ఒక అతీతమైన ఇంద్రియము

ఒక అతీతమైన ఇంద్రియము

VGR COUNT -194, 1

నేను ఇంకా ఈ ఉదయాన పొందిన, ఆ దీవెనలయందు ఆనందించుచున్నాను. ఓ, మనం అంతా కలసి సమావేశమయినప్పుడు దేవుడు మన కొరకు అధికమైన, ఎడతెగని, తెలియని సంగతులు చేయును! మనం దేవునికి సమర్పించుకున్నప్పటి నుండి, ఆ కార్యములు ఇక్కడ ఎలా జరుగుచున్నవో మీరు గమనించారా? ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదము, శక్తి వెంబడి శక్తి, మహిమ వెంబడి మహిమ! కేవలం అది ఆశ్చర్యమైనది. మరియు ఆయన ఆ విధంగా చేయుట కొనసాగించును. ఇక్కడ ఉన్న ఎవరో ఒకరికి చెందిన, ఈ ప్రార్ధనా వస్త్రాలకు, నేను వాటికి ప్రార్ధించాను.

2

ఇప్పుడు నేను కేవలం ఒకటి లేక రెండు క్షణాలు అది వివరించగోరుచున్నాను, మరియు మీరు నా కొరకు తెచ్చిన సూట్ వస్త్రాలు, మీ చక్కని క్రిస్మసు బహుమానం కొరకు మొదట మీకందరకు వందనాలు చెల్లించుచున్నాను. సహోదరుడా నెవిల్, నీ దానిలో ఉన్నది అదే గదా? [సహోదరుడు నెవిల్ చెప్పుచున్నాడు, “అవునండి. అవునండి.”] ఒక సూట్ వస్త్రాలు, ఎందుకనగా బోధకులు ఎల్లప్పుడు ఒక సూట్ వస్త్రాలు ఉపయోగిస్తారు. [“నాకు చక్కగా సరిపోయాయి.”] ఆశ్చర్యము, అది మంచిదే. ఇప్పుడు, వాటికి చెమట పట్టును, మరియు మీరు చూడండి, ఆ చెమటనే నెరిగిన దేనికంటెను బట్టలను త్వరగా తినివేయును, మరియు ఒక బోధకుడు ఉంచుకొనుటకు కేవలం అది ఎక్కువ బట్టలు పొందునట్లు చేయును. మరియు మంచి బట్టలు. కేవలం ఒక చిన్న ముక్కగా చవకగా ఉన్న నూలు వస్త్రం తినివేయును. కనుక ఒక - ఆ విధమైన ఒక మంచి సూట్ దాని లోపల మన్నిక గలది, కలిగి ఉండును.

మిరు పోషించుచూ మరియు ప్రభువు యొక్క సేవకులకు ఇచ్చుచున్న ఈ వస్తాలను గూర్చి నేను బాగా ఆలోచించుచున్నాను. ప్రభువు మిమ్మును దీవించును. యేసు చెప్పెను, “మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో, ఒకనికైనను చేసితిరి గనుక నాకును మీరు చేసితిరి. అందుచే మీరెన్నడూ ఇద్దరు సేవకులకు ఒక సూటు కొనలేదు; మీరు యేసు కొరకు రెండు సూట్లు కొన్నారు. అదే ఆయన చెప్పినది, ”మీరు నాకు అది చేసియున్నారు.“

3

అయితే ఆ చిన్న పరలోక తాకిడి, ఈ ఉదయాన, మీరు దానిని గమనించారా? ఏ వేదిక పిలుపులేదు, ఏమియు లేదు, అయితే కేవలం వర్తమానం తరువాత మరియు ఆహ్లాదమును మరియు నూతనోత్సాహము నిచ్చు పరిశుద్దాత్మడు నీటిలో ముంచునట్లుగా ప్రజలపై ఉండెను, దేవుని మహిమ కదులుచుండెను, కేవలం వారు క్రింద, మొత్తం చుట్టు నుండి, పైకి రానారంభించెను. లూయిస్-విల్ లో, వాల్నట్ స్ట్రీట్ - బాప్టిస్టు చర్చి నుండి, యధార్ధమైన నా మంచి బాప్టిస్టు స్నేహితులను కొందరిని నేను గమనించాను, వారు, వేదికపై నిలబడి, నిజంగా దేవుని శక్తిలో మునిగి సాన్నమాడుచున్నారు. ఓ, మై! వారు, నేను ఆరాధన తరువాత వారిని కలిసాను, వారు అన్నారు, “అది దేవుని శక్తి అయి ఉన్నది.”

నేను అన్నాను, “అది యదార్ధం మీరు ఖచ్చితముగా మీరన్నది. నిశ్చయముగా సరియైనది.”

దేవుని శక్తి! మరియు చెప్పడానికి మాటలు కనుగొనలేవు. మిరు కేవలం ఏమి చెప్పవలెనో ఎరుగరు. ఆ పరిశుద్ధాత్మడు సరిగా కూటమును తీసుకొనును. దానితో ఆయన ఏమి చేయనైయున్నాడో మీరెరుగరు. ప్రశాంతముగా, మాధుర్యముగా, దీనముగా, బాధ, వ్యధ నుండి పైకి తీసుకొని వెళ్ళును. ఓ, సహోదరుడా పాట్, అది నాకు, సరిగా పరలోకమై ఉన్నది. మీరు చూడండి, అలా దానిలో ఉన్న ఆ భావనను ఇష్టపడు ఈ పురాతన కాలపు పద్ధతి మాదిరిగా ఉండు వారిలో నేను ఒకడనైయున్నాను.

4

చనిపోయిన పాల్ రేడర్ వలె, అతడు చెప్పాడు... అతడు ఒక సమయంలో ఒక కధ చెప్పి ఉండెను మరియు అతడు, అతని భార్య బల్ల దగ్గర కూర్చుని ఉన్నారు, మరియు ఆమె ఎక్కడికో వెళ్ళుటకు లేక ఏదో చేయగోరెను, మరియు అతడు ఆమెకు ఇలా చెప్పుచున్నాడు, “నేను అది చేయలేను” మరియు మొదలైనవి, మరియు అతడు ఆమెను కొంచెం చిన్నబుచ్చి గాయపరచి ఉండెను.

కనుక అతడు ఆమె చుట్టూ చూచెను, మరియు ఆమె బుగ్గల మీద నుండి కన్నీళ్ళ కిందకు కారుచుండెను, మరియు అతడు ఆమెతో అన్నాడు, అతడు అనెను, “మంచిదే, ఇప్పుడు,” అతని హృదయంలో ఆలోచించెను, “ఆమె అలా అంత తేలికగా గాయపరచబడిన యెడల, కేవలం అలాగే ఆమెను గాయపడనియ్.” కనుక అతడు, మగవారు చేయునట్లే, అతడు అతని కాగితమును మడత పెట్టినట్లు మడతపెట్టి, మరియు దానిని క్రింద అతని పళ్ళెము మీద పెట్టెను.

5

ఆమె ఎల్లప్పుడు ద్వారము దగ్గర నిలబడి ముద్దుతో శుభం అని చెప్పేది; మరియు అతడు ద్వారము బయటకు వెళ్ళినప్పుడు, ఆమె అతనికి చేయి ఊపేది, మరియు అప్పుడు అది సరిపోవును - మీకు తెలియును, అతడు అతని కార్యాలయం నుండి వెనుకకు తిరిగి అతడు అతని కార్యాలయం నుండి వెనుకకు తిరిగి వచ్చే వరకు అది జాగ్రత్త వహించి యుండును.

కనుక ఆ ఉదయాన, అనెను, వారు బయటకు బయలుదేరినప్పుడు, ఎందుచేత, ఆ ద్వారము యొద్ద, ఎందుకో, ఆమె ద్వారము ప్రక్కన నిలబడి ఉండెను, మరియు అతడు ఆమెను ముదు పెట్టుకొనెను మరియు ఆ ద్వారము చివరకు నడచి వెళ్ళెను, మరియు ఆ ద్వారము తెరచెను మరియు వెనుకకు చూచెను, మరియు ఆమె తలను కిందకు వంచి, ఇంకా బాధపడుచూ, ద్వారము దగ్గర నిలచి ఉండెను, అతడు బై-బై, అని చేయి ఊపితినని చెప్పెను, ఆమె కూడా బై-బై అని చేయి ఊపెనని చెప్పెను.

6

అతడు వీధిలోనికి బయలుదేరనారంభించెనని చెప్పెను, “మరియు అతడు ఇలా ఆలోచించుటకు ప్రారంభించెను, ”నేను ఇంటికి తిరిగి వచ్చేముందు నాకు ఏదైన జరిగి ఉండిన యెడల ఏమి, లేక, నేను వెనుకకు తిరిగి వచ్చే ముందు ఆమెకు ఏదైన సంభవించి ఉండిన యెడల ఏమి — దేవుడు రంగము మీద నుండి మమ్మును పిలచినట్లైనయెడల — మరియు ఆమె ఒక మంచి స్త్రీగా ఉన్నది, మరియు ఆమె ఎంత మాధుర్యముగా ఉన్నది.“ మరియు మొదలైనవి? మరియు అనెను, అతడు ఇంకా ముందుకు వెళ్ళగా, అతని హృదయం మరి ఎక్కువగా ఉప్పొంగనారంభించెను.

అందుచేత అతడు వెనుకకు తిరిగెను మరియు వెనుకకు పరుగెత్తి, ద్వారం తెరచి, ఇంటిలోనికి పరిగెత్తి, తలుపును తెరచెను. అతడు ఆ తలుపును తెరవగా అతడు ఏడ్చుచున్న ఏదో వినెను, చుట్టూ చూచెను, తలుపు వెనుక ఆమె నిలబడి ఉండెను. “నన్ను క్షమించుము,” అని అతడు ఎన్నడూ అనలేదని చెప్పెను, “నేను క్షమాపణ చెప్పుచున్నానని” అతడు ఎన్నడూ చెప్పలేదు, అతడు ఎన్నడూ ఏమియు చెప్పలేదు. అతడు ఆమెను తటాలున పట్టుకొనెను మరియు ఆమెను మరల ముద్దు పెట్టుకొనెను, చుట్టూ తిరిగి మరియు బయట వెనుకకు నడిచెనని చెప్పెను. అతడు ఇలా అనెను, “బై” మరి ఆమెయు అనెను, “బై” ఆమె సరిగా మొదటిసారి చేసినట్టే చేసెనని చెప్పెను, అయితే తరువాత సమయంలో చేసినప్పుడు దానిలో ఆప్యాయత భావము కలిగి ఉండెను.

కనుక అది ఆ పద్ధతిలోనే అయి ఉన్నది. మీరు చూడండి, దానిలో ఆప్యాయత భావమును పొందినప్పుడు, అలా దేవుని నుండి వచ్చిన ఏదో నిజమైనదై ఉన్నది.

7

ఇప్పుడు కొన్నిక్షణాల క్రితం, ఒక కొత్త ధర్మకర్త, సహోదరుడు సాత్మన్ నియమించబడెను. అలా ఆ ధర్మకర్తలు, మరియు అందరూ, ఇప్పుడు జాగ్రత్త కలిగి ఉన్నారని నేను నిశ్చయిత కలిగి ఉన్నాను, అలా జనవరి ప్రారంభంలో, అర్ధిక సంవత్సరం చివరలో, సంఘము యొక్క సమస్త కార్యాలయములు, అలాగే కాపరులు మరియు డీకన్లు, మరియు మొదలైనవి, రద్దయి పోవును. అప్పుడు వారు కొనసాగుటకు కోరినయెడల... కాపరులు కాదు; అలాగని నా ఉద్దేశ్యం కాదు. నా ఉద్దేశ్యము ధర్మకర్తలు, మరియు డీకన్లు, మరియు ఆదివారపుబడి ఉపాధ్యాయులు, మరియు మొదలైనవి. అలా ఆ కాపరి సంఘము ద్వార లోపల ఎన్నిక అవుతాడు, మరియు అతడు అంతవరకు.... అంతవరకు అలాగే నిలచి ఉండును. మరియు అప్పుడు వారు. ఆ ప్రజలు, ప్రస్తుత బోర్డులో ధర్మకర్తలు, లేక పెద్దలు, లేక ఆదివారపుబడి ఉపాధ్యాయులు, లేక ఇంకా ఏమైనప్పటికి, వారు కొనసాగుటకు కోరిన యెడల, వారు సరిగా కొనసాగుదురు. వారు అలా కోరని యెడల, అప్పుడు వారు కొనసాగుటకు కోరనియెడల వారు రాజీనామా చేయవలెను; మరియు వారికి అక్కడ వ్యతిరేకముగా ఏమియు లేదు. అప్పుడు వారు ఆ మరుసటి సంవత్సరం వరకు కొనసాగుదురు. మరియు అప్పుడు వారు కొనసాగని యెడల, అప్పుడు వారు ఎన్నిక కలిగి ఉందురు, మరియు ఎవరో మరొక ధర్మకర్తను, లేక అది ఏ కార్యాలయమై ఉండినా నియామకము చేసికొందురు.

8

కాబట్టి, ఒక బోర్డులో సేవచేయుటకు, అతని జీవితకాలమంతయు ఒక మనిషిని పట్టి ఉంచుటకు ఏ మాత్రము లెక్కపెట్టక పోవును. అయితే దేవుడు తనతో ఉండి, తనకు సహాయం, చేయుచున్నాడని భావించినంత కాలం అతుడు లేక ఆమె తనవంతు చేయటకు కోరినయెడల అది ఏమైనప్పటికిని దేవుని పనిలో కొనసాగవలెను. మనం వారు మనతో ఉండి ఎల్లప్పుడూ సేవ చేయుటకు సంతోషించుచున్నాము. అయితే అదే పద్ధతిలో ఒక సంవత్సరం సేవ చేయుటకు ఒక వ్యక్తికి ఒక అవకాశం కలుగును. మరియు వారు ఎలా దానిని ఇష్టపడుదురో చూడండి. మన ధర్మకర్తలలో కొందరు సంవత్సరాలు, మరియు సంవత్సరాలు అలాగే నిలచి ఉన్నారు, మరియు డీకన్లు కూడ, మరియు పరిపూర్ణముగా అది శ్రేష్ఠమైనది. అయితే అప్పుడు అక్కడ ఒక నిర్ణీత సమయం లేదు. ఆ ధర్మకర్త లేక కాపరి లేక ఆ బోర్డులో ఎవరైనా ఒకరు, ఇక అంతకాలం సేవ చేయలేనని భావించిన యెడల, లేక బయటకు వెళ్ళిపోవుచున్న యెడల, అప్పుడు వారు వారి స్థానములో ఎవరో మనిషిని కలిగి ఉండునట్లు సంఘానికి తెలియపరచవలెను.

9

ఇక్కడ ఈ రాత్రి జరిగినదదే, సహోదరుడు మోర్గన్, సహోదరుడు విలియం మార్గన్ ధర్మకర్తగా రాజీనామా చేశాడు. వారికి మరో ధర్మకర్త అవసరమైయున్నాడు. సహోదరుడు సాత్మన్ మరో సమయంలో ధర్మకర్తగా నియమించబడి - అప్పుడు ఈ రాత్రి బోర్డులోనికి తీసికొనబడ్డాడు.

సంఘమున్నంత వరకు అది అధికారముతో కూడినది. మన సంఘము, అది సంఘము యొక్క అధికారమయి ఉన్నది. సంఘం తొలగించును, లేదా ధర్మకర్తను నియమించును. సంఘం పాస్టరును తొలగించును, లేక పాస్టరును ఉంచును; అది ఏమైనప్పటికిని, సమస్తం సంఘమే చేయును. అది అపొస్తలుల పద్దతి. ఆ పద్ధతిలోనే బైబిలు కాలంలో అది జరిగింది. కాబట్టి అప్పుడు ఒక నియంత లేక ఏదో సంగతిగా సంఘంలో ఒక వ్యక్తి లేడని మనం భావించుచున్నాము. మనం అది కోరుట లేదు. ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి, నా మట్టుకు నేను, ఏదైనా ఒకటి ఎన్నుకొనుచున్నప్పుడు - కేవలం ఒక ఓటును పొందుటయే - ఇక్కడ ఈ సంఘంలో ఏ ఇతర వ్యక్తి కేవలం ఒక వోటును పొందినట్టుగనే. నేనేమి చెప్పానో అది కాదు; సంఘం ఏమి చెప్పునో అదే, చూడండి. శరీరంలోని సంఘం ఏమి చెప్పునో అది. నీవు దానిని ఇష్టపడుచున్నావా? ఓ, అది సరిగా లేఖనార్థమైనదని నేను తలంచుచున్నాను. అది ఆ పద్ధతిలో అది అలాగే ఉండును.

10

ఇప్పుడు, దేవుని చిత్తమైతే ఇది నాకు, రేపు, రాబోయే ఒక గొప్ప వారముగా ఉండనై ఉన్నది. అన్ని ఆహ్వానాల నుండి రాబోయే సంవత్సరానికి నేను నిర్ణయాలు చేయవలసి ఉంది. నేను బయటకు వెళ్ళగోరుచున్నాను - కార్యాలయానికి మరియు నా ఆహ్వానాలన్నిటిని పట్టుకొని వాటిని ఇంటికి తీసుకొని వెళ్ళుదును. కాబట్టి రానున్న కొన్ని దినాలు, నేను దేవునికి ప్రార్ధించుటకై వెళ్ళుచున్నాను. ఎటు వెళ్ళాలో, ఏమి చేయాలో, నాకు చూపించి నన్ను నడిపంచుమని ఆయనకు ప్రార్ధించుటకై వెళ్ళుచున్నాను. ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పటి సమయం వంటి సమయంలో, మనం నివసించుట లేదు. దేవుడు ఆయనను ఒక స్థలం నుండి ఒక స్థలానికి, ఎక్కడకు నడిపించెనో ఆయన ఒక పట్టణంలో కొన్ని గంటలుండి, మరియొక పట్టణానికి వెళ్ళారు. అయితే ఈ రోజు అది ఒక ప్రత్యేక పద్ధతిలో, అది ఒక క్రమములో, సేవ చేయు గుంపులు మరియు చాలా సంగతులు జరగవలసి ఉన్నవి.

