ఒక అతీతమైన సూచన
VGR COUNT -176 [సహో. నెవిల్, బ్రెన్హాం గారితో, “...మీ సేవ ద్వారా దేవుడు మా కనుగ్రహించిన మేలులను, ఈ సమయములో ఈ చిన్న బహుమానమును మేము సమర్చించుట ద్వారా ఉన్న దానిని తెలుపుటకు ఇష్టపడుచున్నామని” చెప్పుచున్నారు.] నెవిల్ సోదరా, మీకు వందనములు. [“దేవుని ఆశీర్వాదములు మీపై ఉండును గాక, మీకు ధన్యవాదములు.”]
నెవిల్ సోదరా, మీకు నిండైన వందనములు, మరియు సంఘమునకు వందనములు. దాని లోపల ఏమున్నదో తెలియదు. మీరు నన్ను తలంచు విధమునకు, మీరు నా కొరకు చేసిన కార్యములకు నా హృదయమంతటితో అభినంధించుచున్నాను. అది మీ కొరకు కానియెడల నేను లేను. దేవుడు నాకు దయచేసిన వర్తమానమును నమ్ముటకు ఎవ్వరో కొందరు లేకున్నయెడల దానిని ప్రసగించుట వ్యర్ధము. మన ఇద్దరము కలసి పని చేయవలసి యున్నది. అందువలన నేనెంతో అభినందించుచున్నాను.
2
మన సంఘము ఎప్పుడు గాని, హెచ్చు తగ్గుగా మన మధ్య ఒక జ్ఞానయుక్త భావనను కలిగియున్నది. ఇప్పుడు కొన్ని క్షణముల క్రితము నేను ఆ వెనుక గదిలోనికి నడిచి వచ్చుచుండగా, ఒకరు చుట్టబడిన ఒక దానిని నా చేతికిచ్చుచు, వేదిక నుండి వచ్చునప్పుడు, సోదరుడు నెవిల్ కు దానిని బహుకరించవలసినదిగా కోరారు. అతని పట్ల నాకును అభిమాన భావములో మరియు ఈ సంఘ సహవాసమందు, గత సంవత్సరములలో మన కాపరిగా ఉండిన అతడు ఈ సంవత్సరము మనకు అదే విధముగా కొనసాగునని మరియు ఎన్నో సంవత్సరములు మన కాపరిగా కొనసాగునన్న మన నమ్మకములు, మరియు ప్రార్థనలకు ఇది ఒక ఆనవాలుగా సంఘము తరపునను, నా తరపునను ఇది బహుకరించబడు చున్నది.
[సోదరులు నెవిల్ ఇలా చెప్పుచున్నారు, “మీకందరికి అధిక వందనములు. దేవుడు మిమ్ము దీవించు గాక, మీవారు దయతో ఇచ్చిన వస్తువుల కొరకు నాకు చేసిన సహాయము కొరకు ఈ సమాజములో ఉన్న ప్రతి ఒక్కరికి నా నిజమైన అభినందనలు, మరియు ఈ ఉదయ కాలమందు నిజముగా నాతో కలసి మనలో ప్రతి ఒక్కరు సోదరులు బ్రెన్హాం గారు మనకేమై యున్నారో, ఆయన సేవ మనకేమై యున్నదో దాని కొరకు మన ఆత్మలలో కృతజ్ఞతను కలిగియున్నాము. దేవుడు ఆయనను దీవించి వర్ధి౦ల్లింపజేయును గాక. ఈ సంవత్సరములోను అతడు ప్రభువు కొరకై ముందుకు వెళ్లవలెననునది నా ప్రార్థనయై యున్నది. మీకందరికి అధిక వందనములు. నిశ్చయముగా నేను దానిని అభినందించుచున్నాను.”]
3
ఆ చిన్న పిల్లలు, మంచిదే, ఆ చిన్న పిల్లలు వారి గదికి వెల్లెదరని నేను తలంచుచున్నాను. ఇప్పుడు దీనిని జ్ఞాపకముంచుకొనండి, ఈ ఉదయకాలము ఆ గదిలో ఉన్న బాల బాలికలు నెమ్మదిగా ఉండవలసియున్నది, ఎందుకనగా ఈ ఆరాధన జరిగిన తరువాత మీకు బహుకరించుట కొరకు ఒకటున్నదని నేను తలంచుచున్నాను.
ఇప్పుడు, పెద్దలతో చెప్పునదేమనగా, మీరు ఈ చిన్న వారి సంఖ్య అధికమగుటకు చూచుచున్నారు. మనము క్రొత్తగా సంఘము కట్టి వారికి ప్రత్యేక గదులను ఏర్పరచవలెనని వాంఛ కలిగియున్నాము.
4
మన సోదరి అర్నాల్డ్ నిజముగా అధికమైన వాటిని కలిగియున్నది; తన చేతి నిండుగా కాదు గాని, తన చేతులకు జోడించునంతగా కలిగి యున్నది. మరియు ఆమె చెప్పిన దానిని నా చిన్న అమ్మాయి ఇలా చెప్పినది, “తండ్రి, సోదరి అర్నాల్డ్ కు చాలా కష్టముగా ఉన్నది. ఆమె మనకు తెలిసిన భాషలోనే మాట్లాడుచున్నది, కాని విన్నవారు వ్యత్యాసముగా మాట్లాడినప్పుడు ఆమె వారిని సరి చేయుచున్నది.” అందు వలన ఆ ఒక్క స్త్రీ పిల్లల తరగతులనన్నింటిని చూచుట చాలా కష్టము, అందువలన మనమా స్త్రీని ఎంతగానో అభినందించుచున్నాము. ఈ అవసర సమయమందు ఆమె యొక్క మంచి సహాయము ఎంతగానో కోరదగినది. దేవుడామెను దీవించు గాక.
5
ఇప్పుడు మనము ఎదురు చూచునది ఏమనగా, ప్రభువు చిత్తమైతే త్వరలో ఒక దినమందు, చక్కని ఒక గొప్ప మందిరమును (గుడారమును) మనము కలిగి యుండెదము. అక్కడ అన్ని రకముల ఆదివారపు పాఠశాల గదులు మనము కలిగియుండవచ్చును. చిన్న బిడ్డలకు బైబిల్ కధలు బొమ్మలతో నేర్పించుటకు, అద్దములు బిగించిన గదులు అక్కడ కలిగి యుండవచ్చును. అక్కడ తర్ఫీదైన బిడ్డలను పరామర్శించు స్త్రీని కలిగి యుండవచ్చును. ఆమె ఈ చిన్న పిల్లలను గురించి శ్రద్ధ తీసికొనును. అందువలన ఆరాధనలో ఎటువంటి ఆటంకము గాని, అటు ఇటు తిరుగుట గాని ఉండదు. ఈ చిన్న పిల్లలు విశ్రాంతి లేక యుందురు; మరియు వారు దేనిని గ్రహించలేరు. మనము వారిని గ్రహించవలసియున్నది; వారు మనలను గ్రహించలేరు. అందువలన దానికొరకు ఒక స్థలమును దేవుడు కోరువిధముగా మనకనుగ్రహించునని నేను నమ్ముచున్నాను. అది ఆకర్షనీయమైననది కాదు గాని, మంచి సంఘముగా ఉండును. మనము దాని కొరకు ఎదురు చూచుచున్నాము.
6
ఇప్పుడు సోదరులు నెవిల్ కొరకును, నా కొరకును ఈ దుస్తులు (సూట్స్) ఇవ్వబడినవని నేను తలంచుచున్నాను. అయితే నాకు తెలియదు, నెవిల్ సోదరా, నేను అలా తలంచుచున్నాను. అయితే నేను ఖచితముగా చెప్పలేను, ఎందుకనగా అది ఒక సూట్ ను పెట్టు బాక్స్ వలే నాకు కనబడుచున్నది. [“ఆమేన్” అని సోదరులు నెవిల్ చెప్పుచున్నారు.] మీరు కూడ ఆ విధముగానే తలంచుట లేదా? [“అవును”] అవి సూట్స్ గానో లేక దానిపై ధరించుకొను కోటుగానో ఉండవలసియున్నది. అవి రెండును ఒక విధముగా కనబడును, అందువలన మనుష్యులను మెప్పించు స్థితి అక్కడ కనబడదు, అందువలన అది ఒక సూట్ అయి ఉండవలెను. మనము దానినెంతో అభినందించవలసియున్నది!
7
కాపరులుగా, సంఘ సేవకులుగా, మేమూ నిశ్చయతను కలిగియున్నాము... “పాస్టరు” అను పదమునకు అర్ధము “ఒక కాపరి - గొర్రెలను కాపాడు ఒకడు.” అందువలన నేను మీకు (నెవిల్ సోదరునికి)ఎంతో విశ్వాస పాత్రునిగా ఉన్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరు అలాగే ఉన్నారు. ఎందుకన గా - అది మీ దయగాను మరియు మీ తలంపులు గాను మరియు మీ ధనముగాను ఉండి ఈ ఉదయ కాలము వీటిని బహుకరించుటకు వీలైనది. దేవుని కృప వలన మేము మీ కాపరులుగా ఉండుటకు సమర్పించుకొన్నాము. మిమ్ములను సరియైన మార్గములో నడిపించుటకు మేము చేయవలసినదంతయు చేయవలసియున్నది. కొన్ని సమయములలో, కొన్ని కార్యములను మాట్లాడు విధము గ్రహించుటకు కఠినముగా ఉన్నను, మార్గ దర్శకులుగా మేము దానిని చేయుచున్నాము. ఆ స్థలమునకు మిమ్మును నడిపించుటకు ప్రయత్నించుచున్నాము. పునరుద్ధానములో మీరు మమ్మును ఎంతగానో మెచ్చుకొనెదరు. ఎందుకనగా మేము మమ్ములను చూచుట లేదు గాని, మేము మాట్లాడు నప్పుడు మా తలంపులను సమాకూరుకొనుట లేదు గాని, పరిశుద్ధాత్మ మమ్ములను ఏ విధముగా నడిపించుచున్నదో ఆ విధముగా మేము మిమ్మును నడిపించుచున్నాము. అది మేము చేయు ప్రయత్నముగా ఉన్నది మరియు మేము ఇంకనూ ఆ కార్యమునే చేయుటకు ప్రయత్నించుచున్నాము. అది వాస్తవము. మన కాపరితో కలసి నేను ఆ విధముగానే చేయుచున్నాము.
8
సూర్యుడు ప్రకాశించుటను చూచుటకు మనమెంతో కృతజ్ఞతగా ఉన్నాము. సోదరులు, డాక్, ఆయన నా సోదరుడు. నాతో మాట్లాడుచు, ఫ్లోరిడాలో ఉన్న సోదరులు ప్రాంకీ వెబెర్ కు ఈ మాట పంపినట్లు చెప్పాడు. “క్రిస్మస్ కు వెలుపలికి వచ్చుటయే కాదు, వేడి వస్త్రములు ధరించక ఒట్టి చొక్కాతో కారు అద్దములను కూడా తుడుచునంత వేడి (ఎండ) ఇక్కడ యున్నది. ఫ్లోరిడాలో ఎప్పుడు సూర్యరశ్మి ఉండుట వలన నీరసించి పోయినది. ఇప్పుడు ఆ సూర్యరశ్మి ఇండియానాకు వచ్చినది. ఏ విధముగా సమస్తమును సమకూడుచున్నదో చూడండి. క్రియా విధముగా తలంచుట లేదా? కావున ఈ ఉదయము కొంచెము క్షణము ఆ సూర్యరశ్మి మనలను (ఇండియానాను) దర్శించినందులకు చాలా సంతోషపడుచున్నాము.
అయితే ఈ కార్యములన్నింటి పైన నుండు దేవుని సూర్యుకాంతి కొరకు మనము వందనస్తులమైయున్నాము. అది నిత్యత్వపు ఆశీర్వాదపు ప్రకాశమును మనకిచ్చుచున్నది.
9
ఇప్పుడు లోపలకు వచ్చిన ఆ చిన్నవాడు తన తల్లిదండ్రులతో కూర్చునుటకు ఇష్టపడుచున్నాడు. లేక అక్కడ వెనుక ఆదివారపు బడి తరగతి జరుగుచున్నది, ఆ చిన్నవాడు, అక్కడకు వెళ్లదలచిన వెళ్లవచ్చును. సోదరులు టైలర్ మీరా చిన్న వానిని అక్కడకు నడిపించగలరా, అది మంచిది. కొన్ని సమయములలో వారు వారి స్వంత వారి యొద్ద ఉండుటకు ఇష్టపడెదరని మీకు తెలియును. వారు కార్యములను అనగా, వారు మాట్లాడుటకు ఇష్టపడిన దానిని సహజముగా తీసికొ౦దురు. అది అంతే అయి యున్నది.
10
ఆ పండ్రెండు సంవత్సరముల బాలిక నేను సాధారణముగా చెప్పుచుండునట్లు, ఎనిమిది, తొమ్మిది, పది సంవత్సరముల పిల్లలు ఎప్పుడును వారి నానమ్మల దగ్గరే లేక అమ్మమ్మల దగ్గర ఉండుటకు ఇష్టపడెదరు. అక్కడ ఏదో పొరపాటున్నది. చూశారా, అక్కడేదో పొరపాటున్నది, ఎందుకనగా వారిరువురి మధ్య ఎంతో వయస్సు భేదమున్నది. ఆ చిన్నవారి కొరకు ఆ నానమ్మ ఎక్కడో ఒక తిను బండారమును (ఆ బిడ్డ కొరకు దాచి పెట్టి) ఆ బిడ్డ తన యొద్దకు వచ్చినప్పుడు తన చేతిని ఆ బిడ్డపై వేసి మెల్లగా దరిచేరుకొనును. ఆ చిన్నది దానిని చూచినపుడు ఆ కండ్లు పెద్దవై ప్రకాశించును. ఎందుకనగా సాధారణముగా మాట్లాడుకొనుటకు వారి మధ్య ఏదియు లేదు. ఆ చిన్న బిడ్డను బుజ్జగించగలదు, అంత మాత్రమే జరుగును. అది ఆ విధముగానే ఉండును, అది అలా ఉన్నందుకు మనమెంతో సంతోషించుచున్నాము.
11
అప్పుడు నేనీ విధముగా చెప్పాను. గొర్రెపిల్ల మరియు పావురముపై ప్రసంగించుచు ఒకప్పుడు నేనూ అలాగే చేశాను. మీరు చూచారా, వారు కొన్ని కార్యములను సహజముగా కలిగి యుండెదరు. వారు కార్యములను గురించి మాట్లాడుచుందురు.
ఆ మెస్సోనిక్ విడిదిలో వారా కార్యములను గురించి మాట్లాడెదరు. “మేసన్స్” విడిది వారును “ఆడ్-ఫెలోస్ విడిది వారును కలిసి మాట్లాడెదరు. జర్మనులు కూడ కొన్ని కార్యములను గురించి మాట్లాడెదరు. జర్మనులు వారి మాతృ భూమి గురించి మాట్లాడెదరు. ఇక్కడ జర్మనులు ఒకరినొకరు కలిసికొన్నప్పుడు, అనగా, తమ మాతృ భూమి నుండి వచ్చిన ఎవ్వరినైనను కలసినప్పుడు వారి కార్యములను గూర్చి మాట్లాడెదరు. ఇటలీ దేశస్థులు కూడ వారి కార్యములను గూర్చి మాట్లాడెదరు.
12
ఆ విధముగానే క్రైస్తవులు ఒకరినొకరు కలసినప్పుడు వారి కార్యములను గూర్చి మాట్లాడెదరు. అందువలననే మనమిలాంటి స్థలముల యందు కలసికొనుచున్నాము. మనము క్రీస్తు యేసు నందు పరలోక స్థలముల యందున్నాము, ఎందుకనగా మనమా దేశపు పౌరులమైయున్నాము. ఈ ప్రపంచమునకు దూరస్తులముగాను, యాత్రికులముగాను నున్నాము, అందువలననే ఈ సబ్బాతు ఉదయ కాలముల యందు మనమీలాగు కూడుటను ప్రేమించుచున్నాము. ప్రార్ధనా కూడికల సమయమందు మనము ఏకముగా కూడుకొనుచున్నాము, ఎందుకనగా మనము కొన్ని కార్యములను సమానముగా కలిగియున్నాము. మనము అందరితో సహజముగా మాట్లాడుటకు ఇష్టపడెదము. అందరితో కార్యములను సమానముగా కలిగి యుండుటను ప్రేమించుచున్నాము. ప్రభువును గురించియు మరియు ఆయన కార్యములను గురించియు మాట్లాడుకొనుచుందుము. కొందరేమో వారి హృదయముల యందు వేదనను కలిగియుండినప్పుడు, ప్రభువు వారిని స్వస్థపరచును. వారక్కడ ఉండవలసినదిగా ఆయన కోరుచున్నాడు. “ప్రభువు ఏమి చేయుచున్నాడో చూడుము!” ఒకరేమో ఒక గొప్ప ఆశీర్వాదమును పొందుచున్నారు. ఆ ఆశీర్వాదమును ఇతరులతో పంచుకొనుట కొరకు సంఘమునకు వెళ్లెదరు. చూశారా, అందువలననే మనము ఆ కార్యములను అందరితో సమానముగా కలిగియున్నాము.
13
సంఘములో ఈ ఉదయకాలము శబ్ద పరికరములు (మైక్ సిస్టము) బాగుగా ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అలా నాకు కనబడుచున్నది. అయితే నేను ఖచ్చితముగా చెప్పలేదు. అటువంటి ప్రతి ధ్వని ఇక్కడున్నది.
గత వారపు ఉజ్జీవ ప్రతిఫలముల నిమిత్తము నేనెంతో సంతోషించుచున్నాను. అది ఈ ప్రాంతపు కదిలికను మాత్రమే చేయలేదు గాని, ప్రపంచమంతటను కదిలించి వేసినది. ప్రభువు మంచివాడని వారు చెప్పిన దానిని ఆ దేశముల యందు మనము విన్నాము. ఇప్పుడు ఆ పాత వంతెనలను కాల్చివేయడము జరుగుచున్నది. ప్రభువులోనికి ప్రవేశించి ఆశీర్వాదములను పొందుటకు సిద్ధపడు కార్యములు త్వరితమగుచున్నవి. ఆ కొద్ది సమయములో అంత గొప్ప కార్యము జరిగినయెడల, ఆ విధముగా కొనసాగినప్పుడు ఎలాగుండును? అందువలన దానిని ఆర్పి వేయకుందుము, కాలమంతటను అధికముగా కావలసిన దానినంతటిని దానిపై క్రుమ్మరించుదుము. ఆ విధముగా ఆ పొగ యొక్క సూచనలు ప్రపంచమంతటను యేసుక్రీస్తు జీవించియున్నాడనియు, మన హృదయముల యందు అగ్ని మండుచున్నదని కనబడునంత వరకు కొనసాగించడము.
