క్రీస్తుతో గుర్తించబడుట

క్రీస్తుతో గుర్తించబడుట

VGR COUNT-129 మీకు చాలా వందనములు. ప్రభుని నామము పేరట తిరిగి వచ్చుటకు నేనెంతో సంతోషించుచున్నాను. ప్రారంభమందు కొద్దిగా బొంగురు గొంతుకతో యున్నాను, కాని కొద్దిసేపటి తరువాత ప్రభువు రెండవ గేరులోకి వెళ్ళనిచ్చును. ఈ వారములో చాలా కూటములలో మాట్లాడితిని. అక్కడ చాలా ప్రశ్నలకు జవాబులు ఇయ్యబడినవి. అంతట వేడిగానున్న భవనములో నుండి బయటకు వచ్చుట జరిగెను. అది అంత ఎక్కువ జలుబు కాదు. నా జీవితములో ఇంత బాగా యుండుట ఎన్నడూ జరుగలేదు. కనుక నేను చక్కగా యున్నాను, అయితే నా గొంతుకు భారము ఎక్కువైనది. అది సరియగును. మీరు చేసిన ప్రతిదాని కొరకు మీలో ప్రతి ఒక్కరికి నేను వందనములు చెల్లించగోరుచున్నాను.

రెండు నిమిషములు క్రితము నేను కారు నడుపుకొని వచ్చుచూ, (బిల్లీ, మరియు ఇంకా కొందరు ఆ బయట ఉన్నారు) వచ్చిన ఒక చిన్న కుటుంబమును కనుగొన ప్రయత్నించాను. వారు ఏదో జరుగుట వలన మరలి వెళ్ళలేకపోయిరి. వారింకా భవనములో యున్నచో వారి చేతులను ఎత్తియో, మరో విధముగానే చూపించవలెనని కోరుచున్నాను. నా కొరకే అది నేను కోరుచున్నాను. ఆ చిన్న కుటుంబము మిషిగాన్ లేదా మరెక్కడ నుండియో వచ్చుచుండగా ఇంధనము అయిపోవుటయో లేక మరేదో, లేక ద్రవ్యము అయిపోవుటయో జరిగినది. మీరింకా ఈ పట్టణములోనే యున్నచో... కూటము తదుపరి వారిని మీరు చూచినచో నా ఇంటికి వారిని పంపించండి. చూచారా? దానిలో ఒకటి నేను కోరుచున్నాను. ఎవరికయినా గాని సాధ్యమైనంత మేరకు చేతిని సహాయము కొరకు ఇయ్యవలెను, అందుకే ఇక్కడ మనము ఉన్నాము. కనుక ఇప్పుడు, ప్రభువైన యేసు మనలను దీవించవలెననునదియే మన ప్రార్ధన.

2

ఇప్పుడు, ఇది ఒక అసామాన్య వారము. మనకు కొన్ని వాడుకలో లేని సంగతులు జరిగెను. ఈ వారము, ఈ కూటములో పరిశుద్ధాత్మ ఇంత స్వేచ్చగా సంచరించుట నేనెన్నడూ చూచియుండలేదు అని చెప్పెదను. నాకది సంపూర్ణ ఆశ్చర్యముగా యున్నది. రాత్రులందు కొన్నిసార్లు ఉదయము 1 గంట అయ్యెడిది, అప్పుడు నేను పరుండెడివాడను. ప్రభువైన యేసు మనకు ఇంత మంచిగా ఉండుటను గూర్చి ఆలోచించుచూ నేను ఆనందించెడివాడను

మరియు ఇప్పుడు, నేను ఈ పట్టణములో గాని, ఈ చుటుప్రక్కల గాని, లేదా “ఇరుగు పొరుగు” గాని ఉన్నవారికెవరికయినా ఇంకా గృహము లేనిచో (సంఘ గృహము) ఏ సమయములోనైనా మీరు వచ్చి దానిని మీ గృహముగా చేసికొనుటకు ఆహ్వానించుచున్నాము. గుర్తించుకొనండి, మనకు ఇక్కడ ఏ సభ్యత్వము లేదు, అందరికీ సహవాసమే. హవర్డ్ కేడిల్ ఈలాగు చెప్పుచుండెడి వాడు, “శాసనము లేదు గాని ప్రేమయే, కల్పనా సిద్ధాంతము లేదు గాని క్రీస్తే, బైబిలు తప్ప మరే గ్రంథము లేదు.” కనుక మీరందరూ ఎల్లప్పుడూ - ఈ చిన్న ఆలయమునకు ఆహ్వానితులు, మేము ఎదురుచూచుచున్నాము, ప్రభుని చిత్తమయితే వీలయినంత త్వరలో ఒక మంచి సంఘమును నిర్మించవలెను - ఇంకా అనుకూలముగా నుండు స్థలము, మరీ పెద్దది కాదు. ఎందుకనగా యేసు త్వరగా వచ్చునని మనము నిరీక్షించుచున్నాము, మరియు మరీ అంత పెద్దదాని మీద మనము కేంద్రీకృతము కారాదు; ఏదో ఒకటి కావలెను.... ఇది పడిపోవనైయున్నది. ఇది తాను ఉద్దేశించిన పనిని చేసినది. దానిని బట్టి మేము చాలా వందనములు చెల్లించుచున్నాము.

3

నేనెన్నడూ మరచిపోను, ఇప్పుడు ఈ వేదిక ఉన్నచోట ఇరవై ఏండ్ల క్రితము ఒక పాత చెరువు వుండెడిది. అందులో నేను మోకరించాను. నా తల మీద గుర్రపు డెక్క చుట్టుకొనెడిది. ప్రభువు ఈలాగు చెప్పెను, “ఇక్కడ నీ ఆలయమును నిర్మించుము.” ఆ చిన్న స్థలము కొరకు మేము ఇన్గ్రామ్ యొద్దకు వెళ్ళి నూట అరవై డాలర్లను అతి కష్టము మీద కొన్నాము. ఇది ఒక మంచు చెరువు. మేమంతా దీని మీద స్కేటింగు చేసేవారము.

సహో, జెస్ స్పెన్సర్ మరియు సోదరి స్పెన్సర్ ఇక్కడ చెరువున్న సంగతిని గుర్తించుకొనియే యుందురు; దానిని మీరు మరువలేదనుకొంటాను. వారు టీములను తీసికొని వచ్చి చెరువులో పడకుండునట్లుగా ఆ త్రోవలో మళ్ళించెడివారు. ఇన్గ్రామ్ విల్లె స్కూలులో నేను ఒక చిన్న బాలునిగా ఉంటిని. ఇది ఒక చెరువు. ఇక్కడికి వచ్చి, మంచు మీద స్కేటింగు చేసెడివారము - (“shinny”) అనబడే ఆట, ఇంకా ఏవేవో ఈ చెరువులో ఆడేవారము. మైక్ సోదరుడా, నీకు ఇది చెరువని గుర్తు౦డును. అవునండీ! ఆ వెనుకనున్న సహో. రాయ్, చెరువున్నచోట... దానిలో కొంత భాగమును మనము విడిచిపెట్టాము, అది ఈ వెనుక నున్నది. పాప క్షమాపణ నిమిత్తము జనులకు బాప్తిస్మము అందులోనే ఇచ్చుచున్నాము.

4

ఇప్పుడు అది..... మీరెరుగుదురు, మీరు ప్రశ్నలు తీసికొని వచ్చి, మీరు మరేదయినా చెప్పగోరినప్పుడు అది సమస్యగా యుండును, ఎందుకనగా మనకు కలగలుపు జనాంగమున్నది. ప్రజలకు ఏదో విధముగా బోధించబడినది. కాని నీవు ఒక సంగతి వివరించినప్పుడు, అది వారు నేర్చుకొనిన దానికి వేరుగా యున్నా సరే, వారి ఆత్మ యొక్క మాధుర్యము వెనుకకు ప్రవహించును. అదే నాకు భక్తి. ఏ ప్రత్యేక పేరును నేను ఉదహరించగోరుట లేదు, కాని ఒక పట్టణము వెలుపల నుండి వచ్చిన డాక్టరు నన్ను గదిలో కలిసికొనెను. ఒక వైద్యుడు అని అనుకొనుచున్నాను. అతడు చెప్పెను... సంవత్సరాల తరబడి అతడు ఆ విధంగా చిక్కుకొని యుండెను. దాని గూర్చి వ్రాయబడిన ఒక గ్రంథమును అతడు చదివెనట, నేను బోధించుచున్నదానికి అది వేరుగా యుండెను. కాని కూటములో కూర్చొని వాక్యవాస్తవములను వివరించుట చూచినప్పటినుండి పూర్తిగా స్థిరపరచబడెను.

5

కొద్దిసేపటి క్రితము పట్టణము బయటనుండి వచ్చిన కొందరిని గదిలో కలిసికొన్నాను. ఇల్లినాయ్ నుండి వచ్చిరి. మరియు అక్కడ నలుగురు సేవకులు అచ్చట యుండిరి. వారీలాగు చెప్పిరి, “బ్రెన్హాం సోదరుడా, మా జీవితమంతయూ వేరే విధముగా నేర్పించబడినాము, కాని ఇప్పుడు మేము దర్శనమును పట్టుకొన్నాము. నిజంగా సత్యమేమిటో చూచుచున్నాము. అది చూచి ఆశ్చర్యపడుచున్నాము.” చూచారా? ఇప్పుడు అది...

ఇప్పుడు మనము అదే అయి యున్నాము, చూచారా. సోదరుడా, అదే అయి యున్నది. ఏ సంఘమునయినా లేక ఏ ప్రజలనయినా అది కించపరుచునని అనుకోవద్దు. అది కేవలము సంఘమును పైకి తెచ్చును. చూచారా? అప్పుడు, మనందరము కలిసి నిలబడవలెను. పెంతెకోస్తు యొద్ద దేవుడే తన్నుతాను విభజించుకొనెను. ఆ అగ్నిస్తంభమును చిన్న చిన్న అగ్నిస్తంభపు ముక్కలుగా విడగొట్టి జనుల మీద వ్రేలాడదీసెను, వారి మీదికి పరిశుద్దాత్మ వచ్చెను. దేవుడే మనమధ్య తన్నుతాను విభాగించుకొనినప్పుడు. ప్రతిసారి మనకు ఒకటి చేర్చును. దానివలన ఎల్లప్పుడునూ అగ్నిస్తంభము చుట్టు మరెన్నో విస్తరించుచుండును. అదంతయూ కలిపి క్రయధనమిచ్చి విడిపించబడిన గొప్ప దేవుని సంఘమే. ఎంతో నిశ్చయముగా మనందరము ఆకాశమునకు ప్రయాణించుదుము.

6

సోదరుల మధ్య విభేదమును లేదా వేర్పాటును చల్లుటకు ఎన్నడునూ నేను ప్రయత్నించలేదు. ఇతర వ్యక్తిని అర్ధము చేసికొనుటలో ఉండవలసినంత దయతో ఎల్లప్పుడూ నేను ఉండుటకు శాయశక్తులా ప్రయత్నించాను. నా కూటమునకు చేయూతనిచ్చుచున్న సంఘములు. వారు గాని.... ఒకరితో ఒకరు విభేదించుకొనినప్పటికిని, నన్ను ప్రేమించుచున్నారు, అయినా వారు నా కూటములకు చేయూతను ఇచ్చుచున్నారు. ఆ జనుల మధ్యకు నేను వచ్చుచున్నాను. ఒక్క మాట కూడా నిశ్చయముగా నేను చెప్పను... ఒక పెద్ద మనిషి ఆలాగు చేయజాలడు, ఒక క్రైస్తవునిగానే ఉండనీయుడి నిశ్చయంగా ఆలాగు చెప్పరు. ప్రభుని చిత్తమయితే, ఒక దినమున రెండు కూటములు ఏర్పాటు చేయవలెనని నేను తలంచుచున్నాను. అప్పుడు నేను.... ఈ బోధలలో ఏదయినా గాని నేను బోధించుటకు ముందుగా, అనేక దినముల పాటు సేవకులతో ఉదయకాలపు సమావేశములు ఏర్పరచుదును. నేను ఏమి బోధించనైయున్నానని వారికి తెలియనిచ్చెదను. మరియు ఏ సోదరుడయినా గాని దానిని కాదన్నచో, సమ్మతించనిచో, అప్పుడు వారి సంఘముతో ఈలాగు చెప్పనిచ్చుదును, “మీరిది వినవద్దు. దానిని వారు బోధించుచుండగా మనము దూరముగా ఉందము. (చూచారా?) వారికి ఆ హక్కు ఇచ్చుదము.” మేము ఎల్లప్పుడూ దేవునితో ఐక్యతను, ఆయన బిడ్డలు ప్రతివారితోను పొందికను కలిగియుండగోరుచున్నాము.

7

ఇప్పుడు, ప్రభుని చిత్తమయితే ఈ రాత్రి నేను జవాబు ఇయ్యవలసిన ప్రశ్న ఒకటున్నది. ఈ ప్రశ్నకు జవాబును, ఇక్కడ మరియొకటి ఉందనుకొన్నాను, కాని ఇది ఎవరో ఇచ్చిన కల, దానిగూర్చి నన్ను ప్రార్ధించి అర్ధము చెప్పమని వారడిగిరి. ఆలాగే అనేకసార్లు చేయుటకు ప్రభువు ఎన్నోసార్లు తన కృపను అనుగ్రహించెను.

ఇప్పుడు, ఆరాధనను ఆరంభించు ముందుగా మేము ఏర్పాటు చేయు ప్రతి కూటమునకు, ప్రతిసారి హృదయపూర్వకముగా ఆహ్వానించుచున్నామని మీకు తెలియ చేయుచున్నాము. లూయిస్విల్ నుండి, పట్టణము బయట నుండి, నగరము వెలుపల నుండి, చుట్ట ప్రక్కలనుండి ఈ చక్కని సేవకులు, సెల్లర్స్ బర్గ్ నుండి వచ్చిన సోదరుడు, గాయకులు (ఆమె ఎవరో గాని చాలా సేపటి నుండి ఇక్కడ పాడుచున్నది, ఆ చిన్న స్త్రీ), అందరకు మేమెంతో వందనములు చెల్లించుచున్నాము. ఆ వెనుకనున్న కొందరు సోదరులతో మేము మాట్లాడుచున్నాము. అసలు వారెవరో చూచు అవకాశమే నాకు దొరకలేదు. అదేమిటో తెలియదు, కాని నిశ్చయంగా దానిని నేను విన్నాను. అది చక్కగా యున్నది, మరియు ఆ ప్రయత్నమును తప్పక నేను అభినందించుదును.

8

ఇప్పుడు, మనము గత రాత్రి దీనిని నేను పోగొట్టుకొన్నాను. నా కుమారుడు దీనిని నా జేబులో ఉంచెను. ఒక ప్రశస్థ వ్యక్తి దీనిని వ్రాసెను మరియు ఇప్పుడు గురుంచుకొనండి. ఈ ప్రశ్నలు భేదమును పుట్టించుటకు కాదు. కొన్నిసార్లు అవి వ్రాయబడిన తీరును బట్టి అవి వేరుగా వినబడును, కాని అది యధార్ధ హృదయమునుండి వెదకుచున్న ప్రయత్నము. చూచారా? ఆ విధంగానే మనము ఎల్లప్పుడూ దానిని సమీపించుదుము. ఏది సరియో అవి ఒక నిజమగు యధార్థపరుడు కనుగొన ప్రయత్నించుచున్నాడు.

ఇప్పుడు, కొంత కాలము క్రిందట ఇక్కడ ఒక ఇంటికి ప్రార్ధన కూటమునకు నేను వెళ్ళాను. మరియు సహో. జూనియర్ జాక్సన్ (కొద్దిసేపటి క్రితం ఆయన మాటలు విన్నాను లేక ఆలాగు తలంచాను) ఆయన నాతో ఉండెను. ఆయనే మాట్లాడెను. అక్కడ మరో సంఘము నుండి వచ్చిన సేవకుడుండెను; నేను ఇంకా లోనికి వచ్చుచుండగానే అతడు దూకి నాతో సరదాగా ఏదో చేయసాగెను. అక్కడ అయిదుగురు సేవకులుండగా ఇది జరుగసాగెను, వారందరూ అతని మీదికి ఎగిరిపోయిరి. “వద్దు, ఆలాగు చేయవద్దు, అతడు నన్ను సవాలు చేసెను, కనుక అతనిని నన్ను మాట్లాడుకోనీయండి,” అన్నాను.

