ్చని, ఒకానొకటి చెప్పెను.“

“సరి మరలా ఆ లేఖనము ఇప్పుడు నా తలంపులో ఉన్నదని నేననుకున్నాను.” మిగిలిన కుర్రవాళ్ళను తీసుకొని వచ్చుటకు వెళ్ళుటకు ముందు, యిప్పుడు నాకిక్కడ కొంచెం - దాదాపు ఒక గంట - సమయమున్నది, కావున నేనా లేఖనమును అధ్యయనము చేయుదునని“ నేననుకున్నాను, యింకా, ”ఇప్పుడది ఎలా వర్తించగలదు“ అని నేననుకున్నాను, నేనిలా అనుకున్నాను, ”ఇది జరుగుటకున్న ఒకే ఒక్క మార్గమిది. ఆ శిష్యులు ప్రాయశ్చిత్తమునకు అవతలి వైపున జీవించిరి, ప్రాయశ్చిత్తము చేయబడక మునుపే, ప్రాయశ్చిత్తము తర్వాత వచ్చినది, దాదాపు, ఓ, కొన్ని వారముల తర్వాత, యేసు ప్రవక్తలకిచ్చినట్లుగానే, ప్రాయశ్చిత్తమునకు ఆవలి వైపున వారికి శక్తినిచ్చెను.

మరియు నేను “ప్రవక్తలు” అనినప్పుడు, మరలా ఒకానొకటి నన్ను తాకినది. “ప్రవక్తలు యేమైయున్నారు?”

34

అప్పుడు నేను దానిని గురించి - ఆయన ప్రవక్తలకు చేసిన దానిని గురించి - ఆలోచించుట మొదలుపెట్టితిని. అంతట అది చేరినది. కొద్దిసేపు నేనక్కడ నాలో నేను మాట్లాడుకొనుచుంటిని, కేవలం ఆలోచించుకొనుచుంటిని.

అంతట ఒకానొకటి సమీపముగా ఉండుటను నేను ఎంతో మెలుకువగా గ్రహించితిని. నేను ఒకరితో మాట్లాడుచుంటిని. అంతట, “అది ప్రాయశ్చిత్తములో ఉన్నది, ఒక పురుషుడు లేక యెంతగానో ప్రత్యేక పరచబడి దేవునికి లోబడినట్లయితే, ఆ దేవుడు లోపలికి ప్రవేశించి వారి స్వరమును వాడుకొనును, అంతట మాట్లాడునది, ఆ మనిషి కాదు గాని యుందున్న దేవుడే మాట్లాడువాడు” అని ఒకానొకటి నాతో చెప్పినది.

“అది సరియే” అని నేను ఆలోచించితిని.

“నీవు ఏమి ఆలోచించుచున్నావు” అని ఏదో నాతో చెప్పుచున్నది. వేదికపై ఆ దర్శనములను నీవెలా చూస్తున్నావు? ఇక్కడ ఆ దర్శనములను నీవెలా చూస్తున్నావు? అదేమిటి? జరుగబోవుదానిని ప్రతి సారీ కచ్చితముగా నీవు ముందుగా చెప్పగలుగుటకు అది నీ సొంత జ్ఞానమని నీవనుకుంటున్నావా? మాట్లాడునది నీవని నువ్వనుకుంటున్నావా? ఏమి చెప్పాలో నీకు తెలియక యుండగా, ఒకసారి పరిశుద్ధాత్మ వర్తమానములోనికి ప్రవేశించినప్పుడు, అప్పుడు మాట్లాడునది యేమిటి? తనకు ఏమీ తెలియని దానిని గురించి ఒక మనిషి ఒక భాషలో మాట్లాడినప్పుడు జరుగుచున్నదేమిటి? ఆ యిద్దరిలో ఎవ్వరికి ఏమియూ తెలియకయుండగా, ఆ భాషకు అర్థము చెప్పు అది యేమిటి? అది ఆ వ్యక్తియా, లేక సజీవ దేవుని యొక్క ఆత్మయా?“ అని ఒకానొకటి నాతో చెప్పినది.

“అది నిజం నేను దానిని గ్రహించితిని. ఆ పలుకునది దేవుడే, సంఘమునకవసరమైనదల్లా ఆయనకు యింకొక్క అడుగు సమీపముగా యుండుటయే, ఆయనతో జీవించుటకు మరింతగా ప్రతిష్టించబడిన జీవితం కలిగియుండుటయే” అని నేనంటిని.

35

దీనిని గురించి ఆలోచిస్తూ, నేను కొన్ని క్షణాలు అక్కడ కూర్చుని ఉండగా, నేను ఎవరితోనో మాట్లాడుచున్నానని నేను గ్రహించితిని. మరియు “అడుగుము... నీ చిత్తము చొపున పలుకుము, అది నెరవేరునని” ఒకానొకటి నాతో చెప్పగా నేను వింటిని.

అంతట నేను “నీకు ఏమి....” అన్నాను, “నేనెవరితో మాట్లాడుచున్నాను? నీవెవరవు? నాతో మాట్లాడుచున్న స్వరమును నేను వినునట్లు యిక్కడ పొదలయొద్ద నిలిచియున్నదెవరు? నీవెవరవు? నాతో చెప్పు” అని నేనంటిని. నేను పూర్తిగా ఉద్రేకమునకు గురై రెండు చెట్ల మధ్య నుంచి ఎగిరితిని. “నాతో మాట్లాడు, నీవెవరవు? నాకు స్వరమును వినబడునట్లు ఇక్కడ పొదల యొద్ద నిలచియున్నదెవరు? నీవెవరవు? నాతో చెప్పు” అని నేనంటిని. నీవెక్కడున్నావు? నాతో నీకేమి కావలెను. ప్రభువా, నీవెక్కడున్నావు?“ అని నేను అరచితిని.

ఒకానొకటి వెనక్కి వచ్చి, “నీ చిత్తము చొప్పున పలుకుము, అది నీకనుగ్రహించబడును” అని చెప్పెను.

“ప్రభువా, నీవు నా పరిచర్యను మార్చుచున్నావా? నీవు చెప్పుచుండిన మార్పు ఇదేనా? అది యిక్కడికే వచ్చుచున్నదా? ఆ దర్శనములో ఆ చిన్న ఇంటిలో నేను చూసిన ఆ సంగతి యిది అదే అగునా. ఇది అదేనా?” అని నేనంటిని.

సరిగ్గా అప్పుడే ఒక నిజమైన గాడమైన మదురమైన పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము నా పాదముల నుండి నన్ను పైకి లేపినట్లుగా అనిపించినది. అంతట, “నీ చిత్తము చొప్పున పలుకుము, అది నీకివ్వబడును” అని చెప్పెను.

36

ఆశ్చర్యపడి నేనక్కడ నిలుచుంటిని, అది నన్ను విడిచిపెట్టెను, నా యొద్ద యేమియూ లేకుండెను. “సరి, నేనేమందును? ఇక్కడ వ్యాధిగ్రస్తులెవరూ లేరు. ఇక్కడేమి లేదు. నేనడవిలో ఉన్నాను. నేనేమందును? నేను యేమి... యేమి.... యేమి చెయ్యగలను?” అని నేననుకున్నాను. ఇంకా “నా మతి చలించుచున్నదా? నా మానసిక సామర్థ్యము బీటలు వారునంతగా నేను కష్టపడి చదివానా?” అని నేననుకున్నాను.

సరిగ్గా అప్పుడే, మీరు నన్ను వింటున్నట్లుగానే నేను దానిని విన్నాను. “నీవు వేటాడుటలేదా? నీకు వేట దొరకలేదు కదా? అనెను. ”నీవు కోరుకొనునది ఏదైనా పలుకుము“ అనెను.

సరి, అంతట నేనిలా ఆలోచించాను. “'అన్ని సంగతులను రూఢిగా తెలిసికొనుము' అని దేవుడు చెప్పెను,” ప్రభువా అది నీవే అయ్యి, నేనెంతో కాలముగా ఎదురు చూస్తున్నట్లుగా యీ దర్శనముల నుండి మరింత ఘనమైన దానికి నా పరిచర్యను నీవు మార్చబోవుచున్నావనుటకు ఇది సూచన అయితే, నీవు నా ప్రార్థనకు బదులిచ్చెదవు గాక,“ అని నేనంటిని.

అంతట కొద్ది సేపు నేనక్కడ నిలుచుంటిని. అంతట, “ఆయన చెప్పినదేమిటి? ప్రార్థించుమని ఆయన చెప్పలేదు, ఆయన ”నీవు కోరునది పలుకుము“ అని చెప్పెను. కేవలం దానిని పలుకుము, అంతట నీ మాటలు రూపుదాల్చును. ఈ పర్వతముతో పలుకుము, మరియు అది నీవు చెప్పినట్లు చేయును” అని నేనాలోచించాను.

37

అందువల్ల నేను నా భుజమును చెట్టు పై వాల్చాను. యాభై గజాల దూరంలో నా తుపాకిని సవరించి ఉంచాను. అది నాకలవాటు కనుక ఒక యాభై గజాల దూరంలో ఉన్న ఒక చెట్టు కోసం నేను వెదికాను. ఆ ఆకుల వెలుపట, యాభై గజాల దూరంలో ఉన్న దానిపై, “ఆ చెట్టుపైకి ఉడుతలు రావటం దాదాపు అసాధ్యం, సరిగ్గా దాని దగ్గరే రైతులు జొన్న కోస్తున్నారు.” “కాని ఒక ఎర్ర ఉడుత వచ్చి ఆ కొమ్మ చివరన కూర్చుంటుంది, దానిని నేనిక్కణుంచి కాలుస్తానని నేనన్నాను.”

నేనది అనగానే ఒక ఉడుత అక్కడికి వచ్చింది. నాకు కొంచెం వణుకొచ్చింది, తర్వాత సర్దుకుని, ఆ ఉడుతని కాల్చి, నడచి వెళ్ళి దాన్ని తీసుకున్నాను. పూర్తిగా వణుకుచుంటిని. “బహుశా అది అలా జరిగిపోయిందేమో” అని నేననుకున్నాను. ప్రజలెలా సందేహించగలరో మీకు తెలుసు. కాని మీరు నిశ్చయముగా ఉండవలెను. మీకు నిశ్చయత కలుగు వరకూ ఏమియు చెయ్యవద్దు, అంతట మీరేమి చేయుచున్నారో మీరు తెలిసికొందురు.

38

నేను నా ముఖం కొంచెం రుద్దుకొని మరలా చూసాను, సరిగ్గా కంటి మీద కొట్టినది. అందువల్ల, నేను పైకి వెళ్ళి కొండ ప్రక్కన క్రింద కూర్చుని, “ప్రభువా, యిద్దరు లేక ముగ్గురు సాక్ష్యల నోట ప్రతి మాట స్థిరపరచబడవలెనని వ్రాయబడియున్నదని నేనంటిని.” “ఒక వేళ అది నీవైతే, నా బుద్ధిహీనతను బట్టి నన్ను క్షమించుము. అయితే అలాంటి మరొక ఉడుతను నాకు యివ్వమని నేనంటిని, ఇంకా, అప్పుడు అది నీవని నేను నమ్మదును. అదేదో అలా జరిగిపోయిందనడానికి ఆ దెయ్యానికి ఇక ఎంత మాత్రమూ అవకాశముండదని” నేనంటిని.

కావున నేనలా కూర్చుంటిని. ఒక్క క్షణంలో అది (నేను దానిని అతీతమైన అభిషేకమంటాను) మరలా వచ్చింది, మరలా వచ్చినది, అంతట నేను దాదాపు నా పాదములను విడిచి లేచితిని, “నీ చిత్తము చొప్పున పలుకుము, అది నీకనుగ్రహించబడును” అని చెప్పెను.

దాదాపు యాభై గజాల దూరంలో బోలెడెంత గుబురుతోనూ, ద్రాక్షతీగలూ యింకా మొదలగునవి దానికి చుట్టబడియున్న మరొక చెట్టును కనుగొనువరకూ నేనా అడవిలో చుట్టూ చూసితిని, ఉడుతలు ఎన్నడూ అలాంటి చెట్టును ఎంచుకోవు. “సరిగ్గా అక్కడే మరొక చిన్న నక్క ఉడుత కూర్చుని యుండును” అని నేనంటిని.

నేను నా వ్రేలిని క్రిందకి దించి, అడవి చుట్టూ చూసితిని. మరలా వెనక్కి చూసాను, అదిగో ఆ నక్క ఉడుత అక్కడే కూర్చుని మరలా నేరుగా నావైపే చూస్తుంది. నేను దానిని కాల్చి తీసుకున్నాను. అప్పుడు నేననుకున్నాను.... ఓ, నేను వణుకుచుంటిని. “పరలోకపు గొప్ప బలవంతుడగు దేవుడు యిక్కడే అడవిలో ఉన్నాడేమో, పదిహేనేళ్ళ క్రితం ఆయన నాతో చెప్పిన దానినే కచ్చితంగా చేయబోతున్నాడని, నా సొంత మార్గములో వేటాడుకొనుచున్న నాకు ఆయన స్థిరపరుస్తున్నాడని నేననుకున్నాను.

నేను కొంచెం గమనించాను. “ప్రభువా, అది మరలా జరుగు”నని నేనంటిని.

“అది ఏ చోట యుండవలెనో చెప్పుమని” ఆయన అనెను.

“దీనిని నేను తీవ్రమైనదిగా చేస్తాను,” అన్నాను. ఆ పొలము ప్రక్కన, ఎండిపోయి, తెల్లగా, పదునుగానున్న ఆ పాత మొద్దుపైన“ అని నేనన్నాను. ”అక్కడ మరొక ఎర్రని ఉడుత వచ్చును. మరియు అది ఆ మొద్దు చివరకు వెళ్ళి ఆ పొలము మీదుగా ఆ రైతుల వైపు చూచును, అది ఆలాగుండును“ అని నేనంటిని. నేను వెనక్కి చూడగా, అక్కడ ఏ ఉడుతా లేదు. నేను దాదాపు ఐదు నిమిషాలు చూసాను, అయినా ఒక్క ఉడుతా లేదు. నేనన్నాను. ”సరే....“ ”రెండు ఉడుతలు చాలును“ అని నేనంటిని. ”రెండు ఒక సాక్ష్యము. నేను దానినలా నమ్ముదు“ అని నేననుకుంటిని.

“కాని అక్కడ ఒకటి యుండునని నీవన్నావు” అని ఒకానొకటి నాతో చెప్పెను.

39

ఇంకొక ఐదు నిమిషాలు నేను ఎదురు చూసాను, ఏమీ లేదు. కాగా దానిని నేను నా హృదయంలో మననం చేసుకుంటూ యంటిని, “అక్కడ ఒకటి యుండునని నీవన్నావు.” నేను చాలా ఎదురుచూసాను.

నీవు సందేహిస్తున్నావా? అని ఒకనొకటి అడిగినది.

“కొంచెం కూడా కాదు” అని నేనన్నాను.

నేనది అన్న వెంటనే, ఆ ఎర్ర ఉడుత ఆ కొమ్మ చివరికి వెళ్ళి నిల్చుని రైతుల వైపు చూసింది. ఇక్కడ నేను నిలబడి యుండగా, దేవుడు నా తీర్పరి, నేనా ఉడుతను కాల్చాను. వెళ్ళి దానిని తీసుకుని, కుర్రవాళ్ళని తీసుకుని వెళ్ళుటకు యింకా చాలా గంటల ముందునుంచీ, యింకా ఎక్కడైనా మరొక్కటైనా ఉంటుందేమో చూడటానికి అడవంతా తిరిగాను. ఒక్కటీ లేదు. అప్పుడు నేను ఇంటికి వచ్చి మీకు దాని గురించి చెప్పాను.

40

ఆ తర్వాత నవంబర్ ఏడున, నేను కెంటకీ వెళ్ళితిని, అక్కడ నిల్చుని యున్న పెద్దలలో ఒక్కడైన బ్రదర్ టోనీ జేబెల్ తో నేను యుంటిని. (టోనీ, మీరు ఇక్కడ ఉన్నారా? ఆయన ఇక్కడే ఎక్కడో యున్నారు). బ్రదర్ టోని జేబెల్ మరియు బ్రదర్ బ్యాంక్స్ ఉడ్ కాగా మేము ఆ పర్వతములపై వేటాడుచుంటిమి.

అంతట నేను అడవిలోనికి బయలుదేరాను, ఉడుతలు అస్సలు లేవు. ఆకులు నేలపై దట్టంగా ఉన్నాయి. నేను అడవిలోనికి బయలుదేరాను. అప్పుడు, ఒకానొకటి నాతో, “ఈ ఉదయం నీకెన్ని ఉడుతలు కావాలి?” అనెను.