14
నేను, నా భార్య కలసి మేము నూతనముగా (దేవునికి) సమర్పించుకొనినప్పుడు, మా గృహము చుట్టూ కార్యములు వ్యత్యాసముగా కనబడుటను మేము గమనించాము. ఏదో ఆవేశముతో ఎగురుటయు, దుముకుటయు, “దీనిని మేము పొందలేదు, దానిని మేము పొందలేదని” చెప్పుట కాదు. మేము ప్రశాంతముగా దాని దగ్గరకు వెళ్ళి, అధిక క్రియలను పొందితిమి.
ఇప్పుడు, ఒక నూతన సంవత్సరము వచ్చుచున్నది. పేజీలను త్రిప్పుట మనము విశ్వసించము గాని, పాతదైన దానిని కాల్చివేయుట యందు విశ్వాసమును కలిగియున్నాము. అందువలన రానున్న సంవత్సరము నందు మిమ్మును పూర్తిగా దేవునికి సమర్పించుకొనుడి, మన కొరకు ప్రభువు దేనిని చేయనై యున్నాడో మనమెరుగము.
15
మీలో ప్రతి ఒక్కరి కొరకు మేము కృతజ్ఞత కలిగియున్నాము. ప్రతి స్థలమునందున్న, ప్రభువు శరీరమందున్న ప్రతి వ్యక్తి కొరకు నేను దేవునికి ఎంతో వందనస్తుడనైయున్నాను. వ్యత్యాసమైన విశ్వాస కోణములలో ఉన్నను, వారెంతగా నన్ను వ్యతిరేకించినను అప్పటికిని నేను వందనస్తుడనైయున్నాను. లేఖనములలో వారు కొంత పొరబడి యున్నారని నేను తలంచినను, వారు విశ్వసించిన దాని కొరకు నమ్మకముగా వారు నిలిచియున్నారు. నేను నిశ్చయముగా ఆ సహోదరులను సహించెదను. వారు కూడ నా పొరపాట్లయందు నన్ను సహించవలసియున్నది, ఎందుకనగా మనలో ఎవ్వరు కూడ పరిపూర్ణులము కాము.
16
అయితే గత సాయంకాలపు వర్తమానమ౦దు, దేవుడు పెంతెకోస్తు నందు తనను వేరుపరచుకొనుచున్నాడని నేను మాట్లాడినప్పుడు, అది ఆ కాలపు సంగమముగా (కలియకగా) ఉండినది, లేక “ఈ నూతన క్రైస్తవ సంఘము ఎలాంటి సంఘముగా ఉండ వలెనని?” తీర్మానించుటకు వారు సమకూడిన సమావేశముగా ఉండినది. అందునిమిత్తమే ఆ సమావేశము జరిగినది. అపొ. కార్యములు 2వ అధ్యాయమందు మనము దానిని కనుగొనగలము; ఎటువంటిదిగా ఆ సంఘముండవలెను, సంఘమేమై యుండవలెను, క్రీస్తును అంగీకరించినప్పుడు ఆ సంఘము యొక్క ప్రతి ఫలములు ఎలాగుండవలెనని నిర్ణయించబడినది. నేను దానిని ప్రేమించుచున్నాను. నేను నమ్మకముగా దాని నొక్కి చెప్పగలను. ఆ సంఘము ఒకప్పుడు స్థాపించబడినది. అది పెంతెకోస్తు దినమున ఏర్పడినది. అప్పుడది వింతగా ఉండినది. ఇప్పుడు కూడ వింతగానే ఉన్నది. భూమి యందు పాపమున్నంత వరకు అది ఆ విధముగానే యుండును, మరియు ఒక యుద్దము జరుగవలసియున్నది. మన విరోధులకు ఆది వింతగానే ఉండును. అయినను, ఆ అమూల్యమైన కార్యములను దేవుడు మనకొరకు చేయునని మనము తీవ్రముగా పోరాడవలసియున్నది.
17
ఇప్పుడు, ప్రకటనలను సోదరులు నెవిల్ ముందుగానే ప్రకటించారని నేను తలంచుచున్నాను.
ఈ మార్గములో దేవునికి ప్రార్ధి౦చుటకును ప్రభువు ముఖ దర్శనమును చేసికొనుటకును ఇంటి దగ్గర ఉండవలసియున్నది. దేవుని సహాయముతో ఆయన నాకు సహాయము చేసినయెడల, రానున్న ఈ సంవత్సరములో, గత కాలమందు నా జీవితములో పోరాడిన దానికన్నను ఇంకనూ కఠినముగా పోరాడవలెనని ఆశపడుచున్నాను. బహూశా, ఈ సంవత్సరములో అధిక భాగము విదేశముల యందును, అక్కడి ద్వీపముల యందును, దక్షిణ అమెరికా యందును, ఆఫ్రికా, ఆసియా, ఇండియా యందును, స్కాండినేవియా దేశమందును గడుపవలసియున్నది. ప్రభువు అనుమతించినయెడల, వాటన్నింటిని ఈ వారమందు తీర్మానించవలసియున్నది. ఆ విధముగా చేయుటకు ప్రభువు నన్ను పంపిన ప్రకారము ఎక్కడికైనను, దేనినైనను నేను చేయవలెనని తలంచుచున్నాను.
నేను విమానము నుండి నేలపై కాలుంచినప్పుడు ఇక్కడకు ఒకరు వచ్చినట్లు కనబడినది. వారిలా చెప్పారు, “ఓ, ఫలాని సంస్థ పడిపోయినది. ఇది దానిని చేసినది, లేక అది పొరపాటుగా వెళ్ళినది, లేక మేము దీనిని చేయలేము, లేక మేము ఈ కూడికలను ఏర్పాటు చేయలేమని అధికారము గలవారు చెప్పుచున్నారని” చెప్పిరి.
అప్పుడు నేను దాని కొరకు నిలచుటకు ఇష్టపడితిని, “అయితే నేను ప్రభువు నామమున వచ్చాను!” అందువలన అది సాతానేయని ఎరిగి యున్నాను. చూశారా, అది నేను పొరపాటు చేశానని కాదు; నేను ఆ విధముగా నడిపించబడితిని. అప్పుడు మీ భుజములను ఆ చక్రమునకు ఆనించి, నిలచి పోరాడవచ్చును.
18
ఇప్పుడు మనము ఈ గ్రంధమును తెరచుటకు ముందు... లేక మనము చదువుచుండగా దానిని విపులపరచుమని దేవుని అడుగక ముందు ఈ ఉదయ కాలము సంఘమునకు ఈ వర్తమానమును తెచ్చిన కారణమును తెలుపగోరుచున్నాను. ఇది సంఘమునకు నా క్రిస్మసు వర్తమానము. నేను దానిని గురించి (క్రిస్మసును గురించి)ఏమని నమ్ముచున్నానో దానిని తెలియపరచుటకు పరిశుద్దాత్మ సహాయము చేయును గాక. ఇప్పుడు అది ఎంత చక్కగా లేఖనముల యందు వ్రాయబడి యున్నను మరియు దానిని ఒక వ్యక్తి ఎంతగా గ్రహించియున్నను, ప్రజలకు దానిని అందించుటకు వారు పరిశుద్ధాత్మపై ఆధారపడి యుండవలసియున్నది. నిజ క్రిస్మను తరువాతనే అన్ని రకముల క్రిస్మసు కథలను మీరు విన్నారు. మరియు రేడియో ప్రసారములను క్రిస్మసు వర్తమానములుగా విన్నారు. క్రిస్మసు కథకు ఇది కొంచెము ప్రత్యేకమైనదిగా ఉండును, అయినను దేవుడు దీనిని హృదయమందుంచాడు.
ఇప్పుడు మనము ఒక్క క్షణము మన శిరస్సులను వంచి ఆయన సన్నిధిలో, ఆయన తీర్పు నీడలలో కృప కొరకు అడిగెదము.
19
ఓ దేవా, మా స్తుతికి పాత్రుడవైన రక్షకా, తండ్రీ, మేము నీ కృపాసనమును దరి చేరుచున్నాము. నీ కుమారుడైన ప్రభువైన యేసు నామములో ఈ ఉదయకాలము వినయముతో మమ్ములను మేము సమర్పించుకొనుచున్నాము. మా ప్రార్థనలను మా విన్నపములను, మా కొరకు నీవు చేసిన సమస్తము కొరకు వందనస్తులముగా ఉన్నాము. ముఖ్యముగా ఈ చివరి వారమందు, ఏ విధముగా ఆ హృదయములు ఆకలిగొని యుండినవో, ప్రజలు ఉపవాసములుండిరే, దాని నిమిత్తము పరిశుద్ధాత్మ వారిని ఆశీర్వదించి మా మధ్య గొప్ప కార్యములను చేసెను! రోగులు స్వస్థత నొందిరి. ఆయన జీవించుచున్నాడని దేవుడు వారికి తెలియపరచబడెను. ఆయన ఆ విధముగా తన ప్రజలను ప్రేమించెను.
మరియు ఆ మాటలు ఇంకను సత్యముగా ఉన్నాయి, అవి ప్రవక్త మాట్లాడిన మాటలు, ఆతడు ప్రభువైన దేవుని మాటలను పలికినప్పుడు “ప్రజలు నా నామమందు సమకూడి ప్రార్ధించినప్పుడు, పరలోకము నుండి నేను వారిని విందునని,” ఆయన చెప్పినప్పుడు, వారు మొదట మాట్లాడినప్పటి నుండి అవి సత్యముగానే ఉన్నాయి. ప్రభువా, మేమూ ఆ విధముగా వాటిని కనుగొన్నాము. మా పాపములన్నిటి నుండి మమ్ములను క్షమించుమని మేము ప్రార్థించుచున్నాము, పాపమైన మా అవిశ్వాసమును క్షమించుము.
20
ప్రభువా, ఆ మొదటి సంఘమును కదిలించిన విశ్వాసమును మాకు మరలా దయచేయుమని మేము ప్రార్థించుచున్నాము. సుఖమైన పుష్ప పాన్పుల కొరకు అడుగుట లేదు గాని, దేవుని కృపను మాత్రము కోరుచున్నాము. ఆయన సన్నిధి కొరకును, మాతో వచ్చునట్లు ఆయన ఆశీర్వాదముల కొరకు ప్రార్ధించుచున్నాము. అది ఒక స్థలముగా ఉండవచ్చు. అది సుఖములను కలిగినదై యుండవచ్చు, అది సుళువైనదై యుండవచ్చు, లేక అది ఒక యుద్ధ రంగముగా కూడ ఉండవచ్చు. ప్రభువా, అది ఏమైనను సరే, నీ చిత్తమునే మా గొప్ప కోర్కెగా నీకు సేవ చేయుదుము. మా మార్గములో మేము తొలగిపోకుండునట్లు, ఓ ప్రభువా, మాకు దానిని విశదపరుచుము. ఎందుకనగా మేము చీకటి యందును, గ్రుడ్డిదైన ప్రపంచములో, పాపభరితులైన గ్రుడ్డి ప్రజల మధ్య నడిచి ముందుకు వెళ్ళుచున్నాము. అందువలన తండ్రి మా మార్గములను సరాళము చేయుము. నీ పచ్చిక బయళ్ళలోని గొర్రెలవలె మమ్ము నడిపించుము.
ఈ ఉదయకాల వర్తమానము కొరకు మేము నీ తట్టు చూచి వేచియుండగా, ఆ కాపరి తన మందను సున్నితముగా, మృదువుగా ఆయన ప్రజలను నడిపించనియ్యుము. మా ప్రతి హృదయముతో, “ఆ పరిశుద్ధాత్మ వరముగా, సరాళముగా మాట్లాడును గాక, మరియు ప్రవక్త దేనిని గురించి మాట్లాడెనని తెలియపరచు క్షణకాల దర్శనమును మేము చేపట్టుదుము గాక, అప్పుడు ప్రతి వాక్యమును నిర్ణయించుటకు దేవుని సన్నిధి యొక్క మహిమకరమైన ఆశీర్వాదములను మేము పొందగలము. నీ కుమారుడును, మా రక్షకుడునైన యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.
21
ఈ ఉదయకాలము నేను ఇక్కడున్న ప్రేక్షకులను అడుగుట ఏమనగా, పరిశుద్ధ గ్రంధమును కలిగియున్నవారు, నాతో చదువుటకు ఇష్టపడిన యెడల లేక లేఖనములను నేను చదువుచుండగా మీరు అనుసరించగోరినయెడల, మీరు యెషయా గ్రంధమును త్రిప్పి, ప్రవక్తయైన యెషయా వ్రాసినది, 7వ అధ్యాయమందు ఒక లేఖనభాగమును నేను చదువుటకు ఇష్టపడుచున్నాను. మనము 10వ వచనమందు దేవుడు ఆహాజుతో మాట్లాడు సంభాషణతో ప్రారంభించెదము.
యెహోవా ఇంకను ఆహాజనకు ఈలాగు సెలవిచ్చెను -
నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే ఊర్ధ్వలోకమంత ఎత్తయినను సరే.
ఆహాజు - నేను అడుగను యెహోవాను శోధింపనని చెప్పగా!
అతడు - ఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా, వినుడి; మనుష్యులను విసిగించుట చాలదనుకని నా దేవుని కూడా విసిగింతురా?
కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు, తేనెను తినును.
కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ యిద్దరు రాజుల దేశము పాడు చేయబడును.
22
దీని నుండి నేనొక అంశమును మాట్లాడవలెనన్న, ఒక సారాంశమును తీసుకు రావలెనన్న, నేను ఈ పదమును వాడుటకు ఇష్టపడుచున్నాను: “ఒక అతీతమైన సూచన.”
కారు చీకటియైన రాత్రిని మనము కలిగి యుండినప్పుడు కొన్ని సమయములలో మన చేతులను చూడలేనంత కారు చీకట్లు కమ్మును, అటువంటి సమయములలో చిన్న వెలుగు కిరణము ప్రకాశవంతముగా వెలుగును. చీకటిలోను ఇలాగుండగలదని చూపుట కొరకు అది మనకు పంపబడినది.
23
ఇది ఆహాజు రాజ పరిపాలించుచుండిన కాలము. అతడు బుద్ధిహీనుడైన ఒక రాజు, మీరు గమనించినట్లయిన - ప్రభువు ఆహాజుతో ఈ వర్తమానమును మాట్లాడుట లేదు గాని, దావీదు వంశముతో మాట్లాడుచున్నాడు. “ఓ దావీదు వంశస్తులారా! వినుడి, ఇది మీకు సూచనగా ఉండును.” ఎందుకనగా, వారు యుద్దమందున్నారు. సోదరులకు వ్యతిరేకముగా సహోదరులు పోరాడుకొనుచున్నారు. అది ఇశ్రాయేలు యాత్ర యందును, బస చేయు స్థలముల యందును చీకటి సమయముగా కనబడుచున్నది. అయితే దేవుడే తన ప్రవక్త ద్వారా, ముందుకు వచ్చెను. అది ఒక నిత్యత్వపు సూచనగా ఉన్నది. ఇప్పుడు అనేక సమయములలో సూచనలు.....
ఈనాడు ప్రజలు సూచనలను కలిగియున్నారు. సూచనలతో నిండిన ఈ ప్రపంచమందు మనము జీవించుచున్నాము. కొన్ని సూచనలను సాధించుటకు మానవుడు ప్రయత్నించుచున్నాడు. మానవుడు తన శాస్త్రీయ పరిశోధనల ద్వారా, తన స్వంత ప్రయత్నముల ద్వారా ఒక ఉన్నతమైన సూచనను చేయుటకు ప్రయత్నించుచున్నాడు, తన బుద్ధి కుశలతను బట్టి తాను ఎంత గొప్పవాడై యున్నాడని తెలుపుకొనుటకు ఒక స్మారక చిహ్నమును ఏర్పరచుటకు ప్రయత్నించుచున్నాడు. అతడెంత గొప్ప తెలివిని లేక జ్ఞానమును కలిగియున్నాడని చూపుటకు ప్రయత్నించుచున్నాడు. గడిచిన సంవత్సరములలో అతడలా చేశాడు.
24
ఉదాహరణకు, ఆ నౌకాదళపు జ్ఞానులు ఈ ప్రపంచపు జ్ఞానులై యుండి, వంద సంవత్సరముల క్రితము ఒక గొప్ప పనితనమును వారీ చాతుర్యమునకు సూచనగా ఈ ప్రపంచమునకు సూచన ఇచ్చుటకు ఇష్టపడిరి. ఎటువంటి అలలకైనను, తుఫానుకైనను జడియని, నీట మునుగని ఒక నౌకను వారు తయారు చేసారు. వారా నౌకను “టైటానిక్” అను పేరుతో పిలిచారు. ఈ ప్రపంచమునకు అదొక తరిగిపోని చిహ్నముగా ఉండి, వారి నౌకా కళా శాస్త్రమునకు ఒక పరిపూర్ణత ఏర్పడినది. ఈ నౌక ఎటువంటి స్థితిలోను మునిగిపోదని వారు ప్రపంచమునకు చూపారు.
అందువలన ఆ నిర్మాణికుల జ్ఞానమునందు ఏర్పడిన భద్రతపై వారు మాట్లాడిన మాటలపై, విజ్ఞాన నిరూపణలపై, ఈ నౌక మునిగిపోదని తెలియబడినది. ఆ విధముగా ప్రజలకు కార్యములను ఎత్తి చూపినప్పుడు, సమస్తము చక్కగా ఉన్నదని వారు నమ్మి, విజ్ఞాన పరిశోధనలు చెప్పినంత వరకు సమస్తము బాగుగా ఉన్నదని నమ్మారు.
25
అందువలన వారందరు ఆ నౌకలో ఆ మహా సముద్రమును దాటుటకు ప్రయాణించుచున్నారు. వారిని ఏదియు హాని చేయదను భద్రతను కలిగి యున్నామని తలంచుకొనుచు ముందుకు కొనసాగుచున్నారు. అప్పుడు వారొక పెద్ద త్రాగుడు సమావేశమును ఏర్పాటు చేశారు. ఆ నౌక యందున్న స్త్రీ, పురుషులు అనేకులు మత్తులైపోయారు. చెప్పాలంటే ఆ నౌకను నడిపించు కెప్టెన్ కూడ మత్తుడై పోయాడు. సంగీత ధ్వనులు అధికమైపోయినవి. “జాజ్” సంగీతము ఆ నాటి గొప్ప భ్రమగా ఉండినది. ఈ నాడు “రాక్-అండ్-రోల్” ను మనము కలిగి యుండినట్లే, అది ఉండినది. ఎందుకనగా వారు భద్రముగా ఉన్నారనియు, మానవుడు తన తెలివితో ప్రపంచమునకు అందించిన సూచనగా, “ఈ నౌక ఎటువంటి అలను గాని, సముద్రమును గాని దాటి వెళ్ళును” అను నమ్మకముపై వారున్నారు.
వారలా మత్తులై ప్రయాణించుచుండగా, ఆ నౌక పొగ మంచు ప్రక్కగా వెళ్ళినది. ఆ నౌకను నడిపించు కెప్టెన్లలో ఒకడు మనము యంత్రములను పరీక్షించవలసియున్నదని చెప్పుచుండెను. అయితే ఆ ముఖ్యమైన సిబ్బంది చెప్పినదేమనగా, “దానిని సూటిగా ముందుకు వెళ్లనిమ్ము! మనమా నౌకాశ్రయమునకు ఒక నిర్నీతమైన ఉద్దేశముతో వెళ్లవలసియున్నదని,” చెప్పారు. ఆ విధముగా ఆ నౌక ఆ మంచు ద్వారా వెళ్ళుచుండగా, ఆ స్థితిని బట్టి అది ఒక నాయకునిగా వెళ్ళుచున్నప్పుడు అనుకోకుండనే ఒక మంచు కొండకు గ్రుద్దుకొన్నది. వెంటనే నీటి అడుగునకు క్రిందికి దిగి పోయినది.
