ఎందుకొరకు పరిశుద్ధాత్మ ఇవ్వబడినది?

ఎందుకొరకు పరిశుద్ధాత్మ ఇవ్వబడినది?

మీరు చూడండి, హస్తనిక్షేపణమును సహోదరుడు నెవిల్ నమ్ముతాడు.

నా వద్దకు కొన్ని ప్రశ్నలు వచ్చియుండుటను నేను చూస్తున్నాను. ఇప్పుడు, రేపు రాత్రి నేను వీటిని చూస్తాను, ఎందుకనగా మీ కొరకు ఈ రాత్రి వాటిని చూడటానికి నాకు సమయం లేదు, బహుశా గత రాత్రి వర్తమానముపై కావచ్చును. ఇప్పుడు, ఏ వర్తమానమును గూర్చియైనా ఎవరికైనా ఒక ప్రశ్న ఉన్నయెడల, కేవలం వాటిని ఒక రాత్రి ఉంచండి, మరియు మరుసటి రాత్రికి నేను వాటిని తీసుకోగలను.

2 ఇప్పుడు, రేపు రాత్రి, సాధ్యమైతే కొంతమంది సేవకులను, లేదా, అవసరమైన సమయంలో, మనం పిలువగలుగునట్టి; కొంత మంది మంచి, ధృడమైన పురుషులు లేదా స్త్రీలను కనుగొనుటకు లేదా, కలిగియుండుటకు నేను ఇష్టపడుచున్నాను, తద్వారా ఆ కార్యక్రమంలో…

రేపు రాత్రి, వర్తమానము తర్వాత, మేము, పరిశుద్ధాత్మ కొరకు, హస్తనిక్షేపణమును ప్రారంభిస్తాము. మరియు పిదప, అక్కడ ఒక…మీరు కోరినయెడల, అంతగా తృష్ణ ఉంటే, ఈ సెలవు దినాలన్నీ మీరు ఇక్కడే ఉండే భాగ్యమును మీరు కలిగియున్నారు. మరియు పిదప—పిదప, అట్లు కాకుండా, మీరు మీ స్వంత గృహానికి వెళ్ళగోరితే, మంచిది, మేము సంతోషిస్తాము, మీరు ఇటువంటి ఒక చోటుకి వస్తే…కేవలం ఎక్కడికి వెళ్ళాలో తెలియకుంటే…

మేము కొంతమంది సేవకులను, వారి నంబర్లను కావాలని కోరుచున్నాము, వారు సందర్శకులైనయెడల; వారు వెంటనే మాకు దొరుకునట్లు, వారి నంబర్లు, మరియు వారు ఎక్కడ ఉంటున్నారన్నది కావలెననియున్నాము; మరియు మనం మాట్లాడుకొనుచున్న, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అను ఈ గొప్ప ఆశీర్వాదమును, వెదకబోవుచున్నవారైన మీకు, వారు సూచనలు ఇవ్వగలుగునట్లు ఒకరిని ఒక గృహములో, మరొకరిని మరొకదానిలో మరియు మరొకరిని మరొకదానిలో ఉంచెదము.

3 గత రాత్రి, “అది ఏమిటి” అన్న దాని గూర్చి మనం మాట్లాడుచుంటిమి. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? మరియు అది సరిగ్గా దేవుడు మనకు వాగ్దానము చేసిన ప్రతీది అయ్యున్నదని, మనము కనుగొన్నాము. అహ-హ. దేవునియొక్క సంఘమునకు సరిగ్గా ఏమి అవసరమో దానిని మనం అందులో కనుగొన్నాము. అది ఒక ముద్రయని, ఒక ఆదరణ కర్త అని, విశ్రాంతియని, మరియు ఆనందము అని, మరియు శాంతియని, మరియు పునరుత్థానము అని మనము కనుగొన్నాము. మరియు దేవుడు తన సంఘమునకు వాగ్దానం చేసినవన్నియు, పరిశుద్ధాత్మలో ఉన్నాయి.

4 మరియు ఇప్పుడు, ఈ రాత్రి, మేము బోధించాలనుకున్నది, లేదా మాట్లాడాలనుకున్నది, బోధించాలనుకుంటున్నది…దానిపై, దాదాపు మూడు లేదా నాలుగు కాగితాల పాఠ్యభాగాలను లేదా లేఖనాలను, నేను ఇక్కడ కలిగియున్నాను, అందులో…గత రాత్రి నేను నా క్రూడెన్స్ అక్షర సూచికను ఇక్కడ వదిలిపెట్టాను, మరియు అది నాకు దొరకలేదు. మరియు నేను ఈ రోజు లేఖనాల గుండా వీలైనంత ఉత్తమముగా పరిశీలించవలసి వచ్చినది. ఇప్పుడు, మరియు రేపు…ఈ రాత్రి మేము బోధిస్తున్నది ఏమిటనగా: పరిశుద్ధాత్మను పంపుటలో దేవుని యొక్క ఉద్దేశ్యం ఏమిటి? అది దేని కొరకు? అది అంత గొప్ప విషయమైనయెడల, మరప్పుడు దేవుడు దానిని ఎందుకొరకు పంపాడు?

5 పిదప, రేపు రాత్రికి మేము మాట్లాడగోరేది ఏదనగా: అది మీ కొరకేనా? మరియు మీరు దానిని ఎలా పొందుకుంటారు? మరియు మీరు దానిని పొందుకున్నప్పుడు మీకు ఎలా తెలుస్తుంది?

మరియు పిదప, లేఖనాల ద్వారా, మనం దానిని పరిశీలించి, అన్నిటికి లేఖనాలను ఉపయోగించుచు, దానిని లేఖనాల ద్వారా వివరించిన తర్వాత, అప్పుడు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టేవారు ముందుకు వస్తారు. మరియు పిదప పరిశుద్ధాత్మతో కొనసాగుటకు, అప్పటి నుండి, ఉజ్జీవము ప్రారంభమవుతుందని నేను ఆశిస్తున్నాను.

6 ఇప్పుడు, రేపు రాత్రి చాలా మంది చర్చిలోని గదుల వద్ద కొంచెము ఎక్కువసేపు ఉండవచ్చు గనుక, వీలైనంత ఎక్కువమంది సేవకులను మరియు పరిశుద్ధాత్మను పొందుటకు ప్రజలను నడిపించడంలో అనుభవజ్ఞులైన వ్యక్తులను పొందగలిగితే బాగుండునని నేను భావిస్తున్నాను, వారిని ప్రోత్సహించుటకు, ఒక—ఒక స్త్రీ మరియు ఆమె భర్తతోపాటు, ఆ గృహములోనికి వెళ్ళుటకు, లేదా—లేదా పరిశుద్ధాత్మను వెదకుచున్న ఇంకెవరితోనైనా వెళ్ళుటకు, బాగా తర్ఫీదు పొందినవారు కావలెను.

ఈ రోజు రాత్రి లేదా రేపు రాత్రి, మీరు కేవలం మీ ఫోన్ నంబరును లేదా చిరునామాను పాస్టర్‌ గారికి ఇస్తే చాలు. కేవలం దానిని సహోదరుడు నెవిల్ కు ఇవ్వండి, అది మనకు ఒక కూటమి సమయాన్ని ఆదా చేస్తుంది. కేవలం మేము మిమ్మల్ని సంప్రదించగలుగునట్టి మీ ఫోన్ నంబరును ఇవ్వండి. ఆపై ఇట్లు చెప్పండి, “మేము…మీరు నన్ను ఒక గృహములో ఉంచగోరినయెడల, నేను అందుబాటులో ఉంటాను.” ఒకవేళ అక్కడ ఒక—ఒక స్త్రీ ఒంటరిగా ఉన్నచో, అప్పుడు మనము ఆ స్త్రీ వద్దకు, చూడండి, ఒక స్త్రీని పంపవచ్చును. మరియు పిదప, అది ఒక పురుషుడు మరియు అతని భార్య ఉన్న గృహములో అయినయెడల, ఇంకేమి, మనము ఒక సేవకుడిని పంపవచ్చును.

మరియు సహకరించ-డానికి మిమ్మల్ని కలిగియుండుటకు మేము సంతోషిస్తాము, ఎందుకనగా మీరు, ప్రతి ఒక్కరూ, దీని పట్ల, ఈ అత్యవసరమైనదాని పట్ల ఆసక్తి కలిగియున్నారని నాకు తెలియును. మరియు గుర్తుంచుకొనండి, “తన తప్పు నుండి ఒక ఆత్మను రక్షించువాడు, అతని యొక్క అనేక పాపములను కప్పియున్నాడు.” చూశారా? మరియు క్రీస్తు యొక్క వధువు ఆకలిగొనుచూ మరియు దప్పిగొనుచున్నది. దేవుని పిల్లలకు జన్మనిచ్చుటకు, ఆమె ప్రసవ వేదనలో ఉన్నది.

7 మరియు ఇప్పుడు, ఈ రాత్రి, మనం లేఖనాలను చదవడానికి ముందు, ప్రార్థన కొరకు ఒక్క క్షణం మన తలలు వంచెదము. మరియు మనము ప్రార్థించే ముందు, మీరు మీ తలలు వంచియుండగా, మీరు ఒక విన్నపము చేసెదరా? కేవలం మీ చేతులను పైకెత్తి ఇలా చెప్పండి, “దేవా, నేను నా చేతులును భక్తితో పైకెత్తాను. నాకు అవసరతయున్నది. ఓ ప్రభువా, నీవు నాకు సహాయం చేయుదువని నేను ప్రార్థిస్తున్నాను.” దేవుడు మీలో ప్రతి ఒక్కరినీ దీవించునుగాక. ఆయన మీ చేతులను చూస్తాడు. దూతలు వారి విన్నపాలను అక్కడికి మోసుకెళ్ళారు.

8 మరియు, పరలోకపు తండ్రీ, మేము ఇప్పుడు, ప్రార్థనలో మరలా నిన్ను సమీపిస్తూ వచ్చుచున్నాము. మరి, ఈ చిన్న స్థలములో ఈ రాత్రి దేవుని పిల్లల మధ్య, ఇదివరకే ప్రార్థన చేయబడినదనుటలో, మరియు పాటలు పాడబడినవనుటలో ఎటువంటి సందేహము లేదు, మరియు దేవుని స్తుతించుటలోగల ఆనందోత్సవములతో ఉప్పొంగిన హృదయాలను మేము కలిగియున్నాము.

9 తాను పరిశుద్ధుల సమాజములోకి వచ్చి తన విన్నపాలను తాను తెలియజేస్తాడని దావీదు చెప్పాడు. మరియు ఈ రాత్రి, అనేక చేతులు ఉండియున్నవి. బహుశా, బహుశా, నేను ఇట్లు చెప్పుదును, ఈ రాత్రి ఈ భవనంలో కూర్చుని ఉన్నవారిలో ఎనభై శాతం మంది ప్రజలు విన్నపముల కొరకు వారి చేతులను ఎత్తారు. ప్రభువా, నీవు లేకుండా మేము అసలు వెళ్ళలేమని, అది చూపించుచున్నది. మేము నిన్ను అనుదినము, కలిగియుండవలసియున్నది. నీవే మా జీవము, మా ఆనందము, మా ఆరోగ్యము, మా స్థిరమైన బలము, మా ఆశ్రయము, మా కవచము, శత్రువు నుండి కాపాడు మా కేడెమునైయున్నావు.

మరియు నీవు లేకుండా జీవితమనే ఈ యుద్ధమును మేము అస్సలు పోరాడలేము. మేము దానిని చేయడం అనేది మాకు పూర్తిగా అసాధ్యమౌతుంది, మరియు మేము పూర్తిగా నీపై ఆధారపడవలసియున్నది. ఎందుకనగా, మేము అంధకారమైన మరియు భయంకరమైన దేశముగుండా నడుస్తున్నామని మేము ఎరిగియున్నాము. అన్ని వైపులా ఉచ్చులు మరియు ఉరులు వేయుచు, శత్రువు మమ్మల్ని చుట్టుముట్టాడు. ప్రభువా, మమ్మల్ని కలవరపెట్టుటకు, మా దారులు, శత్రువుల యొక్క ఉరులతో నిండియున్నవి.

10 మరియు మార్గాంతమున మేము వెళ్ళవలసినట్టి, మరణమని పిలువబడే పొడవైన, ఛాయవంటి ఆ లోయ ఉన్నదని, మేమును ఎరిగియున్నాము. ఓ ప్రభువా, అప్పుడు మా చేతులను ఎవరు పట్టుకుంటారు? ప్రభువా, ఇప్పుడే మేము నిన్ను తెలుసుకొనగోరుచున్నాము. నీవు మా చేతులను పట్టుకొనియున్నావని, మరియు మేము నీ చేతిని పట్టుకొనియున్నామని మేము తెలుసుకొనగోరుచున్నాము, అది ఆ లంగరు వేయబడిన నిశ్చయతను మేము కలియుండుటకైయున్నది తద్వారా మా జీవితంలోని ఆ చివరి గొప్ప క్షణానికి మేము వచ్చినప్పుడు, మరణము అని పిలువబడే ఆ ద్వారములోనికి ప్రవేశించినప్పుడు, ఆ పూర్వకాలపు పరిశుద్ధునితో కలిసి మేము ఇట్లు చెప్పగలము, “ఆయన యొక్క పునరుత్థాపు శక్తిలో నేను ఆయనను ఎరుగుదును, మరియు ఆయన పిలిచినప్పుడు, మృతులలోనుండి నేను లేచి వస్తానని నాకు తెలియును.”

11 ఇప్పుడు, తండ్రియైన దేవా, నీవు మా విన్నపాలను మరియు మా కూటమును ఆశీర్వదించెదవని మేము ప్రార్థిస్తున్నాము. నీ మాటలను ఆశీర్వదించుము. మరియు నీ వాక్యమునకు లేదా నీ చిత్తమునకు వ్యతిరేకముగా నేను ఏదైనా చెప్పనున్నయెడల, సింహాల గుహలో దానియేలు ఉన్నప్పుడు నీవు చేసినట్లే, నా నోటిని మూసివేయుటకు నీవు ఇంకనూ శక్తిని కలిగియున్నావు. మరియు ప్రభువా, ఈ రాత్రి నీవు చెవులను మరియు హృదయాలను తెరచి, మరియు, వారిలో ఒక ఆకలిని మరియు దాహమును సృష్టించెదవని, మేము ప్రార్థిస్తున్నాము. ఆ ఆదరణకర్త వచ్చేంతవరకు వారు నిద్రపోలేనంతగా లేదా, ఎక్కడా, విశ్రాంతి తీసుకోలేనంతగా దాహముతో ఉందురు గాక.

12 మేము కడవరి దినములలో, ఆయన రాకడ యొక్క ఛాయలో జీవిస్తున్నామని మేము నమ్ముచున్నాము. మరియు ప్రభువా, ఈ వర్తమానములు అటు వైపే నిర్దేశించుచున్నవి. ఇవి ప్రజలు చెవియొగ్గి, హెచ్చరికను తీసుకొనుట కొరకైయున్నవి. మరియు ఈ రాత్రి, మేము, సరిగ్గా ఇప్పుడే, ఆ మూతను తీసివేసి, దానిని బల్ల ప్రక్కన పెట్టి, ఇట్లు చెప్పుదుము గాక, “ప్రభువైన దేవా, నేను నీకొక పాత్రనైయున్నాను. నీ ఆత్మను నాలో ఉప్పొంగనిమ్ము. నన్ను మలచుము మరియు నీ చిత్తానుసారముగా నన్ను చేయుము. నేను నా హృదయమును, నా బలమును, నా సమస్తమును నీ కొరకు సమర్పించుకుంటాను.”

13 ప్రభువా, మా మనవి ఆలకించండి. ఈ వర్షపు రాత్రి, మేము కనబరచుకొనుటకు ఇక్కడ లేము. కేవలం వెళ్ళుటకు వేరే ఏ చోటు లేనందున మేము ఇక్కడ లేము. మా హృదయాలలోని ఒక్క భక్తిపూర్వకమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన ఉద్దేశ్యం కొరకు మేము ఇక్కడ ఉన్నాము, అదేమనగా, నీకు దగ్గరగా సమీపించుట కొరకైయున్నది, మేము నిన్ను సమీపించినట్లైతే, నీవు మమ్మల్ని సమీపించెదవని నీవు వాగ్దానం చేశావని ఎరిగియున్నాము. మరియు అందుకే మేము ఇక్కడ ఉన్నాము. ఆకలితో వచ్చువాడు ఆకలితో బయటికి వెళ్ళడు. “నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు,” అని యేసు చెప్పెను, “ఏలయనగా వారు తృప్తిపరచబడతారు.” మరియు మేము రొట్టెను అడిగితే, మేము ఒక రాయిని పొందుకోము. ఆ నిశ్చయత మాకున్నది. మరియు మేము చేపను అడిగితే, ఒక సర్పమును పొందుకోము. అయితే, తండ్రియైన మా దేవుడు మమ్మల్ని పరలోకపు మన్నాతో పోషించును, అది ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చునట్టి ఆయన వాక్యము మరియు ఆయన యొక్క ఆత్మయైయున్నది. ప్రభువా, మేము మీదటికి నీకై కనిపెట్టుకొనియుండగా, మా ప్రార్థనలకు, మరియు మా విన్నపాలకు జవాబునిమ్ము. యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థిస్తున్నాము. ఆమేన్.

14 ఇప్పుడు, ఈ లేఖనాలను వ్రాసుకొనుచున్న మీరు, మీరు నాతో పాటు పరిశుద్ధ యోహాను, 14వ అధ్యాయమునకు త్రిప్పండి. పరిశుద్ధ యోహాను 14వ అధ్యాయము వద్ద మనం ప్రారంభించగోరుచున్నాము. మరియు 14వ వచనము నుండి మనం ప్రారభించుదాము, పరిశుద్ధ యోహాను 14:14, మరియు ఈ లేఖనములో కేవలం కొంత భాగమును చదువుదాము. ఇప్పుడు, ఈ రాత్రి నేను మాట్లాడాలనుకుంటున్న పాఠ్యసందర్భంలో అధిక భాగాన్ని మీరు దీనిలో కనుగొంటారు.

15 మరియు గుర్తుంచుకోండి, ఎర్రని-అక్షరాల బైబిళ్ళను కలిగియున్న మీరు, అది, ఇది ఎరుపు రంగులో ఉంటుంది. ఇవి స్వయంగా యేసు మాట్లాడిన మాటలు, కావున అది సరిగ్గా ఆయన చెప్పినట్లే ఉండునని మనం నిశ్చింతగా ఉండవచ్చును. “భూమ్యాకాశములు గతించును, కానీ ఆయన వాక్యము ఎన్నటికీ విఫలమవ్వదు.”

ఇప్పుడు మనం 14వ అధ్యాయంలోని 14వ వచనము నుండి చదివెదము.

నా నామమున మీరు ఏమి అడిగినను, నేను దానిని చేతును.

ఎటువంటి ఒక ధన్యకరమైన వాగ్దానము!

మీరు నన్ను ప్రేమించిన యెడల, నా ఆజ్ఞలను గైకొనండి.

మరియు నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై, ఆయన వేరొక ఆదరణకర్తను అనగా;

సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును; లోకము ఆయనను చూడదు, గనుక ఆయనను పొందనేరదు,…

ఇప్పుడు, గ్రీకు బైబిల్ నుండి చదువుచున్న వారు, దానిని ఇక్కడ చూస్తారు, కాదు…అక్కడ చూడటము అనగా “గ్రహించడం.” “ఏలయనగా లోకము ఆయనను గ్రహించదు.” అది ఎంతో వాస్తవమైయున్నది. ఇప్పుడు నన్ను దానిని మరలా చదవనివ్వండి.

అనగా సత్యస్వరూపియగు ఆత్మ; ఆయన…సత్యము; లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక, ఆయనను పొందనేరదు: అయితే మీరు ఆయనను ఎరుగుదురు; (ఎవరిని? ఆ ఆదరణ కర్తను.) ఆయన మీతో కూడా నివసించును ఇప్పుడు (వర్తమానకాలము),…ఆయన మీతో కూడా నివసించును, మరియు మీలో ఉండును.

అదేమిటి? అదే ఆదరణకర్త.

నేను మిమ్మును ఆదరణలేనివారిగా విడిచిపెట్టను: నేను…

“నేను” అనేది ఒక వ్యక్తిగత సర్వనామమని ఎవరికైనా తెలియును.

…నేను మీ యొద్దకు వత్తును.

కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరెన్నడును చూడదు; అయితే మీరు చూతురు…అయితే మీరు నన్ను చూతురు: నేను జీవించుచున్నాను గనుక, మీరును జీవింతురు.

నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు.

నా ఆలోచన ప్రధానంగా దీని మీదనే ఉండబోవుచున్నది, అయితే మనము మరి కొంచెం ముందుకు చదవబోవుచున్నాము. ఇప్పుడు, దానిని కూడా నన్ను మళ్ళీ చదవనివ్వండి.

ఆ దినమున (అనగా ఆ గొప్ప, తీర్పు దినమున), నేను తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు.

నా ఆజ్ఞను కలిగియుండి, మరియు వాటిని గైకొనువాడే, నన్ను ప్రేమించువాడు: మరియు నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందును.

ఇస్కరియోతు కాని యూదా, ఆయనతో, ఇట్లనెను, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరచుకొనుటకేమి సంభవించెను?

అది, కాస్మోస్, అనగా “లోక క్రమము.” మీరు అక్కడ ఉపాంత పఠనమును కలిగియున్నయెడల, మీరు గమనిస్తారు. నా దానిలో “జి,” అని ఉన్నది మరియు ఇక్కడ అది చెప్పుచున్నదేమనగా, “కాస్మోస్, లేదా లోక-క్రమము.” అవి సంఘములు, మరియు మొదలగునవైయున్నవి, చూడండి.

…వారికి కాక మాకు మాత్రమే నిన్ను నీవు ఎలా కనబరచుకుంటావు? నీవు దానిని ఎట్లు చేయగలవు?

యేసు సమాధానమిచ్చి మరియు అతనితో ఇట్లు చెప్పెను, ఒకడు నన్ను ప్రేమించినయెడల, వాడు నా మాటలు గైకొనును: (ఆమేన్) అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మరియు మేము వానియొద్దకు వచ్చి, వానియొద్ద నివాసము చేతుము.

నన్ను ప్రేమించని వాడు నా మాటలు గైకొనడు:…

సంఘము యొక్క మాటలను గైకొనవచ్చు; కానీ ఆయన మాటలను గైకొనుట, మీరు చూడండి.

…మరియు మీరు వినుచున్న మాటలు నావి కావు, కానీ నన్ను పంపిన తండ్రివే.

నేను మీయొద్ద ఉండగానే, యీ మాటలు మీతో చెప్పితిని.

అయితే ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ, సమస్తమును మీకు బోధించి, మరియు నేను మీతో చెప్పిన, ఈ సంగతులన్నిటిని (అవి, ఆయన మాటలు) మీకు జ్ఞాపకము చేయును.

అట్లైనయెడల దేవుడు పరిశుద్ధాత్మను ఏ ఉద్దేశ్యం కొరకు పంపించాడు? ఆయన వాక్యమునకు, ఆయన తన దీవెనలను జతచేయును గాక.

16 యేసు ఇట్లు, చెప్పెను, “ఆ దినమున నేను తండ్రియందును, తండ్రి నాయందును; మరియు మీరు…నేను మీయందును, మీరు నాయందును ఉన్నామని మీరెరుగుదురు.” ఇప్పుడు, మనము దీనిని చెప్పబోవుచున్నయెడల…

17 ఇప్పుడు, గుర్తుంచుకొనండి, ఇది టేపుపై ఉండబోవుచున్నది.

కొంత సమయం క్రితం, లూయివిల్ నుండి, ఒక క్రిస్టియన్ బిజినెస్ మెన్ సభ్యుడు నాకు ఫోన్ చేశాడు. మరియు అతడు ఇట్లన్నాడు, “బిల్లీ, నిన్న రాత్రి నీవు చెప్పినట్లు, ఈ వర్తమానాలు, మీ చిన్న ఆలయము వద్దనున్న, నూటయాభై లేదా రెండు, మూడు వందల మందికి బదులు, ఇక్కడున్న నలభై వేల మందిని చేరుకోకపోవడం అవమానకరము.”

18 నేను ఇట్లు చెప్పాను, “అయ్యా, యేసు ఆలస్యము చేస్తే, ఇప్పటి నుండి ఆరు నెలల్లో, ప్రపంచమంతా దీనిని వింటుంది.” చూశారా?

ఆ టేపులు ప్రపంచమంతటకూ వెళ్తాయి, చూడండి, అంతటికీ వెళ్ళును. మరియు, కావున, కేవలం మేము దేనిని సత్యమని నమ్ముచున్నామో, మరియు దేవుడు దేనిని సత్యమని మాకు నిర్ధారించుటను మేము కనుగొన్నామో దానినే ఇప్పుడు ఇక్కడ మేము బోధిస్తున్నాము.

19 ఇప్పుడు, ఉద్దేశ్యము, పరిశుద్ధాత్మను పంపడంలో దేవుని యొక్క ఉద్దేశ్యము ఏమిటి—ఏమిటి? ఇప్పుడు, నేను దానిని వ్రాసుకుంటాను, యోహాను 14, 14వ వచనం వద్ద ప్రారంభించి, మరియు ఆధారం కోసం, ఆ అధ్యాయమంతా చదివెదము. పరిశుద్ధాత్మను పంపడంలో, దేవునికి ఒక్క ఉద్దేశ్యము కలదని, మనము ఇక్కడ కనుగొంటాము, అదేమనగా, స్వయంగా దేవుడే తన సంఘములో నివసించుచు మరియు సంఘము ద్వారా తన ప్రణాళికలను కొనసాగించుటకైయున్నది.

ఎట్లనగా, దేవుడు క్రీస్తులో ఉండి, క్రీస్తు ద్వారా తన ప్రణాళికలను కొనసాగించుచుండెను; క్రీస్తు నుండి బయటకు, సంఘములోనికి వచ్చి, సంఘము ద్వారా తన పనిని కొనసాగించుచున్నాడు.

20 ఇప్పుడు, పరిశుద్ధాత్మ అనగా ఏమిటో మనకు తెలియును. అది దేవుడని, గత రాత్రి, మనము కనుగొన్నాము.

ఇప్పుడు, మనం యేసు ఇక్కడ మాట్లాడినట్లు, తన యొక్క తండ్రి; తండ్రియైన, దేవుడు, యేసు వలె, కుమారుడైన, దేవుడు; ఈ రోజు మనం పిలుస్తున్నట్లు, పరిశుద్ధాత్మయైన దేవుని గురించి అలోచించినప్పుడు, ఇప్పుడు, దాని అర్థం, ముగ్గురు వ్యక్తిగత, విభిన్నమైన దేవుళ్ళు ఉన్నారని కాదు. దాని అర్థము ఒక్క దేవుడే మూడు కార్యాలయములలో ఉండుటయైయున్నది.

దానిని మనము ఇలా చెప్దాము. దేవుడు ఏమైయున్నాడో దానినంతయూ, ఆయన క్రీస్తులో కుమ్మరించెను, ఎందుకనగా ఆయన తనను తాను ఖాళీ చేసుకొని మరియు దానిని క్రీస్తులోనికి కుమ్మరించెను. “మరియు క్రీస్తు శరీరముగా దైవత్వము యొక్క సర్వపరిపూర్ణతయైయున్నాడు.” యెహోవా ఏమైయున్నాడో దానినంతయూ, ఆయన క్రీస్తులో కుమ్మరించెను.

మరియు క్రీస్తు ఏమైయున్నాడో దానినంతటిని, ఆయన సంఘములో కుమ్మరించెను; ఒక వ్యక్తిలోనికి కాదు గానీ, సర్వశరీరములోనికైయున్నది. అక్కడే, అనగా మనము ఐక్యముగా కూడి వచ్చే ఆ చోటనే, మనకు శక్తి కలదు. దేవుడు ఏమైయున్నాడో అదంతయూ, క్రీస్తులో ఉండెను; మరియు క్రీస్తు ఏమైయున్నాడో అదంతయూ, మీలో ఉన్నది.

