పరిశుద్ధాత్మ అనగా ఏమిటి?

పరిశుద్ధాత్మ అనగా ఏమిటి?

 …ఒక కూటమని చెప్పడం కష్టం. మనము సాధారణంగా ఇక్కడ కలిగియుండే కూటము కంటే ఈ కూటము కొంచెము భిన్నంగా ఉండబోవుచున్నది. ఎక్కువగా, మనము ఇక్కడకి కూడివచ్చిన ప్రతీసారి, ఇది ఒక…రోగులను స్వస్థపరచుటకు మరియు భౌతికమైన అవసరాల కొరకైన కూటముగా ఉంటుంది. దానికే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయితే ఈ రాత్రి ఆత్మయొక్క అనగా, మానవునియొక్క ఆ—ఆ ఆత్మను గూర్చిన స్వస్థత కొరకు మేము ఈ ఉజ్జీవమును ప్రారంభించాము.

ఎలాగైనను, ప్రభువు చిత్తమైతే, ఆదివారము ఉదయం, ఆదివారపు బడిలో, ఆదివారము ఉదయము, ప్రభువు చిత్తమైనయెడల, ఆదివారము ఉదయము రోగుల కొరకు ప్రార్ధనను మరియు క్రమంగా జరిగే ప్రార్ధన వరుసను మనము కలిగియుండబోవుచున్నాము. మరియు ఈ వారం రాత్రులు, ఈ—ఈ ఆత్మ కొరకు నిత్యత్వపు సంగతులపై మాట్లాడవలెనని మేమెంతగానో ఒత్తిడి చేయబడియున్నాము.

2 ఇప్పుడు, ఒక—ఒక శరీరము స్వస్థత పొందినప్పుడు, అది మనందరికి సంతోషాన్ని కలిగిస్తుందని మనకు తెలుసు, ఎందుకనగా మన దేవుడు రోగులను స్వస్థపరుస్తాడని అది ఖచ్చితంగా చూపిస్తుందని మనము ఎరిగియున్నాము. అయితే ఆ వ్యాధిగ్రస్తుడు, ఇంకా కొంత కాలం వారు జీవించినట్లైతే, బహుశా మరలా వ్యాధిన పడవచ్చును, వారు స్వస్థత పొందిన అదే రోగముచేతయై ఉండవచ్చును, మరియు అది నయం కాకపోవచ్చును. వైద్యుడు నిమోనియాకి మందులు ఇస్తాడు, మరియు బహుశా వారు బాగుపడతారని అతడు చెప్పిన రెండు రోజుల తర్వాత నిమోనియాచేత వారు చనిపోవచ్చును. అది మరలా సంభవించును. కానీ ఆ ఆత్మ స్వస్థత నొందినప్పుడు, అప్పుడు మీరు, మీలో నిత్యజీవమును కలిగియుంటారు.

3 మరియు మనము ప్రభువైన యేసు యొక్క రాకడకు ఎంతో సమీపముగా ఉన్నామని నేను నమ్ముచున్నాను, అది ఆ రాజ్యములోనికి ప్రతీ ఆత్మను తీసుకువచ్చుటకు మనం చేయగలిగినదంతా చేయునట్లు మనలను ప్రవర్తింపజేస్తుంది, మరియు మన ఆత్మలు స్వస్థత పొందులాగున, ప్రజలను ఆ రాజ్యములోనికి తీసుకువచ్చునట్లు చేయును. నాకు తెలిసినంతవరకు యేసుయొక్క శరీరమే అత్యంత వ్యాధిగ్రస్థమైనదని నేను నమ్ముచున్నాను; అది, ఆ—ఆ శరీరము, భూమిమీద క్రీస్తుయొక్క ఆత్మీయ శరీరము, అత్యంత వ్యాధిగ్రస్థమైనది.

4 మరియు ఇప్పుడు, రాత్రి ఎక్కువ సమయం మిమ్మల్ని ఉంచాలని మేము అనుకోవడంలేదు, ఎందుకనగా మొదటిరోజు రాత్రి మన ప్రియ మిత్రులు కూర్చోడానికి మనకు స్థలము లేకుండెను. సరిగ్గా ఇక్కడ ఈ స్థలములో, మేము ఒక నూతన ఆలయమును, ఒక పెద్ద ఆలయమును, నిర్మించే ప్రయత్నములో ఉన్నాము, లేదా ప్రభువు నడిపించిన ఏ చోటనైనా; అయితే మాకు తెలిసినంతవరకు, అది ఇక్కడేయైయున్నది.

5 మరియు ఇప్పుడు బుధవారము నుండి ఆదివారము వరకు, మేము కూటమును ప్రకటించాము. అయితే పిదప ఆదివారముతో, క్రిస్టమస్ సెలవులు దగ్గరపడతాయి, అయితే అది…ప్రభువు మనతో ఆపివేయమని ఎప్పుడు చెప్తాడో, అదే ఆ సమయమైయుంటుంది. అసలు ఆ ఫలితాలు ఎలా ఉంటాయో మనమెరుగము. అయితే ఇక్కడ ఆలయములోనున్న ప్రజలు మరియు మన సహచర సంఘములు (ఏదనగా, వాటిలో ఒకటి—ఒకటి యూటిక వద్దనున్న ఆ హోలీనెస్ ఆలయమైయున్నది, దానికి సహోదరుడు గ్రహం స్నెలింగ్ సంఘకాపరియై యున్నాడు, మరియు న్యూ ఆల్బనీలో సహోదరుడు—సహోదరుడు జూని జాక్సన్ సంఘ కాపరిగా ఉన్నటువంటిది, మరియు హైవే వద్ద సహోదరుడు రడెల్ సంఘ కాపరిగా ఉన్నటువంటిదైయున్నది), మేము మరియు వారు, ఈ ఆలయముయొక్క సహచర సంఘములై యున్నాము, మేము ఆ…మా ప్రజలను క్రీస్తుతో ఒక ఉన్నతమైన సహవాసములోనికి తెచ్చుటకై ప్రయత్నించుచున్నాము. మరదే మా ఉద్దేశ్యమైయున్నది. కావున ఈ తదుపరి కొన్ని రాత్రులు, నేను చదువుటకు మరియు దానిపై బోధించుటకు నిశ్చయించుకున్నాను…

6 ఈ రాత్రి: పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అనే అంశముపై నేను మాట్లాడగోరుచున్నాను. మరియు రేపు రాత్రి: అది ఎందుకొరకు ఇవ్వబడినది? అను దానిపై నేను మాట్లాడగోరుచున్నాను. మరియు శుక్రవారము రాత్రి…మరియు, రికార్డు చేయువారికి, శుక్రవారము రాత్రి ఇది టేపు చేయబడవలెనని నేను కోరుటలేదు: పరిశుద్ధాత్మను నేనెట్లు పొందుకుంటాను? మరియు దానిని నేను కలిగియున్నానని నాకెట్లు తెలుస్తుంది? మరియు పిదప మనం కేవలం, శనివారము మరియు ఆదివారము కొరకు, ప్రభువు మనలను ఎట్లు నడిపించునో చూద్దాము. మరియు ఆదివారము ఉదయము, ఒక స్వస్థత కూటము, మరియు ఆదివారము రాత్రి కొరకు మరొక సువార్తపరమైన కూటము ఉంటుంది.

7 మరియు ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మేము కోరుచున్నది ఏదనగా…ఆ వెనుక గదిలో రికార్డింగులు చేయబడుచున్నవని నాకు తెలుసు, అయితే మేము దీనిని చెప్పగోరుచున్నాము. ఎందుకనగా, సువార్తికపరమైన ఇటువంటి ఈ కూటములలో, ప్రతి ఒక్కరూ వారియొక్క స్వంత నమ్మకపు పరిధిలో నేర్పించబడినవారై వివిధ సంఘశాఖ సంఘముల నుండి వచ్చిన ప్రజలను, మనము కలిగియుంటాము. మరియు అది సరియే. సహోదరుల మధ్య బేధమును విత్తాననే అపరాధిగా నేనెన్నడూ ఉండగోరలేదు. మరియు బయట కూటములలో, నేను కేవలం నా కూటములకు సమర్పకులైయున్న సహోదరులు నమ్మునటువంటి, లేఖనముయొక్క గొప్ప సువార్త సత్యములను నేను బోధించుదును. కానీ, ఇక్కడ ఈ ఆలయములో, మనము నమ్మునటువంటి దానిపైనే నేను—నేను మాట్లాడగోరుచున్నాను. కాబట్టి, మీరు గనుక—మీకు అది అర్ధం కానియెడల, మేమెందుకు దానిని ఆ విధంగా నమ్ముదుమని నన్ను ప్రశ్నించుటకు, ఒక—ఒక చిన్న ఉత్తరము లేదా ఒక చీటీ మీ వద్ద నుండి వచ్చినయెడల నేను ఎంతగానో సంతోషిస్తాను. మరియు నేను వీలైనంత చక్కగా దానిని వివరించే ప్రయత్నం చేయుటకు నేను చాలా ఆనందిస్తాను.

8 మీకు తెలియును, ప్రతి సంఘము, మీకొక సిద్ధాంతము లేనియెడల, మీరొక సంఘము కాదు. మీరు నిలబడునటువంటి ఏదో ఒక దానిని, మీరు పట్టుకొనియున్న ఏవైనా నియమాలను మీరు కలిగియుండవలసయున్నది. మరియు ఒక వ్యక్తియొక్క అనుబంధము లేదా సంఘశాఖ ఏమైనప్పటికిని, ఆ వ్యక్తి దేవునియొక్క ఆత్మ ద్వారా జన్మించినయెడల, అదేమైనా గానీ, అది నా సహోదరుడు లేదా నా సహోదరియైయున్నారు…తూర్పుకు పడమర ఎంత దూరముగా ఉన్నదో, అంతగా మేము ఇతర విషయములలో విభేదించవచ్చును, కానీ మేమింకనూ సహోదరులమైయున్నాము. మరియు క్రీస్తుకు సమీపముగా, చక్కగా నడుచుటలో ఆ సహోదరునికి సహాయం చేయ ప్రయత్నించుట తప్ప నేను మరొకటి చేయను. మరియు ఏ అసలైన, నిజమైన క్రైస్తవుడైనా గానీ నాకునూ అట్లే చేయునని నేను నమ్ముచున్నాను.

9 ఇప్పుడు, నేను ఈ ఆలయాన్ని అడిగాను…ఇప్పుడు, కేవలం ఒక సుదీర్ఘ కూటము కొరకు మనము దీనిలోనికి ప్రవేశించుటలేదు. నేను దీనిలోనికి ప్రవేశించగోరుచున్నాను, మరియు మీరు మీ వెనుకనున్న ప్రతీ వారధిని కాల్చివేసి, మరియు ప్రతి పాపమును సరిచేసుకొనవలెనని, నేను కోరుచు, మరియు మిమ్మల్ని అడిగియున్నాను, ఎట్లనగా మన హృదయములలో మరియు మన జీవితములలో ఉన్నదానంతటితో మనము దీనిలోనికి ప్రవేశించుచున్నాము. మరే ఇతర ఉద్దేశ్యము కొరకు కాదు గానీ మన ఆత్మలను ప్రభువుయొక్క రాకడకై సిద్ధపరచుకోవలెనన్న ఒకే ఒక ఉద్దేశ్యముతో మనమిక్కడకు రావలెను. మరియు నేను దీనిని పలికి మరియు చెప్పినట్లే, కొన్నిసార్లు నేను ఉపదేశించేది లేదా నేను చెప్పేది ఏదైనా, వేరెవరైనా దానిని నమ్మిన విధానానికి కొంచెం భిన్నంగా ఉండియుండవచ్చును. నేను—నేను వివాదము కొరకు రాలేదు, మీరు చూడండి, నేను—నేను వచ్చినది…ప్రభువు రాకడను సిద్ధపరచుటకై మేమిక్కడ ఉండియున్నాము. మరియు నేను తలంచునది ఏమనగా ఈ చిన్న గుంపు…

10 ఆయా స్థలముల నుండి, వచ్చిన నాకు తెలిసిన కొంతమంది సందర్శక సహోదరులు ఇక్కడ నాతో ఉండియున్నారు, మరియు వారిని కలిగియుండుటకు మనము సంతోషించుచున్నాము. మరియు నగరానికి వెలుపల నుండి వచ్చిన ఇతరులు, ఇక్కడ మన చిన్న జంట నగరాల చుట్టుప్రక్కల నుండి వచ్చినవారే ఈ ప్రజలలో ఉన్నారనుటలో ఎటువంటి సందేహము లేదు. మరియు మిమ్మల్ని కలిగియుండుటకు మేము సంతోషించుచున్నాము, మరియు మీరు ఈ విషయాలు వినుటకు వచ్చేంతగా, మమ్మల్ని ప్రేమించినయెడల మేము మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాము. దేవుడు…నా సహోదరుడా, సహోదరీ, దేవుడు మీ హృదయములో పోయగలిగిన ఘనమైన సంపదలను మీరు మీతోపాటు మీ గృహమునకు తీసుకువెళ్ళుదురన్నది, నా ప్రార్ధనయైయున్నది.

11 మరియు ఈ చిన్న ఆలయమునకు, దానిని చూచుటను బట్టి భూమి మీదనున్న అతి చక్కని ప్రజలలో ఒకరు, ఈ ఆలయమునకు వెళ్ళుదురని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు, “అందరూ” చక్కని ప్రజలని నేను అస్సలు చెప్పలేదు. భూమి మీదనున్న చక్కని ప్రజలలో కొందరు ఈ ఆలయమునకు వెళ్ళుదురని నేను చెప్పాను. అయితే రోజు రోజుకు, తిరిగి ఒక కూటము నుండి మరొక కూటమునకు ప్రవేశించుచుండగా, ఈ ఆలయమునకు గల ఒక గొప్ప అవసరతను నేను చూచుచున్నాను, దానికొక గొప్ప అవసరత కలదు, మరియు అది ఒక నింపుదల, లేదా ఒక సమర్పణ, ఒక లోతైన జీవితం, దేవునితో ఒక దగ్గర నడక కొరకైయున్నది. మరియు నేను దీనిని చేయుదునని, ఈ వర్తమానములను వారికి అందించెదనని వారికి వాగ్దానం చేశాను. మేము బోధిస్తూ మరియు వెలికి తెచ్చుటకు ప్రయత్నించుచుండగా, మిమ్మల్ని లోపలికి తీసుకువచ్చి మరియు మాతో పాటు దేవుని వాక్యముతో సహవాసము చేయుటకు మేము ఆనందించుచున్నాము.

12 ఇప్పుడు, మొదటి మూడు రాత్రులు ప్రసంగించుటకు మనము ఒక అంశమును తీసుకొనబోవడంలేదు, కానీ బోధించడానికి దేవునియొక్క వాక్యము నుండి ఒక వర్తమానమును తీసుకుంటాము.

మరియు ఇప్పుడు, ఏమిటనగా, స్వయంగా నాకు నేనుగా చేయనటువంటి ఏ కార్యమునైనా చేయమని నేను ఎవరినీ అడగను. మరియు ఈ వారము నాకు ఒక సంపూర్ణ కల్వరి వంటిదైయున్నది. నేను దానినిట్లు చెప్పెదను, నేను దాదాపు నా ఆధీనములో లేకుండునంతగా, నేను—నేను అపస్మారక స్థితికి పోయినట్లయినది. కానీ నేను ప్రతీ ఇష్టమును, మరియు నాకు తెలిసిన ప్రతీదానిని, పూర్తిగా ప్రభువుకు అప్పగించుకున్నాను.

13 ఒక రాత్రి, దాదాపు అర్ధరాత్రి దాటిన తర్వాత, నేను మరియు నా భార్య, సిద్ధపడిన తర్వాత, ప్రార్ధన చేస్తూ మరియు ప్రభువుతో మాట్లాడుతూ, మా ముందు గదిలో…చిన్న పీటకి ఎదురుగా, తెరిచియుంచిన రెండు బైబిల్లతో, మేము మా జీవితాలను నూతనముగా దేవునికి సమర్పించుకున్నాము, ఒక సంపూర్ణ సేవ నిమిత్తము, మా స్వంత ఇష్టాలను, మరియు ప్రతిదానిని, మరియు ప్రతీ ప్రతికూలమైన ఆలోచనను, ప్రభువును సేవించుట కొరకు అప్పగించుకున్నాము.

మరియు మీరు అదే విషయాన్ని చేసారని, మీరు కూడా, అదే ఉద్దేశ్యమును కలిగియున్నారని నేను నమ్ముచున్నాను. పిదప ఈ రాత్రి మనము వచ్చుచున్నప్పుడు, పరిశుద్ధమైన స్థలమునకు, ప్రార్ధన చేయుచు, మరియు ఉపవాసముంటూ, మరియు సరిచేసుకొనుచు, మరియు దేవునియొద్ద నుండి ఏదైనా పొందుకొనుటకు సిద్ధపడుచున్న ప్రజల మధ్యకు మనము వచ్చుచున్నాము. మరియు ఆకలితో వచ్చువాడు ఆకలితో తిరిగి వెళ్ళడని నేను ఎరిగియున్నాను, అయితే దేవుడు జీవపు రొట్టెతో పోషించును.

14 ఇప్పుడు, ఆయనయొక్క పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుటకు ముందు, ప్రార్ధన కొరకు ఒక నిమిషము మన శిరములు వంచెదము.

15 ప్రభువా, ఈ రాత్రి ఇదివరకే ఈ స్థలములో ప్రార్ధన అర్పించబడియున్నది. అక్కడ…నీ పిల్లల ద్వారా సీయోను గీతములు పాడబడినవి. వారి హృదయములు ఉప్పొంగియున్నవి. మరియు మమ్మల్ని మేము నీకు సమర్పించుకొనుటకు మరియు మా ప్రాణాంతరంగములో నుండి నిన్ను ఆరాధించుటకు మేము ఇక్కడకి వచ్చియున్నాము. మరియు ప్రభువా, మేము దీనిని నీకు జ్ఞప్తికి తెచ్చుచున్నాము, అదేదనగా కొండపైన కూర్చొని మరియు నీ శిష్యులకు బోధించినప్పుడు నీవు ఇట్లు చెప్పితివి, “నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు.” ప్రభువా, నీవు దానిని వాగ్దానము చేసియున్నావు. ఈ రాత్రి మేము తెరచియున్న హృదయములతో వచ్చుచున్నాము. ఆకలిదప్పులతో, మేము వచ్చుచున్నాము, మరియు నీవు నీ వాగ్దానమును నిలబెట్టుకుంటావని మేము ఎరిగియున్నాము.

16 బైబిలు యొక్క ఈ పరిశుద్ధ పేజీలను తెరచుటకును, దానిలో నుండి ఆ సంగతులను చదువుటకును మేము ప్రయత్నించుచుండగా, పరిశుద్ధాత్మ దానిని ప్రతి హృదయము నొద్దకు తీసుకువెళ్ళునుగాక. మరియు ఆ విత్తనము వాక్యము చేసిన ప్రతి వాగ్దానమును తీసుకొనివచ్చునట్టి ఒక లోతైన, ఘనమైన విశ్వాసములో పడును గాక. ప్రభువా, మా ప్రార్ధనను ఆలకించండి, మరియు మమ్మల్ని శుద్ధి చేయండి, మరియు మమ్మల్ని పరీక్షించండి. మరియు ప్రభువా, మా విషయమై ఏదైనా అపవిత్రమైన సంగతి, ఏదైనా ఒప్పుకొనబడని పాపము, సరి కానిదేదైనా ఉన్న యెడల, దానిని ఇప్పుడే బయలుపరచుము, ప్రభువా, మేము తిన్నగా నడచుకొని మరియు దానిని చేసెదము, ఏలయనగా ప్రభువైన యేసు యొక్క రాకడ యొక్క ఛాయల్లో మేము జీవించుచున్నామని మేము గ్రహించియున్నాము. మరియు పరిశుద్ధుడవైన ఓ దేవా, నీ—నీ నీతి యొక్క నీడలోనికి మేము ఈ రాత్రి వచ్చియున్నాము, మరియు ఒక నూతనమైన ప్రతిష్ట కొరకు, మరియు సమర్పణ కొరకు, మరియు మా జీవితాలలో పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కొరకు మేము బ్రతిమాలుచున్నాము.

17 ఉజ్జీవపు మంటలు చల్లారనారంభించుట చూచుచుండగా, అది ఒక కొత్త మంటను రాజేయునట్లును, మా హృదయములు ఆసక్తితో నిండునట్లును, మమ్ములను వాక్యపు కట్టెలను వేయనిమ్ము. ప్రభువా, నీ యొక్క ప్రశస్తమైన వాక్యము మరియు నీ రక్తము, మరియు నీ కృప ద్వారా మమ్ములను శుద్ధి చేయమని, మేము వేడుకొనుచున్నాము. మరియు సమస్త కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లును. మా హృదయములనుండి సమస్త పక్షపాతమును తీసివేయుము. ఓ ప్రభువా, మమ్ములను శుద్ధి చేయుము. మాకు స్వచ్ఛమైన హృదయములను, మరియు నిర్దోషమైన చేతులను, మరియు శుద్ధ మనస్సులను అనుగ్రహించండి, తద్వారా నీ పరిశుద్ధ స్థలములోనికి, నీ ఆత్మతో నింపబడి మరియు ఆనందించుచు, ప్రతి రాత్రి మేము వచ్చుదుము. మేము దీనిని యేసు నామములో, మరియు ఆయన నిమ్మిత్తము అడుగుచున్నాము. ఆమేన్.