11

మరియు నేను ఆ విధముగ చేయుదును, నా సమస్త ఆఫ్రికా ఆహ్వానములు నేను తీసికొని మరియు వాటిని క్రింద ఉంచెదను, సమస్త ఇండియ ఆహ్వానములు, మరియు సమస్త కాలిఫోర్నియా, ఉటా, మరియు సమస్త వివిధ ఆహ్వానాలు, మరియు వాటిని కుప్పలుగా (ఆహ్వానములను) వేరుగ ఉంచెదను. నేను వాటిని పెట్టి ఉంచెదను. అప్పుడు నేను నడచుచూ మరియు ప్రార్ధించుచూ, నా కారులోనికి వెళ్ళవచ్చు మరియు ఒకటి లేక రెండు రోజులు పోవును, వెనుకకు వచ్చి ప్రార్ధించుచూ ఉందును. ఒక ప్రత్యేక స్థలానికి వెళ్ళుటకు ఏదో సంగతి నా హృదయంలోనికి వచ్చును, అప్పుడు నేను కేవలం అది తలంపేనా అని చూచెదను. అప్పుడు, తరువాత, అప్పుడు నేను, ఒకవేళ అది బలముగా ముద్ర వేయునట్లు మనస్సులోనికి వచ్చిన యెడల, ఆ నిర్ణీత స్థలం ఎక్కడున్నదో ఆ (ఆహ్వానముల) కుప్ప దగ్గరకు వెళ్ళెదను, అప్పుడు, నేను ఒక ఉత్తరము పట్టుకొని మరియు అది ఎక్కడున్నదో చూచుటకు, ఆహ్వానమును, దానిని చదివేదను, అప్పుడు, అక్కడ నుండి...

12

నేను అది చేయుటకు, కారణం ఇక్కడున్నది. నీవెన్నడైన సముద్రాల మీద ప్రయాణించిన, ఒక విమానంపై డెబ్బది రెండు గంటలు, తుఫానులలో క్రిందపైన, ఆ చుట్టూ పయనించిన దాని గూర్చి ఆలోచించుము. కొన్నిసార్లు నీవు పైన ఉన్నప్పుడు తెలియదు. కొన్నిసార్లు క్రింద, షుర్షణతో ఊగుతూ ఆ జలముల మీద ఆ మేఘాల మీద, మూడు రాత్రింబగళ్ళు ఉందువు. అప్పుడు నీవు ఒక స్థలంపై అడుగు పెట్టెదవు, మరియు మొదటి సంగతి సాతాను నిన్ను కలుసుకొనును, “మంచిదే, ఆ సేవకుల గుంపు ఇలా అన్నారు. వారిలో కొందరు అభిప్రాయమును సమ్మతిని తెలియజేయుటలో విడిగా ఉన్నారు, మరియు కొందరు అనుకూలముగా ఉన్నారు....”

చూశారా, అప్పుడు నీవు ఇలా చెప్పవచ్చును, “సరే గాని, ప్రభువు నన్ను రావలెనని కోరలేకపోవచ్చును.”

అయితే నీవు దేవునిచే పంపబడినప్పుడు, నీవు శత్రువును కలుసుకొనుటకు సిద్ధంగా ఉన్నావు. నీవు చెప్పెదవు, “నేను యేసుక్రీస్తు నామం పేరట ఇక్కడ అడుగుపెట్టాను. నేను ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వచ్చాను, ఇక్కడ ఆయన పని నెరవేర్చు వరకు నేను ఉంటాను.” చూశారా, అప్పుడు నీవు ఆ శక్తులను ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉన్నావు.

13

కనుక మీరు నన్ను ప్రేమించారు. మీరు అలా చేశారని నేను ఎరుగుదును. ఆత్మ ప్రేరణ ద్వారా దేవుడు నన్ను నడిపించునట్లుగా, అలా నేను సరియైన నిర్ణయములు చేయునట్లు, ఈ వారం నా కొరకు ప్రార్ధించండి.

ఇప్పుడు నేను చిన్నవైన కొన్ని కూటాలు కొరకు వెళ్ళుచున్నాను, నేను చిన్నవైన గంతుల కూడికలని పిలిచెదను. ఈ నెల ఎనిమిది, తొమ్మిది, పది తేదీలలో ప్లారిడా వరకు వెళ్ళుచున్నాను; లేక, టిప్టన్, జార్జియా, టిప్టన్, జార్జియాలకు జనవరి ఎనిమిది తొమ్మిది, మరియు పదవ తేదీలు, నేను అలా చెప్పుటకు నా ఉద్దేశ్యము, ఈ నెలకు బదులుగా అని. అప్పుడు నేను గ్లాస్కో, కెంటకి వెళ్ళవలసి ఉన్నది; మరియు బహుశా సమర్ సెట్, కెంటకీ; మరియు ఒక రాత్రికి, మరియు కేంప్బెల్స్-విల్, కెంటకీ కావచ్చును. మరియు సహోదరుడు రోజర్స్ ఆయన స్థలానికి, ఒక రాత్రి రమ్మని కోరాడు, ఒకసారి వారి దగ్గరకు వెళ్ళలేకపోయాము.

14

ఇప్పుడు, సహోదరుడు రోజర్స్ ను గూర్చి ప్రార్ధించండి. ఈ రోజు మనం సహవాసంలో ఉన్నాము, మరియు అతని చేయిని నేను పట్టుకున్నాను మరియు, భౌతికముగా, చెడిపోయిన అనారోగ్య స్థితిలో వానిని కనుగొన్నాను. కనుక ఇక్కడున్న సహోదరుడు రోజర్స్ కొరకు ప్రార్ధించండి. అక్కడ అతడు చాలా పెద్ద బాధ్యత తన చేతల మీదకు తీసుకొన్నాడు, మరియు అది వానిని నరముల బలహీనతగల, వానిగా చేసింది మరియు ఉక్కిరి - బిక్కిరి చేసింది, మరియు అతడు బాగా చెడిన ఆర్యోగ్యంతో ఉన్నాడు, మరియు అతని భార్య చాలా దురవస్థలో ఉన్నది. కనుక చక్కని దేవుని పిల్లలైన, ఆ చిన్న జంట కొరకు ప్రార్ధించండి; ప్రభువు చిత్తమైతే, ఒక రాత్రి ఆయన దగ్గరకు వచ్చుదునని నేను ఆయనతో చెప్పాను.

15

మరియు సహోదరుడు రడల్, మన యొక్క చిన్న, ఇక్కడ 62 ఎగువన, మన చిన్న సహోదరీ సంఘాలలో ఒకటి, ఆ చిన్న సిగ్గుతోనున్న పాతకాలపు యవ్వనుడు, ఇక్కడకు వచ్చాడు మరియు ముఖంపైకెత్తి కూడ చూడలేకుండ ఉన్నాడు. అతడు ఇంటి దగ్గరకు వచ్చియున్నాడు. మరియు ఓ, అతడు సాధారణమైనవాడై ఉండెనని ప్రజలు తలంచెనని నేను ఊహించుచున్నాను, కాని అక్కడ ఆ బాలుని గూర్చి కనబడు నిజమైనది ఏదో ఉండెను. నేను యదార్థంగా వానితో నిలచి ఉన్నాను, మరియు వానితో నిలచి ఉన్నాను, అన్నాను, “సహోదరుడా రడల్, నీవు చేయగలవు.”

అతడు అనెను, “సహోదరుడా బ్రెన్హాం, ఒక సమూహము ముందు నేను పైకి లేచి నిలబడినప్పుడు, నా గుండె నా గొంతులోనికి వచ్చును. నేను కేవలం ఒక మాట కూడ చెప్పలేకపోవుదును.”

నేను అన్నాను, “అక్కడ నిలబడముము మరియు దానిని వెనుకకు తెచ్చి క్రిందకు మింగేయి, మరియు ప్రభువు యొక్క నామములో, పలుకుము, చూశారా.” మరియు ఇప్పుడు ఈ పరిమాణములో గల ఒక గుడారం అతడు కలిగి ఉన్నాడు, ఇక్కడ రహదారి మార్గమునకు పైన, సరియైన ఏదో చేయుచున్నాడు. దానితో నిలచి ఉండుము. ఆ బాలుడు ఒక దేవుని పిలుపు కలిగి ఉన్నాడు. నేను అతని తల్లిని, అతని తండ్రిని ఎరుగుదును; వారు చాలా చక్కని ప్రజలై ఉన్నారు.

16

అప్పుడు ఇక్కడ న్యూ-ఆల్బనీ దిగువన, ఒక ర్రాత్రి, జూనీని మనం కలిగి ఉండవలసి ఉన్నది. మరియు, ఓ, నీకు తెలియును, అలా అక్కడ ఒక రాత్రి మరియు ఇక్కడ ఒక రాత్రి, కేవలం చిన్న కూడికలు పెట్టెదను.

జనవరి ఇరవై-ఐదు, వరకు, ప్రతిదినము నిర్ణయించిన పథకము ప్రకారం జరిగిన యెడల, క్రైస్తవ పనివారల సంపూర్ణ సువార్త ప్రపంచ అంతర్జాతీయ కన్వెన్షనుకై మయామికి, వెళ్ళగలను మరియు అక్కడ నుండి కింగ్స్టన్, హయిటి, దక్షిణాఫ్రికా దిగువకు, మరియు మెక్సికోలో ఎగువకు. మరియు అక్కడ నుండి, ఆఫ్రికాలోనికి, ఆఫ్రికా నుండి, స్కాండినేవియాలోని ఎగువకు. మరియు ఆ విధముగా ముందుకు. సంవత్సరంలో అతిపెద్ద భాగము, సముద్రాలకు అవతల జరుగు సమావేశాలకు పట్టునని, నేను నమ్ముచున్నాను. కనుక నేను తప్పక సరియైన నిర్ణయము చేయునట్లు, నా కొరకు ప్రార్ధించండి.

17

ఇప్పుడు, అది దేవుని చిత్తమైనయెడల సరిగా అలా జరుగును; అలా కాని యెడల, నేను ఏ స్థలమునకైకను, ఎక్కడికైనను వెళ్ళుటకు ఇష్టపడుచున్నాను. నేను వెళ్ళగోరుటకు, అది ఎక్కడున్ననూ అదేమియు కాదు. అయితే అలా దేవుడు నాలో ఉంచిన ఈ భూమి ధూళిలో నిలబడుటకు నేను శక్తిగలవాడనై ఉన్నంత కాలము, ఈ శరీరము నుండి మరణం నన్ను తీసుకొనువరకు ఆయన పరిశోదించజాలని ఐశ్వర్యమును గూర్చి నేను బోధించగోరుదును. నాకు ఆయన మాత్రమే సహాయము చేయగలిగినయెడల, దేవుని కృప ద్వారా, నా తీర్మానము అదే. ఆయన తన హస్తమును నా మీద నుండి తీసివేసినయెడల, ఆ అపవాది నన్ను చంపును, కనుక దేవుడు ఆయన కృపాహస్తమును నా మీద ఉంచునట్ల మీరు కేవలము ప్రార్ధించండి.

నేను ఆయన తీర్పు గూర్చి అడుగట లేదు; నేను ఆయన కృప కొరకు అడుగుచున్నాను, చూశారా; ఇప్పుడు ఆయన తీర్పు, వద్దు, నేను దానికి నిలువలేను. కేవలము ఆయన కృప కొరకే నేను ప్రాధేయపడుచున్నాను, కారణం నేను అయోగ్యుడునని ఎరుగుదును, మరియు యోగ్యుడు ఒక్కడూ లేడు. మనం ఆయన తీర్పును కోరుట మంచిది కాదు. మనకు ఆయన కృప కావలెను.

18

ఇప్పుడు ఈ రాత్రి, కొంచెం గొంతు బొంగురు పోయినది, కాని ఈ చక్కని క్రైస్తవ గుంపుతో మాట్లాడే అవకాశమును విడువను. ఆగండి, నేను ఈ ప్రకటన చేయుముందు, నన్ను ఒక సంగతి చెప్పనివ్వండి. ఇప్పుడు మీరందరూ ఒక హృదయంతో, ఏక బావనతో మీరందరు ఉంటుండగా, ప్రతి సంగతి మాధుర్యంగా సాగుచుండగా, నా సంఘముతో ఒక రెండు నిమిషాలు నన్ను కొద్దిగా మాట్లాడనివ్వండి.

19

వినండి, సువార్తలో నా ప్రియమైనవారలారా, యేసు రక్తముతో కొనబడిన నాకు గల కిరీటంలో నక్షత్రములారా. నేను మరల ఈ విధంగా వెనుకకు వచ్చి ఒక ఉద్దేశం కొరకు చేశాను. మేము వేట పర్యటనలో సహోదరుడు రాయ్ రాబర్సన్, సహోదరుడు బాంక్స్ ఉడ్, మరియు నేను ఒక యాత్రలో మేము నిర్ణయించాము, మేము వెనకకు వచ్చి. సహోదరుడు రాయ్ మరియు మేమంతా మాట్లాడుచున్నాం - మన పాస్టరు సహోదరుడు నెవిల్ ని గూర్చి - సమయమంతా మీ అందరి ముందు సహకాపరి పనిచేయుచు మరియు ప్రతి సంగతి చేయు ఒక మనుష్యుడు. మేము ఆయనను ప్రేమించుచున్నాం; అయితే ఇంకా సహోదరుడు - నెవిల్ సహాయ పాస్టరుగా ఉంటుండగా సహోదరుడు నెవిల్ కి అందులోనికి త్రోయబడుట అది కొంచెం కఠినమైన సంగతిగా కనిపించుచున్నది, చూడండి. అందుచేత మేము ప్రార్ధించాము, ఆ పని నేను చేయుట ప్రభువు చిత్తము అయి ఉన్నట్లు అది కనిపించినది. ఇప్పుడు, ప్రభువు నాకు సహాయం చేసినట్లయితే, నేను చేయగలిగిన శ్రేష్ఠమైనది చేయుదును అని ప్రభువును అడిగితిని.

20

నా సొంత సమర్పణ చేసికొనిన తరువాత, మరియు ఇప్పుడు సంఘం ఆ విధంగా చేసిన తరువాత.... ఇప్పుడు, గత కొద్ది కూటాలలో ఆయన ఆశీర్వదించిన విధముగా, దేవుడు ఆశీర్వదించిన యెడల, ఆ చిన్న సమర్పణతో మనం దానిని పట్టుకుని ఉండినయెడల ఆయన ఏమి చేయును, చూశారా. కేవలము దానిని అలాగే పట్టుకుని ఉండండి. ఇప్పుడు వినండి. మీరు ఒకనితో ఒకరు ప్రేమ కలిగియున్నారు; దేవునికి మీ చేతులెత్తి ఈ వారములో మరియు ఈ ఉదయవేళలో వేదికల మీద మిరు ఎలా నిలిచియున్నారు నేను చూశాను. మరియు ఆ ప్రేమగల ఆత్మ మీ మీదుగా, చుట్టూ కదలుచున్నది.

ఇప్పుడు ఆ అపవాది ఒక చెడు సంగతి చెప్పినప్పుడు, మీరు వినవద్దు. ఒకవేళ ఆ అపవాది మీకు కొంత చూపించినప్పుడు, లేక శరీర సభ్యులలో ఒకని గూర్చి మీకు ఏదో కొంత చెడును గూర్చి చెప్పినప్పుడు, మీరు దాని నమ్మవద్దు. ఎందుకనగా, నీవు నమ్మిన వెంటనే, నీ అనుభవాన్ని నీవు చెడగొట్టుకుంటావు.

21

క్రీస్తు శరీర సభ్యులలో ఒకడు ఏదో చెడ్డది చేయుట మీరు చూచిన యెడల ఎవ్వరితోను చెప్పవద్దు; అయితే ఆ సభ్యుని దగ్గరకు వెళ్ళి ప్రేమతో వారిని వెనుకకు క్రీస్తు దగ్గరకు తీసుకురాలేవేమో చూడుము. నీవు అలా చేయలేనప్పుడు, అప్పుడు ఒక వ్యక్తితో చెప్పండి లేక వారిని నీతో రానీయండి. దానిని లేఖనం చెప్పిన పద్ధతిలో చేయుము, చూశారా.

ఎవరో ఒకరు “సహోదరి పలాని-పలాని, లేక సహోదరుడు పలాని-పలాని” అని చెప్పినయెడల, నీవు దానిలో ఒక మాట అయినా నమ్మవద్దు. కేవలం మీరు సరిగా దానిని విడచి వెళ్ళనివ్వండి. ఏలయనగా అది అపవాది మిమ్మును ముక్కలుగా చీల్చుటకు ప్రయత్నించుచున్నదని జ్ఞాపకముంచుకొనండి. ఇప్పుడు లోపలికి వచ్చునప్పుడు వానిని చూడండి; కారణం అతడు అది చేయును. ఇప్పుడు మీరు ఇంటిలోనికి మంచి మనుష్యుడైన విశ్వాసాన్ని రానివ్వండి, అక్కడే నిలబడండి, మరియు అపవాది యొక్క ఒక సంగతి గ్రహించవద్దు. ఈ ప్రజలు పరలోక స్థలాలలో మీతో కూర్చునియున్నారు. దేవుని ఆశీర్వచనాలతో చుట్టూ కలసి సహవాసం చేయుచున్నారు. బల్ల దగ్గర సంస్కారమును తీసికొనుచున్నారు. మరియు ఆ పరిశుద్దాత్మడు వారు దేవుని పిల్లలై యున్నారని సాక్ష్యము మిచ్చియున్నాడు. అందుచే నిజమాధుర్యంగా, దయార్థ హృదయంతో, క్షమించుచు, ప్రేమించుచు కేవలము నిజముగా ఉండండి. ఆ మరో వ్యక్తి నీకు విరోధంగా చెడు మాట్లాడిననూ, నీవు వారితో మాధుర్యంగా మాట్లాడుము. అప్పుడు ఎంత మాధుర్యం మీ దగ్గరకు వచ్చునో గమనించండి, చూశారా. అది యదార్థం. ఎల్లప్పుడు సరిగా కీడు కొరకు మేలు చేయుము. మిమ్మును అసహ్యించుకొను వారిని ప్రేమించండి. సరిగా....

22

ఆ వెనుక ఉన్న ఆ చిన్న బాలిక ప్రియ మాధుర్యమైన నీవు మేలు అనుభవించుచున్నావా? అది మంచిది. నేను అందుకు కృతజ్ఞుడను. అవును, సరిగా వెనకబడిపోయావు... ఆమె అక్కడ చిక్కులో ఉండి రెండింతల వెనకబడిపోయింది. ప్రభుయేసు ఇప్పుడు ఆమెను ముందుకు తెచ్చి, సమావేశాల్లో ఆమెను ఇక్కడుంచారు. అందుచే మేము దానికి కృతజ్ఞులము. కొన్నిక్షణాల క్రితం, వేదిక విడిచినది దాని కొరకే. వారు ప్రార్ధించారు, ప్రార్ధించారు - ప్రభువు దగ్గర నుండి పొందలేకపోయారు.