మంచిది, అతడు ప్రారంభించెను. “బైబిలు ఎక్కడ మాట్లాడునో మేము అక్కడే మాట్లాడుదుము, ఎక్కడ నిశ్శబ్దముగా యుండునో అక్కడ నిశ్శబ్దముగా యుందుము.” అని ఏవేవో చెప్పెను. మరియు వారు వెళ్ళిపోయిరి. కొద్ది క్షణములలో అతడు తప్పుగా అన్వయించుచూ, తప్పుగా వాడుచున్న లేఖనములను నేను వ్రాసికొనుచున్నాను, “పండ్రెండు మంది తప్ప పరిశుద్దాత్మను పొందినవారు మరెవరూలేరు, వారు అపోస్తలులు. దైవిక స్వస్థత ఆ పండ్రెండు మందికి మాత్రమే ఇవ్వబడెను,” అని ఇంకా ఏదో చెప్పెను. కనుక మీరు ఆ గుర్తును చూడండి, అతడు మిలియను మైళ్ళ దూరంలోనే తప్పిపోయెను, కనుక తరువాత నేను..... అతడు అర్థగంట మాట్లాడిన తరువాత, అతనిని నేను అడిగాను..... నన్ను అపవాది, అని అతడు చెప్పెను.

9

కనుక అప్పుడు, అతడు మాట్లాడిన తదుపరి నేనిట్లు చెప్పాను, “ఇప్పుడు, నేను మొదటగా చెప్పు సంగతి ఏమనగా, సోదరుడా, దానిని బట్టి నిన్ను నేను క్షమించుచున్నాను, ఎందుకనగా నీకు తెలియకుండానే ఆలాగు పలికితివి. నీకు తెలియదని నేనెరుగుదును. ఎందుకనగా నీవు, నేను సేవకులము గనుక మనము సోదరులము.” చూచారా? అప్పుడు నేను అన్నాను. “ఇప్పుడు వాక్య విషయములో మనము పరస్పరము అపార్ధము చేసికొనుట చాలా భేదముతో కూడినది.”

కనుక అప్పుడు, మేము వాక్యము తీయనారంభించాము. ఆ నిస్సహాయుడు ఒక్క నిమిషములోనే అయిపోయాడు, ఎక్కడ నిలబడవలెనో, ఏమి చేయవలెనో అతనికి తెలియలేదు. అప్పుడతడు ఎంతో ఇరుకులో పడిపోయి ఏమి చేయాలో తెలియక, ఆ రాత్రి భవనములో నుండి నడిచి వెళ్ళుచూ ఇట్లనెను. “బ్రెన్హాం సోదరుడా, ఒక్క సంగతి నేను చెప్పుదును. నీవు క్రీస్తు ఆత్మను కలిగియున్నావు.” చూచారా?

అంతట నేను ఇట్లు తలంచాను, “కొద్ది నిమిషముల క్రితము దయ్యము, ఇప్పుడేమో క్రీస్తు ఆత్మ అనుచున్నాడా?” నీవు ఆ విధంగానే సమీపించుదువు. అంతే. క్రీస్తు.... నేను తొందరపడినచో....

ఆ వ్యక్తి ఆలాగు చేసినందున అతనికి భయంకరమగు సంగతులు జరిగెను. దాదాపు అతడు పిచ్చివాడాయెను, ఒక భవనము లేదా మరెక్కడ నుండియో ఒక కిటికిలో నుండి దూకి దాదాపు చనిపోయెను. ఇప్పుడతడు తిరిగి కొందరు నా మంచి స్నేహితుల యొద్దకు వచ్చుచున్నాడు. అతడు ప్రతిరోజూ పరిశుద్ధాత్మ బాప్తీస్మము కొరకు వెదకుచున్నాడు. పరిశుద్ధాత్మను పొందుటకు చేతులుంచమని కోరుచూ నా గృహమునకు రాగోరుచున్నాడు. ఒక గొప్ప శాఖ యొక్క బోధకుడు, చూచారా?

10

కనుక, మాకు తెలిసినంతవరకు యధార్ధ-హృదయముతో ప్రశ్నలకు జవాబులు ఇచ్చెదము.

మరియు ఇప్పుడు, ఈ ప్రశ్నను నేను చదువుదును, చక్కగా వ్రాయబడినది:

ప్రశ్న: బ్రెన్హాం సోదరుడా, అపో.కా., 2 మరియు 6 అధ్యాయములలో కూడి వచ్చిన జనుల ఎదుట అపా.కా. 2 మరియు 4 అధ్యాయములలో ప్రజలు ఎందుకు ఇతర భాషలు, లేదా భాషలలో మాట్లాడిరో దయచేసి వివరించుదువా?

అది మొదటి ప్రశ్న; ఒకే వ్యక్తి, అని నేను అనుకొనుచున్నాను. అవును. అదే వ్యకి.

మంచిది ఇప్పుడు, మీరు గమనించండి, సోదరీ, సోదరుడా, వ్రాసిన వారెవరయినా గాని, అక్కడ వారు మేడ గది నుండి క్రిందికి వచ్చినట్లుగా ఒక్క మాట కూడా వ్రాయబడలేదు. మరియు సమూహములు మేడ గదిలో లేరు. కాని వారు సమూహములు కూడియుండిన బయటి ఆవరణలోనికి వచ్చినప్పుడు వారు భాషలతో మాట్లాడుట వినిరి. చూచారా? చూచారా?

ఇప్పుడు మీరు చెప్పగలరు, “వారు పైన అక్కడ మాట్లాడిరి,” అది ఒక వాదముగా లేక వాగ్వివాదముగా తీసికొన్నచో వారు క్రిందికి వచ్చు వరకూ మాట్లాడలేదను హక్కు మీకున్నది. “ఈ శబ్దమును బయట వారు విన్నప్పుడు....” చూచారా.

11

ఇప్పుడు, మరొకటి యున్నది ఇక్కడ, దానితోనే ఇదియును వెళ్ళును:

ప్రశ్న: అపో, కా 8:18లో పరిశుద్దాత్మ ఇయ్యబడినదని సీమోనుకు ఎట్లు తెలియునో వివరించెదవా? అది సమరయు యొద్ద.

మంచిది, ఒక్క సంగతి అక్కడున్నది: భాషలు మాట్లాడుచున్నందున వారు పరిశుద్దాత్మను పొందియున్నారని అతడు ఎరుగడు, లేదా వారాలాగు చేసిరనియు బైబిలు చెప్పలేదు; వారు కేవలము ఫలితములనే చూచిరి. వారిలో ఏదో జరుగకుండా ఎవరునూ పరిశుద్ధాత్మను పొందజాలరు అది నిజము అక్కడ వారు భాషలలో మాట్లాడిరనియు చెప్పబడలేదు, కనుక అతడు భాషలలో మాట్లాడుట గాక మరేదో చూచెను, ఎందుకనగా వారు భాషలలో మాట్లాడినట్లుగా ప్రస్తావించబడలేదు.

12

ప్రశ్న: మరియు పెంతెకోస్తు దినమున జనులలో కొందరు గలీలయ భాషను మాట్లాడిరని ఎట్లు తెలియునో వివరించుము? అక్కడున్న వారిలో ఎక్కువ మంది గలీలయులు, మరియు వారందరూ. ఈ ఉదయమున నేను చెప్పినటుగా, అక్కడ రెండు సంగతులు, రెండు వర్గములున్నవి. ఇప్పుడు, నేను భాషలతో మాట్లాడుట గూర్చి చెప్పు వారి పక్షము వహించుదును - భాషలలో మాట్లాడని జనులు, కాని వారు భాషలతో మేడ గదిలో నుండి వచ్చి జనులను కలిసికొనసాగిరి. కాని మీరు వాక్యము చదివినచో... ఇప్పుడు జాగ్రత్తగా వినండి:

..మాట్లాడు వీరందరూ గలిలయ వారు కారా?

మరియు వీరందరునూ మన మాతృభాషలో మాట్లాడుట వినుచున్నాము గదా?

....ఈ మాట్లాడు వారందరూ గలిలయ వారు కారా?

13

వారు గలిలయ భాషలో మాట్లాడియుండవచ్చును, కాని వారు ఇతర భాషలో మాట్లాడుట వినుచుండిరి. వారు తమ స్వంత భాష, మరో భాష మాట్లాడుచూ యుండవచ్చును, ఏదయినా గాని బాధ లేదు. అయినను అది పెంతెకోస్తు భావనను సరిచేయదు. (చూచారా?) ఎందుకనగా వినండి. ఎందుకో చెప్పెదను. ఏదో వేరయినది చెప్పవలెనని కాదు, కానీ - వాస్తవములను సూటిగా చెప్పవలెను. మీరు గమనించినచో.... అప్పుడు పేతురు లేచి ఆ జనులందరితో ఎందుకు మాట్లాడెను? అక్కడున్న వారందరూ అతడు తమ తమ భాషలో మాట్లాడుట వినిరి, కరడు గట్టిన మూడు వేలమంది యూదులు మారిరి, వారు తమ మత విషయములో బహు నిష్ట కలిగియుండిరి. కాని వారిలో ప్రతిఒక్కరు, పేతురు ప్రవక్తలు మొదలగు వారిని గూర్చి చెప్పిన ప్రతిదియూ ఆ పెంతెకోస్తు దినమున అర్థము చేసికొనిరి, ఎందుకనగా వారు ఈలాగు కేకలు వేసిరి, “అయ్యలారా, సోదరులారా, రక్షణ పొందుటకు మేము ఏమి చేయవలెను?” చూచారా?

పేతురు ఇలాగు చెప్పెను, “మారుమనస్సు పొంది, పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి.”

14

ఇప్పుడు, నా హృదయమంతటితో దీనిని చెప్పనీయండి, ఎందుకంటే నేను మీకు ఏది చెప్పవలెనని ప్రయత్నించుచున్నానో మీరు చూడవలెను. భాషలలో మాట్లాడుటను నేను నమ్ముచున్నాను. సంఘమునకు అది ఒక వరము అని నమ్ముచున్నాను. భాష అనునది ఒకటున్నదని నేను నమ్ముచున్నాను. నాయంతట నేనే అనేక సార్లు భాషలలో మాట్లాడాను.

పెంతెకోస్తు అనగా ఏమనుకొనుచున్నానో మీకు ఒక చిన్న ఉదాహరణను ఇవ్వనీయండి. అది ఈలాగున్నది: ఈ చిత్రము తీయబడుటకు ముందు నేను డల్లాస్- హూస్టన్ టెక్సాస్లో యున్నాను. (సుమారు ఒకరోజు) మ్యూజిక్ హాలును మేము తీసికొనియుండెడివారమే. ఎనిమిది వేలమందిని మేము నిలిపియుంచాము. ప్రజలు లోనికి రాలేకపోయిరి, కాబట్టి మేము రేమండ్ రిచీ ఆలయమునకు వెళ్ళాము. నేను మరచిపోయాను... అది చాలా పెద్ద ఆలయము, దానిని నిండుగా మేము నింపాము. మరియు ఇక్కడ నేను బోధించి, రోగులకు ప్రార్ధించాను. వారిని వారు బయటకు పంపుచుండగా, ఇక్కడ నదికవతల యున్న రేమండ్ రిచీ ఆలయము నొద్ద నేను బోధించి ప్రార్ధి౦చెడివాడను.

15

మరియు తిరిగి మ్యూజిక్ హాలునకు రావలెనని మేము నిర్ణయించినప్పుడు, నేను ఎంత వరకు కొనసాగుదునో అంతవరకు కొనసాగుమని హవర్డ్ చెప్పి నా భుజము తాకి, నా వీపును నిమిరెను. అభిషేకము కొనసాగుచున్నప్పుడు వారు ఈ విధంగా వీపు తట్టుట మీరు గదిలో గమనించగలరు. [సహో, బ్రెన్హాం చేసి చూపించుచున్నారు.] ఇంక ఎక్కువ చెప్పకుండా మానివచ్చుటకు అది సమయమని అర్థము. హవర్డ్.... మూమూలుగా ఆలాగుండును, నేను అక్కడ నిలబడియుందును. అతడు నా చేయి పట్టుకొని తన భుజము మీద వేసికొని బయటకు నడిచి వెళ్ళును. (చూచారా?) ఎందుకనగా నాకు సరిపడినదని అతనికి తెలియును.

మంచిది, అతడు నన్ను తట్టినప్పుడు నేను వేదిక విడిచిపెట్టనారంభించాను. “సరే, సహోదరుడా,” అన్నాను. వేదిక విడువసాగాను, మరియు ఇక్కడ ఒక చిన్న బాలిక - మెక్సికను బాలిక నిలబడి ఏడ్చుచున్నది, పండ్రెండు లేదా పధ్నాలుగు సంవత్సరాల వయస్సులో కనబడినది. యుక్త వయస్కురాలు. ఆమె వైపు నేను చూచి ఈలాగన్నాను, “అమ్మా! ఏమిటి సంగతి?” “ఆమె ఏడ్చుచున్నది, హవర్డ్” అన్నాను.

ఆయన చెప్పెను, “నీవు అలసిపోయావు. నీ కొరకు అక్కడ మరియొక గుంపు ఎదురుచూస్తున్నది.”

“ఆమెను ఇటు తీసికొనిరా,” అని చెప్పాను. నేను దగ్గరగా వెళ్ళి ఆ విధంగా కదిపాను, ఆమె వేదిక మీదికి ఎక్కి వచ్చెను. (సహో. ఉడ్, తదితరులు అచ్చట హాజరయిరని నమ్ముచున్నాను; ఇప్పుడు, వారు కూటము యొద్ద ఉన్నారు. ఆ సమయములో వారున్నారో లేదో ఎరుగను. ఉడ్ సోదరుడా, ఈ రాత్రి ఎక్కడున్నావు? అది నిజమేనా? ఆ నీవు అక్కడున్నావు) “ఆమెను వేదిక మీదికి తీసుకొనిరండి,” అని చెప్పి ఆమెతో ఈలాగు పలికాను. “చూడు పాపా, నీ బాధ ఏమిటో దేవుడు నాకు చెప్పగల సమర్దుడని నమ్ముదువా?” ఆమె తన చిన్న తల దించినది. “బహుశా ఆమె చెవిటి-మూగ అయి యుండవచ్చును,” అనుకొన్నాను.

16

కనుక మరల నేను తిరిగి చూచాను; ఆమె మాట్లాడుట చూచాను. “ఓ! ఆమె ఇంగ్లీషు మాట్లాడలేదు,” అనుకొన్నాను. ఆమె ఒక్క అంగ్ల పదము కూడా మాట్లాడజాలదు. ఆమె మెక్సికో నుండి వచ్చినది, కనుక ఒక అనువాదకుడు రావలసియుండెను. “నీ బాధ ఏమిటో ప్రభువగు యేసు నాకు చెప్పగలడని నమ్ముచున్నావమ్మా?” అనడిగాను.

మంచిది, ఆమె అనువాదకుని ద్వారా తిరిగి మాట్లాడినది. “అవును,” అన్నది, అది ఆమె నమ్మెను.

“నీవసలు ఇంగ్లీషు మాట్లాడనే లేవా?” అనడిగాను. అనువాదకుడు ఆమెతో చెప్పెను....

“లేదు!” అన్నదామె, ఆమె ఏ ఇంగ్లీషు పదము ఎరుగదు; మెక్సికో నుండి వచ్చెను.

కనుక అప్పుడు, నేను దర్శనము చూడనారంభించాను. మరియు నేను చెప్పాను.... వారు దర్శనములు అనువదించరు (మీరు చూచారా), ఎందుకనగా ఎడతెగక మాట్లాడుట జరుగును. అంతా అయిపోవు వరకు వారు ఎన్నడూ దర్శనము అనువదించరు, తరువాత వారు ఏమి జరిగినదో చెప్పెదరు. అప్పుడు నేను.. మాట్లాడ నారంభించినప్పుడు; ఒక దర్శనము చూచాను. “ఆరు సంవత్సరముల బాలికను నేను చూచుచున్నాను. ఆమె ధరించిన దుస్తుల రంగులు చెప్పాను. ఆమె వెనుక నల్లని తల జడలు వ్రేలాడుచున్నవనియు దానికి రిబ్బను ఉన్నదనియు చెప్పాను. ఆమె ఒక పాతకాలపు కుంపటి యొద్ద కూర్చొనియున్నది. ఒక పెద్ద పాత్ర యున్నది, ఆమె దానినుండి పసుపు రంగు పేలాలు తినుచున్నది. ఆమె తినీ తినీ భయంకరముగా జబ్బుపడినది. ఆమె పడి పోతున్నది, ఆమె తల్లి ఆమెను పడక మీద వేయుచున్నది. మరియు ఆమెకు మూర్చ వ్యాధి, ఆమెకు జరిగినది అదే.” చూచారా? “అప్పటి నుండి నీకు మూర్చ రోగమున్నది,” అని చెప్పాను.