ఈ పాటను వ్రాసిన కవి మనకు చెప్పినదేమనగా, “దేవుడు తన బలమైన హస్తముతో అది నిలువదని ఈ ప్రపంచమునకు చూపించెను.”
వారి ఈ గొప్ప సాధన సముద్రపు అడుగునకు దిగిపోయినది, ఆ ఓడ నిండుగా వందలాది ప్రజలు త్రాగుడు మత్తుతో నిండియుండిరి. అది పని చేయలేదు.
26
ఇది కీర్తి శేషుడైన అడాల్ఫ్ హిట్లరు, జర్మను ప్రజలకు తానొక మేధావియని అతడు ఒక సూచనను వారికిచ్చాడు, అతడు సైన్యములో తనకు కలిగిన అనుభవమంతయు ఎరిగి యుండెను. అతనికి దానిని గురించి అధికముగా తెలియును. అతడు “మాగినాట్ లైన్ లేక సీజ్ ఫ్రియర్డ్ లైన్” అను గోడను కట్టుట ద్వారా ఆ జర్మను ప్రజలను నమ్మించాడు. వేల టన్నుల సిమెంటును, ఇనుమును దాని కొరకు అతడు వ్యయపరిచాడు. దాని యందు తన నమ్మకమును తెలియజేశాడు. తన ప్రధాన కార్యాలయమును ముందు భాగమునకు తీసుకొనిపోయాడు. అక్కడ భూమి క్రింది భాగములయందు, భోజన గృహములును, వ్యాపార స్థలములును జరుగుచుండినవి. అక్కడ అనేక వేల టన్నుల సిమెంటును, ఇనుమును క్రుమ్మరించబడినవి. అది ఎటు వెళ్ళినను జర్మను దేశము బహు ధైర్యముగా ఉండినది. అది హిట్లరుతో చేరి నిత్యత్వమునకు వెళ్ళినట్లుండినది.
27
అది నిమ్రోదు, ఒక దినమందు, అతడొక పెద్ద గోపురమును కట్టి తన ప్రజలనందరిని దానిలోనికి రప్పించి అతడు ఎటువంటి సాధనను వేశాడో చూపించ తలంచాడు. మేఘములను దాటి వెళ్ళు గోపురమును అతడు కట్టుటకు మొదలు పెట్టి, దేవుని జయించ తలంచాడు. తన శాస్త్రీయ పరిశోధనల ద్వారా ఆ రాళ్లను బండలను నిలిపి తన ప్రజలకు భద్రతను కలుగజేయ తలంచాడు. అయితే భాషలు తారు మారు కావడముతో అది జరుగక పోయినది, వారా గోపురమును ముగించలేక పోయారు.
28
బబులోను గోడలను నిర్మించినది (రాజైన) నెబుకద్నెజరు వాటి గురించి గొప్పగా చెప్పుకొనెను. అవి ఎంతో గొప్పవి, ఆరు గుర్రముల రథములు ఆ గోడలపై పందెమునకు పరుగిడ గలవు. దాని ద్వారములు ఎంతో పెద్దవి. వాటిని నిలబెట్టుట కొరకు మనుష్యులు తమ జీవములను పోగొట్టుకున్నారు. ఆ ద్వారపు తలుపులు అనేక వేల టన్నుల బరువు కలిగి ఇత్తడితో చేయబడినవి. ఆ గొప్ప పట్టణపు వాకిళ్లను తెరచుటకు వందలాది ప్రజలు కావలసి వచ్చెను. ఏ ఒక్కరు నెబుకద్నెజరును తాకలేరు. అయితే ఒక రాత్రి, త్రాగుబోతు సమూహముతో వారి దినపు ఆయుధాలతో ఆ శాస్త్రీయ గోడల వెనుక క్రమముగా ఉన్నామని తలంచుచుండగా, అక్కడ ఒక చేతి వ్రాత ఆ గోడపై వ్రాసినది. అంతటితో అది ముగించిపోయినది.
ఓ, మానవుడు ఏ విధముగా మరొక మానవుని భద్రతను కొనిపోవుచున్నాడు. తన స్వంత సాధనలతో తనను తానే భద్రపరచుకొనుటకు ప్రయత్నించుచున్నాడు. అది ఆ విధముగా కనబడుచున్నది, ఎందుకనగా మనిషి ఒక సూచనను కోరుచున్నాడు. దానికొక కారణముండవలసియున్నది; మనిషిలో ఉన్న ఏదేదో ఒక తలంపును లేక ఒక సూచనను కోరుచున్నది. ఎక్కడి నుండియో, దాని ద్వారా అతడు సురక్షితముగా ఉండగలడని తలంచుచున్నాడు.
29
అప్పుడు దేవుడు ఇలా మాట్లాడుచున్నాడు, “నేను మీకొక నిత్యమైన సూచనను ఇచ్చెదను. నేను సంఘమునకు ఒక నిత్యమైన సూచనను ఇచ్చెదను. అది ఒక పెద్ద గోడయో, లేక గోపురమో కాదు గాని, ఆయన సెలవిచ్చిన దేమనగా - ”కన్యక గర్భవతియై కుమారుని కనును. ఆయనను 'ఇమ్మానుయేలని' పిలచెదరు. అదే దేవుని నిత్యమైన సూచనగా ఉన్నది.“ ఎంత సామాన్యముగా ఉన్నది! ఎంత స్వల్పముగా ఉన్నది!
మీరు గ్రహించారా? మీరు దాటి వెళ్ళు మరియు విడచి వెళ్ళు చిన్న కార్యములు - అవి దేవునికి ఎంతో గొప్ప భావననిచ్చునవిగా ఉన్నవి. దానిని సంఘము ఉదయ కాలమందు కలిగియుండగలదా? సంస్థలను ఏర్పరచుటలో మన సాధనలను మరియు గొప్ప కట్టడములను నిర్మించుటయందును, కళా కాండములను సాధించుటయందు మనము చిన్న వాటిని విడిచిపెట్టుచున్నాము. అయితే అవి దేవునికి ఎంతో విలువైనవిగా, అర్ధమున్నవిగా ఉన్నాయి. మరియు మన నిత్యత్వపు దూరమునకు అవి ఎంతగానో ముఖ్యమైనవిగా ఉన్నాయి. అయితే మనము వాటిని త్రోసివేయుచున్నాము.
30
దేవుడలా సెలవిచ్చుచున్నాడు, “నేనొక నిత్యత్వపు సూచనను మీకు ఇచ్చెదను. ఒక కన్యక గర్భవతియై కుమారుని కనును.”
ఎందుకు, ఒక బిడ్డ ఎందుకొరకు? ఒక బిడ్డగా ఎందు నిమిత్తము ఉండ వలెను? ఆ సృష్టికర్త తానే దిగి వచ్చి, తన సృష్టిలో జీవించవలసియున్నది. అది మానవునికి ఒక సూచనగా ఉన్నదా? ఒక బిడ్డగా ఎందుకుండవలెను? యాకోబు కలలో వచ్చినట్లు, “నేనొక పెద్ద నిచ్చెనను నిర్మించెదనని ఎందుకు సెలవియ్యలేదు? లేక నేను పరలోకము నుండి, పరలోక వాకిళ్ల నుండి ఒక దారమును దించెదను, మీకు బలము వచ్చినప్పుడు మీరు ఆ దారమును పట్టుకొన్నప్పుడు, నేను నిన్ను పైకి లేపుకొందునని ఆయన చెప్పెనా?”
31
అయితే ఆయన ఎంతో సాధారణముగా వచ్చెను. “ఒక కుమారుని కనును. అది ఒక సూచనగా ఉండును.” అది ఒక సూచనగా మాత్రమే కాదు గాని, అది ఒక అతీతమైన సూచనగా ఉన్నది.“ ఒక కుమారుడు! ఎందుకు, అటువంటి తలంపునకు లోకపు జ్ఞానము పరిహాసము చేయును. అయితే దేవునికి అది ఒక అతీతమైన సూచనగా ఉన్నది. ”కన్యక గర్భవతియై కుమారుని కనును, మరియు ఈ కుమారుడు 'ఇమ్మానుయేలని' పిలువబడును. ఆ మాటకు అర్ధము 'దేవుడు మనకు తోడుగా ఉన్నాడు.“' అదే ఆ అతీతమైన సూచన.
పరలోకపు దేవుడు తన ప్రజలతో జీవించుచున్నాడనుటయే ఆ అతీతమైన సూచనగా ఉన్నది. అది ఆ దినమునకు మాత్రము సూచనగా ఉన్నది. ఈ దినమునకు కూడ సూచనగా ఉన్నది. అన్ని దినములకు అది సూచనగా ఉన్నది. దేవుడు తన ప్రజలతో జీవించుచున్నాడు. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు: ఇదియే ఆ అతీతమైన సూచన, దేవుడిచ్చిన నిత్యమైన సూచన.
32
ఆయన తన స్వంత సృష్టియైన ఈ ధూళిగా ఎందుకు వచ్చాడు? సృష్టికర్తయైన దేవుడు తన స్వంత సృష్టిలోని ధూళిగా వచ్చాడు.
మానవుడు గొప్ప కార్యములను చేయుటకు ప్రయత్నించుచున్నాడు; అయితే దేవుడు ఒక సూచనను ఇచ్చునప్పుడు, అది చాలా స్వల్పముగా ఉన్నది. మనిషి గొప్ప కార్యములను చేయుటకు ప్రయత్నించుచున్నాడు; దేవుడు చిన్న కార్యములను చేయుచున్నాడు. మానవుడు ఇలా చెప్పుటకు ప్రయత్నించుచున్నాడు, “ప్రతి ఒక్కరు ఈ మార్గమున వెళ్ళుచున్నారు. కావున వారు హాలీవుడ్ నందు చేయునట్లే మనము చేయుదము.” అయితే దేవుడు కొద్దిమందిని మాత్రమే కోరుచున్నాడు. ఆయన సమస్త గొప్ప కార్యములను త్రోసివేయుచు, ఆ చిన్న వారిని అంగీకరించుచున్నాడు.
ఒక కుమారుని కనును, చిన్నవాడైన, ఇమ్మానుయేలు జన్మించును, సృష్టికర్తయైన దేవుడు తన సృష్టిలోని భాగమాయెను. భూమ్యాకాశములను సృష్టించిన దేవుడు, మట్టిని, వృక్షములను సృష్టించిన దేవుడు, వాటిలోని భాగమాయెను. అది ఒక సూచనగా ఉన్నది: మానవ జీవము ద్వారా ఆయన రావలసియున్నది.
33
ఇప్పుడు, ఆయన మరొక విధముగా రావచ్చును. ఆయన వచ్చుటకు అనేక మార్గములున్నవి. ఆయన వాటి ద్వారా రావచ్చును.
అయితే ఆయన ఈ మార్గమున వచ్చి మనకొక సూచన నిచ్చెను. అది ఒక అతీతమైన సూచనగా ఉన్నది. “ఒక కన్యక గర్భవతియై కుమారుని కనును. ఆయనను వారు ఇమ్మానుయేలని పిలచెదరు.” ఇప్పుడు అది ఎందు నిమిత్తముగా ఉన్నది? కారణమేమిటి?
ఆయన ఎందు నిమిత్తము ఒక దేవదూతగా వచ్చుటను ఎన్నుకొనలేదు? ఆయన అలా చేసి యుండవచ్చును. ఆయన ఎదిగిన ఒక మనిషిగా వచ్చియుండవచ్చును. ఆయన సమస్త బలముతో పరలోకము నుండి దిగి సమస్త దేవదూతలతోను, పరలోక జీవులతో దిగి వచ్చియుండవచ్చు. పరలోకపు వాకిళ్ల నుండి బంగారపు నిచ్చెనపై దిగి యుండవచ్చును, దూతల సమూహముతో దిగి రావచ్చును. ఆయన అలా చేసియుండవచ్చు.
34
అయితే ఆయన ఇలా సెలవిచ్చెను, “నేను మీకొక సూచన నిచ్చెదను, అది ఒక అతీతమైన సూచన, ఒక నిత్యమైన సూచన. కన్యక గర్భము ధరించి, ఒక కుమారుని కనును.”
ఈ కుమారుడు జన్మించుట కొరకు ఆయన ఒక స్థలమును ఏర్పరచుకొని తన పరలోకపు పరివారముతో ఆ నిచ్చెనపై దిగి వచ్చియుండును. ఆయన ఒక దేవదూతగా పరలోకము నుండి దిగి రాగలడు, లేక ఒక ఎదిగిన మనిషిగా దిగి వచ్చియుండవచ్చును. ఆయన ఒక రాజు యొక్క అంతఃపురమునకు వచ్చి యుండవచ్చు.
అయితే ఆయన ఇలా సెలవిచ్చెను, “నేను మీ కొక సూచన నిచ్చెదను.” ఆ సూచన గొర్రెల కాపరుల కివ్వబడినది. “మీరాయనను పొత్తి గుడ్డలతో చుట్టబడినవాడై, పశుల పాక యందు కనుగొనెదరు.” అదే ఆ అతీతమైన సూచన. పశువుల ఎరువులున్న స్థలమందు జన్మించెను. చెడ్డ వాసనతో కూడిన పాకయందు జన్మించెను. ఆయనపై వేయుటకు ఎటువంటి బట్టలు కూడ లేవు — ఇమ్మానుయేలు! సాతాను తన కార్యములను గొప్పగాను, ప్రకాశము గాను చేయుటకు ప్రయత్నించును. అయితే దేవుడు తన కార్యములను సాత్వీకము నందుంచును. ఒక అతీతమైన సూచన, “ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశుల పాకలో పరుండి యుండటను మీరు కనుగొందురు. అదే ఒక సూచనయైయున్నది, ఒక అతీతమైన సూచన.” ఆయన భూమిపై యున్నప్పుడు, ఆయన ఎంతో పేదవాడు! కఠినమైన కాలములను గురించి మనమేవిధముగా మాట్లాడుచుండెదము? ఎవరీ చిన్నవాడు? ఆయన యెహోవా!
35
యెహోవా దేవుడు ఒక మనిషిగా వచ్చెను, మన భారములను తీసుకొనెను, దేవుని నుండి తానే దిగి వచ్చి, మన స్వరూపమును దాల్చి - ఒక మనిషి ఆయెను. అక్కడే ఆ సూచన ఉన్నది. ఆయన దేవుడై యుండి, మనిషి ఆయెను; గొప్ప ధనికుడు కాదు గాని, ఒక పేదవాడాయెను. ఇదియే ఆ అతీతమైన సూచన. “మీరు ఒక సూచనను అడిగితిరి, నిత్యమైన సూచనను నేను మీకు ఇవ్వబోవు చున్నానని” దేవుడు సెలవిచ్చెను.
నేను చెప్పినట్లు అయన వేరే విధముగా వచ్చి యుండవచ్చును; అయితే ఒక శిశువుగా, “ఆయనెందుకొరకు ఒక శిశువుగా వచ్చెను? అక్కడ ఆ పశుల పాకలో నోటిలో పండ్లు లేని ఆ శిశువు తన నోరు తెరచినప్పుడు, ఆ మొదటి క్రిస్మసు ఉదయ కాలమందు తానున్న ఆ చిన్న పాకలోని తొట్టె యందు, ఆయన స్వరముగా వెలువడిన ఆ మొదటి చిన్న కేక, దేవుడే ఆ విధముగా కేక వేయుచున్నాడు. యెహోవా, తానే చిన్న శిశువుగా ఏడ్చుచున్నాడు; ఒక మనిషిగా, దేవుని నుండి దిగి వచ్చెను; ప్రతి విధమునందు ఆయన ఒక మనిషిగా ఉన్నాడు. ఈ లోకమునకు మరొక విధముగా రాలేదు గాని, మనిషిగా వచ్చెను. ఆయన ఏమి చేయుటకు ప్రయత్నించుచున్నాడు? ఆయన కార్యమేమైయున్నది?
36
ఆయన ఆ పశుల పాకలో ఒక శిశువుగా కేకలు వేసెను. ఆయన వీధిలో ఒక బాలునిగా ఆటలాడెను. ఆయన ఒక మనిషి వలె కష్టపడెను. అయినను ఆయన ఇమ్మానుయేలుగా ఉన్నాడు. ఇది ఆ అతీతమైన సూచనగా ఉన్నది. ఆయన సృష్టించిన తన సృష్టియందు దేవుడు నివాసము చేయుచున్నాడు. “అది మీకొక సూచనగా ఉండును,” అది అతీతమైన సూచన.
ఆయన భూమి పైకి వచ్చినప్పుడు ఎంతో పేదవానిగా వచ్చెను. అప్పుగా తీసికొనిన ఒక గర్భము ద్వారా ఆయన వచ్చెను, ఒక స్త్రీ యొక్క గర్భమును అప్పుగా తీసికొని; పాతిపెట్టుటకు ఒక సమాధిని అప్పు తీసికొనవలసి వచ్చెను. దేవుడు! “ఒక కన్యక గర్భవతి యగును, శరీర సంబంధము లేకుండనే, అది జరుగును.” యెహోవా మరియు గర్భమును అప్పు తీసికొనెను, ఆమె ఒక స్త్రీ, తన విధిని నిర్వహించుటకు ఒక అతీత సూచనను ఆయన ఇవ్వగలుగునట్లు, ఆయన ఆ విధముగా చేయవలసి వచ్చెను. భూమి పైన ఆయన ఎంతో దరిద్రుడాయెను. మూడున్నర సంవత్సరములు సేవ చేసిన తరువాత, ఆయన తనను పాతి పెట్టుట కొరకు ఒక సమాధిని అప్పు తీసికొనవలసి వచ్చినది. దానిని మీరు ఊహించగలరా? అటువంటి కళంకము లేని గర్భమును గురించి ఆ విధముగా మాట్లాడదగునా? ఏదో ఒక విధముగా అది ఎంతో నీచముగా మాట్లాడబడినది కాదా?
37
మీరా నిజ సూచనను చూడలేరా? అది యెహోవా మనలో ఒక మనిషియగుచున్నాడు. యెహోవా దేవుడు ఒక యాత్రికుడుగా, ఒక శరణాగతునిగా, తాను సృష్టించిన భూమి పైకి వచ్చి; నిరాకరించబడి, త్రోసివేయబడి, పరిహసించబడి, దూషించబడి, అవిశ్వాసికి ఒక అడ్డు బండగా, ఒక అపరాధ బండగా మత ప్రపంచమునకు ఒక దయ్యముగా సంచరించెను. అయితే విశ్వాసికి ఒక నిత్యత్వపు సూచనగా ఉన్నాడు. “దేవుడు మనకు తోడుగా ఉన్నాడు,” అనునదే ఆ అతీతమైన సూచన. మీరు దానిని చూచారా? దేవుడు రూపము దాల్చెను, దేవుడు ఈ ప్రపంచమునకు తనను బయలుపరచుకొనెను, అయితే ఒక శరణాగతునిగా; ఆయన వేరు విధముగా వచ్చి యుండవచ్చును గాని, ఆయన ఈ మార్గమును ఎన్నుకొనెను.