ఇప్పుడు, అది అలా చేయడానికి నిశ్చయత కలిగియుండండి. నీమట్టుకు నీవే అలా దేవునికి ప్రతిజ్ఞ చేసికోండి. “దేవా, నీ కృప ద్వారా నేను చేయగలిగినదదే.” ఎవరైనను ఎప్పుడైన చెడు చెప్పినప్పుడు, లెక్క చేయకు; తిరిగి మంచి చేయుము. కీడు చేయ ఆలోచించవద్దు. నీవు కీడు చేయ ఆలోచించిన యెడల, నీవు కేవలం దానిని వేషధారిగా చెప్పుచున్నావు, అప్పుడు నీవు పొరపాటులో ఉన్నావు. ఆ వ్యక్తితో నీవు నిజముగా మంచి భావన పొందేవరకు నీమట్టుకు నీవే దేవునికి సరిగ్గా సమర్పించుకొనుచు ఉండుము. అది చేయుట అదే మార్గము. అపుడు దేవుని మాధుర్య దీవెనలు సరిగా ఉండగలవు, ఓ, అది నీ ఆత్మను ఆవరించి ఉండును. విజయశీలునిగా జీవించుటకు అదే పద్ధతి. అప్పుడు ప్రేమలో నీవున్నంత కాలము, ఏదియు నీకు హాని చేయదు. సరే, నీవు చెప్పుదువు....

23

చూడండి, “నీవు భాషలు కలిగియుండినను, అవి నిలిచిపోవును. నీవు జ్ఞానము కలిగియుండినను, అది నిరర్ధకమగును. ప్రవచనములు విఫలమగును. అయితే నీవు ప్రేమను కలిగియున్నయేడల, అది ఎన్నటికీ ఉండును,” చూశారా.

మీరు ప్రేమించిన వారినే ప్రేమించవద్దు, అయితే మిమ్మును ప్రేమించని వారిని ప్రేమించుము. నన్ను ప్రేమించే ఏ వ్యక్తినయినా ప్రేమించుట నాకు తేలిక, అయితే నిన్ను ప్రేమించని ఎవరో వ్యక్తిని ప్రేమించుటకు ప్రయత్నించుము. అక్కడే నీవు క్రైస్తవుడవై ఉన్నావో లేదో నీవు పరీక్షించుకొనగలవు. నిన్ను ప్రేమించని ఎవరో వ్యక్తిని, ఇంకా నీవు హృదయంలో ప్రేమించవలెను. ఇప్పుడు, నీవు అది చేయని యెడల, అప్పుడు సరిగా దేవుని పట్టుకొనియుండుము. అది అక్కడున్నది, కారణం అది సత్యమైయున్నదని నేనెరుగుదును. ఆమెన్. అది సత్యమైనదని నేనెరుగుదును.

24

ఇప్పుడు మనం ప్రశస్త వాక్యమును తెరచుటకు వెళ్ళుచున్నాము. ఇప్పుడు, హెబ్రియులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయం, కేవలము ఒక సంక్షిప్త వర్తమానం కొరకు, కొంచెం గొంతు బొంగురుపోయి యుండగా, అయితే ఈ సహోదర, సహోదరీలతో ఒక ఆశ్చర్యకరమైన మధ్యాహ్నమును కలిగియున్నాను. మరియు దాదాపు 6 గంటల వరకు నేను లోనికి రాలేకపోయాను. కేవలం నేను గదిలోనికి పరుగెత్తి మరియు పడకగది వద్ద, పడక ప్రక్కగ మోకాళ్ళ వంచి కొన్ని క్షణాలు ప్రార్ధించాను. పైకి లేచి, నా బైబిలు పట్టుకుని మరియు చదువనారంభించాను. అక్కడ ఒక మేగజైను పడియుండుట చూశాను. అది ఆఫ్రికనుల భాషలో వ్రాయబడినందున, నేను దానిని చదువలేకపోయాను.

కొన్ని సమయాలలో చదువుచున్నప్పుడు, నీవు ఒక వాక్యమును తాకగలవు, మరియు ఆ వాక్యము నీకు సజీవముగ ఉండును. ఆ పద్ధతిలోనే ఒక సేవకుడు అతని వర్తమానమును పొందును. కేవలం ప్రారంభించి చదువుచు, ఏదో సంగతి, ఆ బైబిలు నుండి చదువుము. నీవు తెలిసికొను మొదటి సంగతి, ఏదో విషయం నిన్ను తాకును. ఆ ఏదో సంగతికి అప్పుడు మరొక సంగతి చేర్చును. అప్పుడు క్రింద గీత గీయము, మరియు సరిగ వేదిక దగ్గరకు వెళ్ళవలెను, మరియు దానిని చదవవలెను. ఆ మిగిలిన పనిని దేవుడు చేయును. చూశారా, ఆయన ఆ మిగిలిన పని అంతటిని గూర్చి శ్రద్ధ వహించును.

ఇప్పుడు, కొన్నిసార్లు నీవు ఏ సంగతులు ఆలోచించావో, ఆ కొన్ని విషయాలు చిన్న నోట్స్ ను వ్రాసికొను వరకు నీవు కొనిపోబడుదువ. కొన్నిసార్లు ఒక సమావేశములో, ఎక్కడకు నీవు రావలసిన ఉన్నావో, అలా ఆ వేదిక దగ్గరకు త్వరగ వచ్చి, ఆ విధంగ, నీకు వచ్చిన ఆ కొన్ని విషయాలు సరిగ చదువుము, ఆ పరిశుద్దాత్మడు వాటిని నీకు మరల సజీవంగ తెలియజేయును. అలా అనేకసార్లు జరిగెను.

25

ఇప్పుడు హెబ్రి 11, 1వ వచనం ప్రారంభించుచు మరియు కేవలము కొన్ని వచనాలు చదువుదము.

విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వినుటకు ఋజువునై ఉన్నది.

దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి.

ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్ధాములచే నిర్మింపబడలేదనియు, విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము.

అది భాగ్యమైనది కాదా? మూడవ వచనం నన్ను మరల చదవనివ్వండి. దగ్గరగా వినండి.

ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడి పదార్థాములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. [దేవుని వాక్యము అయి ఉన్నది!]

విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినొందియు అ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు.

విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను; అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడైయుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. [ఐదు వందల సంవత్సరములు జీవించినను!]

విశ్వాసము లేకుండా దేవునికి ఇష్ణుడైయుండుట అసాధ్యము: దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను గదా.

విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవునిచేత హెచ్చరింపబడి, భయభక్తులు గలవాడై, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను.

26

ఇప్పుడు ఒక క్షణం మన తలలు వంచి ప్రార్ధించుకొందాము.

ప్రభువా, మా మిక్కిలి కృపగల దేవా, తండ్రి వందనాలు చెల్లించుచూ ఇప్పుడు మేము నీ సన్నిధిలోనికి వరల వచ్చియున్నాము. నీ సన్నిధిలో ఇప్పుడు మేము దానిని అనుభవించుట మాత్రమే కాదు, ఎందుకనగా అలా ప్రార్థించుటకు మేము మా తలలు వంచియున్నాము. అయితే మేము ఎడతెగక నీ సన్నిధిలో ఉన్నామని నమ్ముచున్నాము, ఏలయనగా “ప్రభువు యొక్క కన్నులు భూమియందంతటా సంచారము చేయుచున్నవి.” నీవు సమస్త సంగతులు ఎరుగుదువు. నీవు నా హృదయము యొక్క ఆలోచనలు ఎరుగుదువు.

కాబట్టి ప్రభువా, ఆ కారణం చేత ఈ విన్నపము అడుగుటకు మేము తలలు వంచియున్నాము. నీకు విరోధముగా ఉన్న మా అపరాధములను విశ్వాస ఘాతుకములను నీవు క్షమించెదవని, మరియు మాట్లాడుటకు మా పెదవులను, మరియు వినుటకు మా చెవులకు మరి ఎక్కువగ నీ కృపను మరొకసారి మాకు విస్తరింప చేసి, ఈ రాత్రి నీ వాక్యము మికు నిజమైన బలమైనదిగ ఉండునట్లును చదువుటకు మేము ఎన్నుకొన్న ఈ కొద్ది వచనాలు భూమి మీద ఉన్న మర్మమైన శరీరంలోని ప్రతి సభ్యునికి బలమైన గొప్ప సహాయముగ ఉండునట్లు చేయండి. మొదట జన్మించిన ఆ ఆత్మీయ సంఘము, ఒక మచ్చ ముడత లేకుండా ఆ రోజు దేవుని సన్నిధిలో నిలుచునట్లు శుద్దీకరించబడి, కడుగబడినదై యేసు రక్తంచేత ఆ సంఘం కొనబడినది. మన ప్రభుయేసుని నీతి వాత్సల్యతల ద్వారా ఈ దేవుని మంచితనములో మేము పాలిభాగస్తులమని నమ్ముటకు ఆ విశ్వాసమును కలిగి ఉండుటకు మేము నీకు ఎంతగానో వందనములు చెల్లించుచున్నాము.

27

ఇప్పుడు సమస్త వ్యాధులను నీవు స్వస్థపరచుదువనియు ప్రార్ధించుచున్నాము. సరిగ కొన్ని క్షణముల క్రితం రెండింతల బాధతో అక్కడ గదిలో పడి ఉన్న ఆ చిన్న బాలికను ముట్టిన౦దుకు, నీకు వందనములు చెల్లించుచున్నాము; ఆ చిన్న బాలిక విశ్వాసమును కలిగి, నీ కృపను మరియు నిన్ను అంగీకరించుచు, ఆమె బయటకు నడచి వెళ్ళుట చూచుటకు దీని కొరకు మేము నీకు వందనములు చెల్లించుచున్నాము. కెంటకీలో ఉన్న సహోదరి, బేకర్ యొక్క ప్రేమించబడిన చిన్న దానిని నీవు జ్ఞాపకముంచుకొనమని ప్రార్ధించుచున్నాము. మరియు సహో, నెవిల్ మొరపెట్టిన దాని గూర్చి, మరియు, ఓ దేవా, ప్రతిచోట గల లెక్కింపలేని వ్యాధిగ్రస్తుల శిబిరము కొరకు మరియు ప్రత్యేకముగ, ప్రభువా, రక్షించబడనివారు మరియు నిన్ను ఎరుగనివారు; ఒకవేళ వారి పాపములలో చనిపోవలసినయెడల, వారు నీవు ఉన్న చోటికి రాలేకపోయేవారు.

మాకు సాక్ష్యమును మరియు శక్తిని, వాక్యమును మాట్లాడుటకు ధైర్యమును, మరియు దానిని ఎప్పుడు పలుకవలెనో కావలిసిన జ్ఞానమును దయచేయమని మేము ప్రార్ధి౦చుచున్నాము. మేము తగినంత పలికినప్పుడు మాతో మాట్లాడుము, అప్పుడు మేము బయటకు నడచి వెళ్ళి, పరిశుద్ధాత్మ మరియు దాని యొక్క ఆశ్చర్యకార్యములతో ప్రజలను ఆశ్చర్యములో నింపుదుము గాక. దానిని అనుగ్రహించండి, ప్రభువా. ఇప్పుడు మేము అడిగినది వినుమని ప్రార్ధించుచు, యేసు నామములో మేము దానిని అడుగుచున్నాము. ఆమెన్.

28

నేను కొద్ది సమయము “ఇంద్రియములు” అను అంశముపై మాట్లాడుటకు ఇష్టపడుదును. స్వభావ సిద్ధమైన మనిషికి ఐదు ఇంద్రియాలు కలవని మనకు బోధించబడినది. మరియు ఆ ఐదు ఇంద్రియములు వానిని అదుపులో ఉంచును, వానియొక్క... లేక, దేవుడు వాని భూసంబంధమైన గృహముతో సంబంధము కలిగి ఉండుటకు, వానికి ఈ ఐదు ఇంద్రియములను ఇచ్చెను. మరియు ఆ ఇంద్రియములు ఇలా తెలియబడినవి: చూచుట, రుచి చూచుట, స్పర్శ, వాసన, వినుట. ఆ స్వభావిక మనిషికి తెలిసిన ఆ ఐదు ఇంద్రియములు, మరియు అవి మంచివై ఉన్నవి. ఈ ఇంద్రియములలో ఏ ఒకటి పని చేయుటకు విఫలమయిన యెడల, మనం పనిచేయలేము, లేక ఒక సాధారణ జీవితము జీవించలేము. నీ దృష్టి, వినుట, స్వర, వాసన, లేక రుచి చూచుట, ఇవి లేకుండ మనం మామూలు స్థితిలో ఉండలేము. అలా మనం తాకలేని జీవము యొక్క కొంత భాగము, ఆ ఇంద్రియం పనిచేయకుండా, అక్కడ ఏదో సంగతి తప్పిపోవుచున్నది. మరియు అవి మంచివై ఉన్నవి. మరియు అవి ఉపయోగకరమైనవి, మరియు అవి దేవునిచే మనకు ఇవ్వబడినవి.

29

దేవుడు ఆ ఇంద్రియములను ఇచ్చెను. అయితే అవి నీకు బహుమతిగా ఇవ్వబడినవి. మరియు నీవు ఎలాగు దేనికి ఈ ఇంద్రియాలను స్వాధీనం చేయుచున్నావో అనేదానిపై అది ఆధారపడియున్నది. ఆ ఐదు ఇంద్రియాలు నీవు ఏ పద్ధతిలో లోపరచితివో, అలా ఆ పద్ధతిలోనే నీ జీవితము స్వాధీనపరచబడగలదు. నీవు ఏమి చూచితివో, నీవు ఏమి వింటివో, నీవు ఏమి రుచి చూచితివో, వాసన చూచితివో, లేక స్పర్శ కలిగి ఉంటివో, నీవు అదే అయి ఉన్నావు. ఏమైనప్పటికి ఆ ఇంద్రియాలు దేనికి స్వాధీనపరచబడినవో, అవి నీ మీద ఆధిపత్యము చెలాయించును.

దేవుడు ఆ ఐదు ఇంద్రియములను ఇచ్చినందున మనం దేవునికి కృతజ్ఞులమై ఉండవలెను, అయితే ఇవ్వబడిన ఈ ఐదు ఇంద్రియాలు, నీకు మార్గదర్శిగా ఉండుటకు అని అర్థం కాదు. భూసంబంధమైన వాటికై నీకు సంబంధము కలిగి ఉండుటకు అవి ఇవ్వబడినవి. అయితే అక్కడ ఉండిన ఆరవ ఇంద్రియం నీకు ఇవ్వబడెను, మరియు, ఆ ఆరవ ఇంద్రియం, క్రైస్తవునికి మాత్రమే చెందును, మరియు నీవు ఒక క్రైస్తవునిగా అగువరకు ఈ ఆరవ ఇంద్రియము నీవు కలిగి ఉండలేవు; స్వభావ సిద్ధమైన వ్యక్తి కొరకైన ఆ ఐదు స్వభావ సిద్ధమైన ఇంద్రియాల కంటె ఏదైనా ఎక్కువ నీవు ఎన్నడైనా కలిగియుండగలది ఆ ఒకే మార్గము అయి ఉన్నది. అయితే, ఆ క్రైస్తవునికి, విశ్వాసమే ఆరవ ఇంద్రియమని అత్యుత్తమముగా తెలియజేయబడినది. అది ఒక్కటే అలా పరిపాలించి మరియు నిన్ను నడిపించును, మరియు అది మిగిలిన అన్ని ఇంద్రియాలకు పై అధికారిగా ఉండును. ఆ మిగిలిన, ఐదు ఇంద్రియాలకు, సమస్త ఇంద్రియాలకు అది పై అధికారిగ ఉండును.

30

ఇప్పుడు, మనం ఆరవ ఇంద్రియమును పొందినందున ఆ ఐదు ఇంద్రియాలు ఇక మంచివికాదని, ఇక అక్కరలేదని నేను చెప్పుటలేదు. అవును, అవి ఉన్నవి. ఆ ఐదు ఇంద్రియాలు దేవునిచే నీకివ్వబడినవి మరియు అవి ఉపయోగింపబడుచున్నవి. అయితే ఆ ఐదు ఇంద్రియాలు దేవుని వాక్యమునకు విరుద్ధముగా పనిచేయునప్పుడు, అప్పుడు అవి అబద్ధము లాడుచున్నవి.

ఇప్పుడు, ఆరవ ఇంద్రియము అబద్ధమాడదు, అది అతీతమైన ఇంద్రియమై ఉన్నది. మరియు నేనేమి మాట్లాడగోరుచున్నానో అదే. ఈ ఉదయం నేను 'ఒక అతీతమైన సూచన' గూర్చి మాట్లాడాను. మరియు ఆ రాత్రి: 'ఒక అతీతమైన ఇంద్రియమును' గూర్చి మాట్లాడుతాను.

31

మరియు పరిశుద్ధాత్మయే అతీతమైన ఇంద్రియం అయి ఉన్నది. అది నీలో నివసించు దేవుని విశ్వాసమై ఉన్నది. మరియు ఆరవ ఇంద్రియానికి ఐదు ఇంద్రియాలు నీవు లోపరచగలిగినయెడల, అది నీకు మార్గదర్శిగా ఉండి మరియు ఆ మిగిలిన ఐదు ఇంద్రియములు అన్నింటిని అతీతమైన ఆ ఇంద్రియము యొక్క స్వాధీనములోనికి తెచ్చును. ఎందుకనగా స్వభావ సిద్ధమైన మనిషికి పైగా ఆత్మీయ మనిషి ఉన్నట్టే, స్వభావ సిద్ధమైన మనిషికి పైగా చాలా దూరంలో అది ఉండును. స్వభావ సిద్ధమైన మనిషికి మరియు వాని ఐదు ఇంద్రియాలకు పైగా, ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నవో అంత ఎత్తుగా, అది అంత దూరములో ఉన్నది. అది నీవు చూడలేని చాలా సంగతులు నీవు నమ్మునట్లుగా చేయును, ఆ ఐదు ఇంద్రియాలు ఎన్నడూ దాని గూర్చి ఆలోచించి ఉండునని నీవు తలంచని స్థానములో నీవు పనిచేయునట్లు చేయును. ఆ అపవాది ఈ ఐదు ఇంద్రియాలలో ప్రవేశించును మరియు అది నీకు అబద్ధం చెప్పును. అయితే ఆ ఆతీతమైన ఇంద్రియమును వాడు ముట్టుకొనలేడు. అది వానికి అందకుండ అవతల దూరముగ ఉన్నది. అది దేవుని నుండి వచ్చును. అది విశ్వాసముగా పిలువబడెను. విశ్వాసము అలా గొప్ప సంగతి అయి ఉన్నది.