మరియు వెంటనే, ఎవరూ ఏమి చెప్పకముందే ఆమె అనువాదకుని వైపు చూచి తన స్వభాషలో ఏదో చెప్పెను. “స్పానిష్ మాట్లాడలేడని తలంచాను.”

“నీవు స్పానిష్ మాట్లాడుదువా?” అని అనువాదకుడు అడిగెను.

“రాదండీ! నేను ఇంగ్లీషు మాట్లాడుదును” అన్నాను.

“నీవు స్పానిష్ మాట్లాడావని ఆమె చెప్పినది,” అని చెప్పెను.

నాకది అర్దమై౦ది. “రికార్డరులను ఆప౦డి,'' అన్నాను. చాలా రికార్డరులు, బహుశా ముప్ఫయి వరకూ తిరుగుచున్నవి.

ఆ రోజులలో, రాయ్ రాబర్సన్ సోదరుడా! నీవచ్చట ఉన్నావా? అవును. రాయ్ రాబర్సన్ సోదరుడు మరియు సోదరి రాబర్సన్ మొదలగు వారు అచ్చటఉ౦డిరి.

“రికార్డరులను ఆపండి. వాటిని తిరిగి పెట్టండి,” అన్నాను. మరియు అది అక్షరాలా ఇంగ్లీషు, కాని మీరు చూడండి, నేను ప్రారంభించినప్పుడు.... దర్శనము వచ్చినంత సేపు నేను ఇంగ్లీషునే మాట్లాడాను, కాని ఆమె స్పానిష్ విన్నది. “వారందరూ తమ తమ స్వభాషలో వారు జన్మించిన భాషలో మాట్లాడుట వినిరి,” చూచారా? మరియు కానీ నా అంతట నేను మాట్లాడనారంభించగానే ఆమెకు నేను పలికినది ఏదీ అర్థము కాలేదు; కాని ఆత్మ ఆవేశమున్నంత సేపూ ఒక్కసారి....

17

ఇప్పుడు, దానిని పెంతెకోస్తునకు అన్వయించండి. చూచారా. స్నేహితులారా, దేవుడే నా తీర్పరి, పరిశుద్దాత్మ దానిని చేసెను. ఇప్పుడు, దానిని మనము మన భావము కొరకు పెంతెకోస్తునకు అన్వయించుదము. పరిశుద్దాత్మ ఎన్నడునూ ఏదియు అర్థరహితముగా చేయుట జరుగదు. ఒక కారణము మరియు ఒక హేతువు ఉండవలెను. చూచారా.

ఇప్పుడు, ఆ దినమున “వారందరూ మన మాతృ భాషలో మాట్లాడుట వినుచున్నాము గదా? వీరందరునూ గలీలయ వారు కారా?” వారు గలిలయ భాష మాట్లాడనిచో వారు గలిలయ వారని ఎట్లు తెలియును? వారందరూ ఒకే విధముగా వస్త్రములు ధరించిరి. వారు గలిలయులని ఎట్లు తెలిసినది? ఆ మాట్లాడుచున్న వారందరునూ గలిలయ మాట్లాడలేదా? వారందరును మన స్వభాషలో మాట్లాడుట వినుచున్నాము. ఇదెట్లు జరిగినది?

అంతట మరియొక వ్యక్తి, ఒక గలిలయుడు, పేతురు లేచి వారికి బోధించసాగెను. మరియు ఆ జన సమూహములో నున్న మూడు వేల ఆత్మలు ఏలాగో అతనిని అర్ధము చేసికొని ముందుకు వచ్చి మారు మనస్సు పొంది మరియు తమ జీవితములను క్రీస్తుకు సమర్పించిరి.

18

ఇప్పుడు వినండి, మిమ్ములను నేను ఈ వాక్యమునకు తీసుకువెళ్ళనివ్వండి... మరొక వాక్యము. ఆ గొప్ప పరి. పౌలు యొద్దకు వెళ్ళుదము. I కొరింధీ 12వ అధ్యాయము చదువుదము, ఆ తరువాత Iవ కొరింధీ 13వ అధ్యాయము ప్రారంభించుదుము. పౌలు మాట్లాడుచున్నప్పుడు, చెవులు, ముక్కుతో, “నీ అవసరము నాకు లేదని చెప్పిన యెడల,” “ఆలాగే శరీర అవయవములన్నియూ చెప్పిన యెడల ఎట్లు౦డును?” 13వ అధ్యాయములో, అతడు చెప్పుచున్నది ఇప్పుడు వినండి

ఇప్పుడు బైబిలులో రెండు విధములగు భాషలు ఉదహరించబడినవని మనకు తెలియును. అందులో ఒకటి - ఈ భూమి మీద భాష; మరియు మరియొకటి తెలియని భాష.

19

ఇప్పుడు, మీలోనున్న చాలా మంది నా ప్రశస్థ జనులకు..... నేను పెంతెకోస్తును కలిగియున్నానని చెప్పాను. పరిశుద్దాత్మను పొందినప్పుడు వారు లేచి మరియొక తెలియని భాషలో మాట్లాడుదురని నా జనులలో చాలా మంది నమ్ముదురు. అది వాక్యమునకు పూర్తిగా విరోధము; ఆ జనులకు వారు దేని గూర్చి మాట్లాడుచున్నారో అది తెలియదు. కాని పెంతెకోస్తు దినమున, వారేమి చెప్పుచున్నారో అది అందరికి తెలిసినది. అది ప్రతి దేశమునకు బయలు వెళ్ళుట. చూచారా. యెరూషలేము మొదలుకొని సర్వ ప్రపంచమునకు సువార్త తప్పక బోధించబడవలెనని యేసు చెప్పెను. అది ఆ విధముగా ఉండవలసియుండెను.

ఇప్పుడు గమనించండి. భాషలలో వరమగు ఒక తెలియని భాషలో ఎవరయినా మాట్లాడినచో దానికి అర్ధము లేదా ప్రత్యక్షత చెప్పని వారుండనిచో దానివలన ప్రయోజనము ఎక్కువుండదని పౌలు ఒక్క భాషను గూర్చి చెప్పెను. 13వ అధ్యాయములో అతడీలాగు చెప్పుట మనము కనుగొందుము, “మనుష్యుల భాషలలోను, దేవదూతల భాషలలోను నేను మాట్లాడినను (భాషలనగా భూ-భాషలు) - ప్రేమలేనివాడినయితే వ్యర్ధ్యుడనే” కనుక నీవు అసలయిన మనుష్య భాషలోను, దేవదూతల భాషలలోను మాట్లాడిననూ నీవు పరిశుద్ధాత్మను ఇంకా పొందియుండకపోవుట జరుగును.

20

హెబ్రీ 6లో దానిని మనము చూడలేదా? వర్షము గోధుమల మీద, కలుపు మొక్కల మీద పడును. యేసు ఈలాగు చెప్పలేదా, “నీతిమంతుల మీద, అవి నీతిమంతుల మీద వర్షము కురియుచున్నది!” చూచారా? గోధుమలను పెరుగుచేయుచున్న వర్షమే వీనిని కూడా పెరుగచేయుచున్నది... కాని దాని ఫలమును బట్టి మీరు తెలిసికొందురు. ఆత్మ యొక్క ప్రధమ ఫలము ప్రేమ. పౌలు ఏమి చెప్పెను: “నాకు అన్నీ కలిగినా, అన్ని రకముల భాషలలోను మాట్లాడినా మరియు ప్రేమ, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, సహనము మొదలగునవి లేనిచో వాని వలన నాకు ఏ ప్రయోజనము లేదు.” చూచారా.

మరియు వరములను గూర్చి గమనించండి. “ఓ! అక్కడ గొప్ప దైవజనుడున్నాడు; ఓ, అతడు ఆశ్చర్య కార్యములను చేయుచున్నాడు,” అని మీరనవచ్చును. అందువలన అతడు సరి అయిన వ్యక్తి అని చెప్పజాలము.

“నాకు ఆశ్చర్యకార్యములు చేయు వరమున్ననూ,” అని పాలు I కొరింధీలో, ఇంకా ఈలాగు పలికెను. “కొండలను పెకిలించగల విశ్వాసమున్ననూ ఆత్మ యొక్క ఫలమగు ప్రేమ లేనిచో నేను వ్యర్దునే.” (చూచారా?) ఎందుకనగా విశ్వాసము ఏదయినా చేయును. అందుకే, నేను ఎల్లప్పుడూ ఈలాగందును, “మీ రక్షణ బట్టి మీరు స్వస్థత పొందుట లేదు, మీరు మీ విశ్వాస ప్రతిభను బట్టి స్వస్థత పొందుచున్నారు.” “మీరు నమ్మినట్లయితే.”

21

ఇప్పుడు, చుడండి. “నేను మనుష్యుల భాషలతోను, దేవదూతల భాషలతోను మాట్లాడిననూ, ప్రేమ లేనివాడనయితే వట్టివాడనే” (దానిని అతడు చేయకలిగియుండ వచ్చును) కనుక మీరు చూడండి, మీరేమియూ చెప్పజాలరు.

ఇప్పుడు, నా ప్రశస్థ మొథడిస్తు స్నేహితునికి. ఇక్కడ ఇద్దరు కూర్చొనియు౦డుట నేను చూచుచున్నాను, మరియు ప్రతి చోట ఉన్నారు. ఇక్కడ చాలా మంది వారున్నారు. ఒక వ్యక్తి సరిపడిన భక్తి కలిగియుండి, గట్టిగా కేకలు వేయు శుద్ధీకరణ కలిగియుండినచో దానిని పొందినట్టేనని మెథడిస్తు చర్చి ఆది కాలములో, ఆ పూర్వ దినములలో నమ్మియుండెడిది. భాషలు మాట్లాడినచో అది వచ్చినట్లేనని పెంతెకోస్తు చెప్పెను. నీవు స్వస్థతా సేవ కలిగియున్నచో దానిని నీవు పొందినట్లేనని ఈ దినములలో వారు చెప్పుచున్నారు. కాని ఏదియూ....

స్నేహితులారా, వినండి. ఏదో భావోద్రేకము మీద ఆధారపడి వెదుకవద్దు. ఆలాగు ప్రయత్నించవద్దు, దానికి బదులుగా వాస్తవముల మీద ఆధారపడండి. (చూచారా?) భావోద్రేకములు కాదు; గట్టిగా కేకలు వేయుట మంచిదే; భాషలతో మాట్లాడుట మంచిదే; ప్రభుని స్తుతించుట మంచిదే. అద్భుతముల కొరకు విశ్వాసము కలిగియుండుట మంచిదే. ఆ సంగతులన్నియూ, ఆ భావములన్నియూ... వారిలో కొందరు ఈలాగు చెప్పెదరు, “హూ, బలముగా వీచుచున్న గాలివలె దానిని నేను అనుభవించుచున్నాను.”

“నా ఆత్మలో అగ్ని అనుభవించుచున్నానని మరియొకరు చెప్పవచ్చును.” ఏమిటి, అది ఏ విధముగాను సరిచేయదు. దానిని పొందిన తరువాత నీవు ఏలాగున్నావో అదియే. చూచారా? అదే లెక్కలోనికి వచ్చును. చూడండి? కనుక నీవు దానిని ఏ విధమగు భావోద్రేకమునకు జోడించజాలవు.

ఇప్పుడు, యధార్ధముగా నాకు అత్యుత్తమంగా తెలిసినది అదే. ఇప్పుడు, నేను పొరపాటు చేసియుండవచ్చును. అప్పుడు నేను వాక్యమును అపార్ధము చేసికొన్నానన వచ్చును. అది ఒకవేళ విరుద్ధముగా యున్నచో, అలాగు విరుద్ధముగా యుండగోరుట నా భావము కాదు. చూచారా? కాని నేను సత్యమని నమ్ముచున్న నా వ్యాఖ్యను చెప్పుచున్నాను.

22

మన యధార్థ ఆరాధనను ప్రారంభించు ముందుగా దీనికి చాలా సమయము మనము తీసికొన్నాము. ఆలయము నొద్ద తరుచుగా ఈ సంగతులు మనము ప్రస్తావించాము. చాలా కాలమునకు ఇదే మొదటిసారి అనుకొనుచున్నాను, సంవత్సరము లేదా రె౦డు సంవత్సరములు పైగా అయి యుండవచ్చును. మన జనులలో కొందరు నా యొద్దకు వచ్చి ఈలాగందురు, “బ్రెన్హాం సోదరుడా, నాకు నత్తి పెదవులు వచ్చుచున్నవి, మరియు నేను ఇది చేశాను, అది చేశాను,” అని చెప్పినప్పుడు, సరే, మంచిది. “అది చాలా మంచిది,” అని అనుచుందును.

23

తెలియని భాషలో మీరు మాట్లాడగోరినచో, దానిని దేవుడు మీకు అనుమతించునని నేను నమ్ముచున్నాను. కాని వాక్య ప్రకారము, పరిశుద్ధాత్మ వచ్చువరకు వట్టివాడవే. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీవు భాషలలో మాట్లాడగలిగి యుండవచ్చును. దేవుడు నీవేమై యున్నావో ఆ స్వభావమును తీసివేసి, దానిని నీ కొరకు చెక్కి సాధ్యమయినంత అత్యుత్తమ సేవకునిగా నిన్ను చేయును. ఆయన నిన్ను సువార్త బోధించునట్లుగా చేయవచ్చును; భాషలలో మాట్లాడు వరమును నీకు అనుగ్రహించవచ్చును. ఆయన నిన్ను ఒక ప్రవక్తగా చేయవచ్చును. ప్రవచనపు ఆత్మను ఆయన నీకు ఈయ వచ్చును. ఆయన నీ కొరకు ఏమి చేయునో చెప్పుట కష్టము లేక ఆయన నీ కొరకు అవన్నియూ చేయవచ్చును. కాని మొదటగా తెలిసికొనవలసినది ఏమనగా, ఏదో ఒక భావోద్రేకము ద్వారా కాక, ఒకే ఆత్మ ద్వారా మనమందరము ఒకే శరీరములోనికి బాప్తీస్మము పొంది యున్నామను నిశ్చయత కలిగియుండవలెను. అప్పుడు, ఆ శరీరములో నుండి వారములు (చూశారా): భాషలు మాట్లాడుట ఇంకా ఆ యా వరములన్నియూ వచ్చును.

24

అది ఏమిటి, ఒక నాజరీనువాడు నా దగ్గరకు వచ్చి... ఈలాగన్నచో ఎట్లు౦డును, “బ్రెన్హాం సోదరుడా, మెథడిస్టులో ఇప్పుడు ఒక నాజరీనువాడున్నాడు. వారు కేకలు వేసినప్పుడు పరిశుద్ధాత్మను పొందియున్నామని చెప్పెదరు. తాము పరిశుద్ధాత్మ పొందియున్నామందురు.” వారు పొందలేదని నేను చెప్పుటలేదు. కాని నేను కనిపెట్టునది ఒకటున్నది, వారి ఫలము ద్వారా సత్యము బయలుపరచబడినప్పుడు, వారు ఘోరముగా ఎదురు తిరుగుచున్నారు. “అది దయ్యము.” వారి ఫలములే వారెక్కడ నుండి వచ్చిరో చెప్పుచున్నవి. చూచారా. వారు దానిని పొందలేదని అది చూపించుచున్నది. కాని వెలుగులో నడువవలెనని ఇష్టము కలిగి, వాక్యము చేర్చుకొనువారు.

25

కొంతకాలము క్రిందట కెంటాకీలో నేను బోధించుచున్నాను. మరియు ఆ కూటము బయట అద్భుతములు జరుగు దినములు అయిపోయినవని నమ్ము ఒక సంఘమునకు చెందిన వ్యక్తి యుండెను. అతడు తన చేతిలో ఒక లాంతరు పట్టుకొని యుండెను. “బోధకుడా, నీ కోసమే కనిపెట్టుచున్నాను,” అని చెప్పెను. (నేను, నా ముసలి అంకుల్, ఇప్పుడాయన లేడు).

“సరే, చెప్పండి!” అని నేను అన్నాను.

“నేను పలాని పలాని,” అని చెప్పెను.

నేను అతనితో కరచాలనము చేశాను. “నా సోదరుడా, నిన్ను కలిసికొనుట నిశ్చయంగా నాకు ఆనందము,” అని చెప్పాను.

“నీవు చెప్పుచున్నది పూర్తిగా తప్పు అని నేను నమ్ముచూ చెప్పగోరుటకే వచ్చానని,” పలికెను.

“సరే, నీకు ఆ విధముగా చెప్పు హక్కున్నది, ఎందుకనగా నీవు అమెరికనువి,” అన్నాను.

“సరే, చూడు.....” అని ఏదో చెప్పసాగెను....