“ఏలయనగా దేవుడు శరీరధారియై, మన మధ్య నివసించెను.” మీరు దానిని వ్రాసుకొనుచున్నట్లైతే, మొదటి తిమోతి 3:16, “నిరాక్షేపముగా దైవత్వమును గూర్చిన మర్మము గొప్పదైయున్నది: ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను, మరియు మేము ఆయనను తాకియున్నాము. దేవుడు, యెహోవా, శరీరధారియై, భూమిమీద నడిచెను, మరియు మేము ఆయనను మా కన్నులతో చూశాము.”

21 మీకు తెలుసా, అదే యోహాను 14వ అధ్యాయంలో, ఫిలిప్పు ఇట్లన్నాడు, “ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలును.”

22 యేసు ఇట్లనెను, “ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను, నీవు నన్ను ఎరుగవా? నీవు నన్ను చూసినప్పుడు, నీవు తండ్రిని చూసియున్నావు. మరి, ‘తండ్రిని మాకు కనుపరచుము’ అని నీవేల నాతో చెప్పుచున్నావు?” దేవుడు శరీరధారియాయెను.

23 ఇప్పుడు అది ఏమిటంటే. తండ్రి అనగా మీకు పైన ఉన్న దేవుడు, అని మనము చెప్పుచున్నాము. ఆదాము నుండి మనము అట్లేయుంటిమి. తండ్రియైన, దేవుడు, ఒక అగ్ని స్తంభంలో, మోషే మరియు ఇశ్రాయేలు పిల్లలపైన ఉండెను. పిదప, క్రీస్తులో, దేవుడు మనతో ఉన్నాడు; మనతో నడిచెను, మనతో మాట్లాడెను, మనతో కలిసి తినెను, మనతో కలసి పండుకొనెను. దేవుడు మనకు పైన; దేవుడు మనతో; మరియు ఇప్పుడు దేవుడు మనలో ఉండుట. దేవుడు ఏమైయున్నాడో అదంతయూ, క్రీస్తులోనికి వచ్చెను; క్రీస్తు అయున్నదంతయూ, సంఘములోనికి వచ్చెను.

అదేమిటి? దేవుడు మీలో పనిచేయుటయైయున్నది. ప్రపంచంలో ఎక్కడనుండైనా ఆయన మిమ్మల్ని పిలవగోరినయెడల, మీరు సరిగ్గా అక్కడుంటారు, ఆయన యొక్క మంచి సంకల్పమును నెరవేర్చుటకు మీలో పనిచేయుచుండును. దానికొరకై మనం దేవునికి ఎంతగా కృతజ్ఞతలు చెల్లించవలసియున్నదో! ప్రతి కాలముగుండా కదులుచూ, తన దైవిక సంకల్పాన్ని, నెరవేర్చుచూ, దేవుడు తన సంఘములో నివసించవలెనన్న ఉద్దేశ్యము కొరకు, దేవుడు అనగా ఆ పరిశుద్ధాత్మ పంపబడెను.

24 జనులు మిమ్మల్ని ఎగతాళి చేయునప్పుడు, వారు మిమ్మల్ని ఎగతాళి చేయుటలేదు గానీ, మిమ్మల్ని పంపిన ఆయనను వారు ఎగతాళి చేయుచున్నారు. కావున యేసు ఇట్లు చెప్పెను, “నా నామము నిమిత్తము జనులు మీ మీద, అబద్ధముగా, చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. మీరు ధన్యులు.” మరియు, మరలా, “క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకువారందరూ హింసనొందుదురు.”

ఏలయనగా, దేవుడు క్రీస్తులో తనను తాను బయలుపరచుకున్నప్పుడు, వారు ఆయనను ద్వేషించిరి. ఆయనను అత్యధికముగా ద్వేషించినది, ఎవరు? సంఘమే. సంఘమే, ఆయనను అత్యధికముగా ద్వేషించెను. వారు ఒక—ఒక త్రాగుబోతు కంటెను ఎక్కువగా ఆయనను ద్వేషించారు. వారు ఆయనను మిగతా ప్రజలందరికంటే ఘోరముగా ద్వేషించారు. ఆయనను ద్వేషించినది సంఘమే. కావున, మీరు కాస్మోస్‌ను చూసినప్పుడు, “లోక క్రమము, లోకము ఆయనను ఎరిగియుండలేదు,” అనగా, నామ-కార్ధ “సంఘము,” “ఆయనను ఎరుగలేదు. ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను, మరియు తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు.”

“అయితే తనను ఎందరంగీకరించిరో, వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.” ఓ, మనం ఆయనను ఎంతగా ప్రేమించి మరియు ఆరాధించవలసియున్నది కదా! దేవుని యొక్క ఉద్దేశ్యము, సహవాసములో ఉండుటకైన కోరికయైయున్నది!

25 ఎలాగంటే, మనము ఆ అంశమును విడిచిపెట్టుటకు ముందు, దీనిని మనము ఉపయోగించుదాము; రూతు దినములలో, విమోచన యొక్క చట్టము క్రింద, శోధనలో, క్లిష్ట సమయాలలో, నయోమి దేశమును విడిచి వెళ్ళినప్పటి వలెనున్నది. ఆమె కేవలం నులివెచ్చని, నామకార్ధ క్రైస్తవులైయున్న, మోయాబీయుల దేశములోనికి వెళ్ళినది. ఎందుకనగా, మోయాబీయులు లోతు కుమార్తె నుండి వచ్చారు, వారు నామ-కార్ధ విశ్వాసులు, మరియు మిశ్రమ జనాంగమైయున్నారు. మరియు పిదప ఆమె భర్త చనిపోయెను, మరియు తన ఇద్దరు కుమారులు చనిపోయిరి. మరియు ఇంటికి వెళ్ళే మార్గంలో, నయోమి…రూతు మరియు నయోమి, ఇంటికి వెళ్ళే దారిలో, తన…తన కోడళ్ళ-లో ఒకతైన, ఓర్పా, ఆమె తన దేశమునకు, తన దేవుళ్ళయొద్దకు, మరియు తన సంఘానికి, మరియు తన ప్రజలయొద్దకు తిరిగి వెళ్తానని చెప్పినది. మరియు నయోమి రూతుని వెనక్కి పంపించుటకు ప్రయత్నించినది, కానీ ఆమె ఇట్లు చెప్పినది, “నీ జనమే నా జనము. నీ దేవుడే నా దేవుడు. నీవెక్కడ మరణిస్తావో, నేనునూ అక్కడే మరణిస్తాను. నీవెక్కడ పాతిపెట్టబడుదువో, నేనునూ అక్కడే పాతిపెట్టబడుదును. అంతేగాని నేను వెనక్కి తిరుగను.”

26 ఒక వ్యక్తి ఒక దర్శనమును పొందుకున్నప్పుడు ఆ విధంగా ఉంటుంది. “నీవు ఒక పరిశుద్ధ-గుండ్రాయిగానో లేదా మరి దేనిలాగానో అగుటకు అక్కడకు వెళ్ళుచున్నావు,” అని తన ప్రజలు ఏమి అన్ననూ ఏ వ్యత్యాసము కలుగజేయదు. అది రూతుకి ఎటువంటి తేడాను కలుగజేయలేదు. నెరవేర్చబడవలసినట్టి దేవునియొక్క ఒక ఉద్దేశ్యము అక్కడున్నది.

27 మరియు ఈ రాత్రి మీరు పరిశుద్ధాత్మ కొరకు ఆకలిగొనుచున్నంత నిశ్చయంగానే, అది ఏదో మీలో ఉండి, మిమ్మల్ని లాగుచుండుటయైయున్నది, తద్వారా సరిగ్గా రూతుకి జరిగినట్లే, మీ జీవితంలో దేవునియొక్క ఒక ఉద్దేశ్యం నెరవేర్చబడుటకైయున్నది.

28 ఆ కథ చాలా అందంగా ఉన్నది! ఒక క్షణం, నేను దానిని అసలు వదలలేకపోవుచున్నాను. విమోచన చట్టం మీకు తెలియును, అది బోయజు ఎప్పుడైతే…రూతు ఏ విధంగా పొలంలో పరిగెను ఏరుకొని మరియు బోయజుయొక్క దయను సంపాదించినదన్న కథ మీకు తెలియును. మరియు అతడు ఆమెను వివాహము చేసుకొనుటకు ముందు, నయోమి పోగొట్టుకున్న దానినంతటినీ అతడు విమోచించవలసియుండెను. మరియు విమోచన చట్టం ప్రకారంగా, నయోమి కోల్పోయిన ఆస్తిని విమోచించగల ఏకైక వ్యక్తి, సమీప బంధువుడు మాత్రమే; అతడు విమోచించుటకు ముందు సమీప బంధువుడై యుండవలసియున్నది. మరియు అతడే ఆమెకి అత్యంత సమీప బంధువుడు. మరియు అతడు పురద్వారము వెలుపట, ఒక బహిరంగ సూచన చేయవలసివచ్చినది, లేదా నయోమి పోగొట్టుకున్నదంతా అతడు విమోచించాడని బహిరంగ ఒప్పుకోలు చేయవలసివచ్చినది. మరియు పెద్దల యెదుట వాని చెప్పును తన్నివేయుట ద్వారా బోయజు దానిని చేశాడు, మరియు ఇట్లన్నాడు, “నయోమికి చెందిన దేనినైనను కలిగియున్నవారు ఎవరైనా ఇక్కడ ఉన్నయెడల, ఈ రోజు నేను దానిని విమోచించితిని.”

29 మరియు దేవుడు కూడా అట్లే చేసెను, తన స్వంత చట్టాలను అనుసరించెను. నీకు అనుసరించుటకు ఒక చట్టమును ఇచ్చి మరియు ఆయన ఇంకొక చట్టమును అనుసరించలేడు, దేవుడు అట్లు అనుసరించలేడు. ఆయన తన స్వంత చట్టములను అనుసరిస్తాడు. పిమ్మట, దేవుడు, తప్పిపోయిన సంఘమును, తప్పిపోయిన లోకమును, పతనమైన సృష్టిని విమోచించుటకు; ఆత్మలో అనంతుడైన, దేవుడు, తప్పిపోయిన మానవ జాతిని విమోచించడానికి, దేవుడు తానే సమీపబంధువునిగా మారాడు, ఒక మానవునిగా, మరియ గర్భంలో తాను సృష్టించిన ఒక కుమారునిగా మారాడు. మరియు పిదప యెరూషలేము గవునుల వెలుపట; ఆయన ఒక సూచనను, లేదా ఒక సాక్ష్యమును చేశాడు, ఆయన ఆకాశానికి మరియు భూమికి మధ్య పైకెత్తబడి, మరణించాడు, మరియు ప్రతీదానిని విమోచించాడు. మరియు రక్తమును కార్చడంతో, ఆయన ఒక సంఘాన్ని శుద్ధీకరించాడు, తద్వారా స్వయంగా ఆయనే దానిలో నివసించి, మరియు సహవాసమును కలిగియుండి మరియు సంభాషించుటకైయున్నది, ఎక్కడైతే దేవుడు ప్రతి సాయంత్రము దిగివచ్చెనో అట్టి ఏదేను తోటనుండి కోల్పోయిన సహవాసమైయున్నది, ఆ సంఘ సమయమైయున్నది.

మీరు గమనించారా? చల్లపూట, సూర్యుడు అస్తమించే సమయంలో దేవుడు దిగివచ్చెను. రాత్రి అగుటలో ఏదో ఉన్నది, ప్రజలు అనగా క్రైస్తవులు సంఘము గూర్చి మరియు దేవుని గూర్చి; ఆలోచిస్తారు. సూర్యుడు అస్తమించుటను మీరు చూస్తారు, మీ సూర్యుడు అస్తమిస్తున్నాడని మీరు గ్రహిస్తారు.

30 మరియు సాయంకాలము చల్లపూట ఆయన దిగివచ్చి వారితో సంభాషించేవాడు. మరియు అక్కడే ఆయన ఆ సహవాసాన్ని కోల్పోయాడు, ఎందుకనగా పాపము ఆయనను దానిని చేయనివ్వలేదు.

మరియు పిదప ఆయన శరీరధారియై మన మధ్య నివసించెను, తద్వారా ఆయన మరలా మానవునియొద్దకు తిరిగి వచ్చి, మరియు మానవునిలో జీవించుటకు, మరియు మానవుడిని మరలా ఆయనతో సహవాసమునకు పునరుద్ధరించుటకు, మరియు అతనికి దేవుడు-ఇచ్చిన తన హక్కును తిరిగి ఇచ్చుటకైయున్నది. ఆయన చేసినది అదేయైయున్నది.

31 అదియే పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశ్యం. అది మరలా, తండ్రియే, తండ్రియైన దేవుడు తన విమోచనా ప్రణాళికను పూర్తి చేయుటకు, తన పథకాలను నిర్వర్తించుచు, మీలో నివసించుటయైయున్నది; మీ ద్వారా పని చేయుచు, మిమ్మల్ని ఆయనతో జత-పనివారిగా చేయుటయైయున్నది; మీకు ఒక స్థానమును ఇచ్చుటయైయున్నది, పడిపోయి, తప్పిపోయిన మీ సహోదరి సహోదరుని కొరకు మీకు ఒక భాగమును ఇచ్చుటయైయున్నది; ఆయన ఏదేను తోటలో చేసినట్లే, తప్పిపోయిన వారిని వెంటాడుటకు, మీకు ఆయన యొక్క ఆత్మను మరియు ఆయన యొక్క ప్రేమను ఇచ్చుటయైయున్నది. “ఆదామా ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావు?” ఒక పురుషునికి లేదా ఒక స్త్రీకి పరిశుద్ధాత్మ దానినే చేయును. అది వారి హృదయాన్ని తాకి మరియు దాని నివాసాన్ని తీసుకున్నప్పుడు, పడిపోయిన ఆత్మల కొరకు ఒక దాహం మరియు ఒక ఆకలి అక్కడ ఉంటుంది.

ఈనాడు కూటముల విషయము అదేయైయున్నది. తప్పిపోయి మరియు మరణించుచున్నవారి ఆత్మల కొరకు వెళ్ళడానికి చాలినంత ఆత్మయొక్క-తాకిడి, దానిలో లేదు. ఆత్మను-సంపాదించే కార్యక్రమానికి బదులుగా, ఒక పేరును, లేదా ఒక సంఘమును, లేదా ఒక భవనమును, లేదా ఒక సంస్థను తయారు చేయుటలోనే ఎక్కువగా అది ఉన్నది. ఎంత దయనీయము! దానిపై చాలా సేపు మనము మాట్లాడవచ్చును.

దేవుడు తనను తాను క్రీస్తులో కుమ్మరించుకున్నాడు. అది నిజము.

32 క్రీస్తు తనను తాను సంఘములోనికి కుమ్మరించుకున్నాడు. కావున, ఇప్పుడు గమనించండి, “నేను తండ్రి యందును, మీరు నాయందును, మరియు నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. ఆ దినమున మీరు దానిని ఎరుగుదురు.” ఏలయనగా, అది ఆ విషయమంతయు ఒక్క విమోచన ప్రణాళికయైయున్నది, దిగి వచ్చుట, దేవుడు ఆదిలో చేసినట్లే, ఆయన తన ప్రజలలో నివసించుటకు, మరియు వారితో సంభాషించుటకు, తిరిగి వచ్చుటయైయున్నది.

ఇప్పుడు, పిదప, ఆయన తన సంఘమును పలుకగలిగే స్థితిలోనికి తీసుకువచ్చి, ఆయన దానిగుండా తనను తాను ప్రవహింపజేసుకొని, మరియు ప్రేమించి, ప్రేరేపించి, మరియు సహవాసము కలిగియుండే స్థానముకు తన సంఘమును తీసుకువచ్చిన వెంటనే, అప్పుడు ఒక ఏదేను వస్తుంది. ఆయన తన సంఘమును, అది—అది ఆయనను ఎక్కడైతే విడిచిపెట్టినదో తిరిగి అక్కడికి తీసుకువెళ్తాడు, అది ఎక్కడైతే పడిపోయినదో తిరిగి ఆ ఏదేను వద్దకు తీసుకువెళ్తాడు. అది, ఇప్పుడు…అక్కడే దాని యొక్క మొదటి ప్రారంభం, లేదా పతనం జరిగినది. విమోచించబడినట్టి శుభ్రమైన ప్రతీ పలకతో, అది అక్కడికే తిరిగి తీసుకొనిపోబడుతుంది, వాటిని తిరిగి మరలా నేరుగా ఆ స్థలానికి తీసుకువస్తుంది.

33 సంఘము కొంతకాలము లోకములో ఉన్నది. మరియు సంఘము, నిజముగా, పదిహేను వందల సంవత్సరాలు చీకటి యుగముల, సంస్కరణ తర్వాత…అపొస్తలుల తరువాయి వచ్చిన మొట్టమొదటి సంఘసంస్కర్త లూథరు. మరియు పిదప లూథర్ వచ్చినప్పుడు, దేవుడు ఆత్మను కొద్దిగా తీసుకొని, మరియు నీతికరణలో సంఘముపైన దానిని కుమ్మరించాడు. పిదప వెస్లీ దినములలో, ఆయన మరికొంచెం ఎక్కువగా తనను తాను, శుద్ధీకరణలోనికి కుమ్మరించుకున్నాడు. మరియు అంత్య కాలమునొద్దకు, కాలము ఎదిగినా కొద్దీ, దేవుడు తన సంఘమును నింపుచూ ఉన్నాడు. కేవలం చుట్టూ చూసి అది సత్యమో కాదో, కనుగొనండి.

34 లూథరు కాలమును చూడండి, చరిత్రను చదివే మీరు, వారి ఉజ్జీవమును మరియు వారు ఏమి చేశారో చూడండి. వెస్లీ ఉజ్జీవం ఇంకెంత గొప్పగా ఉన్నదో చూడండి, తక్కువ సంఖ్యలో కూడా, వారు ఎంత ఎక్కువ శక్తిని కలిగియున్నారో చూడండి. పెంతెకొస్తు దినములలో, అప్పుడు వారు ఎటువంటి ఒక ఉజ్జీవమును కలిగియున్నారో గమనించండి, ఎంతో గొప్పగా, విస్తృతంగా వ్యాపించినది.

35 అవర్ సండే విజిటర్, అనే కాథలిక్ పత్రికలో, కూడా, పెంతెకొస్తువారు ఒక సంవత్సరంలో పదిహేను లక్షల మందిని మార్చారని ఒప్పుకోలు చేసారు, మిగతా సంఘాలన్నిటినీ కలిపి వీరు దాటిపోయారు. కాథలిక్కువారు కేవలం ఒక పది లక్షల మందిని మాత్రమే మార్చారని చెప్పారు. తమ స్వంత సండే విజిటర్‌ లో, సండే విజిటర్ అని పిలవబడే పత్రికలో, పెంతెకొస్తువారు తమను అధిగమించారని ప్రకటన ఇచ్చారు.

మరియు, గుర్తుంచుకొనండి, పెంతెకొస్తు ద్వారా జరిగిన మార్పిడి పరిశుద్ధాత్మ-నింపుదలగల-మార్పిడియైయున్నది. తక్కువ మందితో, ప్రారంభంలో, అక్కడున్న వీధి ప్రక్కన వెళ్ళుచు, ఒక—ఒక పాత గిటారు పట్టుకొని బయలుదేరారు. మరియు మహిళలు ఒక జత మేజోళ్ళను కూడా కొనుగోలుచేయు స్తోమతను కలిగిలేరు. రైలు పట్టాల వద్ద పడుకునేవారు, మరియు మొక్కజొన్నలు ఏరుకొని, మరియు వాటిని దంచి, వారి పిల్లల కొరకు రొట్టెలు తయారు చేసేవారు. అయితే అది ఎక్కడికి వచ్చినది? నేడు ప్రపంచంలోనే అత్యంత-శక్తివంతముగా నిలబడే సంఘముగా ఉన్నది, లోకము దృష్టిలో కాదండి, కానీ దేవుని దృష్టిలోయైయున్నది, ఎందుకనగా ఆయన వారి కొరకు చేయుచున్నదానినిబట్టి ఆయన దానిని రుజువు చేయుచున్నాడు. ఆయన తనను తాను వారిలోనికి కుమ్మరించుకొనుచున్నాడు, దానిని లోనికి కుమ్మరించుచున్నాడు.

36 ఇప్పుడు ఏమి జరిగిందో గమనించండి, దేవుడు వారిలోనికి తనను తాను కుమ్మరించుకొనుచున్నాడు. ఇప్పుడు సంఘము లూథర్, వెస్లీ, నుండి ఒక చోటుకు వచ్చియున్నది, మరియు పెంతెకొస్తుకు ఉజ్జీవము మొదలైనది; మరియు ఇప్పుడు మనమిప్పుడు వచ్చుచున్న ఈ కాలములోనికి, అదే పరిశుద్ధాత్మ ద్వారా, దానిని ఎక్కువగా కలిగియుండి వచ్చుచున్నది. ఇప్పుడు, అక్కడ వెనుక లూథరన్లు రక్షించబడినప్పుడు, వారు పరిశుద్ధాత్మలో కొంత భాగాన్ని పొందుకున్నారు. మెథడిస్టులు శుద్ధీకరించబడినప్పుడు, అది పరిశుద్ధాత్మ యొక్క క్రియయైయున్నది. చూడండి, అది పరిశుద్ధాత్మలో ఒక భాగమైయున్నది. “మనం లేకుండా వారు పరిపూర్ణులు కాలేరు,” అని లేఖనము చెప్పుచున్నది. చూశారా?

37 ఇప్పుడు, దేవుడు, అంత్య కాలములో వెలుగు ప్రకాశించుట ప్రారంభమైనందున, ఆయన మనలను, మన నుండి ఒక గొప్ప విషయమును ఆశిస్తున్నాడు. ఎందుకనగా, “ఎక్కడైతే అధికంగా ఇవ్వబడుతుందో, అక్కడ అధికంగా కోరబడుతుంది.” కావున లూథరన్లు లేదా మెథడిస్టుల నుండి ఆయన కోరినదానికంటే మన నుండి చాలా ఎక్కువ కోరనైయున్నాడు, ఎందుకనగా మనము వారు కలిగియున్నదానికంటె మరిగొప్పదైన వెలుగులో, మరిగొప్పదైన శక్తితో, గొప్ప…ఒక—ఒక మరిగొప్పదైన సాక్ష్యముతో నడుచుచున్నాము. ఇప్పుడు, మనము పునరుత్థానమును గూర్చిన మరిగొప్పదైన సాక్ష్యమును కలిగియున్నాము. వారు కలిగియున్నదాని కంటే మరింత స్థిరమైన, మరింత ఖచ్చితమైన సంగతులను మనము కలిగియున్నాము.

38 కానీ ఈమధ్యనే, ఒక లూథరన్ కాలేజీకి నేను చెప్పినట్లుగా అదియున్నది.

వారు ఇట్లన్నారు, “మనము ఏమి కలిగియున్నాము?”

నేను ఇట్లు చెప్పాను, “ఒక వ్యక్తి ఒక మొక్కజొన్న పంటను వేశాడు. మొదటి చిన్న మొలకలు పైకి వచ్చినప్పుడు, అతడిట్లన్నాడు, ‘ఒక—ఒక మొక్కజొన్న పంటకై ప్రభువుకు ధన్యవాదములు!’ అతడు, దాదాపు దానిని కలిగియున్నాడు, కానీ అతడు దానిని ప్రారంభ దశలో మాత్రమే కలిగియున్నాడు. రాను రాను, అది ఒక కాండముగా మారినది.”

మరియు దానిపై వెన్నులు బయటకు వచ్చెను, అది మెథడిస్టులైయున్నారు.

39 మీరు ప్రకృతిని గమనిస్తే, దేవుడు పని చేయుటను మీరు చూస్తారు. నా పరిచర్యకు కూడా సంబంధించిన ఒక రహస్యము అక్కడ ఉండియున్నది. చూశారా? అది, ప్రకృతిని గమనిస్తూ, అది ఎట్లు చేస్తుందో, ఏ కాలమో మరియు ఏ సమయమో చూడండి, మీరు ఎక్కడ జీవిస్తున్నారో మీరు చూడగలరు. కాలమును గమనించండి.

40 ఇప్పుడు, పిదప, ఆ మెథడిస్టులు, వారు వెన్నులైయున్నారు. వారు లూథరన్ల వైపు చూసి ఇట్లన్నారు, “మేము శుద్ధీకరణను పొందాము; దానిలో మీరు ఏమియు కలిగిలేరు.”

క్రమంగా, ఆ పుప్పొడి నుండి, మెథడిస్టుల నుండి, ఒక ధాన్యపు గింజ…ఒక మొక్కజొన్న తొక్క వచ్చెను. అది పెంతెకొస్తైయున్నది.

మీరు అక్కడున్నారు, నీతీకరణము, అది దానిలో ఒక దశ. శుద్దీకరణము, దానిలో మరొక దశ. పరిశుద్ధాత్మ, దాని యొక్క మరొక దశ; పెంతెకొస్తు. లూథర్, వెస్లీ, పెంతెకొస్తు.

41 ఇప్పుడు పెంతెకొస్తు ఏమి చేస్తుంది? నేను దానిని పోల్చుతాను, ఎందుకనగా, పెంతెకొస్తులో, అది ఒక పచ్చని ఆకునో, ఒక వెన్నునో, తిరిగి తీసుకొనిరాలేదు, అయితే…

మొక్కజొన్న ఆ వెన్నుతో ఇట్లనలేదు, “నీ వలన నాకు ఎలాంటి ఉపయోగము లేదు.” లేదా, వెన్ను ఆ—ఆ ఆకుతో ఇట్లు చెప్పలేదు, “నీ వలన నాకు ఎలాంటి ఉపయోగమూ లేదు,” ఎందుకనగా ఆకులో ఉన్న ఆ జీవమే వెన్నును తయారు చేసినది. వెన్నులో ఉన్న ఆ జీవమే కుచ్చును తయారు చేసినది.

మరియు వెస్లీ సంఘమును తయారు చేసినది లూథరను సంఘమే. అలాగే పెంతెకొస్తు సంఘమును తయారు చేసినది వెస్లీ సంఘమే.

అయితే, పెంతెకొస్తు, అది ఏమిటి? అది ప్రారంభములో భూమిలోనికి వెళ్ళిన అదే రకమైన గింజ యొక్క పునరుద్ధరణయైయున్నది, ఈ కడవరి దినాలలో, చూడండి, అది పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా, పెంతెకొస్తు శక్తి యొక్క పూర్తి సంపూర్ణతను తిరిగి తీసుకురావడమైయున్నది. ఓ, చూచుటకు, నమ్ముచూ మరియు దానివైపు చూచుటకు, అది ఒక గొప్ప విషయమైయున్నది.

42 ఇప్పుడు మనమిప్పుడు జీవిస్తున్న ఈ కాలములో, ఈ కాలము, ఇది పెంతెకొస్తును దాటిన కాలమైయున్నది.

పెంతెకొస్తు దానినదే సంస్థలలో స్థిరపరచుకున్నది, మరియు సంస్థలను గూర్చి ఎంతగానో నఖలు చేయడం ప్రారంభించినది, “మేము ఇది మరియు మేము అది.” అది కేవలం ప్రకృతియైయున్నది. దాని విషయంలో మీరు ఏమియు చేయలేరు. అది ప్రకృతియైయున్నది. వారు దానిని చేస్తారు. వారు అలా చేయాలనేది, అది ప్రణాళికయైయున్నది.

అయితే సంఘము ముందుకు కొనసాగిపోయినది. అది మరింత గొప్ప దానిలోనికి, మరింత శక్తివంతమైన దానిలోనికి వెళ్ళినది. అది వరముల యొక్క పునరుద్ధరణయైయున్నది.

