దేవునితో కలసి ఆలోచించుట
VGR CONT -296 ఈ వారము మనము మరి ఒక అద్భుతమైన సమయమును గడిపితిమి. ఈ వారము ఒక గొప్ప ఆశీర్వాదమైన వారముగా నాకుండెను. మరియు ఇక్కడున్న అనేకులకు కూడా ఆ విధముగానే యుండెనని నేను నమ్ముచున్నాను. అనేకులు పరిశుద్ధాత్మను పొందిరి.
ఈ కూటములలో కూడా మనయొక్క ఉద్దేశ్యము అదియేయై యున్నది. ఉన్న ఈ స్థలమందు అనేకమంది ప్రజలను కూర్చోబెట్టలేమనే భావముతో మనము ఈ కూటమును ప్రకటింపలేదు. మనము ఊరక.... ఇచ్చట ఈ ప్రాంతములోనేయున్న జనులు ప్రతి రాత్రియు మరల వారు వారి స్థలములకు తిరిగి వెళ్ళిపోయెదరు, ఆ విధముగా చేయవలెనని మేము ఈ జనులకు చెప్పితిమి.
మరియు ఇప్పుడు కానుకలు తీయు, బుట్టలకై సహాయమును గురించిన విషయము, ఇది స్థానిక జనుల కొరకు. అది మనయొక్క సంఘ విషయమై యున్నది. ఇది ఎప్పుటివలె జరుగు మనయొక్క ఆదివార పాఠశాల, చూశారా. మరియు వారు.... ఒకవేళ ఎవరికైనా ఆ విధముగా సహాయము చేయకోరినట్లైతే, మేము అది అవసరతలో యున్న వారికొరకే తీయబడియున్నదని మీరు నిశ్చయించుకొనవలెను. ఈ నగరములో కుటుంబములు గలవు. క్రిస్మస్ పండుగ వచ్చుచున్నది. గాని వారియొద్ద ఏమీ లేదు. వారు ఈ సంఘముపై ఆధారపడియున్నారు. మరి కావున, అది ఆ విధముగా, ఆ కారణము కొరకై అవి తీయబడియున్నవి. డీకన్లలో యొకరు అది ఎందులకని చెప్పెదరు లేక అక్కడ వెనుకయున్న మన సహోదరి దానిని తీసెదరు.
2
ఇప్పుడు, ఈ ఉదయము మనకు ఇదివరకే బాప్తిస్మము ఆరాధన జరిగెనని నేను విన్నాను. అది నన్ను ముందుకు త్రోయులాగు నుండెను. అదట్లే కదూ? సరి, అట్లైన మనము ఈ రాత్రి ఇంకొక ఆరాధనను కలిగియు౦డేదము, కావున ఆ విధముగా రెండు ఆరాధనలు గలవు. కావున మనము అనుకొనుచున్నాము, లేక బాప్తిస్మమిచ్చు నీళ్ల తొట్టి యుండును. ఎందుకనగా ఆరాధన ముగించిన వెంటనే ఈ రాత్రి వేరొక బాప్తిస్మ ఆరాధన కలదు. మరియు వారు బాప్తిస్మమును తీసుకొనవలెనని వారిలో కొంతమంది చెప్పిరి. కావున కొద్ది నిమిషముల క్రితము బిల్లీ పరుగెత్తుకొని వచ్చి మరి, “ఇప్పుడే రావద్దు, ఏలయనగా సహోదరుడు నెవిల్ మొదట బాప్తిస్మమియ్యవలయును” అని నాతో యిలా చెప్పెను. మరియు అక్కడ అనేకమంది ప్రజలు ఇప్పుడే దానిని తీసుకొనవలెనని అనుకొనిరి గాని, ఈ ఉదయమున వారికి బాప్తిస్మము ఆరాధన గలదనే కచ్చితత్వము వారికి లేదు, అని చెప్పెను
ఈ బాప్తిస్మపు తొట్టి ఎల్లప్పుడును తెరిచి యుండునని గుర్తు౦చుకొనుడి, ఎల్లప్పుడును, ఏ సమయమందైనను, రాత్రి లేక పగలు ఏ సమయములో నైనను బాప్తిస్మమునకు సిద్దముగా నుండును. బాప్తిస్మమిచ్చుటకు ఇతర దైవసేవకులు ఇచ్చటికి వచ్చి ఈ బాప్తిస్మపు తొట్టెను ఉపయోగించుకుంటారు, అందునిమిత్తమై మేము ఎంతగానో సంతోషించుచున్నాము.
3
ఇక్కడ కొద్ది కాలము క్రితము నేను పార్క్ మెతడిస్టు చర్చిలో ప్రసంగి౦చు ఆరాధనలోయుంటిని. మరియు ఆ ప్రియమైన సహోదరుడు చెప్పెను, “ఈ దినమున నేను సహోదరుడు బ్రెన్హాం యొద్దకు ఆ బాప్తిస్మపు తొట్టిని ఉపయోగించుటకై వెళ్ళితిని.” అడిగెను, “దానిని మిరేమని పిలిచెదరు?”
నేను “బాప్తిస్త్రీ,” యని పిలుచుటకు ఒక మెతడిస్టుకు చాలా కఠినమైన విషయముగాయున్నది అని చెప్పాను. వారికొక పాత్ర యుండును అందులో నుండి వారు చిలకరించెదరు, మీరెరుగుదురా, దానిపైన చిన్నదొకటి యున్నది. “బాప్తిస్త్రీ,” అను పదము పలుకుటకు ఒక మెతడిస్టుకు చాలా కఠినమైన విషయముగా యున్నది, అని నేను చెప్పాను.
“అలాంటిది ఇచ్చట మరొకటి వుండాలని అనుకుంటున్నాము. అటువంటి దానియందు నేను నమ్ముచున్నాను” అని అతను చెప్పెను.
కావున గుర్తు౦చుకొనుడి, మెతస్టుస్తు, బాప్తిస్టు, ప్రెస్బిటేరియన్, ఎవరు దానిని ఉపయోగించుకోవాలనుకుంటున్నారో అదచ్చట యున్నది. అది తెరువబడి యున్నది, నీరు ఉచితముగా ఇవ్వబడును.
మరియు మా యొద్ద ఒక చిన్న కట్ట కలదు; ఆ చిన్న వేడి కట్టను అందులో పెట్టి దానిని వేడిచేయుటకు ప్రయత్నించెదము. అయితే నేను మీకు ఇప్పుడు చెప్పుచున్నాను, అది దానిని వేడిచేయదు. నా జీవితములో నేను అనుభవించినంత మట్టుకు అది అతి శీతలమైన నీరది మరియు అందులో నేను బాప్తిస్మమిచ్చాను. నా పాదముల లోతుకు దిగి ఆ మంచుగడ్డను కాలువ కొయ్యలో అలాగ తన్నివేసి అనేక సార్లు నేను వారికి బాప్తిస్మమిచ్చాను. ఆ తర్వాత నేను ఎక్కడ వుంటున్నానో అక్కడికి నడుచుకుంటూ వెళ్ళుటకు ప్రయత్నించుచు నా వస్త్రములను మార్చుకొనుటకు ఇంటికి నడుస్తూ వెళ్ళేవాడిని మరియు నడుస్తూ వేల్లేటప్పుడు నా వస్త్రములు గడ్డలుగా పేరుకుపోయెడివి. నా ఫాంటు కాళ్ళు మంచుచే గడ్డలు కట్టుట వలన నేను నా అడుగులను ముందుకు వేయుటకు ఇబ్బందిపడుచు నా అడుగులను వేసేవాడిని. మరియు ఇటువంటి చల్లదనము తాకగానే జీవితములో నేనెన్నడూ చూడలేనంతటి శీతలముగా అది యున్నది. అటువంటి నీటిని నేన్నెడూ చూడలేదు. సహోదరుడు కెల్లీ, నేను అచ్చటికి వెళ్ళునప్పుడల్లా, నేను మరణించనంతగా అది గడ్డకట్టుకుపోయినట్లుగా యుండును. మరియు కావున దాని పిదప.... అది నిజమే. నీవు మంచిగా అనుభూతి చెందినట్లైతే.... అది ఏమియూ చేయదు అని సహోదరి కెల్లీ చెప్పుచున్నది, అది ఆలాగు అనిపించదు.
4
పలు రకముల సంఘ శాఖల నుండి వచ్చి ఇచ్చట మిళితమైయున్న ఈ ఆనందభరితులైన జనుల కొరకు మేము సంతోషించుచున్నాము. అదంతా వారు దేవుని బిడ్డలతో కలిసి నెట్టుకొని వచ్చుట. ఇక్కడున్న జనులలో మెతడిస్టులు, బాప్తిస్టులు, నాజరీన్లు, పరిశుద్ధ యాత్రికులు కాతోలిక్కులు, యొహోవా సాక్ష్యులు, క్రైస్తవ విజ్ఞానులు పెంతెకోస్తులు మరి సమస్తమైన వారు అక్కడ కూర్చబడియున్నారు, ఒక యూదుడు కూడాయున్నాడు. దానికొరకు దేవునికి స్తోత్రము. మీకు వందనములు. యూదుని కొరకు మేము చాలా ఆనందించుచున్నాము. అవునయ్యా. యూదులు గనుక లేకున్నయెడల మనమెక్కడ యుండెడివారమోయని నాకు తెలియదు. అది నిజము. ఇప్పుడు అది చాలా బాగున్నది.
“పరలోకము ఖచ్చితముగా ఆ విధముగానే నుండును, ఏలయనగా అన్ని సంఘ శాఖల నుండి పరలోకములో కూడుకొని యుండెదరు. మరి ఆ కారణము వలననే మనము పరలోకములో ఉన్నత స్థలములలో ఏకముగా కూర్చొని యున్నాము.”
ఇప్పుడు డాక్, అది కొద్దిగా ఒక మనస్తత్వ శాస్త్రముగా యున్నది. అది అదియేయని నేనెరుగుదును. దానికి నేను సమీపముగా లేను.
5
కొద్దిగా గొంతుకు బొంగురు పోయినందున, ఈ ఉదయము, నేను కొంచెము నెమ్మదిగా ప్రారంభించి వేగము నందుకొనెదను, ఆ విధముగా చేయుదునని నేను నమ్ముచున్నాను.
ఇప్పుడు, ఇంకా కూటముల గురించి గత రాత్రి నా యొద్ద కొన్ని ప్రశ్నలు వచ్చియున్నవి. ఈ రాత్రి ప్రభువు చిత్తమైనయెడల మనము యధాతధంగా ప్రసంగ ఆరాధనను ప్రారంభించే ముందు నేను అతి వేగముగా వాటికి జవాబులిచ్చెదను. ఈ రాత్రి తప్పకుండా వచ్చుటకై ప్రయత్నించుడి, ప్రభువు చిత్తమైనయెడల, పరిశుద్ధాత్మ మనలను నడిపించినట్లైతే, ముగింపు ఉజ్జీవ కూటముల ఆఖరి రాత్రుల యందు నేనొక ప్రాముఖ్యమైన అంశాన్ని ప్రసంగించాలని ఆశించుచున్నాను.
6
మీలోని అనేకులు ఈ కూడిక ముగించిన తరువాత బహుశా, ఈ ఉదయము మీ గృహములకు వెళ్ళవలసి యున్నది, మిమ్మల్ని ఎంతగానో అభినందించాలని మేమను కుంటున్నాము. మేము మీకు ఒక సంతోషకరమైన క్రిస్మస్ మరియు నూతన శుభాకాంక్షాలను తెలియపరచవలెనని ఆశించుచున్నాము. దేవుడు మీతో కూడా యుండి మరియు నూతన విషయములను అనుగ్రహించును గాక! మరియు మీరు వెదకుచున్న ఆకలిగొను దానికొరకై నూతన జీవమును మరిమెండుగా ఆయన అనుగ్రహించును గాక! నాకు నేను చేస్తున్నది కూడా అదియే.
అక్కడ అచ్చట అనేక రకములైన ప్రశ్నలు మరియు ఇతరవి గలవు. అచ్చట. గదిలో కొన్నింటిని నేను తీసుకున్నాను, అటు తర్వాత, వారుకూడా నాకిచ్చిరి. మరియు ఎవరో సహోదరుడు నా కుమారుని యొద్ద గత రాత్రి కొన్ని ప్రశ్నలను ఇచ్చెను. మరియు వాటిని చూచుటకు నాకు సమయము లేదు, ఏలయనగా వాటిని నేను నా జేబులో నొక్కి పెట్టుకొన్నాను. మరి నాకు చాలా అలస్యమైనందువలన ఆ విధముగా నేను చేసితిని. మరియు వాటిలో కొన్ని మత్తయికి సంభందించినవి, లేక హెబ్రీయులకు 6:4.
7
సహోదరి మెమీ కొద్ది నిమిషములకు మునుపు చెప్పెను, దానిని పట్టుకొనుటకు ఆమెకు ఎంతో ఆనందముగా యున్నదని, కారణమేమనగా కొంత కాలము క్రితము ఆమె ఆదే ప్రశ్నను అడిగినది. అది ఎంతగానో, ఎంతగానో మేల్కొలుపు కలుగుచేయునది, కాని అది ఏమైయున్నదో మీ అందరు దానిని పొందుకున్నారని నేను నమ్ముచున్నాను. మీరు దానిని చేసితిరని నా యొక్క నిరీక్షణ.
ఆత్మతో నింపబడినది ఒక క్రైస్తవుడు కాడు. ఇప్పుడు మీరు గనుక హెబ్రీయులకు 10కి వెళ్ళినట్లైయితే, ఆయన చెప్పిన దానిని మీరు చూచెదరు, అది వ్యత్యాసమైనది, తర్వాత క్రైస్తవుని యొక్క క్షమాపణలేని పాపమును గూర్చి ఆయన మాట్లాడుచున్నాడు, అయితే ఇది నింపబడిన వ్యక్తి కొరకు. అయితే అది ఒక వ్యక్తియై కేవలము రుచి చూచిన ఒక మధ్యస్థ విశ్వాసిగా అతడున్నాడు... అన్ని సంఘములలో మనకు అటువంటివారు గలరు. కేవలము సంఘమునకు వచ్చి మరియు, ప్రభువు చేసిన దానిని ఓహో అని అభినందించెదరు, గాని దానిలోనికి మాత్రము వారు రానేరారు. ఎవరో ఒకరు స్వస్థతను పొందుకోవటము చూచి అభినందించెదరు, గాని వెలుపలికి వెళ్ళిపోవుటకు క్రియ చేయరు మరియు వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్ధించి, వైద్యశాలను దర్శించి లేదా మంచి విషయములను చేయుటకు వారు ప్రయత్నించరు, (చూశారా), అది ఆ విధముగా. వారు దయార్ధ హృదయముగలవారుగా యుండుటను మీరు చూడగలరు. వారు రుచిచూచిరి; వారు చూచిరి.
8
నేను చెప్పిన విధముగా, కయీను... కానానీయులు... లేక ఇశ్రాయేలీయులు, వారు కానాను దేశమును సమీపించుచున్నారు, వారు ఒక లోపలికి ప్రవేశించునంతగా చేరుకున్నారు. వారచ్చటికి చేరితిరి, ఆ దేశము యొక్క ఫలములను రుచి చూచునంతగా సమీపించిరి గాని వారు చెప్పిరి, “ఓ, మనము చేయలేము, మనకు అది అసాధ్యమైనది.” అయితే అది వారికి సాధ్యమేనని యొహోషువాకు మరియు కాలేబుకు తెలుసు, కారణమేమనగా వారు దేవుని యొక్క వాగ్దానమును కలిగియుండిరి.
మరియు పౌలు దానిని గురించియే మాటలాడుటకు ప్రయత్నించుచున్నాడు దానిని గురించి వారికి చెప్పుచు మరి వారు దానికి చాలా సమీపముగా వచ్చినా గాని వారు దానిపై వారి చేతులను ఉంచలేకపోయిరి. “ఓ, నేను సంఘమునకు వెళ్ళుచున్నాను. ఆ సంఘములకు నేను పరిశుద్ధ సంఘములకు వెళ్ళుచున్నాను, పెంతెకోస్తు సంఘమునకు. నేను దీనికి వెళ్ళుచున్నాను” అని చెప్పిరి.
“అయితే మీరు విశ్వసించినప్పుడు, మీరు పరిశుద్ధాత్మను పొందితిరా?”
“ఓ, లేదు. దానిని ఇంతవరకు నేను పొందలేదు.” చూశారా, అక్కడే మీరున్నారు.
అయితే ఒక నిజమైన విశ్వాసి దానిని పొందువరకు విశ్రాంతి నొందడు. అతను దానిని పొందుటకు దాని లోపలికి వెళ్ళి పొందుకొనును, చూశారా. అది ఒక మధ్యస్థ విశ్వాసివంటి వారు, ఇప్పుడు, పౌలు ఆ విధమైన వ్యక్తిని గురించి మాట్లాడుచున్నాడు.
9
ఏదెట్లైనను, ఇప్పుడు ఈ ఉదయము ఇది యధార్థముగా జరుగు సువార్త వర్తమానము ఈ ఉదయమునకైనది, ప్రభువు చిత్తమైనయెడల, ఆయన నాకు తగిన స్వరమును అనుగ్రహించెను. కావున నేటి ప్రకటనలు అంతేయని నేను తలంచుచున్నాను. నాకు నిశ్చయముగా తెలియదు, అయితే నాకు తెలిసినంతమట్టుకు అంతే. మరియు సహోదరుడు నెవిల్ తక్కిన ప్రకటనలు మిగతావాటిని తెలియపరచెను.
మీరందరు తెలిసికొనవలయునని నేను మిమ్ములను కోరుచున్నాను, మీరు గనుక ఈ మార్గము ద్వారా ఎన్నడైనను. సాయంకాలపు ఆరాధనకు ఉండలేని వారు ఇప్పుడు గృహములకు వెళ్ళదలచుకొనువారు మీరు తెలిసికొనవలయునని నేను కోరుచున్నాను. మీరు గనుక ఏ సమయములోనైనను ఇచ్చటికి రావలెనని ఆశించిన యెడల మిమ్ములను నేను ఆహ్మానించుచున్నాను, మీరు వచ్చినయెడల మీరు వచ్చి మా కాపరి ప్రసంగించునది మీరు వినవచ్చును. ఈ గుడారములో మనము నిజముగానే ఒక మంచి కాపరిని కలిగియున్నాము, అతను సహోదరుడు ఆర్మన్ నెవిల్.
ఆయన ఇక్కడ కూర్చొని యున్నాడని నేను చెప్పుట లేదు గాని అతనిని అనేక సంవత్సరములుగా నేనెరుగుదును. మరియు అతను ఏ మాత్రము మారలేదు. అతనింకా ప్రభువు యొక్క ఒక సేవకుడుగా ఆర్మన్ నెవిల్ గానే యున్నాడు. మీరు అతనిపై ఆధారపడవచ్చును. ఒక నమ్మకమైన, విశ్వాసముగల, ఒక అద్భుతమైన ప్రసంగికుడు.
10
నేను అక్కడ వెనుక కూర్చొనియున్నాను. మరియు ప్రపంచమంతటాయున్న ప్రపంగింకుల ప్రసంగములను నేను వినియున్నాను. అయితే కొన్ని సమయములలో అతను ప్రసంగించు కార్యములు కొన్ని నాకు ఆశ్చర్యము కలిగించినవి, మరియు అతను ఉపయోగించు చిన్న కార్యములు మిమ్ములను ఎచ్చటికో కొనిపోవును అని నేను మీకు చెప్పుచున్నాను. అతను ప్రసంగించు ప్రతి సమయమున నేను వచ్చునప్పుడు నేను వ్రాసియుంచుకొనియున్న సుమారు పదిహేను అంశములు అతను ప్రసంగించిన వాటినుండి వ్రాసుకొన్నవియే. ఇంటికి వెళ్ళి చూచుకొనిప్పుడు, “ఓ, అది ఒక వర్తమానమును ఇచ్చుచున్నది! ఓ, మై, అది ఒక వర్తమానమును ఇచ్చుట లేదా!” మరియు దానిని అట్లే వ్రాసుకొనియున్నాను.
కావున ఈ వైపున వచ్చినప్పుడు మరి మా సహోదరుడు నెవిల్ ప్రసంగించు ప్రసంగమును వినండి. మరియు వారితో సహవాసము చేయండి. వారు బీదవారు నిజముగానే బీదవారు, అయితే వారు ప్రభువును ప్రేమించుచున్నారు మరియు వారు మిమ్ములను ప్రేమించుచున్నారు. మరియు కావున మీరు మాతో యున్నందులకు మేము ఆనందించుచున్నాము మరియు దేవుడు మిమ్ములను ఆశీర్వదింపవలయునని ప్రార్థించుచున్నాము.
ఇప్పుడు, మనము వాక్యమును సమీపించుటకు ముందు మన తలలను ఒక్క క్షణము వ౦చెదము.
11
కృపగల ప్రభువా, ఎంతటి భయభక్తులతో రావలయునో మరిప్పుడు అంతటి భయభక్తులతో వచ్చుచున్నాము. యేసు నామములో మేము వచ్చుచున్నాము, ఆయన నామములో ఏమీ మేము అడిగినను మీరు వినెదరని, ఆయన ద్వారా మాకు వాగ్దానము చేసిన దానిని మేము నమ్ముచున్నాము. మరియు ఇచ్చట ఈ ఉదయము మమ్ములను దర్శించెదరని ప్రార్థించుచున్నాము దేవా.
గతించిన ఈ వారమంతా మాయెడల మీరు చేసిన వాటికి మా హృదయాంతరంగముల నుండి మేము మీకు కృతజ్ఞతలు తెలుపవలయునని కోరుచున్నాము. అనేక దుఃఖ హృదయాలు ఆనందభరితమైనవి. అనేకమంది జనులు ఉల్లాసభరితులైరి. మరియు ఎందరైతే వాక్యమును గురించి గందరగోళములోనున్న వారు ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా జయముతో ఆర్భాటించుచున్నారు. ఈ కార్యములకై మేము మీకు వందనములు చెల్లించుచున్నాము.
మరియు ఈ దినము మీరు మీ జనులను సందర్శించు మరియొక దినముగా నుండవలయునని మేము ప్రార్థించుచున్నాము. మరియు పలురకములైన వారుగా సంఘ శాఖల నుండి, స్థాపన సంఘముల నుండి మేము ఇక్కడ అందరమును కూడియున్నామని నేను చెప్పుచున్నాను. కొందరైతే వేరే నమ్మకములతో యున్నారు, బహుశా స్నేహపూర్వకముగానే లేఖనములను అంగీకరించక పోయినట్లైతే ఎటువంటి అడ్డు గోడలు మన మధ్య లేకుండ యుండెదము, ఒక యూదరాలైన సహోదరి తనయొక్క హస్తమును కూడా పైకెత్తెను. మేము క్రీస్తు యేసునందు పరలోకములో ఉన్నత స్థలములలో కూడుకొనియున్నాము.
12
ఈ దినమున మీ ఆత్మ మాపైన స్వచ్ఛమైనదిగా కుమ్మరింపవలెనని మేము ప్రార్ధి౦చుచున్నాము. ఈ ఉదయమున ఒక స్వచ్ఛమైన బాప్తిస్మమును లేక ఒక స్వచ్ఛమైన నింపుదలను దయచేయుము, ప్రభువా, అవసరతలోనున్న వారిని, బాధపడుచున్న వారిని, వ్యాధిలోనున్న వారిని మీరు స్వస్థపరచవలయునని మేము అడుగుచున్నాము. ఇక్కడ ఒక వ్యక్తి ఒక చక్రాల కుర్చీలో కూర్చొనియున్నాడు, ఇతరులు అక్కడ వెలుపలనున్నారు, ఒకవేళ గుండె వ్యాధితో, కొందరు కాన్సర్తో యున్నారు. ప్రభువా, వారు చనిపోవుచున్నారు. మరియు మా దేశపు ప్రశస్తమైన వైద్యులు వారియొక్క వ్యాధి ఏమిటని కనుగొని మరి దానిని బాగు చేయుటకు అనేక విధములుగా ప్రయత్నించుచు బహుశా శస్త్రచికిత్స కూడా చేసిరి అయినప్పుటికిని దయ్యము దాని పట్టు విడువక యున్నది. వారి జీవితమును హరించివేయుటకు వాడు ఎదురుచూచుచున్నాడు. ఆ వైద్యుడు వారి మృదువైన చేతులతో ఆ కత్తితో కోసి ఆ వ్యాధిగ్రస్తునికి సహాయపడుటకు ప్రయత్నించుచుండగా, కాని ఆ దయ్యము ఆ స్థలమును వదిలి మరి ఇంకొక స్థలమును పట్టుకొనుచున్నది, ఏలయనగా ఆ దయ్యము వైద్యుని యొద్ద తనను మరుగుపరచుకోగలడు. అయితే, దేవా వాడు మీ యొద్ద నుండి తప్పించుకొని దాగుకొనలేడు. వాడెక్కడ యున్నాడని మీకిప్పుడే తెలియును. మరియు మీ విశ్వాసముతో కూడిన వాక్యముతో మరియు శక్తితో వాడు కదిలి వెళ్ళవలసియున్నది. మరియు ఈ దినమున వారి స్వస్థతనొందునట్లుగా మరియు మన ప్రభువైన దేవుని యొక్క ఆశీర్వాదములను అనుభవించునట్లుగా మరి జనులనుండి ప్రతి దయ్యప్పు కార్యమును స్వస్థత నొందునట్లుగా చేయవలయుని మిమ్ములను మేము ప్రార్థించుచున్నాము, ఏలయనగా దానిని మేము యేసుక్రీస్తు నామమున దీనిని అడుగుచున్నాము. ఆమేన్
13
ఇప్పుడు, ఇక్కడ అనేక చేతిరుమాళు పడియున్నవి. మరియు వాటి కొరకు మనము ప్రార్థించెదము. మరియు మీ యొద్ద ఇప్పుడు చేతిరుమాళు లేనియెడల మరియు మీకు కావలయునని కోరినయెడల మీరు తపాలా పెట్టె రెండు మూడు ఐదుకు వ్రాయుడి, మేము వెంటనే మీకు దానిని పంపించెదము. ఆ కార్యము హెబ్రీయుల గ్రంథములో, అపొస్తలుల కార్యములు గ్రంథములో 19వ అధ్యాయములో యున్నది అక్కడ మనము చేతిరుమాళ్ళు లేక గుడ్డలను జనులయొద్ద నుండి తీసి మరి వాటికొరకై ప్రార్థించెదము.