18 నేనిప్పుడే వాక్యమును చదువగోరుచున్నాను. మరియు…లేఖనముల కొరకు, మీ బైబిల్ గ్రంథాలను, మీ పెన్సిళ్ళు, మీ కాగితములను తెచ్చుకోవలెనని నేను మీకు చెప్పాను. మీరంతగా అట్లు ఆశించినయెడల, అది చాలా బాగుంటుంది. మరియు ఇప్పుడు ప్రారంభించుటకు, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము వద్దకు మీరు వెళ్ళుచుండగా; ఈ ప్రశ్నకు జవాబిచ్చుటకు, లేదా ఈ ప్రశ్నకు సమాధానము ఇవ్వనారంభించుచున్నాము: పరిశుద్ధాత్మ అనగా ఏమిటి?

19 సాతానును ఓడించునది ఏదియు లేదు, ఈ భూమి మీద దేవునియొక్క వాక్యము వలె సాతానును ఓడించునది ఏదియు ఎన్నడూ లేదు. యేసు తనయొక్క గొప్ప పోరాటములో దానిని ఉపయోగించెను; ఆయన ఇట్లు చెప్పెను, “అని వ్రాయబడియున్నది…”

20 మరియు ఈ ఉదయం, కొన్ని రోజుల క్రితము, ఒక ప్రసారాన్ని నేను వినుచుండగా, అది సృష్టి కేవలం కొంత బూడిద వెదజల్లబడుట ద్వారా, మరియు కొంత ఫాస్ఫేటు, మరియు భూమియొక్క కొన్ని రసాయనముల నుండి, మరియు వెచ్చని సూర్యునియొక్క వెలుగు జీవపు కణమును సృష్టించి మరియు జీవమును బయటకు తీసుకు వచ్చెనని చెప్పగోరుచున్నట్లు అగుపించినది. ఎంతటి వెఱ్ఱితనం! ఎట్లనగా, ఆ సూర్యరశ్మి ఎటువంటి జీవకణమునైనా చంపివేయును. ఒక కణమును సూర్యరశ్మి క్రింద ఉంచండి, అది దానిని వెంటనే చంపివేయును. మరియు అసలు అటువంటిదేదియు లేదు; కానీ సాతానుడు దానిని నా మీదకు విసురుటకు ప్రయత్నించుచుండెను. మరియు ఈ ఉదయం నా చిన్న రిబ్కాను నేను పాఠశాలకు తీసుకువెళ్ళిన తరువాత, మరియు తిరిగి వచ్చే దారిలో, నేను మరలా రేడియోను వినడం మొదలుపెట్టాను; మరియు మరలా నేను ఆ విషయాలలోనికి వెళ్ళవలసి వస్తుందని నేను అనుకున్నాను, కాబట్టి మరలా దానిని వెంటనే ఆపుచేశాను.

మరియు నేను ఆ వీధిగుండా వెళ్ళుచుండగా, సాతానుడు నాతో ఇట్లనెను, వాడిట్లన్నాడు, “నీవు యేసు అని పిలిచే ఈ వ్యక్తి, ఒకనాడు తన దినమున, కేవలం ఒక బిల్లీగ్రాహం లేదా ఓరల్ రాబట్స్ వలెనే ఒక మామూలు మనిషేనని నీకు తెలుసా? ఆయన కేవలం వారాయన చుట్టూ కొంత మంది ప్రజలను పోగుచేసి ఆయన ఒక గొప్ప వ్యక్తి అని చెప్పనారంభించినట్టి ఒక మామూలు మనిషేయైయున్నాడు, మరియు కొంత కాలం తర్వాత ఆయన గొప్పవాడయ్యాడు, మరియు పిదప ఆయన వారికి ఒక—ఒక దేవుడయ్యాడు. మరియు ఆయన మరణానంతరం, ఇప్పుడది ప్రపంచమంతటా వ్యాపించింది, అంతే.”

21 “నీవెంత అబద్ధికుడివిరా!” అని నేను అనుకున్నాను. మరియు పిదప సరిగ్గా గ్రాహం వీధిని దాటుచుండగా నేను మలుపు తిరిగాను. నేనిట్లన్నాను, “నా మనస్సాక్షితో మాట్లాడుచున్న సాతానా, నేను నిన్ను కొన్ని విషయాలు అడుగగోరుచున్నాను: రాబోవువాడని ఆ హెబ్రీ ప్రవక్తలు పలికిన ఆయన ఎవరు? ఆ అభిషిక్తుడైన మెస్సీయ ఎవరు? ఆయన ఇక్కడికి రావడానికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే, ఆయనను ముందుగా చూచి మరియు ఆయన జీవితమును గూర్చి చెప్పిన వారిపై ఉన్నది ఏమిటి? అక్షరాలా దానిని గూర్చి ముందుగానే చెప్పినది ఎవరు? మరియు ఆయన వచ్చినప్పుడు, వారిట్లన్నారు, ‘ఆయన అక్రమాకారులలో ఒకడిగా ఎంచబడినాడు,’ మరియు ఆయన ఎంచబడినాడు. ‘మన అతిక్రమ క్రియలనుబట్టి అతడు గాయపరచబడెను,’ మరియు ఆయన గాయపరచబడినాడు. ‘ధనవంతులతో అతనికి సమాధి నియమింపబడెను, కానీ అతడు మూడవ దినమున, తిరిగి లేచును,’ మరియు ఆయన అట్లే చేసియున్నాడు. మరియు పిదప ఆయన పరిశుద్ధాత్మను వాగ్దానము చేసెను, మరియు నేను దానిని పొందుకున్నాను. కాబట్టి నీవిక దానినుండి దూరంగా పోవుట మంచిది, ఎందుకనగా అది వాక్యములో వ్రాయబడియున్నది, మరియు ప్రతీ వాక్యము సత్యమైయున్నది.” అప్పుడు వాడు వెళ్ళిపోయాడు. కేవలం వాడికి వాక్యమును ఇవ్వండి, అది క్రియ చేస్తుంది. వాడు ఆ వాక్యము ఎదుట నిలబడలేడు, ఎందుకనగా అది ప్రేరేపించబడినది.

మనం ఈ రాత్రి అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో నుండి చదవడం ప్రారంభించెదము.

పిదప ప్రధాన యాజకుడు ఇట్లడిగెను, ఈ సంగతులు నిజమేనా?

అందుకతడు ఇట్లు చెప్పెను, పురుషులారా, సహోదరులారా, మరియు తండ్రులారా, వినుడి; మన పితరుడైన అబ్రాహామునకు, తాను హారానులో కాపురముండక మునుపు మెసొపొతమియలో ఉన్నప్పుడు, దేవునియొక్క మహిమ ప్రత్యక్షమయ్యెను,

మరియు నీవు నీ దేశమును, నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని, అతనితో చెప్పెను.

అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి, హారానులో కాపురముండెను: మరియు అక్కడ నుండి, అతని తండ్రి చనిపోయినప్పుడు, మీరు ఇప్పుడు నివసిస్తున్న ఈ దేశంలోకి అతణ్ణి, తీసుకువచ్చెను.

మరియు ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను, స్వాస్థ్యముగా ఇవ్వలేదు, లేదు: అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరతునని అతనికి వాగ్దానము చేసెను.

…దేవుడు అతని సంతానము అన్యదేశమందు పరవాసులగుదురనియు; మరియు వారు నన్నూరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరచుకొని బాధ పెట్టుదురనియు చెప్పెను.

మరియు ఏ జనమునకు వారు దాసులై యుందురో, ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదుననియు: మరియు ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురనియు దేవుడు చెప్పెను.

మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధనను అతనికి అనుగ్రహించెను: కావున అతడు ఇస్సాకును కని, ఎనిమిదవ దినమందు అతనికి సున్నతి చేసెను; మరియు ఇస్సాకు యాకోబును కనెను; మరియు యాకోబు పన్నిద్దరు గోత్రకర్తలను కనెను.

22 ఈ విషయము మీద, ఈ అంశమును సమీపించగోరుచున్నాము, అది ఈనాడు అసాధారణమైన విషయముగా ఉంటుందని నేను తలంచుచున్నాను, అది…పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అది ఏమిటి? మరియు, ఇప్పుడు, నేను ఈ అంశమును ఈ విధమైన వరుసలో తీసుకొనుటకు కారణమేదనగా, అసలు పరిశుద్ధాత్మ అనగా ఏమిటో మీకు తెలిస్తేనే గానీ మీరు వచ్చి మరియు దానిని పొందుకొనలేరు. మరియు అది ఏమిటో మీరు తెలుసుకొని, అది మీ కొరకేననియు, అది మీకు ఇవ్వబడినదనియు నమ్మితేనేగానీ మీరు దానిని పొందుకొనలేరు. మరియు, పిదప, అది ఎటువంటి ఫలితాలను తీసుకొనివస్తుందో మీరు ఎరిగియుంటేనేగాని, మీరు దానిని కలిగియున్నారా, లేదా కలిగిలేరా అన్నది మీరు తెలుసుకొనలేరు. కాబట్టి అది ఏమిటనియు మరియు అది ఎవరి కొరకనియు మరియు అది వచ్చినప్పుడు అది ఎటువంటి చర్యను తీసుకువస్తుందనియు, మీరు తెలుసుకున్నయెడల, అప్పుడు మీరు దానిని పొందుకున్నప్పుడు మీరేమి పొందుకున్నారన్నది మీకు తెలియును. చూశారా? అది సరిగ్గా దానిని స్థిరపరుస్తుంది.

23 సరిగ్గా ఈ రోజు మన సహోదరుడు జెఫ్రీసుతో నేను మాట్లాడుచున్నట్లే అది ఉన్నది, మరియు అతడిట్లు చెప్పెను, “ఈ రాత్రికి కూటము వద్ద ఉండుటను నేను ఇష్టపడుచున్నాను, కానీ నేను రేపు రాత్రికి అక్కడ ఉంటాను.” మేము దానిని ప్రకటించలేదు గనుక; సరిగ్గా ఇక్కడ కూటము జరుగుచున్నదన్న విషయము, అతనికి తెలియకుండెను. కొందరు…సహోదరుడు లియో మరియు వారు నగరము వెలుపలనున్న స్నేహితులలో కొందరికి ఉత్తరము వ్రాసి మరియు వారికి చెప్పిరి. సరి, ఎందుకనగా మనకు సరిపడా స్థలము లేకుండెను.

24 ఇప్పుడు నేనిట్లు చెప్పాను, “సహోదరుడా జెఫ్రీస్, మీ నూనె బావులలో ఒక దాని మీట నొక్కుటకు నీవు నన్ను పంపినయెడల, మరియు దాని గూర్చి నాకు ఏమియూ తెలియదు గనుక, బహుశా నేను దానిని పేల్చివేయుదును. నేను తప్పుడు మీటను నొక్కి లేదా తప్పుడు మోటారును ప్రారంభించవచ్చును. నేను దానిని చేయుటకు ముందు దానిని ఏ విధంగా చేయవలెనో నేను తెలుసుకొనవలసియున్నది.”

మరియు పరిశుద్ధాత్మను పొందుకునే విషయం కూడా ఆ విధంగానే ఉన్నది. మీరు దేనికొరకు వచ్చుచున్నారో, మరియు దానినెట్లు పొందుకోవలెనో, మరియు అదేమిటన్నది మీరు తెలుసుకోవలసియున్నది.

ఇప్పుడు, మొదటిగా, ఆ పరిశుద్ధాత్మ వాగ్దానం చేయబడియున్నది.

25 మనము పది వారములు తీసుకొనవచ్చును మరియు ఎన్నడూ…పరిశుద్ధాత్మ అనగా ఏమిటి, అను ఈ అంశముయొక్క అంచునైననూ దాటలేము. అయితే, మొదటి విషయము ఏమిటనగా, ప్రతీ రాత్రి నేను కేవలం దాని సారాంశమును ఇచ్చుటకు సరిపడునట్లు నేను దానిని సమీపించగోరుచున్నాను, పిదప ఏమైనా ప్రశ్నలు ఉన్నయెడల మరుసటి రాత్రి చూచెదము.

26 ఇక్కడున్న వారిలో ఎంతమంది పరిశుద్ధాత్మ బాప్తీస్మమును పొందియుండియు, పరిశుద్ధాత్మను పొందుకొనలేదు? మీరు పొందుకొనలేదని మీకు తెలిసినవారు, మీ చేతులను పైకెత్తుడి. అసలు ఆ చేతులను చూడండి.

ఇప్పుడు అది ఒక గురుతు గనుక, పరిశుద్ధాత్మ ఒక గురుతుగా ఉన్నదను దానిపై, నేను మాట్లాడగోరుచున్నాను. సమస్త వాగ్దానములు మనకు ఇవ్వబడినవి అని—అని మనము గ్రహించియున్నాము…అబ్రాహాము వాగ్దానమునకు తండ్రియైయున్నాడు, ఎందుకనగా దేవుడు అబ్రాహాముకు మరియు అతని తర్వాత అతని సంతానమునకు వాగ్దానమునిచ్చెను. “అబ్రాహామునకును మరియు అతని సంతానమునకును,” వాగ్దానము చేయబడెను. మరియు ఈ గురుతు ఒక నిబంధనగల ప్రజలకైయున్నది.

27 ఇప్పుడు, కేవలం ఒక క్రైస్తవుడికి మరియు ఒక పరిశుద్ధాత్మ-నింపుదల-గల క్రైస్తవుడికి మధ్య ఎంతో వ్యత్యాసమున్నది. మరియు ఇప్పుడు మనము దీనిని లేఖనము నుండి తీసుకొని, మరియు దానిని సరిగ్గా లేఖనములోనే ఉంచబోవుచున్నాము. మొదటిగా, పైకి ఒక క్రైస్తవుడిగా కనబరుచుకొనే క్రైస్తవుడు కలడు. అయితే ఈ క్రైస్తవుడు గనుక ఇంకనూ పరిశుద్ధాత్మతో నింపబడనియెడల, అతడు కేవలం ఒక క్రైస్తవుడిగా ఉండే ప్రక్రియలోనే ఉన్నాడు. చూశారా? అతడు దానిని నమ్ముచున్నట్లు పైకి చెప్పుకొనుచున్నాడు; అతడు దాని నిమిత్తం పనిచేయుచున్నాడు, కానీ ఈ ఆత్మను, పరిశుద్ధాత్మను దేవుడు ఇంకను అతనికి అనుగ్రహించలేదు. దేవుడు దానిని గుర్తించునంతగా, అతడింకను దేవునితో ఆ గురియొద్దకు చేరుకొనలేదు.

28 ఎందుకనగా, దేవుడు అబ్రాహాముతో ఒక నిబంధనను చేసియున్నాడు, అది ఆయన అబ్రాహామును పిలిచిన తరువాతైయున్నది, అది ఈనాడు విశ్వాసిని పిలుచుచున్నదానికి ఒక సాదృశ్యముగానున్నది.

ఆయన అబ్రాహామును పిలిచెను, మరియు అబ్రాహాము తన దేశము నుండి బయలుదేరి మరియు ఒక క్రొత్త దేశములోనికి, క్రొత్త ప్రజల మధ్య నివసించుటకు వెళ్ళెను, మరియు తన చెడుతనమును మాని, తన పాపము విషయమై పశ్చాత్తాపపడమని దేవుడు ఒక మనిషిని పిలిచినదానికి అది ఒక సాదృశ్యముగానున్నది. అప్పుడు అతడు తానున్న గుంపు నుండి, ఒక క్రొత్త గుంపులో, క్రొత్త విధమైన ప్రజల మధ్యకు నివసించుటకు మరలి వెళ్ళును.

మరియు పిదప అతడు బిడ్డను పొందుకుంటాడనియు, మరియు ఈ బిడ్డ ద్వారా సమస్త భూమి ఆశీర్వదింపబడుననియు, దేవుడు అతనికిచ్చిన వాగ్దాన విషయములో అబ్రాహాము విశ్వాసనీయంగా ఉండుటను దేవుడు కనుగొన్న తర్వాత, అప్పుడు దేవుడు అతనికి ఒక గురుతును ఇచ్చుట ద్వారా అతని విశ్వాసమును స్థిరపరిచెను, మరియు ఆ గురుతు సున్నతియైయున్నది. మరియు సున్నతి పరిశుద్ధాత్మకు సాదృశ్యముగానున్నది.

29 సరిగ్గా మనమిప్పుడు చదివినటువంటి ఈ అధ్యాయములోని తదుపరి వచనాలు తీసుకుందాము, మీరు కోరినట్లయితే దానిని వ్రాసుకోండి. మరియు ఆ…51వ వచనములో, స్తెఫెను ఇట్లు చెప్పెను:

ముష్కరులారా…ఆ హృదయమునకు మరియు చెవులకు సున్నతి లేని వారలారా, మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు: మీ పితరులు చేసినట్లే, మీరును చేయుచున్నారు.

30 ఆ సున్నతి పరిశుద్ధాత్మకు ఒక సాదృశ్యముగానున్నది. మరియు అతడు దేవుడిని ఆయనయొక్క వాగ్దానముపై అంగీకరించిన తరువాత దేవుడు అబ్రాహామునకు ఆ—ఆ సున్నతి గురుతును ఇచ్చెను మరియు అతడొక క్రొత్త దేశములోకి నడిచివెళ్ళిను. చూశారా? అది ఒక గురుతైయున్నది.

మరియు అతని పిల్లలందరూ, తన తరువాత తన సంతానమంతయు, వారి శరీరములో ఈ గురుతును కలిగియుండవలెను, ఎందుకనగా అది ఒక ప్రత్యేకతయైయున్నది. అది అనగా ఈ సున్నతి గురుతు వారిని ఇతర ప్రజలందరి నుండి వేరు చేయుట కొరకైయున్నది.

31 మరియు ఈనాడు దానినే దేవుడు ఉపయోగించుచున్నాడు. అది హృదయపు సున్నతి గురుతైయున్నది, ఆ పరిశుద్ధాత్మయైయున్నది, అది ఇతర సిద్ధాంతములు, విశ్వాసములు మరియు సంఘ శాఖలన్నింటి నుండి దేవునియొక్క సంఘమును ఒక ప్రత్యేకపరచబడిన సంఘముగా చేస్తుంది. వారు అన్ని రకములైన సంఘశాఖలలో ఉన్నారు, మరి అయినను వారు ఒక ప్రత్యేకించబడిన ప్రజలైయున్నారు. మీరు నన్ను ఒక మనుష్యునితో రెండు నిమిషములు మాట్లాడనివ్వండి, అతడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడా లేదా అనునది నేను మీతో చెప్పగలను; అలాగే మీరును చెప్పగలరు. అది వారిని వేరుచేస్తుంది. అది ఒక ముద్రయైయున్నది. అది ఒక గురుతైయున్నది. మరియు పరిశుద్ధాత్మ ఒక గురుతైయున్నది. మరియు అది…

పాత నిబంధనలో పరిశుద్ధాత్మకు ఒక ముంగుర్తుగానున్న, సున్నతిని తృణీకరించిన ఏ పిల్లవాడైనా, ప్రజలలోనుండి కొట్టివేయబడెను. అతడు సున్నతి పొందుటకు నిరాకరించినయెడల, ఇతర సమాజముతో అతడు సహవాసమును కలిగియుండలేడు.

ఇప్పుడు దానిని ఈ దినముతో పోల్చండి. పరిశుద్ధాత్మ బాప్తీస్మమును పొందుకొనుటకు నిరాకరించునట్టి ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మను కలిగియున్నవారి మధ్య ఎలాంటి సహవాసమును కలిగియుండలేడు. మీరు అసలు దానిని చేయలేరు. మీరు ఆ స్వభావమును కలిగియుండవలసియున్నది. ఎట్లనగా, అది…

32 మా అమ్మ ఇట్లు చెప్తుండేది, “ఒకే జాతి పక్షులు కలిసి ఎగురుతాయి.” సరి, అది ఒక పాత సామెత, కానీ అది సత్యమైయున్నది. పావురములు మరియు కాకులు సహవాసము చేయుటను మీరు చూడరు. వాటి ఆహారాలు భిన్నంగా ఉంటాయి. వాటి అలవాట్లు భిన్నంగా ఉంటాయి. వాటి కోరికలు భిన్నంగా ఉంటాయి.

మరియు మీరు పరిశుద్ధాత్మ చేత సున్నతి పొందినప్పుడు, లోకమునకు మరియు ఒక క్రైస్తవునికి మధ్య ఆ విధంగానే ఉంటుంది, దాని అర్ధం, “చర్మమును కత్తిరించుట.”

33 సున్నతి పురుషునిలో మాత్రమే ఉండగలుగుతుంది. అయితే స్త్రీ కి ఒక పురుషునితో వివాహము జరిగినప్పుడు, ఆమె అతనిలో భాగమౌతుంది గనుక, ఆమె అతనితో సున్నతి పొందియున్నది. తిమోతిలో, ఈ విధంగా చెప్పబడినది, మీకు జ్ఞాపకమున్నదా, “అయినను ఆమె స్వస్థబుద్ధి కలిగి, విశ్వాసప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడగా ఉండినయెడల శిశుప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును.”

34 ఇప్పుడు, సున్నతి. మీకు తెలియునా…దూతయొక్క వర్తమానము విషయమై ఆ వెనుక గుడారములో శారా నవ్వెను, అతనెవరో తెలియకపోయినను, ఒక అపరిచితుడైయున్నను, “అబ్రాహాము,” అని ఆయన పిలిచెను, “నీ భార్యయైన, శారా ఎక్కడ?” అతనికి ఒక భార్య ఉన్నదని ఆయనకెట్లు తెలియును?