మరియు చాలా మంది పెంతెకొస్తు ప్రజలు దైవిక స్వస్థత, దేవదూతల పరిచర్య, మరియు దేవుని యొక్క శక్తులను నమ్మరు. చాలా మంది పెంతెకొస్తువారు నేను చూసే ఈ దర్శనాలను, “దయ్యము” అని అంటారు. పెంతెకొస్తులో ఉన్న, అనేక సంఘశాఖలకు దానితో ఎటువంటి సంబంధము లేదు. చూడండి, మనము దానిని దాటియున్నాము. భాషలలో మాట్లాడుట వలన, పెంతెకొస్తువారిని మెథడిస్టులు, “వెర్రి వారు,” అని పిలిచినట్లేయున్నది. కేకలు వేయుట వలన మెథడిస్టులను లూథరన్లు, “పిచ్చి వారు,” అని పిలిచినట్లేయున్నది. చూశారా?

అయితే ఆ గొప్ప సంఘము సంపూర్ణముగా నింపబడి, మరియు సర్వ-శక్తిమంతుడైన దేవుని యొక్క గొప్ప శక్తులను, పూర్తిగా తాగే వరకు, హల్లెలూయా, అదంతా పరిశుద్ధాత్మ వచ్చుటయేయైయున్నది. ఎంతగా అంటే, యేసు చేసిన అవే క్రియలు ఇప్పుడు నేరుగా సంఘములో వాటినవి ప్రత్యక్షపరచుకునే ఒక చోటుకు అది వచ్చినది. స్నేహితులారా, మనము సమీపములో ఉన్నాము.

43 దేవుడు సంఘములో పరిశుద్ధాత్మను ఎందుకొరకు పెట్టాడో తెలియజేయుటకు, నన్ను ఇక్కడ ఒక్క నిమిషం ఆగనివ్వండి, మీరు గ్రహించునట్లు మీకు మరొక మాదిరిని ఇచ్చెదను. వెనుక పాత నిబంధనలో, ఒక—ఒక శిశువు…

ఒక వ్యక్తి తన కొరకు ఒక ఇంటిని నిర్మించుకుంటాడు. అతడు తన వధువును పొందుకుంటాడు, అది మొదటి విషయము.

పిదప అతడు ఒక సంస్థ వలె, ఒక గొప్ప వ్యక్తి అవుతాడు. అది బాగున్నది.

పిదప జరిగినది ఏమిటంటే, ఆ ఇంటిలోనికి ఒక జన్మ సంభవిస్తుంది. అప్పుడే పరిశుద్ధాత్మ, చూడండి, మరొక ఆత్మ లోపలికి వచ్చినది, అది ఒక కుమారుడు. ఆ కుమారుడు, అతడు ఒక నిర్దిష్ట వయస్సుకు వచ్చేంతవరకు, అతడు పూర్తి అధికారమును కలిగియుండడు, అతడు ఒక వారసునిగానూ ఉండలేడు. మరియు అతడు, మొదట నిరూపించబడవలసియుండెను. అవును.

మరియు అప్పుడు వారికి దత్త పుత్రత్వము అనే చట్టము ఉండియున్నది. సేవకులైన మీకు చెప్పుచున్నాను, నేను ఇప్పుడు మాట్లాడేది “ఒక కుమారుడిని స్థానములో పెట్టుట,” ను గూర్చియైయున్నది, చూడండి, పిదప అతడు దత్తత తీసుకొనబడిన ఒక స్థానానికి అతడు వచ్చినప్పుడు. రూపాంతరపు కొండ పైన, యేసు దానికి ఒక అందమైన దృష్టాంతమును ఇచ్చెను.

44 నేను చెప్పినట్లుగా, దేనినైనా చేయుటకు దేవుడు ఎన్నడూ తన నియమాలను దాటి వెళ్ళడు.

గాలిలో అంతటా నీరును వెదజెల్లుతూ, ఒక బుగ్గ బావిని మీరు ఈ కొండపైన కలిగియుండి, మరియు ఇక్కడ ఉన్న ఈ వేరొక కొండ పైన, కాలిపోవుచున్న పంటను మీరు కలిగియుంటే, మీరు ఈ కొండ పైన నిలబడి ఇలా కేకలు వేయవచ్చును, “ఓ, నీరూ, నీవు పరుగిడి వెళ్ళి, నా పంట మొత్తాన్ని తడుపుము! ఓ, నీరూ, నా పంట వద్దకు వెళ్ళుము!” అది ఎప్పటికీ అలా చేయదు. కానీ మీరు గురుత్వాకర్షణ నియమాల ప్రకారం పని చేస్తే, మీరు ఆ పంటకు నీరు పెట్టవచ్చును.

45 ఇక్కడ పడియున్న ఒక వ్యాధి గ్రస్తుడను, లేదా ఒక పాపిని, లేదా సరిగ్గా ఉండాలని కోరుచున్న ఒక వ్యక్తిని మీరు ఇక్కడ కలిగియున్నారు, అతడు మద్యపానమును, ధూమపానమును మానలేకున్నాడు, కామమును మరియు అటువంటి వాటిని వదులుకోలేకున్నాడు. మీరు కేవలం దేవుని నియమాల ప్రకారం పని చేసి, పరిశుద్ధాత్మను అక్కడకు రానిచ్చిన యెడల, అప్పుడు అతడు ఇంకెంత మాత్రము అతని సొత్తు కాదు. అతడు, అతడు ఆ కార్యమును ఆపివేస్తాడు, ఎందుకనగా పరిశుద్ధాత్మ అతణ్ణి స్వాధీనములోనికి తీసుకుంటాడు. కానీ మీరు దేవుని యొక్క చట్టాలు, దేవుని యొక్క నియమాల ప్రకారము పని చేయవలసియున్నది.

46 ఇప్పుడు, పాత నిబంధనలో, ఆ శిశువు పుట్టినప్పుడు, అతడు ఎలా ప్రవర్తిస్తాడో, ఆ ప్రవర్తనను చూచుటకు, వారు వానిని గమనించేవారు.

అప్పుడు ఆ తండ్రి, ఈ సమయానికల్లా ఒక గొప్ప వ్యాపారవేత్తయైయుండి, బహుశా తన నలభై లేదా యాభైలలో ఉండవచ్చును, స్వయంగా తానే ఈ బిడ్డకు నేర్పడానికి అతనికి సమయం లేదు, కావున అతడు…ఇప్పుడు వీరు కలిగియున్నట్లు ఆ రోజుల్లో వారు ప్రభుత్వ పాఠశాలలు కలిగిలేరు, కావున వారు, “బోధకుడు,” లేదా ఒక “పెంచేవాడు,” అని పిలిచే పాఠశాల ఉపాధ్యాయుడిని కలిగియుండేవారు. మరియు ఈ పాఠశాల ఉపాధ్యాయుడు, అతడు నమ్మకముగా ఉండి మరియు దానిని గూర్చి తండ్రికి నిజము చెప్పులాగున, అతడు కనుగొనగలిగిన అత్యుత్తమమైనవాడు.

47 మరియు పిదప ఈ అబ్బాయి ఒక నిర్దిష్ట వయస్సుకు వచ్చినప్పుడు, అతడు పరిపక్వం చెందాడు, అని అనుకుందాము. ఆ అబ్బాయి కేవలం ఒక తిరుగుబోతుయై, ఏ ప్రయోజనమూ లేక, తన తండ్రి వ్యాపారమును పట్టించుకోకుండా ఉండి; అతడు ఆడవాళ్ళ వెంటపడుచూ సరసాలాడటం, లేదా—లేదా మద్యపానం, లేదా జూదం, లేదా గుర్రపు పందెముల గూర్చియే అతడు ఆలోచించిన యెడల; ఆ బాలుడు ఎప్పుడూ ఒక కొడుకుగానే ఉంటాడు, కానీ తన తండ్రి కలిగియున్న దానంతటికి వారసత్వమును కలిగియుండే స్థానములో ఎన్నడూ ఉంచబడడు.

కానీ అతడు ఒక మంచి పిల్లవాడైయుండి, మరియు అతడు తన తండ్రి వ్యాపారం గూర్చి ఆలోచిస్తూ, మరియు ఒక సరైన బిడ్డ అని అతడు నిరూపించుకున్న యెడల, అప్పుడు వారు ఒక వేడుకను జరుపుకుంటారు. వారు ఆ అబ్బాయిని వీధిలోనికి తీసుకెళ్ళి, అతనికి ఒక తెల్లని వస్త్రమును ధరింపజేస్తారు, మరియు ఆ నగరమంతా అతణ్ణి చూచునట్లు వారు అతణ్ణి ఒక పరంజా మీద నిలబెడతారు. వారు ఒక విందును మరియు ఒక ఉత్సవమును చేస్తారు, మరియు పిదప ఆ తండ్రి దత్త పుత్రత్వ వేడుకను చేస్తాడు. అతడు తన స్వంత కుమారుడినే తన స్వంత వ్యాపారంలోనికి దత్తతు తీసుకుంటాడు, మరియు అప్పుడు ఆ కుమారుడు తన తండ్రితో సమాను-డౌతాడు. మరో మాటలో చెప్పాలంటే, ఈనాడు అయితే, చెక్కులో తండ్రి పేరు ఎంతో కుమారుడి పేరు అంతే చెల్లును.

48 ఇప్పుడు దేవుడు ఏమి చేసెనో గమనించండి. తన కుమారుడు జన్మించినప్పుడు, ఆయన ఆయనను ముప్పై సంవత్సరాలు విడిచిపెట్టాడు, ఆయనను పరీక్షించాడు, పరిశోధించాడు. పిదప ఆయన అతనికి మూడు సంవత్సరాల కఠిన పరీక్షను ఇచ్చెను. ఆపై ఆ కఠిన పరీక్ష యొక్క ముగింపులో, తన కుమారుడు తండ్రి పని మీద ఉన్నాడని ఆయన చూసినప్పుడు; రూపాంతరపు కొండ, లూకా సువార్త; ఆయన పేతురు, యాకోబు, యోహాను అను, ముగ్గురు సాక్షులను తీసుకొని, కొండపైకి వెళ్ళాడు, మరియు అక్కడ దేవుడు దత్త పుత్రత్వపు నియమాలను ప్రదర్శించాడు. ఆయన…వారు పైకి చూసి మరియు వారు యేసును చూశారు, మరియు ఆయన వస్త్రాలు మెరుపువలె తెల్లగా ప్రకాశించాయి. మరియు ఒక మేఘం ఆయనను కమ్మగా, మరియు ఆ మేఘం నుండి ఒక స్వరం వచ్చి, ఇట్లు పలికినది, “ఈయన నా ప్రియ కుమారుడు; మీరు ఈయన మాట వినుడి. నేను ఇప్పుడు కూర్చుంటాను మరియు ఇక ఏమియు చెప్పను. ఆయన ఏమి చెప్తాడో అదే ధర్మము మరియు సత్యము.”

49 ఇప్పుడు సంఘము ఆ పాఠశాలల గుండా వచ్చియున్నది. ఆమె చాలా కాలం క్రితమే, వివాహం చేసుకున్నది, మరియు ఒక సంఘశాఖగా, ఒక సంస్థగా మారిపోయినది. అయితే, మీరు గమనించినయెడల, ఆ జన్మ మరొకదానిని ఉత్పత్తి చేసినది. మరియు ఎక్కడైతే పెంతెకొస్తు సంఘము, కొత్త జన్మతో, పరీక్షించబడి మరియు పరిశోధించబడినదో ఆ స్థానానికి అది వచ్చినది, మరియు ఇప్పుడు అది ఒక స్థానానికి వచ్చుచున్నది…దేవుడు సంఘముతో కేవలం ఒక సంస్థగా వ్యవహరించడు. ఆయన సంఘముతో ఒక—ఒక గుంపు ప్రజలుగా వ్యవహరించడు.

ఆయన సంఘముతో వ్యక్తులుగా వ్యవహరించును, సంఘములో ఉన్న ఒక్కొక్క వ్యక్తితో వ్యవహరిస్తాడు. మరియు ఇప్పుడు అది ఒక సమయానికి వచ్చినది…మరియు అది రహస్యము కానే కాదు; మనమందరము దానిని చూస్తున్నాము. ఒక వ్యక్తి నిరూపించినప్పుడు, మరియు దేవుడు అతణ్ణి ప్రేమించినప్పుడు, ఆయన అతణ్ణి ఎక్కడికో తన వద్దకు తీసుకొనివెళ్తాడు. అక్కడ దేవదూతల యెదుట ఆయన అతని కొరకు దేనినో చేస్తాడు. ఆయన దేవుని సన్నిధిలో అతణ్ణి పైకి లేపి, అతనికి వరములను ఇచ్చి, మరియు అతణ్ణి నింపి, మరియు అతణ్ణి బయటకు పంపుతాడు. ఆ కాలములోనే మనము జీవించుచున్నాము.

50 లూథరన్‌లను రక్షించి, మెథడిస్టులను శుద్ధీకరించి, పెంతెకొస్తువారికి బాప్తిస్మము ఇచ్చిన అదే పరిశుద్ధాత్మ, ఇప్పుడు ప్రభువైన యేసు యొక్క రాకడను క్రమపరచుచున్నాడు. అది, చాలా శక్తివంతమైనప్పుడు, ఆ శరీరము, ఈ గుంపులోనికి వస్తుంది, ఒక సంఘము, అది ఆ మిగిలిన వారిని సమాధిలో నుండి లేపుతుంది. ఒక పునరుత్థానం ఉంటుంది. దాని కొరకే పరిశుద్ధాత్మ ఇవ్వబడినది. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? “మనము లేకుండా వారు సంపూర్ణులు కాలేరు.” వారు ఒక దినమున, దాని క్రింద జీవించారు. మనము మరియొక దినములో జీవించుచున్నాము.

“శత్రువు వరద వలె వచ్చినప్పుడు, నేను…దేవుని ఆత్మ దానికి వ్యతిరేకముగా ఒక ధ్వజమునెత్తును.” చూశారా? మనము ఇప్పుడు ఒక దినములో ఉన్నాము…

51 ఆ వెనుకటి వారు, ఈనాటి వారు కలిగియున్నదానిలో సగం తెలివితేటలనైనా కలిగిలేరు. వారు ఒక అణుబాంబునైనను లేదా ఒక మోటరు వాహనమునైనను తయారు చేయలేకపోయారు. ఇప్పుడు మనం కలిగియున్నట్లు విజ్ఞాన శాస్త్రము మరియు విషయాలు వారు కలిగిలేరు, అయితే, మర్మమైన సంగతుల యొక్క విషయాలు; కొంత ధూళి మరియు అటువంటివి, కలిసి ప్రేలుట ద్వారా మానవుడు వచ్చాడని చెప్పడానికి ప్రయత్నిస్తారు, మరియు ప్రజలలో నుండి అవిశ్వాసులను తయారు చేయుటకు, కొంత విశ్లేషించి మరియు దానిని నిరూపించడానికి ప్రయత్నిస్తారు.

అయితే ఇప్పుడు, మనకు అది అవసరమైనప్పుడు, దేవుని ఆత్మ ఒక ధ్వజమును ఎత్తుతుంది. అది ఏమిటి? ఆయన తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. అప్పుడు, సమాధిలో లేదా దేవుని యొక్క బలిపీఠం క్రింద విశ్రాంతి తీసుకొనుచున్నవారు, లేఖనం చెప్పినట్లు, ఇట్లు కేకవేయుచున్నారు, “ఎంత కాలము, ప్రభువా? ఎంత కాలము? ఇంకా ఎంత కాలము?” దేవుడు నా కొరకు మరియు నీ కొరకు వేచియున్నాడు. సంఘము నా కొరకు మరియు నీ కొరకు వేచియున్నది. దత్త పుత్రత్వ సమయము, అది దేవుడు తన సంపూర్ణతను, తన శక్తిని, తన పునరుత్థానమును మనలోనికి కుమ్మరించుకోగలిగినప్పుడై యున్నది, తద్వారా క్రీస్తు మన మధ్య దృష్యునిగా చేసుకొని, మరియు మృతులను లేపి, మరియు మనము ఎత్తబడుటలోనికి వెళ్ళునంతగా, సంఘము మరియు క్రీస్తు, ఎంతో సమీపముగా వచ్చుదురు.

52 ఇప్పుడు మనం చెప్పబోవుచున్నాము, కొద్ది సమయం తర్వాత దానిని చూపించబోవుచున్నాము, అదేమిటనగా పరిశుద్ధాత్మతో నింపబడినవారు మాత్రమే ఆ ఎత్తబడుటలోనికి వెళ్తారు. “ఆ వెయ్యి సంవత్సరాల వ్యవధి వరకు కడమ మృతులు బ్రదుకలేదు.” అది నిజము. కేవలం పరిశుద్ధా-త్మతో-నింపబడిన ప్రజలు మాత్రమే ఎత్తబడుటలోనికి వెళ్ళియున్నారు. ఇప్పుడు, దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చాడు…

53 నేను ఇక్కడ మరొక లేఖనమును కలిగియున్నాను, అది యోహాను 14:12. ఇక్కడ ఆలయము వద్ద ఉన్న ప్రజలందరికీ అది బాగా తెలిసిన లేఖనం.

నిశ్చయంగా, నిశ్చయంగా, నేను మీతో చెప్పునదేమనగా, నాయందు విశ్వాసముంచువాడు…

ఇప్పుడు, “విశ్వాసముంచువాడు” అన్న ఆ పదము మిమ్మల్ని వెనక్కి ఉంచనివ్వకండి. ఒక నామకార్ధపు సంఘంలో, ఇట్లందురు, “అవును, నేను నమ్ముచున్నాను. నిశ్చయంగా, యేసు క్రీస్తు దేవుని కుమారుడని నేను నమ్ముచున్నాను.” దయ్యం కూడా దానినే నమ్ముచున్నది. అది ఖచ్చితము. వాడు నమ్ముచున్నాడని పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది.

అయితే యోహానులో, లేఖనం, ఇట్లు చెప్పుచున్నది, “పరిశుద్ధాత్మ వలన తప్ప, ఎవడునూ యేసే క్రీస్తని చెప్పలేడు.” మీరు, నిజానికి, లేఖనం ద్వారా…నేను చదవడం పూర్తి చేసే ముందు, నన్ను ఒక్క నిమిషం ఇక్కడ ఆగనివ్వండి. మీరు పరిశుద్ధాత్మను పొందే వరకు మీరు మార్పు చెందినవారు కారు. అది నిజము.

54 మీరు “దానికై” విశ్వసించుచున్నారు. పరిశుద్ధాత్మ మీతో మాట్లాడియున్నాడు, మరియు మీరు ఆయనను బహిరంగముగా ఒప్పుకున్నారు. దయ్యం కూడా దానినే కలిగియున్నాడు. “ఆయన దేవుని కుమారుడని నేను నమ్ముచున్నాను.” దయ్యం కూడా దానినే చేయును. అయితే మీరు ఆయన వైపు నడచి వెళ్ళుచున్నారు.

పేతురు పిలువబడి, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా, నీతిమంతునిగా తీర్చబడినప్పుడు; మరియు యోహాను 17:17లో, యేసు వారిని వాక్యము ద్వారా పరిశుద్ధపరచాడు, ఏలయనగా వాక్యము సత్యమైయున్నది. మరియు ఆయన వాక్యమైయున్నాడు. 1, యోహాను ఇట్లు చెప్పుచున్నది, “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియెద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడైయ్యుండెను. మరియు ఆ వాక్యము శరీరధారియై, మన మధ్య నివసించెను.” ఆయనే ఆ వాక్యము, కావున ఆయన వారిని పరిశుద్ధపరచాడు. ఆయన ఇట్లన్నాడు, “తండ్రి,” తనలో ఉన్న ఆత్మతో మాట్లాడుచూ ఇట్లన్నాడు, “నేను వాక్యము ద్వారా వారిని పరిశుద్ధపరచుచున్నాను,” స్వయంగా ఆయనే, ఆయన చేతులు వారిపై ఉంచుట ద్వారాయైయున్నది. “నీ వాక్యమే సత్యమైయున్నది.” ఒక స్త్రీ యొక్క గర్భంలో, కేవలం ఆయనను ఉనికిలోనికి పలికెను; ఓ, ఆయనను ప్రత్యక్షపరచడానికి దేవుని యొక్క ఈ వాక్యం తప్ప వేరే ఏ విధంగానైనా ఆయన ఉండటం పూర్తిగా అసాధ్యం. “నేను వారిని పరిశుద్ధపరచాను.”

55 అపవిత్రాత్మలకు వ్యతిరేకంగా ఆయన వారికి శక్తిని ఇచ్చాడు. వారు బయటకు వెళ్ళారు. ఆయన వారి పేర్లను గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఉంచాడు. మరియు ఆయన వారిని పంపాడు, యోహాను…మత్తయి 10, మరియు వారికి అపవిత్రాత్మల మీద అధికారమిచ్చాడు; అపవిత్రాత్మలను పారద్రోలడానికి, మరియు కార్యములు చేయడానికి, మరియు మొదలగువాటి కొరకు శక్తిని ఇచ్చాడు. మరియు వారు సంతోషిస్తూ, తిరిగి వచ్చి, ఇట్లన్నారు, “దయ్యములు కూడా మాకు లోబడుచున్నవి.”

ఆయన ఇట్లు చెప్పాడు, “దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించకుడి గాని; మీ పేర్లు గ్రంథములో ఉన్నందున సంతోషించుడి.” మరియు యూదా వారితో కూడా ఉండెను. అతడు ఎంత దగ్గరగా రాగలిగెనో చూడండి; నేరుగా నీతీకరణము గుండా, ఆపై నేరుగా శుద్ధీకరణలోనికి వచ్చెను. అయితే అతడు తన వెలుగును ఎక్కడ చూపించాడు? అతడు తనను తాను ఎక్కడ చూపించుకున్నాడు? పెంతెకొస్తుకు ముందు, అతడు తన రంగులను చూపించాడు.

56 గమనించండి, ఆ ఆత్మ ఎంత పవిత్రంగా మరియు ఎంత నీతిగలదిగా ఉండగలదో అంతగా అది ఉంటుంది, ఎంతగా అంటే అది పరిశుద్ధాత్మ వద్దకు వచ్చువరకైయున్నది, మరియు వారు దానిని సరిగ్గా అక్కడే ఆపివేస్తారు. కదలాడుచున్న ఆత్మ (మీరు దానిని చూచుటలేదా?) అదేయైయున్నది, క్రీస్తు విరోధి. మరియు యేసు ఇట్లు చెప్పెను, “ఈ కడవరి దినములలో, సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సైతం మోసం చేయునంతగా, అవి ఎంతో దగ్గరగా ఉండును.” అయితే, గుర్తుంచుకోండి, కేవలం ఎన్నిక చేయబడినవారు మాత్రమే దానిని చూస్తారు.

దేవుడు ఎన్నిక ద్వారా పిలుస్తాడు. మీరు, వారిలో మీరు ఒకరు అయినందుకు మీరు సంతోషంగా లేరా? ఈ రాత్రి, ఇక్కడున్న ప్రజలారా, “నాకు ఆ పరిశుద్ధాత్మ కావాలి. ప్రభువా, నీవు నా హృదయంలో ఉండుట, నాకు కావాలి” అని, మీ హృదయంలో ఏదో లాగుచుండుట మీకు తెలియడంలేదా? అది జగత్తు పునాది వేయబడకముందే దేవుడు మీ పేరును గొర్రెపిల్ల జీవగ్రంథములో ఉంచుటవలనైయున్నది. ఆయన దానిని చెప్పెను.

“ఎవడునూ నా యొద్దకు రాలేడు,” యేసు చెప్పెను, “నా తండ్రి మొదట ఒకనిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. మరియు నా యొద్దకు వచ్చు వారందరికీ, నేను వారికి నిత్యజీవమును ఇచ్చెదను.” నిత్యజీవము అనగా ఏమిటి? పరిశుద్ధాత్మయే. “నిత్యజీవము,” ఆ పదాన్ని తీసుకొని మరియు దానిని గ్రీకు భాషలో చూసినట్లైతే, అది, జోయి అని చెప్పబడుచున్నది. జోయి అనగా పరిశుద్ధాత్మ. “తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు. మరియు నా యొద్దకు వచ్చు వారందరికీ, నేను అతనికి పరిశుద్ధాత్మను అనుగ్రహించెదను, మరియు అంత్య దినమున నేను వానిని లేపుదును. నేను దానిని చేయుదును,” అని ఆయన చెప్పెను. దానిని గూర్చి అట్లైనచో-మరియు-మరియులు లేవు. “నేను చేసెదను. వచ్చు వారందరికీ; నేను నిత్యజీవమును ఇచ్చెదను.” అతడు లేవవలసియున్నది, ఎందుకనగా అతడు నిత్యజీవమును కలిగియున్నాడు. అతడు రావలసియున్నది. దేవుడు మరణించడు గనుక అతడును ఎన్నడూ మరణించడు.

57 ఓ, ఈ దేశమంతటి నుండియైన మరియు ఈ చిన్న నగరంలో ఉన్న నా ప్రియమైన స్నేహితులారా, నేను గనుక, నా మానవ స్వరంతో, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుట యొక్క ప్రాముఖ్యతను మీ హృదయంలో ఉంచగలిగితే చాలు, అది మీరు మీ జీవితంలో ఎన్నడూ పొందనటువంటి అత్యంత అద్భుతమైన ప్రత్యక్షతగా ఉంటుంది. అదేమిటని చూడటానికి…మీరు దానిని తప్పక చేయాలి.

దానిని అనగా, “మీరు మార్పు పొందలేదు,” అన్నదాని గురించి నన్ను స్పష్టం చేయనివ్వండి.

58 పేతురు రక్షించబడ్డాడు. అతడు ప్రభువునందు విశ్వాసముంచి, ఆయనను వెంబడించాడు. అతడెవరన్నది యేసు అతనికి చెప్పి, అతడు ఆయనను వెంబడించునట్లు చేసెను. ఆయన అపవిత్రాత్మలకు వ్యతిరేకంగా అతనికి అధికారాన్ని ఇచ్చాడు మరియు అతనిని పరిశుద్ధపరచాడు. కానీ వాటన్నింటి తరువాత, మరియు అతడు ఆ గుంపు యొక్క ప్రతినిధిగా మారాడు; కాథలిక్కులు దానిని పిలువగోరునట్లు, “సంఘము యొక్క బిషప్పు, లేదా పోపు,” లేదా అదేమైయున్నదో అది, సంఘములో ప్రధానుడు; అయిననూ, ఆయన అప్పగింపబడనున్న రాత్రి యేసు ఇట్లనెను, “పేతురూ, నీవు నన్ను ప్రేమించుచున్నావా?”

మరియు అతడు ఇట్లన్నాడు, “ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలియును.”

ఇట్లనెను, “నా గొర్రెలను మేపుము.” ఆయన దానిని మూడుసార్లు చెప్పెను.

మరియు పేతురు, “నేను నీతో—అంతము వరకు వెళ్ళేంతగా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవు ఎరుగుదువు. మరియు నేను నీతో మరణము వరకు వెళ్ళుదును,” అని మొదలగునవి చెప్పెను.

59 ఆయన ఇట్లు చెప్పెను, “కోడి మూడుసార్లు కూయక మునుపు, నీవు…కోడి కూయక మునుపు, నీవు నన్ను మూడుసార్లు తిరస్కరించెదవు.” ఆయన ఇంకా ఇట్లన్నాడు, “కానీ, పేతురు, నేను నీ కొరకు ప్రార్థించాను.” వినండి. అదే అంతా కాదు. “నేను నీ కొరకు ప్రార్థించాను. మరియు నీవు మార్పునొందిన తర్వాత, అప్పుడు నీ సహూదరులను బలపరుచుము.”

“నీ మనసు తిరిగిన తర్వాత.” అతడు కేకలు వేశాడు. అతడు ఆత్మలో నాట్యమాడియుంటాడు. అతడు, అతడు అన్ని విధములైన కార్యములను చేసాడు, కానీ అతడింకను పరిశుద్ధాత్మను పొందుకొనలేదు. “నీవు మార్పునొందిన తరువాత, అప్పుడు నీ సహోదరులను బలపరచుము,” అది నిజము, “ఆయన ప్రణాళిక చొప్పున చేయుము.”

