పరిశుద్ధాత్మ మీద ప్రశ్నలు మరియు జవాబులు

పరిశుద్ధాత్మ మీద ప్రశ్నలు మరియు జవాబులు

1మరియు గడిచిన రాత్రి తర్వాత మనమందరము తృప్తిచెందాము. పరిశుద్ధాత్మను పొందుకున్న అనేకుల మంచి నివేదికలను నేను ఈ రోజు వినియున్నాను. మరియు దానికై మేము సంతోషించుచున్నాము.

2 ఇక్కడ ఆలయము నుండి మా సహచరులలో ఒకరైన, సహోదరుడు గ్రాహంను ఈ రాత్రి మనతో కలిగియున్నందుకు సంతోషిస్తున్నాము, అతడు యూటికాలోని హోలీనెస్ చర్చి యొక్క సంఘ కాపరియైయున్నాడు. మరియు సహోదరుడు జాక్సన్, గత రాత్రి అతనిక్కడ ఉండెనని, నేను నమ్ముచున్నాను, లేదా ఇప్పుడు ఈ జనాలలో అతను వెనుక ఎక్కడో ఉండియున్నాడు, ఎవరో అన్నారు, ఉన్నాడు…అవును, నేనిప్పుడు సహోదరుడు జాక్సన్ ను ఆ జనాలలో చూస్తున్నాను. మరియు—మరియు సహోదరుడు రడెల్, ఈ రాత్రి అతడు ఇక్కడ ఉన్నాడా? అతను ఇక్కడున్న మన సహచరులలో “62,” ఏండ్లుగల మరొక వ్యక్తియైయున్నాడు. వారిని కలిగియున్నందుకు మనము ఆనందించుచున్నాము. మరియు మాతో…ఓ, సహోదరుడు ప్యాట్, మరియు ఈ ఇతర సహోదరులందరు, మేము—మరియు ఆ జనాలలో ఉన్నారు. ఈ రాత్రి మీ అందరినీ ఇక్కడ కలిగియున్నందుకు మేము సంతోషించుచున్నాము.

3 ఇప్పుడు, నేను న్యాయం చేయాలంటే, మీతో మాట్లాడటానికి ఆ మంచి ప్రసంగికులలో కొందరిని నేను ఇక్కడికి తీసుకువచ్చెదను, ఎందుకనగా గత రాత్రి అటువంటి ఒక గొప్ప సమయం గడుపుటవలన నా గొంతు బొంగురు పోయినది.

4 ఇప్పుడు, నా భార్య, ఆమె నా తప్పులు దిద్దుతుంది; సహోదరులారా, నేను దేనిగూర్చి మాట్లాడుచున్నానో, మీకు తెలుసు. గత రాత్రి ఆ వెనకనున్న ప్రజలు నా స్వరమును వినలేకపోయారని ఆమె చెప్పినది, ఎందుకనగా నేను దీనిలో మాట్లాడుచున్నాను. మరియు ఇప్పుడు, నేను ప్రారంభించడానికి ముందు, నేను ఒక దానిని ప్రయత్నించబోవుచున్నాను. ఇప్పుడు, అది బాగుందాయని నేను ఆశ్చర్యపోవుచున్నాను. అక్కడ ఆ వెనుకనున్నవారికి అది మంచిగా ఉన్నదా? లేదా ఇది బాగున్నదా? ఇది బాగున్నదా? ఇప్పుడు, ప్రియా, మొదటిసారి నీకు వ్యతిరేకంగా నాకు ఒక విషయం దొరికింది. ఇప్పుడు, వారు అదే బాగున్నదని చెప్పుచున్నారు. సరి. ఓ, మై! ఆమె ఒక స్త్రీ. ఆమె మంచిది, ఎందుకనగా నాకు ఒకటి దొరికి చాలా కాలం అవుతుంది. సాధారణంగా ఆమె చెప్పునది సరియే.

5 మంచిది, మనం నిశ్చయంగా ఆ మూడు రాత్రుల కూటములలో ఒక గొప్ప సమయాన్ని గడిపియున్నాము; నేను కలిగియున్నాను. మరియు ఇప్పుడు, ఆ టేపులు, గత రాత్రిది తప్ప అన్నియు…నేను సహోదరుడు గోడ్ ను పిలిచాను మరియు వచ్చి ఆలయం కొరకు టేపును తీసుకొనమని అతనితో చెప్పాను. కానీ బిల్లీ పాల్ తన కారు తీసుకొని వెళ్ళడం జరిగినదని నాకు అర్ధమైనది, కావున నాకు తెలిసినంతమట్టుకు ఆ టేపు తీసుకొనబడలేదు. కావున మేము దానిని తప్పిపోయాము. మనము ఏమి నమ్ముచున్నామని ఎవరైనా చెప్పుటకు—నేను దానిని సంఘము కొరకు—సంఘములో ఉంచుటకు ఇష్టపడుదును.

6 ఇప్పుడు, ప్రశ్నలను నేను సకాలములో పరిశీలించినయెడల, ఈ రాత్రి నేని గొప్ప సమావేశము అనుదానిపై మాట్లాడబోవుచున్నాను. మరియు పిదప, రేపు ఉదయం ఒక స్వస్థత కూటము ఉన్నది. మరియు మేము రోగుల కొరకు ప్రార్థించబోవుచున్నాము. కావున, మేము ఇవ్వలేము—లేదా ఊరకే వెళ్ళి మరియు, “ఇప్పుడు, నేను నిన్ను తీసుకొనబోవుచున్నాను, మరియు నిన్ను, మరియు నిన్ను,” అని చెప్పలేము. అది సరి కాదు. అయితే మేము కొన్ని కార్డులను ఇస్తాము, మరియు ఆ కార్డులలో ఎక్కడో ఒక దగ్గర నుండి, కొంత మందిని నేను వేదిక మీదకి పిలుస్తాను. మరియు పిదప, పరిశుద్ధాత్మ గనుక బయలుపరచడం ప్రారంభించినయెడల, అప్పుడు అది ఆ జన సమూహములోనికి వెళ్ళి మరియు బయటనున్న ఆ సమూహములో నుండి ప్రజలను స్వస్థత కూటమునకు తెచ్చును. మరియు పిదప, రేపు ఉదయం, ప్రభువు చిత్తమైతే, సరిగ్గా స్వస్థత కూటమునకు ముందు, నేను మాట్లాడుదును.

7 నా భార్య నవ్వుటను నేను చూచుచున్నాను. ప్రియా, నేను మాట్లాడేది నీకు అస్సలు వినబడటం లేదా? ఓ, నీవు వినుచున్నావు. సరి, అది మంచిది. ఆమె ఆ వెనుక కూర్చునియున్నది మరియు అది గనుక—వినబడకపొతే, “నీవు…నీవు చెప్పేది వినిపించుట లేదు, నీవు చెప్పేది వినిపించుట లేదు,” అని ఆమె తన తలను ఊపుతుంది.

8 కావున పిదప రేపు—రేపు రాత్రి నీటి బాప్తీస్మముతో పాటు ఒక సువార్తపరమైన కూటము ఉంటుంది. మరియు పిదప, రేపు రాత్రి నేను ప్రసంగించుటను ముగించిన వెంటనే, మేము ఆ తెరలను వెనుకకు లాగి మరియు రేపు రాత్రి నీటి బాప్తీస్మమును ఇచ్చెదము. ప్రభువు చిత్తమైతే, ప్రభువు కోరినయెడల, ఉదయం—లేదా రేపు రాత్రి నేను ఈ అంశముపై మాట్లాడగోరుచున్నాను: ఒక—ఒక సూచన ఇవ్వబడెను. మరియు పిదప, బుధవారం రాత్రి మేమిక్కడ ఉన్నయెడల, బుధవారం రాత్రి ఇక్కడ ఉండుటకు ప్రభువు నాకు అనుమతించినయెడల, తూర్పున మేమాయన నక్షత్రమును చూచి ఆయనను ఆరాధింప వచ్చితిమి: అనే అంశముపై నేను మాట్లాడగోరుచున్నాను. ఇప్పుడు, అది కేవలం క్రిస్టమస్ సందర్భమైయున్నది.

9 మరియు ఆపై, క్రిస్టమస్ అయిపోయిన వెంటనే ఆ వారం క్రిస్టమస్ సెలవులైయున్నవి. అక్కడే మనము ఉత్తరాలన్నిటినీ తీసుకుంటాము…సాధారణంగా సహోదరుడు మెర్సియర్ మరియు వారు వాటిని బయటకు తీస్తారు. మరియు వాటన్నిటిని మేము బయట పెడతాము, మరియు మేము ఆ ఉత్తరాల కొరకు ప్రార్థిస్తాము మరియు ప్రపంచముగుండా మేము వెళ్ళబోవు చోట్లకెల్లా మమ్మల్ని నడిపించమని ప్రభువును అడుగుతాము.

10 ఇప్పుడు, ఫ్లోరిడాలో జరుగబోవు సమావేశమునకు, వెంటనే వెళ్ళుటకు, వారు అనగా క్రైస్తవ వ్యాపారవేత్తలు గొప్ప సిద్ధపాటును కలిగియున్నారు. అక్కడి నుండి కింగ్స్టన్ కు, పిదప హైతీస్ నకు, మరియు దిగువన దక్షిణ అమెరికాలోని ప్యూరెటోరికో నకు, తిరిగి మెక్సికో గుండా ప్రయాణించవలెను.

11 కానీ ప్రభువు నన్ను నార్వే కి నడిపించుచున్నట్లు అనిపిస్తుంది. ఎందుకో నాకు తెలియదు. దేవునియొద్ద నుండి పంపబడిన మనిషి అనే ఆ చిన్న పుస్తకము మీకు తెలుసా? అది నార్వేలో అతిపెద్ద మతపరమైన ప్రచురణయైయున్నది. అక్కడ ప్రభువు ఏమి చేసెనో, దాని గూర్చి ఆలోచించండి. మరియు నేనక్కడ ఉన్నప్పుడు, వారు రోగులపై నా చేతులను పెట్టనీయలేదు. నేనక్కడ మూడు రాత్రులు ఉన్నాను. మరియు వారు రోగులపై నా చేతులను పెట్టనీయలేదు. కావున దేవుడు ఏమి చేయగలడో మీరు చూడండి. గుంపులు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే వారు గుర్రాలను, గుర్రములపై గస్తీ చేయు పోలీసులను తీసుకొని, మరియు నేను ఆ స్థలమునకు చేరుకొనునట్లు ప్రజలను వీధుల్లో నుండి తరమవలసి వచ్చెను. మరియు నేను రోగులపై చేతులుంచలేదు. అయినను వారు ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకొనునట్లు చేసి; నేను వారి కొరకు ప్రార్థించాను.

12 కావున…[ఎవరో బ్రెన్హామ్ సహోదరుడితో మాట్లాడుచున్నారు—సంపా.] అవును, నిశ్చయంగా, అప్పుడు నేను చేస్తాను. ఇప్పుడు, రేపు ఉదయం…ఇప్పుడు, ఈ రాత్రి, బహుశా మనము కేవలం ఈ ప్రశ్నలలోకి వెళ్తాము, ఎందుకనగా కొన్ని మంచి ప్రశ్నలు మనకు వచ్చాయి. మరియు ప్రభువు మనల్ని వాటిపై ఎంతసేపు ఉంచుతాడో నాకు తెలియదు. మరియు పిదప, రేపు ఉదయం బహుశా బిల్లీ పాల్, జీన్, లేదా లియో, ఎవరో ఒకరు, ఎనిమిది నుండి ఎనిమిది-న్నర వరకు ప్రార్థన కార్డులను ఇచ్చుటకు ఇక్కడ ఉంటారు. ఇప్పుడు, ఈ-పట్టణానికి-చెందని ప్రజలారా, మీరు మరచిపోకుండునట్లు నన్ను మళ్ళీ చెప్పనివ్వండి. మీరు గనుక వరుసలోనికి రాగోరినయెడల, వీలయితే మేము ఈ-పట్టణానికి-చెందని ప్రజలను అనుమతిస్తాము.

13 ఇప్పుడు, కొన్నిసార్లు ఇక్కడ సంఘములో మనము ఎటువంటి పరిస్థితికి వస్తామంటే, వారు ఇలా అంటారు, “మంచిది…” మనము ఈ-పట్టణానికి-చెందని ప్రజలను రానిద్దాము, వారిని తీసుకువద్దాము…ఎవరో ఒకరు ఇట్లంటారు, “మంచిది, వారితో సమస్య ఏమిటో నాకు తెలియదు. బహుశా వారు ఏదైనా తప్పు చెప్పుచుండవచ్చును.” పిదప మీరు పట్టణంలోని ప్రజలను తీసుకువస్తారు; అప్పుడు వారిట్లు చెప్తారు, “ఓ, వారు మీకు తెలుసు కాబోలు.” కావున…పిదప వారిట్లంటారు—ఇలా చెప్పబడుతుంది, “మంచిది, నేను మీకు చెప్తాను, అది ప్రార్థనా కార్డులవలనై యున్నది.” మంచిది, అలాగైతే ప్రార్థనా కార్డులు లేనివారి సంగతేమిటి? మరియు దినము వెంబడి దినము…

ఏమంటారు? [సహోదరుడు బ్రెన్హామ్ ని మైక్రోఫోన్ కి వెనకాల నిలబడమని అడిగారు—సంపా.] మైక్ వెనుక నిలబడవలెనా? మంచిది, నేనెల్లప్పుడూ మితముగా బోధిస్తుంటానని, మీకు తెలుసు. కావున బహుశా నేను దానిని ఈ విధంగా తీసుకుంటాను. అది బాగుందా? అది బాగుంది. అది మంచిగానున్నది. అదేమిటో నేను మీకు చెప్తాను. ఇక్కడ మన—మన మైక్ విధానం చాలా పేలవంగా ఉన్నది, చాలా పేలవంగా. మరియు ఇంకా మంచిదానిని తీసుకోవాలని మేము ప్రయత్నించడం లేదు, ఎందుకనగా వెంటనే నూతన ఆలయం కట్టబడాలని మేము కోరుచున్నాము. మరియు అప్పుడే మనకు సరిపడా స్థలము ఉంటుంది (చూశారా?), మనము ఇక్కడకు వచ్చి మరియు ఈ స్థలమును కొంచెం పెద్దగా విస్తరింపజేసి, మరియు మరి కొంత స్థలమును కలిపినయెడల, అప్పుడు మనం వాటిని ఇక్కడ కలిగియున్నప్పుడు కూటములకొరకు సిద్ధపడవచ్చును.

14 మరియు ఇప్పుడు, గుర్తుంచుకొనండి, ఉదయం అబ్బాయిలు, వారిలో ఒకరిద్దరు ఎనిమిది-న్నర మధ్య కార్డులను ఇస్తారు, లేదా, ఎనిమిది మరియు ఎనిమిది-న్నర. అది ప్రతియొక్కరికి స్థిరపడటానికి ఒక అవకాశమిస్తుంది. మరియు వారెట్లు కార్డులను ఇస్తారనియు, మేమెందుకని దానిని చేస్తామన్న దాని గూర్చి నేను మాట్లాడుచుంటిని. అది క్రమంలో ఉంచడానికైయున్నది. చూశారా? ఇప్పుడు, ఎట్లనగా సరిగ్గా ఇప్పుడే, నేను ఇక్కడికి వచ్చి మరియు ఇట్లు చెప్పిన ఏమగును, “ఈ స్త్రీ, ఈ స్త్రీ, మరియు ఆ పురుషుడు, మరియు ఈ స్త్రీ…?” మీరు చూడండి, అది ఒక విధంగా—అది కొంచెం కఠినంగా ఉంటుంది. చూశారా? మరియు పిదప, మీరు గనుక…చాలాసార్లు నేను ఇలా చేశాను. మరియు ఉదయం వారు ఎక్కువ మంది లేనట్లయితే, బహుశా నేను అదే చేస్తాను. నేను ఇలా చెప్తాను, “ఇక్కడున్న ప్రజలలో పట్టణానికి వెలుపలివారైయుండి మీలో ఏదైనా సమస్య ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? మీరు లేచి నిలబడండి.”

15 సహోదరుడా మెర్సియర్, నీవు నన్ను కాపాడడానికి వచ్చుచున్నావు. నీవు నాకు సహాయం చేయబోవుచున్నావా? [సహోదరుడు మెర్సియర్ చెప్పుచున్నాడు, “నన్ను నేను కాపాడుకొనుటకు వచ్చుచున్నాను.”—సంపా.] ఓ, నీవు వచ్చుచున్నావు…అతడు తనను తాను కాపాడుకొనుటకు వచ్చుచున్నాడు. ఈ రోజు నేను నీ ప్రియురాలితో మాట్లాడాను. ఇప్పుడు, నీవు నాతో చాలా మంచిగా ఉండటం మంచిది. చూశారా? అది సరియే. అది మంచిది. సహోదరుడా లోయో నేను—నేను ఆ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. అది సరి కానప్పుడు, దాన్ని ఎలా సరి చేయాలోయని మనకు తెలిసినంతమట్టుకు, మనం—మనం దానిని సరి చేద్దాం, మనం చేయగలిగినంత ఉత్తమమైనదాన్ని చేద్దాము.

16 కావున ఇప్పుడు పిదప, కేవలం వారికి సమస్య ఉన్నటువంటి ఈ-పట్టణం-వెలుపల నుండి వచ్చిన ప్రజలను వారి చేతులను ఎత్తమని అడిగెదము. మరియు పిదప కేవలం అక్కడ నిలబడి, పరిశుద్ధాత్మ ఆరంభమై, మరియు జనులందరిని తీసుకొనువరకు, ఒక్క వ్యక్తిపై ఏకాగ్రత ఉంచెదము. అది ఇక్కడ చేయబడినప్పుడు చూసినవారు ఎంత మంది ఇక్కడున్నారు? నిశ్చయంగా! చూడండి, చూశారా? కావున అది ఏ విధంగా ఉంటుందన్న దానిగూర్చి పట్టింపు లేదు. అది కేవలం…

17 మీరు దీనిని గుర్తుంచుకోవలెనని నేను కోరుచున్నాను, మరియు ఈ ఉదయము మరలా దానిని చెప్పుటకు ప్రయత్నిస్తాను. అన్యజనులు, వారికివ్వబడిన సువార్త విశ్వాసపు సువార్తయైయున్నది, క్రియలు ఎంతమాత్రమును కాదు. చూశారా? మరియు గతరాత్రి నేను చెప్పినట్లేయున్నది. పెంతెకోస్తు వద్ద పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు, వారు యూదుల వద్దకు వెళ్ళినప్పుడు (అపొస్తలుల కార్యములు 19:5), వారు దానిని పొందుకొనునట్లు వారు వారిపై చేతులుంచవలసివచ్చెను. మరియు వారు సమరయుల వద్దకు వెళ్ళినప్పుడు, వారు వారిపై చేతులుంచవలసివచ్చెను. అయితే వారు కొర్నేలి ఇంటిలో అన్యుల వద్దకు వచ్చినప్పుడు, “పేతురు ఈ మాటలు చెప్పుచుండగా…” చేతులు ఉంచడం ఏమియూ లేదు.

18 యాయీరు కుమార్తెయైన, ఆ చిన్న పాప మరణించినప్పుడు, ఆ యాజకుడు, ఇట్లు చెప్పెను, “వచ్చి ఆమెమీద చేతులుంచుము, మరియు ఆమె బ్రతుకును.” కానీ అన్యుడైన, ఆ రోమన్ శతాధిపతి ఇట్లు చెప్పినప్పుడు, “నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, మాట మాత్రం సెలవిమ్ము.” ఇక అంతే. చూశారా?

19 ఆ సురోఫెనికయ స్త్రీ, వాస్తవానికి ఆమె గ్రీసు దేశస్థురాలైయున్నది, ఆమె—యేసు ఆమెతో చెప్పినప్పుడు, “పిల్లల రొట్టె తీసుకొని మరియు దానిని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు,” అని చెప్పెను.

అందుకామె ఇట్లనెను, “నిజమే, ప్రభువా; అయితే కుక్కపిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును గదా.”

అందుకాయన ఇట్లనెను, “ఈ మాట చెప్పినందున, దయ్యము నీ కుమార్తెను వదలిపోయినది.” అలాగైతే మంచి సంగతులు చెప్పండి. ఎవరి గూర్చి అయిన ఏదైనా మంచి విషయమును చెప్పండి. యేసును గూర్చి మాట్లాడండి. ఏదైనా నిజాయితీ గల దానిని, వాస్తవమైన దానిని చెప్పండి. దయ్యముల నుండి విడుదల పొందుటకు అదియే మార్గమైయున్నది. ఆయన ఎన్నడూ చెప్పలేదు—ఆయన అసలు ఆ అమ్మాయి కొరకు ప్రార్థించనేలేదు. ఆమె స్వస్థత పొందునట్లుగా ఆయన ఒక్క విషయమైనా అసలు చెప్పలేదు; ఆయన కేవలం ఇట్లు చెప్పెను, “ఈ మాట చెప్పినందున, ఈ మాట చెప్పినందున…”

20 హెట్టిరైట్, ఒక దినమున, ఆమె దేనికొరకును అడగలేదు. ఆమె కేవలం అక్కడ కూర్చునియుండెను, కానీ ఆమె పరిశుద్ధాత్మను సంతోషపరచినట్టి, సరైన విషయమును చెప్పెను. మరియు పరిశుద్ధాత్మ తిరిగి మాట్లాడి మరియు ఇట్లు చెప్పెను, “హెట్టీ, నీకిష్టమైన దేనినైనను, నీవు కలిగియున్నది మరియు నీవు కోరుకునే దేనినైననూ అడుగుము. ఇది వాస్తవమో కాదో కనుక్కోండి. దేనినైనా అడుగుము (అక్కడ కూర్చొనియున్న కుంటిదైన తన చిన్న సహోదరియొక్క స్వస్థత కొరకు; ఆమెను అక్కడ ఆ కొండలలో త్రవ్వకుండా ఉంచుటకు పదివేల డాలర్ల కొరకైనా; వంగిపోయిన ఆమె శరీరము తిరిగి యౌవ్వనమునకు పునరుద్ధరించబడుటకైనా); నీవేది అడుగగోరినా గానీ, నీవు సరిగ్గా ఇప్పుడే దానిని అడుగుము. అది వచ్చి మరియు సరిగ్గా ఇప్పుడే నీకు దానిని ఇవ్వకపోయినయెడల, అప్పుడు నేనొక అబద్ద ప్రవక్తను.” అది—అది అది ఏదోయైయున్నది, అది కాదా?

21 యేసు చెప్పెను, “ఈ కొండతో చెప్పుడి…” మరియు మీరు—ఏమి జరిగినదన్న దాని గూర్చి మీరు వినియున్నారు; మనము ప్రవేశించుచున్నది ఆ పరిచర్యలోనికేయైయున్నది. మనమిప్పుడు మార్గములో పైకి వచ్చియున్నాము. త్వరలో ప్రభువుయొక్క రాకడ ఉన్నది. మరియు ఒక్క క్షణములో మార్పు చెంది, ఒక రెప్పపాటులో బయటకు వెళ్ళగల ఎత్తబడు విశ్వాసమును మనము ఒక సంఘములో కలిగియుండవలసియున్నది, లేదా మనము వెళ్ళలేము. అయితే విచారించకండి, అది అక్కడ ఉండును. అది అక్కడ ఉండును. మరియు ఈ సంఘముయొక్క శక్తి లేచినప్పుడు, దాని సహోదరులను అది తీసుకువచ్చును; ఆ సంఘముయొక్క శక్తి లేచి, దాని సహోదరులను తీసుకువచ్చును; ఆ సంఘముయొక్క శక్తి ఇతర సహోదరులను తీసుకువచ్చును; అంతట ఒక సాధారణ పునరుత్థానము జరుగును. మరియు మీదటికి దానికొరకు మనము ఎదురు చూచుచున్నాము.

22 ఇప్పుడు, ఉదయం ఎనిమిది గంటల నుండి ఎనిమిది-న్నర వరకు ప్రార్థనా కార్డుల గురించి, మర్చిపోకండి. పిదప ఇవ్వబడినంత వరకు చాలు, ఇక కార్డులు ఇవ్వడం ఆపేసి, మరియు వెనుకకు వెళ్ళి, మరియు కూర్చొనమని నేను వారిని అడుగుతాను (చూశారా?), ఎందుకనగా బహుశా ఎలాగైనను ఆ సమయానికల్లా వారు వాటన్నింటిని ఇచ్చివేస్తారు, లేదా అక్కడనుండి మనము ఎన్ని తీసుకుంటే అన్ని ఇచ్చివేసియుందురు. అబ్బాయిలు లేచి, మీ ముందే ఆ కార్డులన్నిటినీ కలుపుతారు, పిదప మీకొకటి కావాలంటే, మీకు ఒకటి కావాలంటే లేదా, ఆ విధంగా ఏదైనా…పిదప నేను లోపలికి వచ్చినప్పుడు, నేను కేవలం…ప్రభువు ఎక్కడి నుండి పిలవమంటే…మరియు ఆయన, “అసలు పిలువవద్దు,” అని చెప్పినయెడల, అప్పుడు నేను అసలు వాటిని పిలువను (చూశారా?), అది ఏమైనాగానీ అంతే.

23 మరియు నేను…ఎలాగైనా ఆ పరిచర్య కనుమరుగవుచున్నది; ఏదో గొప్పది వచ్చుచున్నది. గుర్తుంచుకొనండి, అది ప్రతీసారి ఈ వేదిక మీదనుండి లేదా ఈ ప్రసంగ బల్ల యొద్ద నుండి చెప్పబడినది, మరియు అది ఎన్నడూ విఫలమవ్వలేదు. చెయ్యిని గూర్చిన ఆ పరిచర్య మీకు జ్ఞాపకమున్నదా? అదేమి చేసెనో చూడండి? హృదయము యొక్క తలంపులు, అదేమి చేసెనో చూడండి? ఇప్పుడు దీనిని గమనించండి: వాక్యమును పలుకుము, మరియు అదేమి చేయునో చూడుము. చూశారా? నేనిక్కడ కొన్ని సంవత్సరాల క్రితమే చెప్పాను—ఈ సంఘము (నేను ఈ ఆలయముతో మాట్లాడుచున్నాను)—సంవత్సరాల క్రితమే, మూడు లేదా నాలుగు సంవత్సరాల క్రితమే, ఏదో కార్యరూపము దాల్చడానికి సిద్ధంగా ఉన్నదని; అది జరగడానికి సిద్ధంగా ఉన్నదిని చెప్పాను. మరియు అది ఇక్కడ సరిగ్గా అందులోనికి చొచ్చుకొనిపోవుచున్నది…అది దానికదే రూపుదిద్దుకొనుచున్నది. ఇప్పుడు, దానికై మనము కృతజ్ఞులముగా ఉన్నాము. ఓ, మనమెంతగానో కృతజ్ఞులమైయున్నాము. చాలా ఆనందంగా ఉన్నది.

24 ఇప్పుడు, మనకు ఇక్కడ కొన్ని కఠినమైన ప్రశ్నలు ఉండియున్నవి, మరియు మేము నేరుగా వాటిలోనికి వెళ్ళగోరుచున్నాము. నేను కలిగియున్న ఈ పుస్తకాలన్నింటిని ఎవరో చూశారు. నేనిట్లన్నాను, “మంచిది, తెలివైన వ్యక్తికి ఒక్కటి మాత్రమే అవసరం.” అయితే నేనొక తెలివైన వ్యక్తిని కాను. నేను పరిశీలించడానికి వాటిని ఎక్కువగా కలిగియుండవలసి యున్నది. మంచిది, ఇది ద్విభాషా పుస్తకము, మరియు ఇది బైబిల్ గ్రంథము, మరియు ఇదేమో కీలక పదాల సూచిక. కావున అదొక…కేవలం ఆయన యొక్క దైవీకమైన చిత్తము మరియు ఆయన వాక్యము ప్రకారంగా ఈ ప్రశ్నలకు జవాబు ఇచ్చుటకు మనకు సహాయము చేసి మరియు మనలను నడిపించమని మనము కేవలం ప్రభువును వేడుకొనబోవుచున్నాము.

25 కావున ఇప్పుడు, ప్రార్థనకై కేవలం ఒక క్షణము మనము మన శిరములు వంచుదాము. ప్రభువా, గడిచిన ఈ మూడు రాత్రులు నీవు మా కొరకు చేసినదానికై మేము మా హృదయాంతరంగముల నుండి నీకు కృతఙ్ఞతలు చెల్లించుచున్నాము. ఓ, సేవకులు వెనుక ఆ గదిలో కలుసుకొని మరియు కరచాలనము చేసుకొని, మరియు విశ్వాసమును నూతనపరచుకొనుటను, మరియు—మరియు ఒక నూతన అడుగు వేయుటను చూసియున్నాము. ఫోన్ చేసుకొనుట…మరియు మా హృదయములు సంతోషిస్తున్నాయి, మరియు నీ వాక్యమును వారు—చూసిన పిమ్మట, ప్రజలు పరిశుద్ధాత్మను పొందుకొనుచున్నారు, నీ పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలన్నది క్రమ క్రమంగా అది ఖచ్చితంగా చెప్పుచున్నది. ప్రభువా, దానికై మేము ఎంతగానో కృతజ్ఞులమైయున్నాము.

26 నీవు మాకు కార్యములను ఎంతో సామాన్యంగా చేసియున్నావు, ఎందుకనగా మేము సామాన్యమైన ప్రజలమైయున్నాము. మరియు దేవా, మమ్మల్ని మేము ఎల్లప్పుడూ పూర్తిగా సామాన్యులుగా చేసుకునేటట్లు, నీవు మాకు అనుమతిస్తావని—అని మేము ప్రార్థించుచున్నాము. ఏలయనగా అది…తనను తాను తగ్గించుకొనువాడే హెచ్చించబడును. మరియు ఆ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమైయున్నది; సువార్త ప్రకటనయను వెఱ్ఱితనము ద్వారా తప్పిపోయినవారిని రక్షించుట దేవునికి ఇష్టమాయెను.

27 మరియు ఇప్పుడు, తండ్రీ, భారము కలిగిన యదార్థ హృదయాలనుండి అడగబడిన అనేక ప్రశ్నలు ఇక్కడ నా ఆధీనంలో ఉన్నాయి. మరియు వాటిలో ఒక్క దానికి తప్పుడు సమాధానము ఇవ్వబడినను అది ఆ వ్యక్తిని తప్పుదోవ పట్టించవచ్చును, వారిని ఇబ్బందిపెట్టే వారి ప్రశ్నపై తప్పుడు వెలుగును ప్రసరింపజేసినట్లు అవుతుంది. కావున ప్రభువైన దేవా, నీ పరిశుద్ధాత్మ మాపై కదలాడి మరియు ఈ సంగతులను బయలుపరచవలెనని నేను ప్రార్థించుచున్నాను, ఏలయనగా లేఖనములలో ఇట్లు వ్రాయబడినది, “అడుగుడి మీకు ఇవ్వబడును; మరియు వెదకుడి మీకు దొరకును; తట్టుడి మీకు అది తీయబడును.” మరియు ప్రభువా, ఇప్పుడు మేము దానినే చేయుచున్నాము, నీ కృపా ద్వారమును తట్టుచున్నాము. నీ దైవీక న్యాయము యొక్క నీడలో నిలబడి, దేవునియొక్క క్రీస్తు రక్తము కొరకు మరియు పరిశుద్ధాత్మ కొరకు మేము వేడుకొనుచున్నాము.

28 మరియు ఆ మూడు రాత్రులు పరిశుద్ధాత్మపై బోధించుటను మేము చాలించుకున్నామన్న దానిని బట్టి మేము వచ్చుటలేదు కానీ, మేము లోతైన గౌరవముతో మరియు యదార్థతతో వచ్చుచున్నాము. భూమిమీద మేము ఉండే చివరి రాత్రి ఇదే అన్నట్లుగా మేము వచ్చుచున్నాము. నీవు మా ప్రార్థనలకు జవాబునిస్తావని నమ్ముచు మేము వచ్చుచున్నాము. మరియు ప్రభువా, నీవు నీ నిత్యజీవముతో మమ్మల్ని సంతృప్తిపరచమని ఇప్పుడు మేము నిన్ను అడుగుచున్నాము. మరియు నీ వాక్యమునకు సమాధానమిచ్చునప్పుడు, ఆ పరిశుద్ధాత్మ అనగా, ఓ దేవా, అది మా మధ్యనున్న నీవేయని మేము కనుగొనియుండగా, ఈ రాత్రి మేము ఆశిస్తున్న సంగతులను ఆయన మాకు బయలుపరచవలసిందిగా మేము ప్రార్థించుచున్నాము. మరియు మేము కేవలం మా ప్రాణములు విశ్రాంతిలో ఉండాలని, మరియు మా మనస్సులు నెమ్మదితో ఉండాలని ఆశిస్తున్నాము, మరియు ఆయన వాగ్దానము చేసిన ఆశీర్వాదాలను పొందుకొనడానికి ముందుకు అడుగువేయునట్లు దేవునియందు విశ్వాసమును కలిగియున్నాము. యేసు నామములో మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్.

29 ఇప్పుడు, ఒక్కటి తప్ప, నాకివ్వబడిన ప్రశ్నలన్నియు నావద్ద ఉన్నవి. మరియు మొన్న రాత్రి నన్ను ఒక ప్రశ్న అడిగిన చిన్న సహోదరుడైన మార్టిన్ కి నేను జవాబునిచ్చాను, కేవలం ఒక్క దానికి. గత రాత్రి ఇక్కడ చాలా ఉండియున్నవి, అయితే అవి ప్రార్థన అవసరతలైయున్నవి. మరియు సహోదరుడు మార్టిన్ నన్ను ప్రశ్నను అడిగాడు, అది యోహాను 3:16—లేదా యోహాను 3 గూర్చియని, నేను నమ్ముచున్నాను, అది, “ఒక మనుష్యుడు నీటి మూలంగాను మరియు ఆత్మ మూలంగాను జన్మించితేనే గానీ, అతడు దేవుని రాజ్యమును చూడలేడు,” అను దాని గూర్చియైయున్నది, మరియు నేను హెబ్రీ పత్రికపై పంపిన ఒక టేపుతో దానిని పోల్చియున్నాడు. మరియు గడిచిన సాయంకాలం ఇక్కడ వెనుక గదిలో నేను అతణ్ణి కలిసాను, మరియు—అతనికి జవాబు ఇచ్చే అవకాశం నాకు రాడానికి ముందే, మరి ఆ అంశం మీద, నేను దానిని చెప్పేసాను.

30 ఇప్పుడు, గత రాత్రి ఇక్కడ లేనివారు ఎవరైనా ఇచ్చట ఉన్నారా? మీ చేతులను చూడనివ్వండి, గతరాత్రి ఇక్కడ లేనివారు. ఓ, నిశ్చయంగా మీరు మాతో ఉండియుండాల్సినదని మేము కోరియున్నాము. మేము అటువంటి ఒక మహిమకరమైన సమయమును కలిగియున్నాము. పరిశుద్ధాత్మ…

31 బహుశా నేను, కేవలం ఒక్క నిమిషం…అది బాధ కలిగించదు. ఇది టేపు చేయబడినది. మరియు ఏ సేవకుడైన—లేదా ఏ వ్యక్తియైనా ఇప్పుడు నేను చెప్పబోవుదానిలోనైనా, లేదా ఈ ప్రశ్నలలోనైనా, వాటి విషయమై ఏకీభవించనియెడల, సహోదరుడా, దానిని మీరు వింతగా తలంచవద్దని, నేను అడుగుచున్నాను, అయితే ఆ—ఈ టేపు ఇక్కడ మన ఆలయములోనే చేయబడుచున్నదని గుర్తుంచుకొనండి. మేము మా ప్రజలకు బోధించుచున్నాము. భిన్నమైన విశ్వాసములు గల చాలామంది సేవకులు చుట్టూ కూర్చుండియున్నారు. మరియు నేను మరలా ఆ అంశములోనికి వెళ్ళగోరుచున్నాను, ఎందుకనగా గత రాత్రి రాలేకపోయినటువంటి మన ప్రజలలో కొందరు ఈ రాత్రి వచ్చియుండుటను నేను చూచుచున్నాను. మరియు దానిని మీరు అనుమతించినయెడల, ఒక్క క్షణము, గడిచిన సాయంకాలము నేను ఏదైతే మాట్లాడానో నేను దాని గుండా వెళ్ళగోరుచున్నాను; మరియు అది పరిశుద్ధాత్మను పొందుకొనే దానిపై, ఆ పెంతెకోస్తుపై ఉండియున్నది.

