వినుట, గుర్తించుట, దేవుని వాక్య ప్రకారము చేయుట

వినుట, గుర్తించుట, దేవుని వాక్య ప్రకారము చేయుట

VGR COUNT -277 ఇప్పటి టేపులు అనగా ఈ ఉదయ కూటపు టేపులు అమ్ముటకు కాదు. అది సంఘము లేదా మరెవరికొరకునో ఉద్దేశించినవి, ఎందుకనగా అది సిద్దాంతము. అక్కడ కూటములలో అది గలిబిలిని కలుగచేయును, ఏక నేత్రంతో, ఏక హృదయంతో ఏ ఇద్దరూ ఖచ్చితంగా చూచుట కష్టముగానే యుండును. కాని ఇవి సంఘములోనున్న స్నేహితులకు మాత్రమేనని గమనించండి.

ప్రార్ధనకై ఒక్క క్షణం తలలు వంచుదము. ప్రార్ధనకై వంగియుండగా, ఎందరు తమ్మును జ్ఞాపకము చేసికొనగోరుచున్నారు? చేతులు పైకెత్తి, “ప్రభువా, ఈ రోజు నేను అవసరతలోనున్నాను. నీ కృప అవసరము,” అని చెప్పండి. దేని కొరకయిననూ అడగండి.

2

మా పరమ తండ్రీ, నీ కృపా సింహాసనమును సమీపించుచున్నాము. ఆ విధముగా చేయమని మమ్మును అడిగియుంటివి. నీ కుమారుడు, మా రక్షకుని పేరట ఏది అడిగిననూ, అది అను గ్రహించబడునని మాకు చెప్పబడినది. కాబట్టి ప్రభువా, నీ రాక ఛాయలలో మేము జీవించమన్నామని ఎరుగుదుము. ఆయన కృపా నీడలో నిలచియున్నాము. ప్రభువా, మేము అడుగుదుము. నీవు ఏర్పరచుకొనుము. నీ పరిశుద్ధాత్మ ద్వారా అడిగినవి అనుగ్రహించుము. ఈ ఉదయ కాలమున మేము ఏది అడిగినను అది నీ వాక్యమునకు, నీ నీతికి, నీ కృప కనికరములకు విరుద్ధముగా నుండక - ఈ దినమున నీ పరిశుద్ధాత్మచే ప్రత్యేకముగా దర్శించుదువని ఎరుగుదుము. ఆయన మా మధ్యకు వచ్చి, మా హృదయాలోచనలను పరిశోధించి - మా బలహీనతలను తెలియపరచి, వారిని రక్షించి, నీ రాకను ఎదుర్కొను వారినిగా మమ్ము సిద్దపరచుము. ప్రభువా, ఈ ప్రార్థన వినుము.

3

ఇప్పుడు నీ వాక్యము చదువగోరుచున్నాము. ఈ ఉదయకాల ఆదివార పఠనమును ఒక అంశముగా మా హృదయములకు బయలుపరచుము. దేవా! నిన్ను మరి ఎక్కువగా ఎరుగవలెనను ఉద్దేశ్యముతోనే మేము వచ్చియున్నాము. అదొక్కటే మా కోరిక. విశ్వాసము ద్వారా క్రైస్తవులమయిన మేము, నిన్ను ఎక్కువగా ఎరుగవలెనని కోరుచున్నాము. ఇంకా క్రైస్తవులు కానివారు రక్షకునిగా, నిన్నేరుగుదురు గాక. రోగులు నిన్ను స్వస్థపరచువానిగా గుర్తించుదురు గాక. ఏ ఒక్కరూ ఖాళీగా ఈ భవనమును విడిచి వెళ్ళకుండునట్లు సహాయము చేయును గాక. ప్రతి విన్నపము నేరవేర్చబడును గాక. ప్రతీ కోరిక తీర్చబడును గాక. ప్రతి వ్యక్తియు ఈ ఆలయము నుండి ఆ ఎమ్మాయు గ్రామస్తులవలె, “ఆయన మనతో మాట్లాడుచుండగా, మన హృదయములు మండలేదా?” అని సంతోషముతో చెప్పెదరు గాక. మేము యేసు నామమున దీనిని అడుగుమన్నాము. ఆమేన్.

4

సువార్త కూటములలో ఇరవై లేదా ముప్పై నిమిషముల ఆత్మీయ సందేశమునందించినచో, అదెంతో జనులపై ప్రభావము చూపించును. ఆ తరువాత వేదిక పైకి పిలచుటతో బాగుండును, కాని ఈ ఉదయం ఆదివారపుబడి గనుక నేనే సమయమును తీసికొని వాక్యమును మాట్లాడుదును.

5

ఎవరయిన ఆదరణ లేక యున్నచో, శీతల స్థితిలోనున్నచో, మా సోదరుడు ఈ సంఘ కాపరి వెనుకనున్నాడు. ఆయనను కలిసికొనండి. ఆ వెనుకనున్న వారివలె చేతినెత్తండి, ఆయనే మీ ఉష్ణమును క్రమపరచును. మీరు ఆదరణతో నుండి బాగా వాక్యమును వినండి. దేవుని వాక్యమును పరిశుద్ధాత్ముడు బోధించునని నమ్ముచున్నాము, వెనుకనున్నవారికి బాగుగా వినపడుచున్నదా? చేతినెత్తండి. బాగుగా వినగలుగుచున్నారా. మంచిది.

6

నాతో పాటు కొన్ని వచనములను తిప్పి చూడండి, మొదటగా రోమా 9వ అధ్యాయము 11వ వచనము నుండి పాఠము నిమిత్తము చదువుదము.

(రిబ్కా మన తండ్రియగు ఇస్సాకు అను ఒకని వలన గర్భవతియైనప్పుడు, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక, పిలుచువాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము, పిల్లలింక పుట్టి మేలైనను - కీడైనను చేయకముందే)

పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను.

ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడియున్నది.

చదువబడిన, వాక్యభాగమును దేవుడు దీవించును గాక. నా పాఠము కొరకు ఆ దినము: “వినుట, గుర్తుంచుట, దేవుని వాక్య ప్రకారము చేయుట. మరల దానిని చెప్పెదను: ”వినుట, గుర్తించుట, దేవుని వాక్య ప్రకారము చేయుట.“

7

ఇప్పుడు, మనకు బాగుగా తెలియును, దివారాత్రులు వాక్యమును పరిశోధించుచున్నాము, వార్తా పత్రికలు చదువుచున్నాము. వ్యాఖ్యానములు వినుమన్నాము. “ఇపుడీ లోకము, రెండు మహా శక్తుల మధ్య నిలబడియున్నది. ఆ రెండూ ఆత్మీయ శక్తులే. ఆ రెండూనూ గొప్ప మత శక్తులే. ఈ రెండు శక్తులు ఒక అంతమునకు చేరుచున్నవని నేను నమ్ముచున్నాను. త్వరలోనే జరుగును. ఈ రెండు గొప్ప శక్తులూ ఇస్పాకు యొక్క ఇద్దరు కూమారులలో ప్రాతినిధ్యము వహించుచున్నవి. దేవుడు తన అనంత జ్ఞానముతో ఏలాగున వీటన్నింటిని చూచేనో, ఆ నీడలు చెప్పుచున్నవి. వీటిని బట్టి మన ముందున్న దానిని స్వయంగా చూడగలము. చాలా స్పష్టముగా కనపడుచున్నది. దేపుడు ఆయన వాక్యము, ప్రకృతి ఆయన ప్రపంచము, ఎంత చక్కగా అమర్చబడినవో చూడండి. పాపులు సహితము జరుగనైయున్న వానిని చక్కగా చూడకలుగుచున్నారు. దేవుడా రీతిగా ఏర్పరచెను. తెలియదని చెప్పుటకు ఎవరికీ సాకు దొరకదు.

8

ఇప్పుడు, ఈ ఇద్దరు కుమారులు జన్మించకముందే, వారు ఒకరితో ఒకరు యుద్దము చేయుచుండిరి. కన్యకయగు వారి తల్లి, అందమగు రిబ్కా దేవుని వాగ్దాన సంతానమయిన నీతిమంతుని పెండ్లి చేసికొనెను. ఇస్సాకు దంపతులు ఇద్దరునూ అర్పించుకొనిన ఆత్మ పొందిన దేవుని విశ్వాసులు, వారిరువురు జతపరచబడుట కూడా ముందుగానే నియమించబడెను. దేవుడు ముందే దానిని నెరుగును. ఒకే తల్లి, ఒకే తండ్రులు మూలముగా అటువంటిది ఎట్లు జరుగును? ఒక వ్యక్తి దుష్టుడు. మరో వ్యక్తి మంచివాడు. మంచివాడు, చెడ్డవానివలెను - చెడ్డవాడు, మంచివానివలెను ఎట్లు కనబడెనో చూడండి.

ఇప్పుడు, అది ఎల్లపుడూ దేవుని కార్యక్రమము. దేవుడు తన కార్యక్రమమును మార్చుకొనలేడు, ఎందుకనగా ఆయన ఖచ్చితముగా తన కార్యక్రమమును తయారు చేయును, ఎందుకనగా అది ఆయనలోని భాగమే.

9

ఏదేను తోటలో పాపము చాలా అందముగా నుండెను. అవ్వను నీతిలో నుండి పాపములోనికి ఆకర్షించినది. అదే తోటలో జీవవృక్షము, మరణ వృక్షము కూడా ఉండెను.

ఈనాడు దానిని ఒక బేధ ధర్మశాస్త్రముగా మనము ఎరుగుదుము. మంచి ఎక్కడ ఉండునో చెడు అక్కడ ఉండును. ఒప్పు ఎక్కడుండునో తప్పు అక్కడుండును. మనము ఎటువంటి పరిసరములో జీవించినప్పటికిని ఆ రెండింటిలో ఏదో ఒక దాని సన్నిధిలో నుండి మనలను మనము విదిలించుకొనజాలము. పౌలు చెప్పెను, “నేను మంచి చేయాలనుకొన్నపుడే చెడు చేయుచున్నాను.” క్రైస్తవుని నుండి పాపి ఎన్నడు కదిలించబడజాలడు, పాపి నుండి క్రైస్తవునిచే ఎన్నడునూ కదిలించబడజాలడు. ఎల్లపుడునూ మంచి, చెడు సాక్ష్యములు ఉండును. నీ ఎన్నికను నీవు చేసికొనవలెను. ఏదో పక్షమున నీవుండి తీరవలెను.

10

కాని ఈ ఇద్దరు కుమారులలో ఎంత వింత కనపడును, వాగ్దాన సంతానమునుండియే అనగా, ఇస్సాకు నుండియే వారిద్దరూ వచ్చిరి. నేను చెప్పే దానిని మీరు సరిగా చూడకలుగునట్లుగా వివరించుదును. మొదట ఏశావు జన్మించెను. తల్లి గర్భము నుండియే వారిరువురునూ పోట్లాడుచూ బయటకు వచ్చిరి. ఏశావు ముందుగా వచ్చెను. అతని మడిమను యాకోబు పట్టుకొనెను. వారింకా పోరాడుచునే యున్నారు.

11

పరిపూర్ణమగు, పవిత్రమగు, ఎన్నిక కాబడిన, పరిశుద్ధమైన. అర్పించుకొనిన తల్లి దండ్రుల నుండి ఇట్లు జరుగుట వింత కదా? దేవుడు ఎన్నిక చేసికొనుటకు ఆధారమదియే. అది నిశ్చయం. నీ తల్లి దండ్రులు ఎంత చక్కనివారయినా గాని, ఎంత మంచి క్రైస్తవులయినా గాని, దేవుని ఎదుట నీవు వ్యక్తిగతముగానే నిలబడవలసి యుండును. ఆ ఇద్దరు పిల్లలు ఎన్నిక ద్వారానే పిలువబడిరని ఈ పాఠము బోధించుచున్నది. తల్లి కన్యక, తండ్రి పరిశుద్దుడు. కాని చూడండి, ఆ సంతానము నుండియే యేసుక్రీస్తు వచ్చెను. మృతులలో నుండి ఒకనివలెనే అతడు జన్మించెను. అతడు పరీక్షింపబడెను, అంతకు ముందుగా అతని తండ్రి పరిక్షింపబడెను; ఇస్సాకు సంతానము ద్వారా సర్వ ప్రపంచము రక్షించబడునని వాగ్దానము చేయబడెను. అటువంటి, వ్యక్తి ఆ తల్లిని ఫిలిష్తియుడు అంటుకొనకుండా దేవుడు కాపాడెను. అంత పవిత్ర రక్తమది. అబ్రాహాము ఆమెను అతనికిచ్చిన పిదప అతని ఇంటిని దేవుడు మొత్తెను, “నీవు మృతిపొందినవాడవు అని చెప్పెను,” ఆ రక్త ప్రవాహమును పవిత్ర ముగా పట్టుకొనెను. ఆ రిబ్కా ఒక నీతిమ౦తురాలు, పరిశుద్ధురాలు. దేవునిచే పంపబడిన దైవిక తల్లి; ఆ పరిశుద్ద సంతానములో నుండి ఒక తిరుగుబాటుదారుడు, ఒక విశ్వాసియు వచ్చిరి. కాబట్టి అది దేవుని ఎన్నిక పిలుపుపై ఆధారపడియున్నది.

12

వారిరువురు జన్మించకముందే, దేవుడు చెప్పెను, “నేను యాకోబును ప్రేమించి, ఏశావును ద్వేషించితిని” — వారిద్దరూ పుట్టకముందే. కాబట్టి మనం ఏమనుకోవాలి? నీతో దేవుడు మాట్లాడి, ఆయన బల్ల యొద్దకు, ఆయన ఇంటికి ఆయన కుమారుడు, కుమార్తెగా నుండుటకు నిన్ను పిలిచెను. అంతకన్న గొప్పది ఇక లేదు.

ఈ ఇరువురి స్వభావములను మనము గమనించినచో, యాకోబు ఆత్మ సంబంధిగా మనకు కనిపించును. ఏశావు శరీర సంబంది. కాని వారిద్దరూ భక్తిగలవారే. ఆత్మ సంబంధి, శరీరసంబంధియగు వారిమధ్య ఎల్లపుడూ ఆ రీతిగానే జరుగుచున్నది.

భూలోక సంబంధిగా ఏశావు ప్రాతినిధ్యం వహించుచున్నాడు. భక్తిగల స్వభావము గలవాడు, కాని అతనిలో మాత్రము ఆ సామర్ధ్యము లేదు. ఈ లోకమును, లోక సంగతులను ఎక్కి పైకి వెళ్ళలేకపోయాడు.

కాని, యాకోబునకు ఆ విధముగా చేయుట చాలా సులువుగా కనిపించెను. ఆ జ్యేష్టత్వపు హక్కు కొరకు యాకోబు చాలా కనిపెట్టుచుండెను. అతని ప్రగాఢ వా౦చ దానిని పొందుటయే. ఏలాగు పొందినా గాని, కావున దానిని పొందుకొనెను.

13

ఈనాడు లోకములో ఇంకా ఆ ఒక్క జన్మ యొక్క ఆత్మ ప్రాతినిధ్యము వహించుచునే యున్నది, మరియు అదిప్పుడు శిరస్సుగా మారుచున్నది — ఆత్మీయ విశ్యాసి; శరీరానుసారుడు, శరీర విశ్వాసి. వారిద్దరూ భక్తిగలవారు కారని ఎవరునూ చెప్పజాలరు. వారిరువురు భక్తులే, వారిలో ఒకరు విగ్రహమును, మరియు ఒకరు దేవునిని ఆరాధించిరని ఎక్కడనూ చెప్పబడలేదు. వారిరువురూ దేవుని దాసులే.

ఈ అంశము పై వచనములను జాగ్రత్తగా వినండి. అది మీకు తప్పక సహాయము చేయునని నాకు తెలియును. “ప్రభువా, ప్రభువా! అని పిలచు ప్రతివాడు పరలోకములో ప్రవేశించడు గాని, పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించునని,” ఆయన చెప్పెను.

14

మీరు గమనించినచో యాకోబునకు ఒక్కటి అవసరముగా నుండెను, వాక్యము ప్రకారము ఆశీర్వాదములు, మంచి మేలులు ఆ జన్మహక్కులోనే ఉండినది. ఆ జన్మహక్కును సంపాదించుట ఒక్కటే యాకోబు మనస్సులో గురిగా నుండెను. ఏశావు దానిని తిరస్కరించెను. దానిని నిజంగా కలిగియున్నవాడు పోగొట్టుకొనెను. దానిని గూర్చి సిగ్గుపడి తృణీకరించెను. కాని ఏ విధముగానైనను దానిని యాకోబు పొందగోరెను. అతడు ఎలాగు పొందినను, అతడు దానిని పొందగోరెను.

ఈనాడు ఆత్మసంబంధియగు విశ్వాసి అంతే. నివెంతగా చూచి నవ్విననూ, ఎంతగా హేళన చేసిననూ, నీ శారీరక మనస్సుకు ఎంత అపహాస్యముగా అతని ప్రవర్తన కనిపించిననూ, జన్మహక్కును పొందుటయే అతని లక్ష్యము. దేవుని పొందవలెననుకొనును, ఎందుకనగా అతనిలో అది జన్మించెను. దానిని చేయక ఉండలేడు.

15

యాకోబు అనగా “మోసగాడు” అని అర్ధము. కాని ఆ జన్మహక్కును కనుగొని మరియు ఆ స్వాస్థ్యముతో వచ్చుచున్నప్పుడు మారిపోయెను. శరీర సంబంధి మారిపోయెను. అపుడతడు యాకోబుగా పిలువబడెను, “ప్రభువుతో ఒక రోజు,” ఆయనతో అతడు పోరాడెను.

ఈ రోజున శరీర సంబంధియగు విశ్వాసి, “ఓ, నేను గుడికి వెళ్ళి మంచి చేస్తున్నంత కాలము ఏమీ తేడా లేదు,” అని చెప్పును. అది ఏశావు గుంపు. అతడింకనూ హేళన చేయుచూ, జన్మహక్కును నిందించుచున్నాడు. అదంటే లక్ష్యము లేదు. కాని యాకోబు దానిని ప్రేమించెను.

ఈనాడు ఆత్మసంబంధియగు స్త్రీ, పురుషుడు అనగా ఎన్నుకొనబడి నిత్యజీవనకు ముందే నిర్ణయింపబడినవారు. తమకున్నదంతా అమ్మి వేసికొనిననూ, దేశంలో నున్న సంఘముల పుస్తకములలో నుండి తమ పేర్లు తొలగించుకొనవలసివచ్చిననూ, వారికి జన్మహక్కుయే కావలెను. వారికి కావలసిందంతా అదే, ఆ జన్మహక్కును పొందితే చాలును. ఏలాగయినా గాని, ఎంత పరిస్థితికి వారు రావలసియున్నాగాని, వారు బలిపీఠము మీదికి వచ్చి గగ్గోలు పెట్టవలసియున్నాగాని, వారు ఆయా స్థలములకు తిరిగి అన్నింటిని సరిదిద్దుకోవలసియున్నా గాని, తమకున్న దానినంతా ఇచ్చి వేసి ఒక యాత్రికునిగా ప్రయాణికునిగా ఉండవలసి వచ్చినా గాని, ఆ జన్మహక్కు కొరకే వారు పోరాడుదురు. ఆ జన్మహక్కున౦దే వారికి ఆసక్తి యుండును. ఆ జనులను నీవు సాధించవద్దు. వారి చేతుల్లో ఏమీ లేదు, దాని కొరకు వారు ఎన్నుకొనబడిరి, ముందుగా నిర్ణయించబడిరి.

16

శరీరసంబంధులు ఇరువురిని మనము చూస్తున్నాము, ఎల్లప్పుడూ ఆలాగే జరుగును. ఈనాడూ అంతే! ఎప్పుడూ అదే మార్గము.

ఏదెను తోటలో కయీను మరియు హేబేలు. ఏదెను సృష్టించబడినప్పుడు, మానవుడు ఎన్నుకొనుటకు రెండు వృక్షములు అక్కడుండెను. ఒకటి తిన్నచో జ్ఞానము అతనికి వచ్చును; ఇ౦కొకటి ఉన్నచో జీవము అతనికి వచ్చును. అక్కడ హేబెలు కయీనులను ఇద్దరు౦డిరి, వారిద్దరూ భక్తిగలవారే. అందులో ఒకడు నిత్యజీవమును కోరి విశ్వాసము ద్వారా దేవునికి కయీను కంటే శ్రేష్ఠమగు అర్పణను అర్పించెను. ఈనాటి సంఘములకు చక్కని మాదిరి: ప్రకృతి సంబంధమగు సంఘము, ఆత్మ సంబంధమగు సంఘము. ఏమీ సందేహము లేదు, కాని ఇప్పుడు రెండు తరగతుల వారికి బోధించుచున్నాను, బహుశా ఈ టేపులు వేలాదిమందిని చేరి మాట్లాడును.