దీనిని వినుడి. దీనిని విడచిపెట్టకుడి!
మానవునికి సరబంధించిన దానిని దేవుడు తన తలంపునందు కలిగియుండెనని నేను తలంచుచున్నాను. అది విశ్వాసి కొరకై యున్నది. మన దేవుడు మనలో ఒకడైనప్పుడు అది మనకు సంబంధించినదగుచున్నది. అయితే దేవుడు లేనివారికి, (భక్తిహీనులకు, కఠినులకు) ఒక అడ్డు బండగా ఉన్నది. “నేను మికొక సూచన నిచ్చెదను, ఒక కన్యక గర్భవతియై కుమారుని కనును. ఇమ్మానుయేలు మీలో ఉండును.” మానవాళికి అది సంబంధించినదని ఎరిగిన మన దేవుడు మనలో ఒకడాయెను. ఆ విధముగా ఆయన తన స్థానమును విడిచి మనలాంటి ధూళి ఆయెను. ఆయన మన స్థితికి వచ్చెను. ఒక మానవ స్థితికి వచ్చెను. ఆయన సమస్థమును సృష్టించిన సృష్టికర్తగా ఉన్నాడు.
మరియు మరలా అది లేఖనమును నెరవేర్చెను. ప్రవక్తలు దానిని చూచారు.
38
మరొక కార్యమేదనగా, వాక్యము ధూళిగాను, శరీరముగాను చేయబడి, మన మధ్య నివాసము చేసెను. ఆ యెహోవా, వాక్యము, మానవుడాయెను, ధూళి ఆయెను, మరియు మనతో నివాసము చేసెను. అది నిత్యమైన సూచన, దానికంతము లేదు. ఓ, మనము దానిని తలంచినప్పుడు, అది ఒక నిత్యమైన సూచనగా ఉన్నది. సూచనలన్నింటికన్నను అతీతమైన సూచనగా ఉన్నది. దేవుడు మనలో ఒకడాయెను.
అంతట ఆయన అబ్రాహాము సంతానముగా ఉండవలసియున్నది. అబ్రాహాము, హవ్వ సంతానమై యున్నాడు. సర్పము యొక్క తలను చితుక గొట్టుటకు ఆయన స్త్రీ యొక్క సంతానమై యున్నాడు. అయితే ఆబ్రాహామును మీరు జాగ్రత్తగా గమనించినట్లయిన, అతడు దేవుడు యందు విశ్వాసము కలిగియుండెను. ఆ విశ్వాసము దేవుని ఆత్మను, మానవ శరీరమును ఏకపరచెను. అచట నుండియే విశ్వాసము వచ్చుచున్నది. అందువలననే ఆయన అబ్రాహాము సంతానమాయెను. శరీరమంతటను కాదు గాని, ఆత్మయు, శరీరమును ఏకమగుట ద్వారా జరుగుచున్నది. దేవుడు తనను ఆ విధముగా చేసికొనుచున్నాడు. సమస్త దుష్టత్వమును వేరుతో పెల్లగించుచున్నాడు. ఆ విధముగా శరీరమును సమర్పణకు తెచ్చుచున్నాడు. ఆ శరీరము ఆయన సృష్టించిన ధూళిగా ఉన్నది. మరియు దాని ద్వారా మీతో సహకారిగాను జీవించుచున్నాడు.
39
మరొక కార్యమేదనగా, ఆయన తన న్యాయవిధులకు ఎంత మాత్రము వ్యతిరేకముగా గాని, తప్పిపోవుట గాని చేయలేదు. ఆయన దానిని చేయలేడు. అందువలన ఒక కన్యక! “నేను మీకోక సూచన నిచ్చెదను, [ఒక టైటానిక్ (ఓడను) కాదు, లేక ఐక్యరాజ్యసమితిని కాదు, అయితే], రక్షణ యొక్క సూచనను నేను మీకిచ్చెదను. ఒక కన్య గర్భవతియై, ఒక కుమారుని కనును, మరియు ఆయనను ఇమ్మనుయేలని పిలచెదరు.” అదియే ఆ సూచన. అవును.
మీరు చూచినట్లయిన, దేవుని యొక్క విమోచన ప్రమాణములందు, అనగా బోయజు, నయోమికి సంబంధించిన భాగములో, అతడు దగ్గరి బంధువైయుండవలెను. ఆ విధముగానే మానవుడు విమోచించబడు ఒకే ఒక మార్గము, ఆ దగ్గరి బంధువుగా - దేవుడే రావలసియున్నది. మీరు దానిని గమనించి చూడవలెనని కోరుచున్నాను. ఆయన ధనికులకు గాని, బలముగల వారికి గాని, సహకారిగా రాలేదు. అయితే ఆయన పశుల పాకలో జన్మించి, పొత్తి గుడ్డలతో చుట్టబడి, పరుండియుండెను. పెద్ద వాడుగా కాదు గాని, ఒక చిన్న బిడ్డగా పరుండియుండెను. ఆయన ఈ సృష్టి యంతటిపైన దేవునిగా ఉన్నాడు. ఆయన దానిని చేయుటకు ఎన్నుకొనెను. ఎదిగిన మనిషిగా వచ్చుటను గాని, చిన్న బిడ్డల యొక్క అనుభూతులలో కలుగు బాధలను రుచి చూచుటకు, చిన్న శిశువుగా జన్మించెను. యవ్వనులకు కలుగు శోధనల గుండా వెళ్ళగలుగునట్లు ఆయన వచ్చెను. ఒక మనిషిగా శ్రమలను భరించునట్లుగా, సాతాను గాయములను అనుభవించునట్లుగా సమస్త కాలములలో, అన్ని తరగతుల, ఆ యా వయస్సు ప్రజలకు మార్గమేర్పరచుటకు ఆయన వచ్చెను. పేదవారైనను, గొప్పవారైనను, సమస్త రకముల వారి కొరకు ఆయన వచ్చెను. మనము ధనవంతులగునట్లు ఆయన రాజ్యమందు వారసులగునట్లు ఆయన మన నిమిత్తము దరిద్రుడాయెను. తనకు తానే తన స్థితిని (దైవత్వమును) దాటినవాడై, తానేమై యుండెనో - ఆ స్థితిని విడిచి, వేరు స్థితికి, ఒక అతీతమైన సూచనగా వచ్చెను. ఒక సూచన ఇవ్వబడును. ఏడ్చుచున్న శిశువుగా, ఆటలాడు బాలుడుగా, శ్రమించు ఒక మనిషిగా, ఒక అతీతమైన సూచనగా ఆయన వచ్చెను. దేవుడు మనవలె పలు దశలలో జీవించెను.
40
దేవుడు తాను దేవుడై యున్నాడని అనేక సూచనలనిచ్చెనని మీకు తెలియును. నోవహు కాలమునకు ముందు ప్రపంచమునకు ఆయనే దేవుడని, తీర్పు తీర్చు దేవుడని ఆయన ఒక సూచన నిచ్చెను. నోవహు దినములలో ఆయన ప్రజలను నీట ముంచి వేసి, నీతిమంతులను ఒక ఓడ ద్వారా నీటిపై తేలిపోజేసెను. ఆయన నీతిమంతుడని, తీర్పు నిశ్చయమని ఒక సూచన ఇవ్వబడినది. మారు మనస్సు లేని ప్రతి పాపి తీర్పులో నశించిపోవునట్లు ఒక సూచన ఇవ్వబడినది. నీతిమంతులు దేవుని కృప ద్వారా రక్షించబడునట్లు అదే సూచన ఇవ్వబడినది.
ఆయన మరియొక సూచనను, ఆ మండుచున్న పొదయొద్ద ఇచ్చినాడు. అది ఏమిటి? పరుగెత్తు ఆ ప్రవక్తను పట్టుకొన్నాడు. “నేను, నా ప్రజల యొక్క మొర్రలను విన్నాను, మరియు నా యొక్క నిబంధనను జ్ఞాపకము చేసికొన్నాను.” ఆయన నిబంధనను కాచుకొను దేవుడని, ఆయన చేసిన వాగ్దానములను జ్ఞాపకము చేసికొను దేవుడని ఆయన మరియొక్క సూచనను అక్కడ ఇచ్చెను. “నేను వారిని విడిపించుటకు దిగి వచ్చితిని,” అను సూచనను ఆ మండుచున్న పొద యొద్ద ఆయన ఇచ్చెను.
41
ఆయన క్రియల మార్గములలో దేవుని గమనించుడి. ఆయన భూమ్యాకాశములను సృష్టించినప్పుడు, ఆయన దేవదూతలను ఏకముగా పిలచి, ఆయన ఇలా సెలవిచ్చెను, “మనము చేయుదుము” [“Let Us”] వాక్యము నందు ఆయన చేసిన అనేక కార్యములయందు: “నేను కాదు, మరి నా తండ్రి” అనుటను చూడవచ్చును.
అయితే విమోచన కార్యక్రమమునకు అది వచ్చినప్పుడు, ఆయన ఒంటరివాడై వచ్చెను; ఆయనతో ఎవ్వరూ లేరు. ఆయన రాగలిగిన ఒక్కడుగా ఉండెను. ఒక దేవదూత దానిని చేయలేడు. తన కుమారుడుగా పిలువబడిన ఆ మరొక మానవుడు దానిని చేయలేడు. పరిశుద్ధ కన్య, లేక పరిశుద్ధ తల్లి, లేక ఒక పరిశుద్ధుడు, అని పిలువబడిన వారు దానిని చేయలేరు. దేవుడే దానిని చేయుటకు దిగి రావలసియున్నది! “నేను మీకొక సూచన నిచ్చెదను. ఒక కన్యక గర్భవతియై కుమారుని కనును, ఆయన ఇమ్మానుయేలుగా ఉండును, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు,” ఒక అతీతమైన సూచన. దేవుడు తన ప్రజలలో ఉన్నాడు. దేవుడు తన ప్రజలతో ఉన్నాడు. దేవుడే ఆయన ప్రజలాయెను. దేవుడు మనిషి ఒకటాయెను. ఒక సూచన! ఈ ప్రపంచమునకు అది ఒక అడ్డు బండ, అయితే విశ్వాసికి ఆశీర్వదించబడిన ఒక నిరీక్షణ. దూషణగా మాట్లాడబడిన ఒక సూచన.
42
ఆయన నిరూపించుటకు మరొక కాలమును కలిగియుండెను. ఆ వరదలో ఆయన తీర్పు యొక్క దేవుడని నిరూపించెను. మరియు తన ఆజ్ఞలను గైకొనువారికి ఆయన కృప యొక్క దేవుడుగా ఉండెను.
ఆ మండుచున్న పొదలో ఆయన చేసిన ప్రతి వాగ్దానమును ఆయన నిలుపుకొనగలడని చూపించెను.
ఎర్ర సముద్రము దగ్గర ఖచితమైన దానిని చేసి, ఆయన ఆజ్ఞలను అనుసరించు వారికి ఆయన మార్గము ఏర్పరచగలడని నిరూపించెను. ఎన్ని ఆటంకములు కలిగినను, దేవుడు ఎర్ర సముద్రము దగ్గర తనను నిరూపించుకొనెను. ఆయన సముద్రమును పాయలుగా చేయగలడను సూచనను ఇచ్చెను. ప్రతి శోధన యందు తప్పించుకొనుటకు ఆయన ఒక మార్గమును ఏర్పాటు చేసెను. “తల్లీ, దానిని నమ్మకము, తండ్రి దానిని నమ్మకము, సంఘమా దానిని నమ్మకుమని” చెప్పునప్పుడు. ఎవరు నమ్మకున్నను నాకక్కర లేదు. మీరు దానిని నమ్మినట్లయిన, దేవుడు మీకొక మార్గమును ఏర్పరచును! ఆయన చేయగలడని ఒక సూచన నిచ్చెను. వారు వారి మార్గములో, సూటిగా వాగ్దాన భూమి వైపునకున్నప్పుడు, ఆయన వారికొక సూచనిచ్చెను. దేవుడు దానిని వారి కొరకు వాగ్దానము చేసెను. ఎర్ర సముద్రము మూయబడి ఉన్నప్పుడు - వారు ఇబ్బందిలో పడి, ఏమి చేయాలోనని వారికి ఏదీ తోచలేదు. అయితే ప్రతి శోధనలో వారు తప్పించుకొనుటకు దేవుడు వారికి మార్గమును ఏర్పరచెనని చూపించెను. నీవు పొగ త్రాగుటను నిలుపలేకున్నయెడల, ఒక్కసారి దేవుని అంగీకరించుమ! నీవు అబద్దమాడుటను మానలేవు! దొంగిలించుటను మానలేవు, కోపపడుటను మానలేవు; అయితే ఒక్కసారి దేవునిని అంగీకరించుము! నీకు సంఘమునకు వెళ్ళుటకు మనస్సు లేకున్నయెడల, లేక మరి ఎక్కడకు గాని పోలేకున్నయెడల; ఒక్కసారి దేవునిని అంగీకరించుము, ఆయన వాగ్దానమును గైకొనుము! తప్పించుకొనుటకు ఆయన మార్గమును ఏర్పరచగలడని ఎర్ర సముద్రము దగ్గర ఆయన దానిని నిరూపించెను. దేవుడు అనేక సూచనలను ఇచ్చియున్నాడు.
43
అయితే ఆ రాత్రి ఆయన ఆ గొర్రెల కాపరులతో ఇలా చెప్పెను, “బెత్లెహేమునకు వెళ్ళుడి, నేడు మీ కొరకు రక్షకుడైన క్రీస్తు జన్మించియున్నాడు. క్రీస్తు, అనగా, అభిషేకించబడిన దేవుడు, ఈ దినమున ఒక స్త్రీ యందు జన్మించియున్నాడు.” దేవుడు!
ఇప్పుడు ఆమెను దేవతనో లేక దేవునిగానో చేయుట కాదు. ఆయన ఒక స్త్రీ గర్భమును అప్పుగా తీసికొనెను. ఆ విధముగానే సువార్తను ప్రకటించుటకు ఆయన ఈ శరీరమును అప్పుగా తీసికొనెను. అదే విధముగా సువార్తను ప్రకటించుటకు గాను ఆయన చేయదలచిన కార్యములను చేయుటకు గాను మీ శరీరములను అప్పుగా తీసికొనెను, ఎందుకనగా ఆయన ఇంకనూ ఇమ్మానుయేలుగానే ఉన్నాడు, అది ఒక సూచనగా ఉన్నది, దేవుడు ఆయన ప్రజలతో ఉన్నాడు. దేవుడు తన ప్రజల మధ్య జీవించుచున్నాడు. ఒక అతీతమైన, నిత్యమైన సూచన. అది ఎన్నడూ తప్పిపోదు. అన్నివేళల అది ఆ సూచనగానే ఉన్నది.
44
మీరు ఈ సూచనలన్నింటిని గురించి మాట్లాడెదరు, అయితే దీనిని గురించినదేమిటి? మీరు మరొక సూచనను పొందుటకు ముందు, భాషలతో మాట్లాడు సూచన, ప్రవచించు సూచన, ఏదో ఒక అతీతమైన సూచన, మరేదైనను మీరు ఆ వెనుకకు వెళ్లవలసియున్నది. ఆ మొదటి సూచనకు వెళ్లవలసియున్నది. అది నిత్యత్వమునకు సంబంధించినదై, నిత్యమైన సూచనగా ఉన్నది. దానితో ప్రారంభించుటకు సిద్ధపడుడి, ఆ పునాదిపై ప్రారంభించుడి, అది కాలముల ద్వారా వచ్చిన “బండగా” ఉన్నది. దానిని మరేది తాకలేదు. పాతాళపు ద్వారములు దాని వ్యతిరేకముగా ఉన్నవి, అయినను దానిని జయించలేవు. ఆ సూచనను పొందుడి, “ఒక కన్యక గర్భవతియై, కుమారుని కనును.”
ఆయన ఈ గొర్రెల కాపరులతో చెప్పెను, “ఆయనను మీరేలాగు కనుగొందురో అది ఇక్కడున్నది. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి, పశుల పాకలో పరుండియుండును. ఆయనను మీరు చూచినప్పుడు, ఆయనను నమ్ముడి, ఎందుకనగా ఆయన మన మధ్య ఉండు దేవుడై యున్నాడు.”
ఆ సూచన గొర్రెల కాపరులకు మాత్రమే కాదు. అయితే అది ప్రపంచమంతయు ఆయనను చూచునట్లు, ఆయన ఎవ్వరో అని తెలిసికొనునట్లు ఇవ్వబడినది. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడనుటయే ఆ సూచన.
45
ఆయన భూమిపైనున్నప్పుడు, ఆయనే దేవుడని ఆయన నిరూపించెను. దేవుడు తనలో ఉన్నాడని నిరూపించెను, ఎందుకనగా దేవుని సూచనలు ఆయనను వెంబడించినవి. ఆయన, “నేను నా తండ్రి క్రియలను చేయకున్న యెడల నన్ను నమ్మకుడి, అయితే నేను నా తండ్రి క్రియలు చేసినయెడల, నన్ను నమ్మనియెడల - ఆ క్రియలను నమ్ముడి. అదియే సూచనగా ఉన్నదని చెప్పెను.” ఇమ్మానుయేలు! నేనును నా తండ్రియు ఒక్కటిగా ఉన్నాము. నా తండ్రి నన్ను పంపెను. ఆయన నన్ను పంపినట్లే, నేను మిమ్మును పంపుచున్నాను. నన్ను పంపిన తండ్రి నాతో ఉన్నాడు; ఆయన నాలో ఉండి తన క్రియలను చేయుచున్నాడు. శరీరములో ఉన్న దేవుడు!“
46
నాశనమునకు ముందు లోతు దానిని రుచి చూడలేదా? దేవుడు శరీరముతో బయలుపడి, ఒక చిన్న దూడ (మాంసమును) తినుచు, ఆవు పాలు త్రాగుచు, రొట్టెను తినుచు, అక్కడున్న గుడారమునకు తన వీపును త్రిప్పి నిలచియుండగా వ్యక్తిగత సర్వనామమైన “నేను..... నేను,” అను పదముతో మాట్లాడెను. “అబ్రాహాము ఈ ప్రపంచపు వారసుడని నేను చూచుచున్నాను. నేను....” మరొక విధముగా మాట్లాడవలెనన్న, “నేను అతనికి తెలియజేసెదను.”
ఆయన ఎవరు? అప్పుడాయన సెలవిచ్చినదేమనగా, “అబ్రాహామా, నీ భార్యయైన శారా ఎక్కడున్నది?” అది అతనిని స్థంభింపజేసినది. దేవుడు క్రీస్తు యొక్క ముందు రూపముగా శరీరములో వచ్చెను.
అప్పుడతడు, “ఆమె నీ వెనుక గుడారములో ఉన్నదని” చెప్పెను.