ఇప్పుడు, రెండు తర్జుమాలు కలిగియున్న ఆ గ్రీకు అనువాదము నుండి గడిచిన సాయంకాలం నేను ఎక్కడైతే ఉన్నానో, అక్కడి నుండి చదువుచున్నాను, అది ఇప్పుడు నా ఎదుట తెరవబడినది. అది గ్రీకు నుండి ఆంగ్లములోనికి చేయబడిన అసలైన తర్జుమాయైయున్నది. అది ఇతర తర్జుమా దారులు, అది—మరియు ఇతర తర్జుమాల గుండా కాకుండా, అది నేరుగా గ్రీకునుండి ఆంగ్లములోనికైయున్నది. ఇప్పుడు ఆంగ్ల పదములకు, చాలా సార్లు ఆ విధమైన అర్ధాలు వాటికి ఉంటాయి, అది ఎట్లనగా ఇప్పుడు, బోర్డ్ అని నేను చెప్తాను. ఆ బోర్డ్ అనే పదమును తీసుకొనండి. “సరి, ఆయనకు మనము బోరు కొట్టించుచున్నామని అతని భావమైయున్నది,” అని మీరు అనవచ్చును. లేదండీ! “ఓహ్, అతడు—అతడు తన నివాసానికి వెల చెల్లించాడు.” కాదు! సరి, అతడు…“అది తన ఇంటి ప్రక్కనున్న ఒక బోర్డ్.” సరి, చూశారా? లేదా వాటిలో ఏదైనా…అక్కడ నాలుగు లేదా ఐదు రకాల పదాలను వాడొచ్చును; మీరు ఆ వచనమును గ్రహించవలసియున్నది. చూచుట [see] అనే పదము. ఆంగ్లములో చూచుట [see] అంటే “గ్రహించుట,” అని అర్థము. సముద్రము [sea] అనగా “ఒక జలాశయం.” చూచుట [see] అంటే “దేనివైపైనా చూచుట,” అని అర్ధమిచ్చును. [ఆంగ్లములో: “see” మరియు “sea” అను పదములు ఒకే విధంగా పలుకును కానీ భిన్నమైన అర్థమును కలిగియుండును.— అనువాదకుడు] చూశారా? అయితే ఈ తర్జుమాలలో, ఇక్కడ వాడబడిన పదము ఏదనగా, గత రాత్రి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో నేను చెప్పినదైయున్నది, అది ఇట్లు చెప్పబడుచున్నది, “అగ్నిజ్వాలలు వారిపై విభాగింపబడెను…” ఇప్పుడు, కేవలం ఒక క్షణము నేను కొద్దిగా వెనుకకు వెళ్ళగోరుచున్నాను. మీరు, ఒక్క క్షణం ఆగి, మనము ఇక ఏమాత్రమైనా ముందుకు వెళ్లడానికంటే ముందే ఒక్క క్షణము దానిని కొద్దిగా పునఃర్విచారణ చేయగోరుదురా?

32 ఇప్పుడు, త్రిప్పండి, మీరు మీ కింగ్ జేమ్స్ లేదా మీరు చదువుచున్న ఏ తర్జుమానుండి అయినా…మరియు నేను దానిని చదువగోరుచున్నాను. మరియు ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. అపార్ధము చేసుకొనకండి. ఈ దినమున చాలామంది, నా సహోదరితో సహా, వారిలో చాలా మంది పిలిచారు, ఇట్లన్నారు…శ్రీమతి. మోర్గాన్…వారిలో చాలా మంది గడిచిన సాయంత్రం వచ్చియున్నారు. తనకై ప్రయత్నాలు ఆపివేయబడిన శ్రీమతి. మోర్గాన్ మన సహోదరీలలో ఒకరు; మరియు ఆమె పదహారు, పదిహేడు సంవత్సరాల క్రితం లూవిల్లీలో క్యాన్సరుతో మరణించేవారి జాబీతాలో ఉన్నది. తిరిగి ఈ రాత్రి ఆమె ఇక్కడ ఆ వెనుక కూర్చొనియున్నదని నేను అనుకొనుచున్నాను. నేను నేరుగా మైక్రోఫోనులో మాట్లాడుచున్నందున, ఆమె వినలేకపోవుచున్నదని, ఆమె చెప్పినది. మరియు వారి కోసం ఒక్క క్షణము నేను దీని మీద మాట్లాడగోరుచున్నాను.

33 ఇప్పుడు, అపొస్తలుల కార్యములు 2లో ఈ లేఖనము నుండి నేను చదువుచున్నాను:

…పెంతెకోస్తను పండుగ దినము సంపూర్ణముగా వచ్చినప్పుడు, వారందరూ ఏక మనస్సుతో నుండిరి…(ఇప్పుడు, ఏకీభావంతో ఉండుట కంటే నేను దానిని ఎక్కువగా ఇష్టపడతాను: ఎందుకనగా దాదాపు ఏ అంశము మీదనైనా మీరు ఏకీభవించవచ్చు, కానీ ఇక్కడ వారి మనస్సులు ఒకటిగా నున్నవి.)…ఏక మనస్సు మరియు ఒక్క స్థలము లోనే.

మరియు అకస్మాత్తుగా వేగముగా వీచు బలమైన గాలివంటి యొక ధ్వని పరలోకము నుండి వచ్చెను, మరియు అది నిండెను…వారు కూర్చుండియున్న ఇల్లు అంతయు నిండెను. (మోకరించలేదు, ప్రార్థించుటలేదు, కానీ కూర్చునియున్నారు.)…

…నాలుకలు విభాగింపబడి…(నా-లు-క-లు—నాలుకలు. “విభాగింపబడి” అంటే, “విడిపోయి.”)…నాలుకలు…వారికి అగ్ని వలె…అగుపించినది…మరియు ఒక…(“ఒక్క,” ఏకవచనం)…వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలెను.

మరియు వారందరూ నింపబడినారు…(“మరియు,” అనుసంధానము.)…అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిరి, మరియు ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించినకొలది, అన్య భాషలతో మాట్లాడ నారంభించిరి.

ఇప్పుడు వారు ఆకాశము క్రిందనుండు ప్రతి జనములో నుండి వచ్చి, యెరూషలేములో కాపురమున్న, భక్తిగల యూదులైయున్నారు.

…ఇది ఇలా ఉండగా…మరియు ఈ వార్త అంతటా వ్యాపించగా, జనులు గుంపులుగా కూడివచ్చి, మరియు కలవరపడిరి, ఎందుకనగా…ప్రతీ ఒక్కరూ…తమ స్వంత భాషలో అతడు మాట్లాడుటను విన్నారు.

34 ఇప్పుడు గమనించండి! ఆ అగ్ని వచ్చినప్పుడు, అది నాలుకలైయున్నవి; వారు మాట్లాడుచున్నప్పుడు, అది భాషయైయున్నది. ఇప్పుడు, నాలుకలకి మరియు భాషలకి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది. మనకైతే అదంతా ఒక్కటే. కానీ, గ్రీకులో, “నాలుక” అంటే ఇది. [సహోదరుడు బ్రెన్హామ్ చూపించుచున్నారు—సంపా.] చెవి అంటే ఇది. చూశారా? దాని అర్ధం ఒక భాష అని కాదు; నీ దేహములోని నాలుక అనే ఒక భాగము అని దాని అర్ధం. మీరు గమనించినట్లైతే, అది అగ్ని నాలుకలు అని తర్జుమా చేయబడినది దాని అర్ధం “నాలుకలవలె,” సరిగ్గా ఒక నిప్పు రవ్వవంటిది, ఒక పొడవైన అగ్ని జ్వాలవంటిది. ఇప్పుడు, దాని ప్రాధాన్యతను గమనించండి. మరియు ఇప్పుడు ఆ చోట్లన్నింటిని, దానిని మర్చిపోకండి.

35 ఇప్పుడు, మేము ఈ రాత్రి ఒక చిన్న నాటికను ఇవ్వబోవుచున్నాము. మరియు నేను దానిని మీకే వదిలేయబోవుచున్నాను. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఏదైనా వ్యతిరేకంగా ఉన్నయెడల, ఇక అది మీ ఇష్టం. అయితే ఏ వ్యక్తియైనా దేవుని దగ్గర నుండి ఏదైనా పొందుకునే ఒకేఒక్క మార్గము విశ్వాసము వలెనేయైయున్నది. మరియు మీరు…

36 నేను చేయుచున్నదానిలో నేను విశ్వాసాన్ని కలిగియుండటానికి ముందు అసలు నేనేమి చేయుచున్నాననేది నేను తెలుసుకోవలసియున్నది. నీ భార్యను నీవెందుకని వివాహము చేసుకున్నావు? నీకు ఆమెపై విశ్వాసము ఉన్నది గనుక. నీవు ఆమెను పరీక్షించావు, ఆమెను గమనించావు, ఈమె ఎందులోనుండి వచ్చినది, ఆమె ఎవరన్నది చూసియున్నావు. దేవునితోను, లేఖనముతోను ఆ విధంగానే ఉన్నది. ఆ కారణంచేతనే ఈ దర్శనాలు, ఆ—ఈ అగ్ని స్తంభము, ఈ సంగతులన్నీ కలిగినవి, ఎందుకనగా దేవుడు దానిని వాగ్దానము చేశాడు. దేవుడట్లు చెప్పాడు. నేను ఆయనను ఆయన వాక్యము ద్వారా పరీక్షించాను మరియు అది సత్యమని నేను తెలుసుకున్నాను. మరియు మీరు ఆయన వాక్యమును వెంబడించండి. పిదప ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న గందరగోళము ఉన్నయెడల, అప్పుడు ఎక్కడో ఏదో తప్పిదమున్నది. ఎందుకనగా దేవుడు (వినండి!)—దేవుడు ఎన్నడూ తన స్వంతదానికి వెలుపల—లేదా తన స్వంత నియమాలకు విరుద్ధంగా పనిచేయలేదు లేదా పనిచేయడు. శీతా కాలము వేసవి కాలములో రాదు, మరియు వేసవి కాలము శీతా కాలములో రాదు. వసంత కాలములో ఆకులు రాలిపోయి మరియు మరలా శరదృతువులో రావు. మీరు అసలు దానిని చేయలేరు.

37 ఆ నీటి బావి గురించి గత రాత్రి నేను చెప్పినట్లు, అది మీ పంటకి నీళ్ళు పెడుతుంది. లేదా మీరు గనుక ఇక్కడ ఒక పొలము మధ్యలో నిలబడియుండి, మరియు అది కటిక చీకటిగా ఉన్నయెడల, మరియు మీరు ఇలా చెప్పారనుకోండి, “ఓ, గొప్ప విద్యుత్ శక్తి, నీవు పొలములో ఉన్నావని నేను ఎరిగియున్నాను. ఇప్పుడు, నేను తప్పిపోయాను, నేను ఎటు వెళ్ళుచున్నానో ఎరుగకయున్నాను. నేను ఎలా నడవాలో చూచునట్లు, వెలుగును దయచేయుము! ఈ పొలమును వెలిగించుటకు చాలినంత విద్యుత్తు ఉన్నది.” అది వాస్తవం. అవునండీ! ఆ లైట్లు లేకునన్నూ దానిని వెలిగించుటకు చాలినంత విద్యుత్తు, ఈ గదిలో ఉన్నది. అయితే మీరు దానిని నియంత్రించవలసి యున్నది. ఇప్పుడు, మీరు ఇక అరవలేనంతవరకు దానికై అరవవచ్చును, అది ఎప్పటికి వెలగదు. కానీ మీరు విద్యుత్తు యొక్క నియమాలను అనుసరించి పని చేసినయెడల, అప్పుడు మీకు వెలుగు వస్తుంది.

38 మంచిది, దేవుని విషయంలో కూడా అది ఆ విధంగానే ఉన్నది. దేవుడు భూమ్యాకాశములయొక్క గొప్ప సృష్టికర్తయై యున్నాడు, నిన్నా, నేడు, మరియు నిరంతరం ఒక్కటే రీతిగా నున్నాడు. ఆయన ఇంకనూ దేవుడే. అయితే మీరు ఆయన నియమాలను మరియు ఆదేశాలను అనుసరించినప్పుడే ఆయన పనిచేస్తాడు. స్నేహితులారా, నేను దీనిని చెప్పుదును: అది విఫలమగుటను నేనెన్నడూ చూడలేదు, మరియు అది విఫలమవ్వదు.

39 ఇప్పుడు, మనము గమనించెదము. వారు రక్షింపబడి మరియు వాక్యానుసారంగా పరిశుద్ధపరచబడిన తర్వాత లూకా 24:49 లో యేసు అపొస్తలులకి ఆజ్ఞాపించెను; ప్రభువైన యేసునందు విశ్వాసముంచుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడి; యోహాను 17:17 లో, “తండ్రీ, సత్యము ద్వారా వారిని శుద్ధీకరించుము. నీ వాక్యమే సత్యము,” అని యేసు చెప్పినప్పుడు, శుద్ధీకరించబడిన తరువాతైయున్నది. మరియు ఆయన వాక్యమైయున్నాడు.

40 ఇప్పుడు, రోగులను స్వస్థపరచుటకు, దయ్యములను వెళ్ళగొట్టుటకు, మృతులను లేపుటకు వారికి అధికారమిచ్చెను; మరియు వారు సంతోషించుచూ తిరిగి వచ్చిరి. మరియు వారి పేర్లు గొట్టెపిల్ల జీవగ్రంథములో ఉన్నవి. ఇప్పుడు మనం దాని గుండా ఎలా వచ్చియున్నామనేది మీరు జ్ఞాపకము చేసుకొనండి. అయితే వారింకను మారలేదు. ఆయన సిలువవేయబడు రాత్రి పేతురుతో యేసు చెప్పెను, ఆయన ఇట్లనెను, “నీవు మారిన తరువాత, నీ సహోదరులను స్థిరపరచుము.”

41 పరిశుద్ధాత్మ…మీరు నిత్యజీవమునకై విశ్వసిస్తున్నారు, అయితే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అదియే నిత్యజీవము. మీరు విశ్వసిస్తున్నారు…శుద్ధీకరణ వద్ద మీరు ఆత్మమూలమున రూపించబడినారు, అయితే పరిశుద్ధాత్మ లోపలికి వచ్చునంత వరకు మీరసలు ఆత్మవలన జన్మించియుండలేదు. అది సరియైయున్నది. తల్లి గర్భములో ఒక శిశువు జీవమును కలిగియున్నది, చిన్న కండరములు వణుకుచున్నవి; అది ఒక జీవమైయున్నది. కానీ దాని నాసికా రంధ్రముల లోనికి అది జీవవాయువును పీల్చుకున్నప్పుడు అది ఒక భిన్నమైన జీవమైయున్నది. అది భిన్నమైనది. అది అదేయైయున్నది, అది…

42 నా ప్రియమైన మెథడిస్టు, మరియు పిలిగ్రిం హోలీనెస్, మరియు నాజరీను సహోదరుడా, పరిశుద్ధాత్మ బాప్తీస్మము శుద్ధీకరణకు భిన్నంగా ఉంటుంది. శుద్ధీకరణ అనగా శుభ్రపరచుట, అది జీవము యొక్క సిద్ధపాటైయున్నది. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, అదే జీవమైయున్నది. సిద్ధపాటు అనేది పాత్రను శుభ్రపరచుట; పరిశుద్ధాత్మ అనేది ఆ పాత్రను నింపుటైయున్నది. శుద్ధీకరణ అనగా “శుభ్రపరచబడి మరియు సేవకై ప్రక్కన పెట్టబడుట.” పరిశుద్ధాత్మ అనగా దానిని సేవలో ఉంచుట. నీవు దేవుడు శుభ్రము చేసిన పాత్రవైయున్నావు.

43 మరియు పరిశుద్ధాత్మ అనగా దేవుడే స్వయంగా మీలోనుండుట అని మనము కనుగొన్నాము. మోషేతో అగ్ని స్తంభములో దేవుడు మీ పైన ఉన్నాడు. యేసుక్రీస్తులో దేవుడు మీతోనున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మలో దేవుడు మీలోనున్నాడు. ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్క దేవుడే మూడు కార్యాలయములలో పనిచేయుట.

44 దేవుడు మానవుడికి పైగానుండుట నుండి తగ్గించుకొనుచు, క్రిందకి వచ్చుచున్నాడు. అతడు ఆయనను తాకలేడు, ఎందుకనగా అతడు ఏదేను తోటలో పాపము చేసి మరియు ఆయన యొక్క సహవాసము నుండి తనను తాను వేరుచేసుకొనెను. అప్పుడు ఏమి జరిగినది? ఆయన అతని పైన ఉండవలసివచ్చినది. ఎడ్ల మేకలయొక్క రక్తము ఆయనను మరలా మానవునితో సహవాసము చేయుటకు అనుమతించలేదు; అయితే ఎడ్లు మరియు గొర్రెలు, మరియు అటువంటివాటి యొక్క బలియర్పణలు, అనే ధర్మశాస్త్రము మరియు ఆ విధుల ద్వారా, ఈ సమయము వచ్చుచున్నదని ముందుగా చూపించుచూ…పిదప దేవుడు క్రిందకు దిగి వచ్చి మరియు స్త్రీ వలనైన కన్యక జన్మ ద్వారా జన్మించి, శుద్ధీకరించబడిన శరీరములో నివసించినప్పుడు, తద్వారా దేవుడు తానే…దేవుడేమి చేసెనో మీకు తెలియునా? ఆయన—ఆయన ఏమేచేయలేదు కానీ…ఆయన కేవలం తన గుడారమును మన మధ్యన వేసుకొనెను. యేసుక్రీస్తు అని పిలువబడు ఒక గుడారములో దేవుడు నివసించెను. ఆయన కేవలం తన గుడారమును మనతో వేసుకొనెను, మారెను…(నేను—ఉదయమున దాని గురించి భోదించుచుంటిని, కావున నేను దానిని వదిలివేయుట మంచిది.) ఇప్పుడు, అది—దేవుడు గుడారము-లేదా మనతో ఎట్లు నివసించాడన్న దాని గూర్చి…

45 మరియు ఇప్పుడు దేవుడు మనలో ఉన్నాడు. యోహాను 14 లో యేసు ఇట్లు చెప్పెను, “నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని, ఆ దినమున మీరెరుగుదురు.” దేవుడు మనలో ఉండుట. ఆ ఉద్దేశ్యమేమిటి? ఆయన ప్రణాళికను కొనసాగించుటకైయున్నది.

46 దేవుడు ఒక ప్రణాళికను కలిగియున్నాడు. ఆయన మనుష్యుల మధ్య పనిచేయవలెనని కోరుకున్నాడు, మరియు ఆయన దానిని అగ్ని స్తంభములో తీసుకొనివచ్చెను, అది ఇశ్రాయేలు పిల్లలపై వ్రేలాడినట్టి మర్మయుక్తమైన వెలుగైయున్నది. పిదప అదే అగ్ని యేసు అనే ఒక శరీరములో ప్రత్యక్షపరచబడెను. మరియు తానే ఆ అగ్నియైయున్నాడని ఆయన చెప్పెను, “అబ్రాహాము పుట్టకమునుపే, నేనున్నాను.” ఆయనే ఆ అగ్ని. ఆయన ఇట్లు చెప్పెను, “నేను దేవునియొద్ద నుండి వచ్చియున్నాను, మరియు నేను తిరిగి దేవునియొద్దకు వెళ్ళుచున్నాను.” మరియు ఆయన మరణము, సమాధి, మరియు పునరుత్థానము తర్వాత, తన పేరు ఇంకా సౌలుగా నుండగనే—దమస్కు మార్గములో—ఆ మార్గములో పరిశుద్ధ పౌలు ఆయనను కలిసెను, మరియు ఆయన మరలా ఆ అగ్ని స్తంభముగా మారిపోయెను. ఒక వెలుగు అతనికి గ్రుడ్డితనము కలుగజేసెను. అది సరియే.

47 మరియు ఈ దినమున ఆయన ఇక్కడున్నాడు, అదే అగ్ని స్తంభము, అదే దేవుడు అవే సూచనలను, అవే కార్యములను చేయుచున్నాడు. ఎందుకు? ఆయన తన ప్రజల మధ్య పని చేయుచున్నాడు. ఆయన మనలో ఉన్నాడు. నేను…ఆయన ఇప్పుడు మీతోనున్నాడు, “అయితే నేను మీలో ఉంటాను. యుగసమాప్తి వరకు, నేను మీతోను, మీలోను ఉంటాను,” యుగాంతము. ఆయన మనతో ఉంటాడు.

48 ఇప్పుడు, గమనించండి. యెరూషలేమునకు వెళ్ళి మరియు వేచియుండమని యేసు వారికి ఆజ్ఞాపించెను. ట్యారీ అను పదమునకు అర్ధం “వేచియుండుట,” ప్రార్థన చేయమని కాదు, “వేచియుండుట,” అని అర్ధం. వారింకను బోధించుటకు తగిన వ్యక్తులు కాదు, ఎందుకనగా ఆయనను వ్యక్తిగా, బాహ్యసంబంధంగా చూచుట ద్వారా మాత్రమే, వారు ఆయన యొక్క పునరుత్థానమును ఎరిగియున్నారు. ఆయన—ఆయన ఇక ఎంతమాత్రమూ బోధించవద్దనియు, మొదటిగా వారు పైనుండి శక్తిని పొందునంతవరకు ఏమియూ చేయకూడదనియు వారికి ఆజ్ఞాపించెను.

అట్లు చేసే ఏ బోధకుడైనా దేవునిచేత పంపబడినాడని లేదా సరిగా నియమించబడినాడని నేను నమ్మను…ఎందుకనగా దేవుడు అనంతుడైయున్నాడు. మరియు దేవుడొక్కసారి ఏమి చేయునో, దానినే ఆయన అన్నివేళలా చేయును. ఇప్పుడు, వారు పెంతెకోస్తునొద్దకు వెళ్ళి మరియు పెంతెకోస్తు అనుభవమును పొందుకునేంతవరకు దేవుడు వారిని బోధించుటకు అనుమతించనియెడల, తాను స్వంతగా లోతైన కోరికను కలిగియున్నా లేదా ఏదైనా సంస్థ అతడిని నియమించినా గానీ, అతడు పరిశుద్ధాత్మతో నింపబడేంత వరకు ఏ మనుష్యునికి ఒక వేదిక మీదకి ప్రవేశించే హక్కు లేదు. అది ఖచ్చితముగా సరియే. ఎందుకనగా అతడు పరిశుద్ధాత్మతో నింపబడనంతవరకు అతడు ఏదో ఒక సంస్థ యొక్క మేధస్సుతో వారిని నడిపించుచున్నాడు; మరియు పిదప, అతడు వారికి పావురము యొక్క ఆహారమును ఇచ్చుచున్నాడు; గడిచిన సాయంకాలము మనము మాట్లాడుకొనినట్లు, ఆ గొర్రెపిల్ల మరియు పావురము.

49 ఇప్పుడు గమనించండి. ఆయన ఇట్లు చెప్పెను, “యెరూషలేమునకు వెళ్ళి మరియు అక్కడ వేచియుండుడి; నేను తండ్రి వాగ్దానము చేసినది పంపువరకు అక్కడే వేచియుండుడి.” మరియు పిదప, వారేమి చేసిరి? అక్కడ స్త్రీ పురుషులు, నూట ఇరువది మంది ఉండియున్నారు. వారు ఆలయము వద్ద ఒక మేడ గదిలోనికి వెళ్ళిరి.

ఇప్పుడు, పెంతెకోస్తు పండుగ దినము సమీపించుచుండెను, పరిశుద్ధ స్థలమును శుభ్రము చేయుట నుండి, పస్కా గొర్రెను వధించుట నుండి, కోత యొక్క ప్రధమ ఫలములైయున్న ఆ—ఆ పెంతెకోస్తు వచ్చు వరకు, అది జూబిలీయై యున్నది, ఆ పెంతెకోస్తు జూబిలీ. మరియు ఆ మేడలపై…

50 ఇప్పుడు, నేను ఆ దేశములకు వెళ్ళియున్నాను. ఆ ప్రాచ్య దేశాలలో లోపలి మెట్లు చాలా అరుదుగా ఉంటాయి. మెట్లు బయట ఉంటాయి. మాకు ఇట్లు చెప్పబడినది, పైన ఒక చిన్న గదికి నడిపించునట్టి ఒక మెట్ల దారి, ఆలయమునకు వెలుపల ఉండును; పైకి, మరియు పైకి, ఇంకా పైకి వెళ్ళి, మీరు ఒక చిన్న గది నొద్దకు వెళ్ళెదరు, ఆలయము పైన ఒక స్టోరు గది వంటిది, ఏదో ఒక చిన్న గది వంటిది, ఒక మేడ గది. మరియు వారక్కడ ఉండిరనియు మరియు ఆ తలుపులు మూయబడి ఉండెననియు బైబిలు చెప్పుచున్నది, ఎందుకనగా వారు యూదులకు భయపడుచుండిరి, ఏలయనగా ప్రధాన యాజకుడైన కయప, మరియు పొంతు పిలాతు, మరియు వారు ఆయనను చంపివేసిన తర్వాత, వారు ప్రభువైన యేసును ఆరాధించుచున్నందుకు వారిని చీల్చివేయుదురు. కావున వారు క్రైస్తవు-లనబడే వారందరిని లేకుండా చేయబోవుచుండిరి. మరియు ఆ తలుపులు మూయబడియున్నవి, మరియు వారు వేచియుండిరి.

51 ఇప్పుడు, అటువంటి ఆ గదులలో, కిటికీలు లేవు. కిటికీలు అనగా మీరు తెరచియుంచునట్లు ఉండే తలుపులు కలిగి, చెక్కలు అడ్డుగా పెట్టబడి ఉన్నట్లుండును. ఆ గదులలో క్రిందకు వ్రేలాడదీయబడి మరియు వెలుగుచుండునట్టి బుడ్డి దీపములుండును…మీరెన్నడైనా కాలిఫోర్నియాలో క్లిఫ్టన్ కెఫ్టీరియా వద్దకు వెళితే, క్రింద బేసుమెంటులోనికి వెళ్ళండి, మరియు మీరు ఆ మేడగది లాగానే ఉన్న, ఒక దానిని మీరు కనుగొంటారు. మీరెప్పుడైన అక్కడికి వెళ్ళారా? ఇక్కడున్న వారిలో ఎంతమంది అక్కడకి వెళ్ళారు? ప్రజలు వారి తలను ఆడించుట నేను చూస్తున్నాను. సరి, నేను దేని గూర్చి మాట్లాడుచున్నానో మీరెరుగుదురు. మంచిది. అక్కడికి వెళ్ళండి, మరియు మీరు గెత్సేమనే తోటను చూసెదరు; మీరు అట్లు చేయుటకు ముందు, ఆ ప్రాచీన గదులలో ఒకదానిలోకి మీరు వెళ్ళుదురు. అది ఖచ్చితంగా నిజము. ఒలీవ నూనెతో నింపబడి దానిలో మండుచున్న ఒక చిన్న ఉన్ని వత్తిని కలిగియున్న ఒక చిన్న దీపమును, మీరు అక్కడ కనుగొంటారు.

52 ఇప్పుడు, వారక్కడ పైన ఉన్నారని అనుకుందాము, ఈ బయటనుండి దానిపైకి ఎక్కుచుండిరి. వారక్కడ పైకి వెళ్ళి మరియు దాక్కొనిరి, ఎందుకంటే వారు యూదులకు భయపడుచుండిరి. మేడ గదికి వెళ్ళమని యేసు వారికి చెప్పలేదు. ఆయన కేవలం, “యెరుషలేములో వేచియుండుము” అని చెప్పెను. వారు క్రింద ఇక్కడ గదిలో ఉన్నచో, ఏమి జరుగునో చెప్పడం కష్టం. వారు లోపలికి వచ్చి మరియు వీరిని పట్టుకొందురు. కావున వారు పైన ఉన్న ఒక చిన్న గదిలోనికి వెళ్ళిరి, అటక పైనయైయున్నది, మరియు అక్కడ, ఆ యూదులు లోపల వారి యొద్దకు రాకుండునట్లు వారు ఆ గది తలుపలకు చెక్కలు అడ్డు పెట్టిరి. మరియు పది రోజులుగా వేచియుంటూ వారక్కడ కూర్చొనియుండిరి.

53 ఇప్పుడు, మనమిప్పుడు అపొస్తలుల కార్యములు, 1వ అధ్యాయములో ఉన్నాము. ఇప్పుడు, ఇప్పుడు శ్రద్ధగా వినండి. మీకా చిత్రము అర్ధమైనదా? భవనము వెలుపల పైకి మెట్లుండెను, మరియు వారు ఈ చిన్న గదిలోనికి వెళ్ళిరి. క్రింద ఆలయములో వారు పెంతెకోస్తు పండుగను చేయుచుండిరి. ఓ, ఒక గొప్ప సమయం గడుచుచుండెను. ఇప్పుడు, పెంతెకోస్తు దినము పూర్తిగా వచ్చినప్పుడు, వారందరు ఏక మనస్సు కలిగి, దేవుడు ఆ వాగ్దానమును పంపబోవుచున్నాడని నమ్ముచూ, ఏక మనస్సుతోనుండిరి. ఈ రాత్రి ఇక్కడున్న ప్రతీవ్యక్తిని సరిగ్గా అదే మనసులోనికి రానీయుడి మరియు ఏమి జరుగునో చూడండి. అది పునరావృతం అవ్వవలసియున్నది. సరిగ్గా వారు కలిగియున్నట్లే అది ఒక వాగ్ధానమైయున్నది. చూశారా?

54 వారేమి చేయుచున్నారు? సూచనలను వెంబడించుచుండిరి, దేవుని యొక్క ఆ—ఆ—ఆ ఆజ్ఞలను వెంబడించుచుండిరి: “వేచియుండుడి…”

55 ఇప్పుడు, వారు యూదులకు భయపడుచుండిరి. ఇప్పుడు, దానిని గుర్తుంచుకోండి. వారు యూదులకు భయపడుచుండిరి. ఇప్పుడు, అకస్మాత్తుగా వేగముగా వీచు గాలి వంటి ఒక ధ్వని వచ్చెను. అది వేగముగా వీచు ఏదో గాలి కాదు; అది వేగముగా వీచు ఒక గాలి వలె ఉన్నది. కేవలం కొద్ది నిమిషాలలో నేను అనువాదికునిపై ఉద్దేశ్యమును చెప్పెదను. అది వేగముగా వీచు ఒక గాలి వలెనున్నది. వేరే మాటల్లో చెప్పాలంటే, అదొక సహజాతీతమైన గాలియైయున్నది (ఓహ్!), వారు అనుభూతి చెందగలుగునట్టి ఏదోయైయున్నది. ఆ గాలి వారి లోపలున్నది. వేగముగా వీచునట్టి ఒక—గాలి వచ్చినది, వేగముగా వీచునట్టి గాలి వంటిదైయున్నది. ఆ గాలి వేగముగా వీచుటలేదు కానీ, అది కేవలం వేగముగా వీచు గాలి వలె ధ్వనించినది, ఏదో వెళ్ళుచున్నట్లుగా: ఫ్వూ! మీరెన్నడైనా దానిని అనుభూతి చెందారా? ఓ, మై! వేగముగా వీచు గాలి వంటిది. ఇప్పుడు గమనించండి. మరియు అది నిండినది…ఇప్పుడు, ఇక్కడ ఇట్లు చెప్పబడినది “అంతయు,” అయితే గ్రీకులో అది ఇట్లు చెప్పబడినది “పూర్తిగా (పెద్దక్షరంలో పూ-ర్తి-గా), ఆ ఇల్లు పూర్తిగా,” అక్కడ ప్రతీచోటా. ప్రతీ మూల, చీలిక, మరియు ప్రతీ పగుళ్ళు దానితో నిండినట్లు కనిపించుచున్నది. “సహోదరులారా, నాకు అనిపించినట్లే మీకును అనిపించుచున్నదా?” అని చెప్పడం కాదు. కాదండి! బలంగా వీచే గాలివలె, అది అంతటా ఉన్నది. ఇప్పుడు గమనించండి. “అంతట ఒక బలమైన గాలివంటి ఒక శబ్దము మరియు (సంయోగము. ఇప్పుడు ఆ మరియులను గమనించండి. మీరు గమనించకపొతే, అది చెప్పని దేనినో అది చెప్పినట్లు మీరు చేస్తారు. చూశారా?)—మరియు ఆ విధంగా (మెదట జరిగినది అదే ఒక శబ్ధము, బలంగా వీచినట్టి ఒక—ఒక గాలి వంటిదేదో వారి మీదకి వచ్చెను)—మరియు (మీరు గుర్తుంచుకొనండి, గత రాత్రి నేను కిరాణా కి వెళ్ళి మరియు ఒక రొట్టె ముక్కను మరియు కొంత మాంసమును కొన్నాను. అది దానితో పాటు జరిగినది. రొట్టె ఒక విషయమైతే, ఆ మాంసము మరొక విషయమైయున్నది. మరియు వారిని తాకిన ఆ ధ్వని ఒక విషయమైతే)—మరియు అక్కడ వారికి, (వారి ముందు) నాలుకలు—విభాగింపబడిన నాలుకలు ప్రత్యక్షమైనవి.”

56 ఇక్కడున్న మీలో ఎవరైనా సిసిల్ డెమిల్లీయొక్క పది ఆజ్ఞలను చూశారా? ఆ ఆజ్ఞలు వ్రాయబడుచుండగా మీరు గమనించారా? అతడెట్లు దానిని పట్టుకున్నాడో, నాకు తెలియదు. దానిలో నేను చూసినటువంటి రెండు లేదా మూడు సంగతులను నేను నిజముగా ఇష్టపడ్డాను. మొదటి విషయము ఏదనగా ఆ పచ్చవర్ణపు వెలుగు, అది ఖచ్చితముగా చూచుటకు అట్లే ఉంటుంది. చూశారా? ఇంకొక విషయం ఏదనగా ఆ ఆజ్ఞ వ్రాయబడుచున్నప్పుడు, మరియు అది అయిపోయిన తర్వాత, ఆ పెద్ద అగ్ని స్తంభము నుండి ఎగురుతూ, చిన్న చిన్న అగ్ని రవ్వలు ఎగురుచుండుటను మీరు గమనించారా? మీరు దానిని గమనించారా? ఇప్పుడు, పెంతెకోస్తు వద్ద ఇది అట్లేయున్నదని నేను తలంచుచున్నాను. వారు దానిని చూడగలుగునట్లు…అక్కడ వారికి ప్రత్యక్షమాయెను. “అక్కడ వారిలో అది పడినది,” అని అది చెప్పబడలేదు. అయితే వారికి అగ్ని రవ్వలు ప్రత్యక్షమాయెను (మనం దానిని ఇట్లంటాము), నాలుకలు, నాలుకవలె ఇక్కడున్న ఈ నాలుకవలె, నాలుక ఆకారంలోనున్న, అగ్ని రవ్వయైయున్నది. ఇప్పుడు, చెవి—నేను చెప్పినట్లు, చెవి అనగా చెవియే; వ్రేలు అనగా వ్రేలేయైయున్నది. వ్రేలు అనగా మీరు అనుభూతి చెందారని అర్ధం కాదు; చూడడానికి అది ఒక వ్రేలులాగా ఉందని దాని అర్ధం. మరియు అది ఒక చెవియైనయెడల, దాని అర్ధం వారు దానిని విన్నారని కాదు; అదొక చెవివలె కనిపించినది. ఇది చూడటానికి ఒక నాలుక వలె కనిపించిన అగ్నియైయున్నది, ఎవరో మాట్లాడుచున్నారని కాదు, అదొక నాలుకవలె కనిపించుచున్న అగ్నియైయున్నది.

57 ఇప్పుడు, వినండి. అది గ్రీకులో ఇక్కడ ఎట్లు చదువబడుచున్నదో గమనించండి:

మరియు అకస్మాత్తుగా ఒక శబ్దము వచ్చెను…అది ఒక బలమైన గాలి వంటిది…(ఆ 3వ—ఆ 3వ వచనం.)

మరియు విభాగింపబడిన నాలుకలు వారికి ప్రత్యక్షమాయెను,…(విభాగింపబడిన నాలుకలు వారిలో ఉన్నాయనో, లేదా వారొక విభాగింపబడిన భాషలో మాట్లాడుచున్నారనో కాదు; అది విభాగింపబడిన నాలుకలు వారికి ప్రత్యక్షమగుటయై యున్నది. ఇప్పుడు, గమనించండి. అది ఇంకనూ వారిపై ఉండలేదు. అది ఆ గదిలో ఉండెను, ఈ గాలిలో ఈలాగున చుట్టూ తిరుగుచుండెను.)…వారికి…అగ్ని…వలె…నాలుకలు విభాగింపబడినట్టు…వారికి ప్రత్యక్షమాయెను…(అది వారి ఎదుటనేయై యున్నది) అగ్ని…వలె, (అగ్ని వంటి నాలుకలు) మరియు ఒక్కొక్కటి (ఏకవచనం) వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలెను. (వారి లోపలికి వెళ్ళుట కాదు; కానీ వారిపై వ్రాలెను.)