35 మరియు యేసు ఇట్లు చెప్పెను, “లోతు దినములలో జరిగినట్లు, మనుష్యకుమారుని రాకడలో జరుగును.” గుర్తుంచుకొనండి, ఆ సూచనలు ప్రపంచములోని, సొదొమ మరియు గొమొఱ్ఱాలో మతస్థుల మధ్యన అప్పగించబడలేదు. కానీ అది ఏర్పరచబడినవారికి, అనగా బయటకు-పిలువబడినవారికై యున్నది. మరియు అబ్రాహాము బయటకు పిలువబడినవాడై యుండెను. మరియు సంఘము అను మాటకు “బయటకు పిలువబడినవారు; ప్రత్యేకపరచబడిన వారు,” అని అర్ధము. అబ్రాహాము తననుతాను ప్రత్యేకించుకొని సున్నతి పొందినట్లే అది ఉన్నది.

మరియు సరిగ్గా ఆ దూత యొక్క సందేశమునకు శారా నవ్వినప్పుడు, దేవుడు అక్కడికక్కడే ఆమెను చంపియుండేవాడు; కానీ ఆయన అబ్రాహామును బాధపరచకుండా శారాను బాధపెట్టలేడు, ఎందుకనగా వారిరువు ఏకమైయున్నారు. ఆమె ఆయనలో భాగమైయున్నది. “మీరిరువురుకాక, ఒక్కరైయున్నారు.”

36 కావున, సున్నతి, ఈనాడు పరిశుద్ధాత్మ హృదయమునకు సున్నతి చేయును. మరియు అది ఒక గురుతైయున్నది, ఇవ్వబడిన ఒక గురుతు.

ఒక రోజు ఒకరిట్లన్నారు…నేను దీనిని మరలా చెప్పుదును, హాస్యంగా కాదు. ఎందుకనగా, అది సత్యమైయున్నది, కానీ అది హాస్యంగా అనిపిస్తుంది. నేను తరచుగా చెప్పినట్లే, ఇది ఒక పరిహాసమాడే స్థలము కాదు. అయితే సరిగ్గా మేమెక్కడైతే ఉన్నామో, అక్కడ ఆ పశ్చిమ తీరమున ఒక చిన్న జర్మను ఉండియున్నాడు. అతడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. మరియు అతడు వీధిలోనికి వెళ్ళి, మరియు అతడు కొంత దూరము నడిచేవాడు, మరియు అతడు తన చేతులను పైకెత్తి భాషలలో మాట్లాడేవాడు. మరియు అతడు పరుగెత్తి, మరియు గంతులు వేసి, మరియు అరిచేవాడు. మరియు అతడు ఆ విధంగా చేయుచు, తన పనిలో ఉండియున్నాడు, మరియు తన యజమాని తనతో ఇట్లన్నాడు, “నీవు ఎక్కడున్నావు?” ఆహ్-హ. మీరు వెళ్ళిన ఆ స్థలములంటే నాకిష్టము. అతడిట్లన్నాడు, “నీవు ఆ వెఱ్ఱివారి గుంపు మధ్యకు వెళ్ళియుంటావు.”

అందుకతడు ఇట్లన్నాడు, “అలాగైతే వారు నట్టులని నీవు అనుకొనుచున్నావా?”

“నిశ్చయంగా, వారు అట్టివారే,” అని అతడు అన్నాడు.

37 “సరి, ఆ నట్టుల కొరకు దేవునికి స్తుతి కలుగును గాక!” అని అతడన్నాడు. మరియు అతడిట్లు చెప్పెను, “ఏంటో నీకు తెలుసా? ఆ నట్లు ఒక పెద్ద పాత్రను పోషించును.” అతడిట్లన్నాడు, “ఉదాహరణకు, ఆ మోటారుకి, దాని నుండి మీరు ఆ నట్లన్నింటిని తీసివేయండి, అప్పుడు మరేదో కాదు కానీ మీరొక ‘చెత్తపోగును’ కలిగియుంటారు.” కావున అది వాస్తవమేయైయున్నది.

38 పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు, ఈ లోకపు మనస్సు మిమ్మల్ని ఇష్టపడనంత భిన్నంగా మీరు ఉంటారు, మరియు వారు మీకు వ్యతిరేకంగా ఉంటారు, మరియు వారు మీతో అసలేమియూ చేయగోరరు. మీరు మరొక ప్రపంచము నుండి జన్మించియున్నారు. మీరు సరిగ్గా ఒక పరదేశిగా, పదిరెట్లు అధికంగా పరదేశివలె ఉందురు, మీరు ఆఫ్రికా అడవులలోని సుదూర ప్రాంతాలలోనికి వెళ్ళినట్లుండును. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు భిన్నంగా ఉంటారు, మరియు అదొక గురుతైయున్నది. అది ప్రజల మధ్యన ఒక ముద్రయైయున్నది.

39 ఇప్పుడు, మీరిట్లనవచ్చును, “అలాగైతే, బ్రెన్హామ్ సహోదరుడా, ఆ సున్నతి గురుతు అబ్రాహాముకి ఇవ్వబడినది కదా?” అది నిజమే. “మరియు అతని సంతానమునకా?” అవును.

40 అది సరియే, ఇప్పుడు మనం గలతీ పత్రిక 3వ అధ్యాయం, 29వ వచనమునకు త్రిప్పబోవుచున్నాము, మరియు అది మనకెట్లు వర్తించునో చూద్దాము. గలతీ 3:29, మరియు అసలు ఈ సున్నతి అనునది ఒక అన్యుడికి ఎట్లు వర్తించునో చూద్దాము, మనము అన్యులమైనయెడల; అది, మన సహజమైన జన్మద్వారాయై యున్నాము.

ఇప్పుడు, మొదటిగా, నేను 16వ వచనమును చదవగోరుచున్నాను.

అబ్రాహాముకు అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను. (అబ్రాహాము మరియు అతని సంతానము!) ఆయన సంతానములకు అని చెప్పలేదు కానీ,…

కేవలం ఏదో ఒక విధంగా…ఇట్లనవచ్చు, “ఓ, నేను కూడా అబ్రాహాము యొక్క సంతానములే.” లేదండి. ఒక “సంతానమునకు,” అబ్రాహాము యొక్క సంతానమునకు!

…అనేకులను గూర్చి అన్నట్టు, సంతానములకు కాదు; కానీ ఒకని గూర్చి అన్నట్లే, మరియు అది—అది వారికి…మరియు నీ సంతానమునకు అని చెప్పెను, అది క్రీస్తే.

41 క్రీస్తు అబ్రాహాము యొక్క సంతానమైయున్నాడు. దానిని మీరు నమ్ముచున్నారా? అది సరియే, ఇప్పుడు మనం 28 మరియు 29వ వచనములు చూద్దాము.

ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదా స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు: యేలయనగా క్రీస్తు యేసునందు మనమందరము ఏకముగా ఉన్నాము.

మరియు మీరు క్రీస్తు సంబంధులైతే, ఆ పక్షమందు మీరు అబ్రాహాముయొక్క సంతానమైయుండి, మరియు వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.

మనమెట్లు “అబ్రాహాము యొక్క సంతానము,” కాగలము? క్రీస్తులో ఉండుటను బట్టి, ఆ ప్రకారము మనము అబ్రాహాము యొక్క సంతానము అవుతాము. మరియు అబ్రాహాము యొక్క సంతానము అనగా ఏమిటి? రోమా 4 మరియు ఇతర చోట్లకు మనము వెళ్ళవచ్చును.

అబ్రాహాము సున్నతి పొందుచున్నప్పుడు వాగ్దానమును పొందలేదు. ఆ సున్నతి అనునది కేవలం ఒక సాదృశ్యముగానున్నదని చూపించుటకు, అతడు సున్నతి చేయబడుటకు ముందే వాగ్దానమును పొందెను. మరియు అతడు సున్నతి పొందుటకు ముందే అతడు కలిగియున్న విశ్వాసము గుర్తించబడినదనుటకు, అది ఒక సాదృశ్యముగానున్నది.

42 ఇప్పుడు, మనము క్రీస్తులో ఉన్నప్పుడు, మనము అబ్రాహాము సంతానముగా మారి మరియు క్రీస్తుతో పాటు వారసులమవుతాము, కాబట్టి, యూదుడైనా లేదా అన్యుడైనా, మనము ఎవరమనే దానితో నిమిత్తము లేదు.

మరియు, “అబ్రాహాము యొక్క సంతానము,” అబ్రాహాము యొక్క సంతానము దేవుడిని ఆయనయొక్క మాట చొప్పున నమ్మగలిగే, అబ్రాహాము యొక్క విశ్వాసమును కలిగియుంటుంది. అది ఎంత ఎగతాళిగా కనిపించినప్పటికీ, మీరెంత అసాధారణముగా ప్రవర్తించినప్పటికీ, అది మిమ్మల్ని ఎంత విచిత్రముగా చేసినా లెక్కలేదు, మీరు దేనితో సంబంధము లేకుండా దేవుడిని ఆయన వాక్యము వద్దనే తీసుకుంటారు.

43 అబ్రాహాము డెబ్బది-ఐదు ఏండ్లు మరియు శారా అరవది-ఐదు ఏండ్లు గలవారైయుండి, దేవుడిని ఆయన వాక్యము వద్దనే తీసుకొనిరి, మరియు దానికి వ్యతిరేకముగానున్న దేనినైనా అది లేదన్నట్లు పలికిరి. ఆ దినమున, వైద్యులు ఏమి తలంచియుందురని మీరు అనుకొందురు? దాదాపు పాతిక ఏండ్ల క్రితమే ఋతు క్రమము నిలిచిపోయిన అరువది-ఐదు ఏండ్ల తన భార్య ద్వారా, తాను “ఒక బిడ్డను కనబోవుచున్నాడని” దేవుని స్తుతించుచున్న ఒక డెబ్బది-ఐదు ఏండ్ల వృద్ధుడిని చూసినప్పుడు, ఆ ప్రజలు ఏమి తలంచియుంటారని మీరు అనుకొందురు? అయితే, మీరు చూడండి, అబ్రాహాము యొక్క ఆ విశ్వాసము, అది మిమ్మల్ని వింతగా ప్రవర్తింపజేస్తుంది.

44 మరియు పరిశుద్ధాత్మచేత మీరు సున్నతి పొందినప్పుడు, అది మీకు అదే కార్యమును చేస్తుంది. అది మీరు చేయుదురని మీరు అనుకొనని కార్యములను మీతో చేయిస్తుంది. మీరు దేవుని యొక్క వాగ్దానమును తీసుకొని మరియు దేవుని నమ్మునట్లు అది చేస్తుంది.

45 ఇప్పుడు, అది ఇంకా, ఒక—ఒక వాగ్దానము మరియు ఒక గురుతు మాత్రమే కాకుండా, అదొక ముద్ర కూడాయైయున్నది. ఇప్పుడు మీరు గనుక నాతోపాటు రోమాలోనికి వెళ్ళినట్లయితే. మొదటిగా, మీరు నాతోపాటు ఎఫెసీ 4:30 వద్దకు వెళ్ళవలెనని నేను కోరుచున్నాను, మరియు మనం ఒక్క నిమిషము ఇక్కడ చదువుదాము. ఎఫెసీ 4:30 ఈ విధంగా చెప్పుచున్నది.

ఇప్పుడు, నానా విధమైన కార్యములను ముద్రలని అనేకులు చెప్పుటను మీరు వినియున్నారు. “మీరు గనుక సంఘమునకు వెళ్ళినట్లైతే, మీరు ఆ సంఘము యొక్క ముద్రను కలిగియుంటారు.” మరియు కొంత మంది ప్రజలు, “అది ఒక ఫలానా దినమును ఆచరించుట, ఒక సబ్బాతు దినము, అదే—అదే దేవుని యొక్క ముద్ర,” అని అంటారు. వారిలో కొంతమంది, “మనము ఒక ఫలానా మత సంస్థలో మన సభ్యత్వాన్ని కలిగియుంటే, మనము దేవుని రాజ్యములో ముద్రించబడతాము,” అని అంటారు.

46 ఇప్పుడు, బైబిలు గ్రంథము ఇట్లు చెప్పుచున్నది, “ప్రతి మనుష్యుని మాటయు అబద్ధమే, కానీ దేవుని మాటయే సత్యము.” ఇప్పుడు, ఎఫెసీ 4:30 ఈ రీతిగా వ్రాయబడియున్నది:

దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, ఎట్లనగా విమోచన దినమువరకు మీరు ముద్రించబడియున్నారు.

47 ఇప్పుడు నేను దీనిపై కొంచెము కఠినంగా చెప్పబోవుచున్నాను, ఊరకయుండుడి. ఇప్పుడు ధర్మశాస్త్రబద్దులైన సహోదరులారా మీరు కాసేపు మౌనంగా ఉండండి. చూశారా? ఆ ముద్ర ఎంత కాలం ఉంటుందో మీరు గమనించారా? మరుసటి ఉజ్జీవము వరకు కాదు, మరొకసారి ఏదో తప్పు జరిగేవరకు కాదు. “మీ విమోచన దినమువరకు,” అప్పటి వరకు మీరు ముద్రించబడియున్నారు. “మీ విమోచన దినమువరకు,” మీరు దేవునితో ఉండుటకు విమోచింపబడునంత వరకు, పరిశుద్ధాత్మ నిన్ను ముద్రించునది అప్పటి వరకైయున్నది. ఒక ఉజ్జీవము నుండి మరొక ఉజ్జీవము వరకు కాదు; కానీ నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు, మీరు పరిశుద్ధాత్మచేత ముద్రించబడియున్నారు.

పరిశుద్ధాత్మ అనగా అదేయైయున్నది, అది ఆయన…మీరు ఆయన దృష్టిలో దయనొందారనుటకు, అది దేవునియొక్క ముద్రయైయున్నది, మరియు ఆయన మిమ్మల్ని ప్రేమించును, మరియు ఆయన మిమ్మల్ని నమ్మును, మరియు ఆయన తన ముద్రను మీపై ఉంచును. ఒక ముద్ర అనగా ఏమిటి? ఎవరైనా…అంతేకాదు, ఒక ముద్ర అనేది ఒక “ముగించబడిన కార్యము,” అని సూచిస్తుంది లేదా అర్ధమిస్తుంది. ఆమేన్. దేవుడు మిమ్మల్ని రక్షించాడు, మిమ్మల్ని పరిశుద్ధపరిచాడు, మిమ్మల్ని శుద్ధి చేసాడు, మీ పట్ల దయ చూపించాడు, మరియు మిమ్మల్ని ముద్రించాడు. ఆయన ముగించాడు. మీ విమోచన దినమువరకు మీరు ఆయన యొక్క ఉత్పత్తియైయున్నారు. ఒక ముద్రించబడినది అంటే ఒక “ముగించబడిన కార్యము.”

పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అది ఒక గురుతైయున్నది. పౌలు మాట్లాడిన ఆ సూచన గురించి, కొద్దిసేపటి తరువాత, మరొక వర్తమానములో మనము చూడబోవుచున్నాము. అది భాషలు విశ్వాసులకు సూచనయా, లేదా అవిశ్వాసులకా అనునదైయున్నది.

48 ఇప్పుడు గమనించండి, అయితే, దీనిలో, పరిశుద్ధాత్మ ఒక గురుతైయున్నది. నా భావమేదనగా…మరియు పరిశుద్ధాత్మ ఒక ముద్రయైయున్నది. అది తాను ఎన్నుకొనిన పిల్లలకు దేవుడు అనుగ్రహించిన ఒక గురుతైయున్నది. దానిని త్రోసివేయుట, ఆ ప్రజలనుండి కొట్టివేయబడుటయై యున్నది; మరియు దానిని స్వీకరించుట, లోకముతో మరియు ఈ లోక సంగతులన్నిటితో ముగించబడుటయై యున్నది, మరియు దేవుడు ఆమోద ముద్ర వేసిన ఒక ఉత్పత్తిగా ఉండుటయైయున్నది.

49 నేను హ్యారీ వాటర్ బెర్రీతో కలిసి ఇక్కడ రైలు రోడ్డు మీద పనిచేసేవాణ్ణి, మరియు మేము కార్లలో సామాను ఎక్కించుటకు వెళ్ళేవారము. ఆ వెనుక నిలుచున్న, నా సహోదరుడు, డాక్, కార్లలో సామాను నింపుటకు సహాయం చేసేవాడు. ఒక కారులో సామాను ఎక్కించబడుచున్నప్పుడు, ఆ తనిఖీదారుడు, వారు ఆ కారును పరిశీలిస్తారు, అయితే అది పడిపోయి మరియు బ్రద్దలైపోవునట్లు, ఏదైనా పాడైనది ఉన్నట్లు, లేదా ఏదైనా వదులుగా ఉన్నట్లు అతడు కనుగొన్నయెడల; అది ఎంతో క్రమంగా పెట్టబడి, మరియు చక్కగా అమర్చబడి, ఆ కారు సంపూర్ణముగా సామాన్లతో మూట కట్టబడే వరకు అతడు ఆ కారుకు ముద్ర వేసేవాడు కాదు, తద్వారా ప్రయాణంలో కుదుపులవల్ల ఆ లోపల ఉన్న వస్తువులు పాడవ్వకుండా ఉండేవి.

50 మనము అంతగా ముద్రించబడకపోవుటకు కారణము అదేయై యున్నది; మనము కొన్ని విషయాలలో మరీ వదులుగా ఉన్నాము. కొన్ని విషయాలలో నీవు కొంచెం వదులుగా ఉన్నావేమో అని చూచుటకు, నీ జీవితమును తనిఖీ చేయుటకు ఆ తనిఖీదారుడు పరిశీలించినప్పుడు, నీ ప్రార్ధనా జీవితంలో కొంచెం వదులుగా, ఆ కోపం విషయంలో కొంచెం వదులుగా, ఇతరుల గూర్చి మాట్లాడుటకు ఆ నాలుక కొంచెం వదులుగా ఉండటం వంటివి ఉన్నచో, ఆయన ఆ కారును ఎన్నడూ ముద్రించడు. కొన్ని చెడు అలవాట్లు, కొన్ని దుష్ట కార్యములు, నీచమైన మనసు, ఆయన ఆ కారును ముద్రించలేడు.

అయితే ప్రతీది దాని స్థానములోనుండుట ఆయన కనుగొనినప్పుడు, ఆ తనిఖీదారుడు, అప్పుడు ఆయన దానిని ముద్రిస్తాడు. అది ఎచ్చటికైతే ముద్రించబడినదో ఆ గమ్యమును అది చేరనంతవరకు ఆ ముద్రను తెరచుటకు ఎవరైనా ధైర్యము చేయునా! అది అక్కడ ఉండియున్నది. “నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు; నా ప్రవక్తలకు కీడు చేయకూడదు. నేను మీతో చెప్పునదేమనగా, ముద్రించబడిన వీరిలో కనీసం ఒక్క అల్పుడినైనా అభ్యంతరపరచుటకు, లేదా కొద్దిగా కుదుపుటకు ప్రయత్నించినయెడల, మీ మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి మరియు మీరు మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట మీకు మేలు.” దాని భావమును మీరు గ్రహించారా?

51 పరిశుద్ధాత్మ అనగా అదేయైయున్నది. అది మీ నిశ్చయతయైయున్నది. అది మీ భద్రతయైయున్నది. అది మీ సాక్ష్యమైయున్నది. అది మీ ముద్రయైయున్నది. అది మీ గురుతైయున్నది, అదేదనగా, “నేను పరలోక బద్ధుడను. అపవాది చెప్పునది నేను లెక్కచేయను! నేను పరలోక బద్ధుడను. ఎందువలన? ఆయన నన్ను ముద్రించెను. ఆయన దానిని నాకు అనుగ్రహించెను. ఆయన నన్ను తన రాజ్యములోనికి ముద్రించెను, మరియు నేను మహిమ-బద్ధుడను! గాలులు వీచనీయండి, సాతాను తాను చేయగోరినదల్లా చేయనీయండి. నా విమోచన దినమువరకు దేవుడు నన్ను ముద్రించెను.” ఆమేన్! పరిశుద్ధాత్మ అనగా అదేయైయున్నది. ఓ, మీరు దానిని కోరుకొనవలసియున్నది. అది లేకుండా నేను కొనసాగాలేను. అక్కడ ఎంతో చెప్పవచ్చును, కానీ నేనేమి మాట్లాడుచున్నానో మీకు తెలియునన్న నిశ్చయతను నేను కలిగియున్నాను.

52 ఇప్పుడు, కేవలం ఒక్క నిమిషము, మనము యోహాను 14ను కూడా, త్రిప్పెదము. నేను వాక్యమును ఎంతో ప్రేమించుదును! అది సత్యమైయున్నది.