60 ఇప్పుడు నేను యోహాను 14:12 చదవడం పూర్తి చేయనివ్వండి. ఇప్పుడు 14వ అధ్యాయము 12వ వచనంలో, యేసు ఇట్లు చెప్పెను, “నిశ్చయంగా, నిశ్చయంగా, నేను మీతో చెప్పుచున్నాను, విశ్వసించువాడు…” మరియు మీరు విశ్వసించలేరు…“నాయందు విశ్వసించువారు.” మీరు ఆయన కొరకు విశ్వసించగలరు. అది ఎంతమందికి అర్థమగుచున్నది? “ఆమేన్,” అని చెప్పండి. [సంఘము “ఆమేన్,” అని చెప్పుచున్నది—సంపా.]

61 అపొస్తలుల కార్యములు 19లో, మీకు జ్ఞాపకమున్నది కదా. దీనిని ఇక్కడ ఆపడం నాకు ఇష్టం లేదు, కానీ అది నా వద్దకు వచ్చినప్పుడు నేను దానిని చెప్పవలసియున్నది. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో, ఈ బాప్టిస్టు బోధకుడు, అతడు ఒక—ఒక న్యాయవాది మరియు మార్పు చెందినవాడు, మరియు అతడు బోధిస్తూ ప్రజలను రక్షణలోనికి తెచ్చుచుండెను. మరియు వారు గొప్ప ఆనందాన్ని కలిగియుండిరి, కేవలం సంతోషిస్తూ మరియు కేకలు వేయుచూ, ఒక కూటమును కలిగియున్నారు. అపొస్తలుల కార్యములు 18, అకుల మరియు ప్రిస్కిల్ల, మనము నిన్న సాయంత్రం దానిని ప్రస్తావించాము, మరియు వారు అతణ్ణి చూడటానికి వెళ్ళారు. మరియు అతడొక గొప్ప వ్యక్తి అని వారికి తెలియును, మరియు అతడొక విద్యార్థి. మరియు అతడు యోహాను యొక్క బాప్తిస్మమును మాత్రమే ఎరిగియుండి, యేసు దేవుని కుమారుడని బైబిలు ద్వారా నిరూపించుచున్నాడు. అతనికి ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిస్మము గూర్చి తెలియదు. కావున అతడు ఇట్లన్నాడు…

అకుల మరియు ప్రిస్కిల్ల, ఆ భార్యాభర్తలు, డేరాలు కుట్టువారు; మరి, పౌలు కూడా, డేరాలు కుట్టువాడైయుండెను. మరియు పౌలు బోధ క్రింద వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వారిట్లన్నారు, “ఇక్కడికి వచ్చుచున్న ఒక చిన్న సహోదరుడు ఉన్నాడు. మనతో దానిని గూర్చి అతణ్ణి కొంచెం మాట్లాడనివ్వండి.”

మరియు పౌలు వచ్చి అతడు బోధించుటను విన్నప్పుడు, అతడొక గొప్ప వ్యక్తియని ఎరిగినవాడై, అతడు ఇట్లన్నాడు, “మీరు విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా?”

వారు ఇట్లు చెప్పారు, “పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే…మాకు తెలియదు.”

అందుకతడు ఇట్లడిగాడు, “ఆలాగైతే దేనినిబట్టి,” లేదా అక్కడున్న అసలైన గ్రీకు పదమేదనగా, “మీరు ఎట్లు బాప్తిస్మము పొందారు?”

వారు ఇట్లు చెప్పారు, “మేము ఇదివరకే యోహాను ద్వారా బాప్తిస్మము పొందాము.”

62 ఇప్పుడు పౌలు ఏమి చెప్పాడో గమనించండి. పౌలు, ఇట్లన్నాడు, “యోహాను మారుమనస్సు నిమిత్తమే బాప్తిస్మమిచ్చాడు; పాప క్షమాపణ నిమిత్తము కాదు గానీ, మీరు నమ్మినది అదియే అని చెప్పుచూ, మారుమనస్సు నిమిత్తం బాప్తిస్మమిచ్చాడు.”

మీరు క్రీస్తును మీ స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకై విశ్వసించుచున్నారు. నా ప్రియమైన బాప్టిస్టు సోదరులారా, అది పరిశుద్ధాత్మ బాప్తిస్మము కాదు. అది తప్పు.

గడిచిన ఒక దినమున, ఒక సహోదరుడు నాతో ఇట్లన్నాడు, “బ్రెన్హామ్ సహోదరుడా,” లేదా కొంత కాలం క్రితం, కొన్నినెలల క్రితం, అతడు ఇట్లన్నాడు, “బ్రెన్హామ్ సహోదరుడా, అబ్రాహాము దేవుని నమ్మెను, మరియు అది అతనికి నీతిగా ఎంచబడెను.”

నేను ఇట్లు చెప్పాను, “నిజమే.”

ఇట్లన్నాడు, “నమ్మడం కంటే ఒక మనిషి ఇంకా ఏమి చేయగలడు?”

63 నేను చెప్పాను, “ఒక మనిషి చేయగలిగినదంతా అదియే. ఈనాడు అతడు చేయగలిగినదంతా, దేవుని నమ్ముటయే. అయితే దేవుడు అతనికి ఒక సున్నతి ముద్రను ఇచ్చాడు,” గత రాత్రి మనము దానిని చూశాము, “ఆయనయందు అతనికున్న విశ్వాసాన్ని అంగీకరించాడనుటకు ఒక గుర్తుగా యైయున్నది.” మరియు, ఈనాడు, దేవుడు…

మీరు ఆయనను మీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించినప్పుడు మీరు ఆయనను విశ్వసిస్తారు. కానీ దేవుడు మీకు పరిశుద్ధాత్మ యొక్క ముద్రను ఇచ్చినప్పుడు, మీ నిత్యమైన గమ్యస్థానానికి ఆయన మిమ్మల్ని ముద్రించాడు. ఇప్పుడు బాప్టిస్టులైన మీరు దానిని తీసుకొనుడి, మరియు నిత్యభద్రత విషయంలో నేను మీతో ఉంటాను. అవును, అయ్యా. ఎందుకనగా, “దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, ఏలయనగా మీరు మీ విమోచనా దినము వరకు ముద్రించబడియున్నారు.” మీరు దాని కొరకు విశ్వసించుట ద్వారా ముద్రించబడలేదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడినారు. ఎఫెసీ 4:30, “దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, మీ విమోచనదినమువరకు మీరు ముద్రించబడియున్నారు.” అది మిమ్మల్ని ముద్రిస్తుంది, మీరు దేవుని దయను పొందినప్పుడు, మరి ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మ చేత ముద్రిస్తాడు.

అది అట్లున్నది, ఏలయనగా పరిశుద్ధ గ్రంథము ఇట్లు చెప్పుచున్నది, “పరిశుద్ధాత్మ వలన తప్ప, ఎవడును యేసు క్రీస్తని చెప్పలేడు.”

64 మీరు ఇట్లు చెప్పవచ్చు, “పాస్టరు గారు చెప్పినందున నేను నమ్ముచున్నాను.” అతడు చెప్పింది నిజమే, కానీ అది మీకు వర్తించదు. “వాక్యం అట్లు చెప్పుచున్నది గనుక నేను దానిని నమ్ముచున్నాను.” అది నిజం, కానీ అది మీ కొరకు కాదు, అది మీకు వర్తించదు.

యేసే క్రీస్తు అని మీరు చెప్పగల ఒకేఒక్క మార్గమేదనగా, పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చి మరియు సాక్ష్యమును కలిగియుండి, “ఆయన దేవుని కుమారుడు,” అని తనకు తానుగా సాక్ష్యమిచ్చినప్పుడైయున్నది. మీరు పునరుత్థానమును ఎరుగు ఒకే ఒక్క మార్గమేదనగా, పరిశుద్ధాత్మ సాక్షమిచ్చినప్పుడేయైయున్నది. “ఆయన అనగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును, జరుగబోవు సంగతులను మీకు చూపించును; నేను చెప్పిన, ఈ సంగతులను, మీకు జ్ఞాపకముచేయును.” మీరు దానిని వేదపాఠశాలలో ఎప్పటికీ కనుగొనలేరు. చూశారా? ఆయన ఈ సంగతులను మీకు జ్ఞాపకము చేయును.

65 ఇప్పుడు మనం ఈ లేఖనములో కేవలం కొంచెం ముందుకు చదవగోరుచున్నాము, ఇప్పుడు యోహాను సువార్త 14:12.

నిశ్చయంగా, నేను మీతో చెప్పుచున్నాను, నేను చేయు క్రియలు, నాయందు విశ్వాసముంచువాడును చేయును; వాటికంటె మరి గొప్పవియు…

మీరు దానిని చూడాలనుకుంటే, “మరి ఎక్కువ,” అనునది అక్కడ సరియైన అనువాదమైయున్నది.

…వీటికంటె గొప్ప కార్యములు చేయును; ఏలయనగా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను.

66 ఆయన తండ్రి యొద్దకు వెళ్ళిన యెడల, పరిశుద్ధాత్మ వచ్చును. అది సరియేనా? మరొక లేఖనము ఇట్లు చెప్పుచున్నది, “నేను వెళ్ళని యెడల, ఆదరణకర్త రాడు. కానీ నేను వెళ్ళినయెడల, నేను మరలా వచ్చి మరియు మీతోను, మీలోనూ ఉంటాను.” చూడండి, అది దేవుడు మీతో ఉండుటయైయున్నది. మొదట, మీపైన; క్రీస్తులో, మీతో; పరిశుద్ధాత్మగా, మీలో. అది దేవుడు మీలో ఉండుటయైయున్నది.

67 ఇప్పుడు, “నేను చేయు క్రియలు మీరును చేతురు,” వేరే క్రియలు కావు. అయితే దేవుడు క్రీస్తులో తాను చేయుచున్న అదే పనిని కొనసాగించడానికి, మీలోనికి, పరిశుద్ధాత్మను తీసుకురాగోరుచున్నాడు.

లూథరు కాలంలో ఆ క్రియలు అంత అవసరమైయుండలేదు. అది దేవుని సంఘమే. అది…వెస్లీ కాలంలో కొంచెం ఎక్కువ అవసరమైయుండెను.

ఎందుకనగా, పరిశుద్ధ గ్రంథము ఇట్లు చెప్పుచున్నది, “ఈ లోకము,” “అన్ని వేళలా బలహీనంగాను, మరియు తెలివిగాను, మరియు మరింత చెడ్డదిగాను మారును.” మనము…ప్రపంచం మరింత దుర్మార్గంగా మారుచున్నది…అది మనకు తెలియును. అంతెందుకు, ఒక వంద సంవత్సరాల క్రితం ఇంత క్రూరమైన మనిషి ఉంటాడని అసలు మీరు ఊహించలేనటువంటి, అంతటి క్రూరమైన పనులను, నేడు మానవుడు చేయుచున్నాడు. “అన్ని వేళలా మరింత దుర్మార్గాముగా, మరియు అన్ని వేళలా, దుర్మార్గులు మరింత దుర్మార్గాముగా చేయుదురు,” అని లేఖనము చెప్పుచున్నది, “మరింతగా మరియు మరి ఎక్కువగా చేయుదురు.”

68 అయితే, పరిశుద్ధాత్మ కదులుచున్నాడు. లూథరుతో దానియొక్క ఊపిరి కేవలం కొద్దిగా ఉన్నది; వెస్లీతో అది కొద్దిగా వీచినది; మరియు పెంతెకొస్తుతో అది లోతుగా వీచినది; ఇప్పుడు ఆ ఊపిరి మరియు ఆత్మ ఒకటైపోయినవి. ఆయన అక్కడ ఆ వెనుక చేసినట్లే పరిశుద్ధాత్మ యొక్క అదే శక్తివంతమైన గాలి వీచుటను తెచ్చుచూ, ఆమె ఐక్యమగుచున్నది, ఆయన గతములో చేసిన అవే క్రియలను ప్రత్యక్షపరచుచున్నది, సరిగ్గా ఈనాడు ప్రత్యక్షపరచబడుచున్నవి, అదే కార్యమైయున్నది.

69 యేసు ఏమి చెప్పెనో గమనించండి: “నిశ్చయంగా, నిశ్చయంగా నేను మీతో చెప్పుచున్నాను, తండ్రి దేనిని చేయుట కుమారుడు చూచునో, అదియే కానీ తనంతట తాను ఏదియు చేయనేరడు. తండ్రి ఏమి చేయునో, ఆయన దానిని కుమారునికి చూపించును. తండ్రి నాయందు నివసించుచున్నాడు; ఆయనే ఆ క్రియలను చేయును.” చూశారా?

70 ఇప్పుడు గమనించండి, సరిగ్గా ఇక్కడే నేను చెప్పగోరు మరొక విషయమున్నది. “ఏలాగు,” యేసు ఇట్లనెను, “తండ్రి నన్ను ఏలాగు పంపెనో,” ఇప్పుడు గమనించండి, “తండ్రి నన్ను పంపినట్లే, నేనును మిమ్మును పంపుచున్నాను.” “తండ్రి పంపినట్లే…” తండ్రి ఆయనను ఎట్లు పంపెను? ఆయనను పంపిన, తండ్రి, పరలోకము నుండి దిగివచ్చి మరియు ఆయనలో నివసించెను.

ఆయన బయలువెళ్ళెను. ఆయన ఇట్లు చెప్పెను, “నేను ఎల్లప్పుడూ నా తండ్రికి ఇష్టమైన దానినే చేయుదును.” చూశారా? తండ్రి ఆయనకు చేయమని చూపించుచున్న కార్యములనే చేయుచూ ఆయన వెళ్ళెను. “మొదటిగా నా తండ్రి నాకు చూపించనిదే నేను ఏమియు చేయను.” ఆయనను పంపిన దేవుడు, ఆయన లోపల ఉన్నాడు. “మరియు తండ్రి నన్ను పంపినట్లే, తండ్రి నన్ను పంపిన అదే విధంగా, నేనును మిమ్మును పంపుచున్నాను.” అది ఏమిటి? మీలో ఉన్న దేవుడు, కొనసాగించుచున్నాడు (ఏమిటి?) అవే కార్యములను, అవే కార్యములను కొనసాగించుచున్నాడు.

యేసు చెప్పెను, “ఆ…విశ్వసించువాడు, నన్ను అనగా ఆ పరిశుద్ధాత్మను, తనలోపల కలిగియున్నవాడు; విశ్వసించువాడు, నా పునరుత్థానాన్ని గూర్చి ఇదివరకే సాక్ష్యమిచ్చినవాడు, నేను అతనిలో ఉన్నానని ఎరిగియున్నాడు. నాలో ఉన్నవాడు; మీరు నాయందు నిలిచియున్నయెడల, నా మాటలు మీలో నిలిచియుండును.”

71 ఇప్పుడు మీరు ఇట్లనవచ్చు, “నేను యేసులో ఉన్నాను; కానీ నేను నిశ్చయంగా దైవిక స్వస్థతను నమ్మను.” ఆయన అక్కడ లేడని అది చూపిస్తుంది.

72 “నేను యేసును నమ్ముచున్నాను; వారు అక్కడ వెనుక కలిగియున్నట్లు, ఈ దినమున పరిశుద్ధాత్మను నేను నమ్మను.” ఆయన అక్కడ లేడని అది చూపిస్తుంది.

73 పరిశుద్ధాత్మ తాను మాట్లాడిన ప్రతి మాటకు సాక్ష్యమిచ్చును. ఆయన ఒక అబద్ధికుడు కాడు. ఆయన ఎవరికినీ లేదా ఏ సంఘ సంస్థకును భయపడడు. ఆయన ఎవరి కొరకు వెనుకకు తగ్గవలసిన అవసరం లేదు. ఆయన పలుకుతాడు, మరియు పిదప ఆయన దానితో నిలబడతాడు.

ఉన్నతులైన, మరియు కలుషితమైన, మరియు విద్యావంతులైన, లేదా మనం పిలుచునట్లు, ఐశ్వర్యవంతులైన వారు, వారు దానిని స్వీకరించగోరని యెడల, “దేవుడు ఈ రాళ్ళవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టించగల సమర్థుడు.” ఆయన బందిపోటులను, మరియు అక్రమకారులను, మరియు మిగతావరందరినీ తీసుకుని, వారిని పైకి లేపుతాడు. దేవుడు దానిని చేయగలడు, మరియు ఆయన దానిని చేయుచున్నాడు. “దేవుడు ఈ రాళ్ళవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టించగల సమర్థుడు.” ఎవరో ఒకరు దానిని చేయబోవుచున్నారు, ఎందుకనగా ఆయన దేవుడైయున్నాడు.

74 “నాయందు మీరును, మీయందు నా మాటలును నిలిచియుండినయెడల, మీకేది ఇష్టమో అడుగుడి,” ఎందుకనగా మీరు ఆయన వాక్యమును అడుగుచున్నారు, మరియు ఆయన వాక్యము జీవమైయున్నది. దానిని పలుకుడి. దేవుడు దానిని చెప్పినట్లైతే, మరియు ఆయన దానిని చెప్పాడన్న నిశ్చయత మీకు ఉంటే, ఆ వాక్యం సరియైనదని పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చును, అప్పుడు, సహోదరుడా, అక్కడే నీవున్నావు. దానిని పలకుము; అది అక్కడే ఉన్నది. “ఈ పర్వతముతో, ‘కదలిపొమ్ము,’ అని చెప్పి నీ హృదయములో సందేహించకుము, అయితే నీవు చెప్పినది నెరవేరుతుందని నమ్ముము.” మీ తండ్రి ఆత్మ మీలో ఉండి, మాటలాడుచున్నాడే గాని; మాటలాడువారు మీరు కారు. ఆ పర్వతముతో మాట్లాడుచున్నది, మీరు కాదు, ఆ పర్వతముతో మాట్లాడుచున్నది, మీలో ఉన్న తండ్రియే. అది కదలాల్సిందే. “ఆకాశము మరియు భూమి సమస్తము గతించును గాని,” ఆయన చెప్పెను, “కానీ నా ఆత్మ, లేదా, నా మాట గతించదు.” నిశ్చయంగా, అది గతించలేదు. తండ్రీ!

75 ఇప్పుడు, “నేను చేయు క్రియలు.” దేవుడు తన క్రియలను కొనసాగించుటకు, తన సంఘములో ఉన్నాడు. అందుకే ఆయన పరిశుద్ధాత్మను పంపాడు. ఇప్పుడు, ఆయన దానిని ఎరిగియున్నాడు. ఆయన, ఆయన వేరే విధానంలో అది అట్లు చేయబడదని, చేయబడుట అసాధ్యమని, ఆయన ఎరిగియున్నాడు, కావున ఆయన పంపవలసి వచ్చెను. తండ్రి కుమారుడిని పంపెను, తం-…కుమారునిలో ఉన్నదంతా మీలో పెట్టెను. మరియు ఆయన చేసిన అవే క్రియలను, ఇప్పుడు యేసు చేసిన అవే క్రియలను, సంఘమైయున్న, మీరు కూడా చేస్తారు.

దేవుని క్రియలు చేయుట మీకు ఇష్టం లేదా? యేసు ఇట్లు చెప్పెను, “మీరు దేవుని క్రియలు చేయగోరినయెడల, నాయందు విశ్వాసముంచుడి.” మీరు ఆయనయందు ఎట్లు విశ్వాసముంచెదరు? మీరు పరిశుద్ధాత్మను పొందుకునే వరకు మీరు దానిని చేయలేరు.

76 ఎందుకనగా, ఆయన దేవుని కుమారుడని ఏ మనుష్యుడును చెప్పలేడు; మీరు ఎవరో చెప్పిన దానిని చెప్పుచున్నారు. “ఆయన దేవుని కుమారుడని బైబిలు చెప్పినది; నేను బైబిలును నమ్ముచున్నాను.” అది సరియే. “ఆయన దేవుని కుమారుడని బైబిలు చెప్పుచున్నది; నేను బైబిలును నమ్ముతాను. ఆయన దేవుని కుమారుడని పాస్టరు గారు చెప్పారు; నేను పాస్టరు గారిని నమ్ముతాను. ఆయన దేవుని కుమారుడని అమ్మ చెప్తుంది; నేను అమ్మను నమ్ముతాను. ఆయన దేవుని కుమారుడని నా స్నేహితుడు చెప్పుచున్నాడు; నేను నా స్నేహితుణ్ణి నమ్ముతాను.”

కానీ ఆయన దేవుని కుమారుడని నేను చెప్పగలిగే ఒకే ఒక్క మార్గమేదనగా, పరిశుద్ధాత్మ లోపలికి వచ్చి మరియు తన గూర్చి తానే సాక్ష్యమిచ్చినప్పుడైయున్నది, అప్పుడు ఆయన దేవుని కుమారుడని నేను ఎరుగుదును. “పరిశుద్ధాత్మ వలన తప్ప యేసు, ‘క్రీస్తు,’ అని ఏ మనిషీ చెప్పలేడు.” అంతే!

77 దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుచున్న ఏ వ్యక్తి కూడా యేసును శాపగ్రస్తుడని చెప్పలేదు, లేదా ఆయన ఆనాడు ఒకటి అని మరియు ఈనాడు మరొకటి అని చెప్పలేదు. అది ఆయనను బలహీనునిగా మరియు తప్పిదస్తునిగా చేస్తుంది. లేదు, అయ్యా.

ఆయన నిన్నా, నేడు, మరియు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఏ నిజమైన ఆత్మయైనా దానిని గూర్చి సాక్ష్యమిస్తుంది. సరి.

78 ఇప్పుడు, ఆయన ఇట్లు చెప్పెను, “నేను చేయు ఈ క్రియలు మీరునూ చేయుదురు,” యోహాను 14:12, ఇప్పుడు, అవే క్రియలు.

“ఓ,” వారు ఇట్లంటారు, “ఈనాడు సంఘము మరి గొప్ప కార్యము చేయుచున్నది.” ఏ విధముగా?

ఆయన ఇట్లు చెప్పెను, “నేను చేయు క్రియలు.”

“అది,” వారు ఇట్లు చెప్తారు, “మంచిది, మేము ప్రపంచవ్యాప్తంగా మిషనరీలను కలిగియున్నాము, అదే ఒక గొప్ప కార్యము.”

79 కానీ ఆయన ఇట్లు చెప్పెను, “నేను చేయు క్రియలు.” ఇప్పుడు వాటిని చేయండి, మొదట వాటిని చేయండి, తర్వాత మిషనరీల గూర్చి మాట్లాడండి.

80 ఈ రోజు, కొంత సమయం క్రితం ఇక్కడ ఒక మహమ్మదీయుని గూర్చి మాట్లాడుచూ, అతడు ఇట్లన్నాడు, “మహమ్మదు చనిపోయాడు.”

“అది నిజం, అతడు సమాధిలో ఉన్నాడు, కానీ ఏదో ఒక రోజున అతడు లేస్తాడు.” అతడు ఇంకా ఇట్లు చెప్పాడు, “అతడు సమాధి నుండి లేచినయెడల, ఇరవై-నాలుగు గంటల్లో ప్రపంచమంతా దానిని తెలుసుకుంటుంది.” అతడన్నాడు, “యేసు రెండు వేల సంవత్సరాల క్రితమే లేచాడని మీరు చెప్తారు, అయితే ముప్పై శాతం మంది ప్రజలకు కూడా ఇంకనూ ఆ విషయము తెలియదు.”

అది మీరు ఒక తెలివిగల కోణము నుండి మాట్లాడుటవలనైయున్నది. మీరు పాఠశాల లేదా విద్యాసంబంధమైన దృక్కోణం నుండి మాట్లాడినారు.

దేవుని యొక్క ఈ గొప్ప, సంఘమంతా, క్యాథలిక్కులను, ప్రొటెస్టంటులను లెక్కించుచూ, అందరూ కలిసి, పరిశుద్ధాత్మను పొందుకున్న యెడల, ఈ ప్రపంచము క్రైస్తవ్యములో దృఢంగా ఉండియుంటుంది; అసలు కమ్యూనిజం వంటిది ఉండేదే కాదు; కలహము, లేదా శత్రుత్వము, లేదా నీచత్వము లేదా ద్వేషం వంటివి ఉండేవి కావు. యేసు తన సింహాసనముపై ఆసీనుడైయుండును, మరియు దేవుని యొక్క పరదైసునందు మనము నడుచుచుండెదము, నిత్యజీవముతో, ఎప్పటికీ జీవిస్తూ; ఇదివరకే క్రొత్త శరీరంలో పునరుత్థానం చేయబడి, చుట్టూ తిరుగుచూ, ఎన్నడూ వృద్ధులము కాక, ఎప్పుడూ తెల్లని వెంట్రుకలు రాక, ఎన్నడూ రోగులము కాక, ఎన్నడూ ఆకలితో ఉండక; జంతువులతో మాట్లాడచూ, ప్రభువు యొక్క సంతోషములలో నడిచెదము. మరియు, ఓ, ఎటువంటి ఒక దినము! అయితే మనము మిగతావన్నీ చేసాము ఆయన చెప్పినది తప్ప…

81 ఆయన ఇట్లు చెప్పెను, “మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి.” సువార్త ఏమి చేస్తుంది? “మాట చేత మాత్రము కాదు గాని, పరిశుద్ధాత్మ యొక్క శక్తియు మరియు దృష్టాంతముల ద్వారాయైయున్నది.” దేవుని వాక్యమును ప్రత్యక్షపరచడమే, సువార్తయైయున్నది.

82 మీరు దానిని చేయలేరు. ఇప్పుడు, ఆయన తన సంఘములో నివసించవలసియున్నదని, యేసు ఎరిగియున్నాడు.

కావున, మనము మేధస్సుగల పాఠశాలలను కలిగియుంటామని ఆయనకు తెలియును. మరియు మీరు ఎన్నడూ దీనిని ఒక మేధస్సుగల పాఠశాలలో పొందలేరు. వారు దానికి వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకనగా, వారికి తెలిసినదల్లా ఎవరో ఒక తెలివైన మనిషి యొక్క పాండిత్యము మాత్రమే, వారు దాని—దాని ద్వారా జీవించగోరు ఏదో ఒక సిద్ధాంతము లేదా సంఘశాఖ మాత్రమే. కావున వారు—వారు మిమ్మల్ని అందులో చేర్చి మరియు మిమ్మల్ని ఆ శరీరంలో సభ్యునిగా చేస్తారు, మరియు, సహోదరుడా, అది సరిగ్గా పరిపూర్ణముగా ఉన్నట్లు అనిపించే కొన్ని విషయాలను ఒక సిద్ధాంతము నుండి మీకు ఉటంకిస్తారు. “ఆ గొప్ప పవిత్ర సంఘము, ఆ తల్లి, అది అనేక విషయాలను తట్టుకుంది, అది అనేక దెబ్బలకు తట్టుకొని నిలనడినది.” అలాగే దయ్యము కూడా; వాడు దాదాపు, అన్ని చోట్లనుండి తరిమివేయబడ్డాడు, మరి ఇంకనూ వాడు అలాగే కొనసాగుచున్నాడు. అవును, అయ్యా. ఓ, వారు వీటిని ఉటంకించడానికి ప్రయత్నిస్తారు.

83 కావున తన దినములలో ఉన్నట్లే ఒక గొప్ప మేధస్సు పరమైన కదలిక ఉండునని యేసు ఎరిగియున్నాడు, కుండలు మరియు పెనములను కడగడం, మరియు బట్టలు ధరించడం, మరియు కాలర్లు ఎగర-వేయడం, మరియు ప్రతీది వారు చేసినట్లే చేయుచూ, వారు చేసే ఈ వివిధమైన పనులన్నిటిలో ఉండియున్నారు. వారు దానిని చేయుదురని ఆయనకు తెలియును, కావున ఆయన ఇట్లన్నాడు, “ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. నేను మిమ్మును ఆదరణ లేనివారిగా విడిచిపెట్టను, మీతో ఉండుటకు నేను మరలా వచ్చుచున్నాను. కావున,” ఆయన ఇంకా ఇట్లనెను, “నేను చేయు క్రియలు, మీరునూ చేయుదురు.”

