నాకు ఇవ్వబడిన ప్రత్యక్షత
VGR COUNT-165 ......?....శుభోదయము. క్రైస్తవ వందనములు. దేవుని యొక్క సమాధానము మీ పైన ఉండును గాక. ఈ ఉదయకాలమున ఇది నాకు ఒక గొప్ప భాగ్యము, ఈ సేవకుల యొక్క సమూహము ముందు నాలో వున్న జీవము యొక్క నిరీక్షణను గూర్చి వివరించుట గొప్ప ధన్యత. చాలా సార్లు ...
గతములో ఈ దీవికి వచ్చినప్పుడు, అంతర్జాతీయ సంపూర్ణ సువార్త క్రైస్తవ వ్యాపారస్తుల యొక్క సహవాసమునకు ఒక ప్రసంగీకుడుగా నేను ఉంటిని. నేను కేవలము ఒక వక్తగా (ప్రసంగీకుడు) తీసుకొని రాబడితిని, కానీ ఒక సువార్త ప్రసారకూడికను సేవకుల సంఘము యొక్క ఆశీర్వాదముతో జరుపవలెనని నేను తలంచుచుండెడివాడను. ఎందుకనగా అవి నా ఆలోచనలు, మరియు పరిశుద్ధ గ్రంథము వాటిని వాడుకొనుమని ప్రవచించిన విధముగా దేవుని యొక్క వరములను ఉపయోగించుకొనుట కొరకు అవి నా ఉద్దేశ్యములు. అది విశ్వాసులను ఐక్యపరచుట కొరకు, క్రైస్తవుల యొక్క సహవాసము ఒక్కటిగా తీసుకొని వచ్చుట కొరకై యున్నది. అన్ని క్రైస్తవ సంఘములు వాటిలో దేవుని యొక్క పరిశుద్ధులను కలిగియుండెను అని నేను నమ్ముచున్నాను. మనము విభాగింపబడకూదదని నేను నమ్మాను. అది కాక మనము విభాగింపబడుట అనునది క్రీస్తు యొక్క ప్రణాళిక కూడా కాదు అని నేను నమ్ముచున్నాను. మనము ఒక్కటై యుండవలెను. యేసు చెప్పెను, “మీరు ఒకరి యెడల ఒకరు ప్రేమను కలిగి ఉన్నప్పుడు, దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొనెదరు.”
2
దైవీక స్వస్థత గురించి మాట్లాడుచూ, ఈ దీవిలో అది ఏ విధముగా ఉన్నదో నాకు తెలియదు, కానీ నేను ప్రయాణించిన మిగతా ప్రపంచమంతటిని గూర్చి మాట్లాడిన యెడల, దైవీక స్వస్థత అనునది రోగయుక్తమైన క్రీస్తు యొక్క శరీరమునకే ఎక్కువ కావల్సియున్నది. మన యొక్క రోగగ్రస్తమైన శరీరములను కలిపియుంచినప్పుడు (చూశారా? క్రీస్తు యొక్క రోగగ్రస్తమైన శరీరము వేరు చేయబడినది, మీకు తెలుసు, అది గుంపులుగా ఉన్నది, మన యొక్క శారీరక స్వస్థత కన్ననూ ఆ క్రీస్తు శరీరము యొక్క స్వస్థత ప్రాముఖ్యమైయున్నది.) యేలయనగా మనము కలిసియున్న యెడల నిలబడెదము, కానీ విభాగింపబడినప్పుడు మనము పతనము అవుదము. నేను లోపలికి వచ్చినప్పుడు ఆ పాట పాడుచూ ఉన్నారు, “ముందుకు సాగుతున్న క్రైస్తవ సైనికులారా, మనము విభాగింపబడలేదు, మనమందరము ఒక్క శరీరమే.” మరియు ఆ విధముగానే మనము నిలబడవలసియున్నది.
ప్రభువు నాకిచ్చియున్న పరిచర్య చాలా ప్రత్యేకమైనది మరియు ఈ దినమునకు, ఎందుకనగా మనము రెండు వేల సంవత్సరముల పాటు లేఖనముల యొక్క మేధో సంబంధమైన బోధను కలిగియున్నాము, కానీ ప్రభువు యొక్క రాకడకు సమయము సమీపించుచున్నది. దేవుని యొక్క వాగ్దానములు ఖచ్చితముగా నెరవేర్చబడవలసి యున్నది. మరియు మందకు కాపరులైన మీకు, సేవకులారా నేను మీకు దానిని వివరించుటకు ప్రయత్నించుచున్నాను, ఇదేదో తయారు చేయబడిన విశ్వాసము కాదని మీరు చూడవలసియున్నది; ఇది ఖచ్చితముగా నెరవేర్చబడవలసి యున్న దేవుని యొక్క వాగ్దానము.
3
కనుక ఈ ఉదయకాలమున ఇది ఒక గొప్ప భాగ్యమని నేను తలంచుచున్నాను, నాకు ఇవ్వబడిన ప్రత్యక్షతను, నా యొక్క సాధారణమైన రీతిలో మీకు తీసుకొని వచ్చుటకు ప్రయత్నించుచున్న నాకు, ఈ స్థలమందు కూర్చొనుటకు అవకాశము ఇవ్వబడినది. దీనితో నేను ప్రారంభించెదను: రోమీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయములో ఇలా వ్రాయబడినది : “వరములు మరియు పిలుపులు మారు మనస్సు లేకుండగనే కలుగును.”
అవి దేవుని ద్వారా ఆయనయొక్క జ్ఞానమును బట్టి ఇవ్వబడెను; కాబట్టి, నేను ఈ వరమును వివరించుటకు అదియే మార్గము. ఒకవేళ మనము గమనించిన ఎడల, జగత్తుకు పునాది వేయబడకమునుపే వధింపబడిన దేవుని యొక్క కుమారుడు యేసు అని లేఖనములు బోధించుచున్నవి. దేవుడు, ముందు జ్ఞానము ద్వారా, ఏమేమి కలిగియుండునో అన్నీఎరిగియున్నాడు; కాబట్టి, ఆయన యొక్క గొప్ప జ్ఞానము ద్వారా ఆయన ముందుగా గమ్యమును నిర్ణయింపగలడు, మరియు ముందుగా చెప్పగలడు, రాబోవుచున్న సంగతులను చెప్పగలడు. ఏదేను తోటనుండీ, సర్పము యొక్క తలను చితకకొట్టు స్త్రీ యొక్క సంతానము యేసే అయియున్నాడు.
4
మోషే ఒక ప్రవక్తగా పుట్టియున్నాడు, అది తన యొక్క స్వంత మంచితనము కాదు, లేక ఆయన యొక్క కోరిక కాదు, కానీ అది దేవుని యొక్క జ్ఞానము, మరియు దేవుని యొక్క ముందు జ్ఞానము. తన సంతానము పరాయి దేశములో పరవాసులవుతారు అని ఆయన అబ్రహాముకు చెప్పాడు.
చెప్పండి, అందరికీ ఇంగ్లీషు అర్థమవుతుంది అని నేను నమ్ముచున్నాను. ఇక్కడ ఉన్న ఎవరికైనా ఇంగ్లీషు అర్థము కాకుండా ఉన్నదా? మంచిది. అది మీలో కొంతమందికి అర్ధమవుతుంది, కానీ ... (తర్జూమా చేయుచున్న అతడు చెప్పుచున్నాడు, “వచనమును కొంచెము పొడిగించి చెప్పుము ...”) ఓహ్, ఓ. అది సరే. అది నిజము.
5
అతడు జన్మించుటకు ఏడువందల పన్నెండు సంవత్సరముల ముందే ప్రవక్తయైన యెషయా బాప్తిస్మమిచ్చు యోహానును చూచెను. అతడిది వింతైన జన్మ కనుక, దీనిని తనకు తాను స్వయముగా యెరిగి యుండుటకు యోహానుకు ఎటువంటి అవకాశములేదు; అందుకొరకే అతడు వచ్చునని దేవుడు ఎరిగియుండెను.
ప్రవక్తయైన యిర్మియాను, అతడు తల్లి గర్భములో రూపింపబడక మునుపే నేను అతడిని ఎరిగియున్నానని దేవుడు చెప్పెను, మరియు అతడిని శుద్ధీకరించెను, మరియు జనములకు ప్రవక్తగా అతడిని నియమించెను. అతడు జన్మించక మునుపే ... చూడండి, వరములు మరియు పిలుపులు పశ్చాత్తాపము లేకుండగనే కలుగును.
6
నా ప్రజలు - నా జనులు (కుటుంబము) మతభక్తి కలిగినవారు కాదు మొదటిగా, మేము ఐరిష్ వారము, కాబట్టి నేపథ్యములో మేము క్యాథలిక్కువారము. కానీ నా తండ్రి మరియు తల్లి ఎన్నడూ అసలు చర్చికే వెళ్ళలేదు. నేను కెంటకీ కొండలలో అక్కడ పైన ఉన్న చెక్కలతో నిర్మించిన క్యాబిన్లో నేను జన్మించాను. మేము చాలా పేదవారము.
నేను జన్మించిన ఆ ఉదయము, నా తల్లి నాకు చెబుతూ ఉండేది, కిటికీవలె ఉండి అద్దము లేకుండా ఉన్న ఆ చిన్న తలుపును తెరిచినది, అది తలుపు అయినప్పటికీ, దానిని తిరిగి తెరచినది, తండ్రి ఆ విధముగా చేసెను, కాబట్టి ఆయన నన్ను ఆమె చేతిలో పెట్టినాడు కాబట్టి ఆమె నన్ను చూడగలదు. అది వేకువజామునే సుమారు అయిదుగంటలకు. సూర్యుడు ఇంకా పైకి రాలేదు, కనుక వారు ఆ కిటికీ తలుపును తెరచినప్పుడు, ఒక బకెట్టు లేక ఒక దిండు వంటి ఆకారము ఉన్న వెలుగు, ఆ కిటికీ లోపలికి వచ్చి మరియు నేను జన్మించిన ఆ చిన్న మంచము పైకి వచ్చి నిలిచెను. ఈ రోజు వాషింగ్టన్, డి. సి.లో వారు అదే చిత్రమును కలిగియున్నారు; మరియు ప్రపంచమంతటా అదే చిత్రమును కలిగియున్నారు. ఇప్పుడు, అది నా కుటుంబీకులకు ఆశ్చర్యము కలుగజేసినది; వారికి అసలు మతమును గూర్చే తెలియదు, కనుక అది ఏమిటో వారికి తెలియదు.
7
నాకు కేవలము రెండు సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు, నేను చూశానని నాకు జ్ఞాపకమున్న నా మొదటి దర్శనం ... నేను నా చిన్న సహోదరునితో ఇంటి వెనుక ఆడుకొనుచున్నాను, అతడు కేవలము ప్రాకుచుండెడివాడు. మరియు ఒక పొదలో నుండి ఒక స్వరము వచ్చియున్నది. మరియు అది చెప్పెను, “నీవు న్యూ ఆల్బెనీ అని పిలువబడే ఒక పట్టణమునకు దగ్గరగా జీవించెదవు.” అది ... అది నన్ను చాలా భయపెట్టినది, మరియు అది చెప్పుటకు నేను ఇంటిలోనికి పరిగెత్తాను. అది ఏమిటో ఆమెకూ తెలియదు. కానీ మూడు సంవత్సరముల తరువాత, మేము ఇండియానాలోని న్యూ ఆల్బెనీ అనే పట్టణమునకు వెళ్ళిపోయాము.
మరియు తరువాత ఏడు సంవత్సరముల వయస్సున్నప్పుడు, కొండపైన ఉన్న గోధుమ గిడ్డంగి దగ్గర నుండి ఒక చిన్న బకెట్టులో నీటిని తీసుకొని ఇంటి దగ్గరకు తీసుకొని వస్తున్నాను. మరియు అది ఆకురాలు కాలమైయున్నది. నా చేతిలో బకెట్లు పట్టుకొని కొద్ది సేపు విశ్రమించుట కొరకు నేను చెట్టు క్రింద కూర్చొన్నాను. నా తండ్రి ఒక పచ్చి తాగుబోతు మరియు ఒక గాలి వీచుచున్నట్లుగా నేను విన్నాను. మరియు అన్ని చోట్లా నిజముగా నిమ్మళముగా ఉన్నది, మరియు ఆ గాలి శబ్దము ఎక్కడ నుండి వచ్చుచున్నదని నేను ఆశ్చర్యపడ్డాను. నేను కూర్చొనియున్నది ఒక పొడగాటి చెట్టు. ఆ గాలి ఎక్కడ నుండి వచ్చుచున్నదని చుట్టూ చూచుటకు నేను ఒక అడుగు వెనుకకు వేశాను. మరియు ఆ చెట్టుకు సుమారు సగము పైన, ఒక పీపా సైజులో, ఆకులు సుడులు, సుడులుగా గుండ్రముగా తిరుగుచూ చెట్టు లోపలికి వెళ్ళుపోవుచున్నట్లుగా కనిపించుచున్నది. మరియు అక్కడ నుండి వచ్చిన ఒక స్వరము ఇలా చెప్పియున్నది, “నీవు ఎన్నడూ పొగత్రాగవద్దు, లేక మద్యము, లేక ఏ రకముగానూ నీ శరీరమును మలినము చేసుకొనవద్దు; నీవు పెద్దవాడైనప్పుడు నీవు చేయుటకు ఒక పని ఉన్నది. (నీవు చేయుటకు ఒక పని ఉన్నది).” అది నన్ను భయపెట్టినది. నేను నా చేతిలో ఉన్న బకెట్టులను క్రిందకు జారవిడిచి, నిజమైన వేగముతో ఇంటికి పరుగెత్తి, అరుస్తూ, నా తల్లి ఒడిలో వాలిపోయాను.
నేను అన్నాను, “ఆ చెట్టుపై ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు.” మరియు నేను-ఆమె చాలా ఆత్రుతపడినది. ఆమె ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి మరియు ఒకవేళ అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ తిరిగి చూసినది. మరియు నేను చాలా భయపడ్డాను. ఆమె డాక్టరును పిలిచినది. మరియు ఆ డాక్టరు “అతడు చాలా ఆందోళన (భయముతో) చెందాడు” అని చెప్పాడు.
8
ఆ పిదప అక్కడ నుండి రెండు వారముల తరువాత, నేను నా సహోదరునితో గోళీలు ఆడుచున్నాను, మరియు ఏదో నా -పైకి వచ్చినది, మరియు నేను ఆ నది వైపు చూచాను. మరియు ఆ నదికి అడ్డముగా ఒక పెద్ద వంతెనను నేను చూచాను, మరియు ఆ వంతెన పైనుండి పదహారు మంది నదిలో పడి ప్రాణాలు పోగొట్టుకొనుటను నేను చూచాను. అది నన్ను విడిచినప్పుడు, నేను నా తల్లి యొద్దకు పరుగెత్తి మరియు నేను ఆమెకు చెప్పాను. “ఓహ్”, ఆమె అన్నది, “హనీ, నీవు కలగనుచున్నావు”. కానీ నేను కలగనలేదు. కానీ ఆమె దానిని వ్రాసి పెట్టినది. మరియు ఆ రోజు నుండి ఇరవై రెండు సంవత్సరములకు, అదే స్థలమందు ఆ మునిసిపాల్ వంతెన ఆ నదిలో కూలినది, మరియు దానిలో పదహారు మంది తమ ప్రాణాలు పోగొట్టుకొనిరి.