ఈ ఉదయము ఇప్పుడు లేఖనములలో యెషయా గ్రంథమును మనము త్రిప్పెదము, 1వ అధ్యాయము. యెషయా 1 మనము లేఖనములలోని ఒక భాగమును చదువబోవుచున్నాము. వాక్యము చదువుచుండగా మమ్ములను అనుసరించుటకు మీరు ఈ ప్పుస్తకమును ఈ ఉదయము త్రిప్పుచుండగా, రాబోవు స్వస్థతా ఆరాధనలను గురించి మేము కొన్ని కార్యములను మాటలాడవలయునని యున్నాము.
ఇప్పుడు, దైవిక స్వస్థత ఇక్కడ ఇచ్చట గొప్పుదిగా చేసి మేము చెప్పుటకు ప్రయత్నించుటలేదు, ఏలయనగా దైవిక స్వస్థత ఒక స్వల్పమైన కార్యము. మరియు మీరు ఒక చిన్న కార్యముపై ఆధారపడి పెద్ద కార్యములను చేయలేరు. అయితే యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో ఎనుబది-ఆరు శాతము దైవిక స్వస్థతయేయని మనము నమ్ముచున్నాము. మరియు దైవిక స్వస్థత ద్వారా జనుల యొక్క గ్రహింపును పట్టుకొని, ఆయన దేవుడై యున్నాడనే గ్రహింపునకు వారిని త్రిప్పుటయు యున్నది.
“మీరు నన్ను ఆ విధముగా దేవుడని నమ్మనియెడల అట్లైన నేను చేయు క్రియలను నమ్ముడి. నేను గనుక నా తండ్రి యొక్క క్రియలు చేయకున్న యెడల నన్ను నమ్మకుడి. అయితే నేను తండ్రి యొక్క క్రియలు చేసినయెడల, మీరు నన్ను నమ్మలేనియెడల క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి” అని ఆయన చెప్పెను.
14
చూశారా, ఒక మానవుడైయుండి ఆయన తననుతాను దేవునిగా చేసికొసెను. సిలువపై, లేక సిలువపై వేయుటకు ముందు వారు ఆయనతో చెప్పిరి, “నీవు చేయు మంచి క్రియల నిమిత్తము మేము నిన్ను రాళ్లతో కొట్టుట లేదు. అయితే నీవు ఒక మానవునిగా యుండి నిన్ను నీవు దేవునిగా చేసికొని యున్నావు, కావున మేము నిన్ను రాళ్ళతో కొట్టుచున్నాము.” ఆయన దేవుడు. ఆయన దేవుడై యున్నాడు. దేవుడు ఆయనలో యుండెను.
మరియు కావున, “మీరు గనుక నన్ను నమ్మనియెడల నేను చేయు క్రియలను నమ్ముడి” అని ఆయన చెప్పెను. చూశారా, “క్రియలను నమ్ముడి, అవి దేవుని క్రియలు.”
మంచిది, ఇప్పుడు, ఈ దినమున కూడా అదే విషయముగా యున్నది. భూమిపైనున్న ఏ వ్యక్తియును దేవుడు కాడు. నిశ్చయముగా కాదు. మనమందరమును మానవులమే, ప్రతియొక్కరును పాపములో జన్మించి, అక్రమములో రూపొందింపబడి, అబద్దములాడుచు లోకములోనికి వచ్చితిమి. అయితే ఈ వారములో చాలా తేటగా మనము చూచినట్లు దేవుడు ఆయన యొక్క సృష్టికి పైగా ఒకప్పుడు జీవించుట చూపబడియున్నది, ఏలయనగా పాపము వలన. పిదప ఆయన ఒక శరీరముతో తన సృష్టితో జీవించెను, యేసుక్రీస్తు అను శరీరముతో తనయొక్క గుడారమును మనతో ఉంచెను, మనతో నుండుటకును, పాపము యొక్క బాధననుభవించుటకును మరియు వేదనలు సహించుటకును, మనవలె బాధలు అనుభవించుటకు శరీరధారియాయెను.
అటు పిదప ఆయన దానిలో నివసించులాగున ఒక సంఘమును పరిశుద్ధపరచెను. కావున మనపైన యున్న దేవుడు, మనతో కూడయున్న దేవుడు, మనలోయున్న దేవుడు. యేసు చెప్పెను, “ ఆ దినమున నేను నా తండ్రియందును, తండ్రి నాలోను; నేను మీలో మరి మీరు నాయందు ఉన్నారని మీరు తెలిసికొసెదరు.” మరియు దేవుడు అక్కడ క్రియ చేయుటను మీరు చూచెదరు. కావున ఒక వ్యక్తి పరిపూర్ణముగా పరిశుద్ధాత్మకు పట్టబడినట్లైతే, అతడు మాట్లాడుచున్నప్పుడు, అది మాటలాడుచున్నది ఆ వ్యక్తి కాదు.
15
“నేను దానిని అనుభవపూర్వకముగా ఎరుగుదును. క్రీస్తుతో యున్న నా యొక్క స్వల్ప అనుభవములో నాకు నేనుగా ఆయనకు పరిపూర్ణముగా సమర్పించుకొనే సమయములను ఆయన నాకు అనుమతించటమును నేను కనుగొన్నాను. అదెట్లు౦డెననగా నేనేమి మాటలాడుచున్నానో నాకు తెలియనంతగా ఆ విధముగా ఆయన చేసెను. నేను దానిని చెప్పెనవసరము లేదు, లోకములో దేనికొరకో కాదు, అయితే ఆయనే దానిని చెప్పెను.
గౌరవనీయురాలైన ఒక స్త్రీ అక్కడ వెనుక కూర్చొనియున్నది. అట్లే ఆ దినమున ఈ నూతన పరిచర్య ఈ ఉదయమున వచ్చునని నేను నమ్ముచున్నాను. మరియు మీరందరును దానిని గురించి వినియున్నారు. మరియు మేము అక్కడ కూర్చొని యున్నప్పుడు. మరియు ఆ సమయమున అక్కడయున్న పది లేక ఎనిమిది మంది ఇప్పుడిక్కడ యున్నారు. మరియు పరిశుద్ధాత్మ ఆ స్త్రీ వైపు తిరిగి ఆమె కోరుకొనునది ఏదైన కోరుకోవచ్చునని, అది ఆమెకు అనుగ్రహింపబడునని ఆమెతో చెప్పెను. అది నేను చెప్పియుంటానని నీవు అనుకుంటున్నావా? నేను దానిని చెప్పగలిగిన యెడల ఇప్పుడు కూడా దానిని చెప్పగలను. అయితే నేను దానిని చెప్పలేను. మరియు నేను వణికిపోయాను, నేను ఎంతగానో బలహీనడనైపోతిని. అక్కడ నిలుచుకొనియున్న సహోదరుడు బేంక్స్ ఉడ్ నా ప్రక్కనే కూర్చొని యుండెను. మరియు నా చేతుల నుండి చెమట కారి నేను చాలా బలహీనుడనైపోతిని, నేను లేచి ఆ యింటిని విడిచిపెట్టునంతగా నన్ను భయంకరముగా భయభ్రాంతుడిగా చేసినది. అయితే ఆ స్త్రీ ఎవ్వరూ అడుగలేనంత ఆ గొప్పటి విషయమును కోరుకొనినది, మరియు ఆమె దానిని పొందుకొనినది కూడా.
చూశారా, అదియే దేవుడు. అది ఒక మనుష్యుడు కాడు. మానవులు ఆ కార్యములను చేయలేరు. యేసు వృక్షముతో చెప్పెను, “ఇకమీదట ఎన్నటికిని నీ పండు ఎవరును తినకుందురు గాక.”
మరియు శిష్యులు మరుసటి దినమున. ఎంత త్వరితముగా, సరిగ్గా అప్పటి నుండి దాని క్రియ మొదలిడెను. మరుసటి దినమున, అది ఎండిపోవుటకు ప్రారంభించెను. మరియు వారు చెప్పిరి, “ఇదిగో చూడుడి, ఎంత త్వరగా చెట్లు ఎండిపోయెనో.”
“మరియు ఆయన చెప్పెను, ”దేవునియందు విశ్వాసముంచుడి. ఏలయనగా నేను మీతో చెప్పుచున్నాను, మీరు, (“నేను” అని చెప్పలేదు అయితే, “మీరు” ఎవరైనను), ఎవరైతే ఈ కొండను చూచి, “నీవు కదిలింపబడి, మరియు సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అదే దేవుడు మీలో యుండుట. కొండను దేవుడు తప్ప ఎవరు కదిలింపగలరు. దేవుడు తప్ప మరి ఎవరు ఈ కార్యములను చేయగలరు.
16
కావున, మీరు చూడుడి, నిస్సందేహముగా దేవుడు ఆయన యొక్క జనులలోనున్నాడు. అట్లైన మనము ఒకరినొకరము గౌరవించుకొనుటకు బద్దులమైయున్నాము. మనము ఒకరినొకరము ప్రేమించవలయును. మన సంఘ శాఖల అడ్డుగోడలన్నింటిని దాటి మనము ఒకరినొకరము ప్రేమింపవలయును. ఒకవేళ మనము ఏకీభవించక పోయినను ఫరవాలేదు.
ఒకవేళ, అపొస్తలులు, వారు ఒకరి అభిప్రాయము ఒకరు ఏకీభవింపకుండా యుండియుండవచ్చును. వారిలో ఎవరు గొప్పవారని మరియు అనేక కార్యములను తెలిసికొనవలయునని అనుకొనిరి. యోహాను, మార్కు మరియు అక్కడ పౌలు వారు. మరియు పేతురును పౌలును ఏకీభవించలేకపోయిరి.
అయితే ప్రేమయను బంధకములు మరి ఈ దినమున దానికొరకే మనము పోరాడుచున్నాము, మెతడిస్టులు అందరును, బాప్తిస్టులును, ప్రెస్బిటేరియన్లు, లూథరనులు ఎవరైనను మనమందరమును ఒక క్రైస్తవ తెగగా యున్నాము.
ఇప్పుడు, మనము దేవునికి సమీపముగా నుండుట కొరకై ఆత్మతో నింపబడుటకు మనము ప్రయత్నించుచున్నాము. అదియే దర్శనము.
17
ఇప్పుడు, మీరు యెషయా 1? తీసిరా? మనము 14వ వచనము నుండి ప్రారంభించెదము. మరియు నా యొక్క అంశమును తీసికొనుటకై నేను ప్రభువు చిత్తమైనయెడల 18వ వచనము నుండి నేను ఒక పాఠమును తీసికొనబోవుచున్నాను.
మీ అమావాస్యలును - ఉత్సవములును నియామక కాలములును నాకు హేయములు అని నాకు బాధకరములు; వాటిని సహింపలేక విసికియున్నాను.
మీరు మీ చేతులు చాచునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను; మీ చేతులు రక్తముతో నిండియున్నవి.
మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొలగించుడి; కీడు చేయుట మానుడి;
మేలు చేయ నేర్చుకొనుడి; న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసి౦చబడు వానిని విడిపించుడి, తండ్రి లేనివానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి.
యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు — రండి మన వివాదము తీర్చుకొందము: మీ పాపములు రక్తమువలె ఎర్రనివైనను, అవి హిమమువలె తెల్లబడును; కెంపువలె ఎర్రనివైనను, అవి గొర్రె బొచ్చువలె తెల్లనివగును.
మీరు సమ్మతించి నా మాట వినినయెడల, మీరు భూమియొక్క మంచి పదార్ధములను అనుభవింతురు.
సమ్మతింపక తిరుగబడిన యెడల, నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు: యెహోవా ఈలాగుననే సెలవిచ్చుచున్నాడు.
18
మీకు తెలియునా, ప్రస్తుత కాలమున మనము జనులు కూడుకొను అనేక సమావేశములను గురించి వినుచున్నాము. దానినే దేవుడు ఇక్కడ మాటలాడుచున్నాడు, ఆయన ప్రజలతో కూడి ఆలోచించుట. మరియు “రండి, మన వివాదము తీర్చుకొందము.” “రమ్ము మరి మనము ఒక్కటిగా చర్చించుకొనెదము.” గత కొద్ది దినములుగా దానిని మనము చేయుచున్నాము.
మరియు దేశములో ఎక్కువగా యున్నవి అవియే మరియు జాతీయ కార్యాకాలాపములన్నియు ఈ దినమున ఈ సమావేశముల సభపైనే ఆధారపడి యున్నవి. ఇక్కడే కొద్ది కాలమునకు మునుపు దానిని నేను సులభముగా జ్ఞాపకమునకు తెచ్చుకొనగలను, మరియు అనేకమంది దానిని జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరు, పెద్ద నలుగురి యొక్క సమావేశము. మరియు ప్రపంచ శాంతి ప్రేమికులైన ప్రపంచములోని గొప్ప నాయకులైన నలుగురు ఏకమై వారు ఒక ఆలోచనా సమావేశమును నిర్వర్తించిరి. చేయతగిన శ్రేష్ఠమైనదేది అని తీర్మానించుట కొరకై ఈ ఆలోచనా సమావేశములో వారు ప్రయత్నించరు.
ఈ సమీప కాలముననే జెనీవాలో, ఆలోచనా సమావేశము జరిగినది, ప్రపంచ శాంతిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుటకై ప్రపంచ శాంతి ప్రేమికులు ఒక చోట ఏకమైరి. అదే జెనీవా ఆలోచనా సమావేశముగా పిలువబడినది.
నేను పొరబాటు పడనట్లైతే ఇక్కడే కొంత కాలమునకు క్రితము పారీస్ ఆలోచనా సమావేశము జరిగినది. వారందరు కూడా సమాధానమును వర్ధిల్లింప జేయాలని ప్రయత్నించిరి. సమస్యలను గురించి తర్కించుకొనుటకు పారిస్ లో సమావేశమైరి.
19
మరిప్పుడు మన ప్రియమైన అధ్యక్షుడు డ్వెయిట్ ఐసన్-హావర్ స్వేచ్చా ప్రపంచమును పర్యటించుచున్నారు. వార్తాపత్రికను దానిని పూర్తిగా ప్రచురించుచున్నవి. మరియు ఆయన ప్రపంచములోని స్వేచ్చా జనులతో జరుపు సంభాషణలు మరియు ఆలోచనా సభలు తరువాత ఆలోచన సభల ద్వారా సమాధానమునకై శ్రీ, ఐసన్-హావర్ చేయు ప్రయత్నములను రేడియోలు ప్రకటించుచున్నవి. మరియు అతను ఏ విధముగా అనేక చోట్ల ఆహ్వానింపబడుచున్నాడో, మరియు వారు అతను వచ్చినప్పుడు ఏ విధముగా అమెరికను పాటలను పాడుచున్నారో లేక జెండాలను ఎగురవేయుచున్నారో వార్తా పత్రికలు మరియు పలువిధములైన వారు అతనికి యిచ్చుచున్నటువంటి బహుమతులను మొదలగు వాటిని వారు తెలియజేయుచున్నారు. సమాధానమును ప్రేమించు దేశములలోని జనులు వారు. మనము ఈ దేశములో ఈ విధమైన కూటములను స్వేచ్చగా జరిపించుకొనుచున్నామనగా వారు చేయు సకల విధములైన ప్రయత్నముల వల్లనే.
కావున మనము శ్రీ. ఐసన్-హావర్ కొరకు ప్రార్థంపవలసియున్నామని నేను తలంచుచున్నాను. మరి దాని యొక్క పాపమంతటితోను మరియు దాని బాధలతోను ప్రపంచమునందున్న దేశములలో కంటె అమెరికా ఇంకా ఉత్తమమైన దేశముగానే యున్నదని నేను దానిని నమ్ముచున్నాను. మరియు అమెరికా ఆ విధముగా ఎల్లప్పుడును నుండుటకు సహాయపడును, ఏలయనగా మనము కొన్ని అమూల్యమైన విధులను కలిగియున్నాము. ఈ విధులను కాపాడుకొనుటకై ఈ ప్రాచీన భూమి రక్తముతో స్నానము చేయబడియున్నది.
కావున దేవుడు శ్రీ ఐసన్ హావర్తో కూడా నిరంతరము యుండునట్లుగాను, అతడు వృద్దుడై పోవుటచే అతని యొక్క ఆరోగ్యము సరిగ్గా వుండుట లేనందువలన అతని కొరకు మనము ప్రార్థించవలయును. అతను తనయొక్క సాంఘిక స్థితిలో ప్రసంగించుచు మరియు అతడు తనకు సాధ్యమైనంత వరకు ప్రయత్నించుచున్నాడు. మీరు ఒకవేళ అతనితో రాజకీయములలో ఏకీభవించకపోయినను, ఇప్పుడు అతని కొరకు ప్రార్థించుడి. మీ యొక్క దేశము అపాయకరమైన స్థితిలో యున్నది.
20
ఎందునిమిత్తము ఈ ఆలోచనా సభలు నిర్వహించుచున్నారు? ఈ ఆలోచన సమావేశముల సభకు గల కారణమేమిటి? వాటికి ఒక కారణము యుండవలయును లేనియెడల ఈ సమావేశములను వారు ఏర్పాటు చేయరు. వారు ఏమి చేయనై యున్నారను ఒక దృఢమైన తీర్మానమునకు వారు రావలయును. మరి అందుకొరకే, ఒక నిర్ణయము తీసికొనుట కొరకై ఒక సమావేశమును ఏర్పాటు చేయుచున్నారు. వివిధ అభిప్రాయములను గలవారైయుండి కొందరు ఒక స్థలము నుండి మరొకరు మరొక స్థలము నుండి వచ్చి ఇచ్చట కొన్ని చిన్న విషయములను లేవనెత్తి అక్కడ ఒక విషయము మరియు అచ్చట చేయదలచి యున్నారో ఆలోచన జరిపి పిదప ఒక తీర్మానమును తీసికొసెదరు. మరి అందుకొరకే ఆ సమావేశములు జరుపబడుచున్నవి.
మరియు అప్పుడు తీర్మానమునకు పిదప లేక సమావేశము జరుప వలయునని ఉద్దేశింపబడిన తరువాత ఈ సమావేశము జరుపబడుటకై వారు ఒక నిర్ణీత స్థలమును కలిగియుండవలయును. మరియు మీరు గనుక గమనించిన యెడల వారు ఒక అందమైన స్థలమును ఏర్పరచుటకు ప్రయత్నించెదరు.
పారీస్ లో జరుగు జెనీవా సమావేశము మరి నేను జెనీవాలో యుంటిని మరియు సమావేశములు జరుపబడిన అనేక స్థలములకు నేను వెళ్ళాను. నేను ఐక్యరాజ్య సమితి కట్టడమునకు వెళ్ళాను. ఓ, అది చాలా చక్కగా నుండెను, ప్రత్యేకముగా జెనీవా, మరుటు పిదప అక్కడ, వారు. వారు ఆకర్షితులగునట్లుగా వుండవలెనని ఆ స్థలములను ఎన్నుకొనుటకు ప్రయత్నించెదరని నేను నమ్ముచున్నాను. అక్కడ ఏదో ఒక విషయమున్నది. అది శాంతియుతము గాను ఆకర్షణగాను యుండును. మరి అటువంటి చక్కటి పరిస్థితులు మానవ ఆత్మపై చక్కగా పనిచేయును. అది నిజమని నేను నమ్ముచున్నాను.
అనేక సమయములలో నాకు నేనుగా ఒక సంధ్యవేళను గమనించుటకు ఒక కొండను ఎక్కినయెడల లేక అది నన్ను పులకరింపజేసి మరియు నా యొక్క సమస్యలు భిన్నాభిప్రాయములన్నియును తీరిపోవు అనుభూతి నిచ్చును. ఒక స్థలము, ఒక స్థలము, ఎంపిక చేయబడిన స్థలములయందే అచ్చటే ఈ సమావేశములు ఏర్పాటు చేయబడును. మరియు అటు పిదప తీర్మానములు తీసికొనబడును.
మరియు ఆ తరువాత ఆలోచనా సభలను గురించి మరొక తలంపును మీ మధ్యకు తీసుకురావలెనని నేను ఆశపడుచున్నాను. అదేమనగా, ఒక కీలకమైన అవసరత వుంటే తప్ప వారు ఆలోచనా సభను జరుపరు. ఆలోచనా సభను వారు ఏర్పాటు చేయునప్పుడు అచ్చట ఒక తీక్షణమైన సమయము కావలెను.
21
బలాఢ్యులైన నాలుగు పెద్ద దేశములు సమావేశము జరుపుచున్నప్పుడు అది రెండవ ప్రపంచ యుద్ధము చేతులు దాటిపోయే సమయమది. మరియు వారు ఒక్కటిగా కూడుకొని మరియు వారియొక్క ఉపాయములన్నింటిని ఒక్కటిగా కూర్చి మరి వారు ఏదో పథకమును వేసెదరు; శ్రీ. చర్చిల్ మరియు రూస్వెల్ట్ మరియు మరికొందరు వారియొక్క యింగిత జ్ఞానమును ఐక్యము చేయుచు ఏది శ్రేష్ఠమైనదో కనుగొనుటకై ప్రయత్నించిరి; ఎందుకనగా అది ఒక తీక్షణమైన సమయము కాబట్టి సమస్త స్వాతంత్ర్య ప్రపంచమంతా బ్రద్దలైపోయేటువంటి ఒక సమయమది. మరియు హిట్లర్ నేటివరకు కూడా ప్రపంచమునకు నియంతగానే యుండెడివాడు. అట్లైన యెడల ఈనాడు ఈ కూటము మనకు ఉండెడిది కాదు.
మరియు ఆ కారణము వలననే ఆలోచనా సభలు ఏర్పాటు చేయుదురు. మరియు ఎన్నిక చేయబడిన స్థలములయందు వాటిని నిర్వహించెదరు. వారు వాటిని ఏర్పాటు చేయుటకు గల కారణము అదే అగును. మనము ఒక ఆలోచనా సభను ఏర్పాటు చేయుటకు బలవంతపెట్టబడుచున్నాము. మరియు ఆ విధముగానే వారు కలుసుకొనెదరు. మరియు వారు గొప్ప సమావేశములను ఏర్పాటు చేసెదరు. నా మనస్సులో ఏ సందేహము లేదు.
మరి కాలా కాలములుగా జరిగిన నేను చదివిన, ఫరో దినములలో జరిగిన ఇతర గొప్ప సమావేశములను మరియు ఆ విధమైన కార్యములను నేను నా స్వరముతో చెప్పుకొనుచూ పోవుటకు సమయము నిశ్చయముగా నాకు సరిపోదని నేను నిస్సందేహముగా చెప్పగలను. అయితే ఈ లోకపు పద్దతుల ప్రకారముగా గొప్ప ఆలోచనా సభలు ఏర్పాటు చేయబడుచున్నవి.
22
మరటు పిదప అచ్చట దేవుని యొక్క గొప్ప కార్య నిర్వాహములో ఒక సమావేశ ఆలోచన సభ జరుపబడవలసిన సమయమొకటి వచ్చెను.
మరియు నేను చెప్పబోవు మొదటి సమావేశము ఈ భూమికైనది ఏదెను తోటలో జరిగెను. దేవుని యొక్క దూతలు గృహమునకు ఏడ్చుకొంటూ వచ్చి యిలా చెప్పెను, “మీ బిడ్డ పడిపోయెను. అతను పాపము చేసెను, మరియు అతను మీ యొక్క ఆజ్ఞలను అతను బ్రద్దలు చేసెను.”
ఏదో ఒకటి చేయవలసియున్నది. దేవుని యొక్క సృష్టి కృపనుండి పడిపోయెను మరియు అతడిని దేవుని యొక్క సన్నిధానము నుండి నిత్య ఎడబాటుకు అది దోహదము చేసినది. అది ఒక కఠినమైన క్షణము, ఏలయనగా పరలోకపు రాజు చెప్పెను, “నీవు వాటిని తిను దినమున నిశ్యయముగా చచ్చెదవు.” మరియు తనయొక్క కుమారుని పైన నమ్మకముంచి చెప్పెను మరి ఆయన కుమారుడు ఆయన ఆజ్ఞలను బ్రద్ధలు చేసెను. అక్కడ ఏదో చేయబడువలయును. అది ఆయన యొక్క సృష్టి, అది ఆయన యొక్క స్వంత చేతి క్రియ. అది ఆయన యొక్క హృదయము నుండి వెలువడిన ప్రేమ, అది ఆయన యొక్క కనుపాప. ఏదో ఒకటి అచ్చట జరుపవలసియున్నది. కావున అక్కడ ఒక సమావేశము ఏర్పరచబడెను.
23
దేవుడు ఒక ప్రత్యేకమైన వృక్షమును ఏదెను తోటలో ఎన్నుకొనెను. మరటు పిదప ఆయన పొదలకు వెనుక రక్తసిక్తమైన గొర్రె చర్మమును పడవేసెను. ఆయన ఆదామును మరియు హవ్వను పిలిచి మరి అక్కడ ఆయన ఒక ఆలోచనను సమావేశపరచి దానిని గురించి ప్రస్తావించి మరి ఆయన యొక్క బిడ్డలు చేసిన ఈ ఘోరమైన కార్యమునకై ఒక పరిహారమును చేసెను. దేవుని యొక్క ఆలోచన సమావేశ సభ.
మరక్కడ ఒక తీర్మానము చేయబడెను. ఎల్లప్పుడును ఆలోచన సమావేశములలో అచ్చట ఒక తీర్మానము చేయబడును. మరియు దేవుడే ఒక తీర్మానము చేసెను. అది. ఏలయనగా హవ్వ. ఆయన ఆమెను సాక్ష్యుల స్తానములో నిలువబెట్టెను, ఎందుకనగా ఆమె లోకమునుండి జీవమును తీసివేసెను, ఆమెయే లోకమునకు జీవమును తీసికొని రావలయును. మరియు ఆదామునకు, మరియు సర్పమునకు మరియు అన్ని జాతులకు అది శిరస్సుగా నున్నందువలన, ఆదాముతో కూడా దాని క్రిందనున్న జాతులన్నియు పడిపోయినవి.