58 ఇప్పుడు, కింగ్ జేమ్స్ దానిని ఎలా తీసివేసెనో చూడండి: “మరియు అగ్ని నాలుకలు వారిమీదకి దిగివచ్చెను, లేదా వ్రాలెను (అక్కడ ఆ కింగ్ జేమ్స్ లో అది ఏ విధంగా చదవబడుచున్నది?) వారి మీద కూర్చుండెను.” చూశారా? ఇప్పుడు, అది అక్కడికి వెళ్ళి కూర్చొనజాలదు. దానిని మనం ఎరుగుదుము. అయితే ఆ అసలైనది, “అది వారి మీద వ్రాలెను,” అని చెప్పెనని నేను నమ్ముచున్నాను; అవును కదా? నన్ను దానియొక్క ఖచ్చితమైన సత్యమును చెప్పనీయండి. అవును! “…వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలెను.” ఒక్క అగ్ని నాలుక వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలెను. అక్కడ చూశారా? దానిని మీరు గ్రహించారా? అది జరిగినటువంటి రెండవ కార్యమైయున్నది. మొదటిగా ఒక గాలి, పిదప అగ్ని నాలుకలు ప్రత్యక్షమగుటయైయున్నది.

59 అది మండుచున్న ఈ చిన్న నూనె దీపములు ఉన్నటువంటి ఈ చిన్న గదిలోయైయున్నది. వారక్కడ కూర్చొనియుండుటను గూర్చి ఆలోచించుడి. మరియు ఒకరు ఇట్లు చెప్పుదురు, “ఓ!” అతడు భవనమంతయు చూచెను; అది ఆ భవనమంతా నిండియుండెను. అప్పుడు వారు ఇట్లన్నారు, “చూడుము!” ఆ భవనము చుట్టూ అగ్ని నాలుకలు రావడం ప్రారంభమాయెను. ఇప్పుడు గమనించండి. మరియు అక్కడ ఈ అగ్ని నాలుకలు ప్రత్యక్షమయ్యెను.

ఇప్పుడు తరువాత విషయం గమనించండి:

మరియు (మరొక సంయోగము; మరొకటి ఏదో జరిగినది.) వారందరు పరిశుద్ధాత్మతో నింపబడిరి,…(రెండవ కార్యం జరిగినది.)

60 ఇప్పుడు చూడండి, మనం దానిని మొత్తం మార్చి ఇట్లు చెప్తుంటాము, “వారు అగ్ని నాలుకలు కలిగియుండి, మరియు ఇక్కడ అర్ధరహితంగా మాట్లాడుచుండిరి; మరియు పిదప బయటకు వెళ్ళి మరియు అన్యభాషలో మాట్లాడుటను ప్రారంభించిరి.” స్నేహితుడా, లేఖనములలో అటువంటిదేదియు లేదు. పరిశుద్ధాత్మను పొందుకొనుటవలన ఒక అన్య భాషతో మాట్లాడేవారు ఎవరైనా దానిని బైబిలుకు విరుద్ధముగా చేయుదురు. మరియు నేను మరికొద్ది నిమిషాలలో దానిని మీకు చూపించి మరియు ఋజువు చేయబోవుచున్నాను నేను అన్యభాషలలో మాట్లాడుటను నమ్ముతాను, అయితే అది పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు కాదు. అది పరిశుద్ధాత్మ యొక్క ఒక వరమైయున్నది. పరిశుద్ధాత్మ ఒక ఆత్మయైయున్నది.

61 ఇప్పుడు గమనించండి. ఈ నాలుకలు అగ్నివలె ఆ గదిలో ఉండియున్నవి, మరియు అది ఒక్కొక్కరిపై వ్రాలినది. అప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడిరి (రెండవ సంగతి), మరియు పిదప, వారు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, భాషలతో మాట్లాడిరి, నాలుకలతో కాదు, భాషలతో మాట్లాడిరి. దానిని మీరు గమనించారా? ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది వారు ఇతర భాషలలో మాట్లాడనారంభించిరి. ఇప్పుడు, ఈ విషయం అంతటా వ్యాపించినది.

62 ఇప్పుడు గమనించండి. ఇప్పుడు, ఆ దృష్టాంతమును మరలా తీసుకుందాము తద్వారా దానిని ఇప్పుడు మీరు మరచిపోరు. లేఖనము ప్రకారము, మేడ గదిలో వేచియుండగా, అకస్మాత్తుగా బలమైన గాలివంటి ఒక శబ్ధం, అది వారిపైకి వచ్చెను; అది పరిశుద్ధాత్మయై యున్నది. అది పరిశుద్ధాత్మ ప్రత్యక్షమగుటయని ఎంతమంది నమ్ముతారు? ఒక గాలి వలె, ఒక సహజాతీతమైన గాలి. అప్పుడు వారు గమనించారు. మరియు అక్కడ చిన్న చిన్న అగ్ని నాలుకలుండెను, వారొక నూటా ఇరువది మంది ఉండిరి, మరియు వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలడం ప్రారంభించెను. అదేమిటి? అదేమిటి? అగ్ని స్తంభం, అది స్వయంగా దేవుడే తన ప్రజల మధ్యలో తనకు తానుగా విభాగింపబడి, ప్రజలలోనికి వచ్చుటయైయున్నది. యేసు ఆ మొత్తమును కలిగియున్నాడు; ఆయన కొలతలేని ఆత్మను కలిగియున్నాడు; మనము దానిని కొలతచొప్పున పొందుకుంటాము (నా భావమును మీరు గ్రహించారా?), ఎందుకనగా మనము దత్త పుత్రులము. ఆయన జీవము—ఆయన యొక్క నిత్యజీవము లోపలికి వచ్చుచున్నది. ఇప్పుడు, ఏమి జరిగినది? అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నింపబడిరి.

63 ఇప్పుడు, నేను మిమ్మల్ని ఒకటి అడగగోరుచున్నాను. ఆ వదంతి ఎప్పుడు మొదలైనది? వారు ఆ మేడ గది నుండి బయటకు వచ్చి ఆ మెట్లు దిగి పైన క్రింద కలిపి, వారున్న చోటు నుండి— బహుశా ఒక పట్టణపు—ప్రాంగణమంత దూరములో ఉన్న, ఆ భవంతి ఆవరణలోనికి, లేదా బయటనున్న ఆ ఆలయం ఆవరణలోనికి, అనగా వెలుపల ఆ ఆవరణములో ప్రజలందరూ కూడుకొనియుండే చోటుకి రావాల్సినయెడల…మరియు అక్కడినుండి ఆత్మచేత నింపబడి త్రాగినవారి-వలెనె బయటకు వచ్చిరి. ఏలయనగా జనులు ఇట్లనిరి, “ఈ మనుష్యులు క్రొత్త మద్యంతో నింపబడిరి.” వారు అటువంటి దానిని ఎన్నడూ చూసియుండలేదు.

64 మరియు ప్రతియొక్కరు ఈలాగు చెప్పుటకు ప్రయత్నించిరి, “పరిశుద్ధాత్మ వచ్చెను. దేవుని యొక్క వాగ్దానము నాపై ఉన్నది. నేను—నేను ఆత్మతో నింపబడియున్నాను.” మరియు అతడొక గలిలయుడైయుండి, అతను ఎవరితోనైతే మాట్లాడుచున్నాడో, ఆ అరబ్బు లేదా పారసీకుడు, తన స్వంత భాషలో అతడు మాట్లాడుటను వినెను.

65 “మనమెట్లు వినుచున్నాము (తెలియని భాష కాదు)—ప్రతి మనుష్యుడు మనం పుట్టిన భాషలో మాట్లాడుటను మనమెట్లు వినుచున్నాము? ఈ మాట్లాడుచున్న వారందరు గలలీయులు కారా?” మరియు బహుశా వారు గలలీ భాషలోనే మాట్లాడుచుండవచ్చును…కానీ వారు అది విన్నప్పుడు మాత్రం, అది వారు పుట్టిన భాషలో ఉండియున్నది. అట్లు కానియెడల, మీరు ఈ ప్రశ్నకు నాకు—జవాబు ఇవ్వవలెనని నేను కోరుచున్నాను: పేతురు అక్కడ నిలబడి మరియు గలలీయలో మాట్లాడగా, మరి ఆ గుంపంతయు అతడు చెప్పేది ఎలా విన్నారు? సరిగ్గా అక్కడ మూడు వేల ఆత్మలు క్రీస్తునొద్దకు వచ్చెను మరి పేతురేమో ఒక్క భాషలోనే మాట్లాడుచుండెను. నిశ్చయంగా! అది దేవుడు ఒక అద్భుతమును చేయుటయైయున్నది. పేతురు, మెసొపొతేమియా నివాసులతో, మరియు అపరిచితులు, మరియు అన్యమతానికి చెందినవారితో తయారైన అదే సమాజముతో, మరియు ప్రపంచమంతట నుండి వచ్చిన వారు అక్కడ నిలబడియుండిరి…మరియు పేతురు నిలబడి మరియు ఒక్క భాషలో బోధించుచున్నాడు, మరియు ప్రతీ వ్యక్తి అతడు చెప్పేది విన్నారు, ఏలయనగా మూడు వేలమంది పశ్చాత్తాపమునొంది మరియు వెంటనే యేసుక్రీస్తు నామములో బాప్తీస్మము పొందిరి. అదెట్లు సంభవించినది?

66 చూడండి, స్నేహితులారా, నా సంఘశాఖ, పెంతెకోస్తు సహోదరుడు దానిని ఇప్పుడే అంగీకరించాలని నేను ఆశించలేను. కానీ దానిని మీరు బైబిలులోనుండి పరిశీలించి మరియు ఎప్పుడైనా నాకు చెప్పండి వారు పరిశుద్ధాత్మను పొందుకొని మరియు వారు మాట్లాడునదేదో వారికే తెలియనటువంటి భాషలో ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడారో చెప్పండి. మరియు వారు దానిని అక్కడ ఆ విధంగా పొందుకున్నయెడల, సర్వాధికారియైన దేవుడు…అది ప్రతీసారి అదే విధంగా జరగవలసియున్నది.

67 ఇప్పుడు, నేను…ఇప్పుడు, తన ఇంటి వద్ద కొర్నే-…మనకు జ్ఞాపకమున్నది, గత రాత్రి, మనం సమరయకు వెళ్ళినప్పుడు, వారు ఏ ఇతర భాషలోనైనా విన్నారన్నట్టుగా ఒక్క విషయమైనా అక్కడ నమోదు కాలేదని మనం కనుగొన్నాము, దానిగూర్చి ఏమియూ చెప్పబడలేదు. కానీ వారు కొర్నేలి యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు, అక్కడ మూడు విభిన్న జాతుల ప్రజలుండిరి, వారు భాషలలో మాట్లాడిరి. మరియు వారు చేసినప్పుడు, వారు చేసినయెడల, ప్రారంభములో వారు దానిని పొందుకున్నట్లే, వీరు దానిని పొందుకున్నారని, పేతురు చెప్పెను. మరియు అన్యజనులు దేవునియొద్ద నుండి కృపను పొందుకున్నారని వారెరిగియున్నారు, ఎందుకనగా సరిగ్గా ప్రారంభములో వారు పొందుకున్నట్లే వీరును పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇక్కడ దాని విషయమై నాకొక ప్రశ్న కలదు, కొద్ది నిమిషాలలో దానిని చూద్దాము. నేను పునాదిని వేయగోరుచున్నాను, తద్వారా అది ఏమైయున్నదో మీరు చూచెదరు.

68 ఇప్పుడు, విభిన్నముగా బోధించబడిన ప్రజల విషయమై నేను ఆశించలేను…మరియు నా ప్రియమైన, ప్రశస్తమైన, పెంతెకోస్తు సహోదరులారా, నేను చెప్పేది వినండి. నేను దీనిని బయట బోధించను. ఇది…బేధమును కల్పించుటకై నేనేదియు చేయను. కానీ మనము సత్యమును పొందుకొననియెడల, మనము ఎప్పుడు ప్రారంభించబోవుచున్నాము? మనల్ని సరిచేయుటకై ఇక్కడ ఏదో జరుగుటను మనము కలిగియుండవలసి యున్నది. ఇప్పుడిక్కడ మనము ఎత్తబడే కృపను పొందుకొనవలసియున్నది. సత్యము బయటకు రావలసియున్నది.

69 ఒక వ్యక్తి తాను చెవిటివాడు, మరియు మూగావడైయ్యుండి, మరియు అస్సలు మాట్లాడలేకపోయినయెడల ఏమి చేస్తాడు? అతడు పరిశుద్ధాత్మను పొందుకోగలడా? ఆ దీనుడు రక్షించబడగోరుచుండి, మరియు మొదటిగా అతనికి అసలు నాలుకే లేని యెడల ఏమిటి? చూశారా? అది ఆ పరిశుద్ధాత్మ, అది ఒక బాప్తిస్మము. మరియు పిదప, భాషలలో మాట్లాడటం, మరియు భాషలను అనువదించడం వంటి ఈ వరములన్నియు, అవి మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా శరీరములోనికి వచ్చిన తర్వాతైయున్నది. ఏలయనగా ఆ వరములు క్రీస్తు యొక్క శరీరములో ఉన్నవి.

70 ఇప్పుడు, నేను చెప్పుటకు కారణము…ఇప్పుడు, ఇక్కడ చూడండి. అపొస్తలుల తరువాత ప్రపంచములో మొట్టమొదటిగా సంస్థాగత సంఘమైన, క్యాథలిక్ సంఘమును మీరు ఊహించగలరా…అప్పుడు క్యాథలిక్ సంఘము సంస్థాగతమైనది, ఓ, చివరి అపొస్తలుడి మరణాంతరము కొన్ని వందల సంవత్సరాల తర్వాత, అపొస్తలుల పిదప ఒక ఆరు వందల—సంవత్సరాల తర్వాత, నైసియా సభ జరిగిన వెంటనే, ఎప్పుడైతే నైసియా తండ్రులు ఒక్కటై మరియు సంస్థను స్థాపించారో; అప్పుడు వారు సార్వత్రిక సంఘమును కలుగజేసిరి, అదే క్యాథలిక్ సంఘము. అక్కడ వారు ఒక ప్రపంచ సంఘమును తయారుచేసిరి. మరియు క్యాథలిక్ అను మాటకు “సార్వత్రిక” అని అర్ధము; అది అంతటా ఉన్నది. వారు…రోమను—అన్య రోము పోపుల రోముగా మార్చబడినది. మరియు ఎవరికైతే రాజ్యమునకు తాళపు చెవులను యేసు ఇచ్చాడని చెప్పి వారు తలంచిరో, అట్టి పేతురు స్థానమును తీసుకొని నాయకుడిగా ఉండుటకు వారు ఒక పోపును పెట్టిరి. మరియు ఆ పోపు విఫలమవ్వనివానిగా ఉన్నాడు, మరియు నేటికిని క్యాథలిక్ సంఘానికి అట్లేయైయున్నాడు. అది…అతని మాటే చట్టము మరియు ఆజ్ఞయైయున్నది. అతడే విఫలమవ్వలేని పోపు. అదే కొనసాగినది.

71 మరియు పిదప, ఈ క్యాథలిక్ సిద్ధాంతముతో వారు ఏకీభవించనందున, వారు చంపబడిరి, కట్టెకు కట్టివేసి కాల్చివేయబడిరి, మరియు అవన్నీ చేయబడినవి. జోసఫస్ యొక్క పవిత్ర రచనల ద్వారా, మరియు ఫాక్స్ యొక్క హతసాక్షుల పుస్తకము ద్వారా దానిని మనమందరము ఎరిగియున్నాము, మరియు అనేకమైన ఇతర పవిత్ర…హిస్లోపు యొక్క రెండు బబులోనులు, మరియు ఆ—ఆ గొప్ప చరిత్రలు కలవు. పిదప, అది—పదిహేను వందల సంవత్సరాల తర్వాత, అంధకార కాలమును గూర్చి మనకు తెలిసినట్లుగా, బైబిలు గ్రంథము ప్రజలయొద్ద నుండి తీసివేయబడినది. మరియు అది—అదొక సాధువు ద్వారా దాచబడినదని, మరి ఆవిధంగా ఉండెనని, మనం అర్ధం చేసుకున్నాము.

72 అటు తరువాత మొదటి సంస్కరణ వచ్చినది, అది మార్టిన్ లూథరైయుండెను. మరియు అతడు ముందుకు అడుగువేసి మరియు శరీరము—అక్షరాల క్రీస్తు యొక్క శరీరమని క్యాథలిక్కులు చెప్పే ఆ ప్రభువు సంస్కారము, కేవలం క్రీస్తుయొక్క శరీరమునకు సాదృశ్యమని చెప్పెను. మరియు అతడు ఆ ప్రభువు సంస్కారమును వేదిక మెట్ల మీద, లేదా ఆ మెట్ల మీదకి విసిరికొట్టాడు, మరియు దానిని అక్షరాలా క్రీస్తుయొక్క శరీరమని పిలుచుటకు నిరాకరించెను, మరియు, “నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రదుకును,” అని బోధించెను. ఇప్పుడు, క్యాథలిక్ సంఘము అతనితో ఏకీభవిస్తుందని మీరు ఆశించలేరు, వారి యొక్క విఫలమవ్వని శిరస్సు వారికి వద్దు అని చెప్పినప్పుడు, నిశ్చయంగా వారు ఏకీభవించరు. అది సరియే.

73 పిదప నీతికరణను బోధించిన, మార్టిన్ లూథర్ తరువాత, శుద్ధీకరణను బోధిస్తూ జాన్ వెస్లీ వచ్చెను. మరియు ఒక మనుష్యుడు, నీతిమంతునిగా తీర్చబడిన తర్వాత (అది సరియే) కానీ మీరు శుద్ధీకరించబడి, శుద్ధి చేయబడి, యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా దుష్టత్వము యొక్క వేరు మీ నుండి తీసివేయబడవలసి యున్నదని అతడు బోధించెను. ఇప్పుడు, లూథరన్లు శుద్ధీకరణను బోధించుటను మీరు ఊహించలేరు, ఎందుకనగా వారు దానిని చేయబోవుటలేదు.

74 వెస్లీ శుద్ధీకరణను బోధించిన పిమ్మట, మరి దాని నుండి అనేకమైన చిన్న చిన్నవి బయటకు-వచ్చినవి, అవి వారి కాలమునకు ఆ మంటను మండిస్తూ ఉన్నటువంటి, వెస్లియన్ మెథడిస్టు, మరియు నాజరీను, మరియు మొదలగునవైయున్నవి, అటు తర్వాత పెంతెకోస్తు వచ్చి మరియు ఇట్లు చెప్పెను, “అంతెందుకు, పరిశుద్ధాత్మ అనేది బాప్తీస్మమైయున్నది, మరియు దానిని పొందుకునేటప్పుడు మనము భాషలతో మాట్లాడతాము.” నిశ్చయంగా. పిదప అది వచ్చినప్పుడు, ఆ నాజరీనులు, మరియు ఆ వెస్లియను మెథడిస్టులు, మరియు మొదలగువారు దానిని నమ్ముటను మీరు ఊహించలేరు. వారు దానిని చెయ్యరు. వారు దానిని దయ్యం అని పిలిచారు. అది సరియే. ఏమి జరిగినది? వారు పడిపోవడం ప్రారంభమైనది; పెంతెకోస్తు అభివృద్ధి చెందడం మొదలైనది. ఇప్పుడు పెంతెకోస్తు కూడా కుదిపివేయబడే పరిస్థితికి అది వచ్చినది. అది సంస్థాగతమై వెళ్ళిపోయినది, వేరే దేనిని అంగీకరించదు. వారు వారి స్వంత నియమ నిబంధనలను కలిగియున్నారు, మరియు అది సరిపోతుంది.

75 ఇప్పుడు, పరిశుద్ధాత్మ వచ్చి మరియు ఏ విషయము యొక్క సత్యమునైనా బయలుపరచి మరియు ఆయనయొక్క స్వంత సన్నిధిచేత మరియు ఆయన యొక్క వాక్యముచేత దానిని ఋజువు చేసినప్పుడు, “నేను దానితో ఏకీభవించుచున్నాను,” అని పెంతెకోస్తు ప్రజలు చెప్పుటను మీరు ఊహించలేరు. లూథరు చేసినట్లు, వెస్లీ చేసినట్లు మరియు ఆ మిగతావారు చేసినట్లు, మీరును ఒంటరిగా నిలబడవలసియున్నది. మీరు దానిపై నిలబడవలెను ఎందుకనగా ఘడియ వచ్చియున్నది. మరియు నన్ను ఒక మురికి బాతుపిల్లలా చేయునది అదేయైయున్నది. నన్ను భిన్నంగా చేయునది అదే.

76 మరియు నా ప్రశస్త సహోదరుడైన ఓరల్ రాబర్ట్స్, మరియు టామీ ఆస్బార్న్, టామీ హిక్స్, మరియు వారివలె నేను ప్రారంభించలేను, ఎందుకనగా సంఘములు నాతో ఏకీభవించవు. వారిట్లంటారు, “అతడు నిత్య భద్రతను నమ్ముతాడు. అతడొక బాప్టిస్టు. భాషలతో మాట్లాడుటను పరిశుద్ధాత్మకు ప్రాథమిక ఋజువుగా అతడు నమ్మడు. అతడి నుండి దూరంగా పొండి!” చూశారా?

77 అయితే దానిని ముఖాముఖిగా ఎదుర్కొనండి. దానిని ఎదుర్కొనండి. ఆ—ఆ మెథడిస్టులు, వారు లూథరన్లను ఎదుర్కొనగలరు. పెంతెకోస్తువారు మెథడిస్టులను ఎదుర్కొనగలరు. నేను దాని విషయమై పెంతెకోస్తులను ఎదుర్కొనగలను. అది ఖచ్చితంగా సరియే. అది వాస్తవం. అది ఎందుకు? ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడచుచున్నాము. చూశారా? మనము రాజుయొక్క రాజమార్గమువైపు పోవుచున్నాము, మరియు దూరంగా పోవుచున్నా కొద్దీ, మరింత కృప ఇవ్వబడును, మరింత శక్తి ఇవ్వబడును, మరింత సహజాతీతమైనది ఇవ్వబడును. మరియు అక్కడే మనము ఉన్నాము. ఆయన ఆరంభములో ఉన్నట్లే పరిశుద్ధాత్మ ఒక వెలుగువలె క్రిందకి వచ్చిన ఘడియ ఇదేయైయున్నది, ఒక అగ్ని స్తంభముగా నుండి, మరియు తనను తాను ప్రత్యక్షపరచుకొనుచు, ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు చేసిన అదే కార్యములను చేయుచున్నాడు. మరియు యేసు ఇట్లు చెప్పెను, “వారు సరియో కాదో మీకెట్లు తెలియును? వారి ఫలములనుబట్టి మీరు వారిని తెలుసుకొందురు. నాయందు విశ్వాసముంచువాడు, నేను చేయు క్రియలను అతడును చేయును. నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును.”

78 ఇప్పుడు, నా పెంతెకోస్తు సహోదరులారా. నేను మీతో ఉన్నాను. నేను మీలో ఒకడిని. నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను. నేను భాషలలో మాట్లాడాను, కానీ పరిశుద్ధాత్మను పొందుకొనుట ద్వారా అది నాకు రాలేదు. నేను పరిశుద్ధాత్మ బాప్తీస్మమును పొందాను; నేను భాషలలో మాట్లాడాను, ప్రవచించాను, బుద్ధి, జ్ఞానము, అనువదించు వరములను కలిగియున్నాను, మరియు ప్రతీదీ జరుగుచున్నది. అయితే ఆ కార్యములలో నేను దేనికైనా బద్ధుడనైయున్నాను, ఎందుకనగా ఇప్పుడు నేనొక దేవుని బిడ్డను. ఆ శక్తి, దేవునియొక్క అగ్ని నా ప్రాణంలో ఉన్నది; ఆ వ్రాలిన అగ్ని నాలుక—నాలోనికి వచ్చియున్నది మరియు దేవునికి విరుద్ధముగానున్న ప్రతీ దానిని కాల్చివేసినది, మరియు ఇప్పుడు నేను ఆయన ఆత్మతో నడిపించబడుచున్నాను. ఆయన ఇట్లు చెప్పగలడు, “ఇక్కడికి వెళ్ళుము,” మరియు నేను వెళ్ళుదును. “ఇక్కడికి వెళ్ళుము,” నేను వెళ్ళుదును. “ఇక్కడ మాట్లాడుము,” నేను మాట్లాడుదును. “మరియు దీనిని, దానిని, మరియు మరొకటి చేయుము.” మీరదే చేస్తారు, సరిగ్గా అలాగే…మీరు ఆత్మచేత నడిపించబడుచున్నారు. అది దేవుడు మీలో ఉండి, తన చిత్తమును జరిగించుటయైయున్నది. అది ఏమైనాగానీ, ఆయన తన చిత్తమును జరిగించుచున్నాడు.

79 ఇప్పుడు, వినండి. మనం ప్రశ్నలను ప్రారంభించుటకు ముందు ఇక్కడ చూడనివ్వండి ఆ పదకోశం నుండి నన్ను చదవనియ్యండి. ఇప్పుడు, వ్యాటికన్ అనువాదము నుండి, 7వ విభాగం, 190—1205:

“అది ఒక అన్య భాషలో మాట్లాడుచున్నట్టి ఆ ప్రజల స్వరమా; లేదా అది ఆ గుంపును ఉత్తేజపరచినట్టి సహజాతీతమైన గాలి వీచుటను గూర్చియైన వార్తా లేక వదంతియా అన్నది నిర్ధారించడం కష్టం.”

వారు దానిని గ్రహించలేకపోయిరి. ఇప్పుడు గమనించండి. అది ఆ ప్రజలా…

80 నేను కొంచెం వివరించెదను. ఒక నిరుపేద, మోటైన గలిలయ గుంపు ఉండియున్నది. మరియు ఇక్కడ వారు బయట వీధిలో ఉన్నారు. వారెన్నడూ అటువంటిది చూచియుండలేదు: వారు ఆ మేడ గదినుండి, చేతులు గాలిలోకి ఎత్తుకొని, ఆ మెట్లు దిగి, అక్కడికి వచ్చియున్నారు, అప్పుడే నింపబడియున్నారు; వారింకనూ మాట్లాడనేలేదు. చూశారా? మరి వారు అక్కడికి వచ్చియున్నారు. మరియు ఇప్పుడు, వారక్కడ, తడబడుచూ ఉన్నారనుకొందాము. మరియు ఆ ప్రజలు ఇట్లన్నారు…ఒక గ్రీకువాడు నావద్దకు పరిగెత్తుకొని వచ్చి మరియు, నేను గలలియ భాష మాట్లాడుతాను, అని చెప్పెననుకుందాము.

మీరు అతనియొద్దకు పరిగెత్తుకొనిపోయి మరియు, “అబ్బాయి, ఏమిటి సంగతి?” అని అన్నారనుకోండి.

81 “నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. అక్కడ ఆ గదిలో దేవునియొక్క శక్తి నాపై కుమ్మరించబడినది. నాకు ఏదో జరిగినది. ఓ, దేవునికి మహిమ!”

మరియు ఇక్కడ మరొకరు, అతడొక అరబ్బుతో మాట్లాడుచుండెను, మరియు అతడొక గలిలయుడైయుండి అరబ్బు—అరబ్బు భాషలో మాట్లాడుచున్నాడు.

82 ఇప్పుడు, ఆ జనసమూహము కూడి వచ్చినప్పుడు, ఆ ప్రజలను పోగుచేసినది బలంగా వీచిన ఆ గాలియా, లేదా అది వారు మాట్లాడుచున్న ఆ అన్య భాషలో మాట్లాడటమా? అన్నది వారు చెప్పలేరు. ఇప్పుడు, బైబిలు ఖచ్చితంగా…మీరు గమనించుటకు రెండు సంగతులు కలవు. అది అదే…ఆ—ఆ బయటివాడు ఇట్లంటాడు, “ప్రతీ వ్యక్తి మనము పుట్టిన మన స్వంత భాషతో మాట్లాడుటను మనము ఎట్లు వినుచున్నాము?” వారు దానిని మాట్లాడుచున్నారని అది చెప్పలేదు, కానీ వారు దానిని వినుచుండిరి.

83 పిదప అదే గుంపు, అదే ప్రజలు, దీనిని వివరించిరి. పేతురు దేనిమీదకో దూకి మరియు ఇట్లు చెప్పెను, “గలలీయ మనుష్యులారా, మరియు యెరూషలేము కాపురస్తులారా, ఇది మీకు తెలియునుగాక (తమకు గలలీయ భాష లేదని ప్రజలు చెప్పారు) ఈ సంగతి మీకు తెలియునుగాక మరియు చెవియొగ్గి నా మాట వినుడి (అతడు వారందరితో, ఏ—ఏ భాషలో మాట్లాడుచుండెను?); అంతెందుకు, మీరు ఊహించునట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దుపొడిచి జామైనా కాలేదు, కానీ యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే: ‘మరియు అంత్య దినములయందు, నేను మనుషులందరి మీద నా ఆత్మను క్రుమ్మరించెదను. మీ కుమారులు మరియు మీ కుమార్తెలు ప్రవచించెదరు, అని దేవుడు సెలవిచ్చెను.’” అతడు ఇంకా మాటలాడుచు, మరియు ఇట్లు చెప్పెను, “మీరు దుష్ట హస్తములతో నిర్దోషియైన దేవుని కుమారుని సిలువవేసిరి. దావీదు ఆయన గూర్చి ఇట్లు పలికెను…‘ఆయన తన ఆత్మను పాతాళములో విడిచిపెట్టడు, ఆయన తన పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయడు.’” ఇంకా ఇట్లు చెప్పెను, “మీరు సిలువవేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెనని మీ అందరికి తెలియునుగాక.” మరియు వారు దీనిని విన్నప్పుడు…ఆమేన్! ఎవరు? ఆకాశము క్రిందనున్న ప్రతీ మనుష్యుడు. ఏమి జరుగుచున్నది? “ఇప్పుడు, నేను గలలీయ భాషలో మాట్లాడతాను; నేను దీనిలో మాట్లాడతాను; మరియు నేను దీనిలో మాట్లాడతాను…?…” అని అతడు చెప్పుటలేదు.

84 పేతురు ఈ మాటలు పలుకుచుండగా, వారిట్లు చెప్పిరి, “అయ్యలారా, మరియు సహోదరులారా, రక్షింపబడుటకు మేమేమి చేయగలము?” మరియు పేతురు వారికి ఆ సూత్రమును ఇచ్చెను. అది ఎల్లప్పుడూ ఆ విధంగానే జరుగుతుంది. చూశారా?

85 అది పైకి కదులుచున్నది, దేవునిలోనికి చొచ్చుకొనిపోవుచు, సమీపంగా నడుచుచున్నది. నీకెలా తెలుసు? మంచిది ఇప్పుడు, లూథరు నీతికరణను స్వీకరించినప్పుడు, దానిని అతడు పరిశుద్ధాత్మ అని పిలిచెను. అదైయున్నది. దేవుడు దానిని కొంచెము అందులో ముంచెను. పిదప ఆయన ఏమి చెప్పెను? వెస్లీ శుద్ధీకరణను స్వీకరించెను, మరియు ఇట్లు చెప్పెను, “అబ్బాయి, నీవు కేకలు వేసినప్పుడు, నీవు దానిని పొందుకున్నావు.” అయితే దానిని కలిగిలేనివారు చాలా మంది కేకలు వేశారు. పెంతెకోస్తువారు భాషలలో—అన్య భాషలలో మాట్లాడినప్పుడు, వారిట్లు చెప్పెరి, “అబ్బాయి, నీవు దానిని పొందుకున్నావు.” కానీ వారిలో చాలా మంది దానిని పొందుకోలేదు.

దానిని తెలుసుకోగల సూచనలు లాంటివి ఏమియూ లేవు. “ఒక చెట్టును నీవు తెలుకొనుటకు ఒకే ఒక మార్గమున్నది,” యేసు ఇట్లు చెప్పెను, “దాని ఫలమును బట్టి మీరు దానిని తెలుసుకొందురు,” అవి ఆత్మ యొక్క క్రియలు, అనగా ఆత్మఫలమైయున్నది. పిదప శక్తితో నింపబడి, ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక వ్యక్తిని మీరు చూసినప్పుడు, అప్పుడు మీరొక మార్పుచెందిన జీవితాన్ని చూస్తారు. నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించుటను మీరు చూస్తారు: “వారు నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. పాము వారిని కరిచినను, అది వారికి హాని చేయదు. మరణకరమైనది, ఏది త్రాగినను, అది వారిని చంపివేయదు. వారు రోగుల మీద చేతులుంచగా, వారు స్వస్థత నొందుదురు.” మై! నమ్మినవారిని ఈ విధమైన సూచక క్రియలు వెంబడించును. అయితే మీరు దానిలోనికి ఎట్లు ప్రవేశిస్తారు? ఆ వరములు శరీరములో ఉన్నవి. మీరు ఆ శరీరములోనికి ఎట్లు ప్రవేశిస్తారు? మీరు మాట్లాడటం వలన కాదు; కానీ ఒక్క శరీరములోనికి బాప్తీస్మము పొందుటవలనై యున్నది (మొదటి కొరింథీ 12:13). ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఆ శరీరములోనికి బాప్తీస్మము పొంది మరియు ఆ వరములన్నిటికి పాత్రులమైయున్నాము. ప్రభువు మిమ్మును దీవించును గాక.

86 ఇప్పుడు, ఎవరైనా ఈ టేపును వినాల్సియుండి లేదా ఇక్కడున్న ఎవరైనా నిరాకరించినయెడల, గుర్తుంచుకొనండి, సహోదరుడా, దానిని స్నేహపూర్వకంగా చేయండి, ఎందుకనగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.

93. ఈ రాత్రి మొదటి ప్రశ్న: సహోదరుడా బ్రెన్హామ్, టెలివిజన్ అనేది ప్రపంచానికి ఒక శాపమని నేను తలంచుచున్నాను. దాని గూర్చి నీవేమి తలంచుదువు?

87 మంచిది, దానిని వ్రాసినది ఎవరైనాగానీ, నేను మీతో ఏకీభవించబోవుచున్నాను. వారు దానిని ప్రపంచానికి ఒక శాపంగా మార్చారు. అది ప్రపంచానికి ఒక ఆశీర్వాదంగా ఉండవచ్చును, కానీ దానిని వారు ఒక శాపంగా మార్చారు. నా ప్రియమైన ప్రజలారా, అటువంటిదేదైనా గానీ, అది స్వయంగా మీరు చూసేదాన్నిబట్టి ఉంటుంది. టెలివిజన్ ఒక శాపమైన యెడల, అప్పుడు వార్తా పత్రిక కూడా ఒక శాపమే, అప్పుడు రేడియో కూడా ఒక శాపమే, మరియు అనేకసార్లు టెలిఫోను కూడా అటువంటిదే. చూడండి, చూడండి, చూడండి, చూశారా? అది మీరు దానితో ఏమి చేస్తారు అనునదైయున్నది. అయితే టెలివిజన్ నందు ఇకపై ఎటువంటి కార్యక్రమాలు లేవని, గత రాత్రి ఆ సహోదరుడు చెప్పినట్లు; అది చాలా ఎక్కువ డబ్బుతో కూడినదైయున్నది. సంపూర్ణ సువార్తను బోధించే పేద సేవకులు టెలివిజనులో ఒక కార్యక్రమమునకు వెల చెల్లించలేరు. కావున తద్వారా…గత రాత్రి సహోదరుడు చెప్పాడని, నేను నమ్ముచున్నాను, ఎక్కడో, ఇట్లు చెప్పాడు, “మీ రేడియోకున్న దుమ్ము దులపండి,” లేదా ఎవరో, లేదా, “ఆ మూల నుండి దానిని తిరిగి తీసుకువచ్చి మరియు ఆ కార్యక్రమాలను వినండి.” అది వాస్తవం.

88 అయితే, ప్రియమైన వ్యక్తీ, నీవెవరివైనా గానీ, నేను నిశ్చయంగా నీతో ఏకీభవించుచున్నాను. అది మానవ జాతికి అత్యంత నాశనకరమైనవాటిలో ఒకటిగా మారినది. అక్కడ ప్రభుత్వానికి పన్నుల కొరకు వెళ్ళాల్సిన ఈ డబ్బంతటిని వారు తీసుకుంటారు, మరియు ఈ సిగరెట్లు మరియు విస్కీ కార్యక్రమాలు మరియు అటువంటి వాటిపై ప్రకటనల కొరకు దానిని పెడతారు, మరియు ప్రభుత్వ పన్నులను ఎగ్గొట్టుచున్నారు; మరియు పిదప వారు బోధకులను పట్టుకొని మరియు వారినుండి కొంత డబ్బును పొందడానికి వారిని కోర్టుద్వారా లాగుతారు. నేను నీతో ఏకీభవిస్తున్నాను, అది ఒక ఘోరమైన విషయమైయున్నది. ఇప్పుడు, అది కాదు…మీకు తెలుసా, అది కేవలం మీరు కనుగొన్నదైయున్నది. సహోదరీ, సహోదరుడా, దానిని అడిగిన మీరు ఎవరైనాగానీ, మీకు ధన్యవాదములు.

94. ఇప్పుడు, ఇక్కడొక మంచిది ఉన్నది. ప్రశ్న: బైబిలులో కొన్ని చోట్ల ఉదాహరణకి మొదటి సమూయేలు 18:10లో, దేవునియొద్ద నుండి ఒక అపవిత్రాత్మ ఇట్టి కార్యములు చేసెనని చెప్పబడుచున్నది. “దేవునియొద్ద నుండి ఒక అపవిత్రాత్మ,” అనేది నాకు అర్ధం కావడంలేదు. దయచేసి దీనిని వివరించగలరు.

