నా మార్గములను నేను పరిశీలన చేసుకొనగా
VGR COUNT -243 సహోదరుడా సులీవాన్, కృతజ్ఞతలు. దయచేసి కూర్చొనండి.
ఈ చటాక్వాలోనికి ఈ రాత్రి తిరిగి మరల వచ్చుటకు నేను చాలా సంతోషిస్తున్నాను. వారు దానిని పిలిచారు అని నేను నమ్ముచున్నాను. మరియు ఎలాగయినా, ఈ సమయములో, ఇది దేవుని యొక్క గృహము, ఆయన సేవల కొరకై మనము ఇక్కడ కలసి కూడుకొనుచున్నాము.
మరియు నేను గత రాత్రి ఇంటికి వెళ్ళిన తరువాత అక్కడకు చాలా మంది వచ్చి రక్షించబడుటను కనుగొనినప్పుడు, నేను చాలా సంతోషించితిని. ముఖ్యముగా అందుకే, రక్షించబడిన పాపులను పొందుకోనుటకై మేము ఇక్కడ వున్నాము. మరియు ఈ రాత్రి నూతనముగా జన్మించిన ఆ యవ్వన క్రైస్తవులకు చెప్పుటకు నేను ఇష్టపడుచున్నాను. సంపూర్ణ సువార్తను బోధించుచు, దైవిక స్వస్థతను నమ్ముచు మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మము నందు నమ్మకముగల ఒక మంచి సంఘమును ఎక్కడైనా నీవు కనుగొనుము. మరియు నీకు నచ్చిన ఒక మంచి సంఘమును నీవు కనుగొని మరియు క్రీస్తుకు నిజమైన సేవకునిగా వుండి, అక్కడే స్థిరపడుము. ఇక్కడ నీవు రక్షింపబడియున్నావు అని సంఘ కాపరికి చెప్పుము. మరియు తన పరిశుద్దుల యొక్క సహవాసములోనికి నిన్ను ఆయన ఆనందముతో స్వీకరించును. మరియు ఆ విధముగా జీవముగల దేవుని యొక్క అందరి పరిశుద్దులతో సహవాసము కలిగియుండుటకు, నీవు క్రీస్తు యొక్క స్వరూపములో ఎదుగుదుపు.
2
ఇప్పుడు, రేపటి రాత్రి ఒక గొప్ప రాత్రిగా వుండును అని మేము ఆశించిచున్నాము. సాధారణముగా ఇది ముందుగా గ్రహించుదము, ప్రజలు వేచియున్నారు. రేపు మధ్యాహ్నం, దక్షిణాఫ్రికా నుండి వచ్చిన మన యొక్క మంచి సహోదరుడు మరియు స్నేహితుడు అయిన సహోదరుడు గ్రూమిట్ థోమ్స్ ఇక్కడ ఈ ప్రదేశములో ఒక చిన్న మిషనరీ ర్యాలీను నిర్వహించుచున్నారు. సహోదరుడు సులీవాన్ ఇప్పుడే నాకు చెప్పిన విధముగా, అది జరగనైయున్నది... ఇది ప్రకటించబడినది.
ఈ సహోదరుడు నిజముగా మంచివాడని నేను ఎరిగియున్నాను. అతను ఒక మంచి బాలుడు. అతను ఇంటి నుండి దూరముగా వున్నాడు; అతడు ఒక ఆఫ్రికాకు చెందినవాడు. నీవు ఒక పరదేశివలె ఉన్నప్పుడు, మంచిగా సన్మానించబడినచో, ఆ అనుభూతి ఎలా ఉండునో నేను ఎరిగియుందును. అయితే అతను దేశములో మాత్రమే ఒక పరదేశీయుడు; పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో క్రీస్తులో అతను మనతో ఒక సహోదరుడు, మరియు అతను ఇక్కడకు వచ్చినపుడు, నా బాలికలలో ఒకరిని తనకు భార్యగా తీసుకొనుట ద్వారా అతను క్రింద, అక్కడ యున్న నా సంఘమును వెలిగించియున్నాడు. ఒక అందమైన క్రైస్తవ బాలిక, నా పెద్దలలో ఒకరి కూమార్తె అతని యొక్క భార్య. నిశ్చయముగా, వారు ఒక మంచి జంటగాయున్నారు, మరియు వారు వివాహము చేయబడిరి. మరియు ఇప్పుడు బరిలో సువార్తను బోధించుచున్నారు.
3
మరియు ఈ యవ్వన మిషనరీ అతని యొక్క జీవితమును ఆఫ్రికాలోని తన యొక్క సొంత ఇంటిలో గడపనైయున్నాడు. అతనికి గిరిజనులు తెలియును. అతను గిరిజనులను ఎరిగియున్నాడు. బహుశా, రేపటి మధ్యాహ్నము మన యొక్క ఆఫ్రికాకు చెందిన కూటములో ప్రభువు ఏమి చేసెనో ఒక వేదిక పిలుపుతో మూఢులైన ముప్పది వేల మంది అన్యులు క్రీస్తు యొద్దకు ఎలా వచ్చిరో, అని అతను సాక్ష్యము చెప్పుచుండగా మీరు విందురు. డర్బన్ రేస్-ట్రాక్ వద్ద వందా-నూట-ఏభైవేల మంది చుట్టూయుండుట, అది జరిగినప్పుడు అక్కడే నేను నిలబడియున్నాను. మరియు అతని మెడ చుట్టూ గొలుసుతో బంధించి, తన యొక్క చేతులు మరియు కాళ్ళతో నడుచుచున్న ఒక పిచ్చిపట్టిన మనిషిని ప్రభువైన దేవుని యొక్క శక్తి తీసుకొని, ఒక్క క్షణములో అతనిని ఒక పరిపూర్ణ సామాన్య వ్యక్తిగా మార్చుట వారు చూచినప్పుడు, ముప్పది వేల మంది జనులు వారి యొక్క జీవితములను యేసుక్రీస్తుకు స్వాధీనము చేసిరి.
మరియు మరుసటి ఉదయకాలమున నేను హోటల్లో కూర్చొనియున్నప్పుడు, పట్టణము యొక్క మేయర్, సిడ్ని స్మిత్ నన్ను చూచుటకై క్రింద ఉన్నారు. మరియు వీధి గుండా ఏదో వచ్చుట నేను వినియున్నాను. నేను బయటకు చూచాను, మరియు అక్కడ బరువుతో ఏడు పెద్ద ఎద్దుల బండులు ఉన్నవి, లేదా... మైదానములో పడియున్న తోపుడు కుర్చీలు, చేతి కర్రలు, కర్రలు, దుడ్డు కర్రలు మరియు మంచములను వాటన్నింటినీ ఏరివేయుటకు వీధి గుండా క్రిందకు వచ్చుచున్నవి. వెంటనే ఒకే సమయములో ఇరువై-ఐదు వేల అద్భుతములు జరిగినవి, తరువాత వారందరు క్రీస్తు నొద్దకు వచ్చిరి. కుంటి, గ్రుడ్డి, వంకర కాళ్ళు గలవారు ఇరువై-ఐదు వేలమంది యున్నారు. మరియు మరుసటి ఉదయకాలమున వారు వీధుల గుండా వెళ్ళుచున్నారు, మునుపటి దినమున వారిలో ఉన్న ఆ జనులు, ఒక గొప్ప పెద్ద ప్రదర్శనలో, పోలీసు వారు దానిని నడిపించుచున్నారు, మరియు ఆ పెద్ద ట్రక్కులు కుప్ప వేసినవి, ఓ, తోపుడు కుర్చీలు, మంచములు, స్ట్రెచర్లను (రోగులను మోసుకుపోయే మంచములవంటివి), దుడ్డు కర్రలను మీద వేసుకొని నడుచుచున్నారు. మరియు ఆ ప్రజలు వెనుకకు నడుచుచున్నారు. విభిన్నమైన గిరిజనులు - మునుపటి దినమున ఆ మంచములపై యున్న పదునాలుగు, పదిహేను విభిన్నమైన తెగలకు చెందిన గిరిజనులు వారి చేతులను గాలిలో ఆడిస్తూ, వారి చేతులతో, వారి యొక్క సొంత భాషలో “కేవలము నమ్ముము, సమస్తమూ సాధ్యము” అని పాడుచూ వెనుక నడుచుచున్నారు.
4
ఓ, నేను కిటికీ యొద్ద కూర్చొనియున్నాను. నేను ఒక చిన్న పిల్లవాడివలె ఏడ్చాను. వారికింకా ఏమి అవసరము లేదు. వేదిక యొద్ద కేవలము నలుగురు జనులు మాత్రమే యున్నారు.
వారిలో ఒక స్త్రీ, ఆమె కన్నులు మధ్యలో ఆమె బొట్టు పెట్టుకొనిన ఒక హిందువు. మరియు ఆమె... నేను “నీవు హిందువురాలవు. మరియు ఒక క్రైస్తవురాలివలె నా యొద్దకు నీవు ఎందుకు వచ్చావు?” అని అడిగాను.
ఆమె, “నీవు నాకు సహాయము చేయగలవని నేను నమ్ముచున్నాను,” అన్నది. మరియు తర్జుమా దారుని ద్వారా... మరియు కాబట్టి, నేను, “మంచిది, నీవు ఎందుకు యేసు యొద్దకు వచ్చావు? మహమ్మద్ యొద్దకు ఎందుకు వెళ్ళలేదు?” అని అడిగాను.
మరియు ఆమె, “నీవు నాకు సహాయము చేయగలవని నేను నమ్ముచున్నాను,” అని అన్నది.
నేను, “మంచిది, నీ సమస్య ఏమిటో, ఆయన నాకు బయలుపరచినయెడల, అది క్రొత్త నిబంధన యొక్క యేసు అని నీవు విశ్వసించుదువా?” అని అడిగాను.
ఆమె, “నేను క్రొత్త నిబందన చదివాను, మరియు దానిని నేను నమ్ముచున్నాను, అదే ఆయన చెప్పియున్నాడు, ఆయన దానిని చేయును,” అని అన్నది.
5
మరియు నేను ఆమె వైపు మరలా చూచాను, మరియు పరిశుద్ధాత్మ కరుణ కలిగియున్నది. నేను, నీవు గర్భము మీద ఒక కంతిని కలిగియున్నావు. నిన్నటి దినమున నీవు డాక్టరు యొద్ద ఉన్నావు, మరియు నీ యొక్క భర్త పొట్టిగా, లావుగా మీసాలు కలిగి ఉన్నాడు, మరియు అతను ఒక బూడిద రంగు కోటు ధరించియున్నాడు. నీవు ఒక తిత్తిని కలిగియున్నావు మరియు తప్పనిసరిగా ఆపరేషన్ చేయవలెను అని డాక్టరు చెప్పెను,“ అని చెప్పాను.
ఆమె, “అది సత్యము. మరియు ఇప్పుడు నేను యేసును నా యొక్క సొంత రక్షకునిగా అంగీకరించుచున్నాను,” అని చెప్పెను. ఒక మహమ్మదీయుడు. గొప్ప దృఢమైన మహమ్మదీయులు, పది వేలమంది మహమ్మదీయులు అక్కడ బయట దీనిని చూస్తున్నారు.
ఆ తరువాత ఒక శ్వేత జాతీయురాలు ఉన్నది. మరణము కొరకు సిద్దపడమని ఆమెకు చెప్పబడెను, ఏలయనగా ఆమె ఇక జీవించదు, మరియు ఆమె రొమ్ము మీద ఒక చిన్న కంతిని కలిగియున్నది. ఆమె క్రిందకు నడచి మరియు దాదాపు ఇరువది నిమిషములు జీవించెను, మరియు ఆ కూటములోనే గుండె నొప్పితో చచ్చిపడిపోయెను.
6
మరియు పిమ్మట మరుసటి ఉదయకాలమున, డాక్టరుల చేత చనిపోవును అని చెప్పబడిన ఒక స్త్రీ, తిరిగి ప్రార్ధన ద్వారా జీవమును పొందుకొనెను. చూచారా, నీవు స్వస్థపరచజాలవు. దేవుడు ఏమి చెప్పమని చెప్పెనో, దానిని మాత్రమే నీవు చెప్పగలను, మరియు పిమ్మట... బహుశా రేపు సహోదరుడు గ్రూమిట్ దాని గురించి మీకు చెప్పును.
మరియు ఇది ఆఖరి... ఈ మనిషి అక్కడ ఉన్న తరువాత, కనీసము తన సరైన మనస్సుతో కాదు, ఒక పల్లెటూరి దేశ సంచారివలె, తన యొక్క చేతులతో అతను నాట్యము చేయవలెనని నేను కోరుకొనియున్నాను అని తలంచితిని. నేను, “మంచిది, నేను గనుక అతనిని స్వస్థపరచగలిగినచో మరియు దానిని చేయలేను, నేను ఒక ఘోరమైన మనిషిగా యుందును. ఆ బీద మనిషిని నేను స్వస్థపరచజాలను. అయితే పరిశుద్ధాత్మ గనుక దానిని నాకు బయలుపరచినయెడల అతని జీవము దాచబడదు,” అని చెప్పాను.
7
మరియు పిమ్మట యేసు ఏమయి ఉన్నాడో, నేను వారిని అడిగాను మరియు వారికి చెప్పాను, మరియు అతను ఏమి చేసెను. అతను స్వస్థపరచలేదు. అతను, “తండ్రి నాకు చూపించిన విధముగానే నేను చేయుదును,” అని చెప్పెను. పిమ్మట ఆ మనిషి... అతను ఒక క్రైస్తవ గృహములో ఎదిగియున్నాడు అని ఆత్మ చూపించినది, మరియు అతని గురించి అంతయు చెప్పినది. మరియు దానిలో యున్న ప్రతీదియూ సత్యము. మరియు అతని తండ్రి మరియు తల్లీ లేచి నిలబడ్డారు, ఆ మార్గమంతటిలో దాదాపు సగము పట్టణము నిరోధించబడినది. అది సత్యము అని సాక్ష్యము చెప్పబడినది. పిమ్మట నేను ఆయనను ముందుకు దాటిపోనిచ్చాను. ఒక నీడవలె నేను చూచాను. నేను ఆ నీడలోనికి చూచాను, మరియు అక్కడ సామాన్యముగా అతను తన కాళ్ళపై నిలబడియున్నాడు. దానిని ఆపివేయుటకు కావలసినన్ని బాధించే దయ్యములు అక్కడ లేవు.
కాబట్టి నేను చెప్పాను, “ఆ మనిషిని తన కాళ్ళపై నిలబెట్టి, సామాన్యముగా మంచిగా, దేవుడు చేసినయెడల, ఇక్కడ ఎంత మంది మహమ్మదీయులు మరియు అందరూ, యేసును తమ సొంత రక్షకునిగా అంగీకరించెదరు?” మీరు చూడగలిగినంత మట్టుకు, చేతులు లేపబడియున్నది. వారికి రక్షణ కంచెను వారు పెట్టిరి, ఏలయనగా వారిలో వారు గిరిజన తెగల యుద్దములను కలిగియున్నారు. అయితే ఆ మనిషిని దేవుడు స్వస్థపరచినప్పుడు, అతను నిలబడెను, అతను శరీరములో స్వస్థపరచబడడమే కాదు, అతని యొక్క జీవితములో మునుపెన్నడూ ఆ విధముగా నడువలేదు. అతను తన యొక్క సరైన మనస్సుతోనే యున్నాడు. చుట్టూ చూచుచున్నాడు, కన్నీళ్ళు అతని చెంపల మీదుగా జారుచూ అతని పొట్ట మీద, ఈ విధముగా కదులుచున్నవి. వేలమంది వారి చేతులను పైకి ఎత్తిరి. మరియు ఆ ఒక సమయమునకు తక్కువలో తక్కువ ముప్పది వేలమంది, ప్రభువైన యేసు యొద్దకు వచ్చెదరు అని మేము అంచనా వేసాము.
8
అప్పుడు నేను, “ప్రార్థనకు జవాబిచ్చుటకు దేవుడు ఇక్కడనే యున్నాడు అని నీవు నమ్మిన యెడల, వ్యాధిగ్రస్తులైన మీరందరు ఇంకా ముందుకు వెళ్ళవలసిన అవసరము లేదు, ఏలయనగా మీ మహమ్మదీయులు మరియు మీ జూలూస్లు, సంగాయినులు మరియు బాసోతోసులు మరియు ఇక్కడ యున్న గిరిజనులైన మీరందరూ ఇక్కడ వేదిక మిద యున్న మీ యొక్క మనిషి ద్వారా, పరలోకపు దేవుడు ఇక్కడనే యున్నాడు, ఆయన ఉన్నాడు అను దానిని మీరు అంగీకరించుచున్నారా? నేను ప్రార్ధించుచుండగా, దేవునిలో విశ్వాసము కలిగియుండుడి,” అని చెప్పాను. మరియు నేను ప్రార్థన చేసాను. మరియు ఒక్క ప్రార్థనతో ఇరవై-ఐదు వేల తిరుగులేని అద్భుతములు జరిగినవి.
ఇప్పుడు, అటువంటి కార్యము ఏదయినా జరిగినప్పుడు, అమెరికాలో బోధించుటకు అది ఎందుకు కష్టమో ఎరిగినప్పుడు మీరు ఆశ్చర్యచకితులైయ్యెదరు.
మరియు ఇండియాలో బొంబాయి దగ్గర, అక్కడ దాదాపుగా పది లక్షలలో సగము అని వారు అంచనా వేసిరి. మరియు ఎలాగు అని చెప్పుటకు వేరే మార్గము లేదు... అక్కడ మూడు రోజులు మాత్రమే వారు నన్ను ఉండనిచ్చిరి, ఏలయనగా ఆ జనుల గురించి జాగ్రత్త వహించుటకు అక్కడ ఏ స్థలమూ లేదు.
9
అందుకొరకే ఇప్పుడు మనము ఇక్కడ అమెరికాలో యున్నాము, మరలా మనము సముద్రములను దాటే ఆ గడియ కొరకు ఎదురుచూచుచున్నాము, అక్కడే మనము ఆ ప్రజలలోనికి వెళ్ళగలుగుదుము. మరియు మనము కలిగియున్న కానుకలు మరియు మొదలగునవి, ఖర్చులన్నియూ, ఆ హేతువునకే తిన్నగా వెళ్ళును. పిమ్మట మనము ఆ తీర్పు సింహసనము నొద్దకు అక్కడకు మనము వెళ్ళినప్పుడు, అది సత్యమే అని మీరు చూచెదరు, మర్యాద పూర్వకముగా మనము చేసియున్నవన్నియూ, మనము కలిగియున్న ప్రతీ పైసాను, మనము దేవుని రాజ్యము కొరకు పెట్టుచున్నాము, మరియు మనము జీవించగలిగినంత సామాన్యంగా జీవించెదము, కావున అది ఆ దేవుని రాజ్యము...
రంగములో పురుషులు చెప్పులు కూడా లేకుండా సువార్తను ప్రకటించుచుండగా, మనము మూడు లేక నాలుగు మిలియన్ల డాలర్లతో సంఘములను స్థాపించి, “యేసు వచ్చుచున్నాడు” అని ప్రసంగించుటను నేను నమ్ముటలేదు. అది సరి కాదు. నా సహోదరులు రంగము మీద ఉన్నారు.
వేరొక దినమున పరిశోధనలో ఆ మనిషి చెప్పెను, “మీరు మీ యొక్క దుస్తులు పెన్నీస్ కొట్టు నుండి కొని, పదిహేడు డాలర్లు చెల్లించారా?”
నేను చెప్పాను, “అది నిజము.”
చెప్పెను, “మంచిది, మీరు అంతకంటే మంచి దుస్తులు కొనగలరు.”
నేను చెప్పాను, “లేదు, నా సహోదరులు వారానికి రెండు సార్లు భోజనము చేయుచూ, వారి కాళ్ళకు చెప్పులు లేకుండా, నేను దేనికొరకైతే నిలబడితినో, ఆ సువార్తను బోధించుచుండగా, దాని కంటే శ్రేష్ఠముగా నేను ఏ మాత్రము ఖర్చుచేయజాలను,”
అది ఖచ్చితముగా నిజము. మనము హక్కును కలిగిలేము. లేదండీ. మనము పెద్ద కట్టడముల కొరకై మిలియన్లు ఖర్చుచేయుటకు హక్కును కలిగిలేము, ఎలాగైన అది చాలా వరకు పేరు కొరకు మాత్రమే. మరియు మిలియన్లు జనులు కేవలం యేసుక్రీస్తు రక్షకుడుగా యున్నాడు, అని తెలుసుకొనకుండానే చనిపోవుచున్నారు, దానిని పొందుట కొరకు ఏడుస్తున్నారు, బ్రతిమాలుకొనుచున్నారు. మరియు మనము ఈ మూలన ఒక పెద్ద సంఘమును కట్టి మరియు దీని అభిప్రాయమును వేరొక మూలన ఇక్కడ ఉన్న దానిపై ఉంచి, వారి గురించి అపహాస్యం చేస్తూ, వారు అంతా తప్పు అని వారికి చెప్తున్నాము. ఇలాంటి పనులు మిలియన్లలో జరుగుచున్నవి, మరియు సంవత్సరమునకు మిలియన్ల కొలది ఒక్కసారి కూడా యేసు అను పేరు వినకుండా చనిపోవుచున్నారు. మనము తొందర చేస్తూ ఉండగా అక్కడ వారు క్రీస్తును తెలుసుకొనకుండానే చనిపోవుచున్నారు. ఆ దినమున దేపుడు దాని కొరకు మనలను బాధ్యులనుగా చేయబోవుచున్నాడు.
10
మంచిది, అది మన యొక్క పాఠ్యంశము కాదు. నేను ఆ విషయములను చెప్పుట వలన సహాయము చేయలేను. కావున సహోదరుడు థామస్ చెప్పిన దానిని వినుటకు మీరు రేపు రండి. అతడు ఏక్కడో ఇక్కడ ఈ భవనములో ఎక్కడో ఉన్నాడు. అతను ఉన్నాడు అని నాకు తెలియును, అతడు మరియు అతని భార్య. మరియు, అవును, సహోదరుడు గ్రూమిట్, అతనిని మరియు అతని భార్యను అక్కడ చూచుటను బట్టి నేను నిశ్చయముగా సంతోషించుచున్నాను. మరియు వారు రెండు గంటలకా? ఇక్కడ ఉందురు. అది సరియా? రేపు మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషములకు.
ప్రభువు నిన్ను దీవించును గాక. మనము వాక్యము చదువుటకు ముందుగా, ప్రార్ధన కొరకై మన తలలను వంచుదము. ప్రార్థించుటకు ముందుగా, నేను ఇది చెప్పవలయును. ఒకవేళ దేవుని చిత్తమయిన యెడల, దీనిపై “పక్షిరాజు తన గూడును రేపినట్లుగా,” అనే దాని మీద ప్రభువు చిత్తమయినయెడల, నేను రేపు రాత్రికి ప్రసంగించవలెనని కోరుచున్నాను.