24
అటు పిదప నా యొక్క జ్ఞాపకమునకు మరియొకటి వచ్చుచున్నది, మరియొక ఆలోచన సమావేశము, అది ఒక పారిపోయిన ప్రవక్తను గురించి, అతను తనయొక్క తీర్మానములో బలహీనుడుగా నుండి మరి తన ముందుంచిన కర్తవ్యము చాలా గొప్పదని తలంచెను. మరియు అతను పారిపోయి, వివాహము చేసుకొని మరియు అరణ్య ప్రాంతమునకు వెళ్ళి అక్కడ నలుబది సంవత్సరములు గడిపెను. దేవుని ద్వారా అభిషేకి౦పబడిన ఒక ప్రవక్త, ఒక గొప్ప కర్తవ్యముతో ప్రపంచములో ఒక ప్రవక్తగానే జన్మి౦చిన వాడు. అయితే దేవుని యొక్క ఉపదేశములను గైకొనుటకు బదులుగా తనకుతానుగా దానిని తన చేతులుద్వారా చేయవలయునని తాను చేసిన తప్పుకు భయపడి, అతను ఒక వ్యక్తిని చంపెను. మరియు ఫరో యొక్క బెదిరింపుకు భయపడి అతను అరణ్యవాసమునకు పారిపోయి అచ్చట నలుబది సంవత్సరములు నుండెను.
మరియు ఐగుప్తు యొక్క బానిసలు, ఆ కార్యము చాలా గొప్పగా నుండెను వారి వీపులన్నియు దెబ్బల వలన బొబ్బలు కట్టి మరియు వారి హృదయములు విగిరిపోయి దేవుడు వారిని గురించి ఒక ఆలోచన సమావేశమును బలవంతముగా ఏర్పాటు చేయబడునట్లు వారి మొర్రలు దేవుని యొద్దకు చేరినవి.
బలవంతముగా ఒక ఆలోచనా సభ జరిగించుటకు ఒక మార్గము కలదు. మీరు మీ యొక్క జీవితములో దానిని చేయవచ్చును, ఒక బలప్రదర్శన.
25
జనులు యొక్క బాధలు మరియు మొర్రలు అధికమైపోయినవి, ఎంతగాననగా దేవుడు బలవంతముగా ఒక ఆలోచనా సభను ఏర్పరచవలనంతగా, దేవుడు గనుక ఒక తీర్మానమును చేసినయెడల అది మరి ఆ విధముగానే అది నుండవలయును.
కావున జనులను విమోచించవలెననే ఉద్దేశ్యముతో ఆయన జగత్తుకు పునాది వేయబడక మునుపే ఒక మానవుడిని గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో నుంచెను. సమస్త కార్యములను దేవుని ద్వారా ముందుగానే పథకము వేయబడెను. ఆ వ్యక్తి పేరు మోషే, ఆయన యొక్క సేవకుడు అతడు. కావున, జగత్తుకు పునాది వేయబడక మునుపే, జనులను విడిపించుటకై మోషే ఎన్నుకొనబడెను. మరియు మోషే దేవుని ఎదుట ఓడిపోయెను.
మరి అది మనకు నమ్మకమును మరియు ధైర్యమును ఇవ్వవలయును. దేవుని యొద్ద అపజయము పొందిన మనము, మనకింకా నిరీక్షణ కలదు. ఒక సంఘముగా మనము ఆయన ఆశను బంగము చేయుచున్నాము. ఒక జనులముగా ఆయనను ఆశభ౦గము చేయుచున్నాము. అయితే మనకు ఒక ఆలోచన సమావేశమును జరిపి, ఆయనతో సంప్రతించి ఆయన మనకు ఏమి చెప్పునని చూచెదము, ఎటువంటి తీర్మానములోనికి మనము నడిపి౦చబడేదమో చూద్దాము.
26
మరియు దేవుని యొక్క వ్యక్తి ఓడిపోయెను మరి దేవుడు ఒక ఆలోచన సమావేశమును జరుపవలసినదాయెను. ఆయన వేరే ఎవరిని ఉపయోగింప లేడు. ఆయన మోషేను ఎన్నుకొనెను. కావున అతను అరణ్యవాసమునకు వెళ్ళి మరి అక్కడెక్కడో సీనాయికి దగ్గర ఎడారికి వెనుక భాగమునకు అతను వెళ్లెను. మరియు ఒక పర్వతము యొక్క శిఖరమును ఆయన ఎన్నుకొనెను. ఒక నిర్ణీయత స్థలములోనున్న పొద అది. “మోషేను ఇచ్చట పైకి తీసికొని వచ్చెదనని,” ఆయన తలంచెను. అతని యొక్క గొర్రెలనుండియు, అతని యొక్క భార్య నుండియు, అతని యొక్క బిడ్డల నుండియు, జనులందరి నుండి దూరముగానున్న ఒక మంచి స్థలమిది అని దేవుడు అనుకొనెను. మరియు నేను అతనితో ఒక ఆలోచనా సభను ఏర్పాటు చేసెదు.
అక్కడ ఆయన ప్రవక్తతో మాటలాడినప్పుడు, చివరికి వారు ఒక అంశమునకు వచ్చిరి. “ నా యొక్క జనుల మొర్రలను నేను వినియున్నాను. అందువలననే నేను నిన్ను పిలిచితిని, మోషే అక్కడ క్రిందనున్న నా జనుల యొక్క మొర్రలు నేను విన్నాను. మరియు నేను చేసిన ఒక వాగ్దానమును నేను జ్ఞాపకము చేసుకొంటున్నాను. దానిని నేను కాపాడుకొనవలెను. ఇప్పుడు నేను అచ్చట క్రిందికి పంపుచున్నాను.”
27
మోషే దేవునితో అతడు తిరిగి పలికిన మాటలు అచ్చట యున్నవి. అతను ఒక మానవుడు. అతను చెప్పెను, “అయితే నేను ఎంతటి వాడిని? నేను మాటలాడలేను.”
మరటు పిదప ఈ ఆలోచన సమావేశ సభలో దేవుడు మోషేతో చెప్పెను, “నరునికి నోరిచ్చిన వాడెవడు? నరుడు మాటలాడుటకు నేర్పించినవాడెవడు? చెవిటివాడిని కలుగజేసిన వాడెవడు? నత్తివాడిని నిర్మించిన వాడెవడు?”
మరి మోషే ఇంకా నెపములను చెప్పుచునే యున్నాడు. అతను దేవుని యొక్క మహిమను చూడవలయునని ఆశించెను. మరియు ఆయన చెప్పెను, “మోషే, నేనెవరని నీవు గనుక తెలిసికొనవలయునని కోరినయెడల నేను అద్భుతములు చేయు దేవుడును. నీ యొక్క కర్రను నేల మీద వేయుము.” మరది సర్పముగా మారెను. పిదప ఆయన చెప్పెను, “నీ చేతిని నీ రొమ్మున పెట్టుకొనుము.” మరి దానిని తీసి చూచినప్పుడు అతి కుష్ఠరోగముగలదిగా నుండెను. మరియు దానిని మరల అచ్చట పెట్టి తీసినప్పుడు అది బాగుపడినది. అడిగెను. “మోషే, నేనెవరని నీకు తెలియునా? అద్భుతములు చేయగల దేవుడును నేను. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచు మరియు బాధింపబడువారిని బాగుచేయు దేవుడను నేను. నేను యొహోవా దేవుడను.”
మోషే చెప్పెను, “నేను మీ యొక్క మహిమను చూచితిని. ఈ యొక్క ఆలోచనా సభ ముగించు లోపల ఇంకొక కార్యము నేను తెలిసికొనవలయునని ఆశపడుచున్నాను. నన్ను పంపినది ఎవరని నేను ఫరోకు ఏమని చెప్పగలను?”
ఆయన చెప్పెను, “నేను ఉన్నవాడను, నిన్ను పంపినవాడనని అతనితో చెప్పుము. ఇంతకు మునుపున్నవాడను, లేక ఉండబోవువాడను కాను, అని కాదు. అయితే నిరంతరము ఉన్నవాడను - నిన్న, నేడు, మరియు నిరంతరముగా ఉన్నవాడను.” “నేను ఉన్నవాడను,” ఉన్నవాడను అనునదిప్పుడు వర్తమాన కాలమును సూచించుచున్నది. అది భూత, వర్తమాన, మరియు భవిష్యత్ కాలములను సూచించుచున్నది, “నేను ఉన్నవాడను. నేను ఉన్నవాడను నిన్ను పంపియున్నాను.”
28
మోషే తనయొక్క ఆజ్ఞలను గైకొని మరి ఐగుప్తునకు బయలుదేరి వెళ్ళెను. వెలుపలికి వచ్చుట, పిల్లలను తీసుకొని వచ్చుచు, అచ్చట ఒక సమయము వచ్చెను, పిదప, అచ్చట వారు మూల స్థలమునకు వచ్చినప్పుడు, ఒక జనులుగా, బయటకి పిలువబడిన ఒక జనులుగా, ఇతర లోకపు జనుల నుండి వేరుపరచబడిన వారు! ఐగుప్తులో వారు ఉన్నంత వరకు ఇశ్రాయేలీయులు దేవుని యొక్క జనులు వారు ఐగుప్తు నుండి వెలుపలికి వచ్చిన తరువాత వారు దేవుని యొక్క సంఘముగానున్నారు. “బయటికి పిలువబడిన వారు.” లేక సంఘము అను పదమునకు అర్థము “బయటికి పిలువబడిన వారు.” కావున వారు ప్రపంచములోని ఇతర జనులనుండి బయటికి పిలువబడిన వారు, కావున వారు సంఘము.
మరి ఈ ఉదయమున అదే ఇచ్చట యున్నది, ప్రపంచము నుండి బయటికి పిలువబడిన వారు, ఏ సంఘ శాఖకు చెందినప్పటికిని ఫరవాలేదు. వారు గనుక బయటికి పిలువబడి యున్నయెడల, వారు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారగుదురు. మరియు వారే ఆయన యొక్క గొప్ప సంఘపు సభ్యులు.
కావున ఈ జనులు గొర్రెపిల్ల యొక్క రక్తమును బలిగా అర్పించుట వలన మరియు ద్వారబంధములపై రక్తమును పూయుట ద్వారా వారిని వారు వారంతట వారే ప్రత్యేకించుకొనిరి. మరియు హిస్సోపు ద్వారా అది పూయబడెను.
29
గమనించుడి. మీరిక్కడ ఒక కార్యమును గమనించవలయునని కోరుచున్నాను. అది చాలా ఆశ్చర్యముగా మనస్సునకు గట్టిగా తోచునట్లున్నది. వారు హిస్సోపును తీసికొని మరియు దానిని గొర్రెపిల్ల రక్తములో ముంచి మరి దానిని ద్వారమునకు పూయవలయునని మోషే ఆజ్ఞాపించెను. ఆ రక్తము క్రీస్తు యొక్క రక్తమును సూచించుచున్నది. హిస్సోపుయనునది సాధారణ కలుపు మొక్కలు. దానిని మీరు ఎక్కడైనను కనుగొనవచ్చును, ఒక గుప్పెటనిండా దానిని తీసికొనుడి. రక్తము పూయుట చాలా సులభమని అది చూపించుచున్నది.
కలుపు మొక్కలు విశ్వాసమునకు పోలికగా యున్నది, దేవునియందు విశ్వాసమును మాత్రము సూచించు చున్నది. మీరు ఎచ్చటికో పోవలసిన పని లేదు. దేవుని యొక్క విశ్వాసమును తీసికొని మరి రక్తమును మీ యొక్క హృదయమునకు పూయండి. “నేను లోకము యొక్క కార్యముల నుండి వేరుపరచబడి యున్నానని చెప్పుము, ఎందుకనగా విశ్వాసము ద్వారా ఈ ఉదయమున రక్తమును నా యొక్క కార్యములపై పూసియున్నాను. నా హృదయపు ద్వార బంధముపై రక్తము పూసియున్నందు వలన నేను స్వస్థత నొందెదను. సందేహమనునది మరల నన్ను దెబ్బ తీయుటకు నేను అనుమతించును, ఏలయనగా యేసుక్రీస్తు రక్తమును విశ్వాసము ద్వారా నా తల౦పులపై నుంచుటకు వలన నన్ను నేను కాపాడుకొనెదను. మరియు ఏ శత్రువును లోనికి ప్రవేశించలేడు. దేవుని యొక్క వాక్యమును నేను ఎన్నడును మరి అవిశ్వాసింపను.” మరి అది అంత సామాన్యముగా నున్నది.
30
వారు వేరుపరచబడిన పిదప ఒక పిలువబడిన జనులుగా వారు వారియొక్క ప్రయాణములో క్రమముగా అడుగులు వేయుచు వెళ్ళుచుండిరి. మరియు వారు ఎర్ర సముద్రము యొద్దకు వచ్చిరి. మరి వారు అక్కడ ఆగవలసి యుండెను. వారు దాటలేకపోయిరి. ఆ గొప్ప సైన్యాధిపతి యెహోషువా తన చేతినెత్తి మరి బూరను ఊదవలసి వచ్చెను, ఎందుకనగా ఇట్లు చెప్పుటకు, “ఆగండి! నడవటము ఆపండి! మనకు మునుపు ఒక ఆటంకమున్నది. మనకిరు ప్రక్కల పర్వతములు యున్నవి. మనము ఇక్కడ క్రింద ఒక లోయలో నున్నాము, మరియు మనము ముందుకు సాగలేము కనుక ఇక్కడ నిలువవలయును.”
మరియు సంఘము ఎప్పుడైనను ఆగిపోయిన యెడల మరప్పుడు సాతానుడు దానిని తన అధీనములో తీసికొనును. కదిలిపోవుచు నుండవలయును, నిలకడతోను మరియు స్థిరముగాను సీయోను వైపుకు కొనసాగిపోవలయును. జీవముగల దేవుని యొక్క సంఘము ఎన్నడును ఆగిపోవునటువంటి నేరమును చేయుటకు అనుమతించకుడి.
కావున, వారు నిలిచిపోయిరి మరియు అడిగిరి, “ఇక్కడ ఏమి జరిగియున్నది?” మరియు వారు అచ్చట ఆగిపోయి వారి గుడారములు కట్టి మరి విశ్రాంతి తీసికొను సమయములో వారు ఉరుములవలె గర్జి౦చు చక్రముల యొక్క శబ్దమును వినిరి. మరియు వారు తప్పించుకొనుటకు గల ఒకే ఒక మార్గము వారు వెనుకకు వెళ్ళుటయే. మరిక్కడ వారియొక్క దారిని మూయటకు వారి దారి కడ్డముగా ఫరో యొక్క సైన్యము కదలి వచ్చుచున్నది.
31
సైనికులైన మీరు, వారు ఏ విధముగా దారిని మూసివేసియున్నారో ఆ యుక్తిని మీరెరుగుదురు. అక్కడ వారికి ముందు రెండు లేక మూడు మైళ్ళకు అడ్డముగా ఎర్రసముద్రముండెను. ఇక్కడేమో ఎత్తైన పర్వతములు; వారు ఆ పర్వతములను ఎక్కలేరు. వారక్కడ చెదరగొట్టబడిన గొర్రెలవలె, ప్రతి విలుకానికి సులభముగా చిక్కిన గొర్రెలవలె నుండిరి. మరియు వారు అచ్చటనే నిలిచిపోయినందున వారి వెనుక శత్రువు వచ్చుచుండెను.
స్నేహితులారా, ఈ దినమున వాగ్దాన భూమికి మనము అడుగులు వేసి కొనుచు వెళ్ళుచునప్పుడు శత్రువు ఒకటి లేక రెండు దూకులు దూకునంతగా మన వెంబడి వచ్చుచున్నాడనుటను అది చూపించుచున్నది. మనము ఈ ఉజ్జీవముతో నిలువలేము. నిలుచునట్లు చెప్పు సమయమువలె ఇది యుండకూడదు. ముందుకు కొనసాగుచూ పోవుడి. పోండి, నిన్నటి దినపు రాత్రి మరియు దానికి మునుపు దినమున రాత్రియున్న పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నతను మీరు కలిగియున్నారు. ఇప్పుడు విడువక దానిలోనికి కదిలి వెళ్ళుడి. నిలిచిపోయెదమని చెప్పవద్దు, ఏలయనగా శత్రువు మీకు వెనుక చాలా సమీపముగానున్నాడు.
32
మరియు నిలిచి పోవలయునని పిలుపు ఇవ్వబడగానే, దూరము నుండి వచ్చుచున్నఫరో యొక్క సైన్యము కనబడినది; రథముల చక్రముల యొక్క గర్జి౦చు శబ్దము, మరియు దానివలన ధూళి ఎగురుచు, సైనికుల యొక్క అరుపులు వినబడుచుండెను. ఎటువంటి సమయమది! మరది జనులను భయభ్రాంతులుగా చేసి పరుగులు తీయించినది.
అయితే కలతనొందనవసరము లేదని ఎరిగియున్న ఒక వ్యక్తి వారి మధ్య నుండెను. అతను ముందుగానే ఆలోచన సభలు కలిగియుండెను. దేవునిని పట్టుకొనుటకు ఏమి చేయవలయునని అతను తెలిసికొనియుండెను. కాబట్టి, అచ్చట ఇలాగు చెప్పెదము. కొండపైన ఒక ఫలానా బండయొద్ద మోషే ఇశ్రాయేలు పుత్రులనుండి వేరుగా దాగుకొనెను, మరియు అక్కడ అతను ఒక ఆలోచన సభను జరిగించెను. “ప్రభువా, నేను ఈ స్థలమునకు అడుగు లేసికొనుచు వచ్చాను అయితే ఒక ఆటంకము వచ్చి మమ్ములను నిలిపివేసెను. మేము నిలిచిపోవలయునని పిలుపు నిచ్చియున్నాము.”
33
ఇక్కడ చక్రాల కుర్చీలో కూర్చొనియున్న మన సహోదరునివలె లేక ఒకవేళ ఒక కాన్సరుతోలేక ఒక గుండె వ్యాధితో లేక మీరు ఇప్పుడే చనిపోవుచున్న వారివలె ఏదో ఒక వ్యాధితో మీరిక్కడ కూర్చొని యుండవచ్చును. శత్రువు మిమ్ములను నిలిపియుండవచ్చును. అతను మీరు నిలిచిపోవునట్లుగా చేసియుండ వచ్చును. శత్రువు మిమ్ములను ముట్టడించుటకు మునుపు ఒకవేళ మీరు నిలిచిపోతిరేమో, ఒకవేళ నీవు నిలిచిపోవుటకు ఏదైన ఒక కారణము మీ జీవితములో యున్నదేమో. ఏది ఏమైనను కావచ్చు. ఒక ఆలోచన సభను కలిగియుండుటకు ఇంకా ఒక తరుణము కలదు. మరి ఆయనతో దానిని గురించి మాటలాడెదము. దానిని గురించి మనము ఏదైనను చేసెదము. శత్రువు ఎంతవాడైనప్పటికి ఫరవాలేదు, అతను మన దేవునికంటె గొప్పవాడేమి కాదు. మనకు ఒక ఆలోచన సభ అవసరమైయున్నది.
కావున మోషే పైకి వెళ్ళి ఒక నిర్దిత స్థలమునకు వెనుకగా వెళ్ళెను, మనము చెప్పవచ్చును, అతను దేవునితో ఒక ఆలోచన సభను కలిగెను.
ఏమి చేయవలయునో అతనికి తెలియలేదు. బహుశా మీకు కూడా ఏమి చేయవలయునో తెలియలేదు. మీరు ఒకవేళ పాపిగా నుండవచ్చును, మరియు ఎంతో పాపము చేసియుండవచ్చును. త్రాగలేనంతగా పొగత్రాగేవాడవు కావచ్చునేమో మరియు దానిని విడిచిపెట్టలేని వారుగా యుండవచ్చును, ఒకవేళ మద్యపానమును త్రాగలేనంతటి త్రాగుబోతుగా యుండవచ్చునేమో. మరియు ఆ అలవాటును మానుకొనలేనివాడుగా యుండవచ్చు. ఒకవేళ మీరు పూర్తిగా పాపముతో, మరియు కామేచ్ఛతో నింపబడి, మీరు చూచు ప్రతి స్త్రీని ఆ దుష్కాము చూపుతో చూచుచు నుండవచ్చును, తప్పైన కార్యమది. లేక ఒకవేళ మీ ప్రకృతి సంబంధమైన స్వాభావికమే తారుమారైపోయి యుండవచ్చును. ఒకవేళ మీరు మరల సాగిపోలేని చోటుకు వచ్చి నిలిచిపోయుండ వచ్చును. మీరు ఎటువంటి స్థానములో నున్నను నాకు అక్కర లేదు, దేవుడింకా మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా సున్నాడు, ఒక ఆలోచన సమావేశము జరిపి మరి దానిని గురించి మీతో మాటలాడుటకు సంసిద్ధముగా నున్నాడు.
34
ఒకవేళ మీరు మీ కుటుంబమును నాశనము చేసుకొని యుండవచ్చును. ఒకవేళ మీ యొక్క భర్తను మీరు వదిలివేసి యుండవచ్చును లేక మీ భార్యను వదిలివేసి యుండవచ్చును. ఒకవేళ మీ యొక్క బిడ్డలను వదిలి పారిపోయి యుండవచ్చును. మరియు శత్రువు కపటోపాయము చేత మిమ్ములను చిక్కుల్లోకి పడవేసిన అనేక విషయములు నీ జీవితములో యుండవచ్చును. అయితే గుర్తు౦చుకొనుడి నా సహోదరుడా, సహోదరి మీరు దేవునితో ఒక ఆలోచన సమావేశమును నడుపుటకు మీకింకా హక్కులు కలవు. అవునయ్యా. ఆయనతో దానిని గురించి సంప్రతించుడి. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.
అటు పిదప మనము మోషే ఒక సమావేశమును కలిగియుండుట చూచుచున్నాము. మరియు ఒకవేళ ఇది ఆలోచన సమావేశముగా నుండి యుండవచ్చును, “ఇశ్రాయేలు యొక్క ఓ గొప్ప నాయకుడా, నేను దీనినంతటిని మీ ఆజ్ఞ చొప్పున జరిగించితిని. నేను మీరు చెప్పిన విధముగా నేను ఈ జనులను నడిపించియున్నాను. నేను రక్తముతో జనులను కప్పియున్నాను; నేను ఆకాశము నుండి తెగుళ్ళను క్రిందికి రప్పించియున్నాను. మీరు నాతో చేయమని చెప్పిన సమస్తమును నేను చేసియున్నాను. మరిక్కడ మేము చిక్కుబడి యున్నాము. ప్రభువా, నేనేమి చేయవలయును? నేను మీతో ఈ ఆలోచన సమావేశమును జరుపవలయును.”
మరియు బహుశా బండపైన కూర్చొని, లేక బండ సందు దగ్గర నిలువబడి, ఈ యొక్క నిర్ణీత, ఎన్నుకొనబడిన స్థలమున, ఈ యొక్క కఠినమైన క్షణములో మోషే ప్రార్థించుచుండి యుండవచ్చును. ఏదైనను జరిగి తీరవలయును లేనియెడల వారు రథముల చక్రముల క్రింద నలిగిపోయెదరు. ప్రతియొక హెబ్రీయుల బిడ్డలు త్రోసి వేయబడెదరు. ప్రతియొక శిశువులు వారి తలలు బండకు కొట్టుకొని బద్దలైపోయుండెడి వారు. మరియు వారి-వారి తండ్రుల గొంతులను కోసేవారు. అది ఒక కఠినమైన ఘడియ.
35
ఒకవేళ అటువంటి విధముగా యుండు ఘడియ రావచ్చును, మరి ఒకవేళ ఆ విధముగా నుండకుండా ఉండవచ్చును, అయితే కాన్సరు మిమ్ములను పట్టుకొని యుండవచ్చును. ఒకవేళ వేరొక వ్యాధి ఏదైనను మిమ్ములను పట్టిపీడించుచు నుండవచ్చును. ఒకవేళ పాపము మిమ్ములను పట్టుకొని యుండవచ్చును. అది తిన్నగా దయ్యము యొక్క పాతాళములోనికి నిన్ను నలిపివేస్తూ తీసుకొని వెళ్ళును. దేవునినుండి ఒక ఎడబాటు చేయుట. వెంటనే ఒక ఆలోచన సమావేశమును జరుప౦డి.
మరియు ఈ యొక్క ఆలోచన సమావేశము జరుగుచుండగా, దేవుడు మోషేకు ప్రక్కగా బండపై నిలిచెను. మరియు ఆయన చెప్పెను, “మోషే క్రింద శిబిరము నొద్దకు నీవు ఎచ్చటి నుండి ప్రారంభించితివో మరచ్చటికి పొమ్ము నేను దేవుడను నీవు అచ్చట క్రిందకు వెళ్ళి ముందుకు సాగిపొమ్మని జనులతో చెప్పు, మార్గమును సిద్ధపరచుటకు ఎప్పుడు సమయము వచ్చునో అప్పుడు నేను మార్గమును సిద్ధపరచెదను. నేను మార్గమును సిద్ధపరచు దేవుడను.”
ఆలోచన సమావేశము ముగించిన పిదప, ముందుకు సాగిపోమను ఆజ్ఞపొందుకొని దేవుని యొక్క సన్నిధి నుండి మోషే క్రిందికి నడుచుకొని వచ్చి మరియు చెప్పెను, “ఇశ్రాయేలూ, భయపడకుము. ఈ దినము ఊరక నిలుచుండి మరి దేవుని యొక్క శక్తిని చూడుము. సముద్రము వైపుకు సాగిపో, ఆజ్ఞ నుండి కదలకుము. ఆజ్ఞ ఏమనగా, ముందుకు సాగిపొమ్ము” వాగ్దాన భూమి మనకు చెందియున్నది. శత్రువు మనలను నరికి వేయుటకు మన మార్గమున యున్నాడు. అయితే దేవుడు చెప్పెను, “ముందుకు సాగిపొమ్ము.”
36
మరి ఈ దినమున సంఘముతోనున్న కార్యము ఇదియే. దేవుడు మిమ్ములను పిలిచి మరి ఆయన మీకు వరములకు పిదప వరమును, శక్తికి పిదప శక్తిని, మరియు కృపకు వెంబడి కృపను అనుగ్రహింపవలయునని కోరుచున్నాడు. అయితే మీరు మిమ్ములను ఒక సంఘ స్థాపనగా చేసికొని, పిదప, “నేను ఇకమీదట ముందుకు సాగలేను, ఏలయనగా సంఘము నన్ను ముందు సాగుటకు అనుమతించుట లేదు.” చూశారా, దేవునియందు నిలిచిపోవుట అనేది లేదు, సంఘ స్థాపనకు చోటు లేదు. ఒక నిర్ణీత నియమము అనునదిలేదు. దానిలోనున్న విషయమేమిటంటే ముందుకు సాగిపో, దేవుని వాక్యమును పలికి మరి ముందుకు సాగిపొమ్ము ముందుకు సాగిపోవుచు నుండుము. నిలువక కదిలి ముందుకు కొనసాగిపొమ్ము. దేవుడు అది సరియని చెప్పితే, అది సరియే. నీవు నీ ఆజ్ఞను పొందుకొనియున్నావు.