“స్వస్థత గూర్చి మీరనుకొనుచున్నది తప్పు.” కాళ్ళు సరిగ్గా లేని ఆ చిన్న బాలిక వట్టి పాదములతో నిన్న- గతరాత్రి నడిచిన సంగతి ఏమిటి?“ అనడిగాను. ఆమెకు పధ్నాలుగు సంవత్సరములు కూడా లేవు, పాదములకు ఏమి లేకుండా యున్నది. ఆమె బాగా పాతదయిన ఆ కాలికో లేదా ఏదో ఒక విధమగు దుస్తులు ధరించినది. (మీరేమని పిలుస్తారు? ఆ బట్టల సంగతి నాకు తెలియదు) ఆమె చేతిలో చిన్న బిడ్డ యున్నది. ఆమె నా యొద్దకు నడిచి వచ్చెను. జనులు కిటికీల మీద గుడి కూడియుండిరి. (ఇది మెథడిస్టు చర్చి, వైట్ పాల్ మెథడిస్తు చర్చి, నేను పుట్టిన కెంటాకీలోని బర్క్స్ విల్ వెలుపట యున్నది) ఆమెకు ఈ చిన్నబిడ్డ యున్నది. ఆమెతో నేను, ”సోదరీ, ఎవరైనా వ్యాధిగ్రస్తులా?“ అనడిగాను.

ఆమె అక్కడికి నడిచి వచ్చినది, కొద్దిగా సిగ్గుపడుచూ, తన చిన్న తలను దించుకొని, “అవునండీ, మా బిడ్డ,” అన్నదామె. మరియు ఆ పసిపిల్ల ఈలాగయి పోవుచున్నది.

“సోదరీ, ఏమిటి సంగతి?” అనడిగాను.

“ఆమె తూలిపడుచున్నది,” అన్నది.

“తూలిపడుటా?” అనడిగాను.

“అవునండీ!”

“ఎంతకాలము నుండి ఈ తూలిపడుట జరుగుచున్నది?” అనడిగాను. “పుట్టినప్పటినుండియూ అనగా సంవత్సరము దగ్గర నుండియూ,” అని చెప్పెను.

“ఆ బిడ్డను నన్ను పట్టుకొననిచ్చెదవా?” అనడిగాను. ఆ కొండలలో అలాంటి విషయాలలో జాగ్రతగా ప్రవర్తించాలి.

“అవునండీ!” అని ఆమె చెప్పెను. ఆ చిన్న బిడ్డను నా చేతులలో పెట్టినది.

26

మరియు నా మనస్సులో.... నేను ఒక నిమిషము పాటు అలాగే నిలబడ్డాను. “ప్రభువా, జనులను నీ కొరకు జయించుటకు ఇప్పుడు నీవు ఏదయినా చేయుము,” అని హృదయములో పలికాను. ఆ బిడ్డను నా చేతులలో పట్టుకొనియుండగానే ఆ వ్యాధి ఆగిపోయినది. బిడ్డ వైపు చూచాను, నా చేతులలో పట్టుకొని బిడ్డతో ఆడాను. ఆ బిడ్డ నా వైపు చూచి నవ్వినది, నేను ఆమె వైపు చూచాను. ఆమె పైకి లేచి, తన చిన్న తలను దించుకొన్నది. దువ్వుకొనిన ఆమె తల వెండ్రుకలు వెనుక వ్రేలాడుచున్నవి, జడలు వేసికొనినది. ఆమె తన తలను పైకెత్తినది, ఆమె చిన్న బుగ్గల మీద నుండి కన్నీరు కారుచుండెను. పొడవైన మీసాలు కలిగిన కరకు మనుష్యులు అక్కడ నిలబడియుండిరి. వారును కన్నీరు కార్చుచుండిరి. చుట్టు చూస్తూ ఈలాగు పలికాను, “సోదరీ, ఇదిగో నీ బిడ్డ, యేసు క్రీస్తు బాగుచేయును.” ఆ వృద్ద స్త్రీలు మతి తప్పి నేల మీద పడిపోసాగిరి. వారి ముఖముల మీద నీరు పోసి గాలి విసురుచుండిరి. “అదేలాగు జరిగినది?” అనడిగాను.

“నేను పూర్తిగా చూస్తేనే గాని ఏదీ అంగీకరించలేను బ్రెన్హాం,” అని పలికాడు.

“సరే, ఒక మంచి అభిప్రాయము, కానీ నీవు ఎక్కడ ఉంటున్నావో అడగవలెనని కోరుచున్నాను,” అని అన్నాను.

“ఇక్కడికి కొంత దూరములో నున్న ఆ కొండకు అవతల ఉన్నాను. ఈ రాత్రి భోజనమునకు నాతో ఇంటికి రమ్ము, కొంత మజ్జిగ, జొన్న రొట్టె ఇచ్చెదను,” అని అతడు పలికెను.

“నాకు రావాలని ఉన్నది, నాకు నిజంగా ఆకలివేస్తున్నది, కాని నేను రాలేను.” “నా అంకుల్ తో నేను ఇంటికి వెళ్ళవలెను,” అని చెప్పాను.

“మంచిది, ఒక సంగతి నిన్ను అడిగెదను. నీవు గృహము ఏలాగు చేరగలనని తలంచుచున్నావు?”

“నేను ఆ కొండ దాటి నడిచి వెళ్ళెదను,” అని చెప్పాడు.

“నీవు నీ ఇంటిని చూడగలవా?” అనడిగాను.

“చూడలేను!” అన్నాడు.

“అయితే అక్కడకు చేరగలనని నీకెట్లు తెలియును?” అనడిగాను.

“అక్కడకు చేరగల ఒక దారి ఉన్నది,” అని అతడు చెప్పెను.

“అయినా నీకు ఇల్లు కనబడదు కదా? నీవు పూర్తిగా చూడనంతవరకు దేనిని అంగీకరించను అని చెప్పావు గదా?” అనడిగాను.

“ఓ! నేను దీపము తీసికొని ఆ వెలుగుతో నడిచిపోయెదను,” అని పలికాడు.

“అదే నీవు చేయవలెనని నేను ప్రయత్నించుచున్నాను,” అని నేను పలికాను. లాంతరు వెలుగును ఇచ్చునట్లుగా, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము, నీవును వెలుగులో నడిచెదవు. అక్కడికి మనము చక్కగా చేరుదము. ఆ అంతము సరిగ్గా నాకు కనబడక పోయినను, అది అక్కడ ఉన్నదని నాకు తెలియును.

27

ఇప్పుడు, ప్రార్ధి౦చుదము. పరమ తండ్రీ, ప్రేమకు కేంద్రమగు యేసు క్రీస్తు యొక్క మంచితనము బట్టి మేము నీకు ఎంతో కృతజ్ఞత చెల్లించుచున్నాము. నీవు నా పట్ల కోపము కలిగియున్నావని నేను మామూలుగా తలంచెడివాడిని, కాని యేసు నన్ను ప్రేమించెను; కాని ఇప్పుడు నేను కనుగొనిన దేవునిగా, యేసు దేవుని యొక్క హృదయము అని నీవు నన్ను ప్రేమించుచున్నావనియు, నా కొరకు శ్రమపడియున్నావనియు నాకు తెలియును.

తండ్రియగు దేవా, నేటి ఈ ప్రపంచము కొరకును, మా దేశము కొరకును ప్రార్ధి౦చుచున్నాను. నా స్వంత తప్పిదముల కొరకును, నా జనుల తప్పిదముల కొరకును క్షమాపణ కోరుచున్నాను, కాయుటకు నాకు అప్పగించిన జనులు వీరు. వారిని దీవించుమనియు, ఈ చిన్న కూటములో ప్రశ్నలడిగిన ప్రతి ఒక్కరిని దీవించుమనియు ప్రార్ధి౦చుచున్నాను. వారు నమ్మినదానికి వ్యతిరేకమగు దానిని నేను చెప్పియుండవచ్చును. ప్రభువా, నా అంతట నేను దానిని వివరించజాలను; నేను చేయలేను. కాని తండ్రీ, నా హృదయములోని భావమును వారిని తెలిసికోనీయవా? దయచూపి, నీవు దానిని చేయుమని ప్రార్ధి౦చుచున్నాను. వీరందరినీ దీవించుము.

బాప్తీస్మపు కార్యక్రమమునకు ముందుగా, కొద్ది క్షణములు నీ వాక్యము కొరకు మేము కనిపెట్టుచుండగా, మమ్ము దీవించుము. సరియైనది మాట్లాడుటకు మాకు సహాయముచేయుము. ఈ రాత్రి వర్తమానములో మాకు సహాయము చేయుము. నా గొంతు చిన్నగా బొంగురుపోయినది. ప్రియదేవా, నాకు నీవు సహాయము చేయుమని ప్రార్ధి౦చుచున్నాను. జనుల మధ్యనున్న రోగులను, బాధపడుచున్నవారిని సహితము బాగుచేయుమని ప్రార్ధి౦చుచున్నాము. యేసు నామములో దీనిని మేము అడుగుచున్నాము. ఆమేన్.

28

కొద్ది క్షణముల పాటు మాట్లాడుటకు రోమా 6 అధ్యాయము మీరు కోరినట్లయితే తీయండి.

మంచిది, ఆగండి. అంతా బాగున్నచో బుధవారము రాత్రి వీటికి నేను జవాబు ఇచ్చెదను; ఇప్పుడు చాలా ఆలస్యము అయినది. ఇప్పుటి వరకు అక్కడున్న ప్రశ్నలను నేను గమనించనే లేదు.

ఇప్పుడు, రోమా 6వ అధ్యాయము చదువుదము.

ఆలాగైన ఏమందుము? కృప విస్తరించవలెనని పాపమందు నిలిచియుందుమా?

అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము, ఇక మీదట ఏలాగు దానిలో జీవించుదము?

క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీస్మము పొందితిమని మీరెరుగుదురా?

కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడెనో ఆలాగే మనమును నూతన జీవము పొందినవారమై నడుచుకొనునట్లు మనము బాప్తీస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్ట బడితిమి.

మరియు ఆయున మరణము యొక్క సాదృశ్యమ౦దు, ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమై యుందుము.

29

దాదాపు ఇరవై నిమిషముల కొరకు ఈ రాత్రి నేను తీసికొను అంశమును ఈలాగు పిలుచుదును: గుర్తింపు, క్రీస్తుతో గుర్తించబడుట,

మీకు తెలియును, ఈనాడు దేశమందు ఎందరో అసంతృప్తి చెందిన జనులున్నారు. మీరు తిరిగి గమనించినచో అంత అసంతృప్తిని కనుగొన్నందుకు ఆశ్చర్యపడుదురు. తాము ఏమి చేయగోరుచున్నారో ప్రజలకే తెలియుట లేదు. ముప్పది మైళ్ళ వేగముతో వెళ్ళవలసిన స్థలమందు దాదాపు గంటకు ఎనభై, డెబ్బయి మైళ్ళతో దూసుకొని పోవుచున్నారు, బ్రేకులు జారిపోవుచున్నవి. అంత వేగముతో మలుపు తిరగసాగి సగం టైరు అరిగిపోతున్నవి. దానిని మరల బాగుచేసికొనుటకు పట్టణములోనికి వెళ్ళి కొంతసేపు ముచ్చటలాడుకొనుచున్నారు. తాము చేయగోరుచున్న దానిని జనులు ఎరుగనట్లుగా కనబడుచున్నది.

30

అ౦దులో కొ౦దరు ఎంతగా కలవరం చెందారంటే, ఒక మ౦దుల షాపుకి వెళ్ళి ఒక ఆర్గనిక్ లేదా సల్ఫూరిక్ ఆమ్లపు సీసా కొనుక్కొని ఆత్మహత్య చేసికొనుచున్నారు. ఆలాగు వారు చచ్చిపడుచున్నారు. కొందరయితే తమ గదులలో వాయువు (గ్యాస్)నువిప్పి, లేదా తమ కార్లలో కూర్చొని పైపులో నుండి కార్బన్ మోనాక్సైడు వాయువును విప్పి జీవితమును దూరపరచుకొనగోరుచున్నారు. మరికొందరు వంతెన మీదికి ఎక్కి చిన్న కాగితము మీద ఏదో వ్రాసి దానిని తమ కోటునకు అంటించి దానిని అక్కడ తగిలించి నదిలోనికి దూకి, తమ్మును తాము చంపుకొనుచున్నారు. ఎత్తైన గోపురములపై నుండి, పర్వతములపైనుండి దూకుచున్నారు. కొందరయితే, తుపాకీ తీసికొని తమ తలకు గురిపెట్టుకొని, అక్షరాలా తమ మెదడును బయటకు చీల్చి తెచ్చుచున్నారు. వారు కేవలము అసంతృప్తి చెందినవారు.

అసంతృప్తి చెందిన జనులతో వైద్యశాలలు నిండిపోవుచున్నవి. పిచ్చాసుపత్రులు ఖాళీ లేకుండా యున్నవి. అసంతృప్తి చెందినవారు, వారికేమి కావలెనో వారికే తెలియదు. వారు దేనినో అందుకొనుటకు వెళ్ళుచున్నట్లు కనబడుచున్నారు, కాని వారెన్నడూ దానిని చేరుట లేదు.

31

మరియు ఆలాగే, దేశమునకు, సంఘమునకు వెన్నెముక అయిన గృహములు విచ్చిన్నమగుట మనము చూస్తున్నాము, విడాకుల కోర్టులు కేసులతో నిండిపోతున్నవి. తల్లులు తమ పసి పిల్లలను కావలి వారికి అప్పగించి ఎక్కడికో పనికి వెళ్ళిపోవుచున్నారు. వారి భర్తలు మంచి ఉద్యోగము చేయుచున్నా గాని వారు తల్లులుగా ఇంటియొద్ద యుండుటకు ఇష్టపడరు. మర్యాద గల స్త్రీ వలె దుస్తులు ధరించుట వలన వారికి తృప్తిలేదు. వారు పురుషులు వలె బట్టలు ధరించుకొనుచున్నారు. పురుషులు స్త్రీల వలె ఉండగోరుచున్నారు. ఎక్కడో ఏదో పొరపాటున్నది. ప్రజలు దేనికొరకో అర్రులు చాచుచు దానిని కనుగొనలేక పోవుచున్నారు. అంతకన్న దయనీయ పరిస్థితి మరొకటి లేదు.

వారు మాదిరిగా తీసికొనుటకు ఏదయినా కనబడునేమోనని వారు నలువైపులా చూచుచున్నారు. మన దినములలోని స్త్రీలను తీసికొందము. ఒక ప్రత్యేకమగు సినీతార కనబడువరకు వారు టెలివిజను చూచుచున్నారు, లేదా ఆమె వచ్చి ఒక ప్రత్యేక రీతిగా దుస్తులు ధరించుకొనినచో, స్త్రీలందరూ ఆమె వలె దుస్తులు ధరించి, లేదా ఆమెవలె ప్రవర్తించి ఆమెను ఒక మాదిరిగా చేసికొనుచున్నారు. కొందరు అందమగు యువతులు, జీవితములో వికసించుచున్నవారు ఏదో ఒక సినీ తారను మాదిరిగా చేసికొన ప్రయత్నించుచున్నారు. ఆ విధముగా నడువగోరుచున్నారు. చివరకు వారు పాపపు బోనులో చిక్కుపడి దానిలో నుండి బయటకు రాలేకపోవుచున్నారు. ఎంత దయనీయ స్థితి వారు కూటములకు వచ్చి కన్నీరు కార్చుట చూచుచున్నారు.... వారు దేనికొరకో వెదకు చున్నారు.

32

మనము పురుషులను తీసికొందము. పురుషులారా, మీరు వారిని వీధులలో గాని లేదా వ్యాపారములో గాని పట్టుకొందురు. ముసలివాడు యవ్వనడుగా ఉండగోరుచున్నాడు. అతడు ముందు తన జట్టును కత్తిరించుకొని వెనుక యువకునివలె త్రిప్పు కొనుచున్నాడు. అతడు యువకునిగా ఉండగోరుచున్నాడు. యువకుడు రాక్-అండ్-రోల్ వేయువానివలె ఉండగోరుచున్నాడు. చివరకు వారు ఏమవుదురు? పాపములోను, అవమానములోను చిక్కుకొందురు.

మనిషి అసంతృప్తి చెందినట్లు కనబడుచున్నాడు. ప్రతిచోటకు పరుగెత్తుచున్నాడు. సరసోక్తుల కొరకు, ఈ హాస్యగాళ్ళు వేయు ఛలోక్తులు మొదలగు వానికొరకు రేడియో వినుచున్నారు. వారు బయటకు వెళ్ళి వారివలెనె అనుకరించుటకు లేదా ప్రవర్తించుటకు ప్రయత్ని౦చుచున్నారు.