“సరి, ఈ ఏడాది నేను, నూట-పద్నాలుగు, నూట-పదిహేను తీసుకున్నాను” అని నేనంటిని. “నాకు యింకొక మూడు దొరికితే, అది నూట-ఇరవై అవుతుంది. దానితో ఒక సరి సంఖ్య యొద్ద ఆగవచ్చు” అని నేనంటిని. ఇంకా, “ఇంకొక సంగతి, దానితో నేను యింటికి తీసుకు వెళ్ళటానికి, ఆరు ఉంటాయి” అని నేనన్నాను. తినుటకు వేరే ఏ మాంసము కన్నా నాకు ఇవి ఎక్కువ యిష్టము, “ఇంకొక్క మూడు మాత్రం నాకు దొరికితే...” అని నేనన్నాను.

41

నేనా అడవిలో పైకి యింకొంచెం ముందుకెళ్ళాను, కాని ఒక్కటీ లేదు. మంచిది, వేటగాళ్ళయిన చార్లీ లాంటి వాళ్ళకి ఒకటి దొరికింది. “సరే, నేను..” అని నేనన్నాను.

“దానితో చెప్పు. మూడు ఉడుతల్నీ పలుకుము, నీవు వాటిని పొందుదువని” ఒకానొకటి నాతో చెప్పినది.

“అదొకసారి జరిగినదని” నేనన్నాను.

ఆ మధ్యాహ్నము గడిచిపోతుండగా కొండల ప్రక్కగా, ఒక చిన్న చెట్టు ప్రక్కన నేను నిలబడితిని. నేనెంత మాత్రము నేలపై నిలబడలేనంత గొప్పగా ఆ అభిషేకము వచ్చి, “పలుకు! నీవు పలుకునది, సందేహించవద్దు, నీవు పలికిన దానిని నీవు పొందగలవు” అని చెప్పెను.

“నేను మూడు ఉడుతలు పొందుదును” అని నేనంటిని.

“అవి ఎక్కడి నుంచి వచ్చును?” అని ఆయన అనెను.

“ఒకటి అక్కడి నుంచీ, ఒకటి అక్కడి నుంచీ, యింకొకటి ఆ వెనుక ఇక్కడి నుంచీ వచ్చును” అని నేనంటిని. దానిని విపరీతము చేయుట. అది ఎంత విపరీతముగా అగుపడినా దేవుడు లెక్క చేయడు. ఆయన పరిస్థితి యొక్క దేవుడు.

42

అంతట కొద్ది నిమిషాలు నేనక్కడ నిలబడగా, ఆ చుట్టు ప్రక్కల ఉన్న మిగిలిన కుర్రాళ్ళ నుంచి నాకు ఎలాంటి ప్రేలుడు శబ్దమూ వినిపించలేదు. నేను వెనక్కి చూసాను. అడవిలో చాలా దూరంగా దాదాపు తొంభై గజాల దూరంలో, ఒక మొద్దు పైన ఏదో ఉన్నదని నాకు అనిపించింది. నేను దానిని గమనించాను. కొద్దిసేపటి తర్వాత అది దూకింది; అదొక బూడిద రంగు ఉడుత, చాలా దూరాన, ఆ లోయకు ఆవల, ఆ పర్వత శ్రేణి శిఖరం పైన అది చెట్టు ప్రక్కకి వచ్చినప్పుడు నేను దానిని కాల్చాను. అది దాదాపు తొంభై గజాల దూరంలో ఉండగా, నేను దాని కాల్చాను. “ఇది ఒకటి, నేను ఇటువైపుకు కూడా తిరిగి మిగిలిన వాటి కోసం చూడటం మంచిది, ఎందుకంటే అవి వస్తున్నాయి” అని నేననుకున్నాను.

చూడండి, సంగతులను మీ యొద్దకు తీసుకుని వచ్చుటకు దేవునికొక మార్గమున్నది. మీరు మాట్లాడుచున్నదానిని మీకు స్థిరపరచుటకు. ఆ అభిషేకము అప్పుడు నన్ను విడిచిపెట్టినది. సరి, దాదాపు ఒక గంట పాటు నేను ఇటువైపు తిరిగి ఎదురుచూసాను. ఏమీ జరుగలేదు. నాకు చలిపెట్టుచుండెను. “ఆ సంగతులను నాకు చెప్పుచున్నది పరిశుద్ధాత్మయే, అయితే నిశ్చయంగా, అది కచ్చితంగా అలాగే యుండును; ఎందుకంటే అభిషేకము నాపై ఉన్నప్పుడు, నేను మాటను పలికితిని, కావున అది అలాగే యుండవలసియున్నది” యని నేననుకున్నాను.

43

ఇప్పుడు, దీనిని శ్రద్దగా వినండి. మరియు ఇది టేపు చేయబడుచున్నది. అది ప్రపంచమంతటా వెళ్ళబోవుచున్నది.

అప్పుడప్పుడు నేను నా ఎడమవైపు గమనించుచుంటిని, కొద్ది సేపటి తర్వాత, నేనొక చెట్టును చూసితిని, ఒక బీచ్ చెట్టు ప్రక్క నుండి, ఒక బూడిద రంగు ఉడుత వచ్చెను. “కచ్చితంగా అలాగే, ప్రభువా, అది సరియే” యని నేనంటిని.

నేను తిరిగి దానిని కాల్చుటకు లేచితిని, అప్పుడు మరొక ఉడుత వచ్చినది. “అదిగో రెండు. కచ్చితంగా, నేను కోరుకున్నవి మూడు అయినవి” అని నేననుకుంటిని. అంతట నేను లేచి, మొదటి ఉడుతను కాల్చితిని.

ఇంకొకటి ఒక మొద్దు క్రిందకి పరుగెత్తినది. ఒక మొద్దు క్రింద అక్రోటు గింజ వంటి దానిని కోరుకుచుండుట నేను చూడగల్గితిని. ఆ మొద్దు ఆ చివరన దాదాపు అంత ఎత్తున్నది, ఒక అడుగు పైకి లేచియున్నది. నేను ఉడుతను చూడగలను. నేను మొదటి దానిని చంపితిని. “ఇప్పుడు నేను మిగిలిన దానిని కూడా పొందెదను” అని నేననుకుంటిని.

అంతట నేను గురి చూసి, ఆ క్రాస్-హైర్ ని (తుపాకిని ఎక్కుపెట్టునప్పుడు కదలకుండా ఉండుటకు వాడే పరికరము - తర్జుమాదారుడు). నేరుగా దాని చెవిపై ఉంచితిని. నలభై, యాభై గజాల కంటే ఎక్కువ దూరంలో లేదు - అప్పుడు కాల్చగా అది మొద్దుకు తగిలినది. ఆ ఉడుత కనీసం ఉద్రేకపడలేదు. అప్పుడు నేను మరొక బులెట్ ని దానిలో పెట్టితిని, అది తిరిగి మొద్దు క్రిందకి వెళ్ళినది. మరియు అది మరొక కొన యొద్దకు వెళ్ళినది. సరే, నేను సరియైన ఎత్తుకు వచ్చి, నేను చూడగల్గినంత చక్కగా గురి చూశాను. సంవత్సరం మొత్తంలో నేను ఐదు సార్లు మాత్రమే గురి తప్పితిని. కావున, అప్పుడు నేను సరియైన ఎత్తుకు వచ్చి సరిగ్గా కచ్చితమైన గురి చూసి, మరలా ట్రిగ్గర్ నొక్కితిని, ఈ సారి దానికి నాలుగు అంగుళాల పైన కాల్చితిని. “నేను నా స్కోపును (తుపాకి పై గురి చూచుటకు ఉంచబడు కటకము - తర్జుమాదారుడు) స్థానము తప్పించితినేమో,” అని నేననుకుంటిని.

44

అంతట నేను మరలా చూసాను. ఆ ఉడుత పరుగెత్తి, నా ప్రక్కవైపు నేరుగా అడవి ప్రక్కకు వెళ్ళినది. “సరే,” నా స్కోపు కదిలిపోయినది కనుక, నేను దానిని ప్రక్క నుంచి చాతిపై కాల్చదును“ అని అనుకున్నాను. ”మరియు నేను పైకి లేచి, అడ్డముగా ఎక్కు పెట్టాను. “బహుశా, నాకు చలీ మరియు వణకూ వచ్చిందేమో” అని నేను అనుకున్నాను. “వేరొక దానిని కాల్చినప్పుప్పుడు నాకు చలీ మరియు వణకూ లేవు కదా” అని నేననుకున్నాను. అందువల్ల అప్పుడు.... అప్పుడే, ఒకటి లేక రెండు నిమిషాల ముందు....

45

అప్పుడు నాకొక పొద దొరికింది, దానిని నా చేతితో పట్టుకుని, తుపాకిని చాలా గట్టిగా పట్టుకున్నాను. దానిని ఉడుత యొక్క చాతివైపు గురిపెట్టి, తుపాకిని లాగాను. అయితే, దానికి ఒక అడుగు క్రింద నేను కాల్చాను. ఇంకొక గుండుని తీసుకుని వచ్చుటకు నేను లాగాను. కాని నేను.... తుపాకి ఖాళీగా ఉన్నది. నేను గుళ్ళు నింపుతూ, “అదక్కడే నిల్చుంటే నేను దాన్ని కొడతాను” అన్నాను. అయితే నేనది చేసిన తర్వాత ఉడుత ఆ అడవి గుండా పైకి వెళ్ళిపోయింది.

నేనక్కడ నిలబడి ఉండిపోయాను. “ఏంటి? వరుసగా మూడు సార్లు గురి తప్పింది, నూటపద్నాలుగులో నేను ఐదు సార్లే గురి తప్పాను” అని నేను అనుకున్నాను. “నా తుపాకి పనిచెయ్యకపోవటం, అదెలా జరుగగలదు?” అని నేననుకున్నాను.

46

సరిగ్గా అప్పుడే నాకు యిలా అనిపించింది, “ఆ ఉడుతను నువ్వు అలా కాల్చలేవు, అది అటు నుంచి రావాలి.” దేవుని వాక్యము పరిపూర్ణమైనది. దక్షిణము నుండి దానిని కాల్చలేను; అది ఉత్తరము వైపు నుండి వస్తుంది. “సరే, నేనిటు తిరిగి, అది వచ్చు వరకూ ఉత్తరము వైపు గమనిస్తాను” అని నేననుకున్నాను.

నేను తుపాకిలో యింకా గుళ్ళు నింపుకుని గమనించాను. కొంచెం... “అది వచ్చినట్లయితే, అది చాలా దగ్గరగా ఉంటుంది” అనుకున్నాను. దానిని దగ్గర నుంచి కాల్చడం నాకిష్టముండదు, అది వేట కాదు. అలా చేయ్యటం బాగుండదు. అందువలన ఒకరు... అక్కడున్న పొద. “సరే, దీనిని నేను ఉత్తరము నుండి పొందవలసియున్నది, ఎందుకంటే నేనలా పలికాను” అని నేననుకున్నాను. అందువలన, గమనిస్తూ నేనిటు నిల్చున్నాను.

అప్పుడు నేనన్నాను... నేను.... కొంచెం ఆలస్యమయ్యాను. “పావు తక్కువ నాలుగు. ఇప్పుడు, నాలుగు గంటలకు, నేను ఆ రెండింటితో వెళ్ళవలసియున్నది, ఎందుకంటే కుర్రాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు” అని నేననుకున్నాను. అలా నేను కొద్ది సేపు ఎదురుచూసాను. నాలుగయ్యింది, నాలుగు దాటి మూడు నిమిషాలు, “సరే, నేను వెళ్ళి, నా ఉడుతలు తెచ్చుకుంటానని” నేననుకున్నాను. నేను పైకి వెళ్ళి ఉడుతలు తెచ్చుకుని, తిరిగి వెనక్కి వచ్చాను. చాలా చీకటిగా ఉండటం వల్ల ఆ లోయలో నాకు ఎంత మాత్రం కనిపించుటలేదు.

47

నేను లోయ క్రిందికి బయలుదేరాను. నేను లోయ క్రిందకి వెళ్ళుచుండగా, అది చీకటిగా యుండెను. అంతకు ముందు నేను నిలబడియున్న చోటిని నేను దాటాను. “నీవక్కడికి వెళ్ళి ఆ ఉడుతను తైచ్చుకోవటం లేదా?” యని ఒకానొకటి నాతో అన్నది.

ఒక చిన్న టెలిస్కోపుతో (తుపాకి పై ఉండే దూరదర్శినీ - తర్జుమాదారుడు), గురిని నిశితంగా గుర్తించే ఒక చిన్న స్కోపుతో “ఇప్పుడు నేను దానినెలా చూడగలను” అని నేనన్నాను. నాకు కొన్ని అడుగుల ముందు చూడటానికి చాలినంత వెలుగు లేదు. “నేను దానినెలా చూడగలను?” అని నేనన్నాను.

“కాని మరొక్కటుందని నీవు పలికావు” అని ఆయన అనెను.

ఓ, ఏదో ఒక రకంగా నేను అది చేయగల్గితే బావుండునని నేననుకున్నాను. ఏదో ఒక విధంగా నేను... అదేమిటో చూసి... దానిని విని, స్నేహితులారా, దాని అసలు అర్థం ఏమిటో. చూడండి, ఆ అభిషేకము క్రింద, దానిని పలికినది నేను కాదు, దానిని పలికినది దేవుడే.

నేను యింకొక రెండడుగులు వేశాను. “తిరిగి మరలా ఉత్తరం వైపునకు వెళ్ళు. నీ ఉడుత అక్కడున్నది” యని చెప్పెను.

నేను వెళ్ళాను - తిరిగాను, “ప్రభువైన దేవా, లేశమాత్రమైనా నేను సందేహించను” అని నేనన్నాను. నేను మరలా తిరిగి ఉత్తరం వైపుకు నడవటం మొదలుపెట్టాను. దీనినెరిగిన వాళ్ళు యిక్కడ కూర్చుని యున్నారు, తిరిగి ఉత్తరం వైపునకు నడవటం మొదలుపెట్టాను. ఆ కొండ శిఖరమునకు పైన, యాభై లేక అరవై గజాల దూరంలో, ఒక ఉడుత చెట్టుపైకి వెళ్ళినది. దానిని నేను చూడటానికి కావల్సినంత వెలుగు మాత్రమే ఉన్నది. నేను నా స్కోపుతో చెట్టు పైనుంచి క్రింది వరకూ వెదికాను. నాకు ఏ ఉడుత కనిపించలేదు. కొద్ది సేపటి తర్వాత, చెట్టుకు బాగా పైన నేనొక ముడిని చూసినట్లు నాకనిపించినది. అంతా చీకటిగా ఉన్నది. “సరే, ఏమైనా నేను దానిని ప్రయత్నిస్తాను,” యని నేననుకున్నాను. అప్పుడు నేను కాల్చాను. నేను కాల్చినప్పుడు, ఒక ఉడుత చెట్టు చుట్టూ పరుగెత్తి క్రిందకి దిగినది. అది నేలను కొట్టుకొనుట నాకు వినబడినది. అది క్రిందకి దూకినదని నేననుకున్నాను. అదే సమయంలో నాకు యిరవై అడుగుల దూరంలో, ఒకటి వైట్ ఓక్ చెట్టు పైకి పరుగెత్తినది.“ ”ఒకటి క్రిందకి మరియు మరొకటి పైకి పరుగెత్తినవి“ అని నేనన్నాను. ప్రభువా, యిప్పుడు ఆ అభిషేకము క్రింద నేను దానిని పలికిన తర్వాత నిశ్చయంగా నీవు నన్ను దానిని పోగొట్టుకొననియ్యవు. నీవు నా పరిచర్యను స్థిరపరచుచున్నావు. దీనితో నీవు దానిని నాకు ఆరు సార్లు స్థిరపరచినట్లు, ఒక మనుష్యుని సంఖ్య ఆరు సార్లు” యని నేననుకున్నాను. “నీవు నన్ను దానిని పోగొట్టుకొననియ్యవు” అని నేనన్నాను.

48

నేను చెట్టు పైకి క్రిందకి చూశాను. ఆ పైన కొన్ని ఆకులు కనిపించాయని నేననుకున్నాను. దానిలో ఏదో కదలటం నేను చూశాను. నేను లేచి కాల్చాను. ఆ ఉడుత చచ్చి నేలరాలింది. ఆనందంతో, ఉత్సహించుచూ నేను కొండ పైకి వెళ్ళాను. నా ఎడమవైపునున్న మొదటి చెట్టు యొద్దకు నేను వెళ్ళగా, అక్కడ ఆ ఉడుత ఉన్నది. “సరే, అది నాకు దొరికిందని నాకు తెలుసు గాని, దీని గురించి నాకు నిశ్చయత లేదు,” అని నేననుకున్నాను. “అయితే, ప్రభువా, మంచి కొలతగా నీవు నాకు యింకొకటి ఇవ్వు” అని నేనన్నాను.

