దేవుని దూత

దేవుని దూత

ఇప్పుడు, ఇక్కడ నుండి వెళ్లి “బ్రాన్హాం సహోదరుడు ఎత్తబాటుకు పది సంవత్సరములు ఉంది అనెను” అని ఎవరూ అనవద్దు. నేను ఎరుగను; ఎవ్వరూ ఎరుగరు. కనీసం పరలోకపు దూతలు కూడా ఎరుగరు. నేను ఎరుగను. కానీ ఆయన చెప్పిన విధంగా సూచనలను బట్టి భయంకరమైనది దగ్గరగా ఉంది అని నేను ఎరుగుదును.“ అది ద్వారం వద్దనే ఉంది” అని ఆయన చెప్పెను. మరియు వాటిని మనం ఇప్పుడే పొంది ఉన్నాము.

2

తర్వాత జరగబోయే సంగతి సంఘమునకు వరముల పునరుద్ధరణ అని నేను ఎరుగుదును. మరియు నేను చేయుటకు కలిగియున్న ఈ మార్గదర్శకపు పనిలో కఠినమైన సంగతి ప్రజలను చూసి..... ఆయన సంఘము విభజించబడి ఉన్నంతవరకూ దేవుడు వరములను సంఘమునకు తిరిగి ఇవ్వడు. వరములు వచ్చేముందు మనం మొదటిగా సంఘమును ఐక్యతలోనికి తీసుకు రావలసి ఉన్నది.

3

కానీ సంపూర్ణ సువార్త ప్రజలందరూ ఏక హృదయము మరియు ఏక ఆత్మలోనికి వచ్చినట్లయితే ప్రపంచమంతటిని కదిలించే ఒక ఉజ్జీవము ఉండును. మరియు అది జరిగిన తర్వాత ప్రతి ఆత్మ వరము గంటల సమయములోపే సంఘములో ఉండును. సంఘమును మనం ఐక్యతలోనికి తీసుకురాగలిగితే అపొస్తలులచే జరిగిన సూచనలు మరియు అద్భుతములు అల్పమైన సంగతే. అది జరగవలసి ఉన్నది. అది జరుగును. నేను రంగంలో నుండి వెళ్ళిన తర్వాత అయినా జరగొచ్చు. కానీ మీరు తెలుసుకునే విధంగా నా మాట దీనిలో ఉంచాలనుకుంటున్నాను, నా స్వరము ఇదే.

4

ఓ క్రైస్తవ జనమా, ఏక హృదయముతో మరియు ఏక ఆత్మతో మిమ్మల్ని మీరు కట్టుకోండి. సంఘము విభజించబడి ఉన్నప్పుడు దేవుడు ఇక ఎంత మాత్రమూ సంఘమునకు వరములను పంపించడు, మనము ఏక ఆత్మలో ఉండకపోతే ఆయన పరిశుద్ధాత్మను పంపడు. అది సత్యం. అది పరిశుద్ధాత్మ ద్వారానే వచ్చును. దానిని నమ్మండి.

5

దేవుని దూతను గూర్చి నేను చేసిన ఒప్పుకోలు, స్వస్థతనుగూర్చి నేను చేసిన ఒప్పుకోలు సత్యం అని తెలియకుండానే ఒక వ్యక్తి ఈ మీటింగులో ఉంటాడని నేను విశ్వసించను. దానిని మీరు నమ్ముచున్నారా? ఖచ్చితముగా స్వయముగా మీ కళ్ళతోనే మీరు చూచెదరు. నిశ్చయముగా.

ప్రజలు వేదిక గుండావెళుతూ స్వస్థత పడకపోవడం నేను చూశాను. క్రీస్తు ముందుకు వేల మంది వచ్చి స్వస్థపడలేదు. “నీవు నమ్మినట్లయితే నేను చేయగలను” అని ఆయన అనెను. కానీ వారి అవిశ్వాసం చేతనే అనేకమైన అద్భుత కార్యములను ఆయన చేయలేకపోయెను. [టేపు పై ఖాళీ ఉంది]

6

జఫర్సన్ విల్ దగ్గరకు వచ్చి నన్ను ఎప్పుడైనా చూడండి. మీరు చేస్తారా? మిమ్మల్ని చూచుట నాకు సంతోషం. నాకు ఉత్తరం వ్రాసి, దానిని నాకు పంపుము. ఒకవేళ నేను...... దానిని నా గృహమునకు పంపుము. ఏ సమయమైనా నేను ......మీరు నాకు ఫోను చేయవచ్చు. మీరు జబ్బు పడినట్లయితే నేను ఫోన్ లో మీ కొరకు ప్రార్ధన చేస్తాను.

ప్రతిసమయమున నేను వచ్చెదనని నేను చెప్పుటలేదు. “వర్షములో లేక ఎండలో అయినా నేను మీ వద్దకు వస్తానని” నేను చెప్పేవాడిని. కెనడా నుండి నేను రావలయును, మరియు పదహారు లేక పద్దెనిమిది విమాన టికెట్లు అక్కడ ఉండెను. ఓహ్, నేను ఆశ్చర్యం చెందాను. చూడండి మీరు వెళ్లలేరు, ఎందుకనగా ఒక దానికి మీరు వెళుతుంటే మరొకటి ఉండును. ఇక్కడ ఒకటి మరియు ఇక్కడే మరొకటి, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో మీకు తెలియదు.

కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మరియు మీకు సహాయం చేయుటకు నేను ఇక్కడ ఉన్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని నీకు రుజువు చేయడానికి నేను మీ కొరకు చేయగలిగినదంతా నేను చేయడానికి ప్రయత్నిస్తాను. మీలో ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక.

7

ఇప్పుడు, వెళ్లబోయే ముందు, ప్రార్ధన వరుసను ప్రారంభించుటకు ముందుగా ఈ చిన్న లేఖనము చదవాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి నాలుగవ అధ్యాయం 23 మరియు 24 వచనములు.

మరియు యేసు గలిలయ అంతటా సంచరించుచూ వారి సమాజ మందిరములలో బోధించుచూ, రాజ్యసువార్తను ప్రకటించుచూ, మరియు ప్రజలలోని పతీ వ్యాధిని రోగమును స్వస్థపరచుచుండెను.

ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను: నానా విధములైన రోగముల చేతను వేదనలచేతను , పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ, దెయ్యం పట్టిన వారిని చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని, వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను.

8

అన్ని వైపులా ఉన్న ప్రేక్షకులందరూ మీరు చేయగలిగినట్లయితే, ఇప్పుడు, కొద్ది క్షణములు, మన తలలు వంచెదము. కొంచేము ఇప్పుడు అత్యంత గౌరవముతో ఉండెదము. ఇప్పుడు, మీ తలలు వంచి ఉండగా నేను దేవుడిని అడిగితే, దేవుడు నా ప్రార్థన విని మరియు మిమ్మల్ని స్వస్థపరుస్తాడని ప్రార్ధన వరుసలోనికి వస్తున్న మీలో ఎంతమంది నమ్ముతున్నారు అని ప్రార్ధన ప్రారంభించుటకు ముందుగా నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మీరు దానిని నమ్ముతున్నారా? ఆయన చేయగలడని మీరు నమ్ముతున్నారా? దేవుడు మిమ్ములను దీవించును గాక.

స్నేహితులారా, ప్రభువు దూత నాతో చెప్పెను, “నిన్ను నమ్మునట్లుగా ప్రజలను నీవు చేయగలిగినట్లయితే...” ఇప్పుడు, మీరు ఏమి చేయవలెనో, నేను చెప్తాను ఈ రాత్రి మీరు ఈ వరుస గుండా వెళుతున్నప్పుడు ఇక్కడి నుండి కేవలం ఆనందిస్తూ వెళ్తారు. ప్రజలతో మీరు స్వస్థపరచబడ్డారని చెపుతూ ఎంతగానో ఆనందిస్తూ ఇక్కడి నుండి వెళ్తారు. మరియు వెళ్లి సాక్ష్యం ఇవ్వండి. శిష్యులు యెరుషలేములో పది పగళ్ళు మరియు పది రాత్రుళ్లు నిరంతరాయంగా పరిశుద్ధాత్మ రాకముందు దేవుడిని స్తుతిస్తూ ఉండెను.

9

తండ్రీ, ఈ సాయంకాలమున మరియొక ఆధిక్యత కొరకై నీకు కృతజ్ఞతలు, చిన్న బాలుడిగా ఉన్నప్పటి నుండి నా హృదయం ఆరాటపడుతూ ఉండగా, సూర్యుని లోయను కలిగి ఉన్న ఈ ప్రేమ పూర్వక చిన్ననగరమైన ఫీనిక్స్ కు ఇది మూడవ యాత్ర. ఓ దేవా, ఈ నగరములోని ప్రతి సంఘములో ఒక ఉజ్జీవమును నీవు ప్రారంభించాలని దేవా, నా ప్రార్థన. ప్రభువా దానిని అనుగ్రహించుము. గొప్ప ఉజ్జీవము ఈ నగరమునకు వచ్చును గాక.

తండ్రీ, నీవు కదలాడాలని నేను ప్రార్థిస్తున్నాను. నేటి రాత్రి, దేవుని దూత ఇక్కడ ఈ వేదిక వద్ద నిలుచుండగా, మరియు స్వస్థపడకుండా ఈ వేదిక గుండా ఒక్కరు కూడా వెళ్లకుందురు గాక. యధార్థహృదయముతో నేను నీకు మొర్రపెట్టుచుండగా నా ప్రార్థన ఆలకించుము తండ్రీ. నా హృదయమంతటితో ఏ విధంగా నిన్ను సేవించవలెనో నిజముగా నేను ఎరిగి ప్రయత్నిస్తూ తెలుసుకొని యుండగా, మరియు నా మనవి వినమని ఈ రాత్రి నేను ప్రార్థించుచున్నాను. సహోదరుడు గార్సియాను దీవించుము...[టేపుపై ఖాళీ ఉంది].

ఓహ్, నేను సగము... [టేపుపై ఖాళీ ఉంది] మరియు అది... [టేపు పై ఖాళీ ఉంది]... వరుస. మరియు ఒక వ్యక్తి ఒక స్త్రీతో వచ్చెను. మరియు ఆమె [టేపు పై ఖాళీ ఉంది]... మేము ఉన్నంతవరకు... [టేపు పై ఖాళీ ఉంది] మరియు ఆమె చేతిని తీసుకుని నేను పట్టుకున్నాను. సహజముగా ఒక... [టేపు పై ఖాళీ ఉంది] ప్రకంపన అనుభవము, ఎందుకనగా ఆమ్లము చేత ఆర్థరైటిస్ కలుగును. మరియు ఆ స్త్రీ కొరకు నేను ప్రార్థించితిని. మరియు అలాగుండగా... [టేపు పై ఖాళీ ఉంది]

10

ఆమె కళ్ళు, ఆమె ఒక మైమరపు స్థితిలోకి వెళ్ళేటట్లుగా కనిపిస్తుంది. నేను సహజముగానే ఆమెను దాటి వెళ్లాను. తర్వాత నేను విడిచి మరియు వెళ్లిపోయాను, కొద్ది రోజులలో తిరిగి వచ్చాను, మరియు ఆమె భర్త ద్వారం వద్ద ఉండెను. మరియు అతను అనెను, “సహోదరుడా బ్రాన్హాం,” “నా భార్యకు ఏదో జరిగింది ఆమె భ్రమలో ఉన్నట్లుగా మాట్లాడుతుంది” అని అతను అనెను.

మరియు నేను అన్నాను, “ఏమి సమస్య జరిగింది?”

ఆయన అనెను “మంచిది, అది అంతా ఇదే.” ఆయన అనెను “ఆమె ప్రార్థించగా... నీవు ఆమె కొరకు ప్రార్ధించగా మేము ఇంటికి చేరువరకు ఆమె భ్రమలో ఉన్నట్టు కనిపించెను. మరియు నీవు ఆమె కొరకు ప్రార్థిస్తూ ఉండగా నీతో వచ్చిన ఆ వేరొక మనిషి ఎవరు?” అని ఆమె నన్ను అడిగింది.

మరియు “వేరొక మనిషి లేడు” అని నేను అన్నాను.

“ఓ అవును, నల్లటి వెంట్రుకలతో తెల్లటి వస్త్రముతో ఉన్న మనిషి” అనెను.

నేను అన్నాను, “మరలా చెప్పుము సహోదరుడా.” మరియు అతడు మరలా చెప్పెను. మరియు నేను అన్నాను, “కనిపించింది ప్రభువు దూత.” చూశారా?

ఆమె అన్నది, “సహోదరుడు బ్రాన్హాం ప్రార్ధిస్తూ ఉండగా ఎందుకు ఆయన క్రిందకు ఆయన వైపు చూస్తున్నాడు” మరియు “ఆయన నాతో మాట్లాడెను” అనెను. మరియు ఆయన అనెను, “ఇప్పుడు నీవు స్వస్థత కొరకు చూస్తున్నావు.” “సహోదరుడు బ్రాన్హాం ప్రార్థనకు జవాబు

ఇవ్వబడును; నీవు స్వస్థపరచబడతావు,“ అనెను. కానీ అనెను, ”సహోదరుడు బ్రాన్హాం చాలా బలహీనముగా కనిపించుటలేదా?“ ”కానీ, కొంచెం సేపు అయిన తర్వాత ఆయన బలవంతుడు అగును“ అనెను. అది నాకు ప్రోత్సాహం ఇచ్చింది. చూడండి, ”కొంచెం సేపు అయిన తరువాత అతను బలవంతుడగును.“

11

ఇప్పుడు, కథను ఆ స్త్రీ ఎప్పుడూ వినలేదు. మరియు ఆమె వర్ణించి మరియు చెప్పెను, ఆయన పెద్దమనిషి, లేత గోధుమ ముఖముతో నల్ల వెంట్రుకలు అతడి భుజం వరకు వ్రేలాడుతూ ఉండెను. ఆమె చెప్పెను, “అతడు వేదిక నుంచి కిందకు రావడం నేను చూశాను.” మరియు అది ఆమె జీవితములో దానిని ఎన్నడూ వినలేదు. మరియు చెప్పెను, “సహోదరుడు బ్రాన్హాం నా కొరకు ప్రార్ధించుటకు మోకరించినప్పుడు ఈ మనిషి చూసి, అక్కడికి వచ్చి; ప్రార్ధించడానికి బదులు ఆయన సహోదరుడు బ్రాన్హాంవైపు క్రిందకు చూస్తూ ఉండెను.” మరియు చెప్పెను “ఆయన చుట్టూ చూసి, మరియు చెప్పెను, 'ఇప్పుడు నీవు స్వస్థత కొరకు వచ్చావు మరియు నీవు స్వస్థపరచబడుతావు.” “మరియు తర్వాత చెప్పెను, ఇప్పుడు సహోదరుడు బ్రాన్హాం చాలా బలహీనంగా కనిపించటం లేదా? ”కానీ కొంచెం సేపు అయిన తర్వాత అతడు బలవంతుడు అగును“ అనెను. చూశారా? మరియు ”తర్వాత వారు నా చక్రాల పడక (స్ట్రెచర్)ను బయటకు కదిలిస్తునప్పుడు, నాతోపాటు అతడు ద్వారం వద్దకు నడచి వచ్చెను, మరియు ఆయనను నేను చూచుట అదే ఆఖరు“ అని చెప్పెను.

12

ఇప్పుడు, అది దేవుని దూత. అనేకసార్లు ఆరాధనలలో ఆయన కనిపించెను. మరియు నేటి రాత్రి ఆయన ఇక్కడ ఉన్నాడని నేనెరుగుదును. ఆయన ఇక్కడ ఉన్నాడని నేనెరుగుదును. నేను ఇక్కడ ఉన్నప్పటి నుంచి మూడు లేక నాలుగు సార్లు ఆయనను నేను అనుభవించాను.

ఇప్పుడు, కొంతమంది తెలుసుకున్నట్లు ఇప్పుడు... చాలామంది ప్రజలు అపార్థం చేసుకుంటారు. ఇప్పుడు,స్నేహితులారా ఇది ఎంత మాత్రము దూతను ఆరాధించుట కాదు. ఇది కాదు. నేను దూత నామములో ప్రార్ధించను, లేదా దూత నామమును ఎరుగను. కానీ మీరు లేఖనములు పరిశీలించినట్లయితే, దేవుడు ఆయన ప్రజలను పంపినప్పుడు వారిని నడిపించేది దూతయే. మోషే...