89 మంచిది, బహుశా ప్రభువుయొక్క సహాయముతో, నేను చేయగలను. దాని అర్ధం దేవుడు ఒక అపవిత్రాత్మ అని కాదు. అయితే ప్రతీ దానియొక్క ప్రతీ ఆత్మ దేవునికి లోబడియుండును. మరియు ఆయన ప్రతీ దానిని తన చిత్తముచొప్పున పనిచేయునట్లు చేయును. చూశారా?

90 ఇప్పుడు, మీ ప్రశ్నపై, సౌలును హింసించడానికి దేవునియొద్ద నుండి బయలువెళ్ళిన ఆ అపవిత్రాత్మను గూర్చి మీరు మాట్లాడుచున్నారు. అతడు ఒక వికలమైన, మనసు-విరిగిన స్థితిలో—ఆ పరిస్థితిలో ఉన్నాడు, ఎందుకనగా, మొదటిగా, అతడు భక్తిలో వెనక్కి తగ్గాడు. మరియు మీరు భక్తిలో వెనక్కి తగ్గినప్పుడు, ఒక అపవిత్రాత్మను—మిమ్మల్ని హింసించడానికి దేవుడు ఒక అపవిత్రాత్మకు అనుమతిస్తాడు.

91 ఒక్క—ఒక్క క్షణంలో నేను మీకు ఒక విషయమును చదవగోరుచున్నాను. ఇక్కడ దానిపై నాకు ఇంకొక ఆలోచన కూడా ఉండియున్నది. చూశారా? ప్రతి ఆత్మ దేవునికి లోబడవలసియున్నది. యెహోషాపాతు మరియు ఆహాబు యుద్ధానికి వెళ్ళుచున్నప్పుడు మీకు జ్ఞాపకమున్నదా? మరియు మొదటి కార్యము మీకు తెలియునా, అక్కడొక—వారు ఆ గవునలయొద్ద కూర్చొనియుండిరి. మరియు యెహోషాపాతు ఒక నీతిమంతుడైయున్నాడు, మరియు అతడు ఇట్లు చెప్పెను (ఆ ఇద్దరు రాజులు అక్కడ కూర్చునియున్నారు, మరియు వారు వారి సైన్యములను సమకూర్చారు) మరియు కావున అతడిట్లు చెప్పెను, “మనము వెళ్ళవలెనో లేదోయని దేవుడిని సంప్రదించెదము.”

92 మరియు ఆహాబు వెళ్ళి తాను కలిగియున్న నాలుగు వందలమంది ప్రవక్తలందరినీ, తీసుకువచ్చెను, వారిని క్రొవ్వియుండునట్లు పోషించుచూ మరియు ప్రతీది చేసెను; వారు మంచి ఆకారమును కలిగియుండిరి. మరియు వారక్కడకు వచ్చిరి, మరియు వారందరూ ఏక మనస్సుతో ప్రవచించి, ఇట్లు చెప్పిరి, “వెళ్ళుము, దేవుడు నీకు జయమునిచ్చును. రామోత్-గిలాదునకు వెళ్ళుము మరియు అక్కడ దేవుడు నీ పక్షమున కార్యమును చేయును.” వారిలో ఒకడు ఒక జత ఇనుప కొమ్ములను చేయించుకొని మరియు ఒక దృష్టాంతముగా చూపించుటకు చుట్టూ పరిగెత్తుచూ, ఇట్లు చెప్పెను, “ఈ ఇనుప కొమ్ముల చేత, నీవు వారిని దేశమునుండి పారద్రోలుదువు; అది నీదగును.”

93 అయితే మీకు తెలియును, అటువంటి వాటన్నింటి కొరకు వెళ్ళనటువంటి ఒక దైవజనుడి విషయంలో ఏదో ఉండియున్నది. చూశారా? అది లేఖనముతో సరిపోల్చబడనియెడల, అప్పుడు ఏదో తప్పిదమున్నది. ఏ నిజమైన విశ్వాసియైనా…కావున యెహోషాపాతు ఇలాగు చెప్పెను, “సరి, ఆ నాలుగు వందలమంది బాగానే కనపడుచున్నారు. వారు మంచివారివలె అగుపించుచున్నారు.”

“ఓ, వారు మంచివారే,” అని బహుశా ఆహాబు చెప్పియుండవచ్చును.

కానీ యెహోషాపాతు ఇట్లనెను, “ఇంకా ఒకడు కలడా?” ఏకమనస్సుతో నాలుగు వందలమందిని నీవు కలిగియున్నప్పుడు ఇంకొకడు ఎందుకు? ఎందుకనగా సరిగ్గా అనిపించనిదేదో ఉన్నదని అతడెరిగియున్నాడు. చూశారా?

అతడు చెప్పెను, “అవును, ఇంకొకరిని మేము కలిగియున్నాము, ఇమ్లా కుమారుడు, అక్కడుంటాడు,” ఇంకా చెప్పెను, “కానీ అతనియందు నాకు ద్వేషము కలదు.” నిశ్చయంగా. నీవు అతడి సంఘమును ఏ సమయములోనైనా మూసివేయుదువు. నీవు అతడిని దేశములోనుండి వెళ్ళగొట్టుదువు. చూశారా? నిశ్చయంగా. “అతనియందు నాకు ద్వేషము కలదు.”

“నీవెందుకతడిని ద్వేషించుదువు?”

“అతడు ఎల్లప్పుడు నన్ను గూర్చి కీడునే ప్రవచిస్తుంటాడు.” వెంటనే అక్కడ—ఏదో తప్పిదమున్నదని యెహోషాపాతుకు తెలిసినదని నేను నమ్ముచున్నాను.

కావున అతడిట్లు చెప్పెను, “వెళ్ళండి మరియు మికాయాను తీసుకురండి.”

కావున వారతని కొరకు వెళ్ళిరి, మరియు అతడు అక్కడికి వచ్చెను…కావున వారక్కడికి వెళ్ళినప్పుడు, వారొక వర్తమానికుడిని పంపి మరియు ఇట్లు చెప్పెను, “ఇప్పుడు, ఒక నిమిషము ఆగుము. ఇప్పుడు, అక్కడ నాలుగు వందల మంది వేదాంత పండితులను వారు కలిగియున్నారు. పిహెచ్, ఎల్ ఎల్ డి, మరియు ప్రతీది కలిగియుండి, దేశములో ఉన్నవారిలో వారే ఉత్తమమైనవారిగా ఉన్నారు.” ఇట్లు చెప్పెను, “ఇప్పుడు నీకు తెలియును, నీవు పేదవాడివైన విద్యావిహీనుడివైన వ్యక్తివి, నీవు ఆ యాజక బృందమంతటితో విభేదించడం లేదు కదా.”

94 ఇమ్లా దీనిని చెప్పెను, లేదా నా భావమేదనగా, మికాయా దీనిని చెప్పెను: “దేవుడు దానిని నా నోట ఉంచువరకు నేను ఏదియు చెప్పను, మరియు పిదప ఖచ్చితంగా ఆయన చెప్పినదే నేను చెప్పుదును.” నేను దానిని ఇష్టపడుదును. నేను దానిని ఇష్టపడుదును. ఇంకో మాటలో చెప్పాలంటే, “నేను వాక్యముతో నిలబడతాను.” ఇతరులు ఏమి చెప్పినను లెక్కలేదు. అతను ఇట్లు చెప్పెను, “సరి,” ఇట్లనెను, “నేను నీతో చెప్పుచున్నాను. నీవు విసిరివేయబడకూడదని కోరుకున్నయెడల, నీవును అదే విషయము చెప్పడం మంచిది.”

కావున అతడు అక్కడికి వెళ్ళెను. మరియు అతడు ఇట్లు చెప్పెను, “నేను పైకి వెళ్ళొచ్చా?”

అతడు చెప్పెను, “వెళ్ళు.” ఇట్లనెను, “నాకు ఈ రాత్రికి సమయం ఇవ్వండి. దానిగూర్చి నన్ను ప్రభువుతో మాట్లాడనీయండి.” నేను దానిని ఇష్టపడుచున్నాను. కావున ఆ రాత్రి ప్రభువు అతనికి ప్రత్యక్షమాయెను, మరియు ఆ మరునాడు అతడు అక్కడికి వెళ్ళెను. మరియు అక్కడికి వెళ్ళుచుండగా, అతడిట్లు చెప్పెను, అతడు ఇట్లనెను, “వెళ్ళుడి; అయితే ఇశ్రాయేలీయులు కాపరి లేని గొర్రెలవలెనే, కొండల మీద చెదరియుండుటను నేను చూచితిని.” ఓ, మై! అది అతడిని బలహీనపరచినది.

మరియు అతడిట్లన్నాడు, “నేను నీతో చెప్పలేదా? అది నాకు తెలుసు. అతడు అన్నివేళలా ఖచ్చితంగా ఆ విధంగానే చేస్తాడు, నా గురించి కీడే పలుకుతాడు.”

95 ఎందువలన? అతడు వాక్యముతో నిలిచియుంటున్నాడు. ఎందుకు? తనకి ముందున్న ప్రవక్త, ఆ నిజ ప్రవక్తయైన ఏలియా నుండి, దేవుని వాక్యము వచ్చియున్నది, అతడు చెప్పెను, “నిర్దోషియైన నాబోతు రక్తమును నీవు ఒలికించితివి గనుక, కుక్కలు నీ రక్తమును కూడా నాకును.” మరియు అతడు అతనికి కీడే చెప్పెను. ఎలీషా పరలోకమునకు పోయెను. కానీ ఎలీషా దేవుని వాక్యమును కలిగియున్నాడని అతడెరిగియున్నాడు, కావున అతడు వాక్యముతో నిలబడ్డాడు. నేను దానిని ఇష్టపడుచున్నాను. వాక్యముతో నిలిచియుండుడి.

96 యేసుక్రీస్తు నిన్నా, నేడు, మరియు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడనియు; ఆయన శక్తి ఇంకనూ ఒక్కటే రీతిగానున్నదనియు; పరిశుద్ధాత్మ ఇచ్ఛయించువారికనియు, బైబిలు చెప్పినయెడల, ఆయనను రానీయుడి, వాక్యముతో నిలిచియుండుడి. అవును, అయ్యా! మిగతా వారు ఏమిచెప్పినా ఫర్వాలేదు. వారెంత మంచిగా పోషించబడి మరియు వారెన్ని పాఠశాలల గుండా వెళ్ళినా గానీ, దానితో ఎటువంటి సంబంధం లేదు.

కావున పిదప అతడు చెప్పెను…తన తలపై ఈ పెద్ద కొమ్ములను కలిగియున్న ఈ వ్యక్తి, దానిని నెట్టబోవుచుండెను—రాజు యెదుట నుండి ఆ దేశము నిర్మూలమగును. అతడు నడిచివెళ్ళి మరియు అతడిని నోటి మీద కొట్టెను (ఈ చిన్న బోధకుడిని). అతడు కేవలం ఒక చిన్న పరిశుద్ధ గుండ్రాయని అతనికి తెలుసు కావున దానిగూర్చి చెప్పబడేది ఏమియూ లేదు, కావున అతడు ఆయనను నోటి మీద కొట్టెను. అతడిట్లనెను, “నేను నిన్ను ఒకటి అడగగోరుచున్నాను.” ఇట్లు చెప్పెను, “నీవు దానిని కలిగియున్నచో దేవునియొక్క ఆత్మ నాయొద్ద నుండి ఏ మార్గమున పోయెను?”

97 అతడిట్లు చెప్పెను, “నీవు ఒక బందీగా చెరపట్టబడి ఆ గుహలో కూర్చుండియున్నప్పుడు నీవు తెలుసుకుంటావు.” ఇంకా ఇట్లనెను, “దేవుడు సింహాసనం మీద ఆశీనుడైయుండుటయు (ఆమేన్! ఇప్పుడు వినండి!), మరియు పరలోక సైన్యమంతయు ఆయన చుట్టూ నిలబడియుండుటను నేను చూచితిని.” విషయం ఏమిటి? ఆహాబుకు ఏమి జరగబోతుందనే దాని గూర్చి తన ప్రవక్త ముందుగానే చెప్పెను. దేవుడు…దానిని చెప్పినది ఏలియా కాదు; అది అభిషేకించబడిన ప్రవక్తయైయుండెను. అది ప్రభుయొక్క మాటయైయుండెను, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడైయ్యుండెను. మరియు మికాయ ఇట్లు చెప్పెను, “పరలోక సైన్యమంతయు ఒక సమావేశముగా దేవుని చుట్టూ కూడియుండుటను నేను చూచితిని. మరియు వారు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచుండిరి. మరియు ప్రభువు ఈలాగున చెప్పెను, ‘అచ్చటికి వెళ్ళుటకు మనము ఎవరిని తీసుకొందుము, దేవుని వాక్యమును నెరవేర్చునట్లు, అతడిని అచ్చటికి తీసుకువచ్చి మరియు, అతడు చంపబడునట్లు ఆహాబును మోసగించుటకు మీలో ఎవరు వెళ్ళెదరు? అక్కడికి వెళ్ళుటకు మనమెవరిని తీసుకొందుము?’”

98 మంచిది, ఇతడిని లేదా అతడిని అని ఒకరు చెప్పుచున్నారు. మరియు కొద్దిసేపటి తర్వాత, ఒక అపవిత్రాత్మ, ఒక అబద్ధములాడు ఆత్మ క్రిందనుండి వచ్చి మరియు ఇట్లు చెప్పెను, “నీవు కేవలం నాకు అనుమతిస్తే చాలును. నేనొక అబద్ధములాడు ఆత్మనైయున్నాను. నేను క్రిందికి వెళ్ళి మరియు ఆ బోధకులందరిలోనికి వెళ్ళుదును, ఎందుకనగా వారు పరిశుద్ధాత్మను కలిగిలేరు; మరియు నేను వారిని (వారు కేవలం పాఠశాల-తర్ఫీదు గల అబ్బాయులు)—మరియు నేను క్రిందకు వెళ్ళి, మరియు వారిలో ప్రతీఒక్కరిలోనికి వెళ్ళుదును, మరియు వారిని మోసగించెదను, మరియు వారు ఒక అబద్ధమును ప్రవచించునట్లు చేయుదును.” అతడు దానిని చెప్పాడా? మరియు, “ఆ విధంగా మేము మోసం చేస్తాము,” అని అతడు చెప్పెను. కావున అతడు క్రిందికి వెళ్ళెను.

అతడు చెప్పెను—దేవుడు ఇట్లు చెప్పెను, “నీవు వెళ్ళడానికి నేను అనుమతిస్తున్నాను.”

99 మరియు అతడు క్రిందికి వెళ్ళి మరియు పాఠశాల-శిక్షణ పొందిన పరిచర్యగల, ఆ అబద్ధ ప్రవక్తలలోనికి ప్రవేశించి, మరియు వారిని ఒక అబద్ధమును ప్రవచించేలా చేశాడు. అది దేవుని చిత్తము కొరకు పనిచేయుచున్న ఒక అబద్ధమాడే ఆత్మయైయున్నది. నన్ను…ఇక్కడ మీరు మరొక దానిని చూడవచ్చును, కేవలం ఒక్క నిమిషం. దీనిని గమనించండి. కేవలం ఒక్క నిమిషము, మీరు నాతోపాటు మెదటి కొరింథీయులు 5వ అధ్యాయం, 1వ వచనమునకు త్రిప్పాలని నేను కోరుచున్నాను. మొదటి కొరింథీ…మరియు మీరు దేనినైనా చూడాలనుకుంటే, దేవుడు దేనినైనా చేయుటను—ఆ దురాత్మలు ఎలా, అవి—అవి ఎట్లు కదులుతాయన్నది చూడాలనుకుంటే దీనిని గమనించండి…అది సరియే, పౌలు మాట్లాడుచున్నాడు:

మీలో జారత్వము జరుగుచున్నదని వదంతి కలదు, మరియు అట్టి జారత్వములు అవి…అన్య జనులలోనైనా జరుగవు,…(అట్టిది సంఘములో జరుగుటను గూర్చి మీకేమి తోచుచున్నది?)…ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట.

అయిననూ మీరు ఉప్పొంగుచున్నారు, కానీ ఎంతమాత్రమూ…(మనం చూద్దాం. నేను రెండు పేజీలను త్రిప్పానని నేను అనుకుంటున్నాను…)…మీరు అట్లున్నారు—మరియు మీరు ఉప్పొంగుచున్నారు, గానీ ఎంతమాత్రము దుఃఖపడలేదు, అది…(ఇప్పుడు, ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. నేను…అవునండీ, అది నిజము. అవును.)…దుఃఖపడలేదు…(అంతే.)…ఉప్పొంగుచున్నారు, కానీ ఎంతమాత్రము…దుఃఖపడలేదు, యీలాటి కార్యము చేసిన వానిని మీలోనుండి వెలివేసినవారు కారు.

100 నాకు తెలియదు. దీని విషయమై ఇంతకన్నా ఎవరైనా చెబుతారని లేదా తగ్గిస్తారని నేను నమ్మను, అయితే కేవలం నేను నమ్ముచున్నదానిని నేను సమర్ధించుచున్నాను: ఒక మనిషి ఒక్కసారి ఆత్మతో నింపబడినాడంటే అతడు దానిని కోల్పోలేడు. చూడండి, చూశారా?

నిశ్చయంగా నేను, దేహవిషయమై దూరముగా ఉన్నను, ఆత్మవిషయమై సమీపముగా ఉండి, మీతో కుడా ఉండినట్టుగానే, యిట్టి కార్యము ఈలాగు చేసినవానిని గూర్చి, యిదివరకే తీర్పు తీర్చియున్నాను,

ప్రభువైన యేసుక్రీస్తు నామములో, మీరు కూడుకున్నప్పుడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలముతో, నా ఆత్మయు,

అట్టి వానిని శరీరేచ్చలు నశించుటకై సాతానునకు అప్పగింపవలెను, తద్వారా ప్రభువైన యేసు దినమందు ఆ ఆత్మ రక్షించబడవచ్చును.

101 దేవుడు, ఇక్కడ భూమి మీద తన శరీరమైయున్న, పరిశుద్ధ సంఘముతో చెప్పుచున్నాడు, అదేమనగా (ఇప్పుడు, ఇది పాత నిబంధన తర్వాత, క్రొత్త దానిలోయై యున్నది) తన స్వంత తండ్రి భార్యతో జీవించేంత అసభ్యంగా మరియు నీచంగా ప్రజల మధ్య ఉన్నటువంటి ఒక వ్యక్తితో చెప్పుచున్నాడు. ఇట్లన్నాడు, “క్రీస్తు యొక్క శరీరములో అటువంటి కార్యమున్నచో…సంఘమైయున్న మీరు, అట్టివానిని, నాశానమునకై సాతానునకు అప్పగించండి…” చూశారా? దేవుడు అనుమతిస్తాడు…మరియు ఆయన జరిగించవలసినది ఏదైనా ఉన్నప్పుడు, ఎవరిమీదైనా ఒక కొరడా ఝుళిపించాలని అనుకున్నప్పుడు, ఆ వ్యక్తిని బాధించి మరియు—మరియు వారిని తిరిగి తీసుకువచ్చుటకు ఆయన ఒక దురాత్మను వారి పైకి వదులుతాడు. ఇప్పుడు, ఈ వ్యక్తిని మనము కనుగొంటాము…

102 ఈ రోజున సంఘములతో వచ్చిన ఇబ్బంది అదియే. ఒక మనిషి క్రీస్తుయొక్క శరీరములోనికి వచ్చి మరియు సభ్యులలో ఒకడిగా మారి మరియు కీడు చేయుటను ప్రారంభించినప్పుడు, మీరంతా కూడుకొని మరియు అదే కార్యమును చేయుటకు బదులు…మరియు మీరు, బ్రెన్హామ్ ఆలయము, దానిని చేయండి. ఎందుకనగా అతణ్ణి మీరు ఎత్తిపట్టుకున్నంత కాలం, అతడు రక్తము క్రింద ఉండును. మరియు అతడు మళ్ళీ మళ్ళీ మరియు అన్నివేళలా ఇక అదే పాత కార్యమును చేస్తుంటాడు. మీరంతా కూడుకొని మరియు శరీరేచ్ఛలు నశించుటకై అతణ్ణి అపవాదికి అప్పగించండి, తద్వారా అతని ఆత్మ—ఒక విధంగా—ప్రభువు దినమందు రక్షింపబడవచ్చును. మరియు దేవునియొక్క కొరడా వచ్చుటను గమనించండి. అపవాది అతణ్ణి పట్టుకొనుటను గమనించండి. అతణ్ణి పట్టుకునేది ఒక దురాత్మయైయున్నది.

103 మరియు ఇక్కడ ఈ అబ్బాయి సరిచేయబడినాడు. అతడు తిరిగి వచ్చాడు. అతడు దేవుని ఎదుట నిజంగా పరిశుద్ధపరచబడుటను మనం రెండవ కొరింథీలో కనుగొంటాము.

104 ఒక పరిపూర్ణమైన వ్యక్తియు, ఒక నీతిమంతుడునైన, యోబును చూడండి. మరియు దేవుడు ఒక చెడ్డ దయ్యమును అతడి మీదకి వచ్చుటకు అనుమతించెను, మరియు అతడిని శిక్షించెను, మరియు అతని ఆత్మయొక్క పరిపూర్ణత కొరకు ప్రతీది చేసెను. చూశారా? కావున దురాత్మలను…దేవుడు తన ప్రణాళికను మరియు తన చిత్తమును నెరవేర్చుటకు చాలాసార్లు దురాత్మలను ఉపయోగించును.

95. ఇప్పుడు, ఇక్కడ నిజంగా గుచ్చుకొనదగినది ఒకటి ఉన్నది. ప్రశ్న ఏదనగా (అదే వ్యక్తియని నేను అనుకొనుచున్నాను, ఎందుకనగా అది అదే చేవ్రాతలా ఉన్నది): మార్పుచెంది మరియు ఎత్తబడుటలోనికి వెళ్ళుటకు ఒక వ్యక్తి తప్పనిసరిగా పరిశుద్ధాత్మను కలిగి—పరిశుద్ధాత్మను కలిగియుండాలంటే, ఏండ్లు నిండకముందే మరణించిన పిల్లల పరిస్థితి ఏమిటి? మరియు వారు ఎప్పుడు లేచెదరు?

105 ఇప్పుడు, నా సహోదరుడా, సహోదరీ, నేను దానిని మీకు చెప్పలేను. నేను దానిని ఎక్కడైనా కనుగొనుటకు బైబిలు గ్రంథములో దానిపై ఎటువంటి లేఖనము లేదు. అయితే నేను నా ఆలోచనలను వ్యక్తపరచగలను. ఇప్పుడు, దేవుని కృపయందు నమ్మికయుంచు మిమ్మల్ని ఇది బలపరుస్తుంది. మీరు చూడండి, ఆ వ్యక్తి తెలుసుకొనగోరుచున్నాడు (ఇది చాలా మంచి ప్రశ్న. చూశారా?) పునరుత్థానము ఏమిటో—ఒక చిన్న బిడ్డకు ఏమి జరుగుతుందోనని ఆ వ్యక్తి తెలుసుకొనగొరుచున్నాడు. ఎత్తబడుటలోనికి వెళ్ళుటకు అతడు పరిశుద్ధాత్మను కలిగియుండవలసినచో…నేను చెప్పినట్లు, అది వాస్తవం. అది బైబిలు ప్రకారముగానున్నది. అది లేఖనముయొక్క బోధనయైయున్నది. కాదు—పరలోకానికి వెళ్ళుటకు కాదు…ఎందుకనగా పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రజలు మొదటి పునరుత్థానమైయున్నారు, ఆ ఏర్పరచబడినవారు. మరియు ఆ మిగిలిన వారు…ఆ కడమ మృతులు ఒక వెయ్యి సంవత్సరాల వరకు బ్రతుకలేదు. వెయ్యేండ్ల తర్వాత, అప్పుడు రెండవ పునరుత్థానము, గొప్ప ధవళ సింహాసనపు తీర్పు. చూశారా? అది ఖచ్చితంగా బైబిలు క్రమమైయున్నది. కానీ ఈ వ్యక్తి ఈ పసి పిల్లల సంగతి ఏమగునో అని తెలుసుకొనగోరుచున్నాడు. వారు…ఇంకో మాటలో చెప్పాలంటే, వారు పుట్టక ముందు వారు పరిశుద్ధాత్మను కలిగియున్నారా? వారు దానిని పొందుకున్నారా? ఇప్పుడు, దానిని నేను మీకు చెప్పలేను.

106 కానీ ఇప్పుడు, మనం ఈ విధంగా చెప్పుకుందాము: చనిపోయిన చిన్న బిడ్డలు, వారి తల్లిదండ్రులతో నిమిత్తము లేకుండా వారు రక్షించబడుదురని, మనము ఎరిగియున్నాము. ఇప్పుడు, దానిపై ప్రవక్తల పాఠశాలతో నేను ఏకీభవించను. అది—పాపియైన తల్లిదండ్రులను కలిగియుండి అది మరణించినయెడల, ఆ బిడ్డ నరకమునకు వెళ్ళుననియు, నశించిపోవుననియు; ఇక అది ఉండదని వారు చెప్పిరి. మంచిది, యేసు…యేసు వచ్చినప్పుడు యోహాను ఇట్లు చెప్పెను, “ఇదిగో లోక పాపములను మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల.” మరియు ఆ బిడ్డ గనుక దేవునియొక్క తీర్పుల క్రిందకు రావలసిన ఒక మానవుడైతే, మరియు పాపమును తీసివేయుటకు యేసు మరణించెను, యేసు ఆ ఉద్దేశ్యము కొరకు మరణించినప్పుడు దేవుని యెదుటనుండి సమస్త పాపము నిర్మూలమయ్యెను. మీ పాపములు క్షమించబడినవి. నా పాపములు క్షమించబడినవి. మరియు మీరు ఎన్నడైనా క్షమించబడగల ఒకే ఒక మార్గమేదనగా ఆయనయొక్క క్షమాపణను అంగీకరించుటయే. ఇప్పుడు, ఆ బిడ్డ తన క్షమాపణను అంగీకరించలేదు, అది ఏమియూ చేయలేదు. అది అసలు ఏమియూ చేయలేదు. కావున పరలోకమునకు వెళ్ళుటకు అది సంపూర్ణముగా స్వతంత్రముగానున్నది.

107 కానీ మీరిట్లు చెప్తారు, “వారు ఎత్తబడుటలోనికి వెళ్తారా?” ఇప్పుడు—ఇప్పుడు, ఇది నా స్వంత మాట; ఇప్పుడిది నా స్వంత ఆలోచనయైయున్నది. వద్దు…బైబిలు ద్వారా నేను దీనిని ఋజువు చేయలేను. అయితే చూడండి. దేవుడు గనుక, జగత్తు పునాది వేయబడుటకు ముందే, భూమి మీద ఉండబోవు ప్రతీ మానవుడిని ఎరిగియున్నయెడల…మీరు దానిని నమ్ముదురా? ఆయన ప్రతీ దోమను, ప్రతీ మిణ్ణల్లిని, ప్రతీ ఈగను ఎరిగియున్నాడు, భూమి మీద ఉండబోవు ప్రతిదానిని ఆయన ఎరిగియున్నాడు. ఆయన దానిని ఎరిగియున్నట్లైతే…

108 చూడండి. ఉదాహరణకు, మనము మోషేను తీసుకుందాము. మోషే పుట్టినప్పుడు, అతడొక ప్రవక్తయైయుండెను. యిర్మియాకి ముందే…దేవుడు యిర్మియాతో ఇట్లు చెప్పెను, “తల్లి గర్భములో నీవు రూపించబడక ముందే, నీవు ఆమె గర్భములో రూపుదాల్చక ముందే, నేను నిన్ను ఎరిగియున్నాను, మరియు నిన్ను పరిశుద్ధపరచి, జనములకు నిన్ను ఒక ప్రవక్తగా నియమించాను.” బాప్తీస్మమిచ్చు యోహాను, అతడు పుట్టడానికి ఏడు వందల పన్నెండ్రు సంవత్సరాలకు ముందే, యెషయా అతణ్ణి ఒక దర్శనమందు చూసెను, ఇట్లు చెప్పెను, “అతడు అరణ్యములో కేక వేయు ఒకని స్వరము.”

109 దేవునియొక్క ఎన్నిక లేదా ముందు జ్ఞానమునకు ఆ చిన్న బిడ్డలను గూర్చినదంతయు తెలియును (చూశారా?), వారేమి చేయబోవుదురన్నది తెలియును. మరియు వారు చనిపోవుదురని ఆయన ఎరిగియున్నాడు. ఆయనకు తెలుసు. దాని గూర్చి దేవునికి తెలియకుండా ఏదియు సంభవించదు. ఏదియు జరగనేరదు…అది ఆ మంచి కాపరివలెనె అది ఉన్నది, ఆయన ఎట్లు లోపలికి వెళ్ళి…ఇప్పుడు, దీనిని లేఖనము ద్వారా తీసుకోవాలంటే, లేఖనము ఫలానా-మరియు-ఫలానా విధంగా చెప్తుందని నేను చెప్పలేను. నేను కేవలం దానిని నా ఆలోచనగా భావిస్తున్నాను.

96. ఇప్పుడు, తర్వాత ప్రశ్న ఏమిటనగా బహుశా ఏదైనా నేను గత రాత్రి చెప్పిన దాని గూర్చియై ఉండవచ్చు. శిశు ప్రసూతి వలన ఒక భార్య రక్షించబడుటను వివరించండి.

110 ఒక శిశువును ప్రసవించడం వలన భార్య రక్షించబడదు. కానీ మనమిప్పుడు ఒక్క క్షణం మొదటి తిమోతి 2:8 నకు త్రిప్పెదము. మరియు ఆ శిశువు గూర్చి బైబిలు ఏమి చెప్తుందో మనము కనుగొందాము. ఇప్పుడు, అది శిశు ప్రసూతి వలన స్త్రీ రక్షించబడుతుందని క్యాథలిక్కులు చెప్పునట్టి, ఒక క్యాథలిక్ సిద్ధాంతమని నేను గ్రహించుచున్నాను, ఒక శిశువును ప్రసవించుట వలన. కానీ మనమైతే…నేను దానిని నమ్ముటలేదు. మొదటి తిమోతి 2వ అధ్యాయము, మరియు 8వ వచనం నుండి మనం ప్రారంభించెదము, మరియు ఇప్పుడు ఒక్క క్షణం చదువుదాము. మంచిది, వినండి.

ఆ ప్రకారమే, మీ స్త్రీలు తగుమాత్రపు వస్త్రముల చేతనే అలంకరించుకొని…(మనం దానిని అడగకూడదు, అడగవచ్చా? దీనిని వినండి.)…అణుకువతోను…(వ్యూ!)…మరియు స్వస్థబుద్ధి గలవారునైయుండి; తన జుట్టును ఆమె జడలతోనైనను, లేదా బంగారముతో, లేదా ముత్యములతో, లేదా మిగుల వెలగల వాటితో అలంకరించుకొనక; (సహోదరులారా, ఇక్కడ నేను మీకు సహాయము చేస్తున్నానని, నేను ఆశించుచున్నాను. ప్రతీ రోజు లేదా ప్రతీ మూడు రోజులకి ఈ క్రొత్త టోపీలన్నియు ఉంటున్నవి. మీరు చూస్తున్నారా? అది క్రైస్తవులుగా అవ్వడం కాదు.)

అయితే (దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా) సత్ క్రియల చేత అలంకరించుకొనవలెను.

మీ స్త్రీలు మౌనముగా నుండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను.

అయితే స్త్రీలు, మౌనముగా ఉండవలసినదేగాని…ఉపదేశించుటకైనను, లేదా పురుషుని మీద అధికారము చేయుటకైనను…ఆమెకు సెలవియ్యను.

ఏలయనగా మొదట ఆదామును, మరియు ఆ తరువాత హవ్వయును నిర్మింపబడిరి.

…ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను.

అయిననూ శిశుప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును…(ఇప్పుడు, ఆయన పిల్లలను కలిగియున్న, లోకసంబంధమైన స్త్రీలతో మాట్లాడుటలేదు.)…ఆమె విశ్వాసములో కొనసాగినయెడల…(చూశారా? ఆమె కొనసాగినయెడల. ఆమె ఇదివరకే…ఆయన మాట్లాడుచున్నది ఆ స్త్రీల గూర్చి, అనగా ఇదివరకే రక్షింపబడిన స్త్రీల గూర్చియైయున్నది. చూశారా?)…మరియు స్వస్థబుద్ధి కలిగి ప్రేమ మరియు పరిశుద్ధతలు కలిగియుండవలెను.

111 ఒక బిడ్డను కనడంవలన ఆమె రక్షింపబడదు, కానీ ఆమె పిల్లలను పెంచడంద్వారా, ఆమె కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నందుకైయున్నది, పిల్లులను, కుక్కలను, మరియు ఈనాడు వారు చేస్తున్నట్లు ఒక బిడ్డయొక్క స్థానమును తీసుకొనుటకు, ఇంకా-వేటినో పెంచుటవలన కాదు, వాటికొక తల్లి ప్రేమను ఇచ్చి తద్వారా ఆమె బయటకు వెళ్ళి మరియు రాత్రంతా తిరగడానికైయున్నది. కొందరు ప్రజలు అలా చేస్తారు. క్షమించండి, కానీ వారు అలా చేస్తారు. నేను అది చెప్పడం చాలా కఠినంగా ఉంది, కానీ సత్యము సత్యమే. చూశారా? ఒక బిడ్డ దానితో ముడివేయబడాలని వారు కోరుకొనరు. కానీ శిశుప్రసూతిలో, ఆమె గనుక విశ్వాసము, ప్రేమ, మరియు పరిశుద్ధతలయందు కొనసాగినయెడల, ఆమె రక్షింపబడుతుంది. కానీ ఆ అయితే అనేది ఏమిటనగా, మీరు తిరిగి జన్మించినట్లయితే మీరు కూడా రక్షింపబడుదురు. మీరు నమ్మినట్లయితే మీరు స్వస్థపరచబడగలరు. మీరు దానిని నమ్మినట్లయితే, దానికై సిద్ధపడుడి, మీరు దానికొరకు సిద్ధముగా ఉన్నట్లయితే మీరు పరిశుద్ధాత్మను పొందుకొనగలరు. మరియు ఆమె ఇట్టి కార్యములను చేయుచుండినయెడల ఆమె రక్షింపబడును (చూశారా?), అంతేగాని ఆమె ఒక స్త్రీ అయినందువలన కాదు. కావున అది సరియే, సహోదరుడా, సహోదరి. ఇది ఒక క్యాథలిక్ బోధన ఎంతమాత్రము కాదు. ఇప్పుడు నేను…ఇక్కడ చాలా గుచ్చుకునేలాంటి మరొక ప్రశ్న ఉన్నది. పిదప మనకు మరొకటి ఉన్నది. బహుశా మనకు దాని కొరకు సమయం ఉన్నది నేను అనుకొనుచున్నాను. నేను మన సమయాన్ని తీసేసుకున్నాను. ఇప్పుడు, అది కేవలం—ఇది కేవలం ఆ ఉజ్జీవము యొక్క పరిణామాలైయున్నవి. ఇది అనగా ఈ ప్రశ్నలు, కూటముయొక్క ప్రభావాలైయున్నవి.

97. ఇప్పుడు: సహోదరుడా బ్రెన్హామ్ (ఇది టైపు చేయబడినది), ఒక వ్యక్తి భాషలలో మాట్లాడి మరియు తన స్వంత సందేశమును అనువదించడం లేఖనానుసారమేనా? అట్లైనచో, దయచేసి వివరించండి. మొదటి కొరింథీ లేదా కొరింథీ 14:19 మరియు కొరింథీ 14:27 కూడా.

112 మంచిది, మనం ఆ లేఖనములోనికి వెళ్ళి మరియు అది ఏమి చెప్పుచున్నదో చూద్దాము. మరియు పిదప మనం దీనిని లేఖనానుసారంగా ఉంచుతున్నామో లేదో చూద్దాము. మనము ఎల్లప్పుడూ లేఖనానుసారంగా ఉండాలని కోరుచున్నాము. మరియు కొరింథీ 14. ఇప్పడు, ఆ వ్యక్తి తెలుసుకొనగోరుచున్నది ఏమిటనగా ఒక వ్యక్తి తాను భాషలలో మాట్లాడిన తన స్వంత సందేశమును అనువదించుట లేఖనానుసారమేనా అన్నదైయున్నది. “అట్లైనచో, కొరింథీ 14:19 వివరించండి.” మనం చూద్దాం, 14 మరియు 19. అది సరియే, మనమిక్కడ ఉన్నాము.

అయినను సంఘములలో నేను…అన్య భాషలలో పదివేల మాటలు పలుకుటకంటె, నా స్వరము చేత ఇతరులకు బోధకలుగునట్లు, నా మనస్సుతో…అయిదు…మాటలు పలుకుట మేలు.