మరొక ఉడుతను కనుగొనుటకు నేను అక్కడకు వెళ్ళాను, అది అక్కడ లేదు. మరియు నేను చూచి, మరలా చూచి, ఆ ఆకుల క్రింద వెదికాను మరియు ముక్కలు చేయబడిన ఆ పాత మొద్దు యొక్క చిన్న చిన్న ముక్కలను పైకి లేపాను. అక్కడ అది లేదు, కాని ముప్పై అడుగుల లోపు ఒక మొద్దు పడియున్నది మరియు నేను దానిని ముక్కలుగా చేసితిని. ఆ లోపటంతా ప్రక్కలలో వెదికితిని మరియు ఆకులలో నా చేతులు పెట్టి అనుభూతి చెందితిని. అక్కడ, ఏ చోటను ఏ ఉడుతయూ లేదు.

ఆ పైన, ఆ కొండ పైన ఒక పెద్ద పాత మొద్దున్నది. నేను ఆ మొద్దు దగ్గరకి వెళ్ళగా, అక్కడొక చిన్న రంధ్రమున్నది. నేను ఆ లోపల తడిమినప్పుడు నా ఉడుత పైకి క్రిందకి కదిలినట్లు నాకనిపించినది. నేను. “సరే, నేను దానిని అందుకోలేను. కనుక ఉదయాన, నేను కుర్రాళ్ళను తీసుకొచ్చి దానిని తెచ్చుకుంటాను,” అని నేననుకున్నాను. నేను వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. నేను బ్రదర్ చార్లీ యొద్దకు వెళ్ళాను, ఆ రంధ్రమును మూసి, బ్రదర్ చార్లీ మరియు వాళ్ళ యొద్దకు వెళ్ళి, వారికి చెప్పాను.

49

ఆ రాత్రి భోజనానికి మేము వాళ్ళింటికి వెళ్ళాము. మేము ప్రభువు సన్నిదిలో ఆనందించుచుంటిమి. అప్పుడు నిద్రపోవుటకు ముందు, ప్రార్థనలో నడిపించమని బ్రదర్ చార్లీ ఆ వెనుక ఉన్న బ్రదర్ టోనీ జెబెల్ను అడిగాడు.

ఇప్పుడు, బ్రదర్ టోనీని వ్యతిరేకించడానికి గాని, గాయపరచడానికి గాని నేనిది చెప్పటం లేదు. నాకు తెలిసిన శ్రేష్టమైన క్రైస్తవ సభ్య జనులలో అతడొకరు. అయితే ప్రభువు ఎలా పనిచేయునో మీకు చూపించుటకు మాత్రమే. ఆ రాత్రి తన ప్రార్థనలో టోనీ, “ప్రభువైనా దేవా, మా సహోదరుడు మాకు నిజమే చెప్పాడని తెలియలాగున, అతడు రేపు ఆ మొద్దులో ఆ ఉడుతను కనుగొనును గాక” యని అన్నాడు.

అది నేనా మొద్దులో ఒక ఉడుతను కనుగొంటానని ఆ అభిషేకం క్రింద నేనెప్పుడు చెప్పలేదు. “నేనా ఉడుతను కాల్చాను” యని నేను చెప్పాను. అయితే, నేనా ఉడుతను దక్కించుకోలేదు. ఎందుకంటే నేను దానిని పొందితే, నేను పలికిన వాటికంటే ఎక్కువ పొందుకున్న వాడినగుదును. సరిగ్గా నేను ఆ అభిషేకము క్రింద పలికినదే, దేవుడు అదే ఉత్పత్తి చేసెను. కనుక నేను దానిని గురించి ఏమీ అనలేదు.

చూడండి, “బ్రదర్ బ్రెన్హాం ఇలా చెప్పారు” యని ఇలాగే జనం అనేక సార్లు అంటున్నారు. బ్రదర్ బ్రెన్హాం ఎమయినా చెప్పినప్పుడు, దానితో చేయుటకు ఎమియు కలిగి ఉండదు, అయితే దేవుడు దానిని పలికినప్పుడు, అది నిరంతరము సత్యము.

అయితే బ్రదర్ టోనీకి అది అర్థం కాలేదు. “ఆ ఉడుత అక్కడుంటే, అప్పుడు మా సహోదరుడు మాకు నిజం చెప్పాడని మాకు తెలియును” యని అతడన్నాడు.

50

బ్రదర్ వుడ్స్, బ్రదర్ చార్లీ, వారందరూ దానిని పట్టుకున్నారు. మేమేమీ అనలేదు. ఆ రాత్రి నేను బ్రదర్ టోనీతో పాటు నిద్రపోయాను. మరుసటి రోజు బల్లయొద్ద, దాని గురించి మేము మాట్లాడుకుంటిమి. ఓ, అదొక భయంకరమైన రోజు. అంతట, “సరే, ఒక సంగతున్నది. బహుశా బ్రదర్ బ్రెన్హాం ఈ ఉదయం తన దానిని ఆ మొద్దులోంచి తెచ్చుకుంటాడేమో ఆ చెట్టులోంచీ,” యని బ్రదర్ టోనీ అన్నాడు.

“బ్రదర్ టోనీ, ఆ ఉడుత ఆ లోపల ఉన్నదని నేనెప్పుడు అనలేదు. నేను దానిని తడిమినప్పుడు నాకలా అనిపించిందని నేను చెప్పాను. అది పైకి లేచినప్పుడు, అది క్రింద పడుచుండెను,” యని నేనన్నాను.

“అది అక్కడే ఉంటుంది. అది సరిగ్గా ఆ మొద్దులో ఉంటుంది,” యని అతడన్నాడు.

మేము పైకి వెళ్ళాము. నేను కారును విడిచినప్పుడు, ఏదో తప్పున్నదంటూ మరలా వెనక్కి బయలుదేరాను, టోనీకి నేనిప్పుడే చెప్పడం మంచిది. ఎందుకంటే, ఆ ఉడుత ఆ రంధ్రములో ఆ మొద్దులో లేకపోతే, నేను ఏ ఉడుతా లేకుండా తిరిగొస్తే, అప్పుడు గత రాత్రి అతడు ప్రార్థన చేసిన తీరును బట్టి, నేను అబద్ధం చెప్పాననే అతడింకా నమ్ముతాడు. “దేవా, నా బైబిలుతో, నేను నిజాయితీగా నిజమే చెప్పానని నీవెరుగుదువు,” యని నేనన్నాను. మరియు అది నిజమని దేవుడెరుగును, నిజము మాత్రమే చెప్పాను.

51

అయితే నేను కొనసాగిపోయాను. ఏదో నన్ను అలా నడిపించింది. నేను వేటాడుతూ ఆ అడవి గుండా నడుచుకుంటూ వెళ్ళాను. “ఆ ఉడుత అక్కడ లేకపోతే ఎలా” యని నేనాలోచిస్తున్నాను. నేను యింకా పెద్ద రంద్రము చేసి దానిని తీసికొనునట్లు అతడు తన వేట-కత్తిని నాకు యిచ్చి యుండెను.

“అదక్కడ ఉంటే ఎంత, లేకపోతే ఎంత, దాని వల్ల కలుగు భేదమేమిటి?” యని నాతో ఏదో చెప్పినది.

“అతడు నన్ను నమ్మడు, అతడు ప్రార్థన చేసి, మేము ఉడుతను కనుగొంటే, మా సహోదరుడు మాకు నిజమే చెప్పాడని నేను తెలిసికుందును, అన్నాడు,” యని నేనన్నాను.

అంతట ఆ గొప్ప అభిషేకము వచ్చినది, “ఆ ఉడుత అక్కడుంటుందనీ, నీవు దానిని పొందుతావనీ పలుకు చాలు” యనెను.

“నిశ్చయంగా ప్రభువా, నిశ్చయంగా, దీనితో ఆ అభిషేకము వరుసగా ఏడు సార్లు నా మీదికి వచ్చినది,” యని నేననుకున్నాను. “అది నీవేనా?” యని నేనన్నాను.

“నీవు ఏమి పలుకుదువో పలుకు!” యని ఆయన అనెను.

“నేనా ఉడుతను కనుగొందును” యని నేనన్నాను. ఆ అభిషేకము నన్ను విడిచిపెట్టినది.

52

నేను తొమ్మిదిన్నర వరకూ వేటాడాను. మేము క్రిందికి వస్తూ కొన్ని కుక్కలను తెచ్చుకోవలసియుండెను. అప్పుడు అవేయని వారనుకున్నారు. అప్పుడు తొమ్మిదిన్నరకు నేను కొండపైకి వెళ్ళి, ఆ రంధ్రమును చూసి, చుట్టూ తడిమి, తొలిచితిని. ఆ రంధ్రములో ఏ ఉడుతా లేదు. నేను చుట్టూ అంతా వేదికాను. ఇప్పుడు, నా చేతికొస్తున్నవి పదునైన చిన్న గడ్డి వేర్లు, నేను దానిని పైకి లాగి తడిమి, కర్రతో దానిని యిలా పైకి లాగినప్పుడు, అది కర్రపై నుండి జారిపోవుచుండెను. నేను ఉడుతను లాగుతుంటే అది కర్రపై నుండి జారిపోతుందని నేననుకున్నాను, కాని అవి చిన్న వేర్లు మరియు అలాంటివి: లోపల ఉడుత లేదు.

“ఇప్పుడు, నేనేం చేస్తాను?” అని నేననుకున్నాను. “ఇదుగో, తొమ్మిదిన్నరయ్యింది, నేను తిరిగి వెళ్ళాలి” అని నేనన్నాను. నేను నా తుపాకి తీసుకొని కొండ క్రిందకు బయలుదేరాను.

“నీవు ఉడుతను కనుగొందువని నీవు చెప్పలేదా?” యని ఒకటి అడిగినది.

“అది నాకెక్కడ దొరుకుతుంది?” యని నేనన్నాను.

53

ఇక్కడున్న ఆయన వాక్యముతో, దేవుడే నా యధార్థ తీర్పరి, ఈ ప్రసంగ పీఠంపై నిలబడుచున్న నేను సువార్త బోధకుడనైన యాభై యేళ్ళ మనుష్యుడను, “ఆ చిన్న బెరడు క్రింద చూడుయని” ఒకానొకటి చెప్పినది.

“ప్రభువా, నేను నిన్ను అనవసరంగా సందేహించనుయని” నేనంటిని. నేను నడిచి వెళ్ళి ఆ బెరడును తీసాను, అక్కడ ఏ ఉడుతా లేదు. “నేను నేననుకున్నాను, నేను...

అయితే నేనది చేయక కొంచెం ముందు, ఒకటి, “అదక్కడ లేకపోతే?” అన్నది.

“ఓ, అదక్కడుంటుంది” అని నేనన్నాను. నేను దానిని పైకెత్తగా అక్కడ ఏ ఉడుతా లేదు. నేను ఆశ్చర్యంతో క్రిందకి చూశాను. ఒక ఆకు క్రింద నుండి ఒక చిన్న బూడిద రంగు వస్తువు నాకు అగుపడింది. నేను దానిని పైకి లేపగా, ఆ ఉడుత అక్కడున్నది, సరిగ్గా ఆయన చెప్పినట్లు దానిని జరిగించెను.

54

నేను కొండ క్రిందికి వెళ్ళి వారికి దానిని గురించి చెప్పాను. మేము ఆనందించాము. కాగా నేను కారు దగ్గరికి వెళ్ళేసరికి, చార్లీ అక్కడే నిలబడియున్నాడు, బ్యాంక్స్ కూడా, వారు మాట్లాడుకుంటున్నారు. “అతడు బ్రదర్ బ్రెన్హాంని అంతగా ప్రేమించినప్పటికి, తన ప్రార్థనలో టోనీ అలాంటి మాట అనటం ఆశ్చర్యం కాదా? అతడు ఆయన మాటను సందేహించి, ఎందుకు అలా అన్నాడు?” చూశారా. అతడు అలా అనవలసియుండెను, ఎందుకంటే ఈ ఉదయం నేను ఈ ప్రసంగ పీఠం యొద్ద నిలబడి అదే విషయాన్ని నిజమని చెప్తానని దేవుడెరిగియుండెను.

మనిషి చెప్పిన దానిని, ఆపై దేవుడు చెప్పిన దానిని మీరు గమనించవలసియున్నది. దేవుడు చెప్పినది సత్యము.

అప్పుడు, “మంచిది, దేవునికి స్తోత్రము కలుగును గాకయని” నేననుకున్నాను. మరియు నేను క్రిందికి వెళ్ళాను. మేము గొప్ప సమయమును కలిగియుంటిమి, ఇ౦టికి తిరిగి వచ్చాము.

55

బ్రదర్ జార్జ్ రైట్, యేళ్ళ తరబడి సంస్కారపు ద్రాక్షారసము తయారు చేసెను. (నేను ముగిస్తున్నాను), సంఘమునకు సంస్కారపు ద్రాక్షారసము చేసెను. (ఆ వెనుక నున్న) బ్రదర్ రాయ్ రాబర్సన్ నన్ను పిలిచి, “బ్రదర్ బ్రెన్హాం, మనం క్రిందికి వెళ్ళి బ్రదర్ రైట్ యొద్ద నుండి సంస్కారపు ద్రాక్షారసం తీసుకొద్దాం” అన్నాడు. అతడు యిప్పుడు యిక్కడ కూర్చోని యున్నాడు, అతడు మరియు అతని కుటుంబము.

ఇప్పుడు మనము ముగిస్తుండగా, దీనిని శ్రద్దగా వినండి. ఓ దేవా. మేము ఉదయాన్నే బ్రదర్ రైట్ యింటికి వెళ్ళాము, యదావిధిగా, ఒక పెద్ద ఆహ్వానమే. అంతట మేము ద్రాక్షారసమును గురించి మాట్లాడుకున్నాము. మరియు అక్కడ కూర్చుని యున్న ఆ చిన్న అవిటి అమ్మాయి, ఆ చిన్న ఎడిత్, ఆమెను నేను ప్రేమింతును, ఈ టేబర్నికల్ యొద్ద మనమందరమూ ప్రేమించినట్లుగానే (నేను మాత్రమే కాదు, టేబర్నికల్ కూడా). ఆమె మన సొంత సహోదరియైనట్లు, రైట్ కుటుంబము అత్యంత పురాతన కుటుంబముగా వున్నది. ఇక్కడున్న స్లాటర్ కుటుంబీకులు, వారిలో ఒకరు, రాయ్ స్లాటర్ మొదలగు వారు. మరియు రైట్ కుటుంబీకులు లేక శ్రీమతి స్పెన్సర్ - వారు టెబర్నికల్లో ఉన్న వారిలో అత్యంత పాత వారిలో ఒకరు. రైట్ కుటుంబీకులు యిరవై-ఐదు, లేక యిరవై-ఆరు సంవత్సరాలుగా యిక్కడికి వస్తున్నారని నేననుకుంటున్నాను.

56

ఆ చిన్న పిల్ల కోసం చాలా ప్రార్ధన చేశాను. దేవుడామెను స్వస్థపరచగా చూచుటకు నేను ప్రార్థన చేసితిని. కాగా ఆమె వ్యాధి కంటే గొప్పవి స్వస్థపరచబడుట నేను చూసితిని. ఆ చిన్న పిల్ల స్వస్థత కొరకు, నేను ఉపవాసముండి, ప్రార్థన చేసి, కన్నీళ్ళతో ప్రభువును వేడుకొని ఆరాటపడితిని. ఆమె యింకా ఒక శిశువుగా ఉండగానే ఆమె వ్యాధిగ్రస్తురాలయ్యెను. ఆమె చేతులనూ కాళ్ళనూ లాగివేసినది, బహుశా శిశు పక్షవాతము కావచ్చును.

ఆమె చాలా సంవత్సరాలు బాధపడినది. మేము ఆమెకు మొదటి సారి ప్రార్థన చేసినప్పుడు, ఆమె బాధపడుట అగిపోయినది. అది ఇరవై-ఆరు సంవత్సరాల క్రితం. ఆమెకు కడుపు నొప్పి లేక పంటి నొప్పి వచ్చినప్పుడు, నేనామెకు ప్రార్థన చేయుటకు వెళ్ళగానే, ప్రభువు దానిని తీసుకొనునని నేనెరుగుదును.