53 ఇప్పుడు, దేవుని యొక్క ఆత్మ, అనగా పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అది క్రీస్తు యొక్క ఆత్మ మీలో ఉండుటయైయున్నది. ఇప్పుడు, మనము చదువుటకు ముందు, నేను ఇక్కడ కొన్ని గుర్తించదగిన మాటలను చెప్పగోరుచున్నాను. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అదొక ముద్రయైయున్నది. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అదొక నిబంధనయైయున్నది. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అదొక గురుతైయున్నది. అలాగైతే పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అది…యేసుక్రీస్తు యొక్క ఆత్మ మీలో ఉండుటయైయున్నది. చూశారా? “కొంత కాలమైన తరువాత,” యేసు చెప్పెను, “లోకము నన్ను మరి ఎన్నడును చూడదు; అయినను మీరు నన్ను చూతురు, ఏలయనగా నేను మీతోను, మీలోను, యుగసమాప్తి వరకు ఉందును.” దేవుని ఆత్మ తన సంఘములో ఉండుట!

54 దేనికొరకు? అయన దానిని ఎందు నిమిత్తము చేసాడు? ఇది కొంచెం రేపటి రాత్రి యొక్క అంశముపై ఉంటుంది. అయితే ఆయన దానిని ఎందుకొరకు చేసాడు? ఆయన ఎందుకని, పరిశుద్ధాత్మ ఎందుకని…ఏమిటి, ఆయన దేనికొరకు వచ్చాడు? ఆయన మీలోనికి ఎందుకు వచ్చాడు, ఆయన నాలోనికి ఎందుకు వచ్చాడు? దేవుని క్రియలను కొనసాగించుట కొరకైయున్నది.

55 “నేనెల్లప్పుడు నా తండ్రికి ఇష్టమైన దానిని చేయుదును. నన్ను పంపిన తండ్రి చిత్తమును నేరవేర్చుటకే గానీ, నేను నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు రాలేదు. మరియు నన్ను పంపిన నా తండ్రి నాతోనున్నాడు; మరియు నా తండ్రి నన్ను పంపిన ప్రకారము, నేనును మిమ్మును పంపుచున్నాను.” ఓ, మై! ఆయనను పంపిన ఆ తండ్రి, ఆయనలోనికి వెళ్ళెను. యేసును పంపిన ఆ తండ్రి ఆయనలోనికి వచ్చి, ఆయన ద్వారా పని చేసెను.

మిమ్మల్ని పంపించు యేసు, మీతో కూడా వెళ్ళును మరియు మీలోనున్నాడు. మరియు యేసుక్రీస్తులో నివసించుచున్న, ఆ ఆత్మ, ఆయన చేసినట్లు చేయించి మరియు ప్రవర్తింపజేసినయెడల, అది మీలోనున్నప్పుడు అది ఎట్లు చేయునన్న ఒక సాధారణమైన అవగాహన మీకు ఉంటుంది, ఎందుకనగా ఆ జీవము మారనేరదు. అది శరీరము నుండి శరీరమునకు వెళ్ళును, కానీ అది దాని స్వభావమును మార్చుకోనేరదు, ఏలయనగా అది దేవుడైయున్నాడు.

56 ఇప్పుడు యోహాను 14లో, 10వ వచనం వద్ద మొదలుపెట్టి, మనము కేవలం కొద్దిగా చదివెదము.

తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని…నీవు నమ్ముటలేదా? ఈ క్రియలు…నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేను చెప్పుటలేదు: అయితే తండ్రి నాయందు నివసించుచు, తన క్రియలు చేయుచున్నాడు.

ఇప్పుడు దాని గూర్చి ఆలోచించండి.

తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి: లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.

నిశ్చయంగా, నేను, తండ్రియొద్దకు వెళ్ళుచున్నాను గనుక, నేను చేయు క్రియలు, నాయందు విశ్వాసముంచువాడును…చేయును; వాటి కంటె మరి గొప్పవియు అతడు చేయునని; మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

మీరు చూచుటలేదా? ఆయన అక్కడ ఎట్లు చెప్పెనో చూశారా? ఇప్పుడు, ఇది ఎలా బయటకు వస్తుందో గమనించండి. నేను కేవలం ఇంకొద్దిగా చదువుతాను. మనము క్రింద దాదాపు 20వ వచము వరకు చదవబోవుచున్నాము. “మరియు మీరు దేనినడుగుదురో…” మనము చూద్దాము, నేను కలిగియున్నాను…అవును. అహ-హ. సరి.

మీరు నా నామమున దేనినడిగినను, తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై, నేను దానిని చేతును.

నా నామమున మీరు నన్నేమి అడిగినను, నేను దానిని చేతును.

మీరు నన్ను ప్రేమించిన యెడల, నా ఆజ్ఞలను గైకొందురు.

నేను తండ్రిని వేడుకొందును, (ఇప్పుడు గమనించండి) మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను;

అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును;లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు: అయితే మీరు ఆయనను ఎరుగుదురు; ఏలయనగా ఆయన మీతో కూడా నివసించును, మరియు మీలోనుండును.

57 అట్లయిన ఆ ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అది క్రీస్తు మీలో ఉండుటయైయున్నది. ఆ ఆదరణకర్త, అది ఆ పరిశుద్ధాత్మయే. “మరియు ఆదరణకర్త వచినప్పుడు, ఆ ఆదరణకర్త నాలో ఉన్నప్పుడు నేను చేసిన అవే క్రియలను ఆయన చేస్తాడు. నేను తండ్రిని వేడుకుంటాను, మరియు ఆయన మీకు ఈ ఆదరణకర్తను అనుగ్రహించును. మీరు ఆదరణకర్తను ఎరుగుదురు. లోకము ఆయనను ఎరుగదు, ఎన్నడూ ఎరుగదు. అయితే ఆయన ఇప్పుడు మీతో నివసించుచున్నాడు గనుక మీరు ఆయనను ఎరుగుదురు,” యేసు చెప్పుచున్నాడు, “అయితే ఆయన మీలో ఉండును.” అదిగో, అదియే ఆదరణకర్త, “మీలో ఉండును.”

మిమ్మును ఆదరణ లేనివారిగా విడువను: నేను మీ యొద్దకు వత్తును.

“నేను…” ఇప్పుడు, ఆయనే ఆ ఆదరణకర్త, క్రీస్తే. పరిశుద్ధాత్మ అనగా అదియే, అది క్రీస్తే.

కొంతకాలమైన తరువాత, లోకము నన్ను మరి ఎన్నడును చూడదు; అయితే మీరు నన్ను చూతురు: నేను జీవించుచున్నాను గనుక, మీరును…జీవింతురు.

58 ఓహ్, మనమింకా కొనసాగుచూనే ఉండవచ్చును; అయితే, మీకు తెలియజేయనివ్వండి. ఆయన ఏమిటి? ఆయన ఒక ముద్ర. ఆయన ఒక గురుతు. ఆయన ఒక ఆదరణకర్త. ఆయన ఏమైయున్నాడో దానినంతటిని చూశారా? అబ్రాహాము సంతానము దానిని స్వతంత్రించుకొనును.

59 ఇప్పుడు మనము…ఆదరణకర్త ఇంకా ఏమైయున్నాడన్నదానిని కూడా కనుగొందాము. మనము మొదటి యోహాను 16:7నకు వెళదాము, ఆయన ఒక ఉత్తరవాది కూడా అయ్యున్నాడా లేదాయని చూసెదము. ఉత్తరవాది అనగా ఏమిటో మీకు తెలియును, వాదించుట. మనకొక ఉత్తరవాది ఉన్నాడు. దానిని మనము ఎరిగియున్నాము. మొదటి యోహాను 16వ అధ్యాయం…ఓ, ఒక్క నిమిషం ఆగండి. నన్ను మన్నించండి. అది, యోహాను సువార్త, 16:7. నన్ను మన్నించండి. నేను దానిని చెప్పినందుకు, నిశ్చయంగా నన్ను మన్నించండి. నేను దానిని తప్పుగా చదివాను…16:7 లో ఉన్నది.

అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను; నేను వెళ్ళిపోవుటవలన మీకు ప్రయోజనకరము: నేను వెళ్ళనియెడల, ఆదరణకర్త మీయొద్దకు రాడు; కానీ నేను వెళ్ళినయెడల, నేను ఆయనను మీయొద్దకు పంపుదును.

మరియు ఆయన వచ్చినప్పుడు, పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, మరియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును:

వారు, నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు;

నేను తండ్రి యొద్దకు వెళ్ళుటవలన, మీరిక నన్నెంతమాత్రము చూడరు గనుక నీతిని గూర్చియు;

ఈ లోకాధికారి తీర్పు పొందియున్నాడు గనుక, తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును.

60 మై! ఇప్పుడు, మొదటి యోహాను 2:12లో—లో, ఆ ఉత్తరవాదిని కనుగొంటాము. ఇప్పుడు కేవలం ఒక్క నిమిషం, మనము దానిని చదువుదాము, మొదటి యోహాను 2:12. నన్ను మన్నించమని వేడుకుంటున్నాను, అది, మొదటి యోహాను…1 మరియు 2. నేను వీటిని వ్రాసియుంచాను, మొదటి యోహాను 2:1 నుండి 2.

నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై, ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. మరియు ఎవడైనను పాపము చేసినయెడల, నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది, తండ్రియొద్ద మనకున్నాడు:

ఆ ఉత్తరవాది ఎవరు? నీతిమంతుడైన యేసుక్రీస్తే.

మరియు ఆయన—ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై యున్నాడు: మరియు మన పాపములకు మాత్రమే కాదు, కాని సర్వలోకము యొక్క పాపములకు ప్రాయశ్చిత్తమై యున్నాడు.

61 పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అది ఉత్తరవాది. ఏమిటి…ఉత్తరవాది అనగా ఏమిటి? అది ఏమి చేయును? విజ్ఞాపన చేయును. కనికరము చూపును. అది, అది నీ స్థానములో నిలబడును. అది, నీవు చేయలేని కార్యములను అది చేయును. అది, అది—అది నీ పాపములకు ప్రాయశ్చిత్తమైయున్నది. అది మీ నీతియైయున్నది. అది మీ స్వస్థతయైయున్నది. అదే మీ జీవము. అదే మీ పునరుత్థానము. దేవుడు మీకొరకు కలిగియున్నదంతా అదేయైయున్నది. ఆయన ఒక ఉత్తరవాదియై యున్నాడు.

62 మనము దాని వివరాలలోనికి వెళ్ళి, మన అజ్ఞానము నిమిత్తము అది—అది ఎట్లు విజ్ఞాపన చేయునన్న దాని గూర్చి, ఎలా విడమరచి చెప్పుకోవచ్చు గదా. కొన్నిసార్లు…మనం పరిశుద్ధాత్మను పొందినప్పుడు, మనం తెలియకుండానే దేనిలోనికో తొట్రుపాటు పడెదము. అప్పుడు మన కొరకు విజ్ఞాపన చేయుటకు పరిశుద్ధాత్మ మనకున్నాడు. ఆయనే మన ఉత్తరవాది. ఆయన మన కొరకు నిలబడును…ఆయనే మన న్యాయవాది. ఆయన అక్కడ నిలబడి మరియు మన కొరకు వేడుకుంటాడు. మన కొరకు మనం వేడుకొనము, ఎందుకనగా మనలోనున్న పరిశుద్ధాత్మయే మన కొరకు వేడుకుంటాడు. కొన్నిసార్లు పరిశుద్ధాత్మయే, గ్రహించలేని పదాలతో మీకు వాక్ శక్తి అనుగ్రహిస్తాడు, మరియు ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. పరిశుద్ధాత్మ అనగా అదియే.

63 నేను దేనిలోనికైనా నడిచి వెళ్ళినప్పుడు, నేను—నేనొక చిన్న పిల్లవాని వలె అడుగులు వేస్తాను; మీరు కూడా ఒక చిన్న పిల్లవాడిలా నడుస్తారు. మనం, మనము శత్రువులతో, పాపముతో, ఉరులతో, మరియు ప్రతిదానితో నిండియున్న ఒక చీకటి ప్రపంచంలో నడుచుచున్నాము.

మీరిట్లు అనవచ్చును, “ఓ, నాకు భయము కలుగుచున్నది. క్రైస్తవ జీవితమును స్వీకరించుటకు నేను భయపడుచున్నాను. నేను, నేను దీనిని చేయుటకు భయపడుచున్నాను. నేను దీనిని చేస్తానేమో అని భయపడుచున్నాను.”

భయపడవద్దు. మనకొక ఉత్తరవాది ఉన్నాడు. ఆమేన్. ఓ, ఆయన మన పక్షమున నిలబడును. ఆయన మనలో ఉన్నాడు, మరియు ఆయన మన కొరకు విజ్ఞాపన చేయును. పరిశుద్ధాత్మ, ఎల్లప్పుడూ, నిత్యము మనకొరకు విజ్ఞాపన చేయుచున్నాడు, నిరంతరము. ఆయనే మన ఉత్తరవాది. ఓ, దానికై మనము దేవునికి ఎంతగానో కృతఙ్ఞతలు చెల్లింతుము!

64 ఒక ముద్ర, ఒక గురుతు, జీవపు ఆత్మ, పరలోకపు దేవుడు, ఆదరణ కర్త, జీవము, ఉత్తరవాది. ఆయన ఏమిటి? ఓ, మై! ఆ విషయంతో మనము గంటల తరబడి కొనసాగవచ్చు.

65 ఇప్పుడు కేవలం ఒక్క నిమిషము మనము మార్చబోవుచున్నాము. ఇప్పుడు మేము అడగబోవుచున్నాము…

అంత్య దినములలో మనకు వాగ్దానము చేసెను! ఈ ఉత్తరవాది, ముద్ర, వాగ్దానము, ఈ రాత్రి ఆయన గూర్చి మనం మాట్లాడుకున్న ప్రతీదానితో పాటు, పదివేల రెట్లు అధికంగా, ఈ అంత్య దినములో అది మనకు వాగ్దానము చేయబడినది.

ఆ దినమున వారు దానిని కలిగిలేరు. వారు ఒక గురుతుగా మరియు ఒక సూచనగా, కేవలం వారి శరీరములో మాత్రమే ఒక ముద్రను కలిగియున్నారు, అది రాబోవుచున్నదని నమ్మి, మరియు ఆ ధర్మశాస్త్రము యొక్క ఛాయలో వారు నడిచారు. ఏమిటనగా, వారు శరీరములో సున్నతి చేయబడినారు.

66 ఈనాడు మనము ధర్మశాస్త్రము యొక్క ఛాయలో నడవడం లేదు. మనము పునరుత్థానము యొక్క శక్తిలో నడుచుచున్నాము. మనము మన నిజమైన ముద్ర, మన నిజమైన ఉత్తరవాది, మరియు మన నిజమైన ఆదరణ కర్తయైన, ఆ ఆత్మయొక్క శక్తిలో నడుచుచున్నాము, అది మనము పైనుండి జన్మించాము అనుటకు నిజమైన గురుతైయున్నది; ప్రత్యేకమైన, వింతైన ప్రజలమైయుండి, విచిత్రంగా ప్రవర్తించుచు, దేవుడిని ఆయన మాటయొద్దనే తీసుకొని, ఇక తక్కినవన్నియు తప్పని చెప్పువారమై యున్నాము. దేవుని వాక్యమే సత్యము. అది…ఓ, మై! పరిశుద్ధాత్మ అనగా అదేయైయున్నది.

67 మీకు అది కావలెనా? దానిని మీరు పొందుకొనుటకు ఇష్టపడుట లేదా? అది వాగ్దానము చేయబడినదాయని చూద్దాము.

ఇప్పుడు తిరిగి మనం యెషయా లోనికి వెళ్దాము, యెషయా గ్రంథము. యెషయా గ్రంథము 28వ అధ్యాయం తీసుకుందాము. ఇప్పుడు మనం యెషయా 28కి వెళ్ళుచున్నాము, మరియు మనం ప్రారంభించబోయేది…మనము 8వ వచనమును తీసుకుందాము, అది జరుగుటకు ఏడు వందల పన్నెండ్రు సంవత్సరాలకు ముందే, యెషయా ఏమి చెప్పెనో చూడండి.

68 వెనుకకు వెళ్ళి, పూర్తిగా ఆ వెనుకకు వెళ్ళి, దీని గూర్చి మనము చాలా చెప్పుకొనవచ్చు, కానీ మనం సరిగ్గా ఇక్కడ ప్రారంభించి మరియు అది సంఘమునకు వాగ్దానం చేయబడినదో లేదో చూద్దాము. అది ఏ దినమున రానైయున్నది? ఎప్పుడైతే అక్కడ—అక్కడ భ్రష్టత్వము ఉంటుందో, అట్టి అంత్య దినములో అయ్యున్నది. ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఆ పదము బహువచనంలో ఉన్నది, “దినములు,” ఆ చివరి రెండు దినములు, చివరి రెండువేల సంవత్సరములైయున్నవి.

ఇప్పుడు, ఇప్పుడు 8వ వచనం.

అన్నియు, ఏలయనగా వారి భోజనపు బల్లలన్నియు…కల్మషములతో నిండియున్నవి, కావున అక్కడ ఎటువంటి పరిశుభ్రమైన చోటు లేకుండెను.

69 దానిని కనుగొనుటకు ఈనాడు అంతటా పరిశోధించండి. చుట్టూ గమనించి ఈనాడు మనము ఆ దినములో ఉన్నామో లేదో చూడండి. “భోజనపు బల్లలన్నియు!” అంతే కాదు, వారు ప్రభువు రాత్రి భోజము నిమిత్తమై వెళ్తారు, మరియు మొదటి విషయం ఏమిటనగా, ఆ పదార్ధముల వరుసలో, ఒక పలచని రొట్టె ముక్కను లేదా ఒక సోడా బిస్కెట్టును తీసుకొని, మరియు దానిని విరిచి ఆ ప్రభు సంస్కారమును చేస్తారు. మరదైతే, పరిశుద్ధాత్మ హస్తములతో చేయబడిన, పులియని రొట్టెయైయుండవలసి యున్నది. క్రీస్తు ఒక మురికి మరియు అపవిత్రుడు కాదు, మరియు అది ఆయనకు సాదృశ్యముగానున్నది.

70 ఇంకొక విషయమేదనగా, దానిని వారు త్రాగుబోతులకు, అబద్ధికులకు, దొంగలకు, పొగ త్రాగువారికి, పొగాకు నములువారికి ఇస్తుంటారు, (వ్యూ!) ఏదైనా ఫర్వాలేదు, వారు సంఘానికి చెందియుంటే చాలనుకుంటారు. అది దూరమగును గాక! మనమిక్కడ దీనిని తినుచుండగా, ఏ వ్యక్తియైనా, ప్రభువు శరీరమును వివేచింపక దానిని తీసుకొనినయెడల, వాడు తనకు శిక్షావిధి కలుగుటకే పీల్చుచు మరియు త్రాగుచున్నాడు. అతడు ఆ జీవితమును జీవించనియెడల, దానికి దూరముగా ఉండవలెను.

మరియు మీరు దానిని తీసుకొననియెడల, మీ స్వంత మనస్సాక్షియే మీరు దోషులని చూపిస్తుంది. “తినని వాడికి, నాతో పాలు లేదు,” అని యేసు చెప్పెను.

71 అయితే ప్రభువు బల్లలన్నియు పూర్తిగా కల్మషములతో నిండియున్నవి. పరిశుభ్రమైన స్థలము ఒక్కటియు లేకుండెను. వినండి, అది ఈ దినమును చూపించుటలేదా!

వాడు ఎవరికి…వాడు ఎవరికి విద్య నేర్పును? మరియు వాడు ఎవరికి…సిద్ధాంతమును గ్రహింపజేయును?…

…విద్యను ఎవరు నేర్చుకుంటారు?…వాడు ఎవరికి సిద్ధాంతమును గ్రహింపజేయును?…

“మంచిది, దేవునికి స్తుతి కలుగునుగాక, నేను ప్రేస్బిటేరియనును. నేను మెథడిస్టును. నేను పెంతెకోస్తును. నేను నాజరీనును. నేను పిలిగ్రిం హోలీనెస్సును.” దేవుడికి అసలు అది విషయమే కాదు; అది కేవలం ఇంకొక బల్లయైయున్నది.

…నేను ఎవరికి సిద్ధాంతమును తెలియజేయుదును?…

72 ఎటువంటి సిద్ధాంతము; మెథడిస్టు, బాప్టిస్టు, ప్రేస్బిటేరియను, పెంతెకోస్తా? బైబిలు గ్రంథము యొక్క సిద్ధాంతమైయున్నది!

…నేను ఎవరికి సిద్ధాంతమును తెలియజేయుదును?…

73 దానిని మీరు పొందినప్పుడు మీకెట్లు తెలియును? మనం శుక్రవారము రాత్రి అందులోనికి వెళతాము. చూశారా?

…నేను ఎవరికి సిద్ధాంతమును తెలియజేయుదును? (ఇప్పడు గమనించండి) తల్లిపాలు విడిచినవారికా, లేక చన్ను విడిచినవారికా.

74 చిన్న పిల్లలు ఇట్లంటారు, “సరి, మా అమ్మ ఈ సంఘమునకు చెందినది గనుక, నేను ఈ సంఘమునకే వెళ్తాను.” ప్రియ సహోదరుడా, దానికి వ్యతిరేకంగా నాకేమియు లేదు. మరియు ఇది టేపు చేయబడినదని నేను గ్రహించియున్నాను. అమ్మ వెళ్ళిన సంఘమునకు చెందియుండుట, అది సరియే. కానీ, వినండి, అమ్మ ఒక వెలుగులో నడిచినది, మీరు వేరొక వెలుగులో నడుచుచున్నారు.