32

ఐదు ఇంద్రియాలు ఆరవ ఇంద్రియమును స్వాధీనం చేసికోలేవు, అయితే ఆరవ ఇంద్రియమే ఐదు ఇంద్రియాలను స్వాధీనపరచుకొనును. అతీతమైన ఇంద్రియము స్వభావసిద్ధమైన ఇంద్రియాలను లోపరచుకొనును, మరియు ఈ ఐదు ఇంద్రియాలు చూచుట, రుచి చూచుట, స్పర్శ, వాసన చూచుట, వినుట. మరియు ఈ అతీతమైన ఇంద్రియము దేవుని వాక్యమును నమ్మునట్లు చేయునదైయున్నది, కేవలము దాని గురించే మాట్లాడును. నీవు చూడలేని, రుచి చేయలేని, స్పర్శించలేని, వాసన చూడలేని, లేక వినలేని సంగతులను నీవు నమ్మునట్లు చేయును, కారణమేమనగా అది దేవుని వాక్యమును తీసికొనును. మరియు అది నీకు దేవుని వాక్యమును విడుదల చేయును, అయితే విశ్వాసము ద్వారా దేవుని వాక్యమును తప్ప, అక్కడ ఉన్న మరేదైనా ఇతర విషయానికి నీవు విరుద్ధముగా నడుచుకొనునట్లు చేయును. విశ్వాసము ద్వారా, విశ్వాసము దానిని చేయును.

33

ఇప్పుడు, ఇంద్రియాలను గూర్చి ఈ చిత్రమును ఇచ్చుచున్నాను, ప్రకృతి సంబంధమైన మనిషి ఈ ఇంద్రియములతో పుట్టాడు, అందుచే అవి స్వభావ సిద్ధముగా ఇవ్వబడిన ఇంద్రియములు. అతడు మానవ జ్ఞానముతో ఆలోచిస్తూ, దాని గూర్చి అతడు ఎన్నడైనా నిజముగా తెలిసికొనగల సంగతి అది మాత్రమే. అతడు ఒక మనిషిగా మాత్రమే ఆలోచించగలడు, అతడు ఒక మనిషిగా చూడగలడు, అతడు ఒక మనిషిగా అర్థం చేసికొనగలడు, అతడు ఒక మనిషిగా వినగలడు; అయితే అతడు పైనున్న అధికారముచే పరిపాలించబడినప్పుడు, లేక తిరిగి-జన్మించినప్పుడు, లేక మనం దానిని “త్రిరిగి జన్మించుట” అని దానిని పిలుస్తాము, అప్పుడు ఆ ఆరవదైన అతీతమైన ఇంద్రియం అతనిని పట్టుకొనును, మరియు ఆ విధంగా చేయుటలో అతడు గ్రహించలేని అవగాహనలు, అతడు చూచి ఉండని సంగతులు, అతడు వినయుండలేని సంగతులు నమ్ముటకు కావలసిన విశ్వాసము కలిగిన ఒక స్థలము లోనికి అతీతమైన ఇంద్రియము వానిని పైకి లేపును. అతడు ఏలాగైనను దానిని నమ్మును, ఏలయనగా ఆరవదైన అతీతమైన ఇంద్రియం ద్వారా అతడు పరిపాలించబడెను. ఓ, ఆలోచించుటకు దానిని నమ్ముట ఎంత సమన్యమైనదో, మరియు దాని నెరిగి ఉండుటకు అది ఎంతగా మరపురానిదైయున్నది!

34

ఇప్పుడు, తిరిగి జన్మించు వరకు నీవు నమ్మలేవు. పరిశుద్దాత్మ ద్వారా తప్ప ఏ మనుష్యుడు యేసును క్రీస్తుగా పిలువలేడని, బైబిలు చెప్పుచున్నది. ఈ గత వారం దాని గుండా మనం వెళ్ళాం. వారు నేను చెప్పుట విన్నప్పుడు ప్రత్యేకంగా పెంతెకోస్తు విశ్వాస ప్రజలు గందరగోళంలో ఇటు - అటు చెదరిపోవుచున్నారు. యేసు, యొహాను 5:24 లో “నా మాటలు విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు” అని చెప్పెను. నిత్యజీవము కేవలము దేవుని నుండి మాత్రమే వచ్చును. మరియు “పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఏ మనుష్యుడు యేసును క్రీస్తు అని చెప్పలేడు.”

నీవు ఎవరో మానవ మేధస్సు ద్వారా నేర్చుకొన్నది, సహజ ఐదు ఇంద్రియాల ద్వారా నేర్చుకొన్నది మాత్రమే తీసికొనుచున్నావు. అయితే పరిశుద్ధాత్మ అయిన ఆరవ ఇంద్రియములోనికి వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ, ఆ ఐదు ఇంద్రియములు సమస్త తర్కవితర్కములను తీసివేయును, మరియు ఆరవ ఇంద్రియములోనికి నిన్ను ఎత్తికొనిపోయి, నీవు చూడని, రుచి చూడని, తాకలేని, వాసన చూడలేని, లేక వినలేని సంగతులను నమ్మునట్లు చేయును. అది నీకు ఏదో చేయును. అప్పుడు నీవు యేసే క్రీస్తని చెప్పగలవు, ఏలయనగా దానికి నీవు సాక్షిగా ఉన్నావు; మానవ మేదస్సు ద్వారా బోధన నీకు ఏమి బోధించినదని కాదు, అయితే నీవు ఏమి అనుభవపూర్వకముగా కలిగియున్నావు అను దానిని బట్టియే.

35

“బ్రెన్హాం సోదరుడా - అప్పుడు ఆరవ ఇ౦ద్రియము ఏమి చేయును? ఆరవ ఇ౦ద్రియము ఎందుకు వచ్చినది?”

ఈ కారణం చేత ఆరవ ఇ౦ద్రియము వచ్చినది. ఇప్పుడు, ఆరవ ఇ౦ద్రియము విశ్వాసము, అతీతమైన ఇ౦ద్రియము అయి ఉన్నది. నీలో ఉన్న ఐదు ఇంద్రియాలు దేవుని వాక్యమునకు విరోధముగా ఉన్న ఏదైనను కాదనుటకు మాత్రమే, దానికొరకే ఆరవ ఇ౦ద్రియము వచ్చియున్నది. అందుకొరకే ఆరవ ఇ౦ద్రియము ఉన్నది. హేతువాదాలు విడిచి పెట్టమని లేఖనం మాట్లాడుచున్నది.

చూడుము, ఆ ఐదు ఇంద్రియాలతో నీవు తర్కించగలవు. “మంచిది, ఇప్పుడు, ఎందుచేత ఈ మనుష్యుడు అతడు ఎందుకు...?”

అయితే ఆరవ ఇ౦ద్రియము ఎంత మాత్రము అవన్నియు చూడదు. అది దానికి చాల అవతల ఉన్నది! ఆ ఇ౦ద్రియాలతో ఎంతమాత్రము వాదించలే నంతగా అది దానికంటె మహోన్నతముగా ఉన్నది. “మేము దానిని నమ్ముదుము!” ఆ ఐదు ఇంద్రియాలు గూర్చి చెప్పవలసి ఉన్న ఏవిషయానికైనను అది చాలా దూరముగ ఉన్నది. ఇప్పుడు మనం స్వస్థతా కూటానికి సిద్ధపడుచున్నాము, చూశారా. “మేము దానిని నమ్ముదుము!” నీవు ఆరవ ఇ౦ద్రియము ద్వారా నడచుదువు, ఆరవ ఇ౦ద్రియము ద్వారా మాట్లాడుదువు, ఆరవ ఇ౦ద్రియము ద్వారా జీవింతువు, ఆరవ ఇ౦ద్రియము ద్వారా చనిపోదువు మరియు ఆరవ ఇ౦ద్రియము ద్వారా తిరిగి లేచెదవు. ఆ ఆరవ ఇ౦ద్రియము, నీలో ఉన్న ఏదో అయి సహజ మనిషి ఏమై ఉన్నాడో దానికి విబేధమైనది.

36

ఈ ఐదు ఇ౦ద్రియాలు, ఆరవ జ్ఞానేంద్రయానికి అప్పగించుకొనిన యెడల మరియు సహజ మనిషి కలిగియున్న ఇవి సరియైనవిగా ఉండును. సహజ మనస్సు దేవుని వాక్యము చదివి, అది దేవుని వాక్యం అని చెప్పిన ఆ మనస్సు సత్యమును గూర్చి మాట్లాడుచున్నది. అయితే ఆ మనస్సు దేవుని వాక్యమును చదివి, “అది అంతా దేవుని వాక్యము కాదు. లేక అది ఏదో మరేదో అయి ఉన్నది..... అది ఒకప్పుడు, అయితే అది ఈ సమయానికి కాదు అని చెప్పినప్పుడు.” ఆరవ ఇ౦ద్రియము లోనికి వచ్చి మరియు చెప్పను, “ఆయన నిన్న, నేడు, నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు.” చూచారా, అదే భేధము.

ఆ కారణం చేతనే చాలామంది ప్రజలు స్వస్థత పొందలేకపోవుచున్నారు. వారు మానవ మేదస్సుతో వచ్చుటకు ప్రయత్నించుచున్నారు. వారు అంటారు, “ఓ, నేను ఇది చేస్తాను, లేక నేను ఇది మరియు మొదలైనవి నమ్ముతాను.”

అయితే ఆ ఆరవ ఇ౦ద్రియము అలా అది చెప్పుచున్నయెడల, ఆ ఆరవ ఇ౦ద్రియము నుండి వారిని ఏదియూ, ఎన్నడు కదలించలేదు.

37

ఆ ఆరవ ఇ౦ద్రియము మానవ వ్యక్తిత్వం పైకివచ్చి వాక్యానికి విరుద్ధంగా ఉన్న ఏదైనను కాదనునట్లు చేయును. దేవుని వాగ్దానమునకు విరుద్ధమైన ఏ లక్షణమైనను, ఒకవేళ తిరిగి-జన్మించిన క్రైస్తవుడైతే, ఆ ఆరవ ఇంద్రయము అక్కడ అది లేదు అని చెప్పును.

మరియు నీవు మొదట తెలిసికొనవలసినదేమనగా, ఎవడో నాస్తికుడు, అవిశ్వాసి, క్రైస్తవుని చుట్టూ చేరి ఇట్లు చెప్పును, “ఇప్పుడు ఇట్లు చూడుము, పరిశుద్దాత్మడు అనునది ఏమిలేదనును. నీవు ఆ విషయంలో పొరబడియున్నావు. నీవు అటువంటి దానిని నమ్మిన యెడల నీవు వెర్రివాడవు. అక్కడ అటువంటిదేమీ లేదు.”

ఆ ఆరవ ఇ౦ద్రియము తిన్నగా సరియైనదిగా పని చేయ వెళ్ళును.

“నీవు పరిశుద్దాత్మను పొందలేవు అనునది నాకు బైబిలు నుండి చూపించుము. నీవు చూడుము, శిష్యులు ఎక్కడ పొందిరో నేను మీకు చూపించెదను, అయితే...”

“మంచిది, చూడుము,” ఆరవ ఇ౦ద్రియము నీకు సూచించి చెప్పును, “కాని ఆయన చెప్పెను, 'ఆ వాగ్దానం నీకును నీ పిల్లలకును' అని నీవు చెప్పెదవు.”

“మంచిది, అది వారి పిల్లల కొరుకు అని అర్థము. నీకు అని అర్ధం కాదు. ”అది నీ కొరకు కాదు.“

అయితే ఆరవ ఇ౦ద్రియము బాగా ఎరుగును. ఎందుచేత? అది ఇదివరకే నీలో ఉన్నది. అది వారు చాలా ఆలస్యంగా చెప్పారు. నీవు ఇదివరకే దానిని పొందియున్నావు.

38

అక్కడ పరిశుద్దాత్మ అను సంగతి లేదు, అని మాట్లాడు ప్రజలు, వారేమి మాట్లాడుచున్నారో వారికే తెలియదు.

ఒకసారి పిల్లవాడు, ఆపిల్ తొక్క ఒలుచుచున్నాడు. ఒక సమావేశంలో వాదిస్తూన్న నాస్తికునిచే ప్రశ్నించబడ్డాడు. అతడు చెప్పెను, “ఇక్కడ నీకేమి కావలెను?

“నేను నిన్ను ఒక ప్రశ్న అడుగగోరుచున్నానని” అని అతడు పలికెను. అతడు ఆనందించుచు ఆఫిలు తినుచుండగా. ఒక విధమైన అతి సామాన్యమైన ముఖంపై జుట్టు వేలాడుచుండగా, మరియు ఒక పన్ను ఎత్తుగా; మరియు పాతదైన మురికి కోటు వేసికొని తప్పు చేసిన వానివలె కనబడు అతి సామాన్యమైనవాడు. “ఒక ప్రశ్న నిన్ను అడుగ కోరుచున్నానని” అని అతడు చెప్పెను.

ఆ నాస్తికుడు అన్నాడు, “దేవుడు అనునది ఏదియూ లేదు. అది అంతా కేవలం భావోద్వేగం. అది బుద్ధిహీనము, అంతా అదే.”

ఆ అబ్బాయి అన్నాడు, “అయ్యా, నేను ఒక ప్రశ్న వేయగోరుచున్నాను. ఈ ఆఫీలు తియ్యగా ఉందా, లేదా పల్లగా ఉందా?”

అతడు చెప్పెను, “నేనెలా ఎరుగుదును? నేను దానిని తినడం లేదు.”

అతడు చెప్పెను, “నేను అనుకున్నది సరిగా అదే” అని వెనకకు నడిచెను.

39

ప్రభువును రుచిచూడని యెడల, నీవు ఎలాగు ఎరుగుదువు? పరిశుద్దాత్మ ఎన్నడు పొందకుండ, ఆయన నిజమైనవాడా, లేక నిజమైనవాడు కాదా అని ఎలా ఎరుగుదువు? అది విశ్వాసమో మరియు శక్తియో ఎలా ఎరుగుదువు? రుచి చూడకుండా, చెప్పనశక్యము కాని ఆనందము మరియు నిండైన మహిమ అక్కడ లేదని నీవు ఎలాగు ఎరుగుదువు? ఆరవ ఇ౦ద్రియము దాని దగ్గరకు నడిపించును. ఆరవ ఇ౦ద్రియము నీకు అది ప్రకటించును.

దానిని నీ దగ్గరకు తీసుకోనివచ్చుటకు అలాంటి మేధాశక్తి లేనే లేదు. మేధాశక్తులు హేతువాదంతో ఇట్లు చెప్పును, “ఎందుకు, ఇది మనస్తత్వ శాస్త్రము అయి ఉన్నది. ఇది ఏదో ఒక రకమైన పద్దతి అయియున్నది, మరియు అది ప్రజలతో భావోద్వేగమైయున్నది.”

అయితే ఆరవ ఇ౦ద్రియములోనికి వచ్చి వాటినన్నిటిని కాదని మరియు ఆ వ్యక్తిని తిన్నగా దేవుని రొమ్ములోనికి తీసుకోని వెళ్ళును. “దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, మరి తన్ను ఆసక్తితో వెదకువానికి ఆయన ఫలము దయచేయువాడని నమ్మవలెను.”

40

విశ్వాసం ద్వారా! విశ్వాసం ద్వారా, అబ్రహాము! విశ్వాసం ద్వారా, ఇస్సాకు! విశ్వాసం ద్వారా, యాకోబు! అందరు విశ్వాసం ద్వారానే! దానిని చేయునది ఆరవ ఇ౦ద్రియమే. దేవుని వాక్యమునకు విరుద్దంగా ఉన్న దేనినైనను, సమస్త లక్షణాలను, ఏ భావోద్వేగమునైనను, వాక్యమునకు విరుద్ధమైనయెడల ఆరవ ఇ౦ద్రియము దానిని నిరాకరించును.

ఎవరో ఒకరు చెప్పును, “ఓ, మంచిది, నేను ప్రార్ధించబడ్డాను; అయితే నాకు ఏమియు ఇంకా బాగున్నట్లుగా మంచి భావన కలుగలేదు.”

ఆరవ ఇ౦ద్రియము దాని కొరకు ఎన్నడూ నిలబడదు. ఆ ఆరవ ఇ౦ద్రియము చెప్పును, “అది ఒక అబద్ధం! నాకు చాలా బాగుంది. నేను బాగుపడుచున్నాను. దేవుడలా చెప్పెను; అది దానిని స్థిరపరచును. ఆమెన్! దేవుడలాగు చెప్పెను.” ఆరవ ఇ౦ద్రియము కేవలము దేవుని వాక్యముచే పోషించబడును.

41

ఆ అతీతమైన ఇ౦ద్రియము, అది అన్ని ఇంద్రియాలన్నింటి కంటె అతీతమైనది. అది ఘనమైన ఇ౦ద్రియము. అది ఒక విశ్వాసం. అది మండించి మరియు ముందుకు నడిపించే అది ఒక శక్తియైయున్నది. ఆమెన్! నీవు చేయుదువని ఎన్నడు తలంచని సంగతులను అది చేయునట్లు నిన్ను చేయునదైయున్నది. అది ఆరవ ఇ౦ద్రియమై, అతీతమైన ఇ౦ద్రియము అయి ఉన్నది.

నీవు ప్రార్ధించబడ్డావు. కుంటి చేయిని కలిగి నీ చేయి కొరకు ప్రార్ధించబడ్డావు. నీవు అక్కడకు వచ్చి దేవుడు నిన్ను స్వస్థపరచబోవుచున్నాడని నమ్ముదువు, కాపరి నీ క్రొరకు ప్రార్ధించును, నీవు వెనుకకు వెళ్ళుదువు. ఆ పాత స్వభావం కలిగిన మనిషి ఇలాగు చెప్పెను, “ఆ చేతిలో నీకే మార్పు ఉన్నట్టు లేదు. ఎప్పుడూ ఉన్నదాని కంటె నీకేమాత్రం మంచి జరగలేదు.” అయితే ఆరవ ఇ౦ద్రియము వెంబడి వచ్చి చెప్పెను, “అది ఒక అబద్దం! నీవు ప్రార్ధించబడ్డావు; అది స్థిరపరచబడినది.” ఆమెన్.

42

ఒకసారి మన సమావేశానికి వచ్చిన ఆ స్త్రీ వలె ఉన్నది. మరియు ఆమె మన సమావేశానికి వచ్చెను, వారిలో ఇద్దరు. వారు ఆ వేదిక ఎదురుగా వచ్చారు. వారు వివేచనలు చూశారు. ఆ ఇద్దరు స్త్రీలు న్యాయబద్ధంగా త్వరగానే మింగబడ్డారు (ఆధీన శక్తికి లొంగిరి) వారిద్దరూ నిజమైన క్రైస్తవులు, ఒకామె పైకి వచ్చింది, మరియు ఆత్మ వచ్చి మరియు చెప్పెను “నీవు కడుపు బాధతో బాధపడుచున్నావు.”

మరియు ఆమె ముఖం ప్రకాశించినది. ఆమె అన్నది, “అది సత్యమైయున్నది.”

మరియు పరిశుద్దాత్ముడు నా ద్వారా ఇట్లు చెప్పెను, “అది ఒక అల్సరు, అది నరముల బలహీనత స్థితి వలన వచ్చినది. నీవు ఒక పలాని డాక్టరుచే వరీక్షించబడ్డావు. మరియు అతడున్నాడు నీవు బాగుండలేవు.... కలిగివుండవలసినది లేక నీకు ఆపరేషన్ అవసరము, అది తీసివేయవలెను?”