33

వీధిలోనున్న చిన్న బాలుని నీవు చూడు, నాకెలా తెలియును. వాడు పలాడిన్, లేక హాప్లాంగ్ కేస్సెడీ వలె ఉండగోరుచున్నాడు. వ్యాపార ప్రపంచము దానిని ఆసరాగా తీసికొని మిలియనుల డాలరు సంపాదించుచున్నారు. వారు రాయ్ రోజర్స్ వలె లేదా మిస్టర్ డిల్లన్, లేదా మరేదో టెలివిజను తారవలె అవ్వవలెనని తలంచుచున్నారు. వారు ఆ వ్యక్తిని అనుకరించుటకు ప్రయత్నించుచున్నారు. వారిని తమకు మాదిరిగా ఉంచుకొనుచున్నారు. తమ జీవిత ప్రమాణమునకు వారినే తీసికొనుచున్నారు. మార్గాంతమున వారు ఏమి కనుగొందురు? ఆ పసివారు రౌడి ముటా గాను, దోపిడీదారులుగాను. స్త్రీలు వేశ్యలు గాను, వీధిలో నడచువారిగాను, అసభ్యమగు వారిగాను మారుదురు. పురుషులు జూదరులు గాను, దేవునికంటె సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారిగాను అగుదురు. సంఘములు మరియొక్క సంఘమును, పెద్ద సంఘమును అనుకరించుటకు ప్రయత్ని౦చుచున్నవి.

34

జనుల మధ్య సంతృప్తి లేదని అది చూపించుచున్నది. వారిని అది చేయునట్లుగా ఏది పురికొల్పుచున్నది? దానికి ఒక కారణమున్నది; అది ఒక స్వభావము. దేవుడు వారికి ఆ స్వభావము ఇచ్చెను. తమ్మును తాము దేనితోనో గుర్తించుకొనగోరు కోరికను కలుగజేయు స్వభావమును వారు పొందిరి. వారికి జీవితములో ఒక గురి యున్నది. తప్పక వారు ఒకదానివలె ఉండవలసిన కోరిక యున్నది. వారు ఒక సినీతారగానో, కౌబోయ్ గానో లేదా అట్టి మరేదో అభిప్రాయమో కలిగియున్నారు.

ఇంటికి వచ్చుచూ రేడియోలో నేను వినుచున్నాను, గొప్ప ఇటలీ వ్యక్తి డెన్వర్ యొద్ద నిండుగా గుండు కలిగియున్న తుపాకీతో హాప్లాంగ్ కేస్సెడీని వాయించుటకు ప్రయత్నించెను. ఆ ప్రయత్నములో అతడు తన తుపాకీని ప్రేల్చుకొని మోకాలు చిప్పను ఎగురగొట్టుకొనెను. అతడు తక్కిన జీవితమంతయూ ఆలాగే జీవించవలసి వచ్చెను. మీరు అక్కడనే ఉన్నారు.

కానీ వారందరునూ వారికి గుర్తింపు తెచ్చు దేనికొరకో వెదుకుచున్నారు. మరియు వారు అలా చేయుటకు కారణము, దేవుడు చేసినది ఏదో వారిలో ఉన్నది. కానీ ఒక మాదిరిగా ఉండుట కొరకు దేవుడు వారిని ఆలాగు చేసెను, మరియు మన రక్షకునిగా ఉండుట కొరకూ యేసు క్రీస్తుని చేసెను. అదే మాదిరి. మరియు జనులు కూడా యేసుతో గుర్తించబడుటకూ, ఆయన వలె ఉండుటను కోరుకొనవలయును.

35

చిన్న బాలురందరూ హాప్లాంగ్ కేస్సెడీ వలెనో లేదా మరేదో వలెనో ఉండగోరినచో, లేదా చిన్న బాలికలందరూ ఏనీ ఓక్లీ మొదలగు వారివలె ఉండగోరినచో ఏమగును; కాని వారు యేసువలె ఉండగోరినచో ఎట్లు౦డును? ప్రతి చోటను ఆదివారపు బడులు ఖాళీ లేకయుండును. ఏదో సినీతారవలె ఉండగోరు ఆ స్త్రీ, యేసువలె ఉండగోరినచో సంఘము ఎన్నడూ ఇక కానుకలు అడుగవలసిన పని ఉండదు. నిశ్చయంగా!

ఒక మాదిరిని కలిగియుండవలెనను కోరికతో దేవుడు మానవుని సృజించెను. మరియు దేవుడు ఒక మాదిరిని ఇచ్చెను. ఆ మాదిరి యేసు క్రీస్తే, ఆయనతో గుర్తింపబడవలెను.

మనము ఎక్కువగా ఆయనవలె ఉన్నచో ప్రపంచములో ఇంతమంది గొప్పవారుగా చెప్పుకొనువారుండరు; ప్రపంచములో ఆకలిగొను పిల్లలుండరు; విస్కీ గాని, త్రాగుడు గాని, లేదా జూదము గాని మరేదీ యుండదు. ఉండుటకు ఒక మాదిరిని దేవుడు ఇచ్చెను, కాని ఆ విధముగా యుండుటకు మనము తిరస్కరించుచున్నాము. ప్రపంచము యొక్క పరిస్థితి ఇప్పుడు అదే. వారికి కోరిక యున్నది, దేవుడు దానిని వారికి అనుగ్రహించెను, కాని దానిని వారు తప్పు మార్గములో మళ్ళించిరి. అది తిరిగి రావలసిన సమయమిది, సరైన దారిలోనికి రావలెను, మరియు కల్వరిని ఎదుర్కొనవలెను. ప్రకృతి దానిని రుజువు చేయును.

36

ఎవరినో మాదిరిగా ఎంచుకొనవలెనను గొప్ప కోరిక మరియు గొప్ప ఆశ కలిగిన నేటి జనులు, క్రీస్తును తమ మాదిరిగా తీసికొనినచో మనము దేశములో యున్న ప్రతి పోలీసును వెనక్కి పంపించగలము. ప్రతివారును తగ్గించుకొని దీనులుగా యు౦దురు. ప్రతివారును దయ కలిగి; పరస్పరము సోదర ప్రేమ కలిగియుందురు; దేశములో ఎన్నడునూ ఒక్క విడాకుల కేసును ఉండదు. ఏ వ్యాధి యుండదు; మనము ఆస్పత్రులను రద్దు చేయవలసియుండును, అందరునూ యేసు క్రీస్తును తమ మాదిరిగా చేసికొనుటకు ప్రయత్నించినచో ఆలాగుండును. మనకు ఏ అక్కరయు ఉండదు.

కనుక ఆ స్వభావము మానవునిలో యున్నది, కాని దానిని అతడు తప్పు విషయముల మీద ఉంచెను. ఏదో మనిషిని తీసికొనుచున్నాడు. శరీరధారిని ఆస్పదముగా చేసికొనినచో మనము శాపగ్రస్తులమగుదుమని బైబిలు చెప్పుట ఎరుగుదురా? శరీరధారిని ఆశ్రయముగా చేసికొన్నచో, లేక (శరీరధారియందు నీవు నమ్మికయుంచినచో) నీవు శాపగ్రస్తుడవగుదువని బైబిలు చెప్పుచున్నది. నాకు ఎంతో బాగుగా తెలియును; ఆలాగు చేయుట చాలా సులభము.

37

దానికి చాలావరకు కారణము ఇక్కడున్నది; మన వార్తా పత్రికలు అసభ్యముతో నిండిపోతున్నవి. మన గృహములన్నియూ అసభ్య చిత్రములతో నిండుచున్నవి; మన వార్తా తెరలు సెన్సార్ పరీక్షకు గురికాబడుట లేదు. అవి పూర్తిగా తెరువబడియున్నవి. ఎటువంటి సరసోక్తులయినా పలుకగలరు. భయంకరమగు కార్యములు చేయగలరు. మన మధ్య ఏ మాత్రమూ పరిశుభ్రత లేదు. నేను చాలా కఠినముగా వీటిని గూర్చి చెప్పానని మీరు తలంచుచున్నారని ఎరుగుదును, కానీ గట్టిగా చెప్పేవారు ఎవరో ఒకరు ఉండాలి. అది చెప్పవలసియున్నది.

నేను చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు, టార్జాన్ మరియు కోతులు అను పుస్తకము చదివాను. శ్రీమతి వాదెన్ ఇచ్చిన ఒక పాత ఉన్ని రగ్గు మా తల్లికుండెను, అక్కడ దుస్తులలో ఉండెను. నేను దానిని కత్తిరించి, నాకు ఒక టార్జాన్ సూటు తయారుచేసికొన్నాను. మరియు ఒక వారము పాటు చెట్లు మీదనే నిద్రించాను. నేను టార్జాన్వలె ఉండగోరాను. ఆ తరువాత నేను లోన్ స్టార్ రేంజరు పుస్తకము చదివి, ఒక చీపురు కట్ట మీద స్వారీ చేయసాగాను, దానిని నేను గుర్రముగా తలంచాను, ఆ లోన్ స్టార్ రేంజరు వలె ఉండగోరాను.

ప్రజలందరూ ఆలాగే చేయుదురు; నీవు చదువునది, నీవు వినునది నిన్ను ఆలాగే చేయును. ఒక బోజనశాల లోనికి వెళ్ళండి, ఈ పాత రాక్-అండ్-రోల్ వినబడును. ప్రజలు పిచ్చివారగుటలో ఆశ్చర్యము లేదు. ఒక మానవుని పిచ్చివాని చేయుటకు అది చాలును.

38

అయితే, అయ్యో! ఒక దినమున యేసును గూర్చి నేను చదివిన దానికి నేను నిరంతరము వందనములు చెల్లించుదును! అది నన్ను సంతృప్తిపరచెను. ఆయనవలె నేను ఉండగోరాను. అది నా కోరిక, నా మరొక చెంపను త్రిప్పుట, లేదా మరొక మైలు వెళ్ళుట, నా ఆశయమయినది. అందరూ నీకు వ్యతిరేకులయినప్పుడు వారిని క్షమించుట, ఎవరి మీద ఎట్టి కక్ష్య లేకుండుట, వారు నిన్ను ప్రత్యక్షముగా అవమానించినా గాని లేదా నీవు సరయినది చేసినప్పుడు, నిన్ను వారు తప్పుగా నిందించినా గాని, ఇంకా వారిని ప్రేమించవలెననునది బోధించెను. ఆలాగే నేను ఉండగోరాను. ఆ విధమగు వ్యక్తిగా నేనుండగోరాను. నన్ను ఎవరు దూషించినా తిరిగి దూషించకుండా ఉండు శక్తి కొరకు ఆశించాను. యేసు క్రీస్తులో దేవుడు అట్టి మాదిరినే మనకు ఇచ్చెను. ఆయనతో మనము గుర్తించబడవలసియున్నాము.

“ఆయనతో నీవెట్లు గుర్తించబడెదవు?” నీవు చెప్పెదవు, “బ్రెన్హాం సోదరుడా, ఇప్పుడు, హాలీవుడ్ తారలవలె దుస్తులు ధరించి, ఇంకా ఆ ఇతర కార్యములు చేయవలెను.” అయితే క్రీస్తుతో ఎట్లు నీవు గుర్తింపు పొందెదవు? మొదటగా, నీవు ఇప్పటికి చేసిన దాని విషయములో పశ్చాత్తాపము చెందవలెను. అప్పుడు, ఇక్కడ కొలనులో ఆయనతో గుర్తింపబడుదువు. కొద్దిక్షణములలో ఆయనతో అనేకులు గుర్తించబడుదురు అనుటలో సందేహము లేదు. కొలనులో బాప్తీస్మము ద్వారా ఆయనతో మీరు గుర్తించబడుదురు, క్రీస్తునందు మనము పాతిపెట్టబడినచో మనము ఆయన మరణము, సమాధి, పునరుత్థానములలో గుర్తించబడుచున్నాము. అందుకే మనము బాప్తీస్మము పొందియున్నాము. మనము నీటిలోనికి వెళ్ళుచున్నాము, యేసు క్రీస్తుయొక్క మరణము, సమాధి, పునరుత్థానములందు విశ్వసించుచున్నామని సాక్ష్యముతో తిరిగి పైకి లేచుచున్నాము. ఆయన యొక్క పోలికలోని మనము నాటబడినచో ఆయన మరణమందు, మనకు దేవుడు ఒక వాగ్దానము ఇచ్చెను. పునరుత్థానమందు మనము ఆయనవలె యుందుము.

39

ఏదో ఒక సినిమా తారతో నిన్ను నీవు గుర్తించుకొని ఎక్కడుందువో చూచుకో. ఏదో ఒక కౌబోయ్ లేదా ఏదో యువకునితో నిన్ను నీవు గుర్తించుకొని ఎక్కడుందువో చూచుకో. కాని ఈ రాత్రి నీకు సవాలు చేయుచున్నాను: యేసు క్రీస్తుతో ఆయన మరణము, ఆయన పునరుత్థానమందు నిన్ను నీవు గుర్తించుకొనుము. పునరుత్థానముందు ఎక్కడుందువో చూచుకొనుము. “ఏలయనగా ఆయనతో మనము శ్రమపడినచో, ఆయనతో కూడా ఏలుదుము.” దేవుడు మనకు వాగ్దానమును ఇచ్చెను. నా కోరిక అంతయూ ఆయన వలె ఉండుటయే. ఓ, ప్రభువా, నన్ను తీసికొని మలచుము, రూపించుము, మరల నన్ను రూపుదిద్దుము. మరియు కుమ్మరి ఇంటికి వెళ్ళిన ఆ ప్రవక్తవలె, నన్ను విరిచి మరల రూపించుము

40

పాత నిబంధనలో దేవుని గృహమునొద్ద గుర్తించబడుటకు ఒకడు వెళ్ళగోరునప్పుడు అతి నిర్దోషమగు గొర్రెపిల్లను అతడు తీసికొని వెళ్ళెడివాడు. మరియు పాపముతో గొర్రెపిల్లకు ఎట్టి సంబంధము లేదని అతడు ఎరుగును, ఎందుకనగా పాపమనగా ఏమియో అది ఎరుగదు. అతడు గొర్రెపిల్లను తీసికొని వెళ్ళి దాని తలమీద చేతినుంచి తన పాపమును ఒప్పుకొనెడివాడు. విశ్వాసము ద్వారా అతడు తన పాపములను గొర్రెపిల్ల మీదికి బదిలీ చేసెను మరియు గొర్రెపిల్ల యొక్క నిర్దోషత్వము అతని మీదికి తిరిగి వచ్చెను. అప్పుడు, గొర్రెపిల్ల చనిపోయినది, ఎందుకనగా అది పాపియాయెను. మానవుడు దేవుడు చెప్పిన దానికి విధేయత చూపి విశ్వాస కార్యము ద్వారా జీవించెను. కాని అతడు ఏమి చేసెను? తాను వచ్చినప్పుడు ఏ వాంఛతో వచ్చెనో అదే వాంఛతో తిరిగి దేవాలయము నుండి వెళ్ళుచుండెను, ఎందుకనగా ఆ రక్త కణము బ్రద్దలయినప్పుడు (జీవము ఒక్క రక్త కణముతోనే ఆరంభమగును)... ఆ గొర్రెపిల్ల జీవము మానవ జీవితము లోనికి వచ్చుట గాని, సమానమగుట గాని జరుగలేదు. మరియు ఎందుకనగా అది ఒక జంతుజీవము. తనకుండిన అదే వాంఛతో ఆ వ్యక్తి మరల వెళ్ళిపోయెను. కాబట్టి మరల నిరంతరము పాపమును ఆలాగే కొనసాగించుచుండెను.

41

కానీ దేవుడు మనలను మాదిరి చేసిన ఒక కాలము వచ్చెను. మరియు ఆయన ప్రభువైన యేసును మనకు ఇచ్చెను. ఆయన ప్రశస్థ తల మీద పాపి తన చేతులుంచి, తన పాపములను ఒప్పుకొనినప్పుడు, అతని పాపములు యేసు మీదికి బదిలీయగును. మరియు యేసు యొక్క నిర్దోషత్వము పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి ఆ వ్యక్తి మీదికి బదిలీయగును. క్రీస్తు యేసునందు అతడు ఒక నూతన సృష్టియగును. అక్కడే నేను గుర్తింపు పొందగోరుచున్నాను. బైబిలు ఈలాగు చెప్పెను, “పాపమెరుగని ఆయన మనకొరకు పాపమాయెను,” కారణమేమనగా ఆయన మన పాపముల కొరకు శ్రమపడెను. వీటివైపు చూచుట మన విధియైయున్నది. అంతకన్న మిన్నయైనది మరేదియూ లేదు, మరియు మనము కలిగియున్న కోరికలను దేవుడే మనయందు ఉంచెను, మనయందు సృష్టించెను, మనలను ఆయనవలె ఉండగోరుటకు ఆయన చేసెను.