84 పరిశుద్ధాత్మను పంపుటలో గల ఉద్దేశ్యం ఏమిటనగా దేవుడిని నిరంతరం లోకానికి బయలుపరచుట కొరకు, దేవుడు ఒక గుంపు ప్రజల ద్వారా కొనసాగుటకైయున్నది. అది ఖచ్చితంగా వాస్తవము. ఒక మత సిద్ధాంతము ద్వారా కాదు, ఒక సంఘశాఖ ద్వారా కాదు, కానీ ఆయన యొక్క పునరుత్థానపు శక్తి వలనైయున్నది, ఆయన వాక్యమును వాస్తవము చేయుచూ; ఆయన వాగ్దానమును తీసుకొని, మరియు స్వల్ప సంఖ్యాకుల పక్షమున నిలబడి, దేవుని నమ్ముచూ; నల్లని మబ్బులు వెనుకకు కదిలిపోయి, మరియు దేవుని శక్తి లోపలికి వచ్చి స్వాధీనం చేసుకొనుటను గమనించండి. ఆమేన్. ఆయనకు కావలసినది అదేయైయున్నది. పరిశుద్ధాత్మ పంపబడినది దాని కొరకేయైయున్నది. ఆయన దానిని ఆ ఉద్దేశ్యము కొరకే పంపియున్నాడు. అది ఏమిటో ఇప్పుడు మనకు తెలియును, మరియు దాని కొరకే ఆయన దానిని పంపెను.

85 కావున, మరే ఇతర రక్తము ప్రజలను పరిశుద్ధపరచదు. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచలేను, మరియు మీరు నన్ను పరిశుద్ధపరచలేరు, ఎందుకనగా మనము ఇరువురము లైంగిక కలయిక ద్వారానే జన్మించాము. కానీ యేసు లైంగిక కలయిక లేకుండా జన్మించెను, అది నిజము, కావున ఆయన రక్తము పరిశుద్ధపరచునదైయున్నది. మరియు దేవుడు దిగివచ్చెను, ఒక శరీరమును కలుగజేసి, దానిలో నివసించెను, దీనిని పరిశుద్ధపరచుటకు ఆ రక్తమును చిందించెను, అది పాపము మరియు అవమానము యొక్క అపరాధాన్ని పరిపూర్ణముగా తొలగించినది. అప్పుడు, విశ్వాసం చేత, దానిని నమ్ముట ద్వారా, ఆ రక్తము యొక్క శుద్ధీకరణ ద్వారా, దేవుడు నేరుగా ఆ మానవ శరీరములోనికి దిగివచ్చును, విశ్వాసము ద్వారా, అతణ్ణి అబ్రాహాము సంతానముగా ఉంచును.

86 అతని రక్తమువలె అద్భుతముగా ఉండు ఆ స్వచ్చమైన రక్తము, ఆ రక్తము వచ్చునని నమ్ముట ద్వారాయైయున్నది, అతడు “మృతతుల్యుడైనవాని వలె ఉన్ననూ” అతడు అక్కడికి నడిచి వెళ్ళెను. ఇరవై-ఐదు సంవత్సరాలు దేవుని నమ్మెను, అతడు డెబ్బది-ఐదు సంవత్సరాలు కలిగి, మరియు అతనికి వంద సంవత్సరాలు వచ్చు వరకూ నమ్మెను. మరియు శారా, అరువది-ఐదు కలిగియుండి, మరియు ఆమెకు తొంభై సంవత్సరాలు వచ్చు వరకు నమ్మినది. “మరియు అతడు మృతతుల్యుడైనవాని వలె ఉండెను.”

మరియు దేవుడు ఇట్లు చెప్పెను, “ప్రజలు దానిని తప్పిపోకుండునట్లు, అతణ్ణి ఇక్కడ పర్వతముపైకి తీసుకొనివచ్చి మరియు అతణ్ణి బలిగా అర్పించుము.”

87 అతడు దాసులతో ఇట్లనెను, “మీరు గాడిదతో ఇక్కడ నిలబడి మరియు వేచియుండండి. నేను మరియు కుమారుడు ఆవలికి వెళ్ళి మరియు ఆరాధిస్తాము, మరియు కుమారుడు మరియు నేను తిరిగి వచ్చెదము.” ఓ, అతడు దానిని ఎట్లు చేయబోవుచున్నాడు?

అబ్రాహాము ఇట్లన్నాడు, “మృతులలో నుండి ఒకని పొందినట్లు నేను అతణ్ణి పొందితిని. మరియు మృతులలో నుండి ఒకని వలె, అతణ్ణి నాకిచ్చిన ఆయన, నేను ఆయన వాక్యాన్ని మాత్రము గైకొనిన యెడల, అతణ్ణి మృతులలో నుండి కూడా లేపగలడని నేనెరుగుదును. గైకొనుట, నేను ఆయన వాక్యాన్ని గైకొనిన యెడల; ఆయన మృతులలోనుండి అతణ్ణి లేపగలడు.”

88 పరిపూర్ణముగా క్రీస్తును గూర్చి మాట్లాడుచున్నది! అక్కడే ఆయన ఉన్నాడు. మరియు ఆ రక్త కణము నుండి పరిశుద్ధాత్మ వచ్చెను, అది యేసు అని పిలువబడే శరీరములో దానినది నింపుకొనెను. విమోచింపబడినవారిని, లేదా దేవుని చేత ఎన్నుకోబడినవారిని పిలుచుటకు, ఆ రక్తము, విశ్వాసము ద్వారా, ఒక దారిని పరిశుద్ధపరచినది. మరియు మీరు దానిని అంగీకరించినప్పుడు, మరియు పరిశుద్ధాత్మ మీ నుండి దుష్టత్వమంతటినీ తీసివేసినప్పుడు, తన చిత్తాన్ని నెరవేర్చుటకు, స్వయంగా దేవుడే, లోపలికి వచ్చును.

89 దిగువున ఇక్కడ, ఆ అధికారి చాలా ఆవేశంతో ఉన్నాడు; మరియు ఈ ఇతర ఫలానా-మరియు-ఫలానా వారు ఇక్కడ ఫలానా-మరియు-ఫలానావి చేయుచున్నారు; మరియు ఈ వృద్ధుడు దాని గురించి, దానికి వ్యతిరేకంగా మాట్లాడుచున్నాడు. అయితే పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక వ్యక్తి సరిగ్గా దానిని ఎదుర్కుంటాడు. ఆమేన్.

90 “మరియు వారు విన్నారు. వారు అజ్ఞానులు మరియు విద్యలేని పామరులు, అయితే వారు విన్నారు వారు యేసుతో ఉండియున్నారు. అందుకొరకే పరిశుద్ధాత్మ వచ్చెను.

91 తన పేరును కూడా సంతకం చేయలేని ఒక చిన్న జాలరి. కానీ అతడు అక్కడ నిలబడి మరియు ఇట్లన్నాడు, “మనము ఎవరిని నమ్మాలి, మనిషినా లేక దేవునినా?” ఆమేన్. “ఇది మీకు తెలియబడనీయుడి, మేము ఇంకను యేసు నామములోనే బోధిస్తాము.” మై, ఎంతటి ధైర్యము! ఆవలిన అతనికి—అతనికి ఒక గృహము ఉన్నదని అతనికి తెలియును. అది నిజము. అతడు ఇక్కడ ఒక యాత్రికుడు మరియు పరదేశీయుడైయున్నాడు. అతడు ఆ పట్టణము కొరకు కనిపెట్టుచున్నాడు.

ఆ వేషధారియైన యాజకుడు అతనికి లెక్కనా? తన కుమారుడైన, క్రీస్తు యేసును లేపిన, పరలోకపు దేవుని యొక్క ఆధిపత్యంలో అతడు ఉన్నాడు, మరియు భూమ్యాకాశములను కలుగజేసిన దేవుని యొక్క ఆత్మతో ఆయన అతడిని నింపెను. అక్కడే మీరున్నారు. అతడు అతనికి భయపడలేదు. లేదు, అయ్యా. మరణం…

92 ఎందుకు, వారు ఆ చిన్న స్తెఫనును అక్కడకు తీసుకెళ్ళి, మరియు ఇట్లన్నారు, “దానిని వెనక్కి తీసుకో!”

అతడు చెప్పాడు, “ముష్కరులారా, హృదయమునందు మరియు చెవులయందు సున్నతి పొందనివారలారా, మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. మీ పితరులు చేసినట్లే, మీరును చేయుచున్నారు.”

వారు ఇట్లన్నారు, “మేము నిన్ను కొట్టి చంపుతాము!”

అతడు ఇట్లు చెప్పాడు, “మీరు దానిని చేయలేరు మీరు గనుక…”

“మేము దానిని చేస్తామో లేదో నీకు చూపిస్తాము!” మరియు వారు పెద్ద రాళ్ళను తీసుకొని అతని తలపై కొట్టడం ప్రారంభించారు.

93 అతడు పైకి చూసి, మరియు ఇట్లన్నాడు, “పరలోకము తెరువబడుట నేను చూస్తున్నాను. ఆ నిచ్చెన క్రిందకి దిగిరావడం నేను చూస్తున్నాను. మహోన్నతుని కుడి పార్శ్వమందు యేసు నిలబడియుండుటను నేను చూస్తున్నాను.” మరియు అతడు చనిపోయాడని బైబిలు చెప్పలేదు; అతడు నిద్రించాడు. ఓ, మై! ఒక తల్లి తన బిడ్డను ఊపినట్లు, ఒక దూత దిగి వచ్చి, అతణ్ణి ఎత్తుకొని అతడు నిద్రపోయేవరకు, అతణ్ణి ఊపుచున్నట్లుగా నేను చూడగలను. ఓ, మై! నిశ్చయంగా.

94 పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం అదే. దాని కొరకే దేవుడు పరిశుద్ధాత్మను పంపెను. మీకు శక్తిని ఇవ్వడానికి పరిశుద్ధాత్మ వచ్చెను. నేను ఇక్కడ మరిన్ని లేఖనాలను కలిగియున్నాను, కేవలం ఒక్క నిమిషం. మీకు శక్తిని ఇవ్వడానికి పరిశుద్ధాత్మ వచ్చెను. నేను—నేను కాదు…మీరు దీన్ని కనుగొనవచ్చు; ఈ రాత్రి, నేను ఇంక చాలా కలిగియున్నాను.

మీకు శక్తిని ఇవ్వడానికి, ప్రార్థనలో శక్తిని ఇవ్వడానికైయున్నది!

95 ఒక మంచి జీవితాన్ని జీవించిన ఒక వ్యక్తిని మీరు తీసుకోండి, కానీ వారు ఎల్లప్పుడూ ఓడిపోయినవారే. “ఓ, నేను మీకు చెప్పుచున్నాను…” మంచి వ్యక్తి, “ఓ, ఖచ్చితంగా, సహోదరుడా బ్రాన్‌హామ్, నేను ప్రభువును ప్రేమించుచున్నాను.” ఎల్లప్పుడూ వారు ఓడిపోతారు, ఒక్క ప్రార్థనకు కూడా ఎన్నడు సమాధానము పొందుకొనరు.

మీరు ఆ చిన్న స్త్రీని ఒక్కసారి పరిశుద్ధాత్మతో నింపండి, ఏమి జరుగుతుందో చూడండి. ఆమె దేవుని ఎదుటకు వెళ్ళినప్పుడు, ఆమె ఓడిపోయినది కాదు. ఆమె విశ్వసించుచూ, ధైర్యముగా దేవుని యొక్క సింహాసనము వద్దకు వస్తుంది. ఒక జన్మ ద్వారా, ఆమె దేవుని కుమార్తెయైనది గనుక ఆమెకు ఒక హక్కు ఉన్నది.

ఎంతో పిరికితనంతో ఉన్న, ఆ చిన్న వ్యక్తిని తీసుకోండి, ఆ అధికారి అతణ్ణి అంతటా తన్నియున్నాడు. ఇట్లంటాడు, “ఇప్పుడు ఒక నిమిషం ఇక్కడ ఆగుము.” ఏదో మారినది, చూడండి, అతడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. అది మీకు శక్తిని ఇస్తుంది. మీ జీవితం శక్తితో నిండి ఉంటుంది.

ఇది మీకు మాటలో శక్తిని ఇస్తుంది.

96 అంతెందుకు, అక్కడ నిలబడి, భయపడుచుండిన ఆ ప్రజలు; పేతురు, యాకోబు, యోహాను, లూకా, మరియు ఆ మిగతా వారందరు. వారు ఇట్లనుచూ మేడ గదిలోనికి వెళ్ళిపోయారు, “ఓ, మనము ఇక ఏమీ చెప్పలేము. వారు, అక్కడ చూడండి, అక్కడ డాక్టర్ ఫలానా -మరియు-ఫలానా మరియు ఫలానా అక్కడున్నారు. అక్కడ ఫలానా -మరియు-ఫలానా మరియు ఫలానా రబ్బీ ఉన్నాడు. మీకు తెలుసా, అతనికి కళాశాలలో నాలుగు డిగ్రీలు ఉన్నాయి; మనం ఎన్నడైనా అతనికి వ్యతిరేకంగా ఎలా నిలబడగలము?” పేతురు ఇట్లన్నాడు, “ఓ, ఒక రోజు అతనికి చేపలు అమ్మడం నాకు జ్ఞాపకమున్నది. అతడు, అతడు మాట్లాడెను, మరియు అతడు దేని గూర్చి మాట్లాడుచున్నాడో కూడా నాకు తెలియలేదు. ఓ, నేను అతనికి వ్యతిరేకంగా ఎన్నడూ నిలబడలేను.” అయితే ఏమి జరిగినది…

“సహోదరులారా, మనము ఏమి చేయగలం?”

“ఆయన ఇట్లు చెప్పెను, ‘వేచియుండుడి.’”

“సరే, మనము ఇప్పటికే నాలుగు రోజులు ఇక్కడ ఉన్నాము.”

“కేవలం వేచి ఉండండి.”

“ఎంత కాలం?”

“పొందువరకు.”

“సరే, ఐదవ రోజున అది జరుగును అని ఆయన చెప్పాడా?”

“ఎంతకాలం అనేది ఆయన ఎన్నడూ చెప్పలేదు. ఆయన ఇట్లు చెప్పాడు, ‘పొందుకునేవరకు.’”

మంచిది, వారు వేచియున్నారు. ఎంత కాలం? “పొందువరకు.” ఎనిమిది రోజులు గడిచాయి. “పొందుకునేవరకు.” తొమ్మిది రోజులు గడిచాయి. “పొందుకునేవరకు.”

మరియు చివరకు పెంతెకొస్తు దినము పూర్తిగా వచ్చినప్పుడు, వారందరూ ఒకే చోట, ఏకమనస్సు కలిగియుండిరి.

97 మండుచున్న మేఘంలో, దేవుడు వారి పైన ఉండెను; దేవుడు భూమిపై, వారితో నడిచెను; ఇప్పుడు ఇంకేదో జరగబోవుచున్నది. ఏదో జరుగుటకు సిద్ధమగుచున్నది.

…వారందరూ ఒకే చోట, ఏకమనస్సుతో నుండిరి.

మరియు అకస్మాత్తుగా పరలోకము నుండి…వేగముగా వీచు బలమైన గాలివంటి యొకశబ్ధము వచ్చినది, మరియు అది వారు కూర్చుండియున్న గది అంతయు నిండెను.

…విభాగింపబడిన నాలుకలు…వారిపై…వ్రాలెను.

విభాగింపబడిన అంటే ఏమిటి? “వేరు చేయబడిన.” తడబడడం వలె, ఎవరైనా తడబడడం మీరు ఎప్పుడైనా విన్నారా? వారు ఇట్లందురు,“అ-అ-అ, ఓ, అ-అ,” చూడండి, వారు ఏమీ చెప్పలేరు. “విభాగింపబడిన, వేరు చేయబడుట.” చీలియున్న డెక్కల వంటిది, అనగా ఏదైనా “విడిపోయినది, విభాగింపబడినది.” వారు మాట్లాడుటలేదు. వారు వేగముగా ఏదేదో మాట్లాడుటలేదు. వారు కేవలం ఒక శబ్దము తప్ప మరేమియు చేయుటలేదు.

…అగ్నిజ్వాలలవంటి, విభాగింపబడిన నాలుకలు వారిపైన వ్రాలెను. (ఓ, వారు తమను తాము ఆపుకోలేకపోయిరి!)

మరియు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడియున్నారు,…(ఫ్వూ!)

98 అప్పుడు ఏమి జరిగినది? వారు వీధులలోనికి వెళ్ళారు. “ఆ జోన్స్ రబ్బీ ఎక్కడ? అతడు ఎక్కడ ఉన్నాడు? మరి ఆ మేధావి దిగ్గజం ఎక్కడ?”

“మోషేతో, మండుచున్న పొదలో, దేవుడు మనకు పైన ఉండెను; ఆయన పైనుండి, మనల్ని మన్నాతో పోషించాడు. ఇక్కడ భూమిపై, ఆయన మూడు సంవత్సరాలు మరియు ఆరు…మూడు సంవత్సరాల ఆరు నెలలు ఆయన మనతో నడిచాడు. కానీ ఇప్పుడు ఆయన నాలో ఉన్నాడు. మాట్లాడేది నేను కాదు; అది ఆయనే. ఆయన ఎవరో నాకు తెలియును, మరియు నేను ఎవరినో నాకు తెలియును. ఇక నేను కాదు; ఆయనే.”

అతణ్ణి ఇక్కడికి తీసుకురండి! ఇశ్రాయేలు వారలారా, మరియు…యూదయ నివాసులారా, ఇది మీకు తెలియబడునుగాక—ఇది మీకు తెలియుగాక, మరియు బోధకులు మరియు రబ్బీలైన మీరంతా, చెవియొగ్గి నా స్వరము వినుడి.

ఫ్వూ! మై! వాక్చక్తి! ఓ! “వీరు మత్తులు కారు!” చిన్న అల్పసంఖ్యలో ఉన్న, ఆ నూట ఇరవై మంది పక్షమున, పదివేలు లేదా అంతకంటే ఎక్కువ మందికి వ్యతిరేకంగా నిలబడుచున్నాడు.

…మీరు ఊహించునట్లు, వీరు మత్తులు కారు, అయితే ప్రొద్దుబొడిచి జామయిన కాలేదు.

నేను ఒక సంపూర్ణ సువార్త బోధకుడను. అయితే ఇది యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన అదే సంగతైయున్నది;

…అంత్యదినములయందు, నేను సర్వజనులమీద…నా ఆత్మను (ఫ్యూ) కుమ్మరింతును, అని దేవుడు చెప్పుచున్నాడు: మరియు మీ… మరియ అక్కడ ఆత్మలో నాట్యమాడుచు, భాషలు మాట్లాడుచూ మరియు ఆవిధంగా ఉండుటను మీరు చూశారా?…సర్వశరీరుల మీదనూ:…

…మరియు నా పనికత్తెల మీద నా ఆత్మను…కుమ్మరించెదను;…

…పైన ఆకాశమందు, మరియు…క్రింద భూమిమీద సూచకక్రియలను చూపించెదను;…అగ్ని స్తంభములను, మరియు పొగ ఆవిరిని కలుగజేసెదను:

దేవుడు అప్పుడు తన ప్రజలలో ఉండెను. ఆమేన్.

“సరే, ఇప్పుడు, నీకు ఏ డిగ్రీ ఉన్నది? నీవు ఎక్కడ, ఏ పాఠశాల నుండి వచ్చావు?”

99 “సరిగ్గా ఇప్పుడు అది ఎటువంటి వెత్యాసమును కలిగించదు.” ఓ, అతడు లేఖనాలను కుమ్మరించడం ప్రారంభించాడు.

(దావీదు ఆయనను ముందే చూశాడు!)…ప్రభువు ఎల్లప్పుడూ నా ముందునున్నాడు…నేను కదల్చబడను:

…ఇంకా నా హృదయము ఉల్లసించెను, ఎందుకనగా…మరియు నా నాలుక ఆనందించెను;

…ఆయన నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టడు, ఆయన తన పరిశుద్ధుని కుళ్ళుపట్టనియ్యడు.

…మూలపురుషుడగు దావీదునుగూర్చి మీతో నేను ధారాళముగ మాటలాడవచ్చును,…అతడు చనిపోయి సమాధిచేయబడెను; అతని సమాధి…నేటివరకు మన మధ్యనున్నది.

అయితే ఒక ప్రవక్త గనుక…అతడు రాబోయే నీతిమంతుని యొక్క రాకడను ముందుగానే చూసెను.

…మరియు ఇది మీకు తెలియుగాక, అదేమనగా దేవుడు ఈ యేసునే, మీరు దుష్ట హస్తములతో సిలువవేసిన ఈ యేసునే, దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. (ఆమేన్!)

100 “మనుషులారా మరియు సహోదరులారా, రక్షింపబడుటకు మేమేమి చేతుము?”

…చెప్పెను, మారుమనస్సు పొంది, మీ పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, మరియు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు.

ఏలయనగా ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, మరియు దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందును. (ఆమేన్)

101 దేవుడు ఒక ప్రజను కలిగియున్నంత కాలం, దేవుడు ఒక సంఘమును కలిగియున్నంత కాలం, దానితో పాటు వెళ్ళునట్లు దేవుడు పరిశుద్ధాత్మను కలిగియున్నాడు. మరి దానికొరకే దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చియున్నాడు. మేధావులు లేస్తారు; ఎల్లప్పుడూ లేచారు. కానీ దేవుడు ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న గుంపును కలిగియున్నాడు. వెలుగును సొంతం చేసుకొనునట్లు, పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో కొనసాగిపోవునట్టి ఒక చిన్న సంఘమును దేవుడు కలిగియున్నాడు. మరియు వారు, తమ సాక్ష్యము ద్వారా, ప్రపంచాన్ని తీర్పు తీర్చేవారిగా ఉంటారు.

యేసు ఇట్లు చెప్పెనని పరిశుద్ధ గ్రంథము చెప్పుటలేదా, “హృదయ శుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు”? మరియు అది, ఇట్లు చెప్పుటలేదా, “నీతిమంతులు, పరిశుద్ధులు, భూమికి తీర్పు తీర్చెదరు”? నిశ్చయంగా.

ఈనాడు మీ సాక్ష్యము ఈ పట్టణము మీదకి తీర్పును తెస్తుంది. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గూర్చి మరియు దేవుని శక్తిని గూర్చి, ఒక పరిశుద్ధ జీవితమును గూర్చిన మన సాక్ష్యము, ఈ పట్టణము మీదకి తీర్పును తెస్తుంది. ఈ…

102 “మొదటివారు కడపటివారును; కడపటివారు మొదటివారగుదురు.” వారి పునరుత్థానమందు, సాంకీ మరియు మూడీని గూర్చి నేను ఏమియు ఎరుగను. దీనిలో, వారికి నా గురించి ఏమీ తెలియదు. అయితే సాక్ష్యము ఇచ్చుట కొరకు, నేను దీనిలో నిలబడతాను; మీరును అలాగే చేస్తారు.

మరియు దాని ద్వారా అనగా, మీ వెలుగును వెదజల్లుట ద్వారా, మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా, మరియు మీరు జీవించిన జీవితాల ద్వారా, మరియు తాను ఇక్కడ కదలుచున్నాడని నిరూపించడానికి దేవుడు చేసిన కార్యములు చేసియుండగా; మరి ఆ మేధావులు, దాని నుండి దూరంగా వెళ్ళిపోవడంతో; వారు పరిశుద్ధుల చేత తీర్పు తీర్చబడతారు. వారు ఇదివరకే తీర్పు తీర్చబడ్డారు. వారు ఇదివరకే దానిని దాటియున్నారు. ఓ, మై!

103 నేను ప్రార్థనా శక్తి, వాక్చక్తి, ఒక పరిశుద్ధ జీవితము యొక్క శక్తిని గూర్చి మాట్లాడుచున్నాను. ఆమేన్. పరిశుద్ధాత్మ చేయునది అదేయైయున్నది.

104 మీలో కొందరు నడుస్తూ, ఇట్లంటారు, “సరే, నేను తాగడం మానేయలేకపోవుచున్నాను. నేను దీనిని మానేయలేకపోవుచున్నాను.”

ఈ చేయలేను అనే వీటన్నిటిని మీ నుండి తీసివేయుట కొరకు, పరిశుద్ధాత్మ మీలో నివసించడానికి వచ్చును. అది నిజము. స్త్రీలు తమ జుట్టును కత్తిరించుకొనుటను, వారు పొట్టి దుస్తులను మరియు పురుషుని దుస్తులను ధరించుటను ఆపివేయునట్లు చేయుటకైయున్నది. ఎటువంటి మినహాయింపులు లేవు. వారు ముచ్చట్లు పెట్టుటను ఆపివేయునట్లు చేయుటకైయున్నది. ఓ, అవును, అది దాని కొరకే, మిమ్మల్ని ఒక పరిశుద్ధ జీవితముగా మార్చుటకైయున్నది. అది ప్రతిసారీ బైబిలు యొక్క సూచనలను వెంబడిస్తుంది.

105 ఒక మహిళ ఇట్లన్నది, “అసలు చాలా వేడిగా ఉన్నది; నేను వీటిని ధరించవలసినదే. నా వెంట్రుకలు పెంచుకుంటే నాకు తలనొప్పి వస్తుంది.”

కానీ పరిశుద్ధాత్మతో ఎటువంటి సాకులు చెప్పరాదు. దానిని అట్లు చేయుటకు అది అక్కడ ఉన్నది. అది వాక్యాన్ని ఖచ్చితంగా వెంబడించును. పరిశుద్ధాత్మ చేయునది అదియే.

అది, పురుషుడవైన నిన్ను సంఘ సభ్యులైయున్న ఆ అర్ధ-నగ్న స్త్రీల నుండి నీ తలను త్రిప్పి, మరియు వారిపై మోహాన్ని విడిచిపెట్టునట్లు చేయుటకైయున్నది. అది దానిని చేయుటకొరకే యైయున్నది

106 ఇది మిమ్మల్ని పొగ త్రాగడం మరియు ధూమపానం, మరియు…ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలని కోరుటను ఆపివేయునట్లు చేయుటకైయున్నది. అది వాటిని మీలోనుండి తీసివేస్తుంది. మీరు అట్లు చేసినప్పుడు అది మిమ్మల్ని దీనులుగా చేయును. పరిశుద్ధాత్మ దానికొరకే యైయున్నది. అది ఒక పవిత్ర జీవితము కొరకైయున్నది. అది నిజము. మీరు పనికిరాని ముచ్చట్లను ఆపివేయునట్లు చేయుటకైయున్నది. మీరు పేకాట ఆడటం, పాచికలు ఆడటం, మరియు మీరు మూలలో చేసే ఈ ఇతర పనులన్నింటినీ ఆపివేయునట్లు చేయుటకైయున్నది.

నీవు నీ భార్యకు అపనమ్మకముగా జీవిస్తూ, నీవు చేయుచున్నదానిని కొనసాగించుటను ఆపివేయునట్లు చేయును. అది దానినే చేయును. అది వాస్తవము. అది నీవు వేరెవరి భార్యనో వివాహం చేసుకొనగోరుటను ఆపివేయునట్లు చేయును. అది ఖచ్చితంగా నిజము.

అది అదేయైయున్నది. అది మిమ్మల్ని ఒక పరిశుద్ధమైన జీవితమును జీవింపజేయుటకొరకై యున్నది. పరిశుద్ధాత్మ దాని కొరకే శక్తియైయున్నది, “పైనున్న వాటిపై మీ మనస్సును ఉంచుటకొరకై యున్నది,” దేవుడు ఎక్కడైతే నిలనడునో…?…క్రీస్తు యొక్క మనస్సు మీలో ఉండుట. మీరు అట్టి సంగతులను చూస్తూ ఉండలేరు; మీరు వాటిని చూసినప్పుడు, మీ తలను త్రిప్పుకుంటారు. అది నిజము. అది మిమ్మల్ని అట్లు చేయుటకైయున్నది.

107 మీరు ఇట్లంటారు, “నేను దానిని చేయలేను. ఓ, నేను దానిని అస్సలు చేయలేను.” ఖచ్చితంగా, మీరు చేయలేరు.