11
ప్రభువా, నీవు మాత్రమే మాకున్న ఏకైక నమ్మిక, ఏకైక రక్షణ మార్గము. మరియు మిలియన్ల కొలది జనులు చీకటిలో, జంతువులను ఆరాధిస్తు కూర్చుని ఉండగా, వారి దగ్గరకు, సముద్రములు దాటిపోవుటను గురించి ఆలోచించినపుడు మేము చాలా సంతోషించుచున్నాము. ప్రభువా, మరియు వారు మట్టితో మరియు రాతితో చేసిన బొమ్మలను ఆరాధించుచున్నారు. పక్షులు మరియు జంతువుల రక్తమును చల్లుచున్నారు. దయకొరకై వెదకుచున్నారు. వారి ఎముకలు విరుచుకుంటున్నారు, మరియు ముఖములను కోసుకొనుచున్నారు. మరియు సమాధానమును కనుగొనుటకు ప్రయత్నిస్తున్నారు... మరియు ఇక్కడ మన సొంత చక్కని ప్రదేశములో, యేసుక్రీస్తు మనకు సమాధానం ఇచ్చుటకు ఎంతో మంచివానిగా ఉండగా, మనము దానిని పొందుట కొరకు వీధి దాటి నడచి వచ్చు జనులును కలిగియుండుట కూడా చాలా కష్టముగా ఉన్నది. న్యాయతీర్పు అతి సమీపముగా వ్రేలాడుచున్నదనుటలో ఆశ్చర్యమే లేదు. ఓ దేవా, నీవు మా కొరకు దయకలిగియుండవలెనని ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాము.
అతను మరియు అతని యొక్క చిన్న భార్య సముద్రమును దాటుచుండగా, మా యొక్క సహోదరుడు థామ్ కొరకు మేము ప్రార్థించుచున్నాము. చీకటిలో కూర్చొనియున్న వారికి దయను మరియు సమాధానమును తీసుకువచ్చుటకు అతను పరిశుద్ధాత్మతో అభిషేకించబడును గాక. ఆ యువ జంటను ఆశీర్వదించండి, ప్రభువా, వారు ఇంకను యవ్వనంలో ఉండగానే మరియు వారు ఈ ఆటవిక అనుభవములకు నిలబడవలెను. మీరు వారితో ఉండవలెనని మేము ప్రార్థించుచున్నాము.
12
ప్రభువా, అమెరికన్లుగా ఉన్న మాకు, ప్రముఖముగా, మమ్ములను మేము క్రైస్తవులుగా పిలుచుకొనుచుండగా, అది చాలా అవసరమైయున్నది. మీరు మాకు ఒక మండుచున్న దర్శనమును ఇవ్వవలెనని ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాము. ఓ, ప్రభువా కరుణను మాకు పంపండి. కమ్యూనిస్టు దేశములను, వారిని మింగివేయు ఘడియ వచ్చుచుండగా, మరియు వారు సువార్తను ప్రకటించు అవకాశమును పొందుకొనలేరు, అందుకై సంస్థల కొరకు, మరియు రంగమునకు పిలువబడ్డ పురుషులు మరియు స్త్రీల కొరకు వారు చాలా త్వరపడవలెనని మేము ప్రార్థించుచున్నాము. తలుపు తెరచియుండగనే ప్రతీ సేవా మనసుగల మనిషి వెళ్ళవచ్చును, లేదా వెళ్ళుచున్న వారికి చేయూతనిచ్చును గాక.
మరియు ప్రభువా, మా దేశమును మరియు మా ప్రజలను ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకొనవలెనని మేము అడుగుచున్నాము, మరియు మా సంఘముల కొరకు ప్రార్థించుచున్నాము. ప్రభువా, చాలాసార్లు మేము వారిని తిట్టియున్నాము మరియు కొన్నిసార్లు మేము ఎందుకు అలా అది చేయుచున్నామో అర్ధం కాలేదు. కాని అది మమ్ములను తీసుకువచ్చుటకు, కదిలించుటకు, ఆ అవసరత చాలా గొప్పది అని మేము తెలుసుకొననివ్వండి. అది పరిశుద్ధాత్మ పనియైయున్నది, మరియు మా సంఘములను దీవించుమని మేము అడుగుచున్నాము.
13
ఈ వచ్చుచున్న వారాంతములు గొప్ప దినములుగా ఉండును గాక, మరియు ఈ ప్రజలు దేవుని శక్తితో కదలించబడుటకు దీని ద్వారా సిద్దపడుదురు గాక. ఒక పాత రకపు ఉజ్జీవం వచ్చును గాక. దానిని దయచేయుము, ప్రభువా. ఈ రాత్రికి ఇక్కడ ఉన్న సేవకులనందరినీ, మరియు ఎవరైతే కష్టపడి, సహాయపడి, ప్రయత్నించి, మరియు ప్రతీ యత్నమును పెట్టిన ఆ సహోదరుడు సులీవాన్ ను దీవించండి. మీ కన్ను ఒక పిచ్చుకను కూడా చూచుచున్నది. మీరు ఈ పనులన్నింటిని చూస్తున్నారు.
ఇప్పుడు, మేము వాక్యమును చదువుచుండగా, అది, మీరు దానిని మాకు తర్జుమా చేయుటకు పరిశుద్ధాత్మను పంపవలెనని మేము ప్రార్థించుచున్నాము. ఆత్మలు రక్షింపబడును గాక, వ్యాధిగ్రస్తులు స్వస్థపడుదురు గాక, మరియు వెనుకకు జారిన వారు తిరిగి దేవుని రాజ్యములోనికి పిలువబడుదురు గాక. మరియు ఎవరైతే పరిశుద్ధాత్మను వెదుకుచున్నారో వారు, ఇదే ఆ దరఖాస్తు అని కనుగొని మరియు రక్షింపబడి, ఆత్మతో నింపబడుదురు గాక. యేసు నామములో మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
14
ఈ రాత్రి నేను రెండు వేర్వేరు స్థలముల నుండి చదువుటకు ఇష్టపడుచున్నాను. ఒక్కొక్క కీర్తన నుండి ఒక్కొక్క వచనము. కీర్తనలు 46:1 మరియు కీర్తనలు 119:59,
దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.
మరియు తరువాత 119:59,
నా మార్గములు నేను పరిశీలన చేసికొంటిని, నీ శానసముల తట్టు మరలుకొంటిని.
సౌలు మరియు అతని సైనికుల చేత అతని గృహము వేగు చూడబడినప్పుడు, దావీదు దీనిని మొర్రపెట్టియున్నాడు, ఈ కీర్తన చరిత్రకారుల చేత మరియు మత బోధకుల చేత నమ్మబడినది. మరియు పగటి కాంతిలో అతను తలుపు దాటి బయటకు వెళ్ళినపుడు, అక్కడ ఒక బల్లెము లేక యీటె, లేదా ఒక బాణము అతని వెనుక భాగమునుండో లేదా తన ప్రక్క స్థలము పై ఉన్న డాలు భాగముల మధ్యనుండో దూసుకొని పోవునని అతనికి తెలియును.
15
మరియు దావీదు కష్టములో ఉన్నందువలన, అతను వెనుకకు, ముందుకు అడుగులు వేయుచూ పైకి, క్రిందికి నేలపై నడచుచూ, చేతులను మెలిపెడుతూ అతని ఇంటిలో ముందుకు వెనుకకు నడుచుచుండుట నేను చూడగలను.
మరియు సాధారణముగా, మనుష్యులు సమస్యలలో ఉన్నప్పుడు వారు దేవుని వైపుకు తిరుగుదురు. చాలా మంది జనులు నవ్వుతూ “దేవుడే లేడు” అని చెప్పుట నేను వినియున్నాను. కాని వారికి సమస్య వచ్చినప్పుడు, మొదటిగా వారు చేయుటకు యోచించునది, ఆయనను పిలుచుటయే.
ఒక ప్రసిద్ధమైన నాస్తికుడు, బాబ్ ఇన్గర్సోల్. అతను వైద్యశాల గదిలో చనిపోవు స్థితిలో ఉన్నప్పుడు, ఇది చెప్పబడినది, అతను త్వరలో తన జీవం నుండి వెలుపలికి వెళ్ళబోవుచున్నాడు అని అతనికి తెలిసినది, చావు అతనిని తాకినప్పుడు, అతను అరచి మరీ చెప్పెను, “ఓ, దేవా, ఒకవేళ దేవుడున్నట్లయినయెడల, నా ఆత్మపై కరుణ చూపించండి,” అతని పిల్లలకు అతను వెళ్ళిన మార్గములో వెళ్ళరాదని, అయితే వారి తల్లి వెళ్ళిన మార్గమును తీసుకొనుమని సలహా యిచ్చియున్నాడు. మీరు దీనిని ఎప్పుడో ఒక సమయాన లేదా వేరొక సమయాన ఆలోచించెదరు.
16
కొన్ని సంవత్సరముల క్రిందట, నేను ఈ నగర న్యాయమూర్తితో మాట్లాడుతూ ఉన్నాను. మరియు అతను నాకు ఒక మంచి స్నేహితుడు. అప్పుడప్పుడు అతను నా సంఘమునకు వచ్చెడివాడు. ఒక కారును దొంగిలించిన ఒక యవ్వనస్తుని గురించి, అతని చూచుటకు నేను అక్కడ ఉన్నాను. మరియు అతని తల్లి దాదాపు ఆ రాత్రంతయూ నా మెట్లపై పడియున్నది. మరియు తరువాత ఉదయం ఆమె చెప్పెను, “సహోదరుడా బ్రెన్హాం, ”న్యాయమూర్తి మీ మాట వింటారు,“ అని చెప్పెను. ”నా కుమారునిపై కరుణ చూపమని అడగండి,“ అని ఆమె అడిగెను.
మంచిది, అది, నేను చేయగలిగిన దానిలో అదే చివరిది. మరియు తదుపరి ఉదయం నేను క్రింద అతని కార్యాలయమునకు వెళ్ళి, మరియు నేను తలుపుపై తట్టితిని. ఒక వ్యక్తి తలుపు తెరిచి, మరియు అతను, “న్యాయమూర్తి తీరిక లేకుండా ఉన్నారు,” అని చెప్పిను.
“సరే, నేను కొన్ని క్షణములలో అతనిని చూడగోరుచున్నానని అతనికి చెప్పుమని నేను చెప్పాను.”
అతను నా గొంతు విన్నాడు. “లోపలికి రండి, సహోదరుడా బ్రెన్హాం,” అని అతను చెప్పాడు. మరియు “నేను మీ కొరకు ఏమి చేయగలను,” అని అతను అడిగాడు.
మరియు నేను అతనికి కథ అంతా వివరించాను. “సహోదరుడా బ్రెన్హాం, ఆ పిల్లవానికి ఇది మొదటి సారి కాదు, ఇది సుమారు అతనికి అయిదవ సారి,” అని అతను
మరియు నేను చెప్పాను, “అయితే న్యాయమూర్తి గారు, ఒకవేళ మీరు ఈ ఒక్క అవకాశం ఇచ్చినట్లయినయెడల, అతను సంఘమునకు వచ్చెదనని, మరియు ఆదివారపు పాఠశాలకు వచ్చెదనని, ప్రతి ఆదివారము హాజరు అవుతానని నాకు అతను చెప్పియున్నాడు.”
అతను చెప్పెను, “సహోదరుడా బ్రెన్హాం, నేను శిక్ష వేయుటకు పాత్రునిగా యెంచిన ప్రతి మనిషి, అతను బయటపడేంతవరకు నేను ఒక బోధకునిగా మారబోవుచున్నాను అనును.”
ఇది కూడ ఆ విధముగానే ఉన్నది. మనము కష్టములో ఉండగా దేవునికి అన్ని రకముల వాగ్దానములు చేయుటకు ప్రయత్నించెదము. కాని మనము ఆ సమస్య నుండి బయటపడినప్పుడు, తదుపరి, దాని గురించి అంతా మరచిపోయెదము.
17
ఇశ్రాయేలు అదే విధముగా ఉండెను. ఇశ్రాయేలు సమస్యలో ఉన్నప్పుడు, వారు దేవుని నుండి దూరమైనప్పుడు... మరియు ఏ ఒక్కరైనను దేవునికి దూరమైనప్పుడు, ఏ దేశమైనా, ఏ జనమైనా, ఏ సంఘమైనా, సమస్యనేది దారిలో ఉండును. మరియు వారు ఒక కాలంలో దేవుని విడిచినప్పుడు, సమస్యలోనికి పోయెదరు, వారు ఎల్లప్పుడు దేవునికి మొర్రపెట్టెదరు, మరియు బలులర్పించెదరు, మరియు దేవుడు వచ్చు వరకు దేవుని గౌరవించెదరు, మరియు వారికి సహాయపడెదరు, మరియు తరువాత మరల ఆయనను మరచిపోయెదరు.
చూచుటకు, అలా చేయుట కేవలము మానవులలోనే ఉన్నది. ప్రభువు యొద్దకు వచ్చుట వారికి ఒక ఉత్సాహకరమైనదిగా ఉన్నట్లు కనిపించును, కాని అది చాలా త్వరగా మరచిపోయెదరు. ఎందుకు, మనము చనిపోవు దినము వరకు జ్ఞాపకం ఉంచుకొనేందుకు సరిపడా దేవుని యొక్క హస్తాన్ని ఇక్కడ ఈ కూడికలో మనము చూచియున్నాము. ఒకవేళ మనము మరొక యాభై నుండి నూరు సంవత్సరములు జీవించగలిగినచో, దేవుడు మన కొరకు ఏమి చేసియున్నాడు అని జ్ఞాపకముంచుకొనుటకే.
18
దావీదు తరువాత మొర్రపెట్టెను “నా మంచము మీద నీ ఆజ్ఞలను కట్టుము. నీ కట్టడలన్నిటిని నేను సన్మానించెదను, మరియు అన్నిటిని...” అయితే మీకు తెలియునా, దేవుడు మనకు ఆశ్రయమును, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడుగా యున్నాడు, అని కీర్తనాకారుడు మరలా చెప్పెను.
కావున, దేవుని తెలుసుకొనుట మంచిది, దేవుని కనుగొనుట, అక్కడ తప్పు ఏదీ లేనప్పుడు ఆయనతో మాట్లాడు విధంగా ఉండుట మంచిది. తదుపరి ఆపత్కాలములో, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు - ఆపత్కాలములో.
19
కొంత కాలం క్రితం, నేను ఒక సువార్తికునితో మాట్లాడుతూ ఉన్నాను. అతను “ఆశ్చర్యకరమైన కార్యములలో ఒకటి జరిగినది,” అని చెప్పెను. ఒక నల్లజాతీయుడైన యవ్వనస్తుడు అతను రక్షించబడుటకు కొన్ని రాత్రుల ముందు అతని యొద్దకు వచ్చి యుండెను,“ అని చెప్పెను. ”అతను ఎప్పుడును బలిపీఠము యొక్క పిలుపుకై ఎదురుచూడనే లేదు,“ అని చెప్పెను. ”నేను బలిపీఠము మీదకు వచ్చినప్పుడు, అతను నేరుగా పైకి నడుచుకుంటూ వచ్చి, మరియు బోధకుడా, నేను యేసును నా స్వంత రక్షకునిగా అంగీకరించవలెనని కోరుచున్నాను,“ అని అతను చెప్పెను.
మరియు అతను నిశ్చయముగా, కుమారుడా, నీతో ప్రార్థించుటకు మరియు నీవు అది చెప్పినప్పుడు వినుటకు నేను చాలా సంతోషించుచున్నాను. కాని హఠాత్తుగా ఈ మార్పు ఏమిటి? ఏమి జరిగినది? ముందు ఎప్పుడైనా నీవు సంఘమునకు వచ్చి యుంటివా?“ అని చెప్పెను.
“లేదయ్యా, నేను రాలేదు,” అని చెప్పెను. “నేను దగ్గర-దగ్గరగా ఒక దేశదిమ్మరిగా ఉంటిని,” అని అతను చెప్పెను. “సుమారు ఆరు మాసముల క్రిందట, నేను మైనే అను రాష్ట్రములో తిరుగుచూ ఉంటిని,” అని చెప్పెను. మరియు చెప్పెను, “నేను బయట ఒక ఒంటరి దారిపై నడుచుచూ యుంటిని. మరియు నాకు ఆకలి వేసినది, మరియు నా యొద్ద డబ్బు లేకుండెను.” మరియు చెప్పెను, “నేను కొంత మంది గుజ్జు నరకువారికి కూలికి పెట్టబడితిని.” మరియు వారు చెప్పారు, “నీవు సహాయం చేయవచ్చును. మేము వంట చేయుటకు లేదా పాత్రలు కడుగుటకు మేము నల్లజాతియురాలైన ఒక స్త్రీని కలిగియున్నాము. నీవు ఆమె కొరకు పాత్రలు కడుగవచ్చును,” అని చెప్పెను. మరియు చెప్పెను, అతను వారితో చెప్పెను, “మంచిది, అది అంతయు సరే, ఏమి చేయుటకైనను నేను లెక్క చేయను. నేను కొంతకాలం పని చేయువలేనని కోరుకొనుచున్నాను. మరియు వారు చెప్పెను, ”మేము నీకు ఆహారము ఇచ్చెదము మరియు ఇంకా చాలా ఇచ్చెదము.“
20
కావున అతను చెప్పెను, “అక్కడ అతను ఉండగా సుమారు రెండు రాత్రుల తరువాత, అతను పాత్రలన్నింటిని కడిగి, మరియు పడకలో పండుకొని ఆలోచించుచుండెను. అక్కడ అతని గదికి మరియు ఆ వయసైన స్త్రీ గదికి మధ్యన, ఒక చిన్న డేరా ముక్క వ్రేలాడుచుండెను. ఆమె ఒక లాంతరును ఒక పెట్టెపై పెట్టి ఉంచెను. మరియు చెప్పెను, ఇద్దరు పురుషులు బయట మాట్లాడుతుండగా అతను వినెను, మరియు అతను ఒక నిజమైన హాస్యకరమైన శబ్దము చోటుచేసుకొనుట, ఒక నిజమైన దుఃఖకరమైన గలగలా శబ్దము వినుట మొదలుపెట్టెను. మరియు మనుష్యులలో ఒకరు వేరొకరితో చెప్పెను, ఆ గొప్ప పెద్ద బొంగురు గొంతు గల వేటగాడు ”జిమ్, మనము ఇంకా కొద్ది నిమిషములలో మనము ఈ భూమిపై నుండి విసిరివేయబడెదము, కావున మనము క్రిందన మన అరకు వెళ్ళుట మంచిది,“ అని చెప్పెను.
మరియు అతడు తన తలను ముసుకు క్రింద ఉంచెను. అతడు ఆ చిన్న దుప్పటి దీని వెనుకకు విసిరివేసెను అని చెప్పెను. మరియు “ఏమి తప్పు జరగబోవుచున్నది?” అయితే చెప్పెను, “ఇంకా కొద్ది నిమిషములలో, కిటికీలో ఆ మెరుపులు, మెరయుట ఆరంభమగును.” మరియు అతను పైకి లేచి, మరియు కిటికీలో నుండి బయటకు చూస్తూ చెప్పెను, దేశమును తాకిన వాటిలో ఒక గొప్ప గాలివాన చెట్ల ద్వారా తిరుగుతూ తిరుగుతూ కేవలము కొంచెం దూరంలో ఉన్నది. మరియు చెప్పెను, అతనిలో అతను అనుకొనెను, “ఒకవేళ అది ఈ ప్రాంతమును తాకిన యెడల ఏమగును,” అని అతను చెప్పెను.
21
మరియు చెప్పెను, “ఆ ప్రక్కగదిలో ఉన్న ఆ వయసైన ఆంటీ, ఆ చాపపై తట్టి చెప్పెను, ”కుమారుడా, ఇక్కడికి రా, నేను వెలుగుచున్న లాంతరును కలిగియున్నాను,“ అని చెప్పెను.
“నేను ఆమె గదిలోనికి వెళ్ళాను, మరియు ఆమె నా చెయ్యి పట్టుకొని యవ్వనస్తుడా, నీవు ఒక క్రైస్తవునివా?” అని చెప్పెను.
“లేదమ్మా, నేను కాదు,” అని చెప్పాను.
“మంచిది,” చెప్పెను, “నీవు ఇప్పుడు, ఇక్కడ క్రిందికి దిగుట మంచిది, ఇంకా కొద్ది నిమిషములలో, ఒకవేళ ఆ గాలివాన ఈ దారిలో ఉన్నట్లయిన, ఈ చిన్న గది ముక్కలుగా పేలిపోవును.”
అతను చెప్పెను, “ఆమె ఆ పాత పెట్టె ప్రక్కగా క్రిందకు దిగెను.” మరియు అతను చెప్పెను, “నేను ఇది వరకు అంత నెమ్మదిగా ప్రార్ధించుట ఎవరి యొద్ద వినలేదు. ఆమె ముందుగా మాట్లాడుచూ ఉండిన ఎవరో ఒకరితో మాట్లాడిన విధంగా ఆమె మాట్లాడెను,” అని అతను చెప్పెను. “ఆమె చూచుటకు ఒకవేళ ఆ గది పేలిపోయినచో అనే దానిపై మనసు పెట్టినట్లు లేదు,” అని అతను చెప్పెను. కాని, “హఠాత్తుగా, కొమ్మలు, ఆ గదిని కొట్టుట ప్రారంభమయ్యెను, చెట్లు వేళ్ళతో సహా పెకిలింపబడి, లోపట పడుచుండెను.”
మరియు ఆ బోధకుడు నీవు ప్రార్థించితివా?“ అని అడిగెను.
అతను చెప్పెను, “లేదయ్యా, ప్రార్ధించుటకు నాకు చాలా భయము కలిగెను.” చెప్పెను, “నాకు తెలియదు, అయితే తరువాత ఏదయితే పడునో అది నన్ను తీసుకొనిపోవును.” కాని ఈ ఒక్కటి నేను చెప్పాను, “ప్రభువా, ఒకవేళ నీవు నాకు దయ చూపగలగినయెడల, నేను ఇక్కడ నుండి బయటపడినప్పుడు, నేను నిన్ను నా స్వంత రక్షకునిగా తెలుసుకొందును.” అతను చెప్పెను, “అందుకోసమే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అలాంటి ఇంకొక పెనుతుఫానును నేను ఎప్పుడు ఎదుర్కొనెదనో నాకు తెలియదు.” అతను తన మనసు సరిగా ఉండగానే, మరియు అతను ఆలోచించగలిగినప్పుడే, అతను ప్రార్థించగలిగినప్పుడే, మరియు అతను అతని కొరకు ఆలోచించకలిగినప్పుడే, దేవునితో సంబంధం కలిగియుండుటకు రావలయునని కోరియున్నాడు.
22
నేను కూడా “చావుపడక పశ్చత్తాపము” ఉన్నది అని నమ్ముదును. అయితే మీరు దానిపై ఆధారపడరా? దాని కొరకు... నేను, రోడ్డు ప్రక్కగా, పాడైపోయే స్థితిలో చాలా మందిని చూశాను, అద్దం వారి దేహములు గుండా చొచ్చుకొనిపోయి, కొంతమంది పేల్చబడి, తుపాకి గుండు వారి ద్వారా పోయి ఉండును. నేను త్వరగా వారియొద్దకు పరుగెత్తుకొని పోయి, నేను అడిగెదను, “నీవు ఒక క్రైస్తవునివా?” అని చెప్పెదను.
“లేదు,” మరియు ప్రార్థించలేరు.