17

ప్రకృతి సంబంధమగు సంఘమును చూడండి, అది శరీరసంబంధమైనది. “నేను సంఘంలో చేరాను, నేను సంఘానికి వెళ్ళి నాకు చేతనయిన మంచి నేను చేసినచో, దేవుడు అంగీకరించును,” అని అనుకొనును. అంతకంటే పైకి వారు రారు. కయీను చేసినది అదే. అతడు వెళ్ళి ఒక బలిపీఠమును నిర్మించి, పండిన పంటలోని మొదటి ఫలములను తెచ్చి, దేవుని ముందు పెట్టి, “ఇదే నేను చేయకలిగింది. స్వీకరించు లేదా త్రోసివేయి,” అని చెప్పెను. శరీరసంబంథియగు విశ్వాసి. ఈ రోజున అలాగే నమ్ముచున్నాడు. “ప్రభువా, నేను ఆలయానికి వెళ్ళుదును, వెదకి మంచి గుంపులో చేరుదును. సంఘమునకు డబ్బు చెల్లించుదును. మంచిని చేయుదును. విధవరాలికి కొంత బొగ్గును కొని ఇచ్చెదను, పిల్లలకు కొన్ని బట్టలు కొన్ని ఇచ్చెదను,” అనుకొనును. [అది మంచిదే, దానికి వ్యతిరేకత ఏమి లేదు.] కాని అంతా అదే అనుకొనుచున్నారు. కావలయునన్నచో, తీసికో; లేనియెడల, నీవు తీసుకునే అవసరత లేదు.“ ఇప్పుడు, అదే ధోరణిలో ఈనాడు శరీర సంఘమున్నది.

18

కాని ఆత్మీయ సంబంధమగు సంఘము! హేబేలు, ప్రత్యక్షత ద్వారా, కృప ద్వారా, అవతలకు చూడకలిగెను. విశ్వాసమును బట్టి దేవునికి కయీనుకంటె శ్రేష్ఠమైన అర్పణను అర్పించెను. దేవుని నీతిని అది నిరూపించెను.

ఇష్మాయేలు మరియు ఇస్సాకులలో కూడా అదే జరిగెను. ఒకటి శరీర సంబంధి, మరొకటి ఆత్మ సంబంధి. ఒకటి దాస్యముతో నున్నది, మరొకటి స్వతంత్రురాలు.

ఇశ్రాయేలు మరియు మోయాబులలో అదే చూడగలము. రెండు గొప్ప సంఘములు కలసి వచ్చుచున్నవి. ఇశ్రాయేలువారు వాగ్దాన భూమికి చేరనైయున్నారు. (ఆత్మ సంబంధమగు సంఘము, యాకోబు జనులు, ఇశ్రాయేలు మార్గములోనున్నది), ఏశావు వారు వారిని ఎదుర్కొనిరి (మోయాబు, శక్తివంతమైన సంఘము). అది అధికార సంఘము. సంఘము యొక్క గొప్ప నాయకుడగు, బిలాము, తన సోదరుని శపించుటకు బయలు వెళ్ళెను; కాని తన సోదరుని శపించలేకపోయెను. కండ్ల గ్రుడ్డితనముతో విఫలుడాయెను. ముందు సంకల్పమును, దేవుని వాక్యమును చూడలేకపోయెను.

మొదటగా దేవుని వాక్యమును వినుటను బట్టి విశ్వాసము వచ్చును. అటు పిమ్మట విశ్వాసి వినును, దానిని గుర్తించును, దాని ప్రకారము చేయును. శరీర సంబంధి దానిని వినును, శబ్దమును వినును, కాని ఎన్నడు.... వినుట అనగా, అర్థము చేసికొనుట. చూచుట అనగా ఒక దానిని చూచుట; అయితే దానిని చూచుట అనగా, దానిని అర్ధము చేసికొనుట. “ఒక వ్యక్తి తిరిగి జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడు.”

19

ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుని వాగ్దానముతో వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనుటకు వచ్చుచున్నారు. అవిశ్వాసులు కారు గాని, విశ్వాసులు — ఇశ్రాయేలు నమ్మిన దేవునినే వారు నమ్మిరి — తన సోదరుని శపించుటకే వచ్చుచుండిరి, ఎందుకనగా తన అనీతిమంతుడై అనేక చెడ్డ పనులు చేసెనని చెప్పినందునే ఇది జరిగెను. కాని ఎన్నికను చూడజాలకపోయెను.

ఏశావు మరియు యాకోబులు అంతే. ఏశావు మంచివానిగా కనపడెను. అతడు స్థిరపడి చాలా ధర్మకార్యములు చేసెను. గ్రుడ్డివాడయిన తన తండ్రి పట్ల శ్రద్ద చూపించెను, మాంసమును వండి తెచ్చెను. చాలా మంచి కుర్రవానిగా కనపడెను. మత పేరున శారీరక విశ్వాసులు చాలా పనులు చేయుదురు. సొసైటీలకు సహాయము చేయుదురు. ప్రజల యొక్క వైద్య బిల్లులు చెల్లించుదురు. గొప్ప మత కార్యములు చేయుదురు, కాని వాటినిగూర్చి నేను మాట్లాడుటలేదు.

20

మోయాబు మంచివాడు, ఒక గొప్ప దేశము, అతనికి సోదరుడు. యాకోబు సమస్తము చేసెను. అతడొక మోసగానివలె ఉండెను. కాని ఇంకనూ, ఒక దానిని సాధించవలసియుండెను. అదియే జన్మహక్కు. వాగ్దానమును సంపాధించుట ఇక్కడ ఇశ్రాయేలు వచ్చుచున్నది, యాకోబు పిల్లలు, ఒకే గురితో వచ్చుచున్నారు. ఇప్పుడు, ఎవరు సరైనవారు?

బిలాము ఏడు బలిపీఠములను కట్టెను. ఇశ్రాయేలులో ఏడు బలిపీఠములున్నవి. పవిత్రమగు జంతువులను ఏడింటిని బలిగా అర్పించెను. సాంప్రదాయ రీత్యా చూచినచో, మోయాబు ఇశ్రాయేలంత భక్తి, ఏశావు యాకోబు అంత భక్తి, కయాను హేబేలంత భక్తిగలవారిగా కనపడిరి. అయితే ఎన్నికలోనే అంతా యున్నది.

21

ఎంత గ్రుడ్డితనము! ఆత్మ సంబంధముగా మాట్లాడుచున్నాను. ఏశావు పిల్లలు, మోయాబీయులు ఇశ్రాయేలు వారిని చూచి, వారు ఒక శాఖ కాదు గాని మోసగాళ్ళ గుంపు. గుడారములలో జీవించుచున్నారు; మేము ఒక గొప్ప జనాంగము. వారు కీడు చేయువారు, మరియు వారి మధ్య ఏ సంస్థయూ లేదు. ఒక ప్రవక్తను వెంబడించి తిరుగుచున్నారు, అని చెప్పుకొనిరి. కాని వారు ఇత్తడి సర్పమును మరియు కొట్టబడిన బండను చూడలేకపోయిరి. వారి ముందే అది వెళ్ళినది. బయటకు పిలువబడిన, ఏర్పాటు చేసికొనబడిన గుంపును చూడలేకపోయెను, దేవుని దైవిక క్రమమును వెంబడించి వాగ్దాన భూమికి వెళ్ళుచు౦డిరి.

ఈనాడూ అంతే. వారు పరిశుద్ద గుంపు లేదా అది, ఇది అని అపహాస్యము చేస్తున్నారు. కాని వారు అది దేవుని వాక్య మార్గమును వెంబడించుట అని ఎరుగరు.

ఇశ్రాయేలు వాగ్దాన భూమిని చేరు మార్గములో యున్నది. దేవుడు తన వాక్యములో ఒక వాగ్దానము చేసెను.

22

దేనిని లక్ష్యపెట్టకుండా యాకోబు జన్మహక్కును ఏన్నుకొనుటకు కారణ మేమనగా, అందులో ఆశీర్వచనములు, జీవము ఉన్నదని ఎరుగుటయే. అదెట్లు వచ్చినా పరవాలేదు, కాని దానిని పొందెను. అదే ప్రధాన విషయము. అది దేనిమీద వచ్చినా గాని లెక్క చేయలేదు. అతడు పొందగోరెను కాబట్టి తప్పక పొందెను. “నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు.” అతడు దానిని పొ౦దవలెనను ఆశతో వెంబడించి పొందెను.

ఇశ్రాయేలు వాగ్దాన దేశమును చేరు మార్గములో ఉన్నది. ఎంతమంది మోయాబీయులు ఎన్ని శాపములు వారిపై ఉంచగోరినను, వారు మాత్రము తిన్నగా వాగ్దాన భూమికి వెళ్ళిరి.

ఈ రోజున చట్టము ఎంత కఠినముగా ఉన్నను, శ్రమలె౦త ఉధృతంగా ఉన్నను, ఎన్ని కీడు మాటలు వారు చెప్పుచున్నను, “పరిశుద్దు గుండ్రాళ్ళు” అని ఎంతో హేళన చేస్తున్నను, సంఘము కదిలిపోవుచున్నది. అది దేవుని వాక్యముతో నిలచియున్నది. అది దానిని పొందుచున్నది.

23

ఒకప్పుడు ఇద్దరు రాజులు కలసివచ్చిరి. అందులో ఒకడు ఆహాబు, చెడ్డ వాడు; మరియొకడు యెహోషాపాతు. ఆత్మీయ సంఘము; శారీర సంఘము.

ఆహాబు ఒక సరిహద్దు విశ్వాసి. ఆతనికి ప్రవక్తలుండిరి. వారు అవిశ్వాసులు కారు, వారు విగ్రహారాధకులు కారు; వారు ఇశ్రాయేలు ప్రవక్తలు. కాని వారందరూ ఆహాబు రాజుచే బోధ, తిండి, బట్టలు పొందెడివారు. రాజకీయ మద్దతు గల ఒక స్థలమువలె అది ఉండును.

యెహోషాపాతు దిగివచ్చి ఒక తప్పుడు సంధి చేసికొనెను.

నీ వెన్నడూ అవిశ్వాసులతో విజ్జోడు కాకూడదు. మనమెన్నడూ ఏ విధంగానూ మన పేర్లను సంఘ పుస్తకములలో గాని సంపూర్ణ నమ్మని వారితో గాని చేరగూడదు. ఎన్నడూ చేయరాదు! నీవు సమస్యలో పడుదువు.

వారు సమస్యలో పడిరి. ఈ నీతిపరుడు అన్నాడు. “రామోతు-గిలాదునకు మనము వెళ్ళాలో - వద్దా, మొదటగా ప్రభుని ఆలోచన చేయవద్దా?”

వారి ఆలోచన ఎంత చక్కగా కనపడినదో చూడండి. మనము రామోతు-గిలాదును గెలుచుకొంటాం, అది మన ఆస్థి, సజీవ దేవుని నుండి సిరియనులు తీసికొనిరి. మనము వెళ్ళి, ఆ భూమిని స్వతంత్రించుకొందము. సందేశం చాలా చక్కగా, చాలా చట్టబద్ధంగా, చాలా నీతియుక్తంగా కనపడింది. యెహోషాపాతు దానికి పడిపోయెను!

24

ఈ రోజు ఒక వ్యక్తి చాలా తెలివితో వేదికపై నిలబడి, చక్కని ప్రసంగము చేస్తూ, విద్యతో బైలులో లేని పరిశుద్ధాత్మను వివరించుచున్నాడు. దైవిక స్వస్థతను, భాషలతో మాట్లాడుటను, భాషార్థమును, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును మరో దినమునకు చెందినదని చెప్పుచున్నారు.

కాని దేవునిచే ఎన్నుకోబడిన వ్యక్తి. “నా గొర్రెలు నా స్వరము వినును.” నీపై దేవుని ఎన్నిక యున్నచో, నీ వెన్నడూ దానిచే పొరపాట్లు పడవు.

నీతిగల రాజయిన యెహోషాపాతు, “యెహోవాను మనము స౦ప్రదించవద్దా?” అన్నాడు. ఆహాబు అది లేకుండానే వెళ్ళుచున్నాడు.

ఈ దినము శరీరసంబంధమగు సంఘము ఆ విధంగానే వెళ్ళుచున్నది. ఈనాడు సేమినెరీల నిండా బోధకులున్నారు. గొప్పవారు, గొప్ప ప్రొపేసర్లు, మేధావులు, తెలివిగల వారు, చమత్కారమైన వారు ఉన్నారు. ఆత్మసంబంధమగు సంఘముకంటే అవతల నున్నది.

25

నోవహు దినములలో ప్రకృతి సంబంధమగు సంఘమును చూడండి. వారెవరు? శాస్త్రజ్ఞులు, నిర్మాణకులు తెలివిగల వారు. కాని ఎన్నుకోబడిన హనోకు, నోవహులు - గొర్రెల కాపరులు మరియు వ్యవసాయదారులు. చదువులేనివారు, దీనులు, తెలివిలేనివారు, కాని తమ దేవుని ఎరుగుదురు — వారిలో ఏదో పిలచుచున్నది, కదలుచున్నది. కొద్ది సమయములో దానిని మనము తెలిసికొందాం.

“ప్రవక్త లేడా?” అని యేహోషాపాతు అడిగెను.

ఓ, వారు బహుశా శరీరసంబంధులు. “నిశ్చయంగా, మనకున్నారు. నాకొక సెమినరీ అచ్చటున్నది, దాని నిండా ఉన్నారు.”

నాలుగు వందల మందిని తెచ్చారు. వారు అవిశ్వాసులు కారు. వారు యెహోవా దేవుని పూజించువారు. “మనం వచ్చి కొద్ది సేపు ప్రవచించుదం” అన్నారు. వారంతా కలిసికొన్నారు. యెహోవా వాక్కు తమకు కలిగిందని, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని,” వారు చెప్పారు. ఇశ్రాయేలు ప్రవక్తలు. “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు! వారిపై వెళ్ళండి, యెహోవా మీతో నుండును. రామోతు-గిలాదును స్వాధీనపరచుకొందురు, ఎందుకనగా అది నిజంగా ఇశ్రాయేలీయులకు చెందినదే,” అన్నారు. అందులోని ఒక ముఖ్యుడు, రెండు పెద్ద ఇనుప కొమ్ములను చేయించాడు? వీటితో సిరియా వారిని రామోతు-గిలాదును నుండి బయటకు వెళ్ళగొట్టుదురని చెప్పెను.“

26

కాని యెహోషాపాతులో ఏదో యున్నది. ఓ, దేవుడు దీనిని మీ హృదయములు గ్రహించునట్లు చేయును గాక. మీయంతట మీరు చదువుకొనుట కాదు, మీయంతట మీరు నేర్చుకొనుట కాదు. నీ కొరకు దేవుడు ఎన్నిక ద్యారా చేయును. “పరుగిడు వాని వలన కాదు గాని, కరుణించు దేవుని వలననే జరుగును.”

యెహోషాపాతు చెప్పెను, “వారు చక్కగా దుస్తులు ధరించుకొన్నవారు.” అతడు ఈ విధంగా చెప్పియుండుననుటలో సందేహం లేదు: “వారు చాలా తెలివైనవారు, మరియు నేనెన్నడూ వినలేని మేధావులు. ఆ క్షణమునకు తగిన విద్య ఉన్నది. వారు ఏకత్మతో నిలబడిరి. వారి మధ్య గొప్ప ఐక్యత యున్నది. చాలా చురుకైనవారు, వారిలో చాలా సత్యమున్నది.”

సమస్త తప్పులలో సత్యముండును. అన్నింటిలోను పెద్ద అబద్దమయిన అవ్వతో, సాతాను చెప్పిన అబద్దములో నూటికి-తొంబది-పాళ్ళ సత్యమున్నది. [టేపు పై ఖాళి ఉన్నది.]

27

“ఓ, వారు చెప్పిన దానిలో చాలా సత్యమున్నది, కాని మరోక్క ప్రవక్త లేడా?”

ఆ వ్యక్తి చెప్పిన దానిని గూర్చి నీవేమి అనుకొనుచున్నావు? “మా వద్ద నాలుగు వందల మంది తెలివిగల మంచి ప్రవక్తలున్నారు. వారు ఆ అరణ్యముతో సగం దిగ౦బరిగా చుట్టూ గొర్రె చర్మము కప్పుకొనిన నీ వంటివారు కారు. వీరు నేను పోషించిన, చదువు నేర్పించిన వారు. అ-ఆలు కూడా రానివారిలాంటి వారు కాడు, వీరు పండితులు. అన్నీ తెలిసిన వారు. గ్రంధపు చుట్టలను, ప్రవచనములను దీవారాత్రులు చదివెడివారు. ఏది నిజమో వారికి తెలుసు. వారందరు ఒకే ఆత్మతో సిద్ధంగా యున్నారు. ఆ నాలుగు వ౦దల మంది 'యెహోవ మీతో ఉన్నాడు పొమ్మని' చెప్పిరి.”

28

కాని కొద్ది నిమిషములు యెహోషాపాతు మనస్సును చదువగలిగినట్లయితే, “నమోదు చేయబడనివారున్నారు, వారు సరైనవారు కాదనుకొనుచున్నాను,” అని యుండును. మరెక్కడైనా మరోక్క ప్రవక్తలేడా?“ అని అడిగాడు.

“ఓ, అవును! మరొక్క ఆయన ఉన్నాడు, కాని ఆయన ఏ సంస్థకు చెందనివాడు. అతడొక విభిన్న మనిషి. అతడు పొగరుబోతు. [ఆయన యాకోబు వంటివాడు.] కాని ఆయనను అడుగవచ్చు. ఆయన ప్రవక్తని వారందురు, కాని నాకు సందేహము, ఎందుకనగా ఎప్పుడూ నన్ను శపించును. ఇది అది ఇంకేదో చెప్తాడు గాని, నా గురించి ఎన్నడూ మంచిది ప్రవచి౦చడు,” అన్నాడు. అతడెట్లు?

“సరే, ఆ ఇమ్లా కుమారుని తీసికొని వద్దాము,” అన్నారు. కావున వెళ్ళి, అతని తీసికొని వచ్చిరి.

29

దానిలో ఎవరో కలిసారు, “నీవు కూడా వారు చెప్పినట్లే చెప్పాలి. ఆ గుంపుతో నీను అంగీకరించాలి, లేనిచో నీవు శ్రమపడెదపు,” అని చెప్పారు.

“దేవుడు నా నోటిలో ఏది ఉంచునో, అది తప్ప మరేదియు చెప్పను,” అని ఆయననెను.

ఆయనచ్చటకు వచ్చిన తరువాత, ఒక రాత్రి సమయం ఇచ్చారు, అతడు లేచి, “ఇశ్రాయేలియులు కాపరి లేని గొర్రెలవలే చెదరియుండుట నాకు కనబడుచున్నది,” అని చెప్పెను.

“నేను నీకు చెప్పలేదా?” అని ఆహాబు పలికెను.

ఒక్కడు నాలుగు వందల మందికి ఎదురు తిరిగెను. తర్బీదు పొందిన తెలివిగల, విద్యగల పండితులు నాలుగు వందల మందిని ఒక చిన్న అనాగరికుడని మనము పిలిచే, మీకాయా ఎదుర్కొనెను. ఒక్కడే, కాని ఆ ఒక్కనికి యెహోవా వాక్కు ఉన్నది. అదే తేడా. వారందరు అబద్ధికులని రుజువు అయినది. మీకాయ ఎందుకంత వ్యతిరేకంగా ఉన్నాడు? ఆ విధంగా ఉండుటకు అతడు పేదవాడు కావలసి వచ్చాడా? కాదు. వాక్యములో నిలచి యుండినందునే మీకాయా భిన్నంగా కనిపించాడు! దేవుని వాక్యముతోనే అతడు నిలచియుండెను.

30

దేవుడు తన ఆత్మను కుమ్మరించుదునని ఈ దినములకు వాగ్దానము చేసెను. అది దానియేలు ద్వారా వాగ్దానము చేయబడెను, ఆ విగ్రహము యొక్క పాదమును రాయి కొట్టు దినములలో జనులు తమ దేవుడు గొప్ప కార్యములను చేయుదురని చెప్పెను. ప్రవచనము వెంబడి ప్రవచనము! అన్ని సేమినరీలు, ప్రపంచము దానిని కాదనలేదు. దేవుడు దానిని చేయును. ఏమైననూ ప్రజలు దానిని వెంబడించుదురు. ప్రకృతి సంబంధమగు సంఘము, ప్రకృతికి అతీతమగు సంఘము. మీరు చూచారా, వాక్యము వలననే ఆ భేదము కలిగెను.

యాకోబు కూడా అదే తలంచెను, “ఏమైనా గాని, ఆ జన్మహక్కు నాకు లేనిచో, ఎన్నడూ నేను ఆశీర్వదింపబడలేననుకొనెను. ఆ జన్మహక్కును నేను పట్టుకొనవలెననుకొనెను.”

కాని ఏశావు దానిని ద్వేషించెను, వాని కుమారులు నేటికిని దానిని ద్వేషించుచున్నారు. ఎప్పుడూ అంతే.

31

ఎక్కడ ఉజ్జీవము జరిగినను దానివలన కవలలు జన్మించుదురు, ఇది కఠినమైనదే గాని, నిజమగు మాట. ఇస్సాకు, రిబ్కాలు జంటను కనిరి. లోకము సృజించబడినప్పుడు, అది రెండు వృక్షములను ఉత్పత్తి చేసెను. కయీను, హేబెలులను ఇద్దరిని ఉత్పత్తి చేసినది. ఇష్మాయేలు, ఇస్సాకు అను ఇద్దరిని ఉత్పత్తి చేసినది. ఏశావు, యాకోబు అను ఇద్దరిని ఉత్పత్తి చేసినది. ఒకడు ప్రకృతి సంబంది (ఒకడు లోక సంబంధి); మరొకడు అతీతుడు. పకృతి సంబంధియైనవాడు తెలివిగలవానిగా కనబడెను. ఇంకొకడు ఆత్మచే నడిపించబడెను. అదెల్లపుడూ అంతే.