ఆమె అన్నది, “దానిలో ప్రతిమాటయు సత్యమైయున్నది!”

మరియు ఆమె గొప్ప విశ్వాసిగా కనబడుచుండగా, “నీ పేరు కుమారి పలాని-పలాని, నీవు పలాని-పలాని, ఆ విధమైన ఒక స్థలం నుండి వచ్చావు” అని అప్పుడు అది చెప్పబడెను.

ఆమె చెప్పెను, “అది సత్యమైయున్నది.”

అది ఏమైయుండెను? ఆరవ ఇ౦ద్రియము దానిని పట్టుకొనుచున్నది. ఆరవ ఇ౦ద్రియము మరియు పరిశుద్దాత్మ ఒక దాని ప్రక్క ఒకటి నిలబడుచున్నారు. పరిశుద్దాత్మ మాట్లాడుచుండగా, ఆరవ ఇ౦ద్రియము “ఆమెన్” అని చెప్పుచున్నాడు. అది అక్కడే ఉన్నది, ఏదో సంభవించనైయున్నది.

43

మార్త యేసును కనుగొని పరుగెత్తినప్పుడు, మరియు ఆమె చెప్పెను, “ప్రభువా!” ఆరవ ఇ౦ద్రియము గమనించండి. నీవు ఇక్కడ ఉండి ఉన్నయెడల, నా సహోదరుడు చావకుండ ఉండెడివాడు, అయితే ఇప్పుడయినను, నీవు దేవుని ఏమడిగినను, దేవుడు నీకు అనుగ్రహించును.“ అక్కడే ఆరవ ఇ౦ద్రియము ఉన్నది.

యేసు తనలోతాను గ్రహించి అన్నాడు, “నేను పునరుత్తానమును మరియు జీవమును; నా యందు విశ్వాసముంచువాడు, చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. దీనిని నీవు నమ్ముచున్నావా?”

నీవేమి చెప్పనైయున్నావు, తర్కించుదువా? అక్కడ ఒక మనిషి చనిపోయి, పడియున్నాడు, మరియు పురుగులు అతని గుండా ప్రాకుచున్నవి.

44

అయితే ఆయన పునరుత్తానము మరియు జీవమునై ఉండెనని చెప్పుచున్నాడు. అది దేవుని మాట. ఆ ఆరవ ఇ౦ద్రియము, వైద్యుని బాధ్యతకు అవతల ఉన్నది, శాస్త్రపరిశోధన యొక్క ఆలోచనలకు సుదూరంగా ఉన్నది. అన్నిటిని కాదనును, అన్ని తర్కములను కాదనును, మరియు వాటిని క్రింద పడవేయును. ఎందుచేత? అది దేవుని వాక్యమునకు సాక్ష్యమిచ్చుచున్నది. “నేను ఉన్నవాడను. 'నేను ఉండెదను అని కాదు, నేను ఉంటిని' అని కాదు, నేను ఇప్పుడు ఉన్నవాడను! నేనే పునరుత్తానమును మరియు జీవమునైయున్నాను,” ఒక మనుష్యుడు, “నాయందు విశ్వాసముంచువాడు, అతడు చనిపోయినను తిరిగి బ్రతుకును; మరియు బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నడికి చనిపోడు. నీవు నమ్ముచున్నావా?”

ఆమె అన్నది “అవును ప్రభువా” (ఆరవ ఇ౦ద్రియము), “లోకమునకు రానైయున్న దేవుని కుమారుడవని నమ్ముచున్నాను.”

“నీ సహోదరుడు మరల లేచును.” ఓ, మై!

45

వారు సమాధి యొద్దకు వెళ్ళారు. వారిద్దరికి ఏదో జరగనైయున్నది. అది అతీయమైన ఇ౦ద్రియము, దేవుని సన్నిధిలో ఉండి, ఏదో జరగవలసియున్నది. ఆ ఇంద్రియము అతీతమైన ఇ౦ద్రియమై, దేవుడైయుండెను. మార్తలో ఉండి అక్కడ ఏదో చెప్పుచుండెను. ఆమె ఆయనను చూచినది. ఆమె ఆయనను ఎరిగియుండెను. ఆయనను మెస్సీయా అని ఆమె గుర్తించెను. ఆయన దగ్గరకు వెళ్ళి మరియు ఆయనకు సమీపముగ వెళ్ళి, సమస్యను ఆయన ముందుంచి ఆయన నుండి ఒక వాగ్దానమును వినవలెనని మాత్రమే ఆమె ఎరుగును. ఆమె కోరినదంతా అదే. ఆయన, నేను పునరుత్తానమును మరియు జీవమునైయున్నాను! “నాయందు విశ్వాసముంచువాడు చనిపోడని చెప్పెను,” మార్త కోరినది అదే, అది వినవలెనని కోరెను. ఎందుచేతననగా ఆరవ ఇ౦ద్రియము, అతీతమైన ఇ౦ద్రియము, ఆమె విశ్వాసం ఆయనను ఒప్పుకొనునట్లు, ఆయనను నమ్మునట్టు ఆమెను త్రోయుచుండెను.

46

ఈ స్త్రీ ఆమె వేదిక విడిచినప్పుడు, “అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు” అయి ఉండెను. “ఇంటికి వెళ్ళి మరియు తినుము. యేసుక్రీస్తు నిన్ను బాగు చేయును,” అని చెప్పబడినది. ఆమె ఇంటికి వెళ్ళిపోయినది.

ఆ రాత్రి, ఆమె వెనుక మూడు లేక నాల్గవ లైనులో, ఆమె స్నేహితురాలు పొరుగు ప్రాంతంలో నివసించుచున్నది. ఆమె మెడపై ఒక పెద్ద కాణితి గలదు. ఇక్కడకు వచ్చిన ఆమె నిమిత్తం ఆమె పొరుగువారు చాలా కాలం నుండి ఎక్కువగా ఆమెను బాధపెట్టిన, ఆ ఆల్సరు, బాగుపడనైయుండగా దీనిని గూర్చి అందరు గుండెలు ఝల్లుమన్నాయి. వేలకొలది వాటిలో, వందల కొలది కేసులలో ఇది ఒకటి అయి ఉన్నది. ఈ పెద్ద కాయ ఆమె మెడపై బయటకు పొడుచుకు వస్తుంది. మరియు ఆమె పైకి వచ్చింది. నేనన్నాను, “దానిని వివేచించువాడు ఏ ఒక్కడూ లేడు, అయితే ఏదో సంగతిని గూర్చి నీవు సంతోషంగా ఉన్నావు. నీ గుండె ఝల్లుమన్నది, ఎందుకనగా అవతల దూరంగా కూర్చున్న ఆ స్త్రీ నీ పొరుగున ఉన్న స్త్రీ అయి ఉన్నది.”

47

పరిశుద్మాత్ముడు! ఆమె ఇలా అనుకొన్నది, “ఈ లోకంలో ఎలా ఆ మనుష్యుడు దానిని తెలిసికొనగలడు? ఆయనకు అది బయలుపరచుటకు ఏదో సంగతి అయి ఉండవలసి ఉన్నది.”

అలా అది చెప్పబడినప్పుడు, అది ఇలా చెప్పబడెను, “నీ మెడను గూర్చి ఆలోచించుచున్నావు.”

“అవును.”

“అది విడిచిపోవునని నీవు నమ్ముచున్నావా?”

“నేను దానిని నమ్ముచున్నాను, నా పూర్ణ హృదయముతో,” అని ఆమె చెప్పెను.

నేనన్నాను, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఇంటికి వెళ్ళి మరియు నీవు స్వస్థతను పొందుకోనుము.”

ప్రకృతి సంబంధమైన మనిషి చుట్టూ చూచెను మరియు అతడు ఏ సూచన చూచియుండలేదు. అల్సరుతో ఉన్న ఆ స్త్రీ ఇంటికి వెళ్ళెను మరియు తినుటకు ప్రయత్నించెను, మరియు, ఓ, ఆమె చనిపోయే దానివలె కనిపించెను. ఓ, ఆ సహజమైన మనిషి ఆ ప్రకృతి సంబంధమైన ఇ౦ద్రియము, ఆ అల్సరు ఇంకా అక్కడే ఉన్నదని వారి భావన తెలుపుచున్నది.

48

కనుక ఒకటి లేక రెండు వారాల గడిచింది, ఆమె పొరుగు ప్రాంతమంతటి గుండా వెళ్ళెను, ఆ సంఘంలో తన ప్రజలందరికీ, “ప్రభువు నన్ను స్వస్థపరచి యున్నాడు” అని సాక్ష్యమిచ్చుచుండెను.

మరియు వారు అన్నారు, “నీవు ఇప్పుడు తినుచున్నావా?”

“లేదు, సరిగా నేను కోరిన ప్రతి వస్తువు తినుట లేదు. అయితే, ”ఆమె

అన్నది, “నేను ఇది వరకే బాగుపడ్డాను, ఏలయనగా నేను ఆయన పొందిన దెబ్బలచేత స్వస్థపడ్డాను.” అది ఏమై ఉండినను లెక్క లేదు, ఆమె స్వస్థత పొంది ఉండెను.

ఒక ఉదయం, పిల్లలు పాఠశాలకు వెళ్ళారు, మరియు ఆమెకు నిజమైన ఆకలి వేసింది. కిటికీ ప్రక్కన, ఆమె పళ్ళెములు తోముచూ, ఆమె నిలబడి ఉండెను. ఆమె కూటమునకు వచ్చెను, ఒక సంవత్సరం తరువాత మరో కూటానికి వచ్చెను, ఆమె పాత్రలు శుభ్రము చేయుచుండెను మరియు అప్పుడు ఆమె, మొదటి సంగతి, ఒక నిజవింతైన భావన ఆమెపై నుండి వెళ్ళినట్లు అనుభవించింది. “అది ఏమై ఉండెను? నేను అరచుటకు కోరిక గల దానివలె భావించబడితిని,” అని ఆమె అనుకొన్నది.

49

ఆమె భర్త ఆమెతో చెప్పెను, అనెను, “ప్రియమైనదాన, ఆ స్వస్థతను గూర్చి మాట్లాడుట నీవు ఆపుము,” చెప్పెను, “ఎందుచేత అనగా,” అతడు ఒక క్రైస్తవుడైయుండియు అనెను, “నీవు ఆ కారణముచే ఒక నిందను తీసికొని వచ్చుచున్నావు.”

ఆయన వాక్యమునకు సాక్ష్యమిచ్చుచుండగా నీవు ఎలా ఒక నిందను తేగలవు? నీవు దానికి సాక్ష్యం ఇవ్వని యెడల నీవు ఒక నిందను తేగలవు.

“నీవు బాగుపడి ఉండిన యెడల, నీవు బాగుపడే ఉన్నావు” అని అన్నాడు.

ఆమె అన్నది, “ఆ మనిషి నిలబడెను మరియు నా కంటివైపు చూచెను, మరియు నా పరిస్థితులు నాకు చెప్పెను, మరియు అలా నేను చేసిన సంగతులు చెప్పెను. మరియు నేను ఎవరినై ఉంటినో, నేను ఎక్కడ నుండి వచ్చానో చెప్పెను.” ఆమె అన్నది, “అతడు వేదికపైకి వచ్చినప్పుడు, పదిహేను నిమిషాలు కూడ నేను ఆ భవనంలో ఉండలేకపోయాను. లోకంలో ఈ మనిషి దానిని ఎలా ఎరుగును? నేనెన్నడూ వానిని నా జీవితంలో చూడలేదు. అతడు నాతో చెప్పెను, ”యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు స్వస్థత పొందావు.“ మరియు ఆమె అన్నది, ”చనిపోయినంత వరకు నేను అది నమ్మగలను“ అమె అన్నది, ”ఏ విధంగా అయినను, నేను అది నమ్మగలను.“ కనుక, ఆమె, మరియు ఆమెకు దిగువన ఉన్న ఆమె సహోదరి, ఒక స్నేహితురాలు, ఆలా వారు ఆ విశ్వాసమును పట్టుకొందుమని, దేవునికి నిబంధన చేసికొనిరి.

50

ఆ ఉదయాన, వింతైన నిజభావన పొందినది. మరియు, కొన్ని నిమిషాలలో, ఆమెకు ఆకలి అయింది, అందుచే పిల్లలు ఒక ప్లేటులో, ఒక చిన్న పళ్ళెములో కొన్ని వోట్స్ విడిచిపెట్టారు; మరియు వోట్స్ ఎప్పుడూ సరిగా ఆమెకు మంట పుట్టించునని చెప్పెను. ఎవరైనా వ్యక్తి ఎన్నడైనా ఒక అల్సరు కలిగి ఉన్నవారికి, అది ఏమై ఉన్నదో మీరు ఎరుగుదురు. అందుచే ఆమె కిందకు వచ్చి మరియు ఆ వోట్స్ రెండుసార్లు తినెను. “ఓ, మై” ఆమె అనెను, నేను దానికి మూల్యం చెల్లించవలసి ఉన్నాను, అయితే ఈ రోజుల్లో ఒక దినమున నేను సరిగా ఉండగలనని, నేను అనుకొనుచున్నాను.“ అయితే ఆమె ఇంకా ఆకలిగానే ఉన్నట్టు గుర్తించింది, కనుక అలా ఆమె ఆ పళ్ళెమును ఖాళీ చేసింది. ఆమె కొన్ని నిమిషాలు కనిపెట్టి ఏమి జరిగినదో చూచెను. ఏమియు జరుగలేదు; మంచిగా ఉన్నట్టు భావించినది, ఇంకా ఆకలిగానే ఉంది. ఆమె ఆమెకు రెండు గుడ్లు కాల్చినది, మరియు ఆమె ఒక కప్పు కాఫీ పోసుకుని త్రాగి, మరియు కాల్చిన రొట్టెను తిని, మరియు ఆమెకు ఒక నిజమైన ఆనంద సమయమై ఉండెను. ఆమె తినగలిగనంత సరిగా తిన్నది. ఆమె పాత్రలు శుభ్రం చేసూ, ముందుకు వెళ్ళెను, మరియు ఒక అరగంట తరువాత, ఆమెకు మరల ఆకలి అయినది. ఎలాటి అనారోగ్యమూ లేదు.

ఆ చిన్న టోపి ధరించి, మరియు ఆ వీధి గుండా దిగువకు పొరుగువాని ఇంటిలోనికి వెళ్ళింది. ఆమె అక్కడకు వెళ్ళినప్పుడు, ఆమె విన్నది, అక్కడ ఆ కుటుంబంలో ఎవరైనా మరణించి ఉండవచ్చునని తలంచెను. వారు బిగ్గరగా అరచుచూ, మరియు వినబడునట్లుగా అరచుచూ, చుట్టూ నడచుచున్నారు. ఆ స్త్రీ ఆ ఉదయాన ఆలస్యంగా నిద్రించింది, మరియు నిద్ర నుండి లేచి, ఆమె మెడపై పెరిగిన దాని కొరకు చూచుచున్నది మరియు అది రాత్రి సమయంలో అదృశ్యమైనది. అది ఏమై ఉండెను? దేవుడు పనిలో ఉ౦డెను.

51

ఇక్కడ కాడిల్ దేవాలయం ఎగువన, మనం ఆ సమావేశము కలిగి ఉన్నాము. ఆ కుంటి అబ్బాయి అక్కడలోనికి వచ్చాడు, అందుకొరకు ప్రార్ధన చేయబడెను. మీలో అనేకులు అతనిని చూచుటకు అక్కడ ఉన్నారు. వారు అతనిని అత్యవసర గదిలోనికి తీసుకువచ్చారు. బిల్లీ వాని దగ్గరకు నన్ను తీసుకు వెళ్ళాడు. అక్కడ ఆ భవనంలో వారు మూడు లేక నాలుగు రాత్రులు ఆ వేదిక మీద వానిని ఉంచారు. అతడు ఒక ప్రార్ధనా కార్డు పొందలేదు, అందుచే వారు అతనిని అత్యవసర గదిలో ఉంచారు. నేను అక్కడకు లోనికి వెళ్ళి అతని కొరకు ప్రార్ధించి, అతని వైపు చూశాను. అతడున్నాడు, “మిస్టర్ బ్రెన్హాం, నాకు కొంత ఆదరణ నిచ్చునది చెప్పగలవా?”

నేనన్నాను, “అవునండి, కుమారుడా పోలియో నిన్నిలా చేసింది.”

అతడన్నాడు “అది నిజము.”

నేనన్నాను, “నీ పేరు పలాని-పలాని అయి ఉన్నది. నీవు ఒక ప్రత్యేక స్థలం నుండి వచ్చావు.”

“అది సరియైనదని” అతడన్నాడు. అతడన్నాడు, “నా స్వస్థత గురించి ఏమిటి?”

నేనన్నాను, “ఆయన పొందిన దెబ్బల చేత నీవు స్వస్థత పొందియున్నావు.”

దేవునికి స్తోత్రం చేస్తూ, సాక్ష్యమిచ్చుచు, ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆ పొరుగు ప్రాంతంలో ఉన్నవారంతా, అతడు ఆ విధమైన నింద తెచ్చాడని ఒక ఆదివారం వరకు అంటు, ఒక పరిచారక గుంపులోనికి వచ్చింది, అతని ప్రక్క కూర్చుని, అన్నారు, “నీవు తప్పక అది చేయుట ఆపుము. ఆ కారణంచే నీవు ఒక నిందను తెస్తున్నావు.”

52

ఆ యవ్వన మనిషి అక్కడ కూర్చుని, అన్నాడు “మిస్టర్ నేనెక్కడ కూర్చున్నావో అక్కడ మీరున్న యెడల, మీరు కూర్చున్న కుర్చీలో మీరున్న యెడల, క్రీస్తులో నేను పొందిన ఆఖరి నిరీక్షణ గూర్చి నన్ను దోచుకొనుటకు మీరు ప్రయత్నించి ఉండరు అని” అన్నాడు, “ఆయన పొందిన దెబ్బలచే నేను స్వస్థత పొందాను.” అతడు అలా చెప్పిన వెంటనే... వెనుక అక్కడ కూర్చుండిన పక్షవాతంతో ఉన్న పాదములు, చేతులు, శరీరం మరియు అతడు అది చెప్పిన వెంటనే, ఆ కుర్చీ నుండి లేచి అతడు దేవుని మహిమ పరచుచు వెళ్ళాడు.

ఏమిటి? అతని ప్రకృతి సంబంధ ఇ౦ద్రియాలు అతడక్కడే కూర్చొనగలడని చెప్పాయి. ఆ డాక్టరు అతడెన్నటికీ అక్కడే ఉండునని చెప్పాడు, లేక అతడు బ్రతికినంత కాలం అక్కడే ఉంటాడని చెప్పాడు. అయితే ఆరవ ఇ౦ద్రియము ఇలా చెప్పును, “ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత నొందాను.” అతడు ఏమి చేయనక్కరలేదు. అది దేవుడు ఏమి చెప్పెనో, దానికి విరుద్ధమైన ప్రతి సంగతిని దూరముగ ఉంచుటే అయి ఉన్నది. ఆరవ ఇ౦ద్రియము దానికొరకై యున్నది.