నీవు దీనిపై ఒక అవకాశము తీసుకొనలేవా, ఇప్పుడు, దేవుడు మనకు అశ్రయమును దుర్గమునై ఉన్నాడు. మరియు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇప్పుడు నీ మార్గములను గురించి ఆలోచించు.
23
కొంతకాలం క్రిందట, నేను ఒక చిన్న ప్రయాణంవంటి దానికై అవకాశము తీసుకొంటిని. నాకు అప్పుడే పెళ్ళి అయినది. నా భార్య అక్కడ కూర్చొని నన్ను చూచుటను నేను చూశాను. మరియు మాకు అప్పుడే పెళ్ళి అయినది, మరియు నేను ఆమెను ఒక చిన్న హానీమూనుకు తీసుకొని వెళ్ళబోవుచున్నాను. మేము కొద్దిగా డబ్బును పొదుపు చేసుకొనియుంటిమి. మరియు నేను నయాగరా జలపాతములకు వెళ్ళబోవుచున్నాను. మరియు నేను అధిరాన్ డాక్ (కొండకు) అంత దగ్గరగా ఉండగా, పనిలో పనిగా నాకు చిన్న వేట కూడా అక్కడ దొరుకునని ఆలోచించాను. కావున నేను ఆమెను నాతో పాటు వేటకు తీసుకెళ్ళాను.
మరియు నేను వెళ్ళినపుడు... నేను వెళ్ళినపుడు... ఆమెను ఒక చిన్న డేరాలో ఉంచాను. అక్కడ తిరిగే వ్యక్తి (కావలివాడు) తరువాత రోజున, అధిరాన్ డాక్ లో ఉన్న హరికేన్ కొండకు వచ్చుచుండెను.
24
నా తల్లి ఒక స్వల్ప ఇండియన్. మరియు నాకు నేనుగా, నేను ఒక మంచి అడవి మనిషిని, అక్కడ చుట్టూ తిరుగగలను అనుకొన్నాను. కావున నేను ఆమెతో చెప్పాను, నేను చెప్పాను, “మిడా, ఇప్పుడు...” అప్పటి నుండి బిల్లీ ఆమెతో ఉండెను, సుమారు ఐదు సంవత్సరముల వయస్సు గలవాడు. మరియు నేను చెప్పాను... అతని తల్లి, మీకు తెలియును, చనిపోయినది. ఇంకా నేను చెప్పాను, “ఇప్పుడు, నీవు నాకు రాత్రి భోజనము సిద్ధము చేయుము, నేను క్రిందికి వెళ్ళిపోవుచున్నాను. నేను మధ్యాహ్నమునకు తిరిగి వచ్చెదను. ఆ పర్వతము యొక్క ఆ భాగమును ఒక ఎలుగుబంటి ఉపయోగించుకొనుచున్నది, మరియు నేను క్రిందకి వెళ్ళుచున్నాను.”
మంచిది, నేను ఆ ఎలుగుబంటి జడ కొరకు బయలుదేరాను, మరియు నేను వెళ్ళుచూనే యున్నాను. మరియు ఇంకా కొన్ని కొండలలోనికి వెళ్ళాను, ఇంకా కొన్ని కొండలు. మరియు కొద్ది సమయం తరువాత, నేను చుట్టూ చూచాను. ఆ లోయలో దేనికొరకైతే నేను చూచుచున్నానో, ఒక గొప్ప పెద్ద దుప్పిని నేను చూచాను. ఆ దుప్పిని పేల్చాను, మరియు నేను చెప్పాను, “చెప్పు, ఇక్కడ చూడుము, అని చెప్పాను. అక్కడ ఒక తుఫాను వచ్చుచున్నది.”
25
మరియు పర్వతములలో వచ్చే తుఫాను గురించి తెలిసినవారు, ఇంతకు మునుపు అక్కడ వేటాడిన వారెవరైనా ఒకవేళ ఉంటే, మీరు కేవలము క్రింద కూర్చొనుట మంచిది. కాని నేను కూర్చుని యుండలేను; నేను భార్యను మరియు బిడ్డను కలిగియున్నాను; మరియు వారు జీవితంలో మొట్టమొదటిసారి అడవులలో చిన్న డేరాలో ఉన్నారు. మంచిది, వారు చనిపోవునంతగా చల్లబడిపోయెదరు. అది ఆ రాత్రికి పదికంటే క్రిందకు వచ్చును. మరియు ఆ తుఫాను వచ్చుచున్నది, అది ఒకవేళ రెండు లేదా మూడు రోజులు ఉంచవచ్చును. మరియు నా భార్య అడవులలో ఇంతవరకు నేను చూసిన వారిలో ఒక పెద్ద భయస్తురాలు, మరియు ఆమె చచ్చేంతగా భయపడును. కావున నేను తప్పనిసరిగా వెనుకకు వెళ్ళవలెను అని అనుకున్నాను.
కావున నేను నా తుపాకీని త్వరగా పైకి తీసుకున్నాను. నేను నా కోటు వేసుకున్నాను. క్రిందకు వచ్చు ఒక చిన్న మార్గం ద్వారా నేను ప్రారంభించాను. మంచు క్రిందకి వస్తూ ఉన్నది, మరియు గాలి క్రిందికి వచ్చుచున్నది. నేను అనుకున్నాను, “ఓ, ఇక్కడి నుండి బయటకు రావటం ఏలా అనేది నాకు తెలియును, నేను నేరుగా వెనుకకు వెళ్ళి, ఆ కొండ ప్రక్కగా వెళ్ళి, శిఖరమునకు నేరుగా వెళ్ళెదను. అది ఇక్కడి నుండి ఐదు మైళ్ళు కూడా లేదు.”
26
కావున నేను నడిచాను మరియు నడిచాను, మరియు నేను చెప్పాను, “ఇక్కడ, నేను ఎక్కడ తిరిగాను అని అనుకున్నాను?” మొదటి విషయం మీకు తెలియునా, నేను ఆగాను, మరియు నేను నా జింక ప్రక్కగా నిలుచున్నాను. నేను మరల మొదలుపెట్టాను మరియు అదే స్థలమునకు నేను తిరిగి వచ్చాను. నేను మరల మొదలుపెట్టాను, ఒక ఫలాని మార్గములో వెళ్ళాను, మరియు తిరిగి అదే స్థలమునకు వచ్చాను. ఇప్పుడు, నీవు ఒక వృత్తాకారంలో గుండ్రంగా తిరిగుతూ ఉంటే దానిని చావునడక అని ఇండియనులు పిలుస్తారు. నీవు ఎప్పటికి దాని నుండి బయటకు రాలేవు. కావున, నేను దాటి వచ్చాను. నాకు తెలుసు ఏదో మార్గములో నేను కొండ దాటి అత్యున్నత పర్వతములలోనికి వచ్చాను, మహాకాయులు అని పిలిచెదరు; ఇది సమభూమిగా ఉన్నది. కాని నేను వెనుకకు ఏ మార్గములో వెళ్ళవలయును? ఈ వృత్తములో నుండి నేను ఎలా బయట పడవలయును?
మంచిది, నేను భయపడితిని. మరియు నేను చెప్పాను, “ఇప్పుడు, ఒక నిమిషము ఆగు. బిల్లీ, నీవు తప్పిపోయే అరణ్యవాసివి కాదు,” నాకు నేను మాట్లాడుకున్నాను. “నీకు తెలియును, ఇక్కడ నుండి బయటకు వెళ్ళుట ఎలా అనునది నీకు తెలియును, నీవు తప్పకుండా ఎరిగియుండాలి. మిడా చనిపోవును, అదే విధంగా బిల్లీ కూడా. మరియు నీవు ఇక్కడ నుండి ఖచ్చితంగా బయటకు వెళ్ళవలయును.” నేను చెప్పాను, “నిశ్చయముగా. ఎలా బయటకు వెళ్ళవలెనో నాకు తెలియును. నేను కేవలము ఇక్కడ నుండి నేరుగా పైకి వెళ్ళెదను, మరియు తిరిగెదను, మరియు దాటి పోయెదను.”
27
నేను నడుచుట ప్రారంభించాను. మరియు నేను ఇంకా ఎక్కువ ఉద్రిక్తతకు లోనైతిని, మరియు నేను తప్పిపోయానని నాకు తెలుసు. మరియు పొగమంచు పరదా ఎంత క్రింద వరకు ఉండునో అంత క్రిందకు వున్నది. మరియు నేను... గాలి అక్కడి నుండి వీస్తున్నది, మంచు పడుచున్నది, పొగమంచు పడుచున్నది, గాలి... మరియు ఇక్కడి నుండి బయట పడుట ఒక సమస్య కాబోవుచున్నదని నాకు తెలిసినది.
మరియు నేను ప్రారంభించాను. నేను చెప్పాను, “ఇప్పుడు, నేను ఈ పర్వతము మీదకు వచ్చినప్పుడు, గాలి నా ముఖముపై ఉన్నది. కావున నేను గాలిలో సరిగ్గా నేరుగా వెనుకకు పోయెదను.” మరియు గాలి నాకు వెనుకన ఉండియున్నది. ఒకవేళ అది నా ముఖముపై ఉండినయెడల... మరియు నేను దారి తప్పిపోయెదను, మరియు నేను అది చేసినప్పుడు, ఈ లేఖనమును ఏదో ఒకటి ఉదహరించునని నేను వినియున్నాను, అది ఈ మధ్యాహ్నమున నాకు వచ్చినది. “దేవుడే ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన మనకు ఆశ్రయమును, దుర్గమునైయున్నాడు.” మంచిది, నేను కేవలము నడుస్తునే ఉన్నాను. మరియు ఆ శబ్దము పెద్దదిగా, పెద్దదిగా అవుచూనే ఉన్నది. “ఓ, నేను దానిని ఉహించుచున్నాను,” అని నేను చెప్పాను. “ఇప్పుడు, నేను బలహీనుడను అవుచున్నానని, నేను ఎరిగియున్నాను,” అని నేను చెప్పాను.
28
ఎవరైనా సరే ఏదైనా సమయమును కోల్పోయినప్పుడు, వారికి జ్వరము వచ్చును. అప్పుడు వారు పరుగులెత్తుట మొదలు పెట్టెదరు, వారి యోచనలో నుండి బయట పడెదరు, పెద్ద కొండ మీద నుండి పడిపోవుదురు లేదా ఏదో ఒకటి, మరియు వారిని వారు చంపుకుంటారు. అదే విధంగా, నాకు జరుగుచున్నది అదియే, అని నాకు తెలుసు. నా మీదకు వచ్చుచున్న ఆ జ్వరమును నేను పొందుకొనబోవుచున్నాను, ఏలయనగా నేను నా భార్య గురించి ఆలోచించుచున్నాను.
సాధారణంగా, నేను ఒక చిన్న స్థలమును కనుగొని, దానిలోనికి జొరబడి, ఒక ముండ్ల పొదో లేక ఎదో ఒకటి ఉంచుకొనిన అది నాకు ఈ తుఫాను ముగిసే వరకు ఉండును, కాని నేను వారి గురించి ఆలోచించలేక పోవుచున్నాను, వారు చనిపోబోవుచున్నారు, మరియు నేను చెప్పాను, “నేను వారి యొద్దకు వెళ్ళవలెను.” కావున నేను చాలా ఉద్రిక్తతకు లోనవుచున్నానని అనుకున్నాను. కావున ఇదే దారి అని నాకు తెలియును; మరియు నేను నేరుగా సరిగా ఈ మార్గములో వెళ్ళుచున్నాను.“
మరియు ఏదో ఒకటి, “దేవుడే మనకు ఆశ్రయము మరియు ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు,” అని చెప్పుచునేయున్నది.
29
కావున, నేను చెప్పాను. “ఇప్పుడు, నేను తప్పనిసరిగా వెర్రివానిగా మారుచున్నాను. నేను నా మతి కోల్పోవుచున్నాను, ఎందుకంటే దానిని నేను నా చెవులలో వింటున్నాను.” మరియు నేను చెప్పాను, “ఇది జరుగకూడదు. నేను సరిగా పోవుచున్నాను. నేను ఖచ్చితముగానే ఉన్నానని నాకు తెలియును. నేను కోల్పోబడనైయున్న చాలా మంచి అరణ్యవాసిని. నేను వెళ్ళుచునే ఉన్నాను. ”నాకు దారులు తెలుసు, నేను తప్పిపోలేదు,“ అని నేను చెప్పాను.
ఒక్కోసారి జనులు ఈ దినాన అదే విధంగా సంఘములో చేరుట ద్వారా వారిపై వారు తమాషా చేసుకొనుటకు ఇష్టపడుచున్నారు. నిన్ను నీవు తమాషా చేసుకొనవద్దు. నీవు సరైన దారిలోకి వస్తే మంచిది. దేవుడే మనకు ఆశ్రయము మరియు దుర్గమునైయున్నాడు, మరియు ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు.
మరియు నేను నడుచుచూ ఉండగా, నేను అనుకున్నాను, “ఇక్కడ, నేను తప్పుగా వెళ్ళుచున్నానని నాకు తెలుసు, ఎందుకనగా నేను తిరిగి సరిగా చుట్టి ఇదే మార్గమునకు మరల తిరుగుచున్నాను, మరియు నేను తప్పిపోయాను అని నేను గుర్తించాను.” ఓ, తప్పిపోవుట అనేది ఒక భయంకరమైన భావన. కావున నేను చెప్పాను, “నేను ఒక అరణ్యవాసినే కాను అని నేను సమర్పించుకొనుచున్నాను, ప్రభువా, నేను మిమ్మును నమ్మవలసియున్నది.” నేను నా టోపిని తీసివేసి, మరియు దానిపై మోకరించాను. అక్కడ చెట్టు ప్రక్కన నా తుఫాకీ ఉంచాను. మరియు నేను చెప్పాను, “ప్రభువా, నేను తప్పిపోయాను. నేను జీవించుటకు అర్హత కలిగిలేను. కాని ఆమె మరియు బిల్లీ జీవించుటకు అర్హులు, నేను వారిని ఈ అడవులలోనికి తీసుకొనివచ్చాను. ప్రభువా, నా కొరకు కాదు, కాని వారి కొరకు, నాకు ఈ అడవులలో నుండి బయటకు పోవుటకు దారి చూపండి, ప్రభువా. నేను తప్పిపోయాను మరియు నేను ఎక్కడున్నది నాకు తెలియదు. మీరు ఒక్కరు మాత్రమే నాకు సహాయము చేయగలరు. ఈ నవంబర్ చివరన, ఈ తుఫాను కొన్ని రోజులు ఉండును.
30
నేను పైకి లేచాను, నా టోపీని వెనుకకు తీసుకున్నాను, దానిని నా తలపై పెట్టుకున్నాను. నేను చెప్పాను, “ఇప్పుడు, ఒక క్రైస్తవుడిగా నాకు తెలుసు; నేను ఈ ఒక దిక్కునే వెంబడించెదను. మరియు నేను పోవుచూ ఉండెదను.” మరియు నేను నడచుట ప్రారంభించితిని. మరియు నేను చెప్పాను, “ఇప్పుడు, ఇది నా అభిప్రాయము (ఆలోచన). నేను నేరుగా ఈ మార్గములో వెళ్ళుచున్నాను. ఆ మార్గములో పోవలెనని నాకు అనిపించుచున్నది.” మరియు నేను నడచుట ప్రారంభించినప్పుడు, హఠాత్తుగా, ఎదో దాని చేతులు నాపై ఉంచినది.
సహోదరుడా బ్రెన్హాం, నీవు కేవలము దానిని అనుకున్నావు,“ అని నీవు చెప్పవచ్చును.
కాదు, నేను అనుకొనలేదు. నేను తిరిగేటప్పటికి ఒక బలమైన స్పర్శను అనుభవించాను. మరియు నేను తిరిగినప్పుడు, అది ఖచ్చితంగా దేవుడై ఉండవచ్చును, నేను చూచుటకు సరిపడు దూరములో నా కొరకు పొగమంచు సరిచేయబడినది, నేను నేరుగా హరికేన్ పర్వతము నుండి వెళ్ళుచూ ఉన్నాను; ఎక్కడైతే కావలివాడు ఉంటాడో అక్కడ ఆ బురుజును నేను నా వెనుక చూశాను, కాని ఆ ఏడాది అతను అక్కడ లేడు. నేను నేరుగా కెనడాకు వెళ్ళుచున్నాను.
31
ఓ, నేను బురుజును చూసిన దిశగా వెంటనే తిరిగాను. నేను వదలలేకున్నాను అని నాకు తెలిసినది. నేను అక్కడికి చేరుటకు పెద్ద కొండలు మరియు ప్రతి దానిపై నుండి పోవలసివచ్చినది. కాని ఎంత తక్కువగా చూసినా, ఆరు లేక ఏడు మైళ్ళు ఆ తుఫానులో... ఆ పొగమంచు వెనుకకు లాగినది, అది దేవుని యొక్క హస్తము కాక మరి ఏమిటి? ఒకవేళ ఎవరైనా కొండలలో తుఫానులో ఎప్పుడైనా ఉండి ఉంటే, ఎందుకు, అది అంత మందంగా ఉండును, నీవు కనీసము ఒక్కోసారి నీ చేతులను నీ ముందు ఉంచి చూచుట కూడా కష్టము. మరియు మైళ్ళు దూరం, అది ఒక క్షణకాలములో సరిచేసినది. దానివైపు నా వెనుక భాగమును త్రిప్పి ఉన్నాను, కాని ఏదో వారి చేతులను నాపై ఉంచినది మరియు నేను అది ఏమిటి అని చూచుటకు తిరుగులాగున చేసినది. ఆయన మాత్రమే ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు.
పయనించిన దారిని నేను పొందుకొన్నపుడు, నేను నా టోపీని తీసి మరియు నేను చెప్పాను, “దేవా, ఇప్పుడు నేను పది లేక అంతకంటే ఎక్కువ సంవత్సరములు మిమ్మును సేవించియున్నాను. నేను చనిపోవువరకు మీకు సేవ చేసెదను. ఓ ప్రభువా, ఆ బురుజు యొద్దకు నన్ను నడిపించండి. నేను నా విధిని నిర్వహించవలయును.
అది ఆ రీతిగానే యున్నది. దేవుడు నిన్ను రక్షించినప్పుడు, నీవు నీ యొక్క గమనమును కల్వరి వైపునకు ఉంచవలయును. నీవు ఎడమకైనను లేదా కుడికైనను తిరుగరాదు.
32
నేను ఆ పర్వతము పైకి చూసితిని, అక్కడ ఒక చిన్న కావలివాని గది ఉన్నది ఎక్కడ... మరియు నాకు తెలియును, ఒకవేళ నేను దానికి చేరినయెడల, మేము ఎక్కడయితే ఉన్నామో ఆ చిన్న భవనము యొక్క వసారా యొద్దకు తిన్నగా చేరేంత వరకు అక్కడ ఒక ఫోసు తీగె పర్వతము క్రింద వరకు దాదాపు ఆరు మైళ్ళ వరకు వేయబడెను, ఎందుకనగా ఆ చిన్న గది ఆ భవనము యొక్క వసారాకు దగ్గరగా ఉన్నది. అది ఇంకా తెరిచియుండ లేదు. అతను నాతో పాటు వేటాడుటకు తరువాత వచ్చును.
మంచిది, కొండలపైకి ఎక్కి రాళ్ళపైకి ఎక్కి జారుతూ, నన్ను నేను గాయపరచుకుంటున్నాను (కోసుకుంటున్నాను). చీకటి పడినది, ఎందుకనగా నేను చుట్టూరా నడుస్తూ ఉండితిని. అప్పుడు ఆ మధ్యాహ్నము సుమారుగా నాలుగు-గంటల-ముప్పై నిమిషాలు అయినది. మరియు చీకటి పడినది, మరియు నేను ఏమియూ చూడలేకున్నాను. తుఫాను మెలి తిరుగుతూ, మరియు విసురుచున్నది, మరియు జంతువులు పరుగులెత్తుచున్నవి.
33
నేను పట్టుకొనవలసిన ఆ తీగ చెట్టుపై కేవలం అదే ఎత్తులో వంకపోవునందువలన నేను దానికై నా చేతిని పైకి ఎత్తి నడవవలయును అని నాకు తెలియును. నేను ఒకవేళ సరియైన దిశలో ఉన్నచో, నా చేయి చివరికి ఆ తీగెను తాకునని నాకు తెలియును. మరియు నేను ఈ చేతిని పైకి ఎత్తి పెట్టెదను, మరియు మంచు క్రిందికి పడుచూ ఉండును, పర్వతములపైకి పోవుకొలది మంచు తుఫాను వలె, గడ్డకట్టు మాదిరిగా ఉండును. నా చేయి చాలా చల్లగా మరియు తిమ్మిరిగా మారును. మరియు నేను ఆగవలయును, నా తుపాకీని ఈ చేతిలో ఉంచుకొని దాని వెచ్చగా మార్చెదను, నా కోటు క్రింద ఉంచెదను, తిరిగి వెనుకకు దాని వెచ్చగా మార్చిదను, నా కోటు క్రింద ఉంచెదను, తిరిగి వెనుకకు దానిని పెట్టెదను. కావున ఖచ్చితంగా నేను నా దిశను దాట లేకుండా ఉండెదను. నా చేతిని తిరిగి ఎత్తి మరియు నడుచుట ఆరంభించెదను.
ఇంకా ఇంకా చీకటి పడుచూ ఉన్నది. అది పడుచూ ఉన్నది... నా భార్య చాలా భయపడుచూ ఉండునని నాకు తెలియును. చివరికి నేను తప్పిపోయాను అని అనుకున్నాను. మరియు నేను చాలాసార్లు ఆగాను. కాని కొంచెం తరువాత, ఏదో నాకు తగిలినది. నేను ఆగాను, అది ఒక కొమ్మగా ఉండినది. నేను దానిని లాగాను. అది ఒక కొమ్మగా ఉండెను. నేను నా చేతిని తిరిగి పైకి లేపి ప్రారంభించాను.
అదే విధంగా నీవు నీ రెండు చేతులను పైకి ఎత్తి కరుణ కొరకు అరుచుచూ, కల్వరికి పోవలసియుండెను. దేవుడు నిన్ను నడిపించును.
34
నా చేయి ఏదో దానికి తగిలినప్పుడు నేను ఏ విధంగా స్పందించితినో మీకు తెలియదు. దానిని నేను లాగెదను మరియు అది తీగె, నేను ఆ తీగను పట్టుకొనగలనని నాకు తెలియును. అది నన్ను నా ప్రియుల యొద్దకు తీసుకొని వెళ్ళును. దేవుడు నాకు సహాయము చేసెనని తెలుసుకొనుట అది ఎటువంటి ఒక అనుభూతిగా ఉన్నది. అది ఒక ఉపశమనం, నేను రక్షించబడ్డానని నాకు తెలిసినది.
నా హృదయమును మరియు నా చేతిని ఏదో ఒకటి తాకినంత వరకు నేను నా చేతులను గాలిలోనికి పెట్టితిని. ఆ దారి చివరన నా ప్రియులు మరియు రక్షకుడు ఎదురుచూస్తున్నారని పరిశుద్ధాత్మ యొక్క తీగె నాకు చెప్పుచున్నది.
నా మార్గములను నేను పరిశీలన చేసుకొనగా, నేను ఒక వేటగాడిని కాను. నేను ఒక అరణ్యవాసిని కాను. దేవుడు నాకు ఆశ్రయము మరియు దుర్గమునై ఉన్నాడు.