శారా నవ్వినప్పుడు, ఆయన, “శారా ఎందుకు నవ్వుచున్నదని” చెప్పెను.
47
ఇమ్మానుయేలు భూసంబంధము కాని శరీరములో కనబడుటకు బదులుగా, స్త్రీ గర్భము ద్వారా వచ్చినప్పుడు, ఆయన ఇలా సెలవిచ్చెను, “మనుష్యకుమారుడు వచ్పు దినమున లోతు దినములవలె ఉండును.”
ఆయన భూమిపై యుండినప్పుడు, ఆ అపోస్తలులు సువార్తతో ముందుకు వెళ్ళినప్పుడు, దేవదూతలు పరలోకపు అంతఃపురముల నుండి వారిని చూచారు. అది మహిమ దేశము యొక్క మార్గముల వలె ఉన్నవి. అక్కడి నుండి వారు దానిని చూచారు. మీరు లేఖనములను వ్రాసికొనుటను చూచుచున్నారు, I తిమోతి 3:16. “నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై యున్నది; ఆయన సశరీరుడగా ప్రత్యక్తుడయ్యెను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునొందెను. దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను.” దేవుని చూచుటకు దేవదూతలు లేచి నిలచారు; ఒకప్పుడు ఆయన అగ్నిస్తంబములో పరలోకపు మహిమతో ఉన్నప్పుడు వారు తమ మట్టలను ఆయన ముందు ఊపి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్దుడు అని కేకలు వేసిరి, ఆయన మానవుడైనప్పుడు; దేవ దూతలు దిగి వచ్చి ఆయనను చూచారు. ఆయనే యెహోవా, శరీరాధారి ఆయెను. నిశ్చయముగా “నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది.”
48
“నేను మీకు ఒక నిత్యమైన సూచనను ఇచ్చెదను,” ఎందుకనగా దేవుడు మనమధ్య శరీరధారి ఆయెను. ఆయన శరీరములో నివాసము చేసెను. అది ఒక నిత్యమైన సూచనగా ఉండును. చూచి విశ్వసించునట్లు గొర్రెల కాపరులకు మాత్రమే కాదు గాని, బ్రె'న్హాం గుడారములోని మీకును మరియు ఈ క్రూరమైన ప్రపంచమునకును, ఆయన దేవుడని విశ్వసించునట్లు కనబడెను. దేవుడే ఆ సూచననిచ్చెను. యేసు ఇలా సెలవిచ్చెను, “జీవించు తండ్రి నన్ను పంపినట్లు, నాతో వచ్చి నాలో నివాసము చేసినట్లు, నేను మిమ్మును పంపుచున్నాను; ఆ జీవించు తండ్రి మీతో వచ్చి, మీలో ఉండును - ఒక నిత్యమైన సూచన. నమ్మిన వారి వలన ఈ సూచనలు వెంబడించును! ఇదిగో నేను యుగ సమాప్తి వరకు, సదా కాలము మీతో కూడా ఉన్నాను, మీలో ఉందును, మీతో ఉండెదను. ఈ ప్రపంచము యొక్క అంతము వరకు నేను మీతో ఉండెదను.”
49
కొందరు నేను మీతో ముందు చెప్పినట్లు, ఆయనను ఒక చిన్న పొట్టి దేవునిగా చేయుటకు ఇష్టపడుచున్నారు. ఆయన మానవుడై యున్నాడు; దేవుడు ఒక మనిషిని వాడుకొనుచున్నాడు. దేవుడు తాను సృష్టించిన శరీరమును తన కొరకు ఉపయోగించుకొనుచున్నాడు, ఆయన ద్వారా సృష్టించుటకును, మరియు ఆయన ద్వారా అనేక కుమారులను తెచ్చుటకును, విధేయుడైన కుమారుని ద్వారా, లేఖనములు ఈ విధముగా చెప్పుచున్నవి. ఒక్క కుమారుని ద్వారా, అందరూ పడిపోయిరి; విధేయుడైన ఒక్క కుమారుని ద్వారా, విశ్వసించిన వారందరు జీవించగలరు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడనునది ఒక సూచనగా ఉన్నది. అది ఒక సూచనగా ఉండునని చెప్పబడెను. యేసు తనను “మనుష్యకుమారుడని” పిలచుకొనుటను ఎంతో ప్రేమించెను, తనకుతాను మనిషిగా, కేవలము ఒక మనిషి, “నేను ఏదియు చేయలేను; కుమారుడు తనకు తాను ఏదియు చేయలేడు.” అయితే అది ఆయనలో ఉన్న తండ్రి, ఇమ్మానుయేలు, దేవుడు.
ఆ శిశువు, దేవుడు, యెహోవా దేవుడు! కేకలు వేయుచున్న ఆ చిన్న శిశువు; యెహోవాగా ఉన్నాడు. మీరు దానిని చూడగలుగుచున్నారా? దేవుడు ఒక శిశువు నందు జీవించుచున్నాడు.
దేవుడు యవ్వనుడిగా జీవించుచున్నాడు. ఆయన ఎటువంటి యవ్వనుడిగా ఉన్నాడు? ఆయన ఒక ఉదాహరణ నుంచియున్నాడు. ఆయన తల్లి దండ్రులు ఆయనను పోగొట్టుకొన్నప్పుడు, వారాయనను వెదకి, ఆలయములో కనుగొన్నారు. ఒక యవ్వనుడుగా ఆయన వారితో చెప్పినదేమిటి? “మీకు తెలియుట లేదా? నేను నా తండ్రి పని మీద ఉన్నానని ఎరుగరా?” యవ్వనులకు అది ఒక ఉదాహరణగా ఉన్నది.
50
ఆయనకు సమర్పించబడిన లోక వైభవములో, ఒక మనిషిగా, సమస్తమును ఆయన చేతులలో ఉండగా ఆయన మనుష్యులందరిలో గొప్పవాడు గాను, ధనికుని గాను ఉండి ఉండవచ్చును; చేప తన నోట ఒక నాణెమును కలిగి యున్నదని ప్రజలతో ఎవ్వరు చెప్పగలరు? బావులలోని మంచి నీటిని ద్రాక్షారసముగా ఎవ్వరు మార్చగలరు? ఆయన ఇష్టపడిన దానినంతటిని ఆయన మార్చగలడు. ఐదు రొట్టెలను, ఐదు వేలమందికి పంచి పెట్టగలడు, గొప్పవాడగునట్లు తన చేతిలో శక్తి కలిగియున్నాడు. అయినను పేదవాడై యుండుటకే ఆయన ఇష్టపడెను. ఆయన మరణించినప్పుడు, ఆయనకొక సమాధి కూడ లేదు. ఒకదాని ఆయన అప్పుగా తీసికొనెను. “ఇమ్మానుయేలు, ఇది ఒక సూచనగా ఉన్నది.” దేవుడెలా వచ్చెను? పేద స్థితిలో వచ్చెను. దేవుడే విధముగా కార్యములను చేసెను? అది ఒక నిత్యమైన సూచనగా ఉన్నది; ఆయన పేద వారితో, చదువులేని వారి మధ్యకు వచ్చెను.
51
“ఒక సూచన” యని ఆ గొప్ప ప్రవక్తిని “అన్న” చెప్పినది. దేవాలయములో సుమియోను తన చేతులను పైకెత్తి, ఆ పొత్తి గుడ్డలతో చుట్టబడిన శిశువును పట్టుకొని, “ఇశ్రాయేలు పడిపోవునట్లు దూషించబడిన సూచన ఇదే, అయితే తిరిగి సమకూరుటకు గాను, అన్యులకు ఒక వెలుగుగా ఆయన ఉన్నాడని” చెప్పెను.
ఏమిటి? “దేవుడు మనకు తోడుగా ఉన్నాడు,” గొప్పవారి మధ్యకు, ధనికుల మధ్యను కాదు గాని, పేదవారి మధ్య ఉన్నాడు. పశువుల పాకలో పుట్టెను. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఏ విధమైన కార్యములు చేయుచున్నాడు? ఆయన కార్యములను గమనించండి. ఆయనను గమనించుడి, అని ఆయన చెప్పెను.
దేవుడే ఈలాగు సెలవిచ్చాడు, “ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన మాటలను వినుడి. నేను నివాసము చేయుటకు ఇష్టపడిన నా కుమారుడు ఇతడే. ఈయన మాటలను వినుడి.”
అతడు చెప్పెను, “నేను నీతో కూడా ఉన్నాను. యుగ సమాప్తి వరకు ఉన్నాను.”
ఆయన తన అపోస్తలులను పంపెను. వారి దినములలో వారు ఈ భూమిని కాల్చి వేశారు, ఎందుకనగా దేవుడు మనిషితో ఏకమై యున్నాడు. వారు యెహోవా నామమైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమిచ్చారు. ఆయన వారిలో ప్రత్యక్షుడగునంతగా వారు ఆయనకు అంత దగ్గరగా జీవించారు. సూచనల ద్వారాను మరియు ఆశ్చర్య క్రియల ద్వారాను, పరిశుద్ధాత్మ వరముల ద్వారాను, వారిలో ప్రత్యక్షుడయ్యాడు. “దేవుడు మనకు తోడుగా ఉన్నాడు.” జీవించుచున్న సత్య దేవుడు ఒక్కడేనని వారు బోధించారు.
మానవుడు తన గోపురములన్నింటిని ఇద్దరు, ముగ్గురు, లేక నలుగురు దేవుళ్ళపై నిర్మించుకొన్నాడు, అయితే ఒక్క దేవుడు మాత్రమే ఉన్నాడు. ఈ కడవరి దినములో ఆ వర్తమానము పునరుద్ధరించబడవలసియున్నది.
52
ఇప్పుడు నీవు దానిని చింతించుట మంచిది; మీ హృదయములను తెరచి, దీనిని మీకు బయలుపరచుమని దేవుని వేడుకొనుడి. నేను చెప్పనున్న దాని గ్రహింపును కోరండి.
ఆయన వచ్చినప్పుడు, ప్రవక్తలు చెప్పిన దానిని ఆయన నెరవేర్చును.
ఆయన చివరి దినములలో వచ్చుచుండగా, అది దేవుని కడవరి వర్షముగా ఉన్నది. అప్పుడు తొలకరి వర్షమును, కడవరి వర్షమును కుమ్మరింపబడును, ఆయనను గురించి ప్రవచించినట్లే ఆయన రాబోవుచున్నాడు. “సాయంకాల సమయములో వెలుగు కలుగును.” ఏది జరుగుటకు? ఇమ్మానుయేలు, ఆ కుమారుడే, అదే వెలుగు, పెంతెకోస్తు దినమున తన ప్రజల మధ్య శరీరములో నివాసము చేయుటకు దిగి వచ్చిన ఆ దేవుడే, ఆ విధముగానే ఈ కడవరి దినములలో వచ్చును. సాయంకాలమన వెలుగు కలుగును. అది ఏమిటి? అది నిత్యమైన ఒక సూచనగా ఉండును: దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనలో ఉన్నాడు, దేవుడు మన ద్వారా, మానవుడు మరియు దేవుడు ఒక్కటై పోయారు. యేసు మరణించి ఆ అమూల్యమైన జీవమునిచ్చాడు, అది తన స్వంత తీర్మానము మీదనే దానినిచ్చాడు, (అది గత ఆదివారపు వర్తమానము), ఎందుకనగా దాని ద్వారా అనేక కుమారులను తెచ్చునట్లు చేసిన తీర్మానము నిమిత్తము ఆయన దానినిచ్చాడు. ఇమ్మానుయేలు మనతో ఉన్నాడు! సాయంకాలపు వెలుగు ప్రజలను అది ఆకర్షించును.
53
దేవుడు ఆ సూచనను ఇచ్చినప్పుడు, “ఇది ఒక సూచనగా ఉండును. దేవుడు శరీరముతో నివాసము చేయుచున్నాడు.” అది ప్రజలను ఆకర్షించునని ఆయన తలంచాడు. ఆ విధముగానే అది జరిగినది! “ఆయనను ఎందరు అంగీకరించిరో వారు దేవుని కుమారులగునట్లు ఆయన వారికి శక్తినిచ్చాడు.”
అదే వెలుగు కనబడినప్పుడు, సాయంకాలపు వెలుగు ప్రజలను అది ఆకర్షించవలసియున్నది. దేవుడు మరియు క్రీస్తు ఒక్కరే! పేతురు ఇలా చెప్పెను, “మీరు సిలువ వేసిన యీ యేసునే, దేవుడు ప్రభువు గాను, క్రీస్తు గాను నియమించెనని మీరు తెలిసికొనవలసియున్నది.” దుష్టముగా మాట్లాడబడిన ఒక సూచన. అయితే ఆ సాయంకాలపు వెలుగులు ఇక్కడున్నవి.
54
ఆ మొదటి దినమందు పెంతెకోస్తు వర్తమానము దిగి వచ్చినప్పుడు, సువార్త సేవకుడుగా కీర్తిశేషులు “డాక్టరు హేఉడ్” ఆయన గతించుటకు ముందుగా, ఆయన పరిపూర్ణుడుగా ఉన్నప్పుడు, ఒక దినమందు ఆత్మ అతనిపై వచ్చినది - ఆయన ఒక కవిగా మరియు బోధకుడుగా అతడుండెను. ఆత్మ వచ్చినప్పుడు - ఆయన తన కలమును తీసికొని దానిని ఇలా వ్రాసెను.
“సాయంకాలమందు వెలుగు కలుగును,
మీరు నిశ్చయముగా కనుగొందురు;
మహిమ మార్గమును నీటి మార్గమందు, ఈనాడు ఆ వెలుగున్నది,
విలువైన యేసు నామమందు పాతిపెట్టబడుచున్నది.
యవ్వనులు మరియు వృద్ధులు, మీ పాపముల నిమిత్తము మారుమనస్సు పొందుడి.
పరిశుద్ధాత మీలో నిశయముగా, ప్రవేశించును;
సాయంకాలపు వెలుగులు వచ్చినవి,
దేవుడు మరియు క్రీస్తు ఒక్కరే అనునది సత్యము.
55
సాయంకాలపు వెలుగులు! మనము ఆ సాయంకాలపు వెలుగు నందు నడిచినట్లయిన, అది సాయంకాలపు సూచనగా ఉన్నట్లయిన, అప్పుడది అదే వెలుగుగాను మరియు అదే సూచనగా, ఒక నిత్యమైన సూచనగా ఉండవలెను. అప్పుడు ఆ సాయంకాలపు వెలుగును, అవే సూచనలు వెంటాడును. వ్యూ! మీరు దానిని చూచారా? మీరు దానిని గ్రహించారా? అదే ఈ క్రిస్మసు వర్తమానముగా ఉన్నది: సాయంకాలపు వెలుగులు, మెస్సీయా యొక్క సూచనలు వర్తమానముతో కలసియున్నవి. సాయంకాలపు వెలుగులు ఇక్కడున్నాయి.
అది దుష్టముగా మాట్లాడబడినది. మీ సోదరులే మిమ్మును త్రోసివేయుదురు. ఆయనను ఎవరు త్రోసివేశారు? ఆయన స్వంత సోదరులే త్రోసివేశారు. ఆయన అద్భుతములను చేయుటను చూచుటకు వారు ఇష్టపడినారు. అయితే సిలువ దగ్గరకు వచ్చినప్పుడు, వారెక్కడ నిలచారు? ముఖ్యమైన ఘడియకు వచ్చినప్పుడు, ఆయన తన సత్యమందును మరియు ఆయన పరిశుద్ధ గ్రంధము ప్రత్యక్షము కానున్నప్పుడు, అప్పుడు వారెక్కడున్నారు? వారు వెనుదిరిగిపోయారు.
56
“మీకొక సూచన ఇవ్వబడును. మిమ్మును ఈ సూచనలు వెంబడించును. నేను చేయు ఈ క్రియలు, మీరును చేయుదురు; వీటి కంటెను అధికముగా చేయగలరు, ఎందుకనగా నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను.”
“సాయంకాల సమయమందు మరలా వెలుగు కలుగును.” ఓ, మనము గడచి వచ్చిన ఈ చీకటి దినము ఎటువంటిది! అయితే నలువది సంవత్సరములుగా ఆ మేఘములు తొలగిపోవుచు దేవుడు మరియు క్రీస్తు ఒక్కటేనను వర్తమానమును, ఆ మొదటి సంస్కరణము నుండి తేబడుచున్నది. దేవుడు శరీరధారి ఆయేననుటయే ఆ మొదటి వర్తమానము. మానవ శరీరమందు నివాసము చేయుటను ఆయన ఎన్నుకొనెను. ఈనాడు వారాయనను సింహాసనముపై కూర్చొనియున్న వానిగా చేయుచున్నారు; చరిత్రపూర్వమైనవానిగా చేయుచున్నారు; వారిలో కొందరు ఆయనను తత్వ శాస్త్రమెరిగిన మేధావిగా చేయుచున్నారు; కొందరేమో ఆయనను ఒక ప్రవక్తగా చేయుచున్నారు. అయితే సోదరా, ఆయన నీలోని దేవుడైయున్నాడు. దేవుడు శరీరమందు ప్రత్యక్షుడాయెను. ఎట్లు?
57
ఆయన శరీరములో ఉన్న దేవుడని వారెట్లు ఎరుగగలరు? ఆయన ఇలా సెలవిచ్చెను, “నేను నా తండ్రి క్రియలను చేయకున్నయెడల, అప్పుడు నేను మీతో చెప్పినది పొరపాటగును. అయితే నేను నా తండ్రి క్రియలను చేసినట్లయిన, (నన్ను నమ్మకున్నను) ఆ క్రియలను నమ్ముడి.”
ఈ దినమున కూడ అదే కార్యము జరుగుచున్నది. ఆయన ఎవ్వరు అను వర్తమానము ఈ కడవరి దినములలో మరలా పునరుద్ధరించబడినది. ఆయన ఎవరైయున్నాడు? ఏమైయున్నాడు అనునదే, ఆ వర్తమానము. ఇమ్మానుయేలు నీలో జీవించుచున్నాడు, ఆనాడు ఆయన చేసిన అవే కార్యములను చేయుచున్నాడు. నీ ద్వారా ప్రత్యక్షుడగుచున్నాడు. ఆయన చేసిన అదే కార్యమును చేయుచున్నాడు. ఇది సాయంకాలపు వెలుగైయున్నది. అది దూషణగా మాట్లాడబడినది. అది కఠినమైన మార్గముగా ఉన్నది.
58
ఆ గొప్ప ధనికుడైన యవ్వనుడికి అది ఏదో అనిపించినది, అయినను అతని హృదయము ఆకలిగొన్నది, అందువలన అతడు యేసు నొద్దకు వచ్చి, “రబ్బీ, నిత్యజీవమును పొందుటకు నేనేమి చేయవలెను?” అని అడిగెను.
“ఆజ్ఞలను పాటించుమని” ఆయన చెప్పెను.
“చిన్ననాటి నుండి నేను చేయుచునేయున్నానని” అతడు చెప్పెను. “నీవు సంపూర్ణుడవు కావలెనా? - నన్ను వెంబడించుము” అని చెప్పెను.