మీరు చెప్పినట్లయితే, “మంచిది, నేను నా యొక్క సంఘమునకు వెళ్ళగా మరి వారు నాకు చెప్పారు ఆ గుడారమునకు నీవు వెళ్ళి యుండకూడదు. వారు అట్లు చెప్పినయెడల నేను ఇప్పుడు గందరగోళములో యున్నాను, పరిశుద్ధాత్మను పొందవలయునా లేక వద్ధాయని.” వాగ్దానము మీకు చెందినది. “ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చె౦దును.”
ఏమిటి? దేవుని యొక్క వాక్యమును పలుకుము. దేవుడు ఆ విధముగా చేయమని చెప్పియున్నాడు. ముందుకు సాగిపొమ్ము శత్రువు చెదరిపోవుటను గమనించుము. ఎర్ర సముద్రము తెరువబడుటను గమనించుము. ఒక ఆలోచన సమావేశమును కలిగియుండుము. ముందుకు సాగిపొమ్ము నిశ్చయముగా, అది తెరువబడును. తప్పించుకొను మార్గము దేవుడే.
37
వాగ్దాన భూమికి ఆయనే తిన్నగా ఒక మార్గమును సిద్దపరిచియున్నాడు. ఆయన మార్గములో ఏదైనను వచ్చినయెడల ఆయన దానినుండి తీసివేయును. ఏదైనను మీ యొక్క మార్గములో వచ్చినయెడల, దేవునితో ఒక ఆలోచన సమావేశ సభను జరుప౦డి. దానిని ఆయనతో మాటలాడి మరి ముందుకు సాగిపోవుడి. మరి దానినే యెషయాతో దేవుడిక్కడ చెప్పుచున్నాడు. “ఓ, మీరు పాపియైన వారిగా నున్నారు. మీ యొక్క పాపములు రక్తమువలె ఎర్రగా నున్నవి. నీవెందుకు వచ్చి నీ వివాదమును పరిష్కరించుకోకూడదు! మరి దానిని గురించి నాతో మాటలాడకూడదు? నా యొక్క కృప చాలును.”
ఎర్ర సముద్రపు ఆలోచన సమావేశము. అనేక సంవత్సరములకు క్రితము జరిగిన ఇంకొక ఆలోచన సభను గురించి నేను ఒక క్షణము మాట్లాడాలని ఆశపడచున్నాను. ఇప్పుడైతే మనము ప్రవేశించుచున్న క్రిస్మస్ ఋతువులాంటిది అది. అచ్చట ఒక క్రిస్మస్ ఉన్నా ఉండవచ్చును లేదా లేకపోవచ్చును. అయితే పరలోకములో ఈ విమోచన పథకము ఏమిటని ఒక ఆలోచన సభ జరిగెను. మరియు దేవుని ద్వారా అక్కడ నిర్ణయింపబడెను, ఆయన ఒక మానవునిగా మారునని, ఆయనే క్రిందికి దిగి వచ్చి ఆయన ఇచ్చిన శాపమును ఆయన తానే తనపై వేసుకొనుట. ఒక దూతను పంపించుట ఆయనకు అది అంత సముఖతగా లేదు. వేరే ఏ ఇతర వ్యక్తిని పంపించుట ఆయనకు తగదు; ఒకవేళ ఆయనకు గనుక ఒక బాలుడున్నయెడల, ఆయన యొక్క బిడ్డను పంపుట కూడా ఆయనకు తగదు.
నేను చేసిన నేరముల వలన వచ్చిన న్యాయ తీర్పుకు జోసప్ను బాధించుట తగని పని. ఆ విధముగా నేను చేసినయెడల నేను అనీతిమంతుడగుదును. నేను గనుక నా న్యాయతీర్పు నిచ్చి దానిని విమోచింపవలయుననిన, దానికొరకై నేను చేయగలిగిన ఒకే కార్యము నాకు నేనే ఆ బాధను భరించవలెను. అదియే సూచన. అదే సాతానుకు మరణ దెబ్బ.
38
ఇప్పుడు నా యొక్క కథోలిక్కు సహోదరుడు, మరియు అనేక నా ప్రాటెస్టెంటులు, నేను మిమ్ములను భాదించుట లేదు. అయితే మీరు యేసును దేవునికంటే ఒక చిన్న దేవునిగా చేయుటకు ప్రయత్నించుచున్నారు, ఆయనను ఒక చిన్న దేవునిగా చేయుచున్నారు. మీరు ఆయన పాదములను నరికి, దేవుని తలకు క్రిందుగా ఆయనను కొద్దిగా క్రిందికి దింపి మరి ఆయనను చిన్న దేవునిగా చేయుచున్నారు. మీరు చాలా తప్పు చేయుచున్నారు. యేసు ఒక మానవుడు. ఆయన తననుతాను మనుష్యకుమారునిగా పిలుచుకొనెను.
అది దయ్యమునకు ఒక చావు దెబ్బ. దయ్యము గర్వము గలవాడై, మిఖాయేలు కన్నను ఒక అందమైన రాజ్యమును తనకు తానుగా నిర్మించుకొనెను. అతను కుమారుడైన కయీను ఫలములతోను మరియు పలు విధములైన కార్యములతో ఒక అందమైన బలిపీఠమును నిర్మించాలని ఆశి౦చెను.
దేవుడు ఆ విధమైన అందమైన వాటిలో నివసింపడు. అయితే దేవుడు పాపమునకు చావు దెబ్బ తగులునట్లుగా, ఆయన ఎట్లు వచ్చెనో గమనించుడి. ఆయన ఏ విధముగా రావలయునని కోరుకొనెను? పరలోకములో ఒక ఆలోచన సభ జరిగెను. “మీరు ఎట్లు క్రిందికి పోబోవుచున్నారు? తండ్రీ, దానిని మీరెట్లు చేయబోవుచున్నారు,” అని దూతలు అడిగిరి.
నేను వారిలో ఒకనిగా మారబోవుచున్నాను. నా యొక్క విమోచన శాసనము ఏమనగా, “ఒక సమీప బంధువుడు.” మరియు నాకు నేనుగా నేను మానవునిగా కావలయును.“
39
మరి ఆ దెబ్భయే సాతానును పడగొట్టినది. జన్మించుట! కెరూబులతో ఆయన క్రిందికి దిగివచ్చి యుండవచ్చును. ఆయన బంగారు నిచ్చెన ద్వారా క్రిందికి దిగివచ్చి యుండవచ్చును. ఆకాశమంతటా పాటలు పాడుచుండగా ఆయన భూమికి నడచి వచ్చి మరియు సమస్తమును వెళ్లగొట్టి యుండవచ్చును.
అయితే ఆయన ఆలోచన సమావేశమును జరిపినప్పుడు, ఆయన ఒక శిశువుగా వచ్చుటకు నిర్ణయించుకొనెను. యెషయా 9:6లో మనము దానిని కనుగొనుచున్నాము: “ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును: ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మరియు ఆయన యొక్క పరిపాలనకు అంతముండదు.” ఇదియే మీకొక సూచన: ఒక శిశువు [ఒక దేవుడు కాదు] — ఒక శిశువు.
ఆయన ఎక్కడ జన్మించెనో గమనించుడి. ఆయన ఎక్కడ జన్మించవలయునో మరియు నిశ్చయముగా ఆయన మానవునిగా జన్మించవలెనని ఆలోచన సభలో తీర్మానింపబడి యుండవలయును. ఆయన ఒక పశువుల పాకలో జన్మించెను. ఏనుగు దంతపు అంతఃపురములలో నుండి భటులు ఆయనను తీసికొని వచ్చుటకు బదులుగా, దూతవంటి కాపలాదారుడు వుండుటకు బదులుగా, కదలాడుచుండు కెరూబులకు బదులుగా, పరలోకపు అలంకరణలకు బదులుగా, తననుతాను ఒక పశువుల పాక జంతువుల పెంటపై, లోకములోని మాలిన్యము మరియు రోతగా నుండు వాటిపై జన్మించుటకు ఆయన ఎన్నుకొనెను.
40
ఆయన మానవుడు. ఆయన దేవునికంటె తక్కువవాడు కాడు. ఆయన ఒక మానవుడు. మన జన్మవలె, జన్మ యొక్క రోత ద్వారా జన్మించెను. స్త్రీ గర్భము నుండి బయటికి వచ్చెను. ఒక దేవునిగా కాదు; ఒక మానవునిగా వచ్చెను! ఆయన ఏమి లేనివాడు మరియు ఆయన గొప్ప కుమారుడనుటలో ఆశ్చర్యమేమి లేదు!
మీరు కూటములలో వివేచనా సూచనలను, జీవించు దేవుని యొక్క ప్రసన్నతను చూచుచున్నారు. ఆయనను గురించిన సూచనలను మీరు ప్రతి చోట చూచుచున్నారు. అయితే నా సహోదరుడా, నా సహోదరి,, నేను దీనిని మీకు చెప్పనిమ్ము: దూతలు గొర్రెల కాపరులకు చెప్పినటువంటి ఆశ్చర్యకరమైన, వింతైన సూచన వంటిది మరి ఇంకొక సూచన లేదు, “పొత్తి గుడ్డలతో చుట్టబడి యొక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరు.” మరియు దేవుడు ఏమైయున్నాడని మీరు చూడవచ్చును.
41
అదియే అది. ఈ దినమున అది నన్ను ఉలికిపడునట్లుగా చేయుచున్నది. ఒక ఉజ్జీవమనునది పట్టణమునకు వచ్చుచున్నది, ఒక గొప్ప ప్రఖ్యాతి చెందిన సువార్తికుడు మరియు గొప్ప గొప్ప వారచ్చటికి వెళ్ళి, నగర మేయరు మరందరును లేక చక్కగా గొప్ప దుస్తులు ధరించిన వారు అచ్చట నుండి, మరి ఏల బీదవారు హేళనగా చూడబడుచున్నారు? మరియు మీరు గొప్ప చదువుకున్న ఒక సేవకుని గురించి మాటలాడుచుండగా, మీరు అర్థము కూడా చేసుకొనుటకు వీలులేకుండా చదువుకొన్నవారు గ్రహించు మేటియైన పదములను వారు ఉపయోగించుచుండగా మరి మీరందరూ దానిని గొప్పయని చెప్పుచున్నారు.
దేవుడు మానవతలో యున్నాడని మీరు చూచుట లేదా? “ఇది ఒక సూచనగా యుండును. ఒక శిశువు పొత్తి గుడ్డలలో” చుట్టబడి, ఆవులు మరియు గొర్రెల యొక్క పేడపై ఒక తొట్టిలో పండుకొని యుండును. “ ఓ, మై. అది ఒక సూచన. మీకిదియే ఒక అనవాలు. మీరు శిశువును అక్కడ కనుగొనెదరు.”
42
అనేక సమయములలో జనులు తలంచెదరు, ఒక చిన్న చినిగిపోయిన గుడారములో అ, ఆ, ఇలు కూడా సరిగ్గా తెలియని కొందరు ప్రసంగికులు, రౌడీ మూకలలొ నున్నవారు మరియు అక్రమమైన వ్యాపారము చేయుచున్నవారు మరియు సమస్త కార్యములతో యున్న వారు మార్పునొంది, చదువు లేక, మరియు వారి దక్షిణ ప్రాంతపు భాష యొక్క ఉచ్ఛరణతో “అయిపోలేదు,” “తీసుకొనిపో,” “నాటు,” “పడుకోవంటి” పదములను ఉపయోగించెదరు... “మరి మీరు అక్కడ దేవుని కనుగొనలేరు.” అయితే, మరక్కడే మీరు పొత్తి గుడ్డలతో చుట్టబడి, దీనత్వముతో యున్న ఆయనను కనుగొనగలరు.
అది గొప్ప మార్గము ద్వారా వచ్చునని మీరు తలంచెదరు, మీరు గనుక దేవునితో నిజముగా ఆలోచన సమావేశమును కలిగి యుండవలయునని ఆశించిన యెడల, మరి అటువంటి ఒక గుంపు జనుల యొద్దకు వెళ్ళి పిదప దానిని గురించి మాట్లాడు.
ఆయన ఏదో ఒక శిల్సిని, ఒక గొప్ప కళాకారుని మరియు ఇంకొకరినెవరినైనను తీసికొని మరి అతినికి బుద్ధికుశలత ఇవ్వబడియుండుటచే మరి వాటిద్వారా మనము దేవుని యొక్క క్రియను చూడగలమని అనుకుంటాము. అటువంటివారిని ఆయన ఉపయోగింపడు. అయితే ఆయన ఏమిలేని దానినొకదానిని తీసికొనను, మొదటిగా ఆయన ఏ విధముగా క్రిందికి దిగివచ్చెనో ఆయన ఆ విధముగా చేయును.
43
కొంత కాలము క్రితము ఎవరో ఒకరు ఈ విధముగా చెప్పిరి, “ఈ ఆత్మ వివేచనా మరియు, ఈ స్వస్తతా మొదలగునవి దేవుని యొక్క కార్యములైన యెడల కాథలిక్కు మతగురువులు దానిని కలిగియుందురు.” ఏల యూదుల మతాధిపత్యము దానిని కలిగియుండలేదు? అది అంతఃపురములో జన్మించలేదు. అది పశువుల పాకలో జన్మించెను. సూదితో కుట్టిన వస్త్రములు ధరించుటకు అవి ఆయనకు లేకుండెను, అయితే నాగలి పెట్టిన ఎద్దు వీపు పైనయున్న చినిగిపోయిన మురిగి గుడ్డలతో ఆయన చుట్టబడెను. ఎరువు దిబ్బపై పండుకొని యుండెను; దేవుడు నివసించిన గుడారము, దేవుని కుమారుడు ఆ విధముగా నుండెను. మరి ఆ విధముగానే ఆయన వచ్చుటకు తీర్మానించుకొనెను. మరి మనకేమో కాలరు తిరగేసుకొని మరియు ఫ్రాక్నుపోలిన తోకవలె కత్తిరించుకొనియున్న కోటు, మరియు పెద్ద, చక్కని మందిరములు బంగారు శిఖరములు గలవు.
“ఇదియే దానికొక సూచన: మీరు ఆయనను పొత్తి గుడ్డలతో చుట్టబడి యుండుట కనుగొనెదరు, పొత్తి గుడ్డలతో చుట్టబడి మరియు ఒక తొట్టిలో పండుకొని యుండుట చూచెదరు. అది మీకొక సూచనగా యున్నది.” దేవుడు దీనత్వములో యుండును. ఆడంబరములో నుండడు; ఆడంబరము ఎల్లప్పుడును దయ్యము యొక్క ఉపాయము. దేవుడు దీనత్మములోనే వచ్చును. “అది మీకొక సూచనగా యుండును.”
44
దేవునికంటె తక్కువైన వాడు కాడు, చిన్న దేవుడుగా కాదు, అయితే ఒక మనుష్యుడు! ఒక మనుష్యుడు! ఆయన శిశువుగానున్నప్పుడు ఒక చిన్న శిశువువలె ఏడ్చెను. ఆయన ఒక బాలునిగాయున్నప్పుడు ఒక బాలునివలె వీధులలో ఆడుకొనెను. ఒక మనుష్యుడు పని చేయలాగున ఆయన యోసేపుతో వడ్రంగిశాలలో పనిచేసెను. ఆయన ఆకలిగానున్నప్పుడు ఆయన తినెను. ఆయన వేడిలో నున్నప్పుడు ఆయన చెమట కార్చెను. ఆయన దుఃఖముగా నున్నప్పుడు ఏడ్చెను. ఆయన ఒక మనుష్యుడు. “ఇది మీకొక సూచనగా యుండును. దేవుడు మీలో నివాసముండును, ఒక విధేయుడుగా.” ఒక గొప్ప వ్యక్తి కాదు, పెద్ద అంతస్తుగల వ్యక్తిగా కాదు, అయితే ఒక చిన్న స్వల్పముగా ఎవరి అండ లేనివాడుగా ఉండెను, ఒక సూచన.
అక్కడే దయ్యమునకు ఒక మరణ దెబ్బ. మరియు అది ప్రతియొక సంఘ శాఖకు మరియు ఆడంబరమునకు, మరియు గొప్పలకు మరియు ఈ లోకపు వైభవమునకు అది చావు దెబ్బగా యున్నది. పరలోకపు దేవుడు ఆ మార్గమున వచ్చుటకు ఎన్నుకొనినందున అది ఒక మరణ దెబ్బగా యుండెను.
మరి ఆలోచన సభలో అదియే జరిగెను. అక్కడ తీర్మానింపబడి యుండవలయును, మరి ఆ విధముగానే ఆయన వచ్చుటకు ఎన్నుకొనెను. ఆయన ఆ విధముగా రానవసరము లేదు. ఆయన పరలోకపు దేవుడు, అయితే ఆయన ఒక శిశువుగా వచ్చుటకు ఎన్నుకొనెను. ఆయన ఆ విధముగా వచ్చుటకు ఎన్నుకొనెను. పరలోకములో జరిగిన ఆలోచన సభలో అదియే జరిగెను.
45
నేను ఇంకొక లేక రెండు ఆలోచన సమావేశములను పిలువ నిమ్ము. నేను దీనిని పిలువనిమ్ము ఒక సమయముండెను. ముప్పది మూడున్నర సంవత్సరములు ఒక పరిపూర్ణ జీవితమును జీవించిన పిదప, నేను ఏ విధముగా జీవింపవలయునని కోరుకొనుచున్నానో, మీరు ఏ విధముగా జీవింపవలయునని కోరుకొనుచున్నారో మరి ఆ విధముగా జీవింపవలయునని కోరుకొనిన ఒక వ్యక్తి ఆయన ప్రేమించిన సహోదరులకై, ఆయన ప్రేమించిన జనుల కొరకై, ఆయన చూడవలయునని ఇష్టపడిన సూర్యాస్తమయమును, ఏదో ఒక కార్యమున్నది ఆయన జీవించి యుండుటకై గుర్తు౦చుకొనుడి, యేసు ఒక మనుష్యడు. దేవుడు ఆయనలో యుండెను.
ఒక సమయము వచ్చెను. [టేపు పై ఖాళీ.]
గొర్రెపిల్లను నడిపించు ఆత్మ పావురము. గొర్రెపిల్లకును మరియు పావురమునకును ఒక ఆలోచనా సమావేశము కలిగియుండవలసినదాయెను. మరి దానిని నిర్ణయించుటకు వారు ఒక స్థలమును ఏర్పరచిరి. ఆ రాత్రి భోజనము ముగించిన పిదప వారు కెరీతు వాగును దాటి లేక మరి అక్కడెక్కడో, మరియు ఆ వాగును దాటి మరి గెత్సేమనే అని పిలువబడు తోటకు వెళ్ళెను. వారు ఒక ఆలోచన సమావేశమును కలిగియుండెవలసినదాయెను. దేవుడు మరియు క్రీస్తు దానిని గురించి సంభాషణ చేయవలసియుండెను. గొర్రెపిల్ల మరియు పావురము ఒక్కటిగా కూర్చుండవలసినదాయెను. పావురము గొర్రెపిల్లతో సంభాషించవలసి యుండెను. అదేమనగా గొర్రెపిల్ల యొక్క మరణమును గూర్చిఇప్పుడు వారు ఆ బండనొద్ద కూర్చొని యుండగా, ఈ యొక్క ఆలోచన సమావేశమును వినుటకై పరలోకము నుండి సమస్త దూతలును క్రిందికి దిగి వచ్చిరి. ఓ, అక్కడ గబ్రియేలు, మిఖాయేలు, మాచిపత్ర వేలకొలది దూతలందరును ఆ బండ చుట్టూ కూర్చొని యుండిరి.
46
ఆయన తనయొక్క శిష్యులకు చెప్పెను, అలసిపోయుండిరి, వారు అనేకమైన పెద్ద కూటములను కలిగియుండిరి, ఈ ఉదయమున మీరున్నట్లుగానే వారు కూడా అలసిపోయి యుండిరి. అయితే ఆయన అడిగెను, “ నాతో కూడా ఒక గంటయైనను మేలుకొని యుండకూడదా? ఏలయనగా, నేను అక్కడ ఎంతో దూరము వెళ్ళవలసి యున్నది. ఆ ప్రక్కకు వెళ్ళి ఆలోచనా సమావేశము జరుపవలసి యున్నది. నేను ఒంటరిగా వెళ్ళవలయును” మరియు వారు. ఆలోచన సమావేశ సభ ఏర్పాటైనది. మరియు గొర్రెపిల్ల, యౌవ్వనమైనది, ఒక మాధుర్యమైన జీవితము గలది, అటువంటి జీవితమును మరి ఎన్నడూ ఎవ్వరికీ లేదు. ఇకనూ ఉండబోదు, ఆ గొర్రెపిల్ల వంటి జీవితము.
అయితే ఇప్పుడు తండ్రి అడిగెను, “నీవు ఇష్టపడుచున్నావా? నీ యొక్క సహోదరుల యెడల నీవు కలిగియున్న ప్రేమ అపారమైనదా? నీవు జన్మించిన ఆ పాప దుర్గంధ భరితమైన లోకముపై గల నీ ప్రేమ, వారికొరకు నీ జీవమునే పోగొట్టనంతగా నీవు వారిని ప్రేమించుచున్నావా? వారియొక్క స్తానమును నీవు తీసికొని, వారి పాపములను నీవు మోసికొని, కఠినమైన, ఘోర మరణమును కూడా వారి కొరకు మరణించునంతగా నీవు వారిని ప్రేమించు చున్నావా?” నీవు. అయితే ఆయనను తప్పనిచ్చి అటువంటి మరణమును మరణించుటకు సిద్ధముగా ఏదియూ లేదు ఎవరునూ లేరు. ఆయన కనుబొమల నుండి రక్తము కారునంతగా ఆ యొక్క ఆలోచన సమావేశ సభలో అటువంటి ఒక తీర్మానము చేయబడెను. ఆయన అతి ప్రయాసతో నుండెను. లోకము యొక్క పాపములు ఆయనపై నుండెను. మరప్పుడు ఆయన పావురము యొక్క ముఖమును చూచి మరి చెప్పెను, “నా యొక్క చిత్తము కాదు గాని, అయితే నీ యొక్క చిత్తము జరుగును గాక.”
ఓ, ఈ ఉదయమున మనయొక్క హృదయములలో మనము ఆ తీర్మానమును కలిగియుండెదమా? మీ యొక్క ఆ చిన్న మురికి జీవితమును వదిలివేయగలరా? మరియు మీరు ఆయన ముఖము వైపు చూచి మరిట్లు చెప్పుటకు సిద్ధముగా నున్నారా, “నా యొక్క చిత్తము కాదు? నేనొక త్రాగుబోతును, అయితే నేను ఇకనుండి త్రాగను. నేనొక జూదగాడిని; నేను ఇకనుండి త్రాగను. నేను నీచునిగా జీవించుచున్నాను, అయితే నేను ఇకనుండి ఆ విధముగా నుండను. నేను ఒక మోసగాడిని, అయితే నేటినుండి నేను దానిని నిలిపివేసెదను. నేను ఒక అసహ్యమైన వ్యక్తిని. అయితే ఈ ఉదయమున ఈ యొక్క ఆలోచన సభలో నేను మీ ముఖము వైపుకు తిరిగి చూచి, నా మార్గమును సరిచేయుటకై ఎవరైతే చనిపోయిరో ఆయనతో ”నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక!“ అని చెప్పెరో అట్టి యజమానునివలె నేను కూడా ఉండెదను. అది ఒకవేళ నా ఇంటిని నేను పోగొట్టుకొనునట్లుగా చేసినను, నా యొక్క భర్తను, నా యొక్క భార్యను, నా తండ్రిని, నా తల్లిని, నా సహవాసమును, నా సంఘ సభ్యత్వమును, దేనిని నేను పోగొట్టుకొనినను ఫరవాలేదు. ఈ ఉదయమున, ఈ యొక్క ఆలోచన సభలో మీ యొక్క పరిశుద్ధాత్మ నాలో జీవింపవలయునని నేను కోరుకొనుచున్నానని నేను చెప్పుచున్నాను, నీవు నాలో వుండాలని ఆశించుచున్నాను. నా యొక్క చిత్తము కాదు, అయితే మీ చిత్తము మాత్రమే సిద్ధించవలెను. అదియే నా యొక్క తీర్మానము. దేవుడు ఏదో గొప్ప ఎత్తైన వైభవము గల గోపుర శిఖరమును ఒక స్థలమని పిలువ లేదు గాని, అయితే పడిపోవునట్లు౦డు ఒక దీన చిన్న మందిరమును ఆయన పిలుచు చున్నాడు. మనము ఒక ఆలోచన సమావేశ సభను కలిగియున్నాము.
47
ఒక్క క్షణము నేను ఇంకొక ఆలోచన సభను గురించి మాటలాడనివ్వండి. అనేకులకు బోధింపవచ్చును. ఆయన మరణించి, పాతిపెట్టబడి మరియు తిరిగి లేచిన తరువాత ఒక ఆలోచన సమావేశము జరిగెను. ఏదో కార్యము జరుగవలసియుండెను. అచ్చట బుద్దికుశలత గల భావముతో నిండియున్న మనుష్యులుండిరి, కావున అక్కడ ఇంకొక గొప్ప ఆలోచన సమావేశసభ సిద్ధపరచబడెను. పరిశుద్ద గ్రంథములో పెంతెకోస్తు, దానిని గురించి మనమెరుగుదుము. వారు ఒక ఆలోచన సమావేశమును కలిగియుండవలసినదాయెను. మరియు ఏదో కార్యము జరుగవలసి యుండెను, “ఏలయనగా యేసు చెప్పెను, ఇకనుండి ప్రసంగింపవద్దు. ఇక నుండి పాటలు పాడవద్దు. బయటికి వెళ్ళి మరి ఇకనుండి సేవచేయ వద్దు. అయితే నేనొక ఆలోచన సమావేశమును మీతో కోరుచున్నాను. మరియు ఈయొక్క ఆలోచన సభలో నేను పరిశుద్ధాత్మను తీసికొని రాబోవుచున్నాను. అయితే యెరూషలేము నగరమునకు మీరు వెళ్ళి మరి నేను తిరిగి వచ్చు వరకు మీరు అక్కడ కాచుకొని యుండుడి. వారక్కడ ఆనందముగా నుండునట్లుగా నేను పరలోకమునకు పోవలయును. మరియు సర్వోన్నతుని యొక్క సింహాసనము యొద్దకు నేను ఎక్కి వెళ్ళవలసి యున్నది” యేసు శరీరము, “అయితే నేను పోవుచున్నాను. పైన అక్కడ మేమక్కడ ఒక ఆలోచన సమావేశమును కలిగియుండబోవుచున్నాము. మరియు నాలో నివసించు దేవుడు నేను మీలో నుండులాగున నేను మరల తిరిగి వెళ్ల వచ్చునని వాగ్దానము చేసియున్నాడు. నేను మీలో ఉంటాను, మీతో ఉంటాను, మీలో, యుగ సమాప్తి వరుకు మీలో ఉంటాను. సమస్తమును ముగియు వరకు, నేను మీతో కూడా నుండెదను. మరియు నేను చేయు క్రియలు మీరు కూడా చేసెదరు
కావున దీనిని వారు ఏ విధముగా చేయగలరో వారికి తెలియలేదు, కావున వారు పెంతెకోస్తుకు వెళ్లి, మరియు నూట-ఇరువది మంది మేడపైనున్న గదిలోనికి వెళ్ళి మరి తలుపులను మూసికొనిరి, మరియు వారు కాచుకొనియుండిరి, మరియు వారు కనిపెట్టుకొని యుండిరి.