కాని ఆ శ్రమ. ఆమె యీ భవనంలో కూర్చునియుండగా యితర అవిటి వారూ, వ్యాధిగ్రస్తులూ మొదలగువారు లేచి నడిచి వెళ్ళిపోవుచుండగా నేను చూసి, “ఆ చిన్నపిల్ల నడవదేమి? ప్రభువా, ఆమెను దర్శించుము, ఆ వెలుగు యొక్క దూత ఆ బిడ్డపై కమ్ముకొననిమ్ము అప్పుడు, 'యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని' నేను చెప్పగలను అనుకొంటిని.” అది నా వలనయితే, నేను దానిని పలుకుదును, కాని అది నా యిష్టము కాదు. అది ఆయన యిష్టము.

57

నేను దానిని గమనించాను. అంతట మేము తిరిగి వచ్చితిమి; ఆమె కుందేలు కావాలన్నది. బ్రదర్ వుడ్ మరియు నేను బయటికెళ్ళి రెండు కుందేళ్ళను చంపి, ఆమె కొరకు వెనక్కి తెచ్చితిమి. శ్రీమతి. రైట్ మరియు వారు. ఆమె కొరకు భోజనము సిద్ధపరచిరి.

మరియు ఆ సమయములో, సిస్టర్ హ్యాటీ మోజియర్, ఆమె ఈ మధ్యనే తన భర్తను కోల్పోయినది. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఆ జంటకు పెళ్ళి చేశాను. వారికి యిద్దరు చక్కని పిల్లలున్నారు, మరియు బ్రదర్ వాట్ చంపబడ్డాడు. అతని సొంత కుమారుడే నలుగగొట్టబడి చనిపోయిన అతడిని తన ట్రాక్టర్ క్రింద కనుగొన్నాడు. మరియు ఆ చిన్న బాలునికి ఏదో విరుగగా అతనికేదో సంభవించినది. అతని తల్లియూ అతని అంకుల్ అతనితో వుండగా, నేనూ బ్రదర్ వుడ్స్ ఒక రాత్రి అక్కడికి వెళ్ళి ఆ రాత్రి అక్కడే వుంటిమి. ప్రభువు అతని స్వస్థపరచెను, ఈ ఉదయం అతడిక్కడ కూర్చొనియున్నాడు.

అతని తల్లికి అతనియందు ఆసక్తి కలిగియుండెను, పదిహేనేళ్ళు, అలాంటి యవ్వనప్రయాములో వుండి అప్పుడే లోకములో తిరుగుట ప్రారంభించెను. అతని తమ్ముడు పన్నెండు లేక పదమూడేళ్ళ వాడగుచుండెను.

58

సిస్టర్ హ్యాటీరైట్... మీ అందరికీ తెలుసు... మనమామెను రైట్ అంటాము, ఆమె పేరు మోజియర్. కాని ఆమె చాలా నమ్మకస్తురాలిగా యుండెను. ఒక చిన్న వృద్ధ గృహిణి, ఆ పైన కొండలలో రెండు గదులలో నివసించుచున్నది. ఆమె, తన చిన్న కుటుంబమంతా కలిసి ఒకే దగ్గర ఉండుటకై బయట గడ్డపారతో త్రవ్వుచూ, బయట ఉన్న ఆ జొన్న పొలములో పల్లెరు కాయలను (కలుపు తీయుట) త్రవ్వుటకు ప్రయత్నించుచున్నది. ఆమె విశ్వాసముతో పనిచేయుచున్నది.

నేను బల్లయొద్ద కూర్చొని తినుచుండగా, విశ్వాసమనగా ఏమిటో నేను వివరించుచుంటిని. “కాగా విశ్వాసమిలా ఉంటుంది: బ్రదర్ షెల్బి యిలా కూర్చున్నట్లు నేనొక దర్శనం చూస్తేయని” నేనన్నాను.

సిస్టర్ హ్యాటీ బాగా వెనుక వేరొక గది వైపు కూర్చొనియున్నది. చెప్పడానికి ఆమె యొద్ద పెద్దగా ఏమీలేదు, ఎప్పుడూ మాట్లాడదు.

59

అంతట మేము మాట్లాడుకుంటుండగా, “ఒకటి జరుగవలసియున్నదని ప్రభువు నాకొక దర్శనము చూపిస్తే, అంతట నేను దానిని చెప్పుదును, చెప్పగలను. అదే నా విశ్వాసమును పెంచునదియని” నేనంటిని. “జరుగబోవు దానిని ప్రభువు నాకు చూపించినప్పుడు నాకు విశ్వాసము కలుగును. అది అలాగే జరుగబోవుచున్నదియని” నేనంటిని.

ఆయన నాకు చూపించినప్పుడు, “ఆ చిన్న వ్యాధిగ్రస్తురాలైన బాలిక అక్కడ కూర్చొనియుండగా, ఆమె స్వస్థపరచబడబోవుచున్నట్లు ప్రభువు నాకు చూపించినట్లయితే, నేను నేరుగా యిక్కడికొస్తాను. నేను తిన్నగా యిక్కడికొచ్చి ఈ త్రోవలో నిలబడి, అంతా కచ్చితంగా ఆయన చెప్పినట్లుగా ఉన్నదా అని చూస్తాను. ఆ తర్వాత, ”యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు, ఎడిత్, లేచి నడువు“ అంటాను. ”ఒక వేళ అది అలా వచ్చినట్లయితే, ఆ చిన్న కాళ్ళు ముడుతలు విడుచుటనూ, ఆ చిన్న చేతులు ముడుతలు విడుచుటనూ మీరు చూస్తారు. ఆమె అక్కడి నుండి లేచి దేవుని మహిమకై నడచునుయని“ నేనన్నాను.

60

ఈ అనుభవం గురించి నేను వారికి చెప్పుచుంటిని “మీకు తెలుసా.... నేను మిమ్మల్ని ఒకటి అడుగగోరుచున్నానుయని” నేనన్నాను. ఆ బల్ల యొద్ద బ్రదర్ బ్యాంక్స వుడ్ నా ప్రక్కను కూర్చొనియున్నాడు. ఆ ప్రక్కన, బాగా వెనుక వైపు సిస్టర్ హ్యాటీ కూర్చొనియుండెను. బాలురు యిక్కడ కూర్చొని యుండిరి, యింకా శ్రీమతి రైట్, శ్రీ రైట్, షెల్చి నా వెనుక వైపు కూర్చొనియుండెను.

ఇప్పుడు, వినండి. దీనిని తప్పిపోవద్దు. దేవుని యొక్క సార్వభౌమత్వము మీకు చూపించును. మేము మాట్లాడుచుండగా, “నేను మిమ్మల్ని ఒకటి అడుగగోరుచున్నాను. అక్కడ ఆ ఉడుతలను ఉంచినదేమిటి? అడవిలో ఉడుతలు లేవు. నేను వేటాడి యుంటిని. నేను అత్యుత్తమ వేటగాడినైతే కాదు, కాని నేనొక చిన్న బాలుడిగా ఉన్ననాటినుండి వేటాడుచుంటిని, నేను చాలా సమీపముగా వేటాడాను, అయితే నేను పిలువగలినంత అసాధారణమైన రీతిగా, అత్యంత అసాధారణమైన చోట అవి యుండినవియని నేనన్నాను. ”వాటినక్కడ ఉంచినదేమిటని“ నేనన్నాను. అబ్రహామునకు తన వాగ్దానమును స్థిరపరచిన రీతిగా, అబ్రహాము యొక్క దేవుడు తన వాగ్దానమును స్థిరపరచుచున్నాడేమో, నా పరిచర్య మార్పునొందబోవుచున్నదేమోయని నేననుకుంటున్నానుయని” నేనన్నాను.

61

“తన కుమారునికి మారుగా అతని కొక బలి అవసరమైనప్పుడు, పర్వతము పై యెహోవా-యీరే ఒక అద్భుతమును చేసి ఒక వంద మైళ్ళ వెనుక ఒక పొట్టేలునుంచెను. అతడు మూడు దినములు ప్రయాణమందుండెను. సాధారణ మనుష్యుడెవరైనా రోజుకు యిరవై-ఐదు మైళ్ళు నడవగలడు. అతడు తన కన్నులెత్తి దూరాన ఆ పర్వతమును చూశాడు. అప్పుడు పర్వతమునొద్దకు వెళ్ళి, పర్వతము పైకి వెళ్ళాడు. పొట్టేలును, ఒక గొర్రెను, ఆ వెనుక, అడవి జంతువులు చంపియుండెడివి. ఇంకా, నీళ్ళు లేని ఆ పర్వత శిఖరము మీద, ఆ పొట్టేలు ఆ పైకి ఎలా వెళ్ళింది. ఏమయ్యింది? తాను యెహోవా-యీరేనని అబ్రహామునకు రుజువు చేయుటకై దేవునికొక బలి అవసరమయ్యెను. సృష్టి యొక్క అదే దేవుడు ఆ పొట్టేలును ఉనికిలోనికి పలికెను. ఇప్పుడు, అదొక దర్శనము కాదు. అతడు పొట్టేలును చంపగా, ఆ జంతువు నుండి రక్తము బయటకి వచ్చెను. అదొక దర్శనము కాదు. అదొక పొట్టేలు” అని నేనన్నాను.

హల్లెలూయా! అదే దేవుడు. “పర్వతము మీద అబ్రహాముతో యెహోవా-యీరే అయిన ఆయన ఈ రోజూ అంతే యెహోవా-యీరే అయ్యున్నాడు” యని నేనన్నాను. తన మహిమకై యింకా ఆయనొక జంతువును పుట్టించగలడు. ఈ ఉడుతలు ఒక దర్శనము కాదు. నేను వాటిని కాల్చాను; వాటి నుండి రక్తము బయటకి వచ్చినది. నేను వాటిని వండి తిన్నాను. అవి దర్శనములు కావు; అవి ఉడుతలు.

62

నా మతి యొక్క మొద్దుబారిన తనమునందునూ, మందత్వమునందునూ తన వాగ్దానమును నా యొద్దకు తెచ్చుటకై ప్రయత్నించుచూ, అబ్రహాము యొక్క అవసరమును ఉనికిలోనికి పలికినట్లుగానే నా అవసరమునూ ఉనికిలోనికి పలుకగలడుయని“ నేనన్నాను

అది నేను చెప్పగానే, ఇప్పుడు అక్కడ కూర్చొని ఏడ్చుచున్న సిస్టర్ హ్యాటీ.... ఒక్క మాట పలుక లేదు. అంతట ఆమె, “అది నిజం తప్ప మరేదీ కాదు” అన్నది.

ఆమె సరియైన మాట పలికినది. అక్కడ బ్యాంక్స్ అన్నట్లుగానే ఆమె కూడా సరియైన మాట అన్నది. అది నా చెవుల మీది నుండి పై అరణ్యములోనికి ధ్వనిస్తున్నట్లుగా వున్న ఆమె స్వరమును నేను విన్నాను. తన చిన్నమ్మాయితో అక్కడ కూర్చొని యున్న శ్రీమతి. రైట్, ఎడిత్ చెప్పిన దానికి అర్థం చెప్పుటకు ప్రయత్నించుచుండెను. శ్రీమతి. రైట్, నేను వినలేకపోతిని.

అప్పుడు ఆ అతీతమైన అభిషేకం నాపై వీచినది, “ఆమె దేవుని దృష్టిలో దయ పొందినదని హ్యాటీతో చెప్పు” అనెను. ఎవరు అనుకొని వుంటారు. “ఆమె ఏది కోరితే అది అడగమని చెప్పు, అంతట ఈ వరముచేత నీవు దానిని ఉనికిలోనికి పలుకు. ఆమె ఏది అడిగినా దానిని ఉనికిలోనికి పలుకు” అని చెప్పెను.

నేను సిస్టర్ హ్యాటీని చూశాను. ఒక మానవుని పై అది మొట్టమొదటి సారి ప్రదర్శించబడుట. “సిస్టర్ హ్యాటీ, నీకేది కావాలో అడుగు. దేవుడు నీకది అనుగ్రహింపబోవుచున్నాడు,” అని నేనన్నాను.

63

దాని గురించి మీరేమనుకుంటున్నారు? అది మీ లోపలికి వెళ్ళుచున్నదా? ఒక జంతువు చేత ఏడూ సార్లు ఆయన దానిని రుజువు చేసెను. ఏడూ దేవుని యొక్క పరిపూర్ణ సంఖ్య ఇక్కడ ఒక మనిషి మీద మొట్టమొదటి సారి జరుగుచున్నది. అయితే ఆయన ఎన్నుకొనినదేమిటి? ఒక గొప్ప వ్యక్తినా? ఒక పేరున్న సేవకుడినా? తన పేరు కూడా సరిగ్గా రాయలేని ఒక దీన అల్ప విధవరాలిని. ఆయనేమి చేస్తున్నాడో దేవునికి తెలుసు. “నీవేమి కోరుదువో అడుగుము” అన్నాను.

హ్యాటీ, “బ్రదర్ బ్రెన్హాం, నీ ఉద్దేశ్యమేమిటి?” యన్నది.

“పరలోకము యొక్క ప్రభువైన దేవుడు బదులిచ్చువాడనీ, మరియు ఆయన యొక్క లేఖనములు సత్యములనీ నీవు తెలిసికొనులాగున, నీ హృదయం కోరునది ఏదైనా అడుగుము, సరిగ్గా యిక్కడే అది నీ కోరిక ఉత్పత్తి చేయబడును” యని నేనన్నాను. ఈ క్రొత్త వరముతో నా మొదటి సారి, నా మొదటి అభిషేకము.... నాకు ఆమె మాటలు వినబడుటలేదు.

ఆమె చుట్టూ చూసింది. ఆమె యొక్క అవిటి చెల్లెలి గురించి మేము మాట్లాడుచుంటిమి. “ఓ, సందేహించవద్దు, కొద్ది నిముషాల్లో చిన్న ఎడిత్ దేవునికి మహిమ కలుగునట్లు గంతులు వేయునని” నా మనస్సులో నేననుకున్నాను.

హ్యాటీ, చుట్టూ చూసింది, అంతా చూసింది. అప్పుడామె, “బ్రదర్ బిల్, నా అతి గొప్ప కోరిక - నా యిద్దరబ్బాయిల రక్షణను గూర్చినదియే.”

64

ఎందుకు, అంతకంటే గొప్ప సంగతి అడిగియుంటే ఆమె దానిని పొందియుండెడిది. ఆమె పది వేల డాలర్లు గురించి అడిగియుండినట్లయినచో ఆమె పొందియుండెడిది. అది ఒక కోటీశ్వరుడయ్యుంటే మరొక కోటి అడిగేవాడు కాదా? ఆమె దేనిని అడుగబోవుచున్నదో దేవుడు ఎరిగియున్నాడు.

అక్కడ నిలబడి యున్న కనీసం ఏడుగురు లేక ఎనిమిది మంది సాక్షులతో సిస్టర్ హ్యాటీ, అది జరిగినప్పుడు అక్కడ నిలబడియున్న మీరందరూ మీ చేతిని పై కెత్తండి. అది జరిగినప్పుడు, భవనంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు. వారు ఏడుగురు, ఎనిమిది మంది. అది జరిగినప్పుడు వారిలో ఎనిమిది మంది వున్నారు.

“నీకు కావలసినదేదైనా అడుగుము, ఎందుకంటే నీకు కావల్సినదేదైనా నీకిమ్మని దేవుడు నాకు యిచ్చి యున్నాడు” యని నేనన్నాను.

తన కుమారులు యవ్వనప్రాయపు అతిశయంలో ప్రక్కకు వెళ్ళిపోవుచున్నారని ఆమె చెప్పెను. అంతట, “నా యిద్దరు కుమారుల రక్షణ” అని ఆమె అన్నది.

“దేవుని చిత్తమువలన, దేవుని శక్తి చేత, యేసుక్రీస్తు నామములో నీ హృదయ వాంఛను నేను నీకు యిస్తున్నానని” నేనన్నాను. అంతట ఆమె యిద్దరు కుమారులూ దేవుని యొక్క శక్తి క్రింద వణికిరి. ఆ భవనమంతా వణికినది. బ్యాంక్స్ తన ప్లేట్లోనికి పడ్డాడు. షెల్బీ గట్టిగా పట్టుకున్నాడు. రెండు వీధుల ఆవల నుండి మీరు వినగల్గినంత గట్టిగా హ్యాటీ అరచినది. కన్నీళ్ళ వారి చెంపలపై కారుచుండగా, ఆ యిద్దరు బాలురూ వారడిగిన దానిని సరిగ్గా అప్పుడే పొందిరి.

ఓ, అది ఒక మానవుని పై మొట్ట మొదటి సారి ఉపయోగించబడుట. “నీవు దేనిని అడుగుదువో అది అడుగుము, అది నీకు అనుగ్రహింపబడును.” ఈ ఉదయం ఆమె కుమారులు ఆమెతో అక్కడ కూర్చొనియున్నారు.