75 లూథర్ ఒక వెలుగులో నడిచాడు; వెస్లీ వేరొక వెలుగులో నడిచాడు. వెస్లీ ఒక వెలుగులో నడిచాడు; పెంతెకోస్తు వేరొక వెలుగులో నడిచినది. అయితే ఈనాడు మనము దానికన్నా ఉన్నతమైన దానిలో నడుచుచున్నాము. మరియు మరొక తరము ఉన్నయెడల, అది మనల్ని దాటిపోవును.

76 ఆ వెనుకనున్న ప్రారంభ దినాల్లో, విషయం విస్తృతంగా ఉండి, చాలా విశాలంగా ఉన్నప్పుడు, లూథర్ విశ్వాసం ద్వారా నీతికరణను బోధించెను. అది కేవలం ప్రజలను కథోలిజం నుండి ప్రొటెస్టంటిజం లోనికి, వాక్యముతో సహవాసములోనికి తీసుకువచ్చుటకై యున్నది. విశ్వాసము వలన నీతికరణ, అదొక పెద్ద విశాలమైన క్షేత్రమైయున్నది. వారెన్నడూ దానినుండి కదలలేదు.

77 దాని వెంబడి జాన్ వెస్లీ అనబడిన మరొక ఉజ్జీవము వచ్చినది. అది వారిని దాని నుండి కుదిపివేసి, మరియు ఆమెను శుద్ధీకరణ వద్దకు తీసుకువచ్చినది, దేవుని యొక్క వాక్యము చేత శుద్దీకరించబడి, ఒక చక్కని, పవిత్రమైన, పరిశుద్ధ జీవితమును జీవించుచు, మీ హృదయమునకు ఆనందమును కలుగజేయును. అది చాలా వరకు లూథరన్ సిద్ధాంతమును కుదిపివేసినది.

78 తర్వాత దాని వెంబడి పరిశుద్ధాత్మ బాప్తీస్మముతో పెంతెకోస్తు వచ్చినది, మరియు పరిశుద్ధాత్మను పొందుకొనుట ద్వారా, అది మరలా దానిని కుదించినది. అది సరియే.

మరియు ఇప్పుడు అది కుదిపివేయబడటం మొదలైనది. సూచనలు మరియు మహాత్కార్యముల యొక్క సంపూర్ణతలో, ఆ వరములు, మరియు పునరుద్ధరణ, మరియు దేవుని యొక్క ఆత్మ, సంఘములోనికి వచ్చి, మరియు పెంతెకోస్తును కుదిపివేసినవి. అదేమైయున్నది? మనము ప్రభువైన యేసుయొక్క రాకడకు ఎంతో సమీపంలో ఉన్నాము, ఎంతగా అంటే, ఆయనలోనున్న అదే ఆత్మ సంఘములో పనిచేయుచు, ఆయన ఇక్కడ భూమి మీదనున్నప్పుడు ఆయన చేసిన అదే కార్యములను చేయుచున్నది. అది అపోస్తలుల కాలము నుండి ఈ కాలము వరకు, ఎన్నడూ ఎక్కడా లేకుండెను.

ఎందువలన? చూడండి, అది విశాలముగా నుండి; ఇరుకుగా, ఇరుకుగా, ఇరుకుగా మారుతుంది. అదేమైయున్నది? సరిగ్గా మీ చేతి నీడవలె; ఛాయగా, ఛాయగా, ఛాయగా నున్నది. కానీ అదేమిటి? అదొక ప్రతిబింబమైయున్నది. లూథరు ఏమైయున్నాడు? క్రీస్తుయొక్క ఒక ప్రతిబింబమైయున్నాడు. వెస్లీ ఏమైయున్నాడు? క్రీస్తుయొక్క ఒక ప్రతిబింబమైయున్నాడు.

79 చూడండి, బిల్లీ సండే కాలము ఇటీవల ముగిసినది. ఒక దినమున, వృద్ధుడైన డాక్టరు విట్నీగారు, సరిగ్గా ఇక్కడ ఈ వేదిక మీదనే బోధించాడు, అతడు ఆ పాత బడికి చెందిన చివరివాడు, దాదాపు తొంబది ఏండ్లప్పుడు మరణించాడని, నేను అనుకొనుచున్నాను. బిల్లీ సండే తన దినమునకు ఆ నామకార్ద సంఘాలకు ఒక ఉజ్జీవకర్తయైయున్నాడు. అతడు గద్దించుటకు వెనుదీయలేదు; అక్కడ నిలబడి మరియు ఇట్లు కేకలు వేసేవాడు, “మెథడిస్టులైన మీరందరు, బోధకులు మరియు అందరు మారుమనస్సు పొందుడి! బాప్టిస్టులైన మీరందరూ మారుమనస్సు పొందుడి! ప్రేస్బిటేరియన్లైన మీరు కూడా!” అతడు గద్దించుటకు వెనకాడలేదు. అతడు ఈ దినపు బిల్లీ గ్రాహమైయున్నాడు.

80 గమనించండి. మరియు పిదప, ఆ నామకార్ద సంఘము ఉజ్జీవమును కలిగియుంటున్న అదే సమయంలో, ఏమి జరిగినది? సంపూర్ణ సువార్తవారు ఒక ఉజ్జీవమును కలిగియుండుచున్నారు. అప్పుడే బోస్వర్త్ సహోదరులు, స్మిత్ విగ్గిల్స్ వర్త్, మరియు డాక్టరు. ప్రైస్, ఐమీ మెక్ఫర్సన్, వారంతా వచ్చారు.

చూడండి, ఒక రాత్రి స్మిత్ విగ్గిల్స్ వర్త్ మరణించాడు. మరునాడు ఉదయం డాక్టరు ప్రైస్ మరణించాడు. ఇరువది-నాలుగు గంటలలోనే నేను రంగము మీదకు వచ్చాను.

81 ఇప్పుడు నా అంతము వచ్చుచున్నది. చూడండి…బిల్లీ గ్రాహం గురించి మీరు అంతగా వినుటలేదు. ఓరల్ రాబర్ట్స్ గురించి మీరు అంతగా వినుటలేదు. నా కూటములు పలచనపడటాన్ని నేను చూచుచున్నాను. విషయమేమిటి? మనం అంతములో ఉన్నాము, మరొక కాలము.

82 బిల్లీ సండే మరియు వారు, ఎట్లు వచ్చిరి? వారు సరిగ్గా ఆ గొప్ప మూడీ ఉజ్జీవము తర్వాత వచ్చిరి. మూడీ ఎప్పుడు వచ్చెను? సరిగ్గా నాక్స్ ఉజ్జీవము తరువాత. నాక్స్ ఎప్పుడు వచ్చెను? సరిగ్గా ఫిన్నీ ఉజ్జీవము తరువాత. ఫిన్నీ కాల్విన్ తరువాత వచ్చెను, కాల్విన్…అలాగే వెస్లీ, మరియు వెస్లీ లూథర్ తరువాత వచ్చెను. కాలము గుండా అది అలాగే వచ్చినది. ఒక ఉజ్జీవము అయిపోయిన వెంటనే, దేవుడు మరొకరిని లేపి, మరియు మరి ఎక్కువ వెలుగును ప్రసరింపజేయును; సరిగ్గా ఆ విధంగా కొనసాగుచుండును.

83 ఇప్పుడు మనం ఈ కాలము యొక్క ముగింపు వద్దనున్నాము. ప్రతి వ్యక్తి తన కూడలి యొక్క ముగింపున క్రీస్తుయొక్క రాకడ కొరకు చూసెను, కానీ వారు ఎదురుచూచుటకు అనేక సంగతులు కలవు; యూదులు తిరిగివచ్చుట, ఆకాశంలో ఎగిరే పళ్లెములు, మనము ఈనాడు చూస్తున్నట్టి అనేక సంగతులు. అయితే మనము అంతమున ఉన్నాము. ఇప్పుడు మనమిక్కడ ఉన్నాము. క్రీస్తు యొక్క అవే క్రియలను సంఘములో చేయునట్టి శక్తిని సంఘము పొందుకొనవలసియున్నదని వారు ఎరిగియున్నారు, ఎందుకనగా ఆ నీడ ఎక్కువగుచున్నాకొద్దీ, అది ఎక్కువగా ప్రతిబింబిస్తుంది.

84 మీరొక నీడను తీసుకొనుడి. ఆ నీడకు దూరమైనా కొద్దీ, మీకు ఆ నీడయొక్క ప్రతిబింబము అతి తక్కువగా వస్తుంది. కొద్దిసేపటి తరువాత, ఆ నీడ మరియు చెట్టు ఒక్కటైపోవునంతగా ఆ నీడ అత్యంత సమీపమౌతుంది.

85 ఇప్పుడు, దేవునియొక్క ఆత్మ లూథర్ ద్వారా, నీతికరణయందు; వెస్లీ ద్వారా, శుద్ధీకరణయందు; పెంతెకోస్తు ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తీస్మమునందు పనిచేసినది; మరియు అది క్రీస్తులో ఉన్నప్పుడు చేసిన అవే క్రియలను చేయుచు ఈ చివరి దినమందు, అది ఇక్కడ ఉండియున్నది. అదేమైయున్నది? క్రీస్తు మరియు సంఘము ఒక్కటైపోయిరి.

మరియు ఆ చివరి గొలుసైయున్న, వారు ఒక్కటిగా కలిసిన వెంటనే, ఆమె కేకలు వేయుచు ఆకాశముగుండా వెళ్ళును. వెస్లీ, లూథర్, మరియు ఆ దినములలోనున్న ఆ మిగతా వారందరు పైకి లేచెదరు, “మొదటివాడు కడపటివాడగును, కడపటివాడు మొదటివాడగును,” మరియు ఒక పునరుత్థానము వచ్చును.

86 మనము అంత్య కాలమున ఉన్నాము. వినండి, పరిశుద్ధాత్మ చేయునది అదే. పరిశుద్ధాత్మ, నీతికరణ ద్వారా, చూడండి, అది దానియొక్క పలచని ఛాయ; పరిశుద్ధాత్మ, శుద్ధీకరణ ద్వారా, దానియొక్క కొంచెం బలమైన ఛాయ; పరిశుద్ధాత్మ, దానియొక్క బాప్తీస్మము ద్వారా, మరింత బలమైన ఛాయ; ఇప్పుడు పరిశుద్ధాత్మ, స్వయంగా ఆయనే ఇక్కడ ఉన్నాడన్నటువంటి పునరుద్ధరణ ద్వారా, ఆదిలో ఆయన చేసినట్లే సూచక క్రియలను మరియు మహాత్కార్యములను చేయుచున్నాడు. వ్యూ! మహిమ! ఎలాగైనా, “మీరు నన్ను ఒక పరిశుద్ధ-గుండ్రాయి,” అని పిలిచెదరు, మీరు ఇప్పుడే దానిని ప్రారంభించవచ్చు.

87 వినండి, సహోదరులారా, దీనిని వినండి.

…భోజనపు బల్లలన్నియు వాంతితో నిండియున్నవి…ఎక్కడా పరిశుభ్రమైన చోటు లేదు.

వాడు ఎవరికి విద్య నేర్పును?…వాడు ఎవరికి తెలియజేసి, వర్తమానమును గ్రహింపజేయును? తల్లిపాలు విడిచిన వారికా, మరియు చన్ను విదిచినవారికా.

చిన్న పిల్లలకు కాదు; ప్రేస్బిటేరియను పిల్లలు, మెథడిస్టు పిల్లలు, పెంతెకోస్తు పిల్లలు, లూథరను పిల్లలు, నాజరీను పిల్లలు. చన్ను విడిచి మరియు ఏదైనా బలమైన మాంసము తినగోరుచున్న వారిని ఆయన కోరుచున్నాడు. ఇక్కడ అది వచ్చుచున్నది;

ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ,…వెంబడి ఆజ్ఞ; సూత్రము వెంబడి సూత్రము,…వెంబడి సూత్రము; కొంత ఇచ్చట, మరియు కొంత అచ్చట:

ఏలయనగా నత్తివారి పెదవుల చేతను మరియు అన్య భాషలతోను ఈ జనులతో మాటలాడుదును.

నిజమే మీరు అలసినవారికి నెమ్మది కలుగజేసే విశ్రాంతి ఇదే, అని వారితో చెప్పెను; మరియు ఇదే విశ్రాంతి: మరి అయినను వారు విననొల్లరైరి.

88 ఆ పరిశుద్ధాత్మ, అది రావడానికి ఏడు వందల పన్నెండ్రు సంవత్సరాలకు ముందే ప్రవచింపబడి, అది సరిగ్గా అది ఆ పెంతెకోస్తు దినమందు వచ్చినప్పుడు ఉన్నట్లే అది లేదా! ఇదిగో ఆ పెంతెకోస్తు దినమందు, అది సరిగ్గా అట్లే వచ్చెను.

89 ఎవరో ఇట్లన్నారు, “విశ్రాంతి దినమును పాటించుట.” ఎవరి సంఘమునైనా లేదా మతమునైనా నేను తక్కువ చేయుటలేదు, లేదా తృణీకరించుటలేదు. అయితే ఇట్లన్నారు, “సబ్బాతు దినము, దేవుని యొక్క సబ్బాతు దినమే విశ్రాంతి దినము.”

ఇదే విశ్రాంతి దినము. “ఇదే విశ్రాంతి,” ఆయన ఇట్లనెను, “అలసిన వారికి విశ్రాంతి కలుగజేయుడి.” అది ఇదే. ఆమేన్! “అది ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రముగా నుండును.” ఇదే విశ్రాంతి. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? విశ్రాంతి. ఓ!

ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును.

90 ఆయన ఏమైయున్నాడు? మీలోనికి వచ్చువాడు, మీకు సమాధానమును ఇచ్చును; మీ గురుతు, మీ ఆదరణకర్త; ఆదరించి, విశ్రాంతినిచ్చి, ముద్రించాడు.

91 మీరెట్లు…? అది ఒక గురుతైయున్నది; మీకేదో జరిగినదని లోకమునకు తెలియును. అదేమిటి? అదొక ఆదరణకర్త. అదేమిటి? ఒక ముద్ర. మీరు విశ్రాంతిలో ఉన్నారు. మీరు…అది మీ ఉత్తరవాది. మీకు, మీకేదైనా జరిగినయెడల, అప్పుడు మీ కొరకు విజ్ఞాపన చేయుచు, వెంటనే మీ పక్షమున వాదించడానికి, అక్కడ ఏదో ఉండియున్నది, చూడండి. అది సంఘములో నివసిస్తున్న దేవుని యొక్క ఆత్మయైయున్నది, అది వచ్చినప్పుడు ఖచ్చితంగా అదేమైయుండునని ప్రవచింపబడినది. అది ఒక నిరంతరము, నిత్యమైన విశ్రాంతిగానుండును.

92 దేవుడు లోకమును సృజించెను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. “దేవుడు లోకమును సృష్టించెను, మరియు ఏడవ దినమున విశ్రాంతినొందెను.” అది సరియే.

తిరిగి ఎనిమిదవ దినము వచ్చినది, క్రింద…కొంత సమయం వరకు, ఆయన దానిని యూదులకు ఒక నిబంధనగా ఇచ్చెను. అది సరియే. కానీ వారు వెళ్ళి ఒక రోజు విశ్రమించేవారు; తిరిగి వెళ్ళి, వారములో మొదటి దినమున, మళ్ళీ మొదలు పెట్టేవారు, క్రొత్తగా, మొదలు పెట్టేవారు. దేవుడు పలికిన విశ్రాంతి అది కాదండి.

దేవుడు ఆరు దినములలో సృష్టిని చేసినప్పుడు, ఆయన విశ్రాంతికి వెళ్ళినప్పుడు, అప్పటి నుండి ఆయన విశ్రాంతిలోనే ఉన్నాడు. అది సరియే. అది స్థిరపరచినది. ఆయన ఎనిమిదవ దినమున తిరిగి వచ్చి మరియు మరలా ప్రారంభించలేదు.

93 అది కేవలం ఒక ఛాయయైయున్నది. ఇప్పుడది, సూర్యునికి చంద్రుడు ఎలాగో, అది అటువంటి ఒక సాదృశ్యమైయున్నది; అయితే సూర్యుడు ఉదయించినప్పుడు, మనకిక చంద్రుడు ఎంతమాత్రము అవసరము లేదు. ఇప్పుడు దీనిని గమనించండి, ఓ, ప్రకటన 11లో, “సూర్యుని ఆమె శిరస్సుపై ధరించుకొని, మరియు ఆమె పాదముల క్రింద చంద్రుడిని కలిగియున్న స్త్రీ.” ఓ, మేము అట్ట నుండి అట్ట వరకు బైబిలు గ్రంధము గుండా వెళ్ళి, మరియు మీకు చూపించగలము. చూశారా?

94 అయితే అదేమిటి? హెబ్రీ 4వ అధ్యాయంలో బైబిలు ఇట్లు చెప్పినప్పుడు, “యేసు వారికి ఒక విశ్రాంతి దినమును ఇచ్చినయెడల, ఆయన ఆ తరువాత దానిగూర్చి మాట్లాడియుండేవాడు; ఆయన ఒక విశ్రాంతి దినము గూర్చి మాట్లాడియుండేవాడు.” ఆయన ఏ దినమును గూర్చి, విశ్రాంతి అని మాట్లాడినాడు?

ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును.

95 మత్తయి సువార్త 11వ అధ్యాయం, 22వ వచనం…చూడండి, పిదప, మనము ఆయన యొద్దకు వచ్చినప్పుడు మనము దానిని కనుగొంటాము. “ఏలయనగా,” హెబ్రీ 4 ఇట్లు చెప్పుచున్నది, “దేవుడు తన కార్యములన్నింటిని ముగించి విశ్రమించిన ప్రకారము, యేసుయొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించినవాడు, తన లోకసంబంధమైన కార్యములను ముగించెను,” ఆయన లోకమును కలుగజేసినప్పుడు, మళ్ళీ ఎన్నడూ దానియొద్దకు మరలకుండునట్లు చేసెను. ఎంతకాలము? మీరెంత కాలము వరకు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడియున్నారు? “మీ విమోచన దినమువరకైయున్నది.” అక్కడే ఆ విశ్రాంతి, ఆదరణ, ఉత్తరవాది, ముద్ర, విమోచకుడు ఉండియున్నవి. ఓ! నాకు ఒక విధమగు ఉత్తేజము కలుగుచున్నది, లేదా ఒక విధమగు ఆశీర్వాదము పొందినట్లున్నది. ఓ!

96 “బ్రెన్హామ్ సహోదరుడా, అది మనకొరకు వాగ్దానము చేయబడినదా? అది బైబిలు గ్రంథము ద్వారా ఋజువు చేయబడినదా?”

మంచిది, మనము యోవేలునకు వెళ్ళి, దానిగూర్చి యోవేలు ఏమి చెప్పెనో కనుగొందాము.

దేవునియొక్క ఈ ధన్యకరమైన వాక్యమును బట్టి నేనెంతగానో కృతజ్ఞుడనైయున్నాను! మీరు దానిని ప్రేమించుచున్నారా? ఈ వాక్యము కొరకు కానియెడల, మనము ఎక్కడ నిలబడియుండేవారమో నాకు తెలియదని, నేను తలంచుచున్నాను. మంచిది.

ఇప్పుడు మనము యోవేలు వద్ద ఉన్నాము. మనము యోవేలునొద్దకు వెళ్ళుచున్నాము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, మరియు మనము 28వ వచనము వద్ద ప్రారంభించబోవుచున్నాము. యోవేలు 2:28, క్రీస్తుయొక్క రాకడకు ఎనిమిది వందల సంవత్సరాలకు ముందు, ఆ ప్రవక్త ఆత్మవశుడయ్యెను. ఇప్పుడు వినండి.

మరియు అటు తరువాత, నేను సర్వశరీరుల మీద నా ఆత్మను కుమ్మరింతును; …మీ కుమారులును మరియు మీ కుమార్తెలును ప్రవచించుదురు, మీ ముసలివారు కలలు కందురు, మరియు మీ యౌవనస్థులు దర్శనములు చూతురు:

మరియు ఆ దినములలో నేను నా పనివారి మీదను మరియు నా పనికత్తెల మీదను…కుమ్మరింతును, నా ఆత్మను కుమ్మరింతును.

మరియు ఆకాశమందును భూమియందును మహత్కార్యములను,…అనగా రక్తమును, అగ్నిని, ధూమస్తంభములను కనుపరచెదను.

యెహోవా యొక్క ఆ భయంకరమైన, మరియు మహాదినము రాకముందు, సూర్యుడు తేజోహీనుడగును…మరియు చంద్రుడు రక్తవర్ణమగును.

మరియు ఆ దినమున ప్రభువు నామమును బట్టి, ఆయనకు ప్రార్ధన చేయువారందరును రక్షింపబడుదురు:

97 అదొక…ఓ! ఏమిటి? యోవేలు! మీరు గమనించారా? అపొస్తలుల కార్యములు 2లో, పేతురు అదే వచనమును తీసుకున్నాడు. ఇట్లు చెప్పెను, “ఇశ్రాయేలులో కాపురమున్న మనుష్యులారా, నా మాట వినుడి. వీరు మత్తులు కారు,” వీరు ముద్రించబడి, ఆదరించబడి, గుర్తించబడిన ప్రత్యేకమైన ప్రజలైయున్నారు. “మీరు ఊహించునట్టు, వీరు మత్తులు కారు,” అపొస్తలుల కార్యములు 2, “పొద్దుబొడిచి జామయిన కాలేదు. అయితే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఇట్లు చెప్పబడినది, ‘అంత్య దినములలో నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను.’”