అయితే అతడు దుఃఖముతో వెళ్ళిపోయెను. అది ఎంతో గొప్ప విలువగా ఉన్నది. ఆ యవ్వనుడు ఆయనకు కొంత ధనమునిచ్చి, గొప్ప సంఘమును కట్టించి, అందులో ఒక పెద్ద సభ్యునిగా అతనిని చేసినయెడల, అతడా కార్యమును సుళువుగా చేసియుండును. ఈనాడు ధనికుల మధ్య అది ఏ విధముగా ఉన్నదో మీరు చూడలేరా? ఇతరులు ఎందరో ఉన్నారు.
ధనికులు మాత్రమే కాదు గాని, పేదలు కూడ అలాగే ఉన్నారు. మురికి తొట్ల నుండి అనేకులు వారి పలుకుబడిని బట్టి నిరాకరించుచున్నారు, ఎందుకనగా ఆయన పలుకబడి కలిగిన వ్యక్తి కాదు. ఆయన ఇమ్మానుయేలు. “అది కించపరచునదని, అది దయ్యమని, అది మనస్సులు చదువుట అని, 'బెయల్జబూబు,' అని వారు చెప్పిరి. ఆ దినపు పండితులు, వారి యొక్క పెద్ద సంఘములు ”బుద్ధిహీనత“ అని చెప్పారు.
అయితే దేవుడిలా చెప్పుచున్నాడు, “అది పరలోక సూచనగా ఉన్నది, అది అతీతమైన సూచన, సూచనలన్నింటికి కన్నను గొప్ప సూచన, అది దేవుడు మీతో ఉండుటయై యున్నది. కడకు ఈ యుగ సమాప్తి వరకు మీలో ఉన్నాడు.” అక్కడే మీ అతీతమైన సూచన యున్నది. అది సూచనలన్నింటిని మించిపోవుచున్నది. అది మొదటి సూచనగా ఉన్నది. అపొ. కార్యములు 19, పరిశుద్ధాత్మను పొందుటకు ఆ ప్రజలు తిరిగి వచ్చి దానిని గుర్తించి వలసియున్నది. (అపొ. కార్య, 19:5). అయినను ఒక విశ్వాసి పరిశుద్ధ గ్రంధమును కలిగి యుండి, యేసు క్రీస్తుగా ఉన్నాడని నిరూపించగల చక్కని బోధకుని గలిగి యుండినను, వారు దాని లోనికి వచ్చుటకు ముందుగా... ఆ సూచనను చూచుటకు గాను, వారు వచ్చి మరలా బాప్తిస్మమును పొంది, వారిపై చేతులుంచబడినప్పుడు, వారు పరిశుద్ధాత్మను పొందిరి. అది సత్యము,
అయితే సాయంకాల సమయములో, ఆ వెలుగులు ఇక్కడున్నాయి. అది కించపరచబడినది; అది పరిహాసము చేయబడినది. అది దూషించబడినది. అది దూషించబడునని ప్రవక్త సెలవిచ్చెను, “ఒక అడ్డు బండగా ఉండును.” దూషింపబడుచు, పరిహాసము చేయబడి, కించపరచబడును; ఇమ్మానుయేలు మనలో ఉన్నాడు, ఆయన చిత్తమును మన ద్వారా నెరవేర్చుచున్నాడు.
59
ఓ, ఈ దినమున, నా యాత్రిక సోదరుడా, నా సోదరీ ఆ సూచనను నమ్ముము. నీ స్వంత హృదయ పాకయందు చూడుము, నీకై నీవు చెప్పగలవేమో చూడుము.... గొర్రెల కాపరులు చూడగలిగిన సూచనను నీవు చూడుము: దేవుడు శరీరధారియై పేదల మధ్య అవసరతలు గల వారి మధ్యను, త్రోసివేయబడిన వారి మధ్య నివాసము చేసెను. నీవు దానిని గ్రహించగలిగితివా అని చూచుకొనుము. దేవుడు నీ హృదయమందు ఉండుటయు, దేవుడు ఇక్కడుండుటయు, గమనించు మరియు ఆయన తనకుతానే ఇక్కడ సాత్వీకుడు గాను, మృదువు గాను ప్రత్యక్షుడగుటను చూడుము. ఆయన ఆ విధముగానే చేయుచున్నాడు.
60
కొన్ని సంవత్సరముల క్రితము కళాశాలకు వెళ్ళిన ఒక అమ్మాయి తన సహవాసులతో చేరి ఒక చక్కని నవనాగరిక స్త్రీగా మారినది. ఆమె పూర్వము తన గ్రామమందు చదువుకొనుచుండినప్పుడు, ఆమె తల్లి అక్కడే ఆ గ్రామములో మిగిలిపోయినది. రెండు సంవత్సరముల తరువాత ఒక దినము ఈ అమ్మాయి తల్లిని చూడవలెనని నిశ్చయించుకొన్నది. తన తల్లికి ఒక టెలిగ్రాము వ్రాయుచు ఫలాని - ఫలాని రైలునకు ఆమె వచ్చునట్లు తెలియజేసినది. ఆమెను స్టేషనులో కలిసికొనవలసినదిగా కోరినది. అయినను ఆ అమ్మాయి తన గ్రామమునకు వెళ్ళుచు తనతో మరొక సోగసరి అమ్మాయిని తీసుకొని వెళ్ళినది. ఆ అమ్మాయి నిజముగానే ఒక సొగసరిగా తయారైనది. దానితో పాటు తనతో మరొక సొగసరిని తోడు చేసికొన్నది, అది ఈనాటి నవనాగరిక విధానములతో ఉన్న యవ్వనస్తురాలు.
61
ఆ విధముగా ఆ అమ్మాయి రైలు స్టేషనుకు వచ్చి చేరినప్పుడు, ఆమె రైలు దిగుచు వెలుపలకు వచ్చినది. అక్కడ ఆమె తల్లి నిలచి యున్నది. తనలో ఉన్న సమస్త భావములతో, తన కుమార్తెను చూచుటకై నిలచి యున్నది. అప్పుడు ఈ అమ్మాయితో వచ్చిన మరొక యవ్వనురాలు ఆ తల్లిని చూచినప్పుడు, ఆమె ముఖమంతయు గాయముల మచ్చలతోను, ఆమె చేతులు కాల్పుల మచ్చలతో, భయంకరముగా, తన వృద్ధ స్థితిలో చూడ శక్యము కాని విధముగా కనబడినది. ఆ చిన్నదైన మేరీతో వచ్చిన ఆ యవ్వనురాలు, “ఆశర్యముగా ఉన్నదే చూచుటకు అసహ్యముగా కనబడు ఈ ముసలిది ఎవ్వరు?” అని అడిగినది.
అప్పుడు ఆ అమ్మాయి తన తల్లిని చూచి సిగ్గుపడి ఇలా చెప్పినది, “నాకు తెలియదు, ఆమె ఎవ్వరో నాకు తెలియదని” చెప్పివేసినది.
అయితే ఆ తల్లి తన కుమార్తెను చూచినప్పుడు పరుగెత్తుకొని వెళ్ళి తన చేతులతో ఆమెను కౌగలించుకొని, ముద్దు పెట్టుకొనుటకు ప్రారంభించినది.
అప్పుడా అమ్మాయి, ఆమెను త్రోసివేసి, “నీవెవ్వరివో నాకు తెలియదు, పొరపాటున, దగ్గరకు వచ్చావని,” చెప్పినది, ఎందుకనగా మరొకరు నవ్వుచు పరిహసించి నిరాకరించిన వారితో తాను కలసికొనుటకు నిరాకరించినది.
అక్కడ ఒక రైలు కండక్టరు నిలచి యుండుట జరిగినది. అతడు వెంటనే ఆ యవ్వనురాలి భుజమును పట్టుకొని, “నిన్ను చూచుటకు నాకెంతో సిగ్గుగా ఉన్నది. నీవొక భయంకరమైనదానవు! జరిగినదేదో నాకు బాగుగా జ్ఞాపకమున్నదని” చెప్పాడు.
62
అప్పుడు అక్కడున్న ప్రజలందరు జరిగిన దానిని వినుటకు గుమ్మిగా చేరారు. అప్పుడతడు అమ్మాయిని మధ్య నిలిపి, ఇలా చెప్పసాగెను, “ఈ యవ్వనురాలు ఆరునెలల బిడ్డగా ఉన్నప్పుడు, మేడ గదిలో తన చిన్న ఉయ్యాలలో ఉండినది. ఆమె తల్లి, నేను చూచిన వారందరిలో అధికముగా సౌందర్యము గల స్త్రీ,” అని ఆ వృద్ధుడైన కండక్టరు చెప్పసాగెను. మరియు ఆ తల్లి బట్టలను ఆరవేయుచుండగా, ఆ ఇంటికి నిప్ప౦టుకొన్నది. చుట్టు ప్రక్కల వారందరు కేకలు వేయుచు పరుగెత్తారు. వారు దీనంతటిని చూస్తూ నిలచిపోయారు. ఆ తల్లి దీనిని గమనించలేదు. ముందు వాకిలిలో ఇది జరిగినది. ఆ తల్లి పెరటిలో ఉండినది. జ్వాలలు అధికమై గాలిలోకి వెళ్ళిపోవుచున్నాయి.“
63
మరియు అతడిలా చెప్పసాగెను, “అక్కడ నిలచిన వారు భయపడిపోయిన ఆ తల్లిని పట్టుకొనలేకపోయారు. ఆమె బిడ్డ మేడ గదిలో ఉన్నది. వారందరు కేకలు వేయుచు, ”నీవా జ్వాలలను ఛేదించుకొని వెళ్లలేవు“ అని చెప్పారు. అయితే ఆమె అక్కడ వ్రేలాడుచుండిన ఒక తడి గుడ్డను లాగి తన చుట్టూర చుట్టుకొని, ఆ జ్వాలలను చేధించుకొని లోపలకు వెళ్ళిపోయినది. ఆమె తన స్వంత ఆపదను తలంచుకోకుండనే వెళ్ళిపోయినది. ఆమె అక్కడకు వెళ్ళిన తరువాత ఆ చుట్టుకున్న తడి గుడ్డతో తిరిగి వెళ్ళలేనని తలంచినది. అయితే తన కుమార్తె అందమును కాపాడుటకై ఆమె ఆ తడి గుడ్డను తీసి ఆ బిడ్డకు చుట్టినది, ఎందుకనగా ఆ బిడ్డ తన తరువాత జీవించవలసియున్నదని తలంచినది. అంతట ఆ బిడ్డను చేతులలో ముడుచుకొని, తాను వట్టి శరీరముతో ఆ జ్వాలల గుండా మరలి వచ్చినది. అప్పుడామె శరీరమును ఆ జ్వాలలు కాల్చివేసినవి. ఆమె వెంట్రుకలు కాలిపోయినవి. ఆమె చెక్కిళ్లు కాలిపోయినవి. ఎముకలు తెలియనంతగా ఆమె కాలిపోయినది.”
“అందువల్లనే ఆమె ఇంత అసహ్యముగా మారినను నీవు చక్కగా ఉండునట్లు తనను సమర్పించుకొనినది. తన అందమును సమర్పించినది. ఆమెకున్న దానంతటిని సమర్పించినది. ఆ విధముగా నిన్ను రక్షించగలిగినది. అందువలన నీవు నిలచిన దానవై ఆ అమూల్యమైన తల్లిని అవమానపరచుచున్నావా?” అని అడిగెను.
64
సోదరా, నేను దేవుని చూచినప్పుడు, ఆ పరలోక దేవుడు తన సింహాసనమును విడిచి, తన సౌందర్యమును విడిచి, తనకున్న ఉన్నత స్థితిని విడిచి, ఒక ఎరువు గుంటగా ఉన్న స్థలములో, పొత్తిగుడ్డలతో చుట్టబడి, తన సూచనలతో తన ఆశర్య క్రియలతో ప్రజలు ఆయనను అవమానపరుచునట్లు, దయ్యమని పిలువబడి, జన్మించియుండగా; నేనాయనను గూర్చి సిగ్గు చెందవచ్చునా? లేదండి, ఈ నాజూకైన ప్రపంచము తానిష్టపడిన దానిని చేయనిమ్ము, అయితే నాకు ఆయన ఆ అతీతమైన సూచనగా ఉన్నాడు. నాలోని పరిశుద్ధాత్మ ఆక్రందన చేయుచున్నది! అది నన్ను పిచ్చివాని వలె, పరిహసింపబడువాని వలె ఈ ప్రపంచము నన్ను చూచునట్లు చేయుచున్నది. నా కొరకు అంత అధికముగా చేసిన ఆయనను నేను త్రోసివేయలేను. మరణమందు ఆయన నా స్థానమును తీసికొనెను. కల్వారిలో ఆయన నా స్థానమును తీసికొనెను. ఆయన ఈ కార్యములన్నింటిని చేసెను. ఆయన పరలోకము నుండి, తెల్లటి ముత్యపు సింహాసనముల నుండి ఒక మనిషిగా వచ్చెను. నా బాధను రుచి చూచుటకును, నా శోధనల ద్వారా వెళ్ళుటకును, నాకొక మంచి మధ్యవర్తిగా ఎలా ఉండగలడని తెలిసికొనునట్లు, నన్ను నడిపించుటకును, నిత్యజీవమునకు నాకు త్రోవ చూపుటకును ఆయన తనను తగ్గించుకొని దిగి వచ్చెను, ఆయన దారిద్రము వలన నేను ధనవంతుడనైతిని. ఆయన మరణమువలన నాకు జీవమివ్వబడినది, నిత్యజీవమివ్వబడినది.
ఆయనను త్రోసివేయవద్దు. ఆయనను గూర్చి సిగ్గు పడవద్దు. ఆయనను గూర్చి సిగ్గుపడకుము. అయితే ఆయనను కౌగిలించుకొని, “నిజమే, నా ప్రియమైన దేవా, పెంతెకోస్తు దినమున వారికనుగ్రహించినట్లు నాకును దయచేయుమని అడుగుము. ప్రభువా, పరిశుద్ధాత్మను దయచేయుమని అడుగుము. దానిని నా హృదయములోనికి క్రుమ్మరించుమని అడుగుము. యవ్వనులు చెప్పునదేమో నా కక్కర లేదు. ఈ ప్రపంచము దేనిని చెప్పుచున్నదో నాకక్కర లేదు. నేను వారిని చూచుట లేదు. నేను నీ వైపు చూచుచున్నానని” చెప్పుము. అది ఏమిటి? సంఘములో చేరుటయా? కాదు. అది ఆ అతీతమైన సూచన. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు!
65
మనము ప్రార్థించుదము.
ఈ ఉదయ కాలము ప్రేక్షకులుగా ఉన్న మీలో ఎవ్వరైనను కొందరు ఈ విధముగా చెప్పుటకు ఇష్టపడినయెడల, “నాకైతే నా జీవితమును గురించి సిగ్గుపడుచున్నాను, నేను ఆయన గురించి సిగ్గుపడుటలేదు. నా జీవితమును గురించి సిగ్గుపడుచున్నానని,” చెప్పగల వారెవరైనా ఉన్నారా? ఆయన మన నిమిత్తము అసహ్యముగా చేయబడెను మరియు ఈ లోకము చేత త్రోసివేయబడెను.
“దుఖఃపూరితుడగు ఒక మనిషిగా - ఆయన తృణీకరింపబడిన వాడాయెను. మనుష్యుల వలన విసర్జింపబడినవాడాయేనని” ఆ ప్రవక్త చెప్పుచున్నాడు. “అయినను అతడు మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడినవానిగాను, దేవుని వలన బాధింపబడినవాని గాను, శ్రమ నొందినవానిగాను మనమతనిని ఎంచితిమి. అయినను మన అతిక్రమక్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్ధమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతను కలిగినది.”
66
ఆయన గురించి నీవు సిగ్గునొందెదవా? మీరు ఈ బలిపీఠము దగ్గరకు వచ్చి మీ పాపముల నిమిత్తము మారుమనస్సు పొందుడి. మీరు ఆయనను గూర్చి సిగ్గుపడక, ఆయనకు మీరు సమర్పించిన మీ జీవితమును గూర్చి సిగ్గుపడుచున్నారు. అది అటువంటి సిగ్గుకరమైన కార్యము. మీ యజమానుని ముందు మీరెన్నో మార్లు సిగ్గుపడితిరి; మీ స్నేహితుల ఎదుటను, మీ పురుష స్నేహితుల ఎదుటను, మీ స్నేహితురాలి ఎదుట లేక మీ స్నేహితుని ఎదుట ఆయనను గురించి మీరు సిగ్గుపడితిరి. ఆయన ఇమ్మానుయేలుగా మీలో నివాసము చేయుచున్నాడు. ఇప్పుడు మీ చేతులెత్తి “దేవా, నేనా విధముగా సిగ్గుపడినందుకు నన్ను మన్నించుమని” చెప్పుము.
67
మా ప్రభువా, మా దేవా, మా మనవిని క్షమించుమని మేము అధిక వినయముగా వేడుకొనుచున్నాము. ఈ ఉదయ కాలము మా లోపములన్నింటి నిమిత్తమును, మా దోషముల నిమిత్తము ప్రాధేయపడి వేడుకొనుచున్నాము. సత్యము కొరకు నిలబడలేని దోషులమైయున్నాము. మేము దోషులము. ఈ లోకస్తులు మమ్ములను దుష్ట పేర్లతో పిలచి, “పరిశుద్ధ గుండ్రాళ్ళు” అని పిలచినను, లేక మరొక దుష్ట పేరుతో పిలచినను, కొన్ని సవయములలో పేతురువలె మేము వెనుక తీసి శత్రువు యొక్క వెచ్చదనమును కాచుకొన్నప్పటికిని, ప్రభువా, మమ్ములను మన్నించుము.
క్రొత్త సంవత్సరము మమ్ములను దరిచేరుచున్నది. ఈ ఘడియ నుండి మా మధ్య ఉన్న దేవుని ఆ అతీతమైన సూచనను చూచుటకు ప్రారంభించెదుము గాక, దేవుడు మాతో జీవించుచున్నాడు, దేవుడు మనలో నివాసము చేయుచున్నాడు. ఆయన చేసినట్లే సమస్తమును చేయుచున్నాడు. మరియు ఆ సాయంకాలపు వెలుగులు ఇక్కడున్నవి.
మా లోపములను మన్నించుము. మా పాపములను మన్నించుము.