65

ఆమె ఏమి అడిగియుండెడిది? ఆమె తన చెల్లిలి స్వస్థత నడిగితే ఏమైయుండును? ఆమె దాని నడిగినట్లయితే ఏమిటి? ఆ చిన్న పిల్ల స్వస్థపరచబడియుండును, కాని ఆమె కుమారులు తప్పిపోయి యుందురు. ఒక క్రొత్త సంఘము నిర్మించుటకు ప్రయత్నించుటలో సహాయము చేయుటకు, ప్రతిజ్ఞను బట్టి ఈ సంఘమునకు యాభై డాలర్లు యిచ్చుటకు ప్రయత్నించినట్లు ఆ పేద విధవరాలు యిప్పుడే నాకు చెప్పినది. అయితే బ్రదర్ రాబర్సన్ దానిని తీసికొనక అందులో యిరవై మాత్రమే ఆమెను యివ్వనిచ్చెను.

ఆమె నాతో మాట్లాడుచుండగా, “ఆ యిరవై నేను తిరిగి ఆమెకు యిచ్చేస్తాను” అని నాలో నేను అనుకున్నాను.

అయితే దర్శనం ద్వారా కాదు గాని, దేవుడు, నా హృదయంలో, నాతో ఇలా అనెను, “పదుల లక్షల డాలర్లు పడియున్న ఆ చోట ఒక విధవరాలు మూడు కాసులు వేయుచుండగా, యేసు అక్కడ నిలబడి చూచుచుండెను, నీవేమి చేసియుండెడివాడవు.”

“సరి, నేనక్కడ నిలబడియున్నట్లయితే, సహోదరి, మాకది అక్కర్లేదు, మా యొద్ద చాలా డబ్బున్నది అనేవాడిని” యని నేనన్నాను.

కాని యేసు ఎన్నడూ అలా అనలేదు. ఆయన ఆమెను దానిని చేయనిచ్చెను, ఏలయనగా ఆ మార్గములో ఏమి రాబోవుచున్నదో ఆయన ఎరిగియుండెను. దేవుడే నాకు యధార్థ తీర్పరి, అందువలన నాకు సహాయము చేయుము, ఆమెకు అది రాబోవుచున్నదని దేవుడెరిగియుండెను.

66

ఆమె యిరవై డాలర్లు ఆమెకు తిరిగి యివ్వాలని, నేను నా చేతిని నా జేబులో పెట్టి, “సిస్టర్ హ్యాటీ, అనబోవు చుండగా..”

అయితే ఆయన “అలా చేయవద్దు” అని చెప్పెను.

ఆ తర్వాత కొద్ది నిమిషాలలో, యెహోవా-యీరేను గూర్చిన ఆ ప్రశ్న తీసుకొనివచ్చినప్పుడు, “అది సత్యము తప్ప వేరేమి కాదు” అని ఆమె అన్నది. కాగా అది ఒక పేద విధవరాలి హృదయం నుండి వచ్చినది, చేయగలిగిన అత్యంత గొప్ప దానిని ఆమె అడుగునని దేవుడెరిగియుండెను.

పరలోకమున్నంత కాలమూ, నక్షత్రములు గతించిపోయినప్పుడు, చంద్రుడు యిక లేకపోయినప్పుడు, భూమి యిక లేక పోయినప్పుడు, సముద్రము యిక లేక పోయినప్పుడు, అమర్త్యమైన ఆ వాగ్దానము నిచ్చిన అదే యెహోవా-యీరేతో ఆ బాలురు నిత్యత్వమందు నివసించుదురు. ఆయన వాగ్దానములు విఫలము కానేరవు.

శాన్-జోస్ లో జరుగనైయున్న ఆ కూటము కొరకు నేను ఎదురుచూస్తున్నాను. ఓ, యిది అలా ముందుకు వచ్చును!

ఇప్పుడు, ఆ అభిషేకము తాకినప్పుడు, “నీవు కోరినది అడుగు.” అది తాకినప్పుడు, అడుగుట కొరకై దేవుడు ఉంచినది ఏదైనా, అది కచ్చితంగా అలాగే యుండునని నాకు పరిపూర్ణమైన నిశ్చయత వున్నది. అది అలా ఉండవలసియున్నది, “ఏలయనగా నీవు ఈ పర్వతముతో చెప్పినట్లయితే.” చూడండి, పలుకుచున్నది నీవు కాదు. అది నీవు కాదు; అది దేవుడు. అది దేవునికి యెంతగానో సమర్పించుకొని యున్న నీవు.

67

ఇప్పుడు మనం ముగిస్తుండగా పాత కాలం నాటి ప్రవక్తలను గమనించండి. పాత కాలం నాటి ఆ ప్రవక్తలు ప్రభువైన యేసు రాకడను వారు చూసినప్పుడు, వారెంతగా ఆత్మవశులైరనగా, అది తామే అన్నట్లు వారు పలికిరి.

22వ క్రీర్తనలో “నా దేవా, నా దేవా, నన్నెందుకు విడనాడితివి?” యని మొరపెట్టుచున్న దావీదును చూడండి. దావీదు కాదు, అది ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత క్రీస్తు అయి వున్నాడు. “నా ఎముకలన్నీ నన్ను తేరి చూచుచున్నవి. తమ పెదవులతో వారు నన్ను పొడుచుచున్నారు. వారు తమ తల ఆడించుచున్నారు.” “అతడు యితరులను రక్షించెను గాని, తననుతాను రక్షించు కొనలేకపోయె” ననిరి. అది తానే అయినట్లు దావీదు మాట్లాడుచున్నాడు, కాని అది అతని యందున్న దేవుని ఆత్మ మాట్లాడుచున్న క్రీస్తు.

ఓ, తన శక్తి యొక్క సంపూర్ణత యందు తన సంఘములోనికి, తన ప్రజల మధ్యకూ ప్రవేశిస్తూ తన గొప్ప కరుణా రెక్కలను బయటికి చాచిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన స్తుతింపబడును గాక.

68

నా ప్రసంగమునకై నా యొద్ద సమయము లేదు. ఒక క్షణం మన తలలు వంచుదాం. ఈ సమయమందు దేవుని ఎదుర్కొనుటకు మేము సిద్ధంగా లేమని ఎరిగిన వారొకరైనా, లేక ఎంతమంది ఈ ఉదయం యిక్కడున్నారు? మీరు మీ చేతులను పైకెత్తి, “బ్రదర్ బ్రెన్హాం, నా కొరకు ప్రార్థించు,” అనగలరా. మిమ్మల్ని మేము బలిపీఠము యొద్దకు తీసికొనిరాలేము, ఏలయనగా బలిపీఠములు నిండిపోయియున్నవి. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక; సహోదరీ నిన్నునూ; సహోదరుడా నిన్ను నిన్నూ; ఆ వెనుక వున్న నిన్నూ; చుట్టూ అందర్నీ; యవ్వన స్త్రీ నిన్నూ; నా సహోదరుడా నిన్నూ; బాగా వెనుక, ఆ వెనుక; చుట్టూ అందర్నీ; దేవుడు, మీ చేతులను చూచును.

ఏ పొట్టేలూ లేని చోట ఆయనొక పొట్టేలును ఉనికి లోనికి తీసుకువచ్చినప్పుడు, జంతువులను ఆయన ఉనికిలోనికి తీసుకువచ్చినప్పుడు, కొండ ప్రక్కన ఎదుగుచున్న ఒక చిన్న అంజూరపు చెట్టును ఆయన పట్టించుకున్నప్పుడు, లేక నీటిలో చచ్చిపడివున్న ఒక చిన్న చేపను పట్టించుకున్నప్పుడు, హృదయ వాంఛను ఆయన యింకెంత అధికముగా యెరిగియున్నాడో కదా... నిశ్చయంగా ఆయనకు తెలుసు. ఆయన అవసరం నీకున్నదని ఆయనకు తెలుసు. “అడుగుము, నీవు పొందుదువు. నీవు ప్రార్థించునప్పుడెల్ల నీవడిగినది పొందియున్నావని నమ్ముము.” నీ చేతిని పైకెత్తినది పరిశుద్ధాత్మయేనా? అలా అయితే, ఆ అభిషేకము నీపై వున్నది. అంతట ప్రార్ధించి దేవుని నమ్ముము, అప్పుడు నీవు పలికినది నీవు పొందుదువు.

69

పరలోకపు తండ్రీ, ఈ దినము మధ్యాహ్నమునకు సాగుచుండగా, నీ వాక్యము చొప్పున నీ దివ్య కృప యొక్క ఈ కధను గూర్చి ఈ ఉదయం నేను సుదీర్ఘముగా (మాట్లాడితిని - తర్జుమాదారుడు) “నా యందు విశ్వాసముంచువాడు, నేను చేయు క్రియలు చేయును” యని మా ప్రభువైన యేసు చెప్పినట్టు లేఖనములలో వ్రాయబడియున్నది. మరియు ఆ క్రియలు సత్యములని మేమెరుగుదుము. నీవు జనుల ఆలోచనలను వివేచించగలవు. అతడెవరో, అతడి పేరేమిటో, అతని తండ్రి యేమిటో నీవు పేతురుతో చెప్పియుంటివి. అతడు నతనయేలును తీసుకువచ్చినప్పుడు, ఫిలిప్పుతో, లేక నతనయేలుతో, అతడు రాకముందు ఆ చెట్టు క్రింద నీవతనిని చూసితివని అతనితో చెప్పితివి. బావి యొద్ద నున్న స్త్రీతో ఆమెకెందరు భర్తలుండిరో చెప్పితివి. ఓ, నీకేదీ మరుగైలేదు. నీవన్ని సంగతులనూ ఎరిగియుంటివి. మరియు అవి నీ క్రియలుగా యున్నవి. అంతట నీవు ఆ అంజూరపు చెట్టుకు ఆ మాట చెప్పుటను మేము చూస్తున్నాము.

ఓ, ప్రభువా, రొట్టెలనూ మరియు చేపలనూ అనేక రెట్లు విస్తరించు ఘడియ త్వరలో స్తున్నదని నేను నమ్ముచున్నాను. త్వరలో మృగము యొక్క ఒక ముద్ర వచ్చును. సంఘముల యొక్క ఒక సమాఖ్య వచ్చును. అంతట వారు - సమాఖ్యగా కూడుకున్న సంఘపు వారు, “ఏ మనుష్యుడూ అమ్మరాదు, కొనరాదు” యని ఒక బోర్డు పెట్టుదురు. అయితే నీ సంఘమును అది కలవరపరచదు, ఏలయనగా అరణ్యములో ఇశ్రాయేలుకు చేసినట్లు, పరిశుద్ధాత్మ వారిని నడిపించి, పోషించును. నీవు దేవునివి ప్రభువా, మేము దానిని తప్పిపోనియ్యకుము. ప్రభువా, మమ్ము నమ్మకముగా ఉండనిమ్ము. మమ్ము యధార్ధముగా ఉంచుము.

70

ప్రభువా, యిప్పుడు యిది మరలా ఎప్పుడు జరుగునో నేనెరుగను, బహుశా మరలా ఈ ఉదయం జరుగునేమో. బహుశా ఈ రోజు టేబర్నికల్లో మరలా అది జరుగునేమో; ప్రభువా అది జరుగునని నమ్ముచున్నాము. జనుల హృదయములో నీవు విశ్వాసమునుంచుదువనీ, నేను వారిని తప్పు త్రోవ పట్టించుట లేదనీ, లేక వారికి చెప్పినవాటిలో ఒక్క సంగతి కూడా తప్పు కాదనీ వారికి తెలియజేయదువనీ నమ్ముచున్నాను. ప్రభువా, నేను నా మాటలను కనిపెట్టుచూ, వాటిని తూకము వేయుచూ, నా హృదయమునందు నేనేరిగినంతలో అత్యుత్తమముగా అది వచ్చిన విధముగానే నేను దానిని చెప్పితిని. నేను చెప్పిన విధంగా, ఏడవసారి, నీవు దానిని నాకు స్థిరపరచితివని నేనెరిగియున్నాను. మరియు దాని వెంటనే, నేనెవరితో మాట్లాడానో ఆ మొట్టమొదటి మనిషి - ఆమె పలికిన వెంటనే ఆమె కూడా తన హృదయ వాంఛను పొందినదని యెరిగియున్నాను.

ప్రభువా, యిప్పుడు, ఈ ఉదయం యిక్కడ అనేక కోరికలున్నవి. ప్రభువా, నీవు నీ సేవకుని అభిషేకించవలసియుండును. నీవు ఆ అభిషేకమును మాత్రము పంపించినట్లయితే! ఈ ఉదయం దానిని నాకు అనుగ్రహించుము. ఎవరికెన అవసరమైతే, వారు లేక నీవు కోరిన వారెవరైనా అడిగినప్పుడు లేక ఎప్పుడైనా ప్రభువా, నీవు నాతో సెలవిమ్మ. అంతట దానిని నెరవేర్చుము. ప్రభువా, అంతట మాట్లాడునది నేను కాను గాని, నీవేయగుదవని యిప్పుడు నేనెరుగుదును.

71

సూచనలూ మరియు అద్భతముల చేత సువార్తను బోధించుటవలన నేను నా జీవితమును నూతనముగా సమర్పించుకొనిన ఈ బలిపీఠము నొద్ద, ఈ దర్శనములూ మొదలైన వాటి యొక్క ఈ పాత తరహా పరిచర్యను విడిచిపెట్టకు ముందు, నన్ను నేను నీకు సమర్పించుకొనుచున్నాను. ప్రభువా పరిచర్య కొరకై మరలా

ఈ ఉదయం, నన్నునేను నీకు సమర్పించుకుంటున్నాను. ఇది మొట్ట మొదటిసారి చెప్పబడినది. ప్రభువా, మొట్ట మొదటి సారే అది ప్రత్యక్షపరచబడినది. సాక్షులిక్కడ కూర్చొని యున్నారు. ఓ, ప్రభువైన దేవా, నా ఈ పాత డొక్కును నీ వెందుకైనా వాడగోరితే, నేను నీ వాడనే ప్రభువా, ప్రభువా నన్ను తీసికొని, మలచి నిన్ను ఘనపరచి, మహిమపరచునదేదైనా చేయుము.

ఇతర సేవకుల యెడల మీరు దీనిని విస్తరింపజేయండి. ప్రపంచం యొక్క నాలుగు మూలలకూ దీనిని పంపించండి. ఆలస్యమగుచున్నది. యేసు వచ్చుచున్నారు. నీ ప్రజలను ఏకముగా దీవించుము. తప్పిపోయిన వారిని రక్షింపుము. ప్రభువా, ఈ ఉదయం యిక్కడ చేతులు పైకెత్తిన ప్రతి ఒక్కరినీ రక్షింపుము. వారికి పరిశుద్ధాత్మ నిమ్ము. వారి జీవితములు నీకు అర్పింపబడినవగును గాక.

ప్రభువా ఈ చిన్న సంఘమునూ, కాపరినీ, యింకా యిక్కడున్న ప్రతి కాపరినీ, ప్రతి సువార్తికునీ, ఉపదేశకుడినీ, ఏ సంఘపు వాడైనా, ప్రతి సభ్యునీ, ఓ, ప్రభువా, ఒక జన శరీరముగా మమ్మును మేము నీకు సమర్పించుకొనుచున్నాము. ప్రభువా, మమ్ము తీసికొని, ఉపయోగించుకొనుము. మేము మీవారమై ఒకనొక రోజున సమాధానముగా మీ యొద్దకు వచ్చెదమని నిరీక్షిస్తున్నాము.

ఇప్పుడు, రోగులూ, వ్యాధిగ్రస్తులెవరైనా ఉంటే, ఈ ఉదయం వారు స్వస్థపరచబడుదురు గాక. మేము మా చేతులను వారిపై ఉంచి ప్రార్థించుచుండగా, నీ కృప మరియు నిత్యమైన దీవెనలూ వారిపై నిలుచును గాక. జరుగవలెనని ఆయన ప్రతిష్టించిన క్రియను పరిశుద్ధాత్మ వచ్చి జరిగించును గాక. తండ్రీ, దాని ననుగ్రహించుము. యేసుక్రీస్తు ద్వారా మేము ఈ ఆశీర్వాదము నడుగుచున్నాము. ఆమేన్.

72

నేను మీకు నిజాయితీగా నిజము చెప్పితిని. దేవుడు దానిని బయలుపరచి మరియు చేసినట్లుగా, నిజాయితీగా నేను మీకు ఆ సత్యమును చెప్పితిని. ఇప్పుడు నేను శ్రద్దగా మీ ప్రార్థనలు కావలెనని కోరుచున్నాను. నా వయస్సు మనుష్యుడు, యాబైయేళ్ళవాడు అని నేను గ్రహించుచున్నాను...