35
ఆ తప్పిపోయిన కుమారుని వలె, అతను ఆ పందుల దొడ్డిలో ఉన్నప్పుడు, అతను అతని యొద్దకు వచ్చును; అతను అతని తండ్రితో ప్రవర్తించిన తీరు, అతను మిగిలిన వారందరితో ప్రవర్తించిన తీరును, అతను అతని మార్గములో ఆలోచించుట ఆరంభించెను. అతను అతని యొద్దకు వచ్చెను. మరియు అతను అతని మార్గములను పరిశీలన చేసుకొనగా, అతను చెప్పెను, “నేను లేచి మరియు నా తండ్రి యొద్దకు వెళ్ళి మరియు చెప్పెదను, నేను నీ కుమారునిగా ఉండుటకు అర్హునిని కాను. నన్ను మీరు మీ కూలి సేవకులలో ఒకరిగా ఉంచుకొనండి.” అతని మార్గములను అతను పరిశీలన చేసుకొనగా, అతను అతని తండ్రి ఇంటి వైపునకు తిరిగెను.
అతను యోబు, ఒక మూలపురుషుడు. అతను అతని మార్గములను మాత్రమే ఆలోచించక; అతను అతని పిల్లల మార్గములను కూడా పరిశీలన చేసెను. అతను ఇలా అనుకొనెను: అతని యవ్వన కుమారులు మరియు కుమార్తెలు బయట వారి విందులను కలిగియున్నపుడు, ఒకవేళ వారు పాపము చేసియుండవచ్చునని చెప్పి, నేను వారి కొరకు ఎలాగైనా ఒక దహనబలి అర్పించెదను అని అతను చెప్పెను. అతను అతని పిల్లల యొక్క మార్గములను పరిశీలన చేసెను.
36
నేను మీకు చెప్పుచున్నాను, ఒకవేళ చాలా మంది అమెరికన్ తల్లులు మరియు తండ్రులు వారిని బయటికి రాక్-అండ్-రోల్ విందులకు, డాన్సులకు మరియు పెద్ద పెద్ద ఖర్చుతో కూడిన విందులకు పంపుటకు బదులుగా, వారి పిల్లల మార్గములను గురించి ఆలోచన చేసినట్లయిన ఈ దేశము శ్రేష్ఠమైనదిగా ఉండి ఉండెడిది.
యోబు చెప్పెను, “ఒకవేళ వారు పాపము చేసియుండిన యెడల, నేను వారి కొరకు ఒక బలిని అర్పించెదను.” మరియు కష్టము అతనిని తాకినప్పుడు, అతను చెప్పగలిగేను, “అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఈ శరీరమును క్రిములు తినివేసిననూ, శరీరముతో నేను దేపుని చూచెదను. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను.” అతను అతని మార్గములను పరిశీలన చేసుకొన్నందున, ఆ దేవుడే ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడాయెను.
37
అది మూలపురుషుడైన పితరుడైన దావీదు. ఆయన ప్రవక్తయిన నాతాను ముందుర కూర్చొని ఉన్నపుడు, మరియు నాతాను అతని యొక్క పాపపు మార్గములను అతనికి బయల్పరచెను. మరియు దావీదు అతని మార్గములను పరిశీలించుట ప్రారంభించెను, అతను అతని యొక్క ప్రియమైన స్నేహితుని, ఊరియాను తీసివేసి, అందముగా యున్న అతని భార్య అయిన బత్సేబను తీసుకొనెను. మరియు తరువాత ఆమె దావీదు వలన తల్లి ఆయెను. మరియు అది అతని (ఊరియా) బిడ్డ అని, దానిని అతని మీద త్రోయుటకై, అతను తన యొక్క భార్యతో జీవించులాగున, అతనిని యుద్ధము నుండి తోడుకొని లోపలకు పంపుటకు ప్రయత్నించెను. దానిని అతనిపై వేసి, “ఇది ఊరియా యొక్క బిడ్డ,” అని చెప్పెను.
కాని ఊరియా, ఆ పరాక్రమముగల సైనికుడు, అతను కేవలము ఒక అన్యమతంలో... అతను ఒక అన్యుడు, ఒక పార్షీయుడు. కాని అతను, “నా దేవుని మందసము యుద్ధ రంగములో ఉండగా, నేను నా భార్యతో జీవించుటను దేవుడు నిషేదించును గాక,” అని చెప్పెను.
నేను ఈ జీవితానికి మరియు అక్కడి దానికి మధ్యన ఉన్న ఈ గీత దాటినప్పుడు, నేను ఊరియా చేతిని కరచాలనం చేయవలెనని కోరుచున్నాను. అతను ఒక నిజమైన మనిషి. నా సహోదరులు బయట అక్కడ ఉండగా, దేవుని మందసము యుద్ధ భూమిలో ఉండగా, మరియు నా సహోదరులు బయట అక్కడ ఉండగా, నేను పోయి నా భార్యతో జీవించుటను దేవుడు నిషేధించును గాక.“
38
అతనిని ఉపసంహరించుటకు మరియు యుద్ధరంగములో ముందు ఉంచుటకై అతనిని తీసుకొనుటకు దావీదు యోవాబును కలిగియుండెను మరియు సూర్యుడు అస్తమించుచుండులాగున కవచమును పట్టుకొని శత్రువు యొక్క శక్తి క్రింద అతను చనిపోయెను. ప్రవక్త అయిన నాతాను అతనికి దానిని బయల్పరచి మరియు అతనికి చెప్పెను. “దావీదు, ధనవంతునిగా ఉన్నప్పటికిని,” దావీదు తదుపరి అతని మార్గములను పరిశీలన చేసుకొనెను, అది అతని పాపములు దేవుని ముందు దాచబడలేదు అని అతను తెలుసుకొనెను. మరియు అది అతనిని గోనెపట్ట యొద్దకు తీసుకొనివచ్చెను, మరియు బూడిదే రాసుకొని ఆ గోనెపట్టతో అతను ఘోరముగా ఏడ్చెను. నిశ్చయమముగా, నీవు నీ మార్గమును పరిశీలించినపుడు.
తన యొక్క సహోదరుని జన్మహక్కును దొంగిలించుటకు, తనలో నుండి ఒక మేషదారిని తయారు చేసుకొని, ఎవరైతే అబద్దము చెప్పియుండిరో, అతడే మూలపురుషుడైన యాకోబు. అతను అహంకారముతో చాలాకాలము వరకు తిరుగుచుండెను, కాని అతను ఇంటికి పోవుట గురించి ఆలోచించుట మొదలు పెట్టెను.
39
ఈ రాత్రి ఇంటికి పోవుట గురించి ఇక్కడ ఉన్న వారిలో చాలా మంది ఆలోచిస్తూ ఉండవచ్చు. ముసలితనము మీతో వచ్చుచున్నది, అనారోగ్యము మీపై పట్టును కలిగియున్నది. మీరు అక్కడికి చేరుటకు ముందే మీ మార్గములను గురించి ఆలోచించుట మంచిది.
మరియు యాకోబు అతని భార్య మరియు పిల్లలతో అతని మార్గములో ఉండగా, ఏశావు ఒక పెద్ద సైన్యముతో అతనిని కలిసికొనుటకు వచ్చుచున్నాడనే వర్తమానము అతను వినియుండెను. మరియు అతను ఏ విధంగా ఏశావుకు చేసేనో దాని గురించి, అతనిని మోసగించిన దాని గురించి, అతను అతని మార్గములను గూర్చి ఆలోచించుట మొదలుపెట్టేను. మరియు ఇది అతనిని ఆ రాత్రంతయూ ప్రార్థించుటకు నడిపించినది. అతను ప్రభువు దూతతో పోరాడెను.
ఈ రాత్రి పురుషులు, మరియు స్త్రీలు, ఆడపిల్లలు మరియు మగపిల్లలు ఏవరైతే పరిశుద్ధాత్మ బాప్తిస్మమును నిర్లక్ష్యపరచియున్నారో, మీరు ఇంటికి ఎంత దగ్గరగా ఉన్నారు అనేది మీకు తెలియదు. మీరు ప్రభువు యొక్క దూతతో పోరాడి, మరియు మీరు ఆశీర్వదింపబడువరకు అతనిని వెళ్ళనివ్వకుండా ఉండేలాగున, మీరు మీ యొక్క హృదయములో ఒక ఉద్దేశ్యమును పెట్టుకొని యుండెదరని నేను నమ్ముచున్నాను.
40
దేవుని యొక్క దూత యాకోబును తాకినప్పటి నుండి అతను వ్యత్యాసముగా నడిచెను. అతను ఆ చిన్న నదికి ఒక వైపున చక్కగా నడవగలిగే వ్యక్తి, కాని వేరొక ప్రక్కన కుంటిగా నడిచే రాజకుమారుడు. నీవు వ్యత్యాసముగా నడువుము; మరియు వ్యత్యాసముగా ఆలోచించుము. అప్పుడు ఏశావును ఎదుర్కొనుటకు అతను భయపడలేదు, ఎందుకనగా అతను దేవుని దూతతో పోరాడియుండెను. మీ మార్గములను గూర్చి ఆలోచించండి.
ఎవరైతే మిద్యాను, కుమార్తె అయిన సిప్పోరాను పెండ్లి చేసుకుని సమాధానంగా జీవించుచున్నాడో అతనే మోషే, అతను బయట అక్కడ గొర్రెలను కాయుచున్నపుడు, ఒక రోజున ఎడారికి వెనకవైపున బాగా తెలిసిన ఒక పాత దారిలో అతను నడుస్తూ సమాధానముగా గొర్రెలను కాయుచుండెను. ఇశ్రాయేలు వారు బానిసలుగా దాస్యత్వములో ఉండెను. అతను అతని మార్గములను గూర్చి ఆలోచించుచుండెను. “ఒక గొర్రెల కాపరిగా ఉండుట, నా పని కాదు. దేవుడు నన్ను ఒక ప్రసంగీకునిగా ఉండుటకు పిలిచెను.”
ఆత్మలను రక్షించుటకు దేవుడు నీకు ఆజ్ఞ ఇవ్వలేదని, ఈ రాత్రి నేను మోషేకు బోధించుటలేదని, ఎక్కడో దూరాన బయట ఒక ట్రక్కును నడుపుకొనుచూ, లేదా ఇక్కడ క్రింద గుజ్జు కర్మగారము యొద్ద లేదా దూరానా బయట ఉక్కు కర్మగారములో ఉన్న నాకు ఎలాగు తెలియును. ఇది చేయుటకు బదులుగా, నీవు నీ యొక్క అనుదిన ఆహారము కొరకు ఒక పని చేసుకొనుచూ, తేలికగా జీవించుచుండగా, వేలకొలది ఆత్మలు నాశనమునకు పోవుచుండెను.
41
సువార్త బరిలోనికి పిలువబడిన స్త్రీ లేదా పురుషులకు నేను బోధించుటలేదని నాకు ఎలాగు తెలియును, అయిననూ ఆ జన్మహక్కును రొట్టె ముక్క కొరకు మీరు అమ్ముకొనుచున్నారు. నీకు నీవుగా, నీ మార్గములను గురించి పరిశీలన చేసుకొనుము. అది నీకు ఏమి తెచ్చునో చూడుము... దాని ద్వారా నీవు ఏ విధంగా ఫలించెదవో? నీవు మొత్తం ప్రపంచమును సంపాదించుకొని మరియు నీ ఆత్మను కోల్పోయినయెడల, నీవు ఏమి చేసినట్లు? నీ మార్గము గురించి ఆలోచించుము.
మరియు మోషే తన మార్గములను పరిశీలన చేసుకొనుట ఆరంభించినందున, “నేను ఒక హంతకుడను; నేను ఒక పిరికివాడిని. ఒక ప్రసంగీకునిగా ఉండుటకు దేవుడు నన్ను పిలిచెను. నేను ఒక వ్యత్యాసమైన జన్మను జన్మించితిని. నేను జమ్ము జంబులలో దాచబడితిని. దేవుడు నన్ను పిలిచియున్నాడు అని ఆమె నాకు చెప్పినప్పుడు, నా తల్లి చెప్పిన కథను నేను ఎన్నడూ మరచిపోను. నేను నా హృదయములో ఒక వర్తమానమును కలిగియున్నాను. కాని నాలో చాలా వేదాంతమును నేను కలిగియున్నాను, ఎందుకు, నేను దానిని నా మార్గములో చేయుటకు ప్రయత్నించాను. అయితే ఇంకా ఇక్కడ ఎక్కడో దేవుడున్నాడు లేదా ఆయన ఎప్పటికి నాకు జీవితమును వదిలియుండేవాడు కాదు.”
అతను అతని మార్గములను గూర్చి ఆలోచించుచుండగా, అతను ప్రక్కకు చూచుట తటస్థించినది, మరియు అక్కడ మండుచున్న పొద అతనికి బదులు ఇచ్చినది. దేవుడు దయగలిగియుండెను.
42
దేవుని పిలుపు నుండి దూరముగా ఉన్న ప్రతి సహోదరునికి ఈ రాత్రి సమాధానం చెప్పుటకు ఒక మండుచున్న పొద ఇక్కడ ఉన్నది. మీ మార్గములను పరిశీలన చేసుకోండి. రోగులను స్వస్థపరచుటకు, సూచనలు చూపిస్తూ, ఆశ్చర్య కార్యములను, అధ్బుతములను చూపిస్తూ పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నది. మీలో చాలా మంది ఒక క్రైస్తవునిగా ఉండవలెనని కోరుకొనుచున్నారు. మీలో చాలా మంది దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని కోరుకొనుచున్నారు. అయినా నీవు నీళ్ళ తొట్టి కొరకు లేదా బయట కర్మగారములో ఎక్కడో ఒక చోట పని కొరకై దానిని నిర్లక్ష్యపరచియున్నావు.
మీలో కొంత మంది స్త్రీలు ఇంటిలో మీ పిల్లలతో ఉండి, వారి కొరకు వరిశుద్ధ గ్రంథము చదువుచూ ఉండవలసి ఉన్నది. అధికముగా డబ్బును సంపాదించుటకై నీవు బయట ఒక పనిని కలిగియుంటివి. మీ కొరకు సిగ్గుపడుచున్నాను. దేవుడు నీకు ఒక పనిని ఇచ్చియున్నాడు; అది పిల్లలను పెంచుట. దేవుని విషయములను వారికి బోధించుట. అది నిజము. స్త్రీలారా, మీ మార్గములను పరిశీలన చేసుకొనుడి. ఆ డాలర్లు ఏమి చేయును? అవి ఇస్కరియోతు యూదా చేసిన మాదిరిగా శబ్దము చేయును. నీ మార్గములను పరిశీలన చేసుకొని ఆయన రక్తము వైపుకు, ఆయన కృపకు, ఆయన అర్పణకై నీ పాదములను త్రిప్పుము.
“నేను నా మార్గములను పరిశీలన చేసుకొనగా,” అని దావీదు చెప్పెను. “నేను నా పాదములను నీ సాక్ష్యము వైపు త్రిప్పితిని.” నిశ్చయముగా, నీవు పోవుచుండగా నీ మార్గములను పరిశీలన చేసుకొనుము.
43
గమనించండి. మోషే అతని మార్గములను పరిశీలన చేసుకొనెను, మరియు అతని పాదములను ప్రభువు యొక్క సాక్ష్యముల తట్టుకు త్రిప్పెను. దేవుడు అతనిని ఆశీర్వదించెను మరియు అతనికి పిలుపునిచ్చెను. అతని సంకల్పమును నూతనపరచెను, ఆయన వాగ్దానము చేసిన వాటినన్నింటిని ఆయన చేసి, అతనిని ఒక గొప్ప విమోచకునిగా చేసెను.
ఒకవేళ అక్కడ ఒక్క ఆత్మను రక్షించుటకై దేవుడు నిన్ను పిలిచియుండవచ్చును, కాని నీవు అది చేయుట లేదు. ఆ ఆత్మ ఎవరు అనేది నీకు ఎలా తెలియును? ఇక్కడ కెంటకీలో ఉన్న ఆ చిన్న ముసలి స్త్రీని చూడుము. వెనుక మెథడిస్టు రోజుల ఆరంభములో, ఆ పట్టణములో ఒక ఉజ్జీవమును కలిగియుండుటకు ఆమె హృదయములో ఒక పిలుపు ఉన్నది, అని నేను నమ్ముచున్నాను. మరియు ఆమె చేసినప్పుడు, ఆమె ఒక గుర్రాలు ఉండే స్థలమును అద్దెకు తీసుకొనినది. ఆమె దానిని అద్దెకు తీసుకొనుటకు అవసరమైన డబ్బు వచ్చు వరకు, ఆమె బట్టలు ఉతికినది; ఆమె దానిని శుభ్రపరచి, ఆమె సొంత బెంచినీ ఒక దానిని అక్కడ వేసి, కొన్ని చిన్న కరపత్రాలు తీసుకొనినది. ప్రసంగించుటకు ఒక పాత ఉపదేశకుడిని అద్దెకు పిలిచినది. ఆ ముసలి ప్రభువు యొక్క సేవకుడు ఘనముగా ప్రసంగించుటకు ఆ రాత్రి వచ్చెను. ప్రతిసారీ వారు ఆ చిన్న కరపత్రికను చూస్తారు, మరియు వారు దానిని నేలపై విసరి వెళ్ళిపోయేవారు. ఆమె ఏడుస్తూ ఉండేది. ఆమె కదలుట ఆరంభించెను. “ప్రభువా, నాకు ఏమి చేయవలెనో తెలియుట లేదు,” అని చెప్పెను.
44
ఒక చిన్న కుర్రాడు అతని జుట్టును, మెడ క్రింద వరకు వ్రేలాడదీసుకుని, అతని తండ్రి బెల్టు వేసుకొని, ఒక పాత జీన్స్ పైజమా ధరించి నడుచుకుంటూ వచ్చి మరియు “స్త్రీ, నీవు ఇచ్చుచున్నది ఏమిటి?” అని అడిగెను.
ఆమె, “ప్రియమైనవాడా, అది ఒక చిన్న కరపత్రిక,” అని చెప్పినది.
చెప్పెను, “నేను చదువలేను.”
చెప్పెను, “అక్కడ ఉన్న ఆ గుర్రముల స్థలములో ఈ రాత్రికి ఒక చిన్నకూటము ఉన్నది. మరియు ఆ రాత్రి, పిలుపు వచ్చినపుడు, తలుపులు తెరువబడెను. ఆ పాత ప్రసంగికుడు మరియు ఆ స్త్రీ మాత్రమే అక్కడ ఉండెను. అతను అతని హృదయములో రగులుచున్న వర్తమానమును ప్రసంగించుటకు లేచి నిలువబడెను. కొంత సేపటి తరువాత, ఆ చిన్న పొడవాటి జుట్టు కలిగిన పాత పిల్లవాడు ఆ భవంతిలోనికి చేరెను. ఆ రాత్రి, అతను బలిపీఠము వద్దకు వచ్చాడు. నాకు జ్ఞాపకం లేదు, అది ఒక మిలియన్ ఆత్మలను కల్వరి యొద్దకు పంపిన డ్వైట్ మూడీ అని నేను నమ్ముచున్నాను. హల్లెలూయ!
45
దేవుడు మమ్ములను పిలువలేదని మీకు ఎలా తెలియును, మరియు మీరు దేవుని యొక్క ఆశీర్వాదములను మీ యొక్క అహంకారము వలన, మరియు జోన్సెస్ వలె నటించుటకు ప్రయత్నించుట వలన మీరు కోల్పోవుచున్నారు. అదే నేనైతే రోజుకు మూడుసార్లు చికెన్ తిని, పెద్ద భవంతిలో జీవిస్తూ, ఈ విషయాలని కోల్పోవుటకు బదులుగా [స్పష్టతలేని మాటలు.]
నీవు పోవుచుండగా నీ మార్గములను పరిశీలన చేసుకొనుము. హల్లెలూయ! అవును, ఆయన దేవుడు. ఆలోచించు. నేను నా మార్గములను పరిశీలన చేసుకొనగా... చక్కని చిన్నదానా, ఈ రాత్రి, నీవు ఎలాగు ఉండబోవుచున్నావు? ఇక్కడ ఎక్కడో బయట, చెంపలకు రంగు పూసుకొని, ఆలోచించు నీవు ఏదో అయి ఉన్నావు, ఈ రోజులలో ఒక రోజున, ఈ నీ చిన్న రూపము కుళ్ళిపోయి మరియు భూమిలో మన్నుగా మారిపోవును, తదుపరి ఆ ఆత్మ ఎక్కడికి పోవును? నీ మార్గములను పరిశీలన చేసుకొనుము.
46
నీవు ఇదంతా తెలుసుకొనుట గురించి ఏమిటి? పురుషులు మరియు స్త్రీలు అయిన మీరు మిగతా అందరికంటే చురుకైనవారని అనుకుంటున్నాను. ఒక వెర్రివాడు సైతం తప్పు పట్టకుండా దేవుడు సువార్తను చాలా స్పష్టంగా, తయారుచేసెనని మీకు తెలియునా? మీ మార్గములను పరిశీలించుడి.
ఈ రక్షణ వర్తమానాన్ని మీకు తెచ్చుటకు ఎవరైతే వెర్రివానిగా పిలువబడెనో ఆ యేసుక్రీస్తు గురించి ఆలోచించండి. వారి సాక్ష్యములను ముద్రించిన అపొస్తలుల గురించి యోచించుడి, వారు అన్ని విధములైన పెద్ద సంఘముల నుండి బయటకు వచ్చి, మత విరోధులుగా పిలువబడిరి. మీరు వారి కంటే శ్రేష్ఠులా? కాదు, ఎప్పటికి కారు, వారికి, మీకు మిలియన్ల మైళ్ళ దూరం ఉన్నది. మీరు వారికంటే శ్రేష్ఠులు కారు. మీ మార్గములను ఆలోచించండి, మరియు మీ పాదములను కల్వరి వైపుకు తిప్పండి. కల్వరి ద్వారా రక్షించబడటం మాత్రమే దేవుడు కలిగియున్న ఏకైక పరిహారము. ఆయన కలిగియున్న ఒకే ఒక్కటి అదియే.
47
అది పేతురు, అతను కోడి పుంజు కూత మూడుసార్లు వినినప్పుడు, తన మార్గములను అతను పరిశీలన చేసికొనెను. యేసుక్రీస్తు అతనితో అలాంటి ఒక విషయము జరుగునని చెప్పియుండెను. మరియు యేసు ఏది జరుగునని వాగ్దానము చేసియుండెనో, అది జరుగుట అతను చూసినపుడు - అతని మార్గములను అతను పరిశీలించుకొనెను. మరియు అతను బయటకు వెళ్ళి, బిగ్గరగా ఏడ్చెను.