53

పురాతన జాన్ రైన్, ఆర్-వై-ఎ-ఎన్ కాదు, ఆర్-హెచ్-వై-ఎన్, అక్కడ పోర్టు వెయన్లో ఒక గుడ్డి బిక్షకుడు ఉన్నాడు. అక్కడకు మేము వెళ్ళినప్పుడు, అతడు ఆ కూటంలో ప్రార్ధించబడ్డాడు. “ఆ గొప్ప వైద్యుడు ఇప్పుడు సమీపంలో ఉన్నాడు” అని ఆ పియానాకి వాయించక ముందు రాత్రి అది. అది లేకుండ ఏ మనిషి లేడు. అతడు గుడ్డివాడైయుండి, విశ్వాసమును బట్టి, కాతలిక్కు అయి ఉన్నాడు. మరియు అతడు వరుసలో ఆగాడు, నేను అతని వైపు చూశాను. నేనన్నాను, నీ పేరు ఇలా మరియు ఈ విధంగా జాన్ రైన్, అయి ఉన్నది.“

“అవును.”

“నీవు ఆ మూలన ఒక భిక్షకుడవైయున్నావు. నీవు సంవత్సరాల నుండి గుడ్డివాడవైయున్నావు.”

“అవును, అది నిజము.”

“విశ్వాసము బట్టి, నీవు ఒక కాతలిక్కువైయున్నావు.”

“అది యదార్ధము.”

నేనన్నాను,“యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాను, నీ స్వస్థతను నీవు పొందుకొనుము.”

“మీకు వందనములండి” అన్నాడు.

నేనన్నాను, “ప్రభువుకు వందనములు.”

అతడన్నాడు, “అయితే నేను చూడలేకపోవుచున్నాను.”

నేనన్నాను, “దానితో దానికేమియు పనిలేదు. నీవు స్వస్థత పొందియున్నావు.”

మరియు అతడు అనెను, ఆ వేదిక నుండి, వారు సహాయం చేయగా, వారు వెంబడి, దిగువకు వెళ్ళాడు. ఆ సహజ మనిషి ఏమియు చూడలేకయున్నాడు. వారు దాని నుండి ఎంత మాత్రం, ఏ ఫలితములు చూడలేకయున్నారు. “ఎందుచేత,” ఇలా చెప్పబడెను, “అతడు కేవలం ఎప్పుడూ ఎలా గుడ్డివాడై ఉండెనో అలాగే ఉండెను.”

54

అందువలన అతని స్నేహితులలలో ఇద్దరు అతని వెనుకకు తెచ్చి, అతని మరల ఆ ప్రార్ధన వరుసలో ఉంచారు, అతని మరల నడిపించారు; హవార్డు అతనిని రానిచ్చాడు. అతడు మరల వెనుకకు వచ్చినప్పుడు, అతడన్నాడు, “అయ్యా, నీవు నేను బాగుపడియున్నానని నాకు చెప్పావు.”

నేనన్నాను, “నేను చెప్పినది నమ్ముచున్నానని, నీవు నాకు చెప్పావు కదా.”

అతడన్నాడు, “నేను నిన్ను నమ్ముచున్నాను. నిన్ను నమ్మకుండుటకు నాకే కారణాలు లేవు” అన్నాడు. “నా జీవితంలో అన్ని సంగతులు నీవు నాకు చెప్పావు” మరియు అతన్నాడు, “ఏమి చేయాలో నేనెరుగను,” అన్నాడు. “ఒక స్త్రీ కొన్ని నిమిషాల ముందు ఒక కణితి ఉన్నట్టు, అది పోయినట్టు, అక్కడ వెనుక ఉండి సాక్ష్యమిచ్చుచున్నది.”

నేనన్నాను, “నీవు నన్ను నమ్మినప్పుడు, ఎందుకు నన్ను ప్రశ్నించుచున్నావు? నేను నీకు దేవుని వాక్యమును చెప్పుచున్నాను.”

అతడన్నాడు, “అయ్యా, నేను ఏమి చేయాలండి?” అతడు ఒక కాతలిక్కు అని ఎరిగియుండి, అతడు పట్టుకొనుటకు భౌతికముగా ఏదో వస్తువు కలిగియుండవలసిన వాడని, నేనన్నాను, “కేవలము సాక్ష్యమిస్తూ ఉండుము, 'ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందాను,' అని చెప్పుచు ఆయనకు స్తుతులు చెల్లించుము.”

55

ఆ వృద్ధ మనిషి, రెండు లేక ఎనిమిది వారాల తరువాత ఆ మూల నిలబడి, పత్రికలు అమ్మెను. కేకలు వేయుచున్నాడు, “అధికము! అధికము! ప్రభువుకు స్తోత్రం! నేను స్వస్థత పొందాను! అధికము! అధికము! ప్రభువుకు స్తోత్రం! నేను స్వస్థత పొందాను!”

అతడు ఆ తరువాత రాత్రి కూటానికి వచ్చినప్పుడు, అతడి వలన నేను బోధించలేకపోయాను. అతడు పైకి లేచి మరియు కేకవేస్తున్నాడు, “ప్రతి వ్యక్తి ప్రశాంతంగా ఉండండి! నన్ను స్వస్థపరచినందుకు, ప్రభువుకు స్తోత్రము! నన్ను స్వస్థపరచినందుకు, ప్రభువుకు స్తోత్రము!” ఒక కాతలిక్కుగా, అతడు విశ్వాసమును ఎలా పట్టుకొని ఉండవలెనో తెలియదు, అయితే అతడు అది చాలా చెప్పుచునేయున్నాడు, ఇంకా చెప్పుచు, అలాగే చెప్పుచు, అలా ఆరవ ఇ౦ద్రియము పని చేయు వరకు చెప్పుచునేయున్నాడు. అది నిజము. “నన్ను స్వస్థపరచినందుకు, ప్రభువుకు స్తోత్రము!”

అతడు ఆ మూలన కూర్చుండి, కేక వేస్తున్నాడు, “నన్ను స్వస్థపరచినందుకు, ప్రభువుకు స్తోత్రము! అధికము! నన్ను స్వస్థపరచినందుకు ప్రభువుకు స్తోత్రము.

ఆ వీధి దిగువన అతడు నడుస్తున్నప్పుడు, అక్కడ ఎవరో ఒకడు వచ్చి “జాన్, నీవెలా ఉన్నావు?” అన్నాడు.

నన్ను స్వస్థపరచినందుకు, ప్రభువుకు స్తోత్రము! మంచిది.“ వారు అతని చూచి నవ్వారు, అతడిని అపహాస్యం చేశారు.

56

ఆ కూటము నుండి రెండు లేక మూడు వారాల తరువాత క్షౌరం కొరకు మరొక చిన్న వార్తలందించు అబ్బాయి అతనిని క్షౌరశాలకు నడిపించాడు. ఆ మంగలి అతనిని కుర్చీలో ఉంచి, అతని ముఖానికి సబ్బు నురుగు పెట్టాడు, అతడన్నాడు, “జాన్,” అతడన్నాడు, “నేను గ్రహించాను....” కొంచెం చురుకైన జాగ్రత్తలో కూడిన ఏదో అతన్నాడు, “ఆ దిగువ నున్న దైవిక స్వస్థత గల వాని దగ్గర ఉన్నావని నేను గ్రహించాను.” [టేపు పై ఖాలీ.]

అతన్నాడు, “అవును, నేను దిగువకు వెళ్ళాను.”

కేవలం అతనిని అపహాస్యం చేయుటకు అతడన్నాడు, “నీవు స్వస్థత నొందావని నేను గ్రహించాను.”

ఆ వృద్ధ మనిషి అన్నాడు, “అవును, ఆయన నన్ను బాగు చేశాడు, ప్రభువుకు స్తోత్రము,” అతని కన్నులు తెరవబడ్డాయి. ఆ క్షౌరశాల కుర్చీ నుండి, తన మెడకు చుట్టబడిన ఒక తువాలుతోనే బయటకు వెళ్ళాడు. తన చేతిలో కత్తితో ఆ మంగలి, అతనిని పట్టుకొనుటకు ప్రయత్నించుచున్నాడు. ఆ వీధి దిగువన వారు వెళ్ళారు! ఎందుచేత? దేవుని వాక్యము పనిచేస్తూ వెళ్ళెను.

57

ఇక్కడ సమీపాన గల కొంతమంది జనులు, చిన్న జార్షి కార్టర్, తొమ్మిది సంవత్సరములు మరియు ఎనిమిది నెలలు అవతల - దిగువన పడియుండుట మీరందరు ఎరుగుదురు; ఆ మూత్రపిండాలు, పేగుల నుండి, ఆ క్రింద నుండి ఒక షీటును తీయుట తప్ప ఇంకేమి చేయలేరు. ఆమె కేవలము ముప్పై-అయిదు పౌండ్లు బరువు గలదైయుండెను. ఇండియానాలోని మిల్టవున్ లో అవల పడియున్నది. ఆమె జనులు మిల్టవున్ బాప్టిస్టు సంఘానికి చెందినవారు. నేను అక్కడ ఒక కూటములో రోగుల కొరకు ప్రార్ధించుటకు మిల్టవున్ బాప్టిస్టు చర్చి దగ్గరకు వెళ్ళాను, ఆ సంఘం, “ఈ సమావేశానికి చెందిన ఏ సభ్యుడైనను ఆ వెర్రివాని దగ్గరకు వెళ్ళిన, మేము వారిని బహిష్కరించుదుము” అన్నారు. ఆమె తండ్రి ఒక పెద్ద అయి ఉండెను.

అయితే ఆమె: యేసు, నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని పిలువబడు నా చిన్న పుస్తకం కలిగి ఉంది. ఒక మధ్యాహ్నన సహోదరుడు హాల్ నన్ను ఆమె దగ్గరకు తీసుకు వెళ్ళాడు. ఆమె తల్లి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది, దానితో ఆమెకేమీ పనిలేదు. నేను లోపలికి వెళ్ళి ఆమె కొరకు ప్రార్ధించాను. “మంచిది, ఆ నేల్ బాలిక సంగతి ఎలా ఉంది?” అని ఆమె అన్నది. ఆమె ఆ దర్శనము గూర్చి ఎరుగును.

నేనన్నాను, “సహోదరీ, అది ఒక దర్శనము. నేను చేయగలది ప్రార్ధించుటే. నీవు విశ్వాసం కలిగియున్నావు.” దీనముగా ఉన్న ఆమె దానికి వ్యతిరేకంగా బోధించబడిరి.

58

అవ్పటి నుండి కొన్ని రోజులకు నేను అక్కడ నిలబడి బాప్తిస్మమిచ్చుచున్నాను. ఆమె అక్కడ దిగువను ఉండి, కేకవేస్తుంది; దేవుడు ఆమెను బాగు చేసిన యెడల, ఆమె వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు నామములో తిరిగి బాప్తిస్మము పొందుదునని ఆమె వాగ్దానం చేసినది.

అక్కడ, ఆమె చిన్న కాళ్ళు సరిగా ఒక చీపురు యొక్క పొడుగాటి కర్రవలె ఉన్నవి. వారు ఆమెను, ఆమె పరుపుపై కూడ ఉంచలేరు, ఆమె తల్లి, ఇంకా ఒక యవ్వన స్త్రీగా, అక్కడ కూర్చుండి, నెరసిన తలతో పక్షవాయువుతో, అంగుళాలుగ అక్కడ పడియుండి, చనిపోవుచున్న ఆమెకు కుమార్తెను గమనించుచున్నది. స్త్రీ గ్రంధిలోనికి క్షయరోగం వచ్చి, ఆమె శరీరమంతా వ్యాపించినది, ఆమె ముప్పై-ఏడు పౌనుల బరువున్నట్లు, వారన్నారని నేను తలంచుచున్నాను. ఆమె క్రింద మలమూత్రాలు పట్టుటకు పెట్టే మూకుడు పెట్టుటకు తగిన ఎత్తునకు ఆమెను లేపలేకుండ ఉన్నారు; ఆమె క్రింద రబ్బరుతో ఉన్న ఒక ఒక బెడ్-షీట్ లాగ వలసియున్నది. తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది నెలల నుండి ఆమె అక్కడ పడియున్నది, కిటీకి గుండా బయట ఉన్న ఒక చెట్టును చూచుటకు కూడ ఆమె తన తల ఎత్తగల శక్తి లేదు.

59

ఒక రోజు జార్జి వ్రైట్ దగ్గర ఆ కొండ పైభాగన వెనుక నిలబడి ఉండగా, పరిశుద్ధాత్మడు నాకిట్లు చెప్పాడు, “నీ పాదాలపైకి లే.” నేను చూడగా, అక్కడ ఒక డాగ్వుడ్ చెట్టుపై ఒక వెలుగు దిగువన ప్రకాశించుచున్నది, “వ్రైట్ మార్గము ప్రక్కగా, వెళ్ళమని చెప్పెను,” లేక “కార్టరు మార్గము ప్రక్కగా వెళ్ళమని” చెప్పెను.

నేనక్కడకు వెళ్ళినప్పుడు, నేను వచ్చుచున్నట్లు ఆమె తల్లికి ఒక సూచన ప్రభువైన యేసు చూపించెను. అక్కడ ఆ పడకపై ఆ బాలిక పడియుండగా, లోనికి నడిచి వెళ్ళాను. ఆమె బలహీనత వలన ఆమె ఉమ్మివేయు గిన్నె కూడ పైకెత్తలేకుండెను. టి.బి.తో ఆ ఉమ్మి వేయు గిన్నెలో ఉమ్మివేయుటకు ప్రయత్నించుచు, “హు” అనుచున్నప్పుడు, ఆమె తల్లి దానిని పట్టుకొనియుండెను. నేనన్నాను, “సహోదరి జార్జి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఒక అరగంట క్రితం అరణ్యంలో ఆవల నన్ను కలసి, నీ మీద చేతులుంచుటకు నన్ను రమ్మని నాతో చెప్పెను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీ పాదములపై నిలబడుము!”

60

మొదటిసారిగా మూడు సంవత్సరాలు... లేక తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది నెలల కాలంలో ఒక శక్తి ఆ బాలికను తాకి, ఆరవ ఇ౦ద్రియము పని చేయ వెళ్ళెను. ఆమె ఎన్నడూ ఆ పాదాలపై ఉండి ఉండలేదు, ఆమె పాదాలపై నుండి ఎగిరి ఆ పెరట్లోనికి పరుగెత్తి, వృక్షాలను - గడ్డిని -ప్రతిదానిని దీవించుచు, లోనికి నడచి వెళ్ళి, క్రింద పియానా వద్ద కూర్చుని, “అక్కడ ఇమ్మానుయేలు నరముల నుండి రక్తము ఒక ఊటగా ప్రవహించుచున్నది” అని వాయించసాగెను.

ఎందుచేత? హేతువాదములు క్రింద ఉంచబడినవి....

ఆమె దానిని చేయలేకపోయినది. ఇప్పుడు నేను ఎరుగను. నేను ఎన్ననడూ ఎరుగను, దేవుని శక్తి మాత్రమే అలా ఆమెను పట్టుకొనెను. ఇక్కడ కీళ్ళు యొద్ద అలా ఆమె కాళ్ళు లావుగా ఉండవు; కేవలం చీపురు యొక్క పొడుగాటి కర్రలవలె ఉండును. అది ఏవో పన్నెండు లేక పద్నాలుగు సంవత్సరముల పూర్వము అది అయి ఉన్నది. మరియు ఈ రోజు ఆమె బలంగా, ఆరోగ్యంగా, ప్రభువైన యేసు కొరకు వెళ్ళుచున్నది.

అది ఏమైయున్నది? మొదటి పర్యాయం, అక్కడ ఏమి జరిగినట్లుగ కనబడలేదు, అయితే హేతువాదం అది జరిగియుండలేదని చెప్పియున్నది. అయితే సహూదరుడా, ఆమె ఆ వాక్యము పట్టుకొన్నది. ఆ సేలం యొద్ద నున్న ఆ కుంటిదైన ఆ నేల్ బాలికను దేవుడు ఆమె కుంటిగా ఉండి పక్షవాయువుతో ఆమె చేతులు ఆ విధంగా వ్రేలాడుచున్నప్పుడు, తీసుకొని ఆమెను బాగుచేసి ఉన్నప్పుడు, ఆమెను కూడ బాగు చేయును. ఆమె అది నమ్మెను.

61

సహోదరుడు హాల్, దూరాన ఒక కేన్సరుతో పడి ఉండి చనిపోవుచున్నాడు; ఆ వ్యక్తియే నన్ను అక్కడకు తీసుకొని వెళ్ళాడు. మిల్టవున్ లో ఉన్న అతని వైద్యుడు ఈ న్యూ-ఆల్బనీలో ఇక్కడ దిగువన ఉన్న అక్కడ సెయింట్ ఎడ్వర్డ్ ఆసుపత్రి వైద్యుని దగ్గరకు వానిని పంపించాడు. నేను మరచి పోయాను.... అతడు నా బిడ్డలను పైకి తీసుకొచ్చాడు; చక్కని మనిషి, మంచి వైద్యుడు. అతడు వానిని పరీక్షించి మిల్టవున్ లో దిగువన ఉన్న డాక్టరు బ్రౌన్ కు “కాన్సర్” అని చెప్పి, “అతడు చనిపోవుచున్నాడని చెప్పాడు.” డాక్టరు బ్రౌన్ చెప్పెను, “నేనూ అలాగే ఆలోచించాను.”

ఈ నగరంలో జడ్జిగా ఉన్న మిష్టరు కోప్ కు బంధువు అయిన ఇక్కడే దిగువన ఉన్న అతని సహోదరి దగ్గరకు వానిని తీసుకొని వెళ్ళారు. వారు అక్కడకు వెళ్ళినప్పుడు, “అతడు చనిపోయే వరకు వానిని ఇక్కడే ఉంచండి” అన్నారు.

62

దిగువకు నన్ను రమ్మని వారిని పంపారు. అక్కడ ఆ మరుసటి రోజు నా భార్యతో వెళ్ళాను. మేము సహోదరుడు హాల్ ను గూర్చి ప్రార్ధించాము. నేను అతనిని ప్రేమించాను. నేను క్రీస్తు దగ్గరకు తెచ్చిన వారిలో అతడు ఒకడై ఉన్నాడు. మరియు అతడి వ్యాధినిరోధక శక్తి తగ్గి మరియు క్షీణించెను, అతడు వాని చేతులను కదపలేకపోయెను.

శ్రీమత్ హాల్ అనెను, “బిల్లీ, నీవు చేయగలిగినది ఏమైనా ఉన్నదా?”