68
అత్యధికమైన మా కృపగల ప్రభువా, దేవుని కుమారుని ఈ క్రిస్మసు బహుమానముగా అంగీకరించుచున్నాము. ఆయన మా శరీరమందు, ఈ ధూళిలో మాతో జీవించునట్లు, తన స్వంత రక్తముతో ఆయన మార్గమును శుద్ధిచేసికొని నిత్యజీవపు వాగ్దానమును మనకు దయ చేయుచున్నాడు. అందు నిమిత్తము మేము నీకు వందనములు సమర్పించుచున్నాము. ఈ గొప్ప అద్భుతమైన దేవుని బహుమానము కొరకు ప్రభువా, నేను నీకు వందనములు చెల్లించుచున్నాను. అది ఒక బహుమానముగా ఉన్నది. అది పరిశుద్ధాత్మ బహుమానము. సమస్తమును ప్రభువైన యేసు నామములో అమర్చబడియున్నది. దానిని అంగీకరించుటకు మేమెంతో సంతోషించుచున్నాము. మేమందరము నీకు వందనములు చెల్లించుచున్నాము, ఎందుకనగా మా సంఘమంతయు ఆ సూచన కొరకు నిలబడుచున్నది. ఎందుకనగా, ఆ సూచన సంఘము యొక్క ఉపదేశము కొరకు నిలచుచున్నది. మేము దాని కొరకు నిలబడుచున్నాము. అది మా కొరకు నిలబడుచున్నది. ఈనాడు ప్రపంచమంతటను క్రైస్తవుల మధ్య జెఫర్సన్ విల్లోని 8వ పెన్ వీధిలో ఉన్న ఒక పేద అమాయకపు ప్రజల మధ్య తెలియబడినది. ఆ ఇమ్మానుయేలు, అరణ్యములో నుండి వచ్చిన ఆ అగ్నిస్తంబము ఆ గలిలయుడైన యేసుక్రీస్తు, పెంతెకోస్తు యొక్క ఆ పరిశుద్ధాత్మ, సాయంకాలపు వెలుగు నందు ఇమ్మానుయేలు యొక్క సమస్త సూచనలతో రూపించబడెను. ప్రభువా, అందు నిమిత్తము మేము వందనస్థులమైయున్నాము. అనేకులు దానిని చూచి అంగీకరించియున్నారు. ఆయన నిమిత్తమును, ఆయన సంఘము నిమిత్తమును యేసుక్రీస్తు నామమందు మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
69
ఒక పాట పాడు వాని స్వరము నాకు ఉండవలెనని నేను వాంఛించుచున్నాను. ఇప్పుడు ఆ పాట పాడు వాని స్వరమును నేను కలిగి యుండిన యెడల నేను అధికముగా ఇష్టపడు ఆ పాటను పాడుటకు నేను ప్రేమించుదును. అది నా ప్రియ స్నేహితుని ద్వారా వ్రాయబడినది, అతడు విలియం బూత్-క్లిబార్న్.
ఆయన మహిమ నుండి దిగిన నిత్యముగా జీవించు గాథ,
నా రక్షకుడైన దేవుడు పుట్టెను, ఆయన పేరు యేసు.
ఒక పాకలో జన్మించెను, తన వారికి ఒక అన్యుడు ఆయెను,
వ్యసనా క్రాంతుడైన దేవుడు, కన్నీటి, ఆక్రందనతో కూడిన వాడాయెను.
ఓ, ఎంతగా నేనాయనను పేమింతును!
ఏ విధముగా నేనాయనను పూజింతును!
నా జీవము, నా సూర్య ప్రకాశము, నాలోని సమస్తము!
ఆ గొప్ప సృష్టికర్త నా రక్షకుడాయెను,
దేవుని సర్వ పరిపూర్ణత ఆయనలో నివాసమాయేను.
ఎటువంటి దయనొ౦దిన స్థితి “విమోచనను” మనకు తెచ్చినది;
కాళరాత్రిలో ఒక్క నిరీక్షణయైనను కనబడనప్పుడు;
(అప్పుడు ఆ సన్నని కిరణము వచ్చినది!)
దేవుడు ప్రియుడై, సన్నిహితుడై, తన గొప్పతనమును ప్రక్క నుంచి
(పశుల పాక, ఎరువు దిబ్బకు, అందులో జన్మించుటకు వచ్చెను)
ప్రేమించి నా ఆత్మను రక్షించి జయించుటకు దిగి వచ్చెను,
ఓ, ఎంతగా నేనాయనను ప్రేమింతును,
ఏ విధముగా నేనాయనను పూజింతును!
నా జీవము, నా సూర్య ప్రకాశము, నాలోని సమస్తమును!
ఆ గొప్ప సృష్టికర్త నా రక్షకుడాయెను.
దేవుని సర్వ పరిపూర్ణత ఆయనలో నివాసమాయెను.
70
ఆయన నాలో ఉన్నాడు, మరియు నేను ఆయనలో ఉన్నాను, “ఆ దినమందు తండ్రి యందు నేను, నా యందు తండ్రియు, మీ యందు నేను, నా యందు మీరును ఉందురని ఎరుగుదురని” చెప్పెను. దేవుడు ఇమ్మానుయేలు మనతో ఉన్నాడు.
ఇప్పుడు అక్కడ కూర్చునియున్న జార్జి రైటును చూచినది ఆ ఇమ్మానుయేలుగా ఉన్నాడు. అతనిని నలుగురు డాక్టర్లు పరీక్షించి విడిచిపెట్టినప్పుడు అతడు మరణ పడకలో ఉండెను. ఒక గర్భమును, అప్పుగా తీసికొన్నది ఆ ఇమ్మానుయేలు, ఒక సమాధిని అప్పుగా తీసికొన్నది ఆ ఇమ్మానుయేలు; ఆయన ఇప్పుడు నా కండ్లను అప్పుగా తీసికొని ఇలా చెప్పెను, “వెళ్ళి సోదరుడు జార్జితో ఇలా చెప్పుము, 'యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. అతనిని చూచి నవ్విన బోధకుల సమాధులను అతడు త్రవ్వును.'”
ఆ ఇమ్మానుయేలు ఆయనే, గత దినమున ఆ అడవులలో ఆ చిన్న జంతువులతో ఉండినది. “మర్గీ మోర్గన్” గురించి చెప్పినది ఆయనే. ఆమె ఇప్పుడు అక్కడ కూర్చొని విశ్రాంతి తీసికొనుచున్నది. శరీరము యొక్క హృదయ తలంపులను అప్పుగా తీసికొనినది ఆయనే. ఆ విధముగా ఆయన ఈ లోకమునకు తనను తెలియ పరచుకొనుచున్నాడు. సాయంకాల వెలుగులు ప్రకాశించునప్పుడు, నీ ద్వారా అది జరుగుచున్నది. స్నేహితులారా, దేవుడు కృప గలిగియున్నాడు!
71
మీ సమయములో నేను అధికముగా తీసుకొన్నాను. మనము దానిని ఒక్కసారి ప్రయత్నించెదము. మనమందరము చేరి పాడుదము,
“ఎంతగా ఆయనను నేను ప్రేమింతును!” ఎందరికి అది తెలిసియున్నది?
ఓ, ఎంతగా నేనాయనను ప్రేమింతును!
ఏ విధముగా నేనాయనను పూజింతును!
నా జీవము, నా సూర్య ప్రకాశము, నాలోని సమస్తము,
ఆ గొప్ప సృష్టికర్త, నా రక్షకుడాయెను.
దేవుని సర్వ పరిపూర్ణత ఆయనలో నివాసమాయెను.
[సోదరులు బ్రెన్హాం, “ఓ ఎంతగా నేనాయనను ప్రేమింతును” అను స్వరమును ఆలాపన చేయుచున్నారు.]
......... ఏ విధముగా నేనాయనను పూజింతును!
నా జీవము, నా సూర్య ప్రకాశము, నాలోని సమస్తము!
ఆ గొప్ప సృష్టికర్త నా రక్షకుడాయెను.
దేవుని సర్వ పరిపూర్ణత ఆయనలో నివాసమాయెను.
72
[సోదరులు బ్రెన్హాం ఆలాపన చేయుటకు ప్రారంభించారు.] ఆయన కృపను చూపుటకు ఇదే సమయము. ఒక తల్లి తన బిడ్డను “లుకేమియా” జబ్బుతో తెచ్చినది. ఆ బిడ్డ రక్త నాళముల యందు “క్యాన్సర్” వ్యాధి ఏర్పడినది. ఒక శిశువునకు అంత చెడు జరిగినదా? దేవుడు నా స్వరమును వినుచున్నాడు. “మాట్లాడుము, అది ఆ విధముగానే జరుగును.” ఎందుకనగా ప్రభువా, నీవిలా సెలవిచ్చావు, “ఈ కొండతో ”కదలి పొమ్మని“ మాట్లాడుము, సందేహించకుము, అది అలా జరుగును. దేవుని కుమారుడైన యేసుక్రిస్తు నామములో లుకేమియా అని పిలువబడు ఈ దురాత్మను, ఈ బిడ్డ శరీరములో ఉన్న ఈ జబ్బు విడిచిపోవును గాక [స్పష్టతలేని మాటలు] యేసుక్రీస్తు నామములో అది అలా జరుగును గాక.
నా సూర్య ప్రకాశము, నాలోని సమస్తము!
ఆ గొప్ప సృష్టికర్త నా రక్షకుడాయెను,
దేవుని సర్వ పరిపూర్ణత ఆయనలో నివాసమాయెను.
ఎంతగా నేనాయనను ప్రేమింతును! నేను దానిని అలాగే వెళ్లనివ్వలేను. నేను యాకోబు వలె దానిని పట్టియుండుటకు ఇష్టపడుచున్నాను.
........... ఆయనను పూజింతును!
నా జీవము, నా సూర్య ప్రకాశము, నాలోని సమస్తము!
(“ఇది ఒక సూచనగా ఉన్నది.”)
ఆ గొప్ప సృష్టికర్త నా రక్షకుడాయెను.
దేవుని సర్వ పరిపూర్ణత ఆయనలో నివాసమాయెను.
73
ఆయన ఆశర్యముగా లేడా? ఆయనను ఆరాధించు అనుభూతి నీకు కలుగుట లేదా? ఆత్మలో ఆయనను ఆరాధించుము. [సోదరులు బ్రెన్హాం “ఆయన మహిమ నుండి అను చరణమును ఆలాపన చేయుచున్నారు.] ఇప్పుడు మిమ్మును మరచిపోండి. సిగ్గుపడవద్దు. ఆ పరిశుద్ధాత్మ ఇక్కడున్నాడు. అదే ఆ పరిశుద్ధాత్మ, మీ యొక్క పద్ధతిలో,
ఆ గొప్ప సృష్టికర్త నా రక్షకుడాయెను.
దేవుని సర్వపరిపూర్ణత ఆయనలో నివాసమాయెను.
ఎటువంటి దయనొ౦దిన స్థితి, మనకు విమోచనను తెచ్చినది;
(“ఇది ఒక సూచనగాయున్నది”)
కాళరాత్రిలో ఒక్క నిరీక్షణయైనను కనబడనప్పుడు;
దేవుడు, ప్రియుడై సన్నిహితుడై తన వైభవమును విడిచిపెట్టి,
(ఆయన దేనిని చేశాడో తలంచుము!)
నా ఆత్మను రక్షించి జయించుటకు ఆకర్షించుటకు తగ్గించుకొనెను.
ఇప్పుడు మనము ఆ పాటను పాడుచుండగా, మన చేతులను పైకెత్తుదము,
ఓ, ఎంతగా నేనాయనను పేమింతును!
ఏ విధముగా నేనాయనను పూజింతును!
నా జీవము, నా యొక్క ప్రకాశము, నాలోని సమస్తము!
దేవుని సర్వ పరిపూర్ణత ఆయనలో నివాసమాయెను.
74
ప్రభువా, నీ ఆత్మ యొక్క నిండుతనమును, ఔన్నత్యములను, ఆ దినమందు మేము ఆయన వచ్చునప్పుడు ఆయనను చూచువరకు గ్రహించలేము. మేము ధూళిలో నిద్రించవచ్చు. నేను ఆ మునుపటి ధూళికి తిరిగి వెళ్లవచ్చు, అయితే నాకు అది ఏ మాత్రము చింతనియ్యదు. “ఆయన నన్ను పిలచుననియు, నేను బదులిచ్చెదననియు అంతట ఆయన ఉన్న రీతిగా నేనాయనను చూచెదననియు ఎరిగియున్నాను, నశించిపోవు ఈ శరీరము మార్చబడి ఆయన స్వంత మహిమ శరీరము వలె మార్చబడును. సమస్తమును ఆయన స్వాధీనపరచుకొనును.”
ఈ క్రిస్మసు బహుమానమైన క్రీస్తు కొరకు నేనెప్పుడు నా హృదయమందు కృతజ్ఞత గల వాడినైయుందును. అదే క్రీస్తుగా ఆయన ఉన్నాడని గ్రహించుచున్నాను, ఎందుకనగా ఆయన అవే కార్యములను చేసెను. ఆది యందు ఆయన తన సేవకులకు చేసినట్లే నాకును అటువంటి అనుభూతిని కలుగుజేసెను.
సర్వలోక సంఘము నిమిత్తము దాని జయము నిమిత్తము ముందుగా దాని ఎన్నుకొని దానిని పిలచిన దాని నిమిత్తమును, దానిని ముద్రించి ఆ శరీరమందు అభిషేకించిన దాని నిమిత్తము నేను వందనస్తుడనై యున్నాను. ఆసియాయందును, ఆఫ్రికా దేశమందును, రోమా దేశమందును, ప్రతి స్థలమందును, ఇండియానా యందును, అమెరికా దేశములోని పట్టణములన్నిటియందును, ఆఫ్రికా దేశమందును, నేను వారిని కనుగొనుచున్నాను. ప్రపంచమందు ప్రతి స్థలములో నీవు శరీరమందు వచ్చియున్నావని ఎరిగిన సంఘ విజయమును నేను కనుగొనుచున్నాను. నీవిలా సెలవిచ్చావు. “ప్రతి ఆత్మ....” పరిశుద్ధ గ్రంధమందు నీవిలా సెలవిచ్చావు, “దీనిని ఒప్పుకొనని ఏ ఆత్మయైనను, తప్పుడు ఆత్మగాను, అంత్యక్రీస్తుగాను ఉన్నాడు. క్రీస్తు శరీరములో వఛ్ఛెనని ఒప్పుకొనని ప్రతి ఆత్మ, దీనికి సాక్ష్యమియ్యని ప్రతి ఆత్మ అంత్యక్రీస్తు ఆత్మగా ఉన్నది.”
75
తండ్రి, దేవా, దూరములో ఉన్న ప్రతి అగ్ని చిహ్నములను కదిలించుటకు సహాయము దయచేయుము. వారిని నేను చూచుచున్నాను. ప్రభువా, కుష్టు రోగులను వాకిలి ద్వారముల యొద్ద చూచుచున్నాను. సమీపములో ఇండియా దేశములో చూచాను. తాజ్ మహల్ ద్వారము దగ్గర, పేదవారు కాళ్లు, చేతులు మెలికలు తిరిగిన వారు కాళ్లు లేని వారు నేలపై పడియున్నారు. ఆఫ్రికా దేశములో ఆ పేద నల్లటి బాలురు, వారి చిన్న చేతులను పైకి ఎత్తి పట్టుచు (భిక్షమడుగుచున్నారు). ఓ దేవా, నన్ను పంపుము ప్రభువా! ఆ దూత అగ్ని కణములలో దిగి వచ్చి నా ఆత్మను వెలిగించనిమ్ము, ప్రభువా, సమస్త కల్మషమును తీసివేయుము. చీకటిలో ఉన్న వారిని వెలుపలకు తెచ్చునట్లు సహాయము దయచేయుము.
ప్రభువా, నా చిన్న సంఘమును దీవించుము. ఓ, ఆ చిన్న వారిని ఇక్కడ నుండి చూడగలుగుచున్నాను. వారెంతో అమూల్యమైన ప్రజలు. కార్లలో ప్రయాణము చేయువారు వారిని చూచి నవ్వుచున్నారు, ఎందుకనగా వారు వారి చేతులను పైకెత్తి పట్టి దేవుని స్తుతించుచున్నారు. అయితే ఒక దినమందు యేసు వచ్చును, అప్పుడు సమస్త కార్యములు చక్కపెట్టబడును. ప్రభువా, మేము సిగ్గుపడము. “మేము ఆ పూర్వపు పౌలుతో కలసి యేసుక్రీస్తు సువార్త నిమిత్తము నేను సిగ్గుపడను, ఎందుకనగా అది నిత్యజీవమునకు రక్షించుచున్న దేవుని శక్తియైయున్నది. విశ్వసించు ప్రతి వారికి అది చెందును.” తండ్రి, ఆ మార్గమందు జీవించుటకు సహాయము చేయుము. ఇప్పుడు మేము పరలోక స్థలముల యందు ఆత్మలో నిన్ను ఆరాధించుచున్నాము. ఈ ఉదయకాలమందు నీవు మమ్ము దర్శించినందుకు మేము వందనములు తెలుపుచున్నాము. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
76
మరొక్కసారి ఆ చరణమును పాడగలరా?
ఓ, ఎంతగా నేనాయనను పేమింతును!
ఏ విధముగా నేనాయనను పూజింతును!
ప్రభువైన యేసు ఆశీర్వదించుము. యేసు నామములో,
................ నాలోని సమస్తము!
ఆ గొప్ప సృష్టికర్త నా రక్షకుడాయెను,
దేవుని సర్వ పరిపూర్ణత ఆయనలో నివాసము చేసెను.
ఆయన ఎంతో అధికముగా కావలసియున్నది, నీకా విధముగా లేదా? “డో?”
[డెరోలెస్ అను సోదరి “నిజమే” అని చెప్పుచున్నది.] ఆమె నా సోదరి, ఆమె శరీరములో ఉన్న నా సోదరి
“ఓ, ఎంతగా నేనాయనను..........
నా కోడలు, వారికి దేవుని ఎంతగానో కోరుచున్నారు. సోదరుడు గ్రీమ్స్లే దేవుని అధికముగా కోరుచు వచ్చుచున్నాడు.
............... నాలోని................
అదే సోదరా. సోదరుడు ఉడ్ వచ్చుచున్నారు. సోదరుడు కాలిన్స్ ఆయన ఒక మెథడిస్టు సేవకుడు; ఆయన భార్య కూడ వచ్చుచున్నది.
ఆయన నా రక్షకుడాయెను.
ఇది పిలచుచును పరిశుద్దాత్మ క్రియలై యున్నవి.
................... ఆయనలో నివాసము చేసెను.
ఓ, ఎంతగా నేనాయనను పేమింతును!
(దానిని మీ స్వంత విధానములో తెలియపరుము)
ఏ విధముగా నేనాయనను పూజింతును!
నా జీవము, నా సూర్య ప్రకాశము, నాలోని సమస్తము!
ఆ గొప్ప సృష్టికర్త, నా రక్షకుడాయెను.
దేవుని సర్వ పరిపూర్ణత ఆయనలో నివాసము చేసెను.
77
ప్రభువా, ప్రభువా వారిక్కడున్నారు. వారు నీ పచ్చిక బయళ్ళలోని గొర్రెలుగా ఉన్నారు. ప్రభువా, వారిని నీ ఆత్మతో పోషించుము. ప్రభువా, వారిని నీకు సమర్పించుకొనుచున్నారు. వారి జీవితములను నీకు అర్పించుకొనుచున్నారు. యేసుక్రీస్తు సువార్త నిమిత్తము సిగ్గుపడకున్నారు కనుక వారు నీ కొరకు నిలచుచున్నారు. ఆ గొప్ప అగ్నిస్తంభమైన క్రీస్తుగా ఉన్న నీవు మా మధ్య ఉన్నావని మేమెరిగి యున్నాము. ఆయనే పరిశుద్ధాత్మగా ఉన్నాడు.