ఇప్పుడు, తరువాత వారు తెలుసుకొనగోరినది, 27వ వచనమైయున్నది.

ఏ వ్యక్తియైనా ఒక అన్య భాషతో మాటలాడితే, ఇద్దరు, లేదా ఒక…అవసరమైతే ముగ్గురు, మరియు అది వంతులచొప్పున మాటలాడవలెను; మరియు ఒకడు అనువదించవలెను.

113 ఇప్పుడు, ఆ వ్యక్తి దేనిని చెప్పుటకు ప్రయత్నిస్తున్నాడో దానిని నేను తీసుకుంటాను (నాకు కావలసినది—ఒక్క క్షణం నేను మీకొరకు ఒక దానిని చదవబోవుచున్నాను). కానీ ఆ సహోదరుడు లేదా సహోదరి దేనిని చెప్పుటకు ప్రయత్నిస్తున్నారని నేను అనుకొనుచున్నానంటే, “భాషలలో మాట్లాడుచున్న ఒక వ్యక్తి తాను చెప్పిన సందేశమునకు అనువాదము కూడా చెప్పడం సరియేనా?” ఇప్పుడు, ప్రియమైన స్నేహితుడా, నీవు కేవలం అదే అధ్యాయంలోని 13వ వచనం చదివినట్లైతే, అది నీకు చెప్తుంది:

అన్య భాషతో మాటలాడువాడు అనువాదము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను.

114 నిశ్చయంగా. అతడు తన స్వంత వర్తమానమును అనువదించవచ్చును. ఇప్పుడు, మనం కేవలం…మనము గనుక…మంచిది, మీరు…ఇక్కడున్న దానంతటిని చదవండి, మరియు మీరు చూడగలరు అది…కేవలం ఆ అధ్యాయమంతటిని చదవండి. అది చాలా బాగున్నది, దానిని వివరిస్తుంది.

115 ఇప్పుడు, భాషలతో మాటలాడుట…ఇప్పుడు, మనము దానిపై ఉండగా, మరియు ఇది టేపు చేయబడుచుండగా, నేను చెప్పగోరునది ఏమిటనగా నేను దైవిక స్వస్థతను, మరియు ఆ—ఆ పరిశుద్ధాత్మ బాప్తీస్మమును, క్రీస్తుయొక్క రెండవ రాకడను, మరియు రాబోవు లోకపు శక్తిని ఎంతగా నమ్ముచున్నానో, భాషలతో మాట్లాడుటను కూడా అంతే నమ్ముచున్నాను; నేను దానిని ఎంతగా అయితే నమ్ముచున్నానో దీనిని అంతే నమ్ముచున్నాను, కానీ భాషలలో మాట్లాడుట దాని స్థానమును కలిగియున్నదని నేను నమ్ముచున్నాను అది సరిగ్గా క్రీస్తుయొక్క రాకడకు దాని స్థానము ఉన్నట్లే; దైవిక స్వస్థతకు దాని స్థానం ఉన్నట్లే; ప్రతిదానికి దాని స్థానం ఉండియున్నది.

116 ఇప్పుడు, ప్రజలైన మీకు, దీనిని ఇప్పుడు చెప్పుటకు నాకు ఒక అవకాశం లభించినది, మరియు దానిని నేను వివరించుటకు ఇష్టపడుచున్నాను. మరియు నేను ఎవరినైనా బాధపెడితే, నా ఉద్దేశ్యం అది కాదు. గందరగోళం కలిగించాలని నా ఉద్దేశ్యం కాదు. అయితే వినండి. పెంతెకోస్తు ప్రజలు అన్య భాషలలో మాట్లాడటంలోని సంగతి ఏమిటి (అది నేనే; నేను పెంతెకోస్తువాడను. చూశారా?)…ఇప్పుడు, సమస్య ఏమైయుండెననగా: వారు దానిని గౌరవించరు. మరియు మరొక సంగతి, వారు దానిని కేవలం పద్దతి లేకుండా జరగనిస్తారు. వారు తిరిగి వాక్యమునొద్దకు రానొల్లరు.

117 ఇప్పుడు వినండి. ఈ విధంగా—అనుమతించారు—ఈ విధంగా సంఘము స్థిరపరచబడినది. ఇప్పుడు, ఒక పెంతెకోస్తు సంఘములో, నేను గనుక ఈ సంఘమునకు కాపరత్వము చేయుచున్నయెడల, నేను దానిని ఎలా స్థిరపరచియుండేవాడినో మీకు చెప్తాను (చూశారా?), నేనైయున్నచో—దానికి కాపరత్వము చేయడానికి నేనెప్పుడూ ఇక్కడ ఉండునట్లైతే యైయున్నది. బైబిలులోని ప్రతీ వరమునకు నేను చందాదారుడిని అవుతాను. మొదటగా పరిశుద్ధాత్మలోనికి బాప్తీస్మము పొందమని విశ్వాసులకు చెప్తాను. మరియు పిదప, మొదటి కొరింథీ 12 లోని ప్రతీ వరము నా సంఘములో పనిచేయాల్సి ఉంటుంది, నేను వారిని అక్కడికి తీసుకు రాగలిగినయెడల, శరీరమంతా పనిచేస్తుంది.

118 ఇప్పుడు, మీరు గమనించినయెడల…ఇప్పుడు ఏదో కించపరచాలని కాదు. మరియు గుర్తుంచుకొనండి, నేను ఒక్క మాటయైనను విరుద్ధంగా చెప్పను—బహుశా నేను పరిశుద్ధాత్మను దూషిస్తానేమో. మరియు నేను అటువంటి తప్పును పలుకనని దేవునికి తెలుసు. చూశారా? అయితే ఇప్పుడు దాదాపు ఇరవై ఏళ్లుగా నేను దానిని అధ్యయనం చేసిన తర్వాత లేఖనము యొక్క కోణాన్ని మీకు ఇవ్వడానికి ప్రయత్నించుటకు మాత్రమే నేను దీనిని చెప్తున్నాను. నేను దాదాపు ముప్పై సంవత్సరాలుగా బోధిస్తున్నాను. మరియు నేను ప్రతీదానిగుండా వచ్చాను, కేవలం బ్రతికి బయటపడ్డాను; అది ఎట్లుండియుండునో మీరు ఊహించగలరు. మరియు ప్రపంచమంతటా ప్రతీ వ్యక్తిని, మరియు వారి సిద్ధాంతమును, గమనిస్తూ వచ్చాను. మరియు నా ఆసక్తిని బట్టి దానిని పట్టించుకున్నాను. అది నా కొరకు మాత్రమే కాకుండా మానవులపట్ల ఉన్న ఆసక్తియైయున్నది. నేనిక్కడ నుండి వెళ్ళవలసియున్నది. మీరును ఇక్కడినుండి వెళ్ళవలసియున్నది. మరియు నేనొక అబద్ధ ప్రవక్తగా వెళ్ళినయెడల, నేను నా స్వంత ఆత్మను కోల్పోతాను మరియు నాతో పాటు మీ ఆత్మలను కోల్పోతాను. కావున అది అంతకన్నా—అది అనుదిన ఆహారముకన్నా మిన్నయైనది; అది పేరు ప్రఖ్యాతలకన్నా గొప్పది; అది దేనికంటెను గొప్పది; అది నాకు జీవమైయున్నది. చూశారా? మరియు నేనెల్లప్పుడూ చాలా ప్రగాఢమైన యధార్థతతో ఉండగోరుచున్నాను.

119 ఇప్పుడు, మీరొక పెంతెకోస్తు సంఘములోనికి వెళ్ళండి, మొదటిది…(వారందరు అని నా ఉద్దేశ్యం కాదు. కొందరు అలా ఉన్నారు…) అనేక సార్లు మీరొక సంఘములోనికి వెళ్ళి మరియు ప్రసంగాన్ని మొదలుపెడతారు; మీరు ప్రసంగిస్తుండగా, ఎవరో ఒకరు పైకి లేచి భాషలలో మాట్లాడతారు. ఇప్పుడు, ఆ ప్రియమైన వ్యక్తి పరిపూర్ణముగా పరిశుద్ధాత్మచేత నింపబడియొండవచ్చును, మరియు ఆ వ్యక్తి ద్వారా మాటలాడునది ఆ పరిశుద్ధాత్మయే కావచ్చును, కానీ దానిలోని విషయమేమిటంటే, వారు తర్ఫీదులేనివారు. ఈ వేదిక వద్దనున్న ఈ పరిచర్య ప్రేరేపణ ద్వారా మాటలాడుచున్నచో, అప్పుడు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తయొక్క ఆధీనములో నుండును. చూశారా? “సమస్త కార్యములు జరగనియ్యుడి…” ఇప్పుడు, అతడు ఎందుకు అలా చెప్పుచున్నాడని చూచుటకు ఇక్కడ పౌలు వద్దకు వద్దాము “ఒకడు మాట్లాడునప్పుడు,” మరియు ఆ విధంగా…“అతడు లోనికి వచ్చినప్పుడు, అక్కడ కేవలం ఒక గందరగోళముగా నుండెను.”

120 ఇప్పుడు, నేను వేదిక నొద్దకు పిలిపును ఇచ్చుచుండగా, మరి ఎవరో పైకి లేచి మరియు భాషలలో మాటలాడెదరు. అది కేవలం…సరి, అప్పుడిక మీరు వేదిక పిలుపును ఆపివేయడం మంచిది. అది దానిని ఆపివేస్తుంది. చూశారా?

121 మరియు పిదప, మరొక సంగతి. చాలా సార్లు ప్రజలు పైకి లేచి భాషలలో మాట్లాడుదురు, మరియు ప్రజలు కూర్చుని మరియు బబుల్ గమ్ నములుచు, చుట్టూ చూస్తుంటారు. దేవుడు మాట్లాడుచున్నయెడల, మౌనంగా ఉండి, వినండి! అది సత్యమైనయెడల, ఆ వ్యక్తిలో నుండి మాట్లాడుచున్నది ఆ పరిశుద్ధాత్మయైనయెడల, మీరు మౌనంగా కూర్చుని మరియు వినండి, భక్తిమర్యాదలతో నుండుడి. ఆ అనువాదం మీకు రావచ్చును. చూశారా? ఊరక కూర్చొనుడి; అనువాదము కొరకు ఆలకించండి. ఇప్పుడు, సంఘములో అనువాదకుడు లేనియెడల, అప్పుడు వారు శరీరములో ఊరకుండవలసియున్నారు.

122 మరియు పిదప, వారు ఒక అన్య భాషతో మాట్లాడినయెడల, వారు తమకుతాము దేవునితో మాటలాడుచున్నారని, బైబిలు చెప్పెను. అన్య భాషలలో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనుచున్నాడు. ఇప్పుడు, అవి అన్య భాషలైయున్నవి; మాండలికములు, భాషలు వ్యత్యాసమైనవి. “అవి ఏమీ కావు,” అని అతడు చెప్పును…కానీ చేయబడిన ప్రతీ శబ్దానికి ఒక అర్ధముంటుంది. కానీ మీరు…ఒక బూర మ్రోగినయెడల, అది ఏ ధ్వనిని ఇచ్చునో మీరు తెలుసుకోవలసియున్నది (…కేవలం దానిని ఊదండి) లేనిచో యుద్ధమునకెట్లు సిద్ధపడవలెనో మీరెరుగరు. ఎవరైనా భాషలలో మాట్లాడినయెడల, మరియు కేవలం “తూతూ”; అన్నట్లు పలికితే దానిలోనిదంతయు అంతే, అప్పుడు ఏమి చేయాలో ఎవరికి తెలుస్తుంది. అయితే అది ఆ ప్రభాతభేరిని ప్రారంభించినయెడల, దాని అర్ధం “మేల్కొనుడి!” అది గనుక బాకానాదమును మ్రోగించినయెడల, దాని అర్ధం “విశ్రమించుడి.” చూశారా? అది దాడి చేయుము అని మ్రోగినయెడల దాని అర్ధం “దాడి చేయుడి.” అది ఒక అర్థమును ఇవ్వవలసియున్నది, మరియు కేవలం ఊరకే పలకడం కాదు. కావున సంఘములో, అనువాదకుడు లేనియెడల, అయితే అనువాదకుడు ఉన్నయెడల, అప్పుడు భాషలనునవి సంఘమునకు చెందినవైయుండును.

123 ఇప్పుడు, నీ ప్రశ్నకు, ప్రియమైన స్నేహితుడా, అదిట్లు చెప్పుచున్నది, “ఐదు వేల మాటలు…పలుకుటకంటె, మరియు అన్య భాషలో ఐదు వేల మాటలు (లేక అది ఇంకెంత చెప్పితే అంత) పలుకుట కంటే ఐదు మాటలు పలికెదను, తద్వారా ప్రజలకు అర్ధమగును.” అది సత్యము. అయితే ఇంకా క్రిందకు చదవండి: “…అది ప్రత్యక్షత లేక అనువాదము ద్వారా క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తమై యుండవలెను.” చూశారా? క్షేమాభివృద్ధి కలుగుటకైయున్నది.

124 ఇప్పుడు, నేను మీకొక చిన్న అవగాహనలాంటిది ఇస్తాను ఒకవేళ—ఏమిటి…వచ్చుచున్న ఈ సంఘమునకు నేను కాపరత్వము చేయవలసిన యెడల ఏమిటి, దానికి కాపరత్వము చేయడానికి దేవుడు నన్ను పిలచిన యెడల, నేను దానిని ఈ విధంగా నడిపిస్తాను: దానిలో ఒక వరమును కలిగియున్న ప్రతీ వ్యక్తిని నేను కనుగొనుటకు ప్రయత్నిస్తాను. మరియు కూటములు ఎన్నడైనా ప్రారంభామవ్వడానికి ఒక గంట ముందే, ఆ వ్యక్తులు ఒక గదిలో వారికి వారు మాత్రమే కూడుకొనునట్లు చేస్తాను. వారిని ఆత్మ క్రింద ఉండనిస్తాను. మరియు మొదటి సంగతి మీకు తెలుసా, ఒకరు వస్తారు, అతనికి భాషలలో మాట్లాడు వరమున్నది. మరియు అతడు భాషలలో మాట్లాడును. అందరు నిశ్శబ్దముగా కూర్చొనియుంటారు. మరియు పిదప ఒక వ్యక్తి లేచి మరియు అతడు చెప్పేదానిని అనువదిస్తాడు. ఇప్పుడు, అది సంఘమునకు ఇవ్వబడటానికి ముందు, అది ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల మధ్య తీర్పు తీర్చబడవలసియున్నది అని బైబిలు చెప్పుచున్నది. ఇప్పుడు, అది ఆ వ్యక్తి ఆత్మ యొక్క వివేచనను కలిగియుండవలెను (చూశారా?), ఎందుకనగా చాలాసార్లు దుష్టశక్తులు కూడ అందులోనికి వచ్చును. (చూశారా?) పౌలు దాని గూర్చి మాట్లాడియున్నాడు. మరి అయితే, దేవుని శక్తి కూడ అక్కడ ఉన్నది. దుష్టత్వము లేని ఒక సభను గూర్చి నాకు చెప్పండి. సాతాను వారి మధ్యలో లేకుండ దేవుని కుమారులు ఎక్కడ కూడుకున్నారో నాకు చెప్పండి. ప్రతీది అదేయైయున్నది. కావున దాని విషయమై విచారించకండి. చూశారా? సాతాను అంతటాయున్నాడు. ఇప్పుడు, మనమిక్కడ ఉన్నాము. ఎవరో ఒకరు భాషలలో మాట్లాడెదరు. ఇప్పుడు, వివేచనాత్మను కలిగియున్న ముగ్గురు అక్కడ కూర్చొనియున్నారు. మరియు ఒకరు భాషలలో మాటలాడి మరియు ఒక వర్తమానమును ఇస్తారు. ఇప్పుడు, అది లేఖనమును నొక్కి చెప్పడం కాదు, ఎందుకంటే దేవుడు వ్యర్ధమైన పునరావృతములను ఉపయోగించడు, మరియు అట్లు చేయవద్దని ఆయన మనతో చెప్పెను. చూశారా? కావున అది అట్లు కాదు. అది సంఘమునకు ఒక వర్తమానమైయున్నది.

125 ఈ ఉజ్జీవములో ఇంతవరకు మనము రెండు విషయములను కలిగియున్నాము. వాటిలో ఒక్కొక్కటి ఏమైయున్నవో గమనించండి—సంపూర్ణముగా, సరియైన సమయములో యున్నవి. చూశారా? లోపలికి వచ్చెను. ఒక వ్యక్తి లేచి, మరియు భాషలలో మాట్లాడెను, మరియు అనువాదమును ఇచ్చి, మరియు తిరిగి వెనుకకు వెళ్ళెను, మరియు అప్పుడే బయలు వెళ్ళిన ఆ వర్తమానమును నిర్ధారించెను. మరొక రాత్రి మరొక వ్యక్తి లేచెను, మరియు చెప్పెను—ప్రవచనముయొక్క ప్రేరేపణలో, దేనినో చెప్పెను మరియు, తాను ఏమి చెప్పుచున్నాడో ఎరుగకుండానే పలికెను; పిదప ముగింపులో తాను ఇట్లు పలికెను, “ప్రభువు పెరట వచ్చువాడు స్తుతింపబడునుగాక.” వెంటనే వెనువెంటనే ఏదో నన్ను పట్టుకొని మరియు ఇట్లు చెప్పెను, “మరొక విధంగా ఇది ప్రభు వచ్చాడని నమ్మువాడు ధన్యుడు.”

126 చూడండి ఆ—పిదప గత రాత్రి పరిశుద్ధాత్మ భవనంలో కుమ్మరించబడినది. చూశారా? అది క్షేమాభివృద్ధి కొరకైయున్నది. వారు పరిశుద్ధాత్మను పొందుకోవలసి యున్నదని ప్రజలకు చెప్పడానికి ప్రయత్నించుచూ నేను అక్కడ నిలబడియుంటిని. మరియు దయ్యము ప్రజల చుట్టూ చేరి, ఇట్లు చెప్పుచుండెను, “వినకండి; ఊరకుండుడి.”

నా సహోదరి ఇట్లన్నది, “బిల్లీ, నీవు ప్రసంగించుచున్నప్పుడు నేను చాలా సంతోషముగా ఉన్నాను; నేను లేచి మరియు ఆ గోడ మీదుగా దూకగలను అన్నట్లు అనిపించినది.”

నేను అన్నాను, “లేచి మరియు గెంతుము.” అంతే.

మరియు ఆమె ఇట్లు చెప్పెను, “కానీ నీవు దానిని చేయుటకు వెళ్ళినప్పుడు,” ఇంకా చెప్పెను, “ప్రజలు అరవడం ప్రారంభించారు,” ఇట్లనెను, “అప్పుడు నేను వృద్ధురాలనై ఏమియు కాని దానను అని నాకనిపించింది.”

127 నేను ఇట్లన్నాను, “అది దయ్యమైయున్నది. అది సాతాను. దానిని చేయుటకు వాడు లోపలికి వచ్చినప్పుడు,” నేనన్నాను, “నువ్వు ఎలాగైనాసరే లేచియుండవలసియున్నది.” మనము ఆత్మీయ అర్పణను—అర్పణను అర్పించుచూ, దేవునికి యాజకులమైయున్నాము, మన జిహ్వా ఫలములు ఆయన నామమును స్తుతించుచున్నవి. చూశారా?

128 ఇప్పుడు, ఇప్పుడు, ఈ విధంగా జరిగినది. అప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడినది, ఎందుకనగా అది కేవలం…“విశ్వసించువాడు ధన్యుడు.” నేరుగా రెండు, మూడు రాత్రులు దానిని అక్కడ వేయుటకు నేను ప్రయత్నించాను; మరియు పిదప, పరిశుద్ధాత్మ మాట్లాడి మరియు చెప్పినది (ప్రేరేపణతో) ఇట్లు చెప్పెను, “ప్రభువు నామములో వచ్చువాడు స్తుతింపబడునుగాక.” మరియు నేను ఏదైనా చెప్పగలుగుటకు ముందే, నేను దానిని చెప్పేసాను. “ప్రభువు దీనియందు వచ్చియున్నాడని నమ్మువాడు ధన్యుడు.” మీరు చూశారా? మరియు నేను ఈమధ్యే దీని గూర్చి మాట్లాడుచుంటిని, ఆ పరిశుద్ధాత్మ అనగా దేవుడు తానే మీలో ఉండుటయైయున్నది. చూశారా? మరియు వారు దానిని గ్రహించారు. చూశారా? మరియు అప్పుడు పరిశుద్ధాత్మ ప్రజల మధ్య కుమ్మరించబడినది. అది—అది ప్రవచనమును, ఎట్లు సరిచేసెనో చూశారా?

129 ఇప్పుడు, ప్రవచనముకు మరియు ప్రవక్తకు మధ్య వ్యత్యాసమున్నది. ప్రవచనము ఒకరి నుండి మరొకరి వద్దకు వెళ్ళును, కానీ ఒక ప్రవక్త మాత్రం ఉయ్యాల నుండే ఒక ప్రవక్తగా జన్మించియుండును. వారు యెహోవ ఈలాగు సెలవిచ్చుచున్నాడును కలిగియుంటారు! వారి విషయమై తీర్పు తీర్చుట ఉండదు. యెషయా, లేక యిర్మియా, లేక ఆ ప్రవక్తలలో ఎవరైనా గానీ ముందు నిలబడుటను మీరు చూడరు, ఎందుకనగా వారు యెహోవ ఈలాగు సెలవిచ్చుచున్నాడును కలిగియుండిరి! అయితే ప్రజల మధ్యనున్న ఒక ప్రవచనాత్మ; మీరు దానిని గమనించవలసియున్నది, ఎందుకంటే సాతాను అందులోనికి జొరబడతాడు. చూశారా? ఇప్పుడు. అయితే అది తీర్పు తీర్చబడవలసి యున్నది.

130 ఇప్పుడు, మనము—మనము ఒక ఉజ్జీవమును కలిగియుండబోవుచున్నాము. ఇప్పుడు, సేవకులైన మీరు, దీనినిప్పుడు జాగ్రత్తగా గమనించండి. మనమొక ఉజ్జీవమును కలిగియుండబోవుచున్నాము. మంచిది. లేదా కేవలం ఒక సాధారణ సంఘపు కూటమును బహుశా మనము కలిగియుంటున్నాము. సంఘము మంటతో ఉన్నది. అన్నివేళలా అది అట్లుండవలసియున్నది. మంచిది, వరములు కలిగియున్నవారు, బహుశా ఐదు లేక ఆరుగురిని మనం కలిగియుండవచ్చును; ఒకరు భాషలలో మాట్లాడుతారు, బహుశా ఇద్దరు లేదా ముగ్గురు భాషలలో మాట్లాడెదరు, నలుగురు లేక ఐదుగురు భాషలలో మాట్లాడుతారు, భాషలలో మాట్లాడే వరమును కలిగియుండి, అన్య భాషలలో మాట్లాడుచుండవచ్చును. వారిలో ఇద్దరు లేదా ముగ్గురు అనువదించగలరు. బహుశా జ్ఞానము యొక్క వరమును కలిగియున్నవారు వారిలో ఒకరు—ఇద్దరు, లేక ముగ్గురు ఉండవచ్చును. మంచిది. ఆ వరములు కలిగియున్న ప్రజలు, వారందరూ కలిసెదరు…మీరు…ఆ వరములు మీకు ఆడుకొనుటకు ఇవ్వబడలేదు, “దేవునికి మహిమ, నేను భాషలలో మాట్లాడుతాను! హల్లెలూయా!” అని చెప్పుటకు ఇవ్వబడలేదు. మీరు—మీరు—మీరు మిమ్మల్ని మీరే కించపరచుకొనుచున్నారు. వాటితో పనిచేయుటకొరకు, అవి మీకు ఇవ్వబడినవి. మరియు అసలైన కూటము ప్రారంభమవ్వడానికి ముందే సంఘములో మీ భాగము రావలసియున్నది, ఎందుకనగా ఉపదేశము పొందనివారు మన మధ్యన ఉండబోవుచున్నారు.

131 అప్పుడు మీరు ఆ గదిలోనికి వెళ్ళెదరు, మరియు మీరు కలిసి, అక్కడ కూర్చుందురు, ఎందుకనగా మీరు సువార్తలో జత-పనివారైయున్నారు. పిదప మీరక్కడ కూర్చొనియుందురు. “ప్రభువా, మేము ఈ రాత్రి తెలుసుకొనవలెనని నీవు కోరినది ఏదైనా ఉన్నదా? ఓ పరలోకపు తండ్రీ, మాతో మాట్లాడుము,” అని ప్రార్థనలను, విన్నపములను అర్పిస్తూ; పాటలను పాడుచుందురు. ఆత్మ నేరుగా క్రిందికి దిగివచ్చి, ఎవరిమీదైన దిగి, భాషలలో మాట్లాడును. ఒకరు లేచి మరియు ఇట్లు చెప్పును, “యెహోవ ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” అదేమిటి? వినండి. “వెళ్ళి సహోదరుడు జోన్స్ కి తాను నివసించుచున్న చోట నుండి దూరముగా పొమ్మని చెప్పుడి, ఏలయనగా రేపు మధ్యాహ్నం ఒక తుఫాను ఆ దేశమును ఊడ్చివేయును; మరియు అది అతని ఇంటిని తీసుకొనబోవుచున్నది. అతని వస్తువులను తీసుకొని మరియు వెళ్ళిపోవలెను!”

132 ఇప్పుడు, అది—అది వినుటకు చక్కగా ఉన్నది. కానీ ఒక్క నిమిషము ఆగండి. అక్కడ వివేచనాత్మను కలిగియున్నవారు ముగ్గురు ఉండవలసియున్నది. వారిలో ఒకరు ఇట్లు చెప్పెదరు, “అది దేవుని యొద్దనుండి వచ్చినది.” మరొకరు ఇట్లు చెప్పెదరు, “అది దేవుని యొద్దనుండి వచ్చినది.” అది ముగ్గురికి విరుద్ధంగా ఇద్దరు—ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులు. మంచిది. వారు దానిని ఒక కాగితపు ముక్కపై వ్రాసెదరు. అది ఆత్మ చెప్పినదైయున్నది. సరి. వారు ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించుచూ, తిరిగి ప్రార్థనలోకి వెళ్ళెదరు.

133 కొద్దిసేపటి తర్వాత, “యెహోవ ఈలాగు సెలవిచ్చుచున్నాడు (ఒక ప్రవక్త లేచును) యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ రాత్రి, న్యూయార్క్ నగరము నుండి ఒక స్త్రీ వచ్చును; ఆమె రోగులను మోసికొనిపోవు ఒక బల్ల మీద ఉన్నది; ఆమె భవనంలోనికి రోగులను మోసికొనిపోవు ఒక బల్ల మీద వచ్చును. ఆమె తన తల చుట్టూ ఒక ఆకుపచ్చని కండువాను కలిగియున్నది. ఆమె క్యాన్సరుతో మరణిస్తున్నది. ఆమె ఈ విధంగా అగుటకు కారణం ఏమిటి, ప్రభువు ఆమె తప్పును ఎంచియున్నాడు: ఆమెకు పదహారేళ్ళ వయస్సు ఉన్నప్పుడు ఒకసారి ఆయన సంఘములో నుండి ఆమె డబ్బును దొంగిలించినది. ఈ విషయాలు ఆమెతో చెప్పమని సహోదరుడు బ్రెన్హామ్ తో చెప్పండి. యెహోవ ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆమె దానిని సరిచేసుకున్నయెడల, ఆమె స్వస్థపరచబడుతుంది.” ఒక్క నిమిషం. అది వినుటకు చాలా బాగుంది, కానీ ఒక్క నిమిషం ఆగండి. వివేచించువాడా, నీవు నీ పేరును ఈ కాగితంపై వ్రాయబోవుచున్నావా? నీవు నీ పేరును వ్రాయబోవుచున్నావా?

134 “అది ప్రభువుయొద్ద నుండి వచ్చినది.” ఒకరు ఇట్లన్నారు, “అది ప్రభువు యొద్ద నుండి వచ్చినది.” అప్పుడు—అప్పుడు మీరు దానిని వ్రాసెదరు, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ రాత్రి ఒక స్త్రీ వచ్చును, ఫలానా-ఫలానా విషయము.” ఆత్మ యొక్క వివేచనను కలిగియున్న ఆ వ్యక్తి, వారిలో ఇద్దరు లేదా ముగ్గురు దానిపై వారి పేరును సంతకము చేస్తారు. ఈ సందేశాలన్నీ ఇవ్వబడినవి. మంచిది.

135 పిదప కొంత సమయం తర్వాత వారు ఆ గంట మ్రోగటాన్ని వింటారు. సంఘము ప్రారంభించబడుతుంది. అప్పుడు వారు ఈ సందేశాలను తీసుకువచ్చి, సరిగ్గా ఇక్కడ ఈ బల్లపై వాటిని పెడతారు. సరిగ్గా ఇక్కడే అవి పెట్టబడవలసియున్నవి. నేనెక్కడో చదువుకుంటూ, ప్రార్థనచేస్తూ ఉంటాను. కాసేపటి తర్వాత పాటలు పాడిన అనంతరం నేను నడుచుకుంటూ వస్తాను. సంఘమంతా క్రమంలో ఉంటుంది, ప్రజలు వస్తుంటారు, కూర్చుని, ధ్యానం చేస్తూ, ప్రార్థన చేయుచుంటారు; మీరు చేయవలసినది అదేయైయున్నది. సంఘానికి వచ్చి ఒకరితో ఒకరు మాట్లాడుట కాదు, దేవునితో మాట్లాడుటకు సంఘానికి రండి. మీ సహవాసమును అక్కడ బయట కలిగియుండండి. చూశారా? ఇప్పుడు మనం దేవునితో సహవాసము చేయుచున్నాము. మరియు మనమిక్కడికి మాట్లాడుకుంటూ వస్తాము, అంతయు నిశ్శబ్దంగా, భక్తిపూర్వకంగా వస్తాము, ఆత్మ కదలాడుతూ ఉంటుంది. ఆ పియానో వాద్యకుడు పాటలు ప్రారంభించుటకు దాదాపు ఐదు నిమిషాల ముందే పియానో వద్దకు వస్తాడు, చాలా మాధూర్యంగా ప్రారంభిస్తాడు:

నా రక్షకుడు మరణించిన ఆ సిలువ వద్ద,

పాపము నుండి ప్రక్షాళన కొరకు అక్కడ నేను మొరపెట్టాను;

లేదా ఏదైనా మంచి మాధూర్యమైన పాటను, చాలా నమ్రతగా వాయిస్తారు. అది కూటములోనికి పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని తీసుకువస్తుంది. చూశారా? అది సరియే.

136 ప్రజలు అక్కడ కూర్చునియున్నారు. వారిలో కొందరు యధార్థపరులు—ఏడవడం ప్రారంభించి మరియు వేదిక నొద్దకు వస్తారు, అసలు కూటము మొదలవ్వడానికి ముందే పశ్చాత్తాపపడతారు. పరిశుద్ధాత్మ అచ్చటనుండును. చూశారా? సంఘము ప్రసవ వేదనలో ఉన్నది. క్రైస్తవులు ప్రార్థించుచున్నారు; వారి స్థానాలను వారు పొందుకున్నారు. వారక్కడ బబుల్ గమ్ నములుకుంటూ కూర్చుని, ఇట్లు చెప్పుటలేదు, “హే, లిడ్డీ, నీ లిప్స్టిక్ కొంత నాకు ఇవ్వు; నాకు కావాలి…మీకు తెలుసా. మీకు తెలియును. నాకు అవసరమున్నది…మీకు తెలుసా, గడిచిన దినమున నేను కొనుగోలు చేస్తున్నప్పుడు, నేను దాదాపు నీ కాలును తొక్కినంత పనియైనది. నేనెప్పుడైనా అటువంటిది చూసానా…దానిగూర్చి నీవేమి అనుకొనుచున్నావు?” ఓ, కనికరము! మరియు దానిని దేవుని ఇల్లు అని అంటారు. ఏమిటి, అది అవమానకరము. క్రీస్తుయొక్క శరీరము కూడి వచ్చుచున్నది. మనమక్కడ కూర్చునియున్నాము.

ప్రక్కన కూర్చున్న వ్యక్తి, “హే, మనం అక్కడికి వెళ్ళినప్పుడు నీకు తెలుసా, ఇది ఫలాన-మరియు-ఫలాన మరియు ఫలాన-మరియు-ఫలాన-మరియు-ఫలాన…” బయట అది మంచిదే, కానీ ఇక్కడ ఇది దేవునియొక్క ఇల్లైయున్నది.

137 ప్రార్థన చేసుకుంటూ లోపలికి వచ్చి; మీ స్థానాలు తీసుకొనండి. సహోదరులారా, ఇప్పుడు నేను మాట్లాడేది, మీ సంఘాలతో కాదు. మీరేమి చేయుదురో నాకు తెలియదు; నేను ఈ ఆలయముతో మాట్లాడుచున్నాను. నేను నా స్వంత ప్రజలతో మాట్లాడుచున్నాను. చూశారా? అది సరియే.

138 ఇప్పుడు, మీరు ఆ విధంగా వచ్చినప్పుడు, అప్పుడు మొదటి విషయము ఏమిటో మీకు తెలియునా, సంఘకాపరి బయటకు వస్తాడు. అతడు తాజాగా ఉండును. అతడు దీనికి, దానికి, మరియు ఆ వేరే దానికి, జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అతడు తన పరిచర్యయొక్క హిమమునుండి—నేరుగా బయటకు వచ్చుచున్నాడు. అతడు పరిశుద్ధాత్మయొక్క శక్తి క్రింద ఉండియున్నాడు. అతడు నేరుగా ఎక్కువ అగ్ని నాలుకలు కూడుకొనియున్న చోటునకు వచ్చును. ఇప్పుడది దాదాపు ఒక స్తంభమువలె ఉన్నది (చూశారా?), అది చుట్టూ కదలాడుచున్నది. అతడిక్కడికి నడుచుకుంటూ వచ్చి, దీనిని తీసుకుంటాడు. “సంఘమునుండి ఒక సందేశము: ‘యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సహోదరుడు జోన్స్ తన ఇంటినుండి వెళ్ళిపోవలెను. రేపు మధ్యాహ్నము రెండు గంటలకు ఒక తుఫాను తన ప్రాంతమును ఊడ్చివేయును. తన సామాన్లు తీసుకొని వెళ్ళిపోవలెను.’” సహోదరుడు జోన్స్ దానిని పొందుకుంటాడు. మంచిది. అది నమోదు అవుతుంది. “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఫలానా-మరియు-ఫలానా పేరుగల ఒక స్త్రీ ఈ రాత్రి ఇక్కడికి వస్తుంది, మరియు అది—ఆమె ఫలానా-మరియు-ఫలానా పని చేసింది.” (సరిగ్గా నేను ఇందాక నేను మీతో చెప్పినట్లే, చూడండి, ఆ విధంగా ఉన్నది.) అది సరియే, అది అక్కడ ఉంటుంది. అది అంతే. ఇప్పుడు వారిదివరకే సంఘములో వారి స్థానమును పొందుకున్నారు. అది సరియే.

139 పిదప అతడు వర్తమానమును తీసుకుంటాడు. మరియు మొదటిగా మీకు తెలియునా, అతడు ప్రసంగించడం మొదలుపెడతాడు. అంతరాయం కలిగించునది ఏదియు ఉండదు; అది ఇదివరకే జరిగినది. ఇప్పుడు, మనం ముందుకు వెళ్తున్నాము, మేము వర్తమానమును ప్రసంగిస్తాము.

140 మరియు కాసేపటి తర్వాత ఎప్పుడైతే…వర్తమానం అయిపోయిన తర్వాత మొదటి విషయం మీకు తెలియునా, స్వస్థత వరుస మొదలవుతుంది. ఇక్కడ ఒక స్త్రీ వచ్చెను. ఎవరో భాషలలో మాట్లాడి మరియు ఆమె వస్తుందని చెప్పారు. చూశారా? ఏమి జరగబోతుందో మనలో ప్రతియొక్కరికి తెలుసు. అది మనలో ప్రతియొక్కరికి తెలుసు. ఇప్పుడు ఆ అగ్ని నాలుకలు మీపై ఉండుటతో విశ్వాసము ఎలా కట్టబడుతుందో చూడండి. ఆమె మీతో కలిసి సమకూర్చబడటం మొదలవుతుంది. ఏంటి, అది కేవలం ఒక ముగించబడిన కార్యమైయున్నది; అంతే.

ఆ స్త్రీ…నేనిట్లంటాను, “న్యూయార్క్ పట్టణం నుండి శ్రీమతి. ఫలానా-మరియు-ఫలానా, ఇక్కడ కూర్చొనియున్నది…” చూశారా?

“ఓ, అది వాస్తవం. అది నీకెలా తెలుసు?”