48
మనతోయున్న చిక్కేమిటనగా, దేవుడు గనుక మనతో పది నిమిషములలో మాటలాడకున్న యెడల, మనము అలసిపోయెదము, మన మోకాళ్ళు నొప్పి పుట్టుటను. మనము విడిచి వదిలివేయాలనుకుంటాము. మనము కోరు విధముగా, మనము తలంపుల కనుగుణముగా ఆయన గనుక మనకు బదులియ్యని యెడల మనము ఆయనపై విసుగు నొందెదము.
“ఓ, రమ్ము మనము దానిన గురించి ఒక్కటిగా కలిసి పరిష్కరించుకొనెదము.” “పెంతెకోస్తునకు వెళ్ళుడి. నేను మీతో ఆలోచించుటకు కోరుచున్నాను. మీరు అచ్చటికి పైకి వెళ్ళి మరి కాచుకొని యుండుడి.” పది దినములు, వారు కూర్చొని, నిలుచుకొని ప్రార్థించుచు, మరి తక్కిన ఇతర కార్యములను చేయుచు వాగ్దానము కొరకు కాచుకొని యుండిరి.
మరి ఆకస్మాత్తుగా, పరలోకములో జరిగిన ఆలోచన సభ యొక్క ఫలితములు క్రిందికి దిగెను — పరిశుద్ధాత్మ — వేగముగా వీచు గాలివంటి ధ్వనితో దిగి మరది వారు కూర్చొనియున్న ఇంటినంతటిని నింపెను. వారు పరిశుద్ధాత్మతో నింపబడిరి. మరి వారు పిదప వాక్యమును ప్రసంగించుచు ముందుకు సాగిరి.
49
మనము ప్రపంచ ఆలోచన సభలను జరుపుచున్నప్పుడు, మామూలుగా వారు ఒక ఎన్నుకొను స్థలమును దానిని జరుపుటకు కలిగియుండెదరు. మరియు వారు ఈ ఆలోచనా సభలో ఏమి చేసెదరు? వారు మద్యమును, మత్తును కలిగించువాటిని త్రాగెదరు. మరియు వారు పొగ చుట్టలను, సిగరెట్లను పీల్చెదరు. వారు ఒకరికొకరు అబద్దములాడుకొనుచు మరియు ఒకరినొకరు మోసగించుకొందురు, మరియు ప్రపంచపు శాంతి యొక్క సంభాషణలివి.
అయితే దేవుడు ఒక ఆలోచనా సభను ఏర్పాటు చేసినప్పుడు, అది ఉపవాసము,శుద్దీకరించుకొనుట, ప్రార్థన, ఆజ్ఞలు గైకొనుట, మరియు ముందుకు కొనిసాగిపోవుట. అదియే దేవుని యొక్క ఆలోచన సభగా యున్నది. మీరు దేవుడిని సంధించుటకు వెళ్ళినప్పుడు విందారగించుట కాదు గాని, అయితే ఉపవాసము, అసహ్యమైన కార్యములలో ను౦డుట కాదు గాని; అయితే నీచమైన కార్యములలో లోనైపోవుట కాదు గాని, అయితే ప్రత్యేకపరచుకొని, ప్రతీ అవినీతి కార్యముల నుండి నిన్నునీవు శుద్దీకరించుకోవలెను. హిస్సోపుతో రక్తమును మీ హృ దయమున పూసుకొనుట వలన, విశ్వాసముతో నిన్ను నీవు శుద్దీకరించుకొని, మరి ఒక ఆలోచన సభ కొరకై దేవుని యొద్దకు నడువుడి. మీరు దేవునిని సంధించునప్పుడు ఒక విధమగు ఆలోచనా సభను నీవు కలిగియుందువు, పిదప దేవుడు మీకు ఆజ్ఞలు ఇచ్చును. అప్పుడు మీరు ముందుకు కొనసాగిపోవుడి; ఆయన మీతో కూడా వచ్చును.
50
మనము తలంచి చూడగల అనేకమైన ఆలోచన సభలున్నవి. అయితే మనకు సమయము చాలదు.
సమీపముగా ఒక ఆలోచన సభ జరిగెను. మార్టిన్ లూథరు దినములలో సంస్కరణల కాలమందు అక్కడ ఒక ఆలోచన సభ జరిగెను. నీతి మత్మమును గురించి ప్రసంగించుటకు దేవుడు మార్టిన్ లూథరును పిలిచెను, మరి అతను దానిని చేసెను. వెస్లీ దినములలో ఇంగ్లాండు దేశములో శుద్దీకరణను గురించి ప్రసంగించుటకు అక్కడ ఒక ఆలోచన సభ జరిగెను. మరి వెస్లీ సాక్ష్యమిచ్చెను....
ఆయన ధరించిన చివరి కోటును ఒక అంగీని నేను ధరించితిని. ప్రతి ఉదయము ఐదు గంటలకు పదునైదు వందల మందికి ఆయన ఎక్కడ ప్రసంగించియున్నాడో మరి అతని ప్రసంగ వేదికపై నేను నిలుచుకొంటిని. ఆయన చనిపోయిన అదే గదిలోనే నేను మోకరించి మరి అతని జీవితము కొరకై దేవునికి స్తోత్రములు చెల్లించితిని. అక్కడ ఆత్మనాపై వచ్చినప్పుడు, “అవును, వెస్లీ సత్యమైనవాడే” అని నేను తలంచాను.
దేవుని యొక్క పరిశుద్ద దూతలు మరియు దేవుడు ఒక ఆలోచన సభను ఏర్పరచిరి. శుద్దీకరణను గురించి ప్రసంగించుటకు సమయముగా నుండెను గనుక మరి వారు వెస్లీని ఎన్నుకొనిరి. మరి అతను దానికి సత్యముగా నుండెను.
పిదప, అటు తరువాత పెంతెకోస్తు వచ్చెను. అది పెంతెకోస్తు తిరిగి పూర్వస్థితికి వచ్చుటకైన సమయమది. పరలోకములో ఒక ఆలోచన సభ జరిగెను: “ఆత్మ సంపూర్ణముగా కుమ్మరింప బడవలసిన సమయము ఇది.” మరది నింపబడెను. మరి వారు దానిని ప్రసంగించిరి. మరియు మనము దానిని పొందియున్నాము మరి పరిశుద్ధాత్మను గైకొనియున్నాము.
51
ఇప్పుడు మనము ఇంకొక ఆలోచన సభలో యున్నామని నేను నమ్ముచున్నాను, అది, దేవుని కుమారుని యొక్క రాకడ. ఆయన తన శిష్యులకు చెప్పెను, “నాకు ఆ నిమిషమును లేక ఆ ఘడియ గాని తెలియడు. ఎవరికి తెలియదు, దూతలకు కూడా తెలియదు. అయితే ఒకనొక రోజు ఒక ఆలోచన సభ జరుగును,” ఇంకొక విధముగా చెప్పవలయుననిన, “నేను మరల వచ్చు ఆ క్షణమును తండ్రి నిర్ణయించును.” ఆ యొక్క ఆలోచన సభ కొనసాగింపబడుచున్నదని నేను నమ్ముచున్నాను. తీర్మానములు చేయబడుచున్నవి. ఆయన ఆత్మ భూమికి వచ్చుచున్నది, అది చాలా బలముగా నుండును ఎంతగా అనగా అది సంఘములో నిలబడి మనస్సులోనున్న తలంపులను వివేచించును. పరిశుద్ద గ్రంథము చెప్పు విధముగా, “దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్ళను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.”
ఫిలిప్పు వచ్చి మారుమనస్సు పొందిన తరువాత మరి వెళ్ళి నతనయేలును సంధించెను. మరి నతనయేలు ఒక యూదుడు, యేసునొద్దకు అతడు తీసికొని రాబడెను. మరియు ఫిలిప్పు అతనికి యేసును గురించి చెప్పుచునుండెను, చెప్పెను, “మంచిది, అంతెందుకు నతనయేలు, కొద్ది దినములకు క్రితము ఒక ముసలివాడైన పామరుడైన జాలరి ఆయన యొద్దకు పచ్చెను మరి ఆయన అతనిని ఎరిగియుండెను. ఆయన అతడిని అతని పేరుతో పిలిచెను, అతను ఎవరైనది అతనికి చెప్పెను. నీకు తెలియదా మన ప్రవక్త ఆ మెస్సీయా వచ్చునని చెప్పెను కదా, ఆ మెస్సీయా ఒక ప్రవక్తగా నుండునని, ఒక దేవునిగా - ప్రవక్తగా నుండునని నీవు గ్రహించుట లేదా? ఆయనే అది. అది ఆయనే.”
నతనయేలు తప్పకుండా ఈ విధముగా చెప్పి యుండవలయును, “నేను దానిని నమ్మను. నాకు నేనే స్వయముగా వెళ్ళి చూచెదను.”
అయితే అతను యేసు యొక్క సన్నిధికి నడచి వెళ్ళినప్పుడు, యేసు చెప్పెను, “ఇదిగో ఏ కపటము లేని ఇశ్రాయేలీయుడు.”
మరియు ఆయన దానిని చేసినప్పుడు, అతను అడిగెను, రబ్బీ, “నన్ను ఏలాగు ఎరుగుదువు?”
చెప్పెను, “ఫిలిప్పు నీవు పిలువక మునుపే, నీవు చెట్టు క్రింద నున్నప్పుడే, నేను నిన్ను చూచితిని.”
ఫిలిప్పు చెప్పెను, “నీవు దేవుని కుమారుడవు. నీవు ఇశ్రాయేలు రాజువు.”
52
ఐదు భర్తలను కలిగిన సమరయ స్త్రీ ఆయన యొద్దకు వచ్చినప్పుడు, మరియు ఆమె చెప్పెను.... ఆమె తనకు నీళ్ళు చేదుకొనుచుండగా, ఆమె ఈ యూదుడు కూర్చొనియుండుట చూచెను. “నాకు దాహమున కిమ్ము” అని ఆయన అడిగెను.
గమనించండి, ఆయన ఒక మనుష్యునివలె దాహము గొనెను. ఆయన ఒక మానవుడు. ఆయన తన శరీరములో ఆయన ఒక మానవుడై యుండెను. ఆత్మలో ఆయన దేవుడై యుండెను. “దేవుడు క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనెను.”
“నాకు దాహమునకిమ్ము” అని ఆయన అడిగెను
ఆమె చెప్పెను, “ఏమిటి, ఇది పద్దతి కాదు.” మరో మాటలో చెప్పాలంటే, “మేము వేరుపరచబడినవారము. యూదులు మాతో సాంగత్యము చేయరు. దానిని నాయొద్ద అడుగకూడదు.”
ఆయన చెప్పెను, “అయితే నీవు ఎవరితో మాటలాడుచున్నావో నీవు గనుక ఎరిగియున్నట్లైతే నివే నన్ను దాహము నిమ్మని అడిగెదవు”
ఓ, నేను ఈ ఉదయమున ఆశ్చర్యపడుచున్నాను, మనము గనుక ఈ గదిలో ఏమున్నదని ఎరిగియున్న యెడల, న్యాయతీర్పు దినమున మనకొరకు గాను లేక మనకు విరోధముగా సాక్ష్యము చెప్పు ఆ పరిశుద్ధాత్మ ఆయనే, ఇప్పుడు ఈ గదిలో యున్నాడని మరియు మన తలంపులను ఎరిగియున్నాడు.
“నీతో మాటలాడుచున్న ఆయన ఎవరని నీవు గనుక ఎరిగియున్నట్లైతే, నీవే నన్నుదాహము నిమ్మని అడిగెదవు.”
ఆమె చెప్పెను, “బావి చాలా లోతైనది.”
ఆమె యొక్క ఆత్మను పట్టుకొనువరకు ఆయన ఆమెతో మాటలు కొనసాగించుచుండెను. మరియు ఆయన చెప్పెను, “నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని యిక్కడికి రమ్ము.”
ఆమె చెప్పెను, “నాకు పెనిమిటి లేడు.”
“నీవు చెప్పినది సరియే; నీకు ఐదుగురు పెనిమిట్లు౦డిరి; ఇప్పుడు ఉన్న వాడు నీ పెనిమిటి కాడు” అని చెప్పెను.
ఆమె చెప్పెను, “అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఇప్పుడు మెస్సీయా వచ్చునప్పుడు, ఆయన ఈ కార్యములన్నియును చేయునని మాకు తెలియును. అయితే నీవెవరవు?”
యేసు చెప్పెను, “నేనే ఆయనను.” ఓ, మై! “నీతో మాటలాడుచున్నవాడు నేనే ఆయనను.” పరలోకము నుండి అలంకరణలతో రాక, ఒక సామాన్యమైన వ్యక్తిగా వచ్చి దాహమునకై నీళ్ళీమ్మని అడుగుచున్నాడు. అక్కడ ఒక ధవళ సింహాసనము లేదు, అయితే ఒక మనుష్యుడుగా యుండెను. ఆయన యొక్క దాహమును తీర్చుకొనుటకై దాహమునకిమ్మని నీటిని అడుగుచున్నాడు! “నీతో మాటలాడుచున్న ఆయనను నేనే.”
మరియు ఆమె ఊరిలోనికి వెళ్ళి మరి చెప్పెను, “మీరు వచ్చి నేను చేసినవన్నియును నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. ఇది మెస్సీయా యొక్క సూచన కాదా? ఇతను ఆయన కాడా?”
53
పాత నిబంధనలో యున్న ప్రవక్తలతో ప్రవచించిన అదే యొకరు. చెప్పిరి, “అప్పుడు వారందరూ సంఘములో చేరి మరి సంఘమునకు వెళ్ళి మరియు మంచి, చక్కటి జనులుగా యుండునటు వంటి ఒక దినము వచ్చును. మరియు వారు సంఘ సంస్థలను మరి మొదలగు వాటిని కలిగియుండెదరు. అది వెలుగు కాదు, చీకటి కాదు, అస్తమయ కాలమున కొద్ది వెలుగుయుండు ఒక దినముగా అది యుండును, అయితే సాయంకాలపు సమయమున అది వెలుతురును కలిగియుండును.”
ఆ ప్రవచనములు నెరవేరవలయును. మీకు గుర్తున్నదా, గత రాత్రి మనము ధ్యానించిన పరలోకములో మన ఆలోచన సభ? దేవుడు దేవదూతలందరిని సమావేశపరచెను, ప్రవక్త యొక్క మాట ఎవరి ద్వారా నెరవేరునట్లుగా ఆయన చేయుటకై ఏలీయాను బయటికి తీసికొని వచ్చును. లేక నేను అహాబును చెప్పుచున్నాను, అహోబును చంపుటకై,
ఇప్పుడు, పరలోకములో ఒక ఆలోచన సభ జరుగుచున్నది. సాయంకాలపు వెలుగు కాంతులు ఇచ్చట నున్నది. అణుబాంబులు మరి ఆ విధమైనవి ప్రతి చోటా వ్రేలాడుచున్నవి, మరియు మనము చివరి కాలమున యున్నాము. ప్రపంచ ఆలోచన సభలు ముగింపునకు వచ్చియున్నవి. దేవుని యొక్క ఆలోచన సభ సమయము వచ్చుచున్నది. అన్యజనులకు ఈ యొక్క వాక్యములు తప్పక నెరవేరవలసి యున్నది: “నేను చేయు క్రియలు మీరు కూడా చేసెదరు.” ఆ సమయమిప్పుడిక్కడ యున్నది. ఆలోచన సభ జరిగియున్నది. ఆత్మ ఇక్కడ యున్నది.
54
ఇప్పుడు, ముగించు ఈ సమయములో స్నేహితుడా, దీనిని నేను చెప్పుచున్నాను. ఈ ఉదయమున మీరు ఒక ఆలోచన సమావేశమున యున్నారు. మీరున్నారు. మరియు మీ యొక్క వ్యాజ్యమును మీ పక్షమున వాదించుటకు సిద్ధముగానున్నది. మీ మీ వ్యాధి యొక్క వ్యాజ్యము, దయగల దేవునికి మునుపు మీ పక్షమున వాదించుటకు సిద్ధముగా నున్నది. దయగల దేవునికి ముందు మీ పాపము యొక్క వ్యాజ్యము వాదించుటకు సిద్ధముగా నున్నది, మరియు మీరు దానిని అంగీకరించులాగున మీరు నిశ్చయముగా కలిగియుండుడి.
నేను మీకు చెప్పనిమ్ము ఎన్నడూ ఏర్పాటు చేయబడునటువంటి ఆఖరి ఆలోచనా సభను గురించి నేను మాటలాడబోవుచున్నాను. దేవుడు దయగల వాడుగా నుండును గాక. అక్కడ ఒకే ఒక కార్యము మాత్రము నుండును, సమాధానపరచబడుట: అదియే న్యాయతీర్పు. మరియు మీరు సమాధానపరచబడు ఒకే ఒక కార్యము ఏమనగా మీరు యేసుక్రీస్తు యొక్క రక్తమును మీ యొక్క క్షమాపణగా అంగీకరించి మరి ఆయన యొక్క ఆత్మతో నింపబడినప్పుడే.
ప్రతియొక పురుషుడును, ప్రతియొక్క స్త్రీయును, ప్రతియొక్క బిడ్డయును సంధించు ఒక ఆలోచన సభ జరుగనైయున్నది. ఆ ఆలోచన సభ ఏర్పాటు చేయుటకై ఎంపిక చేయబడు ఒక స్థలమొకటి యున్నది మరియు ఒక గొప్ప ధవళ సింహాసనపు న్యాయతీర్పు జరుగును. ఆయన యొక్క ప్రవక్తలు లోనికి తొంగి చూచుటకు దేవుడు అనుమతించియున్నాడు, మరియు చెప్పెను, “గ్రంథములు తెరువబడి యున్నవి, మరియు ఇంకొక గ్రంథము, ఇది జీవగ్రంథము. కోట్లకొలది పరిచారకులు మరియు దూతలు ఆయనకు పరిచారము చేసిరి.” పిదప వ్రాయబడియున్నది, “మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే, భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు?”
ఆ యొక్క ఆలోచన సభలో మీ యొక్క స్థితి ఏలాగుండును? మీ జీవితములో మీరు అనేకమైన కార్యములను దాటిపోయి యుండవచ్చును. ఈ యొక్క తలుపుల ద్వారా బయటికి నడచి వెళ్ళి పోవునప్పుడు ఈ ఉదయమున మీరు దీనిని దాటిపోవచ్చును. అయితే, నా స్నేహితుడా, దానిని మీరు దాటిపోలేరు. మీరు అక్కడ యుండబోవుచున్నారు. “ఎందుకనగా, మనుష్యుడు ఒక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను. అటు పిదప తీర్పు జరుగును.” మనమందరమూ కలిసి అచ్చట నిలబడు ఒక గొప్ప ఆలోచన సభ యుండబోవుచున్నది. మరియు ఈ ఉదయమున మనము జరిపిన ఈ భూమిలో జరిగిన ఈ ఆలోచన సభను గురించి మనము లెక్క చెప్పవలసినవారమై యున్నాము.
55
మీరు గనుక పాపియైన యెడల, మీ తలలు వంచియుండగా, మనము ప్రార్థించుచుండగా ఆయన యొక్క కృపను అంగీకరించుడి. మనము ప్రార్ధి౦చుటకు ముందు ఈ ఆలోచన సభలో కూర్చొని, మీరు మీ తలలు వంచియుండగా, పరిశుద్ధాత్మ, “నీవు అపరాధివి,” అని మీతో చెప్పకుండా ఉండునాయని నేను ఈ ఉదయమున ఆశ్చర్యపడుచున్నాను.
మరియు మీరు ఒకవేళ “పరిశుద్ధాత్మ మీరు చూడుడి, ఇది ఈ విధముగా నున్నది.” మరి దానినే మోషే ఎర్ర సముద్రపు ఆలోచన సభయొద్ద చెప్పెను. “ఇది ఈ విధముగా నున్నది ప్రభువా, నేను ఇంతవరకు వచ్చితిని, అయితే నేను ఇక మీదట ముందుకు కొనసాగిపోలేను. నా యొక్క మార్గమున ఏదో కార్యమున్నది.” మీ మార్గమున ఏదైనను యుండవచ్చును. అయితే, గర్తు౦చుకొనుడి, దేవుడు మోషేతో చెప్పెను, “వెళ్ళు, ఇశ్రాయేలు బిడ్డలతో మాటలాడుము, మరి ముందుకు సాగిపొమ్ము.”
ప్రార్థనలో జ్ఞాపకము నుంచు కొనవలయునని కోరువారు మీ చేతులను పైకెత్తి మరి, “నా కొరకు ప్రార్థించుము సహోదరుడా,” యని చెప్పగలరా. దేవుడు మిమ్ములను ఆశీర్వదించును. మై! భవనమంతా డజన్లకొలది చేతులు.
56
పరలోకపు తండ్రీ, ప్రసంగించుట వలన క్షీణించిపోయిన లేక బ్రద్దలైన ఈ స్వరములో ఏ విధముగానైనను, ఆ గొప్ప పరిశుద్ధాత్మ జనుల కొరకు ఇవ్వవలసిన తలంపులను, ఆలోచనలను ఇచ్చియున్నాడు. “రండి, మన వివాదము తీర్చుకొందము, ప్రభువు సెలవిచ్చుచున్నాడు,” యని ప్రవక్త చెప్పినప్పుడు. “ఇప్పుడు రండి, మనము కూర్చున్న చోటనే ఒకరితో యొకరు ఆలోచన సభను ఏర్పాటు చేసుకొనెదము. నేను మీకు ప్రక్కనే ఇక్కడ కూర్చొనియున్నాను. నేను మీతో మాటలాడుచున్నాను.”
“అయితే, ప్రభువా, నేను పాపము చేసియున్నాను,” యని పాపి చెప్పుచున్నాడు. “నేను అనేకములు చేసియున్నాను. నేను మీరు నన్ను మన్నించెదరని నేను నమ్ముట లేదు, ప్రభువా, నేనొక త్రాగుబోతును. నేనొక వ్యభిచారిని. నేను ఓ, ఒక నీచమైన వ్యక్తిని. నాకు మరల ఒక అవకాశమున్నదని నేను నమ్ముట లేదు ప్రభువా.”
అప్పుడు మనము మధురమైన ఆ మాటలు తిరిగి వచ్చుటను వినుచున్నాము, “మీ పాపములు రక్తమువలె ఎర్రనివైనను అవి హిమమువలె తెల్లనివగును, అవి కెంపువలె ఎర్రనివైనను (బిడ్డలు పుట్టక మునుపే అనేకమంది చిన్న శిశువుల ప్రాణములు తీయుట మరి అటువంటి ఘోరమైన కార్యములు); అవి కెంపువలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చువలె తెల్లనివగును.” ఎటువంటి దయ! “ఇప్పుడు దేవుడు చెప్పుచున్నాడు, మనము ఒక్కటిగా వివాదించుకొనెదము.”
57
మనము వచ్చి, ఈ ఆలోచన సమావేశమును జరిపెదము, ప్రభువా! మరియు నీవు, నీ యొక్క జనులతో మాటలాడుచున్నావు. వారు వారి చేతులను పైకెత్తి యున్నారు, నీవు వారి ప్రక్కన యున్నావని అది చూపించుచున్నది. ఏలయనగా లేఖనములలో వ్రాయబడియున్నది, “నా తండ్రీ ఆకర్షింపని యెడల ఎవరును నాయొద్దకు రాలేరు. మరియు తండ్రి నాకు అనుగ్రహించిన వారందరును నాయొద్దకు వచ్చెదరు. మరి నేను వారికి నిత్యజీవమును అనుగ్రహించెదను మరియు చివరి దినమున వారిని లేపెదను.” ప్రభువా, ఎవరైతే చేతులను పైకెత్తిరో వారొక్కక్కరి మీదను, ఎవరైతే చేతులను పైకెత్తలేదో, ఇప్పుడు ఈ భవనములో జనములతోను మీ యొక్క చిన్న వ్యక్తిగత ఆలోచన సమావేశము ఎక్కడెక్కడ జరుగుచున్నదో వారు మీ యొక్క కృపా క్షమాపణను అంగీకరించుకొని మరియు మీ యొక్క ఆత్మ ద్వారా నింపబడి, మీ యొక్క రక్తము ద్వారా కడుగబడుదురు గాక! ఇప్పుడు దానిని అనుగ్రహించుము. మరియు మార్గము అంతమున మీరు, “భళా, నమ్మకమైన మంచి దాసుడా నీవు బాగుగా చేసితివి. ఆ ఉదయమున ఎనిమిదవ పెన్ వీధిలో నీవు నమ్మకముగా నుంటివి, ఇప్పుడు జగత్తుకు పునాది వేయబడినప్పుటి నుండి మీకొరకు సిద్ధపరచబడిన ప్రభువు యొక్క ఆనందములోనికి ప్రవేశింపుము,” యని దేవా చెప్పెదవు గాక!
ప్రభువా, నా దేవా, మరియు నా తండ్రీ, వారిని మీకు సమర్పించుచున్నాను. నేను వేరేమియును చేయలేను. నేను కేవలము మీ యొక్క ప్రసంగికుడిని, మరియు దీనికంటె ఎక్కువగా నేనేమియును చేయలేను. వారు మీవారు. వారి హృదయములోనున్న వారియొక్క అక్కరలను బట్టి మరి వారితో వ్యవహరింపుము తండ్రి. మేము వారిని అనుమతించుచున్నాము. లేక మీ కుమారుడైన యేసుక్రీస్తు నామముమలో వారిని మీకు సమర్పించుచున్నాము. ఆమేన్.