“మంచిది కొత్త నిబంధన సంగతి ఏమిటి?” అని మీరు అనవచ్చు.

ఖచ్చితముగా. అది ఎప్పుడూ ప్రభువు దూతయే. అది సరియే.పేతురు, ఆయన చెరసాలలో ఉన్నప్పుడు, ప్రభువు దూత క్రిందకు వచ్చి (అది సరియేనా?) ఆయనను విడిపించెను. మరియు ఓ, మై, చాలా సార్లు. ఆయన…

మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు సంగతి ఏమిటి? మరియు ఆయన బ్రద్దలైన ఓడలో ఉన్నప్పుడు ఆ రాత్రి ప్రభువు దూత ఆయనకు కనబడి ఆయన వారినందరిని ఆయన చేతులకు ఇస్తున్నట్లు ఆయనకు చెప్పెను. ఖచ్చితముగా. అది ఎల్లవేళలా… పౌలు ఎన్నడూ దూతను ఆరాధించలేదు.

ప్రత్యక్షతగల యోహాను, ప్రకటన గ్రంథము మొత్తము రాసిన తర్వాత, “నేను సంగతులన్నీ నాకు చూపిన దూత పాదములయొద్ద పడితిని”. (అది సరియేనా?) అని యోహాను చెప్పెను. “దేవుడిని ఆరాధించుము” అని అతడు చెప్పెను. ఆయన అతని సహ మనుష్యులు మరియు ప్రవక్తల వంటివాడు. చూశారా?

గమనించుము, దేవుడు ఎప్పుడూ సహజమైన దానిపైకి సహజతీతమైనది పంపును. అది ఇత్తడి సర్పము పైకి, కోనేరువలె మరియు మొదలైనవి. యేసు ఆయన తనంతట తాను ఎవరిని స్వస్థపరిచాను అను పేరును ఎన్నడూ ఆయన తీసుకోలేదు. అది సరియేనా? ఆయన చెప్పెను “నేను చేయుచున్న క్రియలు నావి కావు అది నాతో ఉన్న నా తండ్రివే.” [టేపు పై ఖాళీ ఉంది]

13

ఆయన చనిపోయెనని వైద్యులు ఎరిగియుండెను. ఆ కుటుంబమునకు సానుభూతి తెలియజేయడానికి నేను వెళ్లాను. మరియు నేను ఇంటిలోనికి వెళ్ళుటకు ప్రారంభించగానే ఆ వ్యక్తి కొరకు భార్య ఏడుస్తూ కనిపించెను. మరియు నేను ద్వారం వద్దకు వెళ్ళగానే ఒక మానవ హస్తం చేతితో నన్ను ముట్టుకున్నట్లు అనిపించింది. మరియు అది నన్ను పట్టుకున్నట్లుగా నేను అనుభూతి చెందాను. మరియు నేను ముందుకు వెళ్ళుటకు ప్రారంభించగానే నేను కదలలేకపోయాను. నేను వెనుకకు తిరిగినప్పుడు, చేయి నన్ను విడిచెను.

నేను మంచం వైపునకు వెళ్లి మరియు క్రిందకు ఆ వ్యక్తి వైపు చూసాను. మెథడిస్ట్ పరిచారకుని భార్య మరియు మరియొక సహోదరి ఆ గదిలో ఉండెను. మరియు నేను ప్రార్ధించుట మొదలుపెట్టాను. నేను తెలివిలోనికి వచ్చినప్పుడు, ఈ చనిపోయిన మనిషి శరీరముపై నేను పడుకున్నాను, దాదాపు అర్ధగంట అతని ముఖముపై దుప్పటి కప్పి ఉండెను. నా ముఖం అతని ముఖమునకు ఎదురుగా…ఉండెను. మరియు ఆత్మలు ఉండే ప్రదేశములోనికి నేను “సహోదరుడా ఏలియా” అని పిలిచాను. అతని పేరు ఏలియా “సహోదరుడు ఏలియా” నేను ఏమి చేయుచున్నానో నాకు తెలియకుండానే అతని ఆత్మ కొరకు, ఆ ప్రదేశములోనికి పిలిచితిని.

కొద్దినిమిషములలో, ఇంకా నేను పిలుస్తూ పడుకున్నాను. నా చెవుల చుట్టూ ఆ మనిషి చేయి రావడాన్ని నేను అనుభూతి చెందాను. నేటి రాత్రి ఆ మనిషి సజీవముగా పెన్సిల్వేనియా రైలు రోడ్డున పనిచేయుచున్నాడు.

14

ఇప్పుడు, అది సత్యమని దేవుడు ఎరిగి ఉన్నాడు. అది సత్యము కాకపోయినట్లయితే, ఇప్పుడే ఆయన నన్ను ఈ వేదిక నుండి వెళ్ళనిచ్చును. కానీ దాని అర్థం ప్రతి ఒక్కరూ నమ్మవలెనని కాదు. నా అంతట నేనుగా ఏమి చేయలేను. ఆ దూత చేయమని చెబితే నేను చేస్తాను. కానీ మీరు అప్పుడు… [టేపు పై ఖాళీ ఉంది]

కాని స్వస్థత అవసరం ఏమి ఉంది. గమనించుము. మీరు వెతుకుతున్న సంగతి అప్పటికే పరలోకములో ఉన్న జమ చేసే పెట్టెలో మీ కొరకు ఉండును. క్రీస్తు ఆయన మన అతిక్రమముల కొరకై కొట్టబడెను. మరియు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. అది సరియేనా? చూడండి, అది అప్పటికే చేయబడెను.

ఈ విధముగా నేను చెపుతాను... ఇక్కడ: ఐదువేల డాలర్ల తపాలా చెక్కు లేక మనీ ఆర్డర్ నేను మీకు ఇచ్చినట్లయితే, మంచిది, మీరు అంటారు “ఆ మనీ ఆర్డర్ మంచిదేనా?” ఖచ్చితముగా. ప్రభుత్వము మంచిది అయినట్లయితే ఎందుకు.... లేక ....ఆ మనీ ఆర్డర్ రాసిన వారు, మొత్తం ప్రభుత్వం.......ఆ…ఆ మని ఆర్డర్ రాయడానికి ముందుగా మొదటిగా ఆ ఐదువేల డాలర్లు జమ చేయబడాలి. అది సరియేనా? చూడండి మొదట జమ చేయబడాలి.

15

మంచిది, ఇప్పుడు, చూడుము. ఆ జమ... [టేపు పై ఖాళీ ఉంది] మీ స్వస్థత కొరకు దేవుని మందుల పెట్టెలో లేక కల్వరి యొద్ధ సిలువ వేసిన దినమున అతని బ్యాంకులో ఉంచబడెను. నా అర్థం ఏమై ఉండెనో మీరు చూశారా? అప్పుడు మన అతిక్రమముల కొరకై ఆయన నలుగగొట్టబడెను. మరియు ఆయన దెబ్బలచేత మనము స్వస్థత పొందియున్నాము. మరియు మీ స్వస్థత కొనబడెను మరియు చెల్లించబడెను. ఓ, మై, అది మీది మీరు చేయవలసినదంతా కేవలం చేరుకుని మరియు దానిని పొందుకోవడమే.

ఇప్పుడు, ప్రజలు చూసి మరియు తెలుసుకొనునట్లుగా వరములు పంపుతానని దేవుడు వాగ్దానం చేసెను. అది సరియేనా? శరీరమునకు తొమ్మిది ఆత్మ వరములు వాగ్దానం చేయబడెను. అది విశ్వాసుల శరీరము. అది అవిశ్వాసుల కొరకు కాదు. దైవిక స్వస్థత నమ్మలేనివారైన మీ కొరకు కాదు. అది ఎవరైతే నమ్ముతారో వారి కొరకు. పరిశుద్దాత్మ దానిని నమ్మనివారి కొరకు కాదు: అది దానిని నమ్ము వారి కొరకు.

16

ఇప్పుడు, కొన్ని సంవత్సరముల క్రితం పరిశుద్ధాత్మవచ్చే మునుపు మెథడిస్ట్ దినములలో సంఘము తిరిగి ఆచార భక్తిలోనికి వస్తున్నప్పుడు మరియు ప్రజలు అయిన మీరు విడుదల కొరకు దేవునికి మొఱ్ఱపెట్టగా మరియు దేవుడు ఆత్మ బాప్తిస్మము కుమ్మరించెను. అప్పుడు అప్పటినుండి ప్రజలు పరిశుద్ధాత్మ బాప్తీస్మం పొందు కోవడంచేత వారి పాపముల నుండి విముక్తి పొందెను. అది సరియేనా? ఇప్పుడు, ఎవరైతే దానిని నమ్మలేదో వారు దానిని పొందుకోలేదు. మీరు దానిని నమ్మవలసి ఉన్నది.

కనుక ఆయన వాక్యమును ప్రకటించు అభిషిక్త బోధకులను పంపెను. మరియు మీరు దానిని స్వీకరించారు. మరియు ఇప్పుడు మీరు స్వీకరించి .......ఇక్కడ ఉన్న ఎంతమంది పరిశుద్ధాత్మను అంగీకరించారు, మీ చేతులను చూపించండి? ఇప్పుడు, అది మంచిది. మై అక్కడ చూడండి, దాదాపుగా వంద శాతం అద్భుతం. ఓహ్, మై, మనము ఏదైనా చేయగలము. అది సరియే. ఎందుకు ఇప్పుడు ఏదీ లేదు...

17

ఎందుకు, ఇక్కడ అంతమంది విశ్వాసులు పరిశుద్ధాత్మను పొందియున్నారు, ఎందుకు మీలో తర్వాత కొన్ని గంటలలో ఒక బలహీనమైన వ్యక్తి కూడా ఉండడు. అది సరియే. మంచం మీద ఉన్న సహోదరీ, నీవు దాని గురించి ఏమి అనుకుంటున్నావు? అది అలాగే ఉన్నదని నీవు నమ్ముచున్నావా? అది సరియే.

ఇప్పుడు, గమనించుము. మీరు నమ్మినట్లయితే ఇప్పుడు జరిగిన అనేక అద్భుతాలు నా గదిలోని ప్రార్థనలో భవనములోకి నేను రాకముందే నేను ఎప్పుడూ వాటిని చూస్తాను. ఇక్కడ మీలో ఎంతమంది ఏ విధంగా స్వస్థత వరం నాకు వచ్చి ఉన్నదో వినియున్నారు, మీరు వినలేదా? ఇక్కడ నేను చూస్తున్న మీలో చాలామంది విన్నారు, ఎందుకనగా గతసారి ఇక్కడ దానిని నేను చెప్పాను. దాని గూర్చి... మీరు దానిని ఇంకా నమ్ముతున్నారా? అది మంచిది. ఇప్పుడు, ఇక్కడ నుండి వాక్యములో నుండి కొంచెం మనం చదవాలని అనుకుంటున్నాము. మరియు కొన్ని నిముషములు, దానిని భోదిస్తాను. మరియు దాని తర్వాత మనం స్వస్థత ఆరాధన కొరకు సిద్ధపడుదాము.

18

ఇప్పుడు, ఇది బోధకుని పరిచర్యలోని మొదటి రోజుల్లో. ఆయన ప్రతి స్థలములో ఉన్న ప్రజలను

స్వస్థపరచుచుండెను, మరియు ఆయన పేరు అంతటా ప్రసిద్ధియాయెను. ఇప్పుడు, ఒకవేళ ఆయన దేవుని కుమారుడా, ఆయన దైవికముగా స్వస్థపరిచేవాడా అని ప్రజలు సందేహించినట్లయితే వారు స్వస్థతపడేవారు కాదు. వారి కొరకు ఆయన ప్రార్ధన కూడా వారిని స్వస్థపరచలేదు. ఆయన చేతులు వారి మీద ఉంచినా వారిని స్వస్థపరచలేదు. యేసు ఎవరిని స్వస్థపరచినా ఆ పేరును ఎన్నడూ తీసుకోలేదు. “నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను” అని ఆయన అనెను. అది సరియేనా?“ నీ విశ్వాసము నిన్ను రక్షించెను.”

ఒకసారి ఒక స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టెను, అప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోవాలి అని కోరుకొనెను. మరియు కూడికలలో మీరు గమనించినట్లయితే ప్రజలు అనడం మీరు వింటారు... నేను వాటిని వింటాను. నేను కొంతమందికి చెపుతాను బహుశా ప్రభావం క్రింద అయి ఉండవచ్చు.“ ఈ వీధి గుండా వెళ్ళుము లేక మూలకి వెళ్లి నీ ఊతకర్రలను విసిరివేయుము. అప్పుడు తర్వాత ఒకరు వచ్చి సహోదరుడా బ్రాన్హాం అలాగే చేయమని నాకు చెప్పుము అంటారు. చూసారా? వారు కేవలం ఇతరులు ఏమి చేయుదురో దానిని వారు చూసి పట్టి ఉంచెదరు. మంచిది స్నేహితుడా, ఇక్కడ ఉన్న కొంతమంది ఇప్పుడు లేచి క్రీస్తును విశ్వాసముతో ముట్టుకుంటే, మిగిలినది మీరు చేయు విధముగా అలాగే ఉండును.

19

ఇక్కడ వేరొక రాత్రి... ఈ ప్రకటన నేను చేసి ఉండవచ్చు. అది గత వారం. మేము మియామీలో ఉన్నాము. అది నిజముగా గందరగోళ నగరం. దేశం చుట్టూ పడే అన్నివిధములైన సిద్ధాంతములు మరియు సమస్తము అక్కడికే వచ్చును. అంతటా..... మరియు అప్పుడు.....వస్తూ ప్రయత్నించుచున్నాను... వారన్నారు ప్రజలు రారు అని కానీ వారు వచ్చారు; వారు కూడికకు వేలకొలది వచ్చారు.

కానీ ఇక్కడ జరిగింది. ఒకరాత్రి ఆరాధనలో మేము తొందరలో ఉన్నాము. ఎందుకనగా మాకు అనేక వందల మంది ప్రార్ధనా వరుస గుండా వెళ్ళు వారిని కలిగి ఉన్నాము. మరియు మొదటగా మేము కొద్దిమంది చెవిటి మూగ వారిని తీసుకురాగా ఒక గుడ్డి మనిషి అయి ఉండవచ్చు అని నేను అనుకొనుచున్నాను, కొన్ని ఆ విధమైన సంగతులు జరిగెను. మరియు అది గత రాత్రి అయిఉన్నది. గుడ్డివారిగా జన్మించిన ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, వారు జీవితమంతా చూపులేనివారు, వారు చూపును పొందుకున్నారు; మరియు ఆ విధమైన వివిధ సంగతులు.

మేము కఠినమైన పోరాటం కలిగి ఉంటిమి, ఎందుకనగా సంఘములలో ఒక విధమైన గందరగోళం ఉన్నది; ఎందుకనగా చాలా మంది ప్రజలు వారి స్థలములలో నుండి వచ్చి మరియు సంఘములను ముక్కలు చేస్తున్నారు, మీరు చూడండి; వెళ్లి మరియు వారి సొంత సంఘమును ప్రారంభిస్తారు. మేము ఒక సంఘమును ప్రారంభించడానికి ప్రయత్నించడము లేదు అని ప్రజలు గ్రహించునట్లు చేయుట చాలా కఠినమైనది; సంఘమును ఒక్కటిగా చేయుటకు శక్తి కొలదీ మేము ప్రయత్నిస్తున్నాము. మేము కోరుకునేది అదియే. మీరు దానిని నమ్ముట లేదా? మేము ఒకరికొకరు సహకరించుకోవడం కోరుతున్నాము.

20

మరియు అప్పుడు, దానిలో ఆ విధముగా వస్తున్న ప్రజలకొరకు నేను ప్రార్ధించాను. మరియు మొదటి సంగతి, నేను.... ఇప్పుడు కొంతమంది, వరుసలో విశ్వాసము పడిపోవుట ప్రారంభమైనది; దానిని మీరు అనుభవిస్తారు. మరియు ఆ సంగతి. నేను... [టేపుపై ఖాళీ ఉంది.]

ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉండండి... స్పానిష్ ప్రజలైన మీరు: మీరు తగ్గింపు కలిగి ఉన్నారు, మీరు తినడానికి లేదా ముక్కలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు ఏదైనా...... ఆ వైఖరితో మీరు వచ్చారు, ఆ కారణం బట్టియే స్వస్థత పొందుకునేది. మరియు మీరు స్వస్థత పొందుకునేది ఆ కారణం బట్టియే, ఎందుకనగా మీరు తగ్గింపుతో వచ్చారు. ఎవరైనా గట్టిగా బిగిసుకుని వస్తే దేవుని నుండి ఏదీ పొందలేరు. మిమ్మల్ని మీరు ఎంత తగ్గించుకోగలిగితే మరియు అప్పుడు క్రీస్తు మిమ్మల్ని స్వస్థపరుచును (అది సరియే.), లేక ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన మీకు పరిశుద్ధాత్మను ఇచ్చును, మీరు కనుక కేవలం...

ఇప్పుడు, ఎప్పుడైనా... [టేపుపై ఖాళీ ఉంది] అది మీకు ఇవ్వాలా లేదా అన్నది ఆయన ఇష్టం . మరియు అప్పుడు ఆయన నుండి మీరు పొందుకుంటారు.

21

అప్పుడు నేను ప్రార్ధించుచుండగా, నేను ప్రేక్షకులవైపు వెనుతిరిగాను. అక్కడ వందల కొలది ప్రజలు ఉండెను. మరియు నేను ఆ విధముగా ప్రార్ధించుచుండగా ప్రజలు వరుస గుండా వస్తున్నారు. అప్పుడప్పుడు నేను ఒకరిని ఆపాను, ఎందుకనగా వారు వచ్చి స్వస్థపడే విశ్వాసం వారు కలిగి లేనట్లుగా వారు కనిపించెను.

మరియు నేను ప్రార్ధించుచుండగా, నేను ఒక విధమైన అనుభూతి చెందాను. చుట్టూ తిరిగాను. నేను అన్నాను,“ ఒక కుంటి వ్యక్తి ఎక్కడో స్వస్థపడెను, ఎందుకనగా నేను దానిని అనుభూతి చెందాను.” మరియు కొన్ని క్షణాలలో నేను అన్నాను, “ఎవరో కుంటి వ్యక్తి...”

ఎవరో వెనక వైపు అక్కడ అరవటం నేను విన్నాను. అక్కడ నగరంలోని ఒక యవ్వన వ్యాపారవేత్త అతని భార్యతో కూర్చుండెను. అతను కుంటి చేయి కలిగియున్నాడు. మరియు ఇక్కడ అతడు అతని చేతులను గాలిలోకిపైకి లేపి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుచుండెను. మరియు అతడు అక్కడ కూర్చుని ఉండెను, మరియు చెప్పెను “నేను ఆరాధనలోకి రావాలని కోరుకున్నాను. నేను అక్కడ రెండు లేక మూడురోజుల నుండి ఉన్నాను”. కానీ చెప్పెను నేను ఆ ప్రజలలోకి రాలేకపోయాను. అక్కడ చాలామంది చాలా అవసరతలు కలిగి ఉండెను. మరియు నేను అన్నాను “ఓ దేవా, అది నీ వరమైనట్లయితే నీవు నన్ను స్వస్థపరచుము.” మరియు అది అతని విశ్వాసమును కదిలించి మరియు వెళ్ళెను (మీరు చూశారా?), మరియు అతని వైపు నేను వెనుదిరగగా అది కదలాడడాన్ని నేను అనుభూతి చెందాను. నేను.... తర్వాత అతను పైకి లేచెను.

22

ఇప్పుడు, స్నేహితులారా అది నేను కాదు. కానీ, యేసుక్రీస్తు నిన్న, నేడు, మరియు నిరంతరం ఏక రీతిగా ఉన్నాడని అది రుజువుపరచెను. ఆయన చుట్టూ తిరిగి మరియు అనెను, “ఎవరు నన్ను ముట్టెను?” సహోదరుడా బాస్ వర్త్ అది సరియేనా? ఇప్పుడు, ఇక్కడ కూడికలో ఆ సంగతులు... అక్కడ ఒక రాత్రి, నేను నిలుచుండగా ఒక ఆత్మ నన్ను దాటుట నేను విన్నాను, ఒక ఉక్కిరిబిక్కిరి చేయు ఆత్మ. అది మరలా తిరిగి వచ్చునని నేను అనుకున్నాను. కొద్దిక్షణాలలో అది ఖిల్ సభ వద్ద ఉండెను. ఆ రాత్రి పద్నాలుగు వేల మంది ప్రజలు అక్కడ ఉండెను. మరియు నేను అన్నాను, “ఇక్కడ నుంచి ఆత్మ దాటిపోయెను గనుక గొంతు వాపు వ్యాధితో ఉన్న ఒకరు స్వస్థపడెను.” మరియు నేను అన్నాను, “నిజానికి అది ఇక్కడికి మరల రావచ్చు. మరియు అది… ఆత్మ వెళ్లేటప్పుడు అది కొంచెం బలంగా వస్తుంది. ఎంత బలంగా అంటే మీలో కొంతమందిని ముంచి వేయగలిగినంత బలంగా వస్తుంది . కానీ అది...

23

చెప్పబడిన అనేక సంగతులు సత్యము కాదు అని నేను ఎరుగుదును. కానీ నిజ దేవుడు ఉన్నాడు, మరియు ఆయన స్వస్థపరచును. అది సరియే. మరియు అది వెళ్ళాక నేను మరలా దానిని ప్రకటించాను. మరియు నేను అన్నాను, “ఎవరో ఒకరు వరుస గుండా చూసెను. ఎవరో గొంతు వాపుతో ఉన్నవారు స్వస్థపడెను.” మరియు పైన రెండవ బాల్కనీలో ఎవరో అరుచుట నేను విన్నాను. “సహోదరుడా బ్రాన్హాం, అది నేనే” అనెను.

మరియు వార్తాపత్రికతో పంపబడిన ఒక విలేఖరి అక్కడ ఉన్నాడు. ఒక గొంతు వాపు లోపల వాపు సంవత్సరముల నుండి కలిగియుండెను, అతడిని వదిలెను. అతడు అనెను “అక్కడ చుట్టూ ఉన్న మొత్తం దేవునిశక్తితో ప్రకాశించబడినది.” చూసారా?

అతని విశ్వాసము..... అతను అక్కడికి విమర్శించుటకు వచ్చి ఉండెను. అతడు మరుసటి రోజునకు పత్రికలోవ్రాయుటకు ఉంచిన పూర్తి పేజీని అంతటిని మాకు ఇచ్చెను. అతడు విమర్శ చేయుటకు వచ్చెను. కానీ దేవుడు పని చేయుట మరియు దేవుడు ఏమి చేశాడో అతడు చూడటం మొదలు పెట్టినప్పుడు అతడు తనంతట తాను నమ్మెను. మరియు తర్వాత అతడు నమ్మినప్పుడు దేవుడు అతడిని సన్మానించెను. మరియు అతడు ఎన్నడూ ప్రార్ధన వరుసలోనికి రాలేదు. అతడు పైన రెండవ బాల్కనీలో స్వస్థపడెను. ఓ,మై. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా లేడా అనేది నాకు చెప్పండి. ఆయన శక్తి పరిధి లేనిది. మరియు ఈ క్షణములోకూడా ఆయన అదే కార్యమును చేయగలడు.

24

ఇప్పుడు చూడుము. బాగుపడాలన్న కోరికతో మనమందరము ఇక్కడ ఉన్నాము. మరియు ఎంత లోతుగా మీరు దీనిలోనికి వస్తే అంతగా మీరు మంచిగా అవుతారు. దాని గూర్చి అస్తవ్యస్తముగా రావద్దు. యదార్థ హృదయముతో రండి, మీ హృదయం అంతటితో నమ్మి, నేను ప్రార్థిస్తూ ఉండగా మీ స్వస్థతను పొందుకొనండి. చూశారా? మీరు చేయవలసిన మార్గము అదియే. ఇప్పుడు సగం నమ్మికతో రావద్దు.

ఇప్పుడు, గుర్తుంచుకోండి, నేను ఇక్కడ ఉన్నాను. మరియు ప్రకంపనలు గూర్చి, ఈ సంగతులను గూర్చి, నేను చేసిన ఒప్పుకోలు...

నా ఇతర కూడికలలో ఉండి చెవిటి, మూగ, కుంటి, గుడ్డి మరియు ఇతర వాటిని స్వస్థపడుట చూసినవారు ఎంతమంది ఈ కూడికలో ఉన్నారు, చూచెదము? ప్రజలు వారి వ్యాధులను గూర్చి చెప్పుట మరియు వారి పాపములను, మరియు సంగతులను, ప్రకంపనలను చెప్పుట ఎంతమంది చూశారు...? మంచిది ఎంతమంది దానిని చూశారు...? ఓహ్, చూసారు?

ఇప్పుడు, నేను ఈ ప్రకటనలను చేస్తే మరియు అవి మరియు వాటిని నా అంతట నేను చేస్తే వాటిలో ఏవి జరగకపోతే అప్పుడు దానిని నమ్మవద్దు, ఎందుకనగా నా మాట అసత్యము అవ్వచ్చు కానీ నేను ఆ ప్రకటనలుచేస్తే, మరియు దేవుడు దాని వెనుక ఉంటే, అప్పుడు దానికి సాక్ష్యం దేవుడు ఇచ్చును. అదిసరియేనా? అది సత్యమని చెప్పేదే దేవుని సాక్ష్యం. మంచిది దేవుడు అది సత్యమని చెప్పితే, మరియు వాక్యం వెనువెంబడి అద్భుతములు మరియు సూచక క్రియలతో రుజువు పరిస్తే, అది మీరు దేని గురించి అయితే సంవత్సరముల తరబడి ప్రార్థిస్తున్నారో అది కాదా?

25

మంచిది, మై, మై. ఇప్పుడే మనం స్వస్థపడతాం అని నేను నమ్ముతున్నాను. తప్పకుండా. మై, ఆ ఆత్మ ఆహ్వానిస్తూ వెనుకకు తిరిగి వచ్చుటను నేను అనుభూతి చెందుటకు నేను ఇష్టపడుతున్నాను. అది అద్భుతమైన అనుభూతి. అది సరి. ఇప్పుడు, వాక్యము కొంచెం చదువుదాం. ఇప్పుడు, ఇది ధనికుడి కుమారిని స్వస్థతను గూర్చినది. ఎక్కువగా తీసుకోకుండా కొద్ది నిమిషముల సమయమే అప్పుడు మనం స్వస్థతా ఆరాధనలోకి వెళ్ళవచ్చు.

కనుక యేసు గలిలయలోని కానాకు మరల వచ్చి అక్కడ నీళ్లను ద్రాక్షారసముగా మార్చెను. మరియు ఈ ధనికుని కుమారుడు...

[టేపుపై ఖాళీ ఉంది]

నేను ఇంతకుముందు కొద్ది నిమిషముల క్రితం నేను మాటలాడుచుండగా లేదా అటువంటిది. అది అతడేనా? అది సరే. నేను ఆశ్చర్యపడ్డాను. నేను వేరొకరి వచనములు తీసుకున్నానా అని.

ఏమైనప్పటికీ, ఆయన గలిలయకు తిరిగి వచ్చి అక్కడ ఆయన ఒక అద్భుతం చేశారు. మరి ఇప్పుడు, ఆయన మరలా తిరిగి వచ్చెను. మరియు ఆ అద్భుతం ఆయన పెండ్లిలో ఉన్నప్పుడు చేసెను. కానాలో ఆయన నీళ్లను ద్రాక్షరసముగా మార్చెను.

మరియు ఆయన యవ్వనస్తుడై ఉండి చాలా పేద వాతావరణము నుండి వచ్చెను.

26

మరియు, నేడు యేసు లోకమున లేడని అనుకున్నట్లయితే, ఆయన ఇక్కడ ఉండకపోతే, మరియు నేడు రంగములోకి వస్తే, వారు నిశ్చయంగా దానిని మతోన్మాద గుంపుగా ఎంచి ఉండేవారు. అది సరియేనా? ఇప్పుడు, జ్ఞాపకం ఉంచుకొనండి. చాలా చాలా వందలసార్లు యేసు నుండి మనము దాటి పోయాము ...[టేపు పై ఖాళీ ఉంది]

మంచిది, దానికి కొంచెం సమయము తర్వాత యువతి ఆమె స్థానమును ఇద్దరు లేక ముగ్గురు ప్రజలకు ఇచ్చును. మరియు కొద్ది సమయం తరువాత, ఆరాధన వరుస చివరికి వచ్చేసరికి, ఇంక అక్కడ అద్భుతములు కూడా ముగిసినవి. ఇది త్వరగా ముగించబడింది. మరియు ఆమె గొప్ప జనసమూహమును చూసినప్పుడు, ఆమెకు మిగతా వారిని చూసి ముందుకు వచ్చేందుకు హృదయం ఒప్పుకోవట్లేదు, మరియు ఆమె కుంటి పాదమును కలిగియుండెను. మరియు ఆమె అనెను “ప్రభువా, నూట ఎరవై (120) పౌండ్ల వ్యక్తి ప్రజలను స్వస్థపరచలేడు అని నేను ఎరుగుదును. కానీ నీ దూత అక్కడ ఉందని నేను ఎరుగుదును, ఎందుకనగా నీ వాక్యములు స్థిరమైనవి.” మరియు ఆమె అనెను, “ఇప్పుడు నిన్ను నమ్ముతున్నాను.” మరియు ఆమె పాదము సరి ఆయెను. ఆమె లేచి మరియు అనెను “సహోదరుడా బ్రాన్హాం, నాకు నా చంక కర్ర ఇక ఎంత మాత్రమూ అవసరం లేదు”. మరియు దానిని క్రింద పడవేసి మరియు అందరిలాగా చక్కగా నడిచి వెళ్ళెను.

ఎందుకు? ఆమె ప్రాధాన్యం ఇచ్చింది; తగ్గింపు కలిగి యున్నది; ఆమె వేచి ఉండుటకు సిద్ధమైనది; ఆమె ఏమి చేయుటకు అయినా సిద్ధమైనది. మరియు దేవుడు దానినే గౌరవించేది (అది సరియేనా?): ఒకరికొకరు ప్రాధాన్యత నిచ్చుకొనుట. అది సరియేనా.

27

ఇప్పుడు, ఇక్కడున్న ఈ మనిషి. అతనివైపు చూడుము, అతను ఎంత విధేయతను కలిగియున్నాడు. [టేపుపై ఖాళీ ఉంది] అతడిని పంపుటకు.

ఇప్పుడు యేసు అతడిని గద్దించెను. అతడు అనెను “ఓహ్, మంచిది...”

మరియు మీరు సూచక క్రియలు మరియు అద్భుతములు చూస్తేనే తప్ప మీరు నమ్మరు.

సూచకక్రియలు లేక అద్భుతములు చూడకపోయినా మనము నమ్మాలి. అది సరియేనా? కానీ... ఇప్పుడు, గమనించుము, అతడిని అక్కడ పరీక్షించెను.

శతాధిపతి ఆయనతో అనెను, అయ్యా, రమ్ము లేకపోతే నా బిడ్డ చనిపోవును.

మై, ఏ విధమైన అనుభూతి. మీ కుమారుడు చనిపోతూ ఉండగా, రోగుల కొరకు ప్రార్థించే వ్యక్తి కొరకు వచ్చుటను మీరు ఊహించగలరా. ఆ వ్యక్తి అతనితో అనెను, “మంచిది మీరు సూచక క్రియలు మరియు అద్భుతములు చూచితేనే తప్ప మీరు నమ్మరు.”

ఇప్పుడు, ఆయన ఎంత తగ్గింపుతో ఉండెనో చూడుము. అతడు అనెను, “కానీ అయ్యా రమ్ము లేకపోతే నా బిడ్డ చనిపోవును.”