98 అదేమిటి, పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అది సరియే, ఇప్పుడు మనం మరలా గమనించెదము, విశ్వాసులకు వాగ్దానము చేయబడినది, అది అదేయైయున్నది. ఇప్పుడు, ఈ పరిశుద్ధాత్మ, అదేమిటో మనము కనుగొందాము, కేవలం ఒక్క నిమిషం. అది ఎవరికొరకు వాగ్దానము చేయబడినది? విశ్వాసులకు.

ఇప్పుడు లూకా సువార్త లోనికి వెళ్దాము, లూకా 24వ అధ్యాయం, యేసు భూమిని విడిచిపోవుటకు ముందు ఆయన చివరిగా ఏమి చెప్పినో వినండి. లూకా సువార్త 24వ అధ్యాయం. మరియు ఇప్పుడు దీనిని ఎవరైతే వ్రాసుకుంటున్నారో, దీనిని మీరు వ్రాసుకొనవచ్చు, పిదప మీకు ఎక్కువ సమయం ఉన్నప్పుడు రేపు దానిని అధ్యయనం చేయండి. ఇప్పుడు, లూకా 24:49 లో, యేసు మాట్లాడుచున్నది వినండి. చివరిగా, ఆయన మహిమలోనికి ఆరోహణమగుచున్నప్పుడు, ఆ ఆరోహణమప్పుడు, ఆయన తన శిష్యులతో చెప్పిన మాటలు ఇవే.

…ఇదిగో, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను…

ఏమి వాగ్దానము? ముద్ర, గురుతు, ఆదరణ కర్త, మరియు వేలసార్లు నేను చెప్పిన ఈ సంగతులన్నియు.

…నా తండ్రి వాగ్దానము చేసినది నేను మీ మీదకి పంపుచున్నాను:…

ఏమి వాగ్దానము? “రానున్నదని యెషయా చెప్పినది, ‘నత్తివాని పెదవుల చేతను అన్య భాషతోను నేను ఈ జనులతో మాట్లాడెదను.’ ఆ విశ్రాంతిని నేను మీ మీదకు పంపెదను. యోవేలు దేని గూర్చి పలికెనో దానిని పంపెదను, అదేదనగా, ‘అంత్య దినములయందు, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, అని దేవుడు చెప్పుచున్నాడు.’ ఓ, నేను మీకు పంపెదను, మరియు యెరుషలేము మొదలుకొని, దేశములన్నిటిని, ప్రజలందరిని…నేను ఈ నిబంధన క్రింద అబ్రాహాము సంతానమును లోపలికి తెచ్చెదను. వారిలో ప్రతిఒక్కరిని ముద్రించెదను. చూడండి, నేను నా ఆత్మను కుమ్మరించెదను.”

…నేను నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుదును: అయితే మీరు, మీరు పైనుండి శక్తి పొందువరకు యెరుషలేము పట్టణములో నిలచియుండుడి, అనగా, వేచియుండుడి.

99 అలాగైతే పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? “పైనుండి వచ్చు శక్తి!” బిషప్పు నుండి వచ్చు శక్తి కాదు, సంఘము నుండి వచ్చు శక్తి కాదు. అయితే, “పైనుండి వచ్చు శక్తియైయున్నది!”

100 ఆ శక్తి ఎట్లు వచ్చెను? “సంఘములో చేరుట” వలనా? అది నిజమని చెప్పుదురాయని, నేను మీతో సవాలు చేయుచున్నాను. “ఒక సంఘములో చేరి, బోధకునితో కరచాలనము చేయుట” వలనా? కాదండి. ఇప్పుడు, క్యాథలిక్కులైన మీకు, “మీ నాలుక బయటకు చాపి మరియు మొదటి ప్రభు సంస్కారమును తీసుకొనుటవలనా”? కాదండి.

101 పైనుండి శక్తి, అది ఎలా వచ్చినది? మనం ఇంకా కొద్దిగా చదువుదాము. మనం అపొస్తలుల కార్యములు 1:8 లోనికి వెళ్దాము. ఇప్పుడు వారక్కడ కూడుకొనుచున్నారు. ఇప్పుడు వారు కలిసి సమావేశమైనప్పుడు, వారిక్కడ యేసును గూర్చి మాట్లాడుచున్నారు, మరియు యూదా యొక్క స్థానమును తీసుకొనుటకు ఇంకొకరిని నియమించారు. ఆపొస్తలుల కార్యములు 1:8.

అయినను ఈ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు, మీరు శక్తినొందెదరు:…

ఏమిటి? “నీవు బ్రెన్హామ్ ఆలయములో సభ్యుడవు అగుదువా”? లేదండి. “నీవు మెథడిస్టు సంఘము, క్యాథలిక్ సంఘము, ప్రెస్బిటేరియన్ సంఘముల యొక్క సభ్యుడవు అవుతావా”? బైబిలులో, అలాగు లేదు. అది మానవ-కల్పిత సిద్ధాంతమైయున్నది.

“అయితే నీవొక బోధకుడివైన తర్వాత నీవు పైనుండి శక్తినొందుదువా”? లేదండి. “నీవొక బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టభద్రుడవైనప్పుడు నీవు శక్తినొందెదవా”? లేదండి. “నీవు-…నీవు DD పట్టా పొందిన తర్వాత శక్తి వస్తుందా”? లేదండి. “నీవు నీటిలో బాప్తీస్మము పొందిన తర్వాత నీవు శక్తినొందెదవా”? కాదండి. “నీవు మొదటి ప్రభు సంస్కారమును తీసుకున్నప్పుడు నీవు శక్తినొందెదవా”? కాదండి. చూడండి, అవన్నియు మానవ-కల్పితమైయున్నవి.

102 బైబిలు ఏమి చెప్పినదో, యేసు ఏమి చెప్పెనో వినండి.

…పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, మీరు శక్తినొందెదరు: (పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? ఆ శక్తి) పిదప, దీని తరువాత, మీరు సాక్షులైయుందురు…(“కేవలం మీ పన్నెండుగురు, మీరు యెరూషలేములోనే సాక్ష్యమిచ్చెదరా”?)…మీరు యెరూషలేములోను,…యూదయ,…సమరయలోను, మరియు భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు. (అది ఇంకను చేరుకొనలేదు.)

మరియు ఆయన ఈ సంగతులు చెప్పినప్పుడు,…ఆయన ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా, ఆయన మేఘములో పైకి కొనిపోబడెను మరియు…వారి కన్నులకు కనబడకుండ తీసుకుపోబడెను.

103 ఇప్పుడా పేజీని త్రిప్పండి, ఈ ప్రవచనములు నెరవేరుటను గమనించండి.

మరియు పూర్తిగా పెంతెకోస్తు దినము వచ్చినప్పుడు, వారు ఒక…వారందరు ఏక మనస్సు కలిగి ఒక చోట కూడియుండిరి.

“మరియు అకస్మాత్తుగా సంఘకాపరి లోపలికి వచ్చెనా…”? నేనక్కడ వరుస తప్పాను, కదా? “అకస్మాత్తుగా బోధకుడు వేదిక మీదికి వచ్చెనా”? కాదు.

మరియు అకస్మాత్తుగా ఒక శబ్దం వచ్చెను…

కేవలం ఒక కల్పిత-నమ్మకం కాదు; అక్కడ, ఒక శబ్దం కలిగెను.

“ఒక సేవకుడు ద్వారమునొద్దకు వచ్చుచున్నాడా”? “పరిశుద్ధ స్థలమునుండి, యాజకుడు ప్రభు సంస్కారమును తీసుకువచ్చుచున్నాడా”? లేదు, అటువంటిదేదీ కాదు.

…ఆకాశమునుండి ఒక శబ్దం వచ్చెను…(అడుగుల చప్పుడు కాదు)…వేగముగా వీచు ఒక బలమైన గాలి వంటి…ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను (ఓ, మై! వ్యూ!…?…)…మరియు అది వారు కూర్చుండియున్న ఇల్లంతయు నిండెను.

104 పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? వారు శక్తిని పొందుకునేది ఇక్కడే. వారు వేచియుండవలసినది ఇక్కడే; వారట్లు చేసినప్పుడు జరిగినది ఇదేయైయున్నది. ఆదికాండము నుండి మొదలయ్యి, అబ్రాహాము నుండి వరుసగా; అది రానున్నదనియు, అది ఎట్లు వచ్చుననియు మరియు దాని ఫలితాలు వచ్చుననియు, అందరూ ప్రవచించిరి. అదేమిటి? సంఘమునకు, విశ్వాసులకు వాగ్దానము చేయబడినది.

…మరియు వారు కూర్చుండియున్న ఇల్లంతయు నిండెను.

మరియు అగ్ని నాలుకలు విభాగింపబడినట్టుగా…వారికి కనబడి, మరియు అది ఒక్కొక్కని మీద వ్రాలెను.

మరియు వారందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై, ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించినకొలది, అన్యభాషలతో మాటలాడసాగిరి.

ఇప్పుడు మనము శనివారము రాత్రి, దానిని కొనసాగించెదము. దానిని సరిగ్గా అక్కడే వదిలివేయుదుము, చూడండి.

105 అది ఎట్లుండినది? అది సంఘమునకు ఒక వాగ్దానము, ఖచ్చితంగా ఒక వాగ్దానమైయున్నది. అది సరియే.

106 ఇప్పుడు, మనమిప్పుడు కనుగొనబోవుచున్నాము, వారు నింపబడిన తర్వాత, వారు ఎంత కాలము వరకు ముద్రించబడినారు? [“విమోచన దినము వరకు,” అని సంఘము చెప్పుచున్నది.—సంపా.]

ఇక్కడ ఎంతమంది పరిశుద్ధాత్మను కలిగియున్నారు? మీ చేతులను చూద్దాము. పరిశుద్ధాత్మ లేని వారికంటే కలిగియున్నవారే ఎక్కువ మంది ఉన్నారు. సహోదరీ, సహోదరుడా, మీరు మాలో ఒకరిగా ఉండాలని మేము కోరుచున్నాము. అది ఏమిటని మీకు అర్ధమైనప్పుడు, అది…అది దేవుని క్రియలు చేయుటకై, దేవునియొక్క ఆత్మ మీలో నివసించుటయైయున్నది.

దేవుడు ఎన్నడైనను తన ఆత్మను ఆయనయొక్క సేవకులలోనికి, ఆయనయొక్క ప్రవక్తలలోనికి, ఆయనయొక్క బోధకులలోనికి, ఆయనయొక్క అపొస్తలులలోనికి పంపినప్పుడు, వారెల్లప్పుడూ లోకము ద్వారా త్రోసివేయబడినారు. ప్రతి కాలములోను, వారు పిచ్చివారిగా పరిగణించబడినారు. పౌలు అగ్రిప్ప యెదుట నిలబడినప్పుడు కూడా, అతడిట్లన్నాడు, “మత భేదము అని పిలువబడే ఈ మార్గములోనే…” మత భేదమనగా ఏమిటి? “వెఱ్ఱితనం.” “వారు ఏ మార్గామునైతే వెఱ్ఱిదని, ఒక పిచ్చివారి గుంపుయని, అందురో, ఆ మార్గముచొప్పునే నేను మన పితరుల దేవుడిని ఆరాధించుచున్నాను.” నేను వారిలో ఒకడినని చెప్పుటకు నేనెంతగానో ఆనందిచుచున్నాను. అవునండి. అది వాస్తవం. నేను వారిలో ఒకడినని చెప్పగలుగుటకు నేనెంతగానో సంతోషించుచున్నాను.

107 ఇప్పుడు, ఈ పరిశుద్ధాత్మ వారిపై కుమ్మరించబడిన తర్వాత, ప్రతీది సమిష్టిగా కలిగియుండేంత మాధూర్యముగా అది వారిని మార్చినది. అది నిజమేనా? ఓ, ఓ, ఎటువంటి సహవాసము! మనము కొన్నిసార్లు ఆ పాటను పాడుతాము కదా, “ఓ, ఎటువంటి సహవాసము! ఓ, ఎటువంటి దైవిక ఆనందము!” అదియే. వారు లెక్కచేయలేదు, ఆ—ఆ సూర్యుడు ప్రకాశించాడా లేదాయని వారు లెక్కచేయలేదు. వారు సుఖమయమైన ఒక పూలపాన్పు కొరకు అడగలేదు.

“ఇప్పుడు, నేను పరిశుద్ధాత్మను పొందుకుంటాను,” అని కొందరు ప్రజలు నాతో చెబుతారు, “మిస్టర్. బ్రెన్హామ్, నేనొక కోటీశ్వరుడనౌతానని నీవు నాకు హామీ ఇచ్చినయెడల, నేను నూనె బావులను కనుగొంటానని నీవు నాకు హామీ ఇచ్చినయెడల, మరియు నేను బంగారు గనులను కనుగొనినయెడల, మరియు నేను—నేను…” చూడండి, ప్రజలు దానిని బోధిస్తుంటారు, మరియు వారు ఒక అబద్ధాన్ని బోధిస్తారు. దేవుడు అటువంటి కార్యములను వాగ్దానము చేయలేదు.

108 ఎన్నడైనా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నాడంటే, అతడు రొట్టె కోసం భిక్షమెత్తుకుంటాడా లేదా అనునది లెక్కచేయడు. అది అతనికి ఎటువంటి వ్యత్యాసమును కలిగించదు. అతడొక పరలోక-బద్ధుడైన జీవియైయున్నాడు. అతడు…అతనికిక్కడ, అసలు ఎటువంటి సంబంధాలు లేవు. అది వాస్తవం. అతడు లెక్కచేయడు. ఏది వచ్చినా, ఏది పోయినా, దానిని జరగనీయండి. వారిని విమర్శించనీయండి, హేళన చేయనీయండి. నీ పరువు పోయినా, నీవెందుకు లేక్కచేయాలి? నీవు మహిమకు వెళ్ళే దారిలో ఉన్నావు! హల్లెలూయా! నీ కన్నులు క్రీస్తుపై నిలిపియుంచావు, మరియు నీవు నీ దారిలో ఉన్నావు. లోకము ఏమి అంటుందాయని నీవు లెక్కచేయవు.

పరిశుద్ధాత్మ అనగా అదియే. అదొక శక్తి, అదొక ముద్ర, అదొక ఆదరణ కర్త, అదొక ఉత్తరవాది, అదొక గురుతైయున్నది. ఓ, మై! దేవుడు నిన్ను స్వీకరించాడనుటకు అదొక నిశ్చయతైయున్నది.

నేనెంత సమయము తీసుకున్నాను? నాకింకా ఎనిమిది నిమిషాలు మాత్రమే ఉన్నది. అది సరియే. నన్ను…నేనిక్కడ చాలా లేఖనములను కలిగియున్నాను. నేను వాటిని చెప్పగలుగుదునని నేను అనుకోవడం లేదు, కానీ మా వంతు ప్రయత్నము మేము—మేము చేస్తాము.

109 ఇప్పుడు, ఒక మనిషి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, శ్రమలు మరియు అటువంటివి, అతడిని వెనుకకు వచ్చునట్లు చేయుట సాధ్యమేనా మరియు…ఇప్పుడు, అతడు కోల్పోడు, అతడు ఇంకను దేవుని కుమారుడే, అతడెల్లప్పుడు అదేయైయుంటాడు, ఎందుకనగా మీరెప్పటి వరకు ముద్రించబడినారు? [సంఘము ఇట్లు చెప్పుచున్నది, “విమోచన దినము వరకు.”—సంపా.] అది వాస్తవం. బైబిలు చెప్పినది అదే.

110 ఇప్పుడు, ఆ శిష్యులు కొట్టబడి, వారు వెక్కిరించబడి, ఎగతాళి చేయబడి, మరియు ప్రతీది చేయబడిన తర్వాత, కొంత కాలము కలిసికట్టుగా వెనక్కి వెళ్ళిపోవుటకు అది సమయమని వారు అనుకున్నారు. మనము అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము వైపుకు—వైపుకు త్రిప్పెదము, మరియు వారు…ఏమి జరిగినదో చూద్దాము. ఇప్పుడు ఇది మీకు అనగా దానిని ఇదివరకే పొందుకున్న ప్రజలకైయున్నది. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము.

ఇప్పుడు, ఆ ఆలయము గేటు వద్ద స్వస్థత విషయమై, ఒక స్వస్థతా కూటమును పెట్టినందుకు, పేతురు మరియు యోహాను కొట్టబడి, చెరసాలలో వేయబడిరి. అది ఎంతమందికి తెలియును? తన కాళ్ళలో, కుంటితనమున్న ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. అతడు నడవలేడు; నలభై సంవత్సరాలుగా ఆ విధంగానే ఉండియున్నాడు. మరియు పేతురు ఆ దారిగుండా వెళ్ళెను. మరియు అతడిట్లు చెప్పెను…ఆహారం కొరకు, ఏదైనా తన గిన్నెలో వేయబడుటకు, అతడు తన గిన్నెను చాపెను.

మరియు పేతురు తానొక పరిశుద్ధ-ఆత్మతో-నింపబడిన బోధకుడనియు, తన వద్ద ఎటువంటి డబ్బు లేదనియు చూపించెను. అతడిట్లు చెప్పెను—అతడిట్లు చెప్పెను, “వెండి మరియు బంగారము నా వద్ద లేవు.” చూడండి, అతడు దానిగూర్చి చింతించుట లేదు. కాని అతడు ఒక—ఒక పరలోక-బద్ధుడైన జీవియైయుండెను. ఓ, కొంతసేపు మనము అందులో ఉండుటకు మనకు సమయం ఉంటే బాగుండునని నేను ఎంతగానో కోరుచున్నాను, చూడండి. అతడు పరలోక-బద్ధుడు. అతడు ఆదరింపబడినాడు. అతడు ఆ ఆత్మను కలిగియున్నాడు. అతడు ఆ శక్తిని కలిగియున్నాడు. అతడు నడిచివెళ్ళి మరియు ఇట్లు చెప్పెను, “వెండి మరియు బంగారము నావద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చెదను.”

“అయ్యా, నీవేమి కలిగియున్నావు?” అని ఆ వ్యక్తి అడిగెననుటలో ఎలాంటి సందేహము లేదు.

“నేను విశ్వాసమును కలిగియున్నాను. దాదాపు పది రోజుల క్రితం మొదలయిన దేనినో నేను నా హృదయంలో కలిగియున్నాను. నేనక్కడ మేడ గదిలో ఉన్నాను, మరియు అకస్మాత్తుగా, దేవుడు చేసిన ఆ వాగ్దానములన్నియు…మూడున్నర సంవత్సరాలు నేను యేసుక్రీస్తుతో నడిచాను. నేను ఆయనతో కలిసి చేపలు పట్టాను, చేపలను దరికి లాగుచు అక్కడ ఉన్నాను. నేను ఈ నానావిధమైన కార్యములను చేశాను. మరియు ఆయన రోగులను స్వస్థపరచుటను నేను చూసియున్నాను. నేను…ఆయన నాకిట్లు చెప్తుండేవాడు, ‘తండ్రి నాయందు ఉన్నాడు; కానీ నేను వెళ్ళిన తర్వాత, ఆయన మీలోనికి వచ్చును.’ కాబట్టి నేను దానిని గ్రహించలేకపోయాను. అయితే ఆయన ఇట్లన్నాడు, ‘ఇప్పుడు, నీవు దానిని గ్రహించవలెనని నేను ఆశించడంలేదు.’”

మీరు ఈ సంగతులను గ్రహించరు; మీరు కేవలం వాటిని పొందుకుంటారు. నేను దానిని ఇంకను గ్రహించలేదు. మరియు మీరు గ్రహించారని నాకు చెప్పకండి; ఎందుకనగా మీరు గ్రహించరు. చూశారా? నేను దానిని గ్రహించలేను, కాబట్టి, నేను దానిని వివరించలేను; కానీ, నాకు తెలిసిన ఒకే ఒక్కటి ఏమిటనగా, నేను దానిని పొందుకున్నాను.

“మంచిది, మంచిది,” మీరిట్లంటారు, “అది శాస్త్రీయంగా లేదు.” ఓ, నిశ్చయంగా అది అట్లేయున్నది.

111 ఆ లైట్లవైపు చూడండి. బెంజమిన్ ఫ్రాంక్లిన్ దానిని కనుగొన్నప్పుడు, అతడిట్లన్నాడు, “నేను దానిని పొందుకున్నాను.” అతడేమి కలిగియున్నాడో అతనికి తెలియదు, కానీ అతడు దానిని కలిగియున్నాడు. మరియు ఈ రాత్రి ఎవరైనా విద్యుచ్ఛక్తి అంటే ఏమిటో నాకు చెప్పవలెనని నేను కోరుచున్నాను. అదేమిటో ఇంకా వారికి తెలియదు, కానీ మనం దానిని కలిగియున్నాము. ఆమేన్. అది సరియే. విద్యుచ్ఛక్తి అంటే ఏమిటో తెలిసిన వ్యక్తియే లేడు. వారు దానిని నియంత్రించగలరు, దానిని వెలిగేటట్లు చేయగలరు, దానిని మండేటట్లు చేయగలరు, అది పనిచేయునట్లు చేయగలరు. అయితే అది—అది జనరేటర్ల ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది, రెండు భాగములు ఆ విధంగా కలిసి తిరుగుచుండును. అది దానిని ఉత్పత్తి చేయును, మరియు వారికి తెలిసినదంతా అదేయైయున్నది. అది వెలుగును ఇస్తుంది, మరియు అది దానిలో శక్తిని కలిగియున్నది.