లూథర్ సంఘము వచ్చినపుడూ అంతే.

32

మొదటగా పెంతెకోస్తును తీసికొందము. పెంతెకోస్తు పుట్టుకను చూడండి. అది ఒక గొప్ప శక్తిగల ఉజ్జీవమును ప్రపంచమంతా పెల్లుబికించెను. అది లోకమంతా తెలిసిన పెంతెకోస్తు ఆ కొద్ది కాలమునకే పౌలు చెప్పినట్లుగా, “వారి మధ్య ఒకడు లేచి వంకర విషయములను తీసికొనివచ్చి, దేవుని నుండి జనులను దూరంగా త్రిప్పును.” సరిగ్గా వారు ఆలాగే చేసిరి. అది రెండింటిని ఉత్పత్తి చేసెను.

లూథర్ సంఘము జన్మించినప్పుడు, ఒక ఆత్మీయ ఉజ్జీవమును మార్టిన్ లూథర్ తీసికొని వచ్చెను. దాని వెనుకనే కొద్దికాలమునకు ఏశావు వచ్చెను. దానిని సంస్థగా మార్చిరి. అది రెండింటిని ఉత్పత్తి చేసెను.

ఆ తరువాత మెతడిస్టు వచ్చెను, అది జాన్ వెస్లీ, ఆత్మీయ ఉజ్జీవము. ఆ తరువాత దానిని సంస్థగా మార్చిరి. అది రెండింటిని ఉత్పత్తి చేసెను.

ఆ తరువాత పెంతెకోస్తు ఉజ్జీవము వచ్చెను. దానిని వారు సంస్థగా మార్చిరి. అది రెండింటిని ఉత్పత్తి చేసెను.

33

కాని సజీవ దేవుని ఆత్మీయ సంతానము యాత్రీకునివలెనే ఉండెను. వారు తిరుగుచున్నట్లే కన్పించారు. ఎప్పుడూ వేర్పాటు. ఏశావు, యాకోబుతో ఎక్కువ కాలము ఉండలేకపోయెను. జన్మహక్కును పొందిన వెంటనే పేరు కావలసివచ్చెను. (దేవునికి స్తోత్రము), నీవే సంఘమునకు చెందినా నాకు అక్కరలేదు. నీవు శరీర సంబంధిగా, నీ సహచరులతో పరుగిడుచూ, పేకాట ఆడుచూ, నీ సాహిత్య సమాజములు మొదలగునవి వేరుచేసికొనకుండా ఉన్నావా? నీవు జన్మహక్కును పొందినప్పుడు, ఏదో నీ హృదయంలో జరిగి దేవుని కొరకు ఆకలివచ్చును. నీవు దానిని పొందినప్పుడు వేరు కావలసియుందువు! “వారిలో నుండి వేరుపాడుము, ప్రత్యకేముగా ఉండండి, అని దేవుడు చెప్పెను.” వేరుపాటు!

34

సంఘము స్థిరపడును. చూచారా, అది వెళ్ళజాలదు. ఈ నాటి శారీరక విశ్వాసికి, ఏశావు ఒక మంచి మాదిరిగా ఉన్నాడు. ఎన్నడూ లోకమును జయించలేడు. లోకములో ఉన్న వాటిని జయించలేడు, ఆ పాటలు, డాన్సులు, వేషములు స్త్రీలు ముఖముపై రంగు, జుట్టు కత్తిరించుకొనుట, పొట్టి బట్టలు ధరించుట. పురుషులవలె ఆయా స్థలములకు వెళ్ళుట, సిగరెట్లు త్రాగుట, మురికి సరసోక్తులు మాట్లాడుకొనుట. కాని సంఘమునకు చెందిన వారని చెప్పుకొనుచున్నారు. వారెన్నడూ ఈ కార్యములను జయించలేరు. ఏశావు కూడా అంతే. ఆయనను, అతను తన తెలివితేటలచే భక్తిగా జీవించగోరెను. ఈ రోజున సంఘము కూడా అదే చేస్తున్నది. “మన౦ సంస్థగా మారుదాము. మనం కలసిపోవడ౦, చక్కగా ముద్దలా ఉందాం,” అని తలంచుచున్నారు.

ఈనాడు సంఘము ఆ రీతిగానే కదలిపోవుచున్నది, ఆత్మ సంబంధమైనది, శరీరసంబంధమైనది. అదెన్నడూ మానదు, మారదు.

35

దేవుని యొక్క పరిశుద్దత... దేవుడు తనంతట తానే దానిని ఇచ్చును. పాపి లేనట్లయితే ఆయనెన్నడూ రక్షకుడు కాకపోయి ఉండును. కాని ఆదిలో ఆయన రక్షకుడై యుండెను. కాబట్టి ఏదియూ నశించలేదు, ఆయన తన స్వంత గుణలక్షణములతో రక్షకుడై యుండి, ఒక పాపిని రక్షించుటకు వచ్చెను. ఆయన నీతి ఆయన పరిశుద్దత.... ఒక రోగి లేకపోయినచో, ఆయనెన్నడూ స్వస్థపరచువాడు కాజాలడు. కాని ఆదినుండియూ, అంతకు ముందునుండియూ ఆయన స్వస్థపరచువాడే. ఆయన స్వస్థపరచువానినిగా చేయుటకే ఒక జబ్బు వ్యక్తి అక్కడ ఉద్భవించెను. ఆయన వారిని స్వసపరచును, ఆయనయే స్వస్థతనిచ్చువాడు.

36

ఆ పరిశుద్ద రాజ్యము అవతలనుండియే రక్షణ, శాపములు బయలు వెడలుచుండును. ఒకే తల్లి దండ్రుల నుండి యాకోబు ఏశావులు జన్మించిరి. ఆయన దేవుడు, చూచారా. ఆయన సంకల్పములు మారవు. ఆ రీతిగానే వారు వెళ్ళవలసియుండును, సర్వసృష్టియూ దానికనుగుణంగానే పనిచేయును. అలాగది చేయవలసియున్నది. నేను చెప్పింది అర్ధమయిందా? అది అందులోనే సంచరించును. ఎవరో నశించినపుడే రక్షింపబడుట జరుగును. అదక్కడ లేనిచో ఆయన రక్షకుడు కాజాలడు, కరడు - కరడును పిలచుచున్నది.

నేనెల్లపుడూ ఒక చిన్న పిల్లవాని గూర్చి చెప్తుంటాను. ఆ కుర్రవాడు చెక్కిన పెన్సిలు బాగములను, సైకిలు పాదములను తినెడివాడు, ఎందుకనగా గంధకము అతనికి అవసరము. ఆ గంధకము కావలసిన అవసరత ఆతనిలో ఉన్నందున - మొదటగా ఆ గంధకము ఎక్కడో తయారు కావలసియున్నది. ఆ వాంఛ ఏర్పడక ముందే అక్కడ గంధక ముండవలసియున్నది. గంధకము అతనిలో ఉత్పత్తి కావలసియుండెను, గనుక తిరిగి గంధకము యొద్దకు వెళ్ళెను.

37

దేవుడు కూడా ఆ రీతిగానే రక్షకుడు. ఏదో నశించవలసియుండెను గనుక ఆయన రక్షకుడై యుండెను. అందుకే ఆయన రక్షకుడాయనెను. ఇదంతయూ దేవునిలో ఉన్నది. సమస్తమూ ఆయనలోనే ఉన్నది. బోధకునిలో కాదు, సంఘములో కాదు, సంస్థలో కాదు, కాని దేవునిలోనే, ఎన్నిక పరిపూర్ణముగా నిలబడవలసియున్నది, చూచారా. అది ఆయనలోనే ఉన్నది.

38

ఇంకొక వేర్పాటును మనము చూస్తాము. అబ్రాహాము, లోతులు. వారు సోదరులు, కాని లోతు శరీర సంబంధియగు ఆలోచనాపరుడు. ఏదో గొప్ప దాని కొరకు ఎల్లప్పుడూ వెదకుచుండేవాడు లోతు. కోతివలే ఎపుడూ మెరిసే వాటి కొరకు పరుగిడువాడు, ఈ నాటికి ఆ ఆత్మ విడిచి పెట్టలేదు. వారు పట్టణమునకు వెళ్ళి, ఇటు వంటి చిన్న వారిగా తిరిగిరారు. వారికి పట్టణములో నున్న పెద్ద సంఘము కావలెను. చాలా తెలివిగల పొస్టరు. చక్కని బట్టలు ధరించేవారు. ఆ పట్టణ మేయరు ఎక్కడికి వెళ్ళునో, అక్కడికే వెళ్ళుదురు, అది ఇంకా ఆ ఏశావు ఆత్మయే. జన్మహక్కుతోనే వారు ప్రారంభించారు గాని సంఘముగా తమ్మును తాము పిలచుకొని, దానిని తిరస్కరించినందున పోగొట్టుకున్నారు. వారిని నీవు మోకాళ్ళ మీద పెట్టలేవు. దేవునికి గట్టిగా మొర పెట్టునట్లు చేయలేవు. బయటకు వెళ్ళి, స్వస్థత కూటమును పెట్టలేవు. లోకహింసను తట్టుకొనవలెను, పరిశుద్ధాత్మను పొందవలెను, కాని వారా పని చేయరు. దానిని వారు తిరస్కరించుదురు. అదొక పరిశుద్ధ గుండ్రాళ్ళ గుంపు అని హేళన చేయుదురు. వారా విధముగానే చెప్పుదురని బైబిలు పలికెను. అది వారి స్వభావము గనుక వారావిధంగా చేయుదురు. కాకి పావురములవలే రె౦డు స్వభావములు. వారు దీనిని కోరుదురు ఎందుకనగా వారు అదే అయి యున్నారు. మరొకటి వారు చూడరు, ఎందుకనగా వారది చూచుటకు పుట్టలేదు.

39

కాని ఇంకో వ్యక్తిని దానినుండి దూరపరచలేవు, ఎందుకనగా అది ఆయన ఎన్నిక. అతడు లేక ఆమె ఆత్మ సంబంధిగా జన్మించెను. వారిలో నున్నదేదో ఆ విధంగా పిలచుచున్నది. ఎక్కడ మనము దానిని పొందగలమో, ఆ స్థలమునకు అది మనలను తీసికొని వచ్చును గాక. ఇపుడే ఆ పైనున్నది తొలగించబడు గాక. నేను చెప్పుచున్నది అర్థమవుతున్నదా?

గుర్తుంచుకొనండి, ప్రకృతి సంబంధమైనది, ఆత్మసంబంధమైనది అనగా ఆ రెండు సంఘములు కలిపియున్నంతకాలము ఆశీర్వచనము రాదు. ఏశావు నుండి వేరయ్యేవరకూ యాకోబుకు ఆశీర్వచనము రాలేదు. లోతు నుండి వేరయ్యేవరకు అబ్రాహాముకు దీవెన రాలేదు.

40

అక్కడ లోతుకు చిన్న స్వంత ప్రార్ధనా కూటములు, సంఘముయుండెను. తన కుమారులు, కుమార్తెలు, వారికి నేర్పించెను. ఆ సమయాంతమును గూర్చి వారితో ఆయన చెప్పినప్పుడు అందరూ నవ్విరి. అట్టి జీవితము అతడు జీవించెను.

ఈనాడూ అంతే! దైవిక స్వస్థత, దేవుని శక్తి మొదలగువాని గూర్చి నీవు మాట్లాడితే, వారు నవ్వెదరు. అదే ఆత్మ. ఆ రెండు గొప్ప ఆత్మలు, ఆత్మ సంబంధముగా, భక్తి గా నుండి లోకమును గుప్పెట్లో పెట్టుకొన్నవి. అవిశ్వాసి, విశ్వాసి, నటించు-విశ్వసి, ఒకరినొకరు అనుకరణ చేసికొనుచున్నారు. అబ్రాహాము తన్ను తాను ప్రత్యేకపరచుకొనెను.

41

యేసు రెండవ రాకడను గూర్చిన చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొన్నావా? నోవహు దినములలోవలెనే జనులు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసికొనుచు, పెండ్లికియ్యబడుచూ ఉండిరి. కాని ఆయన లోతును గూర్చి వానిని గూర్చి ఏమియూ చెప్పలేదు. “లోతు దినములు” అని చెప్పెను. అది ప్రత్యక్షత కొరకు.

లోతు దీనములలో ఏమి జరిగిందో గమనించండి. లోతు సొదొమలో బాగా స్థిరపడెను. తెలివిగలవాడు ఆ పట్టణమునకు న్యాయాధికారిగా అంటే ప్రముఖుడుగా నుండెను. గవిని యొద్ద కూర్చొని జనులకు న్యాయము తీర్చుచు౦డెను. అతని భార్య ఆ పట్టణములో నున్న ప్రతి సమాజములోను సభ్యురాలు. అతని కుమార్తెలు చాలా తెలివిగల విద్యగల చురుకైన సరసోక్తులను విసర కలిగినవారు. అలాంటివారినే పెండ్లి చేసికొనిరి. అయితే అబ్రాహాము సింధూర వృక్షము క్రింద ఒక గుడారములో నివసి౦చెను. కాని ఒక రోజున వారిరువురు దర్శించబడిరి.

42

ఒక బుద్దిగల బోధకుడు వెళ్ళి అక్కడే బోధించి, వారిని బయటకు రప్పించెను. బయటకు రండి రండి అను వర్తమునమును లోతుకు అందించెను.

అబ్రాహాము యొక్క కరుణ లేకపోయినట్లయితే, లోతు ఎన్నడును బయటకు పిలువబడి యుండెడివాడు కాడు. అందులో ఏబది మంది నీతిమంతులున్నచో పట్టణమును నాశనము చేయకుందువా? ముప్పది మంది ఉంటే? పదిమంది ఉంటే? ఈ వింధగా తాను వెళ్ళకలిగినంత దూరం వెళ్ళి బ్రతిమాలెను, కాని కనీసం పదిమందిని కూడా కనుగొనలేదు.

ఆశ్చర్యము లేదు, నోవహు దినములలో ఉన్నట్లుగానే. నోవహు సంఘమునకు మాదిరి కాదని జ్ఞాపకముంచుకొనండి. హనోకు సంఘమునకు మాదిరి, అతడు శ్రమల గుండా వెళ్ళకుండా ముందుగానే పైకి కొనిపోబడెను. హనోకు గృహము చేరెను గాని శ్రమలను చూడలేదు. నోవహు వాని గుండా వెళ్ళెను.

43

దీనిని జాగ్రత్తగా గమనించండి. అబ్రాహాము అతని కుటుంబము, ఎట్టి విధమగు గురుతును పొందిరో గమనించండి. సహజాతీతమైన గురుతు. “అబ్రాహామ [అతడు అబ్రాహామని ఎట్లు తెలియును?] నీ భార్య యగు శారా ఎక్కడ?” అతనికి వివాహమైనదనియు శారా అను భార్యా ఉన్నదనియు ఎట్లు తెలియును?

“ఆమె గుడారములో నున్నది.”

అక్కడొక వ్యక్తి మాంసము తినుచూ, పాలు త్రాగుచూ, రొట్టె తినుచూ కూర్చొనియున్నాడు. నీ భార్యయగు శారా ఎచ్చట? అది ఆయనకెట్లు తెలియును? దాని గూర్చి ఆలోచించు. ఆత్మ సంబంధులారా! దీన్ని మీరు గ్రహించండి. ఆతడొక పరదేశివలె బట్టలపై ధూళితో నుండి ఎట్లు తెలిసికొన్నాడు? నీ వెనుక గుడారములో ఆమె ఉన్నదని అబ్రాహాము చెప్పగా..

అందుకాయన, “నేను” అను వ్యక్తిగత సర్వనామమును వాడెను. [“నేను” అనగా శరీరధారియైన దేవుడే. అబ్రాహాము ఆయనను ఎలోహిం అని పిలచెను.] నిన్ను నేను దర్శించుదును. నా వాగ్దానమును నిలబెట్టుకొందును. నిర్ణయింపబడిన కాలమును బట్టి నిన్ను నేను దర్శించుదును. నేను చెప్పిన రీతిగా నీవు ఒక కుమారుని పొందెదవు. అప్పుడు అబ్రాహాము వంధ, శారా తొంబది ఏండ్ల ప్రాయంలో నుండిరి.

44

శారా ఆ గుడారములో నుండెను. (ఆ నాలుగు చిన్న గుడారములలో ప్రధానమైన దానిలో), ఆ వెనుక కూర్చొని ఆమె వినుచుండెను. ఆమె తన హృదయములో నవ్వుకొనుచుండెను, “నేను, నా యజమానుడు వందేళ్ళ ప్రాయంలోనున్నాము. మాకా పిల్లలు? పెండ్లయిన యవనులవలె అనందంగా నేను, నా ప్రభువైన అబ్రాహాము ఉండగలమా?” అని ఆమె తలంచి నవ్వినది.

ఆయన వీపు గుడారమువైపు వీపు పెట్టియుండెను. అయితే ఆయన “శారా ఎందుకు నవ్వినదని అడిగెను?” ఓ, సోదరుడా, అక్కడే నీవున్నావు!

45

శరీర సంబంధియగు సంఘమునకు సువార్త బోధించబడుచున్నది. ఒక ఆధునిక బిల్లీ గ్రాహమ్ తదితరులు అక్కడ సువార్త ప్రకటించుచూ, “బయటకు రండని” పిలచుచున్నారు. కాని వారు వచ్చిరా? లేదు. బహు కొద్దిమంది మాత్రమే.

బయటకు పిలువబడిన అబ్రాహాము ఆ గుంపును చూడండి, ఆయన ఈ సూచన ఇయ్యగా దానిని అతడు నమ్మెను. ఆయన అతని ఎదుటనే అదృశ్యుడాయెను. ఓ, ఎల్లప్పుడూ వేర్పాటు ఉండెను, బయటకు పిలువబడవలెను!

46

ఇప్పుడీ రెండు ఆత్మలు, ఈ రెండు గుంపులు చాలా సన్నిహిత౦గా కలిసిపోయినవి. ఆది కాలమునుండియు. అన్ని కాలములలోను ఆలాగే జరిగినది. ప్రకృతి సంబంధమగు సంఘము, ఆత్మీయ సంఘము. వారు పాత నిబంధనలో ఉన్నారు, క్రొత్త నిబంధనలోను ఉన్నారు, ఇంకా ఈ రోజుకీ ఉన్నారు.

47

రెండు వేల సంవత్సరముల క్రిందట ఇద్దరి వ్యక్తుల నాయకత్వము క్రిందికి అది వచ్చెను. ఒకాయన యేసుక్రీస్తు మరొకడు ఇస్కరియోతు యూదా. ఆ వెనుక కాలంలో ఉండిన దానికంటే మరింత వేరుగా అ రెండు ఆత్మలు ఆయన రాకకు ముందు దినములలో ఉండునని ఆయన చెప్పెను. ఇక్కడే మీకు మహిమ వస్త్రములుంచగోరుచున్నాను. ఈ రెండు ఆత్మలు చాలా భేదముతో నుండును, ఎందుకనగా... సాతాను వచ్చి ఒక సంఘ సభ్యునిలో అనగా ఇస్కరియోతు యూదాలో జీవించెను. అదే శారీరక సంఘము. అతడే అన్ని సమయములలోను దానికి స్నేహితుడు. తన సోదరుని మోసము చేయుచున్నానని అనుకొనెను. వాడు వచ్చి వారికి సంబంధించిన వానివలెనె ఉండెను. దేవుని సత్ క్రియలను పరీక్షించెను, ఆత్మతో ముందుకు సాగిపోయినట్లు కనిపించెను. బయటకు వెళ్ళి సువార్తను ప్రకటించెను, దయ్యములను వెళ్ళగొట్టెను. అయితే అతడు అంతరంగములో మాత్రము అన్ని సమయాల్లో ఇస్కరియోతు యూదాగా ఉండెను. నాశన పుత్రుడుగా అతడు జన్మించెనని బైబిలు చెప్పుచున్నది.

48

ఇప్పుడు, ఏశావు క్రిందనున్న ఆ శారీరక సంఘమును గుర్తించుకొనండి. పరిసయ్యులు సద్దుకయ్యులు వారే.

ఈతడు వర్తమానమతో వెళ్ళుచున్నట్లుగానే కొంతకాలము కనిపించాడు, కాని తన చేతులను అంతగా అందులో ముంచినట్లుగా లేడు. ఆత్మలను చూడండి? నిజమైన దానికంటే నకిలీదే బాగుండును. ఏర్పరచుకొనబడిన వారిని సహితము వీలయితే మోసము చేయును. “సాధ్యమైతే ఏర్పాటు చేయబడినవారిని అన్నమాట, గమనించండి.” కాని అది సాధ్యము కాదు! అది మోసము చేయును.