ఇప్పుడు యేసు ఏమి అనెనో గమనించుము. ఇప్పుడు, ఆయన వెళ్ళవచ్చు. కానీ ఆయన విశ్వాసమును చూసెను. ఆయన వినయమును చూసెను. ఆ వ్యక్తి తాను ఏమి మాట్లాడుతున్నాడో ఎరిగి ఉన్నాడని అతడు చూసెను. యేసు అతనితో అనెను “నీ మార్గమున వెళ్ళుము; నీ కుమారుడు బ్రతుకును.” (ఓ, మై. అక్కడే మీరు ఉన్నారు.) “మీ మార్గమున వెళ్ళు; నీ కుమారుడు బ్రతుకును. మరియు ఆ మనిషి దానిని న-మ్మె-ను. అతడు నమ్మెను. ఇప్పుడు, అతడు ఆయన దగ్గరకు తన బిడ్డకు ప్రార్థన చేయుటకు ఇంటికి తీసుకువెళ్లడానికి వచ్చెను. కానీ యేసు వెళ్లలేదు. ఆయన అనెను, నీ కుమారుడు బ్రతుకును మరియు అతడు దానిని నమ్మెను.

ఇప్పుడు, అదియే... ఇప్పుడు, మిగిలిన కథను వినండి.

యేసు పలికిన వాక్యం... ఆయనతో యేసు పలికిన వాక్యమును నమ్మి, మరియు అతడు అతని మార్గమున వెళ్ళెను.

మరియు అతడు దిగి వెళ్లాక, అతని సేవకుడు అతడిని కలిసి మరియు అతనితో అనెను...... అతనితో చెప్పెను, “నీ కుమారుడు బ్రతికెను... (ఇప్పుడు దీనిని వినుము, ఓ, మై, నేను దీనిని ఇష్టపడుతున్నాను.)

అప్పుడు, అతడు పిలిచి ఏ ఘడియలో అతడు బాగుపడటం మొదలైనదని వారిని అడిగి తెలుసుకొనెను. మరియు అతనితో అతడు నిన్నటి ఏడవ గడియలో జ్వరము కుమారుడిని విడిచెనని చెప్పెను. కనుక యేసు తనతో నీ కుమారుడు బ్రదికెను అని చెప్పిన అదే గడియ అని ఆ తండ్రి ఎరిగి మరియు తనంతట తాను మరియు అతని ఇంటి వారందరూ నమ్మెను. (ఇదంతయూ జత చేసినట్లయితే అక్కడే మీరు ఉంటారు. అది సరి.).... మరియు ఆయన యూదా నుంచి గలిలయకు వచ్చినప్పుడు యేసు చేసిన రెండవ సూచక క్రియ ఇది.

28

గమనించుము. ఇప్పుడు, ఆయన అతనితో వచ్చి తన కుమారుని కొరకు ప్రార్థించాలని అతడు కోరుకునెను, మరియు ఆయన వెళ్లకపోయెను. కానీ ఆయన అనెను, “నీ కుమారుడు బ్రదికెను,” ఆ మనిషి దానిని నమ్మెను. ఇప్పుడు, ఒకవేళ అతడు దానిని నమ్మక పోయినట్లయితే, అది అలాగు జరుగకపోవును. కానీ యేసు అప్పటికే అతడు విశ్వాసము కలిగి ఉండెనని ఎరిగి అతనిని ప్రశ్నించెను.

ప్రార్థనావరుస గుండా వెళ్తున్నపుడు మీలో చాలామంది గమనించి ఉంటారు, ఒక్కొక్కసారి ఒకరు విశ్వాసం కలిగి ఉండటం మీరు కనుగొంటారు. కొన్ని క్షణాలు, కొంచెం ఆ విశ్వాసమును రేపుటకు ఆ వ్యక్తిని ఆపుట వలన అది దాని స్థానమును తీసుకొనును. చూడండి మీరు వారిని విశ్వసించేటట్లు చేయగలిగితే.

ఇప్పుడు, ఆ ఒకరు... దేవుడు చేయవలసిన కటినమైన పని, ఏదనగా ఒక మర్త్యుడు ఇంకొకరిని విశ్వసించేటట్లు చేయడం. నాతో మాట్లాడిన ఆ దూత ఇక్కడ బలిపీఠము పైన ఈ రాత్రి నిలుచుని మీకు దానిని చెప్పడం తేలిక, ఎందుకు అనగా ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి మరియు ఆయనను ఆరాధిస్తారు. మీరు ఆయన పాదముల మీద పడాలని కోరుకుంటారు. ఆయన వచ్చినప్పుడు నేను ఆయనను చూసిన విధములోనే ఆయన ఇక్కడ నిల్చుని కనిపించెను: గొప్ప దృఢమైన మనిషి అక్కడ నిలబడి ఉన్నాడు. ఏ విధంగా నేను అనుభూతి చెందుతున్నానో నేను ఎరుగుదును.

29

కానీ స్నేహితులారా, నా జీవితములో నేను వచ్చిన ఈ ఇరవై-ఒకటి నెలలు ఏ అద్భుతములను నేను చేయలేదు. వేలకొలదీ చేయబడ్డాయి. వాటిలో ఒక్కటి కూడా నేను చేయలేదు. అది చేసినది ఆయనే చూసారా? అది ఆయన. దానితో నేను ఏమీ చేయలేదు. ఆయన ఒక్కడే. నేను కేవలం ఆయన నోటి బూరను మాత్రమే. ఆయన ఏది చెప్తే కేవలం అది నేను మాట్లాడతాను. ప్రజలు విశ్వాసమును కలిగి ఉన్నారో లేక విశ్వాసం కలిగి లేరో అన్నది నేను ఎట్లు ఎరుగుదును. మరియు పది సంవత్సరముల లేక ఇరవై సంవత్సరముల క్రితం మీరు ఏమి చేశారో నేను ఎట్లు ఎరుగుదును. దానిని నేను ఎరుగను. అది దేవుడే.

కనుక పరిశుద్ధ గ్రంధం పునరావృతమయ్యే మరియు వాక్యము నెరవేరే గడియ వచ్చెను . ఇప్పుడు, తొలకరి వర్షం మరియు కడవరి వర్షము ఆయన పంపించునని దేవుడు వాగ్దానం చేసెను. మరియు కడవరి వర్షములో తొలకరి, మరియు కడవరి వర్షమును ఆయన వాగ్దానం చేసెను. ఇంకొక మాటలలో, రెట్టింపు భాగం. ఎలీషా వస్త్రమువలె. ఏలియా దానిని కిందకు జారవిడిచినప్పుడు ఎలీషా దానిని పట్టుకుని మరియు రెట్టింపు భాగమును పొందుకొనెను. సంఘము మరియు క్రీస్తు మాదిరిగా ఆయన ఒక మాదిరి. క్రీస్తుపైకి తీసుకొనిపోబడెను. మనము నేటి రాత్రి క్రీస్తునందు ఉన్న అదే ఆత్మ సంఘము మీద ఉన్నది. పరిశుద్ధాత్మ, చూశారా? “మీరు నేను వెళ్ళుట చూసినట్లయితే,” అని ఏలియా అనెను. మరియు అతడు వస్త్రము తీసుకొనెను. ఇప్పుడు... మరియు యొర్దానును కొట్టి మరియు “ఏలియా దేవుడు మాట్లాడును” అని అనెను.

30

ఇప్పుడు గమనించండి. సంఘము నేటి రాత్రి, మీరు క్రీస్తుపై మీ దృష్టిని ఉంచాలి. ఆయన ఎత్తబడినప్పుడు నూట ఇరవై మంది ఆలాగు చేసెను. మరియు వారు మేడ గదిలోనికి వెళ్ళిరి. మరియు మీరు అనవచ్చు, “క్రీస్తు మీద ఉన్న అదే ఆత్మ ఉన్నదా?”

ఒకరోజు ఒక స్త్రీ, “నీ రాజ్యములో నా కుమారులలో ఒకరు నీ కుడి ప్రక్కన మరియొకరు ఎడమప్రక్కన కూర్చుండనిమ్మని.” అడిగెను.

“నేను త్రాగు గిన్నెలోనిది మీరు త్రాగగలరా? శ్రమలు మొదలగునవి?” అని ఆయన అనెను.

“అవును.” అన్నారు

“నేను తీసుకున్న బాప్తిస్మం లాంటి బాప్తిస్మము మీరు తీసుకునెదరా? తాను చేయగలనని ఆమె అనెను. ఆమె చేయగలదని ఆయన ఒప్పుకున్నాడు. మరియు ఆ బాప్తిస్మము పరిశుద్ధాత్మ. మరియు తర్వాత ఆయన అనెను, ”ఔను, కానీ నా కుడి వైపు మరియు ఎడమవైపు కూర్చుండనిచ్చుట నా అధీనములో లేదు కానీ తండ్రి ఆధీనములోనే ఉంది “ కానీ గమనించండి. [టేపు పై ఖాళీఉంది]

31

జ్ఞాపకముంచుకొనుము... కొద్ది క్షణాల క్రితము డాక్టర్ బాస్వర్త్ తో పరిశుద్ధ యోహాను 5:19, గూర్చి నేను మాట్లాడినట్లుగా ఆయన అక్కడ అనెను. ఆయన కోనేటి వద్ద వ్యక్తిని స్వస్థపరచునప్పుడు మరియు ఆయన బయటికి వెళ్లెను మరియు యూదులు ఆయనను శోధించుచుండిరి. ఆయన అనెను, “తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తానుగా కుమారుడు ఏమీ చేయనేరడు.” చూశారా?

ఇప్పుడు, గమనించుము. ఆయన అక్కడ కోనేటి గుండా వెళ్లగా అక్కడ ఇంచుమించు పదివేల మంది జనులు పడి ఉండెను. ఇప్పుడు, “గుంపులుగా,” అని పరిశుద్ధ గ్రంథము చెప్పెను. దాని అర్థం,“అనేక జనములు” అని కాదా. పదివేల మంది జనులు అయి ఉండవచ్చు. వారిలో కుంటి, గ్రుడ్డి రోగులు మరియు అన్ని రకముల జనులు అక్కడ పడి ఉండెను: చెవిటి, మూగ, వెర్రి వారు. మరియు ఇరవై-ఎనిమిది ఏళ్ల నుండి వ్యాధి కలిగిన మనుష్యుని యొద్దకు ఆయన వెళ్ళెను. మరియు ఆయన అనెను, “అయ్యా నీవు స్వస్థపడగోరుచున్నావా?”

మరియు అతడు అనెను, “నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు మరియు నేను నీటిలోనికి వచ్చినంతలో మరి ఒక్కడు...” చూశారా, అతడు నడవగలడు. “నేను నీటిలోనికి వచ్చునంతలో మరియొకడు ఇంకొంచెం బాగుగా ఉన్నవాడు నా కంటే ముందుగా దిగును.”

ఆయన,“నీవు నీ పరుపెత్తికొని నీ ఇంటికి నడువుము” అనెను. ఇప్పుడు, అతడు ఆయనను ప్రశ్నించలేదు. అతడు కేవలం విధేయత చూపెను. మరియు బలి కన్నా విధేయత శ్రేష్టం. అది సరియేనా?

“మంచిది, నాకు అది చెప్పుటకు నీవెవరవు?” అని అతడు అనలేదు. ఆయన ఏదిచేయమని చెప్పెనో దానికి అతడు విధేయుడు అయ్యెను, అతని పరుపును తీసుకునెను...

32

ఇప్పుడు, ఎందుకు ఆయన మరియొక గుడ్డి, మరియు కుంటి మరియు రోగుల యొద్దకు వెళ్లలేదు? ఎందుకనగా ... ఇప్పుడు, అతడు ఇతర మనుషుల కన్నా అతను ఏమీ విభిన్నముగా కనిపించలేదు. ఇతర మనుషుల కన్నా అతడు విభిన్నముగా వస్త్రము ధరించలేదు. ఇప్పుడు, ఆ ఒకటి... ఎవరికన్నా. మీరు మీరు... పరిచారకులు మరియు మొదలగువారు, వారు కోరుకున్న విధముగా వారు వస్త్రములు ధరించవచ్చు.

కొన్నిరోజుల క్రితం ఇక్కడ ఎవరో అడిగారు... మీలో చాలా మంది వచ్చి ఎబైక్ గూర్చి విని ఉంటారు. వారు ఆ సమయములో ఇక్కడకు వచ్చిరని మీరు ఎరుగుదురు. మంచిది, కొంత సమయం మేము ఒకరికొకరం కలవడానికి ప్రయత్నించాము. కొన్ని రోజుల క్రితం ఫ్లోరిడాలో మేము కలిసాము, మరియు మా చిత్రాలను ఒకచోట చేర్చి మరియు అనెను, “...?...అమెరికన్...?... దైవిక స్వస్థతను సంప్రదించండి.”

33

ఏది ఏమైనా, అతడు, ఎందుకు అతడు... అతడు... అతడు పొడుగు గడ్డం మరియు పొడుగు జుట్టు కలిగియున్న మనిషి. కనుక ఏమిటంటే అది అతని సొంత అభిప్రాయం. అది ఖచ్చితముగా సరియైనదే. ఒకవేళ మీరు ఆ విధముగా అనుకుంటే లేక అలా ఉండాలనుకుంటే అదిసరియే. కానీ అది మిమ్మల్ని “అవును” లేదా “కాదు”గా చేయలేదు. అది మిమ్మల్ని ఏమి చేసేది లేక మీరు ఏమై ఉన్నది దేవుని యందు మీ హృదయం యొక్క స్థితి అయి ఉన్నది. అది సరియే.

ఇప్పుడు, ఆయన దాటిపోతుండగా ఆయన కేవలం యేసు; ఆయన ఒక సాధారణ దుస్తులు ధరించిన మనిషి. మరియు ఆయన జన సమూహముల గుండా వెళ్లి మరియు ఆయన అతడిని చూసెను, ప్రస్ఫుటముగా చూడటానికి కాదు. ఆయన కేవలం అనెను, “నీవు స్వస్థపడగోరుచున్నావా?”

అతడు అనెను, “నన్ను నీటిలోనికి దించుటకు నాకు ఎవ్వరూ లేరు.”

“నీ పరుపెత్తుకుని నడువుము” అనెను. మరియు అతను చేసెను.

మరియు తర్వాత అతను ప్రశ్నించగా ఆయన తండ్రి ముందుగా చేయునది తప్ప మనుష్య కుమారుడు ఏది చేయనేరడు అని వారితో అనెను.

34

ఇప్పుడు, ఇక్కడ ఆయన వచ్చి.... కానాకు మరల, మరియు ఒక శతాధిపతి అబ్బాయి జబ్బుపడెను. ఇప్పుడు 47వ వచనము చూడుము:

యేసు యూదా నుండి గలిలయకు వచ్చునని ఆయన వినినప్పుడు, అతడు ఆయన యొద్దకు వచ్చి, మరియు ఆయనను వేడుకొనెను, ఏమనగా ఆయన వచ్చి తన కుమారుని స్వస్థపరచాలని ఎందుకనగా, అతడు చావునకు దగ్గరలో ఉండెను.

ఇప్పుడు, గమనించుము, “అతడు వినినప్పుడు...” 47వ వచనములోని మూడో వచనం గమనించుము.“యేసు తిరిగి స్వదేశమునకు వచ్చెను అతడు వినినప్పుడు,” అద్భుతమును అక్కడ చేసెను,' అతని కుమారుడు చావునకు దగ్గరలో ఉన్నాడు కావున అతడు తన కుమారుని కొరకు ఆయన యొద్దకు వచ్చెను.“

దానిని పొందుతున్నారా? ఆయన అప్పటికే ఒక అద్భుతము అక్కడ చేసి ఉండెను గనుక ఆయన అది చేస్తాడని అతడు ఎరిగియుండెను. మంచిది ఆయన చేసిన ఒక అద్భుతం తన కుమారుడు ఆయన మాట ద్వారా స్వస్థపడతాడని శతాధిపతి నమ్మేటట్టుగా చేసెను. అయితే ఆయన ఇక్కడ వందలకొలది అద్భుతములు మన ముందు చేయగలడని మనమెందుకు నమ్మలేము. నా అర్థం ఏమిటో మీరు చూశారా?