112 మరియు అది దేవునియొక్క ఆత్మ వలె ఉన్నది. మీరొక భాగామును అనగా అది మీరే, మరియు మరొక భాగమును అనగా దేవుడిని కలిగియుండి; మరియు ఆ విధంగా వాటిని కలిపి నడిపించినట్లయితే, అది మీకొరకు దేనినో చేస్తుంది. అది వాస్తవము. అది వెలుగునిస్తుంది. అది శక్తినిస్తుంది. అదేమిటో మీకు తెలియదు, మరియు అదేమిటో మీరెన్నడూ తెలుసుకొనలేరు, కానీ దానిని మీరు పొందుకున్నప్పుడు మాత్రం మీకు తెలుస్తుంది. అది మాత్రం ఖచ్చితమైయున్నది. మరియు అది మీ కొరకేయైయున్నది. అది మీదే. అది నిశ్చయతయైయున్నది. అది వాస్తవం.

ఆ వెలుగు దేనిని చూపిస్తుంది? అది నిశ్చయతను ఇస్తుంది. అది వెలుగైయున్నది.

ఇప్పుడు దీనిని గమనించండి. ఇప్పుడు, అదేమిటో మీకు తెలియదు.

113 కానీ ఈ వ్యక్తులు ఇట్లన్నారు, “సరి,” వారు…వారికి తెలిసిన ఒక విషయాన్ని వారు చెప్పారు, “వీరు అజ్ఞానులని మాకు తెలుసు.” ఇంకొన్ని “నట్లు,” మీరు చూడండి, తాను అదేనని ఆ చిన్న జర్మను చెప్పినట్లు అది ఉన్నది. చూశారా? ఇట్లనెను, “వారు అజ్ఞానులు మరియు పామరులు. కానీ వారు అక్కడున్న ఆ జాలరితో, యేసు అనబడే ఆ వడ్రంగితో ఉండియున్నారని నేను మీకు చెప్పగలను, ఎందుకనగా ఆయన చేసెడి అవే కార్యములను వారు చేయుచున్నారు.”

114 పరిశుద్ధాత్మ అంటే అదే, అది ఒక అజ్ఞానియైన జాలరిలో, ఒక వడ్రంగిలో, లేదా ఏదైనా, ఒక అజ్ఞానియైన బోధకుడిలోనైనా, అది ఎవరిలోనైనా గానీ, యేసు జీవించుటయై యున్నది. అది ఒక వ్యక్తి ఈ లోకపు సంగతులకు అజ్ఞానుడిగా ఉండగోరి, మరియు దేవుని యొక్క ఆత్మ, ముద్ర, ఆదరణకర్తయైన ఆ యేసును తనలోనికి రానిచ్చుటయైయున్నది. అతడు పరువు ప్రతిష్ట గురించి పట్టించుకొనడు; అతనికి కావలసినది దేవుడు మాత్రమే.

115 దేవుడు క్రమములో పెట్టుచున్నప్పుడు, ఆయనిట్లు చెప్పెను, “లేవీయులారా, నేను మిమ్మల్ని బయటకు పిలిచి మరియు యాజకులనుగా చేసితిని. మరియు మీ సహోదరులందరు, ఆ ఇతర, పన్నెండ్రు గోత్రములు మరియు…ఆ ఇతర పదకొండు గోత్రములవారు మీకు దశమభాగమును చెల్లింతురు.”

“మీకు ఒక తొమ్మిది గంపల యాపిల్ పండ్లు పండినప్పుడు, ఒక గంపెడు ఆ లేవీయులకు ఇయ్యుడి. మీరు ఇచ్చట ఆ—ఆ చావడిలో మీ గొర్రెల మందను మేపుచున్నయెడల, పదియవ గొర్రెను ఇయ్యుడి. అది చిన్నదా, లేదా పెద్దదా, క్రొవ్వినదా, లేదా బక్క చిక్కినదా అనునది నేను లెక్క చేయను, అది లేవీయులకు చెందును.

“ఇప్పుడు, లేవీయులారా, ఇవన్నియూ మీరు పొందుకున్నప్పుడు, అప్పుడు మీరు కూడా, ప్రభువుకు దశమభాగం ఇవ్వవలెను. మీరు అల్లాడించు-అర్పణలను, ప్రతిష్టార్పణలను, ఇతర అర్పణలను అర్పించుడి. ప్రభువుకు మీ దశమభాగం చెల్లించుడి.”

116 ఇట్లు చెప్పెను, “మోషే, నీ భాగము, నేనేయైయున్నాను.” ఓ, మై! ఆయన ఇట్లనెను, “నీ సంతృప్తి పరుచు భాగమును నేనే.”

మరియు ఈనాడు సంఘమునకు పరిశుద్ధాత్మ అదేయైయున్నది. వెండి మరియు బంగారము నా వద్ద లేవు, కానీ ఒక సంతృప్తి పరుచు భాగమును నేను కలిగియున్నాను. హల్లెలూయా! విద్యాభ్యాసం, నేను కనీసం ఈ పుస్తకాన్ని చదవలేను, కానీ నేనొక సంతృప్తిపరుచు భాగమును కలిగియున్నాను. అది మంచిది. డాక్టరు పట్టా, వంటిదేదియు నేను కలిగిలేను; పిహెచ్. డి లు లేదా ఎల్ డిలు, లేదా అవేవియు లేవు. అయితే ఒకటి మాత్రం నేను కలిగియున్నాను, ఆ సంతృప్తి పరిచే భాగము. నాకు కావలసినది ఆ భాగమే. ఆ భాగమునే నీవు కలిగియుండవలెనని దేవుడు కోరుచున్నాడు. ఈ మిగతా పాత కార్యములను, ఘనతనంతటిని మరియు ప్రతి దానిని విసిరివేయండి, మరియు బయటకు వచ్చి మరియు దేవునియొక్క సంతృప్తి పరుచు భాగమును పొందుకొనండి.

117 ఎందుకనగా, నీవు ఈ భూమి మీద ఏది పొందుకున్నను, నీవు వెళ్ళునప్పుడు దానిని ఇక్కడ విడిచిపెడతావు. కానీ నీవు ఆ సంతృప్తిపరుచు భాగమును కలిగియున్నట్లైతే, అది నిన్ను అంతే ఖచ్చితంగా పైకి తీసుకొనిపోవును. ఈనాడు, భీమా ప్రతినిధులకు కట్టుటకు, మనమెల్లప్పుడూ భీమా పాలసీలను తీసుకొనుచున్నాము. మనము దేవునియొక్క సంతృప్తిపరచు భాగమును తీసుకుందాము, మరియు పాతిపెట్టువానికి బదులు పైకి-లేపువానిని పొందుకుందాము. అవి రెండూ పనిచేస్తాయని, మీరెరుగుదురు.

118 ఇప్పుడు మనం చూద్దాము.

…వారు విడుదల నొందినవారై, తమ స్వజనులయొద్దకు వెళ్ళిరి,…

తిరిగి ఆ యాజకులయొద్దకు కాదు. చూడండి, వారు దానిని కలిగియున్నారని అది చూపించినది. వారు తిరిగి మరలా ఆ పాత, చల్లబడిన, నామకార్ద విషయము వైపుకు వెళ్ళుటలేదు, లేదండి; వెనక్కి వెళ్ళి మరియు ఇట్లు చెప్పలేదు, “ఇప్పుడిక్కడ వారు మాకు ఏమి చేసారో చూడండి!” లేదు, లేదు. వారికి వారి స్వజనులున్నారు. వారక్కడ కేవలం పన్నెండు మంది మాత్రమే ఉన్నారు, కానీ అది చాలినంత సమూహమైయున్నది, ఒక పిడికెడు మంది ప్రజలైయున్నారు.

…విడుదల పొందినవారై,…

వారు వారిని కొట్టి మరియు వారిని బెదిరించిన తర్వాత, ఇట్లనిరి, “మళ్ళీ ఎప్పుడైనా యేసు నామములో బాప్తీస్మము ఇచ్చారంటే!” లేదా, ఓ, నా భావము ఆ…సరి, అది నిజము. చూశారా? “మళ్ళీ ఎన్నడైనా మీరు యేసు నామమును ప్రకటించినా, మీరేది చేసినా, మేము మిమ్మల్ని పట్టుకుంటాము!”

119 “హో, అది చాలా పెద్ద బెదిరింపు. మనము ఆ మిగతా సహోదరుల వద్దకు వెళ్దాము,” అని అనుకున్నారు. ఓ, అదీ విధానము. ఐక్యతలో శక్తి ఉన్నది. ఐక్యతలో శక్తి ఉన్నది. “మనము కేవలం ఆ మిగతా సహోదరుల యొద్దకు వెళ్ళి మరియు మనమేమి చేయగలమో కనుగొందాము,” అని అనుకున్నారు.

120 ఇప్పుడు వారందరూ కూడివచ్చి మరియు ఆయా అనుభవాలను చెప్పుకొనుచున్నారు.

…వారు విడుదల నొందినవారై, తమ స్వజనులయొద్దకు వెళ్ళిరి, మరియు ఆ ప్రధాన యాజకులును ఆ పెద్దలును తమతో చెప్పిన మాటలనన్నిటిని వారికి తెలిపిరి.

మరియు వారు అది విన్న తర్వాత, వారు ఏక మనస్సుతో ఎలుగెత్తి దేవునికి బిగ్గరగా మొఱ్ఱపెట్టిరి,…

ఇప్పుడు వారు ఏమి చెప్పారో వినండి. అతణ్ణి గమనించండి, వారిని గమనించండి, వారు వెనక్కి వెళ్ళి, “ఓ…” మరొక దాని గూర్చి, “ఓ ప్రభువా, నన్ను క్షమించు…” అని చెప్పలేదు. లేదండి. వారిదివరకే రక్షించబడియున్నారు. వారు ఆత్మతో నింపబడియున్నారు. వారు నిత్యజీవమును కలిగియున్నారు.

…వారు ఏక మనస్సుతో…తమ స్వరమునెత్తి మరియు, ప్రభువా, నీవే దేవుడవు, అని బిగ్గరగా మొఱ్ఱపెట్టిరి,…

ఆమేన్! సహోదరుడా పామర్, నాకు అది నచ్చినది. నేను దానిని ఇష్టపడుదును.

…నీవే దేవుడవు (మనము దానిని ఎరుగుదుము) ఆకాశమును, మరియు భూమిని, సముద్రమును, మరియు అందులోని సమస్తమును కలుగజేసినవాడవు:

నీ సేవకుడైన దావీదు నోట…పలికితివి,…

121 ఇప్పుడు గమనించండి, మీరు తిరిగి వచ్చి ఇట్లంటారు, “ఇప్పుడు, మేము ఒక…” ఇప్పుడు మీరక్కడికి వెళ్ళి మరియు ఇట్లు చెప్తారు, “మంచిది, ఇప్పుడు, ప్రభువా, ఇప్పుడొక నిమిషం ఇక్కడ ఆగుము. వారు నన్ను ఎంతగానో ఎగతాళి చేయుచున్నారు!” వారట్లు చేయుదురని ఆయన చెప్పలేదా?

“క్రీస్తుయేసు నందు సద్భక్తితో జీవించువారందరు హింస పొందుదురు.”

“మంచిది, మీకు తెలియును, మా యజమాని చెప్పాడు, అతడు కనుగొన్నాడంటే…” వారట్లు అంటారని వారు చెప్పలేదా? “మంచిది, మీకు తెలియును, దాని విషయమై, వారు ఒక దినమున నన్ను కోర్టుకి పిలిపించారు.”

122 ఆయన ఇట్లు చెప్పలేదా, “మీరు నా నామము నిమిత్తము, రాజులు మరియు అధిపతుల ఎదుటకు తీసుకుపోబడుదురు. మీరేమి సమాధానము చెప్పుదురో అని తలంచకుడి, ఎందుకనగా మాటలాడునది మీరు కాదు”? అది నిన్న జరుగుటను నేను చూశాను. “అది మీలో నివసించు పరిశుద్ధాత్మయైయున్నది; ఆయనే మాటలాడును.” చూడండి, “ఆయన.” అది నిజం. అది సరియే. “మీరేమి సమాధానము చెప్పుదురో అని తలంచకండి.”

ప్రభువా, ఎవరి…ద్వారా…నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి, అన్యజనులు ఏల అల్లరి చేసిరి, మరియు ప్రజలు ఎందుకు వ్యర్ధమైన ఆలోచనలు పెట్టుకొనిరి?

ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, మరియు ఆ అధికారులును…ఏకముగా కూడుకొనిరి.

…సత్యమును గూర్చి, ప్రభువా, నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ శిశువైన యేసునకు విరోధముగా, హేరోదు, మరియు పొంతి పిలాతు ఇరువురును, అన్యజనులతోను, మరియు ఇశ్రాయేలు ప్రజలతోను,…కూడుకొనిరి,

ఏమి జరుగవలెనని నీ హస్తము మరియు నీ సంకల్పము ముందుగానే నిర్ణయించెనో వాటి నన్నిటిని చేయుటకైయున్నది.

ఓ, మై! నేను దానిని ఇష్టపడుచున్నాను. “ప్రభువా, వారేమి చేయుదురని నీవు చెప్పితివో సరిగ్గా దానినే వారు చేయుచున్నారు.” బైబిలు ఏమి చెప్పెను? “అంత్య దినములలో, దూషకులు; అహంకారులు, గర్వాంధులు, దేవునికంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించువారు; అనురాగరహితులు, అపవాదకులు, అజితేంద్రియులు, సజ్జనద్వేషులు; పైకి భక్తిగలవారివలె ఉండియు, నిరాకరించేవారు వచ్చును…” వారు ఎన్నడును అచ్చటికి వెళ్ళి మరియు శక్తిని పొందుకొనలేదు: “…ఈ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చిన తర్వాత.” “పైకి భక్తిగలవారివలె ఉండియు, దాని శక్తిని ఆశ్రయించనివారై యుందురు: అట్టివారికి విముఖుడవైయుండుము.” పరిశుద్ధాత్మ అనగా అదేయైయున్నది. చూశారా?

…ఏవి జరగవలెనని…ముందు నిర్ణయించబడెనో.

…ఇప్పుడు, ప్రభువా, వారి బెదిరింపులు చూచి: మరియు—మరియు నీ దాసులమైన, మేము బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము,

ఓ, నేను దానిని ఇష్టపడుచున్నాను! ఆ అదృష్టమనే దానిపై అధారపడకండి, మరియు ఒక నిజమైన ధైర్యాన్ని తెచ్చుకోండి. ఇప్పుడిక్కడ గమనించండి.

…మేము నీ వాక్యమును ప్రకటించునట్లు,

స్వస్థపరచుటకు నీ చెయ్యి చాచుట ద్వారా;…

ఓ, సహోదరుడా! దయ్యములు మరణించవు, అయితే పరిశుద్ధాత్మయు మరణించడు. చూశారా?

…స్వస్థపరచుటకును;…నీ పరిశుద్ధ శిశువైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మరియు మహాత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచుము.

వారు దేనిగూర్చి సణుగుచున్నారో, మీరు చూచుచున్నారు, కదా? వారు ఈనాడు అదే కార్యమును చేయుచున్నారు, కానీ అది ఎంతమాత్రము మేలు చేయదు.

మరియు వారు ప్రార్ధన చేయగానే, వారు కూడియున్న చోటు కంపించెను; అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై, మరియు…దేవుని వాక్యమును బహు ధైర్యముగా బోధించిరి.

123 వ్యూ! మై! వారక్కడికి వెళ్ళినప్పుడు వారు దేనినో పొందుకున్నారు, కాదా? పరిశుద్ధాత్మ అందుకొరకేనని ఆ వాగ్దానము చెప్పియున్నది, మీకు ధైర్యమునిచ్చుటకు, మీకు ఆదరణనిచ్చుటకు, మిమ్మల్ని ముద్రించుటకు, మీకు ఒక గురుతునిచ్చుటకైయున్నది. ఓ, మై!

124 వినండి. ఓ, మనము ఫిలిప్పుతో కూడా ఆ సమరయులయొద్దకు వెళ్ళుటకు, మనకు సమయముంటే బాగుండును. దానిని వ్రాసుకుంటున్న మీకు అది అపొస్తులుల కార్యములు 8:14; లో ఉన్నది. వారు ఒక గొప్ప ఆనందమును, గొప్ప స్వస్థతలను పొందుకున్నారు, అయితే వారు యేసుక్రీస్తు నామములో బాప్తీస్మము పొందియున్నారు. అయితే వారు పేతురును పిలువనంపించుటకు, యెరూషలేమునకు పంపిరి; అతడు వచ్చి మరియు వారి మీద చేతులుంచగా, వారు పరిశుద్ధాత్మను పొందుకొనిరి. అపొస్తులుల కార్యములు 8:14.

125 ఆ అన్యులు, అక్కడ కొర్నేలీ అను పేరుగల ఒకడుండెను. అతడు ఒక అద్భుతమైన వ్యక్తి, దశమ భాగములు చెల్లించేవాడు, ప్రజల కొరకు సమాజ మందిరములను కట్టించాడు, దేవుణ్ణి గౌరవించువాడు, దేవునికి భయపడువాడు; ఒక మంచి వ్యక్తియైయున్నాడు, మంచి ప్రెస్బిటేరియన్, మెథడిస్టు, బాప్టిస్టు, లేదా మరేదోయైయున్నాడు, చూడండి, చాలా మంచి మనిషైయున్నాడు. అయితే ఒక దినమున, దేవుడిట్లు చెప్పెను, “అతడొక మంచి వ్యక్తియైయున్నాడు; కావున నేనిప్పుడే అతడిని ఒక కూటమునకు పంపించుదును. నేను నా బోధకుడిని ఇక్కడికి తీసుకువచ్చి మరియు దాని గూర్చి అతనికి చెప్పవలసియున్నాను.” అది సరియే.

కావున అతడొక దర్శనమును చూసెను, అది ఇట్లు చెప్పబడెను, “యొప్పేకు వెళ్ళుము మరియు అక్కడ నీవు సీమోను అను పేరుగల, ఒక చర్మకారుని కనుగొందువు. మరియు అక్కడ, సీమోను పేతురు అను ఒకడు ఉండియున్నాడు. అతనిని ఇక్కడికి రానిమ్ము; అతడు నీకు మార్గమును తెలియజేయును, ఎందుకనగా అతడు దేనినో పొందుకొనియున్నాడు.”

126 మరియు పేతురు అక్కడ నిలబడియుండగా…మరియు కొర్నేలీ ఆ బోధకుడిని ఆరాధించబోయెను. అతడట్లు చేసెను…అయితే పేతురు ఇట్లు చెప్పెను, “లేచి నిలబడుము. నేను కూడా నీ వంటి నరుడనే.”

ఆదిలో, వారెట్లు వెనుకకు వెళ్ళారన్నదానిని గూర్చి “మరియు పేతురు ఇంకనూ మాట్లాడుచుండగా,” …నేను కూడా దాని గూర్చియే, పరిశుద్ధాత్మను కుమ్మరించెదనని దేవుడెట్లు వాగ్దానము చేసెనన్నది మాటలాడుచున్నాను. “అతడు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడెను.” వ్యూ! అవును. అది ఎవరికొరకో, వారికి పరిశుద్ధాత్మ అనగా అదేయైయున్నది. నిశ్చయంగా. “మరియు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిరి.”

127 మరియు గమనించండి ఎఫెసులో, ఒక బాప్టిస్టు సహోదరుడు ఉన్నాడు. మొదటిగా అతడొక న్యాయవాది, చురుకైనవాడు, తెలివైన వ్యక్తియైయున్నాడు, అతనికి ధర్మశాస్త్రము తెలియును; గొప్పవాడు, ఒక పండితుడు. ఒక దినమున అతడు బైబిలు చదువుచుండెను, మరియు మెస్సీయా అను పేరుతో ఒకరు వచ్చునని అతడు చూసెను. మరియు అతడట్లు చేసినప్పుడు, అంతేకాదు, అతడు ఈ యేసును గూర్చి వినడం మొదలుపెట్టెను, మరియు అతడిట్లు చెప్పెను, “నేను ఒప్పుకొనుచున్నాను. మరియు యేసే దేవుని కుమారుడైన క్రీస్తని, నేను నా విశ్వాసమును బాహాటముగా ఒప్పుకొనుచున్నాను.” అతడొక నిజమైన బాప్టిస్టు. అతనిక్కడికి వచ్చి, “యేసే క్రీస్తని నేను ఒప్పుకొనుచున్నాను.” అతడు దానిని ఎంతగా చేసాడంటే దేవుడు అతణ్ణి పరిచర్యలోనికి పిలిచెను. దేవుడెల్లప్పుడూ ఒక యదార్ధమైన హృదయంతో మాట్లాడుతాడు.

128 అకుల మరియు ప్రిస్కిల్ల అను పేరుగల డేరాలు కుట్టేవారు ఉన్నారు, వారు భార్య భర్తలైయున్నారు. వారు డేరాలు కుట్టువారు. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం దాని గూర్చి మీకు చెప్పును. పౌలు, వారతనికి స్నేహితులైయున్నారు. పౌలుయొక్క హస్తముల క్రింద మరియు అతని బోధ క్రింద వారు పరిశుద్ధాత్మను పొందుకొనియున్నారు.