42

మరియు ఇప్పుడు, ఆ నిజమగు వాంఛ ఇంకా నిన్ను ఎన్నడూ తాకనిచో, దానిని విశ్వాసము ద్వారా నీవు చూడకలిగినచో, ముందుకు రమ్ము, బాప్తీస్మమందు ఆయనతో గుర్తింపుపొందుము. ఆయన మరణమందు నీవు నాటబడినప్పుడు, పునరుత్థానమందు ఆయన పోలికను కూడా నీవు పంచుకొందువు. ఎందుకనగా సమాధినుండి ఆయన వచ్చినప్పుడు, సమాధిలోనికి వెళ్ళిన యేసువలెనె ఆయన ఉండెను. మరియు మనము క్రీస్తునందున్నయెడల (ఎట్లు క్రీస్తు లోనికి వెళ్ళెదము? పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా) ఆ దినమున మనము బయటకు వచ్చి ఆయన పునరుత్థానములో పాలివారమగుదుము.

సంవత్సరముల క్రితము నేను వాడుకగా పాడుచుండిన ఒక చిన్న పాట ఇది.

యేనువలె నుండుట, యేసువలె నుండుట,

భూమి మీద ఆయనవలె నేనుండగోరుచున్నాను,

జీవిత ప్రయాణమంతయూ

భూమినుండి మహిమ వరకు,

ఆయనవలె నుండుట మాత్రమే నేను అడిగెదను.

బెత్లెహేము పశుల తొట్టలోనుండి ఒక పరదేశి వచ్చెను

(లోకమునకు ఒక అపరిచితుడు.)

భూమిమీద ఆయనవలె నేనుండగోరుచున్నాను.

జీవిత ప్రయాణమంతయూ

భూమినుండి మహిమ వరకు,

ఆయనవలె నుండుట మాత్రమే నేను అడిగెదను.

43

ఆయన దీనత్వమందు పాలిభాగము పొందుదుము, ఆయన శక్తియందును మీరు పాలుపంపులు పొందెదరు, ఆయన విధేయత యందు పాలిభాగస్తులగుదురు. ఆయన పునరుత్థానమందు మీరు పాలు పొందెదరు. దేవుడు చేయుమని చెప్పినట్లుగా చేయుడి. నా హృదయమందు నేను యోచించగల గొప్ప సంగతి ఏమనగా, యేసుక్రీస్తువలె నుండవలెననునదియే, ఆయనతో గుర్తించబడవలెను. అందుకే నేను ప్రభువైన ఏసుక్రీస్తు నామమున బాప్తీస్మము పొందెదను, ఎందుకనగా యేసుక్రీస్తే మన గుర్తింపు. గుర్తింపును మనము చుట్టియుంచగలము. “మాటయందును, క్రియయందును, మీరేమి చేసినను, యేసుక్రీస్తు నామమందే చేయుడి, దానిని బట్టి దేవునికి స్తుతులు చెల్లించుడి.” మనము బాప్తీస్మమందు ఆయనతో గుర్తించబడియున్నాము.

44

ఈ రాత్రి కొద్ది నిమిషములలో మేము బాప్తీస్మము ఇయ్యబోవుచున్నాము. బాప్తిస్మము పొందగోరు జనులు ఈ గదిలో నున్నారు. మరియు నీ హృదయములో ఎట్టి కోరిక అయినను యున్నచో, ఏ గొప్ప లోకాశయైనను యున్నచో ఇప్పుడే దానినుండి పశ్చాత్తాపము పొందుము. “యేసువలె నుండుగోరుటయనే తృష్ణ గోరుచున్నానని దేవునికి చెప్పుము.” అణుకువతో, దీనముగా రమ్ము ఆయన శిరస్సు మీద నీ చేతులుంచి విశ్వాసము ద్వారా నీ పాపములను ఒప్పుకొని, “ప్రభువా, దానిని నేను చేసినందుకు చింతించుచున్నాను,” అని చెప్పుము. అప్పుడు ఏమి జరుగును? దేవుడు నీ దోషమంతటినీ ఆయన మీదకు బదిలీ చేసి, తన నిర్దోషత్వము నీ మీద ఉంచును. దేవుని సన్నిధిలో నీవు నీతిమంతునిగా తీర్చబడి నిలబడుదువు, ఎందుకనగా నీవు ఆయన కుమారుడవగు యేసు క్రీస్తునందు విశ్వాసముంచియున్నావు. ఎట్టి రక్షణ సంకల్పము! అప్పుడు నీవు ఆయన మహిమలో పాలుపొందెదవు. దేవుని యొక్క మంచితనము నీ హృదయములోనికి వచ్చును. ఆయన పునరుత్థానము యొక్క శక్తి నిన్ను ఒక నూతన వ్యక్తిగా చేయును. అది ప్రతి ఆకాంక్షను తృప్తిపరచును.

45

నేను బాలునిగా నున్నప్పుడు, ప్రతిది చేయుటకు ప్రయత్నించాను. నేను పెద్దవానిగా చేయవలసిన ప్రతిదియు చేశాను. పెద్దవానిగా చేయజాలని క్రియలు చేశాను. నేను ప్రయత్నించాను. నాకు వేటాడుట ఇష్టము. “అది ఇదే” అని తలంచాను. నా తండ్రి స్వారీ చేయు వ్యక్తి. “ఎప్పుడయినా నేను పశ్చిమానికి వెళ్ళి వారి గుర్రములను పై స్వారి చేసి వాటిని లొంగదీసుకోనవలెనని తలంచాను.”

మంచిది, సోదరుడా, ఆరిజోనాలోని ఆ పర్వతములకు ఆవలనున్నప్పుడు ఒకసారి పశువుల మందను ఒక రాత్రి తోలుకొనివచ్చుచున్నాను, అక్కడ నేను కూర్చొనియున్నాను; స్లిమ్ అను పేరుగల ఒక బాలుడు ఒక పాత దువ్వెనను కాగితముతో చుట్టియంచెను. అతడు ఆడుకొనుచుండెను; టెక్సాస్ నుండి వచ్చిన మరియొకడు ఒక గిటారుతో అక్కడ కూర్చొని సరిచేసికొనుచూ ఒక పాట యొద్దకు వచ్చిరి. నేను గుర్రము మీదనుండి జీనును తీసివేశాను, అక్కడ పడవేశాను, దానిని నేను నాకు తలగడగా ఉపయోగించుకొన్నాను. నా మీద దుప్పటి కప్పుకొన్నాను, నా బూట్లు విప్పకుండానే అక్కడ నేను పరుండియున్నాను. అతడిట్లు పాడుచూ వాయి౦చుచుండెను:

నా రక్షకుడు మృతి పొందిన ఆ సిలువ యొద్ద,

అక్కడ పాపమునుండి శుద్ధికొరకు నేను మొరపెట్టాను,

అక్కడ నా హృదయమునకు రక్తము అన్వయింపబడెను;

ఆయన నామమునకు మహిమ!

46

నేను నా దుప్పటిని తీసి నా చెవులు అది వినుటకు త్రిప్పాను. నేను పైకి చూచాను, నక్షత్రములు క్రిందుగా వ్రేలాడుచున్నవి. కొండలలోని గుసగుసలాడుచున్న పైన్ చెట్లు ఈ విధముగా మొరలిడుచున్నట్లున్నవి, “ఆదామా, నీవెక్కడ?” ఓ, పశువులను మేపుట రెండవ సంగతి అనుకొన్నాను; నేను దేవుని వెదుకగోరాను. నేనిట్లు పలికాను, “దేవా, నీవెవరివో నేను ఎరుగను, కాని నేను నిజమగునది కనుగొనువరకు నన్ను శిక్షించకుము.”

దానికి రెండు రోజుల తరువాత పట్టణములో కూర్చొనియుండగా, మరియు ఆ ప్రయాణము తరువాత, నేను పార్క్ లోని ఒక చిన్న బెంచీ మీద కూర్చొనియున్నాను. ఒక చిన్న స్పానీష్ బాలిక అటు వచ్చినది. మరియు నేను అక్కడ కూర్చొని దేవుడు అనగా ఏమైయున్నది అని తలంచుచున్నాను. మరియు ఆ బాలిక అటు వచ్చినది (మరియు నేను అప్పుడు పద్దెనిమిది ఏండ్ల బాలుడను); ఆమె తన చేతి రుమాలు అచ్చట జారవిడిచి వెళ్ళినది. నేను చెప్పాను, నీవు చేతి రుమాలు జారవిడిచావు.“ దేవునియొక్క ఆలోచనలు నా కోరికను మార్చివేసెను. నా యొక్క దీన ఐరిష్ హృదయము ఆకలిగొని యున్నది. నాకు ఏదో కావలయును, సంతృప్తిపరచునది ఏదో.

47

ఆఫ్రికా, ఇండియా, కెనడా పర్వతములలోను, ఇంకా ఆయా గొప్ప స్థలములందును వేటాడు భాగ్యము దేవుడు నాకు అనుగ్రహించెను. మరియు కొన్ని గొప్ప ప్రపంచ రికార్దులు నెలకొల్పాను. అది మంచిదే, కాని సజీవ దేవుని యొక్క శక్తి నీ ఆత్మతో ముద్రించుటకు ఆక్రమించు స్థలము ఏదియూ తీసుకోలేదు.

నేనక్కడికి వెళ్ళినప్పుడు... నేను పర్వతములను ప్రేమించేవాడిని; సూర్యాస్తమయములను నేను ప్రేమించుదును. నా గుర్రమును కర్రకు కట్టి, పర్వతముల మీదికి వెళ్ళి సూర్యోదయమును, సూర్యాస్తమయమును పరీక్షించుచూ కొద్ది రోజులు అక్కడ గడిపాను, పక్షిరాజుల అరుపులు విన్నాను. అది బాగున్నది; అక్కడుండుటకు నేనె౦తో ఇష్టపడ్డను. కాని సోదరుడా, “అపవిత్రత, అపవిత్రత, దురాత్మలు ఆయనను చీల్చివేసినవి. యేసు ఉండుటకు వచ్చినప్పుడు అంతా బాగున్నది,” నేను తలంచనారంభించినప్పుడు, నా హృదయము వికలమయి కొట్టుకొనసాగినది. రోగుల గూర్చి నేను ఆలోచించుచూ యున్నప్పుడు, నాలో నుండి ఏదో ఈలాగు కేకవేయసాగినది. “వెంటనే! ఈ పర్వతముల నుండి నేను దిగిపోదును. దిగి ఆ జనుల యొద్దకు పోదును.” నేను ఆయన దాసునిగా ఆయన జనుల మధ్య నన్ను నేను గుర్తింపచేసికొనగోరుచున్నాను. ఓ! ఆయనతో నన్ను నేను గుర్తించుకొనుట ఎంతో నాకు ఇష్టము. దానికి ప్రతిఫలముగా ఆయన మన మధ్యకు తిరిగి వచ్చి మనతో తన్ను గుర్తింపచేసికొనును. ఈ రాత్రి ఆయన ఇక్కడున్నాడు, స్నేహితులారా.

48

సుమారు పది నిమిషములలో బాప్తీస్మపు ఆరాధన ప్రారంభమగుటకు ఇది సమయము. దానిని చేయుముందుగా ఈ ఒక్క సంగతి నేను చెప్పవలెనని కోరుచున్నాను. యేసు క్రీస్తు దేవుని కుమారుడు (చాలా వ్యాఖ్యానములు నేను చేయగోరుచున్నాను, కాని సమయము లేదు)... దేవుని కుమారుడగు యేసు క్రీస్తు తన్ను తాను గుర్తింపచేసికొనుచున్నాడు. దేవుని కుమారుడగు యేసు క్రీస్తు ఈ ఉదయకాలపు కూటములో వివేచించుట ద్వారా తన్ను తాను గుర్తింపజేసుకొనెను. పాపిని పాపము యొక్క మూలము నుండి తీసి ఒక క్రొత్త వ్యక్తిగా, ఒక క్రొత్త జీవిగా చేయుటకు ఆయన గుర్తింపజేసుకొనెను. పురుషులలో గాని, స్త్రీలలో గాని అల్పమైనవారు అనగా త్రాగుబోతు, మరియు ఎవరినైనా తీసుకొని వారిని నిదానించి, శుద్ధిచేసినచో, వారిని ఒక గౌరవమైన పురుషునిగా లేదా స్త్రీగా చేయుము. అదే నా దేవుడు. ఏ ఆశ లేని ఒక వ్యక్తిని, బాధలలో ఉన్న వ్యక్తిని, అనారోగ్యముతో ఉన్న వ్యక్తిని తీసుకొని మరలా నూతన జీవమునకు తీసుకొని వచ్చుట మరియు మన మధ్య కనపరచుకొని, మన హృదయములను తెలుసుకొనే అదే యేసు క్రీస్తుగా మన మధ్య గుర్తింపజేసుకొనుట. తన ప్రజల మధ్య నిలబడియుండుట, తన జనులలో దేవుడు ఉండుట, గుర్తింపజేసుకొనుట. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడాయన ఇక్కడే యున్నాడు, అదే పరిశుద్ధాత్మ.

49

ఇక్కడ బాప్తీస్మము కొరకు కూటము మనము ప్రారంభించు ముందుగా ఇది చెప్పవలెను. (సోదరులు సిద్ధపరచుచుండగా), ఈ ఉదయమున ఇంకా ఇక్కడ ప్రార్ధి౦చబడనివారు రోగులుగా ఉన్నచో మీ చేతులు పైకి చూపించండి. మీరు రోగులు గాను, అక్కరలోను ఉండి ఈ ఉదయమున ప్రార్ధి౦చబడనిచో మీ చేతులు పైకి ఎత్తండి. ప్రార్ధన కార్డులు గాని మరేమీ గాని అక్కరలేదు. రోగులు, బాధపడుచున్నవారు. సరే, మంచిది. ఒక్క క్షణము మన తలలు పంచుదము.

50

ప్రభువా, ఈ అణచబడిన గొంతుతో, బొంగురు స్వరముతో, ఓ, ఎలాగయినా గాని విత్తనమును హృదయములో దిగనిమ్మని ప్రార్ధి౦చుచుచున్నాను. మేము తప్పక నీతో గుర్తించబడునట్లుగా ప్రజల హృదయములోనికి దిగనిమ్ము. ఇప్పుడు భూమిమీద ఈ సామెత పాతబడినది. “ఈకెలు బట్టి పిట్ట ఏమిటో తెలియును. తన సహవాసులను బట్టి ఒక వ్యక్తి ఏమిటో తెలియును.” ప్రియ పరమతండ్రీ, నీవే మా సహవాసముగా ఉండమని ప్రార్ధి౦చుచున్నాము. ప్రభువా, ఈ భూమిమీద మాకున్నదంతయూ ఖర్చుపెట్టవలసి వచ్చిననూ నిన్ను మేము కలిగియుండునట్లు చేయుము. “ఆ వ్యక్తి నిజముగా దేవునితో జీవించువాడు. అతని సహవాసము దేవుడే,” అని మేము గుర్తించబడుదుము గాక!

శృంగారమను ద్వారముగా పిలువబడిన దానిగుండా పేతురు, యోహానులు దాటిపోయిన పిదప వారిని చూచి ప్రజలు ఏమనుకొనిరో ఆలాగే అందురు గాక “నా యొద్ద ద్రవ్యము లేదు; కాని మాకున్న దానినే మేము మీకిచ్చుచున్నాము,” అని చెప్పిరి. ఆ కుంటివాడు స్వస్థతపొందెను. ఆ ముందు ఆవరణములో, వారు విద్యలేనివారని, పామరులని ప్రజలు పిలిచిరి; వారికి విద్య లేదు, కాని వారు సరైన వాని సహవాసములో ఉండిరని ప్రజలు గ్రహించిరి, వారు యేసుతో నుండిరి. దేవా, అదే నా హృదయ వాంఛ, నీ దాసులలో ఒకనిగా, నిన్ను ప్రేమించువానిగా, నీ పట్ల యధార్ధముగా నుండువానిగా, నీ గ్రంథములోని కట్టడలు అనుసరించువానిగా, సరి అని నాకు తెలిసిన ప్రతిదియు చేయువానిగా ఉండి నీతో గుర్తించబడునట్లు చేయుము.