ఇప్పుడు, గమనించండి, అక్కడున్న శారీరక సంబంధమైన సంఘమునే కాదు, అదెల్లప్పుడూ ఉండే శారీరక ఏశావు గుంపు.

భయంకరమగు ఈ యూదా గుంపు ఆశీర్వదింపబడు చేతులలోనికి వచ్చుచున్నది. హెబ్రీ 6 మరియు 10లో చెప్పబడినట్లు, “ఒకసారి వెలిగించబడి, పరలోక సంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై, దేవుని దివ్యవాక్యమును, రాబోవు యుగసంబంధమైన శక్తుల ప్రభావమును రుచిచూచి, ఇవన్ని చేసిన తరువాత; మనము సత్యమును గూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా [బుద్ధిపూర్వకముగా, అది ఏమిటి?] పాపము చేసినయెడల, వారు శుద్ధికరింపబడిన నిబంధన రక్తమును అపరిశుద్ధమైనదిగా ఎంచుచున్నారు.”

49

ఒక్క ఉదాహరణ నిచ్చెదను. ఒకాయన ఉన్నాడు, చాలా మంచివాడు, అతడు హృదయపూర్తిగా సేవకునిగా పిలుపును పొంది ఆ విధంగా ఉండాలనుకొనుచున్నాడు. సరే, యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించియున్నాడు. చాలా చక్కని వాడు. ఎవరూ అతనికి వ్యతిరేకంగా ఏమి చెప్పలేరు. ఆ తరువాత శుద్దీకరణ అంశము వచ్చును. ఆ వ్యక్తి స్త్రీల వైపు చూస్తున్నప్పుడు నేత్రాశకు లోనయ్యాడు. ఆ విధ౦గా పాపము చేయుచున్నాడు. ఆ తరువాత పొగ త్రాగాడనుకొందాం, జూదం ఆడాలనుకొన్నాడు. ఈ విధంగా కొన్ని చెడుపనులు చేయగోరెను, అవి చేయకూడదని అతనికి తెలుసు గనుక “ఓ దేవా, యేసు రక్తమును నాపై నుండి శుద్ధిచేయును,” అని చెప్పును.

అతడు శుద్దిపొందును. అతడు చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించును. బయటకు వెళ్ళి మరలా అవే పనులను చేయును. ఆ దినమున ఆ మాదిరి వారుందురని యేసు చెప్పెను. “అనేకులు వచ్చి, ప్రభువా, నీ నామమున ప్రవచించలేదా [బోధించుట] దయ్యములను వెళ్ళగొట్టలేదా?” అని పలుకగా, ఆయన వారితో “అక్రమము చేయువారలారా! మిమ్ములను నేను ఎన్నడూ ఎరుగను,” అని చెప్పెను. వారక్కడే యుందురు, చూచారా.

50

ఇప్పుడిది గమనించండి. ఒక వెంట్రుకలోని వందో మిలియను భాగమును పరీక్షి౦చుచున్నాం. సువార్త యొక్క వాడియగు అంచు నొద్దకు వచ్చుచున్నాము. రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదై, ఎముకలలోనికి దూరుచూ మనస్సులోని ఆలోచలను బయటకు తీయగలదు. [హల్లెలూయా! దేవా! దానిని వెళ్ళనీయండి.] హృదయాలోచనలను పరిశోధించును. అదే సువార్త, దేవుని శక్తి. ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమే సువార్త.

“బైబిలు దానిని దేవుని వాక్యమని చెప్పుచున్నది గదా?” అని నీవనవచ్చు.

ప్రత్యక్షపరచబడిన వాక్యమే సువార్త. కేవలము వాక్కు ద్వారా సువార్త మనకు వచ్చినది, కాని పరిశుద్ధాత్మ యొక్క శక్తి మరియు ప్రత్యక్షపరచబడుట వలన, శక్తి బయలు వెళ్ళినది, సువార్తను జీవింపచేయుచున్నది. సజీవము చేయును.

51

నేను ఇండియాకు వెళ్ళినప్పుడు మెతడిస్టు చర్చి ఆర్చి బిషప్పు వచ్చి “మిస్టర్ బ్రెన్హా౦, మిషనెరీ గూర్చి మాకేమి తెలియబడనక్కర లేదు. మీ అందరికంటే బైబిలు మాకెక్కువ తెలుసు, మేమొక సంఘము. మీరు ఒక దేశంగా ఏర్పడకముందే, రెండువేల సంవత్సరముల క్రితమే ఇక్కడ మేము స్థిరపడితిమి, కాని నిన్ను దేవుడు దర్శించి ఈ బైబిలును సజీవంగా చూపించే ఒక వరమును ఇచ్చాడని విన్నాం. అది మాకు చాలా ఆసక్తిదాయకమైనది,” అని పలికెను. ఓ, మై! చూచారా, ఆ వ్యక్తి ఒక కుమారుడు, మనుమడు కాడు, దావీదు పలికినట్లే. “మేము తెలిసికొనగోరుచున్నాము. అది నిజమేనా?”

“నిశ్చయంగా, అది నిజం. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు,” అని చెప్పాను.

52

గమనించండి, శరీర సంబంధియగు సంఘము ఆత్మీయసంబంధమగు సంఘమును ద్వేషించుచున్నది. యూదా సోదరునివలే నటించి చివరకు అంతిమ స్థితిని చేరుకొనెను.

ఈ యవ్వన బోధకుని గమనించండి. అతడొక చోటికి వచ్చి, “ప్రభువా, నేను స్త్రీల వైపు చూస్తున్నాను. నేనట్లు చేయకూడదు. ఇంకా లోకవిషయములను నేను చేయుచున్నాను. నేనవి చేయరాదు. గుర్రపు పందెములపై నేను నా డబ్బు వ్యయపరచుచున్నాను. ఆ పని నేను చేయరాదు. నేను ప్రతి రాత్రి సినిమాలకు వెళ్ళుచున్నాను. ఇంకా అట్టి కార్యములు ఎన్నో చేయుచున్నాను. వాటిని నేను చేయకూడదు. నేను చెడు బొమ్మలను గదిలో ఉంచుకొని ఆనంది౦చుచున్నాను, అవి లోక సంగతులు. వాటిని నేను చేయకూడదు. ప్రభువా, నన్ను పవిత్రపరచుము!” అని అడిగాడు.

అప్పుడు ప్రభువు, “సరే, నేను చేయుదును,” అని చెప్పి, యేసు రక్తమును అతనికి అన్వయించి మరియు శుద్ది చేయును.

53

ఆ విధంగా చేసి ఒక రాత్రి అతడు వెళ్ళుచుండగా ఏదో విన్నాడు. అతడు వెళ్ళి ఆ మాటలు ఆలకించెను. అతడు పరిశుద్ధాత్మ బాప్తీస్మమును గూర్చి, పరిశుద్ధాత్మ నింపుదలను గూర్చి విన్నాడు. అపుడతడు “ఓ, మై, ఇది అద్భుతము కాదా! అని అనుకొనెను గాని దానిని బోధించినచో, నా సేవ దెబ్బతినును, నా తల్లి నన్ను ఇంట్లో నుండి తరిమివేయును. అందులోనికి నేను వెళ్ళినచో, సంఘములో నుండి నన్ను తరిమివేయుదురు. ఓ, అది నాకక్కర్లేదు. సరే, దాన్ని నన్ను చూడనీ! అది సత్యమే, బైబిలు అవును,” అని తలంచును.

54

మంచిది, ఒక ప్రసిద్ధ బోధకుడున్నాడు, విశ్వవిఖ్యాతి గాంచినవాడు. అతడు ఇంగ్లాండులోని, లండనులో మోకాళ్ళపై నుండి భాషలతో మాట్లాడసాగెను. (ప్యూటోరికోలో నాతో నున్న ఒక వ్యక్తి ఆయనను కనుగొన్నాను) చాలా శక్తి కలిగినవాడు, ఈనాడు ప్రపంచంలో గొప్ప సువార్తీకులలో ఒకడు. ఈయన సోదరుడు నాతో ఇక్కడ ఉన్నాడు. ఆత్మ నింపుదల కలిగిన మనిషి. అతడు పరుగెత్తికొని వెళ్ళి, “ఓ, సోదరుడా, ఇదీ సంగతి!” అని చెప్పాడు.

అ౦దుకాయన, “నాకు తెలుసు, అది నాకు తెలుసు. కాని ఒక విషయం నన్ను చెప్పనీ,” అన్నాడు.

ఆయన, “ఇపుడే బోధించు! దానిని బోధించు! ఇదే ఘడియ. నీ ప్రాబల్యంతో లోకాన్ని కదిలించగలవు,” అనెను.

అతడు అన్నాడు, “లేదు, నేను బోధించజాలను. చూడు! నా సంఘం నన్ను బహిష్కరించును. నేను దానిని బోధించలేను. నేను చేయలేను.” ఓ సహోదరుడా!

55

“ఒకసారి పవిత్ర పరచబడి సత్యవాక్యమును జ్ఞానముగా ఎరిగియు దానిని తిరస్కరించువారు, దేవుని కుమారుని బహిరంగముగా ఆవమానపరచుచు, సువార్తను సిగ్గుపరచుచూ దేవుని కుమారుని సిలువ వేయుచున్నారు.

పౌలు చెప్పెను, “యేసుక్రీస్తును గూర్చిన సువార్త నేను పిగ్గుపడువాడను కాను. రక్షించబడుచున్న వారికి అది దేవుని శక్తియైయున్నది. అయన సంఘము మధ్య పనిచేయుచున్న దేవుని శక్తి అది.

కాని అతడు చెప్పెను, “నేను అది చేయలేను. ”వారు నన్ను పెంతెకోస్తు వారిని అనుకొందురు,“ అని ఆయన పలికెను. ”నా పేరు పూర్తిగా శిధిలమైపోవును,“ అన్నాడు. ఓ, సహోదరుడా!

నాకసలు పేరు లేదు. ఆయన కీర్తి గూర్చియే నేను ఆలోచించుచున్నాను - కేవలము ఆయనే.

56

కాని చూడండి అవి రెండూ ఎంత దగ్గరగా వస్తున్నవో మీకు తెలుసు. అతడు నిబంధన రక్తముతో పరిశుద్ధ చేయబడెను. దానివలన పవిత్రపరచబడి లోకము నుండి బయటకు తీయబడిరి. అతడిని ఇప్పుడిక్కడ ఉంచవలెనని ప్రయత్నించుచున్నారు. అప్పుడు అతడు దానిపైకి చూస్తున్నాడు, దానిని గూర్చిన జ్ఞానమును కలిగియున్నాడు. దానినుండి వెనుదిరుగుమన్నాడు. అపుడిక ఆ పాపమునకు బలి ఇక ఉండదు. ఈ విషయం బైబిలు చెప్పుచున్నది. భయంకరమగు తీర్పు, అగ్నివంటి కోపము ప్రతివారిని మ్రింగివేయును. పగ తీర్చుకొనుట నావంతు అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మోషే ధర్మశాస్త్రమును తిరస్కరించిన వ్యక్తి కృప లేకుండా ఇద్దరు ముగ్గురు సాక్షుల క్రింద చంపబడును, ఎంత గొప్ప శిక్ష. యోగ్యుడగు సేవకుడయినను యేసు రక్తమును కాళ్ళక్రింద తొక్కినప్పుడు, అనగా సత్యమును గూర్చిన జ్ఞానము నెరిగియు తిరస్కరించినచో, అపవిత్రుడగును.

57

మనం ఎచ్చటనున్నాం చూడు? జాగ్రత్తగా నుండుడని యేసు చెప్పెను. యూదా ఎట్లుండెనో చూడండి? ఆయన వారితోనే యుండెను. ఈనాడు ఏశావు మరింత గొప్పగా నున్నాడు. అతడు మోసగాడు, అనుకరించువాడు, ఈనాటి కొరకు గొప్పగా చేయబడెను. నటించ సోదరునిగా యేసు నొద్దకు అతడు వచ్చెను. కాని అతని హృదయములో ఆ శరీరసంబంధమగు మనసుయే యుండెను. యేసును అక్కడకే అమ్మివేసెను. అతడు యేసును తన జన్మహక్కును ఏశావు తిండి కొరకు అమ్మెను. ముప్పది వెండి నాణెములు కొరకు అతడు తన జన్మహక్కును అమ్ముకొనెను.

58

చాలా మంది స్త్రీ మరియు పురుషులు ఈనాడు తమ ఆత్మీయ జన్మహక్కును ఏదో కీర్తి కొరకు జయించలేని ఈ చిన్న విషయము కొరకు అమ్మివేసిరి. కొందరు స్త్రీలు రంగులు వేసుకొని, పొట్టి జుట్టు, షార్టులు వేసికొనుట, అసహ్య సరసోక్తులు, సిగరెట్లు త్రాగుట, ఏదో లోకసంబంధము కొరకు అమ్ముకొనుచున్నారు. దేవుని ప్రేమ నీలో లేదని బైబిలు చెప్పుచున్నది.

మిమ్ము నేను బాధించాలని కోరుటలేదు, కాని మనం అంతములో ఉన్నాము. మనము పైకి వచ్చుచున్నాము, నిచ్చెన పైకి త్వరగా మనం ఎక్కిపోవుదం.

59

ఇదెట్లున్నదో చూడండి? వారది చేయుచున్నారు. వారు ముందుగానే నిర్ణయించబడినవారు, వారు అనుకరణ చేయవచ్చు. వారు తీయగా మరియు నెమ్మదిగా క్రైస్తవులవలె కనబడవచ్చు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయును; కాని వారి ఫలముల వలన వారిని తెలిసికొందురు.

షార్టులు ధరించిన స్త్రీ నాకు ఎన్నడూ క్రైస్తవురాలివలె కనిపించదు. స్త్రీ తల వెంట్రుకలు కత్తిరించుకొనుట అవమానమని బైబిలు చెప్పుచున్నది. యెజెబెలు ఒక్కతే బైబిలులో రంగులు పూసికొన్నది. ముఖానికి రంగు వేసినది.

పురుషుల సంగతి ఏమిటి, క్రైస్తవులవలే ఉండవలసిన పురుషులు, మీ భార్యలను ఆలాగు చేయునట్లు అనుమతించుదురా? అప్పుడు దేవుడు దానికి నిన్ను బాధ్యునిగా చేయును! పురుషులు కాదు; శరీర సంబంధులు! “ఓ, వెళ్ళి నేను ఆ సంఘములో చేరెదను [టేపుపై అంతరాయము] దాన్ని గూర్చి నీవు ఆలోచించు.” వారు ఆ విధంగానే చేయుదురని వాక్యము చక్కగా పలికెను. సరిగ్గా ఆ విధంగానే వారు చేసిరి. ఇకముందుగా వారు ఈ విధంగానే చేయుదురు - రాజీ ధోరణి.

ఎవరో ఒకరు నాతో, “నీవు ఆ బోధ ఆపకపోతే, అందరూ పారిపోవుట ఖాయం,” అని అన్నారు.

కాని వెళ్ళిపోనిది ఒక్కటున్నది, అది పరిశుద్ధాత్మ, ఎందుకనగా అది ఆయన వాక్యము. నిజంగా ముందు నిర్ణయించబడిన విశ్వాసి దూరంగా వెళ్ళడు, ఎందుకనగా అది అతని ఆత్మకు ఆహారము. అతడు దానిని ప్రేమించును, మరియు ఏదియూ అతడిని అది దూరపరచజాలదు. యాకోబువలే అతడు ఏమి చేసి అయినను జన్నహక్కును పొందగోరును. అతడక్కడే నిలబడి యుండును. స్నేహితులను, పనులను వదిలిపెట్టవలసి వచ్చినా గాని ఆ వెలను చెల్లించును, సంఘ సభ్యత్వమును లెక్క చేయడు. అతనిలో ఏదో ఉండి కరడు కరడును పిలచును. దానితోనే అతడు కదలుచుండును. ఏదో అతనిలో నున్నది, ఓ, నీవక్కడే ఉన్నావు.

60

నీవు బై బిలులో దేనినయినా గాని తీసికొని ఆదికాండములోనికి వెళ్ళి చూడు. అక్కడ నుండి ఉద్భవించినదో చూడు. ఈనాటి అన్ని ఆత్మలు, కదలి ఆదికాండము నొద్దకే వెళ్ళును. స్నేహితుడా! నీవు చూచుచున్న సంగతులను రుజువు చేయుటకు నేను అదే చేశాను. దానిని మరువకు. దానిని నీ తలపై నుండి పోవీయవద్దు. అది నీలోనికి పోనిమ్ము. అవి దేవుని సంగతులు. అది శిరస్సుకు చేరినవి, మరియు యేసు - అంత్యదినములలో అది మరల శిరస్సు దశకు వచ్చును అని ప్రవచించెను, మరియు అది: దేవుని ముద్ర, మృగపు ముద్ర, రెండు ఆత్మీయ శక్తులు కలిసి పనిచేయుచున్నవి.

61

దేవుని ముద్ర అనునది జన్మహక్కు అని ఎందరెరుగుదురు? పరిశుద్ధాత్మ బాప్తిస్మము, ఎఫెసీ 4:30లో “మీ విమోచన దినము వరకు ముద్రించబడిన దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడని వ్రాయబడినది.” వారు తిరిగి జన్మించినప్పుడు, పరిశుద్ధాత్మచే నింపబడిరి. పరిశుద్ధాత్మ అనగా నూతన జన్మయే, అది మనకు తెలుసు. మీరు ఆత్మ ద్వారా జన్మించితిరి. నేను దానిని అంగీకరించుదును. కాని నీవు జన్మించే చరకు....

ఒక తల్లి గర్భములో నుండి బిడ్డ పుట్టినది, అదొక జీవము. ఆ చిన్న జీవములోని కణములు తన్నుకొనుచు గంతులు వేయచూ నుండును. కాని అది జన్మించినప్పుడు, [సహోదరుడు బ్రెన్హాం చప్పట్లు కొట్టుచున్నాడు, మరియు పుట్టిన బిడ్డను కొట్టినట్లు అనుకరించుచున్నాడు], కేక వేయును, మరియు జీవించు ఆత్మయగును.

62

చిన్న బిడ్డ సంఘమునకు వెళ్ళి, “ఓ, నేను సంఘమును నమ్ముదును. నేను వెళ్ళి, ఇది చేయుదును. నేను మంచిని చేయగోరుచున్నాను,” అని చెప్పితే ఎట్లుండును. అయితే జీవమునకు నిన్ను లేపుటకు సువార్త దెబ్బ కావలిసియున్నది, నిత్యజీవములోనికి కేక వేయుదువు; ఇంతకు ముందు ఎన్నడూ కేక వేయనట్లు మరియు దానిలో పరిశుద్ధాత్మ కేక వేయును, మరియు అది నూతన సృష్టి, అది ఆత్మమూలముగా జన్మించెను. అది ఎదుగుటకు ఆరంభించి, కదలి, మరియు దేవుని రుపమును పొందును. చూచారా, మామూలు బిడ్డ వలెనే, ప్రకృతికి చెందిన బిడ్డ వలెనే, లోకములో దాని రూపముండును.

63

భూమి మీదనున్న ఈ గుడారము శిధిలమైపోయినను, మనకొరకు మరియొకటి ఎదురు చూస్తున్నది. ఈ ప్రకృతి సంబంధమగు శరీరము వచ్చునప్పుడు, ఆత్మ సంబంధమగు శరీరము కూడా తల్లి నుండి వేరునప్పుడు మరొకటి కాచుకొని యుండును. భూమి అను ఈ తల్లి నుండి వేరగును, అది ఇప్పుడు ప్రసవ వేదనతో మొరపెట్టుచున్నది. (ఓ దేవా!) ప్రయాసపడుచూ వృద్ధురాలగుమన్నది, వ్యాధులు మొదలగునవి మొత్తుచున్నవి. నదికి ఆవలివైపునున్న భూమి కొరకు ఆ లోపలి ఆత్మ చూచుచున్నది. అది వేదనతో మూల్గుచున్నది. వంకర తిరుగుచున్నది, గంతులు వేయుచున్నది (అవునండీ), ఎందుకనగా నిత్యమూ జీవించు జీవము అందులో ఉన్నది. మరణించు శరీరములో అది ఉన్నది. ప్రకృతి సంబంధమగు బిడ్డను తల్లి కనునట్లు, ఆత్మసంబంధమగు దేహమును కూడా భూమి విడిచిపెట్టును, ఆత్మీయ దేహము అవతలకు చేరును. “ఈ భూగుడారము శిథిలమైపోయినను, మరియొకటి చూస్తున్నది.” అందుకే నీవీలోక విషయములను మరచిపోవుచున్నావు - అవి నీకు చచ్చినవి. అక్కడ ఆత్మ ఉన్నది.

ఇప్పుడు మనము ముందుకు వెళ్ళుచు౦డగా ఆ రెండు ఆత్మలను గమనించండి.

64

పరిశుద్ధాత్మ అనగా నూతన జన్మ అని మనకు తెలుసు. దేవుని ఆత్మతో తిరిగి జన్మించుట. ఆ విధంగానే ఆత్మ ద్వారా నీవు జన్మించావు. ఆత్మ ద్వారా జన్మించుట. అదే నూతన జన్మ. నీవు ఆత్మచే జన్మించావు. ఆత్మతో జన్మించినప్పుడు, నీవు పరిశుద్ధాత్మచే నింపబడుదువు. మంచిది.