గమనించుము. ఆ స్త్రీ అక్కడ చనిపోయినప్పుడు ఉన్నవారు ఈ ఉదయం ఎంత మంది ఇక్కడ ఉన్నారు. ఇది శ్రీమతి హాటీ వాల్ డ్రాప్, చూడటానికి, ఇక్కడ ఉన్నారు.....ఆ స్త్రీ ఇక్కడ ఉందా.... ఇక్కడ రాత్రి శ్రీమతి హాటీ ఉందా? శ్రీమతి వాల్ డ్రాప్ ? మంచిది, ఇక్కడ ఆమె ఇక్కడ ఉంది గుండె, పెద్దప్రేగు మరియు లివర్ క్యాన్సర్ తో చనిపోయిన ఆమె బ్రతికెను. కాదా సహోదరీ మీరే. ఆమె వైద్యుడు ఎక్స్రేలు మరియు మొదలగునవి ఇక్కడకు తీసుకువచ్చారు.

35

ఇప్పుడు, క్యాన్సర్‌తో చనిపోయి ఇక్కడ ఉన్న మహిళ ఈ రాత్రి సజీవముగా ఉన్న అదే నగరానికి మేము ఈ రాత్రికి తిరిగి వస్తున్నాము. మరియు ఇది రెండవ అద్భుతం చూశారా.? ఓహ్, మై, రెండవది. కొన్ని డజన్ల మీద డజన్ల అద్భుతములు ఇక్కడ చేయబడినవి. అది సరియేనా?

ఇప్పుడు, గమనించుము. శతాధిపతి అతని కుమారుడు వచ్చి... ఇక్కడ అతడు తన కుమారుడిని తీసుకురాలేదు. కానీ అతడు మాత్రమే ఆయన దగ్గరకు వచ్చెను. మరియు ఆయన “ఇప్పుడు, నీవు వచ్చి నా కుమారుని కొరకు ప్రార్ధించు”. ఇప్పుడు, గమనించుము. ఆయన... వినుట ద్వారా విశ్వాసము కలుగును. ఆయన దానిని చేశాడని అతడు వినెను.

ఇప్పుడు, ఇక్కడ గత కూడికలో యేసు స్వస్థపరచాడని ఎంతమంది విన్నారు? మీ చేతులను చూపించండి. ఇక్కడ గత కూడికలో ఆయన స్వస్థపరచాడని ఎంతమంది ఎరుగుదురు? ఇప్పుడు దాని రుజువు ఇక్కడ ఉన్నది. ఇక్కడ గత కూడికలో ఎంతమంది స్వస్థతపడెను, మీ చేతులను చూపించండి? ఇప్పుడు మీరు అక్కడే ఉన్నారు. ఇప్పుడు మీరు దానిని తిరస్కరించలేరు.

మంచిది ఇప్పుడు, ఒక అద్భుతం కానాలో జరిగెను, ఆ మనుష్యుడు వచ్చి మరియు క్రీస్తునందు విశ్వాసముంచుటకు కారణమైంది. ఎంత ఎక్కువమంది అరిజోనాలో నేటి రాత్రి వచ్చి నమ్మాలి (అది నిజమేనా?), ఎందుకనగా ఎంత ఎక్కువమంది స్వస్థపడ్డారో చూడండి.

36

ఇప్పుడు, ఇక్కడ గమనించండి. 48వ వచనం.

యేసు అప్పుడు అతనితో అనెను, మీరు సూచక క్రియలు మరియు అద్భుతములు చూస్తే తప్ప మీరు నమ్మరు. ఇంకొక మాటలలో అతడు దాని యందు నిలబడతాడా అని చూచుటకు అతనికి గద్దింపు నిచ్చెను.

ఇప్పుడు, ఇక్కడ యజమానుడు ఉండి మరియు ఒకదానిని లేక వారి ఏదైనా అలాంటిది చెప్పినట్లయితే నేటి రాత్రి ఫీనిక్స్ లో ఏమి జరుగునో మీరు ఎరుగుదురు. ఎందుకు, మై, వారు బ్రద్దలై మరియు వెళ్ళిపోవుదురు. ఎందుకు, మీరు రావలసిన అవసరం లేదు.

కానీ ఆ వ్యక్తి ఆ విధమైన వ్యక్తి కాడు. అతడు వినయము కలిగిన వ్యక్తి. ముఖ్యమైన విషయము ఏమనగా అతని కుమారుని వద్దకు క్రీస్తును తీసుకురావడమే. కానీ మీరు చూడండి, ప్రజలు ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉండెనంటే, అంటారు... మంచిది, ఇతరులకంటే ముందు తమకే ప్రాధాన్యత ఇవ్వబడాలని భావిస్తారు, వారు దేవుని నుండి ఏదీ పొందుకోరు. ఎవరైతే వెనక్కి తగ్గడానికి ఇష్టపడతారో, ఎవరైతే ఇతరులకు ప్రాధాన్యత ఇస్తారో, వారు దేవుని నుండి ఏదో ఒకటి పొందుకుంటారు.

ఇక్కడ వేరొక రాత్రి ఒక కూడికలో ఒక చిన్న స్త్రీ ఉండెను, ఆమె అక్కడ వెనుక ఉన్నది. మరియు ఆమెకుంటి కాళ్ళు గలది. ఆమె చంక కర్ర మీద నడుచును. మరియు ఆమె సమయం వచ్చెను. ఆమె సంఖ్య పిలువబడెను. మరియు అక్కడ వెనుక క్యాన్సర్ తో కూర్చున్న స్త్రీని ఆమె చూసెను. ఆమె పంపెను...[టేపుపై ఖాళీ ఉంది] ఒకరిని.

37

“...దీని తర్వాత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, మరియు యెరుషలేము, యూదా, సమరయ మరియు భూదిగంతముల వరకూ మీరు నాకు సాక్షులై యుందురు.” మరియు అది అందులో ఫీనిక్స్, ఆరిజోనా కూడా వస్తాయి. అది సరియే. మార్చి నాలుగున, 1948. ఈ రాత్రి సంఘం మీద కుమ్మరించిన ఆ దినము వలె ఆయన శక్తి అదే విధంగా ఉన్నది. అయితే ఆయన యొక్క ఆశీర్వాదములతో కూడిన బంగారు పాత్రలో ఉన్న అలాంటి కార్యాలను ఎవరు రుచి చూశారో ఆ ప్రజలైన మీరు, నేటి రాత్రి ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని స్వస్థపరచుట లేక ఇక్కడ ప్రతి ఒక్కరిని నింపుటకు తప్ప మరి ఏ విధంగా వేరే దానిని నమ్ముతారు.

ఆయన నిన్న, నేడు, మరియు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నట్లయితే, ఆయన శక్తి ఒకే విధముగా ఉన్నది. ఆయన పరిమితిలేని వాడు, ఆయన శక్తులు కూడా. నేటి రాత్రి నేను ఇక్కడ నిల్చుని సాక్ష్యం వెనుక సాక్ష్యం, గంటల తరబడి, ఆయన ఏమి చేసినది నీకు చెప్తూ ఉండగలను. కానీ, నేను యాభై సంవత్సరములుగా మాట్లాడిన దానికన్నా ఎవరో ఒకరిని స్వస్థపరిచే ఆయన నుండి ఒక సాక్ష్యం గట్టిగా మాట్లాడును. అది సరియే. మనము మౌనముగా ఉందాము, మరియు ఆయనను మాట్లాడనిద్దాము. మరియు ఆయన మాట్లాడును.

38

ఇప్పుడు, మీలో ప్రతి ఒక్కరూ బాగుగా ఉపదేశించబడ్డారు. ఇది ఏ విధంగా వచ్చునో మీకు తెలుసు. అది సంపూర్ణ గౌరవం అయిఉన్నది. అది కళ్ళు మూసుకుని తలవంచుట అయిఉన్నది.అది వేరొక మార్గం కాదు... ఇది కార్యక్షేత్రం కాదు. మరియు ఇది దేవుని గృహము మరియు ఇది మనం క్రీస్తుకు గౌరవం ఇవ్వవలసిన స్థలము.

ఇక్కడ ఇంకొకటి ఉన్నది. ఏ వ్యక్తి అయినా ప్రార్థనా వరుసలో ఉన్నట్లయితే మీకు నా దృఢమైన హెచ్చరికను ఇవ్వనీయండి. మీరు ఒకవేళ ప్రార్థన వరుసలోనికి రావాలనే లక్ష్యముతో ఉన్నట్లయితే మొదట మీ హృదయము క్రీస్తునకు ఇచ్చేంతవరకు మీరు రావద్దు. తర్వాత దానితోనే మీరు ఆగిపోవద్దు. మీరు పశ్చాత్తాపపడి మరియు బాప్తీస్మము పొందాక ఆత్మ బాప్తిస్మం పొందే అంతవరకు వేచి ఉండండి.

స్నేహితుడా, దీనిని నేను మర్యాద పూర్వకముగా చెబుతున్నాను. నేను చాలా కాలము ఇక్కడ ఉండను అని గ్రహించాను. ఎవ్వరూ ఉండము. మనము అంతమునకు దగ్గరలో ఉన్నాము. మనం ఇప్పుడు ప్రతి ఒక్కరూ దానిని ఎరుగుదురు. పద్నాలుగు సంవత్సరములు దాటిన ప్రతి ఒక్క వ్యక్తికి మనం చివరికి వచ్చాము అన్న విషయం తెలుస్తుంది. నేటి రాత్రి ఏమి తెలుసుకోవాలి అనగా మనం ఒకదానికి దగ్గరగా ఉన్నాము. మరియు మీరు దీనిని వినాలని ఆశ పడుతున్నాను. నా ప్రార్థన ద్వారా తప్పకుండా దేవుడు గుడ్డి వారి కన్నులు తెరుచును, మరియు కుంటి వారిని నడిచునట్లు చేయును, తప్పకుండా నేను ఏమి మాట్లాడుతున్నానో దానిని నేను ఎరుగుదును. మనము అంతమునకు దగ్గర ఉన్నాము. అది సరియే.

39

మరియు యవ్వనస్తులు లేక వృద్ధులు క్రీస్తునకు బయట ఉన్న మీరు... ఓహ్, దేవుడు మీకు సహాయం చేయును, స్నేహితులారా. సమయం ఇదే. గడియ ఇదే. మీరు పరిశుద్ధాత్మను పొందకపోయినట్లయితే ఇప్పుడే అది పొందుకొనుము. క్రీస్తునందు ఎవరైతే ఉన్నారో దేవుడు తనతో తీసుకు వచ్చును, మిగిలిన వారు తీర్పు కిందకు వెళ్ళును. నేటి రాత్రి నీవు క్రీస్తులో ఉండనట్లయితే నా మాట వినుము; ఎవరైతే క్రీస్తులో ఉందురో వారు ఎత్తబాటులోకి వెళ్ళుదురు.

నేటిరాత్రి, మీరు సిద్ధపడకపోయినట్లయితే సిద్ధపడండి. మీరు పాపిగా ప్రార్ధన వరుసలోనికి వచ్చినట్లయితే మీరు... అనవచ్చు “పాపి వచ్చునా?” అని. అవును, అయ్యా. పాపి వచ్చును. కానీ ఇప్పుడైతే దేవుడు నిన్ను ముట్టిన తర్వాత, మళ్లీ నీవు సరిగా లేనట్లయితే క్రీస్తులోనికి వచ్చిన తరువాత అది నీకు సరి అయిన దానిని తీసుకొచ్చుటకు బదులుగా మరి ఎక్కువ కీడును తీసుకొచ్చును.

40

ఇక్కడ కొన్ని వారముల క్రితం, ఒక స్త్రీ వరుసలోనికి వచ్చెను ఏదో కలిగి... వార్తాపత్రికలు అంబులెన్సులు వీధి కారును ఆపడం వంటి సంగతులను గూర్చి భయంకరమైన కథనాలు మాకు ఇచ్చెను. మరియు ఆ యువతి ఆమె చేతిని ముట్టుకోవడానికి నేను వెళ్లాను. నేను ఆమె చేతిని ముట్టుకోవడానికి ముందుగా నేను క్యాన్సర్ ను కలిగి ఉన్నాను అని ఆమె చెప్పెను.

నేను ఆమె చేతిని తీసుకుని పట్టుకున్నాను నేను అన్నాను “క్యాన్సర్ కాదు సహోదరీ క్యాన్సర్లను కలిగి ఉన్నావు” ఆమె పది లేక పన్నెండు కలిగి ఉన్నది. మరియు అవి వివిధ భాగములను పట్టుకుని ఉన్నవి. మరియు నా చేయి త్వరగా వాచెను. దానిలో ప్రకంపనలు తిరుగుతున్నాయి.

మరియు ఆమె అనెను, “ నా కొరకు ఏమైనా చేయగలరా?”

నేను అన్నాను, “నీవు ఒకవేళ నమ్మినట్లయితే కానీ నేను దానిని గద్దించి మరియు దానిని పంపితే మరియు నీవు దానిని సందేహించితే అది తిరిగి వచ్చును.” మరియు నీవు క్రీస్తును సేవించునట్లు అయితే అది తిరిగి వచ్చును. నేను అన్నాను “నీవు క్రైస్తవురాలవు కాదని నేను గ్రహించాను”.

“లేదు, నేను కాను” అని ఆమె అనెను.

అప్పుడు ఆమె కళ్ళతో నన్ను చూసినప్పుడు.....దీనిని మీకు చెప్పాలి, ఎందుకనగా చాలామంది ప్రజలు దీనిని ఇప్పటికే ఎరిగియుంటారు. కొన్నిసార్లు నేను వారి కళ్ళను గమనించినప్పుడు నేను వారిని పట్టుకునే విధానం అదియే. మీరు చూశారా? తర్వాత అది మనసును తెలుసుకోవడం కాదు; అది మనస్తత్వ శాస్త్రం కాదు. అదే అయితే పౌలు ఆ వ్యక్తిని చూసి మరియు చెప్పెను “స్వస్థత పొందుటకు నీకు విశ్వాసం ఉందని నేను గ్రహించాను” అన్నప్పుడు దానిని ఉపయోగించెను.

41

దీనిని మీకు నేను అనుమతించాను. ఈ మార్గంలో ఇది మనస్తత్వశాస్త్రం. “సైక్” అర్థం “మనసు”. మరియు ఇది క్రీస్తు యొక్క మనస్సు, మానవుడికి క్రీస్తులోకి వెళ్లి క్రీస్తు యొక్క మనస్సును తెలుసుకునే అధికారం ఉన్నది... హల్లెలూయ. మై, క్రీస్తు మార్గములో నివసించుట ఎంత వాస్తవమైన కార్యమో. అయోగ్యమర్త్యులమైన మనం దేవుని కుమారులు మరియు కుమార్తెలుగా తీసుకురాబడిన సహవాస పౌరులుగా ఉండుటకు...ఓహ్, మై, నేను పొందినప్పుడు నాకు అరవాలని అనిపించెను...

గమనించుము. దూతలు కూడా రాలేనటువంటి ఆ రాజ్యములోనికి... “దూతలు?” అంటారా, అవునయ్యా. మనం కుమారులు మరియు కుమార్తెలు; దూతలు సేవకులు. అది నిజం. కుమారులు మరియు కుమార్తెలు వెళ్లేదగ్గరికి సేవకులు వెళ్ళలేరు. వారు ఆ సంబంధములోనికి ప్రవేశించలేరు ఎందుకనగా వారు సేవకులు, మనము కుమారులము మరియు కుమార్తెలము.

42

గమనించండి. మరియు ఈ స్త్రీ ఆమెను చూస్తూ ఆమె ధూమపానం చేయునని నేను గ్రహించాను. మరియు నేను ఆమెకు చెప్పాను; నేను అన్నాను,“ నీవు సిగరెట్లు తాగుతావు.”

ఆమె అన్నది, “అవును.”

నేను అన్నాను, “నీవు వాటిని వదులుము మరియు నీవు నీ హృదయమును క్రీస్తునకు ఇమ్ము.”

ఆమె అనెను, “ఏ సంఘములో నేను చేరాలి?”