“అది సంఘమునకు ప్రభువుయొద్ద నుండి వచ్చిన ఒక సందేశమైయున్నది. నీకు పదహారు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, నీవు ఒక ఫలానా-ఫలానా చోట ఉండి మరియు—సంఘము నుండి కొంత డబ్బు తీసుకొని, మరియు దానిని దొంగిలించి, మరియు బయటకు వెళ్ళి, మరియు దానితో క్రొత్త బట్టలు కొనుక్కోలేదా?”

“ఓ, అది నిజము. అది వాస్తవమైయున్నది.”

“అది ఖచ్చితంగా ఈ రాత్రి అన్య భాషలతో మాట్లాడిన, ఒక ఫలానా-మరియు-ఫలానా సహోదరుడి ద్వారా దేవుడు మనకు చెప్పినదైయున్నది; ఫలానా-మరియు-ఫలానా సహోదరుడు అనువదించాడు; ఇక్కడ ఆత్మ వివేచన కలిగియున్న ఫలానా-మరియు-ఫలానా సహోదరుడు చెప్పాడు, అది ప్రభువు నుండి వచ్చెనని చెప్పాడు. మరియు అది సత్యమైయున్నది.”

“అవును!”

“పిదప, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, వెళ్ళి దానిని సరిచేసుకొనుము, అప్పుడు నీ క్యాన్సర్ నుండి నువ్వు బయటపడతావు.”

141 సహోదరుడు జోన్స్ ఇంటికి వెళ్తాడు, రవాణా వాహనాలను తీసుకొని, వరుసగా ఉంచి, సామాన్లు సర్దుకొని, మరియు అక్కడినుండి వెళ్ళిపోతాడు. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు: జోవై! అంతా ఊడ్చుకొనిపోతుంది. చూశారా? అప్పుడు సంఘము మహిమపరుస్తుంది…“ప్రభువైన యేసు, నీ మంచితనముకై, నీకు వందనాలు.” ఇప్పుడు, సంఘమునకు, క్షేమాభివృద్ధి అనగా, అదేయైయున్నది.

142 ఇప్పుడు, వారు దానిని చెప్పిన తర్వాత అది జరగకపోయినచో ఏమిటి? అప్పుడు మీ మధ్య ఒక అపవిత్రాత్మ ఉన్నది. మీకు ఆ అపవిత్రమైన కార్యము అవసరము లేదు. ఆకాశము పూర్తిగా పెంతెకోస్తుయొక్క వాస్తవముతో ఉండగా ఆ—ఆ అపవిత్రమైనది మీకెందుకు? అపవాది నుండి ఆ పాత ప్రత్యామ్నయమును తీసుకోకండి. ఏదైనా వాస్తవమైన దానిని పొందుకొనండి. మీ కొరకు దేవుడు దానిని కలిగియున్నాడు. పిదప మీరు సత్యమని దేవుడు నిర్ధారించేవరకు, మీరు ఇక ఎంతమాత్రము కూటములు కలిగియుండకండి, మరియు ఇక్కడ ఎటువంటిది పెట్టకండి, ఎందుకనగా సువార్త పనిలో మీరు సంఘమునకు ఒక సహాయకులైయున్నారు. ఇప్పుడు, అదేమైయున్నదో మీరు అర్ధం చేసుకున్నారా?

143 మరియు భాషలు, అన్యభాషలు…ఏ మనుష్యుడైనా అతడు—అతడేమి మాట్లాడుచున్నాడో ఎరిగియున్నాడు. అతడు మాట్లాడుతాడు; అయితే ప్రతీ శబ్దమునకు ఒక అర్ధమున్నది. దానికొక అర్ధమున్నది. [సహోదరుడు బ్రెన్హామ్ చప్పట్లు కొట్టుచున్నాడు—సంపా.] “గ్లక్, గ్లక్, గ్లక్!” దానికి—అదొక—అది ఎక్కడో ఒక చోట ఒక భాషయైయున్నది.

144 నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు, నేనెన్నడూ దానిని నమ్మలేదు, కానీ ప్రతీ శబ్దానికి ఏదో ఒక విధమైన అర్ధము ఉండియున్నది. ఒక ప్రాధాన్యత లేకుండా, ఒక అర్ధము లేకుండా ఏ శబ్దము ఉండదని బైబిలు చెప్పుచున్నది. చేయబడిన ప్రతీ శబ్దానికి ఏదో ఒక అర్ధము ఉండియున్నది. ఎందువలన, ప్రజలు ఇలా చెప్పడాన్ని నేను వింటుంటాను…నేను ఇట్లంటాను, “దేవుని కుమారుడైన, యేసుక్రీస్తు.”

145 వారిలో ఒకరు ఇట్లంటారు [సహోదరుడు బ్రెన్హామ్ ఒక ఆఫ్రికా అనువాదకునివలె చేయుచున్నాడు—సంపా.]. మరొకరు ఇట్లంటారు [సహోదరుడు బ్రెన్హామ్ మరలా చూపించుచున్నాడు.]. మరి దాని అర్ధం, “దేవుని కుమారుడైన, యేసు క్రీస్తు.” చూశారా? దానికి ఒక…మరియు నాకు అది ఏ అర్థమును ఇవ్వకపోవచ్చును, కానీ వారికైతే అది సరిగ్గా నేను మీతో మాట్లాడుచున్న ఒక భాషలాంటిదేయైయున్నది. ఆ జులూ, గోజా, బజాటో, మరియు ఇంకా దేనినుండైనా, ఆ అనువాదకుడు వచ్చినప్పుడు, చెప్పబడిన ప్రతీదీ, ప్రతీయొక్కరు అర్ధం చేసుకున్నారు. మరియు ఈ ప్రజలు ఊరకే గొణుగుచున్నట్టి ఈ విషయాలను మీరు వింటారు, మరియు అవి అర్ధరహితమైనవని తలంచుతారు, కానీ అది కాదు; దానికొక అర్ధమున్నది. కావున దానిని మనం గౌరవించాలి, దాని స్థానంలో దానిని ఉంచాలి.

146 ఇప్పుడు, బహుశా అక్కడ వర్తమానము లేకపోవచ్చును. ఇప్పుడు, ఆ కూటము ముగిసింది; వేదిక పిలుపు ఇవ్వబడింది. మరియు కాసేపటి తర్వాత ఎవరైనా (అక్కడ ఏ వర్తమానము రాలేదు) వారికి అవకాశము వచ్చిన వెంటనే ఎవరో ఒకరు పైకి లేస్తారు. పరిశుద్ధాత్మ…ఇప్పుడు, బైబిలు ఇట్లు చెప్పుచున్నది, “అనువాదకుడు లేనియెడల, అతడు మౌనంగా ఉండవలెను.” అది మాట్లాడుటకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ, మీరు మౌనంగా ఉండండి.

147 “నేను దానిని చేయలేను,” అని చెప్పండి. మీరు చేయగలరని బైబిలు చెప్పినది. చూశారా? కావున అది—అది దానిని స్థిరపరుస్తుంది. చూశారా? అతణ్ణి మౌనంగా ఉండనీయండి.

148 పిదప, అది, ప్రతీది క్రమంగా ఉన్నప్పుడు అవకాశం వస్తుంది, అప్పుడు పరిశుద్ధాత్మ సందేశమును ఇవ్వడానికి అతనిపై కుమ్మరించబడినట్లైతే, అప్పుడు దానిని ఇవ్వండి. సరిగ్గా మీరు చేయవలసినది అదేయైయున్నది. అప్పుడు ఆ అనువాదం వచ్చి, ఇట్లు చెప్పినది, “ఇక్కడ సాల్లి జోన్స్ అను పేరుగల ఒక స్త్రీ ఉన్నది (ఆ పేరుగల స్త్రీ ఇక్కడ లేదని నేను ఆశిస్తున్నాను, కానీ…) సాల్లి జోన్స్. (చూశారా?) ఆమె పిలుపుకి ఇదే చివరి రాత్రి అని ఆమెతో చెప్పండి. దేవునితో సరిచేసుకొనుము ఎందుకనగా ఆమె ఇక్కడ ఉండుటకు ఆమెకు కొద్ది సమయమే ఉన్నది.” ఇప్పుడు, తాను అక్కడికి చేరుకోడానికి వీలైనంత త్వరగా సాల్లి జోన్స్ వేదికనొద్దకు పరుగెత్తుతుంది (చూశారా?), ఎందుకనగా అది ఆమెకు చివరి పిలుపు. చూశారా? అది ఒక సందేశమును, లేదా ఒక నిర్ధారణను, లేదా దేనినో ఇచ్చుటయైయున్నది.

149 మరదే కార్యాచరణలో ఉన్న పెంతెకోస్తు సంఘమైయున్నది. ఇక అపవిత్రాత్మలు చొరబడుటకు అవకాశాలు లేవు, ఎందుకనగా అది ఇదివరకే…బైబిలు ఖచ్చితంగా ఇస్తుంది, “అది ముగ్గురికి మించకుండ, వంతుల చొప్పున జరగనీయండి; మరియు ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమంది వివేచించవచ్చును.” అది సంఘమంటే. కానీ ఈనాడు దానిని మనమెక్కడికి తీసుకువచ్చాము? ఎవరైనా భాషలలో మాట్లాడుచుండగా, పైకి దుమికి, నవ్వుకుంటూ మరియు అలాగే-కొనసాగుచు పోవుచున్నారు; మరొకరు చూస్తూ, దేనిగురించో మాటలాడుచు మరియు చుట్టూ గుమిగూడుతారు; ఆ సంఘకాపరి ఏదో చేస్తుంటాడు; లేదా ఎవరో చుట్టూ గుమిగూడుతారు. మంచిది, అది సరి కాదు. బహుశా సంఘకాపరి ప్రసంగిస్తుంటాడు, మరియు ఎవరో పైకి లేచి అతనికి అంతరాయం కలిగిస్తారు…బహుశా బైబిలు చదువుతుంటాడు మరియు ఎవరో…బైబిలు చదువుతుండగా, మరియు ఎవరో ఆ వెనుక భాషలు మాట్లాడుతుంటారు. ఓ, లేదండి! చూశారా? బోధకుడు వేదిక మీద ప్రసంగిస్తుంటాడు, ఎవరో పైకి లేచి మరియు భాషలలో మాటలాడుచు, అతడికి అంతరాయం కలిగిస్తారు. అది సరియే. అది పరిశుద్ధాత్మ కాదని నేను అనడం లేదు, కానీ ఆ పరిశుద్ధాత్మను ఉపయోగించడం ఎలా అనేది (చూశారా?), మీరు తెలుసుకోవలసియున్నది, దానిని ఉపయోగించుకోవడం.

ఇప్పుడు, నేను—నేను తీసుకొనుచున్నాను…ఇంకొకదానికి మీరు అవకాశం ఇస్తారా? పిదప, రేపు ఆదివారమైయున్నది. తర్వాత, మనము…మనం కేవలం…ఇక్కడ ఒకటున్నది. అది చాలా కృపాసహితమైనదని నేను తలంచుచున్నాను. మరియు ఇప్పుడు, దయచేసి, మీరందరూ కేవలం ఇంకా కొన్ని నిమిషాలు నన్ను భరించగలిగితే చాలు. మరియు పిదప, నేను…నేను మిమ్మల్ని కోరేది—మీరు దీనిని పొందుకోవాలని నేను కోరుచున్నాను. ఉద్దేశ్యపూర్వకంగానే నేను దీనిని ఉంచాను. ఇది నా చివరిదైయున్నది.

ఇప్పుడు, మొదటిగా, ఆ వ్యక్తి అడిగిన రెండు విషయాలను నేను చదవబోవుచున్నాను. అది ఒక పాత కాగితం ముక్కపై, చక్కని చేవ్రాతతో వ్రాయబడియున్నది. అది ఎవరన్నది అవగాహన లేదు, వాటిలో ఏ ఒక్క—ఏ ఒక్క దానిపై ఏ పేరు సంతకము చేయబడిలేదు.

98. సహోదరుడా బ్రెన్హామ్, సేవకులు వారి కూటములలో జనాలలో ఇంత మంది ఇంత ఇవ్వవలెనని, దేవుడు వారితో చెప్పాడని చెప్పుచూ డబ్బు కొరకు పీడించడం సబబేనా? అది సరియైనచో, నేను తెలుసుకొనగోరుచున్నాను. లేదా అది తప్పైనచో, నేను తెలుసుకొనగోరుచున్నాను. ఇది నన్ను తీవ్రంగా కలవరపరచింది.

150 ఇప్పుడు, మీరు చూడండి, స్నేహితుడా, నేను నీకు చెప్పబోవుచున్నాను, నేను ఏమనుకుంటున్నానో నీకు చెప్పబోవుచున్నాను. చూశారా? ఇప్పుడు, అది సరైనదని అర్ధం కాదు. అది భయంకరమైనదని నేను భావిస్తున్నాను.

151 ఇప్పుడు, నేను ఇలా అనుకుంటున్నాను. దేవుడు నన్ను పరిచర్యలోనికి పంపాడు. నేను చాలా తక్కువ స్థితిలో ఉన్నట్లు కనిపించిన సమయాన్ని నేను చూసాను…మరియు నా—నావద్ద అసలు డబ్బు లేకుండెను. మరియు నేను ఇట్లు చెప్పేవాణ్ణి, “ఆ చందా పళ్ళెమును ఇచ్చేయండి.”

మరియు ఆ మేనేజరు నావద్దకు వచ్చి మరియు ఇట్లనేవాడు, “చూడు, బిల్లీ, ఈ రాత్రి మనం ఐదు వేల డాలర్లు అచ్చియున్నాము, అబ్బాయ్. దానిని చెల్లించుటకు జఫర్సన్విల్ లో నీ వద్ద డబ్బు ఉన్నదా?”

152 నేను ఇట్లు చెప్పేవాణ్ణి, “అది సరియే. దేవుడే నన్నిక్కడికి పంపాడు, లేనిచో నేను వచ్చేవాణ్ణి కాదు. (చూశారా?) కేవలం ఆ చందా ప్లేటును ఇచ్చేయండి.”

మరియు కూటము ముగిసేలోపు, ఎవరో ఇట్లన్నారు, “నీకు తెలుసా, దీనికి ఐదు వేల డాలర్లు ఇవ్వమని ప్రభువు నా హృదయంలో పెట్టాడు.” చూడండి, చూశారా? మొదటిగా, దానిని చేయుటకు నడిపించబడండి.

153 డబ్బు కోసం పీడించడం, మరియు అడుక్కోవడం, మరియు వెంటపడటం వంటివి నేను నమ్మను. అది తప్పుడు కార్యమని నేను భావిస్తాను. ఇప్పుడు, సహోదరుడా, దానిని మీరు చేసినయెడల, నన్ను మీ మనోభావాలను గాయపరచనివ్వకండి. చూశారా? మీరు—మీరు దానిని చేయుటకు దేవునియొద్ద నుండి ఆ-విధమైన-హక్కును కలిగియుండవచ్చు. కానీ నేను కేవలం నా గురించి మాట్లాడుచున్నాను. దానిలో నేను నమ్మికయుంచను.

154 ఇప్పుడు, సేవకులు వెళ్ళి మరియు ఇట్లు చెప్పడం గురించి కూడా నాకు తెలుసు…నేను అక్కడే నిలబడ్డాను, ఈమధ్యనే…ఇప్పుడు, ఇది పెంతెకోస్తువారు కాదు, ఇది…సరి, ఇది సంఘాలు (చూశారా?), వేరే సంఘాలవారు. అదొక పెద్ద క్యాంపు మీటింగు. గెర్టీ, నీవు నాతో కూడా ఉన్నావు, ఇంకా చాలా మంది ఉన్నారు. మరియు వారిలో ఇద్దరు లేదా ముగ్గురు కలిసి—ఒక ప్రసిద్ధిగాంచిన సంఘశాఖ వద్ద వారు ఆ మధ్యాహ్నం మొత్తం తీసుకున్నారు. (అవి ఇక్కడ పట్టణంలో ఉన్న, మన ఆధునిక సంఘాలు మరియు మొదలగు వాటి వంటి, సాధారణ సంఘాలైయున్నవి) ఒక పెద్ద సమావేశము వద్ద—మరియు వారు ఆ మధ్యాహ్నమంతా తీసుకున్నారు, వేదిక మీద నిలబడి—మరియు వారు గనుక ఆ కూటములో ఇవ్వకపోతే దేవుడు వారి పంటలను నాశనము చేస్తాడనియు, వారి పిల్లలకు పోలియో ఇస్తాడనియు, మరియు అటువంటి సంగతులు చెప్పి, భయపెట్టుచుండిరి. బైబిలు నా ముందుండగా, అది ఖచ్చితంగా నిజం. నేను ఇట్లన్నాను, “అది దేవునికి మరియు ఆయన అనుచరులకి దేవదూషణయైయున్నది.” దేవుడు మిమ్మల్ని పంపినచో, ఆయనే మిమ్మల్ని గూర్చి శ్రద్ధ వహిస్తాడు. ఆయన మిమ్మల్ని పంపనిచో, అటువంటప్పుడు సంఘశాఖలను మిమ్మల్ని గూర్చి శ్రద్ధ వహించనివ్వండి. అయితే—అయితే మీరు…దేవుడు మిమ్మల్ని పంపినయెడల, ఆయన మిమ్మల్ని గూర్చి శ్రద్ధ వహిస్తాడు.

99. ఒక పరిశుద్ధాత్మ సంఘములో క్రిస్టమస్ నాటికను గూర్చి ఏమిటి?

155 మంచిది, అది క్రీస్తును గూర్చి అయినచో, అది సరి కావచ్చును. కానీ అది శాంతా క్లాస్ గూర్చి అయినచో, నేను అతనియందు నమ్మికయుంచను. నేను—నేను ఎదిగియున్నాను—నేను దానికి దూరంగా ఎదిగాను. నేను అసలు శాంతా క్లాస్ ను నమ్మను. చూశారా? మరియు వారు కలిగియున్న ఈ చిన్న క్రిస్టమస్ విషయాలలో కొన్నిటిని, నేను విడ్డూరంగా భావిస్తాను. మరియు…అయితే వారు క్రిస్టమస్ నుండి పూర్తిగా క్రీస్తును బయటకు తీసివేసి మరియు దానిలో శాంతా క్లాస్ ను పెట్టారని నేను భావిస్తున్నాను.

156 మరియు శాంతా క్లాస్ ఒక కల్పిత కథైయున్నది. (పిల్లల విషయమైతే, నేను మీ మనోభావాలను గాయపరచడం లేదని, నేను ఆశిస్తున్నాను.) కానీ నేను మీకు చెప్తాను. ఇక్కడ కొంత కాలం క్రితం, దాదాపు ఇరవై-ఐదు, ముప్పై సంవత్సరాల క్రితం, ఇక్కడ ఈ పట్టణంలోని ఒక సేవకుడు, ఈ పట్టణంలోని ఒక ఫలానా పెద్ద సంఘానికి—సంఘకాపరి, నాకు బాగా తెలిసినవాడు, నా ప్రాణ స్నేహితుడైయున్నాడు, అతడు నా వద్దకు నడుచుకుంటూ వచ్చాడు. మరియు చార్లీ బొహానన్ (సహోదరుడా మైక్, నా మంచి స్నేహితుడైన, చార్లీ బొహానన్ నీకు జ్ఞాపకమున్నాడు గదా)…అక్కడ ఆఫీసులో కూర్చొని మరియు ఇట్లు చెప్పెను, “ఆ అబద్ధాన్ని ఇక ఎంతమాత్రము నా పిల్లలకు చెప్పను లేదా నా మనవళ్ళకు కూడా చెప్పనివ్వను.” అతడు ఇట్లు చెప్పెను, “వానికి పన్నెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత నా స్వంత చిన్న అబ్బాయి నావద్దకు నడుచుకుంటూ వచ్చాడు, మరియు శాంతా క్లాస్ గురించి మాట్లాడాడు…” మరియు అతడు, “ఎందుకు…ప్రియా, నేను నీకొక విషయం చెప్పాలి,” అని అన్నాడు. ఇట్లు చెప్పాడు, “అమ్మా…” మీకు తెలుసా, మరియు అతడు ఏమి చేసాడన్నది అతనికి చెప్పుకుంటూ పోయాడు.

పిదప అతడు తిరిగి వచ్చిన తర్వాత, ఇట్లన్నాడు, “అలాగైతే, డాడీ, ఈ యేసు కూడా అటువంటి వాడేనా?”

157 సత్యమును చెప్పండి. శాంతా క్లాస్ అనేది, క్రిస్ క్రింగెల్ లేదా పరిశుద్ధ నికోలస్ అనే ఒక వ్యక్తిని గూర్చిన క్యాథలిక్ వేషమైయున్నది, చాలా సంవత్సరాల క్రితం పిల్లలకు మంచి చేస్తూ తిరిగిన వృద్దుడైన ఒక జర్మను క్యాథలిక్ పరిశుద్ధుని గూర్చినదైయున్నది. మరియు వారు దానిని ఒక ఆచారమువలె పాటించుచు వచ్చిరి. కానీ యేసుక్రీస్తు దేవుని కుమారుడైయున్నాడు. ఆయన వాస్తవమైయున్నాడు, మరియు ఆయన సజీవుడు.

ఇప్పుడు, ఇక్కడొక ప్రశ్న ఉన్నది, ఇది చివరిది, ఇది చాలా…

158 ఇప్పుడు చూడండి. దాని విషయంలో మీరు నాతో ఏకీభవించకపోవచ్చు. కానీ మీరు నాతో ఏకీభవించనియెడల, గుర్తుంచుకొనండి, దానిని స్నేహపూర్వకంగా ఉండనీయండి, మీరు అలా చేస్తారా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మరియు నేను మిమ్మల్ని—నేను మిమ్మల్ని బాధపెట్టగోరడంలేదు. నేను కేవలం, నేను యధార్థంగా ఉండగోరుచున్నాను. నేనట్లు లేనియెడల…నేను మా అబ్బాయికి ఒక అబద్ధం చెప్పినయెడల, అప్పుడు నేనొక అబద్ధికుడనౌతాను. చూశారా? నేను అతనికి సత్యమునే చెప్పగోరుచున్నాను.

159 ఇప్పుడు, నేనతనికి శాంతా క్లాస్ గురించి చెప్తాను, నేనిట్లంటాను, “అవును, నిశ్చయంగా, శాంతా క్లాస్ ఉన్నాడు. క్రిస్టమస్ రాత్రి డాడీని గమనించు.” చూశారా? అవునండి.

160 మీకు తెలుసా, ఒక దినమున నేనక్కడ ఉన్నాను, మరియు ఊరికే చూద్దామని ఒక చిన్న అమ్మాయి వద్ద నేను దానిని ప్రయత్నించాను. నిశ్చయంగా మొన్న నాకు తగిన జవాబే వచ్చినది. నేను భవనంలో ఉన్నాను. మరియు వారక్కడ, దిగువన ఆ క్వాకర్ మెయిడ్ వద్ద నిలబడియున్నారు. మరియు నేనక్కడికి కిరాణ సామాగ్రి తీసుకురాడానికి వెళ్ళాను. మరియు కావున మేము, నా భార్య మరియు నేను, అక్కడ ఉన్నాము. మరియు దాదాపు పద్దెనిమిది నెలల వయస్సైనా లేని, ఒక చిన్న అమ్మాయి అక్కడ ఉన్నది, మరియు ఆమె అక్కడ నిలబడియున్నది, “డింగిల్ బెల్స్, డింగిల్ బెల్స్…” అని పాడుచున్నది. మరియు నేను చెప్పాను…ఆమె తన స్టాండులో, మీకు తెలుసా, ఆ చిన్న బండిలో వెనుక భాగంలో కూర్చుని ఉన్నది.

నేను ఇట్లన్నాను, “నీవు శాంతా క్లాస్ కొరకు ఎదురుచూస్తున్నావా?”

ఆమె ఇట్లన్నది, “మిస్టర్, అది మా డాడీ.”

నేనిట్లన్నాను, “ప్రియా, నీ చిన్ని హృదయము దీవించబడును గాక. నీవు తెలివైనదానివే.”

ఇప్పుడు, స్నేహితులారా, ఇక్కడ ఒక నిజమైన నొప్పించే విషయము ఉన్నది. మరియు దీనిలో…పిదప నేను ముగిస్తాను. ఓ, అది—అది ఒక అద్భుతమైన లేఖనమైయున్నది, కానీ అది ప్రతీ వ్యక్తికీ ఒక నొప్పించే విషయంలా కనిపిస్తుంది. మరియు అది చాలా సంవత్సరాలుగా నా మనసులో భారంగా ఉండియన్నది; మరియు కేవలం దేవుని యొక్క కృప ద్వారా…మరియు నా ప్రశస్తమైన భార్య, ఇప్పుడు సరిగ్గా ఆ వెనుక కూర్చునియున్నది, ఈ మధ్యాహ్నం ఆ ప్రశ్న ఉన్నదని ఆమె విన్నప్పుడు, ఆమె ఇట్లన్నది, “బిల్, నీవు దానికి ఎలా జవాబు ఇస్తావు?” ఆమె ఇంకా ఇట్లన్నది, “దాని విషయమై స్వయంగా నేనే ఎల్లప్పుడూ ఆశ్చర్యపోతుంటాను.” ఇట్లన్నది, “అది నాకు ఎన్నడూ అర్ధం కాలేదు.” మరియు ఇట్లన్నది…

నేనిట్లన్నాను, “ప్రియా, ఈ రాత్రి అక్కడికి రమ్ము. నేను దేవుని సహాయము చేత నా సాయ శక్తులా దానిని చేస్తాను.”

100. సహోదరుడా బ్రెన్హామ్, దయచేసి హెబ్రీ 6:4 నుండి 6 వరకు వివరించండి.

161 ఆ ఒక్కసారి అది నిజంగా…చూడండి, ఇప్పుడు మీరు మన విశ్వాసము, కృప, విశ్వాసుల యొక్క భద్రత, పరిశుద్ధుల యొక్క వీడని పట్టుదలను, మీరు గమనించవలసియున్నది. పెబ్రీ 6వ అధ్యాయము, 4 నుండి 6.

ఇప్పుడు, వెంటనే…దీనిని ముగించిన పిదప, దానిని మీకు స్పష్టంగా తెలియజేయుటకు దేవుడు నాకు సహాయము చేయునని నేను ఆశిస్తున్నాను. నన్ను క్షమించండి, నేను—నేను ఈ రాత్రికి నా వర్తమానమును కలిగియున్నాను; బహుశా నేను అదే విషయాన్ని ఉదయకాల—కూటములో ప్రసంగిస్తాను. తర్వాత నేను వెళ్తాను.

162 ఇప్పుడు, ఇది చాలా నొప్పించునదై యున్నది. చూశారా? ఇప్పుడు, మీరు గమనించాలి. ఇప్పుడు గుర్తుంచుకొనండి, మనము నమ్మి మరియు ఈ సంఘములో బోధించేది ఏమిటనగా, ఇక్కడికి వచ్చి మరియు కేకలు వేసే ప్రతీది, భాషలలో మాట్లాడి, మరియు బోధకునితో కరచాలనం చేసే ప్రతీది, నిత్య జీవమును కలిగియున్నట్లు కాదు. అయితే మీరు నిత్యజీవమును కలిగియున్నయెడల, దేవుడు మీకు నిత్యజీవమును అనుగ్రహించినయెడల, దానిని మీరు నిత్యము కలిగియుంటారని మేము నమ్ముతాము. చూశారా? ఎందుకనగా చూడండి. అది అట్లు కానియెడల, యేసు ఒక అబద్ధ బోధకునిగా గుర్తించబడతాడు. పరిశుద్ధ యోహాను 5:24లో, ఆయన ఇట్లు చెప్పెను, “నా మాటలు విని మరియు నన్ను పంపినవాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు, మరియు వాడు ఎన్నడూ తీర్పులోనికి రాడు, కానీ మరణమును దాటి జీవములోనికి ప్రవేశించియున్నాడు.” ఇప్పుడు, ఆయనతో వాదించండి. “తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ…తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. (నేను లేఖనమును ఎత్తిచూపుచున్నాను.) వచ్చు వారందరూ…మొదట నా తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. మరియు నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. (చూశారా?) మరియు నాయొద్దకు వచ్చు వారందరికి, నేను వారికి నిత్య జీవమును అనుగ్రహించెదను (పరిశుద్ధ యోహాను 6), మరియు అంత్య దినములలో నేను వానిని లేపుదును.” అవి ఆయన మాటలు.

163 ఇప్పుడు చూడండి. నేను తిరిగి ఎఫెసీ 1వ అధ్యాయములో, పౌలు ప్రసంగిస్తున్న దానిలోనికి వెళ్ళగోరినయెడల…ఇప్పుడు, కొరింథీయులకు, ప్రతియొక్కరికి ఒక భాష మరియు ఒక కీర్తన ఉన్నది. మీరు గమనిస్తే ఇతర సంఘములకు అట్టి సమస్య లేదు. అతడు ఎన్నడూ దానిగూర్చి ఏమియూ చెప్పలేదు. అతడు ఎఫెసీ సంఘములోగానీ, రోమా సంఘములోగానీ ఎన్నడైనా భాషల గురించి ప్రస్తావించాడా? లేదండి! కొరింథీయులు కలిగియున్నట్లే వారును భాషలు మరియు ప్రతీదియు కలిగియున్నారు, కానీ వారు దానిని క్రమంలో ఉంచారు. ఆ కొరింథీయులు దానిని అసలు క్రమంలో పెట్టలేకపోయారు. చూశారా? కానీ పౌలు అక్కడికి వెళ్ళి మరియు ఆ సంఘమును క్రమపరిచాడు.

ఇప్పుడు, అతడు…ఓరల్ రాబర్ట్స్ చెప్పినట్లు, “దేవుడు ఒక మంచి దేవుడు,” అని నేను నమ్ముచున్నాను. మీరు దానిని నమ్ముటలేదా?

164 మరియు మీరు ఇట్లంటారు, “సరి, బ్రెన్హామ్ సహోదరుడా, అలాగైతే భాషలు కలిగియున్న ఆ పెంతెకోస్తువారి సంగతేంటి?” వారు పరిశుద్ధాత్మను కలిగియున్నారని నేను అనుకొనుచున్నాను. నిశ్చయంగా వారు కలిగియున్నారు. అది సరియే, ఎందువలన? చూడండి. ఆయన మంచి దేవుడని మీరు నమ్ముచున్నారా? తోమా ఒకసారి ఇట్లు చెప్పెను, “మీకు తెలుసు, ప్రభువు…”

ఆ మిగతా వారందరూ ఆయనను నమ్మారు. ఇట్లన్నారు, “ఓ, ఆయన వాస్తవమని మాకు తెలుసు!”

“ఓ,” తోమా ఇట్లు చెప్పెను, “లేదు, లేదు, నేను దానిని నమ్మను. నాకు ఏదైనా సాక్ష్యాధారం ఉంటేనే గానీ, నేను దానిని నమ్మను. ఆయన ప్రక్కలో మరియు ఆయన చేతులలోని మేకుల గురుతులలో నేను నా వ్రేళ్ళను ఉంచవలసియున్నది.”

ఆయన మంచి దేవుడు. ఆయన ఇట్లు చెప్పెను, “ఇదిగో. తోమా, ఇటు రమ్ము.”

“ఓ,” తోమా ఇట్లన్నాడు, “ఇప్పుడు నేను నమ్మెదను.”

165 ఆయన ఇట్లనెను, “అవును, తోమా, నీవు నన్ను చూచి, మరియు నన్ను స్పర్శించి, మరియు నా చెయ్యిని…నీ చేతులను నా ప్రక్కలో ఉంచిన తర్వాత, నీవు నమ్మితివి. కానీ అసలు ఎన్నడూ చూడకపోయినను నమ్మినవారి ప్రతిఫలము ఎంత గొప్పదో కదా.” ఆయన మంచి దేవుడు. అవును, ఆయన మీ హృదయ వాంఛలను మీకు అనుగ్రహించును. మనం కేవలం ఆయనయందు నమ్మికయుంచుదాము. అది ఆ—అది ఆ—అది అపవాదికి చావుదెబ్బయై యున్నది. ఒక మనుష్యుడు దేవుడిని ఆయన మాటవద్దనే తీసుకున్నప్పుడు, సహోదరుడా, అది ప్రతీసారి సాతానును చంపివేయును. సాతానుకి తగిలే గట్టి దెబ్బ ఎప్పుడనగా, ఒక మనుష్యుడు దేవుడిని ఆయన మాట వద్ద తీసుకున్నప్పుడేయై యున్నది. అవునండీ. నేను చెప్పినట్లు, “మనుష్యుడు కేవలం బ్రతుకడు (యేసు, గతరాత్రి), కానీ వచ్చు ప్రతీ మాటవలన…”

166 ఇప్పుడు, దీనిని గమనించండి. ఇప్పుడు నేను మొదటి వచనాన్ని ప్రారంభించబోవుచున్నాను:

క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని, మనము సంపూర్ణులమగుటకు సాగిపోదము;…(ఇప్పుడు, మీరు తెలుసుకోవాలని నేను కోరుచున్న మొదటి విషయం ఏదనగా: ఇక్కడ పౌలు ఎవరితో మాట్లాడుచున్నాడు? హెబ్రీయులతో. ఇట్లున్నది, “హెబ్రీయులతో,” ఆ పైన, హెబ్రీ పత్రిక అని ఉన్నది. అది సరియేనా? యేసుని త్రోసివేసిన ఆ యూదులు…మీరు—మీరు ఇప్పుడు దానిని గ్రహించగలరా? ఆయన ఆ యూదులతో మాట్లాడుచున్నాడు, ధర్మశాస్త్రముయొక్క ఛాయ క్రీస్తుకు ఒక సాదృశ్యంగా ఉండుటను వారికి చూపించుచుండెను. ఆ పాత కార్యములన్నియు క్రొత్త దానికి ఒక సాదృశ్యముగా ఉన్నవి. ఇప్పుడు గమనించండి.)

…క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని, మనము సంపూర్ణులమగుటకు సాగిపోదము;…

167 ఇప్పుడు, ఆయన ఆ సిద్ధాంతముల గూర్చి వారితో మాటలాడుచునుండెను. మనము వెళ్ళి మరియు పరిపూర్ణమైన విషయాలగూర్చి మాట్లాడుకొనెదము. ఇప్పుడు, మీరు పరిశుద్ధాత్మ చేత మీ విమోచనా దినము వరకు ముద్రించబడినప్పుడు మీరు దేవునిలో పరిపూర్ణులైయున్నారు. “దేవుని మూలంగా పుట్టినవాడు (మొదటి యోహాను) పాపము చేయజాలడు; దేవుని బీజము అతనిలో నిలిచియుండును గనుక, అతడు పాపము చేయజాలడు.”

168 పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక వ్యక్తి, తాను నింపబడ్డాడని అనుకునేవాడు కాదు, అయితే దేవుని ఆత్మచేత జన్మించినవాడు పాపము చేయజాలడు, ఏలయనగా దేవుని బీజము అతనిలో నిలిచియున్నది, మరియు అతడు పాపము చేయజాలడు. చూశారా? బైబిలు దానిని చెప్తుందా? కావున అక్కడే అది ఉన్నది. మీరు…మీరేమి చేస్తారన్నది కాదు, అదేంటి, అన్నది కాదు, లోకము మీ గురించి ఏమి అనుకుంటున్నది అనేది కాదు, అది దేవుడు మీ గురించి ఏమి అనుకుంటున్నాడు అనునదైయున్నది. చూడండి, చూశారా? మీవల్ల కాదు…నగరంలో నేను గంటకి నలభై మైళ్ళ వేగంతో ప్రయాణించవచ్చని, నేను ఈ నగరు మేయరు నుండి వ్రాతపూర్వకంగా ఒక ఉత్తరువును కలిగియుండగా, అప్పుడు ఏ పోలీసైనా నన్నెట్లు అరెస్టు చేయగలడు? నాకట్లు జరుగదు. ఆయన నన్ను ఇక చూడలేనట్లు, ఒక పాపపరిహారార్థబలి, దేవుని యెదుట స్థిరంగా; నాకు మరియు దేవుని యెదుట—యెదుట…ఒక రక్తపు కవచం, ఒక బంపరుగా ఉన్నప్పుడు నేనెట్లు పాపము చేయగలను? ఏలయనగా మనము మృతిపొందితిమి, మరియు మన జీవము పరిశుద్ధాత్మతో ముద్రించబడి, క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది. దేవుని దృష్టిలో తప్పిదమైన ఏ కార్యమునైనా మీరసలు ఎట్లు చేయగలరు? “మనము సత్యమును గూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత (హెబ్రీ 10) బుద్ధిపూర్వకంగా పాపము చేసినయెడల, పాపములకు బలి యికను ఉండదు.” ఇక్కడ (చూశారా?) ఉద్దేశ్యపూర్వకంగా పాపం చేయడం అసాధ్యం.

169 ఇప్పుడు, మనము ఇంకా ముందుకు వెళ్ళి చదువుదాము. అది సరియే.

…సంపూర్ణత; నిర్జీవక్రియలనుండి—నుండి మారుమనస్సు పొందుట, మరియు…దేవుని యందలి విశ్వాసము,

బాప్తీస్మములను గూర్చిన బోధ,…హస్త నిక్షేపణ, మరియు మృతులయొక్క ఆ పునరుత్థానము, మరియు…నిత్యమైన తీర్పు.