ఆ విధముగా, ప్రతీసారీ అది వచ్చుచున్నది. తరువాత, నేను మార్పు చెందాను (క్రీస్తును నమ్మాను). ఆయన చేసినవన్నీ - అన్నీ - పరిశుద్దాత్మ చేసినవన్నీ వ్రాసిన ఎడల చాలా, చాలా పుస్తకములగును. కనుక కేవలము కొద్ది సంగతులను మాత్రమే నేను తాకగలను, కనుక మీరు అర్ధము చేసుకొనగలరు.
పిదప నేను మార్పు చెందిన తరువాత, నేను బాప్టిస్టు సంఘములో చేరాను, వెంటనే, సువార్తను ప్రసంగించుటను మొదలు పెట్టాను. ప్రభువు బహు గొప్పగా ఆశీర్వదించెను. మరియు నేను నా మొదటి ఉజ్జీవమును కలిగియున్నాను, ఒక రెండు వారముల ఉజ్జీవ కూటములు, అయిదు వందల మంది ప్రభువు యొద్దకు వచ్చారు. వారికి బాప్తిస్మమిచ్చుటకు నేను వారిని నది యొద్దకు తీసుకొని వెళ్ళాను. మరియు ఆ నది ఒడ్డున సుమారు పదివేల మంది ఉన్నప్పుడు, చూస్తూ ... రెండు లేక మూడు వారముల నుండి వర్షము లేకపోవుట వలన, అక్కడ నిజముగా ఎండిపోయియున్నది. ప్రజలు వర్షము కొరకు ప్రార్థించుచున్నారు. మరియు ఆ మార్పు చెందిన పదిహేడవ వ్యక్తికి నేను బాప్తీస్మమిచ్చుచున్నప్పుడు, “పైకి చూడుము”, అని చెప్పిన ఒక స్వరమును నేను విన్నాను. అది నన్ను భయపెట్టినది. నేను కేవలము ఒక యవ్వనస్తుడను.
నేను తరువాత వివాహము చేసుకొనిన ఆ బాలిక, అక్కడ నది ఒడ్డున ఫోటోలను తీయుచున్నది. నేను తిరిగి మళ్ళీ దానిని విన్నాను; “పైకి చూడుము”, అని చెప్పెను. మరియు పైకి చూచుటకు నేను భయపడ్డాను. నేను దేనిని గూర్చి సందేహించుచున్నాను దానిని బట్టి ఆ ఒడ్డున ఉన్న అందరూ ఆశ్చర్యపడుచుండిరి. నది ఒడ్డున పైన మరియు క్రింద ఉన్నవారందరూ, చాలా మంది ప్రజలు ...వార్తాపత్రికల ఫోటోగ్రాఫర్లు ... మరియు అది తిరిగి చెప్పెను, “పైకి చూడుము.” మరియు నేను పైకి చూచాను, మరియు నేను పైకి చూచినప్పుడు, ఇక్కడ ఆ వెలుగు క్రిందకు దిగి వచ్చుచున్నది. ప్రజలు సొమ్మసిల్లి పడిపోవడం ప్రారంభించారు, మరియు ఆ ప్రదేశమంతటనూ కుదిపివేసిన ఒక స్వరము వచ్చి మరియు చెప్పెను, “క్రీస్తు యొక్క మొదటి రాకడకు ముందుగా, బాప్తిస్మమిచ్చు యోహాను పంపబడినట్లుగా, నీకు ఇవ్వబడిన వర్తమానము క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందుగా వెళ్ళును.” ముందుగా వెళ్ళునది నేను కాదు, గానీ వర్తమానమే ముందుగా వెళ్ళునదై యున్నది. నేను ఎవరికన్నా ఎక్కువేమి కాదు. మనము మాట్లాడునది క్రీస్తు గురించి అయ్యున్నది. అప్పటి నుండి ఆ దర్శనములు మునుపు కన్నా మరి ఎక్కువగా వచ్చుటకు ప్రారంభించెను.
9
ఇప్పుడు, ఆ వార్తాపత్రిక అసోసియేటెడ్ ప్రెస్ వారి యొద్దకు వెళ్ళినది. అది అలా కెనడా వరకూ వెళ్ళినది, మరియు ఇంకా... దానిని గూర్చిన చిత్రములు మన దగ్గర ఉన్నవి. “ఒక మర్మమైన వెలుగు ఒక స్థానిక బాప్టిస్టు సేవకునిపై కనబడెను...” అని అందులో వ్రాసిరి.
మరియు అప్పుడు, ఆ దర్శనములు వచ్చుటకు ప్రారంభించబడినప్పుడు, వేలకు వేలు అని నేను ఊహించుచున్నాను. కానీ ఏ ఒక్కసారి కూడా అది తప్పిపోలేదు. ప్రతీసారీ అవి సరిగ్గానే ఉన్నవి. మీరు నా దేశము వెళ్ళవచ్చు, లేక నేను నివసించుచున్న పట్టణమునకు వ్రాయవచ్చు, సేవక సమూహమునకు, అధికారులకు లేక పట్టణ మేయరుకు, ఏ ఒక్కసారి కూడా ఆ దర్శనము తప్పు కాలేదు, ప్రతీసారీ అవి ఖచ్చితముగా జరిగెను. కానీ జనులకు చెప్పుటకు నేను భయపడ్డాను.
ఇప్పుడు, ఇక్కడ మొదటగా ఒక సంగతి నేను అడుగగోరుచున్నాను: ఇక్కడ ఎంతమంది ఆత్మతో నింపబడిన ప్రజలు ఉన్నారు? మీ చేయి పైకెత్తుము. నేను మీకు చెప్పగలను కనుక మీరు అర్ధము చేసుకొనగలరు, ఖచ్చితముగా, దానిని గూర్చి ఒక వింతైన సంగతి, అది నేను దగ్గరకు వచ్చినప్పుడు ... లేక ఒక రాత్రి నేను కార్నివాల్ గ్రౌండ్ గుండా వెళ్ళుచున్నప్పుడు అని నేను చెప్పగలను, అది ప్రదర్శనలు జరుగు స్థలము అని మీకు తెలుసు. ఒక గుడారము ప్రక్కగా ఒక యవ్వన స్త్రీ ఉన్నది, ఒక జ్యోతిష్కురాలు. మరియు నా తల్లి నాకు ఎప్పుడూ చెబుతూ ఉండేది మంత్రాలు వేసేవారు, జ్యోతిష్యం చెప్పేవారు అందరూ దయ్యము సంబంధులు అని మరియు ఆమె చెప్పినది నిజమే.
మరియు ఈ చిన్న జ్యోతిష్కురాలు, ఒక యవ్వన స్త్రీ, పదహారు లేక పద్దెనిమిది సంవత్సరముల ఆమె చెప్పినది, “ఓయి, నీవు, ఇక్కడకు రమ్ము.” మరియు నేను ఆమె యొద్దకు నడిచాను. “నీకు తెలుసా నీవు ఒక గురుతు క్రింద జన్మించావు”, అని అన్నది.
“ అది నన్ను భయపెట్టినది. నేను అన్నాను, ”నేను దానితో ఏమియూ చేయగోరుట లేదు“, అని నడిచి వెళ్ళిపోయాను.
10
తరువాత, నేను ఇండియానాకు రాష్ట్ర అటవీ పర్యవేక్షణాధికారిగా నియమించ బడ్డాను. మరియు ఒకరోజు ఒక బస్సులో వెళ్ళుచున్నాను, చాలా రద్దీగా ఉన్నది, మేము నిలబడవలసి వచ్చెను. మరియు నాకు ఒక వింతైన అనుభూతి కలగడం గమనించాను. ఆత్మలకు సంబంధించి నేను ఎల్లప్పుడూ సున్నితమైనవాడను, ప్రత్యేకించి అటువంటి ప్రజలలో ఎవరినైనా కలిసినప్పుడు అటువంటి అనుభూతి కలుగును. అటువంటి ఒక నిజమైన హాస్యాస్పదమైన అనుభూతిని నేను పొందెదను. మరియు దానిని అనుభూతి చెందుటను ప్రారంభించాను, మరియు నేను చుట్టూ చూశాను; మరియు తిన్నగా నా వైపే చూస్తూ ఉన్న ఒక బలముగానున్న స్త్రీ అక్కడ ఉన్నది. ఆమె చెప్పినది, “నేను నీతో మాట్లాడుటకు ఇష్టపడుచున్నాను.”
నేను అడిగాను, “నీకు ఏమి కావలెను?” నేను ఎన్నడూ స్త్రీలను ఇష్టపడను, కానీ సహోదరిలైన మిమ్ములను కాదు, నా అర్ధము, నా శరీరమును పాడు చేసుకొనవద్దు అని ఆయన చెప్పెను. మరియు అది నన్ను వారి పట్ల మరింత నూన్యతకు గురి చేసినది.
కాబట్టి అప్పుడు, ఎందుకనగా ఆ దినమున నా సహాయకులందరూ పాపులుగా ఉందురు. మరియు అక్కడ నేను చెప్పుటకు ఒక గొప్ప కథ ఒకటి ఉండును. విస్కీ త్రాగుట వలన, మరియు అనైతికముగా ఉండుట వలన, మరియు పరిశుద్దాత్మ దిగి వచ్చి, దానికి దూరంగా ఉండునట్లు నన్ను చేసినది. అది నేను కాదు. చూశారా? నేను దానిని చేసియుండెడివాడను. అది దేవుడే ఆ వరమును గూర్చి జాగ్రత్త వహించెను. అది ముందుకు వెళ్ళవలసియుండెను.
11
ఒక రోజు, నేను నా స్వంత ప్రాణమును తీసుకొనుట ప్రారంభించాను, మరియు ఆ తుపాకీ కూడా పేలలేదు. అప్పుడు నేను దానిని త్రిప్పి మరియు తిరిగి కాల్చాను. అది దేవుడే ఆ వరమును గూర్చి జాగ్రత్త వహించుచున్నాడు. అప్పుడు ఆయన ... మోషే వలె, అతడు దాని నుండి తప్పించుకొనలేకపోయెను; దేవుడు నిన్ను పట్టుకొనును. నీవు ఎక్కడ ఉన్నప్పటికీ, ఆయన నిన్ను కనుగొనును.
కాబట్టి ఈ స్త్రీ - “నీకు ఏమి కావాలి?” అని నేను అడిగాను.
“అయ్యా, నీవు ఒక గురుతు క్రింద జన్మించావని నీకు తెలుసా?” అని ఆమె చెప్పెను.
వెంటనే, అది నన్ను భయకంపితుని చేసినది. నేను చెప్పాను, “దానిని గూర్చి నాకు ఏమియూ తెలియదు, మరియు దానిని గూర్చి నేను ఏమియూ తెలుసుకొనగోరుట లేదు.”
ఆమె అడిగినది, “నీవు ఎన్నడూ ప్రసంగీకులతో మాట్లాడలేదా?”
నేను అన్నాను, “వారితో నాకు ఎటువంటి ఉపయోగము లేదు. అటువంటి దేని దగ్గరకూ నేను వెళ్ళను.” నేను చెప్పాను, “నేను నిన్ను బాధపెట్టాలనుకోవడం లేదు, కానీ నీవు చెప్పునదేదీ నేను వినుటకు ఇష్టపడగోరుట లేదు.”
ఆమె అన్నది, “అయ్యా, అది మర్యాద కాదు”.
మరియు తిరిగి నేను ఆమె వైపు తిరిగాను, నేను చెప్పాను“, అది నీకు ఎలాగు తెలుసు?”
ఆమె చెప్పినది, “నీవు ఆ బస్ ఎక్కుచున్నప్పుడు, నేను దానిని చూశాను”. “నేను శ్వేత సౌధం (వైట్ హౌస్) లో పనిచేయుదును”, అని ఆమె అన్నది. “ఒక సేవకుడైన, నా కుమారుడిని చూచుటకు నేను ఇప్పుడు చికాగోకు పోవు మార్గములో ఉన్నాను, నేను ఒక ఖగోళశాస్త్రవేత్తను”, అని ఆమె చెప్పినది. “నీకు తెలుసా .... అది ఎవరో, దేవుడు ఏదైనా చేయగోరినప్పుడు, ఆయన చేయు మొదటి సంగతి దానిని భూమిపైన చూపించుటకు ముందు, దానిని ఆకాశములో చూపించుటయే?
నేను చెప్పాను, “దానిని గూర్చి నాకు ఏమియు తెలియదు”. మరియు మళ్ళీ నేను తిరిగాను అది నన్ను కొంచెము ఇబ్బందికి గురి చేసినది, ఎందుకనగా బస్లో చాలా మంది ప్రజలు ఉన్నారు, మరియు నేను ఒక అధికారిని కనుక అది మర్యాద కాదు అని నేను తలంచాను. కనుక ఆమె నన్ను పిలుస్తూనే ఉన్నది. మరియు నేను తిరిగి ఆమె వైపు తిరిగాను; “అది నాతో ఏమి చేయును?”, అని అడిగాను.
మరియు ఆమె చెప్పెను, “యేసుక్రీస్తు జన్మించినప్పుడు, లేక ఆయన జన్మించుటకు ముందు, తూర్పు నుండి జ్ఞానులు వచ్చిరి”. ఆమె అడిగినది, “ జ్ఞాని అనగా ఎవరు?” నేను అన్నాను, “నాకు తెలియదు.”
ఆమె చెప్పినది, “వారు ఆకాశమును పరిశీలించు ఖగోళ శాస్త్రవేత్తలు, మరియు దేవుడు భూమిపైన దేనినైనా చేయుటకు ముందు, ఆయన దానిని ఆకాశములో కనబరచును.” మరియు ఆమె చెప్పెను ...
నేను అన్నాను, “దానిని గూర్చి నాకు ఏమియూ తెలియదు.”
ఆమె అన్నది, “ కానీ దేవుడు ఏదైనా వరమును ఇచ్చినప్పుడు, ఆయన దానిని ఆకాశములో ప్రకటించును.”
నేను అన్నాను, “దానిని గూర్చి నాకు ఏమియూ తెలియదు”.
మరియు ఆమె చెప్పెను, “నీవు ఆ గురుతు క్రింద జన్మించావు.” మరియు ఆమె చెప్పెను, “నీవు జన్మించినప్పుడు ఏమి జరిగినదో ఒకవేళ నేను నీకు చెప్పిన యెడల, నీవు నన్ను నమ్మెదవా?”