“ప్రియా, నేనిప్పటికే యాభైకి వచ్చాను. ప్రభువు కొరకు నేనేమైనా చేయవలసివుంటే నేను త్వరపడవలసియున్నది” అని గడిచిన ఒక ఉదయమున నా భార్యతో నేనంటిని.

ఆమె అన్నది, “బిల్, దేవుడు మోషేకి ఎనబై యేళ్ళ తర్ఫీదునిచ్చాడు.” ఇంకా, “నీ యొద్ద నుండి ఒక్క రోజు పరిచర్యను పొందుటకై, మరొక యాభై యేళ్ళు ఆయన నీకు తర్ఫీదునివ్వగల సమర్ధుడు. నీ విషయమై ఆయనకొక ఉద్దేశ్యమున్నది. కనుక ఊరకుండుము” అన్నది.

అందులో చాలా జ్ఞానమున్నదని నాకు అనిపించింది: 'ఊరకుండుము.' దేవుడు ప్రతి చేతినీ ఆయన గొప్ప ప్రణాళిక చొప్పున కదుపును. కేవలం ఊరకుండుము. అతిగా ... నెట్టుటకు ప్రయత్నించవద్దు, అప్పుడు నీవు ఆయనకన్నా ముందు వెళ్ళిపోదువు. నడిపించుటకు ప్రయత్నించుట కంటే వెంబడించుటకు ప్రయత్నించుట మేలు, ఏలయనగా ఆయనే నడిపించువాడు.

73

ఇప్పుడు, ప్రపంచమందంతటా, ఎంతో నమ్మకముగా వుండి నా కొరకు ప్రార్ధన చేసిన, యిక్కడి ఈ నా చిన్న సంఘమునకు, నా చిన్న మందకు, మరొక ప్రపంచవ్యాప్తమైన సంచలనము వచ్చుచున్నదని నేను నమ్ముచున్నాను. నేను మీకు చెప్పిన ఈ సంగతులు, ఆ సత్యమే. నేనిక్కడ నిలబడియున్నంత యధార్థముగానే, ఆవలివైపున, తీర్పు దినమున, యిదే కథతో నేను మిమ్మల్ని సంధించుదును.

ఇప్పుడు, ఇదేమిటో మీరందరూ చూడగలుగుచున్నారని నేను నిశ్చయత కలిగియున్నాను. ఇది మరింత గొప్పదీ, మరింత లోతైనదియగు పరిశుద్ధాత్మ అభిషేకము యొక్క రాకడ. అందులోనికి ఎలా వెళ్ళవలెనో నేనెరుగను. నేనెరిగిన ఒకే ఒక్క సంగతి - నిన్ను అందులో ఉంచుటకు దేవుడు కావలయును. అందువలన, ఎంత మధురముగా, ఎంత దీనముగా, దేవునికి ఎంత సమీపముగా మీరు జీవించగలరో అలా జీవించండి. ఆయనను సందేహించవద్దు. సమస్తమూ మీ మంచి కొరకు జరుగుచున్నదని మాత్రము నమ్ముడి, అంతట అంతా సక్రమముగానే జరుగును, చూశారా.

74

గుర్తుంచుకొనుడి, మీరొక గొర్రెయై యున్నారు. ఆయన పావురమై యున్నాడు. మరియు పావురము గొర్రెను నడిపించును. ఎప్పుడు గొర్రెపిల్ల మరియు పావురము ఒకే స్వభావమును కలిగియున్నవి. ఆకాశ పక్షులన్నింటిలో పావురము అత్యంత మృదుస్వభావి. భూమి మీద నున్న జంతువులన్నిటిలో గొర్రెపిల్ల మృదుస్వభావి. అందువలన, చూడండి, వాటి ఆత్మలు ఒక దానితో ఒకటి ఏకీభవించును. ఇప్పుడు ఆ పావురము తోడేలు మీదకి రాజాలదు. (చూశారా?) అది అక్కడ నిలువదు. తోడేలు చంపునది. గొర్రెపిల్ల మృదువైనది. కనుక మీరు చూడండి, అది ఒకదానినొకటి నడిపిస్తున్న గొర్రెపిల్ల మరియు పావురమైయున్నవి.

పావురము గొర్రెపిల్ల నెక్కడికి నడిపించినదో మీరు చూశారా? శిలువ వేయబడుటకై కల్వరి యొద్దకే “మరియు ఆయన తన నోరు తెరువ లేదు. వారాయనపై ఉమ్మి వేసినప్పుడు, ఆయన ఎన్నడు తిరిగి వారిపై ఉమ్మివేయలేదు. వారాయనను కొట్టినప్పుడు, ఆయన వారిని తిరిగి కొట్టలేదు. దేవుని మహిమకొరకై, తాను దేవుని చిత్తమును నెరవేర్చుచున్నానని యెరిగి, ఆయన నేరుగా కొనసాగెను.

75

సిస్టర్ హ్యాటీ, మనము దాదాపు ఒకే వయస్సు వారము. ఆమె తండ్రి బ్రదర్ జార్జ్ రైట్, ఆమె కుమారులూ, తల్లి షెల్బి. నేనిది చెప్పగోరుచున్నాను. నేనెందుకంత తొందరగా ఇంట్లోంచి బయటకి నడిచి వెళ్ళానొయని మీరనుకొనియుండవచ్చు. ఏనాడు నేను... ఒక్కసారిగా ముప్పయి-వేలమంది పచ్చి అన్యులు, రక్షింపబడి క్రీస్తు నొద్దకు వచ్చిన చోట నేనుంటిని - (దక్షిణాఫ్రికా) నేను అనుభూతి చెందిన అతి గొప్ప అభిషేకం అదే యని నేననుకొంటిని. గడచిన దినమున జార్జ్ రైట్ యింటి వద్ద కలిగిన దానితో అది ఎన్నడూ ఏ విధంగానూ తూగదు. అలాంటిది నేనెన్నడూ అనుభవించలేదు. గది అంతా కేవలం దేవుని మహిమ యొక్క వెలుగు వలె అనిపించినది.

ఇప్పుడు, సిస్టర్ హ్యాటీ మౌనముగా నుండు భక్తిపరురాలగు ఒక స్త్రీ ఎన్నడూ ఏ విషయమును గూర్చియు తన స్వరమును హెచ్చించదు. కాని ఆ భవనమును పరిశుద్ధాత్మ తాకినప్పుడు, ఆమె అరుపును ఒక వీధి అవతల మీరు వినగలుగుదురు. ప్రతి ఒక్కరు - ప్రతి ఒక్కరు దానిని అనుభూతి చెందిరి. అది అద్భుతమైనదిగా యున్నది. మనము చాలా కాలము జీవించవచ్చును. కానీ, సిస్టర్ హ్యాటీ, మా యొక్క మదిలో జ్ఞాపకము చేసుకొందుము, సిస్టర్ రైట్.

76

నేను చెప్పినది కచ్చితంగా నిజమేనని, యిప్పుడు జనులు తెలిసికొనులాగున - సిస్టర్ హ్యాటీ, సిస్టర్ రైట్, మరియు అక్కడ వున్న మీరందరూ మీ చేతులను పైకెత్త గలరా, అక్కడ వున్న వారు మాత్రమే - మీరందరూ చూడగలుగునట్లు. చూశారా, సిస్టర్ హ్యాటీ, యిక్కడ లేచి నిలబడుము. మొట్టమొదటి సారి ఆ అద్భుతము జరిగిన ఆ చిన్న విధవరాలు అదిగో ఆ సంగతి మొట్టమొదటి సారి జరుగుట, ప్రపంచములోని జనులందరినీ దాటి, తన పిల్లలను చూసుకోవడానికి ఒక కొండ ప్రక్క నున్న చిన్న నేలలో మొక్కజొన్న పండిస్తున్న ఒక చిన్న దీన పేద విధవరాలి యొద్దకు వచ్చెను. యేసుక్రీస్తు కాలము మొదలుకొని, మొట్ట మొదట సారిగా దేవుడు సన్మానించినది ఆ ఒక్కరినే. మరియు, “నీవు ఏమి అడుగుదువో అడుగుము” యనెను.

“ఎవరినైన సరే నేను ప్రభువు యొక్క నామములో సవాలు చేస్తున్నాను. ఆత్మ తాకి ఆ మాట చెప్పినప్పుడు, నీవు ఏది అడిగినా నాకనవసరం, అది అనుగ్రహించబడునని” నేనన్నాను.

77

ధనవంతులైన ఏలికలూ, అలాంటి పెద్దవాళ్ళ దాని నెందుకు పొందలేదో మీకు తెలుసా? ఎందుకంటే తమకు ఎంత మాత్రమూ మంచివి కాని వాటిని వారు అడుగుదురని దేవుడెరిగియున్నాడు. సరియైన దాని నడుగుదురని ఆయనయే జనమును గురించి ఎరిగియున్నాడో, వారికే ఆయన దాని నిచ్చును. మరియు ఆ స్త్రీ యింకేమి... యింకేమి? అంతకంటే గొప్పదేదైనా ఆమె అడగగలదేమో మీరు నాకు చెప్పండి. ఆమె తల్లియూ, తండ్రియూ రక్షించబడ్డారు. ఆమె చెల్లెలు రక్షించబడింది. అప్పటికి ఆ యిద్దరు అబ్బాయిలు తప్పించి, మిగిలిన కుటుంబమంతా రక్షింపబడింది. వారు రక్షింపబడలేదు.

వారు పేద జనులు, మంచి పంటకు సంవత్సరమునకు అతనికి వచ్చు స్థిరమైన ఆదాయము ఆరు-వందల-డాలర్లని షెల్బీ నాతో చెప్పాడు. దాదాపు నా వయసు వరకూ ఆ కుర్రవాడు పని చేస్తూ వుండి, పూర్తిగా సమస్తమూ కోల్పోయాడు. ముసలి వారైన తన తల్లిదండ్రులను చూసుకుంటూ, వ్యాధిగ్రస్తురాలైన తన చెల్లిని చూసుకుంటూ పని చేస్తున్నాడు, కాని అతడు రక్షింపబడ్డాడు. బ్రదర్ రైట్, వారందరూ రక్షింపబడ్డారు. కాని వారిద్దరూ రక్షింపబడలేదు. హ్యాటీ నిత్యత్వమున్నంత కాలము తన బిడ్డల రక్షణ కొరకై అడిగినది. ఆమె పదివేల డాలర్లు అడిగి దానిని పొందియుండవచ్చును. ఆమె కిష్టమైనదేదైనా ఆమె అడిగియుండవచ్చు. కాని ఆ అభిషేకము నిచ్చుటకు ముందే నీవేమి అడుగుబోవుచున్నావో దేవుడెరిగియున్నాడు. అది నిజం.

78

సిస్టర్ హ్యాటీ, “నీవు కోరినదేదయినా అడుగుము. హ్యాటీ, నీ హృదయమేమి కోరినా దానినడుగుము” యని నేను అన్నాను. అది నిజమేనా? సిస్టర్ హ్యాటీ, అది నిజమేనా? చూశారా? “నీవేది అడగగోరితే అది అడుగుము; అదేమైన లెక్కలేదు. అది అడుగుము. ఆమె అడిగిన దానిని పలుకు చాలు, అంతట ఆమె దానిని పొందునని దేవుడు నాకు చెప్పెను.”

“నీవేమి కోరినా సరే, యిప్పుడు దాని నడుగుమని నేనంటిని.” అంతట ఆమె దాని నడిగినది.

ఓ, సహోదరుడా, సహోదరీ, మనము జీవించుచున్న దినమును నీవు గ్రహించుచున్నావా? పరలోకపు దేవుడు మానవుని యందు, “నీ కిష్టమెచ్చిన దానినడుగుము, ఆయన దానిని నీ కనుగ్రహించునుయని,” దాని నుంచుచున్న అత్యంత మహిమకరమైన సమయము. హు! ఇది నా తలంపునకు అంతుబట్టనంత లోతైనది. అది నాకు తెలుసు. అయితే నా హృదయంలో ఎంత పట్టుగలదో అంత నేను కలిగియుందునని నేననుకుంటున్నాను. అది అలా... నేను దానిని బట్టి జీవించితిని. దానిపై నేను వర్ధిల్లితిని. దానిపై నేను పడమటికి వెళ్ళుచున్నాను. దానిపై నేను కూటములలోనికి ప్రవేశించబోవుచున్నాను. నేను దానిపై జీవించుచున్నాను. దేవుని వాక్యము సత్యము.

79

ఇప్పుడు, నాకు తెలిసినంతలో జరుగబోవు చివరి సంగతి అదే. వేరేదీ నాకు తెలియదు, మానవులకు, “అదేమైనప్పటికీ, నీవు కోరునదేదైనా అడుగుము. కేవలం అడుగుము, అది నీకివ్వబడును” యను దానిని యిచ్చుటకంటే ఇంకేది ఉండగలదు.

మరియు మీరు ఆ జ్ఞానమును చూడగలుగుచున్నారా? అడుగగలిగిన వాటిలో అత్యంత గొప్పదానిని ఆ స్త్రీ అడిగినదని ఎందరు నమ్ముచున్నారు? మిమ్ములను చూడనివ్వండి. మీరు ఉహించగలరా? రోగియైన సహోదరిని కలిగిన ఆ స్త్రి ఆమె స్వస్థత కొరకు అడిగియుండవచ్చు. ఆ స్త్రీ పేదరాలై, ఆమె తల్లిదండ్రులు పేదవారై వారందరూ పేదవారైయుండగా ఆమె డబ్బునడిగి దానిని పొందియుండవచ్చును. తన జీవితమునకు ఆయుష్షును కలుపమని అడిగి, ఆమె దానిని పొందియుండవచ్చును. కాని ఆమె అడుగగల్గిన అత్యంత గొప్ప దానిని యడిగెను, రక్షణలేని తన కుటుంబము యొక్క రక్షణ నడిగి దానిని పొందెను. ఆమేన్. అదే అసలు సంగతి; ఆ వాగ్దానము నిచ్చిన అదే దేవుని ద్వారా దానిని పొందెను. ఆయన దేవుడు, ఓ, నేనాయనను ప్రేమించుచున్నాను.

80

ఇప్పుడు, మేము.... ప్రార్ధింపబడవలసిన రోగులెవరైనా యిక్కడున్నారా? మీ చేతిని పైకెత్తండి.

కొన్ని రాత్రుల క్రితం ఒక స్త్రీ ఫోన్ చేసినది (కాలిఫోర్నియా లేక అలంటి చోట నుండి వారు ముగ్గురున్నారని నాతో చెప్పెనని నేను నమ్ముచున్నాను), “మేము రెండు లేక మూడు సార్లు వచ్చితిమి, మీరు మాకు ప్రార్ధనా కార్డులనిచ్చారు, అయితే మా నెంబర్లు పిలువబడలేదని” చెప్పినది. ఆమె యిక్కడ నిలిచియున్నట్లయితే ఈ ఉదయం రోగుల కొరకు ప్రార్థించెదనని ఆమెకు నేను వాగ్దానము చేసితిని.

వివేచనలూ మొదలగునవి మనము కలిగియున్నప్పుడు ఎంతమంది యిక్కడ వుండిరి? ఓ, మీరందరూ, యిక్కడున్న ప్రతి ఒక్కరూ అని నేననుకుంటున్నాను. అది నిజమని మనకు తెలుసు. ఇప్పుడు మనము దానిని దాటి వెళ్ళుచున్నాము. ఓ, దేవునికి స్తోత్రము కలుగును గాక! ఇప్పుడు మనం దానిని దాటి వెళ్ళుచున్నాము.

బహుశా అది నెరవేరునేమో. ఈ ఉదయం దేవుడేమిచేయునో నేనెరుగను. కాని రోగులూ మరియు వ్యాధిగ్రస్తులైన జనులను, వంతునకు కొద్దిమంది చొప్పున రమ్మని నేను అడుగబోవుచున్నాను. మేము యిటు వైపునున్నవారి కొరకు మొదట ప్రార్థించునట్లు, యిక్కడ యిటు వైపు వున్న వీరిని పైకి రానివ్వండి. బహుశా నేను యిలా దానిని పట్టుకొనగలనేమో. సహోదరీ, నేరుగా ఈ పైకి రమ్ము, ఈ పైన వరుసలో వుండుము. ఎందుకంటే మన యొద్ద ... వారు తిరిగి అదే చోటికి వెళ్ళుచుండుట వలన, వారు వారిని అదే సందు గుండా మరలా క్రిందికి పంపించాలి.