కానీ పరిశుద్ధాత్మ ఆ ఉద్దేశ్యము కొరకే వచ్చెను. అది దానినే చేసెను. అది దానిని తీసివేయుటకు, ఆ పాత అలవాట్లను మరియు మీరు చేయుచున్న వాటన్నిటినీ మీ నుండి తీసివేయుటకు వచ్చెను.

వెనుక-చెడు మాట్లాడుటను తీసివేయుటకైయున్నది, మిమ్మల్ని మీరు వేరుచేసుకొని, ఇట్లంటారు, “దేవునికి స్తుతి కలుగునుగాక, నేను ఒక మెథడిస్టును, ఆ పాత పరిశుద్ధ-గుండ్రాళ్ళతో నాకు ఏ సంబంధం లేదు.” దానిని మీ నుండి తీసివేయుటకు పరిశుద్ధాత్మ వచ్చెను.

108 “నేను ఒక బాప్టిస్టును. నేను ఒక ప్రెస్బిటేరియన్ను. నేను ఆ చిన్న పాత పరిశుద్ధ-గుండ్రాయి గుంపు వద్దకు వెళ్ళను.” ఆ గుజ్జునంతా మీ నుండి బయటకు తీసివేయుటకు పరిశుద్ధాత్మ వచ్చెను. అది దానిని చేసెను. అది మిమ్మల్ని రక్తములో కడుగును; మిమ్మల్ని సరి చేయును. అది దానిని చేయుటకే వచ్చెను.

అది మిమ్మల్ని సరి చేయుటకు వచ్చెను. ఆయన ఇట్లు చెప్పెను, “వంకరగా ఉన్న స్థలాలను తిన్నగా చేయుము.” దానిని చేయుటకే అది వచ్చెను; తిన్నగా చేయుటకైయున్నది. “ఎత్తైన స్థలాలను పల్లముగా చేయవలెను; పర్వతాలన్నీ చిన్న పొట్టేళ్ళ వలె నాట్యం చేస్తున్నట్టు అగుపించులాగున చేయవలెను, మరియు ఆకులన్నియు వాటి చేతులతో, మీకు చప్పట్లు కొట్టుచున్నట్లు చేయవలెను.” [సహోదరుడు బ్రాన్‌హామ్ చప్పట్లు కొట్టారు—సంపా.] పక్షులు భిన్నముగా పాటలు పాడును. ఆనందపు ఘంటలు మోగుచున్నాయి. ఏ సాకులు లేవు. దానిని చేయుటకే అది వచ్చెను. పరిశుద్ధాత్మను పంపడంలో దేవుని ఉద్దేశ్యం అదేయైయున్నది, తద్వారా మీరు ఈ కార్యములు చేయుచు, ఆయనను వెంబడించుటకైయున్నది.

109 ఇప్పుడు నేను మిమ్మల్ని బాధపెట్టగోరడం లేదు, కానీ నేను ఎంతో నిజాయితీతో ఇక్కడ ఉన్నానని మీకు చెప్పియున్నాను. మిమ్మల్ని బాధపెట్టకుండా ఉండేందుకు, అప్పుడప్పుడు నేను ఎక్కడో ఒక వరుసను దాటుదును; మరియు సత్యముతో నిలచియుందును, కానీ అక్కడే ఉండి మరియు అది మిమ్మల్ని ఎక్కువగా బాధపెట్టకుండునట్లు దానిని చేయుదును.

110 అయితే నేను మీకు ఒక విషయమును చెప్పగోరుచున్నాను. ఒక స్త్రీ తన జుట్టును కత్తిరించుకోవడం తప్పు అని బైబిల్ చెప్పినయెడల, మరియు మీరు పరిశుద్ధాత్మను కలిగియున్నారని చెప్పి ఆపై మీ జుట్టును కత్తిరించుకున్నట్లైతే, మీరు కలిగియున్నారా అని నేను ఆశ్చర్యపోవుదును. కోపము తెచ్చుకోకండి; అట్లు వచ్చినయెడల, ఇంకా మీకు వ్యతిరేకంగా మరొక మచ్చ ఉన్నదని అది చూపించును.

111 ఒక స్త్రీ ఒక పురుషునికి సంబంధించిన వస్త్రమును ధరించడం తప్పు అని బైబిలు చెప్పినయెడల, మరియు మీరు, ఎదిగిన స్త్రీలైన మీరు ఇక్కడ బయట రోడ్డు మీద ఈ చిన్న డంగరీలను మరియు పురుషుని దుస్తులను ధరించుచున్నారు! ఒక చిన్న శిశువు అయితే దానిని ధరించి…వారు చిన్న అబ్బాయిలతో మరియు ఆవిధంగా ఆడుతారు. కానీ, చూడండి, మీరు—మీరు ఎదిగిన స్త్రీలు, పదిహేను, పదహారు, పద్దెనిమిది ఏండ్లు గలవారు, అమ్మమ్మ వరకు, ఇక్కడ రోడ్డు మీద అటువంటివి ధరించుచున్నారు! మరియు బైబిలు గ్రంథము ఇట్లు చెప్పెను, “అది దేవుని దృష్టికి హేయమైనది,” ఒక స్త్రీ అటువంటి వస్త్రాలను ధరించుట హేయము. మరియు ఎలాగైనను, మీరు వాటిని ధరిస్తారు, మరియు మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారని చెప్తారు? నేను కొన్నిసార్లు ఆశ్చర్యపోతుంటాను. పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని అక్షరాలా వెంబడిస్తాడు.

మరియు దానిని బోధించుటకు సరిపడా కృపను పొందనివాడై, వేదిక వెనుకనున్న ఒక బోధకుడు, దానిని కలిగియున్నాడా అని నేను సందేహించుదును. అది వాస్తవము! మంచిది, పరిశుద్ధాత్మ దానికొరకే యైయున్నది.

112 అది బోధకుడిని అభిషేకించుట కొరకైయున్నది. అది ఆ గుంపుకు పరిశుద్ధతను ఇచ్చుటకైయున్నది. అది సంఘమును క్రమములో పెట్టుటకైయున్నది. అది ఆత్మ యొక్క ఐక్యతను తీసుకురావడానికైయున్నది. అది మనల్ని శక్తితో ఐక్యపరచుటకైయున్నది. అది మనల్ని ప్రేమతో, సహోదర ప్రేమతో ఐక్యము చేయుటకైయున్నది.

నీవు మెథడిస్టువా, బాప్టిస్టువా, లూథరనువా, ప్రెస్బిటేరియనువా, నీవు ఎవరవైనా నేను లెక్కచేయను, మనమందరము ఒకే పరిశుద్ధాత్మ ద్వారా ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొంది, మరియు యేసుక్రీస్తు యొక్క శరీరములో అవయవములైనయెడల, అప్పుడు లేదు…ఏ వర్తమాన కాలము, ఏ భవిష్యత్తు కాలము లేదు; ఆకలి, కరువు; దేవుని ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమ నుండి “క్రీస్తులో ఉన్న దేవుని ప్రేమ,” నుండి మనల్ని ఏదీయు వేరు చేయలేదు, ఎందుకనగా మనము ఆయన యొక్క ఆత్మ ద్వారా జన్మించాము, ఆయన రక్తంలో కడుగబడ్డాము. మనము ఒక నూతన సృష్టియైయున్నాము. దేవుడు దానిని చేయుటకే వచ్చెను. పరిశుద్ధాత్మ దాని కొరకేయైయున్నది. అవును, అయ్యా. అదియే.

113 ఇప్పుడు, ప్రజలారా, నా ముఖం వైపు, చూడండి. మీరు పరిశుద్ధాత్మను కలిగియున్నారని, చాలా చేతులు పైకెత్తబడ్డాయి; చూడండి, ఖచ్చితంగా, అక్కడున్నాయి. ఓ, ఇప్పుడు నేను—నేను ఇక్కడ కొంచెం దాటబోవుచున్నాను. ఇది టేపు చేయబడుతుంది. అయితే మనము రేపు రాత్రికి దానిని మరింత ఎక్కువ చూడబోవుచున్నాము.

మీరు దానిని పొందుకున్నారని చెప్పి, మరియు వీటి విషయమై దోషులుగా ఉన్నయెడల, మిమ్మల్ని నడిపించేది ఏమిటని నేను ఆశ్చర్యపోవుచున్నాను. దేవుడు ఎన్నడూ మిమ్మల్ని వాక్యము వెలుపలికి నడిపించడు. ఆయన మిమ్మల్ని వాక్యముతో ఉంచుతాడు, ఎందుకనగా అది తన సంఘము, తన ప్రజలు, స్త్రీలు, మరియు పురుషుల కొరకైన, దేవుని యొక్క స్వంత చట్టములైయున్నవి.

114 “మంచిది,” ఇట్లనవచ్చును, “దీనిని లేదా దానిని చేయుట నాకు హానిచేయదు.” అది హానిచేయదా? అది చేయునని వాక్యం చెప్పుచున్నది.

మరియు పరిశుద్ధాత్మ మీలో ఉన్నయెడల, అది మిమ్మల్ని నేరుగా వాక్యామునొద్దకు నడిపించును. ఎటువంటి సాకులు ఉండవు. దేవుడు మినహాయింపులు లేదా సవరింపులు చేయడు. ఆయన ఒక గురుతును పెడతాడు మరియు మీరు దాని వద్దకు నడచి వెళ్తారు. అంతే. అందరితోనూ అది అట్లేయున్నది. మీరును ఆ విధంగానే వచ్చెదరు.

115 పేతురు చెప్పాడు, “మీలో ప్రతి ఒక్కరు, మారుమనస్సు పొంది; మీలో ప్రతి ఒక్కరు, మీ పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు.” చూసారా? అంతే. మనము ఆ వరుసను తాకవలసియున్నది.

116 ఇప్పుడు నేను మిమ్మల్ని బాధపెట్టాలని కాదు; నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. కానీ, సహోదరుడా, సహోదరి…చివరి దినములలో, ఆ పునరుత్థానము వద్ద, ఈ తరము ప్రజలతో నేను నిలబడి, మరియు ఈ వాక్యము నిమిత్తము లెక్క చెప్పవలసియున్నదని, నేను ఎరుగుదునని మీరు గ్రహించుచున్నారా? మరియు పరిశుద్ధాత్మ దీనిని చూపుచూ, మరియు నేను దానిని బోధించుచుండగా, మీరు ఎక్కడ నిలబడతారు? మీరు దానిని ఎలా దాటి వెళతారు? స్నేహితుడా, నీవు దానిని చేయలేవు. దానిని చేయకుము. ఇప్పుడు దానిని ఆపివేయుము. నీవు ఏదైతే చేయుచున్నావో అది తప్పు, దానిని ఆపివేయము.

“నేను చేయలేను,” అని నీవు చెప్పవచ్చు.

అప్పుడు నీవు ఆ కళ్ళెమును ఇంకా పొందుకొనలేదు. పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చినప్పుడు, ఆయన నీకు ప్రపంచముపై అధికారమును ఇస్తాడు. మరియు మీరు…ఆయన చెప్పేది వినండి. “మీరు లోకమును లేదా లోక విషయాలను ప్రేమించిన యెడల, అది దేవుని ప్రేమ మీలో లేనందువలనైయున్నది.” ఇప్పుడు, సాకులు లేవు. ఆయన దానిని స్పష్టంగా చేయును మరియు మనము ఆ గురుతునొద్దకు రావలసియున్నది.

117 నేను భయంకరంగా ఉన్నానని మీరు అనుకొనుచున్నారని నాకు తెలియును. కానీ నేను ప్రస్తుతం భయంకరంగా నింపబడియున్నాను. చూశారా? వినండి. అది నిజం. సహూదరుడా, సహూదరీ, ఇప్పుడు దాని వద్దకు రండి.

118 ఇక్కడున్న ఈ కొన్ని మేధస్సు కళాశాలలను మీకు ఇట్లు చెప్పనివ్వవద్దు, “ఓ, అవి పాతకాలపు విషయాలు.”

అది పాతకాలపు విషయమైతే, అప్పుడు దేవుడు కూడా పాతకాలపువాడు. మరియు దేవుడు పాతకాలపు వ్యక్తి అయితే, నేను కూడా, అంతే. ఆమేన్. నేను ఆయన వలె ఉండగోరుచున్నాను. ఎందుకు? ఆకలిగొనుచూ మరియు దప్పిగొనుచున్న, ఆయన ఆత్మ నాలో ఉన్నది, అది వాక్యానికి వ్యతిరేకంగానున్న ప్రతీదానిని ఎత్తిచూపుచున్నది…

119 ప్రజలు ఇట్లు చెప్పినయెడల, “వినోదం కొరకు, ఓ, ఒక వ్యక్తి కొద్దిగా పేకాట ఆడి, మరియు కేవలం ఒకటి లేదా రెండు నాణెములను జూదమాడితే సరియే. అది పర్వాలేదు.” అది కాదు అని దేవుడు చెప్పుచున్నాడు.

120 “ఓ, మీరు కేవలం ఒక ప్రత్యేక సందర్భంలో మద్యం తీసుకొని, మరియు అప్పుడప్పుడు, కొంచెం త్రాగితే పర్వాలేదు.”

కానీ దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు, “అతనికి శ్రమ.”

121 “ఓ,” మీరు ఇట్లు చెప్పవచ్చు, “బ్రెన్‌హామ్ సహోదరుడా, అది పర్వాలేదు. ఒక నిజమైన కారణం వల్లనే నేను—నేను—నేను నా జుట్టు కత్తిరించుకున్నాను. ఒక స్త్రీ, మీకు తెలుసు కదా, ఆ మిగతా స్త్రీలందరూ దానిని చేయుచున్నారు.” ఆ మిగతా స్త్రీలందరూ ఏమి చేయుచున్నారో నేను లెక్కచేయను. వారు మీకు మాదిరి కాదు లేదా వారు మీకు యజమాని కారు. మీరు పరిశుద్ధాత్మను మీలో కలిగియున్నట్లైతే, ప్రజలు మీ గురించి ఏమి చెప్పినను మీరు ఆయన సూచనలను వెంబడిస్తారు.

122 “సరే, బ్రెన్‌హామ్ సహోదరుడా, చాలా వేడిగా ఉన్నది, కావున నేను ఈ చిన్న ఫలాన-మరియు-ఫలానా బట్టలను వేసుకోవలసియున్నది.” ప్రియమైన సహోదరి, నరకము దాని కంటే వేడిగా ఉంటుంది. దానిని నీకు చెప్పనివ్వు. మరియు—మరియు అట్లు చేయకండి. దానిని మీరు గుర్తుంచుకొనండి.

123 మరియు పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మిమ్మల్ని సత్యము వద్దకు నడిపిస్తాడు, మరియు ఆయన సత్యము వాక్యమే. “నా వాక్యమే సత్యము. ప్రతి మనుష్యుని మాట అబద్ధమే, కానీ నా మాట మాత్రమే సత్యము.”

మరియు ఒక్కసారి ఆలోచించండి, “అది హేయమైనది.” మీరు దానిని ఆలోచించగలరా?

124 ఇది చెప్పటానికి ఒక సేవకునికి ఒక దయనీయమైన పదముగా ఉన్నది, కానీ నేను కొన్ని చోట్ల స్నానాల గదులకు వెళ్ళాను అక్కడ అసలు…మీరు తిరిగి బయటకు వెళ్ళవలసి ఉంటుంది, దాదాపు, అది ఎంతో…మరియు గోడపై మురికి వస్తువులు ఉన్నాయి. నేను ఇట్లు అనుకున్నాను, “అసలు మనుష్యులు ఇంత నీచంగా ఎలా ఉండగలరు?” మరియు దుర్వాసన! మరియు నేను ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, నేను తరచుగా ఇట్లనుకున్నాను, “ఎంత దుర్వాసన!” నేను…అక్కడ, నేను చేతులు కడుక్కోవడానికి, నా ముక్కును ఇలా పట్టుకునేవాడిని. నేను ఆ తలుపు యొక్క గడిని మరలా, పట్టుకున్నప్పుడు, అక్కడ సుఖ వ్యాధులుకు సంబంధించిన క్రిములు ఉండునేమోనని భయపడేవాణ్ణి. మరియు నేను ఇట్లనుకున్నాను, “ఓ!”

125 ఒక రోజు, నేను నడిచి వెళ్ళిన ఆ ప్రదేశాలలో ఒకటైన, విమానాశ్రయం వద్ద నిలబడియున్నాను, లేదా రైలుమార్గము స్థలమైయున్నది, నేను అందులోకి నడిచి వెళ్ళాను. మరియు నేను ఇట్లనుకున్నాను, “ఓ, కనికరము.”

126 మరియు నాతో ఏదో ఇట్లన్నది, “దేవునికి ఈ లోకము యొక్క వాసన అలాగే వచ్చుచున్నది. అది హేయమైనది.”

127 నేను ఇట్లనుకున్నాను, ఒక స్త్రీ అంతా ఆ విధంగా ఉండి, వీధిలో నడుచుటను, మరియు పురుషుని వస్త్రాలు ధరించియుండుటను నేను చూసినప్పుడు, దేవునికి అది అలాగే అగుపించును. అశుద్ధముగా మరియు నీచముగా ఉన్న ఏదైనా, దేవుని ఎదుట అది హేయమైనది. అయినప్పటికీ, ఆమె ఆదివారం సంఘముకు వెళ్ళి, మరియు అలంకరించుకుంటుంది.

ఒక పురుషుడు అక్కడికి వెళ్ళి, త్రాగి, మరియు మోసం చేసి, మరియు డబ్బును ప్రేమించి, కొద్దిగా అదనపు డబ్బు పొందడానికి, తన పొరుగువానిని మోసము చేసి, మరియు అదంతా చేస్తాడు; మరియు ఈ కార్యములను చేస్తాడు, మరియు జూదమాడి, పొగ త్రాగి, మరియు మద్యము త్రాగి, మరియు అబద్ధమాడి; పిదప సంఘముకు వెళ్ళి సాక్ష్యమిస్తాడు. హేయము! అశుద్ధము! అది మేధస్సు గల సంఘము.

128 ఇట్లంటారు, “సరి, నేను సంఘానికి చెందినవాడను.” అవును, మరియు సంఘము జరుగుటకు, మీరు తిరిగి వెళ్ళడానికి ముందు, సంఘ పెద్దలు మరియు వారందరూ మరియు ఆ పాస్టరు కూడా, పొగ త్రాగునట్లు, పదిహేను నిమిషాలు, సంఘాన్ని బయటకు పంపుదురు. నాకు చెప్పండి! ప్రతి అపవిత్రమైన దాని నుండి మిమ్మల్ని మీరు వేరుపరచుకొనుడి!

129 “ఆ శరీరమును పాడు చేసినయెడల; నేను దానిని నాశనము చేయుదును.” ఆయన దానిని చేస్తాడని దేవుడు చెప్పెను. మరియు ఈనాడు, క్యాన్సరు, గొంతు మరియు ఊపిరితిత్తుల క్యాన్సరు వలన సంభవించుచున్న, తొంభై-శాతం మరణాలు, సిగరెట్లు త్రాగుటవలెనే యైయున్నది. “ఆ శరీరమును పాడు చేసినయెడల; నేను దానిని నాశనము చేయుదును.” అయితే వారు అంతగా నరకానికి-బద్ధులైపోయి, అట్లు కొనసాగుచున్నారు, వారు ఎరుగరు.

మరియు స్వయంగా తానే ధూమపానం చేయుచున్న ఒక బోధకుడు, ఒక కళాశాల నుండి, నాలుగు డిగ్రీలతో, ప్రసంగ వేదిక వద్ద నిలబడుచున్నాడు. సహూదరుడా, నన్ను నీకు ఒక విషయమును చెప్పనిమ్ము. అట్టి కార్యము నుండి స్త్రీ పురుషులను బయటకు పిలుచుటకు పరిశుద్ధాత్మ పంపబడెను. మిమ్మల్ని మీరు వేరు చేసుకొనుడి!

సంఘము అనే పదానికి “వేరు చేయబడినది” అని అర్థము. “వారి మధ్య నుండి బయటకు రండి,” అని బైబిలు చెప్పుచున్నది. “వారి అపవిత్రమైనవాటిని ముట్టకుడి, మరియు నేను మిమ్మును స్వీకరించెదను; మరియు మీరు నాకు కుమారులును మరియు కుమార్తెలునై ఉందురు, మరియు నేను మీకు దేవుడనై ఉందును.” ఓ, మై! కఠినముగా ఉండాలని నా ఉద్దేశ్యం కాదుగాని, నిజాయితీగా మరియు నమ్మకంగా ఉండాలని నా ఉద్దేశ్యమైయున్నది. అవును, అయ్యా. ఓ, ఎటువంటి ఒక భయంకరమైన విషయము!

130 స్త్రీ పురుషులారా, ఈనాడు మనము ఎక్కడ నిలబడియున్నాము? మనము ఎక్కడ ఉన్నాము? మనము ఆపివేద్దాము.

131 ఒక రాత్రి, గదిలో ఉన్న ఒక పాత సీటు అవతలి వైపున, (మరియు నేను ముగించవలసియున్నది), ఒక చిన్న పాత సోఫాకుర్చీయైయున్నది. మూడు లేదా నాలుగు దినముల ప్రార్థనానంతరము, నేను అటువంటి ఒక స్థితికి వచ్చియున్నాను, చుట్టూ తిరుగుతూ, మరియు ఇట్లు తలంచుచున్నాను, “ఓ దేవా,” మరియు నేను ఏమి చేయాలో తెలియకుండినటువంటి ఒక స్థితికి నేను వెళ్ళాను. నేను ఇట్లన్నాను, “దేవా, మేము మార్గాంతమున ఉన్నాము. మరియు నేను నిర్లక్ష్యం చేశానని నేను గ్రహించాను. నేను వెళ్ళడానికి పిలుపులు ఉన్నవి, మరియు అలసిపోయినందున, నేను వెళ్ళకపోయేవాడిని.” అప్పుడు నేను ఇట్లనుకున్నాను ఆ చీకటి గుండా నా ప్రభువు తడబడుచూ వెళ్ళడం నేను చూస్తున్నాను, ఆయన ఒక అడుగు తీసి మరొక అడుగు వేయలేనంతగా అలసిపోయినా, కానీ ఆయన…నాయీను స్త్రీ కొరకు ఆగెను, పిదప అక్కడకు తీసుకురాబడిన చనిపోయిన బాలుని కొరకు ఆగెను; ఎప్పటివరకనగా ఆయన వెళ్ళి ఆ పాడెను తాకి, మరియు ఆ బాలుని లేపుటకు తనలో ఉన్న కొంచెం శక్తిని కూడా ఉపయోగించెను. “సరి, మరి నేను ఎలా అలసిపోయాను? ప్రభువా, నాతో సమస్య ఏమిటి? ఇక్కడ నేను ఇట్లనుకొనుచున్నాను, ‘సరి, నేను వృద్ధుడనగుచున్నాను. నేను—నేను దానిని చేయలేను.’”

132 మోషే ఉండియున్నాడు, నేను సేవించు అదే దేవుణ్ణి సేవించుచూ, నూటఇరవై ఏండ్లు గలవాడై, ఆవలిన నిలబడియున్నాడు.

కాలేబు ఉండియున్నాడు, తొంభై ఏండ్ల వయస్సులో, చేతిలో ఒక ఖడ్గముతో నిలబడి, ఇట్లన్నాడు, “యెహోషువా నలభై సంవత్సరాల క్రితం ఈ ఖడ్గమును నా చేతిలో పెట్టాడు.” అతనికి అప్పుడు ఎనభై సంవత్సరాలు. ఇంకా ఇట్లన్నాడు, “అప్పుడు నేనెంతటి ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిగా ఉన్నానో ఈనాడును అట్లే ఉన్నాను.” ఆమేన్.

నేను ఇట్లన్నాను, “దేవా, నన్ను కరుణించుము.”

133 నేను చెప్పాను, “సరి, ఇటు చూడు, నేను ఎల్లప్పుడూ…” మరియు నేను (ఆ వెనుక), ఈ బైబిలు మరియు తన చిన్న బైబిలు మీదుగా, నా భార్య చేయి పట్టుకున్నాను, మరియు నేను ఇట్లు చెప్పాను, “ప్రియా, నేను చాలా ప్రతికూలంగా ఉన్నాను. పరిశుద్ధాత్మ నాలో నన్ను ఖండించుచున్నాడు.” నేను అన్నాను, “అక్కడ ఆ ఉడుతలు గురించి నేను తలంచుదును. అక్కడ హెట్టీ రైట్, మరియు ఆ చిన్న అబ్బాయిల గురించి నేను తలంచుదును. ఆయన సృష్టించగల దేవుడైయున్నాడని, చూపించుచూ, దేవుడు ఏమి చేసెనో నేను దాని గూర్చి ఆలోచిస్తుంటాను.” హల్లెలూయా!

నేను అనుకున్నాను, “ఆయన సంవత్సరాల క్రితం, దానిని నాకు చెప్పాడు, ‘నేను నిన్ను విడువను. నేను నిన్ను ఎన్నడూ ఎడబాయను. నీ జీవితకాలమంతా, నీ యెదుట ఏ మనుష్యుడు నిలబడలేడు. నేను నీతో ఉంటాను. మరియు ఈ వివేచన చేతి నుండి, నీవు మనుష్యుల హృదయ రహస్యాలను ఎరుగునంత వరకు అది వస్తుంది. ఆ తర్వాత, అది మరింత ఎక్కువగా అవుతుంది.’ అది జరిగిన సంవత్సరం తర్వాత, అది ప్రపంచమంతటా, పరిపూర్ణంగా నిరూపించబడినది. ఇదిగో ఇది, దానికి మించియున్నట్టి, ఈ వేరొక గొప్ప పరిచర్య వచ్చినది.”

నేను అన్నాను, “ప్రియా, నేను నీ చేతిని తీసుకొనుచున్నాను. దేవుని సహాయము మరియు దేవుని కృప ద్వారా, మరెన్నడూ నేను ప్రతికూలముగా ఉండకుందును గాక. మునుపెన్నడూ లేని విధంగా బోధించడానికి నన్ను ఇక్కడ ఈ ఉజ్జీవనానికి వెళ్ళనిమ్ము. నన్ను ఇక్కడకు వెళ్ళనిమ్ము, ఎందుకనగా మొదట నన్ను శుద్ధి చేసుకొని, మరియు ప్రజల కొరకు ఒక దారిని ఏర్పరచుటకైయున్నది; నా స్వంత పాపములు, నా స్వంత నిర్లక్ష్యము రక్తము క్రింద ఉండి, నా స్వంత లోపములు రక్తము క్రింద ఉండుటకైయున్నది, తద్వారా నేను బయటకు వెళ్ళి మరియు ఇట్లు చెప్పుట కొరకైయున్నది ‘ప్రజలారా, నన్ను వెంబడించండి.’” అది సరైనది.

ఒక వ్యక్తి ఇట్లు చెప్పుటను చూడటం నాకు ఇష్టము ఉండదు, “మీరు వెళ్ళి దానిని చేయండి.” దానిని చేయుటకు ముందుగా వెళ్ళి దారి చూపే ఒకరిని చూడటం నాకు ఇష్టం. అవును, అయ్యా.

134 ఇక్కడ కొంతకాలం క్రితం, దిగువున ఇక్కడ నగరంలో మనకు అగ్నిప్రమాదం కలిగినది, పీఫాయు నూనె కంపెనీలో మంటలంటుకున్నవి. వారు అక్కడ జెఫెర్సన్విల్ అగ్నిమాపక శాఖను కలిగియున్నారు. మరియు నా స్నేహితులలో ఒకరు, మంచి వ్యక్తి, అటువంటి పెద్ద మంటలు అతనికి ఎప్పుడూ అలవాటు లేదు, అతడు ఇట్లనుచు, అక్కడ నడుచుచుండెను, “అబ్బాయిలు, ఇక్కడ కొద్దిగా నీరు చల్లండి. ఇక్కడ కొద్దిగా నీరు చల్లండి.”