58
మీరు గనుక గుడారములో ఎప్పుడైనను నన్ను గమనించియున్న యెడల, జనులు వెళ్లి మరియు బలిపీఠము యొద్దకు రమ్మని ప్రజలను లాగుటకు నేను అనుమతించుట లేదు. నేను దానిని నమ్మను. దేవుడు గనుక మిమ్ములను తీసికొని రానియెడల, వేరెవరో వచ్చి దానిని చేసినాగాని అది మీకు ఏ మేలు చేయదు. “నా తండ్రి ఎవరిని ఆకర్షింపనియెడల ఏ వ్యక్తియును నా యొద్దకు రాలేడు. మరియు అందరును తండ్రి.” మరియు తండ్రి మిమ్ములను ఆకర్షించి యున్నాడు ఏలయనగా, మీ యొక్క పేరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో నున్నది. మరియు “ ఆయన నాకు అనుగ్రహించిన వారందరును నాయొద్దకు వచ్చెదరు.” మీరు ఒకవేళ మీ కుర్చీలో కూర్చొనియున్నను, బలిపీఠము యొద్దనున్నను, మీరెక్కడున్నను, మీరు వచ్చెదరు. అది ఖచ్చితముగా వాస్తవమైన విషయము. యేసు ఆ విధముగా చెప్పియున్నాడు.
కావున, ఇప్పుడు మీ చేతులను పైకెత్తిన ప్రియమైన జనులారా, మీరు చేయవలసిన తదుపరి కార్యము, మీరు గనుక బాప్తిస్మము తీసికొనని యెడల, మీ పాపక్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలయును. అది వైద్యుని యొక్క ముందు చీటి, రాజ్యమునకు తాళపు చెవులు కలిగియున్న డాక్టరు సీమోను పేతురు, మరియు మీరు ఏ విధముగా ప్రవేశింపవలయునో చెప్పును.
పెంతెకోస్తు దినమున, “రక్షింపబడుటకు మేమేమి చేయవలయును?” అని వారు అడిగిరి.
అతను చెప్పెను, “మీలో ప్రతియొక్కరును మారు మనస్సు పొందుడి (మీరు ఇప్పుడు చేసినది దానినే.) దీనిని నమ్ముచున్నారనియు, ఆయన మీ పాపములను తీసివేసి యున్నాడనియు, లోకమునకును మరియు జనులకును చూపించునట్లుగా మీరు ”యేసుక్రీస్తు నామమున మీ పాపక్షమాపణ కొరకు బాప్తిస్మము పొందవలయును.“ ”అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందెదరు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిచిన వారికందరికిని చెందును.“
59
ఈ యొక్క ఉపదేశములను వెంబడించుడి. ఒకవేళ ఈ యొక్క గుడారములో కాకుండ పోయినను, మీరు వెళ్ళే ఏ మందిరమైనను, మీరు వెళ్ళే ఏ ఆలయమైనసు, అదెక్కడైనను. బయట యుండకుడి. ఆత్మ సంబంధమైన విశ్వాసుల శరీరములోనికి శీఘ్రముగా ప్రవేశించుడి. అసెంబ్లీస్-అఫ్-గాడ్, చర్చి-అఫ్-గాడ్, పెంతెకోస్తు ఏకత్వము, పెంతెకోస్తు దిత్వము, త్రిత్వము అదేమైనను పోవుడి, మీరెక్కడికి వెళ్ళినా నేను లెక్క చేయను. అయితే త్వరగా ఒక సంఘమునకు వెళ్ళుడి. మీ యొక్క సహవాసమును అచ్చట నుంచుడి.
బహుశా వారు చిన్న విషయములను బోధించిన యెడల, ఒకవేళ మీరు వాటిని చేయకుండని యెడల... “సరి, సహోదరుడు బ్రెన్హాం ఆ విధముగా బోధింపవలదు,” అని చెప్పవద్దు. మంచిది, ఏ విధమైన భేదమును, ఏమైనను చేయకుము. నీవు గనుక పరిశుద్ధాత్మను పొందియున్న యెడల సాగిపొమ్ము వారితో కూడా నుండుము. ముందుకు త్రోసుకొని పొమ్ము మన మందరమును ఏలాగైనను ఒకదానికి వచ్చేదము.
సొలోమోను యొక్క ఆలయము కట్టునప్పుడు ఆ పలు విధములైన రాళ్ళు, ప్రపంచము చుట్టునున్న రాళ్ళు, వినోదముగా కనిపించు రాళ్ళు మరియు సమస్తమును చెక్కబడెను. అయితే అవి వాటిన్నింటిని ఒక్కటిగా చేర్చినప్పుడు సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని యెంత మాత్రమును వినబడలేదు. ఆ ఆలయమును కట్టునప్పుడు, నలుబది సంవత్సరములలో ఏనాడు సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని యెంత మాత్రమును వినబడలేదు. అవన్నియును సరిగ్గా చెక్కబడెను.
ఎత్తబడుటకై పరిశుద్ధాత్మను కలిగిన ఈ యొక్క గొప్ప సంఘములన్నియును ఆ దినమున వారియొక్క నిర్ణయ స్థలమునకు క్రీస్తు శరీరములోనికి క్రమముగా కదిలిపోవును. కావున, ఎక్కడైతే వారు సువార్తను నమ్మెదరో అచ్చటికి వెళ్ళుము.
60
ఇప్పుడు, నా యొక్క అమూల్యమైన స్నేహితులారా, నేను మీ యొక్క ఎక్కువ సమయమును తీసికొని యున్నానని నాకు తెలియదు. నేను ఏ సమయమున వచ్చినానని నాకు తెలియదు. అది తొమ్మిదిన్నర లేక పది గంటలు లేక వేరేమైననా? పది గంటలు. నాకు తెలియలేదు. నిజముగా అంతసేపైనదా? దానిని నావలన నమ్ముటకు వీలు కాకున్నది.
వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించుటకు మాత్రము మనకు సమయము కలదు. వారికి దానిని మనము వాగ్దానము చేసియున్నాము. మీరు గనుక నాకు పదిహేను నిమిషములు మాత్రము ఇచ్చినయెడల, ఇప్పటినుండి పదిహేను నిమిషములు, కావున నా యొక్క గడియారము ప్రకారము మనము ఆ పదిహేను నిమిషములను తీసికొనెదము.
61
వినండి. ఇక ఏదియూ ఉండదు. మీరు వ్యాధిగానున్న యెడల మీరు చేయు మొదటి పని మీరు మీ యొక్క వైద్యుని యొద్దకు వెళ్ళేదరు. అతను చేయగలిగినదంతా చేయును. అతను గనుక ఒక ఏమియూ చేయుటకు వీలు కానియెడల, అటు పిదప మీరు ఒక పెద్ద ప్రత్యేకమైన వైద్యుని యొద్దకు వెళ్ళుటకు మీకు హక్కు గలదు. ఇప్పుడు మనము వైద్యులకు విరోధముగా లేము. నా యొక్క బాల్య-స్నేహితులుగా, మంచి వ్యక్తులు దేవుని విశ్వసించు వారు అనేకులు ఉన్నారు వారిని నేను నా అమూల్యమైన స్నేహితులుగా కలిగియున్నాను. మరియు నేను వారి కొరకు ప్రార్థించెదను, మరి వారు నా కొరకు ప్రార్థన కూడా చేసెదరు. అది నిజము.
వారు ఇక ఏమియూ చేయలేని ఒక వ్యాధిగ్రస్తుని కలిగి యుండెదరు. వారు చాలా మంచి వైద్యులు, నేను వారి పేరు చెప్పను. ఒకవేళ వారు పరిశుద్ధాత్మ మరి మొదలగు కార్యములతో నింపబడక యుండవచ్చును, అయితే వారు చాలా మంచి వ్యక్తులు. వారు చెప్పెదరు, “సహోదరుడా బ్రెన్హాం, ఆ వ్యాధిగ్రస్తుని విషయములో నేనేమియు చేయలేక యున్నాను; నీవు గనుక దానిని తీసికొనిన యెడల,”
నేను చెప్పెదను, “వారిని పంపించండి. నేను దానిని ఏమి చేయలేను. నేను దానిని యేసుకు అనుమతించి, యేసుక్రీస్తుకు దానిని అప్పగించెదను, ఆయన దానిని చేయనిమ్ము,” చూశారా. కావున అది చాలా బాగున్నది.
62
అయితే, గమనించుడి. ఎక్కడైనను స్వస్థత జరిగినయెడల దానిని చేయునది క్రీస్తు ఒక్కడే వైద్యుడు ఒక అడ్డును తొలగింపగలడు, ఒక పల్లును లాగావచ్చును లేక ఒక స్థలములో కోయవచ్చును, ఉపాంగమును బయటికి తీయవచ్చును, ఒక కేన్సరును కోయవచ్చును, పులిపిరిని కోయవచ్చును లేక శస్త్రచికిత్స చేయవచ్చును; లేక వేరేదైనను కార్యము కొరకు, క్రిములను చంపుటకు విషమును మీలో నుంచవచ్చును. అయితే దేవుడు తప్పనిచ్చి మరి ఏదియును స్వస్థత నియ్యగలదు, ఎందుకనగా పెరుగటనేది అది సృష్టికార్యము కావలసియున్నది. మరియు ఏ ఔషధమును సృష్టించ లేదు. చూశారా? ఒకే ఒక సృష్టికర్త యున్నాడు, అది దేవుడు. పిదప కీర్తనలు 103, (చూడండి, లేఖనములన్నియూ సత్యమే.) ʻʻమీ వ్యాధ్యులన్నింటిని స్వస్థపరచు యొహోవాను నేనే.“
ఆ విధముగా చెప్పుట వలన వైద్యునికి స్వస్థతలో ఏ వంతు లేదని కాదు. అవును అతనికి భాగమున్నది. నేను గనుక నా యొక్క చేతిని విరుగగొట్టుకొన్నట్లైతే, ఆ చేతిని ఏ విధముగా అమర్చవలయునని ఎరిగియున్న ఒక వైద్యుని యొద్దకు వెళ్ళటమే నా ప్రథమ కర్తవ్యము. అతను దానిని సరిగ్గా పెట్టి, ఎముకలను వాటి స్థానములో తిరిగి వుంచును. మరటు పిదప దేవుడు కాల్షియమును మరియు మొదలగు వాటిని సమకూర్చి పదార్ధములను సృజించి మరి నా చేతి లోపలనున్న అది, మరది ఒక్కటిగా మరల పెరుగును. స్వస్థపరచు వాడు దేవుడే, చూశారా.
63
ఇప్పుడు, మనము ఈ వారమంతా ప్రసంగించుచునే యున్నాము. యూదుల కాలములో జనుల కొరకు యూదుల వాడుక ఏమనగా వ్యాధిగ్రస్తులపై చేతులుంచుటయే. వారు దానినే చేసిరి. సమస్తమును చేతులు పెట్టుట ద్వారా జరుగును. అది యూదుల యొక్క క్రమము. అయితే అన్యజనులకు ఆ విధముగా లేదు, ఎన్నడును అట్లు లేదు.
యూదుల యాజకుడు యాయీరు యొక్క కుమార్తె చనిపోయినప్పుడు, అతను యేసును అడిగెను, “వచ్చి నా బిడ్డపై చేతుల నుంచుము మరి ఆమె జీవించును. ఆమెపై నీ చేతులుంచుము.”
అయితే ఆయన రోమీయుల శతాధిపతి యొద్దకు వెళ్ళినప్పుడు, అతను చెప్పెను, “నీవు వచ్చుటకు నేను ఏ మాత్రమును అర్హుడను కాను. నీవు ఉన్నచోటనే నిలిచి మరి మాట మాత్రము సెలవిమ్ము.” యేసుక్రీస్తు కలిగియున్న అధికారమును అతను గుర్తించెను. అతను చెప్పెను, “నేను కూడా అధికారమునకు లోబడినవాడను. నా చేతి క్రింద....” అతను ఒక శతాధిపతి; అట్లనగా దాని అర్థము అతని క్రింద వందమంది యున్నారు. అతను చెప్పెను, “నేను ఒకనితో ఇది చేయమంటే, అతను దానిని చేయును. మరియు ఆ వ్యక్తి, దానిని చేయుము, అనిన, అతను దానిని చేయును. మరియు మీకు ప్రతియొక్క వ్యాధిపైనను, మరియు ప్రతి బాధపైనను మరియు సమస్తము పైనను అధికారము కలదు. అవన్నియును మీ యొక్క అధికారము క్రింద నున్నవి. మీరు గొప్ప అధిపతి.” ఓ, నేను దానిని నేను ఇష్టపడుచున్నాను.
ఆ మాటలు యేసు యొక్క హృదయమును కూడా తాకినవి. మరియు ఆయన తిరిగి చూచి “ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్లు చూడలేదని,” యూదులతో చెప్పెను.
64
సురోఫెనికయ వంశమందు పుట్టిన అన్యజనురాలైన ఒక గ్రీసు దేశస్తురాలు ఆయన యొద్దకు వచ్చి చెప్పెను, “ప్రభువా, దయ్యము ద్వారా పలు విధములుగా బాధింపబడుచు నుండు నా కుమార్తె నొకదానిని నేను కలిగియున్నాను ఆమె ఇక్కడ క్రింద పండుకొనియున్నది.” ఆమె ఒకవేళ మూర్చరోగము లేక ఒక విధమైన పిచ్చితనముతో నుండవచ్చును. చెప్పెను, “ ఆమె చాలా ఘోరస్థితిలో యున్నది. మీరు ఆమెను స్వస్థపరచగలరా?” అని అడిగెను.
మరి ఆయన ఆమె విశ్వాసమును పరీక్షించెను. “ ఏల,” యని ఆయన అడిగెను, పిల్లలరొట్టె తీసికొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను.“ ఆమెను ఒక కుక్కయని పిలిచెను. మరియు ఆ దినములలో కుక్క పందికి పోల్చబడి మరియు నీచమైన జంతువుగా ఎంచబడెను. ”పిల్లల రొట్టెను తీసికొని మరి కుక్కలైన మీకు ఇచ్చుట యుక్తము కాదనెను“ అని చెప్పును.
ఆమె చెప్పెను, “నిజమే ప్రభువా, ఓ, నేను అది నాకు చాలా ఇష్టము. ”అది నిజమే.“ చెప్పెను, ”అయితే మీకు తెలియునా, కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి, పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును గదా..?“ ఆ మాటలు ఆయనను తాకెను. ఆ ఒకానొక దినమున, హట్టీ, నీవు సరైన కార్యమును చెప్పినట్లుగానే, ఆమె చెప్పెను.
ఆయన తిరిగి మరియు చెప్పెను, “నీవు చెప్పిన ఈ మాటలు నిమిత్తము దయ్యము నీ యొక్క కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను.” ఆమె యొద్దకు వెళ్ళి మరి చేతులను ఆమెపై నుంచనవసరము లేదు.
65
పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు, ఫిలిప్పు సమరయకు వెళ్ళెను. వారు సగము యూదులుగా నుండిరి, కావున అతను అచ్చటికి వెళ్ళినప్పుడు, వారు పరిశుద్ధాత్మను పొందుటకు గాను అతను వారిపై చేతులుంచెను. పరిశుద్ధాత్మ వారెవరిపైనను ఇంకను రాలేదు, కావున వారు పేతురును పిలుచుటకు పంపించిరి. వారు యేసు నామమున బాప్తిస్మము పొందిరి, కావున వారు ప్రధాన స్థలము నొద్ద యెరూషలేము యొద్దకు వెళ్ళి పేతురును మరియు యోహాను తీసుకొని వచ్చిరి. మరియు వారు వచ్చి వారి చేతులను వారిపై నుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి.
పిదప పేతురు కొర్నేలి యొక్క గృహము నొద్దకు వెళ్ళెను. చూడుడి, అతను వారిపై చేతుల నుంచవలసి యుండెను. అపొస్తలుల కార్యములు 19, ఎఫెసులో నున్న కొందరి యూదులపై వారు పరిశుద్ధాత్మను పొందునట్లుగా వారిపైన చేతులుంచవలసినదాయెను. అయితే, అతను కొర్నేలి ఇంటియందు నున్నప్పుడు, అతను ఈ మాటలు చెప్పుచుండగా, పరిశుద్ధాత్మ వారందరి మీద దిగెను. చేతులు పైనుంచుట కాదు. వారు సత్యమును వినుచుండగా పరిశుద్ధాత్మ వారిపైకి దిగెను. వారు ఆకలిగొని మరి దానికొరకు కాచుకొనియు౦డిరి.
66
ఈ ఉదయమున స్వస్థత కొరకు మీరు ఆకలిగొని యున్నారా? అట్లైన యేసు నిన్న నేడు యుగయుగములకు ఒక్కటే రీతిగా యున్నయెడల, పరిశుద్ధాత్మను మాటలాడనియ్యుడి. మీరు దానిని నమ్ముచున్నారా? “నేను చేయు క్రియలు మీరు కూడా చేసెదరని,” ఆయన చెప్పియుండలేదా?
జనులకు వారి మెస్సీయాయనియు యూదులకు మెస్సీయాయనియు ఆయన ఏ విధముగా వారికి చాటించి చెప్పెను? ఆయన దానిని యూదులకు ఎట్లు చెప్పెను? వారి హృదయ రహస్యములను వారికి చెప్పుట ద్వారా వారు మెస్సీయాను ఆయనను గుర్తించిరి. అది నిజమని ఎందరికి తెలియును? నిశ్చయముగా.
పేతురు వచ్చినప్పుడు, ఆయన చెప్పెను, “నీ యొక్క పేరు పేతురు.” మరియు చెప్పెను. లేక, “నీ పేరు కేఫా.” చెప్పెను, “నీవు పేతురువని పిలువబడెదవు. నీ తండ్రి పేరు యోనా.” దానితో ఆయనను గురించిన కార్యము స్థిరపడెను. ఆ కార్యములు చెప్పునది మెస్సీయాయని అతను ఎరిగియుండెను.
ఫిలిప్పు వెళ్ళి మరి నతనయేలును కనుగొనినప్పుడు, ఆయన చెప్పెను, “ నీవు ఒక మంచివాడవు, నమ్మదగిన యోగ్యుడవు.”
అతను అడిగెను, “రబ్బీ, నీవు నన్ను ఏలాగు ఎరుగుదువు?”
“ఫిలిప్పు నిన్ను పిలువక ముందే, నీవు ఆ చెట్ట క్రిందనున్నప్పుడే, నేను నిన్ను చూచియున్నాను.” [కొండలను చుట్టి పదునయిదు మైళ్ళు - ఒక రోజు ప్రయాణము.] “నేను నిన్ను చూచియున్నాను.”
అతడు “నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు, అని చెప్పెను.
67
ఆయన సమరయుల యొద్దకు వెళ్ళెను. ఆయన వెళ్ళవలసిన అవసరముండెను. ఎందుకని? ఆయన సమరయుల యొుద్దకు వెళ్ళెను. మరక్కడ ఒక సమరయ స్త్రీ యు౦డెను , మరి ఆమెకు మెస్సీయా యొక్క సూచన నిచ్చెదనని ఆయన తలంచెను. మరియు ఆయన చెప్పెను, “నీ పెనిమిటిని తీసుకొని ఇచ్చటికి రమ్ము.”
ఆమె చెప్పెను, “నాకు భర్త లేడు.”
ఆయన చెప్పెను, “నీవు చెప్పిన మాట సరియే, ఏలయనగా నీకు ఐదుగురు బర్తలు౦డిరి.”
ఆమె చెప్పెను, “అయ్యా, ఇంకొక మాటలో చెప్పువలయుననిన ఈ విధముగా, మెస్సీయా రావలయునని మేము ఎదరుచూచుచున్నాము. మరియు ఆయన ఒక దేవుడు-ప్రవక్తగా యుండును. మరియు ఆయన వచ్చినప్పుడు, ఆయన ఈ కార్యములను మాకు చెప్పును
అని మేము ఎరిగియున్నాము. కావున, నీవు ఒక విధమైన ప్రవక్తవు.“
ఆయన చెప్పెను, “నేనే మెస్సీయాను. నీతో మాటలాడుచున్న ఆయనను నేనే.”
(ఒక వ్యభిచారి మరియు నిస్పృహలతోనున్న ఆమె.) ఆ నీటి కుండను అచ్చటనే వదిలి పెట్టి మరి ఊరిలోనికి వెళ్ళి మరియు ఆ మనుష్యులతో చెప్పెను, “వచ్చి, నా హృదయములో నున్న దానిని చెప్పిన ఒక మనుష్యుని వచ్చి చూడుడి. ఆయన మెస్సీయా కాదా? ఆయన మెస్సీయా కాదా?”
68
ఒక్కసారి కూడా అన్యజనులయొద్ద అది జరుగలేదు. లేదయ్యా. సాయంకాలపు వెలుగున్నప్పుడు... అది వారి దినము.
ప్రపంచమును స్వాధీనపరచుకొనుటకై యూదులు ఒక దేశములో ఇప్పుడు యున్నారు. ఒకప్పుడు వారు ఆ విధముగా స్వాధీనపరచుకొనిరి. వారు మరల వచ్చుచున్నారు. దూరమున ఆ అంజూరపు చెట్టు చిగురించుటకు గమనించండి. మీరు యూదుని గమనించుడి, అతనెక్కడున్నను, దేవుని యొక్క క్యాలెండర్ ను, మీరు కనుగొనగలరు. ఆయన ఇశ్రాయేలును ఎన్నడును విడువడు. అయితే ఇశ్రాయేలు గ్రుడ్డిగా చేయబడవలసియుండెను. ఇక్కడ కూర్చొనియున్న ఈ యూద స్త్రీల తరపున నేను దీనిని చెప్పుట లేదు. అయితే ఒక అవకాశము ఇచ్చుటకై ఇశ్రాయేలు గ్రుడ్డిగా చేయబడెను. వారిని ప్రేమించండి. మీరు చింతింపకండి; వారు మరల వికసించెదరు.
“గొంగళి పురుగులు విడిచిన దానిని, చీడ పురుగులు తినివేసి యున్నవి; చీడపురుగులు విడిచిన దానిని మిడుతలు తినివేసి యున్నవి; అయితే నేను మరల నిచ్చెదను, ప్రభువు సెలవిచ్చుచున్నాడు.” అది కేవలము తినివేయుటయే యగుచున్నది, ఒక మాట కొరకై, తద్వారా మనము లోపలికి తీసుకొని రాబడితిమి. మన నేత్రములు తెరువబడియున్నవి.
69
ఇప్పుడు అదేమిటి? మనయొక్క దినము అంతమగుచున్నది. దేవుడు చెప్పిన విధముగా యూదులు మరల ఒక్కటిగా ఏకమగుటకు ప్రారంభించి యున్నారు. మరియు సాయంకాలపు వెలుగు ప్రకాశించుచున్నది. దేనిపైన? సాయంకాలమును ఎచ్చట వెలుగు ప్రకాశించును? పడమట. ప్రారంభమునందు తూర్పునయున్న యూదులపై తూర్పు జనులపై అది ప్రకాశించెను. సంఘ శాఖలు మొదలగు వాటికి అది చీకటి దినముగా యున్నది. అయితే పశ్చిమ భాగములోని అర్ధ భాగములోనున్న అన్యజనులపై సాయంకాలపు వెలుగు ప్రకాశించును. ఇప్పుడు మన మిక్కడ అంతమందు యున్నాము. మనము పడమటి తీరమున నున్నాము. ఇక నీవు ముందుకు సాగిపోయినట్లైతే తిరిగి నీవు తూర్పునకే వచ్చెదవు. నాగరికత ఆ విధముగా ప్రయాణము చేయుచున్నది. కావున, సాయంకాలపు వెలుగు ప్రకాశించుచున్నది, “యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగయుగములకు మారనివాడై యున్నాడు.”
70
మనము ప్రార్థించెదము. ఇప్పుడు ప్రభువా, వీరందరును నీవారు. “వాక్యము వినుట ద్వారా విశ్వాసము కలుగును, దేవుని వాక్యము వినుటద్వారా కలుగును.” మరియు, దేవా, మీరు దేవుడని జనులకు నిరూపించుటకై గాను మీరు మీ వాక్యములను బయలుపరచిరి. ఈ ఉదయమున మీరు దేవుడనియు మరియు నేను నీ యొక్క సేవకుడనియు, నిత్యజీవము యొక్క సత్యమును గురించి చెప్పుచున్నానని ఈ ఉదయము ఎరుగుదురు గాక! మన ప్రభువైన యేసుక్రీస్తు నామము ద్వారా మేము ప్రార్థించుచున్నాము. ఆమేన్.
అనేక జనులు ఇక్కడున్నారనియు మరియు అనేక ప్రార్థనా కార్డులు ఇవ్వబడి యున్నవనియు బిల్లీ నాకు బయట అక్కడ చెప్పియున్నాడని నేను నమ్ముచున్నాను. దానిని నిరూపించుటకును లేక మీరు చూడవలయునని వారినందరిని పైకి తీసికొని వచ్చుటకు మా వలన వీలు కాదని మీరు ఎరిగియున్నారు. ఇప్పుడు, దేవుడు దీనిని చేయవలసినవసరము లేదు. మరి ప్రతియొక్కరు దానిని ఎరిగియున్నారా? ఆయన భూమిపైనున్నప్పుడు యేసు ఎవరిని స్వస్థపరచనక్కర లేదు? అది మీకు తెలియునా? అయితే, ప్రవక్త ద్వారా పలుకబడినది నెరవేరునట్లుగా ఆయన దానిని చేసెను. అది నిజమేనా? “సొదొమ దినములలో యుండిన విధముగా మనుష్యుకుమారుని రాకడ దినముల యందును నుండును,” యను వాక్యము నెరవేరునట్లుగా ఆయన దీనిని చేయుచున్నాడు.
71
మీరు గమనించుడి, సొదొమ దినములలో బిల్లీ గ్రాహం మరియు ఓరల్ రాబర్ట్స్ను వారు కలిగియుండిరి. మరి వారివలెనున్న వ్యక్తులు సొదోమ నగరమునకు వెళ్ళి మరి వారికి ప్రకటించిరి అయితే ఎన్నుకొనబడిన అబ్రాహామును అతనికి చెందినవారిని బయటికి పిలువబడిన వారై ఒక ప్రక్కగా నుండిరి. ఎటువంటి దూత వారి వెనుక నుండి మరి వారికి ప్రసంగించెను?