81

ఈ ఉదయం ఈ చిన్నవాడు మాట్లాడిన తీరును బట్టి, యితడు దైవీక స్వస్థత యందు నమ్మకము కలిగియున్నాడని నేను చెప్పగలను. మరియు దేవుని యొక్క శక్తి యందు నమ్మకముంచుచున్నాడని నేనెరుగుదును. ఈ ఉదయం యిక్కడ మరొక సేవకుడెవరైనా ఉన్నారా - దేవుడు రోగులను స్వస్థపరచునుయని విశ్వసించు సేవకుడు? ఒక వేళ ఉన్నట్లయితే, వారొక్కొక్కరూ యిక్కడికి రండి. మేమిక్కడ ఈ రోగులూ మరియు వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్ధిస్తుండగా - మీరందరూ వచ్చి యిక్కడ మాతో నిలబడండి. దేవుడు రోగులను స్వస్థపరచునని విశ్వసించునట్టి సహోదరులైన మీలో ఎవరైనా, అయ్యా, దేవుడు మిమ్మును దీవించును గాక, నేరుగా ముందుకు రమ్ము. మీరు నేరుగా మాతో యిక్కడికి రావాలని మేము కోరుచున్నాము.

అయితే పరిశుద్ధాత్మ యేమి చేయునో మనమెరుగము. గడచిన దినమున సిస్టర్ రైట్ యింటి యొద్ద చేసినట్లుగా ఈ సమయమున పరిశుద్ధాత్మ చేయవచ్చు. ఆయన చేయునని నేను నమ్ముచున్నాను. నాకు తెలియదు. మీరు గ్రహిస్తున్నారా? ఎందరికి తెలుసు. సరే, దర్శనములు మొదట ప్రారంభమైన నాటి నుండీ మీలో ఎంత మంది ఈ చోటిని విడిచిపెట్టి వెళ్ళలేదు. అవి ఎప్పుడు వచ్చునో, అవి ఏమి చేయునో నేనెరుగను, సమస్తమూ దేవుని చిత్తమై, దేవుని చేత నియంత్రించబడవలసియున్నది. ఎంత మందికి అది తెలుసు? తమంతట తాము నియంత్రించుకొనుటకు దేవుడు విషయములను మనుష్యులకు అప్పగించలేదు. వారే చేసినట్లయితే, అప్పుడు అది దేవుడు కాడని మీరు చూచెదరు. అది దేవుడు కాడు. అది యగును. బ్రదర్ మైక్, ఈ చిన్న అల్పమైన చోట, ప్రతి అనుమానపు ఛాయకూ అతీతంగా, కచ్చితంగా ప్రభువు మమ్మల్ని ఎలా దీవించియున్నాడో, మరియు చేయుదునని తాను వాగ్దానము చేసిన దానిని కచ్చితంగా ఎలా చేసియున్నాడో, స్నేహితులారా, మీరు ఆలోచించాలని నేను కోరుచున్నాను.

82

అతీంద్రియానుభూతిని గురించి ఎంత మంది విన్నారు? మీలో అనేకులు విన్నారు. అది కేవలము మత సాంప్రదాయము, ఆత్మకు సంబంధించినవి. అయితే మీకు తెలుసా, అవి చేయజాలవు.... అవి నిలుచునవి కావు. అవి నిలిచియుండ జాలవు. అవి ఎన్నడూ దేనిని ఉత్పత్తి చేయలేవు. వారక్కడ కూర్చోని... “అక్కడొక ఆత్మయున్నది; అక్కడొక ఆత్మయున్నది” యని వారందురు. అంతట వారు దాని ఫోటో తీయుటకు లేక అలాంటి దాని కొరకు ప్రయత్నించుదురు. వారు దానిని చేయలేరు. చూశారా, అదక్కడ లేనేలేదు. అది మానసికమైనది, మనస్సునకు సంబంధించినది, చూశారా.

అయితే దేవుడు చేయునది పరిపూర్ణమై యున్నది. మోషే తన కర్రను క్రింద పడవేసినప్పుడు, మాంత్రికుడు కూడా తన కర్రను క్రింద పడవేసెను. అవి రెండూ సర్పములుగా మార్చబడినవి. అది నిజమేనా? కాని యన్నె-యంబ్రేల కర్రకు ఏమైనది? మోషే కర్ర దానిని మ్రింగిగివేసినది. మరియు మోషే తన కర్రను తీసుకొనినప్పుడు, అది యింకా కర్రగానే యుండెను. కాని వారి కర్ర ఏమైనది? మోషే కర్రలోపల యుండెను. చూశారా, మీరు దానిని చూడలేరు.

దేవుడేదైన చేసినప్పుడు, ఆయన దానిని వాస్తవము చేయును. ఇప్పుడు నీకు తెలుసా, ఆ పరిశుద్ధాత్మ... “అది ప్రజల ఆవేశము, అది మానసికమైనది. ఆ దర్శనములూ మరియు విషయములన్నీ కేవలం మనస్సులను చదువుట” అని వారు నాతో చెప్పుదురు.

83

సరే, జార్జ్ జె.లేసి అక్కడున్న ఆ పటమును పరీక్షించినప్పుడు, ఆ దేవుని యొక్క దూతను... నది యొద్దనూ, యింకా అనేక సార్లు యిక్కడ నిల్చున్న మీలో అనేకులు దానిని చూసియుండిరి. “బ్రదర్ బ్రెన్హాం, కెమెరా యొక్క యాంత్రిక నేత్రము మానసిక శాస్త్రమును తీయదుయని” అతడన్నాడు. “వెలుగు అక్కడ యుండెను.” అదిగో అది. అది సధా నిలుచునది. అది సత్యము.

కావున మీరు చూడండి, అది అదే దేవుని దూత. ఇప్పుడు, దానిని గమనించండి. దాని స్వభావము దానిని రుజువు చేయును. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు, బయలుపరచబడిన దేవుడైన ప్రభువగు యేసుక్రీస్తు నందు అది నివసించెను. కాగా, “కొంత కాలమైన తరువాత లోకము నన్ను మరి యెన్నడునూ చూడదు. అయితే మీరు నన్ను చూతురు, ఏలయనగా నేను యుగాంతము వరకు మీతోను, యింకా మీ యందునూ వుందును. మరియు నేను చేయు క్రియలు మీరునూ చేతురు” అని యేసు చెప్పెను.

ఇప్పుడు, అది వచ్చినప్పుడు, దానిని చూడండి.... ఒక మనిషి ఏమైనా చెప్పవచ్చును, కాని దేవుడు దానిని సమర్ధించినప్పుడు, అది దానిని నిజము చేయును. ఇప్పుడు, ఆ దూత యొక్క స్వభావమును చూడండి. ఆ వ్యక్తి ఆయనకు ఎంతగానో లోబడినప్పుడు, యేసు భూమి మీద ఉన్నప్పుడు చేసిన అదే క్రియను ఆయన చేయును. ఎందుకంటే, మనము ఆత్మ వలన జన్మించినవారమైతే, మనము దేవుని యొక్క కుమారులమూ మరియు కుమార్తెలమైయున్నాము, చూశారా. మరియు యిదేదో కల్పనా విషయము కాదు. దానిని రుజువు చేయుటకు రుజువున్నది. అది సత్యమని అది చూపించుచున్నది. అందువలన మన రక్షణ కచ్చితంగా పరిపూర్ణమైనది.

84

ప్రభువగు యేసు యొక్క రాకడను గూర్చి ప్రవక్తలందరి చేత పలికించిన పరలోకపు దేవుడు. మరియు యేసు తాను వచ్చినప్పుడు, ఆయన ప్రతి ప్రవచనమునూ నెరవేర్చెను. వాటిలో అనేకములు శిలువ యొద్ద నెరవేర్చబడెను - “మన అతిక్రమముల నిమిత్తము గాయపరచబడెను,” మరియు దావీదు ఏమి చెప్పెను, “నా దేవా, నన్నేల విడనాడితివి.” కాని ఎప్పుడైతే దేవుడొక ప్రవక్తను పంపినప్పుడు; ప్రవక్త పలుకును; అది దేవునివలనైతే, దేవుడు దానిని నిజము చేయును. అప్పుడే వారిని తెలిసికొనుమని ఆయన చెప్పెను. “వారు పలుకగా, వారు చెప్పినది నెరవేరితే, వారితో నేనున్నాను గనుక వారిని నమ్ముడి.” ఒక వేళ అది నెరవేరకపోతే, అప్పుడు వారు కాదు. వారు అబద్దపు ప్రవక్తలు. “అయితే వారిని గుర్తించుటకు, అవి నెరవేరునో లేదో చూడుడి,” అని ఆయన చెప్పెను.

ఇప్పుడు, చూడండి. పరిశుద్ధ ప్రవక్త యందు మాట్లాడిన దేవుడు, దేవుని మహిమ మరియు ఘనత కొరకై మెస్సయ్యా యొక్క రాకడను గూర్చి చెప్పెను. రాబోవు ఆకురాలు కాలములో ఎవరు అధ్యక్షుడగునో నాకు తెలిసియుండి, దానిని చెప్పినట్లయితే, అదొక ప్రవచనమగును. అది నిజం. కాని కేవలం ఆటలాడుటకు, దేవుడలా ప్రవచింపడు. దేవుడు ఆయనను మహిమపరచుటకు ఒకానొకటి చేయును, చూశారా.

85

అయితే ఆ మెస్సయ్యా వచ్చినప్పుడు, ఆ మెస్సయ్యా వెళ్ళిపోయినప్పుడు... మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బెటేరియన్, క్యాథలిక్, లూథరన్, పెంతెకోస్తు, నాజరీను, పరిశుద్ధ యాత్రికులు వారైన మిమ్ములనందర్నీ నేను అడుగగోరుచున్నాను. ప్రవక్తల రాజైన యేసు, తన సొంత సంఘమును ఎలా స్థాపించాలో ఎరిగియుండునని మీకనిపించుటలేదా? ప్రవక్తలందరూ ఆయనను గూర్చి పలికినట్లయితే, ఆయన వైపు చూపించినట్లయితే....

ఆయన ఏరకమైన సంఘమును స్థాపించెను? ఆయన వెళ్ళినప్పుడు, ఆయన చెప్పెను.... ఆయన భూమి పై యున్నప్పుడు, “దేవుని యొక్క వాక్యపు ప్రత్యక్షతపై” యని పేతురుతో చెప్పెను. “ఈ బండ పై నా సంఘమును కట్టుదును - పాతాళలోకపు ద్వారములు దాని యెదుట నిలువ జూలవని” ఆయన చెప్పెను. అది నిజము కాదా? సరే. ఆయన... ఆయన వెళ్ళక ముందు, మార్కు 16లో, “నమ్మువారిని ఈ సూచక క్రియలు వెంబడించునని” ఆయన చెప్పెను. ఆయన అలా చెప్పెనా? “నా నామమందు వారు దయ్యములను వెళ్ళ గొట్టుదురు, అన్యభాషలు మాట్లాడుదురు, సర్పములను ఎత్తి పట్టుకొందురు, విషకరమైనవి త్రాగుదురు.” “నేను చేయు క్రియలు మీరును చేతురని” కూడ ఆయన చెప్పెను. అది నిజమేనా? అవి ఆయన సంఘమును వెంబడించు సూచనలు, అదొక సంఘ శాఖ కాదు. అది దేవుని చేత ప్రతిష్ఠ చేయబడి, స్థాపించబడిన ఒక వ్యవస్ధ - పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరలోకము నుండి జన్మించిన సంఘము - సంఘ శాఖలన్నింటి నుండి బయటకి వచ్చిన, నిజముగా నమ్ము ఒక జనాంగము.

86

ఇక్కడ నిలబడిన ఈ సేవకులు నాతో కూడ ఉన్నవారు. మేము మనుష్యులము. ఆయన దేవుడు, అయితే ఆయనకు ప్రాతినిధ్యము వహించుటకై మేమిక్కడున్నాము. ఈ పని చేయుటకు, రోగుల మీద చేతులుంచుటకు, దేవుడు మమ్ములను పంపెనని మీకు చెప్పుటకు, మే మిక్కడున్నాము. “ఈ సూచనలు వారిని వెంబడించును.” ఆ సూచనలు, ఆయన చెప్పిన సూచనలన్నియు విశ్వాసిని వెంబడించును, ఇవిగో యిక్కడ వెంబడించుచున్నవి. అవి వెంబడించును.

అయితే దేవుడు ఏ మనుష్యునీ లెక్క చేయడు. హ్యాటీ కొరకు ఆయన చేసిన దానిని, ఆయన నీ కొరకు కూడా చేయును. గ్రుడ్డివారి కొరకు ఆయన చేసిన దానిని, గ్రుడ్డి వారైన మీ కొరకు కూడా ఆయన చేయును. చెవిటి వారి కొరకు ఆయన చేయు దానిని, మీ కొరకు ఆయన చేయును. మీరు కేవలం నమ్మితే, వేరొకరెవరి కొరకైనా ఆయన చేసిన దేనినైనా మీ కొరకునూ ఆయన చేయును. అది నిజమేనా?

బ్రదర్ టెడ్డి, యిప్పుడు నీవు, “కేవలం నమ్మము” వాయించాలని నేను కోరుచున్నాను. ఈ జనులు వరుస గుండా వెళ్ళిన తర్వాత, మనము రెండో వైపునకు వెళ్ళుదుము. మీ వ్యాధులు స్వస్థపరచబడునట్లు మేమందరమూ వచ్చి మీపై చేతులుంచి ప్రార్ధన చేయదుము. అది జరుగ గలదు. అది జరుగును. అయితే దేవుడేమి చేయబోవుచున్నాడో నేనెరుగను. యిప్పుడైతే ఏమి చేయవలెనో తెలియక నేనిక్కడ నిలబడియున్నాను. నేనొకరికి వాగ్దానము చేసినట్లు రోగుల కొరకు ప్రార్థించబోవుచున్నాను. కేవలం ప్రార్థించండి....

గత ఆదివారం... నేను మీతో చెప్పాను, జ్ఞాపకం చేసుకోండి. గత ఆదివారం బయలుపాటు మరియు మొదలైనవి. ఈ ఆదివారం నేను రోగుల కొరకు ప్రార్థింతును.

87

ఇప్పుడు మనం ప్రార్థన చేయుదుము. ప్రభువా, మీ సేవకులుగా యిక్కడ మేము నిలబడియున్నాము. నీ ప్రజల ఎదుట మేము నిలుచున్నాము. మేమిక్కడున్నాము. నీవేమి చేయుదువో మేమెరుగము. నీవు భాషతో మాట్లాడ వచ్చును. నీవు అర్ధము చెప్పవచ్చును. నీవొక దర్శనమనియ్యవచ్చును. ఒక బయలుపాటుకై నేనెవరి చేతినైనా పట్టుకొనునట్లు నీవు చేయవచ్చును. నీవు పలికి, “నీవు కోరినది పలుకు” అధికారమునివ్వవచ్చు. ప్రభువా, నీవేమి చేయబోవుచున్నావో నేనెరుగను. బహుశా, మేము రోగులపై చేతులుంచవలెనని నీవు కోరవచ్చును. అదేమిటో మేమెరుగము. ప్రభువా, మికిష్టులమై యుండాలని మాత్రమే మేము కోరుచున్నాము. ఇక్కడ మీ సేవకులుగా మేము నిలబడియున్నాము. వీరు నీ ప్రజలైయున్నారు; నీ వాక్యము చేయమని చెప్పిన దానిని బట్టి మేము వారికి సహాయము చేయుటకు ప్రయత్నించుచున్నాము. మేము మీ యొక్క ఉపదేశములను వెంబడించుటకు ప్రయత్నిస్తున్నాము. ప్రభువా, ఈ ప్రజలకు పరిచారము చేయుటకై అవసరమైన దానిని మాకిమ్మని యేసుక్రీస్తు నామములో మిమ్ము వేడుకొనుచున్నాము. ఆమేన్.

మీలో మిగిలిన వారందరూ, మీ తలలు వంచి ప్రార్ధించవలెనని నేను కోరుచున్నాను. బ్రదర్ వుడ్స్, నీకిష్టమైతే.... మరియు పరిచారకులైన సహోదరులారా, మనము సరిగ్గా యిక్కడ నిలబడుదుమని నేను నమ్ముచున్నాను. అక్కడ ఎందరున్నారు? ఇక్కడ మీరు నలుగురున్నారు? సరే, అక్కడ ఒక్కొక్క ప్రక్క యిద్దరు, నేను నేరుగా వరుస యొక్క ప్రారంభము యొద్ద, సరిగ్గా యిక్కడ నిలబడతాను, చూశారా. ఒక్క క్షణం. ఇప్పుడు, సరే. సరే. సహోదరుడా గేరీ, ఇక్కడకు రండి. ఇప్పుడు, అంతే. యిప్పుడు నేరుగా యిక్కడికి రమ్ము, అంతే. యిప్పుడు వారు దాటి వెళ్ళుచుండగా సరిగ్గా అక్కడే నిలబడుము. సమాజమంతా... వారు నడచివచ్చునట్లు చిన్న బాలురైన మీరు యిప్పడు కొంచెం వెనక్కి జరగండి. ఇప్పుడు, మేమందరమూ ప్రార్ధన చేయుచుండగా, అంతట తిన్నగా మీ సీట్ల యొద్దకు వెళ్ళండి. కొద్ది నిమిషములలో, నేను రెండవ వైపు వారిని పిలుచుదును.