ఆ చిన్న క్లార్క్స్‌విల్ వారు అక్కడికి వచ్చారు, “డింగ్, డింగ్, డింగ్, డింగ్,” అక్కడికి పరుగెత్తారు. మరియు అతడు, ఆ అగ్నిమాపక అధికారి క్రిందకు దూకి, ఇట్లన్నాడు, “ఇక్కడ కొద్దిగా నీరు చల్లండి. ఇక్కడ ఈ కిటికీని బ్రద్దలు చేయండి. అక్కడ కొద్దిగా నీరు చల్లండి.”

135 కానీ ఆ నదికి ఆవల లూయివిల్ నుండి శిక్షణ పొందిన అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. ఆ అధికారి నిచ్చెన చివరకు ఎక్కేవరకు ఆ పెద్ద కొక్కెము మరియు నిచ్చెన ఆగలేదు. ఆ నిచ్చెన పైకి వెళ్ళినప్పుడు, అతడు దాని తల వద్ద ఉన్నాడు. అతడు అక్కడికి వెళ్ళుటకు ముందు తన గొడ్డలిని విసిరి, కిటికీని బ్రద్దలు చేసి, ఇట్లన్నాడు, “అబ్బాయిలు, రండి!” అంతే. కొద్ది నిమిషాలలోనే ఆ మంటలు ఆరిపోయినవి.

“ఇక్కడ కొద్దిగా నీరు చల్లండి. అక్కడ కొద్దిగా నీరు చల్లండి,” కాదు. అది ఈ మేధస్సుగల బోధకులలో కొందరిని, మీ మనసుకు తెస్తుంది.

136 రండి! వెళ్దాం రండి! అది సత్యమని నాకు తెలియును. నేను రుచి చేశాను మరియు చూశాను. మహిమ! పరిశుద్ధాత్మ సరైనది. దేవుడు మంచివాడు. ఇక్కడ ప్రయత్నించడం, అక్కడ ప్రయత్నించడం వద్దు; మనము ఆయనలోనికి నడుద్దాము! ఆయన ఇక్కడ ఉన్నాడు. ఇది మీ కొరకే. దేవుడు తన సంఘానికి తన శక్తిని ఇచ్చాడు. దీనిని ఇక్కడ కొద్దిగా చల్లండి, మరియు చల్లండి కాదు; మీరు ఎప్పటికీ ఏమీ చేయలేరు. నాయకత్వము వహించు! ఆమేన్. అహ్! ఫ్యూ! (వాటి గుండా ఏమాత్రము కనపడదు.)

137 ఆమేన్! మనము ఏమి చేయబోవుచున్నాము? ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి దేనితోనో నింపబడియున్నాడు.

అట్లయిన నేను ముగించబోవుచున్నాను; బహుశా తర్వాతైనా, నేను ముగించవలసిందే.

మీరు దేనితోనో నింపబడియున్నారు. మీరు ఏదో ఒకదానితో నిండియుండకుండా అక్కడ కూర్చొనలేరు. మీరు మీలో ఒక జీవమును కలిగియున్నారు. ఆ జీవము మిమ్మల్ని నియంత్రిస్తుంది, మరియు ఆ జీవము ఒక ఆత్మ చేత నియంత్రించబడుతుంది.

ఇప్పుడు, మీరు లోకాన్ని లేదా ఈ లోకపు కార్యాలను ప్రేమిస్తూ, పూర్తిగా లోకంతో నిండి ఉండవచ్చును. దేవుడు మీపై కనికరము చూపును గాక.

మీరు ఏదో ఒక సంఘము నుండియైన నమ్మకాలతో, మీరు చెప్పునట్టి కొన్ని చిన్న ప్రార్ధనలతో నిండియుండవచ్చును, అది ఎవరైనా చనిపోయిన వ్యక్తికి ప్రార్థన చేయుట, లేదా—లేదా మీ మీదుగా ఒక రకమైన గురుతును వేసుకొనుట అని మీరనుకుంటారు. దేవుడు మిమ్మును కరుణించును గాక.

138 మరియు మీరు మతముతో నిండి ఉండవచ్చును, మరది ఇంకా అధ్వానమే. అది నిజము. అది నిజము. బైబిలు ఇట్లు చెప్పినది, “కడవరి దినములలో వారు చాలా మతపరమైనవారై, భక్తి గలవారైయుండి; పైకి భక్తి గలవారైయుండి, దాని శక్తిని ఆశ్రయించనివారైయుందురు: అట్టి వారికి విముఖుడవై యుండుము.”

నీవు మతంతో నిండియుంటే, నీవు దయనీయ స్థితిలో ఉన్నట్లే; కేవలం మతమే అయితే, ఇక అంతే. మీరు నమ్మకాలతో నిండియుంటే, మీరు దేని గురించి మాట్లాడుచున్నారో మీకు తెలియదు. మీరు లోకముతో నిండియుంటే, మీరు గ్రుడ్డివారైయున్నారు.

139 మరియు పిదప, మరలా, మీరు పరిశుద్ధాత్మతో నిండియుండవచ్చును. ఆమేన్. మీరు నింపబడ్డారని నేను ఆశిస్తున్నాను. మరియు, మీరు నింపబడనిచో, మీరు నింపబడవలెనని నేను ఆశిస్తున్నాను. మరియు మీరు పరిశుద్ధాత్మతో నిండియుంటే, మీరు ఏమి కలిగియున్నారు? మీరు శక్తిని కలిగియున్నారు. మీరు ప్రేమను కలిగియున్నారు. మీరు శాంతిని కలిగియున్నారు. “నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను; లోకము అనుగ్రహించినట్లుగా కాదు.” మీరు శాంతిని పొందుకున్నారు. మీరు ముద్రించబడ్డారు. మీరు ఒక గురుతును కలిగియున్నారు. ఆమేన్. మీరు విశ్రాంతిని కలిగియున్నారు. మీరు చెప్పలేనంత ఆనందాన్ని పొందుకున్నారు, మరియు మహిమతో నిండియున్నారు. మీరు లంగరు వేయబడినారు. ఓ, మై! పరిశుద్ధాత్మను కలిగియుండి, మీరు అదేయైయున్నారు. మీరు కలిగియున్నారు…మీరు పరిశుద్ధాత్మతో పూర్తిగా నిండియున్నట్లైతే, “మీరు మరణము నుండి జీవములోనికి దాటియున్నారు,” అంత్య దినమున సాధారణ పునరుత్థానం కొరకు వేచియుంటారు.

140 రాబోవు లోకంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, మరియు ఆయన ఘనత మరియు మహిమతో రావడం చూసినవారు, “సముద్రము తనలోనున్న మృతులను అప్పగించును.” “ఆయనలో నిద్రిస్తున్నవారి క్షయమైన శరీరాలు…”

“ఆయనలో నిద్రించినవారు.” మీరు ఆయనలోనికి ఎలా వెళ్తారు? “ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరంలోనికి బాప్తిస్మము పొందాము.”

“ఆయనలో నిద్రించుచున్నవారి క్షయమైన శరీరములు మార్చబడి మరియు ఆయన స్వంత మహిమగల శరీరము వలె చేయబడతాయి, తద్వారా ఆయన సమస్తమును తనకు లోబరచుకొన సమర్ధుడైయున్నాడు.”

“నేను పరలోకము నుండి ఒక స్వరము విన్నాను,” అని యోహాను అన్నాడు, “నాతో ఇట్లు, చెప్పెను ‘వ్రాయుము, “ప్రభువునందు మృతినొందిన మృతులు ధన్యులు…”’” మీరు లోపలికి ఎట్లు ప్రవేశించబోవుచున్నారు? “ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందాము.” “‘“…ఇకమీదట ప్రభువునందు మృతినొందువారు; ఏలయనగా వారు తమ పనుల నుండి విశ్రాంతి పొందుచున్నారు; మరియు వారి క్రియలు వారి వెంట పోవును.”’” హమ్!

దానికొరకే ఆయన పరిశుద్ధాత్మను పంపెను. ఓ, యేసు నా వాడు, అనే ధన్యకరమైన నిశ్చయత! నేను ఆయనలో ఉన్నాను, మరియు ఆయన నాలో ఉన్నాడు; తండ్రి ఆయనలో ఉన్నాడు, మరియు ఆయన తండ్రిలో ఉన్నాడు; మరియు తండ్రి నాలో, మరియు నేను ఆయనలో ఉన్నాము.

…యేసు నా వాడు!

ఓ, దైవిక మహిమ యొక్క రుచి!

నేను రక్షణకు వారసుడను, దేవుని చేత కొనబడినవాడను,

ఆయన రక్తములో కడుగబడినప్పుడు, ఆయన ఆత్మ ద్వారా జన్మించియున్నాను.

ఆమేన్. నేను దానిని బేరానికి పెట్టను. ఓ, మై!

కెంపులు మరియు వజ్రాలు, మరియు వెండి మరియు బంగారములు,

ఆయన ఖజానాలు నిండిపోయి ఉన్నవి, ఆయన చెప్పలేని సంపదలను కలిగియున్నాడు.

ఏలయనగా నేను ఆ రాజు యొక్క బిడ్డను!

నేను రాజు బిడ్డను!

నా రక్షకుడైన యేసుతో ఉండగా,

అది నన్ను ఆ రాజు బిడ్డగా చేయును!

141 ఆమేన్ మరియు ఆమేన్. నేను దానిని మారకం చేయను. నేను దానిని మారకం చేయను. నేను మరో రెండు లేదా మూడు లేఖనాలను కలిగి-…

పిదప, ఇక్కడ మరొక లేఖనమున్నది. ఎప్పుడైతే—మీరు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, అవి మీరు కలిగియుండే కార్యములైయున్నవి. అప్పుడు లోకానికి, మీరు ఏమిటి? ఒక పరదేశి. ఆలస్యమైనదని నాకు తెలియును, కానీ దీనికోసం అది ఎన్నడూ ఆలస్యం కాదు. ఒక పరదేశివి! ఓ!

మనము ఇక్కడ యాత్రికులము మరియు పరదేశులమైయున్నాము,

మనము రానున్న ఒక పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాము,

ఆ జీవపు నావ త్వరలో వచ్చుచున్నది,

ఆయన యొక్క ఆభరణాలను గృహానికి చేర్చుటకైయున్నది.

142 ఆ ఓహియో నదిపై ఆ నీరు అల్లాడుటను నేను వినగలను, నేను ఒక యవన బోధకుడనైయ్యుండి, దాదాపు ఇరవై-రెండు ఏండ్ల వయస్సులో, అక్కడ దానిని పాడుచున్నప్పుడైయున్నది. మరియు నేను విన్నాను, నా పైకి చూశాను మరియు ఒక స్వరము, ఇట్లనుటను, నేను విన్నాను, “పైకి చూడుము.” ఆ ఆవలిన వ్రేలాడుచున్న ఆ పెద్ద వెలుగు వచ్చి, నా మీదుగా కదులుచూ వచ్చినది, మరియు ఇట్లు చెప్పినది, “క్రీస్తుయొక్క మొదటి రాకడకు ముందుగా బాప్తిస్మమిచ్చు యోహాను పంపబడినట్లు, క్రీస్తుయొక్క రెండవ రాకడకు ముందుగా పంపబడే ఒక వర్తమానమును నీవు కలిగియుంటావు.”

ఓ, నేను దానిని ఎలా నమ్మగలను? అయితే అది ఖచ్చితంగా అలాగే జరిగినది. మరియు ఈ రాత్రి ఉజ్జీవపు మంటలు ప్రపంచవ్యాప్తంగా చుట్టూ మండుచున్నాయి. దేవుని యొక్క విమోచించబడిన గొప్ప సంఘము, తనను తాను ఆ స్థితి నుండి బయటకు తెచ్చుకున్నది, మరియు గొప్ప స్వస్థతా సభలు, మరియు సూచనలు, అద్భుతాలు, మరియు ఆశ్చర్యకార్యాలు ఆ రాకడను చూపించుచున్నవి.

143 నీవు ఒక పరదేశివి, మరియు నీవు ఒక అపరిచితుడవు. నీవు వింతైన కార్యములు చేస్తావు, ఇదివరకు నీవు చేసేవాటికి భిన్నమైనవి చేస్తావు. నీవు మునుపటిలా ప్రవర్తించవు. ప్రజలు…పరిశుద్ధాత్మ, అది మీ మీదకు వచ్చినప్పుడు, మరియు మీరు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, మీరు లోకపు సంగతులను పట్టించుకొనరు. మిమ్మల్ని చిక్కులబెట్టు విషయాలను మీరు పట్టించుకొనరు. మీరు వాటిని లెక్కచేయరు. అప్పుడు మీరు వారికి ఒక—ఒక వింతగా-ప్రవర్తించే సృష్టిగా మారతారు, ఆ వికారమైన బాతువలె, అవుతారు, మరియు పక్షిరాజు తన గూడును రేపినప్పుడు; అని నేను ప్రసంగించినట్టి, కోడి గూడు క్రింద పొదగబడిన ఆ చిన్న పక్షిరాజు వలె ఉన్నది. మీరు వారికి హాస్యకరముగా-కనిపించే ఒక జీవియైయున్నారు.

కానీ, ఓ, మై, ఆ రాజ మార్గములో నడుచుట! ఆమేన్. ఓ, అది పరలోకమునకు ఒక రహదారి. మరియు నేను రాజ మార్గమున నడచుచున్నాను.

ఇట్లంటారు, “ఆ పరిశుద్ధ-గుండ్రాయిని, ఆ వికారమైన బాతును చూడండి. అతడే ఆ పరిశుద్ధ-గుండ్రాయి బోధకుడు.”

144 ఒక ప్రముఖ మెథడిస్టు బోధకుడు లూయివిల్ లోని ఒక వ్యక్తితో ఈ రోజు ఇట్లు చెప్పాడు, ఇట్లన్నాడు, “నేను సహోదరుడు బిల్లీకి సహాయం చేయగోరతాను, కానీ నేను ఏమి చేయుదునో నీకు తెలుసా? నేను నా మెడను ఫణంగా పెట్టవలసియుంటుంది.” నీవు నా కొరకు నీ మెడను ఫణంగా పెట్టనక్కరలేదయ్యా.

ఆయన నా కొరకు తన ప్రాణాన్నే ఫణంగా పెట్టాడు. ఆమేన్!…?…కేవలం ఆ రాజ మార్గమున నడుచుచున్నాను, అంతే. ఓ, మై! ఆయన ఆత్మతో నింపబడి యుండుట! ఆయన ఆత్మ ద్వారా జన్మించి యుండుట! ఆయన రక్తంలో కడుగబడియుండుట! హల్లెలూయా! సంతోషము!

145 ఆపై మరొక విషయము, అంతెందుకు, మిమ్మల్ని అలా చేయునట్లు చేసేది ఏమిటి? మీరింకను మానవులే, అయితే మిమ్మల్ని అలా చేయునట్లు చేసేది ఏమిటి? ఎందుకనగా మీరు వచ్చినది, మీరు, మీ ఆత్మ పైనుండి వచ్చినది. అది మీలోనున్న దేవుడు.

146 నేను రోమ్‌కు వెళ్ళినప్పుడు, వారు, ప్రతి ఒక్కరు, రోమన్ ఆత్మను కలిగియుండుటను నేను గమనించాను. నేను గ్రీసునకు వెళ్ళినప్పుడు, వారందరు గ్రీకు ఆత్మను కలిగియున్నారు. నేను ఇంగ్లాండు వెళ్ళాను; వారందరు ఆంగ్లపు ఆత్మను కలిగియున్నారు. మీరు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, మీరు కనుగొంటారు…పిదప మీరు అమెరికా ఆత్మను కనుగొంటారు; అది భయంకరమైనది.

147 రోము వద్ద సాన్ ఏంజెలో లోని భూగర్భ సమాధుల వద్దకు నేను వెళ్ళినప్పుడు, వారు అక్కడ వారు ఈ విధంగా ఒక గమనికను పెట్టియున్నారు, “దయచేసి, అమెరికా మహిళలారా, చనిపోయినవారిని గౌరవించటానికి, బట్టలు ధరించండి.” అమెరికా ఆత్మ.

విమానం నుండి దిగుచున్నప్పుడు వారిని గమనిస్తే, వారు పొట్టి బట్టలు ధరించియుంటారు, మరియు వారిని చూడటానిక ప్రతీ ఒక్కరూ వెళతారు, మరియు మిస్ అమెరికా వస్తుంది. అది అమెరికా యొక్క ఆత్మ. వస్త్రధారణ బట్టి, ఆమె ఎక్కడి నుండి వచ్చినదో మీరు చెప్పవచ్చు; అబ్బాయి, చీమిడి-ముక్కుతోనున్న ఒక చిన్న పూడిల్ కుక్కను ఆమె వెనుక లాగుచు తెచ్చుచున్నది. అది నిజము. ఓ, అవును, ఆమె ఒక…ఆమె, ఆమె అమెరికా, మిస్ అమెరికాయైయున్నది; క్రిందికి నడుస్తూ, మీకు తెలుసు కదా, అలా గర్వంగా నచుచూ వెళ్ళుచున్నది. ఎందుకని? ఆమె అమెరికా ఆత్మను కలిగియున్నది. అయితే యేసు, ఆ రోజు ఆయన దానికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చాడు, ఆయన ఇట్లన్నాడు, “మీరు ఈ క్రిందనున్న భూమిపై ఉన్నారు. నేను పైనుండి వచ్చాను.”

మరియు నీవు నీలో క్రీస్తు యొక్క ఆత్మను కలిగియున్నట్లయితే, నీవు పైనుండి వచ్చినవాడవైయున్నావు, అప్పుడు ఇక్కడ నీవు ఒక అపరిచితుడవు.

148 అయితే నీవు ఎక్కడినుండి వచ్చావో ఆ ప్రాంతము యొక్క స్వభావాన్ని నీవు కలిగియుంటావు. నేను దానిని చెప్పుటకే ప్రయత్నించుచున్నాను. ఒక రోమీయుడు ఇక్కడికి వస్తాడు, అతడు తన తలను గోక్కుంటాడు; మరియు ఒక జర్మనువాడు ఇక్కడికి వస్తాడు; అమెరికావాడు అక్కడికెళ్తాడు. ఎందుకు? మీరు ఎక్కడినుండైతే వచ్చుచున్నారో ఆ దేశముల యొక్క ఆత్మను మీరు కలిగియుంటారు.

అదే మనల్ని ప్రపంచానికి చాలా భిన్నంగా చేస్తుంది. మీరు పైనుండి వచ్చినవారు. మీరు జన్మించారు. మీరు—మీరు మరొక రాజ్యము యొక్క పౌరులు. మీరు దానిని నమ్ముచున్నారా? పరిశుద్ధాత్మ అనగా అదియే, అది మిమ్మల్ని దేవుని రాజ్యపు పౌరునిగా చేయుటకైయున్నది.

149 పిదప, మీరు దేవుని రాజ్యపు పౌరులైనయెడల, అది మిమ్మల్ని ఎలా ప్రవర్తింపజేస్తుంది? దేవుడు తన రాజ్యంలో చేసినట్లే చేస్తుంది. ఇప్పుడు, దేవుడు తన రాజ్యంలో ఏమి చేస్తాడు? అది పరిశుద్ధత, నీతి, స్వచ్చమైన ఆలోచనలు, స్వచ్చమైన మనస్సైయున్నది; శక్తి మరియు ప్రేమ, నశించిపోవుచున్నవారి యొద్దకు వెళ్ళి, రోగులను స్వస్థపరచుచు, అద్భుతాలు చేయుచూ, గొప్ప కార్యములను చేయుటయైయున్నది. అప్పుడు, లోకానికి మీరు పిచ్చివారిగా కనిపిస్తారు, మరియు వారు ఇట్లంటారు, “వారు బుద్ధిహీనులు.” చూశారా? కానీ మీరైతే రాజ్యం యొక్క పౌరులైయున్నారు.

150 మరొక్క లేఖనము, మీరు దానిని వ్రాసుకొనగోరినయెడల, యోహాను సువార్త 12:24. నన్ను మీకు దీనిని త్వరగా చెప్పనివ్వండి. యేసు ఇట్లు చెప్పెను:

…ఒక గోధుమ గింజ భూమిలో పడి… చావకుండినయెడల, అది మరొక జీవమును తీసుకొనిరాలేదు.

ఇప్పుడు, చూడండి, ఇప్పుడు ఒక్క ముగింపు వ్యాఖ్య. మరియు గుర్తుంచుకోండి, అట్లయిన, అది ఖచ్చితంగా…ఇప్పుడు, ప్రజలారా, మీరు ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది, మీకు అది అవశ్యము మరియు అత్యంత అవసరము, మరియు ఖచ్చితము మరియు తప్పనిసరియైయున్నది. ఏలయనగా, మీరు పొందుకొననియెడల, పునరుత్థానములో మీరు రాలేరు. ఇప్పుడు గమనించండి. దేవుడు తన చట్టాలను ఉల్లంఘించలేడు. మనము దానిని ఎరిగియున్నాము. ఆయన తన చట్టాలను అనుసరిస్తాడు.

151 ఇప్పుడు, యేసు అక్కడ చెప్పినట్లు, ఒక—ఒక గోధుమ గింజ, లేదా ఒక గింజను, మనము తీసుకుందాము. అవును, ఒక—ఒక గింజ, బైబిలులో, నేను ఈ రోజే దానిని చదువుచుంటిని, అవిసె గింజ లేదా ఏ రకమైన విత్తనమునైనా సూచిస్తుంది, అయితే, గోధుమ, బార్లీ, మొక్కజొన్న లేదా ఏదైనా, అదొక గింజయైయున్నది. అయితే ఒక గోధుమ గింజ భూమిలో పడినప్పుడు, ఇప్పుడు, అక్కడ…ఇక్కడున్న మనమందరము చూసియున్నాము, అది జరుగుతుందని ఎరిగియున్నాము. ఒక గోధుమ గింజ, లేదా ఒక మొక్కజొన్న గింజ, అది ఎంతో పరిపూర్ణంగా అగుపించవచ్చును, మరియు మీరు దానిని నేలలో వేయండి, మరియు ఆ గింజ…

అది శాశ్వత జీవమును కలిగియుంటుంది. అది ఈ రోజు క్రిందకు వెళ్ళి, దానినదే ఒక కాండములో పునరుత్పత్తి చేసుకుంటుంది; మరియు మరలా క్రిందకు వచ్చి, మళ్ళీ పైకి వెళ్తుంది; మరియు క్రిందకు వస్తుంది. అది నిరంతర జీవమైయున్నది.

ఆ గింజ గనుక దానిలో జీవ కణాన్ని కలిగిలేనియెడల, అది ఎంత అందంగా కనిపించినా సరే, అది ఎప్పటికీ మొలకెత్తదు. అది భూమిలోనికి వెళ్ళి మరియు కుళ్ళిపోతుంది, మరిక అంతే. దానిలోని భాగము, ఆ పదార్థాలు, భూమిలో ఎరువుగా మరియు అట్టివాటిగా ఉపయోగించవచ్చును. కానీ అది ఎన్నడైనా మరలా జీవించే విషయానికొస్తే, అది దానిలో నిరంతర జీవమును కలిగియుంటేనే తప్ప అది ఎన్నడూ బ్రతుకదు. ఎవరికైనా అది తెలియును. మీరు చేయలేరు.

152 ఇద్దరు వ్యక్తులు ఉండవచ్చు, వారిలో ఒకరు ఖచ్చితంగా, ఇద్దరూ ఒకేలాగా ఉండవచ్చును. వారిలో ఒకరు మంచి వ్యక్తి కావచ్చు, అతడు మంచి పనులు చేయవచ్చును, అతడు ఆ విధంగా చేయవచ్చును; కానీ ఆ మనిషి తనలో నిత్యజీవమును కలిగియుంటేనే తప్ప, అతడు పునరుత్థానములో ఎన్నడూ లేవడు. అతడు లేవలేడు; లేపటానికి అక్కడ ఏమీ లేదు. అతణ్ణి పైకి తీసుకురావడానికి ఏమియు లేదు, అక్కడ జీవము లేదు. కాబట్టి, నా ప్రియమైన సహూదరుడా, నా ప్రియమైన సహూదరీ, మీరు చూడండి, ఒక మనిషి తిరిగి జన్మించితేనే గానీ, అతడు ఈ రాజ్యంలోనికి ఏ విధంగానైనను తిరిగి రాలేడు. అతడు ప్రవేశించలేడు. “ఈ గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే గానీ.” ఆయన తన గురించి తానే మాట్లాడుచున్నాడు. అయితే ఆయన, నిరంతర జీవమును కాదు గాని, నిత్యజీవమును కలిగియున్నాడు; మరియు మీరును అదే జీవమును కలిగియుండునట్లు, ఆయన మీకు ఆ జీవమును ఇచ్చెను.

153 ఇప్పుడు, మీరు చుట్టూ తిరిగుచు మరియు మొహించుటకు చాలినంత, మానవ జీవాన్ని మాత్రమే మీరు కలిగియున్నట్లైతే, “సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రదుకుచుండియు చచ్చినదైయుండును,” మీరు లేవలేరు. నీవు పాఠశాలలో అత్యంత పేరుపొందిన అమ్మాయివి కావచ్చును, నీ సమాజంలోని పేకాటల్లో నీవు అత్యంత పేరుపొందిన అమ్మాయివి కావచ్చును, నీవు దేశంలోనే అత్యుత్తమ దుస్తులు ధరించిన మహిళవు కావచ్చును, నీవు అత్యంత అందమైనదానివి కావచ్చు, నీవు ఉత్తమముగా నిర్మించబడియుండవచ్చును, నీ భర్తకు నీవు ఒక విగ్రహానివి కావచ్చు, నీవు ఇవన్నీ కావచ్చును, మరి, అది అద్భుతమే, కానీ, సహోదరి, నీవు నిత్యజీవమైయున్న పరిశుద్ధాత్మను, నీలో కలిగియుండకపొతే, ఈ మార్గాంతమున నీ పని అయిపోయినది.

మరియు నీవు ఎలా కనిపించుచున్నావు లేదా ఈ విషయాలు ఎలా ఉన్నాయి, లేదా నీవెంత పేరు పొందనిదానివైనా లేదా పేరు పొందినదానివైనా, ఎంత అందముగా ఉన్నా లేదా ఎంత వికారముగా ఉన్నా నేను లెక్క చేయను, నీవు నిత్యజీవమును కలిగియున్నయెడల, అక్కడ నీవు ఎన్నటెన్నటికీ జీవిస్తావు.

154 చంద్రుడు మరియు నక్షత్రాలు వెళ్ళిపోయినప్పుడు, మరియు భూమి దానికదే పర్వతాలలోనికి మరియు ఎడారులలోనికి కన్నీరుగా కారిపోయి, మరియు ఏదియు, లేకుండా, అది ఇక ఎంతమాత్రము లేకుండా, మరియు ప్రపంచము రాత్రివేళ ఇంటికి వచ్చుచున్న ఒక త్రాగినవానివలె తడబడుచున్నప్పుడు, మరియు నక్షత్రాలు ప్రకాశించుటకు నిరాకరించి, ఆకాశము నుండి రాలిపోయి, మరియు చంద్రుడు రక్తముగా మారి, ఆ—ఆ సూర్యుడు ఎర్రబడి తన ముఖాన్ని దాచుకున్నప్పుడు, మరియు మనుష్యకుమారుడు రావడం అవి చూసినప్పుడు, నీవు యేసుక్రీస్తు యొక్క నీతిలో ప్రకాశిస్తావు, ఒక అందమైన, యవ్వన స్త్రీ వలె సమాధి నుండి బయటకు వచ్చుటకైయున్నది, నీ జతను తీసుకొని, ఎన్నటెన్నటికీ, మరియు నిత్యమూ జీవించుటకైయున్నది, మరియు నిత్యమైన యుగములన్నిటిలో నీవింకనూ జీవించుచుందువు. పరిశుద్ధాత్మ దానికొరకేయైయున్నది.

మీరు ఆ చిన్నలాగుడును అనుభూతి చెందినాసరే, దానిని త్రోసివేయకండి.