మరియు ఆమె చెప్పెను, “నీవు 1909లో ఏప్రిల్ 6వ తారీఖున, ఉదయం 5 గంటలకు జన్మించావు, అప్పుడే కొన్ని ఖచ్చితమైన నక్షత్రములు ఒకే వరుసలోనికి వచ్చినవి.” (లేక ఖగోళశాస్త్రము) “దానిని గూర్చి నాకు ఏమియూ తెలియదు, మరియు నేను పట్టించుకొనను,” అని చెప్పాను. కావున ఆమె చెప్పెను, “నీవు దానిని దాటిపోవచ్చును”, కానీ చెప్పెను, “ఒకవేళ నీవు దానిని గౌరవించిన యెడల, అది ప్రపంచమును కుదిపివేయును.” అయితే “ఈ యవ్వన నావికుడు ఎప్పుడు జన్మించెనో చెప్పుము”, అని నేను అన్నాను. ఆమె చెప్పెను, “దానిని నేను చెప్పలేను”.
పిదప నేను ఎక్కడికి వెళ్ళుచున్నానో దాదాపుగా నేను దిగవలసిన ఆ స్థలమునకు వచ్చాను. నాకు ఆగ్రహము పెల్లుబికినది, నా ముఖమంతా కోపముతో కందిపోయినది, బుగ్గలు కదులుచున్నవి, భయము, ఆ బస్ దిగిపోవుట కొరకు చాలా ఆనందముగా ఉన్నాను.
12
తరువాత, నేను సేవకుడిని అయినప్పుడు, మరియు ఆ దర్శనములు అంతకు మునుపు కన్నా చాలా ఎక్కువగా వచ్చుటకు ప్రారంభించెను. చాలా సంగతులు అవి నాకు చెప్పినవి. అప్పుడు నా బాప్టిస్టు సహోదరులు, వారు నాకు చెప్పారు, ఇటువంటి కూడికలలో మేము కలిసినప్పుడు, మరియు నేను వారికి వివరించెడివాడను. “బిల్లీ, వాటిని నీవు వినవద్దు. అవి దయ్యము నుండి వచ్చినవి. అది దయ్యము నిన్నుపట్టుకొనుటకు ప్రయత్నించుచున్నది, అని వారు నాకు చెప్పిరి.”
ఓహ్, మై, అది నన్ను కదిలించివేసెడిది. నేను భయపడ్డాను. దయ్యముతో నేను ఏమియూ చేయగోరుట లేదు. కనుక ఒకరాత్రి - లేక ఒక మధ్యాహ్నము, నేను పనిలో నుండి వచ్చుచున్నాను. నా మధ్యాహ్న భోజనము కొరకు చేతులు కడుగుకొనుటకు నా బెల్టు, నా గన్ బెల్టు తీసివేయుచూ ఇంటి వెనుకకు వెళ్ళుచున్నాను. చేపలకు ఆహారము వేయుటకు నేను వెనుకకు వెళ్ళుచున్నాను. నా భార్య ఆహారము సిద్ధపరిచినది. మరియు నేను ఇంటి వెనుక నుండి బయలుదేరినప్పుడు, హఠాత్తుగా, అది తిరిగి మళ్ళీ వచ్చినది. మరియు నేను నా భార్యతో చెప్పాను, “వెళ్ళు, ఆఫీసుకు ఫోన్ చేసి ఈ మధ్యాహ్నం నేను పనిలోనికి రావడం కుదరదని వారికి చెప్పుము, లేక మళ్ళీ నేను తిరిగి పనిచేసెదనో నాకు తెలియదు.” నేను చెప్పాను, “హనీ, ఇటువంటి జీవితమును నేను ఇలా జీవించలేను. నేను ఒక బానిసను. ఒకవేళ ఆ సహోదరులు చెప్పినది నిజమైతే .... ఒకవేళ ఆ సహోదరులు చెప్పినది నిజమైన యెడల, ఆ సేవకులు, ఆ దయ్యము నా ప్రాణమును తీసుకొనుటకు ప్రయత్నించుచున్నది. మరియు నేను ఒక సేవకుడను, ఈ గుడారమునకు పాస్టరును మరియు అయినప్పటికీ ఆ దయ్యము నా వెంట పడుచున్నది. నేను దానిని వదిలించుకొనవలెను. మరియు నేను దానిని వదిలించుకొనేంత వరకూ నేను మళ్ళీ తిరిగి ఎన్నడూ బోధించను లేక నేను ఎన్నడూ తిరిగి బలిపీఠము యొద్దకు వెళ్ళను.”
13
కనుక ఆ అడవిలో, నేను చేపలు పట్టు ప్రదేశమునకు, నా చిన్న గుడిసె దగ్గరకు వెళ్ళి, మరియు ఆ మధ్యాహ్నమంతా అక్కడ ప్రార్ధన చేశాను. ఇదే బైబిలు చదువుతూ ...మరియు నేను వెళ్ళు ... చీకటి పడినప్పుడు ... చాలా సార్లు, కొన్నిసార్లైతే నేను అక్కడికి వెళ్ళి రోజులు రోజులు ప్రార్ధిస్తూ గడిపెడివాడను. మరియు చీకటి పడి, నేను ఇక చదవలేనప్పుడు, నేను నా మోకాళ్ళపైకి వెళ్ళిపోయెడివాడను, ఎందుకనగా ఆ చిన్న గుడిసె ఎక్కడో కొండలలో ఉన్నది. అది జంతువుల కొరకు ఉచ్చులు పెట్టువారికి దాగు చోటుగా ఉండును, మీకు తెలుసు. (తెలియును.)
అప్పుడు నేను ప్రార్థించినప్పుడు... నేను చాలా సేపు ప్రార్ధించాను. సుమారు రాత్రి రెండు గంటల వరకూ మరియు ఈ విధముగా, నేను ఒక కుర్చీలో కూర్చున్నాను. మరియు నేను నా తలను క్రిందకు వంచియుంటిని, నిజముగా నాకు వింతైన అనుభూతి కలిగినది. మరియు నేను - నా ముఖము నిజముగా ఏడ్చుచున్నది, మరియు నేను నా చేతులు పైకెత్తాను; నేను చెప్పాను, “ఓ దేవా, అది తిరిగి జరుగనివ్వవద్దు. నేను నిన్ను ప్రేమించుచున్నాను. యేసే నా రక్షకుడు. నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఏ దయ్యము కూడా నన్ను జయించజాలదు”, “ప్రభువా, నేను ఏమి చేయగలను. దానిని నా నుండి తీసివేయుటకు నీ శక్తి కావలెను. దయ్యముతో నేను ఏమియూ చేయగోరుట లేదు. నేను యేసును ప్రేమించుచున్నాను, మరియు ఆయననే నేను సేవింపగోరుచున్నాను.”
కేవలము అప్పుడే, నేలపై ఒక వెలుగు వచ్చినది. నేను ఆ వెలుగును చూచాను. అది వ్యాప్తి చెందుటకు (ఆ నేలపై) ప్రారంభించినది, మరియు నేను పైకి చూచాను, మరియు ఇక్కడ ఈ వెలుగు సుడులు తిరుగుచూ ఉన్నది. ఇంత పెద్దదిగా, ఒక రకమైన పసుపు ఆకుపచ్చ రంగులో, పచ్చ మరియు అది నేలపై ఉన్న వెలుగు, పెద్దగా మరియు పెద్దగా పెరుగుచూ ఉన్నది. ఎవరో నడుచుటను నేను విన్నాను; నా ప్రక్కగా వచ్చుచున్నారు, నా కుడి ప్రక్కకు, ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చెను. ఆయన తనపై ఒక తెల్లని వస్త్రము కలిగియుండెను, కాళ్ళకు ఏమీ ధరించిలేడు, ఒక రకముగా కొంచెము రంగు తక్కువ వానిగా, పొడవాటి జుట్టు, భారీ మనిషి, గొప్ప పెద్ద మోచేతులు, ఈవిధముగా ముడుచుకొని ఉండెను. మరియు ఆయన నావైపు నడుచుట ప్రారంభించెను. నేను చాలా భయపడ్డాను, నేను నా వ్రేలు కొరుక్కునుచున్నాను, నా వ్రేలు కొరుక్కున్నాను. నేను నిద్రలోకి జారిపోయానని తలంచాను.
14
ఇప్పుడు, అది మీకు నవ్వు రప్పించుచున్నదని మీరు తలంచి యుండవచ్చు, కానీ ఆ స్థానములో మీరు ఒక్కసారి నిలబడండి, అప్పుడు మీరు అలాగే అనుభూతి చెందెదరు. అది ఒక దర్శనము కాదు. ఖచ్చితముగా, ఒక దర్శనమనగా ఏమిటో నాకు తెలుసు. ఇది దర్శనము కాదు. ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉండినట్లుగానే. మరియు ఆయన నావైపు చూచుచున్నాడు. మరియు నా కుర్చీపై ఆనుకొనుటకు నేను వెనుకకు వెళ్ళుచున్నాను ...?... వెనుకకు చూస్తూ, మరియు ఆయన నేరుగా నావైపే చూచాడు, మరియు ఆయన చెప్పాడు, “భయపడవద్దు”. మరియు ఆయన అది చెప్పిన వెంటనే, నేను బాలునిగా ఉన్నప్పటి నుండి నాతో మాట్లాడినది అదే స్వరమని నేను దానిని ఎరిగియున్నాను. నేను ఇంతకు ముందెన్నడూ ఆయనను చూడలేదు, కానీ అది ఆయన స్వరమే. అది లోతైనది, మరియు ఆయన చెప్పాడు, “భయపడవద్దు, నీ ప్రత్యేకమైన జన్మ మరియు జీవితమును గూర్చి నీకు చెప్పుట కొరకే నేను దేవునియొద్ద నుండి పంపబడ్డాను....”
ఎవ్వరూ నన్ను అర్థము చేసుకొనలేదు. నా సేవక సహోదరులెవ్వరూ నన్ను అర్ధము చేసుకొనలేదు. నా తండ్రి మరియు తల్లి నన్ను అర్థము చేసుకొనలేదు. నా స్నేహితురాండ్రు, నా స్నేహితులు... వారు కూడా. కనీసము నన్ను నేను అర్ధము చేసుకొనలేకపోయాను. దానిని అర్ధము చేసుకోలేకపోయాను. నేను వ్యత్యాసముగా ఉండగోరలేదు. నేను ఎవరో వలె ఉండగోరాను. కానీ దేవుడు నిన్ను ఏవిధముగా చేశాడో ఆ విధముగానే నీవు ఉండెదవు. ఆయన కుమ్మరి; మనము మంటిమి.
15
మరియు నేను ఆయనను విన్నాను. మరియు ఆయన చెప్పాడు, “నీవు రోగులకు ప్రార్థించుట కొరకే జన్మించియున్నావని సూచించుటకే ఇవన్నియూ.” అవును, రోగుల కొరకు ప్రార్ధించుటను గూర్చి నాకేమి తెలుసు? నేను కేవలము ఒక స్థానిక బాప్టిస్టు పాస్టరును. మరియు నేను తిరిగి ఆయనను చూచాను; ఆయన చాలా దయామయుడు. భయము కొంచెము కొంచెము భయము వదిలి వేయుచున్నట్లుగా అనిపించినది. మరియు నేను అన్నాను, “అయ్యా, నేను నిరక్షరాస్యుడను, మరియు నీవు నాకు చేయమని చెప్పిన అటువంటి సంగతులను నేను చేయలేను.”
ఎందుకనగా ఆయన ఇప్పుడే చెప్పాడు, “ నీవు ప్రపంచమంతటికీ వెళ్ళెదవు, మరియు నీవు రాజులకు, దేశాధ్యక్షులకు, చక్రవర్తులకు ప్రార్థించెదవు.” నేను కేవలము ఒక పాఠశాల విద్యా వ్యాకరణముతో ఏవిధముగా దానిని చేయగలను? చూశారా? నేను అప్పటికి ఇంకా పరిశుద్దాత్మను పొందుకొనలేదు. నేను ఒక స్థానిక బాప్టిస్టు పాస్టరును. ఈ సంగతులన్నీ నాకు వింతగా ఉన్నవి. మరియు వాటిని గూర్చి నాకేమియూ తెలియదు.
పిదప ఆయనతో మాట్లాడుటకు నేను తిరిగి ఆయన వైపు చూచాను, మరియు నేను చెప్పాను, “అయ్యా, నేను దానిని చేయలేను.
మరియు ఆయన చెప్పాడు, “ఆయన దేవుని చేత పంపించబడ్డాడు అని ప్రజలకు రుజువు చేయుటకు ఏ విధముగా మోషే రెండు వరములతో పంపించబడ్డాడో, నీకు కూడా రెండు వరములు ఇవ్వబడ్డాయి? -
మరియు నేను చెప్పాను, “అయ్యా, నేను వెళ్ళలేను. మోషే తన చేతిలో ఒక గురుతును కలిగియున్నాడు”. అవును.
“ఇప్పుడు, నీవు చేసే - నీవు నీ చేతిని తీసుకొని మరియూ ప్రజలపై ఉంచెదవు. నీవు ఏమి చెప్పబోవుచున్నావనే దానిని గూర్చి తలంచవద్దు, మరియు వారు కలిగియున్న దానిని అది పిలుచును. అప్పుడు ఒకవేళ నీవు నిజముగా గౌరవముగా, దీనముగా ఉన్న యెడల, (ఆ కారణమును బట్టే నేను ధనమును తీసుకొనను, లేక పెద్దవాడిగా అవ్వను)”. ఆయన చెప్పెను, “నీవు ప్రజల యొక్క హృదయ రహస్యములను ఎరిగియుండుట అనేది నెరవేర్పులోనికి వచ్చును.” మరియు చెప్పెను అప్పుడు, “ఒకవేళ వారు మొదటి సూచనను నమ్మని యెడల, వారు రెండవ దానిని నమ్మెదరు. మరియు ఒకవేళ నీవు యదార్ధముగా ఉన్న యెడల, అది నెరవేర్పులోనికి వచ్చును, అది కొంచెము కొంచెముగా పెద్దదవును.”
16
కనుక అది నాకు క్రొత్తగా ఉండెను, మరియు నేను అన్నాను, “అయ్యా, నేను ఇక్కడ ఉన్నది ఎందుకనగా, అది నేను నా సహోదరుల మధ్యకు వెళ్ళినప్పుడు, నేను ఆ దర్శనములను చూచెదను. మరియు అది దయ్యానికి సంబంధించినది అని నా సేవక సహోదరులు నాకు చెప్పెదరు. మరియు అది ఎన్నడూ దేవుడు నాకు తిరిగి జరుగనివ్వకూడదు అనే నేను ఇక్కడ ఉన్నాను.”
వెంటనే, ఆయన నా ముందుకు నడుచుకొనివచ్చెను, నన్ను నిలబడమని అడిగెను. మరియు నేను లేచి నిలబడ్డాను, మరియు “నీకు లేఖనములు తెలియవా?” అని ఆయన నన్ను అడిగియున్నాడు.
మరియు నేను చెప్పాను, “అవును, సేవకులు ఎవ్వరూ దానితో ఏకీభవించుట లేదు. ఒకవేళ అది దేవునిదైతే, వారు ఎందుకు దానిని కలిగిలేరు?”
ఆయన చెప్పెను, “ఇది దాని కొరకైన దినమైయున్నది, ఇదియే ఆ ఘడియ.”
“మరి దురాత్మ సంబంధమైన చెడు శక్తులు ఏ విధముగా వాటిని ఎరిగియుండెను,” అని నేను అన్నాను.