ఈ రెండూ భూమి మీదనుండినప్పుడు, ప్రకృతి సంబంధమైనది మరియు ఆత్మ సంబంధమైనది, కొన్నిసారూ... నేను చూచాను. ఇప్పుడు ముగింపులో, కొద్ది నిమిషాల్లో దీనిని చెప్పి ముగించాలని అనుకొనుచున్నాను. ప్రకృతి సందింధమైనదిగాని లేదా ఆత్మ సంబంధమైనది గాని.... ఇప్పుడు, మీరు దీనిని గ్రహించారనుకొంటాను. ఇప్పుడు మీరు ఉండగలిగినంత మర్యాదపూర్వకముగా ఉండండి.

65

ఎప్పుడైనా మీరు దీనిని చూచారా? మన సంఘములలో ఇప్పుడు మీరు చూస్తున్నారు, మనం వేరయిపోయిన గుంపులలో కూడా సంస్థలుగా మారిపోయినవి చూస్తున్నం. ఇవన్నీ మనం చూచాం. ఒక వ్యక్తి ఒక ప్రత్యేక వాక్యం ఎత్తి చూపించి, దానిని కొత్తగా జీవింపచేయగలడు. సరిగ్గా బైబిలులో వాగ్దానం చేసిన రీతిగానే అది జరుగును. ఆ విధంగా చేయుట చూచిన మరో వ్యక్తి దానిని చేయుటకు ప్రయత్నించును గాని విఫలుడవును. మీరు ఇప్పుడు చదువుచున్నారనుకొంటాను. అతడు తప్పిపోవును. ఎందువలన? వాక్యము అతనిలో ప్రేరేపింపబడలేదు. కేవలం అనుకరించుటకు మాత్రమే అతడు చేస్తున్నాడు. ఏదో తనకున్నట్లుగా నటించును. ఆ వ్యక్తి మనుష్యునిచే పంపబడియుండును. నీవు కూడా ఆ విధంగా చేయమని ఎవరో అతనిని పురికొలిపి యుండవచ్చును. ఈ విధముగా జరుగునని యేసు చెప్పెను. యన్నె యంబ్రేలు మోషేను ఎదిరించిన రీతిగానే, అంత్యదినములలోను జరుగునని బైబిలు ముందే చెప్పెను.

66

అక్కడ మోషే నిలచెను, మరియు యంబ్రేలు నిలచియుండిరి. మోషే తన కర్రను విసరెను, మరియు అది ఒక సర్పమాయెను. “ఎందువలన,” ఫరో అన్నాడు, “యంబ్రే నీవు కూడా వచ్చి ఆ పని చేయమని పలికెను.” అతడు కూడా చేసెను, చూచారా. కాని ఏం జరిగింది? మోషే కర్ర తక్కిన వాటిని మ్రింగివేసెను. చూచారా, అది ప్రత్యక్షపరచబడినది. అతని కర్ర ఎచ్చటున్నది?

అతీత భావజ్ఞానమువలె అది జరిగెను. అది దయ్యపుతత్వ జ్ఞానము వంటిది. కొన్ని సంఘాలు శారీరసంబంధముగా ఉండి నమ్మి దూరంగా పోవుచున్నవి. కొన్ని సంగతులు వారు చెప్పెదరు. అది మరో దినమునకు చెందినదని చెప్పెదరు. వారు కలసి బయటకు త్రోయబడిరి. కాని అంత్యదినములలో నిజమగు ఆత్మను అనుకరించు ఈ ఆత్మను చూడండి. అక్కడే పొరపాటు వచ్చుచున్నది. నిజమైన దాని వలెనే యుండును, చూచారా; కాని అతడు దానిని ప్రత్యక్షపరచజాలడు, దానిని పట్టుకొనలేడు, కడవరకు దానిని చేయలేడు. ఓ, దేవా!

67

ప్రజలు వచ్చి, “నేను కూడా పరిశుద్ధాత్మను పొందాను,” అందురు. వారి జీవిత విధానం చూడండి. అది ఒక ఉజ్జీవం నుండి మరో ఉజ్జీవానికి, లేదా ఒక కూటం నుండి మరో కూటానికి కూడా నిలువదు. అది ప్రత్యక్షపరచబడినది, కాని వారు పొందలేదు. దేవుని ఆత్మచే జన్మించిన ఏ స్త్రీ, పురుషుడయినా గాని ఆత్మ ఫలములు కలిగి భక్తిగా జీవించుదురు, చూచారా. లోకమునకు దూరంగా ఉందురు. దేవుడు వారి మధ్యలో ప్రత్యక్షమై పనిచేయుచున్నట్లుగా రుజువగును. మరొకటి అనుకరణ అని అర్థమగును, చూచారా.

ఈ అనుకరణ అనునది చాలా కాలము నుండి వచ్చుచునే యున్నది. ఇష్మాయేలు మరియు ఇస్సాకులను చూడండి. అంతా అనుకరణయే. మోషే ప్రవక్తను చూడండి, బిలాము ప్రవక్తను చూడండి. వారెట్లు వచ్చిరో చూడండి? యూదాను, యేసును చూడండి.

చివరి దినములలో ఈ పరిశుద్ధాత్మయే దేవుని ముద్ర అని యేసు ముందుగానే చెప్పెను. ఇప్పుడు, మృగము యొక్క ముద్ర ఏమిటి? దేవుని ముద్రను విసర్జించుటయే, దేవుని ముద్ర కలిగిలేనివారందరూ, మృగపు ముద్రను పొందియున్నవారే. రెండు ఆత్మీయ ముద్రలున్నట్లయితే, వాటిలో ఒకటి నిజమైన దేవుని ముద్రయగును, మరొకటి విశ్వాస బ్రష్టత్వం అగును. నీవు దానిని చూడగలవా?

68

పాత నిబంధనలోని ముద్రను చూడండి. బూర వినపడినప్పుడు, సునాదము ఎన్నో సంవత్సరముల కొకసారి వచ్చును. ఆ బూర ధ్వని మ్రోగినప్పుడు బానిసలు స్వేచ్ఛగా పోవుదురు. ఇష్టమున్న వారందరూ స్వేచ్ఛ పొందవచ్చును. కాని వారిలో కొందరు బానిసలుగా నుండ ఇష్టపడుదురు. కాబట్టి వారిని ఆలయ బలిపీఠపు స్తంభము నొద్దకు తీసికొని వెళ్ళి, ఒక ఇనుప పొగరుతో చెవికి రంధ్రము చేయుదురు. అది శాశ్వత ముద్ర. ఎల్లప్పుడూ యజమానికి బానిసలుగా నుందురు.

సత్యమును గూర్చిన సువార్త సందేశమును ఈనాడు నీవు విసచున్నావు. ఇష్టపడినచో నీవు స్వేచ్ఛగా పోవచ్చును. దేవుడు నీతో మాట్లాడును. సత్యమును గూర్చిన జ్ఞానము నెరిగియుండియూ ఆ సరిహద్దు గీతను నీవు దాటిపోయినచో, నీ చెవికి రంధ్రము చేయబడును. ఇక నీవు యుక్తిగల విశ్వాసిగా మాత్రమే ఉండెదవు. నీవు భక్తిగా నుండి ఆలయానికి వెళ్ళుదువు గాని ఎన్నడూ పరిశుద్ధాత్మను పొందవు. నీ జీవిత కాలమంతా బానిసగానే ఉండి పనిచేయుదువు. ఇప్పుడు, మృగపు ముద్రనా లేక దేవుని ముద్రనా? మరియు మనము ఎంతో దగ్గరగా వచ్చుచున్నాము.

69

ఇప్పుడు, చూడండి, లోకము ఆత్మా వేశముతో నింపబడాలి. దానిని విని, దానిని గుర్తించి, దాని ప్రకరము చేయాలి. చాలామంది విందురు గాని దానిని గుర్తించరు.

“నీకు ఇదే సమయమని,” దేవుడు చెప్పుచున్నాడు.

“నేను పరిశుద్దునిగా ఉండను. అదేమీ నాకు వద్దు.” అంటే వారు గుర్తించలేదన్న మాట.

మనము కూటములకు వెళ్ళుదుము, పరిశుద్ధాత్మ కదలుచుండును, ఒక రోజున నేను అక్కడ కూర్చొని యున్నాను, ఒక దర్శనం వచ్చి మరియు రానున్న దానిని ముందే చక్కగా చెప్పినది. “ఒక యవ్వనుడు ఇక్కడకు వచ్చుచున్నాడు. ఇక్కడకు రమ్ము! నీకు గుండె జబ్బున్నది మరియు నీవు దేనికొరకో చూస్తున్నావు,” అని చెప్పాను.

“అవును, అది అక్షరాలా నిజం.”

“ఆ స్త్రీ ఇక్కడకు వచ్చుట చూచారా? ఇక్కడకు రమ్ము! నీ రొమ్ము పై కణితియున్నది. అది ఎడమ రొమ్ము పై నున్నది. నీవు చాలా విపరీత పరిస్థితిలోనున్నావు. నీవు పాపివి....” అన్నాను.

“అక్షరాలా నిజం.”

70

వారు అచ్చట కూర్చొనియుండిరి, చుట్టూ చూచి, బోధకులు తదితరులుండిరి, కూటానికి వెళ్ళి పరిశుద్ధాత్మ చేయుచున్న పనిని గమనించండి. హృదయ రహస్యములను బయటకు తెచ్చుచున్నది అది ఆశ్చర్యము అని చెప్పుకొనిరి. ఓ సోదరుడా! అది మరో ప్రక్క, అక్కడేదో సంభవించినది. స్త్రీలు మరలా వారి పనిని మానక కొనసాగుచున్నారు. కుక్క తన వాంతికి, పంది తన బురదకు తిరిగినట్లుగానే పురుషులు తిరుగుచున్నారు. మీరు చూచుట లేదా? నేను ఇప్పుడు మాట్లాడుచున్నాను..

71

నీవు ఏ స్థితిలో నున్నావో స్నేహితుడా, గ్రహించుము. ఈ టేపు సంఘముకు మాత్రమే అని నేను చెప్పుటకు కారణము అదే! నీవు చీకటిలో నుండి వెలుగులోనికి - మరణము నుండి జీవములోనికి, క్రీస్తును గూర్చిన ఆచార జ్ఞానము నుండి తిరిగి జన్మి౦చు అనుభవములోనికి నీవు పిలువబడినచో, నీ జీవితములో లోకవిషయము ప్రక్కకు నెట్టబడును. క్రీస్తు కొరకు ఏమైనా గాని, ఏమి సంభవించినా గాని నిలబడుదువు. నీలో ఏదో ఆకలి, కదలిక యాకోబు వలే కలిగియుందువు. నీవు దేవునితో పోరాడి, ఆ తరువాత ప్రత్యేకముగా నడిచెదవు. నీలో ఏదో భేదము, మార్పు కనబడును.

72

అది జరుగుటకు ముందుగా అది నీలో ఆవేశమును పుట్టించును. నా జుట్టు మొత్తం రాలిపోయినా, నా భుజములు వంగిపోయినా, నాకు తొంబదేండ్లు వచ్చినా గాని నేను లెక్క చేయును. నా బోధను ప్రతి దినము మీరు విందురు. దేవుడు దానిని మీలో రగిల్చితేనే గాని మీరు ఉన్న చోటునే యుందురు.

దీనిపై రెండు రోజులు నేను ప్రార్థించి ధ్యానించారు. “ప్రభువా, ఇది సంఘానికి చెప్పాలా?” అని అడిగాను.

ఎవరో అన్నారు, “దానిని చెప్పుము. సమయం సమీపించినది, ప్రకటించు!” ఆయన నన్ను తొ౦దరగానే తీసికొనునని నాకర్ధమయింది. మీరు కూడా అది తెలిసికొనగోరుచున్నాను.

“నా తండ్రి ఆకర్షించితేనే తప్ప, ఏ మనుష్యుడును నా యొద్దకు రాజాలడు,” అని యేసు చెప్పెను. “అబ్రాహాము, దేవుడు మీకున్నారని మీరు చెప్పుచున్నారు; నాకు తెలుసు, కాని నేను చెప్పునదేమనగా, మీరు అపవాది పిల్లలు,” అని యేసు చెప్పెను. భక్తిగల జనుల, యాజకులు, గొప్పవారు అక్కడుండిరి, మీ తండ్రియగు అపవాది పిల్లలు,“ అని ఆయన చెప్పెను.

73

ఆత్మ ఫలములను గమనించండి. అది నిన్ను మేల్కొలుపవలెను.

“ఏదో ఒక రోజున వర్షము పడును, కాబట్టి నేను బయటకు వెళ్ళి, నా కొరకు ఒక ఓడను నిర్మించుకొందును. వర్షము పడితే నేను అందులోనికి వెళ్ళుదును.” నాకేమి తొందర లేదు, వర్షము పడినప్పుడు నేను వెళ్ళి అందులో దాగుకొందును,“ అని నోవహు అనలేదు. ఆ విధంగా అతడు పలికియుండినచో, మొదటిగా హేళన చేయువాడు వచ్చి హేళన చేసినప్పుడు తన సుత్తెను అక్కడ వదిలిపెట్టి యుండెడివాడు.” కాని బైబిలులో అలాగు లేదు. (ఓ, ఎన్నుకొన్న వారు దీనిని విందురు గొక),

ఈ రోజును మనుష్యులు చేసినట్లుగానే, యేసుతోనే అది ఆరంభమాయెను. వారు వచ్చి సత్యమును చూచియూ తిరిగిపోయిరి. దాని యెదుట వారు నిలువకపోయిరి.

ఒక గొప్ప సువార్తీకుడిట్లు చెప్పెను, “అది నా పరిచర్యను బద్దలు చేయును.” పరిశుద్ధాత్ముడు బ్రద్దలు చేయని సేవ ఎందుకు? అది చీల్చబడవలెను. కాని చూడండి, అది గర్వము — ఎంతో గొప్పవాడిని, గొప్ప మనిషిని గర్వము.

ఓ, ఇప్పుడు దీన్ని గమనించండి.

74

నోవహు బయట పొలములో నుండెను, అతడు వినెను, మరియు గుర్తించెను, మరియు ఆ ప్రకారము చేసెను. ఎందరు అపహాసకులు వచ్చినను దానిని నిర్మించెను.

నోవహు, నీవు ఒక పరిశుద్దు గుండ్రాయి,“ అన్నారు.

“నాకేం తొందర కలుగచేయదు.” కట్టుచూ వెళ్ళాడు. అతడు విన్నాడు, అది దేవుడే అని గుర్తించాడు. అది దేవుడేనని లేఖనము ద్వారా రుజువు పరచుకొనెను, మరియు అది ఆలాగు ఉండెను. ఏమయినా గాని తను ఓడను నిర్మించెను.

75

నీవెన్నడై నా దీనిని ఊహించగలవా? మోషే ఐగుప్తు మార్గములో ఒక రోజున తన భార్యయగు శారాతో “సిప్పోరా? ఇది నీవు ఎరుగుదువా? నేను నా వ్యాకరణము పై కొంత మెరుగు దిద్దుకొన్నాను. నాకు వచ్చిన కొద్దిపాటి గణిత శాస్త్రమును చక్కగా దిద్దుకొన్నాను. నా రేఖాగణితం, చదువు సమస్తమును చక్కపరచుకొన్నాను. నేనిక్కడ గొర్రెలు కాయుచూ, ఆ పనిని చేశాను. నేను ఐగుప్తులో ఒక పొరపాటు చేశాను. నేను వెళ్ళి దానినిప్పుడు సరిదిద్దెదను. నేను వెళ్ళాలనుకొంటున్నాను,” అన్నాడా. లేదు, మొదిటి అల అతనికి వ్యతిరేకంగా వచ్చింది, అక్కడే అతడు పడిపోయేడివాడు.

అతడేమి చేసెను? అతడు తనకు వచ్చిన లెక్కలను తెలివిని సమస్తమును మరచిపోయెను. వాటివలనే అతడు ఆపదలోపడెను,

ఈ రోజు సంఘం కూడా అందుకే సమస్యల్లో పడుతుంది. ఆత్మ ద్వారా జన్మించని విద్య కలిగిన బోధకులు చాలామంది లేచారు. తెలివిగా నున్న ప్రసంగములను వినుటకు స్త్రీ, పురుషులు వేగిరపడుతున్నారు. యేసుక్రీస్తు శక్తి, పునరుత్థానమునకు బదులుగా దానిని బోధించుచున్నారు. ఈనాడు అందుకే మనం బాధల్లో పడుతున్నాం. ఇక ఏ మాత్రం ఉన్నత పాఠశాలలు గాని బోధకులకు చదువు గాని అక్కర లేదు. పరశుద్ధాత్మచే నింపబడి, దేవునిచే పిలువబడిన బోధకులు మనకు అవసరము. ఏదో మానవ-కల్పిత వేదాంతము లేదా ఏదో శాఖా వేదాంతము నేర్చుకొన్నవారు కారు. మనకు దేవుడు-పిలిచిన మనుష్యులు అవసరము.

76

మోషే మందను మేపుచు౦డెను, అంతా మరచిపోయి కూర్చున్నాడు. తన తెలివితేటలన్నీ పనికి రాకుండా పోయినవని తెలిసికొనెను. తన విద్య వలననే విఫలమయ్యాడని తెలిసికొన్నాడు. అతడు గొర్రెలను కాయుచుండెను. కాని అతడు విన్నాడు. ఓ! “మోషే, నీ చెప్పులు విడువుము. నీవు నిలబడియున్న స్థలము పరిశుద్దమైనది.” దానిని అతడు వినెను, అదేమిటి? దేవుని దూత వాక్యముతో మాట్లాడెను. పితరుడగు అబ్రాహాముకు దేవుడు వాగ్దానము చేసెను. “నాలుగు వందల సంవత్సరములు వారు అక్కడుండిన తరువాత శక్తిగల హస్తముతో వారిని దర్శించుదును.” అది ప్రత్యక్షపరచబడిన దేవుని లేఖనమని అతడు గుర్తించెను.

ఒక్క నిమిషం ఆగెదను. బాగా నాననివ్వండి. ఈ రోజు నేను చెప్పేది అర్ధమవుతుందా? మీ యెదుటనే దేవుని వాక్యము ప్రత్యక్షపరచబడుచున్నది, మరియు మీరు దానిని గ్రహించుటలేదు. ఇప్పుడు, సొదొమ గొమొర్రాలను గూర్చి ఆలోచించండి, చివరి దీనములను గూర్చిన దేవుని వాగ్దానమును ఆలోచి౦చండి.

77

మోషే దానిని గుర్తించెను. అది వాక్యానుసారము, అది ఒక వాగ్దానము. అతడు విన్నాడు, అతడు గుర్తించాడు. అతనిలోనికి ఏదో వచ్చెను. సోదరుడా, అతడు చేయుటకు వెళ్ళెను. అతడు పనిచేసెను. అతడు వెళ్ళి, ప్రతి ఫరోను ఆపకలిగెను, తెగుళ్ళు రప్పించకలిగెను. తాను కోరగా ఎర్ర సముద్రము పాయలయ్యెను, ఎందుకనగా అతడు విని, దానిని గుర్తించి, దేవునికి ప్రతినిధిగా పనిచేసెను.

“నేను నీకు దేవునిగా నుందును, నీవు నాకు ప్రవక్తగా నుందువు,” అని ఆయన చెప్పెను.

“దానిని నేను చేయలేను,” అని పలికెను.

“అయితే నీవు దేవునిగా నుండుము, అహరోనును నీకు ప్రవక్తగా నుండును. ఏమయినా గాని నీవు వెళ్ళి తీరాలి!” అని ఆయన చెప్పెను.

“నేను వెళ్ళి, అన్నీ సక్రమంగా సరిదిద్దుకొని వచ్చెదనని,” అతడు చెప్పలేదు.

78

కర్మెలు పర్వతముపై ఏలియాను నీవు ఉహించగలవా, “నీకు తెలుసా, ఈ భూమి పాపముతో నిండిపోయినది. నేను వెళ్ళి తన్ను గూర్చి సిగ్గుపడమని ఆహాబుకు చెప్పెదను. నేను వెళ్ళి పర్వతం మీద కూర్చొని ఉపవాసం చేసి, నా ఆకలి బాధను చూచి ప్రజలు విసుగుచెందేవరకు కనిపెట్టుదును, అని అనుకోలేదు. లేదు. లేదు, అది కాదు.

కాని అతడు విని, దానిని గుర్తించి, మరియు పనిచేసెను. “కాకులు నిన్ను పోషించునట్లుగా ఆజ్ఞాపించుదును, కెరీతునొద్దకు పొమ్ము,” అని చెప్పెను.

79

బయలుకు మరియు దేవునికి మధ్య గొప్ప యుద్దము చెలరేగెను. “మీరు వెళ్ళి, మీ ఆర్పణలను అర్పించి, మీ ఇష్టానుసారముగా చేయండి, మీ దేవుని పిలువండి,” అని చెప్పెను. వారు తమ్మును తాము కోసికొనిరి, గాయపరచుకొనిరి, క్రిందికి పైకి ఎగురుచూ చాలా గోలచేసిరి. “ఎక్కడయినా నిద్రపోవుమన్నాడేమో గట్టిగా అరవండి అని చెప్పాడు.” ఓ, సోదరుడా!