ఈ రాత్రి ఇక్కడ ఉన్న మీలో కొంతమంది, మరియు వారు రంగములో ఉండవచ్చును, వారిలో కొంతమంది దీనిని ఒక పరిశుద్ద గుండ్రాళ్ళ గుంపుగాను, దేవుని యొక్క రక్షణను మూఢత్వముగాను అనుకొనుచున్నారు. రాత్రి వెంబడి రాత్రి, అవి నెరవేరుటను మీరు చూడుడి, అదే విషయమును మన ప్రభువు చెప్పెను, “సాధ్యమైయ్యేటటువంటి ఒక సూచన ఇవ్వబడును, నేను వెళ్ళెదను, మరియు నేను ఆదరణకర్తను పంపెదను, అదియే పరిశుద్ధాత్మ అతను వచ్చినప్పుడు. ఆయన వచ్చినప్పుడు, ఆయన నా గురించి సాక్ష్యము చెప్పును. మరియు చివరి దినములలో సొదొమ సూచన కనిపించును.” యేసు చెప్పినది మీరు చూచునప్పుడు, మీ మార్గములను గూర్చి యోచన చేయుడి, “సొదొమ దినములలో జరిగినట్లుగా, మనుష్యకుమారుడు వచ్చు దినములలోను జరుగును.”
48
మరియు మీరు చూడండి, స్వలింగ సంపర్కులు పెరిగిపోవుచున్నారు. సూచనలు కనపడుచుండుటను మీరు చూడండి. మీరు చూడండి, సొదొమ వద్ద ఉన్నటువంటి అదే ప్రభువు దూత, ఇప్పుడు ఈ రాత్రి మన మధ్యలో పని చేయుచున్నాడు. యేసు తన స్థానములో పంపిన ఆ వ్యక్తి, అతడు పరిశుద్ధాత్మగా పిలువబడెను. యేసు ఇక్కడ తన శరీర రూపములో ఉండజాలడు, కాని ఆయన చేసినటువంటి అవే క్రియలు ఆయన స్థానములో ఉండి చేయుటకు గాను పరిశుద్ధాత్మను పంపియుండెను.
నీ ధోరణిలో నీ మార్గముల గూర్చి యోచించుము. నిజమైన జీవముగల దేవునికి సేవ చేయుటకు బదులుగా, నీవు సేవచేస్తున్న ఆ సిద్దాంతములను గురించి ఆలోచించుము. ఒక మనిషి తిరిగి జన్మించితే తప్ప, ఏ విధంగాను అతను దేవుని రాజ్యమును చూచుటకు ఎటువంటి జ్ఞానమును కలిగియుండడు. మీ మార్గములను యోచించుకొనుము. ఓ, ఒకవేళ నీవు దైవత్వములో డాక్టరేటు పొందియుండవచ్చును. మీరు ఏమై ఉన్నారో నాకు తెలియదు. కాని మీరు ఒకవేళ తప్పిపోయినట్లతే, అక్కడ సమయము సమీపించుచున్నందున, మీ మార్గములను గూర్చి ఆలోచించుట మంచిది.
49
అది ప్రధానయాజకుడు, యూదా కొరకు ముప్పది వెండి నాణెములను లెక్కించినట్లుగా యున్నది. అతను ఆ వెండి చేసిన గింగురు శబ్దమును వినినపుడు, యూదా అతని మార్గములను పరిశీలించుకొనెను. మరియు అతను వెళ్ళి, ఒక త్రాడును తీసుకొని తనను తాను ఉరితీసుకొనెను.
అది ఒక రోమా సైనికుడు, అక్కడ అతను నిలబడియున్నపుడు అతను ఆ రోజు మధ్యలోనే సూర్యుడు క్రిందికి దిగుట చూచియుండెను, కొండలలోని రాళ్ళు శబ్దం చేయుటం చూచియుండెను. తండ్రి, వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగకయున్నారు, వారిని మన్నించుము,“ అని ఒకరు చెప్పుట అతడు వినియుండెను. అతను అతని యొక్క బల్లెముతో ఆయన హృదయములో పొడిచి, నీరు మరియు రక్తము బయటకు ప్రవహించుట చూచెను. అది అతను చూచినపుడు, తన మార్గములను గురించి అతను ఆలోచించుట ప్రారంభించెను. అతను క్రింద పడి పెద్దగా అరచి మరియు చెప్పిను, ”నిజముగా, ఆయన దేవుని యొక్క కుమారుడే.“ ఆయన ఏమి చేసెను అనేది అతను చూచినప్పుడు, తన మార్గములను గూర్చి యోచించుట ఆరంభించెను.
50
నీవు ఏమి చేసియుంటివో దాని గురించి ఆలోచించుము. చెడు వైపునకు చూడుము. నీవు ఏ విధంగా క్రీస్తును ప్రక్కన పెడితివో చూడుము. నీవు ఒక నిజమైన క్రైస్తవునిగా ఉండవలెను. నీవు ఏదో విధముగా పరిశుద్ధాత్మతో నింపబడవలెను. ఏదో ఒక రోజున నీవు నిర్ణయించబడెదవు, కాని నీ యొక్క అభిప్రాయము అనేది ఎప్పటికీ నిన్ను అక్కడికి చేర్చదు. మంచి ఉద్దేశ్యములతో నరకము రాళ్ళ చేత కప్పబడియున్నది.
సహోదరుడా, నీవు నీ మార్గములను పరిశీలించుకొనినప్పుడు, రోమా సైనికుడు చేసినదే నీవు చేయుము. దేవునికి మొర్రపెట్టి మరియు నిజముగా, ఆయన దేవుని కుమారుడు, మరియు నేను నా పాదములను ఆయన సాక్ష్యముల వైపునకు త్రిప్పెదను. నా కొరకు చనిపోయిన ఆయన కొరకు నేను జీవించెదనని,“ చెప్పుము.
51
పరిశుద్ధాత్మ కదలికను, గొప్ప సూచనలను మరియు అద్భుతములను చేయుటను మీరు చూచుచుండగానే, మీ మార్గములను మీరు పరిశీలించుకొనుడి. సొదొమ, అది నాశనము చేయుబడుటకు ముందు ఉండినట్లువలె, జరుగునని దేవుడు చెప్పిన ఆ ఆఖరి సూచనను మీరు చూచినట్లయిన, మీ మార్గములను పరిశీలించుకొనండి.
మీరు ఏమి చేయుచున్నారనేది ఆలోచించండి. ఒకవేళ మీరు క్రైస్తవునిగా ఉండినయెడల మీరు జీవించుచున్నట్టి జీవితం గురించి ఆలోచించండి. మీరు నిందా రహితంగా జీవించుచున్నారా? దేవునికి ప్రీతికరమైన కార్యములను మీరు చేయుచున్నారా? మీ హృదయం మీపై దోషం మోపడం లేదా? నీవు ఒకవేళ పాపిగా ఉన్నట్లయిన, వణకుతో దేవుని యొక్క శక్తి క్రిందికి మరియు బలిపీఠము యొద్దకు రమ్ము.
నేను ప్రసంగించుచుండగా నీవు ఒకవేళ నీ మార్గములపై ఆలోచించినట్లయిన, ఒకవేళ దేవుడు నీవు తప్పు అని నీపై అపరాధం మోపినచో, నేను నీకు ఒక విషయం చెప్పగలను: నేను మీకు ఏదో ఒకటి ఈ రాత్రి, ఇక్కడ పరిచయం చేయగలను.
అక్కడ రక్తముతో నింపబడిన ఊట ఉన్నది.
ఇమ్మానుయేలు రక్తనాళాల నుండి తీయబడినది,
ఎక్కడైతే పాపులు వరద క్రింద మునిగిపోయెదరో అక్కడ,
వారి అన్ని అపరాధ మరకలు తొలగించబడును.
ఆ చనిపోయిన దొంగ చూచుటకు సంతోషించేను,
అతని దీనములో, ఆ ఊట; (ఆయన దేవుని కుమారుడు అని
అతను ఆ సూచనను చూచిన పిదప.)
అక్కడ నేను కూడా అతడి వలె దుష్టునిగా ఉన్నప్పటికీ,
నా పాపములన్నింటిని కడిగివేసెను.
విశ్వాసము ద్వారా నేను ఆ ప్రవాహమును చూచినప్పటి నుండి
మీ ప్రవహించుచున్న గాయములచే సిద్దము చేయబడినది,
రక్షించు ప్రేమయే నా ప్రసంగమయినది,
మరియు నేను మరణించువరకు అది ఉండును.
ఒక అత్యున్నతమైన, తీయ్యని పాట నేను పాడెదను.
రక్షించు మీ శక్తిని నేను పాడెదను,
సరిగా మాటలు రాని, నత్తిగల నాలుక
నిశ్శబ్దంగా సమాధిలో పడుకొని యుండును.
52
ఓ, మై. అక్కడ ఊట దగ్గర మీలో ప్రతి ఒక్కరికి స్థానం ఉన్నది. మీ మార్గములను పరిశీలించుకొనుడి. మరియు జ్ఞాపకముంచుకొనండి, మీరు సరైన మనసుతో ఉండగానే, మీరు ఈ రాత్రి ఇక్కడ ఉన్నప్పుడే, మీ మార్గములను మీరు పరిశీలించుకొని మరియు మేము ప్రార్థించుచుండగనే యేసుక్రీస్తును అంగీకరించండి.
అక్కడ ఉన్న వారిలో కొంతమంది ధైర్యము గల వారిగా ఉండవచ్చును, మీరు మీ మార్గములను గురించి ఆలోచించుచుండగనే, మేము ప్రార్ధించుటకు ముందు, మీ చేతిని పైకి లేపి, “సహోదరుడా బ్రెన్హాం, మీరు ప్రార్థించుచుండగా, సన్ను జ్ఞాపకము చేసుకొనుము,” అని చెప్పండి. నేను నా మార్గములను గూర్చి పరిశీలన చేసుకొనుచున్నాను వారు ఎలాగు ఉండవలసినదో కేవలము ఆలాగు లేరు. దేవుడు మిమ్ములను దీవించును గాక. దేవుడు మిమ్ములను దీవించును గాక. దేవుడు మిమ్ములను దీవించును గాక. అది మంచిది. బయట చుట్టూ కూడా అంతా... ఇప్పుడు, వేనుక, ఇంకా చీకటిలో ఉన్న మీ చేతులను నేను చూడగలుగుచున్నాను.
53
మీ చేతిని పైకి ఎత్తండి; మీ తలలను వంచియుంచండి. మీ చేతిని పైకి ఎత్తి, “సహోదరుడా, బ్రెన్హాం నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఓ దేవా, నేను నా చేతిని సహోదరుడు బ్రెన్హాం వైపు ఎత్తడం లేదు ప్రభువా, నేను నీ వైపు దానిని ఎత్తుచున్నాను. కాని నేను అతను నా కొరకు ప్రార్థించవలెనని కోరుచున్నాను. అతను నిజం చెప్పి యున్నాడని నేను నమ్ముచున్నాను. మనము మన మార్గములను పరిశీలించుకొనవలెను,” అని చెప్పెను. అయ్యా, “దేవుడు మిమ్మును దీవించును గాక.” మరియు నేను నా మార్గములను పరిశీలన చేసుకొనగా, నేను నా పాదములను మీ సాక్ష్యముల వైపునకు త్రిప్పితిని. ఓ దేవా, నాపై దయచూపండి. ఇక్కడ ఉన్నవారిలో ఇంకా కొంత మంది మీ చేతులను ఎత్తి, “నేను ఒక క్రైస్తవుడను, సహోదరుడా బ్రెన్హాం, అయితే నిజాయితీగా, నేను నా మార్గములను గూర్చి పరిశీలించుకొనుచున్నాను. పరిచర్య చేయు స్థలములు మరియు ప్రతీ ఒక్కటి తెరువబడియున్నది. మరియు ఇక్కడ నేను, దాని గురించి ఏమి చేయకుండా ఉన్నాను. నేను ఒక కర్మగారములో పని చేయుచున్నాను, కేవలం మనం ఇంకా కొంచెం అధికంగా డాలర్లను పొందగలము. నేను చేయుచున్నాను...” అని చెబుతూ ఉండండి. దేవుడు మిమ్మును దీవించును గాక. దేవుడు మిమ్మును దీవించును గాక. మీ చేతులు ప్రతీచోటులో పైకి ఎత్తబడుచున్నవి. ప్రభువు మిమ్మును దీవించును గాక. చుట్టూ ఉన్న మీ అందరిని దేవుడు దీవించును గాక.
“నేను ఇక్కడ కొంచెం అధికంగా డబ్బు సంపాదించుటకై నా సమయమును ఖర్చుచేయుచున్నాను, మరియు ఆత్మలు చనిపోవుచున్నవి. మరియు నేను నిజముగా కనీసం... నేను దేవుని ముందర మంచి చేయుట లేదు. నేను నా డబ్బును సరిగా ఖర్చు చేయడం కూడా లేదు. నేను దానిని లోకపరమైన విషయముల కొరకు ఇచ్చుచున్నాను.” ఓ, డబ్బు లేకుండా, వెల లేకుండా, అక్కడ రక్తంలో నింపబడి ఉన్న ఈ ఊట యొద్దకు రండి. కొన్ని వందల చేతులు లేపబడియున్నవి. ప్రార్థన ముగించుటకు ముందు, అక్కడ వేరే ఎవరైనా ఉన్నారా? దేవుడు మిమ్మును దీవించును గాక. దేవుడు ఆ చిన్న బాలికను దీవించును గాక. హానీ, నిన్ను దీవించును గాక. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక.
54
కొన్ని నిమిషముల ముందు నేను ఆ ద్వారం గుండా వచ్చుచుండగా, ఒక చిన్న చక్కని బాలిక, ఆమె వచ్చి మరియు చెప్పినది, “నా పేరు కెరెన్. మా అమ్మ మరియు నాన్న వచ్చియున్నారు,” అని ఆమె చెప్పెను. “నేను నా కాళ్ళ నిండుగా పులిపిర్లను, కలిగియున్నాను,” అని ఆమె చెప్పినది.
ఆమె నన్ను ప్రార్థించమని అడగలేదు, నేను ఆమెను నా చేతులలో పైకి ఎత్తుకున్నాను. నేను దేవునికి ప్రార్థించాను, నేను చెప్పాను, “హానీ, ఆ పులిపిర్లు ఇప్పుడు నిన్ను వదిలిపోవును గాక.”
ఆమె అటువైపు చూసినది, మరియు ఆమె యొక్క చిన్నపిల్ల యొక్క కన్నులు నా వైపు చూస్తున్నవి, మరియు “కృతజ్ఞతలండీ” అని చెప్పెను.
ఒక చిన్న బిడ్డ. నీవు చెప్పెదవు, “తదుపరి ఆ బాలిక ఆమె చేతిని పైకి ఎత్తినది. ఆమెకు తెలియదు...”
అవును, ఆమె చేసినది. ఇక్కడ ఉన్న పరిశుద్ధాత్మ ఆ బిడ్డను ఆమె చిన్న వయసులో ఉండగనే ఊట యొద్దకు తీసుకురావలెనని కోరుచున్నది, మరియు ఆమె యొక్క చిన్న వివేకము ఆ పాత రాక్-అండ్-రోల్ డాన్స్ తో, మరియు నిజమైన కథల పత్రికలతోను, మరియు ఈ లోక మురికితోనో రాతిబారిపోలేదు (ఎండిపోలేదు). ఈ రాత్రికి ఆమెను ఆ వెల్లువ క్రింద మునగనివ్వండి, అన్ని అపరాధ మచ్చలను తీసివేసికొననివ్వండి. ఆమె తన మార్గములను పరిశీలించుచున్నది.
55
ప్రియమైన పరలోకపు తండ్రీ, వర్తమానము ముగింపులో, ఎవరయితే చేతులు ఎత్తిరో వారిని నేను మీ యొద్దకు తెచ్చుచున్నాను. వారే ఈ వర్తమానము యొక్క జయ సూచికలు, వారు సామాన్యులుగా వచ్చి, కేవలము వారి చేతులను ఎత్తియున్నారు. లేఖనములో అది వ్రాయబడి ఉన్నది, “ఎంత మంది అయితే నమ్మియున్నారో, వారు సంఘమునకు చేర్చబడ్డారు,” ఎంత మంది రక్షింపబడెదరో వారంతా, మరియు ప్రియమైన దేవా, మీ మాటలు ఇప్పుడు వారి హృదయములో మ్రోగునట్లుగానే వారి చెవులలో కూడా మ్రోగవలెననీ నేను ప్రార్థించుచున్నాను. మనకు తెలియును, మన ప్రభువు చెప్పెను, “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేదు. మరియు తండ్రి నాకనుగ్రహించిన వారందరు నా యొద్దకు వచ్చెదరు.” ఒక్కోసారి మన క్రొత్త వర్తమానములలో, “దాని కొరకు మనము ఏమి చేశాము?” అని మనము ఆలోచిస్తాము. మరియు తరువాత పాపులు వారి చేతులను పైకి పెట్టుటను మనము చూశాము. అప్పుడు మన తండ్రి కార్యము చేయుచున్నాడని మనకు తెలియును. దేవుడు వారు రావలెనని నియమించియుండెనని మనకు తెలియును. మరియు వారు వచ్చెదరు, ఏలయనగా వారు వచ్చెదరని యేసు చెప్పెను. పిదప ఆయన చెప్పెను, “ఎవరైతే నా యొద్దకు వచ్చునో అతనిని ఏ విధముగానూ నేను విడువను. నా మాటలు ఎవరైతే వింటిరో.... [టేపులో ఖాళీ స్థలమున్నది.]
56
...మరియు దానిని ప్రసగించుటకు, ప్రభువా నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు (అది తండ్రియైన దేవునిపై.) నిత్యజీవము గలవాడు మరియు వాడు తీర్పులోనికి రాక, మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు. ఏదో ఒకటి వారి చేతిని ఎత్తమని ఈ జనులకు చెప్పినది, వారు చేసినప్పుడు, అది ఒక ఆత్మ, అది వారితో మాట్లాడినది మరియు చెప్పెను, “మీరు తప్పుగా యున్నారు. మీ చేతులను ఎత్తండి.”
వారు ప్రతి విజ్ఞాన సూత్రాన్ని బ్రద్దలుచేశారు. వారు వారి యొక్క చేతులను ఎత్తిరి. గురుత్వాకర్షణ మీ చేతులను క్రిందికి ఉంచును అని విజ్ఞానము చెప్పును. వారిలో ఉన్న ఒక ఆత్మ అది భూమ్యాకర్షణ సూత్రాన్ని బ్రద్దలు చేసి, వారి చేతిని పైకి ఎత్తినట్లుగా అది చూపించున్నది. వారి చేతులను పైకి ఎత్తిన అదే దేవుడు వారి పేర్లను గొర్రెపిల్ల జీవగ్రంధములో పెట్టుటకు అక్కడ నిలబడియున్నాడు. దానిని నేను నమ్ముచున్నాను, ప్రభువా. వారిని స్వీకరించుము.
57
ఈ జీవితములో నేను వారితో కరచాలనం చేయలేకపోవచ్చు, కాని ఆవల ప్రక్కన, చివరి వర్తమానము ప్రసంగించినప్పుడు, మరియు పరిశుద్ధ గ్రంథము చివరి సారిగా మూసివేయబడినప్పుడు, మరియు నా పెదవులు మరణములో ముద్రించబడును. నా కళ్ళు మూసివేయబడును మరియు ఎరుగని ప్రపంచములకు ఆవల, నిత్యము పచ్చగా ఉండు చెట్టు ప్రక్కన ఉన్న సింహాసనము ప్రక్కగా నేను లేచెదను. నన్ను వారిని కలుసుకొననిమ్ము. ప్రభువా, వారి చేతులతో అక్కడ కరచాలనము చేయనిమ్ము, మరియు వారు చెప్పుదురు, “అది ఆ రాత్రి చటాక్వాలో, ఆ శుక్రవారం రాత్రి, అది నేను నా చేతిని ఎత్తితిని. సహోదరుడా బ్రెన్హాం, నిత్యమునకు అది పరిసమాప్తమైనది. ఇక్కడ ఉండుటకు చాలా సంతోషించుచున్నాము.” ప్రభువా, అది ఆ విధముగా ఉండనిమ్ము. కూడికకు చిహ్నములుగా, నేను వారిని మీకు బహుకరించున్నాను, యేసుక్రీస్తు నామములో వారిని తీసుకొనుము, తండ్రి. ఆమేన్.
ప్రభువు మిమ్మును దీవించును గాక.
58
ప్రార్ధించుటకు చాలా మంది రోగులను నేను కలిగియున్నాను. బలిపీఠపు పిలుపు ప్రారంభించుటకు నేను ఇష్టపడుచున్నాను. కాని ఈ ప్రార్థనా వరుస ముగించిన వెంటనే మీ మాటను తీసుకొనబోవుచున్నాను, అది మీరు ఇక్కడికి బలిపీఠము వద్దకు రాబోవుచున్నారు. ప్రార్ధనా వరుస ముగిసిన తరువాత ఇక్కడ నిలబడండి, మరియు చెప్పండి, “నేను యేసును నా రక్షకునిగా స్వీకరించినందుకు ఈ రాత్రి నేను ఎంతో సంతోషముగా ఉన్నాను.” మరియు ఏదైనా చేయండి. మీ గదికి వెళ్లి మరియు ప్రార్ధించి, మరియు దానికొరకై దేవునికి కృతజ్ఞతలు తెలుపండి. దాని గురించి ఇప్పుడు ఆలోచించండి.
ఇప్పుడు... (వారి ప్రార్ధనా కార్డులు ఏమిటి?) అతను నిన్న ప్రార్థనా కార్డులను ఇచ్చెనని అతను చెప్పెను అని నేను నమ్ముచున్నాను. మరియు ఒకవేళ మనము ఇంకనూ ఉన్నామని అతనికి తెలియదు... అతను దాని గురించి ఒకవేళ ఆలోచించునో, లేదో అనేది నాకు తెలియదు. కాని మేము... ఏది ఏమైనా, మేము ఇచ్చిన ప్రార్థనా కార్డులను కలిగియున్నారు, అది 'ఏ' లు మరియు నేను గత రాత్రి వాటిని తీసుకున్నాను.
59
మరియు ఇప్పుడు, ఈ రాత్రి మనము తీసుకొనబోవుచున్నాము... (“బి” లు, తదుపరీ, ఓబీ' లు, ఒకటి నుండి... అంతా సరియే. ఒకటి నుండి యాభై) “బీ” లు, ఒకటి నుండి యాభై అనే దానిపై ఈ రాత్రికి మనము ఉందాము.
ఇప్పుడు, మనము సరిగా ఈ విధముగా వారిని వరుసలో ఉంచవలయును. మరియు ప్రతి ఒక్కరూ నిజముగా గౌరవముతో ఉండాలని కోరుచున్నాము. ఇది కొంచెం పెందలకడ అని నేను అనుకొనుచున్నాను. కాని ఇప్పుడు, మనము వెళ్ళబోవుచున్నాము... నేను మిమ్మును ఉంచినందులకు క్షమాపణలు చెప్పలేను, పరిశుద్ధాత్మ... మాట్లాడుటకు మీరు అటువంటి ఒక అధ్బుతమైన శ్రోతలుగా ఉన్నారు, నేను కేవలము ఆపలేకున్నాను... ఎప్పుడు ఆగవలెనని నాకు తెలియకున్నది. ఇది కేవలము మంచిది. మరియు అది నా సొంత ఆత్మనే పోషించుచున్నది అని నేను అనుభూతి చెందుచున్నాను. నేను ప్రసంగించునప్పుడు, నేను మంచిగాను మరియు బలముగాను అనుభూతి చెందేదను, ప్రార్థనా వరుసలు నన్ను క్రిందికి త్రోయుచున్నవి, మీకు తెలుసా, అది నా నుండి తీసుకొనును; ఇది నా లోనికి కట్టును.