....... ఆయనను పూజింతును!
నా జీవము, నా సూర్య ప్రకాశము; నాలోని సమస్తము!
ఆ గొప్ప స్త్రష్టికర్త నా రక్షకుడాయెను.
దేవుని సర్వ పరిపూర్ణత ఆయనలో నివాసమాయెను.
[“మహిమ నుండి దిగి వచ్చెనని” సోదరులు బ్రెన్హాం ఆలాపన చేయుచున్నారు.] మీ స్వంత మాటలలో మాట్లాడుడి. మిమ్ములను ఇక్కడకు తెచ్చినది ఆ పరిశుద్ధాత్మగా ఉన్నాడు. మీరు ఆయనను ప్రేమించుచున్నారని ఆయనకు చెప్పండి. ఆనాడు పెంతెకోస్తు దినమున వారిని లేపిన అదే పరిశుద్ధాత్మ ద్వారా మీరిక్కడ నిలచి, ఆక్రందన చేయుచు, ఏడ్చుచు, సంతోషించుచున్నారు.
ఆ గొప్ప సృష్టికర్త, నా రక్షకుడాయెను
దేవుని సర్వ పరిపూర్ణత ఆయనలో నివాసము చేసెను.
ఎదిరించుట అనునది లేక రక్తమాంసములను
ఆయన ధాతువులుగా, (ఒక చిన్న శిశువు తనలో కలిగియున్నది)
మానవ రూపము దాల్చి, మరుగైన తన ఉద్దేశమును బయలుపరచెను.
ఓ, మహిమ గల మర్మము, కల్వరిలో బలియాగము,
ఇప్పుడు నేనెగుదును, నీవే ఆ గొప్ప “ఉన్నవాడవు అనువాడవు.”
ఓ, ఎంతగా నేనాయనను పేమింతును!
(ఓ దేవా) ఏ విధముగా నేనాయనను పూజింతును!
నా జీవము, నా సూర్య ప్రకాశము, నాలోని సమస్తము
గొప్ప సృష్టికర్త నా రక్షకుడాయెను
దేవుని సర్వ పరిపూర్ణత ఆయనలో నివాసము చేసెను.
78
ఓ ప్రేమ, అది నన్ను వెళ్లనివ్వడము లేదు. సమస్తము నుండి దూరముగా ఉండునట్లు నా హృదయమును ప్రేమ పట్టుకొనియున్నది, అదే పరిశుద్ధాత్మ సన్నిధిలోని మాధుర్యముగా ఉన్నది; ఇప్పుడు ఆయన సంఘము ఈ బలిపీఠము చుట్టూ నిలచియుండగా, పశుల పాకను చూచుచు పూజించుచున్నారు, ఆ జ్ఞానులు చూచిన దానినే చూచుచున్నారు, దేవుడు శరీరధారి ఆయెను.
.............. నా రక్షకుడాయెను.
దేవుని సర్వ పరిపూర్ణత ఆయనలో నివాసము చేసెను.
మీ జీవితములలో ఏదేని పొరపాటున్న యెడల, ఇప్పుడే ఆ పరిశుద్ధాత్మ సన్నిధిలో ఒప్పుకొనండి. ప్రశాంతముగా ఉన్న ఈ సమయమందు మీ హృదయములలోనికి చూడండి, ఈ నిందకు నిలచునట్టి పాక అక్కడున్నదేమో చూడండి. ఆయన దేవుడని ఒప్పుకొనుట ద్వారా మీరు చూడగలరు.
దేవుని సర్వ పరిపూర్ణత ఆయనలో నివాసము చేసెను.
79
ఇప్పుడు మీ తలలు వంచి యుండగా, మీ నిమిత్తము ప్రార్థనను సమర్పించుడి. ఇదే ఆ పరిశుద్ధాత్మ, దాని సాత్వీకమును, దేవుని ఆత్మ యొక్క నమ్రతను మీరు అనుభవించుట లేదా, అది మాధుర్యము నశించిపోని జీవము!
“భాషలైనను నిలిచిపోవును, ప్రవచనములైనను నిరర్ధకములగును. జ్ఞానమైనను నిరర్థకమగును. అయితే అది ప్రేమకు వచ్చినప్పుడు, అది ఎప్పుడు నిలచును.” “ప్రేమ శ్రమను ఓర్పును, తనను గొప్ప చేసికొనదు, అది భ్రమ చెందదు, అది పొరపాటుగా నడచుకొనదు. అయితే అది తనను తగ్గించుకొనును, మనలను మాధుర్యత పరచును. మీ ఆత్మలో మాధుర్యమును ఏర్పరచును.”
80
ఇప్పుడు మనము ప్రార్థించుదము, మీ స్వంత మార్గములలో ఆయన చేసిన ప్రతి దాని నిమిత్తము వందనములు చేయుడి.
ఓ దేవా, ఈ పాట యొక్క మాధుర్యము, ఈ వాయిద్యము ద్వారా తెలుపబడినది, అది ఒక నిశ్చయత లేని శబ్దము కాదు. అయితే అది మనకు ఎంతో భావముతో కూడినదై, మన దేవుడెవరని, ఆ వాక్యము వివరించబడుట ద్వారా, తెలియుచున్నది. ఇప్పుడా సంగీతము దానిని ఎత్తి చూపు చున్నది. ప్రభువా, ఇప్పుడు మా హృదయములు దానిని ఎత్తి చూపుచున్నది. మీపై మాకున్న తలంపులను అవి చూపుచున్నవి. మేము ముందుకు వచ్చుచున్నాము, వారు తమ కాళ్లపై నిన్ను ప్రేమించుచున్నారు. ప్రభువా, మేమందరము కలసి, నీ గొర్రెలుగా నీ పచ్చిక బయళ్ళ యందు నిలచియున్నాము. మేమీ ఆహారమును ప్రేమించుచున్నాము. అది మా ఆత్మలకు ఎంతో మంచిది. దేవుడు మాతో నివాసము చేయుచున్నాడని ఎరిగియున్నాము. దేవుడు క్రీస్తుగా అయిపోయాడని మేము ఎరిగియున్నాము. ఆ క్రీస్తు ఖాళి చేసికొని సంఘములోకి వచ్చెను.
ఇక్కడ ఈ దినమందు సమస్త మతములు అనేక రకముల సంస్థలు మరియు శాఖలు అన్ని రకముల నమ్మకములు తెచ్చుచున్నప్పటికిని వాక్యము తానే మాట్లాడుచున్నది. దేవుడు రూపుదాల్చెను. ఆ అతీతమైన సూచనగా అనగా, దేవుడు ఇంకనూ తన ప్రజల శరీరముగా రూపుదాల్చెను అవే కార్యములను, ఆశ్చర్య క్రియలను చేయుచు, ఒక మేఘముగాను, ఒక అగ్నిస్తంభముగాను, మన మధ్య నివాసము చేసెను. ఆయన మన హృదయ ఆలోచనలను శోధించుచు, రానున్న కార్యములను మనతో ముందుగా చెప్పుచు, మన రోగములను స్వస్థపరుచుచు, పరలోకము వైపునకు వెళ్ళు] ప్రజలుగా చేయుచు, మనకు మనమే ఈ లోక పిల్లలకు ఆశర్య క్రియలను చేయువారముగా కనబడుచున్నాము; వారేవిధముగా నవ్వుచు, మనము పిచ్చి వారమని తలంచుచున్నారు. ఆ దినమందు, పెంతెకోస్తు దినమందు “వీరందరు క్రొత్త మధ్యముతో నిండి యున్నారా?” అని వారు (లోకస్తులు) చెప్పినట్లే ఉన్నది.
ఓ, ఎంతగా నేనాయనను పేమింతును!
ఏ విధముగా నేనాయనను పూజింతును!
నా జీవము, నా సూర్య ప్రకాశము, నాలోని సమస్తము
ఆ గొప్ప సృష్టికర్త నా రక్షకుడాయెను,
దేవుని సర్వ పరిపూర్ణత ఆయనలో నివాసము చేసెను.
81
మీ విశ్వాసమును దేవునికి పణముగా ఉంచుటకు మీ చేతులను పైకెత్తగలరా, దేవునికి మీ విశ్వాసమును సమర్పించుకొనుడి. మీ నిజాయితీ, మీకున్నదంతటిని దేవునికి సమర్చించగలరా, ఈ సంఘము దేవునికి సమర్పించుకొనునా?
ప్రభువా, మమ్ములను మేమిప్పుడు మీకు సమర్పించుకొనుచున్నాము. నీ ప్రసన్నత సారూప్యము యొక్క ఈ ఆశీర్వాదముల తరువాత, దేవుడింకను మానవ శరీర రూపముల యందు ప్రత్యక్షుడగుచున్నాడని ఎరిగియున్నాము. ఆయన మనలాంటి ధూళి ఆయెను, ఆయన మన విలువగా మారెను; దేవస్థానమును దాటి ఆయన మానవుడాయెను. ఆ విధముగా ఆ మానవుడు ఆయనలో జీవించునట్లు ఆయన దిగి వచ్చెను. మేము ఈ ఉదయము నిన్ను మా ఆత్మలో అనుభవించాము. మేము నీ క్రియలను, నీ ప్రత్యక్షతలను చూచాము. మేము నిన్ను ప్రేమించుచున్నాము. మేము క్రొత్తగా మీకు సమర్పించుకొనుచున్నాము. నిన్ను గౌరవించుటకును, ప్రేమించుటకును, మేము చేయగల ప్రతిది నీ కొరకు చేయగలుగునట్లు, మేము సంతోషించు విధముగా, క్రైస్తవ జీవితములను జీవించునట్లు, అది ఎలాంటి నిందను తీసికొని రాదు, అయితే నీ గొప్ప పరిశుద్ధ నామమునకు గొప్ప ఆశీర్వాదముగా ఉండెదము. ప్రభువా, దీనిని మేము చేయగలము. నీ కుమారులముగా యేసుక్రీస్తు నామమందు దీనిని అడుగుచున్నాము. ఆమేన్.
82
మీ స్థానములలో మీరు కూర్చొనుటకు ముందు మిమ్ములను ఒకటి అడుగుటకు ఇష్టపడుచున్నాను. అలాంటి అనుభూతిని మిరెప్పుడైనను అనుభవించారా? పరిశుద్ధాత్మ యొక్క మాధుర్యమును అనుభవించారా! ఏ ఒక్కరు కూడా ఒక్క మాటైనను చెప్పలేకున్నారు; వారే లేచి వచ్చుచున్నారు. అదే దేవుని మహిమయై యున్నది, చూశారా.
రెండు రోజులుగా దీనిపై నేను ప్రార్థించుచు, చదువుకొనుచుంటిని. దాని కంటే అధికముగా గత ఆదివారము, లేక అవును, గత ఆదివారమే.
అతీతమైన సూచన ఎలాగున్నది, దానిని దేవుడు ఏలాగు సెలవిచ్చెను, “నేను వారికి ఒక సూచన నిచ్చెదను. నేను వారి శరీరమందు ఉండెదను. నేను వారి వలె ఉండును; వారు నా వలె ఉండెదరు. ”దేవదూతలు దీనిని చూచెదరని ఆయన చెప్పెను, లేక ఇలా సెలవిచ్చెను... ఆ దేవదూతలు ఆ గొర్రెల కాపరులతో ఇలాగున చెప్పిరి, “ఆ పశుల పాకలోనికి చూడండి; నేను భావించునదేమిటో మీరు చూడగలరు.” ఆ సూచన దేవదూతలకు మాత్రమే కాదు గాని, ఆ గొర్రెల కాపరులకు మాత్రము కాదు గాని, ఈ ప్రపంచమంతయు చూచి, దేవుడు శరీరములో నివాసము చేయుచున్నాడని విశ్వసించవలెనని ఇవ్వబడినది.
ఆ శరీరమును అర్చించుట ద్వారా ఆయన మన శరీరమును శుద్ధి చేసెను. ఆ విధముగా ఆయన మనలో నివాసము చేయగలిగెను. దేవుడు మీలో ఉన్నాడు, క్రీస్తు మీలో ఉన్నాడు. “ఇదిగో, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉందును.” దీనిని మరచిపోవద్దు. దీనిని మీ హృదయాలలో దాచుకొనుడి.
83
మంచి క్రిస్మసు బహుమానములను నేను అందుకొన్నాను, ఒక వీడియో కెమెరా, మరియు అనేక ఇతర వస్తువులు అనేకములు మరియు తుపాకీలు ఇతరమైనవి ప్రజలు నన్ను ప్రేమించినందున వారు నాకిచ్చారు. ఏ విధముగా దానిని నేను అభినందింతును!
అయితే, ఓ, ఇది ఈ నిత్యజీవము, క్రీస్తు మనలో నివసించునను దానికి ప్రమాణమైయున్నది. ఆయన పరిపూర్ణత్వము మనలో నివాసము చేయునను దానికి ప్రమాణమై యున్నది. దాని ద్వారా మనము లేచి నిలచి వ్యత్యాసముగా జీవించుచున్నాము, ఎందుకనగా మీరు దానిని చేసినప్పుడు ఈ ప్రపంచమునకు పరదేశులగుచున్నారు. మీరొక యాత్రికులగుచున్నారు. ఈ ప్రపంచ కార్యములకు మీరు మరణించిన వారుగా తలంచుచున్నారు. మరియు ఒక క్రొత్త జీవితమందు జీవించుచున్నారు. ఇప్పుడు ఈ ప్రపంచములో మీరు ఒక పరదేశులుగా ఉన్నారు, ఎందుకనగా మీ క్రియల ద్వారా మీరు దానిని చూపించుట ద్వారా మీరొక పరదేశులుగా ఉన్నారు. ఎట్లనగా, “అక్కడొక పట్టణమున్నది, దాని శిల్పియు నిర్మాణకుడును దేవుడై యున్నాడు,” చూశారా. మీరిక మీదట ఈ ప్రపంచ కార్యమును శ్రద్ధ వహించరు. అయితే మనము ఆ పరలోకము వైపునకు మరలిన ప్రజలముగా, ఆ పట్టణమును సంతానమైయున్నాము, ఎందుకనగా మనము ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వసించుచున్నాము. ఈ ప్రపంచ కార్యములకు మరణించియున్నాము. ఆయన వలె పునరుద్ధానమందు మరలా లేచిన వారమైయున్నాము; అబ్రాహాము నడిచినట్లే, రానున్న పట్టణమును ఎదురుచూస్తు, దేవుని వాక్యమును గైకొని, ప్రతి దానిని వ్యత్యాసముగా పిలచుచు, దేవదూతలను మన గృహములలోకి ఆహ్వానించుచున్నాము. అబ్రాహాము కూడా అలాగే చేసెను, వర్తమానము తెచ్చిన దూతలకు ఉపచారము చేసెను. ఓ, ఏమా సమయము! ఈ ప్రపంచను ఇకపై మనకు అవసరము లేదు. మనకు కావలసినది ఆయననే మరియు ఆయన మాత్రమే. ఆయన మన రక్షకుడై యున్నాడు.
84
ఈ ఉదయ కాలము మీరీ భవనము నుండి ప్రయాణమై వేళ్ళుచుండగా, ఆయనను మీతో కొనిపోవుడి. దానిని విడిచి పెట్టకండి. మీ జీవిత దినములన్నింటిలో మీ ఆత్మ యందు మాధుర్యముగా ఉండుడి, మీ స్థలములకు, మీరు వెళ్ళుచుండగా, దేవుడు మిమ్ము దీవించు గాక. చిన్న పిల్లలకు వారి బహుమానములున్నవి. దేవుడు మిమ్ము దీవించు గాక.
అక్కడైవరికైనను ప్రార్ధి౦చవలసి యున్నదా? [ఒక సోదరి “అవును” అని బదులిచ్చుచున్నది.] సోదరీ, ఇక్కడ నిలబడుము. [ఆ సోదరి, సోదరులు బ్రెన్హాం గారితో మాట్లాడుచున్నారు.] ప్రభువైన దేవుడు ఈ సోదరునికి కృప చూపును గాక! ప్రభువా, అతనిలోని ఆ త్రాగుబోతు ఆత్మను తీసివేయుము. అతడు దేవుని క్రొత్త ద్రాక్షరసమును త్రాగును గాక. యేసుక్రీస్తు నామమందు అడుగుచున్నాను. ఆమేన్.
85
ఇది పరలోక వాతావరణముగా లేదా? దానినెందరు అనుభవించుచున్నారు. అది ఒక మాధుర్యము? ఏమి చెప్పాలో ఎవ్వరికీ తెలియుట లేదు. చెప్పుటకు నాకేమియు తెలియుట లేదు. నేను పదముల కొరకు వెదకుచున్నాను. ఏమి చెప్పాలో నాకు తెలియదు. కేవలము ఆయన ఆత్మ లోనికి కదలాడినది, చూశారా.
అది ఏమిటి? మీరు గొర్రె పిల్లలగుచున్నారు, ఆ గొర్రె పిల్ల ఆహారమునకు ఇక్కడున్న ఆ పావురము మిమ్ములను నడిపించుచున్నది. ఇది గొర్రెల ఆహారము. “మనిషి రొట్టె వలన మాత్రము కాదు గాని, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును.” మన ఆత్మలు దానిపై జీవించును.
86
అటార్నీ రాబర్ట్సన్ అను నా మంచి స్నేహితుని చూడవలసియున్నదని నేను తలంచుచున్నాను. మీరు ఈ కట్టడములో చాలా సమయము వేచియున్నట్లయిన నేను వెళ్ళి బట్టలు మార్చుకొని తిరిగి వచ్చెదను, ఎందుకనగా నాకు చమట పట్టియున్నది.
ఇప్పుడు సోదరులు నెవిల్ ఆరాధనను కొనసాగించెదరు. చిన్న పిల్లలకు బహుమతులిచ్చెదరు. ప్రభువు మిమ్ము దీవించు గాక.
ఎల్లప్పుడు ఈ పాటను పాడండి, “ఆయన మహిమ నుండి” మీరిలా చేయునప్పుడు, ఆయన యందు మనము దేనిని నమ్ముచున్నామో జ్ఞాపకముంచుకొనండి. “సమస్త దేవుని పరిపూర్ణత ఆయనలో నివాసమాయెను.”
నెవిల్ సోదరా, దేవుడు నిన్ను దీవించు గాక.
[సాహోదరుడు నెవిల్ సాహోదారుడు బ్రెన్హాం గారితో మాట్లాడుచున్నారు.] సరే, నేను కొనసాగించ వలెనని కోరుచున్నారా, [“అవును.”]
ఈ రాత్రికి నేను మరలా వచ్చెదనా యని సోదరులు నెవిల్ అడుగుచున్నారు. మరలా ఈ రాత్రి ఆయన ఆరాధనను నేను తీసికొనుటకు ఇష్టపడుట లేదు. నేనిక్కడ ఎందుకు ఉండవలసియున్నదో అందు కొరకు ఉండెదను. సరే, ఈ రాత్రి నేను మరలా వచ్చెదను. ప్రభువు చిత్తమైతే, ఆ ఆరాధనలో మాట్లాడెదను.