గమనించుడి. తాను ఒక విదేశము నుండి వచ్చిన అన్యుడని అక్కడున్న మనుష్యుడు చెప్పెను. ఆయన వస్త్రములపై ధూళి యుండెను. ఆయన అబ్రాహాముతో నుండి లేత దూడలో కొంత తిని, దాని తల్లియొద్ద నుండి పాలు త్రాగి, ధాన్యపు రొట్టెలు కొన్నింటిని భుజించెను. దానిని చేయునప్పుడు ఒకవేళ ఈగలను వెళ్లగొట్టు సాధనమును కలిగియుండి వాటిని వెళ్ళగొట్టి యుండ వచ్చును. అక్కడ కూర్చొని భుజించెను. మరియు ఆయన వెళ్ళిన పిదప. అబ్రాహాము ఆయనను “ఎలోహిమ్, సర్వశక్తిమంతుడు,” యని పిలిచెను. అయితే ఆయన ఒక మనుష్యుడు, దేవుడు, తన జనులలో యుండుట.
72
ఇప్పుడు, ఆయన ఏమి చేసెనో గమనించండి, ఆయనకెట్లు తెలియును. ఆయన అక్కడ కూర్చుండి మరి అబ్రాహాముతో మాటలాడెను. ఆయన చెప్పెను. ఇప్పుడు మొదటిసారి అబ్రాహామును సంధించెను, మొదటిసారిగా అబ్రాహాము ఆయనను చూచెను మరియు వారు ఎవరని తెలిసికొనిరి. మరి ఈ ఇతర వ్యక్తులు సౌదొమకు పోబోవుచున్నారు. మరియు వారు అచ్చటికి వెళ్ళి ప్రసంగించి మరి జనులను గ్రుడ్డి వారిగా చేసిరి. సువార్తను బోధించుటవలన చేయునది అదే కదా, అవిశ్వాసిని అంధునిగా చేయును.
గమనించుడి. అయితే సున్నతి చేయబడిన, నిజమైనవారగు ఎన్నుకొనబడిన సంఘమైన అబ్రాహాముతోను, మరియు అతని వర్గముతోను ఆయన ఒక్కడే అచ్చట ఆగిపోయెను. లోతు నగరములో జీవించుచు మరి ఆడంబరమైన జీవితమును కలిగియుండెను. మరియు అతని కుమార్తెలు, అతని కుమారులు ఎట్లు౦డిరనియు మరియు సమస్తమును ఎట్లు౦డినవో చూడండి. పాపము మరియు సమస్త కార్యములతో నిండిపోయిన నేటి ప్రపంచమువలె ఆ సొదోమ యున్నది. అదే నామకార్ధపు సంఘముగా యున్నది. అయితే ఆత్మ సంబంధమగు సంఘము, వెలుపలికి పిలువబడిన సమూహముగాను, ప్రత్యేకపరచబడిన వారుగా యున్నారు.
ఏ విధమైన దూత వారియొద్దకు వచ్చెను? ఇప్పుడు మనము దానిని గమనించెదము. ఇప్పుడు గురుంచుకొనుడి, మీ ప్రభువు చెప్పెను, “ఆ దినములలోనున్న విధముగా, మనుష్యుకుమారుని రాకడ దినముల యందును నుండును.” యేసు ఆ విధముగా చెప్పియున్నాడు. “ఆకాశము భూమియు గతించునుగాని, నా యొక్క మాటలు ఎన్నడును తప్పిపోవు.” ఇప్పుడు నెమ్మదిగా నుండి, మరి జాగ్రత్తగా వినండి.
73
ఇప్పుడు, ఈ దూత అబ్రాహాముతో మాటలాడెను. ఆయన అడిగెను, “అబ్రాహాము, నీ భార్యయైన శారా ఎక్కడ? అతడు వివాహమైన వ్యక్తిగా ఆయనెట్లు ఎరుగును? అతడికి ఒక భార్య కలదని ఆయనెట్ల ఎరుగును? మరియు ఆమె పేరు శారాయని ఆయనకెట్లు తెలియును? అది వింతగా నున్నది కదూ?”
మరియు అబ్రాహాము చెప్పెను, “ఆమె మీకు వెనుక గుడారములో నున్నది.”
ఆయన చెప్పెను, “అబ్రాహాము నీవు దేవుని నమ్మట చూచునప్పుడు, లోకమునకు నీవు వారసుడవు కాబోవుచున్నావు; నీ సంతతి వలన అన్యజనులందరూ దేవుని రాజ్యములోనికి తీసుకొని రాబడుదురు. వాగ్దానము నీకు ఇవ్వబడియున్నది. ఏ వాగ్దానమును నేను మరుగుపరచను. అబ్రాహామా, నీయందు ఏదియు మరుగుచేయను.” ఓ, నేను దానిని ప్రేమించుచున్నాను. “అబ్రాహాము నీ నుండి నేను దీనిని దాచుట లేదు.” అయితే ఆ బిడ్డ కొరకు నీవు నన్ను ఇరువది-ఐదు సంవత్సరములు నమ్మియున్నావు. ఇప్పుడు నీవు నూరు సంవత్సరములు గలవానిగాను, మరియు ఆమె తొంబది సంవత్సరములు వయస్సుగలదిగా సున్నారు. అయితే, అబ్రాహామా, జీవము యొక్క కాలము ప్రకారముగా, ఒక మిశ్రము జనుల మధ్య నేను చెప్పే భావమేదో మీరెరుగుదురు. ఇరువది ఎనిమిది దినములు. ఏబది సంవత్సరములు లేక ఇంకా పైబడి, అవును, దానికి ముందుగానే అరువది ఏండ్లు ఆమెకు ఆగిపోయి ఉండును. చెప్పెను “శారాతో ఒక జీవ కాలము, ప్రకారముగా నేను మరల నిన్ను దర్శించెదను, మరియు నీవు ఆ బిడ్డిను కనెదవు.”
మరియు ఆయనకు వెనుక మూయబడియున్న గుడారములోనున్న శారా తనలోతాను నవ్వుకొనెను. ఊరక. మరియు తనలోతాను చెప్పుకొనెను, “నా యజమానునితో నాకు సుఖము కలుగునా?” మీ యొక్క భర్తను మీరేమని పిలిచెదరు? “నా యజమానునితో మరల నాకు సుఖము కలుగునా, నేను వృద్దురాలను మరియు అతను కూడా వృద్దుడుగా నుండుట చూడగా ఇది సాధ్యమా?”
మరియు దూత ఆయన వీపున వెనుకకు త్రిప్పి, అడిగెను, “శారా, ఏల నవ్వెను?” ఆమె నవ్వుటకు గల హేతువేమిటి?
మీరు చూచుట లేదా? అక్కడున్న ఆ ఎన్నుకొనబడిన సంఘమును దర్శించినది ఎటువంటి దూత మరి అది ఎటువంటి ఒక ఆత్మ? ఆయన యొక్క రాకడకు ముందు అదే విధమైన కార్యము సంభవించునని యేసు చెప్పియున్నాడు. అదియే ఆయన రాకడకు ఒక సూచన.
74
మనము ఒక ప్రార్థనా వరుసను పిలిచెదము. ఆయన వాగ్దానము చేసి యున్నాడు.ఆయనే దానిని కాపాడును. ఇప్పుడు ఇచ్చట ఎందరు నిలువబడుటకు వీలగునో మరి అంతమందిని ఐదు లేక ఆరుగురిని నేను పిలువవలయును. తక్కిన వారందరును నమ్ముడి.
గమనించండి. మీకు గనుక ఒక ప్రార్థనా కార్డు లేనియెడల మరిక్కడ యున్నయెడల దాని గురించి అక్కర లేదు. నేను మీకు వక్కాణించి చెప్పుచున్నాను.
ఇక్కడ అబ్రాహాము యొక్క సంతతియైన యేసు, ఆయన భూమిపై యున్నప్పుడు ఏమి చేసియున్నాడో అది యున్నది. ఒకానొక దినమున ఆయన జన సమూహము నడుమ నడచి వెళ్ళుచుండెను. మరియు వారందరును చెప్పుచుండిరి, “హల్లో రబ్బీ, ఉదయకాలపు వందనములు, డాక్టరు. పూజ్యనీయుడా, మీరు ఎట్లున్నారు? పూజ్యనీయుడా మిమ్ములను కలుసుకొనుట వలన సంతోషముగా యున్నది. మీరిచ్చట యుండుట ఆనందముగా యున్నది. మేమిచ్చట నుండగా ఒక కూటమును ఏర్పరచబోవుచున్నారా?”
మరియు ఆ బీద చిన్న స్త్రీ ఒక అవసరములో నుండెను, కావున ఆమె జనుల మధ్య జొరబడి మరి ఆయన వస్త్రమును తాకెను. ఏలయనగా ఆమె తనలోతాను అనుకొనెను, “నేను గనుక ఆ పరిశుద్ద వ్యక్తిని తాకగలిగిన యెడల,” చూశారా? ఆమె విశ్వాసమును. చూశారా? “నేను గనుక ఆయనను తాకిన యెడల, నేను స్వస్థత నొందెదను.” కావున ఆమె ఆయనను తాకెను, మరియు ఆమె ఆయనను తాకి జనుల మధ్యకు తిరిగి వెళ్ళిపోయెను. ఆమె చెప్పెను, “ఓ, నేను స్వస్థత నొందినానని నాకు నిశ్చయముగా తెలియును, ఏలయనగా, నేను దానిని నమ్ముచున్నాను. నేను దానిని నమ్మియున్నాను. నేను స్వస్థత పొందుకున్నానని నేనెరుగుదును. నేను - నా రక్తస్త్రావము ఇప్పుదే ఆగిపోయినదని నేను నమ్మియున్నాను. నేను నిలబడి ఈ విధముగా అడిగెను. నేను ఇప్పుడే దానిని నమ్ముచున్నాను.”
యేసు నిలబడి ఈ విధముగా అడిగెను, “నన్ను ముట్టినది ఎవరని చెప్పుడి?”
ఎటువంటి ఒక ప్రశ్న! పేతురు వేరే విధముగా మాటలాడెను, “ప్రభువా, నీకేమి సంభవించియున్నది?” బైబిలు చెప్పుచున్నది అతను ఆయనను గద్దించెనని. అడిగెను, “నీవే అర్థముతో చెప్పుచున్నారు? ఏల, ప్రతియొక్కరును నిన్ను తాకుచున్నారే? నీవేలాగు చెప్పుగలుగుచున్నావు. నీవు, మెస్సీయాగా నుండి ఏల ఈ జనులకు ఎదుట మిమ్ములను బయలుపరచుటకు భయపడుచున్నారు, ఎవరు నన్ను ముట్టినదియని అడుగుచున్నారు? మరియు చివరి నిమిషములో అక్కడ ఐదువందలమంది నిన్ను తాకియున్నారని నేను పందెమువేసి చెప్పగలను. అటువంటి కార్యము నీవు ఎటు చెప్పుగలవు?”
ఆయన చెప్పును, “అయితే ఇది ఒక విధమైన తాకుట. నేను బలహీనుడనై యున్నానని గ్రహించుచున్నాను.” ప్రభావము, ప్రభావమనగా, శక్తియని ఎవరికైనను తెలియునా, “నేను బలహీనుడనై యున్నాను. నాలోనుండి శక్తి బయటికి వెడలి యున్నది.” మరియు ఆయన చుట్టూ చూచెను, చుట్టూ చూచెను. చూడుడి, అక్కడెక్కడో విశ్వాసము యుండెను. ఆయన చుట్టూ చూచి మరి ఆ చిన్న స్త్రీని కనుగొనెను. ఆయనలోనున్న ఆ పరిశుద్ధాత్మ పరిపూర్ణముగానున్న ఆత్మ ఆయనను ఆ చిన్న స్త్రీయొద్దకు నడిపించెను. ఆమెకుయున్న ఆ రక్తస్రావము, ఆయన చెప్పెను, “విశ్వాసము! నేనెన్నడూ నిన్ను స్వస్థపరచలేదు, దానికొరకై నేనేమి చేయలేదు, అయితే నీ విశ్వాసము ఎవరిపై..... దేవునిపై, ఎవరికైతే నేను ప్రతినిధిగాయున్ననో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను.”
75
ఇప్పుడు, బైబిలు చెప్పుచున్నది, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నాడు. అదే పద్ధతిలో ఒకే విధముగా యుండెను, శక్తిలోనూ ఒకే విధముగా యుండెను, వైఖరిలోను అదే విధముగా యుండును. క్రీస్తులో నివాసమైయున్న అదే దేవుడు సంఘములోను నివాసమై యున్నాడు. అంతకంటె అధికముగా కాదు. ఆయన కొలువలేనంతగా దానిని కలిగియుండెను, మనము కొలత కొలది కలిగియున్నాము. అయితే సముద్రము నుండి మీరు గనుక ఒక స్పూన్ నిండుగా నీటిని తీసినయెడల, సముద్రపు నీటియంతటిలోనున్న రసాయనములు ఆ స్పూను నీటిలో యుండును. దానిని గుర్తు౦చుకొనుడి. అది సరియే. అదే మారని దేవుడు.
ఇప్పుడు, బైబిలు చెప్పుచున్నది, హెబ్రీయులు, అతను దానిని చెప్పెను, “యేసుక్రీస్తు ఇప్పుడు ప్రధాన యాజకుడిగా నుండి మన బలహీనతలయందు మనతో సహానుభవము గలవానిగా యున్నాడు.” అది ఎందరికి తెలియును? మంచిది. ఆయన గనుక అదే ప్రధాన యాజకునిగా నున్నయెడల, ఆయనను తాకినప్పుడు ఎలా స్పందించెనో అదే విధముగా యుండడా? మనమెవరిమై యున్నాము? ఆయన యొక్క నోటి బూరగా యున్నాము. మనల్ని మనము ఆయనకు సమర్పించుకుందాము. మరియు మనయొక్క మాటలు మన మాటలు కావు. “మీరేమి మాట్లాడవలెనాయని మీరు చింతింపవద్దు, ఏలయనగా మాటలాడునది మీరు కాదు,” మీలో నివసించు తండ్రి పలుకుచున్నాడు; ఆయన మాటలాడుచున్నాడు.
76
ఎక్కడనో, అదెక్కడ బిల్లీ, ఒకటి నుండి ఏబది వరకు, లేక ఒకటి నుండి వంద వరకా? ఒకటి నుండి వంద వరకు, సహజముగా జనులు ఆ మొదటి ప్రార్థనా కార్డు కొరకు ప్రాకులాడెదరు, కావున మనము దానిని ఒక్క నిమిషము వదిలి వేసెదము. మనము ఒక వింతైన సంఖ్య నుండి ఆరంభించెదము, మనము పిలిచెదము ముప్పై, ముప్పై సంఖ్య ప్రార్ధనా కార్డును ఎవరు కలిగియున్నారు? మీ చేతులను పైకెతుడి. ఏ - ఏ అక్షరమది? బి, బి ముప్పై, అది మంచిది. మీ యొక్క జేబులో చూసి, మీ ప్రార్థనా కార్డును బయటికి తీయండి మరియు అక్కడ గనుక. మంచిది, వినండి, ముప్పై గనుక లేనియెడల మనము వేరేయొక దానినుండి ప్రారంభించెదము. మంచిది మనము ప్రారంభించెదము. ఏమి చెప్పుచున్నాడు? [ఒక సహోదరుడు చెప్పుచున్నాడు, “అక్కడే, వెనక ఎడమ ప్రక్కన.] ఓ, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. అది మంచిది. అయ్యా ఇచ్చటికి రండి. ముప్పై ఒకటి. ముప్పై ఒకటవ ప్రార్థనా కార్డును ఎవరు కలిగియున్నారా? మీ యొక్క చేతిని పైకెత్తగలరా, ముప్పై ఒకటి. అయ్యూ ఇచ్చటికి రండి. ముప్పై రెండు. [టేప్పులో ఖాళీ స్థలము కలదు.] అతనితో మాటలాడాను. నాకు అతని పేరు కూడా తెలియదు. అయితే నేను. మరియు నిష్కపటముగా అతని యొక్క పనిని గురించి సంగతేమిటో నేనెరుగను. దానిని దేవుడెరుగును. అతనికి గల ఇబ్బంది ఏమిటని నేను మీకు చెప్పలేను. అయితే తక్కిన వారందరును నాకు అన్యులని నేను తలంచుచున్నాను. నేను వారిని ఎరుగను.
మిమ్ములను గురించి నాకు ఏమియు తెలియదని ఇచ్చటయున్న ఎందరికి తెలియును? మీ చేతులు పైకెత్తుడి.
77
ఇప్పుడు బైబిలు చెప్పుచున్నది, “పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, ఆయన... మొదటిగా పరిశుద్ధాత్మ చేయు కార్యము ఏమిటి? నేను మీకు బొధించిన ఈ కార్యములను మీకు బయలుపరచును. అది నిజమేనా? పిదప ఆయన ఏమి చేయును? రాబోవు కార్యములను మీకు చూపించును, హృదయ రహస్యములను మీకు బయలుపరచును. యేసు చేసిన అవే క్రియలను ఆయన చేయును. ఇప్పుడు, యేసు రక్షణ ప్రణాళికను మరియు స్వస్థతను కల్వరిలోనే సమాప్తి చేసెనని ఎందరు నమ్ముచున్నారు? నిశ్చయముగా, కావున, దానికి సంబంధించినంత వరకు అదంతయూ సమాప్తమైనది. నిజమే కదూ? అదంతయూ సమాప్తమైనది.
అయితే, ఆయన చేయగలిగిన ఒకే కార్యము మిమ్ములను అదరగొట్టలాగున చేయును లేక ఆయన ఇంకా దేవుడనియు, మరియు ఆయన వాగ్దానమును ఆయన నిలబెట్టుకొనుననే గ్రహింపుకు నీవు వచ్చునట్లుగా ఆయన చేయుటయే.
కావున, ఆయన దానిని చేయునప్పుడు ఆయన ప్రసంగికులకు అభిషేక్రించును. ఈ యొక్క చక్కటి మనుష్యులు ఇచ్చట చుట నిలబడుకొనియున్నారు మరియు వెనుకను నిలబడుకొని యున్నారు. వారు ప్రసంగించుటకు ఆయన వారిని అభిషేకి౦చుచున్నాడు. నేను ఒక ప్రసంగికి బదులుగా ఒక దీన ప్రత్యామ్యాయముగా నున్నాను. ప్రసంగమునకు బదులుగా ఆయన నాకు దీనిని అనుగ్రహించెను. మీరు గమనించండి, ఎందుకనగా నేను విద్యలేని పామరుడును మరియు నాకేమియును తెలియదు. నేనే అర్ధముతో చెప్పుచున్నాననగా నేను పెద్ద వేదపండితుడిగానో లేక వేరే ఏ విధ్యార్థిగానో యగుటకు కాదు. అయితే దానిని చేయుటకు ఈ వ్యక్తులకు ఆయన అవకాశములను ఇచ్చియున్నాడు, మరియు వారు ప్రేరేపణ కలిగి లేచి ప్రసంగించెదరు. ఓ, వారు నేను ఒక గంటలో చెప్పుగలిగిన దానిని ఐదు నిమిషములలో చెప్పగలరు. ఏలయనగా, ప్రేరేపణ క్రింద ఒక ఫీరంగి లేక మెషిన్ తుపాకి వేగముగా కాల్చునట్లుగా, గిర్రున తిరిగే సుత్తివలె వారు ప్రసంగించెదరు. చూశారా, నా యొక్క వరము వేరొకలాగా యున్నది. నేను నా యొక్క సమయమును తీసికొని మరి ఏమైనదో చదివి, పరిశుద్ధాత్మ ఏమి చెప్పుచున్నదో కనిపెట్టుకొని. ఏమిటని చూడవలయును... [టేప్పులో స్థలము కలదు.]
78
దానిని ఇదివరకే ముగించి యున్నాను. అయినను యేసు ఇక్కడ యున్నాడనియు అతను ఏదో విధముగా నమ్మునట్లుగా చేయుటయే. ఇప్పుడు యేసు ఏమి చెప్పెను? సోదొమ దగ్గరనున్న సూచనవలె, చివరి దినములలో నుండును. “నేను చేయు క్రియలు,” అబ్రాహాముతోనున్న అదే ఆయన ఆయనేయని అది చూపించుచున్నది. “అబ్రాహామునకు ముందు, నేను ఉన్నవాడను,” ఆయనే ఆ దూత. మరిక్కడ ఆయన. ఇక్కడ ఆయన, ఈ ఉదయమున ఆయన ఇక్కడ యున్నాడు, అదే దూత మనలో నివసించుచుయున్నాడు.
ఇప్పుడు, ఆ మనుష్యుడు ఒకవేళ నటనచేయు వాడుగా నుండవచ్చును. అతను బహుశా వేషధారిగా నుండవచ్చును. అతను ఒకవేళ దేవుని నమ్మని నాస్తికుడుగా నుండవచ్చును. అతను ఒకవేళ ఒక పరిశుద్దునిగా నుండవచ్చును. అతడి గురించి నాకు ఏమియును తెలియదు; అతను అక్కడ నిలబడుకొని యున్నాడు. అయితే పరిశుద్ధాత్మ గనుక వచ్చి మరి అతనికి బయలుపరచిన యెడల, మరప్పటి నుండి అతను సత్యమని దానిని సరి చూచుకొననిమ్ము తీర్పు తీర్చుకొననిమ్ము అతనికి తెలియును. అతని జీవితము ఏమిటని పరిశుద్ధాత్మ గనుక అతనికి చెప్పినయెడల, నిశ్చయముగా అది గనుక సత్యమైన యెడల, అతని జీవితము ఏలాగుండునని అతను నమ్మగలడు. అది నిజమేనా? ఆయన గనుక ఏమి జరిగినదనియు, ఏ విధముగా నుండబోవునని చెప్పినయెడల? ఇప్పుడు, అది నిజమో కాదోయని అతడెరుగును, ఆ విధముగా నుండెనాయని అతను తెలిసికొనును.
79
వైద్యుడా, నీవు దీనిని నమ్ముము. నీవును మరియు తల్లి మీరిరువురును దీనిని నమ్ముడి. స్సీంగ్ఫీల్డ్, మిస్సోరి నుండి వచ్చి మరి అక్కడ వెనుక కూర్చొని యున్న ఇంకొక వైద్యుడు.
ఇప్పుడు, పరిశుద్ధాత్మ ఇక్కడ యున్నాడు. అవలోన్ విడిదిలో యున్న తలనెరసిన వ్యక్తి అక్కడ యున్నడు. మీ ప్రక్కలోనున్న ఏదో కార్యముతో మీరు బాధపడుచున్నారు. నీవు ఈ ప్రాంతమునకు చెందినవాడవు కానే కాదు. నీవు కెనడాకు చెందినవాడవు. బ్రిటిష్ కొలంబియా, వాన్కువర్. నీవు ఫిన్లాండు నుండి వచ్చియున్నావు, కిట్టోస్. [ఫిన్లాండు భాషలో కిట్టోస్ అనగా అర్ధము “మీకు వందనములు.] సహోదరుడు చెప్పుచున్నాడు, ”కిట్టోస్“ దేవుడు నిన్ను ఆశీర్వదించును, ఇంటికి వెళ్ళుము, నీవు బాగున్నావు. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచును.
నీవు నమ్ముచున్నావా? నాకు ఆ వ్యక్తిని గురించి తెలియదు. నేను అతనికి ఏమి చెప్పితినో నాకు ఇప్పుడు తెలియదు. పరిశుద్ధాత్మయే దానిని చెప్పెను.
80
ఇంకొక అన్యుడు. నాకు అతనికి గురించి తెలియదు, నా జీవితములో నేను అతనిని చూడలేదు. మేము ఒకరినొకరము ఇంతవరకు చూసుకోలేదని నేను అనుకొనుచున్నాను. అది నిజమేనా, అయ్యా? ఆ వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు, నాకు అతనిని గురించి ఏమియూ తెలియదు. ఇప్పుడు భయభక్తులతో నుండండి. మరియు నాకు అతనిని గురించి ఏమియూ తెలియకున్న యెడల, మరి ప్రభువు అతనిని గురించి నాకు ఏదో కార్యము చెప్పినయెడల, మరి అది మనుష్యుడు చేయలేని కార్యమును మరేదో ఒకటి చేయగలదని అది రుజువుపరచుచున్నది. అది నిజమేనా? ఇప్పుడు, మీరు గనుక నిజముగా భయభక్తులతో నుండి మరి గమనించినయెడల మరియు జాగ్రత్తగా నుండినయెడల, మరియు పరిశుద్ధాత్మ గనుక మీపై ఆ విధముగా ధ్వనించినప్పుడు, దానిని అంగీకరించుడి. మీ హృదయమంతటితో దానిని నమ్ముడి.
ఒక అపరిచితుడు.... మొదటి కార్యము, నీవు రక్షణను వెదకుచున్నావు. నీవు ఒక త్రాగుబోతువు. అది ఖచ్చితముగా నిజమే. నీవు ఈ నగరమునకు చెందినవాడవు కావు. నీవు ఇంకొక నగరమైన ఇండియానా నగరమునకు చెందినవాడవు. అవును. నేను అది న్యూ కాసిల్ మరి ఆ విధముగా ఏదో ఖచ్చితముగా, హు — హు. నీవు వేరెవరితోనే యున్నావు, ఇంకొకరు. నేను ఎవరినో చూచుచున్నాను. నీవు ఒక స్త్రీతో యున్నావు. అది సంబంధము కలదు. లైల్ ఉడ్స్ ఎక్కడ? అది అతడి భార్య. ఆమె ఇప్పుడిక్కడ యున్నది. ఆమె కూడా ప్రార్థన చేయించుకోవాలని ఆశించుచున్నది. అవునయ్యా. నీ యొక్క బాధ ఏమిటని దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముచున్నావా? గుండె నొప్పి. ఆమె తాను స్వస్థత నొందునని తన హృదయమంతటితో నమ్మవచ్చును, ఆమె స్వస్థత నొందగలదు. నిన్ను త్రాగుబోతుగా చేయు నీలోనున్న ఆ దయ్యమును నేను గద్దించు చున్నాను. యేసుక్రీస్తు నామమున ఇంటికి వెళ్లి మరియు ఇంకెన్నడును మరల త్రాగకుండునట్లుగా పాపములను తీసివేయునట్లుగా ఆయన యొక్క అమూల్యమైన నామమున బాప్తిస్మము నొందుము. మరియు నేను దయ్యమును ఖండించుచున్నాను; వాడు మిమ్ములను వదిలి వెళ్ళనిమ్ము. ఆమేన్. ముందుకు సాగిపొమ్ము దేవుడు నిన్ను ఆశీర్వదించును, అయ్యా ఇప్పుడు నీ పాపములు క్షమించబడియున్నవి. వెళ్ళి ఇకమీదట పాపము చేయకుము.