అప్పుడు ఆయన చెప్పెను, “మన ప్రభువు యొక్క దినములలో ...” ఆ కారణమును బట్టే ఆయన ప్రభువు కాదు అని నేను తెలుసుకున్నాను.
ఎందుకనగా ఆయన చెప్పెను, “మన ప్రభువు.” (మన ప్రభువు). మన ప్రభువునే ఆయన తన ప్రభువుగా పరిగణించెను. ఆయన ఒక దూత, ఒక వ్యక్తి, ఒక వర్తమానికుడు (వర్తమానమును మోసుకుని వచ్చేవాడు). మరియు ఆయన చెప్పెను, “మన ప్రభువు యొక్క దినములలో, సేవకులు మరియు యాజకులు దేవాలయములో ఉన్నప్పుడు, ఏ రకమైన దుస్తులు ధరించవలెనని వాదించుకొనుచుండగా, అదే సమయములో, ఈ మేగీలు, ఖగోళశాస్త్రజ్ఞులు, వారు ప్రభువైన యేసును ఆరాధించుటకు మార్గములో ఉండియుండిరి. వారు ఆయనను ఎరిగియుండిరి, మరియు ఆ మతాధిపతులు ఆయనను ఎరుగకయున్నారు.” ఆయన చెప్పెను (ఆ దూత), “ ”మేము నిన్ను ఎరిగియున్నాము, నీవెవరవని, దేవుని యొక్క పరిశుద్ధుడవని“, ఆ దయ్యము అలాగు చెప్పగలిగినది. కానీ ఆ యాజకుడు అన్నాడు, ”ఆయన ఒక దయ్యము“. దయ్యము చెప్పినది, ”ఆయన దేవుని యొక్క కుమారుడు“. యాజకులు చెప్పిరి, ”ఆయన ఒక దయ్యము“.”
17
అప్పుడు భయము నన్ను వదిలిపెట్టుట ప్రారంభించినది. పౌలుకు ఏది ఆటంకముగా ఉన్నది, పౌలు మరియు సీలలకు, వారు ఒక ప్రదేశములో ప్రసంగించుచున్నప్పుడు, యాజకుడు చెప్పెను, “ఈ మనుష్యులు లోకమును తలక్రిందులు చేయుదురు, వారు మంచివారు కారు.”
కానీ ఆ చిన్న సోదె చెప్పువాడు చెప్పెను, “వీరు దైవ సంబంధులు, అది జీవిత విధానమును మనకు చెప్పును.” ఎవరు సరైనవారు?
ఈ రోజు ఆ విధముగా అది ఒక గొప్ప విషయము, మరియు అది సత్యము. అప్పుడు బైబిలు ఒక క్రొత్త పుస్తకమగును. నేను దానిని చూడగలను.
ఈ రోజు, మన యొక్క శాఖాపరమైన మరియు మన చిన్న గుంపులకు మరి ఎక్కువగా మనము మన తెలివిపైన ఆధారపడ్డాము, మనము ఒక గొప్ప ఆత్మీయ ... దాటియున్నాము. కానీ ఒక దయ్యముతో పట్టబడిన వ్యక్తి, వారు ఆత్మలతో సంబంధము కలిగియున్నారు. చాలాసార్లు వారు ఆ తెలివైనవారు చూచుట కన్నా ముందుగా వీరు చూడగలరు. ఎందుకనగా అతడు ఆత్మీయసంగతులన్నీ త్రోసివేసి యున్నాడు. సేవకులైన మీ గురించి నేను మాట్లాడుట లేదు. దేవునికి వందనములు, కొంతమంది దానిని చూసి మరియు నమ్మగలరు. చూడగలిగిన వారి కన్నులు, మరియు వినగలిగే చెవులు ధన్యములైయున్నవి, ఏలయనగా దేవుడే దీనిని చేసెను. యేసు చెప్పెను, “నా తండ్రి వానిని ఆకర్షిస్తేనే తప్ప, ఎవరునూ నా యొద్దకు రారు. నా గొర్రెలు నా స్వరమును వినును; అన్యుని అవి వెంబడించవు.”
18
ఇప్పుడు, తరువాత ... నేను తొందరపడెదను. అది వెంటనే, రోగుల కొరకు ప్రార్ధించుటకు నేను పంపించబడ్డాను. మనకు సమయమున్నదా? కేవలము ...?... జరిగిన మొదటి సంగతిని తరువాత నేను మీకు ఇచ్చెదను. వారు - అప్పుడు నేను తొందరపడెదను. అప్పుడు నేను ...(మీరు దానిని చెప్పలేదు). (సహోదరుడు బ్రాన్హాం నవ్వుచున్నారు) అది సరే. మిస్సోరిలోని సెయింట్ లూయిస్ లో రెండు రోజుల తరువాత ఒక రోగి కొరకు నేను పిలువబడితిని. ధరించుటకు నాకు కోటు లేదు. ధరించుటకు ఎవరో నాకు కోటును ఇచ్చియున్నారు. మరియు తీవ్రమైన కీళ్ళవాత జ్వరము కలిగియున్నఒక చిన్న బాలిక యొక్క తండ్రి యొద్దకు నేను వెళ్ళాను. వైద్యులందరూ - అందరూ - వైద్య సంబంధమైన అసోసియేషన్‌కు సెయింట్ లూయిస్ కేంద్రమైయున్నది. మరియు వారు -మరియు ఈ చిన్నబిడ్డకు నయము చేయుటకు చాలామంది వైద్యులు ప్రయత్నించుచున్నారు. ఆమె ఒక ప్రఖ్యాతి గాంచిన సేవకుని యొక్క కుమార్తె. దీనిని గూర్చి ఆయనకు ఏవిధముగా తెలుసని, ఈ రోజుకూ నాకు తెలియదు.
నేను గృహమునకు వెళ్ళాను. ఆ చిన్న బాలిక ఒక జంతువు వలె, తన ముఖముపై గీరుకొనుచూ, తన నాలికను నములుచూ, మొత్తమంతా (శరీరము) కదుపుచూ ఉన్నది. కావున నేను లోపలికి వెళ్ళి, ఇంకా అనేక ఇతర క్రైస్తవులందరితో మోకాళ్ళు వేసి, ప్రార్ధన చేసి, ప్రారంభించాను, మరియు “నీవు ఆజ్ఞను పొందేటంతటి వరకూ ఇక్కడ వేచియుండుము”, అని పరిశుద్దాత్మ చెప్పెను. ఓహ్, దేవునికి స్తోత్రము. “ఇక్కడ వేచియుండుము.”
నేను ఆ రెవరెండ్ గారిని అడిగాను, ఒకవేళ ఆయన ... ఆయన యొక్క ఆలయమునకు వెళ్ళెదమని అడిగాను. మేము ఆయన ఆలయమునకు వెళ్ళి, ప్రార్ధన చేసి, ఇంటికి తిరిగి వెళ్ళెదము. దినమంతా గడిచిపోయెను, రాత్రంతా కూడా.
19
తరువాత రోజు, నేను ఎదురుచూచుచున్నాను, మరియు నేను ఆయన కారులో కూర్చునియున్నాను. మరియు నేను ఆ కారులో తల పైకెత్తి చూచుచున్నప్పుడు, ఒక దర్శనము వచ్చుటను నేను చూచాను. ఆయన ఏమి చెప్పునా అని నేను ఎదురుచూచాను. నాకు దర్శనము వచ్చిన తరువాత, నేను కారులో నుండి బయటకు వచ్చి, ఇంటి యొద్దకు వెళ్ళి, మరియు ఆ పాత-సేవకునితో నేను చెప్పాను, “అయ్యా, నేను యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును కలిగియున్నాను, నీ తండ్రిని తీసుకుని రమ్ము. మరియు మేము మంచము యొద్దకు వెళ్ళాము, నేను ఆ సేవకుని భార్యయైన ఆ స్త్రీతో చెప్పాను, ”రెండు రోజుల క్రితము, నీవు పట్టణమునకు వెళ్ళావు, నీవు ఒక చిన్న తెల్లని పాత్రను కొన్నావు.“ (చిన్న మట్టి కుండ, లేక ఒక పాత్ర, నీకు తెలుసు, ఒక చిన్న బకెట్టు వంటిది). ”దానిలో ఎన్నడూ నీరు పోయబడలేదు. అది మీ వంట గదిలో పాత్రలను తోమే సింక్ క్రింద ఉన్నది.
ఆమె చెప్పెను, “అది నిజమే”.
“వెళ్ళి దానిని తీసుకొని రమ్ము. దానిలో నీరు పోయుము, ఒక తెల్లని గుడ్డ తీసుకొని మరియు దానిని ఇక్కడకు తీసుకొని రమ్ము మరియు ఏమీ అడగవద్దు. కేవలము నేను చెప్పినట్లు చేయుము.”
మరియు నాతో పాటు నిలబడమని నేను ఆ సేవకునితో చెప్పాను. మంచము యొక్క కాళ్ళ వైపున, సేవకుడు కుడి ప్రక్కన, ఆయన తండ్రి ఎడమ ప్రక్కన, తల్లి బిడ్డ ప్రక్కన నిలబడియున్నది. ఆ చిన్న బిడ్డ ఇక ఏ మాత్రము శబ్దము చేయుస్థితిలో లేదు; అది చాలా దుర్బరమైపోయినది. నేను చెప్పాను, “ఆ చిన్న గుడ్డను తీసుకొని, దానిలో నుండి నీటిని పిండుము. మరియు నేను ఒక మాదిరి ప్రార్థనను ప్రారంభించినప్పుడు, ”పరలోకమందున్న మా తండ్రి“ అని, ఆ గుడ్డతో ముఖముపైన తుడువుము. ఎంత మాత్రము నీ చేతిని ఆమె ముఖము పై నుండి తీసివేయవద్దు. నేను ప్రార్ధన మధ్యలోనికి వచ్చినప్పుడు, ”మా అనుదిన ఆహారము, మాకు దయచేయుము“ అని, అప్పుడు ఆ చేతిగుడ్డ బిడ్డకు మధ్యలోనికి రావలెను. మరియు నేను ”ఆమేన్“ అని చెప్పినప్పుడు, అది పాదముల పైకి రావలెను. మరియు మేము ప్రార్ధించాము. అదియే ఖచ్చితముగా నేను దర్శనములో చూచినది. మరియు ఆమె ఆ గుడ్డను అలా క్రిందకి తీసుకొని వచ్చుటకు ప్రారంభించెను, మరియు నేను ”ఆమేన్“ అన్నప్పుడు, అప్పుడు ఆమె తన చేతిని తీసివేసినది. పరలోకము యొక్క గొప్ప దేవా, నన్ను ఆ చిన్న గుడిసెలో కలుసుకొనినవాడా, దీనిని ప్రకటించుటకు నీ దూతను పంపించావు, నేను ఆ బిడ్డ యొక్క జీవము కొరకు పలుకుచున్నాను; ఆ బిడ్డ బ్రతుకును గాక.”
మరియు ఆ చిన్న బాలికనేలపై గెంతినది. వైద్యుడు ఆ ప్రక్క గదిలో ఉండియుండగా, నేను ఆమెను చేయిపట్టుకొని తీసుకొని వెళ్ళాను, మేము అలా ఇంటి బయటకు నడిచి, ఆ సోడా కొట్టు యొద్దకు వెళ్ళి, మరియు ఇద్దరమూ మాల్ట్ కలిపిన పాలును త్రాగాము. మూడు రోజుల తరువాత పంతొమ్మిదివేల మంది పట్టు ఆ కీల్ ఆడిటోరియం పూర్తిగా నిండిపోయినది. అక్కడ నుండి అది ప్రపంచమంతా వెళ్ళిపోయినది.
20
ఇప్పుడు, పుస్తకములు వ్రాయబడవచ్చును, కానీ ఇప్పుడు నేను దీనిని కొంచెము దగ్గరగా తీసుకొని రాయగోరుచున్నాను.
నా సేవక సహోదరులారా, దేవుని యొక్క రాజ్యములో సహపౌరులారా, క్రీస్తు యేసు తోడి సేవకులారా, విశ్వాసులుగా మరియు మందకు కాపరులుగా, నేను మీతో మాట్లాడగోరుచున్నాను. ఒకవేళ ఏదైనా భావమునిచ్చు ... దానిని నేను మాట్లాడిన యెడల, అది నాలో ఉన్న దేనినో బయటకు తెచ్చి మరి దేనినో మీరు నమ్మునట్లుగా చేయుటకు, లేక మిమ్ములను మెప్పించుటకు ఇది కారణమైన యెడల, దయచేసి నన్ను క్షమించండి. అది తెలియకుండానే, దానిని నేను చేసియున్నాను.
మనము చివరి కాలములో ఉన్నాము, మరియు అంత్యకాలములో యేసు వీటిని వాగ్దానము చేసియున్నాడు.
ఇప్పుడు, మీతో ఒక్క లేఖనమును నన్ను మాట్లాడనివ్వండి, లేఖనముల ద్వారా దానిని మనము చదివెదము; దానిని, లేఖనముల ద్వారా, నేను చదివియున్నాను. చాలా స్థలములను నేను సూచించగలను. “లేఖనమంతా నెరవేరవలసియున్నదని” యేసు చెప్పెనని మనకు తెలుసు. అది నిజము. దానిలో ఏదియూ విఫలము కాదు. “భూమ్యాకాశములు విఫలమైపోవును (గతించును), కానీ నా మాట ఎన్నడూ విఫలమవ్వదు.”
21
లూకాలో దీనిని వినుము, “సొదొమ యొక్క దినములలో జరిగినట్లుగా, మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును.” చూశారా? మనుష్య కుమారుని యొక్క రాక నందు ... ఇప్పుడు, చాలా దగ్గరగా గమనించెదము. (నేను కొంచెము వేగముగా మాట్లాడెదను).
అబ్రహాము ... భూమిపైన ఎల్లప్పుడూ మూడు జాతుల ప్రజలు ఉందురు: విశ్వాసులు, తయారు కాబడిన విశ్వాసులు, మరియు అవిశ్వాసులు. ఇప్పుడు, అతడిని గమనించండి. “సొదొమ యొక్క దినములలో....” ఇప్పుడు, దేవుడిని నమ్మని దేశము ఒకటి కలదు, అది సొదొమ, చాలా పాప-చాలా చెడ్డది. మరియు అక్కడ కొంతమంది విశ్వాసులు కూడా ఉన్నారు, స్వాభావిక (శారీరక) సంఘము, లోతు, తన జనులు.
22
ఇప్పుడు, అబ్రహాము ప్రాతినిధ్యము, అనగా ఆత్మీయమైన సంఘమునకు ప్రాతినిధ్యము వహించుచున్నాడు. అతడు అవిశ్వాసులందరి నుండి, మరియు వేషదారుల నుండి, తనను తాను వేరుపరచుకున్నాడు, ఈ దినపు సంఘమునకు చాలా అద్భుతమైన మాదిరి. “సంఘము” అను పదమునకు అర్థము “బయటకు పిలువబడుట”. ఈ దినము సంఘము అదే అయ్యున్నది: బయటకు పిలువబడిన వారు.