నేను అన్నాను, “అది నాకు నేనుగా చెప్పుట కొరకు కాదు. అది నీవు వెదకుట కొరకే. కానీ నీవు పరిశుద్ధాత్మను పొందనట్లయితే, నీవు పరిశుద్ధాత్మ పొందుకుని, మరియు దైవిక స్వస్థతను బోధించి మరియు పరిశుద్ధాత్మను విశ్వసించు, ఒక సంపూర్ణ సువార్త సంఘమునకు వెళ్ళుము.”

ఆమె అక్కడ కొంచెం సేపు పడియుండెను. నేను అన్నాను “నీవు దానిని చేస్తావా?”

ఆమె వాగ్దానం చేసెను. ఆమె అది చేయగానే కాన్సర్ మొదటి గద్దింపు తర్వాత కొద్ది నిమిషాల్లోనే ప్రకంపనలు నా చేతిని విడిచిపెట్టెను. మరియు దానిని పట్టుకొని...[టేపుపై ఖాళీ ఉంది]

ఆమె కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుటకు వైద్యులు ఇచ్చెను. మరియు ఆ స్త్రీ లేచెను. ఆమె తిరిగి వెళ్ళిపోయింది; ఆమె తన పని చేసెను; ఆమె తన పొరుగు వారి పని చేసెను, ఇంకా ఆ సిగరెట్లను త్రాగుతూ ఉండెను. మరియు ఆమె సంఘములో చేరెను... [టేపు పై ఖాళీ ఉంది] మరియు ఆమె కాపరి కూడా…మరియు లేఖనములు సరి అయినవని ఎవరైనా దేవుని చేత స్వస్థత నొంది వారి వారి పాపములను విడిచి పెడతారని ఆయన అర్థం చేసుకున్నట్లయితే; సిగరెట్లు త్రాగుట విడిచి పెట్టమని ఆమెకు చెప్పును. మరియొక రెవరెండ్... నగరములోని ఒక సువార్త సేవకుడు ఆమె వద్దకు వెళ్లి మరియు దానిని చేయవద్దని ఆమెను హెచ్చరించెను.

ఆమె అనెను “నేను వాటిని విడిచిపెట్టలేను.”

అనెను,“అది సహోదరుడు బ్రాన్హాంకు మరియు సర్వశక్తిమంతుడైన దేవుడికి చేసిన వాగ్దానం అదికాదు.” మరియు సేవకుడు ఆఖరి సారి ఆమెను దర్శించిన కొన్ని రాత్రులు తర్వాత గుండెజబ్బుతో ఆమె చనిపోయెను.

43

చూశారా, ఓ, మై. ఇక మీదట పాపము చేయవద్దు. ఇప్పుడు, మీరు పాపం చేసినట్లయితే మీరు ఉత్తరవాదిని కలిగియున్నారు. కానీ నా అర్థం అక్కడికి నడువవద్దు, మరియు మీరు వెంబడించు అదే మార్గమున వెళ్లి వెంబడించవద్దు ఎందుకనగా మీ మీదకు మునుపటికంటే అధ్వాన స్థితి వచ్చును. గుర్తుంచుకోండి నా స్వరం రోగులను స్వస్థపరచడం దేవుని ముందు సరైనదైతే మిమ్మల్ని హెచ్చరించుటకు అది సరైనది. ఎందుకనగా అధ్వాన స్థితి కొరకు మీరు చూస్తున్నారు గనుక.

ఆమె గుండె, పెద్ద ప్రేగు మరియు లివర్ క్యాన్సర్ తో ఇక్కడ ఉన్న ఈ స్త్రీ. ఎందుకు, లివర్లో చీము మిమ్మల్ని చంపును. మరియు ఈమె క్యాన్సర్ కలిగి ఉండెను. అక్కడ వీధులలో ఆమె మరణించిన తరువాత ఎందుకు ఆమె ఇప్పుడు బ్రతికి ఉన్నది? ఆమె ఎలా బ్రతుకుతుంది? ఎందుకనగా తన హృదయములో మిగిలిన తన దినములలో క్రీస్తును సేవించుటకు ఆమె ప్రతిపాదించుకొనెను. మరియు అందుకే వైద్యులు మరియు పరిస్థితులు కూడా. ఎందుకు నేటి రాత్రి ఇక్కడ ఫీనిక్స్ వీధులలో నడుస్తూ దేవుని మహిమపరచుటకు ఆమె బ్రతుకుతుంది. ఎందుకనగా, ఆమె దాని గురించి సిగ్గుపడలేదు. దాని గురించి ఆమె ఎవరికైనా చెప్తుంది. చూడండి, ఆమె దేవున్ని సేవిస్తుంది.

44

ఇప్పుడు, మీరు ఆ స్థితిలో ఉండి మీ హృదయములో నేటిరాత్రి నుండి దేవుడిని సేవించుటకు ప్రతిపాదించుకున్నట్లయితే, నీవు పాపివైనా లెక్క లేదు, నీవు ఇక్కడ స్వస్థత కొరకు ఉన్నట్లయితే, బలిపీఠం వద్ద పడి ఆయనకు నీ హృదయమును ఇమ్ము, అప్పుడే, అటు తర్వాత పరిశుద్ధాత్మను పొందుకొనుము. ఇక్కడికి రమ్ము, మరియు నీవు ఏ సంఘమును ఇష్టపడితే ఆ సంఘములోనికి రమ్ము.

కానీ గుర్తుంచుకొనుము, నువ్వు దైవిక స్వస్థత మరియు సంపూర్ణ సువార్తను విశ్వసించు సంఘమును తీసుకొనుము, ఎందుకనగా ఇతరులు కొందరు నీలోనికి విషమును పంపితే నీవు నీ అనుభవమును కోల్పోతావు. అది సరియే. అది ఒక నిజమైన సంపూర్ణ సువార్త ప్రజలైయుండి క్రీస్తు రాకడను విశ్వసించు దాని యొద్దకు నీవు వెళ్ళుము.

ఇక్కడ ఇప్పుడు వేరుపడు సమయమని నేను నమ్ముతున్నాను. పాపిని ఇంకనూ పాపిగానే ఉండనిమ్ము; పరిశుద్ధున్నిఇంకనూ పరిశుద్ధునిగానే ఉండనిమ్ము. దేవుడు వేరుపరచు గీత గీయు గడియ వచ్చును. అది సరియే. సంఘము ఎత్తబాటునకు సమీపములో ఉన్నది.

ఇప్పుడు, స్నేహితులారా మనకు గంటా పదిహేను నిమిషములు రోగుల కొరకు ప్రార్థించుటకు ఉన్నది. ఇప్పుడు మీలో ఎవరైనా ఉన్నట్లయితే, నేటి రాత్రి తొందరపడవద్దు. వేచియుండుము.

45

స్నేహితులారా, ఇప్పుడు నేను చెప్పేది వినుము. గుర్తుంచుకోండి, నేను నా హృదయం అంతటితో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు బాగుగా ఉండటం చూడాలని నేను కోరుతున్నాను. మరియు నేటి రాత్రి నేను ఇక్కడ ఉన్నది మీరు బాగుగా ఉండటం చూచుట కొరకే. నా విశ్రాంతి సెలవు మానుకుని నేను ఇక్కడకు వచ్చినది మీ కొరకు ప్రార్థించుటకు ఎందుకనగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఈ స్పానిష్ ప్రజలకు నేను తిరిగి వస్తానని వాగ్దానం చేశాను. మరియు ఒక వ్యక్తి అతని మాటలకు కట్టుబడి ఉండనట్లయితే అతను మంచివాడు కాడు. అది సరే మరియు నా సొంత ఆలోచనలు కాదు గాని నేను ఇక్కడ ఉండుటకు నైతికముగా కట్టుబడి ఉన్నాను. మరియు నేను తిరిగి రావాలనుకున్నాను. నేను నా హృదయము అంతటితో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.

మీరు పాడినవి వినుటకు నేను మీ రికార్డులు తీసుకున్నాను సహోదరి గార్సియా అక్కడ ఒక పాట ఒంటరిగా పాడెను. మరియు చాలా గడియలలో నేను కెనడా పొలములలో ఎక్కడో ఉన్నప్పుడు, మై, మై, ఓ, చాలా అలసి...

కొన్నిసార్లు అక్కడ ఆరాధనలో వారు చాలామంది ఒక రాత్రి అక్కడ ముప్పై-ఐదు వేలమంది ప్రజలు కూడెను. అక్కడ ఒక్క ఆదివారము మధ్యాహ్నం పద్దెనిమిది వందల మంది బలిపీఠము నొద్దకు వచ్చెను మరియు వెయ్యి మంది వారి హృదయమును క్రీస్తునకు ఇచ్చెను. మరియు ఆ రాత్రి ఒక్క సమయములోనే ఐదు వందల మంది పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకొనిరి. అది సరియే.

46

ఇప్పుడు, రక్షించుటకు ఆయన ఇక్కడ ఉన్నాడు, స్వస్థపరచుటకు ఆయన ఇక్కడ ఉన్నాడు. మరియు చాలాసార్లు నేను దైవిక స్వస్థతను గూర్చి మాట్లాడుతూ దానిగుండా వెళ్ళాను. కానీ, నేను నీ ఆత్మను గురించి నీతో మాటలాడుట అది ఎంతో ప్రాముఖ్యమైయున్నది. మీరు దేవునిని కలుసుకొనబోయే ఆత్మను కలిగివున్నారు. మీరు గౌరవముతో ఉండవలెను.

మనం తలలు వంచి ఉండగా ఆశ్చర్యకరముగా ఇక్కడ ఉన్న సహోదరి పియానిస్టు వారిలో ఒకరు పియానో యొద్దకు వెళ్ళుము. నా కొరకు ఒక నిమిషం “కేవలం నమ్ముము” పాటను వాయించండి. పియానో వాయించేవారు. ధన్యవాదములు సహోదరుడా.

ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చుని ఉండగా నేను ఆశ్చర్యం చెందాను, ఏమిటో మీకు తెలుసా? నేటి రాత్రినుండి సంవత్సరములో మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? నేటి రాత్రి నుండి ఇదు వందలు సంవత్సరములకు మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ఎందుకో మీకు తెలుసా? బహుశా ఎక్కడో ఇసుకతో నిండి ఉంటుంది, మరియు మీ సమాధి మీదుగా అది ఊదబడినప్పుడు మీ ఆత్మ ఎక్కడో నిత్యత్వములో ఉండును. అది మీకు తెలుసు. అది సరేనా? మంచిది, నేటి రాత్రి నుండి ఒక సంవత్సరములో మీరు ఎక్కడికి వెళ్లబోవుచున్నారు? మీరు ఒకే విధముగా ఉండవచ్చు. రేపు రాత్రి మీరు ఎక్కడికి వెళ్లబోవుచున్నారు? మీరు నిత్యత్వములో ఉండవచ్చు.

47

ఇప్పుడు, ప్రార్థన కొరకు మన తలలువంచి ఉండగా, నేను ఆశ్చర్యపడ్డాను ప్రతి చోటునా ఉన్న క్రైస్తవులు ప్రతి ఒక్కరూ దయచేసి.....

తండ్రీ, రోగులను స్వస్థపరచు గొప్ప గడియ ఇప్పుడు తిరిగి వచ్చెను. ఈ చిన్న ఎడారి పట్టణములో ఏదో ఒక విధముగా ఇక్కడ ఫీనిక్స్ వద్ద పోరాడాలని నేను చాలాసార్లు ప్రయత్నించాను, ఇక్కడ ప్రజలలో గొప్ప గందరగోళం కనిపిస్తోంది, ఇక్కడ నీకు మిగిలియున్న ఈ సంఘాన్ని, ఈ శేషమును ఇప్పుడు నీవు పిలుచుచున్నావు. ఓ, నిత్య దేవా, జీవమునకు కర్తా ఈ సమయమున ఇప్పుడు మాట్లాడుము.

ఇక్కడ రాత్రి కొద్దిమంది అయినా వారి పాపములు క్షమింపబడేందుకు నిన్ను ఎరుగని వారు ఉండవచ్చు. ఒకవేళ అలాంటి వ్యక్తి ఉన్నట్లయితే తండ్రీ...., (టేపు పై ఖాళీ ఉంది) ఆకుపచ్చ వెలుగు, నేను అక్కడికి వెళ్తాను. క్రీస్తు విరోధి గొప్ప కవాతు ప్రారంభమైంది. ఓ దేవా, కరుణించుము. కొంతమంది నశించు అబ్బాయి, అమ్మాయి, పురుషుడు, లేక స్త్రీ వారి పాపములు క్షమించబడుటలో నీతో మాట్లాడునట్లు నేటి రాత్రి అనుగ్రహించుము.

48

ప్రతీ ఒక్కరూ మీ తలలను వంచి ఉండగా. ఎవరైనా రక్షింపబడని వ్యక్తి ఉన్నట్లయితే కేవలం మీ చేతులు ఎత్తి అనండి, “సహోదరుడా బ్రాన్హాం, నేను రక్షింపబడలేదు మీరు నా కొరకు ప్రార్ధించాలని కోరుతున్నాను.” దానిని నేను ఇప్పుడే చేస్తాను. రక్షింపబడని వ్యక్తి. యవ్వనస్తుడా, దేవుడు నిన్ను దీవించును. అవతల వైపు నిన్ను చూస్తాను. అక్కడ నీవు మరియు, నీవు మరియు, నీవు ఎవరో ఒకరు... సహోదరీ, దేవుడు నిన్ను దీవించును. నీవు సహోదరీ నేను నీ చేతిని చూస్తున్నాను. యవ్వనస్థుడా, దేవుడు నిన్ను దీవించును, నేను నీ చేతిని చూస్తున్నాను. ఇక్కడ ఎవరైనా? చిన్న యవ్వనస్థురాలా, దేవుడు నిన్ను దీవించును. నేను నిన్ను చూస్తున్నాను. నా సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును. ఇక్కడ ఎవరో నా కుడి వైపున? అంటున్నారు “సహోదరుడా బ్రాన్హాం, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను తప్పక క్రీస్తు యొక్క అవసరత కలిగి ఉన్నాను. నేటి రాత్రి ఆయన నాకు అవసరం” దేవుడు నిన్ను దీవించును. అయ్యా, దేవుడు నిన్ను దీవించును. చిన్నపాప, దేవుడు నిన్ను దీవించును. మరియు, యవ్వన స్త్రీవైన నీవు. ఇంకా ఎవరైనా ఇక్కడ వెనక ఉన్నారా? నా సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును.

49

ఓ, స్నేహితులారా, మనకు పాత కాలపు ఉజ్జీవము అవసరమని మీరు చూచుట లేదా. మనకు ఆవేదనతో ప్రార్ధించు స్థలము... ఆ స్థానములో దేవుడు నిన్ను దీవించును...?... దేవుడు నిన్ను దీవించును, సహోదరుడా. మరియు సహోదరుడా నీవు ఔను, స్నేహితులారా, ఇప్పుడు ఇదే సమయం.

రాత్రి కొంచెం అలసి ఇక్కడ నిలుచుండగా. ఈ భవనములో పరిశుద్ధాత్మ కదలాడుటను నేను అనుభూతి చెందుతున్నాను. ఇక్కడ అది నిండి ఉండుటను నేను అనుభూతి చెందుతున్నాను. ఏది మానవ హృదయమునకు దోషారోపణ తెచ్చును? వచ్చే వారం ఇదే సమయమున మనం సమాధిలో ఉండవచ్చు అన్న గ్రహింపు కలిగి ఉందాము.

ఒక చిన్నబాబు కొన్ని రోజుల క్రితం ఇక్కడ ఆ మెట్ల మీద నిలుచుండెను. నీటి గుంతలో పడిపోయెను. మరియు రెండు గంటల తర్వాత వారు అతడిని బయటకు తీసెను, మరియు అతని చిన్న ఆత్మ నిత్యత్వములో ఉండెను. కేవలం ఎంత త్వరగా మీరు దేవుడిని కలుసుకొనుటకు వెళ్ళుదురో ఆలోచించుము స్నేహితులారా.