155 పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? దేవుడు మీలో ఉండుట. అది దేనికొరకైయున్నది? ఆయన ప్రజల మధ్య తన పనిని కొనసాగించుటకు; తన సంఘమును సమకూర్చుటకును, సంఘమును ఈ రోజు ఒక స్థానము వద్దకు తీసుకువచ్చుటకైయున్నది, ఎక్కడికనగా, లూథరు, మెథడిస్టు మరియు పెంతెకొస్తును దాటి, దత్తపుత్రులుగా స్వీకరించబడు ఒక స్థానమునకు మరియు ఎత్తబడు కృప వద్దకు తీసుకువచ్చుటకైయున్నది. తద్వారా, సంఘములోని ఈ భాగము, ఇక్కడున్న ఈ సంఘములోనికి ఆయన ఆత్మ కదిలివచ్చినప్పుడు, అది కేవలం లేచును; మరియు అది తీసుకువస్తుంది, ఆ ఆత్మను తాకినట్టి విమోచించబడిన వారందరినీ బయటకు తెస్తుంది.

వారు కలిగియున్న వెలుగంతటితో, నీతికరణలో, నిలబడిన ఆ లూథరనులందరూ; శుద్ధీకరణ ద్వారా, ఆత్మ వారిని తాకడంతో, నేలపై పడి, మరియు వారి ముఖం మీద నీరు చల్లుకున్న ఆ మెథడిస్టులు; వీధిలో పైకి-మరియు-క్రిందికి తిరిగిన, ఆ పెంతెకొస్తులు, వారు “నాలుక-నుండి-ఊపిరితిత్తులకు,” మరియు, ఓ, “అర్దంలేని వాగుడు మాటలాడేవారు,” మరియు “బాతు భాష మాట్లాడేవారు,” మరియు అట్టివారని పిలువబడినారు; ఈ బైబిలు ఇక్కడ ఎంత ఖచ్చితంగా ఉన్నదో, అంతే ఖచ్చితంగా, ఆ దినమున వారు దేవుని దృష్టిలో నీతిమంతులుగా నిలబడతారు. మీరు నన్ను ఒక సేవకుడని నమ్మితే…మీరు నన్ను ఆయన ప్రవక్త అని పిలచుచున్నారు; నన్ను నేను అలా పిలుచుకోవడంలేదు. అయితే, మీరు వినండి, ప్రభువు నామములో నేను మీకు చెప్పుచున్నాను. క్రీస్తులో ఉన్నవారిని దేవుడు తన రాకడలో, పునరుత్థానములో, ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును, అయితే క్రీస్తులో ఉన్నవారిని మాత్రమే.

156 ప్రజలారా, మనం క్రీస్తులోనికి ఎలా వెళ్తాము.

“ఒక్క మత సిద్ధాంతము ద్వారా మనమందరము చేరియున్నామా”? కాదు.

“ఒక్క కరచాలనం ద్వారా మనమందరం లోపలికి లాగబడినామా”? కాదు.

“ఒక్క నీటి ద్వారా మనమందరం లోపలికి బాప్తిస్మము పొందియున్నామా”? కాదు.

లేదా, “ఒక్క సంఘశాఖ ద్వారా మనమందరము సంస్థగా మారామా”? కాదు.

కానీ, “ద్వారా…” మొదటి కొరింథీ 12:13, “ఒక్క ఆత్మ ద్వారా,” పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, “మనమందరము…” మెథడిస్టు, బాప్టిస్టు, లూథరను, ప్రెస్బిటేరియను, “ఆయన వెలుగులోనున్న ప్రకారము, వెలుగులో నడిచినయెడల, మనము ఒకరితోనొకరము సహవాసం కలిగియుందుము, మరియు దేవుని కుమారుడైన, యేసుక్రీస్తు రక్తము, ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును.” “ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరంలోనికి బాప్తిస్మం పొందితిమి, మరియు ఆయన కృపలో పాలిభాగస్తులమయ్యాము.”

157 మీరు తీర్పుకు వెళ్ళలేరు. “నా మాటలు విని మరియు విశ్వాసముంచువాడు.” అతడు పరిశుద్ధాత్మను కలిగియుంటేనే తెప్ప ఎవడును నమ్మలేడు. “మరియు నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు,” పరిశుద్ధాత్మ ఆయన పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడైయున్నది. “నిత్యజీవము గలవాడు, మరియు అతడు ఎన్నటికినీ తీర్పులోనికి రాడు గానీ, మరణము నుండి జీవములోనికి దాటియున్నాడు.” ఏమిటి? మీరు ఎన్నడూ తీర్పులోనికి వెళ్ళరు. మీరు తీర్పు కొరకు ధవళ సింహాసనం వద్ద ఎన్నడూ నిలబడరు.

మీరు సరిగ్గా ఇక్కడే మీ తీర్పును ఎదుర్కొంటారు. మీరు దాటివచ్చి ఇట్లు చెప్పినప్పుడే మీ తీర్పును దాటియున్నారు అదేమనగా, “నాలో ఏ మంచి లేదు, మరియు నేను నేర్చుకున్నదానిలో ఏ మంచి లేదు. ప్రభువా, నాలోనికి రమ్ము, మరియు నన్ను తీసుకొని నన్ను నడిపించుము, ప్రభువా. ఈ వెర్రి ప్రపంచము ఏమి చెబుతుందో నేను పట్టించుకోను. ప్రభువా, నీ ఆత్మ ద్వారా, నన్ను నడిపించుము.” మీరు అప్పుడే తీర్పును పొందియున్నారు. క్రీస్తు నిమిత్తము మిమ్మల్ని మీరు ఒక వెర్రివానిగా తీర్పు తీర్చుకొనుడి, మరియు, ఆయన నీతిలో, ఆ దినమున అమర్త్యులుగా ఆయన పోలికలో మనము నిలబడతాము.

158 ఒకే ఒక్క మార్గము. ఎలా? “ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము.” మరియు మీరు ఆ శరీరములో ఉన్నప్పుడు, తీర్పు ఇదివరకే ఆ శరీరమును తీర్పు తీర్చినది, మరియు మీరు ఆయనను మీ పాపానికి ప్రాయశ్చిత్తంగా అంగీకరించియున్నారు.

మీరు ఇట్లనవచ్చును, “బ్రెన్హామ్ సహోదరుడా, నేను దానిని చేసాను.”

అప్పుడు, పరిశుద్ధాత్మ తిరిగి వచ్చి, ఒక గుర్తుగా మీకు ఒక ముద్రను ఇచ్చినయెడల, ఆ ఆత్మ మిమ్మల్ని క్రీస్తు యొక్క శరీరంలోనికి తీసుకువస్తుంది. మీరు వేరొక మార్గంలోనికి తిరిగి, మరియు మీరు క్రీస్తు యేసులో ఒక నూతన సృష్టియగుదురు. “మీరు మరణము నుండి జీవములోనికి దాటియున్నారు. పాతవి గతించెను, మరియు మీరు క్రీస్తులో నూతనమైనారు!” ఆమేన్!

159 ఓ, నా క్రైస్తవ సహోదరుడా లేదా సహోదరి, దయచేసి, నన్ను మిమ్మల్ని ఒప్పించనివ్వండి. ఈ ఉజ్జీవము మిమ్మల్ని దాటి వెళ్ళనివ్వకండి. మీరు పరిశుద్ధాత్మను తప్పక పొందుకోవాలి. అది ఏమిటి? దేవుని యొక్క ఆత్మ. అది దేని కొరకు? మిమ్మల్ని నడిపించడానికి, మీకు దారిచూపడానికి, మిమ్మల్ని నింపడానికి, మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి, మిమ్మల్ని బయటకు, సంఘములోనికి పిలవడానికైయున్నది.

సంఘము అనగా ఏమిటి, సంఘము అనే పదానికి అర్థం ఏమిటి? “బయటకు పిలువబడినవారు, వేరుచేయబడినవారు.” ఓ, నేను సరిగ్గా ఇప్పుడే దాని నుండి ఒక ప్రసంగమును తీసుకోగలను! “బయటకు పిలువబడినవారు, వేరుచేయబడినవారు.” పరదేశులు, లోకానికి దూరంగా, యాత్రికులు మరియు అపరిచితులు, మనము నివసించగోరున్నట్టి ఏ భూసంబంధమైన పట్టణము మనకు ఇక్కడ లేదని ఒప్పుకొనుచున్నాము. ఓ, మై!

160 అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబులు భూమిపై గుడారాలలో నివసించుచు, యాత్రచేసినట్లేయున్నది. వారు యాత్రికులు మరియు పరదేశులని చెప్పుచుండిరి, ఆ వారసత్వపు విత్తనము, ఆ వెనుకనున్న ఆ వారసత్వము; ఆ తండ్రి, ఆ వారసత్వము. మనము వారి విత్తనములైయున్నాము. “మరియు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైయున్నాడో ఆ పట్టణము కొరకు వారు ఎదురుచూసిరి.” ఆమేన్. వారు వెదకుచుండిరి.

161 మరియు, ఈనాడు, వారి విత్తనము ఇంకను ఒక పట్టణము వచ్చుట కొరకు ఎదురుచూస్తూ, ఇట్లు చెప్పుచున్నారు, “నేను ఈ లోకముతో సర్ధుకొనిపొగోరుటలేదు. నాకు ఈ లోకముతో ఏ సంబంధము వద్దు. చచ్చవుకముగా కట్టబడిన ఒక పట్టణము కొరకు నేను వెదకుచున్నాను, నాకు అది కావలెను. ఎక్కడైతే సూర్యుడు ఎన్నడూ అస్తమించడో, ఎక్కడైతే వృద్ధాప్యం ఎన్నడూ ఉండదో, ఎక్కడైతే తలుపుగొళ్ళెం మీద మరణమును సూచించే వస్త్రము వ్రేలాడదీయబడదో, లేదా ఆ కొండ వైపున ఎన్నడూ ఒక్క సమాధి కూడా ఉండదో, అట్టి నిత్యజీవమును కలిగియున్న ఒక పట్టణము కొరకు నేను ఎదురుచూచుచున్నాను. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైయున్నాడో, ఆ పట్టణము కొరకు నేను వెదకుచున్నాను.”

162 దానిని కనుగొనడానికి ఒకే ఒక్క మార్గం ఉన్నది. “చేతి సహాయము లేకుండా, పర్వతము నుండి తీయబడిన ఒక రాయి ఉన్నది, అది లోకములోనికి దొర్లి మరియు దానిని నలుగ గొట్టినది, మరియు అది గోధుమ వలె…లేదా కళ్ళములోని పొట్టువలె మారినది.” ఆ రాయి, అనగా ఆ క్రీస్తు యేసు; లోకానికి ఆ అడ్డు-రాయి, ఒక అభ్యంతరపు రాయి, ఒక హేళన-రాయి, సంఘానికి ఒక అడ్డు-బండయైయున్నది; కానీ విశ్వాసికి ప్రశస్తమైనది మరియు ఆకర్షణీయమైనది, ఒక నిశ్చయత రాయి, ఒక విశ్రాంతి రాయి. ఓ, మై!

విశ్రాంతి! నేను మరణము నుండి జీవములోనికి దాటియున్నానని నాకు తెలియును. నా ఆత్మ విశ్రాంతిలో ఉన్నది. ఓ! “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మరియు నేను మీ ప్రాణమునకు విశ్రాంతి కలుగజేతును.” “దాని గూర్చి చెడుగా మాట్లాడబడే ఒక—ఒక సూచన,” అని ఆ—ఆ ప్రవక్త మరియకు చెప్పెను. అది ఒక సూచనగా ఉంటుంది, ఖచ్చితంగా, అది ఉంటుంది. కానీ అది ఒక నిశ్చయతయై యుంటుంది. అది ప్రేమయై యుంటుంది. అది ఒక సంతృప్తియై యుంటుంది. అది మీరు మరణము నుండి జీవమునకు దాటియున్నారని మీరు ఎరుగునట్టిదై యుంటుంది.

163 నా సహూదరీ, సహూదరుడా; మీ సహోదరునిగా, క్రీస్తులో మీ సేవకునిగా, నా హృదయపూర్వకంగా, నన్ను మిమ్మల్ని ఒప్పించనివ్వండి. మీరు దీనిని మీ తలపైనుండి, లేదా మీ క్రిందనుండి, లేదా మీ ప్రక్కనుండి వెళ్ళిపోనివ్వకండి. దానిని మీ హృదయములోనికి స్వీకరించండి, మరియు మీరు భూమిపై సంతోషముగల ఒక వ్యక్తిగా ఉంటారు.

మీరు ఒక మిలియన్ డాలర్లు పొందుకుంటారని నేను మీకు వాగ్దానం చేయడంలేదు. లేదు, అయ్యా. సహోదరుడా లియో, ఇప్పటికే అది చాలా ఎక్కువగా వాగ్దానం చేయబడియున్నదని నేను భావిస్తున్నాను, “మిలియను డాలర్లు,” అని ఆయా వ్యక్తులు చెప్పిన విషయాలు. “నీవు ఒక క్రైస్తవునిగా మారితే, నీవు ఒక మిలియన్ డాలర్లను పొందుకుంటావు మరియు నీవు ఒక ధనవంతుడవు అవుతావు.” నేను మీకు అటువంటిదేదియు వాగ్దానం చేయడంలేదు.

నేను మీకు దీనిని వాగ్దానం చేస్తున్నాను, నేను మీకు వాగ్దానం చేయగల ఏకైక విషయమేదనగా: ఆయన యొక్క రక్షణ. ప్రతి శోధనకు ఆయన కృప చాలును. పెంతెకొస్తు వద్ద ప్రజలు, వారు కలిగియున్న వాటిని వారు కనీసం కోరుకోలేదు. ఇప్పుడు లక్షాధికారుల గురించి మాట్లాడండి? సహోదరి ఏంజి, వారు తాము కలిగినయున్న దానిని కూడా కోరుకోలేదు.

164 మీరు మరియు గెర్టీ, ఈ దినములలో ఒక రోజున (ఆమె ఎక్కడున్నది?), ఈ దినములలో ఒక రోజున, గృహానికి వచ్చే వారం, అనే పాటను పాడితే వినగోరుచున్నాను. అప్పటినుండి వారిలో చాలా మంది సరిహద్దును దాటి వెళ్ళారు. ఓ, మై!

వారు గొప్ప విషయాల కొరకు అడగలేదు. వారు డబ్బును అడగలేదు. అంతెందుకు, పేతురు ఇట్లు చెప్పెను, “వెండి బంగారములు నాయొద్ద లేవు గాని, నాకు కలిగినదే, నీకిచ్చుచున్నాను.”

మరియు స్నేహితులారా, నేను ఈ రాత్రి దానినే చెప్పుచున్నాను. నేను కలిగియున్నట్టి, క్రీస్తును మరియు ఆయన పునరుత్థానము యొక్క ఆనందమును, ప్రేమను, నిశ్చయతను, నేను మీకు ఇచ్చుచున్నాను; దేవుని పిల్లలుగా, నేను మీకు దీనిని ఇచ్చుచున్నాను.

మరియు దేవుడు మిమ్మల్ని పిలిచినట్లయితే మీరు వచ్చి సిలువ వద్ద ఉండండి, మరియు మీరు లేవకండి. మీరు రేపు రాత్రి వచ్చినప్పుడు, మీరు ఇక్కడకు వచ్చి మరియు ఇది పూర్తయ్యే వరకు ఉండటానికి రండి, లేదా పైకి రండి మరియు మేము ప్రార్థించి మరియు మీపై చేతులు ఉంచుతాము. వెళ్ళండి…అది బైబిలు యొక్క క్రమము, పరిశుద్ధాత్మ కొరకు వారిపై చేతులుంచడం. ఆపై మేము వెళ్ళుదుము, మీరు మీ ఇంటికి వెళ్ళుదురు…మీరు అక్కడే ఉంటే, మీరు రాత్రంతా ఉండిన యెడల, మరుసటి రోజు కూడా ఉండండి, ఆ మరుసటి రోజు కూడా ఉండండి, సెలవుల్లో ఉండండి, సంవత్సరం మొదటి వరకు ఉండండి మరియు అలాగే ఉండిపోవుడి, అంతవరకు ఉండండి.

165 ఎట్లనగా, బైబిలులో ఏమి వచ్చునని మీకు చూపించుచు, రేపటి రాత్రి గురించి మేము ఏదైతే సూచనలు ఇచ్చామో, అది వస్తుంది. మరియు అది వచ్చినప్పుడు, ఇక హింసించుటకు సరిపడా దయ్యాలు ఉండవు…మీరు మరణము నుండి జీవములోనికి దాటియున్నారని మీరు ఎరిగియున్నారు. మీరు క్రీస్తు యేసులో ఒక నూతన సృష్టియైయున్నారు. పరలోకపు ఆనంద గంటలు మ్రోగుతాయి.

166 ఓతల్ సహోదరుడా, నేను మీకు చెప్పుచున్నాను, అది మిమ్మల్ని మండిస్తుంది. ఇక్కడ ఒక బాలుడు కూర్చొనియున్నాడు, నా యొక్క పాత సహోదరుడు, అతడు తన ప్రక్కలలో తుపాకీలను కలిగియుండి వెళ్ళుచుండెడి ఒక నేరస్థుడైయున్నాడు, వారి మెదడును పేల్చివేయుటకు ఒక వ్యక్తి కొరకు, ఎవరో ఒకరి కొరకు వెదకుచుండేవాడు. మరి ఏమి జరిగినది? ఒకరోజు అతడు చూసి మరియు జీవమును నమ్మాడు. పిమ్మట అతడు నడిచాడు. అతడు నా కూటములను వెంబడించాడు. మరియు ఆ పేదవాడు, తినటానికి చాలినంత లేక, ఆకలిదప్పులతో, గుడారం ప్రక్కన ఉన్న పొదలలో పడుకున్నాడు. మరియు ఒక రోజు పరిశుద్ధాత్మ వచ్చెను. ఓ, నా సహోదరుడా, అది నిన్ను మార్చివేసినది, కాదా? అది జీవమును తెచ్చి, మరియు మరణాన్ని తీసివేసినది. ద్వేషం వెళ్ళిపోయి, ప్రేమ లోపలికి ప్రవేశించినది. ఓ, మై! శత్రుత్వం మరియు కలహాలు అన్నీ తొలగిపోయి; నూతన జీవము వచ్చినది.

ఇక్కడ ఇతర సమయాల్లో ఇతరులను, ఇతర సమయాల్లో ఇతరులను మరియు అక్కడ నుండి చూడండి. ఓ, పరలోకపు ఆనంద గంటలు మ్రోగుచున్నాయి! స్నేహితులారా, నేను దానిని వ్యక్తపరచుటకు ఏ మార్గము లేదు.

167 క్రీస్తు యొక్క సేవకునిగా, నా సాక్ష్యమును మీరు నమ్మినయెడల, నేను దీనిని చెప్పునట్లు, వినండి, అది సరైనదని దేవుని బైబిల్ నుండి మీకు చూపించడానికి ప్రయత్నించాను. మరియు దీని విషయమై నా మాటలు కొంచెం వింతగా ఉన్నట్లు అనిపిస్తే, శాస్త్రీయ ప్రపంచంలోని ఆ చిత్రాన్ని చూడండి. ఆ ఫలమును చూడండి, ఇశ్రాయేలు పిల్లలును నడిపించిన ఈ అగ్ని స్తంభమును చూడండి, అది ఫలించిన ఫలమును చూడండి. అది ఏమి చేస్తుందో, ఏమి చెబుతుందో చూడండి.

మాట్లాడేది నేను కాదు; మీ ద్వారా మాట్లాడేది ఆయనే, మీరు చూడండి. దర్శనాలను చూస్తున్నది నేను కాదు; మీ ద్వారా మాట్లాడేది ఆయనే. రోగులను స్వస్థపరచేది నేను కాదు; మీలో ఉన్న ఆయనే, రోగులను స్వస్థపరచువాడు. బోధించేది నేను కాదు; నేను వెనుకబడిన పిరికివాడను, మరియు ఆ ఆలోచన నుండియే పారిపోయినవాడను, కానీ నా ద్వారా మాట్లాడుచున్నది ఆయనే. నాకు వాక్యము తెలియదు; కానీ ఆయనకు అది తెలియును. అంతే. అంతే. అది అదేయైయున్నది.

మరియు అదిగో ఆయన అక్కడున్నాడు. మరియు అదే దేవదూత ఈ రాత్రి సరిగ్గా ఇక్కడ ఈ భవనంలో ఉన్నాడు. ఓ, నేను ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నానో!

168 ఇప్పుడు ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకొనగోరుచున్నారు? మన జీవితాలను పరిశీలించుదము. ఎంతమంది దానిని పొందకయుండి, మరియు పొందగోరుచున్నారు? మీ చేయిని పైకెత్తి, చెప్పండి, “సహోదరుడా బ్రన్హామ్, నా హృదయపు లోతులనుండి, నేను పరిశుద్ధాత్మను పొందగోరుచున్నాను.” ప్రతిచోటా, దేవుడు మిమ్మును దీవించును గాక.

169 దానిని పొందుకున్నవారైన మీలో ఎంతమంది, అపోస్తుల కార్యములు 4 లో, వారు చేసినట్లు వెళ్ళి, మరియు ఇట్లు చెప్పగోరుచున్నారు, “ఓ ప్రభువా, ఓ ప్రభువా, స్వస్థపరచుట కొరకు నీ చెయ్యిని చాపుము, మరియు నీ పరిశుద్ధ కుమారుడైన యేసు నామములో సూచనలను మరియు అద్భుతాలను చూపించుచు, మరియు మాట్లాడుట కొరకు, నాకు ధైర్యమును మరియు ప్రేమను, మరియు ఒక నూతనమైన నింపుదలను ఇవ్వుము”? అవును, ఇదిగో, నేను కూడా ఎత్తియున్నాను. దేవా, దానిని నాకు ఇవ్వుము.

ప్రతీ ఒక్కరూ మీ కోరికను మీ హృదయములో పట్టియుంచగా, లోతైన యధార్ధతతో, మన తలలు వంచుకుందాం.

170 ప్రభువైన యేసు, వాక్యము మరియు పరిశుద్ధాత్మ చుట్టూ సహవాసం కలిగియున్న తర్వాత, మేము ఈ రాత్రి ఈ చిన్న కూటమిని ముగించుచున్నాము. ఆయన మమ్మల్ని ఆశీర్వదించి మరియు ఆయన వాక్యపు నూనెను మా హృదయాల్లో ఎలా కుమ్మరించాడో! జీవితపు నడకలన్నిటిలోను, ప్రభువు మంచివాడని రుచియించి మరియు చూసిన, సేవకులు మరియు మనుషులు ఇక్కడున్నారు. పరిశుద్ధాత్మ అనగా ఏమిటో ఇప్పుడు మాకు తెలియును, అది దేవుని యొక్క వాగ్దానము. అది విశ్వసించువారందరికి నిత్యజీవమైయున్నది.

171 మరియు పరిశుద్ధాత్మ అనగా, తిరిగి పంపబడిన యేసు క్రీస్తు యొక్క ఆత్మ అని మాకు తెలిసియున్నది, మరియు ఆయన ఈనాడు మాలో ఉన్నాడు. ఆ అగ్ని స్థంభములో, దేవుడు మా పైన ఉన్నట్లు; పిదప ఆయన…ఇమ్మానుయేలు అని పిలువబడిన ఒక శరీరంలో మాతో నడిచాడు, “దేవుడు మనతో”; మరియు ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన మాలో ఉన్నాడు, దేవుడు మాలో ఉండుట. ఓ!

యేసు ఇట్లు చెప్పెను, “నేను తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని, ఆ దినమున మీరు ఎరుగుదురు. ఆ దినమున మీరు గ్రహించెదరు. ఎందుకనగా, మీరు ఇప్పుడైతే, చీకటి ప్రపంచములో ఉన్నారు, కానీ ఆ దినమున మీరు గ్రహిస్తారు.”

172 తండ్రీ, అది తేటతెల్లము మరియు పరిపూర్ణము చేయబడజాలదు, ఎందుకనగా అప్పుడు విశ్వసించుటకు ఇక మాకు ఏమీ ఉండదు. కానీ దేవుని యొక్క కార్యములన్నియు విశ్వాసము చేత నియంత్రించబడతాయి. మరియు నీ వాక్యములో విశ్వాసముంచుట ద్వారా, ఇప్పుడు మాకు తెలిసిన పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యార్ధమై, ఆకలితో ఇక్కడున్న ప్రతి ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడాలని నేను అడుగుచున్నాను. దానిని కలిగిలేక, మరియు దాని కొరకు ఆకలిగొనుచున్నవారిని, కేవలం జ్ఞాపకం చేసికొనుము…ప్రభువా, నీవు చెప్పిన ఈ విధంగానే, మేము వారితో చెప్తాము, “ఆకలిగొనుచు దప్పిగొనుచున్న మీరు ధన్యులు. మీరు తృప్తిపరచబడుదురు.” అది ఒక వాగ్దానము. మరియు ఆకలికలిగి ఉండటము కూడా ఆశీర్వాదమే. దేవుడు మీతో మాట్లాడెనని తెలుసుకొనుటను బట్టి కూడా మీరు ధన్యులే. ఏలయనగా ఇట్లు చెప్పబడినది, “మొదటిగా నా తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు.”

173 మరియు, ప్రభూవా, ఇక్కడ పాత అనుభవజ్ఞులైనవారు, వారు తమ చేతులను పైకి లేపారు. నేనును నా చేతిని పైకి లేపాను. ఓ ప్రభువా, మాకు బలమును దయచేయండి, నీ పరిశుద్ధ బిడ్డయైన యేసు యొక్క చేతిని చాపునట్లు మాకు శక్తిని దయచేయండి, తద్వారా, సూచనలు మరియు అద్భుతాలు జరగి, అది ఒక లోతైన పరిచర్యగా, ఇప్పటివరకు జరిగినదానికంటే ఒక గొప్ప కార్యముగా అది ఉండుటకైయున్నది. ప్రజలతో మాట్లాడటానికి మాకు ధైర్యమును మరియు ప్రేమను అనుగ్రహించండి. ప్రభువా, దానిని అనుగ్రహించండి. అన్ని విషయాలలో మాతో ఉండండి, మేము యేసు నామములో దీనిని అడుగుచున్నాము.

174 మరియు, ప్రభువా, రేపు రాత్రి, అది సరిగ్గా మరొక పెంతెకొస్తు దినమువలె ఉండునట్లు, ఎంతో బలమైన గాలి వీచి ఈ భవనములోనికి వచ్చును గాక. పునాది వేయబడినది. ప్రతీది సిద్ధముగా ఉన్నది. ఎద్దులు వధించబడినవి, క్రొవ్వినవి చంపబడినవి, పొట్టేలు చంపబడినవి; బల్ల సిద్ధము చేయబడినది, అతిథులు ఆహ్వానించబడినారు. ఓ ప్రభువా, రేపు రాత్రికి, ఈ భవనంలోనికి, ఒక పెంతెకొస్తు జూబ్లీని పంపుము, మరియు ప్రతి ఆత్మను పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మముతో నింపుము. తండ్రీ, దీనిని అనుగ్రహించండి. మేము దీనిని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.

…మేము అనేక విషయాలను నేర్చుకుంటాము,

బంగారముతో చేయబడిన ఒక వీణను మేము కలిగియుంటాము,

అది బహుశా వెయ్యి తీగలు గలది;

మేము పాడుచూ కేకలు వేయుచూ మరియు నాట్యము చేస్తాము,

గొర్రెపిల్ల మా కన్నీళ్ళను తుడిచివేయును;

గృహమునకు వచ్చే ఒక గొప్ప వారమును మేము కలిగియుంటాము,

మొదటి పది వేల సంవత్సరాలు. ఆమేన్!

దేవుని స్వంత కుమారుని యొక్క అమూల్యమైన రక్తము శుద్ధిచేసి మరియు పరిశుద్ధపరచినది.

ఆయన నామము కొరకు ఒక అద్భుతమైన జనము మరియు వారు వధువు అని పిలువబడతారు.

ఇక్కడ నిర్లక్ష్యం చేయబడి, తృణీకరించబడినప్పటికినీ, ఒక రోజున ప్రభువు

ఆ ఎన్నిక చేయబడినవారిని గవిని లోపలకు తీసుకువస్తాడు, మరది అన్నిటికీ చాలినది. 

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...