“అక్కడ నాకు తెలిసిందేమి లేదు, సహోదరి హాల్. నేను ఒక మాట ప్రభువు యొద్ద నుండి వినలేదు.” నేను అన్నాను, “నేను నా వైద్యునికి ఆయనను చూపించుటకు ఇష్టపడుచున్నాను.”

ఆవిడ, “మీ డాక్టరు ఎవరు?” అన్నది.

“శ్యామ్ అడయార్” అని నేను అన్నాను.

నేను శ్యామ్ ను పిలిచాను. శ్యామ్ అన్నాడు, “ఒకే విషయము, బిల్లీ, ఎక్స్రే మొదలగు వాటి కొరకు నేను వానిని లూయిస్ విల్లాకు మాత్రమే పంపగలను.” అన్నాడు, “నేను నీకు రిపోర్టు ఇస్తాను.” వారు దిగువకు ఒక బండిని పంపారు, దానిని పట్టుకుని తీసుకు వెళ్ళారు; తిరిగి వచ్చారు.

63

శ్యామ్ నన్ను పిలిచి అన్నాడు, “బిల్లీ అతనికి కాలేయములో కాన్సరు వచ్చింది. అతడు బ్రతికునట్టుగా మనము వాని కాలేయమును కత్తిరించలేము.” అన్నాడు, “అతడు ఒక బోధకుడు; ఇప్పుడు అతడు సరియైన వానిగా ఉండవలసియున్నాడు. అతడు వెళ్ళుచున్నట్లుగా అతనికి చెప్పుట మంచిది.”

నేనన్నాను, “శ్యామ్, అతడు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నాడు. కాని, ఒక విషయము ఏమిటంటే, అతడు వెళ్ళుట చూచుటకు నేను కేవలం అసహ్యించుకొనుచున్నాను. అతడు నా సోదరుడు, మరియు నేను అతని ప్రేమించుదును.”

“ఓ దేవా, నా కొరకు ఏదో చేయండి” అని నేను ఆలోచించాను.

ఆ ఉదయాన ఉడుతల వేటకు వెళ్ళుటకు నేను బయలు దేరాను. ఆ తెల్లవారే ముందు నేను బయటకు చూశాను. ఆ పెరట్లో బయట ఎవరూ లేరు. నా తుఫాకి చేత పట్టుకున్నాను, ఆ ఇంటి నుండి బయలు దేరాను. అక్కడ ఒక పురాతన తినివేయబడినట్లుగా కన్పించుచు ఒక యాఫిలు ఆ గోడ మీద వేలాడుతుంది. నేను తలంచాను, “ఎందుచేత మిడా గోడమీద దానిని పెట్టింది?” నేను మరొకటి, మరొకటి, మరొకటి అలా అక్కడ అవి ఆరు వరకు వేలాడుట నేను చూశాను. నేను నా టోపీని తొలగించి, ఆ నేలపై మోకాళ్ళపై ఉన్నాను. అక్కడ పైకి చూశాను. అప్పుడు ఒక గొప్ప అందమైన యాఫిల్ కిందకు వచ్చి, ఆ అన్ని యాఫిల్స్ తినేసింది. నేను అక్కడని నిలబడుచు పైకి చూశాను, అక్కడ అదే వెలుగు ఉన్నది, (దూరాన ఆ బొమ్మపై వేలాడుచున్నది) అక్కడ నిలిచి, చుట్టూ తిరుగుచు, ఇట్లు చెప్పెను, “నీ పాదములపై నిలబడుము. మిష్టర్ హాల్ దగ్గరకు వెళ్ళి, 'యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,' అతడు చనిపోడు, కాని బ్రతుకును” అని చెప్పుము.

నేను దిగువకు వెళ్ళి అతనికి చెప్పాను. అతనికి ఏ తేడా కలుగలేదు, అయితే దానిని అతడు నమ్మెను. అతడు దానిని పట్టుకున్నాడు. అక్కడ ఏ విధమైన తేడా లేనట్టుగా కనబడెను. ఒక రోజు గడచింది, ఏ భేదం లేదు. రెండవ రోజు, ఏ భేదం లేదు. మూడవ రోజు అది ప్రారంభమయింది. ఇక్కడ ఈ రోజు అతడు సంవత్సరాల తరబడి సంవత్సరాల నుండి జీవించుచున్నాడు.

64

ఇక్కడే సరిగా కూర్చున్న శ్రీమతి వీవర్ ను నేను గమనించాను, లేదు, నేను పొరపడలేదు. ఆమె కుమార్తె వచ్చినప్పుడు, మర్గీ మోర్గాన్ స్వస్థత పొందిన తరువాత, నేను అక్కడ, దిగువకు వెళ్ళాను. అక్కడ ఆ స్త్రీ చేయగలిగినది ఏమియు లేదు. ఆ తరువాత కొద్ది గంటలలో ఆమె చనిపోవలసి యున్నది. వారు ఒకటి లేక రెండు ఇంజక్షనులు ఆమెకు ఇవ్వగలిగారు, మరియు చేసినదంతా అదే, వారు ఒక స్త్రీకి చేయు ఆపరేషన్ (శస్త్ర చికిత్స) చేసిరి, కేన్సర్ ఆమె వెన్నెముఖలోనికి వ్యాపించింది. వారు దానికి ఆపరేషను చేసినప్పుడు, నలువైపులా వ్యాపించెను. ఆ స్త్రీ కొరకు అక్కడ చేయునదేమియు లేదు. నేను స్వస్థతను గూర్చి ఆమెతో మాట్లాడగోరాను.

అయితే ఆమె అన్నాది, “అయ్యా, నీవు ప్రభువైన దేవుని సేవకుడవైయున్నావు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యురాలను కాను.” ఒక సేవకుడు వచ్చుటకు తగదు అని తనంతతానే గణించుకొనుచున్నది. ఆమె అన్నాది, “నేను ఒక జీవితం జీవించాను. నేను నాట్యం చేశాను, నేను చేయకూడని సంగతులు చేశాను. నేను చెడు భాష ఉపయోగించాను, లేక ఏదేమైనప్పటికిని ఎక్కువే చేశాను.” ఆమె ఆమె పాపములను గూర్చి నాతో చెప్పింది, ఆమె అన్నాది, “నేను దానికి తగినదానను కాను.”

65

నేను ఆమె సరియైన మార్గమును తాకినట్లుగ చూశాను. ఇక్కడ ఆ ఆరవ ఇ౦ద్రియము, అతీతమైన ఇ౦ద్రియము. ఎన్నడైనా పనిచేయడానికి ముందు ఆమె క్రీస్తును పొందవలసియున్నది.

మేము క్రింద మోకాళ్ళూనాము. “నీ పాపములు ఎర్రనివైనను” అను దాని గూర్చి నేను ఆమెతో మాట్లాడాను. ఆమె ప్రభు యేసుక్రీస్తుకు ఆమె జీవితమును ఇచ్చినది. ఆమె అది చేసినప్పుడు, ఆమె అన్నాది “ఓ, ఓ, నేను ఒక ప్రత్యేకమైన అనుభవము పొందుచున్నాను. ఏదో సంగతి నాకు జరిగియున్నది. ఏదో సంగతి నాకు జరిగియున్నది. నేను మీ అందరితో కరచాలనం చేయగోరుచున్నాను.”

నేను సరిగా బయటకు చూసినప్పుడు మరియు ఆ ఇంటి వెనుక ఉన్న కోళ్ళ గూటిలోనికి వెనుకకు వెళ్ళుచున్నట్టు నేనామెను ఒక దర్శనంలో చూశాను. నేనన్నాను, “శ్రీమతి వీవర్, ప్రభువైన దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు, ఆ కోళ్ళ గూటి దగ్గరకు నీవు ప్రయాణించగలవు - నీవు బ్రతుకుదువు.”

66

ఆమె ఆ భావనతో ఆ మార్గాన వెళ్ళియుండలేదు; కేన్సరు ఆమెను తినివేసింది. డాక్టరు చెప్పిన విధంగా ఆమె వెళ్ళియుండ లేదు; ఆమె చనిపోవుచున్నది. శ్రీమతి వీవర్, అది 14, 15 సంవత్సరాల క్రితం అని నేననుకొనుచున్నాను? [శ్రీమతి వీవర్ చెప్పెను, “పద్నాలుగు.] 14 సంవత్సరాల క్రితం, ఆమె వ్యాధితో ఉండి ఈ గుడారమునకు తడబడుతూ వచ్చింది. ఆ చిన్న పురాతన అందమైన చేతులతో ఆ పడక నుండి బయటకు వచ్చుటకు శక్తిగలదిగా కనబడలేదు; ఏలయనగా ఆమె వచ్చి యేసు నామములో బాప్తిస్మము పొందుదునని దేవునికి వాగ్దానం చేసింది. అక్కడ చక్రాల కుర్చీలో ఉన్న ఆమెను పట్టుకుని, ఆ నీటి కొలనులోనికి ఆమెను తీసుకు వెళ్ళి, యేసు నామంలో ఆమెకు బాప్తిస్మమిచ్చాము. అక్కడ ఈ రాత్రి ఆమె కూర్చుని ఉంది. మీరు ఆమె ఆరోగ్యంలో ఒక మచ్చనైనను మీరు చూడగోరిన యెడల, ఆమె వైపు చూడండి. ఎందుచేత? హేతువాదములను, శాస్త్రీయ పరిశోధనలును, ప్రతి ఇతరమైనదియు విడచిపెట్టుట, ఏలయనగా ఆరవ ఇ౦ద్రియము పనిచేయవెళ్ళెను. అంతే.

67

చూడండి, కేవలము ఒక నిమిషం, నన్ను దీనిని మరల చెప్పనివ్వండి. ఒకసారి యేసు, ఒక చెట్టు ప్రక్క నుండి వెళ్ళాడు, అది అంజూరపు చెట్టు. ఆయన, ఆ ఆంజూరపు చెట్టు వైపు చూశాడు. ఇప్పుడు దయచేసి దీనిని తప్పిపోవద్దు. ఆయన ఆ అంజూరపు చెట్టు వైపు చూశాడు, అక్కడ దానిపై అంజూరపు కాయలు లేవు. ఆయన అన్నాడు... ఆయన ఆ చెట్టును శపించి మరియు ఇట్లనెను, “నీ చెట్టు ఫలములు ఏ మనుష్యుడు తినలేడు.”

ఆ శిష్యులు చుట్టూ చూశారు; చెట్టు ఎప్పుడూ ఉన్నట్టుగనే కనిపించింది. అప్పటి నుండి ఒక గంట తరువాత కూడ అలాగే కనిపించింది. దేవుడు ఎన్నడూ భూమిని తెరచి దానిని కప్పివేయలేదు. దేవుడెన్నడూ ఆకాశాలను నుండి ఒక వెలుగు భాగాన్ని పంపి దానిని ఒక కాల్చబడిన బొగ్గుగా మాడ్చుటకు అలా చేయలేదు. ఆయన దానిని చేసియుండగలడు, ఖచ్చితంగా ఆయన చేయును. ఆయననెన్నడూ ఆ సంగతులు చేయలేదు.

ఏమి జరిగినది? ఆ చెట్టు శపించబడినది. ఆ దేవుని విశ్వాసము, ఆ చెట్టు జీవానికి వ్యతిరేకంగా ఉంచబడినది. అక్కడ భౌతికముగా నీవేమి జరుగుట చూసియుండలేదు. అయితే ఆ భూమి అడుగు భాగాన, ఆ చెట్టు వేళ్ళలో అడుగున మరణం స్థిరపడియున్నది. అది శపించబడెను. ఆరవ ఇ౦ద్రియము దానికి వ్యతిరేకముగా వచ్చెను. అది చావవలెను. అది వ్రేళ్ళలో నుండి చచ్చుట ఆరంభించెను.

68

ఒక కేన్సరుతో జరిగిన సంగతి అదే; ఒక కణితికి వచ్చిన సంగతి అదే, దానికి వ్యతిరేకంగా, ప్రభువైన దేవుని శక్తి నుండి వచ్చిన ఆ ఆరవ ఇ౦ద్రియము లేచినప్పుడు, ఏ వ్యాధికైనను సంభవించు సంగతి అదే అయి ఉన్నది. “సాతానా, అక్కడ నుండి బయటకు రమ్ము,” అనెను. అప్పుడే ఏ భౌతిక మార్పు కలుగుట నీవు చూచి యుండకపోవచ్చును, అయితే ఆ విశ్వాసం సరిగ్గా అక్కడ ఉన్న అదే విధంగా పట్టుకొనును. అది శపించబడినది. ఆ ఆరవ ఇ౦ద్రియము దానిని వెళ్ళనివ్వదు... ఆ అతీతమైన ఇ౦ద్రియము దానిని వెళ్ళనివ్వదు. నీవెలాటి భావన పొందావు, నీవెలా చూస్తున్నావు, నీవెలా ప్రవర్తించుచున్నావు అనే దానికి అది శ్రద్ద చూపదు. దానితో చేయుటకు దానికి ఒక సంగతియు లేదు. దేవుని వాక్యము ఉపయోగించబడినది. ఆరవ ఇ౦ద్రియము దానిని పట్టుకొనియున్నది. అది అంతా అదే, అది పనిచేయ వెళ్ళును. ఆ కేన్సరు తగ్గిపోవుట ఆరంభించును. అది వ్రేళ్ళలో నుండి చనిపోవును, అది పోయినది. నిశ్చయముగా.

69

ఇదే విధమైన శక్తివంతమైన ఈ ఆరవ ఇ౦ద్రియము వలన రాజ్యములు శిధిలమయ్యాయి. గోడలు ఒకదానికొకటి విరుద్దంగా కూలిపోయాయి.

ఈ ఆరవ ఇ౦ద్రియము వలన ఎర్ర సముద్రం వెనుకకు మరలెను, మరియు దేవుని పిల్లలు తప్పించుకొనుటకు ఆరిన నేల మార్గమునే నేర్పరచెను.

ఈ విధమైన ఆరవ ఇ౦ద్రియము వలన సంసోను కవచాలతోను, ఈటెలతో సైన్యంగా ఉన్న 1000 మంది ఫిలిస్తీయులను జగడానికి పిలిచికొట్టాడు. తనకు తానుగా రక్షించుకొను ఏ మార్గం లేదు, అయితే అడవి గాడిద యొక్క ఒక దవడ ఎముక, ఆ ఆరవ ఇ౦ద్రియము పనిచేయ వెళ్ళెను. అతడు ఒక వెయ్యిమంది ఫిలిస్తీయులను క్రింద పడగొట్టాడు. హెల్లెలూయ!

ఈ ఆరవ ఇ౦ద్రియము వలన మృతులు పైకి లేపబడ్డారు. ఈ ఆరవ ఇ౦ద్రియము వలన శక్తితో కూడిన అద్భుతాలు చేయబడినాయి.

ఆరవ ఇ౦ద్రియముగా పిలువబడి, అతీతమైన ఇ౦ద్రియమై, భూమిని ఎన్నడూ తాకిన అది అత్యంత శక్తివంతమైన బలమైయున్నది. ఇక్కడ దిగువన దీనితో చేయుటకేమీ లేదు. ఇక్కడ ఇది దిగువన దానికి “ఆమెన్” అని చెప్పుచు ప్రకటించుచున్న యెడల, నీవు ముందుకు కదలిసాగిపో; అయితే ఇది ఏమి చేయుచున్నను, లక్ష్యముంచక, దానిని నమ్ముము. “నీవు హృదయంలో విశ్వసించిన యెడల, అక్కడే ఆ శక్తి ఉన్నది. నీవు ఆలోచించే ఐదవ ఇ౦ద్రియము నీ మెదడులో ఉండును, అయితే నీ ఆరవ ఇ౦ద్రియము నీ హృదయంలో ఉన్నది. నీవు హృదయంతో నమ్ముదువు. నోటితో ఒప్పుకొందువు. నీవు నీ హృదయంతో నమ్ముదువు, అవునండి, ఆ ఆరవ ఇ౦ద్రియము అది శక్తితో కూడిన బలము.

70

వినండి, ఆరవ ఇ౦ద్రియము వలన అక్కడ ఒక ప్రవక్త ఒక సింహముల బోనులోనికి త్రోయబడ్డాడు. ఆ ఆరవ ఇ౦ద్రియము మూలముగా ఆ సింహాలు దానియేలును తినియుండలేదు. అవి అతడి దగ్గరకు వెళ్ళలేకపోయెను, ఏలయనగా ఆ ఆరవ ఇ౦ద్రియమును వలన, అతీతమైన ఇ౦ద్రియము.

అదే ఆరవ ఇ౦ద్రియము వలన ముగ్గురు హెబ్రి పిల్లలు ఒక అగ్నిగుండములోనికి త్రోయబడ్డారు. వారిని ఆ అగ్నిజ్వాలలు ఏమి చేయలేకపోయెను. ఆ ఆరవ ఇ౦ద్రియమే! వారు అక్కడకు వెళ్ళకు ముందు, వారు మరణించునట్లు కాల్చబడి యందురని అన్ని హేతువాదములు నిరూపించి యుండును, అయితే ఆ ఆరవ ఇ౦ద్రియము అక్కడ వారిని రెండు లేక మూడు గంటలు నిలబెట్టింది. వారు అగ్ని గుండమును తెరచినప్పుడు, దేవుని కుమారుని వలె, ఒకడు వారి మధ్య నిలచి ఉండుట చూశారు. అదే ఆ ఆరవ ఇ౦ద్రియము. అగ్ని దానిని కాల్చియుండలేదు. అవునండి.

71

ఒకసారి అదే విధమైన ఆరవ ఇ౦ద్రియము అపొస్తలుడైన పేతురు జైలులో పడియున్నప్పుడు అది అక్కడ ఉండెను. వారు ఆ మర్నాడు అతడి తల నరకనై ఉన్నారు. జాన్ మార్కు ఇంటి దగ్గర వారు ఒక ప్రార్ధనా కూటాన్ని కలిగి ఉన్నారు. ఎక్కడ అతడు ప్రార్ధనలో ఉండెనో, ఆ చెరసాల చుట్టూ ఆరవ ఇ౦ద్రియము పోగవుటకు ప్రారంభించెను. ఆ ఆరవ ఇ౦ద్రియము పని చేసెను. ఆ అగ్ని స్తంభం కిటికీ గుండా వచ్చి, పేతురును ముట్టి మరియు ఇట్లనెను, “ఇక్కడ నుండి బయటకు రమ్ము!” అరవ ఇ౦ద్రియము!

ఆ చిన్న ఓడ, నీటిలో మునిగిపోవుచుండగా, పరిశుద్దుడైన పౌలును ఆ మహాసముద్రము పై నుండి మునిగిపోకుండ చేసినది, ఆ ఆరవ ఇ౦ద్రియమే. ఆతీతమైన ఇ౦ద్రియమే ఆయనను మునిగిపోకుండ చేసియుండెను, ఆ ఆరవ ఇంద్రియమే. ఆ పాము ఆయన చేతిపై కరచినప్పుడు, అతడు అగ్నిలో దానిని పడవేసినప్పుడు, అది ఆరవ ఇ౦ద్రియమైయుండెను. దానిని అలా చేసినది ఆరవ ఇ౦ద్రియమైయుండెను.