60
కావున, ప్రభువు మిమ్ములను ఆశీర్వదించును గాక. ఇప్పుడు నమ్ముము. మరియు ప్రతి ఒక్కరూ మీ స్థలములో కేవలము కొద్ది నిమిషములు వరకు నిజమైన గౌరవముతో ఉండండి. మేము ఈ జనులను పైకి పిలిచి వారి కొరకు ప్రార్థించుదము. ఇప్పుడు “బి... (నీవు ఒకటి నుండి యాభై వరకు చెప్పితివా? ఒకటి నుండి యాభై.) ప్రార్థనా కార్డు ”బి“ నంబరు ఒకటి ఎవరు కలిగియున్నారు. మీ చేతిని ఎత్తండి? [టేపు పై ఖాళీ స్థలం ఉన్నది.]
మీ చేయి విరిగినది. మీరు లోపలికి పరిగెత్తి మరియు చెప్పండి, “డాక్టర్, నా చేతిని స్వస్థపరచండి. నేను నా పనిని ఇక్కడే పూర్తి చేయవలసియున్నది. నేను కొన్ని మేకులను దింపుచుండగా, నేను నా చేతిని విరుగగొట్టుకొంటిని. వెంటనే ఇప్పుడే దీనిని స్వస్థపరచండి; నేను దానిని ముగించవలయును, అది... బల్లలు ఇంటిపై ఉన్నవి, చూశారా.
ఎందుకు, “నీకు మానసిక స్వస్థత అవసరము,” అని అతను చెప్పెను.
మంచిది, అది సరి, చూశారా. అతను దానిని స్వస్థపరచజాలడు. అతను ఎముకను వరుసలో అమర్చగలడు, అప్పుడు దేవుడు స్వస్థతను చేయును. అది సరి, అని ఎంతమందికి తెలియును? ఒక చెడిపోయిన అపెండిక్స్ ను నీవు కలిగియుండిన, వైద్యుడు ఆ అపెండిక్స్ ను కోసి బయటకు తీయును, కాని దానిని అతను స్వస్థపరచజాలడు. ఇతను స్వస్థపరచజాలడు. చూశారా, దేవుడు మాత్రమే సృష్టికర్త. దేవుడు మాత్రమే సృష్టికర్త అని ఎంతమందికి తెలియును?
61
ఇప్పుడు, అపవాది సృష్టించలేడు. దెయ్యము, కేవలము దేవుడు సృష్టించిన దానిని వక్రీకరించగలడు. అవినీతి అనగా ఏమిటి? నీతి వక్రీకరించబడుటయే. అబద్దము అనగా ఏమిటి? అది వక్రీకరించబడిన నిజము, చూశారా. వ్యభిచారము అనగా ఏమిటి? పురుషులు మరియు స్త్రీలు న్యాయముగా జీవించుటకు దేవుడు ఇచ్చినటువంటి ఒక క్రియను తప్పుగా ఉపయోగించుటయే, అదియే వ్యభిచారము: అదే క్రీయ, తప్పుడు మార్గము. చూశారా, అదియే వ్యభిచారము. నీతి... అవినీతి అనగా వక్రీకరించబడిన నీతి.
అందరూ ఉన్నారా? ఏమి చెప్పారు? అంతయూ కాని ప్రార్థనా కార్డు ఇరవై-ఐదు. ప్రార్థనా కార్డు ఇరవై-ఐదును ఎవరు కలిగియున్నారు? బహుశా అవిటివారు అయి ఉండవచ్చు, లేదా ఒక చెవుడు, లేదా ఎవరో ఒకరు. ప్రార్ధనా కార్డు ఇరవై-ఐదు, దానిని ఎవరు కలిగియున్నారు? బి - ఇరవై-ఐదు? అది సరి. (అది అదేనా, డాక్టర్, లేదా సహోదరుడు... ఓ, అవును, అది సరి.) అది సరి, ఇరవై-తొమ్మిది. ఓ, సహోదరుడా, కేవలము ఒక్క నిమిషము ఆగుము.
62
అంతా సరి, 'బి' ఒకటి నుండి ఇరవై-ఐదు. ఒకవేళ ఆ వ్యక్తి బయటకు వెళ్ళి యుండవచ్చు, లేదా వారు ఈ రాత్రి ఇక్కడ ఉండి ఉండకపోవచ్చు. ఈ కార్డులు నిన్న ఇవ్వబడినవి, అవియే కదా, పాల్? నిన్న. అంతా సరి. బి-ఒకటి నుండి ఇరవై-ఐదు. తదుపరి ఇరవై-ఐదు నుండి యాభై, వారిని నిలబడనివ్వండి. బి-ఇరవై-ఐదు నుండి యాబై. [టేపులో ఖాళీ స్థలమున్నది.] విశ్వాసము. అది ఎంత మందికి తెలియును? అది విశ్వాసము. విశ్వాసము లేకుండా, నీవు స్వస్థపడలేవు, నీవు విశ్వాసమును కలిగియుండవలెను. మంచిది, దేనిలో విశ్వాసము? కల్వరి యొద్ద యేసు మన కొరకు చేసి ముగించిన కార్యములో విశ్వాసము. దానిని ఎంత మంది నమ్ముచున్నారు?
మంచిది, స్వస్థతకు సంబంధించినంత వరకు, అది యేసు కల్వరి యొద్ద దానిని ముగించినప్పుడే, అది ముందుగానే ముగించబడెను. అది సరియా? మీ చేతిని పైకి ఎత్తండి. తదుపరి చేయవలసినది ఏమిటి? కేవలము దానిని నీవు నమ్ముటయే. నీవు ఈ కూడికలలో ఏదో ఒక కూడికకు రావలసిన అవసరము లేదు. ఎవరో ఒకరు నీ కొరకు ప్రార్థించవలసిన అవసరం నీవు కలిగిలేవు. నీవు కలిగియుండవలసిన ఒకే ఒకటి దానిని నమ్ముటకు అవసరమైన విశ్వాసము.
63
కొన్నిసార్లు... ఇప్పుడు, దేవుడు, ఆయన మంచి దేవుడు. ఆయన మంచి దేవుడని ఓరల్ రాబట్స్ చెప్పును. మరియు అది నిజము. ఆయన మంచి దేవుడు. మరియు ఇంకా, ఆయన మంచి దేవుడు కంటే ఎక్కువ; ఆయన కోపము గల దేవుడు కూడా ఆయన ఇప్పుడు చాలా మంచివాడని, ఆయన తన వాక్యముపై నిలబడడు మరియు నిన్ను ఆయన మన్నించును అని నీవు అనుకొనవద్దు. అది ఆయన ఎప్పుడూ చేయలేదు. ఆయన పరిశుద్ధత ఆయనను నీతిమంతునిగా ఉండవలెనని కోరుచున్నది. ఆయన ఒక నీతిగల దేవునిగా ఉంటూ, ఒక మంచి దేవుడై ఉన్నాడు. ఆయన మంచివాడు, కాని ఆయనకు న్యాయము కూడా అవసరము. మరియు ఆయన నీతి ఆయనను న్యాయముగా ఉండుటకు కోరుచున్నది. ఆయన దానిని ఉంచుకొనవలయును. కావున ఆయన కూడా... ఆయన కోపము గల దేవుడు కూడా.
మరియు ఇప్పుడు గుర్తుంచుకొనండి... మరియు ఒకవేళ నీవు దాని కొరకు నా మాటను తీసుకొనిపోయినను, లేదా నేను నీ మాటను తీసుకొనకపోయినను, దానిని అది ముగించును. కాని దేవుడు కాదు. ప్రతీ ఒక్కరూ ఏ తప్పిదము లేకుండా నిశ్చయముగా ఉండవలయునని, దేవుడు సంఘమునకు ఇంకనూ వరములను పంపుచున్నాడు.
ఆ వరములలో కొన్ని... ఓ, మంచిది, ప్రతి స్థానిక శరీరములోనికి పోవుటకు తొమ్మిది ఆత్మీయ వరములు ఉన్నవి. దానిని ఎంతమంది నమ్ముచున్నారు? I కొరింథీయులకు రాసిన పత్రిక 12. అది భాషలలో మాట్లాడుట, భాషలకు వివరణ చెప్పుట, ప్రవచించు వరములు, మరియు వివేచనలు, మరియు అన్ని రకముల... బుద్ధి, మరియు జ్ఞానము, మరియు స్వస్థతా వరములు, మరియు అవి అన్నియూ మన స్థానిక దేహములోనికి పోవును.
64
అయితే తదుపరి ఐదు పరిచర్య కార్యాలయములు కలవు. దానిని ఎంతమంది నమ్ముచున్నారు? నిశ్చయముగా. మరియు దానిలో మొదటిది అపొస్తలులు, ప్రవక్తలు, ఉపదేశకులు, బోధకులు, సువార్తీకులు. అది ఎంతమందికి తెలియును?
ఇప్పుడు, ప్రవక్త ఉన్నాడు అని చెప్పకుండా, ఒక సంఘ కాపరి లేదా సువార్తికుడు ఉన్నాడు అని నీవు ఎలా చెప్పగలవు? అక్కడ అపొస్తలుడు లేనప్పుడు, ప్రవక్త ఉన్నాడని ఎలా చెప్పగలవు? చూశారా, కాని కొంతమంది జనులు, “ఓ, సంఘ కాపరులు సువార్తికులు మరియు ఉపదేశకులు ఉన్నారు,” అని చెప్పెదరు. అయితే వారు ప్రవక్తలు అని చెప్పుటకు ఇష్టపడరు. “ఉపదేశకులు మరియు సువార్తికులు” అని చెప్పిన అదే దేవుడు, “ప్రవక్తలు” అని చెప్పెను. ఆయన తన మాటను నిలబెట్టుకొనును. మనము దానిని కత్తిరించవద్దు, కేవలము దానిని ప్రసంగించుదము. అందుకోసమే అది... దేవుడు పైన... ఆయన సొంత వాక్యమును కాపాడుట అనునది దేవునికి సంబంధించినది, దానిని నీవు నమ్ముట లేదా?
65
ఇప్పుడు, ఒక ప్రవక్త మరియు ప్రవచనా వరము అనేవి రెండు వ్యత్యాసమైనవి. అది ఎంత మందికి తెలియును? సంఘము ద్వారా ప్రవచనా వరము పనిచేయును; ఒక ప్రవక్త ప్రవక్తగానే జన్మించును. యిర్మియా ఒక ప్రవక్తగా జన్మించెను. తల్లి గర్భంలో రూపింపబడక ముందుగానే దేవుడు అతనిని ఒక ప్రవక్తగా చేసెను, అతనిని జనములపైన ప్రవక్తగా నియమించెను. ఏడు వందల పన్నెండు సంవత్సరముల ముందుగానే అతను జన్మించెను, యెషయా అతనిని చూచెను, “అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము.” ఏదేను తోటలో ను౦డే యేసుక్రీస్తు ఒక స్త్రీ సంతానము. ఆయన వేరే విధముగా ఉండనేరడు కాని యేసుక్రీస్తు, దేవుని కుమారుడు. మోషే ఒక ప్రవక్తగా జన్మించెను, చూశారా. ప్రవక్తలు తయారుచేయబడిన వారు కారు. ఇది హస్తనిక్షేపణము చేసి మరియు వరములను ఇవ్వటం వలే కాదు, ఇది దేవుడే ఇచ్చునది. దేవుడు సంఘములో పెట్టెను, చుశారా. మొదట, అపొస్తలులు, తదుపరి ప్రవక్తలు. మిగిలినవి స్థానిక వరములు, అవి సంఘములోనికి పోపును,
ఇప్పుడు, ప్రభువు మనతో ఉండి, ఈ కార్యములను మనకొరకు చేయునని మనము నమ్ముచున్నాము.
66
ఇప్పుడు, యేసు, ఆయన పరిచర్యలో ఒకసారి... ఇప్పుడు, ఆయన దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత అయి ఉండి, శరీరమందు ఆయనలో నివాసము చేసెను. అది ఎంత మందికి తెలియును, కొలత వేయలేనంతగా ఆత్మ? మనము కొలత ప్రకారముగా అత్మను కలిగియున్నాము. కాని ఒకవేళ దేవుని యొక్క ఆత్మ నాలో ఉంటే, వారిలోను ఆయనలోను, నీలోను అదే ఉన్నది. అది ఒకే విధముగా పనిచేయును. అది ఒకే ఆత్మ, కాని ఉండవలసినంత లేదు, ఇది అదే ఆత్మ, ఉండవలసినంత లేదు, కేవలము సముద్రంలో నుండి బయటికి తీయబడిన ఒక స్పూను నీళ్ళ వలె: పూర్తి సముద్రములో ఉన్న అదే రసాయనాలు, ఆ స్పూన్ నీటిలో కూడా ఉన్నవి, అయితే అంత ఎక్కువగా కాదు. ఆయన దానిని కొలత లేనంతగా కలిగియున్నాడు. మనము దానిని కొలత ప్రకారముగా కలిగియున్నాము. దేవుని యొక్క సంపూర్ణత అంతయూ ఆయనలో ఉండెను. దేవుడు క్రీస్తులో ఉండెను, ఆయనే, లోకమును తనతో సమాధానపరచుకొనెను.
ఇప్పుడు... (అందరూ, యాభై అక్కడ ఉన్నారా?) అది సరి. సరే.
67
కూడికలో ఒకసారి అక్కడ ఒక స్త్రీ ఉండెను. ఆమె ప్రార్ధనా కార్డును కలిగి లేదు; మనము చెప్పెదము. ఆమె ఒక రక్త స్రావమును కలిగియుండెను, మరియు ఆమె యేసు యొద్దకు చేరలేకపోయెను; ఆయన చుట్టూ చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ త్రోయుచున్నారు, ఆయనను కౌగిలించుకొనుచున్నారు మరియు... మనము చెప్పినట్టుగా, ఈ విధంగా “శుభోదయము, పూజ్యనీయుడా లేదా రబ్బీ. ఓ, ఈ రోజు మా ప్రాంతంలో మిమ్ములను కలిగియుండుటను బట్టి మేము చాలా సంతోషించుచున్నాము. మీరు ఎలా ఉన్నారు? నాకు ఒక చిన్న ఆలింగనము ఇవ్వండి. నన్ను మీ చేతిపై తట్టనివ్వండి.” ప్రతి ఒక్కరూ....
మరియు ఆ చిన్న స్త్రీ చూసినది, ఆమె ఆయనకు చేరువగా చేరలేకపోయినది, కావున ఆమె అయన వస్త్రపు చెంగు ముట్టునంత వరకు చుట్టురా ప్రాకుచూ ఉండెను. అది సరియా? ఇప్పుడు, ఆయన కోటును లేదా నా కోటును మీరు తాకి యున్నారో లేదో నేను ఎరిగియుండలేను. పాలస్తీనీయుల వస్త్రము వదులుగా ఉండును మరియు లోదుస్తులు కూడా యుండును. దానికి పైగా ఒక అంగీ ఉండును మరియు ఆమె కేవలము దాని యొక్క చెంగును ముట్టినది, ఎందుకనగా ఆమెలో ఆమే అనుకొనెను, “ఒకవేళ నేను ఆయన వస్త్రపు చెంగును తాకగలిగిన యెడల నేను సరి చేయబడెదను.” అది సరియా? “నేను సరిచేయబడెదను.”
ఇప్పుడు, దాని కొరకైన ఏ వచనమును ఆమె కలిగిలేదు, కాని అమె దానిని విశ్వసించినది. కావున ఆమె ఆయన వస్త్రమును తాకినది. మరియు ఆమె ఆ గుంపులోనికి జారిపోయినది, ఈ విధంగా, బహుశా క్రింద కూర్చొని, లేదా నిలబడి లేదా ఆమె ఎలా ఉన్నదో అలానే ఉండియుండవచ్చును.
యేసు ఆగెను మరియు చెప్పెను, “నన్ను తాకినది ఎవరు?”
మరియు వారందరు “నేను కాదు,” అని చెప్పిరి.
మరియు పేతురు చెప్పెను... అతను ఆయనను గద్దించెను. వేరే విధముగా చెప్పినచో, అతను ఈ విధంగా చెప్పియుండవచ్చు: “ప్రభువా, మీరు దేనిగురించి మాట్లాడుచున్నారు? ఎవరు మిమ్మును తాకిరి? వారు ఒకరిపై ఒకరు మిమ్మును తాకుట కొరకు ప్రాకుచుండగా.”
ఆయన చెప్పెను, “కాని నేను బలహీనపడుటను నేను గ్రహించాను. ప్రభావము నా నుండి వెడలినది.”
68
ఎవరో ఒకరు ఒక వ్యత్యాసకరమైన స్పర్శతో ఆయనను తాకిరి. ఇప్పుడు, ఆ విధమైన స్పర్శ గురించి ఒక నిమిషము మనము మాట్లాడెదము. నీవు నీ చేతిని కరచాలనము చేసిన విధంగా కాదు, నీ పేరు పుస్తకములో పెట్టు విధంగా కాదు, కాని ఆయన గ్రహించగలిగిన ఒక స్పర్శ.
ఇప్పుడు, ఆ చిన్న స్త్రీకి ఒక అవసరత కలిగియుండెను. మరియు ఆయన ప్రజలను చుట్టురా చూసెను... ఆయనకు వివేచించగల ఆత్మ గలదని ఎంత మందికి తెలియును? నిశ్చయముగా, కొలతలేనంత పరిమాణంలో. కాని ఆయనకు తెలియలేదు. ఇప్పుడు, ఒకవేళ ఆయనకు తెలుస్తున్నట్లయితే, ఆయన నీజం చెప్పియుండెడివాడు. ఆయన దేవుడు మరియు ఆయన నిజం చెప్పుట తప్ప వేరేది చేయజాలడు, కాని ఎవరు దానిని చేశారు అనేది ఆయనకు తెలియదు. కాని దేవుడు ఆయనలో ఉండెను. మరియు ఆయన ఆ చిన్న స్త్రీని కనుగొనువరకు సమూహమును చుట్టుగా తేరి చూస్తూ ఉండెను. ఆయన ఆమె యొక్క విశ్వాసమే ఆమె రక్తస్రావమును స్వస్థపరిచినది, అని ఆమెతో చెప్పెను. మరియు ఆమె, ఆమె యొక్క రక్తస్రావము ఆగిపోయినదని, తనలో తాను గ్రహించెను. అది నిజమేనా?
69
ఇప్పుడు, పరిశుద్ధ గ్రంథము యేసుక్రీస్తు - నిన్న, నేడు, మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని చెప్పెను. మీరు దానిని నమ్ముదురా? ఇప్పుడు ప్రస్తుతం ఆయన ప్రధానయాజకునిగా ఉండెను అని క్రొత్త నిబంధన చెప్పెను. అది మన యొక్క బలహీనతల చేత ఆయనను తాకగలము? అది నిజమేనా? మన బలహీనతల చేత మనము ఆయనను తాకగలము. అది సరి.
తదుపరి ఒకవేళ ఆయన ప్రధానయాజకునిగా ఉండిన యెడల, అదే ప్రధానయాజకుడు, మరియు నీవు ఆయనను తాకిన యెడల, ఒకవేళ అదే ప్రధానయాజకునిగా ఆయన ఉండినట్లయిన, ఏ విధంగా ఆయన స్పందించును? ఆయన మొదటిసారి చేసిన విధంగానే. దేవుడు ఏదో ఒక విధంగా పనిచేయడు, కాని మొదటిసారి చేసినట్లుగానే చేయును, ఎందుకనగా ఆయన అనంతుడు. ఆయన అనంతుడు; మనము అంతము గలిగినవారము. మనము అన్ని విధముల తప్పులు చేసెదము, కాని దేవుడు... ఆయన చేయడు. ఆయన... ఆయన ఒకసారి చేసిన, అది ఎప్పటికి పరిపూర్ణము. ఆయన దేవుడు. ఆయన తప్పు చేసి దేవునిగా ఉండజాలడు.
70
కావున ఆ స్త్రీ ఆయనను తాకెను, మరియు ఆయన తిరిగి ఆమెతో చెప్పెను. ఇప్పుడు, ఈ రాత్రి ఆయన అప్పుడు ఉండిన అదే దేవునిగా ఉండినయెడల, అదే ప్రధానయాజకునిగా ఇప్పుడు ఉండినచో, ఈ ఘడియ, మన బలహీనతతో ఆయనను తాకుచూ ఉండిన, ఆయన అదే రీతిగా క్రియ చేయును. ఇప్పుడు, ఆయన మహిమకు వెళ్ళియుండెను.
ఆయన ద్రాక్షవల్లి, మనము తీగెలము. ద్రాక్షవల్లి ఫలములను కాయదు, తీగెలు ఫలములను కాయును. అది సరి కదా? నీవు ద్రాక్షవల్లి నుండి ఫలము పొందలేవు; నీవు వాటిని తీగెల నుండి పొందెదవు. మంచిది, మనము తీగెలమయిన యెడల, ఆయన ద్రాక్షవల్లి, అప్పుడు ఆయనే శక్తిని సమకూర్చును, అదియే పరిశుద్ధాత్మ. మరియు పరిశుద్ధాత్మ ఆయన నుండి వచ్చిన యెడల, అది ఆయన వలెనే పని చేయును.
71
ఇప్పుడు, అక్కడ బయట ఎంత మంది...? అక్కడ బయట ప్రేక్షకులలో ఏమైనా ప్రార్ధనా కార్డులు ఉన్నావా? ఎవరైనా ప్రార్ధనా కార్డులు కలిగియున్నారా, ప్రేక్షకులలో ఎక్కడైనా? ప్రార్ధనా కార్డు కాదు. కావున అది చేయుట నీవు చూచెదవు... నీవు ప్రార్ధనా కార్డును కలిగియుండవలసిన అవసరం లేదు. నీవు విశ్వాసమును కలిగియుండవలెను. విశ్వాసమే విజయము. దేవుడు విశ్వాసము కొరకే చూచును. కేవలము విశ్వాసము కలిగియుండుము. కేవలము నమ్ముము, సమస్తమూ సాధ్యమే.
ఇప్పుడు, అస్వస్థతతో అక్కడ ఉన్న మీలో ప్రతి ఒక్కరు ప్రార్థనా కార్డు కలిగిలేరు, ఈ రాత్రి మహిమలో ఆయన యొక్క వస్త్రపు చెంగు తాకుటకు సరిపోయే విశ్వాసం మీకు ఉన్నదని మీరు నమ్ముచున్నారా? మీరు దానిని నమ్ముచున్నారా? చుట్టూరా, ప్రతీ చోట, మీ చేతులను ఎత్తండి.
72
ఆ చిన్న బాలికను ఆశీర్వదించబడును. ఒక చిన్న బాలిక... అయ్యా? ఆమె మీ బాలికయా, ఆమె అస్వస్థతతో ఉన్నదా? అది సరి. ఆ బిడ్డ కలిగియున్నది ఏమిటి అనేది దేవుడు నాకు తెలియపరచగలడని మీరు నమ్ముచున్నారా? ఒకవేళ ఆమె ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టగలిగిన యెడల? అది అయితే, అది నిజమా కాదా, అనేది మీకు తెలియును, మీరు ఎవరో నాకు తెలియదు, ఆ బాలిక; నేను ఇది వరకు మిమ్మును చూడలేదు. కేవలము మీరు అక్కడ కూర్చొని ఉన్నారు. మీరు నమ్ముదురా?