“మంచిది, మీకు తెలుసా?” అతడు చెప్పెను. “నేను యెహోవా విశ్వాసివి, ఏమయినను దీనిని నేను చేసెదను.” ఓ, లేదు, నీవు దానిని అనుకరించకు! వద్దు, దేవుడు నిన్ను పిలిస్తేనేగాని ఎలియావలె ఏదో చేయుటకు ప్రయత్నించవద్దు. అవునయ్యా. “నేను యెహోవా దాసుడను!” అక్కడ ఏడు వందలమంది ఉన్నారు, కాని ఎవరికి ఆ పని చేసేందుకు ధైర్యం చాలలేదు.

అతడు ఎద్దును వధించి దానిపై నీరు పోసి, “ప్రభువా, నీ ఆజ్ఞానుసారమే దీనిని చేయుచున్నాను,” అన్నాడు. ఎవరైనా ఆ పని చేయుటకు ప్రయత్నించినచో, తప్పక విఫలమవుదురు.

అది నీకు ప్రేరపణ కలిగించాలి! పరిశుద్ధాత్మ దానిని తీసుకొని వచ్చి మరియు దానిని నీకు ప్రత్యక్షపరచవలెను.

80

ఈ రోజు అదే జరుగుతోంది. నీవు వేదికపై నిలబడి, “హల్లెలూయా వాల్లెలూయా, ప్రభువా, నాకు పరిశుద్ధాత్మ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా,” అదే చాలదు. అది కాదు.

కాని, సోదరీ, సోదరుడా, ఆ వాక్యమును పరిశుద్ధాత్మ నీలో ఆవేశపరచినప్పుడు, నీ చోటును విడిచి పెట్టక ముందే నీవు దానిని పొందుదువు. నీలో ఏదో మండును. ఇది చేయుము, అది చేయుము అని బోధకుడు నీకు చెప్పనవసరంలేదు; ఆ పాత ఆకులు రాలిపోయి, క్రొత్త ఆకులు తొడుగును. అది నీకు ప్రేరేపణ. బైబిలు నుండి సత్యమును బోధించిన బోధకుని పట్ల నీకు కోపము రాదు. దానిని నీవు ప్రేమించుదువు, దాని కోరుకొందువు, నీ ఆత్మకు అది ఆహారము.

81

యేసు కూడా ఇట్లనెను, “నా యంతట నేనే చేయగోరుటలేదు, తండ్రి ఏది చేయుట చూచునో దానిని తప్ప కుమారుడు ఏమియూ చేయజాలడు.” ఆయనే ఇమ్మానుయేలు. యేసు భూమిపై దేవుడే. దేవుడు నివసించిన శరీరము ఆయనే. దేవుడు నివసించిన గుడారము ఆయనే. ఆమేన్. అన్నింటికన్న కన్యకకు జన్మించిన దేవుని కుమారుడు, పరిపూర్ణ ఆత్మతోనుండిన ఇమ్మానుయేలు (కొలతలేని ఆత్మను ఆయన కలిగియుండెను), అయినను ఆయన తన శరీరముతో నుండగా ఇట్లనెను, “మొదటగా, తండ్రి నాకు చూపింతేనేగాని నేను ఏమియూ చేయను.” అది చేయవలెనను ఆత్మ ప్రేరణ అవసరం!

సాతాను చెప్పెను, “ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చి ఒక అద్భుతము చేయుము. నీవు చేయుట నన్ను చూడనీ అన్నది.”

“మనుష్యుడు రొట్టెవలన మాత్రము జీవించడని వ్రాయబడినది...” అని ఆయననెను. ఓ, మై! ఆ సమూహము ఆకలిగా నున్నప్పుడు అయిదు రొట్టెలను, రెండు చిన్న చేపలను తీసికొని అయిదు వేలమందిని ఆయన పోషించెను. ఓ, హల్లెలూయా! నా భావము మీరు చూచారా?

82

అనుకరించుటకు ప్రయత్నించవద్దు. ఈ రోజు పెంతెకోస్తు వారి సంగతి ఆదే. ఈనాడు సంఘం ఆలాగే ఉన్నది. చాలామంది తమకు పరిశుద్ధాత్మ ఉన్నట్లుగా అభినయము చేయుచున్నారు. దైవిక స్వస్థతను చాలామంది అనుకరించుటకు ప్రయత్నము చేయుచున్నారు. ప్రభువు యొక్క చాలా కార్యములను అనేకులు అనుకరించుచున్నారు. నీవు ఆ ప్రయత్నంలో విఫలమగుదువు. అవి దేవుని ఏర్పాటు, పిలుపు వలన కలుగును. నీవు తల్లి గర్భము నుండియే అవి చేయటకు ఊడిపడుదువు. “వరములు పిలుపులు మారుమనస్సు లేకుండా ఇవ్వబడును.” ఓ, మై! అది నిజము. నీకు లేనిది ఉన్నట్లుగా నటించుట సాధ్యము కాదు.

కాని ఒకవేళ దేవుడు నిన్ను పిలచినచో, నీవు లోకములో చాలా గొప్ప కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా జీవించు, ఎందుకనగా ఆయన నిన్ను పిలిచెను. అది నీపట్ల యధార్ధమగును.

83

సమయమున్నచో నన్ను తిప్పిన ఉడుతలను గూర్చి మాట్లాడుదును. వాటిని నేనెన్నడూ చూడలేదు, మరియు దానిని చేయలేకపోయాను. (హట్టి వెనుక కూర్చొని నావైపు చూస్తున్నది.) అదెట్లు జరుగును? అది జరిగియుండెడిది కాదు, కాని అది ఆత్మ ప్రేరితమైనది, జీవింపచేయునది. మాట పలుకగా ఆ ప్రకారమయినది. హల్లెలూయా!

84

పౌలు, ఈ విధంగా చెప్పుట ఉహించగలరా, “నేనీ సముద్రంలో పధ్నాలుగు రేయింబగళ్ళు గడిపాను. సూర్య, చంద్ర, నక్షత్రాదులు ఏవీ లేవు. నేను పైకి వెళ్ళి, వారితో దైర్యము కలిగియుండుడి, ఎందుకనగా మన గూర్చి దేవుడెట్లయిననూ జాగ్రత్త వహించును, అని చెప్పుదును.” ఓ, దేవుడా విధంగా పనిచేయడు. దేవుడు ఆ రీతిగా చేయడు.

సోదరుడా, నీ విశ్వాసము మంచిదే. నీ విశ్వాసము అద్భుతమైనది. కాని ఆత్మావేశం నీకు వచ్చువరకు...

85

ఓ, ఇక్కడొక ఎర్ర దీపం వ్రేలాడుచున్నది, “ఆక్సిలేటరు పై నా పాదము నుంచాను. నా కారులో గంటకు-నూట-ఇరవై-నాలుగు మైళ్ళు వెళ్ళుదును. అది నిజము. నా పాదము క్రింద శక్తిని నేను అనుభవించగలను. కాని ”వెళ్ళుమను“ సూచన వచ్చువరకు నీవు వేచియుండుట మంచిది. హల్లెలూయా!

నా భావము మీరు గ్రహించారా? “వెళ్ళుమను” సూచన వచ్చినప్పుడు బాగుండును. ఆ విషయం గూర్చి నీకు ఆత్మావేశం కలిగినప్పుడు, దేవుడు గతంలోని వారికి చెప్పిన రీతిగానే వీరును చెప్పును. కాని ఆయన చెప్పేవరకు ఎదురుచూడకుండా యూదా గుంపువలె అనుకరణ చేయువారిని కలిగియున్నాము, “మంచిది, నేను వారివలె ఉన్నాను. నేను కూడా క్రైస్తవుడను,” అని వారు చెప్పుదురు.

86

ఓ, సేవ్ కుమారుల గూర్చి మీరు మరచిపోకండి. వారు వెళ్ళి, “పౌలు బోధించుచున్న యేసు నామమున నీకు ఆజ్ఞాపించుచున్నామని,” పలుకగా.

అతడు, “పౌలును నేనెరుగుదును, యేసును నేనెరుగుదును, కాని మీరెవరు?” అనెను.

నిజము అబద్ధము బయలుపడు ఘడియ వచ్చియున్నది. అది ఈనాడు క్రైస్తవులలో కనిపించుచున్నది. ఈనాడు సంఘములలో అది కనిపించుచున్నది. ఈనాటి ప్రజలలో అది కనిపించుచున్నది. నేను మిమ్ము ఎక్కువసేపు ఉంచాను. ఇది మీరు గ్రహించాలి అని నేను కోరుచున్నాను.

87

పౌలు ఎన్నడు కూడా, “నేను వెళ్ళి, పైనున్న వారితో ధైర్యముగా నుండుడని చెప్పెదనని,” తలంచలేదు.

ఆతడేమి చేసెను? ఒక దూత స్వరమును వినెను. ఎప్పుడూ తనతో మాట్లాడుతున్న దూత అదేనని గుర్తించెను. ఆ తరువాత పనిచేసెను, అప్పుడు పైకే ఎక్కిపోయి, “ధైర్యముగా నుండుడి, యెహోవా దేవదూత గతరాత్రి ఆయన దాసుడనగు నా ప్రక్క నిలబడి ఏదియూ జరుగదని నాకు దర్శనములో చెప్పెను. ఈ ఓడ ఏమీ అవదని చెప్పెను. ధైర్యముగా నుండి భోజనము చేయండి. అంతా మేలు జరుగును,” అని చెప్పెను. ఆమేన్. నీకు ఆత్మావేశం వచ్చినప్పుడు, దేవుడు దానిని సరిచేయును!

88

ఇక్కడొకటి నేను వ్రాశాను. అన్నింటి యొక్క అంత్యములో మనం ఉన్నాం. దేవుడు మీకేదో బయలుపరచెనని నేను నమ్ముచున్నాను. అన్నింటికీ అంతము వచ్చినది. ఒక రాత్రి ఎవరో అడిగారు, సహోదరుడు ఫ్రెడ్ సొత్మన్ అనుకొంటాను, అంత్యము ఎంత చేరువలో నున్నదో తెలిసికొనగోరుచున్నామని అడిగెను.

89

సహోదరుడు డిమోస్ శకారియన్ ఆ దర్శనం ప్రత్యక్షపరచబడుట చూచాడు, మరియు ఆ తరువాత అయిదు రోజులకు అది చక్కగా నేరవేరినది. అతని కాళ్ళ చెప్పులు విడిచినంత స్పష్టంగా అది జరిగింది. అతడు నన్ను పిలచి, “జోసఫ్ ఎట్లున్నాడు,” అని ప్రశ్నించెను.

“బాగానే ఉన్నాడు,” అని అన్నాను.

“అతడు దర్శనములు చూచునా,” అని అనడిగాడు.

“అవును. సహోదరుడుకుమారుడగు డేవిడ్ ను గూర్చి చెప్పెను. అతడు మోటారు సైకిలు పై నుండి ఎక్కడ పడిపోవునో మూడు, నాలుగు రోజులకు ముందే చెప్పెను. సరిగ్గా ఆలాగే జరిగినది,” అన్నాను.

“అవి కుటుంబములను వెంబడించునని తెలియునా?” అనడిగాడు.

“చెడ్డవాడయినా లేక నీతిమంతుడయినాగాని, ఆ కుటుంబములలో ఆ సంగతులు వెంబడించును,” అని నేను అన్నాను.

90

“ఇదెక్కడ నుండి తీయబడింది, బ్రెన్హాం సోదరుడా?” అని ఫ్రెడ్ నన్ను అడిగెను.

“చూడు ఫ్రెడ్, దానిని ప్రకృతి ద్వారా మనం తీసికొందము. దేవుడు తన ప్రకృతిలో పనిచేయును. ఏం జరిగిందో గమనించు. సూర్యుడు తూర్పున ఉదయించును. ఆ పాత నాగరికత చైనాలోనే ఉన్నది.” మనకది తెలుసు అని నేను అన్నాను.

ప్రాచీన నాగరకత మనకు చైనాలోనున్నది. సరే! ఎల్లప్పుడూ నాగరికత పశ్చిమంగా కదలుచుండును. నీవు పశ్చిమ తీరమును విడిచిపెట్టి తిన్నగా వెళితే, ఎక్కడకు వెళ్ళుదవు? ఈనాడు, సరిగ్గా, మన చివరిలో నున్నాము. బైబిలు చెప్పెను, ప్రవక్త చెప్పెను, “పగలుకాని రాత్రికాని రోజు ఒకటి యుండును. సూర్యుడు దాటి పోవుచుండును, కాని సాయంకాల సమయము [అంతమునకు ముందు] వెలుగు కలుగును.” తొలకరివాన మరియు కడవరివాన ఉండునని యేసు చెప్పెను. కడవరివాన, ఒకే రుతువులో — తోలకరి మరియు కడవరి, రెండు వానలను ఉత్పత్తి చేయును.“ మనం అంత్యకాలములో ఉన్నాము.

91

ఇటు చూడండి, నన్ను మీకు చూపించనీయండి. రాజకీయము అంతములో నున్నది. నీవు దానిని నమ్ముదువా? ఈ దేశము అవినీతిలో ప్రపంచములో నీచమైనది, భక్తిహీనత కనిపించని చోటులేదు. కొరియర్ జర్నల్ పేపర్ ఎందరు చదివారు, లూయిస్-విల్ లో, ప్రపంచ సుందరిగా ఎన్నికగుటకు అన్ని దేశాల నుండి అందగత్తెలు వచ్చారు. రష్యా తప్ప అందరూ వచ్చిరి. ఎందుకు పంపలేదని వారు కృశ్చేవ్ కు కబురు పంపారు. అందుకు కృశ్చేవ్ స్త్రీలు బట్టలు లేకుండా పురుషుల యెదుట నడచుటకు నేను అ౦గీకరించను అన్నాడు. దేవుడు లేని అన్యుల దేశము క్రైస్తవులమగు మనపై నింద మోపుచున్నది. రష్యా ఆ విధంగా స్త్రీలు నగ్నంగా పురుషుల యెదుట నడచుటకు ఒప్పుకోలేదు. రష్యాలో నగ్నముగా వీధులలో తిరుగునట్లు వారి స్త్రీలను అనుమతించరు. అది దేవుడు లేని దేశమే. క్రైస్తవులమని పిలిపించుకొనుచున్న మనం ఎట్లున్నాం?

92

“ప్రతి భోజనపు బల్లయు వాంతితో నిండియున్నది. ఎవరికి నేను హితబోధ చేయుదును? ఎవరు విందురు? సూత్రము వెంబడి సూత్రము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ బయలు వెళ్ళుచున్నది. నత్తి పెదవులతోను, అన్యభాషలతోను నేను ఈ జనులతో మాట్లాడుచున్నాను. ఇదే విశ్రాంతి. వారు ఇదంతయూ వినరు,” అని బైబిలు చెప్పుటలో ఆశ్చర్యము లేదు. మనకు స్వంత జ్ఞానమున్నది. ఓ, దినమంతా మనము దానిపై నుండినచో ఎంత బాగుండును?

రాజకీయము చెడిపోయింది! డెమొక్రాట్సు, రిపబ్లికనులు అ౦దరూ దిగజారిపోయారు. ఏమిటిది? అదొక అంటు కట్టబడిన గుంపు. అందరూ అందులో పని చేస్తున్నారు. వారు తిరిగి జన్మించనివారు, దయ్యమునకు చెందినవారు. “లోకములోని రాజ్యములన్నియూ నావేనని,” దయ్యము పలికినది, మరియు యేసు ఎన్నడూ వాడితో వాదించలేదు. లోకము అపవాది అధీనము క్రింద నున్నది. ప్రభుత్వములో పనిచేయుచున్న ప్రతి వ్యక్తియు క్రైస్తవుడు కానిచో, దయ్యమునకు చె౦ది, దయ్యమునకే పనిచేయుచున్నాడని చెప్పుదును. ఆయన వచ్చునప్పుడు, ఈ రాజ్యములన్నియూ యేసుక్రీస్తు ముందు పతనమగును. వెయ్యేండ్ల పాలన వచ్చును.

93

ఇక్కడ ఈ రోజున చూడు, ఇప్పుడు వారు ఏమి చేయుచున్నారు. ఒక భక్తి ఉద్యమమును లేవనెత్తు ప్రయత్నంలో క్రైస్తవులకు డబ్బు ఖర్చు చేయుచున్నానని చెప్పి, వారు నన్ను మ్రి౦గవలెనను కోపంతో చూస్తున్నారు. రాష్ట్ర చెరసాలలో ఇరవై సంవత్సరముల శిక్షను నాకు వేయాలనుకొనుచున్నారు. సిగరెట్లు, విస్కీలు, బీరుల కొరకు వేలాది మిలియనులు ఖర్చుపెట్టి, దేశాన్ని చెరిపివేయుచున్నారు. యేసుక్రీస్తు తలుపు నొద్ద నిలబడి, నీతిని బోధించుచున్న నాకు, శిక్ష విధించగోరుచున్నారు. తెలివి, జ్ఞానము, చురుకుదనము గలవారు టెలివిజనులకు ఏవేవో వ్రాసి పంపించి లోకాన్ని దిగజార్చి, స్త్రీలను కుక్కలకు పడవేస్తున్నారు. దానితోనే వారికెన్నడూ లేని శాపము వచ్చినది. సువార్తను బోధించినందుకు నాకు జరిమానా విధించాలనుచున్నారు. ప్రజలు నాకు సువార్త బోధించమని కొద్దిగా డాలర్లు ఇచ్చుటయే తప్పు అన్నారు. నేను ధనికుడను కాను. దాని గూర్చి నేను బయటకు వ్రాయలేను. కాని వారు నన్ను రెండు సంవత్సరముల పాటు పట్టుకొని త్వరలోనే శిక్షకు పంపించగోరుచున్నారు. ఓ, ఎంతగా దిగజారిపోయింది, ఎంత అపవిత్రత! దేవా, కరుణించుము.

94

బహుశా దేవుడు తన అణుబా౦బును పంపుటకు ముందుగా ఆలాగే జరుగవలెనేమో. నీవు ఏదో తప్పు చేయాలి. ఆయన అభిషేకించిన దానిని ఒకసారి నీవు తాకవలెను. “నేను అభిషేకించినవారిని తాకవద్దు,” అని వాక్యము బోధించుచున్నది. అది నిజం. దానియేలు దినములలో జరిగినట్లుగానే, ఈ దినములలోను తీర్పు జరుగును, దానిని రానివ్వండి. ప్రభువా, నేను నీ సేవకుడను. అది నిజము. ఓ, అవును.

95

రాజకీయము దిగజారినది! దేశము పాడైపోయినది! ఇప్పుడు పొట్టి దుస్తులతో వారిని సైన్యంలో దించుచున్నారు. ఓ, మై! రాజకీయ యుద్ధం. రాజకీయము అంత్యదశకు చేరినది. నియంతలు తప్పు చేస్తున్నారు. రాజకీయము తప్పుగా తయారయనది. దేవుడు వారికిచ్చిన దావీదు వంటి దైవిక రాజుతో ఎందుకు ఉండలేకపోయిరి? ఇంగ్లాండు యొక్క గొప్ప ప్రభువు ఈ ప్రజాస్వామ్యము రూపొందినప్పుడు, ఈ విధంగా పలికెను, “ఇప్పుడిది బాగానే ఉంది, కాని ఒక సమయం వచ్చును. అప్పుడిది కనపడదు. దిక్కు తోచకుండా పయనించును.” ఆయన చెప్పింది నిజమే. “రాజకీయ నాయకులు ప్రతి మూలలోను సబ్బు పెట్టెలపై నిలబడుదురు. ప్రభుత్వమును చేరిపివేయు సమస్త హేయ కార్యములను చేయుదురు,” అని ఆయన చెప్పెను. అది నిజమే. అదే ఇప్పుడూ జరుగుచున్నది.

96

ఒకడు అటు వెళ్ళి త్రాగుచున్నాడు, అటు వెళ్ళి త్రాగుచున్నాడు, ఇష్టము వచ్చినట్లు దేనినైనా చీల్చుచున్నాడు; అతనికి అందరూ తెలుసు గనుక ఎవరూ ఏమీ అనరు. కాని ఒక పేదవాడు లేదా ఎవరికి తెలియని వ్యక్తి అలా చేసినచో, వెంటనే జైలుకు పంపించుదురు. చెడు, దిగజారిన స్థితి, మురికి, నలభై శాతం మంది పురుష సంయోగులు. ఆలోంచించు, మరో సొదొము, గొమొర్రా ఇది! బక్తిగా నుండవలసిన గుంపు అది.

97

తరువాత అధ్యక్షుడు వచ్చినప్పుడు ఏమి జరుగునో నాకు ఆశ్చర్యం కలుగుచున్నది. దేవుడు భక్తిగల మంచివానిని మనకిచ్చాడు. ఆయనే డ్వయిట్ ఐసెన్ హూవర్, తరువాత వచ్చే వారెవరో గమనించండి! వచ్చేసారి ఖచ్చితంగా ఒక ఎలుక రావచ్చు, యోసేపును ఎరుగని ఫరో ఒకడు వచ్చాడు. అది జ్ఞాపకముంచుకొనండి. రాజకీయం చెడిపోయింది. మనకు అది తెలుసు.