ఇప్పుడు, ఇది అంత్యకాలము యొక్క సమయమై యున్నది, అప్పుడు ముగ్గురు వ్యక్తులు వచ్చి అబ్రహామును కలుసుకొన్నారు. ఇద్దరు— ఆముగ్గురూ—వారిలో ఇద్దరు దూతలైయున్నారు, కానీ వారు మనుష్యులవలె కనిపించుచున్నారు, వారి దుస్తులపై ధూళి ఉన్నది, వారి పాదములు దుమ్ము పట్టి ఉన్నవి. “వచ్చి, సింధూర వృక్షము క్రింద కూర్చొనుము. మీ పాదములు కడుగుకొనుము. నేను మీకు కొంచెము ఆహారము తెచ్చెదను, అప్పుడు మీరు సాగిపోవచ్చును”, అని అబ్రహాము చెప్పాడు. చూశారా? అబ్రహాము దేనికొరకో చూచుచున్నాడు. ఈరోజు, సంఘము, విశ్వాసి ఆ విధముగానే ఉన్నారు, దేనికొరకో ఎదురు చూస్తూ ఉన్నారు. సమయము దగ్గరపడుచున్నదని అతడు ఎరిగియున్నాడు.
అది నోవహు, హనోకును గమనించుచున్నట్లే ఉన్నది. హనోకు పైకి కొనిపోబడినప్పుడు, ఆ జల ప్రళయము సమీపించియున్నదని నోవహు ఎరిగియుండెను.
23
మరియు అబ్రహాము వారిని కూర్చొండబెట్టినప్పుడు, అతడు గుడారము వెనుకకు వెళ్ళి మరియు చెప్పెను, “శారా, మెత్తని పిండి పిసికి మరియు పొయ్యిపై కొన్ని రొట్టెలు కాల్చుము.” అతడు బయటకు వెళ్ళి మరియు ఒక దూడను తెచ్చి మరియు దానిని వధించెను. మరియు అతడు తిరిగి వచ్చి, మాంసమును తెచ్చెను. మాంసము, రొట్టె, మరియు పాలు, మరియు అవన్నీ వారి ముందు పెట్టెను; వారు తినిరి.
మీరు ఊహించగలరా, వారిలో ఒకరు దేవుడు. ఇప్పుడు దానిని గూర్చి మీరు నాతో అంగీకరింపరని నాకు తెలుసు. సహోదరులైన మిమ్ములను నేను అడుగగోరుచున్నాను, అబ్రహాము ఆయనను ఎలోహిమ్ అని పిలువలేదా? అది సర్వశక్తుడైన దేవుడు.
కొంతకాలము క్రితము ఎవరో నాతో చెప్పారు, నేను దానిని గూర్చి మాట్లాడుచుండగా, నీవు చెప్పావు—అతడు అన్నాడు, “సహోదరుడా బ్రాన్హాం, అది ఆయన దేవుడని నీవు నమ్ముచున్నావా?”
నేను అన్నాను, “అవునయ్యా. బైబిల్ ఆ విధముగా చెప్పుచున్నది.”
అతడు చెప్పాడు, “దేవుడు ఆ శరీరములో ఏ విధముగా వచ్చాడు?”
మానవ శరీరము భూమి యొక్క పదహారు మూలకాలతో చేయబడినది : అది పెట్రోలియం, సూర్యరశ్మి, క్యాల్షియం మరియు ...దేవుడు, సృష్టికర్త, దానిలో నుండి ఒక గుప్పెడు తీసుకొని, దానిలో ఊపిరి ఊదెను, “గాబ్రియేలూ, ఇలా రమ్ము. దానిలోనికి అడుగు పెట్టుము,” అని చెప్పెను. మరొకటి తీసుకొని, వ్యూ! “మిఖాయేలూ, ఇలా రమ్ము”. మరియు మరొక గుప్పెడు తీసుకొని, తానే స్వయముగా దానిలో అడుగు పెట్టెను. ఆయన సృష్టికర్త. ఆయన కోరునది ఏదైనా ఆయన చేయగలడు.“
24
నిన్నటి దినమున నా భార్య నాతో చెప్పినది, “బిల్లీ....” కొంతకాలము క్రితము నేను జుట్టుకు కత్తెర వేయించుకొన్నాను, మరియు ఒక మంగలివాడు నా జుత్తుపై కార్బలిక్ యాసిడ్ వేసియున్నాడు, మరియు అదంతా ఊడిపోయినది. మరియు ఆమె చెప్పెను, “బిల్లీ, నీవు పూర్తిగా బట్టతలవానిగా మారావు.”
కానీ నేను చెప్పాను, “వాటిలో ఒక్కదానిని కూడా నేను పోగొట్టుకొనలేదు.”
ఆమె చెప్పెను, “అవి ఎక్కడ ఉన్నవి?” .
“నేను వాటిని కలిగియుండక మునుపు అవి ఎక్కడ ఉండెనో నాకు చెప్పుము”, అని చెప్పాను. ఎక్కడ -అవి కేవలము పెట్రోలియం, మరియు సూర్యరశ్మిలు మాత్రమే, మరియు అప్పుడు అవి నావి ...?... మరియు నేను వాటిని కలిగియుండక మునుపు అవి ఎక్కడ ఉండినప్పటికీ, అవి అక్కడ నా కొరకు ఎదురుచూచుచున్నవి.
యేసు చెప్పెను, “నీ తలవెంట్రుకలు లెక్కించబడినవి. నేను వాటిని అంత్యదినమున లేపుదును. నా తండ్రి నాకిచ్చిన వారందరూ, నా యొద్దకు వచ్చెదరు, మరియు అంత్యదినమున నేను వారిని లేపుదును.”
25
మనము ఒక దేవుడిని ఎరిగియున్నందుకు నేను చాలా సంతోషించుచున్నాను, నేను ఈ మహాసముద్రములో మునిగిపోయినప్పటికీ, నా శరీరము కుళ్ళిపోయినప్పటికీ, ఇంకనూ ఇక్కడ ఉన్న ప్రతీ అణువును నా దేవుడు ఎరిగియున్నాడు. ఒక దినమున ఆయన పలుకును (సహోదరుడా బ్రాన్హాం ఒక ఈల శబ్దమును చేయుచున్నారు) మరియు అప్పుడు నేను ప్రత్యక్షమగుదును. హల్లెలూయా.
26
అదే ఆయన అక్కడ చేసియున్నాడు. ఆయన అక్కడ నిలబడియున్నాడు; ఆయన ఒక దూడ మాంసమును తినియున్నాడు, ఆవు పాలు త్రాగియున్నాడు, రొట్టెను తిన్నాడు. అప్పుడు ఆ ఇద్దరు ప్రసంగీకులు, దూతలు, ఆధునిక బిల్లీ గ్రాహాం, ఓరల్ రాబర్ట్స్. ప్రసంగీకులు... లోకమునకు వారొక వర్తమానమును కలిగియున్నారు. కనుక వారు సొదొమ వైపు చూచారు. వారు అక్కడకు వెళ్ళియున్నారు, పెద్దగా అద్భుతములు ఏమియూ చేయలేదు, కానీ ప్రజలను వారు గ్రుడ్డివారిగా చేసిరి. సువార్తను ప్రసంగించుట ప్రజలను గ్రుడ్డివారిగా మార్చునా. పరిశుద్ధ గ్రంథము అదే చెప్పుచున్నది.
బయటకు పిలువబడిన సంఘమునకు, ఎన్నుకొనబడిన వారికి, అబ్రహాము యొక్క సంఘమునకు పంపబడిన ఈ ఒక్కడిని మనము చూచెదము. ఆయన అబ్రహాముతో చెప్పెను... ఇప్పుడు గుర్తించుకొనండి, ఆయన ఒక క్రొత్త వ్యక్తి, “అబ్రహామూ, నీ భార్యయైన శారా ఎక్కడ?” అతడికి ఒక భార్య ఉన్నదని ఆయనకు ఏలాగు తెలుసు? ఆమె యొక్క పేరు శారా అని ఆయనకు ఏలాగు తెలుసు?
ఇప్పుడు, లేఖనము ఏమి చెప్పుచున్నదో గమనించుడి. “ఆమె నీ వెనుక ఉన్న గుడారములో ఉన్నది”, అని లేఖనము చెప్పుచున్నది.
ఆ మరియు ఆయన చెప్పెను, “నేను అబ్రహామునకు ఏ రహస్యమును దాచియుంచను. మీదటికి నిర్ణయ కాలమున (జీవ కాలము) నేను నిన్ను దర్శించెదను.”
మరియు శారా, ఆమెలో ఆమె నవ్వుకొనెను, “నేను ముసలిదానను, మరియు నా ప్రభువైన అబ్రహాము, అతడు కూడా ముసలివాడే, తిరిగి మేము ఏవిధముగా ఆనందించగలము? అని అనుకొనెను.”
ఇప్పుడు, ఆ దూత, ఈ మనుష్యుడు శరీరములో ఉండెను, ఆయన చెప్పెను, “ఎందుకు శారా నవ్వినది? ఎందుకు ఆమె నవ్వినది?”
యేసు చెప్పెను, “నోవహు యొక్క దినములలో సొదొమ యొక్క దినములలో, జరిగినట్లుగా మనుష్యుకుమారుని యొక్క రాకడలో జరుగును.” ఆధునిక బిల్లీగ్రాహమ్ మరియు మొదలగువారితో, జ్ఞానులకు ఈ సువార్త ప్రసంగింపబడును. కానీ ఆత్మీయ సంఘము, ఒక వర్తమానికుడిని పొందుకొనును, ప్రభువు యొక్క దూత, మరియు సొదొమకు ముందు జరిగిన అదే సంగతులను తిరిగి చేయును. ఎందుకు? లోకము ఈసారి కాల్చివేయబడును. సొదొమ కాల్చబడినది. నోవహును గూర్చి ఆయన చెప్పినప్పుడు, ఆయన ఏమి చెప్పెనో మీరు గమనించితిరా? “అక్కడ ఉన్నట్లుగానే, తినుచూ, త్రాగుచూ, పెండ్లాడుచూ ...” లోకము యొక్క విలువలు .... కానీ ఇక్కడ లోకమునకు ఒక ఆత్మీయ సూచన ఉన్నది. గమనించుడి యేసు వచ్చినప్పుడు, మెస్సియగా కనపరచుకొనుటకు ఆయన ఏవిధముగా తెలియపరచుకొనెను? ఆయన వారి హృదయము యొక్క ఆలోచనలను ఎరిగియుండెను. ఇప్పుడు, సహోదరులారా మరియు పురుషులారా, అది నిజమే కదా? లేఖనము అదే కదా?
27
ఏ విధముగా ... ఆయన సీమోను, పేతురుకు చెప్పినప్పుడు, “నీ పేరు సీమోను, మరియు నీ తండ్రి యోనా”. ... లేఖనములు నెరవేర్చబడుట కొరకు వారు చూచుచున్నారు. అది ... మెస్సియ వచ్చినప్పుడు, ఆయన ఒక దైవ ప్రవక్తగా ఉండును. ఇప్పుడు, ఈ దినమున మనలో అనేకమంది చేసియున్నట్లుగా, యూదులు కూడా ఆ ఆత్మీయభాగము నుండి తప్పిపోయిరి. ఒక గొప్ప వ్యక్తి రావలెనని వారు చూచుచున్నారు, ఆకాశము నుండి స్వారీ చేసుకొనుచూ వచ్చి, లోకమునంతటినీ పాలించువాడిగా, మరియు దానిని చూచుటలో వారు విఫలమైరి. యేసు యొద్ద నుండి పదిహేను మైళ్ళకు దూరముగా, నతానియేలు ఒక చెట్టు క్రింద ఉండెను. వారు యేసును, బయెల్జబూబు అని పిలిచినప్పుడు, వారు ఎన్నడూ తమ పెదవులతో దానిని పలకలేదు. బైబిలు చెప్పెను, “ఆయన వారి యొక్క ఆలోచనలను శోధించెను.” తెలుసు ... వారి ఆలోచనలను ఎరిగి ... ఆయన ఆ బావి యొద్ద స్త్రీతో చెప్పెను, “వెళ్ళి నీ భర్తను తీసుకొని ఇక్కడకు రమ్ము.”
“నాకు ఎవ్వరూ లేరు”, అని ఆమె చెప్పెను. -
“నీకు అయిదుగురు కలరు”, అని ఆయన చెప్పెను. ఇప్పుడు, ఆమె ఆయనను దయ్యము అని పిలువలేదు. ఆమె చెప్పెను, “అయ్యా, మేము, సమరయులము, మాకు తెలుసు ...” చూడండి, ఎక్కడ ... “మెస్సియ వచ్చినప్పుడు ఆయన ఈ సంగతులను చేయునని మేము ఎరిగియున్నాము”. చూశారా? ఆమె సరిగ్గా నేర్పించబడినది. “కనుక నువ్వు బహుశా ఆయన యొక్క ప్రవక్తవు.”
ఆయన చెప్పెను, “అవును అది నేనే”. పట్టణమునకు ఇవ్వబడిన ఆమె వర్తమానమును గమనించుడి. “నేను చేసిన సంగతులను నాతో చెప్పిన ఒక వ్యక్తిని వచ్చి చూడుము. ప్రవక్త యొక్క సూచన ఇది కాదా, మెస్సియ యొక్క సూచన ఇది కాదా? ఈయన అదే మెస్సియ కాడా?” మీకు అర్థమైనదా? యేసు చెప్పెను ... “ఇక నన్ను ఎరుగరు - ఇక ఎన్నడూ నన్ను చూడరు. కానీ మీరు నన్ను చూచెదరు, ఏలయనగా నేను (”నేను“ అనేది వ్యక్తిగత సర్వనామము), నేను మీతో ఉందును, మీలోనూ ఉందును, యుగాంతము వరకూ.
“ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉండెను”, అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది.
28
ఇప్పుడు, కేవలము మరొక్క క్షణము. ఇప్పుడు, నిజముగా జాగ్రత్తగా వినుము. మోషేకు అగుపించిన ఆ దూత, క్రీస్తే అని మన అందరికీ తెలుసు. అది నిబంధన దూత. మీరు దానిని నమ్మెదరా? నిబంధన దూత. ఆయన ఇశ్రాయేలీయులను అగ్ని స్తంభ రూపములో వెంబడించెను. మరియు పిదప యేసు భూమి మీద ఉన్నప్పుడు, ఆయన చెప్పెను, “మునుపు...” వారు ఆయనతో చెప్పిరి ... ఆయన అబ్రహాము యొక్క దినమును చూచియున్నానని వారితో చెప్పినప్పుడు వారు ఆయన మీద కోపపడిరి. “నేను అబ్రహాము కన్నా ముందు ఉన్నవాడను,” అని యేసు చెప్పెను. అది పొదలో ఉన్న అదే అగ్ని స్తంభము, “నేను”.
ఇప్పుడు, ఆయన, యేసు చెప్పెను, “నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, నేను దేవుని యొద్దకు వెళ్ళుచున్నాను.” మీరు దానిని నమ్మెదరా? లేఖనము అది చెప్పుచున్నదా? ఆయన మరణము, భూస్థాపన మరియు పునరుద్ధానము తరువాత సంఘముపైకి శ్రమ వచ్చెను.