88

ఇప్పుడు, మీలో ప్రతి ఒక్కరూ, సేవకులు మాత్రమే కాదు గాని, మీరందరూ ఈ జనుల కొరకు ప్రార్ధించవలసియున్నది. మీరు వేరొకరి కొరకు ప్రార్ధించుచుండగా, దేవుడు మీకేమి చేయబోవునో మీరెరుగరు. మీరు సరియైన మాట పలికెదరేమో? అయితే ఇక్కడొక స్త్రీ నిలుచున్నది, ఆమె ఎంతగా రోగియై యున్నదంటే, వారామెను ఎత్తి పట్టుకొనవలసి వచ్చుచున్నది. బ్యాంక్స్ సరియైన మాట పలికినట్లుగా, హ్యాటీ సరియైన మాట పలికినట్లుగా, మీ ప్రార్ధన సరియైనదగునేమో? దేవుడు క్రిందికి దిగివచ్చి ఒకటి చేయునట్లుగా - మీ ప్రార్థన యుండి - మీరు సరియైన దానిని పలికెదరేమో? చూడండి, యిది ఒక్క వ్యక్తి కాదు; ఇది సజీవ దేవుని యొక్క సంఘము, ప్రతి ఒక్కరూ. ఇప్పుడు, ప్రతి ఒక్కరూ ప్రార్ధనలో ఉండండి.

89

[సాహో బ్రెన్హాం ఒక పరిచారకునికి పరిచయము చేయుచున్నారు.]

[టేపు పై ఒక ఖాలీ] .... కుప్ప వేయబడిన ఈ చేతి రుమాల్లు, ప్రభువా, వివిధ స్థలాలలో యున్న వ్యాధిగ్రస్తులు మరియు రోగుల యొద్దకు ఈ చిన్న గుడ్డలు (బట్టలు) వెళ్ళును. తండ్రి, దేవుని యొక్క మహిమా ఘనతల నిమిత్తమై, యేసుక్రీస్తు నామములో వారు ఆశీర్వదించబడుదురు గాక. ఆమేన్.

90

మంచిది. సహోదరుడా, ప్రభువు నిన్ను దీవించును గాక. మంచిది, ఒరేగాన్ నుండి. శాన్ జోస్... మంచిది, అద్భుతం. దేవుడు నిన్ను దీవించును గాక, అత్యంత గొప్ప కూటములలో అది ఒకటిగా యుండునని నేను ఆశించుచున్నాను. నా సహోదరుడా, నీకు కృతజ్ఞతలు చెప్పుచున్నాను. ప్రభువు నిన్ను దీవించును గాక.

ఇది పరలోకము వలె లేదా? మీరు ఆలోచిస్తే, సూవార్త ప్రకటించబడుట, ఆత్మలు క్రీస్తు వైపు తమ చేతులెత్తుట, రోగులూ, వ్యాధిగ్రస్తులూ, వరుస గుండా వెళ్ళుట, బాప్తిస్మపు ఆరాధనలు, సహవాసము, సహోదరభావమూ - అది భూమి మీదికి జారవిడువబడిన ఒక పరలోకపు తునకయే. మీకు తెలుసు, ఆయన. నాకు ఆ సమయములో ఆ అపోస్తలుడు చెప్పినట్టు అన్పిస్తుంది. “మన మిక్కడ ఉండుట మంచిది.” మనకు సాధ్యమైతే. మనము, ఒక్క గుడారము తప్ప ఎక్కువ అక్కరలేదు. అయితే, దేవుని పరిచర్య కొరకై మనము యిక్కడ వుండుటకు యిష్టపడుదుము.

91

ఇప్పుడు, ఈ ఉదయం ఈ వరుసలో వచ్చు ప్రజలలో ప్రతి ఒక్కరు, ప్రార్ధింపబడినవారు, గుర్తుంచుకొనండి, దేశమందంతటా జరిగినవని చెప్పకొనబడుచున్న ఈ సంగతులను అనుగ్రహించిన అదే దేవుడు — మరియు అవి నిజము, ఎంత యధార్ధముగా నిజము కాగలవో అంత నిజము. మరియు యిక్కడున్న పరిచారకులందరూ, వారి పరిచర్యలలో చేయబడినదంతా, ప్రభువు నాకిచ్చిన పరిచర్యలో చేయబడినదంతా, మేము మా హృదయమంతటితో, యధార్థముగా ఇక్కడ నిలబడి, మీ మీద మా చేతులుంచి ప్రార్థించుచుంటిమి - సరిగ్గా యేసు చెప్పినట్లుగానే. “నమ్మువారిని ఈ సూచక క్రియలు వెంబడించును. వారు రోగులపై చేతులుంచినప్పుడు, వారు స్వస్థపరచబడుదురు.”

ఇప్పుడు, యిది కేవలం... అది జరుగకుండా ఆపగలుగునది ఒకే ఒక్కటి, అది మీరు దానిని నమ్మకపోవుటయే. “ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును. కోరుకొను ప్రతి వాడునూ రమ్ము” యని యేసు చెప్పెను.

ఇప్పుడు, మీరు దానిని తప్పిపోవుటకు ఒకే ఒక్క మార్గమున్నది. దేవుని వాక్యము సత్యము. మిరు దానిని తప్పిపోవుటకు వున్న ఒకే ఒక్క మార్గము, రాకుండుటయే. అది నిజము కాదా? అదే మీరు దానిని తప్పిపోవుటకు వున్న మార్గము. “నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును. వారు రోగులపై చేతులుంచునప్పుడు, వారు స్వస్థపరచబడుదురు” యని దేవుడు చెప్పెను. దానిని తప్పిపోవుటకు మీకు ఒకే మార్గమున్నది - అది దానిని నమ్మకుండుటయే. మీరు దేవుని వాక్యమును నమ్మినట్లయితే, దేవుడు తన మాట నిలబెట్టుకొనును. మీరు చూడండి. అది.... అది మొదటిది, ప్రారంభము.... రోగుల కొరకు ప్రార్ధించు విధానమది. వారు వెళ్ళుచుండగా, వారి మీద చేతులుంచుట లేక అభిషేకించుట లేక దేవుడు చెప్పిన పద్ధతి ఏదైనా...

92

అయితే దానంతటి తర్వాత, తన ప్రజల మధ్య ఆయన వున్నాడని దేవుడు మీకు కనపరచుటకు, ఆయన సూచనలూ, అద్భుతములూ చేయును. చూడండి, ఆయన చేయు క్రియలు చేయుట, అవి సజీవ దేవుని యొక్క అద్భుతములూ మరియు ఆశ్చర్యకార్యములూ, ఇప్పుడు, ఆయన ఆశ్చర్యకరుడు. మీకలా అన్పించుట లేదా?

ఇప్పుడు, బాప్తిస్మపు ఆరాధన కొరకు ఆ లోపల సహోదరులు సిద్ధపడుచున్నారు. మరియు అది చాలా త్వరగా యుండును. ఇప్పుడు, వారు బాప్తిస్మము పొందవలసినవారు, ఆ స్త్రీలు ఆ గదిలోనికి వెళ్ళుదురు. అది సరియేనా, స్త్రీలు అక్కడ? స్త్రీలు యిక్కడ, మరియు పురుషులు యిటువైపు.

మనము బాప్తిస్మపు ఆరాధనకు సిద్ధపడుచుండగా, తర్వాత కొద్ది నిమిషములలో నేనొక లేఖనము చదువగోరుచున్నాను. అంతట మనము నిలబడియుండుట చేత మీలో కొందరి కాళ్ళు తప్పక నొప్పులు పడతాయని నాకు తెలుసు. ఇంకా కొన్ని నిమిషములు మాత్రమే మీరు నిలబడియున్నట్లయితే, ఈ జనులు ముంచబడుట మీరు చూసినప్పుడు మీరొక అందమైన దృశ్యమును చూచెదరు.

93

వారు బాప్తిస్మమునకు సిద్ధపడుచుండగా, అపొస్తలుల కార్యముల గ్రంధములో 2వ అధ్యాయములో కనబడు కొన్ని లేఖనములను యిప్పుడు నేను చదువగోరుచున్నాను. బాప్తిస్మము పొందవలసిన వారు యిద్దరు ముగురు మాత్రమే ఉన్నారని నేననుకుంటున్నాను; కొద్ది సమయం కంటే ఎక్కువ పట్టదు. మరియు మీరు కొంచెం శ్రద్ధగా వినవలెనని కోరుచున్నాను. ఇప్పుడు నేను అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 28వ వచనం నుండి చదవటం మొదలుపెడతాను, చదవటం మొదలు పెడుతున్నాను:

నీవు నాకు జీవమార్గమును తెలియపరచితివి - జీవమార్గములను (అది బహువచనములో యున్నది); నీవు నన్ను ఆనందముతోనూ, నీ ముఖ ప్రకాశముతోను నింపుదువు.

సహోదరులారా, పితరుడైన దావీదును గూర్చి మీతో నన్ను స్వేచ్చగా మాట్లాడనియ్యుడి - అతడు చనిపోయి పాతిపెట్టబడెను, మరియు అతని సమాధి నేటివరకూ మన మధ్యనున్నది.

అందువలన, ప్రవక్తగా నుండి.... [దావీదు ప్రవక్తయుని ఎందరికి తెలియును? నిశ్చయముగా, అతడు కీర్తన కారుడును, ప్రవక్తయునై యుండెను.] అతని సమాధి నేటివరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్తయై యుండెను గనుక - అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చండబెట్టుదును, అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడెరిగి.

క్రీస్తు పాతాళములో విడువ బడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను;

ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము. [అది ఈనాటి వలె అనిపించుట లేదా? మనము ఈ సంగతులకు సాక్షులము. “హ్యాటీ, మరియు మీలో మిగిలిన వారూ ఈ సంగతులకు సాక్షులని” ఈ ఉదయం నేను చెప్పగలను.]

కాగా ఆయన దేవుని కుడిపార్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి యున్నాడు.

దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు; అయితే అతడిట్లనెను - [గత ఆదివారం మేము ప్రవక్తలను గూర్చి - గొప్ప జనులైన వారందరిని గూర్చి - వారెలా చనిపోవలసి వచ్చినదో మేము చెప్పినది మీకు జ్ఞాపకమున్నదా? కాని రాజసంతానమైన ఒకరు వచ్చెను!]

నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచువరకు నీవు నా కుడిపార్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను.

మీరు సిలువ వేసిన యీ యేసునే దేవుడు ప్రభువు గాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.

వారు ఈ మాట విని. [ఆ యేసు ప్రభువు మరయు క్రీస్తు అయి ఉన్నాడు.] వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని - సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా,

పేతురు - మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.

ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.

ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి - మీరు మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను.

కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి; ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.

వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి.

అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములును సూచక క్రియలును అపొస్తలుల ద్వారా జరిగెను.

విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి.

ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారివారి అక్కరకొలది పంచి పెట్టిరి.

మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి.

మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను.

94

ఇప్పుడు వారు నీటి యొద్దకు వచ్చుచున్నప్పుడు. అతడు నీటి యొద్దకు వెళ్ళినప్పుడు, మీరు నాకు చెప్పుడి.

దేవుని చేత సార్వభౌమత్వపు కృప యేలుచున్నదని మీరు తెలిసికొనునట్లు, నేను తిరిగి వెళ్ళ గోరుచున్నాను. వేరొక దానిని లోపలికి తీసుకుని రాకుండా నేను ఉండలేను. రక్షించబడిన ఆ స్త్రీ యొక్క పిల్లల్ని ఆ యిద్దరు బాలురనీ - జగత్తుపునాది వేయబడక ముందే దేవుడెరిగియున్నాడని మీకు తెలుసా? జగత్తుపునాదికి ముందే వారి పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో ఉంచబడినవి. బైబిల్ ఆలాగు చెప్పుచున్నది. అయితే అది ఈ నిమిషం వరకూ క్రియ చేయవలసియుండెను. జగత్తుకు పునాది కూడా వేయక కోటి సంవత్సరాల ముందుగానే మనమిక్కడ నిలబడుదుమని దేవునికి తెలుసని, మీకు తెలుసా? ఈ ఉదయం మన మిక్కడ నిలబడుదుమని ఆయనెరుగునని మీకు తెలుసు? దేవుని యొక్క అనంతత్వము ప్రతి ఈగనూ, ప్రతి దోమనూ, యింకా అవెన్నిసార్లు వాటి కను రెప్పలాడించునో, అవి యెంత క్రొవ్వును ఉత్పత్తి చేయునో, దానిని ఎరిగియుండెను. జగత్తు రూపింపబడక మునుపే దేవుడు దానినెరిగియుండెను.

95

“సరే, అది ఆయనకు తెలిసినట్లయితే, అప్పుడు నీవెందుకు బోధించుచున్నావు?” యని యిప్పుడు నీవందువు, అది దేవుని ప్రణాళికలో ఒక భాగము. ఆయన ప్రణాళికను బోధించుట. ఆయన అపోస్తలులను చూసినప్పుడు, ఆయన కోతకాలమును చూసెను. “పంట కోతకు వచ్చెను గాని పని వారు కొద్ది మందేయున్నారు. ఆయన తన పొలములోనికి పనివారిని పంపునట్లు, కోత యజమానుని వేడుకొనుడని” ఆయన చెప్పెను. ఎంత మందికది జ్ఞాపకమున్నది? సరే, కోత యొక్క యజమాని అది చేయబడునని ఎరిగియుండి, అక్కడ నిలబడియుండగా, వారెందు కొరకు కోత యొక్క యజమానుని వేడుకొనవలెను? ఎందుకు? దేవుడు దానిని అలాగున ఏర్పరచెను, తన...

ఇప్పుడు, దీనిని వినండి. మీరు, నేనూ లేకుండా తన ప్రణాళిక కదలలేకుండునట్లు దేవుడు దానినేర్పరచెను. మరియు మనమేమి చేయవలెనని దేవుడు కోరుచున్నాడో దానిని మనము చేయనంత కాలమూ, మనమాయన ప్రణాళికను ఆటంకపరచుచున్నాము. అయితే, సంఘము పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము చేత నడుస్తున్నప్పుడు, అప్పుడు మనమాయన ప్రణాళికను నెరవేరుస్తూ దేవుని చిత్తములో యున్నవారము.

96

ఓ, నేను కాలిఫోర్నియా నుండి తిరిగి రాగానే, ప్రభువు చిత్తమైతే, బ్రెన్హాం టేబర్నికల్ కి అవసరమైనది ఒక ఉజ్జీవము. ఆమేన్. వారికొక ఉజ్జీవము మరియు పరిశుద్ధాత్మ చేత నింపబడుట అవసరమైయున్నది. ఇప్పుడు అది టేబర్నికల్ యొక్క గొప్ప అవసరమైయున్నది. ప్రపంచములోని అత్యంత శ్రేష్టులైన వారిలో కొందరిక్కడికి వస్తారు, కాని మనకు అవసరమైనది పరిశుద్ధాత్మ బాప్తిస్మమే. అది నేను అనుభూతి చెందుచున్నాను, దానిని చెప్పగలను. ప్రభువు తిరిగి వచ్చిన వెంటనే, ప్రభువు చిత్తమయితే, ఆ ఉద్దేశ్యము నిమిత్తమై మేము ఒక ఉజ్జీవమును కలిగి యుందుము. పరిశుద్ధాత్మను వెదకుచున్న ఈ టేబర్నికల్ యొక్క సభ్యులు వచ్చి సూచనలూ మరియు మిగిలినవన్నీ పొందవచ్చును. సంఘము తిరిగి దేవుని చిత్తములోనికి వచ్చుటకూ, యింకా అది కొనసాగుచుండగా దేవని ప్రణాళికతో కూడా కొనసాగునట్లు పరిశుద్ధాత్మను పొందుటకై యిక్కడ ప్రార్ధనా కూటములు, కలిగి యుండవచ్చును [స్పష్టతలేని మాటలు].

ప్రభువు మిమల్ని దీవించును. ఇప్పుడు వారు కొలను యొద్ద సిద్ధముగా యున్నారని నేను నమ్ముచున్నాను.

ప్రతి వ్యక్తిని నీవు తిసుకోనుము. మరియు నేను అక్కడికి వెళ్ళి వారికొరకు ప్రార్ధించెదను...

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...