అక్కడొక ఉజ్జీవము కలదని వారు విన్నారు, కావున వారక్కడికి వెళ్ళారు. కేవలం పది లేదా పన్నెండుగురు మాత్రమే దానికి హాజరవుచున్నారు. కావున దానిని చూచుటకు అతడక్కడికి వెళ్ళాడు, మరియు ఈ బోధకుడు, తన యదార్థ హృదయంతో ప్రసంగించుటను అతడు విన్నాడు. అతడిట్లు చెప్పెను, “మీకు తెలియునా, అతడు సత్యమును వింటాడని నేను నమ్ముచున్నాను.”

కాబట్టి కూటము ముగించబడిన తర్వాత, అతడు ఇతణ్ణి గుడారము వెనుకకు పిలిచాడు, మరియు ఇట్లన్నాడు, “చూడు, చాలా ఎత్తుగా ఉండి, చిన్న గద్దముక్కు కలిగిన యూదుడైన ఒక చిన్న సహోదరుడు మాకున్నాడు, అయితే, అతడు వచ్చినప్పుడు మాత్రం, అతడు దేవుని వాక్యమును నీకు స్పష్టంగా, బోధిస్తాడు.” సరి, కొద్దిసేపటి తర్వాత…

129 అదే సమయంలో పౌలు చెరసాలలో ఉన్నాడు. ఒక ఆధునిక బోధకుడికి అదొక భయంకరమైన స్థలముగా ఉండును, అవును కదా? అయితే అతడు చెరసాలలో ఉన్నాడు, మరియు ప్రభువు అతనిని అక్కడ ఉంచెను. అయితే భూకంపము వచ్చి, ఆ చెరసాలను కుదిపివేసిన తర్వాత, అతడు ఆ చెరసాల నాయకుడిని మరియు అతని ఇంటివారిని తీసుకొని మరియు వారందరికి, యేసుక్రీస్తు నామములో బాప్తీస్మమిచ్చెను, మరియు అక్కడినుండి వెళ్ళిపోయి, ఇక్కడికి వచ్చెను.

మరియు అక్కడ సోదె చెప్పుచున్నటువంటి ఒక చిన్న స్త్రీ లోనుండి, అతడప్పుడే ఒక దయ్యమును వెళ్ళగొట్టాడు. మరియు, అప్పుడు, ఆమె ద్వారా వారు చాలా డబ్బు సంపాదించుచుండిరి; కావున అతడు వారియొక్క తప్పుడు వ్యాపారమును బట్టబయలు చేసెను, కావున అప్పుడు దాని విషయమై వారతణ్ణి చెరసాలలో వేసిరి. మరియు ప్రభువు ఆ చెరసాలను పడగొట్టెను, ఎందుకనగా ఆ సత్యమును వినుటకై ఆయన అక్కడ ఒక గుంపు ప్రజలను కలిగియున్నాడు. మీరు దేవుని యొక్క వాక్యమును బంధించలేరు. అక్కడ…ఏదేమైనప్పటికీనీ, మీరట్లు చేయలేరు. మీరు దానినస్సలు చేయలేరు.

130 అయితే ఈ మనుష్యుడు ఎక్కడ ఉన్నాడో అతడక్కడికి వచ్చెను. మరియు అకుల మరియు ప్రిస్కిల్ల, బహుశా వారు కొన్ని బన్నురొట్టెలను తినియుండవచ్చును. మరియు ఆ బన్నురొట్టెలను తిన్నవెంటనే, ఇట్లనుకొనిరి, “మనము ఆ ఉజ్జీవమునకు వెళ్ళుదుము.”

పౌలు తన వస్త్రమును పట్టుకొని మరియు అక్కడ వెనుక కూర్చుండెను, మరియు ఈ బాప్టిస్టు బోధకుడు బోధించుటను వినెను.

అతడిట్లన్నాడు, “నీవు బోధించేది, అది మంచిగానున్నది, కానీ అందులో ఇంకా చాలా ఉన్నది.” ఇంకా ఇట్లన్నాడు, “డాక్టర్. అపోల్లో, నేను నిన్ను ఒక ప్రశ్నను అడుగగోరుచున్నాను. నీవు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందితివా?”

“ఓహ్,” అతడిట్లు చెప్పాడు, “అటువంటిది ఉన్నదని మాకు తెలియదు. ‘పరిశుద్ధాత్మ’ అనడంలో, నీ భావమేమిటి? మేము బాప్టిస్టులము.”

అతడిట్లన్నాడు, “నీవొక బాప్టిస్టువని నీకెట్లు తెలియును?” చూశారా?

“సరి, మేము బాప్తిస్మము పొందాము. మేము కేవలం యోహాను యొక్క బాప్తిస్మమును మాత్రమే ఎరుగుదుము.”

అందుకతడిట్లు చెప్పాడు, “అతను ‘తన వెనుక వచ్చువాని యందు,’ అనగా యేసునందు విశ్వాసముంచవలెనని చెప్పుచు, కేవలం మారుమనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెను.”

మరియు అతడు దీనిని వినినప్పుడు, వారు యేసుక్రీస్తు నామములో, బాప్తీస్మము పొందిరి. తరువాత పౌలు వారి మీద తన చేతులుంచగా, పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను, అప్పుడు వారు భాషలతో మాట్లాడిరి మరియు ప్రవచించిరి. ఇట్లు చెప్పబడినది, “ఎందరైతే.”

131 ఇప్పుడు, ఇప్పుడు, మనము దానినెట్లు చేయుదుము? నేను మీకొకటి చెప్పగోరుచున్నాను, పిదప నేను…మనము ముగించెదము, ఎందుకంటే, అది, మిమ్మల్ని త్వరగా పంపిస్తానని నేను మీతో చెప్పాను. పరిశుద్ధాత్మ అనగా ఏమిటో మీకు తెలియును. ఈ రాత్రి చివరి లేఖనము కొరకై…నేనిక్కడ మరి కొన్నిటిని కలిగియున్నాను, కానీ మనము వాటిని ఒదిలివేయవలసియున్నది. మనము మొదటి కోరింథీ 12 నకు త్రిప్పెదము. మరియు మనము దీనిని చదివి, మరియు పిదప మనము—మనము ముగించెదము. సరి. మొదటి కొరింథీ, 12 వ అధ్యాయము.

పరిశుద్ధ పౌలు యొక్క బోధను ఎంతమంది నమ్ముచున్నారు? నిశ్చయంగా! గలతీయులు 1:8 లో, అతడిట్లు చెప్పెను, “ఒక దూతయైనను మరియొక దానిని ప్రకటించినయెడల, అతడు శాపగ్రస్తుడవును గాక,” ఇక ఒక బోధకుని సంగతేమిటి. “పరలోకము నుండి వచ్చిన ఒక దూతయైనను మరియొక దానిని ప్రకటించినయెడల, అతడు శాపగ్రస్తుడవును గాక.” చూడండి, దానితో సంబంధము లేనేలేదు.

132 ఇప్పుడు దీనిని గమనించండి, మొదటి కొరింథీ 12. ఎంతమంది—మనము పునరుత్థానములోనికి వెళ్ళవలెనన్నచో మనము క్రీస్తులో ఉండవలసియున్నదని ఎంతమంది ఎరుగుదురు, ఎందుకనగా దేవుడు లేపుతానని వాగ్దానము చేసినది ఆయన శరీరమునైయున్నది? వేరే ఏ మార్గము లేదు. మీరు క్రీస్తుకి వెలుపల ఉన్నచో, ఇక వేరే ఏ మార్గము లేదు.

మీరు వెనుక ఇక్కడ చూసి మరియు ఆయన యందు నమ్మికయుంచి, ఇట్లు చెప్పవచ్చును, “నిశ్చయంగా, నేను ఆయనను నమ్ముచున్నాను. ఆయన దేవుని కుమారుడు.” మంచిది, నా సహోదరుడా, నీవు దానిని చెప్పినప్పుడు నీతో కరచాలనము చేయుటకు నేను సిద్ధంగా ఉన్నాను. “నేను ఆయనను నమ్ముచున్నాను. నేను ఆయనను నా రక్షకునిగా ఒప్పుకుంటాను.” అది మంచిదే, కానీ ఇంకనూ నీవు ఆయనలో లేవు. “నేను బోధకునితో కరచాలనము చేస్తాను. నేను నా పాపములను ఒప్పుకుంటాను.” అదింకనూ ఆయనలో ఉండుట కాదు.

133 ఇప్పుడు గమనించండి, మీరెట్లు క్రీస్తులోనికి వెళ్తారన్న దానిగూర్చి, పౌలు ఏమి చెప్పెనో చూడండి. మీరు సున్నతి గలవారని ఎట్లు తెలియబడుతుంది? అబ్రాహాము, వారొక గురుతును ఇచ్చిరి. ఇప్పుడు దీనిని వినండి, మొదటి కొరింథీ, 12వ అధ్యాయము, మరియు 12వ వచనము నుండి మనము ప్రారంభించుదుము.

ఏలాగు శరీరము ఏకమైయున్నను, మరియు అనేకమైన అవయవములు కలిగియున్నదో, మరియు…ఏలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను, ఒక్క శరీరమైయున్నవో; అలాగే క్రీస్తు ఉన్నాడు. (విభజించబడిలేడు. “ఒక్కడే!”)

వినండి. “ఒక్క సంఘము ద్వారానా”? ఎంతమంది నాతో చదువుచున్నారు? “ఒక్క కరచాలనము ద్వారానా”? “ఒక్క నీటి ద్వారానా”? కాదు. అప్పుడు ఎవరో తప్పైయున్నారు.

“ఒక్క ఆత్మ ద్వారా!” అది పెద్ద అక్షరమేనా? అలాగైతే, అది, “పరిశుద్ధాత్మ,” అయియున్నది. చూశారా?

…మనమందరము ఒక్క ఆత్మ ద్వారా ఒక్క శరీరములోనికి బాప్తీస్మము పొందియున్నాము, మనము యూదులమైనను లేదా అన్యులమైనను, దాసులమైనను లేదా స్వతంత్రులమైనను; అందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి.

134 క్రీస్తుయొక్క శరీరము ఏకాత్మయైయున్నది, అందులో ప్రతి వ్యక్తియు, పెంతెకోస్తు నుండి ఈ సమయము వరకు, ఒకే క్రొత్త ద్రాక్షారాసమును పానము చేయుదురు, అదే పరిశుద్ధాత్మ, అదే ఫలితాలను తీసుకువచ్చుటయైయున్నది. దానిని మనమెట్లు చేయుదుము? “ఒక్క ఆత్మ ద్వారా.”

పరిశుద్ధాత్మ, అది దేవునియొక్క తెరవబడిన ద్వారమైయున్నది. అదేమిటి? అది దేవునియొక్క తెరవబడిన ద్వారము. అది ఒక గురుతు. అదొక ముద్ర. అదొక ఆదరణకర్త. అదొక ఉత్తరవాది. అదొక నిశ్చయత. అది విశ్రాంతి. అది సమాధానము. అది మంచితనము. అది స్వస్థత. అది జీవము. అది—అది ఈ కార్యములన్నిటికి దేవునియొక్క తెరవబడిన ద్వారము. అది క్రీస్తునొద్దకు దేవునియొక్క తెరవబడిన ద్వారము, అది…

తాను యేసును మృతులలో నుండి లేపెనని దేవుడు ఋజువు చేసెను, మరియు పునరుత్థానమప్పుడు క్రీస్తునందు మృతులైనవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును. “దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి ఏలయనగా మీరు క్రీస్తులోనికి విమోచనదినము వరకు ముద్రింపబడి యున్నారు.” వ్యూ! దానిని ఎంతమంది నమ్ముదురు?

135 క్రీస్తు అనగా ఏమిటి? పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అది ప్రజలు హేళన చేయునటువంటిదేదో కాదు. అది ప్రజలు హేళన చేయునటువంటిదే; కానీ అది విశ్వాసికి మాత్రం అటువంటిది కాదు.

అవిశ్వాసికైతే! నాకు సుదీర్ఘంగా ఒక రెండు లేదా మూడు వారాలు ఉంటే బాగుండును, రేపు రాత్రి తీసుకొని మరియు అది అవిశ్వాసికి ఏమైయున్నదో మీకు చెప్పగోరుచున్నాను. కేవలం ఒక్క నిమిషము, నన్ను దానిని చెప్పనివ్వండి. అది ఒక నవ్వులాట. అదొక ఉచ్చు. అది ఒక అభ్యంతరకరమైన విషయమైయున్నది. అది మరణము. అది దేవుని నుండి ఒక నిత్యమైన యెడబాటైయున్నది. అది ఒక అవిశ్వాసికి ఏమైయున్నదనునది నేను అసలు ఆలోచించలేకున్నాను!

136 గుర్తుంచుకొనండి, అవిశ్వాసి ఏ వర్షమును గూర్చి ఎగతాళి చేసెనో ఆ వర్షమే, నోవహును మరియు అతని కుటుంబమును రక్షించినది. చూశారా? “పిచ్చివారు, మరియు వెఱ్ఱివారి గుంపు, అది వెఱ్ఱితనము,” అని అనుచూ ప్రజలు ఎగతాళి చేయుచున్న అదే ఆత్మ, అనగా అదే పరిశుద్ధాత్మ, చివరి దినములలో సంఘమును ఎత్తబడుటలోనికి తీసుకువెళ్ళి, మరియు దానిని పైకి కొనిపోయే అదే కార్యము; అవిశ్వాసి మీదికి తీర్పును తీసుకువచ్చును. అది నిజము. పరిశుద్ధాత్మ అనగా అదియే.

137 వారు ధన్యులు…నా యదార్థ హృదయముతో, నన్ను దీనిని చెప్పనివ్వండి. దాని కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు, ఏలయనగా వారు తృప్తిపరచబడుదురు.

138 అది వచ్చినప్పుడు అది ఎట్లు, ఏమి చేయునన్న దాని గూర్చి రేపు రాత్రి మనము మాట్లాడెదము.

139 ఇప్పుడిక్కడ పరిశుద్ధాత్మను పొందుకొనగోరుచు, మరియు మీరు వెలుగును చూచునట్లు, ఎవరైనా మీ కొరకు ప్రార్ధించాలని కోరేవారు ఎంతమంది?

“అదేమిటో” మీరెరుగుదురు.

ఇప్పుడు, రేపు రాత్రి, “అది ఏమిచేయును” అనుదానిని మనము తీసికొనబోవుచున్నాము.

140 మరియు పిదప ఆ మరుసటి రాత్రి, “దానినెట్లు పొందుకొనవలెను,” అనునదైయున్నది. పిదప మేము లోపలికి పిలిచెదము, ఇక్కడ ప్రజలకు సూచనలివ్వబడును, మరియు ఆ గదులలోనికి వెళ్ళి మరియు అక్కడ ఉండెదము, అది క్రిస్టమస్ అంతా పట్టినా గాని, అది సరియే, పరిశుద్ధాత్మ వచ్చువరకైయున్నది. బైబిలు యొక్క చిత్తశుద్ధిగల పునాది నుండి మనము దానిని సమీపించబోవుచున్నాము. సరిగ్గా దేవుడు దానిని వాగ్దానము చేయగా, ఆదిలో అది కురిసినట్లే మనము దానిని సమీపించి మరియు దానిని పొందుకొనబోవుచున్నాము. దానిని ఆవిధంగా చేయుటకే మనమిచ్చట ఉన్నాము. నేను…ఏది ఏమి చెప్పిననూ ఏ వ్యత్యాసమును కలిగించదు, మనము…

దేవుని యొక్క వాక్యము…నా హృదయమందు ప్రాధాన్యతను కలిగియున్నది. అది వాస్తవము. మరియు దేవుడు నా కొరకు ఏమి కలిగియున్నాడో నేను దానిని కోరుచున్నాను. ఇంకా ఎక్కువ ఏదైనా ఉన్నయెడల, ప్రభువా పరలోకమును తెరువుము, ఎందుకనగా నా—నా హృదయము దాని కొరకు తెరవబడియున్నది. అది నిజము.

141 ఎంతమందికి అది కావాలి? ఇప్పుడు మీ చేయి పైకెత్తి, ఇట్లు చెప్పండి, “నా కొరకు ప్రార్ధించుము.” ఇప్పుడు, మీ చేతులు పైకెత్తియుండగా.

పరలోకపు తండ్రీ, చాలా సేపు బోధించాము. అయితే నీ ఆత్మ ఇక్కడ ఉండియున్నది. ఇప్పుడు గాలిలోకి ఎత్తబడిన చేతులు ఉన్నాయి. మరియు అదేమిటో వారికి తెలియును, పరిశుద్ధాత్మ అనగా ఏమిటో వారికి తెలియును. దేవా, నేను ప్రార్ధించునది ఏమనగా, ఈ కూటము ముగిసేలోపు, వారు దానిని పొందుకున్నారని ఇక్కడున్న ప్రతి చెయ్యి ఎత్తబడవలెను. ప్రభువా, దానిని అనుగ్రహించండి.

142 మేము వారి కొరకు ప్రార్ధించుచున్నాము. వారిని ఆశీర్వదించమని, మరియు వారి హృదయ కోరికను వారికి అనుగ్రహించమని మేము నిన్ను వేడుకొనుచున్నాము. ప్రభువా, వారి చేతులను చూడుము. వారు నిన్ను ప్రేమించుచున్నారు. వారు దానిని కోరుచున్నారు. వారు వెళ్ళలేరని వారెరిగియున్నారు…రేపు రాత్రి, ప్రభువా, నీవు నాకు సహాయము చేసినయెడల, అది లేకుండా వారు ఎత్తబడలేరని లేఖనములో దానిని మేము ఋజువు చేయగలము. కావున, తండ్రీ, వారికి ఆకలి దప్పులను దయచేయుదువని, తద్వారా వారు తృప్తిపరచబడుదురని, నేను ప్రార్ధించుచున్నాను. తండ్రీ, ఇప్పుడు నేను వారిని నీకు సమర్పించుచున్నాను. మరియు యేసు నామములో మేము దీనిని అడుగుచుండగా ఈ ఆశీర్వాదములను అనుగ్రహించండి. ఆమేన్.

నేను ఆయనను ప్రేమించుచున్నాను, నేను ఆయనను ప్రేమించుచున్నాను

ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను

మరియు నా రక్షణను కొనెను

ఆ కల్వరి వృక్షముపైన.

143 మరలా మనము పాడుటకు ముందు నేను దీనిని చెప్పగోరుచున్నాను. నేను ఇచ్చట గదిలో కొందరు సేవకులను కలువగోరుచున్నాను, శుక్రవారము రాత్రి, కూటము ప్రారంభమగుటకు ముందు, చూడండి, శుక్రవారము రాత్రి. నేను…

నేనేమి చేయుటకు ప్రయత్నించుచున్నానో మీరు చూచుచున్నారా? అదేమిటనియు, దానిని ఎలా సమీపించవలెననియు మరియు దేనిని గౌరవించవలెననియు చూపించుటకైయున్నది; అప్పుడు మీరు గ్రుడ్డిగా, తడువులాడుచూ వచ్చుచున్నట్లుండరు. ఆ కారణముచేతనే దానిని అసలు ఈ రాత్రి నేను అడగలేదు. అదేమిటని మీరు తెలుసుకోవాలని నేను కోరుచున్నాను. అది ఒక వాగ్దానము. అదొక ముద్ర. అది ఆ ఆదరణకర్త. అది ఆవిధంగా ఉన్నది.

పిదప, రేపు రాత్రి మరియు ఆ మరుసటి రాత్రి, అప్పుడు సరిగ్గా అక్కడి నుండి ప్రారంభించెదము, అప్పటినుండి, అది వచ్చువరకు. అది ఎంత సమయం పట్టునన్నది కాదు గానీ; మనం అప్పటివరకు వేచియుందుము. మీ హృదయమును పవిత్రపరచుకొనుడి. ఒక అపవిత్రమైన హృదయంలో ఆయన దానిని ఎన్నడూ కుమ్మరించడు. సరిచేసుకొనుడి, సిద్ధముగానుండుడి, మరియు ఆయన దానిని అనుగ్రహించును.

నేను ఆయనను ప్రేమించుచున్నాను, నేను ఆయనను ప్రేమించుచున్నాను,

ఇప్పుడు మనం మన చేతులను ఎత్తెదము.

ఎందుకనగా ఆయనే మొదటగా నన్ను ప్రేమించెను

మరియు నా రక్షణను కొనెను

ఆ కల్వరి వృక్షముపైన.

రేపు రాత్రి ఏడు-న్నరకి బదులు ఏడు గంటలకే మనము ప్రారంభించెదమని కాపరి ఇప్పుడే చెప్పియున్నాడు, మరియు దానికి మేము అంగీకరించాము. మరియు తద్వారా మిమ్మల్ని తొమ్మిది-న్నరకి బదులు ఎనిమిది-న్నరకే విడిచిపెట్టవచ్చును. ఏడున్న-…ఏడు గంటలకు, రేపు రాత్రి, పాటలు ప్రారంభమవుతాయి. ఏడు-న్నరకి నేను నా వర్తమానమును మొదలుపెట్టెదను.

నేనాయనను ప్రేమించుచున్నాను,

మనము మన చేతి రుమాళ్ళను తీసి మరియు ఆయనకు ఆడించెదము.

నేనాయనను ప్రేమించుచున్నాను

ఇప్పుడు ఆ నామకార్ధ ఆచరణను బ్రద్దలు చేద్దాము!

ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను

మరియు నా రక్షణను కొనెను

ఆ కల్వరి వృక్షముపైన.

మంచిది, ఇప్పుడు మీ కాపరి, సహోదరుడు నెవిల్. 

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...