పౌలు, పెంతెకొస్తు ప్రజలందరినీ చెరసాలలో వేయుటకు జారీ అయిన ఆజ్ఞలను తన జేబులో పెట్టుకొని దమస్కు మార్గమున వెళ్ళుచుండెను, మరియు తన మార్గమధ్యలో ఒక వెలుగు అతనిని తాకెను, మరియు అతడు నేలపైన పడెను. మరియు అతడు పైకి చూచెను, మరియు అగ్నిస్తంభము అతడి ముందర నిలబడి, “సౌలా, సౌలా నీవు నన్నేల హింసించుచున్నావు? అని అడిగెను.”
“నీవు ఎవడవు?” అని అతడు అడిగెను.
మరియు నా గూర్చి సాక్ష్యమిచ్చెదవు ...?...పౌలు ఒక శక్తివంతమైన, వివేకము గల ప్రసంగీకుడు, శక్తిమంతుడైన గమాలీయేలు క్రింద ఉన్నాడు, కానీ లెక్కింపదగినది అది కాదు. అతడు ఈ దూతను, ఈ వెలుగును, ఈ అగ్నిస్తంభమును చూచాడు. “ప్రభువా, నీవెవరవు?”.
ఆయన చెప్పెను, “నేను యేసును”. ఆయన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళెను. “నేను
దేవుని యొద్ద నుండి వచ్చాను; నేను దేవుని యొద్దకు వెళ్ళుచున్నాను.“
29
ఇప్పుడు, నేను మిమ్ములను అడుగగోరుచున్నాను, మీరు ఇక్కడకు వచ్చి ఒక నారింజ చెట్టు నుండి ఒక కాయ కోయగోరిన ఎడల, నారింజ చెట్టు నారింజ కాయలనే కాయును. బొప్పాయి చెట్టు బొప్పాయి కాయలనే కాయును. ఎందుకు? ఆ చెట్టులో ఉన్న ఆ జీవము, దానిలో ఉన్న ఆ జీవము వంటి ఫలములనే అది ఫలించును. అది నిజమేనా?
ఇప్పుడు, మనము చూచెదము. ఈ ప్రభువు యొక్క దూత, చాలా, చాలాసార్లు వారు దాని యొక్క చిత్రమును తీసిరి. (చాలాసార్లు). ఇప్పటి వరకూ ఫోటోగ్రాఫ్ తీయబడిన ఒకే ఒక్క సహజాతీతమైన సంగతిగా, కళావిభాగములో మతసంబంధమైన హాలులో ఒక కాపీరైట్‌తో వాషింగ్టన్ ది.సి.లో అది వ్రేలాడదీయబడియున్నది. హూస్టన్‌లోని, టెక్సాస్ వద్ద (హూస్టన్, టెక్సాస్) నా బాప్టిస్టు సహోదరులలో ఒకడు లేచి మరియు దైవిక స్వస్థతను గూర్చి నాతో వాదించగోరాడు. నేను దానిని నిరాకరించాను. గందరగోళపరచుటకు దేవుడు ఎన్నడూ నన్ను పంపలేదు... ఆయన పిల్లలకు ప్రార్ధన చేయుట కొరకు ...
మరియు అప్పుడు, తరువాత రోజు వార్తాపత్రికలో అతడు ఒక పెద్ద వార్తను పెట్టాడు, మరియు అతడు చెప్పాడు, “అతడు దేనితో (నింపబడ్డాడో) చేయబడ్డాడో అది చూపించుచున్నది; వాక్యమును ఎదుర్కొనుటకు అతడు భయపడుచుండెను.”
డాక్టర్ బోస్‌వర్త్, అతడు నా సహాయకులలో ఒకడు, అప్పుడు అతడి వయస్సు ఎనభై సంవత్సరములు. మీలో చాలా మంది డాక్టర్ బోస్‌వర్త్‌ను గూర్చి వినియున్నారు, ఒక మంచి దైవజనుడు. అతడు వచ్చి అతని చేయి నా చుట్టూ వేసి, మరియు అతడు చెప్పాడు, “సహోదరుడా బ్రాన్హాం, దాని కొరకు నీవు నిలబడెదవా?”
నేను చెప్పాను, “సహోదరుడా బోస్‌వర్త్, నీవు ఏమి చేసినప్పటికీ, యేసు చెప్పెను ”నా తండ్రి మొదటగా అతడిని ఆకర్షిస్తే తప్ప, ఎవ్వరునూ నా యొద్దకు రాలేరు. మరియు నా తండ్రి నాకిచ్చిన వారందరూ నాయొద్దకు వచ్చెదరు“. లేఖనములో వారు చెప్పలేదా ”వారు నమ్మలేరు. వారు కన్నులు కలిగియుండియూ, చూడలేరు, మరియు చెవులు కలిగియుండియు వినలేరు. యేసు అనేకమైన అద్భుతములు చేసినప్పటికీ ... మీకు అర్థమైనదని నిశ్చయముగా నేను ఎరుగుదును.“
మరియు అతడు చెప్పెను, “కానీ బ్రాన్హాం సహోదరుడా, మర్యాదస్తులుగా, సేవకులుగా ఆ వాక్యమును సంరక్షించుటకు ప్రజలకు మేము బద్దులమైయున్నాము.”
నేను అన్నాను, “బహుశా మీరు బద్దులైయుండవచ్చు. ఒక ఆజ్ఞను కొనసాగించుటకు దేవునికి నేను బద్దుడనైయున్నాను..
“దానిని చేయుటకు నీవు నన్నుఅనుమతించెదవా?”, అని అతడు అడిగెను.
“అది కేవలము ఒక వాగ్వివాదము చేయును,” అని నేను అన్నాను.
అతడు అడిగాడు, “దయచేసి, నన్ను దానిని చేయనిమ్ము.”
నేను అతడి వైపు చూచాను, ఎనభై సంవత్సరముల వయస్సు వెళ్లి ఆ పట్టణమును స్వాధీనపరచుకొననిమ్ము అని చెప్పిన కాలేబును అతడు నాకు జ్ఞప్తికి తెచ్చాడు. నేను అన్నాను, “ఇకవేళ నీవు వాదించవు అని నాకు ప్రమాణము చేసిన యెడల.....”
అతడు అన్నాడు, “నేను ప్రమాణము చేయుదును.”
30
ఓ, మై. వార్తాపత్రికకు కావలసినది కేవలము అదే గొప్ప పెద్ద ముఖ్యా౦శములు మత సంబంధమైన పొట్టు ఎగిరిపోవును.“
కాబట్టి అప్పుడు, మరుసటి రోజు శామ్ హూస్టన్ కొలిసియమ్‌లో వారు ఆ ముఖాముఖి వాదనను పెట్టియున్నారు. ముప్పై వేల మంది అక్కడ సమకూడారు.
వినండి, బహుశా ఈరోజు మనము విభాగింపబడి యుండవచ్చు. కానీ దీనిని వినండి. ఈ రోజులలో ఒకానొక రోజు మనమందరమూ ఒక్కటవుదుము. దేవుడు దాని కొరకు చూచును, ఒకవేళ కమ్యూనిజం ... అదియే మనలనందరి, ఒక్కటిగా చేయుటకు బలవంత పెట్టును.
సంఘములన్నియూ ఒకదాని గొంతు దగ్గర ఒకటి కత్తి పెట్టి ఉన్నవి, వేర్వేరు సంఘములు. కానీ అది వార్తా పత్రికలో వచ్చినప్పుడు మనము అందరమూ అప్పుడు ఒకేదానిని కలిగియున్నాము. దైనిక స్వస్థతను నమ్మియున్నవారు, రైళ్ళ నిండా వచ్చియున్నారు. విమానాలు ఎగిరి వచ్చినవి. ప్రతీచోట నుండి వారు వచ్చారు. ఎందుకు? ఒక సూత్రము, మనము అందరమూ నమ్మియున్నది. ఇప్పుడు సందేహముగా నిలబడి యున్నది.
ఆ రాత్రి, నేను క్రిందకు వెళ్ళలేదు. నేను హోటల్‌లోనే ఉండిపోయాను. ఒక్కసారే ఏదో చెప్పినది, “క్రిందకు వెళ్ళుము.”
నేను నా కోటు ధరించుకొన్నాను, నలుగురు పోలీసువారు, ఎందుకనగా మేము గొప్ప కూడికలను కలిగియున్నాము, వారు నాకు ముందూ మరియు నా వెనుక ఉన్నారు. మరియు బాల్కనీ 30 లో మార్గము ఉన్నట్లుగా, నా కోటు పైన వేసుకొని నేను నడిచాను.
31
మరియు నేను అక్కడ కూర్చొని ఉన్నప్పుడు, సేవకులందరూ, సుమారు ఐదు వందల మంది, చుట్టూ ... మరియు అప్పుడు, డాక్టర్. బెస్ట్, అతడు చర్చా వేదికను నడిపే వ్యక్తి, అతడు చెప్పాడు, “శ్రీ బోస్ వర్త్ ను మొదటగా మాట్లాడనిద్దాం.”
శ్రీ బోస్ వర్త్ చెప్పాడు; అతడు అన్నాడు, “రోగుల పట్ల క్రీస్తు కలిగియున్న వైఖరిని గూర్చి నేను ఆరు వందల ప్రకటనలను కలిగియున్నాను. వాటిని శ్రీ బెస్ట్ ముందు నేను ఉంచెదను. ఒకవేళ అతడు వాటిలో ఒకదానిని తీసుకొని మరియు దేవుని యొక్క వాక్యము ద్వారా అది తప్పు అని నిరూపించిన ఎడల, ఈ చర్చను నేను అతనికే ఇచ్చివేయుదును.” అతడు దానిని నిరూపించలేడు. అతడు అన్నాడు, “అయితే నేను శ్రీ బెస్టు అడిగెదను, బాప్టిస్టు ప్రసంగీకుడు, నేను అతడిని ఒక ప్రశ్న అడిగెదను. ఒకవేళ అతడు అవును లేక కాదు అని నాకు సమాధానమిచ్చిన యెడల, కేవలము ”అవును లేక కాదు“ అని, పిదప తక్కిన భాగమంతా(చర్చ) నేను అతనికి ఇచ్చివేయుదును.”
శ్రీ బెస్ట్ అన్నాడు, “అడుగుము.”
ఆ చర్చను నడిపే వ్యక్తి అతడికి స్వేచ్ఛను ఇచ్చాడు. అతడు అన్నాడు, “యెహోవా యొక్క విమోచనా నామములు, యెహోవా యొక్క ఏడు బహుళార్ధ విమోచనా నామములు యేసుకు వర్తించునా, అవునా లేక కాదా?” అది దానిని ముగించినది. ఇప్పుడు, అది వారికి అర్ధమైనదా? (సంఘములో ఉన్న సహోదరుడు దానిని తిరిగి వివరించమని సహోదరుడు బ్రాన్హాంను అడిగియున్నాడు). మీకు అది అర్ధమైనదా? చూశారా? అవును, చూశారా? దానిని మీకు వివరింపనివ్వండి. దానిని తిరిగి చెప్పమని అతడు నన్ను కోరుచున్నాడు, కనుక వారికి సరిగ్గా అర్ధమగును. ఇక్కడ ఎవరు ఉన్నారో నాకు తెలియదు.
“ఆ విమోచనా నామములు, యెహోవా యొక్క ఆ ఏడు బహుళార్ధ విమోచనా నామములు యేసుకు వర్తించునా, అవునా లేక కాదు?” చెప్పుము, “అవును లేక కాదు”. అతడు దానిని చెప్పలేకపోయెను. ఒకవేళ అతడు “అవును” అని చెప్పిన ఎడల, ఆయన యెహోవా యీరే, ప్రభువు యొక్క సమకూర్చబడిన బలిఅర్పణ. మరియు ఒకవేళ అతడు యెహోవా యీరే అయిన యెడల, అప్పుడు ఆయన యెహోవా- రాఫా కూడా అగును.
ఇప్పుడు, వినండి, ఈ సేవకులు దీనిని పట్టుకొనవలెనని నేను కోరుచున్నాను. నేను ఏమి చెప్పియున్నానో మీకు అర్ధమైనదా? చూశారా? యెహోవా యీరే. (మీరు చూడండి, మీకు తెలుసు, అతను చెప్పాడు). యెహోవాయీరే, యెహోవా- రాఫా ... ఒకటి ... అది సరియే ...? .... అది మీకు తెలుసు. సరే.
32
ఇప్పుడు, ఒకవేళ ఆయన యెహోవా-యీరే కాడు అని అతడు చెప్పిన యెడల, ఒకవేళ ఆయన యెహోవా యీరే కాని యెడల, అప్పుడు అతడు కూడా ... ఒకవేళ ఆయన కాని యెడల ... ఒకవేళ ఆయన యెహోవా యీరే అయితే, అప్పుడు ఆయన యెహోవా రాఫా అయ్యుండును. మీరు వాటిని విడదీయలేరు (చూశారా?), వారిని విడదీయలేము. కనుక ఒకవేళ ఆయన మన స్వస్థపరచు యెహోవా కాని ఎడల, ఆయన మన రక్షకుడైన యెహోవా కాడు. అది దానిని ముగించినది. అతడు జవాబు చెప్పలేకపోయెను. వారు దానికి సమాధానము చెప్పలేకపోయిరి. (అర్ధమైనదా? అది సరే. ఇప్పుడు, మీరు చూడండి అతడు ఒక దానిని నిరాకరించి మరియు మరొక దానిని అంగీకరించలేడు, ఎందుకనగా అవి విడదీయలేనివి. కనుక ఒకవేళ ఆయన ఇంకనూ యెహోవా రక్షకుడైన యెడల, అప్పుడు ఆయన దేవుని కుమారుడై యున్నాడు, మరియు ఒకవేళ ఆయన (అదే) అయితే, అప్పుడు ఆయన స్వస్థపరచు యెహోవా అయ్యున్నాడు, నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు.)
ఓహ్, ఆ బాప్టిస్టు సేవకుడు, అతడు కోపపడ్డాడు. మరియు అతడు పైకి కిందకు ఎగురుచున్నాడు, మరియు అతడు చెప్పాడు, “నన్ను అక్కడ ఉండనివ్వండి.” మరియు అతడు పునరుత్థానముపై ప్రసంగించెను. యేసు చేసిన అద్భుతములను అతడు నమ్మలేదు. అతడు ఆడుకొని - దానిని వెయ్యేండ్ల పాలనలో పెట్టియున్నాడు. మరియు అతడు ఒక కేంప్ బెల్ వర్తమానమును ప్రసంగించెను. నేను ఒక బాప్టిస్టును. బాప్టిస్టులు ఏమి నమ్ముదురో నాకు తెలుసు. కానీ అతడు అటువంటి ఒక ఉచ్చులో ఇరుక్కొనియున్నాడు, అతడు దానిలో నుండి బయటకు రాలేకపోయెను. అతడు - చెప్పుటకు ఏమి లేదు. అప్పుడు అతడు చెప్పుచూ ఉన్నాడు ... అతడు ఒక సేవకుని దగ్గరకు నడిచి వెళ్ళి మరియు అతడిని తన చేతితో చరిచెను, అతడి నోటిలో, మరియు ఆ సేవకుని యొద్దనుండి వారు అతడిని లాగవలసివచ్చెను.