యుద్ధం అంతమునకు చేరింది. ఓ, ఒక సమయంలో ఒకరిపై ఒకరు రాళ్ళు విసరుకొని పోరాడేవారు. తరువాత రాతీ గొడ్డళ్ళతో తలలపై కొట్టుకొనేవారు. ఆ తరువాత విల్లులు, బాణములు, తరువాత తుపాకులు, తరువాత మర తుపాకులు, జర్మనీలో ఎనభై ఎనిమిదులు, ఆ తరువాత పెద్ద తుపాకులు, చేతి గ్రెనేడులు, విష-వాయువులు. కాని ఇప్పుడు హైడ్రోజను బాంబు మనకున్నది. యుద్దము చివరకు చేరినది. ఆన్ని దేశాలకు అవి ఉన్నవి, కావున ఇప్పుడు నీవేమి చేయబోవుచున్నావు? చిన్న దేశము అయినను, ఒక ట్రిగ్గర్ నొక్కితే చాలు, అది మాత్రము చాలు, అంతయు ఎగిరిపోవును. యుద్ధం చివరకు చేరింది. ఆమేన్. రాజకీయము, యుద్దము చివరకు వచ్చేసినవి.

98

విద్య చివరకు వచ్చినది. బాల్య చెడుతనం చివరకు వచ్చేసింది. పిల్లలలో ఇక ఏ ఆశ కూడా లేదు. వారు మతిపోయిన వారయిరి. నీకు విద్య దొరకదు. పిల్లవాడిని బడికి పంపలేరు, బడిలో చేరినప్పటికంటే రెండింతలు చెడ్డవాడుగా వాడు బయటకు వచ్చును. ఉపాధ్యాయులు, పిల్లలను ఏమన్నా అన్నచో అందరూ ఏకమై చంపుచున్నారు. రెండువేల మంది ఉపాధ్యాయులను మనము పోగొట్టుకొన్నాం. గత సంవత్సరం ఇరవై వేలమంది ఉపాధ్యాయులు కాల్చి చంపబడిరి. ఓ, నేను వారిని నిందించను. ఎపుడు కూడా మనకు పిల్లలకు కళాశాల - విద్య చెప్పించమను వ్రాతలు కనపడుచుండెడివి. వారికది అవసరమే, కాని దయ్యము వారిని తస్కరించినది. రైలు బండిని రోడ్డు పైకి లాక్కొని వెళ్ళే చిన్న చిన్న పిల్ల చేష్ణలు ఇప్పుడు పోయినవి. పిల్లలు ఇప్పుడు పిచ్చివారయిపోయారు, పిచ్చి పనులు వారు చేస్తున్నారు. కాల్చి చంపుచున్నారు. హత్యలు చేస్తున్నారు. విషమిచ్చుచున్నారు. అదే రాబోయే తరము.

99

పిల్లలను కనుటకు కూడా అంతము వచ్చినది, స్త్రీత్వము, మాతృత్వము మట్టికలసిపోతున్నవి. అన్ని చోట్ల కుటుంబ నియంత్రణ అమలులో ఉన్నది.

అసలు నీతి అనేది ఇక లేదు. స్త్రీలు చెడ్డ వస్త్రధారణ, టెలివిజను ద్వారా హాలీవుడ్ లోని పోకడలన్నీ, చెడులన్నీ అనుకరణ చేయబడుచున్నవి. అంతా ముగింపుకు వచ్చినది!

చదువు ముగింపుకు చేరింది, రాజకీయము, యుద్దము, అంతమును వచ్చినవి, నాగరికత చివరి స్థాయికొచ్చినది. అన్నీ సమాప్తమవుటకు సిద్ధమగుచున్నవి. మై, అప్పుడు మనం ఏం చేయగలం? తరువాత ఏమిటి? అన్నీంటికి అంతములో మనమున్నాము.

100

ఇప్పుడు, సంఘ జీవితము కూడా చివరకు వచ్చినది. మామూలు సంఘము, శారీరక సంఘము. అదే ఏశావు సంఘము. చివరకు వచ్చినది. అదేం చేస్తున్నది? సంఘముల సమాఖ్యగా రూపొందుచున్నది. చివరగా అది కాతలిజంతో కలిసి కమ్యూనిజంతో పోరాడును, సంఘములన్నిటినీ వెనుకకు రమ్మని పోప్ జాన్ పిలుపునిచ్చాను — అవి వచ్చును. అవన్నియు కలిసి ఏకమగునని, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.”

“ఒక్క నిమిషము ఆగు, సహోదరుడా బ్రెన్హాం, నీవు దారి తొలగుచున్నావని,” అంటారేమో. నేను కాదు గాని దేవుడు బైబిల్లును ఆ విధంగానే వ్రాసెను. ఈ విషయంలో నీవు మీకాయాగా నుండవలెను.

101

మోరిస్ సెరిల్లో ఒక రాత్రి నాతో చెప్పాడు, చెప్పెను, “క్రీస్తు విరోధి ఎవరు, సహోదరుడా బ్రెన్హాం, యూదులే అంత్యక్రీస్తు.”

“మోరిస్! నీవూ యూదుడవగు నీవు ఆ మాట చెప్పుచున్నావా?” అన్నాను.

“వారు గొప్ప దేవదూషకులు,” అన్నాడు.

“మోరిస్, కాదు... యెరూషలేములో నుండి అంత్యక్రీస్తు వచ్చునని ఎక్కడున్నదో వాక్యములో చూపించు. అంత్యక్రీస్తు పాలస్తీనా నుండి కాదు, రోమ్ లో నుండి వచ్చును,” అన్నాను.

“సరే, వారు దేవద్వేషకులు,” అని అన్నాడు.

“అవును, మనము చూడకలుగునట్లుగా దేవుడు వారికి గ్రుడ్డితనము కలుగజేసెనని చెప్పబడలేదా? కాని మన దినములు కూడా త్వరలోనే గతించిపోవును.”

“ఓ, బ్రెన్హాం సోదరుడా, నేనెన్నడూ ఆ విధంగా భావించుట లేదు,” అని అన్నాడాయన. చూచారా, అక్కడే మీరున్నారు.

102

మనం అంతములో నున్నాం, చూచారా. శరీరసంబంధమగు లోకము, శరీరసంబంధమగు సంఘము చివరి దశలోనున్నది సంఘ సమాఖ్యలో అదెట్లు విజృంభించుచున్నదో చూడండి. సహోదర సంఘము అందులోనికి వెళ్ళినది. పెంతెకోస్తు వారు అందులోనికి వెళ్ళారు. తక్కిన సంస్థలన్నియూ అందులో చేరినవి నీవు ఆ కనానీయులలో నున్నావు, ఏశావు ఆత్మ అన్ని సమయములలోను వస్తూనేయున్నది. చాలా భక్తి, గాని లోకములో చాలా పొత్తు కూడా ఉన్నది - ఆత్మీయ అవగాహన లేదు, జయించు శక్తి లేదు, బయటకు వచ్చి వేరగుటకు దేవునిచే అది ఎన్నుకొనబడలేదు.

ఓ, నేను దానిని గూర్చి తెలియపరచినచో, ఏదో ప్రక్కకు దానిని నేను త్రోసివేయబడుదును! వారు దానిని చూడరు. వారు కండ్లుండియు చూడరు, చెవులుండియు వినరు. ఓ, మనమెందుకు ఆత్మలో ఇంతగా చల్లారిపోయాం? ఇప్పుడు, దీనిని వినండి, అంతయూ అ౦తమునకు చేరినది.

103

ఆత్మీయ సంఘము కూడా చివరి దశలో ఉన్నది. అది కూడా కడకు చేరుచున్నది. ఓ దేవా! లూథర్ తో అక్కడ అది బయలుదేరినది, కాని ఆత్మీయతను అక్కడే విదిలించివేసినది. ఆ తరువాత వెస్లీ శుద్దీకరణతో వచ్చినది. ఆ తరువాత పెంతెకోస్తు పరిశుద్ధాత్మచే వచ్చినది. ఇప్పుడు అంత్యకాలములో క్రీస్తు యొక్క ఆత్మ సంఘములో ఎంతగా ఉన్నదంటే, అది ఆయన చేసిన కార్యములనే చేయుచున్నది, తిరిగి ఆ శిరస్సును చేరుతున్నది. క్రీస్తు ఆయన సంఘము ఏకమై క్రీస్తు ప్రభుని రాకడ, మృతుల పునరుత్థానము సిద్దముగానున్నది. మనం అంత్యఘడియలో నున్నాము. “సొదొమ దినములలో ఎట్లుండెనో మనుష్యకుమారుని రాకడలోను ఆలాగే యుండునని,” యేసు చెప్పెను. అది నీకు అర్ధమగుచున్నదా?

104

శరీర సంబంధమగు సంఘమును చూడు. వారు ఒహు దూరంగా వెళ్ళిపోవుచున్నారు.

ఆత్మ నింపుదల కలిగిన సంఘమును చూడు. చిన్న చిన్న వాటినన్నిటిని అది వదిలించుకొని, ఆత్మతో వచ్చుచున్నది. అది చిన్నదే కావచ్చు. ఆత్మతో వచ్చి, ఆత్మ సంచారమును కనపరచు చోటికి వచ్చుచున్నది. ఆ మార్గములో పని చేయుచూ, తన ప్రభువును చేర్చుకొనుటకు సిద్ధపడుచున్నది.

తక్కిన వారందరూ సంస్థగా మారిరి. తిరిగి లోకములోనికి పోయిరి, విభజించబడిరి. సమాఖ్యలోనికి పోయిరి. కాలిజము శిరస్సు క్రింద ఒక గొప్ప రాజీ కుదురుచున్నది. “మృగము రూపము గల విగ్రహము తయారవుచున్నది.” విగ్రహము వంటిది. కాతలిజముచే సంఘ ఐక్యత రూపొందించబడుచున్నది. వారిద్దరూ కలిసి పని చేయుచున్నారు. “విగ్రహము యొక్క రూపముగల మృగముతో పోరాడుటకు సమర్దుడెవరు?” నిశ్చయముగా కాదు. ఎన్నిగంటలయినా దీన్ని గూర్చి మనం చెప్పుకోవచ్చును.

105

ఇప్పుడు నేను మీకు చెప్పనివ్వండి, మరియు తరువాత ముగింతును. ఇది ఎక్కువ సమయము తిసుకోనును అని చెప్పాను. దేవుడు వీటన్నింటిని చెప్పమని నాతో అనెను, “ఏ మాత్రం ఊరుకోక వారికి చూపించమని చెప్పెను. వారికి చూపించు! వారు దానిని చేర్చుకొనినచో, నీ చేతులపై రక్తముండదు.” ఘడియ ఇదే, అంతా సిద్దమగుచున్నది.

లోకము చివరి స్థితిలో యున్నది. ఇక అది ఏ మాత్రము నిలువజాలదు. యుద్ధములు అంతములో నున్నవి. ఇక ఏ యుద్ధమూ ఉండదు. ఒక్కసారి యుద్ధం జరిగితే అంతా నాశనమే. రాజకీయము పూర్తిగా కలుషితం అయిపోయింది.

106

సంఘ ప్రపంచము అనగా మెతడిస్థు, బాప్టిస్టు, ప్రేస్బిటరియను పెంటేకోస్తు, అదే పంది మురికి వైపునకు, కుక్క వా౦తికి తిరుగుట. అది నిజం, అందులో ప్రతివారు! ఆ చెడులో నుండి ఎన్నుకోబడిన సంఘమును దేవుడు పిలచుచున్నాడు. “ఏశావు, మేమే సంఘం” అన్నాడు. అందులో సందేహం లేదు. ఇస్సాకు ఏశావు తండ్రి యాకోబు అతని సోదరుడు, అతనితో నున్నాడు. ఒకడయితే జన్మహక్కును పొందగోరెను; మరొకడు ద్వేషి౦చెను. ఒకడు విని, గుర్తించి, పనిచేసెను; ఇంకొకడు, “నేను ఆలయానికి వెళ్ళినచో, మంచి చేసినచో చాలు అనుకొనెను.” నీవక్కడే ఉన్నావు.

107

చివరగా ఇంకో సంగతి, నిజమైన సంఘము జీవించుటకు ఇప్పుడెంతో యున్నది. నిజ సంఘము, యధార్ధ సంఘము, ఏర్పాటుకాబడిన సంఘమునకిది ఎటువంటి సంతోష సమయము? మరణములో నుండి జీవములోనికి, దాటితిని. హృదయములో నీవు తెలిసికొనవలెను. నీ వైపు నీవు చూచుకొని, నీ జీవితమును పరీక్షించుకొని, లోకసంగతులన్నియూ నీలో నుండి పోవునట్లుగా నీ జీవితమే రుజువు చేయును. వారి ఫలముల వలన వారిని తెలిసికొందురు. నీ గురి యావత్తు క్రీస్తే? ఏ క్షణంలోనైనా ఆయన రావచ్చునని నీవు ఆయన కొరకు చూచెదవు. నీవు ఆత్మలో నడిచి ఆయనను ప్రేమించుదువు. నీ ద్వారా ఆయన పనిచేయుట చూతువు. చేయాలని నీవు కోరుట బట్టి కాదు, కాని ఆయనంతట ఆయనే పనిచేయును. ఓ, ఎలాంటి సమయం.

108

ఒక యవ్వనుడు కళాకారునిగా కళ నేర్చుకొనుటకు రోమ్ వెళ్ళిన వృతాంతం జ్ఞాపకము వచ్చుచున్నది. వారతని గుర్తించారు, ఇతర అమెరికను బాలబాలికల కంటే అతడు వ్యత్యాసంగా కనిపించాడు. అక్కడ కళాకారులుగా నుండుటకు వెళ్ళిన వారికి, తక్కిన ప్రపంచములో నున్న వారందరికి బిన్నంగా అతడుండెను. ఈ ఒక్క యవ్వనుడు సాటిలేని వానిగా నుండెను. చాలా చక్కనివాడు. వారు గమనించిరి. ఆ రోమ్ లోని వారు తెగత్రాగుచుందురు.

నేను కూడా వెళ్ళి, స్వయంగా చూచాను. స్త్రీ పురుషులు వీధుల్లోనికి వచ్చుదురు. పార్కులలో, బహిరంగ స్థలములలో అసభ్యముగా ప్రవర్తించుదురు. ఎవరిని పట్టించుకొనరు. ఇ౦గ్లాండులోను అంతే. ఇక్కడ కూడా తక్కువేమీలేము, అంతా ఒక్కలాగే చెడిపోయింది. ఆ పోలీసులు తదితర విషయములు చెప్పినచో భయంకరము!

109

సరే, ఈ యవ్వనుడు వాటన్నింటికీ దూరంగా ఉన్నాడు. వారు విందులకు వెళ్ళుచుండగా, ఇతడు వారిని పోనిచ్చి కళను నేర్చుకొనుచుండెడివాడు. ఆ కళా ప్రదర్శనశాలను కాపలా కాయు ఒక ముసలి క్రైస్తవుడు ఒక రోజున వచ్చి, “నీతో నేను మాట్లాడాలి, అలా షికారుకు వెళదాం రా, కుమారుడా!” అని పిలిచాడు.

అతడు “సరే” నన్నాడు.

కావున వారు వెళ్ళారు. ఇద్దరూ వెనక్కు చేతులు పెట్టికొని ఒక కొండపై నడచుచున్నారు, సూర్యుడస్తమించుచున్నాడు. ఆ వృద్ధుడు ఈ యువ కళాకారునితో, “కుమారుడా! నీవు అమెరికనువు కదా?” అని అడిగాడు.

అతడు అన్నాడు, “అవును.”

“నీ విక్కడకు నీ కళా విద్యను నేచ్చుకొనుటకు వచ్చావు. నీ జీవితములో కళాకారుడుగా రూపొందవలెనని గురి నీకున్నది కదా?” అన్నాడు.

“అవునండీ, ఆ ఉద్దేశ్యంతోనే ఉన్నాను,” అన్నాడు.

“నీవు క్రైస్తవుడవని నేను గుర్తించాను” అన్నాడు ముసలివాడు.

“నేను క్రైస్తవుడను” అని చెప్పాడు యువకుడు.

“సరే, ఒక విషయం నేను అడుగగోరుచున్నాను. ఇతరులను నేను అడిగాను, వారు కూడా క్రైస్తవులమని చెప్పారు. అయితే ఇంతగా నిన్ను వేరుపరచింది ఏమిటి? అమెరికా నుండి వచ్చిన తక్కిన బాలబాలికలకు నీకు ఈ తేడా ఎందువలన వచ్చినది? అందరూ క్రైస్తవులమనే చెప్పుకొనుచున్నారు గదా?” అని ప్రశ్నించాడు.

అందుకతడు,“అయ్యా! ప్రొద్దు ఏ విధంగా గ్రుంకుచున్నదో చూశారు కదా!” అన్నాడు.

“అవును, చూస్తున్నాను,” అన్నాడు వృద్ధుడు.

“ఆ సముద్రమునకు అవతల ఇంగ్లాండు దేశముంది. ఆ దేశంలోని ఒక రాష్ట్రంలో ఉన్న ఒక పట్టణలో ఒక బాలిక జీవిస్తున్నది. నేను యదార్ధముగా జీవించేదనని చెప్పి ఆమెకు వాగ్దానం చేశాను. నా మనస్సులో ఉన్నదంతా నేను పని నేర్చుకొని నన్ను నిజంగా ప్రేమించుచున్న ఆమె వద్దకు వెళ్ళాలనియే. అందుకే నేనేమి చేసినా గాని ఈ విధంగా జీవించుచున్నానని,” అతడు చెప్పెను.

ఓ సోదరీ, సోదరుడా, వారేమని పిలిచినా గాని మేము లెక్కచేయకపోవుటకు కారణమదియే. వారేమన్నా నేను లెక్క చేయను.

110

ఒక రోజున నేను ఫ్రెడ్ తో ప్యూరిటోరికాలోని సాన్-జాన్ లో సముద్రమును పరిశీలించుచూ నిలబడియున్నాను. ఆ గుల్లలను పరీక్షించుచున్నాము. ఒక అరమైలు దూరంలో పెద్ద అలలు ఉవ్వెత్తున లేస్తున్నవి. ఫ్లెమింగోలు ఆ తోటలో నడుస్తు, “సహోదరుడా బ్రెన్హాం, నిజంగా అది పరలోకములా ఉందని,” అతడు చెప్పాడు.

“కాని సోదరుడా, అవతల ఒడ్డున సముద్రం చాలా నిమ్మళంగా నుండునని చెప్పాను. ఆ సముద్రమునకు అవతల పరలోకమను స్థలమున్నది. ఆ ప్రత్యేక స్థలములో యేసు అను ఒకాయన ఉన్నాడు. ఒక రోజున ఆయన నా పాములన్నింటిని తొలగించెను. ఆయన నన్ను కోరిన పతి విషయము పట్లను నేను యధార్ధంగ జీవించుదునని వాగ్దానం చేశాను. అందుకే ఆయన సువార్తను గూర్చి నేను సిగ్గుపడుట లేదు. రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తియైయున్నది. అందుకే క్రైస్తవుడు వేరుగా జీవించును, ఎందుకనగా అతడు వేరుగా జీవించవలసినది ఏదో ఒకటి యున్నది.”

111

ఒక్క క్షణం తలలు వంచుదం.

నా విచారముతోనున్న స్నేహితుడా, ఈ ఉదయాన ఏదో వేరుగా జీవించవలసినది నీకున్నది. ఈ లోకము నుండి వెలుపలకు తెచ్చునది ఏదో యున్నది. క్రీస్తు కొరకు జీవించుటయే అన్నింటికన్న అర్థవంతమైనది కాదా? ఇంకా నీకది లేనిచో ఎందుకు నీవు పొందవు? నేను మంచి వానిగా ఉండగోరుచున్నానని చెప్పి సంఘమునాకు వెళితే చాలదు. నీవు క్రైస్తవుడవు కాగోరుచున్నావు. నీవు సరిగా లేవని నీ హృదయంలో ఏదైనా చెప్పుచున్న చో, మంచిగా ఉండాలను ఆకాంక్ష నీకున్నచో, దేవుడు నిన్ను పిలచుచున్నాడని ఎరుగవా? నీవు వెనుతిరిగి పోకుము. వెలిగించబడు అవకాశమును ఒకసారి నీవు త్రోసివేసినచో, అదే చివర కావచ్చు. ఇక నీ కొరకు పాప ప్రయశ్చిత్తముండదు.

ఏశావుతో నీవు చేరవద్దు. నీవేమి చెల్లించవలసి వచ్చినా గాని, లక్ష్యపెట్టక యాకోబుతోనే రమ్ము. నీ ఇల్లు, నీ పని, నీ భార్య, నీ పిల్లలు, లేదా ఇంకేదైనా వెల చెల్లించవలసి వచ్చినా గాని జన్మహక్కును పొందుము. అదే ముఖ్యము. ఈ ఉదయాన నీవది పొందవలెనను వాంఛయున్నచో, నేనది ఇవ్వలేను గాని దేవుడిచ్చును. ఆయనే నీతో మాట్లాడును. “నాకు జన్మహక్కు కావలెను బ్రెన్హాం సోదరుడా, నా కొరకు ప్రార్ధించు,” అని చెప్పుము. దేవుడు నిన్ను దీవించును గాక. “ఆ జన్మహక్కు నాకు కావాలి.”