51

ఇప్పుడు తండ్రీ, ఇది ఏదో కాదు గాని, ఓ, అది ప్రత్యేక సమయము లేదా ఆ క్రమములోనున్న మరేదోనని జనులు ఎరుగునట్లుగా, ఈ రాత్రి నిన్ను నీవు మరల మా మధ్య గుర్తింపచేసికొనవా? మారని దేవునివగు నీవే ఇక్కడ ఈ ఉదయమున ఉన్నావని ఈ రాత్రి వీరెరుగునట్లు చేయుము. నీవు అదే శక్తిని కలిగియున్నావు. ఈ ఉదయమున, నీవు చేసిన అవే కార్యములు ఈ రాత్రియు చేయగలవని నిరూపించుము. చివరి దినములలో ఆలాగు జరుగునని నీవు వాగ్దానము చేసితివి.

ఇక్కడ చాలామ౦దికి కావలసినంత విశ్వాసమును పొందలేని స్థితిలో యుండవచ్చును. ఇప్పుడు వారికి విశ్వాసమును అనుగ్రహించమని ప్రార్దించుచున్నాను. మా మధ్య నీ ఆత్మను గుర్తింపచేయుము, ఏలయనగా నీవు ఈలాగు చెప్పితివి, “నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును.” ఈ రాత్రి నీవు మాతో ఉన్నావనియు, ఇంకా మమ్ము ప్రేమించుచున్నావనియు తెలియచేయునట్లుగా గుర్తింపు దయచేయుమని ప్రార్ధి౦చుచున్నాను. ఇంకా బాప్తీస్మము పొందకుండా ఉన్న ప్రతివారు వచ్చి, నీతో గుర్తింపబడవలెనినీవు కోరుచున్నావు. వారును ఈ అద్భుత కృపలో పాలుపొంది, మా దోషము ఆయన మీదకు, ఆయన కృప మా మీదకు బదిలీ చేయుటలో పాలిభాగస్తులగునట్లుగా చేయుము. ప్రభువా, అది అనుగ్రహించుము. నీ కుమారుడగు యేసు నామములో దీనిని అడుగుచుండగా, మా ప్రార్థనలు వినుము. ఆమేన్.

52

దేవునియొక్క న్యాయమగు నీతీకరణపు ఛాయలో మేము నిలబడియున్నాము. యేసుక్రీస్తు నామమందు ఇద్దరు ముగ్గురు ఏ సమయములో కూడికొనిననూ వారి మధ్య ఉందునని, ఆయన వాగ్దాసము చేసెను.

ఇప్పుడు నాకు తెలియదు... ప్రార్థన కార్డులలో కొన్ని తీసికొనబడినవని తలంచుచున్నాను. మీలో కొందరు ఇంకా కొన్ని కలిగియుండవచ్చును. మీలో చాలామందికి ప్రార్ధన కార్డులు లేవు. మీకున్నా లేకపోయినా పరవాలేదు. మీరు రోగులయితే, రోగులే. ఈ బైబిలును వ్రాసిన దేవునియందు మీరు పూర్తిగా విశ్వసించుచున్నారా? ఆయన భూమిమీద నున్నప్పుడు జరిగించిన కార్యముల హేతువును బయలుపరచి, ఇక్కడ రోగులను బాగు చేయుటకు ఉన్నాడనియు, ఇక్కడున్న పాపులను ఒప్పింపచేయుటకు ఉన్నాడనియు, వాక్యము ఒప్పింపచేయుటకు ఉన్నాడనియు, వాక్యము బోధించుటయే గాక, తన్నుతాను రుజువుపరచుకొనుటకు మరల మనమధ్యకు తిరిగి వచ్చినచో మీరు సంతోషముగా మీ స్వస్థతను అంగీకరించుదురా? పొందుదుమన్నచో మీ చేతులు ఎత్తండి. ఏ ప్రార్ధన కార్డులు అతడిచ్చెనో నాకు తెలియదు; ప్రార్థన కార్డులు తీసికొనగోరుట లేదు. కేవలము మీరు ప్రార్దించండి; మరియు మీరు విశ్వసించండి.

53

మరియు ఆయన ఆలాగు చేసినచో, తన్ను తాను గుర్తించుకొన్నచో, ఆయనతో గుర్తింపచేసికొనలేనందులకు నీవు తప్పక సిగ్గుపడవలెను. అది నీవు చేసి తీరవలెను. ఇప్పుడు, ఒక తిన్నని సవాలు ఇక్కడ యున్నది. ఈ ఉదయ కాలమున చర్చిలో మేము ప్రార్ధన కార్డులు ఇచ్చాము. వేదిక మీదికి పిలిచాము, వారికొరకు ప్రార్ధి౦చాము. మరియు ఎటువంటి గొప్ప సమయముతో పరిశుద్ధాత్మ కుదిపివేసినదనగా, నన్ను వారు ప్రక్కలకు లాగుట నేను కనుగొన్నాను. నేను బలహీనముగా యున్నాను గనుక అది నేను వెళ్ళిపోవలసిన సమయము. మరియు ఇప్పుడు, ప్రార్థన కార్డులు లేని వారికి, ఈ సమూహములో కూర్చున్న వారికి నేను చెప్పుచున్నాను, ఇది చేయమని నేను సవాలు చేయుచున్నాను, యేసు క్రీస్తును గూర్చి నేను చెప్పిన గాధ సత్యమని విశ్వసించమని చెప్పుచున్నాను. మీరు రోగులయినచో ప్రార్ధించండి. అది ఏమైనా....

ఆలయమునకు చెందని ప్రజలను కనుగొందునేమోనని ఈ ఉదయమున నేను చూచుటకు ప్రయత్నించుచున్నాను. ఈ రాత్రి మీరెక్కడనుండి వచ్చిననూ, నాకు పరవా లేదు. కేవలము మీరు ప్రార్దించండి. ఆ గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వచ్చినచో చాలును. ఆ దృశ్యమును మనము చూచాము. దానిని ఎంతగానో నేను బోధించుట మీరు విన్నారు, ఆయన చేయుదునని చెప్పిన వాగ్దానములు విన్నారు. ఆయన భూమి మీద నుండగా చేసినవన్నీ ఆయన మరల మన శరీరములోనికి వచ్చి చేయును.

54

మీరు రోగులయినచో, ప్రార్ధి౦చండి. దేవునిని సవాలు చేయండి. ఈలాగు చెప్పండి, “దేవా, సహో, బ్రెన్హాం నన్ను ఎరుగడు. నా గూర్చి ఏమియూ అతడు ఎరుగడు. కాని అతనిని నా వైపు త్రిప్పి, నీ వస్త్రపు చెంగును నన్ను అంటుకొననిచ్చినచో, అప్పుడు నీవు మాట్లాడుము.... నీవు ఈ సంఘముతో సంబంధము కలిగియున్నావని నాకు తెలియును. (సంఘమనగా విశ్వాసులు) అప్పుడు నేను నీవు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా యున్నావని ఎరుగుదును.” మీరు ప్రార్ధి౦చండి.

దానిని చేయుటకు నేను నడిపించబడితిని. అదెందుకు చేశానో నాకు తెలియదు, కాని అది చేయుటకు నేను నడిపించబడుచున్నాను.

55

ఇప్పుడు, మీ తలలు పైకెత్తినచో.....

ఇక్కడే ఒక స్త్రీ ఈ విధముగా చేతిని పైకెత్తి కొద్ది నిమిషముల క్రితము ప్రార్ధి౦చుచున్నది. ఆమె తన కొరకే కాకుండా మరెవరి కొరకో ప్రార్ధి౦చుచున్నది. నాకు తెలిసినంత వరకు ఆ స్త్రీని నా జీవితములో ఎన్నడూ ఎరుగను. ఆమె పూర్తిగా నాకు క్రొత్త వ్యక్తి, కానీ ఆమె తన కుమార్తె యొక్క ఒక ఆపరేషను కొరకు ప్రార్ధి౦చుచున్నది. నీవు ఈ ప్రాంతము నుండి వచ్చిన వ్యక్తివి కూడా కాదు. నీవు టెక్సాస్ నుండి వచ్చావు. అది “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” నీకు ప్రార్ధన కార్డున్నదా? నీకు లేదా? సరే, నీకు అక్కర లేదు. నీ పూర్తి హృదయముతో విశ్వసించుము.

నీవు దేనిగూర్చి ప్రార్ధి౦చుచున్నావో నాకెట్లు తెలియును? పరలోకమందున్న దేవుడు హృదయ రహస్యములను బయలుపరచునని నీవు చూడలేవా? దానిని దానియేలు తన రోజుల్లో చెప్పలేదా? దేవుడు హృదయ రహస్యములను బయలుపరచును.

అక్కడ నీ ప్రక్కన ఒకామె కూర్చొనియున్నది. దానిగూర్చి ఆమె ఎంతో ఆనందముగా యున్నది. ఆమెకు గుండె వ్యాధి యున్నది, మరియు ఆమె ప్రార్ధి౦చబడవలెనని కోరుచున్నది కనుక నీ చేతిని ఆమె మీద వేయుము. మంచిది. నీవు పికాగోకు తిరిగి వెళ్ళుము, బాగుపడుము. ఆమేన్! ఆ స్త్రీని కూడా నేను ఎరుగను, ఆమెను గూర్చి ఏమీ ఎరుగను. కాని దేవుడు నిన్ను ఎరుగును! చూడుము, ఆయన తన్నుతాను మనతో గుర్తింపచేసికొనుచున్నాడు. “నమ్ముట నీవలనైతే, నమ్మువానికి సమస్తమూ సాధ్యమే.”

56

ఒక చిన్న యూదా స్త్రీ ఇక్కడ కూర్చొనియున్నది. ఆమె కూడా ప్రార్ధి౦చుచున్నది. అది నిజము. నీకు ఏదో నేను చెప్పవలెనని ప్రార్ధి౦చుచున్నావు. ఈ ఉదయమున నీ బాధలు నేను చూచాను, కాని నిన్ను పిలువలేదు. కాని నీవు బాధపడుచున్న ఆ పాదములు, అవి బాగుపడనైయున్నవి; కనుక దేనిగూర్చియూ చింతచెందవద్దు,

ఇక్కడ కూర్చొనియున్న నీవు కూడా నమ్ముచున్నావా అమ్మా! నేను ఆయన ప్రవక్తనని నమ్ముచున్నావా? నిన్ను నేను ఎరుగను. దేవుడు నిన్ను ఎరుగును, కాని దేవుని యొక్క ఆత్మ మనతో నున్నయెడల, ఆయన యేసు చేసినట్లే చేయును. నీవు ప్రార్ది౦చుచున్నావు, మరియు నీకు నేను ఆకర్షించబడినట్లుగా కనబడుచున్నది. ఆమె ప్రక్కన ప్రభుని దూత యున్నది. నీవు నమ్మినచో, నీ గుండె జబ్బు పోవును, నీ కీళ్ళనొప్పులు బాగవును. నీ పేరు శ్రీమతి విస్డమ్. అది నిజము. నీవు తిరిగి వెళ్ళి బాగవుము, శ్రీమతి విస్డమ్. నా జీవితములో ఎన్నడూ ఆమెను చూడలేదు. కాని నీవు నమ్మినచో ఆయన దేవుడు.

57

ఇక్కడ! ఇటు చూడుము. అక్కడ కూర్చొనియుండిన ఆమె తన చేతిని నోటి వైపు ఈలాగు పైకెత్తినది చూడండి? అక్కడున్న ఆమె మీద వెలుగు వ్రేలాడుట మీరు చూచుట లేదా? ఇప్పుడు చూడండి? ఆమె వైపు అది దిగి వచ్చుచున్నది, అది వెదజల్లబడుట నేను చూచుచున్నాను. ఆమె కాలేయపు జబ్బుతో యున్నది, కాలేయపు వ్యాధితో బాధపడుచున్నది. అది గాల్ బ్లాడర్ వ్యాధి. నీవు శ్రీమతి పామర్, అవును. ఇప్పుడు నేను గుర్తుకు తెచ్చుకున్నాను ఎవరు..... నేను లేదు.... చూడుము, అది కేవలము ఒక దర్శనము. నీవు సహో. పామర్ ప్రక్కన కూర్చొని యుండుట కనబడుచున్నది. అది నిజము. సోదరీ! ఇప్పుడు, నీవు వెళ్ళి బాగవుము మరియు నీ పూర్ణ హృదయముతో నమ్ముము.

58

ఆమె వెనుక కూడా ఒకామె కూర్చొనియున్నది, ఒక విధంగా ఆశ్చర్యపడుచున్నట్లుగా కనబడుచున్నది, ఆమెకు సరిగ్గా వెనుక యున్నది. సోదరీ, నీ ఇద్దరు పిల్లల యొక్క టాన్సిల్ వ్యాధి గూర్చి ఆలోచించుచున్నావు. నీకు కూడా యున్నదా? నీవు నీ ఇంటి దారిలో పొమ్ము సంతోషించుము మరియు ఆనందించుము. నీ చేతిని బిడ్డల మీద ఉంచుము, ఆ వ్యాధితో నున్న నీ ఇద్దరు బిడ్డలు, నీవును బాగయ్యెదరు. మీరందరూ ప్రభువైన యేసు నామములో స్వస్థపడ్డారు, మీరందరూ. నీవును బాగయెదవు, స్వస్థపడుము.

సజీవ దేవుడు నేడును బ్రదికియున్నాడని నీవు చూడగలవా? ఆయన ఎక్కడున్ననూ గొప్పవాడే, కాదా? ఆయనతో మీరు గుర్తింపు పొందగోరుట లేదా? నిశ్చయముగా మీరు పొందగోరుచున్నారు. తప్పక మీరు కోరుచున్నారు.

ఇప్పుడు, అది నిన్ను మరింతగా బలహీనపరచక ముందే ఒక్క క్షణము పాటు మనము తలలు వంచుదము. ఎంత మంది ప్రార్థనలో గుర్తుచేసికొనబడగోరుచున్నారు? ఇప్పుడీలాగు చెప్పండి, “దేవా, నాపై దయచూపుము. ఇప్పుడు నేను ప్రభువైన యేసును విశ్వసించగోరుచున్నాను. ఇప్పుడే నా బాధలన్నియూ సరిచేయబడాలి అని కోరుచున్నాను.” దేవుడు మీతో ఉండును గాక.

59

ప్రభువా, మృతులలో నుండి యేసును తిరిగి లేపితివి, పరలోకపు తండ్రీ, వారి తరపున నేను ప్రార్ధి౦చుచున్నాను. ఇది వారు విశ్వసించు ఘడియగా ఉండును గాక! ఇంతకుముందెన్నడూ వారు చేయనిచో ఇప్పుడు చేయుటకు ముందుకు వచ్చెదరు గాక! ఈ రాత్రి ఈ కొలనులో ఇక్కడ యేసుక్రీస్తుతో గుర్తించబడుదురు గాక. బాప్తీస్మమందు ఆయనతో మనము సమాధి చేయబడినచో, ఆయన మరణమందు పాలుపొందినచో, ఆయనతో పునరుత్థానమందును మేము పాలు పొందుదుమని వాక్యము చెప్పుచున్నది. అది ఒక వాగ్దానము. మరియు ఆ ప్రాచీన మహా పరిశుద్ధుడగు పేతురు మాకు చెప్పినదేమనగా, మారు మనస్సు పొంది, పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమందు బాప్తీస్మము పొందవలెను, అప్పుడు మేము పరిశుద్ధాత్మ అను వరమును పొందుదుము. ఇదంతయూ మేము....

ఇక్కడ నా కోడలు కూర్చొనియున్నది, ప్రభువా, చిన్న లోయిస్ ఆకలిగొని, దాహముగొని, ఉపవాసముతో కనిపెట్టియున్నది. ఆ వెనుక నా సోదరి ఆకలి, దప్పులతో ఉపవాసముండి కనిపెట్టి కూర్చొనియున్నది. ఓ, ప్రభువా, ఇప్పుడే పరిశుద్ధాత్మను ఏలాగో ఈ భవనములోనికి పంపి వారి ఆత్మలను పునరుత్థాన శక్తితో నింపుము. వారి పునరుత్థాన శక్తితో వారు తమ పాదముల మీద లేచి యేసు క్రీస్తుతో ఆయన పునరుత్థాన శక్తియందు గుర్తించబడుదురు గాక. ప్రభువా, అది అనుగ్రహించుము.

60

ప్రతి పాపమును క్షమించుము. ప్రభువా, ప్రతి తప్పిదమును కొట్టివేయుము. యేసు క్రీస్తు నామములో మేము ప్రార్ధించుచుండగా, తండ్రీ, మాకు నీ కృపను అనుగ్రహించుము.