ఓ తండ్రి, నేటి రాత్రి మిమ్మల్ని ప్రేమించే మరియు రక్షింపబడాలని కోరుకునే వారి చేతులను మీరు చూసి ఉంటారు. దేవా, ఈ బబులోనును విడిచి చాలామంది ప్రజలు రాబోవుచున్నారు, మరియు రాజ్యములోనికి గందరగోళం వచ్చును. ఓ, ఈ గొప్ప చీకటి గడియ దేశము ముక్కలవుచుండగా ఇశ్రాయేలు మేల్కొనుచుండగా పరిశుద్ధ గ్రంధం ముందే చెప్పిన సూచక క్రియలు. ఓ, దేవా కరుణించుము. ఇప్పుడే వారు అక్కడ కూర్చుని ఉండగా మీరు వారి ఆత్మకు క్షమాపణా సమాధానమును దయచేయమని నేను ప్రార్థించుచున్నాను. దేవా, దానిని అనుగ్రహించండి.

దేవా, నేటి రాత్రి వారు అక్కడ వాళ్ల మోకాళ్లపై ఉండి మొఱ్ఱపెడుతూ, “దేవా, నాపై కృప చూపుము. నేను నేటి రాత్రి ఒక పాపిని నేను రక్షింపబడాలి అని కోరుచున్నాను. నీ హెచ్చరిక స్వరమును నీవు పంపుతున్నావని నేను నమ్ముతున్నాను. మరియు నేను రక్షింపబడాలి అని కోరుచున్నాను.” అని చెప్పేంతవరకు వారు పడక యొద్దకు వెళ్లకుందురు గాక. దేవా, దానిని అనుగ్రహించుము. దేవా వారు వినయముతో నీ వద్దకు వచ్చి మరియు రక్షింపబడుదురుగాక. దీనిని నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను ఆమెన్...?...

50

ప్రతి ఒక్కరి లోతైన ఏకాగ్రతను నేను కోరుచున్నాను. ఒకవేళ అవిశ్వాసి ఉన్నట్లయితే, ఇప్పుడు ఈ భవనములో ఉండవద్దు. నేను ప్రసంగీకుడను కాను. నేను రోగుల కొరకు ప్రార్థించుటకు వచ్చాను. మరియు ప్రతి విషయము చాలా మర్యాదగా ఉండవలెను. ఇప్పుడు తల్లులైన మీరు మీ పిల్లలను మీ దగ్గరకు తీసుకోండి. ఏమి జరుగునో మీకు తెలుసు. దానిని మీరు ఇంతకు మునుపు కూడికలలో చూసి ఉన్నారు. కొన్నిసార్లు ఈ దయ్యములు అప్పుడే బయటకు వచ్చి మరియు అప్పుడే ఈ ప్రజలలోనికి వెళ్ళును. మరియు అవి ఒకరి నుంచి మరొకరికి వెళ్లును. మరియు అవి కూడిక తర్వాత కూడిక వెంబడించి ప్రార్ధన వరుసలోనికి రావడానికి ప్రయత్నించును.

ఎప్పుడో నాకు తెలియదు. నేను విదేశాలకు వెళుతున్నాను. ఫీనిక్స్ లో ఉండుట నా ఆఖరి సమయం అవ్వచ్చు. కనుక నాకు తెలియదు. మరియు నాకు ఇది తెలుసు గనుక, నేను మీకు సహాయం చేయాలని కోరుచున్నాను: కనుక నేను ఇక్కడి నుండి వెళ్ళినప్పుడు నాతో మీరందరూ అంటారు “నిజంగా యేసు నన్ను పంపెను”అని. మరియు నేటి రాత్రి నేను చేయగలిగినదంతా మీ కొరకు చేయుదును. నాకు మీ సహకారం కావాలి.

51

ఇప్పుడు, చూడుము. మీ సహోదరితో ఉన్న సంగతి ఏమిటి? అది మీ సమస్యా? ఏమంటారు? ఇప్పుడు, చూడుము, ప్రియ సహోదరీ, సందేహం లేదు కానీ నీవు బాగు అవ్వడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించావు.

కొంతమంది కుష్టు రోగులు ద్వారం దగ్గర కూర్చుని అడుక్కొనుచుండెను. అషూరీయులచే ఆ నగరం ముట్టడించబడెను.

వారు అనెను “మనం చనిపోయేవరకు ఎందుకు మనం ఇక్కడ కూర్చోవాలి? మనం నగరానికి వెళ్ళుదాము. అక్కడ తినడానికి ఏమీ లేదు.” వారు పస్తులతో ఉండెను; వారు ఒకరి పిల్లలను ఒకరు తింటున్నారు. మరియు వారు అక్కడ కూర్చుని ఉంటే వారు నిశ్చయముగా చనిపోవుదురు. వారికి ఒకే ఒక అవకాశం ఉండెను. అది శత్రువుల గుడారం వద్దకు వెళ్ళటమే. మరియు వారు అన్నారు, “వారు మనల్ని చంపితే మనం ఏవిధముగానైనా చనిపోవుదుము. ఎందుకనగా ఇక్కడ కూర్చున్నా మనం చనిపోవుదుము. మనం ఆ మార్గమున వెళ్ళినట్లయితే, వారు మనల్నిచంపిననూ మనం కేవలం మన కష్టం నుండి బయట పడతాము. ఎందుకనగా ఏవిధంగానైనా మనం చనిపోవుదుము. కానీ వారు మన మీద దయ కలిగి ఉంటే, ఎందుకు... వారు ... మనం బతుకుతాము.”

52

మరియు వారు అక్కడికి వెళ్లిరి. మరియు యోగ్యమైన ఆ విధమైన విశ్వాసముపైన దేవుడు వారిని సన్మానించెను. మరియు గొప్ప శబ్దములు ఎడారిపై వచ్చుటకు దారితీసెను. మరియు ఇశ్రాయేలు వారు మరికొంతమంది సైనికులను అద్దెకు తెచ్చుకున్నారని వారు అనుకుని మరియు వారు పారిపోయెను.

మరియు వారు గుడారములోనికి వెళ్లి మరియు జీవమును, ఆహారమును, ద్రాక్షారసమును, కనుగొనెను. మరియు వారి సొంత జీవితములను రక్షించుకొనుటయేకాక నగరములోని జీవితములను రక్షించెను.

ఇప్పుడు, నేటి రాత్రి నేను మిమ్మల్ని శత్రువు ఇంటికి రమ్మని అడగడం లేదు. నీవు క్షయ వ్యాధిగ్రస్తుడవు అని నేను గ్రహించాను. మరియు ఇక్కడ ఇది మంచి స్థలమై, ఆరోగ్యకరమైన వాతావరణం అయినా, మరియు నీవు.... ఆ మార్గమున ఉన్నా, మరియు నీవు క్షయ వ్యాధిగ్రస్తుడవు గనుక నీవు నిశ్చయముగా చనిపోతావు. అది సరియే. నీవు దానిని గ్రహించవలెను.

ఇప్పుడు, నీవు..... నీవు.... నీవు దేవుడిని నమ్మవలెను, నీవు నమ్ముతావా? ఇప్పుడు, నీకు దేవుడిని నమ్మినప్పుడు, నీవు నన్ను నమ్ముము. ఏదనగా దేవదూత క్రిందకు దిగివచ్చి దానిని నాకు చెప్పెను అని. దాని కథ నీవు విన్నావు, విన్నావా సహోదరి? అది ఎలా వచ్చింది అన్న కథ మీరు వినే ఉంటారు? ప్రభువు దూత నా యొద్దకు వచ్చెనా ? ఔను.

53

నేను గదిలో కూర్చుని ఉన్నప్పుడు. బాలుడిగా ఉన్నప్పుడే, నాపై ఒక పిలుపు కలిగియుండెను. నేను గదిలో కూర్చుని ఉన్నప్పుడు [టేపు పై ఖాళీ ఉంది] నేలమీద కొడుతుండగా ఒక అతీతమైన వ్యక్తి గదిలోకి నడుస్తూ వచ్చెను. ఆయన దేవుని సముఖము నుండి పంపబడ్డాడని దూత చెప్పెను. ఆయన చెప్పెను. “నీవు ప్రార్థన చేసినప్పుడు యదార్ధంగా ఉండి ప్రజలు నిన్ను నమ్మునట్లుగా నీవు చేయగలిగితే నీ ప్రార్థన ముందు ఏదీ నిలువలేదు, కాన్సర్ అయినా కూడా.”

అప్పుడు మీరు నన్ను అడగవచ్చు, “సహోదరుడా బ్రాన్హాం ప్రతి ఒక్కరూ బాగవుదురా?”

నిజముగా నమ్మిన ప్రతి ఒక్కరూ బాగవుదురు. వేల మంది స్వస్థపడెను. [టేపు పై ఖాళీ ఉంది]

ఇప్పుడు, మీరు విముక్తులయ్యారు. అది నీ భార్య, అవునా? అది నా భార్య అయినప్పుడు ఏ విధంగా నేను ఆలోచిస్తానో ఏ విధముగా నేను అనుభూతి చెందుతానో నేనెరుగుదును.

నిజముగా, ఒక రోజు నా భార్య పెట్టెలో పడిఉండెను. క్షయ వ్యాధిగ్రస్తురాలు. అదిసరే. ఆ కారణం చేతనే ఆ దెయ్యమును నేను ద్వేషిస్తున్నాను మరియు అతడు నన్ను ద్వేషించును. సంవత్సరాల క్రితం నా కుటుంబము విచ్చిన్నం చేసినవాడు అతడే. మరియు బ్రతికియున్న ప్రియమైన దానిని నా నుండి తీసుకొనెను. మరియు నేడు ఆ కారణం చేతనే, అతనిపై నేను శక్తి కలిగి ఉన్నప్పుడు వాడు ఎగిరిపోవడాన్ని చూచుటను నేను ప్రేమిస్తున్నాను.

మరియు నా ప్రియ సహోదరుడా; నేను మీకు చెప్తాను; మనం జీవితములో ఎన్నడూ కలుసుకోకపోవచ్చు. కానీ నీ ప్రియమైన భార్య ఈ దూత వచ్చి మరియు దీనిని చెప్పెనని తన హృదయం అంతటితో నమ్మినయెడల, నీ భార్య బాగవును, మంచి సంతోషకరమైన స్త్రీగా ఉండును. ఇప్పుడు, సహోదరి, నీ హృదయం అంతటితో నమ్ముము. నీ సొంత శక్తితో, అక్కడి నుండి పైకి లేచి, భవనములో నడిచి మరియు నీ మంచమును వదిలే సామర్ధ్యం నీకు ఉండును. రేపు నీ పనిలో నీవు వుందువు. క్యాన్సర్‌తో అక్కడే కన్నుమూసిన (మరియు తిరిగి లేచిన- తెలుగు తర్జుమాదారుడు) ఇక్కడ ఉన్న స్త్రీ లాగా.

54

ఇప్పుడు క్యాన్సర్ కన్నా క్షయను స్వస్థపరచుట దేవునికి కష్టం కాదు. అది సరియే. ప్రకంపన ఆగిపోయి, క్యాన్సర్ చనిపోవుటను చూసి స్త్రీ లేచి, దేవుని నమ్మి మరియు వెళ్లెను. నేను ఆమెకు ఏమి చెప్పానో దానిని ఆమె నమ్మెను. అది సరియేనా? నా సహోదరీ. మరియు నేను ఏమి చెప్పానో ఆమె నమ్మెను, ఆమెలో క్యాన్సర్ కణం అక్కడ చనిపోయింది. ఆమె వైద్యుడు ఆయన నేటి రాత్రి ఈ భవనములో ఉండవచ్చు. నేను వచ్చుటకు నా కొరకు ఆయన కబురు పంపెను, ఆయన నా చేతిని కరచాలనం చేయుటకు ఇష్టపడుచున్నానని ఆయన చెప్పెను. ఆ స్త్రీ ఎక్సరేలను నాకు చూపవలెనని కోరుకునెను. అది సరియే.

ఇప్పుడు, ఆమె నమ్మినట్లయితే, మీరు నమ్మరా?

సేవకుని నుండి ఒక ఉత్తరం నాకు వచ్చెను, ఇక్కడ ఎక్కడో తెలియదు... అది స్పానిష్ సంఘం. దాని ఫైల్ నాకు వచ్చెను. అది ముందు మరియు వెనుక ఉన్న దృశ్యం. ఆయన ఇక్కడ క్షయతో నిలబడి ఉన్నాడు. అత్యంత వికారమైన దృశ్యాలలో ఒకటి. ఊపిరి తీసుకోలేకపోతున్నాడు; అతడు చాలా నీరసముగా ఉండెను. మరియు ఆయన అక్కడికక్కడే స్వస్థపడెను. క్యాన్సర్. దేవుడు ఎలా...అతని సాక్ష్యం డాక్టర్ల సమాచారం... కింద ముగ్గురు లేక నలుగురు డాక్టర్ల పేర్లు ఆ విధంగా ఉండెను. క్యాన్సర్ నుండి సంపూర్ణముగా అతడు బాగుపడెను.

55

అది ఒక్కటేనా? వందలకొలది ఎక్స్ రేలు. మరియు దానిలో ఒకటి మీరు చూడబోవుతున్నారు... ఇప్పుడు కూడికలలో మీరు ఇక్కడ, దాదాపుగా డబ్బై నుండి ఎనభై శాతం ప్రార్ధన వరుస గుండా వచ్చిన వారు, తొంభై దినముల సమయములో స్వస్థపడి బాగుపడెను. మరియు ముప్పై శాతం వారు బాగుపడలేదు. ఇప్పుడు మీరు వారిలో ఏదో ఒక వైపు వారు అయి ఉంటారు. నేటి రాత్రి మనం డబ్భై శాతం వైపు ఉండి, మరియు బాగుపడుదాము. దేవుడు మిమ్మును దీవించును.

ఇప్పుడు, సహోదరుడు మరియు పరిస్థితులు... సహోదరుడు జోసెఫ్ ఎక్కడ? అతను ఎక్కడ ఉన్నాడు? ధన్యవాదములు. సహోదరుడు జోసెఫ్ ప్రార్ధన కార్డులను తీసుకోవాలని నేను కోరుతున్నాను, ఎందుకనగా అతనికి తెలియదు. అతడు స్పానిష్ మాట్లాడలేడు. అతడు అతని మాటలు పలుకగలడు.

ఇప్పుడు, మీలో మిగిలిన వారు ఏమి చేయవలెనని నేను కోరుతున్నానో నేను మీకు చెప్తాను. మీరు అవిశ్వాసి అయినట్లయితే... ఇప్పుడే, ఇక్కడే, ఆడిటోరియములో ఈ ఆఖరి కూడికలో మీరు గుర్తుంచుకొనండి. నేటి రాత్రి ఒక పురుషుడు అయి ఉండవచ్చు ఈ భవనములో దయ్యము అతనిపై వచ్చును. మరియు అతడు లేచి మరియు అనెను “ఫీనిక్స్ లో అది సైకాలజీ అని”. ఆ పురుషుడు పడమర వైపు గుండా దిగివచ్చి కూడికలలోనికి రావడానికి ప్రయత్నించెను.

మరియు గతరాత్రి, శాంటా రోసా, అతని భార్య అక్కడికి వచ్చి మరియు సహోదరుడు బ్రౌన్ మరియు నన్ను పట్టుకొని మరియు మేము నడుస్తున్న దారిలో దాదాపు పడిపోయెను. మరియు అక్కడ ఆమె భర్త అక్కడ కూర్చుని మరియు అతని కళ్ళు ఉబికి వచ్చెను, ఒక ఫీనిక్స్ వ్యక్తి, అరిజోనాఫినిక్స్ నుండి. నేటి రాత్రి ఈ భవనములో ఆ వ్యక్తి ఉన్నాడా? నీవు ఉన్నట్లయితే నీ చేతిని పైకి లేపుము. అక్కడ అతని...[టేపుపై ఖాళీ ఉంది] ఆ మనిషితో నలభై-ఐదు నిమిషాల పాటు అక్కడ ఉన్నాను. తర్వాత దయ్యము అతని నుండి వచ్చెను. అతడు అతని సరియైన మనసుతో ఉండి, ఇంటికి తిరిగి వెళ్లెను. అది సైకాలజీ అని అతడు అనెను. కానీ కొన్ని రోజుల్లో అతడు ఒక హాస్యాస్పదమైన అనుభూతిని పొంది.....అతని మీదకు వచ్చెను. మరియు అతడు అక్కడ నడుస్తూ వెళ్ళెను... పోలీసులు ఇక్కడ నగరములో అతడిని పట్టుకునెను.