33
మరియు వారు దానిని చేసినప్పుడు, ఒక దొమ్మీ జరుగునేమోనని వారు భయపడిరి, కనుక అప్పుడు పోలీసులు కదిలిరి. మరియు అప్పుడు అతడు ఇది చెప్పెను: “ఆ స్వస్థపరచువాడు దానిని చేయుట నన్ను చూడనిమ్ము. ఆ స్వస్థపరచువాడిని ముందుకు తీసుకొని రమ్ము. అతడు దానిని చేయుట నన్ను చూడనిమ్ము.”
సహోదరుడు బోస్వర్త్ చెప్పెను, “సహోదరుడు బ్రాన్హాం ప్రజలను స్వస్థపరచువాడనని తనను తాను ప్రకటించుకొనలేదు.” ఆయన చెప్పెను ...
సహోదరుడు బోస్ వర్త్ను వెదకి పట్టుకొన్నాడు. ఆయన చెప్పెను, “అతడు ఇక్కడ ఉండెనని నాకు తెలుసు, కానీ అతడు జనులతో వాదించడు.” కానీ అతడు చెప్పెను, “ఒకవేళ-ఒకవేళ అతడు వచ్చి ప్రేక్షకులను చెదరగొట్టగోరిన యెడల, అది సరియే”. చెప్పెను ... ఎందుకనగా శ్రీ బెస్ట్, ఇప్పటికే అతడు ఆ చర్చావేదికను ఓడిపోయెను, ఆ చర్చను నడిపేవారు ఆ చర్చను అతడి నుండి తీసుకొనెను, వంద శాతము మరియు దానిని—శ్రీ బెస్ట్—శ్రీ బెస్ట్—శ్రీ బోస్ వర్త్ కు ఇచ్చెను. అతడు అతని ప్రశ్నలకు సమాధానమివ్వలేకపోయెను. మరియు ఈ వ్యక్తులు ఎవరియందు, ఏ ఖచ్చితమైన మతము నందు ఆసక్తి లేనివారు. వారు ఒక ప్రతిజ్ఞ క్రింద ప్రమాణము చేసెను.
34
కావున అప్పుడు, నేను చెప్పాను ... నా సహోదరుడైన హోవార్డ్ నాకు మరియు నా భార్యకు దగ్గరగా కూర్చొనియున్నాడు. (నా సహోదరుడైన హోవార్డ్, మరియు నా భార్య). మరియు నేను లేచుటకు ప్రారంభించితిని, మరియు హోవార్డ్, నా సహోదరుడు, అతడు చెప్పాడు, “కూర్చొనుము.”
నేను అన్నాను, “నేను కూర్చొనుచున్నాను.”
మరియు కొద్ది క్షణాలలో నేను ఏదో వినియున్నాను, ఆ రోజు ఆ చెట్టుపై ఆ ఆకులవలె, వ్యూ, వ్యూ అని శబ్దం చేస్తూ (గాలి వీస్తునట్లుగా సహోదరుడు బ్రాన్హాం శబ్దము చేయుచున్నారు) మరియు నేను పైకి చూచాను, మరియు ఆయన అక్కడ ఉన్నాడు. “నీ కాళ్ళపై లేచి నిలబడుము”, అని చెప్పెను.
దేవుడు యుద్ధములో గొప్పవాడు. మీరు ఆయనను చూడవలెను. ఆయన ఎక్కడైతే ఒక ప్రదర్శన కొరకు సవాలు చేయబడ్డాడో అక్కడ మీరు ఆయనను చూడవలెను, ఆఫ్రికా, ఇండియా లో పడిపోయి మరియు పక్షవాతమునకు గురవ్వడం చూచాము, మరియు మంత్రగాళ్ళు నిలబడి మరియు కదలలేకుండిరి. ఆయన దేవుడైయున్నాడు. కనుక నేను లేచాను.
మరియు నా భార్య నా సహోదరునితో చెప్పినది, “అతడి ముఖమును చూడుము. అతడిని ఒంటరిగా విడువుము.”
అనేక మంది ద్వారపాలకులు దారి అంతా ఒక వరుసను పెట్టిరి. పేద ప్రజలు, చిన్న బిడ్డలను కలిగియున్న తల్లులు నిన్ను తాకుటకు ప్రయత్నించుచుండిరి. (కొందరిని) చంపివేసెను, అది గాయపరచెను ... నాకూ పిల్లలు కలరు. అది వారికి సహాయము చేయునని వారు తలంచిరి.
35
నేను వేదిక యొద్దకు వచ్చాను నేను శ్రీ బెస్ట్ యొద్దకు నడిచి, అతడితో కరచాలనము చేశాను. నేను అన్నాను, “శ్రీ బెస్ట్, నీవు ఎలా ఉన్నావు.”
అతడు చెప్పాడు, “మిస్టర్ బ్రాన్హాం, ఒక వ్యక్తిగా—ఒక వ్యక్తిగా, నేను నిన్ను ఇష్టపడుచున్నాను. కానీ సిద్ధాంతపరముగా, నీవు సరిగ్గా ఉన్నావని నేను నమ్ముట లేదు.
“నేను అన్నాను, ”నేను కూడా అదే విధముగా భావించుచున్నాను.“ కనుక అప్పుడు, నేను చెప్పాను, సహోదరుడా బెస్ట్, నేను ఆశ్చర్యపడ్డాను, నీవు చేసిన ఆ వ్యాఖ్యలను బట్టి, ”ఆ స్వస్థపరచువాడు వచ్చి మరియు ప్రదర్శింపనిమ్ము. అతడిని ఏదో చేయనిమ్ము, అది నన్ను చూడనిమ్ము“. నేను అన్నాను, ”సహోదరుడా బెస్ట్, అదే ఆత్మ పరిసయ్యులపై కూడా ఉన్నదని నీవు అర్ధము చేసుకొనలేవా? “ఒకవేళ నీవు దేవుని కుమారుడవైతే, సిలువపై నుండి దిగిరమ్ము.” వారు ఆయన ముఖముపై వస్త్రము కప్పి, మరియు కర్రతో ఆయన తల మీద కొట్టిరి, మరియు యేసూ, “ఒకవేళ నీవు ప్రవక్తవైతే, నిన్ను ఎవరు కొట్టిరో చెప్పుము?” అని అన్నారు. సహోదరుడా బెస్ట్, అది దయ్యము యొక్క ఆత్మ అని నీవు చూడలేవా? “నీవు దేవుని కుమారుడవైతే, ఈ రాళ్ళ నుండి రొట్టెను చేయుము? ఒక అద్భుతము చేయుము, అది నన్ను చూడనిమ్ము”, అని యేసుతో చెప్పినది, అది దయ్యము కాదా! దేవుడు అటువంటి సంగతులను చేయడు. ఆయన దయ్యమును పట్టించుకొనడు.“ మరియు నేను అన్నాను, ”ఉన్న ఒకే ఆశను తీసుకొనుటకు నీవు ప్రయత్నించు...“
మరియు అతడు చెప్పాడు, “బాప్టిస్టు వారు అటువంటి కార్యములను నమ్మరు.” “దానిని నమ్మువారు ఒకే ఒక తరగతి ప్రజలు ఉన్నారు, మరియు వారే పరిశుద్ధ బండరాళ్ళ గుంపు,” అని అన్నాడు.
36
నేను అన్నాను, “డాక్టర్ బెస్ట్, నన్ను క్షమించమని నేను అడుగుచున్నాను. నాకు నేనుగా నేను ఒక బాప్టిస్టును”. మరియు నేను అన్నాను, “నేను నీకు ఒకటి చూపించగోరుచున్నాను.” నేను అన్నాను, “అక్కడ కనీసము మూడు వందల మంది బాప్టిస్టు సేవకులు ఉన్నారు, ఈ పట్టణ పాస్టర్లు; ఈ పట్టణములో ఉన్న ఆ ప్రజలను నేను అడుగబోవుచున్నాను, బాప్టిస్టు సంఘములలో ఉన్న సభ్యులెవరైనా, నేను ఇక్కడ ఉన్న గత ఎనిమిది దినముల నుండి వారు యేసుక్రీస్తు ద్వారా స్వస్థపడ్డారని, ఒక వైద్యుని యొక్క ప్రకటన ద్వారా చూపించగలిగినవారు, మరియు వారి యొక్క స్వస్థతను నిరూపించుటకు, ఈ వేదిక నొద్దకు రాగలిగిన వారు, మీ కాళ్ళపై లేచి నిలబడుము”. మరియు మూడు వందల మంది లేచి నిలబడిరి. నేను అన్నాను, “తప్పు ప్రజలది కాదు; అది గ్రుడ్డి నాయకులది (నడిపించువారిది)”. నేను అన్నాను, “అయ్యా ....”
అతడు అన్నాడు ...
నేను అన్నాను, “అయ్యా, నేను ప్రజలను స్వస్థపరచలేను.” నేను అన్నాను, “నీ యొక్క పరిచర్య ప్రేరేపించబడినదని నీవు నమ్మెదవా?”
మరియు అతడు అన్నాడు, “అవును”.
నేను అన్నాను, “ఇది ప్రేరేపితమైనది. ” “నేను ప్రజలను స్వస్థపరచను, కానీ ఒకవేళ నేను - ఒకవేళ నేను చెప్పినది ప్రశ్నార్ధకమైతే, పరిశుద్దాత్మను గూర్చి, ఆయనే స్వస్థపరచువాడు”, నేను అన్నాను, “నీవు కళాశాల నుండి వచ్చావు మరియు తెలివైనవాడవు, నేను నీకు వ్యతిరేకముగా రాలేను. మరియు నాకు చదువులేదు, కానీ నేను చెప్పు దానిని అంగీకరించుటకు నేను కొంతమందిని కలిగియున్నాను.” నేను అన్నాను, “ఒకవేళ నా మాటలు ప్రశ్నార్థకమైతే,” అప్పుడు నేను అన్నాను, “అది దేవుని యొక్క వాక్యమే ప్రశ్నార్థకమగును. ఏలయనగా ఆయన ఏమి వాగ్దానము చేసెనో దానినే నేను చెప్పుచున్నాను.” దేవుడు తన స్వంత వాక్యమును గూర్చి శ్రద్ధ వహించగలుగుటను బట్టి దేవునికి వందనములు.
మరియు ఆ సమయములోనే, గిర్రున తిరుగుచూ, ఇదిగో ఆయన వచ్చెను. ప్రజలు మూర్చపోవుటకు ప్రారంభించిరి, మరియు నేను ప్రార్ధనలో ఉండగా, ఎటువంటి ఫోటోలు తీయుటకు వారికి అనుమతి ఇవ్వలేదు. మరియు శ్రీ బెస్ట్ అతడికి ఆరు ఫోటోలు తీయమని ఒకఫోటోగ్రాఫర్‌ను అతడు అద్దెకు తెచ్చుకొనెను.
37
ఇప్పుడు, అతడు ఈ విధముగా వ్యాఖ్యానించెను: “నేను అక్కడకు వెళ్ళుచున్నాను. మరియు ఆ ముసలివాడిని, ఆ ముసలివాడైన బోస్వర్క్ను తీసుకొనబోవుచున్నాను, మరియు నేను అతడి చర్మము ఒలిచి, మరియు ఈ దినపు దైవిక స్వస్థతకు గుర్తుగా (లేదని) అతడి తోలును నేను చదువుకొను గది తలుపునకు వ్రేలాడదీయుదును.”
ఇప్పుడు, అక్కడే ఆ మనుష్యుని యొక్క హృదయములో అతడు సరైనవాడు కాదు అని చూపించబడెను. మరియు మేము కొంచెము— కూడికకు ముందు, అతడు శ్రీ బోస్వర్త్ ను ఈ విధముగా త్రిప్పి, మరియు అతడు తన పిడికిలిని తీసుకొని మరియు అతడి(బోస్వర్త్) ముక్కు క్రింద ఈ విధముగా పెట్టెను, “ఇప్పుడు, నా చిత్రమును తీయుము”, అని అతడు చెప్పెను. మరియు పిదప అతడు తన చేతులను ఈ విధముగా తీసుకొని, “ఇప్పుడు, నా ఫోటో తీయుము,” అని చెప్పెను. మరియు ఆవిధముగా, వారు దానిని ఆరు ఫోటోలు తీసిరి, ఏలయనగా అతని-అతడి మాసపత్రికలో తన చర్చను ప్రదర్శించుకొనుట కొరకు.
సహోదరుడు బోస్వర్త్ దీనముగా అక్కడ నిలబడుకొని, తనను ఆ ఫోటోలను తీసుకొననిచ్చెను.
38
మరియు అప్పుడు ఈ దూత క్రిందకి వచ్చినప్పుడు, ఆ ఫోటోగ్రాఫర్ ఆ గొప్ప యంత్రమును సిద్ధముగా ఉంచెను, మరియు ఆ చిత్రమును తీసెను. మరియు ఆయన క్రిందకు దిగినప్పుడు, ప్రజలు అరచుచూ కేకలు వేసిరి, నేను అన్నాను, “నేను ఇంక మాట్లాడవలసిన అవసరము లేదు. ఆయనే నా స్థానములో మాట్లాడును.” నేను బయటకు వెళ్ళాను. కారు వద్దకు వెళ్ళుటకు పోలీస్ వారు నాకు సహాయము చేసిరి.
ఫోటోగ్రాఫర్లు చిత్రములు తీస్తూ, మరియు ముందుకు సాగిరి ...వారిలో ఒకడు యూదుడు; మరొకరు కాథలిక్కు, ఆ ఇరువురు ఫోటోగ్రాఫర్లు టెక్సాస్లోని, హూస్టన్లో ఉన్న డగ్లస్ స్టూడియోలో పనిచేయుచుండిరి. మరియు వారు అసోసియేషన్లో ఒక సభ్యులు, మరియు వారు స్టూడియోలోనికి వెళ్ళి, మరియు వారు చెప్పిరి, “మనము శ్రీ బెస్ట్ కొరకు ఈ చిత్రములను త్వరగా సిద్ధపరిచెదము; రేపే ఇవి అతడికి కావలెను.”