ప్రతి రోగిని, బాధపడుచున్నవారిని బాగుచేయుము. ప్రభువా, నీవు ఇచ్చటు ఉన్నావు; నీవె దేవుడవు. మరియు నీకు నీవు దేవునిగా రుజువుచేసికొన్నావు, నీ ఆత్మస్వభావమును ఎరిగినవారమై యుండి మేము ప్రార్ధి౦చుచున్నాము. నీవు కొన్ని కార్యములు జరిగించి వారి మధ్యనుండి అదృశ్యమైతివి. అక్కడినుండి మరియొక చోటకు, మరియొక పట్టణములోనికి వెళ్ళినావు. కాని సజీవుడగు దేవుడు జీవించెనన్న గురుతును నీవు విడిచిపెట్టి యున్నావు. మరియు ఎన్నడూ మరువరాని ముద్రగా ఇది జనుల హృదయముల మీద నిలిచియుండవలెనని, ప్రభువైన యేసూ, ప్రార్ధి౦చుచున్నాను. నీ ఆత్మ ఇచ్చట స్వస్థపరచుటకు, రక్షించుటకు, ఆయన మంచితనముతో నింపుటకు సిద్ధముగా యుండునట్లు ప్రార్ధి౦చుచున్నాను. యేసు నామమున ప్రార్ధి౦చుచున్నాను. ఆమేన్.

61

ఇక్కడెందరు బాప్తీస్మము పొందనైయున్నారు? మీ వస్తువులన్నియూ సిద్ధము చేసికొన్నారా - మీ చేతులెత్తండి? అయితే కొద్ది నిమిషములలో నీరు సిద్ధము చేయబడును. మనము ఇప్పుడు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుచుండగా, కొద్ది నిమిషముల పాటు, ఇంకా పరిశుద్ధాత్మను పొందనివారెవరయినా యున్నచో, పరిశుద్ధాత్మ పొందుటకు ఆసక్తితో ప్రార్ధి౦చుచూ కోరుచున్నారా?

టెడ్డీ, నీవు గాని, లేదా మీలో ఎవరయినా గాని, వెంటనే పియానో యొద్దకు రండి. బాప్తీస్మము కొరకు సిద్ధపడుటకు స్త్రీలు ఈ గదిలోనికి వెళ్ళుచుండగా, ఇప్పుడు మనము కొన్ని గీతములు పాడబోవుచున్నాము. బాప్తీస్మము కొరకు సిద్ధపడుటకు పురుషులు ఈ గదిలోనికి వెళ్ళుదురు. ఆ కార్యక్రమము కొరకు మనము సిద్ధపడుదము.

మనము చేయవలసిన కార్యములు బయలుపరచునట్లుగాను, పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చునట్లు గాను, ఇప్పుడు కనిపెట్టనైయున్నాము. అప్పుడు, మనము ప్రధాన ఆడిటోరియములో లైట్లు వేయుదుము. సేవకుడు ఇక్కడ నీటిలోనికి వచ్చును. అప్పుడు మనము బాప్తీస్మమిచ్చు కార్యక్రమములోనికి వెళ్ళుదుము.

ఒక్క నిమషము, మీరు లైట్లు ఆర్పి వేయుక ముందు ఆగండి, సహో. ఇవాన్స్; మనము కనిపెట్టియుండగా, ఒక వాక్యము చదువగోరుచున్నాను. మీకిష్టమైనచో కొన్ని క్షణముల పాటు ఆగుదము.

62

వారు అన్నియూ సిద్దపరచనై యుండగా, ఇక్కడ ఒక వాక్య భాగము చదువగోరుచున్నాను. దేవుడు అనంతుడని ఎందరు నమ్ముచున్నారు? నిశ్చయంగా, ఆయన ఇప్పుడు ఇక్కడే యున్నాడు. పరిశుద్ధాత్మను పొందుటకు మీరు చేయవలసిన ఒకే ఒక కార్యము ఏమనగా లేచి ఆయనను అంగీకరించుటయే. ఆయన ఇక్కడున్నాడని, ఆయన శక్తి రుజవు చేసెను. ఇంక మనకు సందేహములు ఎందుకుండును? ఆయన ధన్యమగు ఛాయ, పరిశుద్ధ సన్నిధి, మన ఆత్మలను స్నానము చేయించుచున్నది. నిత్యము, సదా కాలము నిలచియుండు ఆయన కృప మరియు మంచితనము గూర్చి నా స్వరమంతటితో కేకవేయవలెనని అనిపించుచున్నది. ఆయన ఇచ్చటున్నాడు. నా హృదయము మండుచున్నది, ఆయన సన్నిధి బట్టి అది ఆనందముతో, చెప్పరాని సంతోషముతో నిండియున్నది.

63

వారు లైట్లు ఆర్చివేయక ముందుగా అపొ.కా. 1 అధ్యాయము నుండి చదువగోరుచున్నాను. ఇక్కడున్న ప్రతివారు, సేవకులు, వ్యక్తులు, సువార్తికులు మరెవరయినా గాని: దేవుడు అనంతుడని నమ్ముచున్నారని నా విశ్వాసము. దేవుడు ఒక పనిని ఒక విధముగాను, మరొక పనిని మరొక విధముగాను చేయడు. ప్రతిసారి ఆయన ఒకే రీతిగా అది చేయును. ఆయనాలాగు చేయడా? దేవుని నుండి బయలు వెళ్ళిన ప్రకటన ఇది:

ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మొప్పుపొందినవానిగా మీకు కనబరచెను. ఇది మీరే ఎరుగుదురు. [తాను మెస్సీయానని ఋజువుపరచుటకు ఆయన ఎట్టి సూచక క్రియలను చేసెను? వారి హృదయాలోచనలను ఎరుగుట ద్వారా, అది నిజమేనా? పేతురు ఎందుకు చెప్పెను? “తాను ఆయనతో ఉన్నానని దేవుడు రుజువు చేయుటకు మహత్కార్యములను, సూచక క్రియలను చేసెను.”]

దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి.

మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము: గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను.

ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను - నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమున నున్నాడు. గనుక నేను కదల్చబడను.

కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను: మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును.

నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్దుని కుళ్ళుపట్టనియ్యవు.

నాకు జీవ మార్గములు తెలిపితివి. నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు.

సహోదరులారా, మూల పురుషడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాటలాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మనమధ్యనున్నది.

అతడు ప్రవక్తయై యుండెను గనుక - అతని గర్భ ఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదును, అని దేవుడు తనతో ప్రమాణ పూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడెరిగి;

క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు, దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను.

ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. [ఓ, అది నన్ను అమితానందములో ముంచుచున్నది. మనమింకా ఆయన సాక్షులము. ఆయన మృతులలో నుండి లేచెను. ఆయన ఈ రాత్రి జీవించియున్నాడు] కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది, మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించియున్నాడు.

దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు: అయితే అతడిట్లనెను - నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచుటకొరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను.

ఇది ఇశ్రాలేలీయుల వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను. [ప్రపంచములోని పలు భాషలు మాట్లాడువారందరూ కూడి వినుచున్నప్పుడు అతడు మాట్లాడిన భాష ఏమిటి?]

వారు [ప్రజలు] ఈ మాట విని, హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, [కొద్దిసేపటి క్రితమే వారికి వీరు పిచ్చివారుగా కనబడిరి. అక్కడ నిలబడియున్నవారి ప్రతి దేశమునకు బయలు వెళ్ళుచున్న ఆ బలమగు సందేశమును వినిన తరువాత, “సహోదరులారా, మేమేమి చేతుమని అడిగిరి.” అప్పుడు ఈ సందేశము వచ్చెను.

పేతురు వారితో - మీరు మారు మనస్సు పొంది, పాప క్షమాపణ నిమిత్తము, ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తీస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.

ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.

ఇంకను అనేక విధములయిన మాటలతో సాక్ష్యమిచ్చి - మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. [అదే సువార్తను మనము బోధించుచున్నాము. “ఈ మూర్ఖ తరము నుండి వేరగుడి.” అనేక సూచక క్రియలు, మహత్కార్యములు జరిగించబడినవి. యేసు క్రీస్తు యొక్క సన్నిధి తాను సజీవముగా నున్నానని చూపించుచున్నది. ఇక్కడ ఆజ్ఞాపించబడిన బాప్తీస్మమే ఈ రాత్రి ఇక్కడ వేదిక మీద ప్రకటించబడినది.]

కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీస్మము పొందిరి: ఈ దినమందు ఇంచుమించు మూడు వేలమంది చేర్చబడిరి.

64

ప్రియదేవా, నీతో బాప్తీస్మము ద్వారా గుర్తించబడుటకు నిలబడిన జనులతో గదులు నిండిపోయియున్నవి. ప్రభువా, వారి తరపున నేను ప్రార్ధి౦చుచున్నాను. ప్రభువా, ఈ ఘడియలో నీవు దయచూపి, వారు నీటి నుండి బయటకు వచ్చునప్పుడు, వారి ఆత్మలు పరిశుద్ధాత్మతో నింపబడునట్లు ఏదో ఒకటి జరుగనిమ్ము. వారు వచ్చి నీటిని విడిచి, సువార్తను బోధించుటలో నిన్ను బయలుపరచుటకు బయలు వెళ్ళుదురు గాక. ఆదివారపు పాఠశాల బోధించుదురు గాక, భాషలు మాట్లాడుదురు గాక, భాషలు అనువాదము చేయుదురు గాక. సూచక క్రియలు, అద్భుతములు, మహత్కార్యములు, మరియు అన్నిటికి పైగా దీనత్వముతో, మృధుత్వముతో, సహనము మరియు అణుకువలతో వారి హృదయములలో దేవుని ప్రేమ మండును గాక.

ప్రభువా, వారిని నీకు అప్పగించుచున్నాను. వారు ఈ ఉజ్జీవము యొక్క జయసూచకములు. వారిని నీ కాపుదలలో ఉంచమని ప్రార్ధి౦చుచున్నాను. మరియు ఒక దినమున ఇక్కడ నేను నిలబడి, నీ బైబిలు మీద పడి ప్రార్ధి౦చాను. ఆ తరువాత దానినుండి బోధించాను, నేను సత్యమని నా హృదయమంతటితో యోచించిన, దానిని ప్రకటించాను, దానిని నీవు నాకు బయలుపరచినట్లే చెప్పితిని....

65

ప్రభువా, మేము వారి బాప్తీస్మము కొరకు కనిపెట్టుచున్నాము. ఈ ఆలయములో కూడిన మేమందరము పునరుత్థానము కొరకు కనిపెట్టుచున్నాము. ప్రభువా, ఒక దినమున, మేము పరలోక స్థలములందు కలిసి నిలబడియుండగా, పరము నుండి ఒక శబ్దము వచ్చును గాక; బూర మ్రోగును, క్రీస్తునందు మృతులు మొదట లేతురు. ప్రభువును మధ్యాకాశములో కలిసికొని ఆయనతో సదాకాలము ఉండుటకు కొనిపోబడుదుము గాక. తండ్రీ, అది మాకు అనుగ్రహించుము.

మమ్ములను ఆరోగ్యవంతులుగా, సంతోషభరితులుగా, పరిపూర్ణ ఆసక్తిగలవారిగా ఉంచుము. మేము ద్రవ్యము కొరకు అడుగుట లేదు. మేము కేవలము యేసువలె ఉండుటకు అడుగుచున్నాము. ఆయనతో గుర్తించబడవలెననునదియే మా కోరిక, ఆయనలోనున్న ఆత్మవంటిది కావలెను. దీనత్వము మరియు తగ్గింపు ఎల్లప్పుడునూ తండ్రి యొక్క విధియై యున్నది.

ప్రభువా, ఈ ఉజ్జీవము యొక్క ముగింపు ఘడియలో, మరియు చాలామంది ప్రశస్థ జనుల ఈ గుర్తింపును వారికినీ పరిశుద్ధాత్మను అనుగ్రహించుట ద్వారా నీతోనున్న గుర్తింపును కొనసాగించుము. తండ్రీ, ఇది అనుగ్రహించుము.

ఈ చిన్న ఆలయమును దీవించుము. ప్రతి సేవకుని, హాజరయిన ప్రతి వ్యక్తిని, ఇక్కడున్న ప్రతి సంఘమును దీవించుము.

ప్రభువా, ప్రపంచములోనున్న ప్రతి సంఘములోనికి ఒక ఉజ్జీవము నీవు పంపించుము. మా మధ్య ఇవ్వబడనైయున్న, యేసు క్రీస్తుయొక్క ఎత్తబడు కృప కొరకు వీరందరు ఏక హృదయము, ఏక మనస్సుతో కూడి వచ్చియుండుట మేము చూచుచున్నాము. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.

66

ఇప్పుడు, కొంతసేపు ఆ ప్రధాన ఆడిటోరియములో లైట్లు ఆపివేయబడును. ఈ చేతి రుమాళ్ళు ప్రార్థన చేయబడినవి. మరియు ఇప్పుడు, కొంతసేపు ఆ లైట్లు ఆపుచేయబడుచున్నవి. మరియు నిశ్చబ్దంగా ఉండండి, మరియు సేవకుడు ఒకరి తర్వాత ఒకరికి బాప్తీస్మము ఇచ్చునంతలో అవి సరిచేయబడును.

ఇప్పుడు, అందరూ చూడగలిగినట్లయితే. ఇప్పుడు.... ఆ ఒక్క మైక్రోఫోను, ఆ మైకును క్రిందకి పెట్టగలిగినట్లయితే.. ? ఇది ఆ రికార్డర్ కోసము? సరే మంచిది. దానిగూర్చి ఆయన జాగ్రత్త వహించును.

దానిని ఈ రాత్రి నాకు నేనుగా చేయాలనుకుంటున్నాను. నాకు చాలా వేడిగా ఉన్నది. మరియు సహోదరుడు నెవిల్ విశ్రమించుచుండగా ఏదో చేయమని పాస్టర్ తో చెప్పెను. చాలా మంచి సహోదరుడు. కొంత సమయము ప్రధాన ఆడిటోరియములో లైట్లు తిరిగి వెలిగించబడును, అప్పుడు మీరు ఆ వెనుక అద్దము గుండా, సరాసరి ఆ కొలనులో బాప్తీస్మము కొరకు వచ్చువారిని చూడవచ్చు. మరియు వారిని సిద్ధపరచినచో.... మరియు ప్రతీసారి బాప్తీస్మము ఇచ్చినప్పుడు, వారు బయటకు వచ్చెదరు, పెద్దలు ఆ తెరను లాగెదరు, దానిని బట్టి స్త్రీలు ఆ నీటినుండి బయటకు వచ్చెదరు. మరియు ఒకరి వెంబడి ఒకరు వచ్చెదరు. వారెవరైనా మరియు ప్రభువైన యేసు క్రీస్తు నామములో బాప్తీస్మము ఇవ్వండి..?..

67

ఇప్పుడు, గుర్తించుకొనండి, దేవుని వాక్యము కొరకు బాధ్యత కలిగి సేవకునిగా అది నాకు ఇవ్వబడినది. ఎవరైనా యేసు క్రీస్తు నామములో బాప్తీస్మము తీసుకొనలేనిచో, తిరిగి తీసుకొనమని వారికి నేను ప్రోత్సహిస్తున్నాను. పౌలు అదే చెప్పెను, వారు ఏదో ఒకరకంగా బాప్తీస్మము తీసికొన్ననూ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో తిరిగి తీసుకొనమని అతను చెప్పెను. అతను చెప్పెను, ఏదైనా దూత వచ్చి ఏమైనా చెప్పినా గాని, అతడు శాపగ్రస్తుడగును గాక. గలతీ 1:8లో అది కనిపెట్టవచ్చును. మేము కాకుండా, పరలోకము నుండి ఒక దూత అయినను వచ్చి వేరొక సువార్త బోధించినచో, అతడు శాపగ్రస్తుడగును గాక. ఇప్పుడు, కార్యక్రమము ప్రారంభమునకు ముందు, అందరూ చూడగలుగుచున్నారా?

[సహో, నెవిల్ బాప్తీస్మము ఇచ్చుచున్నారు. టేపు పై ఖాలీ]

[సహోదరుడు బ్రన్హం ఒక వ్యక్తిని గూర్చి చెప్పుచున్నాడు] నా యొక్క ప్రత్యేకమగు సన్నిహితుడు. ఈ స్త్రీ ఓరల్ రాబర్ట్ స్నేహితురాలు, ఆమె మరియు ఆమె భర్త... దేవునికి ఆత్మలు సంపాదించువారు... సహో, ఓరల్ రాబర్ట్స్, నాకు అత్యంత ప్రియ మిత్రుడు....

[సహో నెవిల్ మరికొంత జనులకు బాప్తీస్మము ఇచ్చుచున్నారు. టేపు పై ఖాలీ.] అవును ప్రభువ్రా, అనుగ్రహించుము.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...