మరియు ఈ…దేవుడు సెలవిచ్చినయెడల, మనమాలాగు చేయుదము.

(ఇప్పుడు వారు ప్రారంభించగోరినది ఇక్కడి నుండియే, 4వ వచనం నుండి.) ఏలయనగా ఇది అసాధ్యం…ఒకసారి వెలిగింపబడి, మరియు పరలోక సంబంధమైన వరమును రుచిచూచి, మరియు పరిశుద్ధాత్మలో పాలివారై,

మరియు దేవుని దివ్య వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తులను అనుభవించిన తర్వాత,

తప్పిపోయినవారు, నూతన—వారిని మరలా నూతనపరచుట అసాధ్యము; వారు దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు.

170 ఇప్పుడు, ఇప్పుడు, అక్కడ దానిని మీరు చదువుచున్న కోణము నుండి చూస్తే, ఒక మనిషి పరిశుద్ధాత్మను పొందుకొని, మరియు పిదప పడిపోయి మరియు నశించిపోగలడు. కానీ అతడు దానిని చేయుట అసాధ్యం. చూశారా? అతడు దానిని చేయజాలడు. అతడు చేసినయెడల, క్రీస్తు అబద్ధమాడినట్లే. చూశారా? ఒకసారి వెలిగించబడినవారికి అది అసాధ్యం. ఇప్పుడు, ఇక్కడ గమనించండి. అతడు ఎవరితో మాట్లాడుచున్నాడు? అతడు ఆ సరిహద్దు యూదులతో మాట్లాడుచున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక మనుష్యుడు అని అతడెన్నడూ చెప్పలేదు; కానీ, “అతడు దేవుని వాక్యమును రుచి చూచినయెడల,” అని అతడు చెప్పెను.

171 ఇప్పుడు, కేవలం ఒక ఉపమాన రూపంలో దీనిని మీకు ఇవ్వనివ్వండి, తద్వారా మీరు చూస్తారు మరియు ఇప్పుడు దానిని తప్పిపోకుందురు. ఇప్పుడు, అతడు ఈ యూదులకు వ్రాయుచున్నాడు. వారిలో కొందరు సరిహద్దు విశ్వాసులైయున్నారు. చూశారా? అతడిట్లు చెప్పెను, “ఇప్పుడు, మనమిట్టి కార్యములను విడిచిపెట్టి మరియు సంపూర్ణత గూర్చి మాట్లాడుకోబోవుచున్నాము.” ఇట్లు చెప్పెను, “ఇప్పుడు, మనము బాప్తీస్మములు, మరియు మృతుల పునరుత్థానము, మరియు హస్త నిక్షేపణము మరియు ప్రతిదాని గూర్చి మాట్లాడుకొనుచున్నాము; కానీ ఇప్పుడు సంపూర్ణత గూర్చి మాటలాడుటకై ముందుకు వెళ్దాము. ఇప్పుడు, మీరు పరిశుద్ధాత్మలోనికి వచ్చినప్పటి దాని గూర్చి మనము మాట్లాడుకోబోవుచున్నాము. ఇప్పుడు, మీరు ఎంతో సమయము నుండి ఈ కూటములో ఉండియున్నారు…”

172 మరియు మీరు ఆ ప్రజలను చూసియున్నారు. వారు చుట్టూ నిలబడియుంటారు; వారు లోపలికి రారు లేదా బయటకు వెళ్ళరు. వారు పరిశుద్ధాత్మను అభినందిస్తారు. వారక్కడికి వస్తారు. మరియు బహుశా పరిశుద్ధాత్మ ఏదైనా చేసినచో, మరియు పురుషులు, వారు పైకి లేచి మరియు కేకలు వేస్తారు, మరియు దాని విషయమై నేల మీద పైకి మరియు క్రిందకి గెంతుతారు, కానీ వారెన్నడూ స్వయంగా దానిని పొందుకొనగోరరు. లేదు, లేదు! చూశారా? మరియు వారిట్లంటారు, “ఓ, అవును, అది మంచిది. ఓ, ఇప్పుడు దాని గూర్చి నాకు తెలియదు.” చూడండి, చూడండి చూశారా? సరిహద్దు విశ్వాసులు. వారు సరిగ్గా దానిని రుచి చూసేంత సమీపములో ఉంటారు, అయినా గానీ వారు దానిని పొందుకొనరు. చూశారా? ఇప్పుడు, వారు ఆ విధంగా అక్కడే చాలాసేపు ఉంటారు ఆ తర్వాత వారు పూర్తిగా కొట్టుకొనిపోతారు. ఈ ఆలయములో, అటువంటి కార్యమునే చేసిన చాలామంది పేర్లను నేను చెప్పగలను. మరలా దూరంగా కొట్టుకొనిపోతారు, వారిని పశ్చాత్తాప పడునట్లు నూతనపరచుటకు, వారికి ఇక పశ్చాత్తాపమనేది లేదు. సరిగ్గా వారు వారియొద్ద నుండి ఆత్మను దుఃఖపరిచినారు. వారు ఎంత సమీపముగా ఉన్నారంటే…

173 ఇక్కడ, మీరు గనుక నాతోపాటు త్రిప్పినట్లయితే (మీకు సమయము లేదని, ఇప్పుడు, నాకు తెలియును.) కానీ మీరు ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయమునకు త్రిప్పి మరియు దానిని చదివినయెడల, మీరు అదే కార్యమును పొందుకుంటారు. ఇప్పుడు దానిని గురుతు పెట్టుకునేవారికి, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము. ఇప్పుడు, 19వ వచనము నుండి ప్రారంభించి 26వ వచనము వరకు చదువుదాము. ద్వితీయోపదేశకాండము…మీరు కనుగొంటారు…ఇప్పుడు చూడండి. ఇశ్రాయేలీయులందరూ…ఆ ప్రజలు ఏమి చేశారంటే, వారు కాదేషు-బర్నేయ వద్దకు వచ్చిరి. ఓ, నేను దేనినో చూచుచున్నాను! ఈ ఆలయము, ఈ పెంతెకోస్తు ప్రపంచము సరిగ్గా ఇప్పుడు కాదేషు-బర్నేయ వద్దనే ఉన్నది. సహోదరుడా నెవిల్, అది ఖచ్చితముగా సరియే. మనము కాదేషు-బర్నేయ వద్ద ఉన్నాము, అది లోకముయొక్క తీర్పు సింహాసనము (తీర్పు సింహాసనమైయుండెను).

174 మరియు వేగులవారు బయటకు వెళ్ళిరి. ఇక్కడ యెహోషువా ఇట్లు చెప్పెను, “ఇప్పుడు, నేను వేగుల వారిని పంపియున్నాను,” లేదా మోషే, ఇట్లు చెప్పెను, “నేను వేగులవారిని, మీ ఒక్కొక్క గోత్రములో నుండి ఒక్కొక్క మనిషిని, పన్నెండుగురను పంపియున్నాను. ఆ దేశమును వేగుచూసి మరియు తిరిగి సమాచారమును తీసుకువచ్చుటకు వారిని పంపియున్నాము.” అది నిజమేనా?

మరియు వారు తిరిగి వచ్చినప్పుడు, ఆ పన్నెండుగురిలో నుండి తొమ్మిది మంది ఈలాగు చెప్పిరి, “ఓ, అదొక చక్కని దేశము, కానీ ఓ, కృప, మనము దానిని స్వాధీనం చేసుకోలేము. ఓ, మై! ఆ అమ్మోరీయులు అచ్చట ఉన్నారు, మరియు వారి ప్రక్కన చూడటానికి మనము మిడతల వలె కనిపించెదము. వారు ఆయుధములు ధరించిన వ్యక్తులైయున్నారు. వారి ప్రాకారములు పెద్దవైయున్నవి. ఓ, అది చాలా…అంతేకాదు, నీవు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చుటకంటే మేము ఐగుప్తులోనే చనిపోయి ఉండవలెనని నేను కోరుచున్నాను.”

175 అయితే, చిన్న కాలేబు మరియు యెహోషువాలు అక్కడకి దూకి మరియు వారిని నిమ్మలపరిచి; ఇట్లు చెప్పిరి, “మనము దానిని ఇట్టే స్వాధీనపరచుకొనగలము.” అవును, అయ్యా! అతడు అసలైనవాడు. ఇప్పుడు చూడండి. ఏమి జరిగినది? దేవుడు దానిని గూర్చిన వాగ్దానమును చేసెనని కాలేబు మరియు యెహోషువా ఎరిగియున్నారు: “అది ఎంత పెద్దదైనా నేను లెక్కచేయను, ఎన్ని అడ్డంకులైనా, వారెంత ఎత్తు ఉన్నా, వారెంత గొప్పవారైనా, దానితో ఎటువంటి సంబంధము లేదు. దేవుడు అట్లు చెప్పెను, మరియు మనము దానిని స్వాధీనపరచుకొనగలము.” మరియు ఆ ఇరువది ఐదు లక్షల మంది ప్రజలలో, వారిద్దరు మాత్రమే ఆ దేశములోనికి వెళ్ళారని, మీకు తెలుసా? ఎందుకనగా దేవుడు సత్యమని చెప్పినదానిలో వారు తమ విశ్వాసమును నిలిపియుండిరి. ఆమేన్!

176 ఈ ఆలయము, సరిగ్గా ఇప్పుడు, కాదేషు-బర్నేయ వద్ద నిలబడియున్నది. చూడండి, ఆ ప్రజలు వారు ఆ దేశములోని ద్రాక్షాపండ్లను సైతం రుచి చూసేంత సమీపంగా ఉండిరి. వారు ఆ ద్రాక్షాపండ్లను తిన్నారు. కాలేబు మరియు వారు అక్కడికి వెళ్ళి మరియు ఆ ద్రాక్షాపండ్లను తీసుకు వచ్చినప్పుడు, ఆ వ్యక్తులు కొన్నిటిని తెంపుకొని మరియు వాటిని తినిరి. “ఓ, అవి బాగున్నవి, కానీ మనం దానిని చేయలేము.” “దేవుని యొక్క మంచి కార్యమును రుచి చూసినవారు, పరిశుద్ధాత్మను రుచి చూసినవారు, దాని యొక్క మంచితనమును చూసినవారు, దానిని రుచి చూసినవారు, దేవుని యొక్క వాక్యమును రుచి చూసియున్నారు…” దానిని చూశారా? ఆ మనుష్యులలో ఎవరునూ, వారిలో ఏ ఒక్కరునూ వెళ్ళడానికి అనుమతించబడలేదు. వారు తమ స్వంత దేశములో, ఇక్కడ ఆ అరణ్యములోనే నశించిపోయిరి. వారు ఎన్నడూ అక్కడికి వెళ్ళలేదు, అయిననూ వారు దానిని రుచి చూసేంత దగ్గరగా ఉండిరి, కానీ దానిని స్వాధీనపరచుకొనుటకు సరిపడా కృప మరియు విశ్వాసము లేకుండెను. విషయం అదేయైయున్నది.

177 ఇప్పుడు. ఇప్పుడు ఈ ఉత్తరమును వ్రాసిన ఆ ప్రియమైన వ్యక్తి వ్రాసింది వినండి. మనం కేవలం ఆ తరువాత వచనాన్ని చదువుదాము. కేవలం ఒక్క నిమిషం గమనించండి. పౌలును గమనించండి. ఇప్పుడు మనం 7వది చదువుదాము:

ఎట్లనగా భూమి…తనమీద తరచుగా కురియు వర్షమును త్రాగి, మరియు ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదములను పొందును:

అయితే ముండ్ల తుప్పలును మరియు గచ్చ తీగెలును దానిమీద పెరిగినయెడల అది పనికిరానిదని విసర్జింపబడి, శాపము పొందతగినదగును; తుదకది కాల్చివేయబడును.

178 ఇప్పుడు, ఆయన ఏమి చెప్పెనో చూశారా? ఇప్పుడు గమనించండి. ఇక్కడే ఆ ప్రశ్న ఉన్నది; ఇప్పుడు, మరియు పిదప మనం ముగించెదము…ఈ విషయం కొన్ని ఏండ్ల వరకు నన్ను చంపినట్లు చేసినది.

179 ఒకసారి ఇండియానా, మిషావాక వద్ద భాషలతో మాట్లాడుచున్న ప్రజల మధ్యకు ఒక కూటమునకు నేను వెళ్ళాను. ఇప్పుడు, నేను నా స్వంత గుంపు ఎదుట ఉన్నాను. మీరు ఆ ప్రజలను గూర్చి వినియున్నారు…నేను నా జీవిత చరిత్రను, మరియు “ఇదిగో అతడిక్కడ ఉన్నాడు. ఇదిగో అతడు ఇక్కడున్నాడు,” అని చెప్పిన ఆ నల్ల జాతీయుడి గూర్చి చెప్పుటను విన్నారు. ఇప్పుడు, నేను దానిని చెప్పాను.

180 అయితే ఆ మిగతాది ఇట్లున్నది: నేను ఇద్దరు పురుషులను చూశాను. వారు…ఒకరు వర్తమానమును ఇస్తారు, మరొకరు దానిని అనువదిస్తారు. ఆ ఒకడు వర్తమానమునిచ్చును, మరియు మరొకడు దానిని అనువదించును. మరియు సహోదరుడా, వారు చెప్పేది సత్యమే. సరిగ్గా ఇది…నేనిట్లనుకున్నాను, “ఆహా నా భాగ్యము! అటువంటిది ఎన్నడును నేను చూసియుండలేదు.” నేనిట్లన్నాను, “నేను దేవదూతల మధ్య ఉన్నాను.” నేనెన్నడూ అటువంటిది చూసియుండలేదని, నేను అనుకున్నాను…ఒకడు మాట్లాడును, మరియు మరియొకడు…

181 మరియు నేను ఒక చిన్న బోధకునివలె, ఆ వెనుక కూర్చొనియున్నాను, మీరు…[టేపు మీద ఖాళీగా ఉన్నది—సంపా.]…ఇద్దరు వ్యక్తులు కొంత సమయము తర్వాత కరచాలనం చేయుదురు. నా జీవితములో నేనెన్నడూ అటువంటి వ్యక్తులను చూడలేదు. వారొక వర్తమానమును మాట్లాడుదురు, మరియు ఆ మరొకడు దానిని అనువదించును. మరియు మై, మై! అది అద్భుతంగా ఉండెను! ఒకడు, మాటలాడును మరియు ఆ మరొకడు అనువదించును. ఇరువురు…మరియు వారి చేతులను వారు పైకెత్తినప్పుడు వారు సున్నమువలె తెల్లగా మరెదరు. నేనిట్లనుకున్నాను, “ఓ, మై, మై! నా జీవితమంతా నేను ఎక్కడ ఉండియున్నాను? ఇది అసలు విషయం!” నేనిట్లన్నాను, “మై, పెంతెకోస్తువారు చెప్పినది సరియే.” అది ఖచ్చితముగా సరియే.

182 కేవలం సరిగ్గా ఇక్కడ చుట్టు ప్రక్కల ఉన్నది తప్ప నేను ఎక్కువగా ఏమి చూసియుండలేదు, ఎక్కడైతే…బహుశా ఇద్దరు స్త్రీలు ఎక్కడో ఒక బృందముతో ఉండుటను చూసాను. మరియు వారు గొణుగుతుంటారు; మరియు ఒకరినొకరు, “గ్రద్దగూడు,” అని పిలుచుకొనుచుండిరి మరియు, మీకు తెలుసా, కేవలం ఆ విధంగా, ఒకరినొకరు తిట్టుకొనుచుంటారు. ఇప్పుడు ఇది స్త్రీలను కించపరచాలనో లేదా అట్టిదేదో కాదు, కానీ కేవలం…అది—అది చాలా దయనీయమైన స్థితిలో ఉండియున్నది. మీలో ఎవరైనా గానీ…మీకు గుర్తున్నదా, సహోదరుడా గ్రాహం. ఆ సమయములో నీవు కేవలం ఒక చిన్నపిల్లవాడివి. అయితే, అది ఆ విధంగా ఉండియున్నది.

మరియు నేను దానిని విని, మరియు నేనిట్లనుకున్నాను, “ఓ, మై, నేను దేవదూతలను కలుసుకున్నాను.”

183 ఒక దినమున ఇంటి మూలనుండి వచ్చుచుండగా, రెండవ దినమున, నేను వారిలో ఒక వ్యక్తిని కలిసాను. “అయ్యా, ఎలా ఉన్నారు?” అని నేను అన్నాను.

“మీరెలా ఉన్నారు?” అని అతడన్నాడు. ఇంకా అతడిట్లన్నాడు, “మీరు…మీ పేరు ఏంటి?”

మరియు నేనిట్లు చెప్పాను, “బ్రెన్హామ్.”

“మీరెక్కడినుండి వచ్చారు? ఇక్కడివారేనా?” అని అతడన్నాడు.

మరియు నేనిట్లు చెప్పాను, “కాదు, నేను జఫర్సన్విల్ నుండి వచ్చాను.”

“సరి, అది మంచిది. నీవు పెంతెకోస్తువాడివా?” అని అతడన్నాడు.

నేనిట్లు చెప్పాను, “కాదు, అయ్యా, నేను కాదు.” “పెంతెకోస్తువారి విధానములో పరిశుద్ధాత్మను పొందుకోవడాన్ని నేను అస్సలు ఒప్పుకొను,” అని నేనన్నాను. ఇంకా నేనిట్లన్నాను, “ఏదేమైనా,” నేను చెప్పాను, “నేను నేర్చుకోవడానికే ఇక్కడ ఉన్నాను.”

184 అతడిట్లన్నాడు, “సరి, అది చాలా మంచిది.” మరియు అతనితో మాట్లాడుచుండగా, (ఆ బావినొద్ద స్త్రీ వలె), అతని ఆత్మను వివేచించగా, అతడొక నిజమైన క్రైస్తవుడైయుండెను. సహోదరుడా, అతడు చెప్పినదంతా సరియే అని నా ఉద్దేశ్యం. అతడు మంచివాడు. ఇప్పుడు, మీరందరు…ఎంతమంది నా కూటములలో ఉండి మరటువంటివి జరగడాన్ని చూశారు? మీరు చూశారా? మరియు ఆ వ్యక్తి పరిపూర్ణముగా సరిగానే ఉన్నాడు. కావున పిదప, నేను—నేను ఇట్లనుకున్నాను, “అదిగో! ఆహా, ఎంత అద్భుతం!”

185 దాదాపు ఆ సాయంకాలము, మధ్యాహ్నం సమయం కావచ్చు, నేను ఆ మరొక వ్యక్తిని కలిసాను. “అయ్యా, మీరు ఎలాగున్నారు?” అని నేనన్నాను.

“మీరెలా ఉన్నారు? మీ పేరు ఏంటి?” అని అతడన్నాడు. మరియు నేను అతనికి చెప్పాను. మరియు అతడు, “నీవు…నువ్వు—నువ్వు ఒక పెంతెకోస్తువాడివా?” అని అన్నాడు.

నేనిట్లన్నాను, “లేదు, అయ్యా, ఖచ్చితమైన పెంతెకోస్తువాణ్ణి కాదు, నేను అలా అనుకోవడంలేదు.” ఇంకా నేనన్నాను, “నేను కేవలం ఇక్కడికి నేర్చుకొనడానికి వచ్చాను.”

అతడన్నాడు, నేనన్నాను, అతడిట్లన్నాడు, “నీవెన్నడైనా పరిశుద్ధాత్మను పొందుకున్నావా?”

“నాకు—నాకు తెలియదు,” అని నేను చెప్పాను. నేనిట్లన్నాను, “మీరందరూ కలిగియున్నదాని ప్రకారమైతే, నేను కలిగిలేనని నేను అనుకొనుచున్నాను.”

“ఎన్నడైనా భాషలలో మాట్లాడినావా?” అని అతడన్నాడు.

“లేదు, అయ్యా!” అని నేనన్నాను.

“అలాగైతే నీవు దానిని కలిగిలేనట్టే,” అని అతడన్నాడు.

186 మరియు నేనిట్లన్నాను, “సరి, అది నిజమేనని నేను—నేను అనుకొనుచున్నాను.” నేనింకా ఇట్లన్నాను, “నాకు తెలియదు. కేవలం రెండు సంవత్సరాల కంటె, తక్కువ కాలం నుండి నేను బోధిస్తున్నాను,” మరియు నేను చెప్పాను, “దాని గూర్చి నాకు అంతగా తెలియదు.” నేనన్నాను, “బహుశా నాకు తెలియదు.” నేను ఇట్లన్నాను, “నేను గ్రహించలేకున్నాను…” కారణం ఏమిటి, నేను అతణ్ణి అక్కడ పట్టుకోడానికి ప్రయత్నించుచున్నాను (చూశారా?), దానిని పట్టుకోడానికి. మరియు నేను చేసినప్పుడు, నేనెన్నడైనా ఒక వేషధారిని కలిసానంటే, ఇతను వారిలో ఒకడైయున్నాడు. అతని భార్య నల్ల-జాతీయురాలు; మరియు అతడు ఒక శ్వేత-జాతీయురాలితో జీవిస్తున్నాడు, మరియు ఆమె ద్వారా ఇద్దరు పిల్లల్ని కన్నాడు; మరియు భాషలలో మాట్లాడుచు, అంతే పరిపూర్ణముగా దానిని అనువదించుచున్నాడు. మరియు నేనిట్లన్నాను, “ఇప్పుడు, ప్రభువా, నేను ఎందులో చిక్కుకున్నాను?” దేవదూతల నుండి, నేనెందులోనికి పోయానో నాకు తెలియలేదు. “నేను—నేను—నేను మూలాధారమును కోరెదను; అది బైబిలు గ్రంథమై ఉండవలసియున్నది. అది వాస్తవమైయుండవలెను. ప్రభువా, ఎక్కడో ఏదో తప్పిదమున్నది. అది ఎలా సాధ్యం?” అని నేనన్నాను.

187 ఆ రాత్రి నేను కూటమునకు వెళ్ళాను, మరియు ఆ ఆత్మ కుమ్మరించబడినది; మరియు సహోదరుడా, అది పరిశుద్ధాత్మయేనని, మీరు దానిని అనుభూతి చెందగలరు. అవును, అయ్యా! అది కాదనినయెడల, అది పరిశుద్ధాత్మయేనని అది నా ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చినది. మరియు నేను ఆత్మ యొక్క వివేచన ఎట్లుండునో, దాని గూర్చి అంతగా తెలియని, ఒక యౌవన బోధకుడిగా మాత్రమే ఉన్నాను. కానీ నేనక్కడ కూర్చునియున్నాను. మరియు నన్ను రక్షించిన అదే దేవుడు, అది అదే అనుభూతియని నేనెరిగియున్నాను…నేను ఆ పైకప్పు గుండా పోవుచున్నట్లు అనుభూతి చెందాను, అది ఆ భవనంలో అటువంటి ఒక అద్భుతమైన అనుభూతియైయున్నది. నేను అనుకున్నాను…

188 అక్కడ దాదాపు పదిహేను వందల మంది ఉన్నారు. నేను ఇట్లనుకున్నాను, “మై, ఓ మై!” వారిలో రెండు లేదా మూడు గుంపులు కలుసుకున్నవి. మరియు నేను ఇట్లనుకున్నాను, “ఓ, మై! అది ఎలా సాధ్యం? ఇప్పుడు, ఆ గొప్ప ఆత్మ ఈ భవనంలో ఆ విధంగా కుమ్మరించబడుతుంది; మరియు ఇక్కడ, అక్కడికి పైకి పోవుచున్న వీరిని చూడండి, ఆ అబ్బాయిలు భాషలలో మాట్లాడుచు, అనువదించుచు, వర్తమానమును పరిపూర్ణముగా ఇచ్చుచున్నారు— మరియు వారిలో ఒకడు వేషధారి మరియు మరొకడు ఒక నిజమైన దైవజనుడైయున్నాడు.” మరియు నేను ఇట్లనుకున్నాను, “ఇప్పుడు, నేను మొత్తం గందరగోళంలో ఉన్నాను. ఏమి చేయాలో నాకు తెలియడంలేదు.”

189 సరి, దాని తర్వాత వెంటనే, నా యొక్క ఒక మంచి స్నేహితుడు, సహోదరుడు డేవిస్ (మీకు తెలుసు), నేనొక తోలుబొమ్మనని అనడం ప్రారంభించాడు. అది ఆడపిల్లయొక్క ఆటబొమ్మ, మీకు తెలుసు. మరియు కావున, నేను ఒంటరిగా ఉన్నాను, మరియు కావున నేను…అతడు నాతోపాటు కొనసాగుతూ, మరియు ఆపై నాతో, ఒక విధంగా వేళాకోళం చేయనారంభించాడు.

190 మరియు మేమొక చిన్న…మరియు మీ అమ్మగారు మరియు మేమంతా ఆయా స్థలములలో చిన్న చిన్న కూటములను కలిగియున్నాము. ఆ సమయానికి ఆలయము ఇంకను—ఇంకను నడిపించబడుటలేదు, మరియు మేము ఆయా స్థలములలో చిన్న చిన్న కూటములను కలిగియుంటున్నాము. మరియు చివరకు ఒక దినమున, ఆలయం కట్టబడిన పిమ్మట, అనేక సంవత్సరాల తర్వాత, నేను ప్రార్థించుకోడానికి గ్రీన్స్ మిల్ దగ్గర నా గుహ వద్దకు వెళ్ళాను, ఎందుకనగా సహోదరుడు డేవిస్ తన—తన—తన పత్రికలో నా గురించి కొన్ని భయంకరమైన సంగతులు చెప్పాడు. నేను అతణ్ణి ప్రేమించాను. ఏదీ జరగకూడదని నేను కోరుకున్నాను, మరియు నేను—నేను అతని కొరకు ప్రార్థించుటకు అక్కడికి వెళ్ళాను. మరియు నేనక్కడికి వెళ్ళాను, మరియు నేను ఆ గుహలోకి వెళ్ళాను. మరియు దాదాపు రెండు రోజులు నేనక్కడ ఉన్నాను. మరియు నేను ఇట్లన్నాను, “ప్రభువా, అతణ్ణి క్షమించుము. అతడు—అతని యొక్క భావం—భావం అది కాదు.” మరియు నేను ఇట్లనుకున్నాను, “నీకు తెలుసు…” నేనొక లేఖనము గూర్చి ఆలోచించడం జరిగినది.

191 మరియు నేను బయటకు వెళ్ళాను. మరియు అక్కడ ఒక మొద్దు ఉన్నది (ఆ మొద్దు ఇంకను అక్కడ ఉన్నది, ఈ మధ్యకాలంలో కూడా అది ఇక్కడ దానిపై ఉన్నది) ఆ పర్వతము క్రింద మరియు ఆ లోయ నుండి వచ్చు ఒక చిన్న దారికి అడ్డంగా ఉండియున్నది. మరియు నేను ఆ మొద్దుని అడ్డంగా పెట్టి, ఆ పర్వతాల మీదుగా అక్కడ—ఆ వెనుక చూస్తూ ఉన్నాను, మరియు ఆ విధంగా నా బైబిలు పరచియుంచాను. నేనిట్లు అనుకున్నాను, “నీకు తెలుసు…” నేనొక లేఖనము గూర్చి ఆలోచించుచున్నాను: “ఆ కంచరివాడు, వాడు నాకు చాలా కీడు చేసెను, మరియు ఎదిరించెను.” మీకు తెలుయును…నేనిట్లు అనుకున్నాను, “నేనిప్పుడే దానిని చదివెదనని నేను నమ్ముచున్నాను.” నేను బైబిలును తెరచాను, మరియు నేను ఇట్లన్నాను, “సరి…” నా ముఖాన్ని తుడుచుకున్నాను, మరియు గాలి వీచినది, మరియు అది హెబ్రీ 6నకు దానిని త్రిప్పినది. “సరి,” నేను ఇట్లన్నాను, “అది ఉన్నది అక్కడ కాదు.” మరియు నేను దానిని తిరిగి ఈ విధంగా పెట్టాను. మరియు ఆ గాలి మరలా వీచినది మరియు దానిని మరలా వెనుకకు త్రిప్పినది. మరియు నేను ఇట్లన్నాను, “ఇప్పుడు, ఆ గాలి మరలా దానిని ఆ విధంగా వెనుకకు త్రిప్పడం, అది వింతగానున్నది.” కావున నేను అనుకున్నాను, “సరి, నేను దానిని చదివెదనని నేను నమ్ముచున్నాను.” మరియు ఇట్లు చెప్పబడెను:

ఏలయనగా ఇది అసాధ్యం ఎట్లనగా ఒకసారి వెలిగించబడి,…పరిశుద్ధాత్మలో పాలివారైనవారు, మరియు దేవుని వాక్యమును…రుచిచూసి, మరియు రాబోవు లోకముయొక్క కార్యమును అనుభవించిన తర్వాత.

నేనిట్లు అనుకున్నాను, “సరి, దానిలో నాకు ఏమియూ కనబడుటలేదు.” ఇంకా క్రిందకు, ఆ మిగతా అధ్యాయమును చదివాను. అందులో ఏమి లేదు. నేను ఇట్లన్నాను, “సరి, అది—అది దానిని స్థిరపరుస్తుంది.” మరియు నేను—నేను దానిని ఈ విధంగా చూసాను, మరియు అది మరలా వెనక్కి వెళ్ళినది. మరియు నేను దానిని తీసుకున్నాను, మరియు నేను ఇట్లనుకున్నాను, “సరే, అది ఏమిటి?” నేను దానిని చదువుతూనే ఉన్నాను, మరియు దానిని చదువుతూనే ఉన్నాను, చదువుతూనే ఉన్నాను, నేనిట్లు చెప్పాను, “సరి, నాకు అర్ధం కావడంలేదు.” అప్పుడు నేను…మరియు నేను ఇంకా క్రిందకు చదివాను:

…ఒకసారి వెలిగింపబడిన వారికి అది అసాధ్యము,…

అది ఇక్కడ క్రింద ఎక్కడైతే ఇట్లు చెప్పబడుచున్నదో ఆ చోటుకి అది వచ్చినది:

మరియు భూమి…తన మీద తరుచుగా కురియు వర్షమును త్రాగి, ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు, దేవుని ఆశీర్వచనము పొందును:

అయితే ముండ్లతుప్పలును గచ్చ తీగెలును దానిమీద పెరిగినయెడల అది పనికిరానిదని విసర్జింపబడి, మరియు…శాపమునొందును; తుదకు అది కాల్చివేయబడునన్న తీర్పునొందును.

192 నేను చెప్పాను, “దాని అర్ధం ఏమిటని ఆశ్చర్యపోవుచున్నాను?” నేను కేవలం…ఇప్పుడు, అక్కడ నేనిక దేనిగూర్చి ఆలోచించుటలేదు. కేవలం దానినే ఆలోచిస్తూ ఉన్నాను. మరియు సరిగ్గా నేనక్కడ కూర్చుని ఉండగా, సహోదరుడు డేవిస్ మరియు అక్కడున్న వారి గూర్చి ప్రభువు నాకేదైనా ఒక దర్శనమును ఇస్తాడని నేను అనుకున్నాను. మరియు నేనక్కడ కూర్చున్నాను; నేను చూడగా, మరి నాకు ఎదురుగా ఆ తొర్రలో ఏదో తిరుగుతున్నట్లు నాకు కనిపించినది. మరది ప్రపంచము తిరుగుటయైయున్నది. మరియు అదంతయు బ్రద్దలైయుండుటను నేను చూసాను, అది సరిగ్గా అంతటా దున్నబడినట్లు కనిపించినది. మరియు ఒక మనుష్యుడు అతని ముందు ఒక—ఒక—ఒక పెద్ద వస్తువు నిండా విత్తనాలు కలిగియుండి బయలుదేరాడు, మరియు అతడు తన దారి పొడుగునా ఆ విత్తనాలు భూమియందంతటా చల్లుచుండెను. మరియు అతడు భూమియొక్క ఈవైపు నుండి ఆవైపునకు వెళ్ళెను, మరియు అతడు నా దృష్టినుండి కనుమరుగయ్యెను. మరియు అతడు నా దృష్టికి కనుమరుగైన వెంటనే, నిజంగా దొంగ-చూపులతో, నల్లని దుస్తులు ధరించిన ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు, ఈ విధంగా పోవుచు, వ్యూ, వ్యూ, చెడ్డ విత్తనాలు విసురుచు వెళ్ళుచుండెను, వ్యూ, వ్యూ. మరియు నేను దానిని గమనించాను, మరియు భూమి గుండ్రంగా తిరుగుతున్నాకొద్దీ…

193 కొద్దిసేపటి తర్వాత గోధుమ పైకి వచ్చినది. మరియు ఆ గోధుమ పైకి వచ్చినప్పుడు, అచ్చట నుండి పిచ్చి మొక్కలు, మరియు ముండ్లపొదలు, మరియు గచ్చతీగెలు, మరియు కలుపు మొక్కలు వచ్చినవి, మరియు అన్నియు పెరుగుచున్నవి, ఆ కలుపు మొక్కలు, మరియు అన్నియు ఆ గోధుమలో పెరుగుచున్నవి. మరియు అవన్నియు కలిసి పెరుగుచున్నవి. మరియు అప్పుడు నిజంగా, భయంకరమైన కరువొకటి వచ్చినది, మరియు ఆ చిన్న గోధుమ దాని తలను అలా వాల్చినది, మరియు ఆ చిన్న పిచ్చి మొక్కలు, మరియు ముండ్లపొదలు, గచ్చతీగెలు కూడా, వాటి తలలు వాల్చినవి. ప్రతీ కలుపు మొక్క కేవలం హ, హ, హ, హ, ఆ విధంగా శ్వాస పీల్చుచున్నది. మీరు వాటిని వినవచ్చును. మరియు అవి వర్షము, వర్షము కొరకు కేకలు వేయుచున్నవి.

194 మరియు కాసేపటి తర్వాత, ఒక పెద్ద మేఘము వచ్చినది, మరియు నీరు సమృద్ధిగా ప్రవహించినది. మరియు అది అక్కడ పడినప్పుడు, ఆ గోధుమ పైకి ఎగిరి మరియు, “మహిమ! హల్లెలూయా! దేవునికి స్తోత్రం!” అని అరవడం మొదలుపెట్టినది. మరియు ఆ కలుపు మొక్కలు కూడా పైకి ఎగిరి మరియు, “మహిమ! దేవునికి స్తోత్రం! హల్లెలూయా!” అని అరిచినవి. ఆ ముండ్ల పొదలు మరియు అవన్నియు, ఆ పొలములో నాట్యమాడుతూ, “మహిమ! హల్లెలూయా! దేవునికి స్తోత్రం!” అని కేకలు వేయుచున్నవి.

సరి, “అది నాకు అర్ధం కాలేదు,” అని నేను అన్నాను.

195 ఆ దర్శనము నన్ను విడిచిపెట్టినది; అప్పుడు నేను మళ్ళీ దానిని ధ్యానించడం మొదలు పెట్టాను: “ఆ గచ్చతీగెలు తిరస్కారానికి దగ్గరగా ఉన్నవి.” అప్పుడు నేను దానిని పొందుకున్నాను. యేసు ఇట్లు చెప్పెను, “వర్షము నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కురియును.” ఒక వ్యక్తి కూటములో కూర్చుని, నిజమైన పరిశుద్ధాత్మచేత భాషలలో మాట్లాడి, కేకలు వేసి మరియు మిగిలినవారి లాగానే ప్రవర్తించగలడు మరి అయిననూ అతడు దేవుని రాజ్యములో ఉండకపోవచ్చును. అది ఖచ్చితంగా వాస్తవం. యేసు ఇట్లు చెప్పలేదా, “ఆ దినమున అనేకులు నిలబడి ఇట్లంటారు, ‘ప్రభువా, నీ నామమున నేను దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున నేను (ప్రసంగించలేదా) ప్రవచింపలేదా? నీ నామమున నేను అనేక గొప్ప కార్యములను చేయలేదా?’” యేసు చెప్పెను, “అక్రమము చేయువారలారా, నాయొద్ద నుండి తొలగిపోవుడి, నేను మిమ్మును ఎన్నడును ఎరుగను.” దాని సంగతేమిటి?

196 దాని భావము సరిగ్గా ఇక్కడ ఉండియున్నది. చూశారా? వారు ఆకాశము నుండి మంచి వర్షాన్ని రుచి చూసారు. కానీ ప్రారంభమునుండే, వారు తప్పైయున్నారు. ఆది నుండే వారి ఉద్దేశ్యములు సరైనవి కావు; వారి ఆశయాలు సరైనవి కావు. అది, మీరు చెప్పలేరు. ఆ…మీకు తెలుసా, కోతలో అతడిట్లు చెప్పెను, “నేను వెళ్ళి వాటన్నింటిని పెరికి వేయనా?”