112

మా పరమతండ్రీ, నీకు వందనములు చెల్లించుచున్నాను. గొప్ప దేవా, మహా పరిశుద్ధుడవగు దేవా, మానవ కుమారులు, కుమారైల పట్ల నీ కృపా మంచితనము బహు గొప్పది. ఏదీ ఇక ఎంతో కాలం కొనసాగదు. ఇది అంత్యకాలము అని తెలిసికొన్నాం. అరువు పుచ్చుకొన్న సమయంలో మేమున్నాం. నోవహు దినములలో ఓడ సిద్దపరచబడుచుండగా, దేవుని దీర్ఘశాంతముండినది, అప్పుడు ఎనిమిది ఆత్మలు రక్షించబడినవి. మనుష్యుకుమారుని రాకడను ఆలాగే యుండునని నీవు చెప్పితివి. ఎవరూ నశింపక, అందరూ మారుమనస్సు పొందవలెనని దీర్ఘశాంతము చూపించుచున్నావు.

ఈ దినమున ఈ స్థలంలో చేతులెత్తిన స్త్రీ - పురుషులు, యువతీ - యువకులు, వృద్ధులు ఉన్నారు. ఎదో మాలో పోరాటమున్నదని వారు చెప్పుచున్నారు. ఓ దేవా, వారెన్నడూ దానిని త్రోసివేయకుందురు గాక. వారు తమకున్న విద్య, లేదా ప్రతి దానిని అమ్ముకొందురు గాక. ఆ గొప్ప ముత్యమును కనుగొనిన వ్యక్తివలే. అది గొప్ప ముత్యము. లోకములో తమకు కలిగియున్న ప్రతిదానిని వారు అమ్మి, ఈ ముత్యమును కొనుక్కుందురు గాక. ఈ ఉదయాన తమ కీర్తిని అమ్ముకొందురు గాక.

113

ప్రభువా, ఇక్కడ కూర్చొనిన చాలామంది స్త్రీల అనేకసార్లు బోధించబడిన సువార్తను వినిరి, అయినా లోకపు పోకడను అనుసరించుచున్నాను. వారి బట్టలు, విందులు, ఇంకా నానా లోకసంబంధములు కనపడుచున్నవి. ఓ దేవా, ఈ దినమున వారు సిగ్గునొందుదురు గాక. ఓ, ప్రభువా, వారికేమైనా నిరీక్షణయున్నచో ఈనాడే, ఈ ఘడియలోనే వారిని దానివైపు త్రిప్పుము.

ప్రభువా, ఇక్కడున్న పురుషులపై నీ కృప నుంచుము. వారిలో అనేకులు ఇంకా లోకవిషయములలో నడచుచున్నారు. ఇంకా లోక కోరికలను అనుభవించుచున్నారు. త్రాగుడు, శరీరాశలు, పొగ పీల్చుట, బీరు, అసభ్య వస్త్రధారణ కలిగిన స్త్రీలతో సాంగత్యము చేస్తున్నారు. ఈ యవ్వన స్త్రీల శరీరములు వీధిలో కనబడుచున్నవి. క్రైస్తవులని పిలచుకొనుచున్న వీరిని ప్రజలు చూస్తున్నారు. ఇరవై-నాలుగు గంటలలో క్రుళ్ళిపోపు శరీరము; దానిని పురుగులు తిని వేయును, వారిలోని ఆత్మ దయ్యము పాతాళము చేరును, అది వారి జీవన విధానము. ఇంకనూ వారు పెదవులకు రంగు వేసికొని, నీ వైపు చూచి నవ్వుతున్నారు.

114

దేవా, ఈ జనులను కరుణించుము. వారిని నశించిపోనీయకుము. కృపను పంపించుము, ప్రభువా! ప్రతి ఒక్కరికి ఇమ్ము. నీవు మాత్రమే ఆశీర్వదనమును ఇవ్వగలవాడవు. నిత్యజీవమునకు నీవు వారిని పిలచినచో, వారి హృదయములు తెరువబడును. వారీ ఉదయమున సమస్తమును విడిచిపెట్టి, దానిని చేర్చుకొందురు. తండ్రీ, అనుగ్రహించుము

ఇప్పుడు ఈ కూటములోనున్న రోగులు బాధపడుతున్న వారిపైకి పరిశుద్ధాత్మ దిగి వచ్చును గాక. ఈ ఉదయాన అందించబడిన వర్తమానమును బట్టి రాకడ సమస్తము సమీపములో నున్నట్లుగాను, యేసు తన సంఘములో పనిచేయుటను చూచెదరు గాక. దేవా, నీ హస్తములలోనికి వీరిని తీసికొని ఇపుడే అది జరుగనిమ్ము. పరిశుద్ధాత్మ పనిచేయుచూ, జనులమధ్య సంచరించుట వారు చూచినప్పుడు, నేను ప్రకటించిన సువార్త స్థిరపరచబడి, అంత్యకాలంలో నున్నామని గ్రహించుదురు గాక. వారు విందురు గాక. వారు వినిరి. ఆ దినమునుండిన ఆ యేసే ఈ అంత్యదినమున తన సంఘము ద్వారా పని చేయనున్నట్లు గుర్తించుదురు గాక. అపుడు వారు తమ జీవితములను, దేహములను, ఆత్మలను, ప్రాణములను నీకిచ్చి పనిచేయుదురు గాక! యేసు నామమున వారిని నీకిచ్చుచున్నాను.

115

జనం ఉన్న ఈ స్థలంలో ప్రార్ధనా కార్డులిమ్మని బిల్లీని ఈ ఉదయాన పంపించాను. [టేపు పై ఖాళీ యున్నది.]

మీరు వ్యాధితో అవసరతలో నున్నారా? బావినొద్దనున్న స్త్రీకి తెలియచేసినట్లుగా, మీ వ్యాధిని, మీ గూర్చి దేవుడు నాకు తెలియచేసినయెడల, దేవుని నమ్ము విశ్వాసము మీకు వచ్చునా? మీరెవరో నాకు తెలియదు, మీరెరుగుదురు కదా? తక్కిన వారందరికి విశ్వాసము కలుగునా? మనమిదే మొదటిసారి కలిసికొనుటయా? సరే, నీవు నన్ను ముందు చూచావు, కాని నీకు నేను క్రొత్తవాడిని కదా? అది నిజమేనా? మంచిది, ప్రభువు నీ మనవిని అనుగ్రహించును గాక.

116

అది వాస్తవమా, కాదా? ఓ, మై! నీ తెలివిగల మతమును పిలువుము! ఆతడెక్కడున్నాడని “బిలాము” అడిగెను. ఏలీయా కర్మేలు కొండపై మీ బయలును నిద్ర లేపండి అని చెప్పెను. యేసును మీరు లేపనవసరంలేదు. ఆయనెప్పుడూ మేళకువగా యుండును. ఆయనెల్లపుడూ సిద్దముగా నుండును, ఎప్పుడూ సజీవుడే, ఎప్పుడూ శక్తిగలవాడే. నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగానున్నవాడు. ఆమేన్. దేవుడు దేవుడే.

నీ గుండె జబ్బు పోయి నీవు బాగుపడేదవని నమ్ముచున్నావా? నీవిక్కడ నుండి రాలేదు. నీవు లెక్సింగ్టన్ వెళ్ళి, ప్రభువు నీకు చేసిన గొప్ప కార్యముల గూర్చి చెప్పుము.

117

అది జనుల తలలపై నుండి వెళ్ళిపోవును, ఎన్నడూ దానిని గ్రహించరు. సజీవ సంఘము వెంటనే గ్రహించును, పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడున్నదని తెలిసికొనండి.

ఎవరో వెనుక చేతినెత్తిరి. అమ్మా, నీవేనా? నీ వ్యాధిని గూర్చి దేవుడు నాకు చెప్పునని నమ్మగలవా?

కొద్ది సేపటి క్రిందట ఆ చివర నున్న సోదరుడు చెప్పెనని నేను నమ్ముచున్నాను. సోదరుడా! నీవు నమ్ముదువా? నీ చర్మ వ్యాధి నిన్ను విడిచిపోవును. నీవు బాగవుదువు. నమ్మగలవా? స్వస్థపడినట్లుగా నమ్మగలవా? అంగీకరించినచో, నీ చేతిని పైకెత్తుము. నాకీయన క్రొత్త వ్యక్తి, నీకది తెలుసు, పాట్.

118

ఒక స్త్రీ ప్రార్ధించుచూ నావైపు చూస్తున్నది. ఆమె క్రొత్త వ్యక్తి, నీకున్న గొప్ప రక్తపోటు నిన్ను విడిచిపెట్టెనని నమ్మగలవా? అది నిజమా కాదు? అది నిజమైతే చేతినెత్తుము. దేవునియందు నమ్మిక యుంచుము.

నా భావమును మీరు చూచారా?

నన్నెరిగిన కొందరు మాటేమిటి? నీ గుండెలో ఏదో యున్నది. నీ చేతిని పైకెత్తుము. చూడండి! చాలామంది. నేనేమీ చేయలేను. అది మీ విశ్వాసము ద్వారా రావలసియున్నది.

జార్జీ బ్రూస్, ఆమె అక్కడ కూర్చోని యున్నది, నీ వేప్పుడు ఎవరికొరకో వచ్చుచుందువు. నీవు కాన్సరు నుండి స్వస్థత పొందితివి. నీ మనస్సులో ఏ ప్రశ్న లేదు. ఒక రోజున నీవు ఈ ఆలయానికి వచ్చి, ఆవతలి తలుపు గుండా నడచి వెళ్ళినప్పుడు, పరిశుద్ధాత్మ నాపై దిగివచ్చి ఈ లోకంలో ఎవరికి తెలియని కార్యమును గూర్చి దేవుడు నాకు చెప్పెను కదా? ఆ విషయయు నీకు ఇంకో వ్యక్తికి దేవునికి మాత్రమే తెలుసు. అవునా? జారీ! నీవు నన్ను నమ్ముచున్నావా? వీ హృదయంలో ఏమున్నదో దేవుడు తెలియ చేయునని నమ్మగలవా?

మిగిలిన మీకు కూడా దానివలన విశ్వాసము కలుగును కదా?

119

జార్జీ దేనిగూర్చియో ఆలోచించుచున్నదని నాకు తెలుసు. దూరంగా ఇద్దరి కొరకు ఆమె ప్రార్థించుచున్నది. వారిద్దరూ కొరిడన్ లో ఉన్నరు. ఈ ఆస్పత్రిలో నున్న ఇంకో వ్యక్తి కొరకు ఆమె ప్రార్ధించుచున్నది, నీవతని స్వస్థత కొరకు అంతగా ప్రార్ధించుట లేదు గాని, అతని ఆత్మ రక్షణ కొరకు ప్రార్థించుచున్నావు. “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,” అది నిజమేనా జార్జీ? అక్షరాలా నిజం.

ఆ వెనుక ఎవరో చేతినెత్తిరి. ఏమిటి నీ సంగతి? నీవు నాకు కొత్తవాడవు కదా? ఇక్కడ కూర్చొనియున్న ఈయన నా వైపు చూస్తున్నాడు. నిన్ను నేనెరుగను. నేను దేవుని దాసుడనని నమ్ముతున్నావా? పరిశుద్ధాత్మను, నేను చెప్పినది నిజమనియు నమ్ముచున్నవా నమ్మినచో, వెళ్ళి అడుగుము. నీవు కాన్సరుతో బాధపడుతున్నావు. నీవు ఈ పట్టణం నుండి రాలేదు. నీవు న్యూ-ఆల్బనీ నుండి వచ్చావు, అది నిజం నీవు పూర్ణహృదయంతో నమ్మినచో, నీ కాన్సరు నుండి బాగవుదువు. దానిని అంగీకరించెదవా? నీ చేతినెత్తుము. ప్రభువు దీవించును గాక!

120

తలపై తెల్ల టోపీ ధరించిన నల్ల స్త్రీ చేతిని పైకెత్తియున్నది. ఇంకా ఒక్క నల్ల వ్యక్తిని కూడా నేను పిలువలేదు. నీవు నమ్ముచున్నావా? అయితే నీ పూర్ణహృదయముతో నమ్ముము. నీకు గుండె జబ్బు, ఉదర వ్యాధి. ఇంకా కొన్ని వ్యాధులున్నవి. ఎవరో నిన్ను ఈ ఉదయాన ఇక్కడకు తీసికొని వచ్చిరి. “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.” అది నిజము, కాదా? అయితే నీ చేతిలోనున్న రుమాలును ఊపుము. అందరూ చూచెదరు. నా జీవితంలో ఈ స్త్రీని ఎన్నడూ చూడలేదు.

నీ చేతిని పైకెత్తుము. నీకు నేను క్రొత్త వ్యక్తిని కదా! నీవు నాకు క్రొత్త వ్యక్తివి. దేవుడు నిన్నెరుగునని నమ్ముదువా? నీ హృదయములో ఉన్న దానిని ఆయన నాకు తెలియచేయునని నమ్ముదువా? నీ వెవరి కొరకో ప్రార్ధించుచున్నావు. నీ తండ్రికి గుండె వ్యాధి ఉన్నది. నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకు కనిపెట్టుచున్నావు. “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.”

నమ్ముట నీవలనైతే!

చేతిని ఈ విధంగా పట్టుకొనియున్న ఆ యువతి సంగతేమిటి? నీవు నమ్ముచున్నావా? నీ చేతిపై పుండ్లున్నవి, నీవు మనుమని కోసము ప్రార్థించుచున్నావు. ఆ కుర్రాడు మామూలుగా లేడు. నిజమేనా? దాని కొరకు నీ పూర్ణహృదయంతో నీవు నమ్ముదువా? నీ కుమారుడు అని చెప్పాను కదా? ఒక్క క్షణం ఆగు! నీ కొడుకు, కారు ప్రమాదంలో కుంటివాడయ్యాడు. నిన్ను నేనెరుగను, కాని అది నిజం. అవునన్నచో, నీ చేతిని పైకెత్తు.

121

ఇక్కడెవరు? ఎవరది? నేను కాను. నేనేమి చేయలేను. ఆత్మీయ విషయములను గూర్చి వెనుకాడవద్దు. ఇక్కడ దేవుడున్నాడు. నీకు పరిశుద్ధాత్మ అవసరమయితే, ఇప్పుడే ఆయనను నమ్ముదువా? దానిని పొందుటకు ఇదే సమయము. నీ పూర్ణహృదయంతో నమ్ముము.

జబ్బుగా లేక అవసరతలోనున్నావా? నేను బాగుచేయలేను. ఏ మానవుడు బాగుచేయజాలడు. నేను పరిశుద్ధాత్మను ఇవ్వలేను. కాని స్వస్థతను, పరిశుద్ధాత్మను ఇచ్చు ఒకాయన ఉన్నాడు. ఆయనక్కడే యున్నాడు! ఇది చేసేవాడు ఆయనే.

122

ఇప్పుడు మీ తలలు వంచండి. మీ కొరకు, ఈ చేతిగుడ్డల కొరకు ప్రార్థించుదును.

మా పరమ తండ్రీ, నాకు తెలిసినంతవరకు కొత్తవారి యొద్దకు వెళ్ళాను. నేను బలహీనుడనై అలసిపోయాను. ఎన్నుకొనబడిన వారు చూచే సమయం ఇదే అనుకొన్నాను. నీ ఆత్మ ద్వారా పిలువబడినవారందరూ వారనుకొన్న దాని కంటే ఎక్కువ విశ్వాసమును కలిగియున్నారు. కొందరు తమ హృదయములలో ఇపుడే ప్రారంభించారు.

ఒకప్పుడు ఆయన వెళ్ళుచుండగా, ఒక స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టినది. “నన్నెవరు తాకిరి?” అని ఆయనడిగెను.

“అందరూ నీపై పడుచున్నారు కదా?” అని వారనిరి.

“కాని ప్రభావము నాలో నుండి పోయి బలహీనుడనయ్యానని ఆయన పలికెను.” ఆ స్త్రీ యొక్క రక్తస్రావము ఆగెను. ఆమె విశ్వాసము ఆమెను బాగుచేసెను.

ఆయన మన బలహీనతలను తాకునట్టి ప్రధానయాజకుడని బైబిలు చెప్పుచున్నది. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగానున్నాడని వాక్యము చెప్పుచున్నది; ఆయన మారని యాజకుడు. ఆయన ఆ రీతిగానే పనిచేయును.

123

ఆత్మతో నింపబడిన సంఘము ఒక శిరస్సునకు చేరుచున్నదని జనులు చూచెదరు గాక. క్రీస్తు వచ్చి తన సంఘమును తీసికొననైయున్నాడు. ఆయన చివరి గొప్ప సూచన సొదొమ దినములలో నున్నది. శారా అను భార్య అబ్రాహామునకున్నదని ఆయన ఎరిగియుండెను. గుడారములో ఆమె నవ్వినదని ఎరిగెను. అదే సూచన అని ఆయన చెప్పెను. ఇవన్నియూ జరుగు వరకు ఈ తరము గతించదని ఆయన చెప్పెను, అదే ఇక్కడున్నది. మనం చివరలోనున్నాం.

సజీవుడగు యేసుక్రీస్తు ఇక్కడున్నాడని ప్రతి రోగియు ఎరుగునట్లు సహాయము చేయుము. ప్రభువా! ఈ చేతిగుడ్డలు ఏ రోగ శరీరమును తాకునో, ఆ శరీరములు స్వస్థపడునట్లు కృప చూపుము. జనులలోనున్న అపవాదిని నేను ఖండించుచున్నాను, విశ్వాసముతో దేవుని ఆత్మ ద్వారా దానిని తోలివేయుచున్నాను. ప్రతి సందేహ ఛాయను వెళ్ళగొట్టును, నిత్యజీవమునకు నిర్ణయించబడిన ప్రతి వ్యక్తియు ఈ ఘడియలో దానిని చేర్చుకొందురు గాక. ప్రతి మూఢత్వము, ఈ లోకమునకు చెందిన ప్రతి చిన్న చిన్నవి, బైబిలు చెప్పుచున్నట్లుగా సుళువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి, ముందుంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదుము గాక. [దేనివైపు చూడాలి? సంఘము వైపుకా? సంస్థ వైపుకా?] విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునగు యేసువైపు చూచుచూ పరుగిడాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. నిజమైన మాటలను మనము తీసికొనుట కాదు గాని, ఈ ఉదయాన ఆ మాటలే నిజముగా నిరూపించబడినవి. చనిపోయిన యేసు కాదు గాని, ఆయన తిరిగి లేచెను. రెండువేల సంవత్సరముల తరువాత ఆయన తన సంఘమును ఒక శిరస్సు నొద్దకు తెచ్చుచున్నాడు. వారిమధ్య యూదా ఆత్మ పనిచేయుమన్నది, కాని ప్రతి సిద్దాంతమును ఈ ఘడియలో వారు ప్రక్కకు పెట్టి ఆయననే చేర్చుకొందురు గాక.

124

ప్రసంగము ద్వారా వారు విన్నది గుర్తించుదురు గాక. వారు విన్న మాటలు ప్రత్యక్షపరచబడినవి అని మరియు అది క్రీస్తేనని వారు గుర్తించుదురు గాక. ఇప్పుడు వారు దానిపై పని చేయుదురు గాక. మరియు వారు దాని ప్రకారము చేసి, దాని ప్రకారము ప్రవర్తించి: వారు దానిని చేర్చుకొని, వారి కాళ్ళపై నిలబడి సాక్ష్యము నిచ్చుదురు గాక, పరిశుద్ధాత్మచే నింపబడి దేవుని రాజ్యములోనికి వెళ్ళుదురు గాక.

రోగులు స్వస్థపడుదురు గాక. బాధపరచబడువారు బాగుపడెదరు గాక. ప్రతి హృదయవాంఛ సరిగా చేయబడు గాక. సర్వశక్తిగల దేవా, దానిని అనుగ్రహించుము.

125

మీరిపుడు తలలు వంచి, హృదయములను తెరచి, మీరు కొంత సమయము ప్రార్థించుకొనండి, బాప్తిస్మ కార్యక్రమమునకు ముందుగా మరో ఆరాధన రాత్రిలో యుండును.

ఇప్పుడు, జ్ఞాపకముంచుకొనండి, ఈ అవకాశమును జారవిడువవద్దు. నేను రెండున్నర గంటలు లేదా ఇంకా ఎక్కువ సమయమును తీసికొని చాలా పరిపూర్ణంగా సువార్తను తీసికొని వచ్చాను. ఇప్పుడు మనం చివరకు వచ్చాం. అంశము: వినుట, గుర్తించుట, పనిచేయుట — దీనిని మీ తలలకు పై నుండి పోనీయకండి. మీరు దానిని విన్నారు. ఆయన సన్నిధి ఇక్కడున్నదని మీరు గుర్తించారా? నిన్ను పిలిచేది ఆయనే అని తెలుసుకొన్నావా? అయితే దానిపై పనిచేయుము, దేవుడు మీలో నుండును. ప్రార్ధనలో కొంత సమయం గడపండి.

సహోదరుడా నెవిల్, నీవు ప్రార్ధనలో ముందుకు కొనసాగించి ముగించుము.

Search Messages

0 / 0 matches
Enter characters above to process real-time text query scopes...