72

ఆయన సమాధిలో ఉంచబడిన తర్వాత, మృతుల నుండి అలా యేసుక్రీస్తును లేపినది, ఆ ఆరవ ఇ౦ద్రియము అయి ఉన్నది, ఏలయనగా ఆయన దేవుని వాక్యమును నమ్మెను. “ఈ శరీరమును నాశనం చేయుడి, నేను దానిని మూడవ దినాన పైకి లేపుదును,” అన్నాడు. దావీదు చెప్పెను, “నేను నా పరిశుద్దుని కుళ్ళుపట్టనీయను. నేనాయన ఆత్మను నరకంలో విడిచిపెట్టను.” అదే అతీతమైన ఇ౦ద్రియము అయి ఉన్నది. ఆ ఇ౦ద్రియాల హేతువాదములన్నిటిని క్రింద విడిచి పెట్టుము. యేసుక్రీస్తు ఇచ్చు, విశ్వాస ఇ౦ద్రియమైన అతీతమైన ఇ౦ద్రియమును నమ్ముము.

అదే ఇ౦ద్రియము చేత, అక్కడ ఏమిలేనప్పుడు దేవుడు మాట్లాడెను. ఆ ఇ౦ద్రియము ఏమైయున్నది? అది దేవునిలో ఉన్న అతీతమైన ఇ౦ద్రియము, అది నీలో ఉన్న దేవుని విశ్వాసం, ఆ దేవుని భాగము నీలోనికి వచ్చి మరియు నీకు ఆ ఆరవ ఇ౦ద్రియము ఇచ్చును. అదే ఆరవ ఇంద్రియము చేత, కనబడని అదృశ్య పదార్ధములతో కలపి దేవుడు ప్రపంచములను నిర్మించారు. ఆయన వాక్యమును పలికి మరియు ఆయన వాక్యమును నమ్మెను, మరియు ఒక ప్రపంచం ఉనికిలోనికి వచ్చింది. మహిమ!

73

ఆరవ ఇ౦ద్రియము, ఆ అతీతమైన ఇ౦ద్రియము, ఓ దేవా, దానిని నామీద కుమ్మరించండి. దానిని నాకివ్వండి మరియు అది ఎవరికి అవసరమో ఆ ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ప్రభువా, ఆ ఆరవ ఇ౦ద్రియము నాలోనికి కుమ్మరించండి. ఈ ఐదు ఇంద్రియాలు, నా స్వంత జ్ఞానము, ఆలోచనలు మరియు సకల హేతువాదాలను కింద విడచి పెట్టుచూ లొంగిపోవుటకు నేను ఇష్టపడుచున్నారు. నీ వాక్యమును సత్యముగా ఉండనివ్వండి. ప్రతి మనుష్యుని మాట ఒక అబద్ధం. ప్రతి హేతువాదమును, ప్రతి సందేహమును దూరముగ పెట్టి, పరిశుద్దాత్మ ఇ౦ద్రియము, ఆ అతీతమైన ఇ౦ద్రియము చేత నన్ను నడవనివ్వండి.

నీవు దానిని కోరుట లేదా? మనం కోరునది అదే. స్నేహితుడా, దేవుడు నిన్నుదీవించును. నీకవసరమైనది అదే. ఆ అతీతమైన ఇ౦ద్రియము ఏదో సంగతి కొరకు అడుగును మరియు ఆయన దానిని ఇచ్చునని అది ఎరుగును. అది ఒప్పించును, “దేవుని యొద్దకు వచ్చువాడు, ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.”

74

ఆరవ ఇ౦ద్రియము ఇలా చెప్పిన యెడల, “దేవుడు ఆయన వాక్యమును నేరవేర్చును. నాకునేను ఆయనకు ఇచ్చుకొందును. నాకు కలిగినదంతయు ఆయనకు నేను ఇచ్చికొందును.” దానికి వ్యతిరేకమైన ఏదైనా, అది లేనట్టుగా వారు దానిని ఏమని పిలచినను. దేవుని వాక్యముపై నా విశ్వాసము దానిని నేరవేర్చును అని నా ఇంద్రియము చెప్పుచున్నది.

అబ్రహాము దేవుని కలిసెను, మరియు దేవుడు చెప్పెను, “శారా ద్వారా నీవు ఒక బిడ్డను పొందబోవుచున్నావు.” మరియు అతనికి డెబ్బై-ఐదు సంవత్సరములు, మరియు ఆమెకు ఆరవై-ఐదు సంవత్సరములు. అబ్రహాము లేని ప్రతి సంగతిని, దానికి విరుద్ధముగా ఉన్నదానిని, అది అలా లేనప్పటికి. అతడు దేవుని చూచినట్టుగనే నడిచెను, మరియు అతడు నమ్మెను.

అతడు అలా లేడని చెప్పబడిన ఏ సంగతినైనను, ఏ విధమైన తర్క వితర్కములనైనను, అలా ఏదైన ఇతర సంగతియు నైన ఉన్నట్టుగా పిలుచును. డాక్టరు ఇలా అని ఉండవచ్చు, “ఎందుకు, అబ్రహామా, అలా జరుగుటకు నీవు చాలా ముసలివాడవు.” ఆ డాక్టరు ఏమి చెప్పినను, ఇతర వ్యక్తి ఏమి చెప్పినను, అతని సొంత మనస్సు ఏమి చెప్పినను, ఇతరులు ఏమి చెప్పినను, అది ఏ వ్యత్యాసమును కలిగించదు. దేవుడు చెప్పినదే సరియైనది, మరియు అతడు దానితోనే నిలిచెను.

75

అదే ఆరవ ఇంద్రియము, అతీతమైన ఇంద్రియము. దేవా, దానిని నాకివ్వండి. దేవా, అది ఇంకా ఎక్కువగా నేను కలిగి ఉండునట్లు అనుమతించండి. ఆయన ప్రజలకు సేవ చేయుటకు, నాకివ్వండి. అదే నా ప్రార్ధన అయి ఉన్నది.

ఈ ఉదయాన, ఆ తల్లి ఆ చిన్న ఎర్రని తల గల శిశువును తీసికొని వచ్చినప్పుడు, ఇక్కడ నిలబడి ఉండగా, ఆమె బుగ్గల మీద నుండి కన్నీళ్ళు కారినవి. నేను అన్నాను, “సహోదరీ, ఏమిటి సంగతి?”

ఆమె అనెను, “సహోదరుడా, బ్రెన్హాం, లుకేమియా వచ్చింది.” ఏదో నన్ను పైకి లేపినట్టుగా భావించాను. ఓ, “ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.”

76

ఇక్కడ కొంతకాలం క్రిందట, బిల్లీ మరియు నేను రోడ్డు దిగువకు కారు నడుపుచూ వెళ్ళుచున్నాము. కొంతమంది వర్ణ సోదరులు రోడ్డు దిగువకు వస్తూ, మరియు వారు తొందరగా నడుపుచున్నారు, మరియు వారు ఒకదానితో మరియొకటి ప్రక్కలకు రాసుకొనునట్లు, మరియు చుట్టూ, చుట్టూ, చుట్టూ, గిర్రున తిరిగెను, మరియు బాలురందరు రోడ్డు మీదకు విసరు వేయబడ్డారు. మరియు అతని వీపుతో కారుకు వ్యతిరేకంగా పడి ఉండి, ఒక చిన్న వ్యక్తి కారు కిందకు గుచ్చబడి ఉండెను. ఆ బాలురు గెంతెను మరియు దానిని పైకెత్తుటకు ప్రారంభించెను. అతడు అనెను, “ఓ, దయచేసి అలా చేయకండి, నా వీపు పగిలిపోవుచున్నది, వద్దు! మీరు నన్ను చంపగలరు! మీరు నన్ను చంపగలరు! అది అలా చేయకండి!”

వారన్నారు, “ఓ, మేము నీ నుండి దానిని తీసివేయడానికి వచ్చాము; అది మంటను అంటుకొనుచున్నది.

చెప్పెను, “దానిని కదుపవద్దు; నేను మరణించునట్లు మీరు నొక్కివేయుచున్నారు! దానిని చేయవద్దు! దానిని చేయవద్దు!”

నేను అక్కడ క్రిందకు వెళ్ళి అడిగాను, “కుమారుడా, నీవు ఒక క్రైస్తవునివా?”

అతడన్నాడు, “కాదండి.”

నేనన్నాను, “నీవు ప్రార్ధించుకొనుట మంచిది.”

అతడన్నాడు, “అవునండి.”

ఆరవ ఇ౦ద్రియము పనిచేయ వెళ్ళెను. ఆ కారు వెనుకకు చుట్టూ నేరుగా నడచి వెళ్ళాను, తీర్పు దినము వరకు నేనెన్నడు దానిని తెలుసుకోలేను, అయితే, ఉన్నపాటుగా, ఆ కారు అతని మీద నుండి పక్కు ఒరిగింది మరియు అతడిని విడచి వచ్చేసింది, మరియు అతడు పైకి ఎగిరాడు మరియు అంతా సరియైనది. అది ఏమైయుండెను? “ఆపత్కాలములో నమ్ముకొనదగిన ఒక సహాయము.”

77

మేము ఒక చోట నుండి దిగువకు వస్తుండగా... ఒక యవ్వన వర్ణ సోదరి ఒక కొత్త ప్లేమౌత్ కారును రోడ్డ మీద 400 మైళ్ళ స్పీడులో నడుపుచుండెను. ఆమె చాలా వేగంగా కారును నడుపుచున్నది. నేనా కారును చూశాను. దాని ముందు భాగము అంతా చెట్టులోనికి నడిపించబడింది. బిల్లీ నేను ఆగిపోయాం. మా ముందుగా అక్కడ మంచుతో రోడ్డు జారుచున్నది. అయితే అప్పుడు అది పొడిగా ఉన్నది. ఆ బాలిక... మిన్నీసోటాలో కారును అది తోసేటంతగా ఆ గాలి గట్టిగా వీస్తుంది. బిల్లీ నీకు అది జ్ఞాపకమున్నదా? నేను అక్కడ ఆమె దగ్గరకు పరుగెత్తికొని వెళ్ళాను. ఆమె అక్కడ కూర్చుండి, ఆమె అన్నాది, “ఓ, నేను చనిపోతున్నాను. నేను చనిపోతున్నాను.” వారు అంబులెన్సును పిలిచారు.

ఆ అంబులెన్సు వచ్చింది, అప్పటికే ఆ అంబులెన్సు వెనుక ఒకడు చనిపోయి పడియున్నాడు, “నేను ఆమెను తీసుకు వెళ్ళలేనని” అన్నాడు.

అందుచే ఒక రైతు అనెను, “సరే, ఎవరైనా మరొకరిని, త్వరగా పంపండి; ఆ స్త్రీ చనిపోవుచున్నది.”

నేను అక్కడకు నడచి వెళ్ళాను, నేను అన్నాను, “అమ్మా, ఒక నిమిషము.”

ఆమె అనెను, “ఓ నన్ను ముట్టవద్దండి. నన్ను ముట్టుకోవద్దు. నా వీపు!”

నేను అన్నాను, స్త్రీ నీవు ఒక క్రైస్తవురాలవా?“ ఆమె నా వైపు చూచింది. మరియు నేను అన్నాను, ”నేను ఒక సువార్త సేవకుడనై ఉన్నాను. నీవు చనిపోవుచున్న యెడల, దేవుని యెడల నీవు ఎలా ఉన్నావు?“

ఆమె అన్నది, “అయ్యా, నేను ఇప్పుడు సరిగా ఉండగోరుచున్నాను.”

ఆరవ ఇంద్రియము పని చేయ వెళ్ళింది. ఆ దేవుని శక్తి క్రిందకు దిగి వచ్చింది. ఆమెకు ఎవరూ సహాయం చేయకుండానే, ఆమె ఆ కారు నుండి బయటకు నడచి వచ్చింది. ఆ దేవుని శక్తి అక్కడకు వచ్చింది! “ఆపత్కాలములో అక్కడ నమ్ముకొనదగిన సహాయము.”

మనం విశ్వాసము చేత నడిచెదము. మనం విశ్వాసము ద్వారా జీవించెదము; “నీతిమంతులు విశ్వాసము ద్వారా జీవించును.” మనం ఆ విధముగా జీవించాలి. ఆరవదై, ఆ అతీతమైన ఇంద్రియము ఇంకా ఎక్కువ కలిగి ఉండుటకు ఎందరు ఇష్టపడుచున్నారు?

మనము ప్రార్ధి౦చుచుండగా, మనము మన తలలు వంచెదము.

78

ప్రశస్తమైన ప్రభువా, మా దేవా మరియు మా తండ్రీ, నీవు మాకు మంచివాడవై ఉన్నావు. ఈ భూమి మీద జీవించడానికి మరియు నడవడానికి, నీవు మాకు ఐదు ఇంద్రియాలను ఇచ్చావు, లేక భూమి మీద నివసించుటకు, ఆ ఇంద్రియాలు ఇచ్చావు. అలా మేము ఆ వస్తువులను స్పర్శించగలము. మేము మా చేతులతో, వస్తువులను పట్టుకొని, అలా స్పర్శించగలము. అలా మేము వినగలుగునట్లు, నీవు మాకు వినుటను అనుగ్రహించి ఉన్నావు. అలా మేము దేవుని వాక్యము వినగలుగునట్లు, మేము దానిని గూర్చి సంతోషించుచున్నాము, మరియు దానిచేత, “దేవుని వాక్యము వినుచుండగా, వినుట ద్వారా విశ్వాసము కలుగును.” ప్రభువా, ఈ ఆరు ఇంద్రియముల కొరకు మేము వందనములు చెల్లించుచున్నాము. మా జీవిత దినములన్నిటిలో, మేము వాటిని కాపాడుకొందుము గాక.

అయితే ఈ అతీతమైన ఇంద్రియము, విశ్వాసము యొక్క ఆ ఇంద్రియము, అది విశ్వాసికి చెందియుండును గాక, ఎందుకనగా నమ్ముటకు ఉండవలసిన రీతిలో అతడు దానిని కలిగి ఉండవలసియున్నది. ప్రభువా, మాకు అది ఇంకా ఎక్కువగా అనుగ్రహించండి. ఓ, ప్రభువా, దానిని పరిశుద్దపరచండి, మరియు మమ్మును పరిశోధించి, మరియు నీ మంచితనముతోను మరియు నీ శక్తితోను మమ్మును నింపండి. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఇవ్వబడిన, ఆరవ ఇంద్రియము ద్వారా, విశ్వాసము యొక్క ఇంద్రియము ద్వారా, మా జీవిత దినములన్నిటి యందు మేము నడచుకొనునట్లు చేయండి. మేము దేనికొరకు ఏమని ప్రార్ధించామో, అదే మా హృదయాములో సందేహం లేకుండా, అలా మేము అది పొందునట్లుగా మేము నమ్ముదుము గాక, మరియు అలా అది జరిగియుండునని నీవు వాగ్దానము చేసియున్నావు.

ప్రభువా, ఎవరు తమ చేతులను పైకెత్తారో, వారి కొరకు నేను ప్రార్ధించుచున్నాను. వారికి అవసరతలు ఉన్నవి. అవి ఏమైయున్నవో నీవెరుగుదువు. వాటిలో ప్రతి ఒక్కటి, జరుగుటకు వాటిని నెరవేర్చెదవని నేను ప్రార్ధించుచున్నాను. వారికున్న కోరిక, అది నెరవేర్చబడును గాక. నేను యేసు నామమున అది అడుగుచున్నాను. ఆమెన్.

79

తండ్రిలో విశ్వాసము, కుమారునిలో విశ్వాసము,

పరిశుద్దాత్ముని యందు విశ్వాసము, ఈ మూడును ఒకటే అయి ఉన్నవి;

దయ్యాలు వణకును, మరియు పాపులు మేలుకొందురు;

యెహోవాయందు విశ్వాసము దేనినైననూ కదలించును.

నీవెన్నడైనా దానిని ఇంతకుముందు విన్నావా? ఇప్పుడు సంగీతం లేకుండా, ఒక నిమిషము, అయ్యా.

తండ్రి యందు విశ్వాసము, కుమారునిలో విశ్వాసము,

పరిశుద్దాత్మలో విశ్వాసము, ఈ మూడును ఒకటి అయి ఉన్నవి;

దయ్యములు వణకును, మరియు పాపులు మేలుకొందురు;

యెహోవాయందు విశ్వాసము దేనినైననూ కదలించును.

80

అది నిజము. ఓ, మై! ప్రశస్తమైన విశ్వాసము! ప్రశస్తమైన,

మహిమకరమైన విశ్వాసము! దేవా, నాకు విశ్వాసమును ఇవ్వండి. “విశ్వాసము ద్వారా అబ్రహాము. విశ్వాసము ద్వారా ఇస్సాకు. విశ్వాసము వలన హెబెలు దేవునికి కయీను కంటె శ్రేష్టమైన బలి అర్పించినాడు; అతడు చనిపోయినను, ఇంకా సాక్ష్యమిచ్చుచున్నాడు.” ఓ, మనకు ఎంతగా విశ్వాసము అవసరము! నేనాయనను ప్రేమించుచున్నాను. నేను ఎక్కువగా విశ్వాసమును కోరెదను. ఈ జీవితములో నా కోరిక, మరియు ఈ రానున్న నూతన సంవత్సరము కొరకు, దేవుని యందలి ఎక్కువ విశ్వాసము అయి ఉన్నది. దేవా, నా మనస్సులో ఉన్న అనుమానమునైనను, ఎన్నడైనా అక్కడ ఏ ఒక్కటి లేచిన యెడల దానిని తీసివేయండి. సాతానుడు నాతో పోరాడును, వాడు నీతో పోరాడును, అతడు తన బాణములు వేయుటకు ప్రయత్నించును. అయితే తంత్రాలతో నిలచిన దయ్యము వాని అగ్ని బాణముల వైపుకు గురిపెట్టి, ఆర్పుటకు, నా ఎదుట ఎల్లప్పుడు విశ్వాసపు డాలును నేను కలిగి ఉందును గాక, అది నా యదార్ధ ప్రార్ధన అయి ఉన్నది. దేవుడు మిమ్మును దీవించును.

సహోదరుడా నెవిల్, మీరు ఏమైనా చెప్పుదురా?

[సహోదరుడు నెవెల్ అనెను, “లేదండి... కేవలం...”]

రండి.

[సహోదరుడు నెవిల్ ప్రకటనలు చేయుచున్నారు, సాక్ష్యము, మరియు ముగింపు ప్రార్ధన.]

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...