యూదుడైన, శ్రీ అయ్యర్స్, పై అంతస్తునకు వెళ్ళి మరియు నిద్రించెను. మరియు మరొక వ్యక్తి లోపలికి వెళ్ళి ఆ చిత్రములను ఆమ్లములో పెట్టాడు, వెనుకకు వచ్చి పొగత్రాగుచూ, మరియు ఆలోచించుటకు ప్రారంభించాడు, అతడు చెప్పాడు, “మీకు తెలుసా, ఒకవేళ అతడు క్యాథలిక్ అయిన యెడల, అతడు సత్యము చెప్పును.” చెప్పాడు, “బహుశా అతడు అయియుండవచ్చు.” చెప్పాడు, “ఎందుకనగా అతడి వెనుక ఉన్న అతడి తల్లిదండ్రులు (నా ముందున్న నా ప్రజలు) వారు క్యాథలిక్లు మరియు ఆ వ్యక్తి సరైన వాడైయుండవచ్చు. కానీ అతడు సరైనవాడిగా ఉండి ఒక ప్రొటెస్టెంట్ గా ఉండలేడు.” అతడు లోపలికి వెళ్ళాడు ... మరియు అంతకు ముందు రోజే అతడు ఒక భయంకరమైన వ్యాసమును వార్తాపత్రికలో నా కొరకు వ్రాసాడు, మరియు పిదప అతడు లోనికి వెళ్ళి మరియు ఆ ఆమ్లములో నుండి ఆ చిత్రములను బయటకు లాగాడు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏదియూ రాలేదు. ఆ పరిశుద్ధుడైన ముసలివాని ముఖముపై పిడికిలిని ఆ విధముగా కదుపుచూ ఉన్న ఆ చిత్రమును తీయుటకు దేవుడు అనుమతించలేదు. మరియు అతడు ఏడవ దానిని బయటకు లాగాడు, మరియు ఆ చిత్రముపై అక్కడ ఆ దూత ఉన్నది. మరియు అతడికి గుండె నొప్పి వచ్చి పడిపోయెను.
39
రెండు లేక మూడు రోజుల తరువాత, ఆ రాత్రి, పదకొండు గంటలకు వాషింగ్టన్, డి.సి.కి ఆ నెగిటివ్ తీసుకొని వెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకొని రాబడినది. మరియు జార్జ్ జె.లేసీ, సంయుక్త రాష్ట్రములలోని నిఘా విభాగము అయిన ఎఫ్. బి.ఐ.లోని వేలి ముద్రలు మరియు పత్రాల శాఖకు అధిపతి అయిన ఆయన ఆ చిత్రములను పరీక్షించుటకు వెళ్ళెను, ఒకవేళ ఆ చిత్రముపై ఏదైనా రంగు వేయబడినదా, లేక ఫ్లాష్ వెలుగు రెండు సార్లు ముద్రింపబడినదా, లేక ఏదైనా తప్పు జరిగినదా. మూడు రోజుల తరువాత ఆయన మమ్ములను లోపలికి పిలిచెను. అక్కడ సుమారు రెండు వందల మంది ప్రజలు, మాసపత్రికల సంపాదకీయులు, వేర్వేరు వార్తా పత్రికలకు సంబంధించినవారు, మరియు అతడు లేచి, మరియు అతడు అన్నాడు, “ఎవరి పేరు బ్రాన్హాం?”
నేను అన్నాను, “నా పేరే.”
చెప్పాడు, “ఇక్కడికి రమ్ము.” అతడు కొంచెము కోపిష్టి ... ? ... తన ముఖముపై జుత్తు కలిగి ఉన్నాడు, మరియు అతడు చెప్పాడు, “ఇక్కడ నిలబడుము.”
చెప్పాను, “సరే, అయ్యా.”
అతడు చెప్పాడు, “శ్రీ బ్రాన్హాం, నేను కూడా నిన్ను విమర్శించే వారిలో ఒకడిని, అది మానసిక శాస్త్రము అని నేను చెప్పాను, కానీ వినండి రెవరెండ్ బ్రాన్హాం, కెమెరా యొక్క యాంత్రిక కన్ను ఆ మానసిక శాస్త్రమును ఫోటో తీయలేదు. వెలుగు ఆ లెన్స్ (కెమెరా అద్దము) ను తాకినది.” అతడు అన్నాడు, “ఏదో ఒక రోజు, ఈ చిత్రము ప్రతీ కిరాణా కొట్టు దగ్గర అమ్మబడుతుంది. (నీకు తెలుసా). కానీ చెప్పాడు, ”నీవు బ్రతికి ఉన్నప్పుడు కాదు, ఎందుకనగా దేవుడు దానిని అనుమతించడు.“ కానీ చెప్పాడు, ”నీవు వెళ్ళిపోయిన తరువాత, సంఘము తాము దాటుకొని వెళ్ళిన ఆ దినమును గ్రహించును.“ ”అది ఎల్లప్పుడూ ఆ విధముగానే ఉండును.“ అతడు చెప్పాడు, ”నాకు నేను, నేను ఒక క్యాథలికను.“ అతడు చెప్పాడు, ”కానీ నేను ఆర్క్ నకు చెందిన జోనా యొక్క చరిత్రను జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాను. ఆమె దర్శనములను చూచుటనుబట్టి, మరియు నా సంఘము ఆమెను ఒక మంత్రగత్తెగా భావించి కట్టెలకు కట్టి ఆమెను కాల్చివేసెను. కానీ ఆమె చనిపోయిన చాలాకాలము తరువాత, ఆమె ఒక పరిశుద్ధురాలని మేము కనుగొంటిమి. అప్పటికే ఆలస్యమైపోయినది.“ అతడు చెప్పాడు, ”లేఖనములన్నిటి గుండా అదే కార్యము జరుగుచూ ఉన్నది.“ అతడు చెప్పాడు, ”ఏదో ఒక రోజు నీవు చనిపోతావు.“
నేను అన్నాను, “దేవునికి స్తోత్రము, నేను సిద్ధముగా ఉన్నాను.”
మరియు అతడు చెప్పాడు, “నీ విమర్శకునిగా ఉన్నందుకు నన్ను క్షమించు,” మరియు ఆ ఫోటో నెగిటివ్ ను అతడు నాకు అందించాడు.
నేను అన్నాను, “అది నాది కాదు. అది స్టూడియోకు చెందినది.”
అతడు అన్నాడు, “శ్రీ బ్రాన్హాం, ఆ నెగిటివ్ యొక్క ఖరీదు వేల వేల డాలర్లు,” “ఇది కేవలము ఒకే ఒక్కసారి ఒక సహజాతీతమైన సంగతి శాస్త్రీయముగా ఫోటో తీయబడినది.”
ఇప్పుడు, నేను అన్నాను, “నేను దానిని తీసుకొనను నీ ప్రకటనను అనుసరించి, ఒకవేళ యేసు నన్ను చాలినంతగా ప్రేమించి ప్రపంచ చరిత్రలోనే మొదటిసారిగా ఆయన క్రిందకు వచ్చి నాతో ఫోటో తీసుకొనిన యెడల, దాని నుండి డబ్బు సంపాదించుట కొరకు ఆయన యొక్క చిత్రమును అమ్ముటకు నేనెవడను?”
కానీ ఆ కాపీరైట్ హక్కులలో, నీ యొక్క ప్రకటన లేకుండా, అది ఎవరూ అమ్మకూడదు ...అతడు చెప్పాడు, “నేను నా ప్రకటనను ఆనందముగా వ్రాసెదను.” మరియు అతడు దానిని వ్రాసెను, దానిని సంతకము చేసెను. డగ్లస్ స్టూడియోస్ వారు దానిని తీసుకొనెను.
40
సహోదరీ సహోదరులారా, మనము పురుషులు మరియు స్త్రీలై యున్నాము, మనము చనిపోవలసియున్నాము, కానీ మన మధ్యన ఉన్న దేవుని యొక్క ఆత్మ, ఆయన అరణ్యములో మోషేను కలిసియున్న అదే దేవుడై యున్నాడు. ఆయనే యేసుక్రీస్తుగా భూమిపైన ఉన్నాడు, ఎందుకనగా అది అదే ఆత్మ అని దాని యొక్క జీవము రుజువు చేయుచున్నది. అది అదే కార్యమును చేయుచున్నది. అది క్రీస్తు యొక్క వాగ్దానము. ఓహ్, ఎలా ... దానిని ఆపుటకు అక్కడ ఎటువంటి స్థలము లేదు.
చూడుము, అక్కడ రెండు ... లోకములో కేవలము మూడు జాతుల యొక్క ప్రజలు మాత్రమే ఉన్నారు. మూడు తరగతులు ( జాగ్రత్తగా వినండి, మరియు నేను ముగించెదను) హాము, షేము మరియు యాపెతు. జలప్రళయమునకు ఈవల, మానవజాతి మొత్తము, వారి నుండే వచ్చినది. దానిని మీరు నమ్మెదరా? మనము జీవించుచున్న దేశములను బట్టి మన రంగులు, నలుపు, తెలుపు, గోధుమ రంగు, పసుపు, ఏదైనా రంగుగా మారిపోయెను. అది దానితో ఎటువంటి సంబంధము కలిగిలేదు. మనము ముగ్గురు బిడ్డలుగా వారి నుండే వచ్చాము. వారే యూదులు, అన్యులు, మరియు సమరయులు.
పేతురు రాజ్యము యొక్క తాళపు చెవులు కలిగియుండెనని మీరు గమనించారా? పెంతెకొస్తు దినమున అతడు యూదులకు దానిని తెరిచెను. ఫిలిప్పు సమరయులకు దానిని ప్రసంగించెను. పరిశుద్దాత్మ వారిపై ఎవరి మీదను దిగియుండలేదు. అతడు ఎవరినో పంపించి పేతురును పిలిపించెను, అతడు వారిపై చేతులుంచెను, పరిశుద్దాత్మ దిగి వచ్చెను. అన్యుడైన కొర్నేలీ గృహము వద్ద, పేతురు, అతడు ఇంకనూ ఆ మాటలు చెప్పుచుండగా, పరిశుద్దాత్మ వారి పైకి దిగెను. మరియు అది అక్కడకు వెళ్ళినది. ఆ ముగ్గురు ప్రజలు, మూడు జాతులు ... అక్కడ రెండు ... సమరయులు, మీకు చరిత్ర తెలుసు, వారు సగము యూదులు మరియు అన్యులు.
41
ఇప్పుడు, సమరయులు మరియు యూదులు ఒక మెస్సియ కొరకు ఎదురుచూచు చున్నప్పుడు, అన్యులు ఎదురుచూచుట లేదు. మనము విగ్రహారాధికులము, చూచుట లేదు. కానీ ఆయన వారి యుగము యొక్క ముగింపునకు వచ్చినప్పుడు, ఆయన తనకు తాను ఏవిధముగా తెలియపరచుకొనెనో చూడండి? “నీవు సీమోనువు. నీ తండ్రి పేరు యోనా.” నేను - వారి ఆలోచనలను శోధించుచూ (గ్రహించుచూ) ... ఫిలిప్పు, నత-నతనయేలు, “నీవు చెట్టు క్రింద నిలబడియున్నప్పుడు నేను నిన్ను చూచితిని.”
“నీవు దేవుని యొక్క కుమారుడవు.”
ఆ పెద్ద యూదుడు, యాజకుడు, “అతడు ఒక సోదె చెప్పువాడు.”
యేసు చెప్పెను, “దాని నిమిత్తము నేను మిమ్ములను క్షమించెదను. మీరు మనుష్యకుమారునికి వ్యతిరేకముగా మాటలాడినను, కానీ అన్యుల యొక్క కాలములో, అదే సంగతిని చేయుటకు పరిశుద్దాత్మ వచ్చినప్పుడు, దానికి వ్యతిరేకముగా ఒక్క మాట పలికిననూ అది ఈ లోకములోను లేక రాబోవు లోకములోను ఎన్నడూ క్షమింపబడదు.”
క్రీస్తు యొక్క తృణీకరణను చూడగలుగుచున్నారా? ఆ కారణమును బట్టే, ఒక అణుబాంబు అక్కడ ఎదురుచూచుచున్నది, లోకమును నాశనము చేయుటకు ఎదురుచూచుచున్నది. యూదులు చేసినట్లుగా, వారు క్రీస్తును తిరస్కరించుచున్నారు.
42
ఇప్పుడు చూడండి, అప్పుడు ఆయన సమరయుల యొద్దకు వెళ్ళెను; ఆయన చెప్పెను, “నేను సమరయ గుండా వెళ్ళు అవసరము వచ్చెను.” ఎందుకు? వారొక మెస్సియ కొరకు ఎదురుచూచుచుండిరి, ఒక మెస్సియ ఆయన యూదులకు చేసియున్నట్లుగానే, ఆయన సమరయులకు అదే రీతిగా తనను తాను ప్రత్యక్షపరచుకొనెను. వారు ఆయనను నమ్మిరి.
ఇప్పుడు, ప్రవక్త చెప్పెను, “ఒక దినము ఉండును, అది పగలు కాదు లేక రాత్రికాదు. కానీ సాయంకాలమందు వెలుగు కలుగును.”
మనము ... సూర్యుడు తూర్పున ఉన్న ప్రజలపై ప్రకాశించెను. అది తూర్పున ఉదయించెను. పిదప భౌగోళికముగా భూమి అంతటా దాటుకొని వెళ్ళును. అదే అదే అదే, తూర్పున ఉదయించిన అదే సూర్యుడు, పశ్చిమమున అస్తమించును. తూర్పున ఉన్న ప్రజలు దానిని చూచిరి, దానిని నమ్మిరి, తూర్పున, యూదులు, కొంతమంది దానిని ఖండించిరి. నాగరికత పశ్చిమమునకు కదిలెను. ఇప్పుడు, తూర్పు మరియు పశ్చిమము కలిసి యున్నవి. మనము ఒక దినము కలిగియున్నాము, ఇటువంటి ఒక దినము, దుర్భరమైనది, ఒక చిన్న వెలుగు, ఒక సంస్థగా మారుటకు సరిపోవును, అదే వెలుగు క్రీస్తును నీ రక్షకునిగా నమ్ముటకు, మరియు నీ పేరును ఒక గ్రంథములో వ్రాయుటకు సరిపోవును. ప్రవక్త చెప్పెను, “సాయంకాలమందు వెలుగు కలుగును.”
క్రీస్తులోనికి వచ్చిన, అదే కుమారుడు, అదే పరిశుద్ధాత్మ ఇప్పుడు చేయబడుటను మీరు చూచుచున్న అదే సంగతిని చేసెను. ప్రజలారా మరియు సహోదరుడా, లేఖనములను పరిశోధించుడి. మీ చరిత్రను పరిశీలించుడి. అది ఆనాటి నుండి నేటి వరకు ఎన్నడూ అది జరుగలేదు. మనము సాయంకాలపు సమయములో ఉన్నాము.
ప్రభువు సమీపముగా ఉన్నాడని ఎంతమందికి తెలుసు? మరియు ఆయన మెస్సియ ఇంకా అదే రీతిగా సజీవముగా ఉన్నాడని, దేవుడు అన్యజనులకు బయలుపరచు కొనుచుండెను. అదే స్వభావమును కలిగి, అదే కార్యమును చేయుచూ, ఆయన ఇంకనూ అదే మెస్సియ అని రుజువుపరచెను. వారు ఆయనను చంషి మరియు సమాధిలో పెట్టలేకపోయిరి. ఆయన తిరిగి లేచెను, మరియు ఎప్పటికీ సజీవముగా ఉండెను, ఎప్పుడో ఉన్నవాడు కాదు, ఇప్పుడూ ఉన్నవాడు, యేసుక్రీస్తు, నిన్న, నేడు మరియు నిరంతరముగా ఒక్కటే రీతిగా ఉన్నాడు.