197 ఆయనిట్లు చెప్పెను, “వాటిని కలిసి ఎదగనియ్యుడి, మరియు ఆ దినమున గురుగులు మరియు గచ్చతీగెలు కాల్చివేయబడును, మరియు ఆ గోధుమలు కొట్లలోనికి పోవును.” ఇప్పుడు, ఏది గురుగు, లేదా ఏది గచ్చతీగె, లేదా ఏది గోధుమ అనునది మీకెట్లు తెలియును? “వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకొందురు.” మీరు చూడండి, సహోదరుడా, సహోదరి, ఒక మంచి చెట్టు చెడ్డ ఫలమును తీసుకురాదు. ఏదేమైనను, మార్గములో ఎక్కడో ఒక చోట, మీరు దీనిని ఎదుర్కుంటారు. కావున, మీరు పరిశుద్ధాత్మ బాప్తీస్మమును వెదకుటలో…అది ఎవరు వ్రాసారో గానీ నేను ఆనందిస్తున్నాను. చూశారా?

198 ఇప్పుడు, అక్కడ ఆ సరిహద్దు విశ్వాసులు, వారు సరిగ్గా వారితోనే ఉన్నారు, వారు వారి సున్నతితో పాటు సున్నతి పొందారు. వారు నేరుగా దేవుడు వాగ్దానము చేసిన దేశము వరకు, సరిగ్గా దానియొక్క అంచు వరకు వెళ్ళారు. ఆ అంచుదాకా చాలా మంది వ్యక్తులు నడుస్తారు. అతడు నేరుగా పరిశుద్ధాత్మ బాప్తీస్మము వరకు వెళ్ళి మరియు దానిని నిరాకరిస్తాడు. అతడు దానిని వదులుకొనగోరడు. అతడు సరిగ్గా యేసుక్రీస్తు నామములో బాప్తీస్మము అను లేఖనము వరకు వస్తాడు, మరియు తన వీపును త్రిప్పుకుంటాడు, మరియు దానిని చూడకుండునట్లు దానిని తిరస్కరిస్తాడు.

199 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, నామములో ఎవరైనా బాప్తీస్మము పొందినట్లు బైబిలు అంతటిలో ఒక్క లేఖనమైనా లేదు, ఒక్క లేఖనము కూడా లేదు. క్యాథలిక్ సంఘము దానిని ప్రారంభించినది, లూథర్ లోనికి వచ్చినది, అక్కడి నుండి వెస్లీ, మరియు ఇక్కడి వరకు వచ్చినది. అది ఖచ్చితంగా సరియే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు నామము వాక్య క్రమమైయున్నది. అది అపొస్తలుల బాప్తీస్మమైయున్నది. మీరు దానిని చేసి మరియు ఒక సంఘ శాఖలో ఉండలేరు. అది వాస్తవం.

200 ఇప్పుడు, మీరు ఆ కార్యములు చూస్తున్నారా? పరిశుద్ధాత్మ బాప్తీస్మము, ఆత్మయొక్క వరములు, దేవుడు తీసుకువచ్చే సంగతులు…ఆత్మయొక్క ఫలము ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము (ఓ, మీరిట్లు అనవచ్చు, “కానీ బ్రెన్హామ్ సహోదరుడా, దేవునికి స్తోత్రం, నాకు దీర్ఘశాంతమున్నది.” అది ఆ విధంగా అనిపిస్తుంది. ఈ మధ్యనే నేను ఓహియోకి వెళ్ళాను, మరియు ఎవరో నన్ను అడిగారు, ఇక్కడకి ఒక ఉత్తరమును వ్రాసి మరియు నేను ప్రజలకు యేసుక్రీస్తు నామములో బాప్తీస్మము ఇచ్చానా అని అడిగారు. నేను ఒక్క మాటైనా చెప్పలేదు. ఏదో విధంగా వారు దానిని తెలుసుకున్నారు, మరియు పదహారుగురు సహకరించే సేవకులు వదిలిపెట్టేశారు. దీర్ఘశాంతము అంటే అది కాదా!)—దీర్ఘశాంతము, మంచితనము, సాత్వీకము, దయాళుత్వము, సహనము మరియు పరిశుద్ధాత్మ. చూశారా?

201 ఓ, సహోదరుడా, సహోదరి, మనం—మనం కాదేషు-బర్నేయవద్ద ఉన్నాము. మీరిప్పుడు రుచి చూస్తున్నారు. గత రాత్రి పరిశుద్ధాత్మ ఒక బలమైన గాలి వలె మనపై కుమ్మరించబడి, మన లోపలికి వచ్చినది. అది మీలో అనేకులపై వ్రాలెను. ఈనాడు సేవకులు ఇక్కడా మరియు అక్కడా గృహములను దర్శించుచున్నారు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టువారి మీద చేతులుంచి మరియు వారి కొరకు ప్రార్థిస్తున్నారు. మీరొక ప్రత్యామ్నయాన్ని తీసుకోవద్దు. మీరు ఏదో ఒక విధమైన శబ్దాన్ని తీసుకోవద్దు. మీరు ఏదో ఒక విధమైన అనుభూతిని తీసుకోవద్దు. దేవుడు మిమ్మల్ని మలచి ఒక నూతన సృష్టిగా చేసి, మరియు మిమ్మల్ని ఒక నూతన వ్యక్తిగా మార్చేంతవరకు అక్కడే వేచియుండండి. మీరిప్పుడు దానిని రుచి చూస్తున్నారు, కేవలం రుచి చూస్తునారు, కానీ నేరుగా ఆ బల్ల వద్దకు పావురము మిమ్మల్ని నడిపించనీయండి, మరియు—మరియు ఆ గొర్రెపిల్ల మరియు పావురము కలిసి కూర్చుంటాయి, మరియు ఎప్పటికీ దేవుని వాక్యముపై విందు చేస్తాయి. ఏలయనగా ఆకాశము లేదా భూమియు గతించినా గానీ అది మాత్రం నిలబడుతుంది; దేవుని వాక్యము నిలిచియుంటుంది. అది సత్యమైయున్నది.

202 దయచేసి నేనొక సంస్కరణవాదినని తలంచకండి. నేను అట్లు ఉన్నయెడల, అలా ఉండాలని నా భావం కాదు. నేను గనుక…నాకు తెలిసినంతవరకు; నేను కలిగియున్నదానిని బట్టి, ఈ ప్రశ్నలకు నేను జవాబునిచ్చానని నేను ఆశిస్తున్నాను.

203 మరియు కావున, హెబ్రీ 6లో, మీరు చూసినట్లయితే, “సరి, మేము మీతో కూడా అంతవరకు వచ్చెదము,” అని చెప్పిన హెబ్రీయులతో పౌలు మాట్లాడుచుండెను. వారు పై దాకా వచ్చెదరు. మీరు చూశారా? చెప్పెను, “ఇప్పుడు, మీరు…” పైదాకా వచ్చి మరియు రుచి చూసినవారు.

204 నేను ఆ భవనంలో వెనుకకు చూడటం జరిగినది. అది మీకు సజీవ దేవుని యొక్క ఋజువును చూపించుటకైయున్నది. ఈ వ్యక్తిని నేను ప్రసిద్ధి చేయడంలేదని నేను ఆశిస్తున్నాను. ఈ మధ్యనే నేనొక కూటమునుండి వచ్చియున్నాను, మరియు ఇక్కడికి వచ్చి, మరియు అతని గూర్చి నేను ప్రకటించాను, నాకొక మంచి స్నేహితుడు, నా వ్యక్తిగతమైన చిన్ననాటి మిత్రుడు, నాతోటి వేటగాడు, నా పట్ల మంచితనము కలిగిన ఒక వ్యక్తి, నా సంఘమునకు వచ్చియున్న ఒక వ్యక్తి, మరియు నాకు సహోదరునిగా ఉన్నవాడు; నేను అతణ్ణి బస్టీ అని పిలుస్తాను. అతని పేరు ఎవరెట్ రాజర్స్; అతడు మిల్టౌన్ లో నివసించేవాడు. దానిని ప్రకటించుటకు నేను ఇక్కడకు వచ్చుటను గూర్చి ఎంతమందికి జ్ఞాపకమున్నది? అతడిక్కడ ఆసుపత్రిలో పడియున్నాడు; వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేసి, అతణ్ణి తెరిచి చూడగా, ఎంతగా క్యాన్సరుతో నిండియున్నాడంటే వారు కేవలం అతనికి కుట్లు వేశారు. ఇట్లు చెప్పిరి, “అతడిక క్షీణించిపోతాడు; కొద్ది వారములలో అతడు చనిపోతాడు; దాని విషయములో ఇక అదే జరుగుతుంది. అతడు చనిపోతాడు, అంతే.”

205 నేనిక్కడ వేదిక మీద నిలబడి, అతని కొరకు నేనెట్లు ప్రార్థన చేశానో మీకు జ్ఞాపకమున్నదా? క్రిందకు వెళ్ళి మరియు ఆ గదిలోనికి వెళ్ళాను, ఏదో నా హృదయాన్ని పిండేస్తున్నట్లైనది. నేను ఆ గదిలోనికి నడుచుకుంటూ వెళ్ళాను, మరియు నేను వెళ్ళగానే అందరినీ బయటికి పంపించాను తద్వారా నేను…సహోదరుడు ఎవరెట్ అక్కడ పడియున్నాడు. మరియు మీకిది గుర్తుండియుండును. నేను లోపలికి నడుచుకుంటూ వెళ్ళి; నేనిట్లు అన్నాను, “సహోదరుడా—సహోదరుడా బస్టీ.” (నేను అతణ్ణి బస్టీ అని పిలుస్తుంటాను.)

206 చాలాకాలం క్రితం మేము బ్రష్ ఆర్బర్ కూటములను అక్కడ కలిగియున్నప్పుడు, ఆ కొండమీదనున్న మెథడిస్టులందరూ (గెర్టీ, వారిలో ఒకరు), చుట్టూ జారుకుంటూ వచ్చి, నేనేమి చెప్పబోవుచున్నానో చూచుటకు గ్రేప్ ఆర్బర్ గుండా తొంగి చూసేవారు, మరియు అట్లు చేసేవారు, ఆ మెథడిస్టు సంఘము వారిని వెలివేస్తుందేమోనని భయపడేవారు. మరియు పిదప, నేను వెళ్ళి మరియు అక్కడొక దర్శనమును చూశాను, మరియు ఒక క్యానులో మాంసమంతటిని పోగుచేయుటను నేను చూశాను. నేను కొన్ని చేపలను పట్టుకొని వాటిని వ్రేలాడదీసి, ఈ దారాలపై వాటిని—వాటిని పెట్టి, మరియు వాటిని కట్టగట్టాను. మరియు నేను చూసినప్పుడు…మరియు అదంతా ఒక దర్శనములో అయియున్నది; ఆ రాత్రి బ్రష్ ఆర్బర్ క్రింద నిలబడియున్న ఒక గుంపు ప్రజలను నేను విడిచి—విడిచి వెళ్ళాను మరియు ఆ కొండపైనున్న సహోదరుడు రైట్ వద్దకు వెళ్ళాను. మరియు ఆ మరుసటి ఉదయము కూడా వారు నన్ను కనుగొనలేకపోయారు. నేనిట్లు చెప్పాను, “మీలో ఎవరు కూడా…”

207 నేనక్కడ నిలబడి ప్రసంగించుచుండగా, అంతలో ఆ వెలుగు వచ్చినది; ఆ అగ్ని స్తంభము సరిగ్గా ఇక్కడ నా యెదుట వ్రేలాడి మరియు ఇట్లు పలికినది, “దీనిని విడిచిపెట్టి మరియు అడవులలోనికి వెళ్ళుము; నేను నీతో మాట్లాడుదును.” అదే దినమున, ఆ మరుసటి రోజున వారు నన్ను ఆ కొండ మీద కనుగొన్నారు. మరియు నేనక్కడ ఉండియున్నాను; నా కారును పొదల్లో దాచిపెట్టాను, మరియు ఆ రాత్రంతా మరియు మరుసటి రోజంతా ప్రార్థించుచూ ఆ కొండ మీదనే ఉన్నాను. వారిలో కొందరు అక్కడికి వచ్చారు, ఆ కారును కనుగొని మరియు అక్కడికి వచ్చారు…సహోదరుడు గ్రాహం స్నెల్లింగ్, పరిశుద్ధాత్మతో నింపబడి మరియు పరిచర్యకు పిలుపును పొందుకున్నది, ఆ రోజేయైయున్నది.

208 ఆ పైన కొండమీద నేను పరుండియున్నాను, మరియు ఆయన—ఆయన చేయవలసిన వివిధ సంగతుల గూర్చి నాతో చెప్పెను మరియు మేమెటువంటి సంబంధాన్ని కలిగియుండబోతామన్నది చెప్పెను. వ్రేలాడబడిన చేపలను ఒక దర్శనములో ఆయన నాకు చూపించెను, “ఇది నీ మిల్ టౌన్ సంఘము,” అని చెప్పెను.

మరియు వాటిలో నాలుగు లేదా ఐదు పడిపోయినవి; మరి, “వారెవరు?” అని నేనన్నాను.

“వారిలో ఒకరు స్పెన్సర్ మరియు అతని భార్య. ఇంకొకరు అక్కడున్న మరొక స్పెన్సర్ మరియు అతనివారు,” అని ఆయన చెప్పెను. మరియు ఎవరెవరు పడిపోతారన్నది, ఆయన చెప్పెను.

209 నేను వారితో చెప్పాను; నేనిట్లన్నాను, “మీరెవరు తినకండి.” నేను మరియు నా భార్య…అది మా వివాహానికి ముందు జరిగినది; మరియు ఆమె ఒక అద్భుతమైన స్త్రీయైనటువంటి, సహోదరి స్పెన్సర్ తో రాత్రంతా ఉండటానికి ఇంటికి వెళ్ళినది. అద్భుతమైన వ్యక్తి, గై స్పెన్సర్ మాట మీద నిలబడే ఒక మంచి వ్యక్తియైయున్నాడు. మరియు అతడు—మరియు అతడు అక్కడికి వెళ్ళాడు, మరియు ఓపల్ ఇట్లు చెప్పెను, “ఇప్పుడు, చూడు…” మేడాతో, ఆమె ఇట్లు చెప్పెను, “ఇప్పుడు, మేడా, నేను సహోదరుడు బిల్ ను నమ్ముచున్నాను.” ఆమె ఇట్లు చెప్పెను, “కానీ ఓపల్ కి ఆకలైనప్పుడు, ఆమెకు బన్ను మరియు గుడ్లు కావలెను.” కావున ఆమె అక్కడికి వెళ్ళి, మరియు ఆమె బన్ను మరియు గుడ్లను వేపుకొనెను, వాటిని తినుటకై కూర్చుని, మరియు ప్రార్థించడం ప్రారంభించెను, మరియు ఆ బల్ల మీదికి ఒరిగి, ఏడుస్తూ, దానిని ముట్టుకోలేకపోయెను. తర్వాత వారు వేటాడుచు వచ్చిరి.

210 మరియు అక్కడ ఆ కొండ మీద ఆ దినమున, సరిగ్గా ఏమి జరగనున్నదో ఆయన నాతో చెప్పెను. ఆయన ఇట్లు చెప్పెను, “వీరు విడిచిపెడతారు, మరియు తర్వాత వీరు విడిచిపెడతారు.” కానీ ఆయన ఒక పెద్ద క్యాను-నిండా మాంసమును కలిగియున్నాడు. ఆయన ఇట్లు చెప్పెను, “దీనిని మీదటికి ఆ మిల్ టౌన్ ప్రజల కొరకు ఉపయోగించుటకు దాచియుంచుము.” మరియు ఒక రాత్రి నేను సహోదరుడు క్రీచ్ మాటలు విన్నప్పుడు…అతడు గత రాత్రి ఇక్కడ కూర్చునియుండెను. నాకు…సహోదరుడా క్రీచ్, ఈరాత్రి నీవిచ్చట ఉన్నావా? సహోదరుడు క్రీచ్ నా వద్దకు వచ్చినప్పుడు, నన్ను పిలిచెను, మరియు సహోదరి క్రీచ్, ఏడ్చుచుండెను; ఆమె తండ్రి అచ్చట పడియుండెను. ఇట్లనెను, “సహోదరుడా బిల్, అతనికి చెప్పవద్దు. అతడు మరణమౌచున్నాడు.” ఇంకా ఇట్లు చెప్పెను, “అతడు క్యాన్సరు చేత తినివేయబడెను; వైద్యులు తెరిచి చూసారు, మరియు అతడు పూర్తిగా క్యాన్సరుతో నిండియున్నాడు.” మరియు విల్ హాల్ (మరియు మీ అందరికీ అతను గుర్తుండియుంటాడు), అదే వైద్యుడు అతణ్ణి పరీక్షించినప్పుడు మరియు అతడు క్యాన్సరుతో నిండియుండెను…ఆ ఉదయాన్న నేను ఉడుతల వేటకు వెళ్ళడం మొదలుపెట్టాను, మరియు ఆ యాపిల్ పండ్లు ఆ గదిలో వ్రేలాడుటను నేను చూశాను. (దాని గూర్చిన ఆ కథ మీకు జ్ఞాపకమున్నదా? మరియు ఆ మనిషి ఈనాడు బ్రతికే ఉన్నాడు. అది చాలా సంవత్సరాల క్రితం జరిగెను. అతడు మరియు సహోదరుడు బస్టీ స్నేహితులైయున్నారు.

211 మరియు నేను ఆసుపత్రికి వెళ్ళాను, ఆ క్రొత్త ఆసుపత్రి (అక్కడ న్యూ ఆల్బనీలో, వారు దానిని ఏమని పిలుస్తారో నేను మర్చిపోయాను) క్రొత్త ఆసుపత్రి. మరియు నేను బస్టీ ని చూడటానికి బయటకి వెళ్ళాను; మరియు నేను ఆ గదిలోకి వెళ్ళినప్పుడు, నేను ఇట్లు చెప్పాను, “సహోదరుడా బస్టీ.”

అందుకతడు, “సహోదరుడా బిల్,” అని అన్నాడు. ఆ బిగువైన కరచాలనంతో నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు; మొదటి ప్రపంచ యుద్ధంలో మాజీ సైనికుడు, అతని ఎదుట చెప్పడం కాదు, కానీ ఆ పాత నీలం రంగు చొక్కా క్రింద కొట్టుకొనుచున్న ఒక మంచి హృదయం అతనిది. అతడు నా చెయ్యి పట్టుకున్నాడు. నేను అతని ఇంట్లో ఉన్నాను; సరిగ్గా అతని సహోదరుని వలెనె; అతని ఇంట్లో తిన్నాను, అతని ఇంట్లో పడుకున్నాను. అతని పిల్లలు మరియు అందరం, మేము సరిగ్గా—సరిగ్గా రక్త సంబంధులవలె ఉన్నాము. మంచి మనిషి.

212 మరియు అతను…నేను అతనికి యేసుక్రీస్తు నామములో బాప్తీస్మము ఇచ్చాను. కానీ…అతడు ప్రభువులో ఎన్నడూ లోతైన అనుభవంలోనికి రాలేదు. అయితే ఆ రోజున ఆ మెథడిస్టు బోధకుడు ఇట్లు చెప్పెను, “యేసుక్రీస్తు నామములో బాప్తీస్మము పొందినది ఎవరైనా సరే, నా డేరా క్రింది నుండి బయటకు వెళ్ళిపొండి.” ఏమి ఫర్వాలేదు. జార్జి రైట్ మరియు వారు బయటకి వెళ్ళిపోయారు. ఆ మధ్యాహ్నం టాడెన్ ఫోర్డ్ వద్ద యేసుక్రీస్తు నామములో బాప్తీస్మమివ్వడానికి నేను అక్కడికి వెళ్ళాను. అతని సంఘమంతయు నీటిలోనికి నడిచారు మరియు యేసుక్రీస్తు నామములో బాప్తీస్మము పొందారు. కావున నేను అట్లే కొనసాగాను. అదంతా బాగానే ఉంది. దేవుడు మీ పక్షమున ఉండగా, మీకు విరోధి ఎవడు? ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడో, అతనికి ఏమి జరిగినదో కూడా నాకు తెలియనే తెలియదు.

213 ఎలాగైతేనేమి, నేను ఆసుపత్రికి వెళ్ళాను. పూర్తిగా క్యాన్సరుతో నిండిపోయి బస్టీ అక్కడ పడియున్నాడు, వైద్యులు కనీసం, ఏమి చేయకుండా కేవలం అతణ్ణి వెనుకకు బిగించియుంచారు. బస్టీ నాతో అన్నాడు; అతడు ఇట్లన్నాడు, “సహోదరుడా బిల్, ఇది ఒక ఉద్దేశ్యం కొరకేయైయున్నది. ఏదో జరిగినది.”

నేనిట్లు అన్నాను, “అవును, బస్టీ.” నీకు తెలుసా, నేనెప్పుడు మాటలాడుచుండే ఆ ఆత్మ బలమైన గాలివలె లోపలికి వచ్చుటను, నేను అనుభూతిచెందడం ప్రారంభమైనది.

ఆయన చెప్పెను…నేనక్కడికి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు, ఆ మూలన ఒక వర్షధనుస్సు ఉండియున్నది, ఆ మూలన నిలబడియున్నది. ఒక వర్ష ధనుస్సు అనగా నిబంధనయైయున్నది; దేవునియొక్క నిబంధన. ఆ రోజు ఆ పర్వతము మీద దేవుడు నాతో ఒక నిబంధన చేసాడు. సహోదరుడు బస్టీపై నా చేతులు ఉంచి మరియు అతని కొరకు ప్రార్ధించాను.

ఆ వైద్యులు ఇట్లన్నారు, “అతడు క్షీణించిపోతాడు. అతడు క్రమంగా తగ్గిపోతాడు. ఇక చేసేదేమీ లేదు…ఇంకా కేవలం కొన్ని రోజుల్లోనే అతను చనిపోతాడు.” మరియు బస్టీ రాజర్స్…అది చాలా చాలా మరియు చాలా వారాల క్రితమైయున్నది, మరియు బస్టీ రాజర్స్, నా జీవితంలో అతణ్ణి నేనెన్నడు చూడనంత ఆరోగ్యంగా మరియు ధృడంగా, ఇక్కడ ఈ రాత్రి సంఘములో కూర్చునియున్నాడు. సహోదరుడా బస్టీ, లేచి నిలబడు. అదిగో అతనక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించుదాము, అందరమూ.

వారు ఆ మేడ గదిలో కూడుకొనిరి,

అందరు ఆయన నామములో ప్రార్ధించుచుండిరి.

పరిశుద్ధాత్మతో బాప్తీస్మము పొందిరి,

మరియు సేవ కొరకు శక్తి వచ్చెను.

ఇప్పుడు, ఆ దినమున ఆయన వారి కొరకు ఏమి చేసెనో

దానినే ఆయన మీకును చేయును.

నేను వారిలో ఒకడిని అని చెప్పడానికి నేనెంతగానో ఆనందిస్తున్నాను.

నేను వారిలో ఒకడిని, వారిలో ఒకడిని,

నేను వారిలో ఒకడిని అని చెప్పడానికి నేనెంతగానో ఆనందిస్తున్నాను; (హల్లెలూయా!)

వారిలో ఒకడిని, నేను వారిలో ఒకడిని,

నేను వారిలో ఒకడిని అని చెప్పడానికి నేనెంతగానో ఆనందిస్తున్నాను.

ఈ ప్రజలు ఏ గొప్ప చెప్పుకోనప్పటికీ,

లేదా లోకపు ఘనత ఏమి లేకపోయినప్పటికీ,

వారందరూ తమ పెంతెకోస్తును పొందుకున్నారు,

యేసు నామములో బాప్తీస్మము పొందారు;

మరియు ఇప్పుడు వారు దూరస్తులందరికి చెప్పుచున్నారు,

ఆయన శక్తి ఇంకను ఒక్కటే రీతిగానున్నది.

నేను వారిలో ఒకడిని అని చెప్పడానికి నేనెంతగానో ఆనందిస్తున్నాను.

నేను వారిలో ఒకడిని, నేను వారిలో ఒకడిని,

నేను వారిలో ఒకడిని అని చెప్పడానికి నేనెంతగానో ఆనందిస్తున్నాను; (హల్లెలూయా!)

వారిలో ఒకడిని, నేను వారిలో ఒకడిని,

నేను వారిలో ఒకడిని అని చెప్పడానికి నేనెంతగానో ఆనందిస్తున్నాను.

ఇప్పుడు, నా సహోదరుడా, వచ్చి, ఈ ఆశీర్వాదమును వెదకుము

అది పాపము నుండి నీ హృదయమును శుద్ధి చేస్తుంది,

అది ఆనందపు గంటలను మ్రోగించడం మొదలు పెడుతుంది

మరియు నీ ఆత్మను మండిస్తుంది;

ఓ, అది ఇప్పుడు నా హృదయంలో మండుచున్నది,

ఓ, ఆయన నామమునకు మహిమ,

నేను వారిలో ఒకడిని అని చెప్పడానికి నేనెంతగానో ఆనందిస్తున్నాను.

మనం దానిని పాడుదాం!

ఓ, వారిలో ఒకడిని, వారిలో ఒకడిని,

నేను వారిలో ఒకడిని అని చెప్పడానికి నేనెంతగానో ఆనందిస్తున్నాను; (హల్లెలూయా!)

వారిలో ఒకడిని, వారిలో ఒకడిని,

నేను వారిలో ఒకడిని అని చెప్పడానికి నేనెంతగానో ఆనందిస్తున్నాను.

ఎంత మంది వారిలో ఒకరైయున్నారు? మీ చేతులు పైకెత్తండి. ఓ, మై! ఓ, వారిలో ఒకడినైయున్నందుకు నేనెంతగానో ఆనందిస్తున్నాను!

వారిలో ఒకడిని, వారిలో ఒకడిని,

నేను వారిలో ఒకడిని అని చెప్పడానికి నేనెంతగానో ఆనందిస్తున్నాను; (హల్లెలూయా!)

వారిలో ఒకడిని, వారిలో ఒకడిని,

నేను వారిలో ఒకడిని అని చెప్పడానికి నేనెంతగానో ఆనందిస్తున్నాను.

వారు ఆ మేడ గదిలో కూడుకొనిరి,

అందరు ఆయన నామములో ప్రార్ధించుచుండిరి,

వారు పరిశుద్ధాత్మతో బాప్తీస్మము పొందిరి,

అప్పుడు సేవ కొరకు శక్తి వచ్చెను;

ఇప్పుడు, ఆ దినమున ఆయన వారికి ఏమి చేసెనో

దానినే ఆయన మీకును చేయును,

నేను వారిలో ఒకడిని అని చెప్పడానికి నేనెంతగానో ఆనందిస్తున్నాను.

ఓ, వారిలో ఒకడిని, వారిలో ఒకడిని,

నేను వారిలో ఒకడిని అని చెప్పడానికి నేనెంతగానో ఆనందిస్తున్నాను; (హల్లెలూయా!)

వారిలో ఒకడిని, వారిలో ఒకడిని,

నేను వారిలో ఒకడిని అని చెప్పడానికి నేనెంతగానో ఆనందిస్తున్నాను.

ఇప్పుడు, మనం మళ్ళీ ఆ కోరస్ ను పాడుచుండగా, మీలో ప్రతీయొక్కరు ప్రక్కకు తిరిగి, మరియు మీ ప్రక్కనున్న ఎవరితోనైనా కరచాలనము చేయవలెనని నేను కోరుచున్నాను, మరియు ఇట్లు చెప్పండి, “మీరు వారిలో ఒకరా?” చూశారా? అది సరియే.

ఓ, వారిలో ఒకరు (నీవు వారిలో ఒకడివని నాకు తెలుసు, సహోదరుడా నెవిల్. సహోదరుడా క్యాప్స్, నీవు ఒకడివని నాకు తెలుసు. నీవు ఒకడివని నాకు తెలుసు. నీవు ఒకడివని తెలుసు…?…)

…నేను వారిలో ఒకడిని;

ఓ, వారిలో ఒకడిని, వారిలో ఒకడిని,

నేను వారిలో ఒకడిని అని చెప్పుటకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను.

214 ఓ, నీవు వారిలో ఒకడివైనందుకు నీకు ఆనందంగా లేదా? ఎంతమందికి ఒకరిగా ఉండాలని ఉంది? మీ చెయ్యి పైకెత్తండి. అది సరియే. ఇప్పుడు, నేను మీ కొరకు దీనిని పాడబోవుచున్నాను:

నా సహోదరుడా రమ్ము, ఈ ఆశీర్వాదమును కోరుకొనుము

అది పాపము నుండి నీ హృదయమును శుద్ధి చేస్తుంది,

అది ఆనంద గంటలు మ్రోగిస్తుంది,

మరియు నీ ఆత్మను మండిస్తుంది;

ఓ, అది ఇప్పుడు నా హృదయంలో మండుచున్నది,

ఓ, ఆయన నామమునకే మహిమ,

నేను వారిలో ఒకడిని అని చెప్పుటకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను.

ఓ, వారిలో ఒకడిని, వారిలో ఒకడిని,

నేను వారిలో ఒకడిని అని చెప్పుటకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను; (హల్లెలూయ!)

వారిలో ఒకడిని, నేను వారిలో ఒకడిని,

నేను వారిలో ఒకడిని అని చెప్పుటకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను.

215 ఆ చిన్నది పేతురుతో ఏమి చెప్పినదో గుర్తుంచుకొనండి, “నీవు వారిలో ఒకడవు కావా?” నేను ఎంతగానో ఆనందిస్తున్నాను, మీరు ఆనందించుటలేదా? మీకు తెలుసా, పెంతెకోస్తు దినమున పేతురు ఇట్లు చెప్పెను, “ఇది అదే!” ఇప్పుడు, నేనెల్లప్పుడూ చెప్తుంటాను, “ఇది అది కాని యెడల, నేను దీనిని పొందుకున్నందుకు సంతోషిస్తూ, దాని రాక కొరకు ఎదురుచూస్తుంటాను.” అది సరియే. నేను దీనికై ఆనందిస్తున్నాను.

ఏలయనగా నేను వారిలో ఒకడిని, నేను వారిలో ఒకడిని;

నేను వారిలో ఒకడిని అని చెప్పుటకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను;

ఓ, వారిలో ఒకడిని, వారిలో ఒకడిని;

నేను వారిలో ఒకడిని అని చెప్పుటకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను.

216 ఓ, ఇది ఆశ్చర్యం కాదా, అందరము కలిసి క్రీస్తుయేసులోని పరలోక స్థలములలో కూర్చుని, ఆత్మతో సహవాసము చేయుచు, వాక్యముపై సహవాసము చేయుచూ, రాబోవు మేలుల గూర్చి మాటలాడుచుండుట. ఇది చాలా మంచిది. దానిని తెలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, మీకు లేదా? నీవొక క్రైస్తవుడవైనందుకు నీకు ఆనందంగా లేదా? నీ పాపములు రక్తము క్రింద ఉన్నందుకు నీకు సంతోషంగా లేదా? ఒకానొక ఈ దినాల్లో ఆయన వస్తాడు, మరియు మనము ఆయనతో వెళ్తాము. పిదప ఆలోచించండి, వృద్ధాప్యమంతా మన నుండి రాలిపోతుంది; వ్యాధి అంతయు, బాధ అంతయు, మర్త్యమైన జీవితమంతయు మారిపోవును. ఓ, మై! ఇక్కడ నిలుచున్న ఆ ప్రియమైన వృద్ధ సహోదరుల గూర్చి నేను ఆలోచించగలను. నాకు గుర్తున్నది…రబ్బీ లాసన్ ని ఎంతమంది గుర్తుంచుకున్నారు? మై, దాదాపు అందరు. అతడు ఆ పాత చేతికర్రను సరిగ్గా ఇక్కడ వ్రేలాడదీయుటను నేను చూడగలను. మరియు నేను ఆ వెనుక కూర్చుండేవాణ్ణి. అతడు ఈ చిన్న పాటను పాడేవాడు…(సహోదరుడా టెడ్డీ, ఒక్క నిమిషం.) నేను ప్రయత్నిస్తాను, దాని రాగం నాకు వస్తుందో లేదో చూస్తాను. నాకు తెలియదు.

ఒక సంతోషకరమైన రేపు నా కొరకు వేచియున్నది,

అక్కడ ముత్యపు ద్వారములు విశాలంగా తెరుచుకొనియున్నవి.

మరియు ఈ దుఃఖపు లోయను నేను దాటినప్పుడు,

నేను ఆ ఆవలి గట్టున విశ్రాంతి పొందుతాను.

ఒక దినమున మర్త్యతకి అందని చోటుకు,

ఒక దినమున, ఎక్కడా లేదా ఎప్పుడు అన్నది దేవుడికే తెలియును,

ఈ మర్త్యమైన జీవిత చక్రాలన్నియు ఆగిపోవును,

అప్పుడు నేను సీయోను కొండ మీద నివసించుటకు వెళ్ళుదును. (అవునండి.)

217 మనలో తిరుగుచున్న ఈ చిన్న చక్రాలు— చూచుట, రుచి, స్పర్శ, వాసన, మరియు వినికిడి, అను ఈ చిన్న ఇంద్రియాలు మరియు ఈ మర్త్యమైన జీవితంలో తిరుగుతున్న ఈ చక్రాలు, ఒక దినమున అవి ఆగిపోతాయి. అప్పుడు నేను, స్వయాన నేను, మరియు మీరు, సీయోను కొండ మీద నివసించడానికి వెళ్తాము. ఓ, నేను దానిని ప్రేమిస్తున్నాను, మీరు ప్రేమించుటలేదా? మనకు ఆ ధన్యకరమైన నిశ్చయత కలదని తెలుసుకోండి. అది సరియే. మన పాత బాప్తీస్మము పాట ఎంత మందికి తెలుసు? ఇప్పుడు, దానిని మనం మార్చుదాము. మనము మన వీడ్కోలు పాటను తీసుకుందాము:

యేసు నామమును నీతో తీసుకువెళ్ళుము,

శ్రమలో, దుఃఖములో యున్న బిడ్డా;

అది నీకు ఆదరణను, మరియు సంతోషమును ఇచ్చును,

నీవు వెళ్ళు చోటుకెల్లా దానిని తీసుకువెళ్ళుము.

218 యేసు నామమును మీతో తీసుకువెళ్ళండి. మీరు వెళ్ళుచుండగా, కేవలం దానిని చేయండి. అది సరియే, ఇప్పుడు అందరం కలిసి పాడుదాం. మర్చిపోకండి, కూటము కొరకై ఉదయం ఎనిమిది గంటలకు ప్రార్ధనా కార్డులు ఇవ్వబడతాయి. కూటము తొమ్మిది-న్నరకు మొదలవుతుంది. నేను పది గంటలకు ప్రసంగిస్తాను. వ్యాధిగ్రస్తులకు ప్రార్ధనా కూడిక దాదాపు పదకొండు గంటలకు ప్రారంభమౌతుంది.

219 రేపు మధ్యాహ్నం, రేపు సాయంకాలము ఆలయం వద్ద ఒక సువార్తపరమైన వర్తమానము ఉంటుంది. మరియు రేపు రాత్రి, మీ పాపాల కొరకు పశ్చాత్తాపపడి మరియు అస్సలు బాప్తీస్మము పొందనివారందరు, అక్కడ…ఆ కొలను తెరచే ఉంటుంది; మేము జనులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తీస్మము ఇస్తూ ఉంటాము.

220 ఇప్పుడు ప్రతీయొక్కరం కలిసి, గొంతెత్తి పాడుదాము. సహోదరుడా బస్టీ, నేనెంత ఆనందంగా ఉన్నానో మరియు దేవునికి ఎంత కృతజ్ఞుడనైయున్నానో నీకు తెలియదు. మీకు తెలుసా, అతడు డాక్టరు వద్దకు వెళ్ళాడు. మరియు ఆ డాక్టరు అతణ్ణి చూసి, అసలేమి ఆలోచించలేకపోయెనని వారు నాతో చెప్పారు. అది అదే వ్యక్తి అని అతడు నమ్మలేదు. ఓ, దేవుడు ఏమి చేయగలడన్నది రహస్యమేమి కాదు. అది సరియే కదా? అది సరియే.

ఆ నామమును తీసుకొనుము…

దానిని గట్టిగా పాడుడి!

…మీతో తీసుకువెళ్ళండి,

శ్రమలో, దుఃఖములో యున్న బిడ్డా;

అది నీకు ఆదరణను, సంతోషమును ఇచ్చును,

ఇపుడు, మీరు వెళ్ళు చోటుకెల్లా దానిని తీసుకువెళ్ళండి.

శ్రేష్టమౌ నామము, (శ్రేష్టమౌ నామము!) ఓ ఎంత మాదూర్యము!

భూలోక నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము;

శ్రేష్టమౌ నామము, (ఓ, శ్రేష్టమౌ నామము!) ఓ ఎంత మాదూర్యము!

భూలోక నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము.

221 అది సరియే. ఇప్పుడు కూటమును పాస్టరు గారికి తిరిగి అప్పగిస్తున్నాను. అతడు కొన్ని మాటలు మాట్లాడును, లేదా మనలను పంపించుటకు ఎవరినైనా పిలువవచ్చును, అతని మనస్సులో ఉన్నది చేస్తాడు.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...