శ్రోతలలో ఎంత మంది నమ్మెదరు, అది ఒక బాలిక, కేవలము ఒక చిన్న బాలిక ఆమె అక్కడ కూర్చొని ఉన్నది. ఆమె రెండు చిన్న చేతులను నా వైపుకు ఊపుచున్నది. ఆమె చిన్ని కన్నులు చూచుచున్నవి. ఇప్పుడు, అక్కడ ఆ చిన్న బాలికలో ఏదో ఒక తప్పిదము ఉన్నదని, నేను అనుకొంటున్నాను, నాకు తెలియదు. దేవుడు దానిని తెలియపరచగలరు.
దానికి మీరు ఒప్పుకొనెదరా, సహోదరి? మీరంతా? హనీ, కృతజ్ఞతలు. మీరు ఆత్మీయముగా ఉన్నట్లయిన, దేవుడు నీ కన్నులను తెరచును, చూడుము, అక్కడ ఆ బాలికకు సుమారు రెండడుగుల పైన వ్రేలాడుచుండెను. చూడండి, ఆ వెలుగు? ఇప్పుడు, ఆమె ఇక్కడ ఉన్నది. అక్కడ ఒక దర్శనము వచ్చెను. ఆమెపై ఏదో ఒకటి ఉన్నది. అది ఒక గుండె సమస్య. ఒక వైద్యుడు ఆమె గుండెను చూచుటను నేను చూచుచున్నాను. ఆమె గుండె సమస్యను కలిగియున్నది. అది సరియేనా, ఆ తల్లి తన చేతులను ఎత్తనివ్వండి? మీ చేతిని ఆ బాలికపై ఉంచండి. సాతాను, యేసుక్రీస్తు నామములో, నీవు బయలుపరచబడితివి. నీ యొక్క అబద్దపు యుక్తి పూర్తి అయినది. ప్రభువైన యేసు నామములో ఆ బిడ్డ నుండి బయటకు రమ్ము, జీవముగల దేవుని యొక్క సంఘము అయిన, మేము ఆ బాలికను విడిచిపెట్టమని యేసుక్రీస్తు చేత నిన్ను ఆజ్ఞాపించుచున్నాము.
73
ఇప్పుడు, మీరు నమ్ముచున్నారా? దేవునిలో విశ్వాసముంచండి. కీళ్ళ నొప్పితో తల వంచుకుని ప్రార్థించుచూ, సరిగా అక్కడ కూర్చుని ఉన్న ఆ వ్యక్తి, అయ్యా, దేవుడు నిన్ను స్వస్థపరచును మరియు బాగు చేయును అని నీవు నమ్ముచున్నావా? తెల్లని చొక్కా ధరించి చూచుటకు లావుగా ఉండి, ఆ కుర్చీ చివరగా కూర్చుని ఉన్న మీరు, దేవుడు మీ నుండి మీ కీళ్ళ నొప్పులను తీసివేయగలరని నమ్ముచున్నారా? దాని గురించియే మీరు ప్రార్థించుచున్నారు. అది ఒకవేళ సరియైతే, మీ చేతిని పైకి ఎత్తండి? అది సరి. ఇప్పుడు, ఇంటికి వెళ్ళి మరియు బాగుపడుము. యేసుక్రీస్తు మిమ్మును బాగుచేయును గాక.
దానిని నీవు నమ్ముచున్నావా? విశ్వాసము కలిగియుండుము. ఎవరో ప్రార్థించుచున్నారు. దేవునిలో విశ్వాసముంచుము. సందేహించవద్దు.
74
అక్కడ వెనుక కుడివైపున ఒక స్త్రీ కూర్చొని నా వైపు చూచుచున్నది, నీవు వేరొకరి కొరకు ప్రార్ధించుచున్నావు. అది నీ యొక్క సహోదరుడు. అతను పోలియో వ్యాధితో ఉన్నాడు. అది సత్యమయిన యెడల, అతని కొరకై నీవు లేచి నిలబడుము. నేను నిన్ను ఎరుగను, మరియు మీరు నన్ను ఎరుగరు. అది సత్యమయిన యెడల, నీ యొక్క హస్తమును పైకి లేపుము? అయితే నీవు... అక్కడ ఉన్నారు. అతని కొరకై నీవు ప్రార్థించుచుంటివి. అది సత్యమయిన యెడల, నీ చేతిని ఊపుము. నీ ప్రార్థన వినుచున్న ఆ దేవుడు, నాతో మాటలాడెను మరియు నీవు ఆయన వస్త్రమును తాకితివి. అది చేసిన అదే మార్గము ద్వారా పని చేయుచున్నది ఆ పరిశుద్ధాత్మయే. వెళ్ళి, నీ హృదయమంతటితో నమ్ముము, మరియు అది అతనిని విడిచిపెట్టును.
నీవు నమ్ముచున్నావా? ఆ సమయములోనే ఏదో జరిగినది. తిన్నగా ఇక్కడ ఏదో ఒకటి తగిలినది. ఓ, ఇక్కడనే ఉన్నది. ఇక్కడనే ఒక స్త్రీ కూర్చొనియుండి, పక్షవాతముతో ఉన్న, ఆమె ప్రేమించిన వారిలో ఒకరి కొరకు ప్రార్ధించుచున్నది. వారిని దేవుడు బాగుచేయునని నీవు నమ్ముచున్నావా? అది సరియే. నీవు ఇంటికి వెళ్ళవచ్చును, మరియు నీ హృదయమంతటితో నమ్ముము, ఆ మార్గములో దానిని నీవు కనుగొనెదవు. ఆమేన్.
75
దేవునిలో విశ్వాసము కలిగియుండుము. సందేహించవద్దు. ఈ తరగతిలో యున్న ప్రజల గురించి ఏమిటి? నీవు నమ్ముచున్నావు, నీవు లేకుండా... ఇది ఒక వివేచనా వరుస. కేవలము ఈ జనుల కొరకు ప్రార్థించుటకై నేను వెళ్ళుచున్నాను. ఇది వివేచన. దేవునిలో విశ్వాసము కలిగియుండుము. సందేహించవద్దు. నీ హృదయమంతటితో నమ్ముము,
ఇక్కడ, బారిగా కనపడుచున్న ఈ స్త్రీ ఇక్కడనే కూర్చొనియున్నది. నీ కళ్ళలో సమస్య ఉన్నది, నీవు కలిగిలేవా, సహోదరి? వారు హీనముగా అవుచున్నారు. మరియు దానితో పాటు, నీ యొక్క కాలేయములో సమస్య ఉన్నది, అని నీకు అతడు చెప్పియున్నాడు. అదేనా.... అది సత్యమైన యెడల, నీ యొక్క హస్తమును పైకి లేపుము. వైద్యుడు, బారి కాయము కలిగిన ఆ వ్యక్తి... అది సరియే. ఇంటికి వెళ్ళి మరియు బాగుపడుము. యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును. ఆమేన్.
76
నీవు నమ్ముచున్నావా? ఇప్పుడు నీ మార్గములను పరిశీలించుకొనుము. దేవుని కుమారుడు, యేసుక్రీస్తు, ఆయన చెప్పెను, సొదొమ దినములలో ఉన్న ప్రకారము, ప్రభువు యొక్క దూత మనుష్య శరీరములో క్రిందికి దిగి వచ్చి వివేచించెను, మరియు చెప్పెను, “అబ్రాహామా, నీ భార్య ఎక్కడ?”,
మరియు ఆయన వెనుక గుడారములో, ఆమె తనలోతాను నవ్వుకొనెను. ఆయన, “శారా ఎందుకు నవ్వినది?” అని అడిగెను. ఇప్పుడు నీ మార్గములను పరిశీలన చేసుకొనుము. దేవునితో యదార్ధముగా ఉండుము.
ఇప్పుడు, ఇక్కడ ఉన్న ఈ ప్రార్థనా వరుసలో, నాకు తెలిసినంతవరకు మీరందరు నాకు అపరిచితులు. అయితే, ఆయన సేవకునిగా, ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము నా మీద యున్నదని మీరు నమ్ముచున్నారా? ప్రార్ధనా వరుసలో ఉన్న వారందరు దానిని మీరు నమ్ముచున్నారా? ఇప్పుడు, మీకు తెలుసా, ఈ వరుసలో మేము వివేచనను తీసుకున్నయెడల, ఇది తీసుకొనును... ఓ, ఈ రాత్రి నేను దాని ద్వారా వెళ్ళజాలను. అయితే నా హృదయమంతటితో నేను ప్రార్థించి, నీ కొరకు విశ్వాస సహితమైన ప్రార్థన చేసినయెడల, నీవు బాగుపడేదవని నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావా? ప్రతీ ఒక్కరు, మీరందరూ దానిని నమ్ముదురా? నీవు దానిని నమ్ముదువు. అది సరియే. ఇప్పుడు, వారి కొరకు ప్రార్థించుదము.
77
ప్రభువా, నీవు ఇది మాత్రమే కాదు, అయితే శ్రోతలలో యున్న వారు, మీ యొక్క ఆత్మ ఈ శ్రోతల మీదుగా వెళ్ళి వ్యాధిగ్రస్తులను మరియు బాధింపబడు వారిని స్వస్థపరచును గాక. యేసు నామములో నేను ప్రార్థించుచున్నాను. ఆమేన్.
ఇప్పుడు, మీరు, మీ యొక్క చక్రాల కుర్చీలలో, మంచములలో, మీరు ఈ విధముగా కనబడుచున్నారు, మరియు నీ హృదయమంతటితో నీవు నమ్ముము. మీ సమస్య చాలా చెడ్డదిగా యున్నది, అని మీరు అనుకొనుచున్నారు, అయితే అది అలాగు లేదు. పంటి నొప్పిని స్వస్థపరచుటకు కావలసిన విశ్వాసము కంటే ఎక్కువ విశ్వాసమును ఇది తీసుకొనదు. కేవలము నీవు దానిని నమ్మినయెడల, నిజమైన విశ్వాసము కలిగియుండుడి. దానిని నమ్ముడి.
ఇప్పుడు, కాబట్టి - అభిషేకము తిరిగి నా యొద్దకు వచ్చును, నేను కోరుచున్నాను... నేను కేవలము తీసుకొనగోరుచున్నాను... బహుశా కేవలము ఒక్క నిమిషము ఆమె యొక్క హస్తమును నేను పట్టుకొనెదను. ఒక దర్శనము కొరకు నేను దానిని తీసుకొనుట మంచిది.
78
ఇక్కడ చూడుము. ఆయన సేవకునిగా నన్ను నమ్మొదరా? నీవు చాలా బలహీనముగా యున్నావు అని నీవు గ్రహించుచున్నావు. నీవు కేన్సరను కలిగియున్నావు. చూడమ్మా, ఒక వైద్యుని యొద్దకు నీవు వెళ్ళావు. నీవు మిక్కిలి బలహీనముగా యున్నావు. మరియు నీవు కోయబడుటకు ఎదో దాని కొరకు లేదా ఇంకొక దానికై వైద్యుని యొద్దకు వెళ్ళితివి. ఇది నీ వెనుక ఉన్నది, మరియు ఇది ఒక ప్రాణాంతకముగా ఉన్న ఒక మచ్చవలెయున్నది అని అతడు చెప్పెను, మరియు ఇది స్వస్థత పొందదు, అది అలా పాకుతూనే ఉండును. ఇది ఇంకనూ కేన్సరే, ఒక్కసారి నీ హస్తమును నన్ను పట్టుకొననిమ్ము. ఇక్కడ, ఇక్కడ చూడుము, నీవు దానిని చెప్పగలవు. చూచారా, అది ఏ విధంగా నా చేతి మీద వ్రేలాడుచున్నది? ఇప్పుడు నేను దానిని తీసివేసి మరియు వేరే హస్తమును దాని మీద పెట్టెదను. చూచారా? ఇప్పుడు, ఇది అక్కడ లేదు. చూచారా, నీ హస్తమును అక్కడ పెట్టుము. దేవుని యొక్క కృప చేత మరియు ఆయన ఆత్మచేత, అది నిన్ను వదిలి పోయేటట్లుగా నేను చేయగలను. అయితే ఇది దూరముగా ఉండునో లేక ఉండదో, అది నీకే విడిచిపెట్టబడినది. ఇది జరిగి మరియు పోవుట మీరు చూడగలిగిన యెడల, ఏలయనగా నీవు ఎక్కువ కాలము జీవించజాలవు; అది తిన్నగా నీ యొక్క వెన్నెముకలోనికి వెళ్ళును. (నీవు చూచావా) మరియు కేవలము దానిలోనికి తిన్నగా పరుగిడుము. కాబట్టి, ఇది నీ హస్తము మీద జరిగినట్లుగా నీవు చూచినట్లయిన యెడల, అది నీ విశ్వాసమును పెంపొందింప చేయునా? నీవు యవ్వనములో యున్నావు, మరియు దేవుడు గనుక నీకు సహాయము చేయనియెడల, నీవు ఎక్కువ కాలము జీవించలేవు.
ఇప్పుడు, దయచేసి ఇది ఆలోచించవద్దు... ఇది ఎదో ఒకటి... ఆమె అనుకున్న దానికంటే ఈ స్త్రీ మిక్కిలి నీచముగా(బలహీనముగా) ఉన్నది. నిజముగా హీనముగా యున్నది.
79
దర్శనమనగా ఏమయి ఉన్నది, ఇది ఒక రకమైన శక్తి అని నేను ఎరిగియున్నాను, ఇప్పుడు, నీవు నా చేయి వైపు చూస్తున్నావు. అది ఎలా పొంగుచున్నదో చూడుము? చిన్న తెల్లని వస్తువులు అన్నియూ నా చేయి మీద దొర్లుచుండుట చూడుము? అది కేవలము బర్, బర్, జర్ వలె ఒక కదలిక అయి ఉన్నది, ఏలయనగా పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నది, మరియు మరణము నీ మీద యున్నది. మరియు జీవ మరణములు ఒకదానితో ఒకటి కలసి ఉండజాలవు. ఇప్పుడు, చూడుము, ఈ హస్తములో ఎంత జీవము ఉండియున్నదో, అంత నీవు దానిలో కలిగియుంటివి. ఆ హస్తము అలాగు పెట్టుము. ఇప్పుడు, ఇది అక్కడ లేదు (చూచారా), ఇప్పుడు అక్కడ లేదు. నీ కుడి హస్తము. ఇప్పుడు, నేను నీలాంటి మనిషినే. అయితే చూడుము, ఇది ఆయన యొక్క వాగ్దానము. నీకు నిజము చెప్పుటకు నీవు నన్ను నమ్మియున్నందున, నీ కుడి హస్తమును నీవు పట్టుకొనుము, దేవునికి, నా హృదయమునకు నా హస్తము చాపియున్నాను, చూచారా. ఇప్పుడు, నీ హస్తమును అక్కడ పెట్టి మరియు గమనించుము. నీవు పెట్టు... ఇప్పుడు, ఇక్కడ చూడుము. దీనిని చూడుము? ఇప్పుడు, అక్కడ ఏదో జరుగనైయున్నది, నీవు చూడుము, అవునా (చూడుము), ఎదో అసహజమైనది.
80
ఇప్పుడు, ఒక్క క్షణము పాటు మన యొక్క శిరములు వంచుదము, నిజముగా, ఈ చిన్న దీన స్త్రీ. ప్రియమైన పరలోకపు తండ్రి, యేసు యొక్క నామములో నీవు ఆమెను స్వస్థపరచుదువు, అని నేను ప్రార్థించుచున్నాను. నీ ఆత్మ కదిలింపబడును గాక. ఆ వణకు (కదలికలు) ఆగిపోవునేమోనని, ఆమె నా హస్తమును చూచుచూ గమనించుచున్నది. నా హస్తము వాచిపోవుట, నల్లగా మారుట ఆమే చూచుచున్నది మరియు ఏదో జరుగుట చూచుచున్నది. ఓ, ప్రభువా, సహాయము చేయుము, నేను ప్రార్ధించుచున్నాను, యేసు నామములో శత్రువు ఆమెను విడుచును గాక. ఆమేన్.
ఇప్పుడు, ఒక క్షణము ఆగండి. నేను ఎన్నడూ చూడలేదు; అయితే ఇది వరకు ఉండిన విధముగానే ఇంకా ఉన్నది. ఇది ఆమెను విడువలేదు. మారలేదు, మారినదా? అదే విధముగా ఉన్నది. ఇప్పుడు, మేము అద్భుతముల కొరకు దేవుని అడుగుట లేదు. అది దేవుని అడుగుట సరికాదు. మరియు గుర్తించుకొనుము... ఇప్పుడు, నా హస్తమునకు ఏదో జరుగుచుండుట నీవు చూచియున్నావు, ఇప్పుడు, నీ హస్తమును నీవు కదిపినప్పుడు... తీసివేయుము. గమనించుము, ఇది మరలా ఎలా వెనుకకు తిరిగి వెళ్ళినో చూడండి. ఇప్పుడు, పెట్టుము... ఎలా, చూడుము... నేను నా హస్తమును దాని మీద పెట్టాను, ఆ విధముగా పని చేయలేదు. చూచారా? మరియు నీ యొక్క వేరొక హస్తము ఆ విధముగా పని చేయదు. ఇప్పుడు, దాని మీద మరలా ఈ హస్తమును పెట్టుము, మరియు అక్కడ అది మరలా వెళ్ళెను. చూచారా? చూడండి, నీవు దాని వైపు చూచుచున్నావు. అది సత్యమైనయెడల, ప్రేక్షకులు చూచులాగున ఈ హస్తము పైకి ఎత్తుము. నీకు నీవుగా దానిని చూడగలవు. ఇప్పుడు, ఇక్కడ ఉన్న ఈ బల్ల మీద నా హస్తమును పెట్టెదను. దానిని మీరు చూడగలుగుదురు. నీ హస్తమును నీవు ఏ స్థానములో పెట్టావు అని కాదు. ఎక్కడయినా అది ఒకే రకముగా ఉండును. అది సరీయేనా? దాని వైపు నీవు చూచుచున్నావు.
81
ఇప్పుడు, యేసు, “నా నామములో, వారు దెయ్యములను వెళ్ళగొట్టుదురు,” అని చెప్పెను. ఇప్పుడు, మీరంతా సహాయపడిరి. మీ విశ్వాసమును దేవుని మీద ఉంచుము. ఇప్పుడు, ఇది బయటకు వెళ్ళినప్పుడు, దానిని ఎదుర్కొనుటకు అక్కడ విశ్వాసము లేనియెడల, అది తిరిగి వెనుకకు వచ్చును. ఏలయనగా అపవిత్రాత్మ మనిషి నుండి బయటకు వెళ్ళినప్పుడు, వాడు ఖాళీ స్థలములలో తిరిగి మరియు వెనుకకు వచ్చును. మీకు అర్ధమవుచున్నదా? అయితే అక్కడనే విడిచిపెట్టబడుట నీవు చూచినట్లయితే, అప్పుడు నీవు బాగుపడబోవుచున్నావు అని నీవు ఎరుగుదువు. దానిని నీవు నమ్ముదువు, నీవు నమ్మవా? అది నిన్ను ఉత్తేజపరచును, ఏలయనగా దీనితో నీకు కావలసినంత సమయమును కలిగియుందువు.
ప్రభువైన దేవా, మేము అద్భుతముల గురించి అడుగుట లేదు. అయితే, ప్రభువా, వాటిని నీవు వాగ్దానము చేసితివి. మరియు ఈ శ్రోతలు, మరియు ఈ చిన్న స్త్రీ, అయితే... ప్రభువా, ఆ స్త్రీ ప్రాణమును కాపాడుటకు చాలా ప్రయత్నించారు; ఈ కేన్సరను వాడు వెదజల్లియున్నాడు. ఆమె వెన్నెముకలోనికి, ఆమె వెనుక బాగమునకు వెళ్ళుచున్నది. చీకటి మరియు నీడ ఆమె మీద వ్రేలాడుచున్నవి. అయితే ఆమెను స్వస్థ పరచుటకు నీవు ఇక్కడ యున్నావు. ఆమె నా హస్తమును గమనించుచున్నది. ఏదో ఒకటి జరుగునని లేదా ఒక కదలిక కొరకు ఆమె చూచుచున్నది. ప్రభువా, ఈ ఒక్కసారి అది అలా ఉండును గాక. ప్రజల యొక్క విశ్వాసమును ఇది పెంపొందించును. దేనికొరకో నేను దీనిని అడుగుట లేదు, తండ్రి, అయితే నేను వారికి నిజమునే చెప్పుచున్నాను అని బహుశా ఈ జనులు ఎరిగియున్నారు. మరియు దేవదూత ద్వారా మీరు ఇచ్చిన ఆజ్ఞ, అది సరిగానే యున్నది అని దానిని రుజువు చేసియున్నది, ఇదే మొదటిది అని అది చెప్పినది, మరియు తరువాత వారి యొక్క హృదయ రహస్యమును నీవు ఎరుగుదువు; వారు నన్ను నమ్ముదురు.
82
ప్రభువా, నీ ఆత్మకు వ్యతిరేకముగా, నీ వాక్యమునకు వ్యతిరేకముగా, నీకు వ్యతిరేకముగా, దీనికి వ్యతిరేకముగా ఉండుటకు జనులు బాగా నేర్పించబడుచున్న ఈ దినములో మనము జీవించుచున్నాము. ఏది నమ్మవలేనో వారు ఎరుగకయున్నారు. ఈ చనిపోవుచున్న స్థితిలో ఈ చిన్న స్త్రీ దేవుని యొక్క శక్తిని చూచును గాక. ఆమే నా హస్తమును గమనించుచున్నది. అది కదిలించబడుటకై ఆమె చూచుచున్నది. దాని మీద వచ్చుచున్న ప్రకంపనలు ఆగిపోవుటకు మరియు ఆ వాపు వదిలి వెళ్ళిపోవుటను ఆమె చూచుచున్నది. ప్రభువా, అలాగు జరుగును గాక. నేను ప్రార్థించుచున్నాను, నాకు సహాయము చేయండి, నీవు ఈ మిగిలిన వారు చూచులాగున మరియు లక్ష్యము ఉంచులాగున మరియు దేవుడు ఇంకనూ దేవునిగానే ఉన్నాడు, అని ఎరుగుము. దేవుని యొక్క కుమారుడు, యేసుక్రీస్తు యొక్క నామములో, సాతానా, నేను నిన్ను ఆజ్ఞాపించుచున్నాను, ఆ స్త్రీ నుండి బయటకు వచ్చి ఆమెను విడిచిపెట్టుము.
ఇప్పుడు, ఆ స్త్రీ తనను తాను చూచుకొనుచున్నది. ప్రతీ ప్రకంపనయు వదిలినది, మరియు అది పోయినది. సహోదరి, అది సరియేనా? నీవు స్వస్థపరచబడితివి. నీ మార్గములో వెళ్ళి మరియు ఆనందించుము.
నీవు అక్కడ యున్నావు. తనకు తానుగా ఆమె చూచుకొన్నది, మరియు ఆ స్త్రీని దేవుడు స్వస్థపరచియున్నాడు అని చూచినది. ఇప్పుడు, నీవు నమ్ముచున్నావా? ప్రతీ ఒక్కరూ నమ్ముచున్నారా? ఇప్పుడు మనము ప్రార్థించుచుండగా, విశ్వాసము కలిగియుండుము.