56

ఇప్పుడు, మీరు విశ్వాసి అయినట్లయితే ఈ భవనములో ఉండండి. కానట్లయితే మీరు ఉండవద్దు. అది మీరు ఎక్కడ ఉన్నా బయట ఉండండి. ఇప్పుడు నా పిలుపు మీరు వినేంత వరకు మీరు మీ తలలు వంచి ఉండండి.

ఇప్పుడు, ఇది మూఢభక్తి కాదు. అలా దానిని అనుకోవద్దు. ఇది మూఢభక్తి కాదు. తీర్పు దినమున మన సమాధానం దేవుడు కలిగియుండును. అది నిజమేనా? అందరి హృదయ రహస్యములు తెరవబడినప్పుడు.

మరియు నేను మీకు చెప్పియున్నాను, దేవుడు ముందు దానిని చేసి ఉండెను. మరియు మీరు అత్యంత మర్యాదగా మరియు మీ తల వంచి యుండుము. మరియు ఈ మైక్రో ఫోన్ లో “మీ తలను ఎత్తుము” అని చెప్పే నా స్వరం మీరు వినేంత వరకు.

అప్పుడు ఒకవేళ ఏదైనా జరిగితే, అద్భుతం. అద్భుతములు నా స్వాధీనములో లేవు. ఏమైతే... నా వరము అద్భుతములు కాదు; నా వరం స్వస్థత; మీకు అందరికీ అర్థం అయిందా, మీకు అర్థం కాలేదా? ఆత్మీయ వరములు తొమ్మిది ఉన్నాయి. కానీ చాలా సార్లు, దేవుని దూత అద్భుతం చేయును.

57

ఇక్కడ ఆ రోజున చాలా రోజుల క్రితం కాదు, ఎంతమంది జ్ఞాపకం ఉంది, నేను అక్కడ నిల్చుని మరియు సవాలు చేశాను, అద్భుతముల వరుసలోనికి దేనినైనా తీసుకురండి. ప్రసంగీకులు నేరారోపణ క్రిందకు వెళ్లి అక్కడ పడెను. వేదిక వద్దకు వచ్చి మరియు అది ఒకవేళ ఆయన చిత్తమైతే, ఆ ప్రజలందరినీ స్వస్థపరచుటకు అద్భుతాలు చేసే వరుసలోనికి రమ్మని పిలుస్తాము . ఒకవేళ అది ఆయన చిత్తము కాకపోతే, దేవుని దూత నన్ను కలిసి అది నాకు వద్దని చెప్పును.

మరి ఏమి జరిగెనో ఎంతమంది జ్ఞాపకం ఉంది. ఆడిటోరియములో అది ఉందా? వినికిడి లోపం ఉన్న వ్యక్తి కూడా చెవిటివాడు ఆయెను. ఒక చిన్న పాప, అదే విధంగా అది సరియేనా? అది సరియే.

ఇప్పుడు, మీరు చూడండి, నేను గమనించాను. నేను సంపూర్ణ పరిశుద్ధాత్మ నడిపింపును అనుభూతి చెందినప్పుడు, నేను అప్పుడు మాట్లాడుదును.

ఇప్పుడు, నేడు నా అంతట... మేము నగరం చుట్టూ తిరిగాము, నా భార్యను మరియు వారు నగరం చుట్టూ తిరిగాము.

58

ఇప్పుడు, గమనించుము. రేపు, నేను ప్రార్థనలో ఉండబోవుచున్నాను. రేపు రాత్రి దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటారు. కానీ నేటి రాత్రి, ఇప్పుడు ప్రార్ధన వరుసలో ఉన్న మీరు, మీరు .....మీరు.... సహోదరుడు జాయ్ ఏ విధంగా వరుస క్రమములో ఉండాలో మీకు చెబుతాడు. మరియు మీరు ఒకరి తర్వాత ఒకరు రావలెను.

మరియు ఇప్పుడు, దీనిని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. దేవుని సహాయం చేత ఈ ద్వారం గుండా వెళ్ళు ప్రతి జబ్బు పడిన వ్యక్తి కొరకు ఫీనిక్స్ నేను విడిచి పెట్టుటకు ముందుగా ప్రార్ధిస్తాను. మరియు నేను చేయగలిగిందంతా నేను చేస్తాను. దాని అర్థం మీ కొరకు ప్రార్థిస్తాను. ఈ భవనం విడిచిపెట్టుటకు ముందుగా వచ్చి నాకు తెలిసినంత వరకు చాలా మంచిగా మీ కొరకు ప్రార్థిస్తాను.

ఇప్పుడు, నేను మీకు చెప్పిన ఈ సంగతులు మీరు నమ్ముచున్నారా?(ప్రార్థన చేసే పక్కకు ఇలా రండి. ఇక్కడ ప్రార్థనా వరుసలో నేను కొందరిని కోరుచున్నాను.)

ఈ సంగతులు సత్యములని మీరు నమ్ముతున్నారా? మరియు ఇప్పుడు, నేను దేవుడిని యదార్ధముగా నా హృదయం అంతటితో అడిగితే అదే విధముగా ఆయనను మీరు నమ్మితే [టేపు పై ఖాళీ ఉంది] మీరు బాగుగా అవుతారా? దానిని మీరు నమ్ముతున్నారా? అది సరియే. ఇప్పుడు ప్రతి ఒక్కరు వారితలలు వంచాలని నేను కోరుతున్నాను.

తండ్రీ, మా మధ్య మీ దూతను పంపమని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మరియు మీ దాసుని... నేటిరాత్రి, కానీ ఆ రాత్రి ఎవరైతే నన్ను గదిలో కలుసుకుని మరియు ఈ సంగతులన్నీ జరిగి ఇప్పటికి ఇరవై రెండు నెలలు. నా చేత నిలబెట్టిన ఆ దేవదూత ఇప్పుడు నేటిరాత్రి ఆయన నా వైపు నిలబడాలని నేను ప్రార్థిస్తున్నాను. మరియు ఆయన దేవుని విషయములను తీసుకొని మరియు వాటిని మీ దాసునితో మాట్లాడమని...[టేపు పై ఖాళీ ఉంది] మా మధ్యన ఉండును గాక. మీరు పొందబోవుచున్నారు...?...నేను మరొకసారి ప్రయత్నించుచున్నాను, కనుక నేను యేసు నామమున వచ్చుచున్నాను...[టేపుపై ఖాళీ ఉంది]

ఓహ్, దేవా నాకు సహాయం చేయుము. మరియు సమస్త ఘనత మరియు మహిమలు నేను నీకు ఇచ్చుచున్నాను. యేసు నామమున దానిని అడుగుతున్నాము. ఆమెన్.]

59

ఇప్పుడు మీ తలను మీరు ఎత్తవచ్చు? నేను ప్రార్థన కొరకు గదిలోనికి వెళుతుండగా నేను కేవలం అడుగుతున్నాను…[టేపు పై ఖాళీ ఉంది].

[ఒక స్పానిష్ సేవకుడు మాట్లాడుచుండెను.]

ఇప్పుడు, ప్రతి ఒక్కరు మర్యాదగా ఉండండి. మరియు మీ తలలు వంచండి. ఇప్పుడు చాలా మర్యాదగా ఉండండి. ఇప్పుడు దేవుడు అద్భుతమును చేయవలెననిన ఇప్పుడు చాలా గౌరవముతో ఉండండి. ఇప్పుడు నేను మొదటగా తెలుసుకోవాలని కోరునదేమనగా దీనిని మీరందరూ హృదయపూర్వకముగా గట్టిగా నమ్ముతున్నారా? అలాగయినట్లయితే, ఇప్పుడు మీ చేతులను పైకెత్తుము. మరియు ఇప్పుడు....ఇప్పుడు కేవలం నేను కొద్దిసేపు మీతో మాట్లాడుతుండగా మీ తలలను వంచుము. [టేపుపై ఖాళీ ఉంది].

ఇతరులను దీవించుటకు నాకు సహాయం చేయుము. ప్రభువా, దానిని అనుగ్రహించుము. ఇప్పుడునా సహోదరుడు ఇక్కడ నిలుచుని ఉండగా నీ దాసుడు మధుమేహముతో బాధపడుతున్నాడు. రక్తం ఇప్పుడు చక్కెరగా మారిందని గ్రహించెను. కేవలం మరికొన్ని మలుపులు మరియు చిన్న స్థలము, మరియు చేతులు మరియు పాదములు వాలి ఉండెను. మరియు సాతాను గెలుపొందెను. దేవుని సేవకుడు తన మిగిలిన జీవితం తక్కువ చేసిన ఎడల పడి ఉండును. ఇప్పుడు, దేవా ఏ సందేహమూ లేదు. ఆయన చాలా విషయములను ప్రయత్నించెను. కానీ నేటిరాత్రి ప్రయత్నించుటకు రాలేదు. నేటి రాత్రి స్వస్థపడుటకు వచ్చెను. దానిని అనుగ్రహించుము, తండ్రీ. నా ప్రార్థన మీరు వింటారని నేను ఎరిగి ఉన్నాను. గుడ్డి వారి కన్నులు తెరుచుటకు మరియు మూగ మరియు చెవిటి వారు మరియు కుంటివారు కొరకు మీరు ఇక్కడ ఉన్నారు. ఎంత ఎక్కువ జీవపు రక్తమును నా సహోదరునికి ఇవ్వవలెను. నేను ఇప్పుడు ఈ మధుమేహమును గద్దిస్తున్నాను. యేసు నామమున ఈ మనిషిని వదిలివేయుము. నీవు ఎక్కువ కాలం అతనిని పట్టి ఉంచితే దేవుడు రెట్టింపు శిక్షను ఇచ్చును గాక. అతని నుండి బయటకు రమ్మని యేసుక్రీస్తు ద్వారా అడుగుతున్నాను.

అయ్యా, మీరు ఎలా ఉన్నారు? వైద్యులు చెప్పిన దానిపైన ఆధార పడ్డారా? నీవు దానిని అంగీకరించిన......[టేపు పై ఖాళీ ఉంది]

60

ఇప్పుడు, సమస్యతో బాధపడుతున్న నా సహోదరుని వైపు చూడుము. అతనిని విడిపించి అతనిని బాగు చేయుటకు మీరు ఇక్కడ ఉన్నారు. మీరు తప్పిపోరు. మీరు నిత్యత్వము వరకు దేవుడే. కాలములు గతించిపోవుచున్నవి. మీరు మనుషులను లేపి మనుషులను తీసుకుని; రాజులను తయారుచేసి, మరియు తీసుకుని... [టేపు పై ఖాళీ ఉంది] వరములు పంపుము. మీరు పైకి వెళ్లి మరియు మనుషులకు వరములు ఇవ్వుము. ఇప్పుడు నా సహోదరుడు బాధపడుచున్నాడు. తండ్రీ యదార్ధముగా నా హృదయమంతటితో నేను ప్రార్థించుచున్నాను మీరు అతడిని స్వస్థపరచుము. నేను ఈ ఆస్తమా దగ్గును యేసుక్రీస్తు నామమున గద్దిస్తున్నాను. మరి ఎన్నడూ తిరిగి రాకుండా అది అతనిని విడిచిపెట్టును గాక [టేపుపై ఖాళీ ఉంది]...?... వారితో ఏ తప్పిదము ఉన్నదో వారికి చెప్పుము. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకొనుము. మేము వైద్యుల వద్ద నుండి వచ్చాము. మీరు కష్టముగా దానిని సమీపించినట్లయితే దేవుడు ఏది చెప్పాడో దానినే నేను చేస్తాను అని నేను చెప్పాను.

వారు బిడ్డను లోపలికి తెచ్చారు, తన చేతిని నాపై పెట్టారు... ఇప్పుడు, జ్ఞాపకముంచుకొనుము. అది శక్తివంతమైన మాధ్యమం గుండా ప్రసారమైంది. మరియు వారి వైద్యుడు వినుచుండెను. మరియు వారు అంతకుముందు రోజు వైద్యుని వద్దకు వెళ్ళెను.

నేను అన్నాను, “అవును అయ్యా, ఆ చిన్న బిడ్డ బలహీనమైన కిడ్నీ కలిగియుండెను. రాత్రిపూట పరుపును తడిపి వేయుచుండెను. మరియు ఇంకొక విషయం ఈ మధ్య ఆహారమునంతా వాంతి చేసుకొనుచుండెను, ఎందుకనగా అతడు తన కడుపులో నొప్పి కలిగి ఉన్నాడు.”

అతడు అనెను “సహోదరుడా బ్రాన్హాం.” అనెను, “వైద్యుడా, నీవు దానిని వినుము.” అక్కడ వారు వైద్యుడు వారికి ఏమి చెప్పెనో అదే వారు చెప్పెను. అనెను, “ఇప్పుడు, నా భార్య” ఆమె వచ్చి ఉండెను.

నేను అన్నాను, “ఆ బిడ్డ కిడ్నీ సమస్యను తల్లి నుండి పొందుకొనెను, ఎందుకనగా ఆమె కూడా కిడ్నీల సమస్యతో ఉన్నది. మరియు ఇంకొక విషయం, మీరు ఒక నిజమైన అలసిపోయిన భయానక అనుభూతిని ఎల్లవేళలా కలిగియున్నారు, మీరు కలిగి ఉండలేదా.” నేను అన్నాను,“నీ వయసు నలభై సంవత్సరాలు ఉండవచ్చు. మీరు జీవన మార్పు గుండా వెళుతున్నారు.

మరియు అనెను, “ వైద్యుడు నాతో చెప్పినది అదే.”

61

ఇప్పుడు, అతడు నాతో అనెను... అతడు తన చేతిని అక్కడ ఉంచెను; అతడు యజమాని, మాధ్యమ యజమాని. మరియు అతడు... నేను అన్నాను, “మంచిది, నీవు కలత చెందుతున్నావు. మరియు నీవు దేని గురించి ఆలోచిస్తున్నావో అది ఇదే. కానీ ఒక విషయము, నీవు క్షయ కలిగియున్నావని అనుకుంటున్నావు, కానీ నీవు పార్స్వ శూల నొప్పులను నీ ప్రక్కన కలిగియున్నావు.”

ఆయన అనెను, “అది కేవలం...” (వైద్యుడు వినుచుండెను), “అది ఖచ్చితముగా నిన్న వైద్యుడు నాతో చెప్పినదే.”

నేను అన్నాను, “ఇక్కడ ఒక విషయమును వైద్యుడు నీతో చెప్పియుండలేదు.” నేను అన్నాను, “నీవు రెండు అభిప్రాయముల మధ్య ఊగిసలాడుచున్నావు. నీవు దేవునికి సేవ చేస్తునాను అని అనుకుంటున్నావు మరియు ఈ ప్రసారమును ఈ విధముగా ఉంచడము ద్వారా దాన్ని చేయాలనుకుంటున్నావు. కానీ నీవు పిలుపును కలిగి ఉన్నావు. మరియు నీవు పరిచర్య లోనికి వెళ్లాలని కోరుచున్నావు. ”మరియు నేను అన్నాను, “ప్రసారమును గూర్చి మర్చిపోయి మరియు కోత పొలమునకు వెళ్ళమని నేను నీకు సలహా ఇస్తున్నాను.”

అతడు తన చేతులను నా చుట్టూ వేసి మరియు అక్కడే గట్టిగా అరిచెను. మరియు ఆ మనిషి ఇక్కడ బాస్వర్త్ సంఘములోని సభ్యుడు. అది సరియే. మీరు అక్కడే ఉన్నారు.

కనుక మీరు చూడండి, అది పరిపూర్ణమైనది. దేవుడు అబద్దమాడడు ఎందుకనగా ఆయన దేవుడు. అది నిజమేనా? ఇప్పుడు, అది నేను కాదు; అది ఆయన. ఇప్పుడు, మీ హృదయమంతటితో మీరు నమ్ముదురా? ఆమెన్. ఇప్పుడు, ప్రతీ ఒక్కరూ మీ తలవంచి మరియు భక్తి పూర్వకముగా ఉండండి.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...