దేవుని యందు విశ్వాసముంచుము. సందేహింపకుము. నీలోనున్న సమస్తముతో నమ్ముము.
81
యౌవ్వన స్త్రీ మనము ఒకరికొకరు అన్యులము. క్రీస్తు మన ఇరువురిని ఎరిగి యున్నాడని నీవు నమ్ముచున్నావా? మన రక్షకుడును మరియు బావియొద్దనున్న స్త్రీ వలె ఇప్పుడిక్కడ యున్నది. నీవు ఆ బావి దగ్గరయున్న స్త్రీ కాదు మరియు నేను ఆయననూ కాదు. అయితే ఆయన ఆత్మ నిరంతరము జీవించును. ఇక్కడ నిలుచుకొనియున్న ఈ యౌవ్వన స్త్రీ. మీరు గనుక చూడగలిగినట్లైతే నాకును మరి ఆమెకు మధ్య దూత యొక్క వెలుగు ఇచ్చట నిలుచుకొని యున్నది. అయితే దానికి తరువాత ఒక నీడ యున్నది, మరి అది మరణపు ఛాయా, చీకటి. అది కెన్సరు. కెన్సరు ఎక్కడయని కనుగొనబడినది పెద్ద ప్రేవు చివర. నీవు ఈ ప్రదేశమునకు చెందినదానవు కూడా కాదు. నీవు కెంటకీకి చెందినదానవు. కెంటకీలోనున్న లా-గ్రాంజ్ కు చెందినదానవు. అది సరిగా యున్నది. శ్రీమతి. జాన్సన్ నీవు ఏమి చేయవలయునో నీకు చెప్పెదను. నీ హృదయమంతటితో నీవు గనుక నమ్మినయెడల ఇంటికి వెళ్ళుము, మరి యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచియున్నాడు. నీవు దానిని నమ్ముచున్నావా?
ఈ స్త్రీ యొక్క జీవమును తీయుచున్న ఆ దయ్యమును నేను ఖండించుచున్నాను. యేసుక్రీస్తు యొక్క పునురుత్తానముపై ఆధారపడి మరి నేను ఇప్పుడు సాతానుకు ఎదురుగా సవాలు చేయుచున్నాను. వాడికి చెప్పుచున్నాను, అతను ఒక ఓడిపోయిన వాడనియు మరియు యేసుక్రీస్తు వాడిని కల్వరిలో ఓడించెనని నేను వాడికి చెప్పుచున్నాను. మరియు ఒక దేవుని సేవకునిగా పరిశుద్ధాత్మ అభిషేకము క్రింద ఇప్పుడు నుండగా, దూత ద్వారా నాకు ఇవ్వబడిన అధికారము వలన ఈ స్త్రీ యొక్క ప్రాణము కొరకు ఈ దయ్యమును నేను ఖండించుచున్నాను. ఓ, ప్రభువా ఆమె బ్రతుకును గాక. ఆమేన్. ప్రభువుకు స్తోత్రము చెల్లించును ఆనందించుచు ఇంటికి వెళ్ళి సంతోషముగా నుండుడి. ఇప్పుడు సందేహించ వద్దు. నీ యొక్క మనస్సులో సందేహము నుంచుకొనవద్దు.
82
గౌరవింపతగిన స్త్రీ నీవు దానిని గురించి ఏమి తెలియని అమాయకురాలివలె మరియు భయంకరమైన వినయముతో నున్నట్లు కనిపించుచున్నావు. నీవు పూర్ణహృదయముతో నమ్మినయెడల నీవు బాధపడుచున్న ఆ మాంస గ్రంథి మరియు కీళ్ల నొప్పులు నిన్ను వదిలిపోవును,
ఇప్పుడు, ఈ చిన్న స్త్రీ ఇక్కడ ఏదో ఒకటి ఉన్న అనుభూతి చెందుచున్నారు, ఏలయనగా వారిరువురికి మధ్య అక్కడొక ఆత్మ యున్నది, మీరు చూడుడి. నీకు, నీకు కూడా బాగైనది, నీ పూర్ణహృదయముతో నమ్ముము.
మరియు ఆ విధముగానే ఆమెకు తరువాత అక్కడ కూర్చొనియున్న ఆ చిన్న స్త్రీ అవును, పైకి చూచుచు ప్రార్థించుచుండు అక్కడ కూర్చొనియున్న నీవు. ఉహ్-హు. అది వెన్నెముక వ్యాధి.... నీ హృదయమంతటితో నమ్ముము.
మరియు నీకు కూడా వెన్నెముక వ్యాధి కలదు. కావున పైకి వెళ్ళి మరిప్పుడు ఇంటికి వెళ్ళి స్వస్థత నొందుము.
83
“నీవు నీ హృదయమంతటితో నమ్ముచున్నావా? నీవు నీ యొక్క కుమార్తెకొరకై ఇక్కడ యున్నావు నీ కుమార్తెపై మరణము నీడ యున్నది. అది కాన్సరు. మరియు ఆమె యొక్క ఆత్మీయు పరిస్థితి బాగుగా లేదు. అవును, అయ్యా, ఆమె పైకి క్రిందికి, లోపట మరియు బయట, మరియు అక్కడ ఇక్కడ తిరుగులాడుచున్నది. నీ చేతిలోనున్న చేతిరుమాలును నీవు చూచుచున్నావా? ఇక్కడ మాటలాడుచున్నది పరిశుద్ధాత్మయని నీవు నమ్ముచున్నావా? ఆ చేతి రుమాలును నా చేతి కిమ్ము ప్రభువా, యేసుక్రీస్తు నామమున ఆమె యొక్క కుమార్తె యొక్క స్థితిని నేను ఖండించుచున్నాను. ఆమె తల్లి చెప్పిన మాటలను బట్టి నేను గద్దించిన ప్రభావము ఆమెపై యేసు నామమున నుండనిమ్ము. ఆమేన్. వెళ్ళు; సందేహించవద్దు. విశ్వాసము కలిగియుండుము. ఆమె ఇప్పుడు ఇంటికి వెళ్ళవచ్చును. ఆ చేతిరుమాలును ఆమెపై నుంచుము. నమ్ముము. దేవునియందు విశ్వాసముంచుము.
మీరు గనుక చూడగలిగిన యెడల అక్కడొక స్త్రీ యున్నది. ఆమె తన కండ్లు మూసికొనియున్నది. ఆమె తన కండ్లు తుడుచుకొనును చేతి రుమాలు పైకెత్తి ప్రార్థించు చున్నది. సహోదరి నీవు దేనినో తాకియున్నావు. నీవు నన్ను తాకలేదు, అయితే నీవు ఆయనను తాకియున్నావు. ఇప్పుడు నీకు నరములు ఉబ్బియున్నవి, స్త్రీలకు సంభవించు అనేక వ్యాధులను చిక్కులను కలిగియున్నావు. అది నిజమే. అదియే కదూ? అది గనుక నిజమైనయెడల నీ చేతిని పైకెతుము. అది సరి. ఇప్పుడు బాగుపడి ఇంటికి వెళ్ళుము.
ఆమె దేనిని తాకెను? నేను మిమ్ములను అడుగవలయునని యున్నాను. ఎవరిని, దేనిని ఆ స్త్రీ తాకెను. ప్రధానయాజకుడిని. మీరు గుర్తించగలుగుచున్నారా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఇక్కడ యున్నాడు. “నీవు గనుక నమ్మినయెడల!” జనుల మధ్య ఆ ఆత్మ యున్నది. నమ్ముట నీవలనైతే... ఈ పటములోనున్న ఆ అగ్నిస్తంభము ఇచ్చట నున్నది, జనుల మధ్య అది సంచారము చేయుచున్నది.
84
ఒక స్త్రీ నా వైపే చూచుచు నన్నే చూచుచున్నది. ఆ అగ్నిస్తంభము ఆమెపై నిలుచుకొని యున్నది. ఒక చేతి రుమాలును ఆమె నోటిలో యుంచుకొని ఈ విధముగా చేతులు పైకెత్తి యున్నది. వ్యాధి యున్నది. తలలో నరముల బలహీనత యున్నది. అది నిజమే. నేను ఆయన యొక్క ప్రవక్తయుని నీవు నమ్ముచున్నావా? క్రీస్తు నీతో మాటాలాడుచున్నడాని నీవు నమ్ముచున్నావా? ఇంటికి వెళ్ళుము, నీవు దానిని జయింపగలవు. నీ హృదయమంతటితో నమ్ముము.
అక్కడ ఆమెకు వెనుక కూర్చొనియున్న ఆ పురుషుడు, కాంప్బెల్స్విల్, కెంటకితో ఏదో విధముగా సంబంధముగల వ్యక్తి, ఉహ్-హు. నీకు కూడా నరముల వ్యాధి యున్నది; గూని, అధిక రక్తపోటు గలదు. అధిక రక్తము. అయ్యా, నీవు నీ హృదయమంతటితో నమ్ముచున్నావా? నేను చెప్పిన కార్యములు సరైనయెడల, నీకు గనుక ఆ విధమైన వ్యాధియున్న యెడల నీ చేతిని పైకెత్తుము. నీవు దేనిని తాకి యున్నావు? నీవు ఎవరినో తాకియున్నావు, ప్రధానయాజకుని తాకియున్నావు. నమ్ముచు వెళ్ళు మరి స్వస్థత నొందుము.
ఇక్కడొక లావైన స్త్రీ తన చుట్ట చుట్టుకొని తన చేతిని పైకెత్తుకొని ఇచ్చట కూర్చొనియున్నది. నేను ఆ స్త్రీని ఎరుగుదునని నేను నమ్ముచున్నాను. ఆమెను ఎక్కడో చూచియున్నాను. ఆమె ప్రార్థించుచున్నది. ఆమెకు తన తలలో బాధతో వ్యాధిగా యున్నది. మరియు నేను “తల” యని ఆ ఇంకొక స్త్రీకి కొద్ది నిమిషములకు మునుపు చెప్పిన వెంటనే, అది ఈమెపై ప్రభావము చూపినది. ఆమెకు కూడా తలలో బాధ మొదలైనది. ఆమెను నేను ఎక్కడో చూచితిని. ఎక్కడ చూచినానని సరిగ్గా చెప్పలేను, అయితే నేను ఆమెను చూచాను. అవును నేను చూచియున్నాను. ఇప్పుడు ఆత్మీయముగా కూడా నాకు తెలియునని ఎరిగియున్నాను. ఆమె లూయివిల్, కెంటకీలోనున్న రోన్ ఆస్టీన్. ఇప్పుడు నమ్ముము. ఇంటికి వెళ్లి మరి స్వస్థత నొందుము.
85
నేను నిన్ను ఎరుగుదును. నీ ముఖమును నేను ఎరిగి యున్నాను. ఒక వాహనములో మనము సంభాషించునప్పుడు నేను నీతో కూడా యుంటిని, నీవు అప్పుడు పరిశుద్ధాత్మను పొందితివి. అది నిజమే. అప్పుడు నీపై చేతులుంచగా నీవు పరిశుద్ధాత్మను పొందితివి. ఇప్పుడు ఈ సమయమున నాకు నీ యొక్క పేరు తెలియదు. అయితే నేను నిన్ను ఎరిగియున్నాను. నీవు ఒక కారు వ్యాపారము చేయుచున్నావు. నాకు తెలిసినది అంతే. నీకు గల లోపమేమిటో దానిని గురించి నాకు తెలియదు. నీకు దానిని గురించి తెలియును. [సహోదరుడు చెప్పుచున్నాడు, “అది నిజమే.”] ఏమి తెలియదు.... దేవుడు గనుక ఆ బాధ ఏమిటని బయలుపరచిన యొడల, నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన అదే దేవుడు నీకు స్వస్థత కలుగ చేయును, నీ హృదయ వాంఛలను తీర్చును. దానిని నమ్ముచున్నావా? నీకు నీవుగా నీ కొరకు నీవిచ్చటకు రాలేదు. నీ యొక్క పరిస్థితి వలన రాలేదు; నీవు ప్రేమించిన ఒకరి కొరకు వచ్చియున్నావు. అది వర్జీనియాలోనున్న ఒక సహోదరి. నీవు వెనుక నొప్పితో బాధపడుచున్న మరటువంటి వ్యాధితో నున్నారు. నీ యొక్క భార్య అక్కడ కూర్చొని యున్నది. ఆమె కూడా అవసరతలో యున్నది. [టేపు పై ఖాలీ.] ఆమె గనుక నమ్మినయెడల పాత గుండె వ్యాధి మరియు ఆ కార్యములు ఆమెను వదిలి వెళ్ళిపోవును మరియు ఆమె....
86
ఇక్కడున్న స్త్రీ కూడా మీకు పరిచయస్తురాలే. ఆమె నీ యొక్క తల్లి, ఆమె పరిశుద్ధాత్మను పొందియున్నదా లేదా యని కలవరముతో నున్నది. మరియు ఆమెను వేదించుచున్న మూత్రాశయపు వ్యాధితో మరి వేరే దేనితోనో ఆమె బాధపడుచున్నది. ఒక మంచి నిపుణుడైన వైద్యుడు చెప్పెను, “అది గర్భ సంచి దిగి యున్నది.” కొంత కాలమునకు మునుపు మీకు శస్త్రచికిత్స చేయవలసి యుండెను. మీరు శస్త్రచికిత్స చేసికొనకుండుటకు ఆయనే కారణము; అతను నీవు ఇచ్చటికి వచ్చి ప్రార్థించుకొనవలయునని కోరెను.
ఆమెకు వెనుక నిలుచుకొనియున్నవారు కూడా ఏదో బంధు వర్గమునకు చెందినవారు.ఆ యౌవ్వన స్త్రీ ఏదో విధముగా బంధుత్వమును కలిగియున్నది, అయితే వివాహము ద్వారానే ఆమె బంధువుగా నున్నది. వివాహము ద్వారా ఆమె మేనకోడలు. ఆమె కూడా తన రక్షణను గురించి వ్యాకులతతో యున్నది. అది నిజమే. మరియు ఆమె డయాబిటిస్ తో బాధపడుచున్నది, ఒక యూవ్వన స్త్రీ. ఖచ్చితముగా నిజము.
నీవు నమ్ముచున్నావా? మనము మన చేతులను దేవుని తట్టుకు ఎత్తుదము గాక, ఓ, ప్రభువా, పరలోకమునకు మరియు భూమికిని సృష్టికర్తా జీవమునకు కారణభూతుడా, ప్రతి మంచి యిూవులను అనుగ్రహించువాడా, ఇప్పుడు నీ యొక్క సన్నిదిని ఈ జనుల మధ్యకు పంపుము. వారి హృదయ వాంఛలను వారికి అనుగ్రహించుము, ప్రభువా, దీని కొరకు మేము మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. మీరు వీరిని ఆశీర్వదించి మరియు వారి అక్కరలను వారికి మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున తీర్చమని ప్రార్థించుచున్నాము. ఆమెన్.
87
ఎందరు నమ్ముచున్నారు? నాకు గుర్తులేదు. అయినను ఏదో విధముగా అది ఈ వరుస ద్వారా ఎవరి మీదనో వెళ్ళియున్నది. అదంతయు సత్యమేనా? మీ చేతులను పైకెతుడి. అది ఎవరితో మాట్లాడి యున్నదో, అది సత్యమేనా? సమస్తమును నిజము. అట్లైన పరిశుద్ధాత్మ ఇక్కడ యుండుటయు నిజమే. అది సత్యమే కదూ?
ఇప్పుడు, ఆయన సేవకునిగా నన్ను నమ్ముడి. నేనెరుగుదును. మీరు సంచరించుచున్నారని, మీరు అలసటగా యున్నారని నాకు తెలియును. సందేహింపకుడి. ఇది ఆయనేయని నమ్ముడి. పెంతెకోస్తు దినమున మేడగదిలో బలమైన గాలివలె వచ్చిన అదే కార్యము, అదే పరిశుద్ధాత్మయే, ఈ జనులు అంగీకరించినప్పుడు వారిని ఇక్కడ కదిలించినది. ఇప్పుడే ఇక్కడే మీలో ప్రతియొక్కరిపైన మీ చుట్టూ అది సంచరించుచున్నది. మీ మధ్య బయట జనుల మధ్య పరిశుద్ధాత్మ సంచరించుచున్నది.
ఎందరు.... ఈ యొక్క బైబిలు నా ముందు యుండగా, దీనితో మీరు ఏ విధముగా నిజాయితిగా యున్నారో, ఆ విధముగానే మీరు నాతో నిజాయితిగా నుండవలయునని నేను మిమ్ములను కోరుచున్నాను. ఏదో ఒకటి వచ్చినట్లుగా నుండు ఒక అనుభూతిని ఎందరు అనుభవించుచున్నారు? అదియే పరిశుద్ధాత్మ. అది ఆయనే.
88
ఇప్పుడు, నన్ను నమ్ముడి. నాయొక్క మాటలు సత్యము ఏలయనగా దేవుడు ఆయన యొక్క సత్యమును బైబిలు ద్వారా నిరూపించుచున్నాడు. ఆయన యొక్క పునరుత్థాన శక్తి ద్వారా నిరూపించి యున్నాడు. విజ్ఞాన పరిశోధన ద్వారా నిరూపించియున్నాడు, ఇక మీదట దానిని నిరూపించుటకు ఏదియును లేదు అన్నిటి ద్వారా నిరూపింపబడి యున్నది. ఆయన దేవుడు. అదిక్కడ యున్నది. అట్లైన నన్ను నమ్ముడి నేను మీకు సత్యమును చెప్పుచున్నాను. ఇప్పుడు మీలో ప్రతియొక్కరును బాగుగా స్వస్థత నొందునట్లు దేవుని యొక్క సన్నిధిలో యున్నారు. దానిని మీరు నమ్ముచున్నారా?
ఇప్పుడు, మీరు ఏమి చేయవలయునని నేను కోరుచున్నానో దానిని మీకు చెప్పెదను. మీరెక్కడున్నను, ఫరవాలేదు మీలో ప్రతియొక్కరును ఒకరిపై ఒకరు చేతులు ఉంచవలయునని నేను మిమ్ములను కోరుచున్నాను, కావున అది నేను కాదని మీరు చూచెదరు. మీరు అమోఘమైన వారు. మీరు ఒక విశ్వాసి. ఆ యొక్క పరిశుద్ధాత్మను మీరు అనుభూతి చెందినయెడల, అది మీ పై నున్నది. ఈ విధమైన వరమువలె కాదు, అయితే ఆ పరిశుద్ధాత్మ మీపై నున్నది.
ఎవరైనను ఫరవాలేదు, ఎవరి మీదైనను చేతులుంచండి మరటు పిదప మీ తల వంచుడి. మీ చేతులు ఎవరి మీదైనను ఉంచండి మరి మీ తలవంచండి. దీనిని చేయునట్లుగా నేను నడిపింపబడి యున్నాను. ఇది మీ యొక్క స్వస్థతకు తగిన సమయమని నేను అనుకొనుచున్నాను. “నీవు గనుక నమ్మినయోడల.” ఓ, పరిశుద్ధాత్మ జనులపై కదలాడుచున్నది!
89
జార్జియా నుండి వచ్చిన దూరముగానున్న ఆ చిన్న వ్యక్తి, అక్కడ దూరముగా వెనుక కూర్చొనియున్న నీ సహోదరునికై ప్రార్థించుచున్నాడు; విశ్వాసము కలిగియుండుము, నమ్ముము, ఓ, అది ప్రతిచోటను నున్నది, ప్రతిచోటను నున్నది.
ఇప్పుడు, మీ కొరకు మీరు ప్రార్ధి౦చకండి. మీ చేతులు ఎవరిపై నుంచి యున్నారో ఆ వ్యక్తి కొరకు మీరు ప్రార్థించండి. మీరు ఆ విధముగా చేసినయెడల అది మీలో ప్రతియొక్కరును ఒకరికొకరు ప్రార్థించునట్లుగా చేయును.
ఇప్పుడు, మృతులలో నుండి లేచిన ప్రభువైన యేసు, దేవుని కూమారుడా, పొంతి పిలాతు యొక్క బెదిరింపులు గాని మరియు రోమను ప్రభుత్వము యొక్క ముద్రగాని నిన్ను సమాధిలో బంధించ లేకపోయినవి. ఈస్టరు దినమున సర్వశక్తిమంతుడగు దేవుడు క్రిందికి దిగి వచ్చి మరి ఆ బండను దొర్లించెను, ముద్రను పగలగొట్టెను మరియు నీవు లేచి మరి నీ శిష్యులతో నలువది దినములు యుండి, ఇప్పుడు నెరవేరుచున్న ఈ కార్యములు సర్వలోకమున వెళ్లి చేయుమని వారికి ఆజ్ఞాపించి యున్నావు. అది రెండు వేల సంవత్సరములకు ముందు జరిగినది.
ప్రభువా, నీవు దేవుడవు. నీవు అపజయము నొందవు. మీరిక్కడ యున్నారు. ఈ ఉదయమున మేము కలిగిన ఈ ఆలోచన సమావేశము, ఈ కార్యములను గురించి మేము ఒక్కటిగా కారణ కార్యములను చూచియున్నాము. మీరు దేవుడని మేము ఆలోచించియున్నాము; మీరు దేవుడని దాని కారణమును మేము ఆలోచించి యున్నాము, మరియు మీరిక్కడ నుండు కారణమును ఆలోచించియున్నాము. మరియు ఒకరిపై ఒకరు చేతులుంచవలయునన్న మీయొద్ద నుండి పొందిన ఆజ్ఞను ఇప్పుడు మేము కలిగియున్నాము. మీరు మేము చేయవలయునని చెప్పిన కార్యమదియే. మీరు చెప్పియున్నారు, “నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు.” అదియే ఆలోచన సమావేశము ద్వారా మనకు వచ్చిన అధికారము. ప్రభువా, ఇప్పుడు “బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్ఠము.”
90
ప్రభువా, ఇప్పుడు, మీ యొక్క సేవకునిగా ఈ జనులను కలవరపెట్టుచున్న ప్రతి దయ్యమును, ప్రతి ఆత్మను, ప్రతి వ్యాధిని, ప్రతి బాధను, వేదనను, జనులకు వ్యతిరేకముగానున్న ప్రతిదానిని నేను ఆజ్ఞాపించుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యాధారముతో, నాయొద్దకు పంపబడిన దూత ద్వారా ఇవ్వబడిన అధికారమును బట్టి దేవుని వాక్యము ద్వారా నేను ఈ ఆత్మను సవాలు చేయుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమున వ్యాధి, బాధల కారణమగు; ఈ ఆత్మ జనుల నుండి బయటికి వచ్చి మరి వారు ఆరోగ్యవంతులగుదురు గాక! వారిని వెళ్ళనివ్వు, సాతాను నీవు ఒక అబద్ధికుడివి. నిన్ను మేము పడద్రోసితిమి. అన్యజనులకు మునుపు వారి మధ్య యేసుక్రీస్తు తననుతాను బయలుపరచుకొను సమయము వచ్చియున్నది.
సాతానా, ఇప్పుడు నీవు ఓడిపోయున్నావు. ఒకప్పుడు నీవు జనులను బంధించి యుంటివి. ఇప్పుడు నీకు ఏ బాధల కారణమగు హక్కులు లేవు. నీవు కలిగియున్న ప్రతి హక్కును దేవుడు కల్వరిలో నాశనము చేసెను. ఆయన సంపూర్ణముగా క్రయమును చెల్లించెను, మరియు “ఇదిగో సమాప్తమాయెను” అని చెప్పెను, ప్రతియొక్క సంపూర్ణమైన రక్షణ ప్రణాళికను, సంపూర్ణ స్వస్థతను, సమస్తమును కల్వరిలో ముగింపబడెను. పాపము ద్వారాను, మరియు పడిపోవుట ద్వారాను నీవు ఒకప్పుడు నీ స్వాధీనములో కలిగియున్న సమస్తమును, నీ యొద్ద నుండి తీసివేయబడి యున్నది. ఇప్పుడు మేము యేసు రక్తము ద్వారా విమోచింపబడి యున్నాము. మరియు నీవు ఇక మీదట మమ్ములను బంధించి యుంచలేవు. “ప్రభువైన యేసుక్రీస్తు నామమున మమ్ములను వదిలిపొమ్ము,” అని మేము చెప్పుచున్నాము.
91
ఇప్పుడు మీ చేతులు ఒకరిపై ఒకరు ఉంచుడి. ప్రార్థించండి. మీ చేతులు పెట్టి అలాగే యుంచుడి..... ప్రార్థించండి. ప్రతియొక్కరు “దేవుడు సమీపముగా నున్నాడని, తలంచుకొనుచుండండి. దేవుని ఆత్మ ఇక్కడ యున్నది. దేవుడు నన్ను స్వస్థపరచుచున్నాడు. ఆయన మంచితనము, ఆయన కృప, ఆయన దయ, ఆయన వాగ్దానము నాలో నిజరూపమును ధరించుచున్నవి.”
మనము వారములు వారములుగా బోధించినను. ఇప్పుడు అది ఏ విధమైన వ్యత్యాసమును కలిగించదు; పరిశుద్ధాత్మ ఇక్కడ యున్నది. ఇప్పుడు సరిగ్గా ఇక్కడ యుండునట్లు, ఏ సమయములోనైనా దానిని అది చేయగలదు.
“ఇప్పుడే ఇక్కడే దేవుడు యున్నాడని పరిశుద్ధాత్మ నాకు నిరూపించుచున్నాడనియు, బయలుపరచుచున్నాడనియు నేను నమ్ముచున్నాను. నేను ఆయనను నమ్ముచున్నాను. అది ముగించబడిన క్రియ. నేను దానిని కలిగియున్నాను. అది నా స్వాస్థము. ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ ద్వారా నింపబడుచున్నాను. నా యొక్క వ్యాధులు, నా బాధలు, మరియు నా నొప్పులు వదిలిపోవుచున్నవి. నా యొక్క, బాధలన్నియును నాయొద్ద నుండి దూరముగా పోవుచున్నవి.” మీ తలవంచి, కండ్లు మూసికొని మరి ఆ విధముగానే ప్రార్ధి౦చవలయును. (నమ్మిన మాత్రము చాలును)
ఇప్పుడు మీ తలలు వంచుకొని యుండుడి. మనమిప్పుడు నెమ్మదిగా పాడబోవుచున్నాము.
నమ్మిన మాత్రము చాలును...............
కొండమీద నుండి క్రిందికి దిగి వచ్చినప్పుడు...... మూర్చ రోగము గల బిడ్డ... అక్కడ శిష్యులు ఆలోచన సభలో యుండి...