83
ఇప్పుడు, సహోదరి, ముందుకు రా. ఇక్కడ అదే అభిషేకము ఉన్నది. ప్రతీ ఒక్కరీ కొరకు, మేము ఆపివేసినయెడల, ఏమి జరుగునో మీకు తెలుసు.
ప్రియమైన దేవా, యేసుక్రీస్తు యొక్క నామములో మా యొక్క సహోదరినీ స్వస్థపరచుము. ఆమేన్. ఇప్పుడు, ఆమె చేసిన విధముగా ఆనందించుచూ వెళ్ళుము, మరియు నీ హృదయమంతటితో నీవు నమ్ముము.
ఇప్పుడు, చూడుము, ఇది ఇలా కనబడుచున్న... నీకు తెలుసా, నీవు గనుక ఒక దర్శనమును కలిగియుండనియెడల, ఇది దానిని చేయదు. ఏదో జరుగును. నా ఉద్దేశ్యము ఏమిటో, మీరు ఎరుగుదురా? ఎంతమంది అర్ధము చేసుకున్నారు? ఇప్పుడు, ఆ స్త్రీ తలంచియుండవచ్చును, “మంచిది, అభిషేకము అతని మీద లేదు. అభిషేకము అతనిని వదిలి వెళ్ళిపోయినది.” అభిషేకము నన్ను విడిచి వెళ్ళలేదు. ఇంకనూ అది ఇక్కడే ఉన్నది. నిశ్చయముగా ఉన్నది. దానిని నీవు నమ్ముచున్నావా?
84
ఇక్కడ, ఇక్కడ, ఈ స్త్రీ నేను నిన్ను ఎరుగను, నేను ఎరుగుదునా? దేవుడు నిన్ను ఎరుగును, నేను ఆయన ప్రవక్తగా యున్నాను అని నీవు నన్ను నమ్ముదువా? నేను నిన్ను ఎరిగియుండనప్పటికి, దేవుడు నిన్ను ఎరిగియున్నాడు, నాకు తెలియదు అని నీవు ఎరిగియున్న ఏదో ఒక దానిని, నీ గురించి దేవుడు బయలుపరచిన యెడల, నీవు నన్ను నమ్ముదువా? నీవు ఇప్పటికే నన్ను నమ్మియున్నావు. అది సరియే, నీవు ఉబ్బునరాల వ్యాధితో బాదపడుచున్నావు. అది సరియే. మరియు దానితో పాటు, నీ యొక్క సహోదరుని కొరకు నీవు ప్రార్థించుచున్నావు. మరియు ఆ బాలుడు మానసిక వ్యాధితో బాదపడుచున్నాడు అని తెలియజేయబడినది. దానిని నీవు నమ్ముటలేదు. మరియు అది అలాగు కాదు. అతను కేవలము బలహీనముగా యున్నాడు. దానిని నమ్మవద్దు. నీవు ఎవరివి అనేది దేవుడు ఎరిగియున్నాడు అని నీవు నమ్ముచున్నావా? దేవుని యొక్క ఆత్మ చేత నీవు ఎవరైయున్నావు అని నేను గనుక నీకు చెప్పినట్లయితే, నీలో నుండి ప్రతీ సందేహమును అది తీసివేయును? కుమారి నెవిల్, ఇంటికి వెళ్ళి, బాగుపడుము. యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును. సందేహించవద్దు.
85
అయ్యా, మీరు నమ్ముచున్నారా? ఆ నీడ, కేన్సర్ దెయ్యము నిన్ను విడిచిపెట్టును. ఇక్కడకు రమ్ము. ప్రభువైన దేవా, యేసుక్రీస్తు యొక్క నామములో, యేసుక్రీస్తు నామము ద్వారా ఆ వ్యక్తిని స్వస్థపరచమని నేను ప్రార్థించుచున్నాను. ఆమేన్, నా సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక.
అయ్యా, రండి. నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా? కేవలము దాని వైపు చూడు... బయట అక్కడ వందల మరియు వందల మంది జనులు ప్రార్థించుచుండుటను చూడుము. ప్రభువా, యేసుక్రీస్తు యొక్క నామములో మా యొక్క సహోదరుడిని స్వస్థపరచుము. ఆమేన్. నీ హృదయమంతటితో, సహోదరుడా నమ్ముము.
సహోదరీ, రమ్ము. ఇప్పుడు నీవు నమ్ముచున్నావా? ప్రభువా, పరిశుద్ధాత్మ నా మీద ఉన్నప్పుడు మరియు నన్ను అభిషేకించినప్పుడు, యేసు నామములో మా యొక్క సహోదరినీని పరలోకము యొక్క ప్రశస్త దేవుడు స్వస్థపరచును గాక. ఆమేన్. ఇప్పుడు, వెళ్ళి నీ హృదయమంతటితో నమ్ముము. చూడుము, సహోదరి. ప్రియమైన సహోదరీ, చూడుము. నీ హస్తములను పైకి ఎత్తుము మరియు, “ప్రభువా, కృతజ్ఞతలు. నీ నామము స్తుతించబడును గాక,” అని చెప్పుము. దానిని చేయు విధానము అదే. నీ మార్గములో వెళ్ళుము, మరియు నీ కొరకు దేవుడు దానిని సరి చేయును. అదే విధముగా వెళ్ళి, నమ్ముము.
86
అమ్మా, నీవు ఏమనుకొనుచున్నావు? నీవు నమ్ముచున్నావా? నన్ను దేవుని సేవకునిగా నీవు నమ్ముచున్నావా? అది నిన్ను పట్టుకొనును, నీవు చూడుము. ఏదో జరుగుచున్నదని నీవు గుర్తించుము.
ఆ చిన్న స్త్రీ నుండి ఒక దర్శనము నన్ను పట్టుకొనినది. దీని తరువాత దేవుడు నాకు సహాయము చేయును గాక. ఆమె ఇంతకు మునుపు, ఒక ఆపరేషన్ ద్వారా, సాధారణముగా ఆ స్త్రీ ఒక ఆసుపత్రి అనుభవమును కలిగియున్నది (అది సరియే. అవునా?) మరియు అది ఒక బాలుని కొరకు. నీవు కలిగియున్నది ఒక బాలునికై మరియు అది ఒక ఆపరేషన్ కొరకు, ఒక సిజేరియన్ ఆపరేషన్ పడును అని వైద్యుడు చెప్పియున్నాడు, మరియు ఇది ఒక సాధారణ కాన్పు అయ్యేటట్లుగా ప్రార్థించమని నన్ను నీవు కోరుచున్నావు. అది సరియేనా? నీ హస్తమును పట్టుకొనుము. అది “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” నీవు ఇక్కడ నివసించుదానవు కాపు. నీవు వుస్టర్ అను స్థలమునకు చెందినదానవు. అది సరియే. శ్రీమతి.విన్గర్, నీ మార్గమున వెళ్ళి, ఆనందించుము. సహోదరి, దేవుడు నిన్ను బాగుచేయును, మరియు నీ హృదయ వాంఛను నీకు దయచేయును.
87
అందరము ప్రార్ధించెదము. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ మీ శిరములను వంచండి. మంచిది, మొదటిగా ప్రభువును ఆరాధించెదము. స్తుతులతో మీ యొక్క హస్తములను పైకి ఎత్తండి, మరియు “ప్రభువైన యేసు కృతజ్ఞతలు. ప్రభువా, కృతజ్ఞతలు,” అని చెప్పుము. దేవా, నిన్ను మేము ప్రేమించుచున్నాము. మేము నిన్ను స్తుతించుచున్నాము. ఓ, ప్రభువా, మాపై కరుణ చూపండి. ఓ, తండ్రి అయిన దేవా, మీ కరుణను మాపై దయచేయండి. పరిశుద్ధాత్మను మాకు దయచేయుము. శ్రోతలలో యున్న జనులు నీవు దేవుడవని చూచుదురు గాక, మరియు యేసు నామము ద్వారా ఈ జనులు స్వస్థపరచబడుదురు గాక. అమేన్.
సహోదరీ, రమ్ము. ప్రభువైన యేసు యొక్క నామములో, మీరు వెళ్ళి మరియు బాగుపడుము. ఆమేన్.
ఇప్పుడు, నీవు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ నా మీద ఉండి, నన్ను అభిషేకించుచున్నది. ఇప్పుడు దానిని నమ్ముము. ఇప్పుడు రమ్ము మరియు నీవు దాటి వెళ్ళుచుండగా, నేను ప్రార్ధించెదను. ఈ జనుల కొరకు, ఇప్పుడు మీరందరూ కూడా ప్రార్ధించుచున్నారు.
ప్రభువా, నా సహోదరుని మీద నేను నా హస్తములు పెట్టుచున్నాను. యేసుక్రీస్తు యొక్క నామములో, అతను స్వస్థపరచబడును గాక. ఆమేన్. వెళ్ళి, ఇప్పుడు నమ్ముము. అది సరియే.
సహోదరి, రమ్ము. యేసుక్రీస్తు యొక్క నామములో, ఆమె స్వస్థత కొరకు ఆమె మీద నా హస్తములను నేను పెట్టెదను. ఆమేన్. సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక.
ప్రియమైన సహోదరీ, ఇప్పుడు, రమ్ము. ప్రభువైన దేవా, యేసుక్రీస్తు యొక్క నామములో, ఆమె మీద పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, మన యొక్క సహోదరి స్వస్థపరచబడును గాక. ఆమేన్. సహోదరీ, దేవుడు నిన్ను దీవించును గాక. ఇప్పుడు రమ్ము.
88
ప్రభువా, యేసుక్రీస్తు యొక్క నామములో, అతనిని బాగుచేయుము మరియు నా సహోదరుడిని స్వస్థపరచుము. ఆమేన్, దేవుడు నిన్ను దీవించును గాక, చాలా ఎక్కువ శోదనలు ఉండుట నేను చూచితిని. అది వెళ్ళుచూ ఉండగా చూడండి. [సహోదరుడు బ్రెన్హాం, వేరొకరితో మాట్లాడుచున్నారు.]
అంతా సరియే, రండి. మీరు భయపడుతున్నారా? నీలో ఏ తప్పిదము ఉన్నదో దేవుడు నాకు తెలుపును అని నీవు నమ్ముచున్నావా? అయితే, వెళ్ళుము, మరియు ఆ ఉబ్బస రోగ స్థితి నిన్ను విడుచును గాక. ఆనందముతో వెళ్ళుము.
వచ్చి, నమ్ముము. ప్రభువైన యేసు, నీవు ఆమెను స్వస్థపరచి మరియు ఆమెను బాగుచేయుదువు, అని మేము ప్రార్ధించుచున్నాము. ఆమేన్.
89
పరలోక దేవా, కరుణించుము మరియు మా సహోదరుడిని స్వస్థపరచుము మరియు అతడిని బాగుచేయుము. ఆమేన్,
వచ్చి, మీలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఇప్పుడు సమ్మండి. ఓ, తండ్రి అయిన దేవా, యేసు యొక్క నామములో, అతనిని బాగుచేయుము. అమేన్.
ఇప్పుడు, పరిశుద్ధాత్మ నా మీద ఉన్నది. నేను కేవలము హస్తములు పెట్టుచున్నాను. బైబిల్, “నమ్మువారిని ఆ సూచనలు వెంబడించును; వారు రోగుల మీద చేతులుంచినప్పుడు, వారు బాగుచేయబడుదురు,” అని చెప్పెను.
యేసుక్రీస్తు యొక్క నామములో, నా సహోదరి మీద నా హస్తములు పెట్టుచున్నాను. ఆమె స్వస్థపరచబడును గాక. ఆమేన్. వెళ్ళి, నమ్మిక యుంచుము.
చిన్న బాలుడా, రమ్ము. నీ స్థితిని నేను చూడగలుగుచున్నాను, వారి కొరకు నేను ప్రార్ధించిన తరువాత వారి పాదములన్నియూ సరిచేయబడును అని నీవు నమ్ముము. ప్రియమైన అబ్బాయి, దానిని నీవు నమ్ముదువా? ప్రభువా, యేసుక్రీస్తు యొక్క నామములో, యేసు నామములో దేవుడు ఏమి చేయగలదో చూపించుటకు, ఈ కూటమునకు తిరిగి తీసుకొని వచ్చేంత వరకు, తరువాత కొన్ని గంటలలో ఈ బిడ్డలో ఒక రకమైన ఎదుగుదల ఉండును గాక.
90
నా సహోదరుడా, ఇప్పుడు రమ్ము. యేసుక్రీస్తు యొక్క నామములో, నా సహోదరుడు స్వస్థపరచబడును గాక. ఆమేన్.
నా సహోదరీ, రమ్ము. ఓ, తండ్రి అయిన దేవా, యేసు యొక్క నామములో, నా సహోదరి స్వస్థపరచబడును గాక.
ఇప్పుడు, నీవు వేదికను విడిచి వెళ్ళుచుండగా, ఆనందముతో వెళ్ళుము. నీవు నమ్ముదువా? ఇప్పుడు, ఇంకా పరిశుద్ధాత్మ ఇక్కడనే ఉన్నది.
అక్కడ నీవు కలిగియున్న ఆ గుండె సమస్యను ఆయన స్వస్థపరచును అని నీవు నమ్ముదునా? కేవలము వెళ్ళి, ఆనందించుము, “ప్రభువా, కృతజ్ఞతలు” అని చెప్పుము.
స్త్రీ సమస్య నుండి ఆయన నిన్ను స్వస్థపరచును అని నీవు నమ్ముదువా? అది సరియే, ఆనందించుచూ, ఈ వేదికను విడిచి వెళ్ళుము. “దేవునికి స్తోత్రము,” అని చెప్పుము.
ప్రభువా, యేసు నామములో వారిని స్వస్థపరచమని మరియు వారిని, బాగుచేయుమని నేను ప్రార్ధించుచున్నాను. ఆమేన్.
91
అయ్యా, రండి. ఇప్పుడు, సమ్ముచూ రండి. ప్రియమైన దేవా, నా సహోదరుని మీద నా చేతులు పెట్టి మరియు యేసుక్రీస్తు యొక్క నామములో నీవు అతనిని బాగుచేయుమని మరియు స్వస్థపరచమని ప్రార్ధించుచున్నాను. దయచేయండి, ఓ, ప్రభువా, దేవుని యొక్క రక్షణ మరియు నీ మహిమ కొరకు. అమేన్.
నా సహోదరుడా, రమ్ము. ఓ, మై. మంచిది, ఏలయనగా, అది ఏమిటి అని ప్రతి ఒక్కరికి తెలియక పోవచ్చును, ఆ వ్యక్తి గ్రుడ్డివాడు. అయ్యా, మీరు నమ్ముచున్నారా? ఒక క్షణము పాటు మన యొక్క శిరములను వంచుదము. ఏ తలలు, ఏ కళ్ళు పైకి ఎత్తవద్దు.
ప్రభువా, మేము అద్భుతముల కొరకు అడుగుట లేదు, మేము దాని కొరకు అడుగుట లేదు. మేము కరుణ కొరకు వేడుకొనుచున్నాము, విశ్వాసములో, దేవుని యొక్క ఆ కరుణలు మా యొక్క సహోదరునికి ఇవ్వబడును గాక. అతని మీద ఉన్న ఆ గ్రుడ్డి ఆత్మ వదిలి వెళ్ళును గాక. ఈ ఘడియలో చూపు అతని యొక్క కళ్ళలోనికి వెళ్లును గాక. అతడు సంపూర్ణముగా బాగుచేయబడును గాక. మేము దీనిని అడుగుచున్నాము, మరియు యేసుక్రీస్తు యొక్క నామములో గ్రుడ్డి ఆత్మను తీసివేయుము.
“చూడుము,” అని నా స్వరమును మీరు వినేంత వరకు, ఒక్క క్షణము పాటు ప్రతీ కన్ను మూసివేయుము, ప్రతీ శిరము వంచియుండవలెనని నేను కోరుచున్నాను, సందేహించవద్దు. నా వైపుకి పైకి చూడుము. నీవు నా వ్రేలిని చూడగలుగుచున్నావా? నీ వ్రేళ్ళను, నా ముక్కు మీద పెట్టండి. మీరు అక్కడే యున్నారు. సరియే. అక్కడ ఉన్న వెలుగును చూడగలుగుతున్నావా? వెలుగు నీ యొద్దకు వచ్చుట ఆరంభించినది. [“అవును, ఎంతో చక్కగా చూడగలుగుచున్నాను.”]
అది సరి, నీ తలను ఎత్తుము. అతడు తన చూపును కలిగియున్నాడు. అతడు లైట్లను చూడగలుగుచున్నాడు.
శ్రోతల కొరకై మరలా నీ హస్తమును, నా ముక్కు మీద పెట్టుము. ఇక్కడ ఆనందించుచూ నీ మార్గము వెంబడి వేళ్ళుము. నీవు నీ చూపును పొందుకొనెదవు.
మీ హస్తములను పైకి ఎత్తి మరియు ప్రతీ ఒక్కరూ ప్రభువునకు స్తోత్రము చెప్పుడి, కేవలము మీ హస్తములను పైకి ఎత్తి మరియు “ప్రభువా, మీకు కృతజ్ఞతలు,” అని చెప్పండి.
92
దేవా, యేసుక్రీస్తు యొక్క నామములో, ఈ బిడ్డ స్వస్థపరచబడును గాక. ఆమేన్.
సహోదరీ, రండి. దేవుడు ఆ గుండె సమస్యను స్వస్థపరచును అని నీవు నమ్ముచున్నావా? నీ మార్గములో ఆనంది౦చుచూ వెళ్ళుము, “నన్ను స్వస్థపరచినందులకు, ప్రభువా నీకు కృతజ్ఞతలు” అని చెప్పుము,
అయ్యా రండి. ప్రభువా, యేసు నామములో నీవు అతనిని బాగుచేయుమని మరియు అతనిని స్వస్థపరచమని నా సహోదరుని కొరకు నేను ప్రార్ధించుచున్నాను. ఆమేన్.
ప్రియమైన సహోదరీ, రమ్ము. వచ్చి, ఉత్సహించుము. తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు యొక్క నామములో, స్వస్థపరచి మరియు బాగుచేయుము. ఆమేన్. అది సరియే.
సహోదరీ, రమ్ము. యేసుక్రీస్తు యొక్క నామములో, మా యొక్క సహోదరిని బాగుచేసి మరియు స్వస్థపరచుము. ఆమేన్.
ప్రియమైన నా సహోదరీ, రమ్ము. తండ్రి అయిన దేవా, యేసు, నీ కుమారుని యొక్క నామములో, మా సహోదరినీని బాగుచేసి మరియు స్వస్థపరచుము. ఆమేన్.
రండి. యేసుక్రీస్తు యొక్క నామములో, నా సహోదరుడిని స్వస్థపరచి మరియు బాగుచేయుము. ఆమేన్.
యేసుక్రీస్తు యొక్క నామములో, స్వస్థపరచి మరియు పోగుచేయుము. ఆమేన్.
93
గ్రుడ్డి వ్యక్తి తన చూపుని పొందుకొని మరియు ఉత్సహించుచుండెను. మన పాదములపై నిలువబడి మరియు ప్రభువునందు ఉత్సహించుదము మరియు “ఆయన మంచితనము కొరకు ప్రభువునకు కృతజ్ఞతలు,” చెప్పుము. [సహోదరుడు బ్రెన్హాం ప్రార్ధన చేయుచున్నారు, మరియు జనులు కేకలు వేయుచు ఆనందించుచున్నారు.]
మేము ఎంత కృతజ్ఞులమైయున్నాము. ప్రభువునకు మీరు కృతజ్ఞులుగా లేరా? ఇంకా ఇక్కడ దేవుడు ఉన్నాడు, అని మీరు నమ్ముచున్నారా? దేవుని యొక్క వివేచనలు సరైనవని మీరు నమ్ముచున్నారా? ఆమేన్. ఓ, ఎంత అద్భుతము.
94
నీవు, నీవు రోగివా? ప్రార్ధించబడవలసినవాడవు నీవేనా? ఒక దేవుని యొక్క సేవకునిగా నీవు నన్ను నమ్ముచున్నావా? నీవు నన్ను నమ్ముచున్నావా? ఈ ఉద్దేశ్యము కొరకు దేవుడు నన్ను పంపియున్నాడని నీవు నమ్ముచున్నావా? దేవుడు దేవునిగానే యున్నాడు, అని ఇది ప్రజలకు ఒక సాక్ష్యముగా ఉండునా? నీవు దానిని నమ్ముదువా? నీవు నమ్ముదువా? నీలో ఏ తప్పిదము ఉన్నది, అని నేను నీకు చెప్పినట్లయితే, నిన్ను బలవంతునిగా చేయునా? నీ షుగర్ వ్యాధి, అది స్వస్థపరచబడును అని నీవు తలంచెదవా? అవును. నీవు ఇక్కడవాడవు కాదు, లేదు, నీవు కెంటకీ నుండి వచ్చావు. అది సరియేనా. ఇక్కడ దర్శించుటకు నీవు వచ్చావు. డైటాన్ అని పిలువబడు నగరములో, ఇక్కడ నీవు ఒక కుమార్తెను కలిగియున్నావు. అది సరియేనా, ఆమె రక్త అడ్డంకిని కలిగియున్నది. దాని కొరకు నీవు ప్రార్ధించుచున్నావు. నీ పేరు శ్రీమతీ. హుస్టన్, అది సరియేనా. తిరిగి వెళ్ళుము. యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును. ఉత్సహించుచూ, నీ దారిన వెళ్ళుము, మరియు ప్రభువు యొక్క నామమును మోసుకొని పొమ్ము.
నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా?
చక్రాల కుర్చిలలో ఉన్న నీ గురించి ఏమిటి? ఒక స్త్రీ పైన ఉన్నది. ప్రతీ ఒక్కరూ పైన ఉన్నారు, కాని ఒక్కరు, చెప్పండి, ఆమె హస్తమును పైకి ఎత్తి అక్కడ ఒక స్త్రీ పడియున్నది. చక్రాల కుర్చీలో ఇక్కడకు వెళ్ళుము... కుర్చిలో ఇక్కడకు రమ్ము. ఇక్కడ నీవు రక్తస్రావముతో ఉన్నావు. నీ నుండి ఆ రక్తస్రావము దేపుడు తీసివేయగలడని నీవు నమ్ముచున్నావా? దేవుని యందు విశ్వాసముంచుము. నీ పాదమును పైకి లేపుము. యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును. నీ స్ట్రెచర్ (రోగిని మోసుకుపోయే జిల్ల) మీద నుండి బయటకు రా. దేవుడు ఉన్నాడని నమ్ముము... అక్కడ ఆమె ఉత్సహించుచూ తన యొక్క పాదముల మీద ఉన్నది.
ఎవరైనా స్వస్థపరచబడవలెనని కోరుకొనుచున్నారా? మీలో ఉన్న ప్రతీ ఒక్కరూ, మీ పాదముల మీద నిలబడండి. యేసు క్రీస్తు యొక్క నామములో, దెయ్యము యొక్క శక్తి గద్దించబడును గాక మరియు దేవుడు [స్పష్